హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) – 21. మంచికి, దైవభక్తికి చేదోడుగా ఉండటం

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: ఇమామ్ అబూ జకరియ్యా యహ్యా బిన్ షరఫ్ అన్ నవవీ (రహ్మతుల్లాహి అలైహి)
ఉర్దూ అనువాదం, వ్యాఖ్యానం: హాఫిజ్ సలాహుద్దీన్ యూసుఫ్ · తెలుగు రూపం: హాఫిజ్ ఎస్.ఎమ్. రసూల్ షర్ఫీ · ప్రకాశకులు: ట్రూత్ పబ్లికేషన్స్, హైదరాబాద్

రియాదుస్ సాలిహీన్ – హదీసు కిరణాలు (ఇమామ్ నవవీ) – అరబీ, తెలుగు, English

రియాదుస్ సాలిహీన్ (హదీసు కిరణాలు) – 21వ అధ్యాయం: మంచికి, దైవభక్తికి సంబంధించిన విషయాల్లో చేదోడు వాదోడుగా ఉండటం. ఈ అధ్యాయంలో 2 ఖుర్ఆన్ ఆయతులు, 4 హదీసులు (హదీసు 179 – 182) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, ముఖ్యాంశాలు, English అనువాదంతో.

21. మంచికి, దైవభక్తికి సంబంధించిన విషయాల్లో చేదోడు వాదోడుగా ఉండటం

↑ విషయ సూచిక

باب التعاون عَلَى البر والتقوى

అరబీ పాఠం: రియాదుస్ సాలిహీన్ – తహ్‌ఖీఖ్: షుఐబ్ అల్ అర్నావూత్ (ముఅస్సస్సతుర్ రిసాలా)

{وَتَعَاوَنُوا عَلَى الْبِرِّ وَالتَّقْوَى} [المائدة: ٢]

దివ్య ఖుర్‌ఆన్‌లో అల్లాహ్ సెలవిచ్చాడు : "మంచికి, దైవభక్తికి సంబంధించిన పనులలో అందరితోనూ సహకరించండి." (అల్ మాయిద : 2)

{وَالْعَصْر. ِإِنَّ الأِنْسَانَ لَفِي خُسْر. ٍإِلاَّ الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ وَتَوَاصَوْا بِالْحَقِّ وَتَوَاصَوْا بِالصَّبْر} [العصر:١،٣]

మరోచోట ఆయన ఇలా అంటున్నాడు : "కాలం సాక్షిగా! నిస్సందేహంగా మానవుడు పెద్ద నష్టానికి గురిఅయి ఉన్నాడు. విశ్వసించి సత్కార్యాలు చేస్తూ ఉండేవారూ, ఒకరికొకరు సత్యోపదేశం, సహనబోధ చేసుకునేవారూ తప్ప." (అల్ అస్ర్ : 1 – 3)

ప్రజలందరూ లేక చాలామంది ఈ 'సూరా' మీద యోచన చేసే విషయంలో అశ్రద్ధ వహిస్తున్నారని ఇమామ్ షాఫయి (రహిమహుల్లాహ్) అభిప్రాయం.

English

“Help you one another in Al-Birr and At-Taqwa (virtue, righteousness and piety)”. [Al-Mā’idah 5:2]

“By Al-`Asr (the time). Verily, man is in loss. Except those who believe (in Islamic Monotheism) and do righteous good deeds, and recommend one another to the truth [i.e. order one another to perform all kinds of good deeds (Al-Ma`ruf) which Allah has ordained, and abstain from all kinds of sins and evil deeds (Al-Munkar) which Allah has forbidden], and recommend one another to patience (for the sufferings, harms, and injuries which one may encounter in Allah’s Cause during preaching His religion of Islamic Monotheism or Jihad)”. [Al-‘Aṣr 103:1–3]

179

హదీసు 179

عن أَبي عبدِ الرحمن زيدِ بن خالدٍ الْجُهَنيِّ رضيَ اللَّه عنه قَالَ: قَالَ رَسُولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: مَنْ جهَّزَ غَازِياً في سَبِيلِ اللَّه فَقَدْ غَزَا وَمَنْ خَلَفَ غَازِياً في أَهْلِهِ بِخَيْرٍ فَقَدْ غَزَا "متفقٌ عَلَيهِ.

హజ్రత్ అబూ అబ్దుర్రహ్మాన్ జైద్ బిన్ ఖాలిద్ జుహ్నీ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రవచించారు : దైవమార్గంలో పోరాడే యోధుడికి యుద్ధసామగ్రిని సమకూర్చినవాడు కూడా నిస్సందేహంగా దైవమార్గంలో పోరాడినట్లౌతాడు. ఇంకా, దైవమార్గంలో పోరాడటానికి వెళ్ళిన యోధుని ఇంటి బాగోగులు చూసిన వ్యక్తి (కూడా) దైవమార్గంలో పోరాడినట్లుగా పరిగణించబడతాడు. (బుఖారీ – ముస్లిం)

(సహీహ్ బుఖారీలోని జిహాద్ ప్రకరణంలోనూ, సహీహ్ ముస్లింలోని నాయకత్వ ప్రకరణంలోనూ ఈ హదీసు ఉంది.)

English

Khalid Al-Juhani (radiyallahu anhu) reported: The Prophet ﷺ said, “He who equips a warrior in the way of Allah (will get the reward of the one who has actually gone for Jihad); and he who looks after the family of a warrior in the way of Allah will get the reward of the one who has gone for Jihad”.[Al-Bukhari and Muslim].

ముఖ్యాంశాలు

పై హదీసును అర్థం చేసుకొని దానిపై అమలు జరిపినట్లయితే ఇస్లామీయ సైనిక వ్యవస్థను అత్యంత శక్తిమంతమైనదిగా, విజయవంతమైనదిగా తీర్చిదిద్దవచ్చు. ఆ విధంగా దైవమార్గంలో సలిపేపోరాటంలో సామాన్య ప్రజానీకం పాల్గొనలేకపోయినా సైనికులకు సహాయసహకారాలు అందించి యోధులతోపాటు పుణ్యంలో భాగస్వాములు కావచ్చు. సమాజంలో బలశాలురు, పరాక్రమవంతులైన యువకులు ఎందరో ఉంటారు. కాని వారిదగ్గర వనరులు లేకపోవటం చేత ధర్మయుద్ధంలో పాల్గొనరు. దాంతో సైనిక వ్యవస్థ ఎంతో ఉపయోగకరమైన విభాగాన్ని కోల్పోయినట్లవుతుంది. కాని రెండోవైపు సమాజంలో మరికొందరివద్ద యుద్ధానికి అవసరమైన వనరులు పుష్కలంగా ఉన్నప్పటికీ యుద్ధానికి తగిన వయోపరిమితి, శారీరక శక్తిసామర్థ్యాలు ఉండవు. కనుక ఈ ఇరు వర్గాలవారు కలిసి చేదోడువాదోడుగా పనిచేస్తే సైనికవ్యవస్థ పటిష్ఠంగా తయారవటంతోపాటు అందరికీ సమానంగా పుణ్యం లభిస్తుంది. దైవప్రవక్త ﷺ మరియు ఆయన అనుచరుల హయాంలో నేటి సైనిక వ్యవస్థ మాదిరిగా యోధులు జీతాలపై సైన్యంలో చేర్చుకోబడేవారు కాదు. ప్రజలు స్వచ్ఛందంగా తమంతట తాము యుద్ధంలో పాల్గొనేవారని గ్రహించాలి. అయితే వ్యవస్థీకృతమైన సైన్యానికి కూడా ఈ హదీసు వర్తిస్తుంది. ప్రజలు సైనిక వ్యవస్థకు, యోధుల కుటుంబాలకు సహాయసహకారాలు అందించడం ద్వారా పుణ్యాన్ని పొందవచ్చు.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|21. మంచికి, దైవభక్తికి సంబంధించిన విషయాల్లో చేదోడు వాదోడుగా ఉండటం|హదీసు 179

180

హదీసు 180

وعن أَبِي سعيدٍ الخُدْرِيِّ رضي اللَّه عنهُ أَنَّ رسولَ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم، بَعَثَ بَعْثاً إِلى بَني لِحيانَ مِنْ هُذَيْلٍ فقالَ: "لِيَنْبعِثْ مِنْ كُلِّ رَجُلَيْنِ أَحَدُهُمَا وَالأَجْرُ بَيْنَهُمَا" رواه مسلم.

హజ్రత్ అబూ సయీద్ ఖుద్రీ (రదియల్లాహు అన్హు) కథనం : దైవప్రవక్త ﷺ హుజైల్ తెగ శాఖ అయిన బనూ లహ్యాన్ వైపుకు (వారితో యుద్ధం చేయటానికి) ఒక సైనిక పటాలాన్ని పంపారు. ఆ సందర్భంగా ఆయన "ప్రతి ఇద్దరు వ్యక్తుల్లోనూ ఒకడు తప్పకుండా వెళ్ళాలి. పుణ్యం ఇద్దరికీ లభిస్తుంది (యుద్ధానికి వెళ్ళినవాడికి మరియు అతని ఇంటి బాగోగులు చూసిన వ్యక్తికి కూడా" అని బోధించారు. (ముస్లిం)

(సహీహ్ ముస్లింలోని నాయకత్వ ప్రకరణం)

English

Abu Sa`id Al-Khudri (radiyallahu anhu) reported: Messenger of Allah ﷺ sent a detachment to Banu Lahyan tribe and remarked, “Let one of every two men get ready to advance, and both will earn the same reward”.[Muslim].

ముఖ్యాంశాలు

ఇంతకు ముందు వచ్చిన హదీసులో ప్రస్తావించబడిన విషయమే ఇందులోనూ వివరించబడింది. ప్రజలందరూ యుద్ధంలో పాల్గొనలేరు. అయితే యుద్ధానికి వెళ్ళలేనివారు సైనికుల కుటుంబాలకు భద్రతను కల్పించడం, వారి అవసరాలను తీర్చడం లాంటి పనులుచేసి, తాము కూడా ఇంటిపట్టునవుండి ధర్మయుద్ధ పుణ్యాన్ని జుర్రుకోవచ్చు.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|21. మంచికి, దైవభక్తికి సంబంధించిన విషయాల్లో చేదోడు వాదోడుగా ఉండటం|హదీసు 180

181

హదీసు 181

وعن ابنِ عباسٍ رضي اللَّه عنهما أَنَّ رسُولَ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم لَقِيَ ركْباً بالرَّوْحَاءِ فَقَالَ: "مَنِ الْقوْمُ؟ "قالُوا: المُسْلِمُونَ، فَقَالُوا: مَنْ أَنْتَ؟ قَالَ:"رسولُ اللَّه"فَرَفَعَتْ إِلَيْهِ امْرَأَةٌ صَبِيًّا فَقَالَتْ: أَلَهَذَا حَجٌّ؟ قَالَ:"نَعمْ وَلَكِ أَجْرٌ" رواه مسلم.

హజ్రత్ ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హుమా) కథనం: దైవప్రవక్త ﷺకు 'రౌహా' ప్రాంతంలో ప్రయాణీకుల బృందం ఒకటి ఎదురయ్యింది. ఆయన వారితో "ఎవరు మీరు?" అని అడిగారు. దానికి వారు "మేము ముస్లింలము, మీరెవరు?" అని ప్రశ్నించారు. దానికి ఆయన "నేను దైవప్రవక్తను" అని అన్నారు. అది విని ఒక మహిళ తన పిల్లవాడిని ఎత్తుకొని ఆయనకు చూపిస్తూ "ఇతను హజ్ (యాత్ర) చేయవచ్చా?" అని అడిగింది. "అవును చేయవచ్చు. అయితే దాని పుణ్యం నీకు లభిస్తుంది" అని దైవప్రవక్త ﷺ చెప్పారు. (ముస్లిం)

(సహీహ్ ముస్లింలోని 'హజ్' ప్రకరణం)

English

Ibn `Abbas (radiyallahu anhuma) reported: Messenger of Allah ﷺ came across a party of mounted men at Ar-Rauha and asked them, “Who are you?” They answered: “We are Muslims, and who are you?” He said, “I am the Messenger of Allah.’‘ A woman from among them lifted a boy up to him and asked: “Can this one go on Hajj?” He ﷺ said, “Yes, and you will have the reward.”[Muslim].

ముఖ్యాంశాలు

  1. ఈ హదీసులో దైవప్రవక్త ﷺ నిరాడంబరత వివరించబడింది. ఆయన ఎంత సాదాసీదాగా ఉండేవారంటే, ఆయన తన అనుచరులతోపాటు ఉన్నప్పుడు వారిలో దైవప్రవక్త ఎవరో ప్రజలు కనుక్కోలేకపోయేవారు.
  2. పిల్లవాడు తల్లిదండ్రులతోపాటు హజ్ (యాత్ర) చేస్తే దాని పుణ్యం తల్లిదండ్రులకు లభిస్తుంది. ఎందుకంటే ఆ పసివాడిపై ఇంకా హజ్ విధి కాలేదు. కనుక ప్రాజ్ఞత వచ్చిన తరువాత ఆ పిల్లవాడు స్తోమత కలిగినవాడైతే తిరిగి అతను విధిగా హజ్ చేయవలసి ఉంటుంది. బాల్యంలో చేసిన హజ్‌తో సరిపెట్టుకుంటే చాలదు.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|21. మంచికి, దైవభక్తికి సంబంధించిన విషయాల్లో చేదోడు వాదోడుగా ఉండటం|హదీసు 181

182

హదీసు 182

وَعَنْ أَبِي موسى الأَشْعَرِيِّ رضيَ اللَّهُ عنه، عن النبيِّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم أَنَّهُ قَالَ: "الخَازِنُ المُسْلِمُ الأَمِينُ الَّذِي يُنَفِّذُ مَا أُمِرَ بِهِ، فَيُعْطِيهِ كَامِلاً مَوفَّراً، طَيِّبَةً بِهِ نَفْسُهُ فَيَدْفَعُهُ إِلى الَّذِي أُمِرَ لَهُ بِهِ أَحَدُ المُتَصَدِّقَيْنِ" متفقٌ عَلَيهِ. وفي رواية: "الَّذِي يُعْطِي مَا أُمِرَ بِهِ"وضَبطُوا"المُتَصدِّقَيْنِ" بفتح القاف مَعَ كسر النون عَلَى التَّثْنِيَةِ، وعَكْسُهُ عَلَى الجمْعِ وكلاهُمَا صَحِيحٌ.

దైవప్రవక్త ﷺ ఇలా ప్రవచించారని హజ్రత్ అబూ మూసా అష్అరీ (రదియల్లాహు అన్హు) తెలియజేశారు : నిజాయితీపరుడయిన ముస్లిం కోశాధికారి తనకు ఆజ్ఞాపించబడిన దానిని అమలు పరుస్తూ, ఎవరికయినా ఏదయినా ఇవ్వమని తనకు ఆదేశమయినప్పుడు సహృదయంతో, సంతోషంతో, ఏమీ తగ్గించకుండా పూర్తిగా ఇస్తూ ఉంటే – అతను కూడా దానధర్మాలు చేసేవారిలో ఒకడిగా పరిగణించబడతాడు.

(బుఖారీ – ముస్లిం)

(సహీహ్ బుఖారీ, సహీహ్ ముస్లింలలోని జకాత్ ప్రకరణాలు)

English

Abu Musa (radiyallahu anhu) reported: The Prophet ﷺ said, “The honest Muslim trustee who carries out duties assigned to him (in another narration he said, “Who gives”), and he gives that in full, with his heart overflowing with cheerfulness, to whom he is ordered, he is one of the two givers of charity”.[Al-Bukhari and Muslim].

ముఖ్యాంశాలు

ఎవరికయినా ఏదయినా బాధ్యత అప్పగించబడితే వారు ఆ బాధ్యతను సహృదయంతో నిర్వర్తించాలి. అంతేగాని తమకన్నా ఉచ్ఛస్థితిలో ఉన్నవారిని చూసి అసూయచెందటం, ఆ కోపాన్ని తమ క్రింద పనిచేసే వారిపై ప్రదర్శించటం, అవసరార్థం తమ దగ్గరికి వచ్చినవారిని కసురుకోవటం లాంటి కుచేష్టలకు పాల్పడకూడదు. తన బాధ్యతను సరిగ్గా నిర్వర్తించే వ్యక్తికి ఆ బాధ్యత అప్పగించినవారికి సమానంగా పుణ్యం లభిస్తుంది. ఒక కోశాధికారి తన విధులను సరిగ్గా నిర్వర్తిస్తే అతనికి తనను నియమించిన పై అధికారికి లభించినంత పుణ్యం లభిస్తుంది.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|21. మంచికి, దైవభక్తికి సంబంధించిన విషయాల్లో చేదోడు వాదోడుగా ఉండటం|హదీసు 182