హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: ఇమామ్ అబూ జకరియ్యా యహ్యా బిన్ షరఫ్ అన్ నవవీ (రహ్మతుల్లాహి అలైహి)
ఉర్దూ అనువాదం, వ్యాఖ్యానం: హాఫిజ్ సలాహుద్దీన్ యూసుఫ్ · తెలుగు రూపం: హాఫిజ్ ఎస్.ఎమ్. రసూల్ షర్ఫీ · ప్రకాశకులు: ట్రూత్ పబ్లికేషన్స్, హైదరాబాద్

రియాదుస్ సాలిహీన్ (హదీసు కిరణాలు) – 191వ అధ్యాయం: సామూహిక నమాజ్ ఘనత. ఈ అధ్యాయంలో 7 హదీసులు (హదీసు 1064 – 1070) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, ముఖ్యాంశాలు, English అనువాదంతో.
191. సామూహిక నమాజ్ ఘనత
باب فضل صلاة الجماعة
అరబీ పాఠం: రియాదుస్ సాలిహీన్ – తహ్ఖీఖ్: షుఐబ్ అల్ అర్నావూత్ (ముఅస్సస్సతుర్ రిసాలా)
హదీసు 1064
عن ابنِ عمَر رضي اللَّه عنهما أَنَّ رسولَ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَالَ: "صَلاةُ الجَمَاعَةِ أَفضَلُ مِنْ صَلاةِ الفَذِّ بِسَبْعٍ وَعِشْرِينَ درَجَةً" متفقٌ عليه.
హజ్రత్ ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హుమా) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఈ విధంగా ప్రవచించారు: సామూహికంగా చేసే నమాజ్ ఒంటరిగా చేసే నమాజ్ కంటే ఇరవై ఏడు రెట్లు శ్రేష్ఠమైనది.
(బుఖారీ-ముస్లిం)
(సహీహ్ బుఖారీలోని అజాన్ ప్రకరణం- సహీహ్ ముస్లింలోని ప్రార్థనా స్థలాల ప్రకరణం)
English
Ibn `Umar (radiyallahu anhuma) reported: The Messenger of Allah ﷺ said, “Salat in congregation is twenty-seven times more meritorious than a Salat performed individually.”[Al-Bukhari and Muslim].
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|మహత్యాల ప్రకరణం|191. సామూహిక నమాజ్ ఘనత|హదీసు 1064
హదీసు 1065
وعن أَبي هريرة رضيَ اللَّه عنهُ قَالَ: قَالَ رسولُ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "صَلاةُ الرَّجُلِ في جَماعةٍ تُضَعَّفُ عَلى صلاتِهِ فِي بَيْتِهِ وفي سُوقِهِ خَمْساً وَعِشْرينَ ضِعفًا، وذلكَ أَنَّهُ إِذا تَوَضَّأَ فَأَحْسَنَ الْوُضُوءَ ثُمَّ خَرَجَ إِلى المَسْجِدِ، لا يُخْرِجُه إِلاَّ الصَّلاةُ، لَمْ يَخْطُ خَطْوةً إِلاَّ رُفِعَتْ لَه بهَا دَرَجَةٌ، وَحُطَّتْ عَنْه بهَا خَطِيئَةٌ، فَإِذا صَلى لَمْ تَزَلِ المَلائِكَة تُصَلِّي عَلَيْهِ مَا دَامَ في مُصَلاَّه، مَا لَمْ يُحْدِثْ، تَقُولُ: اللَّهُمَّ صَلِّ عَلَيْهِ، اللَّهُمَّ ارحَمْهُ. وَلا يَزَالُ في صَلاةٍ مَا انْتَظَرَ الصَّلاةَ" متفقٌ عَلَيهِ. وهذا لفظ البخاري.
హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఈ విధంగా ప్రవచించారు: మనిషి తన ఇంట్లో లేక వీధిలో చేసే నమాజ్ కన్నా సామూహికంగా చేసే నమాజుకు పాతిక రెట్లు ఎక్కువ పుణ్యం లభిస్తుంది. ఈ విధంగా ఎక్కువ రెట్లు పుణ్యం లభించటానికి కారణమేమిటంటే, మనిషి చక్కగా వుజూ చేసుకొని కేవలం నమాజు చేసే ఉద్దేశ్యంతో వెళ్తుంటే, ఆ సమయంలో అతను వేసే ప్రతి అడుగుకు దేవుడు ఒక్కొక్కటి చొప్పున అతని అంతస్తులను పెంచుతాడు. అంతేకాదు, అతని వల్ల జరిగిన పాపాలను కూడా ఒక్కొక్కటిగా తుడిచిపెట్టేస్తాడు. అతను నమాజ్ చేస్తూ వుజూతో ఉన్నంతవరకూ దైవదూతలు అతని మీద శాంతి కురవాలని ప్రార్థిస్తూ, "అల్లాహ్! ఇతనిపై శాంతి కురిపించు. అల్లాహ్! ఇతణ్ణి కనికరించు" అని అంటూ ఉంటారు. మస్జిద్లో ప్రవేశించిన తర్వాత సామూహిక నమాజ్ కోసం అతను ఎంతసేపు నిరీక్షిస్తాడో అంతసేపూ అతను నమాజ్‌లో ఉన్నట్లుగానే పరిగణించబడతాడు. (అంటే అతనికి అంత పుణ్యం లభిస్తుందన్నమాట).
(బుఖారీ-ముస్లిం)
English
Abu Hurairah (radiyallahu anhu) reported: The Messenger of Allah ﷺ said, “A man’s Salat in congregation is twenty-five times more rewarding than his Salat at home or in his shop, and that is because when he performs his Wudu’ properly and proceeds towards the mosque with the purpose of performing Salat in congregation, he does not take a step without being raised a degree (in rank) for it and having a sin remitted for it, till he enters the mosque. When he is performing Salat, the angels continue to invoke Blessings of Allah on him as long as he is in his place of worship in a state of Wudu’. They say: `O Allah! Have mercy on him! O Allah! Forgive him.’ He is deemed to be engaged in Salat as long as he waits for it.”[Al-Bukhari and Muslim].
ముఖ్యాంశాలు
పైన పేర్కొనబడిన రెండు హదీసుల్లోనూ ఒంటరిగా చేసే నమాజ్ కన్నా సామూహికంగా చేసే నమాజ్ ఎంతో శ్రేష్ఠమైనదనే విషయం బోధించబడింది. అయితే ఎన్ని రెట్లు శ్రేష్ఠమైనదనే విషయంలో రెండింటి మధ్య కాస్తంత వైరుధ్యం కనిపిస్తుంది. మొదటి హదీసులో ఇరవై ఏడు రెట్లు శ్రేష్ఠమైనదని పేర్కొనబడితే, రెండవ హదీసులో ఇరవై ఐదు రెట్లు శ్రేష్ఠమైనదని చెప్పబడింది.
పై రెండు హదీసులను సమన్వయపరుస్తూ కొంతమంది పండితులు, మొదట్లో దైవప్రవక్త ﷺకు వహీ ద్వారా ఇరవై ఐదు రెట్ల శ్రేష్ఠత మాత్రమే తెలుపబడిందని, ఆ తర్వాత కాలక్రమంలో దాని శ్రేష్ఠత ఇరవై ఏడు రెట్లకు పెంచబడిందని, అయితే ఆయన తన సహచరులకు వహీ ద్వారా అందిన సమాచారం ప్రకారం బోధించటం చేత ఉల్లేఖకుల ఉల్లేఖనాల్లో ఈ వైవిధ్యం చోటుచేసుకున్నదని అభిప్రాయపడ్డారు. నమాజ్‌ను ఎంత ఎక్కువ భక్తీశ్రద్ధలతో నెరవేరిస్తే అన్ని ఎక్కువ రెట్లు శ్రేష్ఠత లభిస్తుందని మరికొంతమంది పండితులు అభిప్రాయపడ్డారు.
