హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) – 342. సమాధులకు అభిముఖంగా నమాజ్ చేయరాదు

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: ఇమామ్ అబూ జకరియ్యా యహ్యా బిన్ షరఫ్ అన్ నవవీ (రహ్మతుల్లాహి అలైహి)
ఉర్దూ అనువాదం, వ్యాఖ్యానం: హాఫిజ్ సలాహుద్దీన్ యూసుఫ్ · తెలుగు రూపం: హాఫిజ్ ఎస్.ఎమ్. రసూల్ షర్ఫీ · ప్రకాశకులు: ట్రూత్ పబ్లికేషన్స్, హైదరాబాద్

రియాదుస్ సాలిహీన్ – హదీసు కిరణాలు (ఇమామ్ నవవీ) – అరబీ, తెలుగు, English

రియాదుస్ సాలిహీన్ (హదీసు కిరణాలు) – 342వ అధ్యాయం: సమాధులకు అభిముఖంగా నమాజ్ చేయరాదు. ఈ అధ్యాయంలో 1 హదీసులు (హదీసు 1759) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, ముఖ్యాంశాలు, English అనువాదంతో.

342. సమాధులకు అభిముఖంగా నమాజ్ చేయరాదు

↑ విషయ సూచిక

باب النهي عن الصلاة إِلَى القبور

అరబీ పాఠం: రియాదుస్ సాలిహీన్ – తహ్‌ఖీఖ్: షుఐబ్ అల్ అర్నావూత్ (ముఅస్సస్సతుర్ రిసాలా)

1759

హదీసు 1759

عَنْ أَبي مَرْثَدٍ كَنَّازِ بْنِ الحُصَيْنِ رَضِيَ اللَّه عَنْهُ قَالَ: سمِعْتُ رَسُولَ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم يَقُولُ:" لا تُصَلُّوا إِلى القُبُورِ، وَلا تَجْلِسُوا علَيْها" رواه مُسْلِم.

దైవప్రవక్త ﷺ ఈ విధంగా ప్రవచిస్తుండగా తాను విన్నానని హజ్రత్ అబూ మర్సద్ కన్నాజ్ బిన్ హుసైన్ (రదియల్లాహు అన్హు) తెలియజేశారు: సమాధులకు అభిముఖంగా నమాజ్ చేయకండి. వాటి మీద కూర్చోకండి. (ముస్లిం)

(సహీహ్ ముస్లింలోని జనాయెజ్ ప్రకరణం)

English

Abu Marthad Kannaz bin Husain (radiyallahu anhu) said: I heard the Messenger of Allah ﷺ saying: “Do not offer Salat (prayer) facing the graves and do not sit on them.”[Muslim].

ముఖ్యాంశాలు

1) సమాధుల ముందు నిలబడి నమాజ్ చేయటాన్ని ఎందుకు వారించబడిందంటే దానివల్ల బహుదైవారాధకుల్ని అనుకరించినట్లవుతుంది. అదీగాక దైవేతరుల్ని ఆరాధించినట్లవుతుంది. ఇది మనిషిని బహుదైవారాధన వైపుకు లాక్కెళుతుంది.

2) మానవుడు గౌరవప్రదమై[న] ప్రాణి. దేవుడు సాటి మానవుణ్ణి గౌరవించమని ఆదేశించాడు. సమాధి మీద కూర్చుంటే ఆ సమాధిలో ఉన్న వ్యక్తిని అగౌరవపరచినట్లవుతుంది. అందుకని పై రెండు పనులకు దూరంగా ఉండాలి.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|వారింపబడిన విషయాల ప్రకరణం|342. సమాధులకు అభిముఖంగా నమాజ్ చేయరాదు|హదీసు 1759