హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: ఇమామ్ అబూ జకరియ్యా యహ్యా బిన్ షరఫ్ అన్ నవవీ (రహ్మతుల్లాహి అలైహి)
ఉర్దూ అనువాదం, వ్యాఖ్యానం: హాఫిజ్ సలాహుద్దీన్ యూసుఫ్ · తెలుగు రూపం: హాఫిజ్ ఎస్.ఎమ్. రసూల్ షర్ఫీ · ప్రకాశకులు: ట్రూత్ పబ్లికేషన్స్, హైదరాబాద్

రియాదుస్ సాలిహీన్ (హదీసు కిరణాలు) – 129వ అధ్యాయం: సమావేశ నియమాలు. ఈ అధ్యాయంలో 13 హదీసులు (హదీసు 825 – 837) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, ముఖ్యాంశాలు, English అనువాదంతో.
129. సమావేశ నియమాలు
باب في آداب المجلس والجليس
అరబీ పాఠం: రియాదుస్ సాలిహీన్ – తహ్ఖీఖ్: షుఐబ్ అల్ అర్నావూత్ (ముఅస్సస్సతుర్ రిసాలా)
హదీసు 825
عن ابنِ عمر رضي الله عنهما قَالَ: قَالَ رَسُول الله صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم "لايُقِيِمَنَّ أحَدُكُمْ رَجُلاً مِنْ مَجْلسهِ ثُمَّ يَجْلسُ فِيه ولكِنْ تَوسَعُّوا وتَفَسَّحوا" وَكَان ابنُ عُمَرَ إِذَا قام َ لهُ رَجُلٌ مِنْ مجْلِسه لَمْ يَجِلسْ فِيه. مُتَّفَقٌ عليه.
హజ్రత్ ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హుమా) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రబోధించారు : మీలో ఎవరూ (సమావేశంలో) ఇతరుల్ని లేపి వారి చోట్లో కూర్చోరాదు. అంతగా అవసరమయితే ఇతరులకు కూడా చోటు దొరికేలా, సర్దుకొని కూర్చోండని చెప్పండి.
ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హుమా)ని చూసి సమావేశంలో ఎవరయినా ఆయనకు చోటు కల్పించటానికి లేచి నించుంటే, ఆయన ఆ చోట్లో కూర్చునేవారు కారు.
(బుఖారీ – ముస్లిం)
(సహీహ్ బుఖారీలోని ఇస్తీజాన్ ప్రకరణం, సహీహ్ ముస్లింలోని సలాం ప్రకరణం)
English
Ibn `Umar (radiyallahu anhuma) reported: Messenger of Allah ﷺ said, “Do not ask someone to give up his seat in order to take it, but make accommodation wide and sit at ease.” It was Ibn `Umar’s habit that if a person left his seat for him, he would not take it.[Al-Bukhari and Muslim].
ముఖ్యాంశాలు
సభలు, సమావేశాలు జరిగినప్పుడు ఒక వ్యక్తి ముందుగా వచ్చి ఒకచోట కూర్చుంటే ఆ తర్వాత వచ్చినవారు అతడ్ని లేపి ఆ చోట్లో కూర్చోవటం సమ్మతం కాదని ఈ హదీసు ద్వారా తెలుస్తోంది. అదేవిధంగా ఎవరయినా తమ సరుకు అమ్ముకోవటానికి లేక మరేదయినా పనిచేయటానికి బజారులు, సంతలు తదితర ప్రదేశాలకు ముందుగా వెళ్ళి ఒక చోటును నిర్ణయించుకుంటే, ఆ చోట్లో వ్యాపార కార్యకలాపాలు నిర్వహించుకోవటానికి వారే ఎక్కువ అర్హులుగా పరిగణించబడతారు. ఇతరులెవరయినా వచ్చి ఆ చోట్లో కూర్చోవటానికి ప్రయత్నిస్తే మొదటగా వచ్చినవారికి వారిని ఆపే హక్కు ఉంటుంది. అయితే ప్రభుత్వ స్థలాల దురాక్రమణను నియంత్రించే విషయంలో ప్రభుత్వ యంత్రాంగానికి పూర్తి అధికారం ఉంటుంది.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|నిద్ర ప్రకరణం|129. సమావేశ నియమాలు|హదీసు 825
హదీసు 826
وعن أبي هريرة رضي الله عنه أن رسول لله صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَالَ: "إِذَا قاَم أحَدُكُمْ منْ مَجْلسٍ ثُمَّ رَجَعَ إلَيْهِ فَهُوَ أحَقُّ بِه "رواه مسلم.
హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రబోధించారు : ఎవరయినా ఒకచోట కూర్చొని లేస్తే, తిరిగొచ్చిన తర్వాత ఆ చోట్లో కూర్చోవటానికి అందరికన్నా అతనే ఎక్కువ అర్హుడు. (ముస్లిం)
(సహీహ్ ముస్లింలోని సలాం ప్రకరణం)
English
Abu Hurairah (radiyallahu anhu) reported: Messenger of Allah ﷺ said, “If someone leaves his seat (for one reason or another) and returns to it, he is better entitled to it.”[Muslim].
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|నిద్ర ప్రకరణం|129. సమావేశ నియమాలు|హదీసు 826
హదీసు 827
وعن جابر بنِ سَمُرَةَ رضي اللَّه عنهما قَالَ: "كُنَّا إذَا أَتَيْنَا النَّبيَّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم جَلَسَ أَحَدُنَا حَيْثُ يَنْتَهي". رواه أَبو داود. والترمذي وَقالَ: حديث حسن.
హజ్రత్ జాబిర్ బిన్ సమురా (రదియల్లాహు అన్హుమా) కథనం : మేము దైవప్రవక్త ﷺ దగ్గరికి వెళ్ళినప్పుడు మాలో ప్రతి ఒక్కడు (సమావేశంలో) ఎక్కడివరకు వెళ్ళగలుగుతాడో (ఎక్కడ స్థలం దొరుకుతుందో) అక్కడే కూర్చునేవాడు. (అబూ దావూద్, తిర్మిజీ – హసన్)
(సుననె అబూ దావూద్లోని సంస్కార ప్రకరణం, సుననె తిర్మిజీలోని ఇస్తీజాన్ అధ్యాయాలు)
English
Jabir bin Samurah (radiyallahu anhuma) reported: Whenever we came to the gathering of the Prophet, we would sit down at the end (of the assembly).[Abu Dawud].
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|నిద్ర ప్రకరణం|129. సమావేశ నియమాలు|హదీసు 827
హదీసు 828
وعن أَبي عبدِ الله سَلْمان الفارِسي رضي الله عنه قَالَ: قَالَ رَسُولُ الله صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "لاَ يَغْتَسِلُ رَجُلٌ يَوْمَ الجُمُعة وَيَتَطهّرُ مَا اسْتَطاعَ منْ طُهر وَيدَّهنُ منْ دُهْنِهِ أوْ يَمسُّ مِنْ طِيب بَيْته ثُمَّ يَخْرُجُ فَلاَ يُفَرِّقُ بَيْنَ اثْنينْ ثُمَّ يُصَلّي ما كُتِبَ له ُ ثُمَّ يُنْصِتُ إذَا تَكَلَّمَ الإمامُ إِلاَّ غُفِرَ لهُ مَا بَيْنَهُ وَبَيَْن الجمُعَةِ الأُخْرَى" رواه البخاري.
హజ్రత్ అబూ అబ్దుల్లాహ్ సల్మాన్ ఫార్సీ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రబోధించారు : ఏ వ్యక్తి అయినా జుమా రోజు గుసుల్ (స్నానం) చేసి, వీలైనంత వరకు శుచీశుభ్రతలు పాటించి, ఇంట్లో ఉన్న నూనె రాసుకొని లేక పరిమళం పూసుకొని, ఆ తర్వాత (జుమా ఆరాధన కోసం) ఇంటి నుండి వెళ్ళి (మస్జిద్లోకి ప్రవేశించిన తర్వాత) అక్కడ ఏ ఇద్దరి మధ్యలోనూ జొరబడకుండా, తనకోసం రాసిపెట్టబడిన నమాజ్ చేసి, ఇమామ్ ఖుత్బా (ఉపన్యాసం) ఇచ్చినప్పుడు మౌనం వహిస్తే, ఆ జుమా నుండి మరో జుమా వరకు అతని వల్ల జరిగే (చిన్న చిన్న) పాపాలన్నీ క్షమించబడతాయి. (బుఖారీ)
(సహీహ్ బుఖారీలోని జుమా ప్రకరణం)
English
Salman Al-Farisi (radiyallahu anhu) reported: Messenger of Allah ﷺ said, “If a man takes a bath on Friday, purifies himself thoroughly, uses oil and perfume which is available in the house, sets forth for the mosque, does not (forcibly) sit between two persons, offers the prayer that is prescribed for him and listens to the Imam silently, his sins between this Friday and the previous Friday will be forgiven.”[Al-Bukhari].
ముఖ్యాంశాలు
పై హదీసు ద్వారా బోధపడే ముఖ్య విషయాలు ఇవి :
1. జుమా రోజు చేసే తలంటు స్నానానికి ఎంతో విశిష్ఠత ఉంది. అందుకే కొంతమంది పండితులు దానిని 'ముస్తహబ్' (అభిలషణీయమైనది)గా భావిస్తే, మరికొంతమంది దాన్ని 'వాజిబ్' (తప్పనిసరి)గా తలపోశారు.
