హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) – 215. మిస్వాక్ ఘనత, మానవ సహజమైన ఆచరణల గురించి

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: ఇమామ్ అబూ జకరియ్యా యహ్యా బిన్ షరఫ్ అన్ నవవీ (రహ్మతుల్లాహి అలైహి)
ఉర్దూ అనువాదం, వ్యాఖ్యానం: హాఫిజ్ సలాహుద్దీన్ యూసుఫ్ · తెలుగు రూపం: హాఫిజ్ ఎస్.ఎమ్. రసూల్ షర్ఫీ · ప్రకాశకులు: ట్రూత్ పబ్లికేషన్స్, హైదరాబాద్

రియాదుస్ సాలిహీన్ – హదీసు కిరణాలు (ఇమామ్ నవవీ) – అరబీ, తెలుగు, English

రియాదుస్ సాలిహీన్ (హదీసు కిరణాలు) – 215వ అధ్యాయం: మిస్వాక్ ఘనత, మానవ సహజమైన ఆచరణల గురించి. ఈ అధ్యాయంలో 10 హదీసులు (హదీసు 1197 – 1206) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, ముఖ్యాంశాలు, English అనువాదంతో.

215. మిస్వాక్ ఘనత, మానవ సహజమైన ఆచరణల గురించి

↑ విషయ సూచిక

باب فضل السِّواك وخصال الفطرة

అరబీ పాఠం: రియాదుస్ సాలిహీన్ – తహ్‌ఖీఖ్: షుఐబ్ అల్ అర్నావూత్ (ముఅస్సస్సతుర్ రిసాలా)

1197

హదీసు 1197

عَنْ أَبي هُريرَةَ رَضِيَ اللَّه عَنْهُ أَنَّ رَسُول اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قالَ: "لَوْلا أَنْ أَشُقَّ عَلى أُمَّتي أَوْ عَلى النَّاسِ لأمرْتُهُمْ بِالسِّواكِ معَ كلِّ صلاةٍ" متفقٌ عَلَيْهِ.

హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఈ విధంగా ప్రవచించారు: నా అనుచర సమాజం (లేక) ప్రజలు ఇబ్బందికి లోనవుతారనే భయం గనక నాకు లేకపోయినట్లయితే నేను వారిని ప్రతి నమాజు సమయంలోనూ మిస్వాక్ చేయాలని ఆదేశించి ఉండేవాణ్ణి.

(బుఖారీ-ముస్లిం)

(సహీహ్ బుఖారీలోని జుమా ప్రకరణం – సహీహ్ ముస్లింలోని శుచీశుభ్రతల ప్రకరణం)

English

Abu Hurairah (radiyallahu anhu) reported: The Messenger of Allah ﷺ said, “Had I not thought it difficult for my Ummah, I would have commanded them to use the Miswak (tooth-stick) before every Salat.”[Al-Bukhari and Muslim].

ముఖ్యాంశాలు

ప్రతి నమాజు వేళ మిస్వాక్ చేసుకోవటాన్ని దైవప్రవక్త ﷺ ఎంతగానో యిష్టపడేవారు. అయినప్పటికీ ఆయన తన అనుచర సమాజం ఇబ్బందిలో పడిపోతుందేమోనన్న భయంతో దాన్ని అనివార్యం (వాజిబ్)గా ఖరారు చేయలేదు. దీనిద్వారా తెలిసేదేమంటే మిస్వాక్ చేయటం (పల్లు తోముకోవటం) ఎంతో అభిలషణీయమైన కార్యం. అంచేత ప్రతి ముస్లిం ఎక్కువగా మిస్వాక్ చేయటాన్ని అలవరచుకోవాలి. వీలైతే ప్రతి నమాజుకు ముందు తప్పకుండా మిస్వాక్ చేయాలి.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|మహత్యాల ప్రకరణం|215. మిస్వాక్ ఘనత, మానవ సహజమైన ఆచరణల గురించి|హదీసు 1197

