9. ప్రార్థన (దు’ఆ)ల పుస్తకం | మిష్కాతుల్ మసాబీహ్

9- كِتَابُ الدَّعْوَاتِ

9. ప్రార్థన )దు( పుస్తకం

దు’ఆ అంటే పిలుచుట, మొరపెట్టుకొనుట. అంటే కష్టాల్లో, ఆపదల్లో సహాయం కొరకు అల్లాహ్‌(త)ను పిలవటం, మొరపెట్టుకోవటం. అల్లాహ్‌ (త) ఆ మొర లను విని కష్టాలను తొలగిస్తాడు. ఆపదలను దూరం చేయడానికి అల్లాహ్‌(త)ను తప్ప ఇతరు లెవ్వరినీ, ఎన్నడూ పిలువరాదు. ఎందుకంటే అల్లాహ్‌(త) తప్ప ఇతరులెవ్వరూ ఆపదలను తొలగించలేరు, లాభాలు చేకూర్చలేరు. అయితే అల్లాహ్‌(త) ను వదలి ఇతరులను మొరపెట్టుకునే వారే బుద్ధిహీనులు మార్గభ్రష్టులూను. ఖుర్‌ఆన్‌లో అల్లాహ్‌ (త) ఇలా ఆదేశించాడు: ”మరియు అల్లాహ్‌(త)ను వదలి పున రుత్థానదినం వరకు తమ ప్రార్థనలను విని సమాధాన మివ్వ లేనటువంటి వారిని ప్రార్థించేవారికంటే, ఎక్కువ మార్గభ్రష్టులెవరు? మరియు వారు (తమను ప్రార్థించే) వారి ప్రార్థనలను ఎరుగకుండా ఉన్నారు.” (సూ. అల్‌ అ’హ్‌ఖాఫ్‌, 46:5)

మరో ఆదేశం: ”నిశ్చయంగా, మీరు అల్లాహ్‌ను విడిచి ఎవరినైతే పిలుస్తున్నారో, వారు కూడా మీలాంటి దాసులే!..” (సూ. అల్‌ అ’అరాఫ్‌, 7:194)

వారు మీ కంటే బలహీనులు, ఎందుకంటే సజీవంగా ఉన్న వ్యక్తి కొన్ని కష్టాలను ఆపదలను పరిష్కరించు కుంటాడు. ప్రాణంలేని వారు దాన్ని దూరం చేసుకో లేరు. ఇతరులకు ఏ సహాయమూ చేయలేరు? అల్లాహ్‌ ఆదేశం: ”మరియు ఆయనను విడిచి మీరు వేడుకునేవారు మీకు ఏవిధమైన సహాయంచేయలేరు. మరియు వారు తమకు తాము కూడా సహాయం చేసుకోలేరు.” (సూ. అల్‌ అ’అరాఫ్‌, 7:197)

పై ఆయతుల ద్వారా అల్లాహ్‌ (త) తప్ప ఇతరు లందరూ శక్తిహీనులే, నిస్సహాయులే. ఒకరు మరొకరి నష్టాన్ని, కష్టాన్ని దూరంచేయలేరని తెలిసింది. కేవలం అల్లాహ్‌ (త) మాత్రమే అందరికీ సహాయం చేయ గలడు. కనుక ఎట్టి పరిస్థితిలోనూ అల్లాహ్‌(త)నే ప్రార్థించాలి. ఆయన్నే మొరపెట్టు కోవాలి. ఇతరులను భాగస్వాములుగా చేర్చరాదు. అల్లాహ్‌(త)తో పాటు ఇతరులను ప్రార్థించడం మహాపాపం, మహా అపరాధం, అల్లాహ్‌ ఆదేశం: ”మరియు అల్లాహ్‌నువదలి నీకు లాభంగానీ మరియు నష్టంగానీ కలిగించలేని దానిని నీవుప్రార్థించకు. ఒకవేళ నీవు అలాచేస్తే! నిశ్చయంగా, నీవు దుర్మార్గులలోచేరిన వాడవవుతావు.” (యూనుస్, 10:106) కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ అల్లాహ్‌(త)నే ప్రార్థించాలి. అల్లాహ్‌ (త) స్వయంగా ఆదేశిస్తున్నాడు: ”నన్ను ప్రార్థించండి, నేను మీ ప్రార్థన లను అంగీకరిస్తాను…” (సూ. గాఫిర్, 40:60) మరో చోట ఇలా ఆదేశిస్తున్నాడు: ”…పిలిచేవాడు నన్ను పిలిచినప్పుడు నేను అతని పిలుపును విని జవాబు ఇస్తాను…” (సూ. అల్ బఖరహ్, 2:186) మరో ఆదేశం: ”మీ ప్రభువును వినయంతో మరియు రహస్యంగా(మౌనంగా)ప్రార్థించండి…” (సూ. అల్ అ’అరాఫ్‌, 7:55)

ప్రవక్త (స) ఇలా ప్రవచించారు: ”దు’ఆ కూడా ఆరా ధనే, దు’ఆ ఆరాధన యొక్క గుజురు వంటిది, దు’ఆ విశ్వాసి ఆయుధం మొదలైన ప్రవచనాలు, అల్లాహ్‌ (త) వద్ద దు’ఆ కంటే ప్రియమైన వస్తువు ఏదీ లేదు. అంతేకాదు దు’ఆ విధివ్రాతనుకూడా మార్చివేస్తుంది. దు ప్రతి ఆపదను తొలగిస్తుంది. (తిర్మిజి’)

ప్రవక్త (స) ఇలా ప్రవచించారు: ”మీ ప్రభువు చాలా సిగ్గు గలవాడు, దాసుడు చేతులెత్తి అల్లాహ్‌(త)ను అర్థించినపుడు, ఆ దాసుడ్ని వట్టిచేతులతో త్రిప్పి పంపడానికి అల్లాహ్‌(త) సిగ్గుపడతాడు.” (అబూ దావూద్‌)

ఇంకా ఇలా ప్రవచించారు: ”దు’ఆ కొరకు ద్వారాలు తెరువబడ్డాయి. అంటే అతనికి దు’ఆ చేసే భాగ్యం ప్రసాదించబడింది. అంటే ఇటువంటి వ్యక్తి కొరకు స్వర్గం, స్వీకారం, కారుణ్యం కొరకు ద్వారాలు తెరువ బడ్డాయి. (ఇబ్నె అబీ షైబహ్ – ‘హిస్సు ‘హసీన్‌) అయితే కష్టాల్లో, ఆపదల్లో దు’ఆ స్వీకరించబడితే సుఖసంతోషాల సమయాల్లో అల్లాహ్‌(త)ను ప్రార్థిస్తూ ఉండాలి. (‘హాకిమ్‌)

ప్రవక్త (స) ప్రవచనం, ”దాసుడు దైవాన్ని ప్రార్థిస్తే మూడు విషయాల్లో ఒక విషయాన్ని తప్పకుండా ప్రసాదిస్తాడు. 1. అతడు కోరింది ప్రసాదిస్తాడు. 2. లేదా దానికంటే ఉత్తమమయిన దాన్ని ప్రసాదిస్తాడు. 3. లేదా దాని ద్వారా వచ్చే ఆపదను దూరం చేస్తాడు.

ఇస్లామీ జాయిఫ్లో దు’ఆ ప్రత్యేకతలు, నియమాలు, షరతులు స్వీకరణా స్థలాలు, సమయాలు మొదలైన వాటిని గురించి అబ్దుస్సలాం బస్తవీ గారు, వివరంగా పేర్కొన్నారు. ఆ పుస్తకాన్ని అధ్యయనం చేయండి. చాలా లాభం కలుగుతుంది. ఖుర్‌ఆన్‌లోని దు’ఆలు, ‘హదీసు’లోని దు’ఆలు అన్నీ ఇందులో ఉన్నాయి.

—–

اَلْفَصْلُ الْأَوَّلُ మొదటి విభాగం 

2223 – [ 1 ] ( صحيح ) (2/691)

عَنْ أَبِيْ هُرَيْرَةَ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لِكُلِّ نَبِيٍّ دَعْوَةٌ مُّسْتَجَابَةٌ فَتَعَجَّلَ كُلُّ نَبِيٍّ دَعْوَتَهُ وَإِنِّي اخْتَبَأْتُ دَعْوَتِيْ “شَفَاعَةً لِأُمَّتِيْ” إِلَى يَوْمِ الْقِيَامَةِ فَهِيَ نَائِلَةٌ إِنْ شَاءَ اللهُ مَنْ مَاتَ مِنْ أُمَّتِيْ لَا يُشْرِكُ بِاللهِ شَيْئًا”. رَوَاهُ مُسْلِمٌ وَلِلْبُخَارِيِّ أَقْصَرُمِنْهُ.

2223. (1) [2/691దృఢం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ప్రతి ప్రవక్తకూ ఒక ప్రత్యేక స్వీకరించబడే దు’ఆ ఉంది. అయితే ప్రతి ప్రవక్త తన దు’ఆ విషయంలో తొందర పడ్డారు. ప్రపంచంలోనే దాన్ని ఉపయోగించు కున్నారు. అది స్వీకరించబడింది. నాకు కూడా ఒక దు’ఆ చేసే అవకాశం ఇవ్వబడింది. అయితే నేను దాన్ని తీర్పుదినం కొరకు దాచిపెట్టాను. అంటే తీర్పు దినంనాడు నేను దు’ఆ చేస్తాను. అదేమిటంటే,

”ఓ అల్లాహ్‌(త) నా అనుచర సమాజాన్ని క్షమించు,” అని. అయితే ఈ నా దు’ఆ (సిఫారసు) ఇన్‌షా’ అల్లాహ్‌ తప్పకుండా స్వీకరించబడుతుంది. ఇది కేవలం నా అనుచర సమాజంలోని ఏనాడూ అల్లాహ్‌కు సాటి కల్పించకుండా మరణించిన ఏక దైవారాధకుల కొరకు మాత్రమే. (బు’ఖారీ, ముస్లిమ్‌)

2224 – [ 2 ] ( متفق عليه ) (2/691)

وَعَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “اَللّهُمَّ إِنِّيْ اتَّخَذْتُ عِنْدَكَ عَهْدًا لَنْ تُخْلِفَنِيْهِ فَإِنَّمَا أَنَا بَشَرٌفَأَيُّ الْمُؤْمِنِيْنَ آذَيْتُهُ شَتَمْتُهُ لَعَنْتُهُ جَلَدْتُّهُ فَاجْعَلْهَا لَهُ صَلَاةً وَّزَكَاةً وَقُرْبَةً تُقَرِّبُهُ بِهَا إِلَيْكَ يَوْمَ الْقِيَامَةِ”.

2224. (2) [2/691ఏకీభవితం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త ఇలా ప్రార్థిం చారు, ”ఓ అల్లాహ్‌(త)! నేను నీతో వినయ పూర్వ కంగా ఒక వాగ్దానం తీసుకుంటున్నాను. నీవు దానికి వ్యతిరేకంగా పాల్పడవని, దాన్ని తప్పకుండా స్వీక రిస్తావని గట్టినమ్మకం కలిగిఉన్నాను. ఆ విన్నపం ఏమిటంటే నేను నిమిత్త మాత్రుణ్ణి, మానవుణ్ణి. (నా వల్ల తప్పొప్పులు సాధ్యం). ఒకవేళ నేను విశ్వాసుల్లో ఎవరినైనా కష్టం కలిగించి ఉన్నా, చీవాట్లుపెట్టిఉన్నా, శాపనార్థాలు, ఎత్తిపొడిచిఉన్నా, కొట్టిఉన్నా, వీటన్ని టికీ అతని కొరకు కారుణ్య సాధనాలుగా మార్చివేయి. అతని పాపాలను క్షమించు. ఇంకా అతని ద్వారా తీర్పుదినం నాడు నా సాన్నిహిత్యానికి సాధనంగా చేయి.” (బు’ఖారీ, ముస్లిమ్‌)

అంటే నా ఈ బాహ్య చీవాట్లను అతని కోసం ప్రార్థినలుగా మార్చివేయి.

2225 – [ 3 ] ( صحيح ) (2/691)

وَعَنْهُ  قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِذَا دَعَا أَحَدُكُمْ فَلَا يَقُلْ: اَللّهُمَّ اغْفِرْ لِيْ إِنْ شِئْتَ ارْحَمْنِيْ إِنْ شِئْتَ ارْزُقْنِيْ إِنْ شِئْتَ وَ لْيَعْزِمْ مَسْأَلَتَهُ إِنَّهُ يَفْعَلُ مَا يَشَاءُ وَلَا مُكْرِهَ لَهُ”. رَوَاهُ الْبُخَارِيُّ

2225. (3) [2/691దృఢం]

అబూ హురైరహ్‌ (రకథనం: ప్రవక్త (స) ప్రవచనం, మీలో ఎవరైనా దు’ఆ చేస్తే, ‘ఓ అల్లాహ్‌(త)! నీవు కోరితే క్షమించు, నీవు కోరితే కరుణించు, నీవు కోరితే ఉపాధి ప్రసాదించు,’ అని ప్రార్థించకూడదు. దు’ఆ చేయడంలో పటిష్టత కనబరచాలి. ఎందుకంటే అల్లాహ్‌ (త) తానుకోరింది చేస్తాడు. అతన్ని ఎవరూ వత్తిడి, బలవంతం చేయలేరు. [1] (బు’ఖారీ)

2226 – [ 4 ] ( صحيح ) (2/691)

وَعَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِذَا دَعَا أَحَدُكُمْ فَلَا يَقُلْ: اَللّهُمَّ اغْفِرْ لِيْ إِنْ شِئْتَ وَلَكِنْ لِّيَعْزِمْ وَلْيُعُظِّمِ الرَّغْبَةَ فَإِنَّ اللهَ لَا يَتَعَاظَمُهُ شَيْءٌ أَعْطَاهُ” .رَوَاهُ مُسْلِمٌ .

2226. (4) [2/691దృఢం]

అబూహురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మీలో ఎవరైనా దు’ఆ చేస్తే, ”ఓ అల్లాహ్‌(త)! ఒకవేళ నీవు కోరితే క్షమించు” అని అనకూడదు. పూర్తి నమ్మకంతో దృఢ విశ్వాసంతో ఉత్సాహంతో శ్రద్ధా-భక్తులతో దు’ఆ చేయాలి. ఎందుకంటే అల్లాహ్‌ (త) ఇవ్వదలచుకున్నది తప్పకుండా ఇస్తాడు. అల్లాహ్‌ వద్ద ఏ వస్తువూ కష్టంగానీ, అసాధ్యంగానీ లేదు. అందువల్ల, ఒకవేళ,అని దు చేయకూడదు. (ముస్లిమ్‌)

2227 – [ 5 ] ( صحيح ) (2/692)

وَعَنْهُ  قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “يُسْتَجَابُ لِلْعَبْدِ مَا لَمْ يَدْعُ بِإِثْمٍ أَوْ قَطِيْعَةِ رَحِمٍ مَا لَمْ يَسْتَعْجِلْ”. قِيْلَ:يَا رَسُوْلَ اللهِ مَا الْاِسْتِعْجَالُ؟ قَالَ: “يَقُوْلُ: وَقَدْ دَعَوْتُ فَلَمْ أَرَ يُسْتَجَابُ لِيْ فَيَسْتَحْسِرُ عِنْدَ ذَلِكَ وَيَدَعُ الدُّعَاءَ”. رَوَاهُ مُسْلِمٌ  .

2227. (5) [2/692దృఢం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ”దాసుని ప్రార్థన స్వీకరించబడుతుంది. అయితే పాపకార్యానికి, సంబంధాలను త్రెంచటానికి, హక్కులను కొల్లగొట్ట టానికి దు’ఆ చేయకూడదు, అదేవిధంగా, ‘తొందర పడకూడదు కూడా,’ అని అన్నారు. ‘తొందరంటే ఏమిటని’ ప్రజలు విన్నవించుకున్నారు. అప్పుడు ప్రవక్త (స) నేను దు’ఆ చేసాను, కాని స్వీకరించబడి నట్లు కనబడలేదు అని పలికి దు’ఆ చేసి అలసి పోతాడు, దు’ఆ చేయడం మానివేస్తాడు అని అన్నారు. [2]  (ముస్లిమ్‌)

2228 – [ 6 ] ( صحيح ) (2/692)

وَعَنْ أَبِيْ الدَّرْدَاءِ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: ” دَعْوَةُ الْمُسْلِمِ لِأَخِيْهِ بِظَهْرِ الْغَيْبِ مُسْتَجَابَةٌ عِنْدَ رَأْسِهِ مَلَكٌ مُوَكَّلٌ كُلَّمَا دَعَا لِأَخِيْهِ بِخَيْرٍ. قَالَ الْمَلَكُ الْمُوَكَّلُ بِهِ: آمِيْنَ وَلَكَ بِمِثْلٍ. رَوَاهُ مُسْلِمٌ .

2228. (6) [2/692దృఢం]

అబూ దర్దా’ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఒక ముస్లిమ్‌ తన సోదరుని కోసం పరోక్షంగా ప్రార్థిస్తే, ఆ ప్రార్థన స్వీకరించబడుతుంది. అతని తల దగ్గర ఒక దూత నియమించబడి ఉంటాడు. ఆ వ్యక్తి తన సోదరుని గురించి ప్రార్థించినప్పుడల్లా ఆ నియమిత దూత ఆమీన్‌! నీకు కూడా అలాగే జరుగుగాక అని దీవిస్తూ ఉంటాడు. [3] (ముస్లిమ్‌)

2229 – [ 7 ] ( صحيح ) (2/692)

وَعَنْ جَابِرٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَا تَدْعُوْا عَلَى أَنْفُسِكُمْ وَلَا تَدْعُوْا عَلَى أَوْلَادِكُمْ لَا تُوَافِقُوْا مِنَ اللهِ سَاعَةً يُسْأَلُ فِيْهَا عَطَاءً فَيَسْتَجِيْبُ لَكُمْ”. رَوَاهُ مُسْلِمٌ.

وَذَكَرَ حَدِيْثُ ابْنُ عَبَّاسٍ: “اِتَّقِ دَعْوَةَ الْمَظْلُوْمِ”. فِيْ كِتَابِ الزَّكَاةِ.

2229. (7) [2/692దృఢం]

జాబిర్‌ (ర) ఉల్లేఖనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మిమ్మల్ని మీరు శపించుకోకండి. మీ సంతానాన్ని శపించకండి. మీ సేవకులకు, పని మనుషులకూ  శాపనార్థాలు పెట్టకండి. ఎందుకంటే ప్రార్థనలు స్వీకరించబడేవేళల్లో మీరు అలా శాపనార్థాలు పెడితే, మీ శాపం కూడా స్వీకరించబడుతుంది.  దానివల్ల మీకే నష్టం కలుగుతుంది. [4] (ముస్లిమ్‌)

ఇబ్నె ‘అబ్బాస్‌ యొక్క ఈ ‘హదీసు’ కితాబు ‘జ్జకాత్‌లో పేర్కొనడం జరిగింది. ”ఇత్తఖి ద’అవతుల్‌ మ”జ్‌లూమ్” బాధితుని ఆర్తనాదానికి దూరంగా ఉండండి.

—–

اَلْفَصْلُ الثَّانِيْ  రెండవ విభాగం 

2230 – [ 8 ] ( لم تتم دراسته ) (2/692)

عَنِ النُّعْمَانِ بْنِ بَشِيْرٍ قَال: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “اَلدُّعَاءُ هُوَ الْعِبَادَةُ”. ثُمَّ قَرَأَ: (وَقَالَ رَبُّكُمُ: ادْعُوْنِيْ أَسْتَجِبْ لَكُمْ، 40: 60) رَوَاهُ أَحْمَدُ وَالتِّرْمِذِيُّ وَأَبُوْ دَاوُدَ وَالنَّسَائِيُّ وَابْنُ مَاجَهُ .

2230. (8) [2/692అపరిశోధితం]

ను’అమాన్‌ బిన్‌ బషీర్‌ (ర) కథనం: ప్రవక్త (స) దు’ఆయే ఆరాధన అని పలికి, ఆ తరువాత ఈ ఆయత్ పఠించారు. ”మీ ప్రభువు ఇలా అన్నాడు, నన్ను ప్రార్థించండి, నేను మీ ప్రార్థనలను  అంగీక రిస్తాను…” (‘గాఫిర్, 40:60).(తిర్మిజి’, అ’హ్మద్‌, అబూ దావూద్‌, నసాయి’, ఇబ్నె మాజహ్)

2231 – [ 9 ] ( ضعيف ) (2/693)

وَعَنْ أَنَسٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “الدُّعَاءُ مُخُّ الْعِبَادَةِ”. رَوَاهُ التِّرْمِذِيُّ  .

2231. (9) [2/693బలహీనం]

అనస్‌ (ర) ఉల్లేఖనం: ప్రవక్త (స) ప్రవచనం, దు’ఆ, (ప్రార్థన) ఆరాధన యొక్క సారం (గుజ్జు). (తిర్మిజి’)

2232 – [ 10 ] ( لم تتم دراسته ) (2/693)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَيْسَ شَيْءٌ أَكْرَمَ عَلَى اللهِ مِنَ الدُّعَاءِ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَابْنُ مَاجَهُ. و قال التِّرْمِذِيُّ هذا حديث حسن غريب.

2232. (10) [2/693అపరిశోధితం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”అల్లాహ్‌ వద్ద దు’ఆ కంటే ప్రియమైనది మరేదీ లేదు. ఆరాధన, దైవస్మరణల్లో దు’ఆ కంటే గొప్పది ఏదీ లేదు. (తిర్మిజి’ – ప్రామాణికం, ఏకోల్లేఖనం, ఇబ్నె మాజహ్)

2233 – [ 11 ] ( لم تتم دراسته ) (2/693)

وَعَنْ سَلْمَانَ الْفَارِسِيِّ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَا يَرُدُّ الْقَضَاءَ إِلَّا الدُّعَاءُ وَلَا يَزِيْدُ فِيْ الْعُمُرِإِلَّا البِّرُّ”. رَوَاهُ التِّرْمِذِيُّ.  

2233. (11) [2/693అపరిశోధితం]

సల్మాన్‌ ఫారసీ (ర)కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”విధి వ్రాతను దు’ఆ తప్ప మరేదీ మార్చలేదు. ఆయుష్షును పుణ్యం తప్ప మరేదీ పెంచలేదు. [5] (తిర్మిజి’)

2234 – [ 12 ] ( لم تتم دراسته ) (2/693)

وَعَنِ ابْنِ عُمَرَ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِنَّ الدُّعَاءَ يَنْفَعُ مِمَّا نَزَلَ وَمِمَّا لَمْ يَنْزِلْ فَعَلَيْكُمْ عِبَادَ اللهِ بِالدُّعَاءِ”. رَوَاهُ التِّرْمِذِيُّ  .

2234. (12) [2/693అపరిశోధితం]

ఇబ్నె ‘ఉమర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”దు’ఆ అవతరించిన ఆపదకూ పనిచేస్తుంది. ఇంకా అవతరించని ఆపదకూ పనిచేస్తుంది. ఓ అల్లాహ్‌ దాసులారా! దు’ఆను తమపై తప్పనిసరి చేసుకోండి. ఎల్లప్పుడూ దు’ఆ చేస్తూ ఉండండి. (తిర్మిజి’)

2235 – [ 13 ] ( لم تتم دراسته ) (2/693)

وَرَوَاهُ أَحْمَدُ عَنْ مُعَاذِ بْنِ جَبَلٍ. وَقَالَ التِّرْمِذِيُّ هَذَا حَدِيْثٌ غَرِيْبٌ.

2235. (13) [2/693అపరిశోధితం]

ఈ ‘హదీసు’ను అ’హ్మద్ కూడా ము’ఆజ్’ బిన్ జబల్ (ర) ద్వారా ఉల్లేఖించారు. (తిర్మిజి’ -ఏకోల్లేఖనం)

2236 – [ 14 ] ( لم تتم دراسته ) (2/693)

وَعَنْ جَابِرٍ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَا مِنْ أَحَدٍ يَدْعُوْ بِدُعَاءٍ إِلَّا آتَاهُ اللهُ مَا سَأَلَ أَوْ كَفَّ عَنْهُ مِنَ السُّوْءِ مِثْلَهُ مَا لَمْ يَدْعُ بِإِثْمٍ أَوْ قَطِيْعَةِ رَحِمٍ”. رَوَاهُ التِّرْمِذِيُّ.

2236. (14) [2/693అపరిశోధితం]

జాబిర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఎవరైనా అల్లాహ్‌(త)ను (ప్రార్థిస్తే) దు’ఆ చేస్తే, అల్లాహ్‌ (త) అతడు అడిగింది ఇచ్చివేస్తాడు. లేదా అతనిపై రానున్న ఆపదను ఆ దు’ఆ ద్వారా తొలగించి వేస్తాడు. అతడు పాపకార్యానికి లేదా బంధుత్వాన్ని త్రెంచటానికి దు’ఆ చేయనంత వరకు. (తిర్మిజి’)

2237 – [ 15 ] ( لم تتم دراسته ) (2/693)

وَعَنِ ابْنِ مَسْعُوْدٍ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “سَلُوا اللهَ مِنْ فَضْلِهِ فَإِنَّ اللهَ يُحِبُّ أَنْ يُّسْأَلَ وَأَفْضَلُ الْعِبَادَةِ انْتِظَارُ الْفَرَجِ”. رَوَاهُ التِّرْمِذِيُّ. وَقَالَ هَذَا حَدِيْثٌ غَرِيْبٌ.  

2237. (15) [2/693అపరిశోధితం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ మస్‌’ఊద్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మీరు అల్లాహ్‌(త)ను ఆయన అను గ్రహాన్ని అర్థించండి. ఎందుకంటే, అల్లాహ్‌ (త) అడిగే వారిని, అర్థించేవారిని ప్రేమిస్తాడు. అన్నిటికంటే గొప్ప ఆరాధన ఏమిటంటే విస్తృతి (మంచిస్థితి) కొరకు వేచి ఉండటం. అంటే కష్టాలు, దుఃఖాలు తొలగించడం కేవలం అల్లాహ్‌ (త) బాధ్యతే అని, ఆయన తప్ప ఇతరులెవ్వరూ దూరం చేయలేరని గట్టి నమ్మకం. విశ్వాసం కలిగి ఉండాలి. కష్టాలు, ఆపదలు వస్తే సహనం పాటించాలి. ఫలితంగా కష్టాలు దూర మవుతాయి, విస్తృతి (మంచి స్థితి) సుఖసంతోషాలు లభిస్తాయి. (తిర్మిజి’ – ఏకోల్లేఖనం)

2238 – [ 16 ] ( لم تتم دراسته ) (2/694)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَنْ لَّمْ يَسْأَلِ اللهَ يَغْضَبْ عَلَيْهِ”. رَوَاهُ التِّرْمِذِيُّ .

2238. (16) [2/694అపరిశోధితం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, అల్లాహ్‌(త)ను అర్థించనివాని పట్ల అల్లాహ్‌ (త) ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. [6] (తిర్మిజి’)

2239 – [ 17 ] ( لم تتم دراسته ) (2/694)

وَعَنِ ابْنِ عُمَرَرَضِيَ اللهُ عَنْهُمَا قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه و سلم: “مَنْ فُتِحَ لَهُ مِنْكُمْ بَابُ الدُّعَاءِ فُتِحَتْ لَهُ أَبْوَابُ الرَّحْمَةِ وَمَا سُئِلَ اللهُ شَيْئًا يَعْنِيْ أَحَبَّ إِلَيْهِ مِنْ أَنْ يُّسْأَلَ الْعَافِيَةَ” رَوَاهُ التِّرْمِذِيُّ.

2239. (17) [2/694అపరిశోధితం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘ఉమర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మీలో ఎవరి కోసం దు’ఆ ద్వారాలు తెరువబడి ఉన్నాయో, అతని కోసం కారుణ్య ద్వారాలు తెరువబడి ఉన్నాయి. అయితే అల్లాహ్‌ (త) ను అర్థించటానికి క్షేమం, ఆరోగ్యం కంటే గొప్ప విషయాలు ఏవీ లేవు.” [7] (తిర్మిజి’)

2240 – [ 18 ] ( لم تتم دراسته ) (2/694)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَنْ سَرَّهُ أَنْ يَّسْتَجِيْبَ اللهُ لَهُ عِنْدَ الشَّدَائِدِ فَلْيُكْثِرِ الدُّعَاءَ فِيْ الرَّخَاءِ” .روَاهُ التِّرْمِذِيُّ وَقَالَ: هَذَا حَدِيْثٌ غَرِيْبٌ.

2240. (18) [2/694అపరిశోధితం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”కష్టాల్లో, ఆపదల్లో, కష్టసమయాల్లో తాము చేసిన దు’ఆలు అల్లాహ్ (త)  స్వీకరించాలని కోరుకునే వారు, సుఖసంతో షాల్లో కూడా అత్యధికంగా దు’ఆలు చేస్తూ ఉండాలి. [8]  (తిర్మిజి’ – ఏకోల్లేఖనం)

2241 – [ 19 ] ( لم تتم دراسته ) (2/694)

وَعَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “اُدْعُوا اللهَ وَأَنْتُمْ مُوْقِنُوْنَ بِالْإِجَابَةِ وَاعْلَمُوْا أَنَّ اللهَ لَا يَسْتَجِيْبُ دُعَاءً مِنْ قَلْبٍ غَافِلٍ لَاهٍ”. رَوَاهُ التِّرْمِذِيُّ. وَقَالَ: هَذَا حَدِيْثٌ غَرِيْبٌ.

2241. (19) [2/694అపరిశోధితం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మీరు అల్లాహ్‌ను వేడుకోండి (దు’ఆ చేయండి). మీ దు’ఆ తప్పకుండా స్వీకరించబడుతుందని గట్టి నమ్మకం కలిగి ఉండండి. శ్రద్ధాసక్తులతో దు’ఆ చేయండి. ఎందుకంటే అల్లాహ్‌ (త) శ్రద్ధాసక్తులు లేని దు’ఆలను స్వీకరించడు.” (తిర్మిజి’ – ఏకోల్లేఖనం)

2242 – [ 20 ] ( لم تتم دراسته ) (2/694)

وَعَنْ مَالِكِ بْنِ يَسَارٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِذَا سَأَلْتُمُ اللهَ فَاسْأَلُوْهُ بِبُطُوْنِ أَكُفِّكُمْ وَلَا تَسْأَلُوْهُ بِظُهُوْرِهَا”.

2242. (20) [2/694అపరిశోధితం]

మాలిక్‌ బిన్‌ యసార్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవ చనం, ”మీరు అల్లాహ్‌ను అర్థించినపుడు, దు’ఆ చేసి నపుడు అరచేతుల లోపలి భాగాలద్వారా అర్థించండి, అరచేతుల వెనుక భాగాల ద్వారా అర్ధించకండి.

2243 – [ 21 ] ( لم تتم دراسته ) (2/694)

وَفِيْ رِوَايَةِ ابْنِ عَبَّاسٍ قَالَ: “سَلُوا اللهَ بِبُطُوْنِ أَكُفِّكُمْ وَلَا تَسْأَلُوْهُ بِظُهُوْرِهَا فَإِذَا فَرَغْتُمْ فَامْسَحُوْا بِهَا وُجُوْهَكُمْ” رَوَاهُ دَاوُدَ

2243. (21) [2/694అపరిశోధితం]

ఇబ్నె ‘అబ్బాస్‌ (ర) ఉల్లేఖనలో ఇలా ఉంది, ”ప్రవక్త (స) మీరు మీ అరచేతుల లోపలి భాగాల ద్వారా అర్థించండి, అరచేతుల వెనుక భాగాల ద్వారా అర్థించకండి. దు’ఆ చేయటం పూర్తయిన తర్వాత, రెండు అరచేతులతో ముఖాన్ని తుడుచుకోండి అని ఉపదేశించారు. [9] (అబూ దావూద్‌)

2244 – [ 22 ] ( لم تتم دراسته ) (2/694)

وَعَنْ سَلْمَانَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِنَّ رَبَّكُمْ حَيٌّ كَرِيْمٌ يَسْتَحْيِي مِنْ عَبْدِهِ إِذَا رَفَعَ يَدَيْهِ إِلَيْهِ أَنْ يَّرُدَّهُمَا صَفِرًا”. رَوَاهُ التِّرْمِذِيُّ وَأَبُوْ دَاوُدَ وَالْبَيْهِقِيُّ فِيْ الدَّعْوَاتِ الْكَبِيْرِ.

2244. (22) [2/694అపరిశోధితం]

సల్మాన్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మీ ప్రభువు చాలా సిగ్గుగలవాడు మరియు గొప్ప వాడూను. దాసుడు ఆయన్ను చేతులెత్తి దు’ఆ చేస్తే, ఆ దాసుడ్ని వట్టి చేతులతో త్రిప్పి పంపడానికి అల్లాహ్‌ (త) సిగ్గుపడతాడు. [10] (తిర్మిజి’, అబూ దావూద్‌, బైహఖీ / ద’అవాతుల్ కబీర్)

2245 – [ 23 ] ( لم تتم دراسته ) (2/695)

وَعَنْ عُمَرَ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: كَانَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم إِذَا رَفَعَ يَدَيْهِ فِيْ الدُّعَاءِ لَمْ يَحُطَّهُمَا حَتَّى يَمْسَحَ بِهِمَا وَجْهَهُ. رَوَاهُ التِّرْمِذِيُّ.

2245. (23) [2/695అపరిశోధితం]

‘ఉమర్‌ (ర) కథనం: ప్రవక్త (స) దు’ఆలో రెండు చేతులను ఎత్తేవారు. చేతులతో ముఖాన్ని తుడుచుకునే వరకు క్రిందకు వదిలేవారు కారు. (తిర్మిజి’)

2246 – [ 24 ] ( لم تتم دراسته ) (2/695)

وَعَنْ عَائِشَةَ رَضِيَ اللهُ عَنْهَا قَالَتْ: كَانَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم يَسْتَحِبُّ الْجَوَامِعَ مِنَ الدُّعَاءِ وَيَدَعُ مَا سِوَى ذَلِكَ. رَوَاهُ أَبُوْ دَاوُدَ.

2246. (24) [2/695అపరిశోధితం]  

‘ఆయి’షహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) జామె’ దు’ఆల ద్వారా దు’ఆ చేసేవారు. జామె’ కాని దు’ఆలను వదలివేసే వారు. [11] (అబూ దావూద్‌)

2247 – [ 25 ] ( لم تتم دراسته ) (2/695)

وَعَنْ عَبْدِ اللهِ بْنِ عَمَرٍو قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِنَّ أَسْرَعَ الدُّعَاءِ إِجَابَةً دَعْوَةُ غَائِبٍ لِغَائِبِ” .رَوَاهُ التِّرْمِذِيُّ وَأَبُوْ دَاوُدَ.

2247. (25) [2/695అపరిశోధితం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘అమ్ర్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఒక వ్యక్తి మరో వ్యక్తిని గురించి చేసే దు’ఆ చాలా త్వరగా స్వీకరించబడుతుంది. (తిర్మిజి’, అబూ దావూద్‌)

ఎందుకంటే ఇటువంటి సందర్భంలో చిత్తశుద్ధితో దు’ఆ చేయబడుతుంది.

2248 – [ 26 ] ( ضعيف ) (2/695)

وَعَنْ عُمَرَ بْنِ الْخَطَّابِ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: اسْتَأْذَنْتُ النَّبِيَّ صلى الله عليه وسلم فِيْ الْعُمْرَةِ فَأَذِنَ لِيْ وَقَالَ: “أَشْرِكْنَا يَا أُخَيَّ فِيْ دُعَائِكَ وَ لَا تَنْسَنَا”. فَقَالَ كَلَمِةً مَا يَسُرُّنِيْ أَنْ لِيْ بِهَا الدُّنْيَا. رَوَاهُ أَبُوْ دَاوُدَ وَالتِّرْمِذِيُّ. وَانْتَهَتْ رِوَايَتُهُ عِنْدَ قَوْلِهِ “ولَا تَنْسَنَا”.

2248. (26) [2/695బలహీనం]

‘ఉమర్‌ (ర) కథనం: నేను ప్రవక్త (స)ను ‘ఉమరహ్‌ కొరకు అనుమతి కోరాను. అతను (స) నాకు అను మతి ఇచ్చారు. ఆ తర్మాత, ”ఓ నా సోదరా! నీ దు’ఆల్లో మమ్మల్ని చేర్చుకో. మమ్మల్ని మరచి పోకు,” అని అన్నారు. ‘ఉమర్‌ (ర) అన్నారు, ”ప్రవక్త (స) నాకు ఎటువంటి మాట అన్నారంటే, ఒకవేళ ప్రాపంచిక సంపదలన్నీ నాకు లభించినా, నాకు అంత సంతోషం కలుగదు. ప్రవక్త (స) గారి ఈ మాట వల్ల నాకు చాలా సంతోషం కలిగింది.” [12] (అబూ దావూద్‌, తిర్మిజి’)

2249 – [ 27 ] ( ضعيف ) (2/695)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “ثَلَاثَةٌ لَا تُرَدُّ دَعْوَتُهُمْ: الصَّائِمُ حِيْنَ يُفْطِرُ وَالْإِمَامُ الْعَادِلُ وَدَعْوَةُ الْمَظْلُوْمِ يَرْفَعُهَا اللهُ فَوْقَ الْغَمَامِ وَتُفْتَحُ لَهَا أَبْوَابُ السَّمَاءِ وَيَقُوْلُ الرَّبُّ: وَعِزَّتِيْ لَأَنْصُرَنَّكَ وَلَوْ بَعْدَ حِيْنٍ”.  رَوَاهُ التِّرْمِذِيُّ.

2249. (27) [2/695బలహీనం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ముగ్గురు వ్యక్తుల దు’ఆ రద్దు కాదు, వారి దు’ఆ ఫలిస్తుంది. ఉపవాసకుడు ఉపవాసం విరమించే టప్పటి దు’ఆ. న్యాయపాలకుని దు’ఆ, బాధితుని దు’ఆ. అల్లాహ్‌ (త) బాధితుని దు’ఆను మేఘాలపై ఎత్తుకుంటాడు. దాని కోసం ఆకాశ ద్వారాలు తెరవ బడతాయి. అల్లాహ్‌ (త) ఇలా అంటాడు: ”నేను నా గౌరవం సాక్షిగా చెబుతున్నాను. ఓ బాధితుడా! నేను నీకు తప్పకుండా సహాయం చేస్తాను. కొంత ఆలస్యం అయినా సరే. (తిర్మిజి’)

2250 – [ 28 ] ( لم تتم دراسته ) (2/695)

وَعَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “ثَلَاثُ دَعْوَاتٍ مُسْتَجَابَاتٌ لَا شَكَّ فِيْهِنَّ: دَعْوَةُ الْوَالِدِ وَدَعْوَةُ الْمُسَافِرِ وَدَعْوَةُ الْمَظْلُوْمِ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَأَبُوْ دَاوُدَ وَابْنُ مَاجَهُ.

2250. (28) [2/695అపరిశోధితం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ముగ్గురు వ్యక్తుల దు’ఆ తప్పకుండా స్వీకరించబడు తుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. 1. తండ్రి తన సంతానం కోసం చేసే దు’ఆ. 2. ప్రయాణికుని దు’ఆ. 3. బాధితుని దు’ఆ. (తిర్మిజి’, అబూ దావూద్‌, ఇబ్నె మాజహ్)

—–

اَلْفَصْلُ الثَّالِثُ  మూడవ విభాగం 

2251 – [ 29 ] ( حسن ) (2/696)

عَنْ أَنَسٍ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لِيَسْأَلْ أَحَدُكُمْ رَبَّهُ حَاجَتَهُ كُلَّهَا حَتَّى يَسْأَلَهُ شَسْعَ نَعْلِهِ إِذَا انْقَطَعَ”.

2251. (29) [2/696ప్రామాణికం]

అనస్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మీరు మీ అవసరాలన్నిటికీ అల్లాహ్‌(త)నే అర్థించండి. చివరికి చెప్పు వారు తెగిపోయినా సరే అల్లాహ్‌ (త)నే అర్థించాలి. (తిర్మిజి’)

అంటే ఎటువంటి వస్తువు గురించైనా అల్లాహ్‌(త)నే అర్థించాలి.

2252 – [ 30 ] ( حسن ) (2/696)

زَادَ فِيْ رِوَايَةٍ عَنْ ثَابِتِ الْبُنَانِيِّ مُرْسَلًا “حَتَّى يَسْأَلُهُ الْمِلْحَ وحَتَّى يَسْأَلَهُ شِسْعَهُ إِذَا انْقَطَعَ”.  رَوَاهُ التِّرْمِذِيُّ .

2252. (30) [2/696ప్రామాణికం]

తిర్మిజి’ లోని, సా’బిత్ బునాని కథనంలో, ఈ క్రింది వాక్యం అధికంగా ఉంది, చివరికి ఉప్పు అయిపోయినా, చెప్పుల పట్టీ తెగిపోయినా అల్లాహ్ (త)నే అర్ధించాలి.[13]

2253 – [ 31 ] ( لم تتم دراسته ) (2/696)

وَعَنْ أَنَسٍ قَالَ: كَانَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم يَرْفَعُ يَدَيْهِ فِيْ الدُّعَاءِ حَتَّى يُرَى بَيَاضُ إِبْطِيْهِ.

2253. (31) [2/696అపరిశోధితం]

అనస్‌ (ర) కథనం: ప్రవక్త (స) దు’ఆలో తన రెండు చేతులను ఎంతపైకి ఎత్తేవారంటే, అతని (స) చంకల్లోని తెలుపుదనం కనపడేది. (బైహఖీ)

2254 – [ 32 ] ( لم تتم دراسته ) (2/696)

وعَنْ سَهْلِ بْنِ سَعْدٍ عَنِ النَّبِيٍّ صلى الله عليه وسلم قَالَ: كَانَ يَجْعُلُ أَصْبَعَيْهِ حِذَاءَ مَنْكِبَيْهِ وَيَدْعُوْ.

2254. (32) [2/696అపరిశోధితం]

సహల్‌ బిన్‌ స’అద్‌ (ర) కథనం: ప్రవక్త (స) తన రెండు చేతుల వ్రేళ్ళను రెండు భుజాలకు సమానంగా ఎత్తి దు’ఆ చేసేవారు. [14] (బైహఖీ)

2255 – [ 33 ] ( ضعيف ) (2/696)

وَعَنِ السَّائِبِ بْنِ يَزِيْدٍ عَنْ أَبِيْهِ أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم كَانَ إِذَا دَعَا فَرَفَعَ يَدَيْهِ مَسَحَ وَجْهَهُ بِيَدَيْهِ رَوَى الْبَيْهَقِيُّ الْأَحَادِيْثَ الثَّلَاثَةَ فِيْ ” الدَّعْوَاتِ الْكَبِيْرِ”.

2255. (33) [2/696బలహీనం]

తన తండ్రి ద్వారా, సాయి’బ్‌ బిన్‌ య’జీద్‌ (ర) కథ నం: ప్రవక్త (స) దు’ఆ చేసినపుడు తన రెండు చేతులను ఎత్తేవారు, దు’ఆ తర్వాత రెండు చేతులతో ముఖాన్ని తుడుచుకునేవారు. (బైహఖీ-ద’అవాతిల్ కబీర్)

2256 – [ 34 ] ( لم تتم دراسته ) (2/696)

وَعَنْ عِكْرِمَةَ عَنِ ابْنِ عَبَّاسٍ رَضِيَ اللهُ عَنْهُمَا قَالَ: اَلْمَسْأَلَةُ أَنْ تَرْفَعَ يَدَيْكَ حَذْوَ مَنْكِبَيْكَ أَوْ نَحْوَهُمَا وَالْاِسْتِغَفَارُ أَنْ تُشِيْرَ بِأَصْبَعٍ وَّاحِدَةٍ وَالْاِبْتِهَالُ أَنْ تَمُدَّ يَدَيْكَ جَمِيْعًا.

 وَفِيْ رِوَايَةٍ قَالَ: وَالْاِبْتِهَالُ هَكَذَا وَرَفَعَ يَدَيْهِ وَجَعَلَ ظُهُوْرَهُمَا مِمَّا يَلِيْ وَجْهَهُ. رَوَاهُ أَبُوْ دَاوُدَ.

2256. (34) [2/696అపరిశోధితం]

ఇబ్నె ‘అబ్బాస్‌ (ర) ద్వారా ‘ఇక్రమ కథనం: ఇబ్నె ‘అబ్బాస్‌ (ర) ఇలా అన్నారు, ”అర్థించే, దు’ఆ చేసే పద్ధతి ఏమిటంటే, మీరు మీ రెండు చేతులను మీ రెండు భుజాల వరకు లేదా దగ్గరగా ఎత్తండి. మరియు ఇస్తి’గ్‌ఫార్‌ పద్ధతి ఏమిటంటే మీరు మీ చేతివేలుతో సైగ చేయండి, మరియు దు’ఆలో అణకువ వినయ వినమ్రతల పద్ధతి ఏమిటంటే, మీరు మీ రెండు చేతులను చాపండి. మరో ఉల్లేఖనంలో ఇబ్నె ‘అబ్బాస్‌ ఇలా అన్నారు: ”అణకువ పద్ధతి ఏమిటంటే, ‘ఇలా’ అని ఇబ్నె అబ్బాస్‌ తన రెండుచేతులను ఎత్తారు. చేతుల వెనుక భాగాన్ని ముఖం వైపు చేసారు. ” [15] (అబూ దావూద్‌)

2257 – [ 35 ] ( لم تتم دراسته ) (2/697)

وَعَنِ ابْنِ عُمَرَ أَنَّهُ يَقُوْلُ: إِنَّ رَفْعَكُمْ أَيْدِيَكُمْ بِدْعَةٌ مَا زَادَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم عَلَى هَذَا يَعْنِيْ إِلَى الصَّدْرِ رَوَاهُ أَحْمَدُ.

2257. (35) [2/697అపరిశోధితం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘ఉమర్‌ (ర) కథనం: అతను (స) ఇలా అనేవారు, ”మీరు దు’ఆలో రెండు చేతులను చాలా ఎక్కువగా ఎత్తటం బిద్‌’అత్ (కల్పితం) వంటిది. ప్రవక్త (స) రొమ్ముకంటే ఎత్తుగా చేతులను ఎత్తలేదు. [16] (అ’హ్మద్‌)

2258 – [ 36 ] ( لم تتم دراسته ) (2/697)

وَعَنْ أُبَيِّ بْنِ كَعْبٍ قَالَ: كَانَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم إِذَا ذَكَرَ أَحَدًا فَدَعَا لَهُ بَدَأَ بِنَفْسِهِ. رَوَاهُ التِّرْمِذِيُّ وَقَالَ هَذَا حَدِيْثٌ حَسَنٌ غَرِيْبٌ صَحِيْحٌ .

2258. (36) [2/697అపరిశోధితం]

ఉబయ్‌ బిన్‌ క’అబ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ఇతరులను గురించి ప్రస్తావించి, అతని కోసం దు’ఆ చేయదలచుకున్నప్పుడు, అన్నిటికంటేముందు తన కోసం దు’ఆ చేస్తారు, తరువాత ఇతరుల కోసం దు’ఆ చేస్తారు. [17] (తిర్మిజి’ – ప్రామాణికం –  ఏకోల్లేఖనం-  దృఢం)

2259 – [ 37 ] ( لم تتم دراسته ) (2/697)

وَعَنْ أَبِيْ سَعِيْدِ الْخُدْرِيِّ أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم قَالَ: “مَا مِنْ مُسْلِمٍ يَدْعُوْ بِدَعْوَةٍ لَيْسَ فِيْهَا إِثْمٌ وَلَا قَطِيْعَةُ رَحِمٍ إِلَّا أَعْطَاهُ اللهُ بِهَا إِحْدَى ثَلَاثٍ: إِمَّا أَنْ يُّعَجِّلَ لَهُ دَعْوَتَهُ وَإِمَّا أَنْ يَّدَّخِرَهَا لَهُ فِيْ الْآخِرَةِ وَإِمَّا أَنْ يَصْرِفَ عَنْهُ مِنَ السُّوْءِ مِثْلَهَا”. قَالُوْا: إِذًا نُكْثِرُقَالَ: “اللهُ أَكْثَرُ”. رَوَاهُ أَحْمَدُ.

2259. (37) [2/697అపరిశోధితం]

అబూ స’యీద్‌ ‘ఖుద్రీ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ఒక ముస్లిమ్‌ పాపకార్యానికి గానీ, బంధు త్వాన్ని త్రెంచటానికిగానీ కాకుండా దు’ఆ చేస్తే అల్లాహ్‌ (త) మూడు విషయాల్లో ఒకటి తప్పకుండా ఇస్తాడు. అతని దు’ఆను వెంటనే స్వీకరిస్తాడు. లేదా అతని దు’ఆను తీర్పుదినానికి మిగిల్చి ఉంచుతాడు. లేదా దాని ద్వారా దానికి సరిసమానమైన ఆపదను తొలగిస్తాడు. అప్పుడు అనుచరులు, ‘అప్పుడైతే మేము అత్యధికంగా లాభం పొందటానికి అత్యధికంగా దు’ఆ చేస్తాం,’ అని అన్నారు. అప్పుడు ప్రవక్త (స), ‘అల్లాహ్‌ (త) అత్యంత అనుగ్రహం గలవాడు’ అని అన్నారు. (అ’హ్మద్‌)

2260 – [ 38 ] ( لم تتم دراسته ) (2/697)

وَعَنِ ابْنِ عَبَّاسٍ رَضِيَ اللهُ عَنْهُمَا عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ: “خَمْسُ دَعْوَاتٍ يُّسْتَجَابُ لَهُنَّ: دَعْوَةُ الْمَظْلُوْمِ حَتَّى يَنْتَصِرَ وَدَعْوَةُ الْحَاجِّ حَتَّى يَصْدُرَ وَدَعْوَةُ الْمُجَاهِدِ حَتَّى يَقْعُدَ وَدَعْوَةُ الْمَرِيْضِ حَتَّى يَبْرَأَ وَدَعْوَةُ الْأَخِ لِأَخِيْهِ بِظَهْرِ الْغَيْبِ”. ثُمَّ قَالَ: “وَأَسْرَعَ هَذِه الدَّعْوَاتِ إِجَابَةً دَعْوَةُ الْأَخِ لِأَخِيْهِ بِظَهْرِ الْغَيْبِ”. رَوَاهُ الْبَيْهِقِيُّ فِيْ الدَّعْوَاتِ الْكَبِيْرِ .

2260. (38) [2/697అపరిశోధితం]

ఇబ్నె ‘అబ్బాస్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఐదుగురు వ్యక్తుల దు’ఆలు స్వీకరించబడతాయి: 1. బాధితుని దు’ఆ – అత్యాచారితో ప్రతీకారం తీర్చు కునేవరకు, 2. ‘హాజీ దు’ఆ – హజ్‌ నుండి తిరిగి వచ్చే వరకు, 3. ముజాహిద్‌ దు’ఆ- జిహాద్‌ ముగిసేరకు, 4. వ్యాధి గ్రస్తుని దు’ఆ – ఆరోగ్యం పొందేవరకు, 5. ఒక ముస్లిమ్‌ పరోక్షంగా మరొక ముస్లిమ్‌ సోదరుని కొరకు చేసే దు’ఆ. ఆ తరువాత ప్రవక్త(స) ఈ దు’ఆ లన్నిటిలో ఒక ముస్లిమ్‌ మరోముస్లిమ్‌ కొరకు పరో క్షంగా చేసే దు’ఆయే అన్నిటికంటే ముందు స్వీకరించ బడుతుంది. (బైహఖీ-ద’అవాతిల్ కబీర్)

—–

1بَابُ ذِكْرِ اللهِ عَزَّ وَجَلَّ وَالتَّقَرُّبِ إِلَيْهِ

1. అల్లాహ్() స్మరణ, ఆయన సాన్నిహిత్యం

అల్లాహ్ స్మరణ (అల్లాహ్ ను గుర్తుచేసుకోవటం) అంటే అల్లాహ్‌ (త) ను గుర్తుచేసుకుంటే ఏం లభిస్తుంది? ఎంత పుణ్యం లభిస్తుంది. అల్లాహ్ స్మరణ ఆరాధనలన్నిటి సారాంశమన్న విషయం అందరికీ తెలిసిందే. నమా’జ్‌, రో’జహ్, ‘హజ్జ్, ‘జకాత్‌, తక్‌బీర్‌, త’హ్‌మీద్‌, త’హ్‌లీల్‌, ఖుర్‌ఆన్‌ పఠనం మొదలైనవన్ని అల్లాహ్ స్మరణ భాగాలే. అన్నిటి ఉద్దేశ్యం అల్లాహ్ స్మరణే. దాసుడు ఎల్లప్పుడూ తన ప్రభువు, యజమాని స్మరణలో నిమగ్నమై ఉండాలి. ఎందుకంటే అతను పుట్టించబడిందీ అందుకే. అల్లాహ్‌ ఆదేశం: ”మరియు నేను జిన్నాతులను మరియు మానవులను సృష్టించింది, కేవలం వారు నన్ను ఆరాధించటానికే!” (సూ. అజ్జా’రియాత్‌, 51:56)

 ఒకవేళ దాసుడు ఈ ఆరాధననూ, అల్లాహ్ స్మరణనూ నిర్వరిస్తూ ఉంటే అల్లాహ్‌ (త)కూడా అతన్ని మరచిపోడు. ఎందుకంటే అల్లాహ్‌ (త) స్వయంగా ఇలా ఆదేశిస్తున్నాడు, ”కావున మీరు నన్నేస్మరించండి, నేను కూడా మిమ్మల్ని జ్ఞాపకం ఉంచుకుంటాను…” (సూ. అల్‌ బఖరహ్‌, 2:152)

 మరో ఆదేశం: ”…మరియు మీరు సాఫల్యం పొందాలంటే అల్లాహ్‌ను అత్యధికంగా స్మరిస్తూ ఉండండి!” (సూ. అల్‌ జుము’అహ్‌, 62:10)

అదేవిధంగా ఎల్లప్పుడూ అల్లాహ్ ధ్యానంలో అల్లాహ్ స్మరణలో నిమగ్నమై ఉండే వారి కొరకు గొప్ప గొప్ప గౌరవ స్థానాలు ఉన్నాయి.

ఎవరైతే నిలుచున్నా, కూర్చున్నా, పరుండినా, అన్ని వేళలా అల్లాహ్‌(త)ను స్మరిస్తారో, భూమ్యా కాశాల నిర్మాణాన్ని గురించి ఆలోచిస్తారో!…(సూ. ఆల ‘ఇమ్రాన్‌, 3:191) అంటే ఎప్పుడూ దైవధ్యానం నుండి ఏమరుపాటుకు గురికారు.

 మరో ఆదేశం: ”మరియు నీవు నీ మనస్సులో వినయంతో, భయంతో మరియు ఎక్కువ శబ్దంతో గాక (తగ్గుస్వరంతో) ఉదయం మరియు సాయంత్రం నీ ప్రభువును స్మరించు. మరియు నిర్లక్ష్యం చేసే వారిలో చేరకు.” (సూ. అల్‌ అ’అరాఫ్‌, 7:205)

మరో ఆదేశం: ”…నిశ్చయంగా, నమా’జ్‌ అసహ్యకర మైన పనులనుండి మరియు అధర్మమైన పనుల నుండి నిషేధిస్తుంది. మరియు అల్లాహ్‌ ధ్యానమే (అన్నిటికంటే) గొప్పది…” (సూ. అల్‌ ‘అంకబూత్‌, 29:45)

ప్రవక్త (స)ను, ‘తీర్పుదినం నాడు అందరికంటే అత్యున్నత స్థానంలో ఎవరుంటారు?’ అని ప్రశ్నించడం జరిగింది. దానికి ప్రవక్త (స), అల్లాహ్() ను అత్యధికంగా స్మరించే స్త్రీ పురుషులు, అని సమాధానం ఇచ్చారు. ప్రవక్త (స) అనుచరులు ప్రవక్త (స)ను, ‘దైవమార్గంలో పోరాడినవారి కంటేనా?’ అని అడగ్గా ప్రవక్త (స), ‘అవును, దైవమార్గంలో పోరాడి అమరగతిని పొందిన వారి కంటే అల్లాహ్‌ స్మరించేవారికి అత్యున్నత స్థానాలు లభిస్తాయి.’ అని అన్నారు.

అల్లాహ్‌ను స్మరించని హృదయాలను షై’తాన్‌ తన అధీనంలోకి తీసుకుంటాడు. అందువల్లే, షై’తాన్‌ మానవుని హృదయంపై కూర్చుని ఉంటాడు. అతడు అల్లాహ్‌ను స్మరిస్తే వెనక్కి తగ్గుతాడు, ఏమరు పాటుకు గురైతే అనేక దురాలోచనలకు గురిచేస్తాడు. ఇలా అనడం ప్రతీతి, కనుక నిర్లక్ష్యంగా ఉన్నవారిలో, అల్లాహ్‌ను స్మరించేవాడు పిరికిపందల్లో పోరాట వీరుని వంటివాడు. (మువత్తా ఇమామ్‌ మాలిక్‌)

ప్రవక్త (స) ఉపదేశం: ”కపటాచారులు చూచి, ‘మీరు చూపుగోలుకు పాల్పడుతున్నారు’ అనేటంత అధికంగా మీరు అల్లాహ్‌ స్మరణ చేయండి. అంతకు మించి అనే వాళ్ళు మీ అల్లాహ్‌ స్మరణలో నిమగ్నతను చూచి పిచ్చివారుగా, సంతులనం కోల్పోయిన వారుగా అనేటంత అధికంగా మీరు అల్లాహ్‌ను స్మరించండి.” (ఇబ్నె హిబ్బాన్‌)

ప్రవక్త (స) ప్రవచనం, ”సభ నుండి అల్లాహ్‌ను స్మరించకుండా లేచి వెళ్ళిపోయే వారు తీర్పుదినం నాడు విచారిస్తారు.” (‘హాకిమ్‌, అబూ దావూద్‌, తిర్మిజి’)

మరో ఉపదేశం, ”ఫజర్‌ నమా’జు చదివి సూర్యోదయం అయ్యేవరకు అల్లాహ్‌ ధ్యానం చేసే వారికి బనీ ఇస్రాయీ’ల్‌లోని నలుగురు బానిసలను విడుదల చేసినంత పుణ్యం లభిస్తుంది. అదేవిధంగా ‘అ’స్‌ర్‌ నమా’జు చదివి సూర్యాస్తమయం వరకు అల్లాహ్‌ స్మరణలో నిమగ్నమై ఉంటే అతనికి కూడా నలుగురు బానిసలను విడుదల చేసినంత పుణ్యం లభిస్తుంది.” (అబూ దావూద్‌)

య’హ్‌యా (అ) ప్రవచనం: ”అల్లాహ్‌ స్మరణ చేసే వారు తమ్ము తాము సురక్షితమైన కోటలో భద్ర పరచుకుంటారు. షై’తాన్‌ వారిని మార్గ-భ్రష్టత్వానికి గురిచేయలేడు.” (తిర్మిజి’, ఇబ్నె హిబ్బాన్‌, అ’హ్మద్‌)

అల్లాహ్‌ స్మరణ ప్రాధాన్యత, ప్రత్యేకతల తర్వాత దాని ఔన్నత్యాన్ని గురించి కూడా తెలుసుకోవడం మంచిది. దీనివల్ల ప్రతివ్యక్తి అన్నిటికంటే గొప్ప స్థానాలను పొందటానికి ప్రయత్నిస్తాడు. అల్లాహ్‌ (త) ప్రతి ఒక్కరికీ దీన్ని అనుసరించే భాగ్యం ప్రసాదించు గాక. ఆమీన్‌!

అల్లాహ్‌ స్మరణలో నాలుగు తరగతులు ఉన్నాయి. 1. కేవలం నోటితో స్మరించటం, హృదయం మాత్రం ఏమరుపాటుకు గురై ఉంది. అయితే దీని ప్రభావం చాలా తక్కువ ఉంటుంది. అయితే వ్యర్థబాతాకానీల కంటే నయమే. 2. మనసులో స్మరించటంకాని అల్లాహ్‌ స్మరణ హృదయంలో స్థిరంగా నిలవదు. అతికష్టంగా స్మరణకు అంగీకరిస్తాడు. 3. అల్లాహ్‌ స్మరణ మనసులో చోటుచేసుకుంది. ఇతర విషయాల్లో మనసు స్పందించదు. 4. అల్లాహ్‌ స్మరణ చేస్తూ అల్లాహ్‌ ప్రేమ మనసులో చోటుచేసుకుంది అల్లాహ్‌ స్మరణలో హృదయంతో పాటు శరీర అవయవాలన్నీ అల్లాహ్‌ స్మరణలో నిమగ్నమయి పోతాయి. ఇది అల్లాహ్‌ స్మరణ చివరి తరగతి. ఇక్కడకు చేరిన తర్వాత హృదయం పరిశుభ్రమై సూర్యునిలా మెరుస్తుంది. ”తన్ను తాను పరిశుద్ధ పరచుకున్న వాడు సాఫల్యం పొందాతాడు.”

అల్లాహ్‌ స్మరణ వల్ల అనేక లాభాలు ఉన్నాయి. ఇబ్ను ఖయ్యిమ్‌, ”ల్వాబిలు స్సయ్యిబ్”లో, ‘గజాలీ, ”ఇహ్యా ఉల్‌ ‘ఉలూమ్”లో, అబ్దుస్సలాం బస్తవి, ”ఇస్లామీ జాయిఫ్”లో పేర్కొన్నారు. ఇప్పుడు ఈ ‘హదీసు’ల అనువాదం చూద్దాం.

اَلْفَصْلُ الْأَوَّلُ మొదటి విభాగం   

2261 – [ 1 ] ( صحيح ) (2/698)

عَنْ أَبِيْ هُرَيْرَةَ وَأَبِيْ سَعِيْدٍ رَضِيَ اللهُ عَنْهُمَا قَالَا: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَا يَقْعُدُ قَوْمٌ يَّذْكُرُوْنَ اللهَ إِلَّاحَفَّتْهُمُ الْمَلَائِكَةُ وَغَشِيْتْهُمُ الرَّحْمَةَ وَنَزَلَتْ عَلَيْهِمُ السَّكِيْنَةُ وَذَكَرَهُمُ اللهُ فِيْمَنْ عِنْدَهُ”. رَوَاهُ مُسْلِمٌ.

2261. (1) [2/698దృఢం]

అబూ హురైరహ్‌ (ర), అబూ స’యీద్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ఎవరైనా కొందరు వ్యక్తులు ఎక్కడైనా అల్లాహ్(త) ను స్మరించటానికి కూర్చుంటే దైవదూతలు వారిని చుట్టుముడతారు. వారిపై కారుణ్యం కమ్ముకుంటుంది. వారిపై శాంతి అవత రిస్తుంది. అల్లాహ్(త) తన దగ్గరున్నవారితో వీరిని గురించి ప్రస్తావిస్తాడు. (ముస్లిమ్‌)

2262 – [ 2 ] ( صحيح ) (2/698)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: كَانَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم يسير فِيْ طَرِيْقِ مَكَّةَ فَمَرَّ عَلَى جَبَلٍ. يَقَالُ لَهُ: جُمْدَانُ. فَقَالَ: “سِيْرُوْا هَذَا جُمْدَانُ سَبَقَ الْمُفَرَّدُوْنَ”. قَالُوْا: وَمَا الْمُفَرِّدُوْنَ؟ يَا رَسُوْلَ اللهِ قَالَ: “الذَّاكِرُوْنَ اللهَ كَثِيْرًا وَالذَّاكِرَاتُ”. رَوَاهُ مُسْلِمٌ.

2262. (2) [2/698దృఢం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) మక్కహ్ ముకర్రమహ్ మార్గంలో ఒక కొండ ప్రాంతం గుండా పోతున్నారు. ఆ కొండ ప్రాంతాన్ని ”జుమ్దాన్” అనే వారు. ప్రవక్త (స), ‘మీరు పదండి ఇది జుమ్దాన్ కొండ, ముఫర్రిదూన్లు చాలా మించిపోయారు,’ అని అన్నారు. అది విని సహచరులు, ‘ముఫర్రిదూన్ లు అంటే ఎవరు దైవప్రవక్తా!’ అని ప్రశ్నించారు. దానికి ప్రవక్త (స) అత్యధికంగా దైవాన్ని స్మరించే స్త్రీ పురుషులు అని చెప్పారు. [18] (ముస్లిమ్‌)

2263 – [ 3 ] ( متفق عليه ) (2/698)

وَعَنْ أَبِيْ مُوْسَى قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَثَلُ الَّذِيْ يَذْكُرُ رَبَّهُ وَالَّذِيْ لَا يَذْكُرُ مَثَلُ الْحَيِّ وَالْمَيِّتِ”.

2263. (3) [2/698ఏకీభవితం]

అబూ మూసా అష్‌’అరీ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవ చనం, ”తన ప్రభువు(త)ను స్మరించేవాడు సజీవంగా ఉన్నవాడితో సమానం, ”తన ప్రభువును స్మరించని వాడు మృతునితో సమానం. (బు’ఖారీ, ముస్లిమ్‌)

2264 – [ 4 ] ( متفق عليه ) (2/698)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “يَقُوْلُ اللهُ تَعَالى: أَنَا عِنْدَ ظَنِّ عَبْدِيْ بِيْ وَأَنَا مَعَهُ إِذَا ذَكَرَنِيْ فَإِنْ ذَكَرَنِيْ فِيْ نَفْسِهِ ذَكَرْتُهُ فِيْ نَفْسِيْ وَإِنْ ذَكَرَنِيْ فِيْ مَلَأٍ ذَكَرْتُهُ في مَلَأٍ خَيْرٍ مِّنْهُمْ.

2264. (4) [2/698ఏకీభవితం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, అల్లాహ్‌ (త) ఇలా ఆదేశించాడు, ”నేను నా దాసుని ఆలోచనకు తగ్గట్టు ఉంటాను. అతను నన్ను గుర్తుచేసుకున్నప్పుడు నేనతని వెంట ఉంటాను. అతను నన్ను తన మనసులో గుర్తుచేసుకుంటే నేనతన్ని నా మనసులో గుర్తుచేసుకుంటాను. ఒకవేళ అతను ఏదైనా సమావేశంలో నన్ను గుర్తుచేసుకుంటే నేనుకూడా అతన్ని వారికంటే శ్రేష్ఠమైన సమావేశంలో గుర్తుచేసుకుంటాను. [19] (బు’ఖారీ, ముస్లిమ్‌)

2265 – [ 5 ] (صحيح ) (2/699)

وَعَنْ أَبِيْ ذَرٍّ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “يَقُوْلُ اللهُ تَعَالى: مَنْ جَاءَ بِالْحَسَنَةِ فَلَهُ عَشْرُأَمْثَالِهَا وَأَزْيَدُ وَمَنْ جَاءَ بِالسَّيِّئَةِ فَجَزَاءُ سَيِّئَةٍ مِّثْلُهَا. أَوْأَغْفِرُ وَمَنْ تَقَرَّبَ مِنِّيْ شِبْرًا تَقَرَّبْتُ مِنْهُ ذِرَاعًا وَمَنْ تَقَرَّبَ مِنِّيْ ذِرَاعًا تَقَرَّبْتُ مِنْهُ بَاعًا وَمَنْ أَتَانِيْ يَمْشِيْ أَتَيْتُهُ هَرْوَلَةً وَمَنْ لَقِيَنِيْ بِقُرَابِ الْأَرْضِ خَطِيْئَةً لَا يُشْرِكُ بِيْ شَيْئًا لَقِيْتُهُ بِمِثْلِهَا مَغْفِرَةً”. رَوَاهُ مُسْلِمٌ .

2265. (5) [2/699దృఢం]

అబూజ’ర్‌ (ర) కథనం: ప్రవక్త(స) ప్రవచనం, ”అల్లాహ్‌ ఆదేశం, ‘ఎవరైనా ఒక పుణ్యం చేస్తే అతనికి ఒక పుణ్యానికి బదులు పది పుణ్యాలు లేదా అంతకంటే అధికంగా ప్రతిఫలం ప్రసాదిస్తాను. అదేవిధంగా ఎవరైనా ఒక పాపం చేస్తే ఆ ఒక పాపానికి తగినట్లే శిక్షిస్తాను లేదా క్షమించి వేస్తాను. ఎవరైనా ఒక జానెడు దూరం నా వైపు వస్తే, పుణ్యం చేసి నా సాన్నిహిత్యం కోరితే, నేను కారుణ్యంతో ఒక గజం ముందుకు వెళతాను. అదేవిధంగా సత్కార్యం చేసి ఒక గజం దూరం నా వైపు వస్తే, నేను రెండు గజాలు అతని వైపు ముందుకు సాగుతాను. నా వద్దకు మెల్లమెల్లగా నడిచి వచ్చినవాడి వైపు నేను పరిగెత్తుకుంటూ అతని దగ్గరకు వస్తాను. అదే విధంగా ఎవరైనా భూమి నిండా పాపాలతో నన్ను కలిస్తే, నాకు ఇతరులెవ్వరినీ సాటి కల్పించకుండా ఉంటే, నేను భూమినిండా క్షమాపణ తీసుకుని అతన్ని కలుస్తాను.”’ [20] (ముస్లిమ్)

2266 – [ 6 ] ( صحيح ) (2/699)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِنَّ اللهَ تَعَالى قَالَ: مَنْ عَادَى لِيْ وَلِيًّا فَقَدْ آذَنْتُهُ بِالْحَرْبِ وَمَا تَقَرَّبَ إِلَيَّ عَبْدِيْ بِشَيْءٍ أَحَبَّ إِلَيَّ مِمَّا افْتَرَضْتُ عَلَيْهِ. وَمَا يَزَالُ عَبْدِيْ يَتَقَرَّبُ إِلَيَّ بِالنَّوَافِلِ حَتَّى أُحِبَّهُ فَإِذَا أَحْبَبْتُهُ كُنْتُ سَمِعَهُ الَّذِيْ يَسْمَعُ بِهِ وَبَصَرَهُ الَّذِيْ يُبْصِرُبِهِ وَيَدَهُ الَّتِيْ يَبْطِشُ بِهَا وَرِجْلَهُ الَّتِيْ يَمْشِيْ بِهَا وَإِنْ سَأَلَنِيْ لَأُعْطِيَنَّهُ وَلِئِنْ اسْتَعَاذَنِيْ لَأُعْيْذَنَّهُ وَمَا تَرَدَّدْتُ عَنْ شَيْءٍ أَنَا فَاعِلُهُ تَرَدُّدِيْ عَنْ نَّفْسِ الْمُؤْمِنِ يَكْرَهُ الْمَوْتَ وَأَنَا أَكْرَهُ مَسَاءَتَهُ وَلَا بُدَّ لَهُ مِنْهُ “. رَوَاهُ الْبُخَارِيُّ

2266. (6) [2/699దృఢం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, అల్లాహ్‌ (త) ఆదేశం: ”ఎవరైనా నా స్నేహితులతో, మిత్రులతో శత్రుత్వం వహించినా, వారిని హింసించినా, వారిని కష్టపెట్టినా, అలాంటివాడిని, నేను వాడితో యుద్ధం చేస్తానని హెచ్చరిస్తాను. నా దాసుడు నేను అతనిపై విధించిన విధులద్వారా నా సాన్నిహిత్యం పొందగోరితే అది నాకు అన్నిటికంటే చాలా ప్రియమైనది. నా దాసుడు అదనపు ఆరాధనల ద్వారా ఎల్లప్పుడూ నా సాన్నిహిత్యాన్ని పొందుతూ ఉంటాడు. చివరికి నేను అతన్ని నా ప్రియమిత్రునిగా చేసుకుంటాను. నేను అతన్ని నా మిత్రునిగా చేసుకుంటే, అతను వినే చెవుగా మారిపోతాను. అతను చూచే కన్ను అయిపోతాను, అతను పట్టుకునే చేయి అయిపోతాను. అతను నడిచే కాలు అపోతాను. ఒకవేళ అతడు ఏదైనా అడిగితే నేనతనికి ఇస్తాను. ఒకవేళ దేన్నుండైనా శరణు కోరితే, నేనతనికి అభయం ప్రసాదిస్తాను. ఇంకా నేను ఒక ముస్లిమ్‌ ప్రాణాలు తీయటంలో సంకోచించినంతగా మరే విషయంలోనూ సంకోచించను. అంటే విశ్వాస దాసుడు మరణించటం నాకు ఇష్టం లేదు. ఇంకా నేనతని ప్రాపంచిక ఆపదలకూ ఇష్టపడను. అయితే చావు తప్పదు, మరో మార్గమూ లేదు.” [21]  (బు’ఖారీ)

2267 – [ 7 ] ( متفق عليه ) (2/699)

وَعَنْهُ  قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِنَّ لِلّهِ مَلَائِكَةً يَّطُوْفُوْنَ فِيْ الطُّرُقِ يَلْتَمِسُوْنَ أَهْلَ الذِّكْرِ فَإِذَا وَجَدُوْا قَوْمًا يَّذْكُرُوْنَ اللهَ تَنَادَوْا: هَلُمَّوْا إِلَى حَاجَتِكُمْ” قَالَ: “فَيَحُفُّوْنَهُمْ بِأَجْنِحَتِهِمْ إِلَى السَّمَاءِ الدُّنْيَا” قَالَ: “فَيَسْأَلُهُمْ رَبُّهُمْ وَهُوَ أَعْلَمُ بِهِمْ:مَا يَقُوْلُ عِبَادِيْ؟” قَالَ: “يَقُوْلُوْنَ: يُسَبِّحُوْنَكَ وَيُكَبِّرُوْنَكَ وَيَحْمَدُوْنَكَ وَيُمَجِّدُوْنَكَ”. قَالَ: “فَيَقُوْلُ: هَلْ رَأَوْنِيْ؟” قَالَ: “فَيَقُوْلُوْنَ: لَا وَاللهِ مَا رَأَوْكَ”. قَالَ فَيَقُوْلُ: “كَيْفَ لَوْ رَأَوْنِيْ؟” قَالَ: “فَيَقُوْلُوْنَ: لَوْ رَأَوْكَ كَانُوْا أَشَدَّ لَكَ عِبَادَةً وَأَشَدَّ لَكَ تَمْجِيْدًا وَأَكْثَرَ لَكَ تَسْبِيْحًا”. قَالَ: “فَيَقُوْلُ: فَمَا يَسْأَلُوْنَ؟” قَالُوْا: “يَسْأَلُوْنَكَ الْجَنَّةَ”. قَالَ: “يَقُوْلُ: وَهَلْ رَأَوْهَا؟” قَالَ: “فَيَقُوْلُوْنَ: لَا وَاللهِ يَا رَب مَا رَأَوْهَا”. قَالَ: “فَيَقُوْلُ: فَكَيْفَ لَوْ رَأَوْهَا؟” قَالَ: “يَقُوْلُوْنَ: لَوْ أَنَّهُمْ رَأَوْهَا كَانُوْا أَشَدَّ حِرْصًا وَأَشَدَّ لَهَا طَلَبًا وَأَعْظَمَ فِيْهَا رَغْبَةً. قَالَ: “فَمِمَّ يَتَعَوَّذُوْنَ؟” قَالَ: “يَقُوْلُوْنَ: مِنَ النَّارِ”. قَالَ: “يَقُوْلُ: فَهَلْ رَأَوْهَا؟” قَالَ: يَقُوْلُوْنَ:”لَا وَاللهِ يَا رَبِّ مَا رَأَوْهَا”. قَالَ: “يَقُوْلُ: فَكَيْفَ لَوْ رَأَوْهَا؟” قَالَ: “يَقُوْلُوْنَ لَوْ رَأَوْهَا كَانُوْا أَشَدَّ مِنْهَا فِرَارًا وَأَشَدَّ لَهَا مَخَافَةً”. قَالَ: “فَيَقُوْلُ: فَأُشْهِدُكُمْ أَنِّيْ قَدْ غَفَرْتُ لَهُمْ”. قَالَ: “يَقُوْلُ مَلَكٌ مِّنَ الْمَلَائِكَةِ: فِيْهِمْ فُلَانٌ لَيْسَ مِنْهُمْ إِنَّمَا جَاءَ لِحَاجَةٍ قَالَ: هُمُ الْجُلَسَاءُ لَا يَشْقَى جَلِيْسُهُمْ”. رَوَاهُ الْبُخَارِيُّ.

وَفِيْ رِوَايَةِ مُسْلِمٍ قَالَ: “إِنَّ لِلّهِ مَلَائِكَةً سَيَّارَةً فَضْلًا يَّبْتَغُوْنَ مَجَالِسَ الذِّكْرِ فَإِذَا وَجَدُوْا مَجْلِسًا فِيْهِ ذِكْرٌ قَعَدُوْا مَعَهُمْ وَحَفَّ بَعْضُهُمْ بَعْضًا بِأَجْنِحَتِهِمْ حَتَّى يَمْلَأُوْا مَا بَيْنَهُمْ وَبَيْنَ السَّمَاءِ الدَّنْيَا فَإِذَا تَفَرَّقُوْا عَرَجُوْا وَصَعِدُوْا إِلَى السَّمَاءِ. قَالَ: فَيَسْأَلُهُمُ اللهُ وَهُوَ أَعْلَمُ : وهو أعلم بحالهم مِنْ أَيْنَ جِئْتُمْ؟ فَيَقُوْلُوْنَ: جِئْنَا مِنْ عِنْدَ عِبَادِكَ فِيْ الْأَرْضِ يُسَبِّحُوْنَكَ وَيُكَبِّرُوْنَكَ وَيُهَلِّلُوْنَكَ وَيُمَجِّدُوْنَكَ وَيَحْمَدُوْنَكَ وَيَسْأَلُوْنَكَ. قَالَ: وَمَاذَا يَسْأَلُوْنِّيْ؟ قَالُوْا: يَسْأَلُوْنَكَ جَنَّتَكَ. قَالَ: وَهَلْ رَأَوْا جَنَّتِيْ؟ قَالُوْا: لَا أَيْ رَبِّ. قَالَ: وَكَيْفَ لَوْ رَأَوْا جَنَّتِيْ؟ قَالُوْا: وَيَسْتَجِيْرُوْنَكَ. قَالَ: وَمِمَّا يَسْتَجِيْرُوْنِيْ؟ قَالُوْا: مِنْ نَّارِكَ. قَالَ: وَهَلْ رَأَوْا نَارِيْ؟ قَالُوْا: لَا. قَالَ: فَكَيْفَ لَوْ رَأَوْا نَارِيْ؟ قَالُوْا: يَسْتَغْفِرُوْنَكَ .قَالَ: “فَيَقُوْلُ: قَدْ غَفَرْتُ لَهُمْ فَأَعْطَيْتُهُمْ مَا سَأَلُوْا وَأَجَرْتُهُمْ مِمَّا اسْتَجَارُوْا”. قَالَ: “يَقُوْلُوْنَ: رَبِّ فِيْهِمْ فُلَانٌ عَبْدٌ خَطَّاءٌ وَإِنَّمَا مَرَّ فَجَلَسَ مَعَهُمْ”. قَالَ: “فَيَقُوْلُ وَلَهُ غَفَرْتُ هُمُ الْقَوْمُ لَا يَشْقَى بِهِمْ جَلِيْسُهُمْ”.

