హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) – 131. సలాం విశిష్టత

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: ఇమామ్ అబూ జకరియ్యా యహ్యా బిన్ షరఫ్ అన్ నవవీ (రహ్మతుల్లాహి అలైహి)
ఉర్దూ అనువాదం, వ్యాఖ్యానం: హాఫిజ్ సలాహుద్దీన్ యూసుఫ్ · తెలుగు రూపం: హాఫిజ్ ఎస్.ఎమ్. రసూల్ షర్ఫీ · ప్రకాశకులు: ట్రూత్ పబ్లికేషన్స్, హైదరాబాద్

రియాదుస్ సాలిహీన్ – హదీసు కిరణాలు (ఇమామ్ నవవీ) – అరబీ, తెలుగు, English

రియాదుస్ సాలిహీన్ (హదీసు కిరణాలు) – 131వ అధ్యాయం: సలాం విశిష్టత, దాన్ని సర్వసామాన్యం చేయాలన్న ఆదేశం గురించి. ఈ అధ్యాయంలో 3 ఖుర్ఆన్ ఆయతులు, 6 హదీసులు (హదీసు 845 – 850) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, ముఖ్యాంశాలు, English అనువాదంతో.

131. సలాం విశిష్టత, దాన్ని సర్వసామాన్యం చేయాలన్న ఆదేశం గురించి

↑ విషయ సూచిక

باب فضل السلام والأمر بإفشائه

అరబీ పాఠం: రియాదుస్ సాలిహీన్ – తహ్‌ఖీఖ్: షుఐబ్ అల్ అర్నావూత్ (ముఅస్సస్సతుర్ రిసాలా)

{يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا لاَ تَدْخُلُوا بُيُوتاً غَيْرَ بُيُوتِكُمْ حَتَّى تَسْتَأْنِسُوا وَتُسَلِّمُوا عَلَى أَهْلِهَا} [النور: ٢٧]

దివ్య ఖుర్‌ఆన్‌లో అల్లాహ్ సెలవిచ్చాడు : "విశ్వసించిన ప్రజలారా! మీ ఇళ్ళల్లోకి తప్ప ఇతరుల ఇళ్ళల్లోకి ఇంటివారి అంగీకారం పొందనంతవరకు, ఇంటివారికి సలామ్ చేయనంత వరకు (లోనికి) ప్రవేశించకండి." (అన్ నూర్ : 27)

{فَإذَا دَخَلْتُمْ بُيُوتاً فَسَلِّمُوا عَلَى أنْفُسِكُمْ تَحِيَّةً مِنْ عِنْدِ اللهِ مُبَارَكَةً طَيِّبَةً} [النور: ٦١]

"ఇళ్ళల్లోకి ప్రవేశించినప్పుడు మీరు మీ వాళ్ళకు సలామ్ చేయండి. ఇది మేలు కొరకు చేయబడే ప్రార్థన. అల్లాహ్ తరపునుండి నిర్ణయించబడింది." (అన్ నూర్ : 61)

{وَإِذَا حُيِّيتُمْ بِتَحِيَّةٍ فَحَيُّوا بِأَحْسَنَ مِنْهَا أَوْ رُدُّوهَا} [النساء: ٨٦]

"మీకు ఎవరయినా గౌరవభావంతో సలామ్ చేస్తే వారికి మీరు అంతకంటే ఉత్తమమైన పద్ధతిలో ప్రతి సలామ్ చెయ్యండి లేదా కనీసం అదే విధంగానయినా చెయ్యండి." (అన్ నిసా : 86)

"ఓ ప్రవక్తా! ఇబ్రాహీమ్ యొక్క గౌరవనీయులైన అతిథుల గాథ కూడా నీకు చేరిందా? వారు అతని వద్దకు వచ్చి, 'మీకు సలామ్' అని అన్నారు. అతను, 'మీకు కూడా సలామ్' అని అన్నాడు."

English

“O you who believe! Enter not houses other than your own, until you have asked permission and greeted those in them.” [An-Nūr 24:27]

“But when you enter the houses, greet one another with a greeting from Allah (i.e., say: As-Salamu `alaikum – peace be on you), blessed and good.” [An-Nūr 24:61]

“When you are greeted with a greeting, greet in return with what is better than it, or (at least) return it equally.” [An-Nisā’ 4:86]

845

హదీసు 845

وعن عبد الله بن عمرو بن العاص رضي الله عنهما أنَّ رَجُلاً سَألَ رسول الله صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم أيُّ الإْسلام خَيْرٌ؟ قَالَ "تُطْعم الطَّعَامَ، وَتَقْرأُ السَّلام عَلَىَ مَنْ عَرِفَتَ وَمَنْ لَمْ تَعْرِفْ". مُتَّفَقٌ عليه.

హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ అమ్ర్ బిన్ ఆస్ (రదియల్లాహు అన్హుమా) కథనం : ఒక వ్యక్తి దైవప్రవక్త ﷺను, "ఇస్లాంలో అన్నిటికన్నా శ్రేష్ఠమైన ఆచరణ ఏది?" అని అడిగాడు. దానికి దైవప్రవక్త ﷺ, "నువ్వు (ఆకలిగొన్నవారికి) అన్నం పెట్టు. పరిచయమున్నా లేకపోయినా ప్రతివ్యక్తికీ సలాం చెయ్యి. (అన్నిటికంటే శ్రేష్ఠమైన ఆచరణ ఇదే)" అని బోధించారు.

(బుఖారీ – ముస్లిం)

(సహీహ్ బుఖారీ, సహీహ్ ముస్లింలలోని విశ్వాస ప్రకరణాలు)

English

Abdullah bin `Amr bin Al-`as (radiyallahu anhuma) reported: A man asked the Messenger of Allah ﷺ: “Which act in Islam is the best?” He ﷺ replied, “To give food, and to greet everyone, whether you know or you do not.”[Al-Bukhari and Muslim].

ముఖ్యాంశాలు

నిరుపేదలకు, ఆకలిగొన్నవారికి అన్నం తినిపించటం చాలా గొప్ప పని. ఇందులో అవసరాల్లో ఉన్నవారి అవసరాలు తీర్చటం అనే అర్థం కూడా ఉంది. అదేవిధంగా పరిచయమున్నా లేకపోయినా ప్రతి ఒక్కరికీ సలాం చేయటం కూడా చాలా గొప్ప లక్షణం. ఈ రెండు పనులూ ఎలాంటివంటే – వీటివల్ల పరస్పరం ప్రేమాభిమానాలు పెంపొందుతాయి. హృదయాల్లో ఉండే అక్కసు, అసూయ, ద్వేషభావాలు నశిస్తాయి. ఇంకో విషయం ; సలాం అంటే 'అస్సలాము అలైకుమ్' అని చెప్పటమేగాని నమస్తే, ఆదాబ్ అర్జ్, గుడ్‌మార్నింగ్ మొదలగు పరిచయవాక్యాలు కావు. ఇవి సలాం క్రిందికి రావు. అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త బోధించిన పద్ధతి ఉండగా పరుల, పాశ్చాత్యుల పోకడలను అనుసరించటం తప్పు. అంతేకాదు, ధర్మనిర్లక్ష్యం కూడాను.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|సలాం ప్రకరణం|131. సలాం విశిష్టత, దాన్ని సర్వసామాన్యం చేయాలన్న ఆదేశం గురించి|హదీసు 845

846

హదీసు 846

وعن أبي هريرة رضي الله عنه عن النَّبيّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قال "لما خَلَقَ الله تعالى آدَمَ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَالَ: اذْهَبْ فَسَلِّمْ عَلَى أُولئِكَ نَفَرٍ مِنَ الَمَلاَئكة جُلُوسٌ فاسْتمعْ مايُحَيُّونَكَ فَإنَّها تَحيَّتُكَ وَتَحِيَّةُ ذُرِّيَّتِك. فَقَالَ: السَّلام عَلَيْكُمْ، فقالوا: السَّلام ُ عَلَيْكَ وَرَحْمةُ اللهِ، فَزادُوهُ: وَرَحْمةُ اللهِ" متفقٌ عَلَيْهِ.

హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రవచించారు : దేవుడు ఆదంను సృష్టించిన తర్వాత ఆయనతో, "వెళ్ళు, వెళ్ళి ఆ కూర్చొని వున్న దైవదూతలకు సలాం చెయ్యి. దానికి వారు ఏం సమాధానమిస్తారో జాగ్రత్తగా విను. వారు పలికిన సలామే నీకూ, నీ సంతానానికి సలాం (చేసే పద్ధతి) అవుతుంది" అని అన్నాడు. అప్పుడు ఆదం (అలైహి) వెళ్ళి వారికి 'అస్సలాము అలైకుం' అని సలాం చేశారు. దానికి వారు 'అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహ్' అని ప్రతి సలాం చేశారు. వారు 'రహ్మతుల్లాహ్' అనే పదాన్ని అదనంగా పలికారు. (బుఖారీ – ముస్లిం)

