హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: ఇమామ్ అబూ జకరియ్యా యహ్యా బిన్ షరఫ్ అన్ నవవీ (రహ్మతుల్లాహి అలైహి)
ఉర్దూ అనువాదం, వ్యాఖ్యానం: హాఫిజ్ సలాహుద్దీన్ యూసుఫ్ · తెలుగు రూపం: హాఫిజ్ ఎస్.ఎమ్. రసూల్ షర్ఫీ · ప్రకాశకులు: ట్రూత్ పబ్లికేషన్స్, హైదరాబాద్

రియాదుస్ సాలిహీన్ (హదీసు కిరణాలు) – 31వ అధ్యాయం: ప్రజల మధ్య సయోధ్యకు ప్రయత్నించటం. ఈ అధ్యాయంలో 4 ఖుర్ఆన్ ఆయతులు, 4 హదీసులు (హదీసు 250 – 253) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, ముఖ్యాంశాలు, English అనువాదంతో.
31. ప్రజల మధ్య సయోధ్యకు ప్రయత్నించటం
باب الإصلاح بَيْنَ الناس
అరబీ పాఠం: రియాదుస్ సాలిహీన్ – తహ్ఖీఖ్: షుఐబ్ అల్ అర్నావూత్ (ముఅస్సస్సతుర్ రిసాలా)
దివ్య ఖుర్ఆన్లో అల్లాహ్ సెలవిచ్చాడు:
{لا خَيْرَ فِي كَثِيرٍ مِنْ نَجْوَاهُمْ إِلَّا مَنْ أَمَرَ بِصَدَقَةٍ أَوْ مَعْرُوفٍ أَوْ إِصْلاحٍ بَيْنَ النَّاسِ} [النساء:١١٤]
"ప్రజలు జరిపే రహస్య సమాలోచనల్లో సాధారణంగా ఏ మేలూ ఉండదు. కాని ఎవరైనా రహస్యంగా దానధర్మాలు చెయ్యండి అని బోధిస్తే లేక ఏదైనా సత్కార్యం కొరకు లేదా ప్రజల వ్యవహారాలను చక్కబరిచే ఉద్దేశ్యంతో ఎవరితోనైనా ఏదైనా రహస్యం చెబితే అది మంచి విషయమే." (అన్ నిసా : 114)
వేరొకచోట అల్లాహ్ ఇలా అంటున్నాడు :
{وَالصُّلْحُ خَيْرٌ} [النساء:١٢٨]
"ఏది ఏమైనా (భార్యాభర్తల మధ్య) సర్దుబాటే అన్ని విధాలా ఉత్తమమైనది." (అన్ నిసా : 128)
ఇంకొకచోట ఇలా అంటున్నాడు :
{فَاتَّقُوا اللَّهَ وَأَصْلِحُوا ذَاتَ بَيْنِكُمْ} [الأنفال:١]
"మీ పరస్పర సంబంధాలను సంస్కరించుకోండి." (అల్ అన్ఫాల్ : 1)
ఆయన ఇంకా ఇలా సెలవిస్తున్నాడు :
{إِنَّمَا الْمُؤْمِنُونَ إِخْوَةٌ فَأَصْلِحُوا بَيْنَ أَخَوَيْكُمْ} [الحجرات:١٠]
"విశ్వాసులు పరస్పరం సోదరులు. కనుక మీ సోదరుల మధ్య సంబంధాలను సంస్కరించండి." (అల్ హుజురాత్ : 10)
English
“There is no good in most of their secret talks save (in) him who orders Sadaqah (charity in Allah’s Cause), or Ma`ruf (Islamic Monotheism and all the good and righteous deeds which Allah has ordained), or conciliation between mankind.” [An-Nisā’ 4:114]
“…and making peace is better.” [An-Nisā’ 4:128]
“So fear Allah and adjust all matters of difference among you.” [Al-Anfāl 8:1]
“The believers are nothing else than brothers (in Islamic religion). So make reconciliation between your brothers.” [Al-Ḥujurāt 49:10]
హదీసు 250
وعن أَبي هريرة رضي اللَّه عنه قَالَ: قَالَ رَسُولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "كُلُّ سُلامى مِنَ النَّاسِ عَلَيْهِ صَدَقَةٌ كُلَّ يوْمٍ تَطْلُعُ فِيهِ الشَّمْسُ: تَعْدِلُ بيْن الاثْنَيْنِ صَدقَةٌ، وَتُعِينُ الرَّجُلَ فِي دَابَّتِهِ فَتحْمِلُهُ عَلَيْهَا، أَوْ تَرْفَعُ لَهُ عَلَيْهَا مَتَاعهُ صَدقَةٌ، وَالْكَلِمَةُ الطَّيبةُ صدقَةٌ، وبكُلِّ خَطْوَةٍ تَمْشِيهَا إِلَى الصَّلاةِ صَدقَةٌ، وَتُمِيطُ الأَذَى عَنِ الطَّرِيقِ صَدَقَةٌ" مُتَّفَقٌ عَلَيهِ. "ومعنى تَعْدِلُ بَيْنَهُمَا"تُصْلحُ بَيْنَهُمَا بِالْعَدْلِ.
హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రబోధించారు : ప్రజల (దేహాల్లోని) ప్రతి కీలు తరపున సూర్యుడు ఉదయించే ప్రతిదినమూ తప్పనిసరిగా సదఖా (సత్కార్యం) చేయాలి. ఇద్దరు వ్యక్తుల మధ్య న్యాయమైన తీర్పుతో రాజీకుదర్చడం కూడా సదఖాయే (సత్కార్యమే) అవుతుంది. నీవు ఎవరినైనా అతని వాహనం మీద కూర్చోబెట్టడం లేదా అతని సామానును అతని వాహనంపై ఎక్కించటంలో సహాయపడటం కూడా సత్కార్యమే. ఒక మంచి మాట పలకటం కూడా సత్కార్యమే. నమాజు కోసం మస్జిద్కు వెళుతున్నప్పుడు నీవు వేసే ప్రతి అడుగూ సత్కార్యమే. దారినుండి ప్రజలకు హాని కలిగించే వస్తువుని తొలగించటం కూడా సత్కార్యంగానే పరిగణించబడుతుంది." (బుఖారీ – ముస్లిం)
'తాదిలు బైనహుమా' అంటే వారిరువురి మధ్య న్యాయబద్ధంగా రాజీ కుదర్చటం అని అర్థం.
(సహీహ్ బుఖారీలోని జిహాద్ ప్రకరణంలోనూ, ఇంకా సహీహ్ ముస్లింలోని జకాత్ ప్రకరణంలోనూ ఈ హదీసు ఉంది.)
English
Abu Hurairah (radiyallahu anhu) reported: Messenger of Allah ﷺ said, “On every joint of man, there is charity, on everyday when the sun rises: doing justice between two men is charity, and assisting a man to ride an animal or to load his luggage on it is charity; and a good word is charity, every step which one takes towards (the mosque for) Salat is charity, and removing harmful things from the way is charity”.[Al-Bukhari and Muslim].
ముఖ్యాంశాలు
మనిషి దేహంలోని ప్రతి అవయవం కదలటానికి, పని చేయటానికి వీలుగా దేవుడు ఎన్నో కీళ్ళు సృష్టించాడు. ఈ కీళ్ళ ఆధారంగానే మనిషి నడవటం, కూర్చోవటం, పరుగెత్తటం లాంటి పనులు చేసుకోగలుగుతున్నాడు. ఇవే లేకపోతే మనిషి బొమ్మలా ఎక్కడ వేస్తే అక్కడ కదలకుండా పడుండేవాడు. కాని దేవుడు మనిషికి కీళ్ళు ప్రసాదించి మహోపకారం చేశాడు. దానికిగాను అతను తప్పకుండా దైవానికి కృతజ్ఞతలు తెలుపుకోవాలి. మనిషి దేహంలో మొత్తం మూడువందల అరవై కీళ్ళు ఉంటాయని వేరొక హదీసు ద్వారా తెలుస్తోంది.
