హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) – 274. ముస్లింకు బాధ కలిగిందని సంబరపడిపోవటం తగదు

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: ఇమామ్ అబూ జకరియ్యా యహ్యా బిన్ షరఫ్ అన్ నవవీ (రహ్మతుల్లాహి అలైహి)
ఉర్దూ అనువాదం, వ్యాఖ్యానం: హాఫిజ్ సలాహుద్దీన్ యూసుఫ్ · తెలుగు రూపం: హాఫిజ్ ఎస్.ఎమ్. రసూల్ షర్ఫీ · ప్రకాశకులు: ట్రూత్ పబ్లికేషన్స్, హైదరాబాద్

రియాదుస్ సాలిహీన్ – హదీసు కిరణాలు (ఇమామ్ నవవీ) – అరబీ, తెలుగు, English

రియాదుస్ సాలిహీన్ (హదీసు కిరణాలు) – 274వ అధ్యాయం: ముస్లింకు బాధ కలిగిందని సంబరపడిపోవటం తగదు. ఈ అధ్యాయంలో 2 ఖుర్ఆన్ ఆయతులు, 1 హదీసులు (హదీసు 1579) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, ముఖ్యాంశాలు, English అనువాదంతో.

274. ముస్లింకు బాధ కలిగిందని సంబరపడిపోవటం తగదు

↑ విషయ సూచిక

باب النهي عن إظهار الشماتة بِالمُسْلِم

అరబీ పాఠం: రియాదుస్ సాలిహీన్ – తహ్‌ఖీఖ్: షుఐబ్ అల్ అర్నావూత్ (ముఅస్సస్సతుర్ రిసాలా)

దివ్యఖుర్‌ఆన్‌లో అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

{إِنَّمَا الْمُؤْمِنُونَ إِخْوَةٌ} [الحجرات: ١٠]

"విశ్వాసులు పరస్పరం అన్నదమ్ములు." (హుజురాత్:10)

{إِنَّ الَّذِينَ يُحِبُّونَ أَنْ تَشِيعَ الْفَاحِشَةُ فِي الَّذِينَ آمَنُوا لَهُمْ عَذَابٌ أَلِيمٌ فِي الدُّنْيَا وَالآخِرَةِ} [النور: ١٩]

"విశ్వాసుల్లో అశ్లీలత వ్యాపించాలని కోరేవారు, ప్రపంచంలోనూ, పరలోకంలోనూ వ్యథాభరితమైన శిక్షకు అర్హులు." (నూర్: 19)

English

“The believers are nothing else than brothers (in Islamic religion).” [Al-Ḥujurāt 49:10]

“Verily, those who like that (the crime of) illegal sexual intercourse should be propagated among those who believe, they will have a painful torment in this world and in the Hereafter.” [An-Nūr 24:19]

1579

హదీసు 1579

وعنْ وَاثِلةَ بنِ الأسْقَعِ رضي اللَّه عنْهُ قالَ: قَالَ رسُولُ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: " لا تُظْهِرِ الشَّمَاتَة لأَخِيكَ فَيرْحمْهُ اللَّهُ وَيبتَلِيكَ" رواه الترمذي وقال: حديث حسنٌ. وفي الباب حديثُ أَبي هريرةَ السابقُ في باب التَّجَسُّسِ: "كُلُّ المُسْلِمِ على المُسْلِمِ حرَامٌ"الحديث.

హజ్రత్ వాసిలా బిన్ అస్‌ఖా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రబోధించారు: నీ సోదరునికి బాధ కలిగిందని సంబరపడిపోకు. దేవుడు అతని మీద దయజూపి నిన్ను పరీక్షకు గురిచేయగలడు.

(తిర్మిజీ-హసన్)

(సుననె తిర్మిజీలోని సిఫతుల్ ఖియామా అధ్యాయాలు)

English

Wathilah bin Al-Asqa` (radiyallahu anhu) said: The Messenger of Allah ﷺ said, “Do not express pleasure at the misfortune of a (Muslim) brother lest Allah should bestow mercy upon him and make you suffer from a misfortune.”[At-Tirmidhi].

ముఖ్యాంశాలు

నిజమైన విశ్వాసి తోటి విశ్వాసి బాధల్లో ఉంటే అతని బాధను తన బాధగా భావిస్తాడు. అతను సంతోషంగా ఉన్నప్పుడు అతని సంతోషంలో పాలుపంచుకుంటాడు. అంతేగాని ఇతరులు బాధల్లో ఉండటం చూసి తను సంతోషంతో కేరింతలు కొట్టడు. అది విశ్వాసి నైతికతకే విరుద్ధం. ఈ వైఖరిని దేవుడు చాలా అసహ్యించుకుంటాడు. అంతేకాదు ఆయన తలచుకుంటే ఆ ఆనందరాయుణ్ణి ఇహలోకంలోనే ఏదో ఒక కష్టానికి గురిచేసి తగిన శాస్తి చేయగలడు.

ఇమామ్ నవవీ (రహిమహుల్లాహ్) ఇలా అంటున్నారు: ఇంతకుముందు 'గూఢచర్యం' అధ్యాయంలో వచ్చిన "ప్రతి ముస్లిం ఇతర ముస్లిం పాలిట నిషేధితుడు (గౌరవనీయుడు)" అన్న అబూహురైరా హదీసు ఈ అధ్యాయానికి కూడా వర్తిస్తుంది.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|వారింపబడిన విషయాల ప్రకరణం|274. ముస్లింకు బాధ కలిగిందని సంబరపడిపోవటం తగదు|హదీసు 1579