హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) – 244. దైవస్మరణం విశిష్ఠత – ప్రోత్సాహం

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: ఇమామ్ అబూ జకరియ్యా యహ్యా బిన్ షరఫ్ అన్ నవవీ (రహ్మతుల్లాహి అలైహి)
ఉర్దూ అనువాదం, వ్యాఖ్యానం: హాఫిజ్ సలాహుద్దీన్ యూసుఫ్ · తెలుగు రూపం: హాఫిజ్ ఎస్.ఎమ్. రసూల్ షర్ఫీ · ప్రకాశకులు: ట్రూత్ పబ్లికేషన్స్, హైదరాబాద్

రియాదుస్ సాలిహీన్ – హదీసు కిరణాలు (ఇమామ్ నవవీ) – అరబీ, తెలుగు, English

రియాదుస్ సాలిహీన్ (హదీసు కిరణాలు) – 244వ అధ్యాయం: దైవస్మరణం విశిష్ఠత – ప్రోత్సాహం. ఈ అధ్యాయంలో 6 ఖుర్ఆన్ ఆయతులు, 36 హదీసులు (హదీసు 1409 – 1444) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, ముఖ్యాంశాలు, English అనువాదంతో.

244. దైవస్మరణం విశిష్ఠత – ప్రోత్సాహం

↑ విషయ సూచిక

باب فَضلِ الذِّكْرِ والحثِّ عليه

అరబీ పాఠం: రియాదుస్ సాలిహీన్ – తహ్‌ఖీఖ్: షుఐబ్ అల్ అర్నావూత్ (ముఅస్సస్సతుర్ రిసాలా)

దివ్యఖుర్‌ఆన్‌లో అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

{وَلَذِكْرُ اللَّهِ أَكْبَرُ} [العنكبوت: ٤٥]

"అల్లాహ్ సంస్మరణ అన్నిటికంటే గొప్పది." (అన్‌కబూత్: 45)

{فَاذْكُرُونِي أَذْكُرْكُمْ} [البقرة: ١٥٢]

"మీరు నన్ను జ్ఞాపకం చేసుకోండి. నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటాను." (బఖర: 152)

{وَاذْكُرْ رَبَّكَ فِي نَفْسِكَ تَضَرُّعاً وَخِيفَةً وَدُونَ الْجَهْرِ مِنَ الْقَوْلِ بِالْغُدُوِّ وَالآصَالِ وَلا تَكُنْ مِنَ الْغَافِلِينَ} [الأعراف: ٢٠٥]

"నీ ప్రభువును ఉదయమూ సాయంత్రమూ స్మరించు, లోలోపల వినయంతోనూ భయపడుతూనూ, మెల్లగా నోటితో కూడా. నిర్లక్ష్యం చేసే వారిలో నీవు చేరకు." (ఆరాఫ్: 205)

{وَاذْكُرُوا اللَّهَ كَثِيراً لَعَلَّكُمْ تُفْلِحُونَ} [الجمعة: ١٠]

"అల్లాహ్‌ను అత్యధికంగా స్మరిస్తూ ఉండండి, బహుశా మీకు సాఫల్య భాగ్యం కలుగవచ్చు." (జుముఅహ్: 10)

{وَالذَّاكِرِينَ اللَّهَ كَثِيراً وَالذَّاكِرَاتِ أَعَدَّ اللَّهُ لَهُمْ مَغْفِرَةً وَأَجْراً عَظِيماً} [الأحزاب: ٣٥]

"నిశ్చయంగా ముస్లిములూ, విశ్వాసులూ…… అల్లాహ్‌ను అత్యధికంగా స్మరించేవారూ అయిన స్త్రీపురుషుల నిమిత్తం అల్లాహ్ క్షమాభిక్షను, గొప్ప ప్రతిఫలాన్ని సిద్ధపరచి ఉంచాడు." (అహ్‌జాబ్: 35)

{يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا اذْكُرُوا اللَّهَ ذِكْراً كَثِيراً وَسَبِّحُوهُ بُكْرَةً وَأَصِيلاً} [الأحزاب: ٤٢,٤١]

"విశ్వసించిన ఓ ప్రజలారా! అల్లాహ్‌ను అత్యధికంగా స్మరించండి. ఉదయం, సాయంత్రం ఆయన పవిత్రతను కొనియాడుతూ ఉండండి." (అహ్‌జాబ్: 41-42)

ఈ అధ్యాయానికి సంబంధించిన సుప్రసిద్ధ సూక్తులు ఇంకా చాలా ఉన్నాయి.

ముఖ్యాంశాలు

పై సూక్తుల్లో దేవుణ్ణి స్మరిస్తూ ఉండాలని ఆదేశించబడింది. ఈ సంస్మరణ వివిధ రకాలుగా ఉండవచ్చు. దేవుడు మనిషికి విధించిన ఆచరణల్ని పాటించటం, ఆయన సామీప్యానికి చేర్చే పనుల్ని నిర్వహించటం కూడా ఒక విధంగా దైవనామస్మరణే. అలాగే దేవుణ్ణి స్తుతించటం, ఆయన పవిత్రతను కొనియాడటం నోటిపరమైన స్మరణ అయితే విశ్వవ్యవస్థలోని వైచిత్రాల మీద, నిదర్శనాల మీద యోచన చేసి దేవుని అస్తిత్వాన్ని గుర్తించటం, ఆయన పట్ల విశ్వాసాన్ని, నమ్మకాన్ని పెంపొందించుకోవటం మనసుకు సంబంధించిన స్మరణ అవుతుంది. అలాగే ఇంకో రకమైన జిక్ర్ (స్మరణ) కూడా ఉంటుంది. అది అవయవాల ద్వారా వ్యక్తమవుతుంది. ఉదా: మనిషి ఎల్లప్పుడూ దైవిధేయతకు కట్టుబడి ఉండటం, నమాజ్ ఉపవాసాలు పాటించటం, హజ్ చేయటం, జకాత్ సదఖా దానాలు చేయటం మొదలగునవి. మొత్తానికి దైవసంస్మరణ అంటే మనిషి తన నోటిద్వారా, మనస్సు ద్వారా, అవయవాల ద్వారా దేవుణ్ణి ప్రస్తుతిస్తూ ఆయన పట్ల తనకున్న విశ్వాసాన్ని వ్యక్తపరుస్తూ ఉండటం. అలా చేసేవారి మీద దేవుడు తన కారుణ్య వర్షాన్ని కురిపిస్తాడు. వారు గనక కష్టాల్లో ఉంటే ఆ కష్టాల నుండి వారిని గట్టెక్కిస్తాడు. వారి పాపాలను ఉపేక్షిస్తాడు.

English

“And the remembering (praising) of (you by) Allah (in front of the angels) is greater indeed [than your remembering (praising) of Allah in prayers]” [Al-‘Ankabūt 29:45]

“Therefore remember Me (by praying, glorifying). I will remember you.” [Al-Baqarah 2:152]

“And remember your Rubb by your tongue and within yourself, humbly and with fear and without loudness in words, in the mornings and in the afternoons, and be not of those who are neglectful.” [Al-A‘rāf 7:205]

“And remember Allah much, that you may be successful.” [Al-Jumu‘ah 62:10]

“Verily, the Muslims (those who submit to Allah in Islam) men and women… (up to)… And the men and the women who remember Allah much with their hearts and tongues. Allah has prepared for them forgiveness and a great reward (i.e., Jannah).” [Al-Aḥzāb 33:35]

“O you who believe! Remember Allah with much remembrance. And glorify His Praises morning and afternoon [the early morning (Fajr) and `Asr prayers].” [Al-Aḥzāb 33:41–42]

1409

హదీసు 1409

وعَنْ أَبي هُريرةَ، رضي اللَّه عنْهُ قالَ: قالَ رَسُولُ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "كَلِمتَانِ خَفِيفَتَانِ عَلى اللِّسانِ، ثَقيِلَتانِ فِي المِيزَانِ، حَبِيبَتَانِ إِلَى الرَّحْمنِ: سُبْحان اللَّهِ وَبِحَمْدِهِ، سُبحانَ اللَّه العظيمِ "متفقٌ عليهِ.

హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఈ విధంగా ప్రవచించారు: రెండు వచనాలున్నాయి. అవి పలకటానికి చాలా తేలికగా ఉంటాయి. కాని త్రాసులో మాత్రం చాలా బరువుని తూస్తాయి. ఇంకా అవి కరుణామయునికి చాలా ప్రియమైనవి. అవే 'సుబ్‌హానల్లాహి వబిహమ్దిహీ సుబ్‌హానల్లాహిల్ అజీమ్' (దేవుడు తన స్తోత్రాలతోపాటు పరమ పవిత్రుడు. మహోన్నతుడైన అల్లాహ్ పరమ పవిత్రుడు.) (బుఖారీ-ముస్లిం)

(సహీహ్ బుఖారీలోని విశ్వాస ప్రకరణం – సహీహ్ ముస్లింలోని జిక్ర్, దుఆల ప్రకరణం)

English

Abu Hurairah (radiyallahu anhu) reported: The Messenger of Allah ﷺ said, “There are two statements that are light for the tongue to remember, heavy in the Scales and are dear to the Merciful: `Subhan-Allahi wa bihamdihi, Subhan-Allahil-Azim [Glory be to Allah and His is the praise, (and) Allah, the Greatest is free from imperfection)‘.”[Al-Bukhari and Muslim].

ముఖ్యాంశాలు

కర్మలకు బరువు ఉంటుందని చెప్పటానికి ఈ హదీసు ప్రబల నిదర్శనం. ప్రళయదినాన మానవుని కర్మలు త్రాసులో తూయబడతాయి. బహుశా ఆ రోజు దేవుడు కర్మలకు ఒక ఆకారం ప్రసాదించవచ్చు లేదా కొంతమంది చెప్పినట్టు కర్మలు వ్రాయబడివున్న పత్రాలనే తూయటం జరుగుతుంది. ఒక నిరాకార వస్తువుకి దేవుడు ఆకారాన్ని ప్రసాదించటం అసాధ్యమేమీ కాదు. ఏమయినప్పటికీ ఈ హదీసులో పేర్కొనబడిన రెండు వచనాలు పఠించటానికి తేలికగా ఉన్నా ప్రళయదినాన అవి ఎంతో బరువుని తూస్తాయి. కనుక ప్రతి ముస్లిం వీటిని అత్యధికంగా పఠిస్తూ ఉండాలి.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|దైవధ్యాన ప్రకరణం|244. దైవస్మరణం విశిష్ఠత – ప్రోత్సాహం|హదీసు 1409

1410

హదీసు 1410

وعَنْهُ رضي اللَّه عنْهُ قَالَ: قالَ رَسُولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "لأَنْ أَقُولَ سبْحانَ اللَّهِ، وَالحَمْدُ للَّهِ، وَلاَ إلَه إلاَّ اللَّه، وَاللَّه أكْبرُ، أَحبُّ إليَّ مِمَّا طَلَعَت عليهِ الشَّمْسُ" رواه مسلم.

హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) గారే చేసిన వేరొక కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఈ విధంగా ప్రవచించారు: "సుబ్‌హానల్లాహి వల్‌హమ్దులిల్లాహి వలా ఇలాహ ఇల్లల్లాహు వల్లాహు అక్బర్" అని పలకటం నాకు సూర్యుడు ఉదయించే (ప్రపంచంలోని) వస్తువులన్నిటికంటే ప్రియమైనది. (ముస్లిం)

(సహీహ్ ముస్లింలోని జిక్ర్, దుఆల ప్రకరణం)

English

Abu Hurairah (radiyallahu anhu) reported: The Messenger of Allah ﷺ said, “The uttering of the words: “Subhan-Allah (Allah is free from imperfection), Al-hamdu lillah (all praise is due to Allah), La ilaha illallah (there is no true god except Allah) and Allahu Akbar (Allah is the Greatest)’ is dearer to me than anything over which the sun rises.”[Muslim].

ముఖ్యాంశాలు

పైన పేర్కొనబడిన వాక్యాల్లో దేవుని స్తోత్రం, ఆయన పవిత్రత, ఔన్నత్యాలు కీర్తించబడ్డాయి. కనుక ఈ వాక్యాలు ప్రపంచంలోని సిరిసంపదలన్నిటి కంటే ఎంతో గొప్పవి. అదీగాక ఈ వాక్యాలు 'బాఖియాతుస్సాలిహాత్' (శాశ్వతంగా మిగిలిఉండే సత్కర్మల) క్రిందికి వస్తాయి. వాటిని పఠించేవారికి ఎంతో పుణ్యం లభిస్తుంది. దీనికి భిన్నంగా ప్రపంచంలోని సిరిసంపదలన్నీ ఏదో ఒక నాడు నశించిపోయేవే. కనుక మనిషి ఎల్లప్పుడూ మిగిలి ఉండేవాటినే ప్రేమించాలి. నశించిపోయేవాటి కోసం ప్రాకులాడరాదు.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|దైవధ్యాన ప్రకరణం|244. దైవస్మరణం విశిష్ఠత – ప్రోత్సాహం|హదీసు 1410

1411

హదీసు 1411

وعنهُ أنَّ رسُولَ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قالَ: "منْ قَالَ لا إله إلاَّ اللَّه وَحْدَهُ لا شرِيكَ لَهُ، لهُ المُلكُ، وَلهُ الحَمْدُ، وَهُوَ عَلى كُلِّ شَيءٍ قَدِيرٌ، في يومٍ مِائةَ مَرَّةٍ كانَتْ لَهُ عَدْل عَشر رقَابٍ وكُتِبَتْ لَهُ مِائَةُ حَسَنةٍ، وَمُحِيت عنهُ مِائة سيِّئَةٍ، وَكَانَتْ لَهُ حِرزاً مِنَ الشَّيطَانِ يومَهُ ذلكَ حَتَّى يُمسِي، وَلَمْ يأْتِ أَحدٌ بِأَفضَل مِمَّا جاءَ بِهِ إلاَّ رجُلٌ عَمِلَ أَكثَر مِنه"، وقالَ:"مَنْ قالَ سُبْحَانَ اللَّهِ وَبحمْدِهِ، في يوْم مِئَةَ مَرَّةٍ، حُطَّتْ خَطَاياهُ، وإنْ كَانَتْ مِثْلَ زَبَدِ البَحْر" متفقٌ عليهِ.

హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) గారే చేసిన మరొక కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రబోధించారు: రోజుకి వందసార్లు 'లా ఇలాహ ఇల్లల్లాహు వహ్‌దహూ లా షరీక లహూ, లహుల్ ముల్కు వలహుల్ హమ్దు, వహువ అలా కుల్లి షైయిన్ ఖదీర్' (అల్లాహ్ తప్ప వేరొక ఆరాధ్య దేవుడు ఎవ్వడూ లేడు. ఆయన ఒక్కడే. ఆయనకు సహవర్తులు ఎవరూలేరు. విశ్వసామ్రాజ్యాధికారం ఆయనదే. స్తోత్రం ఆయనకే శోభిస్తుంది. ఆయన ప్రతి వస్తువుపై అధికారం కలవాడు) అని పలికేవారికి పదిమంది బానిసల్ని విడిపించినంత పుణ్యం లభిస్తుంది. అతని కోసం (అతని కర్మల ఖాతాలో) వంద పుణ్యాలు లిఖించబడతాయి. వంద పాపాలు తుడిచిపెట్టబడతాయి. ఆ రోజు సాయంత్రం వరకు ఈ పలుకులు అతన్ని షైతానుల నుండి రక్షిస్తాయి. ప్రళయ దినాన (దేవుని సన్నిధికి) వచ్చేవారిలో అతనికన్నా గొప్ప విశిష్ఠత మరెవరికీ ఉండదు. అయితే అతని కన్నా ఎక్కువగా ఆ వాక్యాలు పఠించినవారు ఇంకా విశిష్ఠతను కలిగి ఉండవచ్చు.

