4. నమా’జు (’సలాహ్) పుస్తకం – 2 | మిష్కాతుల్ మసాబీహ్

4 بكِتَابُ الصَّلَاةِ

4B. నమాజు (’సలాహ్) పుస్తకం

22- أَوْقَاتِ النَّهْيِ

22. నమాజు చేయకూడని వేళలు

ఈ సమయాల్లో ఉద్దేశ్యపూర్వకంగా అనవసరంగా నమా’జు చదవటం నిషిద్ధం: 1. సూర్యుడు ఉదయించి నపుడు, 2. సూర్యుడు అస్తమించినపుడు, 3. మిట్ట మధ్యాహ్నం సమయంలో. అనవసరంగా ’అ’స్ర్‌ మరియు ఫజ్ర్‌ నమా’జుల తర్వాత కూడా నిషిద్ధం. అయితే అవసరముండి తగిన కారణం ఉంటే చదవ వచ్చును. వీటిని గురించి తెలుసు కుందాం.

اَلْفَصْلُ الْأَوَّلُ  మొదటి విభాగం 

1039 – [ 1 ] ( متفق عليه ) (1/327)

عَنِ ابْنِ عُمَرَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَا يَتَحَرَّى أَحَدُكُمْ فَيُصَلِّيْ عِنْدَ طُلُوْعِ الشَّمْسِ وَلَا عِنْدَ غُرُوْبِهَا” وَفِيْ رَوَايَةٍ قَالَ: “إِذَا طَلَعَ حَاجِبُ الشَّمْسِ فَدَعُوْا الصَّلَاةَ حَتَّى تَبْرُزَ. فَإِذَا غَابَ حَاجِبُ الشَّمْسِ فَدَعُوْا الصَّلَاةَ حَتَّى تَغِيْبَ وَلَا تَحَيَّنُوْا بِصَلَاتِكُمْ طَلُوْعَ الشَّمْسِ وَلَا غُرُوْبَهَا فَإِنَّهَا تَطْلُعُ بَيْنَ قَرْنَي الشَّيْطَانِ”.

1039. (1) [1/327ఏకీభవితం]

’అబ్దుల్లాహ్‌ బిన్‌ ’ఉమర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ‘మీలో ఎవ్వరూ సూర్యోదయం అవుతు న్నప్పుడు, సూర్యాస్తమయం అవుతున్నప్పుడు నమా’జు చదవకండి. మరో ఉల్లేఖనంలో ఇలా ఉంది, ‘సూర్యుడు ఉదయించడం ప్రారంభించగానే నమా’జు చదవడం మానివేయండి. సూర్యుడు ఉదయించి బల్లెమంత ఎత్తుకు రాగానే చదవవచ్చును. అదే విధంగా సూర్యుడు అస్తమించటం ప్రారంభించగానే పూర్తిగా అస్తమించేవరకు నమా’జు చదవటం వదలి వేయండి. రెండు సమయాల్లో ఉద్దేశ్యపూర్వకంగా నమా’జు చదవడానికి సిద్ధంకాకండి. ఎందుకంటే సూర్యుడు షై’తాన్‌ రెండు కొమ్ముల మధ్య ఉదయిస్తాడు. [1] (బు’ఖారీ, ముస్లిమ్‌)

1040 – [ 2 ] ( صحيح ) (1/327)

وَعَنْ عُقْبَةَ بْنِ عَامِرٍ قَالَ: ثَلَاثُ سَاعَاتٍ كَانَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم يَنْهَانَا أَنْ نُّصَلِّيَ فِيْهِنَّ أَوْ نَقْبَرَ فِيْهِنَّ مَوْتَانَا: حِيْنَ تَطْلُعُ الشَّمْسُ بَازِغَةً حَتَّى تَرْتَفِعَ وَحِيْنَ يَقُوْمُ قَائِمُ الظَّهِيْرَةِ حَتَّى تَمِيْلَ الشَّمْسُ وَحِيْنَ تَضَيَّفُ الشَّمْسُ لِلْغُرُوْبِ حَتَّى تَغْرُبُ. رَوَاهُ مُسْلِمٌ.

1040. (2) [1/327దృఢం]

’ఉఖ్‌బ బిన్‌ ’ఆమిర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ఈ మూడు సమయాల్లో నమా’జు చదవరాదని వారించే వారు. ఇంకా మృతులను సమాధులలో ఖననం చేయరాదనీ వారించే వారు: 1. సూర్యుడు ఉదయించి నపుడు, కొంత ఎత్తుకు వచ్చే వరకు, 2. మిట్ట మధ్యాహ్నం, సూర్యుడు వాలే వరకు, 3. సూర్యుడు అస్తమించినపుడు, పూర్తిగా అస్తమించే వరకు. (ముస్లిమ్‌)

1041 – [ 3 ] ( متفق عليه ) (1/327)

وَعَنْ أَبِيْ سَعِيْدِ الْخُدْرِيْ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَا صَلَاةَ بَعْدَ الصُّبْحِ حَتَّى تَرْتَفِعَ الشَّمْسُ. وَلَا صَلَاةَ بَعْدُ الْعَصْرِ حَتَّى تَغِيْبَ الشَّمْسُ”.

1041. (3) [1/327ఏకీభవితం]

అబూ స’యీద్‌ ’ఖుద్రీ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఉదయం నమా’జు తర్వాత సూర్యుడు కొంత ఎత్తుకు వచ్చేవరకు ఏ నమా’జు లేదు. అదే విధంగా ’అస్ర్‌‘ నమా’జు తర్వాత సూర్యుడు పూర్తిగా అస్తమించేవరకు ఏ నమా’జు లేదు.” [2]  (బు’ఖారీ, ముస్లిమ్‌)

1042 – [ 4 ] ( صحيح ) (1/328)

وَعَنْ عَمْرِو بْنِ عَبَسَةَ قَالَ: قَدِمَ النَّبِيُّ صلى الله عليه وسلم الْمَدِيْنَةَ فَقَدِمْتُ الْمَدِيْنَةَ فَدَخَلْتُ عَلَيْهِ فَقُلْتُ: أَخْبِرْنِيْ عَنِ الصَّلَاةِ فَقَالَ: “صَلِّ صَلَاةَ الصُّبْحِ ثُمَّ أَقْصُرْ عَنِ الصَّلَاةِ حَتَّى تَطْلُعُ الشَّمْسُ حَتَّى تَرْتَفِعَ فَإِنَّهَا تَطْلُعُ حِيْنَ تَطْلُعُ بَيْنَ قَرْنَيْ شَيْطَانٍ وَحِيْنَئِذٍ يَّسْجُدُ لَهَا الْكُفَّارُ. ثُمَّ صَلِّ فَإِنَّ الصَّلَاةَ مَشْهُوْدَةٌ مَّحْضُوْرَةٌ حَتَّى يَسْتَقِلَّ الظِّلُّ بِالرُّمْحِ ثُمَّ أَقْصِرْ عَنِ الصَّلَاةِ. فَإِنَّ حِيْنَئِذٍ تُسَجَّرُ جَهَنَّمُ. فَإِذَا أَقْبَلَ الْفَيْءُ فَصَلِّ فَإِنَّ الصَّلَاةَ مَشْهُوْدَةٌ مَّحْضُوْرَةٌ حَتَّى تُصَلِّيَ الْعَصْرَ ثُمَّ أَقْصِرْ عَنِ الصَّلَاةِ حَتَّى تَغْرُبَ الشَّمْسُ فَإِنَّهَا تَغْرُبُ بَيْنَ قَرْنَيْ شَيْطَانٍ وَحِيْنَئِذٍ يَّسْجُدُ لَهَا الْكُفَّارُ”. قَالَ فَقُلْتُ يَا نَبِيَّ الله فَالْوُضُوْءُ حَدِّثْنِيْ عَنْهُ. قَالَ: “مَا مِنْكُمْ رَجُلٌ يُّقَرِّبُ وُضُوْءَهُ فَيُمَضْمِضُ وَيَسْتَنْشِقُ فَيَنْتَثِرُ إِلَّا خَرَّتْ خَطَايَا وَجْهِهِ وَفِيْهِ وَخَيَاشِيْمِهِ ثُمَّ إِذَا غَسَلَ وَجْهَهُ كَمَا أَمَرَهُ اللهُ إِلَّا خَرَّتْ خَطَايَا وَجْهِهِ مِنْ أَطْرَافِ لِحْيَتِهِ مَعَ الْمَاءِ ثُمَّ يَغْسِلُ يَدَيْهِ إِلَى الْمِرْفَقَيْنِ إِلَّا خَرَّتْ خَطَايَا يَدَيْهِ مِنْ أَنَامِلِهِ مَعَ الْمَاءِ. ثُمَّ يَمْسَحُ رَأْسَهُ إِلَّا خَرَّتْ خَطَايَا رَأْسِهِ مِنْ أَطْرَافِ شَعْرِهِ مَعَ الْمَاءِ. ثُمَّ يَغْسِلُ قَدَمَيْهِ إِلَى الْكَعْبَيْنِ إِلَّا خَرَّتْ خَطَايَا رِجْلَيْهِ مِنْ أَنَامِلِهِ مَعَ الْمَاءِ. فَإِنْ هُوَ قَامَ فَصَلَّى فَحِمَدَ اللهَ وَأَثْنَى عَلَيْهِ وَمَجَّدَهُ بِالّذِيْ هُوَ لَهُ أَهْلٌ وَفَرَّغَ قَلْبَهُ للهِ إِلَّا انْصَرَفَ مِنْ خَطِيْئَتِهِ كَهَيْئَتِهِ يَوْمَ وَلَدَتْهُ أُمُّهُ.” رَوَاهُ مُسْلِمٌ .

1042. (4) [1/328దృఢం]

’అమ్ర్ బిన్‌ ’అబస (ర) కథనం: ప్రవక్త (స) మదీ నహ్ వచ్చినపుడు నేను ప్రవక్త (స) వద్దకువెళ్ళి, నాకు నమా’జువేళలు బోధించండని విన్నవించు కున్నాను. దానికి ప్రవక్త (స) నువ్వు ఉదయం నమా’జు చదువు, ఆ తరువాత సూర్యుడు ఉదయించి కొంత ఎత్తుకు వచ్చేవరకు నమా’జు చదవకు. ఎందుకంటే సూర్యుడు షై’తాన్‌ రెండు కొమ్ముల మధ్య నుండి ఉదయిస్తాడు. ఆ సమయంలో అవిశ్వాసులు సూర్యు నికి సాష్టాంగ ప్రమాణంచేస్తారు. సూర్యుడు ఉదయించిన తర్వాత నమా’జు చదువు, ఎందుకంటే నమా’జు సమయంలో దైవదూతలు హాజరవుతారు. ఇంకా తీర్పుదినం నాడు నమా’జు చదివిన వ్యక్తి గురించి సాక్ష్యం ఇస్తారు. అంటే సూర్యోదయం తరువాత నుండి మధ్యాహ్నం వరకు నమా’జు చదివే సమయం. ఇందులో ఫ’ర్ద్, నఫిల్‌ నమా’జులు చదువుకో వచ్చును. మిట్ట మధ్యాహ్నం కాగానే నమా’జు చదవకండి. ఎందుకంటే అప్పుడు నరకం మండించటం జరుగుతుంది. సూర్యుడు వాలిన తర్వాత నమా’జు చదవండి. ఎందుకంటే దైవదూతలు హాజరవుతారు. ఇంకా సాక్ష్యం ఇస్తారు. సూర్యుడు వాలిన తర్వాత నుండి ‘అ’స్ర్‌ వరకు నమా’జు చదవవచ్చును. ‘అ’స్ర్‌ నమా’జు చదివిన తర్వాత సూర్యుడు పూర్తిగా అస్త మించనంత వరకు నమాజు చదవకండి. ఎందుకంటే సూర్యుడు షై’తాన్‌ రెండు కొమ్ముల మధ్య అస్త మిస్తాడు. అవిశ్వాసులు సూర్యునికి సాష్టాంగ ప్రమాణం చేస్తారు,’ అని బోధించారు.

అప్పుడు నేను, ‘ఓ ప్రవక్తా! వు’దూ గురించి కూడా అంటే వు’జూ ప్రాధాన్యత గురించి బోధించండి,’ అని విన్నవించుకున్నాను. దానికి ప్రవక్త (స) ”మీలో ఎవరైనా నీటితో వు’దూ చేస్తూ, పుక్కిలిస్తే ముక్కులో నీళ్ళువేసి శుభ్రపరిస్తే, అతని నోటినుండి, ముక్కు నుండి పాపాలు రాలిపోతాయి, క్షమించబడతాయి. ఆ తర్వాత అతను అల్లాహ్‌ (త) ఆదేశించిన విధంగా ముఖం కడిగితే, ముఖంనుండి పాపాలన్నీ గడ్డం ద్వారా నీటితో పాటు రాలిపోతాయి. ఆ తరువాత రెండుచేతులను మోచేతులతో సహా కడిగితే, ఆ రెండుచేతుల పాపాలు వ్రేళ్ళ చివరల నుండి నీటితో పాటు రాలిపోతాయి. ఆ తరువాత తల మస’హ్‌ చేస్తే తల పాపాలు నీటితో పాటు తొలగిపోతాయి. ఆ తరువాత రెండు కాళ్ళను చీలమండలతో సహా కడిగితే, కాళ్ళ పాపాలు వ్రేళ్ళ చివరల నుండి రాలి పోతాయి.  ఆ తరువాత అతడు నిలబడి నమా’జు చదువుతూ అల్లాహ్ ను స్తుతిస్తే, ఆయన గొప్ప తనాన్ని కొనియాడితే, చిత్తశుద్ధితో నమా’జు చది వితే, నమా’జు పూర్తయిన తర్వాత తల్లి గర్భం నుండి జన్మించినట్టు, అంటే పాపాల నుండి పరిశుద్ధుడై పోతాడు,’ అని అన్నారు. (ముస్లిమ్‌)

1043 – [ 5 ] ( متفق عليه ) (1/328)

وعَنْ كُرَيْبٍ: أَنَّ ابْنَ عَبَّاسٍ وَالْمِسْوَرَ بْنِ مَخْرَمَةَ وَعَبْدَالرَّحْمنِ بْنِ أَزْهَرِ رَضِيَ اللّهُ عَنْهُمْ وَأَرْسَلُوْهُ إِلَى عَائِشَةَ فَقَالُوْا اقْرَأْ عَلَيْهَا السَّلَامَ وَسَلْهَا عَنِ الرَّكْعَتَيْنِ بَعْدَالْعَصْرِقَالَ: فَدَخَلْتُ عَلَى عَائَشَةَ فَبَلَّغْتُهَا مَا أَرْسَلُوْنِيْ”. فَقَالَتْ: سَلْ أُمُّ سَلَمَةَ فَخَرَجْتُ إِلَيْهِمْ فَرَدُّوْنِيْ إِلَى أُمِّ سَلَمَةَ. فَقَالَتْ أُمُّ سَلَمَةَ رَضِيَ اللهُ عَنْهَا: “سَمِعْتُ النَّبِيَّ صلى الله عليه وسلم يَنْهَى عَنْهُمَا ثُمَّ رَأَيْتُهُ يُصَلِّيْهِمَا ثُمَّ دَخَلَ فَأَرْسَلْتُ إِلَيْهِ الْجَارِيَةَ فَقُلْتُ: قَوْلِيْ لَهُ تَقُوْلُ أُمُّ سَلَمَةَ يَا رَسُوْلَ اللهِ سَمِعْتُكَ تَنْهَى عَنْ هَاتَيْنِ وَأَرَاكَ تُصَلِّيْهِمَا؟ قَالَ: “يَا ابْنَةَ أَبِيْ أُمَيَّةَ سَأَلْتِ عَنِ الرَّكْعَتَيْنِ بَعْدَ الْعَصْرِ وَإِنَّهُ أَتَانِيْ نَاسٌ مِّنْ عَبْدِالْقَيْسِ فَشَغَلُوْنِيْ عَنِ الرَّكْعَتَيْنِ اللَّتَيْنِ بَعْدَ الظُّهْرِ فَهُمَا هَاتَانِ”.

1043. (5) [1/328ఏకీభవితం]

కురైబ్‌ (ర) కథనం: ఇబ్నె ’అబ్బాస్‌ (ర) మరియు మిస్‌వర్‌ బిన్‌ మ’ఖ్‌రమహ్‌ మరియు ‘అబ్దుర్ర’హ్మాన్‌ బిన్‌ అల్‌ అ’జ్‌హర్‌ ముగ్గురూ కురైబ్‌ను ‘ఆయి’షహ్‌ (ర) వద్దకు పంపారు. ‘వెళ్ళి ‘ఆయి’షహ్‌ (ర)కు మా సలామ్‌ చెప్పి, ‘అ’స్ర్‌ తరువాత రెండు రకాతుల సున్నతులగురించి అడిగితెలుసుకో,’ అని అన్నారు. నేను ‘ఆయి’షహ్‌ (ర) వద్దకు వెళ్ళాను. వారు చెప్పి నట్టే నేను ఆమెకు చెప్పాను. దానికి ‘ఆయి’షహ్‌ (ర), ‘ఈ విషయాన్నిగురించి ఉమ్మెసలమహ్ ను అడుగు,’ అని అన్నారు. నేను ఆమె వద్ద నుండి తిరిగి వచ్చి ముగ్గురికి జరిగింది చెప్పాను. వారు నన్ను ఉమ్మె సలమహ్ వద్దకు పంపారు. నేను ఆమెను ‘అ’స్ర్‌ తరువాత రెండు రకా’తులు సున్నత్‌లను గురించి అడిగాను. దానికి ఆమె నేను ప్రవక్త (స) ఆ రెండు సున్నతులను చదవరాదని వారిస్తూ ఉండటం విన్నాను. కాని ‘అ’స్ర్‌ తరువాత ప్రవక్త (స) ను రెండు రకా’తులు చదువుతుండగా చూశాను. ప్రవక్త (స) ఇంటికి వచ్చారు. నేను సేవకు రాలిని నీవు ప్రవక్త (స) వద్దకు వెళ్ళి, ఓ ప్రవక్తా! అస్ర్‌ తరువాత రెండు రకా’ తులు చదవరాదని తమరు వారించారు, కాని తమరు ‘అస్ర్‌’ తరువాత రెండు రకా’తులు చదవడం నేను చూశానని ఉమ్మె సలమహ్ అడుగుతున్నారని,’ చెప్పమన్నారు. అప్పుడు ప్రవక్త (స), ఓ అబూ ‘ఉమయ్యహ్ కూతురా! దానికి కారణం ఏమిటంటే, ‘అబ్దుల్‌ ‘ఖైస్‌ తెగకు చెందిన కొంతమంది నా దగ్గరకు వచ్చారు. వారి మాటల్లో ఉండి, ”జుహ్‌ర్‌ తరువాత చదివే రెండురకా’తుల నమా’జ్‌ చదివే అవకాశం లభించలేదు. వాటినే నేను ‘అ’స్ర్‌ తరువాత ఆచ రించాను,’ అని అన్నారు. [3] (బు’ఖారీ, ముస్లిమ్‌)

—–

اَلْفَصْلُ الثَّانِيْ    రెండవ విభాగం  

1044 – [ 6 ] ( صحيح ) (1/329)

عَنْ مُحَمَّدِ بْنِ إِبْرَاهِيْمَ عَنْ قَيْسِ بْنِ عَمْرو قَالَ: رَأَى النَّبِيُّ صلى الله عليه وسلم رَجُلًا يُّصَلِّيْ بَعْدَ صَلَاةِ الصُّبْحِ رَكْعَتَيْنِ. فَقَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “صَلَاةُ الصُّبْحِ رَكْعَتَيْنِ رَكْعَتَيْنِ”. فَقَالَ الرَّجُلُ: إِنِّيْ لَمْ أَكُنْ صَلَّيْتُ الرَّكْعَتَيْنِ اللَّتَيْنِ قَبْلَهُمَا فَصَلَّيْتُهُمَا الآنَ. فَسَكَتَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم. رَوَاهُ أَبُوْ دَاوُدَ وَرَوَى التِّرْمِذِيُّ نَحْوَهُ. وَقَالَ: إِسْنَادُ هَذَا الْحَدِيْثِ لَيْسَ بِمُتَّصِلٍ لِأَنَّ مُحَمَّدَ بْنَ إِبْرَاهِيْمَ لَمْ يَسْمَعْ مِنْ قَيْسِ بْنِ عَمْرٍو.

وَفِيْ شَرْحِ السُّنَّةِ وَنُسِخَ الْمَصَابِيْحِ عَنْ قَيْسِ بْنِ فَهْدٍ نَحْوَهُ.

1044. (6) [1/329దృఢం]

ము’హమ్మద్‌ బిన్‌ ఇబ్రాహీమ్‌ ఖైస్‌ బిన్‌ ’అమ్ర్ ద్వారా కథనం: ప్రవక్త (స) ఒక వ్యక్తిని ఫజ్ర్‌ నమా’జు తర్వాత రెండు రకాతులు చదువుతుండగా చూశారు. అప్పుడు ప్రవక్త (స) ఉదయం నమా’జు రెండు రకాతులే, మరి దాని తరువాత ఈ రెండు రకాతులు ఏమిటి,’ అని అడిగారు. దానికి ఆ వ్యక్తి ఫ’ర్ద్ కు ముందు చవివే రెండు రకాతులు ఉండిపోయాయి. ఇప్పుడు ఫ’ర్ద్ నమా’జు తర్వాత రెండు రకాతుల సున్నత్‌ చదువుతున్నాను,’ అని సమాధానం ఇచ్చాడు. అది విని ప్రవక్త (స) మౌనం వహించారు. (అబూ దావూ‘ద్‌, తిర్మిజి‘)

ఇతర ఉల్లేఖనాల ద్వారా దీనికి సమర్థన లభి స్తుంది. ఈ ’హదీసు‘ అనేక మార్గాల ద్వారా ఉల్లే ఖించబడింది. వీటిని ఇబ్నె ’ఖు’జైమ, ఇబ్ను ’హిబ్బాన్‌, ’హాకిమ్‌ మరియు బైహఖీ ప్రామాణిక మైనవని పేర్కొన్నారు.

1045 – [ 7 ] ( صحيح ) (1/330)

وَعَنْ جُبَيْرِ بْنِ مُطْعَمٍ أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم قَالَ: “يَا بَنِيْ عَبْدِ مُنَافٍ لَا تَمْنَعُوْا أَحَدًا طَافَ بِهَذَا الْبَيْتِ وَصَلَّى أَيَّةَ سَاعَةٍ شَاءَ مِنْ لَيْلٍ أَوْ نَهَارٍ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَأَبُوْ دَاوُدَ وَالنَّسَائِيُّ

1045. (7) [1/330దృఢం]

జుబైర్‌ బిన్‌ ము’త్‌’అమ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఓ ‘అబ్దుమునాఫ్‌ కుమారులారా! మీరు ఎవరినీ ఈ గృహ ప్రదక్షిణ చేయటం పట్ల వారించ కండి. ఇంకా రాత్రీ పగల్లో ఏ సమయంలోనూ ఇక్కడ నమా’జు చదవటాన్ని వారించకండి. అంటే ఏ సమయంలోనైనా బైతుల్లాహ్‌ ’తవాఫ్‌ చేయవచ్చును. వారించే హక్కు ఎవరికీ లేదు. ఎప్పుడైనా అక్కడ నమా’జు చదవవచ్చును. ’అస్ర్‌‘ తరువాత అయినా, ఫజ్ర్‌ తరువాత అయినా, మధ్యాహ్నం అయినా, సూర్యోదయం అయినా, సూర్యాస్తమయం అయినా. (తిర్మిజి‘, అబూ దావూ‘ద్‌, నసాయి‘)

1046 – [ 8 ] ( ضعيف ) (1/330)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ: أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم نَهَى عَنِ الصَّلَاةِ نِصْفَ النَّهَارِ حَتَّى تَزُوْلَ الشَّمْسُ إِلَّا يَوْمَ الْجُمْعَةِ. رَوَاهُ الشَّافِعِيُّ .

1046. (8) [1/330బలహీనం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) మిట్ట మధ్యాహ్నం సమయంలో నమా’జు చదవరాదని వారించారు. అయితే సూర్యుడు వాలిన తర్వాత చదవవచ్చును. కాని శుక్రవారం సూర్యుడు నడినెత్తిన ఉన్నా నమా’జు చదవవచ్చును. (షాఫ’యీ)

1047 – [ 9 ] ( ضعيف ) (1/330)

وَعَنْ أَبِيْ الْخَلِيْلِ عَنْ أَبِيْ قَتَادَةَ قَالَ: كَانَ النَّبِيُّ صلى الله عليه وسلم كَرِهَ الصَّلَاةَ نِصْفَ النَّهَارِ حَتَّى نِصْفَ النَّهَارِ حَتَّى تَزُوْلَ الشَّمْسُ إِلَّا يَوْمَ الْجُمْعَةِ. وَقَالَ: “إِنَّ جَهَنَّمَ تُسَجَّرُ إِلَّا يَوْمَ الْجُمْعَةِ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ. وَقَالَ أَبُوْ الْخَلِيْلِ لَمْ يَلْقَ أَبَا قَتَادَةَ .

1047. (9) [1/330బలహీనం]

అబూ ఖతాదహ్‌ (ర) ద్వారా, అబుల్‌ ’ఖలీల్, కథనం: ప్రవక్త (స) సరిగ్గా మిట్టమధ్యాహ్నం సూర్యుడు వాలేవరకు నమా’జు చదవటాన్ని అసహ్యించుకునే వారు. కాని జుమ’అహ్‌ రోజు తప్ప. నరకం రోజూ మండించబడుతుంది. అంటే ప్రతి రోజూ మధ్యాహ్నం మండించబడుతుంది. అయితే జుమ’అహ్‌ రోజు తప్ప.” (అబూ దావూద్‌)

అబుల్‌ ’ఖలీల్‌ అబూ ఖతాదహ్‌ను కలవలేదని, అబూ దావూద్‌ అన్నారు.

—–

اَلْفَصلُ الثَّالِثُ   మూడవ విభాగం 

1048 – [ 10 ] ( صحيح ) (1/330)

عَنْ عَبْدِ اللهِ الصَّنَابِحِيِّ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: ” إِنَّ الشَّمْسَ تَطلُعُ وَمَعَهَا قَرنُ الشَّيطَانِ. فَإِذَا ارْتَفَعتْ فَارَقَهَا. ثُمَّ إِذَا اسْتَوَتْ قَارَنَهَا فَإِذَا زَالَتْ فَارَقَهَا فَإِذَا دَنَتْ لِلْغُرُوْبِ قَارَنَهَا. فَإِذَا غَرِبَتْ فَارَقَهَا”. وَنَهَى رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم عَنِ الصَّلَاةِ فِيْ تِلْكَ السَّاعَاتِ. رَوَاهُ مَالِكُ وَأَحْمَدُ وَالنَّسَائِيُّ .

1048. (10) [1/330దృఢం]

’అబ్దుల్లాహ్‌ సు‘నాబి’హియ్యి (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”సూర్యుడు ఉదయించినపుడు, దానితో పాటు షై’తాన్‌ కొమ్ము కూడా ఉంటుంది. సూర్యుడు కొంత ఎత్తుకు వస్తే షై’తాన్‌ తన కొమ్మును వేరుచేసు కుంటాడు. సరిగ్గా మిట్ట మధ్యాహ్నం షై’తాన్‌ తన కొమ్మును దానితో కలిపివేస్తాడు. సూర్యుడు వాలితే షై’తాన్‌ తనకొమ్ము దాని నుండి వేరు చేసుకుంటాడు. సూర్యాస్తమయం అయినపుడు షై’తాన్‌ తన కొమ్మును దానితో కలుపు కుంటాడు. సూర్యాస్తమయం అయిపోయిన తర్వాత వేరుచేసు కుంటాడు. ప్రవక్త (స) ఈ మూడు సమయాల్లో నమా’జ్‌ చదవడాన్ని వారించారు. (మాలిక్‌, అ’హ్మద్‌, నసాయి’)

1049 – [ 11 ] ( صحيح ) (1/331)

وَعَنْ أَبِيْ بَصْرَةَ الْغُفَارِيِّ قَالَ: صَلَّى بِنَا رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم بِالْمُخَمَّصِ صَلَاةَ الْعَصْرِ فَقَالَ: “إِنَّ هَذِهِ صَلَاةٌ عُرِضَتْ عَلَى مَنْ كَانَ قَبْلَكُمْ فَضَيَّعُوْهَا فَمَنْ حَافَظَ عَلَيْهَا كَانَ لَهُ أَجْرُهُ مَرَّتَيْنَ وَلَا صَلَاةٌ بَعْدَهَا حَتَّى يَطْلُعَ الشَّاهِدُ”. وَالشَّاهِدُ النَّجْمُ. رَوَاهُ مُسْلِمٌ .

1049. (11) [1/331దృఢం]

అబూ బస్‌‘రహ్‌ ’గుఫారీ (ర) కథనం: ప్రవక్త (స) ము’ఖమ్మ’స్‌ ప్రాంతంలో మాకు ’అ’స్ర్‌ నమా’జు చదివించారు. నమా’జు ముగించిన తరువాత ఈ ‘అ’స్ర్‌ నమా’జును ఇతర అనుచర సమాజాల ముందు ప్రవేశపెట్టబడింది. అంటే వారిపై కూడా విధించబడింది. కాని వారు దాన్ని వృథా చేశారు. సంరక్షించలేక పోయారు. అందువల్ల ’అ’స్ర్‌ నమా’జును సంరక్షించే వారికి రెండింతలు పుణ్యం లభిస్తుంది. ఒకటి చదివి నందుకు, మరొకటి సంరక్షించి నందుకు. ’అ’స్ర్‌ తరువాత ఎటువంటి నఫిల్‌ నమా’జు లేదు. షాహిద్‌ ప్రత్యక్షం అయ్యేవరకు, షాహిద్‌ అంటే నక్షత్రం. అంటే సూర్యాస్తమయం అయ్యేవరకు. (ముస్లిమ్‌)

1050 – [ 12 ] ( صحيح ) (1/331)

وَعَنْ مُعَاوِيَةَ قَالَ: إِنَّكُمْ لَتُصَلُّوْنَ صَلَاةً لَقَدْ صَحِبْنَا رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم فَمَا رَأَيْنَاهُ يُصَلِّيْهِمَا. وَلَقَدْ نَهَى عَنْهُمَا يَعْنِيْ الرَّكْعَتَيْنِ بَعْدَ الْعَصْرِ. رَوَاهُ الْبُخَارِيُّ .

1050. (12) [1/331దృఢం]

ము’ఆవియహ్‌ (ర) కథనం: మీరు నమా’జు చదువుతున్నారు. కాని మేము ప్రవక్త (స) వెంట ఉండి ఉన్నాము. కాని ప్రవక్త (స)ను ’అ’స్ర్‌ తరువాత నమా’జు చదువుతుండగా చూడలేదు. వాస్తవం ఏమిటంటే ప్రవక్త (స) ’అ’స్ర్‌ తర్వాత నమా’జు చదవటాన్ని వారించారు. [4] (బు’ఖారీ)

1051 – [ 13 ] ( ضعيف ) (1/331)

وَعَنْ أَبِيْ ذَرٍّ قَالَ وَقَدْ صَعِدَ عَلَى دَرَجَةِ الْكَعْبَةِ: مَنْ عَرَفَنِيْ فَقَدْ عَرَفَنِيْ وَمن لم يعرفني فأنا جندب سمعت رسول الله صلى الله عليه وسلم يقول: “لا صلاة بعد الصبح حتى تطلع الشمس ولا بعد العصر حتى تغرب الشمس إلا بمكة إلا بمكة إلا بمكة”. رواه أحمد ورزين .

1051. (13) [1/331బలహీనం]

అబూ జ‘ర్‌ (ర) కథనం: అతను క’అబహ్ మెట్లపైకి ఎక్కి ఇలా అన్నారు, ”నన్ను గుర్తించే వారు నన్ను గుర్తిస్తారు. నన్ను గుర్తించని వారు ఇప్పుడు గుర్తించండి. నేను జుందుబ్, నా కునియత్‌ అబూ జ’ర్‌ (ర). ప్రవక్త (స) ఇలా ప్రవచిస్తూ ఉండగా నేను విన్నాను, ‘ఉదయం తరువాత సూర్యుడు ఉద యించిన తరువాత వరకు ఏ నమా’జు లేదు. అలాగే ’అ’స్ర్‌ నమా’జు తరువాత సూర్యుడు అస్తమించే వరకు ఏనమా’జు లేదు. కాని మక్కహ్ ముకర్రమహ్ లో తప్ప, మక్కహ్ ముకర్రమహ్ లో తప్ప, మక్కహ్ ముకర్రమహ్ లో తప్ప.’ (అ’హ్మద్‌, ర’జీన్‌)

మక్కహ్ లో ఎల్లప్పుడూ నమా’జు చదువుకో వచ్చును. చివరికి ఈ మూడు సమయాల్లో కూడా.

=====

23–  بَابُ الْجَمَاعَةِ وَفَضْلِهَا

23. సామూహిక నమాజు, దాని ఘనత

కొంతమంది కలసి నమా’జు చదవటాన్ని సామూ హిక నమా’జు అంటారు. ఇది తప్పనిసరి. దీన్ని చదవనివారు పాపాత్ములౌతారు. అల్లాహ్‌ ఆదేశం: ”…యర్క’ఊ మ’అ అర్రాకి’యీన్… (సూ. అల్ బఖరహ్, 2:43) — ‘…మరియు (నా సాన్నిధ్యంలో వినమ్రులై) వంగే (రుకూ  చేసే) వారితో పాటు మీరూ (వినమ్రులై) వంగండి (రుకూ చేయండి)..’ అంటే సామూహికంగా నమా’జు చదవండి. ప్రవక్త (స) ప్రవచనం, ”సామూహికంగా నమా’జు చదవడానికి రాని వారి ఇళ్ళను కాల్చి వేద్దామని అనుకున్నాను.” (బు’ఖారీ)

ఎక్కడైనా ముగ్గురు ఉన్నాసరే, సామూహికంగా నమా’జు చదవకపోతే, వారిపై షై’తాన్‌ ఆధిక్యత పొందుతాడు. జమా’అత్‌తో కలసి ఉండండి. (అ’హ్మద్‌)

’అబ్దుల్లాహ్‌ బిన్‌ మస్‌’ఊద్‌ (ర) కథనం: ఒకవేళ మీరు అల్లాహ్‌ దర్శనం కోసం ఉత్సాహం కలిగి ఉంటే, ఈ ఐదు నమా’జులను అజా’న్‌ అయిన చోటే గుర్తుం చండి. అంటే మస్జిద్‌లో సామూహికంగా నమా’జు చద వండి. ఎందుకంటే అల్లాహ్‌ ప్రవక్త (స) మార్గదర్శక పద్ధతులు నిర్ణయించి ఉంచారు. సామూహిక నమా’జు కూడా వాటిలో ఒకటే. ఒకవేళ మీరు ఈ నమా’జులను ఒంటరిగా ఇంట్లో చదివితే, మీరు మీ ప్రవక్త (స) పద్ధతిని వదలివేసినట్టే. ఒకవేళ మీరు మీ ప్రవక్త(స) పద్ధతిని వదలివేస్తే మార్గభ్రష్టత్వానికి గురవుతారు. మీరు చక్కగా వు’జూచేసి మస్జిద్‌లో నమా’జు చదవటానికి వస్తే, వేసిన ప్రతి అడుగుకు పుణ్యం లభిస్తుంది, పాపం తొలగించబడుతుంది. తగిన కారణం ఉండి సామూహికంగా చదవని వారు తప్ప, సామూహికంగా చదవని వారు కపటాచారులే. (ముస్లిమ్‌)

اَلْفَصْلُ الْأَوَّلُ    మొదటి విభాగం 

1052 – [ 1 ] ( متفق عليه ) (1/332)

عَنِ ابْنِ عُمَرَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “صَلَاةُ الْجَمَاعَةِ تَفْضَلُ صَلَاةَ الْفَذِّ بِسَبْعٍ وَّعِشْرِيْنَ دَرَجَةً”.

1052. (1) [1/332ఏకీభవితం]

ఇబ్నె ’ఉమర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”సామూహికంగా చదివే నమా’జుకు ఒంటరిగా చదివే నమా’జు కంటే 27 రెడ్లు పుణ్యం అధికంగా లభిస్తుంది.” [5] (బు’ఖారీ, ముస్లిమ్‌)

1053 – [ 2 ] ( صحيح ) (1/332)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “وَالَّذِيْ نَفْسِيْ بِيَدِهِ لَقَدْ هَمَمْتُ أَنْ آمُرَ بِحَطَبٍ فَيُحْطَتُبَ. ثُم آمُر بِالصَّلَاةِ فَيُؤَذَّنَ لَهَا. ثُمَّ آمُرَ رَجُلًا فَيؤُمَّ النَّاسَ ثُمَّ أُخَالِفَ إلَى رِجَالٍ.

وَفِيْ رَوَايَةٍ: لَا يَشْهَدُوْنَ الصَّلَاةَ فَأُحَرِّقَ عَلَيْهِمْ بُيُوْتَهُمْ وَالَّذِيْ نَفْسِيْ بِيَدِهِ لَوْ يَعْلَمُ أَحَدُهُمْ أَنَّهُ يَجِدُ عِرْقًا سَمِيْنَا أَوْ مِرْمَاتَيْنِ حَسَنَتَيْنِ لَشَهِدَ الْعِشَاءَ”. رَوَاهُ الْبُخَارِيُّ وَلِمُسْلِمٍ نَحْوَهُ.

1053. (2) [1/332దృఢం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఎవరి చేతిలో నా ప్రాణం ఉందో, ఆయన సాక్షి! కట్టెలను ఒకచోట ప్రోగుచేయమని ఆదేశించాలని, ఆ తరువాత నమా’జు కోసం అజా’న్‌ ఇవ్వమని ఆదేశించి, ప్రజలకు నమా’జు చదివించమని ఒక వ్యక్తిని నియమించి, సామూహిక నమా’జుకు రానివారి ఇండ్లకువెళ్ళి చూసి వారి ఇండ్లకు నిప్పంటించాలని దృఢసంకల్పం చేసుకున్నాను. ఎవరి చేతిలో నా ప్రాణం ఉందో, ఆయన సాక్షి! ఒకవేళ వారికి మస్జిద్‌లో బలిసిన మేక దుమ్ములు లేదా బలిసిన మేక కాలి డెక్కలు లభిస్తాయంటే ’ఇషా’ నమా’జుకు కూడా వచ్చేస్తారు,’ అని అన్నారు. [6] (బు’ఖారీ, ముస్లిమ్‌)

1054 – [ 3 ] ( صحيح ) (1/332)

وَعَنْهُ قَالَ: أَتَى النَّبِيَّ صلى الله عليه وسلم رَجُلٌ أَعْمَى فَقَالَ: يَا رَسُوْلَ اللهِ إِنَّهُ لَيْسَ لِيْ قَائِدٌ يَقُوْدُنِيْ إِلَى الْمَسْجِدِ. فَسَأَلَ رَسُوْلَ اللهِ صلى الله عليه و سلم أَنْ يُّرَخِّصَ لَهُ فَيُصَلِّيَ فِيْ بَيْتِهِ فَرَخَّصَ لَهُ. فَلَمَّا وَلَّى دَعَاهُ. فَقَالَ: “هَلْ  تَسْمَعُ النِّدَاءَ بِالصَّلَاةِ؟” قَالَ: نَعَمْ قَالَ: “فَأَجِبْ”. رَوَاهُ مُسْلِمٌ .

1054. (3) [1/332దృఢం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ఒక అంధుడు (’అబ్దుల్లాహ్‌ బిన్‌ ఉమ్మె మక్‌తూమ్‌) ప్రవక్త (స) వద్దకు వచ్చాడు. ’ఓ ప్రవక్తా! నన్ను మస్జిద్‌ వరకు తెచ్చేవారెవరూ లేరు. నేను మస్జిద్‌కు రాకుండా ఇంట్లో నమా’జు చదువుకోవచ్చా?’ అని విన్నవించు కున్నాడు. ప్రవక్త (స) అనుమతించారు. అతడు తిరిగి వెళుతుండ  ప్రవక్త (స) అతన్ని పిలిపించి, ‘నీకు అజా’న్‌ వినిపిస్తుందా,’ అని అడిగారు. దానికి అతడు, ‘అవునని,’ అన్నాడు. అప్పుడు ప్రవక్త (స), ’మరైతే నమా’జు చదవడానికి మస్జిదుకు రావలసిందే,’ అని అన్నారు. [7]  (ముస్లిమ్‌)

1055 – [ 4 ] ( متفق عليه ) (1/333)

وَعَنِ ابْنِ عُمَرَ:أَنَّهُ أَذَّنَ بِالصَّلَاةِ فِيْ لَيْلِةِ ذَاتَ بَرْدٍ وَّرِيْحٍ. ثُمَّ قَالَ أَلَا صَلُّوْا فِيْ الرِّحَالِ. ثُمَّ قَالَ: إِنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم كَانَ يَأْمُرُ الْمُؤَذِّنَ إِذَا كَانَتْ لَيْلَةٌ ذَاتَ بَرْدٍ وَّمَطَرٍ يَقُوْلُ: “أَلَا صَلُّوْا فِيْ الرِّحَالِ”.

1055. (4) [1/333ఏకీభవితం]

ఇబ్నె ’ఉమర్‌ (ర) కథనం: నేను తీవ్రమైన వర్షం, చలి ఉన్న రాత్రి అజా’న్‌ ఇస్తూ, అజా’న్‌ మధ్యలో, (”హయ్య అలస్సలాహ్‌”కు బదులు”) ’అలా ’సల్లూ ఫీ రిహాల్,” అని అనేవాడిని. ఎందుకంటే,  ప్రవక్త (స) ముఅజ్జి’న్‌ను తీవ్రగాలి, వర్షంగల రాత్రి ” ’అలా ’సల్లూ ఫీ రిహాల్,” అనిపలకమని ఆదేశించేవారు,’ అని అన్నారు.[8] (బు’ఖారీ, ముస్లిమ్‌)

1056 – [ 5 ] ( متفق عليه ) (1/333)

وَعَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِذَا وُضِعَ عَشَاءُ أَحَدِكُمْ وَأُقِيْمَتِ الصّلَاةَ فَابْدَؤُوْا بِالْعَشَاءِ وَلَا يَعْجَلْ حَتَّى يَفْرُغَ مِنْهُ”. وَكَانَ ابْنُ عُمَرَ يُوْضَعُ لَهُ الطَّعَامُ وَتُقَامُ الصَّلَاةُ فَلَا يَأْتِيْهَا حَتَّى يَفْرُغَ مِنْهُ وَإِنَّهُ لَيَسْمَعُ قِرَاءَةَ الْإِمَامِ.

1056. (5) [1/333ఏకీభవితం]

’అబ్దుల్లాహ్‌ బిన్‌ ’ఉమర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మీలో ఎవరి ముందు అయినా రాత్రి భోజనం ఉంచబడి, ఇటు నమా’జుకు ఇఖామత్‌ పలక బడితే ముందు నిదానంగా భోజనం చేయాలి. తొందర పడకూడదు. అవసరం పూర్తి చేసుకోవాలి. అందువల్లే ఇబ్నె ’ఉమర్‌ (ర) ముందు రాత్రి భోజనం ఉంచబడి, ఇఖామత్‌ అయినా నమా’జుకు వెళ్ళకుండా భోజనం చేసేవారు. అయితే ఇమాము శబ్దం వినబడుతూ ఉండేది. [9] (బు’ఖారీ, ముస్లిమ్‌)

1057 – [ 6 ] ( متفق عليه ) (1/333)

وَعَنْ عَائِشَةَ رَضِيَ اللهُ عَنْهَا أَنَّهَا قَالَتْ: سَمِعْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ: “لَا صَلَاةَ بِحَضْرَةِ الطَّعَامِ وَلَاهُوَ يُدَافِعُهُ الْأَخْبَثَانِ”.

1057. (6) [1/333ఏకీభవితం]

’ఆయి‘షహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ఇలా ప్రవచిస్తూ ఉండగా నేను విన్నాను, ”అన్నం ముందు ఉంటే నమా’జు లేదు. అంటే ఆకలిగా ఉండి ముందు అన్నం ఉంటే నమా’జు సమయం అయినా ముందు అన్నం తినాలి. ఆ తరువాత నమా’జు చదవాలి. అదే విధంగా నమా’జు అవుతున్నా మలమూత్ర అవసరం ఉంటే ముందు మలమూత్ర అవసరం తీర్చుకోవాలి.” (ముస్లిమ్‌)

1058 – [ 7 ] ( صحيح ) (1/333)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِذَا أُقِيْمَتِ الصَّلَاةُ فَلَا صَلَاةَ إِلَّا الْمَكْتُوْبَةَ”. رَوَاهُ مُسْلِمٌ .

1058. (7) [1/333దృఢం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”నమా’జు ప్రారంభమయితే, అంటే నమా’జు కోసం తక్‌బీర్‌ పలకబడితే, విధినమా’జుతప్ప మరేనమా’జు లేదు.” [10] (ముస్లిమ్‌)

1059 – [ 8 ] ( متفق عليه ) (1/333)

وَعَنِ ابْنِ عُمَرَ قَالَ: قَالَ النَّبِيُّ صلى الله عليه وسلم: “إِذَا اسْتَأْذَنَتْ امْرَأَةُ أَحَدِكُمْ إِلَى الْمَسْجِدِ فَلَا يَمْنَعْهَا”.

1059. (8) [1/333ఏకీభవితం]

’అబ్దుల్లాహ్‌ బిన్‌ ’ఉమర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మీలో ఎవరి భార్య అయినా మస్జిద్‌లో నమా’జు చదివేందుకు అనుమతి కోరితే వారికి అనుమతి ఇవ్వాలి. వారించకూడదు.” [11] (బు’ఖారీ, ముస్లిమ్‌)

1060 – [ 9 ] ( صحيح ) (1/333)

وَعَنْ زَيْنَبَ اْمَرَأَةِ عَبْدِ اللهِ بْنِ مَسْعُوْدٍ قَالَتْ: قَالَ لَنَا رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِذَا شَهِدَتْ إِحْدَاكُنَّ الْمَسْجِدَ فَلَا تَمَسَّ طِيْبًا”. رَوَاهُ مُسْلِمٌ  

1060. (9) [1/333దృఢం]

’అబ్దుల్లాహ్‌ బిన్‌ మస్‌’ఊద్‌ (ర) భార్య ’జైనబ్‌ (ర) కథనం: ప్రవక్త (స) మా స్త్రీలతో ఇలా అన్నారు, ‘ఒకవేళ మీలో ఎవరైనా మస్జిద్‌లో నమా’జు చదవడానికి వస్తే, వారు సువాసన పులుముకొని రాకూడదు,’ అని అన్నారు. (ముస్లిమ్‌)

1061 – [ 10 ] ? (1/333)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ رَضي اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “أَيُّمَا امْرَأَةٍ أَصَابَتْ بخُوْرًا فَلَا تَشْهَدَ مَعَنَا الْعِشَاءَ الْآخِرَةَ”.  رَوَاهُ مُسْلِمٌ.

1061. (10) [1/333?]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”సువాసన పులుముకున్న స్త్రీ మాతో కలసి ’ఇషా‘ నమా’జు చదవటానికి రాకూడదు.” (ముస్లిమ్‌)

—–

اَلْفَصْلُ الثَّانِيْ     రెండవ విభాగం

1062 – [ 11 ] ( صحيح ) (1/334)

عَنِ ابْنِ عُمَرَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَا تَمْنَعُوْا نِسَاءَكُمُ الْمَسَاجِدَ وَبُيُوْتُهُنَّ خَيْرٌ لَّهُنَّ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ.  

1062. (11) [1/334దృఢం]

’అబ్దుల్లాహ్‌ బిన్‌ ’ఉమర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మీరు మీ స్త్రీలను మస్జిదులోకి వెళ్ళ కుండా ఆపకండి. అయితే వారి ఇల్లే వారి కొరకు ఉత్తమం.” (అబూ దావూ‘ద్‌)

1063 – [ 12 ] ( صحيح ) (1/334)

وَعَنِ ابْنِ مَسْعُوْدٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “صَلَاةُ الْمَرْأَةِ فِيْ بَيْتِهَا أَفْضَلُ مِنْ صَلَاتِهَا فِيْ حُجْرَتِهَا وَصَلَا تُهَا فِيْ مِخْدَعِهَا أَفْضَلُ مِنْ صَلَاتِهَا فِيْ بَيْتِهَا”. رَوَاهُ أَبُوْ دَاوُدَ.

1063. (12) [1/334దృఢం]

’అబ్దుల్లాహ్‌ బిన్‌ మస్‌’ఊద్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”స్త్రీ తన ఇంటి వరండాలో నమా’జు చదవడం కంటే ఇంటి హాలులో చదవటమే ఉత్తమం. అదేవిధంగా ఇంటి హాలులో నమా’జు చదవడం కంటే లోపలి గదిలో నమా’జు చదవడం ఉత్తమం.”  [12] (అబూ దావూ‘ద్‌)

1064 – [ 13 ] ( ضعيف ) (1/334)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: إِنِّيْ سَمِعْتُ حِبِّيْ أَبَا الْقَاسِمِ صلى الله عليه وسلم يَقُوْلُ: “لَا تُقْبَلُ صَلَاةُ امْرَأَةٍ تَطَيَّبَتْ لِلْمَسْجِدِ حَتَّى تَغْتَسِلَ غُسْلَهَا مِنَ الْجَنَابَةِ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ وَرَوَى أَحْمَدُ وَالنَّسَائِيُّ نَحْوَهُ.

1064. (13) [1/334బలహీనం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ఇలా ప్రవచిస్తూ ఉండగా నేను విన్నాను, ”సువాసన పులుముకొని మస్జిదుకు వచ్చిన స్త్రీ నమా’జు జనాబత్‌ స్నానంలా, కడిగనంత వరకు స్వీకరించ బడదు.”  [13] (అబూ దావూద్‌, అ’హ్మద్‌, నసాయి‘)

1065 – [ 14 ] ( صحيح ) (1/334)

وَعَنْ أَبِيْ مُوْسَى قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “كُلُّ عَيْنٍ زَاِنيَةٌ وَإِنَّ الْمَرَأَةَ إِذَا اسْتَعْطَرَتْ فَمَرَّتْ بِالْمَجْلِسِ فَهِيَ كَذَا وَكَذَا”.  يَعْنِيْ زَانِيَةٌ. رَوَاهُ التِّرْمِذِيُّ وَلِأَبِيْ دَاوُدَ وَالنَّسَائِيِ نَحْوَهُ .

1065. (14) [1/334దృఢం]

అబూ మూసా అష్‌’అరీ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”కామ వాంఛతో పరాయి స్త్రీ లేదా పరాయి పురుషుడిని చూసే కన్ను వ్యభిచారం చేసే కన్నే. సువాసన పులుముకొని పురుషుల సమీపం నుండి వెళ్ళే స్త్రీ కూడా వ్యభిచారియే.” (తిర్మిజి’, అబూ దావూ’ద్‌, నసాయి’)

1066 – [ 15 ] ( حسن ) (1/335)

وَعَنْ أُبَيِّ بْنِ كَعْبٍ قَالَ: صَلَّى بِنَا رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم يَوْمًا الصُّبْحَ. فَلَمَّا سَلَّمَ قَالَ: “أَشَاهِدٌ فَلَانٌ؟” قَالُوْا: لَا. قَالَ: “أَشَاهِدٌ فُلَانٌ؟ ” قَالُوْا: لَا. قَالَ: “إِنَّ هَاتَيْنِ الصَّلَاتَيْنِ أَثْقَلُ الصَّلَواتِ عَلَى الْمُنَافِقِيْنَ وَلَوْ تَعْلَمُوْنَ مَا فِيْهِمَا لَأَتَيْتُمُوْهُمَا وَلَوْ حَبْوًا عَلَى الرُّكَبِ وَإِنَّ الصَّفَّ الْأَوَّلَ عَلَى مِثْلِ صَفِّ الْمَلَائِكَةِ وَلَوْ عَلِمْتُمْ مَا فَضِيْلَتُهُ لَابْتَدَرْتُمُوْهُ وَإِنَّ صَلَاةَ الرَّجُلِ مَعَ الرَّجُلِ أَزْكَى مِنْ صَلَاتِهِ وَحْدَهُ وَصَلَاتُهُ مَعَ الرَّجُلَيْنِ أَزْكَى مِنْ صَلَاتِهِ مَعَ الرَّجُلِ ومَا كَثُرَ فَهُوَ أَحبُّ إِلَى اللهِ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ وَالنَّسَائِيُّ

1066. (15) [1/335ప్రామాణికం]

ఉబయ్‌ బిన్‌ క’అబ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ఒకరోజు ఫజ్ర్‌ నమా’జు మాకు చదివించారు. సలామ్‌ పలికి ముగించిన తర్వాత, ‘ఫలానా వ్యక్తి ఉన్నాడా?’ అని అన్నారు. ప్రజలు, ‘లేడని,’ అన్నారు. మళ్ళీ ‘ఫలానా వ్యక్తి ఉన్నాడా?’ అన్నారు. ప్రజలు ‘లేడని’ అన్నారు. అప్పుడు ప్రవక్త (స) ఈ రెండు నమా’జులు అంటే ఫజ్ర్‌ మరియు ‘ఇషా’ కపటాచారులపై నమా’జులన్నింటి కంటే భారంగా ఉంటాయి. కాని వారు ఈ నమాజులకు గల ప్రతిఫలం ఎంత ఉందో తెలుసుకుంటే, మోకాళ్ళపై నడిచి వస్తారు. ఇంకా నమా’జులోని మొదటి పంక్తి దైవదూతల మొదటి పంక్తితో సమానం. ఒకవేళ మొదటి పంక్తి విశిష్ఠత ప్రజలకు తెలిస్తే పరిగెత్తుకుంటూ వస్తారు. ఒంటరి వ్యక్తి నమా’జు చదవడం కంటే ఇద్దరు వ్యక్తులు కలసి చదవడం మేలు. ఒక వ్యక్తితో కలసి నమా’జు చదవడం కంటే ముగ్గురు వ్యక్తులు కలసి నమా’జు చదవడం మేలు. వ్యక్తులు ఎంత అధికంగా ఉంటే, అంతే అల్లాహ్‌(త)కు ప్రీతికరం” అని అన్నారు. (అబూ దావూ‘ద్‌, నసాయి‘)

1067 – [ 16 ] ( حسن ) (1/335)

وَعَنْ أَبِيْ الدَّرْدَاءِ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَا مِنْ ثَلَاثَةٍ فِيْ قَرْيَةٍ وَلَا بَدْوٍ لَا تُقَامُ فِيْهِمُ الصَّلَاةُ إِلَّا قَدْ اسْتَحْوَذَ عَلَيْهِمُ الشَّيْطَانُ. فَعَلَيْكَ بِالْجَمَاعَةِ فَإِنَّمَا يَأْكُلُ الذِّئْبُ الْقَاصِيَةَ”. رَوَاهُ أَحْمَدُ وَأَبُوْ دَاوُدَ وَالنَّسَائِيُّ .

1067. (16) [1/335ప్రామాణికం]

అబూ దర్‌దా‘ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఏ ఊరిలో లేదా ఏ పట్టణంలో అయినా ముగ్గురు వ్యక్తులు ఉండి, సామూహికంగా నమా’జు ఆచరించక పోతే, వారి పై షై’తాన్‌ అధిగమిస్తాడు. అందువల్ల మీరు సామూహికంగా ఉండండి, సామూహికంగా నమా’జు చదవండి. ఎందుకంటే ఒంటరిగా ఉన్న మేక, గొర్రెను తోడేలు తినేస్తుంది.” (అ’హ్మద్‌, అబూ దావూ’ద్‌, నసాయి’)

1068 – [ 17 ] ( ضعيف ) (1/335)

وَعَنِ ابْنِ عَبَّاسٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَنْ سَمِعَ الْمُنَادِيَ فَلَمْ يَمْنَعْهُ مِنْ اِتِّبَاعِهِ عُذْرٌ”. قَالُوْا وَمَا الْعُذْرُ؟ قَالَ: “خَوْفٌ أَوْ مَرَضٌ لَمْ تُقْبَلْ مِنْهُ الصَّلَاةَ الَّتِيْ صَلَّى” رَوَاهُ أَبُوْ دَاوُدَ وَالدَّارَقُطْنِيُّ

1068. (17) [1/335బలహీనం]

ఇబ్నె ’అబ్బాస్‌ (ర) కథనం: ప్రవక్త (స) ముఅ’జ్జి’న్‌ పిలుపు విని, ఎటువంటి కారణం లేకుండా నమా’జు చదవడానికి మస్జిద్‌కు పోయి, సామూహికంగా నమా’జు చదవకపోతే, అతడు ఒంటరిగా చదివే నమాజు స్వీకరించబడదు,’ అని అన్నారు. ప్రజలు, ‘కారణం అంటే,’ అని అన్నారు. దానికి ప్రవక్త (స) ప్రాణభయం, వర్షం, ధన భయం, నడవలేని వ్యాధి మొదలైన కారణాలు లేకుండా ఒంటరిగా నమా’జు చదివితే, అతనినమా’జు స్వీకరించబడదు” అని అన్నారు.[14] (అబూ దావూ’ద్‌, దారు ఖు’తునీ)

1069 – [ 18 ] ( صحيح ) (1/336)

وَعَنْ عَبْدِ اللهِ بْنِ أَرْقَمَ قَالَ: سَمِعْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ: “إِذَا أُقِيْمَتِ الصَّلَاةَ وَوَجَدَ أَحَدُكُمْ الْخَلَاءَ فَلْيَبْدَأْ بِالْخَلَاءِ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَرَوَى مَالِكٌ وَأَبُوْ دَاوُدَ وَالنَّسَائِيُّ نَحْوَهُ.

1069. (18) [1/336దృఢం]

’అబ్దుల్లాహ్‌ బిన్‌ అర్‌ఖమ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ఇలా ప్రవచిస్తూ ఉండగా నేను విన్నాను, ”సామూహిక నమా’జు ప్రారంభమయినపుడు, మీకు మలమూత్ర విసర్జన అవసరం వస్తే, ముందు మలమూత్ర విసర్జన అవసరాన్ని తీర్చుకోండి. ఆ తరువాత నమా’జు చదవండి. సామూహిక నమా’జు దొరికితే సరే, లేదా సామూహిక పుణ్యం లభిస్తుంది.” (తిర్మిజి’, మాలిక్, అబూ దావూ’ద్‌, నసాయి’)

1070 – [ 19 ] ( ضعيف ) (1/336)

وَعَنْ ثَوْبَانَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “ثَلَاثٌ لَّا يَحِلُّ لِأَحَدٍ أَنْ يَّفْعَلَهُنَّ: لَا يَؤَمَّنُ رَجُلٌ قَوْمًا فَيَخُصُّ نَفْسَهُ بِالدُّعَاءِ دُوْنَهُمْ. فَإِنْ فَعَلَ ذَلِكَ فَقَدْ خَانَهُمْ. وَلَا يَنْظُرُ فِيْ قَعْرِبَيْتٍ قَبْلَ أَنْ يَّسْتَأْذِنَ. فَإِنْ فَعَلَ ذَلِكَ فَقَدْ خَانَهُمْ وَلَا يُصَلِّ وَهُوَ حَقِنٌ حَتَّى يَتَخَفَّفَ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ وَلِلتِّرْمِذِيِّ نَحْوَهُ.

1070. (19) [1/336 బలహీనం]

సౌ‘బాన్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మూడు విషయాలు ఎవరికీ తగనివి. అంటే చేయటం ధర్మం కాదు: 1. ఎవరైనా ఒకజాతికి ఇమామత్‌ చేయటం, అంటే జాతిని వదలి కేవలం తన గురించే దు’ఆ చేయటం, ముఖ్తదీలను వదలివేయటం. అంటే ఇమాము తనతో పాటు ముఖ్తదీ లను గురించి కూడా దు’ఆ చేయాలి, 2. అనుమతి లేకుండా ఇతరుల ఇంట్లో తొంగి చూడడం. అలా చేస్తే ద్రోహం చేసినట్టే, 3. మలమూత్రాల విసర్జనా అవసరం ఉన్నప్పుడు నమా’జు చదవరాదు. వాటిని విసర్జించిన తరువాత చదవాలి. (అబూ దావూ’ద్‌, తిర్మిజి’)

1071 – [ 20 ] ( ضعيف ) (1/336)

وَعَنْ جَابِرٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَا تُؤَخِّرُوا الصَّلَاةَ لِطَعَامٍ وَلَا لِغَيْرِهِ”. رَوَاهُ فِيْ شَرْحِ السُّنَّةِ.

1071. (20) [1/336బలహీనం]

జాబిర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”అన్నం మరియు ఇతర విషయాల వల్ల నమా’జులో ఆలస్యం చేయకండి.”  [15]  (షర్‌’హుస్సున్నహ్‌)

—–

اَلْفَصْلُ الثَّالِثُ   మూడవ విభాగం

1072 – [ 21 ] ( صحيح ) (1/336)

عَنْ عَبْدِ اللهِ بْنِ مَسْعُوْدٍ قَالَ: لَقَدْ رَأَيْتُنَا وَمَا يَتَخَلَّفُ عَنِ الصَّلَاةِ إِلَّا مُنَافِقٌ قَدْ عُلِمَ نِفَاقُهُ أَوْ مَرِيْضٌ إِنْ كَانَ الْمَرِيْضُ لَيَمْشِيْ بَيْنَ رَجُلَيْنِ حَتَّى يَأْتِي الصَّلَاةَ. وَقَالَ إِنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم عَلَّمَنَا سُنَنَ الْهُدَى. وَإِنَّ مِنْ سُنَنِ الْهُدَى الصَّلَاةَ فِيْ الْمَسْجِدِ الَّذِيْ يُؤَذَّنُ فِيْهِ.

وَفِيْ رَوَايَةٍ: “مَنْ سَرَّهُ أَنْ يَّلْقَى اللهَ غَدًا مُسْلِمًا فَلْيُحَافِظْ عَلَى هؤلاء الصَّلَوَاتِ الْخَمْسِ حَيْثُ يَنَادَى بِهِنَّ. فَإِنَّ اللهَ شَرَعَ لِنَبِيِّكُمْ صلى الله عليه وسلم سُنَنَ الْهُدَى. وَإِنَّهُنَّ مِنْ سُنَنَ الْهُدَى وَلَوْ أَنَّكُمْ صَلّيْتُمْ فِيْ بُيُوْتِكُمْ كَمَا يُصَلِّي هَذَا الْمُتَخَلِّفُ فِيْ بَيْتِهِ لَتَرَكْتُمْ سُنةَ نَبِيِّكُمْ وَلَوْ تَرَكْتُمْ سُنَّةَ نَبِيِّكُمْ لَضَلَلْتُمْ. وَمَا مِنْ رَجُلٍ يَّتَطَهَّرُ فَيُحْسِنُ الطُّهُوْرَ ثُمَّ يَعْمِدُ إِلَى مَسْجِدٍ مِّنْ هَذِهِ الْمَسَاجِدِ إِلَّا كَتَبَ اللهُ لَهُ بِكُلِّ خُطْوَةٍ يَّخْطُوْهَا حَسَنَةً. وَرَفَعَهُ بِهَا دَرَجَةً وَحَطَّ عَنْهُ بِهَا سَيِّئَةً وَلَقَدْ رَأَيْتُنَا وَمَا يَتَخَلَّفَ عَنْهَا إِلَّا مُنَافِقٌ مَّعْلُوْمُ النِّفَاقِ وَلَقَدْ كَانَ الرَّجُل يُؤْتَى بِهِ يُهَادَى بَيْنَ الرَّجُلَيْنِ حَتَّى يُقَامَ فِيْ الصَّفِّ. رَوَاهُ مُسْلِمٌ.

