హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) – 343. నమాజ్ చేస్తున్న వ్యక్తి ముందు నుంచి వెళ్ళటం నిషిద్ధం

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: ఇమామ్ అబూ జకరియ్యా యహ్యా బిన్ షరఫ్ అన్ నవవీ (రహ్మతుల్లాహి అలైహి)
ఉర్దూ అనువాదం, వ్యాఖ్యానం: హాఫిజ్ సలాహుద్దీన్ యూసుఫ్ · తెలుగు రూపం: హాఫిజ్ ఎస్.ఎమ్. రసూల్ షర్ఫీ · ప్రకాశకులు: ట్రూత్ పబ్లికేషన్స్, హైదరాబాద్

రియాదుస్ సాలిహీన్ – హదీసు కిరణాలు (ఇమామ్ నవవీ) – అరబీ, తెలుగు, English

రియాదుస్ సాలిహీన్ (హదీసు కిరణాలు) – 343వ అధ్యాయం: నమాజ్ చేస్తున్న వ్యక్తి ముందు నుంచి వెళ్ళటం నిషిద్ధం. ఈ అధ్యాయంలో 1 హదీసులు (హదీసు 1760) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, ముఖ్యాంశాలు, English అనువాదంతో.

343. నమాజ్ చేస్తున్న వ్యక్తి ముందు నుంచి వెళ్ళటం నిషిద్ధం

↑ విషయ సూచిక

باب تحريم المرور بَيْنَ يَدَي المصَلّي

అరబీ పాఠం: రియాదుస్ సాలిహీన్ – తహ్‌ఖీఖ్: షుఐబ్ అల్ అర్నావూత్ (ముఅస్సస్సతుర్ రిసాలా)

1760

హదీసు 1760

عَنْ أَبي الجُهيْمِ عَبْدِ اللَّهِ بْنِ الحَارِثِ بْنِ الصِّمَّةِ الأَنْصَارِيِّ رَضِيَ اللَّه عَنْهُ قَالَ: قَالَ رَسُولُ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "لَوْ يَعْلَمُ المَارُّ بَيْنَ يَدَيِ المُصَلِّي مَاذا عَلَيْهِ لَكَانَ أَنْ يَقِفَ أَرْبَعِينَ خَيْراً لَهُ مِنْ أَنْ يَمُرَّ بَيْنَ يَدَيْهِ" قَالَ الرَّاوي: لا أَدْرِي: قَالَ أَرْبَعِين يَوماً، أَو أَرْبَعِينَ شَهْراً، أَوْ أَرْبَعِينَ سَنَةً.. متفقٌ عَلَيْهِ.

హజ్రత్ అబుల్ జుహైమ్ అబ్దుల్లాహ్ బిన్ హారిస్ బిన్ సిమ్మా అన్సారీ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఈ విధంగా ప్రవచించారు: నమాజీ ముందు నుండి వెళ్ళేవాడికి అది ఎంత ఘోరమైన పాపమో తెలిస్తే అతను ముందు నుంచి వెళ్ళటం కన్నా – నలభై వరకు – నిలబడి ఉండటం మేలని అనుకుంటాడు.

ఉల్లేఖకుడు ఇలా అంటున్నాడు: ఆయన నలభై రోజులు అన్నారో, నలభై నెలలు అన్నారో, నలభై యేళ్లు అన్నారో నాకు గుర్తు లేదు. (బుఖారీ-ముస్లిం)

(సహీహ్ బుఖారీ, సహీహ్ ముస్లింలోని సలాత్ ప్రకరణం)

English

Abul-Juhaim `Abdullah bin Al-Harith (radiyallahu anhu) said: The Messenger of Allah ﷺ said, “If the person who passes in front of a praying person, realizes the enormity of the sinfulness of this act, it will have been better for him to wait forty than to pass in front of him.”[Al-Bukhari and Muslim].

[The narrator was not sure whether the Prophet ﷺ said forty days, months or years.]

ముఖ్యాంశాలు

నమాజ్ చేసేవాని ముందు నుంచి వెళ్ళటం చాలా పెద్ద పాపమని ఈ హదీసు ద్వారా బోధపడుతోంది. కనుక నమాజ్ చేసేవారు కూడా తమ ముందు సుత్రాగాని, స్తంభం లాంటిదిగాని లేకుండా జనం నడిచే దారిలో నమాజ్ చేయకూడదు. దానివల్ల జనానికి ఇబ్బంది కలుగుతుంది. లేదా విషయం తెలియని వారెవరైనా వారి ముందు నుంచి వెళ్లిపోతూ ఉండవచ్చు. సుత్రా లేనప్పుడు నమాజీకు ఎంత ముందు నుంచి వెళ్ళవచ్చు అన్న ప్రశ్నకు మూడు మీటర్లు లేక మూడు పంక్తుల యెడం వదలి వెళ్ళవచ్చని అంచనావేయటం జరిగింది. అయితే జాగ్రత్త కోసం నాలుగైదు పంక్తుల ముందు నుంచి వెళ్ళటం మంచిది.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|వారింపబడిన విషయాల ప్రకరణం|343. నమాజ్ చేస్తున్న వ్యక్తి ముందు నుంచి వెళ్ళటం నిషిద్ధం|హదీసు 1760