హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) – 18. కొత్తపోకడలు సృష్టించరాదు

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: ఇమామ్ అబూ జకరియ్యా యహ్యా బిన్ షరఫ్ అన్ నవవీ (రహ్మతుల్లాహి అలైహి)
ఉర్దూ అనువాదం, వ్యాఖ్యానం: హాఫిజ్ సలాహుద్దీన్ యూసుఫ్ · తెలుగు రూపం: హాఫిజ్ ఎస్.ఎమ్. రసూల్ షర్ఫీ · ప్రకాశకులు: ట్రూత్ పబ్లికేషన్స్, హైదరాబాద్

రియాదుస్ సాలిహీన్ – హదీసు కిరణాలు (ఇమామ్ నవవీ) – అరబీ, తెలుగు, English

రియాదుస్ సాలిహీన్ (హదీసు కిరణాలు) – 18వ అధ్యాయం: (ధర్మంలో) కొత్తపోకడలు, నూతన ఆచారాలు సృష్టించరాదు. ఈ అధ్యాయంలో 5 ఖుర్ఆన్ ఆయతులు, 3 హదీసులు (హదీసు 170 – 172) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, ముఖ్యాంశాలు, English అనువాదంతో.

18. (ధర్మంలో) కొత్తపోకడలు, నూతన ఆచారాలు సృష్టించరాదు

↑ విషయ సూచిక

باب النَّهي عن البِدَع ومُحدثات الأمور

అరబీ పాఠం: రియాదుస్ సాలిహీన్ – తహ్‌ఖీఖ్: షుఐబ్ అల్ అర్నావూత్ (ముఅస్సస్సతుర్ రిసాలా)

{فَمَاذَا بَعْدَ الْحَقِّ إِلاَّ الضَّلالُ} [يونس: ٣٢]

దివ్యఖుర్‌ఆన్‌లో అల్లాహ్ సెలవిచ్చాడు : "సత్యాన్ని తృణీకరిస్తే మార్గభ్రష్టత్వం తప్ప ఇక మిగిలేదేమిటి?" (యూనుస్ : 32)

{مَا فَرَّطْنَا فِي الْكِتَابِ مِنْ شَيْءٍ} [الأنعام: ٣٨]

మరోచోట అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు : "విధివ్రాత ఉన్న గ్రంథంలో మేము ఏ కొరతా చెయ్యలేదు." (అల్ అన్ ఆమ్ : 38)

{فَإِنْ تَنَازَعْتُمْ فِي شَيْءٍ فَرُدُّوهُ إِلَى اللَّهِ وَالرَّسُولِ} [النساء: ٥٩]

ఇంకొకచోట ఆయన ఇలా అన్నాడు : "మీ మధ్య ఏ విషయంలోనైనా వివాదం తలెత్తితే దాన్ని అల్లాహ్‌కు, ప్రవక్తకు నివేదించండి." అంటే దైవగ్రంథం మరియు ప్రవక్త సంప్రదాయం వైపుకు మరలండి. (అన్ నిసా : 59)

{وَأَنَّ هَذَا صِرَاطِي مُسْتَقِيماً فَاتَّبِعُوهُ وَلا تَتَّبِعُوا السُّبُلَ فَتَفَرَّقَ بِكُمْ عَنْ سَبِيلِهِ} [الأنعام: ١٥٣]

ఆయన ఇంకా ఇలా అన్నాడు : "నా ఋజుమార్గం ఇదే. కనుక మీరు దీనిపైనే నడవండి. వేరే మార్గాలపై నడవకండి. ఎందుకంటే అవి మిమ్మల్ని ఆయన మార్గం నుంచి తొలగించి విచ్ఛిన్నపరుస్తాయి." (అల్ అన్ ఆమ్ : 153)

{قُلْ إِنْ كُنْتُمْ تُحِبُّونَ اللَّهَ فَاتَّبِعُونِي يُحْبِبْكُمُ اللَّهُ وَيَغْفِرْ لَكُمْ ذُنُوبَكُمْ} [آل عمران:٣١]

ఇంకా ఇలా సెలవిచ్చాడు : "ప్రవక్తా! నీవు ప్రజలకు ఇలా చెప్పు: మీకు నిజంగానే అల్లాహ్ పట్ల ప్రేమ ఉంటే నన్ను అనుసరించండి. అప్పుడు అల్లాహ్ మిమ్మల్ని ప్రేమిస్తాడు, మీ పాపాలను మన్నిస్తాడు." (ఆలి ఇమ్రాన్ : 31)

ఈ అధ్యాయం క్రింద సుపరిచితమైన సూక్తులు చాలా ఉన్నాయి. హదీసులు కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి. అవి కూడా సుప్రసిద్ధమైనవే. వాటిలో కొన్నింటిని మాత్రమే మేము ఇక్కడ ప్రస్తావిస్తున్నాం –

English

“So after the truth, what else can there be, save error?”. [Yūnus 10:32]

“We have neglected nothing in the Book”. [Al-An‘ām 6:38]

“(And) if you differ in anything amongst yourselves, refer it to Allah and His Messenger ﷺ”. [An-Nisā’ 4:59]

“And verily, this is My straight path, so follow it, and follow not (other) paths, for they will separate you away from His path”. [Al-An‘ām 6:153]

“Say (O Muhammad ﷺ to mankind): ‘If you (really) love Allah then follow me (i.e., accept Islamic Monotheism, follow the Qur’an and the Sunnah), Allah will love you and forgive you your sins”. [Āl ‘Imrān 3:31]

170

హదీసు 170

عن عائشةَ، رَضِي اللَّه عنها، قَالَتْ قَالَ رسولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "منْ أَحْدثَ في أَمْرِنَا هَذَا مَا لَيْسَ مِنْهُ فهُو رَدٌّ" متفقٌ عَلَيهِ. وفي رواية لمسلمٍ: "مَنْ عَمِلَ عمَلاً لَيْسَ عَلَيْهِ أَمْرُنَا فَهُو ردٌّ".

హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా అన్నారు : ఎవరైనా మా ఈ ధర్మంలో లేని కొత్త విషయాన్ని ప్రవేశపెడితే అది త్రోసిపుచ్చదగినది. (బుఖారీ – ముస్లిం)

"ఎవరైనా మేము ఆదేశించని పని ఏదైనా చేస్తే అది త్రోసిపుచ్చదగినది" అని ముస్లింలోని వేరొక ఉల్లేఖనంలో ఉంది.

(సహీహ్ బుఖారీలోని 'ఒడంబడికల' ప్రకరణంలో ఇంకా సహీహ్ ముస్లింలోని వ్యాజ్యాల ప్రకరణంలోనూ ఈ హదీసు ఉంది.)

English

`Aishah (radiyallahu anha) reported: Messenger of Allah ﷺ said, “If anyone introduces in our matter something which does not belong to it, will be rejected”.[Al-Bukhari and Muslim].

The narration in Muslim says: “If anybody introduces a practice which is not authenticated by me, it is to be rejected”.

ముఖ్యాంశాలు

ఈ హదీసులో అతి ముఖ్యమైన సూత్రం ఒకటి వివరించబడింది. దురదృష్టవశాత్తూ ముస్లింలు ఈ హదీసును, ఇందులో బోధింపబడిన విషయాన్ని పట్టించుకోవటం లేదు. ఫలితంగా ధర్మంలో కొత్తపోకడలు, వినూత్న చేష్టలు సర్వసామాన్యమైపోయాయి. ఇంకా చెప్పాలంటే అమాయక జనులు కొత్తపోకడల(బిద్‌అత్)ను, ఆచార వ్యవహారాలనే అసలు ధర్మంగా తలపోస్తున్నారు. ఈ నూతన ఆచారాలను విధులు (ఫరాయజ్)గా భావించి ఆచరిస్తున్నారు. దీనికి ధర్మజ్ఞానం లేకపోవడం మొదటి కారణమైతే పై హదీసులో వివరించబడిన నియమాన్ని అర్థం చేసుకోకపోవటం రెండో కారణం. మరి చూడబోతే దైవప్రవక్త ﷺ ఆ నియమాన్ని ఈ హదీసులో ఎంతో స్పష్టంగా తేటతెల్లం చేసి మరీ బోధించారు. దాని ప్రకారం ; దైవప్రసన్నతను బడయటానికి చేసే ప్రతి పనీ – ఖుర్‌ఆన్, హదీసుల ద్వారా దానికి రుజువు లభించకపోతే లేక షరీఅత్ సూత్రాలకు ప్రవక్త సహచరులు, వారి అనుచరులు (తాబెయీన్) చేసిన వ్యాఖ్యానాల ద్వారాగాని లేదా వారి ఆచరణ వల్లగాని దానికి ఆధారం లభించకపోతే – అది బిద్‌అత్ (క్రొత్తపోకడ) క్రిందికే వస్తుంది.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|18. (ధర్మంలో) కొత్తపోకడలు, నూతన ఆచారాలు సృష్టించరాదు|హదీసు 170

171

హదీసు 171

وعن جابرٍ، رضي اللَّه عنه، قَالَ: كَانَ رسولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم، إِذَا خَطَب احْمرَّتْ عيْنَاهُ، وعَلا صوْتُهُ، وَاشْتَدَّ غَضَبهُ، حتَّى كَأَنَّهُ مُنْذِرُ جَيْشٍ يَقُولُ:"صَبَّحَكُمْ ومَسَّاكُمْ"وَيقُولُ: "بُعِثْتُ أَنَا والسَّاعةُ كَهَاتيْن"وَيَقْرنُ بَيْنَ أُصْبُعَيْهِ، السبَابَةِ، وَالْوُسْطَى، وَيَقُولُ: "أَمَّا بَعْدُ، فَإِنَّ خَيرَ الْحَديثَ كِتَابُ اللَّه، وخَيْرَ الْهَدْى هدْيُ مُحمِّد صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم، وَشَرَّ الأُمُورِ مُحْدثَاتُهَا وكُلَّ بِدْعَةٍ ضَلالَةٌ"ثُمَّ يقُولُ:"أَنَا أَوْلَى بُكُلِّ مُؤْمِن مِنْ نَفْسِهِ. مَنْ تَرَك مَالا فَلأهْلِهِ، وَمَنْ تَرَكَ دَيْناً أَوْ ضَيَاعاً، فَإِليَّ وعَلَيَّ "رواه مسلم. وعنِ الْعِرْبَاض بن سَارِيَةَ، رضي اللَّه عنه، حَدِيثُهُ السَّابِقُ في بابِ الْمُحَافَظةِ عَلَى السُّنَّةِ.

హజ్రత్ జాబిర్ (రదియల్లాహు అన్హు) కథనం : దైవప్రవక్త ﷺ ఖుత్బా (ఉపన్యాసం) ఇచ్చినప్పుడు ఆయన కళ్ళు ఎర్రబడేవి. గొంతు బిగ్గరగా అయ్యేది. కోపం తీవ్రమయిపోయేది. శత్రుసైన్యం ఉదయంగాని లేక సాయంత్రం గాని మీపై దాడిచేయనుందని ప్రజల్ని అప్రమత్తం చేసేవానిలా ఆయన ఆ సమయంలో కనిపించేవారు. ఇలా అనేవారు: నేనూ మరియు ప్రళయం ఈ రెండు వ్రేళ్ల మాదిరిగా పంపబడ్డాము. ఇలా అన్నప్పుడు ఆయన తన చూపుడు వ్రేలునూ, మధ్యవ్రేలిని కలిపి చూపించేవారు (అంటే తన తరువాత ప్రళయం వరకూ ఇక ఏ ప్రవక్తా రాడని అర్థం.) ఇంకా ఇలా అనేవారు : చెప్పొచ్చేదేమిటంటే, నిస్సందేహంగా అన్నిటికన్నా మంచిపలుకు దైవగ్రంథము. మార్గాలన్నిటిలోకీ మేలైన మార్గం ముహమ్మద్ మార్గం. అన్ని పనుల్లోకెల్లా చెడ్డపనులు (ధర్మంలో) కొత్తగా సృష్టించబడినవి. ప్రతి కొత్తపోకడ (బిద్‌అత్) మార్గభ్రష్టతే." ఆ తరువాత "ప్రతి విశ్వాసిపై నాకు అతని ప్రాణానికన్నా ఎక్కువ హక్కు ఉంది. ఎవరైనా (తన తదనంతరం) ధనం వదలివెళితే అది అతని వారసులకే చెందుతుంది.అదే ఎవరైనా రుణం గాని లేక అభాగ్య పరివారాన్నిగాని వదలివెళితే (ఆ రుణాన్ని తీర్చే) బాధ్యత నాపై ఉంటుంది. ఇంకా (అతని సంతానాన్ని పర్యవేక్షించే) విధి కూడా నాపైనే ఉంటుంది." అని ఆయన అనేవారు.

(ముస్లిం)

(సహీహ్ ముస్లింలోని జుమా ప్రకరణం)

English

Jabir (radiyallahu anhu) reported: Whenever the Messenger of Allah ﷺ delivered a Khutbah, his eyes would become red, his tone loud and he showed anger as if he were warning us against an army. He ﷺ would say, “The enemy is about to attack you in the morning and the enemy is advancing against you in the evening”. He would further say, “I am sent with the final Hour like these two fingers of mine.” Messenger of Allah ﷺ held up his index finger and the middle finger together to illustrate. He used to add: “To proceed, the best speech is the Book of Allah and the best guidance is the guidance of Muhammad ﷺ, the worst practice is the introduction of new practices in Islam and every Bid`ah is a misguidance”. He would also say, “I am, in respect of rights, nearer to every believer than his own self. He who leaves an estate, it belongs to his heirs, and he who leaves a debt, it is my responsibility to pay it off.’‘[Muslim].

Same Hadith as reported by `Irbad bin Sariyah (radiyallahu anhu) has already been recorded in the previous chapter regarding safeguarding the Sunnah of the Prophet ﷺ. (See Hadith number 158)

ముఖ్యాంశాలు

ఈ హదీసులో దైవప్రవక్త ﷺ ఉపన్యసించే తీరును గురించి వివరించటం జరిగింది. దైవప్రవక్త ప్రభవనం ప్రళయం రాకకు సూచన అని చెప్పబడింది. ఖుర్‌ఆన్ మరియు హదీసుల ప్రాధాన్యాన్ని గురించి బోధిస్తూ క్రొత్తపోకడలు (బిద్‌అత్‌లు) వినాశానికి గొనిపోతాయని ఈ హదీసు హెచ్చరిస్తోంది. ఇంకా సమాజంలోని అనాధల్ని, అభాగ్య జీవుల్ని ఆదుకోవడం సమకాలీన ప్రభుత్వం యొక్క బాధ్యత అని కూడా అంటోంది. ఎందుకంటే ఖలీఫా (ప్రభుత్వాధినేత) దైవప్రవక్తకు ప్రతినిధి లాంటివాడు. ఆయన తన జీవితకాలంలో చేసిన పనుల్ని ఆయన తదనంతరం ఖలీఫా అయిన వ్యక్తి విధిగా నిర్వర్తించాలి. అయితే ప్రజలు వదలిపెట్టి వెళ్ళిన ఆస్తులకు వాళ్ళ వారసులే హక్కుదారులు అవుతారు గాని ఇతరులెవరికీ వాటిపై హక్కు ఉండదు.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|18. (ధర్మంలో) కొత్తపోకడలు, నూతన ఆచారాలు సృష్టించరాదు|హదీసు 171

172

హదీసు 172

(ఇంచుమించు పై హదీసును పోలిన) హజ్రత్ ఇర్‌బాజ్ బిన్ సారియా (రదియల్లాహు అన్హు) హదీసు ఇంతకు ముందు "ప్రవక్త సంప్రదాయాన్ని కాపాడటం" అన్న అధ్యాయం క్రింద వచ్చింది.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|18. (ధర్మంలో) కొత్తపోకడలు, నూతన ఆచారాలు సృష్టించరాదు|హదీసు 172