హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: ఇమామ్ అబూ జకరియ్యా యహ్యా బిన్ షరఫ్ అన్ నవవీ (రహ్మతుల్లాహి అలైహి)
ఉర్దూ అనువాదం, వ్యాఖ్యానం: హాఫిజ్ సలాహుద్దీన్ యూసుఫ్ · తెలుగు రూపం: హాఫిజ్ ఎస్.ఎమ్. రసూల్ షర్ఫీ · ప్రకాశకులు: ట్రూత్ పబ్లికేషన్స్, హైదరాబాద్

రియాదుస్ సాలిహీన్ (హదీసు కిరణాలు) – 276వ అధ్యాయం: నకిలీల తయారీ, మోసం చేయటం నిషిద్ధం. ఈ అధ్యాయంలో 1 ఖుర్ఆన్ ఆయతులు, 5 హదీసులు (హదీసు 1581 – 1585) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, ముఖ్యాంశాలు, English అనువాదంతో.
276. నకిలీల తయారీ, మోసం చేయటం నిషిద్ధం
٢٧٦ – باب النهي عن الغش والخِداع
అరబీ పాఠం: రియాదుస్ సాలిహీన్ – తహ్‌ఖీఖ్: షుఐబ్ అల్ అర్నావూత్ (ముఅస్సస్సతుర్ రిసాలా)
దివ్యఖుర్‌ఆన్‌లో అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
{وَالَّذِينَ يُؤْذُونَ الْمُؤْمِنِينَ وَالْمُؤْمِنَاتِ بِغَيْرِ مَا اكْتَسَبُوا فَقَدِ احْتَمَلُوا بُهْتَاناً وَإِثْماً مُبِيناً} [الأحزاب: ٥٨]
"ఏ తప్పూ చేయకపోయినా విశ్వాసులైన స్త్రీ పురుషులకు మనస్తాపం కలిగించేవారు, ఒక పెద్ద అభాండభారాన్ని, ఒక స్పష్టమైన పాపభారాన్ని తమ తలపై మోపుకున్నట్లే." (అల్ అహ్‌జాబ్: 58)
English
“And those who annoy believing men and women undeservedly, bear on themselves the crime of slander and plain sin.” [Al-Aḥzāb 33:58]
హదీసు 1581
وَعَنْ أبي هُرَيرةَ رضي اللَّه عَنه أنَّ رَسُولَ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَالَ: "منْ حمَلَ عَلَيْنَا السِّلاحَ، فَلَيْسَ مِنَّا، ومَنْ غَشَّنَا، فَلَيْسَ مِنَّا" رواه مسلم. وفي روايةٍ لَه أنَّ رَسُول اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم مرَّ عَلى صُبْرَةِ طَعامٍ، فَأدْخَلَ يدهُ فِيهَا، فَنالَتْ أصَابِعُهُ بَلَلاً، فَقَالَ:"مَا هَذَا يَا صَاحِبَ الطَّعَامِ؟ "قَالَ أصَابتْهُ السَّمَاءُ يَا رَسُولَ اللَّه قَالَ:"أفَلا جَعلْتَه فَوْقَ الطَّعَامِ حَتِّى يَراهُ النَّاس، مَنْ غَشَّنَا فَلَيْسَ مِنَّا".
హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఈ విధంగా ప్రవచించారు: మా మీదకు ఆయుధం లేపేవాడు మా (ముస్లింలలోని) వాడుకాదు. మమ్మల్ని మోసం చేసేవాడు మా(లోని) వాడుకాదు.
(ముస్లిం)
ముస్లింలోని వేరొక ఉల్లేఖనంలో ఇలా ఉంది: దైవప్రవక్త ﷺ (ఒకసారి) ఓ ధాన్యపు కుప్ప దగ్గర్నుంచి వెళ్తూ అందులో చెయ్యి ఉంచి చూశారు. వేళ్లకు తడిగా అనిపించింది. అప్పుడాయన "ఓ ధాన్యం మనిషీ! ఏమిటిది?" అని అడిగారు. అందుకతను, "వర్షానికి తడిసిపోయినై దైవప్రవక్తా!" అన్నాడు. అది విని ఆయన "మరయితే దాన్ని ప్రజలకు కనపడేలా పైన ఎందుకుంచలేదూ? (విను) మమ్మల్ని మోసం చేసేవాడు మాలోని వాడుకాడు" అని హెచ్చరించారు.
