7- كِتَابُ الصَّوْمِ
7. ఉపవాసం (‘సౌమ్) పుస్తకం
‘ఉషోదయం నుండి సూర్యాస్తమయం వరకు ఉప వాస సంకల్పంతో అన్న-పానీయాలకు, సంభో గానికి, ఇతర ఐహిక వాంఛలకు దూరంగా ఉండ టాన్ని,’ ఉపవాసం అంటారు. ఉపవాసానన్ని ఉర్దూలో, రో’జహ్, అరబ్బీలో ‘సౌమ్ అంటారు. సూర్యాస్తమ యానికి ఉపవాసం విరమిస్తారు. దీన్ని ఇఫ్తార్ అంటారు. ఉపవాసం మూడు రకాలు. 1. విధి (ఫ’ర్ద్), 2. ప్రవక్త సాంప్రదాయం (సున్నత్), 3. నిషిద్ధం (‘హరామ్).
విధి ఉపవాసాలను అకారణంగా వదలటం నిషిద్ధం. అయితే రమ’దాన్ ఉపవాసాలు, మొక్కుబడి ఉపవాసాలు పాటించడం తప్పనిసరి విధి. విధి ఉపవాసాలు రెండు రకాలు.
ముస్లింలు మరియు మస్లిమేతరులు, ఉపవాసాలను పాఠించే విధానంలో భేదాలున్నాయి. ఈ సందర్భంలో ఉపవాసాలు అంటే ముస్లింలు పాఠించే ఉవాసాలే అని భావించాలి.
1. నిర్థారిత విధి ఉపవాసాలు: రమ’దాన్ ఉపవాసాలు, వీటిని రమ’దాన్లోనే పాటించాలి. నిర్థారిత మొక్కుబడి ఉపవాసాలు, వీటిని నిర్థారిత దినాల్లోనే పాటించాలి. అల్లాహ్ ఆదేశం: ‘…(మీ) మొక్కుబడులను పూర్తిచేయండి…’ (సూ. అల్ ‘హజ్జ్, 22:29)
2. విధి ఉపవాసాలు: కారణంగా లేదా అకారణంగా రమ’దాన్లో వదలివేసిన ఉపవాసాలు మరియు మొక్కుబడి ఉపవాసాలు, పరిహార ఉపవాసాలు మొదలైనవి. వాటిని తిరిగి పూర్తిచేయాలి. సంవత్సరంలో ఎప్పుడైనా పూర్తిచేయవచ్చు.
3. తప్పనిసరి కాని ఉపవాసాలు: అంటే ప్రవక్త (స) పాటించిన ఉపవాసాలు. కాని వాటిని గురించి ఆదేశించ లేదు అంటే వెన్నెల రాత్రుల (13, 14, 15) ఉపవాసాలు, షవ్వాల్ నెల 6 ఉపవాసాలు, ‘ఆషూరహ్ (ము’హర్రమ్) ఉపవాసాలు, ‘అరఫహ్ రోజు ఉపవాసం మొదలైనవి. ఇవన్నీ ప్రవక్త సాంప్రదాయానికి చెందినవి. ఒకవేళ మీరు వీటిని పాటిస్తే పుణ్యం లభిస్తుంది. పాటించకపోతే పాపం చుట్టుకోదు.
4. ఉపవాసం పాటించడానికి, నిషిద్ధమైన దినాలు: ‘ఈదుల్ ఫిత్ర్, ‘ఈదుల్ అ’ద్హా, జిల్’హిజ్జ 11, 12, 13 (తష్రీఖ్) దినాలు. కేవలం శనివారం రోజు ఉపవాసం మరియు భర్త అనుమతి లేనిదే భార్య అదనపు ఉపవాసం పాటించడం.
రమ’దాన్ ఉపవాసాలు యుక్తవయస్సుకు చేరిన ప్రతి ఒక్క ముస్లిమ్ స్త్రీ పురుషులకు విధించడం జరిగింది. అయితే యుక్త వయస్సుకు రానివారికి, పిచ్చివారికి, మతిస్థిమితం లేని వారికి తప్పనిసరి కాదు. అలవాటు అవడానికి యుక్తవయస్సుకు రాని పిల్లల్ని ఉపవాసాలు పాటించమని చెప్పాలి. ప్రవక్త (స) ప్రవచనం: ‘7 సంవత్సరాలు పూర్తయిన పిల్లల్ని నమా’జు చేయమని ఆదేశించండి. 10 సంవత్సరాలు నిండిన పిల్లల్ని నమా’జు చదవకపోతే హెచ్చరించండి, మెల్లగా కొట్టండి. అదేవిధంగా ఉపవాసాలు పాటించమని ప్రోత్సహించండి. ‘ఉమర్ (ర) రమ’దాన్లో ఒక తాగుబోతుకు కొరడాతో కొట్టారు. ‘నీచుడా, నీ పాడుగాను రమ’దాన్లో సారాయి త్రాగుతావా? మా పిల్లలు ఉపవాసంతో ఉన్నారు,’ అని అన్నారు. (బు’ఖారీ)
రబీ’అ బిన్తె ము’అవ్వజ్ (ర) కథనం: ప్రవక్త (స) ‘ఆషూరహ్ నాడు ఉదయం అ’న్సార్ వీధుల్లో, ”ఈ రోజు ఉపవాసం లేని వాడు సాయంత్రం వరకు ఏమీ తినరాదు. ఉపవాసం ఉన్నవారు ఉపవాసాన్ని కొనసాగించాలి” అని ప్రకటన చేయించారు.
రమ’దాన్ ఉపవాసాలు తప్పనిసరి. అయితే వ్యాధి వల్ల ఉపవాసం పాటించే శక్తిలేని వారు, వ్యాధి అధికం అయ్యే భయం ఉన్నవారు ఉపవాసం ఉండక పోవచ్చును. ప్రయాణీకులు ప్రయాణంలో ఉపవాసం పాటించక పోవచ్చును. కష్టం కలగదని భావిస్తే ఉపవాసం పాటించ వచ్చును. అల్లాహ్ ఆదేశం: ”…ఫమన్ షహిద మిన్ కుమ్ అష్షహ్ రు ఫల్ యసుమ్ హు. వ మన్ కాన మరీ‘దన్ అవ్ ‘అలా సఫరిన్ ఫ ఇద్దతున్ మిన్ అయ్యామిన్ ఉ‘ఖర్.” — ‘… కావున మీలో ఆ నెలను పొందిన వ్యక్తి ఆ నెలంతా (విధిగా) ఉపవాసాలుండాలి. కాని వ్యాధిగ్రస్తుడైన వాడు, లేక ప్రయాణంలో ఉన్నవాడు, (ఆ ఉపవా సాలను) వేరే దినాలలో పూర్తిచేయాలి… (సూ. అల్ బఖరహ్, 2:185)
గర్భవతి అయిన స్త్రీ, పాలు పట్టే స్త్రీ, ఉపవా సాలను వదలవచ్చు. అదేవిధంగా వృద్ధాప్యానికి చేరిన స్త్రీ పురుషులు ఉపవాసం వదలవచ్చును. ఒక ఉపవా సానికి బదులుగా ఒక పేదవానికి అన్నం పెట్టాలి. (బు’ఖారీ)
అదేవిధంగా బహిష్టుపురుటిలో ఉన్న స్త్రీ ఉపవాసం పాటించనవసరం లేదు. పరిశుద్ధత పొందిన తర్వాత తప్పిన ఉపవా సాలను పాటించాలి. తిర్మిజి’ ధార్మిక పండితుల అభిప్రాయాలను సేకరించారు. పండితుడ లందరూ దీనిపట్ల ఏకాభిప్రాయం కలిగి ఉన్నారు.
ఒకవేళ ఎవరైనా రమ’దాన్ ఉపవాసాల విధిని తిరస్కరిస్తే అవిశ్వాసానికి గురవుతాడు. ఎందుకంటే ఉపవాసం ఇస్లామ్ ఐదు ప్రధాన విధుల్లో ఒక విధి. ఖుర్ఆన్లో కూడా దాన్ని విధిగా పేర్కొనడం జరిగింది. ఒకవేళ అకారణంగా సంభోగానికి పాల్పడి, ఉపవాసాన్ని భంగంచేస్తే దానికి పరిహారం కూడా తప్పనిసరి అవుతుంది. ఉపవాసస్థితిలో చాడీలు చెప్పటం, అబద్ధం పలకటం, పరోక్ష నిందకు గురి కావటం మొదలైనవి నిషిద్ధం. వీటివల్ల ఉపవాసానికి అంతరాయం కలుగుతుంది.
కోరి తిన్నా, త్రాగినా, సంభోగానికి పాల్పడినా, ఉపవాసం భంగమవుతుంది. అయితే మరచి తిన్నా, త్రాగినా ఉపవాసం భంగమవదు. ఉపవాసకులు రాత్రి చివరి జాములో స‘హ్రీ భుజించడం ప్రవక్త సాంప్ర దాయం. అదేవిధంగా రమ’దాన్ చివరి దశకంలో ఏ’తెకాఫ్ పాటించడం కూడా ప్రవక్త సాంప్రదాయమే. రమ’దాన్ మరియు ఇతర ఉపవాసాలకు చాలా గొప్ప ప్రాధాన్యత ఉంది. దీన్ని గురించి రానున్న పేజీల్లో పేర్కొనటం జరుగుతుంది.
—–
اَلْفَصْلُ الْأَوَّلُ మొదటి విభాగం
1956 – [ 1 ] ( متفق عليه ) (1/610)
وَعَنْ أَبِيْ هُرَيْرَةَ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِذَا دَخَلَ شَهْرُ رَمَضَانَ فُتِحَتْ أَبْوَابُ السَّمَاءِ”.
وَفِيْ رِوَايَةٍ: “فُتِحَتْ أَبْوَابُ الْجَنَّةِ وَغُلَّقَتْ أَبْوَابُ جَهَنَّمَ وَسُلْسِلَتِ الشَّيَاطِيْنُ”.
وَفِيْ رِوَايَةٍ: ” فُتِحَتْ أَبْوَابُ الرَّحْمَةِ”.
1956. (1) [1/610-ఏకీభవితం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”రమ’దాన్ మాసం ప్రారంభమవగానే ఆకాశ ద్వారాలు తెరువబడతాయి.
మరో ఉల్లేఖనంలో స్వర్గపు ద్వారాలు తెరువబడ తాయి, నరకద్వారాలు మూసివేయ బడతాయి, షై’తానులను బంధించడం జరుగుతుంది,” అని ఉంది.
మరో ఉల్లేఖనంలో కారుణ్య ద్వారాలు తెరువబడ తాయని ఉంది. [1] (బు’ఖారీ, ముస్లిమ్)
1957 – [ 2 ] ( متفق عليه ) (1/610)
وَعَنْ سَهْلِ بْنِ سَعْدٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “فِيْ الْجَنَّةِ ثَمَانِيَةَ أَبْوَابٍ مِّنْهَا: بَابٌ يُسَمَّى الرَّيَّانَ لَا يَدْخُلُهُ إِلَّا الصَّائِمُوْنَ”.
1957. (2) [1/610-ఏకీభవితం]
సహల్ బిన్ స’అద్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”స్వర్గంలో ఎనిమిది ద్వారాలు ఉన్నాయి. వాటిలో ఒక ద్వారం పేరు రయ్యాన్. ఉపవాసకులు ఈ ద్వారం గుండానే స్వర్గం లోనికి ప్రవేశిస్తారు.” (బు’ఖారీ, ముస్లిమ్)
1958- [ 3 ] ( متفق عليه ) (1/610)
وَعَنْ أَبِيْ هُرَيْرَةَ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَنْ صَامَ رَمَضَانَ إِيْمَانًا وَاِحْتِسَابًا غُفِرَ لَهُ مَا تَقَدَّمَ مِنْ ذَنْبِهِ. وَمَنْ قَامَ رَمَضَانَ إِيْمَانًا وَّاِحْتِسَابًا غُفِرَ لَهُ مَا تَقَدَّمَ مِنْ ذَنْبِهِ. وَمَنْ قَامَ لَيْلَةَ الْقَدْرِ إِيْمَانًا وَاحْتِسَابًا غُفِرَ لَهُ مَا تَقَدَّمَ مِنْ ذَنْبِهِ”.
1958. (3) [1/610-ఏకీభవితం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం: ఎవరు ధర్మనిష్ఠతో, ఆత్మ పరిశీలనతో, పరలోక ప్రతిఫలాపేక్షతో రమ’దాన్ ఉపవాసాలు పాటిస్తారో, వారు పూర్వం చేసిన పాపాలను అల్లాహ్(త) మన్నిస్తాడు. అదేవిధంగా ఎవరయితే ధర్మనిష్ఠతో ఆత్మపరిశీలనతో పరలోక ప్రతిఫలాపేక్షతో రమ’దాన్ (ఖియామ్ / తరావీహ్) నమా’జులు చేస్తారో వారు పూర్వం చేసిన పాపాలను అల్లాహ్ (త) మన్నిస్తాడు. అదేవిధంగా విశ్వాసంతో, చిత్తశుద్ధితో ప్రతిఫలా పేక్షతో ఖద్ర్ మహా శుభరాత్రిలో జాగరణచేస్తే పాపాలన్నీ క్షమించబడతాయి. (బు’ఖారీ, ముస్లిమ్)
1959 – [ 4 ] ( متفق عليه ) (1/611)
وَعَنْ أَبِيْ هُرَيْرَةَ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “كُلُّ عَمَلِ ابْنِ آدَمُ يُضَاعَفُ الْحَسَنَةُ بِعَشْرِ أَمْثَالِهَا إِلَى سَبْعَ مِائَةِ ضِعْفٍ. قَالَ اللهُ تَعَالى: إِلَّا الصَّوْمَ فَإِنَّهُ لِيْ وَأَنَا أَجْزِيْ بِهِ يَدْعُ شَهْوَتَهُ وَطَعَامَهُ مِنْ أَجْلِيْ لِلصَّائِمِ فَرْحَتَانِ: فَرْحَةٌ عِنْدَ فِطْرِهِ وَفَرْحَةٌ عِنْدَ لِقَاءِ رَبِّهِ وَلَخُلُوْفُ فَمِ الصَّائِمِ أَطْيَبُ عِنْدَ اللهِ مِنْ رِيْحِ الْمِسْكِ وَالصِّيَامُ جُنَّةٌ وَإِذَا كَانَ يَوْمُ صَوْمِ أَحَدِكُمْ فَلَا يَرْفَثُ وَلَا يَصْخَبُ فَإِنْ سَابَّهُ أَحَدٌ أَوْ قَاتَلَهُ فَلْيَقُلْ إِنِّيْ امْرُؤٌ صَائِمٌ”.
1959. (4) [1/611-ఏకీభవితం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మనిషి యొక్క ప్రతి సత్కార్యానికి పదిరెట్ల నుండి ఏడువందలరెట్ల వరకు పుణ్యం వ్రాయడం జరుగు తుంది. అంటే ఒక సత్కార్యం చేస్తే పది నుండి ఏడువందల రెట్ల వరకు పుణ్యం ఇవ్వడం జరుగు తుంది. అల్లాహ్ ఆదేశం: ”ఉపవాసం కేవలం నా కొరకే. అందువల్ల నేనే స్వయంగా దాని ప్రతిఫలం ఇస్తాను, నా కోసం అతడు తన అన్నపానీయాలను మనో కాంక్షలను త్యజిస్తాడు.” ఉపవాసకునికి రెండు సంతోష సమయాలు ఉన్నాయి: ఒకటి ఉపవాసం విరమించే టప్పుడు, మరొకటి అల్లాహ్ (త)ను కలిసి నప్పుడు. అదేవిధంగా ఉపవాసకుని నోటి వాసన అల్లాహ్ (త)కు కస్తూరి సువాసన కంటే చాలా ఇష్టం. అదే విధంగా ఉపవాసం ఢాలు వంటిది. దాని ద్వారా షై’తాన్ నుండి సురక్షితంగా ఉంటాడు. నరకాగ్ని నుండి తప్పించుకుంటాడు. మీలో ఎవరైనా ఉపవాసం ఉంటే అశ్లీల పదాలు పలుకరాదు, నీచ ప్రేలాపనలకు గురికారాదు. ఎవరైనా చెడుగా మాట్లాడినా, తిట్టినా, కయ్యానికి కాలుదువ్వినా, వారిని తిట్టరాదు, వారితో వివాదానికి దిగరాదు, ‘నేను ఉపవాసంతో ఉన్నాను,’ అని పలకాలి. (బు’ఖారీ, ముస్లిమ్)
—–
اَلْفَصْلُ الثَّانِيْ రెండవ విభాగం
1960 – [ 5 ] ( صحيح ) (1/611)
وَعَنْ أَبِيْ هُرَيْرَةَ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِذَا كَانَ أَوَّلُ لَيْلَةٍ مِّنْ شَهْرِ رَمَضَانَ صُفِّدَتِ الشَّيَاطِيْنُ وَمَرَدَةُ الْجِنِّ وَغُلِّقَتْ أَبْوَابُ النَّارِ فَلَمْ يُفْتَحْ مِنْهَا بَابُ. و فتحت ابواب الْجَنَّةِ. فَلَمْ يُغْلَقَ مِنْهَا بَابٌ. وَّيُنَادِيْ مُنَادٍ: يَا بَاغِيَ الْخَيْرِ أَقْبِلْ وَيَا بَاغِيَ الشَّرِّ أَقْصِرْوَلِلّهِ عُتَقَاءُ مِنَ النَّارِ وَذَلِكَ كُلَّ لَيْلَةٍ” . رَوَاهُ التِّرْمِذِيُّ وَابْنُ مَاجَهُ.
1960. (5) [1/611–దృఢం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”రమ’దాన్ మొదటి రాత్రి వస్తే, షై’తానులు, తల బిరుసుతనం గల జిన్నులు బంధించబడి, చెరసాలలో వేయబడతారు. నరకద్వారాలు కూడా మూసివేయ బడతాయి. వాటిలో ఏ ఒక్క ద్వారం తెరువబడదు. స్వర్గ ద్వారాలు తెరువబడతాయి. వాటిలో ఏ ఒక్క ద్వారమూ మూసివేయబడదు. ఒక ప్రకటించేవాడు ఓ మంచిని కోరేవాడా! సత్కార్యాల వైపునకు తిరుగు, ఓ చెడువైపు తిరిగి ఉన్నవాడా! దాన్నుండి వెను దిరుగు అని పిలుపునిస్తూ ఉంటాడు. ఇంకా ఆ రాత్రి అల్లాహ్ (త) అనేకమందిని నరకం నుండి విడుదల చేస్తూ ఉంటాడు. ఇలా ప్రతిరాత్రి ప్రకటించడం జరుగుతుంది. (తిర్మిజి’, ఇబ్నె మాజహ్)
1961 – [ 6 ] ( صحيح ) (1/611)
وَرَوَاهُ أَحْمَدُ عَنْ رَجُلٍ وَقَالَ التِّرْمِذِيُّ هَذَا حَدِيْثٌ غَرِيْبٌ
1961.(6) [1/611–దృఢం]
ఒక వ్యక్తి ఉల్లేఖనం ద్వారా. (అ’హ్మద్, తిర్మిజి’ – ఏకోల్లేఖనం).
—–
اَلْفَصْلُ الثَّالِثُ మూడవ విభాగం
1962 – [ 7 ] ? (1/612)
عَنْ أَبِيْ هُرَيْرَةَ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “أَتَاكُمْ رَمَضَانُ شَهْرٌ مُّبَارَكٌ فَرَضَ اللهُ عَلَيْكُمْ صِيَامَهُ تُفْتَحُ فِيْهِ أَبْوَابُ السَّمَاءِ وَتُغْلَقُ فِيْهِ أَبْوَابُ الْجَحِيْمِ وَتُغَلُّ فِيْهِ مَرَدَةُ الشَّيَاطِيْنِ لِلّهِ فِيْهِ لَيْلَةُ خَيْرٌ مِّنْ أَلْفِ شَهْرٍ مَّنْ حُرِمَ خَيْرَهَا فَقَدْ حُرِمَ”. رَوَاهُ أَحْمَدُ وَالنَّسَائِيُّ .
1962. (7) [1/612-?]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”శుభకరమైన, పవిత్రమైన రమ’దాన్ నెల మీపైకి వచ్చింది. దాని ఉపవాసాలను అల్లాహ్ (త) మీపై తప్పనిసరి(విధి)గా చేసాడు. ఈ మాసంలో ఆకాశ ద్వారాలన్నీ తెరువబడతాయి. నరకద్వారాలన్నీ మూసివేయబడతాయి. తలబిరుసుతనం గల షై’తాను లందరినీ బంధించడం జరుగుతుంది. ఇంకా ఈ నెలలో అల్లాహ్(త) తరఫు నుండి ఒక శుభరాత్రి ఉంటుంది. అది వెయ్యి నెలలకన్నా ఉత్తమమైనది. ఆ శుభాన్ని పొందలేని వాడు, ఎన్నో శుభాల నుండి దూరంగా ఉంటాడు. (అ’హ్మద్, నసాయి’)
1963 – [ 8 ] ( صحيح ) (1/612)
وَعَنْ عَبْدِ اللهِ بْنِ عَمْرٍو: أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم قَالَ: “اَلصِّيَامُ وَالْقُرْآنُ يَشْفَعَانِ لِلْعَبْدِ يَقُوْلُ الصِّيَامُ: أَيْ رَبِّ إِنِّيْ مَنَعْتُهُ الطَّعَامَ وَالشَّهَوَاتِ بِالنَّهَارِفَشَفِّعْنِيْ فِيْهِ وَيَقُوْلُ الْقُرْآنُ: مَنَعْتُهُ النَّوْمَ بِاللَّيْلِ فَشَفِّعْنِيْ فِيْهِ فَيُشَفَّعَانِ” .رَوَاهُ الْبَيْهَقِيُّ فِيْ شُعَبِ الْإِيْمَان .
1963. (8) [1/612–దృఢం]
‘అబ్దుల్లాహ్ బిన్ ‘అమ్ర్ (ర) కథనం: మహా ప్రవక్త (స) ప్రవచనం, ”ఉపవాసం, ఖుర్ఆన్ రెండూ పునరు త్థాన దినమున దాసుని కొరకు సిఫారసు చేస్తాయి. ఉపవాసం ఇలా అంటుంది: ‘ఓ నా ప్రభూ! నేను ఈ ఉపవాసిని పగలు భోజనానికి, ఇతర వాంఛలకు దూరంగా ఉంచాను. అందువల్ల ఇతని మోక్షంకొరకు నా సిఫారసును స్వీకరించు.’ అదేవిధంగా, ఖుర్ఆన్: ‘ ఓ నా ప్రభూ! నేను ఇతన్ని రాత్రిళ్ళు నిద్రకు దూరం చేసాను. కనుక ఇతని పట్ల నా సిఫారసును స్వీక రించు.’ అప్పుడు అల్లాహ్ ఆ రెంటి సిఫారసును స్వీకరిస్తాడు. (బైహఖీ – షు’అబిల్ ఈమాన్)
1964 – [ 9 ] ( حسن ) (1/612)
وَعَنْ أَنَسِ بْنِ مَالِكٍ قَالَ: دَخَلَ رَمَضَانُ فَقَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِنَّ هَذَا الشَّهْرَ قَدْ حَضَرَكُمْ وَفِيْهِ لَيْلَةٌ خَيْرٌ مِّنْ أَلْفِ شَهْرٍ مِّنْ حُرِمَهَا فَقَدْ حُرِمَ الْخَيْرَ كُلَّهُ وَلَا يُحْرَمُ خَيْرَهَا إِلَّا كُل مَحْرُوْمٍ”. رَوَاهُ ابْنُ مَاجَهُ.
1964. (9) [1/612–ప్రామాణికం]
అనస్ బిన్ మాలిక్ (ర) కథనం: ”రమ’దాన్ మాసం వచ్చినప్పుడు, ప్రవక్త (స) ‘ఈ రమ’దాన్ నెల మీపై వచ్చింది. ఈ మాసంలో ఒక రాత్రి ఉంది, అది వెయ్యి నెలలకంటే ఉత్తమమైనది. దాన్ని పొందనివాడు, లాభాల నుండి దూరమయ్యాడు. దురదృష్టవంతుడే ఆ లాభాలను పొందలేడు,’ అని ప్రవచించారు.”(ఇబ్నె మాజహ్)
1965 – [ 10 ] ( ضعيف ) (1/612)
وَعَنْ سَلْمَانَ الْفَارِسِيّ قَالَ خَطَبَنَا رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم فِيْ آخِرِ يَوْمٍ مِّنْ شَعْبَانَ فَقَالَ: “يَا أَيُّهَا النَّاسُ قَدْ أَظَلَّكُمْ شَهْرٌ عَظِيْمٌ مُّبَارَكٌ شَهْرٌ فِيْهِ لَيْلَةٌ خَيْرٌ مِّنْ أَلْفِ شَهْرٍ جَعَلَ اللهُ تعالى صِيَامَهُ فَرِيْضَةً وَقِيَامَ لَيْلَهِ تَطَوُّعًا مَّنْ تَقَرَّبَ فِيْهِ بِخَصْلَةٍ مِّنَ الْخَيْرِ كَانَ كَمَنْ أَدَّى فَرِيْضَةً فِيْمَا سِوَاهُ وَمَنْ أَدَّى فَرِيْضَةً فِيْهِ كَانَ كَمَنْ أَدَّى سَبْعِيْنَ فَرِيْضَةً فِيْمَا سِوَاهُ وَهُوَ شَهْرُ الصَّبْرِ وَالصَّبْرُ ثَوْابُهُ الْجَنَّةُ وَشَهْرُ الْمُوْاسَاةِ وَشَهْرٌ يُزَادُ فِيْهِ رِزْقُ الْمُؤْمِنِ مَنْ فَطَّرَ فِيْهِ صَائِمًا كَانَ لَهُ مَغْفِرَةً لِّذُنُوْبِهِ وَعِتْقَ رَقَبَتِهِ مِنَ النَّارِ وَكَانَ لَهُ مِثْلَ أَجْرِهِ مِنْ غَيْرِ أَنْ يَّنْتَقِصَ مِنْ أَجْرِهِ شَيْءٌ”. قُلْنَا: يَا رَسُوْلَ اللهِ لَيْسَ كُلُّنَا نَجِدُ مَا نُفَطِّرُ بِهِ الصَّائِمَ. فَقَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: ” يُعْطِي اللهُ هَذَا الثَّوَابَ مِنْ فَطَّرَ صَائِمًا عَلَى مَذْقَةِ لَبَنٍ أَوْ تَمْرَةٍ أَوْ شُرْبَةٍ مِّنْ مَّاءٍ وَّمَنْ أَشْبَعَ صَائِمًا سَقَاهُ اللهُ مِنْ حَوْضِيْ شَرْبَةً لَا يَظْمَأُ حَتَّى يَدْخُلَ الْجَنَّةَ وَهُوَ شَهْرٌ أَوَّلُهُ رَحْمَةٌ وَأَوْسَطُهُ مَغْفِرَةٌ وَّآخِرُهُ عِتْقٌ مِّنَ النَّارِ وَمَنْ خَفَّفَ عَنْ مَّمْلُوْكِهِ. فِيْهِ غَفَرَ اللهُ لَهُ وَأَعْتَقَهُ مِنَ النَّارِ” رَوَاهُ الْبَيْهِقي.
1965. (10) [1/612–బలహీనం]
సల్మాన్ ఫారసీ (ర) కథనం: ప్రవక్త (స) ష’అబాన్ చివరిరోజు మమ్మల్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ, ఇలా అన్నారు, ”ఓ ప్రజలారా! చాలా గొప్ప మాసం మీపై నీడలా అవతరించింది. ఇది చాలా శుభకరమైన మాసం. ఇందులో ఒక మహా రాత్రి ఉంది. అది వెయ్యి నెలలకంటే ఉత్తమమైనది. అల్లాహ్ (త) దీని ఉపవాసా లను విధిగా చేసాడు. రాత్రి నమా’జులను అదనపు (నఫిల్) ఆరాధనగా నియమించాడు. ఈ నెలలో ప్రతి ఫలాపేక్షతో అల్లాహ్(త) సాన్నిహిత్యం పొందే ఉద్దే శ్యంతో, అదనపు (నఫిల్) ఆరాధన చేస్తే, దానికి విధి ఆరాధన చేసినంత పుణ్యం లభిస్తుంది. అదే విధంగా ఈ నెలలో విధి ఆరాధనచేసిన వారికి 70 రెట్లు అధి కంగా పుణ్యం లభిస్తుంది. ఇది సహనం, ఓర్పుల మాసం. సహనానికి ప్రతిఫలం స్వర్గం. ఇంకా ఇది సుఖదుఃఖాల్లో పాలు పంచుకునే మాసం. ఇది ఎలాంటి మాసం అంటే ఇందులో విశ్వాసి జీవనోపాధి పెంచబడుతుంది. ఎవరైనా ఉపవాసకుని ఉపవాసం విరమించే ఏర్పాటు చేస్తారో, దానికి ప్రతిఫలంగా అతని పాపాలు క్షమించబడతాయి. అతన్ని నర కాగ్ని నుండి విడుదల చేయడం జరుగుతుంది. ఇంకా అతనికి ఉపవాసకునితో సమానంగా పుణ్యం లభి స్తుంది. ఉపవాసకుని పుణ్యం ఏమాత్రం తగ్గదు,’ అని అన్నారు. అనుచరులు ఇలా విన్నవించు కున్నారు, ”ఓ అల్లాహ్ ప్రవక్తా! ఉపవాసకుని ఉపవాసం విర మించే ఏర్పాటు చేసేంత స్తోమత మాలో లేదు.” దానికి ప్రవక్త (స), ‘ఒక గుక్కెడు మజ్జిగ లేదా ఒక ఖర్జూరం, ఒక గుక్కెడు నీళ్ళు త్రాపించి విరమింపజేస్తే అతనికి కూడా ఉపవాసకునికి కడుపు నిండా అన్నం పెట్టినంత పుణ్యం లభిస్తుంది. అతనికి అల్లాహ్ (త) ‘హౌ’దె కౌసర్ ద్వారా నీళ్ళు త్రాపిస్తాడు. ఆ తరువాత స్వర్గంలోనికి ప్రవేశించేవరకు దాహం వేయదు. ఈ మాసం మొదటి దశలో కారుణ్యం ఉంది. మధ్య భాగంలో క్షమాపణ ఉంది. చివరి దశలో నరకం నుండి విముక్తి ఉంది. అదేవిధంగా ఈ మాసంలో తన సేవకు లతో, బానిసలతో పని వాళ్ళతో తక్కువ పని తీసు కుంటే అల్లాహ్ (త) అతన్ని క్షమించి నరకం నుండి విముక్తి ప్రసాదిస్తాడు. (బైహఖీ-షు’అబిల్ ఈమాన్)
1966 – [ 11 ] ( ضعيف جدا ) (1/613)
وَعَنِ ابْنِ عَبَّاسٍ قَالَ: كَانَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم إِذَا دَخَلَ شَهْرُرَمَضَانَ أَطْلَقَ كُلَّ أَسِيْرٍ وَأَعْطَى كُلَّ سَائِلٍ. رَوَاهُ الْبَيْهَقي .
1966. (11) [1/613–అతి బలహీనం]
‘అబ్దుల్లాహ్ బిన్ ‘అబ్బాస్ (ర) కథనం: ప్రవక్త (స) రమ’దాన్ నెల ప్రారంభమైతే ఖైదీలను విడిచిపెట్టే వారు, అడిగే ప్రతి ఒక్కరికీ ఇచ్చేవారు. (బైహఖీ-షు’అబిల్ ఈమాన్)
1967 – [ 12 ] ( لم تتم دراسته ) (1/613)
وَعَنِ ابْنِ عُمَرَ أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم قَالَ: “إِنَّ الْجَنَّةَ تُزَخْرَفُ لِرَمَضَانَ مِنْ رَّأْسِ الْحَوْلِ إِلَى حَوْلِ قَابِلٍ”. قَالَ: “فَإِذَا كَانَ أَوَّلُ يَوْمٍ مِّنْ رَمَضَانَ هَبَّتْ رِيْحٌ تَحْتَ الْعَرْشِ مِنْ وَرَقِ الْجَنَّةِ عَلَى الْحُوْرِ الْعِيْنِ فَيَقُلْنَ: يَا رَبِّ اجْعَلْ لَنَا مِنْ عِبَادِكَ أَزْوَاجًا تَقَرُّ بِهِمْ أَعْيُنُنَا وَتَقَرُّ أَعْيُنُهُمْ بِنَا”. رَوَى الْبَيْهَقِيُّ الْأَحَادِيْثُ الثَّلَاثَةُ فِيْ شُعَبِ الْإِيْمَانِ.
1967. (12) [1/613–అపరిశోధితం]
‘అబ్దుల్లాహ్ బిన్ ‘ఉమర్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం: రమ’దాన్‌కు స్వాగతంగా ఒక రమ’దాను నుండి మరో రమ’దాను వరకు స్వర్గం అలంకరించ బడుతుంది. రమ’దాను మొదటి రోజు అల్లాహ్ సింహాసనం క్రింద స్వర్గం లోని ఆకుల ద్వారా దైవకన్య (‘హూర్)లపై గాలి వీస్తుంది. అప్పుడు ఆ దైవకన్యలు, ‘ఓ మా ప్రభూ! నీ దాసుల్లోని మా భర్తలను నిర్ణయించు. వారి ద్వారా మా కళ్ళను చల్లబరచు. మా ద్వారా వారి కళ్ళు చల్లబరచు,’ అని ప్రార్థిస్తారు. (బైహఖీ – షు’అబిల్ ఈమాన్)
1968 – [ 13 ] ( لم تتم دراسته ) (1/614)
وَعَنْ أَبِيْ هُرَيْرَةَ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم أَنَّهُ قَالَ: “يُغْفَرُ لِأُمَّتِهِ فِيْ آخِرِ لَيْلَةٍ فِيْ رَمْضَانَ”. قِيْلَ: يَا رَسُوْلَ اللهِ أَهِيَ لَيْلَةُ الْقَدْرِ؟ قَالَ: “لَا وَلَكِنَّ الْعَامِلَ إِنَّمَا يُوَفّى أَجْرُهُ إِذَا قَضَى عَمَلَهُ”. رَوَاهُ أَحْمَدُ .
1968. (13) [1/614–అపరిశోధితం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”రమ’దాన్ చివరి రాత్రిలో ముస్లిమ్ సమాజంలోని ఉపవాస కులందరినీ క్షమించడం జరుగుతుంది. ప్రవక్త (స) ను, ‘అది ఖద్ర్ రాత్రా?’ అని ప్రశ్నించడం జరిగింది. దానికి ప్రవక్త (స) కాదు, కాని శ్రామికులు అంటే పనిపూర్తిచేసిన ఉపవాసకులకు పూర్తి ప్రతి ఫలం ఇవ్వబడుతుంది.” (అ’హ్మద్)
=====
1– بَابُ رُؤْيَةِ الْهِلَالِ
1. రమ‘దాన్ నెలవంక చూడటం
రమ’దాన్ నెలవంక కనబడిన వెంటనే రమ’దాన్ నెల ప్రారంభం అవుతుంది. అందుకు రజబ్ మాసం నుండి ఒక దృష్టి ఉంచాలి. రజబ్ 29వ తేదీన ష’అబాన్ నెలవంకను చూడాలి. ఎందుకంటే 29వ తేదీన మేఘాల వల్ల లేదా ఇతర కారణాల వల్ల నెలవంక కనబడకపోతే షాబాన్ 30 రోజులు పూర్తి చేసుకుంటే రమ’దాన్ ఉపవాసాలు ప్రారంభించడానికి ఒకవేళ 29వ తేదీన రమ’దాన్ నెలవంక కనబడితే మరుసటి రోజు ఉదయం ఉపవాసం ఉండాలి. ఒకవేళ 29వ తేదీన ఆకాశం మేఘాలమయంగా ఉండి నెలవంక కనబడక పోతే ఉదయం నుండి మధ్యాహ్నం వరకు అన్నపానీయాలకు దూరంగా ఉండాలి. ఒకవేళ ఎవరైనా నమ్మకం గల వ్యక్తి ద్వారా నెలవంక వార్త అందితే ఉపవాసం ఉండాలి లేదా అక్కరలేదు. ఒకవేళ నెలవంక కనబడింది, కనబడలేదు అనే విషయంలో అనుమానం ఉంటే ఉపవాసం ఏ మాత్రం ఉండరాదు.
—–
اَلْفَصْلُ الْأَوَّلُ మొదటి విభాగం
1969 – [ 1 ] ( متفق عليه ) (1/615)
عَنْ عُمَرَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَا تَصُوْمُوْا حَتَّى تَرُوا الْهِلَالَ وَلَا تُفْطِرُوْا حَتَّى تَرَوْهُ فَإِنْ غُمَّ عَلَيْكُمْ فَاقْدِرُوْا له .
وفي رواية قال: الشهر تسعون و عشرون ليلة فلا تصوموا حتى تروه. فإن غمَّ عليكم فأكملوا العدة ثلاثين.
1969. (1) [1/615–ఏకీభవితం]
ఇబ్నె ‘ఉమర్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”నెలవంకను చూచేవరకు ఉపవాసవ్రతం పాటించ కండి. దాన్ని చూసే వరకు ఉపవాసవ్రతం విరమించ కండి. ఒకవేళ ఆకాశం మేఘాలమయంగా ఉంటే ఆలోచించి మరీ లెక్కకట్టండి.
