హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) – 257. చాడీలు చెప్పటం నిషిద్ధం

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: ఇమామ్ అబూ జకరియ్యా యహ్యా బిన్ షరఫ్ అన్ నవవీ (రహ్మతుల్లాహి అలైహి)
ఉర్దూ అనువాదం, వ్యాఖ్యానం: హాఫిజ్ సలాహుద్దీన్ యూసుఫ్ · తెలుగు రూపం: హాఫిజ్ ఎస్.ఎమ్. రసూల్ షర్ఫీ · ప్రకాశకులు: ట్రూత్ పబ్లికేషన్స్, హైదరాబాద్

రియాదుస్ సాలిహీన్ – హదీసు కిరణాలు (ఇమామ్ నవవీ) – అరబీ, తెలుగు, English

రియాదుస్ సాలిహీన్ (హదీసు కిరణాలు) – 257వ అధ్యాయం: చాడీలు చెప్పటం నిషిద్ధం, చాడీ అంటే సంబంధాలను చెడగొట్టే ఉద్దేశ్యంతో ఒకరి మాటలు ఇంకొకరికి చెప్పటం. ఈ అధ్యాయంలో 2 ఖుర్ఆన్ ఆయతులు, 3 హదీసులు (హదీసు 1537 – 1539) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, ముఖ్యాంశాలు, English అనువాదంతో.

257. చాడీలు చెప్పటం నిషిద్ధం, చాడీ అంటే సంబంధాలను చెడగొట్టే ఉద్దేశ్యంతో ఒకరి మాటలు ఇంకొకరికి చెప్పటం

↑ విషయ సూచిక

باب تحريم النميمة وهي نقل الكلام بَيْنَ الناس عَلَى جهة الإِفساد

అరబీ పాఠం: రియాదుస్ సాలిహీన్ – తహ్‌ఖీఖ్: షుఐబ్ అల్ అర్నావూత్ (ముఅస్సస్సతుర్ రిసాలా)

దివ్యఖుర్‌ఆన్‌లో అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

{هَمَّازٍ مَشَّاءٍ بِنَمِيمٍ} [ن: ١١]

"ఇతరుల్ని ఎత్తిపొడుస్తూ, చాడీలు చెబుతూ తిరుగుతుండేవాడికి ఏ మాత్రం లొంగకు." (అల్ ఖలమ్: 11)

{مَا يَلْفِظُ مِنْ قَوْلٍ إِلاَّ لَدَيْهِ رَقِيبٌ عَتِيدٌ} [ق: ١٨]

"మనిషి నోటి నుండి వెడలే ప్రతి మాటనూ వ్రాయటానికి అనుక్షణం ఒక పరిశీలకుడు సిద్ధంగా ఉంటాడు." (ఖాఫ్: 18)

English

“A slanderer, going about with calumnies.” [Al-Qalam 68:11]

“Not a word does he (or she) utter, but there is a watcher by him ready (to record it).” [Qāf 50:18]

1537

హదీసు 1537

وعَنْ حذَيْفَةَ رضي اللَّه عنهُ قالَ: قَالَ رسُولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "لا يَدْخُلُ الجنةَ نمَّامٌ" متفقٌ عَلَيْهِ.

హజ్రత్ హుజైఫా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఈ విధంగా ప్రవచించారు: "చాడీలు చెప్పేవాడు స్వర్గంలోకి వెళ్ళలేడు."

(బుఖారీ-ముస్లిం)

(సహీహ్ బుఖారీలోని అదబ్ ప్రకరణం – సహీహ్ ముస్లింలోని విశ్వాస ప్రకరణం)

English

Hudhaifah (radiyallahu anhu) said: The Messenger of Allah ﷺ said, “The person who goes about with calumnies will never enter Jannah.”[Al-Bukhari and Muslim].

