6. విధిదానం(‘జకాత్‌) పుస్తకం | మిష్కాతుల్ మసాబీహ్

6- كِتَابُ الزَّكَاةِ

6. విధిదానం (జకాత్) పుస్తకం

‘జకాత్‌ అంటే పరిశుద్ధత, పరిశుభ్రత, వృద్ధిచెందుట – అని అర్థం. ఇస్లామీయ పరిభాషలో నిర్ణీత ధనంలో అల్లాహ్‌ (త) కోసం అల్లాహ్‌ (త) ఆదేశంతో పేదలకు, అగత్యపరులకు ఇవ్వడం. ఇది సంవత్సరం గడచిన తరువాత అల్లాహ్‌ (త) కోసం అగత్యపరులకు, బీదలకు ఇవ్వబడుతుంది. దీనిని ‘జకాత్‌ అంటారు. అల్లాహ్‌ (త) యొక్క ఈ హక్కును నెరవేర్చితే ఆ ధనం పరిశుద్ధమై, అభివృద్ధి, ఆధిక్యతను పొందు తుంది. ‘జకాత్‌ ఇచ్చేవారు కూడా పాపాల నుండి విముక్తి పొందుతారు. అందువల్లే దీన్ని ‘జకాత్‌ అంటారు. నమా’జులా ఇది కూడా ముఖ్య విధి. ఇస్లామ్‌ మూల స్తంభాలలో ఇది కూడా ఒకటి. ప్రవక్త (స) ఇలా ప్రవచించారు: “ఇస్లామ్‌ అయిదు స్తంభాలపై ఆధారపడి ఉంది. 1. అల్లాహ్‌ (త) తప్ప ఆరాధ్యులెవరూ లేరని సాక్ష్యం ఇవ్వటం, ముహమ్మద్‌ (స) ఆయన దాసులు మరియు ప్రవక్త అని, సాక్ష్యం ఇవ్వటం. 2. నమా’జ్‌ స్థాపించటం. 3. ‘జకాత్‌ చెల్లించటం. 4. రమ’దాన్‌ నెలలో ఉపవాసాలు పాటించటం. 5. ‘హజ్‌ చేయటం.

ఇంకా ఇలా ప్రవచించారు: ”మీరు మీ ధనం నుండి ‘జకాత్‌ చెల్లించండి, దానివల్ల మీ ధనం పరిశుద్ధ మవుతుంది. (అ’హ్మద్‌, తర్‌’గీబ్‌)

ప్రవక్త (స) ఇలా ప్రవచించారు: “మీరు ‘జకాత్‌ చెల్లించటం వల్ల మిగిలిన మీ ధనం పరిశుద్ధపరచ బడుతుంది. అందువల్లే అల్లాహ్‌ (త) ‘జకాత్‌ని విధించాడు.

ఖుర్‌ఆన్‌లో 82 చోట్ల ‘జకాత్‌ గురించి ఆదేశించడం జరిగింది, చాలాచోట్ల నమా’జ్‌తో పాటు ‘జకాత్‌ను గురించి కూడా ఆదేశించడం జరిగింది. ”నమా’జు ఆచరించండి, ‘జకాత్‌ చెల్లించండి,” అని.

‘జకాత్‌ చెల్లించినవాడు తన ఇస్లామ్‌ను పరిపూర్ణం చేసుకుంటాడు. ప్రవక్త (స) ప్రవచనం: ”తన ఇస్లామ్‌ను పరిపూర్ణం చేయడంలో తన ధనంలో నుండి ‘జకాత్‌ చెల్లించడం కూడా చేరి ఉంది.” (బ’జ్జార్‌)

ప్రవక్త (స) ఇలా ప్రవచించారు: వెండి, బంగారాల ‘జకాత్‌ చెల్లించనివారు తీర్పుదినం నాడు అతని ధనాన్ని పలకలుగా చేసి నరకాగ్నిలో కాల్చి అతని నుదురు, ప్రక్కలకు, వీపు పైనా వాతలు పెట్టబడును. 50 సంవత్సరాలు గల ఈ దినం అంతా అతన్ని శిక్షించటం జరుగుతూనే ఉంటుంది. చివరికి అందరినీ విచారించడం జరుగుతుంది. తీర్పు తర్వాత స్వర్గంలో లేదా నరకంలో వెళతాడు. (బు’ఖారీ)

ఒకవేళ తన జంతువుల ‘జకాత్‌ చెల్లించనిచో, తీర్పుదినం నాడు ఆ జంతువులు బలిసి ఉండి తమ పెద్దపెద్ద కొమ్ములతో తన యజమానిని పొడుస్తాయి, కాళ్ళతో త్రొక్కుతాయి. యాభైవేల సంవత్సరాలు గల ఈ దినం అంతా ఈ శిక్ష కొనసాగుతుంది. (ముస్లిమ్‌)

ఇలా అని కూడా ప్రవచించారు: ఆ ధనమే విషసర్పంగా మారి తన యజమానిని వెంటాడు తుంది. దాని యజమాని పరిగెడుతూ ఉంటాడు, చివరికి ఆ విషసర్పం అతన్ని పట్టుకొని అతని చేతిని కరుస్తూ మెడలో హారంలా అతని మెడకు చుట్టు కుంటుంది. అతని దవడలను చీల్చుతూ, ”నేను నీవు కూడబెట్టిన నీ ధనాన్ని, నిధిని,” అని అంటుంది. (బుఖారీ, నసాయి)

జకాత్‌ చెల్లించనందువల్ల వర్షం పడదు, కరవు కాటకాలు ఏర్పడుతాయి. ప్రవక్త (స) ఇలా ప్రవచించారు: ”జకాత్‌ చెల్లించనందు వల్ల కరవు కాటకాలు ఏర్పడుతాయి. ఒకవేళ జంతువులే లేకపోతే వర్షం కూడా పడదు.”

ఇబ్నె మస్‌’ఊద్‌ (ర) ఇలా ఉల్లేఖిస్తున్నారు: ”మనకు నమా’జ్‌ స్థాపించమని, ‘జకాత్‌ చెల్లించమని ఆదేశించడం జరిగింది. ‘జకాత్‌ చెల్లించని వారు నమా’జు ఆచరించినా వారి నమా’జు స్వీకరించబడదు.”

నమా’జ్‌ ఆచరిస్తూ ‘జకాత్‌ చెల్లించనివాడికి అతని నమా’జ్‌ లాభం చేకూర్చదు.

ప్రవక్త (స) మె’అరాజ్‌ రాత్రి కొంతమందిని చూసారు. వారు జంతువుల్లా నరకంలో చెత్తాచెదారం, ముళ్ళు, నరకంలోని వేడిరాళ్ళు తింటున్నారు. అప్పుడు ప్రవక్త (స)  ”ఓ జిబ్రీల్‌ వీరెవరు?” అని ప్రశ్నించారు. దానికి జిబ్రీల్‌ అన్నారు, ”వీరు తమ ధన-సంపదలో నుండి ‘జకాత్‌ చెల్లించనివారు.” (బజ్జార్‌, తర్‌గీబ్‌).

ప్రవక్త (స) ఇలా అన్నారు: ‘ ‘జకాత్‌ను తిరస్కరించే వాడు తీర్పుదినంనాడు నరకంలో ఉంటాడు.’

‘జకాత్‌ను తిరస్కరించే వ్యక్తి అవిశ్వాసి. మరణ శిక్షకు అర్హుడు, అల్లాహ్‌ ఆదేశం: ”…కాని వారు పశ్చాత్తాపపడి, నమా’జ్‌ స్థాపించి, ‘జకాత్‌ ఇస్తే, వారిని వారిమార్గాన వదిలిపెట్టండి…” (సూ. అత్ తౌబహ్, 9:5)

‘జకాత్‌ విధి అవడానికి కొన్ని షరతులు ఉన్నాయి: 1. ముస్లిమయి ఉండాలి; 2. నిర్ణీత ధనం కలిగి ఉండాలి; 3. ఆ నిర్ణీత ధనం తన అవసరాలకు మించి ఉండాలి; 4. అతనిపై రుణం ఉండకూడదు; 5. ఆ నిర్ణీత ధనం ఒక సంవత్సరం నుండి ఉండాలి. ఈ ఐదు షరతులు పూర్తయితే అతనిపై ‘జకాత్‌ విధి అవుతుంది.

వెండి నిర్ణీత పరిమాణం రెండు వందల దిర్‌హమ్‌లు, ఒక దిర్‌హమ్‌ 7/10 మిస్‌ఖాల్‌ అవుతుంది, ఒక మిస్‌ఖాల్‌ 4½  మాషాలు, 12 మాషాలు 1 తులం, 200 దిర్‌హమ్‌లు = 52½ తులాలకు నలభయ్యో వంతు ‘జకాత్‌ అంటే, 1 తులం 4 మాషాలు.

‘జకాత్‌, 100 రూపాయిలకు 2 ½ రూపాయిలు. బంగారంలో కనిష్ఠ పరిమాణం 20 దీనార్లు. ఒక దీనారు 4½  మాషాలు. 20 దీనార్లు 7½   తులాలు అవుతాయి. 7½ తులాల్లో 40వ వంతు 2½  మాషాలు ‘జకాత్‌ అవుతుంది. లేదా 2½ మాషాల, ఆ సమయంలో ఉన్న విలువ ఇవ్వవచ్చును. ఒకవేళ వెండి 52½  తులాల కన్నా తక్కువ ఉన్నా ‘జకాత్‌ తప్పనిసరి కాదు. ఒకవేళ సంతోషంతో ఇస్తే అది వేరే సంగతి. అదే విధంగా బంగారం 7½ తులాల కన్నా తక్కువ ఉంటే అందులో ‘జకాత్‌ లేదు, ప్రవక్త (స) ఇలా ప్రవచించారు: ”బంగారం విలువ 200కు చేరితే, నలభై దిర్‌హముల్లో ఒక దిర్‌హమ్‌ (40:1). ఆహార ధాన్యాల నిర్ణీత పరిమాణం 5 సఖ్లు.

ఒక వ’సఖ్‌ = 60 ‘సాలు, 1 సాఅ = 2 సేర్లు 550 గ్రాములు.

జంతువుల నిర్ణీత పరిమాణంలో మేకలు, గొర్రెలు 40 ఉండాలి. కనీసం నలభై మేకలుంటే 1 మేకను జకాత్‌గా ఇవ్వాలి. ఆవులు కనీసం 30 ఉండాలి. 30 ఆవులు ఉంటే ఒక సంవత్సరం నిండిన ఆవుదూడ ‘జకాత్‌గా చెల్లించాలి. ఒంటెల్లో కనీసం 5 ఒంటెలు ఉంటే 1 మేక ఇవ్వాలి. (ఇతర వివరాలు ముందు వస్తాయి). వెండి, బంగారు నగలు నిర్ణీత పరిమాణానికి చేరితే వాటిలో ‘జకాత్‌ ఉంది.

‘జకాత్‌ ధనం పొందవలసినవారు: 8 రకాలకు చెందిన వారు. వీరి గురించి అల్లాహ్‌ (త) ఆదేశం, ”నిశ్చయంగా దానాలు (‘సదఖాత్‌) కేవలం యాచించే నిరుపేదలకు మరియు యాచించని పేద వారికి, (‘జకాత్‌) వ్యవహారాలపై నియుక్తులైన వారికి మరియు ఎవరి హృదయాలనైతే (ఇస్లాంవైపుకు) ఆకర్షించవలసి ఉందో వారికి, బానిసల విముక్తికొరకు, ఋణగ్రస్తులైన వారికొరకు, అల్లాహ్‌ మార్గంలో (పోయే వారి కొరకు) మరియు బాటసారుల కొరకు. ఇది అల్లాహ్‌ నిర్ణయించిన ఒక విధి. మరియు అల్లాహ్‌ సర్వజ్ఞుడు, మహా వివేకవంతుడు.” (సూ. అత్‌ తౌబహ్‌, 9:60).

(1) దీని వివరణ ఎలా ఉందంటే ‘జకాత్‌ ధనం పేదలకు (ఫుఖరా) ఇవ్వాలి, వారు యాచించే వారైనా, యాచించనివారైనా సరే. ఒకచోట అల్లాహ్‌ (త) ఇలా ఆదేశించాడు, ”అల్లాహ్‌ మార్గంలో నిమగ్నులైన కారణంగా (తమ జీవనోపాధి కొరకు) భూమిలో తిరిగే అవకాశంలేక లేమికి గురిఅయ్యే పేదవారు (ధన సహాయానికి అర్హులు). ఎరుగని మనిషి వారి అడగక పోవటాన్ని చూసి, వారు ధనవంతులని భావించ వచ్చు. కాని వారి ముఖ చిహ్నాలు చూసి నీవు వారిని గుర్తించగలవు. వారు ప్రజలను పట్టుబట్టి అడిగేవారు కారు…” (సూ. అల్‌ బఖరహ్, 2:273)

(2). పేదవారంటే (మిస్కీన్) అవసరానికి తగ్గట్టు లేనివారు. ఒక ‘హదీసు’లో ప్రవక్త (స), ”పేదవాడంటే తన సమస్యలను పరిష్కరించుకోలేనివాడు, తన గురించి ఇతరులకు చెప్పుకోలేనివాడు. ఇటువంటి పేదవాడు ‘జకాత్‌ ధనం తీసుకోవడానికి అర్హుడు,” అని ప్రవచించారు. (బు’ఖారీ)

(3). అంటే ‘జకాత్‌ ధనాన్ని వసూలు చేసేవారు. వారిని పాలకుడు నియమిస్తాడు. వీరు పాలకుని అనుమతితో ప్రజల వద్దకు వెళ్ళి ‘జకాత్‌ సొమ్మును వసూలు చేస్తారు. వీరికి ‘జకాత్‌ సొమ్ము నుండి జీతాలు ఇవ్వ వచ్చును.

(4). అంటే, ఇస్లామ్‌ వైపు మొగ్గుచూపేవారు. వీరిలో అనేక రకాల వారున్నారు. 1. ఇప్పటి వరకు ముస్లిములు కాలేదు. కాని వారిహృదయాలు ఇస్లామ్‌ వైపు మొగ్గుచూపుతున్నాయి. ఇటువంటి వారికి ‘జకాత్‌ ఇస్తూ ఉండాలి. దీనివల్ల వారు బహిరంగంగా ఇస్లామ్‌ స్వీకరించటానికి. 2. ఇస్లామ్‌ స్వీకరించారు కాని, ఇస్లామ్‌ విషయంలో బలహీనులై ఉన్నారు, వీరికి కూడా ‘జకాత్‌ ఇస్తూ ఉండాలి. వారి ఇస్లామ్‌ పటిష్ఠం అవడానికి.

(5) ‘జకాత్‌ ధనాన్ని బానిసలను విడిపించడానికి, ఖైదీలను విడిపించడానికి వినియోగించవచ్చును. అంటే ‘జకాత్‌ ధనంతో బానిసను కొని దైవమార్గంలో విడిచిపెట్టడం, ఖైదీలను విడిపించటం చాలా ఉత్తమ కార్యం.

(6) అప్పు తీసుకున్నవాడు అంటే ప్రజలకు డబ్బు బాకీ ఉన్నవాడు, అతని వద్ద అప్పుతీర్చగా నిర్ణీత ధనం లేనివాడు, ఇటువంటి రుణగ్రస్తుడికి ‘జకాత్‌ ధనం ఇవ్వవచ్చును. అదేవిధంగా ఒక వ్యక్తి ఇద్దరు వ్యక్తుల మధ్య, రెండు దేశాల మధ్య ఉన్న సమస్యను పరిష్కరించడానికి, శాంతి స్థాపించడానికి అప్పుతీసుకొని ప్రయత్నిస్తే, ‘జకాత్‌ ధనాన్ని ఇటు వంటి వ్యక్తి రుణాన్ని తీర్చటానికి ఉపయోగించ వచ్చును.

(7) అల్లాహ్ (త) మార్గంలో కృషి ప్రయత్నాలలో వినియోగించ వచ్చును.

(8) ప్రయాణస్థితిలో ఉన్న ప్రయాణీకుడు ఖర్చులకు డబ్బు లేకుండా ఉంటే, తాను ధనవంతుడైనా వెంటనే తెప్పించలేని పరిస్థితిలో ఉంటే, అవసరానికి తగినంత ధనాన్ని ‘జకాత్‌ ధనం నుండి పొందవచ్చును.

ఎనిమిది రకాలమంది ‘జకాత్‌ ధనం పొందటానికి అర్హులు. దీని సారాంశం ఏమిటంటే ధనవంతుల నుండి ‘జకాత్‌ ధనాన్ని వసూలుచేసి పేద ముస్లిములకు ఇవ్వాలి. ప్రవక్త (స) ప్రవచనం: ‘జకాత్‌ ముస్లిమ్‌ ధనవంతుల నుండి వసూలు చేసి వారిలోని పేదలకు ఇవ్వబడుతుంది. (బు’ఖారీ)

క్రింద పేర్కొనబడిన వారికి ‘జకాత్‌ ఇవ్వరాదు, వారు తీసుకోరాదు. ప్రవక్త (స) కుటుంబం, సయ్యిద్, బనూ హాషిమ్, అంటే ‘అలీ సంతానం, అఖీల్‌ (ర), జ’అఫర్‌ (ర), ‘అబ్బాస్‌, ప్రవక్త (స) కుటుంబం వారు. ‘జకాత్‌ వసూలు చేసేవారుగా జీతం తీసుకునేవారు, ప్రవక్త (స) విడిచిపెట్టిన బానిస స్త్రీ పురుషులు, నిర్ణీతధనం గల ధనవంతుడు.

వివరాలు క్రింది ‘హదీసు’ల్లో ఉన్నాయి.

—–

 మొదటి విభాగం  اَلْفَصْلُ الْأَوَّلُ

1772– [ 1 ] ( متفق عليه ) (1/555)

عَنِ ابْنِ عَبَّاسٍ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم بَعَثَ مُعَاذًا إِلَى الْيَمَنِ فَقَالَ: “إِنَّكَ تَأْتِيْ قَوْمًا مِنْ أَهْلِ الْكِتَابِ. فَادْعُهُمْ إِلَى شَهَادَةِ أَنْ لَّا إِلَهَ إِلَّا اللهُ وَأَنَّ مُحَمَّدًا رَّسُوْلُ اللهِ. فَإِنْ هُمْ أَطَاعُوْا لِذَلِكَ. فَأَعْلِمْهُمْ أَنَّ اللهَ قَدْ فَرَضَ عَلَيْهِمْ خَمْسَ صَلَوَاتٍ فِيْ الْيَوْمِ وَاللَّيْلَةِ. فَإِنْ هُمْ أَطَاعُوْا لِذَلِكَ فأعلمهم أن الله قد فرض عليهم صدقة تؤخذ من أغنيائهم فترد في فقرائهم. فإن هم أطاعوا لذلك. فإياك وكرائم أموالهم واتق دعوة المظلوم فإنه ليس بينها وبين الله حجاب”. متفق عليه.

1772. (1) [1/555-ఏకీభవితం]

ఇబ్నె ‘అబ్బాస్‌ (ర) కథనం: ప్రవక్త (స) ముఆజ్‘ను యమన్‌ గవర్నర్‌గా నియమించి పంపిస్తూ ఇలా హితబోధచేసారు. ”ఓ ముఆజ్‌! నువ్వు గ్రంథప్రజల (యూదులు, క్రైస్తవులు) వద్దకు వెళుతున్నావు, ముందు నువ్వు వారికి అల్లాహ్‌ తప్ప మరో ఆరాధ్యుడు లేడని, ముహమ్మద్‌ (స) దైవప్రవక్త అని సాక్ష్యం ఇవ్వవలసిందిగా బోధించు. వారు నీ హితబోధను స్వీకరిస్తే అప్పుడు, దేవుడు రేయింబవళ్ళలో వారిపై ఐదుపూటల నమా’జులు విధిగా చేసాడని వారికి హితబోధ చేయి. దానికి కూడా వారు ఒప్పుకుంటే, దేవుడు వారిపై ‘జకాత్‌ను విధిగా చేసాడని, అది వారి ధనవంతుల నుండి వసూలు చేయబడి వారిలోని బీదవారికి పంచబడుతుందని తెలుపు. దానికి కూడా వారు అంగీకరిస్తే, నీవు వారి సంపదలోని మంచి వస్తువుల్ని తీసుకోకుండా జాగ్రత్తపడు, అంటే మధ్య తరగతికి చెందిన సరకును వసూలు చేయాలి. పీడితుని ఆర్తనాదానికి భయపడు. ఎందుకంటే పీడితుని ఆర్తనాదానికి – అల్లాహ్ కు మధ్య ఎలాంటి అడ్డుతెర ఉండదు. (బు’ఖారీ, ముస్లిం)

1773 – [ 2 ] ( صحيح ) (1/555)

وعَنْ أَبِيْ هُرَيْرَةَ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَا مِنْ صَاحِبِ ذَهَبٍ وَّلَا فِضَّةٍ لَّا يُؤَدِّيْ مِنْهَا حَقَّهَا إِلَّا إِذَا كَانَ يَوْمَ الْقِيَامَةِ صُفِّحَتْ لَهُ صَفَائِحُ مِنْ نَّارٍ. فَأُحْمِيَ عَلَيْهَا فِيْ نَارِ جَهَنَّمَ فَيُكْوَى بِهَا جَنْبُهُ وَجَبِيْنُهُ وَظَهْرُهُ كُلَّمَا رُدَّتْ أُعِيْدَتْ لَهُ فِيْ يَوْمٍ كَانَ مِقْدَارُهُ خَمْسِيْنَ أَلْفَ سَنَةٍ حَتَّى يُقْضَى بَيْنَ الْعِبَادِ فَيَرَى سَبِيْلِهِ إِمَّا إِلَى الْجَنَّةِ وَإِمَّا إِلَى النَّارِ”. قِيْلَ: يَا رَسُوْلَ اللهِ فَالْإِبْلُ؟ قَالَ: “وَلَا صَاحِبُ إِبْلٍ لَا يُؤَدِّيْ مِنْهَا حَقَّهَا وَمِنْ حَقِّهَا حَلْبُهَا يَوْمَ وِرْدِهَا إِلَّا إِذَا كَانَ يَوْمَ الْقِيَامَةِ بُطِحَ لَهَا بِقَاعٍ قُرْقَرٍ أَوْفَرَ مَا كَانَتْ لَا يَفْقِدُ مِنْهَا فَصِيْلًا وَّاحِدًا تَطَؤُهُ بِأَخْفَافِهَا وَتَعُضُّهُ بِأَفْوَاهِهَا كُلُّمَا مَرَّ عَلَيْهِ أَوْلَاهَا رُدَّ عَلَيْهِ أُخْرَاهَا فِيْ يَوْمٍ كَانَ مِقْدَارُهُ خَمْسِيْنَ أَلْفَ سَنَةٍ حَتَّى يُقْضَى بَيْنَ الْعِبَادِ فَيَرَى سَبِيْلَهُ إِمَّا إِلَى الْجَنَّةِ وَإِمَّا إِلَى النَّارِ”. قِيْلَ: يَا رَسُوْلَ اللهِ فَالْبَقَرُ، وَالْغَنَمُ؟ قَالَ: “وَلَا صَاحِبُ بَقَرٍ وَلَا غَنَمٍ لَّا يُؤْدِيْ مِنْهَا حَقَّهَا إِلَّا إِذَا كَانَ يَوْمُ الْقِيَامَةِ بُطِحَ لَهَا بِقَاعٍ قَرْقَرٍلَا يَفْقُدُ مِنْهَا شَيْئًا لَيْسَ فِيْهَا عَقْصَاءُ وَلَا جَلْحَاءُ وَلَا عَضْبَاءُ تَنْطِحُهُ بِقُرُوْنِهَا وَتَطَؤُهُ بِأَظْلَافِهَا كُلَّمَا مُرَّ عَلَيْهِ أَوْلَاهَا رُدَّ عَلَيْهِ أُخْرَاهَا فِيْ يَوْمٍ كَانَ مِقْدَارُهُ خَمْسِيْنَ أَلْفَ سَنَةٍ حَتَّى يُقْضَى بَيْنَ الْعِبَادِ فَيَرَى سَبِيْلَهُ إِمَّا إِلَى الْجَنَّةِ وَإِمَّا إِلَى النَّارِ”. قِيْلَ: يَا رَسُوْلَ اللهِ فَالْخَيْلُ؟” قَالَ: “اَلْخَيْلُ ثَلَاثَةٌ: هِيَ لِرَجُلٍ وِّزْرٌ وَهِيَ لِرَجُلٍ سِتْرٌ وَهِيَ لِرَجُلٍ أَجْرٌ. فَأَمَّا الَّتِيْ هِيَ لَهُ وِزْرٌ فَرَجُلٌ رَّبَطَهَا رِيَاءً وَّفَخْرًا وَّنِوَاءً عَلَى أَهْلِ الْإِسْلَامٍ فَهِيَ لَهُ وِزْرٌ. وَأَمَّا الَّتِيْ لَهُ سِتْرٌ فَرَجُلٌ رَّبَطَهَا فِيْ سَبِيْلِ اللهِ ثُمَّ لَمْ يَنْسَ حَقَّ اللهِ فِيْ ظُهُوْرِهَا وَلَا رِقَابِهَا فَهِيَ لَهُ سِتْرٌ. وَأَمَّا الَّتِيْ هِيَ لَهُ أَجْرٌ فَرَجُلٌ رَبَطَهَا فِيْ سَبِيْلِ اللهِ لِأَهْلِ الْإِسْلَامِ فِيْ مَرْجٍ وَّ رَوْضَةٍ فَمَا أَكَلَتْ مِنْ ذَلِكَ الْمَرْجِ أَوِ الرَّوْضَةِ مِنْ شَيْءٍ إِلَّا كُتِبَ لَهُ عَدَدَ مَا أَكَلَتْ حَسَنَاتٌ وَكُتِبَ لَهُ عَدَدَ أَرْوَاثِهَا وَأَبْوَالِهَا حَسَنَاتٌ وَلَا تَقْطَعُ طِوَلَهَا فَاسْتَنَّتْ شَرَفًا أَوْ شَرَفَيْنِ إِلَّا كَتَبَ اللهُ لَهُ عَدَدَ آثَارِهَا وَأَرْوَاثِهَا حَسَنَاتٌ وَلَا مَرَّ بِهَا صَاحِبُهَا عَلَى نَهْرٍ فَشَرِبَتْ مِنْهُ وَلَا يُرِيْدُ أَنْ يَّسْقِيَهَا إِلَّا كَتَبَ اللهُ لَهُ عَدَدَ مَا شَرِبَتْ حَسَنَاتٍ”.  قِيْلَ: “يَا رَسُوْلَ اللهِ فَالْحُمُرُ؟” قَالَ: “مَا أُنْزِلَ عَلَيَّ فِيْ الْحُمُرِ شَيْءٌ إِلَّا هَذِهِ الْآيَةُ الْفَاذَّةُ الْجَامِعَةُ (فَمَنْ يَّعْمَلْ مِثْقَالَ ذَرَّةٍ خَيْرًا يَّرَهُ وَمَنْ يَّعْمَلْ مِثْقَالَ ذَرَّةٍ شَرًّا يَّرَهُ  –الزلزلة، 99 : 7-8) . رَوَاهُ مُسْلِمٌ

1773. (2) [1/555-దృఢం]  

అబూ హురైరహ్‌ (ర) కథనం: దైవప్రవక్త (స) ఈ విధంగా ప్రవచించారు. వెండి, బంగారాలకు యజమాని అయినవాడు వాటి హక్కును చెల్లించక పోతే ప్రళయదినాన అతని కోసం వెండి, బంగారాల పలకలు తయారుచేయబడి, వాటిని నరకాగ్నిలో బాగా కాల్చి వాటితో వారి ప్రక్కలపై, తొడలపై, వీపులపై వాతలు వేయబడతాయి. ఆ పలకలు చల్లబడగానే వాటిని మళ్ళీ అగ్నిలో కాల్చి తిరిగి వారి ప్రక్కలపై, తొడలపై, వీపులపై వాతలు పెట్టటం జరుగుతుంది. మానవుల విచారణ జరిగే ఆరోజు వరకు ఈ పరంపర ఇలాగే కొనసాగుతూ ఉంటుంది. ఆ ఒక్కరోజు ప్రపంచంలోని యాభైవేల సంవత్సరాలకు సమానంగా ఉంటుంది. చివరికి మానవుల విచారణ ముగుస్తుంది. అప్పుడు వారు తమ మార్గం స్వర్గం వైపునకో లేక నరకం వైపునకో చూసుకుంటారు.

దైవప్రవక్తా! ”మరి ఒంటెల విషయంలో ఏమి జరుగు తుంది?” అని సహచరులు అడగ్గా, ప్రవక్త (స) ఈ విధంగా వివరించారు: ”ఒంటెల యజమాని, వాటికి సంబంధించిన హక్కును నెరవేర్చకపోతే, ప్రళయ దినాన అతడిని ఒక విశాల మైదానంలో ఆ ఒంటెల కాళ్ళ దగ్గర వెల్లకిలా లేక బోర్లా పడేయటం జరుగు తుంది. అసలు ఆ ఒంటెలకు సంబంధించిన హక్కు ఏమిటంటే వాటికి నీళ్ళు త్రాపే రోజున వాటి పాలను పితికి పేదలకు ఇవ్వాలి. ఈ హక్కు నెరవేర్చక పోయినా ఒంటెల యజమానులకు శిక్ష పడుతుంది. ఆ ఒంటెలన్నీ, అవి ప్రపంచంలో ఉన్నప్పుడు వాటిలో అత్యంత లావుగా ఉండిన ఒంటె మాదిరిగా అయి పోతాయి. ఆ ఒంటెల మందలో ఒక చిన్న ఒంటె కూడా తప్పిపోయి ఉండదు సుమా! అవన్నీ అతన్ని తమ కాళ్ళతో త్రొక్కుతాయి. నోళ్ళతో కొరుకుతాయి. తొక్కిన ప్రతి ఒంటె తిరిగి వచ్చి మళ్ళీ వరుసలో నిలుస్తుంది. మానవుల లెక్క తేల్చబడే ఆ రోజున ఈ పరంపర ఇలాగే కొనసాగుతూ ఉంటుంది. ఆ ఒక్కరోజే యాభైవేల సంవత్సరాలకు సమానంగా ఉంటుంది. చివరికి మానవుల మధ్య విచారణ జరిగిన తర్వాత అతను తన మార్గం స్వర్గం వైపునో లేక నరకం వైపునో చూసుకుంటాడు.

ఆ తరువాత, ”ఓ దైవప్రవక్తా! మరి ఆవుల, మేకల విషయంలో ఏం జరుగుతుంది?” అని ప్రశ్నించగా, దానికి సమాధానమిస్తూ దైవప్రవక్త ఈ విధంగా పేర్కొన్నారు: ”ఆవుల మేకల యజమాని వాటి హక్కును నెరవేర్చకపోతే ప్రళయదినాన అతన్ని వాటి మూలంగా ఓ విశాల మైదానంలో వెల్లకిలా లేదా బోర్లా పడవేయటం జరుగుతుంది. ఆ రోజు అతని పశువుల మందలోని ఒక్కటి కూడా తప్పిపోయి ఉండదు. అదేవిధంగా వాటిలో కొమ్ములు తిరిగి ఉన్న లేక కొమ్ములు లేని లేక విరిగిన కొమ్ములు గల ఆవులు, మేకలు అసలు ఉండవు. ఆ తర్వాత ఆ పశువులన్నీ కలిసి అతన్ని కొమ్ములతో పొడుస్తాయి. డెక్కలతో తొక్కి పడేస్తాయి. ప్రతి ఆవు లేక మేక ఒకసారి తొక్కిన తర్వాత మళ్ళీ వరుసలో కొచ్చి నిలబడుతుంది. మానవుల లెక్క తేల్చబడే ఆ రోజు వరకు ఈ పరంపర ఇలాగే కొనసాగుతూ ఉంటుంది. ఆ ఒక్కరోజు యాభైవేల సంవత్సరాలకు సమానంగా ఉంటుంది. చివరికి మానవుల మధ్య తీర్పు జరుగు తుంది. ఆ తర్వాత అతను తన దారి స్వర్గం వైపునో లేక నరకం వైపునో చూసుకుంటాడు.

ఆ తర్వాత, ”దైవప్రవక్తా! మరి గుర్రాలు కలిగి ఉన్న వారి పర్యవసానం ఎలా ఉంటుంది?” అని అడగ్గా, ప్రవక్త (స) ఇలా అన్నారు: ”గుర్రాలు మూడు రకాలుగా ఉంటాయి. కొన్ని గుర్రాలు తమ యజమానుల పాలిట భారంగా పరిణమిస్తాయి. మరికొన్ని గుర్రాలు తమ యజమానులను కప్పిపుచ్చుతాయి. మరికొన్ని గుర్రాలు పుణ్య ఫలాలను తెచ్చి పెడతాయి. ఎవరయినా ప్రదర్శనా బుద్ధితో, తమ గొప్పతనం వ్యాపింప జేయాలన్న ఉద్దేశ్యంతో, ఇస్లామ్‌ ధర్మానికి వ్యతిరేకంగా పోరాడే ఉద్దేశ్యంతో గుర్రాన్ని కట్టి ఉంచితే వారి పాలిట ఆ గుర్రం పాపానికి కారణమవుతుంది. మరెవరయితే లేమిని దాచటం కోసం, దైవమార్గంలో ఉపయోగ పడటం కోసం గుర్రాన్ని కట్టి ఉంచి దాని స్వారీ విషయంలో దేవుని హక్కును మరచిపోకుండా ఉంటారో వారి పాలిట ఆ గుర్రం వారి లోపాలను కప్పిపుచ్చేదిగా ఉంటుంది. ఇంకా ఎవరయినా అల్లాహ్ మార్గంలో పోరాడే ఉద్దేశ్యంతో ముస్లిముల కోసం దాన్ని ఏదయినా పచ్చిక బైలులోగానీ లేదా తోటలో గానీ కట్టి ఉంచితే, ఆ గుర్రం ఆ పచ్చిక బైలు లేక తోటలో మేసిన గడ్డి, ఆకులు, అలములకు సమానంగా పుణ్యం అతని కర్మల జాబితాలో నమోదు చేయబడతాయి. దాని మల-మూత్రాలకు సమానమైన పుణ్యం కూడా అతని కర్మల జాబితాలో వ్రాయబడుతుంది. చివరికి ఆ గుర్రం త్రాడు తెంచుకొని ఒకటి రెండు గుట్టలు దూకివస్తే, ఆ సమయంలో అది ఎంతదూరం నడిచిందో, ఎంత మల మూత్రాన్ని విసర్జించిందో, అంత పుణ్యం అతని కర్మల పత్రంలో నమోదు చేయబడుతుంది. అంతేకాదు, యజమాని తన గుర్రాన్ని తీసుకొని, ఏదయినా నది ఒడ్డు దగ్గరి నుండి వెళ్ళినప్పుడు, తనకు నీళ్ళు త్రాపించే ఉద్దేశ్యం లేక పోయినా గుర్రం దానంతట అదే అక్కడికి వెళ్ళి నీళ్ళు త్రాగితే, అప్పుడు కూడా అది ఎన్ని గుక్కలు నీళ్ళు త్రాగుతుందో అన్ని పుణ్యాలు అతని కర్మల పత్రంలో నమోదు చేయడం జరుగుతుంది.”

ఆ తర్వాత సహచరులు దైవప్రవక్తా! ”మరి గాడిదల విషయం ఏమిటి?” అని అడిగారు. దానికి ఆయన ”ప్రత్యేక మైన, ఎంతో సమగ్రమైన ఈ వాక్యం తప్ప గాడిదల గురించి ఎలాంటి వాక్యమూ నాపై అవతరించలేదు” అని సమాధానం ఇచ్చారు.

అప్పుడు ప్రతివాడు తాను ,  రవ్వంత  మంచి చేసి ఉన్నా  దానిని చూసుకుంటాడు. మరియు అలాగే, ప్రతివాడు తాను రవ్వంత (పరవాణువంత)  చెడును చేసి, దానిని చూసుకుంటాడు.” (సూ. అల్‌ జిల్‌జాల్‌, 99:7-8) (ముస్లిం)

1774 – [ 3 ] ( صحيح ) (1/557)

عَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَنْ آتَاهُ اللهُ مَالًا فَلَمْ يُؤَدِّ زَكَاتَهُ مُثِّلَ لَهُ مَالُهُ  يوم القيامة شُجَاعًا أَقْرَعَ لَهُ زَبِيْبَتَانِ يُطَوَّقُهُ يَوْمَ الْقِيَامَةِ ثم يَأْخُذُ بِلَهْزَمَتَيْهِ- يَعْنِيْ شِدْقَيْهِ – ثم يَقُوْلُ: “أَنَا مَالُكَ، أَنَا كَنْزُكَ”. ثُمَّ تَلَا هَذِهِ الْآيَةَ: (وَلَا يَحْسَبَنَّ الَّذِيْنَ يَبْخَلُوْنَ إِلَى آخِرِ الْآيَةِ، 3: 180). رَوَاهُ الْبُخَارِيُّ.

1774. (3) [1/557-దృఢం]

అబూహురైరా (ర) కథనం: ప్రవక్త (స) ఇలా ప్రవచించారు: ”అల్లాహ్‌(త) ఎవరికయితే ఐశ్వర్యం ప్రసాదించాడో ఆ వ్యక్తి తన ధనంలో నుండి ‘జకాత్‌ చెల్లించకపోతే ఆ ధనం తీర్పుదినాన విషసర్పంగా మారుతుంది. దాని పడగపై రెండు నల్లటి చుక్క లుంటాయి. ఆ సర్పం అతని కంఠాన్ని భారమైన హారంలా చుట్టుకుంటుంది. నేను నీ ధనాన్ని, నీవు కూడబెట్టిన నిధిని అంటూ ఆ సర్పం అతని దవడల్ని గట్టిగా కరచుకుంటుంది. ఆ తరువాత ప్రవక్త (స) ఈ ఆయతును పఠించారు: ”అల్లాహ్‌(త) తన అను గ్రహాలను ప్రసాదించినవారు పిసినారులుగా ప్రవర్తిస్తే …. ఆయతు చివరి వరకు. ” [1] (బు’ఖారీ)

1775 – [ 4 ] ( متفق عليه ) (1/557)

عَنْ أَبِيْ ذَرٍّ رَضِيَ اللهُ عَنْهُ عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ: “مَا مِنْ رَجُلٍ يَّكُوْنُ لَهُ إِبْلٌ أَوْ بَقَرٌ أَوْ غَنَمٌ لَا يُؤَدِّيْ حَقَّهَا إِلَّا أُتِيَ بِهَا يَوْمَ الْقِيَامَةِ أَعْظَمَ مَا يَكُوْنُ وَأَسْمَنَهُ تَطَؤُهُ بِأَخْفَافِهَا وَتَنْطِحُهُ بِقُرُوْنِهَا كُلَّمَا جَازَتْ أُخْرَاهَا رُدَّتْ عَلَيْهِ أَوْلَاهَا حَتَّى يُقْضَى بَيْنَ النَّاسِ”. متفق عليه.

1775. (4) [1/557-ఏకీభవితం]

అబూజ’ర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ఇలా ప్రవచించారు: ఒంటెలు, ఆవులు, మేకలు నిర్ణీత పరిమాణంలో ఉన్నప్పటికీ వాటి హక్కు చెల్లించక పోయినా, ‘జకాత్‌ చెల్లించకపోయినా అవి తీర్పుదినం నాడు రప్పించబడతాయి. చాలా పెద్దవిగా, బలిసి ఉంటాయి. ఆ పశువులు తమ యజమానిని తమ డెక్కలతో, కొమ్ములతో తన్నుతూ పొడుస్తూ ఉంటాయి. ఒక మంద వెళ్ళిపోగానే మరో మంద వచ్చి అదేవిధంగా తన్నుతూ, పొడుస్తూ ఉంటుంది. చివరికి ప్రజలమధ్య తీర్పు చేయడం జరుగుతుంది. (బు’ఖారీ, ముస్లిమ్‌)

1776 – [ 5 ] ( صحيح ) (1/557)

وَعَنْ جَرِيْرِ بْنِ عَبْدِ اللهِ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِذَا أَتَاكُمُ الْمُصَدِّقُ فَلْيَصْدُرْ عَنْكُمْ وَهُوَ عَنْكُمْ رَاضٍ”.  رَوَاهُ مُسْلِمٌ.

1776. (5) [1/557- దృఢం]

జరీర్‌ బిన్‌ ‘అబ్దుల్లాహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ఇలా ప్రవచించారు: ”పాలకుని తరఫు నుండి మీ దగ్గరకు ఎవరైనా ‘జకాత్‌ వసూలు చేయటానికి వస్తే, వారు మీ దగ్గర నుండి సంతోషంగా, తృప్తిగా తిరిగి వెళ్ళాలి. అంటే మీరు ‘జకాత్‌ పూర్తిగా చెల్లిస్తే, వారు మీ పట్ల సంతోషిస్తూ తిరిగి వెళతారు. (ముస్లిమ్‌)

1777 – [ 6 ] ( متفق عليه ) (1/557)

وَعَنْ عَبْدِ اللهِ بْنِ أَبِيْ أَوْفَى رَضِيَ اللهُ عَنْهُمَا قَالَ: كَانَ النَّبِيُّ صلى الله عليه وسلم إِذَا أَتَاهُ قَوْمٌ بِصَدَقَتِهِمْ. قَالَ: “اَللّهُمَّ صَلِّ عَلَى آلِ فُلَانٍ”. فَأَتَاهُ أَبِيْ بِصَدَقَتِهِ. فَقَالَ: “اِللّهُمَّ صلى الله عَلَى آلِ أَبِيْ أَوْفَى”. متفق عليه.

وَفِيْ  رِوَايَةٍ: “إِذَا أَتَى الرَّجُلُ النَّبِيَّ بِصَدَقَتِهِ قَالَ: “اَللّهُمَّ صَلِّ عَلَيْهِ”.

1777. (6) [1/557-ఏకీభవితం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ అబీ అవ్‌ఫా (ర) కథనం: ప్రవక్త (స) వద్దకు ఏ జాతివారైనా ‘జకాత్‌, దానధర్మాలు తీసుకొని వస్తే, ప్రవక్త (స) వారి కోసం ‘ఓ అల్లాహ్‌! ఫలానా కుటుంబం వారిని కరుణించు’ అని ప్రార్థించే వారు. మా తండ్రిగారు కూడా సదఖహ్ తీసుకొని వచ్చారు, నా తండ్రి గురించి ప్రవక్త (స) ‘ఓ అల్లాహ్‌! అబూ అవ్ఫా కుటుంబంపై కారుణ్యం అవతరింప జేయి,’ అని ప్రార్థించారు. (బు’ఖారీ, ముస్లిమ్‌).

మరో ఉల్లేఖనంలో ఇలా ఉంది: ప్రవక్త (స) వద్దకు ఎవరైనా సదఖహ్ తీసుకొనివస్తే, ప్రవక్త(స) అతని గురించి, ‘ఓ అల్లాహ్‌! ఇతన్ని కరుణించు’ అని ప్రార్థించే వారు.

1778 – [ 7 ] ( متفق عليه ) (1/558)

عَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: بَعَثَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم عُمَرَ عَلَى الصَّدَقَةِ فَقِيْلَ: مَنَعَ ابْنُ جَمِيْلِ وَخَالِدُ بْنُ الْوَلِيْدِ وَالْعَبَّاسُ. فَقَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَا يَنْقِمُ ابْنُ جَمِيْلِ إِلَّا أَنَّهُ كَانَ فَقِيْرًا فَأَغْنَاهُ اللهُ وَرَسُوْلُهُ. وَأَمَّا خَالِدٌ فَإِنَّكُمْ تَظْلِمُوْنَ خَالِدًا قَدِ احْتَبَسَ أَدْرَاعَهُوَأَعْتُدَهُ  فِيْ سَبِيْلِ اللهِ. وَأَمَّا الْعَبَّاسُ فَهِيَ عَلَىَّ.وَمِثْلُهَا مَعَهَا”. ثُمَّ قَالَ: “يَا عُمَرُ أَمَا شَعَرْتَ أَنَّ عَمَّ الرَّجُلِ صِنْوُا أَبِيْهِ؟” متفق عليه.

1778. (7) [1/558- ఏకీభవితం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) సదఖహ్ సొమ్ము వసూలు చేసి తెచ్చి ప్రజా సంక్షేమ నిధిలో జమచేయాలని ‘ఉమర్‌ (ర)ను ఆదేశించారు. ఆయన వెళ్ళి వసూలుచేసి తీసుకొనివచ్చారు. కాని కొంత మంది ‘జకాత్‌ చెల్లించలేదు. ఇబ్నె జమీల్‌, ‘ఖాలిద్‌ బిన్‌ వలీద్‌, ‘అబ్బాస్‌ మొదలైన వారు ‘జకాత్‌ ఇవ్వ లేదు. దానిపై ప్రవక్త (స) ‘ఇబ్నె జమీల్‌ ఎందువల్ల ‘జకాత్‌ చెల్లించలేదంటే, అతను ముందు బీదవాడు. ఇప్పుడు అల్లాహ్‌(త), ఆయన ప్రవక్త అతన్ని ధన వంతునిగా చేసారు. అంటే అతను చాలా కృతఘ్నుడు. గుర్తించని వాడు. అతను కృతజ్ఞతా పూర్వకంగా ఇచ్చి ఉండవలసింది. అయినప్పటికీ అతడు ఇవ్వలేదు. దీనివల్ల అతడు చాలా పిసినారి అని తెలుస్తుంది. ‘ఖాలిద్‌ విషయం ఎలా ఉందంటే అతనిపట్ల మీరు దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నట్లు ఉంది. ఎందుకంటే అతడు తన యుద్ధ పరికరాలన్నిటినీ యుద్ధసామగ్రిని దైవమార్గంలో, జిహాద్‌ కొరకు అంకితం చేసాడు. అంటే ‘ఖాలిద్‌ జిహాద్‌ కొరకు తన సామాగ్రి నంతా ముజాహిదీన్లకు అప్పగించాడు. ఇప్పుడు అతనిపై ‘జకాత్‌ విధికాదు. మరోసారి ‘జకాత్‌ వసూలు చేయడం అధర్మం. మిగిలింది ‘అబ్బాస్‌ (ర) ‘జకాత్‌. అది నా బాధ్యత. దానికి రెట్టింపు కూడా అంటే మా చిన్నాన్న ‘అబ్బాస్‌ (ర) తరఫున రెండు సంవత్సరాల ‘జకాత్‌ నేను చెల్లిస్తాను,’ అని అన్నారు. ఆ తర్వాత మళ్ళీ ఇలా అన్నారు, ”ఓ ‘ఉమర్‌! పిన తండ్రి, తండ్రివంటివాడు. తండ్రిని ఎలా వినయ విధేయతలతో గౌరవించడం జరుగుతుందో పినతండ్రికి కూడా అదే స్థానం ఇవ్వాలి.” (బు’ఖారీ, ముస్లిమ్‌)

1779 – [ 8 ] ( متفق عليه ) (1/558)

عَنْ أَبِيْ حُمَيْدٍ السَّاعِدِيِّ: اسْتَعْمَلَ النَّبِيُّ صلى الله عليه وسلم رَجُلًا مِّنَ الْأَزْدِ. يُقَالُ لَهُ ابْنُ اللُّتْبِيَةِ عَلَى الصَّدَقَةِ فَلَمَّا قَدِمَ. قَالَ: هَذَا لَكُمْ وَهَذَا أُهْدِيَ لِيْ فَخَطَبَ النَّبِيُّ صلى الله عليه وسلم فَحَمِدَ اللهُ وَأَثْنَى عَلَيْهِ وَقَالَ: “أَمَّا بَعْدُ فَإِنِّيْ اسْتَعْمِلُ رِجَالًا مِّنْكُمْ عَلَى أُمُوْرٍ مِّمَّا وَلَانِيَ اللهُ فَيَأْتِيْ أَحَدُكُمْ فَيَقُوْلُ: هَذَا لَكُمْ وَهَذَا هَدْيَّةٌ أُهْدِيَتْ لِيْ .فَهَلَّا جَلَسَ فِيْ بَيْتِ أَبِيْهِ أَوْ بَيْتِ أُمِّهِ فَيُنْظُرُ أَيُهْدَى لَهُ أَمْ لَا؟ وَالَّذِيْ نَفْسِيْ بِيَدِهِ لَا يَأْخُذُ أَحَدٌ مِّنْهُ شَيْئًا إِلَّا جَاءَ بِهِ يَوْمَ الْقِيَامَةِ يَحْمِلُهُ عَلَى رَقَبَتِهِ إِنْ كَانَ بَعِيْرًا لَهُ رُغَاءٌ أَوْ بَقَرًا لَهُ خُوَارٌ أَوْ شَاةً تَيْعِرُ”. ثُمَّ رَفَعَ يَدَيْهِ حَتَّى رَأَيْنَا عُفْرَتَيْ إِبْطَيْهِ ثُمَّ قَالَ: “اَللّهُمَّ هَلْ بَلَّغْتُ اَللّهُمَّ هَلْ بَلَّغْتُ”. متفق عليه.

قَالَ الْخَطَّابِيُّ: وَفِيْ قَوْلِهِ: “هَلَّا جَلَسَ فِيْ بَيْتِ أُمِّهِ أَوْ أَبِيْهِ فَيَنْظُرَ أَيُهْدَى إِلَيْهِ أَمْ لَا؟” دَلِيْلٌ عَلَى أَنَّ كُلَّ أَمْرٍ يَّتَذَرُّعُ بِهِ إِلَى مَحْظُوْرٍ فَهُوَ مَحْظُوْرٌ وَّكُلُّ دَخْلٍ فِيْ الْعُقُوْدِ يُنْظَرُ هَلْ يَكُوْنُ حُكْمُهُ عِنْدَ الْانْفِرَادِ كَحُكْمِهِ عِنْدَ الْاِقْتِرَانِ أَمْ لَا؟هَكَذَا فِيْ شَرْحِ السُّنَّةِ.

1779. (8) [1/558- ఏకీభవితం]

అబూ ‘హుమైద్‌ సా’ఇదీ (ర) కథనం: ప్రవక్త (స) అ’జ్‌ద్‌ తెగకు చెందిన ఒక వ్యక్తిని ‘జకాత్‌ వసూలు చేయమని చెప్పి పంపారు. అతని పేరు ఇబ్ను-లుతుబియ్యహ్‌. అతను ‘జకాత్‌ సొమ్ము వసూలుచేసి మదీనహ్ వచ్చి, ‘ఈ ధనం ‘జకాత్‌ది, ఈ ధనం నాకు కానుకగా ఇచ్చారు,’ అని అన్నాడు. ప్రవక్త (స) అది విని, ఇలా ప్రసంగించారు: అల్లాహ్‌ను స్తుతించిన తర్వాత, ”నేను మీలోని కొందరిని ‘జకాత్‌ వసూలు చేయమని పంపుతాను. దీన్ని గురించి, అల్లాహ్‌(త) నన్ను ఆదేశించాడు. నన్ను దాన్ని గురించి ఆదేశించిన పిమ్మట దాన్ని నెరవేర్చటానికి వెళ్ళి తిరిగివచ్చిన వారు, ‘ఇంత ధనం ‘జకాత్‌ది, ‘ఇంత నాకు కానుకగా ఇవ్వబడింది,’ అని అంటున్నారు. ఇటువంటి వారు తమ తండ్రిఇంట్లో కూర్చోవాలి. అతనికి కానుకలు పంపబడతాయో లేదో చూసుకుంటాడు. ఎవరి చేతిలో నా ప్రాణం ఉందో ఆయన(త) సాక్షి! మీలో ఎవరైనా అనుమతి లేకుండా, హక్కులేకుండా ఏదైనా వస్తువును తీసుకుంటే, తీర్పుదినంనాడు తన భుజాలపై వేసుకొని తీసుకు వస్తాడు. ఒకవేళ అది ఒంటె అయితే దాని శబ్దం ఉంటుంది. ఆవు అయితే దాని శబ్దం ఉంటుంది. మేక అయితే దాని శబ్దం ఉంటుంది. అంటే ఇటువంటి వస్తువులను తన భుజంపై వేసుకొని తీర్పు మైదానంలో వస్తాడు. ఇవన్నీ కేకలు పెడుతూ అల్లరి చేస్తూ అరుస్తూ ఉంటాయి. అది చూసి తీర్పు మైదానంలో ఉన్న వారంతా ఇతడు దొంగ, మోసగాడని తెలుసుకుంటారు. ఈ విధంగా అతడు అవమానం, పరాభవం పాలవుతాడు,’ అని అన్నారు. ఆ తరువాత ప్రవక్త (స) తన చేతులను ఎంత పైకి ఎత్తారంటే, మేము ప్రవక్త (స) చంకల తెలుపును చూసు కున్నాము. ఆ తరువాత ఇలా అన్నారు, ”ఓ అల్లాహ్‌! నేను నీ ఆదేశాలను అందజేసాను, నేను నీ ఆదేశాలను అందజేసాను, ఇప్పుడు ఎవరైనా నమ్మండి, నమ్మక పోండి.” [2]  (బు’ఖారీ, ముస్లిమ్‌)

గొప్ప పండితులు ఖత్తాబీ ఈ ‘హదీసు’ యొక్క ఈ వాక్యం, ‘అతన్ని తన తండ్రిఇంట్లో కూర్చోమనండి, ఎవరెవరు కానుకలు ఇస్తారో చూస్తాడు,’ గురించి వివరణ ఇస్తూ పని పేరు చెప్పుకొని అధర్మంగా పొంద గోరితే పని, పేరు చెప్పుకోవటం కూడా అధర్మంగానే పరిగణించబడుతుంది. అదే విధంగా అమ్మడం, కొనడం, వివాహంతో సంబంధం ఉన్న విషయాలన్నీ దొరికినప్పుడు ఎలా ఉంటుందో వేరైనప్పుడు కూడా దాని ప్రకారమే ఉంటుంది. మొదటిది సబబుగా ఉంది. రెండవది సబబుగా లేదు. షరహ్‌ సున్నహ్‌లో ఇదే విధంగా ఉంది.

1780 – [ 9 ] ( صحيح ) (1/559)

وَعَنْ عَدِيِّ بْنِ عَمِيْرَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: ” مَنِ اسْتَعْمَلْنَاهُ مِنْكُمْ عَلَى عَمَلٍ فَكَتَمَنَا مِخْيَطًا فَمَا فَوْقَهُ كَانَ غُلُوْلًا يَأْتِيْ بِهِ يَوْمَ الْقِيَامَةِ”.  رَوَاهُ مُسْلِمٌ .

1780. (9) [1/559-దృఢం]  

‘అదీ బిన్‌ ‘అమీరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ఇలా ప్రవచించారు, ”మీలో ఎవరినైనా మేము ‘జకాత్‌ వసూలుకు నియమించి, అతడు మా నుండి సూదికి సమానంగా లేదా దానికంటే చిన్న వస్తువును దాచుకొని మాకు ఇవ్వకపోతే అది ద్రోహం అవుతుంది. తీర్పుదినం నాడు అతడు ఆ వస్తువును తీసుకు వస్తాడు.” [3] (ముస్లిమ్‌)

—–

اَلْفَصْلُ الثَّانِيْ  రెండవ విభాగం 

1781 – [ 10 ] ( لم تتم دراسته ) (1/559)

عَنِ ابْنِ عَبَّاسٍ رَضِيَ اللهُ عَنْهُمَا قَالَ: لَمَّا نَزَلَتْ (وَالَّذِيْنَ يَكْنِزُوْنَ الذَّهَبَ وَالْفِضَّةَ: 9: 34-35) كَبُرَ ذَلِكَ عَلَى الْمُسْلِمِيْنَ. فَقَالَ: عُمَرُ أَنَا أُفَرِّجُ عَنْكُمْ فَانْطَلَقَ. فَقَالَ: يَا نَبِيَّ اللهِ قَدْ كَبُرَ عَلَى أَصْحَابِكَ هَذِهِ الْآيَةِ. فَقَالَ نَبِيُّ الله صلى الله عليه وسلم: “إِنَّ اللهَ لَمْ يَفْرِضْ الزَّكَاةَ إِلَّا لِيُطَيِّبَ بِهَا مَا بَقِيَ مِنْ أَمْوَالِكُمْ وَإِنَّمَا فَرَضَ الْمَوَارِيْثَ وذَكَرَ كَلِمَةً لِّتَكُوْنَ لِمَنْ بَعْدَكُمْ”. قَالَ: فَكَبَّرَعُمَرُ .ثُمَّ قَالَ لَهُ: “أَلَا أُخْبِرُكَ بِخَيْرٍ مَا يَكْنِزُ الْمَرْءُ الْمَرْأَةُ الصَّالِحَةُ إِذَا نَظَرَ إِلَيْهَا سَرَّتْهُ وَإِذَا أَمَرَهَا أَطَاعَتْهُ وَإِذَا غَابَ عَنْهَا حَفِظَتْهُ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ .

1781. (10) [1/559-అపరిశోధితం]  

ఇబ్నె ‘అబ్బాస్‌ (ర) కథనం: ఈ ఆయతు అంటే: ”… మరియు ఎవరైతే వెండి బంగారాన్ని కూడబెట్టి, దాన్ని అల్లాహ్‌ మార్గంలో ఖర్చుపెట్టరో వారికి బాధాకరమైన శిక్ష గలదనే వార్తను వీనిపించు.” (సూ. అత్తౌబహ్‌, 9:34) ప్రవక్త (స) అనుచరులు చాలా భయపడ్డారు. అప్పుడు ‘ఉమర్‌ (ర) నేను మీ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తాను అని ఓదార్చి ప్రవక్త (స) వద్దకు వచ్చి, ”ఓ అల్లాహ్‌ ప్రవక్తా! ఈ వాక్యం వల్ల అనుచరులు చాలా ఆందోళనకు గురయ్యారు,” అని విన్నవించుకున్నారు. అప్పుడు ప్రవక్త (స), ‘ఏం భయంలేదు, అల్లాహ్‌ (త) ‘జకాత్‌ను మిగతా ధనాన్ని పరిశుద్ధపరచటానికి విధించాడు. మరియు వారసత్వాన్ని మిగిలిన వారు పొందాలని విధించాడు’ అని లేదా దీనిలాంటి మరో పదాన్ని పలికారు.’ ‘ఉమర్‌ (ర) సంతోషంతో ‘అల్లాహు అక్బర్‌’ అని అన్నారు. ఆ తర్వాత ప్రవక్త (స) ‘ఉమర్‌తో ”నేను నీకు ఉత్తమమైన నిధిని చూపెడతాను. అదేమి టంటే విధేయురాలైన పుణ్య స్త్రీ. ఆమెను చూస్తే అతన్ని సంతోషపరచుతుంది, ఆదేశిస్తే ఆజ్ఞాపాలన చేస్తుంది, అతను ఉపాధి నిమిత్తం ఇంటి నుండి దూరంగా ఉంటే అతని ధన, సంతాన, గౌరవ మర్యాదలను సంరక్షిస్తుంది.” [4]  (అబూ దావూద్‌)

1782 – [ 11 ] ( لم تتم دراسته ) (1/559)

عَنْ جَابِرِ بْنِ عَتِيْكٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “سَيَأْتِيْكُمْ رُكَيْبٌ مُّبَغَّضُوْنَ فَإِذَا جَاؤُكُمْ فَرَحِّبُوْا بِهِمْ وَخَلُّوْا بَيْنَهُمْ وَبَيْنَ مَا يَبْتَغُوْنَ فَإِنْ عَدَلُوْا فَلِأَنْفُسِهِمْ وَإِنْ ظَلَمُوْا فَعَلَيْهِمْ وَأَرْضُوْهُمْ فَإِنَّ تَمَامَ زَكَاتِكُمْ رِضَاهُمْ وَلْيَدْعُوْا لَكُمْ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ.