వేరొక హదీసులో ఆయన ﷺ ఇలా అన్నారు: రోజుకి వందసార్లు 'సుబ్‌హానల్లాహి వబిహమ్దిహీ' అని పఠించేవారి పాపాలు సముద్రపు నురుగుకు సమానంగా ఉన్నాసరే అవన్నీ సమసిపోతాయి. (బుఖారీ-ముస్లిం)

(సహీహ్ బుఖారీలోని దావాత్ ప్రకరణం – సహీహ్ ముస్లింలోని జిక్ర్, దుఆల ప్రకరణం)

English

Abu Hurairah (radiyallahu anhu) reported: The Messenger of Allah ﷺ said, “He who utters a hundred times in a day these words: `La ilaha illallahu, wahdahu la sharika lahu, lahul-mulku wa lahul-hamdu, wa Huwa `ala kulli sha’in Qadir (there is no true god except Allah. He is One and He has no partner with Him; His is the sovereignty and His is the praise, and He is Omnipotent),’ he will have a reward equivalent to that for emancipating ten slaves, a hundred good deeds will be recorded to his credit, hundred of his sins will be blotted out from his scroll, and he will be safeguarded against the devil on that day till the evening; and no one will exceed him in doing more excellent good deeds except someone who has recited these words more often than him. And he who utters: `Subhan-Allahi wa bihamdihi (Allah is free from imperfection and His is the praise)’ one hundred times a day, his sins will be obliterated even if they are equal to the extent of the foam of the ocean.”[Al-Bukhari and Muslim].

ముఖ్యాంశాలు

ఇక్కడ పాపాలంటే చిన్నచిన్న పాపాలని భావం. ఘోరపాపాలు తౌబా (పశ్చాత్తాపం)తోనే క్షమించబడతాయి. ఈ విషయం ఇంతకు ముందు కూడా చాలాసార్లు వివరించబడింది.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|దైవధ్యాన ప్రకరణం|244. దైవస్మరణం విశిష్ఠత – ప్రోత్సాహం|హదీసు 1411

1412

హదీసు 1412

وعَنْ أَبي أيوبَ الأنصَاريِّ رضي اللَّه عَنْهُ عَن النَّبيّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَالَ: "مَنْ قالَ لا إلهَ إلاَّ اللَّه وحْدهُ لاَ شَرِيكَ لهُ، لَهُ المُلْكُ، ولَهُ الحمْدُ، وَهُو عَلَى كُلِّ شَيءٍ قَدِيرٌ، عشْر مرَّاتٍ: كَانَ كَمَنْ أَعْتَقَ أرْبعةَ أَنفُسٍ مِن وَلِد إسْماعِيلَ" متفقٌ عليهِ.

హజ్రత్ అబూ అయ్యూబ్ అన్సారీ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఈ విధంగా ప్రవచించారు: ఎవడయితే పదిసార్లు 'లా ఇలాహ ఇల్లల్లాహ్ వహ్‌దహూ లా షరీకలహూ, లహుల్ ముల్కు, వలహుల్ హమ్దు వహువ అలాకుల్లి షైయిన్ ఖదీర్' అని అంటాడో అతను ఇస్మాయీల్ (అలైహి) సంతతికి చెందిన నలుగురు బానిసల్ని విడిపించినవాడుగా పరిగణించబడతాడు.

(బుఖారీ-ముస్లిం)

(సహీహ్ బుఖారీలోని దావాత్ ప్రకరణం – సహీహ్ ముస్లింలోని జిక్ర్, దుఆల ప్రకరణం)

English

Abu Ayyub Al-Ansari (radiyallahu anhu) reported: The Prophet ﷺ said: “He who utters ten times: `La ilaha illallahu, wahdahu la sharika lahu, lahulmulku wa lahulhamdu, wa Huwa `ala kulli sha’in Qadir (there is no true god except Allah. He is One and He has no partner with Him. His is the sovereignty and His is the praise, and He is Omnipotent),’ he will have a reward equal to that for freeing four slaves from the progeny of Prophet Isma`il.”[Al-Bukhari and Muslim].

ముఖ్యాంశాలు

ఇస్మాయీల్ సంతతి అనేది ఇక్కడ ఉపమానం కోసం ఉపయోగించబడింది. అంటే ఎంతో విలువైన బానిసల్ని అని భావం.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|దైవధ్యాన ప్రకరణం|244. దైవస్మరణం విశిష్ఠత – ప్రోత్సాహం|హదీసు 1412

1413

హదీసు 1413

وعنْ أَبي ذَرٍّ رضي اللَّه عَنْهُ قالَ: قالَ لي رسولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "ألاَ أُخْبِرُكَ بِأَحبِّ الكَلامِ إِلَى اللَّهِ؟ إنَّ أحبَّ الكَلامِ إِلَى اللَّه: سُبْحانَ اللَّه وبحَمْدِهِ" رواه مسلم.

హజ్రత్ అబూజర్ర్ (రదియల్లాహు అన్హు) కథనం: దైవప్రవక్త ﷺ నాతో (మాట్లాడుతూ) ఇలా అన్నారు: 'దేవునికి అత్యంత ప్రియమైన పలుకు ఏదో నీకు తెల్పనా?'దేవునికి అత్యంత ప్రియమైన పలుకు 'సుబ్‌హానల్లాహి వబిహమ్దిహీ.'

(ముస్లిం)

(సహీహ్ ముస్లింలోని జిక్ర్, దుఆల ప్రకరణం)

English

Abu Dharr (radiyallahu anhu) reported: The Messenger of Allah ﷺ said to me, “Shall I tell you the expression that is most loved by Allah?” It is `Subhan-Allahi wa bihamdihi’ (Allah is free from imperfection and His is the praise)’.”[Muslim].

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|దైవధ్యాన ప్రకరణం|244. దైవస్మరణం విశిష్ఠత – ప్రోత్సాహం|హదీసు 1413

1414

హదీసు 1414

وعَنْ أَبي مالكٍ الأشْعَرِيِّ رضي اللَّه عنْهُ قَالَ: قَالَ رسُولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "الطُّهُورُ شَطْرُ الإِيمان، والحمدُ للَّهِ تَمْلأُ المِيْزانَ، وسُبْحَانَ اللَّهِ والحمْدُ للَّه تمْلآنِ أو تَمْلأُ ما بَيْنَ السَّمَواتِ والأرْضِ" رواهُ مسلم.

హజ్రత్ అబూ మాలిక్ అష్‌అరీ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఈ విధంగా ప్రవచించారు: "పరిశుభ్రత సగం విశ్వాసం (ఈమాన్). అల్ హమ్దులిల్లాహ్ (అనే పలుకు) త్రాసుని నింపేస్తుంది. సుబ్‌హానల్లాహ్, అల్‌హమ్దులిల్లాహ్ అనే పలుకులు త్రాసుని నింపేస్తాయి లేక భూమి ఆకాశాల మధ్య ఉన్న స్థలాన్ని నింపేస్తాయి." (ముస్లిం)

(సహీహ్ ముస్లింలోని శుచీశుభ్రతల ప్రకరణం)

English

Abu Malik Al-Ash`ari (radiyallahu anhu) reported: The Messenger of Allah ﷺ said, “Wudu’ is half of Salat, and the expression: `Subhan-Allah (Allah is free from imperfection)’ fills the Balance, and the expression: `Al-hamdu lillah (praise be to Allah)’ fills the space between the heavens and the earth.”[Muslim].

ముఖ్యాంశాలు

కొంతమంది పండితుల అభిప్రాయం ప్రకారం ఈ హదీసులో విశ్వాసం అంటే నమాజు అని భావం. దివ్యఖుర్‌ఆన్‌లో కూడా ఒకచోట నమాజుని విశ్వాసం అని చెప్పటం జరిగింది. ఉదా: 'దేవుడు మీ విశ్వాసాలను వ్యర్ధం చేయడు' (బఖర:143). నమాజ్‌ను విశ్వాసమనుకుంటే పరిశుభ్రతను లేక వుజూను మనం సగం విశ్వాసంగా తలచవచ్చు. నమాజ్ నెరవేరాలంటే వుజూ అవసరం. వుజూ లేనిదే నమాజ్ నెరవేరదు. మరికొంతమంది పండితులు ఇక్కడ (ఈమాన్) విశ్వాసమంటే సాధారణంగా మనం చెప్పుకునే షరీఅత్‌పరమైన ఈమాన్ అని అంటున్నారు. అంటే దేవుణ్ణి, దైవప్రవక్తను మనస్ఫూర్తిగా నమ్మటం. విశ్వాసాన్ని సాధారణ అర్థంలో తీసుకుంటే 'పరిశుభ్రత సగం విశ్వాసం' అన్న వాక్యానికి అర్థమేంటి? అనే ప్రశ్న తలెత్తవచ్చు. దానికి సమాధానం ఏమిటంటే పరిశుభ్రత విశ్వాసానికి గల ముఖ్య ఆధారాల్లో చాలా ముఖ్యమైన ఆధారమన్న మాట. ఉదాహరణకు దైవప్రవక్త ﷺ 'హజ్ అంటే అరఫాయే' అని అన్నారు. దానిభావం అరఫాత్ మైదానంలో ఆగటం హజ్ ముఖ్య విధుల్లో అతిముఖ్య విధి అని. మొత్తానికి ఈ హదీసు పరిశుభ్రత ఆవశ్యకతను, దాని ప్రాముఖ్యతను నొక్కి చెబుతోంది.

రెండో విషయం- హదీసులో పేర్కొనబడిన ధ్యాన వచనాలకు ఎంతో విశిష్ఠత ఉంది. ఈ వచనాలకే గనక ఒక ఆకారాన్ని కల్పిస్తే అవి దేవుని త్రాసునీ, భూమ్యాకాశాల మధ్య స్థలాన్ని కూడా నింపేస్తాయి. ఇవి దేవుని అసామాన్య దాతృత్వానికి, విస్తారమైన కారుణ్యానికి ప్రబల నిదర్శనాలు.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|దైవధ్యాన ప్రకరణం|244. దైవస్మరణం విశిష్ఠత – ప్రోత్సాహం|హదీసు 1414

1415

హదీసు 1415

وعَنْ سعْدِ بنِ أَبي وقَّاصٍ رضي اللَّه عنْهُ قَالَ: جاءَ أَعْرَابي إِلى رسُولِ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم فقالَ: علِّمْني كَلاماً أَقُولُهُ. قالَ:"قُل لاَ إله إلاَّ اللَّه وحدَهُ لا شرِيكَ لهُ، اللَّه أَكْبَرُ كَبِيراً، والحمْدُ للَّهِ كَثيراً، وسُبْحانَ اللَّه ربِّ العالمِينَ، وَلاَ حوْل وَلا قُوَّةَ إلاَّ باللَّهِ العَزيز الحكيمِ"، قَالَ: فَهؤلاء لِرَبِّي، فَما لِي؟ قَالَ:"قُل: اللَّهُمَّ اغْفِرْ لِي وارْحمني. واهْدِني، وارْزُقْني" رواه مسلم.

హజ్రత్ సాద్ బిన్ అబూ వఖ్ఖాస్ (రదియల్లాహు అన్హు) కథనం: ఒక పల్లెవాసి దైవప్రవక్త ﷺ దగ్గరికి వచ్చి, "నేను తరచూ పలుకుతూ ఉండటానికి అనువైన పలుకులు నేర్పించండి నాకు" అని అన్నాడు. అందుకు దైవప్రవక్త ﷺ అతనికి ఈ విధంగా పలకమని ఉపదేశించారు-

"అల్లాహ్ తప్ప వేరొక ఆరాధ్యుడు లేడు. ఆయన ఒక్కడే. ఆయనకు సరిసమానులు ఎవరూ లేరు. అల్లాహ్ అందరికంటే గొప్పవాడు, మహోన్నతుడు. అత్యధిక స్తోత్రం ఆయనకే శోభిస్తుంది. అల్లాహ్ పరిశుద్ధుడు. ఆయన సర్వలోకాల ప్రభువు. పాపాల నుండి కాపాడుకునే భాగ్యం, సత్కార్యాలు చేసే సామర్ధ్యం దేవుని నుండే లభిస్తుంది. ఆయన సర్వాధికుడు, వివేచనాపరుడు."

ఇది విని ఆ పల్లెవాసి "ఇవన్నీ నా ప్రభువుకి సంబంధించినవి కదా! మరి నా కోసం ఏంటి?" అని అడిగాడు. అందుకాయన అతనికి ఈ విధంగా పలుకుతూ ఉండమని ఉపదేశించారు:

"అల్లాహ్! నన్ను క్షమించు. నన్ను కరుణించు, నాకు సన్మార్గం చూపు. నీ అనుగ్రహాన్ని ప్రసాదించు."

(ముస్లిం)

(సహీహ్ ముస్లింలోని జిక్ర్, దుఆల ప్రకరణం)

English

Sa`d bin Abu Waqqas (radiyallahu anhu) reported: A bedouin came to the Messenger of Allah ﷺ and said to him, “Teach me a few words to recite frequently.” He ﷺ said, “Say: “La ilaha illallahu wahdahu la sharika lahu; Allahu Akbar kabiran, wal-hamdu lillahi kathiran, wa subhan-Allahi Rabbil-`alamin; wa la hawla wa la quwwata illa billahil-`Azizil-Hakim (there is no true god except Allah the One and He has no partner with Him; Allah is the Greatest and greatness is for Him. All praise is due to Him. Allah, the Rubb of the worlds is free from imperfection; there is no might and power but that of Allah, the All-Powerful and the All-Wise.)”’ The bedouin said: “All of these for my Rubb. But what is for me?” Thereupon he (Messenger of Allah ﷺ) said, “You should say: `Allahummaghfir li, warhamni, wahdini, warzuqni (O Allah! Grant me pardon, have mercy upon me, direct me to righteousness and provide me subsistence)‘.”[Muslim].

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|దైవధ్యాన ప్రకరణం|244. దైవస్మరణం విశిష్ఠత – ప్రోత్సాహం|హదీసు 1415

1416

హదీసు 1416

وعنْ ثوبانَ رضي اللَّه عنْهُ قَالَ: كَانَ رَسُولُ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: " إِذَا انْصَرَف مِنْ صلاتِهِ اسْتَغفَر ثَلاثاً، وَقَالَ:"اللَّهُمَّ أَنْتَ السَّلامُ، ومِنكَ السَّلامُ، تباركْتَ يَاذا الجلالِ وَالإكْرَامِ"قِيل للأَوْزاعي وهُوَ أَحَد رُواةِ الحديث: كيفَ الاستِغفَارُ؟ قال: تقول: أَسْتَغْفرُ اللَّه، أَسْتَغْفِرُ اللَّه". رواهُ مسلم.

హజ్రత్ సౌబాన్ (రదియల్లాహు అన్హు) కథనం: దైవప్రవక్త ﷺ నమాజ్ ముగించుకున్న తర్వాత మూడుసార్లు క్షమాపణలు వేడుకునేవారు. ఆ తర్వాత ఈ దుఆ చేసేవారు: "అల్లాహుమ్మ అన్‌తస్సలాము వ మిన్‌క స్సలాము. తబారక్త యా జల్‌జలాలి వల్‌ఇక్రామ్"

ఈ హదీసుని ఉల్లేఖించినవారిలో ఒకరైన ఇమామ్ అవ్‌జాయీ గారిని ఎవరో అడిగారు: "దైవప్రవక్త క్షమాపణలు ఎలా వేడుకునేవారు?" అని. అందుకు అవ్‌జాయీగారు సమాధానమిస్తూ, "అస్తగ్‌ఫిరుల్లాహ్, అస్తగ్‌ఫిరుల్లాహ్" అని పలికేవారని చెప్పారు.

