హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: ఇమామ్ అబూ జకరియ్యా యహ్యా బిన్ షరఫ్ అన్ నవవీ (రహ్మతుల్లాహి అలైహి)
ఉర్దూ అనువాదం, వ్యాఖ్యానం: హాఫిజ్ సలాహుద్దీన్ యూసుఫ్ · తెలుగు రూపం: హాఫిజ్ ఎస్.ఎమ్. రసూల్ షర్ఫీ · ప్రకాశకులు: ట్రూత్ పబ్లికేషన్స్, హైదరాబాద్

రియాదుస్ సాలిహీన్ (హదీసు కిరణాలు) – 277వ అధ్యాయం: వాగ్దాన ద్రోహం నిషిద్ధం. ఈ అధ్యాయంలో 2 ఖుర్ఆన్ ఆయతులు, 4 హదీసులు (హదీసు 1586 – 1589) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, ముఖ్యాంశాలు, English అనువాదంతో.
277. వాగ్దాన ద్రోహం నిషిద్ధం
باب تحريم الغَدر
అరబీ పాఠం: రియాదుస్ సాలిహీన్ – తహ్ఖీఖ్: షుఐబ్ అల్ అర్నావూత్ (ముఅస్సస్సతుర్ రిసాలా)
దివ్యఖుర్ఆన్లో అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
{يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا أَوْفُوا بِالْعُقُودِ} [المائدة: ١]
"విశ్వాసులారా! కట్టుబాట్లను పూర్తిగా పాటించండి." (మాయిద: 1)
{وَأَوْفُوا بِالْعَهْدِ إِنَّ الْعَهْدَ كَانَ مَسْؤُولاً} [الإسراء: ٣٤]
"చేసిన వాగ్దానాన్ని నెరవేర్చండి. నిస్సందేహంగా వాగ్దానం విషయంలో మీరు సమాధానం చెప్పవలసి ఉంటుంది." (ఇస్రా:34)
ముఖ్యాంశాలు
వాగ్దానాలు రెండు రకాలు. ఒకరకం వాగ్దానం మానవులు పరస్పరం చేసుకునేది. రెండవది, మానవులు తాము అల్లాహ్ ఏకత్వాన్ని ఆయన ప్రభుత్వాన్ని అంగీకరించి, ఆయన ఆజ్ఞల్ని, ఆదేశాల్ని పాటిస్తామని ఆయనతో చేసిన వాగ్దానం. ఈ రెండు రకాల వాగ్దానాలను బాధ్యతతో నెరవేర్చటం చాలా అవసరం. లేదంటే రేపు ప్రళయ దినాన దాని గురించి నిలదీయటం జరుగుతుంది.
English
“O you who believe! Fulfill (your) obligations.” [Al-Mā’idah 5:1]
“And fulfill (every) covenant. Verily! The covenant will be questioned about.” [Al-Isrā’ 17:34]
హదీసు 1586
وعَنْ عبْدِ اللَّهِ بْنِ عَمْرو بْنِ العاص رضي اللَّه عَنْهُمَا أنَّ رسُولَ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَالَ: "أرْبعٌ مَنْ كُنَّ فيهِ، كانَ مُنَافِقاً خَالِصاً، وَمَنْ كانتْ فِيهِ خَصْلَةٌ مِنْهُنَّ، كانَ فِيهِ خَصْلَةٌ مِنَ النِّفاقِ حتَّى يَدَعَهَا: إِذَا أؤتمِنَ خانَ، وَإِذَا حدَّثَ كَذَب، وَإِذَا عاهَدَ غَدَر، وَإِذَا خَاصَم فَجر". متفقٌ عليه.
హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ అమ్ర్ బిన్ ఆస్ (రదియల్లాహు అన్హుమా) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఈ విధంగా ప్రవచించారు: నాలుగు లక్షణాలున్న వ్యక్తి పచ్చి కపటిగా పరిగణించ బడతాడు. ఒకవేళ వాటిలో ఏ ఒక్క లక్షణం అతనిలో ఉన్నా దాన్ని వదలిపెట్టనంత వరకూ అతనిలో ఒక కపట లక్షణం ఉన్నట్లుగా భావింపబడుతుంది. (ఆ నాలుగు లక్షణాలు ఇవి:) 1) అతనికి ఏదైనా అప్పగిస్తే అందులో అతను ద్రోహానికి పాల్పడతాడు. 2) మాట్లాడితే అబద్ధం చెబుతాడు. 3) వాగ్దానం చేసి ఆ తర్వాత మోసం చేస్తాడు. 4) ఎవరితోనయినా పోట్లాడితే నోరు పారేసుకుంటాడు. (బుఖారీ-ముస్లిం)
(సహీహ్ బుఖారీ-సహీహ్ ముస్లిం)
English
`Abdullah bin `Amr bin Al-`As (radiyallahu anhuma) said: The Messenger of Allah ﷺ said, “Whosoever possesses these four characteristics is a sheer hypocrite; and anyone who possesses one of them possesses a characteristic of hypocrisy till he gives it up. These are: when he is entrusted with something, he proves dishonest; when he speaks, he tells a lie; when he makes a covenant, he proves treacherous; and when he quarrels, he behaves in very imprudent, evil, insulting manner.”[Al-Bukhari and Muslim].
ముఖ్యాంశాలు
ఈ హదీసు ఇంతకుముందు 1544వ హదీసు క్రింద కూడా వచ్చింది. ఇందులో కపట విశ్వాసుల లక్షణాలు వివరించబడ్డాయి. నిజమైన విశ్వాసులు తమలో ఈ లక్షణాలు లేకుండా పవిత్రంగా ఉండాలి. మంచి నడవడికకు విశ్వాసంతో అవినాభావ సంబంధముంటుంది. విశ్వాసమున్నచోట ఉత్తమ నడవడిక కూడా తొణికిసలాడుతూ ఉంటుంది. అలాగే విశ్వాసం లేనిచోట నడవడిక కూడా కానరాదు.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|వారింపబడిన విషయాల ప్రకరణం|277. వాగ్దాన ద్రోహం నిషిద్ధం|హదీసు 1586
హదీసు 1587
وعن ابن مسْعُودٍ، وابنِ عُمرَ، وأنسٍ رضي اللَّه عنهُمْ قَالُوا: قَالَ النبيُّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "لِكُلِّ غَادِرٍ لِوَاءٌ يوْمَ القِيامةِ، يُقَالُ: هذِهِ غَدْرَةُ فُلانٍ" متفقٌ عَلَيْهِ.
హజ్రత్ ఇబ్నెమస్వూద్, ఇబ్నె ఉమర్, అనస్ (రదియల్లాహు అన్హుమ్)ల కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఈ విధంగా ప్రవచించారు: ప్రళయదినాన వాగ్దాన ద్రోహం చేసిన వారిలో ప్రతి ఒక్కరికీ ఒక జెండా ఉంటుంది. "ఇతను ఫలానా వ్యక్తికి వాగ్దాన ద్రోహం చేసినందుకు ఇది గుర్తు" అని ప్రకటించటం జరుగుతుంది. (బుఖారీ-ముస్లిం)
(సహీహ్ బుఖారీ, సహీహ్ ముస్లింలోని జిహాద్ ప్రకరణం)
English
Ibn Mas`ud, Ibn `Umar and Anas (radiyallahu anhum) said: The Prophet ﷺ said, “For every one who breaks his covenant, there will be a (huge) flag on the Day of Resurrection and it will be said: `This flag proclaims a breach of covenant by so-and-so.”’[Al-Bukhari and Muslim].
ముఖ్యాంశాలు
గదర్ అంటే వాగ్దాన భంగం చేయటం, వాగ్దానాన్ని లెక్కచేయకపోవటం అని అర్థం. ప్రళయదినాన ఇలాంటి వాగ్దాన ద్రోహులందరికి అందరిముందు జెండాలు ఇవ్వబడతాయి. అది వారి వాగ్దాన ద్రోహానికి ఒక చిహ్నంగా ఉంటుంది.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|వారింపబడిన విషయాల ప్రకరణం|277. వాగ్దాన ద్రోహం నిషిద్ధం|హదీసు 1587
హదీసు 1588
وَعَنْ أَبي سَعِيدٍ الخُدْرِي رضي اللَّه عَنهُ أنَّ النَّبيَّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَال: لِكُلِّ غَادِرٍ لِواءٌ عِندَ إسْتِه يَوْمَ القِيامةِ يُرْفَعُ لَهُ بِقدْرِ غدْرِهِ، ألاَ وَلاَ غَادر أعْظمُ غَدْراً مِنْ أمِيرِ عامَّةٍ" رواه مسلم.