2267. (7) [2/699ఏకీభవితం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, కొంత మంది దైవదూతలు రాత్రీ పగలు దైవస్మరణ చేసే వారిని వెతుక్కుంటూ మార్గాల్లో వీధుల్లో తిరుగుతూ ఉంటారు. ఎక్కడైనా, ఎవరైనా దేవున్ని స్మరిస్తూ వారికి కనిపిస్తే వారు తోటి దైవదూతల్ని పిలుస్తూ, ”ఇలా రండి, మీరు వెతుకుతున్నవారు ఇక్కడ ఉన్నారు,” అని అంటారు. అంతేకాదు, మొదటి ఆకాశం వరకు వారిని తమ రెక్కలతో కప్పి వేస్తారు. వారు తిరిగి వెళ్ళిన తరువాత అల్లాహ్(త) వారిని, ”నాదాసులు ఏమంటున్నారు?” అని అడుగుతాడు. వాస్తవానికి వారేమంటున్నారో ఆయనకు బాగా తెలుసు. దానికి సమాధానంగా దైవ దూతలు, ‘వారు నీ పవిత్రతను కొనియాడు తున్నారు. నీ గొప్పతనాన్ని చాటుతున్నారు. నిన్ను స్తుతిస్తున్నారు. నీ ఔన్నత్యాన్ని పొగుడు తున్నారు,” అని చెబుతారు. ”వారు నన్ను చూసారా?” అని అడుగుతాడు అల్లాహ్. దానికి దూతలు, ”అల్లాహ్ సాక్షి! వారు నిన్ను చూడలేదు” అని, చెబుతారు. ”ఒకవేళ వారు నన్ను చూస్తే అప్పుడెలా ఉంటుంది వారి పరిస్థితి?” అని అడుగు తాడు అల్లాహ్. ”వారు గనుక నిన్ను చూస్తే మరింత అధికంగా నిన్ను ఆరాధిస్తారు. నీ ఔన్నత్యాన్ని పొగుడుతారు. నీ పరిశుద్ధతను కొని యాడుతారు,” అని అంటారు దైవదూతలు. అల్లాహ్, ”వారికి ఏం కావాలట?” అని అడుగుతాడు. ”నువ్వు వారికి స్వర్గం ప్రసాదించాలట,” అని చెబుతారు దైవ దూతలు. ”వారు స్వర్గాన్ని చూసారా?” అని అల్లాహ్ అడిగితే, ”అల్లాహ్ సాక్షి! వారు చూడలేదు,” అని చెబుతారు దైవదూతలు. అప్పుడు అల్లాహ్(త) మళ్ళీ అడుగుతాడు, ”వారు గనుక స్వర్గాన్ని చూస్తే అప్పుడెలా ఉంటుంది వారి పరిస్థితి,” అని. ”ఓ అల్లాహ్! ఒకవేళ వారు గనుక స్వర్గాన్ని చూస్తే, దాన్ని పొందాలనే ఆశ, కోరిక శ్రద్ధాసక్తులు వీరిలో మరింత పెరిగిపోతాయి.” అని చెబుతారు దైవ దూతలు. ”సరే, వారు దేన్నుండి శరణు కోరుతు న్నారు,” అని అల్లాహ్ అడుగుతాడు. ”వారు నర కాగ్ని నుండి శరణుకోరుతున్నారు,” అని అంటారు దైవదూతలు. ”అసలు వారు నరకాన్ని చూసారా?” అని అడుగుతాడు అల్లాహ్ మళ్ళీ, ”లేదు, అల్లాహ్ సాక్షి! వారు దాన్ని చూడలేదు,” అని చెబుతారు దైవ దూతలు. ”ఒకవేళ చూస్తే అప్పుడెలా ఉంటుంది?” అని అడిగితే, దూతలు, ”వారుగనుక దాన్ని చూస్తే దాని నుండి మరింత పారిపోతారు. దానికి ఇంకా భయపడతారు,” అని చెబుతారు. అప్పుడు అల్లాహ్, ”నేను వారందరిని క్షమిస్తున్నాను. ఇందుకు మిమ్మల్ని సాక్షులుగా నిలబెడుతున్నాను,” అంటాడు. దానికి దూతల్లోని ఒక దూత సందేహ పడుతూ, ”ఓ అల్లాహ్! వారిలో ఒక వ్యక్తి మరోపని మీద వెళుతూ, వచ్చి కూర్చున్నాడు. వాస్తవంగా అతను ముందు నుండి వారితోపాటు లేడు,” అని అంటాడు. ఆ మాటవిని అల్లాహ్ (త) ఇలా ప్రకటి స్తాడు. ”అల్లాహ్ ను స్మరిస్తూ కూర్చున్నవారు ఎటు వంటి వారంటే వారితో పాటు కూర్చున్నవారు కూడా ఆ శుభాలను పొందకుండా ఉండరు.” [22] (బు’ఖారీ)

ముస్లిమ్‌ గ్రంథంలో అబూ హురైరహ్‌ (ర)చే ఉల్లేఖించబడిన మరొక ఉల్లేఖనం ప్రకారం దైవప్రవక్త (స) ఈ విధంగా ప్రవచించారు, ”అల్లాహ్ (త) నియమించిన మరికొందరు దైవదూతలు, దైవస్మరణ సభల కోసం తిరుగుతూ ఉంటారు. ఎక్కడయినా ప్రజలు దైవస్మరణలో నిమగ్నమై ఉన్న సభలలో కనిపిస్తే, వీరు కూడా వారితో పాటు కూర్చుంటారు. ఒకరి రెక్కల్ని మరొకరితో కలుపుకొని సభను పూర్తిగా కప్పుకుంటారు. ఆవిధంగా మొదటి ఆకాశం వరకు మధ్యలో ఉన్న స్థలం వారితోనే నిండిపోతుంది. ప్రజలు అక్కడి నుండి సెలవు తీసుకున్న తర్వాత దూతలు ఆకాశం వైపు ఎక్కివెళ్ళి పోతారు. అప్పుడు అల్లాహ్ (త) వారిని అడుగుతాడు, ‘మీరు ఎక్కడి నుండి వస్తు న్నారు?’ అని. వాస్తవం ఏమిటంటే, వారు ఎక్కడి నుండి వస్తున్నారో ఆయనకు బాగా తెలుసు. ఆ ప్రశ్నకు దైవదూతలు, ‘మేము భూమిపై ఉన్న నీ దాసుల దగ్గర నుండి వస్తున్నాం. వారు నీ పవిత్రతను కొనియాడుతున్నారు. నీ గొప్పతనాన్ని చాటుతు న్నారు. నీ ఏకత్వాన్ని కీర్తిస్తున్నారు. నిన్ను స్తుతిస్తు న్నారు. నిన్ను అర్థిస్తున్నారు,’ అని అంటారు. ‘వారు నన్ను ఏమి అర్థిస్తున్నారు?’ అని అడుగుతాడు అల్లాహ్. ‘వారు నిన్ను నీ దగ్గరున్న స్వర్గం ఇవ్వమని అడుగుతున్నారు,’ అని చెబుతారు దైవదూతలు. ‘వారు నా స్వర్గం చూసారా?’ అని అల్లాహ్ ప్రశ్నిస్తాడు. ‘లేదు, ప్రభూ! వారు చూడలేదు,’ అని దైవదూతలు విన్నవించుకుంటారు. ‘ఒకవేళ వారు దాన్ని చూస్తే ఏమనుకుంటారు?’ అని అంటాడు, అల్లాహ్. దూతలు, అంటారు, ‘వారు నీ శరణుకోరుతారు.’ అల్లాహ్(త) అడుగుతాడు, ‘వారు దేనినుంచి నా శరణు కోరుతున్నారు?’ దానికి దైవదూతలు సమాధానమిస్తూ, ‘నీ అగ్నినుండి’ అని విన్నవించు కుంటారు. ‘వారు నా అగ్నిని చూసారా?’ అని ప్రశ్నిస్తాడు అల్లాహ్. ‘లేదు, చూడలేదు,’ అని సమాధానం ఇస్తారు దైవదూతలు. అల్లాహ్ మళ్ళీ, ‘ఒకవేళ వారు నా అగ్నిని చూస్తే ఏమనుకుంటారు?’ అని అంటాడు. దైవదూతలు, ‘వారు నీ మన్నింపును కోరుతారు.’ అని అంటారు. అప్పుడు అల్లాహ్(త) ఇలా ప్రకటిస్తాడు, ‘నేను వారిని మన్నించాను. వారు అడిగినది ఇచ్చేసాను. వారు దేన్నుండి శరణు కోరుతున్నారో ఆ అభయం ఇచ్చాను.’ అని అంటాడు. అది విని దూతలు, ‘ఓ ప్రభూ! వారిలో ఒక పాపాత్ముడు కూడా ఉన్నాడు. నిజానికి అతను అటునుండి వెళుతూ అక్కడ కూర్చున్నాడు,’ అని అంటారు. దానికి అల్లాహ్, ‘నేను అతన్ని కూడా క్షమించాను. అక్కడ కూర్చున్నవారు ఎటువంటి వారంటే వారితో పాటు కూర్చున్నవారు కూడా శుభాలు పొందకుండా ఉండరు,’ అని అంటాడు.

2268 – [ 8 ] ( صحيح ) (2/701)

وَعَنْ حَنْظَلَةَ بْنِ الرُّبَيِّعِ الْأُسَيْدِيِّ قَالَ: لَقِيَنِيْ أَبُوْ بَكْرٍ فَقَالَ: كَيْفَ أَنْتَ يَا حَنْظَلَةُ؟ قُلْتُ: نَافَقَ حَنْظَلَةُ قَالَ: سُبْحَانَ اللهِ مَا تَقُوْلُ؟ قُلْتُ: نَكُوْنُ عِنْدَ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم يُذَكِّرُنَا بِالنَّارِ وَالْجَنَّةِ كَأَنَّا رَأَي عَيْنٍ فَإِذَا خَرَجْنَا مِنْ عِنْدِ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم عَافَسْنَا الْأَزْوَاجَ وَالْأَوْلَادَ وَالضَّيْعَاتِ نَسِيْنًا كَثِيْرًا. قَالَ أَبُوْ بَكْرٍ: فَوَ اللهِ إِنَّا لَنَلْقَى مِثْلَ هَذَا فَانْطَلَقْتُ أَنَا وَأَبُوْ بَكْرٍ حَتَّى دَخَلْنَا عَلَى رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم فَقُلْتُ: نَافَقَ حَنْظَلَةُ يَا رَسُوْلَ اللهِ. قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “وَمَا ذَاكَ؟” قُلْتُ: يَا رَسُوْلَ اللهِ نَكُوْنُ عِنْدَكَ تُذكِّرُنَا بِالنَّارِ وَالْجَنَّةِ كَأَنَّا رَأيَ عَيْنٍ فَإِذَا خَرَجْنَا مِنْ عِنْدَكَ عَافَسْنَا الْأَزْوَاجَ وَالْأَوْلَادَ وَالضَّيْعَاتِ نَسِيْنَا كَثِيْرًا. فَقَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “والَّذِيْ نَفْسِيْ بِيَدِهِ لَوْ تَدُوْمُوْنَ عَلَى مَا تَكُوْنُوْنَ عِنْدِيْ وَفِيْ الذِّكْرِ لَصَافَحَتْكُمُ الْمَلَائِكَةُ عَلَى فُرُشِكُمْ وَفِيْ طُرُقِكُمْ وَلَكِنْ يَا حَنْظَلَةُ سَاعَةً وَسَاعَةً “ثَلَاثَ مَرَّاتٍ”. رَوَاهُ مُسْلِمٌ .

2268. (8) [2/701దృఢం]

‘హన్‌”జలహ్ బిన్‌ రుబయ్యి’య్ ఉసైదీ (ర) కథనం: అబూ బకర్‌ (ర) నన్ను కలిసారు. ఆయన నన్ను ‘హన్‌”జలహ్ ఎలా ఉన్నావు అని అడిగారు. నేను, ‘ ‘హన్‌”జలహ్ కాపట్యానికి గురయ్యాడు,’ అని అన్నాను. అప్పుడతను, ‘సుబ్‌హానల్లాహ్‌ ఎందుకిలా అంటున్నావు?’ అని అన్నారు. దానికి నేను ఇలా అన్నాను, ‘మేము ప్రవక్త (స) వద్ద ఉన్నప్పుడు ప్రవక్త (స) మాకు హితబోధ చేసేవారు. స్వర్గ నరకాలను గురించి ప్రస్తావించేవారు. ఆ సమయంలో మాకు స్వర్గనరకాలను చూస్తున్నట్లు అనిపించేది. ఆ తరువాత ప్రవక్త (స) దగ్గర నుండి లేచి వచ్చి భార్యాబిడ్డలతో కలసినప్పుడు  పొలాలు, తోటల విషయాల్లో నిమగ్నులమయి చాలా విషయాలు మరచిపోతున్నాము.’ అప్పుడు అబూ బకర్‌, ‘అల్లాహ్ (త) సాక్షి! నా పరిస్థితి కూడా ఇదే,’ అని అన్న తర్వాత, మేమిద్దరం ప్రవక్త (స) వద్దకు వెళ్ళాం. నేను, ‘ఓ అల్లాహ్‌ ప్రవక్తా! ‘హన్‌”జలహ్ కపటాచారి అయిపోయాడు,’ అని అన్నాను. ప్రవక్త (స), ‘ఏమయింది?’ అని అన్నారు. అప్పుడు నేను, ‘ఓ అల్లాహ్‌ ప్రవక్తా! మేము మీ దగ్గర ఉన్నప్పుడు స్వర్గనరకాల గురించి విన్నప్పుడు స్వర్గనరకాలను మా కళ్ళతో చూస్తాం. మీ దగ్గర నుండి తిరిగి వెళ్ళి భార్యా బిడ్డల్లో ప్రాపంచిక వ్యవహారాల్లో చిక్కుకుంటే, తమరి హితబోధలు మరచిపోతున్నాం,’ అని విన్నవించుకున్నాను. అప్పుడు  ప్రవక్త (స) ఇలా అన్నారు, ‘ఎవరి చేతుల్లో నా ప్రాణం ఉందో ఆయన (త) సాక్షి! ఒకవేళ మీరు ఎల్లప్పుడూ నా వద్ద ఉన్న స్థితిలోనే ఉంటే, ఎల్లప్పుడూ దైవధ్యానంలో ఉంటే, ఖచ్చితంగా మీ పడకలపై, మీ మార్గాల్లో దైవదూతలు మిమ్మల్ని కరచాలనం చేస్తారు. కాని ‘హన్‌”జలహ్ ఈ పరిస్థితి అప్పుడప్పుడూ ఏర్పడుతుంది,’ ఇలా ప్రవక్త (స) మూడు సార్లు అన్నారు. [23]  (ముస్లిమ్‌)

—–

اَلْفَصْلُ الثَّانِيْ రెండవ విభాగం   

2269 – [ 9 ] ( صحيح ) (2/702)

وَعَنْ أَبِيْ الدَّرْدَاءِ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “أَلَا أُنَبِّئُكُمْ بِخَيْرِ أَعْمَالِكُمْ وَأَزْكَاهَا عِنْدَ مَلِيْكِكُمْ؟ وَأَرْفَعِهَا فِيْ دَرَجَاتِكُمْ؟ وَخَيْرٍ لَّكُمْ مِنْ إِنْفَاقِ الذَّهَبِ وَالْوَرِقِ؟ وَخَيْرٍ لَّكُمْ مِنْ أَنْ تَلْقَوْا عَدُوَّكُمْ فَتَضْرِبُوْا أَعْنَاقَهُمْ وَيَضْرِبُوْا أَعْنَاقَكُمْ؟ “قَالُوْا: بَلَى قَالَ: “ذِكْرُ اللهِ”. رَوَاهُ مَالِكٌ وَأَحْمَدُ وَالتِّرْمِذِيُّ وَابْنُ مَاجَهُ. إِلَّا أَنْ مَالِكًا وَقَفَهُ عَلَى أَبِيْ الدَّرْدَاءِ.

2269. (9) [2/702దృఢం]

అబూ దర్‌దా (ర) కథనం: ప్రవక్త (స) ఒక సారి తన సహచరులకు హితబోధ చేస్తూ, ‘మీ ఆచరణల్లోని ఒక ఆచరణ గురించి నేను మీకు తెలుపనా? అది మీ ఆచరణలన్నిటి కంటే శ్రేష్ఠమైనది. మీ ప్రభువు దృష్టిలో పరిశుధ్ధమైనది, మీ అంతస్తులో ఉన్నతమైనది. మీరు వెండిబంగారాలు ఖర్చుపెట్టటం కన్నా శ్రేష్ఠమైనది. మీరు శత్రువులతో తలపడి మీరు వారి మెడలు నరకటం, వారు మీ మెడలు నరకటం కన్నా ఎంతో గొప్పది అని ప్రవచించారు.’ అందుకు సహచరులు ‘తప్పకుండా తెలియజేయండి,’ అని అన్నారు. దానికి అతను (స), ‘ఆ ఆచరణ అల్లాహ్ ను స్మరించటం,’ అని అన్నారు. [24] (మాలిక్‌, అ’హ్మద్‌, తిర్మిజీ’, ఇబ్నె మాజహ్,)

2270 – [ 10 ] ( صحيح ) (2/702)

وَعَنْ عَبْدِ اللهِ بْنِ بُسْرٍ قَالَ: جَاءَ أَعْرَابِيٌّ إِلَى النَّبِيِّ صلى الله عليه و سلم فَقَالَ: أَيُّ النَّاسِ خَيْرٌ؟ فَقَالَ: “طُوْبَى لِمَنْ طَالَ عُمْرُهُ وَحَسُنَ عَمَلُهُ” .قَالَ: يَا رَسُوْلَ اللهِ أَيُّ الْأَعْمَالِ أَفْضَلُ؟ قَالَ: “اَنْ تُفَارِقَ الدُّنْيَا وَلِسَانُكَ رَطْبٌ مِّنْ ذِكْرِ الله” .رَوَاهُ أَحْمَدُ وَالتِّرْمِذِيُّ.

2270. (10) [2/702దృఢం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ బుస్‌ర్ (ర) కథనం: ప్రవక్త (స) వద్దకు ఒక బదూ’ వచ్చి, ‘అందరికంటే ఉత్తములు ఎవరు?’ అని ప్రశ్నించాడు. ప్రవక్త (స), ‘అధిక ఆయుష్షు లభించి, సత్కర్మలు చేసేవాడికి  శుభవార్త, మేలు ఉన్నాయి,’ అని అన్నారు. మళ్ళీ ఆ వ్యక్తి, ‘ఓ అల్లాహ్‌ ప్రవక్తా! అన్నిటి కంటే ఉత్తమమైన ఆచరణ ఏది?’ అని ప్రశ్నించాడు. ప్రవక్త (స), ‘ఎల్లప్పుడూ అల్లాహ్(త) స్మరణ చేస్తున్న నోటితో మరణించటం. అంటే ఎల్లప్పుడూ మరణించే వరకు అల్లాహ్ (త) స్మరణలో నిమగ్నులమై ఉండాలి. ఎప్పుడూ అల్లాహ్ (త) ధ్యానాన్ని మరువరాదు. ఇటువంటి అల్లాహ్ స్మరణ అన్నిటి కంటే ఉత్తమమైన ఆచరణ,’ అని అన్నారు. (అ’హ్మద్‌, తిర్మిజి’)

2271 – [ 11 ] ( لم تتم دراسته ) (2/702)

وَعَنْ أَنَسٍ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِذَا مَرَرْتُمْ بِرِيَاضِ الْجَنَّةِ فَارْتَعُوْا”. قَالُوْا: وَمَا رِيَاضُ الْجَنَّةِ؟ قَالَ: “حِلْقُ الذِّكْرِ”. رَوَاهُ التِّرْمِذِيُّ.

2271. (11) [2/702అపరిశోధితం]

అనస్‌ (ర) కథనం: ప్రవక్త (స), ”స్వర్గవనాలలో సంచరించినపుడు పళ్ళు ఫలాలను ఆరగించండి,” అని అన్నారు. అనుచరులు, ‘స్వర్గవనాలు అంటే ఏమిటి?’ అని విన్నవించుకున్నారు. ప్రవక్త(స), ‘అల్లాహ్ స్మరణ, ధ్యాన సభలు,’ అని సమాధానం ఇచ్చారు. [25] (తిర్మిజి’)

2272 – [ 12 ] ( صحيح ) (2/702)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَنْ قَعَدَ مَقْعَدًا لَمْ يَذْكُرِ اللهَ فِيْهِ كَانَتْ عَلَيْهِ مِنَ اللهِ تِرَةٌ وَمَنِ اضْطَجَعَ مَضْجَعًا لَا يَذْكُرُ اللهَ فِيْهِ كَانَ عَلَيْهِ مِنَ اللهِ تَرَةٌ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ .

2272. (12) [2/702దృఢం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఒకచోట కూర్చుని అక్కడ అల్లాహ్ (త) స్మరణ చేయకుంటే, తీర్పుదినంనాడు అతన్ని విచారించడం, శిక్షించడం జరుగుతుంది. అదేవిధంగా ఎక్కడైనా ఒకచోట పరుండి అల్లాహ్ (త) స్మరణ చేయకుంటే తీర్పుదినంనాడు అతన్ని విచారించడం, శిక్షించడం జరుగుతుంది. [26] (అబూ దావూద్‌)

2273 – [ 13 ] ( صحيح ) (2/703)

وَعَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَا مِنْ قَوْمٍ يَقُوْمُوْنَ مِنْ مَجْلِسٍ لَا يَذْكُرُوْنَ اللهَ فِيْهِ إِلَّا قَامُوْا عَنْ مِّثْلِ جِيْفَةِ حِمَارٍ وَكَانَ عَلَيْهِمْ حَسْرَةً” . رَوَاهُ أَحْمَدُ وَأَبُوْ دَاوُدَ.

2273. (13) [2/703దృఢం] 

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”కొంత మంది ప్రజలు ఒకచోట కూర్చుని, అక్కడ అల్లాహ్ (త) స్మరణ చేయకుండా లేచి నిలబడితే వారి ఉపమానం మరణించిన గాడిద శవం వంటిది. వారిని గురించి చింతించవలసి ఉంటుంది.” [27] (అబూ దావూద్‌)

2274 – [ 14 ] ( صحيح ) (2/703)

وَعَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَا جَلَسَ قَوْمٌ مَجْلِسًا لَمْ يَذْكُرُوْا اللهَ فِيْهِ وَلَمْ يُصَلُّوْا عَلَى نَبِيِّهِمْ إِلَّا كَانَ عَلَيْهِمْ تِرَةً فَإِنْ شَاءَ عَذَّبَهُمْ وَإِنْ شَاءَ غَفَرَ لَهُمْ”. رَوَاهُ التِّرْمِذِيُّ.

2274. (14) [2/703దృఢం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఒకచోట కూర్చుని, అక్కడ అల్లాహ్(త) ను స్మరించ కుండా, ప్రవక్తపై దరూద్‌ పఠించకుండా ఉంటే ఆ సభ ప్రాణాంతకంగా తయారవుతుంది. అల్లాహ్(త) కోరితే వారిని శిక్షించవచ్చు. లేదా క్షమించవచ్చు. (తిర్మిజి’)

2275 – [ 15 ] ( لم تتم دراسته ) (2/703)

وَعَنْ أُمِّ حَبِيْبَةَ قَالَتْ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “كُلُّ كَلَامِ ابْنِ آدَمَ عَلَيْهِ لَا لَهُ إِلَّا أَمْرٌ بِمَعْرُوْفٍ أَوْ نَهْيٌ عَنْ مُنْكَرٍأَوْ ذِكْرُ اللهِ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَابْنُ مَاجَهُ. وَقَالَ التِّرْمِذِيُّ: هَذَا حَدِيْثٌ غَرِيْبٌ

2275. (15) [2/703అపరిశోధితం]

ఉమ్మె ‘హబీబహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మానవుని ప్రతి పలుకు అతన్ని శిక్షకు, నష్టానికి గురి చేస్తుంది. లాభం చేకూర్చేది కాదు. కాని అతని, మంచిని ఆదేశించడం, చెడు నుండి వారించడం, అల్లాహ్(త) స్మరణ చేయడం ప్రాణాంతకంగా మారదు. పైగా అతనికి లాభం చేకూర్చేదిగా పరిణ మిస్తుంది. (తిర్మిజి’ – ఏకోల్లేఖనం, ఇబ్నె మాజహ్)

2276 – [ 16 ] ( لم تتم دراسته ) (2/703)

وَعَنِ ابْنِ عُمَرَ رَضِيَ اللهُ عَنْهُمَا قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَا تُكْثِرُوْا الْكَلَامَ بِغَيْرِ ذِكْرِاللهِ فَإِنَّ كَثْرَةَ الْكَلَامِ بِغَيْرِذِكْرِ اللهِ قَسْوَةٌ لِّلْقَلْبِ. وَإِنَّ أَبْعَدَ النَّاسِ مِنَ اللهِ الْقَلْبُ الْقَاسِيْ” . رَوَاهُ التِّرْمِذِيُّ .

2276. (16) [2/703అపరిశోధితం]

ఇబ్నె ‘ఉమర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”అల్లాహ్ (త) స్మరణ తప్ప అధికంగా మాట్లాడకండి. ఎందుకంటే అల్లాహ్ స్మరణ లేకుండా అధికంగా మాట్లాడితే హృదయం కఠినంగా తయారవుతుంది. హృదయ కాఠిన్యుడు అల్లాహ్ (త) కారుణ్యానికి చాలా దూరంగా ఉంటాడు. [28] (తిర్మిజి’)

2277 – [ 17 ] ( لم تتم دراسته ) (2/703)

وَعَنْ ثَوْبَانَ قَالَ: لَمَّا نَزَلَتْ(وَالَّذِيْنَ يَكْنِزُوْنَ الذَّهَبَ وَالْفِضَّةَ، 9: 34). كُنَّا مَعَ النَّبِيِّ صلى الله عليه وسلم فِيْ بَعْضِ أَسْفَارِهِ فَقَالَ بَعْضُ أَصْحَابِهِ: نَزَلَتْ فِيْ الذَّهَبِ وَالْفِضَّةِ لَوْ عَلِمْنَا أَيُّ الْمَالِ خَيْرٌ فَنَتَّخِذَهُ؟ فَقَالَ: “أَفْضَلُهُ لِسَانٌ ذَاكِرٌ وَقَلْبٌ شَاكِرٌ وَزَوْجَةٌ مُّؤْمِنَةٌ تُعِيْنُهُ عَلَى إِيْمَانِهِ”  .رَوَاهُ أَحْمَدُ وَالتِّرْمِذِيُّ وَابْنُ مَاجَهُ.

2277. (17) [2/703అపరిశోధితం]

సౌ’బాన్‌ (ర) కథనం: ”వల్లజీ’న యక్‌ని’జూన ‘దహబ వల్‌ ఫి’ద్దత” (సూ. అత్-తౌబహ్, 9:34) ఆయత్ అవతరించబడినప్పుడు మేము ప్రవక్త (స) వెంట ప్రయాణంలో ఉన్నాము. అయితే కొందరు అనుచరులు, ”ఈ ఆయత్ వెండి బంగారాల గురించి అవతరించబడిందని, ఒకవేళ మాకు ఎటువంటి ధనసంపదలు ఉత్తమమైనవో తెలిస్తే, వాటినే కూడబెట్టుకుంటాం,” అని అన్నారు. అది విని దైవప్రవక్త (స), ”అన్నిటికంటే ఉత్తమమైన ధనం అల్లాహ్ (త) స్మరణ చేసేనోరు, కృతజ్ఞతా భావంగల హృదయం, విశ్వాస విషయాల్లో భర్తకు సహాయపడే విశ్వాస సతీమణి,” అని ప్రవచించారు. (అ’హ్మద్‌, తిర్మిజి’, ఇబ్నె మాజహ్)

అంటే ఈ మూడు ఉత్తమమైన ధనసంపదలు.

—–

اَلْفَصْلُ الثَّالِثُ మూడవ విభాగం  

2278 – [ 18 ] ( صحيح ) (2/704)

عَنْ أَبِيْ سَعِيْدٍ قَالَ: خَرَجَ مُعَاوِيَةُ عَلَى حَلْقَةٍ فِيْ الْمَسْجِدِ فَقَالَ: مَا أَجْلَسَكُمْ؟ قَالُوْا: جَلَسْنَا نَذْكُرُ اللهَ قَالَ: آللهِ مَا أَجْلَسَكُمْ إِلَّا ذَلِكَ؟ قَالُوْا: آللهِ مَا أَجْلَسَنَا غَيْرُهُ. قَالَ: أَمَا إِنِّيْ لَمْ أَسْتَحْلِفْكُمْ تُهْمَةً لَّكُمْ وَمَا كَانَ أَحَدٌ بِمَنْزِلَتِيْ مَنْ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم أَقَلَّ عَنْهُ حَدِيْثًا مِّنِّيْ وَإِنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم خَرَجَ عَلَى حَلْقَةٍ مِّنْ أَصْحَابِهِ. فَقَالَ: “مَا أَجْلَسَكُمْ هَاهُنَّا؟” قَالُوْا: جَلَسْنَا نَذْكُرُ اللهَ وَنَحْمَدُهُ عَلَى مَا هَدَانَا لِلْإِسْلَامِ وَمَنَّ بِهِ عَلَيْنَا قَالَ: “آاللهِ مَا أَجْلَسَكُمْ إِلَّا ذَلِكَ؟ قَالُوْا: آ اللهِ مَا أَجْلَسَنَا إِلَّا ذَلِكَ قَالَ: “أَمَا إِنِّيْ لَمْ أَسْتَحْلِفْكُمْ تُهْمَةً لَّكُمْ وَلَكِنَّهُ أتَانِيْ جِبْرِيْلُ فَأَخْبَرَنِيْ أَنَّ اللهَ عَزَّ وَجَلَّ يُبَاهِيْ بِكُمُ الْمَلَائِكَةَ”. رَوَاهُ مُسْلِمٌ.

2278. (18) [2/704దృఢం]

అబూ స’యీద్‌ ‘ఖుద్రీ (ర) కథనం: ఒకరోజు ము’ఆవియహ్‌ (ర) ఒక మస్జిద్‌లోనికి వెళ్ళారు. అక్కడ కొంతమంది సమావేశమై ఉండటం చూసి, ‘మీరెందుకు కూర్చున్నారు?’ అని అడిగారు. ‘అల్లాహ్ (త) స్మరణ కోసం సమావేశమయ్యాం,’ అని అన్నారు వారు. ‘అల్లాహ్ (త) సాక్షిగా చెప్పండి. మీరు సమావేశమయింది అందుకోసమేనా?’ అని అడిగారు అతను. అందుకు వారు ‘ఔను, దాని కోసమే మేము సమావేశమయింది,’ అని అన్నారు. అప్పుడు ము’ఆవియహ్‌ ఇలా అన్నారు: ‘నేను మీచేత ప్రమాణం చేయించానంటే, అది మీరు అసత్యం చెబుతున్నారన్న అనుమానంతో కాదు. దైవప్రవక్త (స)కు నాకంటే ఎక్కువ సన్నిహితంగా ఉండి, నాకన్నా తక్కువ ‘హదీసు’లు వివరించిన వారు ఎవరూ లేరు. (వినండి) ఒక సారి దైవప్రవక్త (స) కూడా తన సహచరులు కొంతమంది ఇలాగే సమా వేశమై ఉంటే వారి దగ్గరకు వచ్చి, ”మీరు దేన్ని గురించి కూర్చున్నారు?” అని అడిగారు. దానికి సహచరులు, ”అల్లాహ్ (త)ను స్మరించటానికి, ఆయన మాకు ఇస్లామ్‌ మార్గం చూపి మాకు మహో పకారం చేసినందుకు మేమాయన్ని స్తుతిస్తున్నాం,” అని సమాధానమిచ్చారు. దైవప్రవక్త (స) ”అల్లాహ్ (త) సాక్షిగా చెప్పండి. అందుకోసమేనా మీరు సమావేశమయింది?” అని మళ్ళీ అడిగారు. దానికి వారు ”అల్లాహ్ సాక్షి! అందుకోసమే సమావేశ మయ్యాం” అని  చెప్పారు. అప్పుడతను (స) ఇలా అన్నారు: ”నేను మీ చేత ప్రమాణం చేయించానంటే, మీరు అబద్ధం చెబుతున్నారన్న అనుమానంతో కాదు, జిబ్రీల్‌ వచ్చి నాతో చెప్పారు, ‘అల్లాహ్(త) మీ గురించి తన దూతల ముందు గొప్పగా చెప్పు కుంటున్నాడు,’ ” అని అన్నారు. [29] (ముస్లిమ్)

2279 – [ 19 ] ( لم تتم دراسته ) (2/704)

وَعَنْ عَبْدِ اللهِ بْنِ بُسْرٍ: أَنَّ رَجُلًا قَالَ: يَا رَسُوْلَ اللهِ إِنَّ شَرَائِعَ الْإِسْلَامِ قَدْ كَثُرَتْ عَلَيَّ فَأَخْبَرِنِيْ بِشَيْءٍ أَتَشَبَّثُ بِهِ قَالَ: “لَا يَزَالُ لِسَانُكَ رَطْبًا بِذِكْرِ اللهِ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَابْنُ مَاجَهُ وَقَالَ التِّرْمِذِيُّ: هَذَا حَدِيْثٌ حَسَنٌ غَرِيْبٌ.  

2279. (19) [2/704అపరిశోధితం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ బుస్ర్ (ర) కథనం: దైవప్రవక్త (స) వద్దకు ఒక వ్యక్తి వచ్చి, ”దైవప్రవక్తా! ఇస్లామ్‌ ఆదేశాలు నాకు చాలా ఎక్కువగా అనిపిస్తాయి. కనుక నేను స్థిరంగా ఆచరించదగిన ఆచరణ ఒకటి నాకు తెలపండి,” అని కోరాడు. ప్రవక్త (స), ”నీ నాలుకను ఎల్లప్పుడూ అల్లాహ్ (త) స్మరణలో లీనమై ఉండేటట్లు చూసుకో,” అని ఉపదేశించారు. (తిర్మిజి’ – ప్రామాణికం, ఏకోల్లేఖనం, ఇబ్నె మాజహ్)

2280 – [ 20 ] ( لم تتم دراسته ) (2/704)

وَعَنْ أَبِيْ سَعِيْدٍ: أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم سُئِلَ: أَيُّ الْعِبَادِ أَفْضَلُ وَأَرْفَعُ دَرَجَةً عِنْدَ اللهِ يَوْمَ الْقِيَامَةِ؟ قَالَ: “الذَّاكِرُوْنَ اللهَ كَثِيْرًا وَالذَّاكِرَاتُ” .قِيْلَ: يَا رَسُوْلَ اللهِ وَمَنِ الْغَازِيْ فِيْ سَبِيْلِ اللهِ؟ قَالَ: “لَوْ ضَرَبَ بِسَيْفِهِ فِيْ الْكُفَّارِ وَالْمُشْرِكِيْنَ حَتَّى يَنْكَسِرَ وَيَخْتَضِبَ دَمًا. فَإِنَّ الذَّاكِرَ لِلّهِ أَفْضَلُ مِنْهُ دَرَجَةً”. رَوَاهُ أَحْمَدُ وَالتِّرْمِذِيُّ. وَقَالَ التِّرْمِذِيُّ: هَذَا حَدِيْثٌ حَسَنٌ غَرِيْبٌ.

2280. (20) [2/704అపరిశోధితం]

అబూ స’యీద్‌ (ర) కథనం: ప్రవక్త (స)ను, ‘తీర్పు దినం నాడు ఎవరి స్థానం అందరికంటే ఉన్నతంగా ఉంటుంది?’ అని ప్రశ్నించడం జరిగింది. ప్రవక్త (స), ‘అల్లాహ్‌ (త)ను  స్మరించే స్త్రీ పురుషులు,’ అని అన్నారు. ఆ తరువాత మళ్ళీ, ‘అల్లాహ్(త) స్మరణ చేసేవారు అల్లాహ్(త) మార్గంలో జిహాద్‌ చేసేవారి కంటే ఉత్తములా?’ అని ప్రశ్నించడం జరిగింది. దానికి ప్రవక్త (స), ‘ఒకవేళ తన కరవాలంతో అవిశ్వాసులతో, విగ్రహారాధకులతో యుద్ధం చేసి చివరికి అతని కరవాలం విరిగిపోయి, తాను కూడా రక్తసిక్తం అయిన, అంటే అమరగతి పొందిన ముజాహిద్‌ కంటే అల్లాహ్ (త) స్మరణ చేసేవారు ఉత్తములు,’ అని అన్నారు. (అ’హ్మద్‌, తిర్మిజి’ – ప్రామాణికం – ఏకోల్లేఖనం)

2281 – [ 21 ] ( لم تتم دراسته ) (2/705)

وَعَنِ ابْنِ عَبَّاسٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “اَلشَّيْطَانُ جَاثِمٌ عَلَى قَلْبِ ابْنِ آدَمَ. فَإِذَا ذَكَرَ اللهَ خَنَسَ وَإِذَا غَفَلَ وَسْوَسَ” .رَوَاهُ الْبُخَارِيُّ تَعْلِيْقًا.

2281. (21) [2/705అపరిశోధితం]

ఇబ్నె ‘అబ్బాస్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”షై’తాన్‌ మానవుని హృదయానికి అతుక్కుని ఆక్రమించుకుని కూర్చొని ఉంటాడు. అతడు అల్లాహ్ (త) స్మరణ చేసినపుడు వెనక్కి తగ్గుతాడు. మళ్ళీ ఏమరుపాటుకు గురైన వెంటనే మనసులో దురాలోచనలు రేకెత్తిస్తాడు.

బు’ఖారీ దీన్ని ఎటువంటి ఆధారాలు లేకుండా ఉల్లేఖించారు.

2282 – [ 22 ] ( لم تتم دراسته ) (2/705)

وَعَنْ مَالِكٍ قَالَ: بَلَغَنِيْ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم كَانَ يَقُوْلُ: “ذَاكِرُ اللهِ فِيْ الْغَافِلِيْنَ كَالْمُقَاتِلِ خَلْفَ الْفَارِّيْنَ وَذَاكِرُ اللهَ فِيْ الْغَافِلِيْنَ كَغُصْنٍ أَخْضَرَ فِيْ شَجَرٍ يَابِسٍ”.

2282. (22) [2/705అపరిశోధితం]

ఇమామ్‌ మాలిక్‌ (ర) కథనం: నాకు ఇలా తెలిసింది, ”ప్రవక్త (స) ఇలా ప్రవచించేవారు, ‘అశ్రద్ధ, ఏమరు పాటుకు గురైనవారిలో, అల్లాహ్(త) ధ్యానం చేసేవాడు అల్లాహ్ (త) మార్గంలో పోరాడుతూ అందరూ పారిపోయినా తానొక్కడే స్థిరంగా ఉండి పోరాడే ముజాహిద్‌ వంటివాడు. అదేవిధంగా శ్రద్ధలేని వారిలో అల్లాహ్ (త) స్మరణ చేసేవారికి చాలా ప్రాధాన్యత ఉంది. ఏమరుపాటుకు గురైనవారిలో అల్లాహ్ (త) స్మరణ చేసేవారు ఎండిన చెట్టుకు పచ్చ కొమ్మ వంటి వాడు.”

2283 – [ 23 ] ( لم تتم دراسته ) (2/705)

وَفِيْ رِوَايَةٍ: “مِثْلَ الشَّجَرَةِ الْخَضْرَاءِ فِيْ وَسَطِ الشَّجَرِوَذَاكِرُ اللهَ فِيْ الْغَافِلِيْنَ مِثْلَ مِصْبَاحٍ فِيْ بَيْتٍ مُظْلِمٍ وَذَاكِرُ اللهَ فِيْ الْغَافِلِيْنَ يُرِيْهِ اللهُ مَقْعَدَهُ مِنَ الْجَنَّةِ وَهُوَ حَيُّ وَذَاكِرُاللهَ فِيْ الْغَافِلِيْنَ يُغْفَرُ لَهُ بِعَدَدٍ كُلِّ فَصِيْحٍ وَأَعْجَمَ” .وَالْفَصِيْحُ: بَنُوْ آدَمَ وَالْأَعْجَمُ: اَلْبَهَائِمُ. رَوَاهُ رَزِيْنٌ.

2283. (23) [2/705అపరిశోధితం]

కొన్ని ఉల్లేఖనాల్లో ఇలా ఉంది, ”అల్లాహ్(త) స్మరణ చేసేవాడు ఎండిన చెట్లలో పచ్చని చెట్టువంటి వాడు. ఏమరుపాటుకు గురైనవారిలో అల్లాహ్(త) స్మరణ చేసేవారు చీకటి గదిలో దీపం వంటివారు. ఏమరుపాటుకు గురైనవారిలో అల్లాహ్(త) ధ్యానం చేసేవారికి అల్లాహ్‌ (త) ప్రాపంచిక జీవితంలోనే స్వర్గంలోని అతని నివాసాన్ని చూపెడతాడు. ఏమరుపాటుకు గురైన వారిలో అల్లాహ్(త) స్మరణ చేసే వారిని క్షమించుతాడు. ఇంకా అతని పాపాలను మానవులు మరియు జంతువుల సంఖ్యకు సమానంగా ఉన్నా క్షమించుతాడు. అంటే ప్రపంచం లోని మానవులు, జంతువుల సంఖ్యకు సమానంగా అతడి పాపాలు ఉన్నా క్షమించ బడతాయి. (ర’జీన్‌)

అంటే పాపాలు ఎన్నిఉన్నా క్షమించబడతాయి.

ఫసీహున్ అంటే మానవులు, అజమ్ అంటే జంతువులు.

2284 – [ 24 ] ( لم تتم دراسته ) (2/705)

وَعَنْ مُعَاذِ بْنِ جَبَلٍ قَالَ: مَا عَمِلَ الْعَبْدُ عَمَلًا أَنْجَى لَهُ مِنْ عَذَابِ اللهِ مِنْ ذِكْرِ اللهِ. رَوَاهُ مَالِكٌ وَالتِّرْمِذِيُّ وَابْنُ مَاجَهُ.

2284. (24) [2/705అపరిశోధితం]

ము’ఆజ్‌’ బిన్‌ జబల్‌ (ర) ”దాసుడు చేసే ఆచరణల్లో అల్లాహ్ (త) ధ్యానం తప్ప ఉత్తమమైనదీ, అల్లాహ్ (త) శిక్ష నుంచి రక్షించేదీ మరేదీ లేదు,’ అని అనే వారు. (మాలిక్‌, తిర్మిజి’, ఇబ్నె మాజహ్)

అంటే అల్లాహ్(త) ధ్యానం ఆచరణలన్నిటిలో ఉత్తమమైనదీ, అల్లాహ్ శిక్ష నుండి రక్షించేదీనూ.

2285 – [ 25 ] ( صحيح ) (2/705)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِنَّ اللهَ تَعَالى يَقُوْلُ: أَنَا مَعَ عَبْدِيْ إِذَا ذَكَرَنِيْ وَتَحَرَّكَتْ بِيْ شَفَتَاهُ”. رَوَاهُ الْبُخَارِيُّ.

2285. (25) [2/705దృఢం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త ప్రవచనం, అల్లాహ్‌(త) ఆదేశం, ”నా దాసుడు నన్ను స్మరించి నపుడు, నా ధ్యానంలో అతని పెదాలు కదులు తున్నప్పుడు నేను అతనితో ఉంటాను.” (బు’ఖారీ)

2286 – [ 26 ] ( لم تتم دراسته ) (2/705)

وَعَنْ عَبْدِ اللهِ بْنِ عُمَرَعَنِ النَّبِيِّ صلى الله عليه وسلم أَنَّهُ كَانَ يَقُوْلُ: “لِكُلِّ شَيْءٍ صَقَالَةٌ وَصَقَالَةُ الْقُلُوْبِ ذِكْرُ اللهِ وَمَا مِنْ شَيْءٍ أَنْجَى مِنْ عَذَابِ اللهِ مِنْ ذِكْرِاللهِ”.قَالُوْا: وَلَا الْجِهَادُ فِيْ سَبِيْلِ اللهِ؟ قَالَ: “وَلَا أَنْ يَّضْرِبَ بِسَيْفِهِ حَتَّى يَنْقَطِعَ” .رَوَاهُ الْبَيْهَقِيُّ فِيْ الدَّعْوَاتِ الْكَبِيْرِ.

2286. (26) [2/705అపరిశోధితం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘ఉమర్‌ (ర) కథనం: ప్రవక్త (స) , ”ప్రతి వస్తువుకు పరిశుద్ధత, పరిశుభ్రత ఉంది. హృదయ పరిశుభ్రత అల్లాహ్(త) స్మరణలో ఉంది . అల్లాహ్ (త) శిక్ష నుండి రక్షించుకొనటానికి, అల్లాహ్ (త) స్మరణ కంటే ఉత్తమమైంది మరొకటి లేదు,” అని అన్నారు. అక్కడ ఉన్నవారు, ”అల్లాహ్ (త) మార్గంలో జిహాద్‌ చేయడం కూడా కాదా?” అని విన్నవించుకున్నారు. ప్రవక్త (స), కాదు ”ఒకవేళ జిహాద్‌ చేసేవాడి కరవాలం జిహాద్‌ చేస్తూ విరిగి పోయినా, దైవస్మరణ కంటే గొప్పది కాజాలదు,” అని అన్నారు. [30] (బైహఖీ-ద’అవాతిల్ కబీర్)

=====

2- بَابُ أَسْمَاءِ اللهِ تَعَالى

2. అల్లాహ్‌ () ఉత్తమ పేర్లు

అల్లాహ్‌ (త) యొక్క ప్రధానమైన పేరు అల్లాహ్‌. మిగతా వన్నీ గుణగణాల ఆధారంగా న్న పేర్లే. అల్లాహ్‌ (త) ఖుర్‌ఆన్‌లో ఇలా ఆదేశించాడు, వారితో ఇలా అను, ”…మీరు ఆయనను, అల్లాహ్‌! అని పిల వండి, లేదా అనంత కరుణామయుడు (అర్ర’హ్మాన్‌)! అని పిలువండి, మీరు ఆయనను ఏ పేరుతోనైనా పిలవండి, ఆయనకున్న పేర్లన్నీ అత్యుత్తమ మైనవే…” (సూ. బనీ ఇస్రాయీల్, 17:110)

—–

اَلْفَصْلُ الْأَوَّلُ మొదటి విభాగం 

2287 – [ 1 ] ( متفق عليه ) (2/707)

عَنْ أَبِيْ هُرَيْرَةَ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِنَّ لِلّهِ تَعَالى تِسْعَةً وَّتِسْعِيْنَ اِسْمًا مِائَةً إِلَّا وَاحِدة، مَنْ أَحْصَاهَا دَخَلَ الْجَنَّةَ” .وَفِيْ رِوَايَةٍ: “وَهُوَ وِتْرٌ يُحِبُّ الْوِتْرَ”.

2287. (1) [2/707ఏకీభవితం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, అల్లాహ్‌(త)కు 99 పేర్లు ఉన్నాయి. అంటే 100కి 1 తక్కువ. వీటిని కంఠస్తం చేసి స్మరించే వ్యక్తి స్వర్గంలో ప్రవేశిస్తాడు. మరో ఉల్లేఖనలో ఇలా ఉంది, ”అల్లాహ్‌ (త) ఒక్కడు. ఆయనకు జతగాడు ఎవడూ లేడు. ఆయన బేసి సంఖ్యనే ఇష్టపడతాడు.” (బు’ఖారీ, ముస్లిమ్‌)

—–

اَلْفَصْلُ الثاني  రెండవ విభాగం 

2288 – [ 2 ] ( ضعيف ) (2/707)

عَنْ أَبِيْ هُرَيْرَةَ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِنَّ لِلّهِ تَعَالى تِسْعَةً وَّتِسْعِيْنَ اِسْمًا مَنْ أَحْصَاهَا دَخَل الْجَنَّةَ. هُوَ اللهُ الَّذِيْ لَا إِلَهَ هُوَ، الرَّحْمنُ، الرَّحِيْمُ، الْمَلِكُ، الْقُدُّوْسُ، السَّلَامُ، الْمُؤْمِنُ، الْمُهَيْمِنُ، الْعَزِيْز،ُالْجَبَّارُ، الْمُتَكَبِّرُ، الْخَالِقُ، الْبَارِئُ، الْمُصَوِّرُ، الْغَفَّارُ، الْقَهَّارُ، الْوَهَّابُ، الرّزَّاقُ، الْفتَّاحُ، الْعَلِيْمُ، الْقَابِضُ، الْبَاسِطُ، الْخَافِضُ، الرَّافِعُ، الْمُعِزُّ، الْمُذِلُّ، السَّمِيْعُ، الْبَصِيْرُ، الْحَكَمُ، الْعَدْلُ، اللَّطِيْفُ، الْخَبِيْرُ، الْحَلِيْمُ، الْعَظِيْمُ، الْغَفُوْرُ، الشَّكُوْرُ، الْعَلِيُّ، الْكَبِيْرُ، الْحَفِيْظُ، الْمُقِيْتُ، الْحَسِيْبُ، الْجَلِيْلُ، الْكَرِيْمُ، الرَّقِيْبُ، الْمُجِيْبُ، الْوَاسِعُ، الْحَكِيْمُ، الْوَدُوْدُ، الْمَجِيْدُ، الْبَاعِثُ، الشَّهِيْدُ، الْحَقُّ، الْوَكِيْلُ، الْقَوِيُّ، الْمَتِيْنُ، الْوَلِيُّ، الْحَمِيْدُ، الْمُحْصِيْ، الْمُبْدِئُ، الْمُعِيْدُ، الْمُحْيِي، الْمُمِيْتُ، الْحَيُّ، الْقَيُّوْمُ، الْوَاجِدُ، الْمَاجِدُ، الْوَاحِدُ (الْأَحْدُ)، الصَّمَدُ، الْقَادِرُ، الْمُقْتَدِرُ، الْمُقَدِّمُ، الْمُؤَخِّرُ، الْأَوَّلُ، الْآخِرُ، الظَّاهِرُ، الْبَاطِنُ، الْوَالِيُّ، الْمُتَعاَلِيْ، الْبَرُّ، التَّوَّابُ، الْمُنْتَقِمُ، الْعَفُوُّ، الرَّؤُوْفُ، مَالِكُ الْمُلْكِ، ذُو الْجَلَالِ وَالْإِكْرَامِ، الْمُقْسِطُ، الْجَامِعُ، الْغَنِيُّ، الْمُغْنِيُّ، الْمَانِعُ، الضَّارُّ، النَّافِعُ، النُّوْرُ، الْهَادِيْ، الْبَدِيْعُ، الْبَاقِيْ، الْوَارِثُ، الرَّشِيْدُ، الصَّبُوْرُ”.  رَوَاهُ التِّرْمِذِيُّ وَالْبَيْهَقِيُّ فِيْ الدَّعْوَاتِ الْكَبِيْرِ. وَقَالَ التِّرْمِذِيُّ : هَذَا حَدِيْثٌ غَرِيْبٌ .

2288. (2) [2/707బలహీనం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ”అల్లాహ్‌ (త)కు 99 పేర్లు ఉన్నాయని’ ప్రవచించారు. వాటిని పఠించినవాడు స్వర్గంలోనికి ప్రవేశిస్తాడు. ఆయనే 1. అల్లాహ్‌ ఆయన తప్ప ఆరాధనకు అర్హులు ఎవ్వరూ లేరు. 2. అనంత కరుణామయుడు, 3. అపార కరుణా ప్రదాత, 4. సార్వభౌముడు, 5. పరమ పవిత్రుడు, 6. శాంతిమయుడు, 7. శాంతిప్రదాత, 8. జాగరూకుడు, 9. సర్వశక్తిమంతుడు, 10. నిరంకుశుడు, 11. గొప్ప వాడు, 12. సర్వసృష్టికర్త, 13. విశ్వనిర్మాత, 14. రూపమిచ్చేవాడు, 15. క్షమాశీలుడు, 16. ప్రబలుడు, 17. సర్వప్రదుడు, 18. ఉపాధిప్రదాత, 19. తీర్పు చేసేవాడు,  20. సర్వజ్ఞుడు, 21. వశపరుచుకునే వాడు, 22. విస్తరింపజేసేవాడు, 23. లొంగదీసే వాడు, 24. పైకెత్తేవాడు, 25. గౌరవప్రదాత, 26. అవమానం పాలు చేయగలవాడు, 27. సర్వశ్రవణ సమర్థుడు, 28. సర్వదృష్టికర్త, 29. విశ్వన్యాధిపతి, 30. న్యాయ శీలుడు, 31. సూక్ష్మగ్రాహి, 32. సర్వపరిచితుడు, 33. శాంత స్వభావుడు, 34. సర్వోత్తముడు, 35. క్షమించే వాడు, 36. ప్రతిఫలమిచ్చేవాడు, 37. మహోన్నతుడు, 38. మహానీయుడు, 39. పర్య వేక్షకుడు, 40. శరణ మిచ్చేవాడు, 41. పరిగణించే వాడు, 42. ఔన్న త్యుడు, 43. గౌరవనీయుడు, 44. కాచువాడు, 45. జవాబిచ్చేవాడు, 46. విస్తారుడు, 47. మహా వివేక వంతుడు, 48. వాత్సల్యుడు, 49. మహత్వుడు, 50. పునరుత్థరింపజేసేవాడు, 51. సర్వసాక్షి, 52. పరమ సత్యం, 53. కార్యకర్త, 54. మహా బలవంతుడు, 55. స్థ్రైర్యవంతుడు, 56. సర్వపోషకుడు, 57. ప్రశంస నీయుడు, 58. సర్వ గ్రాహిణి, 59. ప్రభవింపజేసేవాడు, 60. తిరిగి ఉనికిలోకి తెచ్చేవాడు,  61. జీవనమిచ్చే వాడు, 62. మరణ మిచ్చే వాడు, 63. సజీవుడు, 64. శాశ్వితుడు, 65. అధిపతి, 66. దాతృత్వుడు,  67. అద్వితీయుడు (ఏకైకుడు), 68. నిరపేక్షాపరుడు, 69. సర్వసమర్థుడు, 70. సర్వాధికుడు, 71. ముందుగా తేగలవాడు, 72. వ్వధినిచ్చేవాడు, 73. ప్థథముడు, 74. అంతిముడు, 75. ప్రత్యక్షుడు, 76. గుప్తుడు, 77. ఆశ్రయుడు, 78. సర్వోన్నతుడు, 79. కృపాళువు, 80. పశ్చాత్తాపం అంగీకరించేవాడు, 81. ప్రతీకారం చేయగలవాడు, 82. మన్నించేవాడు, 83. కనికరుడు, 84. విశ్వసామ్రాట్టు, 85. గౌరవనీయుడు, 86. నిశ్పక్ష పాతుడు, 87. సమావేశపరచేవాడు, 88. స్వయం సమృద్ధుడు, 89. భాగ్యదాత, 90. నిషేధించేవాడు, 91. హాని చేయగలవాడు, 92. మేలుచేసే వాడు, 93. విశ్వజ్యోతి, 94. మార్గదర్శకుడు, 95. ఆరంభకుడు, 96. నిత్యుడు, 97. వారసుడు, 98. సన్మార్గగామిని, 99. సహన శీలుడు. [31] (తిర్మిజి’ – ఏకోల్లేఖనం,  బైహఖీ – ద్ద’అవాతుల్ కబీర్)

2289 – [ 3 ] ( صحيح ) (2/708)

وَعَنْ بُرَيْدَةَ: أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم سَمِعَ رَجُلًا يَقُوْلُ: “اَللّهُمَّ  إِنِّيْ أَسْأَلُكَ بِأَنَّكَ أَنْتَ اللهُ لَا إِلَهَ إِلَّا أَنْتَ الْأَحَدُ الصَّمَدُ الَّذِيْ لَمْ يَلِدْ وَلَمْ يُوْلَدْ وَلَمْ يَكُنْ لَهُ كُفْوًا أَحَدٌ”. فَقَالَ: “دَعَا اللهَ بِاسْمِهِ الْأَعْظَمِ الَّذِيْ إِذَا سُئِلَ بِهِ أَعْطَى وَإِذاَ دُعِيَ بِهِ أَجَابَ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَأَبُوْ دَاوُدَ.

2289. (3) [2/708దృఢం]

బురైదహ్ (ర) కథనం: ప్రవక్త (స) ఒక వ్యక్తిని ఈ దు’ఆ పఠిస్తూ ఉండగా విని అతడు అల్లాహ్‌ (త) గొప్ప నామము ద్వారా అర్థించాడు. అల్లాహ్‌(త) గొప్పపేరుతో అర్థిస్తే, అల్లాహ్‌ (త) తప్పకుండా స్వీకరిస్తాడు. ఆ దు’ఆ ఇది. ”అల్లాహుమ్మ ఇన్నీ అస్అలుక, బిఅన్నక అన్ ల్లాహు లా లాహ ఇల్లా అంతల్హదు స్సమదు అల్లజీ లమ్యలిద్వలమ్యూలద్వలమ్యకుల్లహు కుఫువన్హద్‌.” — ‘అల్లాహ్ , నేను నిన్ను మాత్రమే అర్థిస్తున్నాను. ఎందకంటే నువ్వు మాత్రమే ఆరాధ్యుడవు. నీవు ఒక్కడవు తప్ప మరెవ్వరు ఆరాధ్యులు కారు. నీవు ఎలాంటి అక్కరలు లేని వాడవు. నీకు సంతానం లేదు. నీవు కూడా ఎవరి సంతానం కాదు. నీకు సాటి, సమానం ఎవరూ లేరు. (తిర్మిజి’, అబూ దావూద్‌)

2290 – [ 4 ] ( صحيح ) (2/708)

وَعَنْ أَنَسٍ قَالَ: كُنْتُ جَالِسًا مَعَ النَّبِيِّ صلى الله عليه وسلم فِيْ الْمَسْجِدِ وَرَجُلُ يُصَلِّيْ فَقَالَ:اَللّهُمَّ إِنِّيْ أَسْأَلُكَ بِأَنَّ لَكَ الْحَمْدُ لَا إِلَهَ إِلَّا أَنْتَ الْحَنَّانُ الْمَنَّانُ بَدِيْعُ السَّمَاوَاتِ وَالْأَرْضِ يَا ذَا الْجَلَالِ وَالْإِكْرَامِ يَاحَيُّ يَا قَيُّوْمُ أَسْأَلُكَ”. فَقَالَ النَّبِيُّ صلى الله عليه وسلم: “دَعَا اللهُ بِاسْمِهِ الْأَعْظَمِ  الَّذِيْ إِذَا دُعِيَ بِهِ أَجَابَ وَإِذَا سُئِلَ بِهِ أَعْطَى”. رَوَاهُ التِّرْمِذِيُّ وَأَبُوْ دَاوُدَ وَالنَّسَائِيُّ وَابْنُ مَاجَهُ.

2290. (4) [2/708దృఢం]

అనస్‌ (ర) కథనం: నేను ప్రవక్త (స) తో కలసి మస్జిద్‌లో కూర్చున్నాను. ఆ సమయంలో ఒక వ్యక్తి నమా’జు చదువుతున్నాడు. ఆ వ్యక్తి ఇలా దు’ఆ  పఠించాడు. ”అల్లాహుమ్మ ఇన్ని అస్అలుక బిఅన్న లకల్‌’హమ్దు లా ఇలాహ ఇల్లా అం ల్‌ ‘హన్నానుల్మన్నాను దీ స్సమావాతి వల్అర్‌’ది యా జుల్లాలి వల్ఇక్రామ్యాహయ్యు యా ఖయ్యూము అస్ అలుక” – ‘ఓ అల్లాహ్‌ నేను నిన్నే అర్థిస్తున్నాను. ఎందుకంటే స్తోత్రాలన్నీ నీ కొరకే, నీవు తప్ప ఆరాధ్యులెవరూ లేరు. నీవు చాలా దయామయుడవు, ఉపకారం చేసే వాడవు, భూమ్యాకాశాలను సృష్టించేవాడవు, గౌరవం, ఘనత గలవాడవు, ఓ నిత్యం సజీవంగా ఉండేవాడా! పరిరక్షించే వాడా! నిన్నే అర్థిస్తున్నాను,’ ఇది విని ప్రవక్త (స) ఇలా ప్రవచించారు, ”ఇతడు అల్లాహ్‌ను ఆయన అన్నిటి కంటే గొప్ప పేరుతో దు’ఆ చేసాడు, దీని ద్వారా దు’ఆ చేస్తే, అది తప్పకుండా స్వీకరించబడుతుంది. దీని తర్వాత ఏది కోరినా తప్పకుండా అది ఇవ్వబడుతుంది,” అని అన్నారు.[32](తిర్మిజి’, అబూ దావూద్‌, నసాయి’, ఇబ్నె మాజహ్)

2291 – [ 5 ] ( لم تتم دراسته ) (2/709)

وَعَنْ أَسْمَاءِ بِنْتِ يَزِيْدَ رَضِيَ اللهُ عَنْهَا. أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم قَالَ: “اسْمُ اللهِ الْأَعْظَمُ فِيْ هَاتَيْنِ الْآيَتَيْنِ: (وَإِلَهُكُمْ إِلَهٌ وَّاحِدٌ لَا إِلَهَ إِلَّا هُوَ الرّحْمنُ الرَّحِيْمُ، 2: 163) وَفَاتِحَةِ (آلِ عِمْرَانَ): (الم اللهُ لَا إِلَهَ إِلَّا هُوَ الْحَيُّ الْقَيُّوْمُ، 3: 1-2). رَوَاهُ التِّرْمِذِيُّ وَأَبُوْ دَاوُدَ وَابْنُ مَاجَهُ وَالدَّارَمِيُّ.

2291. (5) [2/709అపరిశోధితం]

అస్మా’ బిన్తె య’జీద్‌ (ర) కథనం: ప్రవక్త (స) అల్లాహ్‌(త)కు చెందిన అన్నిటికంటే గొప్ప పేరు ఈ రెండు వాక్యాల్లో ఉంది అని ప్రవచించారు, ఇలాహుకుమ్ఇలాహున్వాహిదున్లా ఇలాహ ఇల్లా హు ర్రహ్మాను ర్రహీమ్‌,” మరొకటి ఆలి ‘ఇమ్రాన్‌ సూరహ్‌ ప్రారంభంలో ”అలిఫ్లామ్మీమ్అల్లాహు లా ఇలాహ ఇల్లా హువల్హయ్యుల్ఖయ్యూమ్, ” — ‘మీ ఆరాధ్యుడు ఒకే ఆరాధ్యుడు, ఆయన తప్ప ఆరాధనకు ఎవ్వరూ అర్హులు కారు. ఆయన అనంత కరుణామయుడు, అపార కరుణాప్రదాత. అలిఫ్‌ లామ్‌ మీమ్‌ అల్లాహ్‌ ఆయన తప్ప ఎవ్వరూ ఆరాధ్యులు కారు, ఆయన నిత్యడు, సజీవుడు, నిరంతరం ఆదుకునే వాడు.’ [33] (తిర్మిజి’, అబూ దావూద్‌, ఇబ్నె మాజహ్, దారమి)

2292 – [ 6 ] ( لم تتم دراسته ) (2/709)

وَعَنْ سَعْدٍ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: دَعْوَةُ ذِيْ النُّوْنِ إِذَا دَعَا رَبَّهُ وَهُوَ فِيْ بَطْنِ الْحُوْتِ (لَا إِلَهَ إِلَّا أَنْتَ سُبْحَانَكَ إِنِّيْ كُنْتُ مِنَ الظَّالِمِيْنَ، 21: 87) لَمْ يَدْعُ بِهَا رَجُلٌ مُّسْلِمٌ فِيْ شَيْءٍ إِلَّا اسْتَجَابَ لَهُ” .رَوَاهُ أَحْمَدُ وَالتِّرْمِذِيُّ.

2292. (6) [2/709అపరిశోధితం]

స’అద్‌ (ర) కథనం: ”ప్రవక్త (స) ఇలా ప్రవచించారు, ”చేపలవాడు చేప కడుపులో తన ప్రభువుతో చేసిన దు’ఆ ఇది, ”లా ఇలాహ ఇల్లాఅన్ సుబ్హానక ఇన్నీ కున్తు మినజ్జాలిమీన్‌.” – ‘… వాస్తవానికి నీవు (అల్లాహ్) తప్ప మరొక ఆరాధ్యదేవుడు లేడు. నీవు సర్వలోపాలకు అతీతుడవు. నిశ్చయంగా నేనే అపరాధులలోని వాడను.’ (సూ. అల్ అంబియా’, 21:87) విశ్వాసుల్లో ఎవరైనా ఏదైనా ప్రత్యేక అవసరం కోసం ఈ దు’ఆ చేస్తే అల్లాహ్‌ (త) అతని దు’ఆను స్వీకరిస్తాడు. [34] (అ’హ్మద్‌, తిర్మిజి’)

—–

اَلْفَصْلُ الثَّالِثُ  మూడవ విభాగం  

2293 – [ 7 ] ( لم تتم دراسته ) (2/709)

عَنْ بُرَيْدَةَ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: دَخَلْتُ مَعَ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم الْمَسْجِدَ عِشَاءً فَإِذَا رَجُلٌ يَّقْرَأُ وَيَرْفَعُ صَوْتَهُ فَقُلْتُ: يَا رَسُوْلَ اللهِ أَتَقُوْلُ: هَذَا مُرَاءٍ؟ قَالَ: “بَلْ مُؤْمِنٌ مُّنِيْبٌ” قَالَ: وَأَبُوْ مُوْسَى الْأَشْعَرِيُّ يَقْرَأُ وَيَرْفَعُ صَوْتَهُ فَجَعَلَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم يَتَسَمَّعُ لِقَرَاءَتِهِ ثُمَّ جَلَسَ أَبُوْ مُوْسَى يَدْعُوْ فَقَالَ: اَللّهُمَّ إِنِّيْ أُشْهِدُكَ أَنَّكَ أَنْتَ اللهُ لَا إِلَهَ إِلَّا أَنْتَ أَحَدًا صَمَدًا لَمْ يَلِدْ وَلَمْ يُوْلَدْ وَلَمْ يَكُنْ لَهُ كُفُوًا أَحَدٌ .فَقَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَقَدْ سَأَلَ اللهَ بِاسْمِهِ الَّذِيْ إِذَا سُئِلَ بِهِ أَعْطَى وَإِذَا دُعِيَ بِهِ أَجَابَ” .قُلْتُ: يَا رَسُوْلَ اللهِ أُخْبِرُهُ بِمَا سَمِعْتُ مِنْكَ؟ قَالَ: “نَعَمْ”. فَأَخْبَرْتُهُ بَقُوْلُ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم. فَقَالَ لِيْ: أَنْتَ الْيَوْمَ لِيْ أَخٌ صَدِيْقٌ حَدّثَتْنِيْ بِحَدِيْثِ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم. رَوَاهُ رَزِيْنٌ.

2293 . (7) [2/709అపరిశోధితం]

బురైదహ్ (ర) కథనం: ప్రవక్త (స) వెంట నేను ‘ఇషా’ సమయంలో మస్జిద్‌లోనికి ప్రవేశించాను. ఒక వ్యక్తి బిగ్గరగా ఖుర్‌ఆన్‌ పఠిస్తున్నాడు. అప్పుడు నేను, ‘ఓ అల్లాహ్‌ ప్రవక్తా! ఇతన్ని కపటకారి అనవచ్చునా?’ అని విన్నవించుకున్నాను. దానికి ప్రవక్త (స), ‘కాదు, ఇతడు విశ్వసనీయుడు, మరలేవాడు, దైవస్తోత్రం చేసేవాడు,’ అని అన్నారు.

బురైదహ్ (ర) కథనం, ”అబూ మూసా అష్‌’అరీ ఖుర్‌ఆన్‌ బిగ్గరగా చదువుతున్నారు. ప్రవక్త (స) చెవియొగ్గి శ్రద్ధగా వింటున్నారు. ఆ తరువాత అబూ మూసా (ర) కూర్చొని ఈ దు’ఆ చదవసాగారు. ”అల్లాహుమ్మ ఇన్నీ ఉష్హిదుక అన్నక అంతల్లాహు లాఇలాహ ఇల్లా అం హద్ స్సమద్ లమ్యలిద్వలమ్యూలద్వలమ్యకుల్లహు ఫఫువన్హద్.” – ‘ఓ అల్లాహ్‌! నీవే వాస్తవ ఆరాధ్యుడవు, నీవు తప్ప ఆరాధ్యులెవరూ లేరు, నీవు ఒక్కడివి, నీవు అక్కర లేనివాడవు, నిన్ను ఎవరూ కనలేదనిలేదు, నీ ద్వారా ఎవరూ పుట్టలేదు, నీకు ఎవరూ సాటిలేరు, అని నేను నిన్ను సాక్ష్యంగా నిలబెడుతున్నాను.” ప్రవక్త (స) ఈ దు’ఆ విని ఇతను అల్లాహ్‌(త) పేరు ద్వారా అర్థించాడు. ‘దీని ద్వారా అర్థించబడినప్పుడల్లా ఇస్తాడు. ఇంకా దు’ఆ చేస్తే స్వీకరిస్తాడు,’ అని అన్నారు. దానికి నేను, ”ఓ అల్లాహ్‌ ప్రవక్తా! ఇప్పుడు మీ ద్వారా నేను విన్నది అబూ మూసాకు తెలియపరచనా,” అని విన్న వించుకున్నాను. దానికి ప్రవక్త (స), ‘అవును,’ అని అన్న పిదప నేను అబూ మూసాకు ప్రవక్త (స) యొక్క ఈ ‘హదీసు’ను వినిపించాను. అప్పుడు అబూ మూసా, ”మీరు ఈ నాటి నుండి నా సోదరులు. ఎందు కంటే, మీరు ప్రవక్త (స) ‘హదీసు’ను నాకు వినిపించారు” అని అన్నారు. (ర’జీన్‌)

=====

3 بَابُ ثَوَابُ التَّسْبِيْحِ وَالتَّحْمِيْدِ  وَالتَّهْلِيْلِ وَالتَّكْبِيْرِ

3. తస్‌’బీహ్‌, హ్మీద్‌, తహ్లీల్‌, తక్బీర్ ప్రతిఫలం

اَلْفَصْلُ الْأَوَّلُ   మొదటి విభాగం 

2294 – [ 1 ] ( صحيح ) (2/711)

عَنْ سَمُرَةَ بْنِ جُنْدُبٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “أَفْضَلُ الْكَلَامِ أَرْبَعٌ: سُبْحَانَ اللهِ وَالْحَمْدُ لِلّهِ وَلَا إِلَهَ إِلَّا اللهُ وَاللهُ أَكْبَرُ”.

وَفِيْ رِوَايَةٍ: “أَحَبُّ الْكَلَامِ إِلَى اللهِ أَرْبَعٌ : “سُبْحَانَ اللهِ وَالْحَمْدُ لِلّهِ وَلَا إِلَهَ إِلَّا اللهُ وَاللهُ أَكْبَرُ”. لَا يَضُرُّكَ بِأَيِّهِنَّ بَدَأْتَ”   .رَوَاهُ مُسْلِمٌ.

2294. (1) [2/711దృఢం]

సమురహ్ బిన్‌ జున్‌దుబ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం:

”వచనాలన్నిటిలో నాలుగు వచనాలు ఉత్తమ మైనవి. 1. సుబ్‌’హానల్లాహ్‌, 2. వల్ హమ్దు లిల్లాహ్, 3. లా ఇలాహ ఇల్లల్లాహ్‌, 4. ల్లాహు అక్బర్‌. మరో ఉల్లేఖనంలో ఇలా ఉంది, ”వచనా లన్ని టిలో అల్లాహ్‌(త)కు ప్రీతికరమైన వచనాలు, 1. సుబ్‌ ‘హానల్లాహ్‌, 2.వల్‌’హమ్‌దు లిల్లాహ్‌, 3. వలా ఇలా హ ఇల్లల్లాహ్‌, 4. వల్లాహు అక్బర్‌. వీటిలో దేన్ని ముందు పఠించినా ఎలాంటి అభ్యంతరం లేదు. [35] (ముస్లిమ్‌)

2295 – [ 2 ] ( صحيح ) (2/711)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَأَنْ أَقُوْلُ: سُبْحَانَ اللهِ وَالْحَمْدُ لِلّهِ وَلَا إِلَهَ إِلَّا اللهُ وَاللهُ أَكْبَرُ أَحَبُّ إِلَيَّ مِمَّا طَلَعَتْ عَلَيْهِ الشَّمْسُ”. رَوَاهُ مُسْلِمٌ .

2295. (2) [2/711దృఢం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”సుబ్‌’హానల్లాహి, వల్‌’హమ్‌దులిల్లాహి, వలా ఇలాహ ఇల్లల్లాహు వల్లాహు అక్బర్‌ అని పలకటం నాకు సూర్యుడు ఉదయించే వస్తువులన్నిటి కంటే ప్రియమైనవి. (ముస్లిమ్‌)

2296 – [ 3 ] ( متفق عليه ) (2/711)

وَعَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: مَنْ قَالَ: “سُبْحَانَ اللهِ وَبِحَمْدِهِ” فِيْ يَوْمٍ مِائَةَ مَرَّةٍ حُطَّتْ خَطَايَاهُ وَإِنْ كَانَتْ مِثْلَ زَبَدِ الْبَحْرِ”.

2296. (3) [2/711ఏకీభవితం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, రోజుకి 100 సార్లు ”సుబ్‌’హానల్లాహి వబి’హమ్‌దిహీ” అని పఠించేవారి పాపాలు సముద్రపు నురుగుకు సమానంగా ఉన్నాసరే అవన్నీ సమసిపోతాయి. (బు’ఖారీ, ముస్లిమ్‌)

2297 – [ 4 ] ( متفق عليه ) (2/711)

وَعَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَنْ قَالَ حِيْنَ يُصْبِحُ وَحِيْنَ يُمْسِيْ: سُبْحَانَ اللهِ وَبِحَمْدِهِ مِائَةَ مَرَّةٍ لَمْ يَأْتِ أَحَدٌ يَوْمَ الْقِيَامَةِ بِأَفْضَلَ مِمَّا جَاءَ بِهِ إِلَّا أَحَدٌ قَالَ مِثْلَ مَا قَالَ أَوْ زَادَ عَلَيْهِ.

2297. (4) [2/711ఏకీభవితం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం:

”ఉదయం, సాయంత్రం సుబ్‌’హానల్లాహి వబి హమ్దిహీ 100 సార్లు పఠిస్తే తీర్పుదినం నాడు ఆ పుణ్యానికి మించింది మరొకటి ఉండదు. అయితే అటువంటి సత్కార్యం చేసి ఉంటే, లేదా అంతకంటే అధికంగా చేసి ఉంటే తప్ప.” (బు’ఖారీ, ముస్లిమ్‌)

2298 – [ 5 ] ( متفق عليه ) (2/712)

وعَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “كَلِمَتَانِ خَفِيْفَتَانِ عَلَى اللِّسَانِ ثَقِيْلَتَانِ فِيْ الْمِيْزَانِ حَبِيْبَتَانِ إِلَى الرَّحْمَنِ: “سُبْحَانَ اللهِ وَبِحَمْدِهِ سُبْحَانَ اللهِ الْعَظِيْمِ”.

2298. (5) [2/712ఏకీభవితం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”రెండు వచనాలు పలకటానికి చాలా తేలికగా, త్రాసులో మాత్రం చాలా బరువుగా ఉన్నాయి. ఇంకా అవి కరుణామయునికి చాలా ప్రియమయినవి, అవి: ”సుబ్‌’హానల్లాహి వబిహమ్దిహీ, సుబ్‌’హానల్లా హిల్ జీమ్” — ‘అల్లాహ్ (త) తన స్తోత్రాలతో కూడిన పరమ పవిత్రుడు, మహోన్నతుడైన అల్లాహ్‌ పరమ పవిత్రుడు.’ (బు’ఖారీ, ముస్లిమ్‌)

2299 – [ 6 ] ( صحيح ) (2/712)

وَعَنْ سَعْدِ بْنِ أَبِيْ وَقَّاصٍ: قَالَ:كُنَّا عِنْدَ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم فَقَالَ: “أَيَعْجِزُأَحَدُكُمْ أَنْ يَّكْسِبَ كُلَّ يَوْمٍ أَلْفَ حَسَنَةٍ؟ “فَسَأَلَهُ سَائِلٌ مِّنْ جُلَسَائِهِ: كَيْفَ يَكْسِبُ أَحَدُنَا أَلْفُ حَسَنَةٍ؟ قَالَ: “يُسَبِّحُ مِائَةَ تَسْبِيْحَةٍ فَيَكْتَبَ لَهُ أَلْفَ حَسَنَةٍ أَوْ يُحَطُّ عَنْهُ أَلْفَ خَطِيْئَةٍ”. رَوَاهُ مُسْلِمٌ وَفِيْ كِتَابِهِ:

فِيْ جَمِيْعِ الرِّوَايَاتِ عَنْ مُوْسَى الْجُهَنِّيِ: “أَوْ يُحَطُّ”. قَالَ أَبُوْ بَكْرِ الْبَرْقَانِيُّ وَرَوَاهُ شُعْبَةُ وَأَبُوْ عَوَانَةَ وَيَحْيَى بْنُ سَعِيْدِ الْقَطَّانُ عَنْ مُوْسَى فَقَالُوْا: “وَيُحَطُّ” بِغِيْرِ أَلْفٍ هَكَذَا فِيْ كِتَابِ الْحُمَيْدِيِّ.

2299. (6)[2/712దృఢం]

స’అద్‌ బిన్‌ అబీ వఖ్ఖా’స్‌ (ర) కథనం: మేము ప్రవక్త (స) దగ్గర కూర్చొని ఉండగా ఆయన మమ్మల్ని, ‘మీలో ఎవరైనా రోజుకి 1000 పుణ్యాలు సంపాదించ గలరా?’ అని అడిగారు. ఆ మాటకు అక్కడ కూర్చున్న వారిలో ఒకరు ‘రోజుకి వెయ్యి పుణ్యాలు ఎవరైనా ఎలా సంపాదించగలరు?’ అని అన్నారు. అప్పుడు దైవప్రవక్త (స), సుబ్హానల్లాహ్అని 100 సార్లు పఠిస్తే అతని కర్మల పత్రంలో 1000 పుణ్యాలు లిఖించబడతాయి. 1000 పాపాలు మన్నించ బడతాయి,” అని ప్రవచించారు. (ముస్లిమ్‌)

2300 – [ 7 ] ( صحيح ) (2/712)

وَعَنْ أَبَيْ ذَرٍّ قَالَ: سُئِلَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم أَيُّ الْكَلَامِ أَفْضَلُ؟ قَالَ: “مَا اصْطَفَى اللهُ لِمَلَائِكَتِهِ: “سُبْحَانَ اللهِ وَبِحَمْدِهِ”  .رَوَاهُ مُسْلِمٌ.

2300. (7) [2/712దృఢం]

అబూ జ’ర్‌ (ర) కథనం: దైవప్రవక్త (స) ను అన్నిటి కంటే ఉత్తమమైన పలుకు ఏది? అని ప్రశ్నించడం జరిగింది. ప్రవక్త (స) ”అల్లాహు (త) దైవదూతల కొరకు ఎన్నుకున్న:

సుబ్‌’హాన హి వబి హమ్దిహీ” అని అన్నారు.[36] (ముస్లిమ్‌)

2301 – [ 8 ] ( صحيح ) (2/712)

وَعَنْ جُوَيْرِيَّةَ أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم خَرَجَ مِنْ عِنْدِهَا بُكْرَةً حِيْنَ صَلَّى الصُّبْحَ وَهِيَ فِيْ مَسْجِدِهَا ثُمَّ رَجَعَ بَعْدَ أَنْ أَضْحَى وَهِيَ جَالِسَةٌ قَالَ: “مَا زِلْتِ عَلَى الْحَالِ الَّتِيْ فَارَقْتُكِ عَلَيْهَا؟” قَالَتْ: نَعَمْ. قَالَ النَّبِيُّ صلى الله عليه وسلم: “لَقَدْ قُلْتُ بَعْدَكِ أَرْبَعَ كَلِمَاتٍ ثَلَاثَ مَرَّاتٍ لَوْ وُزِنَتْ بِمَا قُلْتِ مُنْذُ الْيَوْمِ لَوَزَنَتْهُنَّ: “سُبْحَانَ اللهِ وَبِحَمْدِهِ عَدَدَ خَلْقِهِ وَرِضَاءَ نَفْسِهِ وَزِنَةَ عَرْشِهِ وَمِدَادَ كَلِمَاتِهِ”. رَوَاهُ مُسْلِمٌ.

2301. (8) [2/712దృఢం]

జువైరియహ్ బిన్తె ‘హారిస్‌’ (ర) కథనం: ఒకసారి ఉదయం దైవప్రవక్త (స) ఫజ్ర్‌ నమా’జ్‌ చేసుకొని బయటకు వెళ్ళి నప్పుడు ఆమె తన నమా’జ్‌ చేసిన చోటే కూర్చొని ఉన్నారు. బాగా ప్రొద్దెక్కిన తర్వాత అతను (స) తిరిగొచ్చారు. అప్పటికీ ఆమె అక్కడే కూర్చొని ఉండటం చూచి, ”నేను బయటకు వెళ్ళినప్పటి నుండి నువ్వు ఇక్కడే కూర్చొని ఉన్నావా?” అని అడిగారు. ఆమె ‘అవును’ అని సమాధానం ఇచ్చారు. అప్పుడు దైవప్రవక్త (స) ఇలా అన్నారు, ”నేను నీ దగ్గరి నుండి వెళ్ళిన తర్వాత నాలుగు వచనాలు ఒక్కొక్కటి మూడుసార్లు పఠించాను. వాటిని గనుక నీవు ఈ రోజు ఉదయం నుండి కూర్చుని పలుకుతూ ఉన్న పలుకులతో సరిచూస్తే అవే ఎక్కువ బరువుగా ఉంటాయి. ఆ వచనాలు ఇవి, ”సుబ్‌’హానల్లాహి బిహమ్దిహీ అదదఖల్ఖిహీ, రిదా నఫ్సిహీ జినతఅర్షిహి, వమిదాద కలిమాతిహీ.” — ‘అల్లాహ్ సృష్టితాల సంఖ్యకు సమానంగా, దైవాభీష్టానికి అను గుణంగా అల్లాహ్ సింహాసనం బరువుకు సమానంగా, అల్లాహ్ వచనాలను లిఖించటానికి కావలసిన సిరాకు సమానంగా ఆయన పవిత్రతను కొనియాడు తున్నాను. ఆయన్ను స్తుతిస్తున్నాను.’[37](ముస్లిమ్)

2302 – [ 9 ] ( متفق عليه ) (2/713)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَنْ قَالَ: “لَا إِلَهَ إِلَّا اللهُ وَحْدَهُ لَا شَرِيْكَ لَهُ لَهُ الْمُلْكُ وَلَهُ الْحَمْدُ وَهُوَ عَلَى كُلِّ شَيْءٍ قَدِيْرٌ”. فِيْ يَوْمٍ مِّائَةَ مَرَّةٍ كَانَتْ لَهُ عِدْلَ عَشَرَ رِقَابٍ وَكُتِبَتْ لَهُ مِائَةُ حَسَنَةٍ. وَمُحِيَتْ عَنْهُ مِائَةُ سَيِّئَةٍ. وَكَانَتْ لَهُ حِرْزًا مِّنَ الشَّيْطَانِ يَوْمَهُ ذَلِكَ حَتَّى يُمْسِيَ وَلَمْ يَأْتِ أَحَدٌ بِأَفْضَلِ مِمَّا جَاءَ بِهِ إِلَّا رَجُلٌ عَمِلَ أَكْثَرَ مِنْهُ”.

2302. (9) [2/713ఏకీభవితం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఎవరు ఈ దు’ఆను రోజుకి 100 సార్లు పఠిస్తారో వారికి 10 మంది బానిసలను విడుదలచేసినంత పుణ్యం లభిస్తుంది. 100 పుణ్యాలు వ్రాయబడతాయి. ఇంకా పాపాలన్నీ క్షమించబడతాయి. ఆ రోజంతా షై’తాన్‌ చెడుల నుండి దూరంగా ఉంటాడు. తీర్పుదినంనాడు అంతకంటే మంచి కార్యం చేసేవాడు మరొకడు ఉండడు. అయితే ఈ దు’ఆను పఠించేవాడు తప్ప.  ఆ దు’ఆ ఇది, లా ఇలాహ ఇల్లల్లాహు హ్దహు లా షరీకలహూ లహుల్ముల్కు వలహుల్‌ ‘హమ్దు వహువ అలాకుల్లి షయ్‌’ఇన్ఖదీర్.” — ‘అల్లాహ్‌ తప్ప ఆరాధ్యుడు ఎవరూ లేరు. ఆయన ఒక్కడే. ఆయనకు సాటి ఎవరూ లేరు. సామ్రాజ్యం అంతా ఆయనదే. సకల స్తోత్రాలు ఆయన కొరకే. ఆయన ప్రతి విషయంపై అధికారం కలిగి ఉన్నాడు.’ (బు’ఖారీ, ముస్లిమ్‌)

2303 – [ 10 ] ( متفق عليه ) (2/713)

وَعَنْ أَبِيْ مُوْسَى الْأَشْعَرِيِّ قَالَ: كُنَّا مَعَ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم فِيْ سَفَرٍ. فَجَعَلَ النَّاسُ يَجْهَرُوْنَ بِالتَّكْبِيْرِ. فَقَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “يَا أَيُّهَا النَّاسُ ارْبَعُوْا عَلَى أَنْفُسِكُمْ إِنَّكُمْ لَا تَدْعُوْنَ أَصَمَّ وَلَا غَائِبًا إِنَّكُمْ تَدْعُوْنَ سَمِيْعًا بَصِيْرًا وَهُوَ مَعَكُمْ وَالَّذِيْ تَدْعُوْنَهُ أَقْرَبُ إِلَى أَحَدِكُمْ مِّنْ عُنُقِ رَاحِلَتِهِ”. فقالَ أَبُوْ مُوْسَى: وَأَنَا خَلْفَهُ أَقُوْلُ: لَا حَوْلَ وَلَا قُوَّةَ إِلَّا بِاللهِ فِيْ نَفْسِيْ. فَقَالَ: “يَا عَبْدَ اللهِ بْنِ قَيْسٍ :أَلَا أَدُلُّكَ عَلَى كَنْزِ مِّنْ كُنُوْزِ الْجَنَّةِ ؟” فَقُلْتُ: بَلَى يَا رَسُوْلَ اللهِ قَالَ : “لَا حَوْلَ وَلَا قُوَّةَ إِلَّا بِاللهِ”.

2303. (10) [2/713ఏకీభవితం]

అబూ మూసా అష్‌’అరీ (ర) కథనం, మేము ప్రవక్త (స) వెంట ప్రయాణంలో ఉన్నాం. ప్రజలు తక్‌బీర్లు ఎలుగెత్తి పలకసాగారు. అంటే అతి బిగ్గరగా పలకటం ప్రారంభించారు. ప్రవక్త (స) అది విని, ‘ప్రజలారా! మీపై మీరు దయచూపండి. ఎందుకంటే మీరు చెవిటి వాడిని, పరోక్షంగా ఉన్నవాడిని పిలవటంలేదు. మీరు వినేవాడిని, చూచేవాడిని పిలుస్తున్నారు. మీరు పిలుస్తున్నవాడు మీ వెంటే ఉన్నాడు. ఆయన మీ వాహనాల మెడల కంటే దగ్గరగా ఉన్నాడు. అంటే అల్లాహ్‌ (త) చాలా దగ్గరగా ఉన్నాడు. ప్రతి విషయం ఆయన వింటాడు, ఆయనకు తెలిసి ఉంటుంది. ఎల్లప్పుడూ మీ వెంట ఉంటాడు. మరి కేకలువేసి పిలవటం దేనికి. మీరే అలసిపోతారు. మీ గొంతే నొప్పెడుతుంది. అందుకే మీపై మీరు దయచూపండి,’ అని అన్నారు. అప్పుడు అబూ మూసా (ర), ”నేను మీ వెనుక, ‘లా ‘హౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లాహ్‌’ అని మనసులో పలుకుతున్నాను,” అని అన్నారు. దానికి ప్రవక్త (స), ”ఓ ‘అబ్దుల్లా బిన్‌ ఖైస్‌! నేను నీకు స్వర్గనిధుల్లో ఒక నిధిని చూపనా?” అని అన్నారు. దానికి నేను, ‘చూపండి ఓ అల్లాహ్‌ ప్రవక్తా!’ అని అన్నాను. ప్రవక్త (స) ”లాహౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లాహ్‌.స్వర్గనిధుల్లోని ఒకనిధి అని ప్రవచించారు. [38] (బు’ఖారీ, ముస్లిమ్)

—–

اَلْفَصْلُ الثَّانِيْ   రెండవ విభాగం 

2304 – [ 11 ] ( صحيح ) (2/713)

عَنْ جَابِرٍقَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَنْ قَالَ “سُبْحَانَ اللهِ الْعَظِيْمِ وَبِحَمْدِهِ” غُرِسَتْ لَهُ نَخْلَةٌ فِيْ الْجَنَّةِ”. رَوَاهُ التِّرْمِذِيُّ .

2304. (12) [2/713దృఢం]

జాబిర్‌ (ర) కథనం: దైవప్రవక్త (స) ప్రవచనం, ”సుబ్‌’హానల్లాహిల్ జీమ్  వబిహమ్దిహీ” అని పఠించిన రి కొరకు స్వర్గంలో ఒక ఖర్జూరపు చెట్టు నాటబడుతుంది.” (తిర్మిజి’ – ప్రామాణికం)

2305 – [ 12 ] ( لم تتم دراسته ) (2/714)

وَعَنِ الزُّبَيْرِقَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَا مِنْ صَبَاحٍ يُصْبِحُ الْعِبَادُ فِيْهِ إِلَّا مُنَادٍ يُّنَادِيْ سَبِّحُوا الْمَلِكَ الْقُدُّوْسَ”. رَوَاهُ التِّرْمِذِيُّ.

2305. (12) [2/714అపరిశోధితం]

‘జుబైర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ప్రతిరోజు ఉదయం ఒక దైవదూత బిగ్గరగా కేకలు వేస్తూ ”సబ్బి ‘హుల్ మలికల్‌ ఖుద్దూస్‌” — పరిశుద్ధ చక్రవర్తి ‘పరిశుద్ధతను కొనియాడండి,’ అని అంటాడు. అంటే, ”సుబ్‌’హానల్మలికిల్ఖుద్దూస్,” అని పఠించండి, అని అర్థము. (తిర్మిజి’)

2306 – [ 13 ] ( حسن ) (2/714)

وَعَنْ جَابِرٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “أَفْضَلُ الذِّكْرِ: لَا إِلَهَ إِلَّا اللهُ وَأَفْضَلُ الدُّعَاءِ: اَلْحَمْدُ لِلّهِ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَابْنُ مَاجَهُ.

2306. (13) [2/714ప్రామాణికం]

జాబిర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”అన్నిటి కంటే శుభకరమైన వచనం (తస్బీహ్), ”లా ఇలాహ ఇల్లల్లాహ్” అదేవిధంగా, ప్రార్థనలన్నిటిలో ఉత్తమ మైన ప్రార్థన, అల్‌’హమ్దు లిల్లాహ్”. (తిర్మిజి’, ఇబ్నె మాజహ్)

2307 – [ 14 ] ( لم تتم دراسته ) (2/714)

وَعَنْ عَبْدِ اللهِ بْنِ عَمْرٍو قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “اَلْحَمْدُ” رَأْسُ الشُّكْرِ مَا شَكَرَ اللهَ عَبْدٌ لَا يَحْمَدُهُ.

2307. (14) [2/714అపరిశోధితం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘అమ్ర్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”అల్‌’హమ్దులిల్లాహ్‌,” కృతజ్ఞతా ప్రధాన కాండము. అల్లాహ్‌ను కీర్తించనివాడు, ఆయనకు కృతజ్ఞత చూపనట్టే.

2308 – [ 15 ] ( ضعيف ) (2/714)

وَعَنِ ابْنِ عَبَّاسٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “أَوَّلُ مَنْ يُدْعَى إِلَى الْجَنَّةِ يَوْمَ الْقِيَامَةِ الذِيْنَ يَحْمِدُوْنَ اللهَ فِيْ السَّرَّاءِ وَالضَّرَّاءِ”. رَوَاهُمَا الْبَيْهَقِيُّ فِيْ شُعَبِ الْإِيْمَانِ.

2308. (15) [2/714బలహీనం]

ఇబ్నె ‘అబ్బాస్ (ర) కథనం: తీర్పుదినం నాడు స్వర్గంవైపు అందరికంటే ముందు ప్రపంచంలో కలిమిలేముల్లో ”అల్‌’హమ్దు లిల్లాహ్”అని పలికేవారిని పిలవటం జరుగుతుంది. ఈ రెండు ‘హదీసు’లను బైహఖీ విశ్వాస భాగంలో పేర్కొన్నారు. (బైహఖీ / షు’అ బిల్‌ ఈమాన్‌)

2309 – [ 16 ] ( لم تتم دراسته ) (2/714)

وَعَنْ أَبِيْ سَعِيْدِ الْخُدْرِيِّ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: ” قَالَ مُوْسَى عَلَيْهِ السَّلَامُ: يَا رَبِّ عَلِّمْنِيْ شَيْئًا. أَذْكُرُكَ بِهِ وَأَدْعُوْكَ بِهِ. فَقَالَ : يَا مُوْسَى قُلْ: لَا إِلَهَ إِلَّا اللهُ فَقَالَ : يَا رَبِّ كُلُّ عِبَادِكَ يَقُوْلُ هَذَا إِنَّمَا أُرِيْدُ شَيْئًا تَخُصُّنِيْ بِهِ قَالَ : يَا مُوْسَى لَوْ أَنَّ السَّمَاوَاتِ السَّبْعَ وَعَامِرَهُنَّ غَيْرِيْ وَالْأَرْضِيْنَ السَّبْعَ وُضِعْنَ فِيْ كَفَّةٍ وَلَا إِلَهَ إِلَّا اللهُ فِيْ كَفَّةٍ لَمَالَتْ بِهِنَّ “لَا إِلَهَ إِلَّا اللهُ”.  رَوَاهُ فِيْ شَرْحِ السُّنَّةِ (بغوي).

2309. (16) [2/714అపరిశోధితం]

అబూ స’యీద్‌ ‘ఖుద్రీ (ర) కథనం: ప్రవక్త (స) ఇలా ప్రవచించారు, ”మూసా (అ)  అల్లాహ్‌(త)ను, ‘ఓ నా ప్రభూ! నాకేదైనా ఉత్తమ వచనాన్ని నేర్పించండి. దాని ద్వారా నేను మిమ్మల్ని స్మరించడానికి. దాన్ని పఠించి మిమ్మల్ని ప్రార్థించ నికి,’ అని విన్నవించు కున్నారు. అప్పుడు అల్లాహ్‌ (త), ”ఓ మూసా! నీవు, ‘లా ఇలాహ ఇల్లల్లాహ్,’ అని పలుకు,” అని ఆదేశించాడు. దానికి, ”దీన్ని నీ దాసులందరూ పఠిస్తారు. ప్రత్యేకంగా ఏదైనా ఉంటే, నాకు నేర్పించు, అది ఇతరులెవ్వరికీ తెలియనిదై ఉండాలి,” అని విన్నవించుకున్నారు. దానికి అల్లాహ్‌ (త), ”ఓ మూసా! ‘లా ఇలాహ ఇల్లల్లాహ్‌’కు మించిన శుభవచనం లేదు. ఒకవేళ నన్ను తప్ప సప్త భూమ్యా కాశాలను, వాటిలోని  ప్రజలను తూనికలోని ఒక పళ్లెంలో ఉంచి రెండవ పళ్ళెంలో ‘లా ఇలాహ ఇల్లల్లాహ్‘ను ఉంచితే, లా ఇలాహ ఇల్లల్లాహ్ ఉన్న పళ్ళమే బరువుగా ఉంటుంది,”  అని ఆదేశించాడు. దీన్ని షర్‌హు స్సున్నహ్‌ (బ’గవీ) లో పేర్కొనడం జరిగింది.

2310 – [ 17 ] ( لم تتم دراسته ) (2/714)

وَعَنْ أَبِيْ سَعِيْدٍ وَأَبِيْ هُرَيْرَةَ رَضِيَ اللهُ عَنْهُمَا قَالَا: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَنْ قَالَ: “لَا إِلَهَ إِلَّا اللهُ وَاللهِ أَكْبَرُ” صَدَّقَهُ رَبُّهُ. قَالَ: لَا إِلَهَ إِلَّا أَنَا وَأَنَا أَكْبَرُ. وَإِذَا قَالَ: “لَا إِلَهَ إِلَّا اللهُ وَحْدَهُ لَا شَرِيْكَ لَهُ”. يَقُوْلُ اللهُ : لَا إِلَهَ إِلَّا أَنَا وَحْدِيْ لَا شَرِيْكَ لِيْ وَإِذَا قَالَ: “لَا إِلَهَ إِلَّا اللهُ لَهُ الْمُلْكُ وَلَهُ الْحَمْدُ”. قَالَ: لَا إِلَهَ إِلَّا أَنَا لِيْ الْمُلْكُ وَلِيْ الْحَمْدُ. وَإِذَا قَالَ: “لَا إِلَهَ إِلَّا اللهُ وَلَا حَوْلَ وَلَا قُوَّةَ إِلَّا بِاللهِ”. قَالَ: لَا إِلَهَ إِلَّا أَنَا لَا حَوْلَ وَلَا قُوَّةَ إِلَّا بِيْ”. وَكَانَ يَقُوْلُ: “مَنْ قَالَهَا فِيْ مَرْضِهِ ثُمَّ مَاتَ لَمْ تَطْعَمْهُ النَّار”. رَوَاهُ التِّرْمِذِيُّ وَابْنُ مَاجَهُ.

2310. (17) [2/714అపరిశోధితం]

అబూ స’యీద్‌ ‘ఖుద్రీ (ర), అబూ హురైరహ్‌ (ర)ల కథనం: ప్రవక్త (స) ఇలా ప్రవచించారు, ”ఎవరైనా, ‘లా ఇలాహ ఇల్లల్లాహు, అల్లాహు అక్బర్‌, ‘ అని పలికితే అతని ప్రభువు అతని ఈ పదాలను ధృవీకరిస్తూ సమాధానంగా, ”లా ఇలాహ ఇల్లా అనా వ అనా అక్బర్‌” — ‘నేను తప్ప ఆరాధ్యులెవరూ లేరు మరియు నేను అందరి కంటే పెద్దవాడిని,’ అని అంటాడు. అదేవిధంగా ఎవరైనా, ‘లా ఇలాహ ఇల్లల్లాహు హ్దహ్లా షరీక లహు,’ అని అంటే, అల్లాహ్‌ దానికి సమాధానంగా, ‘లా ఇలాహ ఇల్లా అనా వ’హ్‌దీ లా షరీక లీ” — ‘దాసుడు అల్లాహ్‌ (త) తప్ప ఆరాధ్యు లెవరూ లేరని, ఆయన ఒంటరి వాడని, అతనికి ఎవరూ సాటిలేరని అంటే, అల్లాహ్‌ (త) అవును నేను తప్ప ఆరాధ్యులెవరూ లేరు, నేను ఒక్కడినే నాకు ఎవరూ సాటి లేరు,’ అని సమాధానం ఇస్తాడు. అదేవిధంగా ఎవరైనా, లా ఇలాహ ఇల్లల్లాహు లహుల్ముల్కు వలహుల్‌ ‘హమ్దు, — ‘అల్లాహ్‌ తప్ప ఆరాధ్యులెవరూ లేరు, సర్వాధి కారాలూ ఆయనవే. స్తోత్రాలన్నీ ఆయనకే,’ అని పలికితే, దానికి సమాధానంగా అల్లాహ్‌ (త),

లాఇలాహ ఇల్లా అనా లియల్ముల్కు లియల్ హమ్దు, — ‘నేను తప్ప ఆరాధ్యులెవరూ లేరు, అధికారం నాదే, స్తోత్రాలూ నావే.’ అని సమాధానం ఇస్తాడు. అదేవిధంగా ఎవరైనా, లా ఇలాహ ఇల్లల్లాహు వలాహౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లాహ్, — ‘అల్లాహ్‌ తప్ప ఆరాధ్యు లెవరూ లేరు. పాపాల నుండి దూరంగా ఉండటం పుణ్యం చేయటం అల్లాహ్‌ అనుగ్రహం వల్లనే,’ అని పఠిస్తే అల్లాహ్‌ (త) దానికి  సమాధానంగా, ”లా ఇలాహ ఇల్లా అనా లాహౌల వలాఖువ్వత ఇల్లా బీ ” — ‘నేను తప్ప ఆరాధ్యు లెవరూ లేరు, శక్తి సామర్థ్యాలు లేవు, కాని నేను తప్ప,’ అని అంటాడు. ఎవరైనా తాను అనారోగ్యంగా ఉన్నప్పుడు పఠించి చనిపోతే నరకాగ్ని అతనిని హరించదు (కాల్చదు). (తిర్మిజి’, ఇబ్నె మాజహ్)

2311 – [ 18 ] ( ضعيف ) (2/715)

وَعَنْ سَعْدِ بْنِ أَبِيْ وَقَّاصٍ، أَنَّهُ دَخَلَ مَعَ النَّبِيّ صلى الله عليه وسلم عَلَى امْرَأَةٍ وَبَيْنَ يَدَيْهَا نَوىَّ أَوْ حَصى تُسَبِّحُ بِهِ فَقَالَ: “أَلَا أُخْبِرُكَ بِمَا هُوَ أَيْسَرُعَلَيْكَ مِنْ هَذَا أَوْ أَفْضَلُ؟ “سُبْحَانَ اللهِ عَدَدَ مَا خَلَقَ فِيْ السَّمَاءِ وَسُبْحَانَ اللهِ عَدَدَ مَا خَلَقَ فِيْ الْأَرْضِ وَسُبْحَانَ اللهِ عَدَدَ مَا بَيْنَ ذَلِكَ وَسُبْحَانَ اللهِ عَدَدَ مَا هُوَ خَالِقٌ وَاللهِ أَكْبَرُمِثْلَ ذَلِكَ وَالْحَمْدُ لِلّهِ مِثْلَ ذَلِكَ وَلَا إِلَهَ إِلَّا اللهُ مِثْلَ ذَلِكَ وَلَا حَوْلَ وَلَا قُوَّةَ إِلَّا بِاللهِ مِثْلَ ذَلِكَ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَأَبُوْ دَاوُدَ. وَقَالَ التِّرْمِذِيُّ: هَذَا حَدِيْثٌ غَرِيْبٌ.

2311. (18) [2/715బలహీనం]

స’అద్‌ బిన్‌ అబీ వఖ్ఖా’స్‌ (ర) కథనం: అతను ప్రవక్త (స) వెంట ఒకమహిళ ఇంటికి వెళ్ళారు. ఆమె ముందు ఖర్జూరపు గింజలు, కంకరరాల్ళు ఉన్నాయి. వాటి ద్వారా ఆమె తస్‌బీహ్‌ పఠిస్తున్నారు. అది చూసి ప్రవక్త (స) ఇంతకంటే సులభమైన దాన్ని, ఇంతకంటే ఉత్తమమైన దాన్ని నీకు చూపించనా? అది:

సుబ్‌’హానల్లాహి,  అదద మాఖలఖ ఫిస్సమాయి‘, సుబ్‌’హానల్లాహి, అదద మాఖలఖ ఫిల్అర్‌’ది, సుబ్‌’హానల్లాహి, అదద మాబైన జాలిక, సుబ్‌’హానల్లాహి, అద మా హువఖాలిఖున్, ల్లాహు అక్బర్, మిస్లజాలిక,  వల్హమ్దులిల్లాహి మిస్లజాలిక, వలా ఇలాహ ఇల్ల్ల ల్లాహు మిస్లజాలిక, వలాహౌల వలాఖువ్వత ఇల్లాహ్ బిల్లాహ్ మిస్లజాలిక.[39] (తిర్మిజి’ / ఏకోల్లేఖనం, అబూ దావూద్‌)

2312 – [ 19 ] ( لم تتم دراسته ) (2/715)

وَعَنْ عَمْرِو بْنِ شُعَيْبٍ عَنْ أَبِيْهِ عَنْ جَدِّهِ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَنْ سَبَّحَ اللهَ مِائَةً بِالْغَدَاةِ وَمِائَةً بِالْعَشِيِّ كَانَ كَمَنْ حَجَّ مِائَةَ حَجَّةٍ وَمَنْ حَمِدَ اللهَ مِائَةً بِالْغَدَاةِ وَمِائَةً بِالْعَشِيِّ كَانَ كَمَنْ حَمَلَ عَلَى مِائَةِ فَرَسٍ فِيْ سَبِيْلِ اللهِ وَمَنْ هَلَّلَ اللهُ مِائَةً بِالْغَدَاةِ وَمِائَةً بِالْعَشِيِّ كَانَ كَمَنْ أَعْتَقَ مِائَةَ رَقَبَةٍ مِنْ وُّلِدَ إِسْمَاعِيْلَ وَمَنْ كَبَّرَ اللهَ مِائَةً بِالْغَدَاةِ وَمِائَةً بِالْعَشِيِّ لَمْ يَأْتِ فِيْ ذَلِكَ الْيَوْمِ أَحَدٌ بِأَكْثَرَ مِمَّا أَتَى بِهِ إِلَّا مَنْ قَالَ مِثْلَ ذَلِكَ أَوْ زَادَ عَلَى مَا قَالَ. رَوَاهُ التِّرْمِذِيُّ. وَقَالَ: هَذَا حَدِيْثٌ حسن غَرِيْبٌ.

2312. (19) [2/715అపరిశోధితం]

‘అమ్ర్ బిన్‌ షుఐబ్‌, తన తండ్రి తాతల ద్వారా పేర్కొ న్నారు, ”ప్రవక్త (స) ప్రవచనం, ఉదయం 100 సార్లు సాయంత్రం 100 సార్లు, సుబ్‌’హానల్లాహ్ అని పలికిన వారికి 100 ‘హజ్‌లు చేసినవారితో సమానంగా పుణ్యం లభిస్తుంది. అదేవిధంగా ఉదయం 100 సార్లు, సాయంత్రం 100 సార్లు అల్‌’హమ్దు లిల్లాహ్ అని పఠించిన వారికి దైవమార్గంలో 100 మంది ముజాహి దులను 100 గుర్రాలపై పంపినంత పుణ్యం లభిస్తుంది. అదేవిధంగా ఉదయం సాయంత్రం 100 సార్లు లా ఇలాహ ఇల్లల్లాహు, పఠిస్తే అతనికి ఇస్మా’యీల్‌ (అ) సంతతిలోని 100 బానిసలను విడుదల చేసినంత పుణ్యం లభిస్తుంది. అదేవిధంగా ఉదయం సాయంత్రం 100 సార్లు అల్లాహు అక్బర్ అని పఠించేవ్యక్తి తీర్పుదినం నాడు అతని కంటే అధిక పుణ్యంగల వారెవరూ ఉండరు. అయితే ఈ వచనాల్ని ఇన్నిసార్లు లేదా అంతకంటే ఎక్కువసార్లు పఠించినవారు తప్ప. (తిర్మిజి’ – ప్రామాణికం – ఏకోల్లేఖనం)

2313 – [ 20 ] ( لم تتم دراسته ) (2/716)

وَعَنْ عَبْدِ اللهِ بْنِ عَمْرٍوقَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “اَلتَّسْبِيْحُ نِصْفُ الْمِيْزَانِ وَالْحَمْدُ لِلّهِ يَمْلَؤُهُ وَلَا إِلَهَ إِلَّا اللهُ لَيْسَ لَهَا حِجَابٌ دُوْنَ اللهِ حَتَّى تَخْلُصَ إِلَيْهِ”. رَوَاهُ التِّرْمِذِيُّ. وَقَالَ: هَذَا حَدِيْثٌ غَرِيْبٌ وَلَيْسَ إِسْنَادُهُ بِالْقَوِيِّ.

2313. (20) [2/716అపరిశోధితం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘అమ్ర్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”సుబ్‌’హానల్లాహ్‌, పఠిస్తే తూనిక పళ్ళెం సగం నిండిపోతుంది. అల్‌’హమ్‌దు లిల్లాహ్‌, తూనిక పళ్ళాన్ని నింపుతుంది. సుబ్‌’హానల్లాహ్‌ మరియు అల్‌’హమ్‌దు లిల్లాహ్‌ పఠించినందుకు ఎంత ఎక్కువ పుణ్యం లభిస్తుందంటే పుణ్యంతో తూనిక పళ్ళెం నిండిపోతుంది. ఇంకా  లా ఇలాహ ఇల్లల్లాహు, వచనం దైవం వరకు చేరిపోతుంది. ఏ వస్తువు దాన్ని దైవం వరకు చేరకుండా ఆపజాలదు. అంటే  లా ఇలాహ ఇల్లల్లాహు, పఠించిన పుణ్యం తిన్నగా అల్లాహ్ వరకు చేరిపోతుంది. అల్లాహ్ దాన్ని స్వీకరిస్తాడు. (తిర్మిజి’ –  ఏకోల్లేఖనం. దీని ఆధారాలు దృఢమైనవికావు)

2314 – [ 21 ] ( لم تتم دراسته ) (2/716)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَا قَالَ عَبْدٌ لَا إِلَهَ إِلَّا اللهُ مُخْلِصًا قَطُّ. إِلَّا فُتِحَتْ لَهُ أَبْوَابُ السَّمَاءِ حَتَّى يُفْضِيَ إِلَى الْعَرْشِ مَا اجْتَنَبَ الْكَبَائِرَ”. رَوَاهُ التِّرْمِذِيُّ. وَقَالَ: هَذَا حَدِيْثٌ غَرِيْبٌ.

2314. (21) [2/716అపరిశోధితం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త(స) ప్రవచనం, ”ఎవరైనా నిష్కల్మషమైన మనస్సుతో, చిత్త శుద్ధితో, ప్రదర్శనాబుద్ధి లేకుండా, చూపుగోలు లేకుండా ”లా ఇలాహ ఇల్లల్లాహ్” పఠిస్తే అతని కొరకు ఆకాశ ద్వారాలు తెరువబడతాయి. ఆ ప్రవచనం  దైవ సింహాసనం వరకు చేరుకుంటుంది. అంటే త్వరగా స్వీకరించబడుతుంది. ఇలా పెద్ద పెద్ద పాపాల నుండి దూరంగా ఉన్నంత వరకు. (తిర్మిజి’ – ఏకోల్లేఖనం)

2315 – [ 22 ] ( ضعيف ) (2/716)

وَعَنِ ابْنِ مَسْعُوْدٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَقِيْتُ إِبْرَاهِيْمَ لَيْلَةً أُسْرِيَ بِيْ. فَقَالَ: يَا مُحَمَّدُ أَقْرِئْ أُمَّتَكَ مِنِّيْ السَّلَامَ وَ أَخْبِرْهُمْ أَنَّ الْجَنَّةَ طَيّبَةُ التُّرْبَةِ عَذْبَةُ الْمَاءِ وَأَنَّهَا قِيْعَانٌ وَأَنَّ غِرَاسَهَا سُبْحَانَ اللهِ وَالْحَمْدُ لِلّهِ وَلَا إِلَهَ إِلَّا اللهُ وَاللهِ أَكْبَرُ”.   رَوَاهُ التِّرْمِذِيُّ. وَقَالَ: هَذَا حَدِيْثٌ حَسَنٌ غَرِيْبٌ إِسْنَادًا.

2315. (22) [2/716బలహీనం]

ఇబ్నె మస్‌’ఊద్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, మే’రాజ్‌ రాత్రి నేను ఇబ్రాహీమ్‌ (అ)ను కలిసాను. అతను (అ) నాతో ఓ ము’హమ్మద్‌ ! మీరు మీ అనుచర సంఘానికి నా సలామ్‌ అందజేయండి, ఇంకా వారితో ఇలా అనండి, ”స్వర్గంలోని మట్టి పరిశుద్ధంగా పరిమళభరితంగా ఉంది, ఇంకా అందులోని నీరు చాలా తియ్యగా ఉంది, కాని అది బంజరు భూమిలా ఉంది, అంటే అందులో మొక్కలు గానీ, చెట్లుగానీ లేవు. అందులో, ”సుబ్‌’హానల్లాహి, అల్‌’హమ్దు లిల్లాహి, లా ఇలాహ ఇల్లల్లాహు, అల్లాహు అక్బర్,” అనే చెట్లు ఉన్నాయి. అంటే వాటిని పఠిస్తే మొక్కలు చెట్లు మొలకెత్తుతాయి, అంటే చదివిన ప్రతి ప్రవచనానికి ఒక్కొక్క చెట్టు మొలకెత్తుతుంది ఎంత అధికంగా పఠిస్తే అంతపెద్దగా తయారవుతుంది.” (తిర్మిజి’ – ఏకోల్లేఖనం, దీని ఆధారాలు అపరిచితమైనవి)

——-

2316 – [ 23 ] ( حسن ) (2/716)

وَعَنْ يُسِيْرَةَ رَضِيَ اللهُ عَنْهَا وَكَانَتْ مِنَ الْمُهَاجِرَاتِ قَالَتْ: قَالَ لَنَا رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “عَلَيْكُنَّ بِالتَّسْبِيْحِ وَالتَّهْلِيْلِ وَالتَّقْدِيْسِ وَاعْقِدْنَ بِالْأَنَامِلِ فَإِنَّهُنَّ مَسْؤُوْلَاتٌ مُسْتَنْطَقَاتٌ. وَلَا تَغْفُلْنَ فَتُنْسَيْنَ الرَّحْمَةَ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَأَبُوْ دَاوُدَ.

2316. (23) [2/716ప్రామాణికం]

యుసీరహ్ (ర) కథనం: ఈమె వలసవెళ్ళిన స్త్రీలలో ఒకరు. ఈమె కథనం: ”ప్రవక్త (స) మమ్మల్ని, ”సుబ్‌ ‘హానల్లాహ్‌, లా ఇలాహ ఇల్లల్లాహ్‌, సుబ్‌’హానల్‌ మలికిల్‌ ఖుద్దూస్‌,” క్రమం తప్పకుండా పఠించాలి, వాటిని తమ వ్రేళ్ళతో లెక్కపెట్టాలి, ఎందుకంటే తీర్పుదినంనాడు చేతి వేళ్ళను ప్రశ్నించడం జరుగు తుంది. ఈ వ్రేళ్ళు మాట్లాడుతాయి, సమాధానం ఇస్తాయి. మీరు ఈ దు’ఆలు పఠించడంలో అశ్రధ్ధ చేయవద్దు, అలా చేస్తే అల్లాహ్ (త) శుభాలు మీకు దూరం అవుతాయి, ఇంకా అల్లాహ్(త) కారుణ్యానికి మీరు దూరం అవుతారు, అని హెచ్చరిస్తూ హితబోధ చేసారు.” [40]  (తిర్మిజి’, అబూ దావూద్‌)

—–

اَلْفَصْلُ الثَّالِثُ  మూడవ విభాగం 

2317 – [ 24 ] ( صحيح ) (2/717)

عَنْ سَعْدِ بْنِ أَبِيْ وَقَّاصٍ قَالَ: جَاءَ أَعْرَابِيٌّ إِلَى رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم فَقَالَ: عَلِّمْنِيْ كَلَامًا أَقُوْلُهُ قَالَ: “قُلْ لَا إِلَهَ إِلَّا اللهُ وَحْدَهُ لَا شَرِيْكَ لَهُ اللهُ أَكْبَرُ كَبِيْرًا وَالْحَمْدُ لِلّهِ كَثِيْرًا وَسُبْحَانَ اللهِ رَبِّ الْعَالَمِيْنَ. لَا حَوْلَ وَلَا قُوَّةَ إِلَى بِاللهِ الْعَزِيْزِ الْحَكِيْمِ”. فَقَالَ فَهَؤُلَاءِ لِرَبِّيْ فَمَا لِيْ؟ فَقَالَ: “قُلْ اَللّهُمَّ اغْفِرْ لِيْ وَارْحَمْنِيْ وَاهْدِنِيْ وَارْزُقْنِيْ وَعَافِنِيْ”.  شَكَّ الرّاوِيْ فِيْ “عَافِنِيْ” . رَوَاهُ مُسْلِمٌ.

2317. (24) [2/717దృఢం]

స’అద్‌ బిన్‌ అబీ వఖ్ఖా’స్‌ (ర) కథనం: ఒక ఎడారివాసి(బదూ) ప్రవక్త (స) వద్దకు వచ్చి, ”నేను తరచూ పఠిస్తూ ఉండటానికి అనువైన వచనాలు నాకు నేర్పించండి.” అని అన్నాడు. అప్పుడు ప్రవక్త (స) అతనికి ఈవిధంగా పలక మని ఉపదేశించారు:

లా ఇలాహ ఇల్లల్లాహు, హ్దహు లా షరీక లహూ, అల్లాహు అక్బర్ కబీరా, వల్హమ్దు లిల్లాహి కసీరా, సుబ్హానల్లాహి రబ్బిల్ఆలమీన్, వలా హౌల వలా ఖువ్వత ఇల్లాబిల్లాహిల్ జీజిల్ హకీమ్. — ‘అల్లాహ్‌ తప్ప మరొక ఆరాధ్యుడు లేడు. ఆయన ఒక్కడే. ఆయనకు సరిసమానులు ఎవరూ లేరు. అల్లాహ్‌ అందరికంటే గొప్పవాడు, మహోన్నతుడు, అత్యధిక స్తోత్రాలు ఆయనకే శోభిస్తాయి. అల్లాహ్‌ పరిశుద్ధుడు. ఆయన సర్వలోకాల ప్రభువు. పాపాల నుండి కాపాడుకునే భాగ్యం, సత్కార్యాలు చేసే సామర్థ్యం అల్లాహ్‌ వద్ద నుండే లభిస్తుంది. ఆయన సర్వాధికుడు, వివేచనాపరుడు.” ఇది విని ఆ పల్లెవాసి, ”ఇవన్నీ నా ప్రభువుకి సంబంధించినవి కదా! మరి నా కోసం ఏమిటి?” అని అడిగాడు. అందుకతను (స), వాడికి ఈ విధంగా పఠిస్తూ ఉండమని ఉపదేశించారు:

అల్లాహు మ్మగ్ఫిర్ లీ, ర్హమ్నీ, వహ్దినీ, ర్జుఖ్నీ, ఆఫినీ,” — ‘ఓ అల్లాహ్‌! నన్ను క్షమించు. నన్ను కరుణించు, నాకు సన్మార్గం చూపు. ఇంకా నీ అనుగ్రహాన్ని ప్రసాదించు.’ (ముస్లిమ్‌)

2318 – [ 25 ] ( لم تتم دراسته ) (2/717)

وَعَنْ أَنَسٍ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم مَرَّعَلَى شَجَرَةٍ يَابِسَةٍ الْوَرَقِ فَضَرَبَهَا بِعَصَاهُ فَتَنَاثَرَ الْوَرَقُ فَقَالَ: “إِنَّ الْحَمْدَ لِلّهِ وَسُبْحَانَ اللهِ وَلَا إِلَهَ إِلَّا اللهُ وَاللهِ أَكْبَرُ. تُسَاقِطُ ذُنُوْبَ الْعَبْدِ كَمَا يَتَسَاقَطُ وَرَقُ هَذِهِ الشَّجَرَةِ”. رَوَاهُ التِّرْمِذِيُّ. وَقَالَ: هَذَا حَدِيْثٌ غَرِيْبٌ.

2318. (25) [2/717అపరిశోధితం]

అనస్‌ (ర) కథనం: ప్రవక్త (స) ఆకులు ఎండి పోయిన ఒకచెట్టు ప్రక్క నుండి వెళుతూ బెత్తంతో దాన్ని కొట్టారు. వెంటనే దాని ఆకులు రాలి క్రింద పడ్డాయి. అప్పుడు ప్రవక్త (స):

అల్‌’హమ్దు లిల్లాహ్‌, సుబ్‌’హానల్లాహ్‌, వలా ఇలాహ ఇల్లల్లాహ్‌, అల్లాహు అక్బర్,” అనే దాసుని పాపాలను ఈ చెట్టు ఆకులు రాలినట్లు రాల్చి వేస్తాయి అని ప్రవచించారు.  (తిర్మిజి’ / ఏకోల్లేఖనం)

2319 – [ 26 ] ( لم تتم دراسته ) (2/717)

وَعَنْ مَكْحُوْلٍ عَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: قَالَ  لي رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “أَكْثِرْ مِنْ قَوْلِ: “لَا حَوْلَ وَلَا قُوَّةَ إِلَّا بِاللهِ”. فَإِنَّهَا مِنْ كَنْزِ الْجَنَّةِ”. قَالَ مَكْحُوْلٌ: فَمَنْ قَالَ : “لَا حَوْلَ وَلَا قُوَّةَ إِلَّا بِاللهِ” وَلَا مَنْجَى مِنَ اللهِ إِلَّا إِلَيْهِ كَشَفَ اللهُ عَنْهُ سَبْعِيْنَ بَابًا مِّنَ الضَّرِّ أَدْنَاهَا الْفَقْرُ. رَوَاهُ التِّرْمِذِيُّ. وَقَالَ: هَذَا حَدِيْثٌ لَيْسَ إِسْنَادُهُ بِمُتَّصَلٍ وَمَكْحُوْلٌ لَمْ يَسْمَعْ عَنْ أَبِيْ هُرَيْرَةَ.

2319. (26) [717అపరిశోధితం]

మక్‌’హూల్‌ (ర), అబూహురైరహ్‌ (ర) ద్వారా ఉల్లే ఖిస్తున్నారు. అబూ హురైరహ్‌ (ర) కథనం, ”ప్రవక్త (స) నాతో ఓ అబూ హురైరహ్‌ నువ్వు అత్యధికంగా:

లా హౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లాహ్,‘ పఠించు. ఎందుకంటే ఇది స్వర్గంలోని నిధుల్లోని ఒక నిధి,” అని అన్నారు. ఉల్లేఖన కర్త మక్‌’హూల్‌ (ర) ఇలా అన్నారు, లా హౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లాహి వలా మన్ మినల్లాహి ఇల్లా ఇలైహి,” అని పలికితే 70 రకాల బాధలను అల్లాహ్‌ (త) దూరం చేస్తాడు. వీటిలో అన్నిటికంటే చిన్న బాధ దారిద్ర్యం. (తిర్మిజి’)

ఈ ‘హదీసు’కు ప్రామాణికత లేదు, ఎందుకంటే మక్‌’హూల్‌ అబూ హురైరహ్‌ నుండి వినలేదు, అని తిర్మిజి’ పేర్కొన్నారు.

2320 – [ 27 ] ( لم تتم دراسته ) (2/717)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ قَال: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَا حَوْلَ وَلَا قُوَّةَ إِلَّا بِاللهِ دَوَاءٌ مِّنْ تِسْعَةٍ وَّتِسْعِيْنَ دَاءً أَيْسَرُهَا الْهَمُّ.” رَوَاهُ الْبَيْهِقِيُّ فِيْ الدَّعْوَاتِ الْكَبِيْرِ

2320. (27) [2/717అపరిశోధితం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం:

లాహౌల వలాఖువ్వత ఇల్లాబిల్లాహ్,” 99 వ్యాధులకు చికిత్స. వీటిలో అన్నిటికంటే చిన్నది దుఃఖం, విచారం. అంటే దీన్ని పఠించడం వల్ల 99 వ్యాధులు నయమవుతాయి. (బైహఖీ-ద’అవాతుల్ కబీర్)

2321 – [ 28 ] ( لم تتم دراسته ) (2/717)

وَعَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “أَلَا أَدُلُّكَ عَلَى كَلِمَةٍ مِنْ تَحْتِ الْعَرْشِ مِنْ كَنْزِالْجَنَّةِ. “لَا حَوْلَ وَلَا قُوَّةَ إِلَّا بِاللهِ” يَقُوْلُ اللهِ تَعَالى: أَسْلَمَ عَبْدِيْ وَاسْتَسْلَمَ” . رَوَاهُ الْبَيْهِقِيُّ فِيْ الدَّعْوَاتِ الْكَبِيْرِ.

2321. (28) [2/717అపరిశోధితం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ”దైవ సింహాసనం క్రింద స్వర్గ నిధుల్లోని ఒక వచనాన్ని మీకు తెలుపనా? అని పలికి, అది: లాహౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లాహ్,దాసుల్లోని ఎవరైనా దీన్ని పఠిస్తే, అల్లాహ్‌(త) దానికిసమాధానంగా, ‘నాదాసుడు నా పట్ల విధేయుడయ్యాడు. ఇంకా అతడు తన సమ స్యలన్నిటినీ నాకు అప్పగించాడు,’ అని అంటాడు అని ప్రవచించారు.” (బైహఖీ-ద’అవాతుల్ కబీర్)

2322 – [ 29 ]  ( لم تتم دراسته ) (2/718)

وَعَنِ ابْنِ عُمَرَ أَنَّهُ قَالَ: سُبْحَانَ اللهِ هِيَ صَلَاةُ الْخَلَائِقِ وَالْحَمْدُ لِلّهِ كَلِمَةُ الشُّكْرِ .وَلَا إِلَهَ إِلَّا اللهُ كَلِمَةُ الْإِخْلَاصِ  .وَاللهُ أَكْبَرُ تَمْلَأُ مَا بَيْنَ السَّمَاءِ وَالْأَرْضِ. وَإِذَا قَالَ الْعَبْدُ: لَا حَوْلَ وَلَا قُوَّةَ إِلَّا بِاللهِ. قَالَ اللهُ تَعَالى: أَسْلَمَ عَبْدِيْ وَاسْتَسْلَمَ. رَوَاهُ رَزِيْنٌ.

2322. (29) [2/718అపరిశోధితం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘ఉమర్‌ (ర) ఇలా పలికే వారు, ”సుబ్‌’హానల్లాహ్,” పలకటం సృష్టితాలకు ఆరాధన వంటిది. మరియు ”అల్‌’హమ్దులిల్లాహి” కృతజ్ఞతా వచనం మరియు ”లా ఇలాహ ఇల్లల్లాహ్,‘ చిత్తశుద్ధి వచనం. అంటే దాన్ని పలకటం వల్ల నరకం నుండి విముక్తి లభిస్తుంది. మరియు ”అల్లాహు అక్బర్,” పుణ్యం భూమ్యాకాశాల మధ్య ఉన్నవాటిని నింపి వేస్తుంది. దాసుడు ”లా హౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లాహ్,” అని పలికితే అల్లాహ్‌ (త) సమాధానంగా, ‘నా దాసుడు నాకు విధేయు డయ్యాడు, తన పనంతా నాకు అప్పగించాడు,’ అని అంటాడు.’ (ర’జీన్‌)

=====

4- بَابُ الْاِسْتَغْفَارِ وَالتَّوْبَةِ

4. పశ్చాత్తాపం చెందటం, క్షమాపణ కోరటం

ఇస్తి’గ్‌ఫార్‌, ‘గఫ్‌ర్‌ నుండి వచ్చింది. అంటే దాచటం, కప్పటం అని అర్థం. దీని నుండే ‘గప్ఫార్‌, ‘గాఫిర్‌ వచ్చాయి. ఇవన్నీ అల్లాహ్‌ గుణనామాలు. అంటే పాపాలను కప్పిపుచ్చే వాడు. క్షమించేవాడు, ఇస్తి’గ్‌ఫార్‌ అంటే క్షమాపణ వేడుకోవటం, అంటే అపరాధాల నుండి, పాపాల నుండి క్షమాపణ కోరటం, అదేవిధంగా తౌబహ్ అంటే మరలటం, అంటే పాపాల నుండి వెనుతిరగటం, దీని నుండే తవ్వాబ్‌ వచ్చింది.

ఇది అల్లాహ్‌ గుణసంపన్నమైన పేరు. అంటే అల్లాహ్‌ (త) తౌబహ్ స్వీకరించి పాపాలను క్షమిస్తాడు. పాపాత్ములకు తౌబహ్, ఇస్తి’గ్‌ఫార్‌ చాలా అవసరం. తౌబహ్ నియమాల్లో పాపాల పట్ల సిగ్గుపడటం, ఇక ముందు పాపాలకు పాల్పడనని దృఢ సంకల్పం చేయటం, దాసుల హక్కులను చెల్లించడం తప్పని సరి. ఒక ‘హదీసు’లో ఇలా ఉంది, ”తన పాపాలపై పశ్చాత్తాపం చెందటమే తౌబహ్.” (ఇబ్నె హిబ్బాన్, ‘హాకిమ్‌ – తర్‌’గీబ్‌).

‘అలీ (ర) ఇలా అన్నారు, తౌబహ్లో 6 విషయాలు ఉండాలి. 1. పాపాల పట్ల పశ్చాత్తాపం, 2. ఏదైనా విధి తప్పిపోతే దాన్ని చెల్లించాలి, 3. బాధితుని హక్కు చెల్లించాలి, 4. వివాదం జరిగిన వారిని క్షమాపణ కోరాలి, 5. ఇక ముందు పాపాలకు పాల్పడనని దృఢ సంకల్పం కలిగి ఉండాలి, 6. దైవారాధనలో ఎల్లప్పుడూ నిమగ్నమై ఉండాలి. పాపాల రుచిచూచి నట్లు దైవారాధన రుచికూడా చూడాలి. (అన్‌వారుల్లు’గాత్)

నవవీ (ర) రియా’దుస్సాలిహీన్‌లో ఇలా పేర్కొన్నారు, ”ప్రతి ఒక్క పాపం పట్ల తౌబహ్ చేయాలి. పాపం దైవం మరియు దాసునితో సంబంధం కలిగి ఉంటుంది. దీనికి మూడు షరతులు ఉన్నాయి. 1. పాపాలకు దూరంగా ఉండాలి. 2. వాటిపట్ల పశ్చాత్తాపం చెందాలి. 3. ఇక ముందు చేయనని దృఢనిశ్చయం కలిగిఉండాలి. ఒకవేళ ఏదైనా పాపపు సంబంధం దాసులతో ఉంటే – ఈ మూడు షరతులతో పాటు మరోషరతు ఉంది, అదేమిటంటే అతని హక్కును చెల్లించాలి, అతన్ని క్షమాపణ కోరాలి.

‘గ’జాలీ (ర) ఇ’హ్‌యా ఉల్‌ ‘ఉలూమ్‌లో ఇలా పేర్కొన్నారు, ”మూడు విషయాలను తౌబహ్ అంటారు. అయితే ఇవి శిక్షణ ద్వారా లభిస్తాయి. వీటిలో మొదటిది జ్ఞానం. రెండవది పరిస్థితి, మూడవది ఆచరణ. మొదటిది రెండవ దానికి కారణభూతమౌతుంది. రెండవది మూడవదానికి కారణభూత మౌతుంది. ప్రతి ఒకదాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలి. పాపాల నష్టం చాలా ప్రమాదకరమైనది. ఈ పాపమే వ్యక్తికీ అతని ప్రియమైన వారికి మధ్య తెరగా ఏర్పడుతుంది. ఈ విషయం అతని హృదయంలో నాటుకుంటే, అతనికి తెలియటం వల్ల ప్రియుని కోల్పోతానేమో అని భయం వేస్తుంది. ఒకవేళ తన ఆచరణ వల్లే ప్రియుడు కలవక పోతే చాలా విచారం, దుఃఖం కలుగుతుంది. దీన్నే చింతించటం అంటారు. దీన్నే మరోవిధంగా స్థితిగా భావించాలి. హృదయంలో ఈ పరిస్థితి అధికమైతే మరోస్థితి ఉద్భవిస్తుంది. దీన్నే ఉద్దేశ్యం అంటారు. అయితే మూడు కాలాలకు సంబంధించిన సంకల్పం, ఉద్దేశ్యం కలుగుతుంది. ప్రస్తుత స్థితిలో ఇంతకుముందు చేసే పాపాలను వదలి వేయాలి. భవిష్యత్తు పట్ల అంటే ఏ అపరాధాల వల్ల ప్రియతముడు దొరకలేదో దాన్ని వదలివేయాలి. వర్తమాన కాలం అంటే దానిలో ఎవరికైనా నష్టం కలిగించితే దాన్ని పూర్తిచేయాలి. వీటన్నిటికంటే ముందు జ్ఞానం కలిగి ఉండటమే విశ్వాసం. అంటే హృదయంలో ఏమాత్రం సంకోచం, అనుమానం రానటువంటిది.

సారాంశం ఏమిటంటే ఈ మూడు వరుస క్రమ అంశాలను తౌబహ్ అంటారు. ఇవి ఒక దాని తరువాత ఒకటి ఉంటాయి. 1. జ్ఞానం 2. విచారించటం 3. భవిష్యత్‌ కాలాల్లో చెడుకు దూరంగా ఉండే గట్టి సంకల్పం. వర్తమానంలో జరిగిన వాటికి లోపాలకు పరిహారం చెల్లించటం, వీటన్నిటినీ కలిపి తౌబహ్ అంటారు.

ఖుర్‌ఆన్‌ మరియు ‘హదీసు’లో తౌబహ్ గురించి దాని ప్రత్యేకతల గురించి గుచ్చిచెప్పటం జరిగింది. అల్లాహ్‌ (త) ఆదేశం: ”… ఓ విశ్వాసులారా! మీరం దరూ కలసి అల్లాహ్‌ను క్షమాపణకై వేడుకుంటే, మీరు సాఫల్యం పొందవచ్చు!” (సూ. అన్నూర్‌, 24:31)

ఈ ఆయతులో ముస్లిములందరినీ తౌబహ్ చేయమని ఆదేశించడం జరిగింది. అల్లాహ్‌ ఆదేశం: ”ఓ విశ్వాసులారా! మీరు అల్లాహ్‌ వైపునకు మనఃపూర్వకమైన పశ్చాత్తాపంతో, క్షమాపణ కొరకు మరలితే! మీ ప్రభువు మీ పాపాలను తొలగించి, మిమ్మల్ని క్రింద సెలయేళ్ళు ప్రవహించే స్వర్గ వనాలలో ప్రవేశింపజేస్తాడు. ఆ రోజు అల్లాహ్‌ తన ప్రవక్తను మరియు అతనితోపాటు విశ్వసించిన వారిని అవమానం పాలు చేయడు. వారి కాంతి, వారి ముందు మరియు వారి కుడివైపు నుండి ప్రసరిస్తూ ఉంటుంది. ”…వారు ఇలా ప్రార్థిస్తారు: ‘ఓ మా ప్రభూ! మా కాంతిని మా కొరకు పరిపూర్ణంచేయి మరియు మమ్మల్ని క్షమించు. నిశ్చయంగా, నీవే ప్రతిదీ చేయగల సమర్థుడవు!’ (సూ. అత్‌ త’హ్ర్‌మ్‌, 66:8)

అల్లాహ్‌ ఆదేశం: ”(వీరే అల్లాహ్‌ ముందు) పశ్చాత్తా పపడే వారు, ఆయనను ఆరాధించే వారు, స్తుతించే వారు (అల్లాహ్‌ మార్గంలో) సంచరించే వారు (ఉపవా సాలు చేసేవారు). ఆయన సన్నిధిలో వంగే (రుకూ’ఉ చేసే) వారు, సాష్టాంగం (సజ్దా) చేసేవారు, ధర్మమును ఆదేశించే వారు మరియు అధర్మమును నిషేధించే వారు మరియు అల్లాహ్‌ విధించిన హద్దులను పాటించేవారు కూడాను. మరియు విశ్వాసులకు శుభవార్త తెలుపు.” (సూ. అత్తౌబహ్, 9:112)

ఈ ఆయతులో తౌబహ్ చేసేవారి సుగుణాలను పేర్కొనడం జరిగింది. అంటే ఇటువంటి సుగుణాలు కలిగి ఉండాలి. ఈ ప్రాపంచిక జీవితాన్ని ఎంత మాత్రం నమ్మరాదు. ఎప్పుడూ చావుభయం ఉంటుంది. అందువల్ల తౌబహ్ మరియు క్షమాపణను ఎట్టి పరిస్థితుల్లోనూ విస్మరించరాదు. తౌబహ్ చేసే వారిని అల్లాహ్‌ (త) అమితంగా ప్రేమిస్తాడు.

ఖుర్‌ఆన్‌లో ఇంకా ఇలా ఆదేశించాడు: ” ‘హా-మీమ్‌. గ్రంథ (ఖుర్‌ఆన్‌) అవతరణ సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞుడు అయిన అల్లాహ్‌ తరఫునుండి జరిగింది. పాపాలను క్షమించేవాడు మరియు పశ్చాత్తాపాన్ని అంగీకరించేవాడు, శిక్షించటంలో కఠినుడు, ఎంతో ఉదార స్వభావుడు. ఆయన తప్ప మరొక ఆరాధ్యుడు లేడు. (అందరీ) మరలింపు ఆయన వైపునకే ఉంది!” (సూ. ముఅ’మిన్‌, 40:1-3) అంటే — ‘ఖుర్‌ఆన్‌ అల్లాహ్‌ వద్ద నుండి అవతరింపజేయ బడింది. ఆయన గౌరవం, జ్ఞానం గలవాడు. ఆయన సర్వలోపాలకు అతీతుడు. ఆయనకు తెలియనిది ఒకరవ్వ కూడాలేదు, అది ఎన్నితెరల వెనుక ఉన్నా సరే. ఆయన పాపాలను క్షమించేవాడు. ఆయన తన వైపు మరలేవారి వైపు మరలేవాడు. అదేవిధంగా ఆయనను లక్ష్యపెట్టని వారిని, ఆయన పట్ల అహంకారంగా తలబిరుసుతనంగా ప్రవర్తించే వారిని ఐహిక వాంఛల వెంటపడి పరలోకాన్ని మరచేవారిని, అవిధేయతకు పాల్పడేవారిని కఠినంగా శిక్షించేవాడు.’

అల్లాహ్‌ ఆదేశం: ”నా దాసులకు ఇలా తెలియ జెయ్యి, ‘నిశ్చయంగా, నేను కేవలం నేనే,  క్షమించే వాడను, కరుకరుణించేవాడను. మరియు నిశ్చయంగా, నా శిక్షయే అతి బాధాకరమైన శిక్ష.’ అని.” (సూ. అల్ హిజ్ర్, 15:49-50)

ఇటువంటి అనేక ఆయతులు ఖుర్‌ఆన్‌లో ఉన్నాయి. వీటిలో కరుణ క్షమాపణలతో పాటు శిక్షలను గురించి కూడా పేర్కొనడం జరిగింది. దీనివల్ల దాసుడు భయం ఆశలతో ఉంటాడు. ఆయన విశాల ధనసంపదలు గలవాడు. ఆయన చాలా ఉన్నతుడు. ఆయన మహా ఉపకారి. అనంతమైన అనుగ్రహాలు, కారుణ్యాలు కలవాడు. దాసులపై ఆయన అనేక ఉపకారాలు ఉన్నాయి. వాటిని ఎవరూ లెక్క పెట్టలేరు. మరి కృతజ్ఞతలు ఎలా తెలుపగలరు? మానవులు ఒక్క అనుగ్రహానికి కూడా కృతజ్ఞతలు తెలుపలేరు. ఆయనలాంటి వారు లేరు. ఆయనవంటి గుణం ఎవరిలోనూ లేదు, ఆయన తప్ప ఎవరూ ఆరాధనకు అర్హులు కారు. ఆయన తప్ప పరిరక్షించే, సంరక్షించే వారెవరూ లేరు. అందరూ ఆయన వైపునకే వెళ్ళవలసి ఉంది. అప్పుడు ఆయన ప్రతి ఒక్కరికీ వారి ఆచరణలను గురించి త్వరగా విచారిస్తాడు. లెక్క తీసుకుంటాడు.

‘ఉమర్‌ (ర) వద్దకు ఒక వ్యక్తి వచ్చి, ”నేనొక వ్యక్తిని హత్య చేసాను. నా పశ్చాత్తాపం స్వీకరించబడు తుందా?” అని ప్రశ్నించాడు. అప్పుడు ‘ఉమర్‌ (ర) ప్రారంభ సూరహ్‌ రెండు ఆయతులు పఠించి విని పించారు. ఇంకా ఇలా అన్నారు: ”నిరాశచెందకండి, సత్కార్యాలు చేస్తూ పోండి.” (ఇబ్నె అబీ ‘హాకిమ్‌)

”ఉమర్‌ (ర) వద్దకు సిరియాకు చెందిన ఒక వ్యక్తి వచ్చేవాడు. ఒకసారి చాలా రోజుల వరకు రాలేదు. ‘ఉమర్‌ (ర) ప్రజలతో అతని గురించి అడిగారు. దానికి ప్రజలు, ‘అతడు త్రాగటం మొదలెట్టాడు,’ అని అన్నారు. ‘ఉమర్‌ (ర) తన గుమస్తాను పిలిపించి ఇలా వ్రాయి అన్నారు, ”ఉమర్‌ బిన్‌ ఖత్తాబ్‌ తరఫు నుండి, ఫలానా వ్యక్తి వైపు, అస్సలాము అలైకుమ్‌. నీ ప్రభువును కొనియాడుతున్నాను. ఆయన తప్ప ఆరాధ్యు లెవరూ లేరు. ఆయన పాపాలను మన్నించే వాడు. పశ్చాత్తాపాన్ని స్వీకరించేవాడు. కఠినంగా శిక్షించేవాడు, గొప్ప ఉపకారం చేసేవాడు, ఆయన తప్ప మరో ఆరాధ్యుడులేడు. ఆయన వైపునకే మరలవలసి ఉంది. ఈ ఉత్తరం అతనికి పంపి తన మిత్రులతో, ‘మీ సోదరుని అల్లాహ్‌ మరలించమని, అతని దు’ఆ స్వీకరించమని దు’ఆ చేయండి,’ అని అన్నారు. ఆ వ్యక్తికి ఉత్తరం అందిన తర్వాత ఆ వ్యక్తి ఉత్తరాన్ని అనేకసార్లు చదవటం ప్రారంభించాడు. అల్లాహ్‌ (త) తన శిక్ష ద్వారా భయపెట్టాడు, తన కారుణ్యం పట్ల ఆశ చూపాడు, మన్నింపు వాగ్దానం చేసాడు’ అని అన్నాడు. అనేక సార్లు చదివి ఏడ్చి దైవాన్ని క్షమాపణ కోరి పశ్చాత్తాపం చెందాడు. ‘ఉమర్‌ (ర) కు ఈ విషయం తెలిసి చాలా సంతోషించారు. ‘ఇంకా ఈ విధంగానే చేయండి,’ అని అన్నారు. ముస్లిముల్లోని ఎవరైనా ఈ విధంగా తప్పటడుగు వేస్తే అతనికి మార్గం చూపండి.

సా’బిత్‌ (ర) కథనం: ”నేను కూఫా పరిసర ప్రాంతంలో ముస్‌’అబ్‌ బిన్‌ ‘జుబైర్‌ వెంట ఉన్నాను. ఒక తోట లోనికి వెళ్ళి నేను రెండు రక’అతులు నమా’జ్‌ ప్రారంభించాను.

సూరహ్‌ మూ’మిన్‌ పఠించసాగాను. ఇంకా నేను ఇలైహల్‌ మసీ’ర్‌ వరకే చేరాను. నా వెనుక కంచర గాడిదపై యమనీ దుప్పట్లు కప్పుకొని ఉన్న వ్యక్తి నాతో ఇలా అన్నాడు, గాఫిరి జ్జంబి,పఠిస్తే, యా గాఫిరిజ్జంబి, గ్ఫిర్లీ, అని, ఖాబిలి త్తౌబి, అని పఠిస్తే, యా ఖాబిలిత్తౌబి, ఇఖ్బల్తౌబతీ, అని, షదీదుల్ఇఖాబి అని పఠిస్తే, యా షదీదల్ఇఖాబి, లా తుఆఖిజ్నీ,అని పఠించు.”

ము’స్‌’అబ్‌ కథనం: నేను చూస్తే నాకు ఎవరూ కనబడ లేదు. నమా’జు ముగించి తలుపువద్దకు వెళ్ళాను. అక్కడ కొంతమంది కూర్చొని ఉన్నారు. ‘యమనీ దుప్పటి కప్పుకొని ఉన్న వ్యక్తి ఎవరైనా ఇటుగా వచ్చారా?’ అని వారిని అడిగాను. వారు ‘ఇటుగా ఎవర్నీ వచ్చినట్లుగా, పోయినట్లుగా మేము చూడలేదు,’ అని అన్నారు. అప్పుడు ప్రజలు ఆ వ్యక్తి ఇల్‌యాస్‌ అని భావించారు. ఈ ఉల్లేఖనం మరో పరంపర ద్వారా కూడా ఉల్లేఖించడం జరిగింది. అందులో ఇల్‌యాస్‌ ప్రస్తావన లేదు. (ఇబ్నె కసీర్‌)

ఇస్తి’గ్‌ఫార్‌ ప్రత్యేకతలను క్రింద పేర్కొనడం జరిగింది.

اَلْفَصْلُ الْأَوَّلُ మొదటి విభాగం   

2323 – [ 1 ] ( صحيح ) (2/719)

عَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “وَاللهِ إِنِّيْ لَأَسْتَغْفِرُاللهَ وَأَتُوْبُ إِلَيْهِ فِيْ الْيَوْمِ أَكْثَرَمِنْ سَبْعِيْنَ مَرَّةً. رَوَاهُ الْبُخَارِيُّ.  

2323. (1) [2/719దృఢం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”అల్లాహ్‌ సాక్షి! నేను రోజుకు 70 కంటే ఎక్కువ సార్లు అల్లాహ్‌ను క్షమాపణకై వేడుకుంటాను. ఆయన సన్నిధిలో పశ్చాత్తాపపడతాను. [41] (బు’ఖారీ)

2324 – [ 2 ] ( صحيح ) (2/719)

وَعَنِ الْأَغَرِّ الْمُزَنِيّ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِنَّهُ لَيُغَانُ عَلَى قَلْبِيْ وَإِنِّيْ لَأَسْتَغْفِرُ اللهَ فِيْ الْيَوْمِ مِائَةَ مَرَّةٍ”. رَوَاهُ مُسْلِمٌ.

2324. (2) [2/719దృఢం]

అ’గర్ర్ ము’జని (ర) కథనం: ప్రవక్త (స) ఇలా ప్రబో ధించారు: నేను రోజుకు వందసార్లు అల్లాహ్‌(త)ను క్షమాభిక్షకోసం వేడుకుంటూ ఉంటాను, అయినా అప్పుడప్పుడూ నా హృదయం మీద కూడా ఒక తెరలాంటిది క్రమ్ముకుంటూ ఉంటుంది. [42]  (ముస్లిమ్‌)

2325 – [ 3 ] ( صحيح ) (2/719)

وَعَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “يَا أَيُّهَا النَّاسُ تُوْبُوْا إِلَى اللهِ فَإِنِّيْ أَتُوْبُ إِلَيْهِ فِيْ الْيَوْمِ مِائَةَ مَرَّةٍ” .رَوَاهُ مُسْلِمٌ.

2325. (3) [2/719దృఢం]

అ’గర్ర్ ము’జని (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం ”ప్రజలారా! మీరు పశ్చాత్తాపంతో అల్లాహ్(త) వైపు మరలండి. నేను రోజుకి 100 సార్లు పశ్చాత్తాపంతో అల్లాహ్(త) వైపు మరలుతూ ఉంటాను.” (ముస్లిమ్‌)

2326 – [ 4 ] ( صحيح ) (2/719)

وَعَنْ أَبِيْ ذَرٍّرَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم فِيْمَا يَرْوِيْ عَنِ اللهِ تَبَارَكَ وَتَعَالى أَنَّهُ قَالَ: “يَا عِبَادِيْ إِنِّيْ حَرَّمْتُ الظُّلْمَ عَلَى نَفْسِيْ وَجَعَلْتُهُ بَيْنَكُمَ مُحَرَّمًا فَلَا تَظَالَمُوْا. يَا عِبَادِيْ كُلُّكُمْ ضَالٌّ إِلَّا مَنْ هَدَيْتُهُ فَاسْتَهْدُوْنِيْ أَهْدِكُمْ. يَا عِبَادِيْ كُلُّكُمْ جَائِعٌ إِلَّا مَنْ أَطْعَمْتُهُ فَاسْتَطْعِمُوْنِيْ أُطْعِمُكُمْ. يَا عِبَادِيْ كُلُّكُمْ عَارٍ إِلَّا مَنْ كَسَوْتُهُ فَاسْتَكْسُوْنِيْ أَكْسُكُمْ. يَا عِبَادِيْ إِنَّكُمْ تُخْطِئُوْنَ بِاللَّيْلِ وَالنَّهَارِ وَأَنَا أَغْفِرُ الذُّنُوْبَ جَمِيْعًا فَاسْتَغْفِرُوْنِيْ أَغْفِرْ لَكُمْ. يَا عِبَادِيْ إِنَّكُمْ لَنْ تَبْلُغُوْا ضُرِّيْ فَتَضُرُّوْنِيْ وَلَنْ تَبْلُغُوْا نَفْعِيْ فَتَنْفَعُوْنِيْ. يَا عِبَادِيْ لَوْ أَنَّ أَوَّلَكُمْ وَآخِرَكُمْ وَإِنْسَكُمْ وَجِنَّكُمْ كَانُوْا أَتْقَى قَلْبِ رَجُلٍ وَاحِدٍ مِّنْكُمْ مَا زَادَ ذَلِكَ فِيْ مُلْكِيْ شَيْئًا. يَا عِبَادِيْ لَوْ أَنَّ أَوَّلَكُمْ وَآخِرَكُمْ وَإِنْسَكُمْ وَجِنَّكُمْ كَانُوْا عَلَى أَفْجَرِ قَلْبِ وَّاحِدٍ مِّنْكُمْ مَا نَقَصَ  ذلك مِنْ مُلْكِيْ شَيْئًا. يَا عِبَادِيْ لَوْ أَنَّ أَوَّلَكُمْ وَآخِرَكُمْ وَإِنْسَكُمْ وَجِنَّكُمْ قَامُوْا فِيْ صَعِيْدٍ وَاحِدٍ فَسْأَلُوْنِيْ فَأَعْطَيْتُ كُلَّ إِنْسَانٍ مَسْأَلَتَهُ مَا نَقَصَ ذَلِكَ مِمَّا عِنْدِيْ إِلَّا كَمَا يَنْقُصُ الْمِخْيَطُ إِذَا أُدْخِلَ الْبَحْرَ. يَا عِبَادِيْ إِنَّمَا هِيَ أَعْمَالُكُمْ أُحْصِيْهَا عَلَيْكُمْ ثُمَّ أُوَفِّيَكُمْ إِيَّاهَا فَمَنْ وَجَدَ خَيْرًا فَلْيَحْمَدِ اللهَ وَمَنْ وَّجَدَ غَيْرَ ذَلِكَ فَلَا يَلُوْمَنَّ إِلَّا نَفْسَهُ”. رَوَاهُ مُسْلِمٌ.

2326. (4) [2/719దృఢం]

అబూ జ’ర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం: అల్లాహ్‌ ఆదేశం, ”నా దాసులారా! నాపై నేను దౌర్జన్యాన్ని నిషేధించుకున్నాను, మీ మధ్య కూడా నేను దౌర్జన్యాన్ని నిషేధించాను. కనుక మీరు పరస్పరం దౌర్జన్యానికి పాల్పడకండి. ”నా దాసులారా! మీలో ప్రతి ఒక్కడూ దారి తప్పినవాడే. నేను మార్గం చూపిన వ్యక్తి తప్ప. కనుక సన్మార్గం చూపమని నన్ను ప్రార్థించండి. నేను మీకు మార్గం చూపుతాను. నా దాసులారా! మీలో ప్రతి ఒక్కడూ ఆకలిగొన్న వాడే. నేను అన్నం పెట్టిన వాడు తప్ప. కనుక మీ జీవనోపాధికై నన్ను అర్థించండి. నేను మీకు అన్నం పెడతాను. నా దాసులారా! మీలో ప్రతివాడూ దుస్తులు లేనివాడే. నేను తొడిగించినవాడు తప్ప. కనుక  నన్ను వస్త్రాలకై అర్థించండి. నేను మీకు వస్త్రాలను ప్రదానం చేస్తాను. నా దాసులారా! మీరు రాత్రీ, పగలు పాపాలు చేస్తుంటారు. నేను పాపాలన్నిటినీ మన్నించగలను. కనుక నన్ను క్షమాభిక్షకై వేడుకోండి. నేను మిమ్మల్ని క్షమిస్తాను. ఓ నా దాసులారా! మీరందరూ కలసి నాకు నష్టం కలిగించాలని కోరినా, మీరు ఏ మాత్రం నాకు నష్టం కలిగించలేరు. అదేవిధంగా ఒకవేళ మీరు నాకు లాభం చేకూర్చదలచినా నాకు లాభం చేకూర్చలేరు. ఓ నా దాసులారా! మీ పూర్వీకులు మీ ముందువారు, మానవులు జిన్నులు అందరూ కలసి దైవభీతి పరులైనా మీ దైవభీతి నా సామ్రాజ్యానికి ఎటువంటి లాభం చేకూర్చదు. ఓ నా దాసులారా! మీరంతా మానవులు, జిన్నులు స్త్రీలు పురుషులు దుర్మార్గులై నా సామ్రాజ్యానికి ఎటువంటి హాని తలపెట్టలేరు. ఓ నా దాసులారా! మీ పూర్వీకులు, ముందు వారు స్త్రీలు పురుషులు ఒకచోట నిలబడి మీరు కోరింది అడిగినా, ప్రతిఒక్కరికీ వారడిగినంత నేను ఇచ్చి వేసినా నా సామ్రాజ్యంలో ఏమాత్రం కొరతరాదు. సూదికి తగిలినంత నీరు తప్ప. ఓ నా దాసులారా! మీ ఆచరణలను కనిపెట్టి ఉన్నాను. వాటిని వ్రాస్తూ ఉన్నాను. వాటికి పూర్తి ప్రతిఫలం ఇవ్వటానికి, మీకు మంచి జరిగితే అల్లాహ్‌కు కృతజ్ఞతలు తెలుపండి, దీనికి వ్యతిరేకంగా జరిగితే తన్ను తాను చీవాట్లు పెట్టుకోవాలి. [43] (ముస్లిమ్‌)

2327 – [ 5 ] ( متفق عليه ) (2/720)

وَعَنْ أَبِيْ سَعِيْدِ الْخُدْرِيْ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “كَانَ فِيْ بَنِيْ إِسْرَائِيْلَ رَجُلٌ قَتَلَ تِسْعَةً وَّتِسْعِيْنَ إِنْسَانًا ثُمَّ خَرَجَ يَسْأَلُ فَأَتَى رَاهِبًا فَسَأَلَهُ فَقَالَ: أَلَهُ تَوْبَةٌ قَالَ: لَا فَقَتَلَهُ وَجَعَلَ يَسْأَلُ. فَقَالَ لَهُ رَجُلٌ ائْتِ قَرْيَةَ كَذَا وَكَذَا فَأَدْرَكَهُ الْمَوْتُ فَنَاءَ بِصَدْرِهِ نَحْوَهَا فَاخْتَصَمَتْ فِيْهِ مَلَائِكَةُ الرَّحْمَةِ وَمَلَائِكَةُ الْعَذَابِ. فَأَوْحَى اللهُ إِلَى هَذِهِ أَنْ تَقَرَّبِيْ وَإِلَى هَذِهِ أَنْ تَبَاعَدِيْ. فَقَالَ قِيْسُوْا مَا بَيْنَهُمَا فَوُجِدَ إِلَى هَذِهِ أَقْرَبَ بِشِبْرٍ فَغُفِرَ لَهُ”.

2327. (5) [2/720ఏకీభవితం]

అబూ స’యీద్‌ (ర) కథనం: ప్రవక్త (స) ఇలా ప్రవ చించారు, ”బనీ ఇస్రాయీ’ల్‌లో ఒక వ్యక్తి ఉండే వాడు. అతడు 99 మందిని హత్యచేసాడు. మళ్ళీ ఆ వ్యక్తి ఈ సమస్య గురించి పరిష్కారం అడగడానికి బయలు దేరాడు. ఒక పండితుని వద్దకు వెళ్ళాడు. అతన్ని ఈ సమస్య గురించి ప్రశ్నించాడు. ఆ పండితుడు కాదు అని సమాధానం ఇచ్చాడు. ఆ వ్యక్తి అతన్ని కూడా చంపివేసాడు. 100 హత్యలు పూర్తయ్యాయి. మళ్ళీ ఆ వ్యక్తి ఆ సమస్య కోసం మరొకరి వద్దకు వెళ్ళాడు, సమస్యను పరిష్కరించమని అన్నాడు. అంటే 100 హత్యలు చేసి ఒకవేళ పశ్చాత్తాపం చెందగోరితే అతని పశ్చాత్తాపం స్వీకరించబడుతుందా లేదా అని ప్రశ్నిం చాడు. దానికి ఆ పండితుడు ఉందని చెప్పి ”నువ్వు ఫలానా చోటికి వెళ్ళు. అక్కడ కొంత మంది అల్లాహ్‌ (త) ను ఆరాధించడంలో నిమగ్నులై ఉన్నారు. నీవు కూడా వారితో కలిసి అల్లాహ్‌(త)ను ఆరాధించు. అని పంపాడు. ఆ వ్యక్తి బయలుదేరాడు. సగం దూరం వెళ్ళేసరికి అతనికి మరణసమయం  దగ్గర పడింది. నడవలేక నేలపై ప్రాకుతూ ఊరివైపు ముందుకు సాగుతున్నాడు. మరణం సంభవించింది. కారుణ్య దూతలు, శిక్షించే దూతలు ఇరువురూ వచ్చారు. వారి మధ్య వివాదం తలెత్తింది. ‘అతడు పశ్చత్తాపంచెంది వచ్చాడు, అందువల్ల మేము అతని ప్రాణం తీస్తాము,’ అని కారుణ్యదూతలు అన్నారు. ‘అతడు 100 హత్యలు చేసాడు, అందువల్ల మేము అతని ప్రాణం తీస్తాము,’ అని శిక్షించే దూతలు అన్నారు. అప్పుడు అల్లాహ్(త) చేరవలసిన ఊరును దగ్గరగా అవమని, విడిచి వెళ్ళిన ఊరిని దూరంగా అవమని ఆదేశించాడు. దైవదూతలను రెంటినీ కొలవమని ఆదేశించాడు. కొలచి చూస్తే ఆ వ్యక్తి పాపవిముక్తి కోసం పోదలచుకున్న ఊరు ఒక జానెడు  దగ్గరగా ఉంది. అప్పుడు కారుణ్య దూతలు అతన్ని తమ అధీనం లోనికి తీసుకున్నారు ఇంకా అతన్ని క్షమించడం జరిగింది. [44] (బు’ఖారీ, ముస్లిమ్‌)

2328 – [ 6 ] ( صحيح ) (2/721)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “وَالَّذِيْ نَفْسِيْ بِيَدِهِ لَوْلَمْ تُذْنِبُوْا لَذَهَبَ اللهُ بِكُمْ وَلَجَاءَ بِقَوْمٍ يُذْنِبُوْنَ فَيَسْتَغْفِرُوْنَ اللهَ فَيَغْفِرُ لَهُمْ”. رَوَاهُ مُسْلِمٌ.

2328. (6) [2/721దృఢం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఎవరి చేతిలో నా ప్రాణం ఉందో ఆ అల్లాహ్‌ (త) సాక్షి! ఒకవేళ మీరు పాపం చేయకపోతే అల్లాహ్‌ (త) మిమ్మల్ని నాశనం చేసి మరొక జాతిని తీసుకు వస్తాడు. వారు పాపంచేసి, క్షమాపణ కోరుతారు. అల్లాహ్‌ (త) వారిని క్షమించివేస్తాడు.” [45] (ముస్లిమ్‌)

2329 – [ 7 ] ( صحيح ) (2/721)

وَعَنْ أَبِيْ مُوْسَى رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِنَّ اللهَ يَبْسُطُ يَدَهُ بِاللَّيْلِ لِيَتُوْبَ مُسِيْءُ النَّهَارِ وَيَبْسُطُ يَدَهُ بِالنَّهَارِ لِيَتُوْبَ مَسِيْءُ اللَّيْلِ حَتَّى تَطْلُعَ الشَّمْسُ مِنْ مَغْرِبِهَا”. رَوَاهُ مُسْلِمٌ.

2329. (7) [2/721దృఢం]

అబూ మూసా (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, పగటి పూట పాపం చేసినవాడు రాత్రి పశ్చాత్తాపం చెందాలని, అల్లాహ్‌(త)క్షమించడానికి రాత్రివేళ తన చేయిని చాపుతాడు. అలాగే రాత్రివేళ పాపంచేసిన వాడు పగలు పశ్చాత్తాపం చెందాలని, అల్లాహ్‌ (త) క్షమించడానికి పగటిపూట తన చేయిని చాచి ఉంచు తాడు. సూర్యుడు పడమటి దిక్కు నుంచి ఉదయించే వరకు ఇలా కొనసాగుతూ ఉంటుంది. [46]  (ముస్లిమ్‌)

2330 – [ 8 ] ( متفق عليه ) (2/721)

وَعَنْ عَائِشَةَ رَضِيَ اللهُ عَنْهَا قَالَتْ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِنَّ الْعَبْدَ إِذَا اعْتَرَفَ ثُمَّ تَابَ تَابَ اللهُ عَلَيْهِ”.  

2330. (8) [2/721ఏకీభవితం]

‘ఆయి’షహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”దాసుడు తన పాపాలను ఒప్పుకొని పశ్చాత్తాపం చెందితే అల్లాహ్‌(త) పశ్చాత్తాపం స్వీకరిస్తాడు.” (బు’ఖారీ, ముస్లిమ్‌)

2331 – [ 9 ] ( صحيح ) (2/721)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَنْ تَابَ قَبْلَ أَنْ تَطْلُعَ الشَّمْسُ مِنْ مَّغْرِبِهَا تَابَ اللهُ عَلَيْهِ”. رَوَاهُ مُسْلِم .

2331. (9) [2/721దృఢం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”సూర్యుడు పడమటి దిక్కు నుండి ఉదయించనంత వరకు తన పాపాలపై పశ్చాత్తాపం చెందేవాని పశ్చాత్తాపాన్ని అల్లాహ్‌(త) స్వీకరిస్తూ ఉంటాడు. (ముస్లిమ్‌)

2332 – [ 10 ] ( صحيح ) (2/721)

وَعَنْ أَنَسٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “للهُ أَشَدُّ فَرَحًا بِتَوْبَةِ عَبْدِهِ حِيْنَ يَتُوْبُ إِلَيْهِ مِنْ أَحَدِكُمْ كَانت رَاحِلَتُهُ بِأَرْضِ فُلَاةٍ فَانْفَلَتَتْ مِنْهُ وَعَلَيْهَا طَعَامُهُ وَشَرَابُهُ فَأَيِسَ مِنْهَا فَأَتَى شَجَرَةً فَاضْطَجَعَ فِيْ ظِلِّهَا قَدْ أَيِسَ مِنْ رَاحِلَتِهِ فَبَيْنَمَا هُوَ كَذَلِكَ إِذْ هُوَ بَهَا قَائِمَةٌ عِنْدَهُ فَأَخَذَ بِخِطَامِهَا. ثُمَّ قَالَ مِنْ شِدَّةِ الْفَرَحِ: اَللّهُمَّ أَنْتَ عَبْدِيْ وَأَنَا رَبُّكَ أَخْطَأَ مِنْ شِدَّةِ الْفَرْحِ”.  رَوَاهُ مُسْلِمٌ.

2332. (10) [2/721దృఢం]

అనస్‌ (ర) కథనం: ప్రవక్త (స) ఇలా ప్రవచించారు, ”అల్లాహ్‌ (త) తన దాసుడు, పాపాలపై పశ్చాత్తాప పడినందుకు ఎడారి ప్రదేశంలో ఒంటెను పోగొట్టు కొని తిరిగి పొందిన వ్యక్తికన్నా ఎక్కువగా సంతోషిస్తాడు. ‘ఒక వ్యక్తి ఎడారి ప్రాంతంలో తన ఒంటెపై ప్రయాణిస్తున్నాడు. దానిపైనే అతని ఆహారసామగ్రి, నీరు ఉన్నాయి. మార్గం మధ్యలో ఆ ఒంటె తప్పిపోయింది. అతను ఇక ఆ ఒంటె దొరకదని భావించాడు. వెతికి వెతికి నిరాశతో తిరిగివచ్చి ఓ చెట్టు నీడలో మేనువాల్చాడు. ఇంతలో ఆ ఒంటె వచ్చి అతని ముందు నిలబడింది. వెంటనే అతను దాని ముక్కుతాడు పట్టుకొని ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బై పోయి, ”ఓ అల్లాహ్‌(త)! నీవు నా దాసుడివి. నేను నీ ప్రభువును.” అన్నాడు. సంతోషం పట్టలేక ఆ వ్యక్తి మాటలు అలా తడబడ్డాయను కుంటే నిశ్చయంగా అల్లాహ్‌ (త) తన దాసుని పశ్చాత్తాపంపై అంతకన్నా ఎక్కువగానే సంతోషిస్తాడు. (ముస్లిమ్‌)

2333 – [ 11 ] ( متفق عليه ) (2/722)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِنَّ عَبْدًا أَذْنَبَ ذَنْبًا فَقَالَ: رَبِّ أَذْنَبْتُ فَاغْفِرْهُ. فَقَالَ رَبُّهُ: أَعَلِمَ عَبْدِيْ أَنَّ لَهُ رَبًّا يَغْفِرُ الذَّنْبَ وَيَأْخُذُ بِهِ؟ غَفَرْتُ لِعَبْدِيْ ثُمَّ مَكَثَ مَاشَاءَ اللهُ ثُمَّ أَذْنَبَ ذَنْبًا. فَقَالَ: رَبِّ أَذْنَبْتُ ذَنْبًا فَاغْفِرْهُ. فَقَالَ رَبَّهُ: أَعْلِمَ عَبْدِيْ أَنَّ لَهُ رَبًّا يَغْفِرُالذَّنْبَ وَيَأْخُذُ بِهِ؟ غَفَرْتُ لِعَبْدِيْ ثُمَّ مَكَثَ مَا شَاءَ اللهُ ثُمَّ أَذْنَبَ ذَنْبًا قَالَ: رَبِّ أَذْنَبْتُ ذَنْبًا آخَرَ فَاغْفِرْهُ لِيْ. فَقَالَ: أَعَلِمَ عَبْدِيْ أَنَّ لَهُ رَبًّا يَغْفِرُالذَّنْبَ وَيَأْخُذُ بِهِ؟ غَفَرْتُ لِعَبْدِيْ فَلْيَفْعَلْ مَا شَاءَ”.

2333. (11) [2/722ఏకీభవితం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ఇలా ప్రవచించారు, ”దాసుడు పాపానికి పాల్పడిన తర్వాత విచారిస్తూ ఇలా అంటాడు, ”ఓ నా ప్రభూ! నేను పాపానికి పాల్పడ్డాను, నన్ను క్షమించు.” అతని ప్రభువు, ”నా దాసునికి అతని ప్రభువు ఉన్నాడని, పాపాలను క్షమిస్తాడని, పాపాల వల్ల విచారిస్తాడని తెలుసా? నేను నా దాసున్ని క్షమించాను.” అని అంటాడు.  ఆ తరువాత ఆ దాసుడు కొంతకాలం వరకు పాపాలకు దూరంగా ఉంటాడు. అల్లాహ్‌ కోరినంత వరకు పాపాలకు పాల్పడలేదు. ఆ తరువాత మళ్ళీ పాపాలకు పాల్పడ్డాడు. మళ్ళీ ఆ దాసుడు, ”ఓ నా ప్రభూ! నేను పాపాలకు పాల్పడ్డాను, నన్ను క్షమించు,” అని అంటాడు. అప్పుడు అల్లాహ్‌ (త) ”నా దాసునికి అతని ప్రభువు ఉన్నాడని, తాను కోరినపుడు క్షమిస్తాడు, తాను కోరినపుడు పట్టు కుంటాడు. అందు వల్ల ఓ దైవదూతలారా మీరు సాక్ష్యంగా ఉండండి. నేను నా దాసున్ని క్షమించి వేసాను. అని అంటాడు.” ఆ తరువాత కొంతకాలం అంటే అల్లాహ్ కోరినన్నాళ్ళు పాపాలకు దూరంగా ఉన్నాడు. ఆ తరువాత మళ్ళీ పాపాలకు పాల్పడ్డాడు. ఆ వెంటనే విచారిస్తూ ఇలా అంటాడు, ”ఓ నా ప్రభూ! నేను పాపాలకు పాల్పడ్డాను. నన్ను క్షమించు. అప్పుడు అల్లాహ్‌ (త) నా దాసునికి అతని ప్రభువు ఉన్నాడని, కోరినపుడు క్షమిస్తాడని, కోరినపుడు పట్టుకుంటాడని తెలుసా? ఓ దైవ దూతలారా, సాక్షిగా ఉండండి. నేను అతన్ని క్షమించి వేసాను. అతను కోరింది చేసుకోవచ్చు. అంటే, ‘అతను క్షమాపణ కోరుతున్నంత వరకు నేను క్షమిస్తూ ఉంటాను’ అని అంటాడు.” [47]  (బు’ఖారీ, ముస్లిమ్‌)

2334 – [ 12 ] ( صحيح ) (2/722)

وَعَنْ جُنْدُبٍ رَضِيَ اللهُ عَنْهُ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم حَدَّثَ: “أَنَّ رَجُلًا قَالَ: وَاللهِ لَا يَغْفِرُ اللهُ لِفُلَانٍ. وَأَنَّ اللهَ تَعَالى قَالَ: مَنْ ذَا الَّذِيْ يَتَأَلَّى عَلَيَّ أَنِّيْ لَا أَغْفِرُ لِفُلَانٍ فَإِنِّيْ قَدْ غَفَرْتُ لِفُلَانٍ وَ أَحْبَطْتُّ عَمَلَكَ”. أَوْ كَمَا قَالَ. رَوَاهُ مُسْلِمٌ.