అయితే ఇన్ని రెట్ల శ్రేష్ఠత ఏ విధమైన సామూహిక నమాజ్‌కు లభిస్తుంది? ఇంట్లో, వీధిలో, మైదానంలో ఎక్కడ సామూహికంగా నమాజ్ చేసినా లభిస్తుందా? లేక ఈ ఆజ్ఞ మస్జిదుల్లో చేసే సామూహిక నమాజ్‌కు మాత్రమే పరిమితమా? అనే ప్రశ్నలు ఈ సందర్భంగా జనించటం సహజమే. ఈ విషయమై కొందరు పండితులు మొదటి అభిప్రాయాన్ని ఎన్నుకుంటే మరికొందరు రెండో అభిప్రాయాన్ని సమర్థించారు. ఇమామ్ ఇబ్నె హజర్ (రహిమహుల్లాహ్) రెండో అభిప్రాయాన్నే సమర్థించారు.
అదీగాక హదీసులోని "ఎక్కువ రెట్లు పుణ్యం లభించటానికి కారణమేమిటంటే" అనే వాక్యాలు కూడా ఈ విషయాన్నే సమర్థిస్తున్నాయి.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|మహత్యాల ప్రకరణం|191. సామూహిక నమాజ్ ఘనత|హదీసు 1065
హదీసు 1066
وعنهُ قالَ: أَتَى النبيَّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم رَجُلٌ أَعمى فقَالَ: يا رسولَ اللَّهِ، لَيْس لِي قَائِدٌ يقُودُني إِلي المَسْجِدِ، فَسأَلَ رسولَ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم أَن يُرَخِّصَ لَهُ فَيُصَليِّ فِي بيْتِهِ، فَرَخَّص لَهُ، فَلَمَّا وَلىَّ دَعَاهُ فَقَالَ لَهُ: "هلْ تَسْمَعُ النِّدَاءَ بِالصَّلاةِ؟ "قَالَ: نَعَمْ، قَالَ:"فَأَجِبْ" رواه مُسلِم.
హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు)గారే చేసిన కథనం: ఒక అంధుడు దైవప్రవక్త ﷺ దగ్గరికి వచ్చి, "దైవప్రవక్తా! నన్ను మస్జిద్దాకా తీసుకొని వచ్చేవారెవరూ లేరు" అని విన్నవించుకుంటూ తనకు ఇంట్లో నమాజ్ చేసుకునేందుకు రాయితీ కల్పించమని కోరాడు. దైవప్రవక్త ﷺ అతనికి ఆ మేరకు రాయితీనిచ్చారు. ఆ తర్వాత అతను తిరిగి వెళ్ళిపోతుండగా అతన్ని మళ్ళీ పిలిచి, 'నీకు నమాజ్ కోసం చేయబడే ప్రకటన (అజాన్) వినపడుతుందా?' అని అడిగారు. అతను 'వినపడుతుంద'న్నాడు. అప్పుడాయన 'అయితే దానికి హాజరు పలుకు (అంటే మస్జిద్కు వచ్చి నమాజ్ చెయ్యి)" అని ఆదేశించారు. (ముస్లిం)
(సహీహ్ ముస్లింలోని ప్రార్థనా స్థలాల ప్రకరణం)
English
Abu Hurairah (radiyallahu anhu) reported: A blind man came to the Messenger of Allah ﷺ and said: “O Messenger of Allah! I have no one to guide me to the mosque.” He, therefore, sought his permission to perform Salat (prayer) in his house. He ﷺ granted him permission. When the man turned away, he called him back, and said, “Do you hear the Adhan (call to prayer)?” He replied in the affirmative. The Messenger of Allah ﷺ then directed him to respond to it.[Muslim].
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|మహత్యాల ప్రకరణం|191. సామూహిక నమాజ్ ఘనత|హదీసు 1066
హదీసు 1067
وعن عبدِ اللَّهِ وَقِيلَ: عَمْرِو بْنِ قيْسٍ المعرُوف بابنِ أُمِّ مَكْتُوم المُؤَذِّنِ رضيَ اللَّه عنهُ أَنَّهُ قَالَ: يا رسولَ اللَّه إِنَّ المَدِينَةَ كَثيرَةُ الهَوَامِّ وَالسِّبَاعِ. فَقَالَ رسولُ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "تَسْمَعُ حَيَّ عَلى الصَّلاةِ، حَيًّ عَلى الفَلاحِ، فَحَيَّهَلاً". رَوَاهُ أبُو دَاوُدَ بإسناد حسن. ومعنى:"حَيَّهَلاً": تعال.
హజ్రత్ అబ్దుల్లాహ్ – కొంతమంది అభిప్రాయం ప్రకారం – అమ్ర్ బిన్ ఖైస్ ఉరఫ్ ముఅజ్జిన్ ఇబ్నె ఉమ్మె మక్తూమ్ (రదియల్లాహు అన్హు) ఒకసారి దైవప్రవక్త ﷺ దగ్గరకు వచ్చి, "దైవప్రవక్తా! మదీనాలో పురుగులు (పాములు, తేళ్ళు) క్రూర మృగాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. (కనుక మీరు నాకు ఇంట్లో నమాజ్ చేసుకోవటానికి అనుమతినివ్వండి)" అని మనవి చేసుకున్నారు. దానికి దైవప్రవక్త ﷺ, "నీకు హయ్య్ అలస్సలాహ్ మరియు హయ్య్ అలల్ ఫలాహ్ అనే పలుకులు వినిపిస్తాయా? ఒకవేళ వినిపిస్తే మస్జిద్కు రా" అని అన్నారు.
(అబూదావూద్- హసన్)
English
`Abdullah bin Umm Maktum, the Mu’adhdhin (radiyallahu anhu) reported: I said to the Messenger of Allah ﷺ: “There are many poisonous insects and wild beasts in Al-Madinah, and I am blind. Please grant me permission to perform Salat at home.” He ﷺ enquired whether he could hear the call: Hayya `alas-Salah; Hayya `alal-Falah (Come to the prayer, come to the salvation). When he replied in affirmative, the Messenger of Allah ﷺ directed him to come (to mosque) for prayer.”[Abu Dawud].
ముఖ్యాంశాలు
పై రెండు హదీసుల్లో పేర్కొనబడిన సంఘటన హజ్రత్ ఇబ్నె ఉమ్మె మక్తూమ్(రదియల్లాహు అన్హు)కు సంబంధించినదే. అయితే ఈయన అసలు పేరు విషయంలో భిన్నాభిప్రాయా లున్నాయి. కొంతమంది ఈయన పేరు అబ్దుల్లాహ్ అని అంటే, మరికొందరు అమ్ర్ బిన్ ఖైస్ అని అంటున్నారు. రెండోపేరు బహుళ ప్రచారంలో ఉంది. అత్యధిక మంది పండితులు కూడా ఈయన అసలు పేరు అదేనని భావిస్తున్నారు. ఏది ఏమైనా పై హదీసుల్లో ఇబ్నె ఉమ్మె మక్తూమ్గారు అంధులైనప్పటికీ దైవప్రవక్త ﷺ, సామూహిక నమాజ్ విషయమై ఆయనకు ఎలాంటి రాయితీ కల్పించలేదు. దీని ద్వారా ఇస్లాంలో సామూహిక నమాజ్‌కు ఎంతటి ప్రాముఖ్యం ఉందో బోధపడుతోంది.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|మహత్యాల ప్రకరణం|191. సామూహిక నమాజ్ ఘనత|హదీసు 1067
హదీసు 1068
وعن أبي هريرةَ رضي اللَّه عنهُ أَنَّ رسولَ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قالَ: "وَالَّذِي نَفْسِي بِيدِهِ لَقَدْ هَمَمْت أَن آمُرَ بحَطَبٍ فَيُحْتَطَب، ثُمَّ آمُرَ بالصَّلاةِ فَيُؤذَّنَ لَهَا، ثُمَّ آمُرَ رَجُلاً فَيُؤمَّ النَّاسَ ثُمَّ أُخَالِفَ إِلى رِجَالٍ فأُحَرِّقَ عَلَيْهِمْ بُيُوتَهمْ" متفقٌ عَلَيهِ.
హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఈ విధంగా ప్రవచించారు: ఎవరి చేతిలో నయితే నా ప్రాణముందో ఆ ప్రభువు సాక్షి! కట్టెలు సమీకరించమని, నమాజు కోసం అజాన్ ఇవ్వమని ఆజ్ఞాపించి, ప్రజలకు నమాజ్ చేయించటం కోసం (నా స్థానంలో) మరెవరినైనా నిలబెట్టి (సామూహిక నమాజులో పాల్గొనని) వారి దగ్గరకు నేను స్వయంగా వెళ్ళి వారిని వారి ఇండ్ల సమేతంగా తగలబెడదామని నేను ఎన్నోసార్లు అనుకున్నాను. (బుఖారీ-ముస్లిం)
(సహీహ్ బుఖారీలోని అజాన్ ప్రకరణం- సహీహ్ ముస్లింలోని ప్రార్థనా స్థలాల ప్రకరణం)
English
Abu Hurairah (radiyallahu anhu) reported: The Messenger of Allah ﷺ said, “By Him in Whose Hand my life is, I sometimes thought of giving orders for firewood to be collected, then for proclaiming the Adhan for Salat. Then I would appoint an Imam to lead Salat, and then go to the houses of those who do not come to perform Salat in congregation, and set fire to their houses on them.”[Al-Bukhari and Muslim].
ముఖ్యాంశాలు
స్థానికులు, ఆరోగ్యవంతులయినవారు మస్జిద్కు వెళ్ళి సామూహిక నమాజ్‌లో పాల్గొనటం విధి. అలాంటివారు ఒంటరిగా నమాజ్ చేసుకున్న పక్షంలో నమాజ్ నెరవేరినప్పటికీ ఒక విధిని విడిచి పెట్టినందుకు వారు పాపాత్ములుగా పరిగణించబడతారని పండితులు అభిప్రాయపడుతున్నారు. అందుకు ఈ హదీసుని, ఇంతకు ముందు వచ్చిన ఇబ్నె ఉమ్మె మక్తూమ్ హదీసుని నిదర్శనంగా చూపెడుతున్నారు. సామూహిక నమాజు ఫర్జ్ అయినందునే దానిగురించి అంతగా తాకీదు చేయబడింది, సామూహికంగా చేసే నమాజు ఒంటరిగా చేసే నమాజు కన్నా ఇరవై ఏడు రెట్లు శ్రేష్ఠమైనదని చెప్పబడింది. ఈ హదీసు ద్వారా బోధపడే ఇంకొక విషయం ఏమిటంటే, ఇండ్లల్లో దాక్కున్న వారిని అత్యవసర పరిస్థితుల్లో ఏ విధంగానయినా బయటికి తీయవచ్చు. అదే విధంగా నిందితుల్ని, నేరస్తుల్ని ఏమరుపాటులో ఉన్న స్థితిలో హఠాత్తుగా అరెస్టు చేయవచ్చు.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|మహత్యాల ప్రకరణం|191. సామూహిక నమాజ్ ఘనత|హదీసు 1068
హదీసు 1069
وعن ابنِ مسعودٍ رضي اللَّه عنهُ قال: مَنْ سَرَّه أَن يَلْقَي اللَّه تَعَالَى غداً مُسْلِمًا فَلْيُحَافِظْ عَلى هَؤُلاءِ الصَّلَوات حَيْثُ يُنادَى بهنَّ، فَإِنَّ اللَّهَ شَرَعَ لِنَبِيِّكم صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم سُنَنَ الهُدَى وَإِنَّهُنَّ مِن سُنَنِ الهُدى، وَلَو أَنَّكُمْ صلَّيْتم في بُيوتِكم كَمَا يُصَلِّي هذا المُتَخَلِّف فِي بَيتِهِ لَتَركتم سُنَّة نَبِيِّكم، ولَو تَركتم سُنَّةَ نَبِيِّكم لَضَلَلْتُم، ولَقَد رَأَيْتُنَا وَمَا يَتَخَلَّف عَنها إِلاَّ مُنَافِقٌ مَعْلُومُ النِّفَاق، وَلَقَدَ كانَ الرَّجُل يُؤتىَ بِهِ، يُهَادَي بيْنَ الرَّجُلَيْنِ حَتَّى يُقَامَ في الصَّفِّ. رَوَاهُ مُسلِم. وفي روايةٍ لَهُ قَالَ: إِنَّ رسولَ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم عَلَّمَنَا سُنَنَ الهُدَى، وَإِنَّ مِن سُننِ الهُدَى الصَّلاَة في المسَجدِ الَّذِي يُؤَذَّنُ فِيهِ
హజ్రత్ ఇబ్నె మస్‌వూద్ (రదియల్లాహు అన్హు) కథనం: రేపు (ప్రళయ దినాన) తానొక ముస్లింగా దేవుణ్ణి కలవాలనుకునే వ్యక్తి ఈ నమాజుల కొరకు అజాన్ (ప్రకటన) ఇవ్వబడినప్పుడల్లా వాటిని పరిరక్షించుకోవాలి, (అంటే వాటిని తప్పకుండా నెరవేర్చాలి.) ఎందుకంటే దేవుడు మీ ప్రవక్త కొరకు మార్గదర్శక పద్ధతుల్ని నిర్ణయించాడు. నమాజులు కూడా ఆ మార్గదర్శక పద్ధతుల్లోనివే. ఒకవేళ మీరు కూడా ఈ వెనక ఉండేవాని మాదిరిగా ఇంట్లో నమాజ్ చేసుకుంటే మీరు మీ ప్రవక్త విధానాన్ని వదలి పెట్టినవారవుతారు. మీరు గనక మీ ప్రవక్త విధానాన్ని విడిచి పెట్టినట్లయితే తప్పకుండా భ్రష్టత్వానికి లోనవుతారు.
మా కాలంలో నేను గమనించేవాణ్ణి- పేరెన్నికగన్న కపటులు మాత్రమే (సామూహిక నమాజ్‌లో పాల్గొనకుండా) వెనక ఉండిపోయేవారు. (వ్యాధి మొదలగు కారణాల చేత) నడవలేకపోతున్నవారిని ఇద్దరు మనుషుల సాయంతో తీసుకొని వచ్చి పంక్తిలో నిలబెట్టడం జరిగేది. (ముస్లిం)
ముస్లింలోని వేరొక ఉల్లేఖనంలో ఇలా ఉంది: దైవప్రవక్త ﷺ మాకు మార్గదర్శక పద్ధతులు నేర్పించారు. ఆ మార్గదర్శక పద్ధతుల్లో అజాన్ ఇవ్వబడే మస్జిద్లో నమాజ్ చేయటం కూడా ఒకటి.
