హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: ఇమామ్ అబూ జకరియ్యా యహ్యా బిన్ షరఫ్ అన్ నవవీ (రహ్మతుల్లాహి అలైహి)
ఉర్దూ అనువాదం, వ్యాఖ్యానం: హాఫిజ్ సలాహుద్దీన్ యూసుఫ్ · తెలుగు రూపం: హాఫిజ్ ఎస్.ఎమ్. రసూల్ షర్ఫీ · ప్రకాశకులు: ట్రూత్ పబ్లికేషన్స్, హైదరాబాద్

రియాదుస్ సాలిహీన్ (హదీసు కిరణాలు) – 196వ అధ్యాయం: ఉదయపు నమాజులో రెండు రకాతుల సున్నత్ విషయమై తాకీదు. ఈ అధ్యాయంలో 4 హదీసులు (హదీసు 1100 – 1103) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, ముఖ్యాంశాలు, English అనువాదంతో.
196. ఉదయపు నమాజులో రెండు రకాతుల సున్నత్ విషయమై తాకీదు
باب تأكيد ركعتي سنَّةِ الصبح
అరబీ పాఠం: రియాదుస్ సాలిహీన్ – తహ్ఖీఖ్: షుఐబ్ అల్ అర్నావూత్ (ముఅస్సస్సతుర్ రిసాలా)
హదీసు 1100
عن عائشةَ رضِيَ اللَّه عنْهَا، أَنَّ النَّبِيَّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم كانَ لا يدَعُ أَرْبعاً قَبْلَ الظُّهْرِ، ورَكْعَتَيْنِ قبْلَ الغَدَاةِ. رَوَاهُ البُخَارِيُّ.
హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) కథనం: దైవప్రవక్త ﷺ జుహ్ర్‌కు ముందు నాలుగు రకాతులను, ఉదయానికి (ఫజ్ర్కు) ముందు రెండు రకాతులను ఎన్నడూ వదలిపెట్టేవారు కాదు. (బుఖారీ)
(సహీహ్ బుఖారీలోని నమాజ్ ప్రకరణం)
English
`Aishah (radiyallahu anha) reported: The Prophet ﷺ never omitted four Rak`ah prayer before the Zuhr prayer and two Rak`ah prayers before dawn (Fajr) prayer.[Al-Bukhari].
ముఖ్యాంశాలు
దైవప్రవక్త ﷺ జుహర్కు ముందు నాలుగు రకాతుల సున్నత్ నమాజును, ఫజ్ర్కు ముందు రెండు రకాతుల సున్నత్ నమాజును క్రమం తప్పకుండా పాటించేవారని ఈ హదీసులో చెప్పబడింది. ఇలాంటి నమాజులనే 'సుననె రవాతిబ్' లేక 'సుననె ముఅక్కదా' అని పిలుస్తారు.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|మహత్యాల ప్రకరణం|196. ఉదయపు నమాజులో రెండు రకాతుల సున్నత్ విషయమై తాకీదు|హదీసు 1100
హదీసు 1101
وعنها قالت: لَمْ يَكُنِ النَّبِيُّ صلى الله عليه وسلم, عَلَى شَيْءٍ مِنَ النَّوَافِلِ أشَدَّ تَعَاهُدَاً مِنهُ عَلَى رَكْعَتَي الفَجْرِ. متفقٌ عَلَيهِ.
హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) గారే చేసిన కథనం: దైవప్రవక్త ﷺ ఫజ్ర్ వేళ చేసే రెండు రకాతుల (సున్నత్) నమాజ్ విషయంలో చాలా జాగ్రత్త వహించేవారు. ఆ విధంగా మరే నఫిల్ నమాజ్ విషయంలోనూ ఆయన అంత జాగ్రత్త కనబరిచేవారు కాదు.
(బుఖరీ-ముస్లిం)
(సహీహ్ బుఖారీలోని నమాజ్ ప్రకరణం- సహీహ్ ముస్లింలోని ప్రయాణీకుల నమాజ్ ప్రకరణం)
English
`Aishah (radiyallahu anha) reported: The Prophet ﷺ did not attach more importance to any Nawafil prayer than the two Rak`ah of prayer before dawn (Fajr) prayer.[Al-Bukhari and Muslim].
