హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) – 232. ఏతెకాఫ్ ప్రాశస్త్యం

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: ఇమామ్ అబూ జకరియ్యా యహ్యా బిన్ షరఫ్ అన్ నవవీ (రహ్మతుల్లాహి అలైహి)
ఉర్దూ అనువాదం, వ్యాఖ్యానం: హాఫిజ్ సలాహుద్దీన్ యూసుఫ్ · తెలుగు రూపం: హాఫిజ్ ఎస్.ఎమ్. రసూల్ షర్ఫీ · ప్రకాశకులు: ట్రూత్ పబ్లికేషన్స్, హైదరాబాద్

రియాదుస్ సాలిహీన్ – హదీసు కిరణాలు (ఇమామ్ నవవీ) – అరబీ, తెలుగు, English

రియాదుస్ సాలిహీన్ (హదీసు కిరణాలు) – 232వ అధ్యాయం: ఏతెకాఫ్ ప్రాశస్త్యం. ఈ అధ్యాయంలో 3 హదీసులు (హదీసు 1269 – 1271) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, ముఖ్యాంశాలు, English అనువాదంతో.

232. ఏతెకాఫ్ ప్రాశస్త్యం

↑ విషయ సూచిక

باب فضل الاعتكاف

అరబీ పాఠం: రియాదుస్ సాలిహీన్ – తహ్‌ఖీఖ్: షుఐబ్ అల్ అర్నావూత్ (ముఅస్సస్సతుర్ రిసాలా)

1269

హదీసు 1269

عنِ ابنِ عُمَرَ رَضِي اللَّه عَنْهُما، قالَ: كانَ رسولُ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم يَعتَكِفُ العَشْرَ الأَوَاخِرَ مِنْ رَمَضَانَ. متفقٌ عَلَيْهِ.

హజ్రత్ ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హుమా) కథనం: దైవప్రవక్త ﷺ రమజాన్ మాసంలోని చివరి దశకంలో ఏతెకాఫ్ పాటించేవారు. (బుఖారీ-ముస్లిం)

(సహీహ్ బుఖారీ-సహీహ్ ముస్లింలోని ఏతెకాఫ్ ప్రకరణం)

English

Ibn `Umar (radiyallahu anhuma) reported: The Messenger of Allah ﷺ used to observe I`tikaf in the last ten days of Ramadan.[Al-Bukhari and Muslim].

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ఏతెకాఫ్ ప్రకరణం|232. ఏతెకాఫ్ ప్రాశస్త్యం|హదీసు 1269

1270

హదీసు 1270

وعنْ عائشةَ رَضِيَ اللَّه عنْها، أَنَّ النَّبيَّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم كانَ يَعْتَكِفُ العَشْرَ الأَوَاخِرَ مِنْ رَمَضانَ، حَتَّى تَوَفَّاهُ اللَّه تَعَالَى، ثُمَّ اعْتَكَفَ أَزواجُهُ مِنْ بعْدِهِ. متفقٌ عَلَيْهِ.

హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) కథనం: దైవప్రవక్త ﷺ జీవితాంతం రమజాన్ మాసంలోని చివరి దశకంలో ఏతెకాఫ్ పాటించారు. ఆయన తర్వాత ఆయన సతీమణులు (కూడా) ఏతెకాఫ్ పాటించారు. (బుఖారీ-ముస్లిం)

(సహీహ్ బుఖారీ – సహీహ్ ముస్లింలోని ఏతెకాఫ్ ప్రకరణం)

English

`Aishah (radiyallahu anha) reported: The Prophet ﷺ used to engage himself in I`tikaf (seclusion for prayers) in the mosque during the last ten nights of Ramadan till he passed away; thereafter, his wives followed this practice after him.[Al-Bukhari and Muslim].

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ఏతెకాఫ్ ప్రకరణం|232. ఏతెకాఫ్ ప్రాశస్త్యం|హదీసు 1270

1271

హదీసు 1271

وعَنْ أبي هُريرةَ، رضي اللَّه عنهُ، قالَ: كانَ النبيُّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم يَعْتَكِفُ في كُلِّ رَمَضَانَ عَشَرةَ أيَّامٍ، فَلَمًا كَانَ العَامُ الَّذِي قُبًضَ فِيهِ اعْتَكَفَ عِشرِينَ يَوْماً. رواه البخاريُّ. كتَاب الحَجّ

హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం: దైవప్రవక్త ﷺ ప్రతి రమజాన్ నెలలో పదిరోజులు ఏతెకాఫ్ పాటించే వారు. తను చనిపోయిన సంవత్సరమైతే ఆయన ఇరవై రోజులు ఏతెకాఫ్ పాటించారు. (బుఖారీ)

(సహీహ్ బుఖారీలోని ఏతెకాఫ్ ప్రకరణం)

English

Abu Hurairah (radiyallahu anhu) reported: The Prophet ﷺ used to observe I`tikaf every year (during Ramadan) for ten days; in the year in which he passed away, he observed I`tikaf for twenty days.[Al-Bukhari].

ముఖ్యాంశాలు

రమజాన్ మాసంలోని చివరి దశకంలో ఏతెకాఫ్ పాటించటం దైవప్రవక్త సంప్రదాయం. స్త్రీలు కూడా ఏతెకాఫ్‌లో కూర్చోవచ్చు. అయితే ఏతెకాఫ్ ఇంట్లో కాదు, మస్జిద్‌లోనే పాటించాలి. అందుకని ఒకవేళ మస్జిద్‌లో స్త్రీల కొరకు పురుషుల నుండి వేరుగా ప్రత్యేకంగా, పూర్తి కట్టుబాట్లతో ఏతెకాఫ్ పాటించటానికి అవకాశముంటే అలాంటి చోట్ల స్త్రీలు ఏతెకాఫ్ పాటించవచ్చు. లేకపోతే వారు ఏతెకాఫ్ పాటించకపోవటమే మంచిది.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ఏతెకాఫ్ ప్రకరణం|232. ఏతెకాఫ్ ప్రాశస్త్యం|హదీసు 1271