హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: ఇమామ్ అబూ జకరియ్యా యహ్యా బిన్ షరఫ్ అన్ నవవీ (రహ్మతుల్లాహి అలైహి)
ఉర్దూ అనువాదం, వ్యాఖ్యానం: హాఫిజ్ సలాహుద్దీన్ యూసుఫ్ · తెలుగు రూపం: హాఫిజ్ ఎస్.ఎమ్. రసూల్ షర్ఫీ · ప్రకాశకులు: ట్రూత్ పబ్లికేషన్స్, హైదరాబాద్

రియాదుస్ సాలిహీన్ (హదీసు కిరణాలు) – 263వ అధ్యాయం: అబద్ధపు సాక్ష్యం తీవ్రంగా నిషేధించబడింది. ఈ అధ్యాయంలో 5 ఖుర్ఆన్ ఆయతులు, 1 హదీసులు (హదీసు 1552) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, ముఖ్యాంశాలు, English అనువాదంతో.
263. అబద్ధపు సాక్ష్యం తీవ్రంగా నిషేధించబడింది
باب بيان غلظ تحريم شهادة الزُّور
అరబీ పాఠం: రియాదుస్ సాలిహీన్ – తహ్ఖీఖ్: షుఐబ్ అల్ అర్నావూత్ (ముఅస్సస్సతుర్ రిసాలా)
{وَاجْتَنِبُوا قَوْلَ الزُّورِ} [الحج: ٣٠]
దివ్యఖుర్ఆన్లో అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: "మీరు అబద్ధపు మాటలు పలక్కండి." (అల్హజ్: 30)
{وَلا تَقْفُ مَا لَيْسَ لَكَ بِهِ عِلْمٌ} [الإسراء: ٣٦]
"మీకు తెలియని విషయం వెంట పడకండి." (బనీ ఇస్రాయీల్:36)
{مَا يَلْفِظُ مِنْ قَوْلٍ إِلاَّ لَدَيْهِ رَقِيبٌ عَتِيدٌ} [ق: ١٨]
"మనిషి నోటి నుండి వెడలే ప్రతి మాటనూ వ్రాయటానికి అనుక్షణం ఒక పరిశీలకుడు సిద్ధంగా ఉంటాడు." (ఖాఫ్: 18)
{إِنَّ رَبَّكَ لَبِالْمِرْصَادِ} [الفجر: ١٤]
"నీ ప్రభువు మాటేసి ఉన్నాడు." (ఫజ్ర్:14)
{وَالَّذِينَ لاَ يَشْهَدُونَ الزُّورَ} [الفرقان: ٧٢]
"(విశ్వాసులు) అబద్ధపు సాక్ష్యాలు ఇవ్వరు." (ఫుర్ఖాన్:72)
English
“And shun lying speech (false statements).” [Al-Ḥajj 22:30]
“And follow not (O man, i.e., say not or do not or witness not) that of which you have no knowledge.” [Al-Isrā’ 17:36]
“Not a word does he (or she) utter, but there is a watcher by him ready (to record it).” [Qāf 50:18]
“Verily, your Rubb is Ever Watchful (over them).” [Al-Fajr 89:14]
“And those who do not witness falsehood…” [Al-Furqān 25:72]
హదీసు 1552
وعن أَبي بكْرةَ رضي اللَّه عَنْهُ قَالَ: قالَ رسولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "ألا أُنبِّئكُم بِأكْبَرِ الكَبائِر؟ قُلنَا: بَلَى يَا رسولَ اللَّهِ. قَالَ:"الإشراكُ باللَّه، وعُقُوقُ الوالِديْنِ"وكان مُتَّكِئا فَجلَس، فَقَالَ:"ألاَ وقَوْلُ الزُّورِ، وشهادةُ الزورِ"فَمَا زَالَ يُكَرِّرُهَا حَتَّى قلنا: لَيْتَهُ سكَت. متفق عليه.
హజ్రత్ అబూ బక్రా (రదియల్లాహు అన్హు) ప్రకారం దైవప్రవక్త ﷺ "ఘోరాతి ఘోరపాపాలేవో నేను మీకు తెల్పనా?" అని అడిగారు. అందుకు సహచరులు, "తప్పకుండా తెలుపండి దైవప్రవక్తా!" అని విన్నవించుకున్నారు. అప్పుడాయన "(ఘోరాతి ఘోరపాపాలు) అల్లాహ్కు సహవర్తుల్ని నిలబెట్టటం, తల్లిదండ్రులకు అవిధేయత చూపటం" అని చెప్పారు. ఆ తర్వాత ఆనుకొని కూర్చున్న వారల్లా సర్దుకొని కూర్చుంటూ "ఆఁ అబద్ధపు మాట, అబద్ధపు సాక్ష్యం కూడా…." అని అన్నారు. ఆ మాట ఆయన అదేపనిగా అనసాగారు. అప్పుడు మాకు ఇక ఈయనగారు ఈ మాట చాలిస్తే బాగుండుననిపించింది.
(బుఖారీ-ముస్లిం)
(సహీహ్ బుఖారీలోని షహాదాత్ ప్రకరణం – సహీహ్ ముస్లింలోని ఈమాన్ ప్రకరణం)
English
Abu Bakrah (radiyallahu anhu) reported: The Messenger of Allah ﷺ said, “Shall I not inform you of one of the gravest of the cardinal sins?” We said: “Yes, O Messenger of Allah!” He ﷺ said, “To join others as partners with Allah in worship and to be undutiful to one’s parents.” The Messenger of Allah ﷺ sat up from his reclining position (in order to stress the importance of what he was going to say) and added, “I warn you making a false statement and giving a false testimony. I warn you against making a false statement and giving a false testimony.” The Messenger of Allah ﷺ kept on repeating this (warning) till we wished he should stop.[Al-Bukhari and Muslim]
ముఖ్యాంశాలు
అబద్ధపు సాక్ష్యం చెప్పటం ఎంత పెద్ద పాపమో ఈ హదీసు ద్వారా బోధపడుతోంది. కాని దురదృష్టవశాత్తు సోకాల్డ్ ముస్లింలు ఇతర ఘోరపాపాల్లాగా ఈ ఘోరపాపానికి కూడా పాల్పడటం సర్వసాధారణమయి పోయింది. దేవుడు మనల్ని రక్షించుగాక!
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|వారింపబడిన విషయాల ప్రకరణం|263. అబద్ధపు సాక్ష్యం తీవ్రంగా నిషేధించబడింది|హదీసు 1552
You must be logged in to post a comment.