హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: ఇమామ్ అబూ జకరియ్యా యహ్యా బిన్ షరఫ్ అన్ నవవీ (రహ్మతుల్లాహి అలైహి)
ఉర్దూ అనువాదం, వ్యాఖ్యానం: హాఫిజ్ సలాహుద్దీన్ యూసుఫ్ · తెలుగు రూపం: హాఫిజ్ ఎస్.ఎమ్. రసూల్ షర్ఫీ · ప్రకాశకులు: ట్రూత్ పబ్లికేషన్స్, హైదరాబాద్

రియాదుస్ సాలిహీన్ (హదీసు కిరణాలు) – 361వ అధ్యాయం: ఒక నగరంలో అంటువ్యాధి ప్రబలినప్పుడు అక్కణ్ణుంచి పారిపోవటం, బయటివారు ఆ నగరంలోకి ప్రవేశించటం అవాంఛనీయం. ఈ అధ్యాయంలో 2 ఖుర్ఆన్ ఆయతులు, 2 హదీసులు (హదీసు 1793 – 1794) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, ముఖ్యాంశాలు, English అనువాదంతో.
361. ఒక నగరంలో అంటువ్యాధి ప్రబలినప్పుడు అక్కణ్ణుంచి పారిపోవటం, బయటివారు ఆ నగరంలోకి ప్రవేశించటం అవాంఛనీయం
باب كراهة الخروج من بلد وقع فيها الوباء فراراً منه وكراهة القدوم عليه
అరబీ పాఠం: రియాదుస్ సాలిహీన్ – తహ్ఖీఖ్: షుఐబ్ అల్ అర్నావూత్ (ముఅస్సస్సతుర్ రిసాలా)
దివ్యఖుర్ఆన్లో అల్లాహ్ సెలవిచ్చాడు:
{أَيْنَمَا تَكُونُوا يُدْرِكْكُمُ الْمَوْتُ وَلَوْ كُنْتُمْ فِي بُرُوجٍ مُشَيَّدَةٍ} [النساء: ٧٨]
"మీరు ఎక్కడున్నా సరే మృత్యువు మీకు వచ్చి తీరుతుంది. ఎంతటి దృఢమైన భవనాలలో ఉన్నాసరే." (నిసా: 78)
{وَلا تُلْقُوا بِأَيْدِيكُمْ إِلَى التَّهْلُكَةِ} [البقرة: ١٩٥]
"చేతులారా మిమ్మల్ని మీరు వినాశం పాలు చేసుకోకండి." (బఖర: 195)
ముఖ్యాంశాలు
గ్రంథకర్త ఇమామ్ నవవీ (రహిమహుల్లాహ్) ఈ అధ్యాయం క్రింద రెండు ఖుర్ఆన్ ఆయతులను పేర్కొన్నారు. మొదటి ఆయతు ద్వారా ఆయన అంటువ్యాధి ప్రబలిన నగరం వదలి పారిపోవటం నిషిద్ధం అన్న విషయాన్ని నిరూపించదలిచారు. మనిషి పారిపోయి ఎక్కడికి వెళ్తాడు? తన అదృష్టంలో మృత్యువు రాసిపెట్టి ఉన్నట్లయితే అతను ఎక్కడ ఉన్నా మృత్యువు తప్పకుండా వచ్చి అతన్ని కబళిస్తుంది. పైగా అలా పారిపోవటం మూలంగా ఆ అంటువ్యాధికి కారణమయ్యే క్రిములు ఇతర ప్రాంతాలకు కూడా వ్యాపించే ప్రమాదముంటుంది. అందుకే దైవప్రవక్త ﷺ అంటువ్యాధి ప్రబలిన ప్రాంతాలను వదలి వెళ్ళరాదని తాకీదు చేశారు.
ఇకపోతే గ్రంథకర్త రెండవ ఆయతును ఈ అధ్యాయం క్రింద ప్రస్తావించటంలోని మర్మం ఏమిటంటే ఏదయినా నగరంలో అంటువ్యాధి ప్రబలి ఉన్నప్పుడు బయటివారు అటువంటి నగరాల్లోకి ప్రవేశించి చేజేతులా తమ వినాశాన్ని కొనితెచ్చుకోరాదు. ఇమామ్ నవవీ (రహిమహుల్లాహ్) రెండవ ఆయతు ద్వారా ఈ విషయమే నిరూపించ దలిచారు.
