హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) – 352. నిలిచి ఉన్న నీటిలో మూత్ర విసర్జన చేయరాదు

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: ఇమామ్ అబూ జకరియ్యా యహ్యా బిన్ షరఫ్ అన్ నవవీ (రహ్మతుల్లాహి అలైహి)
ఉర్దూ అనువాదం, వ్యాఖ్యానం: హాఫిజ్ సలాహుద్దీన్ యూసుఫ్ · తెలుగు రూపం: హాఫిజ్ ఎస్.ఎమ్. రసూల్ షర్ఫీ · ప్రకాశకులు: ట్రూత్ పబ్లికేషన్స్, హైదరాబాద్

రియాదుస్ సాలిహీన్ – హదీసు కిరణాలు (ఇమామ్ నవవీ) – అరబీ, తెలుగు, English

రియాదుస్ సాలిహీన్ (హదీసు కిరణాలు) – 352వ అధ్యాయం: నిలిచి ఉన్న నీటిలో మూత్ర విసర్జన మొదలగు పనులు చేయరాదు. ఈ అధ్యాయంలో 1 హదీసులు (హదీసు 1774) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, ముఖ్యాంశాలు, English అనువాదంతో.

352. నిలిచి ఉన్న నీటిలో మూత్ర విసర్జన మొదలగు పనులు చేయరాదు

↑ విషయ సూచిక

باب النهي عن البول ونحوه في الماء الراكد

అరబీ పాఠం: రియాదుస్ సాలిహీన్ – తహ్‌ఖీఖ్: షుఐబ్ అల్ అర్నావూత్ (ముఅస్సస్సతుర్ రిసాలా)

1774

హదీసు 1774

عَنْ جَابِرٍ رَضيَ اللَّه عَنْهُ: أَنَّ رسُولَ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم نَهَى أَنْ يُبَال في المَاءِ الرَّاكدِ. رواهُ مسلم.

హజ్రత్ జాబిర్ (రదియల్లాహు అన్హు) కథనం: దైవప్రవక్త ﷺ నిలిచి ఉన్న నీటిలో మూత్రం పోయటాన్ని వారించారు.

(ముస్లిం)

(సహీహ్ ముస్లింలోని తహారత్ ప్రకరణం)

English

Jabir (radiyallahu anhu) said: The Messenger of Allah ﷺ forbade urinating into stagnant water.[Muslim].

ముఖ్యాంశాలు

చెరువులు, కుంటలు, బావులు మొదలగువాటి నీరు నిలకడగా ఉంటుంది. నదులు, కాలువల మాదిరిగా ఈ నీటిలో ప్రవాహం ఉండదు. కనుక నిలకడగా ఉన్న నీటిలో మలమూత్ర విసర్జన చేయటం వల్ల ఆ నీరు కలుషితమయిపోవటమే గాకుండా చుట్టు ప్రక్కల ప్రాంతాల్లో విపరీతమైన దుర్గంధం కూడా వ్యాపిస్తుంది. దానివల్ల పరిసర ప్రాంతాల ప్రజలు నానా ఇబ్బందులు పడతారు. ఇస్లాం ధర్మం ఇటువంటి చిన్నచిన్న విషయాలను సయితం ఇంత స్పష్టంగా, ఇంత గట్టిగా తాకీదు చేసి పేర్కొంటున్నదంటే దాని వెనుకగల ఉద్దేశాన్ని గ్రహించటం పెద్ద కష్టమేమీ కాదు. సామాజిక జీవనంలో వ్యక్తి చేసే ఓ చిన్న తప్పు కూడా ఆ సమాజంలో జీవిస్తున్న వారందరికీ ఎన్నో తిప్పలు తెచ్చి పెట్టవచ్చు. అందుకని సహజీవన ధర్మాల పరిరక్షణ కోసం ఇస్లాం ధర్మం అడుగడుగునా ఇటువంటి నీతి సూత్రాలెన్నింటినో ప్రబోధిస్తూ ఉంటుంది. ఇస్లాం ధర్మ సమగ్రతకు ఇది ఓ మచ్చుతునక మాత్రమే!

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|వారింపబడిన విషయాల ప్రకరణం|352. నిలిచి ఉన్న నీటిలో మూత్ర విసర్జన మొదలగు పనులు చేయరాదు|హదీసు 1774