హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: ఇమామ్ అబూ జకరియ్యా యహ్యా బిన్ షరఫ్ అన్ నవవీ (రహ్మతుల్లాహి అలైహి)
ఉర్దూ అనువాదం, వ్యాఖ్యానం: హాఫిజ్ సలాహుద్దీన్ యూసుఫ్ · తెలుగు రూపం: హాఫిజ్ ఎస్.ఎమ్. రసూల్ షర్ఫీ · ప్రకాశకులు: ట్రూత్ పబ్లికేషన్స్, హైదరాబాద్

రియాదుస్ సాలిహీన్ (హదీసు కిరణాలు) – 273వ అధ్యాయం: ముస్లింలను చులకనగా చూడటం నిషిద్ధం. ఈ అధ్యాయంలో 2 ఖుర్ఆన్ ఆయతులు, 3 హదీసులు (హదీసు 1576 – 1578) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, ముఖ్యాంశాలు, English అనువాదంతో.
273. ముస్లింలను చులకనగా చూడటం నిషిద్ధం
باب تحريم احتقار المسلمين
అరబీ పాఠం: రియాదుస్ సాలిహీన్ – తహ్ఖీఖ్: షుఐబ్ అల్ అర్నావూత్ (ముఅస్సస్సతుర్ రిసాలా)
దివ్యఖుర్ఆన్లో అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
{يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا لاَ يَسْخَرْ قَوْمٌ مِنْ قَوْمٍ عَسَى أَنْ يَكُونُوا خَيْراً مِنْهُمْ وَلا نِسَاءٌ مِنْ نِسَاءٍ عَسَى أَنْ يَكُنَّ خَيْراً مِنْهُنَّ وَلا تَلْمِزُوا أَنْفُسَكُمْ وَلا تَنَابَزُوا بِالْأَلْقَابِ بِئْسَ الِاسْمُ الْفُسُوقُ بَعْدَ الأِيمَانِ وَمَنْ لَمْ يَتُبْ فَأُولَئِكَ هُمُ الظَّالِمُونَ} [الحجرات: ١١]
"విశ్వాసులారా! పురుషులు ఇతర పురుషులను ఎగతాళి చేయకూడదు. వీరికంటే వారే శ్రేష్ఠులై ఉండవచ్చు. అలాగే స్త్రీలు ఇతర స్త్రీలను ఎగతాళి చేయకూడదు. వీరికంటే వారే శ్రేష్ఠురాండ్రయి ఉండవచ్చు. ఒకరినొకరు ఎత్తిపొడుచుకోకండి. ఒకరినొకరు చెడ్డ పేర్లతో పిలుచుకోకండి. విశ్వసించిన తర్వాత చెడ్డతనంలో పేరు సంపాదించటం చాలా నీచమైన విషయం. ఈ వైఖరిని మానుకోనివారే దుర్మార్గులు." (హుజురాత్: 11)
{وَيْلٌ لِكُلِّ هُمَزَةٍ لُمَزَةٍ} [الهمزة: ١]
"ప్రజలను దెప్పిపొడవటంలో, పరోక్షంగా వారి లోపాలను ఎంచటంలో ఆసక్తి కనబరిచేవాడు సర్వనాశనమయి పోతాడు." (అల్ హుమజహ్:1)
English
“O you who believe! Let not a group scoff at another group; it may be that the latter are better than the former. Nor let (some) women scoff at other women; it may be that the latter are better than the former. Nor defame one another, nor insult one another by nicknames. How bad is it to insult one’s brother after having Faith [i.e., to call your Muslim brother (a faithful believer) as: `O sinner’, or `O wicked’]. And whosoever does not repent, then such are indeed Zalimun (wrongdoers).” [Al-Ḥujurāt 49:11]
“Woe to every slanderer and backbiter.” [Al-Humazah 104:1]
హదీసు 1576
وعنْ أبي هُرَيرة رضي اللَّه عَنْهُ أنَّ رَسُولَ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قالَ "بِحَسْبِ امْرِيءٍ مِنَ الشَّرِّ أنْ يحْقِرَ أخَاهُ المُسْلِمَ" رواه مسلم، وقد سبق قرِيباً بطوله.
హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఈ విధంగా ప్రవచించారు: తోటి ముస్లిం సోదరుణ్ణి చులకనగా చూడటం చాలు అతను చెడ్డవాడు అని చెప్పటానికి. (ముస్లిం- ఈ హదీసు సవివరంగా ఇంతకు కొద్దిముందే గడిచింది.)
English
Abu Hurairah (radiyallahu anhu) said: The Messenger of Allah ﷺ said, “It is enough evil for a Muslim to look down upon his (Muslim) brother.”[Muslim].
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|వారింపబడిన విషయాల ప్రకరణం|273. ముస్లింలను చులకనగా చూడటం నిషిద్ధం|హదీసు 1576
హదీసు 1577
وعَن ابْنِ مسعُودٍ رضي اللَّه عنهُ، عن النَّبيّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قالَ: "لاَ يَدْخُلُ الجَنَّةَ منْ كَانَ في قَلْبِهِ مِثْقَالُ ذَرَّةٍ مِنْ كِبْرٍ،"فَقَالَ رَجُلٌ: إنَّ الرَّجُلَ يُحِبُّ أنْ يَكُونَ ثَوْبُهُ حَسناً، ونَعْلُهُ حَسَنَةً، فَقَالَ:"إنَّ اللَّه جَمِيلٌ يُحِبُّ الجَمَال، الكِبْرُ بَطَرُ الحَقِّ، وغَمْطُ النَّاسِ" رواه مسلم. وَمَعْنَى"بَطَرُ الحَقِّ": دَفْعه،"وغَمْطُهُم": احْتِقَارهُمْ، وقَدْ سَبَقَ بيانُهُ أوْضَح مِنْ هَذا في باب الكِبرِ.
హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ మస్వూద్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ (తన సహచరులకు హితోపదేశం చేస్తూ) "మనిషి మనసులో లేశమాత్రం గర్వమున్నా అతను స్వర్గంలోకి ప్రవేశించలేడు" అని అన్నారు. అది విని ఒక వ్యక్తి (సందేహపడుతూ) "మనిషి తన బట్టలూ, చెప్పులు నీటుగా ఉండాలని కోరుకుంటాడు (మరి ఇది కూడా గర్వమేనా దైవవ్రపక్తా!)" అని అడిగాడు. అందుకాయన బదులిస్తూ, "దేవుడు సుందర స్వరూపుడు. సౌందర్యాన్ని ఇష్టపడతాడు. (గర్వం అంటే అది కాదు). వాస్తవానికి గర్వమంటే సత్యాన్ని త్రోసిపుచ్చటం, ప్రజల్ని నీచులుగా భావించటం" అని చెప్పారు. (ముస్లిం)
బత్రుల్ హఖ్ అంటే సత్యాన్ని తృణీకరించటం, "గమ్తుహుమ్" అంటే ప్రజల్ని చులకనగా చూడటం అని అర్థం. ఈ హదీసు గురించి ఇంతకు ముందు 'గర్వం' అనే అధ్యాయంలో మరింత వివరంగా చర్చించటం జరిగింది.
(సహీహ్ ముస్లింలోని ఈమాన్ ప్రకరణం)
English
Ibn Mas`ud (radiyallahu anhu) said: The Prophet ﷺ said, “The haughty, even with pride equal to a mustard seed in his heart, will not enter Jannah.” A man enquired: “What about that a person likes fine dress and fine shoes?” He said: “Allah is Beautiful and likes beauty. Pride amounts to disclaiming truth out of self-esteem, and despising people .”[Muslim].
