హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: ఇమామ్ అబూ జకరియ్యా యహ్యా బిన్ షరఫ్ అన్ నవవీ (రహ్మతుల్లాహి అలైహి)
ఉర్దూ అనువాదం, వ్యాఖ్యానం: హాఫిజ్ సలాహుద్దీన్ యూసుఫ్ · తెలుగు రూపం: హాఫిజ్ ఎస్.ఎమ్. రసూల్ షర్ఫీ · ప్రకాశకులు: ట్రూత్ పబ్లికేషన్స్, హైదరాబాద్

రియాదుస్ సాలిహీన్ (హదీసు కిరణాలు) – 260వ అధ్యాయం: అబద్ధం చెప్పటం నిషిద్ధం. ఈ అధ్యాయంలో 2 ఖుర్ఆన్ ఆయతులు, 5 హదీసులు (హదీసు 1543 – 1547) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, ముఖ్యాంశాలు, English అనువాదంతో.
260. అబద్ధం చెప్పటం నిషిద్ధం
باب تحريم الكذب
అరబీ పాఠం: రియాదుస్ సాలిహీన్ – తహ్ఖీఖ్: షుఐబ్ అల్ అర్నావూత్ (ముఅస్సస్సతుర్ రిసాలా)
దివ్యఖుర్ఆన్లో అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
{وَلا تَقْفُ مَا لَيْسَ لَكَ بِهِ عِلْمٌ} [الإسراء: ٣٦]
"నీకు తెలియని విషయాల వెంటపడకు." (ఇస్రా: 36)
{مَا يَلْفِظُ مِنْ قَوْلٍ إِلاَّ لَدَيْهِ رَقِيبٌ عَتِيدٌ} [ق: ١٨]
"మనిషి నోటి నుండి వెడలే ప్రతిమాటనూ వ్రాయటానికి అనుక్షణం ఒక పరిశీలకుడు సిద్ధంగా ఉంటాడు." (ఖాఫ్: 18)
English
“And follow not (O man, i.e., say not or do not or witness not) that of which you have no knowledge.” [Al-Isrā’ 17:36]
“Not a word does he (or she) utter, but there is a watcher by him ready (to record it).” [Qāf 50:18]
హదీసు 1543
وعنْ ابنِ مسعود رضي اللَّه عنْهُ قال: قالَ رسُولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "إنًَّ الصِّدْقَ يهْدِي إِلَى الْبِرِّ وَإنَّ البرِّ يهْدِي إِلَى الجنَّةِ، وإنَّ الرَّجُل ليَصْدُقُ حتَّى يُكتَبَ عِنْدَ اللَّهِ صِدّيقاً، وإنَّ الْكَذِبَ يَهْدِي إِلَى الفُجُورِ وإنَّ الفُجُورًَ يهْدِي إِلَى النارِ، وَإِنَّ الرجلَ ليكذبَ حَتى يُكْتبَ عنْدَ اللَّهِ كَذَّاباً" متفقٌ عَلَيْهِ.
హజ్రత్ ఇబ్నె మస్వూద్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఈ విధంగా ప్రవచించారు: నిజాయితి సత్కార్యం వైపుకు తీసుకెళ్తుంది. సత్కార్యం స్వర్గానికి గొనిపోతుంది. మనిషి నిజం చెబుతూ చెబుతూ చివరికి దేవుని దగ్గర నిజాయితీపరుడుగా నమోదు చేయబడతాడు. అబద్ధం అవిధేయత వైపుకు తీసుకెళ్తుంది. అవిధేయత నరకానికి గొనిపోతుంది. మనిషి అబద్ధం చెబుతూ చెబుతూ చివరికి దేవుని దగ్గర 'అబద్ధాలకోరు'గా రాసుకోబడతాడు.
(బుఖారీ-ముస్లిం)
(సహీహ్ బుఖారీలోని అదబ్ ప్రకరణం – సహీహ్ ముస్లింలోని బిర్ర్ ప్రకరణం)
English
Ibn Mas`ud (radiyallahu anhu) reported: The Messenger of Allah ﷺ said, “Truth leads to piety and piety leads to Jannah. A man persists in speaking the truth till he is recorded with Allah as a truthful man. Falsehood leads to transgression and transgression leads to the Hell-fire. A man continues to speak falsehood till he is recorded with Allah as a great liar.”[Al-Bukhari and Muslim].
ముఖ్యాంశాలు
1) మనిషి ఏ ప్రవర్తనను అలవర్చుకుంటే అదే అతని ప్రత్యేక లక్షణంగా గుర్తింపు పొందుతుంది. దాంతోనే అతను ప్రసిద్ధి చెందుతాడు. అందుకే మనిషి ఎల్లప్పుడూ మంచిమాటలు, మంచి ప్రవర్తనను మాత్రమే అలవర్చుకోవాలి. దానివల్ల ప్రజలు ఎలాగూ తనను వేన్నోళ్లా పొగుడుతారు. అంతేకాకుండా దేవుని దగ్గర కూడా తనకు మంచి స్థానం లభిస్తుంది.
2) నిజం విముక్తికి, అబద్ధం వినాశానికి దారితీస్తుంది.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|వారింపబడిన విషయాల ప్రకరణం|260. అబద్ధం చెప్పటం నిషిద్ధం|హదీసు 1543
హదీసు 1544
وعن عبدِ اللَّهِ بنِ عَمْرو بنِ العاص رضي اللَّه عنْهُما، أنَّ النَّبيّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَالَ: "أَرْبعٌ منْ كُنَّ فِيهِ، كَانَ مُنافِقاً خالِصاً، ومنْ كَانتْ فيهِ خَصْلَةٌ مِنْهُنَّ، كَانتْ فِيهِ خَصْلةٌ مِنْ نِفاقٍ حتَّى يَدعَهَا: إِذَا اؤتُمِنَ خَانَ، وَإذا حدَّثَ كَذَبَ، وَإِذَا عاهَدَ غَدَرَ، وَإِذَا خَاصمَ فجَرَ" متفقٌ عَلَيْهِ. وَقَدْ سبقَ بيانه مَعَ حديثِ أَبي هُرَيْرَةَ بنحوهِ في"باب الوفاءِ بالعهدِ".
హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ అమ్ర్ బిన్ ఆస్ (రదియల్లాహు అన్హుమా) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఈ విధంగా ప్రవచించారు: నాలుగు లక్షణాలున్న వ్యక్తి ఒట్టి కపటిగా పరిగణించబడతాడు. ఒకవేళ వాటిలో ఏ ఒక్క లక్షణం అతనిలో ఉన్నా దాన్ని వదలిపెట్టనంతవరకూ అతనిలో ఒక కపట లక్షణం ఉన్నట్లుగా భావింపబడుతుంది. (ఆ నాలుగు లక్షణాలు ఇవి:) 1) అతనికి ఏదైనా అప్పగిస్తే అందులో అతను ద్రోహానికి పాల్పడతాడు. 2) మాట్లాడితే అబద్ధం చెబుతాడు. 3) వాగ్దానం చేసి ఆ తర్వాత మోసం చేస్తాడు. 4) ఎవరితోనైనా పోట్లాడితే, నోరు పారేసుకుంటాడు. (బుఖారీ-ముస్లిం)
ఇంతకు ముందు 'వాగ్దాన పాలన' అనే అధ్యాయంలో ఇలాంటిదే అయిన అబూహురైరా హదీసుతోపాటు దీనిని వివరించటం జరిగింది.