(సహీహ్ ముస్లింలోని ఈమాన్ ప్రకరణం)
English
Abu Hurairah (radiyallahu anhu) said: The Messenger of Allah ﷺ said, “He who takes up arms against us is none of us; and he who cheats us is none of us.”[Muslim].
Another narration of Muslim is: The Messenger of Allah ﷺ happened to pass by a heap of corn. He thrust his hand in that (heap) and his fingers felt wetness. He said to the owner of that heap of corn, “What is this?” He replied: “O Messenger of Allah! These have been drenched by rainfall.” He remarked, “Why did you not place this (the drenched part of the heap) over the corn so that people might see it? He who deceives is not of us.”
ముఖ్యాంశాలు
1) ఆయుధాలు లేపటమంటే ముస్లిం సంఘానికి ఎదురు తిరగటం, వారి మీద తిరుగుబాటు చేయటం లేదా నిష్కారణంగా ముస్లిం మీద ఖడ్గం, తుపాకీ (రివాల్వర్) మొదలగు ఆయుధాలు సంధించి అతన్ని హత్యచేయటం అని అర్థం. దురదృష్టం కొద్దీ ఈ రోజుల్లో ఈ తరహా ఉగ్రవాదంతో సమాజం అట్టుడికిపోతోంది.
2) నకిలీలు తయారుచేయటం, మోసగించటం లాంటివి అనేక రకాలుగా జరుగుతాయి. వాటిలో ఒకటి ఆంతరంగికమైనది. ఉదా: అసత్యానికి సత్యం ముసుగు తొడిగించటం. రెండోది, భౌతికమైనది, బాహ్యపరమైనది. ఉదా: సరుకులో ఏదైనా లోపముంటే దాన్ని బహిర్గతం చేయకుండా అమ్మేయటం. తూకం ఎక్కువ రావాలన్న ఉద్దేశ్యంతో మంచి సరుకులో నాశిరకపు లేదా ఇతర వస్తువులేవయినా కలిపేయటం. ఇలాంటి ఉదాహరణలు మనం ఎన్నో పేర్కొనవచ్చు.
3) మా వాడు కాడు అంటే మా ముస్లింల విధానంపై లేడు. అతను అనుసరిస్తున్న ఈ వైఖరి విశ్వసనీయమైనది కాదు, విశ్వాసఘాతుకంతో కూడుకున్నది అని అర్థం. కనుక ప్రతి ముస్లిం అన్నిరకాల మోసపూరిత విధానాలకు దూరంగా ఉండాలన్నది ఈ హదీసు ఉద్దేశ్యం.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|వారింపబడిన విషయాల ప్రకరణం|276. నకిలీల తయారీ, మోసం చేయటం నిషిద్ధం|హదీసు 1581
హదీసు 1582
وَعَنْهُ أنَّ رَسُولَ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَال:"لاَ تَنَاجشُوا" متفقٌ عَلَيْهِ.
హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు)గారే చేసిన వేరొక కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రబోధించారు: కొనుగోలు చేయాలన్న ఉద్దేశ్యం లేకపోయినా (వస్తువు ధరపెంచే నెపంతో) ఎక్కువ ధరకు బేరమాడకండి.
(బుఖారీ-ముస్లిం)
(సహీహ్ బుఖారీ, సహీహ్ ముస్లింలోని లావాదేవీల ప్రకరణం)
English
Abu Hurairah (radiyallahu anhu) said: The Messenger of Allah ﷺ said, “Do not practise Najsh (to cheat).”[Muslim].
ముఖ్యాంశాలు
ఈ హదీసు ఇంతకుముందు కూడా వచ్చింది. ఒక మనిషి ఒక వస్తువును కొనుగోలు చేసే ఉద్దేశ్యం లేకపోయినా దాన్ని ఎక్కువ ధరకు బేరమాడతాడు. దానివల్ల అసలు కొనుగోలుదారుడు మోసపోతాడు. దాని వాస్తవ ధరకన్నా చాలా ఎక్కువ ధరకు దాన్ని కొనుగోలు చేయవలసి వస్తుంది. ఇదీ ఒక రకంగా మోసమే కనుక ముస్లింలు ఇందుకు దూరంగా ఉండాలి.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|వారింపబడిన విషయాల ప్రకరణం|276. నకిలీల తయారీ, మోసం చేయటం నిషిద్ధం|హదీసు 1582
హదీసు 1583
وَعَنْ ابنِ عُمر رضي اللَّه عَنْهُمَا، أنَّ النبيَّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم نَهَى عن النَّجَشِ. متفقٌ عَلَيْهِ.