దేవుడు చేసిన మరో మహోపకారం ఏమిటంటే, మనిషి ఈ అనుగ్రహాలకు కృతజ్ఞతలు తెలుపుకునేందుకు అత్యంత సులువైన మార్గాన్ని సూచించాడు. పైన హదీసులో పేర్కొనబడిన సత్కార్యాలను ధనిక బీద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ చేయగలరు. కొన్ని ఉల్లేఖనాల్లోనయితే సూర్యోదయం అయిన తరువాత రెండు రకాతుల నమాజ్ చేసుకున్నా ఆ విధి నెరవేరుతుందని చెప్పబడింది. అసలు ఏమీ చేయలేకపోతే ఇతరులకు హాని కల్గించకుండా జాగ్రత్తపడినా చాలని మరికొన్ని ఉల్లేఖనాలు ఉద్ఘాటిస్తున్నాయి.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|31. ప్రజల మధ్య సయోధ్యకు ప్రయత్నించటం|హదీసు 250
హదీసు 251
وعن أُمِّ كُلْثُومٍ بنتِ عُقْبَةَ بن أَبي مُعَيْطٍ رضي اللَّه عنها قَالَتْ: سمِعْتُ رسولَ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم يَقُولُ: "لَيْسَ الْكَذَّابُ الَّذِي يُصْلحُ بَيْنَ النَّاسِ فَيَنْمي خَيْراً، أَوْ يَقُولُ خَيْراً "مُتَّفَقٌ عَلَيهِ. وفي رواية مسلمٍ زيادة، قَالَتْ: وَلَمْ أَسْمَعْهُ يُرَخِّصُ في شَيْءٍ مِمَّا يَقُولُهُ النَّاسُ إِلاَّ في ثَلاثٍ، تَعْنِي: الحَرْبَ، وَالإِصْلاَحَ بَيْنَ النَّاسِ، وَحَدِيثَ الرَّجُلِ امْرَأَتَهُ، وَحَديثَ المَرْأَةِ زَوْجَهَ.
దైవప్రవక్త ﷺ ప్రవచిస్తూ ఉండగా తాను విన్నానని ఉఖబా బిన్ అబూ ముఐత్ కుమార్తె ఉమ్మె కుల్సూమ్ (రదియల్లాహు అన్హా) తెలియజేశారు: ప్రజల మధ్య సంబంధాలను చక్కదిద్దే (ఉద్దేశ్యంతో వాస్తవానికి విరుద్ధంగా మాట్లాడే)వాడు అబద్ధాలకోరు కాజాలడు. అతను (ఒకరి నుండి మరొకరికి) మంచి మాటలే చేరవేస్తాడు. ఏది చెప్పినా మంచి ఉద్దేశ్యంతోనే చెబుతాడు. (బుఖారీ – ముస్లిం)
ముస్లిం ఉల్లేఖనంలో ఈ వాక్యాలు అదనంగా ఉన్నాయి: ఉమ్మె కుల్సూమ్ అంటున్నారు : దైవప్రవక్త ﷺ ప్రజలకు మూడు విషయాల్లో తప్ప మరే విషయంలోనూ వాస్తవానికి విరుద్ధంగా మాట్లాడేందుకు అనుమతి ఇచ్చినట్లు నేను వినలేదు. ఆ మూడు విషయాలు ఇవి : యుద్ధంలో, ప్రజల మధ్య సంబంధాలను చక్కదిద్దే సమయంలో, మనిషి తన భార్యతోగాని, భార్య తన భర్తతోగాని (పరస్పరం సంతోషపెట్టే ఉద్దేశ్యంతో) సంభాషించుకున్నప్పుడు.
(సహీహ్ బుఖారీలోని ఒప్పందాల ప్రకరణంలోనూ ఇంకా సహీహ్ ముస్లింలోని సత్కార్యాలు – సత్సంబంధాల ప్రకరణంలోనూ ఈ హదీసు ఉంది.)
English
Umm Kulthum bint `Uqbah (radiyallahu anha) reported: Messenger of Allah ﷺ said, ‘The person who (lies) in order to conciliate between people is not a liar, when he conveys good or says (something) good”. [Al-Bukhari and Muslim].
