హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) – 198. ఫజ్ర్ సున్నత్ తర్వాత కుడివైపుకు పడుకోవటం

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: ఇమామ్ అబూ జకరియ్యా యహ్యా బిన్ షరఫ్ అన్ నవవీ (రహ్మతుల్లాహి అలైహి)
ఉర్దూ అనువాదం, వ్యాఖ్యానం: హాఫిజ్ సలాహుద్దీన్ యూసుఫ్ · తెలుగు రూపం: హాఫిజ్ ఎస్.ఎమ్. రసూల్ షర్ఫీ · ప్రకాశకులు: ట్రూత్ పబ్లికేషన్స్, హైదరాబాద్

రియాదుస్ సాలిహీన్ – హదీసు కిరణాలు (ఇమామ్ నవవీ) – అరబీ, తెలుగు, English

రియాదుస్ సాలిహీన్ (హదీసు కిరణాలు) – 198వ అధ్యాయం: ఫజ్ర్‌వేళ రెండు రకాతుల సున్నత్ తర్వాత కాసేపు కుడివైపుకు తిరిగి పడుకోవటం అభిలషణీయం, ఇంకా తహజ్జుద్ నమాజ్ చేసినా చేయకపోయినా ప్రజల్ని దానికోసం పురికొల్పటం గురించి. ఈ అధ్యాయంలో 3 హదీసులు (హదీసు 1110 – 1112) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, ముఖ్యాంశాలు, English అనువాదంతో.

198. ఫజ్ర్‌వేళ రెండు రకాతుల సున్నత్ తర్వాత కాసేపు కుడివైపుకు తిరిగి పడుకోవటం అభిలషణీయం, ఇంకా తహజ్జుద్ నమాజ్ చేసినా చేయకపోయినా ప్రజల్ని దానికోసం పురికొల్పటం గురించి…

↑ విషయ సూచిక

باب استحباب الاضطجاع بعد بعد ركعتي الفجر عَلَى جنبه الأيمن والحث عليه سواءٌ كَانَ تهجَّدَ بِاللَّيْلِ أمْ لا

అరబీ పాఠం: రియాదుస్ సాలిహీన్ – తహ్‌ఖీఖ్: షుఐబ్ అల్ అర్నావూత్ (ముఅస్సస్సతుర్ రిసాలా)

1110

హదీసు 1110

عنْ عائِشَةَ رَضِي اللَّه عنهَا قالَت: كانَ النَّبيُّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم إِذَا صلَّى رَكْعَتي الْفَجْرِ، اضْطَجع عَلَى شِقِّهِ الأَيْمنِ. رَوَاهُ البخاريُّ.

హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) కథనం: దైవప్రవక్త ﷺ ఫజ్ర్ వేళ రెండు రకాతుల (సున్నత్) నమాజ్ చేసుకున్న తర్వాత కుడి వైపునకు తిరిగి పడుకునేవారు. (బుఖారీ)

(సహీహ్ బుఖారీలోని తహజ్జుద్ ప్రకరణం)

English

`Aishah (radiyallahu anha) reported: When the Prophet ﷺ had performed two Rak`ah before the Fajr prayer, he would lie down on his right side.[Al-Bukhari].

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|మహత్యాల ప్రకరణం|198. ఫజ్ర్‌వేళ రెండు రకాతుల సున్నత్ తర్వాత కాసేపు కుడివైపుకు తిరిగి పడుకోవటం అభిలషణీయం, ఇంకా తహజ్జుద్ నమాజ్ చేసినా చేయకపోయినా ప్రజల్ని దానికోసం పురికొల్పటం గురించి…|హదీసు 1110

1111

హదీసు 1111

وَعنْهَا قَالَتْ: كانَ النبيُّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم يُصَلِّي فِيمَا بيْنَ أَنْ يفْرُغَ مِنْ صَلاَةِ الْعشَاءِ إلَى الْفجْرِ إحْدَى عَشْرَةَ رَكْعةً يُسَلِّمُ بيْنَ كُلِّ ركعَتيْنِ، ويُوتِرُ بِوَاحِدَةٍ، فَإذا سَكَتَ المُؤَذِّنُ مِنْ صلاةِ الْفَجْرِ، وتَبيَّنَ لَهُ الْفَجْرُ، وَجاءَهُ المُؤَذِّنُ، قَامَ فَرَكَعَ رَكْعَتيْن خَفِيفَتَيْنِ، ثُمَّ اضْطَجَعَ عَلى شِقِّه الأَيْمَنِ، هكَذَا حَتَّى يأْتِيَهُ المُؤَذِّنُ للإِقَامَةِ. رَوَاهُ مُسْلِمٌ.،قَوْلُهَا:"يُسلِّمُ بيْن كُلِّ رَكْعتَيْن"هكَذَا هو في مسلمٍ ومعناه: بعْد كُلِّ رَكْعتَيْنِ.

హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) గారే చేసిన కథనం: దైవప్రవక్త ﷺ ఇషా నమాజు ముగించుకున్నప్పటి నుంచి ఫజ్ర్ వరకు మధ్యకాలంలో పదకొండు రకాతులు చేసేవారు. ప్రతి రెండు రకాతుల మధ్య సలాం చేసేవారు. ఒక రకాత్ విత్ర్ నమాజు చేసేవారు.

(ఫజ్ర్ వేళ) ముఅజ్జిన్ అజాన్ చెప్పి ఊరుకుంటాడు. ఉదయం ప్రస్ఫుటమవుతుంది. ముఅజ్జిన్ (నమాజ్ వేళ అయిందని చెప్పటానికి) ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన సంక్షిప్తంగా రెండు రకాతులు చేసేవారు. ఆ తర్వాత ముఅజ్జిన్ నమాజ్ మొదలు పెట్టటం కోసం వచ్చేవరకు కుడివైపునకు తిరిగి పడుకునేవారు. (ముస్లిం)

"ప్రతి రెండు రకాతుల మధ్య సలాం చేసేవారు" – ముస్లింలోని వాక్యాలు ఇలాగే ఉన్నాయి. ఆయన ప్రతి రెండు రకాతులు అయిపోయిన తర్వాత సలాం చేసేవారని దీనిభావం.

(సహీహ్ ముస్లింలోని ప్రయాణీకుల నమాజ్ ప్రకరణం)

English

`Aishah (radiyallahu anha) reported: When the Prophet ﷺ finished the `Isha prayer, he would perform eleven Rak`ah before the Fajr prayer, concluding each two Rak`ah with Taslim (i.e., saying As-Salamu `Alaikum) and observing the Witr (odd) at the end. When the Mu’adhdhin finished proclaiming Adhan for the Fajr prayer and it was dawn, he would rise and perform two short Rak`ah, and then would lie down on his right side till the Mu’adhdhin came to (inform) him about Iqamah.[Muslim].

ముఖ్యాంశాలు

దైవప్రవక్త ﷺ రాత్రిపూట తహజ్జుద్ నమాజు పదకొండు రకాతులు చేసేవారు. రెండేసి రకాతుల చొప్పున పది రకాతులు చేసేవారు. ఆ తర్వాత ఒక రకాతు విత్ర్ నమాజు చేసేవారు. మరికొన్ని ఉల్లేఖనాల ద్వారా ఎనిమిది రకాతుల తర్వాత మూడు రకాతులు విత్ర్ చేసేవారని తెలుస్తోంది. పై రెండు పద్ధతులూ సరైనవే. ఒక రకాతు విత్ర్ నమాజ్ చేయవచ్చని కూడా ఈ హదీసు ద్వారా బోధపడుతోంది.

తహజ్జుద్ మరియు విత్ర్ నమాజుల్ని ఇషా నమాజు ముగిసినప్పటి నుంచి ఉషోదయానికి ముందు వరకు మధ్యలో ఎప్పుడైనా చేయవచ్చు. కాని రాత్రి చివరిజామున చేయటం ఉత్తమం. ఆ విధంగా చేస్తే తహజ్జుద్ అయిపోగానే ఫజ్ర్ నమాజు కూడా సామూహికంగా నెరవేర్చవచ్చు. రమజాన్ మాసంలో చేసే తరావీహ్ నమాజు కూడా తహజ్జుద్ నమాజే. సౌలభ్యం కోసం, సామూహిక నమాజు పుణ్యం కోసం రమజాన్ మాసంలో దాన్ని తొలివేళలోనే, అంటే ఇషా నమాజ్ ముగిసిన వెంటనే చేస్తారు. కనుక తరావీహ్ నమాజ్ కూడా ఎనిమిది రకాతులే. దైవప్రవక్త ﷺ రమజాన్‌లోగాని, రమజానేతర మాసాల్లోగాని ఎన్నడూ ఎనిమిది రకాతులు, ఆ తర్వాత మూడు రకాతుల విత్ర్ కంటే ఎక్కువ చేయలేదు. సహీహ్ బుఖారీలోని హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) హదీసు ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. హదీసుల్లో రాత్రిపూట చేసే నమాజును 'ఖియాముల్లైల్'గా అభివర్ణించటం జరిగింది. దాన్నే ఖుర్‌ఆన్ మరియు హదీసులు తహజ్జుద్‌గా పేర్కొన్నాయి. కాని దానికోసం తరావీహ్ అనే పదం ఏ హదీసులోనూ వాడబడలేదు. రమజాన్‌కు సంబంధించిన ఖియాముల్లైల్‌కు తరావీహ్ అనే పేరు దైవప్రవక్త, ఆయన సహచరుల కాలం తర్వాత మొదలయింది. కనుక తరావీహ్ నమాజును దైవప్రవక్త ﷺ ద్వారా రుజువైనన్ని రకాతులు చేయటమే ఉత్తమం. ప్రామాణిక హదీసుల ద్వారా తరావీహ్ నమాజు ఎనిమిది రకాతులేనని తెలుస్తోంది.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|మహత్యాల ప్రకరణం|198. ఫజ్ర్‌వేళ రెండు రకాతుల సున్నత్ తర్వాత కాసేపు కుడివైపుకు తిరిగి పడుకోవటం అభిలషణీయం, ఇంకా తహజ్జుద్ నమాజ్ చేసినా చేయకపోయినా ప్రజల్ని దానికోసం పురికొల్పటం గురించి…|హదీసు 1111

1112

హదీసు 1112

وعنْ أَبي هُريرةَ رضيَ اللَّه عنهُ، قالَ: قالَ رسولُ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "إِذا صَلَّى أَحَدُكُمْ ركْعَتَيِ الفَجْرِ فَلْيَضطَجِعْ عَلى يمِينِهِ". رَوَاه أَبو دَاوُدَ، وَالتِّرمِذِيُّ بأَسانِيدَ صحيحةٍ. قالَ الترمذي: حديثٌ حَسَنٌ صَحِيحٌ.

హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఈ విధంగా ప్రవచించారు: మీలో ఎవరైనా ఫజ్ర్ వేళ రెండు రకాతుల (సున్నత్) నమాజ్ చేసుకుంటే ఆ తర్వాత కుడి వైపునకు తిరిగి పడుకోవాలి. (అబూదావూద్ మరియు తిర్మిజీలు ఈ హదీసుని ప్రామాణికమైన ఆధారాలతో వెలికితీశారు. ఇమామ్ తిర్మిజీ దీనిని 'హసన్' మరియు 'సహీహ్' కోవకు చెందిన హదీసుగా పేర్కొన్నారు.)

(సుననె అబూదావూద్, సుననె తిర్మిజీలోని నమాజ్ అధ్యాయాలు)

English

Abu Hurairah (radiyallahu anhu) reported: The Messenger of Allah ﷺ said, “When anyone of you has performed two of Sunnah before the Fajr prayer, he should lie down on his right side.”

[Abu Dawud and At-Tirmidhi].

ముఖ్యాంశాలు

ఇంతకు ముందు వచ్చిన హదీసుల్లో దైవప్రవక్త ﷺ గారి ఆచరణ వివరించబడింది. ఈ హదీసులోనేమో ఆయన ఆదేశం పొందుపరచబడింది. మొత్తానికి ఫజ్ర్ యొక్క సున్నత్ నమాజ్ తర్వాత కాసేపు కుడివైపునకు తిరిగి పడుకోవటమనేది దైవప్రవక్త ﷺ ఆచరణ మరియు ఆదేశం- రెండింటి ద్వారా రుజువయిందని బోధపడుతోంది. ఇది దైవప్రవక్త సంప్రదాయం అనటంలో ఎలాంటి సందేహం లేదు.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|మహత్యాల ప్రకరణం|198. ఫజ్ర్‌వేళ రెండు రకాతుల సున్నత్ తర్వాత కాసేపు కుడివైపుకు తిరిగి పడుకోవటం అభిలషణీయం, ఇంకా తహజ్జుద్ నమాజ్ చేసినా చేయకపోయినా ప్రజల్ని దానికోసం పురికొల్పటం గురించి…|హదీసు 1112