హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: ఇమామ్ అబూ జకరియ్యా యహ్యా బిన్ షరఫ్ అన్ నవవీ (రహ్మతుల్లాహి అలైహి)
ఉర్దూ అనువాదం, వ్యాఖ్యానం: హాఫిజ్ సలాహుద్దీన్ యూసుఫ్ · తెలుగు రూపం: హాఫిజ్ ఎస్.ఎమ్. రసూల్ షర్ఫీ · ప్రకాశకులు: ట్రూత్ పబ్లికేషన్స్, హైదరాబాద్

రియాదుస్ సాలిహీన్ (హదీసు కిరణాలు) – 19వ అధ్యాయం: ఒక మంచి పని లేక చెడు పనిని మొదలెట్టినవాడు. ఈ అధ్యాయంలో 2 ఖుర్ఆన్ ఆయతులు, 2 హదీసులు (హదీసు 173 – 174) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, ముఖ్యాంశాలు, English అనువాదంతో.
19. ఒక మంచి పని లేక చెడు పనిని మొదలెట్టినవాడు
باب في مَنْ سَنَّ سُنَّةً حسنة أَوْ سيئة
అరబీ పాఠం: రియాదుస్ సాలిహీన్ – తహ్ఖీఖ్: షుఐబ్ అల్ అర్నావూత్ (ముఅస్సస్సతుర్ రిసాలా)
{وَالَّذِينَ يَقُولُونَ رَبَّنَا هَبْ لَنَا مِنْ أَزْوَاجِنَا وَذُرِّيَّاتِنَا قُرَّةَ أَعْيُنٍ وَاجْعَلْنَا لِلْمُتَّقِينَ إِمَاماً} [الفرقان:٧٤]
దివ్య ఖుర్ఆన్లో అల్లాహ్ సెలవిచ్చాడు : వారు (కరుణామయుని దాసులు) ఇలా ప్రార్థిస్తూ ఉంటారు, "మా ప్రభూ! మాకు మా భార్యల ద్వారా మా సంతానం ద్వారా కన్నుల చల్లదనాన్ని ప్రసాదించు. మమ్మల్ని భయభక్తులు కలవారికి ఇమాములుగా (ప్రథములుగా) చేయి." (అల్ ఫుర్ఖాన్ : 74)
{وَجَعَلْنَاهُمْ أَئِمَّةً يَهْدُونَ بِأَمْرِنَا} [الأنبياء: ٧٣]
మరోచోట ఇలా సెలవిచ్చాడు : "మా ఆజ్ఞానుసారం మార్గదర్శకత్వం నెరపే వారిని మేము నాయకులుగా చేశాము." (అల్ అంబియా : 73)
English
“And those who say: `Our Rubb! Bestow on us from our wives and our offspring the comfort of our eyes, and make us leaders of the Muttaqun (the pious)”. [Al-Furqān 25:74]
“And We made them leaders, guiding (mankind) by Our Command”. [Al-Anbiyā’ 21:73]
హదీసు 173
عَنْ أَبَي عَمروٍجَرير بنِ عبدِ اللَّه، رضي اللَّه عنه، قال: كُنَّا في صَدْر النَّهارِ عِنْد رسولِ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم فَجاءهُ قوْمٌ عُرَاةٌ مُجْتابي النِّمار أَو الْعَباءِ. مُتَقلِّدي السُّيوفِ عامَّتُهمْ من مضر، بَلْ كُلُّهُمْ مِنْ مُضرَ، فَتمعَّر وجهُ رسولِ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم، لِما رَأَى بِهِمْ مِنْ الْفَاقة، فدخلَ ثُمَّ خَرَجَ، فَأَمر بِلالاً