The narration in Muslim added: She said, “I never heard him (she meant the Prophet ﷺ) giving permission of lying in anything except in three (things): war, conciliating between people and the conversation of man with his wife and the conversation of a woman with her husband”.
ముఖ్యాంశాలు
అబద్ధం చెప్పటం నిషిద్ధమే. కాని సమాజంలోని వ్యక్తుల మధ్య సంబంధాలను చక్కదిద్దే ఉద్దేశ్యంతోగాని, దంపతుల మధ్య సుహృద్భావాన్ని నెలకొల్పేందుకు గాని లేదా ప్రజలందరి ప్రయోజనాల దృష్ట్యాగాని అబద్ధం చెప్పటంలో మాత్రం తప్పులేదు. ఈ మూడు సందర్భాల్లో అబద్ధం చెప్పటానికి అనుమతి ఉంది. (1) ఇద్దరు వ్యక్తుల మధ్య విభేదాలు చోటుచేసుకున్నప్పుడు వారిరువురి మధ్య రాజీ కుదిర్చే ఉద్దేశ్యంతో వాళ్ళు చెప్పకపోయినా ఒకరి తరపునుండి మరొకరికి మంచి మాటలు చెప్పటంలో తప్పులేదు. (2) యుద్ధ సమయంలో అవసరమైతే శత్రు సైన్యాన్ని సందిగ్ధంలో పడవేసేందుకు వాస్తవాలను దాచి వుంచుతూ అబద్ధాన్ని ప్రచారం చేయవచ్చు. (3) అదేవిధంగా సంసార రథం సాఫీగా ముందుకు సాగటంకోసం దాంపత్య జీవితంలోని అన్యోన్యతను కాపాడటం కోసం ఒక్కోసారి భర్త భార్యతోగాని, భార్య భర్తతోగాని అబద్ధం చెప్పాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటి సందర్భాల్లో అబద్ధం చెప్పటానికి షరీఅత్ అనుమతిస్తోంది.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|31. ప్రజల మధ్య సయోధ్యకు ప్రయత్నించటం|హదీసు 251
హదీసు 252
وعن عائشة رضي اللَّه عنها قَالَتْ: سمِع رسولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم صَوْتَ خُصُومٍ بالْبَابِ عَالِيةٍ أَصْواتُهُمَا، وَإِذَا أَحَدُهُمَا يَسْتَوْضِعُ الآخَرَ وَيَسْتَرْفِقُهُ فِي شيءٍ، وَهُوَ يَقُولُ: واللَّهِ لا أَفعَلُ، فَخَرَجَ عَلَيْهِمَا رسولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم فَقَالَ: "أَيْنَ الْمُتَأَلِّي عَلَى اللَّه لاَ يَفْعَلُ المَعْرُوفَ؟ "فَقَالَ: أَنَا يَا رسولَ اللَّهِ، فَلهُ أَيُّ ذلِكَ أَحَبَّ. متفقٌ عليه. معنى"يَسْتَوْضِعُهُ": يَسْأَلهُ أَنْ يَضَعَ عَنْهُ بَعْضَ دينِهِ."وَيَسْتَرفقُهُ": يَسْأَلَهُ الرِّفْقَ"والْمُتأَلي": الحَالِفُ.
హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) కథనం : దైవప్రవక్త ﷺ ఇంటి ముందు ఎవరో తగాదాపడి గట్టిగా మాట్లాడుకోవటం విన్నారు. వారిలో ఒకడు రెండవవాడితో తన అప్పులో కొంత వదిలెయ్యమని, తన పట్ల కాస్త మృదువుగా వ్యవహరించమని బ్రతిమాలుతున్నాడు. కాని రెండవ వ్యక్తి మాత్రం "దైవసాక్షి! నేను అలా చేయను" అని అంటున్నాడు. అంతలో దైవప్రవక్త ﷺ బయటకు వచ్చి, "మంచిపని చేయనని దేవుడి మీద ప్రమాణం చేసి మరీ చెబుతున్నాడు! ఎవడతను?" అని అడిగారు. అప్పుడతను (ముందుకు వచ్చి) "నేను దైవప్రవక్తా! (కాని ఇప్పుడు చెబుతున్నాను) తను కోరినట్టే ఇవ్వమనండి" అని తన కఠినవైఖరికి పశ్చాత్తాపపడుతూ అన్నాడు.