(సహీహ్ బుఖారీలోని విశ్వాస ప్రకరణం – సహీహ్ ముస్లింలోని విశ్వాస ప్రకరణం)
English
`Abdullah bin `Amr bin Al-`As (radiyallahu anhuma) said: The Prophet ﷺ said, “Whosoever possesses these four characteristics, is a sheer hypocrite; and anyone who possesses one of them, possesses a characteristic of hypocrisy till he gives it up. (These are:) When he talks, he tells a lie; when he makes a covenant, he acts treacherously; and when he quarrels, he utters foul language.”[Al-Bukhari and Muslim].
ముఖ్యాంశాలు
మరిన్ని వివరాల కోసం వాగ్దానపాలన అనే అధ్యాయం క్రింద ప్రస్తావించబడిన 689, 690 హదీసులు చూడండి. ఈ రోజుల్లో విశ్వాసపరమైన కపటులెవరూ లేరు గాని నేటి ముస్లింలలో కటప ప్రవర్తన సాధారణమైపోయింది. కనుక ముస్లింలలోని అత్యధిక మందిలో ఈ కపట అలవాట్లు ఉన్నాయని చెప్పవచ్చు. దేవుడు మనల్నందరినీ వాటి నుంచి రక్షించుగాక!
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|వారింపబడిన విషయాల ప్రకరణం|260. అబద్ధం చెప్పటం నిషిద్ధం|హదీసు 1544
హదీసు 1545
وعن ابن عباسٍ رضي اللَّه عنْهُما عن النَّبي صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم، قالَ: "مَنْ تَحَلَّمَ بِحُلْمٍ لمْ يرَهُ، كُلِّفَ أنْ يَعْقِدَ بيْن شَعِيرتينِ، ولَنْ يفْعَلَ، ومِنِ اسْتَمَع إِلَى حديثِ قَوْم وهُمْ لهُ كارِهُونَ، صُبَّ في أُذُنَيْهِ الآنُكُ يَوْمَ القِيامَةِ، ومَنْ صوَّر صُورةً، عُذِّبَ وَكُلِّفَ أنْ ينفُخَ فِيهَا الرُّوحَ وَليْس بِنافخٍ" رواه البخاري. "تَحلَّم"أيْ: قالَ أنهُ حَلم في نَوْمِهِ ورَأى كَذا وكَذا، وَهُوَ كاذبٌ و"الآنك"بالمدِّ وضمِّ النونِ وتخفيفِ الكاف: وهو الرَّصَاصُ المذابُ.
హజ్రత్ ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హుమా) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఈ విధంగా ప్రవచించారు: ఎవరయితే తాను చూడని కల గురించి చూశానని అబద్ధం చెప్పాడో అతన్ని (ప్రళయదినాన) రెండు బార్లీ గింజల మధ్య ముడివేయమని ఆజ్ఞాపించటం జరుగుతుంది. కాని అతను ఎన్నటికీ ఆ పని చేయలేడు. ఎవడయితే ఇతరుల ఇష్టం లేకుండా వారి మాటల్ని శ్రద్ధగా వినటానికి ప్రయత్నిస్తాడో ప్రళయదినాన అతని చెవిలో కరిగించిన సీసం పోయబడుతుంది. ఎవడయితే (ప్రాణుల) చిత్రాలను నిర్మిస్తాడో అతణ్ణి శిక్షించి వాటిలో ప్రాణం పోయమని ఒత్తిడి చేయటం జరుగుతుంది. కాని అతను వాటిలో ప్రాణం పోయలేడు. (బుఖారీ)
'తహల్లమ' అంటే తాను కలలో ఈ విధంగా చూశానని అబద్ధం చెప్పటం. 'ఆనుకు' అంటే కరిగించబడిన సీసము.
(సహీహ్ బుఖారీలోని తాబీర్ ప్రకరణం)
English
Ibn `Abbas (radiyallahu anhuma) said: The Prophet ﷺ said, “He who narrates a dream which he has not seen will be put to trouble to join into a knot two barley seeds which he will not be able to do; and he who seeks to listen to the talk of a people (secretly) will have molten lead poured into his ears on the Day of Resurrection; and he who makes a picture (of people or other creatures with a soul, such as animals and insects) will be (severely punished), and he will be asked to infuse spirit therein, which he will not be able to do.”[Al-Bukhari].
ముఖ్యాంశాలు
1) చెడ్డ కలని 'హుల్మ్' అని అంటారు. ఇక్కడ ఈ పదం కేవలం 'కల' అనే అర్థంలో వాడబడింది. కల గురించి లేనిపోని విషయాలు కల్పించి చెప్పటం చాలా గర్హనీయమైన విషయం. పేరు ప్రఖ్యాతుల కోసం ప్రాకులాడేవారిలో, తమ పరిశుద్ధతను ప్రచారం చేసుకోవాలనుకునే వారిలో ఈ రోగం చాలా ఎక్కువగా ఉంటుంది. కొన్ని సంవత్సరాల క్రితం మనదేశంలో ఒక పెద్ద వక్త తాను ప్రజానాయకునిగా చెలామణి అవ్వాలన్న దురుద్దేశ్యంతో తనకు ఎవేవో చిత్రవిచిత్రమైన, గొప్పవారికి వచ్చే కలలు వస్తున్నాయని ప్రజల్లో ప్రచారం చేశాడు. కాని నిజానికి అవన్నీ అతను కల్పించుకున్న మాటలే. అందుకే చాలా తక్కువ కాలంలోనే అతని బండారం బయటపడింది. ఎవరూ కూడా అతన్ని నమ్మలేదు.
2) ప్రజల రహస్యాలను తెలుసుకోవటానికి ప్రయత్నించటాన్ని, వారి తప్పుల్ని దేవులాడటాన్ని ఈ హదీసులో వారించటం జరిగింది.
3) చిత్రాలు రూపొందించటం చాలా గర్హనీయమైన విషయం. చేత్తో చేసే చిత్రాలయినా, లేక కెమేరాతో తీసిన చిత్రాలయినా ఏవయినా ఒకటే. ఈ రెండిట్లో ఏ మాత్రం తేడా లేదు. అవన్నీ చిత్రనిర్మాణం క్రిందికే వస్తాయి. ఆఖరికి చలన చిత్రాలు తీసేవారికి కూడా ఇదే శిక్షపడుతుంది. విచిత్రమేమిటంటే చాలామంది చలన చిత్రాలను అసలు చిత్రాలుగానే భావించరు.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|వారింపబడిన విషయాల ప్రకరణం|260. అబద్ధం చెప్పటం నిషిద్ధం|హదీసు 1545
హదీసు 1546
وعن ابنِ عُمرَ رضي اللَّه عنْهُما قالَ: قَالَ النَّبيُّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: " أفْرَى الفِرَى أنْ يُرِيَ الرجُلُ عيْنَيْهِ مَا لَمْ تَرَيا". رواهُ البخاري. ومعناه: يقولُ: رأيتُ فيما لَمْ يَرَهُ.
