హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) – 1. సంకల్పశుద్ధి

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: ఇమామ్ అబూ జకరియ్యా యహ్యా బిన్ షరఫ్ అన్ నవవీ (రహ్మతుల్లాహి అలైహి)
ఉర్దూ అనువాదం, వ్యాఖ్యానం: హాఫిజ్ సలాహుద్దీన్ యూసుఫ్ · తెలుగు రూపం: హాఫిజ్ ఎస్.ఎమ్. రసూల్ షర్ఫీ · ప్రకాశకులు: ట్రూత్ పబ్లికేషన్స్, హైదరాబాద్

రియాదుస్ సాలిహీన్ – హదీసు కిరణాలు (ఇమామ్ నవవీ) – అరబీ, తెలుగు, English

రియాదుస్ సాలిహీన్ (హదీసు కిరణాలు) – 1వ అధ్యాయం: సకల అంతర్బాహ్య వాక్కర్మల్లో, సర్వకాల సర్వావస్థల్లో సంకల్పశుద్ధి అవసరం. ఈ అధ్యాయంలో 3 ఖుర్ఆన్ ఆయతులు, 12 హదీసులు (హదీసు 1 – 12) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, ముఖ్యాంశాలు, English అనువాదంతో.

1. సకల అంతర్బాహ్య వాక్కర్మల్లో, సర్వకాల సర్వావస్థల్లో సంకల్పశుద్ధి అవసరం

↑ విషయ సూచిక

باب الإِخلاصِ وإحضار النيَّة في جميع الأعمال والأقوال والأحوال البارزة والخفيَّة

అరబీ పాఠం: రియాదుస్ సాలిహీన్ – తహ్‌ఖీఖ్: షుఐబ్ అల్ అర్నావూత్ (ముఅస్సస్సతుర్ రిసాలా)

అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను.

{وَمَا أُمِرُوا إِلاَّ لِيَعْبُدُوا اللَّهَ مُخْلِصِينَ لَهُ الدِّينَ حُنَفَاءَ وَيُقِيمُوا الصَّلاةَ وَيُؤْتُوا الزَّكَاةَ وَذَلِكَ دِينُ الْقَيِّمَةِ} [البينة: ٥]

అల్లాహ్ సెలవిచ్చాడు: "వారు అల్లాహ్‌కు దాస్యం చేయాలని, పూర్తి ఏకాగ్రతతో తమ ధర్మాన్ని ఆయన కొరకే ప్రత్యేకించుకోవాలని, నమాజ్‌ను స్థాపించాలని, జకాత్ ఇస్తూ ఉండాలని మాత్రమే ఆదేశించడం జరిగింది. ఇదే ఎంతో సరియైన ధర్మం." (అల్ బయ్యినహ్ : 5)

{لَنْ يَنَالَ اللَّهَ لُحُومُهَا وَلا دِمَاؤُهَا وَلَكِنْ يَنَالُهُ التَّقْوَى مِنْكُمْ} [الحج: ٣٧]

మరోచోట అల్లాహ్ సెలవిచ్చాడు : "వాటి మాంసమూ అల్లాహ్‌కు చేరదు, వాటి రక్తమూ చేరదు. కాని మీ భయభక్తులు ఆయనకు చేరుతాయి." (అల్ హజ్జ్ – 37)

{قُلْ إِنْ تُخْفُوا مَا فِي صُدُورِكُمْ أَوْ تُبْدُوهُ يَعْلَمْهُ اللَّهُ} [آل عمران: ٢٩]

ఇంకొకచోట ఆయన ఇలా ఆదేశించాడు : "ప్రవక్తా! ప్రజలను ఇలా హెచ్చరించు : "మీరు దాచినా లేక బహిర్గతం చేసినా – మీ మనసుల్లో ఉన్నదంతా అల్లాహ్‌కు తెలుసు." (ఆలి ఇమ్రాన్ – 29)

English

“And they were commanded not, but that they should worship Allah, and worship none but Him Alone (abstaining from ascribing partners to Him), and perform As-Salat (Iqamat-as-Salat) and give Zakat, and that is the right religion.” [Al-Bayyinah 98:5]

“It is neither their meat nor their blood that reaches Allah, but it is piety from you that reaches Him.” [Al-Hajj 22:37]

“Say (O Muhammad ﷺ): Whether you hide what is in your breasts or reveal it, Allah knows it” [Āl ʿImrān 3:29]

1

హదీసు 1

وعَنْ أَميرِ الْمُؤْمِنِينَ أبي حفْصٍ عُمرَ بنِ الْخَطَّابِ بْن نُفَيْل بْنِ عَبْد الْعُزَّى بن رياحِ بْن عبدِ اللَّهِ بْن قُرْطِ بْنِ رَزاحِ بْنِ عَدِيِّ بْن كَعْبِ بْن لُؤَيِّ بنِ غالبٍ القُرَشِيِّ العدويِّ. رضي الله عنه، قالَ: سمعْتُ رسُولَ اللهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم يقُولُ: "إنَّما الأَعمالُ بالنِّيَّات، وإِنَّمَا لِكُلِّ امرئٍ مَا نَوَى، فمنْ كانَتْ هجْرَتُهُ إِلَى الله ورَسُولِهِ فهجرتُه إلى الله ورسُولِهِ، ومنْ كاَنْت هجْرَتُه لدُنْيَا يُصيبُها، أَو امرَأَةٍ يَنْكحُها فهْجْرَتُهُ إِلى مَا هَاجَر إليْهِ" متَّفَقٌ عَلَى صحَّتِه. رواهُ إِماما المُحَدِّثِين: أَبُو عَبْدِ الله مُحَمَّدُ بنُ إِسْمَاعيل بْن إِبْراهيمَ بْن الْمُغيرة بْن برْدزْبَهْ الْجُعْفِيُّ الْبُخَارِيُّ، وَأَبُو الحُسَيْنِى مُسْلمُ بْن الْحَجَّاجِ بْنِ مُسلمٍ القُشَيْريُّ النَّيْسَابُوريُّ رَضَيَ اللهُ عَنْهُمَا فِي صَحيحيهِما اللَّذَيْنِ هما أَصَحُّ الْكُتُبِ الْمُصَنَّفَة.

విశ్వాసుల నాయకులు హజ్రత్ అబూ హఫ్స్ ఉమర్ బిన్ ఖత్తాబ్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ఉపదేశించారు: ఆచరణలు సంకల్పాలపై ఆధారపడి ఉంటాయి. ప్రతి ఒక్కరికీ అతని మనసులోని ఉద్దేశానికి అనుగుణంగా ప్రతిఫలం దొరుకుతుంది. అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త కోసం వలస పోయిన వ్యక్తి ప్రస్థానం – నిజంగానే అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త కోసం చేసిన ప్రస్థానంగా పరిగణించబడుతుంది. ఎవడైతే ప్రాపంచిక ప్రయోజనం పొందాలనే ఉద్దేశంతో లేక ఏ స్త్రీనయినా వివాహమాడాలనే సంకల్పంతో వలస పోతాడో అతడు – తాను కోరుకున్న వాటి కోసం వలసపోయినట్లుగా భావించటం జరుగుతుంది."

ఈ హదీసు ప్రామాణికతపై ఏకాభిప్రాయం ఉంది. హదీసు వేత్తల్లో అగ్రగణ్యులైన ఉభయులూ – అనగా అబూ అబ్దుల్లాహ్ ముహమ్మద్ బిన్ ఇస్మాయిల్ బుఖారీ మరియు అబుల్ హుసైన్ ముస్లిం బిన్ హజ్జాజ్‌లు – హదీసు సంకలన గ్రంథాలన్నిటిలోకెల్లా ప్రామాణికమైన తమ తమ గ్రంథాల్లో ఈ హదీసును పొందుపరచారు.

(సహీహ్ బుఖారీలోని దైవవాణి ఆరంభ ప్రకరణం, సహీహ్ ముస్లింలోని పదవుల ప్రకరణం)

English

Narrated ‘Umar bin Al-Khattab (radiyallahu anhu), reported: Messenger of Allah ﷺ said, “The deeds are considered by the intentions, and a person will get the reward according to his intention. So whoever emigrated for Allah and His Messenger, his emigration will be for Allah and His Messenger; and whoever emigrated for worldly benefits or for a woman to marry, his emigration would be for what he emigrated for“.[Al-Bukhari and Muslim].

ముఖ్యాంశాలు

మరికొన్ని ఉల్లేఖనాలలో ఈ హదీసు నేపథ్యం క్రింది విధంగా వివరించబడింది – ఒక వ్యక్తి ఉమ్మె ఖైస్ అనే స్త్రీకి వివాహ సందేశం పంపాడు. ఆమె ఆ సందేశాన్ని అంగీకరించడానికి అతను మదీనాకు వలస వెళ్ళాలన్న షరతు పెట్టింది. ఆ షరతు మూలంగానే ఆ వ్యక్తి మదీనాకు వలస వెళ్ళాడు. అక్కడ వారిద్దరికీ వివాహం జరిగింది. అప్పటినుంచీ ఆ వ్యక్తి దైవప్రవక్త సహచరుల మధ్య "ఉమ్మె ఖైస్ ప్రస్థానకుడు" గానే పేరుమోశాడు.

ఈ హదీసు ఆధారంగా పండితులు ఆచరణల్లో సంకల్పం ముఖ్యమనీ, సంకల్పానికి అనుగుణంగానే ప్రతిఫలం లభిస్తుందన్న విషయంపై ఏకీభవిస్తున్నారు. సంకల్పం చేసుకునే చోటు మనస్సు. కనుక మనసులో సంకల్పించుకోవడం అవసరం. అంతేగాని దానిని నోటితో పలకాల్సిన అవసరం లేదు. పైగా అదొక అనాచారం. దీనికి శాస్త్రంలో రుజువు లభించదు. భారత ఉపఖండంలో సాధారణంగా నమాజు చేసేటప్పుడు సంకల్పాన్ని నోటితో పలికే ఆచారాన్ని ఇందుకు ఉదాహరణగా పేర్కొనవచ్చు. ఈ హదీసు ద్వారా బోధపడే మరో విషయం ఏమిటంటే ప్రతి పనిని సంకల్ప శుద్ధితో నెరవేర్చాలి. అంటే ఏ పని చేసినా దేవుని ప్రసన్నతను దృష్టిలో పెట్టుకొని చేయాలి. ఎందుకంటే దురుద్దేశంతో కలుషితమయ్యే ఏ పనీ అల్లాహ్ సమక్షంలో స్వీకృతిని పొందజాలదు.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|1. సకల అంతర్బాహ్య వాక్కర్మల్లో, సర్వకాల సర్వావస్థల్లో సంకల్పశుద్ధి అవసరం|హదీసు 1

2

హదీసు 2

وَعَنْ أُمِّ الْمُؤْمِنِينَ أُمِّ عَبْدِ اللَّهِ عَائشَةَ رَضيَ الله عنها قالت: قالَ رسول الله صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "يَغْزُو جَيْشٌ الْكَعْبَةَ فَإِذَا كَانُوا ببيْداءَ مِنَ الأَرْضِ يُخْسَفُ بأَوَّلِهِم وَآخِرِهِمْ". قَالَتْ: قُلْتُ يَا رَسُولَ اللَّهِ، كَيْفَ يُخْسَفُ بَأَوَّلِهِم وَآخِرِهِمْ وَفِيهِمْ أَسْوَاقُهُمْ وَمَنْ لَيْسَ مِنهُمْ،؟ قَالَ: " يُخْسَفُ بِأَوَّلِهِم وَآخِرِهِمْ، ثُمَّ يُبْعَثُون عَلَى نِيَّاتِهِمْ" مُتَّفَقٌ عَلَيْهِ: هذَا لَفْظُ الْبُخَارِيِّ.

