8– كِتَابُ فَضَائِلِ الْقُرْآن
8. ఖుర్‌ఆన్ మహత్యాల పుస్తకం
ఖుర్‌ఆన్‌ను ప్రశంసించటం మానవమాతృలకు సాధ్యం కాదు. కొన్ని ‘హదీసు’లను పాఠకుల ముందు ఉంచుతున్నాము. ప్రవక్త (స) ప్రవచనం, ”దైవ గ్రంథం లోని ఒక అక్షరం చదివిన వారికి ఒక పుణ్యం లభిస్తుంది. (దార్మి)
ఒక పుణ్యం పదిపుణ్యాలకు సమానం. అలిఫ్-లామ్ -మీమ్ అనేది ఒక అక్షరం కాదు. అలిఫ్ ఒక అక్షరం, లామ్ ఒక అక్షరం, మీమ్ ఒక అక్షరం. ఈ మూడు అక్ష రాలకు బదులు 30 పుణ్యాలు లభిస్తాయి. ఖుర్‌ఆన్ మొత్తంలో 351,318 అక్షరాలు ఉన్నాయి. ఖుర్‌ఆన్ ను పఠిస్తే 3,513,180 పుణ్యాలు లభిస్తాయి. ఇంకా ఇలా అన్నారు, ఖుర్‌ఆన్ పఠించి, దానిపై ఆచరిస్తే అతని తల్లిదండ్రులకు ఒక కిరీటం తొడిగించడం జరుగుతుంది. దాని వెలుగు సూర్యుని వెలుగుకంటే అధికంగా ఉంటుంది. దాన్ని చదివి ఆచరించినవారి పరిస్థితి ఎలా ఉంటుంది అంటే చదివే వారికి చాలా పుణ్యం లభిస్తుంది. (అ’హ్మద్, అబూ దావూద్)
మరో ఉల్లేఖనం: ఖుర్‌ఆన్‌ను పఠించే వ్యక్తితో పఠిస్తూ ఉండు, స్వర్గ అంతస్తుల పైకి వెళ్లూ ఉండు, ఎక్కడ పఠనం ఆపుతావో అదే నీ అంతస్తు అవుతుంది. ఖుర్‌ఆన్‌లో 6236 ఆయతులు ఉన్నాయి. వాటికి ఆ విధంగానే అంతస్తులు లభిస్తాయి. ప్రతి అంతస్తుకు మధ్య భూమ్యాకాశ మంత దూరం ఉంది. (తిర్మిజి’)
మరో ప్రవచనం: ఖుర్‌ఆన్ పఠించి దాని ‘హలాల్‌ను ‘హలాల్‌గా, దాని ‘హరామ్‌ను ‘హరామ్‌గా స్వీకరించిన వ్యక్తిని అల్లాహ్ (త) స్వర్గంలో ప్రవేశింపజేస్తాడు. ఇంకా వారి కుటుంబానికి చెందిన పదిమంది నరకవాసులను గురించి అతని సిఫారసు స్వీకరిస్తాడు. అదేవిధంగా ఖుర్‌ఆన్ పఠించబడే ఇంటిలో అధికంగా శుభం ఉంటుంది. పఠించబడని ఇంట్లో శుభం ఉండదు. (బ’జ్జార్)
మరో ప్రవచనం: నా సమాజంలోని ఉత్తమ ఆరాధన ఖుర్ఆన్ పఠనం. (బైహఖీ)
మరో ప్రవచనం: తన ప్రభువుతో మాట్లాడదలచిన వాడు ఖుర్‌ఆన్ పఠించాలి. అంటే ఖుర్‌ఆన్ పఠించడం తన ప్రభువుతో మాట్లాడటం వంటిది. (క’న్జుల్ అ’అమాల్)
మరో ప్రవచనం: ఖుర్‌ఆన్ పఠించండి, ఖుర్‌ఆన్‌ను కంఠస్తం చేసిన హృదయాన్ని అల్లాహ్ (త) నరకంలో వేయడు. (కన్’జుల్ అ’అమాల్)
మరో ప్రవచనం: ఇనుముకు తుప్పుపట్టినట్లు హృదయాలకు తుప్పు పడుతుంది. ఇనుముకు నీటి వల్ల తుప్పుపడుతుంది. అప్పుడు ప్రజలు, ‘అల్లాహ్ ప్రవక్తా! మరి దాన్ని ఎలా పరిశుభ్రపరచాలి,’ అని ప్రశ్నించారు. ప్రవక్త (స), ‘చావును అధికంగా గుర్తుంచుకుంటూ ఉండండి, ఖుర్‌ఆన్‌ను అధికంగా పఠిస్తూ ఉండండి.’ (బైహఖీ)
మరో ప్రవచనం: నా సమాజంలో ఖుర్‌ఆన్ పఠనం అత్యుత్తమ ఆరాధన. (కన్’జుల్ అ‘అమాల్)
ప్రవక్త (స) ప్రవచనం: మీలో ఖుర్‌ఆన్‌ను నేర్చుకొని ఇతరులకు నేర్పేవారే అందరికంటే ఉత్తములు. (బు’ఖారీ)
ప్రవక్త (స) ప్రవచనం: ఖుర్‌ఆన్‌ను అత్యధికంగా పారాయణం చేయండి. ప్రళయదినాన అది, తనను పారాయణం చేసిన వారి కొరకు సిఫారసు చేస్తుంది. (ముస్లిమ్)
ప్రవక్త (స) ప్రవచనం: ఇతర సమయాల్లో ఖుర్‌ఆన్ పఠించడం కంటే నమా’జ్‌లో ఖుర్‌ఆన్ పఠించడం ఉత్తమం. ఇతర వేళల్లో ఖుర్‌ఆన్ పఠించడం తన్‌బీ’హ్, తక్బీర్ల కంటే ఉత్తమమైనది. దానధర్మాలు చేయడం కంటే తస్బీ’హ్, తక్బీర్ ఉత్తమమైనవి. ‘సదఖహ్ చేయడం ఉపవాసం ఉండటం కంటే ఉత్తమమైనది. ఉపవాసం డాలు వంటిది. (బైహఖీ – మిష్కాత్)
ఖుర్‌ఆన్‌ను కనీసం మూడురోజుల్లో పూర్తి చేయాలి. ప్రవక్త (స) ప్రవచనం: 3 రోజుల కంటే తక్కువ సమయంలో ఖుర్‌ఆన్‌ను పూర్తిచేసిన వారికి ఏమీ అర్థం కాదు.
ఖుర్‌ఆన్ పఠన నియమాలు: 1. వుజూ చేసి భక్తి శ్రద్ధలతో పఠించాలి. 2. చిత్తశుద్ధితో, చూపుగోలు లేకుండా పఠించాలి. 3. ప్రారంభించడానికి ముందు అ’ఊజుబిల్లాహి మినష్షై’తా నిర్రజీమ్ అని పలకాలి. 4. చూసి చదివితే ఖుర్‌ఆన్‌ను కొంత ఎత్తైన ప్రదేశంపై ఉంచి పఠించాలి. 5. అర్థం తెలిస్తే అర్థం చేసుకుంటూ చదవాలి. 6. ఖుర్‌ఆన్‌ను ఆగిఆగి పఠించటం, ప్రతి ఆయతుపై ఆగి పఠించటం ప్రవక్త సాంప్రదాయం.
ప్రవక్త (స)ను, అల్లాహ్ (త), ఖుర్‌ఆన్‌ను నిదానంగా స్పష్టంగా పఠించమని ఆదేశించాడు. ప్రవక్త (స) ఈ దైవాదేశాన్నే అనుసరించేవారు. ప్రతి ఆయత్ను ఆగిఆగి పఠించేవారు.
య’అలా’ (ర) కథనం: నేను ఉమ్మె సలమహ్ను ప్రవక్త (స) ఎలా పఠించేవారని అడిగాను. అప్పుడు ఆమె ప్రవక్త (స) స్పష్టంగా ఒక్కొక్క పదం వేరువేరుగా పఠించేవారని తెలిపారు. అంటే ఉమ్మె సలమహ్ పఠించి ప్రవక్త (స) ఈ విధంగా ఒక్కొక్క పదం స్పష్టంగా చదివేవారని తెలిపారు. (షమాయి’ల్ తిర్మిజి’)
మరో ఉల్లేఖనంలో ఇలా ఉంది: ”ప్రవక్త (స) ప్రతి ఆయత్ ను వేర్వేరుగా చదివేవారు. ”అల్’హమ్‌దు లిల్లాహి రబ్బిల్ ‘ఆలమీన్” పఠించి ఆగి ఆ తర్వాత ”అర్ర’హ్మానిర్ర’హీమ్” పఠిస్తారు. అంటే ఆగి ఆ తర్వాత ”మాలికి యౌమిద్దీన్” పఠించి ఆగిపోతారు. అంటే నిదానంగా ఆగిఆగి స్పష్టంగా పఠించేవారు. (షమాయి’ల్ తిర్మిజి’)
ఈ ‘హదీసు’ ద్వారా ప్రతి ఆయత్పై ఆగి ఆగి పఠించడం ప్రవక్త సాంప్రదాయం అని, ఆయత్ ల చివర ఆగనివారు ప్రవక్త సాంప్రదాయానికి వ్యతిరేకం అని తెలుస్తుంది.
అల్లాహ్ (త) మనందరికీ ఖుర్‌ఆన్ ‘హదీసు’ల ద్వారా ఆచరించే భాగ్యం ప్రసాగించుగాక! వీటిని ప్రచారంచేసే, సేవచేసే, ప్రచురించే భాగ్యం ప్రసాదించు గాక! (ఆమీన్).
ఖుర్‌ఆన్ పట్ల అంతర్గత గౌరవాదరణలతో పాటు బహిర్గత ఆదరణ, గౌరవాన్ని చూపాలి. దీనికి ఎనలేని పుణ్యం లభిస్తుంది. నేలపై పడి ఉన్న ఖుర్‌ఆన్ కాగితాలను ఎత్తిన వాడితో అల్లాహ్ (త) మైత్రి కలిగి ఉంటాడు. అదేవిధంగా అల్లాహ్ (త) పేర్లు వ్రాసి ఉన్న కాగితాలను నేలనుండి ఎత్తినవాడు ‘ఇల్లియ్యీన్‌లో గొప్ప స్థానం పొందుతాడు.
‘అలీ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”నేలపై ఏదైనా పుస్తకం పడితే దాని రక్షణకు అల్లాహ్ (త) దైవదూతలను పంపిస్తాడు. ఆ దైవదూతలు తమ రెక్కల ద్వారా వాటిని రక్షిస్తూ ఉంటారు. చివరికి అల్లాహ్ (త) తన మిత్రుల్లో నుండి ఒకరిని పంపిస్తాడు. అతను దాన్ని నేలపై నుండి ఎత్తుకుంటాడు. ఎవరైనా అల్లాహ్(త) పేరుగల కాగితాన్ని ఎత్తుకుంటే అల్లాహ్ (త) అతనిపేరును ‘ఇల్లియ్యీన్‌లోవ్రాసి గొప్పస్థానాలు ప్రసాదిస్తాడు. ఇంకా అతని తల్లిదండ్రుల శిక్ష తగ్గిస్తాడు. ఒకవేళ వారి తల్లిదండ్రులు అవిశ్వాసులైనా సరే.
—–
اَلْفَصْلُ الْأَوَّلُ మొదటి విభాగం
2109 – [ 1 ] ( صحيح ) (1/651)
عَنْ عُثْمَانَ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “خَيْرُكُمْ مَنْ تَعَلَّمَ الْقُرْآنَ وَعَلَّمَهُ”. رَوَاهُ الْبُخَارِيُّ.
2109. (1) [1/651–దృఢం]
‘ఉస్మాన్ (ర) కథనం: దైవప్రవక్త (స) ప్రవచనం: ”మీలో ఖుర్‌ఆన్‌ను నేర్చుకొని ఇతరులకు నేర్పేవారే అందరికంటే ఉత్తములు.” (బు’ఖారీ)
2110 – [ 2 ] ( صحيح ) (1/651)
وَعَنْ عُقْبَةَ بْنِ عَامِرٍقَالَ: خَرَجَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم وَنَحْنُ فِيْ الصُّفَّةِ فَقَالَ: “أَيُّكُمْ يُحِبُّ أَنْ يَّغْدُوَ كُلَّ يَوْمٍ إِلَى بُطْحَانَ أَوْ إِلَى الْعَقِيْقِ فَيَأْتِيْ مِنْهُ بِنَاقَتَيْنِ كُوْمَاوَيْنِ فِيْ غَيْرِ إِثْمٍ وَّلَا قَطْعِ رَحِمٍ. “فَقُلْنَا يَا رَسُوْلَ اللهِ كلنا نُحِبُّ ذَلِكَ. قَالَ: “أَفَلَا يَغْدُوْ أَحَدُكُمْ إِلَى الْمَسْجِدِ فَيُعَلِّمُ أَوْ يَقْرَأُ آيَتَيْنِ مِنْ كِتَابِ اللهِ عَزّوجل خَيْرٌ لَّهُ مِنْ نَاقَةٍ أَوْ نَاقَتَيْنِ وَثَلَاثٌ خَيْرٌ لَهُ مِنْ ثَلَاثٍ وَّأَرْبَعٍ خَيْرٌ لَّهُ مِنْ أَرْبَعٍ وَّمِنْ أَعْدَادِهِنَّ مِنَ الْإِبْلِ. رَوَاهُ مُسْلِمٌ.
2110. (2) [1/651–దృఢం]
‘ఉఖ్‌బహ్ బిన్ ‘ఆమిర్ (ర) కథనం: మేము సుఫ్పహ్ అంటే అరుగుపై కూర్చొని ఉన్నాము. ఇంతలో ప్రవక్త (స) వచ్చారు. ఇలా అన్నారు, ”మీలో ఎవరు ప్రతిరోజు బత్’హాన్ లేదా ‘అఖీఖ్ మైదానంలోకెళ్ళి అక్కడి నుండి ఎటువంటి అపరాధం చేయకుండా, బంధుత్వాన్ని త్రెంచకుండా అంటే ధర్మసమ్మతంగా ఉత్తమ జాతికి చెందిన రెండు ఒంటెలు తీసుకురావాలని కోరుకుంటారు,’ అని అన్నారు. దానికి మేము, ”మాలో ప్రతి ఒక్కరూ దానికి ఇష్టపడతారు,” అని అన్నాము. అప్పుడు ప్రవక్త (స) మీలో ప్రతి ఒక్కరూ ప్రతి రోజూ ఉదయం మస్జిద్ వైపు వెళ్ళి, ఖుర్‌ఆన్ నేర్పించాలి లేదా రెండు ఆయతులు పఠించాలి. ఇది అతనికి రెండు ఉత్తమ జాతి ఒంటెలకంటే మేలైనది. మూడు ఆయతులు పఠించడం మూడు ఒంటెలకంటే మేలైనది. అదే విధంగా ఎన్ని ఆయతులు పఠిస్తే అన్ని ఒంటెల కంటే మేలైనది అని ప్రవచించారు. [1] (ముస్లిమ్)
2111 – [ 3 ] ( صحيح ) (1/651)
وَعَنْ أَبِيْ هُرَيْرَةَ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “أَيُحِبُّ أَحَدُكُمْ إِذَا رَجَعَ إِلَى أَهْلِهِ أَنْ يَّجِدَ فِيْهِ ثَلَاثَ خَلِفَاتٍ عِظَامٍ سِمَانٍ”. قُلْنَا: نَعَمْ. قَالَ: “فَثَلَاثُ آيَاتٍ يَّقْرَأُ بِهِنَّ أَحَدُكُمْ فِيْ صَلَاتِهِ خَيْرٌ لَّهُ مِّنْ ثَلَاثِ خَلِفَاتٍ عِظَامٍ سِمَانٍ”. رَوَاهُ مُسْلِمٌ.
2111. (3) [1/651–దృఢం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) ‘మీలో ఎవ రైనా తనఇంటికి తిరిగివచ్చినపుడు తనఇంట్లో మూడు గర్భం ధరించిన ఆడ ఒంటెలు ఉండాలని కోరు కుంటారా?’ అని ప్రశ్నించారు. దానికి మేము, ‘ప్రతివ్యక్తి దీన్ని కోరుకుంటాడు,’ అని అన్నాము. అప్పుడు ప్రవక్త (స) ‘మీలో ఎవరైనా నమా’జులో మూడు ఆయతులు పఠిస్తే మూడు గర్భం ధరించిన ఆడఒంటెల కంటే ఎంతో ఉత్తమం’ అని అన్నారు. (ముస్లిమ్)
2112 – [ 4 ] ( متفق عليه ) (1/652)
وَعَنْ عَائِشَةَ رَضِيَ اللهُ عَنْهَا قَالَتْ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “اَلْمَاهِرُ بِالْقُرْآنِ مَعَ السَّفَرَةِ الْكِرَامِ الْبَرَرَةِ وَالَّذِيْ يَقْرَأُ الْقُرْآنَ وَيَتَتَعْتَعُ فِيْهِ وَهُوَ عَلَيْهِ شَاقٌ لَهُ أَجْرَانِ”.
2112. (4) [1/652–ఏకీభవితం]
‘ఆయి’షహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం: ”ఖుర్‌ఆన్ పండితుడయి ఉండి, దాన్ని పఠించే వ్యక్తి, గౌరవనీయులు, పుణ్యాత్ములు అయిన దైవ దూతలతో ఉంటాడు. ఖుర్‌ఆన్‌ను పఠించడంలో తడబడుతూ, శ్రమతో పఠించేవాడు రెట్టింపు పుణ్యాన్ని పొందుతాడు. [2] (బు’ఖారీ, ముస్లిమ్)
2113 – [ 5 ] ( متفق عليه ) (1/652)
وَعَنِ ابْنِ عُمَرَقَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَا حَسَدَ إِلَّا عَلَى اثْنَيْنِ: رَجُلٍ آتَاهُ اللهُ الْقُرْآنَ فَهُوَ يَقُوْمُ بِهِ آنَاءَ اللَّيْلِ وَآنَاءَ النَّهَارِ. وَرَجُلٍ آتَاهُ اللهُ مَالًا فَهُوَ يُنْفِقُ مِنْهُ آنَاءَ اللَّيْلِ وَآنَاءَ النَّهَارِ”.
2113. (5) [1/652–ఏకీభవితం]
‘అబ్దుల్లాహ్ బిన్ ‘ఉమర్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవ చనం, ”ఇద్దరు వ్యక్తుల పట్ల తప్ప, మరెవ్వరి పట్లా అసూయపడకూడదు. ఒకరు: అల్లాహ్ (త) ఖుర్‌ఆన్ జ్ఞానాన్ని ప్రసాదించగా, రాత్రిపగలు దాన్ని చదివి, దాని ప్రకారం ఆచరించే వ్యక్తి. మరొకరు: అల్లాహ్ (త) ధన సంపదలు ప్రసాదించగా వాటిని రాత్రీపగలు అల్లాహ్ (త) మార్గంలో ఖర్చుపెట్టే వ్యక్తి. [3](బు’ఖారీ, ముస్లిమ్)
2114 – [ 6 ] ( متفق عليه ) (1/652)
وَعَنْ أَبِيْ مُوْسَى الْأَشْعَرِيْ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَثَلُ الْمُؤْمِنِ الَّذِيْ يَقْرَأُ الْقُرْآنَ كَمَثَلَ الْأُتْرُجَّةِ رِيْحُهَا طَيِّبٌ وَطَعْمُهَا طَيِّبٌ. وَمَثَلُ الْمُؤْمِنِ الَّذِيْ لَا يَقْرَأُ الْقُرْآنُ كَمَثَلَ التَّمْرَةِ لَا رِيْحَ لَهَا وَطَعْمُهَا حُلْوٌ. وَمَثَلُ الْمُنَافِقِ الَّذِيْ لَا يَقْرَأُ الْقُرْآنَ كَمَثَلِ الْحَنْظَلَةِ لَيْسَ لَهَا رِيْحٌ وَطَعْمُهَا مُرٌّ. وَمَثَلُ الْمُنَافِقِ الَّذِيْ يَقْرَأُ الْقُرْآنَ مَثَلَ الرَّيْحَانَةِ. رِيْحُهَا طَيِّبٌ وَطَعْمُهَا مُرٌّ”. مُتَّفَقٌ عَلَيْهِ.
وَفِيْ رِوَايَةٍ: “اَلْمُؤْمِنِ الَّذِيْ يَقْرَأُ الْقُرْآنَ وَيَعْمَلُ بِهِ كَالْأُتْرُجَّةِ وَالْمُؤْمِنِ الَّذِيْ لَا يَقْرَأُ الْقُرْآنَ وَيَعْمَلُ بِهِ كَالتَّمَرَةِ”.
2114. (6) [1/652–ఏకీభవితం]
అబూ మూసా అష్’అరీ (ర) ఉల్లేఖనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఖుర్‌ఆన్ పఠించే విశ్వాసి కమల పండు (అత్రుజ్జహ్) లాంటి వాడు. కమల పండులో సువాసన కూడా ఉంటుంది. ఇంకా దాని రుచి కూడా తియ్యగా బాగుంటుంది. ఖుర్‌ఆన్ పారాయణం చేయని విశ్వాసి ఖర్జూరపు పండులాంటి వాడు. అందులో సువాసన లేకపోయినా, దాని రుచి మాత్రం తియ్యగా ఉంటుంది. ఇక ఖుర్‌ఆన్ పారాయణం చేయని కపటవిశ్వాసి ఉమ్మెత్తకాయ (‘హంజలహ్) లాంటి వాడు. అందులో సువాసనా ఉండదు, రుచి కూడా చేదుగా ఉంటుంది. ఖుర్‌ఆన్ పారాయణం చేసే కపటాచారి, సుగంధ మొక్క (రీహాన్) లాంటి వాడు. పైకి దాని వాసన బాగున్నా రుచిమాత్రం చేదుగా ఉంటుంది. (బు’ఖారీ, ముస్లిమ్)
మరో ఉల్లేఖనంలో, ”ఖుర్‌ఆన్‌ను పారాయణం చేసే, దాన్ని ఆచరించే విశ్వాసి కమలా పండు లాంటివాడు, ఖుర్‌ఆన్ పఠించక, దానిపై ఆచరించే విశ్వాసి ఖర్జూర పండు లాంటివాడు,” అని ఉంది.
2115 – [ 7 ] ( صحيح ) (1/652)
وَعَنْ عُمَرَبْنِ الْخَطَّابِ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِنَّ اللهَ يَرْفَعُ بِهَذَا الْكِتَابِ أَقْوَامًا وَيَضَعُ بِهِ آخَرِيْنَ”. رَوَاهُ مُسْلِمٌ .
2115. (7) [1/652–దృఢం]
‘ఉమర్ బిన్ ‘ఖత్తాబ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, నిస్సందేహంగా అల్లాహ్ ఈ గ్రంథం (ఖుర్ఆన్) ద్వారా కొన్ని జాతుల్ని మహోన్నత స్థితికి చేరుస్తాడు. మరికొన్ని జాతుల్ని దీని మూలంగా అధోగతి పాలు చేస్తాస్తాడు. [4] (ముస్లిమ్)
2116 – [ 8 ] ( متفق عليه ) (1/652)
وَعَنْ أَبِيْ سَعَيْدِ الْخُدَرِيِّ أَنَّ أُسَيْدَ بْنُ حُضَيْرٍ قَالَ: بَيْنَمَا هُوَ يَقْرَأُ مِنَ اللَّيْلِ سُوْرَةَ الْبَقَرَةَ وَفَرَسُهُ مَرْبُوْطَةٌ عِنْدَهُ إِذْ جَالَتِ الْفَرَسُ فَسَكَتَ فَسَكَتَتْ فَقَرَأَ فَجَالَتْ الْفَرَسُ فَسَكَتَ فَسَكَنَتْ الْفَرْسُ. ثُمَّ قَرَأَ فَجَالَتْ الْفَرَسُ. فَانْصَرَفَ وَكَانَ ابْنُهُ يَحْيَى قَرِيْبًا مِّنْهَا فَأَشْفَقَ أَنْ تُصِيْبَهُ. فَلَمَّا آخَّرَهُ رَفَعَ رَأْسَهُ إِلَى السَّمَاءِ فَإِذَا مِثْلَ الظُّلَّةِ فِيْهَا أَمْثَالُ الْمَصَابِيْحِ فَلَمَّا أَصْبَحَ حَدَّثَ النَّبِيَّ صلى الله عليه وسلم. فَقَالَ: “اِقْرَأْ يَا ابْنَ حُضَيْرٍ اِقْرَأْ يَا ابْنَ حُضَيْرٍ”. قَالَ فَأَشْفَقْتُ يَا رَسُوْلَ اللهِ أَنْ تَطَأَ يَحْيَى وَكَانَ مِنْهَا قَرِيْبًا فانصرفت إليه و رَفَعْتُ رَأْسِيْ إلى السماءِ. فَإِذَا مِثْلَ الظُّلَّةِ فِيْهَا أَمْثَالُ الْمَصَابِيْحِ فَخَرَجْتُ حَتَّى لَا أَرَاهَا قَالَ:”وَتَدْرِيْ مَا ذَاكَ؟” قَالَ لَا. قَالَ: “تِلْكَ الْمَلَائِكَةُ دَنَتْ لِصَوْتِكَ وَلَوْ قَرَأْتَ لَأَصْبَحَتْ يَنْظُرُ النَّاسُ إِلَيْهَا لَا تَتَوَارَى مِنْهُمْ”. مُتَّفَقٌ عَلَيْهِ .
وَاللَّفْظُ لِلْبُخَارِيِّ وَفِيْ مُسْلِمٍ: “عَرَجَتْ فِيْ الْجَوِّ” بَدَلَ: “خَرَجْتُ عَلَى صِيْغَةِ الْمُتَكَلِّمِ”.
2116. (8) [1/652–ఏకీభవితం]
అబూ స’యీద్ ‘ఖుద్రీ (ర) కథనం: ఉసైద్ బిన్ ‘హు’దైర్ తన సంఘటనను ఇలా పేర్కొన్నారు, ”ఒక రాత్రి అతను సూరహ్ బఖరహ్ (2) పఠిస్తున్నారు, అతని గుర్రం అతని దగ్గరే కట్టబడి ఉంది. అకస్మాత్తుగా ఆ గుర్రం గెంతసాగింది. అతను పఠనం ఆపివేసారు. గుర్రం కూడా గెంతటం మాని వేసింది. మళ్ళీ అతను చదవటం ప్రారంభించాడు. మళ్ళీ గుర్రం గెంతసాగింది. అతను పఠనం ఆపివేసారు. గుర్రం కూడా గెంతటం మానివేసింది. మళ్ళీ అతను చదవటం ప్రారంభించాడు. మళ్ళీ గుర్రం గెంతసాగింది. అతను నమా’జు ముగించారు. అతని కుమారుడు య’హ్‌యా గుర్రానికి సమీపంగానే పడుకొని ఉన్నాడు. ఒకవేళ తన కుమారుడు గుర్రం వద్దనే పడుకొని ఉంటే గుర్రం ఈ విధంగా గెంతటం వల్ల అతనికి బాధ కలుగుతుందని అతనికి భయం వేసింది. అతను తన కుమారున్ని అక్కడి నుండి తొలగించాడు. తన తల ఎత్తి ఆకాశం వైపుచూశాడు. నీడలా మేఘం వ్యాపించి ఉంది. అందులో దీపాల్లా వెలుగు ఉంది. ఉదయం లేచి ప్రవక్త (స) వద్దకు వచ్చి రాత్రి జరిగినదంతా విన్నవించుకున్నాడు. అది విని ప్రవక్త (స), ‘ఓ ఇబ్నె ‘హు’దైర్! చదువుతూ ఉండవలసింది. ‘ఓ ఇబ్నె ‘హు’దైర్! చదువుతూ ఉండవలసింది. అతను ఓ అల్లాహ్ ప్రవక్త నా కుమారుడు య’హ్‌యా అక్కడే పడుకుని ఉన్నాడు. గుర్రం నా కుమారున్ని నలిపి వేస్తుందని నాకు భయం వేసింది. అందుకే నమా’జ్ ముగించి అబ్బాయిని తీసుకోవటానికి వచ్చి ఆకాశం వైపు చూస్తే, నీడలా వ్యాపించి ఉంది. అందులో దీపాలు వెలుగుతూ ఉన్నాయి. నేను బయటకు వచ్చాను. అవి మరి కనబడ లేదు.’ ప్రవక్త (స), ‘అవేమిటో నీకు తెలుసా,’ అని అడిగారు. అతను, ‘లేదు,’ అని సమాధానం ఇచ్చాడు. ‘అవి కారుణ్య దైవదూతలు. నీ ఖుర్‌ఆన్ పఠనాన్ని వినడానికి దగ్గరకు వస్తున్నారు. ఒకవేళ నీవు అలాగే చదువుతూ ఉంటే ఉదయం వారిని ప్రజలు చూసుకునేవారు. వారు ప్రజల చూపుల నుండి తప్పించు కోలేరు. [5] (బు’ఖారీ)
మరో ముస్లిమ్ ఉల్లేఖనంలో ఇలా ఉంది, ”దైవ దూతలు ఆకాశం” వైపు వెళ్ళిపోయారు.
2117 – [ 9 ] ( متفق عليه ) (1/653)
وَعَنِ الْبَرَاءِ بْنِ عَازِبٍ قَالَ: كَانَ رَجُلٌ يَقْرَأُ سُوْرَةُ الْكَهْفِ وَإِلَى جَانِبِهِ حِصَانٌ مَّرْبُوْطٌ بِشَطْنَيْنِ فَتَغَشَّتْهُ سَحَابَةٌ فَجَعَلَتْ تَدْنُوْ وَتَدْنُوْ وَجَعَلَ فَرَسُهُ يَنْفِرُ فَلَمَّا أَصْبَحَ أَتَى النَّبِيَّ صلى الله عليه وسلم فَذَكَرَ ذَلِكَ لَهُ. فَقَالَ: “تِلْكَ السَّكِيْنَةُ تَنَزَّلَتْ بِالْقُرْآن”.
2117. (9) [1/653–ఏకీభవితం]
బరా’ (ర) కథనం: ఒక వ్యక్తి సూరహ్ కహఫ్ (18) పఠిస్తున్నారు. ఆయనకు దగ్గరలోనే గుర్రం రెండు త్రాళ్ళతో కట్టబడి ఉంది. ఆ గుర్రాన్ని ఒక మేఘం కప్పివేసింది. గుర్రం దగ్గరకు వచ్చింది. ఆ గుర్రం గెంతసాగింది. ఉదయం కాగానే ఆ వ్యక్తి ప్రవక్త (స) వద్దకు వచ్చి రాత్రి జరిగినదంతా వివరించాడు. అది విన్న ప్రవక్త (స) అది ప్రశాంతత అని, ఖుర్‌ఆన్ పఠించడం వల్ల అవతరించిందని ప్రవచించారు. [6] (బు’ఖారీ, ముస్లిమ్)
2118 – [ 10 ] ( صحيح ) (1/653)
وَعَنْ أَبِيْ سَعِيْدِ بْنِ الْمُعَلّى قَالَ: كُنْتُ أُصَلِّيْ فِيْ الْمَسْجِدِ فَدَعَانِيِ النَّبِيُّ صلى الله عليه وسلم. فَلَمْ أُجِبْهُ حَتَّى صَلَّيْتُ ثُمَّ أَتَيْتُهُ. فَقُلْتُ يَا رَسُوْلَ اللهِ إِنِّيْ كُنْتُ أُصَلِّيْ. فَقَالَ: أَلَمْ يَقُلِ اللهُ (اسْتَجِيْبُوا لِلّهِ وَلِلرَّسُوْلِ إِذَا دَعَاكُمْ-8: 24) ثُمَّ قَالَ لِيْ: “أَلَا أُعَلِّمُكَ أَعْظَمَ سُوْرَةٍ فِيْ الْقُرْآنِ قَبْلَ أَنْ تَخْرُجَ مِنَ الْمَسْجِدِ”. فَأَخَذَ بِيَدِيْ فَلَمَّا أَرَادَ أَنْ يَّخْرُجَ قُلْتُ يا رسول الله إنك قلت: لَأُعَلِّمُكَ أَعْظَمُ سُوْرَةٍ مِّنَ الْقُرْآنِ. قَالَ: (اَلْحَمْدُ لِلّهِ رَبِّ الْعَالَمِيْنَ-1) هِيَ السَّبْعُ الْمَثَانِيْ وَالْقُرْآنُ الْعَظِيْمُ الَّذِيْ أُوْتِيْته”. رَوَاهُ الْبُخَارِيُّ .
2118. (10) [1/653–దృఢం]
అబూ స’యీద్ బిన్ ము’అల్లా (ర) కథనం: నేను మస్జిద్‌లో నమా’జ్ చదువుతున్నాను. ఇంతలో ప్రవక్త (స) నన్ను పిలిచారు. నమా’జులో ఉండటం వల్ల వెంటనే వెళ్ళలేక పోయాను. నమా’జు ముగించుకొని ప్రవక్త (స) వద్దకు వెళ్ళి, ‘తమరు పిలిచినపుడు నేను నమా’జులో ఉన్నాను, అందువల్లే రాలేక పోయాను,’ అని విన్నవించుకున్నాను. అప్పుడు ప్రవక్త (స) అల్లాహ్ (త) ఇలా ఆదేశించలేదా, ”అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త పిలిచినపుడు వెంటనే స్పందించండి, విధేయత చూపండి.’ అని పఠించారు. ఆ తరువాత నువ్వు మస్జిద్ నుండి బయటకు వెళ్ళే ముందు నేను నీకు ఖుర్‌ఆన్‌లో అన్నిటి కంటే పెద్ద సూరహ్ చూపించనా?’ అని పలికి, నా చేయి పట్టుకొని మస్జిద్ నుండి బయటకు నడవసాగారు. బయటకు రాబోతున్నప్పుడు నేను ప్రవక్త (స)ను, ‘ఓ అల్లాహ్ ప్రవక్తా! తమరు ఇప్పుడే మస్జిద్ నుండి బయటకు వెళ్ళే ముందు ఒక పెద్ద సూరహ్ చూపిస్తాను,’ అని అన్నారు అని విన్నవించుకున్నాను. అప్పుడు ప్రవక్త (స) అది, సూరహ్ ఫాతిహా (1), ఇందులో 7 ఆయాతులు ఉన్నాయి, ఇది నమా’జులో అనేకసార్లు పఠించబడుతుంది, నాకు ఇవ్వబడిన ఖుర్‌ఆన్ ఇదే, అని ప్రవచించారు.’ [7] (బు’ఖారీ)
2119 – [ 11 ] ( صحيح ) (1/654)
وَعَنْ أَبِيْ هُرَيْرَةَ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَا تَجْعَلُوْا بُيُوْتَكُمْ مَقَابِرَإِنَّ الشَّيْطَانَ يَنْفِرُمِنَ الْبَيْتِ الَّذِيْ يُقْرَأُ فِيْهِ سُوْرَةُ الْبَقَرَةِ”. رَوَاهُ مُسْلِمٌ .
2119. (11) [1/654–దృఢం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మీరు మీ ఇండ్లను శ్మశానాలుగా మార్చుకోకండి. నిస్సందేహంగా సూరహ్ బఖరహ్ (2) పఠించబడే ఇంట్లో నుంచి షై’తాన్ పారిపోతాడు.” [8](ముస్లిమ్)
2120 – [ 12 ] ( صحيح ) (1/654)
عَنْ أَبِيْ أُمَامَةَ قَالَ: سَمِعْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ: “اقْرَءُوْا الْقُرْآنَ فَإِنَّهُ يَأْتِيْ يَوْمَ الْقِيَامَةِ شَفِيْعًا لِأَصْحَابِهِ اقْرَءُوْا الزَّهْرَاوَيْنِ الْبَقَرَةَ (2) وَسُوْرَةُ آلِ عِمْرَانَ(3) فَإِنَّهُمَا تَأْتِيَانِ يَوْمَ الْقِيَامَةِ كَأَنَّهُمَا غَمَامَتَانِ أَوْ كَأَنَّهُمَا غَيَايَتَانِ أَوْ فِرْقَانِ مِنْ طَيْرٍ صَوَافَّ تُحَاجَّانِ عَنْ أَصْحَابِهِمَا اقْرَءُوْا سُوْرَةَ الْبَقَرَةَ فَإِنَّ أَخْذَهَا بَرَكَةٌ وَتَرْكَهَا حَسْرَةٌ وَّلَا تَسْتَطِيْعُهَا الْبَطَلَةُ”. رَوَاهُ مُسْلِمٌ
2120. (12) [1/654–దృఢం]
అబూ ఉమామహ్ (ర) కథనం: ప్రవక్త (స) ఇలా అంటూ ఉండగా నేను విన్నాను, ”ఖుర్‌ఆన్‌ను అత్యధికంగా పారాయణం చేయండి, ప్రళయదినాన అది, తనను పారాయణం చేసినవారి కొరకు సిఫారసు చేస్తుంది. అదేవిధంగా వెలుగుతో మెరిసే రెండు సూరాలను పఠించండి. అంటే సూరహ్ బఖరహ్ (2), సూరహ్ ఆలి ‘ఇమ్రాన్ (3). ఎందుకంటే, ఈ రెండు సూరాలు తీర్పుదినం నాడు మేఘాల రెండు ముక్క లుగా, లేదా నీడగా లేదా పక్షుల రెండు గుంపులుగా వచ్చి, వారి తరఫున వాదిస్తాయి. పక్షపాతంగా వ్యవ హరిస్తాయి. ముక్తి లభించేలా ప్రయత్నిస్తాయి. అందు వల్ల మీరు సూరహ్ బఖరహ్ (2) పఠించండి. ఎందు కంటే సూరహ్ బఖరహ్ పఠించడం వల్ల శుభం కలుగు తుంది. పఠించక పోవటం దురదృష్టకరం, విచారానికి కారణం అవుతుంది. దాన్ని చదివే వారికి వ్యతిరేకంగా దుర్జనులకు శక్తి లభించదు. దుర్మార్గులు ఖుర్‌ఆన్ పాఠకున్ని ఎదిరించలేరు. (ముస్లిమ్)
2121 – [ 13 ] ( صحيح ) (1/654)
وَعَنِ النَّوَّاسِ بْنِ سَمْعَانَ قَالَ: سَمِعْتُ النَّبِيَّ صلى الله عليه وسلم يَقُوْلُ: “يُؤْتَى بِالْقُرْآنِ يَوْمَ الْقِيَامَةِ وَأَهْلِهِ الَّذِيْنَ كَانُوْا يَعْمَلُوْنَ بِهِ تَقْدَمُهُ سُوْرَةُ الْبَقَرَةِ (2) وَآلُ عِمْرَانَ (3) كَأَنَّهُمَا غَمَامَتَانِ أَوْ ظُلَّتَانِ سَوْدَاوَانِ بَيْنَهُمَا شَرْقٌ أَوْ كَأَنَّهُمَا فِرْقَانِ مِنْ طَيْرٍ صَوَافَّ تُحَاجَّانِ عَنْ صَاحِبَهِمَا”. رَوَاهُ مُسْلِمٌ .
2121. (13) [1/654–దృఢం]
నవాస్ బిన్ సమ’ఆన్ (ర) కథనం: ప్రవక్త (స)ను ఇలా ప్రవచిస్తూ ఉండగా విన్నాను, ”పునరుత్థాన దినమున ఖుర్‌ఆన్‌ను మరియు ప్రపంచంలో దాన్ని ఆచరించిన వారిని అల్లాహ్(త) సన్నిధిలో హాజరు పరచటం జరుగుతుంది. అప్పుడు బఖరహ్(2), ఆలి ‘ఇమ్రాన్ (3) సూరాలు అందరి కన్నా ముందుండి మేఘాల రెండు ముక్కలుగా, లేదా నీడగా లేదా పక్షుల రెండు గుంపులుగా వచ్చి, తమను పఠించేవారి కొరకు సిఫారసు చేస్తాయి. [9](ముస్లిమ్)
2122 – [ 14 ] ( صحيح ) (1/654)
وَعَنْ أُبَيِّ بْنِ كَعْبٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “يَا أَبَا الْمُنْذِرِ أَتَدْرِيْ أَيُّ آيَةٍ مِّنْ كِتَابِ اللهِ مَعَكَ أَعْظَمُ؟” قَالَ: قُلْتُ اللهُ وَرَسُوْلَهُ أَعْلَمُ قَالَ: “يَا أَبَا الْمُنْذِرِ أَتَدْرِيْ أَيُّ آيَةٍ مِّنْ كِتَابِ اللهِ مَعَكَ أَعْظَمُ؟” قَالَ: قُلْتُ (اللهُ لَا إِلَهَ إِلَّا هُوَ الْحَيُّ الْقَيُّوْمُ- 2 : 255) قَالَ فَضَرَبَ فِيْ صَدْرِيْ وَقَالَ: “وَاللهِ لِيَهْنِكَ الْعِلْمُ يا أَبَا الْمُنْذِرِ”. رَوَاهُ مُسْلِمٌ.
2122. (14) [1/654–దృఢం]
ఉబై బిన్ క’అబ్ (ర) కథనం: ప్రవక్త (స) నన్ను ‘ఓ అబా మున్జి’ర్! నీ దగ్గరున్న దైవగ్రంథ వాక్యాల్లో అన్నిటికన్నా గొప్పదేదో నీకు తెలుసా?’ అని అడి గారు. దానికి నేను, ‘అల్లాహ్ (త)కు, ఆయన ప్రవక్తకు (స) తెలుసు,’ అని అన్నాను. మళ్ళీ అతను (స) ‘ఓ అబా మున్జి’ర్ నీ దగ్గరున్న దైవగ్రంథ వాక్యాల్లో అన్నిటికన్నా గొప్పదేదో నీకు తెలుసా?’ అని అడి గారు. అప్పుడు నేను ఆయతుల్ కుర్సీ (2:255)’ అని అన్నాను. అప్పుడతను (స) నా రొమ్ము తట్టి, ”ఓ అబా ముంజి’ర్! నీకు, నీ జ్ఞానం వల్ల శుభం కలుగు గాక!” అని అభినందించారు. [10] (ముస్లిమ్)
2123 – [ 15 ] ( صحيح ) (1/655)
وَعَنْ أَبِيْ هُرَيْرَةَ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: وَكَّلَنِيْ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم بِحِفْظِ زَكَاةِ رَمَضَانَ فَأَتَانِيْ آتٍ فَجَعَلَ يَحْثُوْ مِنَ الطَّعَامِ فَأَخَذْتُهُ وَقُلْتُ وَاللهِ لَأَرْفَعَنَّكَ إِلَى رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم قَالَ إِنِّيْ مُحْتَاجٌ وَعَلَيَّ عَيَالٌ وَّلِيْ حَاجَةٌ شَدِيْدَةٌ، قَالَ فَخَلَّيْتُ عَنْهُ فَأَصْبَحْتُ. فَقَالَ النَّبِيُّ صلى الله عليه وسلم: “يَا أَبَا هُرَيْرَةَ مَا فَعَلَ أَسِيْرُكَ الْبَارِحَةَ”. قَالَ قُلْتُ يَا رَسُوْلَ اللهِ شَكَا حَاجَةً شَدِيْدَةً وَّعِيَالًا فَرَحِمْتُهُ فَخَلَّيْتُ سَبِيْلَهُ قَالَ: “أَمَا إِنَّهُ قَدْ كَذَبَكَ وَسَيَعُوْدُ”. فَعَرَفْتُ أَنَّهُ سَيَعُوْدُ لِقَوْلِ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم: “إِنَّهُ سَيَعُوْدُ”. فَرَصَدْتُّهُ فَجَاءَ يَحْثُوْ مِنَ الطَّعَامِ فَأَخَذْتُهُ فَقُلْتُ: لَأَرْفَعَنَّكَ إِلَى رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم قَالَ: دَعْنِيْ فَإِنِّيْ مُحْتَاجٌ وَعَلَيَّ عَيَالٌ لَّا أَعُوْدُ فَرَحِمْتُهُ فَخَلَّيْتُ سَبِيْلَهُ فَأَصْبَحْتُ. فَقَالَ لِيْ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “يَا أَبَا هُرَيْرَةَ مَا فَعَلَ أَسِيْرُكَ؟ “قُلْتُ يَا رَسُوْلَ اللهِ شَكَا حَاجَةً شَدِيْدَةً وَعَيَالًا فَرَحِمْتُهُ فَخَلَّيْتُ سَبِيْلَهُ. قَالَ: “أَمَا إِنَّهُ قَدْ كَذَبَكَ وَسَيَعُوْدُ”. فَرَصَدْتُّهُ فَجَاءَ يَحْثُوْ مِنَ الطَّعَامِ فَأَخَذْتُهُ فَقُلْتُ لَأَرْفَعَنَّكَ إِلَى رَسُوْلِ اللهِ. وَهَذَا آخِرُ ثَلَاثِ مَرَّاتٍ أَنَّكَ تَزْعُمُ لَا تَعُوْدُ ثُمَّ تَعُوْدُ قَالَ دَعْنِيْ أُعَلِّمُكَ كَلِمَاتٍ يَّنْفَعُكَ اللهُ بِهَا قُلْتُ مَا هُوَ قَالَ إِذَا أَوَيْتَ إِلَى فِرَاشِكَ فَاقْرَأْ آيَةَ الْكُرْسِيِّ (اللهُ لَا إِلَهَ إِلَّا هُوَ الْحَيُّ الْقَيُّوْمُ-2: 255) حَتَّى تَخْتِمَ الْآيَةَ. فَإِنَّكَ لَنْ يَّزَالَ عَلَيْكَ مِنَ اللهِ حَافِظٌ وَّلَا يَقْرَبُكَ شَيْطَانٌ حَتّى تُصْبِحَ فَخَلَّيْتُ سَبِيْلَهُ فَأَصْبَحَ. فَقَالَ لِيْ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَا فَعَلَ أَسِيْرُكَ؟” قُلْتُ: زَعَمَ أَنَّهُ يُعَلِّمُنِيْ كَلِمَاتٍ يَّنْفَعُنِيَ اللهُ بِهَا فَخَلَّيْتُ سَبِيْلَهُ. قَالَ النَّبِيُّ صلى الله عليه وسلم: “أَمَا إِنَّهُ قَدْ صَدَقَكَ وَهُوَ كَذُوْبٌ تَعْلَمُ مَنْ تُخَاطِبُ مُنْذُ ثَلَاثِ لَيَالٍ”. يَا أَبَا هُرَيْرَةَ قَالَ: لَا. قَالَ: “ذَاكَ شَيْطَانٌ”. رَوَاهُ الْبُخَارِيُّ .
2123. (15) [1/655–దృఢం]
అబూ హురైరహ్ (ర) కథనం: దైవప్రవక్త (స) నన్ను రమ’దాన్ మాసంలోని ‘జకాత్ సొమ్ముకు కాపలా ఉంచారు. ఒకరోజు ఎవరో ఒకతను వచ్చి ఆహార ధాన్యాలను దొంగిలించసాగాడు. వెంటనే నేనతన్ని పట్టుకొని, ‘ప్రవక్త (స) వద్దకు పద,’ అని గద్దించాను. అందుకతను భయపడి, ‘అవసరాల్లో ఉన్నాను! భార్యా-బిడ్డలు కలవాన్ని, అప్పులలో చిక్కి పోయాను, ఇప్పుడు నాకు విపరీతమైన అవసరం వచ్చిపడింది, అల్లాహ్(త) కొరకు నన్ను పోనివ్వు’ అని అన్నాడు. నేనతన్ని దయదలచి వదలిపెట్టాను. మరునాటి ఉదయం దైవప్రవక్త (స) నన్ను పిలిచి, ‘అబూ హురైరహ్! నిన్న రాత్రి నువ్వు పట్టుకున్న వ్యక్తిని ఏం చేసావు,’ అని అడిగారు. దానికి నేను, ‘దైవప్రవక్తా! అతను తన అవసరం గురించి, తన మీద ఆధారపడి ఉన్నవారి గురించి మొరపెట్టుకున్నాడు. అందువల్ల నేనతని మీద దయతలచి అతన్ని వదలిపెట్టాను’ అని చెప్పాను. దానికి దైవప్రవక్త (స), ‘అతను నీతో అబద్ధం పలికాడు. అతను మళ్ళీ వస్తాడు. వేచి ఉండు,’ అని అన్నారు. దైవప్రవక్త (స) చెప్పారు కాబట్టి అతను మళ్ళీ తప్పకుండా వస్తాడని నమ్మి అతని కోసం మాటేసి కూర్చున్నాను. అతను వచ్చి చేతులతో ధాన్యాన్ని నింపుకోసాగాడు. నేను మెల్లగా వెళ్ళి అతన్ని పట్టుకొని, ‘ఇప్పుడు మాత్రం నేను నిన్ను తప్పకుండా దైవప్రవక్త దగ్గరకు తీసుకు వెళతాను,’ అని అన్నాను. అందుకతను, ‘నన్ను వదలిపెట్టండి, అవసరాల్లో ఉన్నాను, భార్యాబిడ్డలు గలవాణ్ని, ఇంకెప్పుడూ రాను,’ అని బ్రతిమాలాడు. నాకు అతనిపై జాలివేసింది. కనుక అతన్ని వదలి పెట్టేసాను. మరునాడు ఉదయం దైవప్రవక్త (స) నన్ను పిలిచి, ‘అబూ హురైరహ్ నిన్న రాత్రి నువ్వు పట్టుకున్న వ్యక్తిని ఏం చేసావు?’ అని అడిగారు. ‘దైవప్రవక్తా! అతను తన అవసరం గురించి తన మీద ఆధారపడి ఉన్నవారి గురించి మొరపెట్టుకున్నాడు. అందుకని నే నతని మీద దయతలచి అతన్ని వదలిపెట్టేశాను’ అని చెప్పాను. అది విని దైవప్రవక్త (స) ‘అతను నీతో అబద్ధం చెప్పాడు. అతను మళ్ళీవస్తాడు,’ అని చెప్పారు. మూడోసారి కూడా నేనతని కోసం మాటేసి కూర్చున్నాను. అతను వచ్చి చేతులతో ధాన్యం నింపుకోసాగాడు. నేనతన్ని పట్టుకొని, ‘ఇప్పుడు నేను నిన్ను తప్పకుండా ప్రవక్త (స) దగ్గరికి తీసుకు వెళ్తాను. నువ్వు ఇలా రావటం ఇది మూడోసారి. ప్రతిసారి నువ్వు ఇంకెప్పుడూ రానని వాగ్దానం చేసి మళ్ళీ వస్తున్నావు,’ అని గద్దిస్తూ అన్నాను. దాని కతను, ‘నన్ను వదలిపెట్టండి నేను మీకు కొన్ని వచనాలు నేర్పిస్తాను. వాటి మూలంగా అల్లాహ్ మీకు లాభం చేకూరుస్తాడు,’ అని అన్నాడు. నేను, ‘ఏ వచనాలు’ అని అడిగాను. అప్పుడతను, ‘మీరు నిద్రపోవటానికి పడక మీదకు వెళ్ళినప్పుడు, ఆయతుల్ కుర్సీ (2:255), పఠించండి, అలా చేస్తే తెల్లవారే వరకు, మీకోసం అల్లాహ్ (త) తరఫున ఒక రక్షకుడు నియమించబడతాడు. షై’తాన్ మీ దరిదాపులకు కూడా రాడు’ అని చెప్పాడు. అప్పుడు కూడా నేనతన్ని వదిలేసాను. తెల్లవారిన తర్వాత ప్రవక్త (స) నాతో మాట్లాడుతూ, ‘రాత్రి నువ్వు పట్టు కున్న వ్యక్తిని ఏం చేసావు?’ అని అడిగారు. దానికి నేను ‘దైవప్రవక్తా(స)! అతను నాకు కొన్ని వచనాలు నేర్పిస్తానని, ఆ వచనాల మూలంగా దేవుడు నాకు ప్రయోజనం చేకూరుస్తాడని చెప్పాడు. అందుకని నేనతన్ని వదలిపెట్టేసాను,’ అని చెప్పాను. ‘ఏమిటా వచనాలు?’ అని అడి గారు ప్రవక్త (స). అప్పుడు నేను, ఆ వచ్చిన వ్యక్తి నాతో, ‘మీరు పడక మీదకు వెళ్ళినపుడు మొదటి నుంచిచివరి వరకు, ఆయతుల్ కుర్సీ, పఠించండి, అలా చేస్తే మీ కొరకు అల్లాహ్ (త) తరఫు నుండి ఒక పర్యవేక్షకుడు నియమించబడ తాడు, తెల్లవారే వరకు షై’తాన్ మీ దరిదాపులకు కూడా రాలేడని అన్నాడని,’ చెప్పాను. అప్పుడు దైవప్రవక్త నాతో, ‘ఆ వ్యక్తి మహా అబద్ధాల కోరు. కాని అతను నీతో నిజంచెప్పాడు, అబూ హురైరహ్! మూడు రాత్రుల నుండి నువ్వు ఎవరితో మాట్లాడు తున్నావో నీకు తెలుసా?’ అని అడిగారు. ‘నాకు తెలియదు,’ అని నేనన్నాను. దైవప్రవక్త (స), ‘ఆ వ్యక్తి, షై’తాన్, వాడు సదఖహ్ ధనాన్ని దొంగిలించ డానికి వచ్చాడు,’ అని అన్నారు. (బు’ఖారీ)
2124 – [ 16 ] ( صحيح ) (1/656)
وَعَنِ ابْنِ عَبَّاسٍ قَالَ: بَيْنَمَا جِبْرِيْلُ قَاعِدٌ عِنْدَ النَّبِيِّ صلى الله عليه وسلم سَمِعَ نَقِيْضًا مِنْ فَوْقِهِ فَرَفَعَ رَأْسَهُ فَقَالَ: “هَذَا بَابٌ مِّنَ السَّمَاءِ فُتِحَ الْيَوْمَ لَمْ يُفْتَحْ قَطُّ إِلَّا الْيَوْمَ فَنَزَلَ مِنْهُ مَلَكٌ. فَقَالَ هَذَا مَلَكٌ نَزَلَ إِلَى الْأَرْضِ لَمْ يَنْزِلْ قَطُّ إِلَّا الْيَوْمَ فَسَلَّمَ. وَقَالَ أَبْشِرْ بِنُوْرَيْنِ أَوْتِيْتَهُمَا لَمْ يُؤْتَهُمَا نَبِيٌّ قَبْلَكَ فَاتِحَةُ الْكِتَابِ وَخَوَاتِيْمِ سُوْرَةِ الْبَقَرَةِ لَنْ تَقْرَأَ بِحَرْفٍ مِّنْهُمَا إِلَّا أُعْطِيْتَهُ”. رَوَاهُ مُسْلِمٌ .
2124. (16) [1/656–దృఢం]
ఇబ్నె’అబ్బాస్ (ర) కథనం: ఒకరోజు జిబ్రీల్(అ) మహాప్రవక్త (స) దగ్గర కూర్చొని ఉండగా పై నుండి ఒక ద్వారం తెరువబడే శబ్దం వినిపించింది. జిబ్రీల్ (అ) తలపైకెత్తి, ‘ఆకాశంలోని ఒక ద్వారం తెరువబడింది, ఇది దాని శబ్దమే. ఇంతకు ముందు ఎన్నడూ ఆ ద్వారం తెరువబడలేదు. ఆ ద్వారం గుండా ఒక దైవదూత దిగాడు,’ అని అన్నారు. ఆ దైవదూత గురించి చెబుతూ, ‘భూమిపైకి దిగిన ఈ దైవదూత, ఇంతకుముందు ఎన్నడూ దిగలేదు,’ అని అన్నారు. ఆ దైవదూత దైవప్రవక్త (స)కు సలామ్ చేసి, ‘మీకు రెండు వెలుగులు ఇవ్వబడి నందుకు సంతోషించండి, అవి ఇతర ప్రవక్త లెవ్వరికీ ఇవ్వబడలేదు. అవి సూరహ్ ఫాతిహా (1), సూరహ్ బఖరహ్(2)లోని చివరి ఆయతులు. మీరు వీటిలోని ఏ అక్షరాన్ని పఠించినా, దాని పుణ్యం మీకు లభిస్తుంది లేక ఏ దు’ఆ చేసినా అది అంగీకరించబడుతుంది” అని చెప్పాడు. [11] (ముస్లిమ్)
2125 – [ 17 ] ( متفق عليه ) (1/656)
وَعَنْ أَبِيْ مَسْعُوْدٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “اَلْآيَتَانِ مِنْ آخِرِ سُوْرَةِ الْبَقَرَةِ مَنْ قَرَأَ بِهِمَا فِيْ لَيْلَةٍ كَفَتَاهُ”.
2125. (17) [1/656–ఏకీభవితం]
అబూ మస్’ఊద్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ‘ఎవరయినా రాత్రి పూట సూరహ్ బఖరహ్లోని చివరి 2 ఆయతులు పఠిస్తే వారికి ఆ రాత్రంతా ఆ రెండు ఆయతులే చాలు.’ (బు’ఖారీ, ముస్లిమ్)
2126 – [ 18 ] ( صحيح ) (1/656)
وَعَنْ أَبِيْ الدَّرْدَاءِ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَنْ حَفِظَ عَشَرَ آيَاتٍ مِّنْ أَوَّلَ سُوْرَةِ الْكَهْفِ عُصِمَ مِنْ فِتْنَةِ الدَّجَّالِ”. رَوَاهُ مُسْلِمٌ .
2126. (18) [1/656–దృఢం]
అబూ దర్దా’ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ‘సూరహ్ కహఫ్(18)లోని మొదటి పది ఆయతులను కంఠస్తం చేసుకున్నవాడు దజ్జాల్ ఉపద్రవం నుండి రక్షించబడతాడు. (ముస్లిమ్)
2127 – [ 19 ] ( صحيح ) (1/656)
وَعَنْ أَبِيْ الدَّرْدَاءِ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “أَيَعْجِزُ أَحَدُكُمْ أَنْ يَّقْرَأَ فِيْ لَيْلَةٍ ثُلُثَ الْقُرْآنَ؟” قَالُوْا: وَكَيْفَ يَقْرَأُ ثُلُثَ الْقُرْآنِ؟ قَالَ: “قُلْ هُوَ اللهُ أَحَدٌ(114)” يَعْدِلُ ثُلُثَ الْقُرْآنَ”. رَوَاهُ مُسْلِمٌ .
2127. (19) [1/656–దృఢం]
అబూ దర్దా’ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ‘మీలో ఎవరయినా ఒకే రాత్రిలో మూడవవంతు ఖుర్‌ఆన్ పఠించగలరా?’ అని అడిగారు. సహచరులు, ‘అంత శక్తి మాకెక్కడిది?’ అని విన్న వించుకున్నారు. అప్పుడతను (స), సూరహ్ అల్-ఇ’ఖ్లా’స్ (112) మూడో వంతు ఖుర్ఆన్కు సమానం,’ అని అన్నారు. (ముస్లిమ్)
2128 – [ 20 ] ( صحيح ) (1/656)
وَرَوَاهُ الْبُخَارِيُّ عَنْ أَبِيْ سَعِيْدٍ.
2128. (20) [1/656–దృఢం]
దీన్ని అబూ స’యీద్ ‘ఖుద్రీ (ర) ద్వారా బు’ఖారీ (రహ్మ), ఉల్లేఖించారు.
2129 – [ 21 ] ( متفق عليه ) (1/656)
وَعَنْ عَائِشَةَ: أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم بَعَثَ رَجُلًا عَلَى سَرِيَّةٍ وَكَانَ يَقْرَأُ لِأَصْحَابِهِ فِيْ صَلَاتِهِمْ فَيَخْتِمُ بِ (قُلْ هُوَ اللهُ أَحَدٌ-114) فَلَمَّا رَجَعُوْا ذَكَرُوْا ذَلِكَ لِلنَّبِيِّ صلى الله عليه وسلم فَقَالَ: “سَلُوْهُ لِأَيِّ شَيْءٍ يَصْنَعُ ذَلِكَ” فَسَأَلُوْهُ. فَقَالَ: لِأَنَّهَا صِفَةُ الرَّحْمنِ وَأَنَا أُحِبُّ أَنْ أَقْرَأُ بِهَا. فَقَالَ النَّبِيُّ صلى الله عليه وسلم: “أَخْبِرُوْهُ أَنَّ اللهَ يُحِبُّهُ”.
2129. (21) [1/656–ఏకీభవితం]
‘ఆయి’షహ్ (ర) కథనం: ప్రవక్త (స) ఒక వ్యక్తిని సైన్యానికి నాయకునిగా నియమించి పంపారు. అతను, తన సహచరులను నమా’జు చదివించేవారు. అతను ఖుర్‌ఆన్‌లోని ఒక సూరహ్ పఠించి చివర్లో, సూరహ్ ఇ’ఖ్లా’స్ (112), పఠించేవాడు. వాళ్ళందరూ తిరిగివచ్చిన తర్వాత ప్రవక్త (స)కు తెలియపర్చారు. ప్రవక్త (స), ‘అలా ఎందుకు చేస్తున్నాడో అడగండి’ అని అన్నారు. ప్రజలు అడిగితే, ‘ఇందులో అల్లాహ్ గుణగణాలు ఉన్నాయి, అందుకే దీన్ని పఠించడం నాకు ఇష్టం,’ అని అన్నాడు. ప్రవక్త (స) ఆ సూరహ్‌ను పఠించడం వల్ల అల్లాహ్ (త) అతన్ని ప్రేమిస్తు న్నాడని అతనికి తెలియజేయమని,’ చెప్పారు. (బు’ఖారీ, ముస్లిమ్)
2130 – [ 22 ] ( صحيح ) (1/657)
وَعَنْ أَنَسٍ قَالَ: إِنَّ رَجُلًا قَالَ: يَا رَسُوْلَ اللهِ إِنِّيْ أُحِبُّ هَذِهِ السُّوْرَةِ: (قُلْ هُوَ اللهُ أَحَدٌ-112) قَالَ: إِنَّ حُبَّكَ إِيَّاهَا أَدْخَلَكَ الْجَنَّةَ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَرَوَى الْبُخَارِيُّ مَعْنَاهُ .
2130. (22) [1/657–దృఢం]
అనస్ (ర) కథనం: ఒక వ్యక్తి మహాప్రవక్త (స) తో మాట్లాడుతూ, ‘దైవప్రవక్తా! నేను ఈ సూరహ్ ఇ’ఖ్లా’స్ (112) ను ప్రేమిస్తున్నాను,’ అన్నాడు. అది విని దైవ ప్రవక్త (స) అతనితో, ‘దానిపట్లగల నీప్రేమ నిన్ను స్వర్గానికి తీసుకెళ్తుంది,’ అని చెప్పారు. (బు’ఖారీ, తిర్మిజీ’)
2131 – [ 23 ] ( صحيح ) (1/657)
وَعَنْ عُقْبَةَ بْنِ عَامِرٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “أَلَمْ تَرَآيَاتٍ أُنْزِلَتِ اللَّيْلَةَ لَمْ يُرَمِثْلُهُنَّ قَطُّ (قُلْ أَعُوْذُ بِرَبِّ الْفَلَقِ-113 وَقُلْ أَعُوْذُ بِرَبِّ النَّاسِ-114). رَوَاهُ مُسْلِمٌ.
2131. (23) [1/657–దృఢం]
‘ఉఖ్‌బహ్ బిన్ ‘ఆమిర్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”నిన్న రాత్రి కొన్ని ఆయతులు అవతరించిన విషయం మీకు తెలుసా? అటువంటి వాక్యాలు ఇంతకు ముందెన్నడూ అవతరించలేదు. అవి సూరహ్ అల్-ఫలఖ్ (113), సూరహ్ అన్నాస్ (114).” [12](ముస్లిమ్)
2132 – [ 24 ] ( متفق عليه ) (1/657)
وَعَنْ عَائِشَةَ: أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم كَانَ إِذَا أَوَى إِلَى فِرَاشِهِ كُلَّ لَيْلَةٍ جَمَعَ كَفَّيْهِ ثُمَّ نَفَثَ فِيْهِمَا فَقَرَأَ فِيْهِمَا (قُلْ هُوَ اللهُ أَحَدٌ-112 وَ قُلْ أَعُوْذُ بِرَبِّ الْفَلَقِ-113 وَ قُلْ أَعُوْذُ بِرَبِّ النَّاسِ -114 ) ثُمَّ يَمْسَحُ بِهِمَا مَااسْتَطَاعَ مِنْ جَسَدِهِ يَبْدَأُ بِهِمَا عَلَى رَأْسِهِ وَوَجْهِهِ وَمَا أَقْبَلَ مِنْ جَسَدِهِ يَفْعَلُ ذَلِكَ ثَلَاثَ مَرَّاتٍ”.
وَسَنَذْكُرُ حَدِيْثَ ابْنِ مَسْعُوْدٍ: لَمَّا أُسْرِيَ بِرَسُوْلِ اللهِ صلى الله عليه وسلم فِيْ بَابِ الْمِعْرَاجِ إِنْ شَاءَ اللهُ تَعَالى.
2132. (24) [657–ఏకీభవితం]
‘ఆయి’షహ్ (ర) కథనం: ప్రవక్త (స) నిద్ర పోవటానికి పడకపైకి వచ్చినపుడు రెండు చేతులను కలిపి, సూరహ్ అల్-ఇ’ఖ్లా’స్ (112), సూరహ్ అల్-ఫలఖ్(113), సూరహ్ అన్నాస్ (114) పఠించి రెండు చేతులపై ఊది, వాటితో తన శరీరాన్ని సాధ్యమైనంత పూర్తిగా తుడుచుకునేవారు. మూడుసార్లు ఇలా చేసేవారు. అంటే ఈ మూడు సూరహ్‌లను పఠించి రెండు అరచేతులపై ఊది తలపై, ముఖంపై, ముందు భాగం, మిగతా శరీర భాగాలపై తుడుచుకునేవారు. ఈ విధంగా మూడుసార్లు చేసేవారు. (బు’ఖారీ, ముస్లిమ్)
మే’రాజ్ ‘హదీసు’ను రానున్న పేజీల్లో వివరిస్తాము ఇన్‌షా అల్లాహ్.
—–
اَلْفَصْلُ الثَّانِيْ రెండవ విభాగం
2133 – [ 25 ] ( لم تتم دراسته ) (1/658)
عَنْ عَبْدِ الرَّحْمنِ بْنِ عَوْفٍ عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ: “ثَلَاثَةٌ تَحْتَ الْعَرْشِ يَوْمَ الْقِيَامَةِ الْقُرْآنُ يُحَاجُّ الْعِبَادَ لَهُ ظَهْرٌ وَبَطْنٌ وَّالْأَمَانَةُ وَالرَّحِمُ تُنَادِيْ: أَلَا مَنْ وَصَلَنِيْ وَصَلَهُ اللهُ وَمَنْ قَطَعَنِيْ قَطَعَهُ اللهُ”. رَوَاهُ فِيْ شَرْحِ السُّنَّةِ .
2133. (25) [1/658–అపరిశోధితం]
‘అబ్దుర్రహ్మాన్ బిన్ ‘ఔఫ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”తీర్పుదినం నాడు ఈ మూడు విషయాలు దైవ సింహాసనం క్రింద ఉంటాయి. ఒకటి ఖుర్‌ఆన్, దాసుల తరఫున అల్లాహ్‌తో వాదిస్తున్నది. ఖుర్‌ఆన్ యొక్క ఒక భాగం బహిర్గతంగా ఉంది. ఒక భాగం అంతర్గతంగా ఉంది. 2వది అమానతు, 3వది బంధు త్వం. బంధుజనుల్లో ‘నన్ను కలిపిన వారిని అల్లాహ్ (త) కలుపుతాడని, నన్ను త్రెంచిన వాడిని అల్లాహ్ త్రెంచుతాడని ప్రకటిస్తుంది.” [13] (షర్’హ్ సున్నహ్)
2134 – [ 26 ] ( حسن ) (1/658)
وَعَنْ عَبْدِ اللهِ بْنِ عَمْرٍو قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم : “يُقَالُ لِصَاحِبِ الْقُرْآنِ: اقْرَأْ وَارْتَقِ وَرَتِّلْ كَمَا كُنْتَ تُرَتِّلُ فِيْ الدُّنْيَا فَإِنَّ مَنْزِلَكَ عِنْدَ آخِرِآيَةٍ تَقْرَؤُهَا” .رَوَاهُ أَحْمَدُ وَالتِّرْمِذِيُّ أَبُوْ دَاوُدَ وَالنَّسَائِيُّ.
2134. (26) [1/658–ప్రామాణికం]
‘అబ్దుల్లాహ్ బిన్ ‘అమ్ర్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ఖుర్‌ఆన్‌ను కంఠస్తం చేసుకున్న వ్యక్తితో ప్రళయదినాన ఇలా అనబడుతుంది. ‘నువ్వు ప్రపం చంలో నెమ్మదిగా ఖుర్‌ఆన్ పఠించినట్లు, ఇప్పుడు కూడా అలాగే పఠిస్తూ పైకెళ్ళు. ఎక్కడ పఠనం ఆపుతావో ఆ చివరి ఆయతు దగ్గరే నీ అంతస్తు ఉంటుంది. (తిర్మిజి’, అబూ దావూద్, నసాయి’).
వీటిని గురించి ఇంతకు ముందు ప్రస్తావించడం జరిగింది.
2135 – [ 27 ] ( لم تتم دراسته ) (1/658)
وَعَنِ ابْنِ عَبَّاسٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِنَّ الَّذِيْ لَيْسَ فِيْ جَوْفِهِ شَيْءٌ مِّنَ الْقُرْآنِ كَالْبَيْتِ الْخَرِبِ”. رَوَاهُ التِّرْمِذِيُّ و الدَّارَمِيُّ. وَقَالَ التِّرْمِذِيُّ، هَذَا حَدِيْثٌ صَحِيْحٌ.
2135. (27) [1/658–అపరిశోధితం]
ఇబ్నె ‘అబ్బాస్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ఏమాత్రం ఖుర్‌ఆన్ పరిజ్ఞానం లేని హృదయం పాడుబడిన ఇల్లుతో సమానం. [14] (దారమి; తిర్మిజి’ -దృఢం)
2136 – [ 28 ] ( ضعيف جدا ) (1/658)
وَعَنْ أَبِيْ سَعِيْدٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “يَقُوْلُ الرَّبُّ تَبَارَكَ وَتَعَالى: مَنْ شَغَلَهُ الْقُرْآنُ عَنْ ذِكْرِيْ وَمَسْأَلَتِيْ أَعْطَيْتُهُ أَفْضَلَ مَا أُعْطِيْ السَّائِلِيْنَ، وَفَضْلُ كَلَامِ اللهِ عَلَى سَائِرِ الْكَلَامِ كَفَضْلِ اللهِ عَلَى خَلْقِهِ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَالدَّارَمِيُّ وَالْبَيْهَقِيُّ فِيْ شُعَبِ الْإِيْمَانِ وَقَالَ التِّرْمِذِيُّ هَذَا حَدِيْثٌ حَسَنٌ غَرِيْبٌ.
2136. (28) [1/658–అతి బలహీనం]
అబూ స’యీద్ ‘ఖుద్రీ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”అల్లాహ్ ఆదేశం: ”ఖుర్‌ఆన్ పఠనం నన్ను స్మరించటానికి. నన్ను అర్థించటానికి అవకాశం ఇవ్వనివాడికి అంటే అతడు ఖుర్‌ఆన్ పఠనంలో నిమగ్నమయి ఉండటం వల్ల దైవాన్ని స్మరించలేక పోయాడు, నన్ను ప్రార్థించలేక పోయాడు. అతనికి, అడిగేవాడికి, ప్రార్థించేవాడికి ప్రసాదించే దానికంటే ఉత్తమమైనది ప్రసాదిస్తాను. దైవగ్రంథం ప్రాముఖ్యత ఇతర గ్రంథాలన్నిటి కంటే గొప్పది. అల్లాహ్ (త)కు సృష్టితాలన్నిటి పై ప్రాధాన్యత ఉన్నట్లు. (తిర్మిజి’ – ప్రామాణికం, ఏకోల్లేఖనం, దారమి, బైహఖీ-షు’అబిల్ ఈమాన్)
2137 – [ 29 ] ( صحيح ) (1/659)
وَعَنِ ابْنِ مَسْعُوْدٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَنْ قَرَأَ حَرْفًا مِّنْ كِتَابِ اللهِ فَلَهُ بِهِ حَسَنَةٌ، وَالْحَسَنَةُ بِعَشَرِ أَمْثَالِهَا لَا أَقُوْلُ: آ لم حَرْفٌ. أَلْفٌ حَرْفٌ وَّلَامٌ حَرْفٌ وَمِيْمٌ حَرْفٌ.“ رَوَاهُ التِّرمِذِيُّ وَالدَّارَمِيُّ وَقَالَ التِّرْمِذِيُّ هَذَا حَدِيْثٌ حَسَنٌ صَحِيْحٌ غَرِيْبٌ إِسْنَادًا.
2137. (29) [1/659–దృఢం]
ఇబ్నె మస్’ఊద్ (ర) ఉల్లేఖనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఎవరయినా దైవగ్రంథంలోని ఒకఅక్షరాన్ని చదివితే అతనికి ఒక పుణ్యం లభిస్తుంది. ఆ ఒక్క పుణ్యం పది పుణ్యాలకు సమానంగా ఉంటుంది. నా అభిప్రాయం ప్రకారం, ‘అలిఫ్-లామ్-మీమ్’ అనేది ఒక్క అక్షరం కాదు. పైగా అలిఫ్ ఒక అక్షరం, లామ్ ఒక అక్షరం, మీమ్ ఒక అక్షరం. [15] (దారమి; తిర్మీజి’-ప్రామాణికం -దృఢం – ఏకోల్లోఖనం).
2138 – [ 30 ] ( ضعيف جدا ) (1/659)
وَعَنِ الْحَارِثِ الْأَعْوَرِ قَالَ: مَرَرْتُ فِيْ الْمَسْجِدِ فَإِذَا النَّاسُ يَخُوْضُوْنَ فِيْ الْأَحَادِيْثِ فَدَخَلْتُ عَلَى عَلِيٍّ رضي الله عَنْه فَأَخْبَرْتُهُ قَالَ: أَوْقَدْ فَعَلُوْهَا؟ قُلْتُ نَعَمْ. قَالَ: أَمَا إِنِّيْ قَدْ سَمِعْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ: “أَلَا إِنَّهَا سَتَكُوْنُ فِتْنَةٌ”. فَقُلْتُ مَا الْمَخْرَجُ مِنْهَا يَا رَسُوْلَ اللهِ. قَالَ: “كِتَابُ اللهِ فِيْهِ نَبَأُ مَا كَانَ قَبْلَكُمْ وَخَبَرُ مَا بَعْدُكُمْ وَحُكْمُ مَا بَيْنَكُمْ وَهُوَ الْفَصْلُ لَيْسَ بِالْهَزْلِ مَنْ تَرَكَهُ مِنْ جَبَّارٍ قَصَمَهُ اللهُ وَمَنِ ابْتَغَى الْهُدَى فِيْ غَيْرِهِ أَضَلَّهُ اللهُ وَهُوَ حَبْلُ اللهِ الْمَتِيْنُ وَهُوَ الذِّكْرُ الْحَكِيْمُ وَهُوَ الصِّرَاطُ الْمُسْتَقِيْمُ هُوَ الَّذِيْ لَا تَزِيْغُ بِهِ الْأَهْوَاءُ وَلَا تَلْتَبِسُ بِهِ الْأَلْسِنَةُ وَلَا يَشْبَعُ مِنْهُ الْعُلَمَاءُ وَلَا يَخْلُقُ عَلَى كَثْرَةِ الرَّدِّ وَلَا يَنْقَضِيْ عَجَائِبُهُ هُوَ الَّذِيْ لَمْ تَنْتَهِ الْجِنُّ إِذْ سَمِعَتْهُ حَتَّى قَالُوْا (إِنَّا سَمِعْنَا قُرْآنًا عَجَبًا يَّهْدِيْ إِلَى الرُّشْدِ فَآمَنَّا بِهِ-72: 1) مَنْ قَالَ بِهِ صَدَقَ وَمَنْ عَمِلَ بِهِ أجِرَ وَمَنْ حَكَمَ بِهِ عَدَلَ وَمَنْ دَعَا إِلَيْهِ هُدِىَ إِلَى صِرَاطٍ مُّسْتَقِيْمٍ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَالدَّارَمِيُّ. وَقَالَ التِّرْمِذِيُّ: هَذَا حَدِيْثٌ إِسْنَادُهُ مَجْهُوْلٌ وَفِي الْحَارِثِ مَقَالٌ.
2138. (30) [1/659–అతి బలహీనం]
‘హారిస్’ అ’అవర్ (ర) కథనం: నేను మస్జిద్ వైపు నుండి వెళ్ళాను. ప్రజలు అనవసరమైన మాటల్లో నిమగ్నులయి ఉన్నారు. అంటే అనవసరమైన కథల్లో నిమగ్నులయి ఉన్నారు. ఎవరూ ఖుర్‌ఆన్ పఠించడం లేదు. అది చూసి నేను ‘అలీ (ర) వద్దకు వెళ్ళి ఈ విషయాన్ని తెలియపరిచాను. అతను (ర), ‘వాళ్ళు అలా చేస్తున్నారా?’ అని అన్నారు. అంటే ఖుర్‌ఆన్ పఠనం, దైవస్మరణను వదలి అనవసరమైన విషయాల్లో నిమగ్నమయి ఉన్నారా? అని అర్థం. నేను ‘అవును,’ అని అన్నాను. అప్పుడు ‘అలీ (ర) ప్రవక్త (స) ఇలా ప్రవచిస్తూ ఉండగా నేను విన్నాను, ‘రాబోయే కాలంలో ఉపద్రవాలు, కల్లోలాలు సంభవిస్తాయి.’ అప్పుడు నేను, ‘ఓ అల్లాహ్ ప్రవక్తా! ఈ ఉపద్రవాలనుండి తప్పించుకునే మార్గం ఏది,’ అని ప్రశ్నించాను. ప్రవక్త (స), ‘అల్లాహ్ గ్రంథం, ఖుర్‌ఆన్‌ను అనుసరించడంవల్ల, దీనిలో పూర్వీకుల వృత్తాం తాలు, మీ తరువాత వచ్చే వారి వృత్తాంతాలు, తీర్పుదినం వరకు జరుగబోయే సంఘటనలు ఉన్నాయి. ఇందులో ధర్మా-ధర్మాల, ఆదేశాలు ఉన్నాయి. సత్యా-సత్యాలతీర్పులు ఉన్నాయి. ఇది హాస్యాస్పదమైన విషయం కాదు. చెడు రచనా కాదు. ఏ అహంకారి, దుర్మార్గు డయితే ఈ నాడు ఖుర్‌ఆన్‌ను పఠించడం మానివేసాడో అల్లాహ్ (త) వాడిని సర్వనాశనం చేసి వేస్తాడు. ఖుర్‌ఆన్‌ను వదలి ఇతర వైపుల నుండి రుజు మార్గాన్ని వెదికే వారిని అల్లాహ్ (త) మార్గ భ్రష్టత్వానికి గురిచేస్తాడు. ఈఖుర్‌ఆన్ దృఢమైన అల్లాహ్ త్రాడువంటిది. మరియు ఇది వివేచనా పూరితమైన దీపిక, ఇదే సరైన మార్గం. దీన్ని అనుసరించటం వల్ల చెడు కోరికలురావు. అంటే ఖుర్‌ఆన్‌ను అనుసరించటంవల్ల చెడుకాదు. దీన్ని అనుసరించటంవల్ల చెడు మనోకాంక్షలు అదృశ్య మవుతాయి. ఖుర్‌ఆన్ భాష మరొక భాషతో పోలి ఉండదు. అంటే దీని ఔన్నత్యానికి మరేదీ సాటి కాలేదు.
విద్వాంసులు దీనిపట్ల ఎన్నడూ అసుంతృప్తి చెందరు. ఇది ఎన్నిసార్లు చదివినా, పఠించినా, అధ్యయనం చేసినా పాతదిగా అనిపించదు. దీని అభిరుచీ మారదు. అంతేకాదు దీని మహిమలు ఎన్నడూ అంతంకావు. ఇదే ఆ దైవగ్రంథం. దీన్ని విన్న జిన్నుల బృందం ఉండలేక అమాంతంగా ఇలా పలకసాగారు: ”…ఇన్నా సమి’అనా ఖుర్ఆనన్ ‘అజబన్ యహ్ది ఇలా అర్రుష్ది, ఫ ఆమన్నా బిహీ…” (సూ. అల్ జిన్న్, 72:1-2) — ‘మేము వింత ఖుర్‌ఆన్ ను (ఫఠనాన్ని) విన్నాము. ఇది మంచి, విశ్వాసం వైపు మార్గం చూపుతుంది. మేము దీన్ని విశ్వసించాం.’ ఖుర్‌ఆన్ పట్ల సానుకూలంగా ప్రవర్తించిన వారు సత్యం పలికారు, దాన్ని అనుసరించే వారికి పుణ్యఫలం ప్రసాదించబడుతుంది. దాని కనుగుణంగా తీర్పు ఇచ్చేవారు న్యాయం చేస్తారు. ఖుర్‌ఆన్ వైపు పిలిచిన వారికి రుజుమార్గం చూపబడింది. (తిర్మిజి’ – అస్పష్టం, దారమి)
తిర్మిజి’ దీని పరంపర అస్పష్టంగా ఉందని, ఈ ‘హదీసు’ ఉల్లేఖనకర్త హారిస్ అ’అవర్ అసత్యవాది అని, ఇతని గురించి అనేక విధాలుగా అనుకోవడం జరిగిందని, పేర్కొన్నారు.
2139 – [ 31 ] ( ضعيف ) (1/660)
وَعَنْ مُعَاذِ الْجُهَنِيِّ: أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم قَالَ: “مَنْ قَرَأَ الْقُرْآنَ وَعَمِلَ بِمَا فِيْهِ أُلْبِسَ وَالِدَاهُ تَاجًا يَوْمَ الْقِيَامَةِ ضَوْءُهُ أَحْسَنُ مِنْ ضَوْءِ الشَّمْسِ فِيْ بُيُوْتِ الدُّنْيَا لَوْ كَانَتْ فِيْكُمْ فَمَا ظَنُّكُمْ بِالَّذِيْ عَمِلَ بِهَذَا؟” رَوَاهُ أَحْمَدُ وَأبَوُ دَاوُدَ .
2139. (31) [1/660– బలహీనం]
ము’ఆజ్’ జుహ్‌నీ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ఖుర్‌ఆన్‌ను పఠించి, దాన్ని అనుసరిస్తే దానికి బదు లుగా తీర్పుదినం నాడు అతని తల్లిదండ్రులకు సూర్యుని కన్నా ఎంతో అధిక వెలుగుగల కిరీటాన్ని ధరింపజేయటం జరుగుతుంది. ఆ సూర్యున్ని మీ ఇంట్లో ఉన్నట్లు ఊహించండి. దాన్ని అనుసరించిన వాని గురించి ఆలోచించండి. [16] (అ’హ్మద్, అబూ దావూద్)
2140 – [ 32 ] ( لم تتم دراسته ) (1/660)
وَعَنْ عُقْبَةَ بْنِ عَامِرٍ قَالَ: سَمِعْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ: “لَوْ جَعَلَ الْقُرْآنَ فِيْ إِهَابٍ ثُمَّ أُلْقِيَ فِيْ النَّارِ مَا احْتَرَقَ”. رَوَاهُ الدَّارَمِيُّ.
2140. (32) [1/660–అపరిశోధితం]
‘ఉఖ్‌బహ్ బిన్ ‘ఆమిర్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఒకవేళ ఖుర్‌ఆన్‌ను పచ్చి చర్మంలో చుట్టి అగ్నిలో వేస్తే అది ఏమాత్రం కాలదు. [17] (దారమి)
2141 – [ 33 ] ( لم تتم دراسته ) (1/660)
وَعَنْ عَلِيٍّ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَنْ قَرَأَ الْقُرْآنَ فَاسْتَظْهَرَهُ فَأَحَلَّ حَلَالَهُ وَحَرَّمَ حَرَامَهُ أَدْخَلَهُ اللهُ بِهِ الْجَنَّةَ وَشَفَعَهُ فِيْ عَشْرَةٍ مِّنْ أَهْلِ بَيْتِهِ كُلُّهُمْ قَدْ وَجَبَتْ لَهُ النَّارُ. رَوَاهُ أَحْمَدُ وَالتِّرْمِذِيُّ وَابْنُ مَاجَهُ وَالدَّارَمِيُّ. وَقَالَ التِّرْمِذِيُّ: هَذَاحَدِيْثٌ غَرِيْبٌ وَحَفْصُ بْنُ سُلَيْمَانَ الرَّاوِيْ لَيْسَ هُوَ بِالْقَوِيِّ يُضَعَّفُ فِيْ الْحَدِيْثِ .
2141. (33) [1/660–అపరిశోధితం]
‘అలీ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఖుర్‌ఆన్ చదివి, దాన్ని కంఠస్తం చేసుకొని, దాని ధర్మసమ్మ తాలను ధర్మ సమ్మతాలుగా, దాని అధర్మాలను అధర్మంగా భావించిన వ్యక్తిని అల్లాహ్ (త) స్వర్గంలో ప్రవేశింపజేస్తాడు. ఇంకా వారి కుటుంబానికి చెందిన నరకార్హులైన పదిమంది కొరకు అతని సిఫారసు స్వీకరిస్తాడు.” (అ’హ్మద్, తిర్మిజి’ – బలహీనం, ఇబ్నె మాజహ్, దారమి)
2142 – [ 34 ] ( صحيح ) (1/660)
وَعَنْ أَبِيْ هُرَيْرَةَ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم قَالَ لِأُبَيِّ بْنِ كَعْبٍ: “كَيْفَ تَقْرَأُ فِيْ الصَّلَاةِ؟” فَقَرَأَ أُمَّ الْقُرْآنِ. فَقَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “وَالَّذِيْ نَفْسِيْ بِيَدِهِ مَا أُنْزِلَتْ فِيْ التَّوْرَاةِ وَلَا فِيْ الْإِنْجِيْلِ وَلَا فِيْ الزُّبُوْرِوَلَا فِيْ الْفُرْقَانِ مِثْلُهَا وَإِنَّهَا سَبْعٌ مِّنَ الْمَثَانِيْ وَالْقُرْآنُ الْعَظِيْمُ الَّذِيْ أُعْطِيْتُهُ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَرَوَى الدَّارَمِيُّ مِنْ قَوْلِهِ: “مَا أُنْزِلَتْ”وَلَمْ يَذْكُرْ أُبَيَّ بْنَ كَعْبٍ. وَقَالَ التِّرْمِذِيُّ هَذَا حَدِيْثٌ حَسَنٌ صَحِيْحٌ.
2142. (34) [1/660–దృఢం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) ఉబయ్ బిన్ క’అబ్‌ను, ‘నువ్వు నమా’జులో ఖుర్‌ఆన్‌లోని ఏ సూరహ్ చదువుతావు’ అని ప్రశ్నించారు. అతను సూరహ్ ఫాతిహా(1) పఠించి వినిపించారు. అప్పుడు ప్రవక్త (స) ఎవరి అధీనంలో నా ప్రాణం ఉందో ఆ అల్లాహ్ (త) సాక్షి! సూరహ్ ఫాతిహాలాంటి సూరహ్ తౌరాతులోనూ, ఇంజీల్‌లోనూ, ‘జబూర్‌లోనూ, చివరికి ఖుర్‌ఆన్‌లోనూ అవతరించలేదు. సూరహ్ ఫాతిహాలో 7 ఆయతులు ఉన్నాయి. ఇవి అనేకసార్లు పఠించ బడుతాయి. ఇంకా ఇదే నాకు ఇవ్వబడిన అత్యుత్తమ మైన ఖుర్‌ఆన్. (తిర్మిజి’ – ప్రామాణికం – దృఢం, దారమి)
2143 – [ 35 ] ( لم تتم دراسته ) (1/661)
وَعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “تَعَلَّمُوْا الْقُرْآنَ فَاقْرَءُوْهُ فَإِنَّ مَثَلُ الْقُرْآنِ لِمَنْ تَعَلَّمَ فقرأ وَقَامَ بِهِ كَمَثَلِ جِرَابٍ مَحْشُوٍّ مِّسْكًا يَفُوْحٌ رِيْحُهُ كُلَّ مَكَانٍ وَمَثَلُ مَنْ تَعَلَّمَهُ فَرَقَدَ وَهُوَ فِيْ جَوْفِهِ كَمَثَلِ جِرَابٍ أُوْكِئَ عَلَى مِسْكٍ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَالنَّسَائِيُّ وَابْنُ مَاجَهُ.
2143. (35) [1/661–అపరిశోధితం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ‘ఖుర్‌ఆన్ నేర్చుకోండి, దాన్ని చదవండి, ఎందుకంటే ఖుర్‌ఆన్ చదివి, నేర్చుకొని, దానిప్రకారం ఆచరించిన వాని ఉపమానం (ముష్క్) కస్తూరి పరిమళంతో నిండిన సంచి వంటిది. దాని పరిమళం అన్ని వైపుల వ్యాపిస్తుంది. ఖుర్‌ఆన్ నేర్చుకొని, అది అతని హృదయంలోనే ఉంది కాని, దాన్ని పఠించలేదు, అనుసరించలేదు, నిద్రపోతూ ఉన్నాడు, ఏమరు పాటుకు గురై ఉన్నాడు, అతడి ఉపమానం సుగంధ పరిమళాలు (ముష్క్) గల సంచి వంటిది. దాని నోరు బిగించి ఉంది. దానివల్ల దాని పరిమళం ఎటూ వ్యాపించదు. (తిర్మిజి’, నసాయి’, ఇబ్నె మాజహ్)
2144 – [ 36 ] ( لم تتم دراسته ) (1/661)
وَعَنْ أَبِيْ هُرَيْرَةَ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم:مَنْ قَرَأَ(حم- 40: 1-3) الْمُؤْمِنَ إِلَى (إِلَيْهِ الْمَصِيْرُ) وَآيةُ الْكُرْسِيِّ حِيْنَ يُصْبِحُ حُفِظَ بِهِمَا حَتَّى يُمْسِيْ. وَمَنْ قَرَأَ بِهِمَا حِيْنَ يُمْسِيْ حُفِظَ بِهِمَا حَتَّى يُصْبِحَ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَالدَّرَامِيُّ وَقَالَ التِّرْمِذِيُّ هَذَا حَدِيْثٌ غَرِيْبٌ .
2144. (36) [1/661–అపరిశోధితం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఉదయం వేళ సూరహ్ ‘గాఫిర్ ఇలైహిల్ మ‘సీర్, (గాఫిర్, 40:1-3) వరకు మరియు ఆయతుల్ కుర్సీ పఠిస్తే, సాయంత్రం వరకు ఈ రెండు సూరాల శుభం వల్ల అతడు రక్షించబడతాడు. సాయంత్రం పఠించిన వారికి ఉదయం వరకు రక్షణ కల్పించబడుతుంది.” (తిర్మిజి’ – ఏకోల్లేఖనం, దారమి)
2145 – [ 37 ] ( لم تتم دراسته ) (1/661)
وَعَنِ النُّعْمَانَ بْنِ بَشِيْرٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِنَّ اللهَ كَتَبَ كِتَابًا قَبْلَ أَنْ يَّخْلُقَ السَّمَوَاتِ وَالْأَرْضَ بِأَلْفَيْ عَامٍ أَنْزَلَ مِنْهُ آيَتَيْنِ خَتَمَ بِهِمَا سُوْرَةَ الْبَقَرَةِ وَلَا تُقْرَآنِ فِيْ دَارٍ ثَلَاثَ لَيَالٍ فَيَقَرُّبَهَا الشَّيْطَانُ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَالدَّارَمِيُّ وَقَالَ التِّرْمِذِيُّ: هَذَا حَدِيْثٌ غَرِيْبٌ.
2145. (37) [1/661–అపరిశోధితం]
ను’అమాన్ బిన్ బషీర్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవ చనం, ”భూమ్యాకాశాలు సృష్టించబడటానికి 2000 సంవత్సరాలకు పూర్వం అల్లాహ్ (త) ఒక గ్రంథం వ్రాసాడు. అందులో సూరహ్ బఖరహ్(2) చివరి రెండు ఆయతులు అవతరింపజేసాడు. ఏ ఇంటిలో మూడు రాత్రులు ఇవి పఠించబడతాయో షై’తాన్ ఆ ఇంటి దరిదాపులకురాడు.” (తిర్మిజి’-ఏకోల్లేఖనం, దారమి)
2146 – [ 38 ] ( لم تتم دراسته ) (1/661)
وَعَنْ أَبِيْ الدَّرْدَاءِ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَنْ قَرَأَ ثَلَاثَ آيَاتٍ مِّنْ أَوَّلِ الْكَهْفِ عُصِمَ مِنْ فِتْنَةِ الدَّجَّالِ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَقَالَ: هَذَا حَدِيْثٌ حَسَنٌ صَحِيْحٌ.
2146. (38) [1/661–అపరిశోధితం]
అబూ దర్దా’ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”సూరహ్ కహఫ్ (18) లోని మొదటి 3 ఆయతులు పఠిస్తూ ఉన్న వ్యక్తి దజ్జాల్ ఉపద్రవం నుండి రక్షించ బడతాడు.” (తిర్మిజి’ – ప్రామాణికం – దృఢం)
2147 – [ 39 ] ( ضعيف ) (1/661)
وَعَنْ أَنَسٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِنَّ لِكُلِّ شَيْءٍ قَلْبًا وَقَلْبُ الْقُرْآنِ(يس-36) وَمَنْ قَرَأَ(يس) كَتَبَ اللهُ لَهُ بِقَرَاءَتِهَا قِرَاءَةَ الْقُرْآنِ عَشَرَ مَرَّاتٍ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَالدَّارَمِيُّ. وَقَالَ التِّرْمِذِيُّ هَذَا حَدِيْثٌ غَرِيْبٌ.
2147. (39) [1/661–బలహీనం]
అనస్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ప్రతి వస్తువుకు హృదయం ఉంటుంది. ఖుర్‌ఆన్ హృదయం సూరహ్ యా-సీన్ (36). సూరహ్ యాసీన్‌ను పఠించిన వారికి అల్లాహ్ (త) దానికి బదులు 10 సార్లు ఖుర్‌ఆన్ పఠించినంత పుణ్యం లిఖిస్తాడు. [18] (తిర్మిజి’ – ఏకోల్లేఖనం, దారమి)
2148 – [ 40 ] ( لم تتم دراسته ) (1/662)
وَعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم:”إِنَّ اللهَ تَبَارَكَ وَتَعَالى قَرَأَ (طَه-20) وَ(يس-36) قَبْلَ أَنْ يَّخْلُقَ السَّمَوَاتِ وَالْأَرْضَ بِأَلْفِ عَامٍ. فَلَمَّا سَمِعْتِ الْمَلَائِكَةُ الْقُرْآنَ قَالَتْ طُّوْبَى لِأُمَّةٍ يُّنْزَلُ هَذَا عَلَيْهَا وَطُوْبَى لِأَجْوَافٍ تَحْمِلُ هَذَا وَطُوْبَى لِأَلْسِنَةٍ تَتَكَلَّمُ بِهَذَا”. رَوَاهُ الدَّارَمِيُّ .
2148. (40) [1/662–అపరిశోధితం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”భూమ్యాకాశాలు సృష్టించటానికి 1000 సంవత్స రాలకు ముందు, అల్లాహ్ (త) సూరహ్ ‘తా-హా (20), సూరహ్ యా-సీన్ (36)లను పఠించాడు. దైవదూతలు ఖుర్‌ఆన్‌ను విని ఇది అవతరించ బడనున్న ఆ జాతి ఎంతో ఉత్తమమైనది. అదేవిధంగా దీని బాధ్యతలు తన నెత్తిన వేసుకున్న వారు, దీన్ని కంఠస్తం చేసేవారు, అదేవిధంగా దీన్ని చదివే ఆ నోర్లు కూడా ఎంతో ఉన్నతమైనవి అని పలికారు.” (దారమి)
2149 – [ 41 ] ( لم تتم دراسته ) (1/662)
وَعَنْ أَبِيْ هُرَيْرَةَ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه و سلم: “مَنْ قَرَأَ(حم-الدُّخَانِ-44) فِيْ لَيْلَةٍ أَصْبَحَ يَسْتَغْفِرُ لَهُ سَبْعُوْنَ أَلْفَ مَلِكٍ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَقَالَ: هَذَا حَدِيْثٌ غَرِيْبٌ وَعُمَرُ بْنُ أَبِيْ خَثْعَمِ الرَّاوِيْ يُضَعَّفُ. وَقَالَ مُحَمَّدٌ يَعْنِيْ الْبُخَارِيُّ هُوَمُنْكِرُ الْحَدِيْثُ
2149. (41) [1/662–అపరిశోధితం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఎవరైనా రాత్రిపూట సూరహ్ దుఖాన్ (44) పఠిస్తే ఉదయం వరకు డెభ్భైవేల మంది దైవదూతలు అతని కోసం ప్రార్థిస్తూ, క్షమాపణ వేడుకుంటూ ఉంటారు.” (తిర్మిజి’ – ఏకోల్లేఖనం, బు’ఖారీ – తిరస్కృతం)
2150 – [ 42 ] ( لم تتم دراسته ) (1/662)
وَعَنْ أَبِيْ هُرَيْرَةَ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَنْ قَرَأَ(حم-الدُّخَانِ-44) فِيْ لَيْلَةِ الْجُمُعَةِ غُفِرَلَهُ”. رَوَاهُ التِّرْمذِيُّ. وَقَالَ: هَذَا حَدِيْثٌ غَرِيْبٌ وَهَشَّامٌ أَبُوْ الْمِقْدَامِ الرَّاوِيْ يُضَعَّفُ.
2150. (42) [1/662–అపరిశోధితం]
అబూ హురైరహ్ (ర) ఉల్లేఖనం: ప్రవక్త (స) ప్రవచనం, ”జుమ’అహ్ రోజు రాత్రి సూరహ్ హా-మీమ్ దుఖాన్ (44) పఠిస్తే, అతన్ని క్షమించటం జరుగు తుంది.” (తిర్మిజి’ – ఏకోల్లేఖనం, బలహీనం)
2151 – [ 43 ] ( لم تتم دراسته ) (1/662)
وَعَنِ الْعِرْبَاضِ بْنِ سَارِيَةَ أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم كَانَ يَقْرَأُ الْمُسَبِّحَاتِ قَبْلَ أَنْ يَّرْقُدَ يَقُوْلُ: “إِنَّ فِيْهِنَّ آيَةٍ خَيْرٌمِّنْ أَلْفِ آيَةٍ”. رَوَاهُ التِّرْمَذِيُّ وَأَبُوْ دَاوُدَ .
2151. (43) [1/662–అపరిశోధితం]
‘ఇర్‌బా’ద్ బిన్ సారియహ్ (ర) కథనం: ప్రవక్త (స) పడుకునే ముందు ముసబ్బ‘హాత్‌లను పఠించేవారు. వీటిలో ఒక ఆయత్ వెయ్యి ఆయతులకన్నా ఉత్తమ మైనదని ప్రవచించేవారు. (తిర్మిజి’, అబూ దావూద్)
2152 – [ 44 ] ? (1/662)
وَرَوَاهُ الدَّارَمِيُّ عَنْ خَالِدِ بْنِ مَعْدَانَ مُرْسَلًا. وَقَالَ التِّرْمَذِيُّ: هَذَا حَدِيْثٌ حَسَنٌ غَرِيْبٌ
2152. (43) [1/662– ?]
దారమి, ఖాలిద్ బిన్ మ’అదాన్ ద్వారా దీన్ని ఉల్లేఖించారు.[19] (తిర్మిజి’ – ప్రామాణికం, ఏకోల్లేఖనం)
2153 – [ 45 ] ( حسن ) (1/662)
وَعَنْ أَبِيْ هُرَيْرَةَ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِنَّ سُوْرَةً فِيْ الْقُرْآنِ ثَلَاثُوْنَ آيَةً شَفَعَتْ لِرَجُلٍ حَتَّى غُفِرَ لَهُ وَهِيَ: (تَبَارَكَ الَّذِيْ بِيَدِهِ الْمُلْكُ-67) رَوَاهُ أَحْمَدُ وَالتِّرْمِذِيُّ وَأَبُوْ دَاوُدَ وَالنَّسَائِيُّ وَابْنُ مَاجَهُ.
2153. (45) [1/662–ప్రామాణికం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఖుర్‌ఆన్‌లో (30) ఆయతులు గల, ఒక సూరహ్ ఉంది. అది దైవసన్నిధిలో ఒక వ్యక్తి గురించి సిఫారసు చేసి చివరికి అతనికి క్షమాభిక్ష లభించేలా చేస్తుంది. అది సూరహ్ అల్-ముల్క్ (67).” (అ’హ్మద్, తిర్మిజి’, అబూ దావూద్, నసాయి’, ఇబ్నె మాజహ్)
2154 – [ 46 ] ( ضعيف ) (1/663)
وَعَنِ ابْنِ عَبَّاسٍ قَالَ: ضَرَبَ بَعْضُ أَصْحَابِ النَّبِيِّ صلى الله عليه وسلم خِبَاءَهُ عَلَى قَبْرٍ وَّهُوَ لَا يَحْسِبُ أَنَّهُ قَبْرٌ فَإِذَا فِيْهِ إِنْسَانٌ يَقْرَأُ سُوْرَةَ (تَبَارَكَ الَّذِيْ بِيَدِهِ الْمُلْكُ-67 حَتَّى خَتَمَهَا) فَأَتَى النَّبِيَّ صلى الله عليه وسلم فَأَخْبَرَهُ. فَقَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “هِيَ الْمَانِعَةُ هِيَ الْمُنْجِيَةُ تُنْجِيْهِ مِنْ عَذَابِ الْقَبْرِ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَقَالَ: هَذَا حَدِيْثٌ غَرِيْبٌ.
2154. (46) [1/663–బలహీనం]
ఇబ్నె ‘అబ్బాస్ (ర) కథనం: ప్రవక్త (స) అనుచరుల్లో ఒకరు ఏమరుపాటులో ఒక సమాధిపై టెంట్ వేసారు. అక్కడ సమాధి ఉన్నట్లు అతనికి తెలియదు. అక్కడ ఒక సమాధి ఉండేది. అందులో మృతుడు సూరహ్ ముల్కు (67) పఠిస్తూ ఉన్నాడు. ఆ వ్యక్తి ప్రవక్త (స) వద్దకు వచ్చి జరిగినదంతా విన్నవించుకున్నాడు. అప్పుడు ప్రవక్త (స), ‘ఈ సూరహ్ పాపాల నుండి వారిస్తుంది, సమాధి శిక్ష నుండి రక్షిస్తుంది,’ అని చెప్పారు. (తిర్మిజి’ – ఏకోల్లేఖనం)
2155 – [ 47 ] ( لم تتم دراسته ) (1/663)
وَعَنْ جَابِرٍ أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم كَانَ لَا يَنَامُ حَتَّى يَقْرَأُ: (آلم تَنْزِيْلُ-32 وَتَبَارَكَ الَّذِيْ بِيَدِهِ الْمُلْكُ-67) رَوَاهُ أَحْمَدُ وَالتِّرْمِذِيُّ وَالدَّارَمِيُّ. وَقَالَ التِّرْمِذِيُّ:هَذَا حَدِيْثٌ صَحِيْحٌ. وَكَذَا فِيْ شَرْحِ السُّنَّةٍ /بغوي. وَفِيْ الْمَصَابِيْحِ غريب.
2155. (47) [1/663–అపరిశోధితం]
జాబిర్ (ర) కథనం: ప్రవక్త (స) నిద్రపోయే ముందు సూరహ్ అస్సజ్‌దహ్ (32), సూరహ్ ముల్క్ (67) పఠించి నిద్రపోయేవారు. ఆ సూరాలను పఠించేవరకు నిద్ర పోయే వారు కాదు. (అ’హ్మద్, తిర్మిజి’ – దృఢం, దారమి, షర్’హ్ సున్నహ్-బ’గవి, మసాబీహ్ – ‘గరీబ్)
2156 – [ 48 ] ( لم تتم دراسته ) (1/663)
وَعَنِ ابْنِ عَبَّاسٍ وَأَنَسِ بْنِ مَالِكٍ رضي الله عَنْهُمْ قَالَا: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: (إِذَا زُلْزِلَتِ-99) تَعْدِلُ نِصْفَ الْقُرْآنِ (قُلْ هُوَ اللهُ أَحَدٌ-112) تَعْدِلُ ثُلُثَ الْقُرْآنِ وَ(قُلْ يَا أَيُّهَا الْكَافِرُوْنَ-109) تَعْدِلْ رُبُعَ الْقُرْآنِ”. رَوَاهُ التِّرْمِذِيُّ.
2156. (48) [1/663–అపరిశోధితం]
ఇబ్నె అబ్బాస్, అనస్ బిన్ మాలిక్‌ల కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”సూరతు ‘జ్జిల్’జాల్ (99) సగం ఖుర్‌ఆన్‌కు సమానం. అంటే దాన్ని పఠిస్తే సగం ఖుర్‌ఆన్ పుణ్యం లభిస్తుంది. అదేవిధంగా సూరతుల్ ఇ’ఖ్లా’స్ (112) మూడవ వంతు ఖుర్ఆన్కు సమానం. అంటే దాన్ని పఠించటం వల్ల మూడవ వంతు ఖుర్‌ఆన్ పఠించినంత పుణ్యం లభిస్తుంది. అదే విధంగా సూరతుల్ కాఫిరూన్ (109) నాల్గవవంతు ఖుర్‌ఆన్‌కి సమానం. అంటే సూరహ్‌ను పఠిస్తే నాల్గవ వంతు ఖుర్‌ఆన్ పఠించినంత పుణ్యం లభిస్తుంది. (తిర్మిజి’)
2157 – [ 49 ] ( لم تتم دراسته ) (1/663)
وَعَنْ مَّعْقِلِ بْنِ يَسَارٍ عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ: “مَنْ قَالَ حِيْنَ يُصْبِحُ ثَلَاثَ مَرَّاتٍ: أَعُوْذُ بِاللهِ السَّمِيْعُ الْعَلِيْمِ مِنَ الشَّيْطَانِ الرَّجِيْمِ فَقَرَأَ ثَلَاثَ آيَاتٍ مِّنْ آخِرِسُوْرَةِ (اَلْحَشْر-59) وَكَّلَ اللهُ بِهِ سَبْعِيْنَ أَلْفَ مَلِكٍ يُّصَلُّوْنَ عَلَيْهِ حَتَّى يُمْسِيْ وَإِنْ مَّاتَ فِيْ ذَلِكَ الْيَوْمَ مَاتَ شَهِيْدًا. وَمَنْ قَالَهَا حِيْنَ يُمْسِيَ كَانَ بِتِلْكَ الْمَنْزِلَةِ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَالدَّارَمِيُّ. وَقَالَ التِّرْمِذِيُّ:هَذَا حَدِيْثٌ غَرِيْبٌ.
2157. (49) [1/663-అపరిశోధితం]
ము’అఖిల్ బిన్ యసార్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఎవరైనా ఉదయం వేళ ”అ‘ఊజుబిల్లాహి స్సమీయిల్ ‘అలీమ్ మినష్షై‘తానిర్రజీమ్” అని పలికి, ఆ తరువాత సూరహ్ హష్‌ర్ (59) చివరి 3 ఆయతులు పఠిస్తే, అల్లాహ్ (త) అతని కొరకు డెబ్భయివేల దైవ దూతలను నియమిస్తాడు. వారు సాయంత్రం వరకు అతని కోసం ప్రార్థిస్తూ, క్షమాపణ కోరుతూ ఉంటారు. ఒకవేళ అతను ఆ రోజే మరణిస్తే అమరవీరుడై మరణిస్తాడు. సాయంత్రం వేళ పఠించిన వారికీ ఇదే వర్తిస్తుంది. [20] (తిర్మిజి’ – ఏకోల్లేఖనం, దారమి)
2158 – [ 50 ] ( ضعيف ) (1/664)
وَعَنْ أَنَسٍ عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ: “مَنْ قَرَأَ كُلَّ يَوْمٍ مِّائَتَيْ مَرَّةً (قُلْ هُوَ اللهُ أَحَدٌ-112) مُحِيَ عَنْهُ ذُنُوْبُ خَمْسِيْنَ سَنَةً إِلَّا أَنْ يَّكُوْنَ عَلَيْهِ دَيْنٌ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَالدَّارَمِيُّ
وَفِيْ رِوَايَتِهِ”خَمْسِيْنَ مَرَّةً ” وَلَمْ يَذْكُرْ” إِلَّا أَنْ يَّكُوْنَ عَلَيْهِ دَيْنٌ”.
2158. (50) [1/664–బలహీనం]
అనస్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ఎవరైనా పగలు ఎప్పుడైనా 200 సార్లు సూరహ్ ఇ’ఖ్లా’స్ (112) పఠిస్తే, అతని 50 సంవత్సరాల పాపాలు క్షమించబడతాయి. కాని అతనిపై అప్పు ఉండ కూడదు. (తిర్మిజి’, దారమి)
అంటే అప్పు క్షమించడం జరగదు. ఎందుకంటే ఇది దాసుల హక్కు.
2159 – [ 51 ] ( لم تتم دراسته ) (1/664)
وَعَنْ أَنَسٍ عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم: “مَنْ أَرَادَ أَنْ يَّنَامَ عَلَى فِرَاشِهِ فَنَامَ عَلَى يَمِيْنِهِ ثُمَّ قَرَأَ مِائَةِ مَرَّةٍ (قُلْ هُوَ اللهُ أَحَدٌ-112) إِذَا كَانَ يَوْمُ الْقِيَامَةِ يَقُوْلُ لَهُ الرَّبُ: يَا عَبْدِيْ ادْخُلْ عَلَى يَمِيْنِكَ الْجَنَّةَ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَقَالَ: هَذَا حَدِيْثٌ حَسَنٌ غَرِيْبٌ.
2159. (51) [1/664–అపరిశోధితం]
అనస్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, తన పడకపై పడుకునే ఉద్దేశ్యంతో, కుడి ప్రక్కపై పరుండి 100 సార్లు సూరహ్ ఇ’ఖ్లా’స్(112) పఠిస్తే తీర్పుదినం నాడు అల్లాహ్ (త) అతనితో, ‘ఓ నాదాసుడా! నీవు నీ కుడివైపు నుండి స్వర్గంలోనికి ప్రవేశించు’ అని ఆదేశిస్తాడు. (తిర్మిజి’ – ప్రామాణికం, ఏకోల్లేఖనం)
2160 – [ 52 ] ( لم تتم دراسته ) (1/664)
وَعَنْ أَبِيْ هُرَيْرَةَ أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم سَمِعَ رَجُلًا يَّقْرَأ (قُلْ هُوَ اللهُ أَحَدٌ-112) فَقَالَ: “وَجَبَتْ” قُلْتُ: وَمَا وَجَبَتْ؟ قَالَ: “اَلْجَنَّةُ”. رَوَاهُ مَالِكٌ وَالتِّرْمِذِيُّ وَالنَّسَائِيُّ.
2160. (52) [1/664–అపరిశోధితం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) ఒక వ్యక్తిని సూరహ్ అల్-ఇ’ఖ్లా’స్ (112) పఠిస్తూ ఉండగా విని ‘తప్పని సరి అయిపోయింది,’ అని అన్నారు. దానికి నేను, ‘ఏం తప్పనిసరి అయిపోయింది,’ అని అడిగాను. ప్రవక్త (స), ‘స్వర్గం,’ అని అన్నారు. (మాలిక్, తిర్మిజి’, నసాయి’)
అంటే సూరహ్ అల్-ఇ’ఖ్లా’స్ పఠించటం వల్ల స్వర్గం తప్పనిసరి అయిపోయింది.
2161 – [ 53 ] ( لم تتم دراسته ) (1/664)
وَعَنْ فَرْوَةَ بْنِ نَوْفَلٍ عَنْ أَبِيْهِ: أَنَّهُ قَالَ: يَا رَسُوْلَ اللهِ عَلِّمْنِيْ شَيْئًا أَقُوْلُهُ إِذَا أَوَيْتُ إِلَى فِرَاشِيْ.فَقَالَ: “اقْرَأْ(قُلْ يَا أَيُّهَا الْكَافِرُوْنَ-109) فَإِنَّهَا بَرَاءَةٌ مِّنَ الشِّرْكِ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَأَبُوْ دَاوُدَ وَالدَّارَمِيُّ .
2161. (53) [1/664–అపరిశోధితం]
ఫర్‌వహ్ బిన్ నౌఫల్ (ర) తన తండ్రి ద్వారా కథనం: అతని తండ్రి ఇలా అన్నారు:, ‘ఓ దైవప్రవక్తా! రాత్రి పడకపైకి వెళ్ళేముందు ఏదైనా దు’ఆ బోధించండి,’ అని విన్నవించు కున్నాను. ప్రవక్త (స) సూరహ్ అల్-కాఫిరూన్ (109) చదువుకో, ఎందుకంటే ఈ సూరహ్ షిర్క్ పట్ల విసుగును వ్యక్తం చేస్తుంది,’ అని ఉపదేశించారు. (తిర్మిజి’, అబూ దావూద్, దారమి)
2162 – [ 54 ] ( صحيح ) (1/665)
وَعَنْ عُقْبَةَ بْنِ عَامِرٍ قَالَ: بَيْنَا أَنَا أَسِيْرُ مَعَ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم بَيْنَ الْجُحْفَةِ وَالْأَبْوَاءِ إِذْ غَشِيَتْنَا رِيْحٌ وَّظُلْمَةٌ شَدِيْدَةٌ فَجَعَلَ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يَعَوَّذُ بِ (أَعُوْذُ بِرَبِّ الْفَلَقِ-113 وَأَعُوْذُ بِرَبِّ النَّاسِ-114) وَيَقُوْلُ: “يَا عُقْبَةَ تَعَوَّذْ بِهِمَا فَمَا تَعَوَّذَ مُتَعَوِّذُّ بِمِثْلِهِمَا”. رَوَاهُ أَبُوْ دَاوُدَ.
2162. (54) [1/665–దృఢం]
‘ఉఖ్‌బహ్ బిన్ ‘ఆమిర్ (ర) కథనం: మేము ప్రవక్త (స) వెంట జు’హ్‌ఫహ్, అబ్వాఅ’ ల మధ్య నడుస్తున్నాం. ఇంతలో భయంకరమైన తుఫాను చెలరేగింది. అది మమ్మల్ని చుట్టుముట్టింది. అంతా చీకటి వ్యాపించింది. ప్రవక్త (స) సూరహ్ అల్ ఫలఖ్(113), సూరహ్ అన్నాస్(114) పఠిస్తూ శరణు వేడుకోసాగారు. ఇంకా ఇలా అన్నారు, ‘ఓ ‘ఉఖ్‌బహ్! నువ్వు ఈ రెండు సూరాల ద్వారా శరణు కోరుతూ ఉండు. శరణు కోరేవారు ఎవరైనా ఈ రెండు సూరాలు తప్ప మరే విషయాలతో శరణు పొందలేరు. అంటే ఈ రెండు సూరాలు శరణు పొందటానికి అన్నిటికంటే ఉత్తమమైనవి అని బోధించారు. (అబూ దావూద్)
2163 – [ 55 ] ( لم تتم دراسته ) (1/665)
وَعَنْ عَبْدِ اللهِ بْنِ خُبَيْبٍ قَالَ: خَرَجْنَا فِيْ لَيْلَةِ مَطَرٍ وَظُلْمَةٍ شَدِيْدَةٍ نَّطْلُبُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم فَأَدْرَكْنَاهُ فَقَالَ: “قُلْ”. قُلْتُ مَا أَقُوْلُ؟ قَالَ: “(قُلْ هُوَ اللهُ أَحَدٌ-112 وَالْمُعَوَّذَتَيْنِ-113، 114) حِيْنَ تُصْبِحُ وَحِيْنَ تُمْسِيْ ثَلَاثَ مَرَّاتٍ تَكْفِيْكَ مِنْ كُلِّ شَيْءٍ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَأَبُوْ دَاوُدَ وَالنَّسَائِيُّ .
2163. (55) [1/665–అపరిశోధితం]
‘అబ్దుల్లాహ్ బిన్ ‘ఖుబైబ్ (ర) కథనం: వర్షం పడుతున్న దట్టమైన చీకటి రాత్రిలో మేము ప్రవక్త (స) ను వెదకటానికి బయలుదేరాము. వెతుకుతూ వెతుకుతూ చివరికి ప్రవక్త (స)ను కలుసుకున్నాము. ప్రవక్త (స), ‘పఠించండి,’ అన్నారు. నేను, ‘ఏం పఠించను,’ అని అన్నాను. ప్రవక్త (స), ”సూరహ్ అల్-ఇ’ఖ్లా’స్ (112) మరియు ము’అవ్వజ’తైన్, సూరహ్ అల్-ఫలఖ్(113), సూరహ్ అన్నాస్(114) ప్రతి రోజు ఉదయం సాయంత్రం మూడు సార్లు పఠిస్తూ ఉండు. ప్రతి చెడుకు సరిపోతుంది. ప్రతి ఆపద, కష్టాన్నీ తొలగిస్తుంది,” అని ప్రవచించారు. (తిర్మిజి’, అబూ దావూద్, నసాయి’)
2164 – [ 56 ] ( لم تتم دراسته ) (1/665)
وَعَنْ عُقْبَةَ بْنِ عَامِرٍ قَالَ: قُلْتُ يَا رَسُوْلَ اللهِ اَقْرَأُ (سُوْرَةَ هُوْدٍ-11 أَوْ سُوْرَةَ يُوْسُفَ-12)؟ قَالَ: “لَنْ تَقْرَأَ شَيْئًا أَبْلَغَ عِنْدَ اللهِ مِنْ (قُلْ أَعُوْذُ بِرَبِّ الْفَلَقِ-113). رَوَاهُ أَحْمَدُ وَالنَّسَائِيُّ وَالدَّارَمِيُّ .
2164. (56) [1/665–అపరిశోధితం]
‘ఉఖ్‌బహ్బిన్ ‘ఆమిర్(ర) కథనం:’ఓ అల్లాహ్ ప్రవక్తా! నేను శరణు కోరడానికి సూరహ్ హూద్ (11), సూరహ్ యూసుఫ్ (12) పఠించవచ్చునా?’ అని విన్నవించుకున్నాను. దానికి ప్రవక్త (స), ‘ఈ విషయంలో సూరహ్ అల్ఫలఖ్ (113)కి మించిన సూరహ్ లేదు’ అని ప్రవచించారు. (అ’హ్మద్, నసాయి’, దారమి)
—–
اَلْفَصْلُ الثَّالِثُ మూడవ విభాగం
2165 – [ 57 ] ( ضعيف ) (1/665)
وَعَنْ أَبِيْ هُرَيْرَةَ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “أَعْرِبُوْا الْقُرْآنَ وَاتَّبِعُوْا غَرَائِبِهُ وَغَرَائِبُهُ فَرَائِضُهُ وَحُدُوْدُهُ”. رَوَاهُ الْبَيْهَقِيِّ فِيْ شُعَبِ الْإِيْمَانِ.
2165. (57) [1/665–బలహీనం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఖుర్‌ఆన్ అర్థాన్ని వివరించండి, ఖుర్‌ఆన్ ప్రత్యే కతలను అనుసరించండి. దాని ఆదేశాలు, హద్దులే దాని ప్రత్యేకతలు. [21] (బైహఖీ-షు’అబుల్ ఈమాన్)
2166 – [ 58 ] ( ضعيف ) (1/666)
وَعَنْ عَائِشَةَ رَضِيَ اللهُ عَنْهَا: أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم قَالَ: “قَرَاءَةُ الْقُرْآنِ فِيْ الصَّلَاةِ أَفْضَلُ مِنْ قَرَاءَةِ الْقُرْآنِ فِيْ غَيْرِ الصَّلَاةِ. وقَرَاءَةُ الْقُرْآنِ فِيْ غَيْرِ الصَّلَاةِ اَفْضَلُ مِن التَّسْبِيْحِ وَالتَّكْبِيْرِ. وَالتَّسْبِيْحِ أَفْضَلُ مِنَ الصَّدَقَةِ. وَالصَّدَقَةُ أَفْضَلُ مِنَ الصَّوْمِ. وَالصَّوْمُ جُنَّةٌ مِّنَ النَّار”. رَوَاهُ الْبَيْهَقِيُّ فِيْ شُعَبِ الْإِيْمَانِ.
2166. (58) [1/666–బలహీనం]
‘ఆయి’షహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం: ‘ఇతర సమయాల కంటే నమా’జులో ఖుర్‌ఆన్ పఠిం చడం చాలా ఉత్తమం, ఇతర సమయాలలో, తస్ బీ’హ్, తక్బీర్ల కంటే ఖుర్‌ఆన్ పఠించడం ఉత్తమం. దానధర్మాల కంటే తస్బీ’హ్ ఉత్తమం, ఉపవాసం కంటే దాన ధర్మాలు ఉత్తమం, ఉపవాసం నరకం పట్ల ఢాలు వంటిది. (బైహఖీ – షు’అబిల్ ఈమాన్)
2167 – [ 59 ] ( ضعيف ) (1/666)
وَعَنْ عُثْمَانَ بْنِ عَبْدِ اللهِ بْنِ أَوْسِ الثَّقَفِيِّ عَنْ جَدِّهِ قَال: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “قَرَاءَةُ الرَّجُلِ الْقُرْآنِ فِيْ غَيْرِ الْمُصْحَفِ أَلْفُ دَرَجَةٍ وَّقَرَاءَتُهُ فِيْ الْمُصْحَفِ تُضَعَّفُ عَلى ذَلِكَ إِلَى أَلْفَيْ دَرَجَةٍ”. رَوَاهُ الْبَيْهَقِيُّ فِيْ شُعَبِ الْإِيْمَانِ.
2167. (59) [1/666–బలహీనం]
‘ఉస్మాన్ బిన్ ‘అబ్దుల్లాహ్ బిన్ ఔస్ (ర) తన తాత ద్వారా కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఖుర్‌ఆన్ చూడకుండా పఠించడం వెయ్యి రెట్లు పుణ్యం లభిస్తుంది. ఖుర్‌ఆన్‌ను చూచి చదివితే రెండురెట్లు, అంటే రెండువేల రెట్లు పుణ్యం లభిస్తుంది.” [22] (బైహఖీ – షు’అబిల్ ఈమాన్)
2168 – [ 60 ] ( ضعيف ) (1/666)
وَعَنِ ابْنِ عُمَرَ رَضِيَ اللهُ عَنْهُمَا قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِنَّ هَذِهِ الْقُلُوْبَ تَصْدَأُ كَمَا يَصْدَأُ الْحَدِيْدُ إِذَا أَصَابَهُ الْمَاءُ”. قِيْلَ يَا رَسُوْلَ اللهِ وَمَا جِلَاؤُهَا؟ قَالَ: “كَثْرَةُ ذِكْرِ الْمَوْتِ وَتِلَاوَةِ الْقُرْآنِ”. رَوَى الْبَيْهَقِيُّ الْأَحَادِيْثَ الْأَرْبَعَةَ فِيْ شُعَبِ الْإِيْمَانِ.
2168. (60) [1/666–బలహీనం]
‘అబ్దుల్లాహ్ బిన్ ‘ఉమర్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ‘ఏ విధంగా ఇనుముపై నీరు పడటం వల్ల తుప్పు పడుతుందో, హృదయాలకు కూడా తుప్పు పడుతుంది.’ ప్రవక్త (స)ను, ‘ఓ అల్లాహ్ ప్రవక్తా! మరి దేనిద్వారా అవి పరిశుద్ధమై, తేజోవంతంగా తయార వుతాయి,’ అని ప్రశ్నించడం జరిగింది. అప్పుడు ప్రవక్త (స), ‘చావును సాధ్య మైనంత అధికంగా గుర్తుచేసు కోండి, ఖుర్‌ఆన్‌ను పఠించండి.’ [23] (బైహఖీ – షు’అబిల్ ఈమాన్)
2169 – [ 61 ] ( لم تتم دراسته ) (1/666)
وَعَنْ أَيْفَعَ بْنِ عَبْدِ الْكَلَاعِيِّ قَالَ: قَالَ رَجُلٌ: يَا رَسُوْلَ اللهِ أَيُّ سُوْرَةِ الْقُرْآنِ أَعْظَمُ؟ قَالَ: (قُلْ هُوَ اللهُ أَحَدٌ-114). قَالَ: فَأَيُّ آيَةٍ فِيْ الْقُرْآنِ أَعْظَمُ ؟ قَالَ: آيَةَ الْكُرْسِيِّ (اللهُ لَا إِلَهَ إِلّا هُوَ الْحَيُّ الْقَيُّوْمُ-2: 255). قَالَ: فَأَيُّ آيَةٍ يَا نَبِيَّ اللهِ تًحِبُّ أَنْ تُصِيْبَكَ وَأُمَّتَكَ؟ قَالَ:”خَاتِمَةُ سُوْرَةُ الْبَقْرَةِ فَإِنَّهَا مِنْ خَزَائِنِ رَحْمَةِ اللهِ تَعَالى مِنْ تَحْتِ عَرْشِهِ أَعْطَاهَا هَذِهِ الْأُمَّةِ لَمْ تَتْرُكْ خَيْرًا مِّنْ خَيْرِ الدُّنْيَا وَالْآخِرَةِ إِلَّا اشْتَمَلَتْ عَلَيْهِ” رَوَاهُ الدَّارَمِيُّ.
2169. (61) [1/666–అపరిశోధితం]
అయ్ఫ’అ బిన్ ‘అబ్దుల్ కలా’యీ (ర) కథనం: ఒక వ్యక్తి, ‘ఓ అల్లాహ్ ప్రవక్తా! ఖుర్‌ఆన్‌లో అన్నిటి కంటే పెద్ద సూరహ్ ఏది?’ అని ప్రశ్నించారు. ప్రవక్త (స) సూరహ్ అల్-ఇ’ఖ్లా’స్ (112)’ అని అన్నారు. ఆ వ్యక్తి, ‘ఖుర్‌ఆన్‌లో అన్నిటి కంటే పెద్ద ఆయత్ ఏది,’ అని ప్రశ్నించాడు. ప్రవక్త (స) ”ఆయతుల్ కుర్సీ (2:255)” అని అన్నారు. ఆవ్యక్తి, ‘ఓ అల్లాహ్ ప్రవక్తా! తమరు మీ కోసం, మీ సమాజం కోసం ఏ సూరహ్ను ఇష్టపడతారు?’ అని ప్రశ్నించాడు. ప్రవక్త (స), ‘సూరహ్ బఖరహ్లోని చివరి ఆయతులు (2:285-286) ఎందుకంటే ఇవి అల్లాహ్ కారుణ్య నిధి మరియు ఆయన సింహాసనం క్రింది నుండి అవతరించబడ్డాయి. వీటిని అల్లాహ్ (త) నా సమాజానికి ప్రసాదించాడు. ఉభయలోకాల విజయ సాఫల్యాలన్నీ వీటిలో ఉన్నాయి’ అని అన్నారు. (దారమి)
2170 – [ 62 ] ( ضعيف ) (1/667)
وَعَنْ عَبْدِ الْمَلِكِ بْنِ عُمَيْرٍمُرْسَلًا قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “فِيْ فَاتِحَةِ الْكِتَابِ شِفَاءٌ مِّنْ كُلِّ دَاءٍ”. رَوَاهُ الدَّارَمِيُّ وَالْبَيْهَقِيُّ فِيْ شُعَبِ الْإِيْمَانِ .
2170. (62) [1/667–బలహీనం]
‘అబ్దుల్ మలిక్ బిన్ ‘ఉమైర్ (ర), తాబయీ ప్రోక్తం: ప్రవక్త (స) ప్రవచనం, సూరహ్ ఫాతిహా(1)లో ప్రతి వ్యాధికి చికిత్స ఉంది. [24] (దారమి, బైహఖీ – షుఅబుల్ ఈమాన్)
2171 – [ 63 ] ( لم تتم دراسته ) (1/667)
وَعَنْ عُثْمَانَ بْنِ عَفَّانَ رضي الله عَنْه قَالَ: مَنْ قَرَأَ آخِرَ آلِ عِمْرَانَ(3) فِيْ لَيْلَةٍ كُتِبَ لَهُ قِيَامُ لَيْلَةٍ. رَوَاهُ الدَّارْمِيُّ.
2171. (63) [1/667–అపరిశోధితం]
‘ఉస్మా’న్ బిన్ ‘అఫ్ఫాన్ (ర) కథనం: రాత్రి సూరహ్ ఆలి ‘ఇమ్రాన్ (3) చివరి భాగం అంటే, ”ఇన్న ఫీ ‘ఖల్‌ఖిస్సమావాతి వల్ అర్’ది” నుండి చివరివరకు (సూ. ఆల ఇమ్రాన్, 3:190-200), పఠించిన వారికి తహజ్జుద్‌కు సమానంగా పుణ్యం లభిస్తుంది. (దారమి)
2172 – [ 64 ] ( لم تتم دراسته ) (1/667)
وَعَنْ مَكْحُوْلٍ قَالَ: مَنْ قَرَأَ سُوْرَةَ آلِ عِمْرَانَ(3) يَوْمَ الْجُمُعَةِ صَلَّتْ عَلَيْهِ الْمَلَائِكَةُ إِلَى اللَّيْلِ. رَوَاهُ الدَّارَمِيُّ.
2172. (64) [1/667–అపరిశోధితం]
మక్‌హూల్ (ర) కథనం: శుక్రవారం నాడు సూరహ్ ఆలి ఇమ్రాన్ (3) పఠించిన వారికొరకు కారుణ్య దైవదూతలు రాత్రి వరకు ప్రార్థిస్తూ క్షమాపణ కోరుతూ ఉంటారు. (దారమి)
2173 – [ 65 ] ( لم تتم دراسته ) (1/667)
وَعَنْ جُبَيْرِ بْنِ نُفَيْرٍ رضي الله عَنْه أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم قَالَ: “إِنَّ اللهَ خَتَمَ سُوْرَةَ الْبَقَرَةِ بِآيَتَيْنِ(2: 285-286) أُعْطِيْتُهُمَا مِنْ كَنْزِهِ الَّذِيْ تَحْتَ الْعَرْشِ فَتَعَلَّمُوْهُنَّ وَعَلِّمُوْهُنّ نِسَاءَكُمْ فَإِنَّهَا صَلَاةٌ وَّقُرْبَانٌ وَّدُعَاءٌ”. رَوَاهُ الدَّرَامِيُّ مُرْسَلًا.
2173. (65) [1/667–అపరిశోధితం]
జుబైర్ బిన్ నుఫైర్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”అల్లాహ్ (త) సూరహ్ బఖరహ్‌ను తన ‘అర్ష్ క్రింది ఉన్న నిధి నుండి అవతరించబడిన రెండు ఆయతు లతో (2:285-286) ముగించాడు. అవి నాకు ఇవ్వబడ్డాయి. మీరు వాటిని నేర్చుకోండి, ఇంకా ఇవి అల్లాహ్ సాన్నిధ్యానికి మార్గాలు మరియు ప్రార్థన (దు’ఆ)లు. (దారమి – తాబయీ ప్రోక్తం)
2174 – [ 66 ] ( لم تتم دراسته ) (1/667)
وَعَنْ كَعْبٍ رَضِيَ اللهُ عَنْهُ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم قَالَ: “اقْرَؤُوْا سُوْرَةُ هُوْدٍ(11) يَوْمَ الْجُمُعَةِ”. رَوَاهُ الدَّراَمِيُّ.
2174. (66) [1/667–అపరిశోధితం]
క’అబ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, శుక్రవారం నాడు సూరహ్ హూద్(11)ను పఠిస్తూ ఉండండి. (దారమి)
2175 – [ 67 ] ( حسن ) (1/667)
وَعَنْ أَبِيْ سَعِيْدٍ رَضِيَ اللهُ عَنْهُ أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم قَالَ: “مَنْ قَرَأَ سُوْرَةُ الْكَهْفِ(18) فِيْ يَوْمِ الْجُمُعَةِ أَضَاءَ لَهُ النُّوْرُمَا بَيْنَ الْجُمُعَتَيْنِ”. رَوَاهُ الْبَيْهَقِيُّ فِيْ الدَّعْوَاتِ الْكَبِيْرِ.
2175. (67) [1/667–ప్రామాణికం]
అబూ స’యీద్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, శుక్రవారం నాడు సూరహ్ కహఫ్ (18) పఠించిన వారి కొరకు, రెండు శుక్రవారాల మధ్య వెలుగు ఉంటుంది. అంటే అతని హృదయంలో విశ్వాసం, రుజుమార్గాల వెలుగు వ్యాపిస్తుంది. ఈ శుక్రవారం నుండి వచ్చే శుక్రవారం వరకు. (బైహఖీ – ద’అవాతుల్ కబీర్)
2176 – [ 68 ] ( لم تتم دراسته ) (1/667)
وَعَنْ خَالِدِ بْنِ مَعْدَانَ قَالَ: اقْرَؤُوْا الْمُنْجِيَةَ وَهِيَ (آلم تَنْزِيْلُ-32) فَإِنَّ بَلَغَنِيْ أَنَّ رَجُلًا كَانَ يَقْرَؤُهَا مَا يَقْرَأُ شَيْئًا غَيْرَهَا وَكَانَ كَثِيْرَ الْخَطَايَا فَنَشَرَتْ جَنَاحَهَا عَلَيْهِ قَالَتْ: رَبِّ اغْفِرْلَهُ فَإِنَّهُ كَانَ يُكْثِرُ قَرَاءَتِيْ فَشَفَّعَهَا الرَّبُّ تَعَالى فِيْهِ. وَقَالَ: اكْتُبُوْا لَهُ بِكُلِّ خَطِيْئَةٍ حَسَنَةً وَارْفَعُوْا لَهُ دَرَجَةً”. وَقَالَ أَيْضًا: “إِنَّهَا تُجَادِلُ عَنْ صَاحِبِهَا فِيْ الْقَبْرِ تَقُوْلُ: اَللّهُمَّ إِنْ كُنْتُ مِنْ كِتَابِكَ فَشَفِّعْنِيْ فِيْهِ. وَإِنْ لَمْ أَكُنْ مِّنْ كِتَابِكَ فَامْحُنِيْ عَنْهُ وَإِنَّهَا تَكُوْنُ كَالطَّيْرِ تَجْعَلُ جَنَاحَهَا عَلَيْهِ فَتَشْفَعُ لَهُ فَتَمْنَعُهُ مِنْ عَذَابِ الْقَبْرِ”. وَقَالَ فِيْ (تَبَارَكَ) مِثْلَهُ. وَكَانَ خَالِدٌ لَا يَبِيْتُ حَتَّى يَقْرَأَهُمَا.
وَقَالَ طَاوُوْسٌ: فُضِّلَتَا عَلَى كُلِّ سُوْرَةٍ فِيْ الْقُرْآنِ بِسِتِّيْنَ حَسَنَةً. رَوَاهُ الدَّارَمِيُّ .
2176. (68) [1/667–అపరిశోధితం]
‘ఖాలిద్ బిన్ మ’అదాన్ (ర) కథనం: ”మీరు సూరహ్ సజ్దహ్ (32) పఠిస్తూ ఉండండి. ఎందుకంటే ఈ సూరహ్ సమాధి శిక్ష నుండి, తీర్పుదిన బాధల నుండి విముక్తి కలిగిస్తుంది. ఒక వ్యక్తి ఈ సూరహ్‌ను పఠించేవాడు, మరేమీ పఠించే వాడు కాడు, అతడు చాలా పాపాత్ముడు. ఆ సూరహ్ తన రెండు రెక్కలను అతనిపై వ్యాపింపజేసింది. ఇంకా ఆ సూరహ్ అల్లాహ్ (త)ను ఓ నా ప్రభూ! ఈ వ్యక్తిని క్షమించు, ఎందుకంటే ఈ వ్యక్తి నన్ను చాలా అధికంగా పఠించేవాడు అని అంటుంది. అల్లాహ్ (త) ఆ సూరహ్ సిఫారసును స్వీకరించాడు. ఇంకా ఆ దాసుని ఒక్కొక్క పాపానికి బదులు ఒక్కొక్క పుణ్యం లిఖించమని, అతని స్థానాలను ఉన్నతం చేయమని ఆదేశించినట్లు నాకు తెలిసింది,” అని అన్నారు. మ’అదాన్ ఇలా అన్నారు, ”సమాధిలో తనను పఠించేవారి తరఫున వాదిస్తుంది. ఇంకా ఇలా అంటుంది, ఓ అల్లాహ్(త)! ఒకవేళ నేను నీ పుస్తకంలో నుండి ఉండివుంటే ఇతని గురించి సిఫారసును స్వీకరించు, ఒకవేళ నేను నీ గ్రంథం నుండి కాకపోతే నన్ను చెరిపివేయి. ‘ఖాలిద్ ఇలా కూడా అన్నారు, ”ఈ సూరహ్ పక్షిలా అయిపోతుంది. తనను పఠించినవారిపై తన రెక్కలను పరచి వేస్తుంది. ఇంకా అతని గురించి సిఫారసు చేస్తుంది. సమాధి శిక్ష నుండి కాపాడుతుంది.” సూరహ్ ముల్క్(67) గురించి కూడా ఈ విధంగానే అన్నారు. ఖాలిద్ ఈ రెండు సూరాలను చదవ నంత వరకు పడుకునేవారు కారు.
”తావూస్ ఉల్లేఖన కర్త ఇలా అంటున్నారు, ”ఖుర్‌ఆన్‌లోని ఈ రెండు సూరాలకు ఇతర సూరాల కంటే 60 పుణ్యాలకు సమానంగా ఆధిక్యత, ప్రాముఖ్యత ఇవ్వబడింది.” (దారమి)
2177 – [ 69 ] ( لم تتم دراسته ) (1/667)
وَعَنْ عَطَاءِ بْنِ أَبِيْ رَبَاحٍ قَالَ: بَلَغَنِيْ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم قَالَ: “مَنْ قَرَأَ (يس-36) فِيْ صَدْرِ النَّهَارِ قُضِيَتْ حَوَائِجُهُ”. رَوَاهُ الدَّارَمِيُّ مُرْسَلًا .
2177. (69) [1/667–అపరిశోధితం]
‘అ’తా’ బిన్ అబీ రబా’హ్ (ర) కథనం: నాకు ఈ వార్త అందింది, ”ప్రవక్త (స) ఇలా ప్రవచించారు. ఉదయం సూరహ్ యా-సీన్ (36) పఠించిన వారి అవ సరాలు తీర్చబడతాయి. )దార్మీ – తాబయీ ప్రోక్తం)
2178 – [ 70 ] ( ضعيف ) (1/668)
وَعَنْ مَعْقَلِ بْنِ يَسَارٍ الْمُزَنِيِّ رضي الله عَنْهُ أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم قَالَ: “مَنْ قَرَأَ(يس-36) ابْتِغَاءَ وَجْهِ اللهِ تَعَالى غُفِرَلَهُ مَا تَقَدَّمَ مِنْ ذَنْبِهِ فَاقْرَؤُوْهَا عِنْدَ مَوْتَاكُمْ”. رَوَاهُ الْبَيْهَقِيُّ فِيْ شُعَبِ الْإِيْمَانِ .
2178. (70) [1/668–బలహీనం]
ము’అఖ్ఖల్ బిన్ యసార్ ముజని (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”అల్లాహ్(త) ప్రీతికోసం సూరహ్ యా-సీన్ (36) పఠిస్తేగతంలో చేసినపాపాలన్నీ క్షమించ బడతాయి, మీరు చనిపోబోతున్నవారి ముందు సూరహ్ యా-సీన్ పఠించండి.” (బైహఖీ – షు’అబిల్ ఈమాన్)
2179 – [ 71 ] ( لم تتم دراسته ) (1/668)
وَعَنْ عَبْدِ اللهِ بْنِ مَسْعُوْدٍ أَنَّهُ قَالَ: إِنَّ لِكُلِّ شَيْءٍ سَنَامًا وَإِنَّ سَنَامَ الْقُرْآنِ سُوْرَةُ الْبَقَرَةِ(2) وَإِنَّ لِكُلِّ شَيْءٍ لُبَابًا وَإِنَّ لُبَابَ الْقُرْآنِ الْمُفَصَّلُ. رَوَاهُ الدَّارَمِيُّ .
2179. (71) [1/668–అపరిశోధితం]
‘అబ్దుల్లాహ్ బిన్ మస్’ఊద్ (ర) కథనం: ప్రతి వస్తు వుకు ఒక శిఖరం ఉంటుంది. ఖుర్‌ఆన్ శిఖరం సూరహ్ బఖరహ్(2). ప్రతి వస్తువుకు సారం ఉంటుంది. ఖుర్ ఆన్ సారం ముఫస్సల్ సూరహ్ లు. [25] (దారమి)
2180 – [ 72 ] ( لم تتم دراسته ) (1/668)
وَعَنْ عَلِيٍّ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: سَمِعْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه و سلم يَقُوْلُ: “لِكُلِّ شَيْءٍ عُرُوْسٌ وَعُرُوْسُ الْقُرْآنِ الرَّحْمنُ”. رَوَاهُ الْبَيْهَقِيُّ فِيْ شُعَبِ الْإِيْمَانِ .
2180. (72) [1/668–అపరిశోధితం]
‘అలీ (ర) కథనం: ప్రవక్త (స)ను ఇలా ప్రవచిస్తూ ఉండగా నేను విన్నాను. ప్రతి వస్తువుకు అలంకరణ ఉంది. ఖుర్‌ఆన్ అలంకరణ సూరహ్ ర’హ్మాన్ (55). (బైహఖీ – షు’అబిల్ ఈమాన్)
2181 – [ 73 ] ( لم تتم دراسته ) (1/668)
وَعَنِ ابْنِ مَسْعُوْدٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَنْ قَرَأَ سُوْرَةَ الْوَاقِعَةِ (56) فِيْ كُلِّ لَيْلَةٍ لَمْ تُصِبْهُ فَاقَةٌ ابَدًا”. وَكَانَ ابْنُ مَسْعُوْدٍ يَأْمُرُ بِنَاتِهِ يَقْرَأْنَ بِهَا فِيْ كُلِّ لَيْلَةٍ. رَوَاهُ الْبَيْهَقَيُّ فِيْ شُعَبِ الْإِيْمَانِ.
2181. (73) [1/668–అపరిశోధితం]
‘అబ్దుల్లాహ్ బిన్ మస్’ఊద్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ప్రతి రాత్రి సూరహ్ వాఖి’అహ్ (56) పఠించే వారికి ఎన్నడూ బీదరికం రాదు. ‘అబ్దుల్లాహ్ బిన్ మస్’ఊద్ తన కుమార్తెలకు ప్రతి రాత్రి సూరహ్ వాఖి’అహ్ పఠించాలని ఆదేశించేవారు. (బైహఖీ – షు’అబిల్ ఈమాన్)
2182 – [ 74 ] ( لم تتم دراسته ) (1/669)
وَعَنْ عَلِيٍّ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: “كَانَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم يُجِبُّ هَذِهِ السُّوْرَةَ (سَبِّحِ اسْمِ رَبِّكَ الْأَعْلَى-87). رَوَاهُ أَحْمَدُ .
2182. (74) [1/669–అపరిశోధితం]
‘అలీ (ర) కథనం: ప్రవక్త (స) సబ్బిహిస్మ రబ్బికల్ ఆలా (87)ను చాలా ప్రేమించేవారు. [26] (అ’హ్మద్)
2183 – [ 75 ] ( لم تتم دراسته ) (1/669)
وَعَنْ عَبْدِ اللهِ بْنِ عَمْرٍو قَالَ: أَتَى رَجُلٌ النَّبِيَّ صلى الله عليه وسلم فَقَالَ: أَقْرِئْنِيْ يَا رَسُوْلَ اللهِ فَقَالَ: “اقْرَأُ ثَلَاثًا مِّنْ ذَوَاتِ (الر،10-12) فَقَالَ: كَبُرَتْ سِنِّيْ وَاشْتَدَّ قَلْبِيْ وَغَلُظَ لِسَانِيْ. قَالَ: “فَاقْرَأْ ثَلَاثًا مِّنْ ذَوَاتِ (حم،40-42). فَقَالَ مِثْلَ مَقَالَتِهِ. قَالَ الرَّجُلُ: يَا رَسُوْلَ اللهِ أَقْرِئْنِيْ سُوْرَةً جَامِعَةً فَأَقْرَأَهُ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم (إِذَا زُلْزِلَتِ الْأَرْضُ-99) حَتَّى فَرَغَ مِنْهَا فَقَالَ الرَّجُلُ: وَالَّذِيْ بَعَثَكَ بِالْحَقِّ لَا أَزِيْدُ عَلَيْهَا أَبَدًا ثُمَّ أَدْبَرَالرَّجُلُ. فَقَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: أَفْلَحَ الرُّوَيْجِلُ”. مَرَّتَيْنِ. رَوَاهُ أَحْمَدُ وَأبُوْ دَاوُدَ .
2183. (75) [1/669–అపరిశోధితం]
‘అబ్దుల్లాహ్ బిన్ ‘అమ్ర్ (ర) కథనం: ఒక వ్యక్తి ప్రవక్త (స) వద్దకు వచ్చి, ‘ఓ అల్లాహ్ ప్రవక్తా! తమరు నాకేదైనా బోధించండి అని విన్నవించుకున్నాడు.’ ప్రవక్త (స), ‘నువ్వు ప్రారంభంలో అలిఫ్–లామ్-రా ఉన్న మూడు సూరహ్ (10, 11, 12)లను పఠిస్తూ ఉండు,’ అని అన్నారు. దానికి ఆ వ్యక్తి, ‘నా వయస్సు అధిక మయ్యింది, నా హృదయం కఠినంగా తయా రయ్యింది, నా నాలుక కూడా మొద్దుబారింది. నా జ్ఞాపకశక్తి బలహీనపడింది. మరచిపోతూ ఉంటాను. నాలుక దుడ్డుగా తయారయింది. కనుక కష్టమైన ఆయతులు చదవలేను,’ అని అన్నాడు. అప్పుడు ప్రవక్త (స), ‘అయితే ప్రారంభంలో హా–మీమ్ ఉన్న మూడు సూరహ్ (40, 41, 42) లను పఠిస్తూ ఉండు. ‘ అతడు ఇంతకు ముందు చెప్పిందే మళ్ళీ చెప్పాడు. ఆ తరువాత ఆ వ్యక్తి, ‘ఓ అల్లాహ్ ప్రవక్తా! అన్ని ప్రత్యేకతలు ఉన్న సూరహ్ ఏదైనా ఉంటే కంఠస్తం చేయించండి,’ అని విన్నవించుకున్నాడు. ప్రవక్త (స) సూరతు జ్జిల్-జాల్ (99) నేర్పారు. ఆ వ్యక్తి, ‘మీకు సత్యం ఇచ్చి పంపిన అల్లాహ్ సాక్షి! ఇంతకు మించి చేయను,’ అని పలికి తిరిగి వెళ్ళిపోయాడు. ప్రవక్త (స), ‘ఈ వ్యక్తి సాఫల్యం పొందాడు,’ అని రెండుసార్లు పలికారు. [27] (అ’హ్మద్, అబూ దావూద్)
2184 – [ 76 ] ( لم تتم دراسته ) (1/669)
وَعَنِ ابْنِ عُمَرَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “أَلَا يَسْتَطِيْعُ أَحَدُكُمْ أَنْ يَّقْرَأَ أَلْفَ آيَةٍ فِيْ كُلِّ يَوْمٍ؟” قَالُوْا: وَمَنْ يَّسْتَطِيْعُ أَنْ يَّقْرَأَ أَلْفَ آيَةٍ فِيْ كُلِّ يَوْمٍ؟ قَالَ: “أَمَا يَسْتَطِيْعُ أَحَدُ كُمْ أَنْ يَّقْرَأَ: (أَلَهَاكُمُ التَّكَاثُرُ-102)؟ رَوَاهُ الْبَيْهَقِيُّ فِيْ شُعَبِ الْإِيْمَانِ.
2184. (76) [1/669–అపరిశోధితం]
‘అబ్దుల్లాహ్ బిన్ ‘ఉమర్ (ర) కథనం: ప్రవక్త (స), ‘మీలో ఎవరైనా ప్రతి రోజూ 1000 ఆయతులు పఠించగలరా?’ అని అడిగారు. ‘ఓ అల్లాహ్ ప్రవక్తా! రోజూ వెయ్యి ఆయతులు పఠించే శక్తి ఎవరికి ఉంది,’ అని విన్నవించుకున్నారు. అప్పుడు ప్రవక్త (స), ‘మీలో ఎవరూ సూరహ్ అత్తకాసుర్ (102) చదవలేరా?’ అని ప్రశ్నించారు. (బైహఖీ)
అంటే ఈ సూరహ్‌ను చదవడం వల్ల వెయ్యి ఆయతులు పఠించినంత పుణ్యం లభిస్తుంది.
2185 – [ 77 ] ( لم تتم دراسته ) (1/669)
وَعَنْ سَعِيْدِ بْنِ الْمُسَيَّبِ مُرْسَلًا عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ: “مَنْ قَرَأَ(قُلْ هُوَ اللهُ أَحَدٌ-112)عَشَرَ مَرَّاتٍ بُنِيَ لَهُ بِهَا قَصْرٌ فِيْ الْجَنَّةِ وَمَنْ قَرَأَ عِشْرِيْنَ مَرَّةً بُنِيَ لَهُ بِهَا قَصْرَانِ فِيْ الْجَنَّةِ وَمَنْ قَرَأَهَا ثَلَاثِيْنَ مَرَّةً بُنِيَ لَهُ بِهَا ثَلَاثَةُ قُصُوْرٍ فِيْ الْجَنَّةِ”. فَقَالَ عُمَرُ بْنُ الْخَطَّابِ رضي الله عَنْهُ: وَاللهِ يَا رَسُوْلَ اللهِ إِذَا لَنُكَثِّرَنَّ قُصُوْرَنَا. فَقَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “اللهُ أَوْسَعُ مِنْ ذَلِكَ”. رَوَاهُ الدّارَمِيُّ.
2185. (77) [1/669–అపరిశోధితం]
స’యీద్ బిన్ ముసయ్యిబ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, 10 సార్లు సూరహ్ అల్ఇ’ఖ్లా’స్ (112) పఠించేవాని కొరకు ఈ సూరహ్ శుభం వల్ల స్వర్గంలో ఒక భవనం తయారుచేయబడుతుంది, 20 సార్లు పఠిస్తే స్వర్గంలో రెండు భవనాలు తయారుచేయ బడతాయి. 30 సార్లు పఠిస్తే మూడు భవనాలు తయారుచేయబడతాయి. అప్పుడు ‘ఉమర్ (ర), ‘ఓ అల్లాహ్ ప్రవక్తా! ఈ విధంగా అయితే మేము చాలా భవనాలు తయారుచేసుకోగలం,’ అని అన్నారు. ప్రవక్త (స) విని, ‘అల్లాహ్ (త) అనుగ్రహం అంతకంటే విశాలమైనది, ఇందులో ఆశ్చర్యం చెందే అవసరం లేదు,’ అని అన్నారు. (దారమి)
2186 – [ 78 ] ( لم تتم دراسته ) (1/670)
وَعَنِ الْحَسَنِ مُرْسَلًا: أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم قَالَ: “مَنْ قَرَأَ فِيْ لَيْلَةٍ مِّائَةَ آيَةٍ لَمْ يُحَاجَّهُ الْقُرْآنُ تِلْكَ اللَّيْلَةَ وَمَنْ قَرَأَ فِيْ لَيْلَةٍ مِّائَتَيْ آيَةٍ كُتِبَ لَهُ قُنُوْتُ لَيْلَةٍ وَّمَنْ قَرَأَ فِيْ لَيْلَةٍ خَمْسَمِائَةٍ إِلَى الْأَلْفِ أَصْبَحَ وَلَهُ قِنْطَارٌ مِّنَ الْأَجْرِ”. قَالُوْا: وَمَا الْقِنْطَارُ؟ قَالَ: “اثْنَا عَشَرَ أَلْفًا”. رَوَاهُ الدَّرَامِيُّ.
2186. (78) [1/670–అపరిశోధితం]
‘హసన్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”రాత్రిపూట 100 ఆయతులు పఠిస్తే, ఖుర్‌ఆన్ ఆ రాత్రి అతనితో వివాదానికి దిగలేదు. పైగా అతన్ని సమర్థిస్తుంది. అదేవిధంగా రాత్రి 200 ఆయతులు పఠించిన వారి కొరకు రాత్రంతా నమా’జు చేసినంత పుణ్యం లభిస్తుంది. అదే విధంగా రాత్రి 500 నుండి 1000 ఆయతుల వరకు చదివితే ఉదయం ఆ వ్యక్తి ఎలా మేల్కొంటాడంటే అతని వద్ద పుణ్యం కుప్పలు తెప్పలుగా పడి ఉంటుంది. అప్పుడు అనుచరులు, ‘ఖిన్’తార్, కుప్ప అంటే ఏమిటి?’ అని ప్రశ్నించారు. ప్రవక్త (స) ఒక ఖిన్’తార్ =12,000 కు సమానం, అంటే వెయ్యి ఆయతులు పఠిస్తే పన్నెండు వేల ఆయతుల పుణ్యం లభిస్తుంది. (దారమి)
=====
- بَاب آداب التِّلَاوَة وَ دُرُوس الٌقرْآن
1. ఖుర్‌ఆన్ పారాయణ నియమాలు
ఖుర్‌ఆన్ ఎల్లప్పుడూ పఠిస్తూ ఉండాలి. సాధ్య మైనంత అధికంగా పారాయణం చేస్తూ ఉండాలి. అశ్రద్ధచేస్తే మరచిపోయే ప్రమాదం ఉంది. ఇది దైవగ్రంథం. దీన్ని వినయ విధేయతలతో పఠించాలి. దీన్ని చదివేటప్పుడు మనం దైవంతో మాట్లాడు తున్నట్లు భావించాలి. నిదానంగా మంచి ఉచ్చారణతో పఠించాలి. తొందరగా చదవటం, పఠించటం మంచిది. కాదు, ఖుర్‌ఆన్‌ను 3 రోజుల కంటే ముందు పూర్తి చేయడం ప్రవక్త సాంప్రదాయానికి వ్యతిరేకం. మంచి స్వరంతో ఆగిఆగి చదవాలి. వీటి గురించి క్రింద పేర్కొనడం జరిగింది.
اَلْفَصْلُ الْأَوَّلُ మొదటి విభాగం
2187 – [ 1 ] (مُتَّفَقٌ عَلَيْهِ) (1/671)
عَنْ أَبِيْ مُوْسَى الْأَشْعَرِيِّ رضي الله عَنْه قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “تَعَاهَدُوْا الْقُرَآنَ فَوَالَّذِيْ نَفْسِيْ بِيَدِهِ لَهُوَ أَشَدُّ تَفَصِّيًا مِّنَ الْإِبْلِ فِيْ عُقُلِهَا”.
2187. (1) [1/671–ఏకీభవితం]
అబూ మూసా అష్’అరీ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఖుర్‌ఆన్‌ను పరిరక్షిస్తూ ఉండండి. నిరంతరం దాన్ని చదువుతూ జ్ఞాపకం ఉంచుకోండి. ము’హమ్మద్ ప్రాణం ఎవరి చేతిలో ఉందో ఆ అల్లాహ్(త) సాక్షి! ఖుర్‌ఆన్, త్రాడు తెంచుకొని పారిపోయే పొగరుబోతు ఒంటె కన్నా వేగంగా విడిపించుకొని పారిపోతుంది. [28] (బు’ఖారీ, ముస్లిమ్)
2188 – [ 2 ] ( مُتَّفَقٌ عَلَيْهِ) (1/671)
وَعَنِ ابْنِ مَسْعُوْدٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “بِئْسَ مَالِأَحَدِهِمْ أَنْ يَّقُوْلَ: نَسِيْتُ آيَةَ كَيْتَ وَكَيْتَ بَلْ نُسِّيَ وَاسْتَذْكِرُوْا الْقُرْآنَ فَإِنَّهُ أَشَدُّ تَفْصِيًّا مِّنْ صُدُوْرِ الرِّجَالِ مِنَ النَّعَمِ”. مُتَّفَقٌ عَلَيْهِ. وَزَادَ مُسْلِمٌ: “بِعُقُلِهَا.“
2188. (2) [1/671–ఏకీభవితం]
‘అబ్దుల్లాహ్ బిన్ మస్’ఊద్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ‘నేను ఖుర్‌ఆన్ ఫలానా ఆయతును మరచి పోయాను,’ అని అనటం చాలా చెడ్డ విషయం. ‘నేను మరపింపజేయబడ్డాను’ అని అనటం సమంజసం. ఖుర్‌ఆన్‌ను కంఠస్తం చేసుకుంటూ ఉండండి. ఎందు కంటే అది మనుషుల హృదయాల నుండి చాలా తొందరగా పారిపోతుంది. ఏ విధంగా జంతువు తన త్రాడు విడిపించుకొని పారిపోతుందో. [29] (బు’ఖారీ, ముస్లిమ్)
2189 – [ 3 ] (صَحِيح ) (1/671)
وَعَنِ ابْنِ عُمَرَ أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم قَالَ: “إِنَّمَا مَثَلُ صَاحِبِ الْقُرْآنِ كَمَثَلِ صَاحِبِ الْإِبِلِ الْمُعَقَّلَةِ إِنْ عَاهَدَ عَلَيْهَا أَمْسَكَهَا وَإِنْ أَطْلَقَهَا ذَهَبَتْ” .
2189. (3) [1/671–దృఢం]
ఇబ్నె ‘ఉమర్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఖుర్‌ఆన్ పఠించేవాడు తన ఒంటెను త్రాడుతో కట్టిన యజమాని వంటి వాడు, ఒకవేళ ఒంటెను పరిరక్షిస్తూ, సరిగ్గా ఆపి ఉంచితే అది ఉంటుంది. ఒక వేళ దానిని వదలివేస్తే అది పారిపోతుంది. అదేవిధంగా ఖుర్‌ఆన్‌ను చదవడం మానివేస్తే మరపింపజేయబడుతుంది.
2190 – [ 4 ] (مُتَّفَقٌ عَلَيْهِ) (1/672)
وَعَنْ جُنْدُبِ بْنِ عَبْدِ اللهِ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “اقْرَؤُوْا الْقُرْآنَ مَا ائْتَلَفَتْ عَلَيْهِ قُلُوْبُكُمْ فَإِذَا اخْتَلَفْتُمْ فَقُوْمُوْا عَنْهُ”.
2190. (4) [1/672–ఏకీభవితం]
జున్‌దుబ్ బిన్ ‘అబ్దుల్లాహ్ (ర) కథనం: ఖుర్‌ఆన్‌ను చదవటంలో ఉత్సాహం ఉన్నంతవరకు చదవండి. విసుగుపుడితే, మనసు ఆందోళనకరంగా ఉంటే చదవడం ఆపివేయండి. [30] (బు’ఖారీ, ముస్లిమ్)
2191 – [ 5 ] ( صحيح ) (1/672)
وَعَنْ قَتَادَةَ قَالَ: سُئِلَ أَنَسٌ: كَيْفَ كَانَتْ قِرَاءَةُ النَّبِيِّ صلى الله عليه وسلم فَقَالَ: كَانَتْ مَدًّا مَدًّا ثُمَّ قَرَأَ: بِسْمِ اللهِ الرَّحْمنِ الرَّحِيْمِ يَمُدُّ بِبِسْمِ اللهِ وَيَمُدُّ بِالرَّحْمنِ وَيَمُدُّ بِالرَّحِيْمِ. رَوَاهُ الْبُخَارِيُّ .
2191. (5) [1/672–దృఢం]
ఖతాదహ్ (ర) కథనం: అనస్ బిన్ మాలిక్‌ను, ‘ప్రవక్త (స) ఖుర్‌ఆన్ ఎలా పఠించేవారు,’ అని ప్రశ్నిం చడం జరిగింది. అతడు(ర) ”ప్రవక్త (స) మద్‌చేసి సాగదీసి పఠించే వారు. ఇంకా బిస్మిల్లా హిర్ర’హ్మా నిర్ర ‘హీమ్ చదివి ప్రవక్త (స) బిస్మిల్లాహ్ యొక్క లామ్ యొక్క అలిఫ్‌పై మద్‌చేసే వారు అంటే అలిఫ్‌ను సాగదీసి చదివేవారని, ర’హ్మాన్ పదపు అలిఫ్‌ను సాగదీసి చదివేవారు, ర’హీమ్ పదపు య ను సాగదీసి చదివేవారని సమాధానం ఇచ్చారు. [31] (బు’ఖారీ)
2192 – [ 6 ] (مُتَّفَقٌ عَلَيْهِ) (1/672)
وَعَنْ أَبِيْ هُرَيْرَةَ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَا أَذِنَ اللهُ لِشَيْءٍ مَا أَذِنَ لِنَبِيٍّ يَّتَغَنّى بِالْقُرْآنِ”.
2192. (6) [1/672–ఏకీభవితం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”అల్లాహ్(త) తన ప్రవక్తను ఖుర్‌ఆన్ మధురంగా చదువుతూ ఉండగా విన్నట్టు మరే విషయాన్ని అంత శ్రద్ధగా వినడు.” [32] (బు’ఖారీ, ముస్లిమ్)
2193 – [ 7 ] (مُتَّفَقٌ عَلَيْهِ) (1/672)
وَعَنْ أَبِيْ هُرَيْرَةَ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَا أَذِنَ اللهُ لِشَيْءٍ مَا أَذِنَ لِنَبِيٍّ حَسَنٍ الصَّوْتِ بِالْقُرْآنِ يَجْهَرُ بِهِ”.
2193. (7) [1/672–ఏకీభవితం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”అల్లాహ్ (త) ప్రవక్త బిగ్గరగా పఠిస్తున్న మధుర పఠనాన్ని ప్రత్యేక శ్రద్ధతో విన్నట్లు మరే శబ్దాన్నీ వినడు.” (బు’ఖారీ, ముస్లిమ్)
2194 – [ 8 ] ( صحيح ) (1/672)
وَعَنْ أَبِيْ هُرَيْرَةَ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَيْسَ مِنَّا مِنْ لَّمْ يَتَغَنَّ بِالْقُرْآنِ”. رَوَاهُ الْبُخَارِيُّ.
2194. (8) [1/672–దృఢం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఖుర్‌ఆన్‌ను మంచి స్వరంతో చదవనివాడు మన పధ్ధతిపై నడిచేవాడు కాడు.” [33] (బు’ఖారీ)
2195 – [ 9 ] ( صحيح ) (1/672)
وَعَنْ عَبْدِ اللهِ بْنِ مَسْعُوْدٍ قَالَ: قَالَ لِيْ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم وَهُوَ عَلَى الْمِنْبَرِ: “اِقْرَأُ عَلَيَّ”. قُلْتُ: أَقْرَاُ عَلَيْكَ وَعَلَيْكَ أُنْزِلَ؟ قَال: “إِنِّيْ أُحِبُّ أَنْ أَسْمَعَهُ مِنْ غَيْرِيْ”. فَقَرَأْتُ سُوْرَةَ النِّسَاءِ حَتَّى أَتَيْتُ إِلَى هَذِهِ الْآيَةِ (فَكَيْفَ إِذَا جِئْنَا مِنْ كُلِّ أُمَّةٍ بِشَهِيْدٍ وَجِئْنَا بِكَ عَلَى هَؤُلَاءِ شَهِيْدًا- 4: 41) قَالَ: “حَسْبُكَ الْآن”. فَالْتَفَتُّ إِلَيْهِ فَإِذَا عَيْنَاهُ تَذْرِفَانِ
2195. (9) [1/672–దృఢం]
‘అబ్దుల్లాహ్ బిన్ మస్’ఊద్ (ర) కథనం: ఒక సారి ప్రవక్త (స) నాతో మాట్లాడుతూ, ”ఇబ్నె మస్’ఊద్! నాకు ఖుర్‌ఆన్ చదివి వినిపించు” అని అన్నారు. దానికి నేను, ‘దైవప్రవక్తా! మీపైనే కదా ఖుర్‌ఆన్ అవతరించింది! అటువంటప్పుడు మీకు నేను ఖుర్‌ఆన్ చదివి వినిపించడం ఏమిటి?’ అని విన్నవించుకున్నాను. దానికి ప్రవక్త (స), ‘ఎందుకంటే నాకు ఇతరుల ద్వారా ఖుర్‌ఆన్ పారాయణం వినాలనిపిస్తుంది,’ అని అన్నారు. అప్పుడు నేను, సూరహ్ అన్నిసా’ (4) పారాయణం చేయటం ప్రారంభించాను. అలా నేను పారాయణం చేస్తూ,
”మేము (ప్రతిఫలదినమున) ప్రతి సమాజం నుండి ఒక సాక్షిని తెచ్చి మరియు (ఓ ప్రవక్తా) నిన్ను వీరికి సాక్షిగా నిలబెట్టినపుడు ఎలా ఉంటుంది?” (సూ. అన్నిసా’, 4:41) అనే వాక్యం దగ్గరకు చేరుకోగానే ”ఇకచాలు ఆపు” అని అన్నారు. నేను తలపైకెత్తి చూస్తే ఆయన కళ్ళ వెంబడి అశ్రుధారలు పారుతున్నాయి. [34] (బు’ఖారీ, ముస్లిమ్)
2196 – [ 10 ] (مُتَّفَقٌ عَلَيْهِ) (1/672)
وَعَنْ أَنَسٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم لِأُبَيِّ بْنِ كَعْبٍ: “إِنَّ اللهَ أَمَرَنِيْ أَنْ أقْرَأَ عَلَيْكَ الْقُرْآنَ”: قال آللهُ سَمَّانِيْ لَكَ؟ قَالَ: “نَعَمْ”. قَالَ: وَقَدْ ذُكِرْتُ عِنْدَ رَبِّ الْعَالَمِيْنَ؟ قَالَ: “نَعَمْ” .فَذَرَفَتْ عَيْنَاهُ.
وَفِيْ رِوَايَةٍ: “إِنَّ اللهَ أَمَرَنِيْ أَنْ أَقْرَأَ عَلَيْكَ (لَمْ يَكُنِ الَّذِيْنَ كَفَرُوْا-98) قَالَ: وَسَمَّانِيْ؟ قَالَ: “نَعَمْ”. فَبَكَى .
2196. (10) [1/672–ఏకీభవితం]
అనస్ (ర) కథనం: ప్రవక్త (స) ఉబయ్ బిన్ క‘అబ్‌తో, ‘అల్లాహ్ (త) నీ ముందు నన్ను ఖుర్‌ఆన్ పఠించమని ఆదేశించాడు’ అని అన్నారు. ఉబయ్ బిన్ క’అబ్, ”అల్లాహ్ (త) మీ ముందు నా పేరు పేర్కొన్నాడా?” అని అడిగారు. ప్రవక్త (స), ‘అవును’ అన్నారు. మళ్ళీ ఉబయ్ బిన్ క’అబ్, ‘నేను అల్లాహ్ ముందు ప్రస్తావించబడ్డానా?’ అని అడిగారు. ప్రవక్త (స), ‘అవును’ అని అన్నారు. అది విన్న ఉబయ్ బిన్ క’అబ్ కళ్లంట అశ్రువులు ప్రవహించసాగాయి.
మరో ఉల్లేఖనంలో ఇలా ఉంది. ”ప్రవక్త (స) అల్లాహ్ (త) నన్ను నీ ముందు సూరతుల్ బయ్యినహ్ (98) పఠించమని ఆదేశించాడు,” అని అన్నారు. దానికి ఉబయ్ బిన్ క’అబ్, ‘అల్లాహ్ (త) నా పేరు ప్రస్తావించాడా?’ అని అన్నాడు. ప్రవక్త (స) ‘అవునని’ అన్నారు. అది విన్న ఉబయ్ (ర) ఏడ్వసాగారు. [35] (బు’ఖారీ, ముస్లిమ్)
2197 – [ 11 ] (مُتَّفَقٌ عَلَيْهِ) (1/673)
وَعَنِ ابْنِ عُمَرَ قَالَ: نَهَى رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم أَنْ يُّسَافَرَ بِالْقُرْآنِ إِلَى أَرْضِ الْعُدُوِّ. مُتَّفَقٌ عَلَيْهِ.
وَفِيْ رِوَايَةٍ لِّمُسْلِمٍ: “لَا تُسَافِرُوْا بِالْقُرْآنِ فَإِنِّيْ لَا آمَنُ أَنْ يَّنَالَهُ الْعَدُوُّ”.
2197. (11) [1/673–ఏకీభవితం]
ఇబ్నె ‘ఉమర్ (ర) కథనం: ప్రవక్త (స) శత్రు ప్రాంతం వైపు ఖుర్‌ఆన్ తీసుకొని ప్రయాణించటాన్ని నిషేధించారు. (బు’ఖారీ, ముస్లిమ్)
ముస్లిమ్ ఉల్లేఖనంలో ఇలా ఉంది, ”ప్రవక్త (స) మీరు ఖుర్‌ఆన్ తీసుకొని ప్రయాణం చేయకండి. ఎందుకంటే, శత్రు వులు దాన్ని తీసుకుంటారని నేను భయపడు తున్నాను. అంటే ఖుర్‌ఆన్ తీసుకొని శత్రు దేశాలకు వెళ్ళకండి, శత్రువులు ఖుర్ఆన్ లాక్కుంటారు, దాన్ని అవమానపరుస్తారు.
—–
الْفَصْلُ الثَّانِيْ రెండవ విభాగం
2198 – [ 12 ] ( لم تتم دراسته ) (1/673)
عَنْ أَبِيْ سَعِيْدِ الْخُدْرِيِّ قَالَ: جَلَسْتُ فِيْ عِصَابَةٍ مِّنْ ضُعَفَاءِ الْمُهَاجِرِيْنَ وَإِنْ بَعْضَهُمْ لَيَسْتَتِرُ بِبَعْضٍ مِّنَ الْعُرْيِ وَقَارِئٌ يَّقْرَأُ عَلَيْنَا إِذْ جَاءَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم فَقَامَ عَلَيْنَا فَلَمَّا قَامَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم سَكَتَ الْقَارِئُ فَسَلَّمَ ثُمَّ قَالَ: “مَا كُنْتُمْ تَصْنَعُوْنَ؟ “قُلْنَا: كُنَّا نَسْتَمِعُ إِلَى كِتَابِ اللهِ. قَالَ: فَقَالَ: “اَلْحَمْدُ لِلّهِ الَّذِيْ جَعَلَ مِنْ أُمَّتِيْ مَنْ أُمِرْتُ أَنْ أَصْبَرَ نَفْسِيْ مَعَهُمْ”. قَالَ: فَجَلَسَ وَسَطَنَا لِيَعْدِلَ بِنَفْسِهِ فَيْنَا. ثُمَّ قَالَ بِيَدِهِ هَكَذَا: فَتَحَلَّقُوْا وَبَرَزَتْ وُجُوْهُهُمْ لَهُ، فَقَالَ: “أَبْشِرُوْا يَا مَعْشَرَ صَعَالِيْكَ الْمُهَاجِرِيْنَ بِالنُّوْرِ التَّامِّ يَوْمَ الْقِيَامَةِ تَدْخُلُوْنَ الْجَنَّةَ قَبْلَ أَغْنِيَاءِ النَّاسِ بِنِصْفِ يَوْمٍ وَّذَاكَ خَمْسُمِائَةِ سَنَةٍ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ.
2198. (12) [1/673–అపరిశోధితం]
అబూ స’యీద్ (ర) కథనం: నేను పేద ముహాజిరీన్ల బృందంలో కూర్చొని ఉన్నాను. వారి పరిస్థితి ఎలా ఉండేదంటే బట్టలులేక పోవటం వల్ల కొందరు నగ్నంగా ఉండేవారు. ఇటువంటి వారిని కొందరు తెరచాటుగా పనిచేసేవారు. మా మధ్య ఒక వ్యక్తి ఖుర్‌ఆన్ పారాయణం చేస్తున్నాడు. ఇంతలో ప్రవక్త (స) వచ్చారు. మా ముందు నిలబడ్డారు. ఆయన నిలబడటం చూచిన ఆ వ్యక్తి పఠనం ఆపివేసాడు. ప్రవక్త (స) సలామ్ చేసారు. ‘మీరేం చేస్తున్నారు,’ అని అడిగారు. ‘అల్లాహ్ గ్రంథాన్ని వింటున్నాం,’ అని అన్నాము. ”నా అనుచర సమాజంలో ఇటువంటి వ్యక్తులను సృష్టించిన అల్లాహ్ (త) కు స్తోత్రములు. నన్ను నేను వారితో ముడిపెట్టి ఉంచాలని ఆదేశించ బడ్డాను. అంటే నేను వారితో పాటే కూర్చుంటూ లేస్తూ ఉండాలి.” ఇలా పలికి ప్రవక్త (స) మా మధ్య కూర్చున్నారు. తనను తాను మాకు సమానంగా ఉంచడానికి. అంటే ఒక ప్రత్యేక వ్యక్తి వద్ద కూర్చోలేదు. అందరి మధ్య కూర్చున్నారు. అందరూ ప్రవక్త (స) ద్వారా లాభం పొందటానికి. ఆ తరువాత తమ చేత్తో సైగచేసి ‘ఈవిధంగా కూర్చొండి’ అని అన్నారు. ప్రవక్త (స) ఆదేశంపై అందరూ వృత్తాకారంలో ఎలా కూర్చున్నారంటే అందరి ముఖాలు ప్రవక్త (స) వైపు ఉన్నాయి. ఆ తరువాత ప్రవక్త (స), ‘ఓ పేద ముహాజిరీన్ల సంఘ సభ్యులారా! ఈ విషయంపై మీరు సంతోషించండి: తీర్పుదినంనాడు మీకు సంపూర్ణ వెలుగు లభిస్తుంది. ఇంకా ధనవంతులకన్నా సగం దినానికి ముందే మీరు స్వర్గంలో ప్రవేశిస్తారు. ఈ సగం దినం ఐదు వందల సంవత్సరాలకు సమానం అని ప్రవచించారు. [36] (అబూ దావూద్)
2199 – [ 13 ] ( صحيح ) (1/674)
وَعَنِ الْبَرَاءِ بْنِ عَازِبٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “زَيِّنُوا الْقُرْآنَ بِأَصْوَاتِكُمْ”. رَوَاهُ أَحْمَدُ وَأَبُوْ دَاوُدَ وَابْنُ مَاجَهُ وَالدَّارَمِيُّ.
2199. (13) [1/674–దృఢం]
బరా’ బిన్ ‘ఆ’జిబ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఖుర్‌ఆన్‌ను మీ స్వరాల ద్వారా అలంకరింప జేయండి. అంటే నిదానంగా నియమానుసారంగా మంచి స్వరంతో, వినడానికి బాగుండేటట్లు పఠిం చండి. (అ’హ్మద్, అబూ దావూద్, ఇబ్నె మాజహ్, దారమి)
2200 – [ 14 ] ( لم تتم دراسته ) (1/674)
وَعَنْ سَعْدِ بْنِ عُبَادَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَا مِنِ امْرِئٍ يَّقْرَأُ الْقُرْآنَ ثُمَّ يَنْسَاهُ إِلَّا لَقِيَ اللهُ يَوْمَ الْقِيَامَةِ أَجْذَمَ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ وَالدَّارَمِيُّ.
2200. (14) [1/674–అపరిశోధితం]
స’అద్ బిన్ ‘ఉబాదహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఖుర్‌ఆన్ నేర్చుకొని మరచిపోయినవాడు తీర్పుదినం నాడు చేయితెగి ఉన్న స్థితిలో అల్లాహ్(త)ను కలుసుకుంటాడు.” [37] (అబూ దావూద్, దారమి)
2201 – [ 15 ] ( صحيح ) (1/674)
وَعَنْ عَبْدِ اللهِ بْنِ عَمْرٍو أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم قَالَ: “لَمْ يَفْقَهْ مَنْ قَرَأَ الْقُرْآنَ فِيْ أَقَلَّ مِنْ ثَلَاثٍ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَأَبُوْ دَاوُدَ وَالدَّارَمِيُّ.
2201. (15) [1/674–దృఢం]
‘అబ్దుల్లాహ్ బిన్ ‘అమ్ర్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవ చనం 3రోజుల కంటే తక్కువ వ్యవధిలో ఖుర్‌ఆన్ పఠించి, పూర్తి చేసినవాడు, ఖుర్‌ఆన్‌ను ఏమాత్రం అర్థం చేసుకోలేదు. [38] (తిర్మీజి’, అబూ దావూద్, దారమి)
2202 – [ 16 ] ( لم تتم دراسته ) (1/674)
وَعَنْ عُقْبَةَ بْنِ عَامِرٍقَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “اَلْجَاهِرُ بِالْقُرْآنِ كَالْجَاهِرِبِالصَّدَقَةِ وَالْمُسِرُّبِالْقُرْآنِ كَالْمُسِرِّ بِالصَّدَقَةِ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَأَبُوْ دَاوُدَ وَالنّسَائِيُّ وَقَالَ التِّرْمِذِيُّ: هَذَا حَدِيْثٌ حَسَنٌ غَرِيْبٌ.
2202. (16) [1/674–అపరిశోధితం]
‘ఉఖ్‌బహ్ బిన్ ‘ఆమిర్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ఖుర్‌ఆన్‌ను బిగ్గరగా పఠించేవాడు బహిరంగంగా దానధర్మాలు చేసేవాడితో సమానం, ఖుర్‌ఆన్‌ను నెమ్మదిగా పఠించేవాడు రహస్యంగా దానధర్మాలు చేసేవాడితో సమానం. [39] (తిర్మిజి’ / ప్రామాణికం, ఏకోల్లేఖనం, అబూ దావూద్, నసాయి’)
2203 – [ 17 ] ( لم تتم دراسته ) (1/674)
وَعَنْ صُهَيْبٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَا آمَنَ بِالْقُرْآنِ مَنِ اسْتَحَلَّ مَحَارَمَهُ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَقَالَ: هَذَا حَدِيْثٌ لَيْسَ إِسْنَادُهُ بِالْقَوِيِّ .
2203. (17) [1/674–అపరిశోధితం]
‘సుహైబ్(ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ఖుర్‌ఆన్‌లో ఉన్న నిషిద్ధాలను ధర్మసమ్మతాలుగా భావించిన వాడు ఖుర్‌ఆన్ ను విశ్వసించలేదు. (తిర్మిజి’ / ఆధారాలు బలహీనం)
ఈ ‘హదీసు’ వల్ల ఖుర్‌ఆన్ నిషిద్ధాలను నిషిద్ధాలుగా భావించడం, ధర్మసమ్మతాలను ధర్మసమ్మతంగా భావించడం విధి అని, దీనికి వ్యతిరేకంగా ప్రవర్తించడం అవిశ్వాసం అని తెలిసింది.
2204 – [ 18 ] ( ضعيف ) (1/674)
وَعَنِ اللَّيْثِ بْنِ سَعْدٍ عَنِ ابْنِ أَبِيْ مُلَيْكَةَ عَنْ يَعْلَى بْنَ مَمْلكٍ أَنَّهُ سَأَلَ أُمِّ سَلَمَةَ عَنْ قِرَاءَةِ النَّبِيِّ صلى الله عليه وسلم فَإِذَا هِيَ تنَعْتُ قِرَاءَةً مُفَسَّرَةً حَرْفًا حَرْفًا. رَوَاهُ التِّرْمِذِيُّ وَأَبُوْ دَاوُدَ وَالنَّسَائِيُّ.
2204. (18) [1/674–బలహీనం]
లైస్’ బిన్ స’అద్, ఇబ్నె అబీ ములైక నుండి అతను య’అలా బిన్ మమ్‌లక నుండి కథనం: య’అలా బిన్ మమ్‌లక, ఉమ్మె సలమహ్ (ర అన్హుమ్)ను, ప్రవక్త (స) పఠనాన్ని గురించి అడిగారు. ఉమ్మె సలమహ్ ప్రవక్త (స) పఠనాన్ని గురించి వివరంగా స్పష్టంగా పఠించి తెలిపారు. దీనివల్ల ప్రతి అక్షరం విడివిడిగా అర్థమైపోయేది. (తిర్మిజి’, అబూ దావూద్, నసాయి’)
అంటే స్పష్టంగా, నిదానంగా పఠించి తెలిపేవారు. దీనివల్ల వినేవాడు ప్రతిఅక్షరాన్ని లెక్కపెట్టుకో వచ్చు.
2205 – [ 19 ] ( لم تتم دراسته ) (1/675)
وَعَنِ ابْنِ جُرِيْجٍ عَنِ ابْنِ أَبِيْ مُلَيْكَةَ عَنْ أُمِّ سَلَمَةَ قَالَتْ: كَانَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم يَقْطَعُ قِرَاءَتَهُ يَقُوْلُ: اَلْحَمْدُ لِلّهِ رَبِّ الْعَالَمِيْنَ ثُمَّ يَقِفُ ثُمَّ يَقُوْلُ: الرَّحْمنِ الرَّحِيْمِ ثُمَّ يَقِفُ. رَوَاهُ التِّرْمِذِيُّ وَقَالَ: لَيْسَ إِسْنَادُهُ بِمُتَّصِلٍ لِأَنَّ اللَّيْثَ رَوَى هَذَا الْحَدِيْثَ عَنِ ابْنِ أَبِيْ مُلَيْكَةَ عَنْ يَعْلَى بْنِ مَمْلَكٍ عَنْ أُمِّ سَلَمَةً وَحَدِيْثُ اللَّيْثِ أَصَحُّ.
2205. (19) [1/675–అపరిశోధితం]
ఇబ్నె జురైజ్ ఇబ్నె అబీ ములైకహ్ ద్వారా, అతడు ఉమ్మె సలమహ్ (ర) ద్వారా కథనం: ఉమ్మె సలమహ్ (ర) ప్రవక్త (స) నిదానంగా ఆగి ఆగి పఠించేవారని తెలిపారు. ప్రతి ఆయతును రెండవ ఆయతుతో కలుపకుండా విడివిడిగా పఠించేవారు. అంటే, అల్’హమ్‌దు లిల్లాహి రబ్బిల్ ‘ఆలమీన్ అని పఠించి ఆగిపోతారు. ఆ తరువాత అర్ర’హ్మా నిర్ర’హీమ్ అని పఠించి ఆగుతారు. ఈ విధంగా ప్రతి ఆయత్ ను పఠించిన తరువాత ఆగిపోతారు. (తిర్మిజి’)
ఈ ‘హదీసు’ పరంపర క్రమంగా కలిసి లేదని తిర్మిజి’ పేర్కొన్నారు.
—–
اَلْفَصْلُ الثَّالِثُ మూడవ విభాగం
2206 – [ 20 ] ( لم تتم دراسته ) (1/675)
عَنْ جَابِرٍ قَالَ: خَرَجَ عَلَيْنَا رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم وَنَحْنُ نَقْرَأُ الْقُرْآنَ وَفِيْنَا الْأَعْرَابِيُّ وَالْأَعْجَمِيُّ قَالَ: “اقْرَؤُوْا فَكُلٌّ حَسَنٌ، وَّسَيَجِيْءُ أَقْوَامٌ يُّقِيْمُوْنَهُ كَمَا يُقَامُ الْقِدْحُ، يَتَعَجَّلُوْنَهُ وَلَا يَتَأَجَّلُوْنَهُ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ وَالْبَيْهَقِيُّ فِيْ شُعَبِ الْإِيْمَانِ.
2206. (20) [1/675–అపరిశోధితం]
జాబిర్ (ర) కథనం: ప్రవక్త (స) మా దగ్గరకు వచ్చారు. అప్పుడు మేము ఖుర్‌ఆన్ చదువు తున్నాము. మాలో కొందరు పల్లెవాసులు, మరి కొందరు చదువులేని వారు, మరికొందరు అరబ్బే తరులు ఉన్నారు. అప్పుడు ప్రవక్త (స) ఖుర్‌ఆన్ పఠించండి, మీలో ప్రతి ఒక్కరూ బాగా చదువు తున్నారు. భవిష్యత్తులో కొంత మంది ఖుర్‌ఆన్‌ను తిన్నగా చదువుతారు. బల్లెం సరిచేయబడినట్టు. ఖుర్‌ఆన్ పఠన ప్రతిఫలాన్ని ఇహలోకంలో పొందే తొందరలో ఉంటారు. పరలోకానికి ఏమీ విడిచిపెట్టరు.” అని అన్నారు. [40] (అబూ దావూద్, బైహఖీ – షు’అబుల్ ఈమాన్)
2207 – [ 21 ] ( لم تتم دراسته ) (1/675)
وَعَنْ حُذَيْفَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “اقْرَؤُوْا الْقُرْآنَ بِلُحُوْنِ الْعَرَبَ وَأَصْوَاتِهَا وَإِيَّاكُمْ وَلُحُوْنَ أَهْلِ الْعِشْقِ وَلُحُوْنَ أَهْلِ الْكِتَابَيْنِ وَسَيَجِيْ بَعْدِيْ قَوْمٌ يُرَجِّعُوْنَ بِالْقُرْآنِ تَرَجِيْعَ الْغِنَاءِ وَالنَّوْحِ لَا يُجَاوِزُ حَنَاجِرَهُمْ مَّفْتُوْنَةً قُلُوْبُهُمْ وَقُلُوْبُ الَّذِيْنَ يُعْجِبُهُمْ شَأْنُهُمْ”. رَوَاهُ الْبَيْهَقِيُّ فِيْ شُعَبِ الْإِيْمَان وَ رَزِين.
2207. (21) [1/675–అపరిశోధితం]
‘హుజై’ఫహ్ (ర) కథనం:ప్రవక్త (స) ప్రవచనం, ”మీరు అరబ్బుల ఉచ్చారణ పద్ధతిద్వారా ఖుర్‌ఆన్‌ను పఠించండి. వారి పాటలకు, అశ్లీల స్వరాలకు దూరంగా ఉండండి. గ్రంథప్రజలైన యూదుల్లా, క్రైస్తవుల్లా చదవకండి. వారు పాటలగా సంగీతంతో కలిపి చదువుతారు. మీరు పాడుతూ సంగీతంలా పాడకండి. భవిష్యత్తులో కొందరు ఖుర్‌ఆన్‌ను స్వరాలు మార్చి-మార్చి గీతాలు, పాటలు, సంగీతంలా చదువుతారు. ఈ ఖుర్‌ఆన్ వారి కంఠాల క్రిందికి దిగదు. అంటే హృదయంలో దాని ప్రభావం ఉండదు. వారి హృదయాలు కలతలకు గురయి ఉంటాయి. దానిని వినేవారి హృదయాలు కూడా కలతలకు గురయి ఉంటాయి. వారికి వారి గానం ఎంతో మధురంగా గొప్పగా అనిపిస్తుంది. [41] (ర’జీన్, బైహఖీ – షు’అబుల్ ఈమాన్)
2208 – [ 22 ] ( صحيح ) (1/676)
وَعَنِ الْبَرَاءِ بْنِ عَازِبٍ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: سَمِعْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ: “حَسِّنُوْا الْقُرْآنَ بِأَصْوَاتِكُمْ فَإِنَّ الصَّوْتَ الْحَسَنَ يَزِيْدُ الْقُرْآنَ حَسَنًا”. رَوَاهُ الدَّارَمِيُّ .
2208. (22) [1/676–దృఢం]
బరా’ బిన్ ‘ఆ’జిబ్ (ర) కథనం: ప్రవక్త (స)ను ఇలా అంటూ ఉండగా నేను విన్నాను, ”మీరు మీ స్వరాల ద్వారా ఖుర్‌ఆన్‌ను అలంకరింపజేయండి. ఎందుకంటే మంచి స్వరం ఖుర్‌ఆన్ అందాన్ని మరింత అధికం చేస్తుంది. [42] (దారమి)
2209 – [ 23 ] ( صحيح ) (1/676)
وَعَنْ طَاوُوسٍ مُرْسَلًا قَالَ: سُئِلَ النَّبِيَّ صلى الله عليه وسلم: أَيُّ النَّاسِ أَحْسَنَ صَوْتًا لِلْقُرْآنِ؟ وَأَحْسَنَ قِرَاءَةً؟ قَالَ: “مَنْ إِذَا سَمِعْتُهُ يَقْرَأُ أُرِيْتُ أَنَّهُ يَخْشَى اللهَ”. قَالَ طَاوُوسٌ: وَكَانَ طَلْقٌ كَذِلَكَ. رَوَاهُ الدَّارَمِيُّ.
2209. (23) [1/676–దృఢం]
‘తావూస్ ముర్సల్గా కథనం: ప్రవక్త (స)ను చాలా అందంగా చాలా ఉత్తమంగా ఖుర్‌ఆన్‌ను ఎవరు చదువుతారు, అని ప్రశ్నించడం జరిగింది. దానికి ప్రవక్త (స) చదవడం మీరు వింటే అతను అల్లాహ్ (త)కు భయపడతాడని మీరు భావించాలి. (అంటే అతని పారాయణం మీ హృదయాల్లో ప్రభావం చూపాలి. చదివే వాడిని దైవభీతి ఆవరించి ఉండాలి. అతని కళ్ళంట అశ్రువులు పారాలి). అటువంటి వ్యక్తి చాలా ఉత్తమంగా మంచి స్వరంతో పఠిస్తాడు.” అని అన్నారు. ‘తల్‌ఖ్ ‘హదీసు’వేత్త ఇలాగే ఉండేవారని ‘తావూస్ ఉల్లేఖన కర్త అన్నారు. (దారమి)
2210 – [ 24 ] ( لم تتم دراسته ) (1/676)
وَعَنْ عُبَيْدَةِ الْمُلَيْكِيِّ وَكَانَتْ لَهُ صُحْبَةٌ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “يَا أَهْلَ الْقُرْآنِ لَا تَتَوَسَّدُوا الْقُرْآنَ وَاتْلُوْهُ حَقَّ تِلَاوَتِهِ مِنْ آنَاءِ اللَّيْلِ وَالنَّهَارِوَأَفْشُوْهُ وَتَغَنُّوْهُ وَتَدَبَّرُوْا مَا فِيْهِ لَعَلَّكُمْ تُفْلِحُوْنَ وَلَا تُعَجِّلُوْا ثَوَابَهُ فَإِنَّ لَهُ ثَوَابًا”. رَوَاهُ الْبَيْهَقِيُّ فِيْ شُعَبِ الْإِيْمَانِ.
2210. (24) [1/676–అపరిశోధితం]
‘ఉబైదహ్ ములైకీ కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఓ ఖుర్‌ఆన్ ప్రజలారా! ఖుర్‌ఆన్‌ను తలగడగా చేయకండి. రాత్రీపగలులో ఏ సమయంలోనూ దాన్ని చదివేవిధంగా చదవండి. ఖుర్‌ఆన్‌ను విస్తరింప జేయండి. దాని సందేశ ప్రచారం చేయండి. ప్రజలకు మంచి స్వరంతో వినిపించండి. దాన్ని బాగా అధ్యయనం చేయండి. అర్థం చేసుకుని మరీ చదవండి. దాని వల్ల సాఫల్యం సిద్ధిస్తుంది. దాని ప్రతిఫలం పొందటానికి తొందరపడకండి. అంటే దాని ప్రతిఫలం ఇహలోకంలోనే పొందాలని ఆలోచించకండి. ఎందుకంటే పరలోకంలో దీనికి గొప్ప ప్రతిఫలం ఉంది. (బైహఖీ – షు’అబుల్ ఈమాన్)
=====
2– بَابُ اخْتَلَافِ الْقَرَاءَاتِ وَجَمْعِ الْقُرْآنِ
2. ఖుర్‌ఆన్ పారాయణరకాలు, దాని సంకలనం
ఖుర్‌ఆన్ అల్లాహ్ (త) గ్రంథం. ఇది ఆకాశం నుండి ము’హమ్మద్ (స)పై అవతరించింది. ఇది పఠించిన వారి, కంఠస్తం చేసుకున్నవారి హృదయాల్లో ఉంది. గ్రంథాల్లో ప్రచరించబడి ఉంది. క్రమంగా ఈ పరంపర మనవరకు చేరింది. ముస్లిములు దీన్ని నమా’జులో, ఇతర సమయాల్లో పఠిస్తూ ఉంటారు. 23 సంవత్సరాల కాలంలో ప్రారంభం నుండి అంతం వరకు అవతరించబడింది. ఇది దైవగ్రంథం అనడంలో ఎంత మాత్రం సందేహం లేదు. దీని రక్షణా బాధ్యత అల్లాహ్ (త) స్వయంగా తీసుకున్నాడు. అల్లాహ్ (త) ఆదేశం: ”నిశ్చయంగా, మేమే ఈ జ్ఞాపిక (ఖుర్ఆన్) ను అవతరింపజేశాము మరియు నిశ్చయంగా, మేమే దీనిని కాపాడేవారము.’ (సూ. అల్ ఇస్రా’, 15:9)
”నిశ్చయంగా, దీనిని చేర్చటం మరియు దీనిని చదివించటం మా బాధ్యతే!” (సూ. అల్-ఖియామహ్, 75:17). చేర్చటం రెండు విధాలు. జమ్’ఉ సద్‌రీ అంటే హృదయాల్లో భద్రపరచటం, జమ్’ఉ కితాబీ అంటే గ్రంథంలో వ్రాత పూర్వకంగా వ్రాయడం. ఈ రెండు బాధ్యతలను అల్లాహ్ పూర్తి చేసాడు. చాలామందికి ఖుర్‌ఆన్ కంఠస్తం చేయిం చాడు. వారు ఖుర్‌ఆన్ ‘హాఫి”జ్‌లు అయి పోయారు. అనేక మంది ఖుర్‌ఆన్‌ను పుస్తక రూపం ఇచ్చారు. ప్రచురించారు. ఈ పరంపర తీర్పుదినం వరకు కొనసాగుతుంది.
అల్లాహ్ (త) ఆదేశం: ”వాస్తవానికి ఇవి, స్పష్టమైన సూచనలు (ఖుర్‌ఆన్ ఆయాత్), జ్ఞానమివ్వబడిన వారి హృదయాలలో (భద్రంగా) ఉంచబడ్డాయి… ” (సూ. అనక బూత్, 29:49).
అల్లాహ్ (త) ఆదేశం: వ్రాయబడిన గ్రంథం సాక్షిగా! విప్పబడిన చర్మ పత్రంమీద. (సూ. అత్ తూర్, 52: 2-3). వరఖ్ అంటే పలుచని చర్మాన్ని అంటారు. ప్రాచీన కాలంలో కాగితం లేనందున పలుచని చర్మాలపై వ్రాసేవారు.
మరో ఆదేశం: ”నిశ్చయంగా, ఈ ఖుర్‌ఆన్ దివ్యమైనది. సురక్షితమైన గ్రంథంలో ఉన్నది. దీనిని పరిశుధ్ధులు తప్ప మరెవ్వరూ తాకలేరు.” (సూ. వాఖి’అహ్, 56:77-79)
ఇటువంటి అనేక ఆయాతులు ఉన్నాయి. ప్రవక్త (స)పై అవతరించబడే భాగాల్ని వెంటనే కంఠస్తం చేసుకునేవారు. వ్రాసేవారిని పిలిచి వ్రాయించుకునే వారు. ఈ విధంగా 23 సంవత్సరాల్లో ఖుర్‌ఆన్ మొత్తం వ్రాయబడింది. చాలామంది ప్రవక్త అనుచరులు ఖుర్‌ఆన్‌ను కంఠస్తం కూడా చేసు కున్నారు. అబూ బకర్ (ర) కాలంలో కూడా ఖుర్‌ఆన్ సేవ చాలా జరిగింది. ఖుర్‌ఆన్‌ను ప్రచారం చేయడం జరిగింది. ‘ఉమర్, ‘ఉస్మాన్‌ల కాలంలోనూ ఖుర్‌ఆన్ సేవ చాలా జరిగింది. దీన్ని గురించి వివరంగా ‘హదీసు’ల్లో పేర్కొనడం జరిగింది. ఉదాహరణంగా కొన్ని సంఘటనలను మీ ముందు ఉంచుతున్నాం.
‘స’హీ’హ్ బు’ఖారీలో అనస్ (ర) కథనం: ”ప్రవక్త (స) కాలంలో నలుగురు అ’న్సారీలు ఖుర్‌ఆన్‌ను ఒకచోట చేర్చారు. ఉబయ్, ము‘ఆ‘జ్, ‘జైద్ బిన్ సా‘బిత్, అబూ‘జైద్.
అనస్‌ను, ‘అబూ ‘జైద్ ఎవరు,’ అని ప్రశ్నించడం జరిగింది. దానికి, ‘అతడు నా చిన్నాన్న, అబూ ‘జైద్ చేర్చిన ఖుర్‌ఆన్ నాకు వారసత్వంలో లభించింది,’ అని అన్నారు.
అనస్ (ర) చెప్పింది వాస్తవంగా ఒక ప్రశ్నకు సమాధానం, ఇది బు’ఖారీలోని మరో’హదీసు’లో ఉంది. ఖతాదహ్ ‘తాబయీ, అనస్ ‘స’హాబీని, ‘ఒక క్రమంగా మా ముందు ఉన్న ఖుర్‌ఆన్‌ను ప్రవక్త (స) కాలంలో ఎవరెవరు ఒకచోట చేర్చారు?’ అని ప్రశ్నించారు. అనస్, ఖతాదహ్ కు సమాధానం ఇస్తూ, ‘అ’న్సారు ల్లోని నలుగురు వ్యక్తులు, ఉబయ్, ము’ఆజ్, ‘జైద్, అబూ ‘జైద్, ఖుర్‌ఆన్‌ను ఒకచోట చేర్చారు,’ అని అన్నారు.
‘జైద్ తాను వ్రాసిన ఖుర్‌ఆన్‌ను ప్రవక్త (స)కు చివరి రోజుల్లో సమర్పించినట్లు, ‘కితాబుల్ మ‘ఆరిఫ్ లిఇబ్ని ఖుతైబహ్‘ లో వ్రాసి ఉంది. అంటే ‘జైద్ తన చివరికాలంలో తాను వ్రాసిన ఖుర్‌ఆన్‌ను ప్రవక్త (స)కు ఇచ్చారు, వినిపించారు. అది ప్రస్తుతం ఉన్న ఖుర్‌ఆన్‌లా ఉండేది. ‘జైద్ బిన్ సా‘బిత్, ‘ఉమర్ (ర) ఆదేశంపై అబూ బకర్ (ర) కాలంలో ‘ఖలీఫా కొరకు ఖుర్‌ఆన్ వ్రాసారు. ‘ఉమర్ కొరకు కూడా ఒక ప్రతి వ్రాసారు. (ఫత్హ్ అల్ బారి)
ముస్నద్ అ’హ్మద్, సునన్ నసాయి’లో, ‘అబ్దుల్లాహ్ బిన్ ‘అమ్ర్ బిన్ ‘ఆ‘స్ కథనం: ”నేను ప్రవక్త (స) కాలంలో ఖురాన్నంతా ఒకచోట చేర్చాను. ప్రతి రాత్రి అంతా చదివే వాడిని. ఈ వార్త ప్రవక్త (స)కు చేరింది. ప్రవక్త (స) ఒకనెలలో పూర్తి చేయమని ఆదేశించారు.”
‘అబ్దుల్లాహ్ తనకు అంతకంటే ఎక్కువ శక్తి ఉందని విన్నవించుకున్నారు. ప్రవక్త (స) ఇరవై రోజుల్లో పూర్తి చేయమని ఆదేశించారు. ‘అబ్దుల్లాహ్ మళ్ళీ నాకు అంతకంటే ఎక్కువ శక్తి ఉందని అన్నాడు. అయితే పదిహేను రోజుల్లో పూర్తిచేయమని అన్నారు. అతను మళ్ళీ నాకు అంతకంటే ఎక్కువ శక్తి ఉందని అన్నాడు. అయితే పదిరోజుల్లో పూర్తిచేయి అన్నారు. అతను మళ్ళీ నాకు అంతకంటే ఎక్కువ శక్తి ఉందని అన్నాడు. ‘అయితే 7 రోజుల్లో పూర్తిచేయి, అంతకన్నా తక్కువ సమయంలో పూర్తిచేయకు’ అని అన్నారు.
ఈ కథనం ద్వారా కూడా ఖుర్‌ఆన్ ప్రత్యేక క్రమం వ్యక్తమవుతుంది. నెలసరి పూర్తిచేయడం పట్ల ఖుర్‌ఆన్‌ను 30 భాగాలుగా విభజించడం జరిగింది. అదేవిధంగా ప్రతివారం కొంతభాగం నియమించడం జరిగింది. వాస్తవంగా ఇదంతా అల్లాహ్ తరఫు నుండి నిర్ణయించడం జరిగింది.
అబూ’జైద్ (స‘అద్ బిన్ ‘ఉబైద్ బిన్ నో‘మాన్ అ‘న్సారీ) గురించి అసుదుల్ ‘గాబహ్‌లో ఇలా ఉంది. అంటే అ’న్సారుల్లో ఖుర్‌ఆన్‌ను సంకలనం చేసిన వారిలో వీరు మొదటి వారు. ఉబయ్ ఖుర్‌ఆన్‌ను సాధారణరీతిలో వ్రాసారు. ‘ఉస్మాన్ కాలంలో ప్రజలు ఖుర్‌ఆన్‌ను బంగారు, వెండి ద్వారా అలంకరణకు గురిచేసారు. ఇది కన్‌జుల్ ‘అమాల్‌లో ఉంది. అప్పుడు ఉబయ్ చాలా అయిష్టతకు గురయ్యారు. అసహ్యం వ్యక్తంచేస్తూ, ‘మీరు ఖుర్‌ఆన్‌ను వెండి బంగారాల ద్వారా అలంకరించారు. ఇప్పుడు మీ వినాశనం తప్పదు’ అని అన్నారు. ఇబ్నె మస్’ఊద్ ముందు వెండి బంగారాలతో అలంకరించబడిన ఖుర్‌ఆన్ సమర్పించడం జరిగింది. అతను అన్నారు, ‘ఖుర్‌ఆన్ అలంకరణ దాని పఠనంలో ఉంది.’ ‘అబ్దుల్లాహ్ బిన్ మస్’ఊద్ కూడా ఖుర్‌ఆన్ వ్రాసి, ఒకచోట చేర్చిన వారిలో ఒకరు. ‘స’హీ’హ్ బు’ఖారీ బాబు తాలీఫుల్ ఖుర్‌ఆన్‌లో, తాలీఫు ఇబ్నె మస్’ఊద్ ప్రస్తావన ఉంది. ఇబ్నె మస్’ఊద్ శిష్యుల దగ్గర కూడా ఖుర్‌ఆన్ లిఖిత రూపంలో ఉండేది. ‘స’హీ’హ్ ముస్లిమ్లో ఇలా ఉంది: అబుల్ అ’హ్‌వస్ ఇలా అంటున్నారు. ”మేము అబూ మూసా అష్’అరి ఇంట్లో ఇబ్నె మస్’ఊద్ శిష్యుల వద్ద ఉన్నాం. వారు వ్రాయబడి ఉన్న ఖుర్‌ఆన్‌ను చూస్తూ ఉండటం మేము చూసాము.
‘హాఫిజ్ ఇబ్నె కసీ’ర్ ఫ’జాయిలుల్ ఖుర్‌ఆన్‌లో ఇలా వ్రాస్తున్నారు: ”ఇబ్నె మస్’ఊద్ వద్దకు ప్రజలు వస్తే ఖుర్‌ఆన్ విప్పికూర్చుంటారు. ఇబ్నె మస్’ఊద్ వారిని, ‘ఎల్లప్పుడూ ఖుర్‌ఆన్ చూసి చదవండి,’ అని నొక్కి చెప్పేవారు.
ఏది ఏమైనా ఖుర్‌ఆన్‌ను లిఖితరూపం ఇచ్చిన వారిలో 5 గురు వ్యక్తుల పేర్లు పేర్కొనడం జరిగింది. 1. ఉబయ్, 2. ము‘ఆ‘జ్, 3. ‘జైద్, 4. అబూ ‘జైద్, 5. ఇబ్నె మస్’ఊద్. 6వ వ్యక్తి ‘అబ్దుల్లాహ్ బిన్ ‘అమ్ర్ బిన్ ‘ఆ’స్, 7వ వ్యక్తి ‘ఉస్మాన్ (ర), 8వ వ్యక్తి ‘అలీ (ర), 9వ వ్యక్తి సాలిమ్ (ర). వీరు కూడా ప్రవక్త (స) కాలంలో ఖుర్‌ఆన్ వ్రాసారు. గ్రంథరూపంలో చేర్చారు.
ఇ’జాలతుల్ ‘ఖిఫాలో ఇలా ఉంది: ప్రవక్త (స) కాలంలో ముహాజిరీన్లలో నుండి ఖుర్‌ఆన్‌ను ఒకచోట చేర్చిన వారు, 1. ‘ఉస్మాన్ (ర), 2. ‘అలీ (ర), 3. ఇబ్నెమస్’ఊద్, 4. సాలిమ్. ‘అబ్దుల్లాహ్ బిన్ మస్’ఊద్ ఖుర్‌ఆన్‌ను ఒకచోట చేర్చటం వెనుక పేజీలో బు’ఖారీ ఆధారంగా పేర్కొనడం జరిగింది. ‘ఉస్మాన్ (ర) ప్రవక్త (స) కాలంలో ఖుర్‌ఆన్‌ను గ్రంథస్తం చేయడం, ” ‘తబఖాత్ ఇబ్నె స‘అద్, మిఫ్తాహుస్సఆదహ్” లలో పేర్కొనడం జరిగింది.
‘ఉస్మాన్ (ర), ప్రవక్త (స) కాలంలో ఖుర్‌ఆన్‌ను ఒకచోట చేర్చారు. అదేవిధంగా ‘సవాయిఖు ముహ ర్రిఖహ్ / క్రీ.శ. సం. 69 మరియు తారీఖుల్ ‘ఖులఫా మిస్రీలో కూడా పేర్కొనబడి ఉంది. ‘ఉస్మాన్ (ర) తాను చదవటానికి ఖుర్‌ఆన్‌ను తన చేతులతో వ్రాసు కున్నారు. ద్రోహులు అతన్ని చంపినపుడు అతని చేతిని నరికివేసారు. ఆయన ఆ చేయి పైకెత్తి, ‘అందరి కంటే ముందు ఖుర్‌ఆన్ వ్రాసిన చేయి ఇది’ అని అన్నారు. (ఫజాయిల్ ఖుర్‌ఆన్ ఇబ్నె కసీ’ర్ 49-50 పేజీలు) ‘హాఫిజ్ ఇబ్నె కసీ’ర్ ఇలా పేర్కొన్నారు: ”ఆ సమయంలో ‘ఉస్మాన్ (ర) తనముందు ఉంచుకొని చదువుతున్నది తనచేత్తో వ్రాసిన గ్రంథమే. (ఫజాయిలుల్ ఖుర్‌ఆన్ ఇబ్నె కసీ’ర్ పేజీ-50) హిజ్రీ 8వ శతాబ్దానికి చెందిన ఇబ్నె కసీ’ర్ తన జీవితంలో దమిష్క్ నగరంలోని జామె మస్జిద్‌లో దీన్ని ప్రదర్శించారు.
‘అలీ (ర) ఖుర్‌ఆన్ ఒకచోట చేర్చారనే విషయం ఫత్’హుల్ బారీలో కూడా ఉంది. ‘స’హీ’హ్ బు’ఖారీలో ‘అలీ (ర) కథనం ఇలా ఉంది, ”అంటే ఖుర్‌ఆన్‌ను మేము ప్రవక్త (స) నుండి విని వ్రాసుకున్నాము. ‘సవా‘యిఖు ముహర్రిఖహ్‘ లో కూడా ‘అలీ (ర) గురించి ఇలా ఉంది, ” ‘అలీ(ర) ఖుర్‌ఆన్‌ను ఒకచోట చేర్చి ప్రవక్త(స)కు ఇచ్చారు.” అదేవిధంగా సూయూ’తీ, ”తారీఖుల్ ‘ఖులఫా”లో పేర్కొన్నారు. ‘అలీ (ర) గురించి ఇది కూడా వ్రాసి ఉంది. ‘అలీ (ర) పలకపై ఖుర్‌ఆన్ వ్రాయడం ఇష్టపడేవారు కారు. కన్’జుల్ ‘అమాల్‌లో ఇలా ఉంది: ” ‘అలీ దాన్ని అసహ్యించుకునేవారు. అంటే ఖుర్‌ఆన్‌ను చిన్న వస్తువుపై వ్రాయడమనేది. దీనివల్ల ఖుర్‌ఆన్ ఒక చిన్న పుస్తకం అనిపిస్తుంది. ఈ విధంగా ‘ఉమర్ (ర) కూడా అసహ్యించుకునే వారు.
ఖుర్‌ఆన్‌కు లిఖిత రూపం ఇచ్చిన 9మంది ప్రవక్త (స) అనుచరుల గురించి ప్రస్తావించడం జరిగింది. 10వ వ్యక్తి అబూ అయ్యూబ్ అ‘న్సారీ, 11వ వ్యక్తి ‘ఉబాదా బిన్ సా‘మిత్, 12వ వ్యక్తి అబూ దర్దా (ర) ఉన్నారు.
అంటే ప్రవక్త (స) కాలంలో ఖుర్‌ఆన్‌కు గ్రంథరూపం ఇచ్చిన అన్సారుల్లో, 1. అబూ అయ్యూబ్, 2. ‘ఉబాదహ్, 3. అబూ దర్‌దా’, 4. ఉబయ్ బిన్ క’అబ్ మొదలైన ప్రముఖులు.
13వ అనుచరుడు నా’జియహ్ త’గావీ. తబ్‌రానీలో నా’జియహ్ ఖుర్‌ఆన్ వ్రాసేవారని ఉంది. 14వ వ్యక్తి ప్రఖ్యాత అరబ్ కవి, లబీద్ బిన్ రబీ’అహ్ ‘ఆమిరీ. ఇతని పద్యం ప్రఖ్యాత పుస్తకం ‘సబ్‌అహ్ ము‘అల్లఖహ్‘ లో ఉంది. వీరిని గురించి ఇలా ఉంది, ”ప్రవక్త (స) కాలంలో లబీద్, ఇస్లామ్ స్వీకరించిన తర్వాత కవిత్వాన్ని వదలివేసాడు. ఎల్లప్పుడూ ఖుర్‌ఆన్‌నే వ్రాసేవాడు. 15వ వ్యక్తి ‘ఉఖ్‌బహ్ బిన్ ‘ఆమిర్ జుహ్‌నీ. తహ్’జీబుత్తహ్’జీబ్‌లో ఇలా ఉంది, ‘ప్రవక్త (స) కాలంలో ‘ఉఖ్‌బహ్ ఖుర్‌ఆన్ ఒక చోట చేర్చారు. తన చేత్తో రాసారు. అతను రాసిన ఖుర్‌ఆన్ ఈజిప్టులో (‘హాఫిజ్ బిన్ ‘హజర్) వరకు ఉండేది. 16వ వ్యక్తి, ఉమ్మె సలమహ్ (ర.అ.) ఉమ్ముల్ ముఅ’మినీన్. ‘అబ్దుల్లాహ్ బిన్ నా’ఫె ” ఉమ్మె సల మహ్ నన్ను, తన కోసం ఒక ఖుర్‌ఆన్ వ్రాసి ఇవ్వవలిసిందిగా ఆదేశించారు” అని అన్నారు.
17వ వ్యక్తి ‘హఫ్’సహ్ (ర.అ.). కన్‌జుల్ అమాల్‌లో ఇలా ఉంది, ” ‘హఫ్‌సహ్ (ర) తన బానిసను, అబూ బకర్ సిద్దీఖ్ పరిపాలనా కాలంనాటి ఖుర్‌ఆన్ ను కాపీ చేయటానికి ఇచ్చారు అని నా’ఫె తెలిపారు.
18వ వ్యక్తి ‘ఆయి‘షహ్ (ర.అ.). ‘స’హీ’హ్ ముస్లిమ్లో ఇలా ఉంది, ” ‘ఆయి’షహ్ (ర.అ.), యొక్క బానిస అబూ యూనుస్ కథనం, ”నన్ను ‘ఆయి’షహ్ (ర) ఆమె కోసం ఒక ఖుర్‌ఆన్ వ్రాయమని ఆదేశించారు. ఆ ఖుర్‌ఆన్‌ను ముందు ఉంచుకొని ఆమె మరో బానిస జ’క్‌వాన్ నమా’జు చదివించే వారు. నమా’జులో ఖుర్‌ఆన్ చూచి చదివేవారు.” అయితే ‘స’హీ’హ్ బు’ఖారీలో ఇలా ఉంది, ” ‘ఆయి’షహ్ (ర.అ.) బానిస జ’క్‌వాన్ ఖుర్‌ఆన్ చూసి ‘ఆయి’షహ్ (ర.అ.) యొక్క ఇమామ్‌గా నమా’జు చదివించేవారు. (కన్‌జుల్ ‘అమాల్ 237/1)
హిషామ్ కథనం, ”నేను నా తండ్రి (ఉర్వ) యొక్క పిన్నిగారైన ‘ఆయి’షహ్(ర.అ.) యొక్క ఖుర్‌ఆన్‌లో చూచి చదివాను. ఆ ఖుర్‌ఆన్‌ను చూడటానికి, ఒక వ్యక్తి ఇరాఖ్ నుండి ప్రయాణం చేసి మదీనహ్ వచ్చారు దాన్ని కాపీ చేయాలని. అయితే ‘స’హీ’హ్ బు’ఖారీలో ”ఇరాఖ్ నుండి వచ్చిన ఆ వ్యక్తి ‘ఆయి’షహ్‌తో ”ఓ తల్లిగారూ! నాకు మీ ఖుర్‌ఆన్ ఇవ్వండి, దాన్ని కాపీ చేసుకుంటాను” అని అన్నాడు. ఇరాఖియే ఎందుకు? సిరియా నుండి కూడా ప్రజలు ఖుర్‌ఆన్ కాపీ చేసుకోవడానికి వచ్చేవారు, సిరియా నుండి ఒక బృందం తమకోసం ఖుర్‌ఆన్ వ్రాసుకోవడానికి మదీనహ్ వచ్చారు. అయితే ఇంతకు 18 మంది అయిపోయారు,
19వ వ్యక్తి మొదటి ఖలీఫా అబూ బకర్ (ర). ఇతను ‘జైద్ బిన్ సా’బిత్ ద్వారా ఖుర్‌ఆన్ వ్రాయించారు. ఫత్’హుల్ బారీ, ‘స’హీ’హ్ బు’ఖారీలో ఉంది. ‘జైద్ కథనం, ”అబూ బకర్ (ర) నన్ను ఖుర్‌ఆన్ వ్రాయమని ఆదేశించారు. నేను వ్రాసాను. ఈ ప్రతి అబూ బకర్ వద్ద అతని మరణసమయం వరకు ఉంది. ఆ తరువాత ‘ఉమర్ వద్ద అతని మరణం వరకు ఉంది. ఆ తరువాత అతని కుమార్తె ‘హఫ్’సహ్ వద్ద ఉండేది. ఈ ప్రతి నుండే ‘హఫ్’సహ్ తన బానిస ద్వారా కాపీ చేయించారు. ఈ ప్రతినే ‘హఫ్’సహ్ (ర) దగ్గర నుండి ‘ఉస్మాన్ (ర) తెప్పించి అనేక ప్రతులు వ్రాయించారు.
20వ వ్యక్తిత్వం రెండవ ఖలీఫహ్ ‘ఉమర్ (ర). వీరు ‘జైద్ ద్వారా తన కోసం వేరుగా వ్రాయించారు. ఫత్’హుల్ బారీలో ఇలా ఉంది, ”అబూ బకర్ (ర) మరణించిన తర్వాత ‘ఉమర్ ఖలీఫహ్ అయ్యారు. నేనతని కోసం ఖుర్‌ఆన్ వ్రాసాను. ‘జైద్ ప్రత్యేకంగా ‘ఉమర్ (ర) కొరకు వ్రాసారు. దీనినే కన్‌జుల్ ‘అమాల్ లో ఇలా ఉంది. ఈ ప్రతి ద్వారానే ‘ఉమర్ పఠించే వారు. ఇబ్నె ‘అబ్బాస్ కథనం, ” ‘ఉమర్ (ర) తన ఇంటిలో ప్రవేశించినపుడు ఖుర్‌ఆన్ తెరచి చదివేవారు. అంతేకాదు వ్రాయబడి ఉన్న ఖుర్‌ఆన్‌ను చూచి సంతోషించేవారు. ‘ఉమర్ ఒక వ్యక్తి వద్ద వ్రాసి ఉన్న ఖుర్‌ఆన్‌ను చూసారు. ఇలా చూసినపుడు సంతోషించేవారు. ఖలీఫా సంతోషం ఖుర్‌ఆన్ చూచి పఠించాలని ప్రోత్సహించటం గల ‘హదీసు’ల వల్ల అనేక ఖుర్‌ఆన్ ప్రతులు వ్రాయబడ్డాయి. సర్వ సాధారణంగా బజారుల్లో అమ్మకం కాసాగాయి. కొంత మంది ఖుర్‌ఆన్ ప్రియులకు దీనివల్ల చాలా బాధ కలిగింది. హం’జల ఇలా అంటున్నారు, ”నేను ‘తావూస్ వెంట బజారుకు వెళ్ళాను. అక్కడ ప్రజలు ఖుర్‌ఆన్ అమ్ముతున్నారు, కొంటున్నారు. అది చూచి ‘తావూస్, ‘ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజివూన్,‘ అని పలికారు. చివరికి ‘తావూస్ గురువు ఇబ్నె ‘అబ్బాస్‌ను ప్రశ్నించడం జరిగింది. ఇబ్నె ‘అబ్బాస్‌ను ఖుర్‌ఆన్ అమ్మడాన్ని, కొనడాన్ని గురించి ప్రశ్నించడం జరిగింది. దానికి అతను, ‘ఎలాంటి అభ్యంతరం లేదు,’ అని అన్నారు.
అదేవిధంగా ఇబ్నె ‘అబ్బాస్‌ను ఖుర్‌ఆన్ వ్రాయ టానికి పారితోషికం గురించి ప్రశ్నించడం జరిగింది. దానికతను, ‘ఎటువంటి అభ్యంతరం లేదు,’ అని అన్నారు. ఫలితంగా ఖుర్‌ఆన్ ప్రతులు చాలా అధికం కాసాగాయి. అనేక దేశాల్లో ఖుర్‌ఆన్ ప్రతులు లెక్క పెట్టటం కూడా కష్టం అయిపోయింది. ఇబ్నె హ’జ్మ్ కితాబుల్ ముఫస్సల్‌లో ఇలా వ్రాస్తున్నారు. ఈజిప్టు నుండి ‘ఇరాఖ్ వరకు, షామ్ నుండి యమన్ వరకు వివిధ దేశాల్లో ‘ఉమర్ (ర) మరణ సమయంలో లక్షకు పైగా ప్రతులు ఉన్నాయి. ఏది ఏమైనా ప్రవక్త (స) కాలంలో ఖుర్‌ఆన్‌ను వ్రాసే, ఒకచోట చేర్చే వారి సరైన సంఖ్య అల్లాహ్‌కే తెలియాలి. ఐనీ బు’ఖారీ వివరణలో ఇలా వ్రాస్తున్నారు. ప్రవక్త (స) కాలంలో ఖుర్‌ఆన్‌ను ఒకచోట చేర్చిన వారిని మనం లెక్కపెట్టలేము. 20 వ్యక్తుల గురించి పైన పేర్కొన్నాము. ‘అబ్దుల్లాహ్ బిన్ ‘హారిస్’ పేరు కూడా కొన్ని గ్రంథాలు వ్రాసారు. ఖ’తీబ్ బ’గ్‌దాదీ సా’బిత్ బిన్ బషీర్ బిన్ అబీ ‘జైద్ పేరు కూడా పేర్కొన్నారు. మిగిలిన వారి పేర్లు, సంఖ్య అల్లాహ్‌కే తెలుసు. పై వివరాల వల్ల ప్రవక్త (స) కాలంలో ఖుర్‌ఆన్ వ్రాయడం జరిగింది. ప్రజలు చూచి ఖుర్‌ఆన్ చదివేవారు అని తెలిసింది.
—–
ఖుర్‌ఆన్ చూచి పఠించే మహత్యం
ఖుర్‌ఆన్‌ను చూచి పఠించటానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ప్రవక్త (స) ఖుర్‌ఆన్‌ను చూచి పఠించండి. దీనికి సంబంధించిన కొన్ని ‘హదీసు’లను క్రింద పేర్కొనడం జరిగింది. కొంచెం వీటిపై దృష్టి సారించండి. ప్రవక్త అనుచరులను ఖుర్‌ఆన్‌ను చూచి చదవమని ఆదేశించడం జరిగింది. వీటిని గురించి పుణ్య వాగ్దానాలు కూడా చేయబడ్డాయి. దీన్ని గురించి అనేక ‘హదీసు’లు ఉన్నాయి. అబూ స’యీద్ కథనం, ”చూచి చదవటం, దాన్ని అధ్యయనం చేయటం, ఆలోచించటం కూడా ఆరాధనే. (బైహఖీ).
అబూ మస్’ఊద్ (ర) కథనం, ”ప్రవక్త (స) ప్రవచనం, అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త (స)ను ప్రేమించా లనుకున్న వారు ఖుర్‌ఆన్‌ను చూచి చదవండి.” (జామిస్స’గీర్, కన్’జుల్ ‘అమాల్). ‘అదస్ అస్స’ఖఫీ (ర) కథనం, ”ఇతను ప్రవక్త (స) అనుచరుల నుండి ఖుర్‌ఆన్ ఏడు మన్‌జిల్‌లు తెలుసుకున్నారు. ఇంకా ప్రవక్త (స) నుండి ఇలా విన్నారు, ”ప్రవక్త (స) ఖుర్‌ఆన్‌ను చూడకుండా చదవటం వల్ల వెయ్యి పుణ్యాలు లభిస్తాయి. మరియు ఖుర్ఆన్‌ను చూచి చదివితే రెండువేల పుణ్యాలు లభిస్తాయని అన్నారు. (బైహఖీ)
అదస్ కుమారులు ‘అమ్ర్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”విధి నమా’జులకు అదనపు నమా’జులపై ప్రాధాన్యత ఉన్నట్టు ఖుర్‌ఆన్‌ను చూచి చదవటాన్ని ఖుర్ఆన్‌ను చూడకుండా చదవటంపై ప్రాధాన్యత ఉంది. (ఇబ్నె కసీ’ర్)
‘ఉబాదహ్ బిన్ సా’మిత్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”నా అనుచర సమాజంలోని ఉత్తమ ఆరాధన ఖుర్‌ఆన్ చూచి చదవటం.
ప్రవక్త (స) ప్రవచనం, ”ఖుర్‌ఆన్‌ను ఎల్లప్పుడూ చూచి పఠించేవాడు జీవించి ఉన్నంత వరకు అతని చూపు సురక్షితంగా ఉంటుంది. అంటే ఎటువంటి వ్యాధికి గురికాడు. (ముస్నద్ అ’హ్మద్)
ప్రవక్త (స) ప్రవచనం, ”ఎవరైనా ముస్లిమ్ ఖుర్‌ఆన్ ప్రారంభం నుండి చివరివరకు చూచి చదివితే, అతని కోసం అల్లాహ్ (త) స్వర్గంలో ఒక చెట్టును నాటుతాడు.” సుబ్హానల్లాహ్. అందువల్లే ‘అబ్దుల్లాహ్ బిన్ ‘ఉమర్ ప్రజలతో ”మీరు ఇంట్లో ప్రవేశిస్తే అన్నిటికంటే ముందు ఖుర్‌ఆన్ పఠించండి. ఆ తరువాత ఇతర పనులు చూసుకోండి. ఇబ్నె ‘ఉమర్ కూడా ఇలాగే చేసేవారు. (ఇబ్నె కసీర్)
ఖసీమహ్ కథనం, ”నేను ఇబ్నె ‘ఉమర్ వద్దకు వెళ్ళాను. అతను ఖుర్‌ఆన్ తెరచి చదువు తున్నారు. అతని తండ్రి ‘ఉమర్ (ర) కూడా ఇలాగే చేసేవారు. (ఫజాయిలుల్ ఖుర్‌ఆన్). అబూ హురైరహ్ (ర) కథనం, ప్రవక్త (స) ప్రవచనం, ”ఇంట్లో ఉన్నా చదవబడని ఖుర్‌ఆన్ చాలా దీనస్థితిలో ఉంది. (కన్‌జుల్’అమాల్). ప్రవక్త(స) ప్రవచనం, ”విశ్వాసి చని పోయిన తర్వాత అతని సత్కార్యాలవల్ల పుణ్యం లభించే వాటిలో ధర్మజ్ఞానం ఒకటి. దాన్ని వ్రాపించాడు లేదా ఖుర్ఆన్ తన వారసునికి వదలి వెళ్ళాడు. (ఇబ్నె మాజహ్, జామిఉస్స’గీర్)
ఆలోచించండి! ప్రవక్త(స) తన అనుచరులకు ఖుర్‌ఆన్‌ను ఇంట్లో ఉంచమని దాన్ని చూచి చదవమని వారసులకు వదలి వెళ్ళమని గ్రుచ్చి మరీ చెప్పారు. అనుచరులందరి వద్ద కాకపోయినా కనీసం ప్రతి ఇంటిలో ఒక్కొక్క ప్రతి ఉండి ఉంటుంది. ఉండేది, వారినోటే వినండి. అనుచరుల వద్ద వ్రాయబడి ఉన్న ఖుర్‌ఆన్ ప్రతులు ఉండేవి. వాటి ద్వారా మనం నేర్చుకున్నాం. మా సంతానానికి, బానిసలకు, సేవకులకు నేర్పించాము. వారి పిల్లలు కూడా ఖుర్‌ఆన్ చూచి చదివేవారు. (ముస్నద్ అ’హ్మద్).
ఒక అనుచరుడు తన కొడుకును తీసుకొని ప్రవక్త (స) వద్దకు వచ్చారు. ‘నా ఈ కొడుకు పగలు ఖుర్‌ఆన్ చదువుతున్నాడు,’ అని అన్నాడు. దానికి ప్రవక్త (స), ‘ఇతడు కూడా జా’కిరుల్లాహ్,’ అన్నారు. అంటే అల్లాహ్‌ను ప్రార్థించేవాడు. (ఫ’జాయిలుల్ ఖుర్‌ఆన్). ప్రవక్త అనుచరులు ఎంత అధికంగా ఖుర్‌ఆన్‌ను వ్రాయడం, వ్రాయించడం, చదివించడం చేసారంటే, ప్రవక్త (స) వీరు వ్రాయబడిన ఖుర్‌ఆన్‌పైనే ఎక్కడా ఆధారపడి ఉండిపోతారని, దాన్ని కంఠస్తం చేయడం ఎక్కడ మానివేస్తారనే భయం వేసింది. ప్రవక్త (స) వారి ఇళ్ళల్లో వ్రాసి ఉన్న ఖుర్‌ఆన్‌ను చూచి మీ ఇళ్ళల్లో ఉన్న ఖుర్‌ఆన్‌లు కంఠస్తం చేయకుండా మిమ్మల్ని ఏమరు పాటుకు గురిచేయకూడదు సుమా! ఎందుకంటే ఎవరి హృదయంలో ఖుర్‌ఆన్ కంఠస్తం చేసిఉంటే అతనికి అల్లాహ్(త) నరకంలో వేయడు.” అంటే ప్రవక్త (స) కాలంలో అనుచరులు అనేక ఖుర్‌ఆన్ ప్రతులు వ్రాసిపెట్టారు అని తెలిసింది.
ఖుర్‌ఆన్ పఠనం నియమాలు: ఖుర్‌ఆన్ ప్రతులు పుస్తకరూపంలో చాలా అధికంగా తయారయ్యాయి. ప్రవక్త (స) తరఫున వాటి నియమనిబంధనలు తెలియపర్చటం కూడా తప్పనిసరి అయింది. ‘హకీమ్ బిన్ ‘హి’జామ్ కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఖుర్‌ఆన్‌ను పరిశుద్ధావస్థలో ముట్టుకోవాలి. ఈ ఆదేశం పుస్తక రూపం కొరకు తప్పనిసరి. ఈ ఆదేశం అందరికీ వర్తిస్తుంది. ఎందుకంటే ముట్టుకునే దానికి పరిశుద్ధత చాలా అవసరం. ఈ ఆదేశాన్ని అందరికీ అన్ని దేశాలకు పంపడం జరిగింది. యమన్‌కు పంపబడిన ‘అమ్ర్ బిన్ ‘హజ్మ్‌ను ప్రవక్త(స) ఇచ్చిన ఆదేశాల్లో ఈ ఆదేశం కూడా చేరి ఉంది. అంటే ఖుర్ఆన్ను పరిశుద్ధవ్యక్తి మాత్రమే ముట్టుకోవాలి. అంటే యమన్ ప్రజల వద్ద కూడా ఖుర్‌ఆన్ ప్రతులు చాలా అధికసంఖ్యలో ఉండేవన్నమాట.
అదేవిధంగా మరో నియమం ఏమిటంటే, ప్రవక్త (స) ప్రవచనం, ”శత్రుదేశాల్లో ఖుర్‌ఆన్ తీసుకొని ముస్లిములు వెళ్ళరాదు. (బు’ఖారీ)
‘స’హీ’హ్ ముస్లిములో ఇలా అధికంగా ఉంది. ”శత్రువులు దాన్ని తీసుకొని దాన్ని అవమాన పరుస్తారు. అంటే శత్రువుల చేతుల్లోకి పోయేది ఖుర్‌ఆన్ ప్రతులే. ఖుర్‌ఆన్ తీసుకొని శత్రుదేశాలకు వెళ్ళరాదని ఎందుకు వారించారు? హృదయాల్లో ఉన్నది వారు ఏమీ చేయలేరు. అందువల్లే బు’ఖారీ పై ‘హదీసు’ తర్వాత ఇలా పేర్కొన్నారు, ”ప్రవక్త (స) ఆయన అనుచరులు ఖుర్‌ఆన్ వారి హృదయాల్లో ఉన్న స్థితిలో ప్రయాణం చేసేవారు. అంటే వారు ఖుర్‌ఆన్ కంఠస్తం చేసి ఉండేవారు. ఈ సాక్ష్యాధారాల వల్ల స్పష్టంగా తెలిసిన విషయం ఏమిటంటే, ప్రవక్త (స) కాలంలో అనేక ఖుర్‌ఆన్ ప్రతులు ప్రవక్త (స) అను చరుల వద్ద ఉండేవని తెలుస్తోంది. వారు ఆ ప్రతుల ద్వారా చూచి పఠించేవారు. అంటే ఖుర్ఆన్ ఈ నాడు ఏ క్రమంలో ఉందో ఆ క్రమంలోనే ప్రవక్త (స) కాలంలోనూ ఉండేది. ఈ క్రమంగానే వారు చదివేవారు, పఠించేవారు, కంఠస్తం చేసేవారు. ఇమామ్ మాలిక్ ఇలా అంటున్నారు, ”ప్రవక్త (స) అనుచరులు ప్రవక్త (స) నుండి విన్నవిధంగా ఖుర్‌ఆన్ ఉంది.” నవవీ ఇలా వ్రాస్తు న్నారు, ”అంటే ఖుర్‌ఆన్ ఆనాడు ప్రవక్త (స) కాలంలో సంకలనం చేయబడిన క్రమంలోనే ఈనాడూ ఉంది.”
‘అలీ (ర) ఇలా పేర్కొన్నారు. ఖుర్‌ఆన్ ప్రవక్త (స) కాలంలోనే సంకలనం చేయబడింది. ఒకచోట చేర్చ బడింది. (తవాతురుల్ ఖుర్‌ఆన్). ప్రవక్త (స) అనుచరులవద్ద ఖుర్ఆన్ ప్రతులు అధిక సంఖ్యలో ఉన్నప్పుడు, ప్రవక్త (స) వద్ద పరిపూర్ణ ప్రతి ఉండదంటారా? తప్పకుండా ఉండి ఉంటుంది. బు’ఖారీ దీన్ని గురించి ఒక ప్రత్యేక అధ్యాయాన్నే ఏర్పాటు చేసారు. ప్రవక్త (స) పరిపూర్ణ ఖుర్‌ఆన్‌ను రెండు సంపుటాల్లో వదలివెళ్ళారు.
‘హాఫి”జ్ ఇబ్నె ‘హజర్, ఫత్’హుల్ బారీలో ఒకచోట ఇలా పేర్కొన్నారు, ”ఖుర్‌ఆన్ చర్మ ప్రతులపై వ్రాయబడి ఉండేది. రెండువైపుల కవరు పేజీలు ఉండేవి.
‘స’హీ’హ్ ముస్లిమ్లో ఇలా ఉంది. నేను ఖుర్‌ఆన్ చదివాను. అది రెండు పలకల మధ్య ఉండేది. సహీ బు’ఖారీలోని ఉల్లేఖన సాక్ష్యాధారం వంటిది. అంటే ప్రవక్త (స) ఖుర్‌ఆన్‌ను పరిపూర్ణస్థితిలో, రెండు పలకల మధ్య బైండింగు రూపంలో వదలివెళ్ళారు. దాన్ని గురించే మరణ సమయంలో ఇలా అన్నారు, ”అంటే నేను మీ మధ్య రెండు వస్తువులను వదలి వెళ్తున్నాను. అవి ఉండగా మీరు మార్గభ్రష్టతకు గురికారు. అవి, ఖుర్ఆన్, నా సాంప్రదాయం.”
ఒక సందేహ పరిష్కారం: పై ఉల్లేఖనాల్లో జమ్‌ఉల్ ఖుర్‌ఆన్, లేక అజ్‌మఉల్ ఖుర్‌ఆన్ అనేవి వచ్చాయి. వీటిని గురించి కొన్ని సందేహాలు వెలిబుచ్చడం జరిగింది. అంటే కంఠస్తం చేయడమా లేక లిఖిత రూపం ఇవ్వడమా? అని. దీనికి సమాధానం ఏమిటంటే ఖుర్‌ఆన్ కంఠస్తం చేసిన సహచరులు ఇంచుమించు అందరూ ఉన్నారు. మ‘అవనహ్ బావి వద్ద హతమార్చబడిన 70 మంది అనుచరులు ఖుర్‌ఆన్ కంఠస్తం చేసినవారే. అదేవిధంగా యమామహ్ యుద్ధం లో 70 మంది సహచరులు హతమార్చబడ్డారు. వీరు కూడా ఖుర్‌ఆన్ కంఠస్తంచేసి ఉన్నవారే. వీరేకాక ప్రవక్త (స) కాలంలో సజీవంగా ఉన్న సహచరుల్లో 30 మంది పేర్లు, ”ఫత్‌హుల్ బారీ”లో ఉన్నాయి. అనుచరులు ప్రవక్త (స) ద్వారా ఈ శుభవార్తను విని ఉన్నారు. ”ప్రవక్త (స) ప్రవచనం, ”ఎవరి హృదయంలో ఖుర్‌ఆన్ సురక్షితంగా ఉంటే అతన్ని అల్లాహ్ (త) నరకాగ్నికి గురిచేయడు.” ప్రవక్త(స) ఇలా ప్రవచించారు, ”ముస్లిము శరీరంలో అంటే హృదయంలో ఖుర్‌ఆన్ ఉంటే అతన్ని నరకాగ్ని కాల్చదు.
అటువంటప్పుడు ఏ అనుచరుడు కంఠస్తం చేయ కుండా ఎలా ఉండగలడు? అందువల్ల పై ఉల్లేఖనాల్లో చేర్చటం అంటే లిఖిత రూపంలో చేర్చటం అనే అర్థం. కొన్నికథనాల్లో పుస్తక రూపం గురించి స్పష్టంగా ఉంది. ‘హాకిమ్ కథనంలో ”మేము ఖుర్‌ఆన్‌ను లిఖిత రూపం లో వ్రాసి ఒకచోట చేర్చేవారం. ఈ పేజీల నుండే, ‘జైద్ అబూబకర్ కాలంలో మరోప్రతి తయారుచేసారు. ‘స’హీహ్ బు’ఖారీలో ఇలా ఉంది, ”పై కథనాల్లో ఒకచోట చేర్చటం అంటే వ్రాయడం అని అర్థం. ఇది సహచరుల కంఠస్థానికి ఎటువంటి వ్యతిరేకం కాదు. అయితే వీరు ఖుర్‌ఆన్ కంఠస్తం కూడా చేసేవారు. వ్రాసి కూడా ఉంచేవారు.
జమ్’ఉ ‘ఉస్మాన్ వాస్తవికత: ‘ఉమర్ మరణ సమయంలో సుమారు ఒక లక్ష ఖుర్‌ఆన్ ప్రతులు మదీనహ్ అన్ని వైపులా వ్రాయబడి వ్యాపించి ఉన్నాయి. అని పైన పేర్కొనడం జరిగింది. మరి ‘ఉస్మాన్‌ను జామి’ఉ ఖుర్‌ఆన్ ఎందుకు అంటారు? ఒకవేళ వారు ప్రవక్తకాలంలో తన కోసం ఖుర్‌ఆన్ ప్రతిని ఒకచోట చేర్చి వ్రాసారు అని మిఫ్‌తాహుస్సాదహ్, ఇజా’లతుల్ ‘ఖిఫా పేర్కొన్నట్లు అంటే ఈ విషయంలో అతని స్థానం ఏమిటి? అలా అయితే చాలామంది అనుచరులు ఈ విధంగానే ఒకచోట చేర్చి వ్రాసారు. అసలు విషయం ఏమిటంటే వ్రాసే విధానం, ఉచ్చారణ అందరివి వేరుగా ఉండేవి. అందువల్ల ఉచ్చారణ అనేక విధాలుగా ఉండేది. ఈ విభేదాలను దూరం చేయడానికి ‘ఉస్మాన్ తన పరిపాలనా కాలంలో ఒకే లిఖిత, ఉచ్చారణ విధానంపై అన్నిటినీ చేరవేసారు. దీన్ని గురించి, ‘హాఫిజ్ ఇబ్నె కసీ’ర్ ”కితాబు ఫ’జాయిలుల్ ఖుర్‌ఆన్‌లో ఇలా పేర్కొన్నారు,” ‘ఉస్మాన్ (ర) ప్రజలను ఒకే ఉచ్చారణపై చేర్చారు. దీనివల్ల ఖుర్‌ఆన్ పఠంనలో వ్యత్యాసం రాకూడదని. అందువల్లే అతన్ని జామి’ఉన్నాస్ ఇలా హాజ’ల్ ఖుర్‌ఆన్” అని అనవచ్చు. కాని ”జామి’ఉ ఖుర్‌ఆన్” కాదు. హారిస్ ముహాసిబీ ఇలా అంటున్నారు, ”’ఉస్మాన్ ఖుర్‌ఆన్‌ను ఒకచోట చేర్చారని ప్రజల్లో వ్యాపించింది. కాని వాస్తవం అది కాదు. వాస్తవం ఏమిటంటే ‘స’హీ’హ్ బు’ఖారీలో ఇలా ఉంది, ” ‘ఉస్మాన్ ‘జైద్ బిన్ సా‘బిత్ మరియు కొంతమంది గుమాస్తాలను పిలిచి ‘హఫ్’సహ్కు అబూ బకర్ (ర) వద్ద ఉన్న ఖుర్‌ఆన్ ఇవ్వవలసిందిగా, దాని ద్వారా అనేక ప్రతులు చేయిస్తానని సందేశం పంపారు. ‘జైద్ మరియు ఇతర గుమాస్తాలు అనేక ప్రతులు వ్రాసారు. అవి తయారైన తర్వాత ‘ఉస్మాన్ వాటిని అన్ని వైపులా పంపించారు. (ఫత్’హుల్ బారీ)
ఈ ఉల్లేఖనవల్ల మిట్ట మధ్యాహ్నం సూర్యుడిలా ‘ఉస్మాన్ (ర) అబూ బకర్ వద్ద ఉన్న ఖుర్‌ఆన్ ప్రతులను తయారు చేయించారు. కాని ఒక చోట చేర్చలేదు. అంటే అబూ బకర్ ప్రతి నుండి ‘ఉస్మాన్ ప్రతి వచ్చింది. మరి అబూ బకర్ ప్రతి వచ్చింది… ప్రవక్త (స) తన ఖుర్‌ఆన్‌ను వదలివెళ్ళారు. దీని క్రమం అంతా అల్లాహ్ ప్రేరణే. ఇది అల్లాహ్ (త) తరఫు నుండి వచ్చిందే. ప్రవక్త (స)కు ఇది కంఠస్తం ఉండేది. దాన్ని ప్రవక్త (స) ఏడు భాగాలుగా విభజించారు. దీన్ని గురించి వివరంగా పేర్కొనడం జరిగింది. అందువల్ల సారాంశం ఏమిటంటే ఇప్పుడు మన చేతుల్లో ఉన్నది ఆనాడు ప్రవక్త (స) చేతుల్లో ఉన్న ఖుర్‌ఆన్ మాత్రమే. అల్లాహ్ (త) ప్రవక్త (స)పై అవతరింపజేశాడు. ప్రవక్త (స) పఠించిన క్రమంలోనే ఖుర్‌ఆన్ ఉన్నది. ప్రవక్త (స) సహచరులను కంఠస్తం చేయించారు, వ్రాయించారు. (జమ్‌ఉల్ ఖుర్‌ఆన్ వల్ అ’హాదీస్’)
اَلْفَصْلُ الْأَوَّلُ మొదటి విభాగం
2211 – [ 1 ] (مُتَّفَقٌ عَلَيْهِ) (1/677)
وَعَنْ عُمَرَ بْنِ الْخَطَّابِ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: سَمِعْتُ هِشَامَ بْنَ حَكِيْمِ بْنِ حِزَامٍ يَّقْرَأُ سُوْرَةَ الْفُرْقَانِ عَلَى غَيْرِ مَا أَقْرَؤُوْهَا. وَكَانَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم أَقْرَأَنْيِهَا فَكِدْتُّ أَنْ أَعْجَلَّ عَلَيْهِ ثُمَّ أَمْهَلْتُهُ حَتَّى انْصَرَفَ ثُمَّ لَبَّبْتُهُ بِرِدَائِهِ فَجِئْتُ بِهِ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم. فَقُلْتُ يَا رَسُوْلَ اللهِ إِنِّيْ سَمِعْتُ هَذَا يَقْرَأُ سُوْرَةَ الْفُرْقَانِ عَلَى غَيْرِ مَا أَقْرَأَتَنِيْهَا. فَقَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: أَرْسِلْهُ اقْرَأْ. فَقَرَأَ الْقِرَاءَة الَّتِيْ سَمِعْتُهُ يَقْرَأُ. فَقَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “هَكَذَا أُنْزِلَتْ”. ثُمَّ قَالَ لِيْ: “اقْرَأْ”. فَقَرَأْتُ. فَقَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “هَكَذَا أُنْزِلَتْ إِنَّ الْقُرْآنَ. أُنْزِلَ عَلَى سَبْعَةِ أَحْرُفٍ فَاقْرَءُوْا مَا تَيَسَّرَ مِنْهُ”. مُتَّفَقٌ عَلَيْهِ. وَاللَّفْظُ لِمُسْلِمٍ.
2211. (1) [1/677–ఏకీభవితం]
‘ఉమర్ (ర) కథనం: నేను హిషామ్ బిన్ ‘హకీమ్ బిన్ ‘హి’జామ్‌ను సూరహ్ ఫుర్‌ఖాన్(25)ను నేను చదివే పద్ధతికి వ్యతిరేకంగా చదువుతూ ఉండగా విన్నాను. ఆ సూరహ్‌ను ప్రవక్త (స) నాకు చదివించి ఉన్నారు. నేను ఆయన్ను వెంటనే వారించబోయాను. అంటే నాకు వ్యతిరేకంగా చదవటం వల్ల అతనితో వివాదానికి దిగబోయాను. అతను ఆ సూరహ్ పూర్తి చేసే వరకు ఆగాను. అతను ఆ సూరహ్ పూర్తిచేసారు. వెంటనే నేను నా దుప్పటిని ఆయన మెడలో వేసి గట్టిగా బిగించి అతన్ని లాక్కుంటూ ప్రవక్త(స) వద్దకు తీసుకొని వెళ్ళాను. ”ఓ అల్లాహ్ ప్రవక్తా! ఇతను సూరహ్ ఫుర్‌ఖాన్‌ను మీరునాకు చదివించిన దానికి వ్యతిరేకంగా చదువుతున్నారు. అంటే మీరు చది వించిన దానికి వ్యతిరేకంగా ఇతను చదువు తున్నాడు,” అని విన్నవించుకున్నాను. అప్పుడు ప్రవక్త (స) ”అతన్ని వదలివేయి” అన్నారు. నేను వదలివేసాను. ఆ తరువాత ప్రవక్త (స) హిషామ్తో, ‘నువ్వు సూరహ్ ఫుర్‌ఖాన్ చదివి వినిపించు,’ అని అన్నారు. అతను నేను ఇంతకు ముందు విన్నట్లే చదివాడు. ప్రవక్త (స) అది విని, ”ఈ విధంగా కూడా ఇది అవతరించడం,” జరిగింది అని పలికి నన్ను, ‘ఓ ‘ఉమర్ నువ్వు చదివి వినిపించు,’ అని అన్నారు. నేను ప్రవక్త (స) నాకు నేర్పిన విధంగానే చదివి విని పించాను. అది విని ప్రవక్త (స), ‘ఈ సూరహ్ ఈవిధంగా కూడా అవతరించబడింది. వాస్తవం ఏమి టంటే ఈ ఖుర్‌ఆన్ 7 విధాలుగా అవతరించబడింది. మీకు ఏవిధానం సులువుగా ఉంటే ఆ విధంగా చద వండి’ అని ప్రవచించారు. [43] (బు’ఖారీ, ముస్లిమ్)
2212 – [ 2 ] ( صحيح ) (1/677)
وَعَنِ ابْنِ مَسْعُوْدٍ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: سَمِعْتُ رَجُلًا قَرَأَ وَسَمِعْتُ النَّبِيَّ صلى الله عليه وسلم يَقْرَأُ خِلَافَهَا فَجِئْتُ بِهِ النَّبِيَّ صلى الله عليه وسلم فَأَخْبَرْتُهُ فَعَرَفْتُ فِيْ وَجْهِهِ الْكَرَاهِيَةَ. فَقَالَ: “كِلَاكَمَا مُحْسِنٌ فضاَ تَخْتَلِفُوْا. فَإِنَّ مَنْ كَانَ قَبْلَكُمْ اخْتَلَفُوْا فَهَلَكُوْا”. رَوَاهُ الْبُخَارِيُّ .
2212. (2) [1/677–దృఢం]
‘అబ్దుల్లాహ్ బిన్ మస్’ఊద్ (ర) కథనం: నేను ఒక వ్యక్తిని ఖుర్‌ఆన్ చదువుతూ ఉండటం చూసాను. అతను ప్రవక్త (స) పఠించే పద్ధతికి వ్యతిరేకంగా పఠిస్తు న్నాడు. అతన్ని నేను ప్రవక్త (స) వద్దకు తీసుకొని వెళ్ళాను, జరిగినదంతా చెప్పాను. అది విని ప్రవక్త (స) ఆగ్రహం వ్యక్తం చేసారు. ముఖంలో ఆగ్రహం అలుముకుంది. అప్పుడు ప్రవక్త (స) మీరిద్దరూ సరిగ్గానే చదువుతున్నారు, పరస్పరం విభేదాలకు గురికాకండి. ఎందుకంటే మీ పూర్వీకులు, అల్లాహ్ గ్రంథ విషయంలో విభేదాలకు గురయి నాశనమయ్యారు. [44] (బు’ఖారీ)
2213 – [ 3 ] ( صحيح ) (1/678)
وَعَنْ أُبَيِّ بْنِ كَعْبٍ قَالَ: كُنْتُ فِيْ الْمَسْجِدِ فَدَخَلَ رَجُلٌ يُّصَلِّيْ فَقَرَأَ قِرَاءَةً أَنْكَرْتُهَا عَلَيْهِ ثُمَّ دَخَلَ آخَرُ فَقَرَأَ قِرَاءَةً سِوَى قِرَاءَةِ صَاحِبِهِ فَلَمَّا قَضَيْنَا الصَّلَاةَ دَخَلْنَا جَمِيْعًا عَلَى رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم. فَقُلْتُ إِنَّ هَذَا قَرَأَ قِرَاءَةً أَنْكَرْتُهَا عَلَيْهِ وَدَخَلَ آخَر فَقَرَأَ سِوَى قرَاءَةِ صَاحِبِهِ فَأَمَرَهُمَا النَّبِيُّ صلى الله عليه وسلم فَقَرَأ فَحَسَّنَ شَأْنَهُمَا فَسُقِطَ فِيْ نَفْسِيْ مِنَ التَّكْذِيْبِ وَلَا إِذْ كُنْتُ فِيْ الْجَاهِلَيَّةِ. فَلَمَّا رَأَى رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم مَا قَدْ غَشِيَنِيْ ضَرَبَ فِيْ صَدْرِيْ. فَفِضْتُ عِرْقًا وَكَأَنَّمَا أَنْظُر إِلَى اللهِ عَزَّ وَجَلَّ فَرَقًا. فَقَالَ لِيْ: “يَا أُبَيُّ أُرْسِلَ إِلَيَّ أَنِ اقْرَأ الْقُرْآنَ عَلَى حَرْفٍ فَرَدَدْتُ إِلَيْهِ أَنْ هَوِّنْ عَلَى أُمَّتِيْ فَرُدَّ إِلَيَّ الثَّانِيَةِ اقْرَأْهُ عَلَى حَرْفَيْنِ فَرَدِدْتُ إِلَيْهِ أَنْ هَوِّنْ عَلَى أُمَّتِيْ فَرَدَّ إِلَيَّ الثَّالِثَةِ اقْرَأْهُ عَلَى سَبْعَةِ أَحْرُفٍ وَّلَكَ بِكُلِّ رَدَّةٍ رَدَدْتُّكَمَا مَسْأَلَةٌ تَسْأَلُنِيْهَا. فَقُلْتُ اَللّهُمَّ اغْفِرْ لِأُمَّتِيْ اَللّهُمَّ اغْفِرْ لِأُمَّتِيْ وَأَخَّرْتُ الثَّالِثَةَ لِيَوْمٍ يَّرْغَبُ إِلَيَّ الْخَلْقُ كُلُّهُمْ حَتَّى إِبْرَاهِيْمُ صلى الله عليه وسلم”. رَوَاهُ مُسْلِمٌ.
2213. (3) [1/678–దృఢం]
ఉబయ్ బిన్ క’అబ్ (ర) కథనం: నేను మస్జిద్‌లో ఉన్నప్పుడు ఒక వ్యక్తి వచ్చాడు, నమా’జ్ చదవ సాగాడు. అతడు ఖుర్‌ఆన్‌ను నాకు తెలియని విధంగా చదివాడు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఇంతలో మరో వ్యక్తి వచ్చాడు. అతను మొదటి వ్యక్తి చదివిన దానికి వ్యతిరేకంగా చదివాడు. మేమందరం నమా’జు ముగించిన తర్వాత ప్రవక్త (స) వద్దకు వెళ్ళాము. నేను ప్రవక్త (స)తో, ‘ఈ వ్యక్తి నాకు తెలి యని విధంగా ఖుర్‌ఆన్ పఠించాడు. ఆ తరువాత మరో వ్యక్తి వచ్చి మరో విధంగా ఖుర్‌ఆన్ పఠించాడు,’ అని చెప్పాను. ప్రవక్త (స) వారిద్దరినీ చదివి వినిపించమని ఆదేశించారు. ప్రవక్త (స) వారిద్దరి చదవటాన్ని మెచ్చుకున్నారు. దీనివల్ల నా మనసులో అనుమానం పుట్టింది. అజ్ఞానకాలంలో ఇలా ఎన్నడూ అనుమానం పుట్టలేదు. ప్రవక్త (స)ను పరిస్థితిని, నన్ను అనుమానాలు, అపార్థాలు ఆవరించినట్లు గ్రహించారు. వెంటనే ప్రవక్త (స)ను నా గుండెపై చేత్తో తట్టారు. దానివల్ల శరీరమంతా చెమటలు కక్కింది. భయం వల్ల అల్లాహ్ (త)ను చూసినంత పరిస్థితి అయిపోయింది. అప్పుడు ప్రవక్త (స) నాతో, ‘ఓ ఉబయ్! నావద్దకు దైవదూత వచ్చాడు, నాకు ఖుర్‌ఆన్‌ను ఒకవిధంగా చదవమని ఆదేశించబడింది. అప్పుడు నేను రెండవసారి ఓ ప్రభూ! నా అనుచర సమాజానికి ఖుర్‌ఆన్ సులభతరం చేయి,’ అని ప్రార్థించాను. అప్పుడునాకు నీవు రెండువిధాలుగా చదవగలవు అని ఆదేశించడం జరిగింది. మూడవ సారి ఓ ప్రభూ! నా అనుచర సంఘంపై ఖుర్‌ఆన్‌ను సులభతరంచేయి అని ప్రార్థించాను. మూడు విధాలుగా చివరికి 7విధాలుగా చదవగలరని ఆదేశించబడింది.’ అప్పుడు అల్లాహ్ (త), ‘నీకు నేను ఎన్నిసార్లు చదవమని ఆదేశించానో అన్నిసార్లు నీవు నన్ను విన్నవించుకోగలవు,’ అని అన్నాడు. అప్పుడు నేను ఓ అల్లాహ్! నాఅనుచర సమాజాన్నిక్షమించు, ఓ అల్లాహ్! నా అనుచర సమాజాన్ని క్షమించు అని ప్రార్థించి మూడవ దు’ఆ తీర్పుదినానికి వదలివేసాను. ఆనాడు సృష్టి అంతా నావైపు వస్తుంది. చివరికి ఇబ్రాహీమ్ (అ) కూడా నాతో విన్నవించుకుంటారు. (ముస్లిమ్)
2214 – [ 4 ] (مُتَّفَقٌ عَلَيْهِ) (1/678)
وعَنِ ابْنِ عَبَّاسٍ رَضِيَ اللهُ عَنْهُمَا قَالَ: إِنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم قَالَ: “أَقْرَأَنِيْ جِبْرِيْلُ عَلَى حَرْفٍ فَرَاجَعْتُهُ فَلَمْ أَزَلْ أَسْتَزِيْدُهُ وَيَزِيْدُنِيْ حَتَّى انْتَهَى إِلَى سَبْعَةِ أَحْرُفٍ”. قَالَ ابْنُ شِهَابٍ: بَلَغِنِيْ أَنْ تِلْكَ السَّبْعَةَ الْأَحْرُفَ إِنَّمَا هِيَ فِيْ الْأَمْرِ تَكُوْنُ وَاحِدًا لَّا تَخْتَلِفُ فِيْ حَلَالٍ وَّلَا حَرَامٍ .
2214. (4) [1/678–ఏకీభవితం]
ఇబ్నె ‘అబ్బాస్ (ర) కథనం: ప్రవక్త (స) ఇలా ప్రవచించారు: ”జిబ్రీల్ (అ) నన్ను ఒక విధంగా ఖుర్‌ఆన్ చదివించారు. నేనతన్ని ‘ఇంకా అనేక విధాలుగా చదవటానికి అనుమతించండి’ అని అన్నాను. ఎల్లప్పుడూ అనేక ఉచ్చారణల ద్వారా చదువుతాననే కోరిక వ్యక్తపరిచే వాడ్ని. జిబ్రీల్ అధికం చేస్తూ 7 పద్ధతులవరకు చేరారు. అంటే ఏడు పద్ధతుల ద్వారా చదివే అనుమతి ఇచ్చారు.
ఇబ్నె షిహాబ్ ఇలా అంటున్నారు, ”ఆ 7 పద్ధతులు ధార్మిక ఆదేశాల విషయంలో ఒకటే. ‘హరామ్ ‘హలాల్ భేదం లేదు. అంటే ఒక పద్ధతి ద్వారా ధర్మసమ్మతం అయితే అది ధర్మసమ్మతమే. ఒకవేళ నిషిద్ధం అయితే అది నిషిద్ధమే. వివిధ ఉచ్చారణల వల్ల ధర్మం, నిషిద్ధం మారదు. ఒక ఉచ్చారణ ద్వారా ధర్మసమ్మతం అయితే మరో ఉచ్చారణ ద్వారా కూడా ధర్మసమ్మతమే అవుతుంది.” (బు’ఖారీ, ముస్లిమ్)
—–
اَلْفَصْلُ الثَّانِيْ రెండవ విభాగం
2215 – [ 5 ] ( لم تتم دراسته ) (1/679)
عَنْ أُبَيِّ بْنِ كَعْبٍ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: لَقِيَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم جِبْرِيْلَ فَقَالَ: “يَا جِبْرِيْلَ إِنِّيْ بُعِثْتُ إِلَى أُمَّةٍ أُمِّيِّيْنَ مِنْهُمْ الْعَجُوْزُ وَالشَّيْخُ الْكَبِيْرُ وَالْغُلَامُ وَالْجَارِيَةُ وَالرَّجُلُ الَّذِيْ لَمْ يَقْرَأْ كِتَابًا قَطُّ. قَالَ: يَا مُحَمّدُ إِنَّ الْقُرْآنَ أُنْزِلَ عَلَى سَبْعَةِ أَحْرُفٍ”. رَوَاهُ التِّرْمِذِيُّ
وَفِيْ رِوَايَةٍ لِّأَحْمَدَ وَأَبِيْ دَاوُدَ: قَالَ: “لَيْسَ مِنْهَا إِلَّا شَافٍّ كَافٍّ”.
وَفِيْ رِوَايَةٍ لِلنَّسَائِيِّ قَالَ:”إِنَّ جِبْرِيْلَ وَمِيْكَائِيْلَ أَتَيَانِيْ فَقَعَدَ جِبْرَيْلُ عَنْ يَّمِيْنِيْ وَمِيْكَائِيْلُ عَنْ يَّسَارِيْ. فَقَالَ جِبْرِيْلُ: اقْرَأِ الْقُرْآنَ عَلَى حَرْفٍ. قَالَ مِيْكَائِيْلُ: اسْتَزِدْهُ حَتَّى بَلَغَ سَبْعَةَ أَحْرُفٍ فَكُلُّ حَرْفٍ شَافٍّ كَافٍّ”.
2215. (5) [1/679–అపరిశోధితం]
ఉబయ్ బిన్ క’అబ్ (ర) కథనం: ప్రవక్త (స) జిబ్రీల్ (అ)ను కలిసారు. అప్పుడు ప్రవక్త(స) ఇలా అన్నారు, ”ఓ జిబ్రీల్! నేను నిరక్షరాసుల సమాజం వైపు ప్రవక్తగా పంపబడ్డాను. వీరిలో ముసలి స్త్రీ పురుషులు అబ్బా యిలు, అమ్మాయిలు ఉన్నారు. వీరిలో ఎప్పుడు ఏ పుస్తకం చదవని వారు కూడా ఉన్నారు,” అని విన్న వించుకున్నాను. అప్పుడు జిబ్రీల్, ”ఓ ముహమ్మద్! నిస్సందే హంగా ఖుర్‌ఆన్ 7 ఉచ్చారణలపై అవత రించబడింది. (తిర్మిజి’, అ’హ్మద్)
అబూ దావూద్ యెక్క మరో ఉల్లేఖనంలో ఇలా ఉంది, దీని ప్రతివిధానం స్వస్థత కలిగిస్తుంది, సరిపోతుంది. అంటే అన్నిరకాల వ్యాధులకు చికిత్సగా పనిచేస్తుంది. ఇంకా ఇది ఏకత్వం, దైవదౌత్యం సత్యమైనవి అనడానికి సరిపోతుంది.
నసాయిలోని ఒక ఉల్లేఖనంలో ఇలా ఉంది: ”ప్రవక్త (స) ఇలా అన్నారు, జిబ్రీల్, మీకాయీ’ల్ ఇద్దరూ నావద్దకు వచ్చారు. జిబ్రీల్ నా కుడివైపు కూర్చు న్నారు. మీకాయీ’ల్ నా ఎడమవైపు కూర్చున్నారు. జిబ్రీల్ నన్ను నువ్వు ఖుర్‌ఆన్‌ను ఒక విధంగా పఠించు,’ అని అన్నారు. వెంటనే మీకాయీ’ల్ నన్ను ఇంకా ఎక్కువ కోరు,’ అని అన్నారు. నేను కోరుతూ పోయాను. చివరికి 7పద్ధతుల వరకు చేరాను. వీటిలో ప్రతి పద్ధతి స్వస్థత చేకూర్చేది, సరిపోయేదీను.
2216 – [ 6 ] ( لم تتم دراسته ) (1/679)
وَعَنْ عِمْرَانَ بْنِ حُصَيْنٍ رَضِيَ اللهُ عَنْهُمَا أَنَّهُ مَرَّ عَلَى قَاصٍّ يَّقْرَأُ ثُمَّ يَسْأَلُ. فَاسْتَرْجَعَ ثُمَّ قَالَ: سَمِعْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ: “مَنْ قَرَأَ الْقُرْآنَ فَلْيَسْأَلِ اللهَ بِهِ فَإِنَّهُ سَيَجِيْءُ أَقْوَامٌ يَّقْرَؤُوْنَ الْقُرْآنَ يَسْأَلُوْنَ بِهِ النَّاسَ” . رَوَاهُ أَحْمَدُ وَالتِّرْمِذِيُّ
2216. (6) [1/679–అపరిశోధితం]
‘ఇమ్రాన్ బిన్ ‘హు’సైన్ (ర) కథనం: ఒకసారి అతను కథలు చెప్పేవాడి ప్రక్కనుండి వెళ్ళారు. అతడు ఖుర్ఆన్ చదివి ప్రజలను బిచ్చమడుగుతున్నాడు. ‘ఇమ్రాన్ బిన్ ‘హు’సైన్ ఇది చూచి, ‘ఇన్నాలిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజి వూన్,‘ అని పలికి ఇలా అన్నారు, ”నేను ప్రవక్త (స)ను ఇలా అంటూ ఉండగా విన్నాను, ”ఖుర్‌ఆన్ చదివిన వ్యక్తి దాని ద్వారా అల్లాహ్‌నే అర్థించాలి. ఎందుకంటే భవిష్యత్తులో ఖుర్‌ఆన్ చదివి ప్రజలను అర్థించేవారు వస్తారు.” [45](అ’హ్మద్, తిర్మిజి’)
—–
اَلْفَصْلُ الثَّالِثُ మూడవ విభాగం
2217 – [ 7 ] ( لم تتم دراسته ) (1/680)
عَنْ بُرَيْدَةَ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَنْ قَرَأَ الْقُرْآنَ يَتَأَكَّلُ بِهِ النَّاسَ جَاءَ يَوْمَ الْقِيَامَةِ وَوَجْهُهُ عَظْمٌ لَيْسَ عَلَيْهِ لَحْمٌ”. رَوَاهُ الْبَيْهَقِيُّ فِيْ شُعَبِ الْإِيْمَانِ.
2217. (7) [1/680–అపరిశోధితం]
బురైద (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఖుర్‌ఆన్ పఠించి ప్రజలను అడిగి తినే అంటే ఖుర్‌ఆన్‌ను ఐహిక కాంక్షల సాధనంగా, కడుపునింపే సాధనంగా ఉపయోగిస్తే తీర్పుదినం నాడు అతని ముఖంపై మాంసం లేని స్థితిలో అంటే ఎముకలే ఉండే స్థితిలో వస్తాడు.” (బైహఖీ, షు’అబుల్ ఈమాన్)
అంటే చాలా అవమానానికి, పరాభవానికి గురవుతాడు.
2218 – [ 8 ] ( لم تتم دراسته ) (1/680)
وَعَنِ ابْنِ عَبَّاسٍ قَالَ: كَانَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم لَا يَعْرِفُ فَصْلَ السُّوْرَةِ حَتَّى يَنْزِلَ عَلَيْهِ بِسْمِ اللهِ الرَّحْمنِ الرَّحِيْمِ. رَوَاهُ أَبُوْ دَاوُدَ.
2218. (8) [1/680–అపరిశోధితం]
ఇబ్నె ‘అబ్బాస్ (ర) కథనం: ప్రవక్త (స)కు ఒక సూరహ్ నుండి మరో సూరహ్ వేరుగా ఉండటం తెలిసేది కాదు. చివరికి ‘బిస్మిల్లాహిర్ర’హ్మా నిర్ర’హీమ్ ‘ అవతరించబడింది. [46] (అబూ దావూద్)
2219 – [ 9 ] ( متفق عليه ) (1/680)
وَعَنْ عَلْقَمَةَ قَالَ: كُنَّا بِحِمْصَ فَقَرَأَ ابْنُ مَسْعُوْدٍ سُوْرَةَ يُوْسُفَ. فَقَالَ رَجُلٌ: مَا هَكَذَا أُنْزِلَتْ. فَقَالَ عَبْدُ اللهِ: وَاللهِ لَقَرَأْتُهَا عَلَى عَهْدِ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم. فَقَالَ: “أَحْسَنْتَ” فَبَيْنَا هُوَ يُكَلِّمُهُ إِذْ وَجَدَ مِنْهُ رِيْحَ الْخَمْرِ. فَقَالَ: أَتَشْرَبُ الْخَمْرُ وَتَكَذِّبُ بِالْكِتَابِ؟ فَضَرَبَهُ الْحَدَّ.
2219. (9) [1/680–ఏకీభవితం]
‘అల్ ఖమహ్ (ర) కథనం: ”మేము ‘హిమ్’స్లో అంటే సిరియా దేశంలో ఉన్నాం. ఒకనాడు ‘అబ్దుల్లాహ్ బిన్ మస్’ఊద్ సూరహ్ యూసుఫ్ (12) చదివి వినిపించారు. ఒక వ్యక్తి, ‘ఈ సూరహ్ ఈ విధంగా అవతరించబడలేదు, అంటే మీరు పఠించినట్లు,’ అని అన్నాడు. అప్పుడు ‘అబ్దుల్లాహ్ బిన్ మస్’ఊద్, ”అల్లాహ్ సాక్షి! ఈ సూరహ్‌ను నేను ప్రవక్త (స) కాలంలో ఆయన ముందు చదివాను, ప్రవక్త (స) విని నువ్వు చాలా బాగా చదివావు,” అని అన్నారని చెప్పారు. ‘అబ్దుల్లాహ్ బిన్ మస్’ఊద్ ఆ వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు అతని సారాయి దుర్వాసన గ్రహించారు. దుర్వాసన ఆ వ్యక్తి నోట్లో నుండి వస్తుందని పసిగట్టారు. అప్పుడు అతను (ర) ఆ వ్యక్తితో సారాయి త్రాగుతావు, దైవగ్రంథాన్ని తిరస్కరిస్తున్నావు” అని కోప్పడి, అతనికి తగిన శిక్ష విధించారు. (బు’ఖారీ, ముస్లిమ్)
2220 – [ 10 ] ( صحيح ) (1/680)
وَعَنْ زَيْدِ بْنِ ثَابِتٍ قَالَ: أَرْسَلَ إِلَيَّ أَبُوْ بَكْرٍ رَضِيَ اللهُ عَنْهُ مَقْتَلَ أَهْلِ الْيَمَامَةِ. فَإِذَا عُمَرَ بْنُ الْخَطَّابِ عِنْدَهُ. قَالَ أَبُوْ بَكْرٍ إِنَّ عُمَرَ أَتَانِيْ. فَقَالَ إِنَّ الْقَتْلَ قَدْ اسْتَحَرَ يَوْمَ الْيَمَامَةِ بِقُرَّاءِ الْقُرْآنِ وَإِنِّيْ أَخْشَى إِنِ اسْتَحَرَ الْقَتْلَ بِالْقُرَّاءِ بِالْمَوَاطِنِ فَيَذْهَبَ كَثِيْرٌ مِّنَ الْقُرْآنِ وَإِنِّيْ أَرَى أَنْ تَأْمُرَ بِجَمْعِ الْقُرْآنِ قُلْتُ لِعُمَرَ كَيْفَ تَفْعَلُ شَيْئًا لَمْ يَفْعَلْهُ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم؟ فَقَالَ عُمَرُ: هَذَا وَاللهِ خَيْرٌ فَلَمْ يَزَلْ عُمَرُ يُرَاجِعُنِيْ فِيْهِ حَتَّى شَرَحَ اللهُ صَدْرِيْ لِذَلِكَ وَرَأَيْتُ في ذلك الَّذِيْ رَأَى عُمَرُ قَالَ زَيْدٌ : قَالَ أَبُوْ بَكْرٍ: إِنَّكَ رَجُلٌ شَابٌّ عَاقِلٌ لَا نَتَّهِمُكَ وَقَدْ كُنْتُ تَكْتُبُ الْوَحْيَ لِرَسُوْلِ اللهِ صلى الله عليه وسلم. فَتَتّبَّعِ الْقُرْآنَ فَاْجَمَعْهُ فَوَاللهِ لَوْ كَلِّفُوْنِيْ نَقْلَ جَبَلٍ مِّنَ الْجِبَالِ مَا كَانَ أَثْقَلَ عَلَيَّ مِمَّا أَمَرَنِيْ بِهِ مِنْ جَمْعِ الْقُرْآنِ. قَالَ: قُلْتُ كَيْفَ تَفْعَلُوْنَ شَيْئًا لَمْ يَفْعَلْهُ النَّبِيُّ صلى الله عليه وسلم. قَالَ: هُوَ وَاللهِ خَيْرٌ. فَلَمْ يَزَلْ أبو بكر أيُرَاجِعُونيُ حَتَّى شَرَحَ اللهُ صَدْرِيْ لِلَّذِيْ شَرَحَ اللهُ لَهُ صَدْرَ أَبِيْ بَكْرٍ وَعُمَرَ. فقمت فَتَتَبَّعْتُ الْقُرْآنَ أَجْمَعُهُ مِنَ الْعُسُبِ وَاللِّخَافِ وَصُدُوْرِالرِّجَالِ حَتَّى وَجَدْتُّ آخر سُوْرَةِ التَّوْبَةِ آيَتَيْنِ مَعَ أَبِيْ خُزَيْمَةَ الْأَنْصَارِيِّ، لَمْ أَجِدْهَا مَعَ أَحَدٍغَيْرِهِ (لَقَدْ جَاءَكُمْ رَسُوْلٌ مِّنْ أَنْفُسِكُمْ،9: 128-129) حَتَّى خَاتِمَةِ بَرَاءَةَ. فَكَانَتِ الصُّحُفُ عِنْدَ أَبِيْ بَكْرٍ حَتَّى تَوَّفَاهُ اللهُ ثُمَّ عِنْدَ عُمَرَ حَيَاتَهُ ثُمَّ عِنْدَ حَفْصَةَ. رَوَاهُ الْبُخَارِيُّ
2220. (10) [1/680–దృఢం]
‘జైద్ బిన్ సా’బిత్ (ర) కథనం: యమామహ్ యుద్ధ కాలంలో అబూ బకర్ (ర) నన్ను పిలిపించారు. నేను అక్కడికి చేరేసరికి ‘ఉమర్ (ర) కూడా అక్కడ కూర్చొని ఉన్నారు. అబూ బకర్ నాతో, ” ‘ఉమర్ బిన్ ‘ఖ’త్తాబ్ నా వద్దకు వచ్చి, ‘యమామహ్ యుద్ధంలో చాలా మంది ఖుర్‌ఆన్ ఖారీలు చని పోయారు, నా భయం ఏమిటంటే, వివిధ ప్రాంతాల్లో ఈ విధంగా ఖుర్‌ఆన్ ఖారీలు, ‘హాఫి”జ్‌లు చనిపోతూ ఉంటే, ఖుర్‌ఆన్ చాలా భాగం నామరూపాలు లేకుండా పోతుంది, నేను ఆలోచించిన విషయం ఏమిటంటే మీరు ఖారీల ద్వారా ఖుర్‌ఆన్‌ను ఒకచోట చేర్చమని ఆదేశించండి,’ అని చెప్పారు, నేను ‘ఉమర్‌తో, ‘ప్రవక్త (స) చేయని దాన్ని మనం ఎలా చేయగలం,’ అని అన్నాను. అప్పుడు ‘ఉమర్, అల్లాహ్ సాక్షి! ఇదే సరైన పని,’ అని పలికారు. ‘ఉమర్ నన్ను అనేకసార్లు నచ్చచెప్పారు. దానిప్రాముఖ్యతను తెలుపుతూ ఉన్నారు. చివరికి అల్లాహ్ (త) ఆ పనికోసం నా హృదయాన్ని తెరిచాడు. అప్పుడు నాకు ‘ఉమర్ సలహా సరైనదని తెలిసింది,’ అని అన్నారు. అబూ బకర్ (ర) నాతో, ‘ఓ ‘జైద్! నీవు యువకుడవు, బుద్ధిమంతుడవు, నీపై ఎటువంటి అభాండాలు అపనిందలు లేవు. నీవు ప్రవక్త (స) కాలంలో వ’హీని వ్రాసేవాడవు. ఖుర్‌ఆన్ వ్రాసేవాడవు. కనుక నువ్వు ఖుర్‌ఆన్‌ను వెదికి దాన్ని ఒకచోట చేర్చు,’ అని చెప్పారు.’ అని అన్నారు. ‘అల్లాహ్ సాక్షి! ఒకవేళ అబూ బకర్ నన్ను కొండను ఎత్తమన్నా దాన్ని నేను సులభంగా భావించే వాడ్ని కాని ఖుర్‌ఆన్‌ను ఒకచోట చేర్చడం నాకు చాలా కష్టంగా అనిపిస్తుంది,’ అని ఊహించి, ”అసలు ప్రవక్త (స) చేయని పనిని మీరు ఎలా చేయగలరు’ అని అన్నాను. దానికి అబూ బకర్ (ర), ఇలా అన్నారు, ”అల్లాహ్ సాక్షి! ఇదే ఉత్తమ మైన కార్యం.” అబూ బకర్ నన్ను అనేక సార్లు బోధించారు. చివరికి అల్లాహ్ (త) ఆ కార్యం కోసం నా హృదయాన్ని వికసింపచేసాడు. అబూ బకర్, ‘ఉమర్‌ల హృదయాలను వికసింపజేసి నట్లు. ఆ ఇద్దరు మహాపురుషుల ఆదేశం మేరకు నేను ఖుర్‌ఆన్‌ను వెదకటం ప్రారంభించాను. ఖుర్‌ఆన్‌ను ఖర్జూరపు కొమ్మల నుండి, ఆకుల నుండి, తెల్లటి రాతి పలకల నుండి వ్రాయబడి ఉన్న ఖుర్‌ఆన్‌ను, ఇంకా ప్రజల హృదయాల నుండి అంటే కంఠస్తం చేసి ఉన్న వారిని అడిగి ఒకచోట వ్రాయడం ప్రారంభించాను. చివరికి సూరహ్ తౌబహ్ చివరి రెండు ఆయయులు ‘ఖు‘జైమహ్ అన్సారీ వద్ద దొరికాయి. అతని తప్ప ఇతరులెవ్వరి వద్ద ఈ ఆయతులు నాకు లభించలేదు. ఆ ఆయతులు ఇవి, ”లఖద్ జాఅకుమ్ రసూలున్ మిన్ అన్‌ఫుసికుమ్” నుండి సూరహ్ బరాఅత్‌చివరి వరకు (9:128-129). ఆ ఖుర్‌ఆన్ అబూ బకర్ వద్ద జీవితాంతం ఉండేది. ఆయన మరణించిన తర్వాత ఆ ఖుర్‌ఆన్ ‘ఉమర్ వద్ద అతని జీవితాంతం ఉండేది. అతను మరణించిన తర్వాత ఆ ఖుర్‌ఆన్ ‘హఫ్’సహ్ బిన్‌తె ‘ఉమర్ వద్ద ఉండేది. [47] (బు’ఖారీ)
అబూ బకర్ ప్రతులు ఎప్పటి వరకు సురక్షితంగా ఉన్నాయి
‘జైద్ బిన్ సా‘బిత్ తయారుచేసిన కాపీ అబూ బకర్(ర) నిధిలో భద్రంగా ఉండేది. ఆ తరువాత ‘ఉమర్ (ర) అధీనం లోనికి వచ్చింది. ‘ఉమర్ (ర) దాన్ని ‘హఫ్’సహ్కు అప్పజెప్పి ”ఎవ్వరికీ ఇవ్వరాదు, అయితే కాపీ చేయడానికి, లేదా తన వద్ద ఉన్న దాన్ని సరిచేసుకోవడానికి దాన్ని ఉపయోగించ వచ్చు’ అని చెప్పారు. ‘ఉస్మాన్ తన పరిపాలనా కాలంలో ‘హఫ్’సహ్ నుండి దాన్ని తాత్కాలికంగా తీసుకొని కొన్నికాపీలు తయారు చేయించి ఇతర ప్రాంతాలకు పంపించారు. అయితే అసలు ప్రతి ‘హఫ్’సహ్ వద్దనే ఉండేది. ఆ తర్వాత మర్వాన్ మదీనహ్ పాలకునిగా వచ్చినపుడు అతడు దాన్ని ‘హఫ్’సహ్ నుండి తీసుకోవాలని ప్రయత్నించాడు. కాని ఆమె ఇవ్వటానికి తిరస్కరించారు. జీవితాంతం తమవద్దనే ఉంచారు. ఆమె మరణించిన తర్వాత మర్వాన్ ‘అబ్దుల్లాహ్ బిన్ ‘ఉమర్ నుండి దాన్ని తీసుకొని వ్యర్థం చేసాడు. (ఫత్’హుల్ బారీ 9/10)
2221 – [ 11 ] ( صحيح ) (1/681)
وَعَنْ أَنَسِ بْنِ مَالِكٍ: أَنَّ حُذَيْفَةَ بْنِ الْيَمَانَ قَدِمَ عَلَى عُثْمَانَ وَكَانَ يُغَازِيْ أَهْلَ الشَّأمِ فِيْ فَتْحِ إِرْمِيْنِيَّةَ وَأَذَرْبِيْجَانَ مَعَ أَهْلِ الْعِرَاقِ فَأَفْزَعَ حُذَيْفَةَ اخْتِلَافُهُمْ فِيْ الْقِرَاءَةِ. فَقَالَ حُذَيْفَةَ لِعُثْمَانَ يَا أَمِيْرُ الْمُؤْمِنِيْنَ أَدْرِكْ هَذِهِ الْأُمَّةَ قَبْلَ أَنْ يَّخْتَلِفُوْا فِيْ الْكِتَابِ اخْتِلَافَ الْيَهُوْدِ وَالنَّصَارَى. فَأَرْسَلَ عُثْمَانُ إِلَى حَفْصَةَ أَنْ أَرْسِلِيْ إِلَيْنَا بِالصُّحُفِ نَنْسَخْهَا فِيْ الْمَصَاحِفِ ثُمَّ نَرُدُّهَا إِلَيْكِ. فَأَرْسَلَتْ بِهَا حَفْصَةُ إِلَى عُثْمَانَ فَأَمَرَ زَيْدَ بْنِ ثَابِتٍ وَعَبْدَاللهِ بْنِ الزُّبَيْرِ وَسَعِيْدَ بْنَ الْعَاصِ وَعَبْدَالرَّحْمنِ بْنِ الْحَارِثِ بْنِ هِشَامٍ فَنَسَخُوْهَا فِيْ الْمَصَاحِفِ. وَقَالَ عُثْمَانُ لِلرَّهْطِ الْقُرَشِيِّيْنَ الثَّلَاثِ إِذَا اخْتَلَفْتُمْ انتم وزيد بن ثابت فِيْ شَيْءٍ مِّنَ الْقُرْآنِ فَاكْتُبُوْهُ بِلِسَانِ قُرَيْشٍ. فَإِنَّمَا نَزَلَ بِلِسَانِهِمْ. فَفَعَلُوْا حَتَّى إِذَا نَسَخُوْا الصُّحُفَ فِيْ الْمَصَاحِفِ. رَدَّ عُثْمَانُ الصُّحُفَ إِلَى حَفْصَةَ وَأَرْسَلَ إِلَى كُلِّ أُفُقٍ بِمُصْحَفٍ مِمَّا نَسَخُوْا وَأَمَرَ بِمَا سِوَاهُ مِنَ الْقُرْآنِ فِيْ كُلِّ صَحِيْفَةٍ أَوْ مُصْحَفٍ أَنْ يُّحْرَقَ. قَالَ ابْنُ شِهَابٍ: وَأَخْبَرَنِيْ خَارِجَةُ بْنُ زَيْدِ بْنِ ثَابِتٍ انه سَمِعَ زَيْدَ بْنِ ثَابِتٍ قَالَ: فَقَدْتُّ آيَةً مِّنَ الْأَحْزَابِ حِيْنَ نَسَخْنَا الْمُصْحَفَ قَدْ كُنْتُ أَسْمَعُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يَقْرَأُ بِهَا فَالْتَمَسْنَاهَا فَوَجَدْنَاهَا مَعَ خُزَيْمَةَ بْنِ ثَابِتٍ الْأَنْصَارِيّ (مِنَ الْمُؤْمِنِيْنَ رِجَالٌ صَدَقُوْا مَا عَاهَدُوْا اللهَ عَلَيْهِ، 33: 23) فَأَلْحَقْنَاهَا فِيْ سُوْرَتِهَا فِيْ الْمُصْحَفِ. رَوَاهُ الْبُخَارِيُّ.
2221. (11) [1/681–దృఢం]
అనస్ బిన్ మాలిక్ (ర) కథనం: ‘హుజై’ ఫహ్ బిన్ యమాన్, ‘ఉస్మాన్ వద్దకు వచ్చారు. ఆ సమయంలో ‘ఉస్మాన్ (ర) ఆర్మేనియా, ఆజ’ర్ బైజాన్ పోరాటాలకు సిద్ధమవుతున్న సిరియా ఇరాఖ్‌ల ముజాహిదీన్ల కొరకు యుద్ధసామాగ్రిని సిద్ధం చేయడంలో నిమగ్నులై ఉన్నారు. ఖుర్‌ఆన్ విషయంలో ప్రజల ఈ భేదాభిప్రాయాల పట్ల ‘హుజై’ఫహ్ బిన్ యమాన్ చాలా భయపడ్డారు. ‘హుజై’ఫహ్ బిన్ యమాన్ ‘ఉస్మాన్(ర)తో, ”ఓ అమీరుల్ మూమినీన్! యూదులు, క్రైస్తవులు తమ గ్రంథాల్లో విభేదాలకు గురయినట్లు వీళ్ళు కూడా ఖుర్‌ఆన్ విషయంలో విభేదాలకు గురికాకముందే ఈ సమాజాన్ని సంస్కరించండి. అంటే అనేక ఉచ్చారణల వల్ల ప్రజలు పరస్పరం వివాదపడుతున్నారు. తమరు ఒకే ఉచ్చారణపై అందరినీ చేర్చండి. దీనివల్ల విభేదాలు సమసిపోతాయి. ఇది విని ‘ఉస్మాన్, ‘హఫ్’సహ్కు ఒక వ్యక్తి ద్వారా, ”అబూ బకర్ (ర) కాలంలో వ్రాయబడి మీ దగ్గర ఉన్న ఖుర్‌ఆన్‌ను తాత్కాలికంగా మా వద్దకు పంపండి, దాని ద్వారా మేము దాని ప్రతులను తయారుచేసి మళ్ళీ మీకు తిరిగి పంపివేస్తాం.” అని కబురు పంపారు. ‘హఫ్’సహ్ (ర) ఆ ఖుర్‌ఆన్‌ను ‘ఉస్మాన్(ర) వద్దకు పంపారు. ‘ఉస్మాన్ (ర) ‘జైద్ బిన్ సా’బిత్, ‘అబ్దుల్లాహ్ బిన్ ‘జుబైర్, స’యీద్ బిన్ ఆస్ మరియు ‘అబ్దుల్లాహ్ బిన్ ‘హారిస్’ బిన్ హిషామ్(ర) లను ‘మీరందరూ ఈ ఖుర్‌ఆన్ ప్రతులు తయారు చేయండి’ అని ఆదేశించారు. ‘ఉస్మాన్ (ర), ‘జైద్ బిన్ సా‘బిత్ తప్ప మిగతా ముగ్గురు ఖురైషులను ఒకవేళ ఖుర్‌ఆన్‌లో ఎక్కడైనా పదాల అర్థాలలో మీకు ‘జైద్ బిన్ సా’బిత్‌కి భేదం వస్తే, మీరు ఖురైష్ భాషనే ఎన్నుకోండి. ఎందుకంటే ఖర్ఆన్ చాలా వరకు ఖరైషుల భాష, వారి సామెతలపై అవత రించింది. ఈ నలుగురు హాఫిజ్ – ఖారీలు తమ బాధ్యతను నిర్వర్తించారు. అనేక ప్రతులు తయారు చేసిన తర్వాత ‘ఉస్మాన్ (ర) ఆ మూల ప్రతిని ‘హఫ్’సహ్ వద్దకు తిరిగి పంపివేసారు. కాపీ చేసిన ప్రతులను ఇస్లామీ నగరాల్లో, పట్టణాల్లో పంపించారు. అందరికీ ఈ ఖుర్‌ఆన్ ప్రకారమే చదవాలని, చదివించాలని ఆదేశించారు. ఇది తప్ప వివిధ ఉచ్చారణలపై ఉన్న ఖుర్‌ఆన్‌లు కాల్చివేయమని ఆదేశించారు. ఫలితంగా ప్రజల్లో విభేదాలు జనించవు. ఇబ్నె షిహాబ్ ఇలా అన్నారు, ” ‘ఖారిజహ్ బిన్ ‘జైద్ బిన్ సా’బిత్ నాకు ఇలా తెలిపారు, అతను ‘జైద్ బిన్ సా’బిత్‌ను ఇలా అంటూ ఉండగా విన్నారు, ”మేము ఖుర్‌ఆన్ కాపీ చేస్తున్నప్పుడు సూరహ్ అ’హ్’జాబ్ (33) లోని ఒక ఆయత్ లభించలేదు. దాన్ని నేను ప్రవక్త (స) వింటూ ఉండగా విన్నాను. ఆ వాక్యాన్ని వెతకటం ప్రారంభించాం. ఆ వాక్యం ‘ఖు’జైమహ్ బిన్ సా’బిత్ అన్సారీ వద్ద దొరికింది. ఆ ఆయత్ ఇది, ”మినల్ మూమినీన రిజాలున్ సదఖూ మా ఆహదల్లాహు అలైహి” (సూ. అల్-అహ్ జాబ్, 33:23) మేము ఆ ఆయత్ ను ఖుర్‌ఆన్‌లోని ఈ సూరహ్‌లో వ్రాసాము. [48] (బు’ఖారీ)
2222 – [ 12 ] ( صحيح ) (1/682)
وَعَنِ ابْنِ عَبَّاسٍ قَالَ: قُلْتُ لِعُثْمَانَ مَا حَمَلَكُمْ أَنْ عَمَدْتُّمْ إِلَى الْأَنْفَالِ وَهِيَ مِنَ الْمَثَانِيْ وَإِلَى بَراءَةٍ وَهِيَ مِنَ الْمِئِيْنَ فَقَرَنْتُمْ بَيْنَهُمَا وَلَمْ تَكْتُبُوْا بَيْنَهُمَا سَطْرَ، بِسْمِ اللهِ الرَّحْمنِ الرَّحِيْمِ، وَوَضَعْتُمُوْهَا فِيْ السَّبْعِ الطُّوَلِ مَا حَمَلَكُمْ عَلَى ذَلِكَ. فَقَالَ عُثْمَانَ: كَانَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم مِمَّا يَأْتِيْ عَلَيْهِ الزَّماَنِ وَهُوَ يَنْزِلَ عَلَيْهِ السُّوُرَ ذَوَاتُ الْعَدَدِ فَكَانَ إِذَا نَزَلَ عَلَيْهِ الشَّيْءُ دَعَا بَعْضَ مَنْ كَانَ يَكْتُبُ فَيَقُوْلُ: “ضَعُوْا هَؤُلَاءِ الْآيَاتِ فِيْ السُّوْرَةِ الَّتِيْ يُذْكَرُ فِيْهَا كَذَا وَكَذَا”. فَإِذَا نَزَلَتْ عَلَيْهِ الْآيَةُ فَيَقُوْلُ: “ضَعُوْا هَذِهِ الْآيَةُ فِيْ السُّوْرَةِ الَّتِيْ يُذْكُرُ فِيْهَا كَذَا وَكَذَا”. وَكَانَتِ الْأَنْفَالُ مِنْ أَوْائِلِ مَا نَزَلَتْ بِالْمَدِيْنَةِ وَكَانَتْ بَرَاءَةُ مِنْ آخِرِ الْقُرْآنِ نزولا، وَكَانَتْ قِصَّتُهَا شَبِيْهَةً بِقِصَّتِهَا فَقُبِضَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم وَلَمْ يُبَيِّنْ لَنَا أَنَّهَا مِنْهَا فَمِنْ أَجْلِ ذَلِكَ قَرَنْتُ بَيْنَهُمَا وَلَمْ أَكْتُبْ بَيْنَهُمَا سَطَرَ، بِسْم اللهِ الرَّحْمنِ الرَّحِيْمِ، وَوَضَعْتُهَا فِيْ السَّبْعِ الطُّوْلِ. رَوَاهُ أَحْمَدُ وَالتِّرْمِذِيُّ وَأَبُوْ دَاوُدَ.
2222. (12) [1/682–దృఢం]
ఇబ్నె ‘అబ్బాస్ (ర) కథనం: నేను ‘ఉస్మాన్ (ర)తో ఇలా అన్నాను, ”తమరు మసా’నీలోని సూరహ్ అన్‌ఫాల్(8)ను, మియీ’న్‌లలోని సూరహ్ బరాఅహ్ (9)ను రెంటిని ఒకేచోట ఎందుకు ఉంచారు. రెంటిని కలిపి ఎందుకు ఉంచారు. ఇలా చేయాలని ఎవరు ఆదేశించారు. పోల్చడానికి ఆ రెండు సూరాల మధ్య బిస్మిల్లాహిర్ర‘హ్మా నిర్ర‘హీమ్ అని వ్రాసికూడా లేదు. తమరు సూరహ్ అన్‌ఫాల్‌ను 7 పెద్ద సూరాల్లో ఉంచారు. ఇలా చేయమని ఎవరు మిమ్మల్ని ప్రోత్స హించారు?” ‘ఉస్మాన్ (ర) అతనికి సమాధానం ఇస్తూ, ”ప్రవక్త (స) కాలంలో కొన్ని ఆయతులు గల సూరాలు అవతరించబడినపుడు ప్రవక్త (స) దైవవాణి లేఖకులను పిలిచి, ‘ఈ ఆయతులను ఫలానా సూరహ్‌లో ఫలానా చోట వ్రాయండి. ఇందులో ఫలానా విషయాల గురించి ఉంది’ అని అనేవారు. ఏదైనా ఆయతు అవతరించబడితే లేఖకుడ్ని పిలిచి ఈ ఆయతును ఫలానా సూరహ్‌లో ఫలానా చోట వ్రాయి అనేవారు. సూరహ్ అన్‌ఫాల్ (8) మదీనహ్లో మొదట అవతరించబడిన సూరాల్లో ఉంది. సూరహ్ బరాఅత్ (9) ఖుర్‌ఆన్ లోని చివర అవతరించబడిన సూరాల్లో ఉంది. ఈ రెండు సూరాలు పరస్పరం ఒకేలా ఉన్నాయి. సూరహ్ అన్‌ఫాల్‌లోని ఒక సంఘటన సూరహ్ బరాఅత్‌లోని సంఘటనతో కలుస్తుంది. ప్రవక్త (స) మరణించారు. ప్రవక్త (స) తన జీవితంలో సూరహ్ బరాఅత్ సూరహ్ అన్‌ఫాల్‌లో ఉందా? లేదా స్పష్టంగా మాకు తెలియపర్చలేదు. ఈ కారణంగా మేము ఈ రెండు సూరాలను కలిపి ఉంచాము. రెండు సూరాలను పోల్చడానికి బిస్మిల్లా హిర్ర’హ్మా నిర్ర’హీమ్ కూడా వ్రాసిలేదు. అందువల్ల మేము దీన్ని 7 పెద్ద సూరాల్లోనే చేర్చాము అని సమాధానం ఇచ్చారు. [49] (అ’హ్మద్, తిర్మిజి’, అబూ దావూద్)
*****
[1]) వివరణ-2110: అరబ్బుల్లో ఒంటెలకు, ఆడ ఒంటెలకు చాలా విలువ ఉండేది. ప్రత్యేకంగా ఎత్తైన వీపు ఉన్న ఆడ ఒంటెలంటే చాలా విలువైనదిగా భావించబడేది. ప్రవక్త (స) ఉపమానంగా అన్నారు, బత్’హాన్, ‘అఖీఖ్ ప్రాంతం పేర్లు. అక్కడ సంత తగిలేది. అక్కడి నుండి బలిసిన ఉత్తమ జాతి ఆడఒంటె ఉచితంగా ఎటువంటి అపరాధానికి పాల్పడకుండా తీసుకురావాలనే కోరిక ప్రతి వ్యక్తికి ఉంటుంది. అదేవిధంగా మస్జిద్‌లోనికి వెళ్ళి ఖుర్‌ఆన్ పఠించడం, బోధించడం, ఆ ఒంటెల కంటే ఎంతో ఉత్తమం. ఎందుకంటే ఈ ఒంటెలు నాశనం అయిపోతాయి. అల్లాహ్ గ్రంథం మిగిలి ఉంటుంది.
[2]) వివరణ-2112: పండితుడంటే ఖుర్‌ఆన్ చాలా బాగా కంఠస్తం ఉన్న వ్యక్తి, చాలా మంచిగా పఠిస్తాడు. అతనికి చదవడంలో ఎటువంటి ఆటంకం, కష్టం కలగదు. అయితే తడబడుతూ అతి కష్టంగా, శ్రమతో పఠించేవాడికి అంతకంటే రెట్టింపు పుణ్యం లభిస్తుంది.
[3]) వివరణ-2113: ఈ ‘హదీసు’లో అసూయ (రష్క్) అంటే తనకు కూడా ఇవి లభించాలనే తాపత్రయం. ఇతరుల అనుగ్రహాలు నశించాలని కోరితే అది ఈర్ష్య (‘హసద్) అవుతుంది. ఇలాంటి ఈర్ష్య నిషిద్ధం(‘హరాం).
ఒక వ్యక్తి ఖుర్‌ఆన్ పండితుడు, కంఠస్తం చేసి ఉన్నాడు. నేను కూడా అతనిలా అవ్వాలనే కోరిక కలగడం, దానధర్మాలు చేసే ధనవంతుని చూసి, తనకు కూడా అతనిలా ధనసంపదలు లభించాలని తాను కూడా అతనిలా దానధర్మాలు చేయాలని కోరటం ఉచితమే.
[4]) వివరణ-2115: ఖుర్‌ఆన్‌ను పఠించి దాన్ని అనుసరించే వ్యక్తికి ఉభయలోకాల్లో అల్లాహ్ (త) ఉన్నత స్థానాలు ప్రసాదిస్తాడు. అదేవిధంగా ఖుర్‌ఆన్‌ను పఠించని, దాన్ని అనుసరించని వ్యక్తి ఉభయ లోకాల్లోనూ అధోగతికి చేరుతాడు.
[5]) వివరణ-2116: ఒకవేళ ఒక వ్యక్తి భయభక్తులతో మంచి స్వరంతో ఖుర్‌ఆన్ పఠిస్తే అది వినడానికి ఆకాశం నుండి దైవదూతలు వస్తారు. దీనివల్ల పఠించేవాని ప్రాధా న్యత, ఖుర్‌ఆన్ ప్రత్యేకత తెలుస్తుంది. వీరు వెలుగుతో నిండిన దైవదూతలు. వారి ముఖాలు దీపాల్లా ఉంటాయి.
[6]) వివరణ-2117: ఆ వ్యక్తి అంటే ‘ఉసైద్ బిన్ హు’దైర్, ప్రవక్త గారి అనుచరుల్లో ఒకరు. వీరిని గురించి ఇంతకు ముందు ‘హదీసు’లో పేర్కొనడం జరిగింది. మరికొందరు సా’బిత్ బిన్ ఖైస్ అని అంటారు. ప్రశాంతత అంటే మనశ్శాంతి, కారుణ్య దైవదూతలు.
[7]) వివరణ-2118: ఈ వాక్యానికి అర్థం ఏమిటంటే అల్లాహ్(త) మరియు ఆయన ప్రవక్త (స) పిలిస్తే వెంటనే నేను సిద్ధంగా ఉన్నానని సమాధానం ఇవ్వాలి. ప్రవక్త (స) అతన్ని పిలిచినపుడు వెంటనే సమాధానం ఇచ్చి ఉండవలసింది. అంటే ఇలా, ‘లబ్బైక్ ఓ అల్లాహ్ ప్రవక్త! నేను మీ సేవలో సిద్ధంగా ఉన్నాను.’ ఇలా అనటంవల్ల నమా’జు భంగంకాదు. ఎందుకంటే నమా’జులో, ‘అస్స లాము అలైక అయ్యుహన్నబియ్యు,’ అంటే నమా’జు భంగం కానట్లు. దీనివల్ల సూరహ్ ఫాతి’హా ప్రత్యేకత, ప్రాధాన్యత విశదమవుతుంది. ఖుర్‌ఆన్‌లో భావపరంగా చూస్తే అన్నిటికంటే పెద్ద సూరహ్ ఇదేనని తెలిసింది.
[8]) వివరణ-2119: ఇండ్లను శ్మశానాలుగా చేసుకోవడం అంటే శ్మశానాల్లో నమా’జు చదవబడదు. ఖుర్‌ఆన్ పఠించబడదు. మీరు ఖుర్‌ఆన్ పఠించకుండా, అదనపు నమా’జులు చదవకుండా ఇండ్లను శ్మశానాలుగా మార్చకండి. ఇండ్లలో ఖుర్‌ఆన్ పఠించండి, అదనపు నమా’జులు చదవండి. దాని వల్ల షై’తాన్ మీ ఇండ్లలోకి రాలేడు. వచ్చినా భయంతో తుర్రున పారిపోతాడు. ఈ ‘హదీసు’ ద్వారా సూరహ్ బఖరహ్(2) ప్రాముఖ్యత విశదమవుతుంది.
[9]) వివరణ-2121: అంటే ఖుర్‌ఆన్ మరియు ఆ రెండు సూరాల పుణ్యం కారుణ్యఛాయలా పనిచేస్తుంది. తీర్పు మైదానంలో గల తీవ్రమైన వేడి నుండీ రక్షిస్తుంది. అంటే ఖుర్ఆన్, ఈ రెండు సూరహ్ లను చదివే ప్రతిఫలం కారుణ్య ఛాయగా ఉంటుంది. కాబట్టి వారు నరకాగ్ని నుండి సురక్షితంగా ఉంటారు.
[10]) వివరణ-2122: మొదటిసారి ‘తెలీదు’ అని అన్నారు. అప్పుడు అతనికి గుర్తుకురాలేదు కాబోలు. రెండవసారి ప్రశ్నించినపుడు అతనికి గుర్తుకొచ్చింది. ‘ఆయతుల్ కుర్సీ (2:255)’ అని సమాధానం ఇచ్చారు. భావపరంగా చూస్తే ఆయతుల్ కుర్‌సీ అన్నిటికంటే పెద్ద ఆయతు.
[11]) వివరణ-2124: రెండు వెలుగులంటే సూరహ్ ఫాతిహా (1), సూరహ్ బఖరహ్(2) చివరి వాక్యాలు. తీర్పుదినం నాడు ఈ రెండు వెలుగుగా మారుతాయి. వీటి వెలుగులో ఖుర్‌ఆన్ పఠించేవారు నడుస్తూ ఉంటారు. ”నూరుహుమ్ యస్ఆ బైన అయ్దీహిమ్” మరియు సూరహ్ బఖరహ్ చివరి భాగం అంటే ”లిల్లాహి మాఫిస్సమావాతి” నుండి చివరి వరకు. సూరహ్ ఫాతిహా చాలా ప్రాధాన్యత ఉంది. దీని పేరు ఉమ్ముల్ ఖుర్‌ఆన్, సబ్’ఉ మసా’నీ, సూరహ్ షిఫా’ సూరతుల్ క’న్జ్, సూరతు ‘స్సలాహ్, దీన్ని పఠించనిదే నమా’జ్ నెరవేరదు. ప్రవక్త (స) ఇలా ప్రవచించారు, ”అల్లాహ్ ఆదేశం, ”నేను నమా’జ్ అంటే సూరహ్ ఫాతిహాను తనకూ తన దాసునికి మధ్య చెరిసగం పంచివేసాను. ఎవరు నన్ను ఏది కోరితే దాన్నే అతనికి ప్రసాదిస్తాను. ఒకవేళ దాసుడు, ‘అల్’హమ్‌దులిల్లాహి రబ్బిల్ ‘ఆలమీన్’ అని అంటే అల్లాహ్ (త) ‘హమిదనీ అబ్దీ’ నా దాసుడు నన్ను స్తుతించాడు అని అంటాడు. దాసుడు ‘అర్ర’హ్మా నిర్ర’హీమ్’ అని అంటే అల్లాహ్ (త) ‘అస్నా’అలయ్య అబ్‌దీ’, నా దాసుడు నన్ను కీర్తించాడు అని అంటాడు. దాసుడు, ‘మాలికి యౌమిద్దీన్’ అంటే అల్లాహ్ (త), ‘మజ్జదనీ అబ్‌దీ’, నా దాసుడు నా గొప్పతనాన్ని కొని యాడాడు, అని అంటాడు. దాసుడు, ‘ఇయ్యాక న’అబుదు వ ఇయ్యాక నస్తయీన్,’ అని అంటే అల్లాహ్ (త), ‘ఇది నాకు నా దాసునికి మధ్య ఉంది. దాసుడు ఏది కోరితే అది నేను ప్రసాదిస్తాను.’ ఆ తరువాత దాసుడు చివరి వరకు పఠిస్తే, అల్లాహ్ (త), ‘ఇదంతా నా దాసునికోసమే ఉంది, అతడు ఏమి కోరితే అదే అతని కోసం ఉంది,’ అని అంటాడు. (నసాయి’)
ఈ సూరహ్ మొత్తం స్తోత్రం, కీర్తనం, ప్రార్థనలతో నిండి ఉంది. అందువల్లే దీన్ని వెలుగు అనడం జరిగింది. అదేవిధంగా సూరహ్ బఖరహ్ చివరి వాక్యాలకు కూడా చాలా ప్రాధా న్యత ఉంది. ఇందులో ప్రార్థన, ప్రార్థనా ఫలితం రెండూ ఉన్నాయి. అది, ఆమనర్రసూలు నుండి చివరి వరకు.
తఫ్‌సీర్ ఇబ్నె కసీ’ర్‌లో ‘స’హీ’హ్ బు’ఖారీ ఉల్లేఖనంలో ఈ రెంటి ప్రాముఖ్యత, ప్రాధాన్యత ఈ విధంగా ఉంది, ”ఎవరు ఈ రెండు ఆయతులను రాత్రి పఠిస్తే అతని కొరకు ఆ రెండు సరిపోతాయి.
ముస్నద్ అ’హ్మద్‌లో ఇలా ఉంది. సూరహ్ బఖరహ్ చివరి ఆయతులు దైవ సింహాసనం క్రింద ఉన్న నిధిలో నుండి నాకు ఇవ్వబడ్డాయి. నా కంటే ముందు ఏ ప్రవక్తకూ ఇవి ఇవ్వబడ లేదు.
‘స’హీ’హ్ ముస్లిమ్లో ఇలా ఉంది, ప్రవక్త (స) మే’రాజ్ చేసినపుడు ప్రవక్త (స) ”సిద్‌రతుల్ మున్‌తహా” వరకు వెళ్ళారు. అది ఏడవ ఆకాశంపై ఉంది. ఆకాశంవైపు వెళ్ళేది ఇక్కడి వరకు వెళ్తుంది. ఇక్కడి నుండి తీసు కోవటం జరుగుతుంది. మీద నుండి వచ్చేది కూడా ఇక్కడి వరకే చేరుతుంది. ఇక్కడి నుండి తీసుకోబడు తుంది. దీన్ని బంగారు పిచ్చుకలు కప్పి ఉంటాయి. ఇక్కడ ప్రవక్త (స)కు 3 వస్తువులు ఇవ్వ బడ్డాయి. (1) 5 పూటల నమా’జులు, (2) సూరహ్ బఖరహ్ చివరి ఆయతులు, (3) ఏకదైవారాధకులందరి క్షమాపణ.
ముస్నద్‌లో ఇలా ఉంది, ” ‘ఉఖ్‌బహ్ బిన్ ‘ఆమిర్‌తో ప్రవక్త (స) ఇలా అన్నారు, ”సూరహ్ బఖరహ్‌లో ఈ చివరి ఆయతులు ఎల్లప్పుడూ పఠిస్తూ ఉండు. నాకు అవి దైవసింహాసనం క్రింది నిధి నుండి ఇవ్వబడ్డాయి.
ఇబ్నె మర్ద్‌వియహ్లో ఇలా ఉంది, మాకు ఇతరులపై మూడు విధాలా ఆధిక్యత లభించింది. సూరహ్ బఖరహ్ చివరి ఆయతులు, ఇవి దైవసింహాసనం క్రిందినిధి నుండి ఇవ్వబడ్డాయి. నాకంటే ముందు ఎవ్వరికీ ఇవ్వబడ లేదు. నా తరువాత కూడా ఎవ్వరికీ ఇవ్వబడవు.
ఇబ్నె మర్ద్‌వైహ్‌లో ఇలా ఉంది. ‘అలీ (ర) ఉల్లేఖనం: ముస్లిముల్లోని ఎవరైనా ఆయతుల్ కుర్సీ మరియు సూరహ్ బఖరహ్ చివరి వాక్యాలు చదవకుండా పడుకుంటారని నేననుకోను. ఇవి మీ ప్రవక్త (స)కు దైవసింహాసనం క్రింద ఉన్న నిధి నుండి లభించాయి.
మరో తిర్మిజి’ ‘హదీసు’లో ఇలా ఉంది, ‘అల్లాహ్ (త) భూమ్యాకాశాలను సృష్టించడానికి రెండువేల సంవత్స రాలు ముందు ఒక గ్రంథం వ్రాయబడింది. ఇందులో రెండు వాక్యాలు లిఖించి సూరహ్ బఖరహ్ పూర్తి చేయబడింది. ఎవరి ఇంటిలో మూడు రోజుల వరకు పఠించబడుతుందో, ఆఇంటి సమీపానికి కూడా షై’తాన్ రాలేడు.” ఇమామ్ తిర్మిజి’ దీన్ని విశేషంగా భావించారు. కాని ‘హాకిమ్ తన ముస్తద్‌రక్‌లో దీన్ని ప్రామాణిక మైనదిగా పేర్కొన్నారు.
ఇబ్నె మర్ద్‌వైహ్‌లో ఇలా ఉంది, ”ప్రవక్త (స) సూరహ్ బఖరహ్ చివరి ఆయతులు, ఆయతుల్ కుర్సీ పఠిస్తే నవ్వుతారు, ఇంకా ఈ రెండు దైవసింహాసనం క్రింద నిధి నుండి లభించాయి,” అని అంటారు.
కొన్ని ‘హదీసు’ల్లో ఇలా ఉంది, దాసుడు, ‘గుఫ్‌రానక రబ్బనా,’ అని ప్రార్థిస్తే అల్లాహ్ (త), ‘నఅమ్, నేను నీ పాపాలను క్షమించాను,’ అని అంటాడు,
ఒకవేళ దాసుడు ”రబ్బనా, లాతుఆ’ఖిజ్’నా,” – ‘ఓ అల్లాహ్ మా పాపాల పట్ల మమ్మల్ని విచారించకు,’ అని అంటే అల్లాహ్ (త) సమాధానంగా, ‘నేనలాగే చేస్తాను,’ అని అంటాడు. ఒకవేళ, ”లాత’హ్‌మిల్ ‘అలైనా,” – ‘నాకు శక్తిలేని భారం వేయకు,’ అని అంటే అల్లాహ్(త), ‘నేనలాగే చేస్తాను, అంటే శక్తికి మించిన బరువు వేయనని’ అంటాడు, ఒకవేళ దాసుడు, ”వ ‘అఫు అన్నా” – ‘ఓ అల్లాహ్ నన్ను క్షమించు,’ అని అంటే అల్లాహ్, ‘నేను క్షమించివేస్తాను,’ అని అంటాడు. ఒక వేళ, ”వ’గ్‌ఫిర్‌లనా వర్’హమ్‌నా,” – ‘మమ్మల్ని క్షమించు కరుణించు,’ అని అంటే అల్లాహ్ (త), ”మేము క్షమించాము, కరుణించాము,” అని అంటాడు. ఒకవేళ, ”ఫన్‌సుర్‌నా అలల్ ఖౌమిల్ కాఫిరీన్,” – ‘మాకు అవిశ్వాసులపై సహాయం చేయి,’ అని అంటే అల్లాహ్ (త), ”మేము మీకు సహాయం చేసాము అని అంటాడు.”
[12]) వివరణ-2131: అంటే శరణుకోరటానికి ఆ రెండు సూరాల కంటే మంచి సూరహ్ లేదు
[13]) వివరణ-2133: ఈ మూడు విషయాలు దైవసింహా సనం క్రింద ఉంటాయంటే అల్లాహ్(త)కు చాలా దగ్గరగా ఉంటాయని అర్థం. అల్లాహ్ (త) వారి హక్కులను వృథా చేయడు. అల్లాహ్ (త) వారికి సానుకూలంగా స్పందిస్తాడు.
ఒకటి ఖుర్ఆన్. ఇది దైవగ్రంథం. ఇది సన్నిహితమైన దనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇది ఖుర్‌ఆన్ పఠించేవారి తరఫున అల్లాహ్(త) కు సిఫారసు చేస్తుంది. అల్లాహ్ (త) దాని సిఫారసు స్వీకరిస్తాడు. ఖుర్‌ఆన్ బాహ్య భావం కూడా ఉంది, చాలా మంది సులువుగా అర్థం చేసుకుంటారు. కొన్ని పదాల సూచనలు కూడా ఉన్నాయి. వీటిని చాలా కొద్దిమందే అర్థం చేసు కుంటారు. కొన్ని వాక్యాలు స్పష్టంగా ఉన్నాయి. కొన్ని అస్పష్టంగా ఉన్నాయి. అల్లాహ్ ఆదేశం: ”ఆయన (అల్లాహ్) యే నీపై (ఓ ము’హమ్మద్!) ఈ గ్రంథాన్ని (ఖుర్‌ఆన్‌ను) అవతరింపజేశాడు, ఇందులో కొన్ని స్పష్టమైన అర్థమిచ్చే ఆయతులు (ము‘హ్‌కమాత్) ఉన్నాయి. అవి ఈ గ్రంథానికి మూలాలు. మరికొన్ని అస్పష్టమైనవి (ముతషాబిహాత్) ఉన్నాయి…” (సూ. ‘ఆలి ఇమ్రాన్, 3:7) అంటే కొన్నిటి బాహ్యం ఒకటి ఉంటుంది. వాటి అర్థం గుప్తంగా ఉంటుంది. వాటిపట్ల అధ్యయనం ద్వారా అర్థమవుతాయి.
అమానత్ అంటే ప్రశాంతత, నిర్భయం. మానవుల హక్కులను, దైవహక్కులను నిర్వర్తించటం వల్ల నిర్భయంగా శాంతి భద్రతల్లో ఉంటాడు. ఇటువంటి గుణాలను కలిగి ఉన్న వారిని అమానతుదారు అంటారు. జీవిత వ్యవహారాలన్నిటిలో ధర్మబద్ధంగా వ్యవహరించాలి. ఇతరుల హక్కులను రవ్వంత కూడా చెల్లించాలి. అమానతుదారుకు చాలా ప్రాధాన్యత ఉంది. ఖుర్‌ఆన్‌లో అల్లాహ్‌ఆదేశం: ”నిశ్చయంగా మేము బాధ్యతను భూమికి మరియు పర్వతాలకు సమర్పించగోరాము…” (అల్ అహ్జాబ్, 33:72) ప్రవక్త (స) ఉపదేశం: అమానతు లేకుండా విశ్వాసం లేదు, పరిశుద్ధత లేకుండా నమా’జు లేదు. తెలివితేటలు, సత్యశీలత రెండూ ఒకటే. అమానతుదారుడే విశ్వాసి కాగలడు. ప్రవక్త (స) ప్రవచనం: అమానతుదారు కాని వాడు విశ్వాసి కాలేడు, వాగ్దానం నిలబెట్టు కోనివాడు ధార్మికుడు కాడు. (బజ్జార్ ‘తబ్రానీ). ప్రవక్త (స) ప్రవచనం: నీ దగ్గర ఉంచబడిన ఇతరుల అమానతును వారికి అప్ప జెప్పు. ఒకవేళ నీకు ద్రోహం చేస్తే నీవు వాడికి ద్రోహం చేయకు. (అబూ దావూద్, తిర్మిజి’) అల్లాహ్ ఆదేశం: ”పూచీలను (అమానతులను) తప్పక వాటికి అర్హులైన వారికి అప్పగించండి…” (సూ. అన్-నిసాఅ’, 4:58) అని అల్లాహ్ ఆదేశిస్తున్నాడు. అమానతును అప్పజెప్పని వారిని చాలా కఠినంగా విచారించడం జరుగుతుంది. దీన్ని గురించి అనేక ‘హదీసు’లు ఉన్నాయి. ఇవి ఇస్లామీ తాలీమ్ ఐదవ భాగంలో పేర్కొనబడ్డాయి.
3. బంధువుల హక్కులను చెల్లించటం: బంధుప్రీతి అంటే బంధుత్వాన్ని కలపటం, వారి హక్కులను చెల్లించక పోవటాన్ని బంధుత్వాన్ని త్రెంచటం అంటారు. బంధు ప్రీతి చాలా అవసరం. ఖుర్‌ఆన్, ‘హదీసు’ల్లో దీన్ని గురించి నొక్కి చెప్పబడింది. ప్రవక్త(స) ప్రవచనం: దేవుడు సమస్త సృష్టిరాసుల్ని సృష్టించిన తరువాత బంధుత్వం లేచి నిలబడి, ” అల్లాహ్ (త)! నేను బంధుత్వాల తెగ త్రెంపుల బారి నుండి నీ శరణు కోరుకుంటున్నాను” అని అంది. దానికి, ”అయితే, నీతో సత్సంబంధాలు పెట్టు కున్న వాడితో నేను సత్సం బంధాలు పెట్టుకుంటాను. నీతో తెగ త్రెంపులు, చేసుకున్న వాడితో నేనూ తెగ త్రెంపులు చేసుకుంటాను. ఇది నీకిష్టమే కదా!” అని అడి గాడు .అల్లాహ్ (త), దానికి బంధుత్వం, ”ఇష్టమే ప్రభూ!” అని అన్నది. అప్పుడు అల్లాహ్ (త), ”సరే! ఆ భాగ్యం నీకు దక్కుతుంది” అని అన్నాడు. ఈ బంధు త్వం తీర్పుదినం నాడు బహిరం గంగా ”నన్ను కలిపిన వారిని అల్లాహ్ (త) కలుపుగాక, నన్ను త్రెంచిన వారిని అల్లాహ్ (త) త్రెంచుగాక” అని ప్రకటిస్తుంది.
[14]) వివరణ-2135: అంటే, ఒక్క ఆయత్ కూడా గుర్తు లేని, దానిపట్ల విశ్వాసం లేని, దాన్ని అనుసరించని వాడి హృదయం పాడుబడిన, శిధిలమైన ఇల్లుతో సమానం.
[15]) వివరణ-2137: ఖుర్‌ఆన్ ప్రత్యేకతల అంశంపై ఖుర్‌ఆన్‌లోని అక్షరాల గురించి పేర్కొనడం జరిగింది. ఇప్పుడు ఖుర్‌ఆన్‌లోని పదాల, వచనాల వివరాలను క్రింద పట్టికలో చూడండి. వీటిని లెక్కించటం, గుర్తుంచటం తప్పనిసరి అని పండితులు భావించారు. దీనివల్ల ఖుర్‌ఆన్ రక్షణ, అసలు స్థితిని దృష్టిలో పెట్టుకునేందుకు చాలా సహాయం లభిస్తుంది.
ఖుర్ఆన్ లో:
భాగాలు 30
సూరహ్లు 114
ఆయతులు 6666 (6236)
రుకూలు 540
కథన ఆయతులు 1000
ఉపమాన ఆయతులు 1000
వాగ్దాన ఆయతులు 1000
హెచ్చరిక ఆయతులు 1000
ఆదేశ ఆయతులు 1000
నిషిద్ధ ఆయతులు 1000
ధర్మాధర్మ ఆయతులు 500
ప్రార్థనా ఆయతులు 100
విభిన్న ఆయతులు 66
వచనాలు(Words) 86430
ఖుర్ఆన్ లో అక్షరాలు (حُرُوف)
- అలిఫ్ 48992
- బా 12228
- తా 2404
- స‘ 3105
- జీమ్ 4232
- ’హ 4120
- ’ఖ 2105
- దాల్ 5972
- జా‘ల్ 4739
- ర 12240
- ’జ 3580
- సీన్ 5976
- షీన్ 2115
- ’సాద్ 20083
- ’దాద్ 682
- ’తా 1307
- ”జ 782
- ’ఐన్ 9274
- ’గైన్ 9211
- ఫ 4418
- ఖాఫ్ 6612
- కాఫ్ 10628
- లామ్ 33520
- మీమ్ 26515
- నూన్ 44190
- వావ్ 25589
- హ 16070
- లామ్-అలిఫ్ 4720
- య 25909
మొత్తం అక్షరాల సంఖ్య: 351,318
ఎ‘అరాబ్ (إِعْرَاب)
జబర్ 39552
జేర్ 53243
పేష్ 8804
చుక్కలు 105684
తష్‌దీద్ 1253
మద్‌లు 1771
ఖుర్‌ఆన్ మొదటి అక్షరం: ب
ఖుర్‌ఆన్ మధ్య అక్షరం (వుఖూపి): ت
(తఫ్‌సీర్ ఇత్‌ఖాన్ ప్రకారం ف:
ఖుర్‌ఆన్ చివరి అక్షరం : س
ఆషార్ కూఫి (أعشار) 433
ఆషార్ బస్రీ 623
అఖ్‌మాస్ కూఫీ 447
అఖ్‌మాస్ బస్రీ 1246
ఆయాత్
కూఫీ ఆయాత్ (KFCPHQ) 6236
బస్రీ ఆయాత్ 6216
షామీ ఆయాత్ 6250
మక్కీ ఆయాత్ 6212
ఇరాఖీ ఆయాత్ 6214
ఆయాత్ ఆమ్మ 6666
నోట్: ఖుర్‌ఆన్ మొత్తంలో అలిఫ్(ا) నుండి య(ي) వరకు మూడు లక్షల, యాభై ఒక్కవేల, మూడు వందల పద్దెనిమిది, (351, 318) అక్షరాలు ఉన్నాయి. వాటిని 10తో గుణిస్తే వచ్చేది ముప్ఫైఐదు లక్షల, పదమూడు వేల నూటఎనభై అవుతుంది. ఈవిధంగా ఒకసారి ఖుర్‌ఆన్ పూర్తిచేస్తే 3,513,180 పుణ్యాలు లభిస్తాయి. సుబ్‌హానల్లాహ్! ఇంత పెద్ద పుణ్య ఫలితం మరే గ్రంథాన్ని పఠిస్తే లభించదు.
పైన పేర్కొన్న అక్షరాల వివరాలు రహ్మతుల్ లిల్-ఆలమీన్ 3వ భాగం నుండి తీసుకోవడం జరిగింది. కాని (لأ) అక్షరం అన్వార్ అస్-సవాతి’అ అల్-ఖుర్‌ఆన్ నుండి తీసుకోవటం జరిగింది. వీటి వివరాలు తఫ్‌సీర్ ఇబ్నె-కసీర్, అల్ అక్సీర్ ఫీ ఉసూలి త్తఫ్‌సీర్, ఇత్‌ఖాన్ మొదలైన వాటిలో చూడగలరు.
[16]) వివరణ-2139: అంటే ఖుర్‌ఆన్ పఠించి దాన్ని అనుసరించటం వల్ల ఖుర్‌ఆన్ పాఠకుని తల్లిదండ్రులకు ఒక కిరీటం పెట్టబడుతుంది. దాని వెలుగు సూర్యునికన్నా అధికంగా ఉంటుంది. ఎంత వెలుగు ఉంటుందో ఊహిస్తే సరిపోతుంది.
[17]) వివరణ-2139: ఇది ఖుర్‌ఆన్ మహిమ. మరికొందరు చర్మం అంటే ఖుర్‌ఆన్‌ను పఠించేవాని శరీరం, అంటే ఒకవేళ ఖుర్‌ఆన్ పఠించేవాడిని మంటల్లో వేస్తే ఖుర్‌ఆన్ శుభం వల్ల, ఏమాత్రం కాల్చబడడు. ఇది కూడా ఒక మహిమే.
[18] (వివరణ-2147: అంటే ఒకసారి సూరహ్ యాసీన్ (36) చదివితే 10 సార్లు ఖుర్‌ఆన్ పఠించటానికి సమానం.
[19]) వివరణ-2152: ముసబ్బహాత్ అంటే ప్రారంభంలో సబ్బహ లేదా యుసబ్బిహు లేదా సబ్బిహ్, లేదా సుబ్‌హాన అనే పదం వచ్చే సూరాలు. అవి ఏడు ఉన్నాయి. సూరహ్ బనీ ఇస్రాయీల్ (17), సూరహ్ హదీద్ (57) , సూరహ్ ‘హష్‌ర్ (59), సూరహ్ ‘సఫ్ఫ్ (61), సూరహ్ జుము’అహ్ (62), సూరహ్ త’గాబున్ (64), సూరతుల్ అ’అలా (87). వీటిలో ఒక ఆయత్ వెయ్యి ఆయతుల కంటే ఉత్తమమైన ఆయత్ ఏది అనే విషయంలో పండితుల మధ్య భేదాభిప్రాయాలు ఉన్నాయి. కొందరు లౌ అన్‌జల్‌నా హాజల్ ఖుర్‌ఆన్ అని అంటారు. మరికొందరు అల్ అవ్వలు వల్ ఆఖిరు అని అంటారు. మరికొందరు షబె ఖద్‌ర్ లా ఇది కూడా గుప్తంగా ఉందని అభిప్రాయపడుతున్నారు.
[20]) వివరణ-2157: సూరహ్ ‘హష్‌ర్ చివరి 3 ఆయతులు: ” ఆయనే, అల్లాహ్! ఆయన తప్ప మరొక ఆరాధ్యుడు లేడు. ఆయనకు అగోచర మరియు గోచర విషయాలన్నీ తెలుసు. ఆయన అనంత కరుణా మయుడు, అపార కరుణాప్రదాత. ఆయనే, అల్లాహ్! ఆయన తప్ప మరొక ఆరాధ్యుడు లేడు. ఆయన విశ్వ సార్వభౌముడు, పరమ పవిత్రుడు, శాంతికి మూలా ధారుడు, శాంతిప్రదాత, శరణమిచ్చేవాడు, సర్వ శక్తి మంతుడు, నిరంకుశుడు, గొప్పవాడు. వారు కల్పించే భాగస్వాములకు అల్లాహ్ అతీతుడు. ఆయనే, అల్లాహ్! విశ్వసృష్టికర్త, ప్రతిదానిని సృజించేవాడు మరియు రూపాలను తీర్చిదిద్దేవాడు. ఆయనకు సర్వశ్రేష్ఠమైన పేర్లున్నాయి. ఆకాశాలలో మరియు భూమిలో ఉన్న సమస్తమూ, ఆయన పవిత్రతను కొనియాడుతూ ఉంటాయి. మరియు ఆయనే సర్వ శక్తిమంతుడు, మహా వివేకవంతుడు.” (సూ. అల్-హష్ర్, 59:22-24)
[21]) వివరణ-2165: విధులు: నిర్వర్తించే బాధ్యత అప్పగించబడిన దైవాదేశాలు, అంటే ఆజ్ఞలు. హద్దులు అంటే నిషిద్ధాలు. వీటినుండి వారించడం జరిగింది. అంటే ఖుర్‌ఆన్ అర్థాన్ని, భావాన్ని స్పష్టంగా విశదపరచండి, ఇంకా అందులో ఉన్న కఠిన పదాలను పరిశోధనతో పరిష్కరించండి. వాటి అర్థాన్ని గుర్తించండి, వాటిని అధ్యయనం చేయండి, వాటి ఆదేశాలను వ్యక్తం చేయండి. మీ హృదయాల్లో దాచి ఉంచకండి.
ఈ ‘హదీసు’లో అ’అరిబుల్ ఖుర్‌ఆన్, అంటే, ఖుర్‌ఆన్ ఉచ్చారణ సులభతరం చేయండి. అంటే ఖుర్‌ఆన్‌లో జబర్, జేర్, పేష్‌లను పెట్టటం కూడా ఉచ్చారణ క్రిందికే వస్తుంది. కొందరు బిద్‌అతె ‘హసనహ్, అంటారు, ఇది ప్రవక్త (స) కాలంలో లేదని, తరువాతి కాలంలో పెట్టడం జరిగిందని అంటారు. కాని ఇలా అనడం సరికాదు. ఎందుకంటే అ’అరిబుల్ ఖుర్‌ఆన్ సర్వసాధారణమైనది. అక్షరాలను స్పష్టపరచి, పదాలను ఉచ్చరించే, పఠన ఆదేశాలవలే వ్రాతలో, అక్షరాల, పదాలపై ఏరాబ్ అంటే జబర్, జేర్, పేష్, జజ్మ్, తష్‌దీద్‌లు పెట్టడం కూడా కలిసి ఉంది. కనుక ఖుర్‌ఆన్ అక్షరాలపై ఇస్లామీయ పరిభాషలో ఎ‘అరాబ్ లు పెట్టటం బిద్‌అత్ (కల్పితం) కాదు. నిజం అల్లాహ్ (త) కు తెలుసు.
[22]) వివరణ-2167: ఖుర్‌ఆన్‌ను చేతిలో పట్టుకొని చూచి చదివితే పుణ్యం అధికంగా లభిస్తుంది. ఎందుకంటే అందులో పఠించే, ఆలోచించే, అధ్యయనం చేసే అవకాశం అధికంగా లభిస్తుంది. అంతేకాక ఖుర్‌ఆన్‌ను చేతిలోనికి తీసుకోవటం, చూడటం కూడా ఆరాధనే అవుతుంది.
[23]) వివరణ-2168: అంటే, చావును అధికంగా గుర్తుచేసు కోవటం వల్ల, ఖుర్‌ఆన్‌ను పఠించటం వల్ల హృదయంలో ఉన్న మలినమంతా తొలగిపోతుంది. అందులో పరిశుద్ధత పొంది అందులో వెలుగు జనిస్తుంది.
[24]) వివరణ-2170: అంటే పరిపూర్ణ విశ్వాసంతో, నమ్మకంతో చికిత్స కొరకు స్వస్థత కొరకు దృఢ నిశ్చయంతో పఠిస్తే అంతర్బాహ్య వ్యాధుల నుండి విముక్తి లభిస్తుంది. ఇది అనేక సార్లు ప్రయోగించిన మోతాదు. దాన్ని గురించి పూర్తి వివరణను మేము ఇస్లామీ వజాయిఫ్‌లో పేర్కొన్నాము.
[25]) వివరణ-2179: ముఫస్సల్ అంటే చిన్న చిన్న సూరాలు. సూరహ్ ‘హుజురాత్ నుండి చివరి వరకు(49-114). ఇవి మూడు రకాలుగా ఉన్నాయి. 1. అగ్రశ్రేణి ముఫస్సల్, 2. మధ్య శ్రేణి ముఫ స్సల్, 3. చిన్న శ్రేణి ముఫస్సల్. వీటిని గురించి రానున్న పేజీల్లో వివరించడం జరుగుతుంది.
[26]) వివరణ-2182: అలా చూస్తే మొత్తం ఖుర్‌ఆన్‌ను చాలా ప్రేమించేవారు. కాని, కొన్ని సూరాలను కొన్ని విధాలుగా చాలా ప్రేమించేవారు. ఈ సూరహ్‌లో ఇబ్రాహీమ్ (అ), మూసా (అ)ల ప్రస్తావన ఉంది, తీర్పుదినం గురించి మళ్ళీ లేపబడటాన్ని గురించి కూడా ప్రస్తావించటం జరిగింది.
[27]) వివరణ-2183: సూరతు జ్జిల్ జాల్ (99) గొప్ప సూరహ్. ఎందు కంటే, ఇందులో మంచీ చెడు రెండూ వివరించ బడ్డాయి. రవ్వంత మంచి పని చేసినా దాన్ని చూసుకోవటం జరుగుతుంది. రవ్వంత చెడుపని చేసినా, దాన్ని చూసుకోవడం జరుగుతుంది.
[28]) వివరణ-2187: ఒకవేళ ఒంటె యజమాని తన ఒంటెను కట్టిఉంచితే దాన్ని పరిరక్షిస్తూ ఉంటే అది అతని అధీనంలోనే ఉంటుంది. ఒకవేళ ఒంటెను పరిరక్షించకుండా వదలివేస్తే అది త్రాడు త్రెంచుకొని పారిపోతుంది. యజమాని అధీనంలో ఉండదు. అదేవిధంగా ఖుర్‌ఆన్ పాఠకుడు ఎల్లప్పుడూ ఖుర్‌ఆన్‌ను పఠించకుండా ఉంటే ఖుర్‌ఆన్ అతని హృదయం నుండి అదృశ్యమవుతుంది. అతను మరచిపోతాడు. అందు వల్ల ఖుర్‌ఆన్‌ను ఎల్లప్పుడూ పఠిస్తూ ఉండాలి.
[29]) వివరణ-2188: అంటే ఖుర్‌ఆన్ గురించి కొన్ని నియమాలు నేర్పడం జరిగింది. ‘నేను ఖుర్‌ఆన్ మరచి పోయాను’ అని అనకూడదు. ‘ఖుర్‌ఆన్ మరపింప జేయబడ్డది’ అని అనాలి. దానివల్ల అశ్రద్ధ వ్యక్తం అవుతుంది. దీనివల్ల విచారణ వ్యక్తం అవుతుంది. విచారం వ్యక్తం చేయడం అనుగ్రహం పొందే ఒక మార్గం.
[30]) వివరణ-2190: ప్రతి ఆరాధనలో మనశ్శాంతి, కోరిక, శ్రద్ధ, చిత్తశుద్ధి అవసరం. ఫలితంగా ఆ పని పూర్తవు తుంది. పనిలో మనసు లగ్నం కాకుండా ఉండి విసుగు పుడితే ఆ పని సరిగా పూర్తవదు. అదేవిధంగా ఖుర్‌ఆన్ పఠించడంలోనూ చాలా శ్రద్ధగా, చిత్తశుద్ధితో, ప్రశాంతంగా ఇష్టపూర్వకంగా చదవాలి. విసుగుపుడితే ఆపివేయాలి. ఆరాధనలన్నిటికీ ఈ పద్ధతినే అనుసరించాలి.
[31]) వివరణ-2191: మద్ అంటే సాగదీసి చదవటం అని అర్థం. ఖారీల పరిభాషలో 3 అలిఫ్‌ల పొడవు సాగదీయటాన్ని మద్దె‘తూల్ అంటారు, 2 అలిఫ్ లంత పొడవు సాగదీయటాన్ని మద్దె తవస్సు‘త్, 1 అలిఫ్ పొడవు సాగదీయటాన్ని మద్దె ఖ‘స్‌ర్ అంటారు. మద్ రెండు రకాలు. I. అస్‌లీ, II. ఫర్‌యీ.
I. మద్దె అస్లీ: మద్ తరువాత సుకూన్, హమ్‌జహ్ లేని మద్‌ను మద్దె అస్‌లీ అంటారు.
II. మద్దె ఫర‘యీ: సుకూన్, హమ్‌జహ్ ఉన్న మద్‌ను మద్దె ఫర’యీ అంటారు. మద్దె ఫర’యీ, నాలుగు రకాలు: 1. ముత్త’సల్, 2. మున్‌ఫ’సల్, 3. ‘ఆరి’ద్, 4. లా’జిమ్.
1. ముత్తసిల్: మద్ద అక్షరాల తర్వాత ఒకే పదంలో హమ్‌జహ్ వస్తే ముత్తసిల్ అంటారు. ఉదా: జాఅ’, జీఅ’, సౌదాఅ’
2. మున్ ఫ‘సల్: ఒకవేళ హమ్‌జహ్ తరువాతి పదంలో వస్తే మన్ ఫ’సల్ అంటారు. ఉదా: ఫీ-అన్‌ఫుసికుమ్, ఖాలూ- ఆమన్నా, మా-అన్’జల.
3. మద్దె ‘ఆరి‘ద్: మద్ అక్షరం తర్వాత సుకూన్ వఖ్‌ఫీ ఉంటే మద్దె ‘ఆరి’ద్ అంటారు. ఉదా: ర’హీమున్, త’అలమూన్, తుకజ్జి’బాన్. ఇందులో ‘తూలు, తవస్సు’త్, ఖస్‌ర్ మూడూ సమ్మతమే.
4. మద్దె లా‘జిమ్: ర అక్షరం తర్వాత ర నుండి వీడని సుకూన్ ఉంటే దాన్ని మద్దె లా’జిమ్ అంటారు. మద్దె లా’జిమ్ 4 రకాలు.
(1) హర్ఫీ: ఒకవేళ మద్ద్ అక్షరం ముఖ’త్త’ఆత్‌లలో నుండి ఉంటే హర్‌ఫీ అంటారు. లేకపోతే
(2) కలిమీ అంటారు. హర్‌ఫీ కలిమీలు ప్రతి ఒక్కటి రెండు రకాలు: ముస’ఖ్ఖల్, ము’ఖప్ఫఫ్. (i) ము’సఖ్ఖల్: ఒకవేళ మద్ద్ అక్షరం తర్వాత ముషద్దద్ అక్షరం ఉంటే ము’సఖ్ఖల్ అంటారు. (ii) ము’ఖప్ఫఫ్: ఒకవేళ సుకూన్ ఉంటే ము’ఖప్ఫఫ్ అంటారు. (a) మద్దె ‘లాజిమ్ హర్‌ఫీ ము’సఖ్ఖల్, ఉదా: అలిఫ్-లామ్-మీమ్; అలిఫ్-లామ్-రా; కాఫ్-హా-యా- ఐన్-సాద్; హా-మీమ్; ఐన్-మీమ్-ఖాఫ్; హా-మీమ్; ‘తా-సీన్-మీమ్; మరియు (b) మద్దె ‘లాజిమ్ ‘హర్‌ఫీ ము‘ఖప్ఫఫ్. ఉదా: నూన్; సాద్; ఖాఫ్. (c) మద్దె లాజిమ్ కలిమీ ముసఖ్ఖల్. ఉదా: దాబ్బతున్. (d) . ఉదా: ఆల్ఆ’న్.
(3) మద్దె లీన్: ఒకవేళ వావ్ లేక యా సాకిన్ కు ముందు ఫతహ్ ఉండి, దాని తర్వాత సాకిన్ అక్షరం ఉంటే దాన్ని మద్దె లీన్ అంటారు. అందులో ఖ’స్ర్, తవస్సు’త్, ‘తూల్, మూడూ చేయవచ్చును.
(4) ఐన్ మర్‌యమ్, షీన్ షూరాలో ఖ’స్‌ర్ చేయరాదు. ‘తూల్ చేయడమే మంచిది.
సారాంశం: సూరహ్ ఆలి ఇమ్రాన్‌లో (అలిఫ్-లామ్-మీమ్-అల్లాహు) వస్‌ల్ స్థితిలో మీమ్ సాకిన్ రెండు సాకిన్‌లు చేరడం వల్ల మఫ్‌తూహ్‌గా చదవబడుతుంది. అల్లాహ్‌లో హమ్‌జహ్ చదవబడదు. మీమ్‌లో లాజిమ్ ఉంది. అందువల్ల వస్ల్లో తూల్, ఖస్‌ర్ రెండూ చేయవచ్చును.
మద్ద్ అక్షరంపై మౌఖూఫ్ ఉంటే దాన్ని ఒక అలిఫ్కు మించకుండా చూసుకోవాలి. మద్ద అక్షరం తర్వాత హా మరియు వావ్, హమ్‌జహ్ అధికంగా ఉండరాదు. ఉదా (ఖాలూ ఫీ మాలా) గుర్తుంచక పోవడం వల్ల జరుగు తుంది. దీన్ని గురించి తజ్‌వీద్ పుస్తకాల్లో లభిస్తుంది.
[32]) వివరణ-2192: అంటే ప్రవక్త (స) అల్లాహ్ గ్రంథాన్ని బిగ్గరగా మధురంగా పఠిస్తే అల్లాహ్ (త) ప్రత్యేక శ్రద్ధతో వింటాడు. దాన్ని స్వీకరిస్తాడు. సంతోషిస్తాడు.
[33]) వివరణ-2194: అంటే బిగ్గరగా మంచి స్వరంతో పఠించాలి. మరో అర్థం ఏమిటంటే ఖుర్‌ఆన్ ద్వారా ప్రపంచం పట్ల అనాశక్తత వ్యక్తం చేయాలి. అంటే ఖుర్‌ఆన్ జ్ఞానం లభించిన వారు ఇతరుల వద్దకు వెళ్ళి తమ సమస్యలను చెప్పుకోరాదు. అయితే ఖుర్‌ఆన్ జ్ఞానం లభించకుండానే అనాశక్తత వ్యక్తం చేయటం భావ్యం కాదు. అటువంటివాడు ప్రవక్త పద్ధతిపై లేడు.
[34]) వివరణ-2195: అంటే ప్రవక్త (స) తన అనుచర సమాజం గురించి ఆలోచించారు. వీరిలో కొందరు మంచి వారుంటారు. మరికొందరు చెడ్డవారుంటారు. ప్రవక్త (స) సాక్షిగా దైవం ముందు నిలబడవలసి ఉంది. ఈ సన్ని వేశాన్ని ఊహించి ప్రవక్త (స) ఏడ్వసాగారు. ఎందుకంటే ప్రవక్త (స) తన అనుచర సంఘాన్ని గురించి ఆలోచించే వారు. అల్లాహ్ (త) ఆయనపై ఎనలేని దురూద్ వ సలామ్ అవతరింపజేయుగాక! అంటే, ‘ఇతరుల ద్వారా ఖుర్‌ఆన్ వినడంకూడా అధ్యయనం చేయటానికి మంచి అవకాశం’ అని ఈ ‘హదీసు’ ద్వారా తెలుస్తుంది.
[35]) వివరణ-2196: ఉబయ్ బిన్ క‘అబ్ ఖుర్‌ఆన్ పాఠకుల, అ’న్సార్ల నాయకులు, ప్రముఖ ప్రవక్త అనుచరులు, గొప్ప పండితులు. ఇతడు అ’న్సార్ల తో ప్రవక్త (స) చేతిపై ఉఖ్‌బహ్ లో బై’అత్ చేసారు. ఎల్లప్పుడూ ఇస్లామ్ మరియు ఖుర్‌ఆన్ సేవలో నిమగ్నమయి ఉండేవారు. ఇతని జీవితంలోని ఒక్కొక్క నిమిషం ఇస్లామ్ మరియు ధార్మిక జ్ఞానానికి అంకితమై పోయింది. అ’న్సార్లు ముహాజిరీన్లు వ్యాపారంలో వ్యవ సాయంలో నిమగ్నమయి ఉంటే, ఉబయ్ బిన్ క’అబ్ మస్జిదె నబవీలో దైవదౌత్య జ్ఞానంతో తన దుకాణాన్ని అలంకరించేవారు. అన్సారుల్లో అతనికి మించిన పండితుడు లేడు. ఖుర్‌ఆన్ పఠనంలో, అవగాహనలో ముహాజిరీన్లు మరియు అన్సారుల్లో ఎవరూ ఆయనకు సాటి ఉండేవారు కారు. ఉబయ్ బిన్ క’అబ్‌కు ఖుర్‌ఆన్ పట్ల ప్రత్యేక శ్రద్ధాసక్తులు ఉండేవి. ప్రవక్త (స) కాలంలో పూర్తి ఖుర్‌ఆన్‌ను కంఠస్తం చేసి ఉన్నారు. ప్రవక్త (స) ఇతని గురించి చాలా గొప్పగా చెప్పే వారు. ఉబయ్ బిన్ క’అబ్ ప్రవక్త (స) నుండి పఠించిన దాన్ని ఇంటికి వెళ్ళి వ్రాసుకునేవారు. అదే ఈ ఖుర్‌ఆన్ పఠనకళా చరిత్రలో ముస్హఫ్ ఉబయ్ బిన్ క’అబ్ పేరుతో ఖ్యాతి పొందింది. ఇది ‘ఉస్మాన్ పాలనాకాలం వరకు ఉండేది. దీని ఖ్యాతి దూరప్రాంతాల వరకు వ్యాపించింది. ఉబయ్ బిన్ క’అబ్ మరణానంతరం అతని కుమారుడైన ము’హమ్మద్ మదీనాలోనే ఉండేవారు. ఇరాఖ్ నుండి కొంత మంది వచ్చి, ‘మేము ఆ ముస్హఫ్ను చూడాలను కుంటున్నాం,’ అని అన్నారు. దానికి ఆయన దాన్ని ‘ఉస్మాన్ (ర) ఎప్పుడో తీసుకున్నారు,’ అని అన్నారు. ప్రవక్త (స) అనుచరుల్లో ‘హదీసు’ జ్ఞానం గల గొప్ప పండితుల్లో వీరొకరు. ‘హదీసు’వేత్త ‘దహ్‌బీ, తజ్’కిరతుల్ హుప్ఫా”జ్‌లో ఇలా పేర్కొన్నారు. ప్రవక్త (స) నుండి చాలా ఎక్కువ ‘హదీసు’లు విన్నవారిలో ఉబయ్ బిన్ క’అబ్ ఒకరు. అందువల్లే అనేక మంది ప్రవక్త అనుచరులు ప్రామాణిక ‘హదీసు’లను గుర్తించారంటే వీరు ఉబయ్ బిన్ క’అబ్ శిష్యరికంలో చేరినవారే. 39 హిజ్రీలో వృధ్ధాప్యానికి చేరి ‘ఉస్మాన్ (ర) పరిపాలనా కాలంలో శుక్రవారం నాడు మరణించారు. ‘ఉస్మాన్ (ర) ఉబయ్ బిన్ క’అబ్ జనాజ’హ్ నమా’జు చదివించారు. మదీనహ్ మునవ్వరహ్లో ఖననం చేయబడ్డారు.
[36]) వివరణ-2198: వీరు అ‘స్’హాబె సుఫ్ఫహ్ సభ్యులు. రాత్రీ పగలు దైవారాధనలో నిమగ్నమయి ఉండేవారు. దైవగ్రంథం, ప్రవక్త సాంప్రదాయాల శిక్షణ పొందేవారు. వీరు దారిద్య్రరేఖకు దిగువ ఉన్న నిరుపేదలు. కేవలం మర్మాంగాలను కప్పి పుచ్చేవి తప్ప వీరి వద్ద బట్టలు ఉండేవి కావు. కొందరి తల తెరచి ఉండేది, మరికొందరి వీపు తెరచిఉండేది. మరి కొందరి కాళ్ళు తెరిచి ఉండేవి. దాన్ని దూరం చేయటానికి అందరూ కలసి కూర్చునేవారు. ఒకరికొకరు తెరగా పనిచేసేవారు. అల్లాహ్(త) వీరిని ఎంతో ప్రేమించేవాడు. అల్లాహ్ (త) వీరిని గురించి ఎంతో పొగిడాడు. అంతే కాదు, అటువంటి వారితోనే ఉండాలని, వీరిని వేరు చేయరాదని ఆదేశించాడు. అల్లాహ్(త) ఆదేశం: ”మరియు (ఓ ప్రవక్తా!) ఎవరు ఆయన ముఖ దర్శనం (ప్రసన్నతను) కోరుతూ, ఉదయం మరియు సాయంత్రం తమ ప్రభువును ప్రార్థిస్తున్నారో, వారి సహచర్యంలోనే, సహనంవహించి ఉండు. ఇహలోక ఆడంబరాలను అపేక్షించి నీ దృష్టిని వారి నుండి మరల్చకు. (వారిని ఉపేక్షించకు). మరియు అలాంటివానిని అనుసరించకు (మాటవినకు), ఎవడి హృదయాన్ని మా ధ్యానం నుండి తొలగించామో మరియు ఎవడు తన మనోవాంఛలను అనుసరిస్తున్నాడో మరియు ఎవడి వ్యవహారాలు (కర్మలు) వ్యర్థమయ్యాయో! (అల్ కహఫ్, 18:28)
అంటే అల్లాహ్(త)ను ప్రార్థించే, స్మరించే, స్తోత్రం చేసే వారివద్ద కూర్చో. వీరు ఉదయం సాయంత్రం దైవధ్యానంలో నిమగ్నమయి ఉంటారు. వారు ధనవంతులైన, పేదవారైనా, దరిద్రులైనా, సజ్జనులైనా, బలహీనులైనా, బలవంతులైనా సరే. ఖురైషులు ఇటు వంటి పేదల్లో దరిద్రుల్లో కూర్చోవద్దని విన్న వించుకునే వారు. ఉదా: బిలాల్, ‘అమ్మార్, సు’హైబ్, ఖుబైబ్, ఇబ్నె మస్’ఊద్ మొదలైనవారు. అవిశ్వాసులు మా సభల్లో కూర్చోమని విన్నవించుకునే వారు. అల్లాహ్ (త) వారి ఆహ్వానాన్ని నిరాకరించవలసిందిగా ఆదేశించాడు. అంటే ఎల్లప్పుడూ దైవస్మరణలో ఉండేవారిని సభల నుండి గెంటివేయకు. ‘స’హీ’హ్ ముస్లింలో ఇలా ఉంది. ఆరుగురు నిరుపేదలు ప్రవక్త (స) సభలో కూర్చొని ఉన్నారు. స’అద్ బిన్ అబీ వఖ్ఖాస్, ఇబ్నె మస్’ఊద్, ‘హుజైల్ తెగకు చెందిన ఒక వ్యక్తి, బిలాల్, మరో ఇద్దరు. ఇంతలో అవిశ్వాస ప్రముఖులు వచ్చారు. ‘ఇంత ధైర్యంగా వారిని మీ సభల్లో కూర్చోనివ్వకండి’ అని అన్నారు. అయితే ప్రవక్త (స) మనసులో ఏముందో అల్లాహ్(త)కే తెలుసు. అప్పుడు ఈ ఆయత్ అవతరించింది: ”నిరుపేదలు, ముహాజిరీన్లకంటే, విశ్వా సులకంటే, ఏకదైవారాధకులకంటే ముస్లిమ్ ధనవంతుల కంటే ఐదువందల సంవత్సరాలు ముందు స్వర్గంలో ప్రవేశిస్తారు. తీర్పుదినం వెయ్యి సంవత్సరాలకు సమానంగా ఉంటుంది.” అల్లాహ్ ఆదేశం: ”…నీ ప్రభువు వద్ద ఒక్క దినం మీ లెక్క ప్రకారం వేయి సంవత్సరాలకు సమానమైనది.” (అల్ హజ్జ్, 22:47) కొన్ని ఆయాతులలో, ‘…యాభైవేల సంవత్సరాలకు సమమానం,’ అని ఉంది. (అల్ మఆ రిజ్, 70:4) అది అవిశ్వాసులకు ఉదా: ఒక ఆయతులో ఇలా ఉంది, ”కొన్ని ఉల్లేఖనాల్లో వలస పోయిన పేదలు ధనవంతల కంటే నలభై సంవత్సరాల కంటే ముందు స్వర్గంలో ప్రవేశిస్తారు.” ఈ ‘హదీసు’లో ఐదువందల సంవత్సరాల ముందు వెళతారని ఉంది. అంటే ఆధిక్యతను పేర్కొన డానికి పేర్కొనడం జరిగింది. మరికొందరు కనిష్ట గడువు నలభై సంవత్సరాలు, గరిష్ట గడువు ఐదువందల సంవత్సరాలు. కొంతమంది ఐదు వందల సంవత్సరాల ముందు ప్రవేశిస్తారు. మరికొంత మంది నలభై సంవత్సరాలకు ముందు ప్రవేశిస్తారు.
[37]) వివరణ-2200: అజ్‌జ’మహ్ అంటే కుష్ఠువ్యాధి. కాళ్ళు చేతులు తెగిపోవటం, ఖుర్‌ఆన్ నేర్చుకొని మరిచిపోతే తీర్పుదినం నాడు కుష్ఠురోగిగా లేపబడ తాడు. లేదా ఎటువంటి విలువ లేకుండా అల్లాహ్(త)ను కలుస్తాడు. మరచిపోవడమంటే చూసీ చదవలేడు, చూడకుండానూ చదవలేడు. లేదా ఖుర్‌ఆన్ చదివాడు, కాని దాన్ని అనుసరించలేదు. ఇటువంటి వాడికి తీర్పుదినం నాడు ఎటువంటి విలువ ఉండదు. అతని వెంట వెలుగూ ఉండదు, ఎటువంటి ఆధారమూ ఉండదు. ఖుర్‌ఆన్ నేర్చుకొని మరచి పోవటం మహాపాపం.
[38]) వివరణ-2201: కనీసం 3 రోజులలో ఖుర్‌ఆన్ పూర్తి చేయాలి. అలా అయితేనే సరైన అవగాహన కలుగు తుంది. అర్థం అవుతుంది. మూడు రోజులకంటే తక్కువ వ్యవధిలో పూర్తిచేయడం ఈ ‘హదీసు’కు విరుద్ధం.
[39]) వివరణ-2202: సత్కార్యాలన్నీ సంకల్పాలపై ఆధారపడి ఉంటాయి. ఒకవేళ ఎవరైనా ఖుర్‌ఆన్‌ను ఇతరులను ప్రోత్సహించేందుకు బిగ్గరగా పఠిస్తే, ఇతరు లను ప్రోత్సహించేందుకు బహిరంగంగా దాన ధర్మాలు చేసేవాడితో సమానం. ఇందులో ఖ్యాతి, చూపుగోలు అతని ఉద్దేశ్యం ఎంతమాత్రం కాదు. ఒక వేళ ఎవరైనా చూపుగోలు, ఖ్యాతికి భయపడి మెల్లగా ఖుర్‌ఆన్ పఠిస్తే, ఇటువంటి వ్యక్తి చూపుగోలు, ఖ్యాతికి భయపడి రహస్యంగా దానధర్మాలు చేసేవాడితో సమానం.
అల్లాహ్ (త) ఆదేశం: ”మరియు మీరు (ఇతరులపై) ఏమి ఖర్చు చేసినా, లేక ఏ మొక్కుబడి చెల్లించినా, నిశ్చయంగా అల్లాహ్‌కు అంతా తెలుస్తుంది. మరియు దుర్మార్గులకు సహాయం చేసే వారు ఎవ్వరూఉండరు. మీరు బహిరంగంగా దానధర్మాలు చేయటం మంచిదే! కాని, గుప్తంగా నిరుపేద లకు ఇస్తే అది మీకు అంతకంటే మేలైనది. మరియు ఆయన మీ పాపాలను (దీనివల్ల) రద్దుచేస్తాడు. మరియు మీరు చేసేదంతా అల్లాహ్‌కు బాగా తెలుసు.” (సూ. అల్ బఖరహ్, 2:270–271)
దాసులు ఏమి ఖర్చుచేసినా, మొక్కుబడి చెల్లించినా, ప్రతి సత్కార్యాన్నీ గురించి అల్లాహ్‌కు తెలుసునని అల్లాహ్ (త) తెలియజేస్తున్నాడు. ఆయన, తన దాసు లలో విధేయత చూపేవారికి, ఆయన నుండి పుణ్యం ఆశించేవారికి, ఆయన వాగ్దానాలను సత్యమైనవిగా భావించేవారికి, ఆయన ఆదేశాలను విశ్వసించేవారికి, గొప్ప ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాడు. దీనికి వ్యతిరేకంగా ఆయన ఆదేశాలను తిరస్కరించేవారిని, పాపాలకు పాల్పడే వారిని, ఆయన్ను తిరస్కరించే వారిని, ఆయన్ను వదలి ఇతరులను ఆరాధించేవారిని కఠిన శిక్షకు గురిచేస్తాడు. వీరు దుర్మార్గులు, వీరి శిక్ష తగ్గదు, వీరికి ఎటువంటి సహాయమూ అందదు. బహిరంగంగా దానధర్మాలు చేయటం మంచిదే, అదేవిధంగా పేదలకు అగత్యపరులకు రహస్యంగా ఇవ్వటం కూడా మంచిదే. ఇది చూపుగోలుకు, ఖ్యాతికి ఎంతో దూరంగా ఉంటుంది. అయితే బహిరంగంగా ఇవ్వడంలో ఏదైనా సదుద్దేశం ఉంటే మంచిదే.
[40]) వివరణ-2206: ఖుర్‌ఆన్‌ను స్పష్టంగా చక్కగా చదవాలి. రాగాలు, గీతాలుగా చదవరాదు. భవిష్యత్తులో ప్రజలు ఖుర్‌ఆన్ అతి కష్టంగా స్వరాలు మార్చి చదువుతారు. పదాలను అలంకరించి మరీ ఉచ్చ రిస్తారు. ఇదంతా చూపించడానికి, వినిపించడానికి, పేరు ప్రతిష్టలు పొందడానికి చేస్తారు. ఆ పఠనానికి తగిన ప్రతిఫలం ఇహలోకంలోనే పొందాలని కోరుతారు. పరలోకం గురించి ఏమాత్రం విడిచిపెట్టరు. వీరిలో చిత్తశుద్ధి, దైవభక్తి, ఇతరులకు ప్రాధాన్యత ఇవ్వటం అనేవి ఉండవు. కేవలం ప్రాపంచిక లాభాల కొరకే ఖుర్‌ఆన్ చదువుతారు. అయితే ఖుర్‌ఆన్ మాత్రం దైవప్రీతి కోసమే పఠించబడుతుంది.
[41]) వివరణ-2207: ఖుర్‌ఆన్‌ను ఉన్నది ఉన్నట్టు స్పష్టంగా చదవాలి. అనవసరంగా స్వరాలు మార్చి చదవరాదు. గీతాల్లో, పాటల్లో చదవడం అరబ్బుల పద్ధతి కాదు. ఇది యూదుల, క్రైస్తవుల, ప్రేమ పూజారుల పద్ధతి. చివరి కాలంలో ఖుర్‌ఆన్‌ను సంగీతంలా, పాటలా, రాగాల్లో చదువుతారు. అందువల్ల వారి హృదయాల్లో ఏమాత్రం ప్రభావం ఉండదు. వారు ప్రజలను సంతోష పెట్టడానికి చదువుతారు. ఇటువంటి వారు కలతలకు గురవుతారు. వారు చదివేవారైనా, వినేవారైనా సరే. తర్‌జీ అంటే మంచి స్వరంతో చదవటం, కాని ఇక్కడ పాటలా పఠించడం అని అర్థం. ఇది నిషిద్ధం.
[42]) వివరణ-2208: అంటే మంచి ఉచ్చారణతో, నియ మానుసారంగా, మంచి స్వరంతో చదవండి. ఇలా చదివితే చాలా బాగుంటుంది. అయితే పాటల్లా, గీతాల్లా కాకూడదు.
[43]) వివరణ-2211: 7 అక్షరాల్లో అంటే 7 విధాలుగా అని అర్థం. ఈ ఖుర్‌ఆన్ అరబ్‌లకు చెందిన ఏడు ఉచ్చారణ పద్ధతుల ద్వారా అవతరించబడింది. మీరు ఏ ఉచ్చారణ పద్ధతిని అవలంబించినా అది మీకు సరిపోతుంది. అంటే ఒక్కొక్క పదానికి ఏడు అర్థాలు అని కాదు. అరబ్‌లకు చెందిన ఏడు వర్గాల ఉచ్చారణకు అనుగుణంగా అవత రించబడింది. ఒకచోట ఖురైష్ ఉచ్చారణ ఉంది. మరో చోట హు‘జైల్ ఉచ్చారణ ఉంది. మరోచోట హవా‘జిన్ తెగ ఉచ్చారణఉంది. మరోచోట యమన్ ఉచ్చారణ ఉంది. కొన్ని పదాలను 7 విధాలుగా, లేక 10 విధాలుగా పలకడం జరిగింది. ఉదా: మాలికియౌమిద్దీన్ అబదు త్తాగూత్ లలో కొందరు ఏడు విధాలుగా అని అభిప్రాయ పడ్డారు. కాని ఇది సరికాదు. ఇబ్నె మస్’ఊద్ ఏమంటా రంటే ఏడు అక్షరాలంటే ఒక పదానికి బదులు ఈ అర్థం గల మరోపదాన్ని ఉంచిచదవటం. కొందరు అఖ్‌బల్, హల్లమ్ లేక త’అఆల్అంటారు. ఈమూడింటి అర్థం ఒకటే.
[44]) వివరణ-2212: అంటే ఈ భేదాన్ని నిరాకరించారు. ఎందుకంటే ఖుర్‌ఆన్ ఏడు విధాలుగా అవతరించ బడింది. అన్నీ అల్లాహ్ (త) తరఫు నుండే నిర్ణయించ బడ్డాయి. ఒక పద్ధతిని నిరాకరించడం దైవగ్రంథాన్ని నిరాకరించినట్లవుతుంది. ఈ తిరస్కారం వినాశనానికి గురిచేస్తుంది.
[45]) వివరణ-2216: ఖుర్‌ఆన్ చదవటం దైవారాధనే. దాని ద్వారా ప్రజలను ప్రాపంచిక వస్తువులను అర్థించరాదు. అల్లాహ్(త)నే దాని ద్వారా ఉభయలోకాల అనుగ్రహాలను అర్థించాలి. మరియు ఉభయలోకాల శిక్షల నుండి శరణుకోరాలి. ప్రాపంచిక అనుగ్రహాల కోసం ఖుర్‌ఆన్ పఠించటం ధర్మసమ్మతం కాదు.
[46]) వివరణ-2218: అంటే సూరాల మధ్య తేడా తెలియ డానికి ‘బిస్మిల్లాహిర్ర‘హ్మా నిర్ర‘హీమ్’ అవతరించింది. దీని ద్వారా సూరహ్ ప్రారంభమయినట్టు, సూరహ్ పూర్తయి నట్లు తెలిసేది. ఈ ‘హదీసు’ద్వారా బిస్మిల్లాహ్ ప్రతి సూరహ్ యొక్క భాగం అని, సూ. ఫాతిహా యొక్క భాగం అని, ఖుర్‌ఆన్‌లోని ఒక ఆయత్ అని తెలిసింది.
[47]) వివరణ-2220: యమామహ్ ఒక పట్టణం పేరు. ముసైలమ కజ్జా‘బ్ అక్కడ తాను దైవప్రవక్తనని అసత్యవాదన చేసాడు. అబూబకర్ పరిపాలనా కాలంలో అతడి ఆధిక్యత పెరుగుతూ పోయింది. అబూబకర్ (ర) ‘ఖాలిద్ బిన్ వలీద్‌ను సైన్యం ఇచ్చి అక్కడకు పంపారు. అక్కడ భయంకరమైన పోరాటం జరిగింది. ముసైలమ కజ్జా’బ్ హతమార్చబడ్డాడు. ముస్లిములు కూడా చాలామంది చంపబడ్డారు. ఈ యుద్ధంలో ఏడు వందలు లేదా పన్నెండు వందల ఖారీలు చంపబడ్డారని అంచనా. అందువల్లే ‘ఉమర్ (ర) అబూబకర్‌ను విడివిడిగా ఉన్న ఖుర్‌ఆన్ భాగాలను ఒకచోట చేర్చి సంకలనం చేయించ వలసిందిగా సలహా ఇచ్చారు. ఒకచోట చేర్చి, సంకలనం చేయడం ఇదేం కొత్త కార్యం కాదు. విడిగా ఉన్న భాగాలను ఒకచోట చేర్చి సంకలనం చేసి గ్రంథస్తం చేయడం మాత్రమే. దీన్ని గురించి ఇంతకు ముందు ప్రస్తావించడం జరిగింది. ప్రవక్త (స) కాలంలోనే ఖుర్‌ఆన్ వ్రాయబడింది. ఈ విషయం ఖుర్‌ఆన్ ఆయతుల ద్వారా కూడా తెలుస్తుంది. ‘హాఫి”జ్ ఇబ్నె ‘హజర్, ఫత్’హుల్ బారీ (బు’ఖారీ వివరణ)లో ఇలా పేర్కొన్నారు: ”అల్లాహ్ (త) ఖుర్‌ఆన్‌లో, ”…యత్‌లూ సుహుఫమ్ ముత హ్హరహ్” (అల్ బయ్యినహ్, 98:2) అని పేర్కొన్నాడు. ఖుర్‌ఆన్ పలకలపై వ్రాసి ఉండేది. కాని వేరు వేరుగా ఉండేది. అబూ బకర్ (ర) వాటిని ఒకచోట చేర్చారు. ఆ తరువాత అది సురక్షితంగా ఉన్నది. చివరికి ‘ఉస్మాన్ దాని అనేక ప్రతులు తయారుచేసి ఇతర పట్టణాలకు పంపించారు. (ఫత’హుల్ బారి)
ఈ వివరణ వల్ల అబూ బకర్ ఆదేశంపై ‘జైద్ విడివిడిగా ఉన్న ఖుర్‌ఆన్ భాగాలను ఒకచోట చేర్చి పుస్తక రూపంలో కూర్చారు అని స్పష్టం అయింది.
[48]) వివరణ-2221: ‘ఉస్మాన్ (ర) ఖుర్‌ఆన్‌ను ఒకే పఠన పద్ధతిపై, ఒకే శబ్దానువాదంపై కాపీ చేయించారు. మిగతా పద్ధతులను, ఉచ్చారణలను రద్దుచేసారు. ప్రపంచమంతా ‘ఉస్మాన్ కాపీచేయించిన ఖుర్‌ఆన్ చలామణీలోఉంది. ఇందులో ఒక పఠన పద్ధతి ఉంది. శత్రువులు, మిత్రులు అందరి వద్ద ఇదే ఉంది. ఇన్‌షా అల్లాహ్ తీర్పుదినం వరకు ఇదే ఉంటుంది.
[49]) వివరణ-2222: ఖుర్‌ఆన్‌లోని సూరాలను ఈ విధంగా విభజించడం జరిగింది. సూరహ్ బఖరహ్(2) నుండి సూరహ్ తౌబహ్ (9)వరకు ‘తివాల్ అంటారు. అంటే పెద్ద పెద్ద సూరాలు. సూరహ్ యూనుస్ (10) నుండి సూ. ఫుర్‌ఖాన్(25) వరకు మియీ‘న్ అంటారు. అంటే వంద ఆయతులు లేదా అంతకంటే ఎక్కువ వాక్యాలు గల సూరాలు. సూరహ్ షు’అరా (26) నుండి సూరహ్ అల్-ఫత్’హ్ (48) వరకు మసా‘నీ అంటారు. అంటే 100 కంటే తక్కువగా ఉన్న ఆయతులు గల సూరాలు. వాటి వివరణలు కూడా ఇంచుమించు ఒకేలా ఉంటాయి. అందు వల్లే వీటిని మసా’నీ అంటారు. అంటే మాటి మాటికీ వచ్చే సూరాలు. సూరహ్ ‘హుజురాత్ (49) నుండి చివరి సూరహ్ అన్నాస్ (114) వరకు ముఫ‘స్స లాత్ అంటారు. ఎందుకంటే ఈ సూరాల మధ్య బిస్మిల్లా హిర్ర‘హ్మా నిర్ర‘హీమ్ దగ్గర దగ్గరగా ఉన్నాయి. అంటే చిన్న చిన్న దూరాలు గల సూరాలు. ఈ ముఫ’స్సలాత్ మూడు రకాలు. (1) ‘తివాలు అల్-ముఫ’స్సల్ [49-84] (2) అవ్సా’త్ అల్-ముఫ’స్సల్ [85-98] (3) ఖిసార్ అల్-ముఫ’స్సల్ [99-114]. సూరహ్ ‘హుజురాత్ (49) నుండి సూరహ్ ఇన్‌షిఖాఖ్ (84) వరకు ‘తివాల్ అల్-ముఫ’స్సల్ అంటారు. వస్సమాయి జా’తిల్ బురూజ్ (85) నుండి లమ్‌యకునిల్లజీ / బయ్యినహ్ (98) వరకు అవ్ సా’త్ అల్-ముఫ’స్సల్ అంటారు. లమ్‌యకు నిల్లజీ (99) నుండి చివరి అన్నాస్ (114) వరకు ఖిసార్ అల్-ముఫ’స్సల్ అంటారు. ఇబ్నె ‘అబ్బాస్, ‘ఉస్మాన్ (ర)ను సూరహ్ అన్‌ఫాల్ మసా’నీ సూరహ్ అంటే వంద కంటే తక్కువ ఆయతులు ఉన్నాయి. అంటే 75 ఆయతులు ఉన్నాయి. సూ. బరాఅ’త్ మయీ’న్ సూరహ్ అంటే వందకంటే అధికంగా ఉన్నాయి. అంటే 129 ఆయతులు ఉన్నాయి. క్రమంగా చూస్తే సూరహ్ బరాఅ’త్ సూరహ్ అన్‌ఫాల్ కంటే ముందు రావాలి. సూరహ్ అన్‌ఫాల్ మసానీలో ఉంది. దీన్ని దాని తరువాత ఉంచాలి. మరో విషయం ఏమిటంటే వీటిమధ్య అంతరానికి బిస్మిల్లా హిర్ర‘హ్మా నిర్ర‘హీమ్ కూడా వ్రాసి లేదు అని సందేహం వ్యక్తం చేసారు. ‘ఉస్మాన్ (ర) సమా ధానమిస్తూ, ”ఈ రెండు సూరాలు విషయపరంగా చూస్తే ఇంచుమించు ఒకేలా ఉన్నాయి. అందువల్లే ఈ రెంటినీ ఒకేచోట పేర్కొనడం జరిగింది. ప్రవక్త (స) ద్వారా ఈ రెండు సూరాల మధ్య బిస్మిల్లాహిర్ర‘హ్మా నిర్ర‘హీమ్ చదవటం అనేది జరగలేదు. అందువల్లే బిస్మిల్లా హిర్ర‘హ్మా నిర్ర‘హీమ్ వ్రాయలేదు,” అని అన్నారు. వాస్తవం అల్లాహ్‌కే తెలుసు.
***