English
“Wheresoever you may be, death will overtake you even if you are in fortresses built up strong and high!” [An-Nisā’ 4:78]
“And do not throw yourselves into destruction.” [Al-Baqarah 2:195]
హదీసు 1793
وَعَنْ ابْنِ عَبَّاسٍ رضي اللَّه عَنْهُمَا أنَّ عُمَر بْنِ الْخَطًَّابِ رضي اللَّه عَنْهُ خَرَجَ إلَى الشَّامِ حَتَّى إذَا كَانَ بِسَرْغٍ لَقِيَهُ أُمَراءُ الأجْنَادِ أبُو عُبَيْدَةَ بْنُ الجَرَّاحِ وَأصْحَابُهُ فَأَخْبَرُوهُ أنَّ الْوبَاءَ قَدْ وَقَعَ بالشَّامِ، قَالَ ابْنُ عَبَّاسٍ: فَقَالَ لي عُمَرُ: ادْعُ لِي المُهاجرِين الأوَّلِينَ فَدَعَوتُهم، فَاسْتَشَارهم، وَأَخْبرَهُم أنَّ الْوَبَاءَ قَدْ وَقَعَ بِالشَّامِ، فَاخْتلَفوا، فَقَالَ بَعْصُهُمْ: خَرَجْتَ لأَمْرٍ، وَلاَ نَرَى أنْ تَرْجِعَ عَنْهُ. وَقَالَ بَعْضُهُمْ: مَعَكَ بَقِيَّة النَّاسِ وَأصْحَابُ رسُولِ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم، وَلا نَرَى أنْ تُقْدِمَهُم عَلَى هَذَا الْوَبَاءِ، فَقَالَ: ارْتَفِعُوا عَنِّي، ثُمَّ قَالَ: ادْعُ لِي الأَنْصَارَ، فَدعَوتُهُم، فَاسْتَشَارهمْ، فَسَلَكُوا سَبِيلَ المُهاجرِين، وَاختَلَفوا كَاخْتلافهم، فَقَال: ارْتَفِعُوا عَنِي، ثُمَّ قَالَ: ادْعُ لِي مَنْ كَانَ هَا هُنَا مِنْ مَشْيَخَةِ قُرَيْشٍ مِنْ مُهَاجِرةِ الْفَتْحِ، فَدَعَوْتُهُمْ، فَلَمْ يَخْتَلِفْ عَلَيْهِ مِنْهُمْ رَجُلانِ، فَقَالُوا: نَرَى أنْ تَرْجِعَ بِالنَّاسِ وَلاَ تُقْدِمَهُم عَلَى هَذَا الْوَبَاءِ، فَنَادى عُمَرُ رضي اللَّه عَنْهُ في النَّاسِ: إنِّي مُصْبِحٌ عَلَى ظَهْرِ، فَأَصْبِحُوا عَلَيْهِ: فَقَال أبُو عُبَيْدَةَ بْن الجَرَّاحِ رضي اللَّهُ عَنْهُ: أَفِرَاراً مِنْ قَدَرِ اللَّه؟ فَقَالَ عُمَرُ رضي اللَّه عَنْهُ: لَوْ غَيْرُكَ قَالَهَا يَا أبَا عُبيْدَةَ، وكَانَ عُمَرُ يَكْرَهُ خِلافَهُ، نَعَمْ نَفِرُّ منْ قَدَرِ اللَّه إلى قَدَرِ اللَّه، أرأَيْتَ لَوْ كَانَ لَكَ إبِلٌ، فَهَبَطَتْ وَادِياً لهُ عُدْوَتَانِ، إحْدَاهُمَا خَصْبةٌ، والأخْرَى جَدْبَةٌ، ألَيْسَ إنْ رَعَيْتَ الخَصْبَةَ رعَيْتَهَا بقَدَرِ اللَّه، وإنْ رَعَيْتَ الجَدْبَةَ رعَيْتَهَا بِقَدَر اللَّه، قَالَ: فجَاءَ عَبْدُ الرَّحْمَنِ بْنُ عَوْفٍ رضي اللَّه عَنْهُ، وَكَانَ مُتَغَيِّباً في بَعْضِ حَاجَتِهِ، فَقَال: إنَّ عِنْدِي مِنْ هَذَا عِلْماً، سَمِعْتُ رَسُولَ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم يَقُولُ: "إذَا سَمِعْتُمْ بِهِ بِأرْضٍ، فلاَ تَقْدمُوا عَلَيْهِ، وإذَا وَقَعَ بِأَرْضٍ وَأَنْتُمْ بِهَا، فَلا تخْرُجُوا فِرَاراً مِنْهُ" فَحَمِدَ اللَّه تَعَالى عُمَرُ رضي اللَّه عَنْهُ وَانْصَرَفَ، متفقٌ عَلَيْهِ. والْعُدْوَةُ: جانِبُ الْوادِي.