(సహీహ్ ముస్లింలోని ప్రార్థనా స్థలాల ప్రకరణం)
English
Ibn Mas`ud (radiyallahu anhu) reported: He who likes to meet Allah tomorrow (i.e., on the Day of Requital) as a Muslim, should take care and observe the Salat when the Adhan is announced for them. Allah has expounded to your Prophet ﷺ the ways of right guidance, and these (the prayers) are part of the right guidance. If you have to perform Salat in your houses, as this man who stays away (from the mosque) and performs Salat in his house, you will abandon the Sunnah (practice) of your Prophet ﷺ, and the departure from the Sunnah of your Prophet ﷺ will lead you astray. I have seen the time when no one stayed behind except a well-known hypocrite. I also saw that a man was brought swaying (on account of weakness) between two men till he was set up in a row (in the mosque).[Muslim].
ముఖ్యాంశాలు
ఈ హదీసులో మొదటగా సామూహిక నమాజు గురించి తాకీదు చేయబడింది. తర్వాత దైవప్రవక్త సహచరులకు నమాజ్ పట్ల ఉండిన శ్రద్ధాసక్తులు వివరించబడ్డాయి. సామూహిక నమాజ్ పట్ల నిర్లక్ష్యం వహించటం కపటుల వైఖరి అని చెప్పబడింది. చివరగా దైవప్రవక్త విధానాన్ని అనుసరించమని పురికొల్పటం జరిగింది.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|మహత్యాల ప్రకరణం|191. సామూహిక నమాజ్ ఘనత|హదీసు 1069
హదీసు 1070
وعن أَبي الدرداءِ رضي اللَّه عنه قالَ: سَمِعتُ رسولَ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم يقول: "مَا مِن ثَلاثَةٍ فِي قَرْيَةٍ وَلاَ بَدْوٍ لا تُقَامُ فِيهمُ الصَّلاةُ إِلاَّ قدِ اسْتَحْوَذَ عَلَيْهِمُ الشَّيْطَانُ. فَعَلَيكُمْ بِالجَمَاعَةِ، فَإِنَّمَا يأْكُلُ الذِّئْبُ مِنَ الغَنمِ القَاصِيَةَ" رواه أبو داود بإِسناد حسن.
దైవప్రవక్త ﷺ ఈ విధంగా ప్రవచిస్తుండగా తాను విన్నానని హజ్రత్ అబూ దర్దా (రదియల్లాహు అన్హు) తెలియజేశారు: ఏ నగరంలోనయినా లేక అడవి ప్రాంతంలోనైనా ముగ్గురు వ్యక్తులుండి అక్కడ (సామూహిక) నమాజు నెలకొల్పబడకపోతే ఖచ్చితంగా వారిని షైతాన్ లోబరుచుకుంటాడు. కనుక మీరు సంఘటితులై ఉండండి. తోడేలు మంద నుండి దూరంగా ఉండే మేకనే తినగలుగుతుంది సుమా!
(అబూదావూద్)
(సుననె అబూదావూద్‌లోని నమాజ్ ప్రకరణం)
ముఖ్యాంశాలు:
ఈ హదీసులో కూడా సామూహిక నమాజు ప్రాముఖ్యత గురించి నొక్కి చెప్పబడింది. సామూహిక నమాజు చేయకపోవటం వల్ల కలిగే నష్టాల గురించి వివరించటం జరిగింది. జమాఅత్కు (సంఘానికి) దూరంగా ఉండే వ్యక్తి, మందలో నుంచి బయటికివెళ్ళి తోడేలుకు చిక్కే మేక వంటివాడనీ, అతన్ని కూడా షైతాన్ ఇలాగే తన కుశంకలు, దురనుమానాలతో చాలా సులభంగా వల్లో వేసుకుంటాడని ఇందులో చెప్పబడింది.
English
Abud-Darda’ (radiyallahu anhu) reported: I heard the Messenger of Allah ﷺ saying, “If three men in a village or in the desert, make no arrangement for Salat in congregation, Satan must have certainly overcome them. So observe Salat in congregation, for the wolf eats up a solitary sheep that stays far from the flock.”[Abu Dawud].
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|మహత్యాల ప్రకరణం|191. సామూహిక నమాజ్ ఘనత|హదీసు 1070
You must be logged in to post a comment.