1782. (11) [1/559- అపరిశోధితం]  

జాబిర్‌ బిన్‌ ‘అతీక్‌ (ర) కథనం: ప్రవక్త (స) ఇలా బోధించారు: ఇక ముందు మీ వద్దకు ‘జకాత్‌ వసూలు చేయడానికి ఒక చిన్న బృందం వస్తుంది. ప్రజలు వారిని గురించి చెడుగా భావిస్తారని వాళ్ళు ఆగ్రహం కలిగి ఉంటారు. ఎందుకంటే వారు ‘జకాత్‌ వసూలు చేయడానికి వస్తారు. మీ ధనం గురించి మిమ్మల్ని వారు కోరుతారు. వారు మీ దగ్గరకు వస్తే, వారికి స్వాగతం పలకండి, శుభాకాంక్షలు తెలియజేయండి. మీ ధనాన్నంతా వారి ముందు పెట్టండి, జంతువులు ఉంటే వారి ముందు నిలబెట్టండి. వారు లెక్కకట్టి వారు కోరినంత తీసుకోనివ్వండి. ఒకవేళ వారు న్యాయంగా తీసుకుంటే తమకోసమే తీసుకుంటారు, అంటే న్యాయంగా వ్యవహరించడం వల్ల వారికి పుణ్యం లభిస్తుంది. ఒకవేళ వారు అన్యాయంగా వ్యవహరిస్తే దానికి తగిన శిక్ష వారిపైనే పడుతుంది. వారిని తృప్తి పరచండి, సంతోషపెట్టండి. ఎందుకంటే మీ ‘జకాత్‌ అంతా వారి తృప్తి, సంతోషాలపైనే ఆధారపడి ఉంది. అయితే వారు మీ గురించి ప్రార్థించాలి. (అబూ దావూద్‌)

1783 – [ 12 ] ( لم تتم دراسته ) (1/560)

عَنْ جَرِيْرِ بْنِ عَبْدِ اللهِ قَالَ: جَاءَ نَاسٌ يَعْنِيْ مِنَ الْأَعْرَابِ إِلَى رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم فَقَالُوْا: إِنَّ نَاسًا مِّنَ الْمُصَدِّقِيْنَ يَأْتُوْنَا فَيَظْلِمُوْنَا قَالَ: فَقَالَ: “أَرْضُوْا مُصَدِّقِيْكُمْ وَإِنْ ظَلِمْتُمْ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ.

1783. (12)[1/560- అపరిశోధితం]

 జరీర్‌ బిన్‌ ‘అబ్దుల్లాహ్‌ (ర) కథనం: కొందరు పల్లె వాసులు ప్రవక్త (స) వద్దకు వచ్చారు. వారు ఇలా విన్నవించుకున్నారు, ”ఓ అల్లాహ్‌ ప్రవక్తా! ‘జకాత్‌ వసూలు చేయడానికి అధికారులు మా వద్దకు వస్తున్నారు, మమ్మల్ని పీడిస్తున్నారు, హింసిస్తున్నారు. అప్పుడు ప్రవక్త (స) ‘మీరు ‘జకాత్‌ వసూలు చేసే వారిని సంతోషపరచండి, వారు ఎంత అడిగితే అంత ఇచ్చివేయండి’. దానికి వారు, ‘ఓ అల్లాహ్‌ ప్రవక్తా! వారు మమ్మల్ని పీడించినా, అప్పుడు కూడానా?’ మళ్ళీ ప్రవక్త (స) ” ‘జకాత్‌ అధి కారులను సంతోష పరచండి. వారు పీడిస్తు న్నారని మీరు అనుకున్నా సరే,” అని హితబోధ చేసారు. [5]  (అబూ దావూద్‌)

1784 – [ 13 ] ( لم تتم دراسته ) (1/560)

وَعَنْ بَشِيْرِ بْنِ الْخَصَاصِيَّةِ قَالَ: قُلْنَا: إِنَّ أَهْلَ الصَّدَقَةِ يَعْتَدُوْنَ عَلَيْنَا أَفَنَكْتُمْ مِّنْ أَمْوَالِنَا بِقَدَرِمَا يَعْتَدُوْنَ؟ قَالَ:”لَا”رَوَاهُ أَبُوْ دَاوُدَ.

1784. (13) [1/560- అపరిశోధితం]  

బషీర్‌ బిన్‌ ‘ఖ’సా’సియ్యహ్‌ (ర) కథనం: మేము ప్రవక్త(స)ను ” ‘జకాత్‌ అధికారులు మమ్మల్ని పీడి స్తున్నారు, లెక్కకు మించి ‘జకాత్‌ వసూలు చేస్తు న్నారు, ఇటువంటి పరిస్థితిలో అధిక పరిమాణాన్ని మా ధనం నుండి తీసి దాచి పెట్టవచ్చునా,” అని విన్నవించుకున్నారు. దానికి ప్రవక్త (స), ”దాచకండి,” అని అన్నారు. [6] (అబూ దావూద్‌)

1785 – [ 14 ] ( لم تتم دراسته ) (1/560)

وَعَنْ رَافِعِ بْنِ خَدِيْحٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “اَلْعَامِلُ عَلَى الصَّدَقَةِ بِالْحَقِّ كَالْغَازِيْ فِيْ سَبِيْلِ اللهِ حَتَّى يَرْجِعَ إِلَى بَيْتِهِ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ وَالتِّرْمِذِيُّ

1785. (14) [1/560- అపరిశోధితం]  

రా’ఫె బిన్‌ ‘ఖదీ’హ్(ర) కథనం: ప్రవక్త (స) న్యాయంగా ‘జకాత్‌ వసూలు చేసేవాడు అల్లాహ్‌ (త) మార్గంలో వెళ్ళిన ముజాహిద్‌ వంటివాడు. అతడు తిరిగి తనఇంటికి చేరుకుంటాడు. [7]  (అబూ దావూద్‌, తిర్మిజి’)

1786 – [ 15 ] ( لم تتم دراسته ) (1/560)

وَعَنْ عَمْرِو بْنِ شُعَيْبٍ عَنْ أَبِيْهِ عَنْ جَدِّهِ عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ: “لَا جَلَبَ وَلَا جَنَبَ وَلَا تُؤْخَذُ صَدَقاَتِهِمْ إِلَّا فِيْ دُوْرِهِمْ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ.

1786. (15) [1/560- అపరిశోధితం]

‘అమ్ర్ బిన్‌ షు’ఐబ్‌ (ర) తన తండ్రి, తాతల ద్వారా ఉల్లేఖిస్తున్నారు: ప్రవక్త (స) ఇలా ప్రవచించారు, ”జలబ్‌ మరియు జనబ్‌ ధర్మబద్ధం కావు. ‘జకాత్‌ వారి ఇళ్ళ నుండి వసూలు చేయాలి.” [8] (అబూ దావూద్‌)

1787 – [ 16 ] ( لم تتم دراسته ) (1/560)

وَعَنِ ابْنِ عُمَرَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَنِ اسْتَفَادَ مَالًا فَلَا زَكَاةَ فِيْهِ حَتَّى يَحُوْلَ عَلَيْهِ الْحَوْلُ”. رَوَاهُ التِّرْمِذِيُّ.

وَذَكَرَ جَمَاعَةً أَنَّهُمْ وَقَفُوْهُ عَلَى ابْنِ عُمَرَ.

1787. (16) [1/560- అపరిశోధితం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘ఉమర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ఇలా ప్రవచించారు: ”లాభంగా వచ్చిన ధనంలో ఒక సంవత్సరం నిండనంత వరకు ‘జకాత్‌ లేదు. అంటే ఒక సంవత్సరం గడిచిన తర్వాత దానిలో నుండి ‘జకాత్‌ చెల్లించాలి. [9]  (తిర్మిజి’)

హదీసువేత్తలు దీన్ని అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘ఉమర్ (ర) అభిప్రాయంగా పేర్కొన్నారు.

1788 – [ 17 ] ( لم تتم دراسته ) (1/560)

وَعَنْ عَلِيٍّ رَضِيَ اللهُ عَنْهُ: أَنَّ الْعَبَّاسَ سَأَلَ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم فِيْ تَعْجِيْلِ صَدَقَةٍ قَبْلَ أَنْ تَحِلَّ: فَرَخَّصَ لَهُ فِيْ ذَلِكَ. رَوَاهُ أَبُوْ دَاوُدَ وَالتِّرْمِذِيُّ وَابْنُ مَاجَهُ وَالدَّارَمِيُّ .

1788. (17) [1/560- అపరిశోధితం]

‘అలీ (ర) కథనం: ‘అబ్బాస్‌ (ర) ఒక సంవత్సరం గడవకముందే ‘జకాత్‌ చెల్లించడం గురించి సందేహం విన్నవించుకున్నారు. అంటే సంవత్సరం గడవక ముందే ‘జకాత్‌ చెల్లిస్తే ధర్మబద్ధం లేక ధర్మ వ్యతిరేకమా అని ప్రశ్నించారు. అప్పుడు ప్రవక్త (స) అనుమతి ఇచ్చారు. అంటే ఒకవేళ నిర్ణీత ధనం కలిగి ఉన్న ధనవంతుడు సంవత్సరం గడవకముందే ‘జకాత్‌ చెల్లిస్తే ‘జకాత్‌ స్వీకరించబడుతుంది. (అబూ దావూద్‌, తిర్మిజి’, ఇబ్నె మాజహ్, దారమి)

1789 – [ 18 ] ( لم تتم دراسته ) (1/561)

وَعَنْ عَمْرِو بْنِ شُعَيْبٍ عَنْ أَبِيْهِ عَنْ جَدِّهِ أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم خَطَبَ النَّاسَ فَقَالَ: “أَلَا مَنْ وَّلِيَ يَتِيْمًا لَهُ مَالَ فَلْيَتَّجِرْ فِيْهِ وَلَا يَتْرُكْهُ حَتَّى تَأْكُلَهُ الصَّدَقَةُ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ و التِّرْمِذِيُّ. وَقَالَ :فِيْ إِسْنَادِهِ مَقَالُ: لِأَنَّ الْمُثْنَّى بْنَ الصَّبَّاحِ ضَعِيْفٌ.

1789. (18) [1/561- అపరిశోధితం]

‘అమ్ర్ బిన్‌ షు’ఐబ్‌ (ర) తన తండ్రి తాతల ద్వారా ఉల్లేఖిస్తున్నారు: ప్రవక్త (స) ప్రసంగించారు, ప్రజలకు హితబోధచేసారు, అందులో ఈ విషయాన్ని కూడా ఇలా పేర్కొన్నారు: ”ఎవరైనా అనాథ బాలునికి సంరక్షకుడిగా ఉంటే, ఆ అనాథ బాలుని వద్ద నిర్ణీత పరిమాణానికి చేరిన ధనం ఉంటే, ఆ వ్యక్తి ఆ ధనాన్ని వ్యాపారంలో పెట్టాలి, వ్యాపారం చేయకుండా అలా ఉంచరాదు. ఎందుకంటే ప్రతి సంవత్సరం ‘జకాత్‌ చెల్లిస్తూ ఉంటే ఈ ‘జకాత్‌ అతని ధనాన్ని తినివేస్తుంది. [10] (అబూ దావూద్‌).

ఈ ‘హదీసు’ ప్రామాణికతలో భేదాభిప్రాయాలు ఉన్నాయని తిర్మిజీ’ పేర్కొన్నారు. ఎందుకంటే ఈ’హదీసు’ ఉల్లేఖనకర్త ముస్‌నా బిన్‌ సబా’హ్‌ అనర్హుడు.

—–

الْفَصْلُ الثَّالِثُ  మూడవ విభాగం 

1790 – [ 19 ] ( متفق عليه ) (1/561)

عَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: لَمَّا تُوَفِّيَ النَّبِيُّ صلى الله عليه وسلم وَاسْتُخْلِفَ أَبُوْ بَكْرٍ بعده وَكَفَرَ مَنْ كَفَرَ مِنَ الْعَرَبِ. قَالَ عُمَرُ: يَا أَبَا بَكْرٍ كَيْفَ تُقَاتِلُ النَّاسَ. وَقَدْ قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “أُمِرْتُ أَنْ أُقَاتِلَ النَّاسَ حَتَّى يَقُوْلُوْا: لَا إِلَهَ إِلَّا اللهُ. فَمَنْ قَالَ: لَا إِلَهَ إِلَّا اللهُ عَصَمَ مِنِّيْ مَالَهُ وَنَفْسَهُ إِلَّا بِحَقِّهِ وَحِسَابُهُ عَلَى اللهِ. قَالَ أَبُوْ بَكْرٍ: وَاللهِ لَأُقَاتِلَنَّ مَنْ فَرَّقَ بَيْنَ الصَّلَاةِ وَالزَّكاَةَ فَإِنَّ الزَّكَاةَ حَقُّ الْمَالِ وَاللهِ لَوْ مَنَعُوْنِيْ عَنَاقًا كَانُوْا يُؤَدُّوْنَهَا إِلَى رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم لَقَاتَلْتُهُمْ عَلَى مَنْعِهَا. قَالَ عُمَرُ: فَوَاللهِ مَا هُوَ إِلَّا أَنَّ رَأَيْتُ أَنَّ قَدْ شَرَحَ اللهُ صَدْرَ أَبِيْ بَكْرٍ لِلْقِتَالِ فَعَرَفْتُ أَنَّهُ الْحَقُّ.

1790 . (19) [1/561-ఏకీభవితం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: దైవప్రవక్త (స) మరణా నంతరం అబూ బక్ర్‌ (ర) ‘ఖలీఫా అయ్యారు. అతని(ర) పరిపాలనా కాలంలో కొన్ని ‘అరబ్బు తెగలు ధర్మ తిరస్కా రానికి పాల్పడ్డాయి. ఈ సందర్భంగా ‘ఉమర్‌ (ర), అతని (ర) ముందు దైవప్రవక్త ‘హదీసు’ను పేర్కొంటూ ఇలా అన్నారు. అల్లాహ్‌ (త) తప్ప వేరొక ఆరాధ్య దేవుడు లేడనీ, ప్రజలు ధృవీకరించనంత వరకు వారితో యుద్ధం చేయమని నాకు ఆదేశించబడింది. కనుక ఎవరయితే ఆ విధంగా ధృవీక రిస్తారో, వారు తమ ధనప్రాణాలను నా నుండి కాపాడు కుంటారు, కాకపోతే ధర్మబద్ధంగా వారి వ్యవహారం అల్లాహ్ (త) చూసుకుంటాడు. అతని విచారణ అల్లాహ్‌(త)పై ఉంది. దానికి అబూ బక్ర్‌ (ర) ఇలా అన్నారు. ”అల్లాహ్ సాక్షి! నమా’జ్‌, ‘జకాత్‌ల మధ్య భేదం చూపే వారెవరితో నయినా నేను యుద్ధం చేస్తాను. ఎందుకంటే ‘జకాత్‌ వాస్తవానికి సంపదలో నుండి తీయవలసిన హక్కు. అల్లాహ్ సాక్షి! ఒక వేళ వారు గనుక అల్లాహ్ ప్రవక్త (స) కాలంలో ఇస్తూ వచ్చిన ఒక ఒంటె త్రాడు యినా ఇవ్వటానికి నిరాకరిస్తే నేను వారితో తప్ప కుండా పోరాడుతాను. ఆ తర్వాత ‘ఉమర్‌ (ర) ఈ సంఘటన గురించి మాట్లాడుతూ, ” అల్లాహ్ సాక్షి! తన మార్గంలో పోరాడటంకోసం అల్లాహ్ అబూ బక్ర్‌ హృదయ కవాటాలను తెరిచాడని నేను గ్రహించాను. అప్పుడు అబూ బక్ర్‌ (ర) అభిప్రాయమే సరైనదని నాకు అర్థమయింది అని” అన్నారు. [11]  (బు’ఖారీ, ముస్లిమ్‌)

1791 – [ 20 ] ( لم تتم دراسته ) (1/561)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “يَكُوْنُ كَنْزُ أَحَدِكُمْ يَوْمَ الْقِيَامَةِ شُجَاعًا أَقْرَعَ يَفِرُّ مِنْهُ صَاحِبُهُ وَهُوَ يَطْلُبُهُ حَتَّى يُلْقِمَهُ أَصَابِعَه”.  رَوَاهُ أَحْمَدُ.

1791. (20) [1/561- అపరిశోధితం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ఇలా ప్రవ చించారు: తీర్పు దినంనాడు మీలోని ‘జకాత్‌ చెల్లించనివారి ధనం మహా విషసర్పంగా మారి తన యజమానిని వెంటబడుతుంది. అతనివ్రేళ్ళను తన నోట్లోకి తీసుకొని నములుతుంది. (అ’హ్‌మద్‌)

చేతిని ఎందుకు నములు తుందంటే ఆ చేతి ద్వారా ఆ ధనాన్ని కూడబెట్టాడు గనక.

1792 – [ 21 ] ( لم تتم دراسته ) (1/562)

وَعَنِ ابْنِ مَسْعُوْدٍ عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ: “مَا مِنْ رَجُلٍ لَّا يُؤْدِّيْ زَكَاةَ مَالِهِ إِلَّا جَعَلَ اللهُ يَوْمَ الْقِيَامَةِ فِيْ عُنُقِهِ شُجَاعًا”. ثُمَّ قَرَأَ عَلَيْنَا مِصْدَاقَهُ مِنْ كِتَابِ اللهِ: (وَلَا يَحْسَبَنَّ الَّذِيْنَ يَبْخَلُوْنَ مَا آتَاهُمُ اللهُ مِنْ فَضْلِهِ-3: 180)  الآية. رَوَاهُ التِّرْمِذِيُّ وَالنَّسَائِيُّ وَابْنُ مَاجَهُ.

1792. (21) [1/562అపరిశోధితం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ మస్‌’ఊద్‌ (ర) కథనం: ప్రవక్త (స) ఇలా ప్రవచించారు: ”తన ధనం నుండి ‘జకాత్‌ చెల్లించని వాడిని తీర్పుదినం నాడు అతని ధనాన్ని మహా విషసర్పంగా మార్చి అతని మెడలో వేయడం జరుగుతుంది. ప్రవక్త (స) దీన్ని సమర్థిస్తూ ఈ ఆయతును పఠించారు. ”అల్లాహ్ తన అనుగ్రహంతో ప్రసాదించిన దానిలో లోభం వహించే వారు, తమకది (లోభమే) మేలైనదని భావించరాదు, వాస్తవానికి అది వారి కొరకు ఎంతో హానికరమైనది. వారు తమ లోభ త్వంతో కూడబెట్టినదంతా, తీర్పు దినమున వారి మెడల చుట్టు కట్టబడుతుంది…” (సూ. ఆలి ఇమ్రాన్‌, 3:180). (తిర్మిజి’, నసాయి’, ఇబ్నె మాజహ్)

1793 – [ 22 ] ( ضعيف ) (1/562)

وَعَنْ عَائِشَةَ رَضِيَ اللهُ عَنْهَا قَالَتْ: سَمِعْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ: “مَا خَالَطَتِ الزَّكَاةُ مَالًا قَطُّ إِلَّا أَهْلَكَتْهُ”. رَوَاهُ الشَّافِعِيُّ وَ الْبُخَارِيُّ فِيْ تَارِيْخِهِ

وَالْحُمَيْدِيُّ وَزَادَ قَالَ: يكُوْنُ قَدْ وَجَبَ عَلَيْكَ صَدَقَةٌ فَلَا تُخْرِ جُهَا فَيُهْلِكُ الْحَرَامُ الْحَلَالَ. وَقَدْ احْتَجَّ بِهِ مَنْ يَّرَى تَعَلُّق الزَّكَاةِ بِالْعَيْنِ هَكَذَا فِيْ الْمُنْتَقَى

وَرَوَى الْبَيْهَقِيُّ فِيْ شُعُبِ الْإِيْمَانِ عَنْ أَحْمَدَ بْنِ حَنْبَلٍ بِإِسْنَادِهِ إِلَى عَائِشَةَ. وَقَالَ أَحْمَدُ فِيْ”خَالَطَتْ”: تَفْسِيْرُهُ أَنَّ الرَّجُلَ يَأْخُذُ الزَّكَاةَ وَهُوَ مُوْسِرٌ أَوْغَنِيٌّ وَإِنَّمَا هِيَ لِلْفُقَرَاءِ.

1793. (22) [1/562-బలహీనం]

‘ఆయి’షహ్‌ (ర) కథనం: ప్రవక్త(స) ఇలా అంటూ ఉండగా నేను విన్నాను, ”ఏ ధనంలో ‘జకాత్‌ కలసి పోతుందో అది, ఆ ధనాన్ని నాశనం చేస్తుంది. (బు’ఖారీ, ‘హుమైదీ, షాఫ’యీ).

ఒక ఉల్లేఖనంలో ఇది అధికంగా ఉంది. ఏ ధనంలో ‘జకాత్‌ విధి అయిఉందో, అందులో నుండి ‘జకాత్‌ చెల్లించబడకుండా ఇంకా దానిలోనే కలసి ఉంటే ఈ ‘జకాత్‌ ఆ ధనాన్ని నాశనం చేస్తుంది. ఎందుకంటే ‘జకాత్‌ ఇవ్వక పోవడం నిషిద్ధం. ఈ అధర్మ సంపాదన. ధర్మ సంపాదనతో కలసి ఉంటే వినాశనం తప్పదు. ఈ ‘హదీసు’ ద్వారా వీరు ‘జకాత్‌కు డబ్బుతో సంబంధం ఉందని భావించారు. ఈ విధంగానే మున్‌తఖాలో ఉంది. బైహఖీ-షు’ఉబిల్‌ ఈమాన్‌లో అ’హ్‌మద్‌ బిన్‌ ‘హంబల్‌ ద్వారా ‘ఆయి’షహ్‌ (ర) వరకు ఉల్లేఖించారు.

ఇమామ్‌ అ’హ్‌మద్‌ ఈ ‘హదీసు’ను గురించి ఇలా వివరణ ఇచ్చారు. ధనవంతులై ఉండి కూడా ‘జకాత్‌ తీసుకునే వ్యక్తి, ఆ ‘జకాత్‌ ధనాన్ని తింటే అధర్మ సంపాదనను తన ధనంతో కలుపుతాడు. ఏ ధనంలో ‘జకాత్‌ ధనం కలసిపోతుందో, ఆ ధనం సర్వనాశనం అయిపోతుంది. ఎందుకంటే ‘జకాత్‌కు అర్హులు పేదలు, అగత్యపరులు.

=====

1- بَابُ مَا يَجِبُ فِيْهِ الزَّكَاةِ

1. జకాత్ ను విధిచేసే విషయాలు

1. వెండి, బంగారాలు నిర్ణీత పరిమాణానికి చేరి సంవత్సరం గడిస్తే, వాటిపై ‘జకాత్‌ తప్పనిసరి అవుతుంది.

2. వెండి, బంగారాల్లో, వ్యాపార సామాగ్రిపై, ఆహార ధాన్యాలు, పశువులు మొదలైన వాటిపై, కావలసిన షరతులన్నీ ఉంటే, ‘జకాత్‌ తప్పనిసరి అవుతుంది.

3. ఒంటెలు, ఆవులు, మేకలు, గొర్రెలు, నిర్ణీత పరిమాణానికి చేరి, వాటిలో కావలసిన షరతులన్నీ ఉంటే ‘జకాత్‌ తప్పనిసరి అవుతుంది. పంటల్లో, ఆహారధాన్యాల్లో కూడా అవి నిర్ణీత పరిమాణానికి చేరితే వాటిలో కూడా ‘జకాత్‌ ఉంది. నివసించే ళ్ళల్లో, వాడుకునే వస్తువుల్లో, వాహనాల్లో, సేవచేసే జంతువుల్లో పనిచేసే సేవకుల్లోజకాత్లేదు. వీటి కారణాలు ముందున్నాయి.

—–

اَلْفَصْلُ الْأَوَّلُమొదటి విభాగం 

1794 – [ 1 ] ( متفق عليه ) (1/563)

وَعَنْ أَبِيْ سَعِيْدِ الْخُدْرِيِّ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَيْسَ فِيْمَا دُوْنَ خَمْسَةِ أَوْسُقٍ مِّنَ التَّمْرِ صَدَقَةٌ وَلَيْسَ فِيْمَا دُوْنَ خَمْسِ أَوَاقٍ مِّنَ الْوَرِقِ صَدَقَةٌ وَلَيْسَ فِيْمَا دُوْنَ خَمْسٍ ذَوْدٍ مِّنَ الْإِبْلِ صَدَقَةٌ”. متفق عليه.

1794. (1) [1/563 – ఏకీభవితం]

అబూ స’యీద్‌ ‘ఖుద్రీ (ర) కథనం: ప్రవక్త (స) ఇలా ప్రవచించారు: ”ఖర్జూరాల్లో, 5 వసఖల కన్నా తక్కువగా ఉన్న వాటిలో సదఖహ్, ‘జకాత్‌ లేదు, 5 ఊఖియాల కంటే తక్కువగా ఉన్న వెండిలో జకాత్‌ లేదు. 5 కంటే తక్కువగా ఉన్న ఒంటెలలో ‘జకాత్‌ లేదు. [12]  (బు’ఖారీ, ముస్లిమ్‌)

1795 – [ 2 ] ( متفق عليه ) (1/563)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَيْسَ عَلَى الْمُسْلِمِ صَدَقَةٌ فِيْ عَبْدِهِ وَلَا فِيْ فَرَسِهِ”. متفق عليه.

وَفِيْ رِوَايَةٍ قَالَ: ” لَيْسَ فِيْ عَبْدِهِ صَدَقَةٌ إِلَّا صَدَقَةٌ الْفِطْر”.

1795. (2) [1/563 – ఏకీభవితం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ముస్లిమ్‌పై అతని బానిసల, గుర్రాల విషయంలో ‘జకాత్‌ లేదు, కాని సదఖతుల్ ఫిత్ర్‌ ఉంది అని ప్రవచించారు. [13]  (బు’ఖారీ, ముస్లిమ్‌)

1796 – [ 3 ] ( صحيح ) (1/563)

وَعَنْ أَنَسٍ: أَنَّ أَبَا بَكْرٍ رَضِيَ اللهُ عَنْهُ كَتَبَ لَهُ هَذَا الْكِتَابَ لَمَّا وَجَّهَهُ إِلَى الْبَحْرَيْنِ: بِسْمِ اللهِ الرَّحْمنِ الرَّحِيْمِ هَذِهِ فَرِيْضَةُ الصَّدَقَةِ الَّتِيْ فَرَضَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم عَلَى الْمُسْلِمِيْنَ وَالَّتِيْ أَمَرَ اللهُ عز وجل بِهَا رَسُوْلَهُ فَمَنْ سُئِلَهَا مِنَ الْمُسْلِمِيْنَ عَلَى وَجْهِهَا فَلْيُعْطِهَا وَمَنْ سُئِلَ فَوْقَهَا فَلَا يُعْطِ: فِيْ أَرْبَعٍ وَّعِشْرِيْنَ مِنَ الْإِبْلِ فَمَا دُوْنَهَا من الغنم من كلِّ خَمْسٍ شَاةٌ. فَإِذَا بَلَغَتْ خَمْسًا وَّعِشْرِيْنَ إِلَى خَمْسٍ وَثَلَاثِيْنَ فَفِيْهَا بِنْتُ مَخَاضٍ اُنْثَى فَإِذَا بَلَغَتْ سِتًّا وَّثَلَاثِيْنَ إلى خمسٍ و اربعين فَفِيْهَا بِنْتَ لَبُوْنٍ أُنْثَى. فَإِذَابَلَغَتْ سِتًّا وَأَرْبَعِيْنَ إِلَى سِتِّيْنَ فَفِيْهَا حِقَّةٌ طَرُوْقَةِ الْجَمَلِ فَإِذَا بَلَغَتْ وَاحِدَةٌ وَّسِتِيْنَ إلى خمسٍ و سبعينَ فَفَيْهَا جَذَعَةٌ. فَإِذَا بَلَغَتْ سِتًّا وَّسَبْعِيْنَ إلى تسعين  فَفِيْهَا بِنْتًا لَبُوْنٍ. فَإِذَا بَلَغَتْ إِحْدَى وَتِسْعِيْنَ إِلَى عِشْرِيْنَ وَمِائَةٍ فَفِيْهَا حِقَّتَانِ طَرُوْقَتَا الْجَمَلِ. فَإِذَا زَادَتْ عَلَى عِشْرِيْنَ وَمِائَةٍ فَفِيْ كُلِّ أَرْبَعِيْنَ بِنْتُ لبُوْنٍ وَفِيْ كُلِّ خَمْسِيْنَ حِقَّةٌ. وَمَنْ لَمْ يَكُنْ مَّعَهُ إِلَّا أَرْبَعٌ مِّنَ الْإِبْلِ فَلَيْسَ فِيْهَا صَدَقَةٌ إِلَّا أَنْ يَّشَاءَ رَبُّهَا. فَإِذَا بَلَغَتْ خَمْسًا فَفِيْهَا شَاةٌ وَّمَنْ بَلَغَتْ عِنْدَهُ مِنَ الْإِبْلِ صَدَقَةَ الْجَذَعَةِ وَلَيْسَتْ عِنْدَهُ جَذَعَةٌ وَعِنْدَهُ حقة فَإِنَّهَا تُقْبَلُ مِنْهُ الْحِقَّةِ وَيَجْعَلُ مَعَهَا شَاتَيْنِ أَنْ أَسْتَيْسَرَتَا لَهُ أَوْ عِشْرِيْنَ دِرْهَمًا. وَمَنْ بَلَغَتْ عِنْدَهُ صَدَقةُ الْحِقَّةِ وَلَيْسَتْ عِنْدَهُ الْحَقَّةُ وَعِنْدَهُ الْجَذَعَةُ فَإِنَّهَاتُقْبَلُ مِنْهُ الْجَذَعَةُ وَيُعْطِيْهِ الْمُصَدِّقُ عِشْرِيْنَ دِرْهَمًا أَوْ شَاتَيْنِ. وَمَنْ بَلَغَتْ عِنْدَهُ صَدَقَةُ الْحِقَّةِ وَلَيْسَتْ عِنْدَهُ إِلَّا بِنْتُ لَبُوْنٍ فَإِنَّهَا تُقْبَلُ مِنْهُ بِنْتُ لَبُوْنٍ وَّيُعْطِيْ مَعَهَا شَاتَيْنِ أَوْ عِشْرِيْنَ دِرْهَمًا. وَمَنْ بَلَغَتْ صَدَقَتُهُ بِنْتَ لَبُوْنٍ وَّعِنْدَهُ حِقَّةٌ فَإِنَّهَا تُقْبَلُ مِنْهُ الْحِقَّةُ وَيُعْطِيْهِ الْمُصَدِّقُ عِشْرِيْنَ دِرْهَمًا أَوْ شَاتَيْنِ. وَمَنْ بَلَغَتْ صَدَقَتُهُ بِنْتَ لَبُوْنٍ وَلَيْسَتْ عِنْدَهُ وَعِنْدَهُ بِنْتُ مَخَاضٍ فَإِنَّهَا تُقْبَلُ مِنْهُ بِنْتُ مَخَاضٍ وَّيُعْطَي مَعَهَا عِشْرِيْنَ دِرْهَمًا أَوْ شَاتَيْنِ. وَمَنْ بَلَغَتْ صَدَقَتُهُ بِنْتَ مَخَاضٍ وَلَيْسَتْ عِنْدَهُ وَعِنْدَهُ بِنْتَ لَبُوْنٍ فَإِنَّهَا تُقْبَلُ مِنْهُ وَيُعْطِيْهِ الْمُصَدِّقُ عِشْرِيْنَ دِرْهَمًا أَوْ شَاتَيْنِ . فَإِنْ لَّمْ تَكُنْ عِنْدَهُ بِنْتُ مَخَاضٍ عَلَى وَجْهِهَا وَعِنْدَهُ ابْنُ لَبُوْنٍ فَإِنَّهُ يُقْبَلُ مِنْهُ وَلَيْسَ مَعَهُ شَيْءٌ. وَفِيْ صَدَقَةِ الْغَنَمَ فِيْ سَائِمَتِهَا إِذَا كَانَتْ أَرْبَعِيْنَ إِلَى عِشْرِيْنَ وَمِائَةٍ شَاةٌ فَإِذا زادَتْ عَلَى عِشْرِيْنَ وَمِائَةٍ إِلَى مِائَتَيْنِ فَفِيْهَا شَاتَانِ. فَإِنْ زَادَتْ عَلَى مِائَتَيْنِ إِلَى ثَلَاثِمِائَةٍ فَفِيْهَا ثَلَاثُ شِيَاهٍ. فَإِذَا زَادَتْ عَلَى ثَلَاثَمِائَةٍ فَفِيْ كُلِّ مِائَةٍ شَاةٌ. فَإِذَا كَانَتْ سَائِمَةُ الرَّجُلِ نَاقِصَةُ مِّنْ أَرْبَعَيْنِ شَاةً وَاحِدَةً فَلَيْسَ فِيْهَا صَدَقَةٌ إِلَّا أَنْ يَّشَاءَ رَبُّهَا. وَلَا تُخْرَجُ فِيْ الصَّدَقَةِ هَرِمَةٌ وَلَاذَاتُ عَوَرٍ وَلَا تَيْسٌ إِلَّا مَا شَاءَ الْمُصَدِّقُ. وَلَا يُجْمَعُ بَيْنَ مُتَفَرِّقٍ وَلَا يُفَرَّقُ بَيْنَ مُجْتَمِعٍ خَشْيَةَ الصَّدَقَةِ وَمَا كَانَ مِنْ خَلِيْطَيْنِ فَإِنَّهُمَا يَتَرَاجَعَانِ بَيْنَهُمَا بِالسَّوِيَّةِ. وَفِيْ الرِّقَةِ رُبُعُ الْعُشْرِ فَإِنْ لَّمْ تَكُنْ إِلَّا تِسْعِيْنَ وَمِائَةٍ فَلَيْسَ فِيْها شَيْءٌ إِلَّا أَنْ يَّشَاءَ رَبُّهَا. رَوَاهُ الْبُخَارِيُّ.

1796. (3) [1/563 – దృఢం]

అనస్‌ (ర) కథనం: అబూ బకర్‌ (ర) అతన్ని బహరైన్ గవర్నర్‌గా నియమించి పంపినప్పుడు ఇలా ఆదేశపత్రాన్ని వ్రాసి అతనికి ఇచ్చారు. ”అనంత కరుణా మయుడు, అపార కరుణా ప్రదాత, అయిన అల్లాహ్‌ పేరుతో, ప్రవక్త (స) ముస్లిములపై విధించిన ‘జకాత్‌ వివరణ ఇది. ఇంకా అల్లాహ్(త) దీన్ని గురించి తన ప్రవక్తను ఆదేశించి ఉన్నాడు. అల్లాహ్‌ మరియు ఆయన ప్రవక్త (స) ఆదేశాల కనుగుణంగా  ముస్లిముల నుండి ‘జకాత్‌ కోరితే ముస్లిములు ‘జకాత్‌ చెల్లించాలి. ఒకవేళ నిర్ణీత ‘జకాత్‌ కంటే ఎక్కువ కోరితే ఇవ్వరాదు. 24 లేదా అంతకంటే తక్కువగా ఉన్న ఒంటెలకొరకు, మేకలు జకాతుగా, ఈ క్రింది ప్రకారంగా ఇవ్వాలి. అంటే 5 ఒంటెలు ఉన్నవారు 1 మేక చెల్లించాలి, 10 ఒంటెలు ఉంటే 2 మేకలు ఇవ్వాలి, ఒకవేళ 15 ఒంటెలు ఉంటే 3 మేకలు చెల్లించాలి, ఒకవేళ 20 ఒంటెలు ఉంటే 4 మేకలు చెల్లించాలి, ఇలా 24 వరకు. ఒకవేళ 25 ఒంటెలు ఉంటే 25 నుండి 35 ఒంటెల వరకు 1 సంవత్సరం నిండిన 1 ఆడ ఒంటెను చెల్లించాలి. 36 నుండి 45 వరకు 2 సంవత్సరాలు నిండిన ఆడ ఒంటె చెల్లించాలి. మరియు 46 నుండి 60 వరకు 3 సంవత్సరాలు నిండిన ఒంటెను చెల్లించాలి. 61 నుండి 75 వరకు 4 సంవత్సరాలు నిండిన ఒంటెను చెల్లించాలి. 76 నుండి 90 వరకు 2 సంవత్సరాలు నిండిన, 2 ఒంటెలు చెల్లించాలి. 91 నుండి 120 వరకు 3 సంవత్సరాలు నిండిన 2 ఒంటెలు చెల్లించాలి. 120 కంటే అధికంగా ఉంటే ప్రతి 40కి, 2 సంవత్సరాలు నిండిన, ప్రతి 50లో 3 సంవత్సరాలు నిండిన ఒంటె చెల్లించాలి. ఎవరి దగ్గరైనా కేవలం 4 ఒంటెలు మాత్రమే ఉంటే అందులో ‘జకాత్‌ లేదు. ఒకవేళ యజమాని తన సంతోషంతో ఇస్తే అది వేరే సంగతి. ఒంటెలు 5 అయితే 1మేక ఇవ్వాలి. ఒకవేళ ఎవరి పైన అయినా 4 సంవత్సరాలు నిండిన ఒంటె తప్పని సరి అయి, అతని దగ్గర అది లేక, 3సంవత్సరాల ఒంటె మాత్రమే ఉంటే ఆ మూడు సంవత్సరాల ఒంటెనే స్వీకరించడం జరుగుతుంది. ఒకవేల సాధ్యం అయితే దానితో పాటు 2 మేకలు కూడా తీసుకోవడం జరుగుతుంది. ఒకవేళ మేక లేకుంటే 20 దిర్హములు స్వీకరించబడతాయి. ఎవరిపైన అయినా  3సంవత్సరాల ఒంటె తప్పనిసరి అయి, అది లేక దానికి బదులు 4సంవత్సరాల ఒంటె ఉంటే 4సంవత్సరాల ఒంటెనే స్వీకరించడం జరుగు తుంది. ఆ అధిక చెల్లింపునకు బదులు ‘జకాత్‌ వసూలు చేసేవారు 2మేకలు ఇవ్వాలి. లేదా 20 దిర్‌హమ్‌లు తిరిగి  చెల్లించాలి. ఒకవేళ ఎవరి వద్దనైనా 3 సంవత్సరాలు నిండిన ఒంటె తప్పనిసరి అయి వారి వద్ద దానికి బదులు 2సంవత్సరాల ఒంటె ఉంటే దాన్ని స్వీకరించడం జరుగుతుంది. దానితో పాటు ‘జకాత్‌ చెల్లించే వాడు 2మేకలు లేదా 20 దిర్హంలు చెల్లించాలి. ఒకవేళ ఎవరికైనా 2సంవత్సరాల (బింతె లబూన్) ఒంటె తప్పని సరి అయి అది లేక దానికి బదులు 3 సంవత్సరాల (హిఖ్క్) ఒంటె ఉంటే, దాన్నే ‘జకాత్‌గా స్వీకరించడం జరుగుతుంది. ‘జకాత్‌ వసూలు చేసేవారు అతనికి 20 దిర్‌హమ్‌లు లేదా 2మేకలు తిరిగి ఇవ్వాలి. ఒకవేళ ఎవరి పైనైనా 2 సంవత్సరాల ఒంటె తప్పనిసరి అయితే అది అతని వద్ద లేక దానికి బదులుగా 1సంవత్సరం (బింతె మఖాస్) నిండిన ఒంటె ఉంటే దాన్నే స్వీకరించడం జరుగుతుంది. ‘జకాత్‌ తీసుకునే వారు దానికి బదులు 20 దిర్‌హమ్‌లు లేదా 2మేకలు ఇవ్వాలి. ఒకవేళ ఎవరిపైనైనా 1సంవత్సరం నిండిన ఒంటె తప్పనిసరి అయితే అది అతని వద్ద లేక 2సంవత్సరాల ఒంటె ఉంటే దాన్నే స్వీకరించడం జరుగుతుంది. ‘జకాత్‌ స్వీకరించే వారు అతనికి 20 దిర్‌హమ్‌లు లేదా 2మేకలు చెల్లించాలి. ఒకవేళ అతని వద్ద 1సంవత్సరం నిండిన ఆడ ఒంటె లేదా దానికి బదులు 2సంవత్సరాల ఒంటె ఉంది. దాన్నే స్వీకరించడం జరుగుతుంది. ఇంకేమీ ఇవ్వనవసరం లేదు.

మేకల ‘జకాత్‌ ఈ విధంగా చెల్లించడం జరుగు తుంది. ఒకవేళ ఈ మేకలు అడవిలో మేసేవి అయితే 40 నుండి 120 వరకు, 1మేకను ‘జకాత్‌గా చెల్లించాలి. ఒకవేళ 121 నుండి 200 మేకల వరకు ఉంటే 2మేకలు ‘జకాత్‌గా ఇవ్వాలి. 200 నుండి 300 వరకు 3మేకలు, ‘జకాత్‌గా చెల్లించాలి. 300 కన్నా ఎక్కువ ఉంటే ప్రతి100కు ఒకమేక ‘జకాత్‌గా చెల్లించాలి.

అయితే అడవిలో మేసే మేకలు, నిర్ణీత సంఖ్య కంటే తక్కువగా ఉంటే వాటిలో ‘జకాత్‌ విధికాదు. ఒకవేళ  యజమాని అదనపు సత్కార్యంగా ఇవ్వదలచుకుంటే అది వేరే సంగతి. ‘జకాత్‌లో ముసలి జంతువు, లోపం ఉన్నది, మగ జంతువు స్వీకరించబడదు. ఒకవేళ ‘జకాత్‌ వసూలు చేసే వారు స్వీకరించదలిస్తే స్వీకరించగలడు. వివిధ రకాలకు చెందిన జంతువు లను ఒకేచోట ఉంచరాదు. అనేకమంది యజమానుల జంతువులను సంఖ్య పూర్తిచేయడానికి ఒకేచోట కలిపి ఉంచరాదు. అదేవిధంగా ‘జకాత్‌ చెల్లించే భయంతో జంతువులను వేరువేరుగా విడదీయరాదు. ఇద్దరు భాగస్వాముల మధ్య ఉన్న జంతువులపై ‘జకాత్‌ విధి అయితే ‘జకాత్‌ స్వీకరించడం జరుగుతుంది. దాన్ని వారిద్దరూ పంచుకుంటారు. వెండిలో 1/40వంతు, ఒకవేళ 200 దిర్‌హమ్‌లు పూర్తిగా లేక కేవలం 190 దిర్‌హమ్‌లు ఉంటే ‘జకాత్‌ విధికాదు. కాని యజమాని తన సంతోషం కోసం అదనపు సత్కార్యంగా ఇవ్వదలిస్తే ఇవ్వవచ్చును. [14]  (బు’ఖారీ)

1797 – [ 4 ] ( صحيح ) (1/565)

وَعَنْ عَبْدِ اللهِ بْنِ عُمَرَ عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ: “فِيْمَا سَقَتِ السَّمَاءُ وَالْعُيُوْنُ أَوْ كَانَ عَثَرِيًّا الْعُشْرُ. وَمَا سُقِيَ بِالنَّضْحِ نِصْفُ الْعُشْرِ”.  رَوَاهُ الْبُخَارِيُّ .

1797. (4) [1/565-దృఢం]

ఇబ్నె ‘ఉమర్‌ (ర) కథనం: ఏ భూములైతే వర్షపు నీటితో లేక పారే సెలయేటి నీటితో లేక నది సమీపంలో ఉండి నీటి పారుదల లేకుండానే సాగుబడి అవుతాయో, వాటి పంటలో 10వ వంతును, ఏ భూములైతే మోట మొదలైన వాటి ద్వారా, ధనం వెచ్చించి సాగు చేయబడతాయో వాటి పంటలో 20వ వంతును ‘జకాత్‌గా చెల్లించాలి అని మహాప్రవక్త (స) ప్రవచించారు.[15]  (బు’ఖారీ)

1798 – [ 5 ] ( متفق عليه ) (1/565)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “اَلْعَجْمَاءُ جُرْحُهَا جَبَارٌ وَالْبِئْرُ جَبَارٌ وَالْمَعْدِنُ جَبَارٌ وَفِيْ الرِّكَازِ الْخُمُسُ”.

1798. (5) [1/565-ఏకీభవితం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ఇలా ప్రవచించారు: ”జంతువును గాయపరిచితే నష్ట పరిహారం లేదు. బావిలో పడి మరణించినా, బావి త్రవ్వుతూ ఎవరైనా మరణిస్తే నష్టపరిహారం లేదు, గనులు త్రవ్వుతూ చనిపోతే నష్టపరిహారం లేదు. గుప్తనిధి దొరికితే అందులో నుండి ఐదవ వంతు సమాజ సంక్షేమనిధికి (బైతుల్ మాల్ కు) ఇవ్వాలి. [16] (బు’ఖారీ, ముస్లిమ్‌)

—–

اَلْفَصْلُ الثَّانِيْ  రెండవ విభాగం 

1799 – [ 6 ] ( ضعيف ) (1/565)

عَنْ عَلِيٍّ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسل : “قَدْ عَفَوْتُ عَنِ الْخَيْلِ وَالرَّقِيْقِ فَهَاتُوْا صَدَقَةً الرِّقَةِ: مِنْ كُلِّ أَرْبَعِيْنَ دِرْهَمًا دِرْهَمٌ وَلَيْسَ فِيْ تِسْعِيْنَ وَّمِائَةٍ شَيْءٌ فَإِذَا بَلَغَتْ مِائَتَيْنِ فَفِيْهَا خَمْسَةُ دَرَاهِمَ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَأَبُوْ دَاوُدَ.

 وَفِيْ رِوَايَةٍ لِّأَبِيْ دَاوُدَ عَنِ الْحَارِثِ الآعورعَنْ عَلِيٍّ قَالَ: زُهَيْرٌ أَحْسِبُهُ عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم أَنَّهُ قَالَ: “هَاتُوْا رُبُعَ الْعُشْرِ مِنْ كُلِّ أَرْبَعِيْنَ دِرْهَمًا دِرْهَمٌ وَلَيْسَ عَلَيْكُمْ شَيْءٌ حَتَّى تَتِمَّ مِائَتَيْ دِرْهَمٍ. فَإِذَا كَانَتْ مِائَتَيْ دِرْ هَمٍ فَفِيْهَا خَمْسَةُ دَرَاهِمَ. فَمَا زَادَ فَعَلَى حِسَابِ ذَلِكَ. وَفِيْ الْغَنَمِ فِيْ كُلِّ أَرْبَعِيْنَ شَاةً شَاةٌ إِلى عِشْرِيْنَ وَمِائَةٍ. فَإِنْ زَادَتْ وَاحِدَةٌ فَشَاتَانِ إِلَى مِائَتَيْنِ. فَإِنْ زَادَتْ فَثَلَاثُ شِيَاهٍ إِلَى ثَلَاثَمِائَةٍ. فَإِذَا زَادَتْ عَلَى ثَلَاثِ مِائَةٍ فَفِيْ كُلِّ مِائَةٍ شَاةٌ. فَإِنْ لَّمْ تَكُنْ إِلَّا تِسْعٌ وَثَلَاثُوْنَ فَلَيْسَ عَلَيْكَ فِيْهَا شَيْءٌ. وَفِيْ الْبَقَرِ: فِيْ كُلِّ ثَلَاثِيْنَ تَبِيْعٌ. وَفِيْ الْأَرْبَعِيْنَ مُسِنَّةٌ. وَلَيْسَ عَلَى الْعَوَامِلِ شَيْءٌ”.

1799. (6) [1/565- బలహీనం]

‘అలీ (ర) కథనం: ప్రవక్త (స) ఇలా ప్రవచించారు : ”నేను వ్యాపార సామగ్రికాని గుర్రాలపై, బానిసలపై ‘జకాత్‌ తొలగించి వేసాను. వెండి 200 దిర్‌హమ్‌లు ఉంటే దానిపై ‘జకాత్‌ తీసుకురండి. ప్రతి నలభై దిర్‌హముల్లో నుండి ఒక దిర్‌హమ్‌, ఇంకా ఒకవేళ 190 దిర్‌హములు ఉంటే వాటిపై జకాత్‌ విధికాదు. 200 దిర్‌హములు ఉంటే వాటిలో నుండి 5 దిర్‌హమ్‌లు ‘జకాత్‌ తప్పనిసరి.  (తిర్మిజి’, అబూ దావూద్‌)

అయితే అబూదావూద్‌లోని మరో ఉల్లేఖనంలో ఇలా ఉంది: ప్రవక్త (స) ఇలా ప్రవచించారు: ”మీరు 1/40వ వంతు ‘జకాత్‌ చెల్లించండి. అంటే ప్రతి నలభై దిర్‌హ ముల్లో ఒక దిర్‌హమ్‌. 200 దిర్‌హమ్‌ల కంటే తక్కువ ఉంటే వాటిలో ‘జకాత్‌ లేదు. పూర్తిగా రెండు వందల దిర్‌హమ్‌లు ఉంటే వాటిలో నుండి 5 దిర్‌హమ్‌లు ‘జకాత్‌ ఇవ్వటం తప్పనిసరి. 200 కంటే ఏవిధంగా అధికం అయితే ఆ విధంగా ‘జకాత్‌ తీసుకోవటం జరుగుతుంది.

మేకల్లో ప్రతి 40 మేకలకు 1మేక ‘జకాత్‌గా చెల్లించాలి. ఇలా 120 మేకల వరకు. 121 మేకల నుంచి 200 మేకల వరకు 2 మేకలు ‘జకాత్‌గా చెల్లించాలి. వాటికన్నా ఒకటి అధికంగా ఉంటే 300 మేకల వరకు 3మేకలు జకాత్‌గా ఇవ్వాలి. 300 కన్నా అధికంగా మేకలు ఉంటే ప్రతి 100కు 1మేక తప్పని సరి అవుతుంది. ఇంకా ఒకవేళ 39 మేకలు మాత్రమే ఉంటే వాటిపై జకాత్‌ తప్పనిసరికాదు. ఇంకా ఆవులు, గేదెలు, ఎద్దుల్లో ప్రతి 30 ఆవుల్లో, ఎద్దుల్లో 1సంవత్సరం నిండిన ఆవుదూడ ‘జకాత్‌గా ఇవ్వాలి. 40లో 2సంవత్సరాలు నిండిన ఒక ఆవు ఇవ్వాలి. సేవ తీసుకునే ఆవు, ఎద్దుల్లో ‘జకాత్‌ లేదు. అంటే నాగలి దున్నే, సామాన్లు మోసే ఎద్దులు నిర్ణీత సంఖ్యకు చేరినా వాటిలో జకాత్‌ లేదు.

1800 – [ 7 ] ( لم تتم دراسته ) (1/566)

وَعَنْ مُعَاذٍ: أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم لَمَّا وَجَّهَهُ إِلَى الْيَمَنِ أَمَرَهُ أَنْ يَّأْخُذَ مِنَ الْبَقَرَةِ: مِنْ كُلِّ ثَلَاثِيْنَ تَبِيْعًا أَوْ تَبِيْعَةً وَّمِنْ كُلِّ أَرْبَعِيْنَ مُسِنَّةً. رَوَاهُ أَبُوْ دَاوُدَ وَالتِّرْمِذِيُّ وَالنَّسَائِيُّ وَالدَّارَمِيُّ.

1800 . (7) [1/566- అపరిశోధితం]

ము’ఆజ్‌’ (ర) కథనం: ప్రవక్త (స) అతన్ని యమన్‌ గవర్నర్ గా నియమించి పంపినపుడు అతనికి ఇలా ఉపదేశించారు: ”ప్రతి 30 ఆవులకు 1సంవత్సరం నిండిన ఒక ఆవు దూడ లేదా ఆడదూడ ‘జకాత్‌గా వసూలు చేయండి, ఇంకా ప్రతి 40ఆవులకు 2 సంవత్సరాల ఆవు ‘జకాత్‌గా తీసుకోండి. (అబూ దావూద్‌, తిర్మిజి’, నసాయి, దారమి)

1801 – [ 8 ] ( حسن ) (1/566)

وَعَنْ أَنَسٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “اَلْمُعْتَدِيْ فِيْ الصَّدَقَةِ كَمَانِعِهَا”.  رَوَاهُ أَبُوْ دَاوُدَ وَالتِّرْمِذِيُّ.

1801. (8) [1/5566-ప్రామాణికం]

అనస్‌ (ర) కథనం: ప్రవక్త (స) ఇలా ప్రవచించారు: ‘జకాత్‌లో హద్దుమీరి ప్రవర్తించేవాడు ‘జకాత్‌ను వారించే వానికి సమానం. [17] (అబూ దావూద్‌, తిర్మిజి’)

1802 – [ 9 ] ( لم تتم دراسته ) (1/566)

وَعَنْ أَبِيْ سَعِيْدِ الْخُدْرِيِّ أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم قَالَ: “لَيْسَ فِيْ حَبٍّ وَلَا تَمْرٍ صَدَقَةٌ حَتَّى يَبْلُغَ خَمْسَةَ أَوْسُقٍ”. رَوَاهُ النَّسَائِيُّ .

1802. (9) [1566 – అపరిశోధితం]

అబూస’యీద్‌ ‘ఖుద్రీ (ర) కథనం: ప్రవక్త (స) ఇలా ప్రవచించారు: ”ఆహార ధాన్యాల్లో, ఖర్జూరంలో అవి 5వసఖ్‌లకు చేరనంత వరకు ‘జకాత్‌ తప్పనిసరి కాదు, 5వసఖ్‌లు అంటే సుమారు 20 మన్ల కంటే కొంత అధికం. దీన్ని గురించి వెనుక పేజీల్లో ప్రస్తావించడం జరిగింది. (నసాయి’)

1803 – [ 10 ] ( لم تتم دراسته ) (1/566)

وَعَنْ مُوْسَى بْنِ طَلْحَةَ قَالَ: عِنْدَنَا كِتَابُ مُعَاذِ بْنِ جَبَلٍ عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم أَنَّهُ قَالَ: إِنَّمَا أَمْرُهُ أَنْ يَّأْخُذَ الصَّدَقَةَ مِنَ الْحِنْطَةِ وَالشَّعِيْرِ وَالزَّبِيْبِ وَالتَّمْرِ. مُرْسَلٌ رَوَاهُ فِيْ شَرْحِ السُنَّةِ.

1803. (10) [1/566- అపరిశోధితం]

మూసా బిన్‌ ‘తల్‌హా (ర) కథనం: మా దగ్గర ము’ఆజ్‌’ బిన్‌ జబల్‌కు ప్రవక్త (స) పంపిన ఉత్తరం ఉంది. అందులో ఇలా ఆదేశించబడి ఉంది, ”గోధుమలు యవ్వలు, కిష్‌మిష్, ద్రాక్ష, ఖర్జూరం మొదలైన వాటిలో ‘జకాత్‌ వసూలు చేయండి.[18] (షర’హు స్సున్నహ్‌-  తాబయీ ప్రోక్తం)

1804 – [ 11 ] ( لم تتم دراسته ) (1/567)

وَعَنْ عَتَّابِ بْنِ أَسِيْدٍ أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم قَالَ فِيْ زَكَاةِ الْكُرُوْمِ: “إِنَّهَا تُخْرَصُ كَمَا تُخْرَصُ النَّخْلُ ثُمَّ تُؤَدَّى زَكَاتُهُ زَبِيْبًا كَمَا تُؤَدّى زَكَاةُ النَّخْلِ تَمْرًا”. رَوَاهُ التِّرْمِذِيُّ وَأَبُوْ دَاوُدَ.

1804. (11) [1/567- అపరిశోధితం]

‘అత్తాబ్‌ బిన్‌ అసీద్‌ (ర) కథనం: ప్రవక్త (స) ద్రాక్షల ‘జకాత్‌ విషయంలో ఖర్జూరాలను నిర్థారించినట్లు వాటిని నిర్థారించటం జరుగుతుంది. అటుపిమ్మట ద్రాక్షనుండి కిష్‌మిష్‌ల ‘జకాత్‌ను ఖర్జూరాల ‘జకాత్‌ను ఎండుఖర్జూరాల నుండి చెల్లించినట్లు, చెల్లించడం జరుగుతుంది. [19] (తిర్మిజి’, అబూ దావూద్‌)

1805 – [ 12 ] ( لم تتم دراسته ) (1/567)

وَعَنْ سَهْلِ بْنِ أَبِيْ حَثْمَةَ حَدَّثَ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم كَانَ يَقُوْلُ: “إِذَا خَرَصْتُمْ فَخُذُوْا وَدَعُوْا الثُّلُثَ فَإِنْ لَّمْ تَدَعُوْا الثُّلُثَ فَدَعُوْا الرُّبُعَ”.  رَوَاهُ التِّرْمِذِيُّ وَأَبُوْ دَاوُدَ وَالنَّسَائِيُّ

1805. (12) [1/567- అపరిశోధితం]  

సహ్‌ల్‌ బిన్‌ అబీ ‘హస్మ’ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం: మీరు ‘జకాత్‌ ను నిర్థారించిన తరువాత దాని నుండి 2/3 వంతు తీసుకోండి, 1/3 వంతు యజమానికి వదలివేయండి. ఒకవేళ 1/3 వంతు వదలడం ఇష్టం లేక పోతే 1/4 వంతు వదలివేయండి.[20] (తిర్మిజి’, అబూ దావూద్‌, నసాయి’)

1806 – [ 13 ] ( لم تتم دراسته ) (1/567)

وَعَنْ عَائِشَةَ قَالَتْ: كَانَ النَّبِيُّ صلى الله عليه وسلم يَبْعَثُ عَبْدُ اللهِ ابْنِ رَوَاحَةَ إِلَى يَهُوْدٍ فَيَخْرُصُ النَّخْلَ حِيْنَ يَطِيْبُ قَبْلَ أَنْ يُّؤْكَلَ مِنْهُ. رَوَاهُ أَبُوْ دَاوُدَ.

1806. (13) [1/567- అపరిశోధితం]

‘ఆయి’షహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ రవా’హాను ఖైబర్‌లోని యూదుల వద్దకు పంపేవారు. అయితే అతను వాటిలో తియ్యదనం వచ్చి, ఇంకా తినటానికి సిద్ధంగాలేని స్థితిలో ఉన్న వాటిని నిర్థారించే వారు. (అబూ దావూద్‌)

అంటే పండటానికి ముందు నిర్థారించే వారు.

1807 – [ 14 ] ( لم تتم دراسته ) (1/567)

وَعَنِ ابْنِ عُمَرَقَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم فِيْ الْعَسَلِ: “فِيْ  كُلِّ عَشَرَةِ أَزُقٍّ زِقٌّ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَقَالَ: فِيْ إِسْنَادِهِ مَقَالٌ وَلَا يَصِحُّ عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم فِيْ هَذَا الْبَابِ كَثِيْرُ شَيْءٍ.

1807. (14) [1/567- అపరిశోధితం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘ఉమర్‌ (ర) కథనం: ప్రవక్త (స) తేనె ‘జకాత్‌ గురించి ఇలా ప్రవచించారు, ”ప్రతి 10 ముష్క్‌ల తేనెలో ఒక ముష్క్‌ ఉష్ర్ తేనె ‘జకాత్‌గా ఇవ్వాలి. (తిర్మిజి’)

ఈ ‘హదీసు’ ప్రామాణికమైనది కాదు. అంటే తేనె 10 ముష్క్‌లు అయితే, వాటిలో 1ముష్క్‌ తేనె ఉష్‌ర్‌గా చెల్లించాలి.

1808 – [ 15 ] ( لم تتم دراسته ) (1/567)

وَعَنْ زَيْنَبِ امْرَأَةِ عَبْدِ اللهِ قَالَتْ: خَطَبَنَا رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم فَقَالَ: “يَا مَعْشَرَ النِّسَاءِ تَصَدَّقْنَ وَلَوْ مِنْ حُلِيِّكُنَّ فَإِنَّكُنَّ أَكْثَرُ أَهْلِ جَهَنَّمَ يَوْمَ الْقِيَامَةِ” .رَوَاهُ التِّرْمِذِيُّ.

1808. (15) [1/567- అపరిశోధితం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ మస్‌’ఊద్‌ భార్య ‘జైనబ్‌ (ర) కథనం: ప్రవక్త (స) మా ముందు ప్రసంగించారు, ఆ ప్రసంగంలో స్త్రీల నుద్దేశించి, ‘ఓ స్త్రీలారా! మీరు మీ ధనంలో నుండి ‘జకాత్‌ చెల్లించండి, అది మీ నగలలో నుండైనా సరే, ఎందుకంటే తీర్పుదినంనాడు నరకంలోనికి వెళ్ళేవారిలో అధిక సంఖ్యాకులు స్త్రీలు ఉంటారు, ‘ అని అన్నారు. [21] (తిర్మిజి’)

1809 – [ 16 ] ( حسن ) (1/567)

وَعَنْ عَمْرِو بْنِ شُعَيْبٍ عَنْ أَبِيْهِ عَنْ جَدِّهِ: أَنَّ امْرَأَتَيْنِ أَتَتَا رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم وَفِيْ أَيْدِيْهِمَا سِوَارَانِ مِنْ ذَهَبٍ فَقَالَ لَهُمَا: ” تُؤَدِّيَانِ زَكَاتَهُ؟” قَالَتَا: لَا. فَقَالَ لَهُمَا رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “أَتُحِبَّانِ أَنْ يُّسَوِّرَكُمَا اللهُ بِسَوَارَيْنِ مِنْ نَّارٍ؟” قَالَتَا: لَا. قَالَ: “فَأَدِّيض زَكَاتَهُ”. رَوَاهُ التِّرْمِذِيُّ.

وَقَالَ: هَذَا حَدِيْثٌ قَدْ رَوَاهُ الْمُثَنَّى بْنُ الصَّبَّاحِ عَنْ عَمْرِو بْنِ شُعَيْبٍ نَحْوَ هَذَا وَالْمُثَنَّى بْنُ الصَّبَّاحِ وَابْنُ لَهِيْعَةَ يُضَعَّفَانِ فِيْ الْحَدِيْثِ وَلَا يَصِحُّ فِيْ هَذَا الْبَابِ عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم شَيْءٌ.