ముఖ్యాంశాలు
ఈ హదీసు ఇంతకుముందు 'గర్వాహంకారాలను ప్రదర్శించటం నిషిద్ధం' అనే అధ్యాయంలో కూడా వచ్చింది. (మొదటి భాగంలోని 612వ హదీసు చూడండి) గ్రంథకర్త ఇమామ్ నవవీ (రహిమహుల్లాహ్) 'బత్రుల్ హఖ్' అనేమాటకు 'దఫ్వుల్ హఖ్' అని తర్జుమా చేశారు. దాని అర్థం సత్యాన్ని దాటవేయటం, మాటకు ఎదురుచెప్పటం. దీనికి కూడా సత్యానికి దూరంగా ఉండటం, దాన్ని తృణీకరించటం అనే భావమే వస్తుంది. మొత్తానికి చెప్పొచ్చేదేమిటంటే కేవలం మంచి దుస్తులు ధరించినంత మాత్రాన అది గర్వం అయిపోదు. చాలామంది దాన్నే గర్వంగా భావిస్తున్నారు. నిజానికి గర్వమంటే ఏమిటో పై హదీసులో సూచించటం జరిగింది.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|వారింపబడిన విషయాల ప్రకరణం|273. ముస్లింలను చులకనగా చూడటం నిషిద్ధం|హదీసు 1577
హదీసు 1578
وعن جُنْدُبِ بن عبدِ اللَّه رضي اللَّه عنهُ قالَ: قالَ رسولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "قالَ رَجُلٌ: واللَّهِ لا يَغْفِرُ اللَّه لفُلانٍ، فَقَالَ اللَّه عَزَّ وَجَلَّ: مَنْ ذا الَّذِي يَتَأَلَّى عليَّ أنْ لا أغفِرَ لفُلانٍ إنِّي قَد غَفَرْتُ لَهُ، وًَأَحْبَطْتُ عمَلَكَ" رواه مسلم.
హజ్రత్ జుందుబ్ బిన్ అబ్దుల్లాహ్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రబోధించారు: ఒకవ్యక్తి "అల్లాహ్ సాక్షి! అల్లాహ్ ఫలానా వ్యక్తిని క్షమించడు" అని అంటే, దానికి దేవుడు "నేను ఫలానా వ్యక్తిని క్షమించనని ప్రమాణం చేయటానికి నువ్వెవరివి? నేను అతన్ని క్షమించి నీ కర్మల్ని నాశనం చేస్తాను జాగ్రత్త!" అని అంటాడు.
(సహీహ్ ముస్లింలోని బిర్ర్ ప్రకరణం)
English
Jundub bin `Abdullah (radiyallahu anhu) reported: The Messenger of Allah ﷺ said, “Once someone said: `By Allah! Allah will not forgive such and such (a person).’ Thereupon Allah, the Exalted and the Glorious, said: `Who is he who takes an oath in My Name that I will not grant pardon to so-and-so? I have granted pardon to so-and-so and rendered your good deeds fruitless.”’[Muslim].
ముఖ్యాంశాలు
కొంతమంది తమ ఆరాధనను, ధర్మపరాయణతను తలచుకొని మిడిసిపాటుకు లోనై ఇతరుల విషయంలో దురనుమానాలకు లోనవుతుంటారు. ఫలానా వారిని దేవుడు ఎన్నటికీ క్షమించడని ఎంతో నమ్మకంగా చెబుతారు. ఈ ధోరణి దేవుని ఔన్నత్యం పట్ల అగౌరవాన్ని, మితిమీరిన స్వీయ సదభిప్రాయాన్ని సూచిస్తుంది. దీనిని దేవుడు ఇష్టపడడు. ఆయన తలచుకుంటే ఆ ఆరాధకుని, దైవభీతిపరుని కర్మలన్నింటినీ వ్యర్ధం చేసేసి అతన్ని నరకంలో పడేయగలడు. అతనికి భిన్నంగా అతను ఎవరిగురించి అయితే దేవుడు క్షమించడని ఒట్టేశాడో అతన్ని మన్నించి స్వర్గానికి పంపగలడు. కనుక మనిషి తన ఆరాధనను చూసుకొని మిడిసిపాటుకులోనై ఇతరుల్ని అల్పులుగా భావించరాదు.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|వారింపబడిన విషయాల ప్రకరణం|273. ముస్లింలను చులకనగా చూడటం నిషిద్ధం|హదీసు 1578
You must be logged in to post a comment.