(ముస్లిం)

(సహీహ్ ముస్లింలోని ప్రార్థనా స్థలాల ప్రకరణం)

English

Thauban (radiyallahu anhu) reported: Whenever the Messenger of Allah ﷺ concluded his prayer, he would beg forgiveness from Allah thrice and then would recite: “Allahumma Antas-Salamu, wa minkas-salamu, tabarakta ya Dhal-Jalali wal-Ikram (O Allah, You are the Grantor of security, and security comes from You. You are Blessing, O You Who have majesty and nobility)!” (Imam) Al-Awza`i, one of the narrators of this Hadith, was asked: “How forgiveness is to be sought?” He answered: “The Messenger of Allah ﷺ used to say: `Astaghfirullah! Astaghfirullah! (I beseech Allah for forgiveness, I beseech Allah for forgiveness)’.”[Muslim].

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|దైవధ్యాన ప్రకరణం|244. దైవస్మరణం విశిష్ఠత – ప్రోత్సాహం|హదీసు 1416

1417

హదీసు 1417

وعَن المُغِيرةِ بن شُعْبةَ رضي اللَّه عَنْهُ أنَّ رَسُول اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم كَان إِذَا فَرغَ مِنَ الصَّلاة وسلَّم قالَ: "لاَ إلهَ إلاَّ اللَّه وحْدَهُ لاَ شَرِيكَ لَهُ، لهُ المُلْكُ ولَهُ الحَمْدُ، وهُوَ عَلى كُلِّ شَيءٍ قَديرٌ. اللَّهُمَّ لاَ مانِعَ لِمَا أعْطَيْتَ، وَلا مُعْطيَ لِمَا مَنَعْتَ، وَلاَ ينْفَعُ ذَا الجَدِّ مِنْكَ الجدُّ" متفقٌ عليهِ.

హజ్రత్ ముగీరా బిన్ షోబా (రదియల్లాహు అన్హు) కథనం: దైవప్రవక్త ﷺ నమాజ్ ముగించిన తర్వాత ఇలా అనేవారు: అల్లాహ్ తప్ప వేరొక ఆరాధ్యుడు లేడు. ఆయన ఒక్కడే. ఆయనకు భాగస్వాములు ఎవరూ లేరు. విశ్వసామ్రాజ్యాధికారం ఆయనదే. స్తోత్రం ఆయనకే శోభిస్తుంది. ఆయన ప్రతి వస్తువుపై అధికారం కలవాడు. అల్లాహ్! నీవిచ్చే దాన్ని అడ్డుకునే వాడెవడూ లేడు. నీవు అడ్డుకున్న దాన్ని ఇచ్చే వాడెవడూ లేడు. ఇంకా హోదాదారుణ్ణి నీ పట్టు నుండి కాపాడటానికి అతని హోదా ఎందుకూ పనికిరాదు. (బుఖారీ-ముస్లిం)

(సహీహ్ బుఖారీలోని అజాన్ ప్రకరణం – సహీహ్ ముస్లింలోని ప్రార్థనా స్థలాల ప్రకరణం)

English

Al-Mughirah bin Shu`bah (radiyallahu anhu) reported: Messenger of Allah ﷺ used to say at the conclusion of prayer: “La ilaha illallahu wahdahu la sharika lahu, lahul-mulku, wa lahul-hamdu, wa Huwa `ala kulli shai’in Qadir. Allahumma la mani`a lima a’tayta, wa la mu`tiya lima mana`ta, wa la yanfa`u dhal-jaddi, minkal-jaddu (there is no true god except Allah. He is One and He has no partner with Him, His is the sovereignty and His is the praise, and He is Omnipotent. O Allah! None can deny that which You bestow and none can bestow that which You hold back; and the greatness of the great will be of no avail to them against You).”[Al-Bukhari and Muslim].

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|దైవధ్యాన ప్రకరణం|244. దైవస్మరణం విశిష్ఠత – ప్రోత్సాహం|హదీసు 1417

1418

హదీసు 1418

وعَنْ عبدِ اللَّه بن الزُّبَيْرِ رضي اللَّه تَعَالَى عنْهُما أَنَّهُ كَانَ يقُول دُبُرَ كَلِّ صلاةٍ، حينَ يُسَلِّمُ: لاَ إلَه إلاَّ اللَّه وَحْدَهُ لاَ شريكَ لهُ، لهُ الملكُ ولهُ الحَمْدُ، وهُوَ عَلى كُلِّ شيءٍ قَديرٌ. لاَ حوْلَ وَلا قُوَّةَ إلاَّ بِاللَّه، لاَ إلهَ إلاَّ اللَّه، وَلا نَعْبُدُ إلاَّ إيَّاهُ، لهُ النعمةُ، ولَهُ الفضْلُ وَلَهُ الثَّنَاءُ الحَسنُ، لاَ إلهَ إلاَّ اللَّه مُخْلِصِينَ لَهُ الدِّينَ ولوْ كَرِه الكَافرُون. قالَ ابْنُ الزُّبَيْر: وكَان رسولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم يُهَلِّلُ بِهِنَّ دُبُرَ كُلِّ صَلاةٍ مكتوبة، رواه مسلم.

హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ జుబైర్ (రదియల్లాహు అన్హుమా) ప్రతి నమాజు చివర్లో సలాం చేసిన తర్వాత ఇలా పలికేవారు: అల్లాహ్ తప్ప వేరొక ఆరాధ్యుడు లేడు. ఆయన ఒక్కడే. ఆయనకు భాగస్వాములు ఎవరూ లేరు. విశ్వసామ్రాజ్యాధికారం ఆయనదే. స్తోత్రం ఆయనకే చెల్లుతుంది. ఆయనకు ప్రతి వస్తువుపై అధికారం ఉంది. పాపాల నుండి కాపాడుకోవాలన్నా, మంచి పనులు చేయాలన్నా దైవసాయంతోనే సాధ్యమవుతుంది. అలాంటి అల్లాహ్ తప్ప వేరొక ఆరాధ్యుడు లేడు. మేము ఆయన్నే ఆరాధిస్తాం. అనుగ్రహాలూ, వరాలన్నీ ఆయన ప్రసాదించినవే. మంచి స్తోత్రం ఆయనకే శోభిస్తుంది. అల్లాహ్ తప్ప వేరొక ఆరాధ్యుడు లేడు. అవిశ్వాసులకు ఎంత అయిష్టకరంగా ఉన్నా సరే మేము మా విధేయతను ఆయన కోసమే ప్రత్యేకించుకున్నాం.

ఇబ్నె జుబైర్ ఇలా అంటున్నారు: దైవప్రవక్త ﷺ ప్రతి ఫర్జ్ నమాజ్ తర్వాత ఈ వచనాలతో దేవుని ఏకత్వాన్ని, ఆయన ఔన్నత్యాన్ని చాటేవారు. (ముస్లిం)

(సహీహ్ ముస్లింలో ప్రార్థనా స్థలాల ప్రకరణం)

English

It has been reported that `Abdullah bin Zubair (radiyallahu anhuma) used to recite after Taslim at the conclusion of every Salat (prayer): “La ilaha illallahu wahdahu la sharika lahu, lahul-mulku, wa lahul-hamdu, wa Huwa `ala kulli shai’in Qadir. La hawla wa la quwwata illa billah. La ilaha illallahu, wa la na`budu illa iyyahu, Lahun-ni`matu, wa lahul-fadlu, wa lahuth-thana’ul-hasan. La ilaha ilallahu, mukhlisina, lahud-dina, wa lau karihal-kafirun (there is no true god except Allah; He is One. To Him belongs the dominion and to Him is all praise, and He is Powerful over all things. There is no power and might except with (the help of) Allah. There is no God but Allah and we worship none except Him, to Him belongs the bounty and to Him belongs the grace, and to Him belongs all excellent praise; there is no deity but Allah. We reserve our devotion exclusively for Him though the disbelievers may detest it).” Ibn Az-Zubair said: The Messenger of Allah ﷺ used to celebrate Allah’s Greatness in those terms after every Salat (prayer).[Muslim].

ముఖ్యాంశాలు

నమాజ్ తర్వాత వెంటనే పైన హదీసులో పేర్కొన్న విధంగా దైవాన్ని స్తుతించటం ప్రవక్త సంప్రదాయం. దీనికి భిన్నంగా నమాజ్ అయిన వెంటనే కేవలం కలిమయె తయ్యిబా పఠించటం లేదా సామూహికంగా సలాత్, సలామ్‌లు పఠించటం ధర్మంలో ఓ కొత్త పోకడ మాత్రమే. ఇలా చేసేవారికి ఎలాంటి పుణ్యం లభించదు. ముస్లిం అయినవ్యక్తి దైవప్రవక్త విధానాన్ని అనుసరించాలి. ఇతరత్రా విధానాలు పాటించటం అతనికి శోభాయమానం కాదు.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|దైవధ్యాన ప్రకరణం|244. దైవస్మరణం విశిష్ఠత – ప్రోత్సాహం|హదీసు 1418

1419

హదీసు 1419

وعنْ أبي هُريرةَ رضي اللَّه عَنْهُ أنَّ فُقَرَاءَ المُهاجِرِينَ أَتَوْا رَسُولَ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم فقالُوا: ذَهب أهْلُ الدُّثُورِ بالدَّرجَاتِ العُلى، وَالنِّعِيمِ المُقيمِ: يُصَلُّونَ كَما نُصلِّي، وَيصُومُونَ كَمَا نَصُومُ، ولهمُ فَضْلٌ مِنْ أمْوالٍ: يحجُّونَ، ويَعْتَمِرُونَ، وَيُجاهِدُونَ، ويتَصَدَّقُون. فقالَ:"ألاَ أُعلمُكُمْ شَيْئاً تُدْرِكُونَ بِهِ مَنْ سبَقَكُمْ، وتَسبِقُونَ بِهِ منْ بَعْدكُمْ. وَلاَ يَكُونُ أَحَدٌ أَفْضلَ مِنْكُمْ إلاَّ مَنْ صَنَعِ مِثلَ مَا صَنَعْتُم؟ "قالُوا: بَلَى يَا رسول اللَّه، قَالَ:"تُسبِّحُونَ، وتَحْمدُونَ وتُكَبِّرُونَ، خلْفَ كُلِّ صلاةٍ ثَلاثاً وثَلاثينَ" قَالَ أبُو صالحٍ الرَّاوي عنْ أَبي هُرَيْرةَ، لمَّ سئِل عنْ كيْفِيةِ ذِكْرِهنَّ، قَالَ: يقول: سُبْحان اللَّه، والحمْدُ للَّه، واللَّه أكْبرُ، حتَّى يكُونَ مِنْهُنَّ كُلِّهنَّ ثَلاثاً وَثَلاثِينَ. متفقٌ عليهِ وزاد مُسْلمٌ في روايتِهِ: فَرجع فُقَراءُ المُهَاجِرِينَ إِلَى رسُولِ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم، فقالوا: سمِع إخْوانُنا أهلُ الأمْوال بِما فعَلْنَا، ففعَلُوا مِثْلهُ؟ فقالَ رَسُولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم:"ذلكَ فَضْلُ اللَّه يُؤْتِيهِ منْ يشاءُ ". "الدُّثُورُ"جمع دَثْرٍ"بفتحِ الدَّالِ وإسكانِ الثاء المثلَّثَةِ"وهو المالُ الكثيرُ.

హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం: ముహాజిర్ వర్గానికి చెందిన నిరుపేదలు దైవప్రవక్త ﷺ దగ్గరికి వచ్చి ఇలా విన్నవించుకున్నారు: "దైవప్రవక్తా! ఉన్నత స్థానాలు, శాశ్వత వరాలు ధనవంతులకే లభిస్తాయి. మరి చూడబోతే వాళ్ళు కూడా మాలాగే నమాజులు చేస్తారు. మాలాగే ఉపవాసాలు పాటిస్తారు. అయితే సిరిసంపదల విషయంలో వారు మాకన్నా గొప్పవారు. అందుకే హజ్, ఉమ్రా యాత్రలు చేయగలుగుతున్నారు. జిహాద్‌లో పాల్గొంటున్నారు. దానధర్మాలు చేస్తున్నారు. (ఆ పనులు మేము చేయలేం.)"

వారి మాటలు విని దైవప్రవక్త ﷺ "నేను మీకో విషయం తెల్పనా? దాన్ని గనక పాటిస్తే మీరు, మిమ్మల్ని మించిపోయిన వారిని చేరుకుంటారు. మీ తర్వాతివారికంటే ముందుకెళ్ళిపోతారు. అప్పుడు మిమ్మల్ని అనుసరించేవారు తప్ప మీకంటే గొప్పవారెవరూ ఉండరు" అని అన్నారు. "తప్పకుండా తెలియజేయండి దైవప్రవక్తా!" అని అన్నారు సహచరులు. దానికి దైవప్రవక్త ﷺ "మీరు ప్రతి నమాజ్ తర్వాత ముప్పైమూడు సార్లు దేవుని పవిత్రతను కొనియాడండి, ఆయన్ని స్తుతించండి. ఆయన గొప్పదనాన్ని చాటండి" అని అన్నారు.

ఈ హదీసుని అబూహురైరా నుండి ఉల్లేఖించిన అబూసాలిహ్ ఇలా అంటున్నారు: వాటిని ఎలా పఠించాలని అడగ్గా అందుకాయన "సుబ్‌హానల్లాహ్, అల్‌హమ్దులిల్లాహ్, అల్లాహు అక్బర్ అని అనాలి. ఈ విధంగా ప్రతి వచనం ముప్పైమూడుసార్లు అయ్యే వరకు పఠించాలి" అని చెప్పారు.

(బుఖారీ-ముస్లిం)

ఇమామ్ ముస్లిం తను వెలికితీసిన ఒక హదీసులో ఈ విషయం అదనంగా ప్రస్తావించారు: (కొంతకాలం తర్వాత) ముహాజిర్ నిరుపేదలు మళ్ళీ దైవప్రవక్త ﷺ దగ్గరికి వచ్చి "మేము ఆచరిస్తున్న పద్ధతి గురించి ధనిక సోదరులు కూడా విన్నారు. దాంతో వారు కూడా దీన్ని ఆచరించటం మొదలుపెట్టారు" అని విన్నవించుకున్నారు. ఆ మాట విని ఆయన 'అది దైవానుగ్రహం. దేవుడు తానుకోరిన వారికి దాన్ని ప్రసాదిస్తాడు' అని చెప్పారు.

(సహీహ్ బుఖారీలోని అజాన్ ప్రకరణం – సహీహ్ ముస్లింలోని ప్రార్థనా స్థలాల ప్రకరణం)

English

Abu Hurairah (radiyallahu anhu) reported: The poor Emigrants came to the Messenger of Allah ﷺ and said: “The wealthy have gone with the highest ranks and lasting bliss.” He asked: “How is that?” They replied: “They offer Salat (prayer) as we offer it; they observe fast as we do; (and as they are wealthy) they perform Hajj and `Umrah, and go for Jihad, and they spend in charity but we cannot, and they free the slaves but we are unable to do so.” The Messenger of Allah ﷺ said, “Shall I not teach you something with which you may overtake those who surpassed you and with which you will surpass those who will come after you? None will excel you unless he who does which you do.” They said: “Yes, please do, O Messenger of Allah” He ﷺ said, “You should recite: Tasbih (Allah is free from imperfection), Takbir (Allah is Greatest), Tahmid (Praise be to Allah) thirty-three times after each Salat.”[Al-Bukhari and Muslim].

Abu Salih, the subnarrator of the Hadith said, when Abu Hurairah (radiyallahu anhu) was asked about the manner of reciting Tasbih, Tahmid and Takbir, he said, “Recite: “Subhan-Allah, wal-hamdulillah, wallahu Akbar’, till all are recited thirty-three times.