విశ్వాసుల మాతృమూర్తి ఉమ్మె అబ్దుల్లాహ్ హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రవచించారు: సైనిక పటాలం ఒకటి కాబాపైకి దండెత్తే ఉద్దేశ్యంతో బయలుదేరుతుంది. ఆ సైనిక పటాలం భూమండలంలోని ఒక ప్రదేశానికి చేరుకోగానే అక్కడి వారంతా భూమిలోనికి కూరుకుపోతారు."

హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) అంటున్నారు – ఆ మాట విని నేను "ఓ దైవప్రవక్తా! వారంతా భూమిలో ఎందుకు కూర్చి వేయబడతారు? వారిలో బజారున పోయేవారు, వేరితరులు కూడా ఉంటారు కదా!" అని అడిగాను. (అంటే సైనికాధికారులతో పాటు సామాన్య సిపాయిలు లేదా బజారులో తిరిగే మామూలు మనుషులు కూడా ఉంటారని అర్థం.) దానికి ఆయన "మొదటి నుంచి చివరిదాకా వారందరూ నేలలోకి కూర్చివేయబడతారు. అయితే ఆ తరువాత వారంతా కూడా తమ తమ ఉద్దేశాల ఆధారంగా లేపబడతారు. (అంటే ప్రళయం సంభవించాక వారితో వారి సంకల్పాలనుబట్టి వ్యవహరించడం జరుగుతుంది.)" అని చెప్పారు. (బుఖారీ – ముస్లిం, వాక్యాలు మాత్రం బుఖారీవి).

(సహీహ్ బుఖారీలోని వాణిజ్య ప్రకరణం. సహీహ్ ముస్లింలోని ఉపద్రవాల ప్రకరణం)

English

Narrated ‘A`ishah (radiyallahu anha) reported: Messenger of Allah ﷺ said, “An army will raid the Ka`bah and when it reaches a desert land, all of them will be swallowed up by the earth.” She asked; “O Messenger of Allah! Why all of them?” He answered, “All of them will be swallowed by the earth but they will be raised for Judgement according to their intentions.”[Al-Bukhari and Muslim].

ముఖ్యాంశాలు

మనిషి ఉద్దేశ్యం, సంకల్పాన్ని బట్టి అతనిపట్ల మంచిగానో లేదా చెడుగానో వ్యవహరించడం జరుగుతుందని పై హదీసు ద్వారా బోధపడుతోంది. అంతేకాదు అన్యాయం, అక్రమాలకు ఒడిగట్టే దుండగుల సహచర్యంలో, వారి సాన్నిహిత్యంలో ఉండటం ఎంత అపాయకరమో కూడా ఈ హదీసు ద్వారా తెలుస్తోంది. అయితే అసలు ఈ సైనిక పటాలం ఏది? అది ఎప్పుడు దండెత్తబోతుందన్న విషయం కేవలం అల్లాహ్‌కు మాత్రమే తెలుసు. ఈ భవిష్యవాణి అగోచర విషయాలకు సంబంధించినది. ఇది దైవప్రవక్త గారి ఒకానొక మహిమ. ఇటువంటి భవిష్యవాణులు దేవుని వహీ ద్వారా తెలుపబడినవై ఉంటాయి. కనుక వీటి ఉనికిపై, సత్యసంధతపై విశ్వాసం కలిగి ఉండటం అవసరం.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|1. సకల అంతర్బాహ్య వాక్కర్మల్లో, సర్వకాల సర్వావస్థల్లో సంకల్పశుద్ధి అవసరం|హదీసు 2

3

హదీసు 3

وعَنْ عَائِشَة رَضِيَ اللهُ عنْهَا قَالَت قالَ النَّبِيُّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: " لا هِجْرَةَ بَعْدَ الْفَتْحِ، وَلكنْ جِهَادٌ وَنِيَّةٌ، وَإِذَا اسْتُنْفرِتُمْ فانْفِرُوا" مُتَّفَقٌ عَلَيْهِ. وَمَعْنَاهُ: لا هِجْرَةَ مِنْ مَكَّةَ لأَنَّهَا صَارَتْ دَارَ إِسْلامٍ.

హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రబోధించారు : మక్కా విజయం తరువాత హిజ్రత్ (వలస వెళ్ళవలసిన అవసరం) లేదు. అయితే దైవమార్గంలో పోరాటం మరియు సంకల్పం మాత్రం కొనసాగుతూ ఉంటాయి. దైవమార్గంలో పోరాడటం కోసం మిమ్మల్ని పిలవడం జరిగితే, మీరు (తక్షణమే) బయలుదేరండి. (బుఖారీ, ముస్లిం)

దీని భావం ఏమిటంటే, (హిజ్రీ శకం 8వ ఏట) మక్కా నగరం దారుల్ ఇస్లాం (ఇస్లామీయ రాజ్యం) అయిపోయింది. కనుక మక్కా విజయం తరువాత ఇక మక్కా నుండి వలసవెళ్ళాల్సిన అవసరం మిగిలి ఉండలేదు.

(సహీహ్ బుఖారీలోని పోరాట ప్రకరణం. సహీహ్ ముస్లింలోని పదవుల ప్రకరణం.)

English

A`ishah (radiyallahu anha) narrated that the Prophet ﷺ said, “There is no emigration after the conquest (of Makkah) but only Jihad [(striving and fighting in the cause of Allah) will continue] and good intention.* So if you are summoned to fight, go forth.”[Al-Bukhari and Muslim].

*. Intention according to An-Nawawi: It means that goodness which ceased to continue by the cessation of emigration can still be obtained by Jihad and by intending accomplishing good deeds.

ముఖ్యాంశాలు

ఏదయినా దేశం లేక ప్రాంతం "సంక్షేమ రాజ్యం"గా ఏర్పడిన తరువాత ఇక ప్రజలు అక్కడి నుండి ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళవలసిన అవసరం లేదు. అయితే దైవ తిరస్కారుల రాజ్యంలో సత్య ధర్మాన్ని ఆచరించడం, దానిపై నిలకడగా ఉండటం కష్టంగా పరిణమించినపుడు, ఆ ప్రదేశాల నుండి వలస వెళ్ళడం మాత్రం అవసరం. ఒక ఇస్లామీయ రాజ్యం నుండి మరొక ఇస్లామీయ రాజ్యానికి ప్రస్థానం చేయవలసిన అవసరం లేనప్పుడు, ధనరాసులు విరివిగా ఉన్నాయనో లేక నాగరిక సౌకర్యాలు పుష్కలంగా లభ్యమవుతున్నాయనో ఒక ఇస్లామీయ రాజ్యం నుండి దైవ తిరస్కార రాజ్యానికి వలసవెళ్ళి అక్కడ స్థిరపడిపోవడానికి ఇస్లామీయ చట్టం సుతరామూ సమ్మతించదన్న విషయం కూడా ఈ హదీసు ద్వారా బోధపడుతుంది. దురదృష్టవశాత్తూ ఇందులో నేటి ముస్లింలు కూడా చిక్కుకొని వున్నారు. ముఖ్యంగా వారి పెట్టుబడుల తరలింపు, ముస్లిం తత్త్వవేత్తల వలసలు ఆందోళనకరంగా పరిణమించాయి. వీటివల్ల దైవ తిరస్కార రాజ్యాల ఆర్థిక వ్యవస్థలకు ఊతం లభిస్తోంది. వారి లజ్జావిహీన నాగరికత అభివృద్ధి చెందుతోంది. గమనార్హమైన ఇంకొక విషయం ఏమిటంటే ప్రతి ముస్లిం తన మనసులో దైవమార్గంలో పోరాడాలనే పిపాస, కుతూహలం కలిగి ఉండాలి. దైవమార్గంలో పోరాడటానికి ఏ సందర్భంలో పిలుపు వచ్చినా వెంటనే హాజరు పలికేందుకు అనువుగా వీలైన మేరకు దానికోసం సన్నాహాలు చేసుకొని ఉండాలి.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|1. సకల అంతర్బాహ్య వాక్కర్మల్లో, సర్వకాల సర్వావస్థల్లో సంకల్పశుద్ధి అవసరం|హదీసు 3

4

హదీసు 4

وعَنْ أبي عَبْدِ اللَّهِ جابِرِ بْنِ عَبْدِ اللَّهِ الأَنْصَارِيِّ رضِيَ اللهُ عنْهُمَا قَالَ: كُنَّا مَع النَّبِيِّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم في غَزَاة فَقَالَ: "إِنَّ بِالْمَدِينَةِ لَرِجَالاً مَا سِرْتُمْ مَسِيراً، وَلاَ قَطَعْتُمْ وَادِياً إِلاَّ كانُوا مَعكُم حَبَسَهُمُ الْمَرَضُ" وَفِي روايَةِ: "إِلاَّ شَركُوكُمْ في الأَجْر" رَواهُ مُسْلِمٌ. ورواهُ البُخَارِيُّ عَنْ أَنَسٍ رَضِيَ اللَّهُ عَنْهُ قَالَ: رَجَعْنَا مِنْ غَزْوَةِ تَبُوكَ مَعَ النَّبِيِّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم فَقَالَ: "إِنَّ أَقْوَامَاً خلْفَنَا بالمدِينةِ مَا سَلَكْنَا شِعْباً وَلاَ وَادِياً إِلاَّ وَهُمْ مَعَنَا، حَبَسَهُمْ الْعُذْرُ".