హజ్రత్ ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హుమా) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఈ విధంగా ప్రవచించారు: అన్నింటికంటే పెద్ద అబద్ధమేమిటంటే మనిషి తన కళ్ళకు, అవి చూడని వాటిని చూపించటం. (బుఖారీ)
(సహీహ్ బుఖారీలోని తాబీర్ ప్రకరణం)
English
Ibn `Umar (radiyallahu anhuma) reported: The Prophet ﷺ as saying: “The worst of lies is to pretend to have seen something which he has not seen.”[Al-Bukhari].
ముఖ్యాంశాలు
ఈ హదీసులో కూడా అబద్ధం చెప్పటాన్ని గర్హించటం జరిగింది. కల గురించయినా లేక మేల్కొని ఉన్నప్పుడు జరిగే సంఘటనల గురించయినా తాము చూడని విషయాన్ని చూశామని చెప్పటం మహా అబద్ధం.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|వారింపబడిన విషయాల ప్రకరణం|260. అబద్ధం చెప్పటం నిషిద్ధం|హదీసు 1546
హదీసు 1547
وعن سَمُرَةَ بنِ جُنْدُبٍ رضي اللَّه عَنْهُ قالَ: كانَ رسُولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم مِما يُكْثِرُ أنْ يقولَ لأصحابهِ: "هَلْ رَأَى أحدٌّ مِنكُمْ مِن رُؤْيَا؟ "فيقُصُّ عليهِ منْ شَاءَ اللَّه أنْ يقُصَّ. وَإنَّهُ قَالَ لنا ذَات غَدَاةٍ:"إنَّهُ أتَاني اللَّيْلَةَ آتيانِ، وإنَّهُما قَالا لِي: انطَلقْ، وإنِّي انْطلَقْتُ معهُما، وإنَّا أتَيْنَا عَلى رجُلٍ مُضْطَجِعٌ، وإِذَا آَخَرُ قَائِمٌ عَلَيْهِ بِصَخْرَةٍ، وإِذَا هُوَ يَهْوي بالصَّخْرَةِ لِرَأْسِهِ، فَيثْلَغُ رَأْسهُ، فَيَتَدَهْدهُ الحَجَرُ هَاهُنَا. فيتبعُ الحَجَرَ فيأْخُذُهُ، فَلاَ يَرجِعُ إلَيْه حَتَّى يَصِحَّ رَأْسُهُ كَما كَانَ، ثُمَّ يَعُودُ عَلَيْهِ، فَيفْعلُ بهِ مِثْلَ مَا فَعَل المَرَّةَ الأوْلَى،"قَالَ: قلتُ لهما: سُبْحانَ اللَّهِ، مَا هذانِ؟ قَالا لي: انْطَلِقْ انْطَلِقْ، فانْطَلَقْنا. فأَتيْنَا عَلى رَجُل مُسْتَلْقٍ لقَفَاه وَإذا آخَرُ قائمٌ عليهِ بكَلُّوبٍ مِنْ حَديدٍ، وَإِذَا هُوَ يَأْتى أحَد شِقَّيْ وَجْهِهِ فيُشَرْشِرُ شِدْقَهُ إِلَى قَفاهُ، ومنْخِرهُ إلى قَفَاهُ، وَعينَهُ إلى قَفاهُ، ثُمَّ يتَحوَّل إِلَى الجانبِ الآخرِ فَيَفْعَل بهِ مثْلَ مَا فعلًَ بالجَانِبِ الأوَّلِ، فَما يَفْرُغُ مِنْ ذلكَ الجانبِ حتَّى يصِحَّ ذلكَ الجانِبُ كما كانَ، ثُمَّ يَعُودُ عليْهِ، فَيَفْعَل مِثْلَ مَا فَعلَ فِي المَرَّةِ الأُوْلَى. قَالَ: قلتُ: سُبْحَانَ اللَّه، مَا هذانِ؟ قالا لي: انْطلِقْ انْطَلِقْ، فَانْطَلَقْنَا. فَأتَيْنا عَلى مِثْل التَّنُّورِ فَأَحْسِبُ أنهُ قَالَ: فإذا فيهِ لَغَطٌ، وأصْواتٌ، فَاطَّلَعْنا فيهِ فَإِذَا فِيهِ رجالٌ ونِساء عُرَاةٌ، وَإِذَا هُمْ يأتِيهمْ لَهَبٌ مِنْ أَسْفلِ مِنْهُمْ، فإذا أتَاهُمْ ذلكَ اللَّهَبُ ضَوْضوا، قلتُ مَا هؤلاءِ؟ قَالا لِي: انْطَلِقْ انْطَلِقْ، فَانْطَلقْنَا. فَأَتيْنَا عَلَى نهرٍ حسِبْتُ أَنهُ كانَ يقُولُ:"أَحْمرُ مِثْلُ الدًَّمِ، وَإِذَا في النَّهْرِ رَجُلٌ سابِحٌ يَسْبحُ، وَإذا عَلَى شَطِّ النَّهْرِ رجُلٌ قَد جَمَعَ عِندَهُ حِجارةً كَثِيرَة، وَإِذَا ذلكَ السَّابِحُ يَسْبَحُ مَا يَسْبَحُ، ثُمَّ يَأتيْ ذلكَ الَّذِي قَدْ جمَعَ عِنْدهُ الحِجارةًَ، فَيَفْغَرُ لهَ فاهُ، فَيُلْقِمُهُ حَجَراً، فَيَنْطَلِقُ فَيَسْبَحُ، ثُمًَّ يَرْجِعُ إليهِ، كُلَّمَا رَجَعَ إليْهِ، فَغَر لهُ فاهُ، فَألْقمهُ حَجَراً، قُلْتُ لهُما: مَا هذانِ؟ قالاَ لِي: انْطلِقْ انطلِق، فانْطَلَقنا. فَأَتَيْنَا عَلَى رَجُلٍ كريِه المَرْآةِ، أوْ كأَكرَهِ مَا أنتَ رَاءٍ رجُلاً مَرْأَى، فإذا هُوَ عِندَه نارٌ يحشُّها وَيسْعى حَوْلَهَا، قلتُ لَهُمَا: مَا هَذَا؟ قالاَ لي: انْطَلِقْ انْطلِقْ، فَانْطَلقنا. فَأتَينا عَلَى روْضةٍ مُعْتَمَّةٍ فِيها مِنْ كلِّ نَوْرِ الرَّبيعِ، وَإِذَا بيْنَ ظهْرِي الرَّوضَةِ رَجلٌ طويلٌ لا أكادُ أَرَى رأسَهُ طُولاً في السَّماءِ، وَإِذَا حوْلَ الرجلِ منْ أَكْثَرِ وِلدانٍ رَأَيْتُهُمْ قطُّ، قُلتُ: مَا هَذَا؟ وَمَا هؤلاءِ؟ قالا لي: انطَلقْ انْطَلِقْ فَاَنْطَلقنا. فَأتيْنَا إِلَى دَوْحةٍ عظِيمَة لَمْ أَرَ دَوْحةً قطُّ أعظمَ مِنها، وَلاَ أحْسنَ، قالا لي: ارْقَ فِيهَا، فَارتَقينا فِيهَا، إِلَى مدِينةٍ مَبْنِيَّةٍ بِلَبِنٍ ذَهبٍ ولبنٍ فضَّةٍ، فأتَينَا بَابَ المَدينة فَاسْتفتَحْنَا، فَفُتحَ لَنا، فَدَخَلناهَا، فَتَلَقَّانَا رجالٌ شَطْرٌ مِن خَلْقِهِم كأحْسنِ مَا أنت راءٍ، وشَطرٌ مِنهم كأَقْبحِ مَا أنتَ راءِ، قالا لَهُمْ: اذْهَبُوا فقَعُوا في ذَلِكَ النًّهْر، وَإِذَا هُوَ نَهرٌ معتَرِضٌ يجْرِي كأنَّ ماءَهُ المحضُ في البَيَاضِ، فذَهبُوا فوقعُوا فِيهِ، ثُمَّ رجعُوا إلَيْنَا قَدْ ذَهَب ذلكَ السُّوءُ عَنهمْ، فَصارُوا في أحْسَنِ صُورةٍ. قَالَ: قالا لِي: هذِهِ جَنَّةُ عدْن، وهذاك منزلُكَ، فسمَا بصَرِي صُعداً، فإذا قَصْرٌ مِثلُ الرَّبابة البيضاءِ. قالا لي: هذاكَ منزِلُكَ. قلتُ لهما: باركَ اللَّه فيكُما، فَذراني فأدخُلْه. قالا: أمَّا الآنَ فَلاَ، وأنتَ داخلُهُ. قُلْتُ لهُما: فَإنِّي رأَيتُ مُنْذُ اللَّيلة عَجَباً؟ فما هَذَا الذي رأيت؟ قالا لي: إنَا سَنخبِرُك. أمَّا الرجُلُ الأوَّلُ الَّذِي أتَيتَ عَليه يُثلَغُ رأسُهُ بالحَجَرِ، فإنَّهُ الرَّجُلُ يأخُذُ القُرْآنَ فيرفُضُه، وينامُ عَنِ الصَّلاةِ المكتُوبةِ. وأمَّا الرَّجُلُ الَّذِي أتَيتَ عَليْهِ يُشرْشرُ شِدْقُه إِلَى قَفاهُ، ومَنْخِرُه إِلَى قَفاهُ، وعَيْنهُ إِلَى قفاهُ، فإنَّهُ الرَّجُلُ يَغْدو مِنْ بَيْتِه فَيكذبُ الكذبةَ تبلُغُ الآفاقَ. وأمَّا الرِّجالُ والنِّساءُ العُراةُ الَّذِينَ هُمْ في مِثل بِناءِ التَّنُّورِ، فإنَّهم الزُّناةُ والزَّواني. وأما الرجُلُ الَّذي أتَيْت عليْهِ يسْبَحُ في النَهْرِ، ويلْقمُ الحِجارة، فإنَّهُ آكِلُ الرِّبا. وأمَّا الرَّجُلُ الكَريهُ المَرآةِ الَّذِي عندَ النَّارِ يَحُشُّها ويسْعى حَوْلَها فإنَّهُ مالِكُ خازنُ جَهنَّمَ. وأمَّا الرَّجُلُ الطَّويلُ الَّذي في الرَّوْضةِ، فإنَّهُ إبراهيم صلى الله عليه وسلم، وأمَّا الوِلدانُ الذينَ حوْله، فكلُّ مُوْلود ماتَ عَلَى الفِطْرَةِ"وفي رواية البَرْقَانِي:"وُلِد عَلَى الفِطْرَةِ". فَقَالَ بعض المسلمينَ: يَا رسولَ اللَّه، وأولادُ المشرِكينَ؟ فقال رسولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم:"وأولادُ المشركينَ". وأما القومُ الذينَ كانُوا شَطْرٌ مِنْهُمْ حَسَنٌ وشَطْرٌ مِنْهُمْ قَبيحٌ فإنَّهُمْ قَومٌ خَلَطُوا عَمَلاً صَالِحاً وآخَرَ سَيِّئاً تَجاوَزَ الله عنهم". رواه البخاري. وفي روايةٍ لَهُ: "رأيتُ اللَّيلَةَ رجُلَين أتَياني فأخْرجاني إِلَى أرْضِ مُقدَّسةِ"ثُمَّ ذكَره. وقال:"فانطَلَقْنَا إِلَى نَقبٍ مثلِ التنُّورِ، أعْلاهُ ضَيِّقٌ وأسْفَلُهُ وَاسعٌ، يَتَوَقَّدُ تَحتهُ ناراً، فإذا ارتَفَعت ارْتَفَعُوا حَتى كادُوا أنْ يَخْرُجوا، وَإِذَا خَمَدت، رَجَعوا فِيهَا، وفيها رجالٌ ونِساءٌ عراةٌ. وفيها: حَتَّى أتَينَا عَلَى نَهرٍ مِنْ دًَم، ولم يشكَّ فِيهِ رجُلٌ قائمٌ عَلَى وَسَطِ النًَّهرِ، وعلى شطِّ النَّهر رجُلٌ، وبيْنَ يديهِ حجارةٌ، فأقبلَ الرَّجُلُ الذي في النَّهرِ، فَإذا أرَادَ أنْ يخْرُجَ، رمَى الرَّجُلُ بِحجرٍ في فِيه، فردَّهُ حيْثُ كانَ، فجعلَ كُلَّمَا جاءَ ليخْرج جَعَلَ يَرْمي في فِيهِ بحجرٍ، فيرْجِعُ كما كانَ. وفيهَا:"فَصَعِدَا بي الشَّجَرةَ، فَأدْخلاني دَاراً لَمْ أرَ قَطُّ أحْسنَ منْهَا، فيهَا رجالٌ شُيُوخٌ وَشَباب". وفِيهَا:"الَّذي رأيْتهُ يُشَقُّ شِدْقُهُ فكَذَّابٌ، يُحدِّثُ بالْكذبةِ فَتُحْملُ عنْهَ حتَّى تَبْلُغَ الآفَاقَ، فيصْنَعُ بهِ مَا رأيْتَ إِلَى يوْم الْقِيامةِ". وَفِيهَا:"الَّذي رأيْتهُ يُشْدَخُ رأسُهُ فرجُلُ علَّمهُ اللَّه الْقُرآنَ، فَنَامَ عنهُ بِاللَّيْلِ، ولَمْ يعْملْ فِيهِ بِالنَّهَارِ، فيُفْعلُ بِه إِلَى يَوْمِ الْقِيامةِ". والدَّارُ الأولَى الَّتي دخَلْتَ دارُ عامَّةِ المُؤمنينَ، وأمَّا هذِهِ الدَّارُ فدَارُ الشُّهَداءِ، وأنا جِبْريلُ، وهذا مِيكائيلُ، فارْفع رأسَك، فرفعتُ رأْسي، فإذَا فَوْقِي مِثلُ السَّحابِ، قالا: ذاكَ منزلُكَ، قلتُ: دَعاني أدْخُلْ مَنْزِلي، قالا: إنَّهُ بَقي لَكَ عُمُرٌ لَم تَستكمِلْهُ، فلَوْ اسْتَكْملته، أتَيْتَ منْزِلَكَ" رواه البخاري. قَوْله:"يَثْلَغ رَأْسهُ"هُوَ بالثاءِ المثلثةِ والغينِ المعجمة، أيْ: يشدخُهُ ويَشُقُّه. قولهُ:"يَتَدهْده"أيْ: يتدحرجُ، و"الكَلُّوبُ"بفتح الكاف، وضم اللام المشددة، وَهُوَ معروف. قَوْله:"فيُشَرشِرُ"أيْ: يُقَطَّعُ. قَوْله:"ضوْضَوا"وَهُوَ بضادين معجمتين، أيْ صاحوا. قَوْله:"فيفْغَرُ"هُوَ بالفاءِ والغين المعجمة، أيْ: يفتحُ. قَوْله:"المرآةِ"هُوَ بفتح الميم، أيْ: المنْظَر. قَوْله:"يحُشُّها"هُوَ بفتح الياءِ وضم الحاءِ المهملة والشين المعجمة، أيْ: يوقِدُها، قَوْله:"روْضَةٍ مُعْتَمَّةِ"هُوَ بضم الميم وإسكان العين وفتح التاء وتشديد الميم، أيْ: وافيةِ النَّبات طويلَته. قَولُهُ:"دوْحَةٌ"وهي بفتحِ الدال، وإسكان الواو وبالحاءِ المهملة: وهِي الشَّجرَةُ الْكبيرةُ، قولُهُ:"المَحْضُ"هُوَ بفتح الميم وإسكان الحاءِ المهملة وبالضَّاد المعجمة: وهُوَ اللَّبَنُ. قولُهُ:"فَسَما بصرِي"أي: ارْتَفَعَ."وَصُعُداً": بضم الصاد والعين: أيْ: مُرْتَفِعاً."وَالرَّبابةُ": بفتح الراءِ وبالباءِ الموحدة مُكررة، وهي السَّحابة.
హజ్రత్ సమురా బిన్ జుందుబ్ (రదియల్లాహు అన్హు) కథనం: దైవప్రవక్త ﷺ తరచూ అడుగుతుండే విషయాల్లో ఒకటేమిటంటే ఆయన తన సహచరుల్ని "మీలో ఎవరయినా ఏదయినా కల చూశారా?" అని అడుగుతారు. అప్పుడు ఎవరయినా (తాము కలలో చూసింది) దేవుడు తలచినట్లు వివరిస్తారు.
ఒకరోజు ఉదయం స్వయంగా దైవప్రవక్త ఈ విధంగా వివరించారు: రాత్రి (కలలో) నా దగ్గరికి వచ్చేవారు (దూతలు) ఇద్దరు వచ్చి "పదండి" అన్నారు. నేను వారివెంట నడిచాను. అలా నడుస్తూ మేము ఒకతని సమీపం నుంచి వెళ్ళాం. అతను పడుకొని ఉన్నాడు. అతని దగ్గరే ఇంకో వ్యక్తి ఒక పెద్ద బండరాయి తీసుకొని అతన్ని కొట్టటానికి నించున్నాడు. అతను ఆ రాయితో పడుకున్న వ్యక్తి తల నుజ్జునుజ్జయ్యేలా కొడ్తున్నాడు. ఒక దెబ్బ కొట్టగానే ఆ రాయి దొర్లుకుంటూ కాస్తంత దూరంలో పోయి పడుతోంది. అతను ఆ రాయివెంటే నడిచివెళ్ళి దాన్ని మళ్ళీ పట్టుకొస్తున్నాడు. అతను తిరిగొచ్చేలోగా ఇతని తల తిరిగి యధారూపంలోకి వచ్చేస్తోంది. అతను తిరిగొచ్చి ఇందాక చేసిన పనే మళ్ళీ చేస్తున్నాడు.
(దైవప్రవక్త ﷺ ఇలా అంటున్నారు:) నేను ఆ ఇద్దరు వ్యక్తుల్ని అడిగాను, "సుబ్హానల్లాహ్! ఏమిటిదంతా?" అని. దానికి వారు (సమాధానం చెప్పకుండా) "పదండి పదండి" అన్నారు. మేమక్కణ్ణుంచి బయలుదేరాం. దారిలో మాకు ఒకతను కనిపించాడు. అతను వెల్లకిలా పడుకొని ఉన్నాడు. అతని దగ్గరే ఇంకొకతను ఇనుముతో చేయబడిన జంబూర్ చేతబుచ్చుకొని అతనిమీద నించున్నాడు. పడుకొని వున్నవాని ముఖానికి ఒక వైపుకి వెళ్ళి అతని దవడని మెడ వెనుక భాగం వరకూ చీరేస్తున్నాడు. అలాగే అతని ముక్కు రంధ్రాన్ని, కంటిని కూడా మెడ వెనుక భాగం వరకూ చీరేస్తున్నాడు. ఆ తర్వాత మరో ప్రక్కకెళ్ళి తొలి ప్రక్క చేసిందే అటు ప్రక్క కూడా చేస్తున్నాడు. రెండోపక్క అతను ఆ పని ముగించేలోగానే మొదటి పక్క యధాతథంగా మారిపోతుంది. ఆ తర్వాత అతను తొలిపక్కకు వచ్చి మళ్ళీ అదే పని చేస్తున్నాడు.
నేనది చూసి, "సుబ్హానల్లాహ్! ఎవరు వీరిద్దరు?" అని అడిగాను. దానికి వారు (సమాధానం చెప్పకుండా) "పదండి, పదండి" అన్నారు. మేమింకా ముందుకు వెళ్ళాం. అక్కడ మాకు రొట్టెల పొయ్యి లాంటి ఓ పెద్ద గొయ్యి కనిపించింది. (ఉల్లేఖకులు ఇలా అంటున్నారు:) దైవప్రవక్త ﷺ ఇలా చెప్పినట్లు గుర్తు: ఆ గొయ్యిలో నుంచి పెద్దగా అరుపులు కేకలు వినిపించాయి. మేము ఆ గొయ్యిలోకి తొంగిచూశాము. అందులో నగ్నంగా ఉన్న స్త్రీలు, పురుషులు కనిపించారు. దాని అడుగు నుంచి ఒక అగ్నిజ్వాల పైకి లేస్తుంది. అది వారిని తాకగానే వారు ఒక్కసారిగా అరిచి గోలచేస్తున్నారు. నేను వారిని అడిగాను, "ఎవరు వీళ్లు?" అని. కాని వారు (అందుకు సమాధానం చెప్పకుండా) 'పదండి, పదండి' అన్నారు. మేము ఇంకా ముందుకు పోయాం. ఆ విధంగా పోతూపోతూ ఒక కాలువ దగ్గరికి చేరుకున్నాం. (ఉల్లేఖకుడు ఇలా అన్నాడు:) దైవప్రవక్త ﷺ ఈ విధంగా చెప్పినట్టు గుర్తు: ఆ కాలువ (లోని నీరు) రక్తంలా ఎర్రగా ఉంది. అందులో ఒకతను ఈదుతున్నాడు. ఆ కాలువ గట్టు దగ్గరే మరొకతను ఎన్నో రాళ్లు పోగేసుకొని కూర్చుని ఉన్నాడు. ఆ ఈతగాడు ఈదినంతసేపు ఈది ఆ తర్వాత రాళ్లు పోగేసుకొని కూర్చున్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి అతనిముందు నోరు తెరుస్తున్నాడు. ఆ వ్యక్తి ఇతని నోట్లోకి రాతిముద్ద విసరేస్తున్నాడు. అతను వెనక్కివెళ్ళి కాసేపు కాలువలో ఈది మళ్ళీ తిరిగొస్తున్నాడు. అతను తిరిగొచ్చినప్పుడల్లా ఆ వ్యక్తి ముందుకెళ్ళి నోరు తెరుస్తున్నాడు. ఆ వ్యక్తి అతని నోట్లోకి రాతిముద్ద విసిరేస్తున్నాడు. నేను వారిని 'ఎవరు వీరిద్దరూ?' అని అడిగాను. కాని వారు నాకు (జవాబు చెప్పకుండా) 'పదండి, పదండి' అన్నారు. మేమక్కణ్ణుంచి బయలుదేరి నడుస్తూ నడుస్తూ మరొకతని దగ్గర్నుంచి వెళ్ళాం. అతను చాలా వికృతంగా ఉన్నాడు. (లేక ఆయన) అతను మీరు ఇప్పటివరకు చూసినవారందరి కన్నా కురూపి (అని అన్నారు). అతని దగ్గర అగ్ని ఉంది. దాన్ని అతను రాజేసి దాని చుట్టూ పరుగెత్తుతున్నాడు. అది చూసి నేను 'ఎవరితను?' అని అడిగాను. కాని వారు (నా ప్రశ్నకు జవాబు ఇవ్వకుండా) "పదండి, పదండి" అన్నారు.