ముఖ్యాంశాలు

ఈ హదీసు ఇంతకు ముందు కూడా "సత్కార్యాల మార్గాలు అనేకం" అనే అధ్యాయంలో వచ్చింది. ఇందులో అబూసాలిహ్ వివరించిన తీరును బట్టి మూడు వచనాలనూ కలిపి చదవాలని తెలుస్తోంది. అయితే ఇతర పండితులు మాత్రం వాటిని వేర్వేరుగా పఠించటమే సమంజసమని అన్నారు. ఎలా చదివినా వాటి ఉద్దేశ్యం నెరవేరుతుంది. అలాగే పై వచనాల్లో ప్రతిదాన్నీ 33సార్లు పఠించాలా లేక మూడు కలిపి ముప్పైమూడుసార్లు పఠించాలా? పై హదీసు ద్వారా మాత్రం ఈ విషయం స్పష్టంగా బోధపడటం లేదు. మున్ముందు రాబోయే హదీసుల ద్వారా ప్రతి వచనాన్నీ 33సార్లు పఠించాలని తెలుస్తోంది. ఆ విధంగా మొత్తం 99సార్లు అవుతాయి. ఈ క్రింది హదీసు కాస్తంత వివరంగా ఉంది. గమనించండి.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|దైవధ్యాన ప్రకరణం|244. దైవస్మరణం విశిష్ఠత – ప్రోత్సాహం|హదీసు 1419

1420

హదీసు 1420

وعنْهُ عنْ رَسُولِ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قالَ: "مَنْ سَبَّحَ اللَّه في دُبُرِ كُلِّ صلاةٍ ثَلاثاً وثَلاثينَ، وَحمِدَ اللَّه ثَلاثاً وثَلاثين، وكَبَّرَ اللَّه ثَلاثاً وَثَلاثينَ وقال تَمامَ المِائَةِ: لا إلهَ إلاَّ اللَّه وحْدَه لا شَريك لهُ، لَهُ المُلْكُ وَلَهُ الحمْد، وهُو عَلَى كُلِّ شَيءٍ قَدِيرٌ، غُفِرتْ خطَاياهُ وَإنْ كَانَتْ مِثْلَ زَبدِ الْبَحْرَ "رواهُ مسلم.

అబూహురైరా (రదియల్లాహు అన్హు) గారే చేసిన వేరొక కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఈ విధంగా ప్రవచించారు: ఎవరయితే ప్రతి నమాజ్ తర్వాత 33సార్లు 'సుబ్‌హానల్లాహ్' అనీ, 33సార్లు అల్‌హమ్దులిల్లాహ్ అనీ, 33సార్లు అల్లాహు అక్బర్ అని అంటారో ఆ తర్వాత వంద సంఖ్యను పూర్తి చేస్తూ 'లా ఇలాహ ఇల్లల్లాహు వహ్‌దహూ లా షరీకలహూ లహుల్ ముల్కు వలహుల్ హమ్దు వహువ అలాకుల్లి షైయిన్ ఖదీర్" అని అంటారో వారి తప్పులన్నీ మన్నించబడతాయి. అవి సముద్రపు నురుగుకు సమానంగా ఉన్నాసరే. (ముస్లిం)

(సహీహ్‌లోని జిక్ర్, దుఆల ప్రకరణం)

English

Abu Hurairah (radiyallahu anhu) reported: The Messenger of Allah ﷺ said, “He who recites after every prayer: Subhan-Allah (Allah is free from imperfection) thirty-three times; Al-hamdu lillah (praise be to Allah) thirty-three times; Allahu Akbar (Allah is Greatest) thirty-three times; and completes the hundred with: La ilaha illallahu, wahdahu la sharika lahu, lahul-mulku wa lahul-hamdu, wa Huwa `ala kulli shai’in Qadir (there is no true god except Allah. He is One and He has no partner with Him. His is the sovereignty and His is the praise, and He is Omnipotent), will have all his sins pardoned even if they may be as large as the foam on the surface of the sea.”[Muslim].

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|దైవధ్యాన ప్రకరణం|244. దైవస్మరణం విశిష్ఠత – ప్రోత్సాహం|హదీసు 1420

1421

హదీసు 1421

وعنْ كعْبِ بن عُجرْةَ رضي اللَّه عَنْهُ عَنْ رسولِ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَالَ: "مُعقِّبَاتٌ لاَ يَخِيبُ قَائِلُهُنَّ أَو فَاعِلُهُنَّ دُبُرَ كُلِّ صلاةٍُ مكتُوبةٍ: ثَلاثٌ وثَلاثونَ تَسْبِيحَةً، وثَلاثٌ وثَلاثونَ تَحْمِيدَةً، وَأَرْبَعٌ وثَلاثونَ تَكبِيرةً" رواه مسلم.

హజ్రత్ కాబ్ బిన్ ఉజ్రా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఈ విధంగా ప్రవచించారు: నమాజ్ తర్వాత పఠించబడే కొన్ని వచనాలు ఎలాంటివంటే వాటిని పఠించేవాడు లేక వాటిని పాటించేవాడు ఎన్నటికీ నిష్ఫలుడు కాడు. అవేమిటంటే ప్రతి ఫర్జ్ నమాజ్ తర్వాత 33సార్లు సుబ్‌హానల్లాహ్ అనీ, 33సార్లు అల్‌హమ్దులిల్లాహ్ అనీ, 34 సార్లు అల్లాహు అక్బర్ అని పలకటం.

(ముస్లిం)

(సహీహ్ ముస్లింలోని ప్రార్థనాస్థలాల ప్రకరణం)

English

Ka`b bin `Ujrah (radiyallahu anhu) reported: The Messenger of Allah ﷺ said, “There are some words, the reciters of which will never be disappointed. These are: Tasbih [saying `Subhan-Allah’ (Allah is free from imperfection)], thirty-three times, Tahmid [saying `Al-hamdu lillah’ (praise be to Allah)] thirty-three times and Takbir [saying `Allahu Akbar’ (Allah is Greatest)] thirty-four times; and these should be recited after the conclusion of every prescribed prayer.”[Muslim]

ముఖ్యాంశాలు

హదీసు మూలంలో 'ముఅఖ్ఖిబాత్' అనే పదం వచ్చింది. అంటే ప్రతి నమాజ్ తర్వాత పఠించబడే, దేవుని స్తోత్రానికీ, ఆయన పవిత్రతకూ సంబంధించిన పలుకులని భావం. ఈ హదీసులో 'అల్లాహు అక్బర్' అనే వచనాన్ని 34 సార్లు పఠించాలని చెప్పబడింది.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|దైవధ్యాన ప్రకరణం|244. దైవస్మరణం విశిష్ఠత – ప్రోత్సాహం|హదీసు 1421

1422

హదీసు 1422

وعنْ سعدِ بن أَبي وقاص رضي عنْهُ أنَّ رَسُول اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم كانَ يَتَعوَّذُ دُبُر الصَّلَواتِ بِهؤلاءِ الكلِمات: "اللَّهُمَّ إنِّي أَعُوذُ بِكَ مِنَ الجُبْنِ والْبُخلِ وَأَعوذُ بِكَ مِنْ أنْ أُرَدَّ إِلَى أرْذَل العُمُرِ وَأعُوذُ بِكَ مِنْ فِتْنَةِ الدُّنْيا، وأَعوذُ بِكَ مِنْ فِتْنَةِ القَبر " رواه البخاري.

హజ్రత్ సాద్ బిన్ అబీ వఖ్ఖాస్ (రదియల్లాహు అన్హు) కథనం: దైవప్రవక్త ﷺ నమాజుల తర్వాత ఈ వచనాలతో (దేవుణ్ణి) శరణు వేడేవారు. "దేవా! నేను పిరికితనం, పిసినారితనం నుంచి నీ శరణు వేడుతున్నాను. నికృష్టమైన వృద్ధాప్యానికి చేరుకోవటం నుండి నీ శరణు కోరుతున్నాను. ప్రాపంచిక ఉపద్రవాల నుండి నీ శరణు వేడుతున్నాను. సమాధి యాతనల నుండి నీ శరణు వేడుతున్నాను." (బుఖారీ)

(సహీహ్ బుఖారీలోని దావాత్ ప్రకరణం)

English

Sa`d bin Abu Waqqas (radiyallahu anhu) reported: The Messenger of Allah ﷺ used to seek (Allah’s) protection after prayers in these words: “Alla-humma inni a`udhu bika minal-jubni wal-bukhl, wa a`udhu bika min an uradda ila ardhalil-`umur, wa a`udhu bika min fitnatid-dunya, wa a`udhu bika min fitnatil-qabr (O Allah, I seek refuge with You from cowardice, miserliness and from being sent back to a feeble age; and, seek refuge with You from the trials of this life and those of the grave).”[Al-Bukhari].

ముఖ్యాంశాలు

ఈ హదీసులో పలు విషయాల నుండి శరణు వేడటం జరిగింది. కొంతమంది పండితులు ప్రతి ఫర్జ్ నమాజ్ తర్వాత సుబ్‌హానల్లాహ్, అల్‌హమ్దు లిల్లాహ్, అల్లాహు అక్బర్ అనే వచనాలతోపాటు పైన పేర్కొనబడిన శరణువేడుకోలు కూడా చేసుకోవాలని అభిప్రాయ పడ్డారు. దీనికి భిన్నంగా మరికొంతమంది పండితులు తస్బీహ్ వచనాలు నమాజ్ ముగిసిన తర్వాత పఠించాలనీ, పై శరణు వేడుకోలును నమాజు చివర్లో సలాంకు ముందు చదవాలని అభిప్రాయ పడ్డారు. దైవప్రవక్త ﷺ ఇలాగే చేసేవారు. (నుజ్‌హతుల్ ముత్తఖీన్)

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|దైవధ్యాన ప్రకరణం|244. దైవస్మరణం విశిష్ఠత – ప్రోత్సాహం|హదీసు 1422

1423

హదీసు 1423

وعنْ معاذٍ رضي اللَّه عَنْهُ أَنَّ رسُول اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم أَخَذَ بيَدِهِ وَقالَ: "يَا مُعَاذُ، وَاللَّهِ إنِّي لأُحِبُّكَ"فَقَالَ:"أُوصِيكَ يَا معاذُ لاَ تَدعَنَّ في دُبُرِ كُلِّ صَلاةٍ تقُولُ: اللَّهُمَّ أعِنِّي عَلَى ذِكْرِكَ، وشُكْرِكَ، وَحُسنِ عِبادتِكَ ". رواهُ أَبُو داود بإسناد صحيحٍ.

హజ్రత్ ముఆజ్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ తన చేయి పట్టుకొని, "ముఆజ్! దేవుడు సాక్షి! నేను నిన్ను ప్రేమిస్తున్నాను" అని అన్నారు. తర్వాత ఆయనే ఇలా అన్నారు: "ముఆజ్! నేను నీకో విషయం బోధిస్తున్నాను. ప్రతి నమాజ్ తర్వాత 'అల్లాహ్! నిన్ను స్మరించటంలో, నీకు కృతజ్ఞతలు తెలుపుకోవటంలో, నిన్ను అత్యుత్తమ రీతిలో ఆరాధించటంలో నీవు నాకు సహాయపడు' అని ప్రార్థించే అలవాటుని మానుకోకు."(అబూదావూద్ ఈ హదీసుని దృఢమైన ఆధారాలతో వెలికి తీశారు)

(సుననె అబూదావూద్‌లోని విత్ర్ ప్రకరణం)

English

Mu`adh (radiyallahu anhu) reported: The Messenger of Allah ﷺ took hold of my hand and said, “O Mu`adh! By Allah I love you, so I advise you to never forget to recite after every prayer: “Allahumma a`inni ala dhikrika, wa shukrika, wa husni `ibadatika (O Allah, help me remember You, to be grateful to You, and to worship You in an excellent manner).”[Abu Dawud].

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|దైవధ్యాన ప్రకరణం|244. దైవస్మరణం విశిష్ఠత – ప్రోత్సాహం|హదీసు 1423

1424

హదీసు 1424

عنْ أبي هُريْرة رضي اللَّه عَنْهُ أنَّ رسُولَ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَالَ: "إِذَا تَشَهَّد أَحدُكُمْ فَليسْتَعِذ بِاللَّه مِنْ أرْبَع، يقولُ: اللَّهُمَّ إنِّي أعُوذُ بِكَ مِنْ عذَابِ جهَنَّمَ، وَمِنْ عَذَابِ القَبرِ، وَمِنْ فِتْنةِ المحْيَا والمَماتِ، وَمِنْ شَرِّ فِتْنَةِ المَسِيح الدَّجَّالِ". رواه مسلم.

హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రబోధించారు: మీలో ఎవరైనా తషహ్హుద్ పఠించిన తర్వాత నాలుగు విషయాల నుండి శరణు వేడుకోవాలి. ఇలా అనాలి: దేవా! నరకశిక్ష నుండి, సమాధి యాతన నుండి, జీవన్మరణాల పరీక్షల నుండి, మసీహుద్దజ్జాల్ ఉపద్రవం నుండి నీ శరణు వేడుతున్నాను.

(ముస్లిం)

(సహీహ్ ముస్లింలోని జిక్ర్, దుఆల ప్రకరణం)

English

Abu Hurairah (radiyallahu anhu) reported: The Messenger of Allah ﷺ said, “When anyone of you has done his Tashahhud during Salat (prayer), he should seek refuge in Allah against four things and say: “Allahumma inni a`udhu bika min `adhabi jahannam, wa min `adhabil-qabr, wa min fitnatil-mahya wal-mamat, wa min sharri fitnatil-masihid-dajjal (O Allah! I seek refuge in You from the torment of Hell, from the torment of the grave, from the trials of life and death, and from the mischief of Al-Masih Ad-Dajjal (Antichrist).”[Muslim].

ముఖ్యాంశాలు

మనిషి జీవితంలో అతన్ని శారీరకంగాగానీ, ధార్మికంగాగానీ నష్టపరిచే కష్టాలన్నీ ప్రాపంచిక ఉపద్రవాలే. అలాగే మరణ సమయంలో కలిగే బాధల్ని జీవన్మరణాల పరీక్షలుగా భావించాలి. మసీహ్ అంటే ఒంటికన్ను కలవాడని ఇక్కడ భావం. ప్రళయానికి ముందు ఒక దజ్జాల్ (ఉపద్రవాగ్రేసరుడు) అవతరిస్తాడు. అతనికి ఒకే కన్ను ఉంటుంది. అందుకని అతన్ని 'మసీహ్' అని అంటారు. అతను తాను దేవుణ్ణని చెప్పుకుంటాడు. ప్రజల్ని పరీక్షించటం కోసం దేవుడు ఇతనిచేత కొన్ని అద్భుతాలను కూడా చేయిస్తాడు. దాంతో చాలా మంది అతని ఉపద్రవాల్లో చిక్కుకుంటారు. అయితే సజ్జనులు మాత్రం దేవుని సహాయంతో అతన్ని గుర్తించి అతని వలలో చిక్కుకోకుండా బయటపడతారు. ఏమయినప్పటికీ అదో మహా ఉపద్రవం. దాన్నుండి శరణువేడుకోవటం అన్ని విధాలా ఉత్తమం.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|దైవధ్యాన ప్రకరణం|244. దైవస్మరణం విశిష్ఠత – ప్రోత్సాహం|హదీసు 1424

1425

హదీసు 1425

وعنْ عَلِيٍّ رضي اللَّه عنْهُ قَالَ: كانَ رَسُولُ اللَّهِ إِذَا قَامَ إِلَى الصَّلاةِ يكونُ مِنْ آخِر مَا يقولُ بينَ التَّشَهُّدِ والتَّسْلِيم: "اللَّهمَّ اغفِرْ لِي مَا قَدَّمتُ وَمَا أَخَّرْتُ، وَمَا أَسْرَرْتُ ومَا أعْلَنْتُ، وَمَا أَسْرفْتُ، وَمَا أَنتَ أَعْلمُ بِهِ مِنِّي، أنْتَ المُقَدِّمُ، وَأنْتَ المُؤَخِّرُ، لا إلهَ إلاَّ أنْتَ "رواه مسلم.