1198

హదీసు 1198

وَعنْ حُذيفَةَ رَضِيَ اللَّه عَنْهُ، قَالَ: كَانَ رَسُولُ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم إِذا قَامَ مِنَ النَّومِ يَشُوصُ فَاهُ بالسِّواكِ. متفقٌ عَلَيْهِ. "الشَّوْص": الدَّلكُ"

హజ్రత్ హుజైఫా (రదియల్లాహు అన్హు) కథనం: దైవప్రవక్త ﷺ నిద్ర నుండి మేల్కొన్నప్పుడు పనుదోముపుల్లతో నోటిని బాగా తోమి శుభ్రం చేసుకునేవారు. (బుఖారీ-ముస్లిం)

English

Hudaifah (radiyallahu anhu) reported: Whenever the Messenger of Allah ﷺ got up (from sleep), he would rub his teeth with Miswak (tooth-stick).[Al-Bukhari and Muslim].

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|మహత్యాల ప్రకరణం|215. మిస్వాక్ ఘనత, మానవ సహజమైన ఆచరణల గురించి|హదీసు 1198

1199

హదీసు 1199

وَعَنْ عائشةَ رَضِيَ اللَّه عَنْهَا قَالَتْ: كنَّا نُعِدُّ لرسُولِ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم سِوَاكَهُ وَطَهُورَهُ فَيَبْعَثُهُ اللَّه مَا شَاءَ أَن يبْعَثَهُ مِنَ اللَّيْلِ، فَيتسَوَّكُ، وَيَتَوَضَّأُ ويُصَلِّي"رواهُ مُسلمٌ.

హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) కథనం: మేము దైవప్రవక్త ﷺ కోసం పనుదోము పుల్ల, వుజూ నీళ్ళు సిద్ధపరచి ఉంచేవాళ్ళం. దేవుడు ఆయన్ని నిద్ర లేపదలచినప్పుడు ఆయన నిద్రలేచి పల్లుతోముకొని, వుజూ చేసి నమాజ్ ఆచరించేవారు.

(ముస్లిం)

(సహీహ్ ముస్లింలోని శుచీశుభ్రతల ప్రకరణం)

English

`Aishah (radiyallahu anha) reported: We used to prepare for the Messenger of Allah ﷺ a Miswak (tooth-stick) and the water for making Wudu’. Whenever Allah wished to awaken him from sleep at night, he ﷺ would brush his teeth with Miswak, make Wudu’, and perform Salat.[Muslim].

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|మహత్యాల ప్రకరణం|215. మిస్వాక్ ఘనత, మానవ సహజమైన ఆచరణల గురించి|హదీసు 1199

1200

హదీసు 1200

وعنْ أَنسٍ رَضِيَ اللَّه عَنْهُ، قَالَ: قَالَ رسُولُ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "أَكثَرْتُ عَليكُمْ في السِّوَاكِ" رواهُ البُخاريُّ.

హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఈ విధంగా ప్రవచించారు: నేను మీకు మిస్వాక్ చేయమని (పల్లుతోము కోమని) చాలా తాకీదు చేశాను. (బుఖారీ)

(సహీహ్ బుఖారీలోని జుమా ప్రకరణం)

English

Anas (radiyallahu anhu) reported: The Messenger of Allah ﷺ said, “I stress upon you to use Miswak (tooth-stick).”[Al-Bukhari].

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|మహత్యాల ప్రకరణం|215. మిస్వాక్ ఘనత, మానవ సహజమైన ఆచరణల గురించి|హదీసు 1200

1201

హదీసు 1201

وعَنْ شُرَيحِ بنِ هانِيءٍ قَالَ: قُلْتُ لِعَائِشَةَ رَضِيَ اللَّه عنْهَا: بأَيِّ شيءٍ كَان يَبْدَأُ النَّبِيُّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم إِذا دَخَلَ بَيْتَهُ، قَالَتْ: بِالسِّوَاكِ، روَاهُ مُسْلِمٌ.

హజ్రత్ షురైహ్ బిన్ హానీ (రదియల్లాహు అన్హు) కథనం: నేను హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) ను అడిగాను, "దైవప్రవక్త ﷺ ఇంటికి వస్తే ముందుగా ఏ పని చేస్తారు?" అని. అందుకామె "పల్లు తోముకుంటారు" అని చెప్పారు.

(ముస్లిం)

(సహీహ్ ముస్లింలోని శుచీశుభ్రతల ప్రకరణం)

English

Shuraih bin Hani (radiyallahu anhu) reported: I asked `Aishah (radiyallahu anha): “What was the first thing which the Prophet ﷺ would do when he entered his house?” She replied: “He would use Miswak (tooth-stick).”[Muslim].

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|మహత్యాల ప్రకరణం|215. మిస్వాక్ ఘనత, మానవ సహజమైన ఆచరణల గురించి|హదీసు 1201

1202

హదీసు 1202

وَعَنْ أَبي موسَى الأشعَرِيِّ رَضِيَ اللَّه عَنْهُ، قَاَل: دَخَلت عَلى النَّبي صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم وطرَفُ السوَاكِ عَلَى لِسانِهِ. مُتَّفَقٌ عليهِ، وهذا لَفْظُ مُسلِمٍ.

హజ్రత్ అబూ మూసా అష్‌అరీ (రదియల్లాహు అన్హు) కథనం: నేను దైవప్రవక్త ﷺ సన్నిధికి వెళ్ళినప్పుడు చూశాను. ఆ సమయంలో ఆయన పనుదోముపుల్ల కొన, ఆయన నాలుక మీద ఉంది.

(బుఖారీ-ముస్లిం, వాక్యాలు ముస్లింలోనివి)

(సహీహ్ బుఖారీలోని వుజూ ప్రకరణం – సహీహ్ ముస్లింలోని శుచీశుభ్రతల ప్రకరణం)

English

Abu Musa Al-Ash`ari (radiyallahu anhu) reported: I came to the Prophet ﷺ once and noticed the tip of Miswak (tooth-stick) on his tongue.[Al-Bukhari and Muslim].

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|మహత్యాల ప్రకరణం|215. మిస్వాక్ ఘనత, మానవ సహజమైన ఆచరణల గురించి|హదీసు 1202

1203

హదీసు 1203

وعنْ عائِشَةَ رَضِي اللَّه عَنْها، أَنَّ النَّبِيَّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَالَ: "السِّواكُ مَطهَرةٌ للفَمِ مرْضَاةٌ للرَّبِّ"رواهُ النَّسائيُّ، وابنُ خُزَيمةَ في صحيحهِ بأَسانيد صحيحةٍ.

హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఈ విధంగా ప్రవచించారు: మిస్వాక్ ద్వారా నోరు శుభ్రమవుతుంది. దైవప్రసన్నత లభిస్తుంది. (నసాయి, ఇబ్నె ఖుజైమా దీనిని దృఢమైన ఆధారాలతో వెలికి తీశారు)

(సుననె నసాయిలోని శుచీశుభ్రతల ప్రకరణం – సహీహ్ ఇబ్నె ఖుజైమా, సహీహ్ బుఖారీలోని – ఉపవాస ప్రకరణం)

English

`Aishah (radiyallahu anha) reported: The Prophet ﷺ said, “The Miswak (tooth-stick) cleanses and purifies the mouth and pleases the Rubb.”[An-Nasa’i and Ibn Khuzaimah].

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|మహత్యాల ప్రకరణం|215. మిస్వాక్ ఘనత, మానవ సహజమైన ఆచరణల గురించి|హదీసు 1203

1204

హదీసు 1204

وعَنْ أَبي هُريرةَ رضِيَ اللَّهُ عَنْهُ، عَنِ النَّبِيِّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَالَ: "الفِطرةُ خَمسٌ، أَوْ خمْسٌ مِنَ الفِطرةِ: الخِتان، وَالاسْتِحْدَادُ، وَتقلِيمُ الأَظفَارِ، ونَتف الإِبِطِ، وقَصُّ الشَّارِبِ" مُتفقٌ عَلَيْهِ. الاسْتِحْدَادُ: حلْقُ العَانَةِ، وهُو حَلقُ الشعْرِ الَّذِي حَوْلَ الفرْجِ.

హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఈ విధంగా ప్రవచించారు: (మానవ) సహజమైన విషయాలు ఐదున్నాయి లేక ఐదు విషయాలు (మానవ) సహజమైనవి. 1) ఖత్నా (వడుగు) చేయించుకోవడం, 2) నాభి క్రింద వెంట్రుకలు తీసివేయటం, 3) గోళ్లు కత్తిరించుకోవటం 4) చంకలోని వెంట్రుకలు తొలగించుకోవటం, 5) మీసాలు కత్తిరించుకోవటం.

(బుఖారీ, ముస్లిం)

(సహీహ్ బుఖారీలోని వస్త్రధారణ ప్రకరణం – సహీహ్ ముస్లింలోని శుచీశుభ్రతల ప్రకరణం)

English

Abu Hurairah (radiyallahu anhu) reported: The Prophet ﷺ said, “There are five acts which conform to the pure nature: Circumcision, removing of the pubic hair, clipping the nails, plucking the underarm hair and trimming the moustache.”[Al-Bukhari and Muslim].

ముఖ్యాంశాలు

పై హదీసు మూలంలో 'ఫిత్‌రత్' అనే పదం ఉపయోగించబడింది. నిఘంటువులో 'ఫిత్‌రత్' అనే పదానికి నవీన, కల్పన, అంతకు ముందు లేని వస్తువును వినూత్నంగా పుట్టించటం అనే అర్ధాలున్నాయి. అయితే ఇక్కడ ఈ పదం మనిషికి పుట్టుకతో అబ్బే అలవాటును, స్వభావాన్ని సూచిస్తోంది. కొంతమంది పండితులు దీని గురించి వ్యాఖ్యానిస్తూ, "దైవప్రవక్తలందరూ ఆదరించిన, పురాతన షరీఅత్‌లన్నిటిలోనూ ఉమ్మడిగా ఉన్న విధానాన్ని ఫిత్‌రత్ అంటార"ని చెప్పారు. ఫిత్‌రత్ విధానం అనేది మానవునికి సహజంగానే అబ్బుతుంది. అంచేత పైన పేర్కొనబడిన ఐదు విషయాలను మనిషి తన సహజమైన అలవాట్ల మాదిరిగా ఆచరించాలన్నదే ఈ హదీసు ముఖ్యోద్దేశం.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|మహత్యాల ప్రకరణం|215. మిస్వాక్ ఘనత, మానవ సహజమైన ఆచరణల గురించి|హదీసు 1204

1205

హదీసు 1205

وعَنْ عائِشة رضيَ اللَّه عنْهَا قَالَتْ: قالَ رَسُولُ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "عَشرٌ مِنَ الفِطرَةِ: قَصُّ الشَّارِبِ، وإِعفَاءُ اللِّحْيَةِ، وَالسِّوَاكُ، واسْتِنشَاقُ الماءِ، وقَصُّ الأَظفَارِ، وغَسلُ البَرَاجِمِ، وَنَتفُ الإِبطِ، وَحلقُ العانَة، وانتِقاصُ المَاءِ" قَالَ الرَّاوي: ونسِيتُ العاشِرة إِلاَّ أَن تَكون المَضمضَةُ، قالَ وَكيعٌ وَهُوَ أَحَدُ روَاتِهِ: انتِقَاصُ الماءِ، يَعني: الاسْتِنْجاءَ. رَواهُ مُسلِمٌ. "البَراجِمُ"بالباءِ الموحدةِ والجيم، وهي: "عُقَدُ الأَصَابِعِ"."وَإِعْفَاءُ اللَّحْيَةِ"مَعْنَاهُ: لاَ يقُص مِنْهَا شَيئاً.

హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఈ విధంగా ప్రవచించారు: పది విషయాలు మానవ సహజమైనవి. 1) మీసాలు కత్తిరించటం, 2) గడ్డం పెంచటం, 3) పల్లు తోముకోవటం 4) ముక్కుని నీటితో శుభ్రం చేసుకోవటం 5) గోళ్లు కత్తిరించుకోవటం 6) వ్రేళ్ళ మధ్య భాగాన్ని కడుక్కోవటం 7) చంకలోని వెంట్రుకల్ని తొలగించటం, 8) నాభి క్రింద వెంట్రుకల్ని తీసి వేయటం, 9) మూత్రశుద్ధి చేసుకోవటం – ఆ తర్వాత ఉల్లేఖకుడు ఇలా అంటున్నాడు- 'పదో విషయం నేను మర్చిపోయాను. బహుశా అది పుక్కిలించటం కావచ్చని నా అభిప్రాయం'.

ఈ హదీసు ఉల్లేఖకుల్లో ఒకరైన హజ్రత్ వకీ (రహిమహుల్లాహ్) దీనిని వివరిస్తూ, 'ఇన్‌తిఖాసుల్-మాయి' అంటే మూత్రశుద్ధి అని చెప్పారు. (ముస్లిం)

(సహీహ్ ముస్లింలోని శుచీశుభ్రతల ప్రకరణం)

English

`Aishah (radiyallahu anha) reported: The Messenger of Allah ﷺ said, “There are ten demands of pure nature: trimming the moustache, letting the beard grow, using Miswak (tooth-stick), snuffing up water into the nose (in ablution), paring the nails, washing the bases of the finger joints; plucking the underarm hair, removing of the pubic hair and removing impurities with water from the affected part after a call of nature.”

The subnarrator said: I forgot the tenth but it might possibly be the rinsing of the mouth (in ablution).[Muslim].

ముఖ్యాంశాలు

1) ఈ హదీసులో పది మానవ సహజమైన కార్యాలు పేర్కొనబడ్డాయి. అయితే పదవ విషయమేదో ఇతమిత్థంగా తెలియలేదు. కొంతమంది విద్వాంసులు పదవ విషయం ఖత్నా (వడుగు) చేయించుకోవటం అని అభిప్రాయపడ్డారు. ఏది ఏమైనా ఈ హదీసు ద్వారా ఆ పది విషయాల ప్రాముఖ్యత వెల్లడౌతోంది. వాటిని మానవులు తప్పకుండా నెరవేర్చాలని ఇందులో తాకీదు చేయబడింది. వాటిలో మొదటిది, మీసాలు కత్తిరించుకోవటం. మీసాల్ని పెదవులపైకి పెరగనీయకుండా కత్తిరించుకోవటం సంప్రదాయం. పెద్దపెద్ద మీసాలుంచుకోవటం ఇస్లాంలో అవాంఛనీయంగా పరిగణించబడుతుంది.

2) ఇక గడ్డం విషయానికొస్తే, మనిషి తప్పనిసరిగా గడ్డం ఉంచాలన్నది అత్యధికమంది పండితుల అభిప్రాయం. ఎంత పెంచాలన్న విషయంలో నిర్ణీత హద్దంటూ ఏమీ లేదు. కొంతమంది పండితులు హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) సంఘటనను నిదర్శనంగా తీసుకొని కనీసం ఓ పిడికెడంత గడ్డాన్ని పెంచాలనీ, అంతకంటే ఎక్కువ పరిమాణంలో ఉండే వెంట్రుకల్ని కత్తిరించుకోవచ్చని తలపోస్తున్నారు. అలాగే ఇంకో బలహీనమైన హదీసు ఉంది. దాన్ని ఆధారంగా చేసుకొని గడ్డాన్ని క్రింది నుంచి, ప్రక్కల నుంచి కత్తిరించుకొని సరిచేసుకోవచ్చని అంటున్నారు. కాని ప్రామాణికమైన హదీసుల దృష్ట్యా ఈ విధానం సరియైనది కాదు. బుఖారీ-ముస్లింలోని హదీసుల ప్రకారం దైవప్రవక్త ﷺ దీనికోసం ఐదు పదాలు ఉపయోగించారు. ఈఫూ, ఔఫూ, అర్‌ఖూ, ఉర్‌జూ, వఫ్ఫిరూ. ఈ ఐదు పదాలు గడ్డాన్ని దాని స్థితికి వదిలేయాలనే అర్ధాన్ని సూచిస్తున్నాయి. కనుక గత్యంతరం లేని సందర్భాల్లో తప్ప మిగతా పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ గడ్డాన్ని పూర్తిగా పెంచాలి.

3) శుచీశుభ్రతల దృష్ట్యా గోళ్లను కత్తిరించుకోవటం కూడా చాలా అవసరం. లేకపోతే గోళ్ల సందుల్లో పేరుకుపోయి ఉండే మట్టి మనం తినే ఆహారం ద్వారా కడుపులోకి పోయే ప్రమాదముంది. ఈ రోజుల్లో స్త్రీలు ఫ్యాషన్ పేరిట పెద్దపెద్ద గోళ్లు పెంచుతున్నారు. ఈ విషయంలో పురుషులు కూడా, తాము మాత్రం తక్కువ తిన్నామా అన్నట్లు వ్యవహరిస్తున్నారు. అయితే వాస్తవానికది సహజత్వానికి విరుద్ధమైన చేష్ట. అత్యంత హేయమైన పాశవిక చర్య. ఈ విషయాన్ని అందరూ గ్రహించాలి.

4) చంకల్లో, నాభి క్రింద ఉండే వెంట్రుకల్ని తరచూ తొలగిస్తూ ఉండాలి. ఈ విషయంలో ఆలస్యం చేయటం మంచిది కాదు. ఒక హదీసు ప్రకారం నలభై రోజులకన్నా ఎక్కువ ఆలస్యం చేయటం అత్యంత అయిష్టకరంగా పరిగణించబడుతుంది.

5) పరిశుద్ధతను పొందటానికి మూత్రశుద్ధి చేసుకోవటం చాలా అవసరం. అదీగాక పరిశుద్ధత లేనిదే నమాజ్‌లాంటి ఆరాధనలు ఆమోదించబడవు. మూత్రశుద్ధి మట్టి పెళ్లలతో కూడా చేసుకోవచ్చు. అయితే దానికోసం 3, 5, 7- ఈ విధంగా బేసి సంఖ్యలో మట్టి పెళ్లలు ఉపయోగించి ఆ తర్వాత నీళ్ళతో శుభ్రం చేసుకుంటే చాలా మంచిది. అలా కాకుండా కేవలం నీళ్లతో శుభ్రం చేసుకున్నా సరిపోతుంది.

6) ఖత్నా (వడుగు) చేయించటం కూడా ఓ ప్రాచీన సంప్రదాయం. అత్యధిక మంది విద్వాంసుల దృష్టిలో ఖత్నా (వడుగు) చేయించటం తప్పనిసరి. కొంతమంది పండితులు పిల్లవాడు పుట్టిన ఏడోరోజున ఖత్నా చేయించటం ఉత్తమమని అభిప్రాయపడుతున్నారు. అయితే ఏడోరోజున వీలుకాకపోతే ఆ తర్వాత కూడా చేయించవచ్చు.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|మహత్యాల ప్రకరణం|215. మిస్వాక్ ఘనత, మానవ సహజమైన ఆచరణల గురించి|హదీసు 1205

1206

హదీసు 1206

وَعَن ابنِ عُمَرَ رَضِيَ اللَّه عَنْهُمَا، عن النَّبي صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قالَ: "أَحْفُوا الشَّوارِبَ وأَعْفُوا اللِّحَى" مُتفقُ عليهِ.

హజ్రత్ ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హుమా) ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రబోధించారు: మీసాలు కత్తిరించండి. గడ్డం పెంచండి. (బుఖారీ-ముస్లిం)

(సహీహ్ బుఖారీలోని వస్త్రధారణ ప్రకరణం – సహీహ్ ముస్లింలోని శుచీశుభ్రతల ప్రకరణం)

English

Ibn `Umar (radiyallahu anhuma) reported: The Prophet ﷺ said, “Trim the moustaches and let the beard grow.”[Al-Bukhari and Muslim].

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|మహత్యాల ప్రకరణం|215. మిస్వాక్ ఘనత, మానవ సహజమైన ఆచరణల గురించి|హదీసు 1206