హజ్రత్ అబూ అబ్దుల్లాహ్ జాబిర్ బిన్ అబ్దుల్లాహ్ అన్సారీ (రదియల్లాహు అన్హుమా) కథనం : మేము ఒకానొక యుద్ధంలో దైవప్రవక్త ﷺ వెంట ఉన్నాము. అప్పుడు ఆయన ఈ విధంగా ప్రవచించారు : "మదీనాలో కొంతమంది (యుద్ధానికి) రాలేకపోయారు. అయితే మీరు ప్రయాణించిన ప్రతిచోటా, మీరు నడిచిన ప్రతి లోయలోనూ వారు మీతోపాటే ఉన్నారు. అనారోగ్యం వారిని ఆపి ఉంచింది."

వేరొక ఉల్లేఖనంలో "పుణ్యంలో మీతో పాటు వారు కూడా భాగస్వాములయ్యార"ని ఉంది. (ముస్లిం)

బుఖారీ ఉల్లేఖనంలో హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) ఇలా ఉటంకిస్తున్నారు : మేము తబూక్ యుద్ధానంతరం దైవప్రవక్త ﷺ వెంట తిరిగి వచ్చాము. అప్పుడు ఆయన ఇలా అన్నారు : కొందరు మన వెనక మదీనాలోనే ఆగిపోయి ఉన్నారు. అయితే మనం నడిచిన ప్రతి కనుమ, ప్రతి లోయలోనూ వారు మనతోపాటే ఉన్నారు. తగిన కారణం వల్ల వారు రాలేకపోయారు."

(సహీహ్ బుఖారీలోని దైవమార్గంలో పోరాట ప్రకరణం. సహీహ్ ముస్లింలోని నాయకత్వ ప్రకరణం)

English

Jabir bin Abdullah Al-Ansari (radiyallahu anhuma) reported: We accompanied the Prophet ﷺ in an expedition when he said, “There are some men in Al-Madinah who are with you wherever you march and whichever valley you cross. They have not joined you in person because of their illness.” In another version he said: “They share the reward with you.”[Muslim].

It is narrated by Bukhari from Anas bin Malik (radiyallahu anhu): We were coming back from the battle of Tabuk with the Prophet ﷺ when he remarked, “There are people whom we left behind in Al-Madinah who accompanied us in spirit in every pass and valley we crossed. They remained behind for a valid excuse.”

ముఖ్యాంశాలు

మనసులో దైవమార్గంలో యుద్ధం చేయాలనే ఆకాంక్ష, సంకల్పం ఉంటే చాలు, ఏదయినా ధర్మబద్ధమైన అనివార్య కారణంచేత యుద్ధంలో పాల్గొనకపోయినా అల్లాహ్ అటువంటి వ్యక్తికి ఇంటిలోనే దైవమార్గంలో పోరాటం సలిపినంత ప్రతిఫలం, పుణ్యం ప్రసాదిస్తాడని పై హదీసు ద్వారా బోధపడుతోంది.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|1. సకల అంతర్బాహ్య వాక్కర్మల్లో, సర్వకాల సర్వావస్థల్లో సంకల్పశుద్ధి అవసరం|హదీసు 4

5

హదీసు 5

وَعَنْ أبي يَزِيدَ مَعْنِ بْن يَزِيدَ بْنِ الأَخْنسِ رضي الله عَنْهمْ، وَهُوَ وَأَبُوهُ وَجَدّهُ صَحَابِيُّونَ، قَال: كَانَ أبي يَزِيدُ أَخْرَجَ دَنَانِيرَ يَتصَدَّقُ بِهَا فَوَضَعَهَا عِنْدَ رَجُلٍ في الْمَسْجِدِ فَجِئْتُ فَأَخَذْتُهَا فَأَتيْتُهُ بِهَا. فَقَالَ: وَاللَّهِ مَا إِيَّاكَ أَرَدْتُ، فَخَاصمْتُهُ إِلَى رسولِ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم فَقَالَ: "لَكَ مَا نويْتَ يَا يَزِيدُ، وَلَكَ مَا أَخذْتَ يَا مَعْنُ "رواهُ البخاريُّ.

హజ్రత్ అబూ యజీద్ మాన్ బిన్ యజీద్ బిన్ అఖ్‌నస్ (రదియల్లాహు అన్హుమ్) (ఈయన, ఈయన తండ్రీతాతలు ముగ్గురూ దైవప్రవక్త అనుచరులే) కథనం: మా నాన్న యజీద్ ఒకసారి దానధర్మాల నిమిత్తం కొన్ని దీనార్లు బయటికి తీసి వాటిని మస్జిద్‌లో ఒక వ్యక్తి దగ్గర (అవసరమున్న వానికి ఇవ్వమని) ఉంచి వెళ్ళిపోయారు. అదే సమయంలో నేను అక్కడికి వచ్చాను. (అవసరం నిమిత్తం) నేను ఆ వ్యక్తి నుండి దీనార్లు పుచ్చుకొని ఇంటికి తీసుకువచ్చాను. వాటిని చూసి మా నాన్నగారు "అల్లాహ్ సాక్షి! నేను ఇవి నీకివ్వాలనుకోలేదు" అంటూ నాతో వాదనకు దిగారు. నేను ఆయన్ని దైవప్రవక్త ﷺ దగ్గరికి తీసుకువెళ్ళి ఆయనకు మా నాన్న వాదన గురించి వివరించాను. దానికి ఆయన: "ఓ యజీద్! నీకు నీ సంకల్పానికి అనుగుణంగా పుణ్యం లభిస్తుంది. ఓ మాన్! అలాగే నువ్వు తీసుకున్న దీనార్లు కూడా నీకొరకు ధర్మ సమ్మతమే అవుతాయి" అని తీర్పు చెప్పారు. (బుఖారీ)

(సహీహ్ బుఖారీలోని జకాత్ ప్రకరణంలో అనుకోకుండా కన్నకొడుకుకే దానం చేసిన వాని అధ్యాయంలో ఈ హదీసు పేర్కొనబడింది.)

English

Ma`n bin Yazid bin Akhnas (radiyallahu anhum) (he, his father and his grandfather, all were Companions) reported: My father set aside some dinars for charity and gave them to a man in the mosque. I went to that man and took back those dinars. He said: “I had not intended you to be given.” So we went to Messenger of Allah ﷺ, and put forth the matter before him. He said to my father, “Yazid, you have been rewarded for what you intended.” And he said to me, “Ma`n, you are entitled to what you have taken.”[Al-Bukhari].

ముఖ్యాంశాలు

తాము చేసిన దానధర్మాలు అనుకోకుండా అవసరాల్లో వున్న తమ కొడుకుల చేతికే అందివస్తే వాటిని వాపసు తీసుకోవాల్సిన అవసరం లేదని ఈ హదీసు ద్వారా రూఢీ అవుతోంది. ఎందుకంటే తండ్రి మాత్రం అవసరాల్లో వున్న వ్యక్తికి ధర్మం చేయాలని అనుకున్నాడు కాబట్టి అతనికి తన ఉద్దేశానికనుగుణంగా చేసిన దానానికి పుణ్యం లభించి తీరుతుంది. అయితే కొందరు పండితుల అభిప్రాయం ప్రకారం ఇది నఫిల్ సదఖాలకు (స్వచ్ఛంద దానధర్మాలకు) మాత్రమే వర్తిస్తుంది. ఎందుకంటే విధిగా ఇవ్వవలసిన దానాలను (జకాత్ లాంటివి) ఖర్చుల నిమిత్తం తమపై హక్కుగల వారికి ఇవ్వకూడదు. మరో విషయం ఏమిటంటే తమ తరపున దానం చేయమని వేరొకరికి పని అప్పజెప్పడం ధర్మ సమ్మతమే. ఇక ఈ హదీసు ద్వారా బోధపడే మూడో విషయం ఏమిటంటే, ధార్మిక విషయాల్లో పరస్పరం వాదప్రతివాదాలు చేసుకోవడం, చర్చించుకోవడం అసభ్యత ఏమీ కాదు. అలాగే ధర్మ సందేహాన్ని నివృత్తి చేసుకునే ఉద్దేశ్యంతో కన్న తండ్రిని సమీప న్యాయనిర్ణేత లేక ధర్మవేత్త వద్దకు తీసుకుపోవటం కూడా తండ్రిపట్ల అవిధేయత అనిపించుకోదు.

(ఫత్‌హుల్ బారీలో ఇది ఈ అధ్యాయంలోనే గాక, "భార్య మరియు తన పోషణలో వున్న అనాధలకు జకాత్ ఇచ్చే అధ్యాయం"లోనూ ఉంది.)

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|1. సకల అంతర్బాహ్య వాక్కర్మల్లో, సర్వకాల సర్వావస్థల్లో సంకల్పశుద్ధి అవసరం|హదీసు 5

6

హదీసు 6

وَعَنْ أبي إِسْحَاقَ سعْدِ بْنِ أبي وَقَّاصٍ مَالك بنِ أُهَيْبِ بْنِ عَبْدِ مَنَافِ بْنِ زُهرةَ بْنِ كِلابِ بْنِ مُرَّةَ بْنِ كعْبِ بنِ لُؤىٍّ الْقُرشِيِّ الزُّهَرِيِّ رضِي اللَّهُ عَنْهُ، أَحدِ الْعَشرة الْمَشْهودِ لَهمْ بِالْجَنَّة، رضِي اللَّهُ عَنْهُم قَالَ: "جَاءَنِي رسولُ اللهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم يَعُودُنِي عَامَ حَجَّة الْوَداعِ مِنْ وَجعٍ اشْتدَّ بِي فَقُلْتُ: يَا رسُول اللَّهِ إِنِّي قَدْ بلغَ بِي مِن الْوجعِ مَا تَرى، وَأَنَا ذُو مَالٍ وَلاَ يَرثُنِي إِلاَّ ابْنةٌ لِي، أَفأَتصَدَّق بثُلُثَىْ مالِي؟ قَالَ: لا، قُلْتُ: فالشَّطُر يَارسوُلَ اللهِ؟ فقالَ: لا، قُلْتُ فالثُّلُثُ يَا رَسُولَ اللَّه؟ قَالَ: الثُّلثُ والثُّلُثُ كثِيرٌ -أَوْ كَبِيرٌ – إِنَّكَ إِنْ تَذرَ وَرثتك أغنِياءَ خَيْرٌ مِن أَنْ تذرهُمْ عالَةً يَتكفَّفُونَ النَّاس، وَإِنَّكَ لَنْ تُنفِق نَفَقةً تبْتغِي بِهَا وجْهَ اللهِ إِلاَّ أُجرْتَ عَلَيْهَا حَتَّى ما تَجْعلُ فِيِّ امْرَأَتكَ قَال: فَقلْت: يَا رَسُولَ اللهِ أُخَلَّفُ بَعْدَ أَصْحَابِي؟ قَال: إِنَّك لَنْ تُخَلَّفَ فتعْمَل عَمَلاً تَبْتغِي بِهِ وَجْهَ اللهِ إلاَّ ازْددْتَ بِهِ دَرجةً ورِفعةً ولعَلَّك أَنْ تُخلَّف حَتَى ينْتفعَ بكَ أَقَوامٌ وَيُضَرَّ بِكَ آخرُونَ. اللَّهُمَّ أَمْضِ لأِصْحابي هجْرتَهُم، وَلاَ ترُدَّهُمْ عَلَى أَعْقَابِهم، لَكن الْبائسُ سعْدُ بْنُ خوْلَةَ"يرْثى لَهُ رسولُ اللهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم"أَن مَاتَ بمكَّةَ" متفقٌ عليهِ.