فَأَذَّن وأَقَامَ، فَصلَّى ثُمَّ خَطبَ، فَقالَ: {يَا أَيُّهَا النَّاسُ اتَّقُوا رَبَّكُمُ الَّذِي خَلَقَكُمْ مِنْ نَفْسٍ وَاحِدَةٍ} إِلَى آخِرِ الآية: {إِنَّ اللَّهَ كَانَ عَلَيْكُمْ رَقِيباً} ،وَالآيةُ الأُخْرَى الَّتِي في آخر الْحشْرِ: {يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا اتَّقُوا اللَّهَ وَلْتَنْظُرْ نَفْسٌ مَا قَدَّمَتْ لِغَدٍ} تَصدٍََّق رَجُلٌ مِنْ دِينَارِهِ مِنْ دِرْهَمهِ مِنْ ثَوْبِهِ مِنْ صَاع بُرِّه مِنْ صَاعِ تَمرِه حَتَّى قَالَ: وَلوْ بِشقِّ تَمْرةٍ" فَجَاءَ رَجُلٌ مِنْ الأَنْصَارِ بِصُرَّةٍ كادتْ كَفُّهُ تَعجزُ عَنْهَا، بَلْ قَدْ عَجزتْ، ثُمَّ تَتابَعَ النَّاسُ حَتَّى رَأَيْتُ كَوْميْنِ مِنْ طَعامٍ وَثيابٍ، حتَّى رَأَيْتُ وجْهَ رسولِ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم، يَتهلَّلُ كَأَنَّهُ مذْهَبَةٌ، فَقَالَ رسولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "مَنْ سَنَّ في الإِسْلام سُنةً حَسنةً فَلَهُ أَجْرُهَا، وأَجْرُ منْ عَملَ بِهَا مِنْ بَعْدِهِ مِنْ غَيْرِ أَنْ ينْقُصَ مِنْ أُجُورهِمْ شَيءٌ، ومَنْ سَنَّ في الإِسْلامِ سُنَّةً سيَّئةً كَانَ عَليه وِزْرها وَوِزرُ مَنْ عَمِلَ بِهَا مِنْ بعْده مِنْ غَيْرِ أَنْ يَنْقُصَ مِنْ أَوْزارهمْ شَيْءٌ" رواه مسلم. قولُهُ:"مُجْتَابي النَّمارِ"هُو بالجِيمِ وبعد الأَلِفِ باءٌ مُوَحَّدَةٌ. والنِّمَارُ: جمْعُ نَمِرَة، وَهِيَ: كِسَاءٌ مِنْ صُوفٍ مُخَطَّط. وَمَعْنَى"مُجْتابيها"أَي: لابِسِيهَا قدْ خَرَقُوهَا في رؤوسهم."والْجَوْبُ": الْقَطْعُ، وَمِنْهُ قَوْلُهُ تَعَالَى: {وَثَمُودَ الَّذِينَ جَابُوا الصَّخْرَ بِالْوَادِ} أَيْ: نَحَتُوهُ وَقَطَعُوهُ. وَقَوْلهُ"تَمَعَّرَ"هُوَ بالعين المهملة، أَيْ: تَغَيرَ. وَقَوْلهُ:"رَأَيْتُ كَوْمَيْنِ"بفتح الكافِ وضمِّها، أَيْ: صَبْرتَيْنِ. وَقَوْلُهُ:"كَأَنَّه مَذْهَبَةٌ"هُوَ بالذال المعجمةِ، وفتح الهاءِ والباءِ الموحَّدةِ، قَالَهُ الْقَاضي عِيَاضٌ وغَيْرُهُ. وصَحَّفَه بَعْضُهُمْ فَقَالَ:"مُدْهُنَةٌ"بِدَال مهملةٍ وَضَمِّ الهاءِ وبالنونِ، وَكَذَا ضَبَطَهُ الْحُمَيْدِيُّ، والصَّحيحُ الْمَشْهُورُ هُوَ الأَوَّلُ. وَالْمُرَادُ بِهِ عَلَى الْوَجْهَيْنِ: الصَّفَاءُ وَالاسْتِنَارُة.