2. ఈ తలంటు పోసుకునే సమయం జుమా రోజు ఉషోదయం నుండి సూర్యుడు నడినెత్తి నుండి వాలేవరకు ఉంటుంది. అంటే జుమా నమాజుకు ముందు ఎప్పుడైనా గుసుల్ (స్నానం) చేయవచ్చు.
3. జుమా రోజు సువాసన గల నూనెలు, అత్తరు లాంటి సుగంధ ద్రవ్యాలు ఉపయోగించటం అభిలషణీయం.
4. మస్జిద్లో ఎక్కడ చోటు దొరికితే అక్కడ కూర్చోవాలి. అంతేగాని ప్రజల భుజాల మీద నుంచి గెంతుతూ ముందుకు వెళ్ళకూడదు. జనం మధ్యలో జొరబడి కూర్చోరాదు.
5. జుమా రోజు మస్జిద్లోకి ప్రవేశించిన తర్వాత అన్నిటికన్నా ముందు రెండు రకాతుల నమాజ్ చేయాలి. ఆఖరికి ఖతీబ్ ఖుత్బా (ఉపన్యాసం) ఇస్తున్నప్పుడయినా సంక్షిప్తంగా రెండు రకాతుల నమాజ్ చేసుకున్న తర్వాతే కూర్చోవాలి.
6. పై నియమాలన్నీ పాటించి జుమా నమాజ్ చేస్తే ఆ జుమా నుండి మరో జుమా వరకు మనిషి వల్ల జరిగే చిన్న చిన్న పాపాలన్నీ మన్నించబడతాయి.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|నిద్ర ప్రకరణం|129. సమావేశ నియమాలు|హదీసు 828
హదీసు 829
وعن عمرو بن شُعَيْب عن أبيهِ عن جَدِّهِ رضي الله عنه أنَّ رسول الله صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قال: "لايحَلُّ لِرَجُل أنْ يُفَرِّقَ بَيْنَ اثْنيْنِ إِلاَّ بإذْنِهِمَا" رواه أَبو داود، والترمذي وَقالَ: حديث حسن. وفي رواية لأبي داود: "لايَجلِسُ بَيْنَ رَجُليْن إِلاَّ بإذْنِهمَا".
హజ్రత్ అమ్ర్ బిన్ షుఐబ్ తన తండ్రి నుండి ఆయన తన తాతగారి నుండి చేసిన కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రబోధించారు : కలిసి కూర్చున్న ఇద్దరు వ్యక్తులను వారి అనుమతి లేకుండా విడదీయటం ఏ మనిషికీ సమ్మతం కాదు. (అబూ దావూద్, తిర్మిజీ – హసన్)
అబూ దావూద్లోని వేరొక ఉల్లేఖనంలో, "ఇద్దరు వ్యక్తుల మధ్య వారి అనుమతి లేకుండా కూర్చోకూడదు" అని ఉంది.
(సుననె అబూ దావూద్, సుననె తిర్మిజీలలోని సంస్కార ప్రకరణాలు)
English
`Amr bin Shu`aib on the authority of his father and grandfather reported: Messenger of Allah ﷺ said, “It is not permissible for a person to sit between two people without their permission.”[At-Tirmidhi].
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|నిద్ర ప్రకరణం|129. సమావేశ నియమాలు|హదీసు 829
హదీసు 830
وعن حذيفة بن اليمان رضي الله عنه أنَّ رسول الله صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم لَعَنَ مَنْ جَلَسَ وَسَطَ الحَلْقَةَ. رواه أَبُو داود بإسنادٍ حسن. وروى الترمذي عن أبي مِجْلزٍ أنَّ رَجُلاً قَعَدَ وَسَطَ حَلقْة فَقَالَ حُذَيْفَةُ: مُلْعُونٌ عُلَىَ لِسَانِ مُحَمَّدٍ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم أوْ لَعَنَ اللهُ عَلَى لِسَانِ محُمَدٍ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم مَنْ جَلَسَ وَسَطَ الْحَلْقةِ. قَالَ الترمذي: حديث حسن صحيح.
హజ్రత్ హుజైఫా బిన్ యమాన్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం వలయాకాలంలో ఉండే సమావేశం మధ్యలో కూర్చొనేవాణ్ణి దైవప్రవక్త ﷺ శపించారు.