హజ్రత్ అబూ సయీద్ ఖుద్రీ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఈ విధంగా ప్రవచించారు: ప్రళయదినాన ప్రతి వాగ్దాన ద్రోహి పిరుదుల దగ్గర ఒక జెండా ఉంటుంది. అతని ద్రోహ తీవ్రతను బట్టి అది పైకెత్తబడి ఉంటుంది. వినండి! జనసామాన్య నాయకునికి చేసిన వాగ్దానంలో ద్రోహానికి ఒడిగట్టినవాడి కన్నా పెద్ద వాగ్దానద్రోహి మరొకడు లేడు.
(ముస్లిం)
(సహీహ్ ముస్లింలోని జిహాద్ ప్రకరణం)
English
Abu Sa`id Al-Khudri (radiyallahu anhu) said: The Prophet ﷺ said, “Every one who breaks a covenant will have a flag by his buttocks on the Day of Resurrection. It will be raised higher according to the nature of his breach. Behold, there will be no greater a sin with respect to breaking the covenant than that of a ruler who breaks his covenant with the Muslim masses.”[Muslim].
ముఖ్యాంశాలు
జనసామాన్యానికి నాయకుడంటే సమకాలీన ప్రభుత్వాధిపతి (ఖలీఫా, రాజు, పాలకుడు) లేక అతని ప్రతినిధి అని అర్థం. అతని వాగ్దానాన్ని భంగపరచటమంటే అతనికి విధేయత చూపుతామని చేసిన వాగ్దానాన్ని, ప్రమాణాన్ని భంగపరచి అతనికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయటం. ఇస్లాం ధర్మం ప్రభుత్వాధికారుల్ని విమర్శించమనీ, ఖుర్ఆన్ హదీసుల వెలుగులో వారిని సంస్కరించమని తాకీదు అయితే చేస్తుంది. దానికోసం అది 'మంచిని ఆజ్ఞాపించు చెడుని నివారించు' అనే ప్రతిపాదన కూడా చేస్తుంది. కాని వారి పాప వైఖరిని, దౌర్జన్యాన్ని ఆసరాగా చేసుకొని వారికి చేసిన విధేయతా వాగ్దానాన్ని భంగపరిచి వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయటానికి మాత్రం ఇస్లాం ధర్మం అనుమతించదు. ఎందుకంటే దానిమూలంగా దేశంలో అరాచకం, అశాంతి అలజడులు చెలరేగుతాయి. ఫలితంగా పరిస్థితులు చక్కబడకపోగా మరింత విషమిస్తాయి. ఖలీఫాలకు, సుల్తానులకు వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాటుల చరిత్రను పరిశీలించినా మనకు దీని ప్రయోజన ప్రాముఖ్యతలు బోధపడతాయి. చరిత్రలో ఇప్పటివరకు ఎన్ని తిరుగుబాట్లు జరిగాయో అన్నిట్లోనూ ముస్లిం సమాజానికి లేక ఇస్లాం ధర్మానికి విపరీతమైన నష్టమే తప్ప ఏ ప్రయోజనమూ కలగలేదు.