1072. (21) [1/336దృఢం]

’అబ్దుల్లాహ్‌ బిన్‌ మస్‌’ఊద్‌ (ర) కథనం: మేము సామూ హిక నమా’జుకు వెనుక ఉండిపోయే వారెవరినీ చూడలేదు. అయితే కపటాచారి అని తెలిసినవారు తప్ప. లేదా వ్యాధితో ఉన్నవారు. ఇద్దరు వ్యక్తుల సహాయంతో రాగలిగే వ్యక్తి మస్జిద్‌ వరకు రాగలిగే వాడైతే నమా’జు చదవడానికి వస్తాడు. ప్రవక్త (స) రుజుమార్గ పద్ధతిని నేర్పారు. రుజుమార్గ పద్ధతుల్లో ఒకటి అజా’న్‌ అయిన మస్జిద్‌లో నమా’జు చదవటం. మరో ఉల్లేఖనంలో ఇలా ఉంది, ”ముస్లిమ్‌గా అల్లాహ్‌ ను కలవగోరే వారు అజా’న్‌ పలికేచోట ఐదు నమాజు లను పరిరక్షించాలి. ఎందుకంటే అల్లాహ్‌ మీ ప్రవక్త కోసం మార్గదర్శకత్వం పద్ధతులు నిర్దేశించి ఉన్నాడు. ఈ నమా’జులు కూడా ఆ మార్గదర్శక పద్ధతుల్లోనివే. ఒకవేళ మీరు ఈ నమాజులను మీ ఇళ్ళల్లో చదువు కుంటే, మీ ప్రవక్త పద్ధతిని వదలివేస్తారు. ఒకవేళ మీరు మీ ప్రవక్త (స) సాంప్ర దాయాన్ని వదలివేస్తే, మార్గభ్రష్ట త్వానికి గురవుతారు. మీలో ఎవరైనా పరిశుభ్రత పొంది, చక్కగా వు’దూ చేసి సామూహికంగా నమా’జు చదవబడే మస్జిదుకు వెళితే, ప్రతి అడుగుకు పుణ్యం లభిస్తుంది. మరియు పాపం తొలగించబడుతుంది. ఇంకా అతని స్థానాలు ఉన్నతం చేయబడతాయి. సామూహిక నమాజు నుండి కపటాచారులే వెనుక ఉండేవారు. వాళ్ళ గురించి అందరికీ తెలిసి ఉండేది. బలహీనులు ఇద్దరు వ్యక్తుల సహాయంతో తీసుకు రాబడి, నిలబెట్టబడే అవసరమున్నా, వచ్చి నమాజు చదివేవారు.[16] (ముస్లిమ్‌)

ఈ ‘హదీసు’ ద్వారా సామూహిక నమా’జు యొక్క విశిష్టత, ప్రాధాన్యత విశదమవుతుంది. ఏదైనా పెద్ద కారణం లేకుండా వదలినవాడు కపటాచారిగా పరిగణించబడతాడు.

1073 – [ 22 ] ( ضعيف ) (1/337)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ: “لَوْلَا مَا فِيْ الْبُيُوْتِ مِنَ النِّسَاءِ وَالذُّرِّيَّةِ أَقَمْتُ صَلَاةَ الْعَشَاءِ وَأَمَرْتُ فِتْيَانِيْ يُحَرِّقُوْنَ مَا فِيْ الْبُيُوْتِ بِالنَّارِ”. رَوَاهُ أَحْمَدُ .

1073. (22) [1/337బలహీనం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఒకవేళ ఇండ్లలో స్త్రీలు, పిల్లలు లేనట్లయితే, నేను ‘ఇషా’ నమా’జు చదివిస్తాను. ఇంకా యువకులను, సేవకులను నమా’జుకు రాని పురుషుల ఇండ్లను కాల్చి వేయమని ఆదేశిస్తాను.” (అ’హ్మద్‌)

1074 – [ 23 ] ( حسن ) (1/337)

وَعَنْهُ قَالَ: أَمَرَنَا رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِذَا كُنْتُمْ فِيْ الْمَسْجِدِ فَنُوْدِيَ بِالصَّلَاةِ فَلَا يَخْرُجْ أَحَدُكُمْ حَتَّى يُصَلِّيَ. رَوَاهُ أَحْمَدُ.

1074. (23) [1/337ప్రామాణికం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) మమ్మల్ని ఇలా ఆదేశించారు, ”మీరు మస్జిద్‌లో ఉన్నప్పుడు అజా’న్‌ అయితే, నమా’జు చదవకుండా మస్జిద్‌ నుండి బయటకు వెళ్ళకండి.” [17] (అ’హ్మద్‌)

1075 – [ 24 ] ( صحيح ) (1/337)

وَعَنْ أَبِيْ الشَّعْثَاءِ قَالَ: خَرَجَ رَجُلٌ مِّنَ الْمَسْجِدِ بَعْدَمَا أُذِّنَ فِيْهِ. فَقَالَ أَبُوْ هُرَيْرَةَ: أَمَا هَذَا فَقَدْ عَصَى أَبَا الْقَاسِمَ صلى الله عليه وسلم. رَوَاهُ مُسْلِمٌ.

1075. (24) [1/337దృఢం]

అబూ అష్ష’అసా‘అ‘ (ర) కథనం: అజా‘న్‌ అయిన తర్వాత ఒక వ్యక్తి బయటకు వెళ్ళిపోయాడు. అప్పుడు అబూ హురైరహ్‌ (ర), ”అజా‘న్‌ తరువాత మస్జిద్‌లో ఉండి, జమా’అత్‌తో నమా’జు చదివిన వాడు ప్రవక్త (స) కు విధేయత చూపాడు, నమా’జు చదవకుండా మస్జిద్‌ నుండి బయటకు వెళ్ళిపోయిన వాడు, ప్రవక్త (స)కు అవిధేయత చూపాడు,” అని అన్నారు. (ముస్లిమ్‌)

1076 – [ 25 ] ( ضعيف جدا ) (1/337)

وَعَنْ عُثْمَانَ بْنِ عَفَّانٍ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَنْ أَدْرَكَهُ الْأَذَانُ فِيْ الْمَسْجِدِ ثُمَّ خَرَجَ لَمْ يَخْرُجْ لِحَاجَةٍ وَهُوَ لَا يُرِيْدُ الرَّجْعَةَ فَهُوَ مُنَافِقٌ”. رَوَاهُ ابْنُ مَاجَهُ.  

1076. (25) [1/337అతి బలహీనం]

’ఉస్మాన్‌ బిన్ ’అఫ్ఫాన్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”తాను మస్జిద్‌లో ఉండగా అజా‘న్‌ అయినా మస్జిద్‌ నుండి బయటకు వెళ్ళి అకారణంగా రానివాడు కపటాచారి.” (ఇబ్నె మాజహ్)

1077 – [ 26 ] ( صحيح ) (1/338)

وَعَنِ ابْنِ عَبَّاسٍ رَضِيَ اللهُ عَنْهُ عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ: “مَنْ سَمِعَ النِّدَاءَ فَلَمْ يُجِبْهُ فَلَا صَلَاةَ لَهُ إِلَّا مِنْ عُذْرٍ”. رَوَاهُ الدَّارَقُطْنِيُّ .

1077. (26) [1/338దృఢం]

ఇబ్నె ’అబ్బాస్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”అజా’న్‌ విని సమాధానం ఇవ్వనివాడు అంటే నోటితో ముఅజ్జిన్ పలుకులను వల్లించనివాడూ, మస్జిద్‌లోకి నమా’జు చదవడానికి రానివాడి యొక్క నమా’జు స్వీకరించబడదు. ఎందుకంటే, ముఅజ్జి’న్, ‘నమా’జు చదవడానికి రండి,’ అని అన్నాడు. దానికి సమా ధానం నమా’జు చదవడానికి వచ్చి ఉండ వలసింది. కాని అతను నమా’జు చదవడానికి రాలేదు. అంటే అతను అజా’న్ కు సమాధానం ఇవ్వలేదు. అందువల్ల అతని నమా’జు స్వీకరించబడదు. అంటే ఒకవేళ మస్జిదుకు రాకుండా  ఇంట్లో ఒంటరిగా నమా’జు చదివితే, అతని ఈ నమా’జు స్వీకరించ బడదు. అయితే ఏదైనా అనారోగ్య కారణం ఉండి, మస్జిదుకు రాకుండా ఇంట్లో నమా’జు చదువుకుంటే, అతని నమాజు స్వీకరించబడుతుంది.  (దారు ఖు’తునీ)

1078 – [ 27 ] ( صحيح ) (1/338)

وَعَنْ عَبْدِ اللهِ بْنِ أُمِّ مَكْتُوْمٍ قَالَ: يَا رَسُوْلَ اللهِ إِنَّ الْمَدِيْنَةَ كَثِيْرَةُ الْهَوَامِّ وَالسِّبَاعِ. وَأَنَا ضَرِيْرُ الْبَصْرِ فَهَلْ تَجِدُ لِيْ مِنْ رُّخْصَةٍ؟ قَالَ: “هَلْ تَسْمَعُ حَيَّ عَلَى الصَّلَاةِ حَيَّ عَلَى الْفَلَاحِ؟ “قَالَ: نَعَمْ. قَالَ: “فَحَيَّهَلًا”. وَلَمْ يَرَخِّصْ لَهُ. رَوَاهُ أَبُوْ دَاوُدَ وَالنَّسَائِيُّ.

1078. (27) [1/338దృఢం]

’అబ్దుల్లాహ్‌ బిన్‌ ఉమ్మె మక్‌తూమ్‌ (ర) కథనం: ‘ఓ ప్రవక్తా! మదీనహ్ లో చాలా హానికరమైన జంతువులు ఉన్నాయి. నేను అంధుడను. ఒకవేళ నేను ఈ కారణం వల్ల నమా’జు చదవడానికి మస్జిద్‌కు రాలేకపోతే మీరు నాకు ఇంట్లో నమా’జు చదువుకోమని అనుమ తిస్తారా?’ అని విన్నవించుకున్నాను. దానికి ప్రవక్త (స) ముఅజ్జి’న్‌ ” ‘హయ్య ‘అల’స్సలాహ్‌” — ‘నమా’జు వైపునకు రండి’, ” ‘హయ్య ‘అలల్‌ ఫలా’హ్‌” — ‘సాఫల్యం వైపునకు రండి.’ అనేవి వింటావా?’ అని అడిగారు. నేను, ‘అవునని,’ అన్నాను. అప్పుడు ప్రవక్త (స), ‘మరయితే రావాలి,’ అని అన్నారు. అతనికి అనుమతి ఇవ్వలేదు. [18] (అబూ దావూ’ద్‌, నసాయి’)

1079 – [ 28 ] ( صحيح ) (1/338)

وَعَنْ أُمِّ الدَّرْدَاءِ قَالَتْ: دَخَلَ عَليَّ أَبُوْ الدَّرْدَاءِ وَهُوَ مُغْضَبٌ فَقُلْتُ: مَا أَغْضَبَكَ؟ قَالَ: وَاللهِ مَا أَعْرِفُ مِنْ أَمْرٍ أُمَّةِ مُحَمَّدٍ صلى الله عليه وسلم شَيْئًا إِلَّا أَنَّهُمْ يُصَلُّوْنَ جَمِيْعًا. رَوَاهُ الْبُخَارِيُّ .

1079. (28) [1/338దృఢం]

ఉమ్ము దర్‌దా‘ (ర) కథనం: నా భర్త అబూ దర్‌దా కోపంలో వచ్చారు. ‘కోపం ఎలా వచ్చిందని,’ నేను అడి గాను. దానికి అతడు, ‘అల్లాహ్ సాక్షి! ము’హమ్మద్‌ అనుచర సమాజం యొక్క ఏ పనీ నాకు తెలియదు, వారు కేవలం సామూహికంగా నమా’జు మాత్రం చదువుకుంటున్నారు,’ అని అన్నారు. [19] (బు’ఖారీ)

1080 – [ 29 ] ( صحيح ) (1/338)

وَعَنْ أَبِيْ بَكْرِبْنِ سُلَيْمَانَ بْنِ أَبِيْ حَثْمَةَ قَالَ: إِنَّ عُمَرَ بْنِ الْخَطَّابِ فَقَدْ سُلَيْمَانَ بْنَ أَبِيْ حَثْمَةَ فِيْ صَلَاةِ الصُّبْحِ وَإِنَّ عُمَرَ غَدَا إِلَى السُّوْقِ وَمَسْكَنُ سُلَيْمَانَ بَيْنَ الْمَسْجِدِ وَالسُّوْقِ فَمَرَّ عَلَى الشِّفَاءِ أُمِّ سُلَيْمَانَ. فَقَالَ لَهَا لَمْ أَرَ سُلَيْمَانَ فِيْ الصُّبْحِ فَقَالَتْ إِنَّهُ بَاتَ يُصَلِّيْ فَغَلَبَتْهُ عَيْنَاهُ. فَقَالَ عُمَرُ لَأَنْ أَشْهَدَ صَلَاةَ الصُّبْحِ فِيْ الْجَمَاعِةِ أَحَبُّ إِلَيَّ مِنْ أَنْ أَقُوْمَ لَيْلَةً. رَوَاهُ مَالِكٌ.

1080. (29) [1/338దృఢం]

అబూ బకర్‌ బిన్‌ సులైమాన్‌ బిన్ అబూ ‘హుస్మా’ (ర) కథనం: సులైమాన్‌ బిన్‌ అబీ హుస్మ‘ (ర) ఉదయం సామూహిక నమా’జులో పాల్గొనలేదు. ‘ఉమర్‌ (ర) అతన్ని చూడలేదు. నమా’జు తర్వాత బజారువైపు వెళ్ళారు. సులైమాన్‌ ఇల్లు మస్జిద్‌ మరియు బజారుకు మధ్యలో ఉంది. వాస్తవం తెలుసు కోవడానికి సులైమాన్‌ ఇంటికి వెళ్ళారు. ఈ రోజు సులైమాన్‌ ఎందుకు రాలేదని సులైమాన్‌ తల్లి షఫాను, ‘ఈ రోజు నేను ఉదయం నమా’జులో సులైమాన్‌ను చూడలేదని,’ అన్నారు. దానికి సులైమాన్‌ తల్లి, ‘ఈ రోజు రాత్రంతా సులైమాన్‌ నమా’జులు చదివాడు. ఉదయం అతనికి నిద్ర ముంచుకొచ్చింది. నిద్రపోయాడు. అందువల్లే మస్జిదుకు రాలేక పోయాడు,’ అని అన్నది. దానికి ‘ఉమర్‌(ర), ‘రాత్రంతా నమా’జు చదవటం కన్నా ఉదయం నమా’జు సామూహికంగా చదవడం శ్రేష్ఠమైనది,’ అని అన్నారు. [20] (మాలిక్)

1081 – [ 30 ] ( ضعيف ) (1/339)

وَعَنْ أَبِيْ مُوْسَى الْأَشْعَرِيِّ قَالَ: قالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “اثْنَانِ فَمَا فَوْقَهُمَا جَمَاعَةٌ”. رَوَاهُ ابْنُ مَاجَهُ.

1081. (30) [1/339బలహీనం]

అబూ మూసా అష్‌’అరీ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం ”రెండు మరియు రెండుకంటే ఎక్కువ సామూహిక నమా’జు అవుతుంది.”  [21]  (ఇబ్నె మాజహ్)

1082 – [ 31 ] ( صحيح ) (1/339)

وَعَنْ بِلَالِ بْنِ عَبْدِ اللهِ بْنِ عُمَرَ عَنْ أَبِيْهِ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَا تَمْنَعُوا النِّسَاءُ حُظُوْظَهُنَّ مِنَ الْمَسَاجِدِ إِذَا اسْتَأْذَنْتَكُمْ”. فَقَالَ بِلَالٌ: وَاللهِ لَنَمْنَعُهُنَّ. فَقَالَ لَهُ عَبْدُ اللهِ أَقُوْلُ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم وَتَقُوْلُ أَنْتَ لَنَمْنَعُهُنَّ.  

1082. (31) [1/339దృఢం]

బిలాల్‌ బిన్‌ ’అబ్దుల్లాహ్‌ బిన్‌ ’ఉమర్‌ (ర) తన తండ్రి ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘ఉమర్‌ (ర) ద్వారా కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మీ స్త్రీలు మిమ్మల్ని మస్జిదులకు వెళతామని అనుమతి కోరితే, మస్జిదుల నుండి తమ వంతు పొందటం నుండి వారిని ఆపకండి. అంటే మస్జిదుల్లో నమా’జు చదవటం వల్ల అధిక పుణ్యం లభిస్తుంది. అది వారివంతు. మస్జిదులకు వెళ్ళటాన్ని వారించకండి, అనుమతించండి.”

‘అబ్దుల్లాహ్‌ కుమారులు మరియు బిలాల్‌ (ర), ”అల్లాహ్ సాక్షి! మేము తప్పకుండా స్త్రీలను మస్జిద్‌కు రాకుండా వారిస్తాము,’ అని అన్నారు. అది విని ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘ఉమర్‌, ప్రవక్త (స) ఆపవద్దని,’ అన్నారని నేనంటే నువ్వు ఆపుతానని అంటున్నావు.” అని అన్నారు.

1083 – [ 32 ] ( صحيح ) (1/339)

وَفِيْ رَوَايَةِ سَالِمٍ عَنْ أَبِيْهِ قَالَ: فَأَقْبَلَ عَلَيْهِ عَبْدُ اللهِ فَسَبَّهُ سَبًّا مَا سَمِعْتُ سَبَّهُ مِثْلَهُ قَطُّ وَقَالَ: أُخْبِرُكَ عَنْ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم وَتَقُوْلُ: وَاللهِ لَنَمْنَعُهُنَّ. رَوَاهُ مُسْلِمٌ.  

1083. (32) [1/339దృఢం]

సాలిమ్ ఉల్లేఖనంలో ఇలా ఉంది,” ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ బిలాల్‌ వైపు తిరిగి చాలా కఠినంగా మాట్లాడారు. అలా అధికంగా మాట్లాడటం నేనెప్పుడూ చూడలేదు. ఇంకా నేను నీకు ప్రవక్త (స) ‘హదీసు’ను వినిపిస్తు న్నాను. కాని నువ్వు ప్రమాణం చేసి వారిస్తానని అంటున్నావు,’ అని అన్నారు. (ముస్లిమ్‌)

1084 – [ 33 ] ( صحيح ) (1/339)

وَعَنْ مُجَاهِدٍ عَنْ عَبْدِ اللهِ بْنِ عُمَرَ أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم قَالَ: “لَا يَمْنَعَنَّ رَجُلٌ أَهْلَهُ أَنْ يَّأْتُوْا الْمَسَاجِدَ”. فَقَالَ ابْنٌ لِّعَبْدِ اللهِ بْنِ عُمَرَ: فَإِنَّا نَمْنَعُهُنَّ. فَقَالَ عَبْدُ اللهِ: أُحِدِّثُكَ عَنْ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم وَتَقُوْلُ هَذَا؟ قَالَ: فَمَا كَلَّمَهُ عَبْدُ اللهِ حَتَّى مَاتَ. رَوَاهُ أَحْمَدُ.

1084. (33) [1/339దృఢం]

ముజాహిద్‌, ’అబ్దుల్లాహ్‌ బిన్‌ ’ఉమర్‌ ద్వారా ప్రవక్త (స), ”మీలో ఎవ్వరూ తమ ఇంటివారిని అంటే స్త్రీలను మస్జిదులకు రాకూడదని వారించకూడదు,” అని అన్నారని అన్నారు. దానిపై ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘ఉమర్‌ కొడుకు బిలాల్‌, ‘మేము తప్పకుండా స్త్రీలను మస్జిదులకు రాకుండా వారిస్తాం,’ అని అన్నారు. అది విని, ‘అబ్దుల్లాహ్‌ బిన్‌’ఉమర్‌ ”నేను నీకు ప్రవక్త (స) ‘హదీసు’ వినిపిస్తుంటే, నీవు వారిస్తానని అంటున్నావు. ఆ తరువాత నుండి ‘అబ్దుల్లాహ్‌ మరణించేవరకు తన కొడుకుతో మాట్లాడలేదు.” [22](అ’హ్మద్‌)

=====

24 –  بَابُ تَسْوِيَةِ الصَّفِّ

24. పంక్తులను సరిచేయటం

ఇందులో పంక్తులను సరిచేయటాన్ని గురించి ప్రాధాన్యత చెప్పటం జరిగింది. కలసి నిలబడాలని, ముందూ వెనుకా కాకూడదని, మధ్య ఖాళీ ఉంచ కూడదని, హెచ్చరించటం జరిగింది. కలసి నిలబడక పోయినా, మధ్య ఖాళీగా ఉంచినా, ఆ నమా’జు అసంపూర్ణమైనది. వీటిని గురించి క్రింది ‘హదీసు’లు పేర్కొనబడ్డాయి.

اَلْفَصْلُ الْأَوَّلُ    మొదటి విభాగం  

1085 – [ 1 ] ( صحيح ) (1/340)

عَنِ النُّعْمَانَ بْنِ بَشِيْرٍ قَالَ:كَانَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم يُسَوِّيْ صُفُوْفَنَا حَتَّى كَأَنَّمَا يُسَوِّيْ بِهَا الْقِدَاحَ حَتَّى رَأَى أَنَّا قَدْ عَقَلْنَا عَنْهُ ثُمَّ خَرَجَ يَوْمًا فَقَامَ حَتَّى كَادَ أَنْ يُّكَبِّرَ فَرَأَى رَجُلًا بَادِيًا صَدْرَهُ مِنَ الصَّفِّ. فَقَالَ: “عِبَادَ اللهِ لَتُسَوُّنَ صُفُوْفَكُمْ أَوْ لَيُخَالِفَنَّ اللهُ بَيْنَ وُجُوْهِكُمْ”. رَوَاهُ مُسْلِمٌ .

1085. (1) [1/340దృఢం]

నో’మాన్‌ బిన్‌ బషీర్‌ (ర) కథనం: ప్రవక్త (స) మా పంక్తులను సరిచేసేవారు. చివరికి బాణం ద్వారా సరి చేసేవారు. మేమంతా పంక్తులను సరిచేసుకున్నామని గ్రహించిన తర్వాత నమా’జు ప్రారంభించేవారు. ఒక రోజు ప్రవక్త (స) వచ్చారు. నమా’జు చదివించటానికి నిలబడ్డారు. తక్‌బీర్‌ పలకాలని అనుకున్నారు. ఇంతలో ఒక వ్యక్తి తన గుండె భాగాన్ని కొంత ముందుకు ఉంచినట్టు అనిపించింది. అప్పుడు ప్రవక్త (స), ”ఓ అల్లాహ్‌ దాసులారా! మీరు మీ పంక్తులను ఖచ్చితంగా సరిచేసుకోండి. లేకుంటే అల్లాహ్‌ మీ ముఖాల మధ్య వ్యతిరేకత జనింపజేస్తాడు.” [23] (ముస్లిమ్‌)

1086 – [ 2 ] ( صحيح ) (1/340)

وَعَنْ أَنَسٍ قَالَ: أُقِيْمَتِ الصَّلَاةُ فَأَقْبَلَ عَلَيْنَا رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم بِوَجْهِهِ فَقَالَ:”أَقِيْمُوْا صُفُوْفَكُمْ وَتَرَاصُّوْا فَإِنِّيْ أَرَاكُمْ مِّنْ وَّرَاءِ ظَهْرِيْ”. رَوَاهُ الْبُخَارِيُّ. وَفِيْ الْمُتَّفَقِ عَلَيْهِ قَالَ: “أَتِمُّوا الصُّفُوْفَ فَإِنِّيْ أَرَاكُمْ مِّنْ وَرَاءِ ظَهْرِيْ”.

1086. (2) [1/340దృఢం]

అనస్‌ (ర) కథనం: ఇఖామత్‌ పలకబడింది. ప్రవక్త (స) మావైపు తిరిగి ఇలా అన్నారు, ”పంక్తులను సరిచేసుకోండి, పరస్పరం కలసి నిలబడండి. నేను మిమ్మల్ని వెనుక నుండి కూడా చూస్తాను.” [24](బు’ఖారీ, ముస్లిమ్‌)

1087 – [ 3 ] ( متفق عليه ) (1/340)

وَعَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “سَوُّوْا صُفُوْفَكُمْ. فَإِنَّ تَسْوِيَةَ الصُّفُوْفِ مِنْ إِقَامَةِ الصَّلَاةِ”.إِلَّا أَنَّ عِنْدَ مُسْلِمٍ: “مِّنْ تَمَامِ الصَّلَاةِ”.

1087. (3) [1/340ఏకీభవితం]

అనస్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”పంక్తులను తిన్నగా, సరిగా చేసుకోండి. ఎందుకంటే పంక్తులను సరిచేయటం నమా’జును పూర్తిచేయటం లేదా నమా’జును సరిగాచేయటం అవుతుంది.” [25] (బు’ఖారీ, ముస్లిమ్‌)

1088 – [ 4 ] ( صحيح ) (1/340)

وَعَنْ أَبِيْ مَسْعُوْدِ الْأَنْصَارِيِّ قَالَ: كَانَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم يَمْسَحُ مَنَاكِبَنَا فِيْ الصَّلَاةِ وَيَقُوْلُ: “اسْتَوْوا وَلَا تَخْتَلِفُوْا فَتَخْتَلِفَ قُلُوبُكُمْ لِيَلِيَنِّيْ مِنْكُمْ أُوْلُوا الْأَحْلَامٍ وَالنُّهَى. ثُمَّ الَّذِيْنَ يَلُوْنَهُمْ ثُمَّ الَّذِيْنَ يَلُوْنَهُمْ”. قَالَ أَبُوْ مَسْعُوْدٍ: فَأَنْتُمُ الْيَوْمُ أَشَدُّ اخْتِلَافًا. رَوَاهُ مُسْلِمٌ .

1088. (4) [1/340దృఢం]

అబూ మస్‌’ఊద్‌ అ’న్సారీ (ర) కథనం: ప్రవక్త (స) నమా’జులో మా భుజాలపై చేయిపెట్టి, తిన్నగా నిల బడండి, వ్యతిరేకంగా ఉండకండి. అంటే ముందూ వెనుకా నిలబడకండి, హృదయాలు వ్యతిరేకంగా అయిపోతాయి. వారిలో పెద్దలు తెలివైనవారు నాకు దగ్గరగా నిలబడాలి. ఆ తరువాత వాళ్ళు నిలబడాలి. ఆ తరువాత వాళ్ళు నిలబడాలి అని అనేవారు. అబూ మస్‌’ఊద్‌ ఈ కాలంలో మీరు ప్రవక్త (స)కు వ్యతిరేకంగా ఆచరిస్తున్నారు. అంటే ప్రవక్త (స) ఉపదేశాలకు అనుగుణంగా ఆచరించటంలేదు,’ అని అన్నారు. [26] (ముస్లిమ్‌)

1089 – [ 5 ] ( صحيح ) (1/341)

وَعَنْ عَبْدِ اللهِ بْنِ مَسْعُوْدٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: لَيَلني مِنْكُمْ أُوْلُو الْأَحْلَامِ وَالنُّهَى ثُمَّ الَّذِيْنَ يَلُوْنَهُمْ “ثَلَاثًا وَإِيَّاكُمْ وَهَيْشَاتِ الْأَسْوَاقِ”. رَوَاهُ مُسْلِمٌ .

1089. (5) [1/341దృఢం]

’అబ్దుల్లాహ్‌ బిన్‌ మస్‌’ఊద్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”నాకు దగ్గరగా యుక్తవయస్సుకు చేరి బుధ్ధీ జ్ఞానాలు గలవారు నిలబడాలి. ఇంకా వారికి దగ్గరగా ఇతర యుక్తవయస్సుకు చేరినవారు నిలబడాలి. బజారుల్లా మస్జిదుల్లో అల్లర్లు చేయకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోండి. అంటే బజారుల్లో అల్లర్లు జరిగినట్టు మస్జిదుల్లో అల్లర్లు చేయకండి. (ముస్లిమ్‌)

1090 – [ 6 ] ( صحيح ) (1/341)

وَعَنْ أَبِيْ سَعِيْدِ الْخُدْرِيِّ قَالَ: رَأَى رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم فِيْ أَصْحَابِهِ تَأَخّرًا. فَقَالَ لَهُمْ: “تَقَدَّمُوْا وَأتمُوْا بِيْ وَلْيَأْتَمَّ بِكُمْ مَنْ بَعْدَكُمْ لَا يَزَالُ قَوْمٌ يَّتَأَخَّرُوْنَ حَتَّى يُؤَخِّرَهُمُ اللهُ”. رَوَاهُ مُسْلِمٌ .

1090. (6) [1/341దృఢం]

అబూ స’యీద్‌ ’ఖుద్రీ (ర) కథనం: ప్రవక్త (స) అనుచరులను నమా’జు పంక్తుల్లో వెనుకనిల్చుని ఉండగా చూశారు. అప్పుడు ప్రవక్త (స) ముందుకు రండి, నన్ను అనుసరించండి. మీ వెనుక వారు మిమ్మల్ని అనుసరిస్తారు. మీరు తిన్నగా ఉంటే మీ వెనుకవారు తిన్నగా ఉంటారు. కొందరు ఎల్లప్పుడూ వెనుక ఉంటారు. ముందు పంక్తులకు, మంచి కార్యాల్లో వెనుక ఉంటారు. చివరికి అల్లాహ్‌(త) వారిని తన కారుణ్యానికి వెనుకే ఉంచుతాడు. ఒకవేళ వారు స్వర్గంలోకి వెళ్ళే అర్హత గలవారైనా అందరి తరువాత ప్రవేశిస్తారు.” (ముస్లిమ్‌)

1091 – [ 7 ] ( صحيح ) (1/341)

وَعَنْ جَابِرِ بْنِ سَمْرَةَ قَال: خَرَجَ عَلَيْنَا رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم فَرَآنَا حِلَقًا فَقَالَ: “مَالِيْ أَرَاكُمْ عِزِيْنَ؟ “ثُمَّ خَرَجَ عَلَيْنَا فَقَالَ: “أَلَا تَصُفُّوْنَ كَمَا تَصُفُّ الْمَلَائِكَةُ عِنْدَ رَبِّهَا؟”فَقُلْنَا: يَا رَسُوْلَ اللهِ وَكَيْفَ تَصُفُّ الْمَلَائِكَةُ عِنْدَ رَبِّهَا؟ قَالَ: “يُتِمُّوْنَ الصُّفُوْفَ الْأَوْلَى وَيَتَرَاصُّوْنَ فِيْ الصَّفِ”. رَوَاهُ مُسْلِمٌ .

1091. (7) [1/341దృఢం]

జాబిర్‌ బిన్‌ సమురహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) మా వద్దకు వచ్చారు. మమ్మల్ని వేర్వేరుగా గ్రూపులుగా కూర్చోవటం చూశారు. అంటే మేము వేర్వేరుగా కూర్చొని ఉన్నాము. ‘వేర్వేరుగా కూర్చోకూడదు. అందరూ కలసి సామూహికంగా కూర్చోవాలి. బృందంగా కాక దూరంగా కూర్చోవడం కాపట్య చిహ్నం,’ అని అన్నారు. ఆ తరువా మళ్ళీ వచ్చి, మీరు దైవదూతలు పంక్తుల్లా ఎందుకు పంక్తుల్లో ఉండరు,’ అని అన్నారు. దానికి మేము, ‘ఓ ప్రవక్తా! దైవదూతలు తమ ప్రభువు ముందు ఎలా పంక్తులు కడతారు,’ అని విన్నవించుకున్నాము. దానికి ప్రవక్త (స) వారు మొదటి పంక్తిని పూర్తిచేస్తారు. కలసి నిలబడతారు,’ అని అన్నారు. [27] (ముస్లిమ్‌)

1092 – [ 8 ] ( صحيح ) (1/341)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “خَيْرُ صُفُوْفِ الرِّجَالِ أَوَّلُهَا وَشَرُّهَا آخِرُهَا وَخَيْرُ صُفُوْفِ النِّسَاءِ آخِرُهَا وَشَرُّهَا أَوَّلُهَا”. رَوَاهُ مُسْلِمٌ .

1092. (8) [1/341దృఢం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”అందరి కంటే ముందు ఉండే పురుషుల పంక్తి అన్నిటి కంటే ఉత్తమమైనది. స్త్రీలలో ముందు ఉన్నది అన్నిటికంటే చెడ్డ పంక్తి. అందరికంటే వెనుక ఉండే స్త్రీల పంక్తి అన్నిటికంటే ఉత్తమమైనది. పురుషుల వెనుక ఉండే స్త్రీల పంక్తి అన్నిటి కంటే చెడ్డది.” [28](ముస్లిమ్‌)

—–

اَلْفَصْلُ الثَّانِيْ   రెండవ విభాగం 

1093 – [ 9 ] ( صحيح ) (1/341)

وَعَنْ أَنَسٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “رُصُّوْا صُفُوْفَكُمْ وَقَارِبُوا بَيْنَهَا وَحَاذُوْا بِالْأَعْنَاقِ فَوَالَّذِيْ نَفْسِيْ بِيَدِهِ إِنِّيْ لَأَرَى الشَّيْطَانَ يَدْخُلُ مِنْ خَلَلِ الصَّفِّ كَأَنَّهَا الْحَذْفُ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ .

1093. (9) [1/341దృఢం]

అనస్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మీరు నమా’జు పంక్తుల్లో కలసి నిలబడండి. ఇంకా పంక్తుల మధ్య మరో పంక్తికి సరిపడేంత ఖాళీ ఉంచకండి. చేతు లకు చేతులు, భుజాలకు భుజాలు సరిగ్గా ఉంచండి. ఎవరిచేతిలో నా ప్రాణం ఉందో ఆయన సాక్షి! షై’తాన్‌ పంక్తుల మధ్య ఖాళీగా ఉన్న సందుల్లో నల్లని మేక పిల్లలా దూరటం నేను చూస్తున్నాను.” [29] (అబూ దావూ’ద్‌)

1094 – [ 10 ] ( صحيح ) (1/342)

وَعَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “أَتِمُّوا الصَّفَّ الْمُقَدَّمَ ثُمَّ الَّذِيْ يَلِيْهِ فَمَا كَانَ مِنْ نَّقْصٍ فَلْيَكُنْ فِيْ الصَّفِّ الْمُؤَخَّرِ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ .

1094. (10) [1/342దృఢం]

అనస్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మీరు మొదటి పంక్తిని పూర్తిచేయండి. తరువాత రెండవ పంక్తిలో నిలబడండి. కొరత ఉంటే చివరి పంక్తిలో కొరత ఉండాలి.” (అబూ దావూ‘ద్‌)

1095 – [ 11 ] ( ضعيف ) (1/342)

وَعَنِ الْبَرَاءِ بْنِ عَازِبٍ قَالَ: كَانَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ: “إِنَّ اللهَ وَمَلَائِكَتَهُ يُصَلُّوْنَ عَلَى الَّذِيْنَ يَلُوْنَ الصُّفُوْفَ الْأَوَّلَ وَمَا مِنْ خُطْوَةٍ أَحَبَّ إِلَى اللهِ مِنْ خُطْوَةٍ يَّمْشِيْهَا يَصِلُ الْعَبْدُ بِهَا صَفًّا”. رَواهُ أَبُوْ دَاوُدَ.

1095. (11) [1/342బలహీనం]

బరా‘ బిన్‌ ’ఆ’జిబ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవ చనం, ”అల్లాహ్‌ మరియు ఆయన దూతలు మొదటి పంక్తిలో ఉన్న వారిపై కారుణ్యం అవతరింపజేస్తారు. ఇంకా వారి క్షమాపణ కొరకు ప్రార్థిస్తారు. అదేవిధంగా మొదటి పంక్తికి దగ్గరగా ఉన్నవారికి కూడా ఈ విశిష్ఠత లభిస్తుంది. ఇంకా పంక్తిని సరిచేయటానికి, పూర్తిచేయ టానికి వేసే అడుగు అల్లాహ్‌(త)కు చాలా ప్రియమైనది.” [30]  (అబూ దావూ‘ద్‌)

1096 – [ 12 ] ( حسن ) (1/342)

وَعَنْ عَائِشَةَ رَضِيَ اللهُ عَنْهَا قَالَتْ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِنَّ اللهَ وَمَلَائِكَتَهُ يُصَلُّوْنَ عَلَى مَيَامِنِ الصُّفُوْفِ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ.

1096. (12) [1/342ప్రామాణికం]

’ఆయి‘షహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”పంక్తిలో కుడిప్రక్క నిలబడే వారిపై అల్లాహ్‌ మరియు ఆయన దూతలు కారుణ్యం కురిపిస్తారు, మరియు వారి క్షమాపణకు దు’ఆ చేస్తారు.” [31](అబూ దావూ‘ద్‌)

1097 – [ 13 ] ( صحيح ) (1/342)

وَعَنِ النُّعْمَانَ بْنِ بَشِيْرٍ قَالَ: كَانَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم يُسَوِّيْ صُفُوْفَنَا إِذَا قُمْنَا إِلَى الصَّلَاةِ فَإِذَا اسْتَوَيْنَا كَبَّرَ. رَوَاهُ أَبُوْ دَاوُدَ.

1097. (13) [1/342దృఢం]

నో’మాన్‌ బిన్‌ బషీర్‌ (ర) కథనం: ”ప్రవక్త (స) స్వయంగా మా పంక్తులను సరిచేసేవారు. అప్పుడు మేము నమా’జు కోసం పంక్తుల్లో నిలబడి ఉండేవాళ్ళం. మేము పంక్తులను సరిచేసుకున్న తరువాత ప్రవక్త (స) తక్‌బీరె త’హ్రీమ పలికి నమా’జు ప్రారంభించే వారు.” (అబూ దావూ’ద్‌)

1098 – [ 14 ] ( ضعيف ) (1/342)

وَعَنْ أَنَسٍ قَالَ: كَانَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ عَنْ يَّمِيْنِهِ: “اعْتَدِلُوْا سَوُّوْا صُفُوْفَكُمْ”. وَعَنْ يَّسَارِهِ: “اعْتَدِلُوْا سَوُّوْا صُفُوْفَكُمْ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ.

1098. (14) [1/342బలహీనం]

అనస్‌ (ర) కథనం: ప్రవక్త (స) తన కుడివైపు ఉన్న వారితో ‘తిన్నగా నిలబడండి, పంక్తులను సరిచేసు కోండి,’ అని చెప్పే వారు. ఇంకా ఎడమవైపు ఉన్న వారితో కూడా ఇలాగే అనే వారు. (అబూదావూ‘ద్‌)

1099 – [ 15 ] ( صحيح ) (1/343)

وَعَنِ ابْنِ عَبَّاسٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “خِيَارُكُمْ أَلَيْنُكُمْ مَنَاكِبَ فِيْ الصَّلَاةِ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ .

1099. (15) [1/343దృఢం]

ఇబ్నె ’అబ్బాస్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”నమా’జులో తమ భుజాలను వినయ విధేయతలతో ఉంచేవారే అందరికంటే ఉత్తములు.” [32] (అబూ దావూ‘ద్‌)

—–

اَلْفَصْلُ الثَّالِثُ   మూడవ విభాగం  

1100 – [ 16 ] ( صحيح ) (1/343)

عَنْ أَنَسٍ قَالَ: كَانَ النِّبِيُّ صلى الله عليه وسلم يَقُوْلُ: “اِِِسْتَوْوا اِسْتَوْوا اِسْتَوْوا فَوَالَّذِيْ نَفْسِيْ بِيَدِهِ إِنِّيْ لَأَرَاكُمْ مِّنْ خَلْفِيْ كَمَا أَرَاكُمْ مِنْ بَيْنَ يَدَيَّ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ.

1100. (16) [1/343దృఢం]

అనస్‌ (ర) కథనం: ప్రవక్త (స) నమా’జు చదివించ డానికి నిలబడినపుడు, ”సరిగ్గా నిలబడండి, సరిచేసు కోండి, ముందూ వెనుకా నిలబడకండి. అల్లాహ్ సాక్షి! నేనెలా ముందు నుండి చూస్తానో, వెనుక నుండి కూడా చూస్తాను అని అన్నారు.” (అబూ దావూ‘ద్‌)

1101 – [ 17 ] ( ضعيف ) (1/343)

وَعَنْ أَبِيْ أُمَامَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِنَّ اللهَ وَمَلَائِكَتَهُ يُصَلُّوْنَ عَلَى الصَّفِّ الْأَوَّلِ”. قَالُوْا يَا رَسُوْلَ اللهِ وَعَلَى الثَّانِيْ قَالَ: “إِنَّ اللهَ وَمَلَائِكَتَهُ يُصَلُّوْنَ عَلَى الصَّفِّ الْأَوَّلِ”. قَالُوْا يَا رَسُوْلَ اللهِ وَعَلَى الثَّانِيْ. قَالَ: “إِنَّ اللهَ وَمَلَائِكَتَهُ يُصَلُّوْنَ عَلَى الصَّفِّ الْأَوَّلِ”. قَالُوْا يَا رَسُوْلَ اللهِ وَعَلَى الثَّانِيْ؟ قَالَ: “وَعَلَى الثَّانِيْ”. قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “سَوُّوْا صُفُوْفَكُمْ وَحَاذَوْا بَيْنَ مَنَاكِبِكُمْ وَلِيْنُوْا فِيْ أَيْدِيْ إِخْوَانِكُمْ وَسُدُّوا الْخَلَلَ فَإِنَّ الشَّيْطَانَ يَدْخُلُ بَيْنَكُمْ بِمَنْزِلَةِ الْحَذْفِ”. يَعْنِيْ أَوْلَادَ الضَّأْنِ الصِّغَارِ. رَوَاهُ أَحْمَدُ.

1101. (17) [1/343బలహీనం]

అబూ ’ఉమామహ్ (ర) కథనం: ప్రవక్త (స) ‘మొదటి పంక్తిలో ఉన్న వారిపై అల్లాహ్‌ (త) కారుణ్యం అవత రింపజేస్తాడు మరియు ఆయన దూతలు వారి క్షమా పణ కోసం ప్రార్థిస్తూ ఉంటారు,’ అని అన్నారు. దానికి అనుచరులు ఓ ప్రవక్తా! రెండవ పంక్తి వారి గురించి,’ అని విన్నవించుకున్నారు. ప్రవక్త (స) అల్లాహ్‌ (త) మొదటి పంక్తిలో ఉన్న వారిపై తన కారుణ్యం కురి పిస్తాడు. మరియు ఆయన దూతలు వారి క్షమాపణ కొరకు ప్రార్థిస్తారు,’ అని అన్నారు. అప్పుడు అనుచరులు, ‘ఓ ప్రవక్తా! రెండవ పంక్తి వారిపై,’ అని విన్నవించుకున్నారు. మళ్ళీ ప్రవక్త (స), ‘అల్లాహ్‌ మొదటి పంక్తి వారిపై తన కారుణ్యాన్ని కురి పిస్తాడు, మరియు ఆయన దూతలు వారి క్షమాపణ కొరకు దు’ఆ చేస్తారు,’ అని అన్నారు. అనుచరులు మళ్ళీ, ‘రెండవపంక్తి గురించి, ‘ అని విన్నవించు కున్నారు. దానికి ప్రవక్త (స) రెండవ పంక్తిపై కూడా,’ అని అన్నారు. మొదటి పంక్తివారి గురించి మూడు సార్లు ప్రార్థించారు. రెండవపంక్తి వారి గురించి నాల్గవ సారి అన్నారు. ఆ తరువాత ప్రవక్త (స) ”మీ పంక్తులను సరిచేసుకోండి. భుజాలకు భుజాలు కలపి ఉంచండి. మీ సోదరుల కోసం మెత్తబడిపోండి. మధ్య ఖాళీలను పూర్తిచేయండి. ఎందుకంటే షై’తాన్‌ మేక పిల్లలా మధ్య ప్రవేశిస్తాడు,” అని అన్నారు. (అ’హ్మద్‌)

1102 – [ 18 ] ( صحيح ) (1/344)

وَعَنِ ابْنِ عُمَرَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “أَقِيْمُوا الصُّفُوْفَ وَحَاذُوْا بَيْنَ الْمَنَاكِبِ وَسُدُّوْا الْخَلَلَ وَلِيْنُوْا بِأَيْدِيْ إِخْوَانِكُمْ وَلَا تَذَرُوْا فُرُجَاتٍ لِّلشّيْطَانِ وَمَنْ وَصَلَ صَفًّا وَصَلَهُ اللهُ وَمَنْ قَطَعَهُ قَطَعَهُ اللهُ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ وَالنَسَائِيُّ مِنْهُ قَوْلِهِ: “وَمَنْ وَصَلَ صَفا”. إِلَى أخِرِهِ.

1102. (18) [1/344దృఢం]

ఇబ్నె ’ఉమర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”పంక్తులను సరిచేయండి, భుజాలను సమానంగా ఉంచండి. మధ్య ఖాళీలను పూర్తిచేయండి. మీ సోద రుల కోసం మెత్తపడండి. ఒకవేళ మీ భుజాలపై చేయి పెట్టి ఎవరైనా సరిచేస్తే, అతనికి సహకరించండి. అతనితో వివాదపడకండి. మధ్యఖాళీలను పూర్తి చేయండి. పంక్తిని కలిపిన వాడిని అల్లాహ్‌ (త) తన కారుణ్యంతో కలుపుతాడు. పంక్తికి దూరంగా నిలబడిన వాడు పంక్తిని కోసివేశాడు. అల్లాహ్‌ (త) అతన్ని తన కారుణ్యానికి దూరం చేస్తాడు. (అబూ దావూ’ద్‌, నసాయి’)

1103 – [ 19 ] ( ضعيف ) (1/344)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “تَوَسَّطُوا الْإِمَامَ وَسُدُّوا الْخَلَلَ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ.

1103. (19) [1/344బలహీనం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఇమామును మధ్య ఉంచండి, అంటే పంక్తి ముందు మధ్యలో నిలబడాలి. సరిగ్గా మధ్యలో నిలబడాలి. మధ్య ఖాళీ స్థలాన్ని పూర్తిచేయండి.” (అబూ దావూ’ద్‌)

1104 – [ 20 ] ( ضعيف ) (1/344)

وَعَنْ عَائِشَةَ رَضِيَ اللهُ عَنْهَا قَالَتْ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَا يَزَالُ قَوْمٌ يَّتَأَخَّرُوْنَ عَنِ الصَّفِّ الْأَوَّلِ حَتَّى يُؤَخَّرَهُمُ اللهُ فِيْ النَّارِ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ .

1104. (20) [1/344బలహీనం]

’ఆయి‘షహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఒక జాతి ఎల్లప్పుడూ అలసత్వం వల్ల మొదటి పంక్తికి దూరంగా ఉంటుంది. చివరికి అల్లాహ్‌ (త) వారిని నరకంలో చాలా కాలం వరకు పడవేస్తాడు.”  [33]  (అబూ దావూ’ద్‌)

1105 – [ 21 ] ( صحيح ) (1/345)

وَعَنْ وَابِصَةَ بْنِ مَعْبَدٍ قَالَ:رَأَى رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم رَجُلًا يُّصَلِّي خَلْفَ الصَّفِّ وَحْدَهُ فَأَمَرَهُ أَنْ يُّعِيْدَ الصَّلَاةَ. رَوَاهُ أَحْمَدُ وَالتِّرْمِذِيُّ وَأَبُوْ دَاوُدَ. وَقَالَ التِّرْمِذِيُّ هَذَا حَدِيْثٌ حَسَنٌ .

1105. (21) [1/345దృఢం]

వాబి’సహ్ బిన్‌ మ’అబద్‌ (ర) కథనం: ప్రవక్త (స) ఒక వ్యక్తి ఒంటరిగా పంక్తి వెనుక నమా’జు చదువు తుండగా చూశారు. ప్రవక్త (స) అతన్ని నమా’జును మళ్ళీ చదవమని ఆదేశించారు. [34] (అ’హ్మద్‌, తిర్మిజి‘ – ప్రామాణికం, దృఢం, అబూ దావూ‘ద్‌)

=====

25- بَابُ الْمَوْقِفِ

25. ఇమాము, ముఖ్తదీలు నిలబడే స్థలం

اَلْفَصْلُ الْأَوَّلُ  మొదటి విభాగం 

1106 – [ 1 ] ( متفق عليه ) (1/346)

عَنْ عَبْدِ اللهِ بْنِ عَبَّاسٍ قَالَ: بِتُّ فِيْ بَيْتِ خَالَتِيْ مَيْمُوْنَةَ فَقَامَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم يُصَلِّيْ. فَقُمْتُ عَنْ يَّسَارِهِ فَأَخَذَ بِيَدِيْ مِنْ وَّرَاءِ ظَهْرِهِ فَعَدَلَنِيْ كَذَلِكَ مِنْ وَّرَاءِ ظَهْرِهِ إِلَى الشَّقِّ الْأَيْمَنِ .

1106. (1) [1/346ఏకీభవితం]

’అబ్దుల్లాహ్‌ బిన్‌ ’అబ్బాస్‌ (ర) కథనం: ఒకరోజు రాత్రి పిన్ని మైమూనహ్ ఇంట్లో ఉన్నాను. ప్రవక్త (స) తహజ్జుద్‌ నమా’జు కోసం నిలబడ్డారు. నమా’జు చదవ సాగారు. నేను కూడా నమా’జు చదవడానికి నిలబడ్డాను. ప్రవక్త (స)కు ఎడమవైపు నిలబడ్డాను. ప్రవక్త (స) తన వెనుకవైపు నుండి చేయి పట్టుకొని, తన వెనుక నుండి తన కుడివైపు నిలబెట్టారు. [35]  (బు’ఖారీ, ముస్లిమ్‌)

1107 – [ 2 ] ( صحيح ) (1/346)

وَعَنْ جَابِرٍ قَالَ: قَامَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم لَيُصَلِّيَ فَجِئْتُ حَتَّى قُمْتُ عَنْ يَسَارِهِ فَأَخَذَ بِيَدِيْ فَأَدَارَنِيْ حَتَّى أَقَامَنِيْ عَنْ يَّمِيْنِهِ. ثُمَّ جَاءَ جَبَّارُ بْنُ صَخْرٍ. فَقَامَ عَنْ يَّسَارِ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم فَأَخَذَ بِيَدَيْنَا جَمِيْعًا فَدَفَعَنَا حَتَّى أَقَامَنَا خلَفْهَ. رَوَاهُ مُسْلِمٌ .

1107. (2) [1/346దృఢం]

జాబిర్‌ (ర) కథనం: ప్రవక్త (స) నమా’జు చదవడానికి నిలబడ్డారు. నేనూ వచ్చి ప్రవక్త (స) ఎడమవైపు నిలబడ్డాను. ప్రవక్త (స) నా చేయి పట్టుకొని తిప్పి తన కుడిచేతివైపు నిలబెట్టారు. ఆ వెంటనే జబ్బార్‌ బిన్‌ ‘స’ఖర్‌ అనే అనుచరుడు వచ్చి ప్రవక్త (స) ఎడమవైపు నిలబడ్డాడు. ప్రవక్త (స) మా ఇద్దరినీ చేయిపట్టుకొని వెనుకకు నెట్టారు. (ముస్లిమ్‌)

1108 – [ 3 ] ( صحيح ) (1/346)

وَعَنْ أَنَسٍ قَالَ: صَلَيْتُ أَنَا وَيَتِيْمٌ فِيْ بَيْتِنَا خَلْفَ النِّبِيِّ صلى الله عليه وسلم وَأَمُّ سُلَيْمٍ خَلْفَنَا. رَوَاهُ مُسْلِم

1108. (3) [1/346దృఢం]

అనస్‌ (ర) కథనం: నేనూ మరియు ఒక అనాథుడు కలసి మా ఇంట్లో ప్రవక్త (స) వెనుక నమా’జు చది వాము. ఉమ్మె సులైమ్‌ మా వెనుక నిలబడింది. [36] (ముస్లిమ్‌)

1109 – [ 4 ] ( صحيح ) (1/346)

وَعَنْهُ أَنَّ النَّبِيَّ صلى الله عَلَيْهِ وَسَلم صَلَّى بِهِ وَبِأُمِّهِ أَوْ خَالَتِهِ قَالَ: فَأَقَامَنِيْ عَنْ يَّمِيْنِهِ وَأَقَامَ الْمَرْأَةَ خَلْفَنَا. رَوَاهُ مُسْلِمٌ .

1109. (4) [1/346దృఢం]

అనస్‌ (ర) కథనం: ప్రవక్త (స) నన్ను, నా తల్లి గారికి, పిన్నిగారికి నమా’జు చదివించారు. నన్ను తన కుడివైపు నిలబెట్టారు. మా అమ్మగారిని, మా పిన్నిగారిని వెనుక నిలబెట్టారు. (ముస్లిమ్‌)

1110 – [ 5 ] ( صحيح ) (1/346)

وَعَنْ أَبِيْ بَكْرَةَ أَنَّهُ انْتَهَى إِلَى النَّبِيِّ صلى الله عليه وسلم وَهُوَ رَاكِعٌ فَرَكَعَ قَبْلَ أَنْ يَّصِلَ إِلَى الصَّفِّ ثُمَّ مَشَى إِلَى الصَّفِّ. فَذَكَرَ ذَلِكَ لِلنَّبِيِّ صلى الله عليه وسلم فَقَالَ: “زَادَكَ اللهُ حِرْصًا وَلَا تَعُدْ”. رَوَاهُ الْبُخَارِيُّ .

1110. (5) [1/346దృఢం]

అబూ బక్ర (ర) కథనం: నేను ప్రవక్త (స) వద్దకు వెళ్ళేసరికి రుకూ’లోకి వెళ్ళిపోయారు. పంక్తి వద్దకు వెళ్ళకముందే రుకూ’లోకి వెళ్ళాను. రుకూ’లోనే పంక్తివద్దకు చేరుకున్నాను. నమా’జు తర్వాత ప్రవక్త (స) వద్ద దీన్ని గురించి ప్రస్తావించాను. దానికి ప్రవక్త (స), ‘అల్లాహ్‌(త) నీ కోరికను ఇంకా అధికం చేయు గాక, ఇకముందు అలా చేయకు,’ అని అన్నారు. [37] (బు’ఖారీ)

—–

اَلْفَصْلُ الثَّانِيْ  రెండవ విభాగం  

1111 – [ 6 ] ( ضعيف ) (1/347)

عَنْ سَمُرَةَ بْنِ جُنْدُبٍ قَالَ: أَمَرَنَا رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم. إِذَا كُنَّا ثَلَاثَةً أَنْ يَّتَقَدَّمَنَا أَحَدُنَا. رَوَاهُ التِّرْمِذِيُّ

1111. (6) [1/347బలహీనం]

సమురహ్‌ బిన్‌ జున్‌దుబ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ”ఒకవేళ మేము ముగ్గురం ఉంటే, మాలో ఒకరు ముందు ఉండి అంటే ఇమాముగా మరియు ఇద్దరు ముఖ్తదీలుగా నమా’జు చదవాలని” ఆదేశించారు. (తిర్మిజి’)

1112 – [ 7 ] ( ضعيف ) (1/347)

وَعَنْ عَمَّارِ بْنِ يَاسِرٍ: أَنَّهُ أَمَّ النَّاسَ بِالْمَدَائِنِ وَقَامَ عَلَى دُكَّانٍ يُّصَلِّيْ وَالنَّاسُ أَسْفَلُ مِنْهُ فَتَقَدَّمَ حُذَيْفَةُ فَأَخَذَ عَلَى يَدَيْهِ فَاتْبَعَهُ عَمَّارٌ حَتَّى أَنْزَلَهُ حُذَيْفَةُ. فَلَمَّا فَرَغَ عَمَّارٌ مِّنْ صَلَاتِهِ قَالَ لَهُ حُذَيْفَةُ: أَلَمْ تَسْمَعْ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ: “إِذَا أَمُّ الرَّجُلُ الْقَوْمَ فَلَا يَقُمْ فِيْ مَقَامٍ أَرْفَعَ مِنْ مَّقَامِهِمْ أَوْ نَحْوَ ذَلِكَ؟” فَقَالَ عَمَّارٌ: لِّذَلِكَ اتَّبَعْتُكَ حَيْنَ أَخَذْتَ عَلَى يَدَيَّ. رَوَاهُ أَبُوْ دَاوُدَ

1112. (7) [1/347బలహీనం]

’అమ్మార్‌ (ర) కథనం: నేను మదాయన్‌లో ప్రజలకు నమా’జు చదివించాను. దుకాణంపై నిలబడి నమా’జు ప్రారంభించాను. అంటే ఎత్తైన ప్రదేశంపై నిలబడి నమా’జు చదివించసాగాను. ముఖ్తదీలు వెనుక క్రింద నిలబడసాగారు. అప్పుడు ‘హుజై’ఫా (ర) ముందుకు వెళ్ళి నా (అమ్మార్‌) చేయిపట్టుకొని క్రిందికి దించారు. అనంతరం నేను క్రిందికి దిగివచ్చాను. క్రిందికి దిగి నమా’జు చదివించాను. నమా’జు ముగిసిన పిదప ‘హుజై’ఫా (ర) నాతో, ప్రవక్త (స), ”మీలో ఎవరైనా నమా’జు చదివిస్తే, ముఖ్తదీలకంటే ఎత్తైన ప్రదేశంలో నిలబడకూడదని” పలకటం నీవు వినలేదా, అని అన్నారు. అప్పుడు ‘అమ్మార్‌ ‘హుజై’ఫాతో అందువల్లే నేను మిమ్మల్ని అనుసరించాను. మీరు చేయి పట్టుకొని దించితే దిగిపోయాను. ఎటువంటి అభ్యంతరాన్ని ప్రదర్శించలేదు,’ అని అన్నారు. [38]  (అబూ దావూ’ద్‌)

1113 – [ 8 ] ( متفق عليه ) (1/347)

وَعَنْ سَهْلِ بْنِ سَعْدٍ السَّاعِدِيِّ أَنَّهُ سُئِلَ: مِنْ أَيِّ شَيْءٍ الْمِنْبَرُ؟ فَقَالَ: هُوَ مِنْ أثْلِ الْغَابَةِ عَمِلَهُ فُلَانٌ مَّوْلَى فُلَانَةَ لِرَسُوْلِ اللهِ صلى الله عليه وسلم وَقَامَ عَلَيْهِ رَسُوْلُ الله صلى الله عليه وسلم حِيْنَ عُمِلَ وَوَضَعَ فَاسْتَقْبَلَ الْقِبْلَةَ وَكَبَّرَ وَقَامَ النَّاسُ خَلْفَهُ فَقَرَأَ وَرَكَعَ وَرَكَعَ النَّاسُ خَلْفَهُ ثُمَّ رَفَعَ رَأْسَهُ ثُمَّ رَجَعَ الْقَهْقَري فَسَجَدَ عَلى الْأَرْضِ ثُمَّ عَادَ إِلَى الْمِنْبَرِ ثُمَّ قَرَأَ ثُمَّ رَكَعَ ثُمَّ رَفَعَ رَأْسَهُ ثُمَّ رَجَعَ الْقَهْقَرَيْ حَتَّى سَجَدَ بِالْأَرْضِ. هَذَا لَفْظُ الْبُخَارِيِّ. وَفِيْ الْمُتَّفَق عَلَيْهِ نَحْوَهُ. وَقَالَ فِيْ آخِرِهِ: فَلَمَّا فَرَغَ أَقْبَلَ عَلَى النَّاسِ فَقَالَ: “أَيُّهَا النَّاسُ إِنَّمَا صَنَعْتُ هَذَا لِتَأْتَمُّوْا بِيْ وَلِتَعَلّمُوْا صَلَاتِيْ”.

1113. (8) [1/347ఏకీభవితం]

సహల్‌ బిన్‌ స’అద్ అస్సా’ఇదీ (ర) కథనం: అతన్ని ప్రవక్త (స) మెంబర్‌ ఏ కర్రతో చేయబడిందని ప్రశ్నిం చడం జరిగింది. దానికి అతను ఆ మెంబరు అడవి కట్టెతో చేయబడిందని, దాన్ని ఫలానా వ్యక్తి తయారు చేసారని, ఆ వ్యక్తి ప్రవక్త (స) కోసం మెంబరు తయారు చేసి, మస్జిద్‌లోకి తీసుకు వచ్చిన తర్వాత, ప్రవక్త (స) దానిపై నిలబడ్డారు. ఖిబ్లావైపు నిలబడి తక్‌బీరె త’హ్రీమ పలికారు. ప్రజలు ప్రవక్త (స) వెనుక నిలబడ్డారు. ప్రవక్త (స) మెంబరు పైనే ఖిరాత్‌, రుకూ’ చేశారు. ప్రజలు కూడా రుకూ చేశారు. తరువాత ప్రవక్త (స) రుకూ’ నుండి తలఎత్తారు. ఆ తరువాత వెను కడుగులు వేస్తూ క్రిందదిగారు, నేలపై సజ్దా చేశారు. మళ్ళీ మెంబరుపైకి తిరిగి ఎక్కారు. మళ్ళీ ఖిరాఅత్‌, రుకూ’ చేశారు. రుకూ’ నుండి తలెత్తి, వెనుకడుగులు వేసి క్రిందిదిగి సజ్దాచేశారు. నమాజు ముగిసిన తర్వాత, ప్రవక్త (స) ప్రజలవైపు తిరిగి, ‘ప్రజలారా! నేనిలా మీరు నన్ను అనుసరించాలని, నమా’జు నేర్చుకోవాలని చేశాను,’ అని అన్నారు. (బు’ఖారీ, ముస్లిమ్‌)

1114 – [ 9 ] ( صحيح ) (1/348)

وَعَنْ عَائِشَةَ رَضِيَ اللهُ عَنْهَا قَالَتْ: صَلَّى رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم فِيْ حُجْرَتِهِ وَالنَّاسُ يَأْتمُّوْنَ بِهِ مِنْ وَّرَاءِ الْحُجْرَةِ. رَوَاهُ أَبُوْ دَاوُدَ.

1114. (9) [1/348దృఢం]

’ఆయి’షహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) తన గదిలో నమా’జు చదివారు. ప్రజలు గదికి బయటఉండి, ప్రవక్త (స)ను అనుసరిస్తూ నమా’జు చదివారు. రమ’దాన్‌లో తరావీహ్‌ సందర్భంగా చేసినట్టు. (అబూ దావూ’ద్‌)

—–

اَلْفَصْلُ الثَّالِثُ  మూడవ విభాగం  

1115 – [ 10 ] ( ضعيف ) (1/348)

عَنْ أَبِيْ مَالِكِ الْأَشْعَرِيِّ قَالَ: أَلَا أُحَدِّثُكُمْ بِصَلَاةِ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم؟ قَالَ: أَقَامَ الصَّلَاةَ وَصَفَّ الرِّجَالُ وَصَفَّ خَلْفَهُمُ الْغِلْمَانُ ثُمَّ صَلَّى بِهِمْ فَذَكَرَ صَلَاتَهُ ثُمَّ قَالَ: “هَكَذَا صَلَاةُ”. قَالَ عَبْد العلى: لَا أَحْسِبُهُ إِلَّا قَالَ: أُمَّتِيْ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ .

1115. (10) [1/348బలహీనం]

అబూ మాలిక్‌ అష్‌’అరీ (ర) కథనం: అతను ప్రజలతో, ‘నేను మీకు ప్రవక్త (స) నమా’జు విధానాన్ని తెలపనా’ అని పలికి, అనంతరం, ”ప్రవక్త (స) నమా’జుకు సిద్ధమయ్యారు, తన వెనుక పురుషులను పంక్తిలో నిలబెట్టారు. వారి వెనుక యువకుల పంక్తి నిలబెట్టారు. పంక్తులను సరిచేసిన తర్వాత నమా’జు చదివించారు. ఈ విధంగా ప్రవక్త (స) నమా’జు గురించి ప్రస్తావించారు. ఆ తర్వాత ప్రవక్త (స), ”అనుచర సమాజ నమా’జు ఈ విధంగా ఉంటుంది,” అని అన్నారని, అన్నారు. (అబూదావూ’ద్‌)

1116 – [ 11 ] ( صحيح ) (1/348)

وَعَنْ قَيْس بْنِ عُبَّادٍ قَالَ: بَيْنَا أَنَا فِيْ الْمَسْجِدِ فِيْ الصَّفِّ الْمُقَدَّمِ فَجَبَذَنِيْ رَجُلٌ مِّنْ خَلْفِيْ جَبْذَةً فَنَحَانِيْ وَقَامَ مَقَامِيْ فَواللهِ مَا عَقَلْتُ صَلَاتِيْ . فَلَمَّا انْصَرَفَ إِذَا هُوَ أُبَيُّ بْنُ كَعْبٍ فَقَالَ: يَا فَتى لَا يَسُوْءُكَ اللهُ إِنَّ هَذَا عَهْدٌ مِّنَ النَّبِيِّ صلى الله عليه وسلم إِلَيْنَا أَن نُلِيَهِ ثُمَّ اسْتَقْبَلَ الْقِبْلَةَ فَقَالَ: هَلَكَ أَهْلُ الْعَقْدِ وَرَبِّ الْكَعْبَةِ ثَلَاثًا ثُمَّ قَالَ: وَاللهِ مَا عَلَيْهِمْ آسى وَلَكِنْ آسى عَلَى مَنْ أَضَلُّوْا. قُلْتُ يَا أَبَا يَعْقُوْبَ مَا تَعْنِيْ بِأَهْلِ الْعَقْدِ؟ قَالَ: الْأُمَرَاءُ. رَوَاهُ النَّسَائِيُّ .

