హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: ఇమామ్ అబూ జకరియ్యా యహ్యా బిన్ షరఫ్ అన్ నవవీ (రహ్మతుల్లాహి అలైహి)
ఉర్దూ అనువాదం, వ్యాఖ్యానం: హాఫిజ్ సలాహుద్దీన్ యూసుఫ్ · తెలుగు రూపం: హాఫిజ్ ఎస్.ఎమ్. రసూల్ షర్ఫీ · ప్రకాశకులు: ట్రూత్ పబ్లికేషన్స్, హైదరాబాద్

రియాదుస్ సాలిహీన్ (హదీసు కిరణాలు) – 351వ అధ్యాయం: ప్రజలు నడిచే దారుల్లో, నీడ ఉండే చోట, నీళ్ళు తీసుకుపోయే చోట్లలో, ఇతర ప్రాంతాలలో మలమూత్ర విసర్జన చేయరాదు. ఈ అధ్యాయంలో 1 ఖుర్ఆన్ ఆయతులు, 1 హదీసులు (హదీసు 1773) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, ముఖ్యాంశాలు, English అనువాదంతో.
351. ప్రజలు నడిచే దారుల్లో, నీడ ఉండే చోట, నీళ్ళు తీసుకుపోయే చోట్లలో, ఇతర ప్రాంతాలలో మలమూత్ర విసర్జన చేయరాదు
باب النهي عن التغوط في طريق النَّاس وظلِّهم وموارد الماء ونحوها
అరబీ పాఠం: రియాదుస్ సాలిహీన్ – తహ్ఖీఖ్: షుఐబ్ అల్ అర్నావూత్ (ముఅస్సస్సతుర్ రిసాలా)
దివ్యఖుర్ఆన్లో అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
{وَالَّذِينَ يُؤْذُونَ الْمُؤْمِنِينَ وَالْمُؤْمِنَاتِ بِغَيْرِ مَا اكْتَسَبُوا فَقَدِ احْتَمَلُوا بُهْتَاناً وَإِثْماً مُبِيناً} [الأحزاب: ٥٨]
"ఏ తప్పూ చేయకపోయినా విశ్వాసులైన స్త్రీ పురుషులకు మనస్తాపం కలిగించేవారు, ఒక పెద్ద అభాండభారాన్ని, ఒక స్పష్టమైన పాపభారాన్ని, తమ తలపై మోపుకున్నట్లే." (అహ్జాబ్:58)
ముఖ్యాంశాలు
పైన పేర్కొనబడిన చోట్ల మలమూత్ర విసర్జన చేస్తే ఎవరికైనా బాధకలుగుతుంది. విశ్వాసులకు బాధ కలిగించటం మహాపాపం. అందుకని దానికి దూరంగా ఉండటం మంచిది. వేసవికాలంలో నీడకు ఎంత ప్రాముఖ్యముంటుందో, చలికాలంలో ఎండకు కూడా అంత ప్రాముఖ్యం ఉంటుంది. కనుక కాలాన్ని బట్టి కూడా ఈ చోట్లను దుర్వినియోగపరచటం పాపానికి కారణభూతమవుతుంది.
English
“And those who annoy believing men and women undeservedly, they bear (on themselves) the crime of slander and plain sin.” [Al-Aḥzāb 33:58]
హదీసు 1773
وَعَنْ أَبي هُرَيْرَةَ رَضِيَ اللَّه عَنْهُ أَنَّ رَسُول اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَالَ: "اتَّقُوا الَّلاعِنَيْن"قَالُوا ومَا الَّلاعِنَانِ؟ قَالَ:"الَّذِي يَتَخَلَّى في طَريقِ النَّاسِ أَوْ في ظِلِّهِمْ" رواه مسلم.
హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ శాపానికి కారణమయ్యే రెండు విషయాలకు దూరంగా ఉండమని ప్రబోధించారు. అది విని సహచరులు, 'శాపానికి కారణమయ్యే ఆ రెండు విషయాలు ఏవి?' అని అడిగారు. అందుకాయన, 'ప్రజలు నడిచేదారిలో లేక వారు (కూర్చునే) నీడ చోట్లలో మలమూత్ర విసర్జన చేయటం' అని చెప్పారు.
(ముస్లిం)
(సహీహ్ ముస్లింలోని తహారత్ ప్రకరణం)
English
Abu Hurairah (radiyallahu anhu) said: The Messenger of Allah ﷺ said, “Avoid two habits which provoke cursing.” The Companions said: “What are those things which provoke cursing?” He said, “Relieving on the thoroughfares or under the shades where people take shelter and rest.”[Muslim].
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|వారింపబడిన విషయాల ప్రకరణం|351. ప్రజలు నడిచే దారుల్లో, నీడ ఉండే చోట, నీళ్ళు తీసుకుపోయే చోట్లలో, ఇతర ప్రాంతాలలో మలమూత్ర విసర్జన చేయరాదు|హదీసు 1773
You must be logged in to post a comment.