ముఖ్యాంశాలు

చాడీ అనే పదానికి అర్థమేమిటో ఇమామ్ నవవీ (రహిమహుల్లాహ్) శీర్షికలోనే వివరించారు. చాడీలు చెప్పటం ముమ్మాటికీ నిషిద్ధం. ఈ విషయం తెలిసి కూడా ఎవడైనా దాన్ని ధర్మసమ్మతంగా భావించి చాడీలు చెబుతూ ప్రజల మధ్య సంబంధాలను చెడగొట్టటానికి పాల్పడితే అలాంటివారు ఎన్నటికీ స్వర్గానికి వెళ్ళలేరు. ఒకవేళ తాము దాన్ని హరామ్‌గా భావిస్తున్నప్పటికీ మానవ సహజమైన దౌర్బల్యం మూలంగా తమ వల్ల అలాంటి తప్పు జరిగిపోతుంటే అది వేరే విషయం. అలాంటివారు దేవుడు తమల్ని మొదట్లో క్షమించకపోతే ఆ పాపానికి నరకంలో కొంతకాలం శిక్ష అనుభవించి ఆ తర్వాత స్వర్గానికి వెళ్తారు. సూత్రప్రాయంగా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. దేవుని క్షమాభిక్ష లభిస్తేనే తప్ప ఇలాంటి పాపాత్ములు మొదటి దశలోనే స్వర్గానికి వెళ్ళలేరు.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|వారింపబడిన విషయాల ప్రకరణం|257. చాడీలు చెప్పటం నిషిద్ధం, చాడీ అంటే సంబంధాలను చెడగొట్టే ఉద్దేశ్యంతో ఒకరి మాటలు ఇంకొకరికి చెప్పటం|హదీసు 1537

1538

హదీసు 1538

وعَنْ ابن عَباسٍ رضي اللَّه عَنْهُمَا أنَّ رَسُول اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: مرَّ بِقَبريْنِ فَقَالَ: "إنَّهُمَا يُعَذَّبان، وَمَا يُعَذَّبَانِ في كَبيرٍ، بَلى إنَّهُ كَبيرٌ: أمَّا أحَدُهمَا، فَكَانَ يمشِي بالنَّمِيمَةِ، وأمَّا الآخرُ فَكَانَ لاَ يسْتَتِرُ مِنْ بولِه". متفقٌ عَلَيْهِ، وهذا لفظ إحدى روايات البخاري. قالَ العُلَماءُ: معْنَى:"وَمَا يُعَذَّبَانِ في كَبيرٍ"أيْ كَبيرٍ في زَعْمِهما وقيلَ: كَبِيرٌ تَرْكُهُ عَلَيهما.

హజ్రత్ ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హుమా) కథనం: దైవప్రవక్త ﷺ రెండు సమాధుల దగ్గర్నుంచి వెళ్తూ ఇలా అన్నారు: "ఈ రెండు సమాధుల్లో ఉన్నవారికి శిక్షపడుతోంది. వీరికి ఈ శిక్ష ఏదో పెద్ద విషయం మూలంగా పడుతుంది కాదు! (ఆ తర్వాత ఆయనే అన్నారు) ఎందుకు కాదు, అది పెద్ద విషయమే. వీరిలో ఒకడు చాడీలు చెప్తూ తిరుగుతుండేవాడు. మరొకతను మూత్రం పోసినప్పుడు ఒంటిమీద దాని తాలూకు తుంపరలు పడకుండా జాగ్రత్తపడేవాడు కాదు."

(బుఖారీ-ముస్లిం)

"వీరికి ఈ శిక్ష ఏదో పెద్ద విషయం మూలంగా పడటం లేదు" అనే వాక్యాన్ని గురించి వ్యాఖ్యానిస్తూ పండితులు "దీని అర్థం వారి దృష్టిలో ఆ విషయం పెద్దది కాదు. కాని షరీఅత్ దృష్టిలో అది చాలా పెద్ద విషయం" అని అన్నారు. మరికొంతమంది దాని భావం "ఆ అలవాటును వదిలేయటం వారికి కష్టమైన పని కాదు (వారు తలచుకుంటే ఆ పని మానగలిగేవారు)" అని చెప్పారు.

(సహీహ్ బుఖారీలోని వుజూ ప్రకరణం – సహీహ్ ముస్లింలోని శుచీ శుభ్రతల ప్రకరణం)

English

Ibn `Abbas (radiyallahu anhuma) said: The Messenger of Allah ﷺ passed by two graves and said, “Both of them (the persons in these graves) are being tortured, and they are not being tortured for a cardinal sin. But indeed they are great sins. One of them used not to save himself from being soiled with his urine, and the other one used to go about with calumnies (among the people to rouse hostilities, e.g., one goes to a person and tells him that so-and-so says about him such and such evil things).”[Al-Bukhari and Muslim].