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|మహత్యాల ప్రకరణం|196. ఉదయపు నమాజులో రెండు రకాతుల సున్నత్ విషయమై తాకీదు|హదీసు 1101
హదీసు 1102
وَعنْها عَنِ النبيِّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قالَ: "رَكْعتا الفجْرِ خيْرٌ مِنَ الدُّنيا ومَا فِيها "رواه مسلم. وفي ورايةٍ: "لَهُمَا أَحب إِليَّ مِنَ الدُّنْيا جميعاً ".
హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) గారే చేసిన కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఈ విధంగా ప్రవచించారు: ఫజ్ర్ వేళ చేసే రెండు రకాతుల (సున్నత్) నమాజు – ప్రపంచం మరియు అందులో ఉన్న వస్తువులన్నిటికంటే శ్రేష్ఠమైనది. (ముస్లిం)
ముస్లింలోని వేరొక ఉల్లేఖనంలో ఇలా ఉంది: ఆ రెండు రకాతులు నాకు ప్రపంచమంతటి కన్నా ప్రియమైనవి.
(సహీహ్ ముస్లింలోని ప్రయాణీకుల నమాజ్ ప్రకరణం)
English
`Aishah (radiyallahu anha) reported: The Prophet ﷺ said, “The two Rak`ah before the dawn (Fajr) prayer are better than this world and all it contains.”[Muslim]
Another narration goes: “The two Rak`ah before the dawn (Fajr) prayer are dearer to me than the whole world.”
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|మహత్యాల ప్రకరణం|196. ఉదయపు నమాజులో రెండు రకాతుల సున్నత్ విషయమై తాకీదు|హదీసు 1102
హదీసు 1103
وعنْ أَبي عبدِ اللَّهِ بِلالِ بنِ رَبَاحٍ رضيَ اللَّه عنْهُ، مُؤَذِّنِ رسولِ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم أَنَّهُ أَتَى رَسُولَ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم لِيُؤذِنَه بِصَلاةِ الغدَاةِ، فَشَغَلتْ عَائشَةُ بِلالاً بِأَمْرٍ سَأَلَتهُ عَنْهُ حَتى أَصبَحَ جِدًّا، فَقَامَ بِلالٌ فَآذنَهُ بِالصَّلاةِ، وتَابَعَ أَذَانَهُ، فَلَم يَخْرُجْ رَسُولُ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم، فَلَمَّا خَرَج صلَّى بِالنَّاسِ، فَأَخبَرهُ أَنَّ عائشَةَ شَغَلَتْهُ بِأَمْرٍ سَأَلَتْهُ عنْهُ حَتَّى أَصبحَ جِدّاً، وأَنَّهُ أَبطَأَ عَلَيهِ بالخُروجِ، فَقَال يَعْني النَّبيَّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "إِني كُنْتُ رَكَعْتُ رَكْعْتَي الفَجْرِ"فقالَ: يَا رَسُولَ اللَّهِ إِنَّك أَصْبَحْتَ جِدًّا؟ فقالَ:"لوْ أَصبَحتُ أَكْثَرَ مِما أَصبَحتُ، لرَكعْتُهُما، وأَحْسنْتُهُمَا وَأَجمَلْتُهُمَا" رواه أَبو دَاوُدَ بإِسناد حسن.
దైవప్రవక్త ﷺ గారి ముఅజ్జిన్ అయిన హజ్రత్ అబూ అబ్దుల్లాహ్ బిలాల్ బిన్ రబాహ్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం ఓ రోజు తను దైవప్రవక్త ﷺకు ఉదయం నమాజు గురించి తెలియజేద్దామని ఆయన వద్దకు వెళ్ళారు. అప్పుడే హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) బిలాల్ (రదియల్లాహు అన్హు)ని ఏదో విషయం అడిగారు. ఆయన ఆమె (ప్రశ్నకు జవాబు చెప్పే) పనిలో నిమగ్నులై ఉన్నంతలోనే బాగా తెల్లవారింది. ఇక అప్పుడు బిలాల్ (రదియల్లాహు అన్హు) తేరుకొని దైవప్రవక్తకు నమాజ్ వేళ అయిందని తెలియజేశారు. ఎన్నోసార్లు తెలియజేశారు. అయినా ఆయన మాత్రం బయటికి రాలేదు.
మరికాసేపటికి బయటికి వచ్చి ప్రజలకు నమాజ్ చేయించారు. అప్పుడు బిలాల్ (రదియల్లాహు అన్హు) తనను ఆయిషా (రదియల్లాహు అన్హా) ఒక విషయం అడిగారని, ఆమెకు జవాబు చెప్పే పనిలో నిమగ్నుణ్ణయి ఉండగా బాగా తెల్లారిపోయిందని దైవప్రవక్త ﷺకు సంజాయిషీ చెప్పుకున్నారు. ఆ తర్వాత ఆయన ఆలస్యంగా బయటికి రావటానికి కారణమేమిటో అడిగారు. అందుకు దైవప్రవక్త ﷺ "ఆ సమయంలో నేను ఫజ్ర్కు సంబంధించిన రెండు రకాతుల (సున్నత్) నమాజ్ చేస్తూ ఉన్నాను" అని చెప్పారు. అందుకు బిలాల్ (రదియల్లాహు అన్హు) 'ఏమైనప్పటికీ తమరు బాగా తెల్లారిన తర్వాతగాని బయటికి రాలేదు' అని అన్నారు. అప్పుడు ఆయన 'దీనికన్నా ఎక్కువ తెల్లారినప్పటికీ నేను ఆ రెండు రకాతుల సున్నత్ నమాజ్‌ను సక్రమంగా, అత్యుత్తమరీతిలో నెరవేరుస్తాను' అని చెప్పారు. (అబూదావూద్, ఆధారాలు హసన్ కోవకు చెందినవి)
(సుననె అబూదావూద్‌లోని నమాజ్ ప్రకరణం)
English
Abu `Abdullah Bilal bin Rabah (radiyallahu anhu) the Mu’adhdhin of Messenger of Allah ﷺ reported: I went to inform the Messenger of Allah ﷺ about the time of the dawn (Fajr) prayer, and `Aishah (radiyallahu anha) kept me busy and began to ask me about something till the day grew bright. Then I got up and informed the Messenger of Allah ﷺ of the time of Salat. I informed him again but he did not came out immediately to lead As-Salat. When he came out, he led As-Salat. I said to him: `Aishah (radiyallahu anha) kept me busy and thus diverted my attention by asking about something and the morning grew bright. You also came out late. Upon that the Messenger of Allah ﷺ said, “I was engaged in performing two Rak`ah of Fajr prayer.” Bilal (radiyallahu anhu) said: “O Messenger of Allah! You delayed As-Salat so long as the morning grew bright.” He ﷺ replied, “Even if the morning had become brighter than it had, I would have performed two Rak`ah of prayer in an excellent manner.”[Abu Dawud].
ముఖ్యాంశాలు
ఫజ్ర్ వేళ చేయవలసిన రెండు రకాతుల సున్నత్ నమాజు ఘనత ఏమిటో దీనిద్వారా బోధపడుతోంది. అంతేకాదు, వాటిని అత్యుత్తమ రీతిలో, అత్యంత భక్తిశ్రద్ధలతో ఆచరించాలని కూడా తెలుస్తోంది. మొత్తానికి ఇంతవరకు పేర్కొనబడిన హదీసులన్నీ రుజువు చేసేదేమిటంటే ఫజ్ర్ వేళ చేసే రెండు రకాతుల సున్నతుకు ఎంతో విశిష్ఠత ఉంది. కనుక ఆ నమాజ్ చేయాలి. అలసత్వం, సోమరితనంతో దాన్ని నిర్లక్ష్యం చేయరాదు.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|మహత్యాల ప్రకరణం|196. ఉదయపు నమాజులో రెండు రకాతుల సున్నత్ విషయమై తాకీదు|హదీసు 1103
You must be logged in to post a comment.