మరో ఉల్లేఖనంలో, ‘మాసం 29 రోజులదయితే, నెల వంకను చూసేవరకు ఉపవాసం ప్రారంభించకండి. ఒక వేళ మేఘాలు ఆవరిస్తే, 30 రోజులు పూర్తిచేసుకోండి,’ అని ఉంది. (బు’ఖారీ, ముస్లిమ్)
1970 – [ 2 ] ( متفق عليه ) (1/615)
وَعَنْ أَبِيْ هُرَيْرَةَ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “صُوْمُوْا لِرُؤْيَتِهِ وَأَفْطِرُوْا لِرُؤْيَتِهِ. فَإِنْ غُمَّ عَلَيْكُمْ فَأَكْمِلُوْا عِدَّةَ شَعْبَانَ ثَلَاثِيْنَ”.
1970. (2) [1/615–ఏకీభవితం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”రమ’దాన్ నెల వంక చూసి రమ’దాన్ ఉపవాసాలు పాటించండి, షవ్వాల్ నెలవంక చూసి ఉపవాసాలు విరమించండి. అంటే ఉపవాసాలు పూర్తిచేయండి. ఒక వేళ మీరు ఆకాశం మేఘాలమయంగా ఉంటే, ష’అబాన్ 30 రోజులు పూర్తిచేసుకోండి.” (బు’ఖారీ, ముస్లిమ్)
1971 – [ 3 ] ( متفق عليه ) (1/615)
وَعَنِ ابْنِ عُمَرَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِنَّا أُمَّةٌ أُمِّيَّةٌ لَا نَكْتُبُ وَلَا نَحْسِبُ الشَّهْرُ هَكَذَا وَهَكَذَا وَهَكَذَا”. وَعَقَدَ الْإِبْهَامَ فِيْ الثَّالِثَةِ. ثُمَّ قَالَ: “اَلشَّهْرُهَكَذَاَ وَهَكَذَا وَهَكَذَا”. يَعْنِيْ تَمَامَ الثَّلَاثِيْنَ يَعْنِيْ مَرَّةً تِسْعًا وَّعِشْرِيْنَ وَمَرَّةً ثَلَاثِيْنَ”.
1971. (3) [1/615–ఏకీభవితం]
‘అబ్దుల్లాహ్ బిన్ ‘ఉమర్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మనం నిరక్షరాసులం, మనకు రాయడమూ రాదు, లెక్కలూ రావు. నెల ఇలా-ఇలా-ఇలా అంటే, ఇన్ని రోజులది ఉంటుంది. మూడవసారి బొటనవేలు ముడుచుకొని అన్నారు, ‘నెల ఇలా-ఇలా -ఇలా ఉంటుంది, అంటే ఇన్ని రోజులది ఉంటుంది. అంటే ఒక్కోసారి 29 రోజులు, ఒక్కో సారి 30 రోజుల నెల అవుతుంది.” [2] (బు’ఖారీ, ముస్లిమ్)
1972 – [ 4 ] ( متفق عليه ) (1/615)
وَعَنْ أَبِيْ بَكْرَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “شَهْرًا عِيْدٍ لَا يَنْقُصَانِ: رَمَضَانَ وَذُو الْحِجَّةِ”.
1972. (4) [1/615–ఏకీభవితం]
అబూ బక్రహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”రెండు పండుగ నెలలు రమ’దాన్, జు’ల్’హిజ్జహ్ తక్కువ కావు. [3] (బు’ఖారీ, ముస్లిమ్)
1973 – [ 5 ] ( متفق عليه ) (1/616)
وَعَنْ أَبِيْ هُرَيْرَةَ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَا يَتَقَدَّمَنَّ أَحَدُكُمْ رَمَضَانَ بِصَوْمٍ يَوْمٍ أَوْ يَوْمَيْنِ إِلَّا أَنْ يَّكُوْنَ رَجُلٌ كَانَ يَصُوْمُ صَوْمًا فَلْيَصُمْ ذَلِكَ الْيَوْمَ”
1973. (5) [1/616–ఏకీభవితం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”రమ’దాన్‌కు ఒకటి, రెండురోజులు ముందు ఉపవాసం ఉండరాదు. అయితే అలవాటుగా ఉపవాసం ఉంటూ వస్తున్న వ్యక్తి ఉండవచ్చు.[4] (బు’ఖారీ, ముస్లిమ్)
—–
اَلْفَصْلُ الثَّانِيْ రెండవ విభాగం
1974 – [ 6 ] ( صحيح ) (1/616)
وَعَنْ أَبِيْ هُرَيْرَةَ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِذَا انْتَصَفَ شَعْبَانُ فَلَا تَصُوْمُوْا”. رَوَاهُ أَبُوْ دَاوُدَ وَالتِّرْمِذِيُّ وَابْنُ مَاجَهُ وَالدَّارَمِيُّ.
1974. (6) [1/616–దృఢం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ష’అబాన్ నెల సగం గడచిన తర్వాత అదనపు (నఫిల్) ఉపవాసాలు పాటించకండి. కాని తప్పిపోయిన (ఖ’దా), లేక తప్పనిసరి (వాజిబ్) ఉపవాసాలు ఉండవచ్చు.” (అబూ దావూద్, తిర్మిజి’, ఇబ్నె మాజహ్, దారమి)
1975 – [ 7 ] ( لم تتم دراسته ) (1/616)
وَعَنْ أَبِيْ هُرَيْرَةَ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “أَحْصُوْا هِلَالَ شَعْبَانَ لِرَمَضَانَ”. رَوَاهُ التِّرْمِذِيُّ.
1975. (7) [1/616–అపరిశోధితం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”రమ’దాన్ కోసం ష’అబాన్ నెలవంకను లెక్కకట్టండి.[5] (తిర్మిజి’)
1976 – [ 8 ] ( لم تتم دراسته ) (1/616)
وَعَنْ أُمِّ سَلَمَةَ قَالَتْ: مَا رَأَيْتُ النَّبِيَّ صلى الله عليه وسلم يَصُوْمُ شَهْرَيْنِ مُتَتَابِعَيْنِ إِلَّا شَعْبَانَ وَرَمَضَانَ. رَوَاهُ أَبُو دَاوُدَ وَالتِّرْمِذِيُّ وَالنَّسَائِيُّ وَابْنُ مَاجَهُ.
1976. (8) [616–అపరిశోధితం]
ఉమ్మె సలమహ్ (ర) కథనం: నేను, ప్రవక్త (స)ను రెండు నెలలు ఎడతెగకుండా ఉపవాసాలు ఉండటం చూడలేదు. కాని ష’అబాన్, రమ’దాన్లో తప్ప.[6] (అబూ దావూద్, తిర్మిజి’, నసాయి’, ఇబ్నె మాజహ్)
1977 – [ 9 ] ( لم تتم دراسته ) (1/616)
وَعَنْ عَمَّارِ بْنِ يَاسِرٍرَضِيَ اللهُ عَنْهُمَا قَالَ: “مَنْ صَامَ الْيَوْمَ الَّذِيْ يُشَكُّ فِيْهِ فَقَدْ عَصَى أَبَا الْقَاسِمِ صلى الله عليه وسلم”. رَوَاهُ أَبُوْ دَاوُدَ وَالتِّرْمِذِيُّ وَالنَّسَائِيُّ وَابْنُ مَاجَهُ وَالدَّارَمِيُّ.
1977. (9) [1/616–అపరిశోధితం]
‘అమ్మార్ బిన్ యాసిర్ కధనం: అనుమానం గల దినంలో ఉపవాసం పాటించినవాడు, అబుల్ ఖాసిమ్ (స) పట్ల అవిధేయతకు పాల్పడ్డాడు. [7] (అబూ దావూద్ తిర్మిజి’, నసాయి’, ఇబ్నె మాజహ్, దారమి)
1978 – [10 ] ( لم تتم دراسته ) (1/616)
وَعَنِ ابْنِ عَبَّاسٍ قَالَ: “جَاءَ أَعْرَابِيٌّ إِلَى النَّبِيِّ صلى الله عليه وسلم فَقَالَ: إِنِّيْ رَأَيْتُ الْهِلَالَ يَعْنِيْ هِلَالَ رَمَضَانَ فَقَالَ: “أَتَشْهَدُ أَنْ لَّا إِلَهَ إِلَّا اللهُ؟” قَالَ: نَعَمْ قَالَ: “أَتَشْهَدُ أَنَّ مُحَمَّدًا رَسُوْلُ اللهِ؟” قَالَ: نَعَمْ. قَالَ: “يَا بِلَالُ أَذِّنْ فِيْ النَّاسِ أَنْ يَّصُوْمُوْا غَدًا”. رَوَاهُ أَبُوْدَاوُدَ وَالتِّرْمِذِيُّ وَالنَّسَائِيُّ وَابْنُ مَاجَهُ وَالدَّارَمِيُّ.
1978. (10) [1/616–అపరిశోధితం]
‘అబ్బాస్ (ర) కథనం: ఒక ఎడారివాసి (బదూ’) ప్రవక్త (స) వద్దకు వచ్చాడు, ‘నేను రమ’దాన్ నెల వంకను చూసాను,’ అని చెప్పాడు. ప్రవక్త (స) అతనితో, ‘నువ్వు అల్లాహ్ తప్ప ఇతరులెవ్వరూ ఆరాధ్యులు లేరని సాక్ష్యం ఇస్తావా,’ అన్నారు. ఆ వ్యక్తి, ‘అవును,’ అని అన్నాడు. ఆ తర్వాత ప్రవక్త (స) మళ్ళీ, ‘నీవు ము’హమ్మద్ (స) అల్లాహ్ ప్రవక్త అని సాక్ష్యం ఇస్తున్నావా,’ అని ప్రశ్నించారు. ఆ వ్యక్తి, ‘అవును,’ అని అన్నాడు. ప్రవక్త (స) బిలాల్‌తో, ‘రేపటి నుండి ఉపవాసాలు ప్రారంభం,’ అని ప్రకటించ మని ఆదేశించారు. [8] (అబూ దావూద్, నసాయి’, ఇబ్నె మాజహ్, తిర్మిజి’, దారమి)
1979 – [ 11 ] ( لم تتم دراسته ) (1/617)
وَعَنِ ابْنِ عُمَرَ قَالَ: تَرَاءَىَ النَّاسُ الْهِلَالَ فَأَخْبَرْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم أَنِّيْ رَأَيْتُهُ فَصَامَ وَأَمَرَ النَّاسَ بِصِيَامِهِ. رَوَاهُ أَبُوْ دَاوُدَ وَالدَّارَمِيُّ.
1979. (11) [1/617–అపరిశోధితం]
ఇబ్నె ‘ఉమర్ (ర) కథనం: నెలవంకను చూడటానికి ప్రజలు ఒకచోట చేరారు. నేను ప్రవక్త (స) వద్దకు వచ్చి, ‘నేను నెలవంకను చూశాను,’ అని అన్నాను. ఆ తరు వాత ప్రవక్త(స) ఉపవాసం ఉన్నారు. ప్రజలకు ఉపవాసం పాటించమని ఆదేశించారు. (అబూ దావూద్, దారమి)
—–
اَلْفَصْلُ الثَّالِثُ మూడవ విభాగం
1980 – [ 12 ] ( صحيح ) (1/617)
وَعَنْ عَائِشَةَ رَضِيَ اللهُ عَنْهَا قَالَتْ: كَانَ رَسُوْلُ اللهِ صلى الله عليه و سلم يَتَحَفَّظُ مِنْ شَعْبَانَ مَالًا يَتَحَفَّظُ مِنْ غَيْرِهِ. ثُمَّ يَصُوْمُ لِرُؤْيَةِ رَمَضَانَ فَإِنْ غَمَّ عَلَيْهِ عَدَّ ثَلَاثِيْنَ يَوْمًا ثُمَّ صَامَ. رَوَاهُ أَبُوْ دَاوُدَ.
1980. (12) [1/617–దృఢం]
‘ఆయి’షహ్ (ర) కథనం: ప్రవక్త (స) ష’అబాన్ దినాలను చాలా జాగ్రత్తగా గుర్తుంచేవారు. ఇతర నెలల దినాలను అంత శ్రద్ధగా గుర్తుంచేవారు కాదు. రమ’దాన్ నెలవంకను చూసి ఉపవాసాలు పాటించే వారు. ఒకవేళ మేఘాలు, లేక ఇతర కారణాల వల్ల నెలవంక కనబడకపోతే ష’అబాన్ 30 రోజులు పూర్తిచేసి ఉపవాసాలు ప్రారంభించేవారు. (అబూ దావూద్)
1981 – [ 13 ] ( صحيح ) (1/617)
وَعَنْ أَبِيْ الْبَخْتَرِيّ قَالَ: خَرَجْنَا لِلْعُمْرَةِ فَلَمَّا نَزَلْنَا بِبَطْنِ نَخْلَةَ تَرَاءَيْنَا الْهِلَالَ. فَقَالَ بَعْضُ الْقَوْمِ: هُوَ ابْنُ ثَلَاثٍ. وَقَالَ بَعْضُ الْقَوْمِ: هُوَ ابْنُ لَيْلَتَيْنِ. فَلَقِيْنَا ابْنَ عَبَّاسٍ فَقُلْنَا: إِنَّا رَأَيْنَا الْهِلَالَ فَقَالَ بَعْضُ الْقَوْم: هُوَ ابْنُ ثَلَاثٍ وَقَالَ بَعْضُ الْقَوْمِ: هُوَ ابْنُ لَيْلَتَيْنِ. فَقَالَ: أَيَّ لَيْلَةٍ رَأَيْتُمُوْهُ؟ قُلْنَا: لَيْلَةً كَذَا وَكَذَا. فَقَالَ: إِنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم مَدَّهُ لِلرُّؤْيَةِ فَهُوَ لَيْلَةٌ رَأَيْتُمُوْهُ.
وَفِيْ رِوَايَةٍ عَنْهُ. قَالَ: أَهْلَلْنَا رَمَضَانَ وَنَحْنُ بِذَاتِ عِرْقٍ فَأَرْسَلْنَا رَجُلًا إِلَى ابْنِ عَبَّاسٍ يَسْأَلُهُ. فَقَالَ ابْنُ عَبَّاسٍ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِنَّ اللهَ تَعَالى قَدْ أَمَدَّهُ لِرُؤْيَتِهِ فَإِنْ أُغْمِيَ عَلَيْكُمْ فَأَكْمِلُوا الْعِدَّةَ” .رَوَاهُ مُسْلِمٌ.
1981. (13) [1/617–దృఢం]
అబూ బ’ఖ్తరి (ర) కథనం: మేము ‘ఉమ్రహ్ కోసం మా నగరం కూఫా నుండి బయలుదేరాము. మక్కహ్ ‘తాయఫ్లకు మధ్య ఉన్న బ’తనె న’ఖలహ్కు చేరుకున్న తర్వాత మేము నెలవంక చూడటానికి ఒకచోట చేరాము. నెలవంక చూశాము కాని అది పెద్దదిగా ఉంది. కొందరు దీన్ని మూడవ రోజు నెలవంక అని, మరికొందరు రెండవరోజు నెలవంక అని అన్నారు. మేమందరం కలసి ఇబ్నె ‘అబ్బాస్ వద్దకు వెళ్ళాము. అతని (ర)తో కలసి సమస్య అతని ముందు ఇలా పెట్టాము, ”మేము నెలవంకను చూశాము. అది పెద్దదిగా ఉంది. కొందరు దీన్ని మూడవ రోజు నెలవంక అని, మరి కొందరు రెండవ రోజు నెలవంక అని అంటున్నారు. ఇబ్నె ‘అబ్బాస్ (ర), ‘ఏ రోజు రాత్రి నెలవంకను చూసారు,’ అని అడిగారు. మేము, ‘ఫలానా రాత్రి చూసాము,’ అని అన్నాము. అప్పుడు ఇబ్నె ‘అబ్బాస్, ‘అల్లాహ్ (త) దాన్ని పొడవుగా చేసాడని దాన్ని చూసేందుకు, అది ఆ రోజు నెలవంకేనని, అది ఆ నెలవంక నీవు చూసిన నాటిదేనని ప్రవక్త (స) తెలిపారని,’ అన్నారు.
మరొక ఉల్లేఖనంలో ఇలా ఉంది, మేము రమ’దాన్ నెలవంకను జా’తుల్-‘ఇర్ఖ్లో చూశాము. మేము ఒక వ్యక్తిని ఇబ్నె ‘అబ్బాస్‌ను అడగమని పంపాము. దానికి అతడు(ర) ఇలా ఉల్లేఖించారు, ”అల్లాహ్ (త) ఆ నెలవంకను చూడటానికి పొడవుగా చేస్తాడని, ఒకవేళ ఆకాశం మేఘాలతో నిండి ఉండి నెలవంక కనబడకపోతే, లెక్క పూర్తిచేసుకోండి. అంటే 30 దినాలు పూర్తి చేసుకోండి.” (ముస్లిమ్)
=====
2- بَابُ فِي مَسَائِل مُتَفَرِّقَة مِنْ كِتَاب الصَّوم
2. ఉపవాసం గురించి వివిధ విషయాలు
اَلْفَصْلُ الْأَوَّلُమొదటి విభాగం
1982 – [ 1 ] ( متفق عليه ) (1/619)
عَنْ أَنَسٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “تَسَحَّرُوْا فَإِنَّ فِيْ السُّحُوْرِ بِرَكَةً”.
1982. (1) [1/619–ఏకీభవితం]
అనస్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”స’హ్రీ తినండి. ఎందుకంటే, స’హ్రీలో శుభం ఉంది.” [9] (బు’ఖారీ, ముస్లిమ్)
1983 – [ 2 ] ( صحيح ) (1/619)
وَعَنْ عَمْرِو بْنِ الْعَاصِ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: ” فَصْلُ مَا بَيْنَ صِيَامِنَا وَصِيَامِ أَهْلِ الْكِتَابِ أَكْلَةُ السَّحَرِ”. رَوَاهُ مُسْلِمٌ .
1983. (2) [1/619–దృఢం]
‘అమ్ర్ బిన్ ‘ఆ’స్ కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మన ముస్లిముల, యూదుల మరియు క్రైస్తవుల మధ్య స’హ్రీ తినే తేడా ఉంది,” అని అనేవారు. ముస్లిములు స’హ్రీ తింటారు, యూదులు, క్రైస్తవులు స’హ్రీ తినరు. (ముస్లిమ్)
1984 – [ 3 ] ( متفق عليه ) (1/619)
وَعَنْ سَهْلٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَا يَزَالُ النَّاسُ بِخَيْرٍ مَا عَجَّلُوا الْفِطْرَ”.
1984. (3) [1/619–ఏకీభవితం]
సహల్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఉపవాస విరమణను సమయబద్ధంగా పాటించేవరకు ప్రజలు లాభంలో ఉంటారు.” [10] (బు’ఖారీ, ముస్లిమ్)
1985 – [ 4 ] ( متفق عليه ) (1/619)
وَعَنْ عُمَرَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِذَا أَقْبَلَ اللَّيْلُ مِنْ هَهُنَا وَأَدْبَرَ النَّهَارُ مِنْ هَهُنَا وَغَرَبَتِ الشَّمْسُ فَقَدْ أَفْطَرَ الصَّائِمُ”.
1985. (4) [1/619–ఏకీభవితం]
‘ఉమర్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”రాత్రి అటు నుండి ఇటువస్తే అంటే పగలు ఇటునుంచి అటు వెళ్ళితే, అంటే సూర్యాస్తమయం అయితే, ఉపవాస విరమణా సమయం అయిపోతుంది.” (బు’ఖారీ, ముస్లిమ్)
1986 – [ 5 ] ( متفق عليه ) (1/619)
وَعَنْ أَبِيْ هُرَيْرَةَ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: نَهَى رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم عَنِ الْوِصَالِ فِيْ الصَّوْمِ. فَقَالَ لَهُ رَجُلٌ: إِنَّكَ تُوَاصِلُ يَا رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم قَالَ: وَأَيُّكُمْ مِثْلِيْ إِنِّيْ أَبِيْتُ يُطْعِمُنِيْ رَبِّيْ وَيَسْقِيْنِيْ”.
1986. (5) [1/619–ఏకీభవితం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) వి’సాల్ ఉపవా సాన్నుండి వారించారు. ఒక వ్యక్తి లేచి ”వి’సాల్ ఉపవాసాన్ని మీరు పాటిస్తారా ఓ అల్లాహ్ ప్రవక్తా!” అని విన్నవించుకున్నాడు. అప్పుడు ప్రవక్త (స), ”మీలో నాలాంటి వారెవరున్నారు? అల్లాహ్ (త) నాకు తినిపిస్తాడు, త్రాపిస్తాడు,” అని అన్నారు. [11] (బు’ఖారీ, ముస్లిమ్)
—–
اَلْفَصْلُ الثَّانِيْ రెండవ విభాగం
1987 – [ 6 ] ( صحيح ) (1/620)
عَنْ حَفْصَةَ رَضِيَ اللهُ عَنْهَا قَالَتْ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَنْ لَمْ يُجْمِعِ الصِّيَامَ قَبْلَ الْفَجْرِ فَلَا صِيَامَ لَهُ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَأَبُو دَاوُدَ وَالنَّسَائِيُّ وَالدَّارَمِيُّ
وَقَالَ أَبُوْ دَاوُدَ: وَقَفَهُ عَلَى حَفْصَةَ مَعْمَرٌ وَالزُّبَيْدِيُّ وَابْنُ عَيَيْنَهُ وَيُوْنُسُ الْأَيْلِيُّ كُلُّهُمْ عَنِ الزُّهْرِيِّ.
1987. (6) [1/620–దృఢం]
‘హఫ్’సహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”రాత్రి ఫజ్ర్కి ముందే ఉపవాస సంకల్పం చేయనివాని ఉపవాసం నెరవేరదు.” (తిర్మిజి’, అబూ దావూద్, నసాయి’, దారమి)
ఈ ఉల్లేఖనం ‘హఫ్’సహ్ (ర)తో ముగిసిందని అబూ దావూద్ అభిప్రాయం. ము’అమ్మర్, ‘జుబైదీ, ఇబ్నె ఉయయ్న, యూనున్ అందరూ ‘జుహ్రి ద్వారా ఉల్లేఖించారు. [12]
1988 – [ 7 ] ( صحيح ) (1/620)
وَعَنْ أَبِيْ هُرَيْرَةَ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِذَا سَمِع النِّدَاءَ أَحَدُكُمْ وَالْإِنَاءُ فِيْ يَدِهِ فَلَا يَضَعُهُ حَتَّى يَقْضِيَ حَاجَتَهُ مِنْهُ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ .
1988. (7) [1/620–దృఢం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మీలో ఎవరైనా స’హ్రీ తింటున్నప్పుడు అజా’న్ అయితే, దాన్ని వదిలేయకూడదు, మీ అవసరం పూర్తిచేసుకోండి.” [13] (అబూ దావూద్)
1989 – [ 8 ] ( ضعيف ) (1/620)
وَعَنْ أَبِيْ هُرَيْرَةَ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “قَالَ اللهُ تعالى: أَحَبُّ عِبَادِيْ إِلَيَّ أَعْجَلُهُمْ فِطْرًا” .رَوَاهُ التِّرْمِذِيُّ.
1989. (8) [1/620–బలహీనం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”అల్లాహ్ ఆదేశం: ‘నా దాసుల్లో ఇఫ్తార్ చేయటంలో సమయ పాలన పాటించేవారు నాకు అందరికంటే ప్రియులు.’ (తిర్మిజి’)
ఎందుకంటే వీరందరూ సాంప్రదాయాన్ని అనుస రిస్తున్నారు.
1990 – [ 9 ] ( صحيح ) (1/620)
وَعَنْ سَلْمَانَ بْنِ عَامِرٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِذَا أَفْطَرَأَحَدُكُمْ فَلْيُفْطِرْعَلَى تَمْرٍ فَإِنَّهُ بَرَكَةٌ فَإِنْ لَّمْ يَجِدْ فَلْيُفْطِرْعَلَى مَاءٍ فَإِنَّهُ طَهُوْرٌ”. رَوَاهُ أَحْمَدُ وَالتِّرْمِذِيُّ وَأَبُوْ دَاوُدَ وَابْنُ مَاجَهُ وَالدَّارَمِيُّ. وَلَمْ يَذْكُرْ: “فَإِنَّهُ بَرَكَةٌ” غَيْرُ التِّرْمِذِيُّ.
1990. (9) [1/620–దృఢం]
సల్మాన్ బిన్ ‘ఆమిర్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మీలో ఎవరైనా ఉపవాసాన్ని విరమిస్తే, ఖర్జూరం తిని ఉపవాసం విరమించాలి. ఎందుకంటే అందులో శుభం ఉంది. ఒకవేళ ఖర్జూరం లేకపోతే నీళ్ళతో విరమించాలి. ఎందుకంటే నీరు పరిశుద్ధ మైనది. (అ’హ్మద్, తిర్మిజి’, అబూ దావూద్, ఇబ్నె మాజహ్, దారమి)
అయితే తిర్మిజి‘ తప్ప ఇతరులెవ్వరూ ఖర్జూరం శుభకరమైనదని పేర్కొనలేదు.
1991 – [ 10 ] ( صحيح ) (1/621)
وَعَنْ أَنَسٍ قَالَ: كَانَ النَّبِيُّ صلى الله عليه وسلم يُفْطِرُ قَبْلَ أَنْ يُّصَلِّيَ عَلَى رُطَبَاتٍ فَإِنْ لَمْ تَكُنْ رُطَبَاتٍ فَتُمَيْرَاتٌ فَإِنْ لَمْ تَكُنْ تُمَيْرَاتٌ حَسَا حَسَوَاتٍ مِّنْ مَّاءٍ. رَوَاهُ التِّرْمِذِيُّ وَأَبُو دَاوُدَ. وَقَالَ التِّرْمِذِيُّ: هَذَا حَدِيْثٌ حَسَنٌ غَرِيْبٌ.
1991. (10) [1/621–దృఢం]
అనస్ (ర) కథనం: ”ప్రవక్త (స) మ’గ్రిబ్ నమా’జ్ చదవడానికి ముందే కొన్ని ఖర్జూరాల ద్వారా ఉపవా సాన్ని విరమించేవారు. ఒకవేళ పండు ఖర్జూరాలు లేక పోతే ఎండు ఖర్జూరాలతోనే విరమించేవారు. ఒకవేళ ఎండు ఖర్జూరాలు కూడా లేకపోతే రెండు గుక్కెళ్ళ నీళ్ళతోనైనా విరమించేవారు.” [14] (తిర్మిజి’ / ప్రామాణికం, ఏకోల్లేఖనం, అబూ దావూద్)
1992 – [ 11 ] ( صحيح ) (1/621)
وَعَنْ زَيْدِ بْنِ خَالِدٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَنْ فَطَّرَ صَائِمًا أَوْ جَهَّزَغَازِيًا فَلَهُ مِثْلُ أَجْرِهِ”. رَوَاهُ الْبَيْهَقِيُّ فِيْ شُعَبِ الْإِيْمَانِ وُمُحْيِيْ السُّنَّةِ فِيْ شَرْحِ السُّنَّةِ وَقَالَ صَحِيْحٌ.
1992. (11) [1/621–దృఢం]
‘జైద్ బిన్ ‘ఖాలిద్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఎవరైనా ఒక ఉపవాసి ఉపవాసాన్ని విరమించే ఏర్పాటు (ఇ’ఫ్తార్) చేయించినా, లేక పోరాటంలో పాల్గొనే వీరుడికి యుద్ధసామగ్రిని సమకూర్చినా, అతనికి కూడా సమానమైన పుణ్యం లభిస్తుంది. అంటే ఉపవాసకునికి, పోరాటంలో పాల్గొనే వీరునికి లభించి నంత పుణ్యం ,ఇ’ఫ్తార్ చేయించేవానికి, యుద్ధ సామగ్రి సమకూర్చినవానికి లభిస్తుంది. (బైహఖీ-షు’అబిల్ ఈమాన్, ము’హియియ్ సున్నహ్-ష’ర్హిస్సున్నహ్)
1993 – [ 12 ] ( حسن ) (1/621)
وَعَنِ ابْنِ عُمَرَ قَالَ: كَانَ النَّبِيُّ صلى الله عليه وسلم إِذَا أَفْطَرَ قَالَ: “ذَهَبَ الظَّمَأُ وَابْتَلَّتِ الْعُرُوْقُ وَثَبَتَ الْأَجْرُإِنْ شَاءَ اللهُ” .رَوَاهُ أَبُوْ دَاوُدَ.
1993. (12) [1/621–ప్రామాణికం]
ఇబ్నె ‘ఉమర్ (ర) కథనం: ప్రవక్త (స) ఉపవాసం విరమించినపుడు ఈ దు’ఆ పఠించేవారు, ”జ’హబ అ”జ్జమాఉ’ వబ్తల్లతిల్ ‘ఉరూఖ్ వ స’బతల్ అజ్రు, ఇన్షా అల్లాహుత’ఆలా,” — ‘దాహం తీరింది, నరాలు చల్ల బడ్డాయి, ఇన్షా అల్లాహుత’ఆలా ప్రతిఫలం తప్ప కుండా లభిస్తుంది.” (అబూ దావూద్)
1994 – [ 13 ] ( حسن ) (1/621)
وَعَنْ مُعَاذِ بْنِ زُهْرَةَ قَالَ: إِنَّ النَّبِيَّ صلى الله عليه وسلم كَانَ إِذَاأَفْطَرَ قَالَ: “اَللّهُمَّ لَكَ صُمْتُ وَعَلَى رِزْقِكَ أَفْطَرْتُ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ مُرْسِلًا .
1994. (13) [1/621–ప్రామాణికం]
ము’ఆజ్’ బిన్ ‘జుహ్రహ్ (ర) కథనం: ప్రవక్త (స) ఉప వాసం విరమించేటప్పుడు ఈ దు’ఆ పఠించేవారు, ”అల్లాహుమ్మ లక ‘సుమ్తు, వ ‘అలా రి’జ్ఖిక అ’ఫ్తర్తు” — ‘ఓ అల్లాహ్! నీ కోసమే ఉపవాసం పాటించాను, నీ ఉపాధితోనే ఇఫ్తార్ చేసాను.’ (అబూ దావూద్ – తాబయీ ప్రోక్తం)
—–
اَلْفَصْلُ الثَّالِثُ మూడవ విభాగం
1995 – [ 14 ] ( صحيح ) (1/622)
عَنْ أَبِيْ هُرَيْرَةَ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه و سلم: “لَا يَزَالُ الدِّيْنُ ظَاهِرًا مَا عَجَّلَ النَّاسُ الْفِطْرَ لِأَنَّ الْيَهُوْدَ وَالنَّصَارَى يُؤَخِّرُوْنَ” . رَوَاهُ أَبُوْ دَاوُدَ وَابْنُ مَاجَهُ .
1995. (14) [1/622–దృఢం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ప్రజలు ఉపవాస విరమణలో సమయపాలన చేస్తు న్నంత వరకు ధర్మంఆధిక్యత కలిగిఉంటుంది. ఎందు కంటే యూదులు, క్రైస్తవులు ఆలస్యంగా ఉపవాస విరమణ చేసేవారు. (అబూ దావూద్, ఇబ్నె మాజహ్)
1996 – [ 15 ] ( صحيح ) (1/622)
وَعَنْ أَبِيْ عَطِيَّةَ قَالَ: دَخَلْتُ أَنَا وَمَسْرُوْقٌ عَلَى عَائِشَةَ فَقُلْنَا: يَا أُمَّ الْمُؤْمِنِيْنَ رَجُلَانِ مِنْ أَصْحَابِ مُحَمَّدٍ صلى الله عليه وسلم أَحَدُهُمَا يُعَجِّلُ الْإِفْطَارَوَيُعَجِّلُ الصَّلَاةَ وَالْآخَرُ: يُؤَخِّرُ الْإِفْطَارَ وَيُؤَخِّرُ الصَّلَاةَ. قَالَتْ: أَيُّهُمَا يُعَجِّلُ الْإِفْطَارَ وَيُعَجِّلُ الصّلَاةَ؟ قُلْنَا عَبْدُ اللهِ بْنِ مَسْعُوْدٍ. قَالَتْ: هَكَذَا صَنَعَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم وَالْآخَرُ أَبُوْ مُوْسَى. رَوَاهُ مُسْلِمٌ .
1996. (15) [1/622–దృఢం]
అబూ ‘అ’తియ్యహ్ (ర) కథనం: ”నేను, మస్రూఖ్ ఇద్దరం కలసి ‘ఆయి’షహ్ (ర) వద్దకు వచ్చాము, ”ఓ తల్లిగారూ! ఇద్దరు ప్రవక్త అనుచరులు ఉన్నారు. వారిలో ఒకరు ఇ’ఫ్తార్ చేయటంలో, నమా’జ్ చేయటంలో తొందరపడతారు, మరొకరు ఇ’ఫ్తార్ చేయడంలో, నమా’జ్ చేయడంలో ఆలస్యం చేస్తారు.” దానికి ‘ఆయి’షహ్ (ర), ”ఎవరు తొందరగా ఇ’ఫ్తార్ చేస్తారు, ఎవరు తొందరగా నమా’జ్ చేస్తారు,” అని ప్రశ్నించారు. దానికి మేము ‘ ‘అబ్దుల్లాహ్ బిన్ మస్’ఊద్,’ అని అన్నాం. అప్పుడు ‘ఆయి’షహ్ (ర), ”ప్రవక్త (స), ”కూడా ఇలాగే చేసేవారు,” అని అన్నారు. రెండవ వ్యక్తి అబూ మూసా (అ) (ఏదో కారణంవల్ల ఆలస్యంగా ఇ’ఫ్తార్ చేసేవారు, ఆలస్యంగా నమా’జ్ చేసేవారు). (ముస్లిమ్)
1997 – [ 16 ] ( حسن ) (1/622)
وَعَنِ الْعِرْبَاضِ بْنِ سَارِيَةَ قَالَ: دَعَانِيْ رَسُوْلُ اللهِ صلى الله عليه و سلم إِلَى السُّحُوْرِ فِيْ رَمَضَانَ فَقَالَ: “هَلُمَّ إِلَى الْغَدَاءِ الْمُبَارِكِ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ وَالنَسَائِيُّ.
1997. (16) [1/622–ప్రామాణికం]
‘ఇర్బా’ద్ బిన్ సారియహ్ (ర) కథనం: రమ’దాన్ మాసంలో ప్రవక్త (స) నన్ను స’హ్రీ తినడానికి ఆహ్వానిస్తూ, ”శుభకరమైన భోజనం వైపుకు రా!” అని అన్నారు. [15] (అబూ దావూద్, నసాయి’)
1998 – [ 17 ] ( لم تتم دراسته ) (1/622)
وَعَنْ أَبَيْ هُرَيْرَةَ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “نِعْمَ سَحُوْرُالْمُؤْمِنِ التَّمْرُ” .رَوَاهُ أَبُوْ دَاوُدَ.
1998. (17) [1/622–అపరిశోధితం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”విశ్వాసుని కోసం అత్యుత్తమమైన స’హ్రీ భోజనం ఖర్జూరం.” [16] (అబూ దావూద్)
=====
3- بَابُ تَنْزِيْهِ الصَّوْمِ
3. ఉపవాసాన్ని శుద్ధపరచటం
ఉపవాసాన్ని అధర్మ విషయాలకు, కార్యాలకు దూరంగా ఉంచాలి. కొన్ని విషయాల వల్ల ఉపవాసం భంగమవుతుంటే, మరికొన్ని విషయాల వల్ల ఉపవాసం పాడవుతుంది. ఉపవాసస్థితిలో అసత్యం పలకటం, పరోక్షంగా నిందించటం, అసత్య ప్రమాణం చేయటం, తగువులాడటం మొదలైనవి నిషిద్ధం. వీటివల్ల ఉపవాస పుణ్యం తగ్గిపోతుంది. అదే విధంగా ఉపవాస స్థితిలో తనంతటతాను తినటం వల్ల, త్రాగటం వల్ల, సంభోగం చేయటం వల్ల ఉపవాసం భంగమవుతుంది. ఉపవాస స్థితిలో స్నానం చేయటం వల్ల తలకు నూనె రాయటం వల్ల ఏమీ కాదు. అదేవిధంగా సుర్మా పెట్టకోవచ్చు. అదేవిధంగా ఉపవాస స్థితిలో కిల్లీ (పాన్) తినడం వల్ల, సిగరెట్ త్రాగటం వల్ల ఉపవాసం భంగమవుతుంది. వాంతి తనంతట తానే వస్తే ఉపవాసం భంగమవదు.
اَلْفَصْلُ الْأَوَّلُ మొదటి విభాగం
1999 – [ 1 ] ( صحيح ) (1/623)
وَعَنْ أَبِيْ هُرَيْرَةَ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَنْ لَمْ يَدَعْ قَوْلَ الزُّوْرِ وَالْعَمَلَ بِهِ فَلَيْسَ لِلّهِ حَاجَةٌ فِيْ أَنْ يَّدَعَ طَعَامَهُ وَشَرَابَهُ”. رَوَاهُ الْبُخَارِيُّ .
1999. (1) [1/623–దృఢం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”అసత్యం అధర్మ కార్యాలను వదలకుంటే, అన్న పానీయాలు వదలివేయటం అల్లాహ్‌కు ఏమాత్రం ఇష్టంలేదు. [17] (బు’ఖారీ)
2000 – [ 2 ] ( متفق عليه ) (1/623)
وَعَنْ عَائِشَةَ رَضِيَ اللهُ عَنْهَا قَالَتْ: كَانَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم يُقَبِّلُ وَيُبَاشِرُ وَهُوَ صَائِمٌ وَكَانَ أَمْلَكَكُمْ لِأَرَبِهِ.
2000. (2) [1/623–ఏకీభవితం]
‘ఆయి’షహ్ (ర) కథనం: ప్రవక్త (స) ఉపవాస స్థితిలో ముద్దుపెట్టుకునేవారు. తనపై నియంత్రణా శక్తి కలిగి ఉండే వారు. [18] (బు’ఖారీ, ముస్లిమ్)
2001 – [ 3 ] ( متفق عليه ) (1/623)
وَعَنْ عَائِشَةَ رَضِيَ اللهُ عَنْهَا قَالَتْ: كَانَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم يُدْرِكُهُ الْفَجْرُ فِيْ رَمَضَانَ وَهُوَ جُنُبٌ مِنْ غَيْرِحُلْمٍ فَيَغْتَسِلُ وَيَصُوْمُ .
2001. (3) [1/623–ఏకీభవితం]
‘ఆయి’షహ్ (ర) కథనం: ”ఒక్కోసారి దైవ ప్రవక్త (స) స’హ్రీకి లేచేటప్పుడు అశుద్ధావస్థలో ఉండేవారు. అయితే వీర్యస్ఖలనం వలన కాక సంభోగం వల్ల. అయితే ఉషోదయ కాలంలో స్నానం చేసి ఉపవాసం కొనసాగించే వారు.” [19] (బు’ఖారీ, ముస్లిమ్)
2002 – [ 4 ] ( متفق عليه ) (1/623)
وَعَنِ ابْنِ عَبَّاسٍ قَالَ: إِنَّ النَّبِيَّ صلى الله عليه وسلم احْتَجَمَ وَهُوَ مُحْرِمٌ وَاحْتَجَمَ وَهُوَ صَائِمٌ.
2002. (4) [1/623–ఏకీభవితం]
ఇబ్నె ‘అబ్బాస్ (ర) కథనం: ప్రవక్త ‘హజ్జ్ ఇ’హ్రామ్ స్థితిలో, ఉపవాస స్థితిలోనూ కొమ్ము (హిజామహ్) చేయించుకునే వారు. [20] (బు’ఖారీ, ముస్లిమ్)
2003 – [ 5 ] ( متفق عليه ) (1/623)
وَعَنْ أَبِيْ هُرَيْرَةَ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَنْ نَسِيَ وَهُوَ صَائِمٌ فَأَكَلَ أَوْ شَرِبَ فَلْيُتِمَّ صَوْمَهُ فَإِنَّمَا أَطْعَمَهُ اللهُ وَسَقَاهُ”.
2003. (5) [1/623–ఏకీభవితం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఒకవేళ ఎవరైనా మరచి తిన్నా, త్రాగినా తన ఉపవా సాన్ని పూర్తి చేసుకోవాలి. ఎందుకంటే అల్లాహ్ (త) అతనికి తినిపించాడు, త్రాపించాడు.” [21] (బు’ఖారీ, ముస్లిమ్)
2004 – [ 6 ] ( متفق عليه ) (1/623)
وَعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: بَيْنَمَا نَحْنُ جُلُوْسٌ عِنْدَ النَّبِيِّ صلى الله عليه و سلم إِذْ جَاءَهُ رَجُلٌ فَقَالَ: يَا رَسُوْلَ اللهِ هَلَكْتُ.قَالَ: “مَالَكَ؟ “قَالَ: وَقَعْتُ عَلَى امْرَأَتِيْ وَأَنَا صَائِمٌ. فَقَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “هَلْ تَجِدُ رَقَبَةً تُعْتِقُهَا؟ “ قَالَ: لَا قَال: “فَهَلْ تَسْتَطِيْعُ أَنْ تَصُوْمُ شَهْرَيْنِ مُتَتَابِعَيْنِ؟” قَالَ: لَا. قَالَ: “هَلْ تَجِدُ إِطْعَامَ سِتِّيْنَ مِسْكِيْنًا؟” قَالَ: لَا. قَالَ: “اِجْلِسْ” وَمَكَثَ النَّبِيُّ صلى الله عليه وسلم فَبَيْنَا نَحْنُ عَلَى ذَلِكَ أُتِيَ النَّبِيُّ صلى الله عليه وسلم بِعَرَقٍ فِيْهِ تَمْرٌوَالْعَرَقٌ الْمِكْتَلُ الضَّخْمُ قَالَ: “أَيْنَ السَّائِلُ؟” قَالَ: أَنَا. قَالَ: “خُذْ هَذَا فَتَصَدَّقْ بِهِ”. فَقَالَ الرَّجُلُ: أَعَلى أَفْقَرَ مِنِّيْ يَا رَسُوْلَ اللهِ؟ فَوَاللهِ مَا بَيْنَ لَابَتَيْهَا يُرِيْدُ ا لْحَرَّتَيْنِ أَهْلُ بَيْتٍ أَفْقَرَ مِنْ أَهْلِ بَيْتِيْ. فَضَحِكَ النَّبِيُّ صلى الله عليه وسلم حَتَّى بَدَتْ أَنْيَابُهُ ثُمَّ قَالَ: “أَطْعِمُهُ أَهْلَكَ”.
2004. (6) [1/623–ఏకీభవితం]
అబూ హురైరహ్ (ర) కథనం: మేము ప్రవక్త (స) వద్ద కూర్చొని ఉన్నాము. ఇంతలో ఒక వ్యక్తి వచ్చి, ‘ఓ అల్లాహ్ ప్రవక్తా! ‘నేను నాశనం అయిపోయాను,’ అని విన్నవించుకున్నాడు. ప్రవక్త (స), ‘ఏమయింది,’ అని అడిగారు. దానికి ఆ వ్యక్తి, ‘ఉపవాస స్థితిలో నేను నా భార్యతో సంభోగం చేసాను,’ అని అన్నాడు. ప్రవక్త (స), ‘దాని పరిహారం చెల్లించు, అంటే నువ్వు బానిసను విడుదల చేయగలిగితే ఒక బానిసను విడుదలచేయి,’ అని అన్నారు. ఆ వ్యక్తి, ‘నాకు బానిసను విడుదల చేసే శక్తి లేదు,’ అని అన్నాడు. ప్రవక్త (స), ‘నువ్వు రెండు నెలలు నిరంతరం ఉపవాసాలు ఉండగలవా?’ అని ప్రశ్నించారు. దానికి ఆ వ్యక్తి, ‘లేదు,’ అని సమాధానం ఇచ్చాడు. ప్రవక్త (స), ‘నువ్వు 60 మంది పేదలకు అన్నం పెట్టగలవా?’ అని ప్రశ్నించారు. ఆ వ్యక్తి, ‘లేదు,’ అని సమాధానం ఇచ్చాడు. ప్రవక్త (స), ‘నువ్వు కూర్చో’ అని అన్నారు. ప్రవక్త (స) వేచి ఉన్నారు. ఇంతలో ప్రవక్త (స) వద్దకు ఖర్జూరాలతో నిండిన ఒక సంచి తీసుకురావడం జరిగింది. ప్రవక్త (స), ‘ఆ వ్యక్తి ఎక్కడ,’ అని అడిగారు. ఆ వ్యక్తి, ‘నేను ఇక్కడే ఉన్నాను,’ అని అన్నాడు. ప్రవక్త (స), ‘ఈ ఖర్జూరాలను తీసుకో, పేదలకు ‘సదఖహ్ చేయి,’ అని, ఆ వ్యక్తితో అన్నారు. దానికి ఆ వ్యక్తి, ‘నాకన్నా పేదవాళ్ళైవరైనా ఉన్నారా? నేను ‘సదఖహ్ చేయడానికి, అల్లాహ్ సాక్షి! మదీనహ్ లో అన్ని వైపులా నాకంటే పేద కుటుంబం లేదు,’ అని అన్నాడు. అతని ఈ మాటల వల్ల ప్రవక్త (స) పక్కున నవ్వారు. ఆయన పళ్ళు కనబడ్డాయి. ప్రవక్త (స) అతనితో, ”నీవు, నీ భార్యా బిడ్డలకు ఈ ఖర్జూరాలు తినిపించు” అని అన్నారు. [22] (బు’ఖారీ, ముస్లిమ్)
—–
اَلْفَصْلُ الثَّانِيْ రెండవ విభాగం
2005 – [ 7 ] ( ضعيف ) (1/624)
عَنْ عَائِشَةَ: أَنَّ االنَّبِيَّ صلى الله عليه وسلم: كَانَ يُقَبِّلُهَا وَهُوَ صَائِمٌ وَيَمَصُّ لِسَانَهَا. رَوَاهُ أَبُوْ دَاوُدَ.
2005. (7) [1/624–బలహీనం]
‘ఆయి’షహ్ (ర) కథనం: ప్రవక్త (స) ఉపవాసస్థితిలో ఆమెను ముద్దుపెట్టుకునే వారు, ఆమె నాలుకను చప్పరించే వారు. [23] (అబూ దావూద్)
2006 – [ 8 ] ( ضعيف ) (1/624)
وَعَنْ أَبِيْ هُرَيْرَةَ أَنَّ رَجُلًا سَأَلَ النَّبِيَّ صلى الله عليه وسلم عَنِ الْمُبَاشِرَةِ لِلصَّائِمِ فَرَخَّصَ لَهُ. وَأَتَاهُ آخَرُ فَسَأَلَهُ فَنَهَاهُ فَإِذَا الَّذِيْ رَخَّصَ لَهُ شَيْخٌ وَإِذَا الَّذِيْ نَهَاهُ شَابٌّ. رَوَاهُ أَبُوْ دَاوُدَ.
2006. (8) [1/624–బలహీనం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స)ను ఉపవాస స్థితిలో భార్య ప్రక్కన పండుకోవటాన్ని గురించి ఒక వ్యక్తి విన్నవించుకున్నాడు, ప్రవక్త (స) అతనికి అనుమతి ఇచ్చారు. మరో వ్యక్తి కూడా దాన్ని గురించే ప్రశ్నించాడు. అయితే ప్రవక్త (స) వారించారు. ప్రవక్త (స) అనుమతి ఇచ్చిన వాడు ముసలివాడు. ప్రవక్త (స) వారించినవాడు యువకుడు. [24] (అబూ దావూద్)
2007 – [ 9 ] ( لم تتم دراسته ) (1/624)
وَعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: قَالَ رَسُوْلُ الله صلى الله عليه وسلم: “مَنْ ذَرَعَهُ الْقَيْءُ وَهُوَ صَائِمٌ فَلَيْسَ عَلَيْهِ قَضَاءٌ وَمَنِ اسْتَقَاءَ عَمْدًا فَلْيَقْضِ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَأَبُوْ دَاوُدَ وَابْنُ مَاجَهُ وَالدَّارَمِيُّ
وَقَالَ التِّرْمِذِيُّ: هَذَا حَدِيْثٌ غَرِيْبٌ لَا نَعْرِفُهُ إِلَّا مِنْ حَدِيْثِ عِيْسَى بْنِ يُوْنُسَ. وَقَالَ مُحَمَّدٌ يَعْنِي الْبُخَارِيُّ لَا أَرَاهُ مَحْفُوْظًا.
2007. (9) [1/624–అపరిశోధితం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఒకవేళ ఎవరికైనా ఉపవాస స్థితిలో వాంతి తనంతట తానే వస్తే, మరోసారి ఉపవాసం ఉండనక్కర లేదు. అయితే ఉద్దేశపూర్వకంగా వాంతిచేస్తే, దానికి బదులు మరో ఉపవాసం ఉండాలి. (అబూ దావూద్, ఇబ్నె మాజ, దారమి, తిర్మిజీ / ఏకోల్లేఖనం)
2008 – [ 10 ] ( لم تتم دراسته ) (1/625)
وَعَنْ مَعْدَانَ بْنِ طَلْحَةَ أَنَّ أَبَا الدَّرْدَاءِ حَدَّثَهُ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم قَاءَ فَأَفْطَرَ. قَالَ: فَلَقِيْتُ ثَوْبَانَ فِيْ مَسْجِدِ دِمْشِقَ فَقُلْتُ: إِنَّ أَبَا الدَّرْدَاءَ حَدَّثَنِيْ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم قَاءَ فَأَفْطَرَ. قَالَ: صَدَقَ وَأَنَا صَبَبْتُ لَهُ وَضُوْءَهُ. رَوَاهُ أَبُوْ دَاوُدَ وَالتِّرْمِذِيُّ وَالدَّارَمِيُّ .
2008. (10) [1/625–అపరిశోధితం]
మ’అదాన్ బిన్ ‘తల్’హహ్ (ర) కథనం: ఆయనతో అబూ దర్దా ఇలా అన్నారు, ”ప్రవక్త (స) వాంతి చేసి ఉపవాసం భంగపరిచారు. మ’అదాన్ ఇలా అన్నారు, ”నేను సౌ’బాన్ను దిమిష్క్ మస్జిద్లో కలిసాను, నేను ఆయనతో అబూ దర్దా నాతో ప్రవక్త (స) వాంతిచేసి ఉపవాసం భంగపరిచారని చెప్పాను. దానికి సౌ’బాన్, ‘అబూ దర్దా సత్యం పలికాడు, నేను ప్రవక్త (స)కు వు’జూ నీళ్ళు పోసాను,’ అని అన్నారు. [25] (అబూ దావూద్, తిర్మిజి’, దారమి)
2009 – [ 11 ] ( ضعيف ) (1/625)
وَعَنْ عَامِرِ بْنِ رَبِيْعَةَ قَالَ: رَأَيْتُ النَّبِيَّ صلى الله عليه وسلم مَا لَا أُحْصِيْ يَتَسَوَّكُ وَهُوَ صَائِمٌ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَأَبُوْ دَاوُدَ.
2009. (11) [1/625–బలహీనం]
‘ఆమిర్ బిన్ రబీ’అహ్(ర) కథనం: ఉపవాస స్థితిలో ప్రవక్త (స) ఎన్నిసార్లు మిస్వాక్ చేసారంటే నేను లెక్క పెట్ట లేక పోయాను. [26] (తిర్మిజి’, అబూ దావూద్)
2010 – [ 12 ] ( لم تتم دراسته ) (1/625)
وَعَنْ أَنَسٍ قَالَ: جَاءَ رَجُلٌ إِلَى النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ: “اشْتَكَيْتُ عَيْنِيْ أَفَأَكْتَحِلُ وَأَنَا صَائِمٌ؟ قَالَ: “نَعَمْ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَقَالَ: لَيْسَ إِسْنَادُهُ بِالْقَوِيّ وَأَبُوْ عَاتِكَةَ الرَّاوِيْ يُضَعَّفُ.
2010. (12) [1/625–అపరిశోధితం]
అనస్ (ర) కథనం: ఒక వ్యక్తి ప్రవక్త (స) వద్దకు వచ్చి, ‘నా కళ్ళల్లో నొప్పిగా ఉంది, నేను ఉపవాస స్థితిలో కాటుక పెట్టుకోవచ్చా?’ అని ప్రశ్నించాడు. ప్రవక్త (స), ‘అవును,’ అని అన్నారు. [27] (తిర్మిజి’ / ఈ ‘హదీసు’ పరంపర బలంగా లేదు. అబూ ‘ఆతిఖహ్ బలహీన కథకుడు).
2011 – [ 13 ] ( صحيح ) (1/625)
وَعَنْ بَعْضِ أَصْحَابِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ: لَقَدْ رَأَيْتُ النَّبِيَّ صلى الله عليه وسلم بِالْعَرْجِ يُصُبُّ عَلَى رَأْسِهِ الْمَاءُ وَهُوَ صَائِمٌ مِنَ الْعَطَشِ أَوْ مِنَ الْحَرِّ. رَوَاهُ مَالِكٌ أبو داؤد.
2011. (13) [1/625–దృఢం]
కొందరు ప్రవక్త సహచరుల కథనం: ప్రవక్త (స) ‘అర్జ్ ప్రాంతంలో ఉపవాసస్థితిలో తలపై నీళ్ళుపోసు కున్నారు. దాహంవల్లనో లేదా వేడివల్లనో. [28] (మాలిక్, అబూ దావూద్)
2012 – [ 14 ] ( صحيح ) (1/625)
وَعَنْ شَدَّادِ بْنِ أَوْسٍ: أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم أَتَى رَجُلًا بِالْبَقِيْعِ وَهُوَ يَحْتَجِمُ وَهُوَ آخِذٌ بِيَدِيْ لِثَمَانِيَ عَشَرَةَ خَلَتْ مِنْ رَمَضَانَ فَقَالَ: “أَفْطَرَ الْحَاجِمُ وَالْمَحْجُوْمُ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ وَابْنُ مَاجَهُ وَالدَّارَمِيُّ.
قَالَ الشَّيْخُ الْإِمَامُ مُحْيِيُ السُّنَّةِ رَحمةُ اللهِ عَلَيْهِ: وَتَأَوَّلَهُ بَعْضُ مَنْ رَخَّصَ فِيْ الْحَجَامَةِ: أَيْ تَعَرّضَا لِلْإِفْطَارِ: الْمَحْجُوْمُ لِلضُّعْفِ وَالْحَاجِمُ لِأَنَّهُ لَا يَأْمَنُ مِنْ أَنْ يَّصِلَ شَيْءٌ إِلَى جَوْفِهِ بِمَصِّ الْمَلَازِمِ .
2012. (14) [1/625–దృఢం]
షద్దాద్ బిన్ ఔస్ (ర) కథనం: ప్రవక్త (స) బఖీ’అ ప్రాంతంలో ఒక వ్యక్తి వద్దకు వచ్చారు. ఆ వ్యక్తి కొమ్ము చేస్తున్నాడు. అప్పుడు ప్రవక్త (స) నా చేయి పట్టు కొని ఉన్నారు. ఆ రోజు రమ’దాన్ 18వ తేదీ. ఆ కొమ్ముచికిత్సను చూచి ప్రవక్త (స), ‘కొమ్ముచికిత్స చేసేవాడు, చేయించుకునే వాడు ఇద్దరి ఉపవాసం భంగమయింది’, అని అన్నారు. (అబూ దావూద్, ఇబ్నె మాజహ్, దారమి)
ఇమామ్ ము’హ్ యి సున్నహ్, అభిప్రాయం, ”కొందరు ఈ ‘హదీసు’ భావాన్ని ఎలా చెప్పారంటే కొమ్ము చికిత్సవల్ల రోగి బలహీనతకు గురవుతాడు. ఫలితంగా ఉపవాసం భంగపరచవచ్చు. అయితే కొమ్ముచికిత్స చేసేవాడి ఉపవాసం ఎందుకు భంగమవుతుందంటే రోగి రక్తం పీల్చినప్పుడు కొంత రక్తం నోటిలోనికి వెళ్ళే అవకాశం ఉంది. ఈ రెండు విషయాలు లేకపోతే ఉపవాసం భంగంకాదు. మరి కొందరు ఈ ఆదేశం రద్దయింది అని అభిప్రాయ పడ్డారు. ఎందుకంటే బు’ఖారీ, ముస్లిమ్లలో మొదటి ‘హదీసు’ ఇలా వచ్చింది: ”ప్రవక్త (స) ఉపవాస స్థితిలో కొమ్ముచికిత్స చేయించుకున్నారు. అందువల్ల ధార్మిక పండితులు శస్త్రచికిత్స చేస్తే ఉపవాసం భంగం కాదని తీర్మానించారు. నిజం అల్లాహ్ కు తెలుసు.
2013 – [ 15 ] ( ضعيف ) (1/626)
وَعَنْ أَبِيْ هُرَيْرَةَ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَنْ أَفْطَرَ يَوْمًا مِّنْ رَمَضَانَ مِنْ غَيْرِ رُخْصَةٍ وَّلَا مَرْضٍ لَّمْ يَقْضِ عَنْهُ صَوْمُ الدَّهْرِ كُلِّهِ وَإِنْ صَامَهُ”. رَوَاهُ أَحْمَدُ وَالتِّرْمِذِيُّ وَأَبُوْ دَاوُدَ وَابْنُ مَاجَهُ وَالدَّارَمِيُّ وَالْبُخَارِيُّ فِيْ تَرْجَمَةِ بَابٍ. وَقَالَ التِّرْمِذِيُّ: سَمِعْتُ مُحَمَّدًا يَعْنِي الْبُخَارِيَّ يَقُوْلُ. أَبُوْ الْمُطَوِّسِ الرَّاوِيْ لَا أَعْرِفُ لَهُ غَيْرَ هَذَا الْحَدِيْثِ.
2013. (15) [1/626–బలహీనం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఎవరైనా రమ’దాన్ ఉపవాసాన్ని అకారణంగా, ఎటువంటి వ్యాధి లేకుండా భంగపరచి, దానికి బదులుగా జీవితాంతం ఉపవాసాలు ఉన్నా, దాని లోపాన్ని పూర్తిచేయలేడు. [29] (అ’హ్మద్, తిర్మిజి’ / ఏకోల్లేఖనం, ఇబ్నె మాజహ్, దారమి, బు’ఖారీ)
2014 – [ 16 ] ( صحيح ) (1/626)
وَعَنْ أَبِيْ هُرَيْرَةَ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “كَمْ مِنْ صَائِمٍ لَيْسَ لَهُ مِنْ صِيَامِهِ إِلَّا الظَّمأُ وَكَمْ مِنْ قَائِمٍ لَيْسَ لَهُ مِنْ قِيَامِهِ إِلَّا السَّهْرُ”. رَوَاهُ الدَّارَمِيُّ.
2014. (16) [1/626–దృఢం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”చాలామంది ఉపవాసకులు ఎలా ఉంటారంటే వారు ఆకలి-దప్పులతో ఉండటం తప్ప ఉపవాస పుణ్యం ఏమీ లభించదు. ఇంకా చాలా మంది జాగరణ చేసేవారు, తహజ్జుద్ చదివేవారు ఎలా ఉంటారంటే, వారు రాత్రి జాగరణ చేయడం తప్ప వారి ఆరాధనకు ఎలాంటి పుణ్యం లభించదు.[30] (దారమి)
—–
اَلْفَصْلُ الثَّالِثُ మూడవ విభాగం
2015 – [ 17 ] ( لم تتم دراسته ) (1/626)
عَنْ أَبِيْ سَعِيْدٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “ثَلَاثٌ لَّا يُفطِّرْنَ الصَّائِمَ الْحِجَامَةُ وَالْقَيْءُ وَالْاِحْتِلَامُ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَقَالَ: هَذَا حَدِيْثٌ غَيْرُ مَحْفُوْظٍ وَعَبْدُ الرَّحْمنِ بْنِ زَيْدٍ الرَّاوِيْ يُضَعَّفُ فِيْ الْحَدِيْثِ.
2015. (17) [1/626–అపరిశోధితం]
అబూ స’యీద్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, మూడు విషయాలు ఉపవాసకుని ఉపవాసాన్ని భంగపరచ లేవు: 1. కొమ్ము చికిత్స, 2. వాంతి రావడం, 3. వీర్య స్ఖలనము. (తిర్మిజి’)
ఈ ‘హదీసు’ను తిర్మిజి’ అసురక్షితమైనదని, ఎందుకంటే వ్యాఖ్యానకర్త ‘అబ్దుర్ర’హ్మాన్ బిన్ ‘జైద్ బలహీనుడని పేర్కొన్నారు.
2016 – [ 18 ] ( صحيح ) (1/627)
وَعَنْ ثَابِتٍ الْبُنَانِيِّ قَالَ: سُئِلَ أَنَسُ بْنُ مَالِكٍ: كُنْتُمْ تَكْرَهُوْنَ الْحِجَامَةَ لِلصَّائِمِ عَلَى عَهْدِ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم؟ قَالَ: لَا. إِلَّا مِنْ أَجْلِ الضُّعْفِ. رَوَاهُ الْبُخَارِيُّ.
2016. (18) [1/626–దృఢం]
సా’బిత్ బునాని (ర) కథనం: అనస్ బిన్ మాలిక్‌ను, ”మీరు ప్రవక్త (స) కాలంలో ఉపవాస స్థితిలో కొమ్ము చికిత్సను అసహ్యించుకునేవారా?” అని ప్రశ్నించడం జరిగింది. దానికి అతను, ”లేదు కేవలం బలహీనత కారణంగా మేము దాన్ని మంచిదికాదని భావించే వాళ్ళం,” అని అన్నారు. (బు’ఖారీ)
2017 – [ 19 ] ( لم تتم دراسته ) (1/627)
وَعَنِ الْبُخَارِيِّ تَعْلِيْقًا قَالَ: كَانَ ابْنُ عُمَرَ يَحْتَجِمُ وَهُوَ صَائِمٌ ثُمَّ تَرَكَهُ. فَكَانَ يَحْتَجِمُ بِاللَّيْلِ.
2017. (19) [1/627–అపరిశోధితం]
బు’ఖారీ (రహ్మ్) ఉల్లేఖనం (త’అలీఖన్): ‘అబ్దు ల్లాహ్ బిన్ ‘ఉమర్ ఉపవాసస్థితిలో కొమ్ము చేయించు కునే వారు. ఆ తరువాత అతను ఉపవాస స్థితిలో కొమ్ము (‘హిజామహ్) చేయించుకోవడం మానేసారు. రాత్రిపూట కొమ్ము చేయించుకునే వారు. (బు‘ఖారీ)
2018 – [ 20 ] ( لم تتم دراسته ) (1/627)
وَعَنْ عَطَاءٍ قَالَ: إِنْ مَضْمَضَ ثُمَّ أَفْرَغَ مَا فِيْ فِيْهِ مِنَ الْمَاءِ لَا يَضِيْرُهُ أَنْ يَّزْدَرِدَ رِيْقَهُ وَمَا بَقِيَ فِيْ فِيْهِ وَلَا يَمْضَغُ الْعِلْكَ فَإِنِ ازْدَرَدَ رِيْقَ الْعِلْكِ لَا أَقُوْلُ: إِنَّهُ يُفْطِرُ وَلَكِنْ يُّنْهَى عَنْهُ. رَوَاهُ الْبُخَارِيُّ فِيْ تَرْجَمَةِ بَابِ.
2018. (20) [1/627–అపరిశోధితం]
‘అ’తా’ (ర) కథనం: ఉపవాసస్థితిలో ఎవరైనా నీళ్ళు పుక్కిలించి నీటినంతా బయటకు తీసి ఉమ్మితే, మిగిలిన నీటిని మ్రింగడంలో ఎలాంటి అభ్యంతరం లేదు. ఉపవాస స్థితిలో నములుతూ ఉండకూడదు, ఒకవేళ ఉపవాస స్థితిలో ఉమ్ము మ్రింగితే అతని ఉపవాసం భంగమయిందని నేను చెప్పలేను. అయితే అలా చేయకూడదు. (బు’ఖారీ)
=====
4– بَابُ صَوْمِ الْمُسَافِرِ
4. ప్రయాణికుని ఉపవాసం
అల్లాహ్ (త) ప్రయాణీకులకు సౌకర్యం కలిగించాడు. ప్రయాణంలో నాలుగు రకా’తుల నమా’జు రెండు రకా’తులు చదవాలి. ఒకవేళ కష్టంగా ఉంటే ప్రయాణంలో ఉపవాసం ఉండరాదు. ప్రయాణం నుండి తిరిగి వచ్చిన తర్వాత తప్పిన ఉపవాసాలను పూర్తి చేయాలి. ఖుర్ఆన్ ‘హదీసు’లలో దీన్ని గురించి వివరంగా ఉంది. సూరహ్ బఖరహ్ (2)లో ప్రయాణికుల, వ్యాధిగ్రస్తుల ఉపవాసం గురించి ఆదేశించడం జరిగింది:
”ఓ విశ్వాసులారా! ఉపవాసం మీకు విధిగా నిర్ణయించబడింది — ఏవిధంగానైతే మీ పూర్వీకులకు విధిగా నిర్ణయించబడి ఉండెనో — బహుశా మీరు దైవభీతిపరులై ఉంటారని! ఇది (ఈ ఉపవాసం) నిర్ణయించబడిన రోజులకు మాత్రమే. కానీ, మీలో ఎవరైనా వ్యాధిగ్రస్తులై ఉంటే, లేక ప్రయాణంలో ఉంటే, వేరే దినాలలో (ఆ ఉపవాసాలు) పూర్తిచేయాలి. కాని దానిని పూర్తిచేయటం దుర్భరమైన వారు పరిహారంగా ఒక పేదవానికి భోజనం పెట్టాలి. కాని ఎవరైనా సహృదయంతో ఇంకా ఎక్కువ మేలు చేయదలిస్తే, అది అతని మేలుకే! కాని మీరు తెలుసుకో గలిగితే, ఉపవాసం ఉండటమే, మీకు ఎంతో ఉత్తమమైనది.” (సూ. అల్-బఖరహ్, 2:183-184).
‘హదీసు’ల్లో ప్రయాణీకులు ఎటువంటి ఆటంకం లేకపోతే ఉపవాసం ఉండవచ్చును. దీన్ని గురించి ముందుంది.
اَلْفَصْلُ الْأَوَّلُ మొదటి విభాగం
2019 – [ 1 ] ( متفق عليه ) (1/628)
وَعَنْ عَائِشَةَ رَضِيَ اللهُ عَنْهَا قَالَتْ: إِنَّ حَمْزَةَ بْنَ عَمْرٍو الْأَسْلَمِيِّ قَالَ لِلنَّبِيِّ صلى الله عليه وسلم أَصُوْمُ فِيْ السَّفَرِ، وَكَانَ كَثِيْرَ الصِّيَامِ. فَقَالَ: “إِنْ شِئْتَ فَصُمْ وَإِنْ شِئْتَ فَأَفْطِرْ”.
2019. (1) [1/628–ఏకీభవితం]
‘ఆయి’షహ్ (ర) కథనం: ‘హమ్’జహ్ బిన్ ‘అమ్ర్ అస్లమీ ప్రవక్త (స) తో, ‘నేను చాలా ఎక్కువగా ఉపవాసాలు ఉంటాను, మరి ప్రయాణంలో కూడా ఉపవాసం ఉండవచ్చునా?’ అని విన్నవించు కున్నాడు. అప్పుడు ప్రవక్త (స) నీకు ఇష్టం అయితే ఉండవచ్చు, లేకుంటే ఉండకపోవచ్చు, అంటే ఉండ వద్దు. [31] (బు’ఖారీ, ముస్లిం)
2020 – [ 2 ] ( صحيح ) (1/628)
وَعَنْ أَبِيْ سَعِيْدِ الْخُدْرِيِّ قَالَ: غَزَوْنَا مَعَ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم لِسِتَّ عَشَرَةَ مَضَتْ مِنْ شَهْرِ رَمَضَانَ فَمِنَّا مَنْ صَامَ وَمِنَّا مَنْ أَفْطَرَ فَلَمْ يَعِبِ الصَّائِمُ عَلَى الْمُفْطِرُ وَلَا الْمُفْطِرُ عَلَى الصَّائِمِ. رَوَاهُ مُسْلِمٌ.
2020. (2) [1/628–దృఢం]
అబూ స’యీద్ ‘ఖుద్రీ (ర) కథనం: మేము రమ’దాన్ 16వతేదీన ప్రవక్త(స) వెంట జిహాద్ కోసం బయలు దేరాము. మాలో కొందరు ఉపవాసంతో ఉన్నారు. మరికొందరు ఉపవాసంతో లేరు. ఉపవాసంతో ఉన్నవారు లేని వారిని విమర్శించ లేదు. ఉపవాసం లేనివారు ఉన్న వారినీ విమర్శించ లేదు. [32] (ముస్లిమ్)
2021 – [ 3 ] ( متفق عليه ) (1/628)
وَعَنْ جَابِرٍ قَالَ: كَانَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم فِيْ سَفَرٍ فَرَأَى زِحَامًا وَرَجُلًا قَدْ ظُلِلَ عَلَيْهِ فَقَالَ: “مَا هَذَا؟” قَالُوْا: صَائِمٌ. فَقَالَ: ” لَيْسَ مِنَ الْبِرِّ الصَّوْمُ فِيْ السَّفَرِ”.
2021. (3) [1/628–ఏకీభవితం]
జాబిర్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రయాణంలో కొంత మందిని ఒకచోట గుమిగూడి ఉండటం చూసారు. వారు ఒక వ్యక్తికి నీడ పడుతున్నారు. ‘ఏమయిందని’ ప్రవక్త (స) అడిగారు. దానికి అక్కడున్నవారు’ఫలానా వ్యక్తి ఉపవాసంతో ఉన్నాడు.’ అప్పుడు ప్రవక్త (స), ‘ప్రయాణంలో ఉపవాసంతో ఉండడం మంచిపని కాదు,’ అని అన్నారు. [33] (బు’ఖారీ, ముస్లిమ్)
2022 – [ 4 ] ( متفق عليه ) (1/628)
وَعَنْ أَنَسٍ قَالَ: كُنَّا مَعَ النَّبِيِّ صلى الله عليه وسلم فِيْ السَّفَرِ فَمِنَّا الصَّائِمِ وَمِنَّا الْمُفْطِرُ فَنَزَلْنَا مَنْزِلًا فِيْ يَوْمٍ حَارٍّ فَسَقَطَ الصَّوَّامُوْنَ وَقَامَ الْمُفْطِرُوْنَ فَضَرَبُوْا الْأَبْنِيَةَ وَسَقَوُا الرِّكَابَ. فَقَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “ذَهَبَ الْمُفْطِرُوْنَ الْيَوْمَ بِالْأَجْرِ”.
2022. (4) [1/628–ఏకీభవితం]
అనస్ (ర) కథనం: మేము ప్రయాణంలో ప్రవక్త (స) వెంట ఉన్నాము, మాలో కొందరు ఉపవాసంతో ఉన్నారు. కొందరు ఉపవాసంతో లేరు. మేము వేసవి కాలంలో ఒకచోట దిగాము. ఉపవాసంతో ఉన్నవారు బలహీనత వల్ల మేనువాల్చారు. ఉపవాసం లేని వారు నిలబడి ఉన్నారు. టెంట్ వేసి గుర్రాలకు నీళ్ళు త్రాపించారు. ఇది చూసి ప్రవక్త (స), ‘ఈ రోజు ఉపవాసం లేనివారు పుణ్యం దోచుకున్నారు,’ అని అన్నారు. [34] (బు’ఖారీ, ముస్లిమ్)
2023 – [ 5 ] ( متفق عليه ) (1/629)
وَعَنِ ابْنِ عَبَّاسٍ قَالَ: خَرَجَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم مِنَ الْمَدِيْنَةِ إِلَى مَكَّةَ فَصَامَ حَتّى بَلَغَ عُسْفَانَ ثُمَّ دَعَا بِمَاءٍ فَرَفَعَهُ إِلَى يَدِهِ لِيَرَاهُ النَّاسُ فَأَفْطَرَ حَتَّى قَدِمَ مَكَّةَ. وَذَلِكَ فِيْ رَمَضَانَ. فَكَانَ ابْنُ عَبّاسٍ يَقُوْلُ: قَدْ صَامَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم وَأَفْطَرَ. فَمَنْ شَاءَ صَامَ وَمَنْ شَاءَ أَفْطَرَ”.
2023. (5) [1/629–ఏకీభవితం]
ఇబ్నె ‘అబ్బాస్ (ర) కథనం: ప్రవక్త (స) మదీనహ్ నుండి మక్కహ్ కు బయలుదేరారు. అయితే ప్రవక్త (స) ‘అస్ఫాన్ అనే ప్రాంతంవరకు ఉపవాసం పాటించారు. అక్కడ నీళ్ళు తెప్పించి చేతిలోకి తీసు కున్నారు. ప్రజలు చూడటానికి చేతిని పైకిఎత్తారు, ఉపవాసం భంగంచేసారు. చివరికి ప్రవక్త (స) మక్కహ్ కు చేరుకున్నారు. ఇలా రమ’దాన్లో చేసారు. అందు వల్ల ఇబ్నె అబ్బాస్, ”ప్రవక్త (స) ప్రయాణంలో ఉపవాసం పాటించారు ఉపవాసం విరమించారు. కనుక ఉపవాసం ఉండాలనుకున్న వారు ఉండవచ్చును. లేదా ఉండకపోవచ్చును,” అని అన్నారు. (బు’ఖారీ, ముస్లిమ్)
2024 – [ 6 ] ( صحيح ) (1/629)
وَفِيْ رِوَايَةٍ لِّمُسْلِمٍ عَنْ جَابِرٍ رَضِيَ اللهُ عَنْهُ أَنَّهُ شَرِبَ بَعْدَ الْعَصْرِ.
2024. (6) [1/629–దృఢం]
జాబిర్ (ర) కథనం: ముస్లిమ్ ఉల్లేఖనంలో ఇలా ఉంది, ”ప్రవక్త (స) ‘అస్ఫాన్ ప్రాంతంలో ‘అ’స్ర్ తర్వాత నీళ్ళు తెప్పించి ఉపవాసం భంగంచేసారు.[35]
—–
اَلْفَصْلُ الثَّانِيْ రెండవ విభాగం
2025 – [ 7 ] ( صحيح ) (1/629)
عَنْ أَنَس بْنِ مَالِكِ الْكَعْبِيِّ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِنَّ اللهَ وَضَعَ عَنِ الْمُسَافِرِ شَطْرَ الصَّلَاةِ وَالصَّوْمَ عَنِ الْمُسَافِرِ وَعَنِ الْمُرْضِعِ وَالْحُبْلَى”. رَوَاهُ أَبُوْ دَاوُدَ وَالتِّرْمِذِيُّ وَالنَّسَائِيُّ وَابْنُ مَاجَهُ.
2025. (7) [1/629–దృఢం]
అనస్ బిన్ మాలిక్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, అల్లాహ్ (త) ప్రయాణీకుని సగం నమా’జును క్షమించివేసాడు. మరియు ప్రయాణీకుల, పాలుపట్టే స్త్రీల, గర్భవతి స్త్రీల నుండి కూడా ఉపవాసాలను తొలగించడం జరిగింది. [36] (అబూ దావూద్, తిర్మిజి’, నసాయి’, ఇబ్నె మాజహ్)
2026 – [ 8 ] ( لم تتم دراسته ) (1/629)
وَعَنْ سَلَمَةَ بْنِ الْمُحَبِّقِ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَنْ كَانَ لَهُ حَمُوْلَةٌ تَأْوِيْ إِلَى شَبْعٍ فَلْيَصُمْ رَمَضَانَ مِنْ حَيْثُ أَدْرَكَهُ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ .
2026. (8) [1/629–అపరిశోధితం]
సలమహ్ బిన్ ము’హబ్బిఖ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”సుఖం, సౌకర్యాలు గల స్థలం వరకు చేరవేసే మంచి వాహనం ఉన్నవారు అక్కడ అన్న పానీయాల సౌకర్యం గలవారు రమ’దాన్ ఉపవాసాలు ఆచరించుకోవాలి. [37] (అబూ దావూద్)
—–
الْفَصْلُ الثَّالِثُ మూడవ విభాగం
2027 – [ 9 ] ( صحيح ) (1/630)
عَنْ جَابِرٍ: أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم خَرَجَ عَامَ الْفَتْحِ إِلَى مَكَّةَ فِيْ رَمَضَانَ فَصَامَ حَتَّى بَلَغَ كُرَاعَ الغَمِيْمِ فَصَامَ النَّاسُ ثُمَّ دَعَا بِقَدْحٍ مِّن مَّاءٍ فَرَفَعَهُ حَتَّى نَظَرَ النَّاسُ إِلَيْهِ ثُمَّ شَرِبَ. فَقِيْلَ لَهُ بَعْدَ ذَلِكَ إِنَّ بَعْضَ النَّاسِ قَدْ صَام. فَقَالَ: “أُولَئِكَ الْعُصَاةُ أُولَئِكَ الْعُصَاةُ”. رَوَاهُ مُسْلِمٌ.
2027. (9) [1/630–దృఢం]
జాబిర్ (ర) కథనం: ప్రవక్త (స) మక్కహ్ విజయం సంవత్సరం రమ’దాన్లో మక్కహ్ కు బయలు దేరారు. ప్రవక్త (స) ఉపవాసంతో ఉన్నారు. చివరికి కురా ఉల్ గమీమ్ ప్రాంతం వరకు చేరారు. ప్రజలు కూడా ఉపవాసంతో ఉన్నారు. ప్రవక్త (స) గ్లాసులో నీళ్ళు తెప్పించారు, దాన్ని తన చేత్తో ఎత్తారు. ప్రజలందరూ దాన్ని చూసుకున్నారు. ఆ తరువాత ప్రవక్త (స) ఆనీటిని త్రాగారు. ఆ తరువాత కొందరు ఇంకా ఉపవాసంతో ఉన్నారని తెలియజేయడం జరిగింది. అప్పుడు ప్రవక్త (స), ‘వారు పాపాత్ములు, వారు పాపాత్ములు,’ అని అన్నారు. [38] (ముస్లిమ్)
2028 – [ 10 ] ( لم تتم دراسته ) (1/630)
وَعَنْ عَبْدِ الرَّحْمنِ بْنِ عَوْفٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “صَائِمُ رَمَضَانَ فِيْ السَّفَرِ كَالْمُفْطِرِ فِيْ الْحَضَرِ”. رَوَاهُ ابْنُ مَاجَهُ.
2028. (10) [1/630–అపరిశోధితం]
‘అబ్దుర్ర’హ్మాన్ బిన్ ‘ఔఫ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ప్రయాణంలో రమ’దాన్ ఉపవాసం పాటిం చటం స్వస్థలంలో రమ’దాన్ ఉపవాసం ఉండకపోవటం వంటిది.” [39] (ఇబ్నె మాజహ్)
2029 – [ 11 ] ( صحيح ) (1/630)
وَعَنْ حَمْزَةَ بْنِ عَمْرٍو الْأَسْلَمِيّ أَنَّهُ قَالَ: يَا رَسُوْلَ اللهِ إِنِّيْ أَجِدُ بِيْ قُوَّةً عَلَى الصِّيَامِ فِيْ السَّفَرِ فَهَلْ عَلَيَّ جُنَاحٌ؟ قَالَ: “هِيَ رُخْصَةٌ مِّنَ اللهِ عَزَّ وَجَلَّ فَمَنْ أَخَذَ بِهَا فَحَسَنٌ وَمَنْ أَحَبَّ أَنْ يَّصُوْمُ فَلَا جُنَاحَ عَلَيْهِ”. رَوَاهُ مُسْلِمٌ.
2029. (11) [1/630–దృఢం]
‘హమ్’జహ్ బిన్ ‘అమ్ర్ అస్లమీ (ర) కథనం: ప్రవక్త (స)తో అతడు, ‘ఓ అల్లాహ్ ప్రవక్తా! నేను ప్రయాణంలో ఉపవాసం పాటించగలను. ఒకవేళ నేను ప్రయాణంలో ఉపవాసం ఉంటే పాపం అవుతుందా?’ అని విన్న వించు కున్నాడు. దానికి ప్రవక్త (స), ‘ప్రయాణంలో ఉపవాసం పాటించవద్దని అల్లాహ్ (త) అనుమతి ఇచ్చాడు. ఈ అనుమతిని వినియోగించిన వాడు మంచిచేస్తాడు. ఉపవాసం పాటించేవాడికి ఎటువంటి పాపం చుట్టుకోదు,’ అని అన్నారు. (ముస్లిమ్)
=====
5- بَابُ الْقَضَاءِ
5. తప్పిన ఉపవాసాలు పూర్తిచేసుకోవటం
అనారోగ్యం వల్ల, ప్రయాణం వల్ల, ముసలితనం వల్ల, పాలు పట్టడం వల్ల, గర్భధారణవల్ల రమ’దాన్ ఉపవాసాలు రమ’దాన్లో పాటించలేక పోయినచో ఈ కారణాలు తొలగి పోయిన పిదప రమ’దాన్ తర్వాత తప్పిన ఉపవాసాలు ఆచరించాలి. అల్లాహ్ ఆదేశం: ”… కానీ, మీలో ఎవరైనా వ్యాధిగ్రస్తులై ఉంటే, లేక ప్రయాణంలో ఉంటే, వేరే దినాలలో (ఆ ఉపవాసాలు) పూర్తిచేయాలి. కాని దానిని పూర్తిచేయటం దుర్భర మైన వారు పరిహారంగా, ఒక పేదవానికి భోజనం పెట్టాలి…” (సూ. అల్ బఖరహ్, 2:184)
గర్భవతులకు, పాలుపట్టే స్త్రీలకు ఉపవాసాలు పాటించడం కష్టంగా ఉంటే ఉపవాసాలు పాటించ కూడదు. ఆ దశలు ముగియగానే తప్పిన ఉపవాసా లను పూర్తిచేయాలి. వీరు రోగుల పరిధిలోనికి వస్తారు. రమ’దాన్ తర్వాత సంవత్స రంలో అవకాశం దొరికినపుడు తప్పిన ఉపవాసాలను పూర్తిచేయాలి. అయితే సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలి. అనవసరంగా ఆలస్యం చేయటం మంచిది కాదు. మళ్ళీ రమ‘దాన్ నెల రాకముందే వీటిని పూర్తిచేసుకోవాలి.
ఈ తప్పిపోయిన ఉపవాసాలను ఒకేసారి వరుసగా ఆచరించటం కూడా ధర్మసమ్మతమే. మధ్య విరామం ఇస్తూ ఆచరించటం కూడా ధర్మసమ్మతమే. ఒకవేళ ఉపవాసం ఉండే శక్తి ఏమాత్రం లేకపోతే దానికి బదులు పరిహారం చెల్లించాలి. ఒక ఉపవాసానికి బదులు ఒక నిరుపేదకు అన్నం పెట్టాలి. దీన్ని ఖుర్ఆన్ లో పేర్కొనడం జరిగింది. ఒకవేళ ఒకరిపై రమ’దాన్, లేదా మొక్కుబడి ఉపవాసాలు మిగిలి ఉండి, వాటిని ఆచరించటానికి ముందు అతను మరణిస్తే, అతని తరఫున అతని వారసులు ఉపవాసాలు ఉంటారు, లేదా పరిహారంగా అన్నం తినిపిస్తారు. దీన్ని గురించి రాబోయే పేజీల్లో పేర్కొనడం జరిగింది. ఒకవేళ ఎవరైనా అదనపు ఉపవాసం మధ్యలో విరమిస్తే దాన్ని పూర్తిచేసుకోవడమే ఉత్తమం.
—–
اَلْفَصْلُ الْأَوَّلُ మొదటి విబాగం
2030 – [ 1 ] ( متفق عليه ) (1/631)
عَنْ عَائِشَةَ قَالَتْ: كَانَ يَكُوْنُ عَلَيَّ الصَّوْمُ مِنْ رَمَضَانَ فَمَا أَسْتَطِيْعُ أَنْ أَقْضِيَ إِلَّا فِيْ شَعْبَانَ. قَالَ يَحْيَى بْنِ سَعِيْدٍ: تَعْنِيْ الشُّغْلَ مِنَ النَّبِيِّ أَوْ بِالنَّبِيِّ صلى الله عليه وسلم.
2030. (1) [1/631–ఏకీభవితం]
‘ఆయి’షహ్ (ర) కథనం: బహిష్ఠుస్థితి వల్ల నాపై రమ’దాన్ ఉపవాసాలు మిగిలి ఉండేవి. ష’అబాన్ తప్ప మిగిలిన ఏ నెలలోనూ ఉండే అవకాశం దొరకదు. వాటిని ష’అబాన్ నెలలో పూర్తి చేసుకునేదాన్ని. య’హ్యా బిన్ స’యీద్ ఉల్లేఖన కర్త, ” ‘ఆయి’షహ్ (ర) ప్రవక్త (స) సేవలో నిమగ్నమయి ఉండేవారని పేర్కొన్నారు. [40] (బు’ఖారీ, ముస్లిమ్)
2031 – [ 2 ] ( صحيح ) (1/631)
وَعَنْ أَبِيْ هُرَيْرَةَ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَا يَحِلُّ لِلْمَرْأَةِ أَنْ تَصُوْمَ وَزَوْجُهَا شَاهِدٌ إِلَّا بِإِذْنِهِ وَلَا تَأْذَنَ فِيْ بَيْتِهِ إِلَّا بِإِذْنِهِ”. رَوَاهُ مُسْلِمٌ.
2031. (2) [1/631–దృఢం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”భర్త ఇంటిలో ఉండగా, భర్త అనుమతి లేనిదే భార్య అదనపు ఉపవాసం పాటించరాదు. అదేవిధంగా భర్త అనుమతి లేనిదే భార్య ఇతరులెవ్వరినీ ఇంట్లోకి రానివ్వరాదు. [41] (ముస్లిమ్)
2032 – [ 3 ] ( صحيح ) (1/631)
وَعَنْ مُعَاذَةَ الْعَدَوِيَّةِ أَنَّهَا قَالَتْ لِعَائِشَةَ: مَا بَالَ الْحَائِضِ تَقْضِي الصَّوْمَ وَلَا تَقْضِي الصَّلَاةَ؟ قَالَتْ عَائِشَةَ: كَانَ يُصِيْبُنَا ذَلِكَ فَنُؤْمَرُ بِقَضَاءِ الصَّوْمِ وَلَا نُؤْمَرُ بِقَضَاءِ الصَّلَاةِ. رَوَاهُ مُسْلِمٌ.
2032. (3) [1/631–దృఢం]
ము’ఆజ’హ్ అల్-‘అదవియ్యహ్ (ర) ‘ఆయి’షహ్ (ర)ను ”బహిష్టుస్థితిలో ఉన్న స్త్రీ ఉపవాసాలను తిరిగి పూర్తిచేస్తుంది, కాని నమా’జును కాదు, ఎందువల్ల’ అని ప్రశ్నించారు.” దానికి ‘ఆయి’షహ్ (ర) ‘ప్రవక్త (స) కాలంలో మాకు బహిష్టుస్థితి సంభవించేది. మాకు తప్పిన ఉపవాసాలను తిరిగి పూర్తి చేసుకోవాలని ఆదేశించబడేది. అయితే నమా’జును తిరిగి పూర్తి చేసుకోవాలని మాత్రం ఆదేశించబడేది కాదు. అందు వల్ల ఉపవాసాలను తిరిగి పూర్తిచేసు కోవాలి. నమా’జును కాదు అని సమాధానం ఇచ్చారు.’ [42](ముస్లిమ్)
2033 – [ 4 ] ( متفق عليه ) (1/631)
وَعَنْ عَائِشَةَ رَضِيَ اللهُ عَنْهَا قَالَتْ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَنْ مَاتَ وَعَلَيْهِ صَوْمٌ صَامَ عَنْهُ وَلِيُّهُ”.
2033. (4) [1/631–ఏకీభవితం]
‘ఆయి’షహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మరణించి ఉన్న వ్యక్తిపై ఉపవాసాలు మిగిలి ఉంటే అతని తరఫున అతనివారసుడు ఆచరించాలి.” (బు’ఖారీ, ముస్లిమ్)
—–
اَلْفَصْلُ الثَّانِيْ రెండవ విభాగం
2034 – [ 5 ] ( لم تتم دراسته ) (1/632)
عَنْ نافع عَنْ ابن عُمَرَ عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ: “مَنْ مَاتَ وَعَلَيْهِ صِيَامُ شَهْرِرَمَضَانَ فَلْيُطْعَمْ عَنْهُ مَكَانَ كُلِّ يَوْمٍ مِّسْكِيْنٌ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَقَالَ: وَالصَّحِيْحُ أَنَّهُ مَوْقُوْفٌ عَلَى ابْنِ عُمَرَ.
2034. (5) [1/632–అపరిశోధితం]
‘అబ్దుల్లా బిన్ ‘ఉమర్ (ర) ద్వారా నా’ఫె కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఒకవేళ ఎవరైనా రమ’దాన్ ఉపవాసాలు మిగిలి ఉండి మరణిస్తే, అతని తరఫున ఒక్కొక్క ఉపవాసానికి ఒకపేదవానికి అన్నం పెట్టాలి.[43] (తిర్మిజి’)
తిర్మిజి’ ఇది ‘అబ్దుల్లాహ్ బిన్ ‘ఉమర్ వద్దనే ఆగిందని, అంటే ఇది అతని అభిప్రాయం అని, పేర్కొన్నారు.
—–
الْفَصْلُ الثَّالِثُ మూడవ విభాగం
2035 – [ 6 ] ( لم تتم دراسته ) (1/632)
عَنْ مَالِكٍ بَلَغَهُ أَنَّ ابْنَ عُمَرَ كَانَ يُسْأَلُ: هَلْ يَصُوْمُ أَحَدٌ عَنْ أَحَدٍ أَوْ يُصَلِّيْ أَحَدٌ عَنْ أَحَدٍ؟ فَيَقُوْلُ: لَا يَصُوْمُ أَحَدٌ عَنْ أَحَدٍ. وَّلَا يُصَلِّيْ أَحَدٌ عَنْ أَحَدٍ. رَوَاهُ فِيْ الْمُوَطَّأِ.
2035. (6) [1/632–అపరిశోధితం]
మాలిక్ (ర) కథనం: ఈ ఉల్లేఖనం, ‘అబ్దుల్లాహ్ బిన్ ‘ఉమర్ ద్వారా అతనివరకు చేరింది. అతన్ని ”ఒకరు ఒకరి తరఫున ఉపవాసం ఉండవచ్చునా? లేదా ఒకరు ఒకరి తరఫున నమా’జు చదవవచ్చునా?” అని ప్రశ్నించడం జరిగింది. దానికి అతను, ”ఒకరు ఒకరి తరఫున ఉపవాసం ఉండనవసరం లేదు, నమా’జు చదవనక్కర లేదు,” అని సమాధానం ఇచ్చారు. (మువ’త్తా ఇమామ్ మాలిక్)
ఇది ‘అబ్దుల్లాహ్ బిన్ ‘ఉమర్ అభిప్రాయం, అందు వల్ల మొదటి ‘హదీసు’ మాత్రమే ప్రామాణికమైనది.
=====
6– بَابُ صِيَام التَّطَوُّعِ
6. అదనపు ఉపవాసాలు
اَلْفَصْلُ الْأَوَّلُ మొదటి విభాగం
2036 – [ 1 ] ( متفق عليه ) (1/633)
عَنْ عائشة قَالَتْ: كَانَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم يَصُوْمُ حَتَّى نَقُوْلُ: لَا يُفْطِرُ، وَيُفْطِرُ حَتّى نَقُوْلُ: لَا يَصُوْمُ وَمَا رَأَيْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم اسْتَكْمَلَ صِيَامَ شَهْرٍ قَطُّ إِلَّا رَمَضَانَ وَمَا رَأَيْتُهُ فِيْ شَهْرٍ أَكْثَرَ مِنْهُ صِيَامًا فِيْ شَعْبَانَ وَفِيْ رِوَايَةٍ قَالَتْ: كَانَ يَصُوْمُ شَعْبَانَ كُلَّهُ وَكَانَ يَصُوْمُ شَعْبَانَ إِلَّا قَلِيْلًا.
2036. (1) [1/633–ఏకీభవితం]
‘ఆయి’షహ్ (ర) కథనం: ప్రవక్త (స) ఒక్కోసారి అదనపు ఉపవాసాలు ప్రారంభిస్తే నిరంతరం ఆచరిస్తూ పోతారు. చివరికి మేము, ‘ఇప్పుడు ప్రవక్త (స) ఉపవా సాలు విరమించడం జరగదని,’ అనే వారం. అదే విధంగా ఒక్కోసారి ప్రవక్త ఉపవాసాలు వదిలేసేవారు. అప్పుడు మేము, ‘ఇప్పుడు మరి ప్రవక్త (స) ఇక ఉప వాసాలు ఉండరు,’ అని అనేవారం. రమ’దాన్ తప్ప ఇతర ఏ నెలలోనూ నెలంతా ఉపవాసాలు పాటించటం నేను చూడలేదు. అయితే ష’అబాన్లో ఇతర నెలలకన్నా అధికంగా ఉపవాసాలు ఉండే వారు.
మరో ఉల్లేఖనంలో ఇలా ఉంది, ష’అబాన్లో కొన్ని రోజలు తప్ప నెలంతా ఉపవాసాలు పాటించేవారు. అంటే ష’అబాన్లో అధిక భాగం ఉపవాసాల్లో గడిపే వారు. (బు’ఖారీ, ముస్లిమ్)
2037 – [ 2 ] ( صحيح ) (1/633)
وَعَنْ عَبْدِ اللهِ بْنِ شَقِيْقٍ قَالَ: قُلْتُ لِعَائِشَةَ: أَكَانَ النَّبِيّ صلى الله عليه وسلم يَصُوْمُ شَهْرًا كُلَّهُ؟ قَالَ: مَا عَلِمْتُهُ صَامَ شَهْرُا كُلَّهُ إِلَّا رَمَضَانَ وَلَا أَفْطَرَهُ كُلَّهُ حَتّى يَصُوْمُ مِنْهُ حَتَّى مَضَى لِسَبِيْلِهِ. رَوَاهُ مُسْلِمٌ .
2037. (2) [1/633–దృఢం]
‘అబ్దుల్లాహ్ బిన్ షఖీఖ్ (ర) కథనం: నేను ‘ఆయి ‘షహ్ (ర)ను ”ప్రవక్త (స) ఇతర నెలల్లో నెలంతా ఉప వాసాలు ఉండేవారా? ” అని ప్రశ్నించాను. ‘ఆయి ‘షహ్ (ర) సమాధానమిస్తూ, ”రమ’దాన్ నెల తప్పితే ఇతర ఏ నెలలోనూ నెలంతా ఉపవాసాలు ఉండటం నేను ఎరుగను. అదేవిధంగా ఇతర ఏ నెలలోనూ పూర్తిగా ఉపవాసం ఉండక పోవటం అనేది కూడా మరణించే వరకు జరగలేదు,” అని అన్నారు. (ముస్లిమ్)
2038 – [ 3 ] ( متفق عليه ) (1/633)
وَعَنْ عِمْرَانَ بْنِ حُصَيْنٍ عَنِ النَّبِيَّ صلى الله عليه وسلم: أَنَّهُ سَأَلَهُ أَوْ سَأَلَ رَجُلًا وَّعِمْرَانُ يَسْمَعُ فَقَالَ: “يَا أَبَا فُلَانٍ أَمَا صُمْتَ مِنْ سَرَرِ شَعْبَانَ؟” قَالَ: لَا. قَالَ : “فَإِذَا أَفْطَرْتَ فَصُمْ يَوْمَيْنِ”.
2038. (3) [1/633–ఏకీభవితం]
‘ఇమ్రాన్ బిన్ ‘హు’సైన్ (ర) కథనం: ప్రవక్త (స) అతన్ని లేదా మరో వ్యక్తిని, ‘ఇమ్రాన్ వింటూ ఉండగా, ‘ఓ ఫలానా వ్యక్తి! నీవు ష’అబాన్ చివరన ఉపవాసాలు పాటించావా?’ అని ప్రశ్నించారు. ఆ వ్యక్తి, ‘లేదు,’ అని అన్నాడు. అప్పుడు ప్రవక్త (స), ‘రమ’దాన్ ఉపవాసాలు ముగియగానే పండుగ తర్వాత ఈ దినాల ఉపవాసాలు పాటించు,’ అని హితబోధ చేసారు. [44] (బు’ఖారీ, ముస్లిమ్)
2039 – [ 4 ] ( صحيح ) (1/633)
وَعَنْ أَبِيْ هُرَيْرَةَ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “أَفْضَلُ الصِّيَام بَعْدَ رَمَضَانَ شَهْرُ اللهِ الْمُحَرّم وَأَفْضَلُ الصَّلَاةِ بَعْدَ الْفَرِيْضَةِ صَلَاةُ اللَّيْلِ”. رَوَاهُ مُسْلِمٌ .
2039. (4) [1/633–దృఢం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”రమ’దాన్ తర్వాత అల్లాహ్ (త) మాసమయిన ము‘హర్రమ్ నెలలో పాటించబడే ఉపవాసాలు అత్యంత శ్రేష్ఠమైనవి. అదేవిధంగా ఫర్జ్ నమా’జు తర్వాత పాటించబడే నఫిల్ నమా’జుల్లో తహజ్జుద్ నమా’జు అత్యంత శ్రేష్ఠమైనది.” (ముస్లిమ్)
2040 – [ 5 ] ( متفق عليه ) (1/634)
وَعَنِ ابْنِ عَبَّاسٍ قَالَ: مَا رَأَيْتُ النَّبِيَّ صلى الله عليه وسلم يَتَحَرّى صِيَامَ يَوْمٍ فَضَّلَهُ عَلَى غَيْرِهِ إِلَّا هَذَا الْيَوْم: يَوْم عَاشُوْرَاءَ وَهَذَا الشَّهْرَ يَعْنِيْ شَهْرَ رَمَضَانَ.
2040. (5) [1/634–ఏకీభవితం]
ఇబ్నె ‘అబ్బాస్ (ర) కథనం: ప్రవక్త (స)ను ము‘హర్రమ్ 10వ తేదీ మరియు రమ’దాన్ నెలల ఉపవాసాలను తప్ప మరే ప్రత్యేక దినాల ఉపవా సాలను భక్తి శ్రద్ధలతో ఆచరించటం నేను చూడలే దు.[45] (బు’ఖారీ, ముస్లిమ్)
2041 – [ 6 ] ( صحيح ) (1/634)
وَعَنِ ابْنِ عَبَّاسٍ قَالَ: حِيْنَ صَامَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم يَوْمَ عَاشُوْرَاءَ وَأَمَرَ بِصِيَامِهِ. قَالُوْا: يَا رَسُوْلَ اللهِ إِنَّهُ يَوْمٌ يُعَظِّمُهُ الْيَهُوْدَ وَالنَّصَارَى. فَقَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَئِنْ بَقِيْتُ إِلَى قَابِلٍ لِأَصُوْمَنَّ التَّاسِعَ”. رَوَاهُ مُسْلِمٌ.
2041. (6) [1/634–దృఢం]
ఇబ్నె ‘అబ్బాస్ (ర) కథనం: ప్రవక్త (స) ‘ఆషూరా’ ఉపవాసం పాటించారు. ప్రజలకు కూడా పాటించమని ఆదేశించారు. అప్పుడు ప్రజలు, ‘ఓ అల్లాహ్ ప్రవక్తా! దీన్ని యూదులు, క్రైస్తవులు శుభకరమైన పవిత్రమైన దినంగా భావిస్తారు,’ అని విన్నవించుకున్నారు. అప్పుడు ప్రవక్త (స), ‘ఒకవేళ నేను వచ్చే సంవత్సరం బ్రతికి ఉంటే 9వ తేదీన కూడా ఉపవాసం ఉంటాను,’ అని అన్నారు. [46] (ముస్లిమ్)
2042 – [ 7 ] ( متفق عليه ) (1/634)
وَعَنْ أُمِّ الْفَضْلِ بِنْتِ الْحَارِثِ: أَنَّ نَاسًا تَمَارَوا عِنْدَهَا يَوْمَ عَرَفَةَ فِيْ صِيَامِ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم. فَقَالَ بَعْضُهُمْ: هُوَ صَائِمٌ وَقَالَ بَعْضُهُمْ: لَيْسَ بِصَائِمٍ فَأَرْسَلْتُ إِلَيْهِ بِقَدَحٍ لَبَنٍ وَهُوَ وَاقِفٌ عَلَى بَعِيْرِهِ بِعَرَفَةَ فَشَرِبَهُ.
2042. (7) [1/634–ఏకీభవితం]
ఉమ్మె ఫ’దల్ బిన్తె ‘హారిస్’ (ర) కథనం: ‘అరఫాత్ నాడు ప్రవక్త (స) ఉపవాసం ఉండటాన్ని గురించి ప్రజల్లో భేదాభిప్రాయాలు తలెత్తాయి. కొందరు, ‘ప్రవక్త (స) ‘అరఫాత్ నాడు ఉపవాసంతో ఉన్నారు,’ అని, మరికొందరు, ‘ప్రవక్త (స) ఉపవాసంతో లేరు,’ అని అన్నారు. నేను పాల పాత్రను ప్రవక్త (స) వద్దకు పంపించాను. అప్పుడు ప్రవక్త (స) ‘అరఫాత్ మైదానంలో ఒంటెపై కూర్చుని ఉన్నారు. ప్రవక్త (స) పాలు త్రాగారు. అంటే ప్రవక్త (స) ఉపవాసంతో లేరని తెలిసింది. [47] (బు’ఖారీ, ముస్లిమ్)
2043 – [ 8 ] ( صحيح ) (1/634)
وَعَنْ عَائِشَةَ رَضِيَ اللهُ عَنْهَا قَالَتْ: مَا رَأَيْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم صَائِمًا فِيْ الْعَشْرِ قَطُّ. رَوَاهُ مُسْلِمٌ.
2043. (8) [1/634–దృఢం]
‘ఆయి’షహ్ (ర) కథనం: నేను ప్రవక్త (స) ను 10 జి’ల్’హిజ్జహ్లో ఎన్నడూ ఉపవాసం ఉండటం చూడ లేదు. [48] (ముస్లిమ్)
2044 – [ 9 ] ( صحيح ) (1/634)
وَعَنْ أَبِيْ قَتَادَةَ: أَنَّ رَجُلًا أَتَى النَّبِيَّ صلى الله عليه وسلم. فَقَالَ كَيْفَ تَصُوْمُ فَغَضِبَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم مِنْ قَوْلِهِ. فَلَمَّا رَأَى عُمَرُ رَضي الله عَنْهُمْ غَضَبَهُ قَالَ: رَضِيْنَا بِاللهِ رَبًّا وَبِالْإِسْلَامِ دِيْنًا وَبِمُحَمَّدٍ نَبِيًّا نَعُوْذُ بِاللهِ مِنْ غَضَبِ اللهِ وَغَضَبِ رَسُوْلِهِ. فَجَعَلَ عُمَرُ رضي الله عَنْهُمْ يُرَدِّدُ هَذَا الْكَلَامَ حَتَّى سَكَنَ غَضَبُهُ. فَقَالَ عُمَرُ يَا رَسُوْلَ اللهِ كَيْفَ بِمَنْ يَصُوْمُ الدَّهْرَ كُلَّهُ. قَالَ: “لَا صَامَ وَلَا أَفْطَرَ”. أَوْ قَالَ: “لَمْ يَصُمْ وَلَمْ يُفْطِرْ”. قَالَ كَيْفَ مَنْ يَّصُوْمُ يَوْمَيْنِ وَيُفْطِرُ يَوْمًا. قَالَ: “وَيُطِيْقُ ذَلِكَ أَحَدٌ”. قَالَ كَيْفَ مَنْ يَّصُوْمُ يَوْمًا وَّيُفْطِرُ يَوْمًا. قَالَ: “ذاك صَوْمُ دَاوُدَ عَلَيْهِ السلام”. قَالَ كَيْفَ مَنْ يَّصُوْمُ يَوْمًا وَّيُفْطِرُ يَوْمَيْنِ. قَالَ: “وَدِدْتُّ أَنِّيْ طُوِّقْتُ ذَلِكَ”. ثُمَّ قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: ” ثَلَاثٌ مِّنْ كُلِّ شَهْرٍ وَرَمَضَانُ إِلَى رَمَضَانَ فَهَذَا صِيَامُ الدَّهْرِ كُلِّهِ صِيَامُ يَوْمِ عَرَفَةَ أَحْتَسِبُ عَلَى اللهِ أَنْ يُّكَفِّرَ السَّنَةَ الَّتِيْ قَبْلَهُ وَالسَّنَةَ الَّتِيْ بَعْدَهُ. وَصِيَامُ يَوْمِ عَاشُوْرَاءَ أَحْتَسِبُ عَلَى اللهِ أَنْ يُّكَفِّرَ السَّنَةَ الَّتِيْ قَبْلَهُ”. رَوَاهُ مُسْلِمٌ .
2044. (9) [1/634–దృఢం]
అబూ ఖతాదహ్ (ర) కథనం: ఒక వ్యక్తి ప్రవక్త (స) వద్దకు వచ్చి, ‘ఓ అల్లాహ్ ప్రవక్తా! ‘మీరు ఎలా ఉపవాసం పాటిస్తారు,’ అని ప్రశ్నించాడు. అతని ఈ మాటలు విని ప్రవక్త (స)కు చాలా కోపం వచ్చింది. ‘ఉమర్ (ర) ప్రవక్త (స) కోపాన్ని చూసి, ”మేము అల్లాహ్‌ను ప్రభువుగా, ఇస్లామ్‌ను ధర్మంగా, ము’హమ్మద్‌ను ప్రవక్తగా స్వీకరించాము. ఇంకా మేము అల్లాహ్ ఆగ్రహం నుండి, ఆయన ప్రవక్త ఆగ్రహం నుండి శరణు కోరుతున్నాము,” అని పలికారు. ‘ఉమర్ (ర) ఈ వచనాన్నే అనేకసార్లు వల్లించారు. చివరికి ప్రవక్త (స) కోపం చల్లబడింది. అప్పుడు ‘ఉమర్ (ర), ”ఓ అల్లాహ్ ప్రవక్తా! ఎల్లప్పుడూ ఉపవాసాలుండే వ్యక్తి గురించి చెప్పండి,” అని విన్నవించుకున్నారు. దానికి ప్రవక్త (స), ‘అటువంటి వ్యక్తి ఉపవాసం పాటించనూ లేదు. విరమించనూ లేదు. అంటే అతనికి ఉపవాస పుణ్యం దక్కదు. అంటే ఏమీ తినకుండా ఆకలి దప్పులతో ఉన్నాడు అని అర్థం.” మళ్ళీ ‘ఉమర్, ‘రెండు ఉపవాసాలు ఉండి ఒక రోజు ఉపవాసం ఉండనివాడు ఎటు వంటివాడు ఓ ప్రవక్తా!’ అని ప్రశ్నించారు. ప్రవక్త (స), ‘ఆ శక్తి ఎవరికి ఉంది,’ అని అన్నారు. మళ్ళీ ఉమర్,’ ఒక రోజు ఉపవాసం ఉండి, ఒక రోజు ఉపవాసం ఉండనివాడు ఎటువంటివాడు,’ అని ప్రశ్నించారు. ప్రవక్త (స), ‘ఇది దావూద్ (అ) సాంప్రదాయం,‘ అని అన్నారు. అతను ఒకరోజు ఉపవాసం ఉండేవారు, ఒక రోజు ఉపవాసం ఉండేవారు కాదు.’ ఆ తరువాత మళ్ళీ ఉమర్, ‘ఒకరోజు ఉపవాసం ఉండి రెండు రోజులు ఉండని వ్యక్తి ఎటువంటి వాడు,’ అని ప్రశ్నించారు. దానికి ప్రవక్త (స), ‘ఇలా నేను ఉండాలని, ఉండే శక్తి ఇవ్వబడాలని కోరుకుంటున్నాను.’ ఆ తరువాత మళ్ళీ ప్రవక్త (స) నెలలో 3 రోజులు ఉపవాసం ఉండటం, మరియు రమదాన్ లో ఉపవాసం ఉండటం ఎల్లప్పుడు ఉపవాసం ఉండటంతో సమానమని, అన్నారు. :అదే విధంగా జి’ల్-‘హిజ్జహ్ 9వ తేదీన ఉపవాసం ఉంటే రెండు సంవత్సరాల పాపాలు క్షమించబడతాయని, ఒకటి గడిచిన సంవత్సరం, మరొకటి రాబోయే సంవత్సరం. అదే విధంగా ము’హర్రమ్ 10వ తేదీన ఉపవాసం ఉంటే గడచిన ఒక సంవత్సరం పాపాలు క్షమించబడతాయని: అన్నారు. [49] (ముస్లిమ్)
2045 – [ 10 ] ( صحيح ) (1/635)
وَعَنْ أَبِيْ قَتَادَةَ قَالَ: سُئِلَ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم عَنْ صَوْمِ الْاِثْنَيْنِ فَقَالَ: “فِيْهِ وُلِدْتُّ وَفِيْهِ أَنْزِلَ عَلَيَّ”. رَوَاهُ مُسْلِمٌ.
2045. (10) [1/635–దృఢం]
అబూ ఖతాదహ్ (ర) కథనం: సోమవారం ఉపవాసం గురించి ప్రవక్త (స)ను ప్రశ్నించడం జరిగింది. అప్పుడు ప్రవక్త (స), ‘నేను ఈ నాడు జన్మించాను. ఈ రోజే నాపై ఖుర్ఆన్ అవతరించింది,‘ అని అన్నారు. [50] (ముస్లిమ్)
2046 – [ 11 ] ( صحيح ) (1/635)
وَعَنْ مُعَاذَةَ الْعَدَوِيَّةِ أَنَّهَا سَأَلَتْ عَائِشَةَ: أَكَانَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم يَصُوْمُ مِنْ كُلِّ شَهْرٍ ثَلَاثَةَ أَيَّامٍ؟ قَالَتْ: نَعَمْ فَقُلْتُ لَهَا: مِنْ أَيِّ أَيَّامِ الشَّهْرِ كَانَ يَصُوْمُ؟ قَالَتْ: لَمْ يَكُنْ يُبَالِيْ مِنْ أَيِّ أَيَّامِ الشَّهْرِ يَصُوْمُ. رَوَاهُ مُسْلِمٌ .
2046. (11) [1/635–దృఢం]
ము’ఆజ’హ్ ‘అదవియ్యహ్(ర) కథనం: నేను, ‘ఆయి ‘షహ్ (ర)ను, ”ప్రవక్త (స) ప్రతినెల మూడు రోజులు ఉపవాసం ఉండేవారా?” అని అడిగాను. ‘ఆయి’షహ్ (ర), ‘అవును’ అని సమాధానం ఇచ్చారు. మళ్ళీ నేను, ‘ఏ ఏ రోజులు ఉపవాసం ఉండేవారు,’ అని అడిగాను. ఆయిషహ్ (ర), ‘ప్రత్యేకించేవారు కాదు. తాను కోరిన దినాల్లో ఉపవాసం ఉండేవారు. ‘ అని సమాధానమిచ్చారు. [51] (ముస్లిమ్)
2047 – [ 12 ] ( صحيح ) (1/635)
وَعَنْ أَبِيْ أَيُّوْبَ الْأَنْصَارِيِّ أَنَّهُ حَدَّثَهُ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم قَالَ: “مَنْ صَامَ رَمَضَانَ ثُمَّ أَتْبَعَهُ سِتًّا مِّنْ شَوَّالِ كَانَ كَصِيَامِ الدَّهْرِ”. رَوَاهُ مُسْلِمٌ.
2047. (12) [1/635–దృఢం]
అబూ అయ్యూబ్ అ’న్సారీ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఎవరైనా రమ’దాన్ ఉపవాసాలు ఉండి, రమ’దాన్ తర్వాత షవ్వాల్‌లో 6 ఉపవాసాలు ఉంటే ఎల్లప్పుడూ ఉపవాసాలు ఉండేటంత పుణ్యం లభిస్తుంది. [52] (ముస్లిమ్)
2048 – [ 13 ] ( متفق عليه ) (1/635)
وَعَنْ أَبِيْ سَعِيْدِ الْخُدْرِيِّ قَالَ: نَهَى رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم عَنْ صَوْمِ يَوْمِ الْفِطْرِ وَالنَّحْرِ. متفق عليه.
2048. (13) [1/635–ఏకీభవితం]
అబూ స’యీద్ (ర) కథనం: ప్రవక్త (స) ‘ఈదుల్ ఫి’త్ర్, ‘ఈదుల్ అ’ద్’హా నాడు ఉపవాసం ఉండరాదని వారించారు. [53] (బు’ఖారీ, ముస్లిమ్)
2049 – [ 14 ] ( متفق عليه ) (1/635)
وَعَنْ أَبِيْ سَعِيْدِ الْخُدْرِيِّ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَا صَوْمَ فِيْ يَوْمَيْنِ: الْفِطْرِ وَالْأَضْحَى”.
2049. (14) [1/635–ఏకీభవితం]
అబూ స’యీద్ ‘ఖుద్రీ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఈ రెండు దినాలలో ఉపవాసం పాటించడం ధర్మసమ్మతం కాదు. అంటే ‘ఈదుల్-ఫి’త్ర్, ‘ఈదుల్ అ’ద్హా. (బు’ఖారీ, ముస్లిమ్)
2050 – [ 15 ] ( صحيح ) (1/635)
وَعَنْ نُبَيْشَةَ الْهُذَلِيِّ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “أَيَّامُ التَّشُرِيْقِ أَيَّامُ أَكْلٍ وَّشُرْبٍ وَّذِكْرِ اللهِ”. رَوَاهُ مُسْلِمٌ.
2050. (15) [1/635–దృఢం]
నుబైషహ్ అల్ హుజ’లి (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, జిల్’హిజ్జహ్ 11, 12, 13 దినాలు తినేత్రాగే, దైవాన్ని స్మరించే దినాలు. [54] (ముస్లిమ్)
2051 – [ 16 ] ( متفق عليه ) (1/636)
وَعَنْ أَبِيْ هُرَيْرَةَ رَضِيَ اللهُ عَنْهُ قَالَ : قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم : ” لَا يَصُوْمُ أَحَدُكُمْ يَوْمَ الْجُمُعَةِ إِلَّا أَنْ يَّصُوْمَ قَبْلَهُ أَوْ بَصُوْمَ بَعْدَهُ
2051. (16) [1/636–ఏకీభవితం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ప్రత్యేకంగా శుక్రవారం ఉపవాసం ఉండరాదు. అయితే శుక్రవారంతో మరో దినాన్ని కలుపుకోవాలి. అంటే గురువారం-శుక్రవారం లేదా శుక్రవారం-శనివారం. ఒక్క శుక్రవారం నాడు మాత్రమే ఉపవాసం ఉండరాదు. (బు’ఖారీ, ముస్లిమ్)
2052 – [ 17 ] ( صحيح ) (1/636)
وَعَنْ أَبِيْ هُرَيْرَةَ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَا تَخْتَصُّوْا لَيْلَةَ الْجُمُعَةِ بِقِيَامٍ مِّنْ بَيْنَ اللَّيَالِيْ وَلَا تَخْتَصُّوْا يَوْمَ الْجُمُعَةِ بِصَيَامٍ مِّنْ بَيْنَ الْأَيَّامِ إِلَّا أَنْ يَّكُوْنَ فِيْ صَوْمٍ يَّصُوْمُهُ أَحَدُكُمْ”. رَوَاهُ مُسْلِمٌ .
2052. (17) [1/636–దృఢం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”శుక్రవారం రాత్రిని ఆరాధన కొరకు ప్రత్యేకించకండి. అదేవిధంగా శుక్రవారం దినాన్ని ఉపవాసానికి ప్రత్యే కించకండి. ఉపవాసాలు ఉంటూ శుక్రవారం వస్తే ఫర్వాలేదు. [55] (ముస్లిమ్)
2053 – [ 18 ] ( متفق عليه ) (1/636)
وعَنْ أبي سعيد الخدري قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَنْ صَامَ يَوْمًا فِيْ سَبِيْلِ اللهِ بَعَّدَ اللهُ وَجْهَهُ عَنِ النَّارِ سَبْعِيْنَ خَرِيْفًا”.
2053. (18) [1/636–ఏకీభవితం]
అబూ స’యీద్ ‘ఖుద్రీ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, అల్లాహ్(త) మార్గంలో ఒకరోజు ఉపవాసం ఉంటే అల్లాహ్ (త) అతన్ని నరకం నుండి 70 సంవ త్సరాల దూరం ఉంచుతాడు. (బు’ఖారీ, ముస్లిమ్)
అంటే అతడు నరకంలో చేరడు.
2054 – [ 19 ] ( متفق عليه ) (1/636)
وَعَنْ عَبْدِ اللهِ بْنِ عَمْرٍو بْنِ الْعَاصِ قَالَ: قَالَ لِرَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “يَا عَبْدَ اللهِ أَلَمْ أخْبَرْ أَنَّكَ تَصُوْمُ النَّهَارَ وَتَقُوْمُ اللَّيْلَ؟” فَقُلْتُ: بَلَى يَا رَسُوْلَ اللهِ. قَالَ: “فَلَا تَفْعَلْ صُمْ وَأَفْطِرْ وَقُمْ وَنَمْ فَإِنَّ لِجَسَدِكَ عَلَيْكَ حَقًّا وَإِنَّ لِعَيْنِكَ عَلَيْكَ حَقًّا وَإِنَّ لَزَوْجِكَ عَلَيْكَ حَقًّا وَإِنَّ لِزَوْرِكَ عَلَيْك حَقًّا. لَا صَامَ مَنْ صَامَ الدَّهْرَ. صَوْمُ ثَلَاثَةِ أَيَّامٍ مِّنْ كُلِّ شَهْرٍ صَوْمُ الدَّهْرِ كُلِّهِ. صُمْ كُلِّ شَهْرٍ ثَلَاثَةَ أَيَّامٍ وَاقْرَأَ الْقُرْآنَ فِيْ كُلِّ شَهْرٍ”. قُلْتُ: إِنِّيْ أُطِيْقُ أَكْثَرَ مِنْ ذَلِكَ. قَالَ: “صُمْ أَفْضَلَ الصَّوْمِ صَوْمَ دَاوُدَ: صِيَامُ يَوْمٍ وَإِفْطَارُ يَوْمٍ. وَاقْرَأَ فِيْ كُلِّ سَبْعِ لَيَالٍ مَّرَّةً وَلَا تَزِدْ عَلَى ذَلِكَ”.
2054. (19) [1/636–ఏకీభవితం]
‘అబ్దుల్లాహ్ బిన్ ‘అమ్ర్ బిన్ ‘ఆ’స్ (ర) కథనం: ప్రవక్త (స) నన్ను, ‘ఓ ‘అబ్దుల్లాహ్! నీవు పగలు ఉపవాసం ఉంటున్నావని, రాత్రి నమా’జ్ చేస్తున్నావనే వార్త నాకు అందలేదా?’ అంటే, ‘నువ్వు అలా చేస్తున్నావని నాకు తెలిసిందని’ అన్నారు. నేను, ‘అవును అల్లాహ్ ప్రవక్తా!’ అని అన్నాను. అప్పుడు ప్రవక్త (స), ‘నువ్వు అలా చేయకు, నువ్వు ఒకసారి ఉపవాసం ఉండు, ఒకసారి ఉపవాసం ఉండకు, అదేవిధంగా రాత్రి కొంతసేపు నమా’జ్లో గడుపు, కొంత సేపు నిద్రపో. ఎందుకంటే నీపై నీ శరీర హక్కు ఉంది. నీపై నీ కంటి హక్కు ఉంది. నీపై నీ భార్య హక్కు ఉంది. నీపై నీ అతిధుల హక్కు కూడా ఉంది. ఎల్లప్పుడూ ఉపవాసం ఉన్నవాడు ఉపవాసం లేనట్టే. అంటే ఉపవాస పుణ్యం అతనికి లభించదు. ప్రతినెల 3 ఉపవాసాలు ఉంటే సరిపోతుంది. ఇది ఎల్లప్పుడూ ఉపవాసం ఉండటానికి సమానం. నువ్వు ప్రతినెల మూడు ఉపవాసాలు పాటించు ప్రతినెల ఒక ఖుర్ఆన్ పూర్తిచేయి,‘ అని అన్నారు. అప్పుడు నేను, ‘నాకు ఇంతకంటే ఎక్కువ శక్తి ఉంది,’ అని అన్నాను. ప్రవక్త (స), ‘అన్నిటికంటే ఉత్తమమైన దావూద్ (అ) ఉపవాసం పాటించు. అంటే రోజు తప్పి రోజు ఉపవాసం ఉండు. ఒక వారంలో ఖుర్ఆన్ పూర్తిచేయి. ఇంతకు మించి ఆచరించకు,’ అని అన్నారు. (బు’ఖారీ, ముస్లిమ్)
—–
اَلْفَصْلُ الثَّانِيْ రెండవ విభాగం
2055 – [ 20 ] ( لم تتم دراسته ) (1/637)
وَعَنْ عَائِشَةَ رَضِيَ اللهُ عَنْهَا قَالَتْ: كَانَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم يَصُوْمُ الْاِثْنَيْنَ وَالْخَمِيْسَ. رَوَاهُ التِّرْمِذِيُّ وَالنَّسَائِيُّ .
2055. (20) [1/637–అపరిశోధితం]
‘ఆయి’షహ్ (ర) కథనం: ప్రవక్త (స) సోమవారం, గురువారం ఉపవాసం ఉండేవారు. (తిర్మిజి’, నసాయి’)
2056 – [ 21 ] ( لم تتم دراسته ) (1/637)
وَعَنْ أَبِيْ هُرَيْرَةَ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه و سلم: “تُعْرَضُ الْأَعْمَالُ يَوْمَ الْاِثْنَيْنِ وَالْخَمِيْسِ فَأُحِبُّ أَنْ يُّعْرَضَ عَمَلِيْ وَأَنَا صَائِمٌ”. رَوَاهُ التِّرْمِذِيُّ.
2056. (21) [1/637–అపరిశోధితం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”సోమవారం, గురువారం ఈ రెండు దినాల్లో దాసుల ఆచరణలు దైవసన్నిధిలో చేరవేయబడతాయి. అందువల్ల నేను ఉపవాసస్థితిలో ఉన్నప్పుడు నా ఆచరణలు దైవసన్నిధిలో చేరవేయబడాలని కోరుతున్నాను. (తిర్మిజి’)
2057 – [ 22 ] ? (1/637)
وَعَنْ أَبِيْ ذَرٍّ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “يَا أَبَا ذَرٍّ إِذَا صُمْتَ مِنَ الشَّهْرِ ثَلَاثَةَ أَيَّامٍ فَصُمْ ثَلَاثَ عَشَرَةَ وَأَرْبَعَ عَشَرَةَ وَخَمْسَ عَشَرَةَ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَالنَّسَائِيُّ.
2057. (22) [1/637–?]
అబూజ’ర్ (ర) కథనం: ప్రవక్త (స) నన్ను, ‘ఓ అబూ జ’ర్! నీవు నెలకు మూడు ఉపవాసాలు, అంటే, 13, 14, 15 తేదీలలో ఉపవాసాలు ఉండు,’ అని హితబోధ చేసారు. (తిర్మిజి’, నసాయి’)
2058 – [ 23 ] ( لم تتم دراسته ) (1/637)
وَعَنْ عَبْدِ اللهِ بْنِ مَسْعُوْدٍ قَالَ: كَانَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم يَصُوْمُ مِنْ غُرَّةٍ كُلِّ شَهْرٍثَلَاثَةَ أَيَّامٍ. وَقَلَّمَا كَانَ يُفْطِرُ يَوْمَ الْجُمُعَةِ. رَوَاهُ التِّرْمِذِيُّ وَالنَّسَائِيُّ وَرَوَاهُ أَبُوْ دَاوُدَ إِلَى ثَلَاثَةِ أَيَّامٍ
2058. (23) [1/637–అపరిశోధితం]
‘అబ్దుల్లాహ్ బిన్ మస్’ఊద్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రతి నెల ప్రారంభంలో మూడు ఉపవాసాలు ఉండే వారు. అయితే శుక్రవారం ఉపవాసం ఉండకపోవటం చాలా తక్కువగా జరుగుతుంది. అంటే గురువారం, శుక్రవారం కలిపి ఉపవాసం ఉండేవారు. (తిర్మిజి’, నసాయి’, అబూ దావూద్)
2059 – [ 24 ] ( لم تتم دراسته ) (1/637)
وَعَنْ عَائِشَةَ رَضِيَ اللهُ عَنْهَا قَالَتْ: كَانَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم يَصُوْمُ مِنَ الشَّهْرِ السَّبْتَ وَالْأَحَدَ وَالْاِثْنَيْنَ وَمِنَ الشَّهْرِ الْآخَرِ الثَّلَاثَاءَ وَالْأَرْبِعَاءَ وَالْخَمِيْسَ. رَوَاهُ التِّرْمِذِيُّ.
2059. (24) [1/637–అపరిశోధితం]
‘ఆయి’షహ్ (ర) కథనం: ప్రవక్త (స) ఒక నెలలో శనివారం, ఆదివారం, సోమవారం ఉపవాసం ఉండే వారు. మరో నెలలో మంగళవారం, బుధవారం, గురు వారం ఉపవాసం ఉండేవారు. (తిర్మిజి’)
2060 – [ 25 ] ( لم تتم دراسته ) (1/637)
وَعَنْ أُمِّ سَلَمَةَ قَالَتْ: كَانَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم يَأْمُرُنِيْ أَنْ أَصُوْمَ ثَلَاثَةَ أَيَّامٍ مِّنْ كُلِّ شَهْرٍ أَوَّلُهَا الْاِثْنَيْنِ وَالْخَمِيْسُ. رَوَاهُ أَبُوْ دَاوُدَ وَالنَّسَائِيُّ.
2060. (25) [1/637–అపరిశోధితం]
ఉమ్మె సలమహ్ (ర) కథనం: ప్రతి నెల మూడు ఉప వాసాలు ఉండమని ప్రవక్త (స) మమ్మల్ని ఆదేశించే వారు. మొదటిది సోమవారం, లేదా గురువారం అయి ఉండాలి. (అబూ దావూద్, నసాయి’).
అంటే ప్రతినెల నేను మూడు రోజులు ఉపవాసం ఉండాలి. వాటిలో మొదటిది సోమవారం లేదా గురువారం అయి ఉండాలి.
2061 – [ 26 ] ( لم تتم دراسته ) (1/637)
وَعَنْ مُسْلِمٍ الْقَرَشِيِّ قَالَ: سَأَلْتُ أَوْ سُئِلَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم عَنْ صِيَامِ الدَّهْرِ فَقَالَ: “إِنَّ لِأَهْلِكَ عَلَيْكَ حَقًّا صُمْ رَمَضَانَ وَالَّذِيْ يَلِيْهِ وَكُلُّ أَرْبِعَاءَ وَخَمِيْسٍ فَإِذَا أَنْتَ قَدْ صُمْتَ الدَّهْرَ كُلَّهُ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ وَالتِّرْمِذِيُّ.
2061. (26) [1/637–అపరిశోధితం]
ముస్లిమ్ ఖుర్షీ (ర) కథనం: ఒకసారి ప్రవక్త (స)ను ఎల్లప్పుడూ ఉపవాసం ఉండటాన్ని గురించి నేను ప్రశ్నించాను లేదా మరొకరు ప్రశ్నించారు. అప్పుడు ప్రవక్త (స), ‘ఎల్లప్పుడూ ఉపవాసాలు ఉండకు, ఎందుకంటే నీపై, నీ కుటుంబం హక్కులు కూడా ఉన్నాయి. నువ్వు రమ’దాన్ ఉపవాసాలు ఉండు. రమ’దాన్ తర్వాత షవ్వాల్‌లో 6 ఉపవాసాలు ఉండు. ఇంకా ప్రతి బుధవారం, గురువారం ఉపవాసం ఉండు, ఇలా చేస్తే నీకు ఎల్లప్పుడూ ఉపవాసం ఉండే పుణ్యం లభిస్తుంది అని అన్నారు.’ (అబూ దావూద్, తిర్మిజి’)
2062 – [ 27 ] ( ضعيف ) (1/638)
وَعَنْ أَبِيْ هُرَيْرَةَ رَضِيَ اللهُ عَنْهُ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم: نَهَى عَنْ صَوْمِ يَوْمِ عَرَفَةَ بِعَرَفَةَ. رَوَاهُ أَبُوْ دَاوُدَ.
2062. (27) [1/638–బలహీనం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) ‘అరఫాత్ మైదానంలో అరఫాత్ నాడు అంటే జి’ల్-‘హిజ్జహ్ 9వ తేదీన ఉపవాసం ఉండటాన్ని నిషేధించారు. (అబూ దావూద్)
అంటే ‘అరఫాత్ మైదానంలో 9వ జిల్’హిజ్జహ్ నాడు హాజరైన వ్యక్తి అక్కడ ఉపవాసం ఉండరాదు.
2063 – [ 28 ] ( لم تتم دراسته ) (1/638)
وَعَنْ عَبْدِ اللهِ بْنِ بُسْرٍ عَنْ أُخْتِهِ الصَّمَّاء أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم قَالَ: “لَا تَصُوْمُوْا يَوْمَ السَّبْتِ إِلَّا فِيْمَا افْتُرِضَ عَلَيْكُمْ فَإِنْ لَّمْ يَجِدْ أَحَدُكُمْ إِلَّا لِحَاءَ عِنَبَةٍ أَوْ عُوْدَ شَجَرَةٍ فَلْيَمْضَغْهُ”. رَوَاهُ أَحْمَدُ وَأَبُوْ دَاوُدَ وَالتِّرْمِذِيُّ وَابْنُ مَاجَهُ وَالدَّارَمِيُّ .
2063. (28) [1/638–అపరిశోధితం]
‘అబ్దుల్లాహ్ బిన్ బుస్ర్, తన సోదరి, సమ్మాఅ’ (ర) ద్వారా ఉల్లేఖిస్తున్నారు. అతని (ర) కథనం: ప్రవక్త (స) నన్ను, ‘నువ్వు కేవలం శనివారం నాడే ఉపవాసం ఉండకు. కాని విధి ఉపవాసాలు తప్ప. ఉదా: మొక్కుబడి ఉపవాసం లేదా పరిహార ఉపవాసం. ఒకవేళ నీకు తినడానికి ఏమీ లేక ద్రాక్ష తొక్క లేదా కర్రముక్క దొరికినా దాన్ని నమిలి ఉపవాసం విరమించు,’ అని అన్నారు. (అ’హ్మద్, అబూ దావూద్, తిర్మిజి’, ఇబ్నె మాజహ్, దారిమి)
ఇలా ఎందుకు వారించడం జరిగిందంటే గ్రంథ ప్రజల అనుకరణ కాకూడదని.
2064 – [ 29 ] ( لم تتم دراسته ) (1/638)
وَعَنْ أَبِيْ أُمَامَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَنْ صَامَ يَوْمًا فِيْ سَبِيْلِ اللهِ جَعَلَ اللهُ بَيْنَهُ وَبَيْنَ النَّارِ خَنْدَقًا كَمَا بَيْنَ السَّمَاءِ وَالْأَرْضِ”. رَوَاهُ التِّرْمِذِيُّ .
2064. (29) [1/638–అపరిశోధితం]
అబూ ఉమామహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”అల్లాహ్(త) మార్గంలో ఒక రోజు ఉపవాసం ఉన్న వారికి, అల్లాహ్ (త) అతనికి నరకానికి మధ్య ఒక కందకం తయారు చేస్తాడు. దాని వెడల్పు భూమ్యాకాశాల మధ్య దూరం అంత ఉంటుంది. అంటే అల్లాహ్ (త) మార్గంలో ఉపవాసం ఉండటం వల్ల నరకానికి దూరం చేయబడతాడు. (తిర్మిజి’)
2065 – [ 30 ] ( لم تتم دراسته ) (1/638)
وَعَنْ عَامِرِ بْنِ مَسْعُوْدٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “اَلْغَنِيْمَةُ الْبَارِدَةُ الصَّوْمُ الشِّتَاءِ”. رَوَاهُ أَحْمَدُ وَالتِّرْمِذِيُّ وَ قَالَ: هَذَا حَدِيْثٌ مُرْسَلٌ.
2065. (30) [1/638–అపరిశోధితం]
‘ఆమిర్ బిన్ మస్’ఊద్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”చలికాలంలో ఉపవాసాన్ని మహా భాగ్యంగా భావించాలి. (అ’హ్మద్, తిర్మిజి’ / తాబయీ ప్రోక్తం)
2066 – [ 31 ] ( لم تتم دراسته ) (1/638)
وَذُكِرَ حَدِيْثُ أَبِيْ هُرَيْرَةَ: “مَا مِنْ أَيَّامٍ أَحَبُّ إِلَى اللهِ” فِيْ بَابٍ الْأَضْحِيَّةِ .
2066. (31) [1/638–అపరిశోధితం]
అబూ హురైరహ్ (ర) ‘హదీసు’, ”మా మిన్ అయ్యామిన్ అ’హబ్బు ఇలల్లాహ్”ను ఖుర్బానీ అధ్యాయంలో పేర్కొనడం జరిగింది. [56]
—–
اَلْفَصْلُ الثَّالِثُ మూడవ విభాగం
2067 – [ 32 ] ( متفق عليه ) (1/638)
عَنِ ابْنِ عَبَّاسٍ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم قَدِمَ الْمَدِيْنَةَ فَوَجَدَ الْيَهُوْدَ صِيَامًا يَوْمَ عَاشُوْرَاءَ. فَقَالَ لَهُمْ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَا هَذَا الْيَوْمُ الَّذِيْ تَصُوْمُوْنَهُ؟” فَقَالُوْا: هَذَا يَوْمٌ عَظِيْمٌ: أَنْجَى اللهُ فِيْهِ مُوْسَى وَقَوْمَهُ وَغَرَّقَ فِرْعَوْنَ وَقَوْمَهُ فَصَامَهُ مُوْسَى شُكْرًا فَنَحْنُ نَصُوْمُهُ. فَقَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “فَنَحْنُ أَحَقُّ وَأَوْلَى بِمُوْسَى مِنْكُمْ”. فَصَامَهُ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم وَأَمَرَ بِصِيَامِهِ .
2067. (32) [1/638–ఏకీభవితం]
ఇబ్నె ‘అబ్బాస్ (ర) కథనం: ప్రవక్త (స) మక్కహ్ నుండి మదీనహ్ వలస వచ్చినప్పుడు యూదులను ము’హర్రమ్ 10వ తేదీన ఉపవాసం ఉండటం గమనించారు. ‘మీరెందుకు ఉపవాసం ఉంటున్నారు,’ అని వారిని అడిగారు. అప్పుడు యూదులు, ‘ఇది గొప్పదినము, అల్లాహ్ (త) ఈ నాడే మూసా (అ)ను, అతని జాతి ఇస్రాయీ’ల్ను రక్షించాడు. ఫిర్’ఔన్‌ను అతని సైన్యాన్ని నీటిలో ముంచివేసాడు. మూసా (అ) కృతజ్ఞతా పూర్వకంగా ఈరోజు, ఉపవాసం పాటించారు. మేము మూసా(అ)ను అనుసరిస్తూ ఉపవాసం పాటిస్తున్నాము,’ అని సమాధానం ఇచ్చారు. అది విని ప్రవక్త (స), ‘మేము మీకంటే మూసాతో ఎక్కువ హక్కు గలవారం,’ అని పలికి, తరువాత ప్రవక్త (స) స్వయంగా ఉపవాసం ఉన్నారు. ప్రజలను కూడా ఉపవాసం ఉండమని ఆదేశించారు. (బు’ఖారీ, ముస్లిమ్)
2068 – [ 33 ] ( لم تتم دراسته ) (1/639)
وعَنْ أم سلمة قَالَتْ: كَانَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم يَصُوْمُ يَوْمُ السَّبْتِ وَيَوْمَ الْأَحَدِ أَكْثَرَ مَا يَصُوْمُ مِنَ الْأَيَّامِ وَيَقُوْلُ: “إِنَّهُمَا يَوْمَا عِيْدٍ لِّلْمُشْرِكِيْنَ فَأَنَا أُحِبُّأَنْ أُخَالِفَهُمْ”. رَوَاهُ أَحْمَدُ.
2068. (33) [1/639–అపరిశోధితం]
ఉమ్మె సలమహ్ (ర) కథనం: ‘ప్రవక్త (స) సర్వ సాధారణంగా శనివారం, ఆదివారం ఉపవాసం ఉండే వారు, ఇంకా ఈ రెండు అవిశ్వాసుల పండుగ దినాలని, వారిని వ్యతిరేకిస్తూ ఉపవాసాలు ఉండాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు. (అ’హ్మద్)
ఎందుకంటే ఈ రెండు దినాల్లో వారు తింటారు.
2069 – [ 34 ] ( صحيح ) (1/639)
وَعَنْ جَابِرٍ بْنِ سَمُرَةَ قَالَ: كَانَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم يَأْمُرُ بِصَيَامِ يَوْمِ عَاشُوْرَاءَ وَيَحُثُّنَاعَلَيْهِ وَيَتَعَاهَدُنَاعِنْدَهُ فَلَمَّا فَرِضَ رَمَضَانَ لَمْ يَأْمُرْنَا وَلَمْ يَنْهَنَا عَنْهُ وَلَمْ يَتَعَاهَدْنَا عِنْدَهُ. رَوَاهُ مُسْلِمٌ.
2069. (34) [1/639–దృఢం]
జాబిర్ బిన్ సమురహ్(ర) కథనం: ప్రవక్త (స) ‘ఆషూ రహ్ రోజు ఉపవాసం ఉండమని ఆదేశించేవారు. మమ్మల్ని ప్రోత్సహించేవారు. ‘ఆషూరహ్ దినం దగ్గర కాగానే మమ్మల్ని పర్యవేక్షించేవారు. మమ్మల్ని దృష్టిలో పెట్టుకునేవారు. అయితే రమ’దాన్ ఉపవా సాలు విధికాగానే ఆషూరహ్ ఉపవాసానికి అంత ప్రాధా న్యత ఇచ్చేవారు కాదు. దాన్నుండి వారించనూ లేదు. ముందున్నట్టు శ్రద్ధాశక్తులూ ఉండేవికావు. [57] (ముస్లిమ్)
2070 – [ 35 ] ( لم تتم دراسته ) (1/639)
وَعَنْ حَفْصَةَ قَالَتْ: أَرْبَعٌ لَّمْ يَكُنْ يَدَعُهُنَّ النَّبِيُّ صلى الله عليه وسلم: “صِيَامُ عَاشُوْرَاءَ وَالْعَشْرِ وَثَلَاثَةِ أَيَّامٍ مِّنْ كُلِّ شَهْرٍ وَرَكْعَتَانِ قَبْلَ الْفَجْرِ”. رَوَاهُ النَّسَائِيُّ .
2070. (35) [1/639–అపరిశోధితం]
‘హఫ్’సహ్ (ర) కథనం: ప్రవక్త (స) ఏ నాడూ ఈ నాలుగు విషయాలను వదిలేవారు కాదు. ‘ఆషురహ్ ఉపవాసం, జి’ల్’హిజ్జహ్ 9వ తేదీ ఉపవాసం, ప్రతి నెల 3 ఉపవాసాలు, ఫజర్లోని 2సున్నత్ రకా’తులు. (నసాయి’)
2071 – [ 36 ] ( لم تتم دراسته ) (1/639)
وَعَنِ ابْنِ عَبَّاسٍ قَالَ: كَانَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم لَا يُفْطِرُ أَيَّامَ الْبِيْضِ فِيْ حَضْرٍ وَّلَا في سَفَرٍ. رَوَاهُ النَّسَائِيُّ.
2071. (36) [1/639–అపరిశోధితం]
ఇబ్నె ‘అబ్బాస్ (ర) కథనం: ప్రవక్త (స) అయ్యామె బీ‘ద్ ఉపవాసాలను ప్రయాణంలోనూ స్వస్థలంలోనూ వదిలేవారు కారు. (నసాయి’)
అంటే ప్రతినెల 13,14,15 తేదీల ఉపవాసాలు ఉండే వారు.
2072 – [ 37 ] ( ضعيف ) (1/639)
وَعَنْ أَبِيْ هُرَيْرَةَ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه و سلم: “لِكُلِّ شَيْءٍ زَكَاةٌ وَزَكَاةُ الْجَسَدِ الصَّوْمُ”. رَوَاهُ ابْنُ مَاجَهُ.
2072. (37) [1/639–బలహీనం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ప్రతి వస్తువుపై ‘జకాత్ ఉంటుంది. శరీరం యొక్క ‘జకాత్ ఉపవాసం.” [58] (ఇబ్నె మాజహ్)
2073 – [ 38 ] ( لم تتم دراسته ) (1/639)
وَعَنْ أَبِيْ هُرَيْرَةَ رَضِيَ اللهُ عَنْهُ أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم: كَانَ يَصُوْمُ يَوْمَ الْاِثْنَيْنِ وَالْخَمِيْسِ. فَقِيْلَ: يَا رَسُوْلَ اللهِ إِنَّكَ تَصُوْمُ يَوْمَ الْاِثْنَيْنِ وَالْخَمِيْسَ. فَقَالَ: “إِنَّ يَوْمَ الْاِثْنَيْنِ وَالْخَمِيْسَ يَغْفِرُ اللهُ فِيْهِمَا لِكُلِّ مُسْلِمٍ إِلَّا مُتَهَاجِرَيْنِ يَقُوْلُ: دَعَهُمَا حَتّى يَصْطَلِحَا”. رَوَاهُ أَحْمَدُ وَابْنُ مَاجَهُ .
2073. (38) [1/639–అపరిశోధితం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) సోమవారం, గురువారం ఉపవాసం ఉండేవారు. ప్రవక్త(స) ను, ‘ఓ అల్లాహ్ ప్రవక్తా! మీరు సోమవారం, గురువారం ఉపవాసం ఉంటున్నారా?’ అని ప్రశ్నించడం జరిగింది. ప్రవక్త (స) అవును సోమవారం, గురువారం అల్లాహ్ (త) ముస్లిములందరి పాపాలను క్షమిస్తాడు. కాని, పరస్పరం మాట్లాడుకోని ముస్లిముల పాపాలను క్షమించడు. వారిని గురించి ”వారు మాట్లాడుకోనంత వరకు వదలివేయండి,” అని అంటాడు.’ (అ’హ్మద్, ఇబ్నె మాజహ్)
2074 – [ 39 ] ( لم تتم دراسته ) (1/640)
وَعَنْ أَبِيْ هُرَيْرَةَ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَنْ صَامَ يَوْمًا ابْتِغَاءَ وَجْهِ اللهِ بَعَّدَهُ اللهُ مِنْ جَهَنَّمَ كَبُعْدِ غُرَابٍ طَائرٍ وَهُوَ فَرْخٌ حَتَّى مَاتَ هَرَمًا”. رَوَاهُ أَحْمَدُ
2074. (39) [1/640–అపరిశోధితం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”దైవప్రీతి కోసం ఒక రోజు ఉపవాసం పాటిస్తే, అల్లాహ్ (త) అతన్ని నరకం నుండి ఒక కాకి బాల్యం నుండి వృద్ధాప్యం వరకు ప్రయాణం చేసినంత దూరం చేస్తాడు. (అ’హ్మద్)
2075 – [ 40 ] ( لم تتم دراسته ) (1/640)
وَرَوَى الْبَيْهَقِيُّ فِيْ شُعَبِ الْإْيِمَانِ عَنْ سَلَمَةَ بْنِ قَيْسٍ .
2075. (40) [1/640–అపరిశోధితం]
దీన్నే సలమహ్ బిన్ ఖైస్ ఉల్లేఖించారు. [59] (బైహఖీ – షు’అబిల్ ఈమాన్).
=====
7- بابٌ فِيْ الْإِفْطَارِ مِنْ التَّطَوُّعِ
7. అదనపు (నఫిల్) ఉపవాసాల విరమణ
اَلْفَصْلُ الْأَوَّلُ మొదటి విభాగం
2076 – [ 1 ] ( صحيح ) (1/641)
وَعَنْ عَائِشَةَ رَضِيَ اللهُ عَنْهَا قَالَتْ: دَخَلَ عَلي النَّبِيُّ صلى الله عليه و سلم ذَاتَ يَوْمٍ فَقَالَ: “هَلْ عِنْدَكُمْ شَيْءٌ؟ “فَقُلْنَا: لَا. قَالَ: “فَإِنِّيْ إِذَا صَائِمٌ”. ثُمَّ أَتَانَا يَوْمًا آخَرَ. فَقُلْنَا: يَا رَسُوْلَ اللهِ أُهْدِيَ لَنَا حِيْسٌ فَقَالَ: “أَرِيْنِيْهِ فَلَقَدْ أَصْبَحْتُ صَائِمًا”. فَأَكَلَ. رَوَاهُ مُسْلِمٌ .
2076. (1) [1/641–దృఢం]
‘ఆయి’షహ్ (ర) కథనం: ప్రవక్త (స) ఒక రోజు నా వద్దకు వచ్చారు, ‘నీ దగ్గర ఏమైనా తినడానికి ఉందా,’ అని అడిగారు. నేను, ‘లేదు,’ అని అన్నాను. ‘అయితే నేను ఉపవాసం ఉంటాను,’ అని అన్నారు. అంటే, ‘తినడానికి ఏమీలేకుంటే, నేను ఇప్పటినుండే ఉపవాస సంకల్పం చేసుకుంటాను,’ అని అన్నారు. ఆ తరువాత మరోసారి మా ఇంటికి వచ్చారు. ‘ఏదైనా తినడానికి ఉందా?’ అని అడిగారు. నేను, ‘అవును ఉంది ఓ అల్లాహ్ ప్రవక్తా! తీపి వస్తువు కానుకగా నాకు పంపబడింది,’ అని అన్నాను. ప్రవక్త (స) నాకు చూపించు, ఈ రోజు ఉదయం నేను ఉపవాస సంకల్పం చేసుకున్నాను. కాని తినేవస్తువు ఉంది కాబట్టి ఉపవాసాన్ని విరమిస్తాను,’ అని పలికి ఆ వస్తువును తిన్నారు. [60] (ముస్లిమ్)
2077 – [ 2 ] ( صحيح ) (1/641)
وَعَنْ أَنَسٍ قَالَ: دَخَلَ النَّبِيُّ صلى الله عليه وسلم عَلَى أُمِّ سُلَيْمٍ فَأَتَتْهُ بِتَمْرٍ وَّسَمَنٍ فَقَالَ: “أُعِيْدُوْا سَمَنَكُمْ فِيْ سِقَائِهِ وَتَمْرَكُمْ فِيْ وِعَائِهِ فَإِنِّيْ صَائِمٌ”. ثُمَّ قَامَ إِلَى نَاحِيَةٍ مِّنْ الْبَيْتِ فَصَلَّى غَيْرَ الْمَكْتُوْبَةِ فَدَعَا لِأُمِّ سُلَيْمٍ وَأَهْلِ بَيْتِهَا. رَوَاهُ الْبُخَارِيُّ.
2077. (2) [1/641–దృఢం]
అనస్ (ర) కథనం: ప్రవక్త (స) ఉమ్మె సులైమ్ ఇంటికి వచ్చారు. ఉమ్మె సులైమ్ ప్రవక్త (స) తినడానికి ఖర్జూరం, నెయ్యి తెచ్చారు. ప్రవక్త (స), ‘నెయ్యిని దాని సీసాలో వేసెయ్యి, ఖర్జూరాలను దాని డబ్బాలో వేసెయ్యి. నేను వాటిని తినను, ఎందుకంటే నేను ఉపవాసంతో ఉన్నాను,’ అని అన్నారు. ఆ తరువాత ఇంట్లో ఒక మూలకు వెళ్ళారు. అదనపు నమా’జు చేసారు, ఇంకా ఉమ్మె సులైమ్ మరియు వారి కుటుంబంవారి కొరకు దు’ఆ చేసారు. (బు’ఖారీ)
2078 – [ 3 ] ( صحيح ) (1/641)
وَعَنْ أَبِيْ هُرَيْرَةَ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِذَا دُعِيَ أَحَدُكُمْ إِلَى طَعَامٍ وَّهُوَ صَائِمٌ فَلْيَقُلْ: إِنِّيْ صَائِمٌ”.
وَفِيْ رِوَايَةٍ قَالَ: “إِذَا دُعِيَ أَحَدُكُمْ فَلْيُجِبْ فَإِنْ كَانَ صَائِمًا فَلْيُصَلِّ وَإِنْ كَانَ مُفْطِرًا فَلْيُطْعِمْ”. رَوَاهُ مُسْلِمٌ.
2078. (3) [1/641–దృఢం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మీలో ఎవరినైనా ఉపవాసస్థితిలో విందుకు ఆహ్వానిస్తే, అతడు, ‘నేను ఉపవాసంతో ఉన్నానని చెప్పివేయాలి.’
మరో ఉల్లేఖనంలో ఇలా ఉంది, మీలో ఎవరినైనా విందుకు ఆహ్వానిస్తే, ఆహ్వానాన్ని స్వీకరించాలి. ఒకవేళ ఉపవాసంతో ఉంటే, అతడు నమా’జు చదవాలి. ఒకవేళ ఉపవాసంతో లేకపోతే విందు ఆరగించాలి. [61] (ముస్లిమ్)
—–
اَلْفَصْلُ الثَّانِيْ రెండవ విభాగం
2079 – [ 4 ] ( صحيح ) (1/642)
عَنْ أُمِّ هَانِئٍّ رَضِيَ اللهُ عَنْهَا قَالَتْ: لَمَّا كَانَ يَوْمُ الْفَتْحِ فَتْحِ مَكَّةَ جَاءَتْ فَاطِمَةُ فَجَلَسَتْ عَلَى يَسَارِ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم وَأُمُّ هَانِئٍّ عَنْ يَّمِيْنِهِ فَجَاءَتِ الْوَلِيْدَةُ بِإِنَاءٍ فِيْهِ شَرَابٌ فَنَاوَلَتْهُ فَشَرِبَ مِنْهُ ثُمَّ نَاوَلَهُ أُمَّ هَانِئٍّ فَشَرِبَتْ مِنْهُ. فَقَالَتْ: يَا رَسُوْلَ اللهِ لَقَدْ أَفْطَرْتُ وَكُنْتُ صَائِمَةً. فَقَالَ لَهَا: “أَكُنْتِ تَقْضِيْنَ شَيْئًا؟” قَالَتْ: لَا. قَالَ: “فَلَا يَضُركِ إِنْ كَانَ تَطَوُّعًا”. رَوَاهُ أَبُوْ دَاوُدَ وَالتِّرْمِذِيُّ وَالدَّارَمِيُّ.
