హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) – 362. చేతబడి చేయటం, నేర్చుకోవటం నిషిద్ధం

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: ఇమామ్ అబూ జకరియ్యా యహ్యా బిన్ షరఫ్ అన్ నవవీ (రహ్మతుల్లాహి అలైహి)
ఉర్దూ అనువాదం, వ్యాఖ్యానం: హాఫిజ్ సలాహుద్దీన్ యూసుఫ్ · తెలుగు రూపం: హాఫిజ్ ఎస్.ఎమ్. రసూల్ షర్ఫీ · ప్రకాశకులు: ట్రూత్ పబ్లికేషన్స్, హైదరాబాద్

రియాదుస్ సాలిహీన్ – హదీసు కిరణాలు (ఇమామ్ నవవీ) – అరబీ, తెలుగు, English

రియాదుస్ సాలిహీన్ (హదీసు కిరణాలు) – 362వ అధ్యాయం: చేతబడి చేయటం, నేర్చుకోవటం కఠినంగా నిషేధించబడింది. ఈ అధ్యాయంలో 1 ఖుర్ఆన్ ఆయతులు, 1 హదీసులు (హదీసు 1795) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, ముఖ్యాంశాలు, English అనువాదంతో.

362. చేతబడి చేయటం, నేర్చుకోవటం కఠినంగా నిషేధించబడింది

↑ విషయ సూచిక

باب التغليظ في تحريم السِّحْرِ

అరబీ పాఠం: రియాదుస్ సాలిహీన్ – తహ్‌ఖీఖ్: షుఐబ్ అల్ అర్నావూత్ (ముఅస్సస్సతుర్ రిసాలా)

దివ్యఖుర్‌ఆన్‌లో అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

{وَمَا كَفَرَ سُلَيْمَانُ وَلَكِنَّ الشَّيَاطِينَ كَفَرُوا يُعَلِّمُونَ النَّاسَ السِّحْرَ} الآية [البقرة: ١٠٢]

"వాస్తవంగా సులైమాను ఎన్నడూ అవిశ్వాసానికి ఒడిగట్టలేదు. అసలు అవిశ్వాసానికి పాల్పడింది ప్రజలకు చేతబడిని బోధించే షైతానులే." (బఖర:102)

English

“Sulaiman (Solomon) did not disbelieve, but the Shayatin (devils) disbelieved, teaching men magic.” [Al-Baqarah 2:102]

1795

హదీసు 1795

وَعَنْ أبِي هُرَيْرَةَ رضي اللَّه عَنْهُ عَنِ النبيِّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَالَ: "اجْتَنِبُوا السَّبْعَ المُوبِقَاتِ"قَالُوا: يَا رسُولَ اللَّهِ وَمَا هُنَّ؟ قَالَ:"الشِّرْكُ بِاللَّهِ، السِّحْرُ، وَقَتْلُ النَّفْسِ الَّتي حرَّمَ اللَّه إلاَّ بِالْحَقِّ، وَأَكْلُ الرِّبَا، وَأكْلُ مَالِ اليَتِيمِ، والتَّوَلِّي يَوْمَ الزَّحْفِ، وقَذفُ المُحْصنَات المُؤمِناتِ الْغَافِلات "متفقٌ عَلَيْهِ.

హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ "ప్రాణాంతకమైన ఏడు విషయాలకు దూరంగా ఉండండి" అని బోధించారు. దానికి సహచరులు, "దైవప్రవక్తా! ఏమిటవి?" అని అడిగారు. అందుకాయన ఇలా వివరించారు: "దైవత్వంలో అల్లాహ్‌కు ఇతరుల భాగస్వామ్యం అంటగట్టటం, చేతబడి చేయటం, దేవుడు నిషిద్ధం చేసిన ప్రాణిని అన్యాయంగా చంపటం, వడ్డీ తినటం, అనాధుని సొమ్ము తినేయటం, దైవవిరోధులతో యుద్ధం జరిగినప్పుడు వెన్నుచూపి పారిపోవటం, అమాయకులు, సౌశీల్యవతులు అయిన విశ్వాస స్త్రీల మీద అభాండాలు వేయటం."

(బుఖారీ-ముస్లిం)

English

Abu Hurairah (radiyallahu anhu) said: The Prophet ﷺ said, “Avoid the seven destructive things.” It was asked: (by those present): “What are they, O Messenger of Allah?” He replied, “Associating anyone or anything with Allah in worship; practising sorcery, killing of someone without a just cause whom Allah has forbidden, devouring the property of an orphan, eating of usury, fleeing from the battlefield and slandering chaste women who never even think of anything touching chastity and are good believers.”[Al-Bukhari and Muslim].

ముఖ్యాంశాలు

ఈ హదీసు ఇంతకుముందు "తహ్రీము అమ్‌వాలిల్ యతీమి" అన్న అధ్యాయంలో కూడా వచ్చింది. పైన పేర్కొనబడిన పనులన్నీ నిషిద్ధమైన పనులు. వాటిలోనే చేతబడి నేర్చుకోవటం, నేర్పించటం కూడా ఉన్నాయి. వాటిని రుజువు చేయటానికే గ్రంథకర్త ఈ హదీసును ఇక్కడ ప్రస్తావించారు.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|వారింపబడిన విషయాల ప్రకరణం|362. చేతబడి చేయటం, నేర్చుకోవటం కఠినంగా నిషేధించబడింది|హదీసు 1795