హజ్రత్ అలీ (రదియల్లాహు అన్హు) కథనం: దైవప్రవక్త ﷺ నమాజ్ కోసం సిద్ధమయిన తర్వాత తషహ్హుద్ మరియు సలాం మధ్యన చివర్లో ఈ వచనాలు పఠించేవారు. "దేవా! నా పూర్వపు పాపాలను, జరగబోయే పాపాలను క్షమించు. రహస్యంగా, బహిరంగంగా చేసిన పాపాలను క్షమించు. ఇంకా నా మితిమీరిన తనాన్ని కూడా క్షమించు. మరి కొన్ని పాపాలుండవచ్చు. వాటి గురించి నాకంటే నీకే బాగా తెలుసు. నీవు వాటిని కూడా క్షమించు. ముందుకు నడిపించేవాడివి, వెనక్కి నెట్టేవాడివి నీవే. నీవు తప్ప వేరొక ఆరాధ్యుడు లేడు." (ముస్లిం)

(సహీహ్ ముస్లింలోని ప్రయాణీకుల నమాజ్ ప్రకరణం)

English

`Ali (radiyallahu anhu) reported: When the Messenger of Allah ﷺ was in Salat (prayer), he used to supplicate towards the end of prayer after Tashahhud and before the concluding salutations: “Allahum-maghfir li ma qaddamtu wa ma akh-khartu, wa ma asrartu, wa ma a`lantu, wa ma asraftu, wa ma Anta a`lamu bihi minni. Antal-Muqqadimu, wa Antal-Mu’akh-khiru. La ilaha illa Anta (O Allah! Forgive my former and latter sins, which I have done secretly and those which I have done openly, and that I have wronged others, and those defaults of mine about which You have better knowledge than I have. You Alone can send whomever You will to Jannah, and You Alone can send whomever You will to Hell-fire. None has the right to be worshipped but You.”[Muslim].

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|దైవధ్యాన ప్రకరణం|244. దైవస్మరణం విశిష్ఠత – ప్రోత్సాహం|హదీసు 1425

1426

హదీసు 1426

وعنْ عائشةَ رضي اللَّه عنْهَا قَالَتْ: كانَ النبيُّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم يُكْثِرُ أنْ يقولَ في رُكُوعِهِ وَسُجُودِهِ: سُبْحَانَكَ اللَّهُمَّ رَبَّنَا وَبِحَمْدك، اللَّهُمَّ اغْفِرْ لي "متفقٌ عليهِ.

హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) కథనం: దైవప్రవక్త ﷺ తన రుకూల్లో, సజ్దాల్లో "అల్లాహ్! నీవు పరమపవిత్రుడవు. మా ప్రభూ! పొగడ్తలన్నీ నీకే శోభిస్తాయి. అల్లాహ్! నన్ను క్షమించు" అని అత్యధికంగా అనేవారు. (బుఖారీ-ముస్లిం)

(సహీహ్ బుఖారీలోని అజాన్ ప్రకరణం – సహీహ్ ముస్లింలోని నమాజ్ ప్రకరణం)

English

`Aishah (radiyallahu anha) reported: The Prophet ﷺ used to recite frequently in his bowing and prostration: “Subhanak-Allahumma, Rabbana wa bihamdika. Allahum-maghfir li (O Allah! You are free from imperfection and I begin with praising You. Forgive my sins).”[Al-Bukhari and Muslim].

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|దైవధ్యాన ప్రకరణం|244. దైవస్మరణం విశిష్ఠత – ప్రోత్సాహం|హదీసు 1426

1427

హదీసు 1427

وَعَنْهَا أنَّ رَسُولَ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم كانَ يَقُولُ في رُكوعِهِ وسجودِهِ:" سُبُّوحٌ قدُّوسٌ ربُّ الملائِكةِ وَالرُّوحِ" رواه مسلم.

హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) గారే చేసిన మరొక కథనం: దైవప్రవక్త ﷺ రుకూ సజ్దాల్లో ఇలా అనేవారు: (నా రుకూలు మరియు నా సజ్దాలు) ఎంతో పరిశుద్ధుడు, అత్యంత పునీతుడు, దైవదూతల మరియు జిబ్రయీల్‌ల ప్రభువుకే అంకితం. (ముస్లిం)

(సహీహ్ ముస్లింలోని నమాజ్ ప్రకరణం)

English

`Aishah (radiyallahu anha) reported: The Messenger of Allah ﷺ used to recite in his bowing and prostration: “Subbuhun Quddusun, Rabbul-mala’ikati war-ruh [You are the Most Glorious. The Most Holy. You the Rubb of the angels and of Jibril[Muslim].

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|దైవధ్యాన ప్రకరణం|244. దైవస్మరణం విశిష్ఠత – ప్రోత్సాహం|హదీసు 1427

1428

హదీసు 1428

وعَنِ ابنِ عَبَّاسٍ رضي اللَّه عنْهُما أنَّ رسُول اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَالَ:"فَأَمَّا الرُّكوعُ فَعَظِّموا فيهِ الرَّبَّ عز وجل، وأمَّا السُّجُودُ فَاجْتَهِدُوا في الدُّعاء فَقَمِنُّ أنْ يُسْتَجَاب لَكُمْ "رواه مسلم.

హజ్రత్ ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హుమా) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రబోధించారు: రుకూ విషయం- రుకూలో మీరు ప్రభువు ఔన్నత్యాన్ని కీర్తించండి. పోతే సజ్దాలో- ఆ స్థితిలో మీరు బాగా శ్రమపడి (దేవుణ్ణి) ప్రార్థించండి. అలా చేస్తే మీ ప్రార్థనలు ఆమోదించబడటానికి ఎక్కువ అవకాశముంది. (ముస్లిం)

(సహీహ్ ముస్లింలోని నమాజ్ ప్రకరణం)

English

Ibn `Abbas (radiyallahu anhuma) reported: The Messenger of Allah ﷺ said: “Glorify your Lord in Ruku` (bowing posture) and exert yourself in supplication in prostration. Thus your supplications are liable to be accepted.”[Muslim].

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|దైవధ్యాన ప్రకరణం|244. దైవస్మరణం విశిష్ఠత – ప్రోత్సాహం|హదీసు 1428

1429

హదీసు 1429

وعن أبي هريرةَ رضي اللَّه عَنْهُ أنَّ رسُولَ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَالَ: "أقربُ مَا يَكونُ العبْدُ مِن ربِّهِ وَهَو ساجدٌ، فَأَكثِرُوا الدُّعاءَ "رواهُ مسلم.

హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రబోధించారు: దాసుడు తన ప్రభువుకి అత్యంత సన్నిహితంగా ఉండే స్థితి సజ్దా స్థితి. కనుక మీరు ఆ స్థితిలో అతి ఎక్కువగా ప్రార్థనలు చేయండి. (ముస్లిం)

(సహీహ్ ముస్లింలోని సలాత్ ప్రకరణం)

English

Abu Hurairah (radiyallahu anhu) reported: The Messenger of Allah ﷺ said, “A slave becomes nearest to his Rubb when he is in prostration. So increase supplications while prostrating.”[Muslim].

ముఖ్యాంశాలు

సజ్దా స్థితిలో ప్రార్థన (దుఆ) అంగీకరించబడటానికి ఎక్కువ అవకాశాలున్నట్లు పై హదీసుల ద్వారా బోధపడుతోంది. నఫిల్ నమాజుల్లో దీన్ని అమలు చేస్తూ ఉండాలి.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|దైవధ్యాన ప్రకరణం|244. దైవస్మరణం విశిష్ఠత – ప్రోత్సాహం|హదీసు 1429

1430

హదీసు 1430

وعنهُ أنَّ رسُول اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم كانَ يقُولُ في سُجُودِهِ: " اللَّهُمَّ اغفِرْ لي ذَنبي كُلَّهُ: دِقَّه وجِلَّهُ، وأَوَّله وَآخِرَهُ، وَعَلاَنِيَتَهُ وَسِرَّه" رواهُ مسلم.

హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) గారే చేసిన మరొక కథనం: దైవప్రవక్త ﷺ సజ్దా స్థితిలో ఈ విధంగా ప్రార్థించేవారు: "దేవా! నా పాపాలన్నిటినీ- చిన్నవీ, పెద్దవీ, ముందటివీ, వెనుకటివీ, రహస్యమైనవీ, బహిర్గతమైనవీ- అన్నిటినీ క్షమించు." (ముస్లిం)

(సహీహ్ ముస్లింలోని సలాత్ ప్రకరణం)

English

Abu Hurairah (radiyallahu anhu) reported: The Messenger of Allah ﷺ used to say in his prostration: Allahum-maghfir li dhanbi kullahu: diqqahu wa jillahu, wa `awwalahu wa akhirahu, wa alaniyatahu wa sirrahu (O Allah! Forgive all my sins, the small and the great, first and the last, the open and the secret).”[Muslim].

ముఖ్యాంశాలు

దేవుడు అంతిమ ప్రవక్తగారి ముందటి వెనుకటి పాపాలన్నిటినీ క్షమించేశాడు. అయినప్పటికీ ఆయన దేవుని ఔన్నత్యం, ఆయన మహోజ్వలత్వం దృష్ట్యా తన వల్ల జరిగే చిన్నచిన్న పొరపాట్లకు కూడా దేవుణ్ణి క్షమాపణలు వేడుకునేవారు. చూడండి! ఆయన అంత పునీతులయి ఉండి కూడా దేవుని శిక్ష గురించి భయపడి పోయేవారు. కాని మనం పీకలదాకా పాపాల్లో కూరుకుపోయి ఉండి కూడా దేవుని శిక్ష గురించి ఏమాత్రం భయపడటం లేదు. ఎంత ఘోరం!

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|దైవధ్యాన ప్రకరణం|244. దైవస్మరణం విశిష్ఠత – ప్రోత్సాహం|హదీసు 1430

1431

హదీసు 1431

وعنْ عائشةَ رضي اللَّه عنْها قالَتْ: افتَقدْتُ النَّبيَّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم ذَاتَ لَيْلَةٍ، فَتَحَسَّسْتُ، فَإذَا هُو راكعٌ أوْ سَاجدٌ يقولُ: "سُبْحَانكَ وبحمدِكَ، لاَ إلهَ إلاَّ أنْتَ" وفي روايةٍ: فَوقَعَت يَدِي عَلَى بَطْنِ قَدميهِ، وهُوَ في المَسْجِدِ، وَهُمَا منْصُوبتانِ، وَهُوَ يَقُولُ: "اللَّهُمَّ إنِّي أَعُوذُ بِرضَاكَ مِنْ سَخَطِكَ، وبمُعافاتِكَ مِنْ عُقوبتِكَ، وَأَعُوذُ بِك مِنْكَ، لاَ أُحْصِي ثَنَاءً عليكَ أَنْتَ كَمَا أثنيتَ عَلَى نَفْسِكَ" رواهُ مسلم.

హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) కథనం: ఒక రోజు రాత్రి దైవప్రవక్త ﷺ (పక్కమీద) కనిపించలేదు. నేనాయన్ని వెతుక్కుంటూ బయలుదేరాను. చూస్తే ఒకచోట ఆయన (నమాజు చేస్తూ) రుకూలో (లేక) సజ్దాలో "అల్లాహ్! నీవు నీ స్తోత్ర సమేతంగా పరిశుద్ధుడివి. నీవు తప్ప వేరొక ఆరాధ్యుడులేడు" అని అంటున్నారు.

వేరొక హదీసులో ఇలా ఉంది: (చీకట్లో నేనాయన్ని వెతుకుతున్నప్పుడు) నా చేతికి ఆయన అరికాళ్ళు తగిలాయి. అప్పుడాయన సజ్దాలో ఉన్నారు. ఆయన పాదాలు (నేలకు) నిటారుగా ఆనించి ఉన్నాయి. అప్పుడాయన ఇలా ప్రార్థిస్తున్నారు: దేవా! నేను నీ అప్రసన్నత నుండి నీ ప్రసన్నత శరణు వేడుకుంటున్నాను. నీ శిక్ష నుండి నీ మన్నింపుని శరణు కోరుతున్నాను. నీ ఆగ్రహం నుండి నిన్నే శరణు వేడుతున్నాను. నేను నీ స్తోత్రాన్ని లెక్కించటానికి అనర్హుణ్ణి. నిన్ను నీవు ఎలా స్తుతించుకున్నావో అలాగే వర్ధిల్లుతున్నావు.

(ముస్లిం)

(సహీహ్ ముస్లింలోని సలాత్ ప్రకరణం)

English

`Aishah (radiyallahu anha) reported: One night I missed the Messenger of Allah ﷺ from his bed. I searched for him. When I found him he was in bowing or prostrating posture and was reciting: Subhanaka wa bi hamdika. La ilaha illa Anta (You are free from imperfection and I begin praising You. There is no true god except You).”

Another narration is: My hand fell over his feet while he was in prostration with his feet erect. He was supplicating: “Allahumma inni a`udhu biridaka min sakhatika, wa bi-mu`afatika min `uqubatika, wa a`udhu bika minka, la uhsi thana’an `alaika, Anta kama athnaita `ala Nafsika (O Allah! I seek protection against Your Wrath in Your Pleasure. I seek protection in Your Pardon against Your chastisement, I am not capable of enumerating praise of You. You are as You have lauded Yourself).”

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|దైవధ్యాన ప్రకరణం|244. దైవస్మరణం విశిష్ఠత – ప్రోత్సాహం|హదీసు 1431

1432

హదీసు 1432

وعنْ سعدِ بن أَبي وقاصٍ رضي اللَّه عنْهُ قَالَ: كُنَّا عِنْد رسُولِ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم فقَالَ: "أَيعجِزُ أَحدُكم أنْ يكْسِبَ في كلِّ يوْمٍ أَلف حَسنَة،"فَسَأَلَهُ سائِلٌ مِنْ جُلَسائِهِ: كيفَ يكسِبُ أَلفَ حَسنَةٍ؟ قالَ:"يُسَبِّحُ مِائةَ تَسْبِيحة، فَيُكتَبُ لهُ أَلفُ حسَنَةٍ، أوْ يُحَطُّ عنْهُ ألفُ خَطِيئَةٍ "رواه مسلم. قَالَ الحُميدِيُّ: كذا هُوَ في كتاب مسلم:"أوْ يُحَطُّ"قَالَ: البَرْقَانيُّ: ورواهُ شُعْبَةُ، وأبو عوانَةَ، ويَحيَى القَطَّانُ، عَنْ مُوسى الَّذِي رواه مسلم مِن جِهتِهِ فقالُوا:"وَيُحَطُّ"بِغَيْرِ أَلفٍ.

హజ్రత్ సాద్ బిన్ అబూ వఖ్ఖాస్ (రదియల్లాహు అన్హు) కథనం: మేము దైవప్రవక్త ﷺ దగ్గర కూర్చొని ఉండగా ఆయన మమ్మల్ని "మీలో ఒకరు రోజుకి వేయి పుణ్యాలు సంపాదించలేడా?" అని అడిగారు. ఆ మాటకు అక్కడ కూర్చున్న వారిలో ఒకడు, "రోజుకి వెయ్యి పుణ్యాలు ఎవడైనా ఎలా ఆర్జిస్తాడు?" అన్నాడు. అందుకు దైవప్రవక్త ﷺ, "అతను వందసార్లు దేవుని పవిత్రతను కొనియాడాలి (అంటే సుబ్‌హానల్లాహ్ అని పలకాలి) అలా చేస్తే (అతని కర్మల ఖాతాలో) వెయ్యి పుణ్యాలు లిఖించబడతాయి లేదా వెయ్యి తప్పులు మన్నించబడతాయి" అని చెప్పారు. (ముస్లిం)

ఇమామ్ హుమైదీ ఇలా అంటున్నారు: ముస్లింగారి మూలంలో ఇలాగే "అవ్‌యుహత్తు" అని ఉంది. అయితే ఇమామ్ బర్ఖానీ ఇలా అంటున్నారు: ఈ హదీసుని ముస్లిం మూసా అనే ఆయన్నుంచి ఉల్లేఖించారు. కాని అదే సమయంలో ఈ హదీసుని మూసా నుండి షూబా, అబూ అవానా, యహ్యా ఖత్తాన్ ప్రభృతులు కూడా ఉల్లేఖించారు. అయితే వారి ఉల్లేఖనంలో 'వ యుహత్తు' అని ఉంది.