హజ్రత్ ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హుమా) కథనం: హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) సిరియాకు బయలుదేరి వెళ్ళారు. ఆయన సర్గ్ ప్రాంతంలో ఉన్నప్పుడు సిరియా నగరాల అధిపతులు – అంటే అబూ ఉబైదా బిన్ జర్రాహ్, తన సహచరులతో వచ్చి ఆయన్ని కలుసుకొని, "సిరియాలో అంటువ్యాధి ప్రబలి ఉంద"ని ఆయనకు తెలియజేశారు. అప్పుడు ఉమర్(రదియల్లాహు అన్హు) తన వద్దకు, తొలి ముహాజిర్లను పిలుచుకురమ్మని నన్ను పురమాయించారు. నేనెళ్ళి వారిని పిలుచుకువచ్చాను. ఆయన వారికి సిరియాలో అంటువ్యాధి వ్యాపించి ఉందన్న విషయం తెలియజేసి వారి సలహా కోరారు.
వారు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. కొందరు మాట్లాడుతూ, "మీరు ఒక పని మీద బయలుదేరి వచ్చారు. ఆ పని పూర్తి కాకుండా తిరిగి వెళ్ళటం బాగుండదని మా అభిప్రాయం" అని అన్నారు. మరికొందరు "మీ వెంట మిగతా జనం దైవప్రవక్త సహచరులు తక్కువమంది ఉన్నారు. కనుక వారిని కూడా అంటువ్యాధి వ్యాపించిన ప్రాంతానికి తీసుకెళ్ళటం సరికాదు" అని అన్నారు. వారి అభిప్రాయాలు విన్న తర్వాత ఆయన వారితో, "ఇక మీరు వెళ్ళండి" అన్నారు.
ఆ తర్వాత అన్సారులను పిలవమని పురమాయించారు. నేను వారిని పిలుచుకొచ్చాను. ఆయన వారిని సలహా ఇవ్వమని అడిగారు. వారు కూడా ముహాజిర్ల విధానాన్నే అనుసరించారు. (అంటే వారిలాగే భేదాభిప్రాయం వ్యక్తం చేశారు.) వారి అభిప్రాయాలు విన్న తర్వాత ఆయన వారితో, "ఇక మీరు వెళ్ళండి" అన్నారు. ఆ తర్వాత ఆయన మక్కా విజయం సందర్భంగా (మదీనాకు) వలసవెళ్ళిన ఖురైషు పెద్దల్లో ఇక్కడున్నవారిని పిలవండి అన్నారు. నేను వారిని పిలుచుకొచ్చాను. వారిలో ఏ ఇద్దరూ భిన్నాభిప్రాయాలు వ్యక్తపరచలేదు. "ప్రజలను అంటువ్యాధి వ్యాపిస్తున్న ప్రాంతానికి తీసుకువెళ్ళటం మంచిది కాదు. అందుకని వారిని తీసుకొని తిరిగివెళ్ళిపోవటం మంచిదని మా అభిప్రాయం" అన్నారు వారంతా. అంతా విన్న తర్వాత ఉమర్ (రదియల్లాహు అన్హు) ప్రజల ముందు "నేను రేపు ఉదయం (మదీనాకు) తిరిగి వెళ్తున్నాను. కనుక మీరు కూడా రేపుదయం బయలుదేరటానికి సిద్ధంగా ఉండండి" అని ప్రకటన చేయించారు.
అప్పుడు ఉబైదా బిన్ జర్రాహ్ (రదియల్లాహు అన్హు) "దేవుడు రాసిపెట్టిన అదృష్టం నుంచి పారిపోతున్నారా!" అని అడిగారు. ఆ మాటకు ఉమర్ (రదియల్లాహు అన్హు) ఇలా బదులు చెప్పారు: ఈ మాట మరొకరి నోట వెలువడి ఉంటే బాగుండు (ఎందు కంటే ఆయనతో విభేదించటం ఉమర్ (రదియల్లాహు అన్హు)కు ఇష్టంలేదు) అవునండి, మేము దేవుని అదృష్టం నుండి దేవుని అదృష్టం వైపుకే పారిపోతున్నాం. మీ దగ్గర కొన్ని ఒంటెలు ఉండి, మీరు వాటిని, ఒక వైపు పచ్చటి చెట్లు చేమలు, మరోవైపు బంజరు నేల ఉన్న లోయకు తోలుకెళ్ళా రనుకోండి. అప్పుడు మీరు మీ ఒంటెల్ని (బీడును వదలి) పచ్చిక ఉన్న ప్రదేశంలో మేపినా లేక (పచ్చికను వదలి) బీడులో మేపినా అది దేవుని నిర్ణీత అదృష్టం ప్రకారం మేపినట్లు కాదా?"
అంతలో అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్ అక్కడికి చేరుకున్నారు. ఆయన ఏదో పని మీద వెళ్ళి తిరిగొచ్చారు. విషయం తెలుసుకొని ఆయన "నా దగ్గర ఈ సమస్యకు సంబంధించిన జ్ఞానం ఉంది. దైవప్రవక్త ﷺ ఈ విధంగా ప్రవచించారు: ఒక ప్రాంతంలో అంటువ్యాధి ప్రబలి ఉందని మీరు వింటే అక్కడికి వెళ్ళకండి. ఒకవేళ మీరున్న ప్రాంతంలోనే అంటువ్యాధి ప్రబలితే దాన్నుంచి తప్పించుకోవాలన్న ఉద్దేశ్యంతో అక్కడి నుండి (వేరేచోటికి) వెళ్ళకండి" అని చెప్పారు.
ఈ హదీసు విని ఉమర్ (రదియల్లాహు అన్హు) దైవానికి కృతజ్ఞతలు తెలుపుకున్నారు. అక్కణ్ణుంచి (మదీనాకు) తిరుగు ప్రయాణమయ్యారు. (బుఖారీ-ముస్లిం)
(సహీహ్ బుఖారీలోని తిబ్ ప్రకరణం -సహీహ్ ముస్లింలోని సలామ్ ప్రకరణం)
English
Ibn `Abbas (radiyallahu anhuma) reported: `Umar bin Al-Khattab (radiyallahu anhu) set out for Ash-Sham (the region comprising Syria, Palestine, Lebanon and Jordan). As he reached at Sargh (a town by the side of Hijaz) he came across the governor of Al-Ajnad, Abu `Ubaidah bin Al-Jarrah (radiyallahu anhu) and his companions. They informed him that an had broken out in Syria. Ibn `Abbas relates: `Umar (radiyallahu anhu) said to me: “Call to me the earliest Muhajirun (Emigrants).” So I called them. He sought their advice and told them that an epidemic had broken out in Ash-Sham. There was a difference of opinion whether they should proceed further or retreat to their homes in such a situation. Some of them said: “You have set forth to fight the enemy, and therefore you should not go back;” whereas some of them said: “As you have along with you many eminent Companions of Messenger of Allah ﷺ, we would not advice you to set forth to the place of the plague (and thus expose them deliberately to a danger).” `Umar (radiyallahu anhu) said: “You can now go away.” He said: “Call to me the Ansar (the Helpers).” So I called them to him, and he consulted them and they differed in their opinions as well. He said: “Now, you may go.” He again said: “Call the old (wise people) of the Quraish who had emigrated before the conquest of Makkah.” I called them. `Umar (radiyallahu anhu) consulted them in this issue and not even two persons among them differed in the opinions. They said: “We think that you should go back along with the people and do not take them to this scourge. `Umar (radiyallahu anhu) made an announcement to the people, saying: “In the morning I intend to go back, and I want you to do the same.” Abu ‘Ubaidah bin Al-Jarrah (radiyallahu anhu) said: “Are you going to run away from the Divine Decree?” Thereupon `Umar (radiyallahu anhu) said: “O Abu ‘Ubaidah ! Had it been someone else to say this.” (‘Umar (radiyallahu anhu) did not like to differ with him). He said: “Yes, we are running from the Divine Decree to the Divine Decree. What do you think if you have camels and you happen to get down a valley having two sides, one of them covered with foliage and the other being barren, will you not act according to the Divine Decree if you graze them in vegetative land? In case you graze them in the barren land, even then you will be doing so according to the Divine Decree.
There happened to come `Abdur-Rahman bin `Auf who had been absent for some of his needs. He said: I have knowledge about it. I heard the Messenger of Allah ﷺ saying, “If you get wind of the outbreak of plague in a land, you should not enter it; but if it spreads in the land where you are, you should not depart from it.” Thereupon `Umar bin Khattab (radiyallahu anhu) praised Allah and went back.[Al-Bukhari and Muslim].
