హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) – 195. ఫర్జ్ నమాజులతోపాటు సున్నతె ముఅక్కద ఘనత

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: ఇమామ్ అబూ జకరియ్యా యహ్యా బిన్ షరఫ్ అన్ నవవీ (రహ్మతుల్లాహి అలైహి)
ఉర్దూ అనువాదం, వ్యాఖ్యానం: హాఫిజ్ సలాహుద్దీన్ యూసుఫ్ · తెలుగు రూపం: హాఫిజ్ ఎస్.ఎమ్. రసూల్ షర్ఫీ · ప్రకాశకులు: ట్రూత్ పబ్లికేషన్స్, హైదరాబాద్

రియాదుస్ సాలిహీన్ – హదీసు కిరణాలు (ఇమామ్ నవవీ) – అరబీ, తెలుగు, English

రియాదుస్ సాలిహీన్ (హదీసు కిరణాలు) – 195వ అధ్యాయం: ఫర్జ్ నమాజులతోపాటు సున్నతె ముఅక్కద ఘనత. ఈ అధ్యాయంలో 3 హదీసులు (హదీసు 1097 – 1099) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, ముఖ్యాంశాలు, English అనువాదంతో.

195. ఫర్జ్ నమాజులతోపాటు సున్నతె ముఅక్కద ఘనత…

↑ విషయ సూచిక

بابُ فَضْلِ السنَنِ الراتِبِة مَعَ الفَرَائِضِ وبيانِ أَقَلِّهَا وأَكْمَلِها وما بينَهُما

అరబీ పాఠం: రియాదుస్ సాలిహీన్ – తహ్‌ఖీఖ్: షుఐబ్ అల్ అర్నావూత్ (ముఅస్సస్సతుర్ రిసాలా)

1097

హదీసు 1097

عنْ أُمِّ المؤمِنِينَ أُمِّ حبِيبَةَ رَمْلةَ بِنتِ أَبي سُفيانَ رضيَ اللَّه عَنهما، قَالتْ: سَمِعْتُ رسولَ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم يقولُ: " مَا مِنْ عبْدٍ مُسْلِم يُصَلِّي للَّهِ تَعَالى كُلَّ يَوْمٍ ثِنْتَيْ عشْرةَ رَكْعَةً تَطوعاً غَيْرَ الفرِيضَةِ، إِلاَّ بَنَى اللَّه لهُ بَيْتاً في الجَنَّةِ، أَوْ: إِلاَّ بُنِي لَهُ بيتٌ فِي الجنَّةِ" رواه مسلم.

దైవప్రవక్త ﷺ ఈ విధంగా ప్రవచిస్తుండగా తాను విన్నానని విశ్వాసుల మాతృమూర్తి హజ్రత్ ఉమ్మె హబీబా రమ్లా బిన్తె అబూ సుఫ్యాన్ తెలియజేశారు: ఏ ముస్లిం దాసుడయినా అల్లాహ్ కోసం ప్రతిరోజూ ఫర్జ్ నమాజులు కాక (అదనంగా) పన్నెండు రకాతుల నఫిల్ నమాజ్ చేస్తాడో, అల్లాహ్ అతనికోసం స్వర్గంలో ఒక గృహాన్ని నిర్మిస్తాడు (లేక) అతనికోసం స్వర్గంలో ఒక గృహం నిర్మించబడుతుంది (అని అన్నారు). (ముస్లిం)

(సుననె ముస్లింలోని ప్రయాణీకుల నమాజ్ ప్రకరణం)

English

Umm Habibah (radiyallahu anha) the Mother of the Believers reported: I heard the Messenger of Allah ﷺ saying, “A house will be built in Jannah for every Muslim who offers twelve Rak`ah of optional Salat other than the obligatory Salat in a day and a night (to seek the Pleasure of Allah).”[Muslim].

ముఖ్యాంశాలు

ఫర్జ్ (విధిగా చేయవలసిన) నమాజులుగాక అదనంగా, స్వచ్ఛందంగా చేసే నమాజులను 'నవాఫిల్' అంటారు. నవాఫిల్ అనేది నఫిల్‌కు బహువచనం. నఫిల్ నమాజులను పాటించటాన్ని అరబీలో 'తతవ్వూ' అని అంటారు. సాధారణంగా ఫర్జ్, వాజిబ్ నమాజులు మినహా, సున్నతె ముఅక్కదా, సున్నతె గైర్ ముఅక్కదా మొదలగు వాటినన్నిటిని నవాఫిల్‌గానే వ్యవహరిస్తారు. మొత్తానికి ఈ హదీసులో నఫిల్ నమాజుల ఘనత వివరించబడింది. నఫిల్ నమాజులు చేసే అలవాటు స్వర్గానికి గొనిపోతుందని చెప్పబడింది.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|మహత్యాల ప్రకరణం|195. ఫర్జ్ నమాజులతోపాటు సున్నతె ముఅక్కద ఘనత…|హదీసు 1097

1098

హదీసు 1098

وعَنِ ابنِ عُمَر رَضيَ اللَّه عنْهُما، قالَ: صَلَّيْتُ مَعَ رسُول اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم رَكْعَتَيْنِ قَبْلَ الظُّهْرِ، وَرَكْعَتَيْنِ بَعْدَهَا، ورَكْعَتيْنِ بَعْدَ الجُمُعةِ، ورَكْعتيْنِ بَعْد المغرِبِ، وركْعتيْنِ بعْد العِشَاءِ. متفقٌ عَلَيهِ.

హజ్రత్ ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హుమా) కథనం: నేను దైవప్రవక్త ﷺ వెంట జుహ్ర్ నమాజ్‌కు ముందు రెండు రకాతులు, జుహ్ర్ నమాజ్ తర్వాత రెండు రకాతులు, జుమా తర్వాత రెండు రకాతులు, మగ్రిబ్ తర్వాత రెండు రకాతులు, ఇషా తర్వాత రెండు రకాతుల నమాజ్ చేశాను.

(బుఖారీ-ముస్లిం)

(సహీహ్ బుఖారీలోని తహజ్జుద్ ప్రకరణం- సహీహ్ ముస్లింలోని ప్రయాణీకుల నమాజ్ ప్రకరణం)

English

Ibn `Umar (radiyallahu anhuma) reported: I performed along with the Messenger of Allah ﷺ two Rak`ah of optional prayers before Zuhr and two after the Zuhr (noon prayer), and two after the Friday prayer, and two after the Maghrib (evening) prayer, and two after the `Isha’ (night) prayer.”[Al-Bukhari and Muslim].

ముఖ్యాంశాలు

ప్రతి ఫర్జ్ నమాజుకు ముందు లేక తర్వాత అదనంగా చేసే నఫిల్ నమాజులను రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. వాటిలో మొదటి రకం: దైవప్రవక్త ﷺ క్రమం తప్పకుండా పాటించిన నమాజులు. వీటిని 'సుననె ముఅక్కదా' లేక 'సుననె రవాతిబ్' అని అంటారు. దైవప్రవక్త ﷺ ఈ నమాజులను తను స్వయంగా క్రమం తప్పకుండా చేయటంతోపాటు వాటిని నెరవేర్చమని తన అనుచర సమాజానికి కూడా తాకీదు చేశారు. పై హదీసులో ఈ రకమైన సున్నతుల గరిష్ఠ సంఖ్య పది రకాతులు అని చెప్పబడింది. మరికొన్ని ఉల్లేఖనాల ద్వారా వాటి గరిష్ఠ సంఖ్య పన్నెండు లేక పధ్నాలుగు రకాతులని బోధపడుతోంది.