1809. (16) [1/567-ప్రామాణికం]

‘అమ్ర్ బిన్‌ షు’ఐబ్‌ (ర) తన తండ్రి తాతల ద్వారా కథనం: ఇద్దరు స్త్రీలు ప్రవక్త (స) సన్నిధిలో హాజ రయ్యారు. అప్పుడు వారి చేతుల్లో రెండు బంగారు కడియాలు ఉన్నాయి. అప్పుడు ప్రవక్త (స), ‘మీరు వీటి ‘జకాత్‌ చెల్లించారా?’ అని ప్రశ్నించారు. దానికి వారు, ‘లేదు,’ అని అన్నారు. అప్పుడు ప్రవక్త (స), ‘తీర్పుదినంనాడు అల్లాహ్‌ (త) మీకు అగ్ని కడియాలు తొడిగించడం మీకు ఇష్టమేనా?’ అని అడిగారు. ‘ఇది మాకు ఎంతమాత్రం ఇష్టంలేదు,’ అని అన్నారు. ‘మరి వాటి ‘జకాత్‌ చెల్లించండి,’ అని ప్రవక్త (స) అన్నారు. (తిర్మిజి’)

తిర్మిజి ఇలా పేర్కొన్నారు: ”ముస్‌’నా బిన్‌ ‘సబా’హ్‌ ‘అమ్ర్ బిన్‌ షు’ఐబ్‌ ద్వారా ఇదేవిధంగా ఉల్లేఖించారు. అయితే ముస్‌’నా బిన్‌ ‘సబా’హ్‌, ఇబ్నెలహీ’అలను ‘హదీసు’లో బలహీనులుగా పేర్కొనడం జరిగింది. ఆభరాణాల ‘జకాత్‌ విషయంలో ప్రవక్త (స) తరఫున ఎటువంటి ప్రామాణిక ‘హదీసు’ లేదు. కాని అనేక మార్గాల ద్వారా ఉల్లేఖనాలు రావటం వల్ల ఇవి ‘హసన్‌ స్థానానికి చేరుకున్నాయి. దీనివల్ల ఆభరణాల్లో కూడా ‘జకాత్‌ ఉందని తెలుస్తుంది. [22]

1810 – [ 17 ] ( لم تتم دراسته ) (1/568)

وَعَنْ أُمِّ سَلَمَةَ قَالَتْ: كُنْتُ أَلْبِسُ أَوْضَاحَا مِّنْ ذَهَبٍ فَقُلْتُ: يَا رَسُوْلَ اللهِ أَكَنْزٌهُوَ؟ فَقَالَ: “مَا بَلَغَ أَنْ يُؤَدَّى زَكَاتُهُ فَزُكِّيَ فَلَيْسَ بِكَنْزٍ”. رَوَاهُ مَالِكٌ وَأَبُوْ دَاوُدَ.

1810. (17) [1/568- అపరిశోధితం]

ఉమ్మె సలమహ్‌ (ర) కథనం: నేను బంగారు ఆభరణాలు ధరించే దాన్ని, ”ఓ అల్లాహ్‌ ప్రవక్తా! ఇవి కన్‌’జ్‌గా పరిగణింపబడతాయా? అని విన్నవించు కున్నాను. దానికి ప్రవక్త (స) ఒకవేళ ధనం నిర్ణీత పరి మాణానికి చేరినా దాని నుండి ‘జకాత్‌ చెల్లించకపోతే అది కన్‌’జ్‌ అవుతుంది. ‘జకాత్‌ చెల్లించబడే ధనం కన్‌’జ్‌గా పరిగణించబడదు” అని ప్రవచించారు. [23] (మాలిక్‌, అబూ దావూద్‌)

1811 – [ 18 ] ( ضعيف ) (1/568)

وَعَنْ سَمُرَةَ بْنِ جُنْدُبٍ: أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم كَانَ يَأْمُرُنَا أَنْ نُّخْرِجَ الصَّدَقَةَ مِنَ الَّذِيْ نُعِدُّ لِلْبَيْعِ. رَوَاهُ أَبُوْ دَاوُدَ.

1811. (18) [1/568-బలహీనం]

సమురహ్‌ బిన్‌ జున్‌దుబ్‌ (ర) కథనం: ప్రవక్త (స) మమ్మల్ని, మేము వ్యాపారం కొరకు తయారు చేసే సరుకుల్లో ‘జకాత్‌ చెల్లించమని ఆదేశించేవారు.[24] (అబూ దావూద్‌)

1812 – [ 19 ] ( لم تتم دراسته ) (1/568)

وَعَنْ رَبِيْعَةَ بْنِ أَبِيْ عَبْدِ الرَّحْمَنِ عَنْ غَيْرِ وَاحِدٍ : أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم أَقْطَعَ لِبِلَالِ بْنِ الْحَارِثِ الْمُزَنِّيِ مَعَادِنَ الْقَبَلِيَّةِ وَهِيَ مِنْ نَّاحِيَةِ الْفُرْعِ فَتِلْكَ الْمَعَادِنُ لَا تُؤْخَذُ مِنْهَا إِلَّا الزَّكَاةُ إِلَى الْيَوْمِ. رَوَاهُ أَبُوْ دَاوُدَ.

1812. (19) [1/568- అపరిశోధితం]

రబీ’అహ్ బిన్‌ అబీ ‘అబ్దుర్ర’హ్మాన్‌ (ర) అనేక మంది ప్రవక్త (స) అనుచరుల ద్వారా కథనం: ”ప్రవక్త (స) బిలాల్‌ బిన్‌ ‘హారిస్‌’ ము’జ్‌నీకు  ఖబలియ్యహ్ ప్రాంతంలో ఉన్న గనులను వారసత్వంలో ఇచ్చి వేసారు. ఇవి ఫుర్’అకు సమీపంగా ఉన్నాయి. ఈ గనులనుండి ఇప్పటివరకు ‘జకాత్‌ తీసుకోవటం జరుగుతుంది. [25]  (అబూ దావూద్‌)

—–

اَلْفَصْلُ الثَّالِثُ  మూడవ విభాగం

1813 – [ 20 ] ( لم تتم دراسته ) (1/568)

عَنْ عَلِيِّ أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم قَالَ:”لَيْسَ فِيْ الْخَضْرَا وَاتِ صَدَقَةٌ وَلَا فِيْ الْعَرَايَا صَدَقَةٌ وَلَا فِيْ أَقَلَّ مِنْ خَمْسَةِ أَوْسَقٍ صَدَقَةٌ وَلَا فِيْ الْعَوَامِلِ صَدَقَةٌ وَلَا فِيْ الْجَبْهَةِ صَدَقَةٌ”.

قَالَ الصَّقْرُ: الْجَبْهَةُ الْخَيْلُ وَالْبِغَالُ وَالْعَبِيْدُ. رَوَاهُ الدَّارَقُطْنِيُّ.

1813. (20) [1/568- అపరిశోధితం]

‘అలీ (ర) కథనం: ప్రవక్త (స)  ప్రవచనం, ”ఆకుకూరల్లో, కూరగాయల్లో ‘జకాత్‌ లేదు. ‘అరాయా (బదల్)లో కూడా ‘సదఖహ్ లేదు, ఇంకా ఐదు వసఖ్‌ల కంటే తక్కువలో ‘సదఖహ్ లేదు, శ్రమించే జంతువులలో ‘సదఖహ్ లేదు, జబ్‌హహ్ లో కూడా ‘సదఖహ్ లేదు,

‘సఖ్‌ర్ ఉల్లేఖన కర్త జబ్హ్ అంటే గుర్రం, కంచర గాడిద మరియు బానిస అని పేర్కొన్నారు. [26]  (దారు ఖు’త్నీ)

1814 – [ 21 ] ( لم تتم دراسته ) (1/569)

وَعَنْ طَاوُسٍ أَنَّ مُعَاذَ بْنِ جَبَلٍ أُتِيَ بِوَقْصِ الْبَقَرِ فَقَالَ: لَمْ يَأْمُرْنِيْ فِيْهِ النَّبِيّ صلى الله عليه وسلم بِشَيْءٍ. رَوَاهُ الدَّارَقُطْنِيُّ وَالشَّافِعِيُّ. وَقَالَ: اَلْوَقْصُ مَا لَمْ يَبْلُغِ الْفَرِيْضَةَ.

1814: (21) [1/569- అపరిశోధితం]

‘తాఊస్ (ర) కథనం: ము’ఆజ్‌’ బిన్‌ జబల్‌(ర) వద్దకు నిర్ణీత సంఖ్యకు చేరని జంతువులను తీసుకు రావడం జరిగింది. అప్పుడు ము’ఆజ్‌’ (ర), ప్రవక్త (స) మాకు వీటిలో నుండి ‘జకాత్‌ తీసుకోమని ఆదేశించలేదు అని అన్నారు. [27] (దారు ఖు’త్నీ, షాఫ’యీ)

=====

2- صَدَقَةُ الْفِطْرِ

2. ఫిత్ర దానం

ఫిత్రా అంటే ఉపవాసం విరమించటం అని అర్థం. ఉపవాస స్థితిలో చిన్నచిన్న తప్పులు, పొరపాట్లు జరుగుతాయి, పెద్ద చిన్న పాపాలు కూడా జరుగు తాయి. ఉపవాసాలు పూర్తవగానే, అవి పూర్తయిన సంతోషంలో, అల్లాహ్‌ (త)కు కృతజ్ఞతలు తెలుపుతూ తన పాపాలకు పరిహారంగా ‘సదఖహ్, దానధర్మాలు చేయటాన్ని సదఖతుల్ఫిత్ర్ అంటారు. ‘జకాత్‌లా ‘సదఖతుల్‌ ఫి’త్ర్‌ కూడా తప్పనిసరి విధి. దీన్ని ‘సదఖతుల్‌ ఫి’త్ర్‌ అంటారు. ‘సదఖతుల్‌ ఫి’త్ర్‌ ముస్లిము లందరిపై తప్పనిసరి విధి. వారు ధనవంతు లైనా, పేదవారైనా, స్త్రీలయినా పురుషులైనా, స్వతంత్రులైనా బానిసలైనా, పెద్దలైనా చిన్నలైనా. ‘సదఖతుల్‌ ఫి’త్ర్‌ తప్పనిసరి అవడానికి ధనవంతులు, నిర్ణీతదనం గలవారే కానక్కరలేదు. ప్రతిఒక్కరిపై ఒక’సాఅ తప్పనిసరి విధి. ఆంగ్ల సేరు ప్రకారం పావు తక్కువ మూడు సేర్లు ఉంటుంది. ఒక వ్యక్తి తరఫున సేర్లు గోదుమలు, బియ్యం, శనగపప్పు, ఖర్జూరం, కిష్‌మిష్‌, పనీర్‌ ఇంకా ఇతర పప్పుధాన్యాలు. వీటిలో ఏది సులువైతే అది ఇవ్వవచ్చును. అబూ స’యీద్‌ ‘ఖుద్రీ ఉల్లేఖనం: మేము ప్రవక్త (స) కాలంలో ఒక ‘సా’అ గోదుమలు లేదా ఒక ‘సా’అ యవ్వలు, లేదా ఒక ‘సా’అ పనీరు లేదా ఒక ‘సా’అ కిష్‌మిష్‌ ‘సదఖతుల్‌ ఫి’త్ర్‌గా చెల్లించే వాళ్ళం. (బు’ఖారీ, ముస్లిమ్‌)

ఒకవేళ పేద వాడు సగంసాఅ గోదుమలు ఇస్తే సరిపోతుంది. అయితే రమ’దాన్‌ చివరి రోజు సూర్యాస్త మయం అయిన తరువాత నుండి ప్రారంభ మవుతుంది. ‘ఈద్‌ నమా’జ్‌ ముందు వరకు ఉంటుంది. ఇబ్నె ఖదామహ్‌ అభిప్రాయం: ‘సదఖతుల్‌ ఫి’త్ర్‌ విధి సమయం రమ’దాన్‌ చివరి సూర్యాస్తమయం నుండి ప్రారంభమవుతుంది.

ఈ ‘సదఖహ్ను ‘సదఖతుల్‌ ఫి’త్ర్‌ ఎందుకంటారంటే ఇఫ్‌తార్‌ సూర్యాస్తమయం తర్వాత చేయడం జరుగు తుంది. ప్రవక్త (స) దీన్ని ‘జకాతుల్‌ ఫి’త్ర్‌గా పేర్కొన్నారు. అందువల్లే ఇఫ్‌తార్‌ అంటే రమ’దాన్‌ చివరిదినం సూర్యాస్తమయం తరువాత నుంచి ‘సదఖతుల్‌ ఫి’త్ర్‌ తప్పనిసరి అయిపోతుంది. ఒకవేళ ఒకటి రెండు రోజులు ముందే చెల్లించినా ఫరవాలేదు.

ప్రవక్త (స) అనుచరులు ‘ఈదుల్‌ ఫి’త్ర్‌ కంటే ఒకటి రెండు రోజులు ముందు ‘సదఖతుల్‌ ఫి’త్ర్‌ చెల్లించేవారు. (బు’ఖారీ)

—–

اَلْفَصْلُ الْأَوَّلُ  మొదటి విభాగం

1815 – [ 1 ] ( متفق عليه ) (1/570)

عَنْ ابن عمر قَالَ: فَرَضَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم زَكَاةَ الْفِطْرِ صَاعًا مِّنْ تَمْرٍ أَوْ صَاعًا مِّنْ شَعِيْرٍ عَلَى الْعَبْدِ وَالْحُرِّ وَالذَّكَرِ وَالْأَنْثَى وَالصَّغِيْرِ وَالْكَبِيْرِ مِنَ الْمُسْلِمِيْنَ وَأَمَرَ بِهَا أَنْ تُؤَدَّى قَبْلَ خُرُوْجِ النَّاسِ إِلَى الصَّلَاةِ.

1815. (1) [1/570- ఏకీభవితం]

‘అబ్దుల్లా బిన్‌ ‘ఉమర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ‘సదఖతుల్‌ ఫి’త్ర్‌ను విధిగా నిర్ణయించారు. ప్రతి ముస్లిమ్‌ పురుషులు, స్త్రీలు, చిన్నాపెద్ద, బానిసలు, స్వతంత్రులపై ఒకసా ఖర్జూరం లేదా యవ్వలు, పండుగ నమా’జ్‌కు వెళ్ళే ముందు చెల్లించమని ఆదేశించారు. (బు’ఖారీ, ముస్లిం)

1816 – [ 2 ] ( متفق عليه ) (1/570)

وعَنْ أبي سعيد الخدري قَالَ: كُنَّا نُخْرِجُ زُكَاةَ الْفِطْرِ صَاعًا مِّنْ طَعَامٍ أَوْ صَاعًا مِّنْ شَعِيْرٍ أَوْ صَاعًا مِّنْ تَمْرٍ أَوْ صَاعًا مِّنْ أَقِطٍ أَوْ صَاعًا مِّنْ زَبِيْبٍ .

1816. (2) [1/570-ఏకీభవితం]

అబూ ‘సయీద్‌ ఖు’ద్రీ (ర) కథనం: మేము ‘జకాతుల్‌ ఫి’త్ర్‌ను గోదుమల ఒకసా లేదా యవ్వలు ఒక ‘సా’అ లేదా ఖర్జూరాలు ఒక ‘సా’అ లేదా పనీర్‌ ఒక ‘సా’అ లేదా కిష్‌మిష్‌ ఒక ‘సా’అను చెల్లించే వారం. (బు’ఖారీ, ముస్లిమ్‌)  

అంటే పైనపేర్కొన్నవాటిలో ఒక్కొక్క సాఅ చెల్లించే వారు.

—–

اَلْفَصْلُ الثَّانِيْ  రెండవ విభాగం 

1817 – [ 3 ] ( لم تتم دراسته ) (1/570)

عَنِ ابْنِ عَبَّاسٍ قَالَ: فِيْ آخِرِ رَمَضَانَ أَخْرِجُوْا صَدَقَةَ صَوْمِكُمْ. فَرَضَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم هَذِهِ الصَّدَقَةَ صَاعًا مِّنْ تَمْرٍ أَوْشَعِيْرٍ أَوْ نِصْفَ صَاعٍ مِّنْ قَمْحٍ عَلَى كُلِّ حُرٍّ أَوْمَمْلُوْكٍ ذَكَرٍ أَوْ أُنْثَى صَغِيْرٍ أَوْ كَبِيْرٍ. رَوَاهُ أَبُوْ دَاوُدَ وَالنَّسَائِيُّ

1817. (3) [1/570-అపరిశోధితం]

ఇబ్నె ‘అబ్బాస్‌ (ర)  ”రమ’దాను చివరిలో ప్రజలను, ప్రవక్త (స)  మీకు విధించిన మీ ఉపవాసాల ‘జకాత్‌ చెల్లించండి,” అని అన్నారు. అంటే ఖర్జూరాలు ఒక ‘సాఅ’ చెల్లించండి, లేదా యవ్వలు ఒక ‘సాఅ’ లేదా సగం ‘సా’అ గోదుమలు, స్వతంత్రలు, బానిసలు, పురుషులు, స్త్రీలు, చిన్నా పెద్ద అందరి తరఫు నుండి చెల్లించాలి. (అబూ దావూద్‌, నసాయి’)

1818 – [ 4 ] ( صحيح ) (1/570)

وَعَنِ ابْنِ عَبَّاسٍ قَالَ: فَرَضَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم زَكَاةَ الْفِطْرِ طُهْرَةَ الصِّيَامِ مِنَ اللَّغْوِ وَالرَّفَثِ وَطُعْمَةً لِّلْمَسَاكِيْنَ. رَوَاهُ أَبُوْ دَاوُدَ.

1818. (4) [1/570- దృఢం]

ఇబ్నె ‘అబ్బాస్‌ (ర) కథనం: ప్రవక్త (స) సదఖతుల్‌ ఫిత్ర్‌ను ఎందుకు విధించారంటే, ఉపవాసకుల ఉపవా సాలను చెడుమాటల నుండి, అనవసరమైన చేష్టల నుండి పరిశుద్ధ పరచాలని, పేదలకు, అగత్యపరులకు ఆహార ఏర్పాటు కావాలని. (అబూ దావూద్‌)

—–

اَلْفَصْلُ الثَّالِثُ  మూడవ విభాగం 

1819 – [ 5 ] ( لم تتم دراسته ) (1/571)

عَنْ عَمْرِو بْنِ شُعَيْبٍ عَنْ أَبِيْهِ عَنْ جَدِّهِ أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم بَعَثُ مُنَادِيًا فِيْ فِجَاجِ مَكَّةَ: “أَلَا إِنَّ صَدَقَةَ الْفِطْرِ وَاجِبَةٌ عَلَى كُلِّ مُسْلِمٍ ذَكَرٍ أَوْ أُنْثَى حُرٍّ أَوْ عَبْدٍ صَغِيْرٍ أَوْ كَبِيْرٍ مُدَّانِ مِنْ قَمْحٍ أَوْ سِوَاهُ أَوْ صَاعٌ مِّنْ طَعَامٍ”.  رَوَاهُ التِّرْمِذِيُّ.

1819. (5) [1/571- అపరిశోధితం]

‘అమ్ర్ బిన్‌ షు’ఐబ్‌ (ర) తన తండ్రి, తాతల ద్వారా ఉల్లేఖన: ప్రవక్త (స) మక్కహ్ వీధుల్లో ఒక ప్రకటించేవాడిని పంపి, ఇలా ప్రకటించమని ఆదేశించారు. ” ‘సదఖతుల్ ఫి’త్ర్‌ ప్రతి ముస్లిమ్‌ పురుషులు, స్త్రీలు, స్వతంత్రులు, బానిసలు, పెద్దా చిన్నా అందరిపై తప్పనిసరి విధి. గోదుమలు సగం ‘సాఅ’ లేదా ఇతర ఆహర ధాన్యాల్లో నుండి ఒక ‘సాఅ’. (తిర్మిజి’)

1820 – [ 6 ] ( لم تتم دراسته ) (1/571)

وَعَنْ عَبْدِ اللهِ بْنِ ثَعْلَبَةَ أَوْ ثَعْلَبَةَ بْنِ عَبْدِ اللهِ بْنِ أَبِيْ صُعَيْرٍ عَنْ أَبِيْهِ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “صَاعٌ مِّنْ بُرٍّ أَوْ قَمْحٍ عَنْ كُلِّ اثْنَيْنِ صَغِيْرٍ أَوْ كَبِيْرٍ حُرٍّ أَوْ عَبْدٍ ذَكَرٍ أَوْ أُنْثَى. أَمَّا غَنِيُّكُمْ فُيُزَكِّيْهِ اللهُ. وَأَمَّا فَقِيْرُكُمْ فَيَرُدُّ عَلَيْهِ أَكْثَرَ مما أَعْطَاهُ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ .

1820. (6) [1/571అపరిశోధితం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ స”అలబహ్ లేదా స”అలబహ్ బిన్‌ ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ అబీ ‘సు’ఐర్‌ (ర) తన తండ్రి ద్వారా ఉల్లేఖన: ప్రవక్త (స) ‘సదఖతుల్ ఫి’త్ర్‌ను తప్పనిసరిగా నిర్ణయించారు. ప్రతి ఇద్దరి తరఫున ఒక ‘సాఅ’ గోదుమలు చెల్లించాలి. చిన్నవారైనా పెద్ద వారైనా, బానిసలైనా స్వతంత్రులైనా, పురుషులైనా స్త్రీలయినా మీలోని ధనవంతులను అల్లాహ్‌ (త) పరిశుద్ధపరుస్తాడు. మీలోని పేదలకు ఇచ్చిన దాని కంటే అతనికి అల్లాహ్‌ (త) అధికంగా ప్రసాదిస్తాడు. [28]  (అబూ దావూద్‌)

=====

3بَابُ مَنْ لَّا تَحِلَّ لَهُ الصَّدَقَةُ

3. సదఖహ్ కు అర్హులు కాని వారు

1. ప్రవక్త (స) కుటుంబం, సయ్యద్, బనూ’హాషిమ్‌ అంటే అలీ (ర) సంతానం, అఖీల్ (ర) సంతానం, ఫర్ (ర) సంతానం, అబ్బాస్ సంతానం, వారికి ‘జకాత్‌ ధనం ఇవ్వటం, వారు తెలిసి తీసుకోవటం నిషిద్ధం. ప్రవక్త (స) ఇలా ప్రవచించారు, ”మేము ‘సదఖహ్ తినము. (బు’ఖారీ)

మరో ఆదేశం ”మా కోసం ‘సదఖహ్ ధర్మసమ్మతం కాదు. (ముస్లిమ్‌)

 ప్రవక్త (స) కుటుంబ సభ్యుడు ‘జకాత్‌ తాసిల్దా రుగా పనిచేసి పారితోషికం తీసుకోవడం కూడా నిషిద్ధం. ప్రవక్త (స) అబూ రా’ఫేతో ఇలా అన్నారు, ” ‘సదఖహ్ మనకు ధర్మసమ్మతం కాదు.” (తిర్మిజి’)

ప్రవక్త(స) ఫ’జల్‌తో ఈ’సదఖహ్, ‘జకాత్‌ ప్రజల మాలిన్యం వంటిది. ఇది ప్రవక్త(స), అతని కుటుంబానికి ఎంతమాత్రం తగదు. ”ఒక జాతివారు విడిచిపెట్టిన బానిస ఆ జాతివారిలో ఒకడుగా పరిగణించబడతాడు.”

2. నిర్ణీత ధనసంపదలు గల ధనవంతుడు ‘జకాత్‌ తీసుకోకూడదు. ప్రవక్త (స) ఇలా ప్రవచించారు: ”ధన వంతులు ‘జకాత్‌ తీసుకోవడం ధర్మసమ్మతం కాదు. అయితే ఐదు రకాల ధనవంతులు తీసుకోవచ్చును. 1. ధర్మమార్గంలో పోరాటం, కృషిప్రయత్నాలు చేసే వాడు, 2. ‘జకాత్ వసూలు చేసేవాడు, 3. పరిహారం చెల్లించేవాడు, 4. ‘జకాత్ సరకును డబ్బులిచ్చి కొనే వాడు, 5. ‘జకాత్ లభించిన పేదపొరుగువాడు, అందులో నుండి కొంత ధనవంతుడైన పొరుగువానికి కానుకగా ఇస్తే తీసుకోవచ్చును.

—–

اَلْفَصْلُ الْأَوَّلُ మొదటి విభాగం  

1821 – [ 1 ] ( متفق عليه ) (1/572)

عَنْ أَنَسٍ قَالَ: مَرَّ النَّبِيُّ صلى الله عليه وسلم الله عليه وسلم بِتَمَرَةٍ فِيْ الطَّرِيْقِ فَقَالَ: “لَوْلَا أَنِّيْ أَخَافُ أَنْ تَكُوْنَ مِنَ الصَّدَقَةِ لَأَكَلْتُهَا”.

1821. (1) [1/572- ఏకీభవితం]

అనస్‌ (ర) కథనం: ప్రవక్త (స) ఒకసారి వెళుతున్నారు. దారిలో ఒక ఖర్జూరం పడి ఉంది. అప్పుడు ప్రవక్త (స), ”ఈ ఖర్జూరం ‘సదఖహ్కు చెందినదనే భయం లేకపోతే నేను తిని ఉండే వాడిని,” అని అన్నారు. [29] (బు’ఖారీ, ముస్లిమ్‌)

1822 – [ 2 ] ( متفق عليه ) (1/572)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: أَخَذَ الْحَسَنُ بْنُ عَلِيٍّ تَمْرَةً مِّنْ تَمْرِ الصَّدَقَةِ فَجَعَلَهَا فِيْ فَيْهِ. فَقَالَ النَّبِيُّ صلى الله عليه وسلم: “كَخْ كَخْ” لِيَطْرَحَهَا ثُمَّ قَالَ: “أَمَا شَعَرْتَ أَنَا لَا نَأْكُلُ الصَّدَقَةَ؟”

1822. (2) [1/572- ఏకీభవితం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ” ‘హసన్‌ బిన్‌ ‘అలీ ‘సదఖహ్కు చెందిన ఖర్జూరాల్లోని ఒక ఖర్జూరాన్ని తీసి నోట్లో వేసుకున్నారు. అది చూసిన ప్రవక్త (స), ‘దాన్ని తీసివేయి, దాన్ని తీసివేయి, దాన్ని విసరి పారవెయ్యి, మనం ‘సదఖహ్ ధనం తినమని నీకు తెలియదా?’ అని అన్నారు.” [30]  (బు’ఖారీ, ముస్లిమ్‌)  

1823 – [ 3 ] ( صحيح ) (1/572)

وَعَنْ عَبْدِ الْمُطَّلِبِ بْنِ رَبِيْعَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه و سلم: “إِنَّ هَذِهِ الصَدَقاَتِ إِنَّمَا هِيَ أَوْسَاخُ النَّاسِ وَإِنَّهَا لَا تَحِلُّ لِمُحَمَّدٍ وَلَا لِآلِ مُحَمَّدٍ”.  رَوَاهُ مُسْلِمٌ

1823. (3) [1/572-డృఢం]

‘అబ్దుల్‌ ము’త్తలిబ్‌ బిన్‌ రబీ’అహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం: ”ఈ ‘సదఖహ్, ‘జకాత్‌ల ధనం ప్రజల మాలిన్యాలు, ఇవి ము’హమ్మద్‌కు, అతని కుటుంబానికి ఎంతమాత్రం ధర్మసమ్మతం కావు.” (ముస్లిమ్)

1824 – [ 4 ] ( متفق عليه ) (1/572)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: كَانَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم إِذَا أُتِيَ بِطَعاَمٍ سَأَلَ عَنْهُ: “أَهَدِيَّةٌ أَمْ صَدَقَةٌ؟” فَإِنْ قِيْلَ: صَدَقَةٌ: قَالَ لِأَصْحَابِهِ: “كُلُوْا” وَلَمْ يَأْكُلْ وَإِنْ قِيْلَ: هَدِيَّةٌ ضَرَبَ بِيَدِهِ فَأَكَلَ مَعَهُمْ .

1824. (4) [1/572- ఏకీభవితం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: అలవాటు ప్రకారం ఎక్కడి నుండైనా ప్రవక్త (స) వద్దకు ఏదైనా తినే వస్తువు వచ్చినప్పుడు ప్రవక్త (స) ముందు అది కానుక, లేక ‘సదఖహ్ ‘జకాత్‌కు చెందినదా అని నిర్థారించుకుంటారు. ఒకవేళ అది ‘సదఖహ్దని అంటే తన అనుచరులకు తినమని చెపుతారు. ప్రవక్త (స) దాన్నుండి ఏమీ తినరు. ఒకవేళ అది కానుక అని అంటే తన చేతిని చాచి తీసుకొని సహచరులతో పాటు తింటారు. [31] (బు’ఖారీ, ముస్లిమ్‌)

1825 – [ 5 ] ( متفق عليه ) (1/572)

وَعَنْ عَائِشَةَ رَضِيَ اللهُ عَنْهَا قَالَتْ: كَانَ فِيْ بَرِيْرَةَ ثَلَاثُ سُنَنٍ: إِحْدَى السُّنَنِ أَنَّهَا عَتَقَتْ فَخُيِّرَتْ فِيْ زَوْجِهَا. وَقَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “اَلْوَلَاءُ لِمَنْ أَعْتَقَ”. وَدَخَلَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم وَ الْبُرْمَةُ تَفُوْرُ بِلَحْمٍ فَقُرِّبَ إِلَيْهِ خُبْزٌ وَّأُدُمٌ مِّنَ أُدُمِ الْبَيْتِ فَقَالَ: “أَلَمْ أَرَ بُرْمَةً فِيْهَا لَحْمٌ؟” قَالُوْا: بَلَى وَلَكِنْ ذَلِكَ لَحْمٌ تُصُدِّقَ بِهِ عَلَى بَرِيْرَةَ وَأَنْتَ لَا تَأْكُلُ الصَّدَقَةَ. قَالَ: “هُوَ عَلَيْهَا صَدَقَةٌ وَلَنَا هَدِيَّةٌ”.

1825. (5) [1/572- ఏకీభవితం]

‘ఆయి’షహ్‌ (ర) కథనం: బానిసరాలు బరీరహ్ సంఘటన ద్వారా 3 విషయాలు తెలుస్తున్నాయి: 1. విడుదల అయినపుడు ఆమెకు తాను కోరితే తన భర్త వద్ద ఉండవచ్చని, లేకపోతే వేరైపోవచ్చనే అనుమతి ఇవ్వబడింది, 2. వలా విడుదల చేసిన వారికి చెందుతుందని ప్రవక్త (స) ప్రవచించారు, 3. ఆమెకు ‘సదఖహ్ మాంసం ఇవ్వబడింది. ప్రవక్త (స) నా ఇంటికి వచ్చారు. అప్పుడు మాంసాన్ని వండుతూ ఉన్నాను. ప్రవక్త (స) తినటానికి ఏదైనా తెమ్మన్నారు. రొట్టె, ఇంట్లో ఉన్న కూర తెచ్చి ఇచ్చాను. అప్పుడు ప్రవక్త (స), ‘పొయ్యిమీద గిన్నేలో మాంసం ఉడుకుతూ ఉన్నట్టుంది,’ అని అన్నారు. అంటే ‘మాంసం కూర ఇవ్వండి,’ అని అర్థం. దానికి అక్కడున్నవారు, ‘మాంసం అయితే ఉడుకుతుంది, కాని అది ‘సదఖహ్ మాంసం. అది బరీరహ్కు ఇవ్వబడింది. మరి తమరు ‘సదఖహ్ తినరు కదా?’ అని అన్నారు. దానికి ప్రవక్త (స), ‘ఆ మాంసం బరీరకు ‘సదఖహ్, మాకోసం కానుక,’ అని అన్నారు.[32]  (బు’ఖారీ, ముస్లిమ్‌)

1826 – [ 6 ] ( صحيح ) (1/573)

وَعَنْ عَائِشَةَ رَضِيَ اللهُ عَنْهَا قَالَتْ: كَانَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم يَقْبَلُ الْهَدِيَّةَ وَيُثِيْبُ عَلَيْهَا. رَوَاهُ الْبُخَارِيُّ.

1826. (6) [1/573-దృఢం]

‘ఆయి’షహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) కానుకలు స్వీకరించే వారు. దానికి ప్రతిఫలం కూడా ఇచ్చేవారు. అంటే కానుకకు బదులుగా ప్రవక్త () కూడా కానుకలు ఇచ్చే వారు. (బు’ఖారీ)

1827 – [ 7 ] ( صحيح ) (1/573)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَوْ دُعِيْتُ إِلَى كُرَاعٍ لَأَجَبْتُ وَلَوْ أُهْدِيَ إِلَيَّ ذِرَاعٌ لَّقَبِلْتُ”. رَوَاهُ الْبُخَارِيُّ.

1827. (7) [1/573-దృఢం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త ప్రవచనం: ఒకవేళ మేక పిక్క తినడానికి నన్ను పిలిచినా నేను స్వీకరిస్తాను. అంటే సాధారణమైన వస్తువు తినడానికి ఆహ్వానించినా స్వీకరిస్తాను. అదేవిధంగా ఒకవేళ మేక జబ్బ (దస్త్/జి’రా’అ) మాంసం నాకు పంపినా దాన్ని కూడా స్వీకరిస్తాను. [33] (బు’ఖారీ)

1828 – [ 8 ] ( متفق عليه ) (1/573)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَيْسَ الْمِسْكِيْنُ الَّذِيْ يَطُوْفُ عَلَى النَّاسِ تَرُدُّهُ اللُّقْمَةُ وَاللُّقْمَتَانِ وَالتَّمَرَةُ وَالتَّمَرَتَانِ وَلَكِنَّ الْمُسْكِيْنُ الَّذِيْ لَا يَجِدُ غَنَىٌّ يُّغْنِيْهِ وَلَا يُفْطَنُ بِهِ فَيَتَصَدَّقُ عَلَيْهِ وَلَا يَقُوْمُ فَيَسْأَلُ النَّاسَ”.

1828. (8) [1/573- ఏకీభవితం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త(స) ప్రవచనం, ప్రజల చుట్టూ తిరుగుతూ ఒక ముద్ద, రెండు ముద్దలు, ఒక ఖర్జూరం, రెండుఖర్జూరాలు తీసుకొని పోయేవాడు పేదవాడు కాడు. వాస్తవానికి పేదవాడు అంటే తన అవసరం మేరకు సంపాదించలేనివాడు, తన పేదరికం ప్రజల దృష్టిలో పడకపోవడంచేత వారి దానధర్మాలకు నోచుకోనివాడు. తనకు తానుగా ప్రజలముందు నిలబడి చెయ్యిచాచి అర్థించనివాడు. ఇటువంటి వాడే నిజమయిన పేదవాడు. [34]  (బు’ఖారీ, ముస్లిమ్‌)

—–

الْفَصْلُ الثَّانِيْ  రెండవ విభాగం 

1829 – [ 9 ] ( لم تتم دراسته ) (1/573)

عَنْ أَبِيْ رَافِعٍ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم بَعَثَ رَجُلًا مِّنْ بَنِيْ مَخْزُوْمٍ عَلَى الصَّدَقَةِ. فَقَالَ لِأَبِيْ رَافِعٍ: اصْحَبْنِيْ كَيْمَا تُصِيْبَ مِنْهَا.فَقَالَ: لَا حَتّى آتِيَ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم فَأَسْأَلَهُ. فَانْطَلَقَ إِلَى النَّبِيِّ صلى الله عليه وسلم. فَسَأَلَهُ. فَقَالَ: “إِنَّ الصَّدَقَةَ لَا تَحِلُّ لَنَا وَإِنَّ مَوَالِيَ الْقَوْمِ مِنْ أَنْفُسِهِمْ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَأَبُوْ دَاوُدَ وَالنَّسَائِيُّ.

1829. (9) [1/573-అపరిశోధితం]

అబూ రాఫె (ర) కథనం: ప్రవక్త (స) బనూ మ’ఖ్‌’జూమ్‌కు చెందిన ఒక వ్యక్తిని ‘జకాత్‌ తాసిల్దారుగా పంపించారు. ఆ వ్యక్తి అబూ రాఫే’తో నీవు కూడా నాతో వస్తే నీకూ వీటిలో నుండి వాటా లభిస్తుంది,’ అని అన్నాడు. దానికి అబూ రా’ఫే ‘లేదు, నేను ప్రవక్త (స) వద్దకు వెళ్ళి కనుక్కుంటాను’ అని అన్నారు. అతను ప్రవక్త (స) వద్దకు వెళ్ళి ప్రవక్త (స)ను దాన్ని గురించి అడిగారు, దానికి ప్రవక్త(స), ” ‘సదఖహ్ మనకోసం ధర్మసమ్మతం కాదు. ఒక జాతి వారు విడుదల చేసిన వాడు ఆ జాతివాడిగా పరిగణించబడతాడు అని ప్రవచించారు. [35] (తిర్మిజి’, అబూ దావూద్‌, నసాయి’)

1830 – [ 10 ] ( لم تتم دراسته ) (1/574)

وَعَنْ عَبْدِ اللهِ بْنِ عَمْرٍو قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَا تَحِلُّ الصَّدَقَةُ لِغَنِيٍّ وَلَا لِذِيْ مِرَّةٍ سَوِيٍّ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَأَبُوْ دَاوُدَ وَالدَّارَمِيُّ.

1830. (10) [1/574- అపరిశోధితం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘అమ్ర్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ధనవంతులకు, ఆరోగ్యంగా, బలంగా ఉన్నవారికి, సంపాదించే శక్తిగల వారికి ‘సదఖహ్ తీసు కోవడం ధర్మసమ్మతం కాదు.” (తిర్మిజి’, అబూ దావూద్‌, దారమి)

1831 – [ 11 ] ( لم تتم دراسته ) (1/574)

وَرَوَاهُ أَحْمَدُ وَالنَّسَائِيُّ وَابْنُ مَاجَهُ عَنْ أَبِيْ هُرَيْرَةَ.

1831. (11) [1/574- అపరిశోధితం]

అబూ హురైరహ్‌ (ర) ద్వారా, దీనినే అ’హ్‌మద్, నసాయి’, ఇబ్నె మాజహ్)

1832 – [ 12 ] ( صحيح ) (1/574)

وَعَنْ عُبَيْدِ اللهِ بْنِ عَدِيّ بْنِ الْخِيَارَ قَالَ: أَخْبَرَنِيْ رَجُلَانِ أَنَّهُمَا أَتَياَالنَّبِيَّ صلى الله عليه وسلم وَهُوَ فِيْ حِجَّةِ الْوَدَاعِ وَهُوَ يَقْسِمُ الصَّدَقَةَ. فَسَأَلَاهُ مِنْهَا فَرَفَعَ فِيْنَا النَّظَرَ وَخَفَضَهُ فَرَآنَا جَلْدَيْنِ فَقَالَ: “إِنْ شِئْتُمَاأعْطَيْتُكُمَا وَلَا حَظَّ فِيْهَا لِغَنِيٍّ وَلَا لِقَوِيٍّ مُّكْتَسِبٍ” .رَوَاهُ أَبُوْ دَاود والنسائي.

1832. (12) [1/574-దృఢం]

‘ఉబేదుల్లాహ్‌ బిన్‌ ‘అదీ బిన్‌ ‘ఖియార్‌ (ర) కథనం: నాకు ఇద్దరు వ్యక్తులు ఇలా తెలిపారు, ”ప్రవక్త (స) ‘హజ్జతుల్‌ విదా సందర్భంగా ‘జకాత్‌ ధనాన్ని పంచు తున్నప్పుడు వాళ్ళిద్దరూ వెళ్ళారు. ప్రవక్త (స)ను అర్థించారు. అప్పుడు ప్రవక్త (స) వాళ్ళిద్దరినీ తలపైకెత్తి చూసారు. మళ్ళీ తలదించుకున్నారు. అంటే వాళ్ళిద్దరినీ తలనుండి కాళ్ళవరకు చూసారు. అంటే వాళ్ళిద్దరూ ఆరోగ్యంగా, బలంగా ఉండటం ప్రవక (స) చూసారు. అప్పుడు ప్రవక్త (స) వారితో, ”మీరు కోరితే నేను మీకు ఇవ్వగలను, కాని ఈ ‘జకాత్‌ ధనంలో ధనవంతునికి వంతులేదు, ఆరోగ్యంగా, బలంగా సంపాదించే శక్తి గలవానికి హక్కూలేదు” అని అన్నారు (అబూ దావూద్‌, నసాయి’)

1833 – [ 13 ] ( لم تتم دراسته ) (1/574)

وَعَنْ عَطَاءِ بْنِ يَسَارٍ مُرْسَلًا قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَا تَحِلَ الصَّدَقَةُ لِغَنِيٍّ إِلَّا لِخَمْسَةٍ: لِّغَازٍ فِيْ سَبِيْلِ اللهِ أَوْ لِعَامِلِ عَلَيْهَا أَوْ لِغَارِمٍ أَوْ لِرَجُلٍ اشْتَرَاهَا بِمَالِهِ أَوْ لِرَجُلٍ كَانَ لَهُ جَارٌمِّسْكِيْنٌ فَتُصُدِّقَ عَلَى الْمِسْكِيْنِ فَأَهْدَى الْمِسْكِيْنُ لِلْغَنِيِّ” .رَوَاهُ مَالِكٌ وَأَبُوْدَاوُدَ .

1833. (13) [1/574- అపరిశోధితం]

‘అతాఅ’ బిన్‌ యసార్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం: ”ఏ ధనవంతునికీ ‘సదఖహ్, ‘జకాత్‌ తీసు కోవటం ధర్మసమ్మతం కాదు. అయితే ఐదుగురు ధనవంతులకు చెల్లుతుంది. 1. జిహాద్‌ మరియు పోరాటాల్లో పాల్గొనే వారికి, 2. ‘జకాత్‌ వసూలు చేసే వారికి, 3. పరిహారం చెల్లించేవారికి, 4. తన ధనంతో ‘జకాత్‌ వస్తువును కొనేవారికి, 5. పేదవాడి తరఫున కానుకగా ఇవ్వబడిన ‘జకాత్‌ వస్తువును స్వీకరించే వారికి. (మాలిక్‌, అబూ దావూద్‌)

1834 – [ 14 ] ( لم تتم دراسته ) (1/574)

وَفِيْ رِوَايَةٍ لِّأَبِيْ دَاوُدَ عَنْ أَبِيْ سَعِيْدٍ: “أَوِابْنِ السَّبِيْلِ”.

1834. (14) [1/574- అపరిశోధితం]

అబూ స’యీద్‌ ‘ఖుద్రీ (ర) కథనం: ఇందులో ”లేదా ప్రయాణీకులు” అనేపదం అధికంగా ఉంది.(అబూ దావూద్‌)

1835 – [ 15 ] ( لم تتم دراسته ) (1/574)

وَعَنْ زِيَادِ بْنِ الْحَارِثِ الصُّدَائِيِّ قَالَ: أَتَيْتُ النَّبِيَّ صلى الله عليه وسلم فَبَايَعْتُهُ فَذَكَرَ حَدِيْثًا طَوِيْلًا فَأَتَاهُ رَجُلٌ فَقَالَ: أَعْطِنِيْ مِنَ الصَّدَقَةِ . فَقَالَ لَهُ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: ” إِنَّ اللهَ لَمْ يَرْضَ بِحُكْمِ نَبِيٍّ وَّلَا غَيْرِهِ فِيْ الصَّدَقَاتِ حَتَّى حَكَمَ فِيْهَا هُوَ فَجَزَّأَهَا ثَمَانِيَةَ أَجْزَاءٍ فَإِنْ كُنْتَ مِنْ تِلْكَ الْأَجْزَاءِ أَعْطَيْتُكَ ” . رَوَاهُ أَبُوْ دَاوُدَ.

1835. (15) [1/574- అపరిశోధితం]

‘జియాద్‌ బిన్‌ ‘హారిస్‌’ ‘సుదాయీ’ (ర) కథనం: నేను ప్రవక్త (స) వద్దకు వెళ్ళాను. ప్రవక్త (స) శుభ-హస్తాలపై బైఅత్‌ చేసాను. ఆ తరువాత ‘హారిస్‌’ దీర్ఘమైన ఒక ‘హదీసు’ను పేర్కొన్నారు. అతను ఇలా అన్నారు, ”ఒక వ్యక్తి ప్రవక్త (స) వద్దకు వచ్చాడు, ‘జకాత్‌ ధనం ఇమ్మని అడిగాడు. అప్పుడు ప్రవక్త (స) ఆ వ్యక్తితో ఇలా అన్నారు, ”అల్లాహ్‌(త) ‘సదఖహ్ మరియు ‘జకాత్‌ విషయంలో ప్రవక్త తీర్పుతోనూ ఇష్టపడ లేదు. ఇతరుల తీర్పుతోనూ ఇష్టపడ లేదు. దాన్ని గురించి స్వయంగా అల్లాహ్‌(త) ఇలా తీర్పు ఇచ్చాడు: 8 మందిని గురించి పేర్కొన్నాడు: అంటే 8 మంది ‘జకాత్‌కు అర్హులు: ఒక వేళ నీవు ఆ ఎనిమిది రకాల్లో ఏ రకానికి చెందిన వాడవైనా, నేను నీకు ‘జకాత్‌ ఇచ్చి వేస్తాను. ఒకవేళ నీవు వారిలోని ఏ రకానికీ చెందినవాడవు కానిపక్షంలో నీవు ‘జకాత్‌ తీసుకోవటం మంచిదికాదు’ అని అన్నారు. (అబూ దావూద్‌)

—–

اَلْفَصْلُ الثَّالِثُ  మూడవ విభాగం

1836 – [ 16 ] ( ضعيف ) (1/575)

عَنْ زَيْدِ بْنِ أَسْلَمَ قَالَ: شَرِبَ عُمَرَ بْنُ الْخَطَّابِ رَضِيَ اللهُ عَنْهُ لَبَنًا فَأَعْجَبَهُ فَسَأَلَ الَّذِيْ سَقَاهُ: مِنْ أَيْنَ هَذَا اللَّبَنُ؟ فَأَخْبَرَهُ أَنَّهُ وَرَدَ عَلَى مَاءٍ قَدْ سَمَّاهُ فَإِذَا نَعَمٌ مِّنْ نَعَمِ الصَّدَقَةِ وَهُمْ يَسَقُوْنَ فَحَلَبُوْا مِنْ أَلْبَانِهَا فَجَعَلْتُهُ فِيْ سِقَائِيْ فَهُوَ هَذَا: فَأَدْخَلَ عُمَرُ يَدَهُ فَاسْتَقَاءَهُ. رَوَاهُ مَالِكٌ والبيهقي في شعب الإيمان .

1836. (16) [1/575-బలహీనం]

‘జైద్‌ బిన్‌ అస్‌లమ్‌ (ర) కథనం: ‘ఉమర్‌ (ర) పాలు త్రాగారు. అవి అతనికి చాలా రుచికరమైనవిగా అనిపించాయి. పాలు ఎక్కడి నుండి తెచ్చావని పాలు త్రాపించేవాడిని అడిగారు. అతను ఇలా అన్నాడు: ”నేను ‘సదఖహ్ ఒంటెలు నీరు త్రాగుతున్న చోటికి వెళ్ళాను. ఒంటె యజమానులు ఒంటెల పాలు పితికారు, అక్కడి పేదలకు పంచిపెట్టారు, నేనుకూడా కొన్నిపాలు నాచేదలో తీసుకున్నాను. ఈ పాలు ‘సదఖహ్, ‘జకాత్‌ల ఒంటెలపాలు,” అని అన్నాడు. వెంటనే ‘ఉమర్‌ (ర) తన చేతిని నోట్లో వేసి వాంతి చేసారు. [36]  (మాలిక్‌, బైహఖీ-షు’అబిల్ ఈమాన్)

=====

4بَابُ مَنْ لَّا تَحِلُّ لَهُ الْمَسْأَلَةُ وَمَنْ تَحِلُّ لَهُ

4. అర్థించడానికి అర్హులు, అనర్హులు

అనవసరంగా అర్థించటాన్ని చాలా తీవ్రంగా విమర్శించటం జరిగింది. ఒక ‘హదీసు’లో ప్రవక్త(స) ఇలా ప్రవచించారు: ‘ప్రజలను అడుక్కునేవాడు నరకాగ్నిని కూడబెడుతున్నాడు.” (ముస్లిమ్‌)

మరో సందర్భంలో ఇలా ప్రవచించారు: ”ఉదయం, సాయంత్రాల ఆహారం ఉన్నవారు అర్థించటం మంచిది కాదు.” క్రింద పేర్కొన్న ‘హదీసు’లు అర్థించటాన్ని విమర్శించేవిగా ఉన్నాయి.

——

اَلْفَصْلُ الْأَوَّلُ మొదటి విభాగం 

1837 – [ 1 ] ( صحيح ) (1/576)

عَنْ قَبِيْصَةَ بْنِ مُخَارِقٍ رضي الله عنه قَالَ: تَحَمَّلْتُ حَمَالَةً فَأَتَيْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم أَسْأَلُهُ فِيْهَا. فَقَالَ: “أَقِمْ حَتَّى تَأْتِيْنَا الصَّدَقَةُ فَنَأْمُرَ لَكَ بِهَا”. قَالَ ثُمَّ. قَالَ: “يَا قَبِيْصَةُ إِنَّ الْمَسْأَلَةَ لَا تَحِلُّ إِلَّا لِأَحَدِ ثَلَاثَةٍ رَّجُلٍ تَحَمَّلَ حَمَالَةً فَحَلَّتْ لَهُ الْمَسْأَلَةُ حَتَّى يُصِيْبَهَا ثُمَّ يُمْسِكُ وَرَجُلٌ أَصَابَتْهُ جَائِحَةٌ اجْتَاحَتْ مَالَهُ فَحَلَّتْ لَهُ الْمَسْأَلَةُ حَتَّى يُصِيْبَ قَوَامًا مِّنْ عَيْشٍ. أَوْ قَالَ سِدَادًا مِّنْ عَيْشٍ وَرَجُلٌ أَصَابَتْهُ فَاقَةٌ حَتَّى يَقُوْمَ ثَلَاثَةٌ مِّنْ ذَوِي الْحِجى مِنْ قَوْمِهِ. لَقَدْ أَصَابَتْ فُلَانًا فَاقَةٌ فَحَلَّتْ لَهُ الْمَسْأَلَةُ حَتَّى يُصِيْبَ قِوَامًا مِّنْ عَيْشٍ. أَوْ قَالَ سِدَادًا مِّنْ عَيْشٍ فَمَا سِوَاهُنَّ مِنَ الْمَسْأَلَةِ يَا قَبِيْصَةُ سُحْتٌ يَّأْكُلُهَا صَاحِبُهَا سُحْتًا”. رَوَاهُ مُسْلِمٌ.

1837. (1) [1/576-దృఢం]

ఖబీ’సహ్ బిన్ ము’ఖారిఖ్‌ (ర) కథనం: నేను ఒకరి బాధ్యత తీసుకున్నాను, ప్రవక్త (స) వద్దకు వెళ్ళి అప్పు చెల్లించటానికి అడిగాను. దానికి ప్రవక్త (స), ”ఇక్కడ కొన్ని రోజులు ఉండు, మా దగ్గరకు ‘జకాత్‌ ధనం వచ్చిన వెంటనే ఇవ్వమని ఆదేశిస్తాం.” అని అన్నారు. ఆ తరువాత మళ్ళీ ఇలా అన్నారు, ”ఓ ఖబీ’సహ్  కేవలం ముగ్గురు వ్యక్తులే అర్థించగలరు: 1. అప్పు బాధ్యత తీసుకున్నవాడు అతడు కూడా అప్పు ఎంత ఉందో అంతే అడగ గలడు, అంతకంటే ఎక్కువ అడగరాదు, 2. కష్టాలకు గురయిన వాడు, అతని ధన-సంపదలకు నష్టం వాటిల్లి, కరువు కాటకాలు మొదలైనవాటికి గురైతే, అతడు అవస రానికి కావలసినంత అడగగలడు. అవసరం తీరిపోయిన తర్వాత అతనికి అడిగే అర్హత లేదు, 3.  అతనిపై పెద్ద కష్టం వచ్చిపడి, దానివల్ల అతడు పేదవాడైపోయాడు, తినే త్రాగే ఆధారం లేకుండా పోయింది. అతని కుటుంబానికి చెందిన సజ్జనులైన ముగ్గురు వ్యక్తులు ఆ వ్యక్తి నిజంగానే పేద రికానికి గురయ్యాడని సాక్ష్యం ఇవ్వాలి. అతడు అవసర మున్నంత, అతని జీవితం నిలబడేంత అడగ వచ్చును. అతని అవసరం తీరగానే అర్థించడం తగదు. కేవలం ఈ ముగ్గురు వ్యక్తులే అర్థించగలరు. వీరు తప్ప ఇతరులు అర్థించటం నిషిద్ధం. అనవసరంగా అర్థించేవాడు అధర్మ సంపాదన తింటాడు. [37] (ముస్లిమ్‌)

1838 – [ 2 ] ( صحيح ) (1/576)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَنْ سَأَلَ النَّاسَ أَمْوَالَهُمْ تَكَثُّرًا فَإِنَّمَا يَسْأَلُ جَمْرًا. فَلْيَسْتَقِلَّ أَوِ لْيَسْتَكْثِرْ”.  رَوَاهُ مُسْلِمٌ .

1838. (2) [1/576-దృఢం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం: తనధనాన్ని అధికం చేయటానికి అర్థించే వ్యక్తి నిప్పును అర్థిస్తున్నాడు. అటువంటి వాడు ఎక్కు వైనా అడగవచ్చు, తక్కువైనా అడగవచ్చు, అతని ఇష్టం. (ముస్లిమ్‌)

1839 – [ 3 ] ( متفق عليه ) (1/576)

وَعَنْ عَبْدِ اللهِ بْنِ عُمَرَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَا يَزَالُ الرَّجُلُ يَسْأَلُ النَّاسَ حَتَّى يَأْتِيَ يَوْمَ الْقِيَامَةِ لَيْسَ فِيْ وَجْهِهِ مُزْعَةُ لَحْمٍ”.

1839. (3) [1/576-ఏకీభవితం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘ఉమర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం: ”ఎల్లప్పుడూ ప్రజలను అర్థించేవాడు తీర్పుదినం నాడు ముఖంపై మాంసం లేని స్థితిలో వస్తాడు.” (బు’ఖారీ, ముస్లిమ్‌)

అంటే అవమానపరచబడతాడు లేదా వాస్తవంగా అతని ముఖంపై మాంసం ఉండదు, దానివల్ల అసహ్యంగా కనబడతాడు.

1840 – [ 4 ] ( صحيح ) (1/577)

وَعَنْ مُعَاوِيَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَا تُلْحِفُوْا فِيْ الْمَسْأَلَةٍ فَوَاللهِ لَا يَسْأَلُنِيْ أَحَدٌ مِّنْكُمْ شَيْئًا فَتُخْرِجُ لَهُ مَسْأَلَتُهُ مِنِّيْ شَيْئًا وَأَنَا لَهُ كَارِهٌ فَيُبَارَكُ لَهُ فِيْمَا أَعْطَيْتُهُ” .رَوَاهُ مُسْلِمٌ.

1840. (4) [1/577-దృఢం]

ముఆవియహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం: అర్థించటంలో హద్దులు మీరకండి. అల్లాహ్‌ సాక్షి! మీలో ఎవరైనా నన్ను ఏదైనా వస్తువు అడిగితే, అతడు అడగటం వల్ల నేనతనికి ఆవస్తువు ఇచ్చి, అస హ్యించు కుంటే అందులో శుభం ఉండదు. (ముస్లిమ్‌)

1841 – [ 5 ] ( صحيح ) (1/577)

وَعَنْ الزُّبَيْرِ بْنِ الْعَوَّامِ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لِأَنَّ يَأْخُذَ أَحَدُكُمْ حَبْلَهُ فَيَأْتِيْ بِحُزْمَةِ حُطَبٍ عَلَى ظَهْرِهِ فَيَبِيْعَهَا فَيَكُفَّ اللهُ بِهَا وَجْهَهُ خَيْرٌ لَهُ مِنْ أَنْ يَّسْأَلَ النَّاسَ أَعْطَوْهُ أَوْ مَنَعُوْهُ”. رَوَاهُ الْبُخَارِيُّ .

1841. (5) [1/577- దృఢం]

‘జుబైర్‌ బిన్‌ ‘అవ్వామ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం: మీలో ఎవరైనా తన త్రాడు తీసుకొని కట్టెలు కట్టి తన వీపుపై వేసుకొని వచ్చి దాన్ని అమ్ము కోవాలి, దాని వల్ల అల్లాహ్‌ (త) అతని ముఖాన్ని అవమాన భారం నుండి రక్షిస్తాడు. అంటే అతనికి గౌరవ మర్యాదలను ప్రసాదిస్తాడు, ఇది  ప్రజలు ఇచ్చినా, ఇవ్వక పోయినా ప్రజలను అర్థించే దాని కన్నా చాలా గొప్పది. (బు’ఖారీ)

1842 – [ 6 ] ( متفق عليه ) (1/577)

وَعَنْ حَكِيْمِ بْنِ حِزَامٍ قَالَ: سَأَلْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم فَأَعْطَانِيْ ثُمَّ سَأَلْتُهُ فَأَعْطَانِيْ ثُمَّ قَالَ لِيْ: “يَا حَكِيْمُ إِنَّ هَذَا الْمَالَ خَضِرٌ حُلُوٌّ فَمَنْ أَخَذَهُ بِسَخَاوَةِ نَفْسٍ بُوْرِكَ لَهُ فِيْهِ وَمَنْ أَخَذَهُ بِإِشْرَافِ نَفْسٍ لَمْ يُبَارَكْ لَهُ فِيْهِ. وَكَانَ كَالَّذِيْ يَأْكُلُ وَلَا يَشْبَعُ وَالْيَدُ الْعُلْيَا خَيْرٌ مِّنَ الْيَدِ السُّفْلَى”. قَالَ حَكِيْمٌ: فَقُلْتُ: يَا رَسُوْلَ اللهِ وَالَّذِيْ بَعَثَكَ بِالْحَقِّ لَا أَرْزَأُ أَحَدًا بَعْدَكَ شَيْئًا حَتَّى أُفَارِقَ الدُّنْيَا”.

1842. (6) [1/577- ఏకీభవితం]

‘హకీమ్‌ బిన్‌ ‘హి’జామ్‌ (ర) కథనం: ప్రవక్త (స)ను నేను ఒక వస్తువు అడిగాను, ప్రవక్త (స) నాకు అను గ్రహించారు. మళ్ళీ నేను ప్రవక్త (స)ను అడిగాను, ప్రవక్త (స) నాకు ఇచ్చారు. ఆ తరువాత ప్రవక్త (స) ఇలా అన్నారు, ”ఈ ధనం సస్యశ్యామలంగా, తియ్యగా ఉంటుంది. ఎవరు ఈ ధనాన్ని అడగ కుండా, కోరికలు లేకుండా పొందితే అందులో శుభం ప్రసాదించబడుతుంది. మరెవరు ఈ ధనాన్ని మనో కాంక్షలతో పొందితే అందులో శుభం అనుగ్రహించ బడదు. ఇటువంటి వ్యక్తి తిన్నా, తృప్తిచెందని వ్యక్తితో సమానం. అంటే శుభం లేని కారణంగా. పైనున్న చేయి క్రింద ఉన్న చేయి కంటే ఉత్తమ మైనది. అంటే ఇచ్చేచేయి తీసుకునేచేయి కంటే ఉన్నతమైనది.

‘హకీమ్‌ ఇలా అన్నారు, ”నేనిలా విన్నవించు కున్నాను, ‘ఓ అల్లాహ్‌ ప్రవక్తా! సత్యాన్ని ఇచ్చి మిమ్మల్ని పంపిన ఆ దైవం సాక్షి! ఇకముందు నేను మీ తరువాత ఎవరిధనాన్ని అర్ధించను. అంటే మరణించే వరకు ఎవరినీ అడగను.’ ” (బు’ఖారీ, ముస్లిమ్‌)

1843 – [ 7 ] ( متفق عليه ) (1/577)

وَعَنِ ابْنِ عُمَرَ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم قَالَ وَهُوَعَلَى الْمِنْبَرِوَهُوَ يَذْكُرُ الصَّدَقَةَ وَالتَّعَفُّفَ عَنِ الْمَسْأَلَةِ: “اَلْيَدُ الْعُلْيَا خَيْرٌمِّنَ الْيَدِ السُّفْلَى وَالْيَدُ الْعُلْيَا هِيَ الْمُنْفِقَةُ وَالْيَدُ السُّفْلَى هِيَ السَّائِلَةُ”.

1843. (7) [1/577-ఏకీభవితం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘ఉమర్‌ (ర) కథనం: ప్రవక్త (స) మెంబర్‌పై ప్రసంగించారు. ప్రవక్త (స) తన ప్రసంగంలో ‘సదఖహ్ అర్థించడానికి దూరంగా ఉండమని హితబోధ చేసారు, పైనున్న చేయి క్రిందవున్న చేయికంటే ఉన్నతమైనదని. పైన ఉన్న చేయి ఖర్చుచేసేదని, క్రిందున్న చేయి అడుక్కునేదని విశదపరిచారు. (బు’ఖారీ, ముస్లిమ్‌)

1844 – [ 8 ] ( متفق عليه ) (1/577)

وَعَنْ أَبِيْ سَعِيْدِ الْخُدْرِيِّ قَالَ: إِنَّ أُنَاسًا مِّنَ الْأَنْصَاِر سَأَلُوْا رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم فَأَعْطَاهُمْ ثُمَّ سَأَلُوْهُ فَأَعْطَاهُمْ حَتَّى نَفِدَ مَا عِنْدَهُ. فَقَالَ: “مَا يَكُوْنَ عِنْدِيْ مِنْ خَيْرٍ فَلَنْ أَدَّخِرَهُ عَنْكُمْ وَمَنْ يَّسْتَعِفُّ يُعِفَّهُ اللهُ وَمَنْ يَّسْتَغْنِ يُغْنِهِ اللهُ وَمَنْ يَتَصَبَّرَ يُصَبِّرْهُ اللهُ وَمَا أُعْطِيَ أَحَدٌ عَطَاءٍ هُوَ خَيْرٌ وَأَوْسَعَ مِنَ الصَّبْرِ”

1844. (8) [1/577- ఏకీభవితం]

అబూ స’యీద్‌ ‘ఖుద్రీ (ర) కథనం: అ’న్సారుల్లోని కొందరు ప్రవక్త (స)ను ఏదో అడిగారు, ప్రవక్త (స) వారికి ఇచ్చారు. వాళ్ళు మళ్ళీ అడిగారు. ప్రవక్త (స) మళ్ళీ ఇచ్చారు. చివరికి ప్రవక్త(స) వద్ద ఉన్నదంతా అయిపోయింది. అప్పుడు ప్రవక్త (స), ‘నా వద్ద ఉన్న ధనాన్ని నేను మిగిల్చి ఉంచను (అంటే మీలో పంచి వేస్తాను). అర్థింపునకు దూరంగా ఉండే వాడిని అల్లాహ్‌ (త) అర్థింపునకు దూరంగా ఉంచుతాడు, నిర్లక్ష్యంగా ఉన్నవాడిని అల్లాహ్‌ (త) ధన వంతడుగా చేసి వేస్తాడు. అయితే ఓర్పు, సహనం అర్థించే వారికి అల్లాహ్‌(త) సహనం, ఓర్పులను ప్రసాదిస్తాడు. సహనం ఓర్పుకన్నా ఉత్తమమైన వస్తువు ఏదీ లేదు,’ అని అన్నారు. (బు’ఖారీ, ముస్లిమ్‌)

1845 – [ 9 ] ( متفق عليه ) (1/578)

وَعَنْ عُمَرَ بْنِ الْخَطَّابِ قَالَ: كَانَ النَّبِيُّ صلى الله عليه وسلم يُعْطِيْنِيْ الْعَطَاءَ فَأَقُوْلُ: أَعْطِهِ أَفْقَرَ إِلَيْهِ مِنِّي. فَقَالَ: “خُذْهُ فَتَمَوّلْهُ وَتَصَدَّقَ بِهِ فَمَا جَاءَكَ مِنْ هَذَا الْمَالِ وَأَنْتَ غَيْرُ مُشْرِفٍ وَلَا سَائِلٍ فَخُذْهُ. وَمَالَا فَلَا تُتْبِعْهُ نَفْسَكَ”.

1845. (9) [1/578- ఏకీభవితం]

‘ఉమర్‌ బిన్‌ ‘ఖ’త్తాబ్‌ (ర) కథనం: ‘జకాత్‌ వసూలు చేసి నేను ప్రవక్త (స) వద్దకు తీసుకువచ్చిన తర్వాత ప్రవక్త (స) దాన్నుండి నాకు ఇవ్వాలనుకున్నారు. అప్పుడు నేను, ”నా కంటే పేదవానికి ఇవ్వండి,” అని అన్నాను. దానికి ప్రవక్త (స) నీవు దీన్ని తీసుకో, నీ ధనంలోకి చేర్చుకో. ఆ తరువాత అందులో నుండి నీ తరఫున ‘సదఖహ్చేయి. అంటే దానంచేయి. కోరకుండా ఆశ లేకుండా, అడగకుండా లభించే ధనాన్ని తీసుకో, అలా కాని ధనం వెంటపడకు. [38]  (బు’ఖారీ, ముస్లిమ్‌)

—–

اَلْفَصْلُ الثَّانِيْ రెండవ విభాగం 

1846 – [ 10 ] ( لم تتم دراسته ) (1/578)

عَنْ سَمُرَةَ بْنِ جُنْدُبٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “اَلْمَسَائِلُ كَدُوْحٌ يَّكْدَحُ بِهَا الرَّجُلُ وَجْهَهُ فَمَنْ شَاءَ أَبْقَى عَلَى وَجْهِهِ وَمَنْ شَاءَ تَرَكَهُ إِلَّا أَنْ يَّسْأَلَ الرَّجُلُ ذَا سُلْطَانٍ أَوْ فِيْ أَمْرٍ لَّا يَجِدُ مِنْهُ بُدًّا”. رَوَاهُ أَبُوْ دَاوُدَ وَالتِّرْمِذِيُّ وَالنَّسَائِيُّ .

1846. (10) [1/578-అపరిశోధితం]

సమురహ్‌ బిన్‌ జున్‌దుబ్‌ (ర)కథనం: ప్రవక్త (స) ప్రవచనం: అర్థించడం అంటే బిచ్చమెత్తడం, గాయం వంటిది. బిచ్చమెత్తేవాడు అడిగి తన ముఖాన్ని గాయపరచుకుంటాడు. ఇక కోరినవారు ఆ గాయాన్ని కొనసాగించవచ్చు, కోరినవారు మానివేయవచ్చు. అంటే, బిచ్చగాడు అడగటం వల్ల తన ముఖాన్ని అవమానపరచుకుంటాడు. కోరినవారు బిచ్చ మెత్తుతూ తన్ను తాను అవమానపరచుకోవచ్చు. లేదా అర్థించడం మానివేసి తన గౌరవాన్ని కాపాడుకోవచ్చు .

దీనివల్ల అర్థించడం మంచి పనికాదు అని తెలిసింది. అయితే ఒకవ్యక్తి పాలకుల్ని లేదా ప్రత్యేక అవసరం ఉండి, తప్పనిసరి అయితే అడగవచ్చును. [39] (అబూ దావూద్‌, తిర్మిజి’, నసాయి’)

1847 – [ 11 ] ( صحيح ) (1/578)

وَعَنْ عَبْدِ اللهِ بْنِ مَسْعُوْدٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَنْ سَأَلَ النَّاسَ وَلَهُ مَا يُغْنِيْهِ جَاءَ يَوْمَ الْقِيَامَةِ وَمَسْأَلَتُهُ فِيْ وَجْهِهِ خُمُوْشٌ أَوْ خُدُوْشٌ أَوْ كُدُوْحٌ”. قِيْلَ يَا رَسُوْلَ اللهِ وَمَا يُغْنِيْهِ؟ قَالَ: “خَمْسُوْنَ دِرْهَمًا أَوْ قِيْمَتُهَا مِنَ الذَّهَبِ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ وَالتِّرْمِذِيُّ وَالنَّسَائِيُّ وَابْنُ مَاجَهُ وَالدَّارَمِيُّ.

1847. (11) [578-దృఢం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ మస్‌’ఊద్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం: అడిగే అవసరంలేని వస్తువు తన వద్ద ఉన్నా, ప్రజలను అడిగేవాడు తీర్పుదినం నాడు తన ముఖంపై గాయం ఉన్న స్థితిలో వస్తాడు. ఇలా ప్రశ్నించడం జరిగింది: ”ఓ అల్లాహ్‌ ప్రవక్తా! అవసరం లేకుండా చేసేది ఏమిటీ?” అని. ప్రవక్త (స) 50 దిర్‌హమ్‌లు లేదా దాని విలువకు సమానమైన బంగారం.” [40] (అబూ దావూద్‌, తిర్మిజీ’, నసాయి’, ఇబ్నె మాజహ్, దారమి)

1848 – [ 12 ] ( صحيح ) (1/579)

وَعَنْ سَهْلِ بْنِ الْحَنْظَلِيَّةِ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَنْ سَأَلَ وَعِنْدَهُ مَا يُغْنِيْهِ فَإِنَّمَا يَسْتَكْثِرُ مِنَ النَّارِ”. قَالَ النُّفَيْلِيُّ. وَهُوَ أَحَدُ رُوَاتِهِ فِيْ مَوْضِعٍ آخَرَ: وَمَا الْغِنَى الَّذِيْ لَا تَنْبَغِيْ مَعَهُ الْمَسْأَلَةُ؟ قَالَ: ” قَدْرُ مَا يُغَدِّيْهِ وَيُعَشِّيْهِ”. وَقَالَ فِيْ مَوْضِعٍ آخَرَ: “أَنْ يَّكُوْنَ لَهُ شِبَعُ يَوْمٍ أَوْ لَيْلَةٍ وَّيَوْمٍ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ.

1848. (12) [1/579-దృఢం]

సహల్‌ బిన్‌ ‘హం”జలియ్యహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం: అడిగే అవసరం లేనంతగా తనవద్ద ధనం ఉన్నా ప్రజలను అడుగుతూ తిరిగేవాడు, అత్యధిక నిప్పును అడుగు తున్నాడు. ఈ ‘హదీసు’ ఉల్లేఖనకర్తల్లో ఒకరైన నుఫైలీ ఒక ఉల్లేఖనంలో ఈ పదాన్ని కూడా పేర్కొన్నారు. ఒకసారి ఇతరులను అడిగే అవసరం లేని అనాశక్తత హద్దు ఎక్కడి వరకు ఉందని ప్రవక్త (స)ను ప్రశ్నించడం జరిగింది. దానికి ఉదయం సాయంత్రాల ఆహారం, లేదా ఒక దినం ఒక రాత్రి కడుపునిండా ఆహారం అని సమాధానం ఇవ్వ బడింది. [41] (అబూ దావూద్‌)

1849 – [ 13 ] ( لم تتم دراسته ) (1/579)

وَعَنْ عَطَاءِ بْنِ يَسَارٍ عَنْ رَجُلٍ مِّنْ بَنِيٍ أَسَدٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَنْ سَأَلَ مِنْكُمْ وَلَهُ أَوْقِيَةٌ أَوْ عَدْلُهَا فَقَدْ سَأَلَ إِلْحَافًا”. رَوَاهُ مَالِكٌ وَأَبُوْ دَاوُدَ وَالنَّسَائِيُّ .

1849. (13) [1/579-అపరిశోధితం]

‘అ’తా’ బిన్‌ యసార్‌ బనీ అసద్‌కు చెందిన ఒక వ్యక్తి ద్వారా ఉల్లేఖిస్తున్నారు. ఆ వ్యక్తి కథనం, ”ప్రవక్త (స) ప్రవచనం: 40 దిర్‌హమ్‌లు లేదా దానికి సమానమైన వస్తువు తన వద్ద ఉన్న వ్యక్తి మిమ్మల్ని అర్థిస్తే, అతడు ఇల్‌’హాఫ్తో అడిగాడు. [42] (మాలిక్‌, అబూ దావూద్‌, నసాయి’)

1850 – [ 14 ] ( لم تتم دراسته ) (1/579)

وَعَنْ حُبَشِيِّ بْنِ جُنَادَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِنَّ الْمَسْأَلَةَ لَا تَحِلُّ لِغَنِيٍّ وَلَا لِذِيْ مِرَّةٍ سَوِيٍّ إِلَّا لِذِيْ فَقْرٍ مُّدْقِعٍ أَوْ غُرْمٍ مُّفْظِعٍ وَّمَنْ سَأَلَ النَّاسَ لِيُثْرِيَ بِهِ مَالَهُ: كَانَ خُمُوْشًا فِيْ وَجْهِهِ يَوْمَ الْقِيَامَةِ وَرَضْفًا يَأْكُلُهُ مِنْ جَهَنَّمَ فَمَنْ شَاءَ فَلْيُقِلَّ وَمَنْ شَاءَ فَلْيُكْثِرْ”. رواه الترمذي.

1850. (14) [1/579- అపరిశోధితం]

‘హుబషీ బిన్‌ జునాదహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం: ధనవంతులు, బలవంతులు, ఆరోగ్యంగా ఉన్న వారు అర్థించడం ధర్మసమ్మతం కాదు. అయితే పేదరికం, దారిద్య్రం క్రింద పడవేసినవారు, లేదా అప్పుల్లో కూరుకుపోయిన వారు అర్థించవచ్చు. కాని తన ధనాన్ని ఇంకా అధికం చేసుకోవాలనే ఉద్దేశ్యంతో ప్రజలను అర్థిస్తే, ఈ అర్థింపు తీర్పుదినం నాడు అతని ముఖంపై గాయంగా, మాయని మచ్చగా తయారవు తుంది. నరకంలో వేడిరాళ్ళు ఉంటాయి, వాటిని తింటాడు. కనుక ఇప్పుడు కోరినవారు అధికంగానూ అడగవచ్చు, కోరినవారు తక్కువగానూ అడగ వచ్చు. (తిర్మిజి’)

1851 – [ 5 ] ( ضعيف ) (1/579)

وَعَنْ أَنَسٍ: أَنَّ رَجُلًا مِّنَ الْأَنْصَارِ أَتَى النَّبِيَّ صلى الله عليه وسلم يسأله فَقَالَ: “أَمَا فِيْ بَيْتِكَ شَيْءٌ؟”  قَالَ بَلَى حِلْسٌ نَّلْبَسٌ بَعْضَهُ وَنَبْسُطُ بَعْضَهُ وَقَعْبٌ نَّشْرَبُ فِيْهِ مِنَ الْمَاءِ. قَالَ:”ائْتِنِيْ بِهِمَا”. قَالَ فَأَتَاهُ بِهِمَا فَأَخَذَهُمَا رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم بِيَدِهِ وَقَالَ: “مَنْ يَّشْتَرِيْ هَذَيْنِ؟” قَالَ رَجُلٌ أَنَا آخَذَهُمَا بِدِرْهَمٍ قَالَ: “مَنْ يَّزِيْدُ عَلَى دِرْهَمٍ؟” مَّرَّتَيْنِ أَوْ ثَلَاثًا. قَالَ رَجُلٌ أَنَا آخُذُهُمَا بِدِرْهَمَيْنِ فَأَعْطَاهُمَا إِيَّاهُ وَأَخَذَ الدِّرْهَمَيْنِ فَأَعْطَاهُمَا الْأَنْصَارِيَّ وَقَالَ: “اشْتَرِ بِأَحَدِهِمَا طَعَامًا فَانْبِذْهُ إِلَى أَهْلِكَ وَاشْتَرِ بِالْآخَرِ قَدُوْمًا فَأَتِنِيْ بِهِ”. فَأَتَاهُ بِهِ فَشَدَّ فِيْهِ رَسُوْلِ الله صلى الله عليه وسلم عَوْدًا بِيَدِهِ ثُمَّ قَالَ لَهُ اذْهَبْ فَاحْتَطِبْ وَبِعْ وَلَا أَرَيَنَّكَ خَمْسَةَ عَشَرَ يَوْمًا”. فَذَهَبَ الرَّجُلُ يَحْتَطِبُ وَيَبِيْعُ فَجَاءَ وَقَدْ أَصَابَ عَشْرَةَ دَرَاهِمَ فَاشْتَرَى بِبَعْضِهَا ثَوْبًا وَبِبَعْضِهَا طَعَامًا. فَقَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “هَذَا خَيْرٌ لَّكَ مِنْ أَنْ تَجِيءَ الْمَسْأَلَةُ نُكْتَةً فِيْ وَجْهِكَ يَوْمَ الْقِيَامَةِ إِنَّ الْمَسْأَلَةَ لَا تَصْلُحُ إِلَّا لِثَلَاثَةٍ لَّذِيْ فَقْرٍ مُّدْقِعٍ أَوْ لِذِيْ غُرْمٍ مُّفْظِعٍ أَوْ لِذِيْ دَمٍ مُّوْجِعٍ” رَوَاهُ أَبُوْ دَاوُدَ وَرَوَى ابْنُ مَاجَهُ إِلَى قَوْلِه:”يَوْمَ الْقِيَامَةِ”.

1851. (15) [1/579-బలహీనం]

అనస్‌ (ర) కథనం:  ప్రవక్త (స) వద్దకు ఒక అ’న్సారీ ఏదో అడగడానికి వచ్చాడు. ‘నీ ఇంట్లో ఏమీ లేదా?’ అని ప్రవక్త (స) ప్రశ్నించారు. దానికి ఆ వ్యక్తి, ‘ఒక కంబళి ఉంది, దాని సగభాగాన్ని పరచుకుంటాను, సగభాగాన్ని కప్పుకుంటాను. ఒక చిన్న కప్పు ఉంది, దానితో నీళ్ళు త్రాగుతాను’. అప్పుడు ప్రవక్త (స), ‘ఆ రెంటిని నా దగ్గరకు తీసుకురా,’ అని అన్నారు. ఆ వ్యక్తి రెంటినీ తీసుకువచ్చాడు. ప్రవక్త (స) ఆ రెంటిని తన చేతిలో తీసుకొని, ‘వీటిని ఎవరుకొంటారు,’ అని అన్నారు. ఒక వ్యక్తి లేచి, ‘వీటిని నేను ఒక దిర్‌హమ్‌లో కొంటాను,’ అని అన్నాడు. ప్రవక్త (స), ‘ఒక దిర్‌హమ్‌కన్నా ఎక్కువ ఎవరు ఇస్తారు,’ అని అడిగారు. ఈ పదాలను ప్రవక్త (స) రెండు మూడు సార్లు పలికారు. ఒక వ్యక్తి లేచి, ‘ఈ రెంటిని రెండు దిర్‌హమ్‌లలో నేను కొంటాను,’ అని అన్నాడు. ప్రవక్త (స) ఆ రెంటిని అతనికి ఇచ్చివేసారు. అతని వద్ద నుండి రెండు దిర్‌హమ్‌లు తీసుకున్నారు. ఈ రెండు దిర్‌హముల్లోని ఒక దిర్‌హమ్‌ను అ’న్సారీ వ్యక్తికి ఇచ్చి, ‘ఒక దిర్‌హమ్‌తో ఇంటివారికి అన్న-పానీ యాలను కొని తీసుకువెళ్ళి ఇంట్లోవెయ్యి,’ అని అన్నారు. రెండవ దిర్‌హమ్‌ ఇస్తూ, ‘ఒక దిర్‌హమ్‌తో గొడ్డలి కొని నా దగ్గరకు తీసుకురా,’ అని అన్నారు. ఆ వ్యక్తి గొడ్డలి కొని తీసుకువచ్చాడు. ప్రవక్త (స) తన శుభహస్తాలతో దానికి కర్రతగిలించి, ‘నీవు దీన్ని తీసు కొని కర్రలుకోసి ప్రోగుచేయి, బజారులో అమ్ము, 15 రోజుల వరకు నా దగ్గరకు రావద్దు,’ అని అన్నారు. ఆ వ్యక్తి వెళ్ళి కట్టెలు కొట్టి తెచ్చి అమ్ముతూ ఉన్నాడు. ఆ తరువాత ఒక రోజు ఆ వ్యక్తి ప్రవక్త (స) వద్దకు వచ్చాడు, అప్పుడు అతని వద్ద 10 దిర్‌హమ్‌లు ఉన్నాయి. ఆ వ్యక్తి వాటిలో నుండి కొన్నిటిని ఖర్చుపెట్టి బట్టలు కొన్నాడు, మరికొన్నిటి ద్వారా తినే త్రాగే వస్తువులు కొన్నాడు. ప్రవక్త (స) ఆ వ్యక్తితో, ‘నీవు అడుక్కుంటూ తిరగటంకంటే ఇది నీకు ఉత్తమమైనది. అడుక్కోవటం వల్ల నీ ముఖంపై గాయాలు, మచ్చలుంటాయి. అడుక్కు తినటం ముగ్గురు వ్యక్తులకే చెల్లుతుంది. 1. దారిద్య్రం క్రింద పడవేసిన పేదవాడు లేదా, 2. అప్పుల పాలై, ఆందోళనకు, అశాంతికి గురైనవాడు, లేదా, 3. మరొకరి హత్యా పరిహారం తన నెత్తిన వేసుకొని దాన్ని చెల్లించే శక్తి లేక ఆందోళనకు, అశాంతికి గురైనవాడు అని అన్నారు. [43] (అబూ దావూద్‌)

ఇబ్నె మాజహ్: …ఇలా యౌమిల్‌ ఖియామహ్‌ వరకు ఉల్లేఖించారు.

1852 – [ 16 ] ( حسن ) (1/580)

وَعَنِ ابْنِ مَسْعُوْدٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَنْ أَصَابَتْهُ فَاقَةٌ فَأَنْزَلَهَا بِالنَّاسِ لَمْ تُسَدَّ فَاقَتَهُ. وَمَنْ أَنْزَلَهَا بِاللهِ أَوْشَكَ اللهُ لَهُ بِالْغِنَى إِمَّا بِمَوْتٍ عَاجِلٍ أَوْ غَنٍّى آجِلٍ”.  رَوَاهُ أَبُوْ دَاوُدَ وَالتِّرْمِذِيُّ.

1852. (16) [1/580-ప్రామాణికం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ మస్‌’ఊద్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం: ఎవరైనా దారిద్య్రానికి గురయి తన దారిద్య్రాన్ని గురించి చెప్పుకొని బాధలు తొలగాలని కోరుకుంటే వారి దారిద్య్రం తొలగదు, అవసరమూ తీరదు. కాని ఎవరు తమ దారిద్య్రాన్ని, బాధలను అల్లాహ్‌ ముందు పెడితే, అల్లాహ్‌ (త) చాలా త్వరగా అతని దారిద్య్రాన్ని, బాధలను దూరం చేసి సిరిసంపదలు ప్రసాదిస్తాడు. లేదా త్వరగా చనిపోవడం లేదా ఆలస్యంగా ధనవంతుడు కావటం జరుగు తుంది. [44] (అబూ దావూద్, తిర్మిజీ’)

—–

اَلْفَصْلُ الثَّالِثُ  మూడవ విభాగం 

1853 – [ 17 ] ( لم تتم دراسته ) (1/580)

عَنِ ابْنِ الْفِرَاسِيِّ أَنَّ الْفِرَاسِيَّ قَالَ: قُلْتُ لِرَسُوْلِ اللهِ صلى الله عليه وسلم أَسَأَلُ يَا رَسُوْلَ اللهِ؟ فَقَالَ النَّبِيُّ صلى الله عليه وسلم: “لَا. وَإِنْ كُنْتَ لَابُدَّ فَسَلِ الصَّالِحِيْنَ”.  رَوَاهُ أَبُوْ دَاوُدَ وَالنَّسَائِيُّ.

1853. (17) [1/580-అపరిశోధితం]

ఇబ్నుల్‌ ఫిరాసియ్యి’ (ర) కథనం: నేను ప్రవక్త (స) ను, ఓ అల్లాహ్‌ ప్రవక్తా! నేను ప్రజలను అర్థించ వచ్చా? అని ప్రశ్నించాను. దానికి ప్రవక్త (స) ‘లేదు, ఒకవేళ అర్థించడం తప్పనిసరి అయితే, సజ్జనులనే అర్థించు,’ అని ఉపదేశించారు. (అబూ దావూద్‌, నసాయి’)

1854 – [ 18 ] ( صحيح ) (1/581)

وَعَنِ ابْنِ السَّاعِدِيِّ أَنَّهُ قَالَ: اسْتَعْمَلَنِيْ عمر رضي الله عنه عَلَى الصَّدَقَةِ. فَلَمَّا فَرَغْتُ مِنْهَا وَأَدَّيْتُهَا إِلَيْهِ أَمَرَ لِيْ بِعُمَالَةٍ فَقُلْتُ إِنَّمَا عَمِلْتُ لِلّهِ وَأَجْرِيْ عَلَى اللهِ. فَقَالَ خُذْ مَا أُعْطِيْتَ فَإِنِّيْ قَدْ عَمِلْتُ عَلَى عَهْدِ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم فَعَمَلَنِيْ فَقُلْتُ مِثْلَ قَوْلِكَ فَقَالَ لِيْ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِذَا أُعْطِيْتَ شَيْئًا مِنْ غَيْرِأَنْ تَسْأَلَهُ فَكُلْ وَتَصَدَّقْ”. رَوَاهُ مُسْلِمٌ وَأَبُوْ دَاوُدَ.

1854. (18) [1/581-దృఢం]

ఇబ్ను స్సా’యిదీ (ర) కథనం: ‘ఉమర్‌ (ర) నన్ను ‘జకాత్‌ వసూలు చేయడానికి నియమించారు, నేను ‘జకాత్‌ ధనాన్ని వసూలు చేసి తెచ్చి ‘ఉమర్‌ (ర)కు ఇచ్చివేసాను. ‘ఉమర్‌ (ర)ను పారితోషికం చెల్లించమని ఆదేశించారు. దానికి నేను ఈ పని అల్లాహ్‌ (త) కోసం చేసానని, నా పారితోషికం బాధ్యత అల్లాహ్‌ (త) పై ఉందని అంటే, ఆయన నాకు ప్రతిఫలం ప్రసాదిస్తాడని అన్నాను. అప్పుడు ‘ఉమర్‌ (ర), ”నీకు ఇవ్వబడు తున్న పారితోషికం నువ్వు తీసుకో, నేను కూడా ప్రవక్త (స) కాలంలో ఇలాగే చేసాను, ప్రవక్త (స) నాకు పారితోషికం ఇస్తున్నప్పుడు నేను కూడా నీలాగే ఈ పని నేను అల్లాహ్‌ (త)  కోసం చేసానని, అల్లాహ్‌ నాకు ప్రతిఫలం ప్రసాదిస్తాడని అన్నాను. అప్పుడు ప్రవక్త (స), ‘అడగకుండా నీకు ఇచ్చిన దాన్ని నీవు తీసుకో, దాన్ని తిను, మిగిలింది దాన-ధర్మాలు చేసుకో’, అని అన్నారు. ” (అబూ దావూద్‌)

1855 – [ 19 ] ( لم تتم دراسته ) (1/581)

وَعَنْ عَلِيٍّ رَضِيَ اللهُ عَنْهُ أَنَّهُ سَمِعَ يَوْمَ عَرَفَةَ رَجُلًا يَّسْأَلُ النَّاسَ فَقَالَ: أَفِيْ هَذَا الْيَوْمِ: وَفِيْ هَذَا الْمَكَانِ تَسْأَلُ مِنْ غَيْرِ اللهِ؟ فَخَفَقَهُ بِالدَّرَّةِ. رَوَاهُ رَزِيْنٌ.

1855. (19) [1/581- అపరిశోధితం]

‘అలీ (ర) కథనం: అతను ‘అరఫహ్ రోజు ‘అర ఫాత్‌ మైదానంలో ఒక వ్యక్తిని ప్రజల్లో బిచ్చమెత్తు కుంటూ ఉండటం చూసారు. ‘అలీ (ర) ఆ వ్యక్తిని, ”నీవు ఈ రోజు ఈ స్థలంలో అల్లాహ్‌ (త)ను వదలి ఇతరుల్ని అర్థిస్తున్నావా? అని చీవాట్లు పెడుతూ బెత్తంతో కొట్టారు. [45] (ర’జీన్‌)

1856 – [ 20 ] ( لم تتم دراسته ) (1/581)

وَعَنْ عُمَرَ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: تَعْلَمُنَّ أَيُّهَا النَّاسُ أَنَّ الطَّمَعَ فَقْرٌ وَأَنَّ الْإِيَاسَ غَنِىً وَأَنَّ الْمَرْءَ إِذَا اَلْمَرْءَ إِذَا يَئِسَ عَنْ شَيْئٍ اسْتَغْنَى عَنْهُ رَوَاهُ رَزِيْنٌ.

1856. (20) [1/581- అపరిశోధితం]

‘ఉమర్‌ (ర) కథనం: అతను ప్రజలతో ఓ ప్రజలారా! బాగా గుర్తుంచుకోండి, దురాశ దారిద్య్రం వంటిది. ప్రజల పట్ల అనాశక్తత, వారి నుండి నిరాశతో ఉండటం, గొప్ప ధన సంపదల వంటిది. ఎందుకంటే ఎవరైనా ఏ విషయం పట్ల నిరాశకుగురైతే, దానిపట్ల అనాశక్తతకు గురవుతారు. దాన్నే  స్వయంసమృద్ధి అంటారు. (ర’జీన్‌)

1857 – [ 21 ] ( صحيح ) (1/581)

وَعَنْ ثَوْبَانَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَنْ يَّكْفُلُ لِيْ أَنْ لَّا يَسْأَلَ النَّاسَ شَيْئًا فَأَتَكَفَّلَ لَهُ بِالْجَنَّةِ؟” فَقَالَ ثَوْبَانُ: أَنَا فَكَانَ لَا يَسْأَلُ أَحَدًا شَيْئًا. رَوَاهُ أَبُوْ دَاوُدَ وَالنَّسَائِيُّ.

1857. (21) [1/581- దృఢం]

సౌ’బాన్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం: ఎవరినీ అర్థించనని నాతో వాగ్దానం చేసినవారి కొరకు నేను స్వర్గం గురించి వాగ్దానం చేస్తున్నాను’ అని అన్నారు. సౌ’బాన్‌ (ర) ”ఓ అల్లాహ్‌ ప్రవక్తా! నేను దాన్ని గురించి వాగ్దానం చేస్తున్నాను” అని విన్నవించుకున్నారు. ఆ తరువాత ఆయన మరణించేవరకు ఎవరినీ అర్థించ లేదు. (అబూ దావూద్‌, నసాయి’)

1858 – [ 22 ] ( لم تتم دراسته ) (1/582)

وَعَنْ أَبِيْ ذَرٍّ قَالَ: دَعَانِيْ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم وَهُوَ يَشْتَرِطُ عَلَيَّ: “أَنْ لَّا تَسْأَلَ النَّاسَ شَيْئًا”. قُلْتُ: نَعَمْ. قَالَ: “وَلَا سَوْطَكَ إِنْ سَقَطَ مِنْكَ حَتَّى تَنْزِلَ إِلَيْهِ فَتَأْخُذَهُ”. رَوَاهُ أَحْمَدُ.

1858. (22) [1/582-అపరిశోధితం]

అబూ జ’ర్‌ (ర) కథనం: ప్రవక్త (స) నన్ను పిలిపించారు. అప్పుడు ప్రవక్త (స) ప్రజలతో ఎవరూ ఎవరినీ ఏ వస్తువూ అడగరాదు అనే షరతు పెడుతున్నారు. నన్ను కూడా నీవు ఎవరినీ ఏ వస్తువూ అడగరాదని షరతుపెట్టారు. నేను దాన్ని గురించి వాగ్దానం చేసాను. అప్పుడు ప్రవక్త (స), ‘ఒకవేళ నీ కొరడా నేలపై పడినా, ఇతరులకు ఎత్తి ఇమ్మని చెప్పకుండా నువ్వే స్వయంగా దిగి నీ కొరడాను ఎత్తుకోవాలి.’ అని అన్నారు (అ’హ్మద్‌)

=====

5- بَابُ الْإِنْفَاقِ وَكَرَاهِيَةِ الْإِمْسَاكِ

5. ఖర్చుచేయడం, పిసినారితనం

ఖర్చుచేయడం, దానధర్మాలు చేయడం: ఖర్చు చేయడంలో చాలా ప్రాధాన్యత, ప్రాముఖ్యత గల కార్యాలు. అల్లాహ్‌ భక్తులు దానధర్మాలు చేయడంలో, ఖర్చుచేయడంలో చాలా ముందు ఉంటారు. సంతోషంగా, చిత్తశుద్ధితో అల్లాహ్‌ మార్గంలో ఖర్చుచేసే వారికి తీర్పుదినం నాడు చాలా గొప్ప ప్రతిఫలం లభిస్తుంది. వారు ప్రశాంతంగా సంతోషంగా ఉంటారు.

అల్లాహ్‌ ఆదేశం: ”ఎవరైతే, అల్లాహ్‌ మార్గంలో తమ ధనాన్ని వ్యయంచేసి, ఆ తరువాత తాము చేసిన ఉపకారాన్ని చెప్పుకుంటూ మరియు వారిని బాధిస్తూ ఉండరో, అలాంటివారి ప్రతి ఫలం, వారి ప్రభువు వద్ద ఉంది. మరియు వారికి ఎలాంటి భయమూ ఉండదు మరియు వారు దుఃఖపడరు కూడా! ” (సూ. అల్‌ బఖరహ్‌, 2:262).

ఉన్నత స్థానాలను పొందటానికి ఖర్చు చేయడం తప్పనిసరి. సమయానికి ఖర్చుచేసేవారు, పిసినారి తనం ప్రదర్శించని వారే సాఫల్యం పొందుతారు.

మరోచోట ఇలా ఆదేశించడం జరిగింది: ”నిశ్చయంగా మీ సంపదలు మరియు మీ సంతానం మీ కొరకు ఒక పరీక్ష. మరియు అల్లాహ్‌! ఆయన దగ్గర గొప్ప ప్రతిఫలం (స్వర్గం) ఉంది. కావున మీరు మీ శక్తి మేరకు అల్లాహ్‌ యందు భయ-భక్తులు కలిగి ఉండి, (ఆయన సూచనలను విని), ఆయనకు విధేయులై ఉండండి మరియు (మీ ధనం నుండి) దానం చేస్తే! అది మీ సొంత మేలుకే. మరియు ఎవరైతే తమ హృదయ లోభత్వం నుండి రక్షణ పొందుతారో, అలాంటి వారే సాఫల్యం పొందేవారు. ఒకవేళ మీరు అల్లాహ్‌కు అప్పుగా మంచి అప్పు ఇస్తే, ఆయన దానిని ఎన్నోరెట్లు పెంచి తిరిగి మీకు ప్రసాదిస్తాడు మరియు మిమ్మల్ని క్షమిస్తాడు. వాస్తవానికి అల్లాహ్‌ కృతజ్ఞతలను ఆమోదించేవాడు, సహనశీలుడు.” (సూ. అత్త’గాబున్‌, 64:15-17)

దైవమార్గంలో ఖర్చుచేసేవారి ధనం చాలా అభివృద్ధి చెందుతుంది. ఒక పైసాకు బదులు 100 పైసలు, ఒక రూపాయికి బదులు100 రూపాయలు అంతకంటే ఎక్కువగా లభిస్తాయి. ఖుర్‌ఆన్‌లోని ఈ ఆయతులను పఠించండి, ఆచరించండి.

”అల్లాహ్‌ మార్గంలో తమ ధనాన్ని ఖర్చుచేసే వారి ఉపమానం: ”ఆ విత్తనంవలే ఉంటుంది, దేనినుండి అయితే ఏడు వెన్నులు పుట్టి ప్రతి వెన్నులో నూరేసి గింజలు ఉంటాయో! మరియు అల్లాహ్‌ తాను కోరిన వారికి  హెచ్చుగా నొసంగుతాడు. మరియు అల్లాహ్‌ విస్తారుడు, సర్వజ్ఞుడు.” (సూ. అల్‌ బఖరహ్‌, 2:261)

అంటే ఒక గింజ అనేక గింజలుగా మారుతుంది. అదే విధంగా పుణ్యం యొక్క ఒక్క గింజ అనేక పుణ్యగింజలను సృష్టిస్తుంది. ఎందుకంటే అల్లాహ్‌ (త) విశాలహృదయుడు. ఆయనవద్ద ఒకటి వందగా మారటం అంత కష్టమైనపని కాదు. అంతేకాదు, ఎవరు ఎంత చిత్తశుద్ధితో ఇచ్చారనేది కూడా ఆయనకు తెలుసు. ఈ రుకూ’ చివరిలో అల్లాహ్‌ (త) దైవప్రీతి కోసం చిత్తశుద్ధి తో ధనం ఖర్చు చేసేవారి ఉపమానాన్ని పేర్కొన్నారు.

మరో ఉపమానం: ”మరియు అల్లాహ్‌ ప్రీతి పొందే ఉద్దేశంతో మరియు ఆత్మస్థిరత్వంతో ధనాన్ని ఖర్చుచేసేవారి పోలిక: మెట్టభూమిపై నున్న ఒక తోటవలె ఉంటుంది. దానిపై భారీవర్షం కురిసినపుడు అది రెండింతల ఫలము నిస్తుంది. భారీవర్షం కాక చినుకులు (కురిసినా దానికి చాలు). మరియు అల్లాహ్, మీరు చేసేదంతా చూస్తున్నాడు.” (సూ. అల్‌ బఖరహ్‌, 2:265)

ఈ ఉపమానంలో మెట్టభూమి అంటే చిత్తశుద్ధి, వర్షం అంటే అధికంగా మంచు అంటే కొంచెం ఖర్చు చేయటం, ఫలించడం అంటే ప్రతిఫలం అని అర్థం. మంచినేల ఏ విధంగా వర్షం ద్వారా లేదా మంచు ద్వారా కలకల లాడుతుందో, అదేవిధంగా చిత్తశుద్ధితో దైవమార్గంలో ఖర్చుచేస్తే అది ఒకటికి బదులు వంద అయిపోతుంది. ఎందుకంటే అల్లాహ్‌(త)కు మనం చేస్తున్నదంతా తెలుసు. అదేవిధంగా మన సంకల్పాల గురించీ తెలుసు.

اَلْفَصْلُ الْأَوَّلُ మొదటి విభాగం   

1859 – [ 1 ] ( صحيح ) (1/583)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَوْ كَانَ لِيْ مِثْلُ أُحُدٍ ذَهْبًا لَّسَرَّنِيْ أَنْ لَا يَمُرَّ عَلَيَّ ثَلَاثُ لَيَالٍ وَعِنْدِيْ مِنْهُ شَيْءٌ إِلَّا شَيْءٌ أُرْصِدُهُ لِدَيْنٍ”. رَوَاهُ الْبُخَارِيُّ.

1859. (1) [1/583-దృఢం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం: ఒకవేళ నా దగ్గర ఉ’హుద్‌ కొండంత బంగారం ఉంటే అది నా దగ్గర మూడు రోజులకు మించి ఉండకుండా ఉంటే నేను సంతోషిస్తాను. అంటే మూడు రోజుల్లో బంగారాన్నంతా ఖర్చు చేసివేస్తాను. కాని అప్పు ఉన్నంత బంగారం తప్ప. అప్పులు చెల్లించటానికి మాత్రమే ఉంచుతాను. (బు’ఖారీ)

1860 – [ 2 ] ( متفق عليه ) (1/583)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَا مِنْ يَّوْمٍ يُّصْبِحُ الْعِبَادُ فِيْهِ إِلَّا مَلَكَانِ يَنْزِلَانِ فَيَقُوْلُ أَحَدَهُمَا: اَللّهُمَّ أعْطِ مُنْفِقًا خَلْفًا وَّيَقُوْلُ الْآخَرُ: اَللّهُمَّ أَعْطِ مُمْسِكًا تَلَفًا”.

1860. (2) [1/583-ఏకీభవితం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం: ప్రతి రోజూ ఇద్దరు దైవదూతలు దిగివస్తారు. వారిలో ఒకదూత, ”ఓ అల్లాహ్! ఖర్చుపెట్టేవాడికి ప్రతి ఫలాన్ని ప్రసాదించు,” అని. రెండోదూత ” ఓ అల్లాహ్ (త)! కూడబెట్టివుంచే వాడి ధనాన్ని నాశనం చేయి,” అని ప్రార్థిస్తూ ఉంటారు. (బు’ఖారీ, ముస్లిం)

1861 – [ 3 ] ( متفق عليه ) (1/583)

وَعَنْ أَسْمَاءٍ قَالَتْ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “أَنْفِقِيْ وَلَا تُحْصِيْ فَيُحْصِيْ اللهُ عَلَيْكَ وَلَا تُوْعِيَ فَيُوْعِيَ اللهُ عَلَيْكَ اَرْضخِيْ مَا اسْتَطَعْتِ”.

1861. (3) [1/583- ఏకీభవితం]

అస్మా’ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం: నువ్వు ఖర్చుచేస్తూ ఉండు, లెక్క పెట్టకు. ఒకవేళ నీవు లెక్క పెడితే నీ గురించి కూడా లెక్కపెట్టటం జరుగుతుంది. అదేవిధంగా ఆపి ఉంచకు, నీ నుండి కూడా ఆపివేయడం జరుగుతుంది. నీవల్ల సాధ్యమైనంత వరకు ఖర్చుచేయి. [46] (బు’ఖారీ, ముస్లిమ్‌)

1862 – [ 4 ] ( متفق عليه ) (1/583)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “قَالَ اللهُ تَعَالى: أَنْفِقَ يَا ابْنَ آدَمَ أُنْفِقْ عَلَيْكَ”.

1862. (4) [1/583-ఏకీభవితం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త ప్రవచనం: అల్లాహ్‌ ఆదేశం: ”ఓ ఆదమ్‌ పుత్రుడా ఖర్చు పెట్టు, నీపై కూడా ఖర్చుపెట్టడం జరుగుతుంది.” అంటే నువ్వు నా మార్గంలో ఖర్చుపెట్టు, నేను నీకు ప్రసాదిస్తాను. (బు’ఖారీ, ముస్లిమ్‌)

1863 – [ 5 ] ( صحيح ) (1/583)

وَعَنْ أَبِيْ أُمَامَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “يَا ابْنَ آدَمَ إِنْ تَبْذُلَ الْفَضْلَ خَيْرٌ لَّكَ وَإِنْ تُمْسِكَهُ شَرٌّ لَّكَ وَلَا تُلَامُ عَلَى كَفَافٍ وَابْدأُ بِمَنْ تَعُوْلُ”.  رَوَاهُ مُسْلِمٌ .

1863. (5) [1/583- దృఢం]

అబూ ఉమామహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం: ఓ మనిషీ! నీ దగ్గర మిగిలిపోయిన ధనాన్ని నువ్వు ఖర్చుపెడితే అది నీకే మంచిది. దాన్ని నీ దగ్గర ఆపు కుంటే దానివల్ల నీకే నష్టం. అవసరాలకు సరిపోయే టంత ధనాన్ని కూడబెట్టుకున్న పక్షంలో నీవు నిందా ర్హుడివి కావు. ఖర్చుపెట్టేటప్పుడు నీపై ఆధారపడి ఉన్న వారితోనే మొదలుపెట్టు. [47] (ముస్లిమ్‌)

1864 – [ 6 ] ( متفق عليه ) (1/584)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَثَلُ الْبَخِيْلِ وَالْمُتَصَدِّقِ كَمَثَلِ رَجُلَيْنِ عَلَيْهِمَا جُنَّتَانِ مِنْ حَدِيْدٍ قَدْ اضْطُرَّتْ أَيْدِيْهِمَا إِلَى ثُدَيْهِمَا وَتَرَاقِيْهِمَا فَجَعَلَ الْمُتَصَدِّقُ كُلَّمَا تَصَدَّقَ بِصَدَقَةٍ انْبَسَطَتْ عَنْهُ الْبَخِيْلُ كُلَّمَا هُمْ بِصَدَقَةٍ قَلَصَتْ وَأَخَذَتْ كُلُّ حَلْقَةٍ بِمَكَانِهَا”.

1864. (6) [1/584- ఏకీభవితం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: దైవప్రవక్త (స) పిసి నారిని, ఖర్చుపెట్టే దానగుణం గలవాడిని, కవచాలు ధరించి ఉన్న ఇద్దరు వ్యక్తులతో ఈ విధంగా పోల్చి చెబుతుండగా నేను విన్నాను. ఆ ఇరువురి శరీరాలూ రొమ్మునుండి కంఠం వరకు కవచాలతో కప్పబడి ఉన్నాయి. దానివల్ల వారు చేతులు కదపలేక పోతు న్నారు. వారిద్దరిలో దానధర్మాలు చేసేవాడు దానం చేయాలని అనుకున్నప్పుడు, అతని కవచం పూర్తిగా వదులయి పోతుంది. దానికి భిన్నంగా పిసినారి దానం చేయాలని అనుకున్నప్పుడు కవచంలోని ప్రతికొండి ఎక్కడి కక్కడ బిగుసుకుపోతుంది. అతను దాన్ని వదులు చేసుకోవాలని ప్రయత్నిస్తాడు కాని అది వదులు కాదు. [48]  (బు’ఖారీ, ముస్లిమ్‌)

1865 – [ 7 ] ( صحيح ) (1/584)

وَعَنْ جَابِرٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “اتَّقُوا الظُّلْمَ فَإِنَّ الظُّلْمَ ظُلَمَاتٌ يَّوْمَ الْقِيَامَةِ وَاتَّقُوْا الشُّحَّ فَإِنَّ الشُّحَّ أَهْلَكَ مَنْ كَانَ قَبْلَكُمْ: حَمَلَهُمْ عَلَى أَنْ سَفَكُوْا دِمَاءَهُمْ وَاسْتَحَلُّوْا مَحَارِمَهُمْ”.  رَوَاهُ مُسْلِمٌ.

1865. (7) [1/584-దృఢం]

జాబిర్‌ (ర) కథనం: దైవప్రవక్త (స) ప్రవచనం: అన్యా యానికి దూరంగా ఉండండి. ఎందుకంటే అన్యాయం ప్రళయదినాన దట్టమైన చీకట్లుగా మారుతుంది. ఇంకా పేరాశకు దూరంగా ఉండండి. ఎందుకంటే, ఈ పేరాశయే మీకు పూర్వం గతించిన సమాజాన్ని నాశనం చేసింది. ప్రజలను ఒకరిపట్ల ఒకరు రక్తం చిందించేందుకు, నిషిద్ధ వస్తువుల్ని ధర్మసమ్మతంగా చేసుకునేందుకు ప్రేరేపించింది. (ముస్లిమ్‌)

1866 – [ 8 ] ( متفق عليه ) (1/584)

وَعَنْ حَارِثَةَ بْنِ وَهْبٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “تَصَدَّقُوْا فَإِنَّهُ يَأْتِيْ عَلَيْكُمْ زَمَانٌ يَّمْشِيْ الرَّجُلُ بِصَدَقَتِهِ فَلَا يَجِدُ مَنْ يَّقْبَلُهَا يَقُوْلُ الرَّجُلُ: لَوْ جِئْتَ بِهَا بِالْأَمْسِ لَقَبِلْتُهَا فَأَمَّا الْيَوْمَ فَلَا حَاجَةَ لِيْ بِهَا”. متفق عليه.

1866. (8) [1/584- ఏకీభవితం]

‘హారిస’హ్ బిన్‌ వహబ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం: ‘సదఖహ్ చేస్తూ ఉండండి. ఎందుకంటే ఒక కాలం రాబోతుంది. అందులో మనిషి దానధర్మాలు చేయడానికి తన ధనం తీసుకొని తిరుగుతూ ఉంటాడు, కాని ‘సదఖహ్ తీసుకునేవాడెవడూ కనబడడు. ఒక వ్యక్తి అతనితో ఒకవేళ నిన్న తెచ్చి ఉంటే నేను తీసుకునేవాడిని. ఈనాడు నాకు దీని అవసరం లేదు అని అంటాడు. [49] (బు’ఖారీ, ముస్లిమ్‌)

1867 – [ 9 ] ( متفق عليه ) (1/584)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: قَالَ رَجُلٌ: يَا رَسُوْلَ اللهِ أَيُّ الصَّدَقَةِ أَعْظَمُ أَجْرًا؟ قَالَ: “أَنْ تَصَدَّقَ وَأَنْتَ صَحِيْحٌ شَحِيْحٌ تَخْشَى الْفَقْرَ وَتَأْمُلُ الْغَنِى وَلَا تُمْهِلَ حَتَّى إِذَا بَلَغَتِ الْحُلْقُوْمَ قُلْتَ: لِفُلَانٍ كَذَا وَلِفُلَانٍ كَذَا وَقَدْ كَانَ لِفُلَانٍ”.

1867. (9) [1/584- ఏకీభవితం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ఒక వ్యక్తి మహా ప్రవక్త (స) వద్దకు వచ్చి ఓ దైవప్రవక్తా! పుణ్యఫలం దృష్ట్యా, ఏ దానం అన్నిటి కంటే గొప్పది అని ప్రశ్నించాడు. ప్రవక్త (స) ఇలా ప్రవచించారు. ”నీవు ఆరోగ్యంగా ఉండి, ఐశ్వర్యకాంక్ష ఉండి, మనసు దానధర్మాలు చేయటానికి విముఖంగా ఉన్నప్పుడు, ఒకవైపు దారిద్య్రం వచ్చి పడుతుందన్న భయమూ, మరోవైపు ఐశ్వర్యం వరిస్తుందన్న ఆశ నిన్ను ఆవహించి ఉన్నప్పుడు దానం చేయడం చాలా గొప్పది.  జీవం కంఠం నుండి ఎగిరిపోయే ముందు, ”ఇది ఫలానా వ్యక్తికి, అది ఫలానా వారికి, అని దానం ఇచ్చే పరిస్థితి వచ్చే వరకు నిరీక్షించకు. అప్పుడు అదంతా ఆ ఫలానా వారికి చెందవలసిందే కదా!” [50] (బు’ఖారీ, ముస్లిమ్‌)

1868 – [ 10 ] ( متفق عليه ) (1/584)

وَعَنْ أَبِيْ ذَرٍّ قَالَ: انْتَهَيْتُ إِلَى النَّبِيٍّ صلى الله عليه وسلم وَهُوَ جَالِسٌ فِيْ ظِلِّ الْكَعْبَةِ فَلَمَّا رَآنِيْ قَالَ: “هُمْ الْأَخْسَرُوْنَ وَرَبِّ الْكَعْبَةِ”. فَقُلْتُ: فِدَاكَ أَبِيْ وَأُمِّيْ مَنْ هُمْ؟ قَالَ: “هُمْ الْأَكْثَرُوْنَ أَمْوَالًا إِلَّا مَنْ قَالَ: هَكَذَا وَهَكَذَا وَهَكَذَا مِنْ بَيْنَ يَدَيْهِ وَمِنْ خَلْفِهِ وَعَنْ يَمِيْنِهِ وَعَنْ شَمَالِهِ وَقَلِيْلٌ مَّا هُمْ”. متفق عليه.

1868. (10) [1/584- ఏకీభవితం]

అబూ జ’ర్‌ (ర) కథనం: ఒకసారి నేను ప్రవక్త (స) వద్దకు వెళ్లాను. అప్పుడు ప్రవక్త (స) క’అబహ్ నీడలో కూర్చుని ఉన్నారు. ప్రవక్త (స) నన్ను చూడగానే ”వారంతా నష్టంలో ఉన్నారు,” అని అన్నారు. నేను ఆతృతగా ”నా తల్లి-దండ్రుల్ని మీకై అర్పిస్తాను, ఎవరు వారు?” అని అడిగాను. దానికి ప్రవక్త (స), ”ధనవంతులైనప్పటికీ ధనం ఖర్చు చేయనివారే నష్టంలో ఉన్నవారు. తమ ధనాన్ని నిస్సంకోచంగా ఖర్చుచేసే వారే సాఫల్యం పొందేవారు. తమ ముందు ఉన్నవారికీ, వెనుక ఉన్నవారికీ, ప్రక్కనున్న వారికీ ఇచ్చేవారు. ఇలా ఖర్చుచేసే ధనవంతులు చాలా తక్కువ.” (బు’ఖారీ, ముస్లిమ్‌)

—–

اَلْفَصْلُ الثَّانِيْ   రెండవ విభాగం 

1869 – [ 11 ] ( ضعيف جدا ) (1/585)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “اَلسَّخِيُّ قَرِيْبٌ مِّنَ اللهِ قَرِيْبٌ مِّنَ الْجَنَّةِ قَرِيْبٌ مِّنَ النَّاسِ بَعِيْدٌ مِّنَ النَّارِ. وَالْبَخِيْلُ بَعِيْدٌ مِّنَ اللهِ بَعِيْدٌ مِّنَ الْجَنَّةِ بَعِيْدٌ مِّنَ النَّاسِ قَرِيْبٌ مِّنَ النَّارِ. وَلَجَاهِلٌ سَخِيٌّ أَحَبُّ إِلَى اللهِ مِنْ عَابِدٍ بَخِيْلٍ” .رَوَاهُ التِّرْمِذِيُّ .

1869. (11) [1/585-అతి బలహీనం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం: ”దానశీలుడు అల్లాహ్‌ (త)కు సమీపంగా ఉంటాడు. స్వర్గానికి సమీపంగా ఉంటాడు. ప్రజలకు సమీపంగా ఉంటాడు. నరకానికి దూరంగా ఉంటాడు. పిసినారి వ్యక్తి అల్లాహ్‌(త)కు దూరంగా ఉంటాడు, స్వర్గానికి దూరంగా ఉంటాడు. ప్రజలకు దూరంగా ఉంటాడు, నరకానికి సమీపంగా ఉంటాడు, అల్లాహ్‌(త)కు పిసినారి ఆరాధకుని కంటే అజ్ఞాని అయిన దాన శీలుడు, ప్రియుడు. (తిర్మిజి’)

1870 – [ 12 ] ( لم تتم دراسته ) (1/585)

وَعَنْ أَبِيْ سَعِيْدِ الْخُدْرِيِّ رضي الله عَنْه قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَأَنْ يَتَصَدَّقَ الْمَرْءُ فِيْ حَيَاتِهِ بِدِرْهَمٍ خَيْرٌ لَّهُ مِنْ أَنْ يَّتَصَدَّقَ بِمِائَةٍ عِنْدَ مَوْتِهِ”. رَوَاهُ أَبُوْ دَاوُد.

1870. (12) [1/585- అపరిశోధితం]

అబూ స’యీద్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం: ”మనిషి తన జీవితంలో ఒక దిర్‌హమ్‌ దాన ధర్మాలు చేయడం, మరణసమయంలో వంద దిర్‌హమ్‌లు దానధర్మాలు చేయటం కంటే గొప్పది.” (అబూ దావూద్‌)

1871 – [ 13 ] ( لم تتم دراسته ) (1/585)

وَعَنْ أَبِيْ الدَّرْدَاءِ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَثَلُ الَّذِيْ يَتَصَدَّقُ عِنْدَ مَوْتِهِ أَوْ يُعْتِقُ كَالَّذِيْ يُهْدِيْ إِذَا شَبِعَ”  رَوَاهُ أَحْمَدُ وَالنَّسَائِيُّ وَالدَّارَمِيُّ وَالتِّرْمِذِيُّ وَصَحَّحه

1871. (13) [1/585-అపరిశోధితం]

అబూ ద్దర్‌దా’ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం: ”మరణ సమయంలో దానధర్మాలు చేయటం, బాని సను విడుదల చేయటం, కడుపునిండి సంతృప్తిగా ఉన్న వ్యక్తికి కానుక ఇవ్వటంతో సమానం.” (అ’హ్‌మద్‌, నసాయి’, దారమి, తిర్మిజి’ -దృఢం)

అంటే మరణించేటప్పుడు దానధర్మాలు చేస్తే అధిక పుణ్యం లభించదు. ఎందుకంటే కడుపు నిండిఉన్న వ్యక్తికి అన్నం పెడితే అధిక పుణ్యం లభించదు.

1872 – [ 14 ] ( لم تتم دراسته ) (1/585)

وَعَنْ أَبِيْ سَعِيْدٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “خَصْلَتَانِ لَا تَجْتَمِعَانِ فِيْ مَؤْمِنٍ: اَلْبُخْلُ وَسُوْءُ الْخُلْقِ” .رَوَاهُ التِّرْمِذِيُّ.

1872. (14) [1/585- అపరిశోధితం]

అబూ స’యీద్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం: విశ్వాసిలో ఈ రెండు విషయాలు కలసి ఉండవు. పిసినారి తనం, దుర్గుణాలు. అంటే విశ్వాసి పిసినారి కాడు, దుర్జనుడు కాడు. ఈ రెండు చెడు అలవాట్లు పరిపూర్ణ విశ్వాసిలో ఉండవు. (తిర్మిజి’)

1873 – [ 15 ] ( لم تتم دراسته ) (1/585)

وَعَنْ أَبِيْ بَكْر الصِّدِّيْقِ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَا يَدْخُلُ الْجَنَّةَ خَبٌّ وَلَا بَخِيْلٌ وَّلَا مَنَانٌ”. رَوَاهُ التِّرْمِذِيُّ.

1873. (15) [1/585- అపరిశోధితం]

అబూ బకర్‌ ‘సిద్దీఖ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం: ”మోసగాడు, పిసినారి, ఉపకారం చేసి ఎత్తిపొడిచే వాడు స్వర్గంలో ప్రవేశించరు.” (తిర్మిజి’)

అంటే వారు స్వర్గంలో మొట్ట మొదట ప్రవేశించే వారిలో ఉండరు.

1874 – [ 16 ] ( لم تتم دراسته ) (1/586)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “شَرُّ مَا فِيْ الرَّجُلِ شُحٌّ هَالِعٌ وَّجُبْنٌ خَالِعٌ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ.

وَسَنَذْكُرُ حَدِيْثَ أَبِيْ هُرَيْرَةَ: “لَا يَجْتَمِعُ الشُّحُّ وَالْإِيْمَانُ” فِيْ كِتَابِ الْجِهَادِ إِنْ شَاءَ اللهُ تَعَالى.

1874. (16) [1/586- అపరిశోధితం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం: మనిషిలో ఉన్న ఈ రెండు గుణాలు చాలా చెడ్డవి, ఒకటి చాలా పిసినారిగా వ్యవహరించడం, రెండవది మగతనం లేని పిరికితనం. (అబూ దావూద్‌)

పిసినారితనం, విశ్వాసం కలసి ఉండలేవు అనీ అబూ హురైరహ్‌ ‘హదీసు’ను కితాబుల్‌ జిహాద్‌లో ఇన్‌షా అల్లాహ్‌ పేర్కొందాము.

—–

اَلْفَصْلُ الثَّالِثُ  మూడవ విభాగం 

1875 – [ 17 ] ( صحيح ) (1/586)

عَنْ عَائِشَةَ رَضِيَ اللهُ عَنْهَا أَنَّ بَعْضَ أَزْوَاجِ النَّبِيِّ صلى الله عليه وسلم قُلْنَ لِلنَّبِيِّ صلى الله عليه وسلم: أَيُّنَا أَسْرَعُ بِكَ لُحُوْقًا؟ قَالَ: “أَطْوَلُكُنَّ يَدًا فَأَخَذُوْا قَصْبَةً يَّذْرَعُوْنَهَا فَكَانَتْ سَوْدَةُ أَطْوَلَهُنَّ يَدًا فَعَلِمْنَا بَعْدُ أَنَّمَا كَانَ طُوْلُ يَدِهَا الصَّدَقَةُ وَكَانَتْ أَسْرَعَنَا لُحُوْقًا بِهِ زَيْنَبُ وَكَانَتْ تُحِبُّ الصَّدَقَةَ. رَوَاهُ الْبُخَارِيُّ .

وَفِيْ رِوَايَةِ مُسْلِمٍ قَالَتْ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “أَسْرَعُكُنَّ لُحُوْقًا بَيْنَ أَطْوَلُكُنَّ يَدًا”. قَالَتْ: فَكاَنَتْ يَتَطَاوَلْنَ أَيَّتُهُنَّ أَطْوَلُ يَدًا؟ قَالَتْ فَكَانَتْ أَطْوَلنُاَ يَدًا زَيْنَبُ لِأَنَّهَا كَانَتْ تَّعْمَلُ بِيَدِهَا وَتَتَصَدَّقُ.

1875. (17) [1/586-దృఢం]

‘ఆయి’షహ్‌ (ర) కథనం: కొందరు ప్రవక్త (స) భార్యలు, ఆయన్ను మాలో అందరి కంటే ముందు మిమ్మల్ని ఎవరు కలుస్తారు. (అంటే ముందు ఎవరు మరణిస్తారు) అని ప్రశ్నించారు. దానికి ప్రవక్త (స) అందరికంటే పొడవైన చేతులు ఉన్నవారు. అని సమా ధానం ఇచ్చారు. వారందరూ ఒక బెత్తం తీసుకొని తమతమ చేతులు కొలవసాగారు. చివరికి సౌదహ్ (ర) చేతులు అందరికంటే పొడవుగా ఉన్నాయి. ఆ తర్వాత భార్యలందరిలో అందరికంటే ముందు జైనబ్ (ర) మరణించారు. ఆ తరువాత పొడవైన చేతులు అంటే దానధర్మాలు చేయడం అని అందువల్లే ఆమె అందరికంటే ముందు ప్రవక్త (స)ను కలిసారని, ఎందుకంటే దాన-ధర్మాలు చేయడం అంటే ఆమెకు ఎంతో ఇష్టం అని తెలిసింది. [51]  (బు’ఖారీ, ముస్లిం)

ముస్లిమ్‌లోని ఒక ఉల్లేఖనంలో ఇలా ఉంది, ” ‘ఆయి’షహ్‌ (ర) కథనం, ”ప్రవక్త (స) అందరికంటే ముందు పొడవైన చేతులు గలవారు నన్ను కలుసు కుంటారు,” అని అన్నారు. ప్రవక్త (స) భార్యలు తమ చేతులు కొలవసాగారు. అందరి కంటే ‘జైనబ్‌ చేతులు పొడవుగా ఉండటం గమనించారు. పొడవైన చేతులు అంటే దానధర్మాలు అని అర్థం. అయితే ‘జైనబ్‌ తన చేతులతో సంపాదించేది, తన చేతులతో దాన-ధర్మాలు చేసేది.

1876 – [ 18 ] ( متفق عليه ) (1/586)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ رَضِيَ اللهُ عَنْهُ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم قَالَ: “قَالَ رَجُلٌ: لأتَصَدَّقَنَّ بِصَدَقَةٍ فَخَرَجَ بِصَدَقَتِهِ فَوَضَعَهَا فِيْ يَدِ سَارِقٍ فَأَصْبَحُوْا يَتَحَدَّثُوْنَ تُصُدِّقَ  الليلة عَلَى سَارِقٍ فَقَالَ: “اَللّهُمَّ لَكَ الْحَمْدُ عَلَى سَارِقٍ لَأَتَصَدَّقَنَّ بِصَدَقَةٍ فَخَرَجَ بِصَدَقَتِهِ فَوَضَعَهَا فِيْ يَدِ زَانِيَةٍ فَأَصْبَحُوْا يَتَحَدَّثُوْنَ تُصُدِّقَ اللَّيْلَةَ عَلَى زَانِيَةٍ فَقَالَ: اَللّهُمَّ لَكَ الْحَمْدُعَلَى زَانِيَةٍ لّأَتَصَدَّقَنَّ بِصَدَقَةٍ فَخَرَجَ بِصَدَقَتِهِ فَوَضَعَهَا فِيْ يَدِغَنِيٍّ فأَصْبَحُوْا يَتَحَدَّثُوْنَ تُصُدِّقُ عَلَى غَنِيٍّ فَقَالَ: اَللّهُمَّ لَكَ الْحَمْدُعَلَى سَارِقٍ وَعَلَى زَانِيَةٍ وَعَلَى غَنِيٍّ. فَأُتِيَ فَقِيْلَ لَهُ: أَمَا صَدَقَتُكَ عَلَى سَارِقٍ فَلَعَلَّهُ أَنْ يَّسْتَعِفَّ عَنْ سَرَقَتِهِ. وَأَمَّا الزَّانِيَةُ فَلَعَلَّهَا أَنْ تَسْتَعِفَّ عَنْ زِنَاهَا. وَأَمَّا الْغَنِيُّ فَلَعَلَّهُ يَعْتَبِرُ فَيُنْفِقَ مِمَّا أَطَاهُ اللهُ”.  مُتَّفَقٌ عَلَيْهِ. وَلَفْظُهُ لِلْبُخَارِيِّ.

1876. (18) [1/586-ఏకీభవితం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం: ”ఒక వ్యక్తి, ‘నేను ఈ రాత్రి తప్పకుండా దానం చేస్తాను,’ అని అన్నాడు, అతడు తన దానం తీసుకొని బయలుదేరి ఒక దొంగచేతిలో పెట్టాడు. తెల్లవారిన తర్వాత ప్రజలు పరస్పరం నిన్న రాత్రి ఒక దొంగకు దానం ఇవ్వబడింది’ అని చెప్పుకో సాగారు. అది విన్న ఆ వ్యక్తి, ‘ఓ అల్లాహ్‌ (త) నీకు కృతజ్ఞతలు,  నేను దొంగకు దానం ఇచ్చాను. నేను ఇంకా దానం చేస్తాను,’ అని పలికి రాత్రి తన దానం తీసుకొని బయలుదేరి ఒక వ్యభిచారిణి చేతిలో పెట్టాడు. తెల్లవారగానే ప్రజలు పరస్పరం ఆశ్చర్యంతో, ‘నిన్న రాత్రి ఒక వ్యభిచారిణికి దానం ఇవ్వబడింది,’ అని చెప్పుకో సాగారు. ఈ విషయం అతనికి తెలిసి, ‘ఓ అల్లాహ్‌ సమస్త స్తోత్రాలు నీ కొరకే, నేను వ్యభిచారిణికి దానం చేసాను,’ అని అన్నాడు. అతడు, ‘మళ్ళీ ఈ రోజు రాత్రి కూడా నేను దానం తీసుకొని బయలు దేరుతాను,’ అని అన్నాడు. అతడు ఆ రాత్రి తన దానం తీసుకొని బయలుదేరి ఒక ధనవంతునికి ఇచ్చాడు. ఉదయం ప్రజలు, ‘ధనవంతునికి దానం ఇవ్వడం జరిగింది,’ అని చెప్పుకోసాగారు. అతడికి ఈ విషయం తెలిసి, ‘ఓ అల్లాహ్! నీకు కృతజ్ఞతలు, నీవు నా ద్వారా దొంగకు, వ్యభిచారిణికి, ధనవంతునికి సదఖా ఇప్పించావు’ అని అన్నాడు. అతడు రాత్రి పడుకున్నాడు, కలలో ఒక వ్యక్తి, నీ ఈ మూడు దానాలు అల్లాహ్‌ (త) స్వీకరించాడు. దొంగకు నీవు చేసిన దానం వల్ల అతడు దొంగతనం మానివేయ వచ్చు. వ్యభిచారిణి కూడా వ్యభిచారాన్ని మానివేయ వచ్చు. ధనవంతుడు దాని వల్ల గుణపాఠం నేర్చుకొని తనకు ఇచ్చిన ధనంలో నుండి దానం చేయవచ్చు” అని అన్నాడు. (బు’ఖారీ, ముస్లిమ్‌)

ఒకవేళ ఎవడైనా సత్సంకల్పంతో దాచి రాత్రి చీకటిలో ఇటు వంటి వారికి దానం చేసివేస్తే, అది విధి దానం అయినా, అదనపు దానం అయినా దాన్ని అల్లాహ్‌ (త) స్వీకరిస్తాడని ఈ ‘హదీసు’ ద్వారా తెలుస్తుంది.

1877 – [ 19 ] ( صحيح ) (1/587)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ: “بَيْنَا رَجُلٌ بِفَلَاةٍ مِّنَ الْأَرْضِ فَسِمَعَ صَوْتًا فِيْ سَحَابَةٍ: اِسْقِ حَدِيْقَةَ فُلَانٍ فَتَنَحّى ذَلِكَ السَّحَابُ فَأَفْرَغَ مَاءَهُ فِيْ حَرَّةٍ فَإِذَا شَرْجَةٌ مِّنْ تِلَكَ الشِّرَاجِ قَدْ اسْتَوْعَبَتْ ذَلِكَ الْمَاءَ كُلَّهُ فَتَتَبَّعَ الْمَاءَ فَإِذَا رَجُلٌ قَائِمٌ فِيْ حَدِيْقَتِهِ يُحَوِّلُ الْمَاءَ بِمِسْحَاتِهِ فَقَالَ لَهُ: يَا عَبْدَ اللهِ مَا اسْمُكَ. قال فلان. الإسم الذي سمع في السحابة. فَقَالَ لَهُ: يَا عَبْدَ اللهِ لَمْ تَسْأَلُنِيْ عَنْ اسْمِيْ. فَقَالَ: إِنِّيْ سَمِعْتُ صَوْتًا فِيْ السَّحَابِ الَّذِيْ هَذَا مَاؤُهُ يَقُوْلُ اسْقِ حَدِيْقَةَ فُلَانٍ لِّاِسْمِكَ فَمَا تَصْنَعُ فِيْهَا. قَالَ: أَمَّا إِذَ قُلْتُ هَذَا فَإِنِّيْ أَنْظُرُ إِلَى مَا يَخْرُجُ مِنْهَا فَأَتَصَدَّقُ بِثُلُثِهِ وَآكُلُ أَنَا وَعِيَالِيْ ثُلُثًا وَأَرَدَ فِيْهَا ثُلُثَهُ”. رَوَاهُ مُسْلِمٌ .

1877. (19) [1/587-దృఢం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ఇలా తెలి పారు, ”ఒక వ్యక్తి వెళుతూ ఉండగా మేఘాల్లో నుండి, ”ఫలానా వ్యక్తి తోటలో వర్షం కురిపించు,” అని విన బడింది. అంతలో ఆ మేఘాల్లో నుండి ఒక మబ్బు తునక విడిపోయి ఓ నల్లని రాతినేలపై వర్షం కురిపిం చింది. చివరకు ఒక కాలువ మిగతా కాలువలన్నిటినీ తనలో కలుపుకొని ప్రవహించసాగింది. అది చూసి అతను కూడా ఆ ప్రవాహం వెంట నడవసాగాడు. ఆయనకు ఎవరో ఒక వ్యక్తి తన తోటలో నిలబడి తన దగ్గరున్న పారతో తోటకు నీళ్ళు పెడుతున్నట్లు కనిపించాడు. ఆయన అతని దగ్గరకెళ్ళి ”ఓ అల్లాహ్ దాసుడా! నీ పేరేమిటి?” అని అడిగాడు. తాను ఇంతకు ముందు మేఘాల్లో విన్న పేరే చెప్పాడు ఆ వ్యక్తి. అతడు ”ఎందుకు అడుగుతున్నారు?” అని అన్నాడు. అందుకు ఆ వ్యక్తి కురిపించిన మేఘం నుండి, ”ఫలానా వ్యక్తి తోటలపై వర్షం కురిపించు,” అని విన్నాను. నువ్వు చెప్పిన పేరూ నేను విన్న పేరు ఒక్కటే. అది సరే కాని అసలు నువ్వు చేస్తున్న పనేంటి?” అని అడిగాడు. దానికి ఆ వ్యక్తి ”మీరు అడిగారు కాబట్టి చెబుతున్నాను. ముందుగా నేను ఈ తోటలో పండే పంటను అంచనా వేసుకొని, మొత్తం పంటలో మూడో వంతు దానం చేస్తాను. మరో మూడో వంతు నాకూ, నా కుటుంబ పోషణకు సరిపోతుంది. మిగతా మూడో వంతును నేను వచ్చే పంటకోసం ఉపయోగిస్తాను” అని చెప్పాడు. (ముస్లిమ్‌)

1878 – [ 20 ] ( متفق عليه ) (1/587)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ أَنَّهُ سَمِعَ النَّبِيَّ صلى الله عليه وسلم يَقُوْلُ: إِنَّ ثَلَاثَةً فِيْ بَنِيْ إِسْرَائِيْلَ أَبْرَصَ وَأَقْرَعَ وَأَعْمَى فَأَرَادَ اللهُ أَنْ يَّبْتَلِيَهُمْ فَبَعَثَ إِلَيْهِمْ مَلَكًا. فَأَتَى الْأَبْرَصَ فَقَالَ: أَيُّ شَيْءٍ أَحَبُّ إِلَيْكَ. قَالَ: لَوْنٌ حَسَنٌ وَّجِلْدٌ حَسَنٌ وَّيَذْهَبُ عَنِّيْ الَّذِيْ قَدْ قَذَرَنِيَ النَّاسُ”. قَالَ: “فَمَسَحَهُ فَذَهَبَ عَنْهُ قَذَرُهُ وَأُعْطِيَ لَوْنًا حَسَنًا وَّجِلْدًا حَسَنًا. قَالَ: فَأَيُّ الْمَالِ أَحَبُّ إِلَيْكَ. قَالَ: الْإِبْلُ- أَوْ قَالَ: الْبَقْرُ شَكَّ إِسْحَقُ- إِلَّا أَنْ الْأَبْرَصَ أَوْ الْأَقْرَعَ. قَالَ: أَحَدُهُمَا الْإِبْلُ. وَقَالَ الْآخَرُ: الْبَقَرُ. قَالَ: فَأُعْطِيَ نَاقَةً عُشْرَاءَ. فَقَالَ بَارَكَ اللهُ لَكَ فِيْهَا”. قَالَ: “فَأَتَى الْأَقْرَعَ. فَقَالَ: أَيُّ شَيْءٍ أَحَبُّ إِلَيْكَ. قَالَ: شَعْرٌ حَسَنٌ وَّيَذْهَبُ عَنِّيْ هَذَا الَّذِيْ قَدْ قَذَرَنِيْ النَّاسُ”. قَالَ: “فَمَسَحَهُ فَذَهَبَ عَنْهُ قال: وَأُعْطِيَ شَعْرًا حَسَنًا. قَالَ: فَأَيُّ الْمَالِ أَحَبُّ إِلَيْكَ. قَالَ: الْبَقَرُ. فَأُعْطِيَ بَقَرَةً حَامِلًا. قَالَ: “بَارَكَ اللهُ لَكَ فِيْهَا”. قَالَ: “فَأَتَى الْأَعْمَى. فَقَالَ: أَيُّ شَيْءٍ أَحَبُّ إِلَيْكَ. قَالَ: أَنْ يَّرُدَّ اللهُ إِلَيَّ بَصَرِيْ فَأُبْصِرَ بِهِ النَّاسَ”. قَالَ: “فَمَسَحَهُ فَرَدَّ اللهُ إِلَيْهِ بَصَرَهُ. قَالَ: فَأَيُّ الْمَالِ أَحَبُّ إِلَيْكَ. قَالَ: اَلْغَنَمُ. فَأُعْطِيَ شَاةً وَّالِدًا فَأَنْتَجَ هَذَانِ وَوَلَدَ هَذَا. فَكَانَ لَهَذَا وَادٍّ مِّنَ الْإِبْلِ وَلِهَذَا وَادٍ مِّنَ الْبَقَرِ وَلِهَذَا وَادٍ مِّنَ الْغَنَمِ”. قَالَ: “ثُمَّ إِنَّهُ أَتَى الْأَبْرَصَ فِيْ صُوْرَتِهِ وَهَيْئَتِهِ فَقَالَ: رَجُلٌ مِّسْكِيْنٌ قَدْ انْقَطَعَتْ بِيْ الْحِبَالُ فِيْ سَفْرِيْ فَلَا بَلَاغَ لِيَ الْيَوْمَ إِلَّا بِاللهِ ثُمَّ بِكَ. أَسْأَلُكَ بِالَّذِيْ أَعْطَاكَ اللَّوْنَ الْحَسَنَ وَالْجِلْدَ الْحَسَنَ وَالْمَالَ بَعِيْرًا أَتَبَلَّغُ عَلَيْهِ فِيْ سَفَرِيْ. فَقَالَ: الْحُقُوْقُ كَثِيْرَةٌ. فَقَالَ لَهُ: كَأَنِّيْ أَعْرِفُكَ أَلَمْ تَكُنْ أَبْرَصَ يَقْذَرُكَ النَّاسَ فَقِيْرًا فَأَعْطَاكَ اللهُ مَالًا. فَقَالَ: إِنَّمَا وُرِثْتُ هَذَا الْمَالَ كَابِرًا عَنْ كَابِرٍ. فَقَالَ: إِنْ كُنْتَ كَاذِبًا فَصَيَّرَكَ اللهُ إِلَى مَا كُنْتَ”. قَالَ: “وَأَتَى الْأَقْرَعَ فِيْ صُوْرَتِهِ. فَقَالَ لَهُ: مِثْلَ مَا قَالَ لِهَذَا. وَرَدَّ عَلَيْهِ مِثْلَ مَا رَدَّ عَلَى هَذَا. فَقَالَ: إِنْ كُنْتَ كَاذِبًا فَصَيَّرَكَ اللهُ إِلَى مَا كُنْتَ”. قَالَ: “وَأَتَى الْأَعْمَى فِيْ صُوْرَتِهِ وَهَيْئَتِهِ فَقَالَ: رَجُلٌ مِّسْكِيْنٌ وَابْنُ سَبِيْلٍ انْقَطَعَتْ بِيَ الْحِبَالُ فِيْ سَفَرِيْ فَلَا بَلَاغَ لِيَ الْيَوْمَ إِلَّا بِاللهِ ثُمَّ بِكَ أَسْأَلُكَ بِالَّذِيْ رَدَّ عَلَيْكَ بَصَرَكَ شَاةً أَتَبَلَّغُ بِهَا فِيْ سَفَرِيْ. فَقَالَ: قَدْ كُنْتُ أَعْمَى فَرَدَّ اللهُ إِلَيَّ بَصَرِيْ فَخُذْ مَا شِئْتَ وَدَعْ مَا شِئْتَ فَوَاللهِ لَا أَجْهَدُكَ الْيَوْمَ شَيْئًا أَخَذْتَهُ لِلّهِ. فَقَالَ: أَمْسِكْ مَالَكَ فَإِنَّمَا ابْتَلِيْتُمْ فَقَدْ رَضِيَ عَنْكَ وَسَخِطَ عَلَى صَاحِبَيْكَ”.

1878. (20) [1/587-ఏకీభవితం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ”ప్రవక్త (స) ఇలా ప్రవచిస్తూ ఉండగా నేను విన్నాను, ”బనీ ఇస్రాయీ’ల్‌లో ముగ్గురు వ్యక్తులు ఉండేవారు. వారిలో ఒకరికి కుష్టువ్యాధి, మరొకరికి బట్టతల, మరొకరు అంధుడు. అల్లాహ్‌ (త) ఈ ముగ్గురినీ పరీక్షించాలని నిర్ణయించుకున్నాడు. ఒక దూతను వారివైపు పంపాడు. మొదట ఆ దూత కుష్ఠురోగి వద్దకు వచ్చి, ‘నీకేం కావాలి,’ అని అడిగాడు. దానికి ఆ వ్యక్తి, ‘మంచి రంగు, రూపం కావాలి. ఎందుకంటే ఈ స్థితిలో ప్రజలు నన్ను అసహ్యించుకుంటున్నారు,’ అని అన్నాడు. దైవదూత అతనిపై చేతితో నిమిరాడు. అతని కుష్టు వ్యాధి పోయి అందంగా తయారయ్యాడు. మళ్ళీ ఆ దైవదూత, ‘ప్రపంచంలోని ధనసంపదల్లో నీకు ఎటువంటి ధనసంపదలు కావాలి?’ అని అడిగాడు. దానికి ఆ వ్యక్తి, ‘ఒంటెలు లేదా ఆవులు. ఇస్‌’హాఖ్‌ ఉల్లేఖనకర్తకు అనుమానం ఉంది. ఆ వ్యక్తికి 10 నెలలు నిండిన ఆడ ఒంటె ఇచ్చి, అల్లాహ్‌ (త) నీ కొరకు ఇందులో శుభం ప్రసాదించు గాక! అని దీవించడం జరిగింది. ఆ తరువాత ఆ దైవదూత బట్టతలవాని వద్దకు వచ్చాడు. ఆ వ్యక్తితో నీకేం కావాలి అని అడిగాడు. దానికి ఆ వ్యక్తి మంచి వెంట్రుకలు కావాలి, ఈ బట్టతల పోవాలి. ఎందుకంటే ప్రజలు నన్ను అసహ్యించుకుంటున్నారు’ అని అన్నాడు. దైవదూత అతని తలపై చేత్తో నిమిరాడు. అతని వ్యాధి నయమయింది. మంచి వెంట్రుకలు వచ్చాయి. ఆ తరువాత దైవదూత, ‘ప్రపంచంలోని ఏ ధన సంపదలు నీకిష్టం,’ అని అడిగాడు. దానికి ఆ వ్యక్తి, ‘ఆవులు,’ అని అన్నాడు. దైవ దూత శూలుతో ఉన్న ఆవును ఇచ్చి, ‘అల్లాహ్‌ నీ కోసం ఇందులో శుభం ప్రసాదించుగాక!’ అని దీవించాడు. ఆ తరువాత ఆ దైవదూత గుడ్డివాని వద్దకు వచ్చాడు. ‘నీకేం కావాలి,’ అని అడిగాడు. దానికి ఆ వ్యక్తి, ‘నా దృష్టి నాకు ఇప్పించాలని నేను ప్రజలను చూడగలగాలని కోరుకుంటున్నాను,’ అని అన్నాడు. దైవదూత కళ్ళపై తన చేతులతో నిమిరాడు. అల్లాహ్‌ (త) అతని అంధత్వాన్ని నయంచేసాడు. ఆ తరువాత ఆ దైవదూత ‘ప్రపంచ ధనసంపదల్లో నీకేం కావాలి?’ అని అడిగాడు. దానికి ఆ వ్యక్తి, ‘మేకలు’ అని అన్నాడు. దైవదూత అతనికి ఒక సూలుతో ఉన్న మేకను ఇచ్చాడు. ఆ తరువాత ఒంటెలు, ఆవులు, మేకలు ఈని మందలు మందలుగా మారాయి. కుష్టివాని దగ్గర ఒంటెల మంద, బట్టతలవాని దగ్గర ఆవుల మంద, గ్రుడ్డివాని దగ్గర మేకల మంద తయా రయ్యాయి. చాలా రోజుల తర్వాత దైవదూత తాను మొదట వచ్చిన రూపం లోనే కుష్టువాడి వద్దకు వచ్చి, ‘నేనొక పేదవాడ్ని, బాటసారిని, నా దగ్గర ఉన్న సామానంతా పోయింది. ఇప్పుడు నేను దైవ అనుగ్రహం, నీ సహాయం లేకుండా నా గమ్యానికి చేరలేను,’ అని అన్నాడు. ‘నీ వ్యాధిని దూరం చేసిన అల్లాహ్ (త) సాక్షిగా! నిన్ను నేను అర్థిస్తున్నాను,’ అని అన్నాడు. ‘నేను నిన్ను ఎరుగుదును. నీవు ఒక కుష్టువ్యాధిగ్రస్తుడివి. నాకు ఒక ఒంటె ఇవ్వు, దానిపై స్వారీచేస్తాను, గమ్యస్థానాన్ని నేను చేరుకుంటాను,’ అని అన్నాడు. దానికి ఆ వ్యక్తి, ‘తమ్ముడూ, నేను అప్పులపాలై ఉన్నాను. చాలా మందికి అప్పు తీర్చాలి,’ అని అన్నాడు. దానికి దైవదూత, ‘నేను నిన్ను ఎరుగుదును. అందరూ నిన్ను అసహ్యించుకునే వారు.  అల్లాహ్‌ (త) తన అను గ్రహం ద్వారా నీకు ఇవన్నీ లభించాయి.’ అప్పుడు కుష్టురోగి, ‘నేను మా తాతల కాలం నుండి ధన వంతుడ్ని’ అని అన్నాడు. అప్పుడు దైవదూత, ‘ఒక వేళ నువ్వు అసత్యం పలికితే మళ్ళీ కుష్టువ్యాధితో పేదవానిగా చేసివేయాలి గాక!’ అని అన్నాడు.

ఆ దైవదూత ఆ రూపంలోనే బట్టతల వ్యక్తి వద్దకు వచ్చాడు. కుష్టురోగితో అన్న విధంగానే వాడితోనూ అన్నాడు. బట్టతల వ్యక్తి కూడా కుష్టిరోగిలాంటి సమాధానమే ఇచ్చాడు. దానికి దైవదూత ఒకవేళ నీవు అబద్ధం పలికితే అల్లాహ్‌ (త) నిన్ను వెనుకటి స్థితిలోనికి నెట్టివేయు గాక!’ అని అన్నాడు.

ఆ రూపంలోనే ఆ దైవదూత గ్రుడ్డివాడి వద్దకు వచ్చాడు. అతనితో, ‘నేను చాలా పేద బాటసారిని, నా దగ్గర ప్రయాణ సాధనాలు ఏమీ లేవు, ఇప్పుడు నేను అల్లాహ్‌ అనుగ్రహం, నీ సహాయం లేకుండా గమ్యాన్ని చేరుకోలేను,’ అని అన్నాడు. ‘నీకు మళ్ళీ దృష్టి ప్రసాదించిన దైవం పేరుతో నాకు ఒక మేకను ఇవ్వు, దాని ద్వారా నేను నా గమ్యస్థానాన్ని చేరు కుంటాను,’ అని అన్నాడు. అది విన్న గ్రుడ్డివాడు, ‘నిస్సందేహంగా నేను గ్రుడ్డివాడినే, అల్లాహ్‌(త) నాకు దృష్టిని ప్రసాదించాడు, ధనవంతుడ్ని చేసాడు, ఆయన పేరుతో నువ్వు అడిగితే నీకు ఇష్టమైంది తీసుకు వెళ్ళు, నేను ఈనాడు నిన్ను ఏమాత్రం కష్టపెట్టను. అల్లాహ్‌(త) పేరుతో నీకు తోచింది నువ్వు తీసుకు వెళ్ళు.’ దానికి దైవదూత, ‘అల్లాహ్‌ (త) మీ ముగ్గురిని పరీక్షించదలిచాడు. నీ పట్ల సంతోషించాడు, మిగతా ఇద్దరి పట్ల ఆగ్రహం వ్యక్తం చేసాడు. అని అన్నాడు.’ (బు’ఖారీ, ముస్లిమ్‌)

1879 – [ 21 ] ( لم تتم دراسته ) (1/589)

وَعَنْ أُمِّ بُجَيْدٍ قَالَتْ: قُلْتُ يَا رَسُوْلَ اللهِ إِنَّ الْمِسْكِيْنَ لَيَقِفُ عَلَى بَابِيْ حَتَّى أَسْتَحْيِيَ فَلَا أَجِدُ فِيْ بَيْتِيْ مَا أَدْفَعُ فِيْ يَدِهِ. فَقَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “ادْفِعِيْ فِيْ يَدِهِ وَلَوْ ظِلْفًا مُّحْرَقًا”. رَوَاهُ أَحْمَدُ وَأَبُوْ دَاوُدَ وَالتِّرْمِذِيُّ .و قال: هذا حديث حسن صحيح.

1879. (21) [1/589- అపరిశోధితం]

ఉమ్మె బుజైద్‌ (ర) కథనం: నేను ప్రవక్త (స)ను ఇలా విన్నవించుకున్నాను, ”ఓ అల్లాహ్‌ ప్రవక్తా! బిచ్చ గాళ్ళు వచ్చి నా వాకిలి ముందు నిలబడతారు, నాకు చాలా సిగ్గువేస్తుంది. ఎందుకంటే వారికి ఇవ్వడానికి నా దగ్గర ఏమీ ఉండదు. అప్పుడు ప్రవక్త (స) ‘ఏదైనా ఇచ్చి పంపు. చివరికి కాల్చిన డెక్క (ఖుర్) అయినా సరే’ అని అన్నారు. (అ’హ్మద్‌, అబూ దావూద్, తిర్మిజి’ – ప్రామాణిక్, దృఢం)

1880 – [ 22 ] ( لم تتم دراسته ) (1/589)

وَعَنْ مَوْلًى لِّعُثْمَانَ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: أُهْدِيَ لِأُمِّ سَلَمَةَ بُضْعَةٌ مِّنْ لَحْمٍ وَكَانَ النَّبِيُّ صلى الله عليه وسلم يُعْجِبُهُ اللَّحْمُ. فَقَالَتْ لِلْخَادِمِ: ضَعِيْهِ فِيْ الْبَيْتِ لَعَلَّ النَّبِيَّ صلى الله عليه وسلم يَأْكُلُهُ فَوَضَعَتْهُ فِيْ كُوَّةِ الْبَيْتِ. وَجَاءَ سَائِلٌ فَقَامَ عَلَى الْبَابِ. فَقَالَ: تَصَدَّقُوْا بَارَكَ اللهُ فِيْكُمْ. فَقَالُوْا: بَارَكَ اللهُ فِيْكَ. فَذَهَبَ السَّائِلُ فَدَخَلَ النَّبِيُّ صلى الله عليه وسلم فَقَالَ: “يَا أُمَّ سَلَمَةَ هَلْ عِنْدَكُمْ شَيْءٌ أَطْعَمُهُ؟”  فَقَالَتْ: نَعَمْ. قَالَتْ لِلْخَادِمِ: اذْهَبِيْ فَأَتِيْ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم بِذَلِكَ اللَّحْمَ. فَذَهَبَتْ فَلَمْ تَجِدْ فِيْ الْكُوَّةِ إِلَّا قِطْعَةَ مَرْوَةٍ. فَقَالَ النبي صلى الله عليه وسلم: “فَإِنَّ ذَلِكَ اللَّحْمَ عَادَ مَرْوَةً لَمَّا لَمْ تُعْطُوْهُ السَّائِلَ”. رَوَاهُ الْبَيْهَقِيُّ فِيْ دَلَائِلِ النَّبُوَّةِ .

1880. (22) [1/589- అపరిశోధితం]

‘ఉస్మాన్‌ విడుదల చేసిన బానిస (ర) కథనం: ఉమ్మె సలమహ్కు ఒక మాంసం ముక్క కానుకగా పంపడం జరిగింది. ప్రవక్త (స)కు మాంసం అంటే చాలా ఇష్టం. ఉమ్మె సలమహ్ తన సేవకురాలిని దాన్ని ఇంట్లో పెట్టమని ప్రవక్త (స) తినవచ్చని’ అన్నారు. సేవకురాలు ఆ మాంసాన్ని అటుకపై పెట్టింది. ఇంతలో ఒక బిచ్చగాడు వాకిలి ముందుకు వచ్చి నిలబడ్డాడు. ఆ బిచ్చగాడు, ‘దానధర్మాలు చేయండి అల్లాహ్‌ (త) శుభం ప్రసాదిస్తాడు,’ అని అన్నాడు. ఇంట్లో ఉన్నవారు, ‘అల్లాహ్‌ (త) నీకూ శుభం ప్రసాదించు గాక!’ అని అన్నారు. ఇది బిచ్చగాడికి సమాధానం అయ్యింది. అది విన్న బిచ్చగాడు వెళ్ళి పోయాడు. కొంత సేపటికి ప్రవక్త (స) వచ్చారు. ఉమ్మె సలమహ్తో, ‘తినడానికి ఏమైనా ఉంటే తీసుకు రండి,’ అని అన్నారు. ‘అవును ఉంది,’ అని పలికి సేవకురాలితో, ‘అటుకపై ఉన్న మాంసాన్ని ప్రవక్త (స) ముందు పెట్టు,’ అని అన్నారు. ఆ సేవకురాలు అక్కడ ఆ మాంసాన్ని వెతికింది కాని దొరక లేదు. కాని అక్కడ ఒక తెల్లని రాతి ముక్క దొరికింది. ఈ సంగతి తెలిసిన ప్రవక్త (స), ‘నువ్వు బిచ్చగాడికి ఇవ్వనందు వల్లే మాంసం రాతి ముక్కగా మారింది,’ అని అన్నారు. (బైహఖీ – దలాయి లున్నుబువ్వహ్)

1881 – [ 23 ] ( لم تتم دراسته ) (1/589)

وَعَنِ ابْنِ عَبَّاسٍ رَضِيَ اللهُ عَنْهُمَا قَالَتْ: قَالَ النَّبِيُّ صلى الله عليه وسلم: “أَلَا أُخْبِرُكُمْ بِشَرِّ النَّاسِ مَنْزِلًا؟ قِيْلَ: نَعَمْ قَالَ: الَّذِيْ يُسْأَلُ بِاللهِ وَلَا يُعْطِيْ بِهِ”.  رَوَاهُ أَحْمَدُ.

1881. (23) [1/589- అపరిశోధితం]

ఇబ్నె ‘అబ్బాస్‌ (ర) కథనం: ప్రవక్త (స), ‘దైవం దృష్టిలో అందరికంటే నీచ వ్యక్తిని గురించి చెప్పనా?’ అని అన్నారు. ‘చెప్పండి,’ అని విన్నవించుకోవడం జరిగింది. అప్పుడు ప్రవక్త (స) అల్లాహ్‌(త) దృష్టిలో అందరికంటే నీచుడు ఎవరంటే అల్లాహ్‌ (త) పేరు చెప్పి అడిగినా ఇవ్వని వాడు. [52] (అ’హ్మద్‌)

1882 – [ 24 ] ( صحيح ) (1/589)

وَعَنْ أَبِيْ ذَرٍّ أَنَّهُ اسْتَأْذَنَ عَلَى عُثْمَانَ فَأَذِنَ لَهُ وَبِيَدِهِ عَصَاهُ. فَقَالَ عُثْمَانُ: يَا كَعْبُ إِنَّ عَبْدَ الرَّحْمنِ تُوُفِّيَ وَتَرَكَ مَالًا فَمَا تَرَى فِيْهِ؟ فَقَالَ: إِنْ كَانَ يَصِلُّ فِيْهِ حَقَّ اللهِ فَلَا بَأْسَ عَلَيْهِ. فَرَفَعَ أَبُوْ ذَرٍّعَصَاهُ فَضَرَبَ كَعْبًا وَقَالَ: سَمِعْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ: “مَا أَحِبُّ لَوْ أَنَّ لِيْ هَذَا الْجَبَلَ ذَهَبًا أُنْفِقُهُ وَيُتَقَبَّلُ مِنِّيْ أَذَرُ خَلْفِيْ مِنْهُ سِتَّ أَوَاقِيَّ”. أَنْشُدُكَ بِاللهِ يَا عُثْمَانُ أَسْمِعْتَهُ؟ ثَلَاثَ مَرَّاتٍ. قَالَ: نَعَمْ. رَوَاهُ أَحْمَدُ.

1882. (24) [1/589-దృఢం]

అబూ జ’ర్‌ (ర) కథనం: అతను ‘ఉస్మా’న్‌ (ర) వద్దకు రావటానికి అనుమతి కోరారు. ‘ఉస్మా’న్‌ (ర) ఆయన్ను రావటానికి అనుమతి ఇచ్చారు. అబూ జ’ర్‌ (ర) ‘ఉస్మా’న్‌ దగ్గరకు వెళ్ళారు. అప్పుడు ఆయన చేతిలో ఒక బెత్తం ఉంది. అబూ జ’ర్‌ కూర్చున్న వెంటనే ‘ఉస్మా’న్‌ క’అబ్‌తో, ”ఓ క’అబ్‌! ‘అబ్దుర్ర’హ్మాన్‌ మరణించారు. అతను ఆస్తిని వదలి వెళ్ళారు, అతను వదలి వెళ్ళిన ఆస్తిగురించి నీ అభి ప్రాయం ఏమిటి?” అని అడిగారు. అప్పుడు క’అబ్‌, ”ఒకవేళ ఈ ధనంలో నుండి అల్లాహ్‌ (త) హక్కును చెల్లిస్తూ, ‘జకాత్‌ చెల్లిస్తూ ఉంటే ఎటువంటి అభ్యంతరమూ లేదు,’ అని అన్నారు. అది విన్న అబూ జ’ర్‌ బెత్తంతో క’అబ్‌ను కొట్టి ఇలా అన్నారు, ”ప్రవక్త (స) ను ఇలా అంటుండగా నేను విన్నాను, ‘నావద్ద ఉ’హుద్‌ కొండంత బంగారం ఉండి, దాన్ని ఖర్చుచేస్తూ చివరికి, నా వద్ద 6 ఊఖియహ్(240 దిర్‌హమ్‌) లు కూడ మిగిలి ఉండటం నాకు ఎంత మాత్రం ఇష్టం లేదు.” ఆ తరువాత అబూ జ’ర్‌ ‘ఉస్మాన్‌ను ఉద్దేశించి, ‘అల్లాహ్ ను సాక్షిగా పెట్టి నిన్ను అడుగుతున్నాను. నువ్వు ఈ ‘హదీసు’ను ప్రవక్త (స) నుండి విన్నావా లేదా?’ ఇలా మూడు సార్లు వల్లించారు. అప్పుడు ‘ఉస్మా’న్‌ (ర), ‘అవును నేను ఈ ‘హదీసు’ను విన్నాను’ అని ఒప్పుకున్నారు. [53] (అ’హ్మద్‌)

1883 – [ 25 ] ( صحيح ) (1/590)

وَعَنْ عُقْبَةَ بْنِ الْحَارِثِ قَالَ: صَلَّيْتُ وَرَاءَ النَّبِيِّ صلى الله عليه وسلم بِالْمَدِيْنَةِ الْعَصْرَ فَسَلَّمَ ثُمَّ قَامَ مُسْرِعًا فَتَخْطّى رِقَابَ النَّاسِ إِلَى بَعْضِ حُجَرِ نِسَائِهِ فَفَزَعَ النَّاسُ مِنْ سُرْعَتِهِ فَخَرَجَ عَلَيْهِمْ فَرَأَى أَنَّهُمْ قَدْ عَجِبُوْا مِنْ سُرْعَتِهِ قَالَ: ” ذَكَرْتُ شَيْئًا مِّنْ تِبْرٍعِنْدَنَا فَكَرِهْتُ أَنْ يَّحْبِسَنِيْ فَأَمَرْتُ بِقِسْمَتِهِ”. رَوَاهُ الْبُخَارِيُّ.

وَفِيْ رِوَايَةٍ لَهُ قَالَ: “كُنْتُ خَلَّفْتُ فِيْ الْبَيْتِ تِبْرًا مِّنَ الصَّدَقَةِ فَكَرِهْتُ أَنْ أُبَيِّتَهُ”.

1883. (25) [1/590- దృఢం]

‘ఉఖ్‌బ బిన్‌ ‘హారిస్‌’ (ర) కథనం: నేను మదీనహ్లో ‘అ’స్‌ర్‌ నమా’జు ప్రవక్త (స) వెనుక చదివాను. ప్రవక్త (స) నమా’జ్‌ ముగించిన వెంటనే నిలబడ్డారు. ప్రజల భుజాలను దాటుతూ తన భార్యల గదులవైపు వెళ్ళారు. ప్రవక్త (స) తొందరను చూచి అక్కడున్న ప్రజలు ఆందో ళనకు గురయ్యారు. ప్రవక్త (స) తిరిగి వచ్చిన తర్వాత ప్రజలను తన పట్ల ఆశ్చర్యపడటం చూచారు. అప్పుడు ప్రవక్త (స) ‘నా దగ్గర కొంత బంగారం ఉండేది, అది నాకు గుర్తుకొచ్చింది, దాన్ని ఉంచడం కూడా నాకు ఇష్టం లేదు, దాన్ని పంచి వేయమని ఆదేశించి వస్తున్నాను’ అని అన్నారు. (బు’ఖారీ)

బు’ఖారీకి చెందిన మరో ఉల్లేఖనంలో ప్రవక్త (స) ‘సదఖహ్, ‘జకాత్‌లకు చెందిన బంగారపు ముద్ద ఇంట్లో వదలి వచ్చేసాను, దాన్ని రాత్రంతా ఉంచడం కూడా మంచిది కాదని భావించి తొందరగా వెళ్ళి దాన్ని పంచివేయమని ఆదేశించి వచ్చాను. రాత్రి రాక ముందు పేదల చేతుల్లోకి అది చేరిపోవాలని.’

1884 – [ 26 ] ( لم تتم دراسته ) (1/590)

وَعَنْ عَائِشَةَ رَضِيَ اللهُ عَنْهَا قَالَتْ: كَانَ لِرَسُوْلِ اللهِ صلى الله عليه وسلم عِنْدِيْ فِيْ مَرَضِهِ سِتَّةُ دَنَانِيْرِأوَ سَبْعَةٌ. فَأَمَرَنِيْ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم أَنْ أُفَرِّقَهَا فَشَغَلَنِيْ وَجَعُ نَبِيِّ اللهِ صلى الله عليه وسلم ثُمَّ سَأَلَنِيْ عَنْهَا: “مَا فَعَلَتِ السِّتَّةُ أَوْ السَّبْعَةُ؟” قُلْتُ: لَا وَاللهِ لَقَدْ كَانَ شَغَلَنِيْ وَجَعَكَ فَدَعَا بِهَا ثُمَّ وَضَعَهَا فِيْ كَفِّهِ فَقَالَ: “مَا ظَنُّ نَبِيِّ اللهِ لَوْ لَقِيَ اللهَ عَزَّ وَجَلَّ وَهَذِهِ عِنْدَهُ؟”  رَوَاهُ أَحْمَدُ.

1884. (26) [1/590-అపరిశోధితం]

‘ఆయి’షహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) అనారోగ్యంగా ఉన్న కాలంలో, ప్రవక్తకు చెందిన 6 లేక 7 దీనార్లు నా దగ్గర ఉండేవి. ప్రవక్త (స) వాటిని పంచివేయమని’ ఆదేశించారు. అంటే ప్రజల్లో పంచమని ఆదేశించారు. కాని ప్రవక్త (స) అనారోగ్యం వల్ల నాకు తీరిక దొరక లేదు, నేను పంచలేక పోయాను. ఆ తరువాత ప్రవక్త (స) ఆ 6 లేక 7 దీనార్లు ఏం చేసావని అడిగారు. దానికి నేను ‘అల్లాహ్(త) సాక్షి! తమరి అనారోగ్యం వల్ల నాకు తీరిక దొరక్క పంచలేక పోయాను,’ అని చెప్పాను. ప్రవక్త (స) ఆ అష్‌రఫీలను తెప్పించారు. తన చేతిలో తీసుకొని ప్రవక్త అల్లాహ్‌(త)ను కలిసి నప్పుడు అతనివద్ద అష్‌రఫీలు ఉంటే అతని పరిస్థితి ఏమిటి?’ అని అన్నారు. (అ’హ్‌మద్‌)

1885 – [ 27 ] ( صحيح ) (1/590)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ رَضِيَ اللهُ عَنْهُ أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم دَخَلَ عَلَى بِلَالٍ وَعِنْدَهُ صُبْرَةٌ مِّنْ تَمْرٍ فَقَالَ: “مَا هَذَا يَا بِلَالُ؟ “قَالَ: شَيْءٌ ادَّخَرْتُهُ لِغَدٍ. فَقَالَ: “أَمَا تَخْشَى أَنْ تَرَى لَهُ غَدًا بُخَارًا فِيْ نَارِ جَهَنَّمَ يَوْمَ الْقِيَامَةِ أَنْفِقْ بِلَالُ وَلَا تَخْشَ مِنْ ذِيْ الْعَرْشِ إِقْلَالًا”.

1885. (27) [1/590-దృఢం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) బిలాల్‌ (ర) వద్దకు వచ్చారు. అప్పుడు అతనివద్ద ఖర్జూరాల కుప్ప ఉంది. ‘ఇదేమిటి’ అని ప్రవక్త (స) అడిగారు. బిలాల్‌ (ర) సమాధానం ఇస్తూ ‘ఇది ఎలాంటి వస్తువు అంటే భవిష్యత్తు కోసం దాన్ని కూడబెట్టి ఉంచాను’ అని అన్నారు. అప్పుడు ప్రవక్త (స) ‘ఇది రేపు తీర్పుదినం నాడు నరకాగ్ని పొగగా మారుతుందనే భయం నీకు లేదా? నువ్వు దీన్ని ఖర్చు చెయ్యి, పేదరికం, దారిద్య్రం గురించి మహా సింహాసనం గల వాడికి భయపడకు. అల్లాహ్‌ నీకు తినిపిస్తాడు, త్రాపిస్తాడు’ అని అన్నారు. (బైహఖీ)

1886 – [ 28 ] ( لم تتم دراسته ) (1/591)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “اَلسَّخَاءُ شَجَرَةٌ فِيْ الْجَنَّةِ فَمَنْ كَانَ سَخِيًّا أَخَذَ بِغُصْنٍ مِّنْهَا فَلَمْ يَتْرُكْهُ الْغُصْنُ حَتَّى يُدْخِلَهُ الْجَنَّةَ. وَالشُّحُّ شَجَرَةٌ فِيْ النَّارِ فَمَنْ كَانَ شَحِيْحًا أَخَذَ بِغُصْنٍ مِّنْهَا فَلَمْ يَتْرُكْهُ الْغُصْنُ حَتَّى يُدْخِلَهُ النَّارُ”. رَوَاهُمَا الْبَيْهِقِيُّ فِيْ شُعَبِ الْإِيْمَانِ.

1886. (28) [1/591- అపరిశోధితం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: దాతృత్వం స్వర్గం లోని ఒక చెట్టు. దాతృత్వ గుణం గలవారు దాని కొమ్మను పట్టుకుంటారు. ఆ కొమ్మ అతన్ని స్వర్గం లోనికి పంపేవరకు వదలదు. అదేవిధంగా పిసినారి తనం నరకంలోని ఒకచెట్టు. పిసినారులు దాని కొమ్మను పట్టుకుంటారు. ఆకొమ్మ అతన్ని నరకం లోనికి పంపేవరకు వదలదు. (బైహఖీ -షు’అబిల్ ఈమాన్)

1887 – [ 29 ] ( ضعيف ) (1/591)

وَعَنْ عَلِيٍّ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “بَادِرُوْا بِالصَّدَقَةِ فَإِنَّ الْبَلَاءَ لَا يَتَخَطَّاهَا”. رَوَاهُ رَزِيْنٌ.

1887. (29) [1/591-బలహీనం]

‘అలీ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”దాన ధర్మాలు చేయడంలో తొందర పడండి, ఎందుకంటే ఆపదలు దానధర్మాల్ని దాటి ముందుకు పోలేవు. అంటే దానధర్మాలు చేయడం వల్ల ఆపదలు తొలగి పోతాయి. (ర’జీన్‌)

=====

6- بَابُ فَضْلِ الصَّدَقَةِ

6. దానధర్మాల గొప్పదనం

اَلْفَصْلُ الْأَوَّلُ మొదటి విభాగం   

1888 – [ 1 ] ( متفق عليه ) (1/592)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَنْ تَصَدَّقَ بِعِدْلِ تَمْرَةٍ مِنْ كَسْبٍ طَيِّبٍ وَّلَا يَقْبَلُ اللهُ إِلَّا الطَّيِّبَ فَإِنَّ اللهَ يَتَقَبَّلُهَا بِيَمِيْنِهِ ثُمَّ يُرَبِّيْهَا لِصَاحِبَهَا كَمَا يُرَبِّيْ أَحَدُكُمْ فَلوهُ حَتَّى تَكُوْنَ مِثْلَ الْجَبَلِ”.

1888. (1) [1/592-ఏకీభవితం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం: ఒక వ్యక్తి ధర్మసంపాదనతో ఒక ఖర్జూరం సదఖహ్ చేస్తే-అల్లాహ్‌ (త) ధర్మసంపాదననే స్వీకరిస్తాడు-అల్లాహ్‌ (త) ఆ ధర్మసంపాదన ‘సదఖహ్ను తన కుడిచేతిలో తీసుకొని స్వీకరిస్తాడు. ఆ తరువాత దాన్ని పెంచి పోషిస్తాడు. మీరు దూడను పెంచి పోషించి నట్లు. చివరికి అతని సదఖహ్ పుణ్యం కొండంత అయి పోతుంది. [54]  (బు’ఖారీ, ముస్లిం)

1889 – [ 2 ] ( صحيح ) (1/592)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَا نَقَصَتْ صَدَقَةٌ مِّنْ مَّالٍ شَيْئًا وَمَا زَادَ اللهُ عَبْدًا بِعَفْوٍ إِلَّا عِزًّا وَمَا تَوَاضَعَ أَحَدٌ لِلّهِ إِلَّا رَفَعَهُ اللهُ.  رَوَاهُ مُسْلِمٌ.

1889. (2) [1/592-దృఢం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం: దాన ధర్మాలు చేయడం వల్ల ధనం తగ్గదు, ఒకరిని క్షమించటం వల్ల అల్లాహ్‌(త) గౌరవాన్ని అధికం చేస్తాడు. అణకువగా ప్రవర్తించే వారికి అల్లాహ్‌(త)  తప్పకుండా ఔన్నత్యాన్ని ప్రసాదిస్తాడు. అంటే సున్నిత స్వభావం అణకువల ద్వారా అల్లాహ్‌ (త) ఉన్నతం చేస్తాడు. (ముస్లిమ్‌)

1890 – [ 3 ] ( متفق عليه ) (1/592)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَنْ أَنْفَقَ زَوْجَيْنِ مِنْ شَيْءٍ مِّنَ الْأَشْيَاءِ فِيْ سَبِيْلِ اللهِ دُعِيَ مِنْ أَبْوَابِ الْجَنَّةِ وَلِلْجَنَّةِ أَبْوَابٌ فَمَنْ كَانَ مِنْ أَهْلِ الصَّلَاةِ دُعِيَ مِنْ بَابِ الصَّلَاةِ وَمَنْ كَانَ مِنْ أَهْلِ الْجِهَادِ دُعِيَ مِنْ بَابِ الْجِهَادِ وَمَنْ كَانَ مِنْ أَهْلِ الصَّدَقَةِ دُعِيَ مِنْ بَابِ الصَّدَقَةِ وَمَنْ كَانَ مِنْ أَهْلِ الصِّيَامِ دُعِيَ مِنْ بَابِ الرَّيَانِ”. فَقَالَ أَبُوْ بَكْرٍ: مَا عَلَي مَنْ دُعِيَ مِنْ تِلْكَ الْأَبْوَابِ مِنْ ضَرُوْرَةٍ. فَهَلْ يُدْعَى أَحَدٌ مِّنْ تِلْكَ الْأَبْوَابِ كُلِّهَا؟ قَالَ: “نَعَمْ. وَأَرْجُوْ أَنْ تَكُوْنَ مِنْهُمْ”.

1890. (3) [1/592-ఏకీభవితం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం: అల్లాహ్ (త) మార్గంలో ఒక వస్తువును జతలుగా దానం చేస్తే తీర్పుదినం నాడు స్వర్గద్వారాల వద్ద నుండి అతన్ని పిలవటం జరుగుతుంది. స్వర్గానికి (8) ద్వారాలు ఉన్నాయి. ఒకవేళ ఆ వ్యక్తి అధికంగా నమా’జులు చదివేవాడైతే అతన్ని నమా’జు ద్వారం నుండి పిలవటం జరుగుతుంది. అల్లాహ్ మార్గంలో జిహాద్‌ చేసేవాడైతే అతన్ని జిహాద్‌ ద్వారం నుండి పిలవటం జరుగుతుంది. అధికంగా ‘సదఖహ్ చేసేవాడైతే, ‘సదఖహ్ ద్వారం నుండి పిలవటం జరుగుతుంది, అధికంగా ఉపవాసాలు ఉండేవాడైతే అతన్ని రయ్యాన్‌ ద్వారం నుండి పిలవటం జరుగు తుంది. వెంటనే అబూ బకర్‌ (ర), అన్ని ద్వారాల నుండి పిలువబడటం ఎందుకు, స్వర్గంలో ప్రవేశించ డానికి ఒకే ద్వారం చాలు, అన్ని ద్వారాల నుండి పిలువబడేవారు కూడా ఎవరైనా ఉన్నారా?’ అని ప్రశ్నించారు. అప్పుడు ప్రవక్త (స), ‘అవును, నువ్వూ వారిలోని ఒకడవని నేను భావిస్తున్నాను,’ అని అన్నారు. (బు’ఖారీ, ముస్లిమ్‌)

1891 – [ 4 ] ( صحيح ) (1/593)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَنْ أَصْبَحَ مِنْكُمْ الْيَوْمَ صَائِمًا؟” قَالَ أَبُوْ بَكْرٍ: أَنَا قَالَ: “فَمَنْ تَبِعَ مِنْكُمْ الْيَوْمَ جَنَازَةً؟” قَالَ أَبُوْ بَكْرٍ: أَنَا. قَالَ: “فَمَنْ أَطْعَمَ مِنْكُمْ الْيَوْمَ مِسْكِيْنًا؟” قَالَ أَبُوْ بَكْرٍ: أَنَا. قَالَ: “فَمَنْ عَادَ مِنْكُمْ الْيَوْمَ مَرِيْضًا؟”. قَالَ أَبُوْ بَكْرٍ: أَنَا. فَقَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَا اجْتَمَعْنَ فِيْ امْرِئٍ إِلَّا دَخَلَ الْجَنَّةَ”. رَوَاهُ مُسْلِمٌ.

1891. (4) [1/593- దృఢం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ‘మీలో ఎవరు ఈ రోజు ఉపవాసం ఉన్నారు,’ అని ప్రశ్నించారు. అబూ బకర్‌ (ర), ‘నేను ఉపవాసం ఉన్నాను,’ అని అన్నారు. ఆ తరువాత ప్రవక్త (స) మళ్ళీ, ‘మీలో ఎవరు ఈ రోజు జనా’జహ్ వెంట వెళ్ళారు,’ అని ప్రశ్నించారు. దానికి అబూబకర్‌ (ర), ‘నేను వెళ్ళాను,’ అని అన్నారు. మళ్ళీ ప్రవక్త (స), ‘ఈ రోజు మీలో ఎవరు పేదవానికి అన్నం పెట్టారు,’ అని అన్నారు. అబూ బకర్‌ (ర), ‘నేను పెట్టాను’ అని అన్నారు, ప్రవక్త (స) మళ్ళీ, ‘మీలో ఎవరు ఈ రోజు అనారోగ్యంగా ఉన్న వారిని పరామర్శించారు,’ అని ప్రశ్నించారు. దానికి అబూ బకర్‌ (ర), ‘నేను పరామ ర్శించాను,’ అని అన్నారు. అప్పుడు ప్రవక్త (స), ‘ఈ విషయాలన్ని కలిగి ఉన్న వ్యక్తి తప్పని సరిగా స్వర్గంలో ప్రవేశిస్తాడు,’ అని అన్నారు. (ముస్లిమ్‌)

అంటే ఈ సత్కార్యాలన్నిటినీ ఒకవేళ ఎవరైనా ఒక రోజు చేసి ఉంటే, అతడు స్వర్గంలో ప్రవేశించే అర్హత పొందుతాడు.

1892 – [ 5 ] ( متفق عليه ) (1/593)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “يَا نِسَاءَ الْمُسْلِمَاتِ لَا تَحْقِرَنَّ جَارَةٌ لِجَارَتِهَا وَلَوْ فِرْسَنَ شَاةٍ”.

1892. (5) [1-593- ఏకీభవితం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ఇలా హిత బోధ చేసారు, ”ఓ ముస్లిమ్‌ మహిళల్లారా! పొరిగింటి మహిళకు ఇచ్చేందుకు ఏ కానుకనూ తక్కువయి నదిగా భావించకండి. అది కాలిన మేక కాలి గిట్టె (డెక్క / ఖుర్) అయినా సరే.” [55]  (బు’ఖారీ, ముస్లిమ్‌)

1893 – [ 6 ] ( متفق عليه ) (1/593)

وَعَنْ جَابِرٍ وَحُذَيْفَةَ قَالَا: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “كُلُّ مَعْرُوْفٍ صَدَقَةٌ”.

1893. (6) [1/593- ఏకీభవితం]

జాబిర్‌ (ర), హుజైఫ (ర)ల కథనం: ప్రవక్త (స) ప్రవచనం: ”సత్కార్యం ఎలాంటిదైనా అది ‘సదఖహ్ అవు తుంది.” [56] (బు’ఖారీ, ముస్లిమ్‌)

1894 – [ 7 ] ( صحيح ) (1/593)

وَعَنْ أَبِيْ ذَرٍّ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَا تَحْقِرَنَّ مِنَ الْمَعْرُوْفِ شَيْئًا وَلَوْ أَنْ تَلْقَى أَخَاكَ بِوَجْهِ طَلِيْقٍ”. رَوَاهُ مُسْلِمٌ .

1894. (7) [1/593-దృఢం]

అబూ జ’ర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”నువ్వు ఎటువంటి సత్కార్యాన్నయినా చిన్నదిగా భావించరాదు. అది నీ సోదరుణ్ణి చిరునవ్వుతో పలక రించటం అయినా సరే.” [57] (ముస్లిమ్‌)

1895 – [ 8 ] ( متفق عليه ) (1/593)

وَعَنْ أَبِيْ مُوْسَى الْأَشْعَرِيِّ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “عَلَى كُلِّ مُسْلِمٍ صَدَقَةٌ”  .قَالُوْا: فَإِنْ لَمْ يَجِدْ؟ قَالَ: “فَلْيَعْمَلْ بِيَدَيْهِ فَيَنْفَعُ نَفْسَهُ وَيَتَصَدَّقُ”  قَالُوْا: فَإِنْ لَمْ يَسْتَطِعْ؟ أَوْ لَمْ يَفْعَلْ؟ قَالَ: “فَيُعِيْنُ ذَا الْحَاجَةِ الْمَلْهُوْفَ” .قَالُوْا: فَإِنْ لَمْ يَفْعَلْهُ؟ قَالَ: “فَيَأْمُرُبِالْخَيْرِ”. قَالُوْا: فَإِنْ لَّمْ يَفْعَلْ؟ قَال : “فَيُمْسِكُ عَنِ الشَّرِّ فَإِنَّهُ لَهُ صَدَقَةٌ”.

1895. (8) [1/593- ఏకీభవితం]

అబూ మూసా అష్‌’అరీ (అ) కథనం: ప్రవక్త (స), ‘ప్రతి ఒక్క ముస్లిమ్‌కు దాన-ధర్మాలు చేయడం తప్పనిసరి,’ అని అన్నారు. అప్పుడు ప్రవక్త (స) అనుచరులు, ”ఒక వేళ ఎవరివద్దనైనా దాన-ధర్మాలు చేయడానికి ఏదీ లేకపోతే ఏం చేయాలి?” అని ప్రశ్నించారు. దానికి ప్రవక్త (స), ‘తన రెండు చేతులతో పని చేయాలి, తన్ను తాను లాభం చేకూర్చాలి, అందులో నుండే దాన-ధర్మాలు కూడా చేయాలి.’ దానికి అనుచరులు, ”ఒకవేళ ఎవరైనా అది కూడా చేయలేకపోతే?” అని అన్నారు. అప్పుడు ప్రవక్త (స) ”దుఃఖంలో ఉన్న అగత్యపరునికి సహాయం చేయాలి,” అని అన్నారు. దానికి అనుచరులు, ‘ఇది కూడా చేయలేని పరిస్థితి ఉంటే?’ అని అడగ్గా, అతను (స), ‘ప్రజలకు మంచిని బోధించాలి, మంచిని ఆదేశించాలి,’ అని అన్నారు. ప్రవక్త అనుచరులు, ‘ఒకవేళ అది కూడా చేయలేక పోతే?’ అని అన్నారు. అప్పుడు ప్రవక్త (స), ‘తన్ను తాను చెడుకు, పాపాలకు దూరంగా ఉంచాలి, ఇదే అతని తరఫున ‘సదఖహ్ అని ప్రవచించారు.’ (బు’ఖారీ, ముస్లిమ్‌)

1896 – [ 9 ] ( متفق عليه ) (1/593)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “كُلُّ سَلَامي مِنَ النَّاسِ عَلَيْهِ صَدَقَةٌ .كُلَّ يَوْمٍ تَطْلَعُ فِيْهِ الشَّمْسُ يَعْدِلُ بَيْنَ الْاِثْنَيْنِ صَدَقَةٌ وَيُعِيْنُ الرَّجُلُ عَلَى دَابَّتِهِ فَيَحْمِلُ عَلَيْهَا أَوْ يَرْفَعُ عَلَيْهَا مَتَاعَهُ صَدَقَةٌ. وَالْكَلِمَةُ الطَّيِّبَةُ صَدَقَةٌ وَكُلُّ خَطْوَةٍ تَّخْطُوْهَا إِلَى الصَّلَاةِ صَدَقَةٌ وَيُمِيْطُ الْأَذَى عَنِ الطَّرِيْقِ صَدَقَةٌ”.

1896. (9) [1/593- ఏకీభవితం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మానవుని శరీరంలో ఎన్నికీళ్ళు ఉన్నాయో, ప్రతికీలు తరఫున దాన-ధర్మాలు చేయడం తప్పనిసరి. ఇద్దరి మధ్య ఉన్న సమస్యను పరిష్కరించడం ‘సదఖహ్ అవుతుంది. ఒక వ్యక్తికి వాహనంపై కూర్చోవడంలో సహాయం చేయడం కూడా ‘సదఖహ్ అవుతుంది. అతని సామాన్లను వాహనంపై ఎక్కించడం కూడా ‘సదఖహ్ అవుతుంది. ఇంకా అతని సామాన్లను  ఎత్తటం కూడా ‘సదఖహ్ అవుతుంది. మంచి విషయాన్ని తెలియపరచటం కూడా ‘సదఖహ్ అవుతుంది. నమా’జ్‌ చదవటానికి మస్జిద్‌ వైపునకు అడుగు ముందుకు వేయటం కూడా ‘సదఖహ్ అవుతుంది. బాధ కలిగించే వస్తువును మార్గం నుండి తొలగించడం కూడా ‘సదఖహ్ అవుతుంది.” (బు’ఖారీ, ముస్లిమ్‌)

1897 – [ 10 ] ( صحيح ) (1/594)

وَعَنْ عَائِشَةَ رَضِيَ اللهُ عَنْهَا قَالَتْ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم:” خُلِقَ كُلُّ إِنْسَانٍ مِّنْ بَنِيْ آدَمَ عَلَى سِتِّيْنَ وَثَلَاثِمِائَةٍ مَفْصِلٍ فَمَنْ كَبَّرَ اللهَ وَحَمِدَ اللهَ وَهَلَّلَ اللهَ وَسَبَّحَ اللهَ وَاسْتَغْفَرَ اللهَ وَعَزَلَ حَجَرًا عَنْ طَرِيْقِ النَّاسِ أَوْ شَوْكَةً أَوْ عَظْمًا أَوْ أَمَرَ بِمَعْرُوْفٍ أَوْ نَهَى عَنْ مُنْكَرٍ عَدَدَ تِلْكَ السِّتِّيْنَ وَالثَّلَاثِمِائَةٍ فَإِنَّهُ يَمْشِيْ يَوْمَئِذٍ وَقَدْ زَحْزَحَ نَفْسَهُ عَنِ النَّارِ” .رَوَاهُ مُسْلِمٌ.

1897. (10) [1/594-దృఢం]

‘ఆయి’షహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ప్రతి మానవుడు 360 కీళ్ళతో జన్మిస్తాడు. అంటే అతని శరీరంలో 360 కీళ్ళు ఉన్నాయి. ప్రతి కీలు తరఫున ‘సదఖహ్ చేయడం తప్పనిసరి. అల్లాహు అక్బర్ అని పలికిన వారు ‘సదఖహ్ చేసారు. అల్‌’హమ్దు లిల్లాహ్ అని పలికిన వారు ‘సదఖహ్ చేసారు, లా ఇలాహ ఇల్లల్లాహ్ అని పలికిన వారు, ‘సదఖహ్ చేసారు, సుబ్హానల్లాహ్ అని పలికిన వారు ‘సదఖహ్ చేసారు. అస్తగ్ఫిరుల్లాహ్ అని పలికినవారు ‘సదఖహ్ చేసారు. మార్గంలో పడివున్న రాయిని లేదా ముల్లును లేదా దుమ్మును తొలగించినవారు ‘సదఖహ్ చేసారు, మంచి విషయాన్ని తెలియపరచిన వారు ‘సదఖహ్ చేసారు. చెండు నుండి వారించిన వారు ‘సదఖహ్ చేసారు. ఇలాంటివి 360 సత్కార్యాలు అయితే, అతడు తన ప్రతి ఒక్క కీలు తరఫు నుండి ‘సదఖహ్ చేసినట్లు అవుతుంది. అతడు తన్ను తాను నరకం నుండి విడుదల చేసుకున్న వాడిలా తిరగగలడు. (ముస్లిమ్‌)

1898 – [ 11 ] ( صحيح ) (1/594)

وَعَنْ أَبِيْ ذَرٍّ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِنَّ بِكُلِّ تَسْبِيْحَةٍ صَدَقَةً وَكُلِّ تَكْبِيْرَةٍ صَدَقَةً وَكُلِّ تَحْمِيْدَةٍ صَدَقَةً وَكُلِّ تَهْلِيْلَةٍ صَدَقَةً وَأَمْرٍ بِالْمَعْرُوْفِ صَدَقَةً وَنَهْيٍ عَنِ الْمُنْكَرِ صَدَقَةً وَفِيْ بُضْعِ أَحَدِكُمْ صَدَقَةً”. قَالُوْا: يَا رَسُوْلَ اللهِ أَيَأْتِيْ أَحَدُنَا شَهْوَتَهُ وَيَكُوْنَ لَهُ فِيْهَا أَجْرٌ؟ قَالَ: “أَرَأَيْتُمْ لَوْ وَضَعَهَا فِيْ حَرَامٍ أَكَانَ عَلَيْهِ فِيْهِ وِزْرٌ؟ فَكَذَلِكَ إِذَا وَضَعَهَا فِيْ الْحَلَالِ كَانَ لَهُ أَجْرٌ”.  رَوَاهُ مُسْلِمٌ.

1898. (11) [1/594-దృఢం]

అబూ జ’ర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం: ప్రతి పవిత్ర వచనం ‘సదఖహ్ అవుతుంది. అంటే సుబ్హా నల్లాహ్అంటే ‘సదఖహ్ పుణ్యం లభిస్తుంది. అల్లాహు అక్బర్ అంటే ‘సదఖహ్ అవుతుంది. అల్హమ్దులిల్లాహ్ అంటే ‘సదఖహ్ అవుతుంది. లా ఇలాహ ఇల్లల్లాహ్ అంటే ‘సదఖహ్ అవుతుంది. మంచి విషయాన్ని చెప్పడం ‘సదఖహ్ అవుతుంది. చెడు నుండి వారించడం ‘సదఖహ్ అవుతుంది. భార్య లేక బానిస స్త్రీతో సంభోగం చేయడం కూడా ‘సదఖహ్ అవుతుంది,” అని అన్నారు. అక్కడున్న ప్రజలు ఓ అల్లాహ్‌ ప్రవక్తా! ‘మాలో ఎవరైనా తన కామవాంఛను తీర్చుకుంటాడు అంటే సంభోగం చేస్తాడు, మరి అందులో కూడా పుణ్యం ఉందా?’ అని ప్రశ్నించారు. దానికి ప్రవక్త (స), ‘ఒకవేళ అతడు ధర్మ విరుద్ధంగా కామవాంఛ పూర్తిచేస్తే అతనికి పాపం చుట్టు కుంటుంది. అదేవిధంగా ధర్మబద్ధంగా కామవాంఛ తీర్చుకుంటే అతనికి పుణ్యం లభిస్తుంది.’ (ముస్లిమ్‌)

1899 – [ 12 ] ( متفق عليه ) (1/594)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “نِعْمَ الصَّدَقَةُ اللِّقْحَةُ الصَّفِيُّ مِنْحَةٌ وَالشَّاةُ الصَّفِيُّ مِنْحَةُ تَغْدُوْ بِإِنْاَءٍ وَتَرُوْحُ بِآخَرَ”.

1899. (12) [1/594- ఏకీభవితం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం: పేదవాడు పాలు త్రాగడానికి ఇవ్వబడిన అధికంగా పాలిచ్చే ఆడఒంటె  గొప్ప ‘సదఖహ్, పేదవాడు పాలు త్రాగడానికి ఉదయం, సాయంత్రం గిన్నెనిండా పాలిచ్చే మేక ఉత్తమ ‘సదఖహ్. [58] (బు’ఖారీ, ముస్లిమ్‌)

1900 – [ 13 ] ( متفق عليه ) (1/595)

وَعَنْ أَنَسٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَا مِنْ مُّسْلِمٍ يَغْرِسُ غَرْسًا أَوْ يَزْرَعُ زَرْعًا فَيَأْكُلُ مِنْهُ إِنْسَانٌ أَوْ طَيْرٌ أَوْ بَهِيْمَةٌ إِلَّا كَانَتْ لَهُ صَدَقَةٌ.

1900. (13) [1/595- ఏకీభవితం]

అనస్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఒక ముస్లిమ్‌ ఒక చెట్టు నాటినా, పంటలు పండించినా, వాటిలో నుండి మానవులు గాని, జంతువులు గాని, పక్షులు గాని తింటే, అతనికి ‘సదఖహ్ చేసినంత పుణ్యం లభిస్తుంది. (బు’ఖారీ)

1901 – [ 14 ] (صحيح ) (1/595)

وَفِيْ رِوَايَةٍ لِّمُسْلِمٍ عَنْ جَابِرٍ: “وَمَا سُرِقَ مِنْهُ لَهُ صَدَقَةٌ”.

1901. (14) [1/595-దృఢం]

జాబిర్ (ర) కథనం: ముస్లిమ్‌ యొక్క ఒక ఉల్లేఖనం లో ఇలా ఉంది, ”దొంగలించుకుపోయినా అంటే ఒకవేళ ఎవరైనా దొంగలించుకుపోతే అప్పుడు కూడా అతనికి ‘సదఖహ్ పుణ్యం లభిస్తుంది. (ముస్లిమ్‌)

1902 – [ 15 ] ( متفق عليه ) (1/595)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “غُفِرَ لِاِمْرَأَةٍ مُّوْمِسَةٍ مَّرَّتْ بِكَلْبٍ عَلَى رَأْسِ رَكِيٍّ يَلْهَثُ كَادَ يَقْتُلُهُ الْعَطَشُ فَنَزَعَتْ خُفَّهَا فَأَوْثَقَتْهُ بِخِمَارِهَا فَنَزَعَتْ لَهُ مِنَ الْمَاءِ فَغُفِرَلَهَا بِذَلِكَ”. قِيْلَ: إِنَّ لَنَا فِيْ الْبَهَائِمِ أَجْرًا؟ قَالَ: “فِيْ كُلِّ ذَاتَ كَبِدٍ رَّطْبَةٍ أَجْرٌ”.

1902. (15) [1/595- ఏకీభవితం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఒక వ్యభిచార స్త్రీ కుక్కకు నీళ్ళు త్రాపించినందు వల్ల ఆమెను క్షమించడం జరిగింది. అంటే ఆమె ఒక మార్గం గుండా వెళ్ళడం జరిగింది, దారి ప్రక్కన బావి వద్ద ఒక కుక్క తన నాలుక వ్రేలాడదీసి దాహంతో ఉంది. దాహం వల్ల భరించలేని స్థితిలో ఉంది. ఆ స్త్రీ తన మేజోడును తీసి తన కొంగుకు కట్టి బావిలోకి దింపి నీళ్ళు తోడి ఆ కుక్కకు త్రాపించింది. ఆ పుణ్యం వల్ల ఆమెను క్షమించడం జరిగింది.’ ‘జంతువుల పట్ల మంచిగా ప్రవర్తించినా పుణ్యం లభిస్తుందా?’ అని ప్రవక్త (స)ను ప్రశ్నించడం జరిగింది. దానికి ప్రవక్త (స), ‘ఎలాంటి జంతువు పట్ల అయినా మంచిగా ప్రవర్తిస్తే పుణ్యం లభిస్తుందని’ అన్నారు. [59] (బు’ఖారీ, ముస్లిమ్‌)

1903 – [ 16 ] ( متفق عليه ) (1/595)

وَعَنِ ابْنِ عُمَرَ وَأَبِيْ هُرَيْرَةَ قَالَا: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “عُذِّبَتِ امْرَأَةٌ فِيْ هِرَّةٍ أَمْسَكَتْهَا حَتَّى مَاتَتْ مِنَ الْجُوْعِ فَلَمْ تَكُنْ تُطْعِمُهَا وَلَا تُرْسِلُهَا فَتَأْكُلْ مِنْ خِشَاشِ الْأَرْضِ”

1903. (16) [1/595- ఏకీభవితం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘ఉమర్‌, అబూ హురైరహ్‌ (ర)ల కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఒక స్త్రీని పిల్లి కారణంగా  శిక్షించడం జరిగింది. ఆ స్త్రీ ఆ పిల్లిని కట్టి వేసింది. అది ఆకలితో దాహంతో అలమటిస్తూ, చివరికి చని పోయింది. ఆమె దానికి ఆహారం పెట్టలేదు, అటు ఇటూ తిరిగి కడుపు నింపుకోవడానికీ వదల్లేదు. (బు’ఖారీ, ముస్లిమ్‌)

1904 – [ 17 ] ( متفق عليه ) (1/595)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَرَّ رَجُلٌ بِغُصْنِ شَجَرَةِ عَلَى ظَهْرِ طَرِيْقٍ فَقَالَ: لَأُنَحِّيَنَّ هَذَا عَنْ طَرِيْقِ الْمُسْلِمِيْنَ ولَا يُؤْذِيْهِمْ فَأُدْخِلَ الْجَنَّةَ”.

1904. (17) [1/595- ఏకీభవితం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఒక వ్యక్తి ఒక మార్గం గుండా పోతున్నాడు. ఒక పెద్ద చెట్టుకొమ్మ దారికి అడ్డంగా ఉంది. ‘ముస్లిముల దారికి అడ్డంగా ఉన్న ఈ కొమ్మను నేను తొలగిస్తాను,’ అని దాన్ని మార్గం నుండి తొలగించి దూరం చేసాడు. అతని ఈ సత్కార్యం వల్ల అతన్ని స్వర్గంలో ప్రవేశింపజేయడం జరిగింది. (బు’ఖారీ, ముస్లిమ్‌)

1905 – [ 18 ] ( صحيح ) (1/595)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَقَدْ رَأَيْتُ رَجُلًا يَّتَقَلَّبُ فِيْ الْجَنَّةِ فِيْ شَجَرَةٍ قَطَعَهَا مِنْ ظَهْرِ الطَّرِيْقِ كَانَتْ تُؤْذِي النَّاسَ”. رَوَاهُ مُسْلِمٌ.  

1905. (18) [1/595-దృఢం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స), ”నేను ఒక వ్యక్తిని స్వర్గంలో గర్వంగా, చురుకుగా నడుస్తూ ఉండ డం చూసాను. అతను దారికి అడ్డంగా ఉన్న, ప్రజలకు ఆటంకంగా ఉన్న చెట్టును నరికి వేసేవాడు. (ముస్లిమ్‌)

1906 – [ 19 ] ( صحيح ) (1/595)

وَعَنْ أَبِيْ بَرْزَةَ قَالَ: قُلْتُ: يَا نَبِيَّ اللهِ عَلِّمْنِيْ شَيْئًا أَنْتَفِعُ بِهِ قَالَ: “اِعْزِلِ الْأَذُى عَنْ طَرِيْقِ الْمُسْلِمِيْنَ”. رَوَاهُ مُسْلِمٌ.

وَسَنَذْكُرُ حَدِيْثَ عَدِيِّ ابْنِ حَاتِمٍ: “اتَّقُوْا النَّارَ” فِيْ بَابِ عَلَامَاتِ النُّبُوَّةِ إِنْ شَاءَ اللهُ تَعَالى.

1906. (19) [1/595-దృడం]

అబూ బర్జ’హ్ (ర) కథనం: నేను ప్రవక్త (స) ను, ‘ఓ అల్లాహ్‌ ప్రవక్తా! నాకు లాభం చేకూర్చే విషయం ఏదైనా బోధించండి’ అని ప్రవక్త (స) విన్నవించు కున్నాను. ప్రవక్త (స) నన్ను, ”హాని చేకూర్చే వస్తువును ముస్లిముల మార్గం నుండి తొలగించు” అని హితబోధ చేసారు. (ముస్లిమ్) 

మేము ‘అదీ బిన్‌ ‘హాతిమ్‌ ‘హదీసు’ను దైవదౌత్య చిహ్నాల అధ్యాయంలో ఇన్‌షా అల్లాహ్‌ పేర్కొందుము.

—–

اَلْفَصْلُ الثَّانِيْ  రెండవ విభాగం  

1907 – [ 20 ] ( لم تتم دراسته ) (1/596)

عَنْ عَبْدِ اللهِ بْنِ سَلَامٍ قَالَ: لَمَّا قَدِمَ النَّبِيُّ صلى الله عليه وسلم الْمَدِيْنَةَ جِئْتُ فَلَمَّا تَبَيَّنْتُ وَجْهَهُ عَرَفْتُ أَنَّ وَجْهَهُ لَيْسَ بِوَجِهِ كَذَّابِ فَكَانَ أَوَّلُ مَا قَالَ: “أَيُّهَا النَّاسُ أَفْشُوا السَّلَامَ وَأَطْعِمُوْا الطَّعَامَ وَصِلُوا الْأَرْحَامَ وَصَلُّوْا بِاللَّيْلِ وَالنَّاسُ نِيَامٌ تَدْخُلُوا الْجَنَّةَ بِسَلَامٍ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَابْنُ مَاجَهُ وَالدَّارَمِيُّ .

1907. (20) [1-596-అపరిశోధితం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ సలామ్‌ (ర) కథనం: ”ప్రవక్త (స) మదీనహ్ విచ్చేసినపుడు ప్రవక్త (స) వద్దకు వెళ్ళాను. ప్రవక్త (స) ముఖ వర్చస్సు చూసి ప్రవక్త (స)ది అసత్యం పలికే ముఖం కాదని నిర్థారించుకున్నాను. ప్రవక్త (స) అన్నిటి కంటే ముందు, ‘ప్రజలారా! సలామ్‌ను వ్యాపింపజేయండి. అంటే పరస్పరం పలుకుతూ ఉండండి. ఆకలిగొన్న వారికి అన్నం పెట్టండి, బంధుత్వాలను, సంబంధాలను దృఢ పర్చండి, రాత్రివేళ అంటే ప్రజలంతా పడుకొని ఉన్నప్పుడు నమా’జు ఆచరించండి, సురక్షితంగా స్వర్గంలో ప్రవేశిస్తారు,’ అని అన్నారు. [60] (తిర్మిజి’, ఇబ్నె మాజహ్, దారమి)

1908 – [ 21 ] ( لم تتم دراسته ) (1/596)

وَعَنْ عَبْدِ اللهِ بْنِ عَمْرٍو قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “اعْبُدُوا الرَّحْمنَ وَأَطْعِمُوا الطَّعَامَ وَأَفْشُوا السَّلَامَ تَدْخُلُوا الْجَنَّةَ بِسَلَامٍ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَابْنُ مَاجَهُ .

1908. (21) [1/596-అపరిశోధితం]

‘అబ్దుల్లా బిన్‌ ‘అమ్ర్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మీరు ర’హ్మాన్‌ను అంటే అల్లాహ్‌(త)ను ఆరాధించండి, నిరుపేదలకు, ఆకలిగొన్న వారికి అన్నం పెట్టండి. పరస్పరం సలామ్‌ చేస్తూ ఉండండి, మీరు క్షేమంగా స్వర్గంలోనికి ప్రవేశిస్తారు.” (తిర్మిజి’, ఇబ్నె మాజహ్)

1909 – [ 22 ] ( ضعيف ) (1/596)

وَعَنْ أَنَسٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِنَّ الصَّدَقَةَ  لَتُطْفِئُ غَضَبَ الرَّبِّ وَتَدْفَعُ مِيْتَةَ السَّوْءِ” .رَوَاهُ التِّرْمِذِيُّ.

1909. (22) [1/596-బలహీనం]

అనస్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ” ‘సదఖహ్ (దాన ధర్మాలు) అల్లాహ్‌ ఆగ్రహాన్ని ఆర్పివేస్తాయి, అసామాన్య చావుకు దూరంగా ఉంచుతాయి.” (తిర్మిజి’)

1910 – [ 23 ]?? (1/596)

وَعَنْ جَابِرٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “كُلُّ مَعْرُوْفٍ صَدَقَةٌ. وَإِنَّ مِنَ الْمَعْرُوْفِ أَنْ تَلْقَى أَخَاكَ بِوَجْهٍ طَلِقٍ وَأَنْ تُفْرِغَ مِنْ دَلْوِكَ فِيْ إِنَاءِ أَخِيْكَ”.  روَاهُ أَحْمَدُ وَالتِّرْمِذِيُّ .

1910. (23) [1/596-??]

జాబిర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ప్రతి సత్కార్యం, ఉపకారం ‘సదఖహ్ అవుతుంది. ముస్లిమ్‌ సోదరుణ్ని చిరునవ్వుతో పలకరించడం కూడా సత్కార్యమే. తన చేదలో నుండి తన సోదరుని చేదలో నీళ్ళు వేయడం కూడా పుణ్యమే. (అ’హ్మద్‌, తిర్మిజి’)

1911 – [ 24 ] ( لم تتم دراسته ) (1/596)

وَعَنْ أَبِيْ ذَرٍّ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم:”تَبَسُّمُكَ فِيْ وَجْهِ أَخِيْكَ صَدَقَةٌ وَّأَمْرُكَ بَالْمَعْرُوفِ صَدَقَةٌ وَنَهْيُكَ عَنِ الْمُنْكَرِ صَدَقَةٌ وَإِرْشَادُكَ الرَّجُلَ فِيْ أَرْضِ الضَّلَالِ لَكَ صَدَقَةٌ وَنَصْرُكَ الرَّجُلَ الرَّدِيْءَ الْبَصَرِ لَكَ صَدَقَةٌ وَإِمَاطَتُكَ الْحَجَرَ وَالشَّوْكَ وَالْعَظْمَ عَنِ الطَّرِيْقِ لَكَ صَدَقَةٌ وَإِفْرَاغُكَ مِنْ دَلْوِكَ فِيْ دَلْوِ أَخِيْكَ لَكَ صَدَقَةٌ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَقَالَ: هَذَا حَدِيْثٌ غَرِيْبٌ.

1911. (24) [1/596-అపరిశోధితం]

అబూ జ’ర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”తన సోదరుని ముందు నవ్వడం కూడా పుణ్య కార్యమే, అంటే ఒక ముస్లిమ్‌ సోదరున్ని చిరునవ్వుతో కలవటం కూడా ‘సదఖహ్ అవుతుంది, అదేవిధంగా మంచి పనికి ఆదేశించడం కూడా పుణ్యకార్యమే, చెడు నుండి ప్రజలను వారించడం కూడా పుణ్యకార్యమే, దారితప్పిన వారిని దారి చూపించడం కూడా పుణ్య కార్యమే, అంధునికి సహాయం చేయడం కూడా పుణ్య కార్యమే, మార్గం నుండి ఎముక, రాయి, ముళ్ళు మొదలైన వాటిని తొలగించడం కూడా పుణ్య కార్యమే, తన చేదలో నుండి తన సోదరుని చేదలో నీళ్ళు వేయడం కూడా నీ కోసం పుణ్యకార్యమే అవుతుంది.” (తిర్మిజి’ / ఏకోల్లేఖనం)

1912 – [ 25 ] ( ضعيف ) (1/597)

وَعَنْ سَعْدِ بْنِ عُبَادَةَ قَالَ: يَا رَسُوْلَ اللهِ إِنَّ أُمَّ سَعْدٍ مَاتَتْ فَأَيُّ الصَّدَقَةِ أَفْضَلُ؟ قَالَ: “اَلْمَاءُ”. فَحَفَرَ بِئْرًا وَقَالَ: هَذِهِ لِأُمِّ سَعْدٍ. رَوَاهُ أَبُوْ دَاوُدَ وَالنَّسَائِيُّ.

1912. (25) [1/597- బలహీనం]

స’అద్‌ బిన్‌ ‘ఉబాదహ్‌ (ర) కథనం: నేను ప్రవక్త (స) ను, ‘ఓ దైవప్రవక్తా! స’అద్‌ తల్లిగారు మరణించారు, ఎలాంటి ‘సదఖహ్ ఉత్తమమైనది,’ అని విన్నవించు కున్నాను, దానికి ప్రవక్త (స), ”నీటి ‘సదఖహ్ అన్నిటి కంటే ఉత్తమమైనది,” అని అన్నారు. అప్పుడతను బావి త్రవ్వించి, ఆబావి స’అద్‌ తల్లి తరఫు ‘సదఖహ్ గా అంకితం చేయించారు. [61] (అబూ దావూద్‌, నసాయి’)

1913 – [ 26 ] ( ضعيف ) (1/597)

وَعَنْ أَبِيْ سَعِيْدٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “أَيُّمَا مُسْلِمٍ كَسَا مُسْلِمًا ثَوْبًا عَلَى عُرًى كَسَاهُ اللهُ مِنْ خُضْرِالْجَنَّةِ وَأَيُّمَا مُسْلِمٍ أَطْعَمَ مُسْلِمًا عَلَى جَوْعٍ أَطْعَمَهُ اللهُ مِنْ ثِمَارِ الْجَنَّةِ. وَأَيُّمَا مُسْلِمٍ سَقَّا مُسْلِمًا عَلَى ظَمَأٍ سَقَاهُ اللهُ مِنَ الرَّحِيْقِ الْمَخْتُوْمِ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ وَالتِّرْمِذِيُّ .

1913. (26) [1/597- బలహీనం]

అబూ స’యీద్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఒక ముస్లిమ్‌ మరో నగ్నంగా ఉన్న ముస్లిమ్‌ను దుస్తులు ధరింప జేస్తే, అల్లాహ్‌ (త) అతనికి స్వర్గంలో ఉన్న పచ్చ దుస్తులను ధరింపజేస్తాడు. అదేవిధంగా ఒక ముస్లిమ్‌ ఆకలితో ఉన్న మరో ముస్లిమ్‌కు అన్నం పెడితే, అతనికి ప్రతిఫలంగా అల్లాహ్‌ (త) స్వర్గంలోని ఫలాలను తినిపిస్తాడు. అదేవిధంగా ఒక ముస్లిమ్‌ దాహంగా ఉన్న మరో ముస్లిమ్‌కు నీరు త్రాపిస్తే అల్లాహ్‌ (త) అతనికి స్వర్గంలోని అమృతాన్ని త్రాపిస్తాడు. (అబూ దావూద్‌, తిర్మిజి’)

1914 – [ 27 ] ( لم تتم دراسته ) (1/597)

وَعَنْ فَاطِمَةَ بِنْتَ قَيْسٍ قَالَتْ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِنَّ فِيْ الْمَالِ لَحَقًّا سِوَى الزَّكَاةِ “ثُمَّ تَلَا: (لَيْسَ الْبِرَّ أَنْ تُوَلُّوْا وُجُوْهَكُمْ قَبْلَ الْمَشْرِقِ وَالْمَغْرِبِ. 2: 177)  الْآيَة. رَوَاهُ التِّرْمِذِيُّ وَابْنُ مَاجَهُ وَالدَّارَمِيُّ .

1914. (27) [1/597- అపరిశోధితం]

ఫా’తిమా బిన్‌తె ఖైస్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ధనంలో ‘జకాత్‌తో పాటు మరో హక్కు కూడా ఉంది.” ఆ తరువాత ప్రవక్త (స) సూరహ్‌ బఖరహ్‌లోని 2:177 ఆయత్ ను పఠించారు. [62] (తిర్మిజి’, ఇబ్నె మాజహ్, దారమి)

1915 – [ 28 ] ( ضعيف ) (1/598)

وَعَنْ بُهَيْسَةَ عَنْ أَبِيْهَا قَالَتْ: قَالَ: يَا رَسُوْلُ اللهِ مَا الشَّيْءُ الَّذِيْ لَا يَحِلُّ مَنْعُهُ؟ قَالَ: “اَلْمَاءُ”. قَالَ: يَا نَبِيَّ اللهِ مَا الشَّيْءُ الَّذِيْ لَا يَحِلُّ مَنْعُهُ؟ قَالَ: “اَلْمِلْحُ”. قَالَ: يَا نَبِيَّ اللهِ مَا الشَّيْءُ الَّذِيْ لَا يَحِلُّ مَنْعُهُ؟ قَالَ: “أَنْ تَفْعَلَ الْخَيْرَ خَيْرٌ لَّكَ”.  رَوَاهُ أَبُوْ دَاوُدَ .

1915. (28) [1/598-బలహీనం]

బుహైసహ్ (ర) తన తండ్రి ద్వారా కథనం: ఆమె తండ్రి ప్రవక్త (స)ను, ‘ఓ అల్లాహ్‌ ప్రవక్తా! కూడబెట్టి, ఇవ్వకుండా ఉంచడం ధర్మవిరుద్ధమైన వస్తువు ఏది?’ అని విన్నవించుకున్నారు. ప్రవక్త (స), ‘నీళ్ళు,’ అని అన్నారు. అంటే ఒకవేళ ఎవరైనా త్రాగటానికి నీళ్ళు అడిగితే, నీళ్ళు తప్పకుండా ఇవ్వాలి. తిరస్కరించ రాదు. మళ్ళీ అతడు, ‘ఓ అల్లాహ్‌ ప్రవక్తా! ఇవ్వ కుండా ఉంచడం ధర్మవిరుద్ధమైన వస్తువు ఏది?’ అని ప్రశ్నించాడు. దానికి ప్రవక్త (స), ‘ఉప్పు,’ అని అన్నారు. అంటే ఒకవేళ ఎవరైనా ఉప్పు అడిగితే, తప్పకుండా ఇవ్వాలి. ఆయన మళ్ళీ, ‘తిరస్క రించడం నిషిద్ధమైన వస్తువు ఏది?’ అని ప్రశ్నించారు. దానికి ప్రవక్త (స) ‘ప్రతి మంచిపనిని చేస్తూ పోండి, దాన్నుండి వారించకండి, ఇదే మీకోసం చాలా ఉత్తమమైనది.’ (అబూ దావూద్‌)

1916 – [ 29 ] ( لم تتم دراسته ) (1/598)

وَعَنْ جَابِرٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَنْ أَحْيَى أَرْضًا مَّيْتَةً فَلَهُ فِيْهَا أَجْرٌ وَمَا أَكَلَتِ الْعَافِيَةُ مِنْهُ فَهُوَ لَهُ صَدَقَةٌ”. رَوَاهُ النَّسَائِيُّ وَالدَّارَمِيُّ.

1916. (29) [1/598-అపరిశోధితం]

జాబిర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ఒక వ్యక్తి బంజరు భూమిని సాగుచేసి, అందులో వ్యవసాయం చేసినా, లేదా మొక్కలు నాటినా అతనికి పుణ్యం లభిస్తుంది. అంతే కాదు ఆ పంట నుండి లేదా ఆ తోట నుండి మనుషులైనా, పశువులైనా తినివేస్తే దానివల్ల కూడా అతనికి ‘సదఖహ్ చేసే పుణ్యం లభిస్తుంది. (దార్మీ)

1917 – [ 30 ] ( صحيح ) (1/598)

وَعَنِ الْبَرَاءِ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَنْ مَّنَحَ مِنْحَةَ لَبَنٍ أَوْ وَرَقٍ أَوْ هَدى زُقَاقًا كَانَ لَهُ مِثْلُ عِتْقِ رَقَبَةٍ”.  رَوَاهُ التِّرْمِذِيُّ .

1917. (30) [1/598-దృఢం]

బరా’ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ఎవరైనా బీదవానికి పాలు త్రాగేందుకు తాత్కాలికంగా జంతు వును ఇచ్చినా, లేదా అప్పుగా డబ్బు ఇచ్చినా, లేదా దారి తప్పిన వానికి దారి చూపించినా, అతనికి ఒక బానిసను విడుదల చేసినంత పుణ్యం లభిస్తుంది. (తిర్మిజి’)

1918 – [ 31 ] ( صحيح ) (1/598)

وَعَنْ أَبِيْ جُرَيٍّ جَابِرِ بْنِ سُلَيْمٍ قَالَ: أَتَيْتُ الْمَدِيْنَةَ فَرَأَيْتُ رَجُلًا يَّصْدُرُ النَّاسُ عَنْ رَّأيِهِ لَا يَقُوْلُ شَيْئًا إِلَّا صَدَرُوْا عَنْهُ قُلْتُ: مَنْ هَذَا قَالُوْا: هَذَا رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم قُلْتُ: عَلَيْكَ السَّلَامُ يَا رَسُوْلَ اللهِ مَرَّتَيْنِ قَالَ: “لَا تَقُلْ عَلَيْكَ السَّلَامُ. فَإِن عَلَيْكَ السَّلَامُ تَحِيَّةُ الْمَيِّتِ، قُلِ: السَّلَامُ عَلَيْكَ” قُلْتُ: أَنْتَ رَسُوْلُ اللهِ؟ قَالَ: “أَنَا رَسُوْلُ اللهِ الَّذِيْ إِذَا أَصَابَكَ ضُرٌّ فَدَعَوْتَهُ كَشَفَهُ عَنْكَ وَإِنْ أَصَابَكَ عَامُ سَنَةٍ فَدَعَوْتَهُ أَنْبَتَهَا لَكَ وَإِذَا كُنْتَ بِأَرْضٍ قَفْرٍ أَوْ فَلَاةٍ فَضَلَّتْ رَاحِلَتُكَ فَدَعَوْتَهُ رَدَّهَاعَلَيْكَ”. قُلْتُ: اِعْهَدْ إِلَيَّ. قَالَ: “لَا تَسُبَّنَّ أَحَدًا”. قَالَ فَمَا سَبَبْتُ بَعْدَهُ حُرًّا وَّلَا عَبْدًا وَّلَا بَعِيْرًا وَّلَا شَاةً. قَالَ: “وَلَا تَحْقِرَنَّ شَيْئًا مِّنَ الْمَعْرُوْفِ وَأَنْ تُكَلِّمَ أَخَاكَ وَأَنْتَ مُنْبَسِطٌ إِلَيْهِ وَجْهُكَ إِنَّ ذَلِكَ مِنَ الْمَعْرُوْفِ وَارْفَعْ إِزَارَكَ إِلَى نِصْفِ السَّاقِ فَإِنْ أَبِيْتَ فَإِلَى الْكَعْبَيْنِ وَإِيَّاكَ وَإِسْبَالِ الْإِزَارِ فَإِنَّهَا مِنَ الْمَخْيِلَةِ. وَإِنَّ اللهَ لَا يُحِبُّ الْمَخِيْلَةَ. وَإِنِ امْرُؤٌ شَتَمَكَ وَعَيَّرَكَ بِمَا يَعْلَمُ فِيْكَ فَلَا تُعَيِّرْهُ بِمَا تَعْلَمُ فِيْهِ فَإِنَّمَا وَبَالُ ذَلِكَ عَلَيْهِ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ وَ التِّرْمِذِيُّ مِنْهُ حَدِيْثَ السَّلَامِ.  

وَفِيْ رِوَايَةٍ: “فَيَكُوْنُ لَكَ أَجْرُ ذَلِكَ وَوَبَالُهُ عَلَيْهِ”.

1918. (31) [1/598-దృఢం]

అబూ జురయ్యి జాబిర్ బిన్‌ సులైమ్‌ (ర) కథనం: నేను మదీనహ్ వచ్చిన తర్వాత ప్రజలు ఒక వ్యక్తి అభిప్రాయాన్ని అనుసరించడం చూశాను. అంటే అతను చెప్పినట్లు ఆచరిస్తున్నారు. అతను చెప్పిన విధంగా నడుచుకుంటున్నారు. ఏ ఒక్కడూ అతని ఆదేశాన్ని వ్యతిరేకించడం లేదు. నేను ప్రజలను, ‘వీరెవరు,’ అని అడిగాను. ప్రజలు, ‘వీరు అల్లాహ్‌ ప్రవక్త (స),’ అని సమాధానం ఇచ్చారు. ‘ అతనిపై శాంతి కలుగుగాక!’ నేను అతని దగ్గరకు వెళ్ళి, ‘అలైకస్సలాము ఓ అల్లాహ్‌ ప్రవక్తా!’ అని రెండుసార్లు అన్నాను. ప్రవక్త (స) విని, ‘అలైకస్సలాము,’ అని అనకు, ఎందుకంటే, అలైకస్సలాము అనేది మృతుల దు’ఆ, నువ్వు, ‘అస్సలాము అలైక,’ అని పలుకు అని అన్నారు. అప్పుడు నేను, ‘మీరు అల్లాహ్‌ ప్రవక్తలా?’ అని అడిగాను, దానికి అతను (స), ‘నేను అల్లాహ్‌ ప్రవక్తను. ఆయన ఎటువంటి వాడంటే ఒకవేళ నీకేదైనా ఆపదవచ్చి దాన్ని తొలగించడానికి ఆయన్ను మొరపెట్టుకుంటే, ఆయన (త) నీ ఆపదను దూరంచేస్తాడు. ఒకవేళ మీపై కరవు-కాటకాలు వచ్చి, వాటిని తొలగించడానికి ఆయన్ను ప్రార్థిస్తే ఆయన (త) కరవు కాటకాలను దూరంచేస్తాడు. ఇంకా నీ కోసం నేలనుండి పచ్చిక బయళ్ళను మొలకెత్తింపజేస్తాడు. ఒకవేళ నీవు నీళ్ళుగానీ, పంటలు గానీ లేని బంజరు భూమిపై ఉంటే నీవు జనవాసాలకు దూరంగా ఉంటే, నీ వాహనం ఆ బంజరు భూమిపై తప్పిపోతే దాన్ని గురించి నువ్వు ఆయన్ను ప్రార్థిస్తే, ఆయన నీ వాహనాన్ని నీకు తిరిగి ఇప్పిస్తాడు,’ అని అన్నారు. అప్పుడు నేను, ‘తమరు నాకేదైనా ఉపదేశమివ్వండి,’ అని విన్నవించు కున్నాను. అప్పుడు ప్రవక్త (స), ‘నీవు ఎవ్వరినీ తిట్టకు,’ అని హితబోధ చేసారు. ఈ హితబోధ తర్వాత స్వతంత్ర వ్యక్తిని గానీ, బానిసను గానీ, ఒంటెను గానీ, మేకను గానీ తిట్టలేదు. ఆ తరువాత ప్రవక్త (స) రెండవ హితబోధగా, ‘ఏ పుణ్య కార్యాన్నీ నీవు సామాన్య మైనదిగా, చిన్నదిగా భావించకు, ఇంకా, నీవు నీ సోదరునితో కలిసి మాట్లాడినప్పుడు చిరునవ్వుతో మాట్లాడు, ఇది కూడా పుణ్యమే’ అని చెప్పారు. మూడవ ఉపదేశం ప్రవక్త(స) ఇలా ఉపదే శించారు, ‘నీ లుంగీని చీలమండలకు పైన ఉంచు, ఒకవేళ నీవు కోరితే చీలమండల వరకు ఉంచవచ్చు, చీల మండల క్రింద వరకు లుంగీని ఉంచరాదు. ఎందుకంటే చీల మండల క్రిందివరకు దుస్తులను ధరించడం అహంకారంగా పరిగణించబడుతుంది. అల్లాహ్‌ (త) కు అహంకారం అంటే గిట్టదు. ఒక వేళ మిమ్మల్ని ఎవరైనా తిట్టినా, చెడ్డపేరు పెట్టినా అవమానపరిచినా, మీ గురించి అతనికి తెలిసిన వాటిని బయటపెట్టినా, నీవు మాత్రం అతని లోపాలను ఎత్తిచూపకు, ఎందుకంటే నీకు చేసిన అవమానానికి తగిన శిక్ష అతనిపైనే పడుతుంది.’ [63] (అబూ దావూద్‌, తిర్మిజి’)

మరో ఉల్లేఖనంలో ”నీకు పుణ్యం లభిస్తుంది, అతనికి పాపం చుట్టుకుంటుంది” అని ఉంది.

1919 – [ 32 ] ( صحيح ) (1/599)

وَعَنْ عَائِشَةَ أَنَّهُمْ ذَبَحُوْا شَاةً فَقَالَ النَّبِيُّ صلى الله عليه وسلم: “مَا بَقِيَ مِنْهَا؟” قَالَتْ: مَا بَقِيَ مِنْهَا إِلَّا كَتِفُهَا قَالَ: “بَقِيَ كُلُّهَا غَيْرَ كَتِفِهَا”. رَوَاهُ التِّرْمِذِيُّ وَصَحَّحَهُ.

1919. (32) [1/599-దృఢం]

‘ఆయి’షహ్‌ (ర) కథనం: వారు ఒక మేకను జిబ’హ్‌ చేసారు. ఆ తరువాత ప్రవక్త (స), ‘మేక మాంసంలో నుండి ఏమైనా మిగిలి ఉందా?’ అని అడిగారు. ‘ఆయి’షహ్‌ (ర), ‘మాంసమంతా పంచివేయడం జరిగింది. కేవలం ఒక జబ్బ మాత్రమే మిగిలి ఉంది,’ అని అన్నారు. దానికి ప్రవక్త (స), ‘అంతా మిగిలి వుంది, అంటే అల్లాహ్‌ మార్గంలో పంచి వేయబడిన మాంసపు పుణ్యం మిగిలి ఉంది. ఇంట్లో తినడానికి ఉంచుకున్న తొడభాగం తప్ప,’ అని అన్నారు. [64] (తిర్మిజి’ / దృఢం)

1920 – [ 33 ] ( ضعيف ) (1/599)

وَعَنِ ابْنِ عَبَّاسٍ رضي الله عَنْهُمَا قَالَ: سَمِعْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ: “مَا مِنْ مُّسْلِمٍ كَسَا مُسْلِمًا ثَوْبًا إِلَّا كَانَ فِيْ حِفْظٍ مِّنَ اللهِ مَادَامَ عَلَيْهِ مِنْهُ خِرْقَةٌ”. رَوَاهُ أَحْمَدُ وَالتِّرْمِذِيُّ.

1920. (33) [1/599-బలహీనం]

ఇబ్నె ‘అబ్బాస్‌ (ర) కథనం: నేను ప్రవక్త (స) ను ఇలా అంటూ ఉండగా విన్నాను, ‘ఒక ముస్లిమ్‌ మరో ముస్లిమ్‌కి దుస్తులు దానంగా ఇస్తే, ఆ దుస్తుల భాగం కాని, ఒక ముక్కగానీ అతని శరీరంపై మిగిలి ఉన్నంత వరకు దుస్తులు ఇచ్చిన వాడు అల్లాహ్‌ రక్షణలో ఉంటాడు.’ (అ’హ్మద్‌, తిర్మిజి’)

1921 – [ 34 ] ( لم تتم دراسته ) (1/599)

وَعَنْ عَبْدِ اللهِ بْنِ مَسْعُوْدٍ يَرْفَعُهُ قَالَ: “ثَلَاثَةٌ يُّحِبُّهُمُ اللهُ: رَجُلٌ قَامَ مِنَ اللَّيْلِ يَتْلُوْا كِتَابَ اللهِ وَرَجُلٌ يَّتَصَدَّقُ بِصَدقَةٍ بِيَمِيْنِهِ يُخْفِيْهَا أُرَاهُ قَالَ: مِنْ شِمَالِهِ وَرَجُلٌ كَانَ فِيْ سَرِيَّةٍ فَاْنْهَزَمَ أَصْحَابُهُ فَاسْتَقْبَلَ الْعَدُوَّ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَقَالَ: هَذَا حَدِيْثٌ غَيْرُ مَحْفُوْظٍ أَحَدُ رُوَاتِهِ أَبُوْ بَكْرِ بْنُ عَيَّاشٍ كَثِيْرُ الْغَلَطِ .

1921. (34) [1/599-అపరిశోధితం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ మస్‌’ఊద్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం: ‘ముగ్గురు వ్యక్తులను అల్లాహ్‌ ప్రేమిస్తాడు, రాత్రి నమా’జు, ఖుర్ఆన్ పఠనం చేసేవాడు, కుడిచేత్తో దానంచేస్తే ఎడమచేతికి తెలియనియ్యనివాడు, సైన్యంలో ఉండి, తన సైన్యం ఓడిపోయినా, అతడు మాత్రం ఎదురొడ్డి శత్రువుతో పోరాడేవాడు. (తిర్మిజి’)

ఇంకా ఈ ‘హదీసు’ బలహీనమైనదని  దీని పరంపరలో ఒక ఉల్లేఖన కర్త, అబూకర్ ‘అయ్యాష్ అధికంగా పొరపాట్లు చేసేవాడని’ అన్నారు.

1922 – [ 35 ] ( ضعيف ) (1/600)

وَعَنْ أَبِيْ ذَرٍّ عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ: “ثَلَاثَةٌ يُّحِبُّهُمُ اللهُ وَثَلَاثَةٌ. يُّبْغِضُهُمُ اللهُ. فَأَمَّا الَّذِيْنَ يُحِبُّهُمُ اللهُ فَرَجُلٌ أَتَى قَوْمًا فَسَأَلَهُمْ بِاللهِ وَلَمْ يَسْأَلْهُمْ بِقَرَابَةٍ بَيْنَهُ وَبَيْنَهُمْ فَمَنَعُوْهُ فَتَخَلَّفَ رَجُلٌ بِأَعْيَانِهِمْ فَأَعْطَاهُ سِرًّا لَا يَعْلَمُ بِعَطِيَّتِهِ إِلَّا اللهُ وَالَّذِيْ أَعْطَاهُ وَقَوْمٌ سَارُوْا لَيْلَتَهُمْ حَتَّى إِذَا كَانَ النَّوْمُ أَحَبَّ إِلَيْهِمْ مِمَّا يُعْدَلُ بِهِ فَوَضَعُوْا رُءُوْسَهُمْ. فَقَامَ يَتَمَلَّقُنِيْ وَيَتْلُوْ آيَاتِيْ وَرَجُلٌ كَانَ فِيْ سَرِيَّةٍ فَلَقِيَ الْعَدُوَّ فَهَزَمُوْا وَأَقْبَلَ بِصَدْرِهِ حَتَّى يُقْتَلَ أَوْ يُفْتَحَ لَهُ وَالثَّلَاثَةُ الَّذِيْنَ يُبْغِضُهُمُ اللهُ الشَّيْخُ الزَّانِيْ وَالْفَقِيْرُ الْمُخْتَالُ وَالْغَنِيُّ الظُّلُوْمُ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَالنِّسَائِيُّ .مثله ولم يذكر و ثلاثة يبغضهم.

1922. (35) [1/600-బలహీనం]

అబూ జ’ర్ (ర) కథనం: ప్రవక్త(స) ప్రవచనం, ”ముగ్గురు వ్యక్తుల్ని అల్లాహ్(త) ప్రేమిస్తాడు. ఇంకా ముగ్గరు వ్యక్తుల్ని అల్లాహ్(త) అసహ్యించు కుంటాడు. అల్లాహ్(త) ప్రేమించేవారిలో, ఒక వ్యక్తి ఒక జాతివద్దకు వెళ్ళి, బంధుత్వపరంగా కాక అల్లాహ్(త) పేరుపై అడిగాడు. వారు అతనికేమీ ఇవ్వలేదు. కాని ఒకవ్యక్తి ఎవరూ చూడకుండా రహస్యంగా అతనికి ఇచ్చాడు. ఇది అతనికి, అల్లాహ్(త) కు మాత్రమే తెలుసు. కొందరు రాత్రంతా ప్రయాణం చేస్తూ ఉన్నారు. వారికి నిద్ర ముంచుకొచ్చింది, వారు తల నేలపై పెట్టి నిద్రపోయారు. ఒక వ్యక్తి లేచి వినయ విధేయతలతో అల్లాహ్ (త)ను ప్రార్ధిస్తూ, నా ఆయతులు పఠిస్తూ ఉన్నాడు. మూడవ వ్యక్తి సైన్యంలో ఉన్నాడు. శత్రువులతో యుధ్ధం జరిగింది, ఓడిపోయారు. కాని ఆ వ్యక్తి వీరోచితంగా పోరాడి చివరికి వీరమరణం పొందాడు, లేదా అతని ద్వారా విజయం లభించింది.

అల్లాహ్(త) అసహ్యించుకునే ముగ్గురు వ్యక్తులు: వ్యభిచారం చేసే ముసలివాడు. అహంకారంగల బిచ్చ గాడు. హింసించే ధనవంతుడు. [65](తిర్మిజి’, నసాయి’)

నసాయి’ అల్లాహ్ అసహ్యించుకునే ముగ్గురు గురించి ప్రస్తావించలేదు.

1923 – [ 36 ] ( ضعيف ) (1/600)

وَعَنْ أَنَسٍ عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ: “لَمَّا خَلَقَ اللهُ الْأَرْضَ جَعَلَتْ تَمِيْدُ فَخَلَقَ الْجِبَالَ. فَقَالَ بِهَا عَلَيْهَا فَاسْتَقَرَّتْ فَعَجِبَتِ الْمَلَائِكَةُ مِنْ شِدَّةِ الْجِبَالِ. فَقَالُوْا: يَا رَبِّ هَلْ مِنْ خَلْقِكَ شَيْءٌ أَشَدُّ مِنَ الْجِبَالَ؟ قَالَ نَعَمْ الْحَدِيْدُ. قَالُوْا: يَا رَبِّ هَلْ مِنْ خَلْقِكَ شَيْءٌ أَشَدُّ مِنَ الْحَدِيْدِ؟ قَالَ نَعَمْ النَّارُ. فَقَالُوْا: يَا رَبِّ هَلْ مِنْ خَلْقِكَ شَيْءٌ أَشَدُّ مِنَ النَّارِ؟ قَالَ: نَعَمْ. الْمَاءُ قَالُوْا يَا رَبِّ فَهَلْ مِنْ خَلْقِكَ شَيْءٌ أَشَدُّ مِنَ الْمَاءِ؟ قَالَ: نَعَمْ الرِّيْحُ. فَقَالُوْا: يَا رَبِّ هَلْ مِنْ خَلْقِكَ شَيْءٌ أَشَدُّ مِنَ الرِّيْحِ؟ قَالَ نَعَمْ ابْنُ آدَمَ تَصَدَّقَ صَدَقَةً بِيَمِيْنِهِ يُخْفِيْهَا مِنْ شَمَالِهِ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَقَالَ: هَذَا حَدِيْثٌ غَرِيْبٌ وَذُكِرَ حَدِيْثُ مُعَاذٍ: “الصَّدَقَةُ تُطْفِئُ الْخَطِيْئَةَ”.  فِيْ كِتَابِ الْإِيْمَانِ.

1923. (36) [1/600-బలహీనం]

అనస్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”అల్లాహ్‌ (త) భూమిని సృష్టించినపుడు అది కదలసాగింది. అప్పుడు అల్లాహ్‌ (త) కొండలను పర్వతాలను సృష్టించాడు. వాటిని భూమిపై నిలబెట్టాడు, అంటే మేకుల్లా పాతిపెట్టాడు. భూమి కదలడం ఆగిపోయింది. దైవదూతలు కొండల, పర్వతాల దృఢత్వాన్ని చూచి ఆశ్చర్యంచెందారు. అప్పుడు దైవదూతలు అల్లాహ్‌తో, ‘ఓ మా ప్రభూ! నీ సృష్టితాల్లో కొండలు, పర్వతాలు, రాళ్ళకన్నా దృఢమైన వస్తువులు కూడా ఉన్నాయా?’ అని ప్రశ్నించారు. అప్పుడు అల్లాహ్‌ (త), ‘అవును, ఇనుము ఉంది, ఇది కొండలు, రాళ్ళకంటే దృఢమైనది,’ అని అన్నాడు. మళ్ళీ దైవదూతలు, ‘ఓ మా ప్రభూ! నీ సృష్టితాల్లో ఇనుము కంటే దృఢమైన వస్తువు కూడా ఉందా?’ అని విన్నవించుకున్నారు. దానికి అల్లాహ్‌ (త), ‘అవును, అగ్ని ఉంది. ఇది ఇనుమును కూడా కరగదీస్తుంది,’ అని అన్నాడు. దైవదూతలు మళ్ళీ, ‘అగ్నికంటే దృఢమైన వస్తువు ఏదైనా ఉందా?’ అని ప్రశ్నించారు. దానికి అల్లాహ్‌ (త), ‘అవును నీరు ఉంది. ఇది అగ్నిని ఆర్పివేస్తుంది,’ అని అన్నాడు. మళ్ళీ దైవదూతలు, ‘నీటి కంటే కూడా గట్టి వస్తువు ఏదైనా ఉందా?’ అని ప్రశ్నించారు. అల్లాహ్‌ (త), ‘అవును గాలి ఉంది, ఇది నీటిని కూడా ఇంకి పోయేట్టు చేస్తుంది,’ అని అన్నాడు. మళ్ళీ దైవదూతలు, ‘ఓ మా ప్రభూ! ‘గాలికంటే కూడా శక్తిమంతమైన వస్తువు ఏదైనా ఉందా?’ అని ప్రశ్నించారు. అల్లాహ్‌ (త), ‘అవును మానవుడు ఉన్నాడు, కుడిచేతితో దానం చేస్తే ఎడమ చేతికి తెలియనివ్వడు.’ (తిర్మిజి’ – ఏకోల్లేఖనం)

‘సదఖహ్ పాపాలను చెరిపివేస్తుంది అనే ము’ఆజ్’ ‘హదీసు’ను కితాబుల్‌ ఈమాన్‌లో పేర్కొనడం జరిగింది.

—–

اَلْفَصْلُ الثَّالِثُ  మూడవ విభాగం 

1924 – [ 37 ] ( لم تتم دراسته ) (1/601)

عَنْ أَبِيْ ذَرٍّ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَا مِنْ عَبْدٍ مُّسْلِمٍ يُّنْفِقُ مِنْ كُلِّ مَالٍ لَّهُ زَوْجَيْنِ فِيْ سَبِيْلِ اللهِ إِلَّا اسْتَقْبَلَتْهُ حَجَبَةُ الْجَنَّةِ كُلُّهُمْ يَدْعُوْهُ إِلَى مَا عِنْدَهُ”. قُلْتُ: وَكَيْفَ ذَلِكَ؟ قَالَ: “إِنْ كَانَتْ إِبِلًا فَبَعِيْرَيْنِ وَإِنْ كَانَتْ بَقَرَةً فَبَقَرَتَيْنِ”. رَوَاهُ النَّسَائِيُّ .

1924. (37) [1/601-అపరిశోధితం]

అబూ జ’ర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ముస్లింలలో ఎవరైనా అల్లాహ్‌ మార్గంలో తన సంపదల నుండి రెండేసి ఖర్చుచేస్తే, తీర్పుదినం నాడు స్వర్గ-ద్వార పాలకులు, రక్షకులు ఆయనకు స్వాగతం పలుకుతారు వారిలో ప్రతి ఒక్కరూ తమ వద్ద ఉన్న వస్తువు వైపు పిలుస్తారు.” అబూ జ’ర్‌ కథనం, ‘రెండేసి అంటే అర్థం ఏమిటి?’ అని ప్రశ్నించారు. దానికి ప్రవక్త (స) ‘ఒకవేళ అతని వద్ద ఒంటెలుంటే రెండు ఒంటెలు ఇచ్చాడు, ఒకవేళ ఆవులు, గేదెలు ఉంటే, రెండు ఆవులు, రెండు గేదెలు ఇచ్చాడు.’ అని అన్నారు. (నసాయి’)

1925 – [ 38 ] ( صحيح ) (1/601)

وَعَنْ مَرْثَدِ بْنِ عَبْدِ اللهِ قَالَ: حَدَّثَنِيْ بَعْضُ أَصْحَابِ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم. أَنَّهُ سَمِعَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ: “إِنَّ ظِلَّ الْمُؤْمِنِ يَوْمَ الْقِيَامَةِ صَدَقَتُهُ”.  رَوَاهُ أَحْمَدُ.

1925. (38) [1/601-దృఢం]

ముర్‌స’ద్‌ బిన్‌ ‘అబ్దుల్లాహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) అనుచరుల్లోని కొందరు నాకు ఈ ‘హదీసు’ను ఇలా పేర్కొన్నారు, ”వారు ప్రవక్త (స)ను ఇలా ప్రవచిస్తూ ఉండగా విన్నారు: ”తీర్పు దినంనాడు విశ్వాసి ‘సదఖహ్ (దాన-ధర్మాలు) అతనికి నీడగా నిలుస్తుంది.” [66] (అ’హ్మద్‌)

1926 – [ 39 ] ( ضعيف ) (1/601)

وَعَنِ ابْنِ مَسْعُوْدٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَنْ وَسَّعَ عَلَى عِيَالِهِ فِيْ النَّفَقَةِ يَوْمَ عَاشُوْرَاءَ وَسَّعَ اللهُ عَلَيْهِ سَائِرِسَنَتِهِ”.

قَالَ: سُفْيَانُ: إِنَّا قَدْ جَرَّبْنَاهُ فَوَجَدْنَاهُ كَذَلِكَ. رَوَاهُ رَزِيْنٌ.

1926. (39) [1/601-బలహీనం]

 ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ మస్‌’ఊద్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ముహర్రమ్‌ 10వ తేదీన తన భార్యా బిడ్డ లకు పుష్కలంగా ఆహారం సమకూర్చే వారికి అల్లాహ్‌ (త) సంవత్సరమంతా పుష్కలంగా ఆహారం ప్రసాదిస్తాడు.

సుఫియాన్‌ సౌరీ ”మేము దీన్ని ఆచరించి చూశాము, అలాగే జరిగింది.” అని తన అభిప్రాయం వ్యక్తం చేసారు. (ర’జీన్‌)

1927 – [ 40 ] ( ضعيف ) (1/601)

وَرَوَى الْبَيْهَقِيُّ فِيْ شُعَبِ الْإِيْمَانِ عَنْهُ وَعَنْ أَبِيْ هُرَيْرَةَ وَأَبِيْ سَعِيْدٍ وَجَابِرٍ وَضَعَّفَهُ.

1927. (40) [1/601-బలహీనం]

దీన్నే బైహఖీ షు’అబుల్‌ ఈమాన్‌లో, ‘అబ్దుల్లా బిన్‌ మస్‌’ఊద్‌, అబూ హురైరహ్‌, అబూ స’యీద్‌, మరియు జాబిర్‌ల ద్వారా ఉల్లేఖించారు. అయితే దీన్ని బలహీనమైనదిగా పేర్కొన్నారు. [67]

1928 – [ 41 ] ( لم تتم دراسته ) (1/601)

وَعَنْ أَبِيْ أُمَامَةَ قَالَ: قَالَ أَبُوْ ذَرٍّ: يَا نَبِيَّ اللهِ أَرَأَيْتَ الصَّدَقَةَ مَاذَا هِيَ؟ قَالَ: “أَضْعَافٌ مُّضَاعَفَةٌ وَعِنْدَ اللهِ الْمَزِيْدُ”. رَوَاهُ أَحْمَدُ.

1928. (41) [1/601- అపరిశోధితం]

అబూ ఉమామహ్ (ర) కథనం: ప్రవక్త (స) ను ”ఓ అల్లాహ్‌ ప్రవక్తా! ‘సదఖహ్కు ప్రతిఫలం ఏమిటి? అని అబూ జ’ర్‌ (ర) ప్రశ్నించారు. ప్రవక్త (స) రెండింతలు, రెండింతలకు రెండింతలు. అల్లాహ్‌ వద్ద అంతకంటే ఎక్కువ పుణ్యం కూడా ఉంది. [68] (అ’హ్మద్‌).

=====

7بَابُ أَفْضَلِ الصَّدَقَةِ

7. అత్యుత్తమ దానం (సదఖహ్)

اَلْفَصْلُ الْأَوَّلُ   మొదటి విభాగం 

1929 – [ 1 ] ( صحيح ) (1/602)

عَنْ أَبِيْ هُرَيْرَةَ وَحَكِيْمِ بْنِ حِزَامٍ قَالَا: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “خَيْرُ الصَّدَقَةِ مَا كَانَ عَنْ ظَهْرِ غَنًى وَأَبْدَأَ بِمَنْ تَعُوْلُ”.  رَوَاهُ الْبُخَارِيُّ وَمُسْلِمٌ عَنْ حَكِيْمٍ وَحْدَهُ .

1929. (1) [1/602దృఢం ]

అబూ హురైరహ్‌ (ర), ‘హకీమ్‌ బిన్‌ ‘హి’జామ్‌ (ర)ల కథనం: ప్రవక్త (స) ప్రవచనం: అవసరాలు తీరగా చేసే ‘సదఖహ్ అన్నిటి కంటే ఉత్తమమైన ‘సదఖహ్. అందరి కంటే ముందు మీ సంరక్షణలో, మీ బాధ్యతా పరిధిలో ఉన్నవారికి ఇవ్వండి. మిగులుగా ఉన్నదే ఇతరులకు అగత్యపరులకు ఇవ్వండి. [69] (బు’ఖారీ)

1930 – [ 2 ] ( متفق عليه ) (1/602)

وَعَنْ أَبِيْ مَسْعُوْدٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِذَا أَنْفَقَ الْمُسْلِمُ نَفْقَةً عَلَى أَهْلِهِ وَهُوَ يَحْتَسِبُهَا كَانَتْ لَهُ صَدَقَةً”.

1930. (2) [1/602ఏకీభవితం ]

అబూ మస్‌’ఊద్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఒక ముస్లిమ్‌ తన భార్యా-బిడ్డలకు, బంధువులకు పుణ్యఫలాపేక్షతో ఖర్చుచేస్తే, అతనికి ‘సదఖహ్, పుణ్యం లభిస్తుంది.” (బు’ఖారీ, ముస్లిమ్)

1931 – [ 3 ] ( صحيح ) (1/602)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “دِيْنَارٌ أَنْفَقْتَهُ فِيْ سَبِيْلِ اللهِ وَدِيْنَارٌ أَنْفَقْتَهُ فِيْ رَقَبَةٍ وَدِيْنَارٌ تَصَدَّقْتَ بِهِ عَلَى مِسْكِيْنٍ وَّدِيْنَارٌ أَنْفَقْتَهُ عَلَى أَهْلِكَ أَعْظَمُهَا أَجْرًا الَّذِيْ أَنْفَقْتَهُ عَلَى أَهْلِكَ”.  رَوَاهُ مُسْلِمٌ.