2334. (12) [2/722దృఢం]

జున్‌దుబ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”పూర్వ కాలంలో ఒక వ్యక్తి ఇలా అన్నాడు, ”అల్లాహ్ సాక్షి! ఫలానా వ్యక్తిని అల్లాహ్ (త) క్షమించడు.” అప్పుడు అల్లాహ్‌ (త) ఇలా అన్నాడు, ”ఎవరీ వ్యక్తి, నాపై ప్రమా ణం చేసి ‘నేను ఫలానా వ్యక్తిని క్షమించను,’ అని అంటున్నాడు. ఓ దూతలారా! మీరు సాక్ష్యంగా ఉండండి. నేను ఫలానా వ్యక్తిని క్షమించాను. ఇంకా ఈ ప్రమాణం చేసిన వ్యక్తి ఆచరణను రద్దుచేసాను.” [48] (ముస్లిమ్‌)

2335 – [ 13 ] ( صحيح ) (2/722)

وَعَنْ شَدَّادِ بْنِ أَوْسٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “سَيِّدُ الْاِسْتِغْفَارِ أَنْ تَقُوْلَ: “اَللّهُمَّ أَنْتَ رَبِّيْ لَا إِلَهَ إِلَّا أَنْتَ خَلْقَتَنِيْ وَأَنَا عَبْدُكَ وَأَنَا عَلَى عَهْدِكَ وَوَعْدِكَ مَا اسْتَطَعْتُ أَعُوْذُ بِكَ مِنْ شَرِّ مَا صَنَعْتُ أَبُوْءُ لَكَ بِنِعْمَتِكَ عَلَيَّ وَأَبُوْءُ بِذَنْبِيْ فَاغْفِرْ لِيْ فَإِنَّهُ لَا يَغْفِرُ الذُّنُوْبَ إِلَّا أَنْتَ”. قَالَ: “وَمَنْ قَالَهَا مِنَ النَّهَارِ مُوْقِنًا بِهَا فَمَاتَ مِنْ يَوْمِهِ قَبْلَ أَنْ يُمْسِيَ فَهُوَ مِنْ أَهْلِ الْجَنَّةِ وَمَنْ قَالَهَا مِنَ اللَّيْلِ وَهُوَ مُوْقِنٌ بِهَا فَمَاتَ قَبْلَ أَنْ يُصْبِحَ فَهُوَ مِنْ أَهْلِ الْجَنَّةِ”. رَوَاهُ الْبُخَارِيُّ.

2335. (13) [2/722దృఢం]

షద్దాద్‌ బిన్‌ ఔస్‌ (ర) కథనం: ప్రవక్త (స) ఇలా ప్రవచించారు, సయ్యిదుల్‌ ఇస్తి’గ్‌ఫార్‌ అంటే, ”అల్లాహుమ్మ అన్త రబ్బీ ,లా ఇలాహ ఇల్లా అంత, ‘ఖలఖ్తనీ వ అనా అబ్దుక, వ అనా ‘అలా అహ్ దిక, వ వ’అదిక మస్త’తాతు, అ’ఊజుబిక మిన్ షర్రి మా సన’అతు, అబూఉ’ లక బిని’అమతిక ‘అలయ్య, వ అబూఉ’ బిజ’న్ బీ, ఫ’గ్ఫిర్లీ, ఫ ఇన్నహూ లా యగ్ఫిరుజ్జు’నూబ ఇల్లా అంత ” — ‘ఓ అల్లాహ్‌(త)! నీవే నా ప్రభువవు. నీవు తప్ప ఆరాధ్య దేవుడు మరొకడు లేడు. నీవు నన్ను పుట్టించావు. నేను నీదాసుణ్ణి. నీతో చేసిన ప్రమాణాన్ని, వాగ్దానాన్ని నా శక్తి మేరకు, నెరవేర్చటానికి కృష్టి చేస్తున్నాను. నేను చేసుకున్న చెడు పనుల కీడు నుండి నీ శరణు కోరు తున్నాను. నీవు నాకు చేసిన ఉపకారాలను ఒప్పు కుంటున్నాను. నా పాపాలను అంగీకరిస్తున్నాను. నన్ను క్షమించు, నీవు తప్ప క్షమించే వాడు ఎవడూ లేడు. ఎవరైనా పగటిపూట చిత్తశుద్ధితో దీనిని పఠించి సాయంత్రం మరణిస్తే అతను స్వర్గానికి వెళతాడు. మరెవరైనా రాత్రిపూట చిత్త శుద్ధితో దీనిని పఠించి ఉదయం కాకముందే మరణిస్తే అతను స్వర్గంలోనికి ప్రవేశిస్తాడు. (బు’ఖారీ)

—–

اَلْفَصْلُ الثَّانِيْ  రెండవ విభాగం 

2336 – [ 14 ] ( لم تتم دراسته ) (2/723)

عَنْ أَنَسٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “قَالَ اللهُ تَعَالى: يَا ابْنَ آدَمَ إِنَّكَ مَا دَعَوْتَنِيْ وَرَجَوْتَنِيْ غَفَرْتُ لَكَ عَلَى مَا كَانَ فِيْكَ وَلَا أُبَالِيْ يَا ابْنَ آدَمَ إِنَّكَ لَوْ بَلَغَتْ ذُنُوْبُكَ عَنَانَ السَّمَاءِ ثُمَّ اسْتَغْفَرْتَنِيْ غَفَرْتُ لَكَ وَلَا أُبَالِيْ يَا ابْنَ آدَمَ إِنَّكَ لَوْ لَقِيْتَنِيْ بِقُرَابِ الْأَرْضِ خَطَايَا ثُمَّ لَقِيْتَنِيْ لَا تُشْرِكُ بِيْ شَيْئًا لَأَتَيْتُكَ بِقِرَابِهَا مَغْفِرَةً” .رَوَاهُ التِّرْمِذِيُّ

2336. (14) [2/723అపరిశోధితం]

అనస్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”అల్లాహ్‌ ఆదేశం, ”ఓ మానవుడా! నువ్వు నన్ను దు’ఆ చేస్తున్నంత వరకు అంటే నువ్వు నన్ను క్షమాపణ కోరుతున్నంత వరకు, నా కారుణ్యం పట్ల ఆశ ఉన్నంత వరకు, నీ పాపాలను నేను మన్నిస్తూ ఉంటాను. నీవు ఏ పాపం చేసి ఉన్నా నాకేం అభ్యంతరం లేదు. అంటే నిన్ను క్షమించటం నాకేమంత పెద్ద పనికాదు. ఓ ఆదమ్‌ కుమారా! ఒకవేళ నీ పాపాలు ఆకాశానికి చేరినా అంటే భూమి నుండి ఆకాశం వరకు పాపాలు నిండివున్నా నీవు నన్ను క్షమాపణ కోరితే నేను నిన్ను క్షమిస్తాను. ఇంకా నేను దాన్నేమి పట్టించుకోను. ఇంకా ఓ ఆదమ్‌ కుమారా! ఒకవేళ నీవు భూమినిండా పాపాలు చేసి నన్ను కలిసి, నాకు ఇతరులెవ్వరినీ సాటికల్పించ కుండా ఉంటే నేను భూమినిండా క్షమాపణ తీసుకొని నిన్ను కలుస్తాను.” [49] (తిర్మిజి’)

2337 – [ 15 ] ( لم تتم دراسته ) (2/723)

وَرَوَاهُ أَحْمَدُ وَالدَّارَمِيُّ عَنْ أَبِيْ ذَرٍّ وَقَالَ التِّرْمِذِيُّ: هَذَا حَدِيْثٌ حَسَنٌ غَرِيْبٌ .

2337. (15) [2/723అపరిశోధితం]

అ’హ్మద్, దారిమి, ఈ ‘హదీసు’ను అబూ జ’ర్ కథనంగా ఉల్లేఖించారు. (తిర్మిజి’ – ప్రామాణికం, ఏకోల్లేఖనం)

2338 – [ 16 ] ( لم تتم دراسته ) (2/723)

وَعَنِ ابْنِ عَبَّاسٍ رَضِيَ اللهُ عَنْهُمَا عَنْ رَسُوْلِ اللهِ صلى الله عليه و سلم قَالَ: “قَالَ اللهُ تَعَالى: مَنْ عَلِمَ أَنِّيْ ذُوْ قُدْرةٍ عَلَى مَغْفِرَةِ الذُّنُوْبِ غَفَرْتُ لَهُ وَلَا أُبَالِيْ مَا لَمْ تُشْرِكْ بِيْ شَيْئًا”. رَوَاهُ فِيْ شَرْحِ السُّنَّةِ .

2338. (16) [2/723అపరిశోధితం]

‘అబ్బాస్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనాలు, ”అల్లాహ్‌ ఆదేశం: ”నేను పాపాలను క్షమించే శక్తి కలిగి ఉన్నానని,”  తెలిసినవాడిని నేను అతని పాపాలను క్షమిస్తాను. అతను నాకు సాటి కల్పించనంత వరకు నేను అతన్ని ఏమాత్రం కఠినంగా ప్రవర్తించను.” (షరహ్‌స్సున్నహ్‌)

2339 – [ 17 ] ( لم تتم دراسته ) (2/723)

وَعَنْهُ  قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَنْ لَزِمَ الْاِسْتِغْفَارَ جَعَلَ اللهُ لَهُ مِنْ كُلِّ ضَيِّقٍ مَخْرَجًا وَمِنْ كُلِّ هَمٍّ فَرَجًا وَرَزَقَهُ مِنْ حَيْثُ لَا يَحْتَسِبُ”. رَوَاهُ أَحْمَدُ وَأَبُوْ دَاوُدَ وَابْنُ مَاجَهُ.

2339. (17) [2/723అపరిశోధితం]

ఇబ్నె ‘అబ్బాస్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఇస్తిగ్‌ఫార్‌లో ఎల్లప్పుడూ నిమగ్నమై ఉండే వాడిని అల్లాహ్‌ (త) అతని ప్రతి కష్టాన్నీ దూరం చేసివేస్తాడు. దుఃఖాలన్నిటి నుండి విముక్తి ప్రసాదిస్తాడు. అతడు ఊహించనిదిక్కునుండి అతనికి ఉపాధిప్రసాదిస్తాడు.”[50] (అ’హ్మద్‌, అబూ దావూద్‌, ఇబ్నె మాజహ్)

2340 – [ 18 ] ( ضعيف ) (2/723)

وَعَنْ أَبِيْ بَكْرِ الصِّدِّيْقِ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَا أَصَرَّ مَنِ اسْتَغْفَرَ وَإِنْ عَادَ فِيْ الْيَوْمِ سَبْعِيْنَ مَرَّةً”. رَوَاهُ التِّرْمِذِيُّ وَأَبُوْ دَاوُدَ.

2340. (18) [2/723బలహీనం]

అబూ బకర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”చేసిన ప్రతిపాపం తర్వాత ఇస్తి’గ్‌ఫార్‌ చేసినవాడు పాపాలను అలవాటుగా చేసుకోలేదు, అంటే పాపాలు చేసినప్పుడల్లా ఇస్తి’గ్‌ఫార్‌ చేసేవాడు పాపాలను అంటిపెట్టుకొని ఉండలేదు. అతడు రోజుకు 70 సార్లు పాపాలు చేసినా సరే. [51]  (తిర్మిజి’, అబూ దావూద్‌)

2341 – [ 19 ] ( حسن ) (2/724)

وَعَنْ أَنَسٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “كُلُّ بَنِيْ آدَمَ خَطَّاءٌ وَخَيْرُ الْخَطَّائِيْنَ التَّوَّابُوْنَ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَابْنُ مَاجَهُ وَالدَّارَمِيُّ  .

2341. (19) [2/724ప్రామాణికం]

అనస్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ప్రతి మాన వుడు అపరాధాలు చేసేవాడే. అపరాధుల్లో అందరి కంటే మంచివాడు, పాపాలు చేసిన తర్వాత పశ్చా త్తాపపడే వాడు. (తిర్మిజి’, ఇబ్నె మాజహ్, దారమి)

2342 – [ 20 ] ( لم تتم دراسته ) (2/724)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِنَّ الْمُؤْمِنَ إِذَا أَذْنَبَ كَانَتْ نُكْتَةً سَوْدَاءُ فِيْ قَلْبِهِ فَإِنْ تَابَ وَاسْتَغْفَرَ صَقِلَ قَلْبُهُ .وَإِنْ زَادَ زَادَتْ حَتَّى تَعْلُوْ قَلْبَهُ فَذَلِكُمْ الرَّانُ الَّذِيْ ذَكَرَ اللهُ تَعَالى (كَلَّا بَلْ رَانَ عَلَى قُلُوْبِهِمْ مَا كَانُوْا يَكْسِبُوْنَ، 83: 14) رَوَاهُ أَحْمَدُ وَالتِّرْمِذِيُّ وَابْنُ مَاجَهُ. وَقَالَ التِّرْمِذِيُّ: هَذَا حَدِيْثٌ حَسَنٌ صَحِيْحٌ.

2342. (20) [2/724అపరిశోధితం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”విశ్వాసి అయిన దాసుడు పాపానికి పాల్పడితే అతని హృదయంపై ఒక నల్లని మచ్చ ఏర్పడుతుంది. ఒక వేళ అతడు క్షమాపణ, పశ్చాత్తాపం చెందితే ఆ మచ్చ తొలగిపోతుంది. ఒకవేళ అనేక పాపాలు చేసి పశ్చాత్తాపం చెందకపోతే అతని హృదయంపై నల్లని మచ్చలు ఏర్పడతాయి. చివరికి హృదయం నిండా వ్యాపిస్తాయి. అల్లాహ్‌ (త) ఖుర్‌ఆన్‌లో పేర్కొన్న ఆ తుప్పు ఇదే: ”అలా కాదు వాస్తవానికి వారి హృద యాలకు, వారి (దుష్ట) కార్యాల తుప్పు పట్టింది.” (సూ. అల్ ముతఫ్ఫిఫీన్, 83:14). (అ’హ్మద్‌, తిర్మిజి’ – ప్రామాణికం-దృఢం, ఇబ్నె మాజహ్)

2343 – [ 21 ] ( لم تتم دراسته ) (2/724)

وَعَنِ ابْنِ عُمَرَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِنَّ اللهَ يَقْبَلُ تَوْبَةَ الْعَبْدِ مَا لَمْ يُغَرْغِرْ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَابْنُ مَاجَهُ.

2343. (21) [2/724అపరిశోధితం]

‘అబ్దుల్లా బిన్‌ ‘ఉమర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, అంతిమ ఘడియలు దాపురించనంత వరకు అల్లాహ్‌(త) తన దాసుని పశ్చాత్తాపాన్ని స్వీకరిస్తూనే ఉంటాడు. [52] (తిర్మిజి’, ఇబ్నె మాజహ్)

2344 – [ 22 ] ( ضعيف ) (2/724)

وَعَنْ أَبِيْ سَعِيْدٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِنَّ الشَّيْطَانَ قَالَ: “وَعِزَّتِكَ يَا رَبِّ لَا أَبْرَحُ أُغْوِيْ عِبَادَكَ مَا دَامَتْ أَرْوَاحُهُمْ فِيْ أَجْسَادِهِمْ”. فَقَالَ الرَّبُّ عَزَّوَجَلَّ: “وَعِزَّتِيْ وَجَلَالِيْ وَ ارْتِفَاعِ مَكَانِيْ لَا أَزَالُ أَغْفِرُ لَهُمْ مَا اسْتَغْفَرُوْنِيْ”    رَوَاهُ أَحْمَدُ.

2344. (22) [2/724బలహీనం]

అబూ స’యీద్‌ ‘ఖుద్రీ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”షై’తాన్‌, ‘ఓ అల్లాహ్‌ (త)! నీ గౌరవం సాక్షి! నీ దాసులను ఎల్లప్పుడూ మార్గభ్రష్టత్వానికి గురి చేస్తూ ఉంటాను. వారి ఆత్మలు వారి శరీరాల్లో ఉన్నంత వరకు,” అని అన్నాడు. అల్లాహ్‌ (త) కూడా ”నా గౌరవం, గొప్పతనం సాక్షి! నా దాసులు నన్ను క్షమాపణ కోరుతున్నంతవరకు నేను వారిని క్షమిస్తూ ఉంటాను.” అని ఆదేశించాడు. (అ’హ్మద్‌)

2345 – [ 23 ] ( لم تتم دراسته ) (2/725)

وَعَنْ صَفْوَانَ بْنِ عَسَّالٍ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِنَّ اللهَ تَعَالى جَعَلَ بِالْمَغْرِبِ بَابًا عَرْضُهُ مَسِيْرَةُ سَبْعِيْنَ عَامًا لِلتَّوْبَةِ لَا يُغْلَقُ مَا لَمْ تَطْلُعِ عَلَيْهِ الشَّمْسُ مِنْ قِبَلِهِ وَذَلِكَ قَوْلُ اللهُ عَزَّ وَجَلَّ: (يَوْمَ يَأْتِيْ بَعْضُ آيَاتٍ رَبِّكَ لَا يَنْفَعُ نَفْسًا إِيْمَانُهَا لَمْ تَكُنْ آمَنَتْ مِنْ قَبْلُ، 6: 158). رَوَاهُ التِّرْمِذِيُّ وَابْنُ مَاجَهُ.

2345. (23) [2/725అపరిశోధితం]

‘సఫ్వాన్‌ బిన్‌ ‘అస్సాల్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, అల్లాహ్‌ (త) పడమరవైపు తౌబహ్ ద్వారం నియమించాడు. దాని వెడల్పు 70 సంవత్సరాల ప్రయాణ దూరం. ఈ ద్వారం ఎప్పుడూ తెరచి ఉంటుంది. సూర్యుడు పడమటి దిక్కునుండి ఉదయించనంతవరకు ఈద్వారం మూసివేయబడదు. తీర్పుదినం వరకు ఈ ద్వారం తెరచి ఉంటుంది. అల్లాహ్‌ ఆదేశం: ”…నీ ప్రభువు యొక్క కొన్ని (బహిరంగ) నిదర్శనాలు వచ్చేరోజున, పూర్వం విశ్వసించ కుండా ఆ రోజున విశ్వసించిన వ్యక్తికీ, లేదా విశ్వసించి కూడా ఏ మంచినీ సంపాదించుకోని వ్యక్తికీ, తన విశ్వాసం వల్ల (ఆ రోజు) ఏ ప్రయోజనం చేకూరదు…” (సూ. అల్ అన్ఆమ్, 6:158) (తిర్మిజి’, ఇబ్నె మాజహ్). [53]

2346 – [ 24 ] ( لم تتم دراسته ) (2/725)

وَعَنْ مُعَاوِيَةَ قَالَ :قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَا تَنْقَطِعُ الْهِجْرَةَ حَتَّى تَنْقَطِعَ التَّوْبَةَ وَلَا تَنْقَطِعُ التَّوْبَةُ حَتَّى تَطْلُعَ الشَّمْسَ مِنْ مَغْرِبِهَا”. رَوَاهُ أَحْمَدُ وَأَبُوْ دَاوُدَ وَالدَّارَمِيُّ.

2346. (24) [2/725అపరిశోధితం]

ము’ఆవియహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”తౌబహ్ ముగియనంత వరకు వలసపోవటం ఆగదు. సూర్యుడు పడమటి దిక్కు నుండి ఉదయించనంత వరకు తౌబహ్ ముగియదు.” [54] (అ’హ్మద్‌, అబూ దావూద్‌, దారమి)

2347 – [ 25 ] ( لم تتم دراسته ) (2/725)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِنَّ رَجُلَيْنِ كَانَا فِيْ بَنِيْ إِسْرَائِيْلَ مُتَحَابَّيْنِ أَحَدُهُمَا مُجْتَهِدٌ لِلْعِبَادَةِ وَالْآخَرُ يَقُوْلُ: مُذْنِبٌ فَجَعَلَ يَقُوْلُ: أَقْصِرْعَمَّا أَنْتَ فِيْهِ فَيَقُوْلُ خَلِّنِيْ وَرَبِّيْ حَتَّى وَجَدَهُ يَوْمًا عَلَى ذَنْبٍ اسْتَعْظَمَهُ فَقَالَ: أَقْصِرْ فَقَالَ: خَلِّنِيْ وَرَبِّيْ أُبْعِثْتَ عَلَيَّ رَقِيْبًا؟ فَقَالَ: وَاللهِ لَا يَغْفِرُاللهُ لَكَ أَبَدًا وَلَا يُدْخِلُكَ الْجَنَّةَ فَبَعَثَ اللهُ إِلَيْهِمَا مَلَكًا فَقَبَضَ أَرْوَاحَهُمَا فَاجْتَمَعَا عِنْدَهُ. فَقَالَ لِلْمُذْنِبِ: أدْخُلِ الْجَنَّةَ بِرَحْمَتِيْ. وَقَالَ لِلْآخَر: أَتَسْتَطِيْعُ أَنْ تَحْظُرَ عَلَى عَبْدِيْ رَحْمَتِيْ؟ فَقَالَ: لَا يَا رَبِّ. قَالَ: اذْهَبُوْا بِهِ إِلَى النَّارِ”. رَوَاهُ أَحْمَدُ

2347. (25) [2/725అపరిశోధితం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”బనీ ఇస్రాయీల్‌లో ఇద్దరు స్నేహితులు ఉండేవారు. వారు ప్రాణస్నేహితులు, వారిలో ఒక మిత్రుడు నిరంతరం ఆరాధనలో నిమగ్నమై ఉండేవాడు. రెండవ స్నేహితుడు పాపాలకు గురయ్యాడు. సజ్జనుడైన స్నేహితుడు తన పాపాత్ముడైన స్నేహితుడ్ని పాపాల నుండి వారించే వాడు. ఇంకా, ‘ఓ మిత్రమా! ఇటువంటి పాపాలకు దూరంగా ఉండు,’ అని హితబోధ చేసేవాడు. చెడు మిత్రుడు, ‘నాకు నా ప్రభువుకు మధ్య రాకు అంటే ఈ వ్యవహారంలో నువ్వు తల దూర్చకు, నేనూ నా ప్రభువు చూసుకుంటాం,’ అని అనేవాడు. ఒకరోజు సజ్జనుడైన మిత్రుడు పాపాత్ముడైన మిత్రుణ్ని ఒక మహా పాపం చేస్తూ ఉండగా చూచాడు. ఆ సజ్జనుడు అతడితో ఆ పాపానికి దూరం కమ్మని సలహా ఇచ్చాడు. ఆ చెడుమిత్రుడు, ‘నన్ను నా ప్రభువును వదలివేయి, నువ్వు ఏమైనా నాపై రక్షకుడివా?’ అని అన్నాడు. ఇది విని ఆ సజ్జనుడైన వ్యక్తి అల్లాహ్ సాక్షి! అల్లాహ్ (త) నిన్ను ఎన్నడూ క్షమించడు, స్వర్గంలో ప్రవేశింపజేయడు,’ అని అన్నాడు. అల్లాహ్‌ (త) వీరిద్దరి వద్దకు మృత్యు దూతను పంపించాడు. ఆ దూత ఇద్దరి ప్రాణాలు తీసాడు. వీరిద్దరూ అల్లాహ్‌ (త) వద్ద హాజరయ్యారు. అల్లాహ్‌ (త) పాపాత్ముడితో, ‘నువ్వు నా కారుణ్యం ద్వారా స్వర్గంలో ప్రవేశించు. రెండవ వానితో, ‘నువ్వు నా దాసుణ్ణి, నా కారుణ్యం నుండి దూరం చేయగలవా?’ అని అన్నాడు. దానికి అతడు, ‘ఓ అల్లాహ్‌ నాకు ఆశక్తి లేదు,’ అని అన్నాడు. అప్పుడు అల్లాహ్. ‘అతన్ని నరకంలో పడవేయండి,’ అని  ఆదేశించాడు.[55] (అ’హ్మద్‌)

2348 – [ 26 ] ( لم تتم دراسته ) (2/725)

وَعَنْ أَسْمَاءَ بِنْتِ يَزِيْدَ قَالَتْ: سَمِعْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يَقْرَأ: (يَا عِبَادِيَ الَّذِيْ أَسْرَفُوْا عَلَى أَنْفُسِهِمْ لَا تَقْنَطُوْا مِنْ رَحْمَةِ اللهِ إِنَّ اللهَ يَغْفِرُ الذُّنُوْبِ جَمِيْعًا ، 39: 53) وَلَا يُبَالِيْ. رَوَاهُ أَحْمَدُ وَالتِّرْمِذِيُّ. وَقَالَ هَذَا حَدِيْثٌ حَسَنٌ غَرِيْبٌ.

وَفِيْ شَرْحِ السُّنَّةِ يَقُوْلُ : بَدْلَ : يَقْرَأُ.

2348. (26) [2/725అపరిశోధితం]

అస్మా’ బిన్‌తె య’జీద్‌ (ర) కథనం: ప్రవక్త (స) ఈ ఆయతును పఠిస్తూ ఉండటం నేను విన్నాను, ”ఇలా అను: “స్వయంగా మీకు (మీ ఆత్మలకు) మీరే అన్యా యం చేసుకున్న నా దాసులారా! అల్లాహ్‌ కారుణ్యం పట్ల నిరాశ చెందకండి. నిశ్చయంగా, అల్లాహ్‌ అన్ని పాపాలనుక్షమిస్తాడు…”[56] (సూ.అజ్-జుమర్, 39:53). (అహ్మద్, తిర్మిజి’-ప్రామాణికం- ఏకోల్లేఖనం)

షరహుస్సున్నహ్ లో ‘యఖ్రఉ’ కు బదులు ‘యఖూలు’ అని ఉంది.

2349 – [ 27 ] ( لم تتم دراسته ) (2/726)

وَعَنِ ابْنِ عَبَّاسٍ: فِيْ قَوْلِهِ تَعَالى: (إِلَّا اللَّمَمَ) قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِنْ تَغْفِرُ اللّهُمَّ تَغْفِرْ جَمَّا، وَأَيُّ عَبْدٍ لَّكَ لَا أَلَمَّا، رَوَاهُ التِّرْمِذِيُّ. وَقَالَ: هَذَا حَدِيْثٌ حَسَنٌ صَحِيْحٌ غَرِيْبٌ.

2349. (27) [2/726అపరిశోధితం]

ఇబ్నె ‘అబ్బాస్‌ కథనం: ఖుర్‌ఆన్‌ లోని, ”ఇల్ల ల్లమమ్” ను గురించి వ్యాఖ్యానిస్తూ ప్రవక్త (స), ‘ఓ అల్లాహ్! పెద్దపెద్ద పాపాలనే నీవు క్షమిస్తే, చిన్నచిన్న పాపాలను క్షమిండం నీకేమి పెద్దపనికాదు, వాటిని నువ్వు తప్పకుండా క్షమిస్తావు. ఎందుకంటే చిన్న చిన్న పాపాలు చేయని నీ దాసులు ఎవరున్నారు,’ అని ప్రార్ధించారు. [57] (తిర్మిజి’ – ప్రామాణికం – దృఢం – ఏకోల్లేఖనం)

2350 – [ 28 ] ( لم تتم دراسته ) (2/726)

وَعَنْ أَبِيْ ذَرٍّ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “يَقُوْلُ اللهُ تَعَالى يَا عِبَادِيْ كُلُّكُمْ ضَالٌّ إِلَّا مَنْ هَدَيْتُ فَاسْأَلُوْنِيْ الْهُدَي أَهْدِكُمْ وَكُلُّكُمْ فُقَرَاءُ إِلَّا مَنْ أَغْنَيْتُ فَاسْأَلُوْنِيْ أَرْزُقُكُمْ وَكُلُّكُمْ مُذْنِبٌ إِلَّا مَنْ عَافَيْتُ فَمَنْ عَلِمَ مِنْكُمْ أَنِّيْ ذُوْ قُدْرَةٍ عَلَى الْمَغْفِرَةِ فَاسْتَغْفَرَنِيْ غَفَرْتُ لَهُ وَلَا أُبَالِيْ وَلَوْ أَنَّ أَوَّلَكُمْ وَآخِرَكُمْ وَحَيَّكُمْ وَمَيِّتَكُمْ وَرَطْبَكُمْ وَيَابِسَكُمُ اجْتَمِعُوْا عَلَى أَتْقَى قَلْبِ عَبْدٍ مِّنْ عِبَادِيْ مَا زَادَ فِيْ مُلْكِيْ جَنَاحَ بَعُوْضَةٍ وَلَوْ أَنَّ أَوَّلَكُمْ وَآخِرَكُمْ وَحَيَّكُمْ وَمَيِّتَكُمْ وَرَطْبَكُمْ وَيَابِسَكُمُ اجْتَمِعُوْا عَلَى أَشْقَى قَلْبِ عَبْدٍ مِّنْ عِبَادِيْ مَا نَقَصَ ذَلِكَ مِنْ مُلْكِيْ جَنَاحَ بَعُوْضَةٍ. وَلَوْ أَنَّ أَوَّلَكُمْ وَآخِرَكُمْ وَحَيَّكُمْ وَمَيِّتَكُمْ وَرَطْبَكُمْ وَيَابِسَكُمُ اجْتَمِعُوْا فِيْ صَعِيْدٍ وَّاحِدٍ فَسَأَلَ كُلُّ إِنْسَانٍ مِّنْكُمْ مَا بَلَغَتْ أُمْنِيَّتُهُ فَأَعْطَيْتُ كُلَّ سَائِلٍ مِّنْكُمْ مَا نَقَصَ ذَلِكَ مِنْ مُلْكِيْ إِلَّا كَمَا لَوْ أَنَّ أَحَدُكُمْ مَرَّ بِالْبَحْرِ فَغَمَسَ فِيْهِ إِبْرَةً ثُمَّ رَفَعَهَا ذَلِكَ بِأَنِّيْ جَوَّادٌ مَاجِدٌ أَفْعَلُ مَا أُرِيْدُ عَطَائِيْ كَلَامٌ وَعَذَابِيْ كَلَامٌ إِنَّمَا أَمْرِيْ لِشَيٍء إِذَا أَرَدْتُّ أَنْ أَقُوْلَ لَهُ (كُنْ فَيَكُوْنُ، 2: 117). رَوَاهُ أَحْمَدُ وَالتِّرْمِذِيُّ وَابْنُ مَاجَهُ.

2350. (28) [2/726అపరిశోధితం]

అబూ జ’ర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం: అల్లాహ్‌ ఆదేశం: ”ఓ నా దాసులారా! మీరంతా మార్గభ్రష్టులే. కాని నేను మార్గదర్శక భాగ్యం ప్రసాదించిన వాడు తప్ప.” కనుక మీరు నన్ను మార్గదర్శకత్వం అర్థించండి. నేను మీకు మార్గ దర్శకత్వం ప్రసాదిస్తాను. మీరందరూ దరిద్రులే. కాని నేను ధనసంపదలు ప్రసాదించిన వాడు తప్ప. కనుక మీరు ధన సంపదలకు నన్ను అడగండి. నేను మీకు ధనసంపదలు ప్రసాదిస్తాను. మీకు ఉపాధి ప్రసాదిస్తాను. మీరంతా పాపాత్ములే. కాని నేను పాపాల నుండి రక్షించి క్షేమం ప్రసాదించినవాడు తప్ప. నేను క్షమించే శక్తి, విముక్తి ప్రసాదించే శక్తి కలిగి ఉన్నానని తెలిసి నన్ను క్షమాపణ కోరితే నేనతన్ని క్షమించేవేస్తాను. నేనేమీ అలక్ష్యం చేయను. ఒకవేళ మీలోని పూర్వీకులు, రానున్నవారు సజీవులు, మృతులు, మీ యువకులు, ముసలి వాళ్ళు అందరూ అందరికంటే ఉత్తములు, దైవభీతి పరులుగా మారిపోతే దైవభీతి పరుని హృదయంలా అయిపోతే, మీ అందరి పుణ్యం నా సామ్రాజ్యంలో ఒక్క దోమ రెక్కంత కూడా లాభం చేకూర్చ లేదు. దానివల్ల నా సామ్రాజ్యానికి ఎటువంటి లాభం చేకూరదు. అదేవిధంగా మీలోని పూర్వీకులు, ముందు తరాల వారు సజీవులు నిర్జీవులు, స్త్రీలు, పురుషులు అందరూ పాపాత్ములైతే, అంటే షై’తాన్‌లా అయిపోతే నా సామ్రాజ్యానికి దోమ రెక్కంత నష్టం కూడా జరగదు. ఒకవేళ మీ పూర్వీకులు రాబోయే సంతతి, మీ మృతులు సజీవులు, స్త్రీలు పురుషులు, యువకులు, వృద్ధులు అందరూ ఒక మైదానంలో నిలబడి ప్రతిఒక్కరు తాను కోరినంత నన్ను అడిగితే, నేను ప్రతి ఒక్కరు కోరినంత ఇచ్చివేస్తే, నా సామ్రాజ్యంలో ఏమాత్రం లోటురాదు. మీలో ఎవరైనా సముద్రంలో సూది ముంచితే, సూదికి తగిలిన నీరంత తప్ప సముద్రంలో ఏమాత్రం లోటు రాదు. ఈ విధంగా సృష్టితాల కోరికల ప్రకారం ఇచ్చివేసినా నా నిధుల్లో ఏమాత్రం కొరతరాదు. ఇలా ఎందుకంటే నేను చాలా దాతృత్వం గలవాణ్ణి. అధికంగా ప్రసాదించేవాణ్ని, కోరింది చేసేవాణ్ని. నేను ఇవ్వటానికి కేవలం ఆజ్ఞ చాలు, నేను శిక్షించటానికి కేవలం ఆజ్ఞచాలు: ”…ఆయన ఏదైనా చేయాలని నిర్ణయించుకున్న ప్పుడు, దానిని కేవలం, ‘అయిపో’ అని ఆజ్ఞాపిస్తాడు. అంతే అది అయిపోతుంది.” (సూ. అల్ బఖరహ్, 2:117). (అ’హ్మద్‌, తిర్మిజి’, ఇబ్నె మాజహ్)

2351 – [ 29 ] ( لم تتم دراسته ) (2/727)

وَعَنْ أَنَسٍ عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم أَنَّهُ قَرَأَ(...هُوَ أَهْلُ التَّقْوَى وَأَهْلُ الْمَغْفِرَةِ،74: 56) قَالَ: قَالَ رَبُّكُمْ أَنَا أَهْلُ أَنْ أُتَّقَى فَمَنِ اتَّقَانِيْ فَأَنَا أَهْلٌ أَنْ أَغْفِرَ لَهُ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَابْنُ مَاجَهُ وَالدَّارَمِيُّ.

2351. (29) [2/727అపరిశోధితం]

అనస్‌ (ర) కథనం: ప్రవక్త (స) ఈ ఆయతు పఠించారు: ”…ఆయనే (అల్లాహ్ యే) భయ-భక్తులకు అర్హుడు మరియు ఆయనే క్షమించే అర్హతగలవాడు.” (సూ. అల్ ముదస్సిర్, 74:56). ప్రవక్త (స) ఇలా అన్నారు, ”అల్లాహ్‌ ఇలా ఆదేశిస్తున్నాడు: ‘నే నెలాంటి వాడినంటే నాకు సాటికల్పించడానికి దూరంగా ఉండాలి. షిర్క్‌కు దూరంగా ఉండాలి. షిర్క్‌ నుండి తప్పించుకున్న వాడిని నేను క్షమిస్తాను, విముక్తి ప్రసాదిస్తాను. [58] (తిర్మిజి’, ఇబ్నె మాజహ్, దారమి)

2352 – [ 30 ] ( لم تتم دراسته ) (2/727)

وَعَنِ ابْنِ عُمَرَ قَالَ: إِنَّ كُنَّا لَنَعُدُّ لِرَسُوْلِ اللهِ صلى الله عليه وسلم فِيْ الْمَجْلِسِ يَقُوْلُ: “رَبِّ اغْفِرْ لِيْ وَتُبْ عَلَيَّ إِنَّكَ أَنْتَ التَّوَّابُ الْغَفُوْرُ” مِائَةَ مَرَّةٍ. رَوَاهُ أَحْمَدُ وَالتِّرْمِذِيُّ وَأَبُوْ دَاوُدَ وَابْنُ مَاجَهُ.

2352. (30) [2/727అపరిశోధితం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘ఉమర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ఏ సభలో ఉన్నా, అక్కడ  ఇస్తి’గ్‌ఫార్‌ చేసేవారు. మేము ప్రవక్త(స) ఇస్తి’గ్‌ఫార్‌ను 100 సార్లు లెక్క పెట్టే వాళ్ళం:

 ”రబ్బిగ్ఫిర్ లీ వతుబ్ అలయ్య ఇన్నక అంత్తవ్వాబుల్ గఫూర్.” — ‘ఓ నా ప్రభూ! నన్ను క్షమించు ఇంకా నా పశ్చాత్తాపం స్వీకరించు. నీవే తౌబహ్ స్వీకరించేవాడవు, నీవే క్షమించేవాడవు.’ (అ’హ్మద్‌, తిర్మిజి’, అబూ దావూద్‌, ఇబ్నె మాజహ్)

2353 – [ 31 ] ( لم تتم دراسته ) (2/727)

وَعَنْ بِلَالِ بْنِ يَسَارِ بْنِ زَيْدٍ مَوْلَى النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ: حَدَّثَنِيْ أَبِيْ عَنْ جَدِّيْ أَنَّهُ سَمِعَ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ: مَنْ قَالَ: “أَسْتَغْفِرُاللهَ الَّذِيْ لَا إِلَهَ إِلَّا هُوَالْحَيُّ الْقَيُّوْمَ وَأَتُوْبُ إِلَيْهِ” غُفِرَ لَهُ. وَإِنْ كَانَ قَدْ فَرَّمِنَ الزَّحُفِ. رَوَاهُ التِّرْمِذِيُّ وَأَبُوْ دَاوُدَ لَكِنَّهُ عِنْدَ أَبِيْ دَاوُدَ هَلَالُ بْنِ يَسَارٍوَقَالَ التِّرْمِذِيُّ: هَذَا حَدِيْثٌ غَرِيْبٌ .

2353. (31) [2/727అపరిశోధితం]

బిలాల్‌ బిన్‌ యసార్‌ బిన్‌ ‘జైద్‌ (ర) కథనం: నాకు మా నాన్నగారు తెలిపారు, అతనికి వారి నాన్న గారు తెలిపారు. అతడు ప్రవక్త (స)ను ఇలా అంటూ ఉండగా విన్నారు, ఎవరైనా, ”అస్తగ్ఫిరుల్లాహల్లజీలా ఇలాహ ఇల్లాహువల్‌ ‘హయ్యుల్ఖయ్యూము అతూబుఇలైహి,” — ‘నేను అల్లాహ్ ను క్షమాపణ కోరుతున్నాను, ఆయన తప్ప ఆరాధ్యులెవ్వరూ లేరు, ఆయన సజీవుడు, శాశ్వితుడు, ఇంకా నేను ఆయన సన్నిధిలో పశ్చాత్తాపం చెందుతున్నాను,’ పఠిస్తే అతని పాపాలన్నీ తొలగిపోతాయి. ఒకవేళ అతడు జిహాద్‌ నుండి పారిపోవటానికి సిద్ధపడినా సరే.[59] (తిర్మిజి – ఏకోల్లేఖనం, అబూ దావూద్‌)

—–

اَلْفَصْلُ الثَّالِثُ  మూడవ విభాగం   

2354 – [ 32 ] ( لم تتم دراسته ) (2/727)

عَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِنَّ اللهَ عَزَّ وَجَلَّ لَيَرْفَعُ الدَّرَجَةَ لِلْعَبْدِ الصَّالِحِ فِيْ الْجَنَّةِ فَيَقُوْلُ: “يَا رَبِّ أَنّي لِيْ هَذِهِ؟” فَيَقُوْلُ: بِاِسْتِغْفَارِ وَلَدِكَ لَكَ. رَوَاهُ أَحْمَدُ.

2354. (32) [2/727అపరిశోధితం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, అల్లాహ్‌ (త) స్వర్గంలో స్వర్గవాసి తరగతిని ఉన్నతం చేస్తాడు. అప్పుడు ఆ దాసుడు అల్లాహ్‌ (త)ను, ‘ఓ అల్లాహ్‌ (త)  నా తరగతి ఎందుకు ఇంత ఉన్నతం చేయబడింది, నేనెలా ఈ స్థానానికి చేరుకున్నాను,’ అని ప్రశ్నిస్తాడు. అప్పుడు అల్లాహ్‌ (త), ‘నీ కుమారుని ఇస్తి’గ్‌ఫార్‌ వల్ల,’ అని సమాధానం ఇస్తాడు.[60](అ’హ్మద్‌)

2355 – [ 33 ] ( لم تتم دراسته ) (2/728)

وَعَنْ عَبْدِ اللهِ بْنِ عَبَّاسٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَا الْمَيِّتُ فِيْ الْقَبْرِإِلَّا كَالْغَرِيْقِ الْمُتَغَوِّثِ يَنْتَظِرُدَعْوَةً تَلْحَقُهُ مِنْ أَبٍ أَوْ أُمٍّ أَوْ أَخٍ أَوْ صَدِيْقٍ فَإِذَا لَحِقَتْهُ كَانَ أَحَبَّ إِلَيْهِ مِنَ الدُّنْيَا وَمَا فِيْهَا وَإِنَّ اللهَ تَعَالى لَيُدْخِلُ عَلَى أَهْلِ الْقُبُوْرِمِنْ دُعَاءِ أَهْلِ الْأَرْضِ أَمْثَالَ الْجِبَالِ وَإِنَّ هَدُيَةَ الْأَحْيَاءِ إِلَى الْأَمْوَاتِ الْاِسْتِغْفَارُ لَهُمْ”. رَوَاهُ الْبَيْهَقِيُّ فِيْ شُعَبِ الْإِيْمَانِ.

2355. (33) [2/728అపరిశోధితం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘అబ్బాస్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”సమాధిలో మృతుడు నీటిలో మునిగి పోయిన వాడిలా, అర్థిస్తున్నవాడిలా, ఎవరైనా చేయి పట్టుకొని తీస్తారని ఎదురుచూస్తున్న వాడిలా ఉంటాడు. అదేవిధంగా సమాధిలో మృతుడు తన బంధువులు సోదరులు, తల్లి, తండ్రి, మిత్రులు, స్నేహితులు మొదలైన వారి ప్రార్థనల కొరకు ఎదురు చూస్తూ ఉంటాడు. ఎవరైనా ప్రార్థిస్తే అది మృతునికి చేరుతుంది. అతనికి ప్రాపంచిక కాంక్షలన్నిటికంటే ప్రియమైనదిగా ఉంటుంది. ఇంకా అల్లాహ్‌ (త) సమాధివాసులకు సజీవుల దు’ఆకు చాలా అధికంగా అంటే కొండంత పుణ్యం ప్రసాదిస్తాడు. ఇది సజీవుల తరఫున మృతులకు ఈ ఇస్తి’గ్‌ఫార్‌ చాలా ఉన్నత మైన కానుక.” (బైహఖీ-ష’అబిల్ ఈమాన్)

2356 – [ 34 ] ( لم تتم دراسته ) (2/728)

وَعَنْ عَبْدِ اللهِ بْنِ بُسْرٍقَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “طُوْبَى لِمَنْ وَجَدَ فِيْ صَحِيْفَتِهِ اسْتِغْفَارًا كَثِيْرًا”. رَوَاهُ ابْنُ مَاجَهُ وَ رَوَى  النَّسَائِيُّ فِيْ “عَمَلِ يَوْمِ وَّلَيْلَةٍ.

2356. (34) [2/728అపరిశోధితం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ బుస్‌ర్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”తీర్పుదినంనాడు తన ఆచరణల పట్టికలో అత్యధికంగా ఇస్తిగ్‌ఫార్‌ను పొందినవాడే అదృష్ట వంతుడు, శుభకరుడు.” (ఇబ్నె మాజహ్, నసాయి’)

2357 – [ 35 ] ( لم تتم دراسته ) (2/728)

وَعَنْ عَائِشَةَ أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم كَانَ يَقُوْلُ: “اَللّهُمَّ اجْعَلْنِيْ مِنَ الَّذِيْنَ إِذَا أَحْسَنُوْا اسْتَبْشَرُوْا وَإِذَا أَسَاؤُوْا اسْتَغْفَرُوْا”. رَوَاهُ ابْنُ مَاجَهُ وَالْبَيْهَقِيُّ فِيْ الدَّعْوَاتِ الْكَبِيْرِ.

2357. (35) [2/728అపరిశోధితం]

‘ఆయి’షహ్‌ (ర) కథనం: ప్రవక్త ఇలా ప్రవచించే వారు, ”ఓ నా ప్రభూ! పుణ్యంచేసి సంతోషించే, చెడు చేసి క్షమాపణ కోరేవారిలో నన్ను చేర్చు.” (ఇబ్నె మాజహ్, బైహఖీ-ద’అవాతిల్ కబీర్)

2358 – [ 36 ] ( صحيح ) (2/728)

وَعَنِ الْحَارِثِ بْنِ سُوَيْدٍ قَالَ: حَدَّثَنَا عَبْدُ اللهِ بْنِ مَسْعُوْدٍ حَدِيْثَيْنِ: أَحَدُ هُمَا عَنْ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم وَالْآخَرُ عَنْ نَّفْسِهِ قَالَ: إِنَّ الْمُؤْمِنَ يَرَى ذُنُوْبَهُ كَأَنَّهُ قَاعِدٌ تَحْتَ جَبَلٍ يَخَافُ أَنْ يَّقَعَ عَلَيْهِ وَإِنَّ الْفَاجِرَ يَرَى ذُنُوْبَهُ كَذُبَابٍ مَرَّعَلَى أَنْفِهِ. فَقَالَ بِهِ هَكَذَا أَي بِيَدِهِ فَذَبَّهُ عَنْهُ. ثُمَّ قَالَ: سَمِعْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ: “للهُ أَفْرَحُ بِتَوْبَةِ عَبْدِهِ الْمُؤْمِنِ مِنْ رَجُلٍ نَزَلَ فِيْ أَرْضٍ دَوّيَّةٍ مُهْلِكَةٍ مَّعَهُ رَاحِلَتُهُ عَلَيْهَا طَعَامُهُ وَشَرَابُهُ فَوَضَعَ رَأْسَهُ فَنَامَ نَوْمَةً فَاسْتَيْقَظَ وَقَدْ ذَهَبَتْ رَاحِلَتَهُ فَطَلَبَهَا حَتَّى إِذَا اشْتَدَّ عَلَيْهِ الْحَرُّ وَالْعَطَشُ أَوْ مَا شَاءَ اللهُ قَالَ: أَرْجِعُ إِلَى مَكَانِيْ الَّذِيْ كُنْتُ فِيْهِ فَأَنَامَ حَتَّى أَمُوْتَ فَوَضَعَ رَأْسَهُ عَلَى سَاعِدِهِ لِيَمُوْتَ فَاسْتَيْقَظَ فَإِذَا رَاحِلَتُهُ عِنْدَهُ عَلَيْهَا زَادَهُ وَشَرَابُهُ فَاللهِ أَشَدُّ فَرْحًا بِتَوْبَةِ الْعَبْدِ الْمُؤْمِنِ مِنْ هَذَا بِرَاحِلَتِهِ وَزَادَهُ”. رَوَى مُسْلِمٌ الْمَرْفُوْعَ إِلَى رَسُوْلِ صلى الله عليه وسلم مِنْهُ فَحَسَبُ ورَوَى الْبُخَارِيُّ اَلْمَوْقُوْفَ عَلَى ابْنِ مَسْعُوْدٍ أَيْضًا.

2358. (36) [2/728దృఢం]

‘హారిస్‌’ బిన్‌ సువైద్‌ (ర) కథనం: ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ మస్‌’ఊద్‌ మాకు రెండు ‘హదీసు’లు తెలిపారు. ఒకటి ప్రవక్త (స) ద్వారా తెలిపారు. రెండవది తన తరఫు నుండి చెప్పారు. అవేమిటంటే, ఆయన ఇలా అన్నారు, ”విశ్వాసి తన పాపాలను ఒక పెద్ద కొండలా దాని క్రింద కూర్చున్నట్టు. ఆ కొండ తనపై ఎక్కడ పడుతుందోనని భయపడతాడు, పాపాత్ముడు దుర్మార్గుడు తన పాపాలను తన ముక్కుపై ఈగ వాలినట్లు దాన్ని చేత్తో దులుపుకున్నట్లు భావిస్తాడు. ఆ తరువాత ప్రవక్త (స)ను ఇలా అంటూ ఉండగా నేను విన్నానని అన్నారు, ”అల్లాహ్ (త) తన దాసుని పశ్చాత్తాపం పట్ల ఆ వ్యక్తికంటే అధికంగా సంతోషిస్తాడు. ఎవడైతే ఒక ఎడారి ప్రాంతంలో అడవి లాంటి బంజరు భూమిపై వెళ్తున్నాడు. అతనితో పాటు అతని వాహనం కూడా ఉంది. వాహనంపై అన్న పానీయాలు కూడా ఉన్నాయి. అతడు అక్కడ దిగి విశ్రాంతి తీసుకుంటూ నిద్ర పోయాడు. ఆ తరువాత మేల్కొనేసరికి అతని వాహనం అతనికి కనబడ లేదు. ఎక్కడికో వెళ్ళిపోయింది. దాన్ని వెదకడానికి బయలుదేరాడు. దాన్నివెదుకుతూ అలసి పోయాడు. వాతావరణం చాలా వేడిగా ఉంది. ఆకలి, దాహం వేస్తున్నాయి. అల్లాహ్(త) కోరింది జరిగింది, కష్టాలు కూడా వచ్చాయి. అతడు తన మనసులో బయలుదేరిన చోటికే బయలుదేరుతానని, అక్కడే పడుకుంటానని చివరికి అక్కడే చచ్చిపోతానని నిశ్చయించుకొని అక్కడికి తిరిగి వచ్చి తలను తన చేతిపై పెట్టుకొని చనిపోదామని నిద్రపోతాడు. అతడు నిద్రపోయాడు. మళ్ళీ మేల్కొని లేచి చూస్తే, పోయిన అతని వాహనం అతని తలవద్ద నిలబడి ఉంది. దానిపై అతని అన్నపానీయాలన్నీ ఉన్నాయి. దాన్ని చూచి అతడు చాలా సంతోషించాడు.” విశ్వాసి పశ్చాత్తాపం వల్ల అల్లాహ్‌(త)కు ఆ వ్యక్తి కంటే ఎక్కువ సంతోషం కలుగుతుంది. (ముస్లిమ్‌ – ప్రవక్త ప్రోక్తం, బు’ఖారి – సహచరుని ప్రోక్తం)

2359 – [ 37 ] ( لم تتم دراسته ) (2/729)

وَعَنْ عَلِيٍّ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِنَّ اللهَ يُحِبُّ الْعَبْدَ الْمُؤْمِنَ الْمُفَتَّنَ التَوَّابَ”. رواه أَحْمَدُ.

2359. (37) [2/729అపరిశోధితం]

‘అలీ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, అల్లాహ్‌ (త) అధికంగా క్షమాపణ కోరే పాపాత్ముడైన విశ్వాస దాసున్ని, అధికంగా ప్రేమిస్తాడు. (అ’హ్మద్‌)

2360 – [ 38 ] ( لم تتم دراسته ) (2/729)

وَعَنْ ثَوْبَانَ قَالَ: سَمِعْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ: “مَا أُحِبُّ أَنَّ لِيْ الدُّنْيَا بِهَذِهِ الْآيَةِ (يَا عِبَادِيَ الَّذِيْنَ أَسْرَفُوْا عَلَى أَنْفُسِهِمْ لَا تَقْنَطُوْا، 39: 53)”. فَقَالَ رَجُلٌ: فَمَنْ أَشْرَكَ؟ فَسَكَتَ النَّبِيُّ صلى الله عليه وسلم. ثُمَّ قَالَ: “أَلَا وَمَنْ أَشْرَكَ” ثَلَاثَ مَرَّاتٍ . رواه أَحْمَدُ

2360. (38) [2/729అపరిశోధితం]

సౌ’బాన్‌ (ర) కథనం: ప్రవక్త (స) ను ఇలా అంటూ ఉండగా నేను విన్నాను. ”ఇలా అను: ‘స్వయంగా మీకు (మీ ఆత్మలకు) మీరే అన్యాయం చేసుకున్న నా దాసులారా! అల్లాహ్‌ కారుణ్యం పట్ల నిరాశ చెందకండి. నిశ్చయంగా, అల్లాహ్‌ అన్ని పాపాలను క్షమిస్తాడు… ‘ ” (సూ. అజ్ జుమర్, 39:53). ఇది నాకు ప్రపంచంలోని అన్నిటికంటే ఎంతో ప్రీతికర మైనది. ఒకవ్యక్తి, ‘ఓ అల్లాహ్‌ ప్రవక్త, షిర్క్‌ చేసిన వారు కూడా క్షమించబడతారా?’ అని  ప్రశ్నించాడు. ప్రవక్త (స) దైవవాణి కొరకు ఎదురు చూస్తూ మౌనం వహించారు. దైవవాణి వచ్చింది. ప్రవక్త (స) ఇలా అన్నారు, ”వినండి,  షిర్క్ చేసినవారు కూడా” ఈ విధంగా మూడుసార్లు పలికారు. [61]  (అ’హ్మద్‌)

2361 – [ 39 ] ( لم تتم دراسته ) (2/729)

وعَنْ أبي ذر قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِنَّ اللهَ تَعَالى لَيَغْفِرُ لِعَبْدِهِ مَا لَمْ يَقَعِ الْحِجَابُ”. قَالُوْا: يَا رَسُوْلَ اللهِ وَمَا الْحِجَابُ؟ قَالَ: “أَنْ تَمُوْتَ النَّفْسُ وَهِيَ مُشْرِكَةٌ”. رَوَى الْأَحَادِيْثُ الثَّلَاثَةُ أَحْمَدُ وَرَوَى الْبَيْهَقِيُّ الْأَخِيْرَ فِيْ كِتَابِ الْبَعْثِ وَالنُّشُوْرِ.

2361. (39) [2/729అపరిశోధితం]

అబూ జ’ర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”అల్లాహ్‌ (త) తన దాసుని పాపాలను క్షమిస్తూ ఉంటాడు. దాసునికి దైవకారుణ్యానికి మధ్య తెర అడ్డు రానంత వరకు. ప్రవక్త అనుచరులు, ‘ఆ తెర ఏమిటి’ అని విన్నవించుకున్నారు. ప్రవక్త (స), ‘షిర్క్ స్థితిలో మరణించటం,’ అని అన్నారు. ఈ మూడు ‘హదీసు’లను అ’హ్మద్‌ పేర్కొన్నారు. ఈ చివరి ‘హదీసు’ను బైహఖీ, కితాబుల్‌ బ’అసివన్నుషూర్‌ లో పేర్కొన్నారు.

2362 – [ 40 ] ( لم تتم دراسته ) (2/729)

وَعَنْهُ  قَالَ : قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَنْ لَقِيَ اللهَ لَا يَعْدِلُ بِهِ شَيْئًا فِيْ الدُّنْيَا ثُمَّ كَانَ عَلَيْهِ مِثْلَ جِبَالٍ ذُنُوْبٌ غَفَرَ اللهُ لَهُ “. رَوَاهُ الْبَيْهَقِيُّ فِيْ كِتَابِ الْبَعْثِ وَالنُّشُوْرِ.

2362. (40) [2/729అపరిశోధితం]

అబూ జ’ర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ప్రపంచంలో అల్లాహ్‌కు సాటి కల్పించని స్థితిలో అల్లాహ్‌ (త) ను కలిస్తే, అతనిపై కొండంత పాపాలున్నా అల్లాహ్‌ (త) అతన్ని క్షమించి వేస్తాడు. (బైహఖీ-బ’అస్ వన్నషూర్)

2363 – [ 41 ] ( لم تتم دراسته ) (2/730)

وَعَنْ عَبْدِ اللهِ بْنِ مَسْعُوْدٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “اَلتَّائِبُ مِنَ الذَّنْبِ كَمَنْ لَا ذَنْبَ لَهُ”. رَوَاهُ ابْنُ مَاجَهُ وَالْبَيْهَقِيُّ فِيْ شُعَبِ الْإِيْمَانِ. وَقَالَ تَفَرَّدَ بِهِ النَّهْرَانِيْ وَهُوَ مَجْهُوْلٌ. وَفِيْ شَرْحِ السُّنَّةِ رَوَي عَنْهُ مَوْقُوْفًا قَالَ: النَّدَمُ تَوْبَةٌ وَالتَّائِبُ كَمَنْ لَا ذَنْبَ لَهُ.

2363. (41) [2/730అపరిశోధితం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ మస్‌’ఊద్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, పాపాల పట్ల పశ్చాత్తాపం చెందేవాడు పాపం చేయని వాడితో సమానం. (ఇబ్నె మాజహ్, బైహఖీ-షుఅబిల్ ఈమాన్)

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ మస్‌’ఊద్‌ గారి మరో కథనం ఇలా ఉంది, ‘పాపాలపట్ల చింతించడమే పశ్చాత్తాపం.’ పాపా లపట్ల పశ్చాత్తాపం చెందినవాడు పాపం చేయని వాడితోసమానం. (ష’ర్హ్ సున్నహ్-సహచరుని ప్రోక్తం)

=====

5- بَابُ رَحْمَةِ اللهِ

5. దైవకారుణ్య విశాలత

اَلْفَصْلُ الْأَوَّلُమొదటి విభాగం   

2364 – [ 1 ] ( متفق عليه ) (2/731)

عَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَمَّا قَضَى اللهُ الْخَلْقَ كَتَبَ كِتَابًا فَهُوَعِنْدَهُ فَوْقَ عَرْشِهِ: إِنَّ رَحْمَتِيْ سَبَقَتْ غَضَبِيْ”. وَفِيْ رِوَايَةٍ ” غَلَبَتْ غَضَبِيْ”.

2364. (1) [2/731ఏకీభవితం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”అల్లాహ్‌ (త) సృష్టితాలను సృష్టించ నిశ్చ యించాడు. ఆయన ఒక గ్రంథం వ్రాసాడు. ఆ గ్రంథం ఆయన వద్ద సింహాసనంపై ఉంది. ఆ గ్రంథంలో, ”నా కారుణ్యం, నా ఆగ్రహాన్ని మించిపోతుంది,” అని ఉంది.

మరో ఉల్లేఖనంలో ”నా కారుణ్యం, నా ఆగ్రహాన్ని అధిగమించింది,” అని ఉంది. [62] (బు’ఖారీ, ముస్లిమ్‌)

2365 – [ 2 ] ( متفق عليه ) (2/731)

وَعَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِنَّ لِلّهِ مِائَةُ رَحْمَةٍ أَنْزَلَ مِنْهَا رَحْمَةً وَّاحِدَةً بَيْنَ الْجِنِّ وَالْإِنْسِ وَالْبَهَائِمِ وَالْهَوَامِّ فَبِهَا يَتَعَاطَفُوْنَ وَبِهَا يَتَرَاحَمُوْنَ وَبِهَا تَعْطِفُ الْوَحْشُ عَلَى وَلَدِهَا وَأَخَّرَ اللهُ تِسْعًا وَتِسْعِيْنَ رَحْمَةً يَرْحَمُ بِهَا عِبَادَهُ يَوْمَ الْقِيَامَةِ”.

2365. (3) [2/730ఏకీభవితం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”అల్లాహ్‌ (త) వద్ద 100 కారుణ్యాలు ఉన్నాయి. వాటిలో ఒకదాన్ని ప్రపంచంలోనికి దించాడు. దాన్ని జిన్నులకు, మానవులకు, జంతువులకు, పశువు లకు, పురుగులకు, క్రిమికీటకాలకు పంచి వేసాడు. ఈ కారుణ్యం ద్వారానే పరస్పరం కలుస్తారు, పరస్పరం ప్రేమించుకుంటారు, దయచూపుతారు, ఒకర్ని ఒకరు కరుణిస్తారు. ఇంకా ఈ కారుణ్యం ద్వారానే అడవి జంతువులు కూడా తమ సంతానం పట్ల ఎంతో ప్రేమతో, కరుణతో ఉదారంగా వ్యవహరిస్తాయి. ఇంకా 99 కారుణ్యాలను అల్లాహ్‌ (త)తీర్పుదినం కొరకు మిగిల్చి ఉంచాడు. ఆ 99 కారుణ్యాలను తన భక్తులపై అవతరింపజేస్తాడు. (బు’ఖారీ, ముస్లిమ్‌)

2366 – [ 3 ] ( صحيح ) (2/731)

وَفِيْ رِوَايَةٍ لِمُسْلِمٍ عَنْ سَلْمَانَ نَحْوَهُ وَفِيْ آخِرِهِ قَالَ: “فَإِذَا كَانَ يَوْمَ الْقِيَامَةِ أَكْمَلَهَا بِهَذِهِ الرَّحْمَةِ”.

2366. (3) [2/731దృఢం]

ముస్లిమ్ లోని మరొక ఉల్లేఖనలో, సల్మాన్ (ర) కథనం: తీర్పుదినం నాడు అల్లాహ్‌ (త) 99 కారుణ్యాలతో ఈ ప్రాపంచిక కారుణ్యాన్ని కలిపివేస్తాడు. ఇవన్నీ కలసి 100 పూర్తవుతాయి. [63]

2367 – [ 4 ] ( متفق عليه ) (2/731)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَوْ يَعْلَمُ الْمُؤْمِنُ مَا عِنْدَ اللهِ مِنَ الْعَقُوْبَةِ مَا طَمِعَ بِجَنَّتِهِ أَحَدٌ وَلَوْ يَعْلَمُ الْكَافِرُ مَا عِنْدَ اللهِ مِنَ الرَّحْمَةِ مَا قَنِطَ مِنْ جَنَّتِهِ أَحَدٌ”.

2367. (4) [2/731ఏకీభవితం]

అబూ హురైరహ్‌ (రకథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఒకవేళ విశ్వాసి అల్లాహ్‌ (త) ఎంత కఠినంగా శిక్షిస్తాడో తెలిస్తే ఎవరూ స్వర్గాన్ని గురించి కాంక్షించరు. అదేవిధంగా అవిశ్వాసి అల్లాహ్‌ వద్ద ఎంత విశాల కారుణ్యం ఉందో తెలిస్తే స్వర్గం పట్ల నిరాశచెందడు.[64](బు’ఖారీ, ముస్లిమ్‌)

2368 – [ 5 ] ( صحيح ) (2/731)

وَعَنِ ابْنِ مَسْعُوْدٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “اَلْجَنَّةُ أَقْرَبُ إِلَى أَحَدِكُمْ مِنْ شِرَاكِ نَعْلِهِ وَالنَّارُ مِثْلُ ذَلِكَ”. رَوَاهُ الْبُخَارِيُّ.

2368. (5) [2/731దృఢం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ మస్‌’ఊద్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”స్వర్గం మీ చెప్పు త్రాడుకంటే దగ్గరగా ఉంది. అదేవిధంగా నరకం కూడా మీకు చాలా దగ్గరగా ఉంది. [65] (బు’ఖారీ)

2369 – [ 6 ] ( متفق عليه ) (2/732)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “قَالَ رَجُلٌ لَمْ يَعْمَلْ خَيْرًا قَطُّ لِأَهْلِهِ.

وَفِيْ رِوَايَةٍ أَسْرَفَ رَجُلٌ عَلَى نَفْسِهِ فَلَمَّا حَضَرَهُ الْمَوْتُ أَوْصَى بَنِيْهِ إِذَا مَاتَ فَحَرِّقُوْهُ ثُمَّ اذْرُوْا نِصْفُهُ فِيْ الْبِرِّ وَنِصْفَهُ فِيْ الْبَحْرِ فَوَ اللهِ لَئِنْ قَدَرَاللهُ عَلَيْهِ لَيُعَذِّبَنَّهُ عَذَابًا لَا يُعَذَّبُهُ أَحَدًا مِّنَ الْعَالَمِيْنَ فَلَمَّا مَاتَ فَعَلُوْا مَا أَمَرَ هُمْ. فَأَمَرَ اللهُ الْبَحْرَ فَجَمَعَ مَا فِيْهِ وَأَمَرَ الْبَرَّ فَجَمَعَ مَا فِيْهِ ثُمَّ قَالَ لَهُ: لَمَ فَعَلْتَ هَذَا؟ قَالَ: مِنْ خَشْيَتِكَ يَا رَبِّ وَأَنْتَ أَعْلَمُ فَغَفَرَ لَهُ”.

2369. (6) [2/732ఏకీభవితం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ప్రాచీన కాలంలో ఒక వ్యక్తి ఉండేవాడు. అతడు ఎటు వంటి సత్కార్యం చేయలేదు. తనకు తాను అన్యాయం చేసుకున్నాడు. అతడు మరణించి నప్పుడు తన కుమారులను, ‘నేను చనిపోయిన తర్వాత నన్ను కాల్చి బూడిదచేసి, కొంత బూడిదను అడవులలో మరికొంత బూడిదను నదులలో, సముద్రంలో పారవేయాలి, అల్లాహ్ సాక్షి! ఒకవేళ అల్లాహ్‌(త) కు ఆశక్తి ఉంటే సృష్టితాల్లో ఎవ్వరినీ శిక్షించనివిధంగా నన్ను శిక్షిస్తాడు,’ అని హితబోధ చేసాడు. అతడు చనిపోయిన తర్వాత అతని కొడుకులు అతడు చెప్పినట్లే చేసారు. అల్లాహ్‌(త) నదులకు సముద్రాలకు అతడి బూడిదను ఒకచోట చేర్చమని ఆదేశించాడు. నేలను, అడవులను వాటిలో ఉన్న బూడిదను ఒకచోట చేర్చమని ఆదేశించాడు. అల్లాహ్‌ (త) ఆదేశంపై ఇవన్నీ అతని బూడిదను ఒకచోట చేర్చాయి. అల్లాహ్‌ (త) ఆ బూడిద నుండి మానవుణ్ణి సృష్టించి, ‘నువ్వు అలా ఎందుకుచేసావు,’ అని ప్రశ్నించాడు. ఆ వ్యక్తి, ‘ఓ నా ప్రభూ! నీ భయం వల్ల అలా చేసాను, వాస్తవం నీకు తెలుసు,’ అని అన్నాడు. అప్పుడు అల్లాహ్‌ (త) అతన్ని క్షమించివేసాడు. [66]  (బు’ఖారీ, ముస్లిమ్‌)

2370 – [ 7 ] ( متفق عليه ) (2/732)

وَعَنْ عُمَرَ بْنِ الْخَطَّابِ قَالَ: قَدِمَ عَلَى النَّبِيِّ صلى الله عليه وسلم سَبْيٌ فَإِذَا امْرَأَةٌ مِّنَ السَّبْيِ قَدْ تَحَلَّبَ ثَدْيُهَا تَسْعَى إِذَا وَجَدَتْ صَبِيّا فِيْ السَّبِيِّ أَخَذَتْهُ فَأَلْصَقَتْهُ بِبَطْنِهَا وَأَرْضَعَتُهُ. فَقَالَ لَنَا النَّبِيّ صلى الله عليه وسلم: “أَتُرَوْنَ هَذِهِ طَارِحَةً وَّلَدَهَا فِيْ النَّارِ؟” فَقُلْنَا: لَا وَهِيَ تَقْدِرُ عَلَى أَنْ لَّا تَطْرَحُهُ فَقَالَ: “اللهُ أَرْحَمُ بِعِبَادِهِ مِنْ هَذِهِ بِوَلَدِهَا”.

2370. (7) [2/732ఏకీభవితం]

‘ఉమర్‌ (ర) కథనం: ప్రవక్త (స) వద్దకు కొంత మంది ఖైదీలు వచ్చారు. వారిలో ఒక స్త్రీ కూడా ఉంది. ఆమె పిల్లల తల్లి. ఆమె బిడ్డ ఆమె వెంటలేడు. ఈ కారణంగా రొమ్ముల ద్వారా పాలు ప్రవహిస్తున్నాయి. ఆమె తన బిడ్డకోసం అటూ ఇటూ వెదుకుతుంది. ఖైదీల్లో ఒక బిడ్డను చూచి వెళ్ళి వెంటనే ఒడిలోకి ఎత్తుకుంది. ఆప్యాయంగా ప్రేమతో తనపాలు పట్టసాగింది. ఇది చూచి ప్రవక్త (స) మాతో, ‘మీ దృష్టిలో ఈ స్త్రీ తన బిడ్డను మంటల్లోకి విసురుతుందా?’ అని అడిగారు. ‘లేదు, ఆమె శక్తి ఉన్నా వెయ్యలేదు’ అని అన్నాము. అప్పుడు ప్రవక్త (స), అల్లాహ్‌ (త) తన దాసులపై ఈ స్త్రీ తన బిడ్డపై చూపే కరుణకంటే అధికంగా కరుణ చూపేవాడు.  (బు’ఖారీ, ముస్లిమ్‌)

2371 – [ 8 ] ( متفق عليه ) (2/732)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَنْ يُنْجِيَ أَحَدًا مِّنْكُمْ عَمَلُهُ” .قَالُوْا: وَلَا أَنْتَ يَا رَسُوْلَ اللهِ؟ قَالَ: “وَلَا أَنَا إِلَّا أَنْ يَّتَغَمَّدَنِيَ اللهُ مِنْهُ بِرَحْمَتِهِ فَسَدِّدُوْا وَقَارَبُوْا وَاغْدُوْا وَرُوْحُوْا وَشَيْءٌ مِّنَ الدُّلْجَةِ وَالْقَصْدَ الْقَصْدَ تَبْلُغُوْا”.

2371. (8) [2/732ఏకీభవితం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”దైవకారుణ్యం లేకుండా మీలోని ఎవరి ఆచరణ ఎంత మాత్రం విముక్తి ప్రసాదించలేదు.” అప్పుడు ప్రజలు, ”ఓ అల్లాహ్‌ ప్రవక్తా! మీ ఆచరణ కూడా విముక్తి ప్రసా దించ లేదా?” అని ప్రశ్నించారు. ప్రవక్త (స) ‘అవును,’ కాని అల్లాహ్‌ (త) కారుణ్యం నన్ను కప్పివేస్తేనే తప్ప. కనుక మీరు రుజు ర్గంపై నడవండి. మధ్యే మార్గాన్ని అవలంబించండి. దానికి దగ్గరగా ఉండండి. ఉదయం సాయంత్రం రాత్రి కొంత భాగంలో ఆరాధన చేసుకోండి. ప్రతి పనిలో మధ్యేమార్గాన్ని అవలం బించండి. దాన్ని తప్పనిసరి చేసుకోండి. మీరు మీ గమ్యాన్ని చేరుకుంటారు. (బు’ఖారీ, ముస్లిమ్‌)

2372 – [ 9 ] ( صحيح ) (2/732)

وَعَنْ جَابِرٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَا يُدْخِلُ أَحَدًا مِنْكُمْ عَمَلُهُ الْجَنَّةَ وَلَا يُجِيْرُهُ مِنَ النَّارِوَلَا أَنَا إِلَّا بِرَحْمَةِ اللهِ”. رَوَاهُ مُسْلِمٌ.

2372. (9) [2/732దృఢం]

జాబిర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మీలో ఎవరి ఆచరణా తనను స్వర్గంలో ప్రవేశింపజేయలేదు, నరకం నుండి రక్షించనూ లేదు. నన్ను కూడా రక్షించ లేదు, దైవకారుణ్యం వల్ల తప్ప.” [67] (ముస్లిమ్‌)

2373 – [ 10 ] ( صحيح ) (2/732)

وَعَنْ أَبِيْ سَعِيْدٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِذَا أَسْلَمَ الْعَبْدُ فَحَسُنَ إِسْلَامُهُ يُكَفِّرُ اللهُ عَنْهُ كُلَّ سَيِّئَةٍ كَانَ زَلَّفَهَا وَكَانَ بَعْدُ الْقِصَاصُ: الْحَسَنَةُ بِعَشَرِأَمْثَالِهَا إِلَى سَبْعِ مِائَةِ ضِعْفٍ إِلَى أَضْعَافٍ كَثِيْرَةٍ وَالسَّيِّئَةُ بِمِثْلِهَا إِلَّا أَنْ يَّتَجَاوَزَاللهُ عَنْهَا”. رَوَاهُ الْبُخَارِيُّ.

2373. (10) [2/732దృఢం]

అబూ స’యీద్‌ ‘ఖుద్రీ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”దాసుల్లో ఎవరైనా ఇస్లామ్‌ స్వీకరిస్తే, అతడు పూర్తిగా ఇస్లామ్‌ను ఆచరిస్తే. అన్ని విధాలా దైవానికి విధేయుడుగా ఉన్నట్లయితే, ఇస్లామ్‌ స్వీకరించడానికి ముందు అతడు చేసిన పాపాలను అల్లాహ్‌ (త) క్షమించివేస్తాడు. ఇస్లామ్‌ స్వీకరించిన తర్వాత చేసిన ఆచరణకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. అంటే ఒక పుణ్యానికి 10 పుణ్యాల నుండి 700 పుణ్యాల వరకు లేదా అంతకంటే అధికంగా లభిస్తాయి. పాపంచేస్తే దానికి సమానంగా పాపం లిఖించడం జరుగుతుంది. అంటే ఒక పాపం చేస్తే ఒక పాపమే లిఖించబడుతుంది. అయితే దీన్ని కూడా అల్లాహ్‌ (త) క్షమించ వచ్చు. [68] (బు’ఖారీ)

2374 – [ 11 ] ( متفق عليه ) (2/733)

وَعَنِ ابْنِ عَبَّاسٍ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِنَّ اللهَ كَتَبَ الْحَسَنَاتِ وَالسِّيَئَاتِ: فَمَنْ هَمَّ بِحَسَنَةٍ فَلَمْ يَعْمَلْهَا كَتَبَهَا اللهُ لَهُ عِنْدَهُ حَسَنَةً كَامِلَةً فَإِنْ هَمَّ بِعَمْلِهَا كَتَبَهَا اللهُ لَهُ عِنْدَهُ عَشْرَ حَسَنَاتٍ إِلَى سَبْعِمِائِةِ ضِعْفٍ إِلَى أَضْعَافٍ كَثِيْرَةٍ وَمَنْ هَمَّ بِسَيِّئَةٍ فَلَمْ يَعْمَلْهَا كَتَبَهَا اللهُ عِنْدَهُ حَسَنَةً كَامِلَةً فَإِنْ هُوَ هَمَّ بها فَعَملَهَا كَتَبَهَا اللهُ لَهُ سَيِّئَةً وَّاحِدَةً”.

2374. (11) [2/733ఏకీభవితం]

ఇబ్నె ‘అబ్బాస్‌ (ర) కథనం: ప్రవక్త (స) ఇలా ప్రవచించారు, ”అల్లాహ్‌ (త) పుణ్యాలను వ్రాస్తాడు, పాపాలనూ వ్రాస్తాడు. ఎవరైనా సత్కార్యం చేద్దామని నిశ్చయించుకొని ఇంకా చేయనప్పటికీ అల్లాహ్‌ (త) ఒక పూర్తి పుణ్యాన్నివ్రాస్తాడు. ఒకవేళ అతడు నిశ్చయించుకొని ఆ సత్కార్యం పూర్తిచేస్తే 10 పుణ్యాలు వ్రాస్తాడు. అంతకంటే అధికంచేసి 700 రెట్లవరకు ఇంకా అంతకంటే అధికంగా వ్రాస్తాడు. ఒకవేళ ఎవరైనా పాపకార్యం నిశ్చయించుకొని, పాపం చేయకపోతే ఒక సత్కార్య పుణ్యం రాస్తాడు. ఒకవేళ పాపకార్యం ఉద్దేశించి పాపం చేస్తే ఒక పాపానికి తగిన ఒక పాపం  మాత్రమే వ్రాస్తాడు. (బు’ఖారీ, ముస్లిమ్‌)

—–

اَلْفَصْلُ الثَّانِيْ  రెండవ విభాగం 

2375 – [ 12 ]?  (2/733)

عَنْ عُقْبَةَ بْنِ عَامِرٍقَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِنَّ مَثَل الَّذِيْ يَعْمَلُ السَّيِّئَةِ ثُمَّ يَعْمَلُ الْحَسَنَاتِ كَمَثَلِ رَجُلٍ كَانَتْ عَلَيْهِ دِرْعٌ ضَيِّقَةٌ قَدْ خَنَقَتْهُ ثُمَّ عَمِلَ حَسَنَةً فَانْفَكَّتْ حَلْقَةٌ ثُمَّ عَمِلَ أُخْرَى فَانْفَكَّتْ أُخْرَى حَتَّى تَخْرُجَ إِلَى الْأَرْضِ”. رَوَاهُ فِيْ شَرْحِ السُّنَّةِ .

2375. (12) [2/733?]

‘ఉఖ్‌బహ్ బిన్‌ ‘ఆమిర్‌ కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ఒకవ్యక్తి పాపాలు చేస్తూ ఉంటాడు. ఆ తరువాత పుణ్యాలు చేయనారంభిస్తాడు. అతని ఉదాహరణ ఒక వ్యక్తి శరీరంపై చాలా బిగుతుగా ఉన్న ఒక కవచం ఉంది. దాని వలయాలు అతని శరీరాన్ని నొక్కి ఉంచాయి. అతడు పుణ్యం చేయనారంభిస్తాడు. దాని వల్ల అతని ఒక వలయం తెరుచుకుంటుంది. ఆ తరువాత రెండవవలయం తెరచుకుంటుంది. అదే విధంగా ఎన్ని వలయాలు ఉన్నాయో అన్నీ విడి పోతాయి. చివరికి ఆ కవచం వొదులుగా అయి నేలపై పడిపోతుంది. [69] (షరహ్‌సున్నహ్‌)

2376 – [ 13 ] ( لم تتم دراسته ) (2/733)

وَعَنْ أَبِيْ الدَّرْدَاءِ: أَنَّهُ سَمِعَ النَّبِيَّ صلى الله عليه وسلم يَقُصُّ عَلَى الْمِنْبَرِ وَهُوَ يَقُوْلُ: (وَلِمَنْ خَافَ مَقَامَ رَبِّهِ جَنَّتَانِ، 55: 46). قُلْتُ: وَإِنْ زَنَى وَإِنْ سَرَقَ يا رَسُوْلَ اللهِ؟ فَقَالَ الثَّانِيَةَ: (وَلِمَنْ خَافَ مَقَامَ رَبِّهِ جَنَّتَانِ). فَقُلْتُ الثَّانِيَةَ: وَإِنْ زَنَى وَسَرَقَ  يَا رَسُوْلَ اللهِ؟ فَقَالَ الثَّالِثَةَ: (وَلِمَنْ خَافَ مَقَامَ رَبِّهِ جَنَّتَانِ). فَقُلْتُ الثَّالِثَةُ: وَإِنْ زَنَى وَسَرَقَ يَا رَسُوْلَ اللهِ قَالَ: “وَإِنْ رَغِمَ أَنْفُ أَبِيْ الدَّرْدَاءِ”. رَوَاهُ أَحْمَدُ.

2376. (13) [2/733అపరిశోధితం]

అబూ దర్‌దా (ర) కథనం: నేను, ప్రవక్త (స)ను మెంబర్‌పై హితబోధ చేస్తూ ఈ వాక్యాన్ని పఠిస్తూ ఉండగా విన్నాను. ”మరియు ఎవడైతే తన ప్రభువు సన్నిధిలో హాజరుకావలసి ఉంటుందనే భయం కలిగి ఉంటాడో, అతనికి రెండు స్వర్గవనాలుంటాయి.” (సూ. అర్ రహ్మాన్, 55:46) నేనిలా అన్నాను, ”ఓ అల్లాహ్‌ ప్రవక్తా! అతడు వ్యభిచారం చేసినా, దొంగతనం చేసినానా?” ప్రవక్త (స) రెండవసారి ”ఎవడైతే తన ప్రభువు సన్నిధిలో హాజరుకావలసి ఉంటుందనే భయం కలిగి ఉంటాడో, అతనికి రెండు స్వర్గవనాలుంటాయి.” అని పఠించారు. మళ్ళీ నేను ”అతడు వ్యభిచారం చేసినా, దొంగతనం చేసినానా?” అని అన్నాను. మూడవసారి, ఎవడైతే తన ప్రభువు సన్నిధిలో హాజరుకావలసి ఉంటుందనే భయం కలిగి ఉంటాడో, అతనికి రెండు స్వర్గవనాలుంటాయి.” అని పఠించారు. మళ్ళీ నేను మూడవసారి ఓ అల్లాహ్‌ ప్రవక్తా! అతడు వ్యభిచారం చేసినా,” దొంగతనం చేసినాసరేనా? అన్నాను. అప్పుడు ప్రవక్త (స) ‘అబూ దర్దా నీదుంప తెగ,’ అని అన్నారు.[70](అ’హ్మద్‌)

2377 – [ 14 ] ( لم تتم دراسته ) (2/734)

وَعَنْ عَامِرٍ الرَّامِ قَالَ: بَيْنَا نَحْنُ عِنْدَهُ يَعْنِيْ عِنْدَ النَّبِيِّ صلى الله عليه وسلم. إِذْ أَقْبَلَ رَجُلٌ عَلَيْهِ كِسَاءٌ وَفِيْ يَدِهِ شَيْءٌ قَدْ الْتَفَّ عَلَيْهِ. فَقَالَ: يَا رَسُوْلَ اللهِ مَرَرْتُ بِغَيْضَةِ شَجَرٍ فَسَمِعْتُ فِيْهَا أَصْوَاتَ فِرَاخٍ طَائِرٍ. فَأَخَذْتُهُنَّ فَوَضَعْتُهُنَّ فِيْ كِسَائِيْ فَجَاءَتْ أُمُّهُنَّ فَاسْتَدَارَتْ عَلَى رَأْسِيْ فَكَشَفْتُ لَهَا عَنْهُنَّ فَوَقَعَتْ عَلَيْهُنَّ فَلَفَفْتُهُنَّ بِكِسَائِيْ فَهُنَّ أَوْلَاءِ مَعِيَ قَالَ: “ضَعْهُنَّ” فَوَضَعْتُهُنَّ وَأَبَتْ أُمُهُنَّ إِلَّا لَزُوْمَهُنَّ. فَقَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “أَتَعْجَبُوْنَ لِرَحْمِ أُمِّ الْافَرَاخِ فِرَاخَهَا؟ فَوَ الَّذِيْ بَعَثَنِيْ بِالْحَقِّ للهُ أَرْحَمُ بِعِبَادِهِ مِنْ أُمِّ الْاَفْرَاخِ بِفِرَاخِهَا. ارْجِعْ بِهِنَّ حَتَّى تَضَعَهُنَّ مِنْ حَيْثُ أَخَذْتَهُنَّ وَأُمُّهُنَّ مَعَهُنَّ”. فَرَجَعَ بِهِنَّ. رَوَاهُ أَبُوْ دَاوُدَ.