ముఖ్యాంశాలు
మూలంలో 'అజ్నాద్' అనే పదం వచ్చింది, ఇక్కడ అజ్నాద్ అంటే సిరియా దేశపు ఐదు నగరాలు: పలస్తీనా, జోర్డాన్, డెమాస్కస్, హిమ్స్, ఖిన్సిరీన్ (ఇబ్నె అల్లాన్). పై హదీసులో హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) మరియు ఆయన సహచరుల అభిప్రాయం దైవప్రవక్త ﷺగారి ప్రవచనానికి అనుగుణంగా ఉంది. అందుకే హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు)గారు తన అభిప్రాయం దైవప్రవక్త హదీసుకు అనుగుణంగా ఉన్నట్లు రుజువైనందున ఆయన అల్లాహ్కు కృతజ్ఞతలర్పించారు. అంతకు ముందు అన్సార్ మరియు ముహాజిర్ సహాబీల్లోని ఒక వర్గం వెలిబుచ్చిన అభిప్రాయం కూడా షరీఅత్ యొక్క ఏదేని మూలం మీద ఆధారపడి ఉన్నప్పటికీ పరిస్థితుల స్వరూపం దృష్ట్యా ఆ నిర్ణయం సరికాదని తేలింది. వీరు దేవుని మీద మొక్కవోని విశ్వాసం, త్యాగభావం, నిస్వార్ధం మొదలగు షరీఅతు మూలాలను దృష్టిలో పెట్టుకొని, ఒకసారి ఓ ధర్మకార్యం తలపెట్టిన తర్వాత నగరంలో అంటువ్యాధి ప్రబలి ఉందన్న భయంతో దైవకార్యాన్ని విరమించుకోరాదని అభిప్రాయపడ్డారు. దీనికి భిన్నంగా మరొక వర్గం ముందుజాగ్రత్త, చేజేతులా వినాశాన్ని కొనితెచ్చుకోకుండా ఉండటం లాంటి షరీఅతు ప్రబోధనల్ని దృష్టిలో పెట్టుకొని అంటువ్యాధి ప్రబలి ఉన్న నగరంలోకి ప్రవేశించకుండా ఉండటమే మేలని అనుకుంది. చివరికి ఉమర్ (రదియల్లాహు అన్హు) మరియు ఆయన సహచరుల అభిప్రాయానికి దైవప్రవక్త ﷺ హదీసు కూడా బలం చేకూర్చింది.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|వారింపబడిన విషయాల ప్రకరణం|361. ఒక నగరంలో అంటువ్యాధి ప్రబలినప్పుడు అక్కణ్ణుంచి పారిపోవటం, బయటివారు ఆ నగరంలోకి ప్రవేశించటం అవాంఛనీయం|హదీసు 1793
హదీసు 1794
وَعَنْ أُسَامَةَ بْنِ زَيْدٍ رضي اللَّه عَنْهُ عنِ النَّبِيِّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَالَ: "إذَا سمِعْتُمْ الطَّاعُونَ بِأَرْضٍ، فَلاَ تَدْخُلُوهَا، وَإذَا وقَعَ بِأَرْضٍ، وَأَنْتُمْ فِيهَا، فَلاَ تَخْرُجُوا مِنْهَا" متفقٌ عليهِ.
హజ్రత్ ఉసామా బిన్ జైద్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రబోధించారు: "ఏదయినా ప్రాంతంలో ప్లేగు వ్యాధి ఉందని తెలిస్తే మీరు అక్కడికి వెళ్ళకండి. మీరు ఏదయినా ప్రాంతంలో ఉన్నప్పుడు అక్కడ ప్లేగు వ్యాధి వ్యాపిస్తుంటే మీరు అక్కడి నుంచి (వేరేచోటుకి) వెళ్ళకండి." (బుఖారీ-ముస్లిం)
(సహీహ్ బుఖారీలోని తిబ్ ప్రకరణం – సహీహ్ ముస్లింలోని సలామ్ ప్రకరణం)
English
Usamah bin Zaid (radiyallahu anhu) said: The Prophet ﷺ said, “If you get wind of the outbreak of plague in a land, do not enter it; and if it breaks out in a land in which you are, do not leave it.”[Al-Bukhari and Muslim].
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|వారింపబడిన విషయాల ప్రకరణం|361. ఒక నగరంలో అంటువ్యాధి ప్రబలినప్పుడు అక్కణ్ణుంచి పారిపోవటం, బయటివారు ఆ నగరంలోకి ప్రవేశించటం అవాంఛనీయం|హదీసు 1794
You must be logged in to post a comment.