(అబూ దావూద్ దీనిని ప్రామాణికమైన ఆధారాలతో ఉల్లేఖించారు)
తిర్మిజీ అబూ మిజ్లజ్ నుండి చేసిన కథనం ఇలా ఉంది : వలయాకారంలో ఉన్న సమావేశం మధ్యలో కూర్చొని ఉన్న ఒక వ్యక్తిని చూసి హుజైఫా (రదియల్లాహు అన్హు) ఇలా అన్నారు:
"వలయాకారంలో ఉండే సమావేశం మధ్యలో కూర్చునేవాడు ముహమ్మద్ ﷺ నోట శాపగ్రస్తుడవుతాడు లేదా దేవుడు అతడ్ని ముహమ్మద్ ﷺ నోట శపిస్తాడు." (తిర్మిజీ – హసన్, సహీహ్)
(సుననె అబూ దావూద్లోని సంస్కార ప్రకరణం, సుననె తిర్మిజీలలోని సంస్కార అధ్యాయాలు)
English
Hudhaifah bin Al-Yaman (radiyallahu anhu) reported: Whosoever takes seat in the midst of an assembly has been cursed by Messenger of Allah ﷺ The Messenger of Allah curses the one who sits in the middle of people’s circle.[Abu Dawud].
ముఖ్యాంశాలు
సమావేశంలో కూర్చొని ఉన్న జనం మధ్య జొరబడకూడదనే ఈ హదీసు భావం కూడాను. అలా చేయటం సభ్యత అనిపించుకోదు. పైగా సభా నియమాలను ఉల్లంఘించినట్లవుతుంది.
ఈ సందర్భంగా గమనార్హమైన విషయం ఏమిటంటే ఈ హదీసుని వివరించిన ఉల్లేఖకుల పరంపరలో ఒకచోట లింకు తెగి వుందని షేఖ్ అల్బానీ (రహిమహుల్లాహ్) అన్నారు. ఎందుకంటే అబూ మిజ్లజ్ (ఈయన అసలు పేరు లాహిఖ్ బిన్ హుమైద్) హజ్రత్ హుజైఫా (రదియల్లాహు అన్హు) నుండి ఈ హదీసు వినలేదని చారిత్రక ఆధారాల ద్వారా నిరూపితమయింది. అయినప్పటికీ ఇందులోని భావాన్ని ప్రామాణికమైన హదీసులు బలపరుస్తున్నాయి.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|నిద్ర ప్రకరణం|129. సమావేశ నియమాలు|హదీసు 830
హదీసు 831
وعن أَبي سعيدٍ الخدريِّ رضي الله عنه قَالَ سَمِعت رَسُول الله صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم يقول "خَيْرُ الْمَجَالِسِ أوْسَعُهَا" رواه أَبُو داود بإسنادٍ صحيح عَلَى شرطِ البخاري.
దైవప్రవక్త ﷺ ఈ విధంగా ప్రవచిస్తుండగా తాను విన్నానని హజ్రత్ అబూ సయీద్ ఖుద్రీ (రదియల్లాహు అన్హు) తెలియజేశారు : విశాలంగా ఉండే సమావేశాలే అత్యుత్తమ సమావేశాలు.
(అబూ దావూద్ దీనిని దృఢమైన ఆధారాలతో, బుఖారీ నియమాలననుసరించి ఉల్లేఖించారు)
(సుననె అబూ దావూద్లోని సంస్కార ప్రకరణం)
English
Abu Sa`id Al-Khudri (radiyallahu anhu) reported: I heard Messenger of Allah ﷺ saying “The best assemblies are those in which people make room for one another.”[Abu Dawud].
ముఖ్యాంశాలు
సమావేశం జరిగే స్థలం గనక ఇరుకుగా ఉంటే ఆ సమావేశానికి హాజరయ్యే జనం నానా ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. అదే సమావేశపు స్థలం విశాలంగా ఉంటే జనం ప్రశాంతంగా కూర్చొని అక్కడ బోధింపబడే విషయాలు వింటారు. బయటినుంచి వచ్చేవారికి కూడా కూర్చోవటానికి తగినంత చోటు లభిస్తుంది. అన్నిటినీ మించి సభకు అంతరాయం కలగకుండా ఉంటుంది.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|నిద్ర ప్రకరణం|129. సమావేశ నియమాలు|హదీసు 831
హదీసు 832
وعن أَبي هريرة رضي الله عنه قَالَ: قَالَ رَسُولُ الله صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "مَنْ جَلَسَ في مَجْلس فَكثُرَ فيهِ لَغطُهُ فَقَالَ قَبْلَ أنْ يَقُومَ منْ مجلْسه ذَلِكَ: سبْحانَك اللَّهُمّ وبحَمْدكَ أشْهدُ أنْ لا إلهَ إِلاَّ أنْت أسْتغْفِركَ وَأتَوبُ إليْك: إلا غُفِرَ لَهُ ماَ كان َ في مَجْلِسِهِ ذلكَ" رواه الترمذي وقال: حديث حسن صحيح.
హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రబోధించారు : ఎవరయినా ఒక సమావేశంలో కూర్చొని ఎన్నో వ్యర్థమైన మాటలు మాట్లాడి, తిరిగి ఆ సమావేశం నుండి లేచేముందు, "సుబ్హానకల్లాహుమ్మ వ బిహమ్దిక, అష్హదు అల్ల్రా ఇలాహ ఇల్లా అన్త, అస్తగ్ఫిరుక వ అతూబు ఇలైక్ (దేవా! నీవు నీ స్తోత్ర సమేతంగా పరిశుద్ధుడవు. నీవు తప్ప వేరొక ఆరాధ్యదేవుడు లేడని నేను సాక్ష్యమిస్తున్నాను. నేను నిన్ను క్షమాభిక్ష పెట్టమని వేడుకుంటున్నాను. నా వల్ల జరిగిన పాపాలపై పశ్చాత్తాపపడుతూ నీ వైపుకు మరలుతున్నాను)" అని అంటే ఆ సమావేశంలో అతని వల్ల జరిగిన పాపాలన్నీ మన్నించబడతాయి.
(తిర్మిజీ – హసన్, సహీహ్)
(సుననె తిర్మిజీలోని ప్రార్థనల ప్రకరణం)
English
Abu Hurairah (radiyallahu anhu) reported: Messenger of Allah ﷺ said, “Whoever sits in a gathering and indulges in useless talk and before getting up supplicates: `Subhanaka Allahumma wa bihamdika, ash-hadu an la ilaha illa Anta, astaghfiruka wa atubu ilaika (O Allah, You are free from every imperfection; praise be to You. I testify that there is no true god except You; I ask Your Pardon and turn to You in repentance),’ he will be forgiven for (the sins he may have intentionally or unintentionally committed) in that assembly.”[At-Tirmidhi].
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|నిద్ర ప్రకరణం|129. సమావేశ నియమాలు|హదీసు 832
హదీసు 833
وعن أَبي بَرْزَةَ رضي الله عنه قال: كان رسول صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم يقولُ بأَخَرَةٍ إذَا أرَادَ أنْ يَقُومَ مِنَ الْمَجِلسِ "سُبْحَانَكَ اللَّهُمَّ وبَحَمْدكَ أشْهدُ أنْ لا إلهَ إِلاَّ أنْتَ أَسْتَغْفِرُكَ وأتُوبُ إِلَيْكَ"فقال رَجُلٌ يارسول الله إنَّكَ لَتَقُولُ قَوْلاَ مَاكُنْتَ تَقُولُهُ فِيَما مَضَى؟ قَالَ:"ذلكَ كفَّارَةٌ لِماَ يَكُونُ في الْمجْلِسِ "رواه أَبُو داود، ورواه الحاكم أَبُو عبد الله في المستدرك من رواية عائشة رضي الله عنها وقال: صحيح الإسناد.
హజ్రత్ అబూ బర్జా (రదియల్లాహు అన్హు) కథనం: దైవప్రవక్త ﷺ ఏదయినా సమావేశం నుండి లేవదలచుకున్నప్పుడు చివర్లో ఈ విధంగా ప్రార్థించేవారు:
"దేవా! నీవు నీ స్తోత్రసమేతంగా పరిశుద్ధుడవు. నీవు తప్ప వేరొక ఆరాధ్యదేవుడు లేడని నేను సాక్ష్యమిస్తున్నాను. క్షమాభిక్ష పెట్టమని నిన్ను వేడుకుంటున్నాను. నా వల్ల జరిగిన పాపాలపై పశ్చాత్తాపపడుతూ నీ వైపుకు మరలుతున్నాను."
ఒకసారి ఓ వ్యక్తి దైవప్రవక్త ﷺ ఈ ప్రార్థనా వాక్యాలు పఠిస్తుండగా విని, "దైవప్రవక్తా! మీరు ఇవ్వాళ మునుపు ఎన్నడూ పఠించని వాక్యాలు పఠించారేమిటి?" అని అడిగాడు. అందుకాయన "ఈ వాక్యాలు సమావేశంలో జరిగే తప్పులకు పరిహారమవుతాయి" అని చెప్పారు.
(అబూ దావూద్, ముస్తద్రక్ హాకిమ్ – హాకిమ్ దీని పరంపరను దృఢమైనదిగా ఖరారు చేశారు).
(సుననె అబూ దావూద్లోని సంస్కార ప్రకరణం)
English
Abu Barzah (radiyallahu anhu) reported: Towards the end of his life, Messenger of Allah ﷺ would supplicate before leaving an assembly thus: “Subhanaka Allahumma wa bihamdika, ash-hadu an la ilaha illa Anta, astaghfiruka wa atubu ilaika (O Allah, You are free from every imperfection; all praise is for You. I testify that there is no true god except You, I ask Your forgiveness and turn to You in repentance).” A man once said to him: “O Messenger of Allah! You have spoken such words as you have never uttered before.” He said, “It is an expiation of that which goes on in the assembly.”[Abu Dawud].
ముఖ్యాంశాలు
దైవప్రవక్త ﷺ నోటి నుండి వ్యర్థమైన మాటలు ఎన్నడూ వెలువడలేదు. అయినప్పటికీ ఆయన సమావేశం పూర్తి కాగానే పశ్చాత్తాపంతో కూడిన వేడుకోలు వచనాలు పఠించేవారు. దైవాన్ని స్తుతించటానికి, ఆయన పవిత్రతను, ఔన్నత్యాన్ని కొనియాడటానికి, ముఖ్యంగా తన అనుచర సమాజానికి బోధించే ఉద్దేశ్యంతోనే ఆయన అలా చేసేవారు. కనుక మనం ఆయన సంప్రదాయాన్ని తప్పకుండా పాటించాలి.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|నిద్ర ప్రకరణం|129. సమావేశ నియమాలు|హదీసు 833
హదీసు 834
وعن ابن عمر رضي الله عنهما قال: قَلَّمَا كَانَ رسول الله صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم يَقُومُ مِنْ مَجْلس حَتَّى يَدعُوَ بهؤلاَءِ الَّدعَوَاتِ "الَّلهمَّ اقْسِم لَنَا مِنْ خَشْيَتِكَ مَا تحُولُ بِه بَيْنَنَا وبَينَ مَعاصيك، وَمِنْ طَاعَتِكَ ماتُبَلِّغُنَا بِه جَنَّتَكَ، ومِنَ اْليَقيٍن ماتُهِوِّنُ بِه عَلَيْنا مَصَائِبَ الدُّنيَا. الَّلهُمَّ مَتِّعْنا بأسْمَاعِناَ، وأبْصَارناَ، وِقُوّتِنا مَا أحييْتَنَا، واجْعَلْهُ الوَارِثَ منَّا، وِاجعَل ثَأرَنَا عَلى مَنْ ظَلَمَنَا، وانْصُرْنا عَلى مَنْ عادَانَا، وَلا تَجْعلْ مُِصيَبتَنا فِي دينَنا، وَلا تَجْعلِ الدُّنْيَا أكبَرَ همِّنا وَلاَ مَبْلَغَ عِلْمٍنَا، وَلا تُسَلِّط عَلَيَنَا مَنْ لاَ يْرْحَمُناَ "رواه الترمذي وقال حديث حسن.
హజ్రత్ ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హుమా) కథనం: దైవప్రవక్త ﷺ ఏదయినా సమావేశం ముగిసిన తర్వాత ఈ విధంగా ప్రార్థించకుండా లేచి వెళ్ళిపోవటమనేది బహు అరుదు.
"దేవా! పాపాలకు ఒడిగట్టకుండా మమ్మల్ని అడ్డుకునేటంతటి పాపభీతిని మాకు ప్రసాదించు. మమ్మల్ని నీ స్వర్గంలోకి ప్రవేశింపజేసేటంతటి విధేయతా భావాన్ని మాలో కలిగించు. ఇహలోకంలో ఎదురయ్యే కష్టాలను అవలీలగా భరించగలిగే విధంగా మాలో (ధర్మం పట్ల) నమ్మకాన్ని పెంపొందించు. దేవా! నీవు మాకు బ్రతుకనిచ్చినంత కాలం మా చెవులద్వారా, కళ్ళద్వారా ఇతర శక్తుల ద్వారా మాకు ప్రయోజనాన్ని చేకూర్చు. ఇంకా ఆ ప్రయోజనానికి మమ్మల్ని వారసులుగా చెయ్యి (అంటే జీవితాంతం మా శరీరా వయవాలు ఆరోగ్యంగా ఉండేటట్లు చెయ్యి). మాపై దౌర్జన్యం జరిపే వ్యక్తికి నీవు ప్రతీకారం చెయ్యి. శత్రువులకు వ్యతిరేకంగా మాకు సహాయపడు. ధార్మిక వ్యవహారాల్లో మమ్మల్ని కష్టాల పాల్జేయకు. ప్రాపంచిక సౌఖ్యాన్ని మా జీవితాల ఉన్నతాశయంగా, మా విద్యార్జనకు గమ్యంగా చేయకు. మాపై దయజూపని వ్యక్తికి మాపై అధికారం ఇవ్వకు.
(తిర్మిజీ – హసన్)
(సుననె తిర్మిజీలోని ప్రార్థనల అధ్యాయాలు)
English
Ibn `Umar (radiyallahu anhuma) reported: Messenger of Allah ﷺ seldom left a gathering without supplicating in these terms: “Allahumma-qsim lana min khashyatika ma tahulu bihi bainana wa baina ma`sika, wa min ta`atika ma tuballighuna bihi jannataka, wa minal-yaqini ma tuhawwinu `alaina masa-‘ibad-dunya. Allahumma matti`na biasma`ina, wa absarina, wa quwwatina ma ahyaitana, waj`alhul-waritha minna, waj`al tharana `ala man zalamana, wansurna `ala man `adana, wa la taj`al musibatana fi dinina, wa la taj`alid-dunya akbara hammina, wa la mablagha `ilmina, wa la tusallit `alaina man-la yarhamuna, (O Allah, apportion to us such fear as should serve as a barrier between us and acts of disobedience; and such obedience as will take us to Your Jannah; and such as will make easy for us to bear in the calamities of this world. O Allah! let us enjoy our hearing, our sight and our power as long as You keep us alive and make our heirs from our own offspring, and make our revenge restricted to those who oppress us, and support us against those who are hostile to us let no misfortune afflict our Deen; let not worldly affairs be our principal concern, or the ultimate limit of our knowledge, and let not those rule over us who do not show mercy to us).”[At-Tirmidhi].
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|నిద్ర ప్రకరణం|129. సమావేశ నియమాలు|హదీసు 834
హదీసు 835
وعن أَبي هريرة رضي الله عنه قال: قال رسول صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم "مَا مِنْ قَوْمٍ يَقومونَ منْ مَجْلسٍ لاَ يَذكُرُون الله تَعَالَى فِيهِ إِلاَّ قَاموا عَنْ مِثلِ جيفَةِ حِمَارٍ وكانَ لَهُمْ حَسْرَةً "رواه أَبُو داود بإسنادٍ صحيح.
హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రవచించారు : ఎవరయినా ఒక సమావేశంలో కూర్చొని దేవుణ్ణి స్మరించకుండా లేచి వెళ్ళిపోతే, వారు చనిపోయిన గాడిద శవం దగ్గరినుండి లేచి వెళ్ళిపోయారనుకోవాలి. ఇంకా ఆ సమావేశం వారి పాలిట దుఃఖదాయకంగానూ పరిణమిస్తుంది.
(అబూ దావూద్ దీనిని దృఢవైన ఆధారాలతో వెలికితీశారు)
(సుననె అబూ దావూద్ – సంస్కార ప్రకరణం)
English
Abu Hurairah (radiyallahu anhu) reported: Messenger of Allah ﷺ said, “Those people who leave a gathering in which they have not remembered Allah, will conclude it as if it has foul odour similar to that of a rotten carcass of a donkey. And it will be a cause of grief to them.’‘[Abu Dawud].
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|నిద్ర ప్రకరణం|129. సమావేశ నియమాలు|హదీసు 835
హదీసు 836
وعنه عن النبيِّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَالَ: "مَا جَلَسَ قَومٌ مَجْلِساً لَمْ يَذْكرُوا الله تَعَالَى فِيهِ ولَم يُصَُّلوا عَلَى نَبِيِّهم فِيهِ إلاَّ كانَ عَلَيّهمْ تِرةٌ، فإِنْ شاءَ عَذَّبَهُم، وإنْ شَاءَ غَفَرَ لَهُم" رواه الترمذي وقال حديث حسن.
హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) గారే చేసిన కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రబోధించారు : ఎవరయినా ఒక సమావేశంలో కూర్చొని దేవుణ్ణి స్మరించకుండా, తమ ప్రవక్త కోసం ప్రార్థించకుండా లేచి వెళ్ళిపోతే, ఆ సమావేశం వారి పాలిట దుఃఖ దాయకంగా పరిణమిస్తుంది. దేవుడు వారిని శిక్షించవచ్చు లేదా మన్నించనూవచ్చు. అది ఆయనిష్టం. (తిర్మిజీ – హసన్)
(సుననె తిర్మిజీలోని ప్రార్థనల అధ్యాయాలు)
English
Abu Hurairah (radiyallahu anhu) reported: The Prophet ﷺ said, “Whenever a group of people sit in a gathering in which they do not remember Allah the Exalted, nor supplicate to elevate the rank of their Prophet, such a gathering will be a cause of grief to them. If Allah wills, He will punish them, and if He wills He will forgive them.”[At-Tirmidhi].
ముఖ్యాంశాలు
ఈ హదీసులో 'తిరతున్' అనే పదం వాడబడింది. తిరతున్ అంటే దుఃఖదాయకం అని అర్థం. కొంతమంది దాన్ని నరకానికి గొనిపోయేది అని కూడా అనువదించారు. అంటే సమావేశంలో కూర్చొని దేవుణ్ణి స్మరించకపోతే, దైవప్రవక్త ﷺ కోసం ప్రార్థించకపోతే, ఆ సమావేశం వల్ల పుణ్యం లభించకపోగా, సమావేశంలో పాల్గొన్నవారిని అది నరకానికి గొనిపోతుంది. అందుకే కొంతమంది పండితులు సమావేశాల్లో కూర్చున్నప్పుడు తప్పనిసరిగా దైవప్రవక్త ﷺపై దరూద్ పంపాలని అభిప్రాయపడ్డారు.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|నిద్ర ప్రకరణం|129. సమావేశ నియమాలు|హదీసు 836
హదీసు 837
وعنه عن رسول الله صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَالَ: "مَنْ قعَدَ مَقْعَداً لَمْ يَذْكُرِ الله تَعَالَى فِيهِ كَانَت عَلَيْهِ مِنَ اللهِ ترَة، وَمَن اضطجَعَ مُضْطَجَعاً لايَذْكرُ الله تَعَالَى فِيهِ كَاَنتْ عَليْه مِنَ اللهِ تِرَةٌ َ"رواه أَبُو داود. وَقَدْ سبق قريباً، وشَرَحْنَا"التِّرَةَ"فِيهِ
హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) గారే చేసిన కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రబోధించారు : ఎవరయినా ఒకచోట కూర్చొని అక్కడ (ఒక్కసారయినా) దేవుణ్ణి స్మరించకపోతే, దేవుని తరపునుండి ఆ కూర్చోవటం అతని పాలిట సిగ్గుచేటుగా పరిణమిస్తుంది. అలాగే ఎవరయినా ఒకచోట పడుకొని అక్కడ దేవుణ్ణి స్మరించకపోతే, దేవుని తరపునుండి ఆ పడుకోవటం అతని పాలిట సిగ్గుచేటుగా పరిణమిస్తుంది. (అబూ దావూద్)
(సుననె అబూ దావూద్లోని సంస్కార ప్రకరణం)
English
Abu Hurairah (radiyallahu anhu) reported: Messenger of Allah ﷺ said, “If anyone sits in a gathering where he does not remember Allah, he will bring grief upon himself (on the Day of Resurrection), and he who lies down in a place where he does not remember Allah, will bring grief upon himself (on the Day of Resurrection).”[Abu Dawud].
ముఖ్యాంశాలు
మనిషి సర్వకాల సర్వావస్థల్లోనూ దైవం పట్ల ఏమరుపాటుకు లోనుకాకుండా అనునిత్యం ఆయన్ని స్మరిస్తూ ఉండాలన్నదే పై హదీసులన్నిటి సారాంశం. దాసుడు తనకు మంచి జరిగినా, చెడు జరిగినా, కష్టాలొచ్చినా సుఖాలు స్వాగతించినా, పస్తులుండవలసి వచ్చినా పరమాన్నాలు తినే అదృష్టం కలిగినా అన్నివేళల్లోనూ దైవాన్ని తలచుకుంటూ ఉండాలి. ఒక్క క్షణమైనా దైవాన్ని విస్మరించకూడదు. క్షణిక విస్మరణమే ఒక్కోసారి మనిషిని దైవాజ్ఞల్ని ఉల్లంఘించేలా, దేవుని హద్దుల్ని అతిక్రమించేలా చేస్తుంది సుమా!
ఇంకో విషయం ఏమిటంటే సాధారణంగా ప్రజలు ఒకచోట సమావేశమై కూర్చున్నప్పుడు అక్కడ లేని వారి గురించి చాడీలు చెప్పుకోవటం, దురనుమానాలు రేకెత్తించటం, నీలాపనిందలు మోపటం లాంటి చేష్టలకు పాల్పడుతూ ఉంటారు. దానివల్ల ప్రజల మధ్య విద్వేషం, వైషమ్యాలు చెలరేగి సమాజంలో సమైక్యతా భావం నశించే ప్రమాదముంది. అదే దైవనామ స్మరణ జరిగే సమావేశాల్లోనయితే సభ్యులు అలాంటి కుచేష్టలకు పాల్పడరని ఆశించవచ్చు. అందుకే సభలు, సమావేశాలు ఆఖరికి ఒంటరిగా కూర్చున్నప్పుడు కూడా దైవాన్ని స్మరించాలని తాకీదు చేయబడింది.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|నిద్ర ప్రకరణం|129. సమావేశ నియమాలు|హదీసు 837
You must be logged in to post a comment.