(బుఖారీ – ముస్లిం)
'యస్తౌజివుహూ' అంటే అప్పులో కొంత మాఫీ చేయమని అభ్యర్థించటం. 'యస్తర్ఫిఖుహూ' అంటే మృదువుగా వ్యవహరించమని బ్రతిమాలటం. 'ముతఅల్లి' ప్రమాణం చేసేవాడని అర్థం.
(సహీహ్ బుఖారీలోని ఒప్పందాల ప్రకరణంలోనూ ఇంకా సహీహ్ ముస్లింలోని వాణిజ్య ప్రకరణంలోనూ ఈ హదీసు ప్రస్తావించబడి ఉంది.)
English
`Aishah (radiyallahu anha) reported: Messenger of Allah ﷺ heard the voices of altercation of two disputants at the door; both the voices were quite loud. One was asking the other to make his debts little (so that he could pay them) and was pleading with him to show leniency to him, whereupon the (other one) said: “By Allah, I will not do that”. Then there came Messenger of Allah ﷺ to them and said, “Where is he who swore by Allah that he would not do good?” He said: “O Messenger of Allah, it is me. Now he may do as he desires”.[Al-Bukhari and Muslim].
ముఖ్యాంశాలు
- బాకీదారుల పట్ల మృదువైఖరిని అవలంబించాలి. బాకీదారుడు తీసుకున్న అప్పును తీర్చలేడనుకుంటే విశాల హృదయంతో ఆ అప్పులోని కొంతభాగాన్ని మాఫీ చేయాలి లేదా కనీసం అప్పు తీర్చడానికి మరింత గడువు అయినా ఇవ్వాలి. దివ్య ఖుర్ఆన్లో అల్లాహ్, "మీ బాకీదారుడు ఆర్థిక ఇబ్బందులలో ఉంటే, అతని పరిస్థితి మెరుగుపడేవరకు గడువు ఇవ్వండి, లేక మీరు తెలిసినవారే అయితే, ఆ బాకీని అతనికి దానం చేయండి. అది మీకు ఎక్కువ శ్రేయస్కరం" అని ఉపదేశిస్తున్నాడు.
- ఎవరైనా పుణ్య కార్యాలు చేయనని నిర్ణయించుకుంటే అతన్ని మందలించి ఆ నిర్ణయాన్ని మార్చుకునేలా చేయాలి. మంచిపనులు చేయమని ప్రేరేపించాలి.
- మన వీధిలోనే, మన యింటిముందరే, మన కళ్ల ఎదుటే ఎవరైనా తగవులాడుకుంటుంటే చూసి మనకెందుకులే అని ఊరుకోరాదు. వారిని విడిపించటానికి, వారి మధ్య రాజీ కుదర్చటానికి ప్రయత్నించాలి.