1931. (3) [1/602దృఢం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”అల్లాహ్‌ మార్గంలో నీవు ఖర్చుచేసే దీనారు, బానిసను విడుదలచేసేందుకు నీవు ఖర్చుచేసే దీనారు, ఒక నిరుపేదకు నీవు ‘సదఖహ్ చేసే దీనారు, నీ భార్యా-బిడ్డల కొరకు నీవు ఖర్చుచేసే దీనారు, వీటన్నిటిలో — పుణ్యపరంగా చూస్తే–నీ భార్యా-బిడ్డల కొరకు ఖర్చుచేసిన దీనారే ఉత్తమమైనది.” [70] (ముస్లిమ్‌)

1932 – [ 4 ] ( صحيح ) (1/602)

وَعَنْ ثَوْبَانَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم:” أَفْضَلُ دِيْنَارٍ يُّنْفِقُهُ الرَّجُلُ دِيْنَارٌ يُّنْفِقُهُ عَلَى عِيَالِهِ وَدِيْنَارٌ يُّنْفِقُهُ عَلَى دَابَّتِهِ فِيْ سَبِيْلِ اللهِ وَدِيْنَارٌ يُّنْفِقُهُ عَلَى أَصْحَابِهِ فِيْ سَبِيْلِ اللهِ. رَوَاهُ مُسْلِمٌ .

1932. (4) [1/602 దృఢం]

సౌ’బాన్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”అన్నిటి కంటే తన భార్యా-బిడ్డలపై ఖర్చుచేసే దీనారే ఉత్తమమైనది. అదేవిధంగా దైవమార్గంలో తన జంతువులపై ఖర్చుచేసే దీనార్ ఉత్తమమైనది. దైవ మార్గంలో పోరాడే తన మిత్రులపై ఖర్చుచేసే దీనార్ ఉత్తమమైనది. [71] (ముస్లిమ్‌)

1933 – [ 5 ] ( متفق عليه ) (1/602)

وَعَنْ أُمِّ سَلَمَةَ قَالَتْ: قُلْتُ: يَا رَسُوْلَ اللهِ أَلِيْ أَجْرٌ أَنْ أُنْفِقَ عَلَى بَنِيْ أَبِيْ سَلَمَةَ؟ إِنَّمَا هُمْ بَنِيَّ فَقَالَ: “أَنْفِقِيْ عَلَيْهِمْ فَلَكِ أَجْرُ مَا أَنْفَقْتِ عَلَيْهِمْ”.

1933. (5) [1/602ఏకీభవితం]

ఉమ్మె సలమహ్ (ర) కథనం: ఆమె, ‘ఓ అల్లాహ్‌ ప్రవక్తా! ఒకవేళ నేను నా మొదటి భర్త అబూ సలమహ్ కొడుకులపై ఖర్చుచేస్తే — ఎందుకంటే వారు అనాథులు, నా కొడుకులు కూడాను — నాకు పుణ్యం దక్కుతుందా? అని విన్నవించుకుంది. ప్రవక్త (స) నీవు వారి గురించి ఖర్చుచేయి. ఆ అనాథ పిల్లలపై నువ్వు ఖర్చుచేసినందుకు పుణ్యం లభిస్తుంది’ అని అన్నారు. (బు’ఖారీ, ముస్లిమ్‌)

1934 – [ 6 ] ( متفق عليه ) (1/603)

وَعَنْ زَيْنَبَ امْرَأَةِ عَبْدِ اللهِ بْنِ مَسْعُوْدٍ قَالَتْ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “تَصَدَّقْنض يَا مَعْشَرَ النِّسَاء وَلَوْ مِنْ حُلِيِّكُنَّ”. قَالَتْ فَرَجَعْتُ إِلَى عَبْدِ اللهِ فَقُلْتُ إِنَّكَ رَجُلٌ خَفِيْفٌ ذَاتُ الْيَدِ وَإِنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم قَدْ أَمَرَنَا بِالصَّدَقَةِ فَأْتِهِ فَاسْأَلْهُ فَإِنْ كَانَ ذَلِكَ يُجْزِيُ عَنِّيْ وَإِلَّا صَرَفْتُهَا إِلَى غَيْرِكُمْ. قَالَتْ: فَقَالَ لِيْ عَبْدُ اللهِ: بَلْ ائْتِيْهِ أَنْتِ. قَالَتْ فَانْطَلَقْتُ فَإِذَا امْرَأَةٌ مِّنَ الْأَنْصَارِ بِبَابِ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم حَاجَتِيْ حَاجَتُهَا قَالَتْ: وَكَانَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم قَدْ أُلْقِيَتْ عَلَيْهِ الْمَهَابَةُ. فَقَالَتْ: فخَرَجَ عَلَيْنَا بِلَالٌ. فَقُلْنَا لَهُ: اِئْتِ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم. فَأَخْبِرْهُ أَنَّ امْرَأَتَيْنِ بِالْبَابِ تَسْأَلَانِكَ أَتُجْزِئُ الصَّدَقَةُ عَنْهُمَا عَلَى أَزْوَاجِهِمَا وَعَلَى أَيْتَامٍ فِيْ حُجُوْرِهُمَا وَلَا تُخْبِرْهُ مَنْ نَّحْنُ. قَالَتْ فَدَخَلَ بِلَالٌ عَلَى رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم فَسَأَلَهُ. فَقَالَ لَهُ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَنْ هُمَا”. فَقَالَ امْرَأَةٌ مِّنَ الْأَنْصَارِ وَزَيْنَبُ. فَقَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “أَيَّ الزَّيَانِبِ”. قَالَ امْرَأَةُ عَبْدِ اللهِ. فَقَالَ لَهُ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَهُمَا أَجْرَانِ أَجْرُ الْقَرَابَةِ وَأَجْرُ الصَّدَقَةِ”. وَاللَّفْظُ لِمُسْلِمٍ .

1934. (6) [1/603ఏకీభవితం]

 ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ మస్‌’ఊద్‌ (ర) భార్య ‘జైనబ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ‘ఓ స్త్రీలారా! మీరు దానధర్మాలు చేయండి. మీ ఆభరణాల నుండైనా సరే’ అని హితబోధ చేసారు. ‘జైనబ్‌ ఇలా అంటున్నారు: ‘అది విని నేను నా భర్త ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ మస్‌’ఊద్‌ (ర) వద్దకు వచ్చి మీరు చాలా పేదవారు, ప్రవక్త (స) మమ్మల్ని దానధర్మాలు చేయమని ఆదేశించారు. మీరు ప్రవక్త (స) వద్దకు వెళ్ళి ఈ సమస్యను విన్నవించుకోండి, ఒకవేళ నేను మీకు, మీ సంతానానికి ధర్మం చేస్తే నాకు పుణ్యం లభిస్తుందా లేదా? ఇంకా ఇది నా తరఫున సరిపోతుందా లేదా? ఒకవేళ ఈ ‘సదఖహ్ సరిపోతుందంటే నేను ఇచ్చి వేస్తాను. లేకపోతే మీతోపాటు ఇతరులకు కూడా ఇస్తాను,’ అని విన్నవించుకుంది. అది విని నా భర్త ‘అబ్దుల్లాహ్‌, ‘నువ్వే వెళ్ళి ఈ సమస్యకు పరిష్కారం అడుగు,’ అని అన్నారు. నేను సమస్య పరిష్కారం అడగటానికి ప్రవక్త (స) వద్దకు వెళ్ళాను. ఆయన ద్వారం వద్ద ఒక అ’న్సారీ స్త్రీని చూచాను. ఆమె కూడా ఆ సమస్య గురించే వచ్చి ఉంది. ‘జైనబ్‌ కథనం: ”ప్రవక్త (స) లో అసామాన్యమైన హోదా కనబడేది. ప్రతి వ్యక్తి ప్రవక్త (స) వద్దకు వెళ్ళడానికి భయపడేవాడు. అందువల్లే మాకు లోపలికి వెళ్ళడానికి ధైర్యం చాలలేదు. చేసేది లేక ద్వారం వద్దే నిలబడ్డాము. ఇంతలో బిలాల్‌ లోపలి నుండి బయటకు వచ్చారు. అప్పుడు మేము బిలాల్‌తో, ‘నీవు ప్రవక్త (స) వద్దకు వెళ్ళి ద్వారం వద్ద ఇద్దరు స్త్రీలు నిలబడి ఉన్నారు, వారు ఇలా ప్రశ్నిస్తు న్నారు, ‘ఒకవేళ మేము మా భర్తలకు, మా సంరక్షణలో ఉన్న అనాథపిల్లలకు ‘సదఖహ్ ఇస్తే సరి పోతుందా?’ అని అడగమని, అయితే మా గురించి ప్రస్తావించవద్దని చెప్పి పంపారు. బిలాల్‌ ప్రవక్త (స) వద్దకు వెళ్ళారు, మా సందేశాన్ని అందజేసారు. ప్రవక్త (స) బిలాల్‌ను, ‘ఆ ఇద్దరు స్త్రీలు ఎవరు,’ అని అడిగారు. దానికి బిలాల్‌, ‘ఒకామె అ’న్సారీ స్త్రీ, మరొక స్త్రీ ‘జైనబ్‌’ అని అన్నారు. ప్రవక్త (స) బిలాల్‌తో, ‘ ‘జైనబ్‌ పేరుగల స్త్రీలు చాలామంది స్త్రీలు ఉన్నారు. మరి ఏ జైనబ్‌,’ అని అన్నారు. వెంటనే బిలాల్‌ (ర) ‘ ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ మస్‌’ఊద్‌ (ర) భార్య’ అని అన్నారు. ప్రవక్త (స) బిలాల్‌ను వెళ్ళి వారిద్దరి ‘సదఖహ్కు రెట్టింపు పుణ్యం లభిస్తుందని, ఒకటి బంధుత్వానిది, మరొకటి ‘సదఖహ్ది,’ అని చెప్పమన్నారు. [72] (బు’ఖారీ, ముస్లిమ్‌)

1935 – [ 7 ] ( متفق عليه ) (1/603)

وَعَنْ مَيْمَوُنَةَ بِنْتِ الْحَارِثِ: أَنَّهَا أَعْتَقَتْ وَلِيْدَةً فِيْ زَمَانِ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم فَذَكَرَتْ ذَلِكَ لِرَسُوْلِ اللهِ صلى الله عليه وسلم فَقَالَ: “لَوْ أَعْطَيْتِهَا أَخْوَالَكِ كَانَ أَعْظَمَ لِأَجْرِكِ”.  

1935. (7) [1/603ఏకీభవితం]

మైమూనహ్ బిన్‌తె ‘హారిస్‌’ (ర) ప్రవక్త (స) కాలంలో ఒక బానిసరాలిని విడుదలచేసారు. దాన్ని గురించి ప్రవక్త (స)తో ప్రస్తావించారు. అప్పుడు ప్రవక్త (స), ”ఒకవేళ నువ్వు ఆ బానిసరాలును నీ మామలకు ఇచ్చి ఉంటే నీకు అత్యధిక పుణ్యం లభించేది,” అని అన్నారు. [73] (బు’ఖారీ, ముస్లిమ్‌)

1936 – [ 8 ] ( صحيح ) (1/603)

وَعَنْ عَائِشَةَ قَالَتْ: يَا رَسُوْلَ اللهِ إِنَّ لِيْ جَارَيْنِ فَإِلَى أَيِّهِمَا أُهْدِيْ؟ قَالَ: “إِلَى أَقْرَبِهِمَا مِنْكَ بَابًا”.  رَوَاهُ الْبُخَارِيُّ .

1936. (8) [1/603దృఢం]

‘ఆయి’షహ్‌ (ర) కథనం: నేను ప్రవక్త (స)ను ఓ అల్లాహ్‌ ప్రవక్తా! నాకు ఇద్దరు పొరుగువారు ఉన్నారు. ఒకవేళ నేను కానుక పంపాలంటే, అందరికంటే ముందు ఎవరికి పంపాలి అని విన్నవించుకున్నాను. దానికి ప్రవక్త (స), ‘ఎవరి ద్వారం నీ ద్వారానికి అతి దగ్గరగా ఉంటే వారికి ముందు పంపు,’ అని హితబోధ చేసారు. (బు’ఖారీ)

1937 – [ 9 ] ( صحيح ) (1/604)

وَعَنْ أَبِيْ ذَرٍّ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِذَا طَبَخْتَ مَرَقَةً فَأَكْثِرْ مَاءَهَا وَتَعَاهَدْ جِيْرَانَكَ”. رَوَاهُ مُسْلِمٌ .

1937. (9) [1/604దృఢం]

అబూ జ’ర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ”మీరు కూర వండితే, దానిలో కొంత నీళ్ళు అధికంగా వెయ్యండి. ఇరుగు పొరుగు వారిని కూడా గుర్తుంచుకొండి. అంటే వారికీ పంపండి” అని ఉపదేశించారు. (ముస్లిమ్‌)

—–

اَلْفَصْلُ الثَّانِيْ  రెండవ విభాగం 

1938 – [ 10 ] ( لم تتم دراسته ) (1/604)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: يَا رَسُوْلَ اللهِ أَيُّ الصَّدَقَةِ أَفْضَلَ؟ قَالَ: “جُهْدُ الْمُقِلِّ وَابْدَأْ بِمَنْ تَعُوْلُ” .رَوَاهُ أَبُوْ دَاوُدَ.

1938. (10) [1/604అపరిశోధితం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ”అతను ప్రవక్త (స)ను ”ఓ అల్లాహ్‌ ప్రవక్తా! అన్నిటికంటే ఉత్తమమైన ‘సదఖహ్ ఏది? అని విన్నవించుకున్నారు. దానికి ప్రవక్త (స) ‘తక్కువ ధనం ఉన్నవాడు తన స్థోమతకు తగ్గట్టు చేసే ‘సదఖహ్ ఉత్తమమైన ‘సదఖహ్, అందరి కంటే ముందు నీ సంరక్షణలో ఉన్నవారికి ఇవ్వాలి. [74]  (అబూ దావూద్‌)

1939 – [ 11 ] ( صحيح ) (1/604)

وَعَنْ سَلْيمَانَ بْنِ عَامِرٍقَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “الصَّدَقُةُ عَلَى الْمِسْكِيْنِ صَدَقَةٌ وَهِيَ عَلَى ذِي الرَّحِمِ ثِنْتَانِ: صَدَقَةٌ وَّصِلَةٌ”. رَوَاهُ أَحْمَدُ وَالتِّرْمِذِيُّ وَالنَّسَائِيُّ وَابْنُ مَاجَهُ وَالدَّارَمِيُّ .

1939. (11) [1/604దృఢం]

సులైమాన్‌ బిన్‌ ‘ఆమిర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”పేదవానికి ‘సదఖహ్ ఇస్తే, ఒక ‘సదఖహ్ పుణ్యం లభిస్తుంది. బంధువులకు, సన్నిహితులకు ‘సదఖహ్ చేస్తే రెండు ‘సదఖహ్ ల పుణ్యం లభిస్తుంది. ఒకటి ‘సదఖహ్ పుణ్యం, రెండవది బంధుత్వం పుణ్యం. (అ’హ్మద్‌, తిర్మిజి’, ఇబ్నె మాజహ్, నసాయి’, దారమి)

1940 – [ 12 ] ( صحيح ) (1/604)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: جَاءَ رَجُلٌ إِلَى النَّبِيِّ صلى الله عليه وسلم فَقَالَ: عِنْدِيْ دِيْنَارٌ فَقَالَ: “أَنْفِقْهُ عَلَى نَفْسِكَ”. قَالَ: عِنْدِيْ آخَرُ. قَالَ: “أَنْفِقْهُ عَلَى وَلَدِكَ”. قَالَ: عِنْدِيْ آخَرُ .قَالَ: “أَنْفِقْهُ عَلَى أَهْلِكَ”. قَالَ: عِنْدِيْ آخَرُ. قَالَ: “أَنْفِقْهُ عَلَى خَادِمِكَ”. قَالَ: عِنْدِيْ آخَرُ قَالَ: “أَنْتَ أَعْلَمُ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ وَالنَّسَائِيُّ.

1940. (12) [1/604దృఢం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) వద్దకు వచ్చి ఒక వ్యక్తి నా దగ్గర ఒక దీనారు ఉంది’ అని అన్నాడు. ప్రవక్త (స) ఆ వ్యక్తితో, ‘నీ కోసం ఖర్చు పెట్టుకో,’ అని అనగా, అతడు, ‘నా వద్ద మరో దీనారు ఉంది,’ అని అన్నాడు. ప్రవక్త (స), ‘నీ సంతానం కొరకు ఖర్చుచేయి,’ అని అన్నారు. ఆ వ్యక్తి మళ్ళీ, ‘నా వద్ద మరో దీనారు ఉంది,’ అని అన్నాడు, దానికి ప్రవక్త (స), ‘నీ భార్య కొరకు ఖర్చు చేయి,’ అని అన్నారు. మళ్ళీ ఆ వ్యక్తి నా వద్ద మరో దీనారు ఉంది,’ అని అన్నాడు. దానికి ప్రవక్త (స), ‘నీ సేవకుని పై ఖర్చుచేయి,’ అని అన్నారు. ఆ వ్యక్తి మళ్ళీ, ‘నా వద్ద మరో దీనారు,’ ఉంది అన్నాడు. ప్రవక్త (స), ‘నీకే ఎక్కువ తెలుసు ఎక్కడ ఖర్చు చేయాలో,’ అని అన్నారు. (అబూ దావూద్‌, నసాయి’)

1941 – [ 13 ] ( صحيح ) (1/604)

وَعَنِ أبْنِ عَبَّاسٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “أَلَا أُخْبِرُكُمْ  بِخَيْرِالنَّاسِ؟ رَجُلٌ مُّمْسِكٌ بِعِنَانِ فَرَسِهِ فِيْ سَبِيْلِ اللهِ. أَلَا أُخْبِرُكُمْ بِالَّذِيْ يَتْلُوْهُ؟ رَجُلٌ مُّعْتَزِلٌ فِيْ غَنِيْمَةٍ لَهُ يُؤَدِّيَ حَقَّ اللهِ فِيْهَا.أَلَا أُخْبِرُكُمْ بِشَرِّ النَّاسِ رَجُلٌ يَسْأَلُ بِاللهِ وَلَا يُعْطِيْ بِهِ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَالنَّسَائِيُّ وَالدَّارَمِيُّ .

1941. (13) [1/604దృఢం]

ఇబ్నె ‘అబ్బాస్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”నేను మీకు అందరికంటే ఉత్తమవ్యక్తిని చూపెట్టనా అంటే మీకు అందరికంటే ఉత్తమ వ్యక్తిని చూపిస్తాను. అతడు అల్లాహ్‌(త) మార్గంలో పోరాటానికి తన గుర్రం కళ్ళెం పట్టుకొని సిద్ధంగా ఉన్నాడు. ఆ తరువాత ప్రవక్త (స) అతని తర్వాత ఉత్తమ స్థానానికి చేరువగా ఉన్న వ్యక్తి గురించి చెప్పనా? అతడు కొన్ని మేకలు తీసుకొని ప్రజల నుండి వేరుగా ఉన్నాడు. ఆ మేకల్లో నుండి అల్లాహ్‌(త) హక్కును నెరవేరుస్తూ ఉంటాడు’ అని అన్నారు. ఆ తర్వాత మళ్ళీ నేను మీకు అందరికంటే నీచుడ్ని చూపెట్టనా అంటూ ‘అల్లాహ్(త) పేరు చెప్పి అడిగినా ఇవ్వని వాడు అందరికంటే నీచుడు’ అని అన్నారు. (తిర్మిజి’, నసాయి’, దారమి)

1942 – [ 14 ] ( لم تتم دراسته ) (1/605)

وَعَنْ أُمِّ بُجَيْدٍ قَالَتْ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “رُدُّوا السَّائِلَ وَلَوْ بِظِلْفٍ مُّحْرَقٍ”. رَوَاهُ مَالِكٌ وَالنَّسَائِيُّ وَ التِّرْمِذِيُّ وَأَبُوْ دَاوُدَ مَعْنَاهُ.

1942. (14) [1/605అపరిశోధితం]

ఉమ్మె బుజైద్‌ (ర) కథనం: ప్రవక్త(స) ప్రవచనం: ”అడిగిన వారికి ఏదైనా కొంత ఇచ్చి పంపండి, కాలిన గిట్ట అయినా సరే. (మాలిక్‌ నసాయి’ తిర్మిజీ’, అబూ దావూద్‌)

తిర్మిజీ’, అబూ దావూద్‌లు దీని అనువాదాన్ని ఉల్లేఖించారు. అంటే అడిగిన వారికి ఉత్తచేతులతో పంపకండి. ఉన్నది ఎంత సామాన్య వస్తువైనా ఇచ్చి పంపించండి. కాలిన మేక గిట్ట చాలా సామాన్యమైనది. ఉంటే అదే ఇచ్చి పంపించండి.

1943 – [ 15 ] ( صحيح ) (1/605)

وَعَنِ ابْنِ عُمَرَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَنِ اسْتَعَاذَ مِنْكُمْ بِاللهِ فَأَعِيْذُوْهُ وَمَنْ سَأَلَ بِاللهِ فَأَعْطُوْهُ وَمَنْ دَعَاكُمْ فَأَجِيْبُوْهُ وَمَنْ صَنَعَ إِلَيْكُمْ مَعْرُوْفًا فَكَافِئُوْهُ فَإِنْ لَّمْ تَجِدُوْا مَا تُكَافِئُوْهُ فَادْعُوْا لَهُ حَتَّى تُرَوْا أَنْ قَدْ كَافَأْتُمُوْهُ”. رَوَاهُ أَحْمَدُ وَأَبُوْ دَاوُدَ وَالنَّسَائِيُّ  .

1943. (15) [1/605దృఢం]

ఇబ్నె ‘ఉమర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఎవరైనా అల్లాహ్‌(త) పేరు చెప్పి మిమ్మల్ని శరణు కోరితే, అతనికి శరణు ఇవ్వండి. అదేవిధంగా ఎవరైనా అల్లాహ్‌(త) పేరుతో అడిగితే, అతనికీ ఇవ్వండి. ఎవరైనా మిమ్మల్ని విందుకు ఆహ్వానిస్తే ఆహ్వా నాన్నీ స్వీకరించండి, ఎవరైనా మీకు ఉపకారం చేస్తే, మీరు కూడా అతని పట్ల ఉపకారం చేసి బదులు తీర్చి వేయండి. బదులుకు ఏ వస్తువూ లేకపోతే, అతనిపట్ల దానికి తగ్గట్టు అతని గురించి దు’ఆ చేయండి.” (అ’హ్మద్‌, అబూ దావూద్‌, నసాయి’)

1944 – [ 16 ] ( ضعيف ) (1/605)

وَعَنْ جَابِرٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَا يَسْأَلُ بِوَجْهِ اللهِ إِلَّا الْجَنَّةَ”.  رَوَاهُ أَبُوْ دَاوُدَ .

1944. (16) [1/605బలహీనం]

జాబిర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం: ”అల్లాహ్‌ పేరుతో అడక్కూడదు. కాని స్వర్గం మాత్రమే.” [75] (అబూ దావూద్‌)

—–

اَلْفَصْلُ الثَّالِثُ  మూడవ విభాగం 

1945 – [ 17 ] ( متفق عليه ) (1/606)

عَنْ أَنَسٍ قَالَ: كَانَ أَبُوْ طَلْحَةَ أَكْثَرَ أَنْصَارِيْ بِالْمَدِيْنَةِ مَالًا مِّنْ نَخْلٍ وَكَانَ أَحَبُّ أَمْوَالِهِ إِلَيْهِ بَيْرُحَاءُ وَكَانَتْ مُسْتَقْبِلَ الْمَسْجِدِ وَكَانَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم يَدْخُلُهَا وَيَشْرَبُ مِنْ مَّاءِ فِيْهَا طَيِّبٍ. قَالَ أَنَسٌ فَلَمَّا نَزَلَتْ (لَنْ تَنَالُوا الْبِرَّ حَتَّى تُنْفِقُوْا مِمَّا تُحِبُّوْنَ. 3: 92) قَامَ أَبُوْ طَلْحَةَ. فَقَالَ: يَا رَسُوْلُ اللهِ إِنَّ اللهَ تَعَالى يَقُوْلُ: (لَنْ تَنَالُوا الْبِرَّ حَتَّى تُنْفِقُوْا مِمَّا تُحِبُّوْنَ) وَإِنَّ أَحَبَّ مَالِيْ إِلَيَّ بَيْرُحَاءُ وَإِنَّهَا صَدَقَةٌ لِلّهِ أَرْجُوْ بِرَّهَا وَذُخْرَهَا عِنْدَ اللهِ فَضَعْهَا يَا رَسُوْلَ اللهِ حَيْثُ أَرَاكَ اللهُ. فَقَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “بَخْ بَخْ ذَلِكَ مَالٌ رَّابِحٌ وَقَدْ سَمِعْتُ مَا قُلْتَ وَإِنِّيْ أَرَى أَنْ تَجْعَلَهَا فِيْ الْأَقْرَبِيْنَ”. فَقَالَ أَبُوْ طَلْحَةَ: أَفْعَلُ يَا رَسُوْلَ اللهِ فَقَسَمَهَا أَبُوْ طَلْحَةَ فِيْ أَقَارِبِهِ وَفِيْ بَنِيْ عَمِّه.

1945. (17) [1/606ఏకీభవితం]

అనస్‌ (ర) కథనం: ”మదీనహ్ అ’న్సారుల్లో ఖర్జూరపు తోటలరీత్యా అబూ ‘తల్‌’హా అందరికంటే గొప్ప ధనవంతులు. అతనికి బైరు’హా’ అనే పేరుగల తోట ఉండేది. ఇది అన్నిటికంటే అతనికి చాలా ప్రియమైనది. ఇది మస్జిదె నబవీ ముందు ఉండేది. ప్రవక్త (స) ఈ తోటలోనికి వెళ్ళేవారు. అందులో నుండి మంచి నీరు త్రాగేవారు: ”మీకు అత్యంత ప్రీతికరమైన దానిని మీరు (అల్లాహ్ మార్గంలో) ఖర్చుపెట్టనంత వరకు మీరు పుణ్యాత్ములు (ధర్మ నిష్ఠాపరులు) కాలేరు…” (ఆల ఇమ్రాన్, 3:92) అనే ఆయతు అవతరించినపుడు అబూ ‘తల్‌’హా ప్రవక్త (స) వద్దకు వచ్చి, ”ఓ అల్లాహ్‌ ప్రవక్తా! అల్లాహ్‌ (త): లన్తనాలుల్బిర్రహత్తా తున్ఫిఖూ మిమ్మా తుహిబ్బూన్‌’ అని ఆదేశిస్తున్నాడు. నా బైరు’హా’ తోట నాకు అన్నిటికంటే చాలా ప్రియమైనది. నేను దాన్ని అల్లాహ్‌ మార్గంలో ‘సదఖహ్ చేస్తున్నాను, దానికి ప్రతిఫలం లభిస్తుందని ఆశిస్తున్నాను, దాన్ని అల్లాహ్‌ (త) వద్ద పొందుతానని నమ్మకం కలిగి ఉన్నాను. ఓ అల్లాహ్‌ ప్రవక్తా! మీరు ఎక్కడ తలచుకుంటే అక్కడ దాన్ని వినియోగించండి,’ అని అన్నారు. ప్రవక్త (స) అది విని, ‘చాలా మంచిది, చాలా మంచిది, ఇది లాభం చేకూర్చే ధనం, నీవు చెప్పావు, నేను విన్నాను. అయితే నువ్వు ఈ తోటను నీ బంధువులకు ఇచ్చి వేస్తే బాగుంటుంది అని అనుకుంటాను,’ అని అన్నారు. దానికి అబూ ‘తల్’హా, ‘ఓ అల్లాహ్‌ ప్రవక్తా! మీరు చెప్పినట్లే చేస్తాను.’ అని అబూ ‘తల్‌’హా ఆ తోటను తన బంధువులకు, చిన్నాన్న కొడుకులకు పంచివేసారు. (బు’ఖారీ, ముస్లిమ్‌)

1946 – [ 18 ] ( لم تتم دراسته ) (1/606)

وَعَنْ أَنَسٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “أَفْضَلُ الصَّدَقَةِ أَنْ تُشْبِعَ كَبِدًا جَائِعًا”. رَوَاهُ الْبَيْهَقِيُّ فِيْ شُعَبِ الْإِيْمَانِ.

1946. (18) [1/606అపరిశోధితం]

అనస్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఆకలి గొన్న వారికి కడుపునిండా అన్నం పెట్టటం అన్నిటి కంటే ఉత్తమమైన ‘సదఖహ్, మానవులైనా, జంతువు లైనా.” (బైహఖీ-షు’అబిల్ ఈమాన్)

=====

8- بَابُ صَدَقَةِ الْمَرْأَةِ مِنْ مَّالِ الزَّوْجِ

8. భర్త ధనం నుండి భార్య చేసే ఖర్చు

اَلْفَصْلُ الْأَوَّلُ మొదటి విభాగం 

1947 – [ 1 ] ( متفق عليه ) (1/607)

وَعَنْ عَائِشَةَ رَضِيَ اللهُ عَنْهَا قَالَتْ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِذَا أَنْفَقَتِ الْمَرْأَةِ مِنْ طَعَامٍ بَيْتِهَا غَيْرَ مُفْسِدَةٍ كَانَ لَهَا أَجْرُهَا بِمَا أَنْفَقَتْ وَلِزَوْجِهَا أَجْرُهُ بِمَا كَسَبَ. وَلِلْخَازِنِ مِثْلُ ذَلِكَ لَا يَنْقُصُ بَعْضُهُمْ أَجْرَ بَعْضٍ شَيْئًا”.

1947. (1) [1/60ఏకీభవితం]

‘ఆయి’షహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఒకవేళ ఎవరైనా స్త్రీ తన ఇంటి అన్నంలో నుండి ఖర్చుచేస్తే, ‘సదఖహ్ చేస్తే వృథా ఖర్చుచేసే ఉద్దేశం లేకుండా ఉంటే ఆమెకు ‘సదఖహ్ పుణ్యం లభిస్తుంది. ఆమె భర్తకు దాని సంపాదన పుణ్యం లభిస్తుంది. అదేవిధంగా కోశాధికారికి కూడా పుణ్యం లభిస్తుంది. వారి పుణ్యాలలో ఒకరి పుణ్యం మరొకరి కంటే తగ్గించటం జరగదు. అంటే ప్రతి ఒక్కరికీ పూర్తి పుణ్యం లభిస్తుంది. [76] (బు’ఖారీ, ముస్లిమ్‌)

1948 – [ 2 ] ( متفق عليه ) (1/607)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِذَا أَنْفَقَتِ الْمَرْأَةُ مِنْ كَسْبِ زَوْجِهَا مِنْ غَيْرِ أَمْرِهِ فَلَهَا نِصْفُ أَجْرِهِ”.

1948. (2) [1/607ఏకీభవితం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”భార్య, భర్త అనుమతిలేనిదే అతని ధనంలో నుండి ఖర్చుచేస్తే ఆమెకు సగం పుణ్యం లభిస్తుంది. (బు’ఖారీ, ముస్లిమ్‌)

1949 – [ 3 ] ( متفق عليه ) (1/607)

وَعَنْ أَبِيْ مُوْسَى الْأَشْعَرِيِّ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “اَلْخَازِنُ الْمُسْلِمُ الْأَمِيْنُ الَّذِيْ يُعْطِيْ مَا أُمِرَ بِهِ كَامِلًا مُّوَفَّرًا طَيِّبَةً بِهِ نَفْسُهُ فَيَدْفَعُهُ إِلَى الَّذِيْ أُمِرَ لَهُ بِهِ أَحَدُ الْمُتَصَدِّقِيْنَ”.

1949. (3) [1/607ఏకీభవితం]

అబూ మూసా అష్‌’అరీ (ర) కథనం: ప్రవక (స) ప్రవచనం: నమ్మకస్తుడైన ముస్లిమ్‌ గుమాస్తా తన యజమాని ఆదేశం మేరకు సంతోషంతో ఇచ్చి నట్లయితే, అతడు కూడా ‘సదఖహ్ చేసేవారిలో ఒకడు. [77] (బు’ఖారీ, ముస్లిమ్‌)

1950 – [ 4 ] ( متفق عليه ) (1/607)

وَعَنْ عَائِشَةَ رَضِيَ اللهُ عَنْهَا قَالَتْ: إِنَّ رَجُلًا قَالَ لِلنَّبِيِّ صلى الله عليه وسلم: إِنَّ أُمِّيْ أُفْتَلَتَتْ نَفْسَهَا وَأَظُنُّهَا لَوْ تَكَلَّمَتْ تصَدَّقَتْ فَهَلْ لَهَا أَجْرٌ إِنْ تَصَدَّقْتُ عَنْهَا؟ قَالَ: نَعَمْ”.

1950. (4) [1/607ఏకీభవితం]

‘ఆయి’షహ్‌ (ర) కథనం: ”ఒక వ్యక్తి ప్రవక్త (స) ను, ”నా తల్లి అకస్మాత్తుగా మరణించింది, ఒకవేళ ఆమెకు అవకాశం ఉండివుంటే దానధర్మాలు చేయమని ఆదేశించేది. ఒకవేళ నేను ఆమె తరఫున ‘సదఖహ్ దానధర్మాలు చేస్తే ఆమెకు పుణ్యం లభిస్తుందా?” అని విన్నవించుకున్నాడు. దానికి ప్రవక్త (స), ‘అవును’ అని అన్నారు. (బు’ఖారీ, ముస్లిమ్‌)

—–

اَلْفَصْلُ الثَّانِيْ  రెండవ విభాగం 

1951 – [ 5 ] ( لم تتم دراسته ) (1/608)

عَنْ أَبِيْ أُمَامَةَ قَالَ: سَمِعْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ فِيْ خُطْبَتِهِ عَامَ حَجَّةِ الْوَدَاعِ: “لَا تُنْفِقُ امْرَأَةٌ شَيْئًا مِّنْ بَيْتِ زَوْجِهَا إِلَّا بِإِذْنِ زَوْجِهَا”. قِيْلَ: يَا رَسُوْلَ اللهِ وَلَا الطَّعَامَ؟ قَالَ: “ذَلِكَ أَفْضَلُ أَمْوَالِنَا”. رَوَاهُ التِّرْمِذِيُّ.

1951. (5) [1/608అపరిశోధితం]

అబూ ఉమామహ్ (ర) కథనం: హజ్జతుల్‌ విదా ప్రసంగంలో ఇలా ప్రసంగిస్తూ ఉండగా విన్నాను, ”ఏ స్త్రీ కూడా తన భర్తఇంట్లో అతని అనుమతిలేనిదే ఖర్చుచేయరాదు.” ప్రవక్త (స)ను ఓ అల్లాహ్‌ ప్రవక్తా! అన్నం కూడా ఇవ్వకూడదా? అని ప్రశ్నించగా, అనుమతి లేకుండా అన్నం కూడా ఇవ్వరాదు. ఎందుకంటే అన్నం మన ధన-సంపదల్లో చాలా ప్రధానమైనది,’ అని అన్నారు. [78] (తిర్మిజి’)

1952 – [ 6 ] ( لم تتم دراسته ) (1/608)

وَعَنْ سَعْدٍ قَالَ: لَمَّا بَايَعَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم النِّسَاءَ قَامَتِ امْرَأَةٌ جَلِيْلَةٌ كَأَنَّهَا مِنْ نِّسَاءِ مُضَرَفَقَالَتْ: يَا نَبِيَّ اللهِ إِنَّا كَلٌّ عَلَى آبَائِنَا وَأَبْنَائِنَا وَأَزْوَاجِنَا فَمَا يَحِلُّ لَنَا مِنْ أَمْوَالِهِمْ؟ قَالَ: “الرَّطْبُ تَأْكُلْنَهُ وَتُهْدِيْنَهُ”.  رَوَاهُ أَبُوْ دَاوُدَ.

1952. (6) [1/608అపరిశోధితం]

స’అద్‌ (ర) కథనం: ప్రవక్త (స) స్త్రీల నుండి వాగ్దానం తీసుకున్నప్పుడు, ఇస్లామీయ ఆదేశాలను పాటిస్తామని వాగ్దానం తీసుకున్నారు. అప్పుడు వారిలో ము’దర్‌ తెగకు చెందిన వృద్ధ స్త్రీ నిలబడి, ‘ఓ అల్లాహ్‌ ప్రవక్తా! మేము మా తండ్రులకు, కొడుకులకు, భర్తలకు భారంగా ఉన్నాం. మేము వారి ధనంలో నుండి తీసుకోవచ్చా?’ అని ప్రశ్నించింది. దానికి ప్రవక్త (స) తాజాగా ఉన్న ఆహారాన్ని మీరు తిన వచ్చును, ఇతరులకు కానుకగా పంపవచ్చును,’ అని సమాధానం ఇచ్చారు. [79]  (అబూ దావూద్‌)

—–

اَلْفَصْلُ الثَّالِثُ  మూడవ విభాగం 

1953 – [ 7 ] ( صحيح ) (1/608)

عَنْ عُمَيْرٍ مَوْلى آبِيْ اللَّحْمِ قَالَ: أَمَرَنِيْ مَوْلَايَ أَنْ أُقَدِّدَ لَحْمًا فَجَاءَنِيْ مِسْكِيْنٌ فَأَطْعَمْتُهُ مِنْهُ فَعَلِمَ بِذَلِكَ مَوْلَايَ فَضَرَبَنِيْ فَأَتَيْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم فَذَكَرْتُ ذَلِكَ لَهُ فَدَعَاهُ فَقَالَ: “لِمَ ضَرَبْتَهُ؟” فَقَالَ: يُعْطِيْ طَعَامِيْ بِغَيْرِ أَنْ آمُرَهُ فَقَالَ: “اَلْأَجْرُ بَيْنضكُمَا”.

وَفِيْ رِوَايَةٍ قَالَ: كُنْتُ مَمْلُوْكًا فَسَأَلْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم: أَتَصَدَّقُ مِنْ مَّالِ مَوَالِيَّ بِشَيْءٍ؟ قَالَ: “نَعَمْ وَالْأَجْرُ بَيْنَكُمَا نِصْفَانِ”.  رَوَاهُ مُسْلِمٌ .

1953. (7) [1/608దృఢం]

అబీల్ల’హమ్‌ విడుదల చేసిన బానిస ‘ఉమైర్‌ (ర) కథనం: మా యజమాని నన్ను మాంసాన్ని ముక్కలుగా చేసి ఎండబెట్టమని అన్నారు. ఇంతలో ఒక బిచ్చగాడు వచ్చాడు. నేను ఆ మాంసంలో నుండి కొంత అతనికి ఇచ్చివేసాను. ఇది మా యజమానికి తెలిసింది. అతను నన్ను కొట్టాడు. నేను ప్రవక్త (స) వద్దకు వెళ్ళి జరిగినదంతా చెప్పాను. ప్రవక్త (స) మా యజమానిని పిలిపించారు. అతన్ని, ‘నీవెందుకు కొట్టావు,’ అని ప్రశ్నించారు. దానికతడు, ”వీడు నా అనుమతి లేకుండా నా ఆహార పదార్థాలను ఇతరులకు ఇచ్చి వేస్తున్నాడు.” దానికి ప్రవక్త (స), ”మీ ఇద్దరికీ దాని పుణ్యం లభిస్తుంది,” అని అన్నారు.

 మరో ఉల్లేఖనంలో ఇలా ఉంది, ”నేను బానిసగా ఉండే వాడిని, ‘నేను నా యజమాని ధనం నుండి ‘సదఖహ్ చేయగలనా?’ అని ప్రశ్నించాను. ప్రవక్త (స), ‘అవును, మీ ఇద్దరికీ సగం, సగం పుణ్యం లభిస్తుంది,’ అని అన్నారు.” [80]  (ముస్లిమ్‌)

=====

9- بَابُ مَنْ لَّا يَعُوْدُ فِيْ الصَّدَقَةِ

9. సదఖహ్ ఇచ్చి, తిరిగి తీసుకోరాదు

اَلْفَصْلُ الْأَوَّلُ మొదటి విభాగం 

 1954 – [ 1 ] ( متفق عليه ) (1/609)

عَنْ عمر بن الخطاب رضي الله عَنْه قَالَ: حَمَلْتُ عَلَى فَرَسٍ فِيْ سَبِيْلِ اللهِ فَأَضَاعَهُ الَّذِيْ كَانَ عِنْدَهُ فَأَرَدْتُّ أَنْ أَشْتَرِيَهُ وَظَنَنْتُ أَنَّهُ يَبِيْعُهُ بِرُخْصٍ فَسَأَلْتُ النَّبِيَّ صلى الله عليه وسلم فَقَالَ: “لَا تَشْتَرِهِ وَلَا تَعُدْ فِيْ صَدَقَتِكَ وَإِنْ أَعْطَاكَهُ بِدِرْهَمٍ فَإِنَّ العَائِدَ فِيْ صَدَقَتِهِ كَالْكَلْبِ يَعُوْدُ فِيْ قَيْئِهِ”.

وَفِيْ رِوَايَةٍ: “لَا تَعُدْ فِيْ صَدَقَتِكَ. فَإِنَّ الْعَائِدَ فِيْ صَدَقَتِهِ كَالعَائِدِ فِيْ قَيْئِهِ .

1954. (1) [1/609ఏకీభవితం]

‘ఉమర్‌ (ర) కథనం: ”నేను ఒక వ్యక్తికి అల్లాహ్ మార్గంలో పోరాడేందుకు స్వారీ చేయటానికి నా గుర్రాన్ని ఇచ్చాను. అతడు దాన్ని పోగొట్టు కున్నాడు. అంటే అశ్రద్ధవల్ల దాన్ని ఆహారం సరిగా పెట్టలేక పోయాడు. చివరికి అది బక్క చిక్కిపోయింది. నేను దాన్ని కొనాలని అనుకున్నాను. అది బక్క చిక్కి ఉన్నందున చవకగా అమ్మివేస్తాడని భావించాను. దీన్ని గురించి ప్రవక్త (స)ను సంప్ర దించాను. దానికి ప్రవక్త (స) నీవు దాన్ని కొనకు, దానం చేసిన ‘సదఖ హ్ను తిరిగి తీసుకోకు, అతడు నీకు ఒక్క దిర్‌హమ్‌లో ఇచ్చినా సరే. చేసిన ‘సదఖహ్ను తిరిగి తీసుకునేవాడు వాంతిచేసి నాకే కుక్కతో సమానం అని అన్నారు.”

మరో ఉల్లేఖనంలో ఇలా ఉంది, ”ప్రవక్త (స) నువ్వు నీ ‘సదఖహ్ను తిరిగి ఇవ్వకు. ఎందుకంటే ‘సదఖహ్ను తిరిగి ఇచ్చేవాడు వాంతిచేసి దాన్ని నాకే దానికి సమానం.” అని అన్నారు. [81] (బు’ఖారీ, ముస్లిమ్‌)

1955 – [ 2 ] ( صحيح ) (1/609)

وَعَنْ بُرَيْدَةَ قَالَ: كُنْتُ جَالِسًا عِنْدَ النَّبِيِّ صلى الله عليه وسلم إِذْ أَتَتْهُ امرْأَةٌ فَقَالَتْ: يَا رَسُوْلَ اللهِ إِنِّيْ كُنْتُ تَصَدَّقْتُ عَلَى أُمِّيْ بِجَارِيَةٍ وَإِنَّهَا مَاتَتْ قَالَ: “وَجَبَ أَجْرُكِ وَرَدَّهَا عَلَيْكَ الْمِيْرَاثُ”. قَالَتْ يَا رَسُوْلَ اللهِ إِنَّهُ كَانَ عَلَيْهَا صَوْمُ شَهْرٍ أَفَأَصُوْمُ عَنْهَا قَالَ: “صُوْمِيْ عَنْهَا”. قَالَتْ يَا رَسُولَ اللهِ إِنَّهَا لَمْ تَحُجَّ قَطُّ أَفَأَحُجُّ عَنْهَا قَالَ: ” نَعَمْ حُجِّيْ عَنْهَا”  رَوَاهُ مُسْلِمٌ

1955. (2) [1/609దృఢం]

బురైదహ్‌ (ర) కథనం: నేను ప్రవక్త (స) వద్ద కూర్చు న్నాను. ఒక స్త్రీ వచ్చి, ‘ఓ అల్లాహ్‌ ప్రవక్తా! నేను నా తల్లి గారికి ఒక బానిసరాలిని ‘సదఖహ్గా ఇచ్చాను, నా తల్లి చనిపోయింది. నేను తప్ప వారసులెవరూ లేరు. నేను ఆ బానిసరాలిని తిరిగి తీసుకోవచ్చా?’ అని విన్నవించుకుంది. ప్రవక్త (స) ‘దాని పుణ్యం నీకు లభించింది. వారసత్వం ఆ బానిస రాలిని తిరిగి నీకు ఇప్పించింది. (అంటే వారసత్వంలో బానిసరాలు నీకు దొరికింది) నీవు తీసుకోవచ్చు’ అని అన్నారు. ఆమె, ‘ఓ అల్లాహ్‌ ప్రవక్తా! నా తల్లిపై ఒక నెల ఉపవాసాలు కూడా మిగిలి ఉన్నాయి. నేను నా తల్లి తరఫున ఉప వాసాలు పాటించవచ్చునా?’ అని విన్నవించుకుంది. ప్రవక్త (స), ‘నీ తల్లి తరఫున ఉపవాసాలు పాటించు,’ అని అన్నారు. మళ్ళీ ఆమె, ‘ఓ అల్లాహ్‌ ప్రవక్తా! నా తల్లి ‘హజ్జ్ కూడా చేయలేదు, నా తల్లి తరఫున నేను ‘హజ్జ్ చేయవచ్చునా? అని విన్నవించుకుంది. దానికి ప్రవక్త (స), ‘అవును ఆమెతరపున  ‘హజ్జ్ చేసుకో,’ అని అన్నారు. (ముస్లిమ్)

ఈ ‘హదీసు’ ద్వారా మృతుల తరఫునుండి ఉపవాసాలు పాటించడం, ‘హజ్జ్ చేయడం ధర్మ సమ్మతమే, అని తెలిసింది.

—–

 هذا الباب خال من الفصل الثاني و الثَّالث

ఇందులో రెండవ, మూడవ విభాగాలు లేవు

*****


[1]) వివరణ-1774: షుజా’అ అఖ్‌ర’అ అంటే మహా విషపూరితమైన సర్పం. అది విషంతో నిండి ఉన్నందు వల్ల దాని తలపై వెంట్రుకలు ఉండవు. అది దీర్ఘాయుష్షు కలిగి ఉంటుంది. దాని కళ్ళపై భాగంలో రెండు నల్లని చుక్కలు ఉంటాయి. ఆ సర్పం మహా ప్రమాదకరమైన దనడానికి ఆ చుక్కలు నిదర్శనం. అటువంటి విష పూరితమైన సర్పం ‘జకాత్‌ చెల్లించని ధనవంతునికి కాటు వేస్తుంది, అతని కంఠానికి హారంలా చుట్టుకుంటుంది. ఈ భావాన్నే ఖుర్‌ఆన్‌లోని ఈ ఆయతులో తెలియ పరచటం జరిగింది: ”అల్లాహ్ తన అనుగ్రహంతో ప్రసాదించిన దానిలో లోభం వహించే వారు, తమకు అది మేలైనదని భావించరాదు. వాస్తవానికి అది వారి కొరకు ఎంతో హానికరమైనది. వారు తమ లోభత్వంతో కూడ బెట్టినదంతా, తీర్పు దినమున వారి మెడల్లో చుట్టు కుంటుంది. మరియు భూమ్యాకాశాల వారసత్వం అల్లాహ్‌కే చెందుతుంది. మరియు మీరు చేస్తున్న దంతా అల్లాహ్‌ ఎరుగును.” (సూ. ‘ఆల ఇమ్రాన్‌, 3:180)

[2]) వివరణ-1779: పండితులు ఖ’త్తాబీ ఈ ‘హదీసు’ నుండి రెండు సూత్రాలను కనుగొన్నారు. ఈ రెండు తమ తమ స్థానాల్లో సరయినవే. ఎందుకంటే పాపానికి మార్గం సుగమం చేసేది పాపమే అవుతుంది. అదేవిధంగా ధర్మ సమ్మతంవైపు మార్గం చూపేది కూడా ధర్మసమ్మతం అవుతుంది.

[3]) ఈ ‘హదీసు’ను ఈ ఆయత్ సమర్థిస్తుంది: ”…మరియు నమ్మక ద్రోహానికి పాల్పడిన వాడు పునరుత్థాన దినమున తన నమ్మక ద్రోహంతో పాటు హాజరవుతాడు…” (సూ. ఆల ఇమ్రాన్‌, 3:161)

[4]) వివరణ-1781: ఆయత్ మొత్తం సూరహ్‌ తౌబహ్‌లో ఇలా ఉంది:  ”…మరియు ఎవరైతే వెండి, బంగారాన్ని కూడబెట్టి, దానిని అల్లాహ్‌ మార్గం లో ఖర్చుపెట్టరో వారికి బాధాకరమైన శిక్ష గలదనే వార్తను వినిపించు. దినమున దానిని (జకాత్‌ ఇవ్వని ధనాన్ని / ఆ వెండి బంగారాన్ని) నరకాగ్నిలో కాల్చి దానితో వారి నుదురుల మీద, ప్రక్కల మీద మరియు వీపులమీద వాతలు వేయబడతాయి. (అప్పుడు వారితో ఇలా అనబడు తుంది): ”ఇదంతా మీరు మీ కొరకు కూడబెట్టు కున్నదే, కావున మీరు కూడబెట్టుకున్న దానిని చవిచూడండి.” (సూ.అత్తౌబహ్‌, 9:3435) అని చెప్పడం జరుగుతుంది.

ఈ ఆయతు వివరణ స్పష్టంగా ఉంది. ‘జకాత్‌ చెల్లించని వారు శిక్షలకు గురవుతారు, ‘జకాత్‌ చెల్లించేవారు శిక్షలకు గురికారు. ఎందుకంటే ఇస్లామీయ పరిభాషలో ‘జకాత్‌ చెల్లించకుండా ఉండేదే కన్‌జ్‌ అనబడుతుంది. ‘జకాత్‌ చెల్లించిన తర్వాత ఆ ధనం పరిశుద్ధమై పోతుంది. దాన్ని ఉంచడం ధర్మసమ్మతం. మరణించిన తరువాత ధర్మబద్ధంగా హక్కుగల వారిలో ఆస్తిని పంచడం జరుగు తుంది. ‘ఉమర్‌ (ర) ప్రశ్నించడం వల్ల విషయం వివరంగా తెలిసిపోయింది. ఇంకా ప్రవక్త (స) విధేయురాలైన భార్యను గొప్పనిధిగా అభివర్ణించారు.

[5]) వివరణ-1783: అంటే వారు లెక్కకట్టి ‘జకాత్‌ పూర్తిగా తీసుకుంటారు. కాని మీరు, వారు మీనుండి అధికంగా ‘జకాత్‌ వసూలు చేసారని అనుకుంటారు. అయితే వారు ఎక్కువేమీ తీసుకోలేదు.

[6]) వివరణ-1784: ప్రవక్త (స) దాచిపెట్టే అనుమతి ఎందకు ఇవ్వలేదంటే ఇకముందు వారిలో కొంతమంది మొత్తం ధనాన్ని దాచిపెట్టే ప్రయత్నం చేయగలరు. లేదా అన్యాయం జరుగుతుందని భావించగలరు. అసలు వారి పట్ల అన్యాయం జరగ లేదు. అందువల్లే వారికి దాచిపెట్టే అనుమతి ఇవ్వలేదు.

[7]) వివరణ-1785: అంటే ముజాహిద్‌ దైవమార్గంలో కృషి చేయడానికి ఇంటినుండి బయటకు వెళ్ళిపోయాడు. అల్లాహ్‌(త) మార్గంలో జిహాద్‌ చేస్తూ ఉంటాడు. అతడు ఇంటికి తిరిగి వచ్చే వరకు అతనికి లభించినంత పుణ్యం న్యాయంగా ధర్మంగా ‘జకాత్‌ వసూలు చేసే వారికి లభిస్తుంది. అంటే ముజాహిద్‌ వసూలు చేసేవాడు పుణ్యంలో ఇద్దరూ సమానులే.

[8]) వివరణ-1786: జలబ్ రెండు విషయాల్లో అవుతుంది. ఒకటి ‘జకాత్‌లో రెండు గుర్రాల్లో, ‘జకాత్‌లో జలబ్‌ అంటే ‘జకాత్‌ వసూలు చేసే తాసిల్దారు ఒకచోట ఉండి ప్రజలను తమ జంతువులను తీసుకొని తన వద్దకు రమ్మని ఆదేశించటం ప్రవక్త (స) దీన్నుండి వారించారు. ఎందు కంటే దీనివల్ల జంతువుల యజమానులకు కష్టం కలుగు తుంది. స్వయంగా తాసిల్దారు జంతువులు ఉన్నచోటికి వెళ్ళాలి. అక్కడకు వెళ్ళి ‘జకాత్‌ వసూలు చేయాలి. రెండవ రకానికి చెందిన జలబ్‌ ఏమిటంటే తన గుర్రం వెనుక ఒక వ్యక్తిని నియమించడం, అతడు దాన్ని కసురుతూ, తోలుతూ ఉంటాడు, అది ముందుకు సాగిపోవాలని. జనబ్ అంటే పశువుల యజమాని తన జంతువులను తీసుకొని తన ఇంటి నుండి దూరంగా అడవిలోకి వెళ్ళి పోవటం, దీనివల్ల తాసిల్దారుకు అక్కడకు చేరటంలో కష్టాలు ఎదురవుతాయి. అందువల్ల ప్రవక్త (స) దీన్ని కూడా వారించారు.

[9]) వివరణ-1787: అంటే ఎవరైనా నిర్ణీత ధనం కలిగి ఉన్నంత మాత్రాన అతనిపై ‘జకాత్‌ విధి కాదు. సంవత్సరం మధ్యలో వారసత్వపు ఆస్తి లేదా కానుకగా ధనం లభిస్తే, ఆ ధనంపై ఒక సంవత్సరం గడిచిన తర్వాత దానిపై ‘జకాత్‌ విధి అవుతుంది. ఈ విషయంలో పండితుల మధ్య భేదాభిప్రాయాలు ఉన్నాయి. నాలుగైదు నెలల తర్వాత అతనికి మరో 41 మేకల్లో ‘జకాత్‌ విధి కాదు అని అభిప్రాయ పడుతున్నారు. మాలిక్‌ (ర), అబూ హనీఫా (ర) మొదలైన వారు 80, 41లను కలిపి మొత్తం 121 మేకల్లో జకాత్‌ రెండు మేకలు చెల్లించాలి అని అభిప్రాయ పడుతున్నారు. (వాస్తవం అల్లాహ్‌కే తెలుసు)

[10]) వివరణ-1789: ఈ ‘హదీసు’ వల్ల తెలిసిన విషయం ఏమిటంటే నిర్ణీత పరిమాణానికి చేరిన అనాథ బాలుని ధనంలో ‘జకాత్‌ విధించబడింది. ఎందుకంటే, ఇది బీదల, అనాథల హక్కు ఈ ‘హదీసు’ను ‘హాకిమ్‌ ప్రామాణిక మైనదిగా పేర్కొన్నారు.

[11]) వివరణ-1790: ప్రవక్త (స) మరణానంతరం కొంత మంది మార్గభ్రష్టత్వానికి గురయ్యారు. వీరు మూడు రకాలకు చెందిన వారు. 1. కొందరు పూర్తిగా మార్గ-భ్రష్టత్వానికి గురయ్యారు. ఇటువంటి వారు మరణశిక్షకు అర్హులు. ప్రవక్త (స) ప్రవచనం, ”ఇస్లామ్‌ను త్యజించిన వారిని నరికివేయండి.”  2.వ రకానికి చెందినవారు ప్రవక్త (స)ను అంతిమ ప్రవక్తగా స్వీకరించలేదు. ముసైలమహ్ కజ్జా’బ్‌ను ప్రవక్తగా భావించి అతన్ని అనుసరించారు. అయితే వీరు మరణశిక్షకు అర్హులుకారు. 3.వ రకానికి చెందిన వారు ‘జకాత్‌ను తిరస్కరించారు. మిగతా ఇస్లామీయ ఆదేశాలన్నింటినీ ఆచరించేవారు. అబూ బకర్‌ (ర) వారితో యుద్ధం చేయడానికి పూనుకున్నారు. దానికి ‘ఉమర్‌, ‘వీరు ముస్లిములు, నమా’జ్‌ ఆచరిస్తున్నారు, ఉపవాసాన్ని పాటిస్తున్నారు, ‘హజ్జ్ చేస్తున్నారు, అందువల్ల వారితో యుద్ధం చేయడం సబబు కాదు. వారు ఇస్లామ్‌ పరిధిలోనే ఉన్నారు’ అన్నారు. దానికి అబూ బకర్‌ (ర) వీరు మార్గ-భ్రష్టత్వంలో ఉన్నారు. ఎందుకంటే ‘జకాత్‌ను తిరస్కరిస్తే మనిషి అవిశ్వాసానికి గురవుతాడు. ఒకవేళ ప్రవక్త (స) కాలంలో ఒక మేకపిల్లను ఇచ్చేవారు ఇప్పుడు ఇవ్వక పోయినా మరణశిక్షకు అర్హులు. ఇలా ఉదాహరణకు అనడం జరిగింది. అంతేగాని మేకపిల్లను ‘జకాత్‌లో స్వీకరించడం జరుగదు.

[12]) వివరణ-1794: ఒక వసఖ్ = 60 సాఅలు ఉంటుంది. ఒక సాఅ = 2 సేర్ల 10 ½  ఛటాకులు. ఒక వసఖ్‌ 4మన్ల 6 ఛటాకులు ఉంటుంది. 5 వసఖ్‌లు 20 మన్ల 1 సేరు 6 ఛటాకులు ఉంటుంది. వర్షం వల్ల పండే పంటలో 10 భాగం జకాత్‌ ఇవ్వాలి. అంటే 20 మన్లలో 2 మనులు ఇవ్వాలి. నుయ్యి ద్వారా, శ్రమ ద్వారా నీరు అందిస్తే 20 భాగం ఇవ్వాలి. అంటే కేవలం 1మన్‌ ఇవ్వాలి. ప్రవక్త (స) ఇలా ప్రవచించారు: ”ఆకాశం ద్వారా, నీటి ఊటల ద్వారా, లేదా దానంతట అదే నీళ్ళు కలదిగా ఉన్న పంటల్లో 10వ వంతు జకాత్‌ చెల్లించ బడుతుంది. నుయ్యి ద్వారా, నీళ్ళు తోడటం ద్వారా పండిన పంటల్లో 20వ వంతు జకాత్‌ ఉంది. అంటే వర్షం, నదులు, కాలువల వల్ల లేదా చెరువులు దానంతట అదే తడిగా ఉండటం వల్ల పండిన పంటల్లో 10వ వంతు, బావుల ద్వారా, కరంటు ద్వారా, శ్రమ ద్వారా పండిన పంటల్లో ఇరవయ్యో వంతు ‘జకాత్‌ ఉంది. జొన్నలు, గోధుమలు, ధాన్యం, వేరుశనగ, కందిపప్పు, మసూర్‌, ఖర్జూరం, కిస్‌మిస్‌ల నిర్ణీత పరిమాణం, 20 మన్లు దాని కంటే తక్కువ ఉన్న వాటిలో 10వ వంతు లేదా పంటల్లో, ఆహార ధాన్యాల్లో ఈ షరతులు ఉంటే 10వ వంతు ‘జకాత్‌ విధి అవుతుంది. అల్లాహ్‌ ఆదేశం: పంట హక్కును దాని కోసే సమయాన్నే చెల్లించండి. మీ కోసం భూమి నుండి పండించబడిన పంటల్లో నుండి అల్లాహ్‌ మార్గంలో ఖర్చు చేయండి. ఈ రెండు ఆయతుల వల్ల 10వ వంతు విధి అని తెలుస్తుంది. 10వ వంతు కోసం శ్రమతో కూడిన భూమి అవసరం లేదు. రెండు రకాల భూముల్లోనూ 10వ వంతు మాత్రమే విధి. ‘హదీసు’ వాక్యాల, ద్వారా ఈ విషయం అర్థమవుతుంది.

1 ఊఖియ = 40 దిర్హమ్లు. 5 ఊఖియాలు = 200 దిర్‌హమ్‌లు అవుతాయి. 1 దిర్‌హమ్‌ మిస్ఖాల్‌కి 7/10 అవుతుంది. 1 మిస్ఖాల్‌ 4½ మాషాలు అవుతుంది. 12 మాషాలు 1 తులం అవుతుంది. 1 తులం = 11.66 గ్రాములు. 200 దిర్‌హమ్‌లకు 52½ తులాలు ఉంటుంది. 52½ తులాలకు జకాత్‌ 40 వంతు 1 తులం 4 మాషాలు ఉంటుంది. 100 రూపాయిలకు రూపాయిలు అవుతాయి. ఇందులోనే చాలా అప్రమత్తంగా ఉండాలి.

[13]) వివరణ-1795: అంటే సేవకోసం ఉన్న బానిసలు, వాహనాలు, గుర్రాల్లో ‘జకాత్‌ లేదు. అయితే ముస్లిమ్‌ బానిసల తరఫున సదఖ పిత్ర్‌ తప్పనిసరి విధి. ఒకవేళ బానిసలు, గుర్రాలు వ్యాపారానికి చెందినవైతే, అవి నిర్ణీత పరిమాణానికి చేరి ఉంటే వాటిలో ‘జకాత్‌ ఉంది.

[14]) వివరణ-1796: ఈ కలిపివేతలను, తీసివేతలను మాలిక్‌ తన పుస్తకం అయిన మువ”త్తా ఇమామ్‌ మాలిక్‌లో ఈ విధంగా పేర్కొన్నారు. ముగ్గురు వ్యక్తులకు 40 చొప్పున మేకలు ఉన్నాయి. ప్రతి ఒక్కరూ ఒక్కొక్క మేకను చెల్లించాలి. ‘జకాత్‌ స్వీకరించేవారు వస్తే ఈ ముగ్గురూ తమ మేకలనూ ఒకచోట కలిపి ఉంచడం వల్ల వారిపై ఒక మేకను చెల్లించడం తప్పనిసరి అవుతుంది. ఈ విధంగా ఇద్దరు భాగస్వాముల వ్యాపార సామగ్రిలో అంటే 201 మేకలు ఉంటే వారిపై మూడు మేకలు విధి  అవుతాయి. ఒకవేళ వారు ‘జకాత్‌ తాసిల్దారు వచ్చి నప్పుడు వేరుచేసివేస్తే 2 మేకలే ‘జకాత్‌గా తప్పనిసరి అవుతాయి. దీన్నుండి వారించడం జరిగింది. ఇది అల్లాహ్‌ పట్ల మోసం అవుతుంది. అల్లాహ్‌ క్షమించుగాక! అల్లాహ్‌కు అన్నీతెలుసు. సాయి’మహ్‌ అంటే అడవిలో మేసే వ్యాపార సామగ్రిగా ఉన్న మేకలు. నిర్ణీత సంఖ్యకు చేరితే వాటిలో ‘జకాత్‌ విధించబడుతుంది. మేకలు ఇంట్లో పాలుత్రాగటానికి, మేక ఇంటివద్దనే ఉండి దానికి మేత కొనిపెడుతున్నట్లైతే అది సాయి’మహ్‌ కాదు, అందులో ‘జకాత్‌ లేదు.

[15]) వివరణ-1797: అంటే వర్షం ద్వారా, నదుల ద్వారా, చెరువుల ద్వారా పండే పంటల్లో నుండి 10వ వంతు ‘జకాత్‌ ఇవ్వాలి. బావుల ద్వారా, చట్రాల ద్వారా, కరెంటు ద్వారా పండే పంటలో 20వ వంతు ‘జకాత్‌ చెల్లించాలి. ‘ఉష్‌రీ భూమి అంటే నీటి గుంటల ద్వారా పండే పంటల భూమి. ‘ఆసూర్‌ అంటే వర్షపు నీరు నిలిచి ఉన్న గుంటలు అని అర్థం. కొందరు తడి బూమి అని అభిప్రాయపడుతున్నారు. ఈ విధంగా శ్రమ కష్టం ఉండదు, అందువల్లే ఇందులో 10వ వంతు ‘జకాత్‌ విధి అవుతుంది. బావుల ద్వారా చట్రాల ద్వారా, కరెంటు ద్వారా శ్రమ, ఖర్చు రెండు ఉంటాయి. అందువల్లే ఇందులో 20వ వంతు ‘జకాత్‌ చెల్లించాలి.

[16]) వివరణ-1798: అంటే ఒకవేళ జంతువు యజమాని ప్రమేయం లేకుండా ఎవరినైనా గాయపరిస్తే లేదా నష్టపరిస్తే యజమానిపై ఎలాంటి నష్టపరిహారమూ లేదు. అది క్షమాపణకు తగినది. ఎందుకంటే జంతువుపై ఎటువంటి బాధ్యత లేదు. ఎవరైనా కూలివాడ్ని పెట్టి బావి త్రవ్విస్తున్నారు. ఆ కూలివాడు అందులో పడి మరణించాడు. అయితే బావి త్రవ్విస్తున్న వారిపై ఎటు వంటి నష్టపరిహారమూ లేదు. అదే విధంగా ఎవరైనా బంగారం, వెండి, ఇనుపగనుల్లో పనిచేస్తూ చనిపోతే యజమానిపై ఎటువంటి నష్టపరిహారమూ లేదు. ఒకవేళ ఎవరికైనా గుప్తనిధి దొరికితే అందులో నుండి ఐదవ వంతు సమాజ సంక్షేమనిధికి చెల్లించాలి. నాలుగు వంతులు దొరికిన వానికి లభిస్తుంది. రికా’జ్‌ అంటే అజ్ఞాన కాలంలో పాతి పెట్టబడి ఉన్న నిధులు. ఇరాఖ్‌ ప్రజలు రికాజ్‌ అంటే గనులుగా పేర్కొంటారు.

[17]) వివరణ-1801: అంటే నిర్ణీత ‘జకాత్‌కు మించి వసూలు చేసేవాడు ‘జకాత్‌ ఇవ్వటానికి తిరస్కరించే వాడికి సమానం, ‘జకాత్‌ను తిరస్కరించేవాడు నేరస్తుడు, పాపాత్ముడు. అదే విధంగా నిర్ణీత ‘జకాత్‌కంటే అధికంగా వసూలు చేసేవాడు కూడా పాపాత్ముడే. వీరిద్దరూ పాపాల ప్రకారం చూస్తే సమానులే.

[18]) వివరణ-1803: అంటే ఆహార ధాన్యాలు నిర్ణీత పరిమాణానికి చేరితే వాటిలో 1/10 వంతు ‘జకాత్‌ తప్పనిసరి అవుతుంది. ఈ ఆదేశం ధాన్యం, శెనగ, మటర్ ఇంకా తదితర ఆహారధాన్యాలన్నిటికీ వర్తిస్తుంది.

[19]) వివరణ-1804: తఖ్‌రస్‌ అంటే నిర్థారించటం, లెక్క కట్టడం అని అర్థం.  ఆ ద్రాక్ష పండ్లను ఎండిన తర్వాత ఎంత బరువు ఉంటాయో నిర్థారించటం జరుగుతుంది. ఎండిన ద్రాక్షల ప్రకారం వాటి ‘జకాత్‌ చెల్లించడం జరుగుతుంది, ఎండిన ఖర్జూరం నిర్థారించబడి ఖర్జూరం ‘జకాత్‌ చెల్లించబడినట్లు.

[20]) వివరణ-1805: ఈ ఆదేశం ‘జకాత్‌ వసూలు చేసే వారికి వర్తిస్తుంది. ‘జకాత్‌ ఎంత తీసుకోవాలి అనేది నిర్థారించిన తర్వాత దాన్ని మూడు భాగాలుగా విభజించాలి. రెండుభాగాలు అంటే 2/3 ‘జకాత్‌ తీసుకొని ప్రజా సంక్షేమనిధిలో జమచేయాలి. ఆ ‘జకాత్‌ ధనంలోని 1/3వ వంతును యజమానికి అప్పగించాలి. ఆయన పేదలకు, బిచ్చగాళ్లకు, అగత్యపరులకు ఇవ్వడానికి.

[21]) వివరణ-1808: ఒకవేళ స్త్రీ ధనవంతురాలై, నిర్ణీత ధనం కలిగిఉంటే ఆమెపై ‘జకాత్‌ చెల్లించడం తప్పనిసరి విధి. ఒకవేళ ఆమెవద్ద వెండి, బంగారు ఆభరణాలు ఉండి, అవి నిర్ణీత ప్రమాణానికి చేరి ఉంటే ఆ ఆభరణాలపై ‘జకాత్‌ తప్పనిసరి విధి అవుతుంది. దీని గురించి మరికొన్ని సాక్ష్యాధారాలు ముందున్నాయి.

[22]) అయితే కొన్ని ఉల్లేఖనాల్లో బంగారం, వెండి అనే పదాలు ఉన్నాయి. అయితే అవి ఆభరణాల రూపంలో ఉన్నా దిర్‌హమ్‌ల రూపంలో ఉన్నా బంగారం వెండిలలో ‘జకాత్‌ తప్పనిసరి విధి. అయితే అవి నిర్ణీత పరిమాణానికి చేరుకుంటే, ఇదే సరైన అభిప్రాయం.

[23]) వివరణ-1810: జకాత్చెల్లించబడని ధనాన్ని ఇస్లామీయ పరిభాషలో కన్జ్ అంటారు. దీన్ని గురించి ఈ వాక్యంలో పేర్కొనడం జరిగింది. ఉమ్మె సల్మా ఒక రకానికి చెందిన బంగారు ఆభరణాన్ని గురించి ప్రశ్నించింది. అవి కడియాలైనా, పట్టీలైనా, వడ్డాణాలైనా కావచ్చు. వీటిలో ‘జకాత్‌ ఉందా లేదా అనే దానికి అవి నిర్ణీత పరిమాణానికి చేరితే దానినుండి జకాత్‌ తప్పనిసరి అవుతుందని, జకాత్‌ చెల్లించిన తర్వాత అది కన్‌జ్‌గా పరిగణించబడదని ప్రవక్త (స) తెలిపారు.

[24]) వివరణ-1811: వ్యాపార సామగ్రి నిర్ణీత పరిమాణానికి చేరితే దాన్నుండి ‘జకాత్‌ చెల్లించమని ప్రవక్త (స) ఆదేశించేవారు. ప్రవక్త (స) ఇలా ప్రవచించారు: ”ఒంటెల్లో జకాత్‌ ఉంది, ఆవుల్లో జకాత్‌ ఉంది, వ్యాపార బట్టలపై జకాత్‌ ఉంది. ఇబ్నుల్‌ మున్‌జిర్‌ ఇలా అభిప్రాయ పడుతున్నారు: ”వ్యాపార సామగ్రిలో ‘జకాత్‌ తప్పనిసరి విధి అనే విషయంపై పండితులందరూ ఏకాభిప్రాయం కలిగి ఉన్నారు. ముహమ్మద్‌ బిన్‌ ఖదా మహ్‌ ”ముజ్నీ”లో ఇలా అభిప్రాయపడుతున్నారు, ”వ్యాపార సామాగ్రి విలువలో ‘జకాత్‌ విధి అని అనేకమంది పండితులు ఏకాభిప్రాయం కలిగి ఉన్నారు.

[25]) వివరణ-1812: ఖబ్‌ల్‌ అంటే ఒక ప్రాంతంపేరు. షర కూడా ఒకప్రాంతం పేరే. ఇవి మక్కహ్ మదీనహ్ల మధ్య ఉన్నాయి. ఖబ్‌ల్‌ ప్రాంతానికి చెందిన గనులను ప్రవక్త (స) బిలాబ్‌ బిన్‌ హారిస్‌కి వారసత్వంగా ఇచ్చివేసారు. ఆ గనుల నుండి ఇప్పటికీ ‘జకాత్‌ స్వీకరించడం జరుగు తుంది. అంటే 40వ వంతు. 5వ వంతు కాదు.

[26]) వివరణ-1813: ఆకుకూరల్లో జకాత్‌ లేదు అనేది బలహీనమైన ఉల్లేఖనం. ‘అరాయాలో కూడా ‘సదఖహ్ లేదు. ‘అరాయా అంటే ఎండు ఖర్జూరాలు ఉండి పండు ఖర్జూరాలు కొనడానికి అతని వద్ద డబ్బులు లేవు. అతని వద్ద మరోతోట కూడా లేదు. తన భార్యాబిడ్డలకు తినిపించడానికి, అతను ఇలా చేయగలడు. మరోతోట యజమానికి ఎండు ఖర్జూరాలు ఇచ్చి వాటికి బదులు పళ్ళను కొనుక్కుంటాడు. అవసరం గనుక ప్రవక్త (స) దీనికి అనుమతించారు. అయితే 5 వసఖ్‌ల కంటే తక్కువలో ఇలా చేయవచ్చును, ఎందుకంటే ఇంతకంటే అధికంగా భార్యాబిడ్డలకు తినిపించడానికి అవసరం ఉండదు. ఒక వసఖ్అరవై సాఅలు ఉంటుంది. అంటే 240 సేర్లు ఉంటుంది. ఇతర ఫలాలు కూడా ఖర్జూరంగానే నిర్థారించటం జరుగుతుంది. ఇమామ్‌ మాలిక్‌ అభిప్రాయం ఖరియ్యహ్ అంటే ఒక వ్యక్తి తన తోటలో నుండి ఒకటీ లేక రెండు వృక్షాల నుండి ఫలాలను తీసి పేదవారికి ఇచ్చివేయాలి. ఆ తరువాత మాటి మాటికీ ఆ పేదవాడు తోటలోనికి రావడం వల్ల తోట యజమానికి బాధ కలుగుతుంది. కనుక అతడు ఆ చెట్టు ఫలాలను నిర్థారించి ఎండు ఖర్జూరాలకు బదులు కొనుక్కోవాలి. మరి కొందరు ఏమంటున్నారంటే ఒకటి లేక రెండు చెట్ల ఫలాలు దొరికిన పేదవాడు వాటి కోతవరకు వేచి ఉండలేక పోతే ఒక నిర్థారణ ప్రకారం ఎండు ఖర్జూరానికి బదులు వాటిని ఎవరికైనా అమ్మివేయడం ధర్మబద్ధమే. ఉర్యహ్‌: చెట్టుపై ఉన్న పళ్ళు అమ్మడం లేదా ఎండు ఖర్జూరాలకు బదులు మార్చుకోవడం ధర్మంగా పరిగణించారు ప్రవక్త (స). అంటే శ్రమించే జంతువులు అవి భూమిదున్నే జంతువులైనా, సామాన్లుమోసే జంతువులైనా, ఇటువంటి జంతువుల్లో ‘జకాత్‌ లేదు. పనికోసం ఉన్న గుర్రాల్లో, కంచరగాడిదల్లో, బానిసల్లో ‘జకాత్‌ లేదు.

[27]) షాఫయీ అభిప్రాయం: వఖస్ అంటే నిర్ణీత సంఖ్యకు చేరని జంతువులు. 5 కంటే తక్కువగా ఉన్న ఒంటెలు, 30 కంటే తక్కువగా ఉన్న ఆవులు, 40కి తక్కువగా ఉన్న మేకలు.

[28]) వివరణ-1820: ఈ మూడు ఉల్లేఖనాల ద్వారా సగం ‘సా’అ ధాన్యం ఒక వ్యక్తి తరఫున ఇస్తే సరిపోతుంది. అబూ స’యీద్‌ ‘ఖుద్రీ ఉల్లేఖనం ద్వారా ప్రతీది ఒక ‘సా’అ ఇవ్వాలని తెలుస్తుంది. సగం ‘సా’అ ఉన్న ప్రామాణిక ‘హదీసు’లన్నీ బలహీనమైనవని ‘హదీసు’వేత్తలు తీర్మానించారు. ఒక ‘సా’అ ఉన్న ‘హదీసు’ను ప్రామాణిక మైనది, బలమైనదీను. అందువల్ల ఒక’సా’అ ఉన్న ఉల్లే ఖనం ప్రామాణికమైనది. ఒకవేళ ఎవరైనా పేదవాడు సగం’సా’అ చెల్లిస్తే ధార్మికపండుతులు దీన్నిధర్మసమ్మత మైనదిగా భావించారు. నిజం అల్లాహ్‌(త)కే తెలుసు.

[29]) వివరణ-1821: అంటే ఈ పడి ఉన్న ఖర్జూరం ‘జకాత్‌కు చెందినదై ఉండవచ్చు, ‘జకాత్‌ ధనాన్ని ఆరగించడం నాకు ఎంతమాత్రం ధర్మసమ్మతం కాదు. ఒకవేళ ఇది ‘జకాత్‌కు చెందనిదని నాకు ఖచ్చితంగా తెలిసి ఉంటే నేను తినేసేవాడిని.

[30]) వివరణ-1822: ఈ ‘హదీసు’ ద్వారా ఏవిధంగా ‘జకాత్‌ ‘సదఖహ్ల ధనం ప్రవక్త (స)కు ధర్మసమ్మతం కాదో, అదే విధంగా ప్రవక్త సంతానానికి కూడా ధర్మసమ్మతం కాదని తెలుస్తుంది. అంతేకాక పెద్దలు వేటికి దూరంగా ఉంటారో చిన్నలు కూడా వాటికి దూరంగా ఉండాలి. ‘హసన్‌ ‘జకాత్‌ ఖర్జూరాన్ని నోట్లో వేసుకున్నప్పుడు అతను చిన్న వయస్కులు, ‘జకాత్‌ ధనం ప్రవక్త (స) కుటుంబానికి తగదని అతనికి ఇంకా తెలియదు. అందువల్లే ప్రవక్త (స) దానిపట్ల అసహ్యం కలిగించేందుకు ఈ పదాలను వాడారు. ఎవరినైనా దేని నుండైనా ఆపడాన్ని లేదా చెడు పదార్థాల నుండి, మాలిన్యాల నుండి అసహ్యం కలిగించడానికి ఇటువంటి పదాలు ఉపయోగించడం జరుగుతుంది. ఉర్దూలో ఛీ, ఛీ అని పిల్లల్ని అపరిశుద్ధాల నుండి వారించడం జరుగు తుంది. మరో ఉల్లేఖనంలో ప్రవక్త (స) అతని నోట్లో నుండి దాన్ని తీసి పారవేసారని ఉంది.

[31]) ఇలా అడగటం ప్రవక్త (స) దైవభీతికి, దైవభక్తికి తార్కాణం.

[32]) వివరణ-1825: బరీరహ్ ఒక బానిసరాలి పేరు. ఆమె భర్త పేరు ముగీస్. వీరిద్దరూ బానిస భార్యాభర్తలు. ‘ఆయి’షహ్‌ (ర) బరీరహ్ ను విడుదల చేసారు, అప్పుడు ఆమె భర్త బానిస. ప్రవక్త (స) ఆమెతో, ‘ఇప్పుడు నీవు భర్తతో పాటు ఉండదలచుకుంటే ఉండవచ్చును లేదా వేరైపో వచ్చును,’ అని అన్నారు. అందువల్ల ధార్మిక పండితులు బానిస స్త్రీ విడుదలైతే భర్త బానిస అయితే ఆమె తన భర్త సంరక్షణలో ఉండవచ్చును లేదా వేరై పోవచ్చును. కానీ భర్త విడుదల అయితే అతనికి ఈ అధికారం లేదు. ధార్మిక పండితులందరి అభిప్రాయం ఇదే. కొన్ని ఉల్లేఖనాల్లో బరీరహ్ భర్త స్వతంత్రుడని ఉంది. అయితే ‘హదీసు’వేత్తలు దీనికి అంతగా ప్రాధాన్యత ఇవ్వలేదు. రెండవ విషయం వల్ల బానిసరాలు వలాఅంటే, ఆమెఆస్తి ఆమెను విడుదలచేసిన వారికి దక్కుతుంది. వలా’ ఒక రకమైన హక్కు. ఇది బానిస లేదా బానిసరాలిని విడుదల చేసినవారికి వర్తిస్తుంది. అంటే ఒకవేళ ఆమె చనిపోతే విడుదలచేసిన వారే ఆస్తికి వారసులు. ‘ఆయి’షహ్‌ (ర) బరీరహ్ ను కొని విడుదల చేయగోరి నపుడు బరీరహ్ యజమానులు” వలా’ మేము తీసుకుంటాము,” అని అన్నారు. ‘ఆయి’షహ్‌ (ర) ప్రవక్త (స)తో దాన్ని గురించి ప్రస్తావించగా, ప్రవక్త (స), ‘అది తప్పుడు షరతు వలా విడుదల చేసిన వారి హక్కు,’ అని అన్నారు. మూడవ విషయం వల్ల ‘సదఖహ్ పేదలకు, అగత్యపరులకు ఇవ్వాలి. అయితే వారు ధనవంతులకు కానుకగా ఇస్తే ధనవంతులు ఆ ‘సదఖహ్ ను తినవచ్చు. ఎందుకంటే ఇది వారికి కానుక వంటిది. యాజమాన్యం మారితే దాని ఆదేశం కూడా మారిపోతుంది.

[33]) అంటే సామాన్యమైన వస్తువు కానుకగా పంపినా నేను దాన్ని స్వీకరిస్తాను.  

[34]) వివరణ-1828: అంటే ఇంటింటా బిచ్చమెత్తుకుని తిరిగే వారు పేదవారు కాదు. అగత్యపరుడే అసలైన పేదవాడు. అతని వద్ద తన అవసరాలకు ధనం ఉండదు. అతడు పేదవాడన్నది ఇతరులకు తెలియదు, అతనికి దానధర్మాలు చెల్లించడానికి. ఇటువంటి వారు ఇతరుల ఇంటిముందు నిలబడి అడగరు. ఇటువంటి వారికి ఇవ్వడమే మహా పుణ్యం.

[35]) వివరణ-1829: అబూ రాఫే’ ప్రవక్త (స) విడుదల చేసిన బానిస. అతన్ని ‘జకాత్‌ నుండి ఎందుకు వారించా రంటే, అతను బనూ హాషిమ్‌ పరిధిలోనికి వచ్చేసారు. అందువల్ల సయ్యిదుల ద్వారా విడుదల చేయబడిన బానిస కూడా ‘సదఖహ్ తీసుకోలేరు అని తెలిసింది.

[36]) వివరణ-1836: ‘ఉమర్‌ (ర) దైవభీతి, దైవభక్తి వల్ల ఇలా చేసారు. కాని పేదవాడు తనకు దొరికిన ‘జకాత్‌ను ఏ ధన వంతుడికైనా కానుకగా ఇస్తే దాన్ని తీసుకోవడం ధర్మ సమ్మతమే. ఎందుకంటే యాజమాన్యం మారితే ఆదేశం కూడా మారిపోతుంది.

[37]) వివరణ-1837: హమ్మాల అంటే బాధ్యతా భారం అని అర్థం. ఒక వ్యక్తి మరోవ్యక్తి రుణభారాన్ని, హత్యా పరిహారాన్ని చెల్లించడంలో అతని ధనం ఖర్చయింది. అతడు మరో వ్యక్తి అప్పు తీర్చడం కోసం ఎంత ఖర్చు చేసాడో అంతసొమ్ము అడగ గలడు. అసలు ఆ వ్యక్తి తనకోసం అడగటం లేదు, అప్పు తీసుకున్న వ్యక్తి అప్పు తీర్చడానికి అడుగుతున్నాడు.

[38]) వివరణ-1845: ఈ ‘హదీసు’ ద్వారా ‘ఉమర్‌ (ర) పరి పూర్ణ భక్తి, అనాశక్తత తెలుస్తున్నాయి. ప్రవక్త (స) ఉపదే శానికి అర్థం ఏమిటంటే అడక్కుండా ధర్మ సమ్మతంగా లభించిన ధనాన్ని తీసుకోవాలి, ఇది దైవానుగ్రహం.

[39]) వివరణ-1846: ముస్లిమ్‌ పాలకుడు ఉండి ప్రజానిధిలో ప్రజల హక్కు ఉంటే, ప్రజానిధి నుండి, పాలకుడ్ని తన హక్కు అడగవచ్చును. ఒకవేళ ఏదైనా తప్పనిసరి పరిస్థితి ఏర్పడితే, జామీను మొదలైన వాటికోసం అడగవచ్చును.

[40]) వివరణ-1847: ‘ఖుమూషున్‌, ఖుముషున్కి బహు వచనం. దీని అర్థం గాయం, ఖుదూషున్‌, ‘ఖుదుషున్కి బహువచనం. ఖుదుషున్ అంటే వలచడం, చీల్చడం, పొడవడం అని అర్థం. కుదూహన్, కద్హన్కి బహు వచనం. దీని అర్థం తిక్కలు వలచడం. ఈ పదాల అర్థా లన్నీ సమీపభావం కలిగి ఉన్నాయి. అంటే గాయ పరచడం, పీక్కుతినడం, వొలచడం, అంటే అర్థించడం వల్ల గాయం అయిపోతుంది. దానివల్ల ముఖంపై వెలుగు ఉండదు, అవమానానికి గురవుతాడు.

[41]) వివరణ-1848: అంటే ఒక దినం ఒక రాత్రి ఆహారం ఉన్నవారు అడగటానికి అనర్హులు. కొన్ని ఉల్లేఖనాల్లో ధన సంపదల హద్దు 40 దిర్‌హమ్‌లు. ఈ ‘హదీసు’లో ఒక దినం, ఒక రాత్రి ఆహారంగా పేర్కొనడం జరిగింది. అంటే ఇది వివిధ రకాల మనుషులను బట్టి ఉంటుంది. కొందరికి ఒక దినం, ఒక రాత్రి ఆహారం, తినేవారు అధికంగా ఉంటే నలభై దిర్‌హమ్‌లు ఉదయం, సాయంత్రానికి సరిపోతుంది.

[42]) వివరణ-1849: ఇల్‌’హాఫ్అంటే వెంటపడి అడగటం, కొందరు బలవంతంగా అడగటంగా పేర్కొన్నారు. ఖుర్‌ఆన్‌లో బలవంతంగా అడగటాన్ని నిషేధించడం జరి గింది.” అంటే అనవసరంగా బలవంతంగా అడగరాదు.”

[43]) వివరణ-1851: ముద్ఖిబన్, వఖ్ నుండి వచ్చింది. మట్టి అని అర్థం. అంటే దారిద్య్రం నేలపై విసరివేసిన వాడు లేదా దారిద్య్రం వల్ల నేలపై పడిపోయినవాడు. ముద్జియన్ఫజఉన్ నుండి వచ్చింది. బలహీనతకు గురైనవాడు అజ్మ్ అంటే అప్పు అని అర్థం. అంటే అప్పులకుప్పగా మారిన పక్షంలో అర్థించవచ్చును. మేజిఉన్వజ్ఉన్ నుండి వచ్చింది. దీని అర్థం నొప్పి, దుఃఖం. అంటే ఇతరుల ప్రాణాలు రక్షించటానికి పరిహార బాధ్యత తన నెత్తిన వేసుకున్న వ్యక్తి. ఇటువంటి వారు అర్థించ గలరు, అడగ గలరు.

[44]) వివరణ-1852: త్వరగా మరణించడమంటే అతని బంధువు లెవరైనా మరణిస్తే, అతడి ధనం వారసత్వపు ఆస్తిగా అతనికి దక్కుతుంది. దానివల్ల అతడు ధనవంతుడైపోతాడు. లేదా తానే త్వరగా చనిపోతాడు, దానివల్ల ప్రాపంచిక బాధలు అతనికి ఉండవు. అంటే సహనం పాటిస్తే త్వరలోనే అల్లాహ్‌(త) అతన్ని ధనవంతుడు చేసివేస్తాడు. అల్లాహ్‌ ఆదేశం: ‘…మరియు అల్లాహ్‌ యందు భయభక్తులు గలవానికి, ఆయన ముక్తిమార్గం చూపుతాడు.’ (సూ. అ’త్-‘తలాఖ్, 65:2)

[45]) వివరణ-1855: ‘అరఫహ్ దినం అంటే జి’ల్‌ ‘హిజ్జహ్ 9వ తేదీ. ఇది చాలా గొప్పదినం. ‘అరఫాత్‌ అంటే 9వ తేదీన ‘హాజీలందరూ ఒకచోట చేరే మైదానం. ఈ రోజు ఈ దినం చిన్న-పెద్ద ధనవంతులు, పేదవారు అందరూ అల్లాహ్‌(త)నే అర్థిస్తారు. అల్లాహ్‌(త)యే అందరి కోరికలనూ తీర్చుతాడు. ఆ పవిత్ర మైదానంలో అల్లాహ్‌(త)ను వదలి ఇతరుల్ని వేడుకోవడం చాలా చెడ్డ విషయం. అందువల్ల ‘అలీ (ర) శిక్షణా దృష్టితో అతనికి బెత్తంతో కొట్టారు. అదేవిధంగా మసీదుల్లో కూడా అల్లాహ్‌(త)ను వదలి ఇతరులను అర్థించకూడదు.

[46]) వివరణ-1861: అంటే లెక్కపెట్టటం అని అర్థం. అంటే నువ్వు ధనాన్ని లెక్కపెట్టి, కూడబెట్టి, ఆపి ఉంచకు, ఒకవేళ నీవు ఇలా చేస్తే, అల్లాహ్‌ (త) కూడా అలాగే చేస్తాడు. అంటే లెక్కపెట్టి ఇస్తాడు. నీవు లెక్కపెట్టకుండా ఇస్తే నీకూ లెక్కపెట్ట కుండా ఇవ్వడం జరుగుతుంది. అంటే కూడబెట్టి ఉంచరాదు, పిసినారితం ప్రదర్శించ రాదు, అలాచేస్తే నీ పట్ల కూడా పిసినారి తనంగా ప్రవర్తించటం జరుగుతుంది. అంటే అల్లాహ్‌ (త) కూడా నీకు లెక్కపెట్టి ఇస్తాడు.

[47]) వివరణ-1863: అంటే మీ అవసరాలకు మించి ఉన్న వస్తువులను అల్లాహ్‌ మార్గంలో ఖర్చుచేయండి. ఇదే మీకు ఉత్తమం, లాభదాయకం. ఉభయలోకాల్లో దీని ప్రతిఫలం లభిస్తుంది. దాన్ని దాచిఉంచడం, ఖర్చు చేయకపోవడం వల్ల ఉభయలోకాల్లోనూ ప్రతిఫలం లభించదు. ఒకవేళ మీ దగ్గర అవసరానికి మించి లేకుండా, మీకు సరిపోయేంతగా ఉన్నప్పుడు మీరు ఖర్చుపెట్టక పోతే మీపై ఎటువంటి అభ్యంతరమూ లేదు. ముందు మీపై బాధ్యత ఉన్నవారికి ఇవ్వండి, ఆ తరువాత మిగిలింది ఇతరులకు ఇవ్వండి.

[48]) వివరణ-1864: అంటే ధర్మాత్ముడు ఖర్చుపెట్టి నపుడు అతని హృదయం విశాలమౌతుంది. పిసినారి హృదయం ముడుచుకు పోతుంది. ఈ ‘హదీసు’లో ధర్మాత్ముడు, పిసినారుల హృదయాల స్థితిని పేర్కొనడం జరిగింది. దాన ధర్మాలు చేస్తున్నకొలది అతని హృదయం కూడా విశాలమవుతూ ఉంటుంది. కాని పిసినారి హృదయం దానం చేయదలచినప్పుడు ముడుచుకుపోతుంది.

[49]) వివరణ-1866: అంటే సదఖహ్ను శుభావకాశంగా భావించాలి. ఎందుకంటే భవిష్యత్తులో అందరూ ధనవంతులై పోతారు, తీసుకునే వాడెవడూ ఉండడు. దానివల్ల మీకు లభించవలసిన పుణ్యం లభించదు.

[50]) వివరణ-1867: అంటే ఆరోగ్యంగా ఉన్నప్పుడు చేసిన దానధర్మాలకు అధికంగా పుణ్యం లభిస్తుంది. చావటానికి ముందు దానధర్మాలు చేస్తే ఎటువంటి లాభం చేకూరదు. ఎందుకంటే మరణించిన తర్వాత ఆ ధనం వారసులపరం అయిపోతుంది. అతని అధీనంలో నుండి తొలగిపోతుంది.

[51]) వివరణ-1875: సౌదహ్ మరియు ‘జైనబ్‌ ప్రవక్త (స) భార్యల్లో ఒకరు. ‘ఖదీజహ్ (ర) మరణించిన తర్వాత ప్రవక్త (స) సౌదహ్ ను దైవదౌత్య 10వ సంవత్సరంలో పెళ్ళి చేసుకున్నారు. ఈమె చాలా ఆరాధకురాలు, భక్తురాలు, తన చివరి జీవితంలో తన వంతును ‘ఆయి’షహ్‌ (ర)కు ఇచ్చి వేసారు. ఈమె చాలా దాతృత్వం, దానధర్మాలు చేసే స్త్రీ. ఈమె ప్రవక్త (స)కు విధేయత, ఆజ్ఞాపాలన చేసేవారు. ఈమె ఇతరులకన్నా కొంచెం పొడవుగా ఉండేవారు, చేతులు కూడా పొడవుగా ఉండేవి. ప్రవక్త (స) భార్యలందరూ ‘మాలో అందరికంటే ముందు తమరి తరువాత ఎవరు మరణిస్తారు’ అని అడగ్గా, ‘ఎవరి చేతులు అందరికన్నా పొడవుగా ఉంటే, వారే’ అని అన్నారు. వాళ్ళందరూ తమ తమ చేతులు కొలిచారు. అందరికంటే పెద్ద చేయి సౌదహ్దిగా తేలింది. కాని అందరి కంటే ముందు ‘జైనబ్‌ మరణించిన పిదప చేయి పొడవుగా ఉండటం అంటే దానధర్మాలు చేయడం అని తెలుసుకున్నారు. ‘హదీసు’లో దాన్ని పేర్కొనడం జరిగింది. ఎందుకంటే ఆమె పేదలకు, అగత్యపరులకు ఎంతో దాతృత్వంతో అన్నం తినిపించే వారు. తన చేత్తో సంపాదించేవారు. తన అవసరాలు తీరగా మిగిలిన దాన్ని పేదలకు పంచిపెట్టేవారు. అందువల్లే ఈమె ఉమ్ముల్మసాకీన్‌”గా పేరు గాంచారు.

[52]) వివరణ-1881: ఈ వాక్యానికి రెండు అర్థాలు ఉన్నాయి. ఒకటేమిటంటే బిచ్చగాడు అల్లాహ్‌(త) పేరుతో అడిగాడు. అయినప్పటికీ అతని కేమీ ఇవ్వబడ లేదు. అంటే అర్థించబడిన వాడు చాలా నీచుడు, అతడు అల్లాహ్‌ (త) పేరును కూడా లక్ష్యపెట్టలేదు. లేదా ప్రతిచోట అల్లాహ్‌ (త) పేరు చెప్పి అడిగినా ఇవ్వబడని బిచ్చగాడు అందరికంటే నీచుడు. ఈ వ్యక్తి దైవాన్ని హీనదృష్టికి గురిచేస్తూ తిరుగుతాడు. ఇటువంటి వ్యక్తి అందరికంటే నీచుడు.

[53]) వివరణ-1882: అబూ ర్ (ర) ప్రవక్త (స) అనుచరుల్లో ఒకరు. అజ్ఞానకాలంలో కూడా వీరు ఏక దైవారాధకులు. ఇస్లామ్‌ ప్రారంభంలో విశ్వసించిన వారిలోని ఒకరు. వీరి ఇస్లాం స్వీకరణ ఆసక్తికరమైన సంఘటన బు’ఖారీలో ఇంకా ఇతర చారిత్రక గ్రంథాల్లో ఉంది. హిజ్రత్‌ తర్వాత మదీనహ్లో నివసించారు. యుద్ధాల్లో, పోరాటాల్లో పొల్గొన్నారు. అబూ జ’ర్‌ అసలు ఒక పేద వ్యక్తి. భక్తిపరులు, ప్రపంచం పట్ల అనాశక్తత, నిరాడంబరులు, అందువల్లే ప్రవక్త (స) అతనికి ‘మసీహ్‌ ఇస్లామ్‌,’ అనే బిరుదు ఇచ్చారు. ప్రవక్త (స) తరువాత ఇతడు ప్రపంచం పట్ల విసుగుకు గురిచేసుకున్నారు. అయినా ప్రియ ప్రవక్త ప్రదేశంలోనే ఉన్నారు. ప్రవక్త (స) మరణం వల్ల మనసు విరిగిపోయింది. అందువల్లే అబూ బకర్‌ కాలంలో ఏ విషయం లోనూ పాల్గొనలేదు. అబూ బకర్‌ మరణం మరీ ఆయన్ను నిరాశకు గురిచేసింది. మదీనహ్ తోటంతా శిథిలాలుగా కనబడసాగింది. అందువల్లే మదీనహ్ వదలి సిరియా వెళ్ళిపోయారు. (ఇస్తిఆబ్‌ 1/83) వీరు పెట్టుబడి దారీ తనానికి బద్ధ వ్యతిరేకులు. ‘జకాత్‌ చెల్లిస్తున్న డబ్బును దాచి ఉంచడాన్ని ఇష్టపడేవారు కారు. అందువల్లే ఇతర ప్రవక్త (స) అనుచరులతో అభిప్రాయభేదాలు ఉండేవి. ‘ఉస్మా’న్‌ ఇతని ముందు క’అబ్‌ను ధనం దాచి ఉంచే విషయం గురించి మాట్లాడితే క’అబ్‌ ‘జకాత్‌ చెల్లిస్తే ధనాన్ని దాచి ఉంచవచ్చని సమాధానం ఇచ్చారు. ఇది విన్న అబూ జ’ర్‌ క’అబ్‌ను కొట్టారు. అంతే కాదు, పైన పేర్కొన్న ‘హదీసు’ను వినిపించారు. ‘ఉస్మా’న్‌ (ర) అతనికి రబ్‌’హ్ అనే ప్రాంతంలో నివసించమని సలహా ఇచ్చారు. అతను చివరి క్షణం వరకు రబ్‌’జహ్లో నే నివసించారు. అతని జీవితం ప్రారంభం నుండి అంతం వరకు దైవభక్తిలో, దైవారాధనలోనే గడిచింది. ఎటు చూచినా అసామాన్యమైన భక్తిప్రపత్తులు కనబడతాయి. ఈ నిరాడంబరమైన జీవితాన్ని చూసి ప్రవక్త (స), ”నా అనుచర సంఘంలోని అబూ జ’ర్‌లో ‘ఈసా (అ) లాంటి అనాశక్తత ఉంది” అని అన్నారు. (అసదుల్‌ గాబహ్ 5 – ఇస్తీఆబ్‌) చివరి క్షణం వరకు ఇలాగే జీవించారు. ప్రవక్త (స) కాలం తర్వాత ప్రజల్లో చాలా మార్పువచ్చింది. కాని అబూజర్‌ మొదటి నుండి చివరి వరకు ఒకే రంగులో ఉన్నారు. (అసాబహు 4/62)

[54]) వివరణ-1888: ఈ ‘హదీసు’ ద్వారా అల్లాహ్‌కు చేతులు ఉన్నాయని తెలుస్తుంది. మరో ఉల్లేఖనం ద్వారా అల్లాహ్‌కు రెండు కుడిచేతులు ఉన్నాయని తెలుస్తుంది. ఇవి ఆకారం లేనివి. ‘హదీసు’వేత్తలు వీటి గురించి ఎటువంటి కల్పనలకు సాహసించలేదు. అంతేకాదు, ఇవి ముతషాబిహాత్‌ అని పేర్కొన్నారు. వీటిని కూడా తప్పనిసరిగా విశ్వసించాలి. వీటిని గురించి చర్చించడం అనవసరం.

[55]) వివరణ-1892: అంటే తన పొరుగువారికి కానుకలు ఇస్తూ ఉండండి. అది చిన్న వస్తువైనా సరే. తీసుకునే వారు కూడా కానుకగా చిన్న వస్తువు ఇచ్చినా సంతోషంగా స్వీకరించాలి. దాని వల్ల పరస్పరం ప్రేమాభి మానాలు జనిస్తాయి. శతృత్వం ఉండదు.

[56]) వివరణ-1893: అంటే ఒకరి పట్ల మంచిగా ప్రవర్తించినా, సత్కార్యం చేసినా తెలియపరిచే వారికి కూడా ‘సదఖహ్ పుణ్యం లభిస్తుంది

[57]) వివరణ-1894: అంటే గౌరవమర్యాదలతో కలవటం కూడా సత్కార్యమే.

[58]) వివరణ-1899: అరబ్బుల్లో ఒంటెలు, మేకలు ఉన్న వారు పేదలకు పాలు తాగటానికి తాత్కాలికంగా ఇచ్చే అలవాటు ఉండేది. పాలు రావడం మానివేస్తే దాన్ని తిరిగి తీసుకునే వారు, దాన్ని వారి పరిభాషలో మనీహా అనేవారు. మనీహా భూముల్లో, తోటల్లో, ఇళ్లల్లో డబ్బులో జరుగుతుంది. అరబ్బుల్లో ఒక నానుడి ఉంది, ”వెండి లేదా పాలు మనీహాగా ఇచ్చేవారికి ఒక బానిసను విడుదల చేసినంత పుణ్యం లభిస్తుంది.”  వెండి మనీహా అంటే ఒకరికి అప్పు ఇవ్వడం, పాలు మనీహా అంటే ఒకరికి ఒంటె లేదా మేక పాలు త్రాగడానికి ఇవ్వడం, అదేవిధంగా వాటి వెంట్రుకలు, ఉన్నితో లాభం పొందేందుకు, లాభం పొందేందుకు ఇవ్వటం, ఆ తరువాత కొంత గడువు తర్వాత యజమాని తిరిగి తీసుకోవటం.  మనీహా యజమానికి తిరిగి ఇచ్చి వేయాలి. ఇది తప్పనిసరి.

[59]) వివరణ-1902: అయితే అది హానికరమైన జంతువు కాకూడదు.

[60]) వివరణ-1907: అజ్ఞాన కాలంలో ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ సలామ్‌ పేరు ‘హుసైన్ ఉండేది. ప్రవక్త (స) అతనికి అబ్దుల్లాహ్ అని పేరు పెట్టారు. అతని ఇస్లామ్‌ సంఘటన ఈ విధంగా ఉంది. అబ్దుల్లాహ్‌ బిన్‌ సల్లామ్‌ తన పిల్లల కోసం తోటలో పండ్లు కోయడానికి వెళ్ళారు. ప్రవక్త (స) మదీనహ్ వచ్చి మాలిక్బిన్నజ్జార్వీధిలో విడిదిచేసారు. ఈ వార్త అబ్దుల్లాహ్‌ బిన్‌ సలామ్‌కు అందింది. పండ్లు తీసుకొని ప్రవక్త(స) వద్దకు పరుగెత్తారు. దర్శించి తిరిగి వెళ్ళిపోయారు. ప్రవక్త (స) ‘మన అన్సార్‌ మిత్రుల్లోని ఎవరి ఇల్లు దగ్గరగా ఉంది?’ అని అడిగారు. దానికి అబూ అయ్యూబ్‌ అ’న్సారీ, ప్రవక్తా! నేను అందరికంటే దగ్గరగా ఉంటున్నాను. ఇది నా ఇల్లు. ఇది నా ఇంటి వాకిలి అని అన్నారు. ప్రవక్త (స) అతని ఇంటిని తన నివాసంగా మార్చుకున్నారు. ప్రవక్త (స) నివాసం నిర్థారించబడిన తర్వాత ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ సలామ్‌ రెండవ సారి ప్రవక్త (స) వద్దకు వచ్చారు. ప్రవక్త (స)ను ‘మిమ్మల్ని మూడు ప్రశ్నలు అడుగుతున్నాను. అవి ప్రవక్తలకు తప్ప ఇతరులెవ్వరికీ తెలియవు’ అని విన్నవించుకున్నాడు. ప్రవక్త (స) వాటికి సమాధానాలు ఇచ్చారు. వెంటనే అష్‌హదు అల్లాయిలాహ ఇల్లల్లాహు వ అష్‌హదు అన్నక రసూలుల్లాహ్‌ సల్లల్లాహ్‌ అలైహి వ సల్లమ్‌ అని ఎలుగెత్తి పలికిన తర్వాత, ‘యూదులు అభాండాలు వేసే జాతి, ఎందు కంటే నేను పండితుడి కుమారుడు పండితుడను. ధనవంతుని కుమారుడు ధన వంతుడను. వారిని పిలిచి నా గురించి అడగండి, కాని నేను ఇస్లామ్‌ స్వీకరించానని మాత్రం చెప్పకండి’ అని అన్నారు. ప్రవక్త (స) యూదులను పిలిపించి ఇస్లామ్‌ సందేశాన్ని అందజేసి, ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ సలామ్‌ ఎవరు?’ అని ప్రశ్నించారు. దానికి వారు, ‘మా నాయకులు మా నాయకుల కుమారులు’ అని అన్నారు. ‘అతను ఇస్లామ్‌ స్వీకరించ గలరా?’ అని అన్నారు. సమాధానంగా, ‘ముమ్మాటికీ కాదు.’ అబ్దుల్లాహ్‌ బిన్‌ సలామ్‌ ఇంట్లో ఒక మూలలో దాక్కున్నారు. ప్రవక్త (స) పిలవగానే పవిత్ర వచనం పఠిస్తూ బయటకు వచ్చారు. యూదులతో, ‘అల్లాహ్ కు భయపడండి, వీరు అల్లాహ్‌ ప్రవక్త అని, వీరి ధర్మం సత్య మైనదని మీకు బాగా తెలుసు, అయినా విశ్వసించటానికి నిరాకరిస్తున్నారు’ అని అన్నారు. యూదులు తమ ఆశలు నిరాశగా మారటం చూసి, వారి ఆగ్రహం చెలరేగింది. వారు ఆగ్రహావేశాలతో, ‘నీవు అసత్యవంతుడవు, మా జాతిలో అందరికంటే నీచుడవు, నీ తండ్రి కూడా చాలా నీచుడు,’ అని అన్నారు. అప్పుడు ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ సలామ్‌ ప్రవక్త (స) తో, ‘చూసారా! నేను దీన్ని గురించే భయపడేవాణ్ణి,’ అని అన్నారు. (బు’ఖారీ, పేజి 556, 561/10) 

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ సలామ్‌ చాలా ప్రాముఖ్యత, పరిపూర్ణత గల వ్యక్తి. తౌరాతు, ఇంజీలు, ఖుర్‌ఆన్‌ మరియు ప్రవక్త (స) ప్రవచనాల వెలుగుతో అతని వెలుగు నిండి ఉండేది. ఖుర్‌ఆన్‌లో ఆయన గురించి అనేక ఆయతులు అవతరించాయి. తౌరాతు గ్రంథం విషయంలో అతడు మహా పండితులు. వీరి గురించి జహ్బీ ఇలా అభిప్రాయ పడ్డారు: ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ సలామ్‌ మదీనహ్లోని గ్రంథ ప్రజల్లో గొప్ప పండితులు. ఇస్లామ్‌ స్వీకరించిన తర్వాత ఖుర్‌ఆన్‌ ‘హదీసు’లను బాగా అధ్యయనం చేసారు. ‘హదీసు’లో ప్రావీణ్యత సంపాదించారు. ప్రవక్త (స) ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ సలామ్‌ను తప్ప భూమిపై నడిచే ఏ వ్యక్తినీ స్వర్గవాసిగా పేర్కొనలేదు. (బు’ఖారీ) 

తిర్మిజీ’లో ఇలా ఉంది, ముఆజ్‌’ బిన్జబల్ మరణించి నపుడు తన శిష్యులతో నేను ఈ లోకం నుండి వెళు తున్నాను. అయితే నాతో పాటు జ్ఞానం కూడా అంత మవదు. ప్రయత్నించి కృషిచేసేవ్యక్తి దాన్నిపొందుతాడు. ఆ తరువాత నలుగురు వ్యక్తుల పేర్లు పేర్కొన్నారు, వారిలో ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ సలామ్‌ కూడా ఒకరు. ఇతని గురించి ఇలా అన్నారు, ”పూర్వం అతడు యూదుడు, ఆ తరువాత ముస్లిమ్‌ అయ్యాడు, అతడు పదవ స్వర్గ వాసి అని ప్రవక్త (స) ప్రవచించగా నేనువిన్నాను.”  వీరు చాలా వినమ్రత గలవారు, ఒకరోజు మస్జిదె నబవీలో నమా’జుకు వచ్చారు. అక్కడున్న వారు, ‘ఇతను స్వర్గ వాసి’ అని అన్నారు. అది విని, ఒక వ్యక్తి, ‘తనకు తెలియని దాన్ని గురించి మాట్లాడకూడదు,’ అని అన్నాడు. ఆ తరువాత ప్రవక్త (స) తన కల గురించి మీరు జీవితాంతం ఇస్లామ్‌పై స్థిరంగా ఉంటారు అనే పరమార్థాన్ని గురించి ప్రస్తావించారు. ఈ సంఘటన మరో సంఘటన కూడా కలిపి చూస్తే అతని వినయ విధేయతలు, వినమ్రత పరిపూర్ణమైనవని తెలుస్తుంది. ఒకసారి అతడు కర్రల దిండు మోసుకొని వస్తున్నారు. ”మీరు ధనవంతులు, దీని అవసరం మీకు ఎంత మాత్రం లేదు” అని అక్కడున్నవారు అన్నారు. దానికి, ”అవును, అది సరేకాని, నాలో ఉన్న అహంకారాన్ని, గర్వాన్ని అణచివేయాలని ప్రయత్నిస్తున్నాను” అని అన్నారు. (తజ్‌కిరతుల్‌ హుప్ఫాజ్‌ 1/23) సత్యాన్వేషణ, సత్యాచరణపై ఇతనికి అమిత ఉత్సాహం ఉండేది. ఒకసారి ఇలా అన్నారు, మీకూ ఖురైషులకు ఒకసారి యుద్ధం సంభవించవచ్చు. అప్పుడు ఒకవేళ నాలో శక్తి లేకపోతే కుర్చీపై కూర్చొబెట్టి నన్ను ఇరు పక్షాల మధ్య వదలి వేయండి. (ఇస్తెఆబ్‌ 1-396)

[61]) వివరణ-1912: మృతులకు పుణ్యం పంపేందుకు బావులు మొదలైనవి త్రవ్వించి అంకితం చేయడం చాలా ఉత్తమమైన ‘సదఖహ్.

[62]) వివరణ-1914: సూ. అల్ బఖరహ్‌, 2: 177వ ఆయత్ లో ఇలా ఉంది: ”వినయ విధేయత (ధర్మనిష్ఠా పరత్వం) అంటే మీరు మీ ముఖాలను తూర్పు దిక్కునకో, లేక పడమర దిక్కునకో చేయటం కాదు; కాని వినయ విధేయత (ధర్మనిష్ఠా పరత్వం) అంటే, అల్లాహ్‌ను, అంతిమ దినాన్ని, దేవదూతలను, ప్రతి దివ్యగ్రంథాన్ని మరియు ప్రవక్తలను హృదయ పూర్వకంగా విశ్వసిం చడం; మరియు ధనంపై ప్రేమ కలిగివుండి కూడా, దానిని బంధువుల కొరకు అనాథులకొరకు, యాచించని పేదల  కొరకు, బాటసారుల కొరకు, యాచకుల కొరకు మరియు బానిసలను విడిపించడానికి వ్యయపరచడం. మరియు నమా’జ్‌ను స్థాపించడం, ‘జకాత్‌ ఇవ్వడం మరియు వాగ్దానం చేసినప్పుడు తమ వాగ్దానాన్ని పూర్తిచేయడం. మరియు దురవస్థలో మరియు ఆపత్కాలాలలో మరియు యుధ్ధ సమయాలలో స్థైర్యం కలిగి ఉండటం. ఇలాంటి వారే సత్యవంతులు మరియు ఇలాంటి వారే దైవభీతి గలవారు.”

[63]) వివరణ-1918: జాబిర్‌ (ర) ”అలైకస్సలామ్‌” అని రెండు సార్లు ఎందుకు అన్నారంటే మొదటి సారి ప్రవక్త (స) విని ఉండకపోవచ్చు. లేదా జాబిర్‌ (ర) మెల్లగా సలామ్‌ చేసి ఉండవచ్చు. అందువల్లే రెండవసారి అనడం జరిగింది. ప్రవక్త (స) అతనికి సలామ్‌ చేసే పద్ధతి అంటే సజీవులకు అస్సలాము ‘అలైకుమ్‌ అని పలకమని నేర్పారు. ఎందుకంటే మృతులకు ‘అలైకస్సలాము’ అని పలకాలి. ఈ ‘హదీసు’ ద్వారా మృతులకు అస్సలాము అలైకుమ్‌ అని పలకటం ధర్మ సమ్మతం కాదని తెలిసింది. అయితే ప్రవక్త (స) సమాధులను సందర్శించి నపుడు ”అస్సలాము ‘అలైకుమ్‌ దార ఖౌమిన్‌ మూమినీన్‌” అని పలికేవారు. దీన్ని గురించి ‘హదీసు’ వేత్తలు వ్యాఖ్యానిస్తూ ఇక్కడ వారించడం జరిగింది. కాని నిషేధించబడలేదని పేర్కొన్నారు. మరికొందరు అజ్ఞాన కాలంలో మృతులనూ అలైకస్సలాము అని పలికే వారని తెలియపరిచారు. దీన్ని గురించి ఇతర వివరాలు ‘జాదుల్‌ మ’ఆద్‌లో ఉన్నాయి.

[64]) వివరణ-1919: ఖుర్‌ఆన్‌లో అల్లాహ్‌ (త) ఇలా ఆదేశించాడు: ”మీ వద్ద ఉన్నది నశించేది, అల్లాహ్‌ వద్ద ఉన్నది మిగిలి ఉండేది.”

[65]) వివరణ-1922: షేఖ్‌ అంటే ముసలివాడు కావచ్చు. అంటే ముసలితనంలో కూడా వ్యభిచరించే వ్యక్తి. లేదా వివాహితుడు, అంటే భార్య ఉన్నప్పటికీ పరస్త్రీలతో వ్యభిచరించేవ్యక్తి. బిచ్చగాడు అయినప్పటికీ గర్వా-హంకారాలను ప్రదర్శించే వ్యక్తి అందరికంటే నీచుడు, ధనవంతుడు అయినప్పటికీ ప్రజల ధనాన్ని ఉంచుకుంటున్న వ్యక్తి, వారిని హింసిస్తున్న వ్యక్తి. ఈ ముగ్గురు వ్యక్తులు అల్లాహ్‌ దృష్టిలో నీచులు, దైవాగ్రహానికి గురయ్యేవారు.

[66]) వివరణ-1925: తీర్పుదినంనాడు ఎండ చాలా తీవ్రంగా ఉంటుంది. దానివల్ల వేడిమి అధికంగా ఉంటుంది. నీడ కోసం ఎటువంటి గొడుగు ఉండదు. ఇహలోకంలో ఒకవేళ అతడు పుణ్యం చేసి ఉంటే, ఆ పుణ్యం తీర్పు దినంనాడు నీడగా పనికి వస్తుంది. అంటే ఈ ‘సదఖహ్ తీర్పుదినంనాడు నీడగా పని చేస్తుంది. దీని ద్వారా ‘సదఖహ్ ప్రాధాన్యత విశదమవుతుంది.

[67]) వివరణ-1927: ఇబ్ను ‘జౌజీ, ఇబ్నె తైమియాలు ఈ ‘హదీసు’ను కల్పితంగా పేర్కొన్నారు. అయితే కొందరు ధార్మిక పండితులు అనేక మార్గాల ద్వారా ఉల్లేఖించబడటం వల్ల ప్రామాణికమైనదిగా పేర్కొన్నారు.

[68]) వివరణ-1928: అంటే ఒక పుణ్యం, ఒక ‘సదఖహ్ పుణ్యం పది ‘సదఖహ్లకు సమానంగా, అంతకంటే అధికంగా కూడా ఉంది. అదేవిధంగా ఒక ఖర్జూరం పుణ్యం కొండకంటే అధికంగా అవుతుందని ఇంతకు ముందు పేర్కొనటం జరిగింది

[69]) వివరణ-1929: అంటే ‘సదఖహ్ ఇచ్చిన తర్వాత కూడా ఆ వ్యక్తి మంచి స్థితిలో ఉండాలి. దారిద్య్రానికి గురికారాదు. తాను, తన భార్యాబిడ్డలు ఆకలికి గురవకూడదు. తనతోపాటు తన కుటుంబం ఖర్చులు పోగా ఉన్నదాన్ని దానంచేయాలి.

[70]) వివరణ-1931: అంటే పుణ్యపరంగా భార్యా-బిడ్డలపై ఖర్చుచేయడమే ఉత్తమం

[71]) వివరణ-1932: అంటే ఈ మూడు విధాలుగా ఖర్చు చేయడం అన్నిటికంటే ఉత్తమమైనది.

[72]) వివరణ-1934: భార్య తన పేద భర్తకు ‘సదఖహ్ ఇవ్వవచ్చని ఈ ‘హదీసు’ ద్వారా విశదపరచబడింది.

[73]) వివరణ-1935: అంటే బంధుత్వానిది, ‘సదఖది, మొత్తం రెండు పుణ్యాలు లభిస్తాయి.

[74]) వివరణ-1938: జి’హాద్‌, జు’హద్‌ అనేక ‘హదీసు’ల్లో వచ్చి ఉన్నాయి. రెంటి అర్థం శక్తి మరియు ప్రయత్నం అనే వస్తుంది. ముఖిర్‌ అంటే తక్కువ ధనం గలవాడు తన స్తోమతకు తగ్గట్టు చేసే ‘సదఖహ్ ఉత్తమమైన ‘సదఖహ్. ఇంతకుముందు, ‘హదీసు’లో, ‘ ‘సదఖహ్ చేసిన తర్వాత కూడా మనిషికి ఎటువంటి విచారం ఉండనటువంటి ‘సదఖహ్ ఉత్తమమైనది,’ అని పేర్కొనడం జరిగింది. అంటే తన కుటుంబ ఖర్చులు పోగా ఉన్నదాంట్లో ‘సదఖహ్ చేయాలి. ఉన్నదంతా ఖర్చుచేసి స్వయంగా తాను ఒక బిచ్చగాడిగా అవతారం ఎత్తకూడదు. ఒకవేళ ఎవరికైనా అల్లాహ్పై పరిపూర్ణమైన నమ్మకం ఉంటే పేదరికంలో కూడా ‘సదఖహ్ చేయవచ్చును, అబూ బకర్‌ (ర) చేసినట్లు. అయితే అల్లాహ్పై పూర్తి నమ్మకం లేనివాళ్ళ ముందు తమ అవసరాలను పూర్తి చేసుకోవాలి. ఆ తరువాత ఇతరులకు ఇవ్వాలి.

[75]) వివరణ-1944: అంటే అల్లాహ్‌(త) పేరుతో కేవలం స్వర్గాన్ని మాత్రమే అడగండి. ప్రాపంచిక వస్తువులను అల్లాహ్‌ (త) పేరుతో అడగకండి.

[76]) వివరణ-1947: భర్త భార్యను ‘సదఖహ్ దాన-ధర్మాలు చేయవచ్చని అనుమతి ఇచ్చి ఉన్నప్పుడు ఇది వర్తిస్తుంది.

[77]) వివరణ-1949: ఈ ‘హదీసు’లో నాలుగు విషయాలు పేర్కొనడం జరిగింది. 1. యజమాని ఆదేశమివ్వటం, 2. పూర్తిగా ఇవ్వటం, 3. సంతోషంతో ఇవ్వటం, 4. ఇవ్వమన్న వారికే ఇవ్వటం. గుమాస్తాకు కూడా యజమానిలా ‘సదఖహ్ పుణ్యం లభిస్తుంది.

[78]) వివరణ-1951: అంటే భర్త అనుమతిలేనిదే, అతని ఇష్టం లేకుండా అతని ధనంలో నుండి భార్య ఏమీ ఖర్చుచేయరాదు. ఒకవేళ అతని అనుమతి ఉంటే ఖర్చు చేయవచ్చు.

[79]) వివరణ-1952: తా’జహ్ వస్తువులంటే తొందరగాపాడై పొయే వస్తువులు, పప్పు, కూరలు, ఫలాలు తొందరగా పాడైపోతాయి. వాటిని తినగలరు, ఇవ్వగలరు.

[80]) వివరణ-1953: ఆబిల్లహమ్‌ అంటే మాంసాన్ని తిరస్కరించే వాడు. అంటే మాంసం తిననివాడు. అజ్ఞాన కాలంలో అల్లాహ్‌యేతరుల పేర జిబహ్‌ చేసే జంతువుల మాంసాన్ని తినేవారు కారు. అందువల్లే అతని బిరుదు ఆబుల్లహమ్‌ పడింది. ప్రవక్త (స) అతనికి ‘అబ్దుల్లాహ్‌ అని పేరు పెట్టారు. వీరు ప్రవక్త అనుచరుల్లో ఒకరు. వీరి దైవభక్తి పరిస్థితి ఎలా ఉండేదంటే ఇస్లామ్‌ కు ముందు దైవేతరుల పేర జిబహ్‌ చేయబడిన జంతువు మాంసం తినేవారు కారు. ‘ఉమైర్‌ అతని బానిస. ‘ఒకవేళ నేను ఆ బిచ్చగాడికి మాంసం ఇస్తే, నా యజమాని కోపగించు కోడు’ అని అనుకున్నాడు. అందువల్లే ఇచ్చివేసాడు. అందువల్లే ప్రవక్త (స) మీరిద్దరికీ పుణ్యం లభిస్తుందని అన్నారు. అంటే మీ ఇద్దరికీ వేర్వేరుగా పుణ్యం లభిస్తుంది అని అర్థం.

[81]) వివరణ-1954: ‘సదఖహ్ను తిరిగి తీసుకోకూడదని ఈ ‘హదీసు’ ద్వారా తెలిసింది.

***

%d bloggers like this: