హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: ఇమామ్ అబూ జకరియ్యా యహ్యా బిన్ షరఫ్ అన్ నవవీ (రహ్మతుల్లాహి అలైహి)
ఉర్దూ అనువాదం, వ్యాఖ్యానం: హాఫిజ్ సలాహుద్దీన్ యూసుఫ్ · తెలుగు రూపం: హాఫిజ్ ఎస్.ఎమ్. రసూల్ షర్ఫీ · ప్రకాశకులు: ట్రూత్ పబ్లికేషన్స్, హైదరాబాద్

రియాదుస్ సాలిహీన్ (హదీసు కిరణాలు) – 199వ అధ్యాయం: జుహ్ర్కు సంబంధించిన సున్నత్లు. ఈ అధ్యాయంలో 6 హదీసులు (హదీసు 1113 – 1118) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, ముఖ్యాంశాలు, English అనువాదంతో.
199. జుహ్ర్కు సంబంధించిన సున్నత్లు
باب سُنّة الظهر
అరబీ పాఠం: రియాదుస్ సాలిహీన్ – తహ్ఖీఖ్: షుఐబ్ అల్ అర్నావూత్ (ముఅస్సస్సతుర్ రిసాలా)
హదీసు 1113
عَنِ ابنِ عُمَرَ، رَضيَ اللَّه عنْهُما، قالَ: صلَّيْتُ مَع رسولِ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم ركْعَتَيْنِ قَبْل الظُّهْرِ، ورَكْعَتيْنِ بعدَهَا. متفقٌ عَلَيهِ.
హజ్రత్ ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హుమా) కథనం: నేను దైవప్రవక్త ﷺ వెంట జుహ్ర్ (వేళ, ఫర్జ్ నమాజు) కు ముందు రెండు రకాతులు, దాని తర్వాత రెండు రకాతులు నమాజ్ చేశాను.
(బుఖారీ-ముస్లిం)
English
Ibn `Umar (radiyallahu anhuma) reported: I performed with the Messenger of Allah ﷺ two Rak`ah before and two after Zuhr prayers.[Al-Bukhari and Muslim].
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|మహత్యాల ప్రకరణం|199. జుహ్ర్కు సంబంధించిన సున్నత్లు|హదీసు 1113
హదీసు 1114
وعَنْ عائِشَة رَضِيَ اللَّه عنْهَا، أَنَّ النَّبِيَّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم كَانَ لا يدعُ أَرْبعاً قَبْلَ الظُّهْرِ، رَوَاهُ البخاريُّ.
హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) కథనం: దైవప్రవక్త ﷺ జుహ్ర్కు ముందు నాలుగు రకాతులను ఎన్నడూ వదలిపెట్టేవారు కారు.
(బుఖారీ)
(సహీహ్ బుఖారీలోని తహజ్జుద్ ప్రకరణం)
English
`Aishah (radiyallahu anha) reported: The Prophet ﷺ never omitted four Rak`ah supererogatory prayer before Zuhr prayers.[Al-Bukhari].
ముఖ్యాంశాలు
కొన్ని ఉల్లేఖనాల్లో జుహ్ర్కు ముందు రెండు రకాతులు దాని తర్వాత రెండు రకాతులు చేయాలని చెప్పబడింది. ఈ హదీసులోనేమో జుహ్ర్కు ముందు నాలుగు రకాతులున్నాయని వివరించబడింది. ఈ రెండు సంఖ్యలూ సరైనవే. పరిస్థితుల కనుగుణంగా రెండింట్లో ఏ హదీసునయినా ఆచరించవచ్చు.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|మహత్యాల ప్రకరణం|199. జుహ్ర్కు సంబంధించిన సున్నత్లు|హదీసు 1114
హదీసు 1115
وَعَنها قالتْ: كانَ النبيُّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم يُصَليِّ في بَيْتي قَبْلَ الظُّهْر أَرْبَعاً، ثُمَّ يخْرُجُ فَيُصليِّ بِالنَّاسِ، ثُمَّ يدخُلُ فَيُصَليِّ رَكْعَتَينْ، وَكانَ يُصليِّ بِالنَّاسِ المَغْرِب، ثُمَّ يَدْخُلُ بيتي فَيُصليِّ رَكْعَتْينِ، وَيُصَليِّ بِالنَّاسِ العِشاءَ، وَيدْخُلُ بَيْتي فَيُصليِّ ركْعَتَيْنِ. رواه مسلم.
హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) గారే చేసిన కథనం: దైవప్రవక్త ﷺ జుహ్ర్ వేళ ఫర్జ్ నమాజుకు ముందు నా ఇంట్లో నాలుగు రకాతులు చేసేవారు. తర్వాత బయటికి వెళ్ళి ప్రజలకు నమాజ్ చేయించేవారు. ఆ తర్వాత ఇంటికి వచ్చి రెండు రకాతులు చేసేవారు. అదే విధంగా ప్రజలకు మగ్రిబ్ నమాజు చేయించేవారు. తర్వాత ఇంటికి వచ్చి రెండు రకాతులు చేసేవారు. అలాగే ప్రజలకు ఇషా నమాజు చేయించి, ఇంటికి తిరిగొచ్చిన తర్వాత రెండు రకాతులు చేసేవారు.
(ముస్లిం)
(సహీహ్ ముస్లింలోని ప్రయాణీకుల నమాజ్ ప్రకరణం)
English
`Aishah (radiyallahu anha) reported: Whenever the Prophet ﷺ stayed in my house, he would perform four Rak`ah (supererogatory prayer) before Zuhr prayer. Then he would go out and lead Salat. He ﷺ would then come back and perform two Rak`ah (supererogatory prayer). He would lead the Maghrib prayer and come back and perform two Rak`ah (supererogatory prayer). When he ﷺ had led the `Isha’ prayer, he would enter the house and perform two Rak`ah (supererogatory prayer).[Muslim]
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|మహత్యాల ప్రకరణం|199. జుహ్ర్కు సంబంధించిన సున్నత్లు|హదీసు 1115
హదీసు 1116
وعن أُمِّ حَبِيبَةَ رَضِيَ اللَّه عَنها قَالَتْ: قالَ رسولُ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: " منْ حَافظَ عَلى أَرْبَعِ ركعَاتٍ قَبْلَ الظُّهْرِ، وَأَرْبعٍ بَعْدَهَا، حَرَّمهُ اللَّه عَلَى النَّارَ". رواه أَبو داود، والترمذي وَقالَ: حديثٌ حسنٌ صحيحٌ.
హజ్రత్ ఉమ్మె హబీబా (రదియల్లాహు అన్హా) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఈ విధంగా ప్రవచించారు: జుహ్ర్కు ముందు నాలుగు రకాతుల్ని, దాని తర్వాత నాలుగు రకాతుల్ని క్రమం తప్పకుండా చేసేవారి కొరకు దేవుడు నరకాగ్నిని నిషిద్ధం చేస్తాడు. (అబూదావూద్, తిర్మిజీలు దీనిని ఉల్లేఖించారు: తిర్మిజీ దీనిని హసన్ మరియు సహీహ్గా పేర్కొన్నారు)
(సుననె అబూదావూద్, సుననె తిర్మిజీలలోని ప్రయాణీకుల నమాజ్ ప్రకరణం)
English
Umm Habibah (radiyallahu anha) reported: The Messenger of Allah ﷺ said, “Whoever observes the practice of performing four Rak`ah before Zuhr prayer and four after the Zuhr prayer, Allah will shield him against the Fire (of Hell).[Abu Dawud and At-Tirmidhi].
ముఖ్యాంశాలు
నరకాగ్నిని నిషిద్ధం చేయటమంటే ఇస్లాం స్థితిలోనే వారికి మరణం సంభవిస్తుందని భావం. కనుక అలాంటివారు అవిశ్వాసుల మాదిరిగా శాశ్వతంగా నరకంలో ఉండాల్సిన అవసరం లేదు. అదే విధంగా కొన్ని హదీసుల్లో నరకాగ్ని వారిని అంటుకొనజాలదు అని వస్తుంది. దాని భావం కూడా అదే. అంటే శాశ్వత నరకం వారిని అంటుకొనజాలదన్నమాట!
ఒకవేళ ముస్లిం వ్యక్తి గనక పాపాత్ముడయి, శిక్షార్హుడయి ఉంటే అతను కూడా కొంతకాలంపాటు నరకంలో శిక్షననుభవించాల్సిందే! ఆ విధంగా ముస్లింల నరక ప్రవేశం సదరు హదీసులాంటి హదీసుల భావాలకు విరుద్ధమూ కాదు. ఎందుకంటే ముస్లింలు అంతిమంగా నరకం నుండి బయటికి తీయబడి స్వర్గానికి పంపబడతారు. ముస్లింలు నరకంలో ఎల్లకాలం ఉండరు. అయితే ముస్లింలు ఏం చేసినా అసలు వారికి నరక శిక్షే ఉండదని భావించటం కూడా తగదు. దేవుడు గనక వారిని ప్రారంభంలో క్షమించకపోతే, ఆయన తలచినంత కాలం నరకంలో మాడిచావాల్సిందే. ఆ తర్వాతే వారికి స్వర్గభాగ్యం లభిస్తుంది.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|మహత్యాల ప్రకరణం|199. జుహ్ర్కు సంబంధించిన సున్నత్లు|హదీసు 1116
హదీసు 1117
وعَنْ عبدِ اللَّهِ بن السائب رضِيَ اللَّه عَنْهُ أَنَّ رسولَ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم كانَ يُصَلِّي أَرْبعاً بعْدَ أَن تَزول الشَّمْسُ قَبْلَ الظُّهْرِ، وقَالَ:" إِنَّهَا سَاعَةٌ تُفْتَحُ فِيهَا أَبوابُ السَّمَاءِ، فأُحِبُّ أَن يَصعَدَ لِي فيهَا عمَلٌ صَالِحٌ" رواه التِّرمِذِيُّ وقالَ: حديثٌ حسنٌ.
హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ సాయిబ్ (రదియల్లాహు అన్హు) కథనం: దైవప్రవక్త ﷺ సూర్యుడు నడినెత్తి నుండి క్రిందికి వాలిన తర్వాత జుహ్ర్ నమాజుకు ముందు నాలుగు రకాతులు చేసేవారు. ఇంకా ఇలా అనేవారు: "ఇది ఎలాంటి సమయమంటే ఇందులో ఆకాశ ద్వారాలు తెరుచుకుంటాయి. కనుక ఈ ఘడియలో నా సదాచరణలు పైకి వెళ్ళటాన్ని నేను యిష్టపడతాను."
(తిర్మిజీ-హసన్)
(సుననె తిర్మిజీలోని నమాజ్ అధ్యాయం)
English
`Abdullah bin As-Sa’ib (radiyallahu anhu) reported: The Messenger of Allah ﷺ used to perform four Rak`ah prayer after the declining of the sun before Zuhr prayer and would say, “This is an hour at which the gates of heaven are opened, and I like that my good deeds should rise to heaven at that time.”[At-Tirmidhi].
ముఖ్యాంశాలు
సూర్యుడు నడినెత్తి నుండి వాలగానే జుహ్ర్ నమాజ్ వేళ ప్రారంభమవుతుంది. దీని ద్వారా దైవప్రవక్త ﷺ జుహ్ర్కు సంబంధించిన నాలుగు రకాతుల సున్నత్ నమాజును తొలివేళలో చేసేవారని అర్థమవుతోంది. అదీగాక దైవప్రవక్త ﷺ ఒక్క ఇషా నమాజు మినహా మిగతా నమాజులన్నిటిని తొలివేళలోనే నెరవేర్చేవారు. ఆకాశ ద్వారాలు తెరుచుకుంటాయంటే ఆ సమయంలో మానవుల ఆచరణలు దైవసన్నిధికి గొనిపోబడతాయని భావం.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|మహత్యాల ప్రకరణం|199. జుహ్ర్కు సంబంధించిన సున్నత్లు|హదీసు 1117
హదీసు 1118
وعَنْ عَائِشَةَ رَضِيَ اللَّه عنْهَا، أَنَّ النَّبِيَّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم كانَ إِذا لَمْ يُصَلِّ أَرْبعاً قبْلَ الظهْرِ، صَلاَّهُنَّ بعْدَها. رَوَاهُ الترمذيُّ وَقَالَ: حديثٌ حسنٌ.
హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) కథనం: దైవప్రవక్త ﷺ ఎప్పుడైనా జుహ్ర్కు ముందు నాలుగు రకాతులు చేయలేకపోతే జుహ్ర్ తర్వాత వాటిని నెరవేర్చేవారు. (తిర్మిజీ-హసన్)
(సుననె తిర్మిజీలోని నమాజ్ ప్రకరణం)
English
`Aishah (radiyallahu anha) reported: If the Prophet ﷺ could not perform four Rak`ah before Zuhr prayer, he would perform them after it (i.e., after the obligatory prayer).[At-Tirmidhi].
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|మహత్యాల ప్రకరణం|199. జుహ్ర్కు సంబంధించిన సున్నత్లు|హదీసు 1118
You must be logged in to post a comment.