- తగవులాడుకునేవారు కూడా మధ్యవర్తులతో సహకరించాలి. అంతేగాని అడ్డొచ్చిన వాళ్ళపై తిరగబడటం తమ కోపాన్ని వాళ్ళపై వెళ్ళగ్రక్కటం చేయరాదు.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|31. ప్రజల మధ్య సయోధ్యకు ప్రయత్నించటం|హదీసు 252
హదీసు 253
وعن أَبي العباس سهلِ بنِ سعدٍ السَّاعِدِيِّ رضي اللَّهُ عنه، أَن رسولَ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم بلَغهُ أَنَّ بَني عَمْرِو بن عوْفٍ كَانَ بيْنهُمْ شَرٌّ، فَخَرَجَ رسولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم يُصْلِحُ بَيْنَهمْ فِي أُنَاسٍ مَعَه، فَحُبِسَ رَسُول اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم وَحَانَتِ الصَّلاَةُ، فَجَاءَ بِلالٌ إِلَى أَبي بَكْرٍ رضي اللَّه عنهما فَقَالَ: يَا أَبَا بَكْرٍ إِنَّ رسولَ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَدْ حُبِسَ، وَحَانَتِ الصَّلاةُ، فَهَلْ لكَ أَنْ تَؤُمَّ النَّاس؟ قَالَ: نَعَمْ إِنْ شِئْتَ، فَأَقَامَ بِلالٌ الصَّلاةَ، وَتقَدَّمَ أَبُو بَكْرٍ فَكَبَّرَ وكبَّرَ النَّاسُ، وَجَاءَ رَسُول اللَّه يمْشِي في الصُّفوفِ حتَّى قامَ في الصَّفِّ، فَأَخَذَ النَّاسُ فِي التَّصْفِيقِ، وكَانَ أَبُو بَكْر رضي اللَّه عنه لا يَلْتَفِتُ فِي صلاتِهِ، فَلَمَّا أَكَثَرَ النَّاسُ التَّصْفِيقَ الْتَفَتَ، فَإِذَا رسولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم، فَأَشَار إِلَيْهِ رسولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم، فَرَفَعَ أَبْو بَكْر رضي اللَّه عنه يدَهُ فَحمِد اللَّه، وَرَجَعَ القَهْقَرَى وَراءَهُ حَتَّى قَامَ فِي الصَّفِّ، فَتَقدَّمَ رَسُول اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم، فَصَلَّى للنَّاسِ، فَلَمَّا فرغَ أَقْبلَ عَلَى النَّاسِ فَقَالَ: " أَيُّهَا النَّاسُ مالَكُمْ حِين نَابَكُمْ شَيْءٌ في الصَّلاَةِ أَخذْتمْ فِي التَّصْفِيقِ؟، إِنَّما التَّصْفِيقُ لِلنِّسَاءِ. منْ نَابُهُ شيءٌ فِي صلاتِهِ فَلْيَقلْ: سُبْحَانَ اللَّهِ؟ فَإِنَّهُ لاَ يَسْمعُهُ أَحدٌ حِينَ يَقُولُ: سُبْحانَ اللَّهِ، إِلاَّ الْتَفَتَ. يَا أَبَا بَكْرٍ: مَا منعَك أَنْ تُصَلِّيَ بِالنَّاسِ حِينَ أَشرْتُ إِلَيْكَ؟ "فَقَالَ أَبُو بكْر: مَا كَانَ ينبَغِي لابْنِ أَبي قُحافَةَ أَنْ يُصلِّيَ بِالنَّاسِ بَيْنَ يَدَيْ رسولِ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم. متفقٌ عَلَيهِ. معنى"حُبِس": أَمْسكُوهُ لِيُضيِّفُوه.
హజ్రత్ అబుల్ అబ్బాస్ సహ్ల్ బిన్ సాద్ సాయిదీ (రదియల్లాహు అన్హు) కథనం : అమ్ర్ బిన్ ఔఫ్ తెగ వారి మధ్య తగాదా జరిగిందని దైవప్రవక్త ﷺకు కబురందింది. ఆయన కొంతమందిని వెంటబెట్టు కొని వారి మధ్య రాజీ కుదిర్చే ఉద్దే శ్యంతో వారి దగ్గరికి వెళ్ళారు. అయితే (కొన్ని కారణాల వల్ల) ఆయన అక్కడే ఆగిపోవలసివచ్చింది. అప్పుడే నమాజు వేళ కూడా అయింది. (మరోవైపు ప్రజలు ఆయన కోసం ఎదురుచూడసాగారు. చాలాసేపు ఎదురుచూసిన తరువాత) బిలాల్ (రదియల్లాహు అన్హు), హజ్రత్ అబూబక్ర్ (రదియల్లాహు అన్హు) దగ్గరికి వెళ్ళి, "(దైవప్రవక్త ఇంకా రాలేదు) ఆయన ﷺ అక్కడే ఆగిపోయినట్టుంది. నమాజ్ వేళ అయింది. మరి మీరు నమాజ్ చేయించగలరా?" అని అడిగారు. దానికాయన "సరే, నీ యిష్టం" అని అన్నారు. బిలాల్ (రదియల్లాహు అన్హు) నమాజ్ కోసం ఇఖామత్ పలికారు. హజ్రత్ అబూబక్ర్ (అందరికన్నా) ముందు నిలబడి 'అల్లాహు అక్బర్' అంటూ నమాజు మొదలెట్టారు. ప్రజలు కూడా 'అల్లాహు అక్బర్' అంటూ ఆయన్ని అనుసరించారు. అంతలోనే దైవప్రవక్త ﷺ పంక్తుల గుండా నడుస్తూ వచ్చి పంక్తిలో నించున్నారు. ప్రజలు (దైవప్రవక్త వచ్చేశారని అబూబక్ర్కు తెలియపరచటానికి) చప్పట్లతో సైగ చేయసాగారు. (కాని అబూబక్ర్ (రదియల్లాహు అన్హు) వినిపించుకోలేదు.) ఆయన నమాజ్ చేస్తున్నప్పుడు దేనివైపూ దృష్టి సారించరు. కాని ప్రజలు చప్పట్లు చరచటం అధికం చేసినప్పుడు ఆయన దృష్టి మళ్ళించారు. వెనుక పంక్తిలో దైవప్రవక్త ఉండటం గమనించి (వెనక్కి జరగబోయారు.) అయితే దైవప్రవక్త ﷺ ఆయన్ని (తన స్థానంలోనే నిలబడమని) సైగ చేశారు. కాని అబూబక్ర్ (రదియల్లాహు అన్హు) మాత్రం (తనను దైవప్రవక్త ﷺ తన సమక్షంలో ప్రజలకు సారధ్యం వహించటానికి యోగ్యుడిగా గుర్తించినందుకు కృతజ్ఞతగా) చెయ్యి ఎత్తి దైవాన్ని స్తుతించారు. తరువాత దైవప్రవక్త ﷺ కన్నా వెనక్కి జరిగి అందరితోపాటు సమానంగా నించున్నారు.
తరువాత దైవప్రవక్త ﷺ ముందుకు వెళ్ళి నమాజు చేయించారు. నమాజు అనంతరం ప్రజలతో ఇలా అన్నారు : "ప్రజలారా! నమాజులో అనూహ్యమైన పరిణామం సంభవించగానే మీరు చప్పట్లు కొడతారేమిటి? చప్పట్లు కొట్టటం స్త్రీల పద్ధతి (అన్న సంగతి మీకు తెలియదా?) కనుక (ఇకనుంచి) నమాజులో ఊహించని సంగతేదైనా జరిగితే 'సుబ్హానల్లాహ్' అనాలి. ఎందుకంటే ఎవరైనా సుబ్హానల్లాహ్ అని అంటే తప్పకుండా దృష్టి మళ్ళిస్తారు."
(ఆ తరువాత అబూబక్ర్ (రదియల్లాహు అన్హు)తో "ఓ అబూబక్ర్! ప్రజలకు నమాజు చేయించమని నేను సైగచేసినప్పటికీ మీరు ఎందుకు ఆగిపోయారు?" అని అడిగారు. దానికి, "దైవప్రవక్త సమక్షంలో అబూ ఖుహాఫా కొడుకు నమాజులో ప్రజలకు సారధ్యం వహించటం సమంజసంగా ఉండదు కదా" అని విన్నవించుకున్నారు హజ్రత్ అబూబక్ర్ (రదియల్లాహు అన్హు).
(బుఖారీ – ముస్లిం)
'హుబిస' అంటే (ఇక్కడ) ఆయనకు అతిథి మర్యాదలు చేయటానికి ఆపివుంచారని అర్థం.
(సహీహ్ బుఖారీలోని 'నమాజులో దొర్లే పొరపాట్ల ఆదేశాలు' ప్రకరణంలోనూ, ఇంకా సహీహ్ ముస్లింలోని నమాజ్ ప్రకరణంలోనూ ఈ హదీసు వచ్చింది.)
English
Sahl bin Sa`d As-Sa`idi (radiyallahu anhu) reported: There was some quarrel among the members of Banu `Amr bin `Auf. Messenger of Allah ﷺ went with some of his Companions to bring about peace between them and he was detained. The time for Salat approached and Bilal (radiyallahu anhuma) went to Abu Bakr (radiyallahu anhu) and said to him: “Messenger of Allah ﷺ has got late and it is the time for Salat. Will you lead Salat?” He said: “Yes, if you desire”. Bilal (radiyallahu anhu) proclaimed the Adhan and then pronounced Iqamah. Abu Bakr (radiyallahu anhu) stepped forward and commenced As-Salat. (He recited Takbir and the people followed him). In the meantime, Messenger of Allah ﷺ arrived and, passing through the rows, took his stand in the first row. The people started clapping. It was the habit of Abu Bakr (radiyallahu anhu) that whenever he started praying, he would never look round. He paid no heed (to the clapping). When the clapping increased, he turned round and saw Messenger of Allah ﷺ. He (the Prophet ﷺ) beckoned him to continue performing Salat. But Abu Bakr (radiyallahu anhu) raised his hands and praised Allah. Then he retreated, taking his steps backwards. When Messenger of Allah ﷺ saw that, he went ahead and led Salat. When he finished Salat, he faced the congregation and said, “Why do you clap when something happens during the Salat. Clapping is only for women. If something happens in the course of Salat you should say, Subhan Allah. It is bound to attract attention. And you, Abu Bakr, what prevented you from carrying on with Salat, after I beckoned to do so?” He said, “It was not becoming for the son of Abu Quhafah to lead Salat in the presence of Messenger of Allah ﷺ”.[Al-Bukhari and Muslim].
ముఖ్యాంశాలు
- బనూ అమ్ర్ బిన్ ఔఫ్ అనేది ఔస్కు చెందిన ఓ పెద్ద తెగ. ఈ తెగలో ఎన్నో కుటుంబాలు ఉండేవి. మదీనా వెలుపల ఖుబా ప్రాంతంలో ఈ తెగవారు నివాసముండేవారు. ఒకసారి ఏదో విషయంలో వారి మధ్య తగాదా వచ్చి, పరస్పరం కొట్టుకోవటం, రాళ్ళు విసురుకోవటం దాకా వెళ్ళింది వ్యవహారం. ఈ సంగతి తెలుసుకొని వెంటనే దైవప్రవక్త ﷺ వారిని విడిపించి, రాజీకుదిర్చే ఉద్దేశ్యంతో కొంతమంది సహచరులను వెంట బెట్టుకొని అక్కడికి చేరుకున్నారు. దీనిద్వారా ముస్లింల మధ్య తగాదాలు జరిగినప్పుడు రాజీ కుదర్చటం చాలా అవసరమని తెలుస్తోంది. ప్రారంభంలోనే రాజీ కుదిర్చితే తగాదా అంతటితో సద్దుమణుగుతుంది. లేకపోతే పరిస్థితి విషమించిన తరువాత ఆ తగాదాను అదుపుచేయటం కష్టతరం కావచ్చు.
- ఒకే నమాజును ఒకడి తరువాత మరొకడు ఇద్దరు ఇమాముల సారధ్యంలో చేయవచ్చు.
- నమాజులో ఇమామ్ను అప్రమత్తం చేయటానికి ముఖ్తదీలు (అనుయాయులు) సుబ్హానల్లాహ్ అనాలి. స్త్రీలయితే చప్పట్లు చరచాలి.
- అవసరమైనప్పుడు నమాజులో కొద్దిగా మళ్ళటంగాని లేదా క్రీగంట చూపులతో చూడటంగాని చేయవచ్చు. అదేవిధంగా ముందుకు వెళ్ళటం, వెనక్కి జరగటం కూడా ధర్మసమ్మతమే. దీనివల్ల నమాజ్ భంగం కాదు.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|31. ప్రజల మధ్య సయోధ్యకు ప్రయత్నించటం|హదీసు 253
You must be logged in to post a comment.