(సహీహ్ ముస్లింలోని జిక్ర్, దుఆల ప్రకరణం)

English

Sa`d bin Abu Waqqas (radiyallahu anhu) reported: We were with the Messenger of Allah ﷺ when he asked, “Is anyone of you unable to earn a thousand good deeds?” One of those present asked: “How can one earn thousand good deeds in a day?” He ﷺ replied, “By saying: Subhan Allah a hundred times, then one thousand good deeds will be recorded for him or one thousand sins will be blotted out from his record.”[Muslim].

ముఖ్యాంశాలు

వందసార్లు సుబ్‌హానల్లాహ్ అని పలికితే వెయ్యి పుణ్యాలు లభిస్తాయంటే అది ఒక సత్కార్యానికి పదిరెట్ల పుణ్యం లభిస్తుందన్న సూత్రం ఆధారంగా జరుగుతుంది. ఈ హదీసు మూలంలో స్వల్ప భేదాభిప్రాయముంది. కొంతమంది ఉల్లేఖకులు 'వయుహత్తు' అని ఉల్లేఖిస్తే మరికొందరు 'అవ్‌యుహత్తు' అని ఉల్లేఖించారు. 'వయుహత్తు' అంటే వెయ్యి పుణ్యాలు లిఖించబడతాయి మరియు వెయ్యి తప్పులు మన్నించబడతాయి అని భావం. అదే 'అవ్‌యుహత్తు' అని అంటే 'వెయ్యి పుణ్యాలు లిఖించబడతాయి లేదా వెయ్యి పాపాలు మన్నించబడతాయి' అనే అర్థం వస్తుంది.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|దైవధ్యాన ప్రకరణం|244. దైవస్మరణం విశిష్ఠత – ప్రోత్సాహం|హదీసు 1432

1433

హదీసు 1433

وعنْ أَبي ذَرٍّ رضي اللَّه عنْهُ أَنَّ رسُولَ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قالَ: "يُصْبِحُ عَلى كُلِّ سُلامَى مِنْ أَحدِكُمْ صَدَقةٌ: فكُلُّ تَسْبِيحةٍ صدقَةٌ، وكُلُّ تَحْمِيدَةٍ صَدَقَةٌ، وَكُلُّ تَهْلِيلَةٍ صَدَقَةٌ، وكُلُّ تَكْبِيرةٍ صدقَةٌ، وَأَمْرٌ بِالمعْرُوفِ صَدقَةٌ، وَنَهْيٌ عَنِ المُنكَرِ صدقَةٌ. وَيُجْزِيءُ مِنْ ذلكَ ركْعتَانِ يَرْكَعُهُما منَ الضُّحَى "رواه مسلم.

హజ్రత్ అబూ జర్ర్ (రదియల్లాహు అన్హు)గారు చేసిన కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రబోధించారు: మీలోని ప్రతి ఒక్కరిపై (శరీరంలోని ప్రతి కీలుపై) ఉదయంపూట ఒక సదఖా చేయటం తప్పనిసరి. అలాంటప్పుడు ప్రతి తస్బీహ్ (సుబ్‌హానల్లాహ్ అనటం కూడా) ఒక సత్కార్యమే. ప్రతి తహ్‌మీద్ (అల్‌హమ్దులిల్లాహ్ అనడమూ) ఒక సత్కార్యమే. ప్రతి తహ్‌లీల్ (లా ఇలాహ ఇల్లల్లాహ్ అనడం కూడా) ఒక సత్కార్యమే. ప్రతి తక్బీర్ (అల్లాహు అక్బర్ అనడమూ) ఒక సత్కార్యమే. మంచిని గురించి ఆజ్ఞాపించటం సత్కార్యం. అలాగే చెడు నుండి వారించడమూ సత్కార్యమే. అయితే సూర్యోదయం అయిన తర్వాత మనిషి చేసే రెండు రకాతుల (చాష్త్) నమాజు వీటన్నిటికీ ప్రత్యామ్నాయం కాగలదు.

(ముస్లిం)

(సహీహ్ ముస్లింలోని ప్రయాణీకుల నమాజ్ ప్రకరణం)

English

Abu Dharr (radiyallahu anhu) reported: The Messenger of Allah ﷺ said, “Every morning charity is due from every joint bone of the body of every one of you. Every utterance of Allah’s Glorification (i.e., Subhan-Allah) is an act of charity, and every utterance of praise of Him (i.e., Al-hamdu lillah) is an act of charity, and every utterance of profession of Faith (i.e., La ilaha illallah) is an act of charity, and every utterance of His Greatness (i.e., Allahu Akbar) is an act of charity; and enjoining good is an act of charity and forbidding what is disreputable is an act of charity; and two Rak`ah prayer which one offers in the forenoon (Ad-Duha) will suffice for all this.”[Muslim].

ముఖ్యాంశాలు

ఈ హదీసు ఇంతకుముందు 'సత్కార్యమార్గాలు అనేకం' అనే అధ్యాయంలో కూడా వచ్చింది. ఇందులో సూర్యోదయం తర్వాత చాష్త్ వేళ చేయబడే రెండు రకాతుల నమాజు యొక్క విశిష్ఠత వివరించబడింది. ఆ నమాజు చేస్తే శరీరంలో 360 కీళ్లు సురక్షితంగా, ఆరోగ్యంగా ఉంచినందుకు దేవునికి కృతజ్ఞతలు తెలుపుకోవటంతో సమానంగా భావింపబడుతుంది. అదే విధంగా దైవాన్ని స్తుతించటం, దేవుని పవిత్రతను కొనియాడటం, లా ఇలాహ ఇల్లల్లాహ్ అని అనటం, మంచిని గురించి ఆదేశించి చెడులను నిర్మూలించటం కూడా శరీరావయవాల తరపున దానధర్మాలుగా పరిగణించబడతాయి.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|దైవధ్యాన ప్రకరణం|244. దైవస్మరణం విశిష్ఠత – ప్రోత్సాహం|హదీసు 1433

1434

హదీసు 1434

وعَنْ أُمِّ المؤمنينَ جُوَيْرِيَةَ بنتِ الحارِثِ رَضِيَ اللَّه عَنْها أنَّ النَّبيّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم خَرجَ مِنْ عِنْدِهَا بُكرَةً حِينَ صَلَّى الصُّبْحَ وهِيَ في مسْجِدِهَا، ثُمَّ رَجع بَعْد أَنْ أَضْحى وهَي جَالِسةٌ فقال:"مازلْتِ عَلَى الحالِ الَّتي فارَقْتُكَ عَلَيْهَا؟ "قالَتْ: نَعمْ: فَقَالَ النَّبيُّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم:"لَقَدْ قُلْتُ بَعْدِكِ أرْبَعَ كَلمَاتٍ ثَلاثَ مرَّاتٍ، لَوْ وُزِنَتْ بمَا قُلْتِ مُنْذُ الْيَومِ لَوَزَنْتهُنَّ: سُبْحَانَ اللَّهِ وبحمْدِهِ عَدَدَ خَلْقِهِ، وَرِضَاءَ نَفْسِهِ، وَزِنَةَ عرْشِهِ، ومِداد كَلمَاتِه" رواه مسلم. وفي روايةٍ لهُ: سُبْحانَ اللَّهِ عددَ خَلْقِهِ، سُبْحَانَ اللَّهِ رِضَاءَ نَفْسِهِ، سُبْحانَ اللَّهِ زِنَةَ عَرْشِهِ، سُبْحَانَ اللَّهِ مِداد كَلماتِهِ". وفي روايةِ الترمذي:"ألا أُعلِّمُكِ كَلماتٍ تَقُولِينَها؟ سُبْحانَ اللَّهِ عَدَدَ خلْقِهِ، سُبْحانَ اللَّهِ عَددَ خَلْقِهِ، سُبْحانَ اللَّه عَدَدَ خَلْقِهِ، سُبْحانَ اللَّه رِضَا نَفْسِهِ، سُبْحان اللَّهِ رِضَا نَفْسِهِ، سُبْحانَ اللَّه رِضَا نَفْسِهِ، سُبحَانَ اللَّه زِنَةَ عرْشِهٍ، سُبحَانَ اللَّه زِنَةَ عرْشِهٍ، سُبحَانَ اللَّه زِنَةَ عرْشِهٍ، سُبحَانَ اللَّهِ مِدادَ كَلماتِهِ، سُبحَانَ اللَّهِ مِدادَ كَلماتِهِ، سُبحَانَ اللَّهِ مِدادَ كَلماتِه".

విశ్వాసుల మాతృమూర్తి జువైరియా బిన్తె హారిస్ (రదియల్లాహు అన్హా) కథనం ప్రకారం ఒకరోజు పొద్దున్నే దైవప్రవక్త ﷺ ఫజ్ర్ నమాజ్ చేసుకొన్న తర్వాత బయటికి వెళ్ళినప్పుడు ఆమె తాను నమాజ్ చేసినచోటే కూర్చొని (దైవధ్యానంలో) నిమగ్నులై ఉన్నారు. బాగా పొద్దెక్కిన తర్వాత ఆయన తిరిగొచ్చారు. అప్పటికీ ఆమె అక్కడే కూర్చొని ఉండటం చూసి, "నేను బయటికి వెళ్ళినప్పటి నుంచి నువ్వు ఇక్కడే కూర్చొని ఉన్నావా?" అని అడిగారు. అందుకు ఆమె 'అవును' అని సమాధానమిచ్చారు. అప్పుడు దైవప్రవక్త ﷺ ఇలా అన్నారు: నేను నీ దగ్గరి నుండి వెళ్ళిన తర్వాత నాలుగు వచనాలు – ఒక్కొక్కటి మూడుసార్లు చొప్పున పఠించాను. వాటిని గనక, నువ్వు ఈ రోజు పొద్దున్నుంచి పలుకుతూ కూర్చున్న పలుకులతో సరితూచితే అవే ఎక్కువ బరువుని తూస్తాయి. ఆ వచనాలు ఇవి: 'సుబ్‌హానల్లాహి వబిహమ్‌దిహీ అదద ఖల్‌ఖిహీ వ రిజాఅ నఫ్‌సిహీ వ జినత అర్‌షిహీ వ మిదాద కలిమాతిహీ' (దేవుని సృష్టితాల సంఖ్యకు సమానంగా, దైవాభీష్టానికి అనుగుణంగా, దేవుని సింహాసనం బరువుకు సమానంగా, దేవుని వచనా లను లిఖించటానికి ఎంత సిరా అయితే పడుతుందో లేదా ఆయన వచనాలు ఎంత ఎక్కువగా ఉన్నాయో అంత ఎక్కువగా మేము ఆయన పవిత్రతను కొనియాడుతున్నాం. ఆయన్ని స్తుతిస్తున్నాం.) (ముస్లిం)

ముస్లింలోని వేరొక ఉల్లేఖనంలో ఇలా ఉంది: (దేవుని సృష్టితాల సంఖ్యకు సమానంగా, దైవాభీష్టానికి తగినంతగా, దేవుని సింహాసనం బరువుకు సమానంగా, దేవుని వచనాలు ఎంత ఎక్కువగా ఉన్నాయో లేదా వాటిని లిఖించటానికి ఎంత సిరా పడుతుందో అంతగా నేను దేవుని పవిత్రతను కొనియాడుతున్నాను.

తిర్మిజీలోని ఇంకొక ఉల్లేఖనంలో ఇలా ఉంది: "నేను నీకు పలకటానికి అనుకూలమైన పలుకులు నేర్పనా? (ఇలా అంటూ ఉండు:) దేవుని సృష్టితాలకు సమానంగా ఆయన పవిత్రతను కొనియాడుతున్నాను. దేవుని సృష్టితాలకు సమానంగా ఆయన పవిత్రతను కొనియాడుతున్నాను. దేవుని సృష్టితాల సంఖ్యకు సమానంగా ఆయన పవిత్రతను కొనియాడుతున్నాను. దైవాభీష్టానికి అనుగుణంగా ఆయన పవిత్రతను కొనియాడుతున్నాను. దైవాభీష్టానికి అనుగుణంగా ఆయన పవిత్రతను కొనియాడుతున్నాను. దైవాభీష్టానికి అనుగుణంగా ఆయన పవిత్రతను కొనియాడుతున్నాను. దేవుని సింహాసనం బరువుకు సమానంగా ఆయన పవిత్రతను కొనియాడుతున్నాను. దేవుని సింహాసనం బరువుకు సమానంగా ఆయన పవిత్రతను కొనియాడుతున్నాను. దేవుని సింహాసనం బరువుకు సమానంగా ఆయన పవిత్రతను కొనియాడుతున్నాను. దేవుని వచనాలను లిఖించటానికి ఎంత సిరా పడుతుందో అంతగా నేను ఆయన పవిత్రతను కొనియాడుతున్నాను. దేవుని వచనాలను లిఖించటానికి ఎంత సిరా పడుతుందో అంతగా నేను ఆయన పవిత్రతను కొనియాడుతున్నాను. దేవుని వచనాలను లిఖించటానికి ఎంత సిరా పడుతుందో అంతగా నేను ఆయన పవిత్రతను కొనియాడుతున్నాను."

(సహీహ్ ముస్లింలోని జిక్ర్, దుఆల ప్రకరణం – సుననె తిర్మిజీలోని దావాత్ అధ్యాయాలు)

English

Juwairiyah bint Al-Harith (radiyallahu anha) reported, the Mother of the Believers: The Prophet ﷺ came out from my apartment in the morning as I was busy in performing the dawn prayer. He came back in the forenoon and found me sitting there. The Prophet ﷺ said, “Are you still in the same position as I left you.” I replied in the affirmative. Thereupon the Prophet said, “I recited four words three times after I had left you. If these are to be weighed against all you have recited since morning, these will be heavier. These are: Subhan-Allahi wa bihamdihi, `adada khalqihi, wa rida nafsihi, wa zinatah `arshihi, wa midada kalimatihi [Allah is free from imperfection and I begin with His praise, as many times as the number of His creatures, in accordance with His Good Pleasure, equal to the weight of His Throne and equal to the ink that may be used in recording the words (for His Praise)].”[Muslim].

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|దైవధ్యాన ప్రకరణం|244. దైవస్మరణం విశిష్ఠత – ప్రోత్సాహం|హదీసు 1434

1435

హదీసు 1435

وعنْ أَبي مُوسَى الأشعريِّ، رضي اللَّه عنهُ، عن النَّبيّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم، قَالَ: "مَثَلُ الَّذِي يَذكُرُ ربَّهُ وَالذي لا يذكُرُهُ، مَثَل الحيِّ والمَيِّتِ" رواهُ البخاري. ورواه مسلم فَقَالَ: "مَثَلُ البَيْتِ الَّذي يُذْكَرُ اللَّه فِيهِ، وَالبَيتِ الَّذِي لا يُذْكَرُ اللَّه فِيهِ، مَثَلُ الحَيِّ والمَيِّتِ".

హజ్రత్ అబూ మూసా అష్‌అరీ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఈ విధంగా ప్రవచించారు: దేవుణ్ణి స్మరించేవాడు బ్రతికున్నవ్యక్తిలాంటి వాడు. దేవుణ్ణి స్మరించనివాడు చనిపోయిన వ్యక్తిలాంటివాడు.

(బుఖారీ)

ముస్లిం ఈ హదీసుని ఈ విధంగా ఉల్లేఖించారు: దేవుణ్ణి స్మరించే ఇల్లు జీవించివున్న దానితో సమానం. దేవుణ్ణి స్మరించని ఇల్లు చచ్చిపోయిన దానితో సమానం.

(సహీహ్ బుఖారీలోని దావాత్ ప్రకరణం – సహీహ్ ముస్లింలోని ప్రయాణీకుల నమాజ్ ప్రకరణం)

English

Abu Musa Al-Ash`ari (radiyallahu anhu) reported: The Prophet ﷺ said, “The similitude of one who remembers his Rubb and one who does not remember Him, is like that of the living and the dead.”[Al-Bukhari and Muslim].

ముఖ్యాంశాలు

దేవుణ్ణి స్మరించకపోవటం మృత్యువుతో సమానం. మరణించిన వ్యక్తి ఏ పనీ చేయలేడు. అలాగే దైవస్మరణను వదలిపెట్టిన వ్యక్తి దేవుణ్ణి సంతోషపెట్టే, తనకు ప్రయోజనకరమైన పని ఏదీ చేయలేడు.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|దైవధ్యాన ప్రకరణం|244. దైవస్మరణం విశిష్ఠత – ప్రోత్సాహం|హదీసు 1435

1436

హదీసు 1436

وعنْ أَبي هُريرةَ، رضي اللَّه عنْهُ، أنَّ رسُولَ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قالَ:"يقُولُ اللَّه تَعالى: أَنَا عِنْدَ ظَنِّ عَبْدِي بِي، وَأَنَا مَعهُ إِذَا ذَكَرَني، فَإن ذَكرَني في نَفْسهِ، ذَكَرْتُهُ في نَفسي، وإنْ ذَكَرَني في ملإٍ، ذكَرتُهُ في ملإٍ خَيْرٍ منْهُمْ" متَّفقٌ عليهِ.

హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దేవుడు ఇలా అంటాడని దైవప్రవక్త ﷺ తెలియజేశారు: నేను నా దాసుని ఆలోచన దగ్గర ఉంటాను. అతను నన్ను గుర్తుచేసుకున్నప్పుడు నేనతని వెంటే ఉంటాను. అతను నన్ను తన మనసులో గుర్తుచేసుకుంటే నేనతన్ని నా మనసులో గుర్తుచేసుకుంటాను. అతను గనక ఏదయినా సమావేశంలో నన్ను గుర్తుచేసుకుంటే నేను కూడా అతన్ని వారికంటే శ్రేష్ఠమైన సమావేశంలో గుర్తుచేసుకుంటాను. (బుఖారీ-ముస్లిం)

(సహీహ్ బుఖారీలోని తౌహీద్ ప్రకరణం – సహీహ్ ముస్లింలోని జిక్ర్, దుఆల ప్రకరణం)

English

Abu Hurairah (radiyallahu anhu) reported: The Messenger of Allah ﷺ said, “Allah the Exalted says: `I am as my slave expects me to be, and I am with him when he remembers Me. If he remembers Me inwardly, I will remember him inwardly, and if he remembers Me in an assembly, I will remember him in a better assembly (i.e., in the assembly of angels).”[Al-Bukhari and Muslim].

ముఖ్యాంశాలు

మనిషి తన ప్రభువు విషయంలో సదభిప్రాయం (సదనుమానం) కలిగి ఉండాలని ఈ హదీసు ప్రబోధిస్తోంది. సదభిప్రాయంటే దేవుడు దాసుల పశ్చాత్తాపాన్ని అంగీకరిస్తాడనీ, వారి పాపాలను మన్నిస్తాడనీ, కష్టాల్లో వున్న వారిని తమ కష్టాల నుండి గట్టెక్కిస్తాడన్న దృఢనమ్మకాన్ని కలిగివుండటం, అలాంటి నమ్మకంతోపాటు దేవుణ్ణి ప్రసన్నం చేసుకునేందుకు అనువైన మంచిపనులు కూడా చేస్తూ, ఆయన వారించిన విషయాల జోలికి పోకుండా ఉండటం. ఉదాహరణకు ఒక రైతు పొలం దున్ని విత్తనాలు నాటుతాడు. నీరు సరఫరా చేసి దాన్ని కనిపెట్టుకొని ఉంటాడు. ఆ తర్వాతే ఫలసాయాన్ని ఆశిస్తాడు. అలాగే ఒక వ్యక్తి పండితుడు కావాలన్నా డాక్టర్ లేక ఇంజనీరు కావాలన్నా ముందు తనకు ఇష్టమున్న రంగానికి సంబంధించిన పుస్తకాలను చదివి, వాటిలో ఉన్న జ్ఞానాన్ని ఆర్జించవలసి ఉంటుంది. ఆ తర్వాతే అతను డాక్టరు లేక ఇంజనీరు అవగలడని ఆశించగలుగుతాం. దేవుని పట్ల సదనుమానం కలిగి ఉండే విషయం కూడా అంతే. మనిషి దృఢంగా దేవుణ్ణి నమ్మి, సదాచరణకు ఉపక్రమించ నంతవరకు దేవునిపట్ల సదభిప్రాయాన్ని కలిగి ఉంటాడనటంలో అర్థం లేదు. ఒక బానిస తన యజమానికి సేవ చేయకుండా పారిపోయి, అతనికి తీరని నష్టం కలుగజేసి తీరా తన యజమాని ఎంతో దయామయుడనీ, తనను ఏమీ అనడని సదభిప్రాయంతో ఉంటే ఆ బానిసను ఎవరైనా ఏమంటారు? అవివేకి అంటారు. దేవుడు అమిత దయామయుడు, అత్యంత కరుణామయుడు అన్నదాంట్లో ఏమాత్రం సందేహం లేదు. అయితే అది ఎవరి విషయంలో? తన దాసుల విషయంలో మాత్రమే. షైతాన్ దాసుల విషయంలో మాత్రం కాదు. షైతాన్ మరియు అతని దాసుల్ని నరకంలో నింపుతాను అంటున్నాడు దేవుడు. (సూరె సాద్ : 85వ సూక్తి)

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|దైవధ్యాన ప్రకరణం|244. దైవస్మరణం విశిష్ఠత – ప్రోత్సాహం|హదీసు 1436

1437

హదీసు 1437

وعَنْهُ قَالَ: قالَ رَسُولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "سبقَ المُفَرِّدُونَ"قالوا: ومَا المُفَرِّدُونَ يَا رسُول اللَّهِ؟ قَالَ:"الذَّاكِرُونَ اللَّه كَثيراً والذَّاكِراتُ" رواه مسلم. روي:"المُفَرِّدُونَ"بتشديد الراءِ وتخفيفها، والمَشْهُورُ الَّذي قَالَهُ الجمهُورُ: التَّشديدُ.

హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) గారే చేసిన కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఒకసారి, 'ముఫర్రిదూన్‌లు మించిపోయారు' అని అన్నారు. ఆ మాట విని సహచరులు, 'ముఫర్రిదూన్‌లు అంటే ఎవరు దైవప్రవక్తా?' అని అడిగారు. అందుకు ఆయన సమాధానమిస్తూ, "దేవుణ్ణి అత్యధికంగా స్మరించే స్త్రీ పురుషులు' అని చెప్పారు. (ముస్లిం)

(సహీహ్ ముస్లింలోని జిక్ర్, దుఆల ప్రకరణం)

English

Abu Hurairah (radiyallahu anhu) reported: The Messenger of Allah ﷺ said, “The Mufarridun have gone ahead.” He was asked, “Who are the Mufarridun?” He ﷺ replied, “Those men and women who frequently celebrate the remembrance of Allah.”[Muslim].

ముఖ్యాంశాలు

ఈ హదీసులో ముఖ్యంగా రెండు విషయాలు బోధించబడ్డాయి. ఒకటి; దేవుణ్ణి అత్యధికంగా స్మరించటం అత్యంత విశిష్ఠమైన పుణ్యకార్యం. దేవుణ్ణి అత్యధికంగా స్మరించేవారు ప్రళయదినాన పుణ్యం రీత్యా అందరికంటే ముందుంటారు. రెండోది; దేవుణ్ణి స్మరించేవారు, దైవానికి విధేయత చూపేవారు- వారు స్త్రీలయినా, పురుషులయనా ఇద్దరికీ సమానమైన పుణ్యం లభిస్తుంది. దైవస్మరణకు, దైవవిధేయతకు లభించే పుణ్యంలో లింగపరమైన ఎలాంటి వివక్షత చూపబడదు.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|దైవధ్యాన ప్రకరణం|244. దైవస్మరణం విశిష్ఠత – ప్రోత్సాహం|హదీసు 1437

1438

హదీసు 1438

وعن جابرٍ رضي اللَّه عَنْهُ قالَ: سمِعْتُ رسُول اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم يقولُ: "أَفْضَلُ الذِّكرِ: لا إلهَ إلاَّ اللَّه". رواهُ الترمِذيُّ وقال: حديثٌ حسنٌ.

దైవప్రవక్త ﷺ ఈ విధంగా ప్రవచిస్తుండగా తాను విన్నానని హజ్రత్ జాబిర్ (రదియల్లాహు అన్హు) తెలియజేశారు: అన్నిటికంటే శ్రేష్ఠమైన దైవస్మరణ 'లా ఇలాహ ఇల్లల్లాహ్' అని పలకటం.

(తిర్మిజీ-హసన్)

(సుననె తిర్మిజీలోని దావాత్ ప్రకరణం)

English

Jabir (radiyallahu anhu) reported: I heard the Messenger of Allah ﷺ saying, “The best way to celebrate the remembrance of Allah is to say: La ilaha illallah (there is no true god except Allah).”[At-Tirmidhi].

ముఖ్యాంశాలు

హదీసులో పేర్కొనబడిన వచనం ఏకేశ్వరోపాసనా సిద్ధాంతానికి పునాది లాంటిది. అందుకే దీన్ని అత్యంత శ్రేష్ఠమైన దైవస్మరణగా పేర్కొనటం జరిగింది. పోతే కొంతమంది పండితులు ఈ ఒక్క వచనాన్ని మాత్రమే శ్రేష్ఠమైన దైవస్మరణగా పేర్కొంటే అందులో 'ముహమ్మద్ రసూలుల్లాహ్' అనే వచనం కూడా ఉందనీ 'లా ఇలాహ ఇల్లల్లాహు ముహమ్మద్ రసూలుల్లాహ్' అనే మొత్తం వచనం 'శ్రేష్ఠమైన దైవస్మరణ' అవుతుందని అభిప్రాయపడ్డారు.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|దైవధ్యాన ప్రకరణం|244. దైవస్మరణం విశిష్ఠత – ప్రోత్సాహం|హదీసు 1438

1439

హదీసు 1439

وعنْ عبد اللَّه بن بُسْرٍ رضي اللَّه عنْهُ أنَّ رَجُلاً قَالَ: يَا رسُولَ اللَّهِ، إنَّ شَرائِع الإسْلامِ قَدْ كَثُرتْ علَيَّ، فَأخبرْني بِشيءٍ أتشَبَّثُ بهِ قَالَ:"لا يَزالُ لِسَانُكَ رَطْباً مِنْ ذِكْرِ اللَّهِ ". رواهُ الترمذي وقال: حديثٌ حَسَنٌ.

హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ బుస్ర్ (రదియల్లాహు అన్హు) కథనం: (దైవప్రవక్త సన్నిధిలో) ఒక వ్యక్తి, "దైవప్రవక్తా! ఇస్లాం ఆదేశాలు నాకు చాలా ఎక్కువగా కనిపిస్తాయి. కనుక నేను స్థిరంగా ఆచరించదగిన ఆచరణ ఒకటి నాకు తెలపండి"అని కోరాడు. అందుకాయన 'నీ నోరు ఎల్లప్పుడూ దైవస్మరణలో లీనమై ఉండేలా చూసుకో' అని ఉపదేశించారు. (తిర్మిజీ-హసన్)

(సుననె తిర్మిజీలోని దావాత్ ప్రకరణం)

English

`Abdullah bin Busr (radiyallahu anhu) reported: One of the Companions said, “O Messenger of Allah. There are many injunctions of Islam for me. So tell me something to which I may hold fast.” He said, “Keep your tongue wet with the remembrance of Allah.”[At-Tirmidhi].

ముఖ్యాంశాలు

మూలంలో 'షరాయివు' అనే పదం వచ్చింది. అది షరీఅతున్ అనే పదానికి బహువచనం. దేవుడు నిర్ణయించిన ఆదేశాలు అని దాని భావం. దైవాదేశాల్లో కొన్ని విధులు (ఫర్జ్‌లు), మరికొన్ని ముస్తహబ్‌లు, ఇంకొన్ని నఫిళ్లు (స్వచ్ఛంద సత్కార్యాలు) ఉన్నాయి. విధుల్ని ఎట్టి పరిస్థితుల్లోనయినా నిర్వర్తించాల్సిందే. అందులో ఎలాంటి మినహాయింపూ ఉండదు. అలాగే దేవుని ప్రసన్నతను బడయటానికి, దైవసామీప్యాన్ని చూరగొనటానికి ముస్తహబ్‌లు, నఫిళ్లు కూడా పాటిస్తూ ఉండటం మంచిది. కాని సామాన్యప్రజలకు వీటిని గురించి చెబితే వారు 'ఇన్ని ఆదేశాలు పాటించాలా?'అని బెదిరిపోవచ్చు. సాధారణంగా వారు ఫర్జ్ మరియు సున్నత్‌లతో సరిపుచ్చుకోవాలనుకుంటారు. ఈ హదీసులో పేర్కొనబడిన వ్యక్తి ఆ బాపతే. అందుకే దైవప్రవక్త ﷺ అతనికి నిత్యం నోటిని దైవస్మరణలో లీనం చేసుకోమనీ, అంటే నిత్యం దైవాన్ని స్మరిస్తూ ఉండమని బోధించారు. నఫిల్ ఆరాధనల్ని చూసి బెదిరిపోనవసరం లేదు. నిత్యం దైవస్మరణలో నిమగ్నమై ఉంటే సరిపోతుంది అని చెప్పటమే ఆయన ఉద్దేశ్యం.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|దైవధ్యాన ప్రకరణం|244. దైవస్మరణం విశిష్ఠత – ప్రోత్సాహం|హదీసు 1439

1440

హదీసు 1440

وعنْ جابرٍ رضي اللَّه عنهُ، عَنِ النبي صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَالَ: "منْ قَالَ: سُبْحانَ اللَّهِ وبحَمدِهِ، غُرِستْ لهُ نَخْلَةٌ في الجَنَّةِ". رواه الترمذي وَقالَ: حديث حسنٌ.

హజ్రత్ జాబిర్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఈ విధంగా ప్రవచించారు: ఎవరయితే 'సుబ్‌హానల్లాహి వబిహమ్దిహీ' అని అంటారో వారి కోసం స్వర్గంలో ఒక ఖర్జూరపు చెట్టు నాటడం జరుగుతుంది.

(తిర్మిజీ – హసన్)

(సుననె తిర్మిజీలోని దావాత్ ప్రకరణం)

English

Jabir (radiyallahu anhu) reported: The Prophet ﷺ said, “For him who says: `Subhan-Allahi wa bi hamdihi (Allah is free from imperfection, and I begin with praising Him, and to Him),’ a palm-tree will be planted in Jannah.”[At-Tirmidhi].