ముఖ్యాంశాలు

1) 'లా యస్తతిరు మిన్ బౌలిహీ' అనే వాక్యానికి ఇంకొక అర్థం కూడా ఉంది. అదేమిటంటే ఆ వ్యక్తి మూత్రం పోసేటప్పుడు ప్రజలెవరికీ కనపడని చోటుకెళ్ళి మూత్ర విసర్జన చేయడు. నిస్సిగ్గుగా అందరూ చూస్తుండగానే మూత్ర విసర్జన చేయటానికి కూర్చుంటాడు. ఈ లజ్జారాహిత్యం కూడా పాపమే. మొత్తానికి ఈ హదీసు ద్వారా బోధపడేదేమంటే చాడీలు చెప్పటం, మూత్రపు తుంపరల విషయంలో అజాగ్రత్త వహించటం లేక మూత్రవిసర్జన సమయంలో పరదా పాటించకపోవటం- ఇవన్నీ ఘోరమైన పాపాలు, ఇలాంటి పాపాలకు పాల్పడేవారు పట్టుబడతారు.

2) కొంతమంది సమాధి యాతనను నమ్మరు. ఈ హదీసు ద్వారా సమాధి యాతన నిజమని రుజువు అవుతోంది.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|వారింపబడిన విషయాల ప్రకరణం|257. చాడీలు చెప్పటం నిషిద్ధం, చాడీ అంటే సంబంధాలను చెడగొట్టే ఉద్దేశ్యంతో ఒకరి మాటలు ఇంకొకరికి చెప్పటం|హదీసు 1538

1539

హదీసు 1539

وعن ابن مسْعُودٍ رضي اللَّه عنْهُ أنَّ النَّبيّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَالَ: "أَلاَ أُنَبِّئكُم مَا العَضْهُ؟ هي النَّمِيمةُ، القَالَةُ بيْنَ النَّاسِ" رواه مسلم. "العَضْهُ": بفَتْح العين المُهْمَلَةِ، وإسْكان الضَّادِ المُعْجَمَةِ، وبالهاءِ عَلَى وزنِ الوجهِ، ورُوي:"العِضَةُ"بِكسْرِ العَيْنِ وفَتْحِ الضَّادِ المُعْجَمَةِ عَلى وَزْنِ العِدَةِ، وهِي: الكذِبُ والبُهتانُ، وعَلى الرِّواية الأولى: العَضْهُ مصدرٌ، يقال: عَضَهَهُ عَضْهاً، أيْ: رماهُ بالعَضْهِ.

హజ్రత్ ఇబ్నె మస్‌వూద్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఈ విధంగా ప్రవచించారు: 'అజ్‌హు' అంటే ఏమిటో నేను మీకు తెలుపనా? అజ్‌హు అంటే చాడీలు చెప్పటం, ప్రజల్లో ఒకరి గురించి మరొకరికి చెప్పటం. (ముస్లిం)

అజ్‌హు-వజ్‌హు అన్న విధంగా పలకాలి. అయితే దీన్ని 'ఇజతు' అని పలకాలని వేరొక కథనం కూడా ఉంది. దీనికి అబద్ధం, అపనింద అనే అర్థాలున్నాయి.

(సహీహ్ ముస్లింలోని బిర్ర్ ప్రకరణం)

English

Ibn Mas`ud (radiyallahu anhu) said: The Prophet ﷺ said, “Shall I tell you what `Al-`Adhu’ (falsehood and slandering) is? It is calumny which is committed among the people.”[Muslim].

ముఖ్యాంశాలు

చాడీలు చెప్పటం, అబద్ధం పలకటం, అపనిందలు మోపటం మొదలగునవన్నీ ఘోరమైన పాపాలని ఈ హదీసు ద్వారా బోధపడుతోంది. ఎందుకంటే వీటి మూలంగా సమాజంలో కల్లోలం వ్యాపిస్తుంది. ప్రజాసంబంధాలు చెడిపోతాయి. మనుషుల మధ్య అంతరాల అగాధాలు పెరిగిపోతాయి. ఒక ముస్లిం వ్యక్తి నడవడిక ఇలాంటి లోపాలు లేకుండా పవిత్రంగా ఉండాలి.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|వారింపబడిన విషయాల ప్రకరణం|257. చాడీలు చెప్పటం నిషిద్ధం, చాడీ అంటే సంబంధాలను చెడగొట్టే ఉద్దేశ్యంతో ఒకరి మాటలు ఇంకొకరికి చెప్పటం|హదీసు 1539