2377. (14) [2/734అపరిశోధితం]

‘ఆమిర్ రామి (ర) కథనం: మేము ప్రవక్త (స) వద్ద కూర్చొని ఉన్నాము. కంబళి కప్పుకొని ఉన్న ఒక వ్యక్తి వచ్చాడు. అతని చేతిలో ఏదో ఉంది. దాన్ని అతడు కంబళిలో దాచి ఉంచాడు. ఆ వ్యక్తి ఇలా అన్నాడు, ”ఓ అల్లాహ్‌ ప్రవక్తా! నేను అనేక చెట్లు ఉన్న ప్రదేశం నుండి వచ్చాను. అక్కడ పక్షి పిల్లల శబ్దాలు విన్నాను. నేను వాటిని పట్టుకొని నా కంబళి లోనికి తీసుకున్నాను. వాటి తల్లి వచ్చింది. నా తలపై తిరగసాగింది. నేను దాని పిల్లల్ని దాని ముందు పెట్టాను. ఆ పక్షి వాటి ముందు పడిపోయింది. నేను వాటిని వాటి తల్లితో పాటు కంబళిలో కప్పు కున్నాను. ఇప్పుడు అవన్నీ నా వద్ద ఉన్నాయి. అప్పుడు ప్రవక్త (స) ”వాటన్నిటినీ విప్పి నేలపై పెట్టమని” అన్నారు. ఆ వ్యక్తి తీసి పెట్టాడు. ఆ పక్షి తనపిల్లలను కప్పుకుంది. ఆపక్షి అక్కడి నుండి ఎగరలేదు. అది చూచి ప్రవక్త (స), ‘నీవు ఆ తల్లి పక్షి ప్రేమపై ఆశ్చర్యపోతున్నావా? తల్లిపక్షి తన పిల్లల ప్రేమవల్ల ఎలా కప్పుకొనిఉందో చూడు. సత్యం ఇచ్చి నన్ను పంపిన అల్లాహ్ (త) సాక్షి! ఆయన (త) తన విశ్వాసదాసుల పట్ల ఇంతకంటే అధిక కారుణ్యంతో వ్యవహరిస్తాడు,’ అని అన్నారు. ఆ తరువాత ప్రవక్త (స) ఆ వ్యక్తితో, ‘ఎక్కడి నుండి తెచ్చావో అక్కడే పెట్టి రా,’ అని అన్నారు. ఆ వ్యక్తి తిరిగి తీసుకువెళ్ళాడు. (అబూ దావూద్‌)

—–

اَلْفَصْلُ الثَّالِثُ  మూడవ విభాగం 

2378 – [ 15 ] ( لم تتم دراسته ) (2/734)

عَنْ عَبْدِ اللهِ بْنِ عُمَرَ قَالَ: كُنَّا مَعَ النَّبِيِّ صلى الله عليه وسلم فِيْ بَعْضِ غَزَوَاتِهِ فَمَرَّ بِقَوْمٍ فَقَالَ: “مَنِ الْقَوْمُ؟” قَالُوْا: نَحْنُ الْمُسْلِمُوْنَ وَامْرَأَةٌ تَحْضِبُ بِقِدْرِهَا وَمَعَهَا ابْنٌ لَهَا فَإِذَا ارْتَفَعٍ وَهَجٌ تَنَحَّتْ بِهِ. فَأَتَتِ النَّبِيَّ صلى الله عليه وسلم. فَقَالَ: أَنْتَ رَسُوْلُ اللهِ؟ قَالَ: “نَعَمْ”. قَالَتْ: بِأَبِيْ أَنْتَ وَأُمِّيْ أَلَيْسَ اللهُ أَرْحَمَ الرَّاحِمِيْنَ؟ قَالَ:”بَلَى”. قَالَتْ: أَلَيْسَ اللهُ أَرْحَمَ بِعِبَادِهِ مِنَ الْأُمِّ عَلَى وَلِدِهَا؟ قَالَ: “بَلَى” . قَالَتْ: إِنَّ الْأُمَّ لَا تُلْقِيْ وَلَدَهَا فِيْ النَّارِ .فَأَكَبَّ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم يَبْكِيْ. ثُمَّ رَفَعَ رَأْسَهُ إِلَيْهَا فَقَالَ: “إِنَّ اللهَ لَا يُعِذِّبُ مِنْ عِبَادِهِ إِلَّا الْمَارِدَ الْمُتَمِرِّدَ الَّذِيْ يَتَمَرَّدُ عَلَى اللهِ وَأَبَى أَنْ يَقُوْلَ: لَا إِلَهَ إِلَّا اللهُ” .رَوَاهُ ابْنُ مَاجَهُ.

2378. (15) [2/734అపరిశోధితం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘ఉమర్‌ (ర) కథనం: ప్రవక్త (స) వెంట మేము ఒక పోరాటంలో ఉన్నాము. ప్రవక్త (స) ఒక బృందం ప్రక్కనుండి వెళుతూ వారిని, ‘మీరెవరు,’ అని అడిగారు. వారు మేము, ‘ముస్లిములమని’ అన్నారు. వారిలో ఒక స్త్రీ కూడా ఉంది. ఆమె వండుతూ ఉంది. కుండక్రింద మండుతున్న అగ్గిఉంది. ఆమె దగ్గర ఆమె బిడ్డ కూడా ఉన్నాడు. మంటలు అధికం అయినపుడు ఆ స్త్రీ తన బిడ్డను దూరం చేసేది. ఆ స్త్రీ ప్రవక్త (స) వద్దకు వచ్చింది. ‘మీరు అల్లాహ్‌ ప్రవక్తనా?’ అని అడిగింది. దానికి ప్రవక్త (స), ‘అవును నేను అల్లాహ్‌ ప్రవక్తను,’ అని అన్నారు. ఆ స్త్రీ, ‘నా తల్లి దండ్రుల్ని మీపై త్యాగం అవుగాక! అల్లాహ్‌(త) అందరికంటే గొప్ప కరుణామయుడు కదా?’ అని అన్నది. ప్రవక్త (స), ‘అవును’ అన్నారు. ఆ స్త్రీ, ‘అల్లాహ్‌ (త) తన దాసులపై ఒక తల్లికి, తన బిడ్డపై ఉన్న ప్రేమకంటే అధిక కారుణ్యంతో వ్యవహరించడా?’ అని విన్నవించుకుంది. ప్రవక్త (స), ‘అవును,’ అని అన్నారు. ఆ స్త్రీ, ‘తల్లి తన బిడ్డను అగ్గిలో వేయదు, మరి అల్లాహ్‌(త) తన దాసుల్ని నరకంలో ఎందుకువేస్తాడు.’ ఇది విని ప్రవక్త (స) తలదించుకున్నారు. ఏడ్వసాగారు. ఆ తరువాత తలఎత్తి, ‘అల్లాహ్‌ (త) తన దాసుల్ని శిక్షించడు, కాని అహంకారంగా తలబిరుసుతనంగా ప్రవర్తించే, అల్లాహ్(త) పట్ల తలబిరుసుతనంగా వ్యవహరించే వాడిని, ”లా ఇలాహ ఇల్లల్లాహ్ను” తిరస్కరించే వాడినే వేస్తాడు,’ అని అన్నారు. (ఇబ్నె మాజహ్)

2379 – [ 16 ] ( لم تتم دراسته ) (2/735)

وَعَنْ ثَوْبَانَ عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ: “إِنَّ الْعَبْدَ لَيَلْتَمِسُ مَرْضَاةَ اللهِ فَلَا يَزَالُ بِذَلِكَ فَيَقُوْلُ اللهُ عَزَّوَجَلَّ لِجِبْرِيْلَ: إِنَّ فُلَانًاعَبْدِيْ  يَلْتَمِسُ أَنْ يُّرْضِيَنِيْ. أَلَا وَإِنَّ رَحْمَتِيْ عَلَيْهِ. فَيَقُوْلُ جِبْرِيْلَ: رَحْمَةُ اللهِ عَلَى فُلَانٍ وَيَقُوْلُهَا حَمَلَةُ الْعَرْشِ وَيَقُوْلُهَا مَنْ حَوْلَهُمْ حَتَّى يَقُوْلَهَا أَهْلُ السَّمَاوَاتِ السَّبْعِ ثُمَّ تَهْبِطُ لَهُ إِلَى الْأَرْضِ”. رَوَاهُ أَحْمَدُ.

2379. (16) [2/735అపరిశోధితం]

సౌ’బాన్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, దాసుడు దైవ సంతృప్తిని వెదుకుతూ ఉంటాడు. ఎల్లప్పుడూ ఈ ప్రయత్నంలోనే ఉంటాడు. అల్లాహ్‌ (త) జిబ్రీల్‌తో ఇలా అంటాడు, ”నా ఫలానా దాసుడు నా సంతృప్తిని వెదుకుతున్నాడు. మీరంతా వినండి, నా కారుణ్యం అతనిపై ఉంది.” ఆ తర్వాత జిబ్రీల్‌, ”అల్లాహ్‌ (త) కారుణ్యం ఫలానా దాసునిపై అవతరించుగాక!” అని అంటారు. ఇది విని అల్లాహ్(త) సింహాసనం మోస్తున్న దైవదూతలు, వారికి దగ్గరగా ఉన్న దైవ దూతలు చివరికి సప్తాకాశాల దైవదూతలు, ‘ఈ దాసునిపై అల్లాహ్‌(త) కారుణ్యం కురియుగాక,’ అని అంటారు. ఆ తరువాత ఆ కారుణ్యం భూమిపై దించబడుతుంది. భూవాసులు కూడా అతన్ని ప్రేమిస్తారు. [71] (అ’హ్మద్)

2380 – [ 17 ] ( لم تتم دراسته ) (2/735)

وَعَنْ أُسَامَةَ بْنِ زَيْدٍ عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم فِيْ قَوْلِ اللهِ عَزَّ وَجَلَّ: (فَمِنْهُمْ ظَالِمٌ لِنَّفْسِهِ وَمِنْهُمْ مُقْتَصِدٌ وَّمِنْهُمْ سَابِقٌ بِالْخَيْرَاتِ، 35: 32 ) قَالَ : كُلُّهُمْ فِيْ الْجَنَّةِ”. رَوَاهُ الْبَيْهَقِيُّ فِيْ كِتَابِ الْبَعْثِ وَالنُّشُوْرِ.

2380. (17) [2/735అపరిశోధితం]

‘ఉసామహ్ బిన్‌ ‘జైద్‌ (ర) కథనం: ప్రవక్త (స) ఖుర్‌ఆన్‌ మజీద్‌లోని ఈ ఆయతు, ”వారిలో కొందరు తమకు తాము అన్యాయం చేసుకున్న వారున్నారు. మరికొందరు మరికొందరు మధ్యస్థంగా ఉండే వారున్నారు, ఇంకా కొందరు, అల్లాహ్ సెలవుతో  సత్కార్యాలలో మున్ముందు ఉండేవారూ ఉన్నారు…” (సూ. ఫాతిర్, 35:32) గురించి ప్రస్తావిస్తూ  వీరందరూ స్వర్గవాసులు,’ అని అన్నారు. ” [72]  (బైహఖీ)

=====

6- بابُ مَا يَقُوْلُ عِنْدَ الصَّبَاحِ وَالْمَسَاءِ وَالْمَنَامِ

6. ఉదయం, సాయంత్రం, పడుకునేటప్పుడు పఠించే దుఆలు

اَلْفَصْلُ الْأَوَّلُ మొదటి విభాగం 

2381 – [ 1 ] ( صحيح ) (2/736)

عَنْ عَبْدِ اللهِ قَالَ: كَانَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم إِذَا أَمْسَى قَالَ: “أَمْسَيْنَا وَأَمْسَى الْمُلْكُ لِلّهِ وَالْحَمْدُ لِلّهِ وَلَا إِلَهَ إِلَّا اللهُ وَحْدَهُ لَا شَرِيْكَ لَهُ لَهُ الْمُلْكُ وَلَهُ الْحَمْدُ وَهُوَ عَلَى كُلِّ شَيْءٍ قَدِيْرٌ. اَللّهُمَّ إِنِّيْ أَسْأَلُكَ مِنْ خَيْرِهَذِهِ اللَّيْلَةِ وَخَيْرِمَا فِيْهَا وَأَعُوْذُ بِكَ مِنْ شَرِّهَا وَشَرِّمَا فِيْهَا. اَللّهُمَّ إِنِّيْ أَعُوْذُ بِكَ مِنَ الْكَسْلِ وَالْهَرَمِ وَسُوْءِ الْكِبَرِوَفِتْنَةِ الدُّنْيَا وَعَذَابِ الْقَبْرِ”. وَإِذَا أَصْبَحَ قَالَ أَيْضًا: “أَصْبَحْنَا وَأَصْبَحَ الْمُلْكُ لِلّهِ”. وَفِيْ رِوَايَةٍ: “رَبِّ إِنِّيْ أَعُوْذُ بِكَ مِنْ عَذَابٍ فِيْ النَّارِ وَعَذَابٍ فِيْ الْقَبْرِ”. رَوَاهُ مُسْلِمٌ.

2381. (1) [2/736దృఢం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ మస్‌’ఊద్‌ (ర) కథనం: ప్రవక్త (స) ఈ దు’ఆను సాయంత్రం వేళ పఠించేవారు:

అమ్సయ్నా, అమ్సల్ముల్కు, లిల్లాహి, వల్‌’హమ్దు లిల్లాహి, వలా ఇలాహ ఇల్లల్లాహు, హ్దహు, లా షరీక లహు, లహుల్ముల్కు, వలహుల్హమ్దు, వహువ అలా కుల్లి షయ్ఇన్ఖదీర్‌. అల్లాహుమ్మ న్నీ అస్అలుక మిన్‌ ‘ఖైరి హాజిహిల్ లైలతి, ఖైరి మాఫీహా, అఊజుబిక, మిన్షర్రిహా, షర్రి మాఫీహా. అల్లాహుమ్మ ఇన్నీ ఊజుబిక మినల్కసలి, వల్హరమి సూయిల్కిబ్రి, ఫిత్నతి ద్దునియా, అజాబిల్‌ ‘ఖబ్రి.” — ‘మేము సాయంత్రం చేసాము. ఇంకా అల్లాహ్ సామ్రాజ్యాధికారం కూడా సాయంత్రం చేసింది. స్తోత్రాలన్నీ అల్లాహ్‌కే చెందుతాయి. అల్లాహ్‌ తప్ప మరో ఆరాధ్యదేవుడు లేడు. ఆయన ఒక్కడే. ఆయనకు సహవర్తులు ఎవరూ లేరు. ఆయన కొరకే సామ్రాజ్యం, ఆయన కొరకే స్తోత్రం . ఇంకా ఆయన ప్రతి విషయంపై శక్తిగలవాడు. ఓ అల్లాహ్, ఈ రాత్రి మేలు, ఈ రాత్రిలో ఉన్నవాటి మేలు కొరకు నిన్ను అర్ధిస్తున్నాను. ఇంకా ఈ రాత్రి చెడునుండి, ఇంకా ఈరాత్రిలో ఉన్నవాటి చెడునుండి నీ శరణు కోరుతున్నాను, ఓ అల్లాహ్, సోమరితనం నుండి ముసలితనం మరియు ముసలితనం అవమానం నుండి, ఇహపరాల కల్లోలాల నుండి, సమాధి శిక్ష నుండి నీ శరణు కోరుతున్నాను.’

అదేవిధంగా ఉదయం, స్ హనా స్ హల్ ముల్కు లిల్లాహి. — ‘మేము ఉదయం చూసాము, ఇంకా అల్లాహ్ (త) సామ్రాజ్యం కూడా ఉదయం చూసింది,’ అని ప్రారంభించేవారు.

మరో ఉల్లేఖనలో, రబ్బి ఇన్నీ ఊజుబిక మిన్ అజాబిన్ ఫిన్నార్, అజాబిన్ ఫిల్ ఖబర్. — ‘ఓ నా ప్రభూ, నరక శిక్ష నుండి, సమాధి శిక్ష నుండి నేను నీ శరణు కోరుతున్నాను.’ అని చదివేవారని ఉంది.  (ముస్లిమ్)

2382 – [ 2 ] ( صحيح ) (2/736)

وَعَنْ حُذَيْفَةَ قَالَ: كاَنَ النَّبِيُّ صلى الله عليه وسلم: إِذَا أَخَذَ مَضْجَعَهُ مِنَ اللَّيْلِ وَضَعَ يَدَهُ تَحْتَ خَدِّهِ ثُمَّ يَقُوْلُ: “اَللّهُمَّ بِاسْمِكَ أَمُوْتُ وَأَحْيَا”. وَإِذَا اسْتَيْقَظَ قَالَ: “اَلْحَمْدُ لِلّهِ الَّذِيْ أَحْيَانًا بَعْدَمَا مَا أَمَاتَنَا وَإِلَيْهِ النُّشُوْرِ”. رَوَاهُ الْبُخَارِيُّ.

2382. (2) [2/736దృఢం]

‘హుజై’ఫా (ర) కథనం: ప్రవక్త (స) రాత్రి పడుకున్నపుడు తన చేతిని తన బుగ్గల క్రింద పెట్టుకొని ఈ దు’ఆను పఠించేవారు:

అల్లాహుమ్మ బిస్మిక అమూతు హ్యా — ‘ఓ అల్లాహ్‌ నీ పేరుతోనే మరణిస్తాను మరియు సజీవుడనౌతాను.’

ప్రవక్త (స) నిద్ర నుండి మేల్కొన్నప్పుడు, ”అల్‌’హమ్దు లిల్లాహిల్లజీ హ్యానా మా అమాతనా ఇలైహిన్నుషూర్” — ‘స్తోత్రాలన్నీ ఆ అల్లాహ్‌ కొరకే. ఆయన చంపిన తర్వాత మళ్ళీ బ్రతికించాడు. అందరికీ ఆయన వద్దకే పోవలసి ఉంది,’ అని పఠించేవారు. (బు’ఖారీ)

2383 – [ 3 ] ( صحيح ) (2/736)

وَمُسْلِمٌ عَنِ الْبَرَاءِ.  

2383. (3) [2/736దృఢం]

ఇదే బరా’ బిన్‌ ‘ఆ’జిబ్‌ (ర) ద్వారా. (ముస్లిమ్‌)

2384 – [ 4 ] ( متفق عليه ) (2/736)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم : “إِذَا أَوَى أَحَدُكُمْ إِلَى فِرَاشِهِ فَلْيَنْفُضْ فِرَاشَهُ بِدَاخِلَةِ إِزَارِهِ فَإِنَّهُ لَا يَدْرِيْ مَاخَلَّفَهُ عَلَيْهِ ثُمَّ يَقُوْلُ: “بِاسْمِكَ رَبِّيْ وَضَعْتُ جَنْبِيْ وَبِكَ أَرْفَعُهُ إِنْ أَمْسَكَتَ نَفْسِيْ فَارْحَمْهَا وَإِنْ أَرْسَلْتَهَا فَاحْفَظْهَا بِمَا تَحْفَظُ بِهِ عِبَادَكَ الصَّالِحِيْنَ”. وَفِيْ رِوَايَةٍ: “ثُمَّ لِيَضْطَجِعْ عَلَى شِقِّهِ الْأَيْمَنِ ثُمَّ لِيَقُلْ: بِاسْمِكَ”.

وَفِيْ رِوَايَةٍ: “فَلْيَنُفُضْهُ بِصَنِفَةِ ثَوْبِهِ ثَلَاثَ مَرَّاتٍ وَإِنْ أَمْسَكْتَ نَفْسِيْ فَاغْفِرْ لَهَا”.

2384. (4) [2/736ఏకీభవితం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, మీలో ఎవరైనా పడక మీదకు వచ్చినపుడు లుంగీ లోపలి భాగంతో పడకను తుడుచుకోవాలి. మీరు లేనప్పుడు మీ పడకలపై ఏమి వచ్చి వాలిందో మీకు తెలియదు. ఆ తర్వాత ఈ విధంగా ప్రార్థించాలి: ”ఓ ప్రభూ! నేను నీ పేరుతోనే మేను వాల్చాను. తిరిగి నీ పేరుతోనే దాన్ని లేపుతాను. నీవు నా ఆత్మను ఆపుకుంటే దానిపై కరుణించు. ఒకవేళ విడిచిపెట్టి నట్లయితే నీవు దాన్ని నీ పుణ్య దాసుల్ని ఎలా కాపాడుతావో అలా కాపాడు.” (బు’ఖారీ, ముస్లిమ్‌)

మరో ఉల్లేఖనలో కుడిప్రక్క పండుకొని బిస్మిక…. దు’ఆను పఠించాలని ఉంది.

మరో ఉల్లేఖనంలో ఇలా ఉంది, ‘నిద్రపోవటానికి ముందు పడకను తన బట్టతో మూడుసార్లు తుడవాలి. ఇంకా ”ఒక వేళ నా ఆత్మను ఆపుకుంటే దాన్ని క్షమించు,” అని పలకాలి. ఈ ఉల్లేఖనంలో ‘కరుణించుకు’ బదులు ‘క్షమించు’ అని ఉంది.

2385 – [ 5 ] ( متفق عليه ) (2/737)

وَعَنِ الْبَرَاءِ بْنِ عَازِبٍ قَالَ: كَانَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم إِذَا أَوَى إِلَى فِرَاشِهِ نَامَ عَلَى شِقِّهِ الْأَيْمَنِ ثُمَّ قَالَ: “اَللّهُمَّ أَسْلَمْتُ نَفْسِيْ إِلَيْكَ وَوَجَّهْتُ وَجَهِيَ إِلَيْكَ وَفَوَّضْتُ أَمْرِيْ إِلَيْكَ وَأَلْجَأْتُ ظَهْرِيْ إِلَيْكَ رَغْبَةً وَرَهْبَةً إِلَيْكَ لَا مَلْجَأَ وَلَا مَنْجَاَ مِنْكَ إِلَّا إِلَيْكَ آمَنْتُ بِكِتَابِكَ الَّذِيْ أَنْزَلْتَ وَنَبِيِّكَ الَّذِيْ أَرْسَلْتَ”. وَقَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَنْ قَالَهُنَّ ثُمَّ مَاتَ تَحْتَ لَيْلَتِهِ مَاتَ عَلَى الْفِطْرَةِ”.

وَفِيْ رِوَايَةٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم لِرَجُلٍ: “يَا فُلَانُ إِذَا أَوَيْتَ إِلَى فِرَاشِكَ فَتَوَضَّأْ وُضُوْءَكَ لِلصَّلَاةِ ثُمَّ اضْطَجِعْ عَلَى شِقِّكَ الْأَيْمَنِ ثُمَّ قُلْ: “اَللّهُمَّ أَسْلَمْتُ نَفْسِيْ إِلَيْكَ إِلَى قَوْلِهِ: أَرْسَلْتَ” .وَقَالَ: “فَإِنْ مِّتَّ مِنْ لَيْلَتِكَ مِتَّ عَلَى الْفِطْرَةِ وَإِنْ أَصْبَحْتَ أَصَبْتَ خَيْرًا”.

2385. (5) [2/737ఏకీభవితం]

బరా’ బిన్‌ ‘ఆ’జిబ్‌ (ర) కథనం: ప్రవక్త (స) తన పడకపైకి వచ్చినపుడు కుడిప్రక్కపై పడుకొని ఈ దు’ఆను పఠించేవారు:

అల్లాహుమ్మ అస్లమ్తు నఫ్సీ ఇలైక, వజ్జహ్తు వజ్హియ ఇలైక, ఫవ్వద్తు అమ్రీ ఇలైక, వల్జఅతుజహ్రీ ఇలైక, గ్బతన్వరహ్బతన్ఇలైక, లా మల్జఅ వలామన్జఅ మిన్, ఇల్లా ఇలైక. ఆమన్తు బికితాబిక అల్లజీఅన్‌’జల్, నబియ్యిక అల్లజీ అర్సల్.” — ‘ఓ అల్లాహ్‌! నా ప్రాణాన్ని నీకు అప్పగించాను. ఇంకా నా ముఖాన్ని నీ వైపు త్రిప్పాను. నా పనులను నీకు అప్పగించాను. ఇంకా నా వీపును నీ అధీనంలోకి ఇచ్చాను. సంతోషంగా నీ భయంవల్ల, నీ శిక్షనుండి నేను శరణు కోరుతున్నాను. ముక్తి నీవద్ద తప్ప మరెక్కడా లేదు. నీవు అవతరింపజేసిన గ్రంథాన్ని, నీవు పంపిన ప్రవక్తను విశ్వసించాను.’ ప్రవక్త (స) ఇలా ప్రవచించారు, ”ఎవరైనా ఈ దు’ఆను పఠించి ఆ రాత్రిలోనే చనిపోతే విశ్వాసిగా మరణిస్తాడు.”

మరో ఉల్లేఖనంలో ఇలా ఉంది, ”ప్రవక్త (స) ఒక వ్యక్తితో నీవు పడుకునే ఉద్దేశ్యంతో పడకపైకి వెళ్లినపుడు పడుకునే ముందు పరిపూర్ణంగా వు’దూ చేయి, కుడిప్రక్కపై పండుకొని, అల్లాహుమ్మ అస్లమ్తు నఫ్సీ.. నుండి అర్సల్ వరకు పఠించు. ఇలా చెప్పి, ”ఒకవేళ నువ్వు అదే రాత్రి చనిపోతే ప్రకృతి అంటే ఇస్లామ్‌ ధర్మంపై మరణిస్తావు. ఒకవేళ ఉదయం సజీవంగా లేస్తే మంచిని పొందుతావు,” అని అన్నారు. (బు’ఖారీ, ముస్లిమ్‌)

2386 – [ 6 ] ( صحيح ) (2/737)

وَعَنْ أَنَسٍ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم كَانَ إِذَا أَوَى إِلَى فِرَاشِهِ قَالَ: “اَلْحَمْدُ لِلّهِ الَّذِيْ أَطْعَمَنَا وَسَقَانَا وَكَفَانَا وَآوَانَا. فَكَمْ مِّمَّنْ لَا كَافِيَ لَهُ وَلَا مُؤْوِيَ” . رَوَاهُ مُسْلِمٌ.

2386. (6) [2/737దృఢం]

అనస్‌ (ర) కథనం: ప్రవక్త (స) నిద్రపోవటానికి పడకపై వెళ్ళినపుడు ఈ దు’ఆను పఠించేవారు:

అల్‌’హమ్దు ల్లిల్లాహిల్లజీ అత్అమనా సఖానా కఫానా ఆవానా. ఫకమ్ మిమ్మల్లా కాఫియ లహు వలా ముఅవి.” — ‘సర్వ స్తోత్రాలూ ఆ అల్లాహ్‌కే ఎవరైతే మమ్మల్ని తినిపించాడు, త్రాపించాడు, సంరక్షించాడు, నివాసం కల్పించాడు, సంరక్షకుడు లేని చాలామందికి రక్షణ కల్పించాడు. (ముస్లిమ్‌)

2387 – [ 7 ] ( متفق عليه ) (2/737)

وَعَنْ عَلِيٍّ: أَنَّ فَاطِمَةَ أَتَتِ النَّبِيَّ صلى الله عليه وسلم تَشْكُوْ إِلَيْهِ مَا تَلْقَى فِيْ يَدِهَا مِنَ الرَّحى وَبَلَغَهَا أَنَّهُ جَاءَهُ رَقِيْقٌ فَلَمْ تُصَادِفْهُ فَذَكَرْتُ ذَلِكَ لِعَائِشَةَ فَلَمَّا جَاءَ أَخْبَرَتْهُ عَائِشَةَ. قَالَ: فَجَاءَنَا وَقَدْ أَخَذْنَا مَضَاجِعَنَا فَذَهَبْنَا نَقُوْمُ. فَقَالَ: عَلَى مَكَانِكُمَا فَجَاءَ فَقَعَدَ بَيْنِيْ وَبَيْنَهَا حَتَّى وَجَدْتُّ بَرْدَ قَدْمِهِ عَلَى بَطْنِيْ. فَقَالَ: “أَلَا أَدُلُّكُمَا عَلَى خَيْرِ مِّمَّا سَأَلْتُمَا؟ إِذَا أَخَذْتُمَا مَضْجِعَكُمَا فَسَبِّحَا ثَلَاثًا وَّثَلَاثِيْنَ وَاحْمِدَا ثَلَاثًا وَّثَلَاثِيْنَ وَكبرا ثَلَاثًا وَّثَلَاثِيْنَ فَهُوَ خَيْرٌ لَّكُمَا مِنْ خَادِمٍ”.

2387. (7) [2/737ఏకీభవితం]

‘అలీ (ర) కథనం: ఫా’తిమ (ర) పిండిమర త్రిప్పటం వల్ల చేతుల కష్టాన్ని చెప్పుకోవటానికి ప్రవక్త (స) వద్దకు వెళ్ళారు. ఎందుకంటే ప్రవక్త (స) వద్దకు బానిసలు వచ్చారన్న వార్త ఆమెకు అందింది. సేవకోసం ఒక బానిసను నాకు ఇస్తారని అనుకుంది. ఫా’తిమ ప్రవక్త (స) ఇంటికి వెళ్ళి నపుడు ప్రవక్త (స) ను కలవలేక పోయారు. ఫాతిమ (ర) ‘ఆయి’షహ్‌ (ర)తో తన కష్టాన్ని గురించి చెప్పుకున్నారు. ఆ తరువాత ప్రవక్త (స) వచ్చారు. ‘ఆయి’షహ్‌ (ర) ప్రవక్త (స)తో ‘ఫా’తిమహ్ ఫలానా పనిమీద ఇక్కడికి వచ్చి వెళ్ళారని’ తెలిపింది.

‘అలీ (ర) కథనం, ”ఇది విని ప్రవక్త (స) మా ఇంటికి మేము పడుకున్న సమయంలో వచ్చారు. ప్రవక్త (స) రాగానే మేము లేవబోయాము. ప్రవక్త (స), ‘మీరు నిశ్చింతగా, అలాగే ఉండండి,’ అని పలికి మా ఇద్దరి మధ్య కూర్చున్నారు. చివరికి నేను ప్రవక్త (స) అడుగుల చల్లదనాన్ని గ్రహించాను. అప్పుడు ప్రవక్త (స) నీవు నన్ను అడగటానికి వచ్చిన దాని కంటే ఉత్తమమైన దాన్ని గురించి చెప్తాను, అంటే బానిస, సేవకుడికంటే ఉత్తమమైనది. అదేమిటంటే:

”మీరిద్దరూ, ‘33 సార్లు సుబ్‌’హానల్లాహ్‌, 33 సార్లు అల్‌’హమ్దులిల్లాహ్‌, 34 సార్లు అల్లాహు అక్బర్,‘అనండి. ఇది మీకు బానిసకంటే లాభదాయక మైనదిగా పనికివస్తుంది,” అని ప్రవచించారు. (బు’ఖారీ, ముస్లిమ్‌)

2388 – [ 8 ] ( صحيح ) (2/738)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: جَاءَتْ فَاطِمَةُ إِلَى النَّبِيِّ صلى الله عليه وسلم تَسْأَلُهُ خَادِمًا فَقَالَ: “أَلَا أَدُلُّكِ عَلَى مَا هُوَ خَيْرٌ مِّنْ خَادِمٍ؟ تُسَبِّحِيْنَ اللهَ ثَلَاثًا وَّثَلَاثِيْنَ وَتَحْمَدِيْنَ اللهُ ثَلَاثًا وَّثَلَاثِيْنَ وَتُكَبِّرِيْنَ اللهَ أَرْبَعًا وَّثَلَاثِيْنَ عِنْدَ كُلِّ صَلَاةٍ وَعِنْدَ مَنَامِكَ” .رَوَاهُ مُسْلِمٌ.

2388. (8) [2/738దృఢం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ఫా’తిమహ్ (ర) ప్రవక్త (స) వద్దకు ఒక బానిస అడగటానికి వెళ్ళారు. ప్రవక్త (స) ”బానిసకంటే ఉత్తమమైన దాన్ని నీకు తెలుపనా? అది ప్రతి రోజు పడుకునేటప్పుడు మరియు ప్రతి విధి నమా’జు తర్వాత, ‘33 సార్లు సుబ్హానల్లాహ్‌, 33 సార్లు అల్హమ్దు లిల్లాహ్‌, 34 సార్లు అల్లాహు అక్బర్,” అని పఠించు అని ప్రవచించారు. (ముస్లిమ్‌)

—–

اَلْفَصْلُ الثَّانِيْ  రెండవ విభాగం  

2389 – [ 9 ] ( لم تتم دراسته ) (2/738)

عَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: كَانَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم إِذَا أَصْبَحَ قَالَ: “اَللّهُمَّ بِكَ أَصْبَحْنَا وَبِكَ أَمْسَيْنَا وَبِكَ نَحْيَا وَبِكَ نَمُوْتُ وَإِلَيْكَ الْمَصِيْرُ”. وَإِذَا أَمْسَى قَالَ: “اَللّهُمَّ بِكَ أَمْسَيْنَا وَبِكَ أَصْبَحْنَا وَبِكَ نَحْيَا وَبِكَ نَمُوْتُ وَإِلَيْكَ النُّشُوْرِ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَأَبُوْ دَاوُدَ وَابْنُ مَاجَهُ .

2389. (9) [2/738అపరిశోధితం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) తెల్లవారి నిద్రలేచిన తర్వాత:

అల్లాహుమ్మ బిక స్ హ్నా బిక అమ్ సయ్ నా, వబిక హ్యా, వబిక నమూతు, ఇలైకల్ మసీర్.‘అల్లాహ్! నీ కృపతోనే మేము తెల్లవార్చాము. నీ కృపతోనే సాయంత్రం చేసాము. నీ కృపతోనే జీవిస్తాం, నీకృపతోనే మరణిస్తాం, తిరిగి లేపబడిన తర్వాత మేమంతా నీ వద్దకే మరలి రావలసి ఉంది,’ అని ప్రార్థించేవారు.

సాయంత్రం ఈ విధంగా ప్రార్థించే వారు, ”అల్లాహుమ్మ బిక అమ్ సైనా బిక అస్ హ్నా,వబిక హ్యా వబిక నమూతు, ఇలైకన్నుషూర్. ‘ఓ అల్లాహ్‌! నీ కృపతోనే మేము సాయంత్రం చేసాము, నీ కృపతోనే మేము ఉదయం చేసాము, నీ శక్తితోనే జీవించి ఉన్నాం. తిరిగి నీ శక్తితోనే మరణిస్తాం. తిరిగి లేపబడిన తరువాత మేమంతా నీ వద్దకే మరలి రావలసి ఉన్నది.’ (అబూ దావూద్‌, తిర్మిజి’, ఇబ్నె మాజహ్)

2390 – [ 10 ] ( لم تتم دراسته ) (2/738)

وَعَنْهُ قَالَ: قَالَ اَبُوْبَكْرٍ: قُلْتُ يَا رَسُوْلَ اللهِ مُرْنِيْ بِشَيْءٍ أَقُوْلُهُ إِذَا أَصْبَحْتُ وَإِذَا أَمْسَيْتُ قَالَ: “قُلْ اَللّهُمَّ عَالِمَ الْغَيْبِ وَالشَّهَادَةِ فَاطِرَ السَّمَاوَاتِ وَالْأَرْضِ رَبَّ كُلِّ شَيْءٍ وَمَلِيْكَهُ أَشْهَدُ أَنْ لَّا إِلَهَ إِلَّا أَنْتَ أَعُوْذُ بِكَ مِنْ شَرِّ نَفْسِيْ وَمِنْ شَرِّ الشَّيْطَانِ وَشِرْكِهِ قُلْهُ إِذَا أَصْبَحْتَ وَإِذَا أَمْسَيْتَ وَإِذَا أَخَذْتَ مَضْجِعَكَ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَأَبُوْ دَاوُدَ وَالدَّارِمِيُّ .

2390. (10) [2/738అపరిశోధితం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: అబూ బకర్‌ (ర) కథనం, నేను ప్రవక్త (స)ను, ”ఓ అల్లాహ్‌ ప్రవక్తా! ఉదయం సాయంత్రం చదవడానికి నాకేదైనా మంచి దు’ఆ నేర్పండి,” అని విన్నవించుకున్నాను. ప్రవక్త (స) నువ్వు ఈ దు’ఆను పఠిస్తూ ఉండు:

అల్లాహుమ్మ ఆలిమల్ గైబి వష్షహాదహ్, ఫాతిరస్సమావాతి వల్అర్ది, రబ్బకుల్లి షైయిన్ వమలీకహు, అష్ హదు అల్లాయిలాహ ఇల్లా అంత, ఊజు బిక మిన్ షర్రి నఫ్సీ, మిన్ షర్రి ష్షైతాని షిర్కిహీ. — ‘ఓ అల్లాహ్‌! గుప్తంగాను, బహిరంగం గాను ఉన్నవాటిని ఎరిగినవాడవు, భూమ్యా-కాశాలను సృష్టించినవాడవు, ప్రతి వస్తువుకు ప్రభువు, యజమానివి. నేను నీవే వాస్తవ ఆరాధ్యుడవని, నీవు తప్ప వాస్తవ ఆరాధ్యులు లేరని సాక్ష్యం ఇస్తున్నాను. ఇంకా నేను నా ఆత్మ చెడుల నుండి, షై’తాన్‌ చెడుల నుండి, వాడు షిర్క్‌వైపు పిలవటాన్నుండి నీ శరణు కోరుతున్నాను.’ ”ఈ దు’ఆను ఉదయం, సాయంత్రం, పడుకునేటప్పుడు పఠిస్తూ ఉండు,” అని అన్నారు. (తిర్మిజి’, అబూ దావూద్‌, దారమి)

2391 – [ 11 ] ( صحيح ) (2/739)

وَعَنْ أَبَانِ بْنِ عُثْمَانَ قَالَ: سَمِعْتُ أَبِيْ يَقُوْلُ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَا مِنْ عَبْدٍ يَقُوْلُ فِيْ صَبَاحٍ كُلَّ يَوْمٍ وَّمَسَاءٍ كُلِّ لَيْلَةٍ بِسْمِ اللهِ الَّذِيْ لَا يَضُرُّ مَعَ اسْمِهِ شَيْءٌ فِيْ الْأَرْضِ وَلَا فِيْ السَّمَاءِ وَهُوَ السَّمِيْعُ الْعَلِيْمُ. ثَلَاثَ مَرَّاتٍ فَيَضُرَّهُ شَيْءٌ”. فَكَانَ أَبَانَ قَدْ أَصَابَهُ طَرَفُ فَالِجٍ فَجَعَلَ الرَّجُلُ يَنْظُرُ إِلَيْهِ فَقَالَ لَهُ أَبَانَ: مَا تَنْظُرُ إِلَيَّ؟ أَمَا إِنَّ الْحَدِيْثَ كَمَا حَدَّثْتُكَ وَلَكِنِّيْ لَمْ أَقُلْهُ يَوْمَئِذٍ لِيَمْضِيَ اللهُ عَلَيَّ قَدَرُهُ. رَوَاهُ التِّرْمِذِيُّ وَابْنُ مَاجَهُ وَأَبُوْ دَاوُدَ.

وَفِيْ رِوَايَتِهِ: “لَمْ تُصِبْهُ فَجَاءَةُ بَلَاءٍ حَتَّى يُصْبِحَ وَمَنْ قَالَهَا حِيْنَ يُصْبِحُ لَمْ تُصِبْهُ فَجَاءَةُ بَلَاءٍ حَتَّى يُمْسِيَ”.

2391. (11) [2/739దృఢం]

‘అబాన్ బిన్‌ ‘ఉస్మా’న్‌ (ర) కథనం: నేను ప్రవక్త (స) ను ఇలా ప్రవచిస్తూ ఉండగా విన్నాను, ”దాసుల్లో ఎవరైనా ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం మూడుసార్లు ఈ దు’ఆను పఠిస్తే, ఏ వస్తువు అతనికి హాని చేకూర్చ లేదు. ఆ దు’ఆ ఇది:

బిస్మిల్లాహిల్లజీ లాయదుర్రు ఇస్మిహీ  షైఉన్ ఫిల్ అర్జి వలా ఫిస్సమాయి హువస్సమీఉల్ అలీమ్.” — ‘ఉదయం, సాయంత్రం ఆ అల్లాహ్‌ పేరు స్మరిస్తున్నాను. ఆయన పేరుతో  భూమ్యాకాశాల్లో ఏ వస్తువూ హాని చేకూర్చలేదు. ఆయన వినేవాడు, పరిపూర్ణ జ్ఞానసంపన్నుడు, ‘హదీసు’ ఉల్లేఖనకర్త అబాన్ బిన్‌ ‘ఉస్మాన్‌ ఒకసారి పక్షవాతానికి గురయ్యారు. ఈ ‘హదీసు’ను తన శిష్యునికి వినిపిస్తున్నప్పుడు, శిష్యుడు ఆశ్చర్యంతో చూడ సాగాడు. ఎందుకంటే ఈ దు’ఆను తెలుపు తున్నారు, స్వయంగా తాను వ్యాధికి గురయ్యారు. ‘అబాన్ బిన్‌ ‘ఉస్మాన్‌కు అర్థమైపోయింది. సమాధానంగా, ”నువ్వు నన్ను ఎందుకలా చూస్తున్నావు! ఈ ‘హదీసు’ను నేను చెప్పినట్లే ఉంది. ఇందులో ఏమాత్రం అనుమానం లేదు. కాని ఈ వ్యాధి నాకు సోకిన రోజు నేను ఈ దు’ఆను పఠించలేదు. విధివ్రాత జరగాలి, అది పూర్తవ్వాలి,” అని అన్నారు. (తిర్మిజి’, అబూ దావూద్‌, ఇబ్నె మాజహ్)

మరో ఉల్లేఖనంలో ఇలా ఉంది, ”ఉదయం, సాయంత్రం ఈ దు’ఆను పఠించిన వారిపై ఎటువంటి ఆపదరాదు. ఉదయం చదివితే సాయంత్రం వరకు అతనిపై అకస్మాత్తుగా ఏ ఆపద రాదు.

2392 – [ 12 ] ( لم تتم دراسته ) (2/739)

وَعَنْ عَبْدِ اللهِ أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم كَانَ يَقُوْلُ إِذَا أَمْسَى: “أَمْسَيْنَا وَأَمْسَى الْمُلْكُ لِلّهِ وَالْحَمْدُ لِلّهِ و لَا إِلَهَ إِلَّا اللهُ وَحْدَهُ لَا شَرِيْكَ لَهُ. لَهُ الْمُلْكُ وَلَهُ الْحَمْدُ وَهُوَ عَلَى كُلِّ شَيْءٍ قَدِيْرٌ. رَبِّ أَسْأَلُكَ خَيْرَ مَا فِيْ هَذِهِ اللَّيْلَةِ وَخَيْرَ مَا بَعْدَهَا. وَأَعُوْذُ بِكَ مِنْ شَرِّ مَا فِيْ هَذِهِ اللَّيْلَةِ وَشَرِّ مَا بَعْدَهَا. رَبِّ أَعُوْذُ بِكَ مِنَ الْكَسْلِ وَمِنْ سُوْءِ الْكِبْرِ أَوِ الْكُفْرِ”.

وَفِيْ رِوَايَةٍ: “مِنْ سُوْءِ الْكِبْرِ وَالْكُفْرِ. رَبِّ أَعُوْذُ بِكَ مِنْ عَذَابِ فِيْ النَّارِ وَعَذَابٍ فِيْ الْقَبْرِ”. وَإِذَا أَصْبَحَ قَالَ ذَلِكَ أَيْضًا: “أَصْبَحْنَا وَأَصْبَحَ الْمُلْكُ لِلّهِ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ وَالتِّرْمِذِيُّ

وَفِيْ رِوَايَتِهِ لَمْ يَذْكُرْ: “مِنْ سُوْءِ الْكُفْرِ”.

2392. (12) [2/739అపరిశోధితం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ మస్‌’ఊద్‌ (ర) కథనం: ప్రవక్త (స) సాయంత్రం వేళ, ఈ దు’ఆను పఠించేవారు:

అమ్సైనా అమ్సల్ముల్కు లిల్లాహి వల్ హమ్దు లిల్లాహి వలా ఇలాహ ఇల్లల్లాహు హ్దహు, లా షరీకలహు, లహుల్ముల్కు వలహుల్హమ్దు, వహువ అలాకుల్లి షయ్ఇన్ఖదీర్‌. రబ్బీ అస్అలుకఖైర మాఫీ హాజిహిల్లైలతి, ఖైరమా అదహా, ఊజుబిక మిన్షర్రి మా ఫీహాజి హిల్లైలతి, షర్రిమా అదహా. రబ్బి ఊజుబిక మినల్కస్లి వమిన్సూయిల్కిబరి వల్కుఫ్రి” — ‘మేము సాయంత్రం చేసాము. ఇంకా అల్లాహ్‌ సృష్టితాలన్నీ సాయంత్రం చేసాయి. సర్వస్తోత్రాలన్నీ అల్లాహ్‌ కొరకే. అల్లాహ్‌ తప్ప ఆరాధనకు అర్హులు ఎవరూ లేరు. ఆయన ఒకే ఒక్కడు. అతనికి ఎవరూ సాటిలేరు. రాజ్యాధికారం ఆయనదే. స్తోత్రం ఆయన కొరకే. ఇంకా ఆయన ప్రతి విషయాన్ని చేయగల సమర్థుడు. ఓ నా ప్రభూ! ఈ రాత్రి మంచిని, ఈ రాత్రిలో ఉన్న మంచిని, ఈ రాత్రి తరువాత రాబోతున్న మంచిని నీ నుండి అర్థిస్తున్నాను. అదేవిధంగా ఈ రాత్రి చెడునుండి ఈ రాత్రి తరువాత రాబోయే చెడునుండి నీ శరణు కోరుతున్నాను. ఓ నా ప్రభూ! సోమరితనం నుండి, ముసలితనంలోని అవమానం నుండి, అవిశ్వాసం, కృతఘ్నతల నుండి నిన్ను శరణుకోరుతున్నాను.’

మరో ఉల్లేఖనంలో ఇలా ఉంది, ”మిన్ సూయిల్కిబరి, వల్కిబరి రబ్బి, ఊజుబిక మిన్అజాబిన్ ఫిన్నారి జాబిన్ఫిల్ఖబ్రి.” — ‘ఓ నా ప్రభూ! నా ముసలితనం, అహంకారాల చెడునుండి నిన్ను శరణు కోరుతున్నాను. మరియు నరక శిక్షనుండి, సమాధి శిక్షనుండి నిన్ను శరణు కోరుతున్నాను.’ ప్రవక్త (స) ఉదయంవేళ స్హ్నా స్బహల్ముల్కు. చివరి వరకు పఠించేవారు. (అబూ దావూద్‌, తిర్మిజి’)

2393 – [ 13 ] ( لم تتم دراسته ) (2/739)

وَعَنْ بَعْضِ بَنَاتِ النَّبِيِّ صلى الله عليه وسلم أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم كَانَ يُعَلِّمُهَا فَيَقُوْلُ: “قَوْلِيْ حِيْنَ تُصْبِحِيْنَ: “سُبْحَانَ اللهِ وَبِحَمْدِهِ وَلَا قُوَّةَ إِلَّا بِاللهِ مَا شَاءَ اللهُ كَانَ وَمَا لَمْ يَشَأْ لَمْ يَكُنْ أَعْلَمُ أَنَّ اللهَ عَلَى كُلِّ شَيْءٍ قَدِيْرٌ. وَأَنَّ اللهَ قَدْ أَحَاطَ بِكُلِّ شَيْءٍ عِلْمًا. فَإِنَّهُ مَنْ قَالَهَا حِيْنَ يُصْبِحُ حُفِظَ حَتَّى يُمْسِيَ وَمَنْ قَالَهَا حِيْنَ يُمْسِيْ حُفِظَ حَتَّى يُصْبِحَ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ.

2393. (13) [2/739అపరిశోధితం]

ప్రవక్త (స) కుమార్తెలు కొందరు ఉల్లేఖిస్తున్నారు, ప్రవక్త (స) తన కుమార్తెలకు ఈ దు’ఆను ఉదయం పఠించమని నేర్పేవారు:

సుబ్‌’హానల్లాహి వబి హమ్దిహీ, వలా ఖువ్వత ఇల్లా బిల్లాహి, మాషా అల్లాహు కాన వమాలమ్ యషలమ్యకున్లము, అన్నల్లాహ అలాకుల్లి షయ్ఇన్ఖదీర్‌. అన్నల్లాహ ఖద్హా బికుల్లి షయ్ఇన్ఇల్మా.”– ‘నేను అల్లాహ్‌ను స్తుతి స్తున్నాను. ఇంకా ఆయన్ను కీర్తిస్తున్నాను. పాపాల నుండి మరలే శక్తి లేదు, సత్కార్యాలు చేసే శక్తి లేదు కాని అల్లాహ్‌ భాగ్యం వల్ల ఆయన సహాయం వల్ల. అల్లాహ్‌ కోరింది జరిగింది. కోరనిది జరగలేదు. అల్లాహ్‌ (త) అన్ని విషయాలపై సమర్ధుడు. ఇంకా ఆయన తన జ్ఞానం ద్వారా ప్రతి వస్తువును ఆవరించి ఉన్నాడు.’

ఈ దు’ఆను ఉదయం పఠించిన వాడికి సాయంత్రం వరకు రక్షణ లభిస్తుంది. అన్ని రకాల ఆపదలు, కష్టాల నుండి సురక్షితంగా ఉంటాడు. అదేవిధంగా సాయంత్రం పఠించిన వారికి ఉదయం వరకు రక్షణ కల్పించడం జరుగుతుంది. (అబూ దావూద్‌)

2394 – [ 14 ] ( ضعيف ) (2/740)

وَعَنِ ابْنِ عَبَّاسٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَنْ قَالَ حِيْنَ يُصْبِحُ: “فَسُبْحَانَ اللهِ حِيْنَ تُمْسُوْنَ وَحِيْنَ تُصْبِحُوْنَ وَلَهُ الْحَمْدُ فِيْ السَّمَوَاتِ وَالْأَرْضِ وَعَشِيًّا وَحِيْنَ تُظْهِرُوْنَ” إِلَى قَوْلِهِ: “وَكَذَلِكَ تُخْرَجُوْنَ”. أَدْرَكَ مَا فَاتَهُ فِيْ يَوْمِهِ ذَلِكَ. وَمَنْ قَالَهُنَّ حِيْنَ يُمْسِيْ أَدْرَكَ مَا فَاتَهُ فِيْ لَيْلَتِهِ”.  رَوَاهُ أَبُوْ دَاوُدَ.

2394. (14) [2/740బలహీనం]

ఇబ్నె ‘అబ్బాస్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ఎవరు ఈ దు’ఆను ఉదయం పఠిస్తే, ఏవైనా వచనాలు, ధ్యానాలు మరచిపోతే వాటి పుణ్యం అతనికి లభిస్తుంది:

సుబ్‌’హానల్లాహి హీన తుమ్సూన హీన తుస్బి హూన వలహుల్ హమ్దు ఫిస్సమావాతి వల్అర్‌’ది అషియ్యన్ హీన తుజ్హిరూన యుఖ్రిజుల్‌ ‘హయ్య మినల్మయ్యితి వయుఖ్రిజుల్మయ్యిత మినల్‌’హయ్యి, యుహ్యిల్అర్‌’ అద మౌతిహా, కజాలిక తుఖ్రజూన్.” —  ‘ఉదయం సాయంత్రం అల్లాహ్‌ స్తోత్రాల్ని కొనియాడండి. భూమ్యా కాశాల్లో గొప్పతనం మధ్నాహ్నం, సాయంత్రం ఆయనదే. ఆయనే జీవం గల దాన్ని నిర్జీవునిగా చేస్తాడు. నిర్జీవిని సజీవునిగా చేస్తాడు. ఆయనే మృత భూమిని చనిపోయిన తర్వాత సజీవంగా చేస్తాడు. అదే విధంగా మిమ్మల్ని సమాధులనుండి జీవంపోసి లేపుతాడు.’

 ఈ దు’ఆను సాయంత్రం పఠిస్తే రాత్రి తప్పిన దైవ స్మరణల పుణ్యం లభిస్తుంది. (అబూ దావూద్‌)

2395 – [ 15 ] ( صحيح ) (2/740)

وَعَنْ أَبِيْ عَيَّاشٍ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم قَالَ: “مَنْ قَالَ إِذَا أَصْبَحَ: لَا إِلَهَ إِلَّا اللهُ وَحْدَهُ لَا شَرِيْكَ لَهُ لَهُ الْمُلْكُ وَلَهُ الْحَمْدُ وَهُوَ عَلَى كُلِّ شَيْءٍ قَدِيْرٌ. كَانَ لَهُ عِدْلُ رَقَبَةٍ مِنْ وُلْدِ إِسْمَاعِيْلَ. وَكُتِبَ لَهُ عَشْرُ حَسَنَاتٍ. وَحُطَّ عَنْهُ عَشْرُ سَيِّئَاتٍ. وَرُفِعَ عَشْرُ دَرَجَاتٍ. وَكَانَ فِيْ حِرْزٍ مِّنَ الشَّيْطَانِ حَتَّى يُمْسِيْ. وَإِنْ قَالَهَا إِذَا أَمْسَى كَانَ لَهُ مِثْلُ ذَلِكَ حَتَّى يُصْبِحَ”. قَالَ حَمَّادُ بْنُ سَلَمَةَ: فَرَأَى رَجُلٌ رَّسُوْلَ اللهِ صلى الله عليه وسلم فِيْمَا يَرَى النَّائِمُ. فَقَالَ: يَا رَسُوْلَ اللهِ إِنَّ أَبَا عَيَّاشٍ يُحَدِّثُ عَنْكَ بِكَذَا وَكَذَا قَالَ: “صَدَقَ أَبُوْ عَيَّاشٍ”.  رَوَاهُ أَبُوْ دَاوُدَ وَابْنُ مَاجَهُ.

2395. (15) [2/740దృఢం]

అబూ ‘అయ్యాష్‌ (ర) కథనం: ప్రవక్త  (స) ప్రవచనం, ఉదయం ఈ దు’ఆను పఠించిన వారికి ఇస్మా’యీల్‌ (అ) సంతతిలోని ఒక బానిసను విడుదల చేసినంత పుణ్యం లభిస్తుంది. అంటే ఇస్మా’యీల్‌ కుటుంబానికి చెందిన బానిసను విడుదల చేసినంత పుణ్యం లభిస్తుంది. దానికి 10 పుణ్యాలు లిఖించబడతాయి. 10 పాపాలు చెరిపివేయబడతాయి. ఇంకా 10 తరగతులు ఉన్నతం చేయబడతాయి. సాయంత్రం వరకు షై’తాన్‌ కుట్రల నుండి రక్షించబడతాడు. అదేవిధంగా సాయంత్రం ఈ దు’ఆను పఠించినా ఈ పుణ్యమే లభిస్తుంది. ఆ దు’ఆ ఇది:

లా ఇలాహ ఇల్లల్లాహు హ్దహు, లాషరీక లహు, లహుల్ముల్కు, వలహుల్‌’హమ్దు, వహువ అలా కుల్లి షయ్ఇన్ఖదీర్‌.” — ‘అల్లాహ్‌ తప్ప ఆరాధ్యు లెవరూ లేరు, ఆయన ఒకే ఒక్కడు, అతనికి ఎవరూ సాటిలేరు, సర్వలోకాలు ఆయనవే, స్తోత్రాలన్ని ఆయనవే, ఆయన సమస్త విషయాలపై అధికారం గలవాడు.’

ఈ ‘హదీసు’ ఉల్లేఖన కర్త ఇలా అన్నారు, ”ఒక వ్యక్తి ప్రవక్త (స)ను స్వప్నంలో చూచి ఇలా విన్నవించుకున్నాడు, ‘ఓ అల్లాహ్‌ ప్రవక్తా! అబూ ‘అయ్యాష్‌ ఇటువంటి ‘హదీసు’ను మీ ద్వారా ఉల్లేఖిస్తున్నారు, అది నిజమేనా?’ అప్పుడు ప్రవక్త (స), ‘అబూ ‘అయ్యాష్‌ సత్యం పలికాడు,’ అని అన్నారు. [73] (అబూ దావూద్‌, ఇబ్నె మాజహ్)

2396 – [ 16 ] ( ضعيف ) (2/741)

وَعَنِ الْحَارِثِ بْنِ مُسْلِمِ التَّمِيْمِيِّ عَنْ أَبِيْهِ عَنْ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم أَنَّهُ أَسَرَّ إِلَيْهِ فَقَالَ: “إِذَا انْصَرَفْتَ مِنْ صَلَاةِ الْمَغْرِبِ فَقُلْ قَبْلَ أَنْ تُكَلِّمَ أَحَدًا “اَللّهُمَّ أَجِرْنِيْ مِنَ النَّارِ” سَبْعَ مَرَّاتٍ فَإِنَّكَ إِذَا قُلْتَ ذَلِكَ ثُمَّ مِتَّ فِيْ لَيْلَتِكَ كُتِبَ له لَكَ جَوَازٌمِّنْهَا. و إذا صليت صبح فقل كذلك فإنك إذا. مِتَّ في يومك كتب لك جواز منها”. رَوَاهُ أَبُوْ دَاوُدَ.

2396. (16) [2/741బలహీనం]

‘హారిస్‌’ బిన్‌ ముస్లిం తమీమీ తన తండ్రి ద్వారా కథనం: ప్రవక్త (స) నా తండ్రి గారితో రహస్యంగా ఇలా అన్నారు, ”మీరు మ’గ్‌రిబ్‌ నమా’జ్‌, ముగించిన తర్వాత ఎవరితోనూ మాట్లాడటానికి ముందు 7 సార్లు ఈ దు’ఆను పఠించండి. ఒకవేళ నువ్వు ఆ రాత్రే మరణిస్తే మీకు నరకం నుండి విముక్తి లభిస్తుంది. అదేవిధంగా ఉదయం ఫజ్‌ర్‌ నమా’జు తర్వాత ఈ దు’ఆను 7 సార్లు పఠించి ఈ పగటి పూట మరణిస్తే నరకాగ్ని నుండి విముక్తి లభిస్తుంది. ఆ దు’ఆ ఇది. ”అల్లాహుమ్మ అజిర్నీ మినన్నార్” — ‘ఓ నా ప్రభూ! నన్ను నరకాగ్నినుండి కాపాడు.’ (అబూ దావూద్‌)

2397 – [ 17 ] ( لم تتم دراسته ) (2/741)

وَعَنِ ابْنِ عُمَرَ قَالَ: لَمْ يَكُنْ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم يَدَعُ هَؤُلَاءِ الْكَلِمَاتِ حِيْنَ يُمْسِيْ وَحِيْنَ يُصْبِحُ: “اَللّهُمَّ إِنِّيْ أَسْأَلُكَ الْعَافِيَةَ فِيْ الدُّنْيَا وَالْآخِرَةِ. اَللّهُمَّ إِنِّيْ أَسْأَلُكَ الْعَفْوَ وَالْعَافِيَةَ فِيْ دِيْنِيْ وَدُنْيَايَ وَأَهْلِيْ وَمَالِيْ. اَللّهُمَّ اسْتُرْعَوْرَاتِيْ وَآمِنْ رَوْعَاتِيْ. اللّهُمَّ احْفَظْنِيْ منْ بَيْنَ يَدَيَّ وَمِنْ خَلْفِيْ وَعَنْ يَمِيْنِيْ وَعَنْ شِمَالِيْ وَمِنْ فَوْقِيْ وَأَعُوْذُ بِعَظْمَتِكَ. من  أَنْ أُغْتَالَ مِنْ تَحْتِيْ يَعْنِيْ الْخَسْفَ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ.

2397. (17) [2/741అపరిశోధితం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘ఉమర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ఈ శుభవచనాలను ఉదయం సాయంత్రం ఎప్పుడూ వదిలేవారు కారు. నిరాటంకంగా ప్రతిరోజు ఉదయం సాయంత్రం పఠించేవారు.

అల్లాహుమ్మ న్ని అస్అలు కల్‌ ‘ఆఫియత ఫిద్దునియా వల్ఖిరతి. అల్లాహుమ్మ ఇన్నీ అస్అలు కల్‌ ‘అఫ్ వల్‌ ‘ఆఫియత ఫీ దీనీ దునియాయ, అహ్లీ మాలీ. అల్లాహుమ్మస్ తుర్ఔరాతీ, ఆమిన్రౌఆతీ. అల్లా హుమ్మహ్జ్నీ మిన్బైని యదయ్య వమిన్‌ ‘ఖల్ఫీ అన్ యమీనీ, అన్ షిమాలీ, మిన్ఫౌఖీ, ఊజుబి జ్మతిక మిన్అన్ఉగ్తాల, మిన్హ్తీ.” — ‘ఓ అల్లాహ్‌! నేను నిన్ను ఉభయ లోకాల క్షేమాన్ని కోరుకుంటున్నాను. ఓ అల్లాహ్‌! నేను నిన్ను నా ధర్మంలో, నా జీవితంలో, నా కుటుంబంలో, నా ధనంలో క్షమాపణను, క్షేమాన్ని కోరుతున్నాను. ఓ అల్లాహ్‌! నా లోపాలను కప్పిపుచ్చు. ఇంకా నన్ను భయపెట్టే విషయాల నుండి రక్షించు. ఓ నా ప్రభూ! నా ముందు నుండి, వెనుక నుండి, కుడి ప్రక్క నుండి, ఎడమ ప్రక్క నుండి, పైనుండి రక్షణ కల్పించు. నీ గొప్పతనం సాక్షి! క్రింది నుండి, నాశనం చేయబడటాన్నుండి అంటే భూమిలో దిగబడి పోవటం నుండి నేను శరణుకోరుతున్నాను.’ (అబూ దావూద్‌)

2398 – [ 18 ] ( لم تتم دراسته ) (2/741)

وَعَنْ أَنَسٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَنْ قَالَ حِيْنَ يُصْبِحُ: اَللّهُمَّ أَصْبَحْنَا نُشْهِدُكَ وَنُشْهِدُ حَمَلَةَ عَرْشِكَ وَمَلَائِكَتِكَ وَجَمِيْعِ خَلْقِكَ أَنَّكَ أَنْتَ اللهُ لَا إِلَهَ إِلَّا أَنْتَ وَحْدَكَ لَا شَرِيْكَ لَكَ وَأَنْ مُحَمَّدًا عَبْدُكَ وَرَسُوْلُكَ. إِلَّا غَفَرَاللهُ لَهُ مَا أَصَابَهُ فِيْ يَوْمِهِ ذَلِكَ مِنْ ذَنْبٍو إن قالها حين يمسي غفرالله له ما أصابه في تلك الليلتي من ذنب. رَوَاهُ التِّرْمِذِيُّ وَأَبُوْ دَاوُدَ. وَقَالَ التِّرْمِذِيُّ: هَذَا حَدِيْثٌ غَرِيْبٌ.

2398. (18) [2/741అపరిశోధితం]

అనస్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ఈ దు’ఆను ఉదయం పఠించిన వారి ఆ రోజు పాపాలన్నీ అల్లాహ్‌ (త) క్షమించివేస్తాడు. ఒకవేళ సాయంత్రం పఠిస్తే, ఆ  రాత్రి పాపాలన్నీ అల్లాహ్‌ (త) క్షమిస్తాడు.

అల్లాహుమ్మ స్హ్నా, నుష్హిదుక వనుష్ హిదుహమలత అర్షిక, మలాయికతిక, జమీ ఖల్ఖిక అన్నక అంతల్లాహు, లా ఇలాహ ఇల్లా అం హ్దక, లా షరీకలక, అన్న ముహమ్మదన్‌ ‘అబ్దుక రసూలుక.” — ‘ఓ అల్లాహ్‌! నేను ఉదయం చూసాను. ఇంకా నిన్ను, నీ సింహాసనాన్ని మోస్తున్న దూతల, ఇంకా సృష్టితాల సాక్షిగా నీవే వాస్తవ ఆరాధ్యుడవు. ఇంకా నీవు తప్ప ఆరాధ్యులెవరూ లేరు. నీవు ఒక్కడివే ఆరాధనకు అర్హుడవు. నీకు ఎవరూ సాటి లేరు. వాస్తవంగా ము’హమ్మద్‌ (స) నీ దాసులు, నీ ప్రవక్త (స).’ (తిర్మిజి’ / ఏకోల్లేఖనం, అబూ దావూద్‌)

2399 – [ 19 ] ( لم تتم دراسته ) (2/741)

وَعَنْ ثَوْبَانَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَا مِنْ عَبْدٍ مُسْلِمٍ يَقُوْلُ إِذَا أَمْسَى وَإِذَا أَصْبَحَ ثَلَاثًا. رَضِيْتُ بِاللهِ رَبًّا وَّبِالْإِسْلَامِ دِيْنًا وَبِمُحَمَّدٍ نَبِيًّا. إِلَّا كَانَ حَقًا عَلَى اللهِ أَنْ يُرْضِيَهُ يَوْمَ الْقِيَامَةِ” . رَوَاهُ أَحْمَدُ وَالتِّرْمِذِيُّ

2399. (19) [2/741అపరిశోధితం]

సౌ’బాన్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ముస్లిముల్లో ఎవరైనా ప్రతి రోజూ ఉదయం సాయంత్రం మూడు సార్లు ఈ దు’ఆను పఠించాలి. నిశ్చయంగా అల్లాహ్‌ (త) తన కారుణ్యం, అనుగ్రహం ద్వారా తీర్పుదినం నాడు అతన్ని సంతోషపరుస్తాడు. అంటే ఎంత పుణ్యం ప్రసాదిస్తాడంటే అతడు చాలా సంతోషిస్తాడు. ఆ దు’ఆ ఇది:

దీతు బిల్లాహి రబ్బన్, బిల్ఇస్లామి దీనన్, బి ముహమ్మదిన్నబియ్యన్‌.” — ‘నేను అల్లాహ్‌ను దైవంగా, ఇస్లామ్‌ను ధర్మంగా, ము’హమ్మద్‌ (స)ను దైవప్రవక్తగా ఆమో దిస్తున్నాను.’ (అ’హ్మద్‌, తిర్మిజి’)

2400 – [ 20 ] ( لم تتم دراسته ) (2/742)

وَعَنْ حُذَيْفَةَ أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم كَانَ إِذَا أَرَادَ أَنْ يَّنَامَ وَضَعَ يَدَهُ تَحْتَ رَأْسِهِ ثُمَّ قَالَ: “اَللّهُمَّ قِنِيْ عَذَابَكَ يَوْمَ تَجْمَعُ عِبَادَكَ أَوْ تَبْعَثُ عِبَادَكَ” .رَوَاهُ التِّرْمِذِيُّ.

2400. (20) [2/742అపరిశోధితం]

‘హుజై’ఫహ్ (ర) కథనం: ప్రవక్త (స) పడుకున్నప్పుడు తన కుడిచేతిని తల క్రింద పెట్టి ఈ దు’ఆను పఠించేవారు:

అల్లాహుమ్మ, ఖినీఅజాబక యౌమ తజ్బాదక  అవ్ తబ్అసు ఇబాదక.” — ‘ఓ నా ప్రభూ! నీవు నీ దాసులను కూడబెట్టి జీవంపోసి మరల లేపిన దినాన నన్ను నీ శిక్ష నుండి రక్షించు.’ (తిర్మిజి’)

2401- [ 21 ] ( لم تتم دراسته ) (2/742)

وَرَوَاهُ أَحْمَدُ عَنِ الْبَرَاءِ .

2401. (21) [2/742అపరిశోధితం]

దీన్నే బరా’ బిన్‌ ‘ఆ’జిబ్‌ కూడా ఉల్లేఖించారు. (అ’హ్మద్‌)

2402 – [ 22 ] ( لم تتم دراسته ) (2/742)

وعَنْ حَفْصَةَ رَضِيَ اللهُ عَنْهَا أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم كَانَ إِذَا أَرَادَ أَنْ يَّرْقُدَ وَضَعَ يَدَهُ الْيُمْنَى تَحْتَ خَدِّهِ ثُمَّ يَقُوْلُ: “اَللّهُمَّ قِنِيْ عَذَابَكَ يَوْمَ تَبْعَثُ عِبَادَكَ”. ثَلَاثَ مَرَّاتٍ رَوَاهُ أَبُوْ دَاوُدَ.

2402. (22) [2/742అపరిశోధితం]

‘హఫ్‌’సహ్ (ర) కథనం: ప్రవక్త (స) పడుకోగోరి నప్పుడు కుడిచేతిని తన కుడి బుగ్గక్రింద పెట్టి ఈ దు’ఆను మూడు సార్లు పఠిస్తారు:

అల్లాహుమ్మ ఖినీ అజాబక యౌమ తబ్‌’అసు‘ ‘ఇబాదక.” — ‘ఓ నా ప్రభూ! నీవు నీ దాసులను లేపే రోజున నన్ను నీశిక్ష నుండి రక్షించు.’ (అబూ దావూద్‌)

2403 – [ 23 ] ( لم تتم دراسته ) (2/742)

وَعَنْ عَلِيٍّ رَضِيَ اللهُ عَنْهُ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم كَانَ يَقُوْلُ عِنْدَ مَضْجَعِهِ: “اَللّهُمَّ إِنِّيْ أَعُوْذُ بِوَجْهِكَ الْكَرِيْمِ وَكَلِمَاتِكَ التَّامَّاتِ مِنْ شَرِّمَا أَنْتَ آخِذٌ بِنَاصِيَتِهِ. اَللّهُمَّ أَنْتَ تَكْشِفُ الْمَغْرَمَ وَالْمَأْثَمَ اَللّهُمَّ لَا يُهْزَمُ جُنْدُكَ وَلَا يُخْلفُ وَعْدُكَ ولَا يَنْفَعُ ذَا الْجَدِّ مِنْكَ الْجَدُّ سُبْحَانَكَ وَبِحَمْدِكَ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ.

2403. (23) [2/742అపరిశోధితం]

‘అలీ (ర) కథనం: ప్రవక్త (స) పడుకునే టప్పుడు ఈ దు’ఆను పఠించేవారు:

అల్లాహుమ్మ ఇన్నీ ఊజుబి వజ్హికల్కరీమి, కలిమాతికత్తామ్మాతి, మిన్షర్రిమా అం ఖిజున్బినాసియతిహీ. అల్లాహుమ్మ అం తక్షిఫల్గ్రమ వల్మాస, అల్లాహుమ్మ లా యహ్‌’జము జుందుక వలా యుఖ్లఫు దుక, వలా యన్ ల్జద్ది మిన్కల్జద్దు, సుబ్‌’హానక వబిహమ్దిక.” — ‘ఓ అల్లాహ్‌! నేను నీ మహోన్నతమైన ముఖం మరియు వచనాలన్నిటి శుభాల ద్వారా నీ అధీనంలో ఉన్నవాటి చెడునుండి శరణు కోరుతున్నాను. ఓ అల్లాహ్‌! నువ్వు నా రుణాన్ని, పాపాన్ని దూరం చేయి, ఓ అల్లాహ్‌! నీ సైన్యం ఎన్నడూ ఓటమి చవిచూడదు. నువ్వు వాగ్దానానికి వ్యతిరేకంగాచేయవు. ధన వంతునికి అతని ధనసంపదలు నీ శిక్ష నుండి కాపాడలేవు. నీవు పరిశుద్ధ ఆరాధ్యుడవు. స్తోత్రాలన్నీ నీ కొరకే. (అబూ దావూద్‌)

2404 – [ 24 ] ( ضعيف ) (2/742)

وَعَنْ أَبِيْ سَعِيْدٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَنْ قَالَ حِيْنَ يَأْوِيْ إِلَى فَرَاشِهِ: أَسْتَغْفِرُ اللهَ الَّذِيْ لَا إِلَهَ إِلَّا هُوَ الْحَيُّ الْقَيُّوْمَ وَأَتُوْبَ إِلَيْهِ”. ثَلَاثَ مَرَّاتٍ غَفَرَ اللهُ لَهُ ذُنُوْبَهُ وَإِنْ كَانَتْ مِثْلُ زَبَدِ الْبَحْرِ أَوْ عَدَدَ رَمْلِ عَالَجَ. أَوْ عَدَدَ وَرَقِ الشَّجَرِ أَوْ عَدَدَ أَيَّامِ الدُّنْيَا”. رَوَاهُ التِّرْمِذِيُّ وَقَالَ: هَذَا حَدِيْثٌ غَرِيْبٌ.

2404 . (24) [2/742బలహీనం]

అబూ స’యీద్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఎవరైనా పడుకున్నప్పుడు ఈ దు’ఆను మూడు సార్లు పఠిస్తే, అల్లాహ్‌ (త) అతని పాపాలన్నీ క్షమించి వేస్తాడు. అతని పాపాలు సముద్రపు నురగుకు సమానంగా ఉన్నా లేదా ఇసుక రేణువులన్ని ఉన్నా సరే, లేదా, చెట్ల ఆకులన్ని ఉన్నా సరే లేదా ఇహలోక దినాలన్ని ఉన్నా సరే:

 ”అస్తగ్ఫిరుల్లాహల్లజీలా ఇలాహ ఇల్లా హువల్‌ ‘హయ్యుల్ఖయ్యూము, అతూబు ఇలైహి.” — ‘నేను అల్లాహ్‌ను క్షమాపణ కోరుతు న్నాను, ఆయన తప్ప మరో ఆరాధ్యుడు లేడు, ఆయన శాశ్వతంగా సజీవంగా ఉండేవాడు, నేను ఆయన వైపునకే మరలుతున్నాను.’ [74]  (తిర్మిజి’ – ఏకోల్లేఖనం)

2405 – [ 25 ] ( ضعيف ) (2/743)

وَعَنْ شَدَّادِ بْنِ أَوْسٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَامِنْ مُسْلِمٍ يَّأْخُذُ مَضْجَعَهُ بِقَرَاءَةِ سُوْرَةٍ مِّنْ كِتَابِ اللهِ إِلَّا وَكَلَ اللهُ بِهِ مَلَكًا فَلَا يَقْرَبُهُ شَيْءٌ يُؤْذِيْهِ حَتَّى يَهُبَّ مَتَى هَبَّ”. رَوَاهُ التِّرْمِذِيُّ .

2405. (25) [2/743బలహీనం]

షద్దాద్‌ బిన్‌ ఔస్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం: ”ఎవరైనా ముస్లిమ్‌ పడుకునేటప్పుడు ఖుర్‌ఆన్‌ సూరాల్లోని ఏదైనా సూరహ్‌ పఠిస్తే, అల్లాహ్‌ (త) అతని కొరకు ఒక దూతను రక్షకుడుగా నియమిస్తాడు. అతడు రాత్రంతా అతన్ని కాపాడుతూ ఉంటాడు. ఎటువంటి హాని చేకూర్చే వస్తువు అతడు మేల్కొనే వరకు అతని దగ్గరకు రాలేదు.[75]  (తిర్మిజి’)

2406 – [ 26 ] ( صحيح ) (2/743)

وَعَنْ عَبْدِ اللهِ بْنِ عَمْرِو بْنِ الْعَاصِ رَضِيَ اللهُ عَنْهُمَا قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “خُلَّتَانِ لَا يُحْصِيْهِمَا رَجُلٌ مُّسْلِمٌ إِلَّا دَخَلَ الْجَنَّةَ. أَلَا وَهُمَا يَسِيْرٌ وَمَنْ يَعْمَلُ بِهِمَا قَلِيْلٌ يُسَبِّحُ اللهَ فِيْ دُبِرِ كُلِّ صَلَاةٍ عَشْرًا وَيَحْمَدَهُ عَشْرَا وَيُكَبِّرُهُ عَشْرًا”.

وَفِيْ أَكْثَرِ نُسَخِ الْمَصَابِيْحِ عَنْ: عَبْدِ اللهِ بْنِ عُمَرَ.

2406. (26) [2/743దృఢం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘అమ్ర్ బిన్‌ ‘ఆస్‌’ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”రెండు అలవాట్లు పాటించక పోవటం, పఠించకుండానే వెళ్ళిపోవటం, నిద్రపోయే టప్పుడు కూడా షై’తాన్‌ అతన్ని పడుకోబెట్టడు. ఈ వచనాలను పఠించలేక పోవటం. ఎందుకంటే పడుకునే టప్పుడు షై’తాన్‌ అతన్ని జోకొట్టి పడుకోబెట్టటం పఠించకుండా నిద్రపోవటం. (తిర్మిజి’, అబూ దావూద్‌, నసాయి’)

అబూ దావూద్‌లోని ఒక ఉల్లేఖనం ఇలా ఉంది, ”ప్రవక్త (స) ప్రవచనం: ”రెండు అలవాట్లు ఉన్నాయి. వాటిని ఎవరైనా ముస్లిమ్‌ క్రమం తప్పకుండా ఆచరిస్తే అతడు స్వర్గంలో ప్రవేశిస్తాడు,” అని ఉంది.

మరో ఉల్లేఖనంలో ఇలా ఉంది. తూనికలో వీటి సంఖ్య 1500 ఉంటుంది. ప్రవక్త (స) ప్రవచనం, ”34 సార్లు అల్లాహు అక్బర్‌, 33సార్లు అల్‌’హమ్దు లిల్లాహ్‌, 33 సార్లు సుబ్‌’హానల్లాహ్,” పడుకునే టప్పుడు పలకాలి అని ఉంది.

2407 – [ 27 ] ( ضعيف ) (2/744)

وَعَنْ عَبْدِ اللهِ بْنِ غَنَّامٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَنْ قَالَ حِيْنَ يُصْبِحُ: اَللّهُمَّ مَا أَصْبَحَ بِيْ مِنْ نِّعْمَةٍ أَوْ بِأَحَدٍ مِّنْ خَلْقِكَ فَمِنْكَ وَحْدَكَ لَا شَرِيْكَ لَكَ فَلَكَ الْحَمْدُ وَلَكَ الشُّكْرُ فَقَدْ أَدَّى شُكْرَيَوْمِهِ. وَمَنْ قَالَ مِثْلَ ذَلِكَ حِيْنَ يُمْسِي فَقَدْ أَدّى شُكْرَ لَيْلَتِهِ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ .

2407. (27) [2/744బలహీనం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘గన్నామ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఉదయం, సాయంత్రం ఈ దు’ఆను పఠించిన వారు ఆ నాటి రాత్రి పగలు కృతజ్ఞత తెలుపు కున్నారు.

అల్లాహుమ్మ మా స్ బీ మిన్ నిమతిన్, అవ్బిఅహదిన్ మిన్‌ ‘ఖల్ఖిక, ఫమిన్ హ్దక, లాషరీక లక ఫలకల్‌’హమ్దు వలకష్షుక్రు. — ‘ఓ నా ప్రభూ! నాకు లేదా ఎవరికైనా ఏ అనుగ్రహం లభించినా అది నీ ఒక్కడి తరఫునుండే, నీకు ఎవరూ సాటిలేరు, స్తోత్రాలన్నీ నీ కొరకే, కృతజ్ఞతలు కూడా నీకే.’ (తిర్మిజి’)

2408 – [ 28 ] ( صحيح ) (2/744)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم أَنَّهُ كَانَ يَقُوْلُ إِذَا أَوَى إِلَى فِرَاشِهِ: “اَللّهُمَّ رَبَّ السَّمَاوَاتِ وَرَبَّ الْأَرْضِ وَرَبَّ كُلِّ شَيْءٍ فَالِقِ الْحَبِّ وَالنَّوَى مُنْزِلَ التَّوْرَاةِ وَالْإِنْجِيْلِ وَالْقُرْآنِ أَعُوْذُ بِكَ مِنْ شَرِّ كُلِّ ذِيْ شَرٍّ أَنْتَ آخِذٌ بِنَاصِيَتِهِ. أَنْتَ الْأَوَّلُ فَلَيْسَ قَبْلَكَ شَيْءٌ وَأَنْتَ الْآخِرُ فَلَيْسَ بَعْدَكَ شَيْءٌ وَأَنْتَ الظَّاهِرُ فَلَيْسَ فَوْقَكَ شَيْءٌ. وَأَنْتَ الْبَاطِنُ فَلَيْسَ دُوْنَكَ شَيْءٌ. اقْضِ عَنِّيِ الدَّيْنَ وَأَغْنِنِيْ مِنَ الْفَقْرِ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ وَالتِّرْمِذِيُّ وَابْنُ مَاجَهُ وَرَوَاهُ مُسْلِمٌ مَعَ اخْتِلَافٍ يَسِيْرٍ.

2408. (28) [2/744దృఢం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) పడుకోవటానికి పడకపై వెళ్ళినపుడు ఈ దు’ఆ పఠిస్తారు:

అల్లాహుమ్మ రబ్బి స్సమావాతి రబ్బల్అర్‌’ది రబ్బ కుల్లి షయ్ఇన్ఫాలిఖల్‌ ‘హబ్బి వన్నవా, మున్‌’జిల త్తౌరాతి వల్ఇన్జీలి, వల్ఖుర్ఆని. ఊజుబిక మిన్షర్రి కుల్లి జీషర్రిన్, అం ఖిజున్బి నాసియతిహీ. అంతల్అవ్వలు ఫలైస ఖబ్లక షైఉన్‌, అంతల్ఖిరు ఫలైస దక షయ్న్, అంజ్జాహిరు ఫలైస ఫౌఖక షయ్న్ అంతల్బాతిను ఫలైస దూనక షయ్న్ఇఖ్‌’ది న్నిద్దైన. గ్నినీ మినల్ ఖ్రి!”  — ‘ఓ అల్లాహ్‌! సప్తాకాశాలకు భూమికి ప్రభువువే అన్నిటికీ ప్రభువువీ, బీజాన్ని చీల్చేవాడా! గింజలను మొలకెత్తించే వాడా, తౌరాతు, ఇంజీలు, ఖుర్‌ఆన్‌ను అవతరింపజేసిన వాడా! నిన్ను నేను శరణు కోరుతున్నాను. చెడు వస్తువు యొక్క చెడు నుండి అంటే ప్రతి హాని తలపెట్టే వస్తువు నుండి. దాని నుదురు నీ చేతిలోనే ఉంది. నీవే అందరికంటే ముందువాడవు. నీ కంటే ముందు ఏదీలేదు. నీవే అందరికంటే చివరివాడవు. నీ తర్వాత ఏదీ లేదు. నీవు బహిర్గతుడవు, నీవు అంతర్గతుడవు. నీకంటే రహస్యమైనది ఏదీలేదు. నీవు నన్ను రుణం తీర్చివేయడంలో, దారిద్య్రాన్నుండి దూరం కావడంలో నాకు సహాయం చేయి.’ [76] (అబూ దావూద్‌, తిర్మిజి’, ఇబ్నె మాజహ్, ముస్లిమ్‌)

2409 – [ 29 ] ( لم تتم دراسته ) (2/744)

وَعَنْ أَبِيْ الْأَزْهَرِ الْأَنْمَارِيِّ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم كَانَ إِذَا أخَذَ مَضْجَعَهُ مِنَ اللَّيْلِ قَالَ: “بِسْمِ اللهِ وَضَعْتُ جَنْبِيْ لِلّهِ اَللّهُمَّ اغْفِرْ لِيْ ذَنْبِيْ وَاخْسَأْ شَيْطَانِيْ وَفُكَّ رِهَانِيْ وَاجْعَلْنِيْ فِيْ النَّدِيِّ الْأَعْلَى”. رَوَاهُ أَبُوْ دَاوُدَ .

2409. (29) [2/744అపరిశోధితం]

‘అబుల్‌ అ’జ్‌హర్‌ అన్మారీ (ర) కథనం: ప్రవక్త (స) రాత్రి పడుకునేటప్పుడు ఈ దు’ఆను పఠించేవారు:

బిస్మిల్లాహి తు జమ్బీ లిల్లాహి, అల్లాహు మ్మగ్ఫిర్లీ న్బీ ఖ్ అషైతానీ ఫుక్క రిహానీ, వజ్‌’అల్నీ ఫిన్నదియ్యిల్ఆలా.” — ‘అల్లాహ్‌ పేరుతో, అల్లాహ్‌ కొరకు ప్రక్కను వాల్చాను. ఓ అల్లాహ్‌! నా పాపాలను క్షమించు, నా షై’తాన్‌ను అవమానపరచు, నన్ను విడిపించు, నన్ను ఉన్నతుల్లో చేర్చు.” (అబూ దావూద్‌)

2410 – [ 30 ] ( لم تتم دراسته ) (2/745)

وَعَنِ ابْنِ عُمَرَ: أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم كَانَ إِذَا أَخَذَ مَضْجَعَهُ مِنَ اللَّيْلِ قَالَ: “اَلْحَمْدُ لِلّهِ الَّذِيْ كَفَانِيْ وَآوَانِيْ وَأَطْعَمَنِيْ وَسَقَانِيْ وَالَّذِيْ مَنَّ عَلَيَّ فَأَفْضَلَ وَالَّذِيْ أَعْطَانِيْ فَأَجْزَلَ الْحَمْدُ لِلّهِ عَلَى كُلِّ حَالٍ اَللّهُمَّ رَبَّ كُلِّ شَيْءٍ وَمَلِيْكَهُ وَإِلَهَ كُلِّ شَيْءٍ أَعُوْذُ بِكَ مِنْ النَّارِ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ .

2410. (30) [2/745-అపరిశోధితం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘ఉమర్‌ (ర) కథనం: ప్రవక్త (స) తన పడకపైకి వచ్చినపుడు ఇలా పఠిస్తారు:

అల్‌ ‘హమ్దులిల్లాహిల్లజీ కఫానీ ఆవానీ అత్అమనీ సఖానీ వల్లజీ మన్నఅలయ్య అఫ్జల వల్లజీ ఆతానీ ఫఅజ్జల అల్హమ్దు లిల్లాహి అలాకుల్లి హాలిన్. అల్లాహుమ్మ రబ్బకుల్లి షయ్ఇన్మలీకహు ఇలాహ కుల్లి షయ్యిన్అఊజుబిక మినన్నార్‌.” — ‘స్తోత్రాలన్నీ అల్లాహ్‌కే, ఆయన నన్ను సంరక్షించాడు, ఇతరుల అవసరం లేకుండా చేసాడు, ఉండటానికి చోటు ఇచ్చాడు, నన్ను తినిపించాడు, త్రాపించాడు, నాకు ఉపకారం చేసాడు ఇంకా నన్ను చాలా అనుగ్ర హించాడు, చాలా ప్రసాదించాడు. సర్వ వేళలా స్తోత్రాలన్నీ అల్లాహ్‌కే. ఓ అల్లాహ్! నీవు ప్రతి వస్తువుకు పరిపోషకుడవు, ప్రతి వస్తువుకు యజమానివి, ప్రతివస్తువుకు ఆరాధ్యదైవం నీవే, నిన్ను నరకం నుండి శరణుకోరుతున్నాను.’ (అబూ దావూద్‌)

2411 – [ 31 ] ( لم تتم دراسته ) (2/745)

وَعَنْ بُرَيْدَةَ قَالَ: شَكَا خَالِدُ بْنُ الْوَلِيْدِ إِلَى النَّبِيِّ صلى الله عليه وسلم فَقَالَ يَا رَسُوْلَ اللهِ مَا أَنَامُ مِنَ اللَّيْلِ مِنَ الْأَرَقِ. فَقَالَ نَبِيُّ اللهِ صلى الله عليه وسلم: “إِذَا أَوَيْتَ إِلَى فِرَاشِكَ فَقُلِ: “اَللّهُمَّ رَبَّ السَّمَاوَاتِ السَّبْعِ وَمَا أَظَلَّتْ وَرَبَّ الْأَرْضِيْنَ وَمَا أَقَلَّتْ وَربَّ الشَّيَاطِيْنَ وَمَا أَضَلَّتْ كُنْ لِيْ جَارًا مِنْ شَرِّ خَلْقِكَ كُلِّهِمْ جَمِيْعًا أَنْ يَّفْرُطَ عَلَيَّ أَحَدٌ مِّنْهُمْ أَوْ أَنْ يَبْغِيَ عَزَّ جَارُكَ وَجَلَّ ثَنَاؤُكَ وَلَا إِلَهَ غَيْرُكَ لَا إِلَهَ إِلَّا أَنْتَ”.

 رَوَاهُ  التِّرْمِذِيُّ وَقَالَ هَذَا حَدِيْثٌ لَيْسَ إِسْنَادُهُ بِالْقَوِيِّ وَالْحَكَمُ بْنُ ظُهَيْرٍ الرَّاوِيْ  قَدْ تُّرَكَ حَدِيْثَهُ بَعْضُ أَهْلِ الْحَدِيْثِ .

2411. (31) [2/745అపరిశోధితం]

బురైదహ్‌ (ర) కథనం: ‘ఖాలిద్‌ బిన్‌ వలీద్‌ ప్రవక్త (స)ను రాత్రి పూట ఆందోళనకరంగా మనశ్శాంతి లేకుండా ఉంటుందని ఇలా విన్నవించుకున్నారు, ”ఓ అల్లాహ్‌ ప్రవక్తా! రాత్రి మనశ్శాంతి లేకుండా ఆందోళన కరంగా ఉండటం వల్ల నేను పడుకోలేకపోతున్నాను.” దానికి ప్రవక్త (స) నీవు పడకపైకి వెళ్ళినపుడు ఈ దు’ఆను పఠించు:

అల్లాహుమ్మ రబ్బస్సమావాతి స్సబ, వమా అజల్లత్వరబ్బల్అర్జీన, వమా అఖల్లత్వరబ్బష్షయాతీన్వమా అజల్లత్కున్లీ జారన్మిన్షర్రి ఖల్ఖిక కుల్లిహిమ్జమీఅన్అయ్యఫ్రుత అలయ్య అహదుమ్మిన్హుమ్, అవ్అయ్యబ్గియ అజ్జజారుక జల్లసనాఉక వలాయిలాహ గైరుక లా ఇలాహ ఇల్లాఅన్.” — ‘ఓ అల్లాహ్‌ నీవు సప్తాకాశాలకు వాటి నీడలో ఉన్నవాటికి ప్రభువువు, నీవు భూములకు వాటిలో ఉన్నవాటికి ప్రభువువు. నీవు షై’తానులకు వారికి గురైన వారికి ప్రభువువు, నీవు నీ సృష్టితాల చెడునుండి వారు నాపై అత్యాచారం చేయకుండా నన్ను కాపాడు, నీ శరణు చాలా గొప్పది, నీ స్తోత్రం చాలా పవిత్రమైనది, నీవు తప్ప ఆరాధ్యులెవరూ లేరు. తప్పకుండా నీవే ఆరాధ్యుడవు.’ (తిర్మిజి’-దీని ఆధారాలు దృఢమైనవి కావు. హకీం బిన్ ”జుహైర్ – ఉల్లేఖకుని ‘హదీసు’లను కొందరు ‘హదీసు’ వేత్తలు తీసుకోవటం మానేశారు.)

—–

اَلْفَصْلُ الثَّالِثُ మూడవ విభాగం 

2412 – [ 32 ] ( لم تتم دراسته ) (2/746)

وَعَنْ أَبِيْ مَالِكٍ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم قَالَ: “إِذَا أَصْبَحَ أَحَدُكُمْ فَلْيَقُلْ: “أَصْبَحْنَا وَأَصْبَحَ الْمُلْكُ لِلّهِ رَبِّ الْعَالَمِيْنَ اَللّهُمَّ إِنِّيْ أَسْأَلُكَ خَيْرَ هَذَا الْيَوْمِ فَتْحَهُ وَنَصْرَهُ وَنُوْرَهُ وَبَرْكَتَهُ وَهُدَاهُ وَأَعُوْذُ بِكَ مِنْ شَرِّ مَا فِيْهِ وَمِنْ شَرِّ مَا بَعْدَهُ” ثُمَّ إِذَا أَمْسَى فَلْيَقُلْ مِثْلَ ذَلِكَ. رَوَاهُ أَبُوْ دَاوُدَ.

2412. (32) [2/746అపరిశోధితం]

అబూ మాలిక్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం,  మీరు ఉదయం ఇలా పఠించండి:

అస్బహ్నా వఅస్బహల్ముల్కు లిల్లాహి రబ్బిల్ఆలమీన్‌, అల్లాహుమ్మ ఇన్నీ అస్అలుక ఖైర హాజల్యౌమి త్హహూ వనస్రహు, నూరహు, వబర్కతహు, వహుదాహు, అఊజుబిక మిన్ షర్రిమా ఫీహి వషర్రి మా బాదహు.” — ‘మేము మరియు అల్లాహ్‌ దేశమంతా ఉదయం చూసాము. ఓ నా ప్రభూ! ఈ రోజు మంచిని, విజయాన్నీ, సహాయాన్ని, వెలుగును, శుభాన్ని, మార్గదర్శ కత్వాన్ని నేను నిన్ను అర్థిస్తున్నాను. అదేవిధంగా ఈ రోజు చెడును, దాని తరువాత చెడునుండి నీ శరణు కోరుకుంటున్నాను.’ [77] (అబూ దావూద్‌).

2413 – [33] ( لم تتم دراسته ) (2/746)

وَعَنْ عَبْدِ الرَّحْمنِ بْنِ أَبِيْ بَكْرَةَ قَالَ: قُلْتُ لِأَبِيْ: يَا أَبَتِ أَسْمَعُكَ تضقُوْلُ كُلَّ غَدَاةٍ: “اَللّهُمَّ عَافِنِيْ فِيْ بَدَنِيْ اَللّهُمَّ عَافِنِيْ فِيْ سَمْعِيْ اَللّهُمَّ عَافِنِيْ فِيْ بَصَرِيْ .لَا إِلَهَ إِلَّا أَنْتَ”. تُكَرِّرُهَا ثَلَاثًا حِيْنَ تُصْبحُ وَثَلَاثًا حِيْنَ تُمْسِيْ. فَقَالَ: يَا بُنَيَّ سَمِعْتُ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم يَدْعُوْ بِهِنَّ فَأَنَا أُحِبُّ أَنْ أَسْتَنَّ بِسُنَّنِهِ. رَوَاهُ أَبُوْ دَاوُدَ.

2413. (33) [2/746అపరిశోధితం]

‘అబ్దుర్రహ్మాన్‌ బిన్‌ అబీ బక్‌ర్‌ (ర) కథనం: నేను మా తండ్రి గారితో తమరు ప్రతిరోజూ మూడుసార్లు ఉదయం, మూడు సార్లు సాయంత్రం చదువు తున్నారు. ఏనాడూ తప్పటం లేదు’ అని అన్నాను. అప్పుడు మా తండ్రిగారు అబూ బకర్‌ (ర) ‘కుమారా! నేను ప్రవక్త (స)ను ఈ దు’ఆ పఠిస్తూ ఉండగా విన్నాను. అందువల్ల ఆయన్ను అనుసరిస్తూ నేను కూడా చదువుతున్నాను. ఇంకా నేను ఆయన సాంప్ర దాయాన్ని అనుసరించడం అంటే ఎంతో ఇష్టం.’ ఆ దు’ఆ ఇది:

అల్లాహుమ్మ ఆఫినీ ఫీబదనీ, వఆఫినీ ఫీసమ్ యీ, వఆఫినీ ఫీ బసరీ లా ఇలాహ ఇల్లా అన్ — ‘ఓ అల్లాహ్‌ నా శరీరంలో క్షేమాన్ని ప్రసాదించు, ఓ నా ప్రభూ! నా చెవులకు, కళ్ళకు క్షేమాన్ని ప్రసాదించు. నీవే వాస్తవ ఆరాధ్యుడవు, నీవు తప్ప ఆరాధ్యులెవరూ లేరు.’ (అబూ దావూద్‌)

2414 – [ 34 ] ( لم تتم دراسته ) (2/746)

وَعَنْ عَبْدِ اللهِ بْنِ أَبِيْ أَوْفَى قَالَ: كَانَ رَسُوْلُ اللهِ صلى الله عليه و سلم إِذَا أَصْبَحَ قَالَ: “أَصْبَحْنَا وَأَصْبَحَ الْمُلْكُ لِلّهِ وَالْحَمْدُ لِلّهِ وَالْكِبْرِيَاءُ وَالْعَظْمَةُ لِلّهِ وَالْخَلْقُ وَالْأَمْرُ وَاللَّيْلُ وَالنَّهَارُ وَمَا سَكَنَ فِيْهِمَا لِلّهِ اَللّهُمَّ اجْعَلْ أَوَّلَ هَذَا النَّهَارَ صَلَاحًا وَأَوْسَطَهُ نَجَاحًا وَآخِرَهُ فَلَاحًا يَا أَرْحَمَ الرَّاحِمِيْنَ”. ذَكَرَهُ النَّوْوِيُّ فِيْ كِتَابِ الْأَذْكَارِ بِرِوَايَةِ ابْنِ السُّنِّيْ .

2414. (34) [2/746అపరిశోధితం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ అబీ అవ్ఫా (ర) కథనం: ప్రవక్త (స) ఉదయం మేల్కొన్న తర్వాత ఈ దు’ఆ పఠించే వారు:

స్బహ్నా వఅస్బహ్ల్ముల్కు లిల్లాహి, వల్హమ్దులిల్లాహి, వల్కిబ్రియాఉ వల్అజ్మతు లిల్లాహి వల్ఖల్ఖువల్అమ్రు వల్లైలు వన్నహారు వమా సకన్ఫీ హిమా లిల్లాహి అల్లాహుమ్మజ్అల్అవ్వల హాజన్నహార సలాహవ్వ అన్సతహు నజాహన్ ఆఖిరహు లాహన్యాఅర్హమర్రాహిమీన్‌” — ‘మేము మరియు అల్లామ్‌ సామ్రాజ్యం తెల్లవారు చేసాం. స్తోత్రాలన్నీ అల్లాహ్‌ కొరకే. సృష్టించడం, ఆదేశించడం, రాత్రి పగలు వాటిలో జీవించే వారందరూ అల్లాహ్‌ కొరకే. ఓ అల్లాహ్‌! ఈ దినం మొదటి భాగాన్ని శుభం, దాని మధ్య భాగాన్ని సమస్య పరిష్కారం, చివరి భాగాన్ని సాఫల్యం ప్రసాదించేదిగా చేయి. ఓ అందరి కంటే గొప్ప కరుణామయుడా!’ (నవవీ, కితాబుల్‌ అజ్‌’కార్‌)

2415 – [ 35 ] ( لم تتم دراسته ) (2/746)

وَعَنْ عَبْدِ الرَّحْمَنِ بْنِ أَبْزَى قَالَ: كَانَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ إِذَا أَصْبَحَ: “أَصْبَحْنَا عَلَى فِطْرَةِ الْإِسْلَامِ وَكَلِمَةِ الْإِخْلَاصِ وَعَلَى دِيْنِ نَبِيِّنَا مُحَمَّدٍ صلى الله عليه وسلم وَعَلَى مِلَّةِ أَبِيْنَا إِبْرَاهِيْمَ حَنِيْفًا وَمَا كَانَ مِنَ الْمُشْرِكِيْنَ”.  رَوَاهُ أَحْمَدُ وَالدَّارَمِيُّ.

2415. (35) [2/746అపరిశోధితం]

‘అబ్దుర్రహాన్‌ బిన్‌ అబ్‌’జా (ర) కథనం: ప్రవక్త (స) ఉదయం ఈ దు’ఆ పఠించేవారు:

అన్బహ్నా అలా ఫిత్రతిల్ఇస్లామి కలిమతిల్ఇఖ్లాసి అలా దీని నబియ్యినా ముహమ్మదిన్సల్లల్లాహు అలైహి సల్లమ్ అలా మిల్లతి అబీనా ఇబ్రాహీమహనీఫన్వమాకాన మినల్ముష్రికీన్.” — ‘మేము ఇస్లామ్‌ ధర్మ ఆధారంగా, చిత్త శుద్ధివచనం ద్వారా, మా ప్రవక్త ధర్మం ద్వారా, మా తండ్రి ఇబ్రాహీమ్‌ (అ) సంఘం ద్వారా ఉదయం చూసాము. ఆయన వేరుగా ఉండేవారు, ఆయన ముష్రికుల్లోని వారు కారు.’ (అ’హ్మద్‌, దారమి)

=====

7- بَابُ الدَّعْوَاتِ فِيْ الْأَوْقَات

7. వివిధ సమయాల్లో చేసే దుఆలు

اَلْفَصْلُ الْأَوَّلُ మొదటి విభాగం 

2416 – [ 1 ] ( متفق عليه ) (2/748)

عَنِ ابْنِ عَبَّاسٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَوْ أَنَّ أَحَدَكُمْ إِذَا أَرَادَ أَنْ يَّأْتِيَ أَهْلَهُ قَالَ: “بِسْمِ اللهِ اَللّهُمَّ جَنِّبْنَا الشَّيْطَانَ وَجَنِّبِ الشَّيْطَانَ مَا رَزَقْتَنَا فَإِنَّهُ إِنْ يُقَدَّرَ بَيْنَهُمَا وَلَدٌ فِيْ ذَلِكَ لَمْ يَضُرَّهُ شَيْطَانٌ أَبَدًا”.

2416. (1) [2/748ఏకీభవితం]

ఇబ్నె ‘అబ్బాస్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మీలో ఎవరైనా తన భార్య వద్దకు గాని, బానిసరాలి వద్దకు గాని, సంభోగ ఉద్దేశ్యంతో వెళ్ళినపుడు సంభోగానికి ముందు ఈ దు’ఆను పఠించాలి, ఫలితంగా అల్లాహ్‌ (త) వానికి సంతాన భాగ్యం ప్రసాదిస్తే, షై’తాన్‌ అతని సంతానానికి ఎటువంటి హాని తలపెట్టలేడు. ఆ దు’ఆ ఇది:

బిస్మిల్లాహి, అల్లాహుమ్మ జన్నిబ్నష్షైతాన జన్నిబి ష్షైతాన మా జఖ్తనా.” — ‘అల్లాహ్‌ పేరుతో ప్రారంభిస్తున్నాను. ఓ అల్లాహ్‌ మమ్మల్ని షై’తాన్‌ నుండి రక్షించు. ఇంకా నీవు మాకు ప్రసాదించిన దాన్ని కూడా షై’తాన్‌ నుండి రక్షించు.’ [78] (బు’ఖారీ, ముస్లిమ్‌)

2417 – [ 2 ] ( متفق عليه ) (2/748)

وَعَنْهُ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم كَانَ يَقُوْلُ عِنْدَ الْكَرْبِ: “لَا إِلَهَ إِلَّا اللهُ الْعَظِيْمُ الْحَلِيْمُ لَا إِلَهَ إِلَّا اللهُ رَبُّ الْعَرْشِ الْعَظِيْمِ لَا إِلَهَ إِلَّا اللهُ رَبُّ السَّمَاوَاتِ وَرَبِّ الْأَرْضِ رَبِّ الْعَرْشِ الْكَرِيْمِ”.

2417. (2) [2/748ఏకీభవితం]

ఇబ్నె ‘అబ్బాస్‌ (ర) కథనం: ప్రవక్త (స) విచారం, దుఃఖం ఆందోళనకరమైన సమయాల్లో ఈ దు’ఆను పఠించేవారు:

లా ఇలాహ ఇల్లల్లాహుల్అజీముల్లీము, లా ఇలాహ ఇల్లల్లాహు రబ్బుల్అర్షిల్అజీమి, లా ఇలాహ ఇల్లల్లాహు రబ్బుస్సమావాతి రబ్బుల్అర్‌’ది రబ్బుల్అర్షిల్రీమ్.” — ‘అల్లాహ్‌ తప్ప ఆరాధ్యులెవరూ లేరు. ఆయన గొప్పవాడు, వివేకవంతుడూను. అల్లాహ్‌ తప్ప ఆరాధ్యులెవరూ లేరు ఆయన మహా సింహాసనానికి ప్రభువు. అల్లాహ్‌ తప్ప ఆరాధ్యులెవరూ లేరు. ఆయన ఆకాశాలకు ప్రభువు, భూమికి ప్రభువు. గౌరవప్రదమైన సింహాస నానికి ప్రభువు.’ (బు’ఖారీ, ముస్లిమ్‌)

2418 – [ 3 ] ( متفق عليه ) (2/748)

وَعَنْ سُلَيْمَانَ بْنِ صُرَدٍ قَالَ: استَبَّ رَجُلَانِ عِنْدَ النَّبِيِّ صلى الله عليه وسلم وَنَحْنُ عِنْدَهُ جُلُوْسٌ وَأَحَدُهُمَا يَسُبُّ صَاحِبَهُ مُغْضَبًا قَدْ احْمَرَّ وَجْهُهُ. فَقَالَ النَّبِيُّ صلى الله عليه وسلم: “إِنَّيْ لَأَعْلَمُ كَلِمَةً لَوْ قَالَهَا لَذَهَبَ عَنْهُ مَا يَجِدُ  من الغضبِ أَعُوْذُ بِاللهِ مِنَ الشَّيْطَانِ الرَّجِيْمِ”. فَقَالُوْا لِلرَّجُلِ: ألَا تَسْمَعُ مَا يَقُوْلُ النَّبِيُّ صلى الله عليه وسلم؟ قَالَ: إِنِّيْ لَسْتُ بِمَجْنُوْنٍ.

2418. (3) [2/748ఏకీభవితం]

సులైమాన్‌ బిన్‌ ‘సురద్‌ (ర) కథనం: ప్రవక్త (స) సమక్షంలో ఇద్దరు వ్యక్తులు పరస్పరం తిట్టుకున్నారు. అప్పుడు మేము ప్రవక్త (స) వద్ద కూర్చున్నాము. వారిలో ఒకరు కోపంగా రెండవ వ్యక్తిని తిట్టాడు. కోపంతో అతని ముఖం మండి పోతుంది. ఈ పరిస్థితి చూసి ప్రవక్త (స) ఇలా అన్నారు, ”ఒక పవిత్ర వచనం ఉంది. ఒకవేళ కోపంతో ఉండి తిడుతున్న ఈ వ్యక్తి ఆ వచనాన్ని పఠిస్తే అతని కోపమంతా తొలగిపోతుంది. ఆ వచనం:

ఊజుబిల్లాహి మినష్షైతా నిర్రజీమ్.” ప్రజలు ఆ వ్యక్తితో, ‘వింటున్నావా, ప్రవక్త (స) ఏమంటున్నారో? అంటే నువ్వు కోపంలో ఉన్నావు. ఇది షై’తాన్‌ వల్ల జరుగుతుంది. అందు వల్ల షై’తాన్‌ను కోపాన్ని దూరం చేయడానికి, ఊజు బిల్లాహి మినష్షైతానిర్రజీమ్‌” అని పలుకు,’ అని అన్నారు. దానికి ఆ వ్యక్తి, ‘నేను పిచ్చి వాడ్ని మతి స్థిమితం లేనివాడ్ని కాను. ఈ వచనం పిచ్చి వాళ్ళను, సంతులనం కోల్పోయిన వారిచేత చదివిస్తారు,’ అని అన్నాడు. [79] (బు’ఖారీ, ముస్లిమ్‌)

2419 – [ 4 ] ( متفق عليه ) (2/748)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِذَا سَمِعْتُمْ صِيَاحَ الدِّيْكَةِ فَسَلُوا اللهَ مِنْ فَضْلِهِ فَإِنَّهَا رَأَتْ مَلَكًا وَإِذَا سَمِعْتُمْ نَهِيْقَ الْحِمَارٍ فَتَعَوَّذُوْا بِاللهِ مِنَ الشَّيْطَانِ الرَّجِيْمِ فَإِنَّهُ رَأى شَيْطَانًا”.

2419. (4) [2/748ఏకీభవితం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త(స) ప్రవచనం, మీరు కోడిపుంజు కూత వింటే అల్లాహ్‌ను ఆయన అనుగ్రహాన్ని అర్థించండి. ఎందుకంటే ఆ కోడి పుంజు దైవదూతను చూచింది. అంటే మీరు ఇలా పలకండి:

అల్లాహుమ్మ ఇన్ని అస్అలుక మిన్ఫజ్లిక. ” — ‘ఓ అల్లాహ్ నేను నీ అనుగ్రహాన్ని అర్ధిస్తున్నాను.’ అదేవిధంగా మీరు గాడిద శబ్దంవింటే షై’తాన్‌ నుండి శరణుకోరండి. ఎందుకంటే ఆ గాడిద షై’తాన్‌ను చూచింది.  అంటే గాడిద శబ్దం విని ఇలా పలకాలి: ”అల్లాహుమ్మ ఇన్ని అఊజుబిక మినష్షైతా నిర్రజీమ్.” — ‘ఓ అల్లాహ్ బహిష్కరించబడిన షై’తాన్ నుండి నీ శరణు కోరుతున్నాను.’  (బు’ఖారీ, ముస్లిమ్‌)

2420 – [ 5 ] ( صحيح ) (2/749)

وَعَنِ ابْنِ عُمَرَ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم كَانَ إِذَا اسْتَوَى عَلَى بَعِيْرِهِ خَارِجًا إِلَى السَّفْرِ: “كَبَّرَ ثَلَاثًا ثُمَّ قَالَ:(سُبْحَانَ الَّذِيْ سَخَّرَ لَنَا هَذَا وَمَا كُنَّا لَهُ مُقْرِنِيْنَ وَإِنَّا إِلى رَبِّنَا لَمُنْقَلِبُوْنَ..،43: 13) اَللّهُمَّ إِنَّا نَسْأَلُكَ فِيْ سَفَرِنَا هَذَا الْبِرَّ وَالتَّقْوَى وَمِنَ الْعَمَلِ مَا تَرْضَى اَللّهُمَّ هَوِّنْ عَلَيْنَا سَفَرَنَا هَذَا وَاطْوِ لَنَا بُعْدَهُ. اَللّهُمَّ أَنْتَ الصَّاحِبُ فِيْ السَّفَرِ وَالْخَلِيْفَةُ فِيْ الْأَهْلِ وَالْمَالِ. اَللّهُمَّ إِنِّيْ أَعُوْذُ بِكَ مِنْ وَعْثَاءِ السَّفَرِ وَكَآبِةِ الْمَنْظَرِ وَسُوْءِ الْمُنْقَلَبِ فِيْ الْمَالِ وَالْأَهْلِ”.

وَإِذَا رَجَعَ قَالَهُنَّ وَزَادَ فِيْهِنَّ: “آيِبُوْنَ تَائِبُوْنَ عَابِدُوْنَ لِرَبِّنَا حَامِدُوْنَ”.  رَوَاهُ مُسْلِمٌ.

2420. (5) [2/749దృఢం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘ఉమర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రయాణం చేయ నిశ్చయించినపుడు ఒంటెపై కూర్చున్న తర్వాత: ”మూడుసార్లు, అల్లాహ్అక్బర్‌, అల్లాహు అక్బర్‌, అల్లాహు అక్బర్‌’ అని పలికి ఒకసారి ఈ దు’ఆను పఠించేవారు, ” ‘సుబ్‌’హానల్లజీ ఖ్ఖరలనా హాజహ్ వమా కున్నా హు ముఖ్రినీన వఇన్నా ఇలా రబ్బినా లమున్ఖలిబూన్‌.’ అల్లాహుమ్మ ఇన్నా నస్అలుక ఫీ సఫరినా హాజల్బిర్ర వత్తఖ్వా వమినల్అమలి మా తర్‌’దా అల్లాహుమ్మ హవ్విన్ అలైనా సఫ్రనా హాజహ్ వత్విలనా బుదహు,అల్లాహుమ్మ అంతస్సాహిబు ఫిస్సఫరి వల్ఖలీఫతు ఫిల్అహ్లి, అల్లాహుమ్మ ఇన్నీ జుబిక మిన్వఅసాయి స్సఫరి బతిల్మన్జరి వసూయిల్మున్ఖలబి ఫిల్మాలి వల్అహ్లి.” — ‘అల్లాహ్‌ (త) పరిశుద్ధుడు. ఆయనే మన కోసం ఈ వాహనాన్ని లోబరచాడు. అంతే గానీ దాన్ని మనం మన అధీనంలో చేసే శక్తి మనకెక్కడిది? మనం మన ప్రభువు వైపు మరలవలసి ఉన్నవారమే. ఓ అల్లాహ్‌! మేము ఈ ప్రయాణంలో నితో, మంచిని, దైవభీతిని, ఇంకా నీకు ప్రీతికరమైన ఆచరణను అర్థిస్తున్నాము. ఓ అల్లాహ్‌! ఈ ప్రయాణాన్ని సులభతరం చేయి. ఇంకా దాని దూరాన్ని చుట్టి వేయి. ఓ అల్లాహ్‌! ఈ ప్రయాణంలో నీవే మా ఆప్త మిత్రుడవు, మా ఇంటి మంచీ చెడ్డలను చూచే సంరక్షకుడివి. ఓ అల్లాహ్‌! ప్రయాణపు కష్టాల నుండి, చెడు దృశ్యాల నుండి, ఇంట్లోని అనివార్య పరిస్థితుల నుండి, భార్యా బిడ్డల చెడు స్థితిని చూడటాన్నుండి నీ శరణు కోరుతున్నాను.’

ప్రవక్త (స) ప్రయాణం నుండి తిరిగి వచ్చిన తర్వాత పైన పేర్కొన్న వచనాల్నే పఠించేవారు. వాటితో పాటు ఈ వచనాల్ని కూడా పఠించేవారు:

 ”ఆయిబూన, తాయిబూన, ఆబిదూన లిరబ్బినా హామిదూన,”– ‘మేము తిరిగివచ్చాము, మేము పశ్చా త్తాపం చెందేవాళ్ళం, ఆరాధించే వాళ్ళం, మా ప్రభువు గొప్పతనాన్ని కొనియాడేవాళ్ళం.’ (ముస్లిమ్‌)

2421 – [ 6 ] ( صحيح ) (2/749)

وَعَنْ عَبْدِ اللهِ بْنِ سَرْجِسَ قَالَ: كَانَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم إِذَا سَافَرَيَتَعَوَّذُ مِنْ وَعْثَاءِ السَّفَرِوَكَآبِةِ الْمُنْقَلَبِ وَالْحَوْرِبَعْدَ الْكَوْرِ وَ دَعْوَةِ الْمَظْلُوْمِ وَسُوْءِ الْمَنْظَرِ فِيْ الْأَهْلِ وَالْمَالِ. رَوَاهُ مُسْلِمٌ.

2421. (6) [2/749దృఢం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ సర్‌జిస్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రయాణం చేస్తే ప్రయాణంలో ప్రయాణపు కష్టాలు నష్టాల నుండి, చెడు స్థితిలో తిరిగి రావటాన్నుండి, స్థితి మార్పునుండి, లాభం తర్వాత నష్టాన్నుండి, వృద్ధి తర్వాత పతనం నుండి, బాధితుని ఆర్తనాదం నుండి, భార్యాబిడ్డలను, ధనసంపదలను చెడుస్థితిలో చూడటాన్నుండి నేను అల్లాహ్‌ శరణు కోరుకుంటున్నాను. అంటే ఇలా దు’ఆ చేసేవారు:

అల్లాహుమ్మ ఇన్నీ అఊజుబిక మిన్వఅసాయి స్సఫరి కఆబతిల్మున్ఖలబి వల్హౌరి బాదల్కౌరి వమిన్దావతిల్మజ్లూమి వమిన్సూయిల్మన్జరి ఫిల్అహ్లి వల్మాలి.” (ముస్లిమ్‌)

2422 – [ 7 ] ( صحيح ) (2/749)

وَعَنْ خَوْلَةَ بِنْتِ حَكِيْمٍ قَالَت: سَمِعْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ: “مَنْ نَزَلَ مَنْزِلًا فَقَالَ: “أَعُوْذُ بِكَلِمَاتِ اللهِ التَّامَّاتِ مِنْ شَرِّ مَاخَلَقَ لَمْ يَضُرَّهُ شَيْءٌ حَتَّى يَرْتَحِلَ مِنْ مَنْزِلِهِ ذَلِكَ” . رَوَاهُ مُسْلِمٌ.

2422. (7) [2/749దృఢం]

‘ఖౌలహ్ బిన్‌తె ‘హకీమ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ఇలా అంటూ ఉండగా నేను విన్నాను, ‘ఎవరైనా ప్రయాణంలో ఒకచోట దిగి, అక్కడ విశ్రాంతి తీసుకొని ఈ దు’ఆను పఠిస్తే అక్కడ ఉన్నంతసేపు అతనికి ఏ వస్తువూ హానిచేకూర్చ లేదు. ఆ దు’ఆ ఇది:

అఊజుబిక లిమాతిల్లాహి త్తామ్మాతి మిన్షర్రి మాఖలఖ — ‘అల్లాహ్‌ సృష్టించిన వాటి చెడు నుండి, ఆయన సంపూర్ణ వచనాల ద్వారా నేను శరణు కోరుతున్నాను.’ (ముస్లిమ్‌)

2423 – [ 8 ] ( صحيح ) (2/750)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: جَاءَ رَجُلٌ إِلَى رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم فَقَالَ: يَا رَسُوْلَ اللهِ مَا لَقِيْتُ مِنْ عَقْرَبٍ لَدَغَتْنِيْ الْبَارِحَةَ قَالَ: “أَمَا لَوْ قُلْتَ حِيْنَ أَمْسَيْتَ: “أَعُوْذُ بِكَلِمَاتِ اللهِ التَّامَّاتِ مِنْ شَرِّ مَا خَلَقَ لَمْ تَضُرَّكَ”. رَوَاهُ مُسْلِمٌ .

2423. (8) [2/750దృఢం]

అబూ హురైరహ్‌ (ర)కథనం: ఒక వ్యక్తి ప్రవక్త (స) వద్దకు వచ్చి ”ఓ అల్లాహ్‌ ప్రవక్తా! నిన్న రాత్రి నాకు ఒక తేలు కుట్టటం వల్ల చాలా బాధ కలిగింది,” అని విన్నవించుకున్నాడు. దానికి ప్రవక్త (స) ‘ఒకవేళ నువ్వు సాయంత్రం, ”అ’ఊజు’బి కలిమాతిల్లాహి త్తామ్మాతి మిన్‌ షర్రిమా ‘ఖలఖ,” అని పఠించి ఉంటే ఈ తేలు కుట్టి ఉండేది కాదు, మరే వస్తువూ హాని చేకూర్చి ఉండేదికాదు’ అని అన్నారు. (ముస్లిమ్‌)

2424 – [ 9 ] ( صحيح ) (2/750)

وَعَنْهُ أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم كَانَ إِذَا كَانَ فِيْ سَفَرٍ وَأَسْحَرَ يَقُوْلُ: “سَمِعَ سَامِعُ بِحَمْدِ اللهِ وَحُسْنِ بَلَائِهِ عَلَيْنَا وَرَبَّنَا صَاحِبْنَا وَ أَفْضِلْ عَلَيْنَا عَائِذًا بِاللهِ مِنَ النَّارِ”. رَوَاهُ مُسْلِمٌ.

2424. (9) [2/750దృఢం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రయాణంలో ఉన్నప్పుడు సహ్‌రీ సమయంలో ఈ దు’ఆను పఠించేవారు:

సమి సామిఉన్ బిహమ్దిల్లాహి హుస్ని బలాయిహీ అలైనా, రబ్బనాసాహిబ్నా వఅఫ్‌’దిల్అలైనాఆయిన్బిల్లాహి మినన్నారి — ‘అల్లాహ్‌ స్తోత్రాన్ని, మనపై ఉన్న అనుగ్రహాల గురించి వినే వాడు విన్నాడు. ఓ మా ప్రభూ! మాతో ఉండు, మమ్ము అనుగ్రహించు. నరకం నుండి నేను అల్లాహ్‌ శరణు కోరుతున్నాను.’ (ముస్లిమ్‌)

2425 – [ 10 ] ( متفق عليه ) (2/750)

وَعَنِ ابْنِ عُمَرَ قَالَ: كَانَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم إِذَا قَفَلَ مِنْ غَزْوٍ أَوْ حَجٍّ أَوْ عُمْرَةٍ يُكَبِّرُ عَلَى كُلِّ شَرَفٍ مِنَ الْأَرْضِ ثَلَاثَ تَكْبِيْرَاتٍ ثُمَّ يَقُوْلُ: “لَا إِلَهَ إِلَّا اللهُ وَحْدَهُ لَا شَرِيْكَ لَهُ لَهُ الْمُلْكُ وَلَهُ الْحَمْدُ وَهُوَ عَلَى كُلِّ شَيْءٍ قَدِيْرٌ .آيِبُوْنَ تَائِبُوْنَ عَابِدُوْنَ سَاجِدُوْنَ لِرَبِّنَا حَامِدُوْنَ صَدَقَ اللهُ وَعْدَهُ وَنَصَرَ عَبْدَهُ وَهَزَمَ الْأَحْزَابَ وَحْدَهُ”.

2425. (10) [2/750ఏకీభవితం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘ఉమర్‌ (ర) కథనం: ప్రవక్త (స) యుద్ధం నుండి లేదా ‘హజ్జ్ నుండి లేదా ‘ఉమ్‌రహ్‌ నుండి తిరిగి వచ్చినప్పుడు మార్గంలో ఎత్తుగా ఉన్న ప్రాంతాల్లో మూడుసార్లు ”అల్లాహు అక్బర్ ”అని అంటారు. ఆ తరువాత ఈ దు’ఆను ఒకసారి పఠిస్తారు:

లా ఇలాహ ఇల్లల్లాహు హ్దహు లాషరీక లహు లహుల్ముల్కు వలహుల్హమ్దు వహువ అలాకుల్లి షయ్ఇన్ఖదీర్‌. ‘ఆయిబూన, తాయిబూనఆబిదూన, సాజిదూన లిరబ్బినాహామిదూనసదఖల్లాహు దహు వనసరఅబ్దహు జమల్అహ్‌’జాబ హ్దహు.” –‘అల్లాహ్‌ తప్ప ఆరాధ్యులెవరూ లేరు. ఆయనకు ఎవరూ సాటిలేరు. రాజ్యం ఆయనదే, స్తోత్రం ఆయనదే. ఆయన ప్రతి విషయంపై శక్తిగలవాడు. మేము తిరిగి వచ్చాము. పశ్చాత్తాపం చెందేవారుగా, ఆరాధించేవారుగా, సజ్దా చేసేవారుగా, తన ప్రభువు స్తోత్రం చేసేవారుగా. అల్లాహ్‌ (త) తన వాగ్దానాన్ని నిజంచేసి చూపాడు. ఇంకా తన దాసుడైన ము’హమ్మద్‌కు సహాయం చేసాడు. ఇంకా అవిశ్వాసుల సమూహాన్ని తాను ఒంటరిగా ఓడించాడు.  (బు’ఖారీ, ముస్లిమ్‌)

2426 – [ 11 ] ( متفق عليه ) (2/750)

وَعَنْ عَبْدِ اللهِ بْنِ أَبِيْ أَوْفَى قَالَ: دَعَا رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم يَوْمَ الْأَحْزَابِ عَلَى الْمُشْرِكِيْنَ فَقَالَ: “اَللّهُمَّ مُنْزِلَ الْكِتَابِ سَرِيْعَ الْحِسَابِ. اَللّهُمَّ اهْزِمِ الْأَحْزَابِ اَللّهُمَّ اهْزِمْهُمْ وَزَلْزِلْهُمْ”.

2426. (11) [2/750ఏకీభవితం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ అబీ అవ్‌ఫా (ర) కథనం: ప్రవక్త (స) అ’హ్‌’జాబ్‌ యుద్ధం నాడు అవిశ్వాసులను ఇలా శపించారు,

అల్లాహుమ్మ మున్జిలల్కితాబి, సరీఅల్‌ ‘హిసాబ్. అల్లాహుమ్మహ్జిమిల్హ్‌’జా, అల్లాహుమ్మహ్‌ ‘జిమ్హుమ్జల్‌’జిల్హుమ్‌.” — ‘ఓ అల్లాహ్‌! గ్రంథాలను అవతరింపజేసేవాడా! త్వరగా లెక్క తీసుకునేవాడా! అవిశ్వాసులను ఓడించేవాడా! వారిని ఓడించు ఇంకా వారి పాదాలను అస్థిరతకు గురిచెయ్యి.’ (బు’ఖారీ, ముస్లిమ్‌)

2427 – [ 12 ] ( صحيح ) (2/750)

وَعَنْ عَبْدِ اللهِ بْنِ بُسْرٍ قَالَ: نَزَلَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم عَلَى أَبِيْ فَقَرَّبْنَا إِلَيْهِ طَعَامًا وَّوَطَبَةً. فَأَكَلَ مِنْهَا ثُمَّ أَتَي بِتَمْرٍ فَكَانَ يَأْكُلُهُ وَيُلْقِيْ النَّوَى بَيْنَ إِصْبَعَيْهِ. وَيَجْمَعُ السَّبَابَةَ وَالْوُسْطَى وَفِيْ رِوَايَةٍ: فَجَعَلَ يُلْقِيْ النَّوَى عَلَى ظَهْرِ أصْبَعَيْهِ السُّبَابَةَ وَالْوُسْطَى. ثُمَّ أُتِيَ بِشَرَابٍ فَشَرِبَهُ فَقَالَ أَبِيْ وَأَخَذَ بِلِجَامِ دَابَّتِهِ: ادْعُ اللهَ لَنَا فَقَالَ: “اَللّهُمَّ بَارِكَ لَهُمْ فِيْمَا رَزَقْتَهُمْ وَاغْفِرْ لَهُمْ وَارْحَمْهُمْ”. رَوَاهُ مُسْلِمٌ .

2427. (12) [2/750దృఢం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ బుస్ర్ (ర) కథనం: ప్రవక్త (స) నా తండ్రిగారి వద్ద అతిధిగా వచ్చారు. మేము ప్రవక్త (స) ముందు భోజనం మరియు మలిదహ్‌ ఉంచాము. ప్రవక్త (స) వాటిలో నుండి ఆరగించారు. ఆ తరువాత ప్రవక్త (స)  ముందు ఖర్జూరాలు ఉంచడం జరిగింది. ప్రవక్త (స) ఖర్జూరాలను తింటూ వాటి గింజలను రెండు వేళ్ళ మధ్య ఉంచి రెండు ప్రక్కల పారవేస్తూ ఉన్నారు. ఆ తరువాత ఆయనకు త్రాగటానికి నీళ్ళు ఇవ్వటం జరిగింది. ప్రవక్త (స) వాటిని త్రాగారు. ప్రవక్త (స) వెళ్ళసాగారు. అప్పుడు మా తండ్రిగారు ప్రవక్త (స) వాహనం యొక్క  కళ్ళెం పట్టుకొని, ఓ అల్లాహ్‌ ప్రవక్తా! ‘మా గురించి దు’ఆ చేయండి’ అని విన్నవించుకున్నారు. ప్రవక్త (స) ఇలా దు’ఆ చేసారు:

అల్లాహుమ్మ బారిక్లహుమ్ఫీమా జఖ్ తహుమ్గ్ఫిర్లహుమ్వర్‌’హమ్హుమ్‌,” — ‘ఓ అల్లాహ్‌! వీరికి ప్రసాదించిన వాటిలో శుభం ప్రసాదించు, వారిని క్షమించు, వారిని కరుణించు.’ (ముస్లిమ్‌)

—–

اَلْفَصْلُ الثَّانِيْ  రెండవ విభాగం 

2428 – [ 13 ] ( لم تتم دراسته ) (2/751)

عَنْ طَلْحَةَ بْنِ عُبَيْدِ اللهِ أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم كَانَ إِذَا رَأَى الْهِلَالَ قَالَ: “اَللّهُمَّ أَهِلَّهُ عَلَيْنَا بِالْأَمْنِ وَالْإِيْمَانِ وَالسَّلَامَةِ وَالْإِسْلَامِ رَبِّيْ وَرَبُّكَ اللهُ”. رَوَاهُ التِّرْمِذِيُّ. وَقَالَ: هَذَا حَدِيْثٌ حَسَنٌ غَرِيْبٌ .

2428. (13) [2/751అపరిశోధితం]

‘తల్‌’హా బిన్‌ ‘ఉబేదుల్లాహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) మొదటి తేదీ నెలవంకను చూచి ఈ దు’ఆ పఠించే వారు:

అల్లాహుమ్మ అహిల్లహుఅలైనా బిల్అమ్ని వల్ఈమాని వస్సలామతి వల్ఇస్లామి రబ్బీ రబ్బుకల్లాహ్‌.” ‘ఓ అల్లాహ్‌! మాకు శాంతి, విశ్వాసం, ప్రశాంతత, ఇస్లామ్‌ల చంద్రున్ని చూపించు. మరియు ఓ చంద్రుడా! నీకు నాకు ప్రభువు, ఆ అల్లాహ్‌యే.’ (తిర్మిజి’ – ప్రామాణికం – ఏకోల్లేఖనం)

2429 – [ 14 ] ( لم تتم دراسته ) (2/751)

وَعَنْ عُمَرَ بْنِ الْخَطَّابِ وَأَبِيْ هُرَيْرَةَ قَالَا: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَا مِنْ رَجُلٍ رَأَى مُبْتَلَى فَقَالَ: اَلْحَمْدُ لِلّهِ الَّذِيْ عَافَانِيْ مِمَّا ابْتَلَاكَ بِهِ وَفَضَّلَنِيْ عَلَى كَثِيْرٍ مِّمَّنْ خَلَقَ تَفِضِيْلًا إِلَّا لَمْ يُصِبْهُ ذَلِكَ الْبَلَاءُ كَائِنَا مَا كَانَ”. رَوَاهُ التِّرْمِذِيُّ.

2429. (14) [2/751అపరిశోధితం]

‘ఉమర్‌, అబూ హురైరహ్‌ (ర)ల కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మీలో ఎవరైనా కష్టాల్లో ఉన్న వ్యక్తిని చూచి ఈ దు’ఆ పఠిస్తే, ఆ ఆపద, ప్రమాదం అతనికి ఎన్నడూ ఎదురు కావు. అది ఎటువంటి ఆపద అయినాసరే:

అల్హమ్దులిల్లాహిల్లజీఆఫానీ మిమ్మబ్తలాక బిహీ ద్దలనీ అలా కసీరిమ్మిమ్మన్‌ ‘ఖలఖ తఫ్‌’దీలా  — ‘స్తోత్రాలన్నీ అల్లాహ్‌ కొరకే, ఆయనే నాకు, నిన్ను గురిచేసిన ఈ వ్యాధి నుండి రక్షించాడు, ఇంకా తన అనేక సృష్టితాలపై నాకు ప్రాధాన్యత ఇచ్చాడు.’ (తిర్మిజి’)

2430 – [ 15 ] ( لم تتم دراسته ) (2/751)

وَرَوَاهُ ابْنُ مَاجَهُ عَنِ ابْنِ عُمَرَ. وَقَالَ التِّرْمِذِيُّ هَذَا حَدِيْثٌ غَرِيْبٌ وَعَمْرُو بْنُ دِيْنَارٍ الرَّاوِيِّ لَيْسَ بِالْقَوِيِّ.

2430. (15) [2/751అపరిశోధితం]

ఇబ్నె ‘ఉమర్‌ (ర) కథనం. (ఇబ్నె మాజహ్). తిర్మిజి’ దీన్ని ఏకోల్లేఖనం (‘గరీబ్) అన్నారు, ఎందుకంటే ‘అమ్ర్ బిన్ దీనార్ బలహీన కథకుడు.

2431 – [ 16 ] ( لم تتم دراسته ) (2/751)

وَعَنْ عُمَرَأَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم قَالَ: “مَنْ دَخَلَ السُّوْقَ فَقَالَ: “لَا إِلَهَ إِلَّا اللهُ وَحْدَهُ لَا شَرِيْكَ لَهُ لَهُ الْمُلْكُ وَلَهُ الْحَمْدُ يُحْيِيْ وَيُمِيْتُ وَهُوَ حَيُّ لَا يَمُوْتُ بِيَدِهِ الْخَيْرُ وَهُوَ عَلَى كُلِّ شَيْءٍ قَدِيْرٌ”. كَتَبَ اللهُ لَهُ أَلْفَ أَلْفَ حَسَنَةٍ. وَمَحَا عَنْهُ أَلْفَ أَلْفَ سَيِّئَةً. وَرَفَعَ لَهُ أَلْفَ أَلْفَ دَرَجَةً. وَّبَنَى لَهُ بَيْتًا فِيْ الْجَنَّةِ. رَوَاهُ التِّرْمِذِيُّ وَابْنُ مَاجَهُ وَقَالَ التِّرْمِذِيُّ: هَذَا حَدِيْثٌ غَرِيْبٌ وَفِيْ شَرْحِ السُّنَّةِ: “مَنْ قَالَ فِيْ سُوْقٍ جَامِعٍ يُبَاعُ فِيْهِ” بَدَلَ مَنْ “دَخَلَ السُّوْقَ “.

2431. (16) [2/751అపరిశోధితం]

‘ఉమర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, బజారులో ప్రవేశించిన తర్వాత ఈ దు’ఆను పఠించిన వ్యక్తి కొరకు అల్లాహ్‌ (త) పదిలక్షల పుణ్యాలు వ్రాస్తాడు. అదేవిధంగా పదిలక్షల పాపాలను తుడిచివేస్తాడు. అదేవిధంగా పదిలక్షల స్థానాలను ఉన్నతం చేస్తాడు. స్వర్గంలో అతని కొరకు ఒక భవనం నిర్మిస్తాడు. ఆ దు’ఆ ఇది:

లా ఇలాహ ఇల్లల్లాహు హ్దహు లాషరీక లహూ లహుల్ముల్కు, వలహుల్‌ ‘హమ్దు .యుహ్యీ వయుమీతు వహువహయ్యున్లాయమూతు బియది హిల్‌’ఖైరు, వహువ అలా కుల్లి షయ్ఇన్ఖదీర్‌.‘అల్లాహ్‌ తప్ప ఆరాధ్యు లెవరూ లేరు. ఆయనకు ఎవరూ సాటిలేరు, రాజ్యం ఆయనదే, స్తోత్రాలన్నీ ఆయనకే, ఆయన జీవం పోస్తాడు, మరణం ప్రసాదిస్తాడు, ఆయన శాశ్వత సజీవుడు, ఆయనకు చావురాదు, మంచి ఆయన చేతుల్లోనే ఉంది. ఆయన సమస్త విషయాలపై అధికారం గలవాడు.’ (తిర్మిజి’ – ఏకోల్లేఖనం, ఇబ్నె మాజహ్)

2432 – [ 17 ] ( لم تتم دراسته ) (2/752)

وَعَنْ مُعَاذِ بْنِ جَبَلٍ قَالَ: سَمِعَ النَّبِيُّ صلى الله عليه وسلم رَجُلًا يَّدْعُوْ يَقُوْلُ: اَللّهُمَّ إِنِّيْ أَسْأَلُكَ تَمَامَ النِّعْمَةِ فَقَالَ: “أَيُّ شَيْءٍ تَمَامُ النِّعْمَةِ؟ “قَالَ: دَعْوَةٌ أَرْجُوْ بِهَا خَيْرًا. فَقَالَ: “إِنَّ مِنْ تَمَامَ النِّعْمَةِ دُخُوْلَ الْجَنَّةِ وَالْفَوْزَ مِنَ النَّارِ”. وَسَمِعَ رَجُلًا يَقُوْلُ: يَا ذَا الْجَلَالِ وَالْإِكْرَامِ فَقَالَ: “قَدْ اسْتُجِيْبَ لَكَ فَسَلْ”. وَسَمِعَ النَّبِيُّ صلى الله عليه وسلم رَجُلًا وَهُوَ يَقُوْلُ: اَللّهُمَّ إِنِّيْ أَسْأَلُكَ الصَّبْرَ فَقَالَ: “سَأَلْتَ اللهَ الْبَلَاءَ فَاسْأَلْهُ الْعَافِيَةَ”. رَوَاهُ التِّرْمِذِيُّ.

2432. (17) [2/752అపరిశోధితం]

ము’ఆజ్‌’ బిన్‌ జబల్‌ (ర) కథనం: ప్రవక్త (స) ఒక వ్యక్తిని ఈ దు’ఆ పఠిస్తూ ఉండగా విన్నారు:

అల్లాహుమ్మ ఇన్నీ అస్అలుక తమామన్నేమతి — ‘ఓ అల్లాహ్! నేను నిన్ను నీ అనుగ్రహాలన్నిటినీ కోరుతున్నాను.’ ప్రవక్త (స)ను ఆ వ్యక్తిని, ‘అనుగ్రహాలన్నీ అంటే అర్థం ఏమిటి?’ అని ప్రశ్నించారు. ఆ వ్యక్తి, ‘ఈ దు’ఆ, దీనిద్వారా మంచిని ఆశిస్తున్నాను,’ అని అన్నాడు. అప్పుడు ప్రవక్త(స) అనుగ్రహమంతా అంటే స్వర్గంలోనికి ప్రవేశించడం, నరకం నుండి తప్పించుకోవటం అన్నిటికంటే గొప్ప అనుగ్రహం ఇదే,’ అని అన్నారు.

ప్రవక్త (స) మరో వ్యక్తిని యా ల్జలాలివల్ఇక్రామ్‌’‘అని అంటూ ఉండగా విన్నారు. అంటే ఓ గౌరవోన్నతులు గలవాడా! ప్రవక్త (స) ”మరయితే నీ విన్నపము తప్ప కుండా స్వీకరించబడుతుంది, నువ్వు అడుగుతూ పో,” అని అన్నారు.

ప్రవక్త (స) ఒక వ్యక్తిని, అల్లాహుమ్మ ఇన్నీ అస్అలుకస్సబ్,— ‘ఓ అల్లాహ్‌ నాకు సహించే భాగ్యం ప్రసాదించు,’ అని ప్రార్థిస్తూ ఉండగా విన్నారు. అప్పుడు ప్రవక్త (స), ‘నువ్వు కష్టాన్ని, ఆపదల్ని గురించి అర్థిస్తున్నావు, నువ్వు క్షేమాన్ని అర్థించు,’ అని అన్నారు. (తిర్మిజి’)

2433 – [ 18 ] ( صحيح ) (2/752)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَنْ جَلَسَ مَجْلِسًا فَكَثُرَ فِيْهِ لَغَطُهُ. فَقَالَ قَبْلَ أَنْ يَّقُوْمَ: “سُبْحَانَكَ اَللّهُمَّ وَبِحَمْدِكَ أَشْهَدُ أَنْ لَّا إِلَهَ إِلَّا أَنْتَ أَسْتَغْفِرُكَ وَأَتُوْبُ إِلَيْكَ” إِلَّا غُفِرَ لَهُ مَا كَانَ فِيْ مَجْلِسِهِ ذَلِكَ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَالْبَيْهَقِيُّ فِيْ الدَّعْوَاتِ الْكَبِيْرِ.

2433. (18) [2/752దృఢం]

అబూహురైరహ్‌ (ర) కథనం, ప్రవక్త (స) ప్రవచనం: అసహజ వచనాలు గల, వ్యర్థమాటల సభలో కూర్చోని, ఆ సభనుండి లేచినపుడు ఒకవేళ ఈ దు’ఆ పఠిస్తే ఆ సభలో జరిగిన పాపాలన్నీ తొలగిపోతాయి. అంటే క్షమించబడతాయి:

సుబ్హానకల్లాహుమ్మ వబిహమ్దిక అష్హదు అల్లాయిలాహ ఇల్లా అన్ అస్తగ్ఫిరుక అతూబు ఇలైక — ‘ఓ అల్లాహ్‌ మేము నీ పరిశుద్ధతను స్తుతిస్తున్నాము, నీ గొప్పతనాన్ని స్మరిస్తున్నాము, నీవు తప్ప ఆరాధ్యులెవరూ లేరని సాక్ష్యం ఇస్తున్నాము, నిన్నే క్షమాపణ వేడుకుంటున్నాము. ఇంకా నీ వైపు మరలుతున్నాము. (బైహఖీ-ద’అవా తిల్ కబీర్, తిర్మిజి’)

2434 – [ 19 ] ( لم تتم دراسته ) (2/752)

وَعَنْ عَلِيٍّ: أَنَّهُ أُتِيَ بِدَابَّةٍ لِيَرْكَبَهَا فَلَمَّا وَضَعَ رِجْلَهُ فِيْ الرِّكَابِ قَالَ: بِسْمِ اللهِ فَلَمَّا اسْتَوَى عَلَى ظَهْرِهَا قَالَ: اَلْحَمْدُ لِلّهِ ثُمَّ قَالَ: (سُبْحَانَ الّذِيْ سَخَّرَ لَنَا هَذَا وَمَا كُنَّا لَهُ مُقْرِنِيْنَ وَإِنَّا إِلَى رَبِّنَا لَمُنْقَلِبُوْنَ، 43: 13) ثُمَّ  قَالَ: اَلْحَمْدُ لِلّهِ ثَلَاثًا وَاللهُ أَكْبَرُ ثَلَاثًا. سُبْحَانَكَ إِنِّيْ ظَلَمْتُ نَفْسِيْ فَاغْفِرْ لِيْ فَإِنَّهُ لَا يَغْفِرُ الذُّنُوْبَ إِلَّا أَنْتَ. ثُمَّ ضَحِكَ. فَقِيْلَ: مِنْ أَيِّ شَيْءٍ ضَحِكْتَ يا أَمِيْرَ الْمُؤْمِنِيْنَ؟ قَالَ: رَأَيْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم صَنَعَ كَمَا صَنَعْتُ ثُمَّ ضَحِكَ. فَقُلْتُ: مِنْ أَيِّ شَيْءٍ ضَحِكْتَ يَا رَسُوْلَ اللهِ؟ قَالَ: “إِنَّ رَبَّكَ لَيَعْجَبُ مِنْ عَبْدِهِ إِذَا قَالَ: رَبِّ اغْفِرْ لِيْ ذُنُوْبِيْ. يَقُوْلُ: يَعْلَمُ أَنَّهُ لَا يَغْفِرُ الذُّنُوْبَ غَيْرِيْ” .رَوَاهُ أَحْمَدُ وَالتِّرْمِذِيُّ وَأَبُوْ دَاوُد.

2434. (19) [2/752అపరిశోధితం]

‘అలీ (ర) వాహనంగా ఒక జంతువును తీసుకు రావడం జరిగింది. అలీ (ర) దానిపై ఎక్కి రికాబ్లో కాళ్ళుపెట్టి ‘బిస్మిల్లాహ్‘ అని పఠించారు. నిదానంగా వీపుపై కూర్చున్న తర్వాత, అల్‌’హమ్దులిల్లాహ్‌’ అన్నారు. ఆ తర్వాత ఈ దు’ఆ పఠించారు:

సుబ్హానల్లజీ ఖ్ఖరలనా హాజవమాకున్నా లహు ముఖ్రినీన ఇన్నా ఇలా రబ్బినా లమున్ఖలిబూన్‌.” (సూ. అజ్జు’ఖ్రుఫ్, 43:13) — ‘ఆయన పరిశుద్ధుడు, ఆయనే దీన్ని మా కొరకు ఏర్పాటు చేసాడు. లేకపోతే దాన్ని మనం అధీనంలో చేసుకునే శక్తి మనకెక్కడిది. మనం మన ప్రభువు వైపునకు మరలేవారమే.’ ఆ తరువాత మళ్ళీ మూడుసార్లు అల్‌’హమ్దులిల్లాహ్, మూడుసార్లు అల్లాహు అక్బర్ అని పలికి, ఆ తరువాత, సుబ్‌’హానక ఇన్నీ లమ్తు నఫ్సీ గ్ఫిర్లీ ఫఇన్నహు లాయగ్ఫిరుజ్జునూ ఇల్లా అన్ — ‘ఓ నా ప్రభూ నీవు పరిశుద్ధుడవు, నాపై నేను అన్యాయం చేసుకున్నాను. నన్ను క్షమించు, ఎందుకంటే నీవే క్షమించేవాడవు.’

ఆ తరువాత ‘అలీ (ర) నవ్వసాగారు. ఆయన్ను ఓ నాయకుడా! మీరెందుకు నవ్వుతున్నారని ప్రశ్నించడం జరిగింది. దానికి ‘అలీ (ర) సమాధాన మిస్తూ ప్రవక్త (స)ను కూడా ఇలాగే చేస్తుండగా చూచాను. అందువల్ల నేను కూడా అలాగే చేసాను. నేను ప్రవక్త (స) ను మీలాగే ఎందుకు నవ్వారని అడిగాను. దానికి ప్రవక్త (స), ”అల్లాహ్‌ (త) తన దాసునిపట్ల సంతోషిస్తాడు. దాసుడు ఇలా పలికి నపుడు, రబ్బిగ్ఫిర్లీ జునూబీ — ‘ఓ నా ప్రభూ! నా పాపాలను క్షమించు.’ అల్లాహ్‌ తప్ప తనను ఎవరూ క్షమించలేరని దాసునికి తెలుసున్నమాట అని అంటాడు. (అ’హ్మద్‌, తిర్మిజి’, అబూ దావూద్‌)

2435 – [ 20 ] ( صحيح ) (2/753)

وَعَنِ ابْنِ عُمَرَ قَالَ: كَانَ النَّبِيُّ صلى الله عليه وسلم إِذَا وَدَّعَ رَجُلًا أَخَذَ بِيَدِهِ فَلَا يَدَعْهَا حَتَّى يَكُوْنَ الرَّجُلُ هُوَ يَدَعُ يَدَ النَّبِيِّ صلى الله عليه وسلم وَيَقُوْلُ: “أسْتَوْدِعُ اللهَ دِيْنَكَ وَأَمَانَتَكَ وَآخِرَ عَمَلِكَ”.

وَفِيْ رِوَايَةٍ “خَوَاتِيْمَ عَمَلِكَ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَأَبُوْ دَاوُدَ وَابْنُ مَاجَهُ.  وَفِيْ رِوَايَتِهِمَا لَمْ يُذْكَرْ: “وَآخِرَ عَمَلِكَ”.

2435. (20) [2/753దృఢం]

‘అబ్దుల్లా బిన్‌ ‘ఉమర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ఎవరినైనా వీడ్కోలు పలికినపుడు ఆత్మీయతతో అతని చేయి పట్టుకుంటారు. తాను స్వయంగా అతని చేతిని వదలరు. చివరికి ఆ వ్యక్తి వెళ్ళగోరుతూ తన చేతిని విడిపించుకుంటాడు. వీడ్కోలు పలికినపుడు ఈ దు’ఆను పఠిస్తారు:

అస్తవ్ది ఉల్లాహ దీనక అమానతక ఆఖిర అమలిక — ‘నీ ధర్మాన్ని, నీ అమానతును, నీ చివరి ఆచరణను అల్లాహ్‌కు అప్పగిస్తున్నాను.’

మరో ఉల్లేఖనంలో ఇలా ఉంది, ” ఖవాతీము అమలిక” — ‘నీ చివరి ఆచరణలు’ అని ఉంది. [80] (తిర్మిజి’, అబూ దావూద్‌, ఇబ్నె మాజహ్)

2436 – [ 21 ] ( صحيح ) (2/753)

وَعَنْ عَبْدِ اللهِ الْخِطْمِيِّ قَالَ: كَانَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم إِذَا أَرَادَ أَنْ يَسْتَوْدَعَ الْجَيْشَ قَالَ: “أسْتَوْدِعُ اللهَ دِيْنَكُمْ وَأَمَانَتَكُمْ وَخَوَاتِيْمَ أَعْمَالِكُمْ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ.

2436. (21) [2/753దృఢం]

‘అబ్దుల్లాహ్‌ ‘ఖ’త్‌మియ్యి (ర) కథనం: ప్రవక్త (స) సైన్యాన్ని పంపినపుడు ఈ దు’ఆను పఠించేవారు:

స్తౌది ఉల్లాహ దీనకుమ్ అమానతకుమ్ఖవాతీమ ఆమాలికుమ్‌” — ‘నేను మీ ధర్మాన్ని, మీ అమానతులను, మీ చివరి ఆచరణలను అల్లాహ్‌కు అప్పగిస్తున్నాను.’ (అబూ దావూద్‌)

2437 – [ 22 ] ( لم تتم دراسته ) (2/753)

وَعَنْ أَنَسٍ قَالَ: جَاءَ رَجُلٌ إِلَى النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ: يَا رَسُوْلَ اللهِ إِنِّيْ أُرِيْدُ سَفَرًا فَزَوِّدْنِيْ فَقَالَ: “زَوَّدَكَ اللهُ التَّقْوَى”. قَالَ: زِدْنِيْ قَالَ: “وَغَفَرَ ذَنْبَكَ” .قَالَ: زِدْنِيْ بِأَبِيْ أَنْتَ وَأُمِّيْ قَالَ: “وَيَسَّرَ لَكَ الْخَيْرَ حَيْثُمَا كُنْتَ”.  رَوَاهُ التِّرْمِذِيُّ. وَقَالَ: هَذَا حَدِيْثٌ حَسَنٌ غَرِيْبٌ.

2437. (22) [2/753అపరిశోధితం]

అనస్‌ (ర) కథనం: ప్రవక్త (స) వద్దకు ఒక వ్యక్తి వచ్చి, ”ఓ అల్లాహ్‌ ప్రవక్తా! నేను ప్రయాణంలో వెళ్ళాలనుకుంటున్నాను, తమరు నాకు ప్రయాణ సామగ్రి ఇవ్వండి అంటే నా గురించి దు’ఆ చేయండి” అని విన్నవించుకున్నాడు:

ప్రవక్త (స) జవ్వదకల్లా హత్తఖ్వా — ‘అల్లాహ్‌ (త) నీకు దైవభీతిని, దైవభక్తిని ప్రసాదించుగాక!’ అని దీవించారు. ఆ వ్యక్తి మరి కాస్త దు’ఆ చేయండి ప్రవక్తా! అని విన్నవించుకున్నాడు. ప్రవక్త (స) గఫరజమ్బక — ‘అల్లాహ్‌ నీ పాపాలను క్షమించుగాక!’ అని అన్నారు. ఆ వ్యక్తి, ‘నా తల్లి దండ్రులు మీ త్యాగంకాను మరికొంత దు’ఆ చేయండి,’ అని అన్నాడు. ప్రవక్త (స) యస్సరలకల్ఖైరహైసు మా కున్— ‘నీ వెక్కడ ఉన్నా, అల్లాహ్‌ (త) మంచిని నీ కొరకు సులభతరం చేయుగాక!’ అని దీవించారు. (తిర్మిజి’ – ప్రామాణికం, ఏకోల్లేఖనం)

2438 – [ 23 ] ( لم تتم دراسته ) (2/753)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: إِنَّ رَجُلًا قَالَ: يَا رَسُوْلَ اللهِ إِنِّيْ أُرِيْدُ أَنْ أُسَافِرَ فَأَوْصِنِيْ قَالَ: “عَلَيْكَ بِتَقْوَى اللهِ وَالتَّكْبِيْرِ عَلَى كُلِّ شَرَفٍ”. قَالَ: فَلَمَّا وَلَّى الرَّجُلُ قَالَ: “اَللّهُمَّ اَطْوِ لَهُ الْبُعْدَ وَهَوِّنْ عَلَيْهِ السَّفَرَ”. روَاهُ التِّرْمِذِيُّ .

2438. (23) [2/753అపరిశోధితం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) వద్దకు ఒక వ్యక్తి వచ్చి, ‘నేను ప్రయాణానికి వెళ్ళాలను కుంటున్నాను. నాకు హితబోధచేయండి,’ అని అన్నాడు. ప్రవక్త (స):

”దైవభీతిని అవలంబించు, నీవు ఎక్కడున్నా దైవభీతితో ఉండు, ఇంకా ప్రతి ఎత్తుగా ఉండే ప్రాంతంలో ‘అల్లాహు అక్బర్ ‘ అని పలుకు,” అని అన్నారు. అతడు వెను తిరిగి వెళ్ళినపుడు ప్రవక్త (స) అతని గురించి ఈ దు’ఆ చేసారు: అల్లాహుమ్మ త్వి లహుల్బు, హవ్విన్అలైహిస్సఫర — ‘ఓ నా ప్రభూ! ఇతని దూరాన్ని చుట్టి వేయి, ఇతని ప్రయాణాన్ని సులభతరం చేయి.’ (తిర్మిజి’)

2439 – [ 24 ] ( لم تتم دراسته ) (2/753)

وَعَنِ ابْنِ عُمَرَقَالَ: كَانَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم إِذَا سَافَرَ فَأَقْبَلَ اللَّيْلُ قَالَ: “يَا أَرْضُ رَبِّيْ وَربُّكِ اللهُ أَعُوْذُ بِاللهِ مِنْ شَرِّكِ وَشَرِّ مَا فِيْكِ وَشَرِّ مَا خُلَقَ فِيْكِ وَشَرِّ مَا يَدُبُّ عَلَيْكِ وَأَعُوْذُ بِاللهِ مِنْ أَسَدٍ وَأَسْوَدَ وَمِنَ الْحَيَّةِ وَالْعَقْرَبِ وَمِنْ شَرِّ سَاكِنِ الْبَلَدِ وَمِنْ شَرِّ وَّالِدٍ وَمَا وَلَدَ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ.

2439. (24) [2/753అపరిశోధితం]

ఇబ్నె ‘ఉమర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రయాణంలో రాత్రయితే ఈ దు’ఆ పఠించేవారు:

యా అర్‌’దు రబ్బీ వరబ్బుకిల్లాహు ఊజు బిల్లాహి మిన్షర్రికి వషర్రిమా ఫీకి వషర్రిమాఖులిఖ ఫీకి వషర్రిమా యుదిబ్బు అలైకి ఊజుబిల్లాహి మిన్దిన్వఅస్వ మినల్‌ ‘హయ్యతి వల్‌ ‘అఖ్రబి వమిన్షర్రి సాకినిల్బలది వమిన్వాలిదివ్వ మా వలద.” — ‘ఓ నేల! నీకు నాకు ప్రభువు అల్లాహ్‌ ఒక్కడే. నీ చెడు నుండి నీలో ఉన్న చెడు నుండి, నీలో ఉన్న దాన్ని చెడు నుండి, నీ పైన నడిచేవాని చెడు నుండి నేను అల్లాహ్‌ను శరణు కోరుతున్నాను. సింహం మరియు నల్లసర్పం నుండి, తేలు నుండి ఈ భూమిపై ఉన్నవాళ్ళ చెడు నుండి, ఇబ్లీసు మరియు వాడి సంతానం చెడు నుండి నీ శరణు కోరుతున్నాను.” (అబూ దావూద్‌)

2440 – [ 25 ] ( لم تتم دراسته ) (2/754)

وَعَنْ أَنَسٍ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: كَانَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم إِذَا غَزَا قَالَ: “اَللّهُمَّ أَنْتَ عَضُدِيْ وَنَصِيْرِيْ بِكَ أَحُوْلُ وَبِكَ أَصُوْلُ وَبِكَ أُقَاتِلُ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَأَبُوْ دَاوُدَ  .

2440. (25) [2/754అపరిశోధితం]

అనస్‌ (ర) కథనం: ప్రవక్త (స) జిహాద్‌కు బయలు దేరితే ఈ దు’ఆ పఠిస్తారు:

అల్లాహుమ్మ అన్ దుదీ సీరీ బిక హూలు వబిక సూలు వబిక ఉఖాతిలు.” — ‘ఓ అల్లాహ్‌! నీవే నా కండబలానివి, సహాయకుడివీను, నీ శక్తివల్లే తిరుగుతున్నాను, నడుస్తున్నాను. నీ శక్తివల్లే దాడిచేస్తున్నాను. ఇంకా నీ సహవాసంతోనే జిహాద్‌ చేస్తున్నాను.’ (తిర్మిజి’, అబూ దావూద్‌)

2441 – [ 26 ] ( لم تتم دراسته ) (2/754)

وَعَنْ أَبِيْ مُوْسَى: أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم كَانَ إِذَا خَافَ قَوْمًا قَالَ: “اَللّهُمَّ إِنَّا نَجْعَلُكَ فِيْ نُحُوْرِهِمْ وَنَعُوْذُ بِكَ مِنْ شُرُوْرِهِمْ”. رَوَاهُ أَحْمَدُ وَأَبُوْ دَاوُدَ.

2441. (26) [2/754అపరిశోధితం]

అబూ మూసా (ర) కథనం: ప్రవక్త (స) ఎప్పుడైనా ఏ జాతికైనా భయపడితే ఈ దు’ఆ పఠించేవారు:

అల్లాహుమ్మ ఇన్నా నజ్అలుక ఫీనుహూరి హిమ్వనఊజుబిక మిన్షురూరిహిమ్ — ‘ఓ అల్లాహ్‌! ఆ శత్రువులకు వ్యతిరేకంగా నిన్ను పెడుతున్నాము. వారి చెడు నుండి నీ శరణు కోరుతున్నాము.’ (అ’హ్మద్, అబూ దావూద్‌)

2442 – [ 27 ] ( صحيح ) (2/754)

وَعَنْ أُمِّ سَلَمَةَ رَضِيَ اللهُ عَنْهَا أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم كَانَ إِذَا خَرَجَ مِنْ بَيْتِهِ قَالَ: “بِسْمِ اللهِ تَوَكَّلْتُ عَلَى اللهِ. اَللّهُمَّ إِنَّا نَعُوْذُ بِكَ مِنْ أَنْ نَّزِلَّ. أَوْ نَضِلَّ أَوْ نَظْلِمَ أَوْ نُظْلِمَ أَوْ نُجْهَلَ أَوْ يُجْهَلَ عَلَيْنَا”. رَوَاهُ أَحْمَدُ وَالتِّرْمِذِيُّ وَالنَّسَائِيُّ. وَقَالَ التِّرْمِذِيُّ : هَذَا حَدِيْثٌ حَسَنٌ صَحِيْحٌ

وَفِيْ رِوَايَةِ أَبِيْ دَاوُدَ وَابْنُ مَاجَهُ قَالَتْ أُمِّ سَلَمَةَ: مَا خَرَجَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم مِنْ بَيْتِيْ قَطُّ إِلَّا رَفَعَ طَرْفَهُ إِلَى السَّمَاءِ فَقَالَ: “اَللّهُمَّ إِنِّيْ أَعُوْذُ بِكَ أَنْ أَضِلَّ أَوْ أَضَلَّ أَوْ أَظْلِمَ أَوْ أُظْلَمَ أَوْ أَجْهَلَ أَوْ يُجْهَلُ عَلَيَّ”.

2442. (27) [2/754దృఢం]

ఉమ్మెసలమహ్ (ర) కథనం: ప్రవక్త (స) ఇంటి నుండి బయటకు వెళ్ళినపుడు ఈ దు’ఆ పఠించేవారు:

బిస్మిల్లాహి తవక్కల్తుఅలల్లాహి, అల్లాహుమ్మ ఇన్నా ఊజుబిక మిన్అన్ జిల్ల అన్జిల్ల అవ్జ్లి అవ్నుజ్లమ అవ్నజ్‌’హల అవ్యుజ్‌’హల అలైనా.” — ‘అల్లాహ్‌ పేరుతో బయలు దేరు తున్నాను. ఇంకా అల్లాహ్‌నే నమ్ము కున్నాను, ఓ అల్లాహ్! జారిపోవడం నుండి, మార్గ భ్రష్టతకు గురి కావటం నుండి, ఇతరులకు అన్యాయం చేయటా న్నుండి, మాకు అన్యాయం జరగటా న్నుండి, తెలివి తక్కువ పదాలు పలకటాన్నుండి మేము తెలివి తక్కువ తనానికి గురికావటాన్నుండి, నీ శరణు కోరుతున్నాను.’ (తిర్మిజి’, అ’హ్మద్‌, నసాయి’)

మరియు అబూ దావూద్‌ మరియు ఇబ్నె మాజహ్ ఉల్లేఖ నంలో ఇలా ఉంది, ”ఉమ్మె సలమహ్ (ర) కథనం: ప్రవక్త (స) ను ఇంటి నుండి బయటకు వెళ్ళి నపుడు ఆకాశం వైపు చూస్తూ ఈ దు’ఆను పఠిస్తారు:

అల్లాహుమ్మ ఇన్నీ ఊజుబిక అన్దిల్ల అవ్ల్ల అవ్జ్లమ అవ్జ్లిమ అవ్అజ్హిల అవ్యుజ్హలఅలయ్య.” — ‘ఓ అల్లాహ్‌ నేను ఇతరులను మార్గభ్రష్టతకు గురిచేయటా న్నుండి, మేము అపమార్గానికి గురిచేయ బడటాన్నుండి లేదా మేము అన్యాయం చేయటా న్నుండి, లేదా మేము అన్యాయం చేయబడ టాన్నుండి లేదా అనుచిత మాటలు పలకటం నుండి లేదా మాపై అనుచిత మాటలు పలకబడటం నుండి, నీ శరణు కోరుతున్నాను.” (అబూ దావూద్‌, ఇబ్నె మాజహ్)

2443 – [ 28 ] ( لم تتم دراسته ) (2/755)

وَعَنْ أَنَسٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِذاَ خَرَجَ الرَّجُلُ مِنْ بَيْتِهِ فَقَالَ: “بِسْمِ اللهِ تَوَكَّلْتُ عَلَى اللهِ لَا حَوْلَ وَلَا قُوَّةَ إِلَّا بِاللهِ”. يَقَالُ لَهُ حَيْنَئِذٍ هُدِيْتَ وَكُفِيْتَ وَوُقِيْتَ فَيَتَنَحَّى لَهُ الشَّيْطَانُ. وَيَقُوْلُ شَيْطَانٌ آخَرُ: كَيْفَ لَكَ بِرَجُلٍ قَدْ هُدِيَ. وَكُفِيَ وَوُقِيَ”  .رَوَاهُ أَبُوْ دَاوُدَ وَرَوَى التِّرْمِذِيُّ إِلَى قَوْلِهِ: “الشَّيْطَانُ”.

2443. (28) [2/755అపరిశోధితం]

అనస్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఎవరైనా ఇంటి నుండి బయలుదేరి ఈ దు’ఆను పఠిస్తే, దానికి సమాధానంగా, ”నీకు రుజుమార్గం ఇవ్వబడింది, నీకు ఇది సరిపోతుంది, నీవు క్షేమంగా ఉన్నావు.” అది విని షై’తాన్‌ అక్కడినుండి తొలగిపోతాడు. మరో షై’తాన్‌ మొదటి షై’తాన్‌తో, ”అతనికి రుజుమార్గం చూప బడింది, అతన్ని రక్షణలోకి తీసుకోబడింది, అతన్ని కనిపెట్టడం జరిగింది. మరి ఇప్పుడు ఎలా అతనిపై పట్టుసాధిస్తావు,” అని అంటాడు. ఆ దు’ఆ ఇది:

బిస్మిల్లాహి తవక్కల్తు అలల్లాహి లాహౌల వలా ఖువ్వత ఇల్లాబిల్లాహ్ — ‘అల్లాహ్‌ పేరుతో నేను బయలుదేరుతున్నాను. ఇంకా నేను అల్లాహ్‌నే నమ్ముకున్నాను. పాపాలకు దూరంగా ఉండే శక్తి, సత్కార్యాలు చేసే శక్తి కేవలం అల్లాహ్‌ సహాయం వల్లే లభిస్తుంది.’ (అబూ దావూద్, తిర్మిజి’)

2444 – [ 29 ] ( لم تتم دراسته ) (2/755)

وَعَنْ أَبِيْ مَالِكٍ الْأَشْعَرِيُّ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: إِذَا وَلَجَ الرَّجُلُ بَيْتَهُ فَلْيَقُلْ: “اَللّهُمِّ إِنِّيْ أَسْأَلُكَ خَيْرَ الْمَوْلِجِ وَخَيْرَ الْمَخْرَجِ بِسْمِ اللهِ وَلَجْنَا وَعَلَى اللهِ رَبِّنَا تَوَكَّلْنَا ثُمَّ لَيُسَلِّمْ عَلَى أَهْلِهِ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ.

2444. (29) [2/755అపరిశోధితం]

అబూ మాలిక్‌ అష్‌’అరీ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, తమ ఇంట్లో ప్రవేశించిన వారు ఈ దు’ఆ పఠించి సలామ్‌ చేయాలి:

అల్లాహుమ్మ ఇన్నీ అస్అలుక ఖైరల్మౌలిజి ఖైరల్మఖ్రజి, బిస్మిల్లాహి వలజ్నా అలల్లాహి రబ్బినా తవక్కల్నా.” — ‘ఓ అల్లాహ్‌! నేను నిన్ను ఇంట్లో ప్రవేశించే శుభాన్ని అర్థిస్తున్నాను. ఇంట్లోనుండి బయటకువచ్చే శుభాన్ని అర్థిస్తున్నాను. అల్లాహ్‌ పేరుతో ప్రవేశించాము. మా ప్రభువునే నమ్ము కున్నాము.’ (అబూ దావూద్‌)

2445 – [ 30 ] ( صحيح ) (2/755)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم كَانَ إِذَا رَفَّأَ الْإِنْسَانَ إِذَا تَزَوَّجَ قَالَ: “بَارَكَ اللهُ لَكَ وَبَارَكَ عَلَيْكُمَا وَجَمَعَ بَيْنَكُمَا فِيْ خَيْرٍ”. رَوَاهُ أَحْمَدُ وَالتِّرْمِذِيُّ وَأَبُوْ دَاوُدَ وَابْنُ مَاجَهُ.

2445. (30) [2/755దృఢం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) నూతన వధూ వరులకు ఇలా ఆశీర్వదించేవారు:

బారకల్లాహులక వబారకఅలైకుమా వజమ బైనకుమా ఫీఖైరిన్”– ‘అల్లాహ్‌ (త) మీపై శుభాన్ని అవతరింపజేయు గాక! ఇంకా మీ ఇద్దరి మధ్య మంచిలో ఐక్యతగా ఉండే భాగ్యం ప్రసాదించు గాక!’ (అ’హ్మద్‌, తిర్మిజి’, అబూ దావూద్‌, ఇబ్నె మాజహ్)

2446 – [ 31 ] ( حسن ) (2/755)

وَعَنْ عَمْرِو بْنِ شُعَيْبِ عَنْ أَبِيْهِ عَنْ جَدِّهِ عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ: إِذَا تَزَوَّجَ أَحَدُكُمْ امْرَأَةً أَوِ اشْتَرَى خَادِمًا فَلْيَقُلْ “اَللّهُمَّ إِنِّيْ أَسْأَلُكَ خَيْرَهَا وَخَيْرَ مَا جَبَلْتَهَا عَلَيْهِ وَأَعُوْذُ بِكَ مِنْ شَرِّهَا وَشَرِّ مَا جَبَلْتَهَا عَلَيْهِ.

وَإِذَا اشْتَرَى بَعِيْرًا فَلْيَأْخُذْ بِذَرْوَةِ سَنَامِهِ وَلْيَقُلْ مِثْلَ ذَلِكَ.

وَفِيْ رِوَايَةٍ فِيْ الْمَرْأَةِ وَالْخَادِمِ: “ثُمَّ لْيَأْخُذْ بِنَاصِيَتِهَا وَلْيَدْعُ بِالْبَرَكَةِ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ وَابْنُ مَاجَهُ .

2446. (31) [2/755ప్రామాణికం]

‘అమ్ర్ బిన్‌ షుఐబ్‌ తన తండ్రి తాతల ద్వారా కథనం, ”ప్రవక్త (స) ప్రవచనం, ”మీరు స్త్రీతో వివాహం చేసుకున్నా, బానిసను కొన్నా ఈ దు’ఆ పఠించాలి:

అల్లాహుమ్మ ఇన్నీ అస్అలుకఖైరహా ఖైరమా జబల్తహాఅలైహి జుబిక మిన్ షర్రిహా షర్రిమా జబల్తహాఅలైహి.” — ‘ఓ అల్లాహ్‌ నేను నిన్ను దాని శుభాన్ని కోరుకుంటు న్నాను. నీవు దేనిపై సృష్టించావో దాని శుభాన్ని కోరుకుంటున్నాను. దాని చెడునుండి నేను శరణు కోరుతున్నాను. ఇంకా దేనిపై సృష్టించావో దాని చెడునుండి శరణుకోరుతున్నాను.’

ఒంటెను గానీ ఏదైనా జంతువును గానీ కొంటే దాని మూపురాన్ని, నుదురును పట్టుకొని ఈ దు’ఆను పఠించాలి. (అబూ దావూద్‌, ఇబ్నె మాజహ్)

2447 – [ 32 ] ( لم تتم دراسته ) (2/756)

وَعَنْ أَبِيْ بَكْرَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: دَعْوَاتُ الْمَكْرُوْبِ: “اَللّهُمَّ رَحْمَتَكَ أَرْجُوْ فَلَا تَكِلْنِيْ إِلَى نَفْسِيْ طَرْفَةَ عَيْنٍ وَأَصْلِحْ لِيْ شَأْنِيْ كُلَّهُ لَا إِلَهَ إِلَّا أَنْتَ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ

2447. (32) [2/756అపరిశోధితం]

అబూ బక్‌రహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ఆందోళనకు, అశాంతికి ఈ దు’ఆను పఠించాలి:

అల్లాహుమ్మ హ్మతక అర్జూ ఫలాతకిల్నీ ఇలా నఫ్సీ తరఫత ఐనిన్వఅస్లిహ్లీ షానీ కుల్లహూ లాలాహ ఇల్లా అం.” — ‘ఓ నా ప్రభూ! నేను నీ కారుణ్యాన్ని అర్థిస్తున్నాను. ఒక్క ఘడియ కూడా నన్ను నా అంతరాత్మ వైపు విడిచి పెట్టకు. నా పనులన్నిటినీ పరిష్కరించు. నీవు తప్ప ఆరాధనకు అర్హులు ఎవ్వరూ లేరు.’ (అబూ దావూద్‌)

2448 – [ 33 ] ( لم تتم دراسته ) (2/756)

وَعَنْ أَبِيْ سَعِيْدِ الْخُدْرِيِّ قَالَ: قَالَ رَجُلٌ: هُمُوْم لَزِمَتْنِيْ وَدُيُوْنٌ يَا رَسُوْلَ اللهِ قَالَ: “أَفَلَا أُعَلِّمُكَ كَلَامًا إِذَا قُلْتَهُ أَذْهَبَ اللهُ هَمَّكَ وَقَضَى عَنْكَ دَيْنَكَ؟” قَالَ: قُلْتُ: بَلَى قَالَ: “قُلْ إِذَا أَصْبَحْتَ وَإِذَا أَمْسَيْتَ: “اَللّهُمَّ إِنِّيْ أَعُوْذُ بِكَ مِنْ الْهَمِّ وَالْحُزْنِ. وَأَعُوْذُ بِكَ مِنْ العجزي و الكسلي و أعوذبك من البخلي و الجيني و أعوذبك من غَلَبَةِ الدَّيْنِ. وَقَهْرِ الرِّجَالِ”. قَالَ: فَفَعَلْتُ ذَلِكَ. فَأَذْهَبَ اللهُ هَمِّيْ وَقَضَى عَنيْ دَيْنِيْ. روَاهُ أَبُوْ دَاوُدَ.   

2448. (33) [2/756అపరిశోధితం]

అబూ స’యీద్‌ ‘ఖుద్రీ (ర) కథనం: ప్రవక్త (స) వద్దకు ఒక వ్యక్తి వచ్చి, ‘ఓ అల్లాహ్‌ ప్రవక్తా! నేను చాలా దుఃఖ విచారాల్లో ఉన్నాను. అప్పులతో అలమటిస్తున్నాను. తీర్చటానికి మార్గమేదీ కనబడ్డం లేదు. కనుక నేను చాలా కష్టాల్లో ఉన్నాను,’ అని అన్నాడు. దానికి ప్రవక్త (స) ‘నేను నీకు ఒక దు’ఆ నేర్పిస్తాను. నువ్వు దాన్ని ఉదయం సాయంత్రం పఠించు. అల్లాహ్‌ (త) నీ కష్టాలను, దుఃఖాన్ని దూరం చేస్తాడు, నీ అప్పును కూడా తీర్చివేస్తాడు,’ అని అన్నారు. దానికి ఆ వ్యక్తి, ‘అలాగే ఓప్రవక్తా! మీరు నాకు చూపెట్టండి,’ అని అన్నాడు. ప్రవక్త (స), ‘నువ్వు ఉదయం సాయంత్రం ఈ దు’ఆను పఠించు,’ అన్నారు. ఆ దు’ఆ ఇది:

అల్లాహుమ్మ ఇన్నీ ఊజుబిక మినల్హమ్మి వల్‌’హుజ్ని, ఊజుబిక మినల్‌ ‘అజ్‌’జి వల్కసలి, ఊజుబిక మినల్బుఖ్లి వల్జుబ్ని, ఊజుబిక మిన్‌ ‘గలబతిద్దైని ఖహ్రిర్రిజాల్‌.” — ‘ఓ నా ప్రభూ! దుఖం నుండి, విచారం నుండి నేను నీ శరణుకోరు తున్నాను,  ఓ నా ప్రభూ! లొంగుబాటు నుండి, అలసత్వంనుండి నేను నీ శరణు కోరుతు న్నాను. పిరికితనంనుండి, పిసినారితనం నుండి నేను నీ శరణుకోరుతున్నాను, అప్పుల ఆధిక్య తనుండి, ప్రజల వత్తిడినుండి నేను నీ శరణు కోరుతున్నాను.’

‘ఆ వ్యక్తి కథనం, ”నేను ప్రవక్త (స) హితబోధ ప్రకారం ఆచరించాను. ఈ దు’ఆ చదువుతూ ఉన్నాను. అల్లాహ్‌ (త) నా దుఃఖాన్ని, విచారాన్ని దూరం చేసాడు.” నా అప్పును కూడా తీర్చివేసాడు. (అబూ దావూద్‌)

2449 – [ 34 ] ( لم تتم دراسته ) (2/756)

وَعَنْ عَلِيٍّ: أَنَّهُ جَاءَهُ مَكَاتَبٌ فَقَالَ: إِنِّيْ عَجِزْتُ عَنْ كِتَابِيْ فَأَعِنِّيْ قَالَ: أَلَا أُعَلِّمُكَ كَلِمَاتٍ عَلَّمَنِيْهِنَّ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم لَوْ كَانَ عَلَيْكَ مِثْلُ جَبَلٍ كَبِيْرٍ دَيْنًا أَدَّاهُ اللهُ عَنْكَ. قُلْ: “اَللّهُمَّ اكْفِنِيْ بِحَلَالِكَ عَنْ حَرَامِكَ وَأَغْنِنِيْ بِفَضْلِكَ عَمَّنْ سِوَاكَ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَالْبَيْهَقِيُّ فِيْ الدَّعْوَاتِ الْكَبِيْرِ وَسَنَذْكُرُ حَدِيْثَ جَابِرٍ: “إِذَا سَمِعْتُمْ نُبَاحَ الْكِلَابِ” فِيْ بَابِ “تَغْطِيَةِ الْأَوَانِيْ” إِنْ شَاءَ اللهُ تَعَالى .

2449. (34) [2/756అపరిశోధితం]

‘అలీ (ర) కథనం: అతని వద్దకు ఒక ముకాతబ్‌ బానిస వచ్చి, ”నేను ఒప్పంద ధనాన్ని ఇవ్వలేక పోతున్నాను. చాలా కష్టంగా ఉంది. నాకు సహాయం చేయండి.” అని అన్నాడు. అప్పుడు ‘అలీ (ర) నేను నీకు కొన్ని వచనాలు చూపెట్టనా? ప్రవక్త (స) నాకు వీటిని తెలిపారు, ఒకవేళ నీపై పెద్ద కొండంత అప్పు ఉన్నా, అల్లాహ్‌ (త) దాన్ని తీర్చివేస్తాడు. నువ్వు ఈ దు’ఆ పఠించు అని అన్నారు:

అల్లాహుమ్మక్ఫినీ  బిహలాలికఅన్‌ ‘హరామిక వఅగ్నినీ బిఫద్లిక అమ్మన్సివాక.” — ‘ఓ నా ప్రభూ! పరిశుద్ధమైన సంపాదనతో నా అవసరాలన్నీ తీర్చు, అక్రమార్జన నుండి నన్ను కాపాడు. నీ అనుగ్రహాలతో నన్ను ఇతర విషయాల్లో నిరపేక్షా పరునిగా చెయ్యి.’ (తిర్మిజి’, బైహఖీ-ద’అవాతిల్ కబీర్)

—–

اَلْفَصْلُ الثَّالِثُ  మూడవ విభాగం 

2450 – [ 35 ] ( صحيح ) (2/757)

وَعَنْ عَائِشَةَ قَالَتْ: إِنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم كَانَ إِذَا جَلَسَ مَجْلِسًا أَوْ صَلّى تَكَلَّمَ بِكَلِمَاتٍ فَسَأَلْتُهُ عَنِ الْكَلِمَاتِ فَقَالَ: “إِنْ تَكَلَّمَ بِخَيْرٍ كَانَ طَابِعًا عَلَيْهِنَّ إِلَى يَوْمِ الْقِيَامَةِ وَإِنْ تَكَلَّمَ بِشَرٍّ كَانَ كَفَّارَةٌ لَهُ: “سُبْحَانَكَ اَللّهُمَّ وَبِحَمْدِكَ لَا إِلَهَ إِلَّا أَنْتَ أَسْتَغْفِرُكَ وَأَتُوْبُ إِلَيْكَ”. رَوَاهُ النَّسَائِيُّ.

2450. (35) [2/757దృఢం]

‘ఆయి’షహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ఎక్కడైనా కూర్చున్నా లేదా నమా’జ్‌ చేసినా తరువాత కొన్ని శుభవచనాలు పలికేవారు. నేను వాటి గురించి అడిగాను. దానికి ప్రవక్త (స), ‘ఈ శుభవచనాలకు ముందు ఏవైనా మంచి మాటలు మాట్లాడి ఉంటే వాటిపై ఇవి తీర్పుదినం వరకు ముద్రగా మారి పోతాయి. అంటే ఆ వచనాలు సురక్షితంగా ఉంటాయి. వాటి పుణ్యం ఎన్నడూ వ్యర్థం కాదు. ఏ విధంగా ముద్రవేయబడినది వ్యర్థంకాదో. ఒకవేళ వాటికన్నా ముందు చెడు మాట్లాడితే, ఈ వచనాలు వాటికి పరిహారంగా అవుతాయి. ఆ వచనాలు ఇవి:

సుబ్‌’హానక అల్లాహుమ్మ వబిహమ్దిక లాఇలాహ ఇల్లా అన్ అస్గ్ఫిరుక వఅతూబు ఇలైక” — ‘ఓ అల్లాహ్! నేను నీ పరిశుద్ధతను కొనియాడుతున్నాను. నిన్ను స్తుతిస్తున్నాను. నీవు తప్ప ఆరాధ్యులెవరూ లేరు, నేను క్షమాపణ కోరుతున్నాను. నీ వైపే పశ్చాత్తాపంతో మరలు తున్నాను.’ (నసాయి’)

2451 – [ 36 ] ( لم تتم دراسته ) (2/757)

وَعَنْ قَتَادَةَ: بَلَغَهُ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم كَانَ إِذَا رَأَى الْهِلَالَ قَالَ: “هِلَالُ خَيْرٍوَّرُشْدٍ هِلَالُ خَيْرٍوَّرُشْدٍ هِلَالُ خَيْرٍ وَّرُشْدٍ. آمَنْتُ بِالَّذِيْ خَلَقَكَ” ثَلَاثَ مَرَّاتٍ ثُمَّ يَقُوْلُ: “اَلْحَمْدُ لِلّهِ الَّذِيْ ذَهَبَ بِشَهْرِ كَذَا وَجَاءَ بِشَهْرِ كَذَا” . رَوَاهُ أَبُوْ دَاوُدَ .

2451. (36) [2/757అపరిశోధితం]

ఖతాదహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) మొదటి తేదీ నెల వంకను చూచి:

హిలాలుఖైరిన్వరుష్దిన్, హిలాలుఖైరిన్ రుష్దిన్, హిలాలుఖైరిన్ రుష్దిన్, మంతు బిల్లజీ‘ ‘ఖలఖక మూడుసార్లు, తరువాత, అల్ హమ్ దులిల్లా హిల్లజీహబ బిషహ్రిక వజాఅబిషహ్రి కజ అని పఠించేవారు.” (అబూ దావూద్‌)

‘ఈ నెలవంక మంచిదీ, పుణ్యప్రదమైనదీను. ఈ నెలవంక మంచిదీ పుణ్యప్రదమైనదీను, ఈ నెలవంక మంచిదీ పుణ్యప్రదమైనదీను. నిన్ను సృష్టించిన వాడిని నేను విశ్వసించాను. స్తోత్రాలన్నీ అల్లాహ్‌ (త) కొరకే. ఆ నెలను తీసుకువెళ్ళాడు, ఈ నెలను తీసుకు వచ్చాడు.’ (అబూ దావూద్‌)

2452 – [ 37 ] ( لم تتم دراسته ) (2/757)

وَعَنِ ابْنِ مَسْعُوْدٍ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم قَالَ: “مَنْ كَثُرَ هَمُّهُ فَلْيَقُلْ: اَللّهُمَّ إِنِّيْ عَبْدُكَ وَابْنُ عَبْدِكَ وَابْنُ أَمَتِكَ وَفِيْ قَبْضَتِكَ نَاصِيَتِيْ بِيَدِكَ مَاضٍ فِيَّ حُكْمِكَ عَدْلٌ فِيَّ قَضَاؤُكَ أَسْأَلُكَ بِكُلِّ اسْمٍ هُوَ لَكَ سَمَّيْتَ بِهِ نَفْسَكَ أَوْ أَنْزَلْتَهُ فِيْ كِتَابِكَ أَوْ عَلَّمْتَهُ أَحَدًا مِنْ خَلْقِكَ أَوْ أَلْهَمْتَ عِبَادَكَ أَوْ اسْتَأْثَرْتَ بِهِ فِيْ مَكْنُوْنِ الْغَيْبِ عَنْدَكَ أَنْ تَجْعَلَ الْقُرْآنَ رَبِيْعَ قَلْبِيْ وَجِلَاءَ هَمِّيْ وَغَمِّيْ مَا قَالَهَا عَبْدٌ قَطُّ إِلَّا أَذْهَبَ اللهُ غَمَّهُ وَأَبْدَلَهُ فَرْحًا”. رَوَاهُ رَزِيْنٌ .

2452. (37) [2/757అపరిశోధితం]

ఇబ్నె మస్‌’ఊద్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”చాలా అధికంగా దుఃఖం విచారంలో ఉన్న వ్యక్తి ఈ దు’ఆను పఠించాలి. దీన్ని పఠించిన వారి విచారాన్ని, దుఃఖాన్ని అల్లాహ్‌ (త) తొలగించివేస్తాడు. ఇంకా దానికి బదులుగా సుఖసంతో షాలను ప్రసాదిస్తాడు. ఆ దు’ఆ ఇది:

అల్లాహుమ్మ ఇన్నీ అబ్దుక, వబ్నుఅబ్దిక ,వబ్ను అమతిక, వఫీ ఖబ్‌’తిక, నాసియతీ బియదిక, మాది ఫిహుక్ము, అద్లున్ఫీ దావు ,అస్అలుక బికుల్లి ఇస్మిన్, హువలక మ్మై బిహి నఫ్సక, అవ్అన్‌’జల్హు ఫీ కితాబిక, అవ్అల్లమ్తహు హదన్మిన్ఖల్ఖిక, అవ్అల్హమ్ ఇబాదక, అవిస్తాసర్ బిహీ ఫీ మక్నూనిల్గైబి ఇందక, అన్తజ్అలల్ఖుర్ఆన రబీఅ ఖల్బీ జిలాఅ హమ్మి గమ్మీ.” — ‘ఓ నా ప్రభూ! నేను నీ దాసుణ్ణి, నీ దాసుని-నీ దాసి కుమారుణ్ని. నా నుదురు నీ చేతిలో ఉంది. నీవు జారీచేసే ప్రతి ఉత్తరువు నాపై అమలు జరుగుతుంది. నా విషయంలో నీవు చేసే ప్రతి తీర్పు న్యాయంతో కూడుకున్నది. నీవు నీ కోసం ఇష్టపడిన, నీ గ్రంథంలో అవతరింపజేసిన, నీవు నీ సృష్టికి నేర్పించిన, నీ అగో చర జ్ఞానంలో భద్రంగా ఉంచిన పేర్లను సాధనంగా చేసు కొని అర్థిస్తున్నాను. ఖుర్‌ఆన్‌ను నా హృదయానికి వసంతంగా నా కళ్ళకు జ్యోతిగా నా విచార దుఃఖాలను దూరం చేసే సాధనంగా చెయ్యి.’ (ర’జీన్‌)

2453 – [ 38 ] ( صحيح ) (2/758)

وَعَنْ جَابِرٍ قَالَ: كُنَّا إِذَا صَعِدْنَا كَبَّرَنَا وَإِذَا انَزَلَنَا سَبَّحَنَا. رَوَاهُ الْبُخَارِيُّ

2453. (38) [2/758దృఢం]

జాబిర్‌ (ర) కథనం: ”మేము ఎత్తైన ప్రదేశానికి ఎక్కి నప్పుడు ‘అల్లాహు అక్బర్ ‘ అని, క్రిందికి దిగినపుడుసుబ్హానల్లాహ్‘ అని పలికేవారం. (బు’ఖారీ)

2454 – [ 39 ] ( لم تتم دراسته ) (2/758)

وَعَنْ أَنَسٍ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم كَانَ إِذَا كَرَبَهُ أَمْرٌ يَقُوْلُ: “يَا حَيُّ يَا قَيُّوْمُ بِرَحْمَتِكَ أَسْتَغِيْثُ”. رَوَاهُ التِّرْمِذيُّ وَقَالَ: هَذَا حَدِيْثٌ غَرِيْبٌ وَلَيْسَ بِمَحْفُوْظٍ .

2454. (39) [2/758అపరిశోధితం]

అనస్‌ (ర) కథనం: ప్రవక్త (స) కు ఏదైనా పని కష్ట మైనదిగా ఉంటే  ఈ దు’ఆ పఠిస్తారు:

యాహయ్యు యా ఖయ్యూము. బిరహ్మతిక అస్తగీసు.” – ‘శాశ్విత సజీవుడా! అందరినీ ఆదుకునేవాడా! నేను నీ కారుణ్యం ద్వారా ఫిర్యాదు చేస్తున్నాను.” (తిర్మిజి’  – ఏకోల్లేఖనం, ఈ ‘హదీసు’ ఆధార పరంపర భద్రపరచ బడలేదు)

2455 – [ 40 ] ( لم تتم دراسته ) (2/758)

وَعَنْ أَبِيْ سَعِيْدِ الْخُدْرِيِّ قَالَ: قُلْنَا يَوْمَ الْخَنْدَقِ: “يَا رَسُوْلَ اللهِ هَلْ مِنْ شَيْءٍ نَقُوْلُهُ؟” فَقَدْ بَلَغَتِ الْقُلُوْبِ الْحَنَاجِرَ. قَالَ: نَعَمْ. “اَللَّهُمَّ اسْتُرْ عَوْرَاتِنَا وَآمِنْ رَوْعَاتِنَا”. قَالَ: فَضَرَبَ اللهُ وُجُوْهَ أَعْدَائِهِ بِالرِّيْحِ وَهَزَمَ اللهُ بِالرِّيْحِ. رَوَاهُ أَحْمَدُ.

2455. (40) [2/758-అపరిశోధితం]

అబూ స’యీద్‌ ‘ఖుద్రీ (ర) కథనం: కందక యుద్ధం నాడు మేము ప్రవక్త  (స)ను ఇలా ప్రశ్నించాము, ”ఓ అల్లాహ్‌ ప్రవక్తా! మా హృదయాలు గొంతులోకి వచ్చాయి, ఏదైనా దు’ఆ ఉంటే చెప్పండి. మేము చదవడానికి.” అంటే మేము చాలా అశాంతికి, ఆందోళనకు గురిఅయ్యాము, అని అర్థం. ప్రవక్త (స) అవును, ఆ దు’ఆ ఇది అని అన్నారు:

అల్లాహు మ్మస్తుర్‌ ‘అవ్రాతినా ఆమిన్రౌ తినా.” — ‘ఓ అల్లాహ్‌! మా లోపాలను కప్పి పుచ్చు, ఇంకా మాకు భయం నుండి ప్రశాంతతను ప్రసాదించు.’

ఉల్లేకనకర్త కథనం: ఈ దు’ఆ శుభం వల్ల అల్లాహ్‌ తుఫాను గాలి ద్వారా శత్రువులను వెనుతిరిగేటట్లు చేసాడు. ఇంకా వారిని ఓటమికి అవమానానికి గురిచేసాడు. (అ’హ్మద్‌)

2456 – [ 41 ] ( لم تتم دراسته ) (2/758)

وَعَنْ بُرَيْدَةَ قَالَ: كَانَ النَّبِيُّ صلى الله عليه وسلم إِذَا دَخَلَ السُّوْقَ قَالَ: “بِسْمِ اللهِ اَللّهُمَّ إِنِّيْ أَسْأَلُكَ خَيْرَ هَذِهِ السُّوْقِ وَخَيْرَ مَا فِيْهَا وَأَعُوْذُ بِكَ مِنْ شَرِّهَا وَشَرِّ مَا فِيْهَا. اَللّهُمَّ إِنِّيْ أَعُوْذُ بِكَ أَنْ أُصِيْبَ فِيْهَا صَفَقَةً خَاسِرَةً”. رَوَاهُ الْبَيْهَقِيُّ فِيْ الدَّعْوَاتِ الْكَبِيْرِ.

2456. (41) [2/758అపరిశోధితం]

బురైదహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) బజారుకు వెళ్ళినపుడు ఈ దు’ఆ పఠించేవారు:

బిస్మిల్లాహి అల్లాహుమ్మ ఇన్నీ అస్అలుకఖైర హాజ స్సూఖి, ఖైర మాఫీహా, ఊజుబిక మిన్ షర్రిహా, షర్రి మా ఫీహా, అల్లాహుమ్మ ఇన్నీ ఊజుబిక అన్సీబ ఫీహా సఫఖతన్‌ ‘ఖాసిరతన్‌.” — ‘అల్లాహ్‌ పేరుతో, ఓ అల్లాహ్‌ నేను నిన్ను ఈ బజారు యొక్క మంచిని  కోరుతున్నాను.  ఈ బజారులో ఉన్న  చెడునుంచి నీ శరణు కోరుతున్నాను. అదేవిధంగా ఈ కొనుగోలులో నష్ట పోవటాన్నుండి నేను నీ శరణు కోరుతున్నాను.” (బైహఖీ – ద’అవాతుల్ కబీర్)

=====

8- بَابُ الْاِسْتَعَاذَةِ

8. శరణు కోరే (ఇస్తిఆజహ్) దుఆలు

మానవుని జీవితంలోని కష్టాలు, నష్టాలు, ఆపదలు అతన్ని చుట్టుముట్టి ఉన్నాయి. ఈ కష్టనష్టాలు, ఆపదలు అన్నీ తాను స్వయంగా పాపాలకు పాల్పడిన దాని ఫలితమే. ప్రతివ్యక్తి వీటి ద్వారా ముక్తి, సాఫల్యాలు పొందాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. అయితే ప్రవక్త సాంప్రదాయాన్ని అనుసరించటమే అన్నిటికంటే మంచి పద్ధతి. ప్రవక్త (స) కష్టాల నుండి నష్టాలనుండి, ఆపదలనుండి అల్లాహ్‌ను శరణు కోరారు. అదే విధంగా తన అనుచరులకు కూడా దీన్ని గురించి శిక్షణ ఇచ్చారు. ”మీకేదైనా కష్టం సంభవిస్తే అల్లాహ్‌ (త)ను శరణుకోరండి, అల్లాహ్‌ (త) వాటిని దూరం చేస్తాడు అని తన అనుచరులకు హిత బోధ చేసారు. అనుచరులు దీన్ని అనుసరించారు. అల్లాహ్‌ (త) వారి కష్టాలను దూరం చేసి వారికి సుఖ ప్రదమైన జీవితం ప్రసాదించాడు. మనం కూడా మన కష్టాలను దూరం చేయటానికి ప్రవక్త (స) చూపెట్టిన పద్ధతిని అనుసరించి ఆచరిస్తే ఇన్‌షా అల్లాహ్‌ కష్టాలు నష్టాలు తొలగిపోతాయి. ప్రవక్త (స) శరణుకోరే దు’ఆలను క్రమం తప్పకుండా సమయాను సారంగా పఠిస్తూ ఉండండి. అల్లాహ్‌ (త) ముస్లిము లందరి ఆపదలను, కష్టాలను తొలగించు గాక. ఆమీన్‌!

—–

اَلْفَصْلُ الْأَوَّلُ మొదటి విభాగం   

2457 – [ 1 ] ( متفق عليه ) (2/759)

عَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم “تَعَوَّذُوْا بِاللهِ مِنْ جَهْدِ الْبَلَاءِ وَدَرْكِ الشَّقَاءِ وَسُوْءِ الْقَضَاءِ وَشَمَاتَةِ الْأَعْدَاءِ”.

2457. (1) [2/759ఏకీభవితం]

అబూహురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మీరు ఆపదలు, కష్టాలనుండి, దురదృష్టం నుండి, చెడు తీర్పుల నుండి, శత్రువుల సంతోషం నుండి అల్లాహ్‌ను శరణుకోరండి:

అల్లాహుమ్మ ఇన్నీ ఊజుబిక మిన్జహ్దిల్బలాయివదర్కిష్షఖాయి సూయిల్దాయి షమాతతిల్దాయి‘.” — ‘ఆపదల నష్టాన్నుండి, దురదృష్టం నుండి చెడు తీర్పుల నుండి, శత్రువుల సంతోషం నుండి నేను నీ శరణు కోరుతున్నాను.’ (బు’ఖారీ, ముస్లిమ్‌)

2458 – [ 2 ] ( متفق عليه ) (2/759)

وَعَنْ أَنَسٍ قَالَ كَانَ النَّبِيُّ صلى الله عليه وسلم يَقُوْلُ: “اَللّهُمَّ إِنِّيْ أَعُوْذُ بِكَ مِنَ الْهَمِّ وَالْحُزْنِ وَالْعِجْزِ وَالْكَسْلِ وَالْجُبُنِ وَالْبُخْلِ وَضِلَعِ الدَّيْنِ وَغَلَبَةِ الرِّجَالِ”.

2458. (2) [2/759ఏకీభవితం]

అనస్‌ (ర) కథనం: ప్రవక్త (స) ఈ దు’ఆను పఠించేవారు:

అల్లాహుమ్మ ఇన్నీ ఊజుబిక మినల్హమ్మి వల్‌’హుజ్ని వల్‌ ‘అజ్‌’జి వల్కస్లి వల్జుబ్ని వల్బుఖ్లి లయిద్దైని గలబతి ర్రిజాలి.” — ‘ఓ అల్లాహ్‌! దుఃఖం, విచారాల నుండి, దీనత్వం, బద్దకం, పిరికితనం, పిసినారి తనం, రుణభారం, ప్రజల బలవంతం వత్తిడి నుండి నీ శరణు కోరుతున్నాను.’ (బు’ఖారీ, ముస్లిమ్)

2459 – [ 3 ] ( متفق عليه ) (2/759)

وَعَنْ عَائِشَةَ قَالَتْ: كَانَ النَّبِيُّ صلى الله عليه وسلم يَقُوْلُ: “اَللَّهُمَّ إِنِّيْ أَعُوْذُ بِكَ مِنَ الْكَسْلِ وَالْهَرَمِ وَالْمَغْرَمِ وَالْمَأْثَمِ. اَللّهُمَّ إِنِّيْ أَعُوْذُ بِكَ مِنْ عَذَابِ النَّارِ وَفِتْنَةِ النَّارِ وَفِتْنَةِ الْقَبْرِ وَعَذَابِ الْقَبْرِ وَمِنْ شَرِّ فِتْنَةِ الْغِنَى وَمِنْ شَرِّ فِتْنَةِ الْفَقْرِ وَمِنْ شَرِّ فِتْنَةِ الْمَسِيْحِ الدَّجَّالِ. اَللّهُمَّ اغْسِلْ خَطَايَايَ بِمَاءِ الثَّلْجِ وَالْبَرْدِ وَنَقِّ قَلْبِيْ كَمَا يُنَقَّى الثَّوْبُ الْأَبْيَضُ مِنَ الدَّنَسِ وَبَاعِدْ بَيْنِيْ وَبَيْنَ خَطَايَايَ كَمَا بَاعَدْتَ بَيْنَ الْمَشْرِقِ وَالْمَغْرِبِ”.

2459. (3) [2/759ఏకీభవితం]

‘ఆయి’షహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ఈ దు’ఆను పఠించేవారు:

అల్లాహుమ్మ ఇన్నీ ఊజుబిక మినల్కస్లి వల్‌ ‘హరమి వల్గ్రమి వల్మాసమి, అల్లాహుమ్మ ఇన్నీ ఊజుబిక మిన్అజాబిన్నారి, వఫిత్ తిన్నారి, ఫిత్నతిల్‌ ‘ఖబ్రి, అజాబిల్ ఖబరీ, మిన్షర్రి ఫిత్నతిల్ గినా, మిన్షర్రి ఫిత్నతిల్ ఫఖ్రి, మిన్షర్రి ఫిత్నతిల్మసీహిద్దజ్జాలి, అల్లాహుమ్మగిసిల్‌ ‘తాయాయ బిమాయి స్సల్జి వల్బర్ది. వనఖ్ఖి ఖల్బీ కమా యునఖ్ఖ స్సౌబుల్అబ్దు మినద్దనసి వబాయిద్బైనీ వబైనతాయాయ కమా బాఅత్త బైనల్మష్రిఖి వల్మగ్రిబి.” — ‘ఓ నా ప్రభూ! బద్దకం నుండి, వృద్ధాప్యం నుండి, రుణం నుండి, పాపాల నుండి నీ శరణు కోరుకుంటున్నాను. ఓ నా ప్రభూ! నరక శిక్ష నుండి, అగ్ని పరీక్ష నుండి సమాధి ఉపద్రవం నుండి, సమాధి శిక్ష నుండి, ఐశ్వర్యాల ఉపద్రవాల చెడు నుండి, దారిద్య్రం నుండి, మసీహద్దజ్జాల్‌ కల్లోలం నుండి నేను నీ శరణు కోరుతున్నాను. ఓ అల్లాహ్‌! నా పాపాలను వడగళ్ళ ద్వారా నీటి ద్వారా శుభ్రపరచు, నా హృదయాన్ని తెల్లని వస్త్రం మురికి నుండి శుభ్రపరచబడినట్లు శుభ్రపరచు. నాకూ నా పాపాలకూ మధ్య తూర్పు పడమరల మధ్య ఉన్నంత దూరం చేసివేయి.” (బు’ఖారీ, ముస్లిమ్‌)

2460 – [ 4 ] ( صحيح ) (2/760)

وَعَنْ زَيْدِ بْنِ أَرْقَمَ قَالَ: كَانَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ: “اَللّهُمَّ إِنِّيْ أَعُوْذُ بِكَ مِنْ الْعِجْزِ وَالْكَسْلِ وَالْجُبْنِ وَالْبُخْلِ وَالْهَرَمِ وَعَذَابِ الْقَبْرِ. اَللّهُمَّ آتِ نَفْسِيْ تَقْوَاهَا وَزَكِّهَا أَنْتَ خَيْرُ مَنْ زَكَاهَا. أَنْتَ وَلِيُّهَا وَمَوْلَاهَا. اَللّهُمَّ إِنِّيْ أَعُوْذُ بِكَ مِنْ عِلْمٍ لَا يَنْفَعُ وَمِنْ قَلْبٍ لَايَخْشَعُ وَمِنْ نَفْسٍ لَا تَشْبَعُ وَمَنْ دَعْوَةٍ لَا يُسْتَجاَبُ لَهَا”. رَوَاهُ مُسْلِمٌ .

2460. (4) [2/760దృఢం]

‘జైద్‌ బిన్‌ అర్ఖమ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ఈ దు’ఆను పఠించేవారు:

అల్లాహుమ్మ ఇన్నీ ఊజుబిక మినల్జ్‌’జి వల్కసలి, వల్జుబ్ని వల్బుఖ్లి ,వల్‌ ‘హరమి వఅజాబిల్ఖబ్రి, అల్లాహుమ్మ ఆతినఫ్సీ తఖ్వాహా ,జక్కిహా అన్ ఖైరు మన్‌’జక్కాహా ,అన్ వలియ్యుహా మౌలాహా, అల్లాహుమ్మ ఇన్నీ ఊజుబిక మిన్ఇల్మిన్లాయన్ఫఉ, వమిన్ఖల్బిన్లా యఖ్షఉ, వమిన్నఫ్సిన్లా తష్బఉ, వమిన్దావతిన్లా యుస్తజాబు లహా.” — ‘ఓ అల్లాహ్‌! బలహీనత, బద్దకం, సోమరితనం, పిరికితనం, పిసినారితనం నుండి, ముసలితనం నుండి, సమాధి శిక్ష నుండి, నీ శరణు కోరుతున్నాను. ఓ అల్లాహ్‌! నా హృదయానికి దైవభీతి, దైవభక్తి ప్రసాదించు. దాన్ని పరిశుభ్రపరచు. నీవు అందరికంటే బాగా పరిశుభ్రపరిచేవాడవు. నీవే ఈ ఆత్మకు యజమాని, సంరక్షకుడవు. ఓ అల్లాహ్‌! లాభం చేకూర్చని జ్ఞానం నుండి దైవభీతిలేని హృదయం నుండి, తృప్తిచెందని హృదయం నుండి స్వీకరించ బడని దు’ఆ నుండి నీ శరణు కోరుతున్నాను.” (ముస్లిమ్‌)

2461 – [ 5 ] ( صحيح ) (2/760)

وَعَنْ عَبْدِالله بْنِ عُمَرَ قَالَ: كَانَ مِنْ دُعَاءِ رَسُوْلِ اللهِ صلى الله عليه سوسلم: “اَللّهُمِّ إِنِّيْ أَعُوْذُ بِكَ مِنْ زَوَالِ نِعْمَتِكَ وَتَحَوُّلِ عَافِيَتِكَ وَ فُجَاءَةِ نِقْمَتِكَ وَجَمِيْعِ سَخَطِكَ” . رَوَاهُ مُسْلِمٌ .

2461. (5) [2/760దృఢం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘ఉమర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ఈ దు’ఆను కూడా పఠించేవారు:

అల్లాహుమ్మ ఇన్నీ ఊజుబిక మిన్‌ ‘జవాలి నిమతిక వతహవ్వులిఆఫియతిక వఫుజాఅతి నిఖ్మతిక జమీ ఖతిక్,”  — ‘ఓ నా ప్రభూ! నీ అనుగ్రహం లాక్కోబడటంనుండి, నీ రక్షణ తొలగించ బడటంనుండి, నీ వ్యధా భరితమైన శిక్ష నుండి నీ అనేక విధాల ఆగ్రహం నుండి నేను నీ శరణు కోరుతున్నాను.’ (ముస్లిమ్‌)

2462 – [ 6 ] ( صحيح ) (2/760)

وَعَنْ عَائِشَةَ قَالَتْ: كَانَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ: “اَللّهُمَّ إِنِّيْ أَعُوْذُ بِكَ مِنْ شَرِّ مَا عَمِلْتُ وَمِنْ شَرِّ مَا لَمْ أَعْمَلْ” . رَوَاهُ مُسْلِمٌ .

2462. (6) [2/760దృఢం]

‘ఆయి’షహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ఈ దు’ఆ పఠించేవారు:

అల్లాహుమ్మ ఇన్నీ ఊజుబిక మిన్షర్రిమాఅమిల్తు మిన్షర్రి మా లమ్మల్‌.” — ‘ఓ నా ప్రభూ! ఇంత వరకు చేసిన మరియు ఇంకా నేను చేయని పాపాల చెడునుండి నేను నీ శరణు కోరుతున్నాను.” (ముస్లిమ్‌)

2463 – [ 7 ] ( متفق عليه ) (2/760)

وَعَنِ ابْنِ عَبَّاسٍ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم كَانَ يَقُوْلُ: “اَللّهُمَّ لَكَ أَسْلَمْتُ وَبِكَ آمَنْتُ وَعَلَيْكَ تَوَكَّلْتُ وَإِلَيْكَ أَنَبْتُ وَبِكَ خَاصَمْتُ. اَللّهُمَّ إِنِّيْ أَعُوْذُ بِعِزَّتِكَ لَا إِلَهَ إِلَّا أَنْتَ. أَنْ تُضِلِّنِيْ أَنْتَ الْحَيُّ الَّذِيْ لَا يَمُوْتُ وَالْجِنُّ وَالْإِنْسُ يَمُوْتُوْنَ”.

2463. (7) [2/760ఏకీభవితం]

ఇబ్నె ‘అబ్బాస్‌ (ర) కథనం: ప్రవక్త (స) ఈ దు’ఆను కూడా పఠించేవారు:

అల్లాహుమ్మ లక అస్లమ్తు వబిక ఆమన్తు వఅలైక తవక్కల్తు వఇలైక అనబ్తు వబికఖాసమ్తు, అల్లాహుమ్మ ఇన్నీ ఊజు బి జ్జతిక లాయిలాహ ఇల్లా అన్ అన్తుదిల్లనీ అన్తల్‌ ‘హయ్యుల్లజీ లాయమూతు, వల్జిన్ను వల్ఇన్సు యమూతూన.” — ‘ఓ నా ప్రభూ! నీ కోసం నేను ఇస్లామ్‌ స్వీకరించాను, నీ కోసం విశ్వసించాను, నిన్నే నమ్ముకున్నాను, నీవైపే మరలాను, నీ ద్వారానే శత్రువులతో తలపడ్డాను. ఓ నా ప్రభూ! నీ గౌరవం సాక్షి! నీవు తప్ప ఆరాధ్యు లెవరూ లేరు. నీవు నన్ను అవమానపరచటాన్నుండి నేను నీ శరణు కోరుతున్నాను. నీవు మరణించని నిత్య సజీవుడవు. జిన్నులు, మానవులు మరణిస్తారు.’ (బు’ఖారీ, ముస్లిమ్‌)

—–

اَلْفَصْلُ الثَّانِيْ    రెండవ విభాగం 

2464 – [ 8 ] ( لم تتم دراسته ) (2/760)

عَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: كَانَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ: “اَللّهُمَّ إِنِّيْ أَعُوْذُ بِكَ مِنَ الْأَرْبَعِ: مِنْ عِلْمٍ لَا يَنْفَعُ وَمِنْ قَلْبٍ لَا يَخْشَعُ وَمِنْ نَفْسٍ لَا تَشْبَعُ وَمِنْ دُعَاءِ لَا يَسْمَعُ”. رَوَاهُ أَحْمَدُ وَأَبُوْ دَاوُدَ وَابْنُ مَاجَهُ.

2464. (8) [2/760అపరిశోధితం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ఇలా పలికే వారు, ”నేను నాలుగు విషయాల నుండి శరణు కోరుతున్నాను. లాభం చేకూర్చని జ్ఞానం, భయపడని హృదయం, తృప్తిచెందని ఆత్మ, స్వీకరించబడని దు’ఆ.” (అ’హ్మద్‌, అబూ దావూద్‌, ఇబ్నెమాజహ్, నసాయి’)

2465 – [ 9 ] ( لم تتم دراسته ) (2/761)

وَرَوَاهُ التِّرْمِذِيُّ عَنْ عَبْدِ اللهِ بْنِ عُمَرَ. وَالنَّسَائِيُّ عَنْهُمَا .

2465. (9) [2/761అపరిశోధితం]

దీనినే, ‘అబ్దుల్లాహ్ బిన్ ‘ఉమర్ (ర) ద్వారా. తిర్మిజి’, నసాయి’, ఉల్లేఖించారు.

2466 – [ 10 ] ( لم تتم دراسته ) (2/761)

وَعَنْ عُمَرَ قَالَ: كَانَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم يَتَعَوَّذُ مِنْ خَمْسٍ: مِّنَ الْجُبْنِ وَالْبُخْلِ وَسُوْءِ الْعُمُرِ وَفِتْنَةِ الصَّدْرِ وَعَذَابِ الْقَبْرِ. رَوَاهُ أَبُوْ دَاوُدَ وَالنَّسَائِيُّ.

2466. (10) [2/761అపరిశోధితం]

‘ఉమర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ఈ 5 విషయాల నుండి శరణు కోరేవారు. ”పిరికితనం, పిసినారితనం, వృద్ధాప్యం, హృదయాల కలతలు, సమాధి శిక్ష.” (అబూ దావూద్‌, నసాయి’)

2467 – [ 11 ] ( صحيح ) (2/761)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم كَانَ يَقُوْلُ: “اَللّهُمَّ إِنِّيْ أَعُوْذُ بِكَ مِنْ الْفَقْرِوَالْقِلَّةِ وَالذِّلَّةِ. وَأَعُوْذُ مِنْ أَنْ أَظْلِمَ أَوْ أَظْلَمَ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ وَالنَّسَائِيُّ .

2467. (11) [2/761దృఢం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ఈ దు’ఆను కూడా పఠించేవారు:

అల్లాహుమ్మ ఇన్నీ ఊజుబిక మినల్ఫఖ్రి, వల్ఖిల్లతి, వజ్జిల్లతి, ఊజు బిక మిన్అన్జ్లిమ అవ్ జ్లమ.” — ‘ఓ నా ప్రభూ! దారిద్య్రం నుండి, ధనకొరత నుండి, అవమానం నుండి, అగౌరవం నుండి నేను నీ శరణు కోరుతు న్నాను. ఓ నా ప్రభూ! దుర్మార్గానికి పాల్పడటం నుండి, దుర్మార్గానికి గురికావటం నుండి నేను శరణు కోరుతున్నాను.’ (అబూ దావూద్‌, నసాయి’)

2468 – [ 12 ] ( لم تتم دراسته ) (2/761)

وَعَنْهُ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم كَانَ يَقُوْلُ: “اَللّهُمَّ إِنِّيْ أَعُوْذُ بِكَ مِنَ الشِّقَاقِ وَالنِّفَاقِ وَسُوْءِ الْأَخْلَاقِ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ وَالنَّسَائِيُّ .

2468. (12) [2/761అపరిశోధితం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ఈ దు’ఆను పఠించే వారు:

అల్లాహుమ్మ ఇన్నీ ఊజుబిక మినష్షిఖాఖి, వన్నిఫాఖి, సూయిల్ఖ్లాఖ్.” — ‘ఓ నా ప్రభూ! వ్యతిరేకత నుండి, కాపట్యం నుండి, దుర్గుణాల నుండి నేను నీ శరణు కోరుతున్నాను.’ (అబూ దావూద్‌, నసాయి’)

2469 – [ 13 ] ( لم تتم دراسته ) (2/761)

وَعَنْهُ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم كَانَ يَقُوْلُ: “اَللّهُمَّ إِنِّيْ أَعُوْذُ بِكَ مِنَ الْجُوْعِ فَإِنَّهُ بِئْسَ الضَّجِيْعُ وَأَعُوْذُ بِكَ مِنَ الْخِيَانَةِ فَإِنَّهَا بِئْسَتِ الْبِطَانَةُ” . رَوَاهُ أَبُوْ دَاوُدَ وَالنَّسَائِيُّ وَابْنُ مَاجَهُ .

2469. (13) [2/761అపరిశోధితం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ఈ దు’ఆను కూడా పఠించేవారు:

అల్లాహుమ్మ ఇన్నీ ఊజు బిక మినల్ జూ, ఇన్నహూ బీద్దజీ, ఊజుబిక మినల్‌ ‘ఖియా నతి, ఇన్నహా బీసతిల్బితాహ్.”  — ‘ఓ నా ప్రభూ! ఆకలి నుండి శరణు కోరుతున్నాను. ఎందు కంటే అది చెడ్డ సహవాసి, ఇంకా ద్రోహం నుండి నీ శరణు కోరుతున్నాను. ఎందుకంటే అది చెడ్డ అల వాటు.” (అబూ దావూద్‌, నసాయి’, ఇబ్నె మాజహ్)

470 – [ 14 ] ( لم تتم دراسته ) (2/761)

وَعَنْ أَنَسٍ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم كَانَ يَقُوْلُ: “اَللّهُمَّ إِنِّيْ أَعُوْذُ بِكَ مِنَ الْبَرَصِ وَالْجُذَامِ وَالْجُنُوْنِ وَمِنْ سَيِّئٍ الْأَسْقَامِ” . روَاهُ أَبُوْ دَاوُدَ وَالنَّسَائِيُّ.

2470. (14) [2/761అపరిశోధితం]

అనస్‌ (ర) కథనం: ప్రవక్త (స) ఈ దు’ఆను కూడా పఠించేవారు:

అల్లాహుమ్మ ఇన్నీ ఊజుబిక మినల్బరసి, వల్జుజామి, వల్జునూని, వమిన్సయ్యియిల్అస్ఖామ్.” — ‘ఓ నా ప్రభూ! తెల్లమచ్చల రోగం నుండి, కుష్టువ్యాధి నుండి, పిచ్చితనం నుండి, ఇంకా ఇతర ప్రమాద కరమైన రోగాల నుండి నేను నీ శరణు కోరుతున్నాను.’ (అబూ దావూద్‌, నసాయి’)

2471 – [ 15 ] ( لم تتم دراسته ) (2/761)

وَعَنْ قُطْبَةَ بْنِ مَالِكٍ قَالَ: كَانَ النَّبِيُّ صلى الله عليه وسلم يَقُوْلُ: “اَللّهُمَّ إِنِّيْ أَعُوْذُ بِكَ مِنْ مُنْكَرَاتِ الْأَخْلَاقِ وَالْأَعْمَالِ وَالْأَهْوَاءِ”. رَوَاهُ التِّرْمِذِيُّ.

2471. (15) [2/761అపరిశోధితం]

ఖు’త్‌బహ్ బిన్‌ మాలిక్‌ (ర) కథనం: ప్రవక్త (స) ఈ దు’ఆను కూడా పఠించేవారు:

అల్లాహుమ్మ ఇన్నీ ఊజుబిక మిన్మున్ రాతిల్ఖ్లాఖి వల్మాలి వల్అహ్ వాయి‘.” — ‘ఓ నా ప్రభూ! దుర్గుణాల నుండి, చెడు పనుల నుండి, చెడు కోరికల నుండి నేను నీ శరణు కోరుతున్నాను.” (తిర్మిజి’)

2472 – [ 16 ] ( لم تتم دراسته ) (2/762)

وَعَنْ شُتَيْرِ بْنِ شَكَلِ بْنِ حُمَيْدٍ عَنْ أَبِيْهِ قَالَ: قُلْتُ: يَا نَبِيَّ اللهِ عَلَمْنِيْ تَعْوِيْذًا أَتَعَوَّذُ بِهِ قَالَ: “قُلْ اللّهُمَّ إِنِّيْ أَعُوْذُ بِكَ مِنْ شَرِّ سَمْعِيَ وَ شَرِّ بَصْرِيْ وَشَرِّ لِسَانِيْ وَشَرِّ قَلْبِيْ وَشَرِّ مَنِيِّيْ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ وَالتِّرْمِذِيُّ وَالنَّسَائِيُّ .

2472. (16) [2/762అపరిశోధితం]

షుతైర్‌ బిన్‌ షకల్‌ బిన్‌ ‘హుమైద్‌ (ర) తన తండ్రి ద్వారా ఉల్లేఖిస్తున్నారు, అతని తండ్రి ప్రవక్త (స)ను ఇలా విన్నవించుకున్నారు, ‘తమరు శరణు కోరే దు’ఆ ఏదైనా ఉంటే నాకు నేర్పించండి దాని ద్వారా నేను శరణు కోరుతూ ఉంటాను.’  ప్రవక్త (స) ఈ దు’ఆను పఠించు అని ఉపదేశించారు:

”అల్లాహుమ్మ ఇన్నీ ఊజుబిక మిన్షర్రి సమ్‌’యీ వషర్రి స్రీ షర్రి లిసానీ వషర్రి ఖల్బీ, వషర్రి మనియ్యీ.” — ‘ఓ నా ప్రభూ! నా చెవుల నుండి, కళ్ళ నుండి, నా హృదయం నుండి, నా నాలుక నుండి, నా వీర్యం కీడుల నుండి నేను నీ శరణు కోరుతున్నాను.’ (అబూ దావూద్‌, తిర్మిజి’, నసాయి’)

2473 – [ 17 ] ( لم تتم دراسته ) (2/762)

وَعَنْ أَبِيَ الْيَسَرِ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم كَانَ يَدْعُوْ: “اَللّهُمَّ إِنِّيْ أَعُوْذُ بِكَ مِنَ الْهَدْمِ وَأَعُوْذُ بِكَ مِنَ التَّرَدِّيْ وَمِنَ الْغَرَقِ وَالْحَرَقِ وَالْهَرَمِ. وَأَعُوْذُ بِكَ مِنْ أَنْ يَتَخَبَّطَنِيَ الشَّيْطَانُ عِنْدَ الْمَوْتِ وَأَعُوْذُ بِكَ مِنْ أَنْ أَمُوْتَ فِيْ سَبِيْلِكَ مُدْبِرًا. وَأَعُوْذُ بِكَ مِنْ أَنْ أَمُوْتَ لَدِيْغًا” .رَوَاهُ أَبُوْ دَاوُدَ وَالنَّسَائِيُّ

وَزَادَ فِيْ رِوَايَةٍ أُخْرَى”اَلْغَمِّ”.

2473. (17) [2/762అపరిశోధితం]

అబుల్‌ యస్‌ర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ఈ దు’ఆను కూడా పఠించేవారు:

అల్లాహుమ్మ ఇన్నీ ఊజుబిక మినల్హదమి ఊజుబిక మినత్తరద్దీ మినల్‌ ‘గరఖి వల్‌ ‘హరఖి వల్హరమి, ఊజుబిక మిన్న్ ఖబ్బతనియ షైతాను ఇందల్మౌతి.  ఊజుబిక మిన్అన్అమూత ఫీ సబీలిక ముద్బిరన్. ఊజుబిక మిన్అన్అమూత లదీగన్‌.” — ‘ఓ నా ప్రభూ! నొక్కి వేయబడి మరణించటం నుండి, క్రిందపడి మరణించటం నుండి, మునిగి మరణించటం నుండి, కాలి మరణించడం నుండి, వృద్ధాప్యపు చివరిదశ నుండి నేను నీ శరణు కోరుతున్నాను. ఇంకా నేను మరణ సమయంలో షై’తాన్‌ నన్ను అస్థిరతకు గురిచేయటాన్నుండి నేను నీ శరణు కోరుతున్నాను. ఇంకా నేను నీ మార్గంలో యుద్ధ మైదానం నుండి వెన్నుచూపి పారిపోవ టాన్నుండి నేను నీ శరణు కోరుతున్నాను. ఇంకా నేను విషజంతువులు కుట్టి మరణించటాన్నుండి నేను నీ శరణు కోరుతున్నాను.’ (అబూ దావూద్‌, నసాయి’)

2474 – [ 18 ] ( ضعيف ) (2/762)

وَعَنْ مُعَاذٍ عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ: “أَسْتَعِيْذُ بِاللهِ مِنْ طَمَعٍ  يَهْدِيْ إِلَى طَبَعٍ”. رَوَاهُ أَحْمَدُ وَالْبَيْهَقِيُّ فِيْ الدَّعْوَاتِ الْكَبِيْرِ.

2474. (18) [2/762బలహీనం]

ము’ఆజ్‌’ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మీరు పేరాస (అత్యాస) నుండి అల్లాహ్‌(త)ను శరణు కోరండి. ఎందుకంటే అది లోపాలకు గురిచేస్తుంది.” (అ’హ్మద్, బైహఖీ-ద’అవాతుల్ కబీర్)

2475 – [ 19 ] ( لم تتم دراسته ) (2/762)

وَعَنْ عَائِشَةَ أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم نَظَرَ إِلَى الْقَمَرِ فَقَالَ: “يَا عَائِشَةَ اسْتَعِيْذِيْ بِاللهِ مِنْ شَرِّ هَذَا فَإِنْ هَذَا هُوَ الْغَاسِقُ إِذَا وَقَبَ”. رَوَاهُ التِّرْمِذِيُّ.

2475. (19) [2/762అపరిశోధితం]

‘ఆయి’షహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) చంద్రుని వైపు చూచి ఇలా అన్నారు. ”ఓ’ఆయి’షహ్‌! దీని చెడు నుండి అల్లాహ్‌ (త)ను శరణుకోరు. ఎందుకంటే ఇది వెలుగుకోల్పోయి చీకటిని వ్యాపింపజేస్తుంది.” [81] (తిర్మిజి’)

2476 – [ 20 ] ( لم تتم دراسته ) (2/762)

وَعَنْ عِمْرَانَ بْنِ حُصَيْنٍ قَالَ: قَالَ النَّبِيُّ صلى الله عليه وسلم لِأَبِيْ: “يَا حُصَيْنُ كَمْ تُعْبَدُ الْيَوْمُ إِلَهًا؟” قَالَ أَبِيْ: سَبْعَةٌ، سِتًّا فِيْ الْأَرْضِ وَ وَاحِدًا فِيْ السَّمَاءِ. قَالَ: “فَأَيُّهُمْ تَعُدُّ لِرَغْبَتِكَ وَرَهْبَتِكَ؟” قَالَ: الَّذِيْ فِيْ السَّمَاءِ. قَالَ: “يَا حُصَيْنُ أَمَا إِنَّكَ لَوْ أَسْلَمْتَ عَلَّمْتُكَ كَلِمَتَيْنِ تَنْفَعَانِكَ”. قَالَ: فَلَمَّا أَسْلَمَ حُصَيْنٌ قَالَ: يَا رَسُوْلَ اللهِ عَلِّمْنِيْ الْكَلِمَتَيْنِ اللَّتَيْنِ وَ عَدْتَّنِيْ  فَقَالَ: “قُلِ اللّهُمَّ أَلْهِمْنِيْ رُشْدِيْ وَأَعِذْنِيْ مِنْ شَرِّ نَفْسِيْ”. رَوَاهُ التِّرْمِذِيُّ .

2476. (20) [2/762అపరిశోధితం]

ఇమ్రాన్‌ బిన్‌ ‘హు’సైన్‌ (ర) కథనం: ప్రవక్త (స) మా తండ్రి గారైన ‘హు’సైన్‌ తో ఇలా అన్నారు, ”ఓ ‘హు’సైన్! నువ్వు రోజుకి ఎంతమంది దేవుళ్ళకు పూజలు చేస్తున్నావు?” మా తండ్రిగారు, ‘7గురు దేవుళ్ళను పూజిస్తాను. 6గురు భూమిలో ఉన్నారు, అంటే, గూస్, ఊఖ్‌, స్ర్‌, లాత్‌, మనాత్‌, ‘జ్జా మరొక దేవుడు  ఆకాశంలో ఉన్నాడు, అంటే అల్లాహ్‌(త)’ అని అన్నారు. ప్రవక్త (స), ‘ఓ ‘హు’సైన్‌! ఈ దేవుళ్ళలో ఎవరినుండి ఆశతో ఉన్నావు,’ అని అడిగారు, దానికి అతడు, ‘ఆకాశంలో ఉన్న దేవుని నుండి మంచి చేకూరుతుందని ఆశతో ఉన్నాను. ఆయన శిక్షలకు భయపడుతున్నాను,’ అని అన్నారు. ప్రవక్త(స), ‘ఓ ‘హు’సైన్‌! ఒకవేళ నీవు ఇస్లామ్‌ స్వీకరిస్తే నీకు లాభం చేకూర్చే రెండు వచనాలను నేర్పుతాను,’ అని అన్నారు. ఇమ్రాన్‌ కథనం: నా తండ్రిగారు ఇస్లామ్‌ స్వీకరించారు. ఆ తరువాత అతడు, ‘ఓ అల్లాహ్‌ ప్రవక్తా! మీరు వాగ్దానం చేసిన ఆ 2 వచనాలను నేర్పండి,’ అని అన్నారు. ప్రవక్త (స) నువ్వు ఇలా పలుకు:

అల్లాహుమ్మ అల్హిమ్నీ రుష్దీ వఅజ్నీ మిన్షర్రి నఫ్సీ.” — ‘ఓ నా ప్రభూ! నా హృదయంలో మంచిని వేయి, ఇంకా నా ఆత్మ చెడు నుండి నన్ను కాపాడు.’ (తిర్మిజి’)

2477 – [21] ( لم تتم دراسته ) (2/763)

وَعَنْ عَمْرِو بْنِ شُعَيْبٍ عَنْ أَبِيْهِ عَنْ جَدِّهِ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم قَالَ: “إِذَا فَزِعَ أَحَدُكُمْ فِيْ النَّوْمِ فَلْيَقُلْ: أَعُوْذُ بِكَلِمَاتِ اللهِ التَّامَّاتِ مِنْ غَضَبِهِ وَعِقَابِهِ وَشَرِّ عِبَادِهِ وَمِنْ هَمَزَاتِ الشَّيَاطِيْنِ وَأَنْ يَّحْضُرُوْنَ فَإِنَّهَا لَنْ تَضُرَّهُ”. وَكَانَ عَبْدُ اللهِ بْنِ عَمْرٍو يُعَلِّمُهَا مِنْ بَلَغَ مِنْ وَّلَدِهِ وَمَنْ لَمْ يَبْلُغْ مِنْهُمْ كتبهَا فِيْ صَكٍّ ثُمَّ عَلَّقَهَا فِيْ عُنُقِهِ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ وَالتِّرْمِذِيُّ وَهَذَا لَفْظُهُ.

2477. (21) [2/763అపరిశోధితం]

‘అమ్ర్ బిన్‌ షు’ఐబ్‌ తన తండ్రి తాతల ద్వారా అంటే ‘అబ్దుల్లాహ్‌ ద్వారా కథనం, ప్రవక్త (స) ఇలా ప్రవచించారు, ”మీలో ఎవరైనా నిద్రలో భయపడితే ఈ దు’ఆ పఠించాలి. దీన్ని పఠిస్తే జిన్నులు, ఏమాత్రం హాని చేకూర్చలేవు.’ ఆ తరువాత ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘అమ్ర్‌ తన యుక్త వయస్సుకు చేరిన కొడుకులను ఈ వచనాలను నేర్పేవారు, కంఠస్తం చేయించే వారు. యుక్త వయస్సుకు చేరని పిల్లలకు వ్రాసి మెడలో వేసేవారు. ఆ వచనాలు ఇవి:

ఊజుబికలిమా తిల్లాహి త్తామ్మాతి మిన్‌ ‘బిహీ, ఇఖాబిహీ షర్రి ఇబాదిహీ వమిన్‌ ‘హమజాతిష్షయాతీని, న్ హ్‌’దురూన్‌.” — ‘నేను దైవాగ్రహం నుండి, ఆయన (త) శిక్ష నుండి, ఆయన దాసుల వల్ల కలిగే కీడు నుండి, షైతాన్‌ దుష్ట ప్రేరణల నుండి, ఇంకా అవి నా దగ్గరకు రావటం నుండి దేవుని సంపూర్ణ వచనాల ద్వారా శరణు కోరుతున్నాను.” (తిర్మిజి’)

2478 – [ 22 ] ( لم تتم دراسته ) (2/763)

وَعَنْ أَنَسٍ قَالَ، قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَنْ سَأَلَ اللهُ الْجَنَّةَ ثَلَاثَ مَرَّاتٍ. قَالَتِ الْجَنَّةُ: اَللّهُمَّ أَدْخُلْهُ الْجَنَّة وَمَنِ اسْتَجَارَمِنَ النَّارِ ثَلَاثَ مَرَّاتٍ. قَالَتِ النَّارُ: اَللّهُمَّ أَجِرْهُ مِنَ النَّارِ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَالنَّسَائِيُّ.

2478. (22) [2/763అపరిశోధితం]

అనస్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”అల్లాహ్‌ (త)ను 3 సార్లు స్వర్గం అర్థించిన వారికి అంటే:

అల్లాహుమ్మ ఇన్నీ అస్అలుకల్జన్నత — ‘ఓ అల్లాహ్‌! నేను నిన్ను స్వర్గం అర్థిస్తున్నాను.” లేదా అల్లాహుమ్మ అద్‌’ఖిల్నిల్జన్నత” — ‘ఓ అల్లాహ్‌! నన్ను స్వర్గంలో ప్రవేశింప య్యి,’ అని ప్రార్థిస్తే స్వర్గం అతని గురించి అల్లాహ్‌(త)ను ఇలా ప్రార్థిస్తుంది, ”ఓ అల్లాహ్‌! తమరు ఇతన్ని స్వర్గంలో ప్రవేశింపజేయండి.” అదేవిధంగా  3సార్లు నరకం నుండి శరణు కోరితే అంటే:

అల్లాహుమ్మ అజిర్నీ మినన్నార్‌” — ‘ఓ అల్లాహ్‌(త)! నాకు నరకం నుండి విముక్తి ప్రసాదించు’ అని ప్రార్థిస్తే నరకం అతని కొరకు అల్లాహుమ్మ అజిర్హు మినన్నార్‌” — ‘ఓ అల్లాహ్‌ నువ్వు ఇతన్ని నరకం నుండి రక్షించు.’ (తిర్మిజి’, నసాయి’)

—–

الْفَصْلُ الثَّالِثُ  మూడవ విభాగం 

2479 – [ 23 ] ( لم تتم دراسته ) (2/763)

عَنِ الْقَعْقَاعِ: أَنَّ كَعْبَ الْأَحْبَارِ قَالَ: لَوْلَا كَلِمَاتٌ أَقُوْلُهُنَّ لَجَعَلَتْنِيْ يَهُوْدٌ حِمَارًا فَقِيْلَ لَهُ: مَا هُنَّ؟ قَالَ: “أَعُوْذُ بِوَجْهِ اللهِ  الْعَظِيْمِ الَّذِيْ لَيْسَ شَيْءٌ أَعْظَمَ مِنْهُ وَبِكَلِمَاتِ اللهِ التَّامَّاتِ الَّتِيْ لَا يُجَاوِزُهُنَّ بَرٌّوَلَا فَاجِرٌ. وَبِأَسْمَاءِ اللهِ الْحُسْنَى مَا عَلِمْتُ مِنْهَا وَمَا لَمْ أَعْلَمُ مِنْ شَرِّ مَا خَلَقَ وَذَرَأَ وَبَرَأَ”. رَوَاهُ مَالِكٌ.

2479. (23) [2/763అపరిశోధితం]

ఖ’అఖా’అ (ర) ద్వారా, క’అబ్‌ అ’హ్‌బార్‌ కథనం: ‘ఒకవేళ నేను ఈ వచనాలను పలికితే యూదులు నన్ను గాడిదగా చేసివేస్తారు.’  ‘ఆ వచనాలు ఏవి,’ అని అతన్ని ప్రశ్నించడం జరిగింది. దానికి అతను ఇలా పలికాడు:

 ఊజుబివజ్హిల్లాహిల్జీమిల్లజీలైస షయ్న్జము మిన్హు బి కలిమాతిల్లాహి త్తామ్మాతిల్లతీ లా యుజావిజుహున్న బర్రున్వలా ఫాజిరున్ బి అస్మా యిల్లాహిల్‌ ‘హుస్నా మా అలిమ్తు మిన్హా బి మాలమ్ఆలమ్మిన్షర్రిమాఖలఖ వజరఅవబరఅ — ‘అల్లాహ్‌ మహా వ్యక్తిత్వం ద్వారా, ఆయన కంటే పెద్దది ఏదీ లేదు. అల్లాహ్‌ (త) పరిపూర్ణ వచనాల ద్వారా వాటిని ఏ పుణ్యం, ఏ పాపం అధిగమించలేదు. ఇంకా నాకు తెలిసిన, తెలియని అల్లాహ్‌ (త) ఉన్నత పేర్ల ద్వారా వాటిని అల్లాహ్‌(త)యే సృష్టించాడు, వాటిని వ్యాపింపజేసాడు, వాటిని సరిచేసాడు.” [82]  (మువ’త్తా ఇమామ్‌ మాలిక్‌)

అంటే సరైన అవయవాలు అమర్చాడు.

2480 – [ 24 ] ( لم تتم دراسته ) (2/763)

وَعَنْ مُسْلِمِ بْنِ أَبِيْ بَكْرَةَ قَالَ: كَانَ أَبِيْ يَقُوْلُ فِيْ دُبُرِ الصَّلَاةِ: “اَللّهُمَّ إِنْ أَعُوْذُ بِكَ مِنَ الْكَفْرِ وَالْفَقْرِ وَعَذَابِ الْقَبْرِ”. فَكُنْتُ أَقُوْلُهُنَّ فَقَالَ: أَيْ بُنَيّ عَمَّنْ أَخَذْتَ هَذَا؟ قُلْتُ: عَنْكَ قَالَ: إِنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم كَانَ يَقُوْلُهُنَّ فِيْ دُبُرِ الصَّلَاةِ. رَوَاهُ النَّسَائِيُّ وَالتِّرْمِذِيُّ

 إِلَّا أَنَّهُ لَمْ يَذْكُرْ فِيْ دُبُرِ الصَّلَاةِ وَرَوَى أَحْمَدُ لَفْظُ الْحَدِيْثِ وَعِنْدَهُ: فِيْ دُبُرِ كُلِّ صَلَاةٍ.

2480. (24) [2/763అపరిశోధితం]

ముస్లిమ్‌ బిన్‌ అబీ బక్రహ్‌ (ర) కథనం: మా తండ్రి గారు ప్రతి విధి నమా’జు తర్వాత ఈ దు’ఆను పఠించేవారు:

అల్లాహుమ్మ ఇన్నీ ఊజుబిక మినల్కుఫ్రి వల్ఫఖ్రి అజాబిల్ఖబ్రి.” — ‘ఓ నా ప్రభూ! అవిశ్వాసం నుండి, దారిద్య్రం నుండి, సమాధి శిక్ష నుండి నేను నీ శరణు కోరుతున్నాను.” నేను కూడా ఆ వచనాలను చదవసాగాను. మా తండ్రిగారు, ‘కుమారా! ఈ వచనాలు ఎవరివద్ద నేర్చుకున్నావు,’ అని అడి గారు. నేను, ‘మీ నుండి,’ అని సమాధానం ఇచ్చాను. అప్పుడు మా తండ్రిగారు, ‘ప్రవక్త (స) విధి నమా’జుల తర్వాత ఈ వచనాలను పలికేవారు,’ అని అన్నారు. (నసాయి’, తిర్మిజి’, అ’హ్మద్‌)

2481 – [ 25 ] ( لم تتم دراسته ) (2/764)

وعَنْ أَبِيْ سَعِيْدٍ قَالَ: سَمِعْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ: “أَعُوْذُ بِاللهِ مِنَ الْكُفْرِ وَالدَّيْنِ” .فَقَالَ رَجُلٌ: يَا رَسُوْلَ اللهِ أَتَعْدِلُ الْكُفْرُ بِالدَّيْنِ؟ قَالَ: “نَعَمْ”.

وَفِيْ رِوَايَةٍ “اَللّهُمَّ إِنِّيْ أَعُوْذُ بِكَ مِنَ الْكُفْرِ وَالْفَقْرِ”. قَالَ رَجُلٌ: وَيُعْدَلَانِ؟ قَالَ: “نَعَمْ”. رَوَاهُ النَّسَائِيُّ.

2481. (25) [2/764అపరిశోధితం]

అబూ స’యీద్‌ ‘ఖుద్రీ (ర) కథనం: నేను ప్రవక్త (స)ను ఇలా పఠిస్తూ ఉండగా విన్నాను:

ఊజు బిల్లాహి మినల్కుఫ్రి ద్దైని — ‘ఓ నా ప్రభూ! అవిశ్వాసం నుండి, రుణంనుండి నేను నీ శరణు కోరుతున్నాను.’ ఒక వ్యక్తి, ‘ఓ అల్లాహ్‌ ప్రవక్తా! అవిశ్వాసం రుణం సమానమా?’ అని అన్నాడు. ప్రవక్త (స), ‘అవును,’ అని అన్నారు.

మరో ఉల్లేఖనంలో ఇలా ఉంది:

అల్లాహుమ్మ ఇన్నీ ఊజుబిక మినల్కుఫ్రి వల్ఫఖ్రి.” — ‘ఓ నా ప్రభూ! అవిశ్వాసం నుండి, దారిద్య్రం నుండి నేను నీ శరణు కోరుతున్నాను.’ ఒక వ్యక్తి, ‘రెండూ సమానమేనా?’ అని అడిగాడు. ప్రవక్త (స), ‘అవును,’ అని అన్నారు. [83]  (నసాయి’)

=====

9- بَابُ جَامِعِ الدُّعَاءِ

9. సమగ్రమైన దుఆలు

اَلْفَصْلُ الْأَوَّلُ మొదటి విభాగం  

2482 – [ 1 ] ( متفق عليه ) (2/765)

عَنْ أَبِيْ مُوْسَى الْأَشْعَرِيُّ عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم: أَنَّهُ كَانَ يَدْعُوْ بِهَذَا الدُّعَاءِ: “اَللّهُمَّ اغْفِرْ لِيْ خَطِيْئَتِيْ وَجَهْلِيْ وَإِسْرَافِيْ فِيْ أَمْرِيْ. وَمَا أَنْتَ أَعْلَمُ بِهِ مِنِّيْ اَللّهُمَّ اغْفِرْ لِيْ جِدِّيْ وَهَزْلِيْ وَخَطَئِيْ وَعَمَدِيْ وَكُلُّ ذَلِكَ عِنْدِيْ. اَللّهُمَّ اغْفِرْ لِيْ مَا قَدَّمَتْ وَمَا أَخَّرْتُ وَمَا أَسْرَرْتُ وَمَا أَعْلَنْتُ وَمَا أَنْتَ أَعْلَمُ بِهِ مِنِّيْ. أَنْتَ الْمُقَدِّمُ وَأَنْتَ الْمُؤَخِّرُ وَأَنْتَ عَلَى كُلِّ شَيْءٍ قَدِيْرٌ”.

2482. (1) [2/765ఏకీభవితం]

అబూ మూసా అష్‌’అరీ (ర) కథనం: ప్రవక్త (స) ఈ దు’ఆను పఠించేవారు:

అల్లాహుమ్మగ్ఫిర్లీ తీఅతీ వజహ్లీ ఇస్రాఫి, ఫీఅమరీ వమా అన్ లము బిహీ మిన్నీ, అల్లాహుమ్మగ్ఫిర్లీ జిద్దీ జ్లీ, ఖతయీ, అమదీ కుల్లు జాలిక ఇందీ, అల్లాహుమ్మగ్ఫిర్లీ మా ఖద్దమ్తు  వమా అఖ్ఖర్తు వమా అస్రర్తు వమా ఆలన్తు వమా అంత లము బిహీ మిన్నీ అంతల్ముఖద్దము అంతల్ముఅఖ్ఖిరు. అంఅలా కుల్లి షయ్ఇన్ఖదీర్‌.” — ‘ఓ నా ప్రభూ! నా తప్పులను, మూర్ఖత్వాన్ని, ఆచరణలో హద్దుమీరి ప్రవర్తించటాన్ని, నా కంటే నీవు ఎరిగిన వాటిని క్షమించు. ఓ నా ప్రభూ! ఎగతాళి ద్వారా చేసినపాపాలను లేదా ఏమరు పాటుకు గురై లేదా ఉద్దేశ్యపూర్వకంగా చేసిన పాపాలను నాలో ఉన్న చెడును క్షమించు. ఓ నా ప్రభూ! ఇంతకు ముందు చేసిన పాపాలను, తరువాతచేసిన పాపాలను, బహిరం గంగా చేసిన పాపాలను, రహస్యంగా చేసిన పాపాలను, నా కంటే అధికంగా నీకు తెలిసిన పాపాలను అన్నిటినీ క్షమించు. నీవే ముందుకు సాగించే వాడవు. నీవే వెనక్కి నెట్టేవాడవు. నీవు సమస్త విషయాలపై శక్తి గలవాడవు.’ (బు’ఖారీ, ముస్లిమ్‌)

2483 – [ 2 ] ( صحيح ) (2/765)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: كَانَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ: “اَللّهُمَّ أَصْلِحْ لِيْ دِيْنِيَ الَّذِيْ هُوَ عِصْمَةُ أَمْرِيْ. وَأَصْلِحْ لِيْ دُنْيَايَ الَّتِيْ فِيْهَا مَعَاشِيْ. وَأَصْلَحَ لِيْ آخِرَتِيْ الَّتِيْ فِيْهَا مَعَادِيْ. وَاجْعَلِ الْحَيَاةَ زِيَادَةً لِّيْ فِيْ كُلِّ خَيْرٍ. وَّاجْعَلِ الْمَوْتَ رَاحَةً لِّيْ مِنْ كُلِّ شَرٍّ”. رَوَاهُ مُسْلِمٌ.

2483. (2) [2/765దృఢం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ఈ దు’ఆను పఠించేవారు:

అల్లాహుమ్మ స్లిహ్లీ దీని యల్లజీ హువస్మతు అమ్రీ స్లిహ్లీ దున్యాయ అల్లతీ ఫీహా మఆషీ స్లిహ్లీ ఖిరతీ అల్లతీ ఫీహా ఆదీ వజ్అలిల్‌ ‘హయాతజియాదతన్లీ ఫి కుల్లిఖైరిన్వజ్అలిల్మౌత రాహతన్లీ మిన్కుల్లి షర్రిన్‌.” — ‘ఓ నా ప్రభూ! నా ధర్మాన్ని సంస్కరించు, అదే నా అంతిమ పర్యవసానాన్ని రక్షించేది. నా ప్రాపంచిక వ్యవహారాన్ని చక్కబెట్టు. ఎందుకంటే అందులో నా జీవనోపాధి ఉంది. ఓ నా ప్రభూ! నా పరలోక జీవితాన్ని చక్కదిద్దు. మరణానంతరం నేను తిరిగి అక్కడికే వెళ్ళ వలసి ఉంది. నా పుణ్యకార్యాలు పెరిగి పోయేందుకు అనువుగా, నా జీవితాన్ని తీర్చిదిద్దు. అన్ని రకాల చెడుల నుండి కాపాడుకోవటానికి వీలుగా మరణాన్ని నాకొరకు సుఖవంతం చేయి.” (ముస్లిమ్‌)

2484 – [ 3 ] ( صحيح ) (2/765)

وَعَنْ عَبْدِ اللهِ بْنِ مَسْعُوْدٍ عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم أَنَّهُ كَانَ يَقُوْلُ: “اَللّهُمَّ إِنِّيْ أَسْأَلُكَ الْهُدَى وَالتُّقَى وَالْعَفَافَ وَالْغِنَى”. رَوَاهُ مُسْلِمٌ.

2484. (3) [2/765దృఢం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ మస్‌’ఊద్‌ (ర) కథనం: ప్రవక్త (స) ఈ దు’ఆ పఠించేవారు:

అల్లాహుమ్మ ఇన్నీ అస్అలుకల్హుదా వత్తుఖా వల్‌’అఫాఫ వల్‌’గినా — ‘ఓ నా ప్రభూ! నాకు సన్మార్గాన్ని, దైవ భీతిని, శీలాన్ని, నిరపేక్షా భావాన్ని ప్రసాదించమని వేడుకుంటున్నాను.’ (ముస్లిమ్‌)

2485 – [ 4 ] ( صحيح ) (2/765)

وَعَنْ عَلِيٍّ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ لي رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: قُلِ “اللّهُمَّ اهْدِنِيْ وَسَدِّدْنِيْ”. وَاذْكُرْ بِالْهُدَى هِدَايَتَكَ الطَّرِيْقَ وَبِالسَّدَادِ سَدَادَ السَّهُمِ”.  رَوَاهُ مُسْلِمٌ .

2485. (4) [2/765దృఢం]

‘అలీ (ర) కథనం: ప్రవక్త (స) నన్ను ఈ దు’ఆ పఠించమని ఉపదేశించారు:

అల్లాహుమ్మహ్దినీ సద్దిద్నీ.” — ‘ఓ నా ప్రభూ! రుజుమార్గాన్ని ప్రసాదించు మరియు నన్ను మార్గంలో పెట్టు.’ ఒకవేళ నీవు రుజుమార్గ భాగ్యం అర్ధిస్తే, సత్య మార్గ భాగ్యం ప్రసాదించమని అర్ధించు. సత్య మార్గంపై పెట్టటమంటే బాణంలా తిన్నగా ఉండే భాగ్యం ప్రసాదించమని కోరాలి. (ముస్లిమ్‌)

2486 – [ 5 ] ( صحيح ) (2/766)

وَعَنْ أَبِيْ مَالِكٍ الْأَشْجَعِيِّ عَنْ أَبِيْهِ قَالَ: كَانَ الرَّجُلُ إِذَا أَسْلَمَ عَلَّمَهُ النَّبِيُّ صلى الله عليه وسلم اَلصَّلَاةَ. ثُمَّ أَمَرَهُ أَنْ يَّدْعُوَ بِهَؤُلَاءِ الْكَلِمَاتِ: “اَللّهُمَّ اغْفِرْ لِيْ وَارْحَمْنِيْ وَاهْدِنِيْ وَعَافِنِيْ وَارْزُقْنِيْ”. رَوَاهُ مُسْلِمٌ.

2486. (5) [2/766దృఢం]

అబూ మాలిక్‌ అష్‌జ’యీ (ర) కథనం: అతని తండ్రి గారి కథనం, ఎవరైనా ఇస్లామ్‌ స్వీకరిస్తే ప్రవక్త (స) అతనికి నమా’జ్‌ నేర్పేవారు. ఆ తరువాత ఈ వచనాలను పఠించి దు’ఆ చేయమని ఆదేశించేవారు:  

అల్లాహుమ్మగ్ఫిర్లీ వర్‌’హమ్నీ వహ్దినీ ఆఫినీ వర్‌’జుఖ్నీ.” – ‘ఓ నా ప్రభూ! నన్ను క్షమించు నాపై దయచూపు, నాకు సన్మార్గంచూపు, నన్ను సురక్షితంగా ఉంచు, నాకు ఉపాధి ప్రసాదించు.’ (ముస్లిమ్‌)

2487 – [ 6 ] ( متفق عليه ) (2/766)

وَعَنْ أَنَسٍ قَالَ: كَانَ أَكْثَرُ دُعَاءِ النَّبِيِّ صلى الله عليه وسلم: (“اَللّهُمَّ أتِنَا فِيْ الدُّنْيَا حَسَنَةً وَفِيْ الْآخِرَةِ حَسَنَةً وَّقِنَا عَذَابَ النَّارِ”، 2: 201 )  

2487. (6) [2/766ఏకీభవితం]

అనస్‌ (ర) కథనం: ప్రవక్త (స) సర్వసాధారణంగా ఈ దు’ఆను పఠించేవారు:  

అల్లాహుమ్మ ఆతినా ఫిద్దునియాహసనతన్ఫిల్ఖిరతిహసనతన్వఖినాఅజా బన్నార్.” — ‘ఓ మా ప్రభూ! మాకు ఇహలోకంలో మంచిని మరియు పరలోకంలో కూడా మంచిని ప్రసాదించు. మరియు మమ్మల్ని నరకాగ్ని నుండి కాపాడు.’ (సూ. అల్ బఖరహ్, 2:201).(ముస్లిమ్‌)

—–

اَلْفَصْلُ الثَّانِيْ  రెండవ విభాగం 

2488 – [ 7 ] ( لم تتم دراسته ) (2/766)

عَنِ ابْنِ عَبَّاسٍ قَالَ: كَانَ النَّبِيُّ صلى الله عليه وسلم يَدْعُوْ يَقُوْلُ: “رَبِّ أَعِنِّيْ وَلَا تُعِنْ عَلَيَّ. وَانْصُرْنِيْ وَلَا تَنْصُرْ عَلَيَّ . وَامْكُرْ لِيْ وَلَا تَمْكُرْ عَلَيَّ. وَاهْدِنِيْ وَيَسِّرِ الْهُدَى لِيْ. وَانْصُرْنِيْ عَلَيَّ مَنْ بَغَى عَلَيَّ. رَبِّ اجْعَلْنِيْ لَكَ شَاكِرًا، لَكَ ذَاكِرًا، لَكَ رَاهِبًا، لَكَ مِطْوَاعًا، لَّكَ مُخْبِتًا، إِلَيْكَ أَوَّاهَا مُنِيْبًا، رَبِّ تَقَبَّلْ تَوْبَتِيْ وَاغْسِلْ حَوْبَتِيْ وَأَجِبْ دَعْوَتِيْ وَثَبِّتْ حُجَّتِيْ وَسَدِّدْ لِسَانِيْ وَاْهِد قَلْبِيْ وَاسْلُلْ سَخِيْمَةَ صَدْرِيْ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَأَبُوْ دَاوُدَ وَابْنُ مَاجَهُ.

2488. (7) [2/766అపరిశోధితం]

ఇబ్నె ‘అబ్బాస్‌ (ర) కథనం: ప్రవక్త (స) ఈ దు’ఆను పఠించేవారు:

రబ్బి న్ని వలా తున్‌ ‘అలయ్య, న్‌’సుర్నీ వలాతన్‌’సుర్‌ ‘అలయ్య, వమ్కుర్లీ వలా తమ్కుర్అలయ్య, వహ్దినీ వయస్సిరిల్హుదా లీ, వన్‌’సుర్నీ అలా మన్గా అలయ్య, రబ్బిజ్‌’అల్నీ లక షాకిరన్, లక జాకిరన్, లక రాహిబన్, లక మిత్వాఅన్, లక ముఖ్బితన్, ఇలైక అవ్వహన్మునీబన్. రబ్బి తఖబ్బల్తౌబతీ, వగ్సిల్ హౌబతీ,   అజిబ్ దావతీ, వసబ్బిత్ హుజ్జతీ, వసద్దిద్లిసానీ, వహ్ది ఖల్బీ, స్లుల్సఖీమతసద్రీ.’‘ — ‘ఓ నా ప్రభూ! నాకు సహాయం చేయి, నాకు వ్యతిరేకంగా సహాయం చేయకు. నాకు ఆధిక్యతను ప్రసాదించు, నన్ను ఓటమికి గురి చేయకు, నాకు మార్గాన్నిచూపు, నాకు వ్యతిరేకంగా శత్రువులకు మార్గంచూపకు. నాకు రుజుమార్గాన్ని చూపు, నా కోసం రుజుమార్గాన్ని సులభతరం చేయి. దుర్మార్గులకు వ్యతిరేకంగా నాకు సహాయం చేయి. ఓ నా ప్రభూ! నీ కృతజ్ఞుడిగా, నిన్ను స్మరించేవానిగా, నీకు భయపడేవానిగా, నీ ఆదేశం పాలించేవానిగా, నీ వైపు మరలేవానిగా చేయి. ఓ నా ప్రభూ! నా పశ్చా త్తాపాన్ని స్వీకరించు, నా పాపాలను శుభ్రపరచు, నా దు’ఆను స్వీకరించు, నా ఆధారాన్ని స్థిరంగా ఉంచు, నా నాలుకను సరిచేయి, నా హృదయానికి రుజుమార్గం ప్రసాదించు, నా హృదయంలో ఉన్న నీచత్వాన్ని తీసివేయి.’ (తిర్మిజి’, అబూ దావూద్‌, ఇబ్నె మాజహ్)

2489 – [ 8 ] ( صحيح ) (2/766)

وَعَنْ أَبِيْ بَكْرٍ قَالَ: قَامَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم عَلَى الْمِنْبَرِ ثُمَّ بَكَى فَقَالَ: سَلُوْا اللهَ “الْعَفْوَ وَالْعَافِيَةَ”. فَإِنَّ أَحَدًا لَمْ يُعْطَ بَعْدَ الْيَقِيْنِ خَيْرًا مِّنَ الْعَافِيَةِ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَابْنُ مَاجَهُ. وَقَالَ التِّرْمِذِيُّ: هَذَا حَدِيْثٌ حَسَنٌ غَرِيْبٌ إِسْنَادً ا.

2489. (8) [2/766దృఢం]

అబూ బకర్‌ (ర) కథనం: ప్రవక్త (స) మెంబరుపై నిలబడి ఏడ్వసాగారు. ఆ వెంటనే, ‘మీరు అల్లాహ్‌ను క్షమాపణ, క్షేమం అర్థించండి,’ ఎందుకంటే విశ్వసించిన తరువాత ఎవ్వరికీ క్షేమాన్ని మించింది ప్రసాదించ బడలేదు అని హితబోధచేశారు.” (తిర్మిజి’ – ప్రామా ణికం – ఆధారాల రీత్య ఏకోల్లేఖనం, ఇబ్నె మాజహ్)

2490 – [ 9 ] ( لم تتم دراسته ) (2/767)

وَعَنْ أَنَسٍ أَنَّ رَجُلًا جَاءَ إِلَى النَّبِيِّ صلى الله عليه وسلم فَقَالَ: يَا رَسُوْلَ اللهِ أَيُّ الدُّعَاءِ أَفْضَلُ؟ قَالَ: سَلْ رَبَّكَ: “الْعَافِيَةَ وَالْمُعَافَاةَ فِيْ الدُّنْيَا وَالْآخِرَةِ” .ثُمَّ أَتَاهُ فِيْ الْيَوْمِ الثَّانِيْ. فَقَالَ: يَا رَسُوْلَ اللهِ أَيُّ الدُّعَاءِ أَفْضَلُ؟ فَقَالَ لَهُ مِثْلَ ذَلِكَ ثُمَّ أتَاهُ فِيْ الْيَوْمِ الثَّالِثِ. فَقَالَ لَهُ مِثْلَ ذَلِكَ قَالَ: “فَإِذَا أُعْطِيْتَ الْعَافِيضةَ وَالْمَعَافَاةَ فِيْ الدُّنْيَا وَالْآخِرَةِ فَقَدْ أَفْلَحْتَ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَابْنُ مَاجَهُ وَقَالَ التِّرْمِذِيُّ: هَذَا حَدِيْثٌ حَسَنٌ غَرِيْبٌ إِسْنَادًا.

2490. (9) [2/767అపరిశోధితం]

అనస్‌ (ర) కథనం: ప్రవక్త (స) వద్దకు ఒక వ్యక్తి వచ్చి ఓ అల్లాహ్‌ ప్రవక్తా! ఏ దు’ఆ అన్నిటి కంటే ఉత్తమమైనది?’ అని ప్రశ్నించాడు. ప్రవక్త (స) ”నీవు నీ ప్రభువును, క్షేమాన్ని, జీవితంలో ధార్మికతలో రక్షణను అర్థించాలి. అంటే ఇలా అనాలి:

రబ్బి ఇన్నీ అస్అలుకల్‌ ‘ఆఫియత వల్ముఆఫాత ఫి ద్దునియా వల్ఖరతి.” — ‘ఓ నా ప్రభూ! నిన్ను క్షేమాన్ని, ఉభయలోకాల్లో క్షమాపణను అర్థిస్తున్నాను.’ రెండవరోజు మళ్ళీ ఆ వ్యక్తి వచ్చాడు. ‘ఓ అల్లాహ్‌ ప్రవక్తా! ఏ దు’ఆ అన్నిటికంటే గొప్పది?’ అని ప్రశ్నించాడు. ప్రవక్త (స), ‘మొదటి రోజు ఇచ్చిన సమాధానమే మళ్ళీ ఇచ్చారు. మళ్ళీ మూడవ రోజు ఆ వ్యక్తి వచ్చి మళ్ళీ అలాగే ప్రశ్నించాడు. ప్రవక్త (స) మళ్ళీ ఆ విధంగానే సమాధానం ఇచ్చారు. ప్రవక్త (స) ”నీకు క్షేమాన్ని, జీవితం, ధార్మికతలో రక్షణ ఇవ్వ బడితే, నీవు సాఫల్యం పొందినట్లే. ఇంకా నీవు నీ లక్ష్యంలో సాఫల్యం పొందినట్లే అని అన్నారు.” (తిర్మిజి’ / ప్రామాణికం – ఆధారాల రీత్య ఏకోల్లేఖనం, ఇబ్నె మాజహ్)

2491 – [ 10 ] ( لم تتم دراسته ) (2/767)

وَعَنْ عَبْدِ اللهِ بِنْ يَزِيْدَ الْخَطْمِيِّ عَنْ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم أَنَّهُ كَانَ يَقُوْلُ فِيْ دُعَائِهِ: “اَللّهُمَّ ارْزُقْنِيْ حُبَّكَ وَحُبَّ مَنْ يَّنْفَعُنِيْ حُبُّهُ عِنْدَكَ. اَللّهُمَّ مَا رَزَقْتَنِيْ مِمَّا أُحِبُّ فَاجْعَلْهُ قُوَّةً لِيْ فِيْمَا تُحِبُّ. اَللّهُمَّ مَا زَوَيْتَ عَنِّيْ مِمَّا أُحِبُّ. فَاجْعَلْهُ فِرَاغًا لِّيْ فِيْمَا تُحِبُّ”. رَوَاهُ التِّرْمِذِيُّ.

2491. (10) [2/767అపరిశోధితం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ య’జీద్‌ ‘ఖ’త్‌మి (ర) కథనం: ప్రవక్త (స) తన దు’ఆలో ఇలా పలికేవారు:

అల్లాహుమ్మర్‌’జుఖ్నీహుబ్బ హుబ్బ య్యన్ఉనీహుబ్బుహూఇన్దక ,అల్లాహుమ్మ మా జఖ్తనీ మిమ్మా హిబ్బు ఫజ్అల్హు ఖువ్వతల్లీ ఫీమా తుహిబ్బు, అల్లాహుమ్మ మాజ వై అన్నీ మిమ్మా హిబ్బు ఫజ్అల్హు ఫరాగల్లీ ఫీమా తుహుబ్బు.” — ‘ఓ నా ప్రభూ! నాకు నీ ప్రేమను, నీవద్ద నాకు లాభం చేకూర్చే వారి ప్రేమను ప్రసాదించు, ఓ నా ప్రభూ! నీవు నాకిచ్చే ప్రేమను నీకిష్టమైన వాటిలో నాకు బలం చేకూర్చు. ఓ నా ప్రభూ! నీవు నాకు ప్రసాదించిన ప్రియమైనవాటిలో, నీకు ఇష్టమైన వాటిలో నిమగ్నమై ఉన్నట్లు నాకు స్థిరత్వాన్ని ప్రసాదించు.” (తిర్మిజి’)

2492 – [ 11 ] ( لم تتم دراسته ) (2/767)

وَعَنِ ابْنِ عُمَرَ قَالَ: قَلَمَّا كَانَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم يَقُوْمُ مِنْ مَّجْلِسٍ حَتَّى يَدْعُوْ بِهَؤُلَاءِ الدَّعَوَاتِ لِأَصْحَابِهِ: “اَللّهُمَّ اقْسِمْ لَنَا مِنْ خَشْيَتِكَ مَا تَحُوْلُ بِهِ بَيْنَنَا وَبَيْنَ مَعَاصِيْكَ. وَمِنْ طَاعَتِكَ مَا تُبَلِّغُنَا بِهِ جَنَّتَكَ. وَمِنَ الْيَقِيْنِ مَا تُهَوِّنُ بِهِ عَلَيْنَا مُصِيْبَاتِ الدُّنْيَا وَمَتِعْنَا بِأَسْمَاعِنَا وَأَبْصَارِنَا وَقُوَّتِنَا مَا أَحْيَيَتْنَا وَاجْعَلْهُ الْوَارِث مِنَّا وَاجْعَلْ ثَأرَنَا عَلَى مَنْ ظَلَمَنَا وَانْصُرْنَا عَلَى مَنْ عَادَانَا وَلَا تَجْعَلْ مُصِيْبَتِنَا فِيْ دِيْنِنَا وَلَا تَجْعَلِ الدُّنْيَا أَكْبَرُ هَمِّنَا وَلَا مَبْلَغَ عِلْمِنَا وَلَا تُسَلِّطْ عَلَيْنَا مَنْ لَّا يَرْحَمُنَا”. رَوَاهُ التِّرْمِذِيُّ وَقَالَ: هَذَا حَدِيْثٌ حَسَنٌ غَرِيْبٌ.

2492. (11) [2/767అపరిశోధితం]

‘ఉమర్‌ (ర) కథనం: ప్రవక్త (స) అనుచరుల సమా వేశంనుండి లేచి అనుచరులకొరకు ఆ సమా వేశంలో దు’ఆ చేసేవారు:

అల్లాహుమ్మఖ్సిమ్లనా మిన్‌ ‘ఖష్యతిక, మాతహూలు బిహీ బైననా వబైన సీక, వమిన్తాతి మా తుబల్లిగునా బిహీ జన్నతక, మినల్యఖీన మాతుహవ్విను బిహీ అలైనా ముసీబాతి ద్దునియా, మత్తీనా బిఅస్మాయినా వఅబ్‌’సారినా ఖువ్వతినా మా హ్యయ్తనా ,వజ్అల్‌’హుల్వారిసమిన్నా ,వజ్అల్సారనాఅలా మన్‌ ”జలమనా, వన్‌’సుర్నాఅలా మన్దానా, వలా తజ్అల్ముసీబతనా ఫీ దీనినా, వలాతజ్అలిద్దునియా అక్బరహమ్మినా, వలామబ్ఇల్మినా, వలాతుసల్లిత్అలైనా న్ లా యర్హమునా.” — ‘ఓ నా ప్రభూ! నీ భయాన్ని మాకు పంచిపెట్టు. అది మాకు నీ అవిధేయతకు మధ్య అడ్డుతెర కావాలి. మాకు విధేయత ప్రసాదించు. అది మమ్మల్ని స్వర్గానికి చేర్చాలి. మాకు గట్టినమ్మకం ప్రసాదించు. దానివల్ల ఇహలోక కష్టాలు మాకు చాలా తేలిక అయిపోవాలి. మాకు సజీవంగా ఉంచినంత వరకు మా చెవులలో, కళ్ళలో, శక్తి యుక్తులలో లాభాన్ని చేకూర్చు. వాటిలో ప్రతి ఒక్కదాన్ని మా వారసులుగా చేయి. మా కోపాన్ని మా దైర్జన్యపరులపై వేయి. మా శత్రువు లకు వ్యతిరేకంగా మాకు సహాయం చేయి. మా ధార్మి కతలో కష్టాలకు గురిచేయకు. ప్రాపంచిక జీవి తాన్ని మాదుఃఖాలకు మూలంగా, మా జ్ఞానం చేరిన చోటుగా చేయకు. ఇంకా మాపై కఠోర మనస్కులను అవత రింపజేయకు.’ (తిర్మిజి’-ప్రామాణికం- ఏకోల్లేఖనం)

2493 – [ 12 ] ( لم تتم دراسته ) (2/768)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: كَانَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ: “اَللّهُمَّ انْفَعْنِيْ بِمَا عَلَّمْنِيْ وَعَلِّمْنِيْ مَا يَنْفَعُنِيْ وَزِدْنِيْ عِلْمًا الْحَمْدُ لِلّهِ عَلَى كُلِّ حَالٍ وَأَعُوْذُ بِاللهِ مِنْ حَالِ أَهْلِ النَّارِ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَابْنُ مَاجَهُ .

وَقَالَ التِّرْمِذِيُّ: هَذَا حَدِيْثٌ غَرِيْبٌ إِسْنَادًا.

2493. (12) [2/767అపరిశోధితం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ఈ దు’ఆను పఠించేవారు:

అల్లాహుమ్మన్అనీ బిమాఅల్లమ్తనీ, అల్లిమ్నీ మా యన్నీ, జిద్నీఇల్మన్, అల్ హమ్దులిల్లాహిఅలాకుల్లిహాలిన్, ఊజు బిల్లాహి మిన్‌ ‘హాలి అహ్లిన్నారి.” — ‘ఓ నా ప్రభూ! నీవు నాకు నేర్పినదానిద్వారా నాకులాభం చేకూర్చు ఇంకా నాకు లాభంచేకూర్చేదాన్ని  నాకునేర్పు. ఇంకా నా జ్ఞానాన్ని వృద్ధిపరచు. ఎల్లవేళలా స్తోత్రా లన్నీ అల్లాహ్‌ కొరకే. ఇంకా నరకవాసుల దుస్థితి నుండి నేను అల్లాహ్‌ను శరణు కోరుతున్నాను.” (తిర్మిజి’ – ఆధారాల రీత్య ఏకోల్లేఖనం, ఇబ్నె మాజహ్)

2494 – [ 13 ] ( لم تتم دراسته ) (2/768)

وَعَنْ عُمَرَ بْنِ الْخَطَّابِ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: كَانَ النَّبِيُّ صلى الله عليه وسلم إِذَا نَزِلَ عَلَيْهِ الْوَحْيُ سُمِعَ عِنْدَ وَجْهِهِ دَوِيٌّ كَدَوِيِّ النَّحْلِ. فَأُنْزِلَ عَلَيْهِ يَوْمًا فَمَكَثْنَا سَاعَةً فَسُرِّيَ عَنْهُ فَاسْتَقْبَلَ الْقِبْلَةَ وَرَفَعَ يَدَيْهِ وَقَالَ: “اَللّهُمَّ زِدْنَا وَلَا تَنْقُصْنَا وَأَكْرِمْنَا وَلَا تُهِنَّا وَأَعْطِنَا وَلَا تَحْرِمْنَا وَآثِرْنَا وَلَا تُؤْثِرْعَلَيْنَا وَأَرْضِنَا وَأَرْضَ عَنَّا”. ثُمَّ قَالَ: “أُنْزِلَ عَلَيَّ عَشْرُ آيَاتٍ مَّنْ أَقَامَهُنَّ دَخَلَ الْجَنَّةَ”. ثُمَّ قَرَأَ: (قَدْ أَفْلَحَ الْمُؤْمِنُوْنَ، 23: 1-10) حَتَّى خَتَمَ عَشْرَ آيَاتٍ . رَوَاهُ أَحْمَدُ وَالتِّرْمِذِيُّ.

2494. (13) [2/767అపరిశోధితం]

‘ఉమర్‌ (ర) కథనం: ప్రవక్త (స) పై దైవవాణి అవతరించబడినపుడు, ప్రవక్త (స) ముఖం ముందు మధురమైన శబ్దం వినపడేది. తేనెటీగలు ఎగురు తున్నట్లు శబ్దం వచ్చేది. ఒకసారి ప్రవక్త (స)పై దైవవాణి అవతరించసాగింది. మేము కొంత సేపు ప్రవక్త (స)వద్ద నిలబడి ఉన్నాం. దైవవాణి అవతరణ పూర్తయింది. ప్రవక్త (స) నుండి దైవవాణి తీవ్రత దూర మయింది. ప్రవక్త (స) కొంత విశ్రాంతి తీసుకున్నారు. ఆ తరువాత ప్రవక్త (స) ఖిబ్లా వైపు తిరిగి రెండు చేతులు ఎత్తి ఈ దు’ఆ పఠించారు:

అల్లాహుమ్మ జిద్నా వలా తన్ఖుస్నా వఅక్రిమ్నా వలాతుహిన్నా, ఆతినా వలా హ్రిమ్నా, ఆసిర్నా వలా తూసిర్అలైనా, అర్జినా వర్జఅన్నా.” — ‘ఓ నా ప్రభూ! నీవు మా స్థాయిని పెంచనూవద్దు, తగ్గించనూ వద్దు. మాకు గౌరవనాన్ని ప్రసాదించు. మమ్మల్ని అవమాన పరచకు. మాకు ప్రసాదించు, తప్పించకు. మమ్మల్ని పెంచి సంతోషపరచు. ఇతరులను మాకంటే పెంచకు, మమ్మల్ని సంతోషపరచు. మా పట్ల సంతోషం వ్యక్తం చేయి.’ ఆ తరువాత ప్రవక్త (స), నాపై 10 ఆయతులు అవతరింపజేయబడ్డాయి. వాటిని ఆచరించి, వాటి ఆదేశాలను పాలించేవాడు స్వర్గంలో ప్రవేశిస్తాడు అని పలికి, ”సూరహ్ అల్‌-మూమినూన్‌, 23:1-10 ఆయతులు పఠించారు.” [84]  (అ’హ్మద్‌, తిర్మిజి’)

—–

اَلْفَصْلُ الثَّالِثُ  మూడవ విభాగం  

2495 – [ 14 ] ( صحيح ) (2/768)

عَنْ عُثْمَانَ بْنِ حُنَيْفٍ قَالَ :إِنَّ رَجُلًا ضَرِيْرَ الْبَصَرِ أَتَى النَّبِيَّ صلى الله عليه وسلم فَقَالَ: ادْعُ اللهَ أَنْ يُّعَافِيْنِيْ فَقَالَ: “إِنْ شِئْتَ دَعَوْتَ وَإِنْ شِئْتَ صَبَرْتَ فَهُوَ خَيْر لَكَ”. قَالَ: فَادْعُهُ. قَالَ: فَأَمَرَهُ أَنْ يَّتَوَضَأَ فَيُحْسِنَ الْوَضُوْءَ وَيَدْعُوْ بِهَذَا الدُّعَاءِ: “اَللّهُمَّ إِنِّيْ أَسْأَلُكَ وَأَتَوَجَّهُ إِلَيْكَ بِنَبِيِّكَ مُحَمَّدٍ نَبِيِّ الرَّحْمَةِ إِنِّيْ تَوَجَّهْتُ بِكَ إِلَى رَبِّيْ لِيَقْضِيَ لِيْ فِيْ حَاجَتِيْ هَذِهِ. اللّهُمَّ فَشَفِّعْهُ فِي”. رَوَاهُ التِّرْمِذِيُّ وَقَالَ: هَذَا حَدِيْثٌ حَسَنٌ صَحِيْحٌ غَرِيْبٌ.

2495. (14) [2/768దృఢం]

‘ఉస్మా’న్‌ బిన్‌ ‘హునైఫ్‌(ర) కథనం: ప్రవక్త (స) వద్దకు ఒక అంధుడు వచ్చి ఓ అల్లాహ్‌ ప్రవక్తా! అల్లాహ్‌ (త) నన్ను క్షేమంగా ఉంచమని (అంధత్వం దూరం చేయ మని) దు’ఆ చేయండని విన్న వించు కున్నాడు. ప్రవక్త (స) ‘ఒకవేళ నువ్వు కోరితే నీ గురించి దు’ఆ చేస్తాను. ఒకవేళ నువ్వు కోరితే ఓర్పు, సహనం వహించు. ఇది నీకు చాలా మంచిది,’ అని అన్నారు. ఆ వ్యక్తి, ”తమరు దు’ఆ చేయండని” అన్నాడు. ప్రవక్త(స) అతన్ని శుభ్రంగా వు’జూచేసి రమ్మని ఆదేశించారు. ఈ దు’ఆను పఠించమని అన్నారు:

అల్లాహుమ్మ ఇన్నీ అస్అలుక అతవజ్జహు ఇలైక బినబియ్యిక ముహమ్మదిన్నబియిర్రహ్మతి ,ఇన్నీ తవజ్జహ్తు బిక ఇలా రబ్బీ లియఖ్జిదియలీ ఫీహాజతీ హాజిహీ అల్లాహుమ్మ ఫషఫ్ఫీహు ఫియ్య.”  — ‘ఓ నా ప్రభూ! నిన్ను అర్థిస్తున్నాను. నీ కారుణ్య ప్రవక్త ము’హమ్మద్‌ (స) ద్వారా నీ వైపు మరలు తున్నాను. ఓ ప్రవక్తా! నేను మిమ్మల్ని నా అవసరాలను పరిష్కరించటానికి మీ ప్రభువు వైపు మరలిస్తున్నాను. దానివల్ల అల్లాహ్‌ (త)ను అవసరాలు పూర్తిచేయాలని. ఓ నా ప్రభూ! ప్రవక్త (స) నా గురించి చేసిన సిఫారసును స్వీకరించు.” [85]  (తిర్మిజి’  – ప్రామాణికం – దృఢం – ఏకోల్లేఖనం)

2496 – [ 15 ] ( لم تتم دراسته ) (2/769)

وَعَنْ أَبِيْ الدَّرْدَاءِ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم كَانَ مِنْ دُعَاءِ دَاوُدَ يَقُوْلُ: “اَللّهُمَّ إِنِّيْ أَسْأَلُكَ حُبَّكَ وَحُبَّ مَنْ يُحِبُّكَ وَالْعَمَلَ الَّذِيْ يُبَلِّغُنِيْ حُبَّكَ. اللّهُمَّ اجْعَلْ حُبَّكَ أَحَبَّ إِلَيَّ مِنْ نَفْسِيْ وَمَالِيْ وَ أَهْلِيْ وَمِنَ الْمَاءِ الْبَارِدِ”. قَالَ: وَكَانَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم إِذَا ذُكِرَ دَاوُدَ يُحَدِّثُ عَنْهُ يَقُوْلُ: “كَانَ أَعْبَدَ الْبَشَرِ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَقَالَ: هَذَا حَدِيْثٌ حَسَنٌ غَرِيْبٌ .

2496. (15) [2/769అపరిశోధితం]

అబూ దర్దా (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, దావూ’ద్‌ (అ) ఈ దు’ఆను పఠించేవారు:

అల్లాహుమ్మ ఇన్నీ అస్అలుకహుబ్బక హుబ్బ న్ యుహిబ్బుక, వల్‌ ‘అమలల్లజీ యు బల్లిగునీహుబ్బక, అల్లాహుమ్మజ్అల్‌ ‘హుబ్బక అహుబ్బఇలయ్య మిన్నఫ్సీ వమాలీ అహ్లీ వమినల్మాయిల్బారిది.” — ‘ఓ అల్లాహ్‌! నేను నీ ప్రేమ, నీ ప్రియుల ప్రేమ కొరకు, నిన్ను కోరుతు న్నాను. ఇంకా నీ ప్రేమవరకు చేర్చే ఆచరణను అర్థిస్తు న్నాను. ఓ అల్లాహ్‌ నీ ప్రేమను అన్నిటికంటే ప్రియ మైనదిగా అంటే నాప్రాణం, నాధనం, నా కుటుంబం, చల్లని నీటికంటే ప్రియమైనదిగా నిర్ణయించు.’

ఉల్లేఖన కర్త కథనం: ప్రవక్త (స) దావూ’ద్‌ అలైహిస్సలామ్‌ గురించి ప్రస్తావించినా, అతని గురించి ఏదైనా వివరించినా దావూ’ద్‌ (అ) తన కాలంలో అందరికంటే అధికంగా దైవారాధనలో నిమగ్నమై ఉండేవారు అని చెప్పేవారు. (తిర్మిజి’ – ప్రామాణికం-ఏకోల్లోఖనం)

2497 – [ 16 ] ( صحيح ) (2/769)

وَعَنْ عَطَاءِ بْنِ السَّائِبِ عَنْ أَبِيْهِ قَالَ: صَلّى بِنَا عَمَّارُ بْنُ يَاسِرٍ صَلَاةً. فَأَوْجَزَ فِيْهَا فَقَالَ لَهُ بَعْضُ الْقَوْمِ: لَقَدْ خَفَّفْتَ وَأَوْجَزْتَ الصَّلَاةَ. فَقَالَ أَمَا عَلَيَّ ذَلِكَ لَقَدْ دَعَوْتُ فِيْهَا بِدَعَوَاتٍ سَمِعْتُهُنَّ مِنْ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم. فَلَمَّا قَامَ تَبِعَهُ رَجُلٌ مِّنَ الْقَوْمِ هُوَ أَبِيْ غَيْرَ أَنَّهُ كَنَى عَنْ نَفْسِهِ فَسَأَلَهُ عَنِ الدُّعَاءِ. ثُمَّ جَاءَ فَأَخْبَرَ بِهِ الْقَوْمَ: “اَللّهُمَّ بِعِلْمِكَ الْغَيْبَ وَقُدْرَتِكَ عَلَى الْخَلْقِ أَحْيِنِيْ مَا عَلِمْتَ الْحَيَاةَ خَيْرًا لِّيْ وَتَوَفَّنِيْ إِذَا عَلِمْتَ الْوَفَاةَ خَيْرًا لِّيْ. اَللّهُمَّ وَأَسْأَلُكَ خَشْيَتَكَ فِيْ الْغَيْبِ وَالشَّهَادَةِ وَأَسْأَلُكَ كَلِمَةَ الْحَقِّ فِي الرِّضَى وَالْغَضَبِ وَأَسْأَلُكَ الْقَصْدَ فِيْ الْفَقْرِ وَالْغِنَى وَأَسْأَلُكَ نَعِيْمًا لَا يَنْفَدُ وَأَسْأَلُكَ قرَّةُ عَيْنِ لَا تَنْقَطِعُ وَأَسْأَلُكَ الرِّضَى بَعْدَ الْقَضَاءِ وَأَسْأَلُكَ بَرْدَ الْعَيْشِ بَعْدَ الْمَوْتِ وَأَسْأَلُكَ لَذَّةَ النَّظْرِ إِلَى وَجْهِكَ وَالشَّوْقَ إِلَى لِقَائِكَ فِيْ غَيْرِ ضَرَّاءَ مُضِرَّةِ وَلَا فِتْنَةٍ مُضِلَّةٍ. اَللّهُمَّ زَيِّنًا بِزِيْنَةِ الْإِيْمَانِ وَاجْعَلْنَا هُدَاةً مَّهْدِّيِّيْنَ”. رَوَاهُ النَّسَائِيُّ.

2497. (15) [2/769దృఢం]

‘అ’తా’ బిన్‌ సా’యిబ్‌ తన తండ్రిద్వారా కథనం: ‘అమ్మార్‌ బిన్‌ యా’సిర్‌ మాకు నమా’జ్‌ చాలా సంక్షిప్తంగా చదివించారు. కొంతమంది, ”ఈ వేళ మీరు చాలా సంక్షిప్తంగా నమా’జు చదివించారు,” అని అన్నారు. దానికి ‘అమ్మార్‌ బిన్‌యాసిర్‌ సమాధానం ఇస్తూ, ”సంక్షిప్తంగా నమా’జు చదవటం నాకేం నష్టమైన పనికాదు. ఎందుకంటే ఈ నమా’జులో నేను ప్రవక్త(స) పఠిస్తూ ఉండగా విన్న దు’ఆలను పఠించాను,’ అని సమాధానం ఇచ్చారు. ఆ తరువాత ‘అమ్మార్‌ బిన్‌ యా’సిర్‌ అక్కడి నుండి బయలు దేరి వెళుతుండగా ఒకవ్యక్తి ఆయన వెంట వెళ్ళాడు. ఆ వ్యక్తి మా నాన్న గారు ‘సాయిబ్‌ ‘అమ్మార్‌ నుండి ఆ దు’ఆ కనుక్కొని  తిరిగి వచ్చి ప్రజలకు తెలిపారు. ఆ దు’ఆ ఇది:

అల్లాహుమ్మ బిఇల్మికల్ గైబ, ఖుద్రతికఅలల్‌ ‘ఖల్ఖి, హ్యినీ మాఅలిమ్తల్‌ ‘హయాతఖైరల్లీ, వతవప్ఫనీ ఇజా అలిమ్తల్వఫాతఖైరల్లీ, అల్లాహుమ్మ అస్అలుకఖష్యతక ఫిల్‌’గైబి వష్షహాదతి, వఅస్అలుక కలిమతల్‌ ‘హఖ్ఖి ఫిర్రిదా వల్‌ ‘గజబి,   అస్అలుకల్ఖస్ ఫిల్ఫఖ్రి వల్‌’గినా, అస్అలుక నయీమన్లాయన్ఫుదు,  వఅస్అలుక ఖుర్రత ఐనిన్లా తన్ఖతి, వఅస్అలు ర్రిజా బాదల్దాయి, వఅస్అలుక బర్దల్ఐషి దల్మౌతి, అస్అలుక లజ్జతన్నజ్రి ఇలా వజ్‌’హిక, వష్షౌఖ ఇలా లిఖాయిక, ఫీగైరిర్రా ముదిర్రతిన్,  వలా ఫిత్నతిన్ముదిల్లతిన్.  అల్లాహుమ్మజయ్యిన్నా బిజీనతిల్ ఈమాని,  వజ్అల్నా హుదాతన్ మహ్దియ్యీన్‌.” — ‘ఓ అల్లాహ్‌! నీ అగోచర జ్ఞానం శుభంతో, సృష్టితాలపై నీ శక్తి ద్వారా నాకు జీవితం శుభకరంగా ఉన్నంతవరకు సజీవంగా ఉంచు. ఇంకా నా చావు నాకు శుభకరమైనపుడు నాకు చావు ప్రసాదించు. ఓ అల్లాహ్‌! సంతోషంలో ఆగ్రహంలో నాకు సత్యం, న్యాయం పలికే భాగ్యాన్ని ప్రసాదించు. ఇంకా కష్టాల్లోనూ సుఖాల్లోనూ నాకు మధ్యే మార్గాన్ని ప్రసాదించు. ఓ అల్లాహ్‌ నేను నశించని అను గ్రహాలు, కంటిచలువఅర్థిస్తున్నాను. నాపట్ల నీ తీర్పు తరువాత నీ సంతృప్తిని కోరుతున్నాను. ఇంకా నేను మరణం తరువాత సుఖజీవితాన్ని అర్థిస్తు న్నాను. ఇంకా నీ ముఖాన్ని చూచే మాధుర్యాన్ని, ఎటువంటి కష్టం లేని, నిన్ను కలిస్తే ఉత్సాహాన్ని, ఎటువంటి అవ మానంలేని పరీక్షను కోరుతున్నాను. ఓ అల్లాహ్‌! విశ్వాసంద్వారా మమ్మల్నిఅలంక రించు. మమ్మల్ని రుజు మార్గగాముల మార్గదర్శిగా చేయి.’ (నసాయి’)

2498 – [ 17 ] ( لم تتم دراسته ) (2/770)

وَعَنْ أُمِّ سَلَمَةَ أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم كَانَ يَقُوْلُ فِيْ صَلَاةِ الْفَجْرِ: “اَللّهُمَّ إِنِّيْ أَسْأَلُكَ عِلْمًا نَافِعًا وَعَمَلًا مُّتَقَبَّلًا وَرِزْقًا طَيِّبًا”. رَوَاهُ أَحْمَدُ وَابْنُ مَاجَهُ وَالْبَيْهَقِيُّ فِيْ الدَّعْوَاتِ الْكَبِيْرِ.

2498. (17) [2/770అపరిశోధితం]

ఉమ్మె సలమహ్ (ర) కథనం: ప్రవక్త (స) ఫజ్ర్‌ నమా’జు తర్వాత ఈ దు’ఆ పఠించేవారు:

అల్లాహుమ్మ ఇన్నీ అస్అలుకఇల్మన్నాఫిఅన్ అమలన్ ముతఖబ్బలన్వరిజ్ఖన్తయ్యిబన్‌.” — ‘ఓ అల్లాహ్‌! నేను లాభం చేకూర్చే జ్ఞానాన్ని, స్వీక రించబడే కర్మను, పరిశుద్ధ ఉపాధికి నిన్ను అర్థిస్తు న్నాను.’ (ఇబ్నె మాజహ్, బైహఖీ-ద’అవాతుల్ కబీర్)

2499 – [ 18 ] ( لم تتم دراسته ) (2/770)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: دُعَاءٌ حَفِظْتُهُ مِنْ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم لَا أَدْعُهُ: “اَللّهُمَّ اجْعَلْنِيْ أُعْظِمُ شُكْرَكَ وَأَكْثِرُ ذِكْرَكَ وَأَتَّبِعُ نُصْحَكَ وَأَحْفَظُ وَصِيَّتَكَ”. رَوَاهُ التِّرْمِذِيُّ.

2499. (18) [2/770అపరిశోధితం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ఈ దు’ఆను నేను ప్రవక్త (స) నుండి విని కంఠస్తం చేసుకున్నాను. దీన్ని ఎప్పుడూ వదిలేవాడిని కాను. అంటే ఎల్లప్పుడూ చదువుతూ ఉంటాను:

అల్లాహుమ్మజ్అల్నీ అజిము షుక్రక, క్సిరు జిక్రక, వఅత్తబిఉ నుస్‌’హక, వఅహ్ఫిజు సియ్యతక.” — ‘ఓ అల్లాహ్‌! నన్ను నీ చాలా గొప్ప కృతజ్ఞునిగా చేయి, ఎల్లప్పుడూ నిన్ను గుర్తు చేసేవానిగా చేయి. నన్ను నీ బోధనలను అనుసరించే వానిగా, గుర్తుంచేవానిగా చేయి.” (తిర్మిజి’)

2500 – [ 19 ] ( لم تتم دراسته ) (2/770)

وَعَنْ عَبْدِ اللهِ بْنِ عَمْرٍو قَالَ: كَانَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ: “اَللّهُمَّ إِنِّيْ أَسْأَلُكَ الصِّحَّةَ وَالْعِفَّةَ وَالْأَمَانَةَ وَحُسْنَ الْخُلُقِ وَالرِّضَى بِالْقَدْرِ. رَوَاهُ الْبَيْهَقِيُّ فِيْ الدَّعْوَاتِ الْكَبِيْرِ

2500. (19) [2/770అపరిశోధితం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘అమ్ర్ (ర) కథనం: ప్రవక్త (స) ఇలా ప్రవచించేవారు:

అల్లాహుమ్మ ఇన్నీ అస్అలుక స్సిహ్హత వల్ఇప్ఫత వల్అమానత హుస్నల్‌ ‘ఖులుఖి వర్రిదా బిల్ఖద్ర్‌.” — ‘ఓ నా ప్రభూ! నేను నిన్ను ఆరోగ్యం, దైవభీతి, అమానతు, సద్గుణాలు, విధివ్రాతపై సంతృప్తులను అర్థిస్తున్నాను.’ (బైహఖీ)

2501 – [ 20 ] ( لم تتم دراسته ) (2/770)

وَعَنْ أُمِّ مَعْبَدٍ قَالَتْ: سَمِعْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ: “اَللّهُمَّ طَهِّرُ قَلْبِيْ مِنَ النِّفَاقِ وَعَمَلِيْ مِنَ الرِّيَاءِ وَلِسَانِيْ مِنَ الْكَذِبِ وَعَيْنِيْ مِنَ الْخِيَانَةِ. فَإِنَّكَ تَعْلَمُ خَائِنَةَ الْأَعْيُنِ وَمَا تُخْفِيْ الصُّدُوْرُ”. رَوَاهُمَا الْبَيْهَقِيُّ فِيْ الدَّعْوَاتِ الْكَبِيْرِ.

2501. (20) [2/770అపరిశోధితం]

ఉమ్మె మ’అబద్‌ (ర) కథనం: ప్రవక్త (స)ను ఈ దు’ఆ పఠిస్తూ ఉండగా నేను విన్నాను:

అల్లాహుమ్మతహ్హిర్ఖల్బీ, మినన్నిఫాఖి, అమలీ మినర్రియాయి,  వలిసానీ మినల్కజిబి, ఐనీ మినల్‌ ‘ఖియానతి, ఫఇన్నక లముఖాయి నతల్యుని వమాతుఖ్ఫిస్సుదూర్‌.”  — ‘ఓ నా ప్రభూ! కాపట్యం నుండి నా హృదయాన్ని, నా ఆచరణను చూపుగోలునుండి, నా నాలుకను అసత్యంనుండి, నా కళ్ళను ద్రోహంనుండి పరిశుభ్ర పరచు. ఎందుకంటే నిస్సందేహంగా కళ్ళద్రోహం, హృదయాలు దాచేవి సైతం నీకు తెలుసు.’ (బైహఖీ)

2502 – [ 21 ] ( صحيح ) (2/770)

وَعَنْ أَنَسٍ:أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم عَادَ رَجُلًا مِنَ الْمُسْلِمِيْنَ قَدْ خَفَتَ فَصَارَمِثْلَ الْفَرْخِ فَقَالَ لَهُ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “هَلْ كُنْتَ تَدْعُو اللهَ بِشَيْءٍ أَوْ تَسْأَلُهُ إِيَّاهُ؟”  قَالَ: نَعَمْ كُنْتُ أَقُوْلُ: اَللّهُمَّ مَا كُنْتَ مُعَاقِبِيَّ بِهِ فِيْ الْآخِرَةِ فَعَجِّلْهُ لِيْ فِيْ الدُّنْيَا. فَقَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “سُبْحَانَ اللهِ لَا تُطِيْقُهُ وَلَا تَسْتَطِيْعُهُ أَفَلَا قُلْتَ: (“اَللّهُمَّ آتِنَا فِيْ الدُّنْيَا حَسَنَةً وَّفِيْ الْآخِرَةِ حَسَنَةً وَّقِنَا عَذَابَ النَّارِ”، 2: 201). قَالَ: فَدَعَا اللهَ بِهِ فَشَفَاهُ اللهُ . رَوَاهُ مُسْلِمٌ .

2502. (21) [2/770దృఢం]

అనస్‌ (ర) కథనం: ప్రవక్త (స) అనారోగ్యంగా ఉన్న ఒక ముస్లిమ్‌ను పరామర్శించడానికి వెళ్ళారు. అతడు పక్షి పిల్లలా చాలా బలహీనుడైపోయాడు. ప్రవక్త (స) అతన్ని: ”నువ్వు అల్లాహ్‌ (త)ను ప్రార్థించావా లేదా అల్లాహ్‌ (త)ను అర్థించావా,” అని అడిగారు. దానికి ఆ వ్యక్తి, ”అవును, నేను:

అల్లాహుమ్మ మాకున్త ముఆఖిబియ్య  బిహీ ఫిల్ ఖిరతి, ఫఅజ్జిల్హు లీ ఫిద్దునియా.” — ‘ఓ అల్లాహ్! నువ్వు నన్ను పరలోకంలో ఇవ్వదలచు కున్న శిక్షను భూలోకం లోనే త్వరగా ఇచ్చివేయి,’ అని ప్రార్థించాను” అని అన్నాడు.

ప్రవక్త (స) అది విని, ”అల్లాహ్‌ (త) పరిశుద్ధుడు, నువ్వు అల్లాహ్‌ (త) శిక్షను భూలోకంలోనూ, పరలోకంలోనూ భరించలేవు. నువ్వు:

అల్లాహుమ్మ తినా ఫిద్దునియాహసనతన్వఫిల్‌ ‘ఖిరతిహసనతన్ ఖినాఅజాబన్నార్‌.” — ‘ఓ మా ప్రభూ! నువ్వు మాకు ఇహలోకం లోనూ మంచిని ప్రసాదించు, ఇంకా మాకు పరలోకంలోనూ  మంచిని ప్రసాదించు,’ (సూ. అల్-బఖరహ్, 2:201) అని ఎందుకు ప్రార్థించలేదని అన్నారు. అప్పుడా వ్యక్తి ఈ దు’ఆ ద్వారా అల్లాహ్‌ను ప్రార్థించాడు, అల్లాహ్‌ (త) అతనికి స్వస్థతను ప్రసాదించాడు. (ముస్లిమ్‌)

2503 – [ 22 ] ( لم تتم دراسته ) (2/771)

وَعَنْ حُذَيْفَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَا يَنْبَغِيْ لِلْمُؤْمِنِ أَنْ يُّذِلَّ نَفْسَهُ”. قَالُوْا: وَكَيْفَ يُذِلُّ نَفْسَهُ؟ قَالَ: “يَتَعَرَّضُ مِنَ الْبَلَاءِ لِمَا لَا يُطِيْقُ” .رَوَاهُ التِّرْمِذِيُّ وَابْنُ مَاجَهُ وَالْبَيْهَقِيُّ فِيْ شُعَبِ الْإِيْمَانِ.

وَقَالَ التِّرْمِذِيُّ: هَذَا حَدِيْثٌ حَسَنٌ غَرِيْبٌ.

2503. (22) [2/771అపరిశోధితం]

‘హుజై’ఫహ్ (ర) కథనం: ప్రవక్త (స) ‘తన్ను తాను పరాభవంపాలు చేయడం విశ్వాసికి తగదు,’ అని అన్నారు. అక్కడున్నవారు, ‘తన్ను తాను ఎలా పరాభవంపాలు చేస్తాడు,’ అని అడిగారు. దానికి ప్రవక్త (స) ”తట్టుకునే శక్తిలేని కష్టాలకు, నష్టాలకు, ఆపదలకు గురికావడం,” అని సమాధానం ఇచ్చారు. (తిర్మిజి’ – ప్రామాణికం-ఏకోల్లేఖనం, ఇబ్నె మాజహ్, బైహఖీ-షు’అబిల్ ఈమాన్)

2504 – [ 23 ] ( لم تتم دراسته ) (2/771)

وَعَنْ عُمَرَ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: عَلَّمَنِيْ رَسُوْلُ اللهِ صلى الله عليه و سلم قَالَ: “قُلْ اَللّهُمَّ اجْعَلْ سَرِيْرَتِيْ خَيْرًا مِّنْ عَلَانَيِتِيْ وَاجْعَلْ عَلَانَيَتِيْ صَالِحَةً. اَللّهُمَّ إِنِّيْ أَسْأَلُكَ مِنْ صَالِحِ مَا تُؤْتِيْ النَّاسَ مِنَ الْأَهْلِ وَالْمَالِ وَالْوَلَدِ غَيْرِالضَّالِّ وَلَا الْمُضِلِّ” .روَاهُ التِّرْمِذِيُّ.

2504. (23) [2/771అపరిశోధితం]

‘ఉమర్‌ (ర) కథనం: ప్రవక్త (స) నాకు ఈ దు’ఆ నేర్పి దీన్ని పఠిస్తూఉండు అని అన్నారు.

అల్లాహుమ్మజ్అల్సరీరతీఖైరన్మిన్‌ ‘అలా నియతీ, వజ్అల్‌ ‘అలానియతీసాలిహతన్‌, అల్లా హుమ్మ ఇన్నీ అస్అలుక మిన్‌’సాలిహి మ్మా తూతీ న్నాస మినల్అహ్లి వల్మాలి వల్వలది గైరిజ్జాల్లి వల్ముజిల్లి.” — ‘ఓ అల్లాహ్‌! నా ఆంత ర్యాన్ని బాహ్యం కంటే మంచిగా చేయి. నా బాహ్యాన్ని మంచిగా మార్చు. ఓ అల్లాహ్‌! నీవు ప్రజలకు ఇచ్చే దానికంటే మంచి విషయాన్ని నేను కోరుతున్నాను. అంటే భార్య, సంపదలు, సంతానం మార్గభ్రష్టతకు గురికానివి, మార్గభ్రష్టతకు గురి చేయనివి. (తిర్మిజి’)

*****


[1]) వివరణ-2225: అంటే దు’ఆ చేయడంలో నిర్థారిత వచ నాల్ని పలకాలి. ఒకవేళ నీవు కోరితే అనే అనుమానాస్ప దమైన వచనాలవల్ల దు’ఆ స్వీకరించ బడదు. అల్లాహ్‌ (త) ఇలా ప్రార్థించటాన్ని అసహ్యించు కుంటాడు.

[2]) వివరణ-2227: దు’ఆ స్వీకరించబడటానికి అనేక నియమాలు, షరతులు ఉన్నాయి. వాటిలో ఒక షరతు ఏమిటంటే, షరతుపెట్టి మరీ ప్రార్థించకూడదు, అంటే, ‘ఓ అల్లాహ్‌(త)! ఒకవేళ నువ్వు కోరితే ఇలా చెయ్యి, నువ్వు కోరితే అలా చెయ్యి,’ అని అనకూడదు. తొందర పడకూడదు. రెండు మూడుసార్లు లేక కొన్ని రోజుల వరకు దు’ఆ చేసి ఫలించే నిదర్శనాలు కనబడకపోతే, అలసిపోయి వదలి వేయకూడదు. ఎల్లప్పుడూ దు’ఆ చేస్తూ ఉండాలి. దు’ఆ చేయడం మన బాధ్యత. దు’ఆ స్వీకరించబడటానికి, నియమాలు, నిబంధనలు ఇస్లామి జాయిఫ్ లో వివరంగా పేర్కొనబడ్డాయి.

[3]) వివరణ-2228: ఒక ముస్లిమ్‌ తన సోదరున్ని పరోక్షంగా చిత్తశుద్ధితో ప్రార్థిస్తే అందులో ఎటువంటి చూపుగోలు, పేరు ప్రతిష్ఠలు ఉండవు. అందువల్ల ఆ దు’ఆ స్వీకరించ బడుతుంది.

[4]) వివరణ-2229: దానివల్ల మీకే నష్టం కలుగుతుంది. ఆ తరువాత మీరు చాలా విచారిస్తారు. అందువల్ల శాపనార్థాలు పెట్టకండి.

ఖుర్‌ఆన్‌లో కూడా తమ ధన, ప్రాణాలను శపించటాన్ని వారించడం జరిగింది. అల్లాహ్‌(త) ఆదేశం: ”మరియు మానవుడు (తెలియక తరచుగా) మేలు కొరకు ఎలా అర్థించాలో, కీడుకొరకు కూడా అలాగే అర్థిస్తాడు. మరియు మానవుడు చాలా తొందరపాటు గలవాడు (ఆత్రగాడు)” (సూ. బనీ ఇస్రాయీ’ల్‌, 17:11)

అంటే ఒక్కో సారి మానవుడు నిరాశచెంది తన తప్ప టడుగు వల్ల తన్ను తాను శాపనార్థాలు పెట్టుకుంటాడు. ఒక్కోసారి తన ధనానికి, సంతానానికి శాపనార్థాలు పెడతాడు. ఒక్కోసారి చావు గురించి, వినాశనం గురించి శాపనార్థాలు పెడతాడు. కాని అతని ప్రభువు అతనిపై అతనికంటే దయామయుడు. ఇటు శపిస్తే అటు ఆ దు’ఆ స్వీకరించబడాలి కాని, అలా జరగదు. అల్లాహ్‌ ఆదేశం:మరియు ప్రజలు తమ మేలు కొరకు తొందరపడినట్లు అల్లాహ్‌ వారిపై కీడును పంపటంలో తొందర పడిఉంటే, వారి వ్యవధి ఎప్పుడో పూర్తయి ఉండేది…” (సూ. యూనుస్‌, 10:11)

కనుక మానవుడు తనకోసం ఎన్నడూ శాపాన్ని ఉపయో గించకూడదు. ఎందుకంటే ఒక్కో సమయం ప్రార్థన స్వీకార సమయం ఆసన్నమయి ఉంటుంది. ఆ సమ యంలో నోటినుండి శాపాలు వెలువడితే, అవి స్వీకరించ బడవచ్చు. ఎవర్ని శపించడం జరిగిందో వారికి తగల వచ్చు. అందువల్ల ప్రవక్త (స) దీన్ని వారించారు.

[5]) వివరణ-2233: విధివ్రాత రెండు రకాలు, ముబర్రమ్‌, ముఅల్లఖ్‌. దైవ అనుజ్ఞతో దు’ఆ తఖ్‌దీర్‌ ముఅల్లఖ్‌ను మార్చ గలదు. అదేవిధంగా పుణ్యం చేస్తే ఆయుష్షు పెరుగుతుంది. కొందరి అభిప్రాయం ప్రకారం పుణ్యం ఏ విధంగానూ వ్యర్థం కాదు. అతని ఆయుష్షు కూడా వ్యర్థం కాదు. అంటే పుణ్యం వల్ల ఆయుష్షు పెరుగుతుంది.

[6]) వివరణ-2238: అంటే అల్లాహ్‌ (త) అర్థిస్తే సంతో షిస్తాడు. ప్రజలు మాటిమాటికీ అడిగితే విసిగిపోతారు. కాని అల్లాహ్‌ (త) అర్థిస్తూ ఉండేవాడిపట్ల సంతోషం వ్యక్తం చేస్తాడు. అంటే నీ అవసరం కొరకు ఎవ్వరినీ అర్థించకు. ఎల్లప్పుడు తలుపులు తెరచి ఉంచేవాడిని అర్థించు. దైవానికి మానవునికి మధ్య తేడా ఇదే. అల్లాహ్‌ (త) అడగటం మానివేస్తే ఆగ్రహం వ్యక్తంచేస్తాడు. కాని మానవుడు అడిగితే ఆగ్రహం వ్యక్తంచేస్తాడు.

[7]) వివరణ-2239: అంటే దు’ఆ చేసే భాగ్యం ప్రసాదించ బడిన వాడు ఎల్లప్పుడూ దు’ఆ చేస్తూ ఉంటాడు. అంటే అతని కోసం కారుణ్యద్వారాలు తెరువబడి ఉంటాయి. అదేవిధంగా క్షేమాన్ని కోరితే అల్లాహ్‌(త) చాలా సంతో షిస్తాడు. ఎందుకంటే క్షేమంపైనే అన్ని విషయాలు ఆధారపడి ఉన్నాయి.

[8])వివరణ-2240: అంటే సుఖసంతోషాల్లో అత్యధికంగా దు’ఆలు, ప్రార్ధనలు చేయటంవల్ల కష్టాల్లో, ఆపదల్లో చేసే దు’ఆలు స్వీకరించబడతాయి. అంటే సుఖసంతోషాల్లో ఉన్నా, కష్టాల్లోఉన్నా, ఎల్లప్పుడూ దు’ఆ చేస్తూ ఉండాలి. కష్టాల్లో దు’ఆ చేయడం, సుఖసంతోషాల్లో మరచి పోవడం చేయరాదు. ఇటువంటి వారి గురించి అల్లాహ్‌ (త) ఖుర్‌ఆన్‌లో ఇలా పేర్కొన్నాడు,మరియు మానవునికి కష్టకాలం వచ్చినప్పుడు, అతడు పరుండినా, కూర్చుండినా లేక నిలుచుండినా, మమ్మల్ని ప్రార్థిస్తాడు. కాని మేము అతని ఆపదను తొలగించిన వెంటనే, అతడు తనకు కలిగిన కష్టానికి, ఎన్నడూ మమ్మల్ని ప్రార్థించనేలేదు అన్నట్లు ప్రవర్తిస్తాడు. ఈ విధంగా మితిమీరి ప్రవర్తించేవారికి, వారి చేష్టలు ఆకర్షణీయ మైనవిగా చూపబడతాయి.” (సూ. యూనుస్‌, 10:12)

అంటే మానవునికి కష్టాలు ఎదురైతే అల్లాహ్‌ను ప్రార్థిస్తాడు. కష్టాలు తొలగిపోగానే దైవాన్ని మరచిపోతాడు. అల్లాహ్‌ ఆదేశం, ”మరియు ఒకవేళ మేము మానవుణ్ని అనుగ్రహిస్తే, అతడు ముఖం త్రిప్పుకొని (మా నుండి) మరలిపోతాడు. కాని అతనికి కీడు కలిగితే నిరాశ చెందుతాడు.”(సూ. బనీ ఇస్రాయీ’ల్, 17:83)

అంటే సుఖసంతోషాల్లో అల్లాహ్‌(త)ను గుర్తుంచుకోడు, దు’ఆ కూడా చేయడు. గర్వంగా ప్రవర్తిస్తాడు. అల్లాహ్‌ ఆదేశం,మరియు ఒకవేళ మేము మానవునికి మా కారుణ్యాన్ని రుచి చూపించి, తరువాత అతని నుండి దానిని లాక్కుంటే! నిశ్చయంగా అతడు నిరాశచెంది, కృతఘ్నుడవుతాడు. కాని ఒకవేళ మేము అతనికి ఆపద తరువాత, అనుగ్రహాన్ని రుచిచూపిస్తే, ”నా ఆపదలన్నీ నానుండి తొలగిపోయాయి!” అనిఅంటాడు. నిశ్చయంగా అతడు ఆనందంతో విర్రవీగుతాడు. కాని, ఎవరైతే సహనం వహించి, సత్కార్యాలు చేస్తూ ఉంటారో, అలాంటివారికి క్షమాపణ మరియు గొప్ప ప్రతిఫలం ఉంటాయి. (సూ. హూద్‌, 11:9-11)

[9]) వివరణ-2243: దు’ఆ నియమాల్లో ఒకటేమిటంటే రెండు చేతులను ఎత్తి దు’ఆ చేయాలి. రెండు అరచేతుల లోపలిభాగాలను తనముఖం వైపు ఉంచాలి. అరచేతుల వెనుక భాగాలను ముఖం వైపు ఉంచరాదు. ఇంకా దు’ఆ చేసిన తర్వాత రెండు అరచేతులతో ముఖాన్ని తుడుచుకోవాలి. అయితే ఇస్తిస్ఖా దు’ఆ చేసేటప్పుడు అరచేతుల వెనుక భాగాలతో దు’ఆ చేయాలి. అంటే అరచేతుల వెనుక భాగాలు తన ముఖం వైపు ఉండాలి.

[10]) వివరణ-2244: అంటే అల్లాహ్‌ (త) ముందు ఎవరైనా తన చేతులు చాచి దు’ఆ చేస్తే, అల్లాహ్‌ (త) అతని దు’ఆను స్వీకరిస్తాడు. వట్టి చేతులతో పంపడానికి ఆయన సిగ్గుపడతాడు.

[11]) వివరణ-2246: జామె’ దు’ఆలంటే పదాలు కొంచెం భావం అధికంగా ఉండే, ఉభయలోకాల శుభాలు చేరి ఉన్న దు’ఆలను జామె’ దు’ఆలు అంటారు. రబ్బనా ఆతినా ఫిద్దునియా … చివరి వరకు.

[12]) వివరణ-2248: దీని అర్థం ఏమిటంటే ప్రవక్త (స) అతన్ని తన సోదరునిగా పేర్కొన్నారు మరియు తన గురించి దు’ఆ చేయమని ఆదేశించారు. ‘నీ దు’ఆల్లో మమ్మల్ని చేర్చు, మరచి పోకూడదు’ అని అన్నారు. ఎందుకంటే ‘హజ్జ్, ‘ఉమ్‌రాల్లో దు’ఆ స్వీకరించబడు తుంది. ప్రవక్త (స) ఎటువంటి కల్మషం లేనివారు. ప్రవక్త (స) పాపాలన్నీ క్షమించబడ్డాయి. అయినప్పటికీ తాను స్వయంగా దు’ఆ చేసేవారు, ఇతరులకు కూడా దు’ఆ చేయమని ఆదేశించేవారు. దీనివల్ల తెలిసిన విషయం ఏమిటంటే ఎవరైనా ‘హజ్‌, ‘ఉమ్‌రహ్‌లకు వెళ్తు న్నప్పుడు వారితో తన గురించి దు’ఆ చేయమని విన్నవించు కోవడం అభిలషణీయం.

[13]) వివరణ-2252: ప్రవక్తలందరూ తమ అవసరాలకు అల్లాహ్‌(త)నే మొరపెట్టుకున్నారు. మూసా (అ) ఆకలి దప్పులతో మద్‌యన్‌ చేరినపుడు ఆహారం కోసం ఇలా అర్థించారు. ”…ఓ నా ప్రభూ! నీవు నాపై ఏ మేలును అవతరింపజేసినా, నేను దాని ఆవశ్యకత గలవాడనే!” (అల్‌ ఖసస్‌, 28:24)

[14]) వివరణ-2254: అనస్‌ (ర) ‘హదీసు’ వల్ల ప్రవక్త (స) దు’ఆలో చేతులను చంకల తెల్లదనం కనబడేంత పైకి ఎత్తే వారని తెలిసింది. అయితే, ఇలా అప్పుడప్పుడూ చేసేవారు. ఇస్‌తిస్‌ఖా మొదలైన నమా’జుల్లోచేతులను తిప్పి ఉంచే వారు. సహల్‌ బిన్‌ స’అద్‌ (ర) ఉల్లేఖనం వల్ల దు’ఆలో చేతుల వ్రేళ్ళ చివర్లను భుజాలకు సమానంగా ఉంచేవారని తెలుస్తుంది. ప్రవక్త (స) సాధారణంగా ఇలాగే చేసేవారు. ఏది ఏమైనా రెండు పద్ధతులు ధర్మసమ్మతమే.

[15]) వివరణ-2256: అర్థించటాన్ని, దు’ఆ చేయటాన్ని గురించి నియమాలు ‘హదీసు’లో పేర్కొనబడ్డాయి. మరియు ఇస్తి’గ్‌ఫార్‌ యొక్క అంటే అల్లాహ్‌(త)ను పాపాల పట్ల క్షమాపణ కోరే పద్ధతి ఏమిటంటే చేతి వ్రేలితో సైగ చేస్తూ నఫ్‌సె అమ్మారాను చీవాట్లు పెట్టాలి, షై’తాన్‌ నుండి శరణుకోరాలి. అల్లాహ్ ఏకత్వాన్ని స్వీకరించాలి. ఒక వ్రేలితో సైగ చేయటం ఎందుకంటే ఒక్క అల్లాహ్ వైపు సైగ చేయటానికి అంటే దేవుడు ఒక్కడే. రెండు వ్రేళ్ళతో సైగ చేయటాన్ని వారించడం జరిగింది. అదేవిధంగా ఇబ్‌తెహాల్ అంటే విలవిలలాడుతూ దు’ఆ చేయటం. ఆ సమయంలో రెండు చేతులు ఎత్తాలి. దీని విధానం ఏమిటంటే రెండు చేతులను ఒకేసారి ఎత్తాలి. అరచేతుల వెనుక భాగాన్ని ముఖానికి సమానంగా ఉంచాలి. ఇలా ఇస్‌తిస్‌ఖా సందర్భంగా చేయటం జరుగుతుంది.

[16]) వివరణ-2257: ప్రవక్త (స) వివిధ పరిస్థితుల్లో, వివిధ సమయాల్లో దు’ఆల్లో రెండు చేతులను ఎత్తటం గురించి అనేక ‘హదీసు’లు ఉన్నాయి. ప్రవక్త (స) ఒక్కోసారి రొమ్మువరకు ఒక్కోసారి భుజాలవరకు ఒక్కోసారి అంతకంటే ఎత్తుగా చేతులు ఎత్తేవారు. ఇబ్నె ‘ఉమర్‌ (ర) చెప్పటంలో అర్థం ఏమి టంటే, దు’ఆలో ఎల్లప్పుడూ చాలా ఎత్తుగా చేతులు ఎత్తటం ప్రవక్త (స) ద్వారా నిరూపణ జరగలేదు. అయితే ఇస్‌తిస్‌ఖా నమా’జులో ఎత్తుగా చేతిని ఎత్తినట్లు మాత్రం నిరూపణ ఉంది.

[17]) వివరణ-2258: అంటే ఉదాహరణకు ఇలా అంటారు: ”అల్లాహు మ్మ’గ్‌ఫిర్‌లీ వలిఫలానిన్‌.”

[18]) వివరణ-2262: జుమ్దాన్ అన్నది ఒక కొండ పేరు. అది మక్కహ్-మదీనహ్ త్రోవలో,  మదీనహ్ నుండి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రవక్త (స) ఈ మార్గం గుండా వెళుతున్నారు. ఆ కొండను చూచి ప్రవక్త (స), ‘మదీనహ్ కొండ జుమ్దాన్‌ వచ్చేసింది, మీ ఇళ్ళు దగ్గరికొచ్చాయి. తొందరగా పదండి మీ ఇళ్ళకు, తొందరగా చేరుకుందురు గాని. కాని మిమ్మల్ని ముఫర్రిదూన్ అధికమించారు. తమ గమ్య నానికి చేరుకున్నారు,’ అని అన్నారు. ప్రవక్త (స)ను, అనుచరులు, ‘ముఫర్రిదూన్అంటే ఎవరు,’ అని అడిగారు. దానికి ప్రవక్త (స), ‘అత్యధికంగా దైవాన్ని స్మరించే స్త్రీ పురుషులు,’ అని అన్నారు.  ”ఫర్‌ద్‌” అల్లాహ్‌ పేర్లలో ఒక పేరు. ఎందుకంటే ఆయన ఒక్కడు, ఒంటరివాడు. ఆయనకు ఎవరూ జతగాడు గానీ, సాటిగానీ, ఆయనకు పోలినవారుగాని లేరు. అందువల్ల ఎల్లప్పుడూ దైవధ్యానంలో నిమగ్నమై ఉండే వారిని ముఫర్రిదూన్‌ అంటారు. అల్లాహ్‌(త) తప్ప వారికి మరో ఆలోచన, ధ్యాస ఉండదు.

[19]) వివరణ-2264: దీని అర్థం ఏమిటంటే, ఒకవేళ నా దాసుడు నా పట్ల క్షమాపణ కోసం ఆశతో ఉంటే, అతను ఆలోచించినట్లు నేను ప్రవర్తిస్తాను. అతన్ని క్షమించి వేస్తాను. అందువల్ల అల్లాహ్‌ (త) పట్ల ఎప్పుడూ సదా ఆలోచన కలిగి ఉండాలి. ఇటువంటి మంచి ఆలోచన మంచి పనుల వల్ల వస్తుంది. అల్లాహ్‌(త) కారుణ్యం పట్ల ఆశతో ఉండాలి, ఆయన శిక్షల పట్ల భయపడుతూ ఉండాలి. ఆయన కారుణ్యం పట్ల నిరాశగా ఉండకూడదు. శిక్షల పట్ల నిర్భయంగా ఉండకూడదు. విశ్వాసంతో మరలటం, భయపడటం రెండూ అవసరం.

[20]) వివరణ-2265: ఇదంతా అల్లాహ్‌(త) అనుగ్రహమే. ఒక పుణ్యానికి బదులు పది పుణ్యాల ప్రతిఫలం లేదా అంతకంటే అధికంగా ప్రతిఫలం ప్రసాదిస్తాడు. చాలా చిన్న పుణ్యం చేసి అల్లాహ్‌(త) సాన్నిహిత్యం కోరితే, అల్లాహ్‌ (త) అతనికి చాలా దగ్గర అయిపోతాడు. ఏకదైవారాధకుడు, విధేయుడు ఎన్ని పాపాలు చేసి దైవంతో కలసినా, అల్లాహ్‌(త) అనంతమైన క్షమాపణ తీసుకొని అతన్ని కలుస్తాడు. ఈ ‘హదీసు’ ద్వారా ఏకత్వ ప్రాధాన్యత, ప్రాముఖ్యత తెలుస్తుంది. అల్లాహ్‌ (త) ఏకత్వం పట్ల సంతోషిస్తాడు. సాటి కల్పించటం పట్ల ఆగ్రహిస్తాడు. అసహ్యించుకుంటాడు. బహుదైవా రాధకుడ్ని ఎన్నడూ క్షమించడు. పాపాలు చేసిన విశ్వాసిని క్షమించివేస్తాడు. అల్లాహ్‌ (త) మనందరినీ ఏకత్వంపై, ప్రవక్త సాంప్రదాయంపై నిలకడగా ఉండే భాగ్యాన్ని ప్రసాదించుగాక, ఆమీన్‌!

[21]) వివరణ-2266: వలీ అంటే మిత్రుడు అని కూడా అర్థం ఉంది. అంటే ఏకదైవారాధకుడైన ముస్లిమ్‌ అల్లాహ్‌ మరియు ఆయన ప్రవక్త (స)కు విధేయత చూపేవాడు, ఎల్లప్పుడూ ఆరాధిస్తూ ఉండేవాడు, పాపాలన్నిటికీ దూరంగా ఉండేవాడు, అల్లాహ్‌ను ఆయన ప్రవక్తను ప్రపంచంలోని వస్తువులన్నింటి కంటే అధికంగా ప్రేమించేవాడు అల్లాహ్‌కు ప్రీతిపాత్రుడు. అతన్నే వలీ అని కూడా అంటారు. ఇటువంటి వలీలను చాలా ప్రశంసించటం జరిగింది. అల్లాహ్‌ఆదేశం: ”వినండి, నిశ్చయంగా, అల్లాహ్‌కు ప్రియులైన వారికి ఎలాంటి భయమూ ఉండదు మరియు వారు దుఃఖపడరు కూడా.” (సూ. యూనుస్‌, 10:62) అల్లాహ్‌(త) భక్తులను ప్రేమించటం విశ్వాసంలోని భాగమే. వారిని ప్రేమించేవాడు అల్లాహ్‌(త)ను ప్రేమిస్తాడు. వారిపట్ల శత్రుత్వం ఉన్నవాడు అల్లాహ్‌(త) పట్ల శత్రుత్వం ఉంచినట్లు. కనుకనే ‘హదీసు’లో ఇలా ఉంది, ”నా భక్తుల పట్ల శత్రుత్వం కలిగి ఉంటే నేను అతడ్ని నాతో యుద్ధానికి సిద్ధం కమ్మని హెచ్చరిస్తాను.” అల్లాహ్‌(త)తో ఎవరూ యుద్ధం చేయలేరు, ఎదురించలేరు. కనుక ఆయన అవిధేయతల పట్ల దూరంగా ఉండాలి. ఖుర్ఆన్లో ఇలా ఉంది: ”ఒకవేళ వారు అవిధేయతలను విసర్జించకపోతే, అల్లాహ్‌ మరియు ఆయన ప్రవక్తతో యుద్ధం చేయటానికి సిద్ధపడాలి.” (సూ. అల్ బఖరహ్, 2:279). అల్లాహ్‌తో యుద్ధం చేసేవాడు ఎన్నడూ విజయం పొందలేడు.

(2) అల్లాహ్‌(త) సాన్నిహిత్యం పొందటానికి మంచి అవకాశం విధి ఆరాధనలు. నమా’జు, రో’జహ్, ‘హజ్‌, ‘జకాత్‌, మొదలైనవి. ఈ విధి ఆరాధనల వల్ల అల్లాహ్‌(త) చాలా సంతోషిస్తాడు. ఇటువంటి వారిని తన సన్నిహితులుగా చేసుకుంటాడు. సాన్నిహిత్యం పొందిన తర్వాత అల్లాహ్‌(త) అతని ప్రతి పని సులభతరం చేస్తాడు. అతని ప్రతిపని దైవప్రీతికి అనుగుణంగా జరుగుతుంది. అతడు పాపాలు చేయడు. పాపాల ఉద్దేశ్యం కూడా అతనికి కలగదు. అల్లాహ్‌(త)కు ఇష్టమైన వాటినే వింటాడు, అల్లాహ్‌(త)కు ఇష్టమైన వాటినే కళ్ళతో చూస్తాడు. అల్లాహ్‌(త)కు ఇష్టమైన వాటినే చేస్తాడు. అల్లాహ్‌(త)కు ఇష్టమైన వాటినే అనుసరిస్తాడు. అల్లాహ్‌(త)కు ఇష్టమైన వైపే వెళతాడు. ఈవిధంగా దాసుడు దైవధ్యానంలో నిమగ్నుడయి ఉంటే అంతర్బాహ్య అవయవాలన్నీ దైవాదేశాలకు అను గుణంగా మారిపోతాయి. కనుకనే ఈ ‘హదీసు’లో నేను అతని ఫలానా అవయవంగా మారిపోతానని ఉంది. అంటే అతని కదలికలు, ఆలోచనలు, ప్రేరణలు, నమ్మకాలు అన్నీ దైవప్రీతికి అనుగుణంగా మారిపోతాయి. అల్లాహ్‌ (త) అతని సహాయకుడిగా, సమర్థుడిగా మారిపోతాడు.

(3). అల్లాహ్‌ (త) సర్వాధికారి. తాను కోరింది చేస్తాడు. ఏ పనిని చేయటంలో అతనికి ఎటువంటి సంకోచం కలుగదు. అంటే నేను విశ్వాస భక్తునితో కలవాలని కోరుతున్నాను. ఈ కలయిక చావు లేకుండా సాధ్యం కాదు. విశ్వాసదాసుడు చావుకు ఇష్టపడడు. నేనతని ప్రాపంచిక ఆపదలను భరించలేను. అందువల్ల నేను వేచి ఉండి, అతని దుస్థితిపై జాలిపడతాను.

[22]) వివరణ-2267: ఈ ‘హదీసు’ ద్వారా దైవస్మరణ చేసే వారి, ఇటువంటి సభల, సమావేశాల ప్రాధాన్యత విశద మవుతుంది. ఇటువంటి వారితో పాటు కూర్చున్న పాపాత్ములు కూడా క్షమించబడతారు. ప్రవక్త (స)తో కలిసే, కూర్చునే, తోడుండే వారందరూ క్షమించబడ్డారు. అదేవిధంగా ప్రవక్త(స) అనుచరులవెంటకూర్చుని, తోడు వుండే వారందరూ క్షమించబడతారు. వారితో సంబంధం ఉన్నవారు వారిలో ఒకరుగా పరిగణించ బడతారు.

[23]) వివరణ-2268: దైవస్మరణ వల్ల హృదయంలో ఒక వెలుగు జనిస్తుంది. దానివల్ల దివ్యదృష్టి జనిస్తుంది. అయితే ఇలా ఎల్లప్పుడూ జరగదు. అప్పుడప్పుడూ ఇలా సంభవిస్తుంది. చివరికి ప్రవక్తలకు కూడా. షేఖ్‌ స’అదీ ఇలా పేర్కొన్నారు: ఒక వ్యక్తి యాఖూబ్‌ (అ)ను, ‘తమరు ఈజిప్టులో ఉన్న యూసుఫ్‌ సువాసనను పసిగట్టారు. కాని, కన్‌ఆన్‌లో చీకటిలో, బావిలో పడివున్న యూసుఫ్‌ను పసిగట్ట లేకపోయారు?’ అని ప్రశ్నించాడు. దానికి యాఖూబ్‌ (అ), ‘మన పరిస్థితులన్నీ అల్లాహ్‌(త) చేతుల్లో ఉన్నాయి. ఇవి పిడుగు వంటివి. ఇవన్నీ దైవ అనుజ్ఞతో జరుగుతాయి. మళ్ళీ వెంటనే అదృశ్యం అవుతాయి. అల్లాహ్‌ ఆదేశంపై ఒక్కోసారి మనం దైవ సింహాసన వార్తలు తెలుసుకుంటాము. ఒక్కోసారి మన వెనుక ఏముందో కూడా మనకు తెలియదు,’ అని సమాధానం ఇచ్చారు.

[24]) వివరణ-2269: అంటే దైవధ్యానం ఆచరణలన్నిటి కంటేఉత్తమమైనది. చివరికి జిహాద్‌కంటే కూడా గొప్పది.

[25]) వివరణ-2271: అంటే మీరు స్వర్గవనాల్లో, స్వర్గ పైరుల్లో సంచరించే తనివితీరా దైవస్మరణ సభలు, సమావేశాలు. వీటిలో అనేకమంది కూర్చొని దైవ స్మరణలో నిమగ్నమై ఉంటారు. ఇటువంటి పరిశుద్ధ సభలలో వెళితే వారితో పాటు కూర్చొని దైవస్మరణలో పాల్గొనండి. ఈ దైవస్మరణ స్వర్గ ప్రవేశానికి, దాని సుఖ సంతోషాలను అనుభవించటానికి కారణమవుతుంది.

[26]) వివరణ-2272: ఏదైనా సమావేశంలో కూర్చొని, అల్లాహ్‌ (త)ను ప్రార్థించకుంటే, ఎక్కడైనా పరుండి అల్లాహ్‌(త)ను స్మరించకుంటే తీర్పుదినం నాడు తీవ్ర నష్టానికి గురవుతాడు. అందువల్ల కూర్చున్నా, లేచినా, పడుకున్నా అల్లాహ్‌(త)ను స్మరించాలి. సమావేశాల్లో, పడుకునేటప్పుడు పఠించేదు’ఆ ముందుపేర్కొన బడింది.

[27]) వివరణ-2273: అంటే ఏ సమావేశంలో దైవస్మరణ చేయబడదో, ఆ సమావేశం మరణించిన గాడిద శవం వంటిది. ప్రజలు అక్కడినుండి లేచి వెళితే గాడిద శవాన్ని తిని లేచారు. తీర్పుదినం నాడు ఈ సమావేశం ప్రాణాలకు ముప్పుగా పరిణమిస్తుంది.

[28]) వివరణ-2276: అనవసరమైన వృథా కార్యకలాపాల వల్ల హృదయం ఏమరుపాటుకు గురవుతుంది. హృదయ వెలుగు నశిస్తుంది. ఫలితంగా అల్లాహ్(త)కు దూరమవుతాడు.

[29]) వివరణ-2278: అంటే అల్లాహ్‌ (త) దైవదూతల నుద్దేశించి, ”ఓ దైవదూతలారా!  వీరి గురించే కదా! మీరు, ‘వీరు ప్రపంచంలో కల్లోలాలు సృష్టిస్తారు, నన్ను స్మరించరని అన్నారు. ‘ మీరే చూడండి వారు ప్రపంచంలో నన్ను చూడకుండానే నన్ను స్మరిస్తు న్నారు,” అని అంటాడు.

[30]) వివరణ-2286: అంటే దైవధ్యానం వల్ల హృదయం పరిశుద్ధత పొందుతుంది. ఇంకా ఈ దైవస్మరణే దైవ శిక్ష నుండి కూడా రక్షిస్తుంది. ఇంకా ఈ దైవస్మరణే దైవ మార్గంలో జిహాద్‌ కంటే కూడా చాలా గొప్పది.

[31]) వివరణ-2288: (1) هُوَ الله الَّذِي لآ إلَهَ إلَّا هُوَ: Allah, అల్లాహ్ (సు.త.)Applied to the Being who exists necessarily, by Himself, comprising all the attributes of perfection; (TA) ; a proper name denoting the true God, comprising all the excellent divine names; a unity comprising all the essences of existing things. ఇది సర్వ సృష్టికర్త, సర్వ పోషకుడు మహోన్నతుడు అయిన విశ్వప్రభువు యోక్క పేరు. ఈ పేరితో ఆయన(సు.త)ను తప్ప మరెవ్వరినీ పిలువరాదు. దీనికి సరి సమానమైన పదం వేరే భాషలో లేదు, ఫార్సి భాషలోని ఖుదా అనే పదం తప్ప. ఇది ఒక ప్రత్యేకవైన, విశేషపదం. ఈ పదానికి బహువచనం గానీ, స్త్రీ లింగం గానీ లేవు.  అల్లాహ్ (సు.త.) యొక్క స్పష్టమైన నిర్వచనంకొరకు చూడండి, సూ. అల్ఇఖ్లాస్ (112:1-4). اللهُ 980 times, 2:7, 10:3, 20:14, 28 :70; اللهَ 592 times, 2:9; اللهِ  1125 times, 1:2, 28:88. ఇది విశ్వం మొత్తాన్ని సృజించిన స్వామి పేరు. ఇది ప్రధానమైన పేరు. ఇందులో అనేక గుణాలు ఇమిడి ఉన్నాయి. ఆయనే వాస్తవ ఆరాధ్యుడు. అల్లాహ్‌ గురించి ఏది విన్నా మానవునికి ఆశ్చర్యం వేస్తుంది. ఆయన తన సృష్టితాలపై ఎంత కారుణ్యంతో వ్యవహరిస్తాడంటే ఒక తల్లికూడా తనబిడ్డలపై అంత కారుణ్యం చూపదు. దానితోపాటు ఆయన తన దాసులను ప్రేమిస్తాడు కూడా.

(2) الرَّحْمَنُ అర్-రహ్మాను : The Most Gracious, అనంత కరుణామయుడు. (చూడండి, అర్-రహీము 3, అర్రవూఫు 83) Rahmah means mercy. The Compassionate. He is Ar-Rahman with all creation and Ar-Raheem with the believers ; (At-Tabari). Ar-Rahmanis more intensive in signification than Ar-Raheem. It includes in its objects the believer and the unbeliever. It is Hebrew in origin, (I’Ab, TA). The term Rahman circumscribes the quality of abounding grace inherent in, and inseparable from, the concept of Allah’s Being, whereas Raheem expresses the manifestation of that grace in, and its effect upon, His creation – in other words, an aspect of His activity. (Ibn al-Qayyim). الرَّحْمنُ 51 times,13:30, 67:29; الرّاحمين , 23:109; الرَّحيم الرَّحْمَنَ 6 times,1:1, 3,  2:163, 27:30, 41:2, 59:22 ; అంటే ఇహలోకంలో విశ్వాసులు మరియు అవిశ్వాసులు అందరిపట్ల కరుణా మయుడు. ఎల్లప్పుడూ కారుణ్యం కురిపించేవాడు, అందరినీ క్షమించేవాడు, స్నేహితులపై, శత్రువులపై అతని కారుణ్యం వ్యాపించి ఉంది. ఇది కేవలం ఇహలోకానికి ప్రత్యేకం.

(3) الرَّحِيمُ అర్-రహీము: Most Merciful, Dispenser of Grace, అపార కరుణాప్రదాత.  = అర్రవూఫు 83, (చూడండి, అర్-రహ్మాను 2) ; Rahmah means mercy. The Compassionate. He is Ar-Rahman with all creation and Ar-Raheem with the believers ; (At-Tabari). Ar-Rahmanis more intensive in signification than Ar-Raheem. It includes in its objects the believer and the unbeliever. It is Hebrew in origin, Ar-Raheem has its peculiar object the believer. It is Arabic in origin, (I’Ab, TA).The term Rahman circumscribes the quality of abounding grace inherent in, and inseparable from, the concept of Allah’s Being, whereas Raheem expresses the manifestation of that grace in, and its effect upon, His creation -in other words, an aspect of His activity. (Ibn al-Qayyim). الرَّحِيمُ 3 times 1:1; الرَّحيم الرَّحْمَن 6 times,1:1, 3, 2:163,  27:30, 41:2, 59:22 ; تَوَّاب الرحيم 9 times, 2:37; رَءوف الرحيم 9 times, 2:143; غَفُور الرَّحيم 72 times, 2:173, 39:53;  العَزيز الرحيم 13 times, 26 :9 ;ربُّ رحيم  36:58; البرُّ الرَّحيم 52:28;رحيم ودود  11:90. అంటే పరలోకంలో కేవలం విశ్వాసుల పట్లయే కరుణాప్రదాత, అంటే పరలోకంలో కేవవలం ఆయనను విశ్వసించినవారిని మాత్రమే కరుణించేవాడు, అని కొందరు వ్యాఖ్యానించారు.

(4) المَلِكُ అల్-మలికు<