హజ్రత్ ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హుమా) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ 'నజష్'ను (మోసపుచ్చే ఉద్దేశ్యంతో ధర ఎక్కువ పలికించటాన్ని) వారించారు.
(బుఖారీ-ముస్లిం)
(సహీహ్ బుఖారీ, సహీహ్ ముస్లింలోని లావాదేవీల ప్రకరణం)
English
Ibn `Umar (radiyallahu anhuma) said: The Messenger of Allah ﷺ prohibited the practice of Najsh.[Al-Bukhari and Muslim].
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|వారింపబడిన విషయాల ప్రకరణం|276. నకిలీల తయారీ, మోసం చేయటం నిషిద్ధం|హదీసు 1583
హదీసు 1584
وعَنْهُ قَالَ: ذَكَرَ رَجُلٌ لِرَسُولِ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم أنَّهُ يُخْدعُ في البُيُوعِ؟ فَقَالَ رَسُولُ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "منْ بايَعْتَ، فَقُلْ لاَ خِلابَةَ" متفقٌ عَلَيْهِ. "الخِلابةُ"بخاءٍ معجمةٍ مكسورةٍ، وباءٍ موحدة: وهي الخدِيعةُ.
హజ్రత్ ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హుమా)గారే చేసిన కథనం: ఒక వ్యక్తి దైవప్రవక్త ﷺతో మాట్లాడుతూ తాను క్రయవిక్రయాల్లో ఎల్లప్పుడూ మోసపోతుంటానని చెప్పాడు. అందుకు దైవప్రవక్త ﷺ అతనికి "(ఇకముందు) నువ్వు లావాదేవీలు జరిపితే 'మోసం ఉండకూడదు' అని చెప్పెయ్యి" అని ఉపదేశించారు. (బుఖారీ-ముస్లిం)
(సహీహ్ బుఖారీ, సహీహ్ ముస్లింలోని లావాదేవీల ప్రకరణం)
English
Ibn `Umar (radiyallahu anhuma) said: A man mentioned to the Messenger of Allah ﷺ that he was often deceived in dealings. The Messenger of Allah ﷺ said to him, “When you enter into a transaction you should say: “There should be no deception.”’[Al-Bukhari and Muslim].
ముఖ్యాంశాలు
పై హదీసులోని 'మోసం ఉండకూడదు' అనే వాక్యం వినియోగదారుని ఎంపిక హక్కుని సూచిస్తోంది. అంటే సరుకులో ఏదయినా మోసం ఉందని తెలిస్తే కొనుగోలు దారునికి ఆ సరుకును వాపసు చేసే హక్కుంటుంది. అమ్మకం దారులు కూడా కొనుగోలుదారులకు చెందిన ఆ హక్కును గౌరవించాలి.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|వారింపబడిన విషయాల ప్రకరణం|276. నకిలీల తయారీ, మోసం చేయటం నిషిద్ధం|హదీసు 1584
హదీసు 1585
وَعَنْ أَبي هُرَيْرَةَ رضي اللَّه عَنهُ قَال: قَالَ رَسُولُ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "مَنْ خَبَّب زَوْجَة امْرِيءٍ، أوْ ممْلُوكَهُ، فَلَيْسَ مِنَّا" رواهُ أَبُو داود. "خَبب"بخاءٍ معجمة، ثُمَّ باءٍ موحدة مكررة: أيْ: أفسدَهُ وخدعَهُ.
హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఈ విధంగా ప్రవచించారు: ఒకరి భార్యను లేక బానిసను మోసగించేవాడు మాలోని వాడు కాడు. (అబూదావూద్)
(సుననె అబూదావూద్‌లోని అదబ్ ప్రకరణం)
English
Abu Hurairah (radiyallahu anhu) said: The Messenger of Allah ﷺ said, “He who deceives another’s wife or his slave is none of us.”[Abu Dawud].
ముఖ్యాంశాలు
ఒకరి భార్యను లేక బానిసను తన భర్తకు లేదా యజమానికి వ్యతిరేకంగా పురికొల్పటం, వారి మధ్య అపార్థాలు సృష్టించి వారికి ఒండొకరి మీద ద్వేషం కలిగేలా చేయటం చాలా పెద్దపాపం. విశ్వాసి అనేవాడు ప్రజల మధ్య సత్సంబంధాలు ఏర్పరచాలిగాని ఉన్న సంబంధాల్ని చెడగొట్టరాదు.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|వారింపబడిన విషయాల ప్రకరణం|276. నకిలీల తయారీ, మోసం చేయటం నిషిద్ధం|హదీసు 1585
You must be logged in to post a comment.