హజ్రత్ అబూ అమ్ర్ జరీర్ బిన్ అబ్దుల్లాహ్ (రదియల్లాహు అన్హు) కథనం : (ఒకరోజు) ప్రాతఃకాలం మేము దైవప్రవక్త ﷺ సన్నిధిలో ఉండగా కొంతమంది వచ్చారు. వారి ఒంటిమీద సరిగ్గా బట్టలు కూడా లేవు. గళ్ల దుప్పట్లు లేక కంబళ్లు చుట్టుకొని ఉన్నారు. (వారి భుజాలకు) ఖడ్గాలు వ్రేలాడుతున్నాయి. వాళ్ళల్లో చాలామంది, చాలామంది ఏమిటీ దాదాపు అందరూ 'ముజర్' తెగకు చెందినవాళ్ళే. వారి పస్తుల పరిస్థితి చూసి దైవప్రవక్త ముఖారవిందం మారిపోయింది. ఆయన తన (కుటీరం)లోనికి వెళ్ళి తిరిగి బయటికొచ్చారు. అజాన్ ఇవ్వమని బిలాల్ని ఆదేశించారు. బిలాల్ (రదియల్లాహు అన్హు) అజాన్ ఇచ్చి (ప్రజలు నమాజు కోసం హాజరైన తరువాత) ఇఖామత్ పలికారు. దైవప్రవక్త ﷺ నమాజు చేయించిన తరువాత ప్రజల ముందు ఉపన్యసించారు. ఆయన ﷺ ఇలా అన్నారు : ప్రజలారా! మిమ్మల్ని ఒకే ప్రాణినుంచి పుట్టించిన మీ ప్రభువుకు భయపడండి…… (సూక్తి చివరివరకు) అల్లాహ్ మిమ్మల్ని గమనిస్తున్నాడనే విషయాన్ని తెలుసుకోండి. (సూరె నిసా : 1) తరువాత సూరె హష్ర్లోని ఈ సూక్తిని పఠించారు: "విశ్వసించిన ఓ ప్రజలారా! అల్లాహ్కు భయపడండి. ప్రతి వ్యక్తీ తాను రేపటి కొరకు ఏమి సమకూర్చుకున్నాడో చూసుకోవాలి." (ఆ తరువాత ప్రజల్ని దానధర్మాలు చేయమని పురికొల్పారు). "ప్రతివ్యక్తీ తన దీనారునుండి, దిర్హము నుండి, తన బట్టల నుండి, ఇంకా గోధుమల 'సా' (ఒక ప్రమాణం) నుంచి, ఖర్జూరాల 'సా' నుండి దానం చేయాలన్నారు. అంతేకాదు, ఒక్క ఖర్జూరపు ముక్కైనా సరే దానం చేయాలని ప్రకటించారు.
అప్పుడు అన్సార్లలోని ఒకతను ఒక సంచి తీసుకొని వచ్చాడు. (బరువు మూలంగా) అతని చేయి ఆ సంచిని మోయలేనట్టుగా ఉంది. (కొంతదూరం వచ్చాక) అసలు మోయలేకపోయింది. ఆ తరువాత ప్రజలు ఒకణ్ణి చూసి మరొకడు దానాలు చేస్తూపోయారు. నేను చూస్తుండగానే అక్కడ రెండు కుప్పలు పేరుకున్నాయి. వాటిలో ఒకటి తినే వస్తువులది. రెండోది బట్టలది. అది చూసి దైవప్రవక్త ﷺ ముఖారవిందం మేలిమి బంగారపు ముక్కలా మెరుస్తుండటం నేను గమనించాను. తరువాత ఆయన ఇలా ఉద్బోధించారు: ఎవడైనా ఇస్లాంలో ఒక మంచిపని మొదలుపెడితే అతనికి తన పుణ్యం లభిస్తుంది, ఇంకా అతని తరువాత దానిని ఆచరించే వారి పుణ్యం కూడా లభిస్తుంది. దానివల్ల వారికి లభించే పుణ్యంలో ఎలాంటి కోత ఉండదు. దీనికి విరుద్ధంగా ఇస్లాంలో ఎవడైనా ఏదైనా చెడ్డపని ప్రారంభిస్తే అతనిపై దాని పాపభారం పడుతుంది, ఇంకా అతని తరువాత దానిని అమలు చేసేవారందరి పాపం కూడా అతని నెత్తిమీదే పడుతుంది. అయితే దీనివల్ల వారిపై పడే పాపభారంలో మాత్రం ఎలాంటి తగ్గింపు ఉండదు. (ముస్లిం)
'నిమార్' అనేది 'నమిరతున్' అనే పదానికి బహువచనం. గళ్ళున్న ఉన్ని వస్త్రం. 'ముహ్తాబీహా' అంటే వాటిని తొడుక్కొని ఉన్నవారు. దైవప్రవక్త ﷺ సన్నిధికి వచ్చినవాళ్ళు ఆ దుప్పట్లను లేక చర్మాలను మధ్యలో చింపి తలనుండి ఒంటిమీద వేసుకునేవారు. అంటే అవి చొక్కాగా పనికిరావు, వాటిని వాళ్ళు చుట్టుకోనూలేరు. 'జాబ్' అంటే కోయటం, ముక్కలు చేయటం. దివ్య ఖుర్ఆన్లో 'సమూదల్లజీన జాబుస్సఖ్ర బిల్వాద్" (లోయలో కొండరాళ్ళను తొలచిన సమూద్ జాతి) అన్న వాక్యంలోని 'జాబూ' అన్న పదం 'జాబ్' నుండి వచ్చిందే. 'తమ-అ-ర' అంటే మారిపోయింది. "కీమైన్" ('క' కు ఉకారం కూడా సరైనదే) అంటే అర్థం రెండు కుప్పలు. 'ముజ్హబతున్' – ఖాజీ అయాజ్ తదితరులు ఈ పదాన్ని ఇలాగే కంఠస్తం చేశారు. కొంతమంది వాస్తవానికి ఈ పదం 'ముద్హునహ్' అని అంటున్నారు. ఇమామ్ హుమైదీ కూడా ఇలాగే కంఠస్తం చేశారు. తొలి ఉల్లేఖనమే ప్రామాణికమైనది, సుప్రసిద్ధమైనదీను. అయితే రెండు పదాలకూ అర్థం మాత్రం ఒక్కటే-ముఖవర్చస్సు, కాంతి అని. (సహీహ్ ముస్లింలోని 'జకాత్' ప్రకరణం)