మేము అక్కణ్ణుంచి ఇంకా ముందుకు వెళ్ళాం. ఆ విధంగా వెళ్తూవెళ్తూ ఒక తోట దగ్గరికి చేరుకున్నాం. ఆ తోటలో ఎన్నో చెట్లున్నాయి. (అది వసంత కాలమైనట్లు) ఆ చెట్లకు అన్ని రకాల పూలు పూసివున్నాయి. ఆ తోట మధ్యలో ఒక పొడవాటి మనిషి ఉన్నాడు. అతని తల ఆకాశమంత ఎత్తులో ఉన్నట్లుంది. అందుకని నేను దాన్ని చూడలేకపోయాను. అతని చుట్టూ ఎంతోమంది పిల్లలున్నారు. అలాంటి పిల్లల్ని నేనెన్నడూ చూడలేదు. నేను "ఎవరితను? ఈ పిల్లలెవరు?" అని అడిగాను. వారు మళ్ళీ, "పదండి, పదండి" అన్నారు. మేమక్కణ్ణుంచి బయలుదేరి ఒక పెద్ద చెట్టు దగ్గరికి చేరుకున్నాం. దానికంటే పెద్దచెట్టు, దానికంటే మంచి చెట్టు నేనెన్నడూ చూడలేదు. వాళ్ళిద్దరూ నన్ను ఆ చెట్టు ఎక్కమని చెప్పారు. మేము దానిపైకి ఎక్కగానే అక్కడ మాకు బంగారం వెండి ఇటుకలతో నిర్మించబడిన ఒక పట్టణం కనిపించింది. మేము ఆ నగరద్వారం దగ్గరికి వెళ్ళి ద్వారం తెరువమని అడిగాం. (కాసేపటికి) ద్వారం తెరుచుకోబడింది. మేము లోపలికి వెళ్ళాం. అక్కడ మాకు ఎంతోమంది మనుషులు కనిపించారు. వారి అర్ధ శరీరం మీరింతవరకు చూసినవారందరికంటే అందంగా ఉంది. మిగతా అర్థ శరీరం మీరింతవరకు చూసినవారందరి కంటే వికృతంగా ఉంది. నా వెంటవున్న వాళ్ళిరువురు వారిని "పోండి, పోయి ఆ కాలువలో దూకండి" అని ఆదేశించారు. అక్కడ ఒక కాలువ అడ్డంగా ప్రవహిస్తూ ఉంది. ఆ కాలువలోని నీళ్లు పాలవంటి తెలుపురంగులో ఉన్నాయి. వారు వెళ్ళి ఆ కాలువలో దూకారు. తర్వాత మా దగ్గరికి తిరిగొచ్చేసరికి అందవికారంగా ఉన్న వారి అర్ధ శరీరాలు మాయమై వారందరూ గొప్ప అందగాళ్ళుగా మారిపోయారు. వాళ్ళిద్దరు నాకు ఇలా చెప్పారు: ఇది శాశ్వత స్వర్గం. అదిగో (ఆ కనిపిస్తున్నదే) మీ స్థానం. నేను (వారు చూపిస్తున్న వైపు) పైకి చూశాను. అక్కడ తెల్లని మబ్బులాంటి ఒక భవనం కనిపించింది. నావెంట ఉన్న వాళ్ళిద్దరూ "ఇదే మీ స్థానం" అని అన్నారు. నేను వారితో "దేవుడు మీకు శుభం చేయుగాక! నన్ను వదలండి. నేను లోపలికి వెళ్తాను" అని అన్నాను. అందుకు వారు "ఇప్పుడు కాదు, కాని ఎప్పటికైనా మీరే అందులోకి ప్రవేశిస్తారు. (ఇతరులెవరికీ ఆ అర్హతలేదు)" అని చెప్పారు. అప్పుడు నేను వారిని "రాత్రి నేను చాలా విచిత్రమైన విషయాలు చూశాను. నేను చూసినవన్నీ ఏమిటి?" అని అడిగాను. అప్పుడు వారు "చెప్తాం చెప్తాం. మొట్టమొదట మీరు ఒకతని సమీపం నుంచి వచ్చారు. అతని తల రాయితో మోదబడుతుంది. అతను ఖుర్ఆన్ను తీసుకొని కూడా ఆ తర్వాత దాన్ని వదలిపెట్టినవాడు (అంటే ఖుర్ఆన్ను కంఠస్థం చేసుకొని మర్చిపోవటం లేక ఖుర్ఆన్ జ్ఞానాన్ని నేర్చుకొని దాన్ని ఆచరించకపోవటం) ఇంకా అతను ఫర్జ్ నమాజుల్ని ఎగ్గొట్టి నిద్రపోయేవాడు. ఆ తర్వాత మీరు మరొకతని సమీపం నుంచి వచ్చారు. అతని దవడను, ముక్కు రంధ్రాన్ని, కంటిని మెడవెనుక భాగం వరకూ చీరేయబడుతూ ఉంది. ఇతను ఎవరంటే-ఇతను ఉదయం తన ఇంటి నుంచి బయలుదేరి అబద్ధాలు చెబుతూ (తిరుగుతూ) ఉంటాడు. అతను చెప్పే అబద్ధాలు (లోకం) నలుదిక్కులా వ్యాపిస్తాయి.
పోతే పొయ్యిలాంటి గొయ్యిలో నగ్నంగా ఉన్న స్త్రీ పురుషులు (ప్రపంచంలో) వ్యభిచారం చేసినవారు. ఆ తర్వాత మీరు ఇంకొకతన్ని చూశారు. అతను కాలువలో ఈదుతూ ఉంటే అతని నోట్లో రాతిముద్ద విసిరేయబడుతూ ఉంది. అతను వడ్డీలు తినేవాడు. తర్వాత అగ్నిని రగిలించి దానిచుట్టూ పరుగెత్తుతూ ఉన్న కురూపి ఎవరంటే, అతను నరకద్వారపాలకుడైన మాలిక్. ఆ తర్వాత తోటలో కనిపించిన పొడవాటి మనిషి ఇబ్రాహీమ్ (అలైహి). ఆయన చుట్టూ ఉన్న పిల్లలు సహజత్వం (అంటే నిజధర్మం)పై మరణించిన వారు. బర్ఖానీలోని ఒక ఉల్లేఖనంలో 'ఆ పిల్లలు సహజత్వంపై పుట్టిన వారు' అని ఉంది.