ఇహలోకంలోనే స్వర్గ సుఖాల శుభవార్త పొందిన పదిమందిలో ఒకరైన అబూ ఇస్‌హాఖ్ సాద్ బిన్ అబూ వఖ్ఖాస్ (రదియల్లాహు అన్హు) కథనం : దైవప్రవక్త ﷺ తాను అంతిమ హజ్ యాత్ర చేసిన యేట వ్యాధిగ్రస్తుణ్ణయిఉన్న నన్ను పరామర్శించే నిమిత్తం నా వద్దకు వచ్చారు. అప్పుడు నేను విపరీతమైన నొప్పితో బాధపడుతున్నాను. నేను ఆయన్ని "దైవప్రవక్తా! నా నొప్పి ఎంత తీవ్రంగా తయారయిందో తమరు చూస్తూనే ఉన్నారు. నేనా డబ్బు కలవాణ్ణి. నాకు ఒక్కగానొక్క కూతురు తప్ప ఇతర వారసులెవరూ లేరు. నేను నా ధనంలోని మూడింట రెండొంతులను ఎవరికైనా దానం చేయవచ్చా?" అని అడిగాను. దానికి ఆయన "కూడదు" అన్నారు. తిరిగి నేను "సగం ధనం దానం చేయనా" అని అడిగాను. దానికి కూడా ఆయన "కూడదు" అనే అన్నారు. మళ్ళీ నేను "మూడింట ఒక వంతైనా దానం చేయలేనా దైవప్రవక్తా!" అని విన్నవించుకోగా అందుకు ఆయన "మూడింట ఒక వంతు అయితే చేయ గలవు. కాని అది కూడా ఎక్కువే (లేక) పెద్దదే అవుతుంది (అని అన్నారు). ఎందుకంటే నువ్వు నీ వారసులను పరుల ముందు చేయి చాపుతూ తిరిగే దరిద్రులుగా వదలి వెళ్ళడంకన్నా స్థితిమంతులుగా వదలి వెళ్ళడమే ఎంతో శ్రేయస్కరం. (గుర్తుంచుకో!) నువ్వు దైవప్రసన్నత కోసం ఏది ఖర్చుపెట్టినా దానికి నువ్వు ప్రతిఫలం పొందుతావు. ఆఖరికి నువ్వు నీ భార్య నోట్లో వేసే ముద్దకు కూడా ప్రతిఫలం పొందుతావు" అని ఉపదేశించారు. అప్పుడు నేను "ఓ దైవప్రవక్తా! నేను నా సహచరుల వెనుక ఉండిపోతానా? (అంటే నా సహచరులు ముందుగానే చనిపోయి నేను ఈ లోకంలో ఒక్కడినే ఉండిపోతానా?)" అని సందేహపడగా దానికి ఆయన (అయితేనేమి? మంచిదేగా) ఎందుకంటే నీ సహచరుల అనంతరం నువ్వు బ్రతికివుంటే దైవప్రసన్నత కోసం నువ్వు చేసుకునే ప్రతి ఆచరణతో నీ స్థాయి, అంతస్థులు పెరుగుతాయి. బహుశా నీకు ఇంకా జీవితం గడిపే అవకాశం లభిస్తుందేమో! అప్పుడు కొంతమంది (విశ్వాసులకు) నీవల్ల మేలు కలగవచ్చు, ఇంకొంతమంది (దైవ తిరస్కారులకు) నీ వల్ల కీడు కలగవచ్చు. ఓ అల్లాహ్! నా సహచరుల హిజ్రత్‌ని (ప్రస్థానాన్ని) పరిపూర్ణం గావించు. వారిని పరాజయం పాలుచేయకు" అని వేడుకున్నారు. కాని "సాద్ బిన్ ఖౌలా" దయార్హులు. ఎందుకంటే ఆయన మక్కాలో ఉండగానే కన్నుమూశారు. అందుకని ఆయన కనికరించబడాలని దైవప్రవక్త ﷺ దుఆ చేసేవారు. (బుఖారీ – ముస్లిం)

(సహీహ్ బుఖారీలోని అంత్యక్రియల ప్రకరణం. సహీహ్ ముస్లింలోని వీలునామాల ప్రకరణం).

English

Abu Ishaq Sa`d bin Abu Waqqas (radiyallahu anhu) (one of the ten who had been given the glad tidings of entry into Jannah) narrated: Messenger of Allah ﷺ visited me in my illness which became severe in the year of Hajjat-ul-Wada` (Farewell Pilgrimage). I said, “O Messenger of Allah, you can see the pain which I am suffering and I am a man of means and there is none to inherit from me except one daughter. Should I give two-thirds of my property in charity?” He ﷺ said, “No”. I asked him, “Then half?” He said, “No”. Then I asked, “Can I give away one-third”. He said, “Give away one-third, and that is still too much. It is better to leave your heirs well-off than to leave them poor, begging people. You will not expend a thing in charity for the sake of Allah, but you will be rewarded for it; even the morsel of food which you feed your wife”. I said, “O Messenger of Allah, would I survive my companions?” He said, “If you survive others and accomplish a thing for the sake of Allah, you would gain higher ranking and standing. You will survive them … your survival will be beneficial to people (the Muslim) and harmful to others (the enemies of Islam). You will survive others till the people will derive benefit from you, and others would be harmed by you.” Messenger of Allah ﷺ further said, “O Allah, complete for my Companions their emigration and do not cause them to retract.” Sa`d bin Khaulah was unfortunate. Messenger of Allah ﷺ lamented his death as he died in Makkah.[Al-Bukhari and Muslim].

వివరణ

ప్రవక్త ప్రియ సహచరులు తమకెంతో ఇష్టమయిన మక్కా నగరాన్ని కేవలం అల్లాహ్ ప్రసన్నత కోసం వదలి మదీనాకు వలసవెళ్ళారు. అంతేకాదు, తాము దైవం కోసం వదలిపెట్టిన నగరంలో తిరిగి స్థిరపడటాన్ని కూడా వారు సుతరామూ ఇష్టపడేవారు కాదు. అందుకే హజ్రత్ సాద్ (రదియల్లాహు అన్హు) తనకు మక్కాలోనే ఎక్కడ మృత్యువు సంభవిస్తుందోనని భయపడేవారు. అందుకే దైవప్రవక్త ﷺ ఆయన హిజ్రత్ పూర్తి కావాలని ప్రార్థన చేశారు. హజ్రత్ సాద్ (రదియల్లాహు అన్హు) గారి దైన్యస్థితికి ఆయన చాలా దుఃఖించారు. ఎందుకంటే సాద్ (రదియల్లాహు అన్హు) మక్కాలో ఉండగానే మరణించారు. ఆ విధంగా ఆయన దైవమార్గంలో ప్రస్థానానికి (హిజ్రత్‌కు) లభించవలసిన పూర్తి ప్రతిఫలాన్ని పొందలేకపోయారు.

ముఖ్యాంశాలు

  1. మరణం ఆసన్నమయిన తరువాత మనిషి తన ధనంలో మూడింట ఒక వంతుకంటే ఎక్కువ ధనాన్ని దానం చేయడంగాని లేక వీలు రాయించడం గాని చేయలేడన్న దానికి ఈ హదీసు నిదర్శనం.
  2. మనిషి సంకల్పం సవ్యంగా వుంటే అతను, తాను భార్యా పిల్లలపై చేసే ఖర్చుకు కూడా పుణ్యఫలం పొందుతాడు.
  3. చికిత్స చేయించుకోవటం కోసం లేక పుణ్యాత్ముల చేత ప్రార్థన చేయించుకునే మంచి ఉద్దేశ్యంతో మనిషి తన అనారోగ్యాన్ని, బాధను ఇతరుల ముందు వెల్లడించటంలో తప్పులేదు. ఇది అల్లాహ్ మీద ఫిర్యాదు చేసినట్లు కాదు.
  4. దైవమార్గంలో ఖర్చుచేసేటప్పుడు, దానధర్మాలు చేసేటప్పుడు తమ సన్నిహిత బంధువులకు ఎక్కువ ప్రాధాన్యతనివ్వాలి.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|1. సకల అంతర్బాహ్య వాక్కర్మల్లో, సర్వకాల సర్వావస్థల్లో సంకల్పశుద్ధి అవసరం|హదీసు 6

7

హదీసు 7

وَعَنْ أبي هُريْرة عَبْدِ الرَّحْمن بْنِ صخْرٍ رضي الله عَنْهُ قَالَ: قالَ رَسُولُ اللهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "إِنَّ الله لا يَنْظُرُ إِلى أَجْسامِكْم، وَلا إِلى صُوَرِكُمْ، وَلَكِنْ يَنْظُرُ إِلَى قُلُوبِكُمْ وَأَعْمَالِكُمْ" رواه مسلم.

హజ్రత్ అబూ హురైరా అబ్దుర్రహ్మాన్ బిన్ సఖర్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ఉపదేశించారు: అల్లాహ్ మీ శరీరాలను, మీ ముఖాలను చూడడు. ఆయన మీ అంతరంగాలను, ఆచరణలను మాత్రమే చూస్తాడు. (ముస్లిం)

(సహీహ్ ముస్లింలోని సత్కార్యాల ప్రకరణం.)

English

Abu Hurairah (radiyallahu anhu) narrated: Messenger of Allah ﷺ said, “Allah does not look at your figures, nor at your attire but He looks at your hearts and accomplishments”.[Muslim].

ముఖ్యాంశాలు

పై హదీసు ద్వారా కూడా చిత్తశుద్ధి, సవ్యమైన సంకల్పాల ప్రాముఖ్యత వెల్లడవుతోంది. కనుక ప్రతి సదాచరణలోనూ వీటిని దృష్టిలో పెట్టుకోవటం చాలా అవసరం.

ఆచరణల్ని పాడుచేసే విషయాల నుండి అంతరంగాన్ని కాపాడుకోవాలి. ఉదాహరణకు ప్రదర్శనాబుద్ధి, పరులకు చూపించి సత్కర్మలు చేయాలనే కోరిక, ప్రాపంచిక వ్యామోహం – ఇత్యాది నీచమైన స్వార్థపూరిత భావాల నుంచి మనసును రక్షించుకోవాలి. హృదయాల స్థితి అల్లాహ్‌కు మాత్రమే తెలుసు. కనుక ఆచరణల నిజ స్వరూపం ఏమిటో ప్రళయదినానే తెలిసి వస్తుంది. అప్పుడు దేవుని దర్బారులో వాటికి మంచి లేదా చెడు ప్రతిఫలం లభిస్తుంది. ప్రపంచంలో మాత్రం వ్యవహారం మనిషి బాహ్య ఆచరణల ఆధారంగానే జరుగుతుంది. అతని అంతరంగ స్థితిని అల్లాహ్‌కు వదలిపెట్టడం జరుగుతుంది.

గమనిక

"రియాజుస్సాలిహీన్" కు చెందిన కొన్ని ప్రతుల్లో ఈ హదీసులోని 'వ ఆమాలికుమ్' (మీ కర్మలను) అనే పదాన్ని మినహాయించి నకలు చేయడం జరిగింది. ఇది సరికాదు. సహీహ్ ముస్లింలో "ఖులూబికుమ్" (అంతరంగాలు) అనే పదంతోపాటు "వ ఆమాలికుమ్" (మీ కర్మలు) అని కూడా ఉంది. ఆ అదనపు పదాన్ని ప్రస్తావించడం అవశ్యం. ఎందుకంటే అది లేకపోతే ప్రజలు ఈ హదీసును అర్థం చేసుకోవడంలో పొరబడవచ్చు. ఎవరికయినా గడ్డం పెంచడం తప్పనిసరి అనీ, దైవ తిరస్కారుల విధానాలను అనుకరించడం తగదని ఉపదేశిస్తే లేక పరదా పద్ధతి ప్రాముఖ్యత గురించి చెబితే, ఇతర ధార్మిక నియమాలను గురించి బోధిస్తే వారు వాటిని లక్ష్యపెట్టటం లేదు. "అసలు మనసులో భయం, భక్తి ఉంటే చాలండీ" అంటున్నారు. (అంటే నియమాలను పాటించాల్సిన అవసరం లేదని వారి భావం) పైపెచ్చు "అల్లాహ్ మీ అంతరంగాలను మాత్రమే చూస్తాడు" అన్న ఈ హదీసు వాక్యాన్ని నిదర్శనంగా చూపించి వాదిస్తున్నారు. నిజానికి దానితోపాటు "మరియు మీ కర్మల్ని చూస్తాడు" అన్న వాక్యం కూడా ఉంది. దీంతో ఆచరణ ప్రయోజనం, పైగా దైవప్రవక్త విధానానికి అనుగుణమైన ఆచరణ ప్రాముఖ్యత వెల్లడౌతుంది. వాస్తవానికి ఏక కాలంలో అంతరంగంతో పాటు బాహ్యాచరణల సంస్కరణ తప్పనిసరిగా జరగాలి. ఎందుకంటే రెండూ పరస్పరం విడదీయరానివి. మనసు సవ్యంగా ఉంటే ఆచరణ కూడా సవ్యంగా ఉంటుంది. అలాగే ఆచరణ సవ్యంగా ఉంటే అంతరంగమూ బాగుంటుంది. ఆచరణల సంస్కరణ లేకుండా అంతరంగాలను చక్కదిద్దడం, అంతరంగాల దిద్దుబాటు లేనిదే ఆచరణల్ని సంస్కరించడం సంభవం కాదు. ఈ విషయాన్నే వేరొక హదీసులో ఈ విధంగా వివరించడం జరిగింది: "మానవ శరీరంలో ఒక మాంసపు ముద్ద ఉంది. అది గనక సవ్యంగా ఉంటే మొత్తం శరీరం సవ్యంగా ఉంటుంది. ఒకవేళ అదే చెడిపోతే శరీరమంతా చెడిపోతుంది. ఆ మాంసపు ముద్దే హృదయం." (588 వ హదీసు చూడండి). వేరితర హదీసుల ద్వారా కూడా ఆచరణల ప్రాముఖ్యత తెలియవస్తోంది. దివ్య ఖుర్‌ఆన్‌లో అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు – "ప్రతి ఒక్కరికీ ఆచరణలకు అనుగుణంగానే అంతస్థులు ప్రాప్తిస్తాయి." మరోవిధంగా చెప్పాలంటే ఆచరణల ఆధారంగానే స్వర్గవాసుల శ్రేణుల్లో హెచ్చుతగ్గులుంటాయి. వేరొకచోట అల్లాహ్ ఇలా అంటున్నాడు – "మీరు మీ కర్మల ఆధారంగా స్వర్గంలోకి ప్రవేశించండి." మరి కర్మకు ఇంతటి ప్రాముఖ్యముండగా అల్లాహ్ శరీరాలు, ముఖాల మాదిరిగానే 'కర్మల్ని' కూడా పట్టించుకోడు అని అనటం ఎంతవరకు సమంజసం? వాస్తవానికి ఈమాన్ (విశ్వాసం) తరువాత స్వర్గ ప్రవేశానికి అర్హత కల్పించేది ఈ ఆచరణయే కదా!? ('రియాజుస్సాలిహీన్' పై అల్ బానీ గారి సూచనల సంగ్రహణం)

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|1. సకల అంతర్బాహ్య వాక్కర్మల్లో, సర్వకాల సర్వావస్థల్లో సంకల్పశుద్ధి అవసరం|హదీసు 7

8

హదీసు 8

وعَنْ أبي مُوسَى عبْدِ اللَّهِ بْنِ قَيْسٍ الأَشعرِيِّ رضِي الله عنه قالَ: سُئِلَ رسولُ الله صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم عَنِ الرَّجُلِ يُقاتِلُ شَجَاعَةً، ويُقاتِلُ حَمِيَّةً ويقاتِلُ رِياءً، أَيُّ ذلِك في سَبِيلِ اللَّهِ؟ فَقَالَ رَسُول الله صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "مَنْ قاتَلَ لِتَكُون كلِمةُ اللَّهِ هِي الْعُلْيَا فهُوَ في سَبِيلِ اللَّهِ" مُتَّفَقٌ عَلَيهِ

హజ్రత్ అబూ మూసా అబ్దుల్లాహ్ బిన్ ఖైస్ అష్‌అరీ (రదియల్లాహు అన్హు) కథనం : ఒకసారి దైవప్రవక్త ﷺ ను "ఒకడు తన శూరత్వాన్ని ప్రకటించుకోవడానికి, మరొకడు తన వంశ ప్రతిష్ఠను చాటుకోవడానికి, ఇంకొకడు పరుల మెప్పు పొందడానికి పోరాడుతున్నారు. అయితే ఈ ముగ్గురిలో ఎవరు దైవ మార్గంలో పోరాడుతున్నట్లు?" అని ప్రశ్నించడం జరిగింది. అందుకాయన "దైవవాక్కు (దైవధర్మం) ఉన్నతి కోసం పోరాడినవాడు అల్లాహ్ మార్గంలో పోరాడినట్లు పరిగణించడం జరుగుతుంది" అని సమాధానమిచ్చారు. (బుఖారీ – ముస్లిం)

(సహీహ్ బుఖారీలోని విద్యా ప్రకరణం. సహీహ్ ముస్లింలోని నాయకత్వ ప్రకరణం)

English

Abu Musa Al-Ash`ari (radiyallahu anhu) reported that Messenger of Allah ﷺ was asked about who fights in the battlefield out of valour, or out of zeal, or out of hypocrisy, which of this is considered as fighting in the cause of Allah? He said: “He who fights in order that the Word of Allah remains the supreme, is considered as fighting in the cause of Allah”.[Al-Bukhari and Muslim].

ముఖ్యాంశాలు

దేవుని సన్నిధిలో ఆచరణల్ని సత్సంకల్పాల ఆధారంగా పరికించడం జరుగుతుంది. కనుక ఆయన సన్నిధిలో దైవధర్మ ఔన్నత్యంకోసం పోరాడినవాడే వాస్తవానికి యోధుడనిపించుకోవటానికి అర్హుడు. అయితే ఇది అంతరంగంతో ముడిపడిన విషయం. మనుషులు దీనిని పసికట్టలేరు. కనుక ధర్మయుద్ధ రంగంలో హతుడైన ప్రతి ముస్లింనూ షహీద్ (అమరగతుడు)గానే వ్యవహరించడం జరుగుతుంది. గుండెల్లోని గుట్టును ఎరిగినవాడు అల్లాహ్‌యే గనక అతని సంకల్ప వ్యవహారం ఆయనకే వదలివేయడం జరిగింది.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|1. సకల అంతర్బాహ్య వాక్కర్మల్లో, సర్వకాల సర్వావస్థల్లో సంకల్పశుద్ధి అవసరం|హదీసు 8

9

హదీసు 9

وعن أبي بَكْرَة نُفيْعِ بْنِ الْحارِثِ الثَّقفِي رَضِي الله عنه أَنَّ النَّبِيَّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَالَ: "إِذَا الْتقَى الْمُسْلِمَانِ بسيْفيْهِمَا فالْقاتِلُ والمقْتُولُ في النَّارِ"قُلْتُ: يَا رَسُول اللَّهِ، هَذَا الْقَاتِلُ فمَا بَالُ الْمقْتُولِ؟ قَال: " إِنَّهُ كَانَ حَرِيصاً عَلَى قَتْلِ صَاحِبِهِ" متفقٌ عليه.

హజ్రత్ అబూబక్రహ్ నుఫైబిన్ హారిస్ సఖఫీ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ : "ఇద్దరు ముస్లింలు తమ తమ ఖడ్గాలతో పరస్పరం దాడికి దిగితే, హంతకుడు, హతుడు – ఇద్దరూ నరకానికి వెళతారు" అని చెప్పారు. నేను "దైవప్రవక్తా! హంతకుని మాట సరేగాని హతుడేం పాపం చేశాడని నరకానికి వెళతాడు?" అని సందేహపడ్డాను. అందుకాయన "అతనూ తన ప్రత్యర్థిని చంపాలన్న కసితోనే ఉన్నాడు కదా!" అని బదులిచ్చారు. (బుఖారీ – ముస్లిం)

(సహీహ్ బుఖారీలోని ఉపద్రవాల ప్రకరణం. సహీహ్ ముస్లింలోని ఉపద్రవాల ప్రకరణం).

English

Abu Bakrah Ath-Thaqafi (radiyallahu anhu) reported: The Prophet ﷺ said: “When two Muslims are engaged in a combat against each other with their sword’s and one is killed, both are doomed to Hell”. I said, “O Messenger of Allah! As to the one who kills, it is understandable, but why the slain one?” He ﷺ replied: “He was eager to kill his opponent”.[Al-Bukhari and Muslim].

ముఖ్యాంశాలు

మనిషి ఏదైనా దుష్కర్మ చేయాలని దృఢంగా నిశ్చయించుకొని దానికి కావలసిన వస్తు సామగ్రినంతటినీ సమకూర్చుకుంటే చాలు, ఏదయినా కారణంచేత అతడు ఆ నిర్ణయంలో సఫలీకృతుడు కాకపోయినప్పటికీ దైవశిక్షకు గురవుతాడని ఈ హదీసు ద్వారా తెలుస్తోంది. అంటే తలంపు వేరు. దుష్ప్రేరణ వేరు. ఇవి రెండూ ఒకటి కావని భావం. చెడు తలంపులు మన్నించదగినవేగాని చెడు ప్రేరణలు మాత్రం క్షమార్హం కావు. అయితే ఈ హదీసులో ప్రస్తావించబడిన హెచ్చరిక కేవలం ఐహిక అహంభావం, మూఢత్వంతో కొట్లాడుకునే ముస్లింలకు మాత్రమే వర్తిస్తుంది. ధార్మిక విషయాలకు ఇది వర్తించదు. ఎందుకంటే ధార్మిక విషయమై కొట్లాడుకున్నప్పుడు వారిలోని ప్రతి ఒక్కరికీ తాను సత్యంపై ఉన్నానన్న దృఢ నమ్మకముండవచ్చు. అలాంటి పరిస్థితిలో వారు దేవుని దృష్టిలో క్షమార్హులవుతారు.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|1. సకల అంతర్బాహ్య వాక్కర్మల్లో, సర్వకాల సర్వావస్థల్లో సంకల్పశుద్ధి అవసరం|హదీసు 9

10

హదీసు 10

وَعَنْ أبي هُرَيْرَةَ رَضِيَ الله عنه قَالَ: قَالَ رَسُولُ الله صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "صَلاَةُ الرَّجُلِ في جماعةٍ تزيدُ عَلَى صَلاَتِهِ في سُوقِهِ وَبَيْتِهِ بضْعاً وعِشْرينَ دَرَجَةً، وذلِكَ أَنَّ أَحَدَهُمْ إِذا تَوَضَّأَ فَأَحْسَنَ الْوُضُوءَ، ثُمَّ أَتَى الْمَسْجِد لا يَنْهَزُهُ إِلاَّ الصَّلاَةُ، لا يُرِيدُ إِلاَّ الصَّلاَةَ، لَمْ يَخطُ خُطوَةً إِلاَّ رُفِعَ لَهُ بِها دَرجةٌ، وَحُطَّ عَنْهُ بِهَا خَطيئَةٌ حتَّى يَدْخلَ الْمَسْجِدَ، فَإِذَا دَخَلَ الْمَسْجِدَ كانَ في الصَّلاَةِ مَا كَانَتِ الصَّلاةُ هِيَ تحبِسُهُ، وَالْمَلائِكَةُ يُصَلُّونَ عَلَى أَحَدكُمْ مَا دَامَ في مَجْلِسهِ الَّذي صَلَّى فِيهِ، يقُولُونَ: اللَّهُمَّ ارْحَمْهُ، اللَّهُمَّ اغْفِرْ لَهُ، اللَّهُمَّ تُبْ عَلَيْهِ، مالَمْ يُؤْذِ فِيهِ، مَا لَمْ يُحْدِثْ فِيهِ "متفقٌ عليه، وهَذَا لَفْظُ مُسْلمٍ. وَقَوْلُهُ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "ينْهَزُهُ"هُوَ بِفتحِ الْياءِ وَالْهاءِ وَبالزَّاي: أَي يُخْرِجُهُ ويُنْهِضُهُ.

దైవప్రవక్త ﷺ ప్రవచించారని హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) తెలిపారు: మనిషి సామూహికంగా చేసే నమాజు అతను తన ఇంట్లో లేక బజారులో చేసే నమాజుకన్నా ఇరవై రెట్లకు పైగా ఘనమైనది. ఎందుకంటే ఒక వ్యక్తి చక్కగా వుజూ చేసుకుంటాడు, తరువాత నమాజు కోసం మస్జిద్‌కు వస్తాడు. నమాజు మాత్రమే అతణ్ణి మస్జిద్‌కు తీసుకువస్తే – అలాంటి వ్యక్తి మస్జిద్ చేరుకునేంత వరకూ అతను వేసే ఒక్కో అడుగుకు బదులుగా అతని ఒక్కో అంతస్థు పెరుగుతూ ఉంటుంది. అతని వల్ల జరిగిన ఒక్కో పాపం తొలగించబడుతూ ఉంటుంది. ఆ తరువాత మస్జిద్‌లో ప్రవేశించిన పిదప నమాజు అతన్ని ఆపివుంచినంతసేపూ అతను నమాజు చేస్తున్నట్లుగానే పరిగణించబడతాడు. మీలో ఎవడైనా నమాజు చేసిన స్థానంలో కూర్చొని ఉన్నంత వరకూ దైవదూతలు అతనిపై అల్లాహ్ కారుణ్యం కురవాలని వేడుకుంటూనే ఉంటారు. ఆ వ్యక్తి పరులకు హాని కలిగించనంతవరకు, అతని వుజూ భంగం కానంతవరకు దైవదూతలు "ఓ అల్లాహ్! ఈ వ్యక్తిని కరుణించు. ఓ అల్లాహ్! ఇతన్ని మన్నించు. ఓ అల్లాహ్! ఇతన్ని కనిపెట్టుకుని ఉండు" అని విన్నవించుకుంటూ ఉంటారు (బుఖారీ – ముస్లిం). హదీసు వాక్యాలు మాత్రం ముస్లింలోనివి. హదీసులో వచ్చిన పదం "యన్‌హజుహూ" అంటే అతన్ని బయటికి తీసుకు వస్తుంది లేక అతన్ని లేపుతుందని అర్థం.

(సహీహ్ బుఖారీలోని నమాజు ప్రకరణం. సహీహ్ ముస్లింలోని నమాజు ప్రకరణం)

English

Abu Hurairah (radiyallahu anhu) reported that: The Messenger of Allah ﷺ said: “The reward for Salat performed by a person in congregation is more than 20 times greater than that of the Salat performed in one’s house or shop. When one performs Wudu’ perfectly and then proceeds to the mosque with the sole intention of performing Salat, then for every step he takes towards the mosque, he is upgraded one degree in reward and one of his sins is eliminated until he enters the mosque, and when he enters the mosque, he is considered as performing Salat as long as it is the Salat which prevents him (from leaving the mosque); and the angels keep on supplicating Allah for him as long as he remains in his place of prayer. They say: ‘O Allah! have mercy on him; O Allah! forgive his sins; O Allah! accept his repentance’. This will carry on as long as he does not pass wind“.[Al-Bukhari and Muslim].

ముఖ్యాంశాలు

అంగళ్ళలో, ఇండ్లల్లో ఒంటరిగా నమాజు చేసుకోవచ్చు గాని దానికంటే సామూహికంగా చేసే నమాజు – ఇతర ఉల్లేఖనాల్లో ప్రస్తావించబడినట్లు – ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు రెట్లు శుభప్రదమైనది, శ్రేష్ఠమైనదనీ ఈ హదీసు ద్వారా విదితమవుతోంది. నమాజ్ ఇతర సత్కార్యాల కన్నా ఎంతో గొప్పదనీ, దైవదూతలు నమాజు చేసే వ్యక్తికి శుభశ్రేయాలు ప్రాప్తించాలని వేడుకుంటారని కూడా ఈ హదీసు ద్వారా తెలుస్తోంది.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|1. సకల అంతర్బాహ్య వాక్కర్మల్లో, సర్వకాల సర్వావస్థల్లో సంకల్పశుద్ధి అవసరం|హదీసు 10

11

హదీసు 11

وَعَنْ أبي الْعَبَّاسِ عَبْدِ اللَّهِ بْنِ عبَّاسِ بْنِ عَبْدِ الْمُطَِّلب رَضِي اللهُ عنهما، عَنْ رَسُول الله صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم، فِيما يَرْوى عَنْ ربِّهِ، تَبَارَكَ وَتَعَالَى قَالَ: "إِنَّ اللهَ كتَبَ الْحسناتِ والسَّيِّئاتِ ثُمَّ بَيَّنَ ذلِكَ: فمَنْ همَّ بِحَسَنةٍ فَلمْ يعْمَلْهَا كتبَهَا اللَّهُ تَبَارَكَ وَتَعَالَى عِنْدَهُ حَسَنَةً كامِلةً وَإِنْ همَّ بهَا فَعَمِلَهَا كَتَبَهَا اللَّهُ عَشْر حَسَنَاتٍ إِلَى سَبْعِمَائِةِ ضِعْفٍ إِلَى أَضْعَافٍ كثيرةٍ، وَإِنْ هَمَّ بِسيِّئَةِ فَلَمْ يَعْمَلْهَا كَتَبَهَا اللَّهُ عِنْدَهُ حَسَنَةً كامِلَةً، وَإِنْ هَمَّ بِها فعَمِلهَا كَتَبَهَا اللَّهُ سَيِّئَةً وَاحِدَةً" متفقٌ عليهِ.

దైవప్రవక్త ﷺ తన ప్రభువు ద్వారా ఉల్లేఖించిన విషయాన్ని హజ్రత్ అబుల్ అబ్బాస్ అబ్దుల్లాహ్ బిన్ అబ్బాస్ బిన్ అబ్దుల్ ముత్తలిబ్ (రదియల్లాహు అన్హుమా) ఈ విధంగా ఉటంకించారు : అల్లాహ్ సత్కార్యాలను, దుష్కార్యాలను రాసి, పిదప వాటిని గురించి వివరించాడు; ఎవడైనా ఏదైనా మంచి పని చేయాలని సంకల్పించుకొని, (ఏదయినా కారణంచేత) దానిని అమలుపరచలేక పోయినప్పటికీ అల్లాహ్ తన వద్ద అతను ఒక సత్కార్యం పూర్తి చేసినట్లు రాసుకుంటాడు. మరి ఆ వ్యక్తి ఆ మంచి పని చేయాలని ఉద్దేశించుకొన్న పిదప దాన్ని నెరవేరిస్తే దానికి అల్లాహ్ పది నుండి ఏడు వందల రెట్లు – ఇంకా దానికంటే ఎన్నో రెట్లు అధికంగానే సత్కర్మలు చేసినట్లు అతని ఖాతాలో రాస్తాడు. (దీనికి భిన్నంగా) ఎవడైనా ఒక చెడుపని చేయాలనుకుని ఏదయినా కారణంచేత చేయకుండా ఉంటే అప్పటికీ అల్లాహ్ తన వద్ద, ఆ వ్యక్తి పూర్తిగా ఒక మంచి పని చేసినట్లు రాసుకుంటాడు. అయితే అతను ఆ చెడ్డపని చేయాలని సంకల్పించుకున్న పిదప దాన్ని చేసేస్తే మాత్రం ఒక్క చెడ్డపని చేశాడని పొందుపరుస్తాడు. (బుఖారీ – ముస్లిం)

(సహీహ్ బుఖారీలోని కారుణ్య ప్రకరణం. సహీహ్ ముస్లింలోని విశ్వాసాల ప్రకరణం)

English

`Abdullah bin `Abbas (radiyallahu anhuma) reported: Messenger of Allah ﷺ said that Allah, the Glorious, said: “Verily, Allah (SWT) has ordered that the good and the bad deeds be written down. Then He explained it clearly how (to write): He who intends to do a good deed but he does not do it, then Allah records it for him as a full good deed, but if he carries out his intention, then Allah the Exalted, writes it down for him as from ten to seven hundred folds, and even more. But if he intends to do an evil act and has not done it, then Allah writes it down with Him as a full good deed, but if he intends it and has done it, Allah writes it down as one bad deed”.[Al-Bukhari and Muslim].

ముఖ్యాంశాలు

దైవప్రవక్త ﷺ అల్లాహ్ ద్వారా ఉల్లేఖించిన పలుకులు "హదీసె ఖుద్సీ" అనబడతాయి. ఈ హదీసులో అల్లాహ్ ఇహపరాలలో తన దాసులపై కురిపించే అనంత అనుగ్రహాలు, విస్తృతమైన ఆయన ఉదాత్త గుణాలు వివరించబడ్డాయి.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|1. సకల అంతర్బాహ్య వాక్కర్మల్లో, సర్వకాల సర్వావస్థల్లో సంకల్పశుద్ధి అవసరం|హదీసు 11

12

హదీసు 12

وعن أبي عَبْد الرَّحْمَن عَبْدِ اللَّهِ بْنِ عُمَرَ بْنِ الْخطَّابِ، رضيَ اللهُ عنهما قَالَ: سَمِعْتُ رسولَ الله صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم يَقُولُ: "انْطَلَقَ ثَلاَثَةُ نَفَرٍ مِمَّنْ كَانَ قَبْلَكُمْ حَتَّى آوَاهُمُ الْمبِيتُ إِلَى غَارٍ فَدَخَلُوهُ، فانْحَدَرَتْ صَخْرةٌ مِنَ الْجبلِ فَسَدَّتْ عَلَيْهِمْ الْغَارَ، فَقَالُوا: إِنَّهُ لاَ يُنْجِيكُمْ مِنْ الصَّخْرَةِ إِلاَّ أَنْ تَدْعُوا الله تعالى بصالح أَعْمَالكُمْ قَالَ رجلٌ مِنهُمْ: اللَّهُمَّ كَانَ لِي أَبَوانِ شَيْخَانِ كَبِيرانِ، وكُنْتُ لاَ أَغبِقُ قبْلهَما أَهْلاً وَلا مالاً فنأَى بِي طَلَبُ الشَّجرِ يَوْماً فَلمْ أُرِحْ عَلَيْهمَا حَتَّى نَامَا فَحَلبْت لَهُمَا غبُوقَهمَا فَوَجَدْتُهُمَا نَائِميْنِ، فَكَرِهْت أَنْ أُوقظَهمَا وَأَنْ أَغْبِقَ قَبْلَهُمَا أَهْلاً أَوْ مَالاً، فَلَبِثْتُ وَالْقَدَحُ عَلَى يَدِى أَنْتَظِرُ اسْتِيقَاظَهُما حَتَّى بَرَقَ الْفَجْرُ وَالصِّبْيَةُ يَتَضاغَوْنَ عِنْدَ قَدَمى فَاسْتَيْقظَا فَشَربَا غَبُوقَهُمَا. اللَّهُمَّ إِنْ كُنْتُ فَعَلْتُ ذَلِكَ ابْتِغَاءَ وَجْهِكَ فَفَرِّجْ عَنَّا مَا نَحْنُ فِيهِ مِنْ هَذِهِ الصَّخْرَة، فانْفَرَجَتْ شَيْئاً لا يَسْتَطيعُونَ الْخُرُوجَ مِنْهُ. قَالَ الآخر: اللَّهُمَّ إِنَّهُ كَانتْ لِيَ ابْنَةُ عمٍّ كانتْ أَحَبَّ النَّاسِ إِلَيَّ"وفي رواية: "كُنْتُ أُحِبُّهَا كَأَشد مَا يُحبُّ الرِّجَالُ النِّسَاءِ، فَأَرَدْتُهَا عَلَى نَفْسهَا فَامْتَنَعَتْ مِنِّى حَتَّى أَلَمَّتْ بِهَا سَنَةٌ مِنَ السِّنِينَ فَجَاءَتْنِى فَأَعْطَيْتُهِا عِشْرينَ وَمِائَةَ دِينَارٍ عَلَى أَنْ تُخَلِّىَ بَيْنِى وَبَيْنَ نَفْسِهَا ففَعَلَت، حَتَّى إِذَا قَدَرْتُ عَلَيْهَا"وفي رواية: "فَلَمَّا قَعَدْتُ بَيْنَ رِجْليْهَا، قَالتْ: اتَّقِ اللهَ وَلاَ تَفُضَّ الْخاتَمَ إِلاَّ بِحَقِّهِ، فانْصَرَفْتُ عَنْهَا وَهِىَ أَحَبُّ النَّاسِ إِليَّ وَتركْتُ الذَّهَبَ الَّذي أَعْطَيتُهَا، اللَّهُمَّ إِنْ كُنْتُ فَعْلتُ ذَلِكَ ابْتِغَاءَ وَجْهِكَ فافْرُجْ عَنَّا مَا نَحْنُ فِيهِ، فانفَرَجَتِ الصَّخْرَةُ غَيْرَ أَنَّهُمْ لا يَسْتَطِيعُونَ الْخُرُوجَ مِنْهَا. وقَالَ الثَّالِثُ: اللَّهُمَّ إِنِّي اسْتَأْجَرْتُ أُجرَاءَ وَأَعْطَيْتُهمْ أَجْرَهُمْ غَيْرَ رَجُلٍ وَاحِدٍ تَرَكَ الَّذي لَّه وَذَهبَ فثمَّرت أجْرَهُ حَتَّى كثرت منه الأموال فجائنى بَعدَ حِينٍ فَقالَ يَا عبدَ اللهِ أَدِّ إِلَيَّ أَجْرِي، فَقُلْتُ: كُلُّ مَا تَرَى منْ أَجْرِكَ: مِنَ الإِبِلِ وَالْبَقَرِ وَالْغَنَم وَالرَّقِيق فقالَ: يا عَبْدَ اللَّهِ لا تَسْتهْزيْ بي، فَقُلْتُ: لاَ أَسْتَهْزيُ بِكَ، فَأَخَذَهُ كُلَّهُ فاسْتاقَهُ فَلَمْ يَتْرُكْ مِنْه شَيْئاً، اللَّهُمَّ إِنْ كُنْتُ فَعَلْتُ ذَلِكَ ابْتغَاءَ وَجْهِكَ فافْرُجْ عَنَّا مَا نَحْنُ فِيهِ، فَانْفَرَجَتِ الصَّخْرَةُ فخرَجُوا يَمْشُونَ "متفقٌ عليه.

దైవప్రవక్త ﷺ ప్రవచించగా తాను విన్నానని హజ్రత్ అబూ అబ్దుర్రహ్మాన్ అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ బిన్ ఖత్తాబ్ (రదియల్లాహు అన్హుమా) తెలియజేశారు: "మీ పూర్వీకుల్లోని ముగ్గురు వ్యక్తులు కలిసి ప్రయాణానికి బయలుదేరారు. దారిలో రాత్రయింది. ఆ ముగ్గురూ ఒక గుహలో శరణుతీసుకుందామని అందులోకి వెళ్ళారు. అంతలోనే పర్వతం పైనుంచి ఒక పెద్ద బండరాయి దొర్లిపడింది. దాంతో గుహ ముఖద్వారం మూసుకుపోయింది. దాంతో వారు ఆ ఆపద నుంచి బయటపడే మార్గం గురించి మాట్లాడుకున్నారు. ఆఖరికి తాము అంతకు మునుపు చేసుకున్న సత్కార్యాల ఆధారంగా అల్లాహ్‌ను వేడుకోవడం తప్ప ఆ విపత్తు నుండి బయటపడేందుకు వేరేమార్గం లేదన్న నిర్ణయానికి వచ్చారు. వారిలోని ఒకడు ఇలా వేడుకున్నాడు : "దేవా! నాకు మరీ ముసలివారైన తల్లిదండ్రులుండేవారు. సాయంత్రం పూట అందరికంటే ముందు నేను నా తల్లిదండ్రులకే పాలు త్రాగించేవాడిని. వారికంటే ముందు నా భార్యాబిడ్డలకు గానీ, నా నౌకర్లకు గాని త్రాపించేవాణ్ణి కాను. ఒకరోజు నేను (పశువులకు) చెట్లమేత కోసం చాలా దూరం వెళ్ళిపోయాను. నేను ఇంటికి తిరిగి వచ్చేసరికి నా తల్లిదండ్రులిద్దరూ నిద్రపోయారు. నేను ఆ పూట పాలు పితికి తీసుకు వచ్చాను. అప్పటికే వారు గాఢ నిద్రలో ఉండడం గమనించాను. వారిని మేల్కొలపడానికి నాకు మనసొప్పలేదు. వారికంటే ముందు నా భార్యాబిడ్డలకు, నౌకర్లకు పాలు త్రాగించడం కూడా నాకిష్టం లేదు. అందుకని నా పిల్లలు నా కాళ్ళ మీద పడి విలవిల్లాడినా కూడా (నేను వారికి త్రాపకుండా) పాలపాత్ర చేతిలో పట్టుకొని తెల్లవారే దాకా వాళ్ళ దగ్గరే నిలబడి, ఏ సమయంలోనైనా వారు మేల్కొంటారేమోనని ఎదురు చూడసాగాను. తెల్లవారిన తరువాత గాని వారు లేవలేదు. నిద్ర మేల్కొని రాత్రి వారికోసం ఉంచబడిన పాలు తాగారు. ఓ అల్లాహ్! కేవలం నీ ప్రసన్నత కోసమే నేనీ పని చేసివుంటే మేము చిక్కుకున్న ఈ గుహ ముఖద్వారం నుండి బండ రాయిని తొలగించి మమ్మల్ని రక్షించు."

అతని వేడుకోలు ఫలితంగా ఆ బండ రాయి కొద్దిగా జరిగింది. అయితే (అప్పటికీ) ఆ సందుగుండా వారు బయటికి రాలేకపోయారు.

తరువాత రెండో వ్యక్తి అభ్యర్థించుకోసాగాడు: "ఓ దేవా! నా బాబాయి కూతురు ఒకామె ఉండేది. నేనామెను అమితంగా ఇష్టపడేవాణ్ణి. (వేరొక ఉల్లేఖనంలో ఇలా ఉంది): మగవారు ఆడవారిని అమితంగా ప్రేమించినంతగా నేను ఆమెను ప్రేమించే వాడిని. ఒకసారి నేను ఆమె పొందుకోసం పరితపించాను. కాని అందుకామె ఒప్పుకోలేదు. ఆఖరికి దుర్భిక్షం ఆమెను గత్యంతరం లేక నా వద్దకు వచ్చేలా చేసింది. అప్పుడు ఆమె నాతో ఏకాంతంలో గడిపే షరతుపై నేనామెకు నూట ఇరవై దీనార్లు ఇచ్చాను (గత్యంతరం లేక ఆమె అవి తీసుకుంది). నా కోరిక తీర్చేందుకు సిద్ధమయ్యింది. నేనామెను ఆక్రమించుకున్నప్పుడు, (వేరొక ఉల్లేఖనం ప్రకారం) నేను ఆమె రెండు తొడల మధ్య కూర్చున్నప్పుడు ఆమె నాతో; "అల్లాహ్‌కు భయపడు! అక్రమంగా కన్నె పొరను చీల్చకు" అని అంది. ఆ మాటలు విన్న తడవుగా నేను ఆమె దగ్గర్నుండి లేచి పోయాను. నిజానికి ఆమె నాకు ప్రజల్లో అత్యంత ప్రియతమమైనది. నేను ఆమెకిచ్చిన బంగారు దీనార్లను కూడా వదులుకున్నాను. ఓ దేవా! నేను కేవలం నీ ప్రసన్నత కోసమే ఇలా చేసి ఉన్నట్లయితే మాపై వచ్చిపడిన ఈ విపత్తు నుండి మమ్మల్ని రక్షించు."

రెండో వ్యక్తి వేడుకోలు తరువాత ఆ బండరాయి ఇంకొంచెం తొలగింది. అయినా గాని వారు బయటపడేందుకు మార్గం సుగమం కాలేదు.

ఆ తరువాత మూడో వ్యక్తి వేడుకోవడం ప్రారంభించాడు: "ప్రభూ! నేను కొంతమంది పని మనుషులను జీతానికుంచుకున్నాను. నేను వారందరికీ జీతాలిచ్చేశాను. కాని వారిలో ఒకడు మాత్రం తన జీతం పుచ్చుకోకుండానే వెళ్ళిపోయాడు. నేను అతని జీతాన్ని వ్యాపారంలో పెట్టుబడిగా పెట్టాను. దాంతో చాలా ధనం పోగయ్యింది. కొంత కాలానికి ఆ వ్యక్తి వచ్చి, "ఓ దైవ దాసుడా! నాకు నా జీతం ఇవ్వు" అనడిగాడు. దానికి నేను, "నువ్వు చూస్తున్నటువంటి ఈ ఒంటెలు, ఆవులు, మేకలు, బానిసలు – అన్నీ నీ జీతం ఫలాలే (వాటిని నువ్వు తీసేసుకో)" అన్నాను. అందుకతను "ఓ దైవదాసుడా! నాతో పరాచికాలు వద్దు" అంటూ చిన్నబోయాడు. నేను "ఇది పరాచికం కాదు (నిజం చెబుతున్నాను)" అన్నాను. అప్పుడు అతను (నా కోసం) ఏమీ వదల కుండా ఆ సంపదనంతా తరలించుకొని వెళ్ళిపోయాడు. ఓ అల్లాహ్! నేను ఈ పని కేవలం నీ ప్రసన్నతను దృష్టిలో పెట్టుకొనే చేసినట్లయితే మేము చిక్కుకున్నటువంటి ఈ ఆపద నుంచి మమ్మల్ని కాపాడు."

దాంతో ఆ బండరాయి పూర్తిగా తొలగిపోయి గుహద్వారం తెరుచుకోవటంతో వారు ముగ్గురూ బయటపడ్డారు. (బుఖారీ – ముస్లిం)

(సహీహ్ బుఖారీలోని ప్రవక్తల ప్రకరణం. సహీహ్ ముస్లింలోని కారుణ్య ప్రకరణం)

English

`Abdullah bin `Umar bin Al-Khattab (radiyallahu anhuma) narrated that: He heard Messenger of Allah ﷺ as saying: “Three men, amongst those who came before you, set out until night came and they reached a cave, so they entered it. A rock fell down from the mountain and blocked the entrance of the cave. They said: `Nothing will save you from this unless you supplicate to Allah by virtue of a righteous deed you have done.’ Thereupon, one of them said: `O Allah! I had parents who were old, and I used to offer them milk before any of my children or slaves. One day, I went far away in search of grazing and could not come back until they had slept. When I milked as usual and brought the drink I found them both asleep. I hated to disturb them and also disliked to give milk to my children before them. My children were crying out of hunger at my feet but I awaited with the bowl in my hand for them to wake up. When they awoke at dawn, they drank milk. O Allah! If I did so to seek Your Pleasure, then deliver us from the distress caused by the rock’. The rock moved slightly but they were unable to escape. The next said: `O Allah! I had a cousin whom I loved more than any one else (in another version he said: as a man can love a woman). I wanted to have sexual intercourse with her but she refused. Hard pressed in a year of famine, she approached me. I gave her one hundred and twenty dinars on condition that she would yield herself to me. She agreed and when we got together (for sexual intercourse), she said: Fear Allah and do not break the seal unlawfully. I moved away from her in spite of the fact that I loved her most passionately; and I let her keep the money I had given her. O Allah! If I did that to seek Your Pleasure, then, remove the distress in which we are.’ The rock moved aside a bit further but they were still unable to get out. The third one said: `O Allah! I hired some labourers and paid them their wages except one of them departed without taking his due. I invested his money in business and the business prospered greatly. After a long time, he came to me and said: O slave of Allah! Pay me my dues. I said: All that you see is yours – camels, cattle, goats and slaves. He said: O slave of Allah! Do not mock at me. I assured him that I was not joking. So he took all the things and went away. He spared nothing. O Allah! If I did so seeking Your Pleasure, then relieve us of our distress.’ The rock slipped aside and they got out walking freely”.[Al-Bukhari and Muslim].

ముఖ్యాంశాలు

  1. సత్కార్యాల ఆధారంగా అల్లాహ్‌ను వేడుకోవడం ధర్మసమ్మతమేననీ, అలాగాకుండా వ్యక్తులను అడ్డం పెట్టుకొని వేడుకోవడం తగదని, పైగా ధర్మంలో ఓ కొత్త పోకడ (బిద్‌అత్) అని పై హదీసు ద్వారా తెలుస్తోంది. ధర్మావలంబనలో ప్రజలు ఇలాంటి కొత్త పుంతలు తొక్కరాదు. ఎందుకంటే అసలు షరీయత్‌లో దీనికి ఎలాంటి ఆధారమూ లేదు. రెండో విషయం ఏమిటంటే ఈ విధానం దైవప్రవక్త మరియు ఆయన అనుచరుల కాలం నాటి విధానానికి భిన్నమైనది.
  2. ఆలుబిడ్డల ఆలనాపాలన కన్నా తల్లిదండ్రుల సేవకు ఎక్కువ ప్రాధాన్యతనివ్వాలి.
  3. దైవభీతితో చెడు నడత నుంచి ఆగిపోవటం గొప్ప సదాచరణ.
  4. కార్మికుల పట్ల ఉత్తమంగా వ్యవహరించాలి. వారిలో ఎవరి హక్కైనా మిగిలిపోయి ఉన్నట్లయితే దానిని ఉత్తమ రీతిలో నెరవేర్చాలి.
  5. చిత్తశుద్ధితో, భక్తీప్రపత్తులతో, దీనాతిదీనంగా చేసే వేడుకోలు తప్పకుండా స్వీకృతిని పొందుతుంది.
  6. అల్లాహ్ అప్పుడప్పుడూ తన దాసులకు అసాధారణ రీతిలో కూడా సహాయం చేస్తూ ఉంటాడు. దీనినే "కరామత్" అంటారు. ప్రవక్తల నిదర్శనాల లాగానే అల్లాహ్‌కు ప్రియులైన దాసుల (వలీల) మహిమలు కూడా వాస్తవమే. అయితే ఏ అద్భుతాలయినా మహిమలయినా అల్లాహ్ ఇష్టానుసారమే ఉనికిలోకి వస్తాయి. అంతేగాని ప్రవక్తలు, సజ్జనులు ఎప్పుడంటే అప్పుడు అద్భుతాలను, మహిమలను సృష్టించలేరు.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|1. సకల అంతర్బాహ్య వాక్కర్మల్లో, సర్వకాల సర్వావస్థల్లో సంకల్పశుద్ధి అవసరం|హదీసు 12