وَفِيْ رِوَايَةٍ لِّأَحْمَدَ وَالتِّرْمِذِيُّ نَحْوَهُ. وَفِيْهِ فَقَالَتْ: يَا رَسُوْلَ اللهِ أَمَا إِنِّيْ كُنْتُ صَائِمَةً فَقَالَ: “الصَّائِمُ الْمُتَطَوِّعُ أَمِيْرُ نَفْسِهِ إِنْ شَاءَ صَامَ وَإِنْ شَاءَ أَفْطَرَ”.
2079. (4) [1/642–దృఢం]
ఉమ్మె హానీ (ర) కథనం: మక్క విజయం నాడు (అప్పటికి మక్కహ్ జయించబడింది) ఫాతిమహ్ (ర) వచ్చి ప్రవక్త (స) కు ఎడమవైపు కూర్చున్నారు. ఉమ్మెహాని ప్రవక్త (స) కుడివైపు కూర్చున్నారు. ఇంతలో ఒక బానిసరాలు ఒక గిన్నెలో త్రాగే పదార్థం తీసుకువచ్చింది. ఆమె దాన్ని ప్రవక్త (స) కు ఇచ్చింది. ప్రవక్త (స) కొంత త్రాగి మిగిలింది ఉమ్మె హానికి ఇచ్చారు. ఉమ్మెహాని కూడా కొంత త్రాగారు. ఆ తరువాత ఆమె, ‘అల్లాహ్ ప్రవక్తా! నేను ఉపవాసంతో ఉన్నాను. ఈ నీళ్ళు త్రాగి నేను ఉపవాసాన్ని విరమించాను,’ అని అన్నారు. అప్పుడు ప్రవక్త (స), ‘తప్పిన ఉపవాసాలు పాటిస్తున్నావా?’ అని అడిగారు. దానికి ఆమె, ‘లేదు,’ అని అన్నారు. ప్రవక్త (స), ‘అదనపు ఉపవాసం అయితే మరేం ఫర్వాలేదు,’ అని అన్నారు. (అబూ దావూద్, తిర్మిజి’, దారమి’)
మరో ఉల్లేఖనంలో ఇలా ఉంది, ”ఉమ్మె హానీ, ‘అల్లాహ్ ప్రవక్తా(స)! నేను ఉపవాసంతో ఉన్నాను,’ అని అన్నారు. ప్రవక్త (స), ‘అదనపు ఉపవాసం ఉండేవాడు తనకు తాను నాయకుడు, యజమాని. అతడు కోరితే కొనసాగించగలడు, లేకపోతే విరమించ గలడు,’ అని అన్నారు.
2080 – [ 5 ] ( لم تتم دراسته ) (1/642)
وَعَنِ الزُّهْرِيِّ عَنْ عُرْوَةَ عَنْ عَائِشَةَ قَالَتْ: كُنْتُ أَنَا وَحَفْصَةُ صَائِمَتَيْنِ فَعَرَضَ لَنَا طَعَامٌ اشْتَهَيْنَاهُ فَأَكَلْنَا مِنْهُ. فَقَالَتْ حَفْصَةُ: يَا رَسُوْلَ اللهِ إِنَّا كُنَّا صَائِمَتَيْنِ فَعَرَضَ لَنَا طَعَامٌ اشْتَهَيْنَاهُ فَأَكَلْنَا مِنْهُ. قَالَ: “أَقْضِيَا يَوْمًا آخَرَ مَكَانَهُ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَذَكَرَ جَمَاعَةً مِّنَ الْحُفَّاظِ رَوَوْا عَنِ الزُّهْرِيِّ عَنْ عَائِشَةَ مُرْسَلًا وَلَمْ يَذْكُرُوْا فِيْهِ عَنْ عُرْوَةَ وَهَذَا أَصَحُّ وَرَوَاهُ أَبُوْ دَاوُدَ عَنْ زُمِيْلٍ مَّوْلَى عُرْوَةَ عَنْ عُرْوَةَ عَنْ عَائِشَةَ .
2080. (5) [1/642–అపరిశోధితం]
‘జుహ్రీ – ‘ఉర్వహ్ ద్వారా, ‘ఉర్వహ్ -‘ఆయి’షహ్ (ర) ద్వారా ఉల్లేఖిస్తున్నారు. ‘ఆయి’షహ్ (ర) కథనం: ”నేను హఫ్’సహ్ ఇద్దరం ఉపవాసం ఉన్నాం. మా ముందు అన్నం పెట్టడం జరిగింది. మాకు తినాలని కోరిక ఉండేది. మేము దాన్ని తిన్నాం. ఉపవాసాన్ని విరమించాం. ‘హఫ్’సహ్ (ర), ‘అల్లాహ్ ప్రవక్తా! మే మిద్దరం ఉపవాసంతో ఉండేవారం. మా ముందు ఆహారం పెట్టడం జరిగింది. మాకు తినాలని కోరిక కలిగి మేమిద్దరం తిన్నాము,’ అని విన్న వించుకుంది.’ అది విని ప్రవక్త (స) దాన్ని మరో రోజు ఉపవాసం ఉండి పూర్తిచేసుకోండి’ అని అన్నారు. (తిర్మిజి’, అబూ దావూద్).
హదీసువేత్తల ఒక బృందం ‘జుహ్రీ ద్వారా ఉల్లేఖించారు. ‘జుహ్రీ ‘ఆయి’షహ్ (ర) ద్వారా ముర్సల్ ఉల్లేఖించారు. ఇందులో ‘ఉర్వహ్ ప్రస్తావన లేదు. అందుకే దీన్ని ముర్సల్ అంటాం. అబూ దావూద్ ‘జుమీల్ ద్వారా ఉల్లేఖించారు. ‘జుమీల్ ‘ఉర్వ ద్వారా, ‘ఉర్వహ్ ‘ఆయి’షహ్ ద్వారా ఉల్లేఖించారు. [62]
2081 – [ 6 ] ( لم تتم دراسته ) (1/643)
وَعَنْ أُمِّ عُمَارَةَ بِنْتِ كَعْبٍ أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم دَخَلَ عَلَيْهَا فَدَعَتْ لَهُ بِطَعَامٍ. فَقَالَ لَهَا: “كُلِيْ”. فَقَالَتْ: إِنِّيْ صَائِمَةٌ. فَقَالَ النَّبِيُّ صلى الله عليه وسلم: “إِنَّ الصَّائِمَ إِذَا أُكِلَ عِنْدَهُ صَلَتْ عَلَيْهِ الْمَلَائِكَةُ حَتَّى يَفْرَغُوْا”. رَوَاهُ أَحْمَدُ وَالتِّرْمِذِيُّ وَابْنُ مَاجَهُ وَالدَّارَمِيُّ.
2081. (6) [1/643–అపరిశోధితం]
ఉమ్మె ‘ఉమారహ్ బింతె క’అబ్ (ర) కథనం: ప్రవక్త (స) వారి ఇంటికి వెళ్ళారు. వారు ప్రవక్త (స) కోసం భోజనం తెప్పించారు. ప్రవక్త (స), ఉమ్మె ‘ఉమారహ్ ను, ‘నీవుకూడా తిను,’ అని అన్నారు. అప్పుడు ఉమ్మె ఉమారహ్, ‘నేను ఉపవాసంతో ఉన్నాను,’ అని అన్నారు. దానికి ప్రవక్త (స), ‘ఉపవాసంతో ఉన్న వ్యక్తి ముందు అన్నం తినబడు తుంటే కారుణ్య దైవదూతలు అన్నం తినబడేంత వరకు ఉపవాసకుని కోసం ప్రార్థిస్తూ ఉంటారు,’ అని ప్రవచించరు. (అ’హ్మద్, తిర్మిజి’, ఇబ్నె మాజహ్, దారమి)
—–
اَلْفَصْلُ الثَّالِثُ మూడవ విభాగం
2082 – [ 7 ] ? (1/643)
عَنْ بُرَيْدَةَ قَالَ: دَخَلَ بِلَالٌ عَلَى رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم وَهُوَ يَتَغَدَّى. فَقَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “اَلْغَدَاءُ يَا بِلَالُ”. قَالَ: إِنِّيْ صَائِمٌ يَا رَسُوْلَ اللهِ. فَقَالَ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم: “نَأْكُلُ رِزْقَنَا وَفَضْلُ رِزْقِ بِلَالٍ فِيْ الْجَنَّةِ أَشَعَرْتَ يَا بِلَالُ أَنَّ الصَّائِمَ نُسَبِّحُ عِظَامُهُ وَتُسْتَغْفِرُ لَهُ الْمَلَائِكَةُ مَا أُكِلَ عِنْدَهُ؟” رَوَاهُ الْبَيْهَقِيُّ فِيْ شُعَبِ الْإِيْمَانِ.
2082. (7) [1/643–?]
బురైదహ్ (ర) కథనం: బిలాల్ (ర) ప్రవక్త (స) వద్దకు వచ్చారు. అప్పుడు ప్రవక్త (స) ఉదయపు అల్పాహారం తింటున్నారు. ప్రవక్త(స) బిలాల్‌ను ”బిలాల్! ఉదయపు అల్పాహారం తయారు ఉంది తినేయి,” అన్నారు. అప్పుడు బిలాల్, ‘నేను ఉపవాసంతో ఉన్నాను,’ అని అన్నారు. అప్పుడు ప్రవక్త (స), ‘మేము మా ఆహారాన్ని ఇహలోకంలో తింటున్నాము. అయితే, బిలాల్ ఉత్తమ ఉపాధి స్వర్గంలో ఉంది. ‘ ‘ఓ బిలాల్! ఉపవాసకుని ఎముకలు దైవస్మరణ చేస్తాయని, కారుణ్య దైవ దూతలు ఉపవాసకుని కోసం ప్రార్థిస్తాయని, క్షమాపణ కోరుతాయని, ఇలా అతని ముందు ఆహారం తినబడేంత వరకు జరుగుతుందని, నీకు తెలుసా?’ అని అన్నారు. (బైహఖీ-షు’అబిల్ ఈమాన్)
=====
8- بَابُ لَيْلَةُ الْقَدْرِ
8. ఘనతగల రాత్రి (లైలతుల్ ఖద్ర్)
షబె (లైలతుల్) ఖద్ర్, అంటే గౌరవనీయమైన రాత్రి. ఇస్లామీయ పరిభాషలో రమ’దాన్ చివరి దశకంలోని అయిదు బేసి రాత్రుల్లోని ఒక రాత్రిని లైలతుల్ ఖద్ర్ అని అంటారు. ఇందులో ఆరాధించడం వేయి రాత్రుల ఆరాధన కంటే గొప్పది. దీని గొప్పతనాన్ని గురించి, ప్రాముఖ్యతను గురించి, ప్రాధాన్యతను గురించి అల్లాహ్ (త) ఖుర్ఆన్లో పేర్కొన్నాడు: ”నిశ్చయంగా, మేము దీనిని (ఈ ఖుర్ఆన్ ను) ఘనతగల ఆరాత్రి (అల్-ఖద్ర్)లో అవతరింపజేశాము. మరియు ఆ ఘనతగల రాత్రి అంటే ఏమిటో నీకేం తెలుసు? ఆఘనతగల రాత్రి వేయి నెలలకంటే శ్రేష్ఠమైనది. ఆరాత్రిలో దేవదూతలు మరియు ఆత్మ (జిబ్రీల్), తమ ప్రభువు అను మతితో, ప్రతి (వ్యవహారానికి సంబంధించిన) ఆజ్ఞలు తీసుకుని దిగివస్తారు. ఆ రాత్రిలో తెల్లవారే వరకు శాంతి వర్థిల్లుతుంది.” (సూ. అల్ ఖద్ర్, 97:1-5)
ఈ సూరహ్ యొక్క అవతరణా కారణం ఏమిటంటే ప్రవక్త (స) బనీ ఇస్రాయీ’ల్ కు చెందిన నలుగురు భక్తుల గురించి ప్రస్తావించారు. వీరు 80 సంవత్సరాల వరకు అల్లాహ్‌ను ఆరాధించారు. ఒక రవ్వంత కూడా దైవ అవిధేయతకు పాల్పడలేదు. వీరు అయ్యూబ్ (‘అ), ‘జకరియా (‘అ), ‘హిజ్కీల్ (‘అ), యూష‘అ (‘అ). ప్రవక్త (స) అనుచరులకు చాలా ఆశ్చర్యం వేసింది. అప్పుడు ప్రవక్త (స) వద్దకు జిబ్రీల్ (‘అ) వచ్చి ఇలా అన్నారు, ”ఓ ము’హమ్మద్ (స), ఈ బృందం ఆ ఆరాధనపట్ల ఆశ్చర్యం వ్యక్తం చేసింది. కనుక అల్లాహ్ (త) అంతకంటే ఉన్నతమైన విషయాన్ని అవతరింపజేశాడు. అది షబె ఖద్ర్. అది మీరు మీ సమాజం ఆశ్చర్యం చెందిన దానికంటే ఉత్తమమైనది’ అని అన్నారు. ప్రవక్త (స) ఆయన అనుచరులు చాలా సంతోషించారు. (ఇబ్నెకసీ’ర్, ఇబ్నె అబీ’హాతిమ్)
ముజాహిద్ దీని భావాన్ని ఇలా పేర్కొన్నారు, ”ఈ రాత్రిలో చేసే సత్కార్యం, ఉపవాసం, నమా’జు వేయి సంవత్సరాల ఉపవాసాలు, నమా’జుల కంటే ఉత్తమ మైనది. (ఇబ్నెకసీ’ర్).
షబె ఖద్ర్ ప్రాధాన్యతను గురించి, ప్రాముఖ్యతను గురించి అనేక ‘హదీసు’లు ఉన్నాయి. వాటిలో కొన్నింటిని క్రింద పేర్కొనడం జరిగింది.
اَلْفَصْلُ الْأَوَّلُ మొదటి విభాగం
2083 – [ 1 ] ( صحيح ) (1/644)
وَعَنْ عَائِشَةَ رَضِيَ اللهُ عَنْهَا قَالَتْ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “تَحَرَّوْا لَيْلَةَ الْقَدْرِ فِيْ الْوِتْرِ مِنَ الْعَشْرِ الْأَوَاخِرِ مِنْ رَمَضَانَ”. رَوَاهُ الْبُخَارِيُّ.
2083. (1) [1/644–దృఢం]
‘ఆయి’షహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”రమ’దాన్ చివరి దశకంలోని బేసి రాత్రుల్లో షబె ఖద్ర్ను వెదకండి,
(అంటే 21, 23, 25, 27, 29 రాత్రులు.” (బు’ఖారి)
2084 – [ 2 ] ( متفق عليه ) (1/644)
وَعَنِ ابْنِ عُمَرَ قَالَ: إِنَّ رِجَالًا مِّنْ أَصْحَابِ النَّبِيِّ صلى الله عليه وسلم أُرُوْا لَيْلَةَ الْقَدْرِ فِيْ الْمَنَامِ فِيْ السَّبْعِ الْأَوَاخِرِ .فَقَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “أَرَى رُؤْيَاكُمْ قَدْ تَوَاطَأَتْ فِيْ السَّبْعِ الْأَوَاخِرِ فَمَنْ كَانَ مُتَحَرِّيَهَا فَلْيَتَحَرَّهَا فِيْ السَّبْعِ الْأَوَاخِرِ”
2084. (2) [1/644–ఏకీభవితం]
‘అబ్దుల్లాహ్ బిన్ ‘ఉమర్ (ర) కథనం: ప్రవక్త (స) అనుచరులకు రమ’దాన్ చివరి 7 రాత్రులు కలలో షబె-ఖద్ర్ చూపడం జరిగింది. అది విన్న ప్రవక్త (స) ఇలా అన్నారు, ”నా అభిప్రాయం మీ కల రమ’దాన్ చివరి ఏడు రాత్రులది సరైనదే. అంటే అందరూ రమ’దాన్ చివరి రాత్రుల్లో షబె ఖద్ర్ను చూశారు. షబె ఖద్ర్ను కోరేవారు రమ’దాన్ చివరి ఏడు రాత్రుల్లో వెదకాలి. [63] (బు’ఖారి, ముస్లిమ్)
2085 – [ 3 ] ( صحيح ) (1/644)
وَعَنِ ابْنِ عَبَّاسٍ أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم قَالَ: اَلْتَمِسُوْهَا فِيْ الْعَشَرِ الْأَوَاخِرِ مِنْ رَمَضَانَ لَيْلَةَ الْقَدْرِ: فِيْ تَاسِعَةٍ تَبْقَى فِيْ سَابِعَةٍ تَبْقَى فِيْ خَامِسَةٍ تَبْقَى. رَوَاهُ الْبُخَارِيُّ.
2085. (3) [1/644–దృఢం]
ఇబ్నె ‘అబ్బాస్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”షబె ఖద్ర్ను రమ’దాన్ చివరి దశకంలో వెదకండి. అంటే 9 రాత్రులు మిగిలి ఉండగా లేదా 7 రాత్రులు లేదా 5 రాత్రులు. (బు’ఖారి)
2086 – [ 4 ] ( متفق عليه ) (1/644)
وَعَنْ أَبِيْ سَعِيْدِ الْخُدَرِيِّ رضي الله عَنْهُمْ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم اِعْتَكَفَ الْعَشَرَ الْأَوَّلَ مِنْ رَمَضَانَ ثُمَّ اعْتَكَفَ الْعَشَرَ الْأَوْسَطَ فِيْ قُبَّةٍ تُرْكِيَّةٍ ثُمَّ أَطْلَعَ رَأْسَهُ. فَقَالَ: “إِنِّيْ اَعْتَكِفُ الْعَشْرِ الْأَوَّلَ أَلْتَمِسُ هَذِهِ اللَّيْلَةَ ثُمَّ اَعْتَكِفُ الْعَشْرَ الْأَوْسَطَ ثُمَّ أُتِيْتُ. فَقِيْلَ لِيْ إِنَّهَا فِيْ الْعَشْرِ الْأَوَاخِرِ فَمَنْ كان أَعْتَكَفَ مَعِيَ فَلِيُعْتَكِفِ الْعَشْرَ الْأَوَاخِرَ. فَقَدْ أُرِيْتُ هَذِهِ اللَّيْلَةَ ثُمَّ أُنْسِيْتُهَا. وَقَدْ رَأَيْتُنِيْ أَسْجُدْ فِيْ مَاءٍ وَّطِيْنٍ مِّنْ صَبِيْحَتِهَا فَالْتَمِسُوْهَا فِيْ الْعَشْرِ الْأَوَاخِرِ وَالْتَمِسُوْهَا فِيْ كُلِّ وَتْرٍ”. قَالَ: فَمَطَرَتِ السَّمَاءُ تِلْكَ اللَّيْلَةَ وَكَانَ الْمَسْجِدُ عَلَى عَرِيْشٍ فَوَكَفَ الْمَسْجِدُ فَبَصُرَتْ عَيْنَايَ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم وَعلَى جَبْهَتِهِ أَثَرُالْمَاءِ وَالطِّيْنِ مِنْ صَبِيْحَةِ إِحْدَى وَّعِشْرِيْنَ.
فِيْ الْمَعْنَى وَاللَّفْظُ لِمُسْلِمٍ إِلَى قَوْلِهِ: “فَقِيْلَ لِيْ: إِنَّهَا فِيْ الْعَشْرِ الْأَوَاخِرِ”. وَالْبَاقِيْ لِلْبُخَارِيِّ .
2086. (4) [1/644–ఏకీభవితం]
అబూ స’యీద్ ‘ఖుద్రీ (ర) కథనం: ప్రవక్త (స) రమ’దాన్ మొదటి దశకంలో ఏ’తెకాఫ్ పాటించారు. ఆ తరువాత మధ్య దశకంలో ఏ’తెకాఫ్ ఒక తుర్కీ టెంట్లో పాటించారు. ఆ తరువాత ఒక రోజు ప్రవక్త (స) టెంట్ నుండి తల బయటకు తీసి, నేను మొదటి దశకంలో ఏ’తెకాఫ్ పాటించాను. షబె ఖద్ర్ను వెదికాను, కాని మొదటి దశకంలో షబె ఖద్ర్ లభించలేదు. మళ్ళీ నేను మధ్య దశకంలో ఏ’తెకాఫ్ పాటించాను. కాని అందులో కూడా దొరకలేదు. ఆ తరువాత నా దగ్గరకు ఒక దైవదూత వచ్చాడు. షబె ఖద్ర్ రమ’దాన్ చివరి దశకంలో ఉందని తెలిపాడు. నాతోపాటు ఏతెకాఫ్ పాటించదలచిన వ్యక్తి చివరి దశకంలో కూడా ఏతెకాఫ్ పాటించాలి. నాకు స్వప్నంలో షబె ఖద్ర్ చూపించబడింది. మళ్ళీ మరిపించబడింది. కలలో నన్ను నేను షబె ఖద్ర్ ఉదయం బురదలో సజ్దా చేస్తూ ఉండగా చూశాను. కనుక షబె ఖద్ర్ను చివరి దశకంలో వెతకండి. ప్రతి బేసి రాత్రిలో వెతకండి అని ఉపదేశించారు.
షబె ఖద్ర్ రాత్రి వర్షం పడింది. మస్జిద్‌పై కప్పు ఖర్జూరం ఆకులతో చేయబడి ఉండేది. వర్షం వల్ల మస్జిద్లో నీళ్ళు కారాయి. మస్జిద్లో అంతా బురద మయం అయిపోయింది. నేను ప్రవక్త (స) నుదుటిపై బురద తగిలి ఉండటం చూశాను. అది 21వ రాత్రి ఉదయం అని ఉల్లేఖన కర్త అన్నారు. (బు’ఖారీ)
2087 – [ 5 ] ( صحيح ) (1/645)
وَفِيْ رِوَايَةِ عَبْدِ اللهِ بْنِ أُنَيْسٍ قَالَ: “لَيْلَةِ ثَلَاثٍ وَّعِشْرِيْنَ”. رَوَاهُ مُسْلِمٌ.
2087. (5) [1/645–దృఢం]
‘అబ్దుల్లాహ్ బిన్ ఉనైస్ (ర) కథనంలో 23వ రాత్రి అని ఉంది. (ముస్లిమ్)
2088 – [ 6 ] ( صحيح ) (1/645)
وَعَنْ زِرِّ بْنِ حُبَيْشٍ قَالَ: سَأَلْتُ أُبَيَّ بْنَ كَعْبٍ. فَقُلْتُ إِنَّ أَخَاكَ ابْنَ مَسْعُوْدِ يَقُوْلُ: مَنْ يُّقِمِ الْحُوْلَ يُصِبْ لَيْلَةَ الْقَدْر. فَقَالَ رَحِمَهُ اللهُ أَرَادَ أَنْ لَّا يَتَّكِلَ النَّاسُ أَمَا إِنَّهُ قَدْ عَلِمَ أَنَّهَا فِيْ رَمَضَانَ وَأَنَّهَا فِيْ الْعَشْرِ الْأَوَاخِرِ وَأَنَّهَا لَيْلَةُ سَبْعٍ وَّعِشْرِيْنَ ثُمَّ حَلَفَ لَا يَسْتَثْنِيْ أَنَّهَا لَيْلَةُ سَبْعٍ وَّعِشْرِيْنَ. فَقُلْتُ: بِأَيِّ شَيْءٍ تَقُوْلُ ذَلِكَ يَا أَبَا الْمُنْذِرِ؟ قَالَ: بِالْعَلَامَةِ أَوْ بِالْآيَةِ الَّتِيْ أَخْبَرَنَا رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم أَنَّهَا تَطْلُعُ يَوْمَئِذٍ لَّا شُعَاعَ لَهَا. رَوَاهُ مُسْلِمٌ
2088. (6) [1/644–దృఢం]
‘జిర్ బిన్ ‘హుబైష్ (ర) కథనం: నేను ఉబయ్ బిన్ క’అబ్ను ”మీ సోదరులు ‘అబ్దుల్లాహ్ బిన్ మస్’ఊద్ షబె ఖద్ర్ విషయంలో ఒక వ్యక్తి సంవత్సరమంతా రాత్రులు ఆరాధిస్తే, అతనికి సంవత్సరం మొత్తంలో ఏదో ఒక రాత్రి షబె ఖద్ర్ దొరికిపోతుంది అని అంటు న్నారు.” అని చెప్పారు. (ఏమీ అతని ఈ ఆదేశం సరైనదేనా?) అప్పుడు ఉబయ్ బిన్ క’అబ్ ”అల్లాహ్ (త) ఇబ్నె మస్’ఊద్‌ను కరుణించుగాక! ప్రజలు ఆ ఒక్క రాత్రినే నమ్ముకొని ఉండకూడదని అలా చెప్పి ఉంటారు. ఎందుకంటే షబె ఖద్ర్ రమ’దాన్లో ఉందని, రమ’దాన్ చివరి దశకంలో ఉందని, అది 27వ రాత్రి షబె ఖద్ర్,” అని అన్నారు. ‘ఓ అబూ మున్జిర్ మీరు ఎలా కనిపెట్టారు?’ అని నేను అడిగాను. దానికి అతను, ‘ప్రవక్త (స) మాకు ఇచ్చిన సూచనలు, చిహ్నాల ద్వారా అంటే ఆ రాత్రి ఉదయం సూర్యుడు ఉదయిస్తే అందులో కిరణాలు ఉండవు. అంటే తక్కువ వెలుగు ఉంటుంది,’ అని అన్నారు. (ముస్లిమ్)
2089 – [ 7 ] ( صحيح ) (1/645)
وَعَنْ عَائِشَةَ رَضِيَ اللهُ عَنْهَا قَالَتْ: كَانَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم يَجْتَهِدُ فِيْ الْعَشْرِ الْأًوَاخِرِ مَا لَا يَجْتَهِدُ فِيْ غَيْرِهِ. رَوَاهُ مُسْلِمٌ .
2089. (7) [1/645–దృఢం]
‘ఆయి’షహ్ (ర) కథనం: ప్రవక్త (స) రమ’దాను చివరి దశకంలో భక్తిశ్రద్ధలతో ఆరాధించినట్లు ఇతర దినాల్లో అంతశ్రద్ధాశక్తులతో ఆరాధనచేసేవారు కారు. (ముస్లిమ్)
2090 – [ 8 ] ( متفق عليه ) (1/645)
وَعَنْ عَائِشَةَ رَضِيَ اللهُ عَنْهَا قَالَتْ: كَانَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم إِذَا دَخَلَ الْعَشْرُ شَدَّ مِئْزَرَهُ وَأَحْيَا لَيْلَهُ وَأَيْقَظَ أَهْلَهُ.
2090. (8) [1/645–ఏకీభవితం]
‘ఆయి’షహ్ (ర) రమ’దాన్ చివరి దశకం రాగానే ప్రవక్త (స) నడుం బిగించేవారు, రాత్రి మేల్కొని ఉండే వారు, తన కుటుంబం వారినీ మేల్కొలిపేవారు. [64] (బు’ఖారి, ముస్లిమ్)
—–
اَلْفَصْلُ الثَّانِيْ రెండవ విభాగం
2091 – [ 9 ] ( صحيح ) (1/646)
وَعَنْ عَائِشَةَ رَضِيَ اللهُ عَنْهَا قَالَتْ: قُلْتُ: يَا رَسُوْلَ اللهِ أَرَأَيْتَ إِنْ عَلِمْتُ أَيُّ لَيْلَةُ الْقَدْرِمَا أَقُوْلُ فِيْهَا؟ قَالَ: قَوْلِيْ: “اللَّهُمَّ إِنَّكَ عَفُوٌ تُحِبُّ الْعَفُوَ فَاعْفُ عَنِّيْ”. رَوَاهُ أَحْمَدُ وَابْنُ مَاجَهُ وَالتِّرْمِذِيُّ وَصَحَّحَهُ .
2091. (9) [1/646–దృఢం]
‘ఆయి’షహ్ (ర) కథనం: ప్రవక్త (స)ను నేను, ‘ఒకవేళ నాకు షబె-ఖద్ర్ లభిస్తే, అందులో నేను ఏమని దు’ఆ చేయాలి,’ అని విన్నవించుకున్నాను. ప్రవక్త (స) ఈ దు’ఆ పఠించమని ఉపదేశించారు. ”అల్లాహుమ్మ ఇన్నక ‘అఫువ్వున్ తు‘హిబ్బుల్ ‘అఫువ ఫ‘అఫు ‘అన్నీ” — ‘ఓ అల్లాహ్! నీవు క్షమించేవాడవు, క్షమాపణను ఇష్టపడతావు. కావున నీవు నన్ను క్షమించు.’ (అ’హ్మద్, ఇబ్నె మాజహ్, తిర్మిజి’ – దృఢం)
2092 – [ 10 ] ( لم تتم دراسته ) (1/646)
وَعَنْ أَبِيْ بَكْرَةَ قَالَ: سَمِعْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ: “اَلْمِسُوْهَا يَعْنِيْ لَيْلَةَ الْقَدْرِ فِيْ تِسْعٍ يَّبْقِيْنَ أَوْ فِيْ سَبْعٍ يَّبْقِيْنَ أَوْ فِيْ خَمْسٍ يَّبْقِيْنَ أَوْ ثَلَاثٍ أَوْ آخِرِ لَيْلَةٍ”. رَوَاهُ التِّرْمِذِيُّ.
2092. (10) [1/646–అపరిశోధితం]
అబూ బక్రహ్ (ర) కథనం: ప్రవక్త (స)ను ఇలా అంటూ ఉండగా విన్నాను, ”మీరు షబె ఖద్ర్ను వెతకండి. అంటే మిగిలి ఉన్న 9వ రాత్రి, లేదా మిగిలి ఉన్న 7వ రాత్రి, లేదా మిగిలి ఉన్న 5వ రాత్రి లేదా 3వ రాత్రి లేదా చివరి రాత్రి. (తిర్మిజి’)
అంటే 21, 23, 25, 27 లేదా 29వ రాత్రి.
2093 – [ 11 ] ( لم تتم دراسته ) (1/646)
وَعَنِ ابْنِ عُمَرَ قَالَ: سُئِلَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم عَنْ لَيْلَةِ الْقَدْرِ فَقَالَ: “هِيَ فِيْ كُلِّ رَمَضَانَ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ وَقَالَ: رَوَاهُ سُفْيَانُ وَشُعْبَةُ عَنْ أَبِيْ إِسْحَقٍ مَوْقُوْفًا عَلَى ابْنِ عُمَرَ.
2093. (11) [1/646–అపరిశోధితం]
‘అబ్దుల్లాహ్ బిన్ ‘ఉమర్ (ర) కథనం: షబె ఖద్ర్ గురించి ప్రవక్త(స)ను ప్రశ్నించడం జరిగింది. ప్రవక్త (స) ఈ రాత్రి ప్రతి రమ’దాన్లో, చివరి దశకంలోని బేసి రాత్రుల్లో వస్తుంది అని అన్నారు. (అబూ దావూద్)
అబూ దావూద్ ఇంకా ఇలా ఉల్లేఖించారు, దీన్ని సుఫియాన్, షు’అబహ్, అబూ ఇ’స్హాఖ్ ద్వారా మౌఖూఫన్ అలా ‘అబ్దుల్లాహ్ బిన్ ‘ఉమర్ (తాబయీ ప్రోక్తం).
2094 – [ 12 ] ( لم تتم دراسته ) (1/646)
وَعَنْ عَبْدِ اللهِ بْنِ أُنَيْسٍ قَالَ: قُلْتُ يَا رَسُوْلَ اللهِ إِنَّ لِيْ بَادِيَةً أَكُوْنُ فِيْهَا وَأَنَا أُصَلِّيْ فِيْهَا بِحَمْدِ اللهِ فَمُرْنِيْ بِلَيْلَةٍ أَنْزِلُهَا إِلَى هَذَا الْمَسْجِدِ فَقَالَ: “اَنْزِلْ لَيْلَةَ ثَلَاثٍ وَّعِشْرِيْنَ”. قِيْلَ لِاِبْنِهِ:كَيْفَ كَانَ أَبُوْكَ يَصْنَعُ؟ قَالَ: كَانَ يَدْخُلُ الْمَسْجِدَ إِذَا صَلَّى الْعَصْرَ فَلَا يَخْرُجُ مِنْهُ لِحَاجَةٍ حَتَّى يُصَلِّيَ الصُّبْحَ فَإِذَا صَلَّى الصُّبْحَ وَجَدَ دَابَّتَهُ عَلَى بَابِ الْمَسْجِدِ فَجَلَسَ عَلَيْهَا وَلَحِقَ بِبَادِيَتِهِ. رَوَاهُ أَبُوْ دَاوُدَ.
2094. (12) [1/646–అపరిశోధితం]
‘అబ్దుల్లాహ్ బిన్ ఉనైస్ (ర) కథనం: ప్రవక్త (స)ను, ‘ఓ అల్లాహ్ ప్రవక్తా! నా ఇల్లు అడవిలో, ఒక పల్లెలో ఉంది. అల్లాహ్ దయవల్ల నేను కూడా నమా’జ్ చదువుకుంటున్నాను. తమరు దయచేసి షబె ఖద్ర్ ఏ రాత్రి వస్తుందో తెలియపర్చండి. తద్వారా నేను షబె ఖద్ర్‌లో మస్జిదె నబవీలో నమా’జ్ చదువటానికి వస్తాను,’ అని విన్నవించుకున్నాను. ప్రవక్త (స), ’23వ రాత్రి వచ్చి పాల్గొను,’ అని అన్నారు. ‘అబ్దుల్లా బిన్ ఉనైస్ కుమారున్ని, ‘మీ నాన్నగారు ఏం చేస్తుండే వారు,’ అని ప్రశ్నించడం జరిగింది. అతను సమాధానం ఇస్తూ, ‘అసర్ నమా’జు చదివి మస్జిద్లో ప్రవేశించి ఏ అవసరానికీ బయటకు వచ్చేవారు కాదు. చివరికి ఫజ్ర్ నమా’జు చదివి మస్జిద్ నుండి బయటకు వచ్చేవారు. మస్జిద్ బయట ఉన్న వాహనంపై ఎక్కి ఇంటికి చేరుకునే వారు అని అన్నారు.’ [65] (అబూ దావూద్)
—–
اَلْفَصْلُ الثَّالِثُ మూడవ విభాగం
2095 – [ 13 ] ( صحيح ) (1/647)
عَنْ عُبَادَةَ بْنِ الصَّامِتِ قَالَ: خَرَجَ النَّبِيُّ صلى الله عليه وسلم لِيُخْبِرَنَا بِلَيْلَةِ الْقَدْرِ فَتَلَاحَى رَجُلَانِ مِنَ الْمُسْلِمِيْنَ فَقَالَ: “خَرَجْتُ لِأُخْبِرَكُمْ بِلَيْلَةِ الْقَدْرِ فَتَلَاحَى فُلَانٌ وَفُلَانٌ فَرُفِعَتْ وَعَسَى أَنْ يَّكُوْنَ خَيْرًا لَّكُمْ فَالْتَمِسُوْهَا فِيْ التَّاسِعَةِ وَالسَّابِعَةِ وَالْخَامِسَةِ”. رَوَاهُ الْبُخَارِيُّ .
2095. (13) [1/647–దృఢం]
‘ఉబాదా బిన్ ‘సామిత్ (ర) కథనం: ప్రవక్త (స) షబెఖద్ర్ గురించి ప్రజలకు తెలియజేయడానికి ఇంటి నుండి బయలు దేరారు. దారిలో ఇద్దరు ముస్లిములు పోట్లాడుకోవటం చూచి వారి సమస్య పరిష్కరించడంలో నిమగ్నులయి అసలు విషయం మరచిపోయారు. ప్రవక్త (స), ‘నేను షబె ఖద్ర్ గురించి మీకు తెలుపుదామని ఇంటి నుండి బయలు దేరాను. దారిలో ఇద్దరు పోట్లాడు కుంటున్నారు. ఆ రాత్రి విషయం నా నుండి చెరిపి వేయబడింది. అయితే అందులోనే మీకోసం క్షేమం ఉందనుకుంటాను. కనుక మీరు 29, 27, 25, రాత్రుల్లో వెతకండి’ అని ఉపదేశించారు. (బు’ఖారీ)
2096 – [ 14 ] ( لم تتم دراسته ) (1/647)
وَعَنْ أَنَسٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِذَا كَانَ لَيْلَةُ الْقَدْرِ نَزَلَ جِبْرِيْلُ عَليه السلام فِيْ كُبْكُبَةٍ مِّنَ الْمَلَائِكَةِ يُصَلُّوْنَ عَلَى كُلِّ عَبْدٍ قَائِمٍ أَوْ قَاعِدٍ يَّذْكُرُ اللهَ عَزَّوَجَلَّ فَإِذَا كَانَ يَوْمُ عِيْدِهِمْ يَعْنِيْ يَوْمَ فِطْرِهِمْ بَاهى بِهِمْ مَلَائِكَتَهِ فَقَالَ: يا مَلَائِكَتِيْ مَا جَزَاءُ أَجِيْرٍ وَّفى عَمَلَهُ؟ قَالُوْا: رَبَّنَا جَزَاؤُهُ أَنْ يُّوَفّى أَجْرَهُ. قَالَ: مَلَائِكَتَيْ عَبِيْدِيْ وَإِمَائِيْ قَضَوْا فَرِيْضَتِيْ عَلَيْهِمْ ثُمَّ خَرَجُوْا يَعُجُّوْنَ إِلَى الدُّعَاءِ وَعِزَّتِيْ وَجَلَالِيْ وَكَرَمِيْ وَعُلُوِّيْ وَاِرْتِفَاعِ مَكَانِيْ لَأُجِيْبَنَّهُمْ .فَيَقُوْلُ: ارْجِعُوْا فَقَدْ غَفَرْتُ لَكُمْ وَبَدَلْتُ سَيِّئَاتِكُمْ حَسَنَاتٍ. قَالَ: فَيَرْجَعُوْنَ مَغْفُوْرًا لَّهُمْ”. رَوَاهُ الْبَيْهَقِيُّ فِيْ شُعَبِ الْإِيْمَانِ .
2096. (14) [1/647–అపరిశోధితం]
అనస్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం: ఖద్ర్ రాత్రి జిబ్రీల్ (అ) దైవదూతల బృందంతో పాటు ఇహలోకానికి వచ్చేస్తారు. ఈ దైవదూతలు నిలబడి, కూర్చొని, ఆరాధించే, దైవస్మరణలో నిమగ్నమయి ఉండేవారి గురించి దు’ఆ చేస్తారు. ముస్లిముల పండుగ దినంనాడు అల్లాహ్ (త) దైవదూతల ముందు గర్విస్తూ, ‘ఓ నా దూతలారా! పని పూర్తిచేసిన శ్రామికుని ప్రతిఫలం ఏమిటి?’ అని ప్రశ్నిస్తాడు. దైవదూతలు, ‘ఓ మా ప్రభూ! దయచేసి నీవు ఈ శ్రామికునికి పూర్తి ప్రతిఫలం ప్రసాదించు!’ అని విన్నవించుకుంటారు. అప్పుడు అల్లాహ్, ”ఓ నా దూతలారా! నా దాసులు నా విధిని పూర్తిగా నిర్వర్తించారు. అంటే రమ’దాను అంతా ఉపవాసం ఉన్నారు. పండుగ నమా’జ్ కొరకు ఇంటి నుండి బయలుదేరారు. బిగ్గరగా ప్రార్థిస్తూ, తక్బీర్ పలుకుతూ వచ్చారు. నేను నా గౌరవం, గొప్పతనం సాక్షిగా! నా దాతృత్వం, ఔన్నత్యం స్థానం సాక్షిగా, తప్పకుండా వీరి ప్రార్థనలను స్వీకరిస్తాను” అని అంటాడు. ఆ తర్వాత మళ్ళీ, ”మీరు పండుగ నమా’జుచదివి తిరిగివెళ్ళండి. నేను మీ పాపా లన్నింటినీ క్షమించాను, ఇంకా మీ పాపాలను పుణ్యాలుగా మార్చివేసాను” అని అల్లాహ్ (త) అంటాడు. ప్రవక్త (స) ‘వారు క్షమించబడి తిరిగి వెళ్ళుతారు’ అని అన్నారు. (బైహఖీ షు’అబుల్ ఈమాన్)
=====
9- بَابُ الْاِعْتِكَافِ
9. ఏ‘తెకాఫ్
ఏ’తెకాఫ్ అంటే ఆగిపోవటం, ఇస్లామీయ పరిభాషలో ప్రాపంచిక వ్యవహారాలన్నిటినీ వదలి ఆరాధనా సంకల్పంతో దైవప్రీతి కోసం మస్జిద్లో ఉండి ఆరాధించటాన్ని ఏ’తెకాఫ్ అంటారు. ఏ’తెకాఫ్ స్థితిలో అత్యధికంగా అదనపు నమా’జులలో ఖుర్ఆన్ పఠనంలో, దైవధ్యానంలో, దైవకీర్తనలో, దరూద్ పఠించటంలో నిమగ్నమయి ఉండటం. ఖుర్ఆన్ ‘హదీసు’లను బోధించడం, హితబోధ చేయటం కూడా ధర్మసమ్మతమే. ఎందుకంటే ఇవి కూడా ఆరాధనలే. ఏ’తెకాఫ్కు చాలా ప్రాధాన్యత ఉంది.
ప్రవక్త (స) ప్రవచనం, ”తన సోదరుని అవసరం కోసం నడచి అందులో సఫలం పొందితే, 10 సంవత్సరాలు ఏ’తెకాఫ్ పాటించటం కంటే అధికంగా పుణ్యం లభిస్తుంది. అల్లాహ్ (త) ప్రీతి కోసం ఒక్క రోజు ఏ’తెకాఫ్ పాటిస్తే అల్లాహ్ (త) అతని నుండి నరకానికి మూడు కందకాలంత దూరాన్ని చేసివేస్తాడు. అవి భూమ్యాకాశాలకంటే దూరంగా ఉన్నాయి. మరో ఉల్లేఖనంలో, ”రమ’దాన్లో పది రోజులు ఏ’తెకాఫ్ పాటించిన వారికి రెండు ‘హజ్జ్ల, రెండు ‘ఉమ్రహ్ల పుణ్యం లభిస్తుంది.” (బైహఖీ)
ఏ’తెకాఫ్ పాటించేవారు ముస్లిమయి, బహిష్టు, ప్రసవదశ, జనాబత్ల నుండి పరిశుద్ధులై ఉండాలి. ఏ’తెకాఫ్ సంకల్పం, మస్జిద్లో ఉండటం తప్పనిసరి. ఏ’తెకాఫ్ రెండురకాలు. 1. ఫ’ర్ద్, 2. సున్నత్, ఫ’ర్ద్ అంటే మొక్కుబడి, తనపై తప్పనిసరి చేసుకోవడం, అంటే, ‘దైవం కోసం నేను ఏ’తెకాఫ్ పాటిస్తాను’ అనటం వాటిని పాటించటం తప్పనిసరి. అల్లాహ్ ఆదేశం, ”…మీ మొక్కుబడులను పూర్తిచేయండి….” (సూ. అల్-‘హజ్జ్, 22:29)
‘ఉమర్ (ర) ఇస్లామ్ స్వీకరించడానికి ముందు ఏ’తెకాఫ్ చేస్తానని మొక్కుకున్నారు. ప్రవక్త (స)ను విన్నవించుకున్నారు, ప్రవక్త (స) నీ మొక్కుబడిని చెల్లించు” అని అన్నారు. (బు’ఖారీ)
రమ’దాన్ చివరి దశకంలో 10 రోజులు ఏ’తెకాఫ్ పాటించటం ప్రవక్త సాంప్రదాయం .’ఆయి’షహ్(ర), ‘ప్రవక్త (స) రమ’దాన్ చివరి దశకంలో చివరి శ్వాస వరకు ఏ’తెకాఫ్ పాటించేవారు,’ అని అన్నారు. దీని వల్ల ఏ’తెకాఫ్ తప్పనిసరి సాంప్రదాయం. ప్రవక్త (స) ప్రతి సంవత్సరం ఏ’తెకాఫ్ పాటించేవారు. ఒక సంవత్సరం రమ’దాన్లో పాటించలేదు. షవ్వాల్‌లో దాన్ని పూర్తిచేశారు. తప్పనిసరి ఏ’తెకాఫ్ 10 రోజులది ఉంటుంది.
ఏ’తెకాఫ్ పాటించేవారు మస్జిద్ నుండి బయటకు వెళ్ళరాదు. క్రింది విషయాల వల్ల మస్జిద్ నుండి బయటకు వెళ్ళవచ్చును, మలమూత్ర విసర్జన, తప్పనిసరి స్నానం, జుమ’అహ్ నమా’జు. ‘ఆయి’షహ్ (ర) కథనం, ”ప్రవక్త (స) మస్జిద్లో ఏ’తెకాఫ్ పాటిస్తే, నేను అతని తల దువ్వేదాన్ని. ప్రవక్త (స) కాలకృత్యాలకు తప్ప మరి దేనికోసం ఇంట్లోకి వచ్చేవారు కాదు. (బు’ఖారి, ముస్లిమ్)
اَلْفَصْلُ الْأَوَّلُ మొదటి విభాగం
2097 – [ 1 ] ( متفق عليه ) (1/648)
وَعَنْ عَائِشَةَ: أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم كَانَ يَعْتَكِفُ الْعَشْرَ الْأَوَاخِرَ مِنْ رَمَضَانَ حَتَّى تَوَفَّاهُ اللهُ ثُمَّ اعْتَكَفَ أَزْوَاجُهُ مِنْ بَعْدِهِ.
2097. (1) [1/648–ఏకీభవితం]
‘ఆయి’షహ్ (ర) కథనం: దైవప్రవక్త (స) జీవితాంతం రమ’దాన్ మాసంలోని చివరి దశకంలో ఏ’తెకాఫ్ పాటించేవారు. ఆయన తర్వాత ఆయన సతీమణులు కూడా ఏ’తెకాఫ్ పాటించారు. [66] (బు’ఖారి, ముస్లిమ్)
2098 – [ 2 ] ( متفق عليه ) (1/648)
وَعَنِ ابْنِ عَبَّاسٍ قَالَ: كَانَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم أَجْوَدَ النَّاسِ بِالْخَيْرِ. وَكَانَ أَجْوَدَ مَا يَكُوْنُ فِيْ رَمَضَانَ وَكَانَ جِبْرِيْلُ يَلْقَاهُ كُلَّ لَيْلَةٍ فِيْ رَمَضَانَ يَعْرِضُ عَلَيْهِ النَّبِيُّ صلى الله عليه وسلم اَلْقُرْآنَ. فَإِذَا لَقِيَهُ جِبْرَيْلُ كَانَ أَجْوَدَ بِالْخَيْرِ مِنَ الرِّيْحِ الْمُرْسَلَةِ .
2098. (2) [1/648–ఏకీభవితం]
ఇబ్నె ‘అబ్బాస్ (ర) కథనం: ప్రవక్త (స) అందరి కంటే అధికంగా దానధర్మాలు చేసేవారు. అందరికంటే అధికంగా ప్రవక్త (స) రమ’దాన్లో దానధర్మాలు చేసేవారు. జిబ్రీల్ (అ) దైవదూత రమ’దాన్లో ప్రతిరాత్రి ప్రవక్త (స)ను కలిసేవారు, ప్రవక్త (స) జిబ్రీల్ ముందు ఖుర్ఆన్ పఠించేవారు. జిబ్రీల్ ప్రవక్త (స) ను కలసినపుడు ప్రవక్త (స) దానధర్మాలు మరీ అధికం అయిపోయేవి. (బు’ఖారి, ముస్లిమ్)
2099 – [ 3 ] ( صحيح ) (1/648)
وَعَنْ أَبَيْ هُرَيْرَةَ قَالَ: كَانَ يُعْرَضُ عَلَى النَّبِيِّ صلى الله عليه وسلم اَلْقُرْآنُ كُلَّ عَامٍ مَرَّةً فَعُرِضَ عَلَيْهِ مَرَّتَيْنِ فِيْ الْعَامِ الَّذِيْ قُبِضَ وَكَانَ يَعْتَكِفُ كُلَّ عَامٍ عَشْرًا فَاعْتَكَفَ عِشْرِيْنَ فِيْ الْعَامِ الَّذِيْ قُبِضَ. رَوَاهُ الْبُخَارِيُّ.
2099. (3) [1/647–దృఢం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) ముందు ప్రతి సంవత్సరం ఖుర్ఆన్ చదవబడేది, అంటే జిబ్రీల్ పఠించేవారు. ప్రవక్త (స) వినేవారు, ప్రవక్త (స) పఠిస్తే, జిబ్రీల్ వినేవారు, ఒక’హాఫిజ్ మరో ‘హాఫిజ్‌కు వినిపించి నట్లు. ప్రవక్త (స) మరణించిన సంవత్సరం ప్రవక్త (స) ముందు రెండుసార్లు ఖుర్ఆన్ పఠించడం జరిగింది. ప్రతిసంవత్సరం ప్రవక్త (స) 10 రోజులు ఏ’తెకాఫ్ చేసేవారు. ప్రవక్త (స) మరణించిన సంవత్సరం ప్రవక్త (స) 20 రోజులు ఏ’తెకాఫ్ పాటించారు. (బు’ఖారీ)
2100 – [ 4 ] ( متفق عليه ) (1/648)
وَعَنْ عَائِشَةَ رَضِيَ اللهُ عَنْهَا قَالَتْ: كَانَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم إِذَا اعْتَكَفَ أَدْنَى إِلَيَّ رَأْسَهُ وَهُوَ فِيْ الْمَسْجِدِ فَأُرَجِّلُهُ وَكَانَ لَا يَدْخُلُ الْبَيْتَ إِلَّا لِحَاجَةِ الْإِنْسَانِ”.
2100. (4) [1/648–ఏకీభవితం]
‘ఆయి’షహ్ (ర) కథనం: ప్రవక్త (స) మస్జిద్లో ఏ’తెకాఫ్ పాటించినప్పుడు, తన తలను నావైపు చేసేవారు. నేను ప్రవక్త (స) తలను దువ్వేదాన్ని. ప్రవక్త (స) కాలకృత్యాలకు తప్ప మరి దేనికీ ఇంట్లోకి వచ్చేవారు కాదు. [67] (బు’ఖారీ, ముస్లిమ్)
2101 – [ 5 ] ( متفق عليه ) (1/648)
وَعَنِ ابْنِ عُمَرَ: أَنَّ عُمَرَ سَأَلَ النَّبِيَّ صلى الله عليه وسلم قَالَ: “كُنْتُ نَذَرْتُ فِيْ الْجَاهِلِيَّةِ أَنْ أَعْتَكِفَ لَيْلَةً فِيْ الْمَسْجِدِ الْحَرَامِ؟ قَالَ: “فَأَوْفِ بِنَذْرِكَ”.
2101. (5) [1/648–ఏకీభవితం]
‘అబ్దుల్లాహ్ బిన్ ‘ఉమర్ (ర) కథనం: ప్రవక్త (స)తో ‘ఉమర్ (ర), ”అజ్ఞానకాలంలో నేను అంటే ఇస్లామ్‌కు ముందు మస్జిదె ‘హరామ్లో ఒకరాత్రి ఏ’తెకాఫ్ పాటిస్తానని మొక్కుకున్నాను,” అని అన్నారు. ప్రవక్త (స), ”నువ్వు నీ మొక్కుబడిని పూర్తిచేసుకో,” అని అన్నారు. [68] (బు’ఖారీ)
—–
اَلْفَصْلُ الثَّانِيْ రెండవ విభాగం
2102 – [ 6 ] ( لم تتم دراسته ) (1/649)
عَنْ أَنَسٍ قَالَ: كَانَ النَّبِيُّ صلى الله عليه وسلم يَعْتَكِفُ فِيْ الْعَشْرِ الْأَوَاخِرِ مِنْ رَمَضَانَ فَلَمْ يَعْتَكِفْ عَامًا. فَلَمَّا كَانَ الْعَامُ الْمُقْبِلُ اعْتَكَفَ عِشْرِيْنَ. رَوَاهُ التِّرْمِذِيُّ.
2102. (6) [1/649–అపరిశోధ్తితం]
అనస్ (ర) కథనం: ప్రవక్త(స) రమ’దాన్ చివరి దశకంలో ఏ’తెకాఫ్ పాటించేవారు. ఒక సంవత్సరం ఏదో కారణంవల్ల ఏ’తెకాఫ్ పాటించలేదు. ఆ తరువాతి సంవత్సరం 20 రోజులు ఏ’తెకాఫ్ పాటించారు. (తిర్మిజి’)
2103 – [ 7 ] ( لم تتم دراسته ) (1/649)
وَرَوَاهُ أَبُوْ دَاوُدَ وَابْنُ مَاجَهُ عَنْ أُبَيِّ بْنِ كَعْبٍ.
2103. (7) [1/649–అపరిశోధ్తితం]
ఉబయ్ బిన్ క’అబ్ (ర) కథనం: (అబూ దావూద్, ఇబ్నె మాజహ్)
2104 – [ 8 ] ( لم تتم دراسته ) (1/649)
وَعَنْ عَائِشَةَ رَضِيَ اللهُ عَنْهَا قَالَتْ: كَانَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم إِذَا أَرَادَ أَنْ يَّعْتَكِفَ صَلَّى الْفَجْرَ ثُمَّ دَخَلَ فِيْ مُعْتَكَفِهِ. رَوَاهُ أَبُوْ دَاوُدَ وَابْنُ مَاجَهُ.
2104. (8) [1/649–అపరిశోధ్తితం]
‘ఆయి’షహ్ (ర) కథనం: ప్రవక్త (స) ఏ’తెకాఫ్ పాటించ దలచినపుడు ఫజ్ర్ నమా’జు ఆచరించి ఏ’తెకాఫ్ ప్రదేశంలోనికి ప్రవేశించేవారు. [69] (అబూ దావూద్, ఇబ్నె మాజహ్)
2105 – [ 9 ] ( لم تتم دراسته ) (1/649)
وَعَنْ عَائِشَةَ رَضِيَ اللهُ عَنْهَا قَالَتْ: كَانَ النَّبِيُّ صلى الله عليه وسلم يَعُوْدُ الْمَرِيْضَ وَهُوَ مُعْتَكِفٌ فَيَمُرُّ كَمَا هُوَ فَلَا يُعَرِّجُ يَسْأَلُ عَنْهُ. رَوَاهُ أَبُوْ دَاوُدَ وَابْنُ مَاجَهُ.
2105. (9) [1/649–అపరిశోధ్తితం]
‘ఆయి’షహ్ (ర) కథనం: ప్రవక్త (స) ఏ’తెకాఫ్ స్థితిలో రోగిని పరామర్శించేవారు. అయితే నడుస్తూనే – దాని కోసం ఆగేవారు కాదు. నడుస్తూనే మాట మంచి అడిగి తెలుసు కునేవారు. [70] (అబూ దావూద్)
2106 – [ 10 ] ( لم تتم دراسته ) (1/649)
وَعَنْ عَائِشَةَ رَضِيَ اللهُ عَنْهَا قَالَتْ: اَلسُّنَّةُ عَلَى الْمُعْتَكِفِ أَنْ لَّا يَعُوْدَ مَرِيْضًا وَّلَا يَشْهَدَ جَنَازَةً وَلَا يَمَسَّ الْمَرْأَةَ وَلَا يُبَاشِرْهَا وَلَا يَخْرُجَ لِحَاجَةٍ إِلَّا لِمَا لَا بُدَّ مِنْهُ وَلَا اعْتِكَافَ إِلَّا بِصَوْمٍ وَّلَا اِعْتِكَافَ إِلَّا فِيْ مَسْجِدٍ جَامِعٍ. رَوَاهُ أَبُوْ دَاوُدَ.
2106. (10) [1/649–అపరిశోధ్తితం]
‘ఆయి’షహ్ (ర) కథనం: ఏ’తెకాఫ్ పాటించే వారు ఏ’తెకాఫ్ స్థితిలో ఉద్దేశ్యపూర్వకంగా వ్యాధిగ్రస్తున్ని పరామర్శించక పోవటం, జనా’జహ్ నమా’జులో పాల్గొనక పోవటం, స్త్రీని ముట్టుకోకపోవటం, భార్యను కౌగిలించుకోక పోవటం ప్రవక్త (స) సాంప్రదాయం. అనవసరంగా మస్జిద్ నుండి బయటకు వెళ్ళరాదు, ఉపవాసం ఉంటేనే ఏ’తెకాఫ్ అవుతుంది. అంతేకాదు జామె మస్జిద్‌లోనే ఏ’తెకాఫ్ అవుతుంది. (అబూ దావూద్)
ఇది ‘ఆయి’షహ్ (ర) అభిప్రాయం, ‘హదీసు’ ప్రామాణికమైనది కాదు (ఇది మర్ఫూ‘అ ‘హదీస్’). అందువల్ల ఇది ఆచరణయోగ్యం కాదు.
—–
اَلْفَصْلُ الثَّالِثُ మూడవ విభాగం
2107 – [ 11 ] ( لم تتم دراسته ) (1/650)
عَنِ ابْنِ عُمَرَ عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم أَنَّهُ كَانَ إِذَا اعْتَكَفَ طُرِحَ لَهُ فِرَاشُهُ أَوْ يُوْضَعُ لَهُ سَرِيْرُهُ وَرَاءَ أُسْطُوَانَهِ التَّوْبَةِ. رَوَاهُ ابْنُ مَاجَهُ.
2107. (11) [1/650–అపరిశోధ్తితం]
‘అబ్దుల్లాహ్ బిన్ ‘ఉమర్ (ర) కథనం: ప్రవక్త (స) ఏతెకాఫ్ పాటించినపుడు ప్రవక్త (స) కోసం పడక పరచబడేది. లేదా తౌబహ్ స్తంభం వెనుక మంచం వేయబడేది. [71] (ఇబ్నె మాజహ్)
2108 – [ 12 ] ( لم تتم دراسته ) (1/650)
وعَنِ ابْنِ عَبَّاسٍ: أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم قَالَ فِيْ الْمُعْتَكَفِ: “هُوَ يَعْتَكِفُ الذُّنُوْبِ وَيُجْرَي لَهُ مِنَ الْحَسَنَاتِ كَعَامِلِ الْحَسَنَاتِ كُلِّهَا”. رَوَاهُ ابْنُ مَاجَهُ.
2108. (12) [1/650–అపరిశోధ్తితం]
ఇబ్నె ‘అబ్బాస్ (ర) కథనం: ప్రవక్త (స) ఏ’తెకాఫ్ పాటించే వారు. ఏ’తెకాఫ్ స్థితిలో పాపాలకు దూరంగా ఉంటారు, వాటినుండి తప్పించుకుంటారు, అందువల్ల పుణ్యాలు చేసేవారిలా అతనికి కూడా పూర్తి సత్కార్యాల పుణ్యం లభిస్తుందని ప్రవచించారు. [72] (ఇబ్నె మాజహ్)
*****
[1]) వివరణ-1956: ఈ ‘హదీసు’ ద్వారా రమ’దాను ప్రాధాన్యత బహిర్గతం అవుతుంది. ఈ మాసంలో దైవకారుణ్యం అవతరిస్తుంది. షై’తానులను మానవులను వక్రమార్గాలకు గురిచేయకుండా అడ్డుకోవడం జరుగు తుంది. అంటే దృఢవిశ్వాసం కలిగిఉన్న విశ్వాసులను షైతానులు ఏమీ చేయలేరు.
[2]) వివరణ-1971: ఉమ్మీ అంటే నిరక్షరాస్యులు. అంటే ‘అరబ్బులు. నిరక్షరాసులు అయినందువల్లే ప్రవక్త (స) 29 లేక 30 రోజులు తెలియపరచడానికి రెండు చేతుల అరచేతులను మూడుసార్లు ఎత్తారు. మూడుసార్లు సైగచేసి నెల 30 రోజులది, మరియు 29 రోజులది అవుతుందని తెలపడానికి మూడుసార్లు ఎత్తారు. మూడవసారి బొటనవ్రేలు ముడుచుకున్నారు. దీనివల్ల నెల 29 రోజులది కూడా అవుతుందని తెలుస్తుంది.
[3]) వివరణ-1972: అంటే రమ’దాన్ మరియు జు’ల్’హిజ్జహ్ రెండు నెలలూ పుణ్యపరంగా తక్కువకావు. ఒకవేళ నెల 29 రోజులది అయినా పూర్తినెల పుణ్యం లభిస్తుంది, 30 రోజులది అయినా పూర్తినెల పుణ్యం లభిస్తుంది. పుణ్యం ఏమాత్రం తక్కువ కాదు. అదేవిధంగా జు’ల్’హిజ్జహ్ మాసంలో, ఆరాధనా గడువు పదిరోజులు మాత్రమే ఉన్నా, పూర్తి నెల పుణ్యం లభిస్తుంది. అదేవిధంగా రెండు నెలలు ఒకే సంవత్సరంలో 29 రోజులవి కావు. ఒకవేళ ఒకటి 30 రోజులది ఉంటే, మరొకటి 29 రోజులది ఉంటుంది.
[4]) వివరణ-1973: రమ’దాన్ మాసానికి ముందు రమ’దాన్‌కు స్వాగతంగా ఒకటి, లేక రెండు రోజులు ఉపవాసాలు ఉండరాదు. ఉంటే ఇది గ్రంథప్రజల అనుకరణ అవుతుంది. కాని ఒకవేళ ప్రతినెల ఉపవాసాలు ఉంటూ వస్తే రమ’దాన్‌కు ముందు అలవాటు ప్రకారం ఉపవాసాలు ఉండవచ్చును.
[5]) వివరణ-1975: అంటే ష’అబాన్ దినాలను లెక్కపెడుతూ ఉండాలి. రమ’దాన్ కోసం సులువవు తుంది. ఒకవేళ మేఘాల వల్ల 29న నెలవంక కనబడక పోతే 30 రోజులు పూర్తిచేసుకుని రమ’దాన్ ప్రారం భించాలి. ఎందుకంటే ష’అబాన్ దినాలను లెక్కపెడితేనే అది సాధ్యం అవుతుంది.
[6]) వివరణ-1976: అంటే రమ’దాన్ నెలంతా ఉపవాసాలు ఉంటారు. ష’అబాన్లో కూడా అధికంగా ఉపవాసాలు ఉంటారు. దీన్ని గురించి ముందు వస్తుంది.
[7]) వివరణ-1977: ఒకవేళ ష’అబాన్ 29న మేఘాలు ఉండి నెలవంక కనబడకపోయినా సరైన వార్త అందకపోయినా, ష’అబాన్ 30వ తేదీన అనుమానం ఉంటే నిర్థారించ కుండా ఆ రోజు ఉపవాసం ఉండరాదు. ఒకవేళ ఎవరైనా ఆ రోజు ఉపవాసం ఉంటే ప్రవక్త (స)కు అవిధేయత చూపినట్లవు తుంది.
ఈ ‘హదీసు’ ఉల్లేఖనకర్త ‘అమ్మార్ బిన్ యాసిర్ ప్రఖ్యాత అనుచరులు. వీరు మొట్టమొదటి బృందంలోని వారు. వీరు ఇలా అంటున్నారు; ‘నేను సు’హైబ్ను అర్ఖమ్ బిన్-అబీ అర్ఖమ్ ద్వారం వద్ద చూసి, ‘నీవు ఏ ఉద్దేశ్యంతో వచ్చావు’ అని అడిగాను. దానికి అతను, ‘ముందు నువ్వు నీ ఉద్దేశ్యం చెప్పు’ అని అన్నాడు. నేను, ‘ప్రవక్త(స)ను కలసి, ఉపదేశాలు గ్రహించడానికి,’ అని అన్నారు. దానికి అతడు, ‘నేను కూడా అందుకే వచ్చాను,’ అని అన్నారు. ఇద్దరూ ఒకేసారి ప్రవేశించారు. ప్రవక్త ఒకేసారి ఇద్దరికీ ఇస్లామ్ పరిచయం చేసారు. అమ్మార్తో పాటు ముందు లేదా వెనుక అతని తల్లి-దండ్రులు కూడా ఇస్లామ్ స్వీకరించారు.
‘స’హీ’హ్ బు’ఖారీలో ఒక ఉల్లేఖనం ఇలాఉంది: ‘ ‘అమ్మార్ ఇస్లామ్ స్వీకరించినప్పుడు అతడు, ప్రవక్త (స) వెంట అబూ బకర్ (ర)ను, కేవలం ఐదుగురు బానిస లను, ఇద్దరు స్త్రీలను చూశారు. వీరందరూ తమ ఇస్లామ్‌ను బహిర్గతం చేసినవారు. అయితే ప్రామాణిక ఉల్లేఖనాల ప్రకారం అప్పటివరకు 30 కంటే ఎక్కువ మంది ఇస్లామ్ స్వీకరించి ఉన్నారు. వీరందరూ అవిశ్వా సుల భయంవల్ల బహిర్గతం చేయలేదు. (ఫత్హుల్ బారీ)
‘అమ్మార్ నిస్సహాయుడైన పరదేశస్తుడు. ప్రాపంచిక శక్తులు, ధనసంపదలు కూడా ఆయన వద్ద లేవు. అన్నిటికంటే గొప్ప విషయం ఏమిటంటే అతని తల్లి సుమయ్య అప్పటి వరకు బనీ మ‘ఖ్’జూమ్ బానిస బంధాల నుండి విముక్తి కాలేదు. వారి విశ్వాస ఉత్సాహం ఒక్కరోజు కంటే ఎక్కువ రహస్యంగా ఉంచలేదు. అవిశ్వా సులు నిస్సహాయులైన వారి కుటుంబాన్ని చాలా హింసిం చారు. అనేక విధాలుగా చిత్ర హింసలు పెట్టారు. మధ్యాహ్నం కాలుతున్న ఇసుకపై పరుండబెట్టారు. అగ్నితో కాల్చారు. నీటిలో ముంచి హింసించారు. వారు ఎంత ప్రయత్నంచినా వారిని ఇస్లామ్ నుండి వేరు చేయ లేక పోయారు. (తబఖాత్ ఇబ్నె సఅద్ 3/177)
‘అమ్మార్ తల్లిఅయిన సుమయ్యను అబూ జహల్ దారు ణంగా, కిరాతకంగా బల్లెం గుచ్చి చంపాడు. ఇది ఇస్లామ్ మార్గంలో తొలి వీరమరణం. ఆమె తన ఇస్లామ్‌ను కాపా డుతూ అల్లాహ్ మార్గంలో ప్రాణాలర్పించింది. ఇస్లామ్‌పై స్థిరంగా ఉంటూ అతని తండ్రి, అతడు, అతని సోదరులు కూడా ఈ మార్గంలోనే ప్రాణాలర్పించారు. ఒకసారి అవిశ్వాసులు ‘అమ్మార్ను చూడగానే అగ్నిపై పరుండ బెట్టారు. ప్రవక్త (స) అటువైపుగా పోతూ అతని తలను చేత్తోనిమురుతూ, ”ఓఅగ్ని నీవుఇబ్రాహీమ్లా ‘అమ్మార్ పై కూడా చల్లబడిపో” అని అన్నారు. అదే విధంగా ప్రవక్త (స) అతని ఇంటి వైపునుండి పోతూ, అతని కుటుంబం ఆపదల్లో చిక్కుకొనిఉండటంచూసి, ‘ఓ యాసిర్ కుటుంబ సభ్యులారా! సంతోషించండి, స్వర్గం మీ గురించి వేచి ఉంది’ అన్నారు. (ముస్తదరక్ ‘హాకిమ్ 3/88)
ఒకసారి యాసిర్ (ర) ప్రవక్త (స)ను కాలచక్రం గురించి ఫిర్యాదు చేసారు. ప్రవక్త (స) ఓర్పువహించు, ఓర్పు వహించు అని పలికి, ”ఓ అల్లాహ్! యాసిర్ కుటుం బాన్ని క్షమించు” అని ప్రార్థించారు. (తబఖాత్ ఇబ్నె సఅద్ : 3/178)
ఒకసారి అవిశ్వాసులు అతన్ని నీటిలో ఈత కొట్టించారు. చివరికి అతను స్పృహ కోల్పోయారు. ఆ స్థితిలోనే ఆ దుర్మార్గులు అతని నోటిద్వారా తాము కోరింది చెప్పించుకున్నారు. ఆ కష్టం నుండి గట్టెక్కారు. అతని పౌరుషం అతన్ని ప్రవక్త (స) వద్దకు వెళ్ళమని వత్తిడి చేసింది. కళ్ళంటనీళ్ళు కారుతున్నాయి. ఏమయిందని ప్రవక్త (స) ప్రశ్నించారు. అప్పుడు ‘అమ్మార్, ”చాలా చెడు విషయం, ‘ఈ రోజు నేను మిమ్మల్ని తిట్టనంత వరకు, వారి విగ్రహాలను పొగిడినంత వరకు విడుదల లభించ లేదు,” అని అన్నారు. అప్పుడు ప్రవక్త (స) ‘నీ హృదయం ఏమంటుంది?’ అని అన్నారు. ‘నా హృదయం విశ్వాసంతో నిండి ఉంది,’ అని అన్నారు. ప్రవక్త (స) ఉదారంగా అతని కళ్ళ నుండి కారుతున్న అశ్రువులను తుడిచి, ‘ఏం ఫర్వాలేదు, మళ్ళీ ఇలా జరిగినా, ఇలాగే చేయి,’ అని అన్నారు. ఆ తరువాత వెంటనే ఖుర్ఆన్లోని ఈ ఆయతు అవతరించింది. (తబఖాతుల్ ఇబ్నె సఅద్ 3/178): ”ఎవడైతే విశ్వసించిన తర్వాత, అల్లాహ్‌ను తిరస్కరిస్తాడో – తన హృదయం సంతృప్తి కరమైన విశ్వాసంతో నిండి ఉండి, బలవంతంగా తిరస్కరించేవాడు తప్ప-…” (సూ. అన్నహ్ల్, 16: 106)
ఒకసారి సయీద్ బిన్ జుబైర్, అబ్దుల్లాహ్ బిన్ ‘అబ్బాస్‌ను, ‘అవిశ్వాసులు ముస్లిములను తమ ధర్మాన్ని త్యజించమని హింసించేవారా?’ అని ప్రశ్నించారు. దానికి అతను, ‘అల్లాహ్ సాక్షి! అవును, వారిని కొట్టేవారు, ఆకలి దప్పులకు గురిచేసే వారు. చివరికి బలహీనత, అనారోగ్యం, గాయాలవల్ల లేవడానికి కూడా శక్తి ఉండేది కాదు. ఈ స్థితిలోనే వారు తాము కోరింది వారినోట చెప్పించేవారు,’ అని అన్నారు. అమ్మార్ కూడా ఇటువంటి వారిలోని ఒకరు. వీరు అల్లాహ్ మార్గంలో సహనం ఓర్పులను, స్థిరత్వాన్ని పాటిస్తూ అనేక హింసలు, కష్టాలు భరించారు. కాని హృదయం నుండి విశ్వాసాన్ని తొలగనివ్వలేదు. బలహీనతా స్థితిలో అతని వీపును చూచినవారు వీపుపై భరించిన చిత్రహింసల మచ్చలు చూచేవారు. (అసదుల్ గాబహ్) అమ్మార్ ఏక దైవారాధనలో, విధేయతలో ప్రత్యేక ఆనందం, సంతోషం పొందేవారు. రాత్రంతా నమాజులో, దైవస్మరణల్లో నిమగ్నులై ఉండేవారు. ‘అబ్దుల్లాహ్ బిన్ ‘అబ్బాస్ (ర) అభిప్రాయం: ”ఏమీ? ఎవడైతే శ్రద్ధతో రాత్రి ఘడియలలో సాష్టాంగం (సజ్దా) చేస్తూ మరియు నిలిచి (నమా’జ్) చేస్తూ పరలోక (జీవిత)మును గురించి భయపడుతూ, తన ప్రభువు కారుణ్యాన్ని ఆశిస్తూ ఉంటాడో!…” (సూ. అజ్జుమర్, 39:9) ‘అమ్మార్ గురించే అవతరించబడింది. (ముస్తద్రక్ ‘హాకిమ్) దైవభీతి, దైవభక్తి, అల్లాహ్(త)పట్ల శ్రద్ధను నమా’జును మూలంగా భావించే వారు. ఒకసారి నమా’జు చదువటానికి నిలబడ్డారు. తొందరగా పూర్తిచేసి కూర్చున్నారు. ప్రజలు, ‘ఇలా ఎందుకు తొందర పడ్డారు,’ అని అడిగారు. దానికి అతను, ‘అప్పుడు నాకు షై’తాన్ను అధిగమించవలసి వచ్చింది’ అని అన్నారు. (ముస్నద్ అహ్మద్ 4/263) అంగవైకల్య స్థితిలో కూడా నమాజు తప్పేది కాదు. ఒక సారి ప్రయాణ సందర్భంగా స్నానం చేయవలసి వచ్చింది. ఎంత ప్రయత్నించినా నీళ్ళు దొరకలేదు. పరిశుద్ధమైన మట్టిని, నీళ్ళకు బదులు వాడవచ్చని అతనికి తెలిసి ఉండేది. అందువల్ల శరీరాన్నంతా మట్టి పులుముకొని నమా’జు చదివారు. ప్రయాణం నుండి తిరిగివచ్చి జరిగినదంతా ప్రవక్త (స)కు విన్నవించుకున్నారు. అప్పుడు ప్రవక్త (స), ‘ఇటువంటి పరిస్థితిల్లో తయమ్ముమ్ సరిపోతుంది,’ అని అన్నారు. (ముస్నద్ అహ్మద్).
శుక్రవారం నాడు ప్రసంగానికి ముందు మెంబరుపై కూర్చొని సాధారణంగా సూరహ్ యాసీన్ పఠించేవారు. ప్రసంగం ప్రభావపూరితంగా ఉండేది. అందులో మహిమాన్వితంగా, సంక్షిప్తంగా ప్రసంగించే వారు. ఒకసారి ఎవరో ఒకరు విమర్శించారు. దానికి అతను దీర్ఘంగా చదవడం, ప్రసంగాన్ని సంక్షిప్తంగా చేయటం వివేకానికి చిహ్నంగా పేర్కొన్నారని సమాధాన మిచ్చారు. (ముస్నద్ అహ్మద్ బిన్ హంబల్)
మదీన వలసపోయిన 6, 7 నెలల తర్వాత మస్జిదె నబవీ స్థాపన జరిగింది. ప్రవక్త (స), తన అనుచరులను ఉత్తేజ పరచడానికి తాము కూడా పనిలో నిమగ్నులయ్యారు. అమ్మార్ ఇటుకలు, బురద తెచ్చి ఇచ్చేవారు. కాని నోటిపై అల్లాహ్ స్మరణ ఉండేది. అబూ సయీద్ (ర) మేము ఒక్కొక్క ఇటుక ఎత్తేవారం, అయితే అమ్మార్ రెండు ఇటుకలు ఎత్తేవారు. ఒకసారి ప్రవక్త (స) అతని ప్రక్కనుండి వెళ్తున్నారు. ప్రవక్త (స) ఎంతో ఆదరంతో అతని తలపై ధూళిని తుడుస్తూ చాలా విచారకరం ‘అమ్మార్ నిన్ను ద్రోహులు చంపుతారు,’ అని అన్నారు. (ముస్తదరక్ హాకిమ్). నీవు వారిని అల్లాహ్ వైపు ఆహ్వానిస్తావు. వారు నిన్ను నరకం వైపు పిలుస్తారు.’ (బు’ఖారీ). ఒకసారి ఒక వ్యక్తి అతనిపై శక్తికి మించిన సరకులు వేశాడు. అది చూసి ప్రజలు ‘అమ్మార్ చనిపోతారని కేకలు వేయసాగారు. అంతకుముందు కూడా ‘అమ్మార్ శక్తికి మించిన బరువు పట్ల ఫిర్యాదు చేసి ఉన్నారు. అది విన్న ప్రవక్త (స) కొన్ని ఇటుకలు దించి పారవేసారు. ఇంకా చాలా విచారకరం, ‘ఓ ఇబ్నె సుమయ్యా! నిన్ను శత్రువులు చంపుతారు,’ అని అన్నారు. (తబఖాత్ ఇబ్నె సఅద్).
ఈ భవిష్యవాణి ప్రకారం ‘అలీ (ర) తరఫున ఉన్నందుకు ము’ఆవియా సైనికుడు ఇబ్నె లగానియ మరియు ఇతర షామీ సైనికులు చంపివేసారు. ఇన్నాలిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజివూన్. ‘అలీ (ర) ఇతని మరణవార్త విని, ”అల్లాహ్ (త) ‘అమ్మార్ను కరుణించాడు. అతను చంపబడినపుడు అల్లాహ్ అతనిని కరుణించాడు. అతను తుదిదినమున లేపబడినపుడు అతన్ని కరుణించడం జరుగుతుంది. నేను ఇతన్ని కేవలం 4 లేక 5 గురు అనుచరులు తమ విశ్వాసప్రకటన చేసే భాగ్యం కలిగి నపుడు ప్రవక్త (స) వెంట చూసాను. గొప్ప గొప్ప అను చరుల్లోని వారెవరికీ ఇతని ముక్తి సాఫల్యాలపై ఏమాత్రం అనుమానం ఉండదు. ‘అమ్మార్ మరియు సత్యం, వాస్తవం రెండూ ఒకరిపట్ల ఒకరు తప్పనిసరి. అందు వల్లనే అతని హంతకుడు తప్పకుండా నరకవాసి అవుతాడు.” అని అన్నారు ఆ తరువాత జనా’జహ్ విధులకు ఆదేశించారు. తాను స్వయంగా జనా’జహ్ నమా’జు చదివించారు. రక్తసిక్తంగా ఉన్న 91 సంవత్స రాల సత్య ప్రియుణ్ని మట్టిలో కలిపివేసారు. (తబఖాత్ ఇబ్నె స’అద్ 3/187, సీరతుస్స’హాబహ్ -322-336)
[8]) వివరణ-1978: ఒకవేళ ఎవరైనా అపరిచితులు వారు ముస్లిములు, ముస్లిమేతరులో తెలియకుండా ఉండి, వారు నెలవంకను గురించి సాక్ష్యం ఇస్తే, అతను ముస్లిమ్ అవునో కాదో, నిర్థారించుకోవాలి. ఒకవేళ సత్యవచనం పలికి నెలవంక గురించి సాక్ష్యం ఇస్తే దాన్ని స్వీకరించాలి. అదేవిధంగా రమ’దాన్ నెలవంక గురించి ఒక ముస్లిమ్ వ్యక్తి సాక్ష్యం సరిపోతుంది. కాని పండుగ నెలవంకకు ఇద్దరు ముస్లిం వ్యక్తుల సాక్ష్యం తప్పనిసరి.
[9]) వివరణ-1982: స’హ్రీ అంటే రాత్రి చివరిజాము ఇది ఉషోదయానికి ముందు వస్తుంది. ఉపవాసకులు రాత్రి చివరి జాములో భుజించడాన్ని స’హ్రీ అంటారు. ఆకలి దప్పికల ప్రభావం నుండి దూరంగా ఉండాలని, చివరి జాములో కూడా చివరి సమయంలో తినడం మంచిది. స’హ్రీ తినడం వల్ల పగలంతా శక్తి ఉంటుంది. అందులో శుభం ఉంటుంది. అందువల్లే ఈ భోజనానికి శుభంగా పేర్కొనడం జరిగింది. స’హ్రీ భుజించడం ప్రవక్త (స) సాంప్రదాయం. ‘హదీసు’ల్లో స’హ్రీ ప్రాముఖ్యత ప్రాధాన్యతల గురించి అనేక ఉల్లేఖనాలు ఉన్నాయి.
[10]) వివరణ-1984: సూర్యాస్తమయ సమయంలో ఉపవాసం విరమించటాన్ని ఇఫ్తార్ అంటారు. సూర్యాస్తమయం అయిన వెంటనే ఉపవాస విరమణ (ఇఫ్తార్) చేయాలి. అనవసరంగా ఆలస్యం చేయరాదు. ఇలా చేయడం ప్రవక్త సాంప్రదాయానికి వ్యతిరేకం.
[11]) వివరణ-1986: ‘సౌమె వి’సాల్ అంటే రాత్రిపగలు నిరంతరం ఉపవాసం ఉండటం, మధ్యలో ఉపవాసం విరమించకుండా ఉండటం. ఈ ఉపవాసం చాలా కష్టంగా ఉంటుంది. అందువల్లే ప్రవక్త (స) దీన్నుండి వారించారు. అయితే ‘సౌమె ‘విసాల్ ప్రవక్త (స) ప్రత్యేకత.
[12]) వివరణ-1987: అదనపు ఉపవాసాలు ఏమీ తినకుండా మిట్టమధ్యాహ్నానికి ముందు సంకల్పించు కుంటే సరిపోతుంది.
[13]) వివరణ-1988: అంటే ఒకవేళ ఉషోదయానికి ముందు అజా’న్ అయి, అప్పుడు ఎవరైనా నీళ్ళు త్రాగుతుంటే నీళ్ళను వదలకూడదు. నీళ్ళు త్రాగవచ్చు. అయితే ఇది అజా’న్ ఉషోదయానికి ముందు అయినప్పుడు, తరువాత కాదు.
[14]) వివరణ-1991: ఖర్జూరాలు బేసి సంఖ్యలో ఉపయో గించటం అభిలషణీయం.
[15]) వివరణ-1997: అంటే స’హ్రీని శుభకరమైన భోజనంగా పేర్కొన్నారు.
[16]) వివరణ-1998: ఎందుకంటే వీటిని వండే అవసరం ఉండదు, చాలా ఆలస్యంగా జీర్ణమవుతాయి.
[17]) వివరణ-1999: ఉపవాసం అంటే కేవలం అన్నపానీ యాలను వదలివేయటం కాదు. ఇంకా ఇతర చెడు కార్యాలను కూడా వదలి వేయటాన్ని ఉపవాసం అంటారు. చెడు కార్యాలను వదలివేయని ఉపవాసం పరిపూర్ణం కాదు. అతనికి పూర్తి ప్రతిఫలమూ లభించదు.
[18]) వివరణ-2000: అంటే ప్రవక్త (స) మీ కంటే అధికంగా తన్ను తాను నియంత్రణలో ఉంచగలిగే శక్తి కలిగి ఉండే వారు. అయినప్పటికీ ముద్దు పెట్టుకునేవారు, ధర్మ వ్యతిరేకతకు పాల్పడేవారు కాదు. అంటే ఒకవేళ ఎవరైనా తనపై కంట్రోలు చేసే శక్తి లేకపోతే ముద్దు కూడా పెట్టుకోకూడదు. కొందరు ముసలివాడు ఉపవాసస్థితిలో ముద్దు పెట్టుకోవచ్చని, యువకుడు ముద్దు పెట్టుకో కూడదని అభిప్రాయపడ్డారు.
[19]) వివరణ-2001: అంటే స’హ్రీకి ముందే సంభోగం పూర్త యింది. ఏదో కారణం వల్ల స్నానం చేయలేకపోయారు. అయితే ఉషోదయం అయిన తర్వాత స్నానం చేసి ఉపవాసం ఉన్నారు. దీనివల్ల ఇటువంటి పరిస్థితి ఎవరికైనా సంభవిస్తే ఉపవాసం భంగం కాదని తెలిసింది.
[20]) వివరణ-2002: అంటే కొమ్ము చేయించుకోవటం వల్ల ఉపవాసం భంగంకాదని తెలిసింది.
[21]) వివరణ-2003: అంటే మతిమరుపు వల్ల తిన్నా, త్రాగినా ఉపవాసం భంగం కాదు.
[22]) వివరణ-2004: రమ’దాన్ ఉపవాసాల స్థితిలో ఒకవేళ ఎవరైనా ఉద్దేశ్యపూర్వకంగా తన భార్యతో సంభోగం చేస్తే ఉపవాసం భంగమవుతుంది. ఆ పాపానికి పరిహారంగా ఒక బానిసను విడుదల చేయాలి. ఆ శక్తి లేకపోతే 2 నెలలు నిరంతరం ఉపవాసం ఉండాలి. దానికీ శక్తి లేకపోతే 60 మంది పేదలకు అన్నం పెట్టాలి. దానికీ శక్తి లేకపోతే ఇతరులు ‘సదఖహ్ ధనాన్ని అతనికి ఇవ్వాలి – అతను తన పరిహారం చెల్లించడానికి.
[23]) వివరణ-2005: ‘హదీసు’వేత్తలు ఈ ‘హదీసు’ను ‘దయీఫ్ ‘హదీసు’గా పేర్కొన్నారు. ఉపవాస స్థితిలో ముద్దు పెట్టుకోవటంలో, భార్య నాలుకను చప్పరించడంలో ఎటు వంటి అభ్యంతరం లేదు.
[24]) వివరణ-2006: అంటే స్త్రీ శరీరాన్ని తన శరీరంతో తాకటం, కౌగిలించుకోవటం ధర్మసమ్మతమే, అయితే సంభోగ పరిస్థితి రానియ్యరాదు. ముసలివానికి అనుమతి ఇవ్వటం వల్ల సంభోగ ప్రమాదం లేదు. యువకునికి అనుమతి ఇవ్వక పోవటంలో రహస్యం సంభోగ ప్రమాదం ఉంది.
[25]) వివరణ-2008: వాంతి చేసారు అంటే కోరివాంతి చేసారు. కోరి వాంతిచేస్తే ఉపవాసం భంగమవుతుంది. మొదటి ఉల్లేఖనంలో ఉన్నట్లు కొన్ని ఉల్లేఖనాల్లో వు’జూ చేసారని ఉంది. దీనివల్ల కొందరు వాంతిచేస్తే వు’జూ భంగం అవుతుందని అభిప్రాయపడుతున్నారు. మరికొందరు ప్రవక్త (స) అదనపు ఉపవాసంతో ఉన్నప్పుడు వాంతి రావటం వల్ల బలహీనతకు గురయి ఉపవాసం భంగం చేసారు అని అభిప్రాయపడ్డారు.
[26]) వివరణ-2009: ఈ ‘హదీసు’ వల్ల ఉపవాస స్థితిలో మిస్వాక్ చేయవచ్చని తెలిసింది.
[27]) వివరణ-2010: ఉపవాసస్థితిలో సుర్మా పెట్టు కోవటంలో ఎలాంటి అభ్యంతరం లేదు.
[28]) వివరణ-2011: ఈ ‘హదీసు’ వల్ల తెలిసిన విషయం ఏమిటంటే, ఉపవాస స్థితిలో దాహం వల్ల లేదా వేడివల్ల తలపై నీళ్ళు పోయడంలో, స్నానం చేయడంలో ఎలాంటి అభ్యంతరం లేదు.
[29]) వివరణ-2013: అంటే రమ’దాన్ పుణ్యం అతనికి లభించదు. కాని ఒకవేళ దానికి బదులు ఒక ఉపవాసం ఉంటే రమ’దాన్ ఉపవాసానికి సరిపోతుంది.
[30]) వివరణ-2014: ఉపవాస స్థితిలో నిషిద్ధాలకు దూరంగా ఉండాలి. వాటికి దూరంగా ఉండకుండా, వాటికి పాల్పడుతూ ఉంటే ఆకలిదప్పులతో ఉండటం తప్ప వారికి ఏమీ లభించదు. వారికి ఉపవాస పుణ్యం లభించదు. అదేవిధంగా చూపుకోలు, ప్రదర్శనా బుద్ధితో నమా’జు చదివినా, రాత్రి జాగరణ చేసినా, రాత్రి జాగరణ సమయం వృథా చేయడం తప్ప మరేమీ లభించదు. ప్రతి ఆరాధనలో చిత్తశుద్ధి అవసరం లేదా శ్రమ వృథా అవుతుంది, పాపం చుట్టుకుంటుంది.
[31]) వివరణ-2019: అంటే ఒకవేళ ఆటంకం, కష్టం లేకుంటే రెండూ సాధ్యమే. ఒకవేళ ఉంటే ధర్మసమ్మతమే లేకుంటే అనుమతి ఉంది.
[32]) వివరణ-2020: ఒకవేళ ఎటువంటి ఆటంకం లేకుంటే రెండు విధాలా మంచిదే.
[33]) వివరణ-2021: అంటే ఆటంకం ఉన్నా, కష్టంగా ఉన్నా బాధగా ఉన్నా ప్రయాణంలో ఉపవాసం ఉండరాదు.
[34]) వివరణ-2022: అంటే ఉపవాసం లేకుండా ప్రయాణంలో తమ మిత్రులకు సేవ చేసారు, వాహనాలకు నీళ్ళు త్రాపించారు. టెంట్లు వేసారు, వీరికి ఎక్కువ పుణ్యం లభించింది. అంటే ప్రయాణంలో మిత్రులకు సేవ చేస్తే అధిక పుణ్యం లభిస్తుందని తెలిసింది.
[35]) వివరణ-2024: మక్కహ్ విజయం సంవత్సరం రమ ‘దాన్లో మదీనహ్ నుండి మక్కహ్ కు ప్రవక్త(స) బయలు దేరారు. ప్రయాణంలో ప్రవక్త (స) కొన్ని రోజుల వరకు ఉపవాసం ఉన్నారు. ఎందుకంటే జిహాద్లో పాల్గొనవలసి ఉండేది. అది వేసవికాలం. నీళ్ళు తెప్పించి చేతిలోకి తీసుకొని పైకి ఎత్తి ప్రజలందరికీ చూపించి ఉపవాసం భంగంచేసారు. కొన్ని ఉల్లేఖనాల్లో ఇలా ఉంది, ”ప్రవక్త (స) ఉపవాసం భంగంచేసినా కొందరు ఉపవాసం కొనసా గించారు. ప్రవక్త (స) వారిని అవిధేయులుగా పేర్కొ న్నారు. ఇది రానున్న పేజీల్లో వస్తుంది.”
[36]) వివరణ-2025: ప్రయాణీకుని కోసం సగం నమా’జు క్షమించడం జరిగింది. అంటే నాలుగు రకాతులకు బదులు రెండు రకాతులు చదవాలి. అదేవిధంగా ప్రయాణీకుడు, పాలుపట్లే స్త్రీ, గర్భవతి ఉపవాసం వదల వచ్చును. అయితే ప్రయాణీకుడు ప్రయాణం నుండి తిరిగి వచ్చిన తర్వాత, తప్పని సరిగా ఉపవాసాలను ఆచరించాలి. పాలుపట్టే స్త్రీ, గర్భవతులు వారి దశ ముగియగానే తప్పిన ఉపవాసాలను తప్పనిసరిగా పూర్తిచేయాలి.
[37]) వివరణ-2026: అంటే ఉపవాసం పాటించటంలో ఎటువంటి ఆటంకం, నిర్బంధం లేని యెడల రమ’దాన్ ఉపవాసాలు ఆచరించుకోవాలి.
[38]) వివరణ-2027: కురాఉల్ ‘గమీమ్ ఒక ప్రాంతం పేరు. ఇది మక్కహ్ మరియు మదీనహ్ లకు మధ్య ఉంది. ఇది ‘అస్ఫాన్ ప్రాంతానికి దగ్గరగా ఉంది. మొదటి ఉల్లేఖనంలో అస్ఫాన్ ప్రాంతంచేరి ప్రవక్త (స) ఉపవాసం విరమించారని ఉంది. ఈ రెండు ఉల్లేఖనాల్లో ఎటువంటి భేదం లేదు. ఎందుకంటే కురాఉల్ ‘గమీమ్, అస్ఫాన్ రెండు ప్రాంతాలు కలసి ఉన్నాయి. ఈ ‘హదీసు’ ద్వారా తెలిసిన విషయం ఏమిటంటే ఒకవేళ ప్రయాణంలో ఉపవాసం ఉండటంలో ఎలాంటి ఆటంకం, అభ్యంతరం ఉన్నా ఉపవాసం ఉండనక్కర లేదు.
[39]) వివరణ-2028: అంటే ప్రయాణావస్థలో కష్టాలు, ఆపదలు, ఆటంకాలు ఎక్కువగా ఉన్నప్పుడు ఉపవాసం పాటించడం పాపకార్యమవుతుంది. ఉదా: స్థానికుడు తన ఇంట్లో ఉండి ఉపవాసం పాటించక పోవటం అవుతుంది. అయితే ఈ ‘హదీసు’ బలహీనమైనది.
[40]) వివరణ-2030: అంటే బహిష్టు వల్ల కొన్ని రమ’దాన్ ఉపవాసాలు తప్పిపోయేవి. వాటిని ష’అబాన్లో పూర్తిచేసుకునే వారు. మిగతా నెలల్లో ప్రవక్త (స) సేవలో ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండేవారు. ప్రవక్త (స)కు ఏ అవసరం ఏర్పడినా ‘ఆయి’షహ్ (ర) దాన్ని పూర్తిచేసే వారు. ఎందుకంటే ప్రవక్త (స) ష’అబాన్లో సాధ్యమైనంత వరకు అధికంగా ఉపవాసాలు ఉండేవారు. అందువల్ల సేవచేసే అవసరం ఉండేది కాదు. ‘ఆయి’షహ్ (ర) ఈ అవకాశాన్ని వినియోగించుకొని తప్పిన ఉపవాసాలను పూర్తిచేసుకునేవారు.
[41]) వివరణ-2031: భర్త హక్కు చాలా పెద్దది. ఒకవేళ పగలు సంభోగ అవసరం ఏర్పడి, భార్య అదనపు ఉపవాసంతో ఉంటే అతని హక్కు కొల్లగొట్టినవుతుంది. అందువల్ల భార్య అదనపు ఉపవాసాలు ఉండటానికి భర్త అనుమతి పొందాలి. అదే విధంగా భర్త అనుమతిలేనిదే ఇతరులను ఇంట్లోకి రానివ్వరాదు.
[42]) వివరణ-2032: తప్పిన ఉపవాసాలను తిరిగి ఆచరించటం సులభం. సంవత్సరంలో ఒకేసారి ఏర్పడుతుంది. నమా’జులు ప్రతినెల పూర్తిచేయవలసి వస్తుంది. ఇది చాలా కష్టంగా ఉంటుంది.
[43]) వివరణ-2034: మొదటి ‘హదీసు’ దృష్ట్యా ఉపవాసాలు బాకీ ఉన్న మరణించిన వ్యక్తి తరఫున అతని వారసులు ఉపవాసం ఉండాలి. ఈ ‘హదీసు’ దృష్ట్యా ఒక ఉపవాసానికి బదులు ఒక పేదవానికి అన్నం పెట్టాలి అని తెలుస్తుంది. ఈ విషయంలో పండితుల మధ్య అభిప్రాయభేదాలు ఉన్నాయి. అయితే ఒకవేళ ఉపవాసం ఉండే శక్తి ఉంటే ఉపవాసాలు పాటించాలి. లేదా అతని తరఫున పరిహారం చెల్లించాలి.
[44]) వివరణ-2038: ఈ వ్యక్తి ప్రతి నెల చివరన ఉపవాసం ఉండేవాడు. ప్రవక్త (స) ష’అబాన్ చివరన ఉపవాసాలు ఉండవద్దని వారిస్తే, ఆ వ్యక్తి ష’అబాన్ చివరన ఉపవాసం ఉండలేదు. అప్పుడు ప్రవక్త (స) అతన్ని, ‘నువ్వు ప్రతినెల చివరి రోజులో ఉపవాసాలు పాటించేవాడివి, మరి ష’అబాన్ చివరన ఉపవాసాలు ఉన్నావా లేదా?’ అని అడిగారు. ఆ వ్యక్తి ‘లేదు’ అని సమాధానం ఇచ్చాడు. అప్పుడు ప్రవక్త (స) రమ’దాన్ తర్వాత ఉపవాసం ఉండమని, ఎందుకంటే ఎల్లప్పుడూ చేస్తూ ఉన్న ఒక మంచి పనిని ఎల్లప్పుడూ చేస్తూ ఉండాలి. వదల కూడదు అని హితబోధ చేసారు.
[45]) వివరణ-2040: అంటే ప్రవక్త (స) కేవలం రమ’దాన్, ము’హర్రమ్ పదవ తేదీల ఉపవాసాలకే ప్రాధాన్యత ఇచ్చే వారు. ఇతర ఉపవాసాలకు కాదు. అంటే అన్నిటికంటే ప్రాధాన్యత, ప్రాముఖ్యత గల ఉపవాసాలు రమ’దాన్ మరియు ము’హర్రమ్ 10వ తేదీ ఉపవాసాలు. ఇది ఇబ్నె ‘అబ్బాస్ అభిప్రాయం. కాకపోతే ‘అరఫహ్ ఉపవాసం ము‘హర్రమ్ ఉపవాసం కంటే శ్రేష్ఠమైనది. అనేక ‘హదీసు’ల్లో దీన్ని గురించి ఉంది.
[46]) వివరణ-2041: అంటే 9, 10వ తేదీలు ఉపవాసం పాటించి యూదులను, క్రైస్తవులను వ్యతిరేకిస్తాను
[47]) వివరణ-2042: ఉమ్మె ఫ‘దల్ ప్రవక్త (స) చిన్నాన్న భార్య. అంటే ‘అబ్బాస్ (ర) భార్య. అంటే ‘హాజీలు ‘అరఫాత్ నాడు ఉపవాసం ఉండరాదు. ఇతరులు ఈ దినాన ఉపవాసం పాటించవచ్చును.
[48]) వివరణ-2043: 10 జి’ల్ ‘హిజ్జహ్కు చాలా ప్రాధాన్యత ఉంది. దాని ఉపవాసాలకు కూడా చాలా ప్రాధాన్యత ఉంది. చాలా వరకు ప్రవక్త (స) 10 జి’ల్’హిజ్జహ్లో ఉపవాసం ఉండే వారు కాదు. ఒక్కోసారి ఉండేవారు, ఒక్కోసారి ఉండేవారు కాదు. ‘ఆయి’షహ్ (ర) నాకు తెలియదని పేర్కొంది. వాస్తవం ఏమిటంటే ప్రవక్త (స) ఉండేవారని ఇతర ‘హదీసు’ల్లో పేర్కొనడం జరిగింది. దీన్ని గురించి రాబోయే పేజీల్లో పేర్కొనడం జరిగింది.
[49]) వివరణ-2044: సంవత్సరమంతా నిరంతరాయంగా ఉపవాసం ఉండటం, నిషిధ్ధ దినాల్లో ఉపవాసం ఉండటం అధర్మం. ప్రతినెల 3 ఉపవాసాలు పాటించటం వల్ల నెలంతా ఉపవాసం ఉన్నట్లు పుణ్యం లభిస్తుంది. ఎందుకంటే ఒక పుణ్యానికి 10 పుణ్యాల ప్రతిఫలం లభిస్తుంది. రమ’దాన్ నెలంతా ఉపవాసం ఉంటే 10 నెలల ఉపవాసాల పుణ్యం లభిస్తుంది. ప్రతినెల మూడు ఉపవాసాలు ఉండి, రమ’దాన్ ఉపవాసాలు ఉంటే అతనికి సంవత్సరమంత ఉపవాసం ఉండే పుణ్యం లభిస్తుంది. అయితే ఒక రోజు ఉపవాసం ఉండటం, ఒక రోజు వదలడం ఉత్తమం. ఒక రోజు ఉపవాసం ఉండటం రెండు రోజులు వదలడం, అంతకంటే ఉత్తమం. ప్రవక్త (స), ‘దాని గురించి నాకు శక్తి ఉంటే ఎంత బాగుండును,’ అని అనడానికి అర్థం, దాసుల హక్కుల్లో నిమగ్నంగా ఉండటం వల్ల అధికంగా ఉపవాసాలు ఉండే అవకాశం లభించదు. అందువల్ల ప్రవక్త (స) ఇలా అన్నారు. అదేవిధంగా ఈ ‘హదీసు’ వల్ల ‘అరఫాత్ నాడు ఉపవాసం అభిలషణీయం అని దీనివల్ల రెండు సంవత్సరాల పాపాలు క్షమించబడతాయని తెలిసింది.
[50]) వివరణ-2045: అంటే సోమవారం ఉపవాసం ఉండవచ్చు.
[51]) వివరణ-2046: అంటే అదనపు ఉపవాసాలు ఆచరించ డానికి దినాలను ప్రత్యేకించేవారు కారు. ఒక్కోసారి ప్రారంభంలో, ఒక్కోసారి మధ్యలో, ఒక్కోసారి చివరిలో ఉపవాసాలు ఉండేవారు. 13, 14, 15 తేదీలను ప్రత్యే కించే వారు కాదు. అయితే ఈ తేదీలలో ఉపవాసం ఉండ టం అత్యుత్తమం. దీన్ని గురించి ముందు తెలుస్తుంది.
[52]) వివరణ-2047: అంటే పండుగ రోజు తర్వాత, రెండవ తేదీ నుండి వీటిని ప్రారంభించాలి. వరుసగా పాటించాలి. ఒక వేళ ఏకారణం చేతనైనా మధ్యలో ఆటంకం కలిగితే ఏం ఫర్వాలేదు.
[53]) వివరణ-2048: ఎందుకంటే ఈ దినాలు అల్లాహ్ (త) తరఫు నుండి ఆతిధ్య దినాలు, ఈ రెండు దినాలు. మరియు జి’ల్-‘హిజ్జహ్, 13వ తేదీ వరకు ఉపవాసం పాటించడం నిషిద్ధం.
[54]) వివరణ-2050: తష్రీఖ్ దినాలు అంటే జిల్’హిజ్జహ్ 11, 12, 13 తేదీలను అంటారు. ఎందుకంటే ఈ దినాల్లో అరబ్బులు ఖుర్బానీ మాంసాన్ని ఎండబెట్టేవారు. అందుకే వీటిని తఫ్రీఖ్ దినాలు అంటారు. కనుక ఈ దినాల్లో ఉపవాసం ఉండరాదు. ఈ దినాల్లో తింటూ, త్రాగుతూ, దైవాన్ని స్మరిస్తూ ఉండాలి. అల్లాహ్ ఆదేశం: ”… మరియు ఆయన వారికి జీవనోపాధిగా ప్రసాదించిన పశువుల మీద, నిర్ణీత దినాలలో అల్లాహ్ పేరును స్మరిస్తూ (జి”బ్హ్ చేయండి). వాటి (మాంసాన్ని) తినండి మరియు లేమికి గురిఅయిన నిరుపేదలకు తినిపించండి. (అల్-‘హజ్జ్, 22:28) అంటే యౌము న్న‘హ్ర్ మరియు తష్రీఖ్ దినాలు.
[55]) వివరణ-2052: అయితే శుక్రవారంతో మరో దినాన్ని కలుపుకోవచ్చు. అంటే గురువారం-శుక్రవారం లేదా శుక్రవారం-శనివారం. ఒక్క శుక్రవారం నాడు మాత్రమే ఉపవాసం ఉండరాదు.
[56]) వివరణ-2066: చల్లదనం మహా భాగ్యం అంటే శ్రమ కష్టం లేకుండా యుద్ధ ధనం లభించినట్లు. అదేవిధంగా చలి కాలంలో ఉపవాసం ఉండటం వల్ల పుణ్యం లభిస్తుంది. అంటే ఆకలి దప్పికల బాధ ఉండదు.
[57]) వివరణ-2069: రమ’దాన్ ఉపవాసాలు విధి కావటానికి ముందు ఆషూరహ్ ఉపవాసం విధిగా ఉండేది. అందువల్లే ప్రవక్త (స) దానిపట్ల శ్రద్ధచూపేవారు, ప్రజలకు తాకీదు చేసేవారు. రమ’దాన్ ఉపవాసాలు విధి అయిన తర్వాత, ఆషూరహ్ ఉపవాస విధి రద్దయింది. అందువల్లే ప్రవక్త (స) దానిపట్ల ఎక్కువగా శ్రద్ధ చూపే వారు కారు. కోరినవారు పాటించాలి, కోరనివారు ఉండక్కరలేదు. అయితే ఉపవాసం ఉండడం మంచిది.
[58]) వివరణ-2072: ‘జకాత్ అంటే పరిశుద్ధత, పరిశుభ్రత. ప్రతివస్తువుకు పరిశుద్ధత, పరిశుభ్రత అవసరం ఉంటుంది. శరీర అంతర్గత పరిశుభ్రత ఉపవాసం వల్ల సాధ్యమవుతుంది.
[59]) వివరణ-2075: కాకి వయస్సు వెయ్యి సంవత్సరాలు అనేది ప్రతీతి. ఒకవేళ కాకి బాల్యం నుండి ముసలితనం వరకు ఎగిరితే వెయ్యి సంవత్సరాల దూరం. ఈ ‘హదీసు’ అర్థం ఏమిటంటే, అల్లాహ్ ప్రీతికోసం ఒక్క రోజు ఉపవాసం ఉంటే నరకం నుండి వెయ్యి సంవత్సరాల దూరం ఉంచబడుతుంది. అంటే అతడు నరకంలో ప్రవేశించడు అని అర్థం.
[60]) వివరణ-2076: ఈ ‘హదీసు’ ద్వారా అనేక విషయాలు తెలిసాయి. ఒకవేళ ఎవరైనా పగలు ఏమీ తినకుండా అదనపు ఉపవాసం సంకల్పం చేసుకోవటం ధర్మసమ్మతమే. అదే విధంగా మరో వ్యక్తి అదనపు ఉపవాసంతో ఉన్నాడు. ఏదైనా వస్తువు తిని ఉపవాసం విరమిస్తే అది ధర్మసమ్మతమే. తరువాత దాన్ని పూర్తి చేసుకుంటే మంచిది. చేయకపోయినా మరేం ఫర్వా లేదు. హైసున్ అంటే ఖర్జూరం, నెయ్యి, పనీర్ కలిపి చేయబడుతుంది. అది ఒక రకమైన హల్వా లాంటిది.
[61]) వివరణ-2078: అంటే ఒకవేళ అతడు ఉపవాసంతో ఉంటే ఉపవాసం విరమించకూడదు. అయితే అదనపు నమా’జ్ చదవాలి. ప్రవక్త (స) ఉమ్మె సులైమ్ ఇంట్లో అదనపు నమా’జ్ చదివినట్లు.
[62]) వివరణ-2080: మొదటి ‘హదీసు’ ద్వారా అదనపు ఉపవాసాలు ఉన్నవారు ఉపవాసాన్ని కొనసాగించ వచ్చును లేదా విరమించవచ్చును. ఈ ‘హదీసు’ ద్వారా ఒకవేళ అదనపు ఉపవాసం మధ్యలో విరమిస్తే తరువాత దాన్ని పూర్తిచేసుకోవాలి. ‘హదీసు’వేత్తలు దీన్ని గురించి ఇలా వివరించారు. అంటే ఒకవేళ పూర్తిచేసుకుంటే మంచిది. ఒకవేళ పూర్తి చేయకపోతే మరేం ఫర్వాలేదు. ఈ ఉల్లేఖనం తాబయీ ప్రోక్తం (ముర్సల్) అనబడుతుంది.
[63]) వివరణ-2084: ఏడు రాత్రులంటే 21 నుండి 27వ రాత్రి వరకు లేదా 23-29వ రాత్రి వరకు. ఈ రాత్రుల్లో ఏదో ఒకటి షబె ఖద్ర్ అయి ఉంటుంది.
[64]) వివరణ-2090: నడుం బిగిస్తారంటే నడుం బిగించి సాధ్యమైనంత అధికంగా ఆరాధన చేసేందుకు ప్రయ త్నించాలి. లేదా చివరిదశకంలో ఏ’తెకాఫ్ ఆచరించటం వల్ల భార్యలకు దూరంగా ఉండేవారు. అంటే రాత్రంతా మేల్కొని నమా’జు చదువుతారు. ఖుర్ఆన్ పఠిస్తారు. దైవస్మరణలో ఉంటారు. దీన్ని గురించే తన ఇంటివారిని భార్యలను, బానిసరాళ్ళను, సేవకులను మేల్కొలిపే వారు. అందరూ కలసి దైవారాధన చేయటానికి.
[65]) వివరణ-2094: షబె ఖద్ర్ గురించి అనేక ‘హదీసు’లు వివిధ రాత్రుల గురించి ఉన్నాయి. ఈ రాత్రి ప్రతి సంవత్సరం వస్తూ ఉంటుంది. ఒక సంవత్సరం 21వ రాత్రి, మరో సంవత్సరం 23వ రాత్రి, మరో సంవత్సరం 25వ రాత్రి, మరో సంవత్సరం 27వ రాత్రి, మరో సంవత్సరం 29వ రాత్రి మారుతూ ఉంటాయి. ఏ సంవత్సరంలో ఏ రాత్రి ఉంటే దాన్ని గురించే ప్రవక్త (స) ఆ రాత్రి గురించే తెలిపేవారు. ఇందులో ఎలాంటి అభిప్రాయభేదాలు లేవు.
[66]) వివరణ-2097: ఈ ‘హదీసు’ ద్వారా స్త్రీలు కూడా ఏ’తెకాఫ్ పాటించవచ్చని తెలిసింది. అయితే తమ ఇంటి మస్జిద్లో ఏ’తెకాఫ్ పాటించటమే మంచిది.
[67]) వివరణ-2100: ఏ’తెకాఫ్ పాటించేవారు ఆ స్థితిలో మస్జిద్‌లోనే ఉండాలి. ఒకవేళ ఏదైనా అవసరం ఉండి మస్జిద్లో కూర్చొని ఇంటివైపు శుభ్రపరచడానికి, లేదా తల దువ్వడానికి తన తలను వంచితే, ఎటువంటి అభ్యంతరం లేదు. కాల కృత్యాలు, వీర్య స్ఖలనానికి, స్నానానికి, మస్జిద్ నుండి బయటకు వెళ్ళవచ్చు.
[68]) వివరణ-2101: ఏ’తెకాఫ్ కేవలం ఒక రాత్రి కూడా ఉండవచ్చని, ఏ’తెకాఫ్కి ఉపవాసం అవసరం లేదని ఈ ‘హదీసు’ ద్వారా తెలిసింది.
[69]) వివరణ-2104: ఈ ‘హదీసు’ ద్వారా ఫజ్ర్ నమా’జు చదివి ఏ’తెకాఫ్ ప్రదేశంలోనికి ప్రవేశించాలని తెలిసింది. కొందరు సూర్యాస్తమయం అయిన వెంటనే ఏ’తెకాఫ్ ప్రదేశంలో ప్రవేశించాలని అభిప్రాయపడుతున్నారు. రెండూ ధర్మసమ్మతమే, కాని ప్రవక్త సాంప్రదాయాన్ని అనుసరిస్తే అధిక పుణ్యం లభిస్తుంది.
[70]) వివరణ-2105: అంటే ఏదైనా ప్రత్యేక అవసరం ఉంటే మస్జిద్ నుండి బయటకువెళ్ళేవారు. అకస్మాత్తుగా దారిలో అనారోగ్యంగా ఉన్నవారు కలిస్తే నడుస్తూ పరామర్శించే వారు. దాని కోసం అక్కడ ఆగేవారు కారు. లేదా పరామర్శించడానికే ప్రత్యేకంగా బయటకు వెళ్ళే వారు కారు.
[71]) వివరణ-2107: మస్జిదె నబవీలోని స్తంభాల్లో ఒక స్తంభానికి తౌబహ్ అనే పేరు ఉండేది. దీన్ని ఇలా ఎందుకు అనేవారంటే అబూ లుబాబహ్ అ‘న్సారీ వల్ల ఒక పొరపాటు జరిగింది. అతను ఆ అపరాధ క్షమాపణ కొరకు తన్నుతాను ఈ స్తంభానికి కట్టేసుకున్నారు. కొన్ని రోజుల వరకు కట్టబడి ఉన్నారు. అతని తౌబహ్ స్వీకరించబడింది. ప్రవక్త (స) అతని కట్లు విప్పారు. ఈ స్తంభం వద్ద అతని పశ్చాత్తాపం స్వీకరించబడింది. అందుకే దీన్ని తౌబహ్ స్తంభం అంటారు. ఈ స్తంభం దగ్గర ప్రవక్త (స) కొరకు మంచం పడక వేయబడేది. నాలుగు వైపుల నుండి చుట్టుముట్టబడేది. అక్కడ ప్రవక్త (స) ఏ’తెకాఫ్ ఆచరించేవారు. అవసరం ఉంటే మస్జిద్లో మంచం వేయవచ్చును.
[72]) వివరణ-2108: ఏ’తెకాఫ్ మస్జిద్లో అవుతుంది. మస్జిద్ ప్రార్థనాస్థలం. అందువల్ల ఏ’తెకాఫ్ పాటించేవారు మస్జిద్లో పాపాలన్నిటి నుండి రక్షించబడతారు. కాని ఏ’తెకాఫ్ వల్ల కొన్ని సత్కార్యాల్లో పాల్గొనలేడు. ఉదా: జిహాద్ ఫీ సబీలిల్లాహ్, వ్యాధిగ్రస్తులను పరామర్శిం చటం, జనా’జహ్ నమా’జులో పాల్గొనడం, ముస్లిములను విద్వాంసులను సందర్శించటం మొదలైనవి. అందువల్ల ఏ’తెకాఫ్ పాటించని వారు మస్జిద్ బయట ఉండి ఈ సత్కార్యాలన్నిటినీ చేస్తారు. వీటన్నిటి పుణ్యం ఏ’తెకాఫ్ చేసేవారికి కూడా లభిస్తుంది.
***