ఇకపోతే దైవప్రవక్త ﷺ నిత్యం కాకుండా అప్పుడప్పుడూ చేసిన నమాజులను 'నవాఫిల్' లేక 'సుననె గైర్ ముఅక్కదా' అని అంటారు. అయితే దేవునితో ప్రత్యేక సంబంధాన్ని ఏర్పరచుకోవటంలో ఈ నఫిల్ నమాజులు ప్రముఖ పాత్ర వహిస్తాయి. కనుక విశ్వాసులు వీటిని నిర్వర్తించటంలో ప్రత్యేక ఆసక్తి కనబరుస్తారు. షరీఅత్ పరంగా చూస్తే నఫిల్ నమాజుల్ని పాటించటం వల్ల పుణ్యం లభిస్తుంది. ఒకవేళ పాటించకపోతే ఏ పాపం లేదు. మరొక విషయమేమిటంటే 'సున్నతె ముఅక్కదా' నమాజులను ఇంట్లో చేసుకోవటం ఉత్తమం. దైవప్రవక్త ﷺ స్వయంగా అలా చేసేవారు. పైగా తన సహచరుల్ని కూడా అలాగే చేయమని ప్రోత్సహించేవారు.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|మహత్యాల ప్రకరణం|195. ఫర్జ్ నమాజులతోపాటు సున్నతె ముఅక్కద ఘనత…|హదీసు 1098

1099

హదీసు 1099

وعنْ عبدِ اللَّهِ بن مُغَفَّلٍ رضِيَ اللَّه عنهُ، قَالَ: قالَ رسولُ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "بَيْنَ كُلِّ أَذانَيْنِ صَلاةٌ، بيْنَ كلِّ أَذَانيْنِ صَلاةٌ، بَيْنَ كُلِّ أَذَانَيْنِ صَلاةٌ"وقالَ في الثَالثَة:"لمَنْ شَاءَ" متفقٌ عَلَيهِ. المُرَادُ بالأَذَانَيْن: الأَذَانُ وَالإِقَامةُ.

హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ ముగప్ఫల్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺఈ విధంగా ప్రవచించారు: ప్రతి రెండు అజానుల మధ్య ఒక నమాజు ఉంది. ప్రతి రెండు అజానుల మధ్య ఒక నమాజు ఉంది. ప్రతి రెండు అజానుల మధ్య ఒక నమాజు ఉంది.

మూడోసారి ఆ మాట అన్నప్పుడాయన 'చేయదలచుకున్న వారికి' అని చెప్పారు. (బుఖారీ-ముస్లిం)

రెండు అజానులంటే అర్థం అజాన్ మరియు ఇఖామత్.

(సహీహ్ బుఖారీలోని అజాన్ ప్రకరణం- సహీహ్ ముస్లింలోని ప్రయాణీకుల నమాజ్ ప్రకరణం)

English

`Abdullah bin Mughaffal (radiyallahu anhu) reported: The Messenger of Allah ﷺ said, “There is a Salat (prayer) between every Adhan and Iqamah; there is a Salat between every Adhan and Iqamah.” (While saying the same for the) third time (he ﷺ added), “It is for him who desires (to perform it).”[Al-Bukhari and Muslim].

ముఖ్యాంశాలు

ప్రతి అజాన్‌కు మరియు ఇఖామత్‌కు మధ్య ఉండే విరామ సమయంలో రెండు రకాతుల నమాజ్ చేయటం అభిలషణీయం (ముస్తహబ్). ఈ నమాజుని గైర్ రాతిబా లేక గైర్ ముఅక్కదాగా వ్యవహరిస్తారు. ఐదు ఫర్జ్ నమాజు వేళల్లోనూ (అజాన్ తర్వాత ఇఖామత్‌కు ముందు) ఈ నఫిల్ నమాజు చేయవచ్చు. అయితే ఫజ్ర్ తర్వాత గైర్ ముఅక్కదా, నఫిల్ నమాజులు చేసే విషయంలో భిన్నాభిప్రాయాలున్నాయి. ఎందుకంటే దైవప్రవక్త ﷺగాని ఆయన సహచరులుగాని ఆ సమయంలో నఫిల్ నమాజులు చేసిన దాఖలాలు లేవు. వాస్తవం దేవునికే తెలుసు.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|మహత్యాల ప్రకరణం|195. ఫర్జ్ నమాజులతోపాటు సున్నతె ముఅక్కద ఘనత…|హదీసు 1099