హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: ఇమామ్ అబూ జకరియ్యా యహ్యా బిన్ షరఫ్ అన్ నవవీ (రహ్మతుల్లాహి అలైహి)
ఉర్దూ అనువాదం, వ్యాఖ్యానం: హాఫిజ్ సలాహుద్దీన్ యూసుఫ్ · తెలుగు రూపం: హాఫిజ్ ఎస్.ఎమ్. రసూల్ షర్ఫీ · ప్రకాశకులు: ట్రూత్ పబ్లికేషన్స్, హైదరాబాద్

రియాదుస్ సాలిహీన్ (హదీసు కిరణాలు) – 214వ అధ్యాయం: లైలతుల్ ఖద్ర్లో చేయబడే నమాజు ప్రాశస్త్యం, ఆ రాత్రుల్లో ఏ రాత్రి అత్యంత ఆశావహమైనదనే విషయం గురించి. ఈ అధ్యాయంలో 2 ఖుర్ఆన్ ఆయతులు, 7 హదీసులు (హదీసు 1190 – 1196) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, ముఖ్యాంశాలు, English అనువాదంతో.
214. లైలతుల్ ఖద్ర్లో చేయబడే నమాజు ప్రాశస్త్యం, ఆ రాత్రుల్లో ఏ రాత్రి అత్యంత ఆశావహమైనదనే విషయం గురించి…
باب فضل قيام ليلة القدْر وبَيان أرجى لياليها
అరబీ పాఠం: రియాదుస్ సాలిహీన్ – తహ్ఖీఖ్: షుఐబ్ అల్ అర్నావూత్ (ముఅస్సస్సతుర్ రిసాలా)
దివ్యఖుర్ఆన్లో అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
{إِنَّا أَنْزَلْنَاهُ فِي لَيْلَةِ الْقَدْرِ} [القدر: ١]
"మేము దీన్ని ఘనతగల మహారాత్రిన అవతరింపజేశాం. ఘనతగల ఆ రాత్రి ఏమిటో నీకేం తెలుసు? ఆ మహారాత్రి వేయి నెలల కన్నా ఎంతో శ్రేష్ఠమైనది. ఆ రాత్రి పరిశుద్ధాత్మ, దైవదూతలు తమ ప్రభువు అనుమతితో ప్రతి వ్యవహారానికి సంబంధించిన ఆజ్ఞలు తీసుకొని అవతరిస్తారు. ఆ రాత్రి అంతా తెల్లవారే వరకు పూర్తిగా శాంతిశ్రేయాలే అవతరిస్తూ ఉంటాయి. ' (అల్ఖద్ర్: 1-5)
{إِنَّا أَنْزَلْنَاهُ فِي لَيْلَةٍ مُبَارَكَةٍ.} الآيات [الدخان: ٣]
"హా.మీమ్. స్పష్టమైన ఈ గ్రంథం సాక్షిగా! మేము దీనిని ఎంతో మేలైన, అత్యంత శుభవంతమైన రాత్రిన అవతరింపజేశాము." (అద్దుఖాన్:1-3)
వివరణ
ఘనమైన రాత్రి అన్నా, శుభవంతమైన రాత్రి అన్నా రెండూ ఒక్కటే. లైలతుల్ ఖద్ర్ అని దాని భావం. ఇది రమజాన్ మాసంలో చివరి దశకంలోని బేసి రాత్రుల్లో ఏదో ఒకటి అయివుంటుంది. ఆ ఘనమైన రేయిలోనే ఖుర్ఆన్ అవతరణ ప్రారంభమయింది లేదా సురక్షిత ఫలకం (లౌహె మహ్ఫూజ్) నుండి మొదటి ఆకాశంపైనున్న 'బైతుల్ఇజ్జత్' పైకి దించబడి ఉంటుంది. ఆ తర్వాత అక్కణ్ణుంచి అవసరాన్నిబట్టి, దైవాభీష్టానికి అనుగుణంగా కొంచెం కొంచెం అవతరిస్తూ ఉండింది. ఖుర్ఆన్ అవతరించిన కారణంగానే ఆ రాత్రికి అంతటి ఘనతావిశిష్టతలు లభించాయి.
English
“Verily, We have sent it (this Qur’an) down in the Night of Al-Qadr (Decree). And what will make you know what the Night of Al-Qadr (Decree) is? The Night of Al-Qadr (Decree) is better than a thousand months (i.e., worshipping Allah in that night is better than worshipping Him a thousand months, i.e., 83 years and 4 months). Therein descend the angels and the Ruh [Jibril (Gabriel)] by Allah’s Permission with all Decrees. (All that night), there is peace (and goodness from Allah to His believing slaves) until the appearance of dawn.” [Al-Qadr 97:1–5]
“We sent it (this Qur’an) down on a blessed night [(i.e., the Night of Al-Qadr, Surah No:97) in the month of Ramadan, the 9th month of the Islamic calendar]. Verily, We are ever warning [mankind that Our Torment will reach those who disbelieve in Our Oneness of Lordship and in Our Oneness of worship]. Therein (that night) is decreed every matter of ordainments (i.e., the matters of deaths, births, provisions, and calamities for the whole (coming) year as decreed by Allah). As a Command (or this Qur’an or the Decree of every matter) from Us. Verily, We are ever sending (the Messengers). (As) a Mercy from your Rubb, Verily! He is the All-Hearer, the All-Knower.” [Ad-Dukhān 44:3–6]
హదీసు 1190
وَعَنْ أَبي هُريرةَ رَضِيَ اللَّه عَنْهُ، عن النَّبِيِّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَالَ: "مَنْ قَامَ لَيْلَةَ القَدْرِ إِيماناً واحْتِسَاباً، غُفِر لَهُ مَا تقدَّم مِنْ ذنْبِهِ" متفقٌ عَلَيْهِ.
హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఈ విధంగా ప్రవచించారు: ఎవరయితే విశ్వాసంతో, పుణ్యం లభించాలన్న ఉద్దేశ్యంతో ఘనమైన రేయిలో నమాజుచేస్తూ నిలబడ్డారో (అంటే దైవారాధన చేశారో) వారి వెనుకటి పాపాలన్నీ మన్నించబడతాయి.
(బుఖారీ-ముస్లిం)
(సహీహ్ బుఖారీలోని తరావీహ్ నమాజు ప్రకరణం- సహీహ్ ముస్లింలోని ప్రయాణీకుల నమాజ్ ప్రకరణం)
English
Abu Hurairah (radiyallahu anhu) reported: The Prophet ﷺ said, “Whosoever performs Qiyam during Lailat-ul-Qadr (Night of Decree), with Faith and being hopeful of Allah’s reward, will have his former sins forgiven.”[Al-Bukhari and Muslim].
ముఖ్యాంశాలు
హదీసు మూలంలో 'ఖామ లైలతన్' అన్న పదం వాడబడింది. ఖామ అనేది 'ఖియామ్' అనే పదం నుండి వచ్చింది. రాత్రిపూట శక్తి మేరకు జాగారం చేసి దైవారాధనలో గడపటం, నఫిల్ నమాజులు చేయటం, గతంలో తమవల్ల జరిగిన పాపాలపై పశ్చాత్తాపభావంతో కుమిలిపోవటం, మన్నింపు ప్రార్థనలు చేసుకోవటం, ముఖ్యంగా ఇషా మరియు ఫజ్ర్ నమాజులను సామూహికంగా నెరవేర్చటం ఇవన్నీ ఖియాముల్లైల్ క్రిందికే వస్తాయి.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|మహత్యాల ప్రకరణం|214. లైలతుల్ ఖద్ర్లో చేయబడే నమాజు ప్రాశస్త్యం, ఆ రాత్రుల్లో ఏ రాత్రి అత్యంత ఆశావహమైనదనే విషయం గురించి…|హదీసు 1190
హదీసు 1191
وعن ابنِ عُمر رضِيَ اللَّه عَنهما أَنَّ رِجَالاً مِنْ أَصْحَابِ النَّبِيِّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم، أُرُوا ليْلَةَ القَدْرِ في المنَامِ في السَّبْعِ الأَواخِرِ، فَقال رسُولُ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: " أَرى رُؤيَاكُمْ قَدْ تَواطَأَتْ في السَّبْعِ الأَوَاخِرِ، فَمَنْ كَانَ مُتحَرِّيهَا، فَلْيَتَحرَّهَآ في السبْعِ الأَواخِرِ" متُفقٌ عليهِ.
హజ్రత్ ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హుమా) కథనం: దైవప్రవక్త సహచరుల్లో కొందరికి కలలో, ఘనమైన రేయి చివరి ఏడు రాత్రుల్లో(ఉన్నట్లు) చూపించబడింది. (ఈ విషయం తెలుసుకొని) దైవప్రవక్త ﷺ తన సహచరుల్ని ఉద్దేశ్యించి, "చివరి ఏడు రాత్రుల విషయంలో మీ అందరికీ ఒకే రకమైన కల వచ్చినట్లుంది. కనుక మీలో ఘనమైన రేయిని అన్వేషించదలచుకున్నవారు చివరి ఏడు రాత్రుల్లో దాన్ని అన్వేషించాలి"అని అన్నారు.
(బుఖారీ-ముస్లిం)
(సహీహ్ బుఖారీలోని లైలతుల్ ఖద్ర్ ప్రాశస్త్య ప్రకరణం- సహీహ్ ముస్లింలోని ఉపవాసాల ప్రకరణం)
English
Ibn `Umar (radiyallahu anhuma) reported: Some of the Companions of the Prophet ﷺ saw Lailat-ul-Qadr (Night of Decree) in their dreams in the last seven nights of Ramadan, whereupon the Messenger of Allah ﷺ said, “I see that your dreams all agree upon the last seven nights. Whosoever seeks it, let him seek it in the last seven nights.”[Al-Bukhari and Muslim].
ముఖ్యాంశాలు
మూలంలో 'తవాతఅ' అనే పదం వాడబడింది. తవాతఅ అనే పదానికి త్రొక్కటం, తన మిత్రుడు కాలు పెట్టిన చోట తను కాలుపెట్టడం అనే అర్థాలున్నాయి. ఇక్కడ ఇది 'ఒకదానినొకటి పోలి ఉన్నాయి' అనే అర్థంలో ఉపయోగించబడింది. సహచరులందరూ ఒకే రకమైన కల చూశారన్నది దాని భావం. వారందరికీ ఘనమైన రేయి, మాసపు చివరి ఏడు రాత్రుల్లో ఉన్నట్లు కనిపించింది. అందుకే దైవప్రవక్త ﷺ తన సహచరుల కలలను బట్టి ఆ ఘనమైన రేయిని ఆ మాసపు చివరి ఏడురాత్రుల్లోనే అన్వేషించమని ఆదేశించారు. ప్రజలు వీలైనంత ఎక్కువగా రాత్రుల్లో దైవారాధన చేస్తారన్న ఉద్దేశ్యంతోనే ఆ రాత్రిని అస్పష్టంగా ఉంచటం జరిగింది.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|మహత్యాల ప్రకరణం|214. లైలతుల్ ఖద్ర్లో చేయబడే నమాజు ప్రాశస్త్యం, ఆ రాత్రుల్లో ఏ రాత్రి అత్యంత ఆశావహమైనదనే విషయం గురించి…|హదీసు 1191
హదీసు 1192
وعنْ عائِشَةَ رَضِيَ اللَّه عنْهَا، قَالَتْ: كانَ رسُولُ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم يُجاوِرُ في العَشْرِ الأَوَاخِرِ مِنْ رمضَانَ، ويَقُول: "تحَرَّوْا لَيْلَةَ القَدْرِ في العشْرِ الأَوَاخِرِ مِنْ رَمَضانَ" متفقٌ عَلَيْهِ.
హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) కథనం: దైవప్రవక్త ﷺ రమజాన్ మాసపు చివరి దశకంలో ఏతెకాఫ్ కోసం కూర్చునేవారు. (దీని గురించి చెబుతూ) ఆయన, "ఘనమైన రేయిని మీరు రమజాన్ మాసపు చివరి దశకంలో అన్వేషించండి" అని ఉపదేశించేవారు. (బుఖారీ-ముస్లిం)
(సహీహ్ బుఖారీలోని లైలతుల్ ఖద్ర్ ప్రాశస్త్య ప్రకరణం- సహీహ్ ముస్లింలోని ఉపవాసాల ప్రకరణం)
English
`Aishah (radiyallahu anha) reported: The Messenger of Allah ﷺ used to seclude himself (in the mosque) during the last ten nights of Ramadan. He would say, “Search for Lailat-ul-Qadr (Night of Decree) in the last ten nights of Ramadan.”[Al-Bukhari and Muslim].
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|మహత్యాల ప్రకరణం|214. లైలతుల్ ఖద్ర్లో చేయబడే నమాజు ప్రాశస్త్యం, ఆ రాత్రుల్లో ఏ రాత్రి అత్యంత ఆశావహమైనదనే విషయం గురించి…|హదీసు 1192
హదీసు 1193
وَعَنْها رَضِيَ اللَّه عنها أَنَّ رَسُولَ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَالَ: "تَحرّوْا لَيْلةَ القَدْرِ في الوتْرِ مِنَ العَشْرِ الأَواخِرِ منْ رمَضَانَ" رواهُ البخاريُّ.
హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) గారే చేసిన కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఈ విధంగా ఉపదేశించారు: ఘనమైన రేయిని మీరు రమజాన్ మాసపు చివరి దశకంలోని బేసి రాత్రుల్లో అన్వేషించండి. (బుఖారీ)
(సహీహ్ బుఖారీలోని లైలతుల్ ఖద్ర్ ప్రాశస్త్య ప్రకరణం)
English
`Aishah (radiyallahu anha) reported: The Messenger of Allah ﷺ used to observe I`tikaf in the last ten days of Ramadan and say, “Seek Lailat-ul-Qadr (Night of Decree) in the odd nights out of the last ten nights of Ramadan.”[Al-Bukhari].
ముఖ్యాంశాలు
రమజాన్ మాసపు చివరి దశకంలోని ఐదు బేసి తేదీలైన 21,23,25,27,29వ రాత్రుల్లో ఏదో ఒకటి ఘనమైన రేయి కావచ్చని ఈ హదీసు ద్వారా బోధపడుతోంది. ప్రజలు రాత్రిళ్ళు వీలైనంత ఎక్కువగా దైవారాధనలో గడపాలన్న ఉద్దేశ్యంతో ఆ తేదీని అస్పష్టంగానే ఉంచటం జరిగింది. ఒకవేళ అది గనక నిర్ణయించబడినట్లయితే ప్రజలు ఆ ఒక్కరోజు ఆరాధనతోనే సరిపెట్టుకునేవారు. అయినప్పటికీ కొంతమంది పండితులు ఆ రాత్రి నిర్ణీతంగా 27వ తేదీ రాత్రి కావచ్చునని అభిప్రాయపడుతున్నారు. కాని ఈ అభిప్రాయం సరయినది కాదు. ఆ విధంగా ప్రత్యేకంగా ఒక రాత్రిని నిర్ణయించడాన్ని హదీసులు సమర్ధించటం లేదు.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|మహత్యాల ప్రకరణం|214. లైలతుల్ ఖద్ర్లో చేయబడే నమాజు ప్రాశస్త్యం, ఆ రాత్రుల్లో ఏ రాత్రి అత్యంత ఆశావహమైనదనే విషయం గురించి…|హదీసు 1193
హదీసు 1194
وعَنْهَا رَضَيَ اللَّه عَنْهَا، قَالَتْ: كَانَ رسُول اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "إِذا دَخَلَ العَشْرُ الأَوَاخِرُ مِنْ رمَضَانَ، أَحْيا اللَّيْلَ، وَأَيْقَظَ أَهْلَه، وجَدَّ وَشَدَّ المِئزرَ" متفقٌ عَلَيهِ.
హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) గారే చేసిన కథనం: రమజాన్ మాసపు చివరి దశకం రాగానే దైవప్రవక్త ﷺ రాత్రిళ్లు జాగారం చేసేవారు. తమ ఇంటివారిని కూడా మేల్కొలిపేవారు. నడుం బిగించి బాగా, ముమ్మరంగా ఆరాధన చేసేవారు. (బుఖారీ-ముస్లిం)
(సహీహ్ బుఖారీలోని లైలతుల్ ఖద్ర్ ప్రాశస్త్య ప్రకరణం – సహీహ్ ముస్లింలోని ఏతెకాఫ్ ప్రకరణం)
English
`Aishah (radiyallahu anha) reported: When the last ten nights (of Ramadan) would begin, the Messenger of Allah ﷺ would keep awake at night (for prayer and devotion), awaken his family and prepare himself to be more diligent in worship.[Al-Bukhari and Muslim].
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|మహత్యాల ప్రకరణం|214. లైలతుల్ ఖద్ర్లో చేయబడే నమాజు ప్రాశస్త్యం, ఆ రాత్రుల్లో ఏ రాత్రి అత్యంత ఆశావహమైనదనే విషయం గురించి…|హదీసు 1194
హదీసు 1195
وَعَنْهَا قَالَتْ: كَانَ رَسُولُ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم يَجْتَهِدُ فِي رَمضانَ مَالا يَجْتَهِدُ في غَيْرِهِ، وَفِي العَشْرِ الأَوَاخِرِ منْه، مَالا يَجْتَهدُ في غَيْرِهِ"رواهُ مسلمٌ.
ఆవిడగారే చేసిన మరొక కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ దైవారాధనల్లో రమజాన్ మాసంలో శ్రమించినంతగా మరే ఇతర మాసంలోనూ శ్రమించేవారు కారు. అలాగే రమజాన్ మాసపు చివరి దశకంలో శ్రమించినంతగా ఇతర దినాల్లో శ్రమించేవారు కారు. (ముస్లిం)
(సహీహ్ ముస్లింలోని ఏతెకాఫ్ ప్రకరణం)
English
`Aishah (radiyallahu anha) reported: The Messenger of Allah ﷺ used to strive more in worship during Ramadan than he strove in any other time of the year; and he would devote himself more (in the worship of Allah) in the last ten nights of Ramadan than he strove in earlier part of the month.[Muslim].
ముఖ్యాంశాలు
ఇతర మాసాలన్నిటికన్నా రమజాన్ మాసంలో, అందులోనూ రమజాన్ మాసంలోని తొలి రెండు దశకాల కన్నా చివరి దశకంలో వీలైనంత ఎక్కువ దైవారాధనలో, దైవాజ్ఞాపాలనలో నిమగ్నులై ఉండాలి. ఘనమైన రేయిని పొందటానికి చివరి దశకపు రాత్రుల్లో జాగారం చేసి ప్రార్థనల్లో, ఆరాధనల్లో గడపాలి. తమ ఇంటివారిని కూడా మేల్కొలిపి దైవారాధన చేయమని ప్రబోధించాలి. చివరి దశకంలో ఏతెకాఫ్ పాటిస్తే ఇంకా మంచిది. ఇంతకు ముందు హదీసులో 'దైవప్రవక్త ﷺ ఆరాధన కోసం నడుం బిగించేవారు' అని చెప్పబడింది. కొంతమంది పండితులు దానికి ఆయన సమధికోత్సాహంతో ఆరాధనలు చేసేవారని వ్యాఖ్యానించారు. మరికొంతమంది ఆయా రోజుల్లో భార్యలతో సంభోగ సంబంధాలకు దూరంగా ఉండేవారని వివరించారు.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|మహత్యాల ప్రకరణం|214. లైలతుల్ ఖద్ర్లో చేయబడే నమాజు ప్రాశస్త్యం, ఆ రాత్రుల్లో ఏ రాత్రి అత్యంత ఆశావహమైనదనే విషయం గురించి…|హదీసు 1195
హదీసు 1196
وَعَنْهَا قَالَتْ: قُلْتُ: يَا رَسُولَ اللَّهِ أَرَأَيْتَ إِن عَلِمْتُ أَيَّ لَيْلَةٍ لَيْلَةُ القَدْرِ مَا أَقُولُ فِيهَا؟ قَالَ:"قُولي: اللَّهُمَّ إِنَّكَ عَفُوٌّ تُحِبُّ العفْوَ فاعْفُ عنِّي" رواهُ التِرْمذيُّ وقال: حديثٌ حسنٌ صحيحٌ.
ఆవిడగారే చేసిన ఇంకొక కథనం: నేనాయన్ని "దైవప్రవక్తా! నేనొకవేళ ఘనమైన రేయి ఏదో కనుగొంటే ఆ రాత్రి నేను ఏమని ప్రార్థించాలో కాస్త చెబుతారా?" అని అడిగాను. అందుకాయన ఈ విధంగా ప్రార్థించమని ఉపదేశించారు: "అల్లాహుమ్మ ఇన్నక అఫువ్వున్ తుహిబ్బుల్ అఫ్వ ఫాఫు అన్నీ (అల్లాహ్! నీవు అమితంగా మన్నించేవాడవు. మన్నింపును ఇష్టపడతావు. కనుక నన్ను మన్నించు)."
(తిర్మిజీ- హసన్, సహీహ్)
(సుననె తిర్మిజీలోని ప్రార్థనలు, దైవధ్యాన ప్రకరణం)
English
`Aishah (radiyallahu anha) reported: I asked: “O Messenger of Allah! If I realize Lailat-ul-Qadr (Night of Decree), what should I supplicate in it?” He ﷺ replied, “You should supplicate: Allahumma innaka `afuwwun, tuhibbul-`afwa, fa`fu `anni (O Allah, You are Most Forgiving, and You love forgiveness; so forgive me).”[At-Tirmidhi].
ముఖ్యాంశాలు
లైలతుల్ ఖద్ర్ (ఘనమైన రేయి)కి సంబంధించి స్పష్టమైన చిహ్నాలేవీ హదీసుల్లో పేర్కొనబడలేదు. అయితే పూర్వీకుల్లోని కొంతమంది పండితులు తమ అనుభవాలను పురస్కరించుకొని ఇలా వివరించారు: ఆ రోజు రాత్రి అత్యధిక సంఖ్యలో దైవదూతలు భువిపైకి దిగిరావటం మూలంగా ఆ రాత్రి ఓ ప్రత్యేకమైన ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. హృదయాలు నెమ్మదిస్తాయి. ఆ రాత్రి మరీ అంత చల్లగా గాకుండా, మరీ ఉక్కపోయ కుండా మధ్యస్థంగా ఉంటుంది. మరుసటి దినం ఎండలో తీవ్రత ఉండదు. ఏది ఏమైనా ఆ రాత్రిని పొందినవారు దేవుని క్షమాగుణాన్ని ఆధారంగా చేసుకొని ప్రార్థిస్తే, ఆయన తప్పకుండా క్షమిస్తాడు.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|మహత్యాల ప్రకరణం|214. లైలతుల్ ఖద్ర్లో చేయబడే నమాజు ప్రాశస్త్యం, ఆ రాత్రుల్లో ఏ రాత్రి అత్యంత ఆశావహమైనదనే విషయం గురించి…|హదీసు 1196
You must be logged in to post a comment.