ముఖ్యాంశాలు

దేవుని స్వర్గం ఎంత విశాలమైనదంటే దాన్ని మనం మాటల్లో వర్ణించలేం. కనుక దేవుణ్ణి స్తుతించటం, ఆయన పవిత్రతను కొనియాడటం మూలంగా స్వర్గంలో చెట్టు నాటబడటం అసాధ్యమేమీ కాదు. కనుక నిజంగా అలా జరుగుతుందని చెప్పటంలో ఎలాంటి సంశయం అక్కర్లేదు. అయితే కొంతమంది పండితులు ఇక్కడ దీని భావం పుణ్యప్రాప్తి అనీ, అది కూడా చాలా ఎక్కువ పుణ్యం లభిస్తుందని చెబుతారు.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|దైవధ్యాన ప్రకరణం|244. దైవస్మరణం విశిష్ఠత – ప్రోత్సాహం|హదీసు 1440

1441

హదీసు 1441

وعن ابن مسْعُودٍ رضي اللَّه عَنْهُ قال: قال رسُول اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم "لَقِيتُ إبراهيمَ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم لَيْلَةَ أُسْرِيَ بِي فَقَالَ: يَا مُحمَّدُ أقرِيءْ أُمَّتَكَ مِنِّي السَّلام، وأَخبِرْهُمْ أنَّ الجنَّةَ طَيِّبةُ التُّرُبةِ، عذْبةُ الماءِ، وأنَّها قِيعانٌ وأنَّ غِرَاسَها: سُبْحانَ اللَّه، والحمْدُ للَّه، وَلاَ إلهَ إلاَّ اللَّه واللَّه أكْبَرُ". رواه الترمذي وقال: حديثٌ حسنٌ.

హజ్రత్ ఇబ్నె మస్‌వూద్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రవచించారు: నాకు మేరాజ్ యాత్ర చేయించబడిన రాత్రి నేను ఇబ్రాహీమ్ (అలైహి)ని కలిశాను. అప్పుడాయన నాతో ఇలా అన్నారు: ముహమ్మద్ ﷺ! మీ అనుచర సమాజానికి నా తరపున సలాం చెప్పండి. ఇంకా వారికి ఇలా తెలపండి: స్వర్గంలోని మట్టి శుద్ధమైనది. అక్కడి నీళ్ళు తీయగా ఉంటాయి. అదో చదును మైదానం. "సుబ్‌హానల్లాహి వల్‌హమ్దులిల్లాహి వలా ఇలాహ ఇల్లల్లాహ్" అని అంటే అక్కడ ఒక చెట్టుని నాటుకున్నట్లే. (తిర్మిజీ-హసన్)

(సుననె తిర్మిజీలోని దావాత్ ప్రకరణం)

English

Ibn Mas`ud (radiyallahu anhu) reported: Messenger of Allah ﷺ said, “I met Ibrahim ﷺ on the Night of Ascension (Al-Asra), and he said to me: `O Muhammad, convey my greetings to your Ummah, and tell them that Jannah has a vast plain of pure soil and sweet water. It is a plain levelled land. The plants grow there by uttering: Subhan-Allah, Al-hamdu lillah, La ilaha illallah and Allahu Akbar (Allah is free from imperfection; praise be to Allah; there is no true god except Allah; and Allah is Greatest).”[At-Tirmidhi].

ముఖ్యాంశాలు

దేవుణ్ణి స్తుతించటం, ఆయన పవిత్రతను కొనియాడటం మూలంగా చదును మైదానంగా ఉండే స్వర్గం చెట్లతో, మొక్కలతో సస్యశ్యామలమైపోతుంది. ఎవరు ఎంత ఎక్కువగా దైవాన్ని స్మరిస్తారో వారికి లభించే స్వర్గం అంతే ఎక్కువగా చెట్లతో నిండుగా సస్యశ్యామలంగా ఉంటుంది.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|దైవధ్యాన ప్రకరణం|244. దైవస్మరణం విశిష్ఠత – ప్రోత్సాహం|హదీసు 1441

1442

హదీసు 1442

وعنْ أَبي الدِّرداءِ، رضيَ اللَّه عَنْهُ قالَ: قالَ رسولُ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "أَلا أُنَبِّئُكُم بِخَيْرِ أَعْمَالِكُم، وأَزْكَاهَا عِند مليكِكم، وأَرْفعِها في دَرجاتِكم، وخَيْرٌ لَكُمْ مِنْ إِنْفَاق الذَّهَبِ والفضَّةِ، وخَيْرٌ لَكُمْ مِنْ أَنْ تَلْقوْا عدُوَّكم، فَتَضربُوا أَعْنَاقَهُم، ويضرِبوا أَعْنَاقكُم؟ "قَالَوا: بلَى، قَالَ:"ذِكُر اللَّهِ تَعالى ". رواهُ الترمذي، قالَ الحاكمُ أَبو عبد اللَّهِ: إِسناده صحيح.

హజ్రత్ అబూ దర్దా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఒకసారి (తన సహచరులకు ప్రబోధిస్తూ ఇలా అన్నారు:) "మీ ఆచరణల్లో ఒకదాని గురించి నేను మీకు తెలుపనా? అది మీ ఆచరణలన్నిటికంటే శ్రేష్ఠమైనది. మీ యజమాని దృష్టిలో అత్యంత పవిత్రమైనది. అన్నింటికంటే ఎక్కువగా మీ అంతస్తుల్ని పెంచుతుంది. మీరు (దైవం కోసం) వెండి బంగారాలు ఖర్చుపెట్టటం కన్నా శ్రేష్ఠమైనది. మీరు శత్రువులతో తలపడి మీరు వారి మెడలు నరకటం వారు మీ మెడలు నరకటం కన్నా ఎంతో గొప్పది."

అందుకు సహచరులు 'తప్పకుండా తెలియజేయండి' అన్నారు. దానికాయన 'ఆ ఆచరణ దేవుణ్ణి స్మరించటం' అని అన్నారు. (తిర్మిజీ – హాకిమ్. అబూ అబ్దుల్లాహ్ దీని ఆధారాలు దృఢమైనవని అన్నారు)

(సుననె తిర్మిజీలోని దావాత్ అధ్యాయాలు)

English

Abud-Darda (radiyallahu anhu) reported: The Messenger of Allah ﷺ said, “Shall I not inform you of the best of your actions which are the purest to your Rubb, which exalt you to the high ranks, which are more efficacious than spending gold and silver (in charity), and better for you than you should encounter your enemies whom you will smite their necks and they will smite your necks?” They said, “Certainly.” He ﷺ said, “Remembrance of Allah the Exalted.”[At-Tirmidhi].

ముఖ్యాంశాలు

ఈ హదీసు కూడా దైవస్మరణ విశిష్ఠతను వెల్లడిస్తోంది. ఏ మంచిపనికయినా ఆధారం దైవస్మరణే. సత్కార్యాలను చిత్తశుద్ధితో, ఆపేక్షతో చేసినప్పుడే అవి ఆమోదించబడతాయి. దైవాన్ని స్మరించకుండా, దైవాభీష్టాన్ని లెక్కలోకి తీసుకోకుండా చేసే ఎంత పెద్ద పుణ్యకార్యమైనా వ్యర్ధమయిపోతుంది. అందుకే ఈ హదీసులో దైవస్మరణను అన్నిటికంటే గొప్ప ఆచరణగా పేర్కొనటం జరిగింది.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|దైవధ్యాన ప్రకరణం|244. దైవస్మరణం విశిష్ఠత – ప్రోత్సాహం|హదీసు 1442

1443

హదీసు 1443

وعن سعْدِ بنِ أَبي وقَّاصٍ رضي اللَّه عَنْهُ أَنَّهُ دَخَل مَعَ رسولِ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم عَلَى امْرأَةٍ وبيْنَ يديْهَا نَوىً أَوْ حصىً تُسبِّحُ بِه فقال: "أَلا أُخْبِرُك بما هُو أَيْسرُ عَليْكِ مِنْ هَذَا أَوْ أَفْضَلُ"فقالَ:"سُبْحانَ اللَّهِ عددَ مَا خَلَقَ في السَّماءِ، وَسُبْحانَ اللَّهِ عددَ مَا خَلَقَ في الأَرْضِ، وسُبحانَ اللَّهِ عددَ مَا بيْنَ ذلك، وسبْحانَ اللَّهِ عدد ما هُوَ خَالِقٌ. واللَّه أَكْبرُ مِثْلَ ذلكَ، والحَمْد للَّهِ مِثْل ذَلِكَ، وَلاَ إِله إِلا اللَّه مِثْل ذلكَ، وَلاَ حوْل وَلاَ قُوَّةَ إِلاَّ باللَّه مِثْلَ ذَلِكَ". رواه الترمذي وقال: حديثٌ حسنٌ.

హజ్రత్ సాద్ బిన్ అబూ వఖ్ఖాస్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం ఒకసారి ఆయన దైవప్రవక్త ﷺతోపాటు ఓ మహిళ ఇంటికి వెళ్ళారు. ఆ సమయంలో ఆమె ముందు టెంకాయలు (లేక) కంకర్రాళ్ళు పడివున్నాయి. వాటితో ఆమె లెక్కపెట్టుకుంటూ "సుబ్‌హానల్లాహ్…… సుబ్‌హానల్లాహ్" అని అంటోంది. అది చూసి దైవప్రవక్త ﷺ ఆమెతో, దీనికంటే సులువైన (లేక) దీనికంటే శ్రేష్ఠమైన వచనాలు తెల్పనా? (నువ్వు ఈ విధంగా పఠించు:) "దేవుడు ఆకాశాల్లో సృష్టించిన వస్తువులకు సమానంగా నేను దేవుని పవిత్రతను కొనియాడుతున్నాను. ఆయన భూమిలో సృష్టించిన వస్తువులకు సమానంగా నేను దేవుని పవిత్రతను కొనియాడుతున్నాను. ఇంకా భూమ్యాకాశాల మధ్యనున్న దేవుని సృష్టితాలకు సమానంగా నేను ఆయన పవిత్రతను కొనియాడుతున్నాను. ఆయన పుట్టించబోయే వస్తువులకు సమానంగా ఆయన పవిత్రతను కొనియాడుతున్నాను." అలాగే అల్లాహు అక్బర్, అల్‌హమ్దులిల్లాహ్, లా ఇలాహ ఇల్లల్లాహ్, లా హౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లాహ్ అనే వచనాలను కూడా (పఠించాలి). (తిర్మిజీ-హసన్)

(సుననె తిర్మిజీలోని దావాత్ అధ్యాయం)

English

Sa`d bin Abu Waqqas (radiyallahu anhu) reported: The Messenger of Allah ﷺ and I went to see a woman. She had date-stones or pebbles in front of her, and she was counting and reciting Tasbih. [`Subhan-Allah’ (Allah is free from imperfection)]. He said, “Shall I not inform you of what is easier or better than this for you?” You should say: `Subhan-Allahi `adada ma khalaqa fis-sama’, wa subhan-Allahi `adada ma khalaqa fil-ardi, wa subhan-Allahi `adada ma baina dhalika, wa subhan-Allahi `adada ma Huwa Khaliqun, wallahu Akbaru mithla dhalika, wal-hamdu lillahi mithla dhalika, wa la ilaha illallahu mithla dhalika, wa la hawla wa la quwwata illa billahi mithla dhalika (Subhan-Allah, equal to the number of what He created in the heaven; and Subhan-Allah, equal to the number of His creatures in the earth; and Subhan-Allah, equal to the number in between them; and Subhan-Allah equal to the number of those He will create).’ Then say: `Allahu Akbar’ (Allah is Greatest) in the same way. Then say: `Al-hamdu lillah’ (praise be to Allah) in the same way. Then say: `La ilaha illallah’ (there is no true god except Allah) in the same way. Then say: `La hawla wa la quwwata illa billah’ (there is no change of a condition nor power except by Allah) in the same manner.”[At-Tirmidhi].

ముఖ్యాంశాలు

షేఖ్ అల్‌బానీ (రహిమహుల్లాహ్) 'అజ్జయిఫా' అనే గ్రంథంలో ఈ హదీసుని బలహీనమైనదిగా పేర్కొన్నారు. ఇమామ్ తిర్మిజీ దీనిని 'హసన్' కోవకు చెందినదని పేర్కొనగా ఇమామ్ ఇబ్నె హిబ్బాన్ 'సహీహ్'గా పరిగణించారు. అయితే ఇక్కడ షేఖ్ అల్‌బానీ (రహిమహుల్లాహ్) ఇచ్చిన వివరాలు కాస్త గమనార్హమైనవి. ఆయన అభిప్రాయం ప్రకారం ఈ మొత్తం హదీసు జయీఫ్‌కాదు. ఇందులోని 'టెంకాయలు, కంకర్రాళ్ళు' అనే పదాలు తీసేస్తే అప్పుడది 'సహీహ్' హదీసే అవుతుంది అని అంటారాయన. ఈ హదీసుని ఇమామ్ ముస్లిం తన 'సహీహ్' గ్రంథంలో జువైరియా (రదియల్లాహు అన్హా) ఆధారంగా వెలికితీశారు. (మరిన్ని వివరాలకు షేఖ్ అల్‌బానీగారిచే పరిశోధిత రియాజుస్సాలిహీన్ (గ్రంథం చూడండి)

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|దైవధ్యాన ప్రకరణం|244. దైవస్మరణం విశిష్ఠత – ప్రోత్సాహం|హదీసు 1443

1444

హదీసు 1444

وعنْ أَبي مُوسى رضي اللَّه عنْه قَالَ: قالَ لي رسُولُ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "أَلا أَدُلُّك عَلَى كَنْزٍ مِنْ كُنُوزِ الجنَّةِ؟ "فقلت: بلى يَا رسولَ اللَّه، قَالَ:"لا حَوْلَ وَلاَ قُوَّةَ إِلاَّ بِاللَّهِ "متفقٌ عليه.

హజ్రత్ అబూమూసా (రదియల్లాహు అన్హు) కథనం: దైవప్రవక్త ﷺ నాతో "నేను నీకు స్వర్గనిధుల్లోని ఒక నిధి గురించి తెలుపనా?" అని అన్నారు. నేను "తప్పకుండా తెలపండి దైవప్రవక్తా!" అని అన్నాను. అందుకాయన 'లాహౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లాహ్' (అనే పలుకే ఆ నిధి) అని చెప్పారు.

(బుఖారీ-ముస్లిం)

(సహీహ్ బుఖారీలోని దావాత్ ప్రకరణం – సహీహ్ ముస్లింలోని జిక్ర్, దుఆల ప్రకరణం)

English

Abu Musa (radiyallahu anhu) reported: The Messenger of Allah ﷺ said to me, “Shall I not guide you to a treasure from the treasures of Jannah?” I said: “Yes, O Messenger of Allah!” Thereupon he ﷺ said, “(Recite) `La hawla wa la quwwata illa billah’ (There is no change of a condition nor power except by Allah).”[Al-Bukhari and Muslim].

ముఖ్యాంశాలు

ఈ హదీసులో 'లాహౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లాహ్' అనే వచనాన్ని స్వర్గనిధిగా పేర్కొనటం జరిగింది. అంటే అది స్వర్గంలోని అత్యంత అమూల్యమైన సంపద అన్నమాట. ఈ వచనాన్ని పఠించేటప్పుడు మనిషి తన నిస్సహాయతను వెలిబుచ్చుతాడు, సకల శక్తిసామర్ధ్యాలు దేవుని నుండే వస్తాయని ప్రకటిస్తాడు. ఈ విషయాన్ని దేవుడు అమితంగా ఇష్టపడతాడు. అందుకే ఆ వచనపఠనానికి అంతటి ప్రాముఖ్యత ఉంది. పోతే ఆ వచనం భావం ఏమిటంటే- మనిషి తనకు తానుగా ఏదీ చేయలేడు. ఏదైనా మంచిపని చేయాలన్నా లేక ఎదయినా చెడు పని నుండి కాపాడుకోవాలన్నా కేవలం దేవుని సంకల్పం, ఆయన కల్పించే అవకాశాలతోటే సాధించగలుగుతాడు.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|దైవధ్యాన ప్రకరణం|244. దైవస్మరణం విశిష్ఠత – ప్రోత్సాహం|హదీసు 1444