English
Jarir bin `Abdullah (radiyallahu anhu) reported: We were with Messenger of Allah ﷺ shortly after dawn when there came to him some people clad in woollen rags, or covered with sleeveless blankets; and with swords hanging down from their necks. Most of them rather, all of them, belonged to the Mudar tribe. The face of the Prophet ﷺ changed when he saw them starving. Then he went into his house and came out; then he commanded Bilal (radiyallahu anhu) to proclaim Adhan (call to prayers). So he proclaimed Adhan and recited Iqamah and the Prophet ﷺ led the Salat. Then he delivered a Khutbah saying, “O mankind! Be dutiful to your Rubb, Who created you from a single person (Adam), and from him (Adam) He created his wife (Eve), and from them both He created many men and women; and fear Allah through Whom you demand your (natural) rights, and do not sever the relations of kinship. Surely, Allah is Ever an All-Watcher over you.” (4:1) He also recited the Ayah which is in the end of Surat Al-Hashr: “O you who believe! Fear Allah and keep your duty to Him. And let every one look what he has sent forth for the tomorrow”. (59:18). Thereafter, every man gave in charity Dinar, Dirham, clothes, measure-fulls of wheat and measure-fulls of dates till he said: “(Give in charity) be it half a date”. Then a man of the Ansar came with a bag which was difficult for him to hold in his hand. Thereafter, the people came successively (with charity) till I saw two heaps of food and clothes. I noticed that the face of Messenger of Allah ﷺ was glowing like that of the bright moon or glittering gold. Then he ﷺ said, “Whosoever introduces a good practice in Islam, there is for him its reward and the reward of those who act upon it after him without anything being diminished from their rewards. And whosoever introduces an evil practice in Islam, will shoulder its sin and the sins of all those who will act upon it, without diminishing in any way their burden”[Muslim].
ముఖ్యాంశాలు
కొందరు ప్రభృతులు పై హదీసులోని "మన్ సన్న ఫిల్ ఇస్లామి సున్నతన్ హసనతన్" అన్న వాక్యాన్ని ఆధారంగా చేసుకొని "బిద్అతె హసనా" (మంచి బిద్అత్) ధర్మసమ్మతమేనని వాదిస్తున్నారు. ఆ విధంగా వారు బిద్అత్ (కొత్తపోకడ)ను రెండు రకాలుగా వర్గీకరిస్తున్నారు. ఒకటి హసనా (మంచిది), రెండవది సయ్యిఆ (చెడ్డది). కాని ఈ వర్గీకరణ సరైనది కాదు. ధర్మంలో తలెత్తే కొత్తపోకడ ఎన్నటికీ మంచిది కాజాలదు. బిద్అత్ ఎప్పుడూ చెడ్డదే అయి ఉంటుంది. ఎందుకంటే బిద్అత్లను పుట్టించడమంటే వాస్తవానికి ఓ కొత్తధర్మాన్ని, ఓ వినూత్న షరీఅత్ను నిర్మించడమన్నమాట! ఆ హక్కు మానవుడికి లేనేలేదు. షరీఅత్ నిర్మాణ హక్కులన్నీ అల్లాహ్కే చెందుతాయి. ఆయనే షరీఅత్ నిర్మాత. ఆయన ఆదేశానుసారమే ప్రవక్తలు మానవులకు షరీఅత్ ఆజ్ఞలను వినిపిస్తారు. దైవప్రవక్తలకు కూడా ఆ హక్కు ఇవ్వబడనప్పుడు పీఠాధిపతులకు, బాబాలకు ఆ హక్కు ఎక్కడ్నుంచి వచ్చింది?
అందుకే పై హదీసుకు సరైన భావం ఏమిటంటే, ఇస్లాంలో 'ధర్మసమ్మతమైన' పనిని అందరికన్నా ముందుగా నిర్వర్తించి, ఇతరులకు ఆదర్శంగా నిలిచిన వ్యక్తికి – అతను చేసిన దానిపై పుణ్యం లభించడంతో పాటు, ఇంకా ఎవరైనా ఆ మంచిపనిచేస్తే వారికి లభించినంత పుణ్యం అదనంగా అతని ఖాతాలో జమ అవుతూ ఉంటుంది. ధర్మంలో ఋజువు లభించని పనిని ఎంతమంచి పద్ధతిలో చేసినా దానిపై పుణ్యం సుతరామూ లభించదు. పైగా పాపానికి ఒడిగట్టినట్లుగా పరిగణించబడుతుంది. అలాంటి పని ఎన్నటికీ 'హసనా' కాజాలదు.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|19. ఒక మంచి పని లేక చెడు పనిని మొదలెట్టినవాడు|హదీసు 173
హదీసు 174
وعن ابن مسعودٍ رضي اللَّه عنه أَنَّ النَّبِيَّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَالَ: "لَيْسَ مِنْ نفْسٍ تُقْتَلُ ظُلماً إِلاَّ كَانَ عَلَى ابنِ آدمَ الأوَّلِ كِفْلٌ مِنْ دمِهَا لأَنَّهُ كَان أَوَّل مَنْ سَنَّ الْقَتْلَ" متفقٌ عَلَيهِ.
హజ్రత్ ఇబ్నె మస్వూద్ కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా అన్నారు : (ప్రపంచంలో) అన్యాయంగా ఏ ప్రాణి అయినా హత్యచేయబడితే, దాని రక్తం చిందించిన నేరం కొంత హజ్రత్ ఆదం (అలైహి) పెద్ద కుమారుడి (ఖాబీల్)పై కూడా పడుతుంది. ఎందుకంటే (లోకంలో) అందరికన్నా ముందు అన్యాయపు హత్యకు శ్రీకారం చుట్టింది అతనే. (బుఖారీ – ముస్లిం)
(సహీహ్ బుఖారీలోని జనాయెజ్ ప్రకరణంలోనూ, 'ఏతెసామ్' ప్రకరణంలోనూ, ఇంకా సహీహ్ ముస్లింలో హతుని వారసులముందు చేసే ప్రమాణ ప్రకరణంలోనూ ఈ హదీసు పొందుపరచబడి ఉంది.)
English
Ibn Mas`ud (radiyallahu anhu) reported: The Prophet ﷺ said, “The first son of Adam* takes a share of the guilt of every one who murders another wrongfully because he was the initiator of committing murder”.[Al-Bukhari and Muslim].
* The son of Adam in the Hadith is said to be Qabil. Allah tells us about his story in Surat Al-Ma’idah (The Table spread with Food). Verses 27-31.
ముఖ్యాంశాలు
షరీఅత్కు విరుద్ధమైన పనుల్ని అందరికన్నా ముందుగా చేసి ఇతరులకు ఆదర్శంగా నిలవడం ఎంతపెద్ద నేరమో ఈ హదీసు ద్వారా అవగతమవుతోంది. దురదృష్టవశాత్తూ ఇతరులెవరైనా ఆ బాటలో నడిస్తే ప్రళయం వరకు దాని పాపం అతని నెత్తిన పడటం ఖాయం. కనుక మనిషి ఎల్లప్పుడూ దైవప్రవక్త ﷺ అడుగుజాడల్లోనే నడుస్తూ కొత్తపోకడలకు, వినూత్న ఆచారాలకు దూరంగా ఉండాలి. ఇందులోనే అతని శ్రేయం ఇమిడి ఉంది.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|19. ఒక మంచి పని లేక చెడు పనిని మొదలెట్టినవాడు|హదీసు 174
You must be logged in to post a comment.