ఈ మాట అన్నప్పుడు ముస్లింలలో ఒకతను (సందేహపడుతూ) "దైవప్రవక్తా! (వారిలో) బహుదైవారాధకుల పిల్లలు కూడా ఉన్నారా?" అని అడిగాడు. అందుకాయన "అవును, బహుదైవారాధకుల పిల్లలు కూడా" అని అన్నారు.
ఆ తర్వాత అర్ధశరీరం అందంగానూ, మిగతా అర్ధశరీరం అంద వికారంగానూ ఉన్న వారెవరంటే, వారు రెండురకాల ఆచరణ చేసినవారు. అంటే వారు చేసిన కొన్ని కర్మలు మంచివి, మరికొన్ని చెడ్డవి. అయితే దేవుడు వారిని మన్నించేశాడు. (బుఖారీ)
బుఖారీలోని వేరొక ఉల్లేఖనంలో ఇలా ఉంది: నేను రాత్రి (కలలో) చూశాను. నా దగ్గరికి ఇద్దరు మనుషులు వచ్చి నన్ను పవిత్రభూమి వైపు తీసుకొని వెళ్ళారు. ఆ తర్వాత దైవప్రవక్త ﷺ (పైన చెప్పిన) సంఘటన అంతా వివరించారు. (అందులో ఇలా ఉంది) మేము నడుస్తూ నడుస్తూ ఒక గొయ్యి దగ్గరికి చేరుకున్నాం. అది రొట్టెల పొయ్యిలాగుంది. దాని పైభాగం ఇరుకుగానూ అడుగుభాగం విశాలంగానూ ఉంది. దాని అడుగుభాగంలో అగ్ని మండుతూ ఉంది. ఆ మంటలు పైకి లేవగానే (ఆ గొయ్యిలో ఉన్నవారు కూడా) పైకి వస్తున్నారు. కొద్దిట్లో బయటికి వచ్చేస్తారన్నంతలోనే మంటలు ఆరిపోయి మళ్ళీ క్రిందికి వెళ్ళిపోతున్నారు. ఆ గొయ్యిలో నగ్నంగా ఉన్న పురుషులు, స్త్రీలు ఉన్నారు.
ఈ ఉల్లేఖనంలో ఇలా కూడా ఉంది: మేము ఒక రక్తపు కాలువ దగ్గరికి చేరుకున్నాం. (మొదటి ఉల్లేఖనంలో లాగా) ఇందులో ఉల్లేఖకుడు సందేహం వెలిబుచ్చలేదు. దాని ప్రకారం ఒకతను కాలువ మధ్యలో నించొని ఉన్నాడు. కాలువ ఒడ్డున మరొకతను ఉన్నాడు. అతని ముందు రాళ్ళున్నాయి. కాలువలో ఉన్న వ్యక్తి ముందుకొచ్చి బయటికి వెళ్ళాలని ప్రయత్నించినప్పుడు ఒడ్డున ఉన్న మనిషి అతని నోట్లో రాయి విసిరి అతన్ని మళ్ళీ వెనక్కి తరుముతున్నాడు. (ఒడ్డు మీద కూర్చున్నవాడు మాటిమాటికీ అదే పని చేస్తున్నాడు.) కాలువలో ఉన్న మనిషి బయటికి రావాలని ప్రయత్నించినప్పుడల్లా అతని నోట్లో రాయికొట్టి అతన్ని వెనక్కి తరుముతున్నాడు.
ఆ ఉల్లేఖనంలో ఈ విషయం కూడా ఉంది: ఆ ఇద్దరు వ్యక్తులు నన్ను తీసుకొని ఒక చెట్టెక్కారు. అక్కడ వారు నన్ను ఒక ఇంట్లోకి తీసుకెళ్ళారు. దానికంటే అందమైన ఇల్లు నేనెన్నడూ చూడలేదు. ఆ ఇంట్లో కొందరు మగవారు ఉన్నారు. వారిలో ముసలివారు, యువకులు ఇరువురూ ఉన్నారు. ఆ ఉల్లేఖనంలో ఈ విషయం కూడా ఉంది: దవడలు చీరేయబడుతూ ఉండగా నేను చూసిన వ్యక్తి పెద్ద అబద్ధాలరాయుడు. అతని నోటి నుంచి అబద్ధాలే వచ్చేవి. అతని నోటి నుంచి వినబడిన ఆ అబద్ధాలు (లోకం) నలువైపులా వ్యాపించేవి. కనుక ప్రళయం వరకూ ఇతని పట్ల ఇదే వ్యవహారం జరుగుతూ ఉంటుంది.
అందులో ఈ విషయం కూడా ఉంది: తల మోదబడుతూ మీకు కనిపించిన వ్యక్తి ఎవరంటే దేవుడు అతనికి ఖుర్ఆన్ జ్ఞానాన్ని ప్రసాదిస్తే అతను దాన్ని వదలిపెట్టి రాత్రిపూట నిద్రపోయేవాడు. పగలు కూడా దాన్ని ఆచరించేవాడు కాదు. ఇతనిపట్ల కూడా ప్రళయం వరకూ ఇదే వ్యవ హారం కొనసాగుతూ ఉంటుంది. తొలిసారి మీరు లోపలికి వెళ్ళిన ఇల్లు సాధారణ విశ్వాసులది. కాని ఇది అమరగతుల ఇల్లు. నేను జిబ్రయీల్ని. ఈయన మీకాయీల్. మీరు కాస్త తల పైకెత్తండి."
నేను తలపైకెత్తి చూశాను నాపైన మబ్బులాంటిది ఏదో కనిపించింది. దాన్ని చూపిస్తూ వారు "ఇది మీ స్థానం" అని అన్నారు. అప్పుడు నేను "నన్ను నా స్థానంలోకి వెళ్ళనివ్వండి" అన్నాను. అందుకువారు "మీ ఆయుష్షు ఇంకా కొంత మిగిలుంది. అది ఇంకా పూర్తికాలేదు. దాన్ని పూర్తి చేసిన తర్వాత మీరు మీ స్థానంలోకి వెళ్తారు" అని చెప్పారు. (బుఖారీ)
(సహీహ్ బుఖారీలోని తాబీర్ ప్రకరణం)
English
Sumurah bin Jundub (radiyallahu anhu) said: The Messenger of Allah ﷺ very often used to ask his Companions, “Do any one of you has seen a dream?” So dreams would be narrated to him by those whom Allah willed to relate. One day he ﷺ said, “Last night I had a vision in which two men (angels) came to me and woke me up and said to me, `Proceed!’ I set out with them and we came across a man lying down, and behold, another man was standing over his head, holding a big rock. Behold, he was throwing the rock at the man’s head, smashing it. When he struck him, the stone rolled away and he went after it to get it, and no sooner had he returned to this man, his head was healed and restored to its former condition. The thrower (of the rock) then did the same as he had done before. I said to my two companions, `Subhan-Allah! Who are these?’ They said: `Proceed, proceed.’ So we proceeded and came to a man lying in a prone position and another man standing over his head with an iron hook, and behold, he would put the hook in one side of the man’s mouth and tear off that side of his face to the back (of the neck), and similarly tear his nose from front to back, and his eyes from front to back. Then he turned to the other side of the man’s face and did just as he has done with the first side. He had hardly completed that (second) side when the first returned to its normal state. I said to my two companions, `Subhan-Allah! Who are these?’ They said, `Proceed, proceed.’ So we proceeded and came across something like a Tannur (a kind of baking oven, a pit usually clay-lined for baking bread).” I (the narrator) think the Prophet ﷺ said, “In that oven there was much noise and voices.” The Prophet ﷺ added, “We looked into it and found naked men and women, and behold, a flame of fire was reaching to them from underneath, and when it reached them they cried loudly. I asked, `Who are these?’ They said to me, `Proceed, proceed.’ And so we proceeded and came across a river.” I (the narrator) think he said, “– red like blood.” The Prophet ﷺ added, “And behold, in the river there was a man swimming, and on the bank there was a man who had collected many stones. Behold, while the other man was swimming, he went near him. The former opened his mouth and the latter (on the bank) threw a stone into his mouth whereupon he went swimming again. Then again he (the former) returned to him (the latter), and every time the former returned, he opened his mouth, and the latter threw a stone into his mouth, (and so on) the performance was repeated. I asked my two companions, `Who are these?’ They replied, `Proceed, proceed.’ And we proceeded till we came to a man with a repulsive appearance, the most repulsive appearance you ever saw a man having! Beside him there was a fire, and he was kindling it and running around it. I asked my two companions, `Who is this (man).’ They said to me, `Proceed, proceed!’ So we proceeded till we reached a garden of deep green dense vegetation, having all sorts of spring colours. In the midst of the garden there was a very tall man, and I could hardly see his head because of his great height, and around him there were children in such a large number as I have never seen! I said to my two companions, `Who is this?’ They replied, `Proceed, proceed.’ So we proceeded till we came to a majestic, huge garden, greater and better than any garden I have ever seen! My two companions said to me, `Ascend up’ and I ascended up.” The Prophet ﷺ added, “So we ascended till we reached a city built of gold and silver bricks, and we went to its gate and asked (the gatekeeper) to open the gate, and it was opened; and we entered the city and found in it men with one side of their bodies as handsome as the most handsome person you have ever seen, and the other side as ugly as the ugliest person you have ever seen! My two companions ordered those men to throw themselves into the river. Behold, there was a river flowing across (the city), and its water was like milk in whiteness. Those men went and threw themselves in it and then returned to us after the ugliness (of their bodies) had disappeared, and they came in the best shape.” The Prophet ﷺ further added, “My two companions said to me: `This place is the `Adn Jannah, and that is your place.’ I raised up my sight, and behold, there I saw a palace like a white cloud! My two companions said to me, `That palace is your place,’ I said to them, `May Allah bless you both! Let me enter it.’ They replied, `As for now, you will not enter it, but you shall enter it (one day).’ I said to them, `I have seen many wonders tonight. What does all that mean which I have seen?’ They replied, `We will inform you: As for the first man you came upon, whose head was being smashed with the rock, he is the symbol of the one who studies the Qur’an and then neither recites it nor acts on its orders, and sleeps, neglecting the enjoined prayers. As for the man you came upon, whose sides of mouth, nostrils and eyes were torn off from front to back, he is the symbol of the man who goes out of his house in the morning and tells lies that are spread all over the world. And those naked men and women whom you saw in a construction resembling an oven, they are the adulterers and the adulteresses. And the man who was given a stone to swallow is the eater of Ar-Riba (usury), and the bad-looking man whom you saw near the fire, kindling it and going around it, is Malik, the gatekeeper of Hell, and the tall man you saw in the garden is (Prophet) Abraham, and the children around him are those who died upon Al-Fitrah (the Islamic Faith of Monotheism).”’ The narrator added: Some Muslims asked the Prophet ﷺ , “O Messenger of Allah! What about the children of Al-Mushrikun (i.e., polytheists, pagans, idolaters, and disbelievers in the Oneness of Allah and in His Messenger Muhammad ﷺ)?” The Prophet ﷺ replied, “And also the children of Al-Mushrikun.” The Prophet ﷺ added: “My two companions added, `The men you saw half handsome and half ugly were these people who had mixed an act that was good with another that was bad, but Allah forgave them‘.”
Another narration of Al-Bukhari is: The Messenger of Allah ﷺ said, “One night two men came to me and took me to a blessed land.” (The Messenger of Allah ﷺ told of the same incident as above) and said, “After a while of walking we came upon a pit like an oven, narrow at the top and wide at the bottom with fire raging in it. When the flames rose up (the people in it) also rose up till they were about to come out; and when the fire subsided they, too, would go down with it. In it were naked men and women.” (The remainder of the Hadith is the same as the above Hadith except that at the end of it, the Messenger of Allah said: “We came upon a river of blood in the middle of which there was a man standing, and at the bank of the river there was a man with plenty of stones before him…” In this narration we also find: “They made me climb the tree and they made me enter an abode so beautiful the like of which I have never seen before. There (I saw) old men and youth.” In this narration we also find: “`The first house you entered was the abode of the believers in general, and the other house was the abode of the martyrs. I am Jibril (Gabriel), and this is Mika’il. Raise your head.’ I looked up and saw something like clouds. They said to me, `That is your abode.’ I said, `Shall I enter it?’ They said, `You have not completed your term of life yet. When you do, you will certainly enter it.”’[Al-Bukhari]
ముఖ్యాంశాలు
ఇందులో దైవప్రవక్త ﷺకు స్వప్నావస్థలో, వివిధ పాపాలకు విధించబడే శిక్షలు చూపించబడ్డాయనే విషయం వివరించబడింది. ఉదా: ఖుర్ఆన్ను కంఠస్తం చేసి మర్చిపోవటం, దాన్ని ఆచరించకపోవటం. అదే విధంగా ఖుర్ఆన్ జ్ఞానం నేర్చుకొని అనాచరణకు, దురాచరణకు పాల్పడుతూ ఉండటం, సోమరితనంతో ఫర్జ్ నమాజుల్ని ఎగ్గొట్టటం, అబద్ధం చెప్పటం, వ్యభిచారం చేయటం, వడ్డీలు తినటం మొదలగు పాపాలకు ఘోరమైన శిక్షలు విధించబడతాయని హెచ్చరించటం జరిగింది. వాటి కొన్ని నమూనాలు పై హదీసులో వివరించబడ్డాయి. అంతేకాదు, ఈ హదీసులో దైవప్రవక్త ﷺ స్థానాన్నీ, ఆ తర్వాత అమరవీరుల స్థానాలను కూడా స్పష్టం చేయటం జరిగింది. ఇందులో బోధించబడిన ఇంకో విషయం ఏమిటంటే దేవుడు తన దాసుల్ని శిక్షించటం కోసం నరకాన్నీ, అనుగ్రహించటం కోసం స్వర్గాన్నీ తయారుచేసి ఉంచాడు. వాటిలో అనేక శిక్షల్ని, అనుగ్రహాలను తన అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ ﷺకు దర్శనం చేయించాడు.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|వారింపబడిన విషయాల ప్రకరణం|260. అబద్ధం చెప్పటం నిషిద్ధం|హదీసు 1547
You must be logged in to post a comment.