నేటి ప్రజాస్వామిక వ్యవస్థలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు మొదలగువాటిని ప్రజాస్వామ్యంలో భాగంగా, పైగా ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రాణంగా భావిస్తారు. కాని నిజానికి ఆ విధానం ప్రజాస్వామ్య వ్యవస్థకు కూడా ప్రయోజనదాయకం కాదు. దానివల్ల పరిపాలకుల వైఖరి మారుతుందన్న ఆశ లేదు, దేశానికి, జాతికి కూడా దాని మూలంగా ఎలాంటి ప్రయోజనం ఉండదు. కాని విధ్వంసం మూలంగా ప్రజల ఆస్తులకు, జాతి సంపదకు నష్టం కలుగుతుంది. కొన్నికొన్ని సందర్భాల్లో ప్రాణనష్టం కూడా జరుగుతుంది. కనుక ఈ రాజకీయ నిరసన ప్రదర్శనలు కూడా షరీఅత్ దృష్టిలో కాస్త చర్చించదగినవే. పరిపాలకులకు వ్యతిరేకంగా ఈ విధమైన చర్యలకు పాల్పడటాన్ని ఈ హదీసులో తీవ్రంగా గర్హించటం జరిగింది. కనుక అధికారంలో ఉన్న పాలకుల సంస్కరణ కోసం 'మంచిని ఆజ్ఞాపించి, చెడుని నివారించు' అన్న విధిని నిర్వర్తించటం కోసం మనం వేరొక సముచితమైన మార్గాన్ని అవలంబించాలి. అందులో విమర్శ స్వార్ధ ప్రయోజనాల కోసం కాకుండా సరైన శ్రేయోభిలాషతో, జాతి, దేశ ప్రయోజనాల దృష్టితో జరగాలి. అంతేగాని ఈ ధర్నాలు, రాజకీయ సమ్మెలు, రాస్తారోకోలు షరీఅత్ దృష్టిలోనూ తప్పే. వీటిమూలంగా నష్టమే తప్ప లాభం ఉండదని అనుభవాలు హెచ్చరిస్తున్నాయి.
2) అరబ్బుల్లో వాగ్దాన ద్రోహానికి పాల్పడేవారిని అపఖ్యాతికి, అవమానానికి గురిచేసేందుకు బజార్లలో వారిపేరు మీద జెండాలు నాటే రివాజు ఉండేది. ప్రజలు ఆ పాపాన్ని, దానికి పడే శిక్షను అర్థం చేసుకోవటానికి దేవుడు కూడా వారి రివాజు ప్రకారమే వారికి పరలోకంలో విధించబడనున్న శిక్ష గురించి వివరించాడు.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|వారింపబడిన విషయాల ప్రకరణం|277. వాగ్దాన ద్రోహం నిషిద్ధం|హదీసు 1588
హదీసు 1589
وعنْ أَبي هُرَيرةَ رضي اللَّه عنهُ عن النبيّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَالَ:" قَالَ اللَّه تَعَالَى ثَلاثَةٌ أنا خَصْمُهُمْ يوْمَ القِيَامَةِ: رَجُلٌ أعطَى بي ثُمْ غَدَرَ، وَرجُلٌ بَاعَ حُراً فأَكل ثمنَهُ، ورجُلٌ استَأجرَ أجِيراً، فَاسْتَوْفى مِنهُ، ولَمْ يُعْطِهِ أجْرَهُ" رواه البخاري.
దేవుడు ఈ విధంగా అన్నాడంటూ దైవప్రవక్త ﷺ ప్రవచించారని హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) తెలియజేశారు: ఒకడు నా పేరు మీద వాగ్దానం చేసి మోసం చేసినవాడు. మరొకడు, స్వేచ్ఛాపరుణ్ణి అమ్మి ఆ డబ్బు తిన్నవాడు. ఇంకొకడు, ఒక మనిషిని కూలికి పెట్టుకొని అతనితో బాగా పని చేయించుకుని కూలి ఇవ్వకుండా ఎగవేసినవాడు. ఈ ముగ్గురితో ప్రళయదినాన నేను స్వయంగా గొడవపడతాను. (బుఖారీ)
(సహీహ్ బుఖారీలోని లావాదేవీల ప్రకరణం)
English
Abu Hurairah (radiyallahu anhu) reported: The Prophet ﷺ said, “Allah, the Exalted says: `I will contend on the Day of Resurrection against three (types of) people: One who makes a covenant in My Name and then breaks it; one who sells a free man as a slave and devours his price; and one who hires a workman and having taken full work from him, does not pay him his wages.”’[Al-Bukhari].
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|వారింపబడిన విషయాల ప్రకరణం|277. వాగ్దాన ద్రోహం నిషిద్ధం|హదీసు 1589
You must be logged in to post a comment.