హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: ఇమామ్ అబూ జకరియ్యా యహ్యా బిన్ షరఫ్ అన్ నవవీ (రహ్మతుల్లాహి అలైహి)
ఉర్దూ అనువాదం, వ్యాఖ్యానం: హాఫిజ్ సలాహుద్దీన్ యూసుఫ్ · తెలుగు రూపం: హాఫిజ్ ఎస్.ఎమ్. రసూల్ షర్ఫీ · ప్రకాశకులు: ట్రూత్ పబ్లికేషన్స్, హైదరాబాద్

రియాదుస్ సాలిహీన్ (హదీసు కిరణాలు) – 258వ అధ్యాయం: ప్రజల సంభాషణలు, వారి మాటలు అనవసరంగా అధికారులకు చేరవేయరాదు. ఒకవేళ కల్లోలం వ్యాపించే లేక నష్టం జరిగే సూచనలుంటే అప్పుడు ధర్మసమ్మతమే. ఈ అధ్యాయంలో 1 ఖుర్ఆన్ ఆయతులు, 1 హదీసులు (హదీసు 1540) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, ముఖ్యాంశాలు, English అనువాదంతో.
258. ప్రజల సంభాషణలు, వారి మాటలు అనవసరంగా అధికారులకు చేరవేయరాదు. ఒకవేళ కల్లోలం వ్యాపించే లేక నష్టం జరిగే సూచనలుంటే అప్పుడు ధర్మసమ్మతమే
باب النهي عن نَقْل الحديثِ وكلام الناس إِلَى ولاة الأمورِ إِذَا لَمْ تدْعُ إِلَيْهِ حاجةٌ كَخَوفِ مفسدةٍ ونحوها
అరబీ పాఠం: రియాదుస్ సాలిహీన్ – తహ్‌ఖీఖ్: షుఐబ్ అల్ అర్నావూత్ (ముఅస్సస్సతుర్ రిసాలా)
దివ్యఖుర్‌ఆన్‌లో అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
{وَلا تَعَاوَنُوا عَلَى الْأِثْمِ وَالْعُدْوَانِ} [المائدة: ٢]
"పాపకార్యాలలో, అత్యాచారాలలో ఎవరితోనూ సహకరించకండి." (మాఇద: 2)
ఇంత కు ముందు అధ్యాయంలో వచ్చిన హదీసులు ఈ అధ్యాయానికి కూడా వర్తిస్తాయి. (అదనంగా మరో హదీసును పరిశీలించండి)
English
“… Do not help one another in sin and transgression.” [Al-Mā’idah 5:2]
హదీసు 1540
وعن ابن مَسْعُودٍ رضي اللَّه عنهُ قالَ: قالَ رَسُولُ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "لا يُبَلِّغْني أحدٌ مِنْ أصْحابي عنْ أحَدٍ شَيْئاً، فَإنِّي أُحِبُّ أنْ أَخْرُجَ إِليْكُمْ وأنَا سليمُ الصَّدْرِ" رواه أَبُو داود والترمذي.
హజ్రత్ ఇబ్నె మస్‌వూద్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రబోధించారు: నా సహచరుల్లో ఎవరూ కూడా ఎవరి గురించీ నాతో ఏ మాటా చెప్పరాదు. ఎందుకంటే నేను మీ దగ్గరికి వచ్చినప్పుడు (మీలో ప్రతి ఒక్కరి విషయంలో) నా హృదయం స్వచ్ఛంగా ఉండాలని నేను కోరుకుంటాను. (అబూదావూద్-తిర్మిజీ)
(సుననె అబూదావూద్‌లోని సంస్కార ప్రకరణం – సుననె తిర్మిజీలోని మనాఖిబ్ అధ్యాయాలు)
English
Ibn Mas`ud (radiyallahu anhu) said: The Messenger of Allah ﷺ said, “None of my Companions should convey to me anything regarding another because I desire to meet everyone of you with a clean heart.”[Abu Dawud and At-Tirmidhi].
ముఖ్యాంశాలు
'మాట' అంటే దైవప్రవక్త ﷺకు నచ్చని మాట లేక సంబంధిత దాసుని వ్యక్తిత్వానికి నష్టం కలిగించే మాట అని భావం. ఇందులో తోటివారి వ్యక్తిగత విషయాలను మరుగున ఉంచాలని తాకీదు చేయబడింది. ప్రజల మాటలు అనవసరంగా అధికారులకు చేరవేయటాన్ని వారించటం జరిగింది. ఇమామ్ నవవీ (రహిమహుల్లాహ్) పెట్టిన శీర్షిక ద్వారా కూడా ఈ విషయాలు బోధపడుతున్నాయి.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|వారింపబడిన విషయాల ప్రకరణం|258. ప్రజల సంభాషణలు, వారి మాటలు అనవసరంగా అధికారులకు చేరవేయరాదు. ఒకవేళ కల్లోలం వ్యాపించే లేక నష్టం జరిగే సూచనలుంటే అప్పుడు ధర్మసమ్మతమే|హదీసు 1540
You must be logged in to post a comment.