హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) – 192. ఫజ్ర్, ఇషా సామూహిక నమాజులు

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: ఇమామ్ అబూ జకరియ్యా యహ్యా బిన్ షరఫ్ అన్ నవవీ (రహ్మతుల్లాహి అలైహి)
ఉర్దూ అనువాదం, వ్యాఖ్యానం: హాఫిజ్ సలాహుద్దీన్ యూసుఫ్ · తెలుగు రూపం: హాఫిజ్ ఎస్.ఎమ్. రసూల్ షర్ఫీ · ప్రకాశకులు: ట్రూత్ పబ్లికేషన్స్, హైదరాబాద్

రియాదుస్ సాలిహీన్ – హదీసు కిరణాలు (ఇమామ్ నవవీ) – అరబీ, తెలుగు, English

రియాదుస్ సాలిహీన్ (హదీసు కిరణాలు) – 192వ అధ్యాయం: ఫజ్ర్ మరియు ఇషా సామూహిక నమాజుల్లో పాల్గొనమని పురికొల్పటం గురించి. ఈ అధ్యాయంలో 3 హదీసులు (హదీసు 1071 – 1073) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, ముఖ్యాంశాలు, English అనువాదంతో.

192. ఫజ్ర్ మరియు ఇషా సామూహిక నమాజుల్లో పాల్గొనమని పురికొల్పటం గురించి

↑ విషయ సూచిక

باب الحثِّ عَلَى حضور الجماعة في الصبح والعشاء

అరబీ పాఠం: రియాదుస్ సాలిహీన్ – తహ్‌ఖీఖ్: షుఐబ్ అల్ అర్నావూత్ (ముఅస్సస్సతుర్ రిసాలా)

1071

హదీసు 1071

عنْ عثمانَ بنِ عفانَ رضيَ اللَّه عنهُ قالَ: سمعتُ رسولَ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم يقولُ: "مَنْ صَلَّى العِشَاءَ فِي جَمَاعَةٍ، فَكَأَنَّما قامَ نِصْف اللَّيْل وَمَنْ صَلَّى الصبْح في جَمَاعَةٍ، فَكَأَنَّما صَلَّى اللَّيْل كُلَّهُ" رواه مُسلِم. وفي روايةِ الترمذي عنْ عثمانَ بنِ عفانَ رضي اللَّه عنهُ قَالَ: قَالَ رسولُ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "مَنْ شَهِدَ العِشَاءَ فِي جمَاعةٍ كَانَ لهُ قِيامُ نِصْفِ لَيْلَة، ومَنْ صَلَّى العِشَاءَ والْفَجْر فِي جمَاعَةٍ، كَانَ لَهُ كَقِيَامِ لَيْلَة" قَالَ التِّرمذي: حديثٌ حسن صحيحٌ.

దైవప్రవక్త ﷺ ఇలా ప్రబోధిస్తుండగా తాను విన్నానని హజ్రత్ ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్ (రదియల్లాహు అన్హు) తెలియజేశారు: ఎవరయినా ఇషా నమాజును సామూహికంగా నెరవేరిస్తే వారు అర్ధరాత్రి వరకు దైవారాధనలో గడిపినట్లే. మరెవరయితే ఫజ్ర్ నమాజును సామూహికంగా నెరవేరుస్తారో వారు రాత్రంతా నమాజ్ చేసినట్లే. (ముస్లిం)

తిర్మిజీలోని ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్(రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఈ విధంగా ప్రవచించారు: ఇషాకు సంబంధించిన సామూహిక నమాజులో పాల్గొన్నవారికి అర్ధరాత్రి వరకు నమాజ్ చేసినంత పుణ్యం లభిస్తుంది. ఇషా మరియు ఫజ్ర్‌లకు సంబంధించిన సామూహిక నమాజుల్లో పాల్గొనేవారికి ఒక రాత్రంతా నమాజ్ చేసినంత పుణ్యం లభిస్తుంది.

(ఇమామ్ తిర్మిజీ ఈ హదీసును 'హసన్' 'సహీహ్'గా పేర్కొన్నారు.)

(సహీహ్ ముస్లింలోని ప్రార్థనా స్థలాల ప్రకరణం- సుననె తిర్మిజీలోని నమాజ్ అధ్యాయాలు)

English

`Uthman bin `Affan (radiyallahu anhu) reported: I heard the Messenger of Allah ﷺ saying: “One who performs `Isha’ prayer in congregation, is as if he has performed Salat for half of the night. And one who performs the Fajr prayer in congregation, is as if he has performed Salat the whole night.”[Muslim]

The narration of At-Tirmidhi says: `Uthman bin Affan (radiyallahu anhu) narrated that he had heard the Messenger of Allah ﷺ saying: “He who attends `Isha’ in congregation, is as if he has performed Salat for half of the night; and he who attends `Isha’ and Fajr prayers in congregation, is as if he has performed Salat for the whole night.”

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|మహత్యాల ప్రకరణం|192. ఫజ్ర్ మరియు ఇషా సామూహిక నమాజుల్లో పాల్గొనమని పురికొల్పటం గురించి|హదీసు 1071

1072

హదీసు 1072

وعن أَبي هُريرة رضيَ اللَّه عنهُ أَنَّ رسولَ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَالَ: " وَلَوْ يعْلَمُونَ مَا في العَتمَةِ والصُّبْحِ لأَتَوْهُما وَلَو حبْوًا" متفقٌ عَلَيْهِ. وقد سبق بطوِلهِ.

హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం, దైవప్రవక్త ﷺ ఈ విధంగా ప్రవచించారు: ఇషా మరియు ఫజ్ర్ నమాజుల్ని (సామూహికంగా) చేయటంలో ఎంత పుణ్యం ఉందో ప్రజలకు తెలిస్తే, వాటి కోసం మోకాళ్ళు ఈడ్చుకుంటూ నడవవలసివచ్చినా సరే వారు తప్పకుండా వస్తారు.

(బుఖారీ-ముస్లిం)

ఈ హదీసు ఇంతకు ముందే వివరంగా వచ్చింది.

English

Abu Hurairah (radiyallahu anhu) reported: The Messenger of Allah ﷺ said, “If they knew the merits of Salat after nightfall (`Isha’) and the morning (Fajr) Salat, they would come to them even if they had to crawl to do so.”[Al-Bukhari and Muslim]

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|మహత్యాల ప్రకరణం|192. ఫజ్ర్ మరియు ఇషా సామూహిక నమాజుల్లో పాల్గొనమని పురికొల్పటం గురించి|హదీసు 1072

1073

హదీసు 1073

وعنهُ قَالَ: قال رسولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "لَيْسَ صَلاةٌ أَثْقَلَ عَلَى المُنَافِقينَ مِنْ صَلاَةِ الفَجْرِ وَالعِشاءِ وَلَوْ يَعْلَمُونَ مَا فِيهما لأَتَوْهُما وَلَوْ حبْوًا" متفقٌ عَلَيهِ.

హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) గారే చేసిన కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఈ విధంగా ప్రవచించారు: కపట విశ్వాసులకు ఫజ్ర్ మరియు ఇషా నమాజులకన్నా బరువైన నమాజ్ మరొకటి లేదు. ఆ రెండింటిని నెరవేర్చటంలో ఎంతపుణ్యం ఉందో వారికి తెలిస్తే, వాటి కోసం మోకాళ్ళు ఈడ్చుకుంటూ నడవవలసి వచ్చినా సరే వారు తప్పకుండా, పోటిపడి మరీ వస్తారు. (బుఖారీ-ముస్లిం)

(సహీహ్ బుఖారీలోని అజాన్ ప్రకరణం – సహీహ్ ముస్లింలోని ప్రార్థనా స్థలాల ప్రకరణం)

English

Abu Hurairah (radiyallahu anhu) reported: The Messenger of Allah ﷺ said, “No Salat is more burdensome to the hypocrites than the Fajr (dawn) prayer and the `Isha’ (night) prayer; and if they knew their merits, they would come to them even if they had to crawl to do so.”[Al-Bukhari and Muslim].

ముఖ్యాంశాలు

కటప విశ్వాసులు ఇతరులకు చూపించే ఉద్దేశ్యంతో నమాజ్ చేస్తారు. కనుక ఫజ్ర్ మరియు ఇషా నమాజుల్లో తాము పాల్గొన్నా, చీకటి మూలంగా ఎవరూ తమల్ని గుర్తుపట్టరు. ఆ విధంగా వారి అభిప్రాయం ప్రకారం ఆ నమాజుల వల్ల పెద్దగా ఒరిగే ప్రయోజనం ఏమీ ఉండదు. అందుకే ఆ నమాజుల్లో పాల్గొనటం, వారి మనసులకు పెద్ద బరువుగా తోస్తుంది.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|మహత్యాల ప్రకరణం|192. ఫజ్ర్ మరియు ఇషా సామూహిక నమాజుల్లో పాల్గొనమని పురికొల్పటం గురించి|హదీసు 1073