1116. (11) [1/348దృఢం]

ఖైస్‌ బిన్‌ ’ఉబ్బాద్‌ (ర) కథనం: నేను మస్జిద్‌లో మొదటి పంక్తిలో నిలబడ్డాను. ఎవరో నన్ను వెనక్కి లాగి, నా స్థానంలో అతను నిలబడిపోయారు. నన్ను వెనుక పంక్తిలో నిలబెట్టి నా స్థానంలో అతను నిలబడి నందుకు నాకు చాలా కోపం వచ్చింది. కోపంవల్ల నేను ఏమి చదువుతున్నానో నాకు తెలియలేదు. నమా’జు ముగిసిన తర్వాత చూస్తే, అతను ’ఉబయ్‌ బిన్‌ క’అబ్‌ (ర). అతను నాతో, ”కుమారా! ఆగ్రహం చెందకు, నిన్ను అల్లాహ్‌ సంతోషంగా ఉంచుగాక!” అన్నారు. ప్రవక్త (స) మాకు, ”పెద్దలు, విద్య వంతులు, ఇమాముకు సమీపంగా నిలబడాలని, పిల్లలు వెనుక నిలబడాలని,” హితబోధ చేసారని చెప్పి అతను ఖిబ్లావైపు తిరిగి ”అల్లాహ్ సాక్షి! నాయకులు నాశనం అయ్యారు” అని మూడు సార్లు పలికి మళ్ళీ ”అల్లాహ్ సాక్షి! ఆ నాయకుల పట్ల విచారించను, వీళ్ళు మార్గభ్రష్టత్వానికి గురిచేసిన వారిపట్ల విచారిస్తున్నాను” అని అన్నారు. నేను ‘ఉబయ్‌ బిన్‌ క’అబ్‌ను అహ్‌లిల్‌-‘అఖ్‌ద్‌ అంటే ఎవరని అడిగాను. దానికి అతను పాలకులు, నాయకులు,’ అని అన్నారు. (నసాయి)  

=====

26- بَابُ الْإِمَامَةِ

26. నమాజులో నాయకత్వం (ఇమామత్)

పాలకులు లేదా నాయకులను ఇమాము అంటారు. ఇక్కడ ఇమాము అంటే నమా’జు చదివించేవారు. అతని వెనుక నమా’జు చదివే వారందరినీ ముఖ్తదీలు అంటారు. ధార్మిక జ్ఞానం అధికంగా ఉన్నవారు ఇమామత్‌కు అర్హులు. అంటే ఖుర్‌ఆన్‌, ‘హదీసు’ల జ్ఞానం గలవారై ఉండాలి. ఖుర్‌ఆన్‌ బాగా చదవడం వచ్చిన వారు, దైవభీతిపరులు, ఉత్తములు, మంచి స్వభావం గలవారు ఇమామత్‌కు అర్హులు.

ప్రవక్త (స) ఉపదేశం: మీలో ఉత్తములను, మంచి వారిని, ఇమాముగా ఎన్నుకోండి. ఎందుకంటే అతడు మీకు, అల్లాహ్ కు మధ్య కార్యకర్త. అతడు మీ ప్రతినిధిగా ఉంటాడు. (దార్ ఖుత్నీ)

మరో ఉపదేశం: ఒకవేళ మీరు మీ నమా’జులు స్వీకరించబడాలని కోరుకుంటే దైవభీతిపరులను ఇమాముగా నియమించుకొండి. (తబ్రాని)

మరో ఉపదేశం: ముగ్గురుంటే ఒకరిని ఇమాముగా చేసుకోండి, ఖుర్‌ఆన్‌ బాగా చదివేవారే ఇమామత్‌కు అందరికంటే ఎక్కువ అర్హులు. (ముస్లిమ్‌)

మరో ఉపదేశం: ఖుర్‌ఆన్‌ అధికంగా గుర్తు ఉన్న వారే ఇమామత్‌కు అర్హులు. ఒకవేళ అందరూ సమానులైతే, వారిలో సున్నత్‌ గురించి ఇతరుల కంటే అధికంగా తెలిసిన వారు ఇమాముగా ఉండాలి. ఈ రెంటిలో సమానంగా ఉంటే, అందరికంటే ముందు హిజ్రత్‌ చేసినవారు. అందరూ సమానులైతే అందరి కంటే అధిక వయస్సు గలవాడు ఇమాము అవ్వాలి. (ముస్లిమ్‌)

اَلْفَصْلُ الْأَوَّلُ  మొదటి విభాగం  

1117 – [ 1 ] ( صحيح ) (1/349)

عَنْ أَبِيْ مَسْعُوْدٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “يَؤُمُّ الْقَوْمَ أَقْرَؤُهُمْ لِكِتَابِ اللهِ فَإِنّْ كَانُوْا فِيْ الْقِرَاءَةِ سَوَاءً فَأَعْلَمُهُمْ بِالسُّنَّةِ فَإِنْ كَانُوْا فِيْ السُّنَّةِ سَوَاءً فَأَقْدَمُهُمْ هِجْرَةً فَإِنْ كَانُوْا فِيْ الْهِجْرَةِ سَوَاءً فَأَقْدَمُهُمْ سِنًّا وَلَا يَؤُمِّنَّ الرَّجُلُ الرَّجُلَ فِيْ سُلْطَانِهِ وَلَا يَقْعُدُ فِيْ بَيْتِهِ عَلَى تَكْرِمَتِهِ إِلَّا بِإِذْنِهِ”. رَوَاهُ مُسْلِمٌ. وَفِيْ رِوَايَةٍ لَّهُ: “وَلَا يَؤُمَّنَّ الرَّجُلُ الرَّجُلَ فِيْ أَهْلِهِ”.

1117. (1) [1/349దృఢం]

అబూ మస్‌’ఊద్‌ (ర) కథనం: ప్రవక్త(స) ప్రవచనం, ”ఖుర్‌ఆన్‌ చక్కగా చదవగలిగిన వారే, ప్రజలకు ఇమామత్‌ చేయాలి. ఇందులో అందరూ సమానులైతే, సున్నత్‌ గురించి అధికంగా తెలిసిన వారు ఇమాము అవ్వాలి. సున్నత్‌లో కూడా అందరూ సమానులైతే అందరికంటే ముందు హిజ్రత్‌ చేసిన వ్యక్తి ఇమాము అవ్వాలి. హిజ్రత్‌లో అందరూ సమానులైతే ఎక్కువ వయస్సు గల వారు చదివించాలి. ఒక వ్యక్తి మరో వ్యక్తి రాజ్యం ప్రభుత్వంలో ఇమామత్‌ చేయరాదు. అదేవిధంగా ఒక వ్యక్తి మరో వ్యక్తి ఇంట్లో అతను కూర్చునేచోట కూర్చో కూడదు. అయితే అతని అనుమతితో కూర్చోవచ్చు. మరో ఉల్లేఖనంలో ఇలా ఉంది, ”ఒక వ్యక్తి మరో వ్యక్తి ఇంట్లో ఇమామత్‌ చేయరాదు.” [39] (ముస్లిమ్‌)

1118 – [ 2 ] ( صحيح ) (1/349)

وَعَنْ أَبِيْ سَعِيْدٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِذَا كَانُوْا ثَلَاثَةً فَلْيَؤُمُّهُمْ أَحَدُهُمْ وَأَحَقُّهُمْ بِالْإِمَامِ أَقْرَؤُهُمْ”. رَوَاهُ مُسْلِمٌ  وَذَكَرَ حَدِيْثُ مَالِكِ بْنِ الْحُوَيْرِثِ فِيْ بَابِ بَعْدَ بَابِ “فَضْلِ الْأَذَانِ”.

1118. (2) [1/349దృఢం]

అబూ స’యీద్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ముగ్గురు ఉంటే వారిలో ఒకరు ఇమాము అయి పోవాలి. అందరి కంటే ఎక్కువ విద్యార్హతలు గలవారు ఇమామత్‌కు అర్హులు.” (ముస్లిమ్‌)

—–

اَلْفَصْلُ الثَّانِيْ  రెండవ విభాగం  

1119 – [ 3 ] ( ضعيف ) (1/350)

عَنِ ابْنِ عَبَّاسٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لِيُؤَذِّنَ لَكُمْ خِيَارُكُمْ وَلْيَؤُمَّكُمْ قُرَّاؤُكُمْ”. رَوَاهُ أَبُوْ دَاوُد.

1119. (3) [1/350బలహీనం]

ఇబ్నె ‘అబ్బాస్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మీలో  మంచివారు అజా’న్‌ ఇవ్వాలి, మీలో అందరి కంటే విద్యార్హతలు గలవారు ఇమాము అవ్వాలి.” (అబూ దావూ’ద్‌)

1120 – [ 4 ] ( صحيح ) (1/350)

وَعَنْ أَبِيْ عَطِيَّةَ الْعُقَيْلِيِّ قَالَ: كَانَ مَالِكُ بْنُ الْحَوَيْرِثِ يَأْتِيْنَا إِلَى مُصَلَّانَا يَتَحَدَّثُ فَحَضَرَتِ الصَّلَاةُ يَوْمًا قَالَ أَبُوْ عَطِيِّةَ: فَقُلْنَا لَهُ: تَقَدَّمْ فَصَلِّهُ. قَالَ لَنَا قَدِّمُوْا رَجُلًا مِنْكُمْ يُصَلِّيْ بِكُمْ وَسَأُحَدِّثُكُمْ لِمَ لَا أُصَلِّيْ بِكُمْ؟ سَمِعْتُ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ: “مَنْ زَارَ قَوْمًا فَلَا يَؤُّمَّهُمْ وَلْيَؤُمَّهُمْ رَجُلُ مِّنْهُمْ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ وَالتِّرْمِذِيُّ وَالنَّسَائِيُّ إِلَّا أَنَّهُ اقْتَصَرَ عَلَى لَفْظِ النّبِيِّ صلى الله عليه وسلم .

1120. (4) [1/350దృఢం]

అబూ ‘అ’తియ్య ‘ఉఖైలీ (ర) కథనం: మాలిక్‌ బిన్‌ ‘హువైరిస్‌’ మా మస్జిద్‌కు వచ్చారు. ప్రవక్త (స) ‘హదీసు’లను వినిపించసాగారు. ఇంతలో నమా’జు సమయం అయిపోయింది. మేము మాలిక్‌ బిన్‌ ‘హువై రిస్‌’ను, ‘తమరు నమా’జు చదివించండి,’ అని అన్నాము. అప్పుడతను మాతో, ”మీలో నుండే ఎవరినైనా చదివించమనండి. అతను నమా’జు చది విస్తాడు. ఇంకా నేను మీకు ఎందుకు నమా’జు చది వించలేనో చెపుతాను, వినండి, ప్రవక్త (స)ను ఇలా అంటూ ఉండగా నేను విన్నాను, ‘ఎవరైనా ఒక వర్గం వారితో కలవడానికి వెళితే వారికి ఇమామత్‌ చేయ కూడదు, వారిలోనేఒకరు వారికి ఇమామత్‌ చేయాలి.’ అని అన్నారు.” (అబూ దావూ’ద్‌, తిర్మిజి’, నసాయి’)

తిర్మిజీ’లో కేవలం ‘హదీసు’ పదాలు ఉన్నాయి.

1121 – [ 5 ] ( صحيح ) (1/350)

وَعَنْ أَنَسٍ قَالَ: اسْتَخْلَفَ رَسُوْلُ الله صلى الله عليه وسلم اِبْنَ أُمِّ مَكْتُوْمٍ يَؤُّمُ النَّاسَ وَهُوَ أَعْمَى. رَوَاهُ أَبُوْ دَاوُدَ.

1121. (5) [1/350దృఢం]

అనస్‌ (ర) కథనం: ప్రవక్త (స) ఇబ్నె ఉమ్మె మక్‌తూమ్‌ను తన స్థానంలో ప్రజలకు నమా’జు చదివించమని ఇమాముగా నియమించారు. [40] (అబూ దావూ’ద్‌)

1122 – [ 6 ] ( حسن ) (1/350)

وَعَنْ أَبِيْ أُمَامَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “ثَلَاثَةٌ لَا تُجَاوِزُ صَلَاتُهُمْ آذَانَهُمُ: الْعَبْدُالآبِقُ حَتَّى يَرْجِعَ وَامْرَأةٌ بَاتَتْ وَزَوْجُهَا عَلَيْهَا سَاخِطٌ وَإِمَامٌ قَوْمٍ وَهُمْ لَهُ كَارِهُوْنَ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَقَالَ: هَذا حَدِيْثٌ غَرِيْبٌ .

1122. (6) [1/350ప్రామాణికం]

అబూ ఉమామహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ముగ్గురు వ్యక్తుల నమా’జు వారి చెవులపైకి వెళ్ళదు. అంటే వారి నమా’జు స్వీకరించబడదు. 1. పారి పోయిన సేవకుడు తిరిగివచ్చే వరకు, 2. రాత్రంతా భర్తను అయిష్టానికి గురిచేసిన స్త్రీ, 3. తన చెడుపనుల వల్ల ముఖ్తదీలు అయిష్టంగా ఉన్న ఇమాము. (తిర్మిజి’ – ఏకోల్లేఖనం)

1123 – [ 7 ] ( ضعيف ) (1/351)

وَعَنِ ابْنِ عَمْرٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “ثَلَاثَةٌ لَا تُقْبَلُ مِنْهُمْ صَلَاتُهُمْ: مَنْ تَقَدَّمَ قَوْمًا وَهُمْ لَهُ كَارِهُوْنَ وَرَجُلٌ أَتَى الصَّلَاةَ دِبَارًا وَالدِّبَارُ: أَنْ يَّأْتِيَهَا بَعْدَ أَنْ تَفُوْتَهُ وَرَجُلٌ اعْتَبَدَ مُحَرَّرَةُ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ وَابْنُ مَاجَهُ .

1123. (7) [1/351బలహీనం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘ఉమర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ముగ్గురు వ్యక్తుల నమా’జు స్వీకరించ బడదు. 1. తన చెడు నడవడిక వల్ల ప్రజలు అయిష్టంగా ఉన్న ఇమాము, 2. అకారణంగా నమా’జు ఆలస్యంగా చదివేవాడు, 3. స్వతంత్రుడ్ని బానిసగా చేసిన వాడు. (అబూ దావూ’ద్‌, ఇబ్నె మాజహ్)

1124 – [ 8 ] ( ضعيف ) (1/351)

وَعَنْ سَلَامَةَ بِنْتِ الْحُرِّ قَالَتْ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِنَّ مِنْ أَشْرَاطِ السَّاعَةِ أَنْ يَّتَدَافَعَ أَهْلُ الْمَسْجِدِ لَا يَجِدُوْنَ إِمَامًا يُّصَلِّيْ بِهِمْ”. رَوَاهُ أَحْمَدُ وَأَبُوْ دَاوُدَ وَابْنُ مَاجَهُ .

1124. (8) [1/351బలహీనం]

సలామహ్ బిన్‌తె ‘హుర్రి (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”పునరుత్థాన సూచనల్లో ఇది కూడా ఒకటి, ప్రజలు పరస్పరం ఇమామత్‌ను ఒకరిపైఒకరు వేస్తారు. అంటే తనను తగనివారుగా భావించి ఇమామత్‌కు దూరంగా ఉంటారు. నమా’జు చదివించే వారెవరూ ఉండరు.” (అ’హ్మద్‌, అబూ దావూ’ద్‌, ఇబ్నె మాజహ్)

1125 – [ 9 ] ( ضعيف ) (1/351)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “اَلْجِهَادُ وَاجِبٌ عَلَيْكُمْ مَعَ كُلِّ أَمِيْرٍ بَرًّا كَانَ أَوْفَاجِرًا وَّإِنْ عَمِلَ الْكَبَائِرَ. وَالصَّلَاةُ وَاجِبَةٌ عَلَيْكُمْ خَلْفَ كُلِّ مُسْلِمٍ بَرًّا كَانَ أَوْ فَاجِرًا وَّإِنْ عَمِلَ الْكَبَائِرَ. وَالصَّلَاةُ وَاجِبَةٌ عَلَى كُلِّ مُسْلِمٍ بَرًّا كَانَ أَوْ فَاجِرًا وَإِنْ عَمِلَ الْكَبَائِرَ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ .

1125. (9) [1/351బలహీనం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మీ పై అల్లాహ్ మార్గంలో పోరాడటం తప్పనిసరివిధి. నాయకుడు మంచివాడైనా, చెడ్డవాడైనా, మహా పాపాలు చేసే వాడైనా సరే. అదేవిధంగా ప్రతి ముస్లిమ్‌ వెనుక నమా’జు తప్పని సరి, అతడు మంచివాడైనా, చెడ్డవాడైనా, అతడు మహాపాపాలు చేసేవాడైనా సరే. అదేవిధంగా ప్రతి ముస్లిమ్‌పై జనా’జహ్ నమా’జు తప్పనిసరి విధి. అతడు మంచివాడైనా, చెడ్డవాడైనా, మహా పాపాలు చేసిన వాడైనా సరే. (అబూ దావూ’ద్‌)

—–

اَلْفَصْلُ الثَّالِثُ  మూడవ విభాగం  

1126 – [ 10 ] ( صحيح ) (1/352)

عَنْ عَمْرِو بْنِ سَلَمَةَ قَالَ: كُنَّا بِمَاءِ مَّمَرِّ النَّاسِ وَكَانَ يَمُرُّ بِنَا الرُّكْبَانُ نَسْأَلُهُمْ مَا لِلنَّاسِ مَا لِلنَّاسِ؟ مَا هَذَا الرَّجُلُ فَيَقُوْلُوْنَ يَزْعَمُ أَنَّ اللهَ أَرْسَلَهُ أَوْحَى إِلَيْهِ أَوْ أَوْحَى اللهُ كَذَا. فَكُنْتُ أَحفَظُ ذَلِكَ الْكَلَامَ فَكَأَنَّمَا يُغَرّى فِيْ صَدْرِيْ وَكَانَتِ الْعَرَبُ تَلَوَّمُ بِإِسْلَامِهِمُ الْفَتْحَ فَيَقُوْلُوْنَ اتْرُكُوْهُ وَقَوْمَهُ فَإِنَّهُ إِنْ ظَهَرَ عَلَيْهِمْ فَهُوَ نَبِيٌّ صَادِقٌ. فَلَمَّا كَانَتْ وَقْعَةُ الْفَتْحِ بَادَرَ كُلُّ قَوْمٍ بِإِسْلَامِهِمْ وَبَدَرَ أَبِيْ قَوْمِيْ بِإِسْلَامِهِمْ فَلَمَّا قَدِمَ قَالَ: جِئْتُكُمْ وَاللهِ مِنْ عِنْدَ النَّبِيِّ حَقًّا فَقَالَ: “صَلُّوْا صَلَاةً كَذَا فِيْ حِيْنَ كَذَا وَصَلُّوْا صَلَاةً كَذَا فِيْ حِيْنَ كَذَا. فَإِذَا حَضَرَتِ الصَّلَاةُ فَلْيُؤَذِّنْ أَحَدُكُمْ وَلْيَؤُمَّكُمْ أَكْثَرُكُمْ قُرْآنًا”. فَنَظَرُوْا فَلَمْ يَكُنْ أَحَدٌ أَكْثَرَ قُرْآنًا مِّنِّيْ لِمَا كُنْتُ أَتَلَقّى مِنَ الرُّكْبَانِ فَقَدَّمُوْنِيْ بَيْنَ أَيْدِيْهِمْ وَأَنَا ابْنُ سِتٍّ أَوْ سَبْعِ سِنِيْنَ وَكَانَتْ عَلَيَّ بُرْدَةٌ كُنْتُ إِذَا سَجَدْتُّ تَقَلّصَتْ عَنِّيْ. فَقَالَتْ امْرَأَةٌ مِّنَ الْحَيِّ أَلَا تُغَطُّوْنَ عَنَّا اِسْتَ قَارِئِكُمْ فَاشْتَرَوْا فَقَطَّعُوْا لِيْ قَمِيْصًا فَمَا فَرِحْتُ بِشِيْءٍ فَرَحِيُ بِذَلِكَ الْقَمِيْصِ. رَوَاهُ الْبُخَارِيُّ .

1126. (10) [1/352దృఢం]

అమ్ర్ బిన్‌ సలమహ్ (ర) కథనం: మేము ఒక చెరువు ప్రక్కన ఉండేవాళ్ళం. అది రహదారి కూడా. బిడారాలు రెండు వైపుల నుండి వచ్చీపోయేటప్పుడు నీటిదగ్గర ఆగేవి. మేము ఆ బాటసారులను వారి పరిస్థితులను అడిగేవాళ్ళం. అంటే, ‘మక్కహ్ నుండి ఇస్లామ్‌ అనే ఒక మతం ప్రారంభం అయిందని, ప్రజలు ఇస్లామ్‌ స్వీకరిస్తున్నారా? లేదా ఇస్లామ్‌ ప్రచారం చేస్తున్న ఆ వ్యక్తి పరిస్థితి ఏంటి? అతని గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు?’ అని అడిగే వాళ్ళం. దానికి ఆ బిడారువారు, ‘ఇస్లామ్‌ గురించి ప్రచారం చేస్తున్న ఆ వ్యక్తి అల్లాహ్‌ తనను ప్రవక్తగా పంపాడని, అతనిపై దైవవాణి అవతరిస్తుందని, మరియు వాళ్ళు ఖుర్‌ఆన్‌ పఠించి, వినిపించేవారు.’ నేను ఆ దైవవాణి, ఖుర్‌ఆన్‌ను కంఠస్తం చేసుకునేవాడిని. నా హృదయంలో ఆ ఖుర్‌ఆన్‌ అతుక్కుపోయేది. విని విని ఖుర్‌ఆన్‌ నాకు జ్ఞాపకం అయిపోయేది. అరబ్‌ ప్రజలు అప్పుడు ఇస్లామ్‌ స్వీకరించడానికి మక్కహ్ విజయం గురించి వేచి ఉన్నారు. ఇంకా ఈ ప్రవక్తను, ఇతని జాతిని వదలి వేయండి. ఒకవేళ ఇతడు వారందరిని అధిగమిస్తే, సత్యప్రవక్త అని అనేవారు. మక్కహ్ విజయం కాగానే ప్రతి తెగవారు త్వర త్వరగా ఇస్లామ్‌ స్వీకరించారు. మా తండ్రిగారు కూడా ఇస్లామ్‌ చాలా తొందరగా స్వీకరించారు. మా తండ్రి గారు ఇస్లామ్‌ స్వీకరించి మక్కహ్ నుండి వచ్చి, అల్లాహ్ సాక్షి! నేను ప్రవక్త (స) దగ్గరి నుండి సత్యం తీసుకొని వచ్చాను అని పలికి, ప్రవక్త (స) ఫలానా వేళలో ఇన్ని నమా’జులు చదవమని, నమా’జు సమయం అయితే, ఒక వ్యక్తి అజా’న్‌ ఇవ్వాలని, ఖుర్‌ఆన్‌ అధికంగా జ్ఞాపకం ఉన్నవారు ఇమాముగా నమా’జు చదివించాలని ఆదేశించారని, అప్పుడు ప్రజలు నాకంటే ఎక్కువ ఖుర్‌ఆన్‌ మరెవ్వరికీ జ్ఞాపకం లేదని తెలుసుకొని, ఎందుకంటే నేను ముందే వచ్చే, పోయే ప్రయాణీకుల ద్వారా, ఖుర్‌ఆన్‌ నేర్చుకొని ఉన్నాను. అనంతరం ప్రజలు నన్ను ముందుకు నెట్టారు. అప్పుడు నా వయస్సు 6 లేదా 7 సంవత్సరాలు ఉంటుంది. అప్పుడు నా శరీరంపై ఒక దుప్పటి మాత్రమే ఉండేది. సజ్దా చేసినపుడు దుప్పటి ఇరుకుగా అయిపోయేది. కొంత దుప్పటి విడిపోయేది. ఈ పరిస్థితి చూసి, వీధిలోని ఒక స్త్రీ, ‘మీరు మీ ఇమాము సతర్‌ను మా నుండి ఎందుకు దాచరు,’ అని చెప్పింది. అప్పుడు ప్రజలు వస్త్రం కొని, నా కోసం చొక్కా కుట్టించారు. దానివల్ల నాకు చాలా సంతోషం కలిగింది.” [41] (బు’ఖారీ)

1127 – [ 11 ] ( صحيح ) (1/353)

وَعَنِ ابْنِ عُمَرَ قَالَ: لَمَّا قَدِمَ الْمُهَاجِرُوْنَ الْأَوَّلُوْنَ الْمَدِيْنَةَ كَانَ يَؤُمُّهُمْ سَالِمٌ مَوْلَى أَبِيْ حُذَيْفَةَ وَفِيْهِمْ عُمَرُ وَأَبُوْ سَلَمَةَ بْنُ عَبْدِ الْأَسْدِ. رَوَاهُ الْبُخَارِيُّ.

1127. (11) [1/353దృఢం]

ఇబ్నె ‘ఉమర్‌ (ర) కథనం: ముహాజిరీన్లు మదీనహ్ వచ్చిన ప్రారంభంలో అబూ ‘హుజై’ఫహ్ విడుదల చేసిన బానిస సాలిమ్‌ ప్రజలకు నమా’జు చదివించే వారు. అప్పుడు ముఖ్త దీల్లో ‘ఉమర్‌ మరియు అబూ సలమహ్ కూడా ఉండే వారు. [42] (బు’ఖారీ)

1128 – [ 12 ] ( حسن ) (1/353)

وَعَنِ ابْنِ عَبَّاسٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “ثَلَاثَةٌ لَا تُرْفَعُ لَهُمْ صَلَاتُهُمْ فَوْقَ رُؤُوْسِهِمْ شِبْرًا: رَّجُلٌ أَمَّ قَوْمًا وَهُمْ لَهُ كَارِهُوْنَ وَامْرَأَةٌ بَاتَتْ وَزَوْجُهَا عَلَيْهَا سَاخِطٌ وَأَخَوَانِ مُتَصَارِمَانِ”. رَوَاهُ ابْنُ مَاجَهُ.

1128. (12) [1/353ప్రామాణికం]

ఇబ్నె ‘అబ్బాస్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ముగ్గురు వ్యక్తుల నమా’జు వారి తలల నుండి ఒక్క జానెడు కూడా పైకి వెళ్ళదు. అంటే వారి నమా’జు స్వీకరించబడదు. 1. ప్రజలు అయిష్టంగా ఉన్న ఇమాము, 2. భర్త రాత్రంతా అయిష్టంగా ఉన్న స్త్రీ, 3. పరస్పరం ద్వేషానికి గురయి సలాము, మాటలు మానుకున్న ఇద్దరు సోదరులు. (ఇబ్నె మాజహ్)

=====

27- بَابُ مَا عَلَى الْإِمَامِ

27. ఇమామ్ బాధ్యతలు

اَلْفَصْلُ الْأَوَّلُ  మొదటి విభాగం   

1129 – [ 1 ] ( متفق عليه ) (1/354)

عَنْ أَنَسٍ قَالَ: مَا صَلَّيْتُ وَرَاءَ إِمَامَ قَطُّ أَخَفَّ صَلَاةً وَلَا أَتَمَّ صَلَاةً مِّنَ النَّبِيِّ صلى الله عليه وسلم وَإِنْ كَانَ لَيَسْمَعُ بُكَاءَ الصَّبِيِّ فَيُخَفِّفُ مَخَافَةَ أَنْ تُفْتَنَ أُمُّهُ.

1129. (1) [1/354ఏకీభవితం]

అనస్‌ (ర) కథనం: నేను ప్రవక్త (స) వెనుక సులభమైన, పరిపూర్ణమైన నమా’జు చదివినట్టు మరెవరివెనుకా చదవలేదు. ప్రవక్త (స) నమాజులో పిల్లల ఏడుపువిని నమా’జును త్వరగా ముగించే వారు. తల్లులు పిల్లల పట్ల ఆందోళన చెంద కూడదని. [43](బు’ఖారీ, ముస్లిమ్‌)

1130 – [ 2 ] ( صحيح ) (1/354)

وَعَنْ أَبِيْ قَتَادَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِنِّيْ لَأَدْخُلُ فِيْ الصَّلَاةِ وَأَنَا أُرِيْدُ إِطَالَتَهَا فَأَسْمَعُ بُكَاءَ الصَّبِيِّ فَأَتَجَوَّزُ فِيْ صَلَاتِيْ مِمَّا أَعْلَمُ مِنْ شِدَّةِ وَجْدِ أُمِّهِ مِنْ بُكَائِهِ”. رَوَاهُ الْبُخَارِيُّ.

1130. (2) [1/354దృఢం]

అబూ ఖతాదహ్ (ర) కథనం: ప్రవక్త (స), ”నేను నమా’జు ప్రారంభించినప్పుడు, నమా’జును దీర్ఘంగా చదివించాలని అనుకుంటాను. కాని పిల్లల ఏడుపులు విని, నమా’జును సంక్షిప్తం చేసుకుంటాను. ఎందుకంటే పిల్లల ఏడుపులు విని తల్లులు చాలా ఆందోళన చెందుతారు. ఆమె నమా’జుకు అంతరాయం కలగ గూడదని,” అన్నారు. (బు’ఖారీ)

1131 – [ 3 ] ( متفق عليه ) (1/354)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِذَا صَلّى أَحَدُكُمْ لِلنَّاسِ فَلْيُخَفِّفْ فَإِنَّ فِيْهِمُ السَّقِيْمَ وَالضَّعِيْفَ وَالْكَبِيْرَ. وَإِذَا صَلَّى أَحَدُكُمْ لِنَفْسِهِ فَلْيُطَوِّلْ مَا شَاءَ”.

1131. (3) [1/354ఏకీభవితం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మీలో ఎవరైనా ప్రజలకు నమా’జు చదివిస్తే తేలికైన, సంక్షిప్తంగా నమా’జు చదివించాలి. ఎందుకంటే ముఖ్తదీల్లో రోగులూ ఉంటారు, బలహీనులూ ఉంటారు. ముసలివారూ ఉంటారు. అయితే తాను ఒంటరిగా నమా’జు చదివితే తన ఇష్టం వచ్చినట్లు దీర్ఘంగా చదువుకోవచ్చు. (బు’ఖారీ, ముస్లిమ్‌)

1132 – [ 4 ] ( متفق عليه ) (1/354)

وَعَنْ قَيْسِ بْنِ أَبِيْ حَازِمٍ قَالَ: أَخْبَرَنِيْ أَبُوْ مَسْعُوْدٍ أَنَّ رَجُلًا قَالَ: وَاللهِ يَا رَسُوْلَ اللهِ إِنِّيْ لَأَتَأَخَّرُ عَنْ صَلَاةِ الْغَدَاةِ مِنْ أَجْلِ فُلَانٍ مِمَّا يُطِيْلُ بِنَا فَمَا رَأَيْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم فِيْ مَوْعِظَةٍ أَشَدُّ غَضَبًا مِنْهُ يَوْمَئِذٍ. ثُمَّ قَالَ: “إِنَّ مِنْكُمْ مُنَفِّرِيْنَ فَأَيُّكُمْ مَا صَلَّى بِالنَّاسِ فَلْيَتَجَوَّزْ: فَإِنَّ فِيْهِمُ الضَّعِيْفَ وَالْكَبِيْرَ وَذَا الْحَاجَةِ”.

1132. (4) [1/354ఏకీభవితం]

ఖైస్‌ బిన్‌ అబీ ‘హా’జిమ్‌ (ర) కథనం: అబూ మస్’ఊద్‌ (ర) నాకు ఈ విషయాన్ని తెలిపారు, ”ఒక వ్యక్తి ప్రవక్త (స)ను, ‘అల్లాహ్ సాక్షి! ఓ ప్రవక్తా! ఫలానా వ్యక్తివల్ల నేను ఉదయం నమా’జు ఆలస్యం చేస్తున్నాను. ఎందుకంటే, అతను దీర్ఘంగా నమా’జు చదివిస్తున్నాడు,’ అని విన్నవించుకున్నాడు. అప్పుడు ప్రవక్త (స) హితబోధచేస్తూ, ‘దీర్ఘంగా నమా’జు చదివించే వారి పట్ల అయిష్టాన్ని వ్యక్తం చేశారు. అంత అయిష్టం చూపటం నేనెప్పుడూ చూడలేదు. ఆ తరువాత, ‘మీలో కొందరు దీర్ఘంగా నమా’జు చదివించి, ప్రజలకు నమా’జు పట్ల విసుగు పుట్టేలా చేస్తున్నారు. ప్రజలకు నమా’జు చదివించి నపుడు తేలికైన నమా’జు చదివించాలి. ఎందుకంటే ప్రజల్లో బలహీనులు, వృద్ధులు, అవసరం ఉన్నవారూ ఉంటారు,’ అని ప్రవచించారు. (బు’ఖారీ, ముస్లిమ్‌)

1133 – [ 5 ] ( صحيح ) (1/355)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “يُصَلُّوْنَ لَكُمْ فَإِنْ أَصَابُوْا فَلَكُمْ وَإِنْ أَخْطَئُوْا فَلَكُمْ وَعَلَيْهِمْ”. رَوَاهُ الْبُخَارِيُّ .

1133. (5) [1/355దృఢం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మీ ఇమాములు మీకు నమా’జు చదివించాలి. ఒక వేళ వారు సరైన విధంగా నమా’జు చదివిస్తే, దాని వల్ల మీకూ లాభం కలుగుతుంది, వారికీ లాభం కలుగు తుంది. ఒకవేళ తప్పుగా నమా’జు చదివిస్తే, పద్ధతికి వ్యతిరేకంగా చదివిస్తే మీ నమా’జు అయి పోతుంది. వారికి సంకటంగా తయారవుతుంది.” (బు’ఖారీ)

—–

                وَهَذَا الْبَابُ خَالٍ عَنِ الْفَصْلِ الثَّانِيْ

ఇందులో రెండవ విభాగం లేదు.

—–

اَلْفَصْلُ الثَّالِثُ  మూడవ విభాగం 

1134 – [ 6 ] ( صحيح ) (1/355)

عَنْ عُثْمَانَ بْنِ أَبِيْ الْعَاصِ قَالَ: آخِرُ مَا عَهِدَ إِلَيّ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِذَا أَمَمْتَ قَوْمًا فَأَخِفَّ بِهِمُ الصَّلَاةَ”. رَوَاهُ مُسْلِمٌ.

وَفِيْ روَايَةً لَهُ: أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم قَالَ لَهُ: “أُمَّ قَوْمَكْ” قَالَ: قُلْتُ يَا رَسُوْلَ اللهِ إِنِّيْ أَجِدُ فِيْ نَفْسِيْ شَيْئًا. قَالَ: “ادْنُهُ”. فَأَجْلَسَنِيْ بَيْنَ يَدَيْهِ ثُمَّ وَضَعَ كَفَّهُ فِيْ صَدْرِيْ بَيْنَ ثَدْيَيَّ ثُمَّ قَالَ: “تَحَوَّلْ”. فَوَضَعَهَا فِيْ ظَهْرِيْ بَيْنَ كَتِفَيَّ ثُمَّ قَالَ: “أُمَّ قَوْمَكَ فَمَنْ أَمَّ قَوْمًا فَلْيُخَفِّفْ فَإِنَّ فِيْهِمُ الْكَبِيْرَ وَإِنَّ فِيْهِمُ الْمَرِيْضَ وَإِنَّ فِيْهِمُ الضَّعِيْفَ وَإِنَّ فِهْيِمْ ذَاالْحَاجَةِ فَإِذَا صَلَّى أَحَدُكُمْ وَحْدَهُ فَلْيُصَلِّ كَيْفَ شَاءَ”.

1134. (6) [1/355దృఢం]

‘ఉస్మా’న్‌ బిన్‌ అబుల్‌ ‘ఆ’స్‌ (ర) కథనం: ప్రవక్త (స) నాకు చివరి హితబోధ చేశారు, ”మీరు ఎవరికైనా నమా’జు చదివిస్తే తేలికైన నమా’జు చదివించండి.” (ముస్లిమ్‌)

 ముస్లిమ్‌లోని మరో ఉల్లేఖనంలో ఇలా ఉంది, ”ప్రవక్త (స) ‘ఉస్మా’న్‌ బిన్‌ అబిల్‌ ‘ఆస్‌తో, ‘నీవు నీ జాతి వారికి ఇమాముగా నమా’జు చదివిస్తూ ఉండు,’ అని అన్నారు. దానికి నేను, ‘ఓ ప్రవక్తా! నేను దానికి తగనని అనుకుంటున్నాను,’ అని విన్నవించు కున్నాను. అప్పుడు ప్రవక్త (స), ‘నా దగ్గరకు రమ్మని అన్నారు. ప్రవక్త (స) నన్ను తనముందు కూర్చో బెట్టుకున్నారు. ప్రవక్త (స) తన చేతిని నా గుండెపై పెట్టారు. ఆ తరువాత వెనక్కి తిరగమన్నారు. ప్రవక్త (స) నా వీపుపై చేయిపెట్టారు. ఆ తరువాత ఇలా అన్నారు, ‘నీవు నీ జాతి వారికి ఇమామత్‌ చేయి, తన జాతికి ఇమాముగా ఉన్నవారు తేలికైన నమా’జు చదివించాలి. ఎందుకంటే అతని వెనుక వృద్ధులు, రోగులు, బలహీనులు, అవసరం ఉన్నవారు ఉంటారు. ఒంటరిగా నమా’జు చదివినపుడు తన ఇష్టం వచ్చినట్టుగా చదువుకోవచ్చు. అని అన్నారు.

1135 – [ 7 ] ( صحيح ) (1/355)

وَعَنِ ابْنِ عُمَرَ قَالَ: كَانَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم يَأْمُرُنَا بِالتَّخْفِيْفِ وَيَؤُمُّنَا ب (اَلصَّافَّاتِ-37) رَوَاهُ النَّسَائِيُّ.

1135. (7) [1/355దృఢం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘ఉమర్‌ (ర) కథనం: ప్రవక్త (స) మమ్మల్ని నమా’జు తేలిగ్గా చదివించమని ఆదేశించే వారు. మరియు ప్రవక్త (స) సూరహ్‌ అ’స్-‘సాఫ్ఫాత్‌ (37) ద్వారా మాకు ఇమామత్‌ చేసేవారు. [44](నసాయి’) 

=====

28- بَابُ مَا عَلَى الْمَأْمُوْمِ

)مِنَ الْمَتَابَعَةِ وَحُكْمِ الْمَسْبُوْقِ(

28. నమాజును అనుసరించే వారి (ముఖ్తదీల) బాధ్యతలు

ఇఖ్‌తిదా’ అంటే విధేయత, అనువర్తించుట, అనుస రించుట. ఇమామును అనుసరిస్తూ నమా’జు చదివే వారిని ముఖ్‌తదీ అంటారు. ముఖ్తదీ మూడు రకాలు: 1. ముద్‌రిక్‌, 2. మస్‌బూఖ్‌, 3. లాహిఖ్‌.

ఇమాముతో కలసి ప్రారంభం నుండి చివరి వరకు నమా’జు చదివిన వ్యక్తి ముద్‌రిక్‌. ఇమాముతో కలసి ఒకటి లేక రెండు రకాతులు తప్పిపోయినవారు అంటే కూర్చుండి నిద్రపోయి, ఇమాము ఒకటి లేదా రెండు రకాతులు చదువే వరకు లేవని వ్యక్తిని లాహిఖ్‌ అంటారు. మస్‌బూఖ్‌ మరియు లాహిఖ్‌కు ఒకే రకమైన ఆదేశాలు వర్తిస్తాయి, అంటే ఇమాము సలామ్‌ పలికిన తరువాత తప్పిపోయిన రకాతులు పూర్తి చేసుకోవాలి. ముఖ్తదీ నమా’జులోని ప్రతి విషయంలో ఇమామును అనుసరించాలి. ఇమాము తర్వాత అనుసరించాలి. ఇమాముకు ముందు ఏదీ ఆచరించ కూడదు. ఇమాము రుకూ చేసిన తర్వాత రుకూ చేయాలి, సజ్దాలోకి వెళ్ళిన తర్వాత సజ్దా చేయాలి. వీటన్నిటి గురించి తెలుసుకుందాం.

اَلْفَصْلُ الْأَوَّلُ  మొదటి విభాగం   

1136 – [ 1 ] ( متفق عليه ) (1/356)

عَنْ الْبَرَاءِ بْنِ عَازِبٍ قَالَ:كُنَّا نُصَلِّيْ خَلْفَ النَّبِيِّ صلى الله عليه وسلم فَإِذَا قَالَ: “سَمِعَ اللهُ لِمَنْ حَمِدَهُ”. لَمْ يَحْنُ أَحْدٌ مِّنَّا ظَهْرَهُ حَتَّى يَضَعَ النَّبِيُّ صلى الله عليه وسلم جَبْهَتَهُ عَلَى الْأَرْضِ.

1136. (1) [356ఏకీభవితం]

బరాఅ’ బిన్‌ ‘ఆ’జిబ్‌ (ర) కథనం: ప్రవక్త (స) వెనుక మేము నమా’జు చదివేవాళ్ళం. ప్రవక్త (స) ”సమిఅల్లా హులిమన్‌ హమిదహ్‌” అని పలికిన తరువాత, ప్రవక్త (స) తన నుదురు నేలపై పెట్టేవరకు, మాలో ఎవ్వరూ సజ్దా కోసం వంగేవారం కాము.” [45] (బు’ఖారీ, ముస్లిమ్)

1137 – [ 2 ] ( صحيح ) (1/356)

وَعَنْ أَنَسٍ قَالَ: صَلَّى بِنَا رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم ذَاتَ يَوْمٍ فَلَمَّا قَضَى صَلَاتَهُ أَقْبَلَ عَلَيْنَا بِوَجْهِهِ فَقَالَ: أَيُّهَا النَّاسُ إِنِّيْ إِمَامُكُمْ فَلَا تَسْبِقُوْنِيْ بِالرُّكُوْعِ وَلَا بِالسُّجُوْدِ وَلَا بِالْقِيَامِ وَلَا بِالْاِنْصِرَافِ: فَإِنِّيْ أَرَاكُمْ أَمَامِيْ وَمِنْ خَلْفِي”. رَوَاهُ مُسْلِمٌ .

1137. (2) [1/356దృఢం]

అనస్‌ (ర) కథనం: ప్రవక్త (స) ఒక రోజు మాకు నమా’జు చదివించారు. నమా’జు ముగిసిన తర్వాత మా వైపు తిరిగి, ప్రజలారా! నేను మీ ఇమామును, మీరు నాకంటే ముందు రుకూ’లోకి వెళ్ళకండి. సజ్దా కూడా నాకంటే ముందు చేయకండి. నాకంటే ముందు లేచి నిలబడకండి, నాకంటే ముందు ముగించకండి. నేను మిమ్మల్ని ముందునుండి వెనుకనుండి చూస్తూ ఉంటాను, అని అన్నారు. (ముస్లిమ్‌)

1138 – [ 3 ] ( متفق عليه ) (1/356)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَال رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَا تُبَادِرُوْا الْإِمَامَ إِذَا كَبَّرَ فَكَبِّرُوْا وَإِذَا قَالَ: وَلَا الضَّالِيْنَ. فَقُوْلُوْ: آمِيْن وَإِذَا رَكَعَ فَارْكَعُوْا وَإِذَا قَالَ: سَمِعَ اللهُ لِمَنْ حَمِدَهُ فَقُوْلُوْا: اللَّهُمَّ رَبَّنَا لَكَ الْحَمْدُ”. إِلَّا أَنَّ الْبُخَارِيَّ لَمْ يَذْكُرْ: “وَإِذَا قَالَ: وَلَا الضَّالِيْنَ”.

1138. (3) [1/356ఏకీభవితం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మీరు ఇమాముకు ముందు ఏదీ చేయకండి. ఇమాము, ‘అల్లాహు అక్బర్‌’ అని అంటే మీరు కూడా, ‘అల్లాహు అక్బర్‌’ అని పలకండి. అతడు, ‘వల’ద్దాల్లీన్‌’ అని పలికితే మీరు, ‘ఆమీన్‌’ అని పలకండి. అతడు రుకూ’ చేస్తే మీరు కూడా రుకూ’ చేయండి. అతడు, ‘సమిఅల్లాహులిమన్‌’హమిదహ్‌’ అని అంటే మీరు, ‘రబ్బనా వలకల్‌ ‘హమ్‌ద్‌’ అని పలకండి.” (బు’ఖారీ, ముస్లిమ్‌) కాని బు’ఖారీలో ”ఇజా’ ఖాల వల’ద్దాల్లీన్‌… ” చివరి వరకు లేదు.

1139 – [ 4 ] ( متفق عليه ) (1/357)

وَعَنْ أَنَسٍ: أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم رَكِبَ فَرَسًا فَصُرِعَ عَنْهُ فَجُحِشَ شِقُّهُ الْأَيْمَنُ فَصَلَّى صَلَاةً مِّنَ الصَّلَواتِ وَهُوَ قَاعِدٌ فَصَلَّيْنَا وَرَاءَهُ قُعُوْدًا فَلَمَّا انْصَرَفَ قَالَ: “إِنَّمَا جُعِلَ الْإِمَامُ لِيُؤْتَمَّ بِهِ فَإِذَا صَلَّى قَائِمًا فَصَلُّوا قِيَامًا فَإِذَا رَكَعَ فَارْكَعُوْا وَإِذَا رفع فارفعوا .وإذا قَالَ سَمِعَ اللهُ لِمَنْ حَمِدَهُ. فَقُوْلُوْا رَبَّنَا وَلَكَ الْحَمْدُ. وَإِذَا صَلَّى قَائِمًا فَصَلُّوْا قِيَامًا. وَإِذَا صَلَّى جَالِسًا فَصُلُّوْا جُلُوْسًا أَجْمَعُوْنَ ” قَالَ الْحُمَيْدِيُّ:قَوْلُهُ:”إِذَا صَلَّى جَالِسًا فَصَلُّوْا جُلُوْسًا” .هُوَ فِيْ مَرْضِهِ الْقَدِيْمِ. ثُمَّ صَلَّى بَعْدَ ذَلِكَ النِّبِيُّ صلى الله عليه وسلم جَالِسًا وَالنَّاسُ خَلْفَهُ قِيَامٌ لَمْ يَأْمُرْهُمْ بِالْقُعُوْدِ وَإِنَّمَا يُؤْخَذُ بِالْآِخِر فَالْآخِرِ مِنْ فِعْلِ النَّبِيِّ صلى الله عليه وسلم. هَذَا لَفْظُ الْبُخَارِيِّ. وَاَتَّفَقَ مُسْلِمٌ إِلَى أَجْمَعُوْنَ. وَزَادَ فِيْ رِوَايَةٍ: “فَلَا تَخْتَلِفُوْا عَلَيْهِ وَإِذَا سَجَدَ فَاسْجُدُوْا”.

1139. (4) [1/357ఏకీభవితం]

అనస్‌ (ర) కథనం: ప్రవక్త (స) గుర్రంపై కూర్చున్నారు. వెంటనే దానిపై నుండి క్రిందపడ్డారు. దానివల్ల ప్రవక్త (స) కుడి ప్రక్క గీసుకుపోయింది. ప్రవక్త (స) చాలా నమా’జులు కూర్చొని చదివించారు. మేము కూడా ప్రవక్త (స) వెనుక కూర్చొనే నమా’జులు ఆచరించాము. నమా’జు ముగిసిన తరువాత ప్రవక్త (స) ఇమామును అనుసరించడానికే నియమించడం జరిగింది. ఇమాము నిలబడి నమా’జు చదివిస్తే, మీరూ నిలబడి నమా’జు చదవండి. అతను రుకూ’ చేస్తే, మీరూ రుకూ’ చేయండి. అతను రుకూ’ నుండి తలఎత్తితే మీరూ రుకూ’ నుండి తలఎత్తండి. అతను ‘సమిఅల్లాహులిమన్‌’హమిదహ్‌’ అని పలికితే, మీరు ‘రబ్బనావలకల్‌’హమ్‌ద్‌’ అని పలకండి. అతను కూర్చొని నమా’జు చదివిస్తే, మీరందరూ కూర్చొని చదవండి. ప్రవక్త (స) ఇమాము కూర్చొని నమా’జు చదివిస్తే మీరు కూడా కూర్చొని చదవండి అని మొదటి సారి అనారోగ్యానికి గురయినపుడు ఆదేశించారు. ఆ తరువాత ప్రవక్త (స) కూర్చొని నమా’జు చదివారు. ప్రజలు ఆయన వెనుక నిలబడి ఉన్నారు. ప్రవక్త (స) వారిని కూర్చోమని ఆదేశించ లేదు. అంటే ప్రవక్త (స) చివరి ఆచరణ మనకు ప్రమాణం. (బు’ఖారీ)

అంటే మొదటి ఆదేశం రద్దయినట్టు, దీన్ని కొనసా గించినట్టు. (బు’ఖారీ, ముస్లిమ్‌)

1140 – [ 5 ] ( متفق عليه ) (1/358)

وَعَنْ عَائِشَةَ قَالَتْ: لَمَّا ثَقُلَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم جَاءَ بِلَالٌ يُوْذِنُهُ لِصَّلَاةِ فَقَالَ: “مُرُوْا أبَا بَكْرٍ أَنْ يُّصَلِّيَ بِالنَّاسِ” فَصَلَّى أَبُوْ بَكْرٍ تِلْكَ الْأَيَّامُ. ثُمَّ إِنَّ النَّبِيَّ صلى الله عليه وسلم وَجَدَ فِيْ نَفْسِهِ خِفَّةً. فَقَامَ يُهَادَى بَيْنَ رَجُلَيْنِ وَرِجْلَاهُ يَخُطَّانِ فِيْ الْأَرْضِ حَتَّى دَخَلَ الْمَسْجِدُ. فَلَمَّا سَمِعَ أَبُوْ بَكْرٍ حِسَّهُ ذَهَبَ أخر فَأَوْمَأَ إِلَيْهِ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم أَنْ لَّا يَتَأَخَّرَ فَجَاءَ حَتَّى جَلَسَ عَنْ يَّسَارِ أَبِيْ بَكْرٍ فَكَانَ أَبُوْ بَكْرٍ يُّصَلِّيْ قَائِمًا وَكَانَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم يُصَلِّيْ قَاعِدًا يَقْتَدِيْ أَبُوْ بَكْرٍ بِصَلَاةِ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم وَالنَّاسُ يَقْتَدُوْنَ بِصَلَاةِ أَبِيْ بَكْرٍ. وَفِيْ رَوَايَةٍ لَهُمَا: يُسْمِعُ أَبُوْ بَكْرٍالنَّاسَ التَّكْبِيْرَ.

1140. (5) [1/358ఏకీభవితం]

‘ఆయి’షహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. బిలాల్‌ (ర) నమా’జును గురించి తెలియపరచటానికి వచ్చారు. అప్పుడు ప్రవక్త (స), ‘అబూ బకర్‌ను నమా’జు చదివించమని చెప్పమని,’ అన్నారు. అనంతరం అబూ-బకర్‌ (ర), ప్రవక్త (స) అనారోగ్యంగా ఉన్న దినాలలో నమా’జులు చదివించారు. కొంత కోలుకున్న తర్వాత ఇద్దరు వ్యక్తుల సహాయంతో మస్జిదువైపు తీసుకురావటం జరిగింది. బలహీనత వల్ల ప్రవక్త (స) కాళ్ళతో నేలపై గీసుకుంటూ వచ్చారు. ప్రవక్త (స) మస్జిద్‌లోకి వచ్చారు. ప్రవక్త (స) వచ్చారని అబూ బకర్‌ (ర) గ్రహించారు. వెనక్కి తగ్గసాగారు. ప్రవక్త (స) వెనక్కి తగ్గ వద్దని సైగచేశారు. ప్రవక్త (స) వచ్చి అబూ బకర్‌ (ర) ఎడమ వైపు కూర్చున్నారు. అబూ బకర్‌ (ర) నిలబడి నమా’జు చదివించారు. ప్రవక్త (స) కూర్చొని నమా’జు చదివారు. అబూ బకర్‌ ప్రవక్త (స) ను అనుసరించారు. వెనుక ఉన్నవారు అబూ-బకర్‌ను అనుసరించారు. [46] (బు’ఖారీ) 

మరో ఉల్లేఖనంలో ఇలా ఉంది, ”అబూ బకర్‌ (ర) ప్రజలకు తక్‌బీర్లు వినిపించేవారు. అంటే ప్రవక్త (స) ఇమాముగా ఉన్నారు. అనారోగ్యం వల్ల గొంతు బలహీనంగా ఉండేది. అబూ బకర్‌ (ర) ముకబ్బిర్‌ అంటే ‘అల్లాహు అక్బర్‌’ అని బిగ్గరగా పలికేవారు, ప్రజలకు వినబడాలని.

1141 – [ 6 ] ( متفق عليه ) (1/358)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ رَضِيَ اللهُ عَنْهُ قَالَ : قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “أَمَا يَخْشَى الَّذِيْ يَرْفَعُ رَأْسَهُ قَبْلَ الْإِمَامِ أَنْ يُّحَوِّلَ اللهُ رَأْسَهُ رَأْسَ حِمَارٍ”.

1141. (6) [1/358ఏకీభవితం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”తన ఇమాము కన్నా ముందు తన తలను ఎత్తే వాడికి అల్లాహ్‌ (త) అతని తలను గాడిదతలగా మార్చి వేస్తాడని భయం లేదా?” [47] (బు’ఖారీ, ముస్లిమ్‌)

—–

اَلْفَصْلُ الثَّانِيْ  రెండవ విభాగం

1142 – [ 7 ] ( صحيح ) (1/358)

عَنْ عَلِيٍّ وَمُعَاذِ بْنِ جَبَلٍ رَضِيَ اللهُ عَنْهُمَا قَالَا: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِذَاأَتَى أَحْدُكُمُ الصَّلَاةَ وَالْإِمَامُ عَلَى حَالٍ فَلْيَصْنَعْ كَمَا يَصْنَعُ الْإِمَامُ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَقَالَ: هَذَا حَدِيْثٌ غَرِيْبٌ .

1142. (7) [1/358దృఢం]

‘అలీ మరియు ము’ఆజ్‌’ బిన్‌ జబల్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మీలో ఎవరైనా నమా’జు చదవ డానికి వస్తే, ఇమాము ఏ స్థితిలో ఉంటే, ఆ స్థితిలోనే నమా’జులో కలసిపోవాలి. ఇమాము చేసిందే అతనూ చేయాలి. [48]  (తిర్మిజి’ – ఏకోల్లేఖనం)

1143 – [ 8 ] ( ضعيف ) (1/359)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِذَا جِئْتُمْ إِلَى الصَّلَاةِ وَنَحْنُ سُجُوْدٌ فَاسْجُدُوْا وَلَا تَعُدُّوْهُ شَيْئًا وَمَنْ أَدْرَكَ رَكْعَةً فَقَدْ أَدْرَكَ الصَّلَاةَ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ

1143. (8) [1/359బలహీనం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మీరు నమా’జుకు వచ్చినపుడు, మేము సజ్దాలో ఉంటే మీరు కూడా సజ్దాలో కలసిపోండి. అయితే ఆ సజ్దాను లెక్కపెట్టకండి. ఎవరైనా ఇమాముతో కలసి ఒక్కరకాతు పొందితే, పూర్తి నమా’జు యొక్క పుణ్యం పొందినట్లే. [49](అబూ దావూ’ద్‌)

1144 – [ 9 ] ( ضعيف ) (1/359)

وَعَنْ أَنَسٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَنْ صَلَّى لِلهِ أَرْبَعِيْنَ يَوْمًا فِيْ جَمَاعَةٍ يُّدْرِكُ التَّكْبِيْرَةَ الْأَوْلَى كُتِبَ لَهُ بَرَاءَتَانِ: بَرَاءَةٌ مِّنَ النَّارِ وَبَرَاءَةٌ مِّنَ النِّفَاقِ”. رَوَاهُ التِّرْمِذِيُّ.

1144. (9) [1/359బలహీనం]

అనస్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”అల్లాహ్‌ ప్రీతి కోసం 40 రోజులు సామూహికంగా ప్రారంభ తక్‌బీర్‌తో సహా నమా’జు చదివినవాడు నరక శిక్ష నుండి తప్పించు కుంటాడు మరియు కాపట్యం నుండి బయటపడతాడు.” (తిర్మిజి’)

1145 – [ 10 ] ( صحيح ) (1/359)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَنْ تَوَضَّأَ فَأَحْسَنَ وُضُوْءَهُ ثُمَّ رَاحَ فَوَجَدَ النَّاسَ قَدْ صَلَّوْا أَعْطَاهُ اللهُ مِثْلَ أجْرِ مَنْ صَلَّاهَا وَحَضَرَهَا لَا يَنْقُصُ ذَلِكَ مِنْ أُجُوْرِهِمْ شَيْئًا”. رَوَاهُ أَبُوْ دَاوُدَ وَالنَّسَائِيُّ .

1145. (10) [1/359దృఢం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఎవరైనా చక్కగా వు’జూచేసి, నమా’జు చదవడానికి మస్జిద్‌ చేరితే, అప్పటికి ప్రజలు నమా’జు చదువు కున్నప్పటికీ, అల్లాహ్‌ అతనికి సామూహిక నమా’జు పుణ్యం ప్రసాదిస్తాడు. ఇంకా వారి పుణ్యంలో ఏమాత్రం కొరత రానివ్వడు.” [50]  (అబూ దావూ’ద్‌, నసాయి’)

1146 – [ 11 ] ( صحيح ) (1/360)

وَعَنْ أَبِيْ سَعِيْدِ الْخُدْرِيِّ قَالَ: جَاءَ رَجُلٌ وَقَدْ صَلَّى رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم فَقَالَ: “أَلَا رَجُلُ يَّتَصَدَّقُ عَلَى هَذَا فَيُصَلِّيْ مَعَهُ؟” فقامَ رَجُلٌ فَيُصَلِّىْ مَعَهُ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَأَبُوْ دَاوُدَ.

1146. (11) [1/360దృఢం]

అబూ ‘సయీద్‌ ‘ఖుద్రీ (ర) కథనం: ప్రవక్త (స) నమా’జు చదువుకున్న తరువాత ఒక వ్యక్తి వచ్చాడు. అప్పుడు ప్రవక్త (స), ‘ఈ వ్యక్తిపై ‘సదఖహ్ చేసేవ్యక్తి ఎవరైనా ఉన్నారా?’ అంటే అతనితో కలసి నమా’జు చదివేవారెవరైనా ఉన్నారా?’ అని అడిగారు. ఒక వ్యక్తి సిద్ధమై అతనితో కలసి నమా’జు చదివాడు. [51] (తిర్మిజి’, అబూ దావూ’ద్‌)

—–

اَلْفَصْلُ الثَّالِثُ   మూడవ విభాగం  

1147 – [ 12 ] ( متفق عليه ) (1/360)

عَنْ عُبَيْدِاللهِ بْنِ عَبْدِاللهِ قَالَ: دَخَلْتُ عَلَى عَائِشَةَ فَقُلْتُ أَلَا تًحَدِّثِيْنِيْ عَنْ مَرَضِ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم. قَالَتْ بَلَى ثَقُلَ النَّبِيُّ صلى الله عليه وسلم فقَالَ: “أَصَلَّى النَّاسَ؟” قُلْنَا لَا يَا رَسُوْلَ اللهِ وَهُمْ يَنْتَظِرُوْنَكَ فَقَالَ: “ضَعُوْا لِيْ مَاءً فِيْ الْمِخْضَبِ” قَالَتْ فَفَعَلْنَا فَاغْتَسَلَ فَذَهَبَ لِيَنُوْءَ فَأُغْمِيَ عَلَيْهِ ثُمَّ أَفَاقَ. فَقَالَ صَلى الله عليه وسلم: “أَصَلَّى النَّاسُ؟” قُلْنَا لَا هُمْ يَنْتَظِرُوْنَكَ يَا رَسُوْلَ اللهِ قَالَ: “ضَعُوْا لِيْ مَاءً فِيْ الْمِخْضَبِ” قَالَتْ فَقَعَدَ فَاغْتَسَلَ ثُمَّ ذَهَبَ لِيَنُوْءَ فَأُغْمِيَ عَلَيْهِ ثُمَّ أَفَاقَ فَقَالَ: “أَصَلَّى النَّاسَ؟” قُلْنَا لَا هُمْ يَنْتَظِرُوْنَكَ يَا رَسُوْلَ اللهِ. فَقَالَ: “ضَعُوْا لِيْ مَاءً فِيْ الْمِخْضَبِ” فَقَعَدَ فَاغْتَسِلَ ثُمَّ ذَهَبَ لِيَنُوْءَ فَأُغْمِيَ عَلَيْهِ. ثُمَّ أَفَاقَ فَقَالَ: “أَصَلَّى النَّاسُ”. قُلْنَا لَا هُمْ يَنْتَظِرُوْنَكَ يَا رَسُوْلَ اللهِ. وَالنَّاسُ عُكُوْفٌ فِيْ الْمَسْجِدِ يَنْتَظِرُوْنَ النَّبِيَّ صلى الله عليه وسلم لِصَلَاةِ الْعِشَاءِ الْآخِرَةِ. فَأَرْسَلَ النَّبِيُّ صلى الله عليه وسلم إِلَى أَبِيْ بَكْرٍ بِأَنْ يُّصَلِّيَ بِالنَّاسِ. فَأَتَاهُ الرَّسُوْلُ. فَقَالَ: إِنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يَأْمُرُكَ أَنْ  تُصَلِّيَ بِالنَّاسِ. فَقَالَ أَبُوْ بَكْرٍ وَكَانَ رَجُلًا رَقِيْقًا: يَا عُمَرُ صَلِّ بِالنَّاسِ: فَقَالَ لَهُ عُمَرُ: أَنْتَ أَحَقُّ بِذَلِكَ. فَصَلَّى أَبُوْ بَكْرٍ تِلْكَ الْأَيَّامُ. ثُمَّ إِنَّ النَّبِيَّ صلى الله عليه وسلم وَجَدَ مِنْ نَفْسِهِ خِفَّةً وَخَرَجَ بَيْنَ رَجُلَيْنِ أَحَدُهُمَا الْعَبَّاسُ لِصَلَاةِ الظُّهْرِ وَأَبُوْ بَكْرٍ يُّصَلِّيْ بِالنَّاسِ. فَلَمَّا رَآهُ أَبُوْ بَكْرٍ ذَهَبَ لِيَتَأَخَّرَ فَأَوْمَأ إِلَيْهِ النَّبِيُّ صلى الله عليه وسلم بِأَنْ لَّا يَتَأَخَّرَ. قَالَ: “أَجْلِسَانِيْ إِلَى جَنْبِهِ”. فَأَجْلَسَاهُ إِلَى جَنْبِ أَبِيْ بَكْرٍ وَالنَّبِيُّ صلى الله عليه وسلم قَاعِدٌ. قَالَ عُبَيْدُاللهِ: فَدَخَلْتُ عَلَى عَبْدِاللهِ بْنِ عَبَّاسٍ فَقُلْتُ لَهُ: أَلَا أَعْرِضُ عَلَيْكَ مَا حَدَّثَتْنِيْ بِهِ عَائِشَةَ عَنْ مَرَضِ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم؟ قَالَ: هَاتِ فَعَرَضْتُ عَلَيْهِ حَدِيْثَهَا فَمَا أَنْكَرَ مِنْهُ شَيْئًا غَيْرَ أَنَّهُ قَالَ: أَسَمَّتْ لَكَ الرَّجُلَ الَّذِيْ كَانَ مَعَ الْعَبَّاسِ. قُلْتُ: لَا. قَالَ: هُوَ عَلِيٌّ رَضِيَ اللهُ عَنْهُ.