(సహీహ్ బుఖారీలోని దైవప్రవక్తల ప్రకరణం, సహీహ్ ముస్లింలోని స్వర్గ ప్రకరణం)

English

Abu Hurairah (radiyallahu anhu) reported: The Prophet ﷺ said, “When Allah created Adam ﷺ, He said to him: `Go and greet that company of angels who are sitting there – and then listen to what they are going to say in reply to your greetings because that will be your greeting and your off-spring’s.’ Adam ﷺ said to the angels: `As-Salamu `Alaikum (may you be safe from evil).’ They replied: `As-Salamu `Alaikum wa Rahmatullah (may you be safe from evil, and Mercy of Allah be upon you).’ Thus adding in reply to him: `wa Rahmatullah (and Mercy of Allah)’ to his greeting.”[Al-Bukhari and Muslim].

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|సలాం ప్రకరణం|131. సలాం విశిష్టత, దాన్ని సర్వసామాన్యం చేయాలన్న ఆదేశం గురించి|హదీసు 846

847

హదీసు 847

وعن أَبي عُمارة البراءِ بن عازبٍ رضي الله عنهما قَالَ: أمرنا رسولُ الله صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم بِسَبعٍ: "بِعِيادَةِ الَمرِيضِ. وَاتِّباع الجَنائز، وَتشْميت العَاطس، ونصرِ الضَّعِيف، وَعَوْن المَظْلُومِ، وإفْشاءِ السَّلام، وإبرارِ المُقسِمِ "متفقٌ عَلَيْهِ، هَذَا لفظ إحدى روايات البخاري.

హజ్రత్ అబూ ఉమారా బరా బిన్ ఆజిబ్ (రదియల్లాహు అన్హుమా) కథనం : దైవప్రవక్త ﷺ మాకు ఏడు విషయాలను గురించి ఆజ్ఞాపించారు : 1. వ్యాధిగ్రస్తుణ్ణి పరామర్శించటం. 2. శవం వెంట వెళ్ళటం. 3. తుమ్మిన వ్యక్తి (అల్‌హమ్దు లిల్లాహ్ అంటే అతని)కి సమాధానమివ్వటం. 4. బలహీనుడికి సహాయం చేయటం. 5. బాధితునికి సాయపడటం. 6. సలాంను సర్వసామాన్యం చేయటం. 7. ప్రమాణం చేసేవాని ప్రమాణాన్ని నెరవేర్చటం.

(బుఖారీ – ముస్లిం)

(ఈ వాక్యాలు బుఖారీగారి ఒక ఉల్లేఖనంలోనివి)

English

Al-Bara’ bin `Azib (radiyallahu anhuma) reported: The Messenger of Allah ﷺ commanded us to do seven things: to visit the sick, to follow the funeral (of a dead believer), to invoke the Mercy of Allah upon one who sneezes (i.e., by saying to him: Yarhamuk-Allah), to support the weak, to help the oppressed, to promote the greeting of `As-Salamu `Alaikum’, and to help those who swear to do something to keep their oaths.[Al-Bukhari and Muslim].

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|సలాం ప్రకరణం|131. సలాం విశిష్టత, దాన్ని సర్వసామాన్యం చేయాలన్న ఆదేశం గురించి|హదీసు 847

848

హదీసు 848

وعن أَبي هريرةَ رضي الله عنه قَالَ: قالَ رَسُول الله صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم "لاَ تَدْخُلُوا الجَنَّةَ حَتَّى تُؤْمِنُوا وَلا تُؤمِنوا حَتى تحَابُّوا، أَوَلا أدُلُّكُمْ عَلَى شَئٍ إِذَا فَعَلْتُمُوهُ تَحاَبَبْتُم؟ أفْشُوا السَّلام بَيْنَكُم" رواه مسلم.

హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రబోధించారు : మీరు విశ్వసించనంతవరకూ స్వర్గంలోకి ప్రవేశించలేరు. అలాగే మీరు పరస్పరం ప్రేమించుకోనంత వరకూ (పూర్తిగా) విశ్వసించలేరు. మీరు ఒండొకర్ని ప్రేమించుకోవాలంటే ఏం చేయాలో నేను మీకు తెల్పనా? మీ మధ్య నలాంను నర్వసామాన్యం చేసుకోండి (ఒండొకరికి ఎక్కువగా సలాములు చేస్తూ ఉండండి.) (ముస్లిం)

(సహీహ్ ముస్లింలోని విశ్వాస ప్రకరణం)

English

Abu Hurairah (radiyallahu anhu) reported: The Messenger of Allah ﷺ said, “By Him in Whose Hand is my life! You will not enter Jannah until you believe, and you will not believe until you love one another. Shall I inform you of something which, if you do, you will love one another? Promote greetings amongst yourselves.”[Muslim].

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|సలాం ప్రకరణం|131. సలాం విశిష్టత, దాన్ని సర్వసామాన్యం చేయాలన్న ఆదేశం గురించి|హదీసు 848

849

హదీసు 849

وعن أَبي يوسف عبد الله بن سلام رضي الله عنه قالَ: سَمِعتُ رَسُولَ اللهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم يقول "يَا أيُّهَا النّاسُ أفْشُوا السَّلام، وَأْطعِمُوا الطْعَامَ، وَصِلُوا الأْرحامَ، وَصَلُّوا والنَّاس نيامٌ، تَدْخُلوا الجُنَّة بِسَلاَم "رواه الترمذي وقال: حديث حسن صحيح.

దైవప్రవక్త ﷺ ఇలా ప్రబోధిస్తుండగా తాను విన్నానని అబూ యూసుఫ్ అబ్దుల్లాహ్ బిన్ సలామ్ (రదియల్లాహు అన్హు) తెలియజేశారు : ప్రజలారా! సలాంను సర్వ సామాన్యం చెయ్యండి. (ఆకలిగొన్నవారికి) అన్నం పెట్టండి. బంధువుల యెడల ఉత్తమంగా మెలగండి. జనులు నిద్రపోయి ఉన్నప్పుడు (తహజ్జుద్) నమాజ్ చేయండి. వీటిని పాటిస్తే మీరు ప్రశాంతంగా స్వర్గంలోకి ప్రవేశిస్తారు. (తిర్మిజీ – హసన్, సహీహ్)

(సుననె తిర్మిజీలోని అన్నపానీయాల అధ్యాయాలు)

English

`Abdullah bin Salam (radiyallahu anhu) reported: I heard the Messenger of Allah ﷺ saying, “O people, exchange greetings of peace (i.e., say: As-Salamu `Alaikum to one another), feed people, strengthen the ties of kinship, and be in prayer when others are asleep, you will enter Jannah in peace.”[At-Tirmidhi].

ముఖ్యాంశాలు

ఇద్దరు ముస్లింలు పరస్పరం కలుసుకున్నప్పుడు వారి మధ్య సంభాషణ మొదలవటానికి లేక పరస్పరం ప్రేమాభిమానాలను వ్యక్తం చేసుకోవటానికి ఇస్లాం ధర్మం ఒక చక్కని పరిచయ వాక్యాన్ని సూచించింది. అదే 'అస్సలాము అలైకుమ్' అని అనటం. పరిచితులయినా, అపరిచితులయినా ప్రతి ఒక్కరికీ సలాం చేయమంటోంది ఇస్లాం. "అస్సలాము అలైకుం" అంటే మీకు శాంతి కలుగుగాక! అని అర్థం. సలాం చేసేవ్యక్తి ఎదుటివ్యక్తి శ్రేయోశాంతుల కోసం దేవుణ్ణి ప్రార్థిస్తాడన్నమాట! పరస్పరం సలాం చేసుకునే ఈ ఆచారం ఈ నాటిది కాదు. ఆది మానవుడైన ఆదం ప్రవక్త కాలం నుంచే మానవుల మధ్య ఈ ఆచారం నడుస్తూ వస్తోంది. పైన పేర్కొనబడిన హదీసుల్లోని ఒక హదీసులో ఆదం (అలైహి) 'అస్సలాము అలైకుం' అని అంటే దానికి జవాబుగా దైవదూతలు "వ అలైకుముస్సలామ్ వ రహ్మతుల్లాహ్" అని ప్రతి సలాం చేశారు. అయితే మొదటగా సలాం చేసే వ్యక్తి స్వయంగా "అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహూ" అని అనటం అభిలషణీయమనీ, దానివల్ల పుణ్యం కూడా ఎక్కువ లభిస్తుందని మరికొన్ని హదీసుల ద్వారా బోధపడుతోంది.

సలాం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి. దానివల్ల ఇద్దరి మధ్య ప్రేమ పెరుగుతుంది. పరస్పర భయభ్రాంతులు తొలగిపోతాయి. ఎదుటి వ్యక్తి శ్రేయాన్ని కాంక్షించినందుకు పుణ్యం కూడా లభిస్తుంది. దైవప్రవక్త సహచరులు కేవలం సలాం చేయటం కోసమే బజారుకు వెళ్ళేవారని రాబోయే హదీసులో చెప్పబడింది. దీనిద్వారా ఇస్లాం ధర్మంలో సలాంకు ఎంతటి ప్రాముఖ్యం ఉందో బోధపడుతోంది.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|సలాం ప్రకరణం|131. సలాం విశిష్టత, దాన్ని సర్వసామాన్యం చేయాలన్న ఆదేశం గురించి|హదీసు 849

850

హదీసు 850

وعن الطُّفَيْل بن أُبَيِّ بن كعبٍ أنَّه كَانَ يأتي عبد الله بن عمر فيغدو مَعَهُ إِلَى السُّوقِ, قَالَ: فإذَا غَدَوْنَا إِلَى السُّوقِ, لَمْ يَمُرَّ عَبدُ الله عَلَى سَقَّاطٍ وَلاَ صَاحِبِ بيعَة وَلا مْسكين وَلا أحَدٍ إِلاَّ سَلّم عَليه، قَالَ الطُّفيلُ: فَجِئْتُ عبد الله بنَ عُمرَ يَوْماً فاستَْتَبعني إِلَى السُّوقِ فقُلْت لَهُ: ماتَصْنعُ بالسوقٍ وأنْتَ لا تَقِفُ عَلى البَيْع وَلا تَسْألُ عَن السِّلَعِ وَلا تَسُومُ بِهَا وَلا تَجلسُ في مَجَالِسِ السُّوقِ؟ وأقولُ اجْلسْ بِنَا ههُنا نَتَحدَّث، فَقَالَ يَا أَبَا بُطْن. وَكانَ الُطُّفَيلُ ذَا بَطْن إنَّما نَغُدو منْ أجْل السَّلام فنُسَلِّمُ عَلَى مَنْ لَقِيناهُ، رواه مالك في الموُطَّإ بإسناد صحيح.

హజ్రత్ తుఫైల్ బిన్ ఉబై బిన్ కాబ్ తరచూ అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హుమా) దగ్గరికి వెళ్తుండేవారు. అలా వెళ్ళినప్పుడల్లా అబ్దుల్లాహ్ (రదియల్లాహు అన్హు)తో పాటు సంతకు పోయేవారు. ఆయన ఇలా తెలియజేస్తున్నారు:

మేమిద్దరం సంతకు వెళ్ళినప్పుడు సంతలో పాత సామాన్లు అమ్మేవారు, వ్యాపారులు, అభాగ్యులు ఎవరు తారసిల్లితే వారికి అబ్దుల్లాహ్ (రదియల్లాహు అన్హు) సలాం చేసేవారు. ఒకరోజు నేను ఆయన దగ్గరికి వెళ్ళాను. అప్పుడాయన తనతోపాటు నన్ను కూడా సంతకు రమ్మని పిలిచారు. అందుకు నేనాయనతో, "ఏమండీ, ఎందుకండి సంతకు? సంతలో ఏం చేస్తారు మీరు? మీరు ఏ వ్యాపారి దగ్గరా కూర్చోరు. ఏ సామాను గురించీ అడగరు. ఏ వస్తువునీ బేరమాడరు, ఆఖరికి సంతలో జరిగే సమావేశాల్లోనూ కూర్చోరు. అందుకని నా మాట విని ఇక్కడే కూర్చోండి. మనం ఇక్కడే మాట్లాడుకుందాం" అని అన్నాను.

అందుకాయన "ఓయి బొజ్జవాడా! (తుఫైల్ కడుపు పెద్దగా ఉండేది) మనం కేవలం సలాం చేసే ఉద్దేశ్యంతో సంతకు వెళ్తున్నాం. సంతలో ఎవరు కానొస్తే వారికి సలాం చేస్తాం" అని అన్నారు.

(ముఅత్తా. దీని ఆధారాలు దృఢమైనవి)

(ముఅత్తా ఇమామ్ మాలిక్‌లోని సలాం ప్రకరణం)

English

At-Tufail bin Ubayy bin Ka`b (radiyallahu anhu) reported: I used to visit `Abdullah bin `Umar (radiyallahu anhuma) in the morning and accompany him to the market. `Abdullah offered greetings of peace to every one he met on the way, be they sellers of petty goods, traders or poor people. One day when I came to him, he asked me to accompany him to the market. I said to him: “What is the point of your going to the market when you do not sell, nor ask about articles, nor offer a price for them, nor sit down with any company of people. Let us sit down here and talk.” He replied: “O Abu Batn (belly)! (Tufail had a large belly), we go to the market to greet everyone we meet.”[Malik].

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|సలాం ప్రకరణం|131. సలాం విశిష్టత, దాన్ని సర్వసామాన్యం చేయాలన్న ఆదేశం గురించి|హదీసు 850