1147. (12) [1/360ఏకీభవితం]

‘ఉబేదుల్లాహ్‌ బిన్‌ ‘అబ్దుల్లాహ్‌ (ర) కథనం: నేను ‘ఆయి’షహ్‌ (ర) వద్దకు వెళ్ళి, తమరు నాకు ప్రవక్త (స) అనారోగ్య పరిస్థితిని గురించి చెప్పగలరా, అని విన్నవించుకున్నాను. దానికి ఆమె అవును, చెప్ప గలను అని చెప్పి ఇలా వివరించారు, ”ప్రవక్త (స) అనారోగ్యం చాలా తీవ్రంగా తయారయింది. దానివల్ల నమా’జు చదివించడానికి మస్జిదుకు వెళ్ళ లేక పోయారు. ప్రవక్త (స), ‘ప్రజలు నమా’జు చదువు కున్నారా?’ అని అడిగారు. దానికి మేము, ‘లేదు, మీ కొరకు ఎదురుచూస్తున్నారు,’ అని అన్నాం. అప్పుడు ప్రవక్త (స), ‘నేను స్నానం చేయటానికి పాత్రలో నీళ్ళువేయండి, నేను స్నానంచేస్తాను,’ అని అన్నారు. మేము అలాగే చేశాము. ప్రవక్త (స) స్నానం చేసి వెళ్లడానికి నిలబడ్డారు. వెంటనే స్పృహ కోల్పోయారు. కొంతసేపు తర్వాత స్పృహలోకి వచ్చారు. మళ్ళీ ప్రవక్త (స), ‘ప్రజలు నమా’జు చదువు కున్నారా?’ అని అడిగారు. మేము, ‘లేదు, వారు మీ గురించి ఎదురుచూస్తున్నారు,’ అని అన్నాం. అప్పుడు ప్రవక్త (స), ‘నేను స్నానం చేయడానికి నీళ్ళు నింపండి,’ అని అన్నారు. మేము అలాగే చేశాము. ప్రవక్త(స) స్నానంచేసి, నిలబడటానికి ప్రయత్నించగా మళ్ళీ స్పృహ కోల్పోయారు. స్పృహ వచ్చిన తరువాత మళ్ళీ, ‘ప్రజలు నమాజు చదువు కున్నారా,’ అని అడిగారు. దానికి మేము, ‘లేదు, మీ గురించి ఎదురు చూస్తున్నారు,’ అని అన్నాం. అప్పుడు ప్రవక్త (స) నా కొరకు నీళ్ళు నింపండి అని అన్నారు. ప్రవక్త (స) కూర్చొని స్నానంచేసి, మళ్ళీ నిలబడటానికి ప్రయత్నించగా మళ్ళీ స్పృహ కోల్పోయారు. స్పృహ వచ్చిన తర్వాత, ‘ప్రజలు నమా’జు చదువుకున్నారా,’ అని అడిగారు. మేము ‘లేదు, ప్రజలు మీ కొరకు ఎదురు చూస్తున్నారు ఓ ప్రవక్తా!’ అని అన్నాం. ఇటు ప్రజలు ‘ఇషా’ నమా’జు కోసం ప్రవక్త (స) కొరకు ఎదురుచూస్తున్నారు. ప్రవక్త (స) తాను వెళ్ళలేని పరిస్థితి చూసి అబూ బకర్‌ (ర)కు, ప్రజలకు నమా’జు చదివించమని సందేశం పంపారు. పంపిన వ్యక్తి వచ్చి, అబూ బకర్‌తో, ‘ప్రవక్త (స) మిమ్మల్ని ప్రజలకు నమా’జు చదివించ మన్నారు,’ అని చెప్పాడు. అబూ బకర్‌ (ర) సున్నిత స్వభావులు. అందువల్ల అబూ బకర్‌ (ర) ‘ఉమర్‌తో, ‘ప్రజలకు నమా’జు చదివించు,’ అని అన్నారు. దానికి ‘ఉమర్‌ (ర), ‘మీరే ఇమామత్‌కు నాకంటే తగినవారు,’ అని అన్నారు. అబూ బకర్‌ (ర) ఆ రోజుల్లో నమా’జు చదివించారు. ఆ తరువాత ప్రవక్త (స) ఆరోగ్యం కొంత కుదుటపడింది. అది గ్రహించిన ప్రవక్త (స) ఇద్దరు వ్యక్తుల సహాయంతో ఒకవైపు, ఇబ్ను ‘అబ్బాస్‌ (ర), మరోవైపు మరోవ్యక్తి ఉన్నారు. వారిద్దరి సహాయంతో ప్రవక్త (స) ”జుహ్‌ర్‌ నమా’జు కోసం మస్జిద్‌కు వెళ్ళారు. ఆ సమయంలో అబూ బకర్‌ (ర) ప్రజలకు నమా’జు చదివిస్తున్నారు. ప్రవక్త (స) వచ్చారని తెలిసిన అబూ బకర్‌ (ర) వెనక్కి తగ్గసాగారు. ప్రవక్త (స) వెనక్కి తగ్గ వద్దని సైగ చేశారు. ఆ ఇద్దరు వ్యక్తులతో తనను అబూ బకర్‌ (ర) ప్రక్కన కూర్చోబెట్టమని చెప్పారు. వారిద్దరూ ప్రవక్త (స)ను అబూ బకర్‌ (ర) ప్రక్కన కూర్చోబెట్టారు. ప్రవక్త (స) కూర్చున్నారు.

‘ఉబేదుల్లాహ్‌ (ర) కథనం: నేను ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘అబ్బాస్‌  వద్దకు వెళ్ళి, ‘ఆయి’షహ్‌ (ర) ప్రవక్త (స) అనారోగ్యాన్ని గురించి చెప్పిన ‘హదీసు’ మీకు వినిపించనా,’ అని అన్నాను. దానికి ఇబ్నె అబ్బాస్‌, ‘వినిపించండి’ అని అన్నారు. అప్పుడు నేను పై ‘హదీసు’ పూర్తిగా పేర్కొన్నాను. ఇబ్నె ‘అబ్బాస్‌ (ర) ఈ ‘హదీసు’లోని ఏ విషయం గురించి అభ్యంతరం చెప్పలేదు. కేవలం అబ్బాస్‌ వెంట ఉన్న ఆ రెండవ వ్యక్తి గురించి ‘ఆయి’షహ్‌ (ర) ఏమన్నారు,’ అని అడిగారు. దానికి నేను, ‘పేరు చెప్పలేదు,’ అని అన్నాను. దానికి అతను, ‘ఆ రెండవ వ్యక్తి ‘అలీ,’ అని అన్నారు. (బు’ఖారీ, ముస్లిమ్‌)

1148 – [ 13 ] ( ضعيف ) (1/361)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ أَنَّهُ كَانَ يَقُوْلُ: “مَنْ أَدْرَكَ الرَّكْعَةَ فَقَدْ أَدْرَكَ السَّجْدَةَ وَمَنْ فَاتَتْهُ قِرَاءَةُ أُمِّ الْقُرْآنِ فَقَدْ فَاتْهُ خَيْرٌ كَثِيْرٌ”. رَوَاهُ مَالِكٌ .

1148. (13) [1/361బలహీనం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ఎవరికైనా రుకూ’ దొరికితే, సజ్దా కూడా దొరికినట్టే, అంటే రక’అత్‌ మొత్తం లభించినట్లే. సూరహ్‌ ఫాతి’హా తప్పిపోయిన వారి చాలా పుణ్యం తప్పిపోయినట్టే. [52] (మాలిక్)

1149 – [ 14 ] ( ضعيف ) (1/361)

وَعَنْهُ قَالَ: اَلَّذِيْ يَرْفَعُ رَأْسَهُ وَيَخْفِضُهُ قَبْلَ الْإِمَامِ فَإِنَّمَا نَاصِيَتُهُ بِيَدِ الشَّيْطَانِ”. رَوَاهُ مَالِكٌ.

1149. (14) [1/361-బలహీనం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ఇమాము కంటే ముందు తల ఎత్తినా, వంచినా అతని నుదురు షై’తాన్‌ చేతిలో ఉన్నట్టే. (మాలిక్‌)

=====

29 – بَابٌ مَنْ صَلَّى صَلَاةً مَّرَّتَيْنِ

29. రెండుసార్లు నమాజు చదవటం

اَلْفَصْلُ الْأَوَّلُ  మొదటి విభాగం   

1150 – [ 1 ] ( متفق عليه ) (1/362)

عَنْ جَابِرٍ قَالَ: كَانَ مُعَاذُ بْنُ جَبَلٍ يُّصَلِّيَ مَعَ النِّبِيِّ صلى الله عليه وسلم ثُمَّ يَأْتِيْ قَوْمَهُ فَيُصَلِّيْ بِهِمْ.

1150. (1) [1/362ఏకీభవితం]

జాబిర్‌ (ర) కథనం: ము’ఆజ్‌’ బిన్‌ జబల్‌ (ర) ప్రవక్త (స)తో కలసి నమా’జు చదివేవారు. ఆ తరువాత తన జాతివారి వద్దకువెళ్ళి నమాజు చదివించేవారు. [53] (బు’ఖారీ, ముస్లిమ్‌)

1151 – [ 2 ] ( صحيح ) (1/362)

وعَنْهُ قَالَ: كَانَ مُعَاذٌ يُّصَلِّيْ مَعَ النَّبِيِّ صلى الله عليه وسلم الْعِشَاءُ ثُمَّ يَرْجِعُ إِلَى قَوْمِهِ فَيُصَلِّيْ بِهِمُ الْعِشَاءَ وَهِيَ لَهُ نَافِلَةٌ. رَوَاهُ بيْهَقِيَّ.

1151. (2) [1/362దృఢం]

జాబిర్‌ (ర) కథనం: ము’ఆజ్‌’ బిన్‌ జబల్‌ ప్రవక్త (స) తో కలసి ‘ఇషా’ నమా’జు చదివి, తిరిగి తన జాతి వారి వద్దకు వెళ్ళి ‘ఇషా’ నమా’జు చదివించేవారు. రెండవసారి చదివింది నఫిల్‌ నమా’జు అవుతుంది. (బైహఖీ)

—–

اَلْفَصْلُ الثَّانِيْ  రెండవ విభాగం 

1152 – [ 3 ] ( صحيح ) (1/362)

عَنْ يَزِيْدَ بْنِ الْأَسْوَدِ قَالَ: شَهِدْتُّ مَعَ النَّبِيِّ صلى الله عليه وسلم حَجَّتَهُ فَصَلَّيْتُ مَعَهُ صَلَاةَ الصُّبْحِ فِيْ مَسْجِدِ الْخَيْفِ فَلَمَّا قَضَى صَلَاتَهُ وَاَنْحَرَفَ فَإِذَا هُوَ بِرَجُلَيْنِ فِيْ آخِرِ الْقَوْمِ لَمْ يُصَلِّيَا مَعَهُ قَالَ: “عَلَيَّ بِهِمَا” فَجِيْءَ بِهِمَا تُرْعَدُ فَرَائِصُهُمَا. فَقَالَ: “مَا مَنَعَكُمَا أَنْ تُصَلِّيَا مَعَنَا؟” فَقَالَا: يَا رَسُوْلَ اللهِ إِنَّا كُنَّا قَدْ صَلَّيْنَا فِيْ رِحَالِنَا. قَالَ: “فَلَا تَفْعَلَا. إِذَا صَلَّيْتُمَا فِيْ رِحَالِكُمَا ثُمَّ أَتَيْتُمَا مَسْجِدَ جَمَاعَةٍ فَصَلِّيَا مَعَهُمْ فَإِنَّهَا لَكُمَا نَافِلَةٌ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَأَبُوْ دَاوُدَ وَالنَّسَائِيُّ.

1152. (3) [1/362దృఢం]

య’జీద్‌ బిన్‌ అస్వద్‌ (ర) కథనం: హజ్జ్ లో ప్రవక్త (స) వెంట నేనున్నాను. మస్జిదె ఖీఫ్లో ప్రవక్త (స) తో కలసి ఫజర్‌ నమా’జు చదివాను. నమా’జు ముగిసిన తర్వాత ప్రవక్త (స) తిరిగి వెళ్ళినపుడు ఇద్దరు వ్యక్తులు కూర్చొని ఉన్నారు. వారిద్దరూ ప్రవక్త (స)తో కలసి నమా’జు చదవలేదు. ప్రవక్త (స), ”వెళ్ళి ఆ ఇద్దరినీ నా వద్దకు పిలుచు రా” అని అన్నారు. వారిద్దరినీ పిలుచుకొని వచ్చాను. అప్పుడు వారిద్దరూ భయంతో వణుకుతున్నారు. ప్రవక్త (స) వారిని, ‘మాతో కలసి నమా’జు ఎందుకు చదవలేదు,’ అని అన్నారు. దానికి వారు, ‘ప్రవక్తా! మేము మా ఇంట్లో నమా’జు  చదువుకున్నాం,’ అని అన్నారు. దానికి ప్రవక్త (స), ‘ఇక ముందు ఇలా చేయకండి, ఒకవేళ మీరు మీ ఇంట్లో నమా’జు చదువుకున్న తరువాత మస్జిదుకు వస్తే, వారితో పాటు మళ్ళీ నమా’జు చదువుకోండి. రెండవసారి చదివిన నమా’జు నఫిల్‌ నమా’జు అయిపోతుంది’ అని హితబోధచేశారు. (తిర్మిజి’, అబూదావూ’ద్‌, నసాయి’)

—–

اَلْفَصْلُ الثَّالِثُ   మూడవ విభాగం 

1153 – [ 4 ] ( صحيح ) (1/363)

وَعَنْ بُسْرِ بْنِ مِحْجَنٍ عَنْ أَبِيْهِ أَنَّهُ كَانَ فِيْ مَجْلِسِ مَعَ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم. فَأُذِّنَ بِالصَّلَاةِ. فَقَامَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم فَصَلَّى وَرَجَعَ وَمِحْجَنٌ فِيْ مَجْلِسِهِ. فَقَالَ لَهُ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَا مَنَعَكَ أَنْ تُصَلِّيَ مَعَ النَّاسِ؟ أَلَسْتَ بِرَجُلٍ مُّسْلِمٍ؟” فَقَالَ: بَلَى يَا رَسُوْلَ اللهِ وَلَكِنِّيْ كُنْتُ قَدْ صَلَّيْتُ فِيْ أَهْلِيْ. فَقَالَ لَهُ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِذَا جِئْتَ الْمَسْجِدَ وَكُنْتَ قَدْ صَلَّيْتَ فَأُقِيْمَتِ الصَّلَاةُ فَصَلِّ مَعَ النَّاسِ وَإِنْ كُنْتَ قَدْ صَلَّيْتَ”. رَوَاهُ مَالِكٌ وَالنَّسَائِيُّ.

1153. (4) [1/363దృఢం]

బుస్ర్‌ బిన్‌ మి’హ్ జన్‌ (ర) తన తండ్రి ద్వారా కథనం: అతను ప్రవక్త (స)తో కలసి ఒక సభలో కూర్చొని ఉన్నారు. ఇంతలో నమా’జు కోసం అజా’న్‌ ఇవ్వబడింది. ప్రవక్త (స) వెళ్ళి నమా’జు చదివించి తిరిగి సభలోకి వచ్చారు. మి’హ్ జన్‌ అక్కడే కూర్చొని ఉన్నారు. ప్రవక్త(స) అతన్ని మాతో కలసి నమా’జు ఎందుకు చదవలేదు, నీవు ముస్లిమ్‌ కావా?’ అని అన్నారు. దానికి అతను, ‘ఓ ప్రవక్తా! నేను ముస్లిమును కాని, నేను నా ఇంట్లో నమా’జు చదువు కున్నాను. అందువల్లే మీతో కలసి నమాజు చదవ లేదు,’ అని విన్నవించుకున్నాడు. అప్పుడు ప్రవక్త(స) ‘ఇంట్లో నమా’జు చదివి ఉన్నా, మస్జిద్‌లో ప్రజలతో కలసి మళ్ళీ నమా’జు చదువుకో,’ అని అన్నారు. (మాలిక్‌, నసాయి’)

1154 – [ 5 ] ( ضعيف ) (1/363)

وَعَنْ رَجُلٍ مِّنْ أَسَدِ بْنِ خُزَيْمَةَ أَنَّهُ سَأَلَ أَبَا أَيُّوْبَ الْأَنْصَارِيَّ قَالَ: يُصَلِّيْ أَحَدُنَا فِيْ مَنْزِلِهِ الصَّلَاةَ ثُمَّ يَأْتِيْ الْمَسْجِدُ وَتُقَامُ الصَّلَاةُ فَأُصَلِّيْ مَعَهُمْ فَأَجِدُ فِيْ نَفْسِيْ شَيْئًا مِّنْ ذَلِكَ. فَقَالَ أَبُوْ أَيُّوْبَ: سَأَلْنَا عَنْ ذَلِكَ النَّبِيَّ صلى الله عليه وسلم قَالَ: ” فَذَلِكَ لَهُ سَهْمُ جَمْعٍ”. رَوَاهُ مَالِكٌ وَأَبُوْ دَاوُدَ .

1154. (5) [1/363బలహీనం]

అసద్‌ బిన్‌ ‘ఖుజైమహ్ తెగకు చెందిన ఒక వ్యక్తి కథనం: ”నేను అబూ అయ్యూబ్‌ అ’న్సారీని, ‘ఎవరైనా తన ఇంటిలో నమా’జు చదివి, ఇఖామత్‌ అవుతున్నప్పుడు మస్జిద్‌కు వస్తే, నేను వారితో కలసి మళ్ళీ నమా’జు చదవవచ్చా? ఎందుకంటే నాకు కొంత అనుమానంగా ఉంది,” అని అన్నారు. దానికి అబూ అయ్యూబ్‌ అ’న్సారీ, ”దీన్ని గురించి, మేము ప్రవక్త (స)ను విన్నవించుకోగా, ప్రవక్త (స) ఈ రెండవ సారి నమా’జు వల్ల సామూహిక నమా’జు పుణ్యం లభిస్తుంది,’ అని అన్నారు,” అని సమాధాన మిచ్చారు. (మాలిక్‌, అబూ దావూద్‌)

1155 – [ 6 ] ( صحيح ) (1/363)

وَعَنْ يَزِيْدِ بْنِ عَامِرٍ قَالَ: جِئْتُ رَسُوْلَ الله صلى الله عليه وسلم وَهُوَ فِيْ الصَّلَاةِ فَجَلَسْتُ وَلَمْ أَدْخُلُ مَعَهُمْ فِيْ الصَّلَاةِ. فَلَمَّا انْصَرَفَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم رَآنِيْ جَالِسًا فَقَالَ: “أَلَمْ تُسْلِمْ يَا زَيْدُ؟” قُلْتُ: بَلَى يَا رَسُوْلَ اللهِ قَدْ أَسْلَمْتُ. قَالَ: “وَمَا مَنَعَكَ أَنْ تَدْخُلَ مَعَ النَّاس فِيْ صَلَاتِهِمْ؟” قَالَ: إِنِّيْ كُنْتُ قَدْ صَلّيْتُ فِيْ مَنْزِلِيْ أَحْسِبُ أَنْ قَدْ صَلَّيْتُمْ. فَقَالَ: “إِذَا جِئْتَ الصَّلَاةَ فَوَجَدْتَّ النَّاسَ فَصَلِّ مَعَهُمْ وَإِنْ كُنْتَ قَدْ صَلَّيْتَ تَكُنْ لَّكَ نَافِلَةً وَهَذِهِ مَكْتُوْبَةٌ”. رَوَاهُ أَبُوْدَاوُدَ.

1155. (6) [1/363దృఢం]

య’జీద్‌ బిన్‌ ‘ఆమిర్‌ (ర) కథనం: ప్రవక్త (స) వద్దకు నేను వెళ్ళాను. ప్రవక్త (స) నమా’జు చదువు తున్నారు. నేను కూర్చున్నాను. వారితో పాటు నమా’జులో పాల్గొనలేదు. ప్రవక్త (స) నమా’జు ముగించిన తర్వాత నేను కూర్చొని ఉండటం చూచి, ‘యజీద్‌ నీవు ముస్లిమ్‌ కావా? నమా’జు ఎందుకు చదవలేదు?’ అని అన్నారు. దానికి నేను, ‘ఓ ప్రవక్తా! నేను ముస్లిమ్‌ను,’ అని అన్నాను. దానికి ప్రవక్త (స), ‘మరి ప్రజలతో కలసి నమా’జు ఎందుకు చదవలేదు?’ అని అన్నారు. దానికి నేను, ‘ఓ ప్రవక్తా! తమరు నమా’జు చదువుకున్నారని, అనుకొని, నేను ఇంట్లో నమా’జు చదువుకొని వచ్చాను,’ అని అన్నారు. ‘నీవు మస్జిద్‌కు వస్తే, ప్రజలను నమా’జు చదువుతుండగా చూస్తే, వారితో కలసి నమా’జు చదువుకో, అంతకు ముందు నువ్వు నమా’జు చదివిఉన్నా సరే. రెండవ సారి చదివిన నమా’జు నఫిల్‌ అయిపోతుంది. ముందు చదివినది ఫ’ర్ద్ అయిపోతుంది,’ అని అన్నారు. (అబూ దావూ’ద్‌)

1156 – [ 7 ] ( صحيح ) (1/364)

وَعَنِ ابْنِ عُمَرَ رَضِيَ اللهُ عَنْهُمَا: أَنَّ رَجُلًا سَأَلَهُ فَقَالَ: إِنِّيْ أُصَلِّيْ فِيْ بَيْتِيْ ثُمَّ أَدْرِكُ الصَّلَاةَ فِيْ الْمَسْجِدِ مَعَ الْإِمَامِ أَفَأُصَلِّيْ مَعَهُ؟ قَالَ لَهُ: نَعَمْ. قَالَ الرَّجُلُ: أَيَّتَهُمَا أَجْعَلْ صَلَاتِيْ؟ قَالَ عُمَرَ: وَذَلِكَ إِلَيْكَ؟ إِنَّمَا ذَلِكَ إِلَى اللهِ عز وجل يَجْعَلُ أَيَّتُهُمَا شَاءَ. رَوَاهُ مَالِكٌ .

1156. (7) [1/364దృఢం]

ఇబ్నె ‘ఉమర్‌ (ర) కథనం: ఒకవ్యక్తి, ఆయన్ను, ‘నేను మా ఇంట్లో నమా’జు చదువుకున్న తరువాత మస్జిదుకు వచ్చి, ఇమాము నమా’జు చదువుతూ ఉండటం చూచి, ఆ ఇమాముతో కలసి మళ్ళీ నమా’జు చదువుకోవచ్చా?’ అని ప్రశ్నించాడు. దానికి ‘అబ్దుల్లాహ్‌ బిన్, ‘ఉమర్‌, ‘అవును, చదువుకో,’ అని అన్నారు. దానికి ఆ వ్యక్తి, ‘ఆ రెండు నమా’జుల్లో ఏది ఫ’ర్ద్ అవుతుంది, ఏది నఫిల్‌ అవుతుంది,’ అని విన్నవించుకున్నాడు. దానికి ‘అబ్దుల్లాహ్‌ బిన్‌-‘ఉమర్‌, ‘ఇది నీ బాధ్యతకాదు, ఇది అల్లాహ్ బాధ్యత, ఆయన తాను కోరినదాన్ని ఫర్జ్‌గా, తాను కోరిన దాన్ని నఫిల్‌గా పరిగణిస్తాడు,’ అని అన్నారు. [54] (ము’వత్తా ఇమామ్‌ మాలిక్‌)

1157 – [ 8 ] ( حسن ) (1/364)

وَعَنْ سُلَيْمَانَ مَوْلَى مَيْمُوْنَةَ قَالَ: أَتَيْنَا ابْنَ عُمَرَ عَلَى الْبَلَاطِ وَهُمْ يُصَلُّوْنَ. فَقُلْتُ: أَلَا تُصَلِّيْ مَعَهُمْ؟ فَقَالَ: قَدْ صَلَّيْتُ وَإِنِّيْ سَمِعْتُ رَسُوْلَ اللهِ يَقُوْلُ: “لَا تُصَلُّوْا صَلَاةً فِيْ يَوْمٍ مَّرَّتَيْنِ”. رَوَاهُ أَحْمَدُ وَأَبُوْ دَاوُدَ وَالنَّسَائِيُّ .

1157. (8) [1/364ప్రామాణికం]

మైమూనహ్ విడుదల చేసిన సేవకుడు సులైమాన్‌ (ర) కథనం: ”బలా’త్‌ ప్రాంతంలోని ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘ఉమర్‌ వద్దకు మేము వచ్చాము. అక్కడ అందరూ నమా’జు చదువుతున్నారు. ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘ఉమర్‌ నమా’జులో కలవకుండా వేరేగా కూర్చున్నారు. అప్పుడు నేను అతన్ని, ‘మీరు వారితో ఎందుకు నమా’జు చదవలేదు’ అని అన్నాను. దానికి అతను, ‘నేను నమా’జు చదువుకున్నాను. ప్రవక్త (స) ఇలా అంటుండగా నేను విన్నాను, ‘ఒక్కరోజులో ఒకే నమా’జును రెండుసార్లు చదవకండి,” అని అన్నారు.[55]  (అ’హ్మద్‌, అబూ దావూ’ద్‌, నసాయి’)

1158 – [ 9 ] ( صحيح ) (1/364)

وَعَنْ نَافِعٍ قَالَ: إِنَّ عَبْدَ اللهِ بْنِ عُمَرَ كَانَ يَقُوْلُ: مَنْ صَلَّى الْمَغْرِبَ أَوْ الصُّبْحَ ثُمَّ أَدْرَكَهُمَا مَعَ الْإِمَامِ فَلَا يَعُدْ لَهُمَا. رَوَاهُ مَالِكٌ .

1158. (9) [1/364దృఢం]

నా’ఫె (ర) కథనం: ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘ఉమర్‌ (ర) ”మ’గ్‌రిబ్‌ మరియు ఫజ్ర్‌ నమా’జు చదువుకున్న వ్యక్తి, మళ్ళీ ఆ రెంటిని ఇమామును చదువుతూ చూసినా తిరిగి (ఫ’ర్ద్ సంకల్పంతో) చదవరాదు” అని అనే వారు. [56] (మాలిక్) 

=====

30- بَابُ السُّنَنِ وَفَضَائِلِهَا

30. నమాజులోని సున్నతుల ఘనత

అల్లాహ్ ఆదేశంలో ఎటువంటి అనుమానం, సందేహంలేని దాన్ని ఫ’ర్ద్ అంటారు. దీన్ని తిరస్కరిస్తే. అవిశ్వాసులు అవుతారు. అకారణంగా వదలినవాడు పాపాత్ముడవుతాడు. అదేవిధంగా తిరస్కరిస్తే అవిశ్వాసానికి గురిచేసే ధార్మిక ఆదేశాన్ని వాజిబ్ అంటారు. దాన్ని వదలివేస్తే పాపానికి, శిక్షకు గురవుతాడు. దీన్నే సున్నతె ముఅక్కదహ్ అని కూడా అంటారు. ప్రవక్త (స) ఎల్లప్పుడూ చేస్తూఉన్న దాన్ని సున్నత్‌ అంటారు. ఇటువంటి సున్నత్‌ను వదలితే, మనిషి పాపాత్ముడవుతాడు. అదేవిధంగా చేస్తే పుణ్యం, చేయకపోతే ఏమీ లేదు అయినటు వంటిది నఫిల్‌. ఐదునమా ‘జులు తప్పనిసరి విధి. ఇవేకాక సున్నతులు, నఫిల్‌లు కూడా ఉన్నాయి. రాత్రి పగలులో 12 లేదా 10 సున్నతె ము’అక్కదహ్ ఉన్నాయి. దీన్ని గురించి, ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. 2 రకాతులు ఫజ్ర్‌ నమా’జు కు ముందు, 4 లేదా 2 రకాతులు ”జుహ్ర్‌ నమా’జుకు ముందు  2 రకాతులు ”జుహ్ర్‌ నమా’జు తర్వాత, 2 రకాతులు మ’గ్‌రిబ్‌ నమా’జు తర్వాత, 2 రకాతులు ‘ఇషా’ నమా’జు తర్వాత. వీటన్నిటి గురించి క్రింద తెలుసు కుందాం.

—–

اَلْفَصْلُ الْأَوَّلُ  మొదటి విభాగం  

1159 – [ 1 ] ( صحيح ) (1/365)

عَنْ أُمِّ حَبِيْبَةَ قَالَتْ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَنْ صَلَّى فِيْ يَوْمٍ وَلَيْلَةٍ اِثْنَتَيْ عَشَرَةَ رَكْعَةً بُنِيَ لَهُ بَيْتٌ فِيْ الْجَنَّةِ: أَرْبَعًا قَبْلَ الظُّهْرِ وَرَكْعَتَيْنِ بَعْدَهَا وَرَكْعَتَيْنِ بَعْدَ الْمَغْرِبِ وَرَكْعَتَيْنِ بَعْدَ الْعِشَاءِ وَرَكْعَتَيْنِ قَبْلَ صَلَاةِ الْفَجْرِ”. رَوَاهُ التِّرْمِذِيُّ.

وَفِيْ رَوَايَةٍ لِّمُسْلِمٍ أَنَّهَا قَالَتْ: سَمِعْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ: “مَا مِنْ عَبْدٍ مُّسْلِمٍ يُّصَلِّيْ لِلهِ كُلّ يَوْمٍ ثِنْتَيْ عَشْرَةَ رَكْعَةً تَطْوُّعًا غَيْرَ فَرِيْضَةً إِلَّا بَنَى اللهُ لَهُ بَيْتًا فِيْ الْجَنَّةِ أَوْ إِلَّا بُنِيَ لَهُ بَيْتٌ فِيْ الْجَنَّةِ”.

1159. (1) [1/365దృఢం]

ఉమ్మె ‘హబీబహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”రాత్రీ పగలులో 12 రకా’తుల సున్నతులు చదివే వారి కొరకు స్వర్గంలో భవనం నిర్మించబడును. 4 రకా’ తులు ”జుహ్ర్‌కు ముందు, 2 రకా’తులు ”జుహ్ర్‌ తరువాత, 2 రకా’తులు మ’గ్రిబ్‌ తరువాత, 2 రకా’తులు ‘ఇషా’ తర్వాత, 2 రకా’తులు ఫజ్ర్‌ ముందు. (తిర్మిజి’)

ముస్లిమ్‌ ఉల్లేఖనంలో ఇలా ఉంది, ”ఉమ్మె ‘హబీబహ్ (ర) ప్రవక్త (స) ఇలా ప్రవచిస్తూ ఉండగా విన్నారు, ‘ఎల్లప్పుడూ అంటే ప్రతిరోజు 12 రకాతులు సున్నతులు చదివే వారి కోసం అల్లాహ్‌ స్వర్గంలో ఒక భవనం నిర్మిస్తాడు.”

1160 – [ 2 ] ( متفق عليه ) (1/365)

وَعَنِ ابْنِ عُمَرَ قَالَ: صَلَّيْتُ مَعَ رَسُوْلِ الله صلى الله عليه وسلم رَكْعَتَيْنِ قَبْلَ الظُّهْرِ وَرَكْعَتَيْنِ بَعْدَهَا وَرَكْعَتَيْنِ بَعْدَ الْمَغْرِبِ فِيْ بَيْتِهِ وَرَكْعَتَيْنِ بَعْدَ الْعِشَاءِ فِيْ بَيْتِهِ، قَالَ: وَحَدَّثَتْنِيْ حَفْصَةُ: أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم كَانَ يُصَلِّيْ رَكْعَتَيْنِ خَفِيْفَتَيْنِ حِيْنَ يَطْلُعُ الْفَجْرُ”.

1160. (2) [1/365ఏకీభవితం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘ఉమర్‌ (ర) కథనం: నేను ప్రవక్త (స), 2 రకా’తులు ”జుహ్ర్‌కు ముందు, 2 రకా’తులు ”జుహ్ర్‌ తరువాత, 2 రకా’తులు మ’గ్రిబ్‌ తరువాత, 2 రకా’తులు ‘ఇషా’ తరువాత తన ఇంట్లో చదివేవారు.

ఇంకా ‘హఫ్‌’సహ్ (ర), ‘ప్రవక్త (స) 2 రకా’తులు తేలిగ్గా ఫజ్ర్‌కు ముందు చదివే వారు,’ అని అన్నారు.[57] (బు’ఖారీ, ముస్లిమ్‌)

1161 – [ 3 ] ( متفق عليه ) (1/366)

وَعَنِ ابْنِ عُمَرَ قَالَ: كَانَ النَّبِيُّ صلى الله عليه وسلم لَا يُصَلِّيْ بَعْدَ الْجُمْعَةِ حَتَّى يَنْصَرِفَ. فَيُصَلِّيَ رَكْعَتَيْنِ فِيْ بَيْتِهِ .

1161. (3) [1/366ఏకీభవితం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘ఉమర్‌ (ర) కథనం: ప్రవక్త (స) జుము’అహ్‌ తరువాత మస్జిద్‌లో సున్నతులు చదివేవారు కాదు. ఇంటికి వచ్చి, రెండు రకా’తులు చదివేవారు. [58] (బు’ఖారీ, ముస్లిమ్‌)

1162 – [ 4 ] ( صحيح ) (1/366)

وَعَنْ عَبْدِ اللهِ بْنِ شَقِيْقٍ قَالَ: سَأَلْتُ عَائِشَةَ عَنْ صَلَاةِ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم عَنْ تَطَوُّعِهِ. فَقَالَتْ: كَانَ يُصَلِّيْ فِيْ بَيْتِيْ قَبْلَ الظُّهْرِ أَرْبَعًا ثُمَّ يَخْرُجُ فَيُصَلِّيْ بِالنَّاسِ ثُمَّ يَدْخُلُ فَيُصَلِّيْ رَكْعَتَيْنِ .وَكَانَ يُصَلِّيْ بِالنَّاسِ الْمَغْرِبَ ثُمَّ يَدْخُلُ فَيُصَلِّيْ رَكْعَتَيْنِ. وَيُصَلِّيْ بِالنَّاسِ الْعِشَاءِ وَيَدْخُلُ بَيْتِيْ فَيُصَلَّيْ رَكْعَتَيْنِ. وَكَانَ يُصَلِّيْ مِنَ اللَّيْلِ تِسْعَ رَكْعَاتٍ فِيْهِنَّ الْوِتْرَ وَكَانَ يُصَلِّيْ لَيْلًا طَوِيْلًا قَائِمًا. وَلَيْلًا طَوِيْلًاقَاعِدًا. وَكَانَ إِذَا قَرَأَ وَهُوَ قَائِمٌ رَكَعَ وَسَجَدَ وَهُوَ قَائِمٌ. وَإِذَا قَرَأَ قَاعِدًا رَكَعَ وَسَجَدَ وَهُوَ قَاعِدٌ. وَكَانَ إِذَا طَلَعَ الْفَجْرُ صَلَّى رَكَعْتَيْنِ. رَوَاهُ مُسْلِمٌ . وَزَادَ أَبُوْ دَاوُدَ: ثُمَّ يَخْرُجُ فَيُصَلِّيْ بِالنَّاسِ صَلَاةُ الْفَجْرِ.

1162. (4) [1/366దృఢం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ షఖీఖ్‌ (ర) కథనం: నేను ‘ఆయి’షహ్‌ (ర)ను ప్రవక్త (స) నఫిల్‌ నమా’జుల గురించి అడిగాను. దానికి ‘ఆయి’షహ్‌ (ర) ”ప్రవక్త (స) మా ఇంటిలో ”జుహ్ర్‌కు ముందు 4 రకా’తులు చదివే వారు. తరువాత మస్జిద్‌కు వెళ్ళి నమా’జు చదివించే వారు. ఇంటికి వచ్చిన తర్వాత 2 రకా’తులు సున్నతులు చదివేవారు. ప్రజలకు మ’గ్రిబ్‌ నమా’జు చదివించిన తరువాత ఇంటికి వచ్చి 2 రకా’తులు సున్నతులు చదివేవారు. ప్రజలకు ‘ఇషా’ నమా’జు చదివించి మా ఇంటికి వచ్చి 2 రకా’తులు సున్నతులు చదివేవారు, రాత్రి తహజ్జుద్‌ నమా’జు 9 రకాతులు చదివేవారు. అందులో విత్‌ర్ కూడా ఉండేది. ప్రవక్త (స) రాత్రి చాలాసేపు వరకు నిలబడి చాలాసేపు వరకు కూర్చొని చదివేవారు. నిలబడి చదివితే ఖియామ్‌ తర్వాత రుకూ’, సజ్దాలు చేసేవారు. కూర్చొని చదివితే రుకూ’ మరియు సజ్దాలు కూడా కూర్చొనే చేసేవారు. ఇంకా ‘సుబహ్‌ ‘సాదిఖ్‌ అయిన తర్వాత ఫజ్ర్‌కు ముందు 2 రకాతులు చదివేవారు. ఆ తరువాత ఫజ్ర్‌ నమా’జు చదివించటానికి మస్జిద్‌కు వెళ్ళేవారు. (ముస్లిమ్‌, అబూ దావూ’ద్‌)

1163 – [ 5 ] ( متفق عليه ) (1/366)

وَعَنْ عَائِشَةَ رَضِيَ اللهُ عَنْهَا قَالَتْ: لَمْ يَكُنِ النَّبِيُّ صلى الله عليه و سلم عَلَى شَيْءٍ مِّنَ النَّوَافِلِ أَشَدَّ تَعَاهُدًا مِّنْهُ عَلَى رَكْعَتِيْ الْفَجْرِ.

1163. (5) [1/366ఏకీభవితం]

‘ఆయి’షహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) నఫిల్‌ నమా’జుల్లో ఫజ్ర్‌లోని 2 రకా’త్‌ల సున్నతులకు ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇచ్చేవారు. ఈ విధంగా ఇతర నఫిల్‌ నమా’జులకు ఇచ్చేవారు కారు. (బు’ఖారీ, ముస్లిమ్‌)

1164 – [ 6 ] ( صحيح ) (1/366)

وَعَنْهَا قَالَتْ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “رَكْعَتَا الْفَجْرِ خَيْرُ مِّنَ الدُّنْيَا وَمَا فِيْهَا”. رَوَاهُ مُسْلِمٌ .

1164. (6) [1/366దృఢం]

‘ఆయి’షహ్‌ (ర) కథనం: ప్రవక్త (స), ”ఫజ్ర్‌ యొక్క 2 రకా’తులు ప్రపంచం మరియు ప్రపంచంలోని అనుగ్రహాలన్నింటి కంటే ఉత్తమమైనవి,” అని ప్రవచించారు. (ముస్లిమ్‌)

1165 – [ 7 ] ( متفق عليه ) (1/366)

وَعَنْ عَبْدِ اللهِ بْنِ مُغَفَّلٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “صَلُّوْا قَبْلَ صَلَاةِ الْمَغْرِبِ رَكْعَتَيْنِ صَلُّوْا قَبْلَ صَلَاةِ الْمَغْرِبِ رَكْعَتَيْنِ”؛ قَالَ فِيْ الثَّالِثَةِ: “لِمَنْ شَاءَ”. كَرَاهِيَةَ أَنْ يَّتَّخِذَهَا النَّاسُ سُنَّةً.

1165. (7) [1/366ఏకీభవితం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ము’గప్ఫల్‌ (ర) కథనం: ప్రవక్త (స), ‘మ’గ్రిబ్‌ విధి నమా’జుకు ముందు 2 రకా’తులు సున్నత్‌ చదువుకోండి అని మూడుసార్లు పలికారు. మూడవసారి కోరినవారు చదువుకోండి, కోరనివారు చదవకండి.’ ప్రజలు దాన్ని సున్నతులుగా ఎక్కడ భావిస్తారో అని వివరంగా పేర్కొన్నారు. [59](బు’ఖారీ, ముస్లిమ్‌)

1166 – [ 8 ] ( صحيح ) (1/366)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَنْ كَانَ مِنْكُمْ مُصَلِّيًا بَعْدَ الْجُمُعَةِ فَلْيُصَلِّ أَرْبَعًا “. رَوَاهُ مُسْلِمٌ وَفِيْ أُخْرَى لَهُ قَالَ:”إِذَا صَلَّى أَحَدُكُمْ الْجُمُعَةَ فَلْيُصَلِّ بَعْدَهَا أَرْبَعًا”.

1166. (8) [1/366దృఢం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మీలో ఎవరైనా జుము’అహ్‌ తరువాత సున్నతులు చదవాలనుకుంటే, వారు 4 రకాతులు చదువు కోవాలి.” మరో ఉల్లేఖనంలో జుము’అహ్‌ నమా’జు చదివినవారు 4 రకాతులు సున్నతులు చదువుకోవాలి. (ముస్లిమ్‌)

—–

اَلْفَصْلُ الثَّانِيْ  రెండవ విభాగం  

1167 – [ 9 ] ( صحيح ) (1/367)

عَنْ أُمِّ حَبِيْبَةَ قَالَتْ: سَمِعْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ: “مَنْ حَافَظَ عَلَى أَرْبَعٍ رَكْعَاتٍ قَبْلَ الظُّهْرِ وَأَرْبَعٍ بَعْدَهَا حَرَّمَهُ اللهُ عَلَى النَّارِ”. رَوَاهُ أَحْمَدُ وَالتَّرْمِذِّي وَأَبُوْ دَاوُدَ وَالنَّسَائِيُّ وَابْنُ مَاجَهُ .

1167. (9) [1/367దృఢం]

ఉమ్మె ‘హబీబహ్ (ర) కథనం: ప్రవక్త (స) ఇలా ప్రవచిస్తూ ఉండగా నేను విన్నాను, ”జుహ్ర్‌కు ముందు 4 రకా’తులను, ”జుహ్ర్‌ తరువాత 4 రకా’తులను పరిరక్షించే వారిపై అల్లాహుత’ఆలా నరకాగ్నిని నిషేధిస్తాడు. (అ’హ్మద్‌, తిర్మిజి’, అబూ దావూ’ద్‌, నసాయి’, ఇబ్నె మాజహ్)

1168 – [ 10 ] ( ضعيف ) (1/367)

وَعَنْ أَبِيْ أَيُوْبَ الْأَنْصَارِيِّ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم : “أَرْبَعٌ قَبْلَ الظُّهْرِ لَيْسَ فِيْهِنَّ تَسْلِيْمٌ تُفْتَحُ لَهُنَّ أَبْوَابُ السَّمَاءِ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ وَابْنُ مَاجَهُ.

1168. (10) [1/367బలహీనం]

అబూ అయ్యూబ్‌ అ’న్సారీ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”జుహ్ర్‌కు ముందు 4 రకాతులు సున్నతులు ఉన్నాయి. వాటి రెండు రకాతుల మధ్య సలామ్‌ లేదు. అంటే 4 రకాతులు ఒకే సలామ్‌తో చదవాలి. వీటిని చదివే వారికోసం ఆకాశద్వారాలు తెరువబడతాయి. అంటే 4 రకాతులు స్వీకరించ బడతాయి.” (అబూ దావూ’ద్‌, ఇబ్నె మాజహ్)

1169 – [ 11 ] ( صحيح ) (1/367)

وَعَنْ عَبْدِ اللهِ بْنِ السَّائِبِ قَالَ: كَانَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم يُصَلِّيْ أَرْبَعًا بَعْدَ أَنْ تَزُوْلَ الشَّمْسُ قَبْلَ الظُّهْرِ وَقَالَ: “إِنَّهَا سَاعَةٌ تُفْتَحُ فِيْهَا أَبْوَابُ السَّمَاءِ فَأُحِّبُ أَنْ يَّصْعَدَ لِيْ فِيْهَا عَمَلٌ صَالِحٌ”. رَوَاهُ التِّرْمِذِيُّ .

1169. (11) [1/367దృఢం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ సాయి’బ్‌ (ర) కథనం: ప్రవక్త (స) సూర్యుడు వాలిన తరువాత ”జుహ్ర్‌కు ముందు 4 రకా’తులు సున్నతులు చదివేవారు. ఇంకా, ”ఈ సమ యంలో ఆకాశద్వారాలు తెరువబడతాయి. ఈ సమయంలో సత్కార్యాలు పైకి వెళ్ళాలని నేను అభిలషిస్తున్నాను” అని అన్నారు. (తిర్మిజి’)

1170 – [ 12 ] ( حسن ) (1/367)

وَعَنِ ابْنِ عُمَرَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “رَحِمَ اللهُ امْرَءًا صَلَّى قَبْلَ الْعَصْرِأَرْبَعًا”. رَوَاهُ أَحْمَدُ وَالتِّرْمِذِيُّ

1170. (12) [1/367ప్రామాణికం]

ఇబ్నె ‘ఉమర్‌ (ర) కథనం: ప్రవక్త (స), ” ‘అ’స్ర్‌కు ముందు 4 రకా’తులు చదివేవారిని అల్లాహ్‌ కరుణించుగాక” అని దీవించారు. (తిర్మిజి’, అబూ దావూ’ద్‌)

1171 – [ 13 ] ( حسن ) (1/367)

وَعَنْ عَلِيٍّ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: كَانَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم يُصَلِّيْ قَبْلَ الْعَصْرِأَرْبَعَ رَكْعَاتٍ يَفْصِلُ بَيْنَهُنَّ بِالتَّسْلِيْمِ عَلَى الْمَلَائِكَةِ الْمُقَرَّبِيْنَ وَمَنْ تَبِعَهُمْ مِّنَ الْمُسْلِمِيْنَ وَالْمُؤْمِنِيْنَ”. رَوَاهُ التِّرْمِذِيُّ .

1171. (13) [1/367ప్రామాణికం]

‘అలీ (ర) కథనం: ప్రవక్త (స) ‘అస్ర్‌’కు ముందు 4 రకా’తులు చదివేవారు. వాటి మధ్య సన్నిహిత దైవదూతలపై, ముస్లిములపై సలామ్‌ పలికి విరామం ఇచ్చేవారు. [60] (తిర్మిజి’)

1172 – [ 14 ] ( حسن ) (1/368)

وَعَنْ عَلٍّي رَضِيَ اللهُ عَنْهُ قَالَ: كَانَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم يُصَلِّيْ قَبْلَ الْعَصْرِ رَكْعَتَيْنِ. رَوَاهُ أَبُوْ دَاوُدَ

1172. (14) [1/368ప్రామాణికం]

‘అలీ (ర) కథనం: ప్రవక్త (స) అస్ర్‌కు ముందు 2 రకా’అతులు చదివేవారు. [61](అబూ దావూ’ద్‌)

1173 – [ 15 ] ( لم تتم دراسته ) (1/368)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَنْ صَلَّى بَعْدَ الْمَغْرِبِ سِتَّ رَكْعَاتٍ لَمْ يَتَكَلَّمْ فِيْمَا بَيْنَهُنَّ بِسُوْءِ عُدِلْنَ لَهُ بِعِبَادَةِ ثِنْتَيْ عَشَرَةَ سَنَةً”. رَوَاهُ التِّرْمِذِيُّ. وَقَالَ: هَذَا حَدِيْثٌ غَرِيْبٌ لَا نَعْرِفُهُ إِلَّا مِنْ حَدِيْثِ عُمَرَ بْنِ أَبِيْ خَثْعَمٍ وَسَمِعْتُ مُحَمَّدَ بْنَ إِسْمَاعِيْلَ يَقُوْلُ: هُوَ مُنْكَرُ الْحَدِيْثِ وَضَعَّفَهُ جِدًّا.

1173. (15) [1/368అపరిశోధితం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మ’గ్రిబ్‌ తరువాత 6 రకాతులు నఫిల్‌చదివి, వాటి మధ్య నోటితో ఎటువంటి చెడుమాట పలకకపోతే, ఈ 6 రకాతులు 12 సంవత్సరాల ఆరాధనకు సమానంగా చేయబడతాయి. అంటే అతనికి 12 సంవత్సరాల పుణ్యం లభిస్తుంది.” (తిర్మిజి’)

తిర్మిజి’ దీన్ని ‘హదీసె’ ‘గరీబ్‌గా పేర్కొన్నారు. ఇంకా ఇది కేవలం ‘ఉమర్‌ బిన్‌ అబీ ‘హకీమ్‌ ‘హదీసు’గా మాకు తెలుసునని ఇంకా బు’ఖారీ, ” ‘ఉమర్‌ బిన్‌ అబీ హకీమ్‌ మున్‌కిరుల్‌ ‘హదీస’ని, ఇది చాలా బలహీనమైన ‘హదీస’ని పేర్కొన్నారని” అన్నారు.

1174 – [ 16 ] ( موضوع ) (1/368)

وَعَنْ عَائِشَةَ قَالَتْ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَنْ صَلَّى بَعْدَ الْمَغْرِبِ عِشْرِيْنَ رَكْعَةً بَنَى اللهُ لَهُ بَيْتًا فِيْ الْجَنَّةِ”. رَوَاهُ التِّرْمِذِيُّ  .

1174. (16) [1/368కల్పితం]

‘ఆయి’షహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మ’గ్రిబ్‌ తరువాత 20 రకాతులు చదివితే, దానికి బదులుగా అల్లాహ్‌ అతని కోసం స్వర్గంలో భవనం నిర్మిస్తాడు.” [62](తిర్మిజి’)

1175 – [ 17 ] ( ضعيف ) (1/368)

وَعَنْهَا قَالَتْ: مَا صَلَّى رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم العِشَاءَ قَطُّ فَدَخَلَ عَلَيَّ إِلَّا صَلَّى أَرْبَعَ رَكْعَاتٍ أَوْ سِتَّ رَكْعَاتٍ. رَوَاهُ أَبُوْ دَاوُدَ.

1175. (17) [1/368బలహీనం]

‘ఆయి’షహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ‘ఇషా’ నమా’జు చదివి మా ఇంటికి వచ్చిన తర్వాత 4 రకా’తులు లేదా 6 రకా’త్‌లు సున్నత్‌ చదివేవారు. [63] (అబూ దావూ’ద్‌)

1176 – [ 18 ] ( ضعيف ) (1/368)

وَعَنِ ابْنِ عَبَّاسٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِدْبَارَ النُّجُوْمِ الرَّكْعَتَانِ قَبْلَ الْفَجْرِ وَإِدْبَارَ السُّجُوْدِ الرَّكْعَتَانِ بَعْدَ الْمَغْرِبِ”. رَوَاهُ التِّرْمِذِيُّ .

1176. (18) [1/368బలహీనం]

ఇబ్నె ‘అబ్బాస్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఇద్‌బారన్నుజూమ్‌” అంటే ఫజ్ర్‌లోని 2 రకా’త్‌ల సున్నతులు. అదేవిధంగా ”ఇద్‌బారస్సుజూద్‌” అంటే మ’గ్రిబ్‌ తరువాత 2 రకాత్‌ల సున్నతులు. [64](తిర్మిజి’)

—–

اَلْفَصْلُ الثَّالِثُ   మూడవ విభాగం 

1177 – [ 19 ] ( ضعيف ) (1/369)

عَنْ عُمَرَ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: سَمِعْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ: “أَرْبَعُ رَكْعَاتٍ قَبْلَ الظُّهْرِ بَعْدَ الزَّوَالِ تُحْسَبُ بِمِثْلِهِنَّ فِيْ صَلَاةِ السَّحَرِ. وَمَا مِنْ شَيْءٍ إلَّا وَهُوَ يُسَبّحُ اللهُ تِلْكَ السَّاعَةَ ثُمَّ قَرَأَ: (يَتَفَيَّأُ ظِلَالُهُ عَنِ الْيَمِيْنِ وَالشَّمَائِلِ سُجَّدًا لِلهِ وَهُمْ دَاخِرُوْنَ؛16: 48). رَوَاهُ التِّرْمِذِيُّ وَالْبَيْهَقِيُّ فِيْ شُعَبِ الْإِيْمَانِ.

1177. (19) [1/369బలహీనం]

‘ఉమర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ఇలా ప్రవచిస్తూ ఉండగా నేను విన్నాను, ”జుహ్ర్‌కు ముందు సూర్యుడు వాలిన తర్వాత 4 రకా’తులు సున్నతులు ఉన్నాయి. ఇవి తహజ్జుద్‌ నమా’జులా పరిగణించబడతాయి. అంటే సూర్యుడు వాలిన తరువాతి 4 రకా’తుల సున్నతులు తహజ్జుద్‌ 4 రకా’త్‌లుగా పరిగణించబడతాయి. ఆ సమయంలో ప్రతి వస్తువూ దైవస్మరణ చేస్తుంది. ఆ తరువాత ప్రవక్త (స) ఈ ఆయతును పఠించారు: ” ఏమీ? వారు అల్లాహ్‌ సృష్టించిన ప్రతి వస్తువునూ గమనించటం (చూడటం) లేదా? వాటి నీడలు కుడివైపుకూ, ఎడమ వైపుకూ వంగుతూ ఉండి, అల్లాహ్‌కు సాష్టాంగం (సజ్దా) చేస్తూ, ఎలా వినమ్రత చూపుతున్నాయో.” (సూ. అన్ నహ్ల్, 16:48). (తిర్మిజి’, బైహఖీ – షు’అబిల్ ఈమాన్)

1178 – [ 20 ] ( متفق عليه ) (1/369)

وَعَنْ عَائِشَةَ قَالَتْ: مَا تَرَكَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم رَكْعَتَيْنِ بَعْدَ الْعَصْرِ عِنْدِيْ قَطُّ وَفِيْ رِوَايَةٍ لِّلْبُخَارِيِّ قَالَتْ: وَالَّذِيْ ذَهَبَ بِهِ مَا تَرَكَهُمَا حَتَّى لَقِيَ اللهَ.

1178. (20) [1/369ఏకీభవితం]

‘ఆయి’షహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ‘అ’స్ర్‌ తరువాత ఎల్లప్పుడూ నా ఇంట్లో 2 రకాత్‌లు చదివే వారు. వాటిని మరణించే వరకు వదలలేదు. [65] (బు’ఖారీ, ముస్లిమ్‌)

1179 – [ 21 ] ( صحيح ) (1/370)

وَعَنِ الْمُخْتَارِ بْنِ فُلْفُلٍ قَالَ: سَأَلْتُ أَنَسَ بْنَ مَالِكٍ عَنِ التَّطَوُّعِ بَعْدَ الْعَصْرِ فَقَالَ: كَانَ عُمَرُ يَضْرِبُ الْأَيْدِيَ عَلَى صَلَاةِ بَعْدَ الْعَصْرِ وَكُنَّا نُصَلِّيْ عَلَى عَهْدِ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم رَكْعَتَيْنِ بَعْدَ غُرُوْبِ الشَّمْسِ قَبْلَ صَلَاةِ الْمَغْرِبِ. فَقُلْتُ لَهُ: أَكَانَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم يُصَلِّيْهِمَا؟ قَالَ: كَانَ يَرَانَا نُصَلِّيْهِمَا فَلَمْ يَأْمُرْنَا وَلَمْ يَنْهَنَا. رَوَاهُ مُسْلِمٌ.

1179. (21) [1/370దృఢం]

ము’ఖ్తార్‌ బిన్‌ ఫుల్‌ఫుల్‌ (ర) కథనం: నేను అనస్‌ బిన్‌ మాలిక్‌ను ‘అ’స్ర్‌ తరువాత నఫిల్‌ నమా’జులు చదవటాన్ని గురించి అడిగాను. దానికి అతను, ” ‘ఉమర్‌ (ర) ‘అ’స్ర్‌ తరువాత నఫిల్‌ నమా’జు చదివేవారి చేతులపై బెత్తంతో కొట్టేవారు. అంటే ‘అ’స్ర్‌ తరు వాత నమా’జు చదివేవారిని వారించే వారు. ఇంకా మేము ప్రవక్త (స) కాలంలో సూర్యాస్త మయం తరువాత మగ్రిబ్‌ నమా’జుకు ముందు రెండు రకా తులు నమా’జు చదివేవాళ్ళం.’ నేను ‘ప్రవక్త (స) కూడా చదివేవారా,’ అని అడిగాను. దానికి అతను ‘మమ్మల్ని చదువుతుండగా చూసి, తప్పనిసరి అని,’ సూచించనూ లేదు, వారించనూ లేదు అని అన్నారు.” [66] (ముస్లిమ్‌)

1180 – [ 22 ] ( صحيح ) (1/370)

وَعَنْ أَنَسٍ قَالَ: كُنَّا بِالْمَدِيْنَةِ فَإِذَا أَذَّنَ الْمُؤَذِّنُ لِصَلَاةِ الْمَغْرِبِ ابْتَدَرُوا السَّوَارِيَ فَرَكَعُوْا رَكْعَتَيْنِ حَتَّى إِنَّ الرَّجُلَ الْغَرِيْبَ لَيَدْخُلُ الْمَسْجِدَ فَيَحْسَبُ أَنَّ الصَّلَاةَ قَدْ صُلِّيَتْ مِنْ كَثْرَةِ مَنْ يُّصَلِّيْهِمَا. رَوَاهُ مُسْلِمٌ.

1180. (23) [1/370దృఢం]

అనస్‌ (ర) కథనం: మేము మదీనహ్ లో ఉన్నప్పుడు, ము’అజ్జి’న్‌ మ’గ్రిబ్‌ అజాన్‌ ఇచ్చిన తర్వాత, ప్రజలు మస్జిద్‌లోని స్తంభాల వైపు తొందరగా వెళ్ళి 2 రకాత్‌ల సున్నతులు చదివేవారు. బాటసారులెవరైనా వస్తే, నమా’జు అయి పోయిందని భావించేవారు. [67](ముస్లిమ్‌)

1181 – [ 23 ] ( صحيح ) (1/370)

وَعَنْ مَّرْثِدِ بْنِ عَبْدِ اللهِ قَالَ: أَتَيْتُ عُقْبَةَ الْجُهْنِيّ فَقُلْتُ: أَلَا أُعَجِّبُكَ مِنْ أَبِيْ تَمِيْمٍ يَرْكَعُ رَكْعَتَيْنِ قَبْلَ صَلَاةِ الْمَغْرِبِ؟ فَقَالَ عُقْبَةُ: إِنَّا كُنَّا نَفْعَلُهُ عَلَى عَهْدِ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم. قُلْتُ: فَمَا يَمْنَعُكَ الآنَ؟ قَالَ: الشُّغُلُ. رَوَاهُ الْبُخَارِيُّ .

1181. (23) [1/370దృఢం]

మర్‌స’ద్‌ బిన్‌ ‘అబ్దుల్లాహ్‌ (ర) కథనం: నేను ఉఖ్‌బహ్ అల్ జుహ్‌నీ వద్దకు వచ్చాను. నేను అతన్ని, ”అబూ తమీమ్‌ మ’గ్రిబ్‌కు ముందు 2 రకాతులు చదవటం మీకు ఆశ్చర్యం కలిగించటం లేదా?” అని అడిగాను. దానికి ఉఖ్‌బహ్, ”ఇందులో ఎటువంటి ఆశ్చర్యంలేదు. మేము ప్రవక్త (స) కాలంలో చదివే వాళ్ళం,” అని అన్నారు. దానికి నేను ‘మరి ఇప్పుడు మీరెందుకు చదవడంలేదు?’ అని అడిగాను. దానికి అతను ‘వ్యాపార లావాదేవీల వల్ల మాకు చదవటానికి సమయం దొరకనందువల్ల,’ అని సమాధానం ఇచ్చారు. [68]  (బు’ఖారీ)

1182 – [ 24 ] ( ضعيف ) (1/370)

وَعَنْ كَعْبِ بْنِ عُجْرَةَ قَالَ: إِنَّ النَّبِيَّ صلى الله عليه وسلم أَتَى مَسْجِدَ بَنِيْ عَبْدِ الْأَشْهَلِ فَصَلَّى فِيْهِ الْمَغْرِبَ فَلَمَّا قَضَوْا صَلَاتَهُمْ رَآهُمْ يُسَبِّحُوْنَ بَعْدَهَا فَقَالَ: “هَذِهِ صَلَاةُ الْبُيُوْتِ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ

وَفِيْ رِوَايَةِ التِّرْمِذِيِّ وَالنَّسَائِيِّ قَامَ نَاسٌ يَّتَنَفَّلُوْنَ. فَقَالَ النَّبِيُّ صلى الله عليه وسلم: “عَلَيْكُمْ بِهَذِهِ الصَّلَاةِ فِيْ الْبُيُوْتِ”.

1182. (24) [1/370బలహీనం]

క’అబ్‌ బిన్‌ ఉజ్ర (ర) కథనం: ప్రవక్త (స) బనూ అబ్దిల్‌ అష్‌హల్‌ మస్జిద్‌కు ఒకసారి వచ్చారు. అక్కడ మ’గ్రిబ్‌ నమా’జు చదివారు. ప్రజలందరూ మ’గ్రిబ్‌ నమా’జు చదువుకున్న తరువాత ప్రవక్త (స) ప్రజలను మస్జిద్‌లోనే సున్నతులు చదువుతుండగా చూచి, ‘ఈ నఫిల్‌ నమా’జులు ఇంట్లో చదవాలి. అందువల్ల సున్న తులను, నఫిల్‌ నమా’జులను ఇళ్ళల్లో చదవండి’ అని అన్నారు. [69]  (అబూ దావూ’ద్‌, తిర్మిజి’)

1183 – [ 25 ] ( ضعيف ) (1/371)

وَعَنِ ابْنِ عَبَّاسٍ قَالَ: كَانَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم يُطِيْلُ الْقَرَاءَةُ فِيْ الرَّكْعَتَيْنِ بَعْدَ الْمَغْرِبِ حَتَّى يَتَفَرَّق أَهْلُ الْمَسْجِدِ. رَوَاهُ أَبُوْ دَاوُدَ.

1183. (25) [1/371బలహీనం]

ఇబ్నె ‘అబ్బాస్‌ (ర) కథనం: ప్రవక్త (స) మగ్రిబ్‌ తర్వాత 2 రకాత్‌లలో దీర్ఘంగా ఖిరాఅ’త్‌ చేసేవారు. చివరికి అందరూ వెళ్ళిపోయే వారు. [70] (అబూ దావూద్‌)

1184 – [ 26 ] ( ضعيف ) (1/371)

وَعَنْ مَكْحُوْلٍ يَّبْلُغُ بِهِ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم قَالَ: “مَنْ صَلَّى بَعْدَ الْمَغْرِبِ قَبْلَ أَنْ يَّتَكَلَّمَ رَكْعَتَيْنِ.

وَفِيْ رِوَايَةٍ أَرْبَعَ رَكَعَاتٍ رُفِعَتْ صَلَاتُهُ فِيْ عِلِّيِّيْنَ”. مُرْسَلًا.

1184. (26) [1/371బలహీనం]

మక్‌’హూల్‌ తాబ’యీ, ప్రవక్త (స) ద్వారా ఉల్లేఖి స్తున్నారు. ప్రవక్త (స)ప్రవచనం, ”మ’గ్రిబ్‌ తర్వాత మాట్లాడకుండా, 2 లేదా 4 రకాత్‌లు చదివితే, అతని నమా’జును ‘ఇల్లియ్యీన్‌లో చేర్చబడును. అంటే స్వీకరించబడుతుంది.”

1185 – [ 27 ] ( ضعيف ) (1/371)

وَعَنْ حُذَيْفَةَ نَحْوَهُ وَزَادَ فَكَانَ يَقُوْلُ: “عَجِّلُوْا الرَّكْعَتَيْنِ بَعْدَ الْمَغْرِبِ فَإِنَّهُمَا تُرْفَعَانِ مَعَ الْمَكْتُوْبَةِ”. رَوَاهُمَا رَزِيْنٌ وَرَوَى الْبَيْهَقِيُّ الزِّيَادَةَ عَنْهُ نَحْوَهَا فِيْ شُعَبِ الْإِيْمَانِ .

1185. (27) [1/371బలహీనం]

‘హుజై’ఫహ్కూడా ఈవిధంగా ఉల్లేఖించారు. అయితే అతని ఉల్లేఖనంలో ఈ పదాలు అధికంగా ఉన్నాయి, ”ప్రవక్త (స) ప్రవచనం, ‘మ’గ్రిబ్‌ నమా’జు తర్వాత 2 రకాత్‌ ల సున్నతులను త్వరగా చదువు కోండి. ఎందుకంటే ఆ రెండూ విధి నమా’జులతో పాటు లేపబడతాయి.” [71] (ర’జీన్‌, బైహఖీ – ష’అబిల్ ఈమాన్)

1186 – [ 28 ] ( صحيح ) (1/371)

وَعَنْ عَمْرِو بْنِ عَطَاءٍ قَالَ: إِنَّ نَافِعَ بْنَ جُبَيْرٍ أَرْسَلَهُ إِلَى السَّائِبِ يَسْأَلُهُ عَنْ شَيْءٍ رَآهُ مِنْهُ مُعَاوِيَةُ فِيْ الصَّلَاةِ فَقَالَ: نَعَمْ صَلَّيْتُ مَعَهُ الْجُمُعَةَ فِيْ الْمَقْصُوْرَةِ. فَلَمَّا سَلَّمَ الْإِمَاُم قُمْتُ فِيْ مَقَامِيْ فَصَلَّيْتُ. فَلَمَّا دَخَلَ أَرْسَلَ إِلَيَّ. فَقَالَ: لَا تَعُدْ لِمَا فَعَلْتَ إِذَا صَلَّيْتَ الْجُمُعَةَ فَلَا تَصِلْهَا بِصَلَاةٍ حَتَّى تُكَلِّمَ أَوْتَخْرُجَ. فَإِنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم أَمَرَنَا بِذَلِكَ أَنْ لَّا نُوْصِلَ بِصَلَاةٍ حَتَّى نَتَكَلَّمَ أَوْنَخْرُجَ. رَوَاهُ مُسْلِم .

1186. (28) [1/371దృఢం]

‘అమ్ర్ బిన్‌ ‘అ’తాఅ’ (ర) కథనం: అతన్ని నా’ఫె బిన్‌ ‘జుబైర్‌ సాయి’బ్‌ వద్దకు పంపి ము’ఆవియహ్ నమా’జు విషయంలో అతన్ని చూసిన దాన్ని గురించి అడగమన్నారు. దానికి సాయి’బ్‌, ”అవును, నేను అతనితో కలసి మఖ్‌’సూరహ్‌ అనే ప్రాంతంలో జుమ’అహ్‌ నమా’జు చదివాను. ఇమాము సలామ్‌ పలికి నమా’జు ముగించిన వెంటనే నేను నా స్థానంలోనే నిలబడి, జుమ’అహ్‌ సున్నతులు చదివాను. ము’ఆవియహ్‌ (ర) నమా’జు చదివి, ఇంటికి వెళ్ళిన తర్వాత నన్ను పిలిపించి, ‘ఈ రోజు చేసినట్టు, ఇక ముందు ఇలా చేయకు అంటే ఫర్ద్ నమా’జు తర్వాత వెంటనే సున్నతులు చదవకు. నువ్వు జుమ’అహ్‌ నమా’జు లేదా ఇతర ఏ నమాజైనా చదువుకున్న తర్వాత సున్నతును, ఫ’ర్ద్ నమా’జుతో కలపకు. మాట్లాడుకో లేదా స్థలం మార్చుకో, ఎందుకంటే ప్రవక్త (స) మమ్మల్ని ఒక నమా’జును మరో నమా’జుతో కలపరాదని, మాట్లాడుకోవాలని లేదా చోటు మార్చు కోవాలని ఆదేశించారు’ అని అన్నారు. (ముస్లిమ్‌)

1187 – [ 29 ] ( صحيح ) (1/371)

وَعَنْ عَطَاءٍ قَالَ: كَانَ ابْنُ عُمَرَ إِذَا صَلَّى الْجُمُعَةَ بِمَكَّةَ تَقَدَّمَ فَصَلَّى رَكْعَتَيْنِ ثُمَّ يَتَقَدَّمَ فَيُصَلِّيْ أَرْبَعًا. وَإِذَا كَانَ بِالْمَدِيْنَةِ صَلَّى الْجُمُعَةَ ثُمَّ رَجَعَ إِلَى بَيْتِهِ فَصَلَّى رَكْعَتَيْنِ وَلَمْ يُصَلِّ فِيْ الْمَسْجِدِ. فَقِيْلَ لَهُ. فَقَالَ: كَانَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم يَفْعَلُهُ. رَوَاهُ أَبُوْ دَاوُدَ

وَفِيْ رَوَايَةِ التِّرْمِذِيُّ قَالَ: “رَأَيْتُ ابْنَ عُمَرَ صَلَّى بَعْدَ الْجُمُعَةِ رَكْعَتَيْنِ ثُمَّ صَلَّى بَعْدَ ذَلِكَ أَرْبَعًا”.

1187. (29) [1/371దృఢం]

‘అ’తాఅ’ (ర) కథనం: ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘ఉమర్‌ మక్కహ్ లో ఉంటే జుమ’అహ్‌ నమా’జు చదివిన తర్వాత, తన చోటునుండి ముందుకుజరిగి 2 రకాతులు సున్నత్‌ చదివేవారు. ఆ తర్వాత మళ్ళీ రెండడుగులు ముందుకు మారి 4 రక’అతులు సున్నతులు చదివేవారు. మదీనాలో ఉంటే, జుమ’అహ్ నమా’జు చదివి ఇంటికి వెళ్ళి, ఇంట్లో 2 రకాత్‌లు చదివే వారు. మస్జిద్‌లో చదివేవారు కాదు. ‘మీరు ఇలా ఎందుకు చేస్తారని,’ ప్రశ్నిస్తే. దానికి అతను, ‘ప్రవక్త (స) కూడా ఇలాగే చేసేవారు,’ అని అన్నారు. [72] (అబూ దావూద్‌)

తిర్మిజీ’లో ఇలాగే ఉంది, ” ‘అ’తాఅ’ (ర) కథనం: ”నేను ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘ఉమర్‌ను 2 రకా’త్‌లు చదువుతుండగా, ఆ తరువాత మళ్ళీ 4 రకా’త్‌లు చదువుతుండగా చూశాను.”

=====

31- بَابُ صَلَاةِ اللَّيْلِ

31. రాత్రి పూట (తహజ్జుద్‌) నమాజు

రాత్రి నమా’జుకోసం నిలబడటాన్ని ఖియాముల్లైల్ అంటారు. ఐదు విధి నమా’జులు కాకుండా, రాత్రి చివరిజాములో మేల్కొని నమా’జు చదవటాన్ని తహజ్జుద్‌ అంటారు. ఇది ఇస్లామ్‌ ప్రారంభంలో విధించ బడింది. తరువాత రద్దు చేయబడింది. అయితే అభిలషణీయంగా పేర్కొనబడింది. కాని ప్రవక్త (స) ఎల్లప్పుడూ దీన్ని చదివేవారు. ఖుర్‌ఆన్‌లో అల్లాహ్‌ ఆదేశం: ”ఓ దుప్పటి కప్పుకున్నవాడా! రాత్రంతా (నమాజ్లో) నిలబడు, కొంత భాగాన్ని విడిచి; దాని సగ భాగంలో, లేదా దానికంటే కొంత తక్కువ; లేదా దానికంటే కొంత ఎక్కువ; మరియు ఖుర్‌ఆన్‌ను ఆగి-ఆగి, నెమ్మదిగా, స్పష్టంగా పఠించు. నిశ్చయంగా, మేము నీపై భారమైన సందేశాన్ని అవత రింపజేయ బోతున్నాము. నిశ్చయంగా, రాత్రి వేళ లేవటం (మనస్సును) అదుపులో ఉంచుకోవ టానికి ఎంతో ఉపయుక్త మైనది మరియు (అల్లాహ్‌) ప్రవచనాలను (అర్థం చేసుకోవటానికి) కూడా ఎంతో అనుగుణమైనది. వాస్తవానికి, పగటివేళ నీకు చాలా పనులుంటాయి. మరియు నీవు నీ ప్రభువు నామాన్ని స్మరిస్తూ ఉండు. మరియు అత్యంత శ్రధ్ధతో ఆయన వైపుకు మరలుతూ ఉండు.” (సూ. ముజ్జమ్మిల్‌, 73:1-8)

అల్లాహ్‌(త) ప్రవక్త(స)కు రాత్రి కొంతకాలం నిద్ర పోయి, తరువాత లేచి తహజ్జుద్‌ నమా’జు చదవమని ఆదేశించాడు.

అల్లాహ్ ఆదేశం: ”మరియు రాత్రి వేళలో జాగరణ (తహ జ్జుద్) నమా’జు చెయ్యి. ఇది నీకొరకు అదనపు (నఫిల్) నమాజు. దీనితో నీ ప్రభువు నీకు (పునరుత్ధాన దినమున) ప్రశంసనీయమైన స్ధానము (మఖామమ్మ్ మ’హమూద్) నొసంగవచ్చు.” (సూ. అల్ ఇస్రాఅ, 17:79)

اَلْفَصْلُ الْأَوَّلُ మొదటి విభాగం 

1188 – [ 1 ] ( متفق عليه ) (1/373)

عَنْ عَائِشَةَ رَضِيَ اللهُ عَنْهَا قَالَتْ: كَانَ النِّبِيُّ صلى الله عليه وسلم يُصَلِّيْ فِيْمَا بَيْنَ أَنْ يَّفْرُغَ مِنْ صَلَاةِ الْعِشَاءِ إِلَى الْفَجْرِ إِحْدَى عَشَرَةَ رَكْعَةً يُسَلِّمُ مِنْ كُلِّ رَكْعَتَيْنِ وَيُوْتِرُ بِوَاحِدَةٍ فَيَسْجُدُ السَّجْدَةَ مِنْ ذَلِكَ قَدْرَمَا يَقْرَأُ أَحَدُكُمْ خَمْسِيْنَ آيَةً قَبْلَ أَنْ يَّرْفَعَ رَأْسَهُ فَإِذَا سَكَتَ الْمُؤَذِّنُ مِنْ صَلَاةِ الْفَجْرِوَتَبَيَّنَ لَهُ الْفَجْرُقَامَ فَرَكَعَ رَكْعَتَيْنِ خَفِيْفَتَيْنِ ثُمَّ اضْطَجَعَ عَلَى شِقِّهِ الْأَيْمَنِ حَتَّى يَأْتِيِهِ الْمُؤَذِّنُ لِلْإِقَامَةِ فَيَخْرُجُ .

1188. (1) [1/373ఏకీభవితం]

‘ఆయి’షహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ‘ఇషా’ నమా’జు చదివిన తర్వాత ఫజ్ర్‌కు ముందు వరకు 11 రక’అతులు నమా’జు చదివేవారు. ప్రతి 2 రక’అతుల తర్వాత సలామ్‌ పలికేవారు. వీటిలో ఒక రక’అతు విత్ర్‌ చదివేవారు. ఎంత దీర్ఘంగా సజ్దా చేసేవారంటే, మీలో ఎవరైనా అందులో 50 ఆయతులు చదువు కుంటారు. ముఅ’జ్జి’న్‌ ఫజ్ర్‌ అజా’న్‌ ఇచ్చిన తర్వాత ప్రవక్త (స) నిలబడి తేలికైన 2 రక’అతుల సున్నత్‌ చదివేవారు. ఆ తరువాత కుడిప్రక్కకు తిరిగి పరుండే వారు. చివరికి ము’అజ్జి’న్‌ వచ్చి ఇఖామత్‌ పలక డానికి అనుమతి కోరుతాడు. అప్పుడు ప్రవక్త (స) నమా’జు చదివించటానికి బయటకు వెళ్ళేవారు. [73] (బు’ఖారీ, ముస్లిమ్‌)

1189 – [ 2 ] ( صحيح ) (1/373)

وَعَنْهَا قَالَتْ: كَانَ النَّبِيُّ صلى الله عليه وسلم إِذَا صَلَّى رَكْعَتَي الْفَجْرِ فَإِنْ كُنْتُ مُسْتَيْقَظَةً حَدَّثَنِيْ وَإِلَّا اضْطَجَعَ. رَوَاهُ مُسْلِمٌ .

1189. (2) [1/373దృఢం]

‘ఆయి’షహ్‌ (ర) కథనం: ప్రవక్త(స) ఫజ్ర్‌లోని 2 రక’అతుల సున్నత్‌ చదువుకున్న తర్వాత, ఒకవేళ నేను మేల్కొని ఉంటే, నాతో మాట్లాడుకుంటారు. ఒకవేళ నేను పడుకొని ఉంటే పరుండిపోతారు. [74] (ముస్లిమ్‌)

1190 – [ 3 ] ( متفق عليه ) (1/373)

وَعَنْهَا قَالَتْ: كَانَ النَّبِيُّ صلى الله عليه وسلم إِذَا صَلَّى رَكْعَتَي الْفَجْرِ اضْطَجَعَ عَلَى شِقِّهِ الْأَيْمَنِ”.

1190. (3) [1/373ఏకీభవితం]

‘ఆయి’షహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ఫజ్ర్‌లోని 2 రక’అతులు చదువుకున్న తర్వాత కుడిప్రక్కకు తిరిగి పరుండి పోతారు. [75] (బు’ఖారీ, ముస్లిమ్‌)

1191 – [ 4 ] ( صحيح ) (1/373)

وَعَنْهَا قَالَتْ: كَانَ النَّبِيُّ صلى الله عليه وسلم يُصَلِّيْ مِنَ اللَّيْلِ ثَلَاثَ عَشَرَةَ رَكْعَةً مِّنْهَا الْوِتْرُ وَرَكْعَتَا الْفَجْرِ. رَوَاهُ مُسْلِمٌ.

1191. (4) [1/373దృఢం]

‘ఆయి’షహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) రాత్రి 13 రకా’తులు చదివేవారు. అందులో విత్ర్‌ మరియు ఫజ్ర్‌ సున్నతులు కూడా చేరి ఉన్నాయి. అంటే 8 రకా’తులు తహజ్జుద్‌, 3 రకా’తులు విత్ర్‌, 2 రకా’తులు ఫజ్ర్‌ సున్నత్‌లు. (ముస్లిమ్‌)

1192 – [ 5 ] ( صحيح ) (1/373)

وَعَنْ مَسْرُوْقٍ قَالَ: سَأَلْتُ عَائِشَةَ عَنْ صَلَاةِ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم بِاللَّيْلِ. فَقَالَتْ: سَبْعٌ وَتِسْعٌ وَإِحْدَى عَشَرَ رَكْعَةً سِوَى رَكْعَتَيِ الْفَجْرِ. رَوَاهُ الْبُخَارِيُّ.

1192. (5) [1/373దృఢం]

మస్‌రూఖ్‌ (ర) కథనం: నేను ప్రవక్త (స) రాత్రి నమా’జు ఎన్ని రకా’తులు చదువుతారని ‘ఆయి’షహ్‌ (ర)ను అడిగాను. దానికి ఆమె, 7, 9, 11 రకా’తులు ఫజర్‌ సున్నతులు తప్ప అని అన్నారు. (బు’ఖారీ)

1193 – [ 6 ] ( صحيح ) (1/374)

وَعَنْ عَائِشَةَ قَالَتْ: كَانَ النِّبِيُّ صلى الله عليه وسلم إِذَا قَامَ مِنَ اللَّيْلِ لِيُصَلِّيَ افْتَتَحَ صَلَاتَهُ بِرَكْعَتَيْنِ خَفِيْفَتَيْنِ. رَوَاهُ مُسْلِمٌ .

1193. (6) [1/374దృఢం]

‘ఆయి’షహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) రాత్రి తహజ్జుద్‌ కోసం నిలబడి ముందు తేలిగ్గా రెండు రకా’తులు చదువుకునే వారు. (ముస్లిమ్‌)

1194 – [ 7 ] ( صحيح ) (1/374)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِذَا قَامَ أَحَدُكُمْ مِّنَ اللَّيْلِ فَلْيَفْتَحِ الصَّلَاةَ بِرَكْعَتَيْنِ خَفِيْفَتَيْنِ. رَوَاهُ مُسْلِمٌ.

1194. (7) [1/374దృఢం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మీలో ఎవరైనా తహజ్జుద్‌ నమా’జుకోసం నిలబడితే, ముందు తేలికైన రెండు రకా’త్‌లు చదువుకోవాలి.” (ముస్లిమ్‌)

1195 – [ 8 ] ( متفق عليه ) (1/374)

وَعَنِ ابْنِ عَبَّاسٍ قَالَ: بِتُّ عِنْدَ خَالَتِيْ مَيْمُوْنَةَ لَيْلَةً وَالنَّبِيُّ صلى الله عليه وسلم عِنْدَهَا فَتَحَدَّثَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم مَعَ أَهْلِهِ سَاعَةً. ثُمَّ رَقَدَ فَلَمَّا كَانَ ثُلُثُ اللَّيْلِ الْآخِرُ أَوْ بَعْضُهُ قَعَدَ فَنَظَرَ إِلَى السَّمَاءِ فَقَرَأَ: (إِنَّ فِي خَلْقِ السَّمَاوَاتِ وَالْأَرْضِ وَاخْتِلَافِ اللَّيْلِ وَالنَّهَارِ… -2: 164) حَتَّى خَتَمَ السُّوْرَةَ. ثُمَّ قَامَ إِلَى الْقِرْبَةِ فَأَطْلَقَ شِنَاقَهَا ثُمَّ صَبَّ فِيْ الْجَفَنَةِ ثُمَّ تَوَضَّأَ وُضُوْءًا حَسَنًا بَيْنَ الْوُضُوْءَيْنِ لَمْ يُكْثِرْ وَقَدْ أَبْلَغَ فَقَامَ فَصَلَّى فَقُمْتُ وَتَوَضَّأَتُ. فَقُمْتُ عَنْ يَّسَارِهِ فَأَخَذَ بِأُذُنِيْ فَأَدَارَنِيْ عَنْ يَّمِيْنِهِ فَتَتَامَّتْ صَلَاتُهُ ثَلَاثَ عَشَرَةَ رَكْعَةً ثُمَّ اضْطَجَعَ فَنَامَ حَتَّى نَفَخَ وَكَاَنَ إِذَا نَامَ نَفَخَ. فَآذَنَهُ بِلَالٌ بِالصَّلَاةِ فَصَلَّى وَلَمْ يَتَوَضَّأْ وَكَانَ فِيْ دُعَائِهِ: “اللَّهُمَّ اجْعَلْ فِيْ قَلْبِيْ نُوْرًا وَفِيْ بَصْرِيْ نُوْرًا وَفِيْ سَمْعِيْ نُوْرًا وَعَنْ يَّمِيْنِيْ نُوْرًا وَعَنْ يَّسَارِيْ نُوْرًا وَفَوْقِيْ نُوْرًا وَتَحْتِيْ نُوْرًا وَأَمَامِيْ نُوْرًا وَّخَلْفِيْ نُوْرًا وَاجْعَلْ لِّيْ نُوْرًا”.

وَزَادَ بَعْضُهُمْ: “وَفِيْ لِسَانِيْ نُوْرًا” وَّذَكَرَ: “وَعَصَبِيْ وَلَحْمِيْ وَدَمِيْ وَشَعْرِيْ وَبَشَرِيْ.

وَفِيْ رِوَايَةٍ لَّهُمَا: “وَاجْعَلْ فِيْ نَفْسِيْ نُوْرًا وَأَعْظِمْ لِيْ نُوْرًا”.

وَفِيْ أُخْرَى لِمُسْلِمٍ: “اَللَّهُمَّ أَعْطِنِيْ نُوْرًا”.

1195. (8) [1/374ఏకీభవితం]

ఇబ్నె ‘అబ్బాస్‌ (ర) కథనం: ఒక రోజు రాత్రి నేను మా పిన్ని మైమూనహ్ (ర) ఇంట్లో ఉండిపోయాను. ఆ రోజు రాత్రి ప్రవక్త (స) మైమూనహ్ (ర) ఇంటిలోనే ఉన్నారు. ప్రవక్త (స) కొంతసేపు తన ఇంటివారితో మాట్లాడారు. ఆ తరువాత నిద్రపోయారు. రాత్రి చివరి భాగం లేదా అంతకన్నాముందు మేల్కొని కూర్చున్నారు. ఆకాశం వైపు చూచి: ”ఇన్న ఫీ ‘ఖల్‌ ఖిస్సమావాతి వల్‌ అర్‌’ది, వ’ఖ్‌తిలాఫిల్‌ లైలి, వన్నహారి ల ఆయాతిన్‌ లిఊలిల్‌ అల్‌బాబ్‌ ….”(సూ. అల్ బఖరహ్, 2:164) సూరహ్‌ చివరి వరకు పఠించారు. ఆ తరువాత నీటి కుండ దగ్గర నిలబడి దాని మూత విప్పి ముంతలో నీళ్ళు తీసుకొని చక్కగా వు’దూ చేశారు. చాలినన్ని నీళ్ళే ఉపయోగించారు. ఆ తరువాత నిలబడి తహజ్జుద్‌ నమా’జ్‌ ప్రారంభించారు. అది చూసి నేను కూడా నిలబడి వు’జూ చేసి ప్రవక్త (స)కు ఎడమవైపు నిలబడ్డాను. ప్రవక్త (స) నా చెవిపట్టుకొని కుడి వైపు నిలబెట్టారు. ప్రవక్త (స) 13 రకా’త్‌లు పూర్తిచేసు కున్నారు. ఆ తరువాత ప్రవక్త (స) పండుకున్నారు. చివరికి ప్రవక్త (స) ముక్కునుండి శబ్దం రాసాగింది. ప్రవక్త(స) నిద్రలో ఉన్నప్పుడు శబ్దం వచ్చేది. ఆ తరువాత బిలాల్‌ వచ్చి ప్రవక్త(స)కు నమా’జు గురించి తెలియపరిచారు. ప్రవక్త (స) ఫజ్ర్‌ యొక్క 2 రకాతుల సున్నత్‌ చదివారు. మళ్ళీ వు’దూ చేయలేదు. సున్నతులు, ఫ’ర్ద్ల్ మధ్య ఈ దు’ఆ చదివారు.

”అల్లాహుమ్మజ్‌అల్‌ ఫీ ఖల్‌బీ నూరన్‌, వబ’సరీ నూరన్‌, వఫీ సమ్‌’యీ నూరన్‌, వ’అన్‌యమీనీ నూరన్‌, వఅన్‌యసారీ నూరన్‌, వఫౌఖీ నూరన్‌, వతహ్‌తీ నూరన్‌, వఅమూమీ నూరన్, వ’ఖల్‌ఫీ నూరన్‌, వజ్‌’అల్లీ నూరన్‌, వఫీ లిసానీ నూరన్, వ ఫీ ‘అ’సబీ నూరన్‌, వఫీ ల’హ్‌మీ నూరన్‌, వదమీ నూరన్‌, వషఅరీ నూరన్‌, వబష్‌రీ నూరన్‌, వజ్‌’అల్‌ ఫీ నఫ్‌సీ నూరన్‌, వ అ’అ”జమ్‌ లీ నూరన్‌ అల్లాహుమ్మ ఆ’అతినీ నూరన్‌.” — ‘ఓ అల్లాహ్‌! నా హృదయంలో వెలుగును ప్రసాదించు, నా కళ్ళల్లో వెలుగును ప్రసాదించు, నా చెవులలో వెలుగును ప్రసాదించు, నా కుడివైపు వెలుగును ప్రసాదించు, నా ఎడమవైపు వెలుగును ప్రసాదించు, నా పైన వెలుగును ప్రసాదించు, నా క్రింద వెలుగును ప్రసాదించు, నా ముందు వెలుగును ప్రసాదించు, నా వెనుక వెలుగును ప్రసాదించు, నా కోసం వెలుగు ప్రసాదించు, నా నాలుకలో వెలుగును ప్రసాదించు, నా నరాలలో వెలుగును ప్రసాదించు, నా మాంసంలో వెలుగును ప్రసాదించు, నా రక్తంలో వెలుగును ప్రసాదించు, నా వెంట్రుకల్లో వెలుగును ప్రసాదించు, నా చర్మం (శరీరం) లో వెలుగును ప్రసాదించు, నా హృదయం (మనస్సు) లో వెలుగును ప్రసాదించు, ఇంకా నా వెలుగును ఉత్తమం చేయి, ఇంకా నాకు వెలుగే వెలుగు ప్రసాదించు.” (బు’ఖారీ, ముస్లిమ్‌)

1196 – [ 9 ] ( صحيح ) (1/375)

وَعَنْهُ: أَنَّهُ رَقَدَ عِنْدَ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم فَاسْتَيْقَظَ فَتَسَوَّكَ وَتَوَضَّأَ وَهُوَ يَقُوْلُ: (إِنَّ فِيْ خَلْقِ السَّمَاوَاتِ وَالْأَرْضِ-2: 164) حَتَّى خَتَمَ السُّوَرَةَ ثُمَّ قَامَ فَصَلَّى رَكْعَتَيْنِ أَطَالَ فِيْهِمَا الْقِيَامَ وَالرُّكُوْعَ وَالسُّجُوْدَ. ثُمَّ انْصَرَفَ فَنَامَ حَتَّى نَفَخَ. ثُمَّ فَعَلَ ذَلِكَ ثَلَاثَ مَرَّاتٍ سِتَّ رَكَعَاتٍ كُلّ ذَلِكَ يَسْتَاكُ وَيَتَوَضَّأُ وَيَقْرَأُ هَؤُلَاءِ الْآيَاتِ. ثُمَّ أَوْتَرَبِثَلَاثٍ. رَوَاهُ مُسْلِمٍ.

1196. (9) [1/375దృఢం]

ఇబ్నె ‘అబ్బాస్‌ (ర) కథనం: ఒక రోజు రాత్రి ప్రవక్త (స) ఇంట్లో ఉన్నాను. ప్రవక్త (స) రాత్రి మేల్కొన్నారు. మిస్వాక్‌ చేశారు, వు’దూ చేశారు, ఇంకా ఈ ఆయతు నుండి సూరహ్‌ చివరి వరకు చదివారు. ”ఇన్న ఫీ ఖల్‌ఖిస్సమా వాతి… ”(సూ. అల్-బఖరహ్, 2:164) ఆ తరువాత ప్రవక్త (స) నిలబడి రెండేసి రకాత్‌లు తహజ్జుద్‌ నమా’జును ఆచరించారు. వీటిలో ఇతర నమా’జులకంటే ఖియామ్‌ రుకూ’, సజ్దాలు, దీర్ఘంగా చేశారు. చదివిన తర్వాత నిద్రపోయారు, గురకలు కొట్టసాగారు. రాత్రంతా ఈ విధంగా మూడుసార్లు చేశారు. 6 రక’అత్‌లు చదివారు. ప్రతిసారి మిస్వాక్‌ చేసి, వు’దూ చేసి పై ఆయతులు పఠించారు. చివరిగా 3 రక’అత్‌లు విత్ర్‌ చదివారు. (ముస్లిమ్‌)

1197 – [ 10 ] ( صحيح ) (1/375)

وَعَنْ زَيْدِ بْنِ خَالِدٍ الْجُهْنِّيْ أَنَّهُ قَالَ: لِأَرْمُقَنَّ صَلَاةَ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم اللَّيْلَةَ فَصَلَّى رَكْعَتَيْنِ خَفِيْفَتَيْنِ ثُمَّ صَلّى رَكْعَتَيْنِ طَوِيْلَتَيْنِ طَوِيْلَتَيْنِ طَوِيْلَتَيْنِ. ثُمَّ صَلَّى رَكْعَتَيْنِ وَهُمَا دُوْنَ اللَّتَيْنِ قَبْلَهُمَا. ثُمَّ صَلَّى رَكْعَتَيْنِ وَهُمَا دُوْنَ اللَّتَيْنِ قَبْلَهُمَا ثُمَّ صَلَّى رَكْعَتَيْنِ وَهُمَا دُوْنَ اللَّتَيْنِ قَبْلَهُمَا [ثُمَّ صَلَّى رَكْعَتَيْنِ وَهُمَا دُوْنَ اللَّتَيْنِ قَبْلَهُمَا] ثُمَّ أَوْتَرَ فَذَلِكَ ثَلَاثَ عَشَرَةَ رَكْعَةً. رَوَاهُ مُسْلِمٌ قَوْلُهُ: ثُمَّ صَلَّى رَكْعَتَيْنِ وَهُمَا دُوْنَ اللَّتَيْنِ قَبْلَهُمَا أَرْبَعَ مَرَّاتٍ. هَكَذَا فِيْ صَحِيْحِ مُسْلِمٍ. وَأَفْرَادَهُ مِنْ كِتَابِ الْحُمَيْدِيِّ وَمُوَطَّأِ مَالِكٍ. وَسُنَنِ أَبِيْ دَاوُدَ. وَجَامِعِ الْأُصُوْلِ.

1197. (10) [1/375దృఢం]

‘జైద్‌ బిన్‌ ‘ఖాలిద్‌ జుహ్‌నీ (ర) కథనం: ఒకసారి అతను, ”ఈ రోజు ప్రవక్త (స) తహజ్జుద్‌ నమా’జు ఎలా ఉంటుందో చూస్తాను,” అని అనుకొని, చూసి, ఇలా పేర్కొన్నారు, ”అన్నిటి కంటే ముందు ప్రవక్త (స) రెండు రక’అతులు తేలిగ్గా చదివారు. ఆ తరువాత 2 రకా’త్‌లు దీర్ఘంగా చదివారు. ఆ తరువాత 2 రకా’త్‌లు మధ్యస్థంగా చదివారు. మళ్ళీ 2 రకా’త్‌లు వాటి కంటే తేలిగ్గా చదివారు. ఆ తరువాత విత్ర్‌ చదివారు. అన్నీ కలిపి 13 రకాత్‌లు అయ్యాయి. అంటే రెండేసి రకాత్‌లు 4 సార్లు వచ్చాయి.” (‘స’హీ’హ్ ముస్లిమ్‌, ‘హుమైది, మువ’త్తా ఇమామ్‌ మాలిక్‌, జామి’ఉల్‌ ఉ’సూల్‌)

1198 – [ 11 ] ( متفق عليه ) (1/376)

وَعَنْ عَائِشَةَ رَضِيَ اللهُ عَنْهَا قَالَتْ: لَمَّا بَدَّنَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم وَثَقُلَ كَانَ أَكْثَرُ صَلَاتِهِ جَالِسًا.

1198. (11) [1/376ఏకీభవితం]

‘ఆయి’షహ్‌ (ర) కథనం: చివరికాలంలో, ప్రవక్త (స) శరీరం బరువైపోయింది. అందువల్ల ప్రవక్త (స) తరచూ కూర్చొనే నమా’జు చదివేవారు. (బు’ఖారీ, ముస్లిమ్)

1199 – [ 12 ] ( متفق عليه ) (1/376)

وَعَنْ عَبْدِ اللهِ بْنِ مَسْعُوْدٍ قَالَ: لَقَدْ عَرَفْتُ النَّظَائِرَ الَّتِيْ كَانَ النَّبِيُّ صلى الله عليه وسلم يَقْرُنُ بَيْنَهُنَّ فَذَكَرَعِشْرِيْنَ سُوْرَةً مِّنْ أَوَّلِ الْمُفَصَّلِ عَلَى تَأْلِيْفِ ابْنِ مَسْعُوْدٍ سُوْرَتَيْنِ فِيْ رَكْعَةً آخِرُهُنَّ (حم الدُّخَانِ-44) وَ (عَمَّ يَتَسَاءَلُوْنَ-78)

1199. (12) [1/376ఏకీభవితం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ మస్‌’ఊద్‌ (ర) కథనం: నాకు పరస్పరం సమానంగా ఉన్న ఆ సూరాల గురించి నాకు తెలుసు. ప్రవక్త (స) ఈ రెండు సూరాలను ఒక్కొక్క రక’అత్‌లో కలిపి చదివేవారు. ప్రారంభ ముఫ’స్సల్‌ లోని 20 సూరాలను గురించి పేర్కొన్నారు. ఈ విధంగా ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ మస్‌’ఊద్‌ ఖుర్‌ఆన్‌లో వ్రాయబడి ఉంది. ప్రవక్త (స) ఒక రక’అత్‌లో రెండేసి సూరాలు చదివేవారు. ఈ 20 సూరాల్లో చివరి రెండు సూరాలు ‘హా-మీమ్‌, దు’ఖాన్‌ (44), అమ్మ యతసాఅ’లూన్‌  (78) ఉన్నాయి. [76]  (బు’ఖారీ, ముస్లిమ్‌)

—–

اَلْفَصْلُ الثَّانِيْ  రెండవ విభాగం  

1200 – [ 13 ] ( صحيح ) (1/376)

عَنْ حُذَيْفَةَ: أَنَّهُ رَأَى النَّبِيَّ صلى الله عليه وسلم يُصَلِّيْ مِنَ اللَّيْلِ وَكَانَ يَقُوْلُ: “اللهُ أَكْبَرُ”- ثَلَاثًا. “ذُو الْمَلَكُوْتِ وَالْجَبْرُوْتِ وَالْكِبْرِيَاءِ وَالْعَظْمَةِ”. ثُمَّ اسْتَفْتَحَ فَقَرَأَ الْبَقَرَةَ ثُمَّ رَكَعَ فَكَانَ رُكُوْعُهُ نَحْوًا مِّنْ قِيَامِهِ فَكَانَ يَقُوْلُ فِيْ رُكُوْعِهِ: “سُبْحَانَ رَبِّيَ الْعَظِيْمِ”. ثُمَّ رَفَعَرَأْسَهُ مِنَ الرُّكُوْعِ. فَكَانَ قِيَامُهُ نَحْوًا مِّنْ رُّكُوْعِهِ يَقُوْلُ: “لِرَبِّيَ الْحَمْدُ”.  ثُمَّ سَجَدَ فَكَانَ سُجُوْدُهُ نَحْوًا مِّنْ قِيَامِهِ فَكَانَ يَقُوْلُ فِيْ سُجُوْدِهِ: “سُبْحَانَ رَبِّيَ الْأَعْلَى”. ثُمَّ رَفَعَ رَأْسَهُ مِنَ السُّجُوْدِ وَكَانَ يَقْعُدُ فِيْمَا بَيْنَ السَّجْدَتَيْنِ. نَحْوًا مِّنْ سُجُوْدِهِ وَكَانَ يَقُوْلُ: “رَبِّ اغْفِرْ لِيْ رَبِّ اغْفِرْ لِيْ”. فَصَلَّى أَرْبَعَ رَكَعَاتٍ قَرَأَ فِيْهِنَّ: (اَلْبَقْرَةَ-2 وَ آلَ عِمْرَانَ-3 وَ النِّسَاءَ-4 وَ الْمَائِدَةَ-5 أَوْ اَلْأَنْعَامَ-6) شَكَّ شُعْبَةُ. رَوَاهُ أَبْوُ دَاوُدَ.

1200. (14) [1/376దృఢం]

‘హుజై’ఫహ్ (ర) కథనం: నేను ప్రవక్త (స)ను రాత్రి తహజ్జుద్‌ నమా’జు చదువుతుండగా చూశాను, ”ప్రవక్త (స) తక్‌బీరె త’హ్రీమ పలికిన తరువాత మూడు సార్లు ‘అల్లాహు అక్బర్‌, జు’ల్‌ మలకూత్‌ వల్‌ జబరూత్‌ వల్‌ కిబ్‌రియాయి’, వల్‌ ‘అ”జ్‌మహ్‌’ చదివారు. ఆ తరువాత నమా’జు ప్రారంభించారు. సూరహ్‌ అల్ బఖరహ్‌ (2) చదివారు. ఆ తరువాత రుకూ’ చేశారు. ప్రవక్త (స) రుకూ’ కూడా ఖియామ్‌లా దీర్ఘంగా ఉంది. రుకూ’లో ”సుబ్‌’హాన రబ్బియల్‌ ‘అ”జీమ్‌” చది వారు. ఆ తరువాత రుకూ’ నుండి తల ఎత్తారు. ఆ తరువాత సజ్దా చేశారు. సజ్దా కూడా ఖియామ్‌లా దీర్ఘంగా ఉంది. సజ్దా లో, ”రబ్బి’గ్‌ఫిర్‌లీ, రబ్బి’గ్‌ ఫిర్‌లీ,” చదివారు. ఆ తరువాత సజ్దా నుండి తల ఎత్తారు, రెండుసజ్దాల మధ్య ఒక సజ్దాలో ఉన్నంత సేపు కూర్చున్నారు. ఈ విధంగా 4 రకా’త్‌లు చది వారు. వీటిలో సూరహ్‌ అల్-బఖరహ్‌ (2), సూరహ్‌ ఆ’ల ‘ఇమ్రాన్‌ (3), సూరహ్‌ అన్ నిసా’ (4), సూరహ్‌ అల్ అన్‌’ఆమ్‌ (6) చదివారు.” (అబూ దావూద్‌)

1201- [ 14 ] ( حسن ) (1/377)

وَعَنْ عَبْدِ اللهِ بْنِ عَمْرِو بْنِ الْعَاصِ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَنْ قَامَ بِعَشْرِآيَاتٍ لَمْ يَكْتَبْ مِنَ الْغَافِلِيْنَ. وَمَنْ قَامَ  بمِائَةِ آيَةٍ كُتِبَ مِنَ الْقَانِتِيْنَ. وَمَنْ قَامَ بِأَلْفِ آيَةٍ كَتِبَ مِنَ الْمُقَنْطِرِيْنَ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ.

1201. (14) [1/377ప్రామాణికం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘అమ్ర్ బిన్‌ ‘ఆ’స్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”నమా’జులో 10 ఆయతులు చదివితే, ఏమరుపాటుకు గురికాని వాడుగా లిఖించబడతాడు. నమా’జులో 100 ఆయతులు పఠించిన వారు విధేయుల్లో లిఖించబడతారు. నమా’జులో 1000 ఆయతులు చదివిన వారు అధిక పుణ్యం సంపాదించే వారిలో లిఖించబడతారు.” [77]  (అబూ దావూద్‌)

1202 – [ 15 ] ( ضعيف ) (1/377)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: كَانَ قِرَاءَةُ النَّبِيِّ صلى الله عليه وسلم بِاللَّيْلِ يَرْفَعُ طَوْرًا وَيَخْفِضُ طَوْرًا. رَوَاهُ أَبُوْ دَاوُدَ .

1202. (15) [1/377బలహీనం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) రాత్రి అనేక విధాలుగా పఠించేవారు. ఒంటరిగా ఉంటే బిగ్గరగా చదివేవారు. ఒక వేళ చుట్టుప్రక్కల ప్రజలు పడుకొని ఉంటే మెల్లగా ఖుర్‌ఆన్‌ చదివేవారు. అంటే బిగ్గరగా, మెల్లగా చదివేవారు. (అబూ దావూద్‌)

1203 – [ 16 ] ( حسن ) (1/377)

وَعَنِ ابْنِ عَبَّاسٍ قَالَ: كَانَتْ قِرَاءَةُ النَّبِيِّ صلى الله عليه وسلم عَلَى قَدْرِمَا يَسْمَعُهُ مَنْ فِيْ الْحُجُرَةِ وَهُوَفِيْ الْبَيْتِ.رَوَاهُ أَبُوْ دَاوُدَ

1203. (16) [1/377ప్రామాణికం]

ఇబ్నె ‘అబ్బాస్‌ (ర) కథనం: ప్రవక్త (స) ఎంత బిగ్గరగా చదివే వారంటే, ఒకవేళ ప్రవక్త (స) ఇంట్లో చదివితే ప్రాంగణంలో ఉన్నవారు వినేవారు. (అబూ దావూద్‌)

1204 – [ 17 ] ( صحيح ) (1/377)

وَعَنْ أَبِيْ قَتَادَةَ قَالَ: إِنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم خَرَجَ لَيْلَةً فَإِذَا هُوَ بِأَبِيْ بَكْرٍ يُّصَلِّيْ يَخْفِضُ مِنْ صَوْتِهِ وَمَرَّ بِعُمَرَ وَهُوَ يُصَلِّيْ رَافِعًا صَوْتَهُ قَالَ: فَلَمَّا اجْتَمَعَا عِنْدَ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ: “يَا أَبَا بَكْرٍ مَرَرْتُ بِكَ وَأَنْتَ تُصَلِّيْ تَخْفِضُ صَوْتَكَ”. قَالَ: قَدْ أَسْمَعْتُ مَنْ نَّاجَيْتُ يَا رَسُوْلَ اللهِ. وَقَالَ لِعُمَرَ: “مَرَرْتُ بِكَ وَأَنْتَ تُصَلِّيْ رَافِعًا صَوْتَكَ”. فَقَالَ: يَا رَسُوْلَ اللهِ أَوْقِظُ الْوَسْنَانَ وَأَطْرُدُ الشَّيْطَانَ. فَقَالَ النَّبِيُّ صلى الله عليه وسلم: “يَا أَبَا بَكْرٍ ارْفَعْ مِنْ صَوْتِكَ شَيْئًا”. وَقَالَ لِعُمَرَ: “اخْفِضْ مِنْ صَوْتِكَ شَيْئًا”. رَوَاهُ أَبُوْ دَاوُدَ. وَرَوَى التِّرْمِذِّي نَحْوَهُ.

1204. (17) [1/377దృఢం]

అబూ ఖతాదహ్‌ (ర) కథనం: ఒకరోజు రాత్రి ప్రవక్త (స) బయటకు వెళ్ళారు. ప్రవక్త (స) అబూ బక్ ర్‌ (ర) ఇంటివైపు వెళ్ళారు.  అప్పుడు అబూ బక్ ర్‌ (ర) తహజ్జుద్‌ నమా’జు చదువుతున్నారు. ఖుర్‌ఆన్‌ మెల్లమెల్లగా చదువుతున్నారు. ఆ తరువాత ‘ఉమర్‌ ఇంటివైపు వెళ్ళారు. అతను తహజ్జుద్‌ నమా’జులో ఖుర్‌ఆన్‌ బిగ్గరగా చదువుతున్నారు. మరునాడు వీరిద్దరూ ప్రవక్త (స) వద్దకు వెళ్ళినపుడు, ప్రవక్త (స) వారితో, ‘అబూ బకర్‌ నేను మీ ఇంటి ప్రక్కనుండి వెళ్ళాను. నీవు ఖుర్‌ఆన్‌ మెల్లగా చదువుతున్నావు’ అని అన్నారు. దానికి అతను ‘ఓ ప్రవక్తా! నేను మాట్లాడుతున్న వానికి వినిపిస్తున్నాను. అతడు మెల్లగానూ వింటాడు, బిగ్గరగానూ వింటాడు,’ అని అన్నారు. ఆ తరువాత ప్రవక్త (స) ‘ఉమర్‌తో, ‘నేను మీ ఇంటి వైపునుండి వెళ్ళాను. నీవు తహజ్జుద్‌ నమా’జులో ఖుర్‌ఆన్‌ను బిగ్గరగా చదువుతున్నావు’ అని అన్నారు. దానికి ‘ఉమర్‌ (ర) పడుకున్నవారిని లేపటానికి, షై’తానులను తరిమివేయటానికి నేను బిగ్గరగా చదివాను,’ అని అన్నారు. దానికి ప్రవక్త (స), ‘ఓ అబూ బకర్‌ నీవు నీ శబ్దాన్ని కొంతపెంచు,’ అని. ‘ఉమర్‌తో, ‘నీవు నీ శబ్దాన్ని కొంత తగ్గించు,’ అని అన్నారు. (తిర్మిజి’)

1205 – [ 18 ] ( صحيح ) (1/378)

وَعَنْ أَبِيْ ذَرٍّ قَالَ: قَامَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم حَتَّى أَصْبَحَ بِآيَةِ وَّالْآيَةُ: (إِنْ تُعَذّبْهُمْ فَإِنَّهُمْ عِبَادُكَ وَإِنْ تَغْفِرْلَهُمْ فَإِنَّكَ أَنْتَ الْعَزِيْزُ  الْحَكِيْمُ-5: 118) رَوَاهُ النَّسَائِيُّ وَابْنُ مَاجَهُ .

1205. (18) [1/378దృఢం]

అబూజ’ర్‌ (ర) కథనం: ప్రవక్త (స) తహజ్జుద్‌ కోసం నిలబడ్డారు. ఉదయం వరకు ఈ ఒక్క ఆయతునే పఠిస్తూ ఉన్నారు. ”ఇన్‌ తు’అజ్జి’బ్‌హుమ్‌ ఫ ఇన్నహుమ్‌ ‘ఇబాదుక, వ ఇన్‌ త’గ్‌ఫిర్‌ లహుమ్‌, ఫ ఇన్నక అన్‌తల్‌ ‘అ’జీ’జుల్‌ ‘హకీమ్.” (అల్ మాయిదహ్, 5:118) [78]. (నసాయి’, ఇబ్నె మాజహ్)

1206 – [ 19 ] ( صحيح ) (1/378)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِذَا صَلَّى أَحَدُكُمْ رَكْعَتَيِ الْفَجْرِ فَلْيَضْطَجِعْ عَلَى يَمِيْنِهِ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَأَبُوْ دَاوُدَ .

1206. (19) [1/378దృఢం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మీలో ఎవరైనా ఫజ్ర్‌ సున్నతులు చదువుకుని, కుడి ప్రక్కకు తిరిగి పరుండాలి. దానివల్ల తహజ్జుద్‌ అలసట కొంత తగ్గుతుంది.” (తిర్మిజి’, అబూ దావూద్‌)

—–

اَلْفَصْلُ الثَّالِثُ  మూడవ విభాగం  

1207 – [ 20 ] ( متفق عليه ) (1/378)

عَنْ مَسْرُوْقٍ قَالَ: سَأَلْتُ عَائِشَةَ: أَيُّ الْعَمَلِ كَانَ أَحَبَّ إِلَى رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم؟ قَالَتْ: الدَّائِمُ. قُلْتُ: فَأَيَّ حِيْنَ كَانَ يَقُوْمُ مِنَ اللَّيْلِ؟ قَالَتْ: كَانَ يَقُوْمُ إِذَا سَمِعَ الصَّارِخَ .

1207. (20) [1/378ఏకీభవితం]

మస్‌రూఖ్‌ (ర) కథనం: నేను ‘ఆయి’షహ్‌ (ర)ను, ‘ప్రవక్త (స)కు ఏపని అన్నింటి కంటే ప్రియమైనది,’ అని అడిగాను. దానికి ‘ఆయి’షహ్‌ (ర) ‘ఎల్లప్పుడూ చేస్తూ ఉన్నది,’ అని అన్నారు. మళ్ళీ నేను, ‘ప్రవక్త (స) తహజ్జుద్‌ నమా’జు కొరకు ఎప్పుడు మేల్కొనే వారు,’ అని అడిగాను. దానికి ఆమె ‘కోడి కూత వినగానే లేచేవారు,’ అని అన్నారు. (నసాయి’)

1208 – [ 21 ] ( صحيح ) (1/379)

وَعَنْ أَنَسٍ قَالَ: مَا كُنَّا نَشَاءُ أَنْ نَرَى رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم فِيْ اللَّيْلِ مُصَلِّيًا إِلَّا رَأَيْنَاهُ وَلَا نَشَاءُ أَنْ نَرَاهُ نَائِمًا إِلَّا رَأَيْنَاهُ. رَوَاهُ النّسَائِيُّ

1208. (21) [1/379దృఢం]

అనస్‌ (ర) కథనం: ప్రవక్త (స)ను రాత్రి నమా’జు స్థితిలో చూడాలనుకుంటే మేము ప్రవక్త (స)ను నమా’జు స్థితిలో చూసుకునే వాళ్ళం. అదేవిధంగా మేము రాత్రి ప్రవక్త (స)ను పడుకునే స్థితిలో చూడాలనుకుంటే, ప్రవక్త (స)ను పడుకున్న స్థితిలో చూసుకునే వాళ్ళం. అంటే ప్రవక్త (స) రాత్రి పడుకునే వారు, ఇంకా తహజ్జుద్‌ కోసం మేల్కునే వారు. అంటే ప్రవక్త (స) రాత్రంతా నమా’జు చదివేవారు కాదు లేదా రాత్రంతా పడుకునేవారునూ కాదు. (నసాయి’)

1209 – [ 22 ] ( صحيح ) (1/379)

وَعَنْ حُمَيْدِ بْنِ عَبْدِ الرَّحْمَنِ بْنِ عَوْفٍ قَالَ: إِنَّ رَجُلًا مِّنْ أَصْحَابِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ: قُلْتُ وَأَنَا فِيْ سَفْرٍ مَّعَ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم: وَاللهِ لأرْقُبَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم لِلصَّلَاةِ حَتَّى أَرَى فَعَلَهُ. فَلَمَّا صَلَّى صَلَاةَ الْعِشَاءِ وَهِيَ الْعَتَمَةُ اِضْطَجَعَ هَوِيًّا مِّنَ اللَّيْلِ ثُمَّ اسْتَيْقَظَ فَنَظَرَ فِيْ الْأُفُقِ. فَقَالَ: (…رَبَّنَا مَا خَلَقْتَ هَذَا بَاطِلًا حَتَّى بَلَغَ إِلَى إِنَّكَ لَا تُخْلِفُ الْمِيْعَادَ-3: 191-194) ثُمَّ أُهْوَى رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم إِلَى فَرَاشِهِ فَاسْتَلَّ مِنْهُ سِوَاكًا. ثُمَّ أَفْرَغَ فِيْ قَدَحٍ مِّنْ إِدَاوَةٍ عِنْدَهُ مَاءً فَاسْتَنَّ ثُمَّ قَامَ فَصَلَّى حَتَّى قُلْتُ: قَدْ صَلَّى قَدْرَ مَا نَامَ. ثُمَّ اضْطَجَعَ حَتَّى قُلْتُ قَدْ نَامَ. قَدْرَ مَا صَلَّى ثُمَّ اسْتَيْقَظَ. فَفَعَلَ كَمَا فَعَلَ أَوَّلَ مَرَّةٍ. وَقَالَ مِثْل مَا قَالَ. فَفَعَلَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم ثَلَاثَ مَرَّاتٍ قَبْلَ الْفَجْرِ. رَوَاهُ النَّسَائِيُّ

1209. (22) [1/379దృఢం]

‘హుమైద్‌ బిన్‌ ‘అబ్దుర్ర’హ్మాన్‌ బిన్‌ ‘ఔఫ్‌ (ర) కథనం: ప్రవక్త (స) అనుచరుల్లో ఒక అనుచరుడి కథనం: నేను ప్రవక్త (స) వెంట ప్రయాణంలో ఉన్నాను. అల్లాహ్ సాక్షి! ప్రవక్త (స) తహజ్జుద్‌ నమా’జు చదువుతుండగా నేను చూశాను. అది చూసి నేను కూడా అలాగే ఆచరించాలని, అనుకున్నాను. అనంతరం ప్రవక్త (స) ‘ఇషా’ నమా’జు చదువుకున్నారు. దీన్ని ‘అతమహ్‌ అని కూడా అంటారు. చాలాసేపు వరకు పడుకున్నారు. ఆ తరువాత మేల్కొన్నారు. ఆకాశం వైపు దృష్టి సారించి ఈ ఆయతు చదివారు: ”…రబ్బనా మా ‘ఖలఖ్‌తహాజా బాతిలన్‌…” నుండి ”లాతు’ఖ్‌లిఫుల్‌ మీ’ఆద్‌.” వరకు, (సూ. ఆల ఇమ్రాన్, 3:191-194). ఆ తరువాత పడకపై ఉన్న మిస్వాక్‌ను చేతిలో తీసుకున్నారు. తొట్టెలో నుండి ముంతలో నీళ్ళు తీసుకున్నారు. మిస్వాక్‌ చేసారు, వు’దూ చేసారు. ఆ తరువాత తహజ్జుద్‌ నమా’జు కోసం నిలబడ్డారు. పడుకున్నంత సేపు నమా’జు చదివారు. ఆ తరువాత పడుకున్నారు. నమా’జు చదివినంత సేపు పడుకున్నారని నేను అనుకు న్నాను. మళ్ళీ ప్రవక్త (స) మేల్కొన్నారు. మళ్ళీ ఇంతకు ముందు చేసినట్టే చేశారు. రాత్రంతా ఫజ్ర్‌కు ముందు మూడుసార్లు ఇలా చేశారు. (నసాయి’)

1210 – [ 23 ] ( صحيح ) (1/379)

وَعَنْ يَّعْلَى بْنِ مَمْلَكٍ أَنَّهُ سَأَلَ أُمَّ سَلَمَةَ زَوْجَ النَّبِيِّ صلى الله عليه وسلم عَنْ قِرَاءَةِ النَّبِيٍّ صلى الله عليه وسلم وَصَلَاتَهُ؟ فَقَالَتْ: وَمَا لَكُمْ وَصَلَاتُهُ؟ كَانَ يُصَلِّيْ ثُمَّ يَنَامُ قَدْرَ مَا صَلَّى ثُمَّ يُصَلِّيْ قَدْرَ مَا نَامَ ثُمَّ يَنَامُ قَدْرَ مَا صَلَّى حَتَّى يُصْبِحَ ثُمَّ نَعَتَتْ قِرَاءَتَهُ فَإِذَا هِيَ تَنْعَتُ قِرَاءَةً مُّفَسَّرَةً حَرْفًا حَرْفًا) رَوَاهُ أَبُوْ دَاوُدَ وَالتِّرْمِذِيُّ وَالنَّسَائِيُّ .

1210. (23) [1/379దృఢం]

య’అలా బిన్‌ మమ్ లకి ప్రవక్త (స) భార్య ఉమ్మె సలమహ్ ను ప్రవక్త (స) ఖిరా’అత్‌, తహజ్జుద్‌ నమా’జు గురించి అడిగారు. దానికి ఉమ్మె సలమహ్ ”ప్రవక్త (స) ఖిరాఅత్‌ మరియు ఆయన తహజ్జుద్‌ నమా’జు వల్ల మీకేం లాభం. ఆయనలా ఖిరా’అత్‌ చేయలేరు, ఆయనలా తహజ్జుద్‌ చదవలేరు. తెలుసు కోవటం వల్ల మీకేం లాభం. అయినా సంక్షిప్తంగా చెప్తాను వినండి. ప్రవక్త (స) నమా’జు చదివే వారు, ఆ తరువాత నమా’జు చదివినంతసేపు విశ్రాంతి తీసుకునే వారు. మళ్ళీ విశ్రాంతి తీసుకున్నంత సేపు నమా’జు చదివేవారు. మళ్ళీ మేల్కొని విశ్రాంతి తీసుకున్నంతసేపు నమా’జు చదివేవారు. చివరికి తెల్లవారి పోయేది. అంటే రాత్రంతా ఈ విధంగా గడిచేది.” ఆ తరువాత ఉమ్మె సలమహ్ ఖిరా’అత్‌ గురించి ప్రస్తావిస్తూ, ”ప్రవక్త (స) ప్రతి అక్షరం స్పష్టంగా చదివేవారు,” అని చెప్పారు. (అబూ దావూద్‌, తిర్మిజి’, నసాయి’)

=====

32 – بَابُ مَا يَقُوْلُ إِذَا قَامَ مِنَ اللَّيْلِ

32. తహజ్జుద్నమాజులో ప్రవక్త () చదివిన దుఆలు

اَلْفَصْلُ الْأَوَّلُ  మొదటి విభాగం  

1211 – [ 1 ] ( متفق عليه ) (1/381)

عَنِ ابْنِ عَبَّاسٍ قَالَ: كَانَ النَّبِيُّ صلى الله عليه وسلم إِذَا قَامَ مِنَ اللَّيْلِ يَتَهَجَّدُ قَالَ: “اَللَّهُمَّ لَكَ الْحَمْدُ أَنْتَ قَيِّمُ السَّمَاوَاتِ وَالْأَرْضِ وَمَنْ فِيْهِنَّ، وَلَكَ الْحَمْدُ أَنْتَ نُوْرُ السَّمَاوَاتِ وَالْأَرْضِ وَمَنْ فِيْهِنَّ، وَلَكَ الْحَمْدُ أَنْتَ مَلِكُ السَّمَاوَاتِ وَالْأَرْضَ وَمَنْ فِيْهِنَّ، وَلَكَ الْحَمْدُ، أَنْتَ الْحَقُّ، وَوَعَدُكَ الْحَقُّ، وَلِقَاؤُكَ حَقٌّ، وَقَوْلُكَ حَقٌّ، وَالْجَنَّةُ حَقٌّ، وَالنَّارُحَقٌّ، وَالنَّبِيُّوْنَ حَقٌّ، وَّمُحَمَّدٌ حَقٌّ، وَالسَّاعَةُ حَقٌّ، اللَّهُمَّ لَكَ أَسْلَمْتُ، وَبِكَ آمَنْتُ، وَعَلَيْكَ تَوَكَّلْتُ، وَإِلَيْكَ أَنَبْتُ، وَبِكَ خَاصَمْتُ، وَإِلَيْكَ حَاكَمْتُ، فَاغْفِرْ لِيْ مَا قَدَّمْتُ وَمَا أَخَّرْتُ، وَمَا أَسْرَرْتُ وَمَا أَعْلَنْتُ، وَمَا أَنْتَ أَعْلَمُ بِهِ مِنِّيْ، أَنْتَ الْمُقَدِّمُ، وَأَنْتَ الْمُؤَخِّرُ، لَا إِلَهَ إِلَّا أَنْتَ، وَلَا إِلَهَ غَيْرُكَ”.

1211. (1) [1/381ఏకీభవితం]

ఇబ్నె ‘అబ్బాస్‌ (ర) కథనం: ప్రవక్త (స) తహజ్జుద్‌ నమా’జు చదవటానికి నిలబడినప్పుడు తక్‌బీరె త’హ్రీమ తరువాత ఈ దు’ఆ పఠించేవారు. ”అల్లా హుమ్మ లకల్‌ ‘హమ్‌దు, అన్‌త ఖయ్యిము స్సమా వాతి వల్‌అర్‌’ది, వమన్‌ ఫీహిన్న వలకల్‌’హమ్‌దు. అన్‌త నూరుస్స మావాతి వల్‌అర్‌’ది, వమన్‌ ఫీహిన్న, వలకల్‌ హమ్‌దు. అన్‌త మలికుస్సమా వాతి వల్‌ అర్‌’ది, వమన్‌ ఫీహిన్న, వలకల్‌ హమ్‌దు. అన్‌తల్‌ ‘హఖ్ఖు, వ వఅద కల్‌’హఖ్ఖు, వలిఖాఉ’క ‘హఖ్ఖున్‌. వఖౌలుక ‘హఖ్ఖున్‌. వల్‌జన్నతు హఖ్ఖున్‌. వన్నారు హఖ్ఖున్‌. వన్నబియ్యూన హఖ్ఖున్‌. వ ము’హమ్మదున్‌ హఖ్ఖున్‌. వస్సాఅతు హఖ్ఖున్‌. అల్లాహుమ్మ లక అస్‌లమ్‌తు, వబిక ఆమన్‌తు, వ అలైక తవక్కల్‌తు, వఇలైక అనబ్‌తు, వబిక ‘ఖా’సమ్‌తు, వ ఇలైక ‘హాకమ్‌తు, ఫగ్‌ఫిర్‌లీ మా ఖద్దమ్తు వమా అఖ్ఖర్‌తు, వమా అస్‌రర్‌తు వమా ఆ’అలన్ తు, వమా అన్‌త ఆ’అలము బిహీ మిన్నీ, అన్‌తల్‌ ముఖద్దిము, వఅన్‌తల్‌ ముఅ’ఖ్ఖిరు, లాయి లాహ ఇల్లా అన్‌త, వలా ఇలాహ ‘గైరుక.” ‘ఓ అల్లాహ్‌!  సర్వ స్తోత్రాలన్నీ  నీకొరకే, నీవే భూమ్యా-కాశాలను, వాటిలో ఉన్న వాటన్నింటినీ స్థాపించావు. సర్వ స్తోత్రాలన్నీ నీ కొరకే, నీవే భూమ్యా-కాశాలకు, వాటిలో  ఉన్న వాటన్నింటికీ వెలుగు ప్రసాదిస్తావు. స్తోత్రాలన్నీ నీ కోసమే. నీవే భూమ్యాకాశాలకు, వాటిలో ఉన్నవాటన్నిటికి చక్రవర్తివి. స్తోత్రాలన్నీ నీకోసమే. నీవే సత్యం. నీ వాగ్దానమే సత్యమైనది. నీ దర్శనమే సత్యమైనది. నీ పలుకే సత్యమైనది. స్వర్గం సత్యం, నరకం సత్యం. మరియు ప్రవక్తలందరూ సత్యం. మరియు ము’హమ్మద్‌ (స) సత్యం. మరియు తీర్పు దినం సత్యం. ఓ అల్లాహ్‌! నేను నీకు విధేయుడను అయ్యాను. మరియు నిన్నే విశ్వసించాను మరియు నిన్నే నమ్ముకున్నాను. మరియు నీవైపే మరలాను. మరియు నీ సహాయం తోనే పోరాడుతున్నాను. మరియు నిన్నే మొరపెట్టు కుంటున్నాను. కనుక నీవు ఇంతకు ముందు, ఇక ముందు, రహస్యంగా ఉన్నవి, బహిర్గతంగా ఉన్నవి, నీకు తెలిసిన పాపాలన్నిటినీ క్షమించు. ముందూ, వెనుకా చేసే వాడవు నీవే. నీవు తప్ప ఆరాధ్యులెవరూ లేరు, సత్కార్యాలు చేసే శక్తి, పాపాలకు దూరంగా ఉండే శక్తి నీవు తప్ప మరెవ్వరూ ప్రసాదించలేరు.” (బు’ఖారీ, ముస్లిమ్‌)

1212 – [ 2 ] ( صحيح ) (1/381)

وَعَنْ عَائِشَةَ قَالَتْ: كَانَ النَّبِيُّ صلى الله عليه وسلم إِذَا قَامَ مِنَ اللَّيْلِ افْتَتَحَ صَلَاتَهُ فقَالَ: “اللَّهُمَّ رَبَّ جِبْرِيْلَ وَمِيْكَائِيْلَ وَإِسْرَ افِيْلَ،  فَاطِرَ السَّمَاوَاتِ وَالْأَرْضِ، عَالِمَ الْغَيْبِ وَالشَّهَادَةِ، أَنْتَ تَحْكُمُ بَيْنَ عِبَادِكَ فِيْمَا كَانُوْا فِيْهِ يَخْتَلِفُوْنَ، اهْدِنِيْ لَمَّا اخْتُلِفَ فِيْهِ مِنَ الْحَقِّ بِإِذْنِكَ، إِنَّكَ تَهْدِيْ مَنْ تَشَاءُ إِلَى صِرَاطٍ مُّسْتَقِيْمٍ”. رَوَاهُ مُسْلِمٌ.

1212. (2) [1/381దృఢం]

‘ఆయి’షహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) రాత్రి తహజ్జుద్‌ నమా’జు చదవడానికి నిలబడినపుడు, ఈ దు’ఆ ద్వారా నమా’జు ప్రారంభించేవారు: ”అల్లాహుమ్మ రబ్బజిబ్రీల వ మీకాయీ’ల వ ఇస్రాఫీల. ఫా’తిర స్సమావాతి వల్‌అర్‌’ది. ఆలిమల్‌’గైబి వష్సహాదహ్‌. అన్‌త త’హ్‌కుము బైన ఇబాదిక ఫీమా కానూ ఫీహి య’ఖ్‌తలిఫూన్. ఇహ్దిని లిమ’ఖ్తులిఫ ఫీహి, మినల్‌ హఖ్ఖి బిఇ’జ్నిక. ఇన్నక తహ్‌దీ మన్‌తషాఉ ఇలా సిరా’తిమ్ ముస్తఖీమ్‌.” — ‘ఓ అల్లాహ్‌! జిబ్రీల్‌, మీకాయీ’ల్‌, ఇస్రాఫీల్‌ల ప్రభువా! భూమ్యా-కాశాలను సృష్టించినవాడా! గోచర అగోచరాలు తెలిసినవాడా! భేదాభిప్రాయాలకు గురైన నీ దాసుల మధ్య నీవే తీర్పుచేస్తావు. నేను మార్గం తప్పినప్పుడు నాకు, నీ అనుమతితో సత్యం వైపుకు మార్గదర్శకత్వం చేయి.  నిస్సందేహంగా నీవు కోరిన వారికి రుజుమార్గం వైపుకు మార్గదర్శకత్వం చేస్తావు.’ (ముస్లిమ్‌)

1213 – [ 3 ] ( صحيح ) (1/382)

وَعَنْ عُبَادَةَ بْنِ الصَّامِتِ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَنْ تَعَارَّ مِنَ اللَّيْلِ فَقَالَ: لَا إِلَهَ إِلَّا اللهُ  وَحْدَهُ لَا شَرِيْكَ لَهُ، لَهُ الْمُلْكُ، وَلَهُ الْحَمْدُ، وَهُوَ عَلَى كُلِّ شَيْءٍ قَدِيْرٌ، وَسُبْحَانَ اللهِ، وَالْحَمْدُ لِلهِ، وَلَا إِلَهَ إِلَّا اللهُ، وَاللهُ أَكْبَرُ، وَلَا حَوْلَ وَلَا قُوَّةَ إِلَّا بِاللهِ”. ثُمَّ قَالَ: “رَبِّ اغْفِرْ لِيْ” أَوْ قَالَ: ثُمَّ دَعَا؛ اسْتُجِيْبَ لَهُ، فَإِنْ تَوَضَّأَ وَصَلَّى .قُبِلَتْ صَلَاتُهُ”. رَوَاهُ الْبُخَارِيُّ.

1213. (3) [1/382దృఢం]

‘ఉబాదహ్‌ బిన్‌ ‘సామిత్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”రాత్రి మేల్కొని ఈ దు’ఆను చదివితే, అతని దు’ఆ స్వీకరించబడుతుంది. ఒకవేళ వు’జూ చేసి నమా’జు చదివితే, అతని నమా’జు కూడా స్వీకరించబడుతుంది.” ఆ దు’ఆ ఇది: ”లాఇలాహ ఇల్లల్లాహు. వ’హ్‌దహు లాషరీక లహు. లహుల్‌ ముల్కు వలహుల్‌ ‘హమ్‌దు, వహువ ‘అలాకుల్లి షైయి’న్‌ ఖదీర్‌. వ సుబ్‌హానల్లాహి, వల్‌హమ్‌ దులిల్లాహి, వలా యి’లాహ ఇల్లల్లాహు వల్లాహు అక్బర్‌, వలాహౌల వలాఖువ్వత ఇల్లాబిల్లాహి.  రబ్బి’గ్‌ఫిర్‌లీ.” — ‘అల్లాహ్‌ తప్ప ఆరాధ్యులెవరూ లేరు. ఆయన ఒకే ఒక్కడు. ఆయనకు సాటి ఎవ్వరూ లేరు. సర్వాధికారాలు ఆయనవే. స్తోత్రాలన్నీ ఆయన కొరకే. ప్రతి విషయంపై శక్తి గలవాడు. లోపాలన్నిటికీ అతీతుడు. స్తోత్రాలన్నీ ఆయన కొరకే. అల్లాహ్‌ తప్ప ఆరాధ్యులెవరూ లేరు. అల్లాహ్‌ అందరికంటే గొప్పవాడు, చెడులకు దూరంగా ఉండేశక్తి, సత్కార్యాలు చేసే శక్తి అల్లాహ్ భాగ్యం వల్లనే. కనుక ఓ అల్లాహ్‌ నన్ను క్షమించు.’ (బు’ఖారీ)

—–

اَلْفَصْلُ الثَّانِيُّ   రెండవ విభాగం 

1214 – [ 4 ] ( ضعيف ) (1/382)

وَعَنْ عَائِشَةَ رَضِيَ اللهُ عَنْهَا قَالَتْ: كَانَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم إِذَا اسْتَيْقَظَ مِنَ اللَّيْلِ قَالَ: “لَا إِلَهَ إِلَّا أَنْتَ سُبْحَانَكَ اللَّهُمَّ وَبِحَمْدِكَ اسْتَغْفِرُكَ لِذَنْبِيْ وَأَسْأَلُكَ رَحْمَتَكَ اللَّهُمَّ زِدْنِيْ عِلْمًا وَلَا تُزِغْ قَلْبِيْ بَعْدَ إِذْ هَدَيْتَنِيْ وَهَبْ لِيْ مِنْ لَّدُنْكَ رَحْمَةً إِنَّكَ أَنْتَ الْوَهَّابُ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ .

1214. (4) [1/382బలహీనం]

‘ఆయి’షహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) రాత్రి  మేల్కొని ఈ దు’ఆ చదివేవారు: ”లాయి’లాహ ఇల్లా అన్‌త.  సుబ్‌’హానక, అల్లాహుమ్మ, వబి’హమ్‌దిక. అస్త’గ్‌ ఫిరుక లి’జన్‌బీ. వఅస్‌అలుక ర’హ్‌మతక. అల్లా హుమ్మ ‘జిద్‌నీ ఇల్‌మా.  వలా తు’జిగ్‌ ఖల్‌బీ, బ’అద ఇజ్‌’ హదైతనీ. వహబ్‌లీ మిల్లదున్‌క రహ్‌మహ్. ఇన్నక అన్‌తల్‌వహ్హాబ్‌.” — ‘ఓ అల్లాహ్‌! నీవు తప్ప ఆరాధ్యులెవరూ లేరు. నీవు పరిశు ద్ధుడవు. ఓ అల్లాహ్‌!  స్తోత్రాలన్నీ నీ కొరకే. నేను, నిన్ను నా పాపాలకు క్షమాపణ కోరుతున్నాను. నీ కారుణ్యాన్ని కోరుతున్నాను. ఓ అల్లాహ్‌! నా జ్ఞానాన్ని అధికం చేయి. రుజుమార్గం ప్రసాదించిన తర్వాత నన్ను మార్గభ్రష్టత్వానికి గురిచేయకు. నాకు నీ ప్రత్యేక కారుణ్యాన్ని ప్రసాదించు. నిస్సందేహంగా నీవు అత్యధికంగా ప్రసాదించేవాడవు.’ (అబూ దావూద్‌)

1215 – [ 5 ] ( صحيح ) (1/382)

وَعَنْ مُّعَاذِ بْنِ جَبَلٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَا مِنْ مُّسْلِمٍ يَّبِيْتُ عَلَى ذِكْرٍ طَاهِرًا فَيَتَعَارُّ مِنَ اللَّيْلِ فَيَسْأَلُ اللهُ خَيْرًا إِلَّا أَعْطَاهُ اللهُ إِيَّاهُ”. رَوَاهُ أَحْمَدُ وَأَبُوْ دَاوُدَ .

1215. (5) [1/382దృఢం]

ము’ఆజ్‌ బిన్‌ జబల్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఒక ముస్లిమ్‌ వు’దూ చేసి అల్లాహ్ (త) స్మరణ చేస్తూ నిద్రపోయి, మళ్ళీ రాత్రి మేల్కొని అల్లాహ్‌ (త)ను ఏది కోరినా, అల్లాహ్‌ అతనికి ప్రసాదిస్తాడు.” (అ’హ్మద్‌, అబూ దావూద్‌)

1216 – [ 6 ] ( ضعيف ) (1/383)

وَعَنْ شُرَيْقِ الْهَوْزَنِيِّ قَالَ: دَخَلْتُ عَلَى عَائِشَةَ فَسَأَلْتُهَا: بِمَ كَانَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم يَفْتَتِحُ إِذَا هَبَّ مِنَ اللَّيْلِ فَقَالَتْ: سَأَلْتَنِيْ عَنْ شَيْءٍ مَا سَأَلَنِيْ عَنْهُ أَحَدٌ قَبْلَكَ. كَانَ إِذَا هَبَّ مِنَ اللَّيْلِ كَبَّرَ عَشْرًا، وَحَمِدَ اللهَ عَشْرًا، وَقَالَ: “سُبْحَانَ اللهِ وَبِحَمْدِهِ عَشْرًا”، وَقَالَ:”سُبْحَانَ الْمَلِكِ الْقُدُّوْسِ”عَشْرًا، وَّاَسْتَغْفَرَ اللهَ عَشْرًا، وَّهَلَّلَ عَشْرًا، ثُمَّ قَالَ: “اَللَّهُمَّ إِنِّيْ أَعُوْذُ بِكَ مِنْ ضِيْقِ الدُّنْيَا وَضِيْق يَوْمِ الْقِيَامَةِ” عَشْرًا، ثُمَّ يَفْتَتِحُ الصَّلَاةَ. رَوَاهُ أَبُوْ دَاوُدَ.

1216. (6) [1/383బలహీనం]

షురైఖ్ అల్‌ హౌ’జని (ర) కథనం: నేను ‘ఆయి’షహ్‌ (ర) వద్ద కు వెళ్ళాను. ‘ప్రవక్త (స) రాత్రి మేల్కొని ఏ దు’ఆను ముందు పఠిస్తారని’ అడిగాను. దానికి ‘ఆయి’షహ్‌(ర), ”ఇంతకు ముందు ఎవ్వరూ అడగ నటువంటి ప్రశ్న నువ్వు అడిగావు అని చెప్పి, ప్రవక్త (స) రాత్రి మేల్కొన్న తరువాత, 10 సార్లు అల్లాహు అక్బర్‌, 10 సార్లు అల్‌’హమ్‌దు లిల్లాహ్, 10 సార్లు సుబ్‌’హానల్లాహి వబి’హమ్‌దిహి, 10 సార్లు సుబ’హానల్లాహిల్ మలికిల్ ఖుద్దూస్, 10 సార్లు అస్త’గ్ ఫిరుల్లాహ్, 10 సార్లు లా యి’లాహ ఇల్లల్లాహ్‌, 10 సార్లు, అల్లాహుమ్మ ఇన్నీ అ’ఊజు’బిక మిన్‌ ‘దీఖి ద్దునియా వ ‘దీఖి యౌమిల్‌ ఖియామతి’ అని పఠిస్తారు.” — ‘ఓ అల్లాహ్‌! నేను ప్రాపంచిక కష్టాల నుండి, పరలోక పరీక్షల నుండి నీ శరణు కోరు తున్నాను.” ఆ తరువాత తహజ్జుద్‌ నమా’జు ప్రారంభించే వారు. [79] (అబూ దావూద్‌)

—–

الْفَصْلُ الثَّالِثُ  మూడవ విభాగం 

1217 – [ 7 ] ( صحيح ) (1/383)

عَنْ أَبِيْ سَعِيْدٍ قَالَ: كَانَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم إِذَا قَامَ مِنَ اللَّيْلِ كَبَّرَ ثُمَّ يَقُوْلُ:”سُبْحَانَكَ اللَّهُمَّ وَبِحَمْدِكَ وَتَبَارَكَ اسْمُكَ وَتَعَالَى جَدُّكَ وَلَا إِلَهَ غَيْرُكَ”. ثُمَّ يَقُوْلُ: “اللهُ أَكْبَرُ كَبِيْرًا”. ثُمَّ يَقُوْلُ: “أَعُوْذُ بِاللهِ السَّمِيْعُ الْعَلِيْمِ مِنَ الشَّيْطَانِ الرَّجِيْمِ مِنْ هَمْزِهِ وَنَفْخِهِ وَنَفْثِهِ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَأَبُوْ دَاوُدَ وَالنَّسَائِيُّ.

وَزَادَ أَبُوْ دَاوُدَ بَعْدَ قَوْلِهِ: “غَيْرُكَ” ثُمَّ يَقُوْلُ: “لَا إِلَهَ إِلَّا اللهُ” ثَلَاثًا وَفِيْ آخِرِالْحَدِيْثِ  ثُمَّ يَقْرَأُ.

1217. (7) [1/383దృఢం]

అబూ ‘సయీద్‌ ‘ఖుద్రీ (ర) కథనం: ప్రవక్త (స) రాత్రి తహజ్జుద్‌ నమా’జు కోసం నిలబడితే, ”అల్లాహు అక్బర్‌” అని అంటారు. ఆ తరువాత ”సుబ్‌’హాన కల్లాహుమ్మ వబి’హమ్‌దిక వతబార కస్ముక వత’ఆలా జద్దుక వలాయి లాహ ‘గైరుక” — ‘ఓ అల్లాహ్‌! నేను నీ పరిశుద్ధతను స్తుతిస్తున్నాను. నీ స్తోత్రం కొనియాడుతున్నాను. నీ నామం శుభకర మైనది. నీ ఔన్నత్యం చాలా గొప్పది. నీ తప్ప ఆరాధ్యులెవరూ లేరు.’ ఆ తరువాత, ”అల్లాహు అక్బర్‌ కబీరా” అని పలికిన తరువాత ”అ’ఊజు బిల్లాహి స్సమీ’యిల్‌ ‘అలీమ్‌ మినష్షైతా నిర్రజీమ్‌, మిన్‌హుమ్‌జిహి, వనఫ్‌’ఖిహి, వనఫ్‌సి’హి” — ‘వినే మరియు చూసే ఓ అల్లాహ్‌! షై’తాన్‌ నుండి, వాడి ప్రేరణల నుండి, వాడి అహంకారం నుండి, వాడి చెడు నుండి నీ శరణు కోరుతున్నాను.’ (తిర్మిజి’, అబూ దావూద్‌, నసాయి’)

అబూ దావూద్‌లో ఇది అధికంగా ఉంది, ”లా యిలా హ గైరుక” తర్వాత మూడుసార్లు ”లా యిలాహ ఇల్ల ల్లాహ్‌” పలికిన తరువాత ఖిరాఅత్‌ ప్రారంభించేవారు.

1218 – [ 8 ] ( صحيح ) (1/384)

وَعَنْ رَبِيْعَةَ بْنِ كَعْبِ الْأَسْلَمِيِّ قَالَ: كُنْتُ أَبِيْتُ عِنْدَ حُجْرَةِ النَّبِيِّ صلى الله عليه وسلم. فَكُنْتُ أَسْمَعُهُ إِذَا قَامَ مِنَ اللَّيْلِ يَقُوْلُ: “سُبْحَانَ رَبِّ الْعَالَمِيْنَ” الْهَوِيَّ ثُمَّ يَقُوْلُ: “سُبْحَانَ اللهِ وَبِحَمْدِهِ” الْهَوِيَّ. رَوَاهُ النَّسَائِيُّ وَلِلتِّرْمِذيُّ نَحْوَهُ وَقَالَ: هَذَا حَدِيْثٌ حَسَنٌ صَحِيْحٌ .

1218. (8) [1/384దృఢం]

రబీ’అహ్ బిన్‌ క’అబ్‌ అల్‌ అస్లమీ (ర) కథనం: నేను ప్రవక్త (స) గదికి సమీపంగా పడుకునేవాణ్ణి. ప్రవక్త (స) తహజ్జుద్‌ నమా’జుకు నిలబడినపుడు చాలాసేపు వరకు ఇలా పలకడం వినేవాడ్ని. ”సుబ్‌’హానరబ్బిల్‌ ‘ఆలమీన్‌ వ సుబ్‌’హానల్లాహి వబి’హమ్‌దిహి.” [80]  (నసాయి’, తిర్మిజి’ / ప్రామాణికం, దృఢం)

=====

33بَابُ التَّحْرِيْضِ عَلَى قِيَامِ اللَّيْلِ

33. తహజ్జుద్‌ (సలాతుల్లైల్‌)కై ప్రోత్సహించటం

اَلْفَصْلُ الْأَوَّلُ  మొదటి విభాగం 

1219 – [ 1 ] ( متفق عليه ) (1/385)

عَنْ أَبِيْ هُرَيْرَةَ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم قَالَ: “يَعْقِدُ الشَّيْطَانُ عَلَى قَافِيَةِ رَأْسِ أَحَدِكُمْ إِذَا هُوَ نَامَ ثَلَاثَ عُقِدَ يَّضْرِبُ عَلَى كُلِّ عُقْدَةٍ: عَلَيْكَ لَيْلٌ طَوِيْلٌ فَارْقُدْ. فَإِنِ اسْتَيْقَظَ فَذَكَرَ اللهَ انْحَلَّتْ عُقْدَةٌ فَإِنْ تَوَضَّأَ انْحَلَّتْ عُقْدَةٌ. فَإِنْ صَلَّى انْحَلَّتْ عُقْدَةٌ فَأَصْبَحَ نَشِيْطًا طَيِّبَ النَّفْسِ. وَإِلَّا أَصْبَحَ خَبِيْثَ النَّفْسِ كَسْلَانَ”.

1219. (1) [1/385ఏకీభవితం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మీలో ఎవరైనా పడుకున్నప్పుడు, షై’తాన్‌ అతని తల వెనుక భాగంలో మూడు ముళ్ళు వేస్తాడు. ప్రతి ముడికి, ”రాత్రి చాలా ఉంది, నిశ్చింతగా పడుకో,” అని మంత్రం చదువుతాడు. ఒకవేళ ఆ వ్యక్తి మేల్కొని అల్లాహ్‌ను స్మరిస్తే, ఒక ముడి వీడిపోతుంది. ఆ తరువాత అతడు వు’దూ చేస్తే మరోముడి వీడి పోతుంది, నమా’జు చదవ సాగితే మూడవముడి కూడా వీడిపోతుంది. ఉదయం ఆ వ్యక్తి సంతోషంగా, ఉత్సాహంగా ఉంటాడు. ఒకవేళ అలా చేయకపోతే ఉదయం వికారంగా, విచారంగా సోమరితనంతో లేస్తాడు.” [81] (బు’ఖారీ, ముస్లిమ్‌)

1220 – [ 2 ] ( متفق عليه ) (1/385)

وَعَنِ الْمُغِيْرَةِ قَالَ: قَامَ النَّبِيُّ صلى الله عليه وسلم حَتَّى تَوَرَّمَتْ قَدَمَاهُ فَقِيْلَ لَهُ: لَمْ تَصْنَعُ هَذَا وَقَدْ غُفِرَ لَكَ مَا تَقَدَّمَ مِنْ ذَنْبِكَ وَمَا تَأَخَّرَ؟ قَالَ: “أَفَلَا أَكُوْنَ عَبْدًا شَكُوْرًا”.

1220. (2) [1/385ఏకీభవితం]

ము’గీరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) తహజ్జుద్‌ నమా ‘జులో ఎంత అధికంగా నిలబడేవారంటే, ప్రవక్త (స) కాళ్ళు వాచిపోయేవి. ప్రవక్త (స)ను ‘తమరు ఇంత ఎందుకు శ్రమిస్తున్నారనీ, తమరి ముందూ, వెనుకా పాపాలు క్షమించబడ్డాయి కదా?’ అని విన్నవించు కోగా, ‘నేను కృతజ్ఞుడైన దాసుడను కాకూడదా?’ అని సమాధానం ఇచ్చారు. (బు’ఖారీ, ముస్లిమ్‌)

1221 – [ 3 ] ( متفق عليه ) (1/385)

وَعَنِ ابْنِ مَسْعُوْدٍ قَالَ: ذُكِرَ عِنْدَ النَّبِيِّ صلى الله عليه وسلم رَجُلٌ فَقِيْلَ لَهُ مَازَالَ نَائِمًا حَتَّى أَصْبَحَ مَا قَامَ إِلَى الصَّلَاةِ قَالَ: “ذَلِكَ رَجُلٌ بَالَ الشَّيْطَانُ فِيْ أُذُنِهِ” أَوْ قَالَ: “فِيْ أُذُنَيْهِ”.

1221. (3) [1/385ఏకీభవితం]

ఇబ్నె మస్‌’ఊద్‌ (ర) కథనం: ప్రవక్త (స) ముందు, ఉదయం వరకు పడుకుని, నమా’జు కోసం లేవని వ్యక్తి గురించి ప్రస్తావించటం జరిగింది. దానికి ప్రవక్త (స) ‘అతని చెవిలో షైతా’న్‌ మూత్రవిసర్జన చేస్తాడు లేదా అతని రెండు చెవులలో షై’తాన్‌ మూత్రవిసర్జన చేస్తాడు’ అని అన్నారు. [82] (బు’ఖారీ, ముస్లిమ్‌)

1222 – [ 4 ] ( صحيح ) (1/385)

وَعَنْ أُمِّ سَلَمَةَ قَالَتْ: اسْتَيْقَظَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم لَيْلَةً فَزِعًا يَقُوْلُ: “سُبْحَانَ اللهِ مَاذَا أُنْزِلَ اللَّيْلَةَ مِنَ الْخَزَائِنِ؟ وَمَاذَا أُنْزِلَ مِنَ الْفِتَنِ؟ مَنْ يُّوْقِظُ صَوَاحِبَ الْحُجُرَاتِ”. يُرِيْدُ أَزْوَاجَهُ “لِكَيْ يُصَلِّيْنَ؟ رُبَّ كَاسِيَةٍ فِيْ الدُّنْيَا عَارِيَةٍ فِيْ الْآخِرَةِ”. أَخْرَجَهُ الْبُخَارِيُّ .

1222. (4) [1/385దృఢం]

ఉమ్మె సలమహ్ (ర) కథనం: ప్రవక్త (స) ఒక రోజు రాత్రి ఆందోళనతో మేల్కొన్నారు. ఇంకా ఇలా ప్రవచించారు: ”సుబ్‌హానల్లాహ్‌! ఈ రోజు రాత్రి ఎన్ని నిధులు మరియు ఎన్ని ఉపద్రవాలు అవతరించ బడ్డాయి! ఆ స్త్రీలను లేపే వారెవరైనా ఉన్నారా, వాళ్ళు నమా’జు చదువుకుంటారు. ఎందుకంటే చాలామంది స్త్రీలు ప్రపంచంలో దుస్తులు ధరిస్తారు కాని పరలోకంలో నగ్నంగా ఉంటారు.” [83]  (బు’ఖారీ)

1223 – [ 5 ] ( متفق عليه ) (1/386)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “يَنْزِلُ رَبُّنَا تَبَارَكَ وَتَعَالَى كُلَّ لَيْلَةٍ إِلَى السَّمَاءِ الدُّنْيَا حِيْنَ يَبْقَى ثُلُثُ اللَّيْلِ الآخِرُ يَقُوْلُ: مَنْ يَّدْعُوْنِيْ فَأَسْتَجِيْبَ لَهُ؟ مَنْ يَّسْأَلُنِيْ فَأُعْطِيَهُ؟ مَنْ يَسْتَغْفِرنِيْ فَأَغْفِرَ لَهُ؟”

وَفِيْ رِوَايَةٍ لِّمُسْلِمٍ: ثُمَّ يَبْسُطُ يَدَيْهِ وَيَقُوْلُ: “مَنْ يُّقْرِضُ غَيْرَ عَدُوْمٍ وَلَا ظَلُوْمٍ؟ حَتَّى يَنْفَجِرَ الْفَجْرُ”.

1223. (5) [1/386ఏకీభవితం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”అల్లాహ్‌ (త) ప్రతిరాత్రి భూలోక ఆకాశంపైకి దిగుతాడు. రాత్రి చివరి జాములో ‘ఎవరైనా ప్రార్థించేవారు ఉన్నారా? నేను అతని ప్రార్థన స్వీకరించడానికి, ఎవరైనా అడిగేవారు ఉన్నారా? నేను ప్రసాదించడానికి, ఎవరైనా క్షమాపణ కోరేవారు ఉన్నారా? నేను క్షమించడానికి’ అని అంటాడు.” [84] (బు’ఖారీ, ముస్లిమ్‌)

ముస్లిమ్‌ ఉల్లేఖనంలో ఇలా ఉంది, ”అల్లాహ్‌ తన రెండు చేతులను విశాలపరుస్తాడు. ‘అక్కర లేనివాడికి, దుర్మార్గుడు కాని వాడికి, అప్పు ఇచ్చే వారెవరైనా ఉన్నారా’ అని ఉదయం వరకు ఇలాగే అంటూ ఉంటాడు.

1224 – [ 6 ] ( صحيح ) (1/386)

وَعَنْ جَابِرٍ قَالَ: سَمِعْتُ النَّبِيَّ صلى الله عليه وسلم يَقُوْلُ: “إِنَّ فِيْ اللَّيْلِ لَسَاعَةً لَا يُوَافِقُهَا رَجُلٌ مُّسْلِمٌ يَّسْأَلُ اللهَ فِيْهَا خَيْرًا مِّنْ أَمْرِالدُّنْيَا وَالْآخِرَةِ إِلَّا أَعْطَاهُ إِيَّاهُ وَذَلِكَ كُلَّ لَيْلَةٍ”. رَوَاهُ مُسْلِمٌ

1224. (6) [1/386దృఢం]

జాబిర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ఇలా ప్రవచిస్తూ ఉండగా నేను విన్నాను, ”రాత్రిపూట స్వీకరించబడే ఒక ఘడియ ఉంది. ఆ సమయంలో ఒక ముస్లిమ్‌ ఇహపర లోకాలకు సంబంధించిన మేలు కోరితే అల్లాహ్‌ (త) తప్పకుండా ప్రసాదిస్తాడు. ఈ ఘడియ ప్రతి రాత్రి వస్తుంది.” [85](ముస్లిమ్‌)

1225 – [ 7 ] ( متفق عليه ) (1/386)

وَعَنْ عَبْدِ اللهِ بْنِ عَمْرٍو قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “أَحَبُّ الصَّلَاةِ إِلَى اللهِ صَلَاةُ دَاوُدَ. وَأَحَبُّ الصِّيَامِ إِلَى اللهِ صِيَامُ دَاوُدَ. كَانَ يَنَامُ نِصْفَ اللَّيْلِ وَيَقُوْمُ ثُلُثَهُ وَيَنَامُ سُدُسَهُ وَيَصُوْمُ يَوْمًا وَيُفْطِرُ يَوْمًا”.

1225. (7) [1/386ఏకీభవితం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘ఉమర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”అల్లాహ్‌ (త) వద్ద నమా’జులన్నిటిలో కెల్లా ప్రియమైనది దావూద్‌(అ) నమా’జు. ఉపవాసా లన్నిటిలోకెల్లా ప్రియమైనది దావూద్‌ (అ) ఉపవాసం. దావూద్‌ (అ) సగం రాత్రి నిద్రపోయేవారు, చివరి జాములో లేచి దైవారాధన చేసేవారు. మళ్ళీ రాత్రి 6వ వంతులో నిద్రపోయే వారు. రోజు విడిచి రోజు ఉపవాసం ఉండేవారు.” (బు’ఖారీ, ముస్లిమ్‌)

1226 – [ 8 ] ( متفق عليه ) (1/386)

وَعَنْ عَائِشَةَ رَضِيَ اللهُ عَنْهَا قَالَتْ: كَانَ تَعْنِيْ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يَنَامُ أَوَّلَ اللَّيْلِ وَيُحْيِيْ آخِرَهُ. ثُمَّ إِنْ كَانَتْ لَهُ حَاجَةَ إِلَى أَهْلِهِ قَضَى حَاجَتَهُ ثُمَّ يَنَامُ. فَإِنْ كَانَ عِنْدَ النِّدَاءِ الْأَوَّلِ جُنُبًا وَّثَبَ فَأَفَاضَ عَلَيْهِ الْمَاءَ. وَإِنْ لَّمْ يَكُنْ جُنُبًا تَوَضَّأَ لِلصَّلَاةِ ثُمَّ صَلَّى رَكْعَتَيْنِ”.

1226. (8) [1/386ఏకీభవితం]

‘ఆయి’షహ్‌ (ర) కథనం: ”ప్రవక్త (స) రాత్రి మొదటి భాగంలో నిద్రపోయేవారు. చివరిభాగంలో మేల్కొని ఆరాధన చేసేవారు, అంటే తహజ్జుద్‌ నమా’జ్‌ చేసేవారు. ఒకవేళ భార్యతో ఏదైనా పనిఉంటే చేసుకునేవారు, లేకపోతే నిద్రపోయే వారు. ఒకవేళ మొదటి అ’జా’న్‌ అయినపుడు స్నానం అవసరం ఉంటే చేసుకునేవారు, అవసరం లేకపోతే వు’దూ చేసి, ఫజ్ర్‌ సున్నతులు చదువుకునేవారు.” (బు’ఖారీ, ముస్లిమ్‌)

—-

اَلْفَصْلُ الثَّانِيْ రెండవ విభాగం 

1227 – [ 9 ] ( حسن بشواهده ) (1/387)

عَنْ أَبِيْ أُمَامَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “عَلَيْكُمْ بِقِيَامِ اللَّيْلِ فَإِنَّهُ دَأْبُ الصَّالِحِيْنَ قَبْلَكُمْ وَهُوَ قُرْبَةٌ لَّكُمْ إِلَى رَبِّكُمْ وَمَكَفِّرَةٌ لِلّسّيِئَاتِ وَمَنْهَاةٌ عَنِ الْإِثْمِ”. رَوَاهُ التِّرْمِذِيُّ.

1227. (9) [1/387సాక్షులచే ప్రామాణికం]

అబూ ఉమామహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మీరు ఖియామల్‌ లైల్‌ను తప్పకుండా ఆచరించండి. ఎందుకంటే ఇది మీ పూర్వీకుల్లోని పుణ్యాత్ముల పద్ధతి. ఇంకా ఇది దైవసామీప్యానికి మార్గం. ఇంకా పాపాలను దూరం చేయటానికి ఉత్తమ సాధనం. [86] (తిర్మిజి’)

1228 – [ 10 ] ( ضعيف ) (1/387)

وَعَنْ أَبِيْ سَعِيْدِ الْخُدْرِيِّ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “ثَلَاثَةُ يَضْحَكُ اللهُ إِلَيْهِمُ. الرَّجُلُ إِذَا قَامَ بِاللَّيْلِ يُصَلِّيْ وَالْقَوْمُ إِذَاصَفُّوْا فِيْ الصَّلَاةِ. وَالْقَوْمُ إِذَا صَفُّوْا فِيْ قِتَالِ الْعُدُوِّ. رَوَاهُ فِيْ شَرْحِ السُّنَّةِ .

1228. (10) [1/387బలహీనం]

అబూ స’యీద్‌ ‘ఖుద్రీ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”అల్లాహ్‌ ఈ ముగ్గురి పట్ల సంతోషిస్తాడు:

1. రాత్రి మేల్కొని తహజ్జుద్‌ నమా’జు చదివే వ్యక్తి.

2. పంక్తులను సరిచేసి సరిగ్గా నిలబడే నమా’జీలు.

3. శత్రువుతో పోరాడటానికి పంక్తుల్లో సరిగ్గా నిలబడే పోరాట వీరులు. (షర్‌’హుస్సున్నహ్‌)

1229 – [ 11 ] ( صحيح ) (1/387)

وَعَنْ عَمْرٍو بْنِ عَبَسَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “أَقْرَبُ مَا يَكُوْنَ الرَّبُّ مِنَ الْعَبْدِ فِيْ جَوْفِ اللَّيْلِ الْآخِرِ فَإِنِ اسْتَطَعْتَ أَنْ تَكُوْنَ مِمَّنْ يَّذْكُرُ اللهَ فِيْ تِلْكَ السَّاعَةِ فَكُنْ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَقَالَ: هَذَا حَدِيْثٌ حَسَنٌ صَحِيْحٌ غَرِيْبٌ إِسْنَادًا.

1229. (11) [1/387దృఢం]

‘అమ్ర్ బిన్‌ ‘అబసహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవ చనం, ”రాత్రి చివరి భాగంలో దాసుడు అల్లాహ్‌(త)కు చాలా దగ్గరవుతాడు. ఒకవేళ సాధ్యమైతే మీరు, ఆ సమయంలో అల్లాహ్‌(త)ను ప్రార్థించేవారిలో చేరి పోండి.” (తిర్మిజి’ / ప్రామాణికం, దృఢం, ఆధారాలు-ఏకోల్లేఖనం)

1230 – [ 12 ] ( حسن ) (1/388)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “رَحِمَ اللهُ رَجُلَا قَامَ مِنَ اللَّيْلِ فَصَلَّى وَأَيْقَظَ امْرَأَتَهُ فَصَلَّتْ فَإِنْ أَبَتْ نَضَحَ فِيْ وَجْهِهَا الْمَاءَ. رَحِمَ اللهُ امْرَأَةً قَامَتْ مِنَ اللَّيْلِ فَصَلَّتْ وَأَيْقَظَتْ زَوْجَهَا فَصَلَّى فَإِنْ أَبَى نَضَحَتْ فِيْ وَجْهِهِ الْمَاءَ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ وَالنَّسَائِيُّ.

1230. (12) [1/388ప్రామాణికం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”రాత్రి తాను మేల్కొని నమా’జు చదివి, తన భార్యను కూడా లేపితే, ఆమె కూడా నమా’జ్‌ చదివితే, ఒకవేళ ఆమె మేల్కొనక పోతే, ఆమె ముఖంపై నీళ్ళు చిలకరించే వ్యక్తిని అల్లాహ్‌ (త) కరుణించుగాక! అదేవిధంగా రాత్రి తాను మేల్కొని నమా’జు చదివి, తన భర్తను కూడా లేపితే, అతను కూడా నమా’జ్‌ చదివితే. ఒకవేళ అతను మేల్కొనక పోతే, అతని ముఖంపై నీళ్ళు చిలకరించే స్త్రీని అల్లాహ్‌ (త) కరుణించు గాక!” [87] (అబూ దావూద్‌, నసాయి’)

1231 – [ 13 ] ( حسن ) (1/388)

وَعَنْ أَبِيْ أُمَامَةَ قَالَ: قِيْلَ: يَا رَسُوْلَ اللهِ أَيُّ الدُّعَاءِ أَسْمَعُ؟ قَالَ: “جَوْفُ اللَّيْلِ الْآخِرُ وَدُبُرِالصَّلَواتِ الْمَكْتُوْبَاتِ”. رَوَاهُ التِّرْمِذِيُّ.

1231. (13) [1/388ప్రామాణికం]

అబూ ‘ఉమామ (ర) కథనం: ప్రవక్త (స)ను ఏ సమయంలో దు’ఆ స్వీకరించబడుతుందని ప్రశ్నిం చడం జరిగింది. దానికి ప్రవక్త (స), ‘రాత్రి చివరిభాగంలో మరియు ప్రతి విధి నమా’జు తరువాత,’ అని అన్నారు. (తిర్మిజి’)

1232 – [ 14 ] ( صحيح ) (1/388)

وَعَنْ أَبِيْ مَالِكٍ الْأَشْعَرِيِّ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِنَّ فِيْ الْجَنَّةِ غُرَفًا يُّرَى ظَاهِرُهَا مِنْ بَاطِنِهَا وَبَاطِنُهَا مِنْ ظَاهِرِ هَا أَعَدَّهَا اللهُ لِمَنْ آلانَ الْكَلَامَ وَأَطْعَمَ الطَّعَامَ وَتَابِعَ الصِّيَامَ وَصَلَّى بِاللَّيْلِ وَالنَّاسُ نِيَامٌ”. رَوَاهُ الْبَيْهَقِيُّ فِيْ شُعَبِ الْإِيْمَانِ.

1232. (14) [1/388దృఢం]

అబూ మాలిక్‌ అష్‌’అరీ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”స్వర్గంలో ఎటువంటి గదులు ఉంటా యంటే, వాటి లోపలి నుండి బయటి వస్తువులు కనబడతాయి. లోపలి వస్తువులు బయటి నుండి కనబడతాయి. అంటే అవి అద్దంలా ఉంటాయి. ఈ గదులను అల్లాహ్‌ సున్నితంగా మాట్లాడే వారికోసం, పేదలకు, అక్కరగల వారికి, ఆకలి గొన్నవారికి అన్నంపెట్టే వారి కోసం, నిరంతరం నఫిల్‌ నమా’జు చదివే వారికోసం, రాత్రి అందరూ పడుకున్నప్పుడు లేచి నమా’జు చదివేవారి కోసం సిద్ధంచేసి ఉంచాడు.” (బైహఖీ)

1233 – [ 15 ] ( صحيح ) (1/388)

وَرَوَى التِّرْمِذِيُّ عَنْ عَلِيٍّ نَحْوَهُ وَفِيْ رَوَايَتِهِ: “لِمَنْ أَطَابَ الْكَلَامَ”.

1233. (15) [1/389దృఢం]

తిర్మిజి, దీనినే ‘అలి (ర) ద్వారా, ఉల్లేఖించారు.

—–

الفَصْلُ الثَّالِثُ  మూడవ విభాగం  

1234 – [ 16 ] ( متفق عليه ) (1/389)

عَنْ عَبْدِ اللهِ بْنِ عَمْرٍو بْنِ الْعَاصِ قَالَ: قَالَ لِيْ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “يَا عَبْدَ اللهِ لَا تَكُنْ مِّثْل فُلَانٍ كَانَ يَقُوْمُ مِنَ اللَّيْلِ فَتَرَكَ قِيَامَ اللَّيْلِ”.

1234. (16) [1/389ఏకీభవితం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘అమ్ర్ బిన్‌ ‘ఆ’స్‌ (ర) కథనం: ప్రవక్త (స) నన్ను, ఓ ‘అబ్దుల్లాహ్‌! నీవు ఫలానా వ్యక్తిలా కా కూడదు. ఆ వ్యక్తి రాత్రి తహజ్జుద్‌ చదవ డానికి లేచే వాడు, ఆ తరువాత వదలి వేశాడు.” [88] (బు’ఖారీ, ముస్లిమ్‌)

1235 – [ 17 ] ( ضعيف ) (1/389)

وَعَنْ عُثْمَانَ بْنِ أَبِيْ الْعَاصِ قَالَ: سَمِعْتَ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ: “كَانَ لِدَاوُدَ عَلَيْهِ السَّلَامُ مِنَ اللَّيْلِ سَاعَةٌ يُّوْقِظُ فِيْهَا أَهْلَهُ يَقُوْلُ: يَا آلَ دَاوُدَ قُوْمُوْا فَصَلُّوْا فَإِنْ هَذِهِ سَاعَةٌ يَّسْتَجِيْبُ اللهُ عَزَّوَجَلَّ  فِيْهَا الدُّعَاءَ إِلَّا لِسَاحِرٍ أَوْ عَشَّارٍ” .رَوَاهُ أَحْمَدُ .

1235. (17) [1/389బలహీనం]

‘ఉస్మాన్‌ బిన్‌ అబిల్‌ ‘ఆ’స్‌ (ర) కథనం: ప్రవక్త (స) ఇలా ప్రవచిస్తూ ఉండగా నేను విన్నాను, ”దావూ’ద్‌ (అ) రాత్రి పూట ఒక నిర్ణీత సమయం ఉండేది. అందులో తన ఇంటి వారిని మేల్కొలిపే వారు. ఇంకా ఇలా అనేవారు, ”ఓ దావూ’ద్‌ కుటుంబీకులారా! నిలబడండి, నమా’జు చదవండి, ఈ సమయంలో అల్లాహ్‌ మీ ప్రార్థనలను స్వీకరిస్తాడు. కాని మాంత్రికుల మరియు అన్యాయంగా పన్ను వసూలు చేసేవారి ప్రార్థనలు స్వీకరించడు.” (అ’హ్మద్‌)

1236 – [ 18 ] ( صحيح ) (1/389)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: سَمِعْتُ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ: “أَفْضَلُ الصَّلَاةِ بَعْدَ الْمَفْرُوْضَةِ صَلَاةٌ فِيْ جَوْفِ اللَّيْلِ”. رَوَاهُ أَحْمَدُ.

1236. (18) [1/38దృఢం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ఇలా ప్రవచిస్తూ ఉండగా నేను విన్నాను, ”ఫ’ర్ద్ నమాజుల తర్వాత అన్నిటి కంటే ఉత్తమమైనది చివరిరాత్రి నమా’జు అంటే తహజ్జుద్‌ నమా’జు.” (అ’హ్మద్‌)

1237 – [ 19 ] ( صحيح ) (1/389)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: جَاءَ رَجُلٌ إِلَى النَّبِيِّ صلى فَقَالَ: إِنَّ فُلَانًا يُّصَلِّي بِاللَّيْلِ فَإِذَا أَصْبَحَ سَرَقَ فَقَالَ: إِنَّهُ سَيَنْهَاهُ مَا تَقُوْلُ. رَوَاهُ أَحْمَدُ وَالْبَيْهَقِيُّ فِيْ شُعَبِ الْإِيْمَانِ.

1237. (19) [1/389దృఢం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) వద్దకు ఒక వ్యక్తి వచ్చి, ‘ఓ ప్రవక్తా! ఒక వ్యక్తి రాత్రి నమా’జు చదువుతున్నాడు. ఉదయం దొంగతనం చేస్తు న్నాడు,’ అని విన్నవించుకున్నాడు. దానికి ప్రవక్త (స) ‘త్వరలో ఈ నమా’జు అతన్ని నీవు చెప్పిన విషయాన్నుండి వారిస్తుంది,’ అని అన్నారు.[89]  (అ’హ్మద్‌, బైహఖీ-షు’అబిల్ ఈమాన్)

1238 – [ 20 ] ( صحيح ) (1/390)

وَعَنْ أَبِيْ سَعِيْدٍ وَأَبِيْ هُرَيْرَةَ قَالَا:قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِذَا أَيْقَظَ الرَّجُلُ أَهْلَهُ مِنَ اللَّيْلِ فَصَلَّيَا أَوْ صَلَّى رَكْعَتَيْنِ جَمِيْعًا كُتِبَا فِيْ الذَّاكِرِيْنَ وَالذَّاكِرَاتِ”.رَوَاهُ أَبُوْ دَاوُدَ وَابْنُ مَاجَهُ

1238. (20) [1/390దృఢం]

అబూ స’యీద్‌ (ర) మరియు అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఒక వ్యక్తి రాత్రి తన భార్యను లేపి, ఇద్దరూ కలసి నమా’జు చదివినా, లేదా వీరిలో ప్రతి ఒక్కరూ రెండు రకా’తులు చదివినా, వారిద్దరూ అల్లాహ్ (త)  స్మరించే వారు, అల్లాహ్(త) స్మరించే వారిలో లిఖించబడతారు.” [90](అబూ దావూద్‌, ఇబ్నె మాజహ్)

1239 – [ 21 ] ( ضعيف ) (1/390)

وَعَنِ ابْنِ عَبَّاسٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “أَشْرَافُ أُمَّتِيْ حَمَلَةُ الْقُرْآنِ وَأَصْحَابُ اللَّيْلِ”.  رَوَاهُ الْبَيْهَقِيُّ فِيْ شُعَبِ الْإِيْمَانِ.

1239. (21) [1/390బలహీనం]

ఇబ్నె ‘అబ్బాస్‌ (ర) కథనం: ప్రవక్త(స)ప్రవచనం, ”నా అనుచర సమాజంలో ఉత్తమ ప్రజలు  ఖుర్‌ఆన్‌, విద్యా బోధనలు చేసేవారు, ఖుర్‌ఆన్‌ కంఠస్తం చేసేవారు, తహజ్జుద్‌ చదివేవారు.” [91] (బైహఖీ-షు’అబిల్ ఈమాన్)

1240 – [ 22 ] ( صحيح ) (1/390)

وَعَنِ ابْنِ عُمُرَأَنَّ أَبَاهُ عُمَرَ بْنَ الْخَطَّابٍ رضي الله عَنْهُ كَانَ يُصَلِّيْ مِنَ اللَّيْلِ مَا شَاءَ اللهُ حَتَّى إِذَا كَانَ مِنْ آخِرِ اللَّيْلِ أَيْقَظَ أَهْلَهُ لِلصَّلَاةِ يَقُوْلُ لَهُمُ: اَلصَّلَاةُ ثُمَّ يَتْلُوْ هَذِهِ الْآيَةِ: (وَأَمر أَهْلَكَ بِالصَّلَاةِ وَاصْطَبِرْ عَلَيْهَا لَا نَسْأَلُكَ رِزْقًا نَحْنُ نَرْزُقُكَ وَالْعَاقِبَةُ لِلتَّقْوَى).  رَوَاهُ مَالِكٌ .

1240. (22) [1/390దృఢం]

ఇబ్నె ‘ఉమర్‌ (ర) కథనం: ‘ఉమర్‌ (ర) రాత్రి అల్లాహ్‌ కోరినంతసేపు నమా’జు చదివేవారు, రాత్రి చివరిభాగం అవగానే, తన ఇంటివారిని లేపి, ”లేవండి, నమా’జు చదవండి,” అని చెప్పి, ఈ ఆయతు, ”వా’ముర్‌ అ’హ్‌లక బి’స్సలాతి వ’స్తబిర్‌ ‘అలైహా. లా నస్‌అలుక రి’జ్‌ఖన్‌ న’హ్‌ను నర్‌’జుఖుక వల్‌ ‘ఆఖిబతు లిత్తఖ్‌వా.” పఠించేవారు — ‘నీ కుటుంబం వారిని నమాజు చేయమని ఆజ్ఞాపించు మరియు స్వయంగా నీవుకూడా దానిని సహనంతో పాటించు. మేము నీ నుండి జీవనోపాధిని ఆశించము. మేమే నీకు జీవనోపాధిని ఇచ్చేవారము. చివరకు దైవభీతి గలవారిదే ఉత్తమ ముగింపు.’ [92] (సూ. ‘తా హా, 20:132), (మాలిక్)

=====

34- بَابُ الْقَصْدِ فِيْ الْعَمْلِ

34. మితమైన ఆచరణ

ప్రతి పనిలో మధ్యేమార్గాన్ని అనుసరించాలి, అధికంగాగాని అల్పంగాగాని ప్రవర్తించరాదు. మధ్యే మార్గాన్ని అనుసరించే వారు మంచివారుగా పరిగణించబడతారు. ఇది మంచి పద్ధతి. తినటంలో, త్రాగటంలో, నిద్రలో, నడకలో, మధ్యేమార్గం అనుస రించాలని ఆదేశించడం జరిగింది. ఖుర్‌ఆన్‌లో లుఖ్‌మాన్‌ (అ) బోధనల్లో: ”వ’ఖ్సిద్ ఫి మషయిక…” — ‘నీ నడకలో నమ్రతను (మధ్యేమార్గాన్ని) పాటించు…’ (సూ. లుఖ్మాన్, 31:19) అని ఉంది. ఈ గుణం తన గమ్యాన్ని చేరుస్తుంది. మధ్యేమార్గం మానవున్ని తన గమ్యానికి చేరుస్తుంది. పరిగెత్తేవారు అలసిపోయి కూర్చుండి పోతారు. అన్న పానీయాల్లో, శ్రమలో, విశ్రాంతిలో, నిద్రలో, మెలుకువలో, మాట్లడ టంలో, అన్నిటిలో మధ్యేమార్గం చాలా అవసరం. ఎక్కువగా లేదా తక్కువగా ప్రవర్తించడం అపాయ కరం. ప్రవక్త (స) నమా’జు మధ్యస్థంగా ఉండేది. ప్రసంగం కూడా మధ్యస్థంగా ఉండేది. అయితే అవి వేకులు, అజ్ఞానులు ఖుత్బాలను దీర్ఘంగా నమా’జును సంక్షిప్తంగా చేస్తారు. ప్రవక్త(స), ‘మధ్యేమార్గాన్ని అనుస రించండని,’ ఆదేశించి ఉన్నారు. అదేవిధంగా ఖర్చు చేయటంలో కూడా మధ్యే మార్గాన్ని అనుసరించాలి. రాబడి కంటే అధికంగా ఖర్చు చేయరాదు. తరువాత ఇతరుల ముందు చేతులు చాచే పరిస్ధితి తెచ్చుకోకూడదు. తన స్తోమతకు తగ్గట్టు ఖర్చు చేయాలి. అదేవిధంగా పిసినారి తనంగా కూడా వ్యవహరించరాదు. ధనసంపదలు కలిగి ఉంటే కుటుంబ సభ్యుల హక్కులను నెరవేరుస్తూ, అల్లాహ్ తనపై విధించిన బాధ్యతలను నెరవేర్చాలి. ధనసంపదలు ఉండికూడా కుటుంబం విషయంలో పిసినారిగా వ్యవహ రించరాదు. ప్రవక్త (స) ఉపదేశం: రాబడి, ఖర్చుల్లో మధ్యే మార్గాన్ని అనుసరించడం జీవిత సుఖసంతోషాల్లోని సగ భాగం. (కన్జుల్ ‘ఉమ్మాల్)

ఆర్ధికం, మధ్యేమార్గం దైవదౌత్య భాగాల్లోని ఒక భాగం. ప్రవక్త (స) ప్రవచనం: మంచి నడవడిక, మంచి పధ్ధతి, మధ్యేమార్గం దైవదౌత్య భాగాల్లోని ఒక భాగం. (అబూ దావూద్)

ఈ ‘హదీసు’ ద్వారా మధ్యేమార్గం యొక్క విశిష్టత స్పష్టమవుతుంది. ప్రతి విషయంలో మధ్యేమార్గం అనుసరించటం చాలా మంచిది. ‘హు’దైఫహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం: ”కలిమిలేముల్లో మధ్యే మార్గం ఎంతో మంచిది, ఆరాధనలో మధ్యేమార్గం ఎంతో మంచిది.” (ముస్నద్ బ’జ్జార్)

  అదే విధంగా ధన సంపదల్లో పడి సత్యాన్ని తిరస్కరించ కూడదు. పేదరికానికి గురై అసహనాన్ని వ్యక్తం చేయరాదు. అందువల్లే ఇస్లామ్‌ మధ్యే మార్గాన్ని సూచిస్తుంది. ప్రజలు ధన సంపదలు రాగానే భోగవిలాసాల్లో మధ్యేమార్గాన్ని అధిగ మిస్తారు. మరికొందరు లేమికిగురై సహనం కోల్పోయి మంచి గుణాలన్నిటినీ వదలివేస్తారు. ఇది కూడా మంచిది కాదు. ఈ రెండు పరిస్ధితుల్లోనూ ఇస్లామ్ బోధించేదేమిటంటే, ధనసంపదల్లో హద్దులు మీరి ప్రవర్తించరాదు. పేదరికంలో తన స్ధాయికంటే దిగజారి పోరాదు. అదేవిధంగా ఆరాధనల్లో ప్రార్ధనల్లో కూడా మధ్యే మార్గం అవలంభించాలని ఆదేశించడం జరిగింది. అదేవిధంగా ఆరాధనలో కూడా మధ్యేమార్గాన్ని అనుసరించాలి. అల్లాహ్‌ ఆదేశం: ”…వలా తజ్ హర్ బి ‘సలాతిక వలా తు’ఖాఫిత్ బిహా, వబ్’తగి బైన జా’లిక సబీలా.” — ‘…నీ నమా’జ్‌లో నీవు చాలా గట్టిగాగానీ, చాలా మెల్లగా గానీ పఠించక, వాటి మధ్య మార్గాన్ని అవలంబించు.’ (సూ. బనీ ఇస్రాయీ’ల్, 17:110)

ఖుర్ఆన్ లో పుణ్యాత్ముల గుణాలు ఈ విధంగా ఉంటారని పేర్కొనడం జరిగింది. అల్లాహ్‌ ఆదేశం: ”మరియు ఎవరైతే, ఖర్చుచేసేటప్పుడు అనవసర ఖర్చుగానీ లేక లోభత్వంగానీ చేయకుండా, ఈ రెండింటి మధ్య మితంగా ఉంటారో.”  [93] (సూ. అల్‌ ఫుర్‌ఖాన్‌, 25:67)

—–

اَلْفَصْلُ الْأَوَّلُ   మొదటి విభాగం 

1241 – [ 1 ] ( صحيح ) (1/391)

عَنْ أَنَسٍ قَالَ: كَانَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم يُفْطِرُ مِنَ الشَّهْرِ حَتَّى يُظُنَّ أَنْ لَا يَصُوْمَ مِنْهُ وَيَصُوْمُ حَتَّى يُظَنَّ أَنْ لَا يُفْطِرُ مِنْهُ شَيْئًا وَكَانَ لَا تَشَاءُ أَنْ تَرَاهُ مِنَ اللَّيْلِ مُصَلِّيًا إِلَّا رَأَيْتَهُ وَلَا نَائِمًا إِلَّا رَأَيْتَهُ. رَوَاهُ الْبُخَارِيُّ .

1241. (1) [1/391దృఢం]

అనస్‌ (ర) కథనం: ప్రవక్త (స) ఒక్కోసారి నెలంతా ఉపవాసాలు పాటించేవారు కాదు, చివరికి మేము ఇక ప్రవక్త (స) ఉపవాసాలు పాటించరని భావించే వాళ్ళం. ఒక్కోసారి ప్రవక్త (స) ఉపవాసాలు పాటించేవారు, చివరికి మేము ఇక ప్రవక్త (స) ఉపవాసాలు మానరు అని భావించే వాళ్ళం. ఒకవేళ మీరు రాత్రివేళ ప్రవక్త (స)ను నమా’జు స్థితిలో చూడాలను కుంటే చూడ గలరు. అదేవి ధంగా ఒకవేళ మీరు ప్రవక్త (స)ను నిద్ర పోతూ ఉండగా చూడాలనుకుంటే చూడగలరు. [94] (బు’ఖారీ)

1242 – [ 2 ] ( متفق عليه ) (1/391)

وَعَنْ عَائِشَةَ قَالَتْ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “أَحَبُّ الْأَعْمَالِ إِلَى اللهِ أَدْوَمُهَا وَإِنْ قَلَّ”.

1242. (2) [1/391ఏకీభవితం]

‘ఆయి’షహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”సత్కార్యాలన్నింటిలో అల్లాహ్‌కు ప్రియమైనది – ఎల్లప్పుడూ చేసేదే, అది ఎంత చిన్నదైనా సరే.” (బు’ఖారీ, ముస్లిమ్‌)

1243 – [ 3 ] ( صحيح ) (1/391)

وَعَنْ عَائِشَةَ رَضِيَ اللهُ عَنْهَا قَالَتْ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسل: “خُذُوْا مِنَ الْأَعْمَالِ مَا تُطِيْقُوْنَ. فَإِنَّ اللهَ لَا يَمَلُّ حَتَّى تَمَلُّوْا”.

1243. (3) [1/391దృఢం]

‘ఆయి’షహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”సత్కార్యాల్లో మీరు చేయగలిగిందాన్నే ఎంచుకోండి. ఎందుకంటే అల్లాహ్‌ ప్రతిఫలం ఇవ్వటంలో వెనక్కి తగ్గడు. కాని చివరికి మీరు ఆచరిస్తూ అలసిపోతారు అంటే వదలివేస్తారు.” [95]  (బు’ఖారీ, ముస్లిమ్‌)

1244 – [ 4 ] ( متفق عليه ) (1/391)

وَعَنْ أَنَسٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لِيُصَلِّ أَحَدُكُمْ نَشَاطَهُ وَإِذَا فَتَرَ فَلْيَقْعُدْ.

1244. (4) [1/391]

అనస్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మీరు ఉత్సాహంగా ఉన్నంత వరకు, ఆరాధనలో శ్రద్ధ ఉన్నంత వరకు నమా’జు చదవండి. అలసటగా ఉంటే కూర్చోండి. అంటే నమా’జు ఆపివేయండి.” [96](బు’ఖారీ, ముస్లిమ్‌)

1245 – [ 5 ] ( متفق عليه ) (1/391)

وَعَنْ عَائِشَةَ قَالَتْ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِذَا نَعَسَ أَحَدُكُمْ وَهُوَ يُصَلِّيْ فَلْيَرْقُدْ حَتَّى يَذْهَبَ عَنْهُ النَّوْمُ فَإِنَّ أَحَدَكُمْ إِذَا صَلَّى وَهُوَ نَاعِسٌ لَا يَدْرِيْ لَعَلَّهُ يَسْتَغْفِرُ فَيَسُبَّ نَفْسَهُ”.

1245. (5) [1/391ఏకీభవితం]

‘ఆయి’షహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మీలో ఎవరికైనా నమా’జు స్థితిలో నిద్రవస్తే నిద్ర పూర్తయ్యే వరకు నిద్రపోవాలి. ఎందుకంటే నిద్ర లేదా, కునుకు ఉన్నప్పుడు నమా’జు చదివితే ఏమి పలుకు తున్నాడో అతనికి తెలియదు. క్షమాపణ కోరటానికి బదులు తన్ను-తాను దూషించుకోవచ్చు. తన గురించి ప్రార్థించటానికి బదులు తన్ను-తాను శపించుకో వచ్చు. [97]  (బు’ఖారీ, ముస్లిమ్‌)

1246 – [ 6 ] ( صحيح ) (1/391)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِنَّ الدِّيْنَ يُسْرٌ وَلَنْ يُّشَادَ الدِّيْنَ أَحَدٌ إِلَّا غَلَبَهُ فَسَدِّدُوْا وَقَارِبُوْا وَأَبْشِرُوْا وَاسْتَعِيْنُوْا بِالْغَدْوَةِ وَالرَّوْحَةِ وَشَيْءٍ مِنَ الدُّلْجَةِ”. رَوَاهُ الْبُخَارِيُّ .

1246. (6) [1/391దృఢం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ధర్మం సులువైనది. ధర్మంలో కఠినంగా వ్యవహరించిన వారిపై ధర్మమే ఆధిక్యత పొందు తుంది. కనుక మధ్యేమార్గాన్ని అవలంబించండి. మరియు తమ శక్తిమేరకు పనిచేయండి. ఇంకా తమ ఉత్తీర్ణత పట్ల సంతోషించండి. ఇంకా ఉదయం సాయంత్రం ఇంకా రాత్రి కొంతసేపు అల్లాహ్‌ను సహాయం అర్థించండి.” [98] (బు’ఖారీ)

1247 – [ 7 ] ( صحيح ) (1/392)

وَعَنْ عُمَرَرَضِيَ اللهُ عنه قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَنْ نَامَ عَنْ حِزْبِهِ أَوْ عَنْ شَيْءٍ مِّنْهُ فَقَرَأَهُ فِيْمَا بَيْنَ صَلَاةِ الْفَجْرِ وَ صَلَاةِ الظُّهْرِ كُتِبَ لَهُ كَأَنَّمَا قَرَأَهُ مِنَ اللَّيْلِ”. رَوَاهُ مُسْلِمٌ .

1247. (7) [1/392దృఢం]

‘ఉమర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”తన అలవాటు ప్రకారం చేసే ఆరాధనలను మరచి లేదా నిద్రవల్ల వదలి పడుకొని, ఫజ్ర్‌ మరియు ”జుహర్‌ల మధ్య ఆచరిస్తే అతనికి రాత్రి ఆచరించినట్టు పుణ్యం లభిస్తుంది.” [99] (ముస్లిమ్‌)

1248 – [ 8 ] ( صحيح ) (1/392)

وَعَنْ عِمْرَانَ بْنِ حُصَيْن قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “صَلِّ قَائِمًا فَإِنْ لَمْ تَسْتَطِعْ فَقَاعِدًا فَإِنْ لَّمْ تَسْتَطِعْ فَعَلَى جَنْبٍ”. رَوَاهُ الْبُخَارِيُّ.

1248. (8) [1/392దృఢం]

‘ఇమ్రాన్‌ బిన్‌ ‘హు’సైన్‌(ర) కథనం: ప్రవక్త(స) ప్రవచనం, ”ఒకవేళ నిలబడి నమా’జు చదవగలిగితే నిలబడి నమా’జు చదవండి. ఒకవేళ నిలబడి నమా’జు చదవలేకపోతే కూర్చొని నమా’జు చదవండి. ఒకవేళ కూర్చొని కూడా నమా’జు చదవలేకపోతే పరుండి నమా’జ్‌ చదవండి.” (బు’ఖారీ)

1249 – [ 9 ] ( صحيح ) (1/392)

وَعَنْ عِمْرَانَ بْن حُصَيْنِ: أَنَّهُ سَأَلَ النَّبِيَّ صلى الله عليه وسلم عَنْ صَلَاةِ الرَّجُلِ قَاعِدًا. قَالَ: “إِنْ صَلَّى قَائِمًا فَهُوَ أَفْضَلُ وَمَنْ صَلَّى قَاعِدًا فَلَهُ نِصْفُ أَجْرٍ الْقَائِمِ وَمَنْ صَلَّى نَائِمًا فَلَهُ نِصْفُ أَجْرِالْقَاعِدِ”. رَوَاهُ الْبُخَارِيُّ .

1249. (9) [1/392దృఢం]

‘ఇమ్రాన్‌ బిన్‌ ‘హు’సైన్‌ (ర) కథనం: ప్రవక్త (స)ను కూర్చొని నమా’జు చదవటాన్ని గురించి ప్రశ్నించాను. దానికి ప్రవక్త (స) ఒకవేళ నిలబడి చదివితే మంచిది. ఒకవేళ కూర్చొని చదివితే సగం పుణ్యం లభిస్తుంది. ఒకవేళ పరుండి నమా’జు చదివితే కూర్చొని చదివిన దానిలో సగం పుణ్యం లభిస్తుంది అని అన్నారు. [100](బు’ఖారీ)

—–

اَلْفَصْلُ الثَّانِيْ  రెండవ విభాగం 

1250 – [ 10 ] ( ضعيف ) (1/392)

عَنْ أَبِيْ أُمَامَةَ قَالَ: سَمِعْتُ النَّبِيَّ صلى الله عليه وسلم يَقُوْلُ: “مَنْ أَوَى إِلَى فِرَاشِهِ طَاهِرًا وَذَكَرَ اللهَ حَتَّى يُدْرِكَهُ النُّعَاسُ لَمْ يَتَقَلَّبْ سَاعَةً مِّنَ اللَّيْلِ يَسْأَلُ اللهَ فِيْهَا خَيْرًا مِّنْ خَيْرِ الدُّنْيَا وَالْآخِرَةِ إِلَّاأَعْطَاهُ إِيَّاهُ”. ذَكَرَهُ النَّوْوِيُّ فِيْ كِتَابِ الْأَذْكَارِ بِرِوَايَةٍ ابْنِ السُّنِّيِّ .

1250. (10) [1/392బలహీనం]

అబూ ఉమామ (ర) కథనం: ప్రవక్త (స) ఇలా ప్రవచిస్తూ ఉండగా నేను విన్నాను, ”ఎవరైనా వు’దూ చేసి తన పడకపైకి వచ్చి నిద్రవచ్చే వరకు దైవాన్ని స్మరించితే, రాత్రి ఎప్పుడైనా ప్రక్కమారి అల్లాహ్‌ (త)ను ఏది కోరినా అల్లాహ్‌(త) అతనికి తప్పకుండా ప్రసాదిస్తాడు.” (ఇబ్నుస్సున్నీ)

1251 – [ 11 ] ( صحيح ) (1/392)

وَعَنْ عَبْدِ اللهِ بْنِ مَسْعُوْدٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “عَجِبَ رَبُّنَا مِنْ رَّجُلَيْنِ رَجُلٌ ثَارَ عَنْ وِّطَائِهِ وَلِحَافِهِ مِنْ بَيْنَ حِبِّهِ وَأَهْلِهِ إِلَى صَلَاتِهِ. فَيَقُوْلُ اللهُ لِمَلَائِكَتِهِ: انْظُرُوْا إِلَى عَبْدِيْ ثَارَ عَنْ فِرَاشِهِ وَوِطَائِهِ مِنْ بَيْنَ حِبِّهِ وَأَهْلِهِ إِلَى صَلَاتِهِ رَغْبَةً فِيْمَا عِنْدِيْ وَشَفَقًا مِمَّا عِنْدِيْ. وَرَجُلٌ غَزَا فِيْ سَبِيْلِ اللهِ فَانْهَزَمَ مَعَ أَصْحَابِهِ فَعَلِمَ مَا عَلَيْهِ فِيْ الْاِنْهِزَامِ وَمَا لَهُ فِيْ الرُّجُوْعِ فَرَجَعَ حَتَّى اُهْرِيْقَ دَمُهُ. فَيَقُوْلُ اللهُ لِمَلَائِكَتِهِ: انْظُرُوْا إِلَى عَبْدِيْ رَجَعَ رَغْبَةً فِيْمَا عِنْدِيْ وَشَفَقًا مِمَّا عِنْدِيْ حَتَّى اُهْرِيْقَ دَمُهُ”. رَوَاهُ فِيْ شَرْحِ السُّنَّةِ.

1251. (11) [1/392దృఢం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ మస్‌’ఊద్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మన ప్రభువు ఇద్దరు వ్యక్తుల పట్ల సంతోషిస్తాడు. 1. తన మెత్తనిపడక, తనకు ప్రియమైన భార్యను వదలి తహజ్జుద్‌ నమా’జు కోసం లేచి నమా’జు చదివేవాడు. అల్లాహ్‌ దైవదూతలతో నా ఈ దాసుణ్ణి చూడండి, కేవలం నమా’జు కోసం తన మెత్తని పడక, తన ప్రీతికరమైన భార్యా-బిడ్డలను వదలి నా వద్ద ఉన్న అనుగ్రహాలను పొందే సంతోషంలో, నా శిక్షకు భయపడుతూ నిలబడి నమా’జు చదువు తున్నాడు, అని అంటాడు. 2వ వ్యక్తి దైవమార్గంలో పోరాడుతూ తన మిత్రులతో పాటు ఓడిపోయి, పారిపోవడంలో ఉన్న పాపాన్ని గురించి ఆలోచించి, తిరిగి వచ్చి మళ్ళీ పోరాడటంలో గల పుణ్యాన్ని గురించి ఆలోచించి తిరిగి శత్రువులతో పోరాడుతూ వీరమరణం పొందుతాడు. అల్లాహ్‌ (త) దైవదూతలతో నా ఈ దాసుణ్ణి చూడండి, నా దగ్గ రున్న స్వర్గం పొందటానికి, నా దగ్గరున్న నరకశిక్షకు భయపడి తన రక్తాన్ని చిందించి వీరమరణం పొందాడు,’ అని అంటాడు.” (షర్‌’హుస్సున్నహ్‌)

అంటే తహజ్జుద్‌ నమా’జు చదివేవారి పట్ల, దైవమార్గంలో వీరమరణం పొందినవారి పట్ల అల్లాహ్‌ చాలా సంతోషిస్తాడు.

—–

الْفَصْلُ الثَّالِثُ   మూడవ విభాగం 

1252 – [ 12 ] ( صحيح ) (1/393)

عَنْ عَبْدِ اللهِ بْنِ عَمْرٍو قَالَ: حُدِّثْتُ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم قَالَ: “صَلَاةُ الرَّجُلِ قَاعِدًا نِصْفُ الصَّلَاةِ”. قَالَ: فَأَتَيْتُهُ فَوَجَدْتُّهُ يُصَلِّيْ جَالِسًا فَوَضَعْتُ يَدِيْ عَلَى رَأْسِهِ. فَقَالَ: “مَالَكَ يَا عَبْدَ اللهِ بْنِ عَمْرٍو؟” قُلْتُ: حُدِّثْتُ يَا رَسُوْلَ اللهِ أَنَّكَ قُلْتُ: “صَلَاةُ الرَّجُلِ قَاعِدًا عَلَى نِصْفِ الصَّلَاةِ”. وَأَنْتَ تُصَلِّيْ قَاعِدًا قَالَ: “أَجَلْ وَلَكِنِّيْ لَسْتُ كَأَحَدٍ مِّنْكُمْ”. رَوَاهُ مُسْلِمٌ.

1252. (12) [1/393దృఢం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘అమ్ర్ (ర) కథనం: నాకు ఇలా తెలియ పరచటం జరిగింది: ప్రవక్త (స) ప్రవచనం, ”శక్తి ఉండి కూడా, అకారణంగా కూర్చొని నమా’జు చదివితే, సగం పుణ్యం లభిస్తుంది.” నేను ఒకసారి ప్రవక్త (స) వద్దకు వెళ్ళాను. అప్పుడు ప్రవక్త (స) కూర్చొని నమా’జు చదువు తున్నారు. ఆశ్చర్యంగా నేను ప్రవక్త (స) తలపై చేయి పెట్టాను. దానికి ప్రవక్త (స), ‘ఓ ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘అమ్ర్! ఏం చేస్తున్నావు,’ అని అడిగారు. దానికి నేను, ”ఓ ప్రవక్తా! మీ ‘హదీసు’, కూర్చొని చదివితే సగం పుణ్యం లభిస్తుందని నాకు తెలియపర్చటం జరిగింది. మరి మీరు కూర్చొని చదువుతున్నారు,” అని విన్నవించుకున్నాను. దానికి ప్రవక్త (స) ‘అవును, నిజమే కాని నేను మీలాంటివాణ్ణి కాను’ అని అన్నారు. [101] (ముస్లిమ్‌)

1253 – [ 13 ] ( صحيح ) (1/393)

وَعَنْ سَالِمِ بْنِ أَبِيْ الْجَعْدِ قَالَ: قَالَ رَجُلٌ مِّنْ خُزَاعَةَ: لَيْتَنِيْ صَلَّيْتُ فَاْسْتَرَحْتُ فَكَأَنَّهُمْ عَابُوْا ذَلِكَ عَلَيْهِ فَقَالَ: سَمِعْتُ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ: “أَقِمِ الصَّلَاةَ يَا بِلَالُ أَرِحْنَا بِهَا”. رَوَاهُ أَبُوْ دَاوُدَ.

1253. (13) [1/393దృఢం]

సాలిమ్‌ బిన్‌ అబిల్‌ జ’అద్‌ (ర) కథనం: ‘ఖు’జా’అ తెగకు చెందిన ఒక వ్యక్తి, ‘నేను నమా’జు చదివితే, ఎంతో సుఖంగా ఉంటుంది’ అని అన్నాడు. ప్రజలు అది విని చీవాట్లు పెట్టసాగారు. అప్పుడావ్యక్తి నేను ప్రవక్త (స)ను, ”ఓ బిలాల్‌! నీవు తక్‌బీర్‌ పలికితే నేను నమా’జు చదివి శాంతి సుఖాలను పొందుతాను. ఎందుకంటే నాకు నమా’జు ద్వారా సుఖం ప్రాప్తిస్తుంది” అని పలకటం విన్నాను అని అన్నాడు. (అబూ దావూద్‌)

=====

35- بَابُ الْوِتْرِ

35. విత్ర్నమాజు

విత్ర్‌ అంటే బేసి సంఖ్య రకాతులను అంటారు. ఉదా: 1, 3, 5, 7, 9. దీన్ని నమా’జులన్నీ చదివిన తర్వాత చదవాలి. దీన్ని రాత్రి చివరి భాగంలో ఆచరించటం ఉత్తమం. అప్పుడు లేవలేమని భయం ఉన్నవారు ఇషా విధి, సున్నతుల తర్వాత చదువుకో వచ్చును. రాత్రి చదవలేనివారు ఫజ్ర్‌కు ముందు చదువుకోవాలి. దీన్ని గురించి ప్రత్యేకంగా బోధించడం జరిగింది. అకారణంగా దీన్ని వదలకూడదు. ఇది సున్నతె ముఅక్కదహ్. ఇది తప్పనిసరి (విధి) కాదు. విత్ర్‌ 1 లేదా 3 లేదా 5 లేదా 7 లేదా 9 రకాతులు చదవాలి. ఒక్కోసారి 1, ఒక్కోసారి 3, ఒక్కోసారి 5, ఒక్కోసారి 7 చదవాలి. 3 లేదా 5 రకాత్లు ఒకే సలామ్తో చదవాలి. 7 లేదా 9 చదివితే 1 రకాత్‌ మిగిల్చి రెండేసి రకా’త్‌ల తర్వాత కూర్చొని చివరగా ఒక రకా’త్‌ చదివి సలామ్‌ పలకాలి. వీటన్నిటిలో చివరి రకా’త్‌లో రుకూ తర్వాత రెండు చేతులను ఎత్తి దుఆయె ఖునూత్ చదవాలి.

اَلْفَصْلُ الْأَوَّلُ మొదటి విభాగం  

1254 – [ 1 ] ( متفق عليه ) (1/394)

عَنِ ابْنِ عُمَرَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “صَلَاةُ اللَّيْلِ مَثْنَى مَثْنَى فَإِذَا خَشِيَ أَحَدُكُمْ الصُّبْحَ صَلَّى رَكْعَةً وَاحِدَةً تُوْتِرُ لَهُ مَا قَدْ صَلَّى”.

1254. (1) [1/393ఏకీభవితం]

ఇబ్నె’ఉమర్‌ (ర) కథనం: ప్రవక్త(స) ప్రవచనం, ”రాత్రి నమా’జు రెండేసి రకాతులు. మీలో ఎవరైనా ఉదయం అవబోతుందని ఆందోళనచెందితే 1 రకా’త్‌ చదువుకోవాలి. అంతకుముందు చదివిన నమా’జును అది బేసిగావిత్ర్‌గా మార్చివేస్తుంది. [102] (బు’ఖారీ, ముస్లిమ్)

1255 – [ 2 ] ( صحيح ) (1/394)

وَعَنِ ابْنِ عُمَرَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “اَلْوِتْرُ رَكْعَةً مِّنْ آخِرِ اللَّيْلِ”. رَوَاهُ مُسْلِمٌ.

1255. (2) [1/394దృఢం]

ఇబ్నె ‘ఉమర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”రాత్రి చివరి భాగంలో విత్ర్‌ ఒక రకా’త్‌.” (ముస్లిమ్)

1256 – [ 3 ] ( متفق عليه ) (1/394)

وَعَنْ عَائِشَةَ رَضِيَ اللهُ عَنْهَا قَالَتْ: كَانَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم يُصَلِّيْ مِنَ اللَّيْلِ ثَلَاثَ عَشَرَةَ رَكْعَةً يُوْتِرُ مِنْ ذَلِكَ بِخَمْسٍ لَّا يَجْلِسُ فِيْ شَيْءٍ إِلَّا فِيْ آخِرِهَا”.

1256. (3) [1/394ఏకీభవితం]

‘ఆయి’షహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) రాత్రి 13 రకా’తులు చదివేవారు. వీటిలో విత్ర్‌ 5 రక’అత్‌లు ఉండేవి. వీటిలో కేవలం చివరి రకాత్‌లో కూర్చునే వారు. [103]  (బు’ఖారీ, ముస్లిమ్‌)

1257 – [ 4 ] ( صحيح ) (1/394)

وعَنْ سَعْدِ بْنِ هَشَّامٍ قَالَ: انْطَلَقْتُ إِلَى عَائِشَةَ فَقُلْتُ يَا أُمَّ  الْمُؤْمِنِيْنَ اَنَبِئِيْنِيْ عَنْ خُلُقِ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم قَالَتْ: أَلَسْتَ تَقْرَأُ الْقُرْآنَ؟ قُلْتُ: بَلَى. قَالَتْ: فَإِنَّ خُلُقَ نَبِيِّ الله صلى الله عليه وسلم كَانَ الْقُرْآنُ. قُلْتُ: يَا أُمَّ الْمُؤْمِنِيْنَ أنْبِئِيْنِيْ عَنْ وِتْرِ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم. فَقَالَتْ: كُنَّا نُعِدُّ لَهُ سِوَاكَهُ وَطَهُوْرَهُ فَيَبْعَثُهُ اللهُ مَا شَاءَ أَنْ يَّبْعَثَهُ مِنَ اللَّيْلِ فَيَتَسَوَّكَ وَيَتَوَضَّأُ وَيُصَلِّيْ تِسْعَ رَكْعَاتٍ لَا يَجْلِسُ فِيْهَا إِلَّا فِيْ الثَّامِنَةِ فَيَذْكُرُ اللهَ وَيَحْمَدُهُ وَيَدْعُوْهُ ثُمَّ يَنْهَضُ وَلَا يُسَلِّمُ فَيُصَلِّي التَّاسِعَةَ ثُمَّ يَقْعُدُ فَيَذْكُرُ اللهَ وَيَحْمَدُهُ وَيَدْعُوْهُ. ثُمَّ يُسَلِّمُ تَسْلِيْمًا يُسْمِعْنَا ثُمَّ يُصَلِّيْ رَكْعَتَيْنِ بَعْدَمَا يُسَلِّمُ وَهُوَ قَاعِدٌ فَتِلْكَ إِحْدَى عَشَرَةَ رَكْعَةً. يَابُنَيَّ فَلَمَّا أَسَنَّ صلى الله عليه وسلم وَأَخَذَ اللَّحْمَ أَوْتَرَ بِسَبْعٍ وَصَنَعَ فِيْ الرَّكْعَتَيْنِ مِثْلَ صَنِيْعِهِ فِيْ الْأَوْلَى فَتِلْكَ تِسْعٌ. يَا بُنَيَّ وَكَانَ نَبِيٌّ الله صلى الله عليه وسلم إِذَا صَلَّى صَلَاةً أَحَبَّ أَنْ يُّدَاوِمَ عَلَيْهَا وَكَانَ إِذَا غَلَبَهُ نَوْمٌ أَوْ وَجْعٌ عَنْ قِيَامِ اللَّيْلِ صَلَّى مِنَ النَّهَارِ ثِنْتَيْ عَشَرَةَ رَكْعَةً وَلَا أَعْلَمُ نَبِيَّ اللهِ صلى الله عليه وسلم قَرَأَ الْقُرْآنَ كُلُّهُ فِيْ لَيْلَةٍ. وَلَا صَلَّى لَيْلَةٍ إِلَى الصُّبْحِ. وَلَا صَامَ شَهْرًا كَامِلًا غَيْرَ رَمْضَانَ. رَوَاهُ مُسْلِمٌ .

1257. (4) [1/394దృఢం]

స’అద్‌ బిన్‌ హిషామ్‌ (ర) కథనం: నేను ‘ఆయి’షహ్‌ (ర) వద్దకు వెళ్ళాను. ఓ విశ్వాసుల మాతృ మూర్తి! ప్రవక్త(స) సద్దుణాల గురించి వివరించండి, అని విన్నవించుకున్నాను. దానికి ‘ఆయి’షహ్‌ (ర), ‘నీవు ఖుర్‌ఆన్‌ చదవలేదా?’ అని అడిగారు. నేను ‘అవును, చదివాను’ అని అన్నాను. దానికి ‘ఆయి’షహ్‌ (ర), ‘ప్రవక్త (స) సద్గుణాలు ఖుర్‌ఆన్‌లో ఉన్నాయి’ అని అన్నారు. అంటే, ఖుర్‌ఆన్‌లో ఉన్న సద్గుణా లన్నింటినీ ప్రవక్త (స) ఆచరించేవారు. ‘ప్రవక్త (స) సద్గుణాలను చూడాలనుకుంటే, ఖుర్‌ఆన్‌ అద్దంలో చూడండి’ అని అన్నారు. దానికి నేను, ‘ఓ మాతృ మూర్తి! ప్రవక్త (స) విత్ర్‌ నమా’జు ఎలా చదివేవారో తెలుపండి’ అని విన్నవించుకున్నాను. దానికి ‘ఆయి’షహ్‌ (ర) ‘మేము ప్రవక్త (స) కోసం వు’దూ నీటిని, మిస్వాక్‌ను సిద్ధం చేసి ప్రవక్త (స) పడక వద్ద ఉంచేవాళ్ళం. అల్లాహ్‌(త) లేపినపుడు ప్రవక్త (స) మేల్కొని, మిస్వాక్‌ చేసి, వు’దూ చేసి 9 రకా’తులు నమా’జు చదువుతారు. వాటిలో కేవలం 8 రకా’త్‌ల తర్వాత తషహ్హుద్‌లో కూర్చుంటారు. దైవాన్ని స్మరిస్తారు. స్తోత్రం చేస్తారు, ఇంకా దు’ఆ చేస్తారు. సలామ్‌ పలకకుండా లేచి నిలబడతారు. 9వ ర’కాత్‌ చదివి కూర్చుంటారు. అల్లాహ్‌ను స్మరిస్తారు. ఆయన్ను స్తోత్రం చేస్తారు, దు’ఆ చేస్తారు. ఆ తరువాత సలామ్‌ పలుకుతారు. దాన్ని మేము వినే వాళ్ళం. అంటే బిగ్గరగానూ, మెల్లగానూ కాకుండా పలికేవారు. మేము ఆయన ప్రక్కనే ఉంటాము. అందువల్ల ప్రవక్త (స) సలామ్‌ ను వినగలిగే వాళ్ళం. సలామ్ పలికిన తరువాత రెండు రక’అతులు కూర్చోని చదివేవారు. ఓ నా కుమారా ఇవన్నీ 11 రకాతులు అయ్యాయి.

ఆ తరువాత ప్రవక్త (స) వయస్సు పెరిగి, వృద్ధా ప్యానికి చేరుకుని, శరీరం బరువెక్కిన తరువాత విత్ర్‌ 7 రక’అతులు మాత్రమే చదివేవారు. అలవాటు ప్రకారం  2 రక’అత్‌లు సలామ్‌ తరువాత కూర్చొని చదివేవారు. ఓ అబ్బాయి, ఇవన్నీ 9 రక’అత్‌లు అయ్యాయి. ప్రవక్త (స) నఫిల్‌ నమా’జు చదివితే దాన్ని ఎల్లప్పుడూ పాటించటాన్ని ఉత్సాహం చూపే వారు. ఒకవేళ నిద్రవల్ల లేదా అనారోగ్యం వల్ల లేదా శారీరక నొప్పివల్ల తహజ్జుద్‌ చదవలేని పక్షంలో పగలు 12 రకాతులు చదువుకునే వారు. ఇంకా ఒక్క రాత్రిలోనే ప్రవక్త (స) మొత్తం ఖుర్‌ఆన్‌ చదివి నట్టు, రాత్రంతా ఉదయం వరకు నమా’జు చదివి నట్టు, రమ’దాన్‌ తప్ప ఇతర దినాల్లో అన్ని రోజులు ఉపవాసం ఉన్నట్టు నాకు తెలియదు,’ అని సమా ధానం ఇచ్చారు. [104] (ముస్లిమ్‌)

1258 – [ 5 ] ( صحيح ) (1/395)

وَعَنِ ابْنِ عُمَرَ عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ: “اجْعَلُوْا آخِرَ صَلَاتِكُمْ بِاللَّيْلِ وِتْرًا”. رَوَاهُ مُسْلِمٌ .

1258. (5) [1/395దృఢం]

ఇబ్నె ‘ఉమర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”రాత్రి నమా’జుల్లో విత్ర్‌ను చివరి నమా’జుగా చేసుకోండి. అంటే విత్ర్‌ను అన్నిటికంటే చివరిలో ఆచరించాలి.” [105](ముస్లిమ్‌)

1259 – [ 6 ] ( صحيح ) (1/395)

وَعَنِ ابْنِ عُمَرَ عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ: “بَادِرُوْا الصُّبْحَ بِالْوِتْرِ”. رَوَاهُ مُسْلِمٌ.  

1259. (6) [1/395దృఢం]

ఇబ్నె ‘ఉమర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఉదయం అవకముందే విత్ర్‌ చదువుకోండి.” [106] (ముస్లిమ్‌)

1260 – [ 7 ] ( صحيح ) (1/395)

وَعَنْ جَابِرٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَنْ خَافَ أَنْ لَا يَقُوْمَ مِنْ آخِرِ اللَّيْلِ فَلْيُوْتِرُ أَوَّلَهُ وَمَنْ طَمَعَ أَنْ يَّقُومَ آخِرَهُ فَلْيُوْتِرْ آخِرَ اللَّيْلِ فَإِنَّ صَلَاةَ آخِرَ اللَّيْلِ مَشْهُوْدَةٌ وَذَلِكَ أَفْضَلُ”. رَوَاهُ مَسْلِمٌ .

1260. (7) [1/395దృఢం]

జాబిర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఎవరైనా రాత్రి చివరి భాగంలో లేవలేమని భయంగా ఉంటే, ‘ఇషా’ తరువాత రాత్రి ప్రారంభంలోనే విత్ర్‌ చదువు కోవాలి. రాత్రి చివరి భాగంలో లేవగలిగే వారు. విత్ర్‌ను రాత్రి చివరి భాగంలో చదువుకోవాలి. ఎందుకంటే రాత్రి చివరిభాగంలో శుభ-కారుణ్యాల దైవదూతలు అవతరిస్తారు. అంటే విత్ర్‌ను రాత్రి చివరి భాగంలో చదవటమే ఉత్తమం.” (ముస్లిమ్‌)

1261 – [ 8 ] ( متفق عليه ) (1/395)

وَعَنْ عَائِشَةَ رَضِيَ اللهُ عَنْهَا قَالَتْ: مِنْ كُلِّ اللَّيْلِ أَوْتَرَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم مِنْ أَوَّلَ اللَّيْلِ وَأَوْسَطِهِ وَآخِرِهِ وَانْتَهَى وِتْرُهُ إِلَى السَّحَرِ.

1261. (8) [1/395ఏకీభవితం]

‘ఆయి’షహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) విత్ర్‌ను రాత్రి ప్రతి భాగంలో చదివారు. ప్రారంభంలో, మధ్యలో, చివరిలో. ప్రవక్త (స) ఉషోదయ కాలం ప్రారంభం వరకు ఎప్పుడైనా చదివే వారు. (బు’ఖారీ, ముస్లిమ్‌)

1262 – [ 9 ] ( متفق عليه ) (1/395)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: أَوْصَانِيْ خَلِيْلِيْ بِثَلَاثِ: صِيَامِ ثَلَاثَةِ أَيَّامٍ مِّنْ كُلِّ شَهْرٍ وَرَكْعَتَيِ الضُّحَى وَأَنْ أُوْتِرَ قَبْلَ أَنْ أَنَامَ .

1262. (9) [1/395ఏకీభవితం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: నాకు నా ప్రియ ప్రవక్త (స) ఈ మూడు విషయాల గురించి హితబోధ చేశారు. 1. ప్రతి నెలలో 3 ఉపవాసాలు పాటించు. 2. మిట్టమధ్యాహ్నానానికి ముందు 2 రకాతులు (చాష్త్‌) చదువుతూ ఉండు. 3. నిద్రపోవడానికి ముందు విత్ర్‌ నమా’జును చదువుకుంటూ ఉండు. [107] (బు’ఖారీ, ముస్లిమ్‌)

—–

اَلْفَصْلُ الثَّانِيْ రెండవ విభాగం 

1263 – [ 10 ] ( صحيح ) (1/396)

عَنْ غُضَيْفِ بْنِ الْحَارِثِ قَالَ: قُلْتُ لِعَائِشَةَ: أَرَأَيْتِ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم كَانَ يَغْتَسِلُ مِنَ الْجَنَابَةِ فِيْ أَوَّلِ اللَّيْلِ أَمْ فِيْ آخِرِهِ؟ قَالَتْ: رُبَّمَا اغْتَسَلَ فِيْ أَوَّلِ اللَّيْلِ وَرُبَّمَا اغْتَسَلَ فِيْ آخِرِهِ قُلْتُ: اللهُ أَكْبَرُ اَلْحَمْدُ لِلهِ الَّذِيْ جَعَلَ فِيْ الْأَمْرِ سَعَةً قُلْتث: كَانَ يُوْتِرُ أَوَّلَ اللَّيْلَ أَمْ فِيْ آخِرِهِ؟ قَالَتْ: رُبَّمَا أَوْتَرَ فِيْ أَوَّلِ اللَّيْلِ وَرُبَّمَا أَوْتِرَ فِيْ آخِرِهِ. قُلْتُ: اللهُ أَكْبَرُ اَلْحَمْدُ لِلهِ الَّذِيْ جَعَلَ فِيْ الْأَمْرِ سَعَةً قُلْتُ: كَانَ يَجْهَرُ بِالْقِرَاءَةِ أَمْ يَخْفِتُ؟ قَالَتْ: رُبَّمَا جَهَرَ بِهِ وَرُبَّمَا خَفَتْ قُلْتُ: اللهُ أَكْبَرُ الْحَمْدُ للهِ الَّذِيْ جَعَلَ فِيْ الْأَمْرِ سَعَةً. رَوَاهُ أَبُوْ دَاوُدَ وَرَوَى ابْنُ مَاجَهُ اَلْفَصْلُ الْأَخِيْرَ.

1263. (10) [1/396దృఢం]

గు’దైఫ్ బిన్‌ ‘హారిస్‌ (ర) కథనం: నేను ‘ఆయి’షహ్‌ (ర) ను ప్రవక్త (స) జనాబత్‌ ‘గుసుల్‌ అంటే లైంగిక స్నానం, రాత్రి ప్రారంభం లో చేసేవారా లేక రాత్రి చివరి భాగంలో చేసేవారా అని అడిగాను. దానికి ఆమె ప్రవక్త (స) జనాబత్‌ స్నానం ఒక్కోసారి రాత్రి ప్రారంభంలో చేసేవారు, ఒక్కోసారి రాత్రి చివరి భాగంలో చేసేవారు అని సమాధానం ఇచ్చారు. దానికి నేను ”అల్లాహ్‌ చాలా గొప్పవాడు, స్తోత్రాలన్నీ అల్లాహ్‌ కొరకే. ఆయన ఇందులో విశాలత పొందుపరిచాడు. ఆ తరువాత నేను ప్రవక్త (స) ‘విత్ర్‌ నమా’జును రాత్రి చివరి భాగంలో చదివేవారా లేక రాత్రి ప్రారంభంలో చదివేవారా’ అని అడిగాను. దానికి ఆమె ‘ఒక్కోసారి ప్రారంభంలో, ఒక్కోసారి చివరిలో చదివేవారు’ అని అన్నారు. నేను సంతోషం పట్టలేక ‘అల్లాహు అక్బర్‌ స్తోత్రాలన్నీ అల్లాహ్‌ కొరకే, ఆయన ధార్మిక విషయాల్లో విశాలత ఉంచాడు’, అని అన్నాను. ఆ తరువాత నేను ‘ప్రవక్త (స) తన తహజ్జుద్‌ నమా’జులో ఖుర్‌ఆన్‌ పఠనం బిగ్గరగా చేసేవారా లేక మెల్లగా చేసేవారా’ అని అడిగాను. దానికి ఆమె ‘ఒక్కోసారి బిగ్గరగా, ఒక్కోసారి మెల్లగా చేసేవారు’ అని అన్నారు. అప్పుడు నేను మళ్ళీ ‘అల్లాహ్‌యే గొప్పవాడు, స్తోత్రాలన్నీ ఆయనకే, ఆయనే కర్మల్లో విశాలత పొందుపరిచాడు’ అని అన్నాను. (అబూ దావూద్‌, ఇబ్నె మాజహ్)

1264 – [ 11 ] ( صحيح ) (1/396)

وَعَنْ عَبْدِ اللهِ بْنِ أَبِيْ قَيْسٍ قَالَ: سَأَلْتُ عَائِشَةَ: بِكَمْ كَانَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم يُوْتِرُ؟ قَالَتْ: كَانَ يُوْتِرُ بِأَرْبَعٍ وَثَلَاثَ وَّسِتٍّ وَثَلَاثٍ وَّثَمَانٍ وَثَلَاثٍ وَّعَشَرٍوَّثَلَاثٍ وَلَمْ يَكُنْ يُوْتِرُ بِأَنْقَصَ مِنْ سَبْعٍ وَلَا بِأَكْثَرَ مِنْ ثَلَاثَ عَشَرَةَ. روَاهُ أَبُوْ دَاوُدَ.

1264. (11) [1/396దృఢం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ అబీ ఖైస్‌ (ర) కథనం: నేను ‘ఆయి’షహ్‌ (ర)ను ”ప్రవక్త (స) విత్ర్‌ నమా’జు ఎన్ని రకా’తులు చదివే వారు’ అని అడిగాను. దానికి ఆమె ‘4+3 అంటే 7; 6+3 అంటే 9; 8+3 అంటే 11; 10+3 అంటే 13 రకా’తులు అని; ఇంకా ప్రవక్త (స) 7 కంటే తక్కువ 13 రకా’తుల కంటే ఎక్కువ ఎన్నడూ చదవనే లేదు” అని అన్నారు. [108] (అబూ దావూద్‌)

1265 – [ 12 ] ( صحيح ) (1/396)

وَعَنْ أَبِيْ أَيُّوْبَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “اَلْوِتْرُ حَقٌّ عَلَى كُلِّ مُسْلِمٍ فَمَنْ أَحَبَّ أَنْ يُّوْتِرَ بِخَمْسٍ فَلْيَفْعَلْ وَمَنْ أَحَبَّ أَنْ يُّوْتِرَ بِثَلَاثٍ فَلْيَفْعَلْ وَمَنْ أَحَبَّ أَنْ يُّوْتِرَ بِوَاحِدَةٍ فَلْيَفْعَلْ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ وَالنَّسَائِيُّ وَابْنُ مَاجَهُ.

1265. (12) [1/396దృఢం]

అబూ అయ్యూబ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ప్రతి ముస్లిమ్‌పై విత్ర్‌, హక్కు (సున్నత్‌ ముఅక్కదహ్)గా విధించబడింది. కోరినవారు 5 రక’అతులు చదువుకోవచ్చు, కోరినవారు 3 రక’అతులు చదువుకోవచ్చు. ఒక రక’అతు చదవ గోరేవారు ఒక రక’అతు చదువుకోవచ్చు. (అబూ దావూద్‌, తిర్మిజి’, నసాయి’, ఇబ్నె మాజహ్)

1266 – [ 13 ] ( حسن ) (1/397)

وَعَنْ عَلِيٍّ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِنَّ اللهَ وِتْرٌ يُّحِبُّ الْوِتْرَ فَأَوْتِرُوْا يَا أَهْلَ الْقُرْآنِ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَأَبُوْ دَاوُدَ وَالنَّسَائِيُّ .

1266. (13) [1/397ప్రామాణికం]

‘అలీ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”అల్లాహ్‌ బేసి అంటే ఏకైకుడు, ఒంటరి తనాన్ని ప్రేమిస్తాడు. ఓ ఖుర్‌ఆన్‌ ప్రజలారా! విత్ర్‌ను పాటించండి.” [109] (తిర్మిజి’, అబూ దావూద్‌, నసాయి’)

1267 – [ 14 ] ( ضعيف ) (1/397)

وَعَنْ خَارِجَةَ بْنِ حُذَافَةَ قَالَ: خَرَجَ عَلَيْنَا رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم وَقَالَ: “إِنَّ اللهَ أَمَدَّكُمْ بِصَلَاةِ هِيَ خَيْرُ لَّكُمْ مِّنْ حُمُرِالنَّعَمِ:اَلْوِتْرُ جَعَلَهُ اللهُ لَكُمْ فِيْمَا بَيْنَ صَلَاةِ الْعِشَاءِ إِلَى أَنْ يَّطْلُعَ الْفَجْرُ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَأَبُوْ دَاوُدَ .

1267. (14) [1/397బలహీనం]

‘ఖారిజ బిన్‌ ‘హుజా’ఫహ్ (ర) కథనం: ప్రవక్త (స) మా వద్దకు వచ్చి, ‘అల్లాహ్‌(త) ఒక నమా’జు ద్వారా మీకు సహాయం చేసాడు. అది ఖరీదైన ఒంటెల కంటే విలువైనది. అది విత్ర్‌ నమా’జు. దానికి అల్లాహ్‌ ‘ఇషా’ నమా’జు తరువాత నుండి ఉషోదయం వరకు సమయం నిర్ణయించాడు,’ అని అన్నారు. [110] (తిర్మిజి’, అబూ దావూద్‌)

1268 – [ 15 ] ( حسن ) (1/397)

وَعَنْ زَيْدِ بْنِ أَسْلَمَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَنْ نَامَ عَنْ وِتْرِهِ فَلْيُصَلِّ إِذَا أَصْبَحَ”. رَوَاهُ التِّرْمِذِيُّ مُرْسَلًا .

1268. (15) [1/397-ప్రామాణికం]

 ‘జైద్‌ బిన్‌ అస్లమ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఎవరైనా విత్ర్‌ చదవకుండా నిద్రపోతే ఉదయం లేచిన తర్వాత చదువుకోవాలి.” [111](తిర్మిజి’ – తాబయీ ప్రోక్తం)

1269 – [ 16 ] ( صحيح ) (1/397)

وَعَنْ عَبْدِ الْعَزِيْزِ بْنِ جُرَيْجٍ قَالَ: سَأَلْنَا عَائِشَةَ رَضِيَ اللهُ عَنْهَا بِأَيِّ شَيْءٍ كَانَ يُوْتِرُ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم؟ قَالَتْ: كَانَ يَقْرَأُ فِيْ الْأُوْلَى ب (سَبِّحِ اسْمِ رَبِّكَ الْأَعْلَى-87) وَفِيْ الثَّانِيَةِ ب (قُلْ يَا أَيُّهَا الْكَافِرُوْنَ-109) وَفِيْ الثَّالِثَةِ ب (قُلْ هُوَ اللهُ أَحَدٌ-112؛ وَالْمُعَوَّذَتَيْنِ-113، 114). وَرَوَاهُ التِّرْمِذِيُّ وَأَبُوْ دَاوُدَ.

1269. (16) [1/397దృఢం]

‘అబ్దుల్‌ ‘అ’జీ’జ్‌ బిన్‌ జురైజ్ (ర) కథనం: నేను ‘ఆయి’షహ్‌ (ర) ను ‘ప్రవక్త (స) విత్ర్‌ నమా’జులో ఏ ఏ సూరాలు చదివేవారు’ అని అడిగాను. దానికి ఆమె సమాధానం ఇస్తూ  ‘మొదటి రకాతులో సూరహ్‌ ఫాతి’హా తరువాత ”సూరహ్ అల్‌ అ’అలా (87)” రెండవ రకాతులో సూరహ్‌ ఫాతి’హా తరువాత ”సూరహ్ అల్‌ కాఫిరూన్‌ (109) మరియు మూడవ రకాతులో సూరహ్‌ ఫాతి’హా తరువాత సూరగ్ అల్‌ ఇ’ఖ్‌లాస్‌ (112) మరియు ము’అవ్వజ’తైన్‌ సూరహ్ అల్‌ ఫలఖ్‌ (113), సూరహ్ అన్నాస్‌ (114) చదివే వారు అని అన్నారు.” (తిర్మిజి’, అబూ దావూద్‌)

1270 – [ 17 ] ( صحيح ) (1/397)

وَرَوَاهُ النَّسَائِيُّ عَنْ عَبْدِ الرَّحْمنِ بْنِ أَبْزَى .

1270. (17) [1/397దృఢం]

నసాయి’, దీన్ని అబ్దుర్ ర’హ్మాన్ బిన్ అబ్జి ద్వారా ఉల్లేఖించారు.

1271 – [ 18 ] ( صحيح ) (1/397)

وَرَوَاهُ أَحْمَدُ عَنْ أُبَيِّ بْنِ كَعْبٍ .

1271. (18) [1/397దృఢం]

అ’హ్మద్‌ దీన్ని ఉబయ్ బిన్ క’అబ్ ద్వారా ఉల్లేఖించారు.

1272 – [ 19 ] ( صحيح ) (1/398)

وَالدَّارَمِيُّ عَنِ ابْنِ عَبَّاسٍ وَلَمْ يَذْكُرُوْا وَالْمُعَوَّذَتَيْنِ .

1272. (19) [1/398దృఢం]

దార్మీ, ఇబ్నె అబ్బాస్ ద్వారా, కొన్ని ఉల్లేఖనాల్లో ము’అవ్వజ’తైన్‌ అనే పదం లేదు.

1273 – [ 20 ] ( صحيح ) (1/398)

وَعَنِ الْحَسَنِ بْنِ عَلِيٍّ رَضِيَ اللهُ عَنْهُمَا قَالَ: عَلَّمَنِيْ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم كَلِمَاتٍ أَقُوْلُهُنَّ فِيْ قُنُوْتِ الْوِتْرِ: “اَللَّهُمَّ اهْدِنِيْ فِيْمَنْ هَدَيْتَ، وَعَافِنِيْ فِيْمَنْ عَافَيْتَ، وَتَوَلَّنِيْ فِيْمَنْ تَوَلَّيْتَ، وَبَارِكْ لِيْ فِيْمَا أَعْطَيْتَ، وَقِنِيْ شَرَّ مَا قَضَيْتَ، فَإِنَّكَ تَقْضِيْ وَلَا يُقْضَى عَلَيْكَ، إِنَّهُ لَا يُذِلُّ مَنْ وَالَيْتَ، تَبَارَكْتَ رَبَّنَا وَتَعَالَيْتَ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَأَبُوْ دَاوُدَ وَالنَّسَائِيُّ وَابْنُ مَاجَهُ وَالدَّارَمِيُّ .

1273. (20) [1/398దృఢం]

‘హసన్‌ బిన్‌ ‘అలీ (ర) కథనం: ప్రవక్త (స) నాకు విత్ర్‌లో చదవమని ఈ దుఆయె ఖునూత్ నేర్పారు: ”అల్లాహుమ్మహ్‌దినీ ఫీమన్‌ హదైత. వ ‘ఆఫినీ ఫీమన్‌ ‘ఆఫైత. వ తవల్లనీ ఫీమన్‌ తవల్లైత. వ బారిక్‌లీ ఫీమా అ’అతైత. వఖినీ షర్ర మాఖ’దైత, ఫ ఇన్నక తఖ్‌’దీ వలా యుఖ్‌’దా ‘అలైక. ఇన్నహూ లా యజి’ల్లు మన్ వల్లైత. తబారక్‌త రబ్బనా వత’ఆలైత. వనస్‌తగ్‌ఫిరుక వనతూబు ఇలైక.” — ‘ఓ అల్లాహ్‌! నీవు సన్మార్గం చూపించిన వారిలా నాకూ సన్మార్గం చూపించు. నీవు క్షేమాన్ని ప్రసాదించిన వారిలా నాకూ క్షేమాన్ని ప్రసాదించు. నీవు మిత్రులుగా చేసుకున్న వారిలా నన్ను మిత్రునిగా చేసుకో. ఇంకా నాకు ప్రసాదించిన వాటిలో శుభాన్ని ప్రసాదించు. నీవు నా విధి వ్రాతలో వ్రాసిన కీడు నుండి నన్ను కాపాడు, ఎందుకంటే నీవే అధికారం చలాయించేవాడవు. నీపై అధికారం చెలాయించడం జరుగదు. నీ మిత్రుడు అవమానానికి గురికాడు. ఓ మా ప్రభూ! నీవే శుభకరుడవు, గొప్పవాడవు. నిన్ను క్షమాపణ కోరుతున్నాము, పశ్చాత్తాపంచెంది నీవైపే మరలు తున్నాము.’ (తిర్మిజి’, అబూ దావూద్‌, నసాయి’, ఇబ్ను మాజహ్, దార్మీ)

1274 – [ 21 ] ( صحيح ) (1/398)

وَعَنْ أُبَيِّ بْنِ كَعْبٍ قَالَ: كَانَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم إِذَا سَلَّمَ فِيْ الْوِتْرِ قَالَ: “سُبْحَانَ الْمَلِكِ الْقُدُّوْسِ” .رَوَاهُ أَبُوْ دَاوُدَ وَالنَّسَائِيُّ وَزَادَ: ثَلَاثَ مَرَّاتٍ يُّطِيْلُ فِيْ آخِرِهِنَّ .

1274. (21) [1/398దృఢం]

ఉబయ్‌ బిన్‌ క’అబ్‌ (ర) కథనం: ప్రవక్త (స) విత్ర్‌లో సలామ్‌ పలికిన తర్వాత మూడుసార్లు, ”సుబ్హానల్మలికిల్ఖుద్దూస్” అని పలికేవారు. (అబూ దావూ’ద్‌) మూడవసారి బిగ్గరగా పలికేవారు (నసాయి).

1275 – [ 22 ] ( صحيح ) (1/398)

وَفِيْ رَوَايَةٍ لِلنَّسَائِيِّ عَنْ عَبْدِ الرَّحْمَنِ بْنِ أَبْزَى عَنْ أَبِيْهِ قَالَ: كَانَ يَقُوْلُ إِذَا سَلَّمَ: “سُبْحَانَ الْمَلِكِ الْقُدُّوْسِ” ثَلَاثًا وَيَرْفَعُ صَوْتَهُ بِالثَّالِثَةِ.

1275. (22) [1/398దృఢం]

అబ్దుర్ ర’హ్మాన్ బిన్ అబ్జి తన తండ్రి ద్వారా ‘దీన్నే ఉల్లేఖించి, మూడవ సారి బిగ్గరగా పలికేవారు,’ అని అన్నారు. (నసాయి’)

1276 – [ 23 ] ( صحيح ) (1/398)

وَعَنْ عَلِيٍّ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: إِنَّ النَّبِيَّ صلى الله عليه وسلم كَانَ يَقُوْلُ فِيْ آخِرِوِتْرِهِ: “اللَّهُمَّ إِنِّيْ أَعُوْذُ بِرِضَاكَ مِنْ سَخَطِكَ وَبِمُعَافَاتِكَ مِنْ عُقُوْبَتِكَ وَأَعُوْذُ بِكَ مِنْكَ لَا أُحْصَي ثَنَاءً عَلَيْكَ أَنْتَ كَمَا أَثْنَيْتَ عَلَى نَفْسِكَ”.رَوَاهُ أَبُوْ دَاوُدَ وَالتِّرْمِذِيُّ وَالنَّسَائِيُّ وَابْنُ مَاجَهُ.

1276. (23) [1/398దృఢం]

‘అలీ (ర) కథనం: ప్రవక్త (స) విత్ర్‌ చివరిలో ఈ దు’ఆను చదివేవారు. ”అల్లాహుమ్మ ఇన్నీ అ’ఊజు’బిక బి ర’దాక మిన్‌ స’ఖ’తిక, వ బి ము’ఆఫాతిక మిన్‌ ‘ఉఖూ బతిక, వ అ’ఊజు ‘బిక మిన్‌క. లా ఉ’హ్‌’సీ స’నాఅన్‌ అలైక. అన్‌త కమా అస్‌’నైత అలా నఫ్‌సిక.” — ‘ఓ అల్లాహ్‌! నీ సాన్నిహిత్యం ద్వారా నీ ఆగ్రహం నుండి నీ శరణు కోరు తున్నాను. ఇంకా నీ క్షమాపణ ద్వారా నీ శిక్ష నుండి శరణు కోరుతున్నాను. ఇంకా నేను నిన్ను నీ ఆగ్రహం నుండి శరణు కోరుతున్నాను. నీ మంచి తనాలను నేను ఆపలేను. నీవు, నిన్ను-నీవు పేర్కొన్నట్లే ఉన్నావు.’ (అబూ దావూద్‌, నసాయి’, తిర్మిజి’, ఇబ్నె మాజహ్)

—–

اَلْفَصْلُ الثَّالِثُ  మూడవ విభాగం 

1277 – [ 24 ] ( صحيح ) (1/399)

عَنِ ابْنِ عَبَّاسٍ قِيْلَ لَهُ: هَلْ لَكَ فِيْ أَمِيْرِ الْمُؤْمِنِيْنَ مُعَاوِيَةَ فَإِنَّهُ مَا أُوْتَرَ إِلَّا بِوَاحِدَةٍ؟ قَالَ: أَصَابَ إِنَّهُ فَقِيْهٌ.

وَفِيْ رَوَايَةٍ: قَالَ ابْنُ أَبِيْ مُلَيْكَةَ: أَوْتَرَ مُعَاوِيَةُ بَعْدَ الْعِشَاءِ بِرَكْعَةٍ وَعِنْدَهُ مُوْلَى لِاِبْنِ عَبَّاسٍ فَأَتَى ابْنَ عَبَّاسٍ فَأَخْبَرَهُ. فَقَالَ: دَعَهُ فَإِنَّهُ قَدْ صَحِبَ النَّبِيَّ صلى الله عليه وسلم. رَوَاهُ الْبُخَارِيُّ

1277. (24) [1/399దృఢం]

ఇబ్నె ‘అబ్బాస్‌ను, ము’ఆవియహ్‌ ఒక్క రకాతు మాత్రమే చదవటం గురించి మీ అభిప్రాయం ఏమిటి,’ అని ప్రశ్నించడం జరిగింది. దానికి ఇబ్నె ‘అబ్బాస్‌, ”ము’ఆవియహ్‌ ఒక రకా’తు చదవటం సరైనదే. ఎందుకంటే, అతడు మేధావి, ధార్మిక పండితుడు,” అని అన్నారు.

మరో ఉల్లేఖనంలో ఇలా ఉంది, ”ఇబ్ను అబీ ములైకహ్ కథనం: ము’ఆవియహ్‌ ‘ఇషా’ తర్వాత విత్ర్‌ ఒక్కరక’అతు మాత్రమే చదివారు. అక్కడ ఇబ్నె ‘అబ్బాస్‌ విడుదల చేసిన  సేవకుడు కూర్చొని ఉన్నాడు. ఈ విషయం చూసి, ఇబ్నె ‘అబ్బాస్‌ (ర) వద్దకు వచ్చి తెలియపరిచాడు. దానికి ఇబ్నె ‘అబ్బాస్‌ అతన్ని వదిలేయి, అతన్ని విమర్శించకు. అతను ప్రవక్త (స) వెంట ఉండేవారు. ప్రవక్త (స)ను విత్ర్‌ ఒక రకాతు చదువుతుండగా చూసి ఉన్నారు” అని అన్నారు. [112]  (బు’ఖారీ)

1278 – [ 25 ] ( ضعيف ) (1/399)

وَعَنْ بُرَيْدَةَ قَالَ: سَمِعْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ: “اَلْوِتْرُ حَقٌّ فَمَنْ لَمْ يُوْتِرْ فَلَيْسَ مِنَّا. اَلْوِتْرُ حَقٌّ فَمَنْ لَّمْ يُوْتِرْ فَلَيْسَ مِنَّا. اَلْوِتْرُ حَقٌّ فَمَنْ لَّمْ يُوْتِرُ فَلَيْسَ مِنَّا”. رَوَاهُ أَبُوْ دَاوُدَ.

1278. (25) [1/399బలహీనం]

బురైదహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ఇలా ప్రవచిస్తూ ఉండగా నేను విన్నాను, ”విత్ర్‌ హక్కు, విత్ర్‌ చదవని వారు మావారు కారు. విత్ర్‌ హక్కు, విత్ర్‌ చదవని వారు మావారు కారు. విత్ర్‌ హక్కు, విత్ర్‌ చదవని వారు మా వారు కారు” అని మూడుసార్లు పలికారు. (అబూ దావూద్‌)

1279 – [ 26 ] ( صحيح ) (1/399)

وَعَنْ أَبِيْ سَعِيْدٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَنْ نَامَ عَنِ الْوِتْرِ أَوْ نَسِيَهُ فَلْيُصَلِّ إِذَا ذَكَرَ أَوْ إِذَا اسْتَيْقَظَ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَ أَبُوْ دَاوُدَ وَابْنُ مَاجَهُ.

1279. (26) [1/399దృఢం]

అబూ స’యీద్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”విత్ర్‌ చదవకుండా నిద్రపోయినా లేదా మరచి పోయినా, గుర్తుకు రాగానే చదువుకోవాలి.” (తిర్మిజి’, అబూ దావూద్‌, ఇబ్నె మాజహ్)

1280 – [ 27 ] ( ضعيف ) (1/399)

وَعَنْ مَالِكٍ بَلَغَهُ أَنَّ رَجُلًا سَأَلَ ابْنُ عُمَرَ عَنِ الْوِتْرِ: أَوَاجِبٌ هُوَ؟ فَقَالَ عَبْدُ اللهِ: قَدْ أَوْتَرَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم وَأَوْتَرَ الْمُسْلِمُوْنَ. فَجَعَلَ الرَّجُلُ يُرَدِّدُ عَلَيْهِ. وَعَبْدُ اللهِ يَقُوْلُ: أَوْتَرَرَسُوْلُ اللهِ صلى الله عليه وسلم وَأَوْتَرَ الْمُسْلِمُوْنَ. رَوَاهُ فِيْ الْمُوَطَّأ.

1280. (27) [1/399బలహీనం]

మాలిక్‌కు ఈ వార్త అందింది: ఇబ్నె ‘ఉమర్‌ను ఒక వ్యక్తి విత్ర్‌ గురించి ‘విత్ర్‌ను తప్పనిసరి విధిగా చద వాలా?’ అని అడిగాడు. దానికి ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘ఉమర్‌ (ర), ప్రవక్త (స) విత్ర్‌ నమా’జు చదివారు, ముస్లిములు కూడా విత్ర్‌ నమా’జు  చదివారు’ అని అన్నారు. ఆ వ్యక్తి అనేకసార్లు ‘విత్ర్‌ తప్పనిసరి విధా, కాదా?’ అని అడగసాగాడు. దానికి ఇబ్నె ‘ఉమర్‌ (ర) ‘ప్రవక్త (స) విత్ర్‌ చదివారు, ముస్లిములు విత్ర్‌ చదివారు’ అనే సమాధానం ఇస్తూపోయారు. [113] (మువత్తా ఇమామ్ మాలిక్)

1281 – [ 28 ] ( ضعيف جدا ) (1/400)

وَعَنْ عَلِيٍّ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: كَانَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم يُوْتِرُ بِثَلَاثِ يَقْرَأُ فِيْهِنَّ بِتِسْعِ سُوْرٍ مِّنَ الْمُفَصَّلِ يَقْرَأُ فِيْ كُلِّ رَكْعَةٍ بِثَلَاثَ سُوَرٍآخِرُهُنَّ: (قُلْ هُوَا للهُ أَحَدٌ 114) رَوَاهُ التِّرْمِذِيُّ .

1281. (28) [1/400అతి బలహీనం]

‘అలీ (ర) కథనం: ప్రవక్త(స) విత్ర్‌ మూడు రకా’తులు చదివేవారు. వాటిలో 9 ముఫ’స్సల్‌ సూరాలు పఠించే వారు. చివరగా సూ. ఇ’ఖ్లాస్‌ (112) చదివేవారు. [114] (తిర్మిజి’)

1282 – [ 29 ] ( صحيح ) (1/400)

وَعَنْ نَافِعٍ قَالَ: كُنْتُ مَعَ ابْنِ عُمَرَبِمَكَّةَ وَالسَّمَاءُ مُغَيَّمَةٌ فَخَشَيَ الصُّبْحَ فَأَوْتَرَ بِوَاحِدَةٍ ثُمَّ انْكَشَفَ فَرَأَى أَنَّ عَلَيْهِ لَيْلًا فَشَفَّعَ بِوَاحِدَةٍ ثُمَّ صَلَّى رَكْعَتَيْنِ رَكْعَتَيْنِ فَلَمَّا خَشِيَ الصُّبْحَ أَوْتَرَ بِوَاحِدَةٍ. رَوَاهُ مَالِكٌ .

1282. (29) [1/400దృఢం]

నా’ఫె (ర) కథనం: నేను మక్కహ్ లో ఇబ్నె ‘ఉమర్‌ వెంట ఉన్నాను. అప్పుడు ఆకాశం మేఘాలమయంగా ఉంది. ఇబ్నె ‘ఉమర్‌ ఉదయం అవుతుందని భయపడి, ఒక రకా’తు విత్ర్‌ చదువుకున్నారు. ఆ తరువాత మేఘాలు తొలగిపోయాయి. అప్పుడు ఇంకా రాత్రి మిగిలి ఉందని గ్రహించి మరో రక’అతు చదివి రెండు రక’అతులను జత చేసుకున్నారు. ఆ తరువాత రెండేసి రక’అతులు చదవసాగారు. రాత్రి చివరి భాగంలో ఉషోదయ కాలం కావస్తుందనితెలిసి ఒకరక’అతు విత్ర్‌ చదువుకున్నారు. [115] (మాలిక్‌)

1283 – [ 30 ] ( صحيح ) (1/400)

وَعَنْ عَائِشَةَ: أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم كَانَ يُصَلِّيْ جَالِسًا فَيَقْرَاُ وَهُوَ جَالِسٌ. فَإِذَا بَقِيَ مِنْ قِرَاءَتِهِ قَدْرَ مَا يَكُوْنُ ثَلَاثِيْنَ أَوْ أَرْبَعِيْنَ آيَةً قَامَ وَقَرَأَ وَهُوَ قَائِمٌ ثُمَّ رَكَعَ ثُمَّ سَجَدَ ثُمَّ يَفْعَلُ فِيْ الرَّكْعَةِ الثَّانِيةِ مِثْلَ ذَلِكَ. رَوَاهُ مُسْلِمٌ .

1283. (30) [1/400దృఢం]

‘ఆయి’షహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) నఫిల్‌ నమా’జు లు కూర్చొని చదివేవారు. అందులో ఖుర్‌ఆన్‌ను చాలా సేపు వరకు పఠించేవారు. 30 లేదా 40 ఆయతులు మిగిలి ఉండగా నిలబడి, మిగిలిన ఆయతులను పఠించేవారు. ఆ తరువాత రుకూ’, సజ్దా చేసేవారు. రెండవ రకాతులో కూడా ఇలాగే చేసేవారు. (ముస్లిమ్‌)

1284 – [ 31 ] ( صحيح ) (1/400)

وَعَنْ أُمِّ سَلَمَةَ رَضِيَ اللهُ عَنْهَا: أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم: “كَانَ يُصَلِّيْ بَعْدَ الْوِتْرِ رَكْعَتَيْنِ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَزَادَ ابْنُ مَاجِهُ: خَفِيْفَتَيْنِ وَهُوَ جَالِسٌ.

1284. (31) [1/400దృఢం]

ఉమ్మె సలమహ్ (ర) కథనం: ప్రవక్త (స) విత్ర్‌ తర్వాత కూర్చొని తేలికైన రెండు రకాతులు (నఫిల్) చదివే వారు. (తిర్మిజి’, ఇబ్నె మాజహ్)

1285 – [ 32 ] ( صحيح ) (1/401)

وَعَنْ عَائِشَةَ رَضِيَ اللهُ عَنْهَا قَالَتْ: كَانَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم يُوْتِرُ بِوَاحِدَةٍ. ثُمَّ يَرْكَعُ رَكْعَتَيْنِ يَقْرَأُ فِيْهِمَا وَهُوَ جَالِسٌ فَإِذَا أَرَادَ أَنْ يَرْكَعَ قَامَ فَرَكَعَ. رَوَاهُ ابْنُ مَاجَهُ .

1285. (32) [1/401దృఢం]

‘ఆయి’షహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) విత్ర్‌ ఒక రకాతు చదివేవారు. ఆ తరువాత 2 రకాతులు కూర్చొని చదివే వారు. వాటిలో కూర్చొనే ఖిరాఅ’త్‌ చేసేవారు. రుకూ’ చేయవలసి వచ్చినపుడు నిలబడి రుకూ’ చేసేవారు.[116] (ఇబ్నె మాజహ్)   

1286 – [ 33 ] ( صحيح ) (1/401)

وَعَنْ ثَوْبَانَ عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ: “إِنَّ هَذَا السَّهْرَ جُهْدٌ وَثِقْلٌ فَإِذَا أَوْتَرَ أَحَدُكُمْ فَلْيَرْكَعْ رَكْعَتَيْنِ. فَإِنْ قَامَ مِنَ اللَّيْلِ وَإِلَّا كَانَتَا لَهُ”. رَوَاهُ الدَّارَمِيُّ .

1286. (33) [1/401దృఢం]

సౌ’బాన్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”రాత్రి మేల్కొని ఉండటం చాలా కష్టం. మీలో ఎవరైనా విత్ర్‌ చదివితే, మరో రెండు రకా’తులు చదువుకోవాలి. ఒకవేళ రాత్రి మేల్కొని తహజ్జుద్‌ చదువుకుంటే మంచిదే. లేకపోతే ఈ రెండు రకా’తులు తహజ్జుద్‌కు బదులు సరిపోతాయి. వాటివల్ల తహజ్జుద్‌ పుణ్యం లభిస్తుంది.” [117] (ఇబ్నె మాజహ్)

1287 – [ 34 ] ( حسن ) (1/401)

وَعَنْ أَبِيْ أُمَامَةَ: أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم كَانَ يُصَلِّيْهِمَا بَعْدَ الْوِتْرِوَهُوَ جَالِسٌ يَقْرَأُ فِيْهِمَا (إِذَا زُلْزِلَتِ-99) وَ(قُلْ يَا أَيُّهَا الْكَافِرُوْنَ-109) رَوَاهُ أَحْمَدُ .

1287. (34) [1/401ప్రామాణికం]

అబూ ఉమామ (ర) కథనం: ప్రవక్త (స) విత్ర్‌ తరువాత రెండు రకాతులు కూర్చొని చదివేవారు. అందులో సూరహ్‌ ‘జిల్‌’జాల్‌ (99), సూరహ్‌ కాఫిరూన్‌ (109) చదివేవారు. (అ’హ్మద్‌)

=====

36- بَابُ الْقُنُوْتِ

36. దుఆయె ఖునూత్

ఈ పదం గురించి అనేక అర్థాలు ఉన్నాయి. దు’ఆ చేయడం, మౌనంగా ఉండటం, విధేయత చూపడం, నమా ‘జులో నిలబడటం, అల్లాహ్‌ ఆదేశం: ”అల్లాహ్‌ ముందు నిశ్శబ్దంగా నిలబడండి.” మరోచోట, ”ఆమె అల్లాహ్‌ విధేయురాలు.” అన్నిటి కంటే ఉత్తమమైన నమా’జు ఖియామ్‌ దీర్ఘంగా ఉన్నదే. ఇక్కడ ఖునూత్ అంటే ప్రత్యేక దు’ఆ. దీన్ని విత్ర్‌ నమా’జులో లేదా ఫజ్ర్‌ నమా’జులో లేదా కష్టాల నుండి గట్టెక్కడానికి చదవడం జరుగుతుంది.

దు’ఆయె ఖునూత్‌ చదవటం తప్పనిసరి కాదు. కాని అభిలషనీయం. దీన్ని చివరి రకాతులో రుకూకు ముందు, రుకూతర్వాత చదవవచ్చును. అయితే రుకూ తర్వాత చదవడం ఉత్తమం.

అనస్‌ (ర) కథనం: ప్రవక్త (స), అబూ బకర్‌, ‘ఉమర్‌ (ర) రుకూ’ తర్వాత ఖునూత్‌ చదివేవారు, ప్రజలు రుకూ’ పొందాలని.

‘అవ్వామ్‌ బిన్‌’హమ్‌’జహ్ కథనం: నేను అబూ ‘ఉస్మాన్‌ నహ్‌దీను ఉదయం ఖునూత్‌ గురించి అడిగాను. దానికి అతను, ”రుకూ’ తరువాత,’ అని అన్నారు. ‘ఎవరినుండి సేకరించారు,’ అని అడిగాను. దానికి అతను, ‘అబూ బకర్‌, ‘ఉమర్‌, ‘ఉస్మా’న్‌ల నుండి,’ అని అన్నారు.

ఇబ్నె సీరీన్‌ కథనం: ‘ఉమర్‌ పరిపాలనా కాలంలో ‘ఉబై (ర) ప్రజలకు తరావీహ్‌ నమా’జు చదివించే వారు. సగం రమ’దాన్‌ అయిన తరువాత రుకూ’ తరువాత బిగ్గరగా ఖునూత్‌ చదివేవారు.

‘అబ్దుర్ర’హ్మాన్‌ కథనం: ” ‘అలీ (ర) విత్ర్‌లో రుకూ’ తర్వాత ఖునూత్‌ చదివేవారు.” ఇబ్రాహీమ్‌ నఖ్‌యీ’ కథనం: ”అస్వద్ కోసం నేను ఖుర్‌ఆన్‌ పట్టుకొని ఉండేవాడ్ని. అతను అనారోగ్యంగా ఉండేవారు. విత్ర్‌ మూడవ రకా’త్‌ రుకూ’ నుండి లేచిన తర్వాత ఖునూత్‌ చదివేవారు.”

అస్వద్‌ కథనం: ” ‘ఉమర్‌ (ర) విత్ర్‌లో రుకూ’కు ముందు ఖునూత్‌ చదివేవారు. మరో ఉల్లేఖనంలో ఖిరాఅత్‌ తర్వాత రుకూ’కు ముందు ఖునూత్‌ చదివే వారని ఉంది.”

‘అబ్దుర్ర’హ్మాన్‌ బిన్‌ షద్దాద్‌ కథనం: ”నేను ‘ఉమర్‌, ‘అలీ, అబూ మూసాల వెనుక నమా’జు చదివాను. వీరు ఉదయం నమా’జులో రుకూ’కు ముందు ఖునూత్‌ చదివారు.”

‘హుమైదీ కథనం: ”నేను అనస్‌ను ఖునూత్‌ రుకూ’కు ముందా లేక తరువాతనా?’ అని అడిగాను. దానికి అతను ”మేము రుకూ’కు ముందు, రుకూ’ తర్వాత కూడా చదివే వాళ్ళం. అయితే అస్వద్‌ రుకూ’కు ముందు ఖునూత్‌ చదివారు.” అదేవిధంగా అ’హ్మద్‌ను, ”ఖునూత్‌ రుకూ’కు ముందా లేక తర్వాతనా?” అని, ఇంకా ”ఖునూత్‌లో చేతులు ఎత్తాలా లేక ఎత్తకూడదా?’ అని అడగటం జరిగింది. దానికి అతను ‘ఖునూత్‌ రుకూ’ తర్వాత చదవాలి, ఖునూత్‌లో  చేతులు ఎత్తాలి, ఇది ప్రవక్త (స) ‘హదీసు’కు అనుగుణంగా ఉంది. ప్రవక్త (స) ఫజ్ర్‌ నమా’జులో ఈ విధంగా చేసేవారు,” అని అన్నారు. అబూ అయ్యూబ్‌ మరియు అబూ ‘హైస’మ మరియు ఇబ్నె అబీ షైబ అభిప్రాయం కూడా ఇదే.

—–

اَلْفَصْلُ الْأَوَّلُ  మొదటి విభాగం   

1288 – [ 1 ] ( متفق عليه ) (1/402)

عَنْ أَبِيْ هُرَيْرَةَ: أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم كَانَ إِذَا أَرَادَ أَنْ يَّدْعُوَ عَلَى أَحَدٍ أَوْ يَدْعُوْ لِأَحَدٍ قَنَتَ بَعْدَ الرُّكُوْعِ فَرُبَّمَا قَالَ إِذَا قَالَ: “سَمِعَ اللهُ لِمَنْ حَمِدَهُ رَبَّنَا لَكَ الْحَمْدُ: اللَّهُمَّ أَنجِ الْوَلِيْدَ بْنِ الْوَلِيْدِ وَسَلَمَةَ ابْنَ هِشَّامٍ وَعَيَّاشَ بْنِ أَبِي رَبِيْعَةَ اللَّهُمَّ اشْدُدْ وَطْأَتَكَ عَلَى مُضَرَ وَاجْعَلْهَا سِنِيْنَ كَسِنِيْ يُوْسُفَ”. يَجْهَرُ بِذَلِكَ وَكَانَ يَقُوْلُ فِيْ بَعْضِ صَلَاتِهِ: “اَللَّهُمَّ الْعَنْ فُلَانًا وَفُلَانًا لِأَحْيَاءٍ مِّنْ الْعَرَبِ حَتَّى أَنْزَلَ اللهُ: (لَيْسَ لَكَ مِنَ الْأَمْرِ شَيْءٌ-3: 128) الآية.

1288. (1) [1/402ఏకీభవితం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త(స) ఎవరినైనా శపించాలన్నా, ఎవరి గురించి అయినా ప్రార్థించా లనుకున్నా, రుకూ’ తర్వాత ఖునూత్‌ చదివేవారు. ఒక్కోసారి ”సమిఅల్లాహు లిమన్‌ హమిదహ్‌” తరువాత ఇలా పలికే వారు, ”ఓ అల్లాహ్‌! వలీద్ బిన్‌ వలీద్‌కు, సలమహ్ బిన్‌ హిషామ్‌కు మరియు అయ్యాష్ ‘బిన్‌ రబీ’అ కు సాఫల్యం ప్రసాదించు. మరియు అవిశ్వాసుల నుండి రక్షించు, ఓ అల్లాహ్‌! నీవు ము’దర్‌ తెగవారిపై నీ శిక్షను అవతరింపజేయి, యూసుఫ్‌ (అ) కాలం నాటి కరువు వంటిది వారిపై అవతరింపజేయి.” ఈ దు’ఆను బిగ్గరగా చదివేవారు. కొన్ని నమా’జుల్లో, ”ఓ అల్లాహ్‌! అరబ్బుల్లోని ఫలానా తెగలల్లోని ఫలానా వ్యక్తులపై నీ శాపాన్ని అవతరింపజేయి,” అని ప్రార్థించేవారు. చివరికి అల్లాహ్‌ (త) ”నీ అధీనంలో ఏమీలేదు” అనే ఆయతు అవతరింపజేశాడు. [118]  (బు’ఖారీ, ముస్లిమ్‌)

1289 – [ 2 ] ( متفق عليه ) (1/402)

وَعَنْ عَاصِمِ الْأَحْوَلِ قَالَ: سَأَلْتُ أَنَسَ بْنَ مَالِكٍ عَنِ الْقُنُوْتِ فِيْ الصَّلَاةِ كَانَ قَبْلَ الرُّكُوْعِ أَوْ بَعْدَهُ؟ قَالَ: قَبْلَهُ إِنَّمَا قَنَتَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم بَعْدَ الرُّكُوْعِ شَهْرًا إِنَّهُ كَانَ بَعَثَ أُنَاسًا يُّقَالُ لَهُمُ الْقُرَّاءُ سَبْعُوْنَ رَجُلًا فَأَصِيْبُوْا فَقَنَتَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم بَعْدَ الرُّكُوْعِ شَهْرًا يَدْعُوْ عَلَيْهِمْ.

1289. (2) [1/402ఏకీభవితం]

‘ఆసిమ్‌ బిన్‌ అ’హ్‌వల్‌ (ర) కథనం: ‘ఆసిమ్‌ బిన్‌ అ’హ్మద్‌ (ర) కథనం: నేను అనస్‌ బిన్‌ మాలిక్‌ను దు’ఆయె ఖునూత్‌ గురించి అడిగాను. అంటే ‘రుకూ’కు ముందు చదవాలా లేక రుకూ’ తరువాతనా?’ అని. దానికి అనస్‌ (ర) సమాధాన మిస్తూ రుకూ’కు ముందు అని, ప్రవక్త (స) నెల రోజుల వరకు రుకూ’ తర్వాత దుఆ’యె ఖునూత్‌ చదవారని, దానికి కారణం ఏమిటంటే ప్రవక్త (స) కొంతమంది ఖారీలను, ‘హాఫిజ్‌లను సందేశప్రచారానికి పంపారు. వారు సుమారు 70 మంది ఉంటారు. శత్రువులు వారిని హతమార్చారు. అప్పుడు ప్రవక్త (స) నెలరోజుల వరకు రుకూ’ తర్వాత శత్రువులను శపిస్తూ ఉన్నారు. [119] (బు’ఖారీ, ముస్లిమ్‌)

—–

اَلْفَصْلُ الثَّانِيْ  రెండవ విభాగం 

1290 – [ 3 ] ( حسن ) (1/403)

عَنِ ابْنِ عَبَّاسٍ قَالَ: قَنَتَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم شَهْرًا مُتَتَابِعًا فِيْ الظُّهْرِ وَالْعَصْرِوَالْمَغْرِبِ وَالْعِشَاءِ وَصَلَاةِ الصُّبْحِ. إِذَا قَالَ: “سَمِعَ اللهُ لِمَنْ حَمِدَهُ” مَنْ الرَّكْعَةِ الْآخِرَةِ يَدْعُوْ عَلَى أَحْيَاءٍ مِّنْ بَنِيْ سُلَيْمٍ: عَلَى رِعْلٍ وَّذَكْوَانَ وَعُصَيَّةَ وَيُؤَمِّنُ مَنْ خَلْفَهُ. رَوَاهُ أَبُوْ دَاوُدَ.  

1290. (3) [1/403ప్రామాణికం]

ఇబ్ను ‘అబ్బాస్‌ (ర) కథనం: ప్రవక్త (స) నెల రోజుల వరకు నిరంతరంగా ఐదు పూటల నమా’జుల్లో, ‘సమి’అ అల్లాహ్ లిమన్‌ ‘హమిదహ్‌’ తరువాత చివరి రకాతులో దుఆయె ఖునూత్చదివేవారు. బనీ’ సులైమ్‌కు చెందిన కొన్ని తెగలు ర’అల్‌, ‘జక్‌వాన్‌, ఉసయ్యలను శపించేవారు. దీనిపై వెనుక నున్న ముఖ్తదీలు ఆమీన్‌’ అని అనేవారు.    [120] (అబూ దావూద్‌)

1291 – [ 4 ] ( صحيح ) (1/403)

وَعَنْ أَنَسٍ: أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم قَنَتَ شَهْرًا ثُمَّ تَرَكَهُ. رَوَاهُ أَبُوْ دَاوُدَ وَالنَّسَائِيُّ .

1291. (4) [1/403దృఢం]

అనస్‌ (ర) కథనం: ప్రవక్త (స) నెలరోజుల వరకు దు’ఆయె ఖునూత్‌ చదివారు. ఆ తరువాత ఆపి వేశారు. (అబూ దావూద్‌, నసాయి’)

1292 – [ 5 ] ( صحيح ) (1/403)

وَعَنْ أَبِيْ مَالِكِ الْأَشْجَعِيِّ قَالَ: قُلْتُ لِأَبِيْ: يَا أَبَتِ إِنَّكَ قَدْ صَلَّيْتَ خَلْفَ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم وَأَبِيْ بَكْرٍ وَعُمَرَ وَعُثْمَان وَعَلِيٍّ هَهُنَا بِالْكُوْفَةِ نَحْوًا مِّنْ خَمْسِ سِنِيْنَ أَكَانُوْا يَقْنُتُوْنَ؟ قَالَ: أَيْ بُنَيَّ مُحْدَثٌ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَالنَّسَائِيُّ وَابْنُ مَاجَهُ .

1292. (5) [1/403దృఢం]

అబూ మాలిక్‌ అష్‌జ’యీ (ర) కథనం: నేను మా తండ్రి గారిని, ‘తమరు ప్రవక్త (స) వెనుక, అబూ బకర్‌, ‘ఉమర్‌, ‘ఉస్మాన్‌, ‘అలీల వెనుక నమా’జు చదివారా?’ అని అడిగాను. దానికి ‘అవును,’ అన్నారు. నేను, ‘కూఫాలో 50 సంవత్సరాలు ఇంచుమించు వీళ్ళు ఖునూత్‌ చదివేవారా?’ అని అడిగాను. దానికి మా తండ్రి గారు, ‘కుమారా! ఇది బిద్‌’అత్‌ (కల్పితం) అని అన్నారు. [121] (తిర్మిజి’, నసాయి’, ఇబ్నెమాజహ్)

—–

اَلْفَصْلُ الثَّالِثُ   మూడవ విభాగం 

1293 – [ 6 ] ( ضعيف ) (1/404)

عَنِ الْحَسَنِ: أَنَّ عُمَرَ بْنَ الْخَطَّابِ جَمَعَ النَّاسَ عَلى أُبَيِّ بْنِ كَعْبٍ فَكَانَ يُصَلِّيْ بِهِمْ عِشْرِيْنَ لَيْلَةٍ وَلَا يَقْنُتُ بِهِمْ إِلَّا فِيْ النِّصْفِ الْبَاقِيْ فَإِذَا كَانَتِ الْعَشْرُ الْأَوَاخِرُ تَخَلَّفَ فَصَلَّى فِيْ بَيْتِهِ فَكَانُوْا يَقُوْلُوْنَ: أَبَقَ أُبَيٌّ. رَوَاهُ أَبُوْ دَاوُدَ .

1293. (6) [1/404బలహీనం]

‘హసన్‌ కథనం: ‘ఉమర్‌ (ర) ప్రజలను ఉబయ్‌ బిన్‌ క’అబ్‌ వెనుక నమా’జు చదవడానికి ఒకచోట చేర్చారు. ఉబయ్‌ బిన్‌ క’అబ్‌ 20 రోజులవరకు రమ’దాన్‌లో నమా’జు చదివించారు. రాత్రి చివరి భాగంలో దు’ఆయె’ ఖునూత్‌ చదివారు. రమ’దాన్‌ చివరి దశకం ప్రారంభం కాగానే సామూహికంగా తరావీ’హ్‌ చదవటం మానేసే వారు. తమ ఇళ్ళల్లో ఒంటరిగా నమా’జు చదువుకునే వారు. ప్రజలు ఉబయ్‌ పారిపోయాడు’ అని అనేవారు. (అబూ దావూద్‌)

1294 – [ 7 ] ( صحيح ) (1/404)

وَسُئِلَ أنَسُ بْنُ مَالِكٍ عَنِ الْقُنُوْتِ. فَقَالَ: قَنَتَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم بَعْدَ الرُّكُوْعِ. وَفِيْ رَوَايَةٍ: قَبْلَ الرُّكُوْعِ وَبَعْدَهُ. رَوَاهُ ابْنُ مَاجَهُ .

    1294. (7) [1/404దృఢం]

మరో ఉల్లేఖనంలో అనస్‌ను ఖునూత్‌ గురించి అడగటం జరిగింది. దానికి అతను(ర), సమాధానం ఇస్తూ ప్రవక్త (స) రుకూ’కు ముందు, తరువాత కూడా దు’ఆయె’ ఖునూత్‌ చదివారు’ అని అన్నారు. [122]  (ఇబ్నె మాజహ్)

=====

37- بَابُ قِيَامِ شَهْرِ رَمَضَانَ

37. రమదాన్ లో తరావీహ్ నమాజు

اَلْفَصْلُ الْأَوَّلُ  మొదటి విభాగం   

1295 – [ 1 ] ( متفق عليه ) (1/405)

عَنْ زَيْدِ بْنِ ثَابِتٍ: أَنَّ النَّبِيُّ صلى الله عليه وسلم اتَّخَذَ حُجْرَةً فِيْ الْمَسْجِدِ مِنْ حَصِيْرٍ فَصَلَّى فِيْهَا لَيَالِيَ حَتَّى اجْتَمَعَ عَلَيْهِ نَاسٌ ثُمَّفَقَدُوْا صَوْتَهُ لَيْلَةً وَّظَنُّوْا أَنَّهُ قَدْ نَامَ فَجَعَلَ بَعْضُهُمْ يَتَنَحْنَحُ لِيَخْرُجَ إِلَيْهِمْ. فَقَالَ: مَا زَالَ بِكُمُ الَّذِيْ رَأَيْتُ مِنْ صَنِيْعِكُمْ حَتَّى خَشِيْتُ أَنْ يُّكْتَبَ عَلَيْكُمْ وَلَوْ كُتِبَ عَلَيْكُمْ مَا قُمْتُمْ بِهِ.فَصَلُّوْا أَيُّهَا النَّاسُ فِيْ بُيُوْتِكُمْ فَإِنَّ أَفْضَلَ صَلَاةِ الْمَرْءِ فِيْ بَيْتِهِ إِلَّا الصَّلَاةَ الْمَكْتُوْبَةَ.

1295. (1) [1/405ఏకీభవితం]

‘జైద్‌ బిన్‌ సా’బిత్‌ (ర) కథనం: ప్రవక్త (స) మస్జిద్‌లో చాపతో ఒక గదిలా చేసుకున్నారు. అందులో కొన్ని రాత్రులు నమా’జు చదివారు. అది చూచి చాలామంది చేరారు. ఈ కారణంగా ప్రవక్త (స) ఆ గదిలో నఫిల్‌ నమా’జు చదవడం మానివేశారు. ప్రజలు రాత్రి ప్రవక్త (స) శబ్దాన్ని వినలేదు, ప్రవక్త (స) పడుకున్నారని, ప్రవక్త (స)ను లేపటానికి దగ్గరవసాగారు. బయటకు వచ్చి నమా’జు చదివిస్తారని. ప్రవక్త (స), ‘నఫిల్‌ నమా’జు పట్ల మీ ఆసక్తిని నేను చూస్తున్నాను. ఒకవేళ మీరు ఇంత ఆసక్తికరంగా ఆచరిస్తే, మీపై విధించబడ వచ్చు. మీపై విధిస్తే మీరు దాన్ని నిర్వర్తించలేరు. అందువల్ల ఓ ప్రజలారా! ఈ నఫిల్‌ నమా’జును ఇళ్ళల్లో చదువుకోండి. ఎందుకంటే నఫిల్‌ నమా’జులు ఇంట్లో చదవడమే ఉత్తమం. అధిక పుణ్యం లభిస్తుంది. విధి నమా’జులను మస్జిద్‌లో ఆచరించడం ఉత్తమం అని ప్రవచించారు.’ (బు’ఖారీ, ముస్లిమ్‌)

1296 – [ 2 ] ( صحيح ) (1/405)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: كَانَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم يُرَغِّبُ فِيْ قِيَامِ رَمَضَانَ مِنْ غَيْرِ أَنْ يَّأْمُرَهُمْ فِيْهِ بِعَزِيِمَةٍ فَيَقُوْلُ: “مَنْ قَامَ رَمْضَانَ إِيْمَانًا وَاحْتِسَابًا غُفِرَ لَهُ مَا تَقَدَّمَ مِنْ ذَنْبِهِ. فَتُوُفِيَّ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم وَالْأَمْرُ عَلَى ذَلِكَ ثُمَّ كَانَ الْأَمْرُ عَلَى ذَلِكَ فِيْ خِلَافَةِ أَبِيْ بَكْرٍ وَصَدْرًا مِّنْ خِلَافَةِ عُمَرَ عَلَى ذَلِكَ”. رَوَاهُ مُسْلِمٌ .

1296. (2) [1/405దృఢం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) రమ’దాన్‌లో ప్రజలను, ఆరాధించమని ప్రోత్సహించే వారు. ఇంకా రమ’దాన్‌లో విశ్వాసంతో చిత్తశుద్ధితో రాత్రిపూట నఫిల్‌ నమా’జు (తహజ్జుద్‌-తరావీ’హ్‌) ఆచరిస్తే అతని అంతకు ముందు పాపాలన్నీ క్షమించ బడతాయని చెప్పేవారు. ప్రవక్త (స) మరణించిన తరువాత సాంప్రదాయం ప్రకారం ప్రజలు ఒంటరిగా తరావీ’హ్‌ నమా’జు ఆచరించేవారు. అబూబకర్‌ (ర) కాలంలో, ‘ఉమర్‌(ర) పరిపాలన ప్రారంభంలో కూడా ఇదే పద్ధతి ఉండేది.  [123] (ముస్లిమ్‌)

1297 – [ 3 ] ( صحيح ) (1/405)

وَعَنْ جَابِرٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِذَا قَضَى أَحَدُكُمْ الصَّلَاةَ فِيْ مَسْجِدِهِ فَلْيَجْعَلْ لِبَيْتِهِ نَصِيْبًا مِّنْ صَلَاتِهِ فَإِنَّ اللهَ جَاعِلٌ فِيْ بَيْتِهِ مِنْ صَلَاتِهِ خَيْرًا”. رَوَاهُ مُسْلِمٌ .

1297. (3) [1/405దృఢం]

జాబిర్‌ (ర) కథనం: ”ప్రవక్త (స) ప్రవచనం, మీలో ఎవరైనా మస్జిద్‌లో ఫ’ర్ద్ నమా’జు చదువుకుంటే, కొంత నఫిల్‌ నమా’జు ఇంట్లో చదవడానికి ఉంచు కోవాలి. ఎందుకంటే, ఇంట్లో నఫిల్‌ నమా’జు చదవడం వల్ల అల్లాహ్‌ (త) ఇంట్లో శుభం అవతరింపజేస్తాడు.” (ముస్లిమ్‌)

 అంటే ఫర్ద్ నమా’జు మస్జిద్‌లో, నఫిల్‌ నమా’జు ఇంట్లో చదివితే మంచిది.

—–

اَلْفَصْلُ الثَّانِيْ  రెండవ విభాగం 

1298 – [ 4 ] ( صحيح ) (1/406)

عَنْ أَبِيْ ذَرٍّ قَالَ: صُمْنَا مَعَ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم رَمَضَان فَلَمْ يَقُمْ بِنَا شَيْئًا مِّنَ الشَّهْرِ حَتَّى بَقِيَ سَبْعٌ فَقَامَ بِنَا حَتَّى ذَهَبَ ثُلُثُ اللَّيْلِ فَلَمَّا كَانَتِ السَّادِسَةُ لَمْ يَقُمْ بِنَا فَلَمَّا كَانَتِ الْخَامِسَةُ قَامَ بِنَا حَتَّى ذَهَبَ شَطْرُ اللَّيْلِ. فَقُلْتُ: يَارَسُوْلَ اللهِ لَوْ نَفَّلْتَنَا قِيَامَ هَذِهِ اللَّيْلَةِ. فَقَالَ: “إِنَّ الرَّجُلَ إِذَا صَلَّى مَعَ الْإِمَامِ حَتَّى يَنْصَرِفَ حُسِبَ لَهُ قِيَامُ اللّيْلَةٍ”. قَالَ: فَلَمَّا كَانَتِ الرَّابِعَةُ لَمْ يَقُمْ فَلَمَّا كَانَتِ الثَّالِثَةُ جَمَعَ أَهْلَهُ وَنِسَاءَهُ وَالنَّاسَ. فَقَامَ بِنَا حَتَّى خَشِيْنَا أَنْ يَّفُوْتَنَا الْفَلَاحُ. قَالَ: قُلْتُ: وَمَا الْفَلَاحُ؟ قَالَ: اَلسَّحُوْرُ. ثُمَّ لَمْ يَقُمْ بِنَا بَقِيَّةَ الشَّهْرِ. رَوَاهُ أَبُوْ دَاوُدَ وَالتِّرْمِذِيُّ وَالنَّسَائِيُّ وَرَوَى ابْنُ مَاجَهُ نَحْوَهُ إِلَّا أَنَّ التِّرْمِذِيَّ لَمْ يَذْكُرْ: ثُمَّ لَمْ يَقُمْ بِنَا بَقِيَّةَ الشَّهْرِ”.

1298. (4) [1/406దృఢం]

అబూ జ’ర్‌ (ర) కథనం: ప్రవక్త (స)తో కలసి నేను రమ’దాన్‌ ఉపవాసాలు ఉన్నాను. ప్రవక్త (స) నెలలో అధికశాతం మాకు ఖియాముల్‌ లైల్‌ చదివించలేదు. అంటే తరావీహ్ నమా’జు చదివించలేదు. నెల పూర్తవ  డానికి 7 రోజులు ఉన్నాయనగా ప్రవక్త (స) మాతో కలసి రాత్రి చివరిజాము వరకు ఖియామ్‌ చేశారు. అంటే 23వ రాత్రి చివరిజామువరకు తరావీ’హ్‌ నమా’జు చదివించారు. 24వ రాత్రి చదివించలేదు. 25వ రాత్రి సగం రాత్రి వరకు నమా’జు చదివించారు. మేము, ‘ఓ ప్రవక్తా! ఈ రాత్రి ఇంకా ఎక్కువ నమా’జు చదివితే బాగుండును,’ అని విన్నవించుకున్నాము. దానికి ప్రవక్త (స), ‘మనిషి ఇమాముతో కలసి ఫ’ర్ద్ నమా’జు చదివి ఇంటికి తిరిగి వెళితే, రాత్రంతా నమా’జు చదివినంత పుణ్యం వ్రాయబడుతుంది’ అని అన్నారు. 26వ రాత్రి నమా’జు చదివించలేదు. చివరికి చివరి జాము మిగిలి ఉంది. 27వ రాత్రి ప్రవక్త (స) తన ఇంటి వారిని, స్త్రీలను ఇతరులను ఒకచోట చేర్చి రాత్రంతా నమా’జు చదివించారు. అంటే రాత్రంతా నమా’జు చదివిస్తూనే ఉన్నారు. చివరికి మేము స’హ్‌రీ తప్పి పోతుందేమోనని భయపడ్డాము. ఉల్లేఖన కర్త కథనం: ‘ఫలా’హ్‌ అంటే ఏమిటి’ అని అడిగాను . దానికి అబూ జ’ర్  స’హ్‌రీ అని అన్నారు. ఆ తరువాత రమ’దాన్‌ చివరి వరకు ప్రవక్త(స) నమా’జు చదివించలేదు. (అబూ దావూ’ద్‌, తిర్మిజి’, నసాయి’, ఇబ్నె మాజహ్)

కాని తిర్మిజి ఉల్లేఖనలో రమ’దాన్‌ చివరి వరకు ప్రవక్త (స)  మాతో కలసి నమా’జు చదవలేదు. అని లేదు.

1299 – [ 5 ] ( ضعيف ) (1/406)

وَعَنْ عَائِشَةَ قَالَتْ: فَقَدْتُّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم لَيْلَةً فَإِذَا هُوَ بِالْبَقِيْعِ فَقَالَ: “أَكُنْتِ تَخَافِيْنَ أَنْ يَّحِيْفَ اللهُ عَلَيْكِ وَرَسُوْلُهُ؟ قُلْتُ: يَا رَسُوْلَ اللهِ إِنِّيْ ظَنَنْتُ أَنَّكَ أَتَيْتَ بَعْضَ نِسَائِكَ. فَقَالَ: إِنَّ اللهَ تَعَالى يَنْزِلُ لَيْلَةَ النِّصْفِ مِنْ شَعْبَانَ إِلَى السَّمَاءِ الدُّنْيَا فَيَغْفِرُ لِأَكْثَرَ مِنْ عَدَدِ شَعَرِ غَنَمِ كَلْبٍ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَابْنُ مَاجَهُ وَزَادَ رَزِيْنٌ: “مِمَّنِ اسْتَحَقَّ النَّارَ”. وَقَالَ التِّرْمِذِيُّ: سَمِعْتُ مُحَمَّدًا يَعْنِيْ الْبُخَارِيُّ يُضَعِّفُ هَذَا الْحَدِيْثَ.

1299. (5) [1/406బలహీనం]

‘ఆయి’షహ్‌ (ర) కథనం: ఒకరోజు రాత్రి ప్రవక్త (స) పడకపై కనబడలేదు. ప్రవక్త (స) మదీనహ్ లోని ప్రఖ్యాత శ్మశానం బఖీ’లోకి వెళ్ళారు. ప్రవక్త (స) తిరిగి వచ్చిన తర్వాత, ‘ఓ ప్రవక్తా! మరో భార్య దగ్గరకు వెళ్ళారా?’ అని అడిగాను. దానికి ప్రవక్త (స), ‘అల్లాహ్‌ మరియు ఆయన ప్రవక్త నిన్ను అన్యాయం చేస్తారని నీ హక్కును కొల్లగొడతారని భయపడు తున్నావా?’ అని అడిగారు. దానికి నేను ‘ప్రవక్తా! తమరు పడకపై లేనందున మరో భార్య వద్దకు వెళ్ళారని అనుకున్నాను.’ దానికి ప్రవక్త (స) ష’అబాన్‌ 15వ తేదీన అల్లాహ్‌ ఇహలోక ఆకాశంపై అవతరిస్తాడు. బనీ కల్బ్‌ తెగవారి మేకల కంటే అధికసంఖ్యలో ప్రజలను క్షమిస్తాడు అని ప్రవచించారు. (తిర్మిజి’ – బలహీనం, బు’ఖారీ – బలహీనం, ఇబ్నె మాజహ్)

ర’జీన్‌లో ”నరకానికి అర్హులైన వారిని క్షమించి వేయడం జరుగుతుందని ఉంది.

1300 – [ 6 ] ( صحيح ) (1/407)

وَعَنْ زَيْدِ بْنِ ثَابِتٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “صَلَاةُ الْمَرْءِ فِيْ بَيْتِهِ أَفْضَلُ مِنْ صَلَاتِهِ فِيْ مَسْجِدِيْ هَذَا إِلَّاالْمَكْتُوْبَةَ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ وَالتِّرْمِذِيُّ.

1300. (6) [1/407దృఢం]

‘జైద్‌ బిన్‌ సా’బిత్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మనిషి తన నఫిల్‌ నమా’జు ఇంట్లో చదవడమే ఉత్తమం. ఫ’ర్ద్ నమా’జును  మస్జిద్‌లో చదవడం తప్ప.”  [124] (అబూ దావూ’ద్‌, తిర్మిజి’)

—–

اَلْفَصْلُ الثَّالِثُ   మూడవ విభాగం 

1301- [ 7 ] ( صحيح ) (1/407)

عَنْ عَبْدِ الرَّحْمَنِ بْنِ عَبْدِ الْقَارِيْ قَالَ: خَرَجْتُ مَعَ عُمَرَ بْنِ الْخَطَّابٍ لَيْلَةً إِلَى الْمَسْجِدِ فَإِذَا النَّاسُ أَوْزَاعٌ مُّتَفَرِّقُوْنَ يُصَلِّي الرَّجُلُ لِنَفْسِهِ. وَيُصَلِّي الرَّجُلُ فَيُصَلِّي بِصَلَاتِهِ الرَّهْطُ. فَقَالَ عُمَرُ: إِنِّيْ أَرَى لَوْ جَمَعْتُ هَؤُلَاءِ عَلَى قَارِئٍ وَّاحِدٍ لَكَانَ أَمْثَلَ ثُمَّ عَزَمَ فَجَمَعَهُمْ عَلَى أَبِيِّ بْنِ كَعْبٍ. ثُمَّ خَرَجْتُ مَعَهُ لَيْلَةً أُخْرَى وَالنَّاسُ يُصَلُّوْنَ بِصَلَاةِ قَارِئِهِمْ. قَالَ عُمَرُ رَضِيَ اللهُ عَنْهُ: نَعْمَتِ الْبِدْعَةُ هَذِهِ وَالَّتِيْ تَنَامُوْنَ عَنْهَا أَفْضَلُ مِنَ الَّتِيْ تَقُوْمُوْنَ. يُرِيْدُ آخِرَ اللَّيْلِ وَكَانَ النَّاسُ يَقُوْمُوْنَ أَوَّلَهُ. رَوَاهُ الْبُخَارِيُّ.

1301. (7) [1/407దృఢం]

‘అబ్దుర్ర’హ్మాన్‌ బిన్‌ ‘అబ్దుల్‌ ఖారీ (ర) కథనం: నేను ఒక రోజు రాత్రి ‘ఉమర్‌(ర)తో కలసి మస్జిద్‌లోకి వెళ్ళాను. అక్కడ ప్రజలు వేర్వేరుగా నఫిల్‌ నమా’జులు చదువుతున్నారు. అంటే రమ’దాన్‌లో తరావీహ్‌ నమా’జు ప్రతి వ్యక్తి వేర్వేరుగా చదువు తున్నాడు. కొందరు ఇద్దరు, ముగ్గురు కలసి చదువుతున్నారు. అది చూసి, ‘ఉమర్‌ (ర) వీళ్ళందరిని ఒకే ఇమాము వెనుక చేస్తే బాగుంటుందని చెప్పి, నిశ్చయించుకొని ఉబయ్బిన్అబ్ను ఇమాముగా చేసి, అందరినీ అతని వెనుక నిలబెట్టారు. అనంతరం ఉబయ్‌ బిన్‌ క’అబ్‌ అందరికీ తరావీ’హ్‌ నమా’జు చదివించసాగారు. నేను రెండవ రోజు రాత్రి కూడా ‘ఉమర్‌ వెంట మస్జిద్‌కు వెళ్ళాను. ప్రజలందరూ ఒకే ఇమాము వెనుక తరావీ’హ్‌ నమా’జు చదువుతున్నారు. అది చూసి ‘ఉమర్‌ (ర) ఈ పద్ధతి బాగుంది, దీన్ని చదవకుండా మీరు నిద్రపోయే బదులు అంటే రాత్రి చివరి భాగంలో చదవ లేక పోవడానికి బదులు ఇది ఉత్తమంగా ఉంది. అంటే రాత్రి ప్రారంభంలో చదవటం. ప్రజలు ప్రారంభ రాత్రిలో తరావీ’హ్‌చదువుకునే వారు.  [125] (బు’ఖారీ)

1302 – [ 8 ] ( صحيح ) (1/407)

وَعَنِ السَّائِبِ بْنِ يَزِيْدٍ قَالَ: أَمَرَ عُمَرُ أَبَيَّ بْنَ كَعْب وَتَمِيْمًا الدَّارِيَّ أَنْ يَّقُوْمًا لِلنَّاسِ فِيْ رَمَضَانَ بِإِحْدَى عَشَرَةَ رَكْعَةً فَكَانَ الْقَارِئُ يَقْرَأُ بِالْمَئِيْنِ حَتَّى كُنَّا نَعْتَمِدُ عَلَى الْعَصَا مِنْ طُوْلِ الْقِيَامِ فَمَا كُنَّا نَنْصَرِفُ إِلَّا فِيْ فُرُوْعِ الْفَجْرِ. رَوَاهُ مَالِكٌ.

1302. (8) [1/407దృఢం]

సాయి’బ్‌ బిన్‌ య’జీద్‌ (ర) కథనం: ‘ఉమర్‌ (ర) ఉబయ్‌ బిన్‌ క’అబ్‌, తమీమ్‌ దారీలను రమ’దాన్‌లో ప్రజలకు 11 రకాతులు చదివించమని ఆదేశించారు. ఇమాము 100 ఆయతులు గల సూరహ్‌ పఠించేవారు. ఇంకా ఖారీ ప్రజలకు 100 కంటే ఎక్కువ ఆయతులు గల సూరహ్‌ పఠించేవారు. ఖియామ్‌ దీర్ఘంగా ఉండటం వల్ల మాలో బలహీనులు కర్ర సహాయంతో నిలబడే వారు. మా రాత్రి నమాజు ఫజ్ర్‌కు ముందు పూర్తిఅయ్యేది.  [126] (మాలిక్‌ -మువత్తా)

1303 – [ 9 ] ( صحيح ) (1/408)

وَعَنِ الْأَعْرَجِ قَالَ: مَا أَدْرَكْنَا النَّاسَ إِلَّا وَهُمْ يَلْعَنُوْنَ الْكَفَرَةَ فِيْ رَمْضَانَ قَالَ: وَكَانَ الْقَارِئُ يَقْرَأُ سُوْرَةُ الْبَقْرَةِ فِيْ ثَمَانِ رَكَعَاتٍ وَإِذَا قَامَ بِهَا فِيْ ثِنْتَيْ عَشَرَةَ رَكْعَةً رَأَى النَّاسُ أَنَّهُ قَدْ خَفَّفَ. رَوَاهُ مَالِكٌ .

1303. (9) [1/408దృఢం]

అ’అరజ్‌ (ర) కథనం: రమ’దాన్‌లో ముస్లిములు దు’ఆయె’ ఖునూత్‌ చదివి అవిశ్వాసులను శపించే వారు. రమ’దాన్‌లో ఖారీ అంటే ఇమాము సూరహ్‌ బఖరహ్‌ను 8 రకాతుల్లో చదివేవారు. ఒకవేళ సూరహ్‌ బఖరహ్‌ను 12 రకాతుల్లో చదివితే, ప్రజలు తేలిగ్గా చదివించారని భావించే వారు. [127] (మాలిక్‌)

1304 – [ 10 ] ? (1/408)

وَعَنْ عَبْدِ اللهِ بْنِ أَبِيْ بَكْرٍ قَالَ: سَمِعْتُ أَبِيْ يَقُوْلُ: كُنَّا نَنْصَرِفُ فِيْ رَمَضَانَ مِنَ الْقِيَامِ فَنَسْتَعْجِلُ الْخَدَمَ بِالطَّعَامِ مَخَافَةَ فَوْتِ السَّحُوْرِ. وَفِيْ آخْرَى مَخَافَةَ الْفَجْرِ. رَوَاهُ مَالِكٌ .

1304. (10) [1/408?]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ అబీ బక్‌ర్‌ (ర) కథనం: నేను ఉబయ్‌ బిన్‌క’అబ్‌ ను ఇలా అంటూ ఉండగా విన్నాను, మేము రమ’దాన్‌లో ఖియాముల్‌ లైల్‌ (తరావీ’హ్‌) పూర్తి చేసుకొని ఇంటికి వచ్చి, స’హ్‌రీ ఎక్కడ తప్పి పోతుందోనని సేవకులను ‘త్వరగా అన్నం పెట్టమని’ తొందరపెట్టే వాళ్ళం. మరో ఉల్లేఖనంలో ‘ఎక్కడ ఉదయం అయిపోతుందోనని’ అని ఉంది. (మాలిక్‌)

1305 – [ 11 ] ( ضعيف ) (1/408)

وَعَنْ عَائِشَةَ عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ: “هَلْ تَدْرِيْنَ مَا هَذِهِ اللَّيْلِ؟ “يَعْنِيْ لَيْلَةَ النِّصْفِ مِنْ شَعْبَانَ قَالَتْ: مَا فِيْهَا يَا رَسُوْلَ اللهِ. فَقَالَ: “فِيْهَا أَنْ يُّكْتَبَ كُلُّ مَوْلُوْدٍ مِّنْ بَنِيْ آدَمَ فِيْ هَذِهِ السَّنَةِ وَفِيْهَا أَنْ يُّكْتَبَ كُلُّ هَالِكٍ مِّنْ بَنِيْ آدَمَ فِيْ هَذِهِ السَّنَةَ وَفِيْهَا تُرْفَعُ أَعْمَالُهُمْ وَفِيْهَا تُنْزَلُ أَرْزَاقُهُمْ”. فَقَالَتْ: يَا رَسُوْلَ اللهِ مَا مِنْ أَحَدٍ يَّدْخُلُ الْجَنَّةَ إِلَّا بِرَحْمَةِ اللهِ تعالى؟ فَقَالَ: “مَا مِنْ أَحَدٍ يَّدْخُلُ الْجَنَّةَ إِلَّا بِرَحْمَةِ اللهِ تَعَالى”. ثَلَاثًا. قُلْتُ: وَلَا أَنْتَ يَا رَسُوْلَ اللهِ؟ فَوَضَعَ يَدَهُ عَلَى هَامَّتِهِ فَقَالَ: “وَلَا أَنَا إِلَّا أَنْ يَّتَغَمَّدَنِيَ اللهُ بِرَحْمَتِه”. يَّقُوْلُهَا ثَلَاثَ مَرَّاتٍ. رَوَاهُ الْبَيْهَقِيُّ فِيْ الدَّعْوَاتِ الْكَبِيْرِ.

1305. (11) [1/408బలహీనం]

‘ఆయి’షహ్‌ (ర) కథనం: ప్రవక్త (స), ‘ఓ ‘ఆయి’షహ్‌! ష’అబాన్‌ 15వ తేదీన ఏం జరుగు తుందో నీకు తెలుసా?’ అని అన్నారు. దానికి ‘ఆయి’షహ్‌, ”మీరే చెప్పండి, ఏం జరుగుతుందో,” అని అన్నారు. దానికి ప్రవక్త (స) సంవత్సరంలో పుట్టబోయే పిల్లలందరి గురించి వ్రాయడం జరుగు తుంది. ఇంకా ఈ రాత్రిలోనే మానవుల కర్మలు ఎత్తుకోవటం జరుగుతుంది. ఇంకా ఈ రాత్రిలోనే ప్రజల ఉపాధి అవతరింపజేయటం జరుగుతుంది’ అని అన్నారు. దానికి  ‘ఆయి’షహ్‌ (ర), ‘ఓప్రవక్తా! అల్లాహ్ కారుణ్యం ప్రమేయం లేకుండా స్వర్గంలో ప్రవేశించే వారెవరైనా ఉన్నారా’ అని అడిగారు. దానికి ప్రవక్త (స) అల్లాహ్‌ కారుణ్యం లేకుండా ఎవ్వరూ స్వర్గంలో ప్రవేశించ లేరు. కేవలం కర్మల వల్ల స్వర్గంలో ప్రవేశించలేరు’ అని అన్నారు. దానికి ‘ఆయి’షహ్‌ (ర), ‘ఓ ప్రవక్తా! మీరు కూడానా?’ అని అడిగారు. దానికి ప్రవక్త (స), తన చేతిని తన తలపై పెట్టి, ”అల్లాహ్‌ తన కారుణ్యం ద్వారా కప్పుకుంటేనే” అని మూడు సార్లు పలికారు. [128] (బైహఖీ-ద’అవాతుల్ కబీర్)

1306 – [ 12 ] ( ضعيف ) (1/409)

وَعَنْ أَبِيْ مُوْسَى الْأَشْعَرِيِّ عَنْ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم قَالَ: “إِنَّ اللهَ تَعَالى لَيَطَّلِعُ فِيْ لَيْلَةِ النِّصْفِ مِنْ شَعْبَانَ فَيَغْفِرُ لِجَمِيْعِ خَلْقِهِ إِلَّا لِمُشْرِكٍ أَوْ مُشَاحِنٍ”. رَوَاهُ ابْنُ مَاجَهُ .

1306. (12) [1/409బలహీనం]

అబూ మూసా (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”అల్లాహ్‌ ష’అబాన్‌ 15వ తేదీన ప్రత్యేక కారుణ్య దృష్టి కలిగి ఉంటాడు. మానవులందరిని క్షమిస్తాడు. కాని, సాటి కల్పించే వారిని, ద్వేషం కలిగిఉన్న వారిని క్షమించడు. కొన్ని ఉల్లేఖనాల్లో హంతకులను క్షమించడు,” అని ఉంది. (ఇబ్నె మాజహ్)

1307 – [ 13 ] ( ضعيف ) (1/409)

وَرَوَاهُ أَحْمَدُ عَنْ عَبْدِ اللهِ بْنِ عَمْرِو بْنِ الْعَاصِ وَفِيْ رَوَايَتَهِ: ” إِلَّا اثْنَيْنِ مَشَاحِنُ وَّقَاتلُ نَفْسِ .

 1307. (13) [1/409బలహీనం]

దీనినే, అ’హ్మద్‌, ఇబ్నె మాజహ్, ‘అబ్దుల్లాహ్ బిన్ ‘అమ్ర్ బిన్ అల్ ‘ఆ’స్, ద్వారా కూడా ఉల్లేఖించారు.

1308 – [ 14 ] ( موضوع ) (1/409)

وَعَنْ عَلِيٍّ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِذَا كَانَتْ لَيْلَةُ النِّصْفِ مِنْ شَعْبَانَ فَقُوْمُوْا لَيْلَهَا وَصُوْمُوْا يَوْمَهَافَإِنَّ اللهَ تَعَالى يَنْزِلُ فِيْهَا لِغُرُوْبِ الشَّمْسِ إِلَى السَّمَاءِ الدُّنْيَا فَيَقُوْلُ: أَلَامِنْ مُّسْتَغْفِرٍ فَأَغْفِرَ لَهُ؟ أَلَا مُسْتَرْزِقٍ فَأَرْزُقَهُ؟ أَلَا مُبْتَلى فَأُعَافِيَهِ؟ أَلَا كَذَا أَلَا كَذَا حَتَّى يَطْلُعَ الْفَجْرُ”. رَوَاهُ ابْنُ مَاجَهُ .

1308. (14) [1/409కల్పితం]

‘అలీ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ష’అబాన్‌ 15వ రాత్రి వస్తే, మీరు నఫిల్‌ నమా’జులు చదవండి. ఆ దినం నఫిల్‌ ఉపవాసం పాటించండి. ఎందుకంటే అల్లాహ్‌ ఆ రాత్రి సూర్యుడు అస్తమించిన తర్వాత, ప్రాపంచిక ఆకాశంపై అవతరిస్తాడు. ఇంకా, క్షమాపణ కోరేవారెవరైనా ఉన్నారా? నేను క్షమించటానికి, ఉపాధి అర్థించే వారెవరైనా ఉన్నారా? నేను ఉపాధి ప్రసాదించడానికి, నన్ను కష్టాల్లో మొరపెట్టుకునే వారెవరైనా ఉన్నారా? నేను వారిని కష్టాల నుండి గట్టెక్కించడానికి” అని ప్రకటిస్తాడు. [129] (ఇబ్నె మాజహ్)

=====

38- بَابُ صَلَاةِ الضُّحَى

38. దుహా (ష్రాఖ్ మరియు చాష్త్) నమాజులు

‘సూర్యోదయం తరువాత మధ్యాహ్నానికి ముందు చదివే నఫిల్‌ నమా’జును సలాతుద్దుహా అని అంటారు. ఇది 2 రకాలు. ఒకటి పెద్దది, రెండవది చిన్నది. సూర్యోదయం తరువాత సూర్యుడు, కొంత ఎత్తుకు వచ్చిన తర్వాత చదివే నమా’జును, 1. సలాత్ అ’ద్దు’హా ‘సుగ్‌రా’ మరియు ఇ’ష్రాఖ్‌ నమా’జు’ అని అంటారు. 2. ‘సూర్యుడు ఉదయించి చాలా ఎత్తుకు వచ్చిన తర్వాత చదివే నమా’జును, సలాత్ అ’ద్దు’హా’ ఉర్దూలో, చాష్త్ నమా’జు’ అని అంటారు. దీనికి చాలా ప్రాధాన్యత ఉంది.

اَلْفَصْلُ الْأَوَّلُ  మొదటి విభాగం   

1309 – [ 1 ] ( متفق عليه ) (1/411)

عَنْ أُمّ هَانِئٍ قَالَتْ: إِنَّ النَّبِيَّ صلى الله عليه وسلم دَخَلَ بَيْتَهَا يَوْمَ فَتْحٍ مَكَّةَ فَاغْتَسَلَ وَصَلَّى ثَمَانِيَ رَكَعَاتٍ فَلَمْ أَرَ صَلَاةً قَطُّ أَخَفَّ مِنْهَا غَيْرَ أَنَّهُ يُتِمُّ الرُّكُوْعَ وَالسُّجُوْدَ. وَقَالَتْ فِيْ رِوَايَةٍ أُخْرَى: وَذَلِكَ ضُحّى .

1309. (1) [1/411ఏకీభవితం]

ఉమ్మె హానీ (ర) కథనం: ప్రవక్త (స) మక్కహ్ విజయం నాడు మా ఇంటికి వచ్చారు, స్నానం చేశారు, ఇంకా 8 రకాతులు నమా’జు చదివారు. ఇంత తేలికైన నమా’జు నేను చూడలేదు. కాని ప్రవక్త (స)  రుకూ’, సజ్దాలు పూర్తిగా చేశారు. అయితే చదివింది ‘ద్దు’హా’ నమా’జు. [130] (బు’ఖారీ, ముస్లిమ్‌)

1310 – [ 2 ] ( صحيح ) (1/411)

وَعَنْ مُعَاذَةَ قَالَتْ: سَأَلْتُ عَائِشَةَ: كَمْ كَانَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم يُصَلِّيْ صَلَاةَ الضُّحَى؟ قَالَتْ: أَرْبَعَ رَكَعَاتٍ وَّيَزِيْدُ مَا شَاءَ اللهُ. رَوَاهُ مُسْلِمٌ .

1310. (2) [1/411దృఢం]  

ము’ఆజ్‌ (ర) కథనం: నేను ‘ఆయి’షహ్‌ (ర) ను ‘ప్రవక్త (స) ‘ద్దు’హా’ నమా’జు ఎన్నిరకా’తులు చదివేవారు’ అని అడిగాను. దానికి ఆమె నాలుగు లేదా అంతకంటే అల్లాహ్ కోరినంత అధికంగా చదివేవారు,’ అని అన్నారు. [131] (ముస్లిమ్‌)

1311 – [ 3 ] ( صحيح ) (1/411)

وَعَنْ أَبِيْ ذَرٍّ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “يُصْبِحُ عَلَى كُلِّ سُلَامَي مِنْ أَحَدِكُمْ صَدَقَةٌ، فَكُلُّ تَسْبِيْحَةٍ صَدَقَةٌ، وَكُلُّ تَحْمِيْدَةٍ صَدَقَةٌ، وَكُلُّ تَهْلِيْلَةٍ صَدَقَةٌ، وَكُلُّ تَكْبِيْرَةٍ صَدَقَةٌ، وَأَمْرٌ بِالْمَعْرُوْفِ صَدَقَةٌ، وَنَهْيٌ عَنِ الْمُنْكَرِ صَدَقَةٌ، وَيُجْزِئُ مِنْ ذَلِكَ رَكْعَتَانِ يَرْكَعُهُمَا مِنَ الضُّحَى”. رَوَاهُ مُسْلِمٌ.

1311. (3) [1/411దృఢం]

అబూ జ’ర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ప్రతి రోజూ ఉదయం ప్రతి మానవునిపై అతని ప్రతికీలు తరఫున ‘సదఖహ్ చేయటం తప్పనిసరి. సుబ్‌’హా నల్లాహ్‌ పలకటం ‘సదఖహ్, అల్‌’హమ్‌దు లిల్లాహ్‌ పలకటం సదఖహ్, లా ఇ’లాహ ఇల్లల్లాహ్‌ పలకటం సదఖహ్, అల్లాహు అక్బర్‌ పలకటం సదఖహ్, మంచి మాట మాట్లాడటం సదఖహ్, చెడు నుండి వారిం చటం సదఖహ్, ఈ విషయాలన్నిటికీ ‘ద్దు’హా’ రెండు రకాతుల నమా’జ్‌ సరిపోతుంది.” [132](ముస్లిమ్‌)

1312 – [ 4 ] ( صحيح ) (1/411)

وَعَنْ زَيْدِ بْنِ أَرْقَمِ أَنَّهُ رَأَى قَوْمًا يُّصَلُّوْنَ مِنَ الضُّحَى فَقَالَ: لَقَدْ عَلِمُوْا أَنَّ الصَّلَاةَ فِيْ غَيْرِ هَذِهِ السَّاعَةِ أَفْضَلُ. إِنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم قَالَ: “صَلَاةُ الْأَوَّابِيْنَ حِيْنَ تَرْمُضُ الْفِصَالُ”. رَوَاهُ مُسْلِمٌ .

1312. (4) [1/411దృఢం]

‘జైద్‌ బిన్‌ అర్‌ఖమ్‌ ప్రజలను ‘ద్దు’హా’ నమా’జు చదువుతుండగా చూచి, ఈ నమా’జు ఈ సమయం కాక మరో సమయంలో చదవటం ఉత్తమం అని వీరికి తెలుసు. ప్రవక్త (స), ”అవ్వాబీన్‌ నమా’జు అంటే దైవ భక్తుల నమా’జు ఒంటె బిడ్డకాలు వేడెక్కిన తరువాత చదివే నమా’జు. అంటే సూర్యుడు ఎత్తుకు వచ్చి, ప్రతి వస్తువు వేడెక్కిన తరువాత చదివే నమా’జు అని ప్రవచించారని,” అన్నారు. [133] (ముస్లిమ్‌)

—–

اَلْفَصْلُ الثَّانِيْ   రెండవ విభాగం 

1313 – [ 5 ] ( صحيح ) (1/412)

وَعَنْ أَبِيْ الدَّرْدَاءِ وَأَبِيْ ذَرٍّ رَضِيَ اللهُ عَنْهُمَا قَالَا: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “عَنِ اللهِ تَبَارَكَ وَتَعَالى أَنَّهُ قَالَ: يَا ابْنَ آدَمَ ارْكَعْ لِيْ أَرْبَعَ رَكَعَاتٍ مِّنْ أَوَّلِ النَّهَارِ أَكْفِكَ آخِرَهُ”. رَوَاهُ التِّرْمِذِيُّ.  

1313. (5) [1/412దృఢం]

అబూ దర్‌దా’ మరియు అబూ జ’ర్‌ (ర) కథనం: ప్రవక్త(స) ప్రవచనం, ”అల్లాహ్‌ ఆదేశం: ‘ఓ మాన వుడా! నీవు ఉదయం 4 రకాతులు నా కోసం నమా’జ్‌ చదువుకో, దినం చివరి వరకు అంటే సాయంత్రంవరకు నేను నీకురక్షకునిగా ఉంటాను.’ ”[134] (తిర్మిజి’)

1314 – [ 6 ] ( صحيح ) (1/412)

وَرَوَاهُ أَبُوْ دَاوُدَ وَالدَّارَمِيُّ عَنْ نَعِيْمِ بْنِ هَمَّارٍ الْغَطْفَانِيِّ وَأَحْمَدُ عَنْهُمْ.

1314. (6) [1/412దృఢం]

అబూ దావూద్‌, దార్మీ, దీనిని న’యీమ్ బిన్ హమ్మార్ ‘గత్ఫాని ద్వారా కూడా ఉల్లేఖించారు.

1315 – [ 7 ] ( صحيح ) (1/412)

وَعَنْ بُرَيْدَةَ قَالَ: سَمِعْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ: “فِيْ الْإِنْسَانِ ثَلَاثُمِائِةٍ وَّسِتُّوْنَ مُفْصِلًا فَعَلَيْهِ أَنْ يَّتَصَدَّقَ عَنْ كُلِّ مَفْصِلٍ مِّنْهُ بِصَدَقَةٍ”. قَالُوْا: وَمَنْ يُّطِيْقُ ذَلِكَ يَا نَبِيَّ اللهِ؟ قَالَ: “النُّخَاعَةُ فِيْ الْمَسْجِدِ تَدْفِنُهَا وَالشَّيْءُ تُنَحِّيْهِ عَنِ الطَّرِيْقِ فَإِنْ لَمْ تَجِدْ فَرَكْعَتَا الضُّحَى تُجْزِئُكَ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ.

1315. (7) [1/412దృఢం]

బురైదహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ఇలా ప్రవచిస్తూ ఉండగా నేను విన్నాను. ‘మానవుని శరీరంలో 360 కీళ్ళు ఉన్నాయి. ప్రతికీలుకు బదులుగా దానం చేయ డం ఉత్తమం.’ దానికి ప్రజలు, ‘ఓ ప్రవక్తా! అంత శక్తి ఎవరివద్ద ఉంది’ అని విన్నవించుకున్నారు. దానికి ప్రవక్త (స) మస్జిద్‌లో పడి ఉన్న ఉమ్మిని కప్పివేయ డం, దాన్ని శుభ్రపరచడం దానం అవుతుంది. దారిలో ఉన్న హానికరమైన వస్తువును తీసి పారవేయడం దానం అవుతుంది. ఒకవేళ వీటిలో ఏది దొరక్కపోతే రెండు రకా’తులు ‘ద్దు’హా’ నమా’జు చదువు కుంటే సరిపోతుంది అని ప్రవచించారు. (అబూ దావూద్‌)

1316 – [ 8 ] ( ضعيف ) (1/413)

وَعَنْ أَنَسٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَنْ صَلَّى الضُّحَى ثِنْتَيْ عَشَرَةَ رَكْعَةً بَنَى اللهُ لَهُ قَصْرًا مِّنْ ذَهَبَ فِيْ الْجَنَّةِ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَابْنُ مَاجَهُ وَقَالَ التِّرْمِذِيُّ:هَذَا حَدِيْثٌ غَرِيْبٌ لَا نَعْرِفُهُ إِلَّا مِنْ هَذَا الْوَجْهِ .

1316. (8) [1/413బలహీనం]

అనస్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”12 రకాతులు ‘ద్దు’హా’ నమా’జు చదువుతూ ఉండే వ్యక్తి కోసం అల్లాహ్‌ (త) స్వర్గంలో భవనం నిర్మిస్తాడు.” (తిర్మిజి’ – ఏకోల్లేఖనం, ఇబ్నె మాజహ్).

1317 – [ 9 ] ( ضعيف ) (1/413)

وَعَنْ مُّعَاذِ بْنِ أَنَسِ الْجُهَنِّيْ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَنْ قَعَدَ فِيْ مُصَلَّاهُ حِيْنَ يَنْصَرِفُ مِنْ صَلَاةِ الصُّبْحِ حَتَّى يُسَبِّحَ رَكْعَتَيِ الضُّحَى لَا يَقُوْلُ إِلَّا خَيْرًا غُفِرَ لَهُ خَطَايَاهُ وَإِنْ كَانَتْ أَكْثَرَ مِنْ زَبَدِ الْبَحْرِ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ.

1317. (9) [1/413బలహీనం]

ము’ఆజ్‌’ బిన్‌ అనస్‌ జుహ్‌నీ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఫజ్ర్‌ నమా’జు చదివి, తన ముసల్లాపై సూర్యోదయం వరకు కూర్చొని, సూర్యోదయం తరువాత 2 రకాతుల ష్రాఖ్ నమా’జు చదివితే, ఈ మధ్య కేవలం మంచి మాటలే మాట్లాడి ఉంటే, అతని పాపాలన్నీ క్షమించబడతాయి. సముద్రంపై ఉన్న నురుగు కంటే అధికంగా ఉన్నా సరే. (అబూ దావూద్‌)

—–

اَلْفَصْلُ الثَّالِثُ   మూడవ విభాగం 

1318 – [ 10 ] ( ضعيف ) (1/413)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَنْ حَافَظَ عَلَى شُفْعَةِ الضُّحَى غُفِرَتْ لَهُ ذُنُوْبُهُ وَإِنْ كَانَتْ مِثْلَ زَبَدِ الْبَحْرِ”. رَوَاهُ أَحْمَدُ وَالتِّرْمِذِيُّ وَابْنُ مَاجَهُ.

1318. (10) [1/413బలహీనం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం ” ‘దుహా నమా’జు యొక్క రెండు రకాతులను పరిరక్షిస్తూ ఉండే వ్యక్తి పాపాలు క్షమించబడతాయి, సముద్రంలోని నురుగుకు సమానంగా ఉన్నా సరే.” (అ’హ్మద్‌, తిర్మిజి’, ఇబ్నె మాజహ్)

1319 – [ 11 ] ( صحيح ) (1/413)

وَعَنْ عَائِشَةَ أَنَّهَا كَانَتْ تُصَلِّيْ الضُّحَى ثَمَانِيَ رَكَعَاتٍ ثُمَّ تَقُوْلُ: “لَوْ نُشِرَ لِيْ أَبَوَايَ مَا تَرَكْتُهَا”. رَوَاهُ مَالِكٌ .

1319. (11) [1/413దృఢం]

‘ఆయి’షహ్‌ (ర) ‘దుహా యొక్క 8 రకాతులు చదివే వారు. ఇంకా ‘ఒకవేళ నా తల్లిదండ్రులు తిరిగి సజీవులు చేయబడినా నేను వీటిని ఎంతమాత్రం వదలను’ అని అనేవారు. [135] (మాలిక్‌)

1320 – [ 12 ] ( ضعيف ) (1/413)

وَعَنْ أَبِيْ سَعِيْدٍ قَالَ: كَانَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم يُصَلِّي الضُّحَى حَتَّى نَقُوْلَ: لَا يَدَعُهَا وَيَدَعُهَا حَتَّى نَقُوْلُ: لَا يُصَلِّيْهَا. رَوَاهُ التِّرْمِذِيُّ.

1320. (12) [1/413బలహీనం]

అబూ స’యీద్‌ ‘ఖుద్రీ (ర) కథనం: ప్రవక్త (స) ‘దుహా నమా’జును చదివేవారు. చివరికి మేము ‘ప్రవక్త (స) మరి విరమించరు’ అని చెప్పుకునే వాళ్ళం. ప్రవక్త (స) వదలివేస్తే మేము ‘ప్రవక్త (స) మరిచదవరు’ అని అనుకునే వాళ్ళం. [136]  (తిర్మిజి’)

1321 – [ 13 ] ( صحيح ) (1/414)

وَعَنْ مُوَرِّقِ الْعِجْلِيِّ قَالَ: قُلْتُ لِاِبْنِ عُمَرَ: تُصَلِّي الضُّحَى؟ قَالَ: لَا. قُلْتُ: فَعُمَرُ؟ قَالَ: لَا. قُلْتُ: فَأَبُوْ بَكْرٍ؟ قَالَ: لَا. قُلْتُ: فَالنَّبِيُّ صلى الله عليه وسلم؟ قَالَ: لَا إِخَالُهُ. رَوَاهُ الْبُخَارِيُّ.

1321. (13) [1/414-దృఢం]

మువర్రఖ్‌ అల్‌ ‘అజలీ (ర) కథనం: నేను ‘అబ్దు ల్లాహ్‌ బిన్‌ ‘ఉమర్‌ను మీరు ‘దుహా నమా’జు చదువు తారా’ అని అడిగితే, ‘లేదు’ అన్నారు. దానికి నేను ‘ఉమర్‌ (ర) చదివే వారా’ అని అడిగాను. దానికి అతను ‘లేదు’ అన్నారు. మళ్ళీ నేను ‘అబూ బకర్‌ (ర) చదివే వారా’ అని అడిగాను. దానికి అతను ‘లేదు’ అన్నారు. మళ్ళీనేను ‘ప్రవక్త (స) చదివే వారా’ అనిఅడిగాను. దానికి అతను ‘ప్రవక్త (స) కూడా చదివే వారుకారని నా అభిప్రాయం అన్నారు. [137](బు’ఖారీ)

=====

39- بَابُ التَّطَوُّعِ

39. అదనపు (నఫిల్) నమాజులు

اَلْفَصْلُ الْأَوَّلُ  మొదటి విభాగం

1322 – [ 1 ] ( متفق عليه ) (1/415)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم لِبِلَالٍ عِنْدَ صَلَاةِ الْفَجْرِ: “يَا بِلَالُ حَدِّثْنِيْ بِأَرْجى عَمَلٍ عَمِلْتَهُ فِيْ الْإِسْلَامِ فَإِنِّيْ سَمِعْتُ دَقَّ نَعْلَيْكَ بَيْنَ يَدَيَّ الْجَنَّةَ”. قَالَ: مَا عَمِلْتُ عَمَلًا أَرْجَى عِنْدِيْ أَنّيْ لَمْ أَتَطَهَّرْ طُهُوْرًا مِّنْ سَاعَةٍ مِّنْ لَيْلٍ وَّلَا نَهَارٍ إِلَّا صَلَّيْتُ بِذَلِكَ الطُّهُوْرِ مَا كُتِبَ لِيْ أَنْ أُصَلِّيَ.

1322. (1) [1/415ఏకీభవితం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ఫజ్ర్‌ సమయంలో బిలాల్‌ను, ‘ఓ బిలాల్‌! ఇస్లామ్‌ స్థితిలో నీవు చేసిన గొప్ప పని ఏదైనా ఉంటే చెప్పు, ఎందు కంటే స్వర్గంలో నేను నా ముందు నీ చెప్పుల శబ్దం విన్నాను’ అని అన్నారు. దానికి బిలాల్‌(ర), ‘చెప్పుకోదగ్గ పనేదీచేయలేదు గాని, రాత్రి పగళ్ళలో వు’దూ చేసినప్పుడల్లా అల్లాహ్ కోరినన్ని రకా’తుల నమా’జు చదివేవాడిని,’ అని అన్నారు. [138](బు’ఖారీ, ముస్లిమ్‌)

1323 – [ 2 ] ( صحيح ) (1/415)

عَنْ جَابِرِ بْنِ عَبْدُ اللهِ قَالَ: كَانَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم يُعَلِّمُنَا الْاِسْتَخَارَةَ فِيْ الْأُمُوْرِ كَمَا يُعَلِّمُنَا السُّوْرَةَ مِنَ الْقُرْآنِ يَقُوْلُ: “إِذَا هَمَّ أَحَدُكُمْ بِالْأَمْرِ فَلْيَرْكَعْ رَكْعَتَيْنِ مِنْ غَيْرِ الْفَرِيْضَةِ ثُمَّ لِيَقُلْ: “اَللَّهُمَّ إِنِّيْ أَسْتَخِيْرُكَ بِعِلْمِكَ وَأَسْتَقْدِرُكَ بِقُدْرَتِكَ وَأَسْأَلُكَ مِنْ فَضْلِكَ الْعَظِيْمِ فَإِنَّكَ تَقْدِرُ وَلَا أَقْدِرُ وَتَعْلَمُ وَلَا أَعْلَمُ وَأَنْتَ عَلَّامُ الْغُيُوْبِ. اَللَّهُمَّ إِنْ كُنْتَ تَعْلَمُ أَنَّ هَذَا الْأَمْرَ خَيْرٌ لِّيْ فِيْ دِيْنِيْ وَمَعَاشِيْ وَعَاقِبَةِ أَمْرِيْ – أَوْقَالَ فِيْ عَاجِلٍ أَمْرِيْ -وَآجِلِهِ  فَاقْدِرْهُ لِيْ وَيَسِّرْهُ لِيْ ثُمَّ بَارَكَ لِيْ فِيْهِ. وَإِنْ كُنْتَ تَعْلَمُ أَنَّ هَذَا الْأَمْرَ شَرٌّ لِيْ فِيْ دِيْنِيْ وَمَعاشِيْ وَعَاقِبَةِ أَمْرِيْ – أَوْ قَالَ فِيْ عَاجِلِ أَمْرِيْ – وَآجِلِهِ  فَاصْرِفْهِ عَنِّيْ وَاصْرِفْنِيْ عَنْهُ وَاقْدُرْ لِيْ الْخَيْرَ حَيْثُ كَانَ ثُمَّ أَرْضِنِيْ بِهِ”. قَالَ: “وَيُسَمِّيْ حَاجَتَهُ.” رَوَاهُ الْبُخَارِيُّ .

1323. (2) [1/415-దృఢం]

జాబిర్‌ (ర) కథనం: ప్రవక్త (స) మాకు అన్ని పనుల్లోనూ ఇస్తిఖారహ్‌ గురించి, ఏవిధంగా ఖుర్‌ఆన్‌ లోని సూరహ్‌ నేర్పించేవారో ఆవిధంగా నేర్పించేవారు. ఇంకా మీలో ఎవరైనా ఏదైనా పనిచేయాలని సంకల్పిస్తే ఫ’ర్ద్ నమా’జును వదలి రెండు రకాతులు నమా’జు చదివి ఆ తరువాత ఈ దు’ఆను పఠించాలి. మరియు ”హాజ’ల్‌ అమ్ర్‌”కి బదులు ఆ పని పేరు పలకాలి. దు’ఆయె’ ఇస్తి’ఖారహ్‌: ”అల్లాహుమ్మ ఇన్నీ అస్త’ఖీరుక బి ‘ఇల్మిక, వ అస్తఖ్‌దిరుక బి ఖుద్‌రతిక, వ అస్‌అలుక మిన్‌ ఫ’ద్ లిక అల్‌ ‘అ”జీమ్‌, ఫ ఇన్నక తఖ్‌దిరు వలా అఖ్‌దిరు, వ త’అలము వలా అ’అలము, వ అన్‌తల్ ‘అల్లాముల్‌ ‘గుయూబ్‌. అల్లాహుమ్మ ఇన్‌కున్‌త త’అలము, అన్న హాజల్‌ అమ్‌ర్ ‘ఖైరున్ లీ, ఫీ దీని, వ మ’ఆషీ,  వ ‘ఆఖిబతి అమ్‌రీ, అవ్ ఖాల – ఫి ఆజిలి అమ్‌రీ వ ఆజిలిహీ – ఫఖ్‌దిర్‌హూ లీ, వ య’స్సిరుహూ లీ, సు’మ్మ బారిక్‌ లీ ఫీహ్. వ ఇన్‌కున్‌త  త’అలము అన్న హాజ’ల్‌ అమ్‌ర షర్రుల్‌ లీ ఫీ దీనీ, వ మ’ఆషి, వ ‘ఆఖిబతి అమ్‌రీ, అవ్ ఖాల – ఫి ఆజిలి అమ్‌రీ వ ఆజిలిహీ, ఫ’స్‌రిఫ్‌హూ ‘అన్నీ, వ’స్‌రిఫ్‌ నీ అన్‌హూ, వ అఖ్‌దిర్‌లి అల్‌ ఖైరన్ ‘హైసు కాన, సుమ్మ అర్‌’దినీ బిహీ.” ఖాల సుమ్మ యుసమ్మి ‘హాజతుహు. — ‘ఓ అల్లాహ్‌! నేను, నీ జ్ఞానం ద్వారా మంచిని అర్థిస్తున్నాను. నీ శక్తి ద్వారా శక్తిని కోరుతున్నాను. ఇంకా నేను నీ అత్యుత్తమ అనుగ్రహాన్ని కోరుతున్నాను. ఎందుకంటే నీవే సర్వశక్తి గల వాడవు. నాకు శక్తిలేదు. నీకే తెలుసు నాకు తెలియదు. అగోచరాలను గురించి తెలిసినవాడవు నీవే. ఓ అల్లాహ్‌! ఒక వేళ ఈ పని నాకు ధార్మికంగా, ఉపాధి మార్గంగా, పర్యవసానంగా, మంచిదైతే, దీన్నినాకు సులభతరం చేయి. ఇంకా అందులో నాకు శుభం ప్రసాదించు. ఒకవేళ ఇది నా కొరకు ప్రాపంచిక పరంగా, ఉపాధిపరంగా మంచిది కాకపోతే నా నుండి దీన్ని దూరం చేయి. ఎక్కడున్నా నాకు మంచిని ప్రసాదించు, ఇంకా దాని ద్వారా నన్ను సంతోషపరచు.’ [139] (బు’ఖారీ)

—–

اَلْفَصْلُ الثَّانِيْ   రెండవ విభాగం 

1324 – [ 3 ] ( حسن ) (1/416)

وَعَنْ عَلِيٍّ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: حَدَّثَنِيْ أَبُوْ بَكْرٍ وَصَدَقَ أَبُوْ بَكْرٍ. قَالَ: سَمِعْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ: “مَا مِنْ رَجُلٍ يُذْنِبُ ذَنْبًا ثُمَّ يَقُوْمُ فَيَتَطَهَّرُ. ثُمَّ يُصَلِّيْ ثُمَّ يَسْتَغْفِرُ اللهُ إِلَّا غَفَرَ اللهُ لَهُ. ثُمَّ قَرَأَ هَذِهِ الاية: (وَالَّذِيْنَ إِذَا فَعَلُوْا فَاحِشَةً أَوْ ظَلَمُوْا أَنْفُسَهُمْ ذَكَرُوْا اللهَ فَاسْتَغْفَرُوا لِذُنُوْبِهِمْ؛ 3: 135) رَوَاهُ التِّرْمِذِيُّ وَابْنُ مَاجَهُ إِلَّا أَنَّ ابْنَ مَاجَهُ لَمْ يَذْكُرِ الْآيَةَ.

1324. (3) [1/416ప్రామాణికం]

‘అలీ (ర) కథనం: అబూ బకర్‌ (ర) నాకు ‘హదీసు’ వినిపించారు, ”ప్రవక్త (స) ఇలా ప్రవచించారు, ”ఎవరైనా పాపం చేస్తే, వు’జూ చేసి, నమా’జు చదివి, ఆ తరువాత అల్లాహ్‌ను క్షమాపణ కోరితే, అల్లాహ్‌ క్షమిస్తాడు’ అని పలికి ఈ ఆయతు చదివారు: ”వల్లజీన ఇ’జా ఫ’అలూ ఫాహిషతన్, అవ్ ”జలమూ అన్‌ఫుసహుమ్‌ ‘జకరుల్లాహ ఫస్త’గ్‌ఫిరూ లిజు’నూ బిహిమ్‌. వ మయ్య’గ్‌ఫిరు జ్జు’నూబ ఇల్లా అల్లాహు, వలమ్‌ యుసిర్రూ ‘అలా మా ఫ’అలూ వహుమ్‌ య’అలమూన్‌.” (సూ. ఆల ఇమ్రాన్, 3:135) (తిర్మిజి’, ఇబ్నె మాజహ్) ఇబ్నె మాజహ్ ఈ ఆయతును ప్రస్తావించలేదు.

1325 – [ 4 ] ( ضعيف ) (1/416)

وَعَنْ حُذَيْفَةَ قَالَ: كَانَ النَّبِيُّ صلى الله عليه وسلم إِذَا حَزَبَهُ أَمْرٌ صَلَّى. رَوَاهُ أَبُوْ دَاوُدَ .

1325. [1/416బలహీనం]

హుజై’ఫహ్ (ర) కథనం: ప్రవక్త (స)కు ఏదైనా కష్టం లేదా ఆపద ఎదురైతే, ప్రవక్త (స) నమా’జు చదువుతారు. [140] (అబూ దావూద్‌)

1326 – [ 5 ] ( صحيح ) (1/416)

وَعَنْ بُرَيْدَةَ قَالَ: أَصْبَحَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم فَدَعَا بِلَالًا فَقَالَ: “بِمَ سَبَقْتَنِيْ إِلَى الْجَنَّةِ مَا دَخَلْتُ الْجَنَّةَ قَطُّ إِلَّا سَمِعْتُ خَشْخَشَتَكَ أَمَامِيْ”. قَالَ: يَا رَسُوْلَ اللهِ مَا أَذَّنْتُ قَطُّ إِلَّا صَلَّيْتُ رَكْعَتَيْنِ وَمَا أَصَابِنِّيْ حَدَثٌ قَطُّ إِلَّا تَوَضَّأْتُ عِنْدَهُ وَرَأَيْتُ أَنَّ لِلهِ عَلَيَّ رَكْعَتَيْنِ. فَقَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “بِهِمَا”. رَوَاهُ التِّرْمِذِيُّ .

1326. (5) [1/416-దృఢం]

బురైదహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ఉదయం నమా’జు తర్వాత బిలాల్‌ను పిలిచి, ”నువ్వు ఏ గొప్ప పని చేయటంవల్ల స్వర్గంలో నాకంటే ముందు నడు స్తున్నావు. స్వర్గంలో నేను ఎక్కడ నడచినా నీ చెప్పులశబ్దం విన్నాను” అని అన్నారు. దానికి బిలాల్‌, ఓ ప్రవక్తా! నేను అజా’న్‌ ఇచ్చి నప్పుడు, అజా’న్‌ తరువాత 2 రక’అతులు సున్నత్‌ చదువు కుంటాను. ఇంకా వు’దూ చేసిన తర్వాత 2 రక’అతులు చదువుకుంటాను. నేను వు’దూ మరియు అ’జా’న్‌ల తర్వాత రెండు రక’అతులు తప్పకుండా చదువుకుంటాను’ అని అన్నారు. అప్పుడు ప్రవక్త (స), ‘ఈ రెంటివల్లే నీవు స్వర్గంలో నా ముందు ఉన్నావు,’ అని అన్నారు. (తిర్మిజి’)

1327 – [ 6 ] ( موضوع ) (1/417)

وَعَنْ عَبْدِ اللهِ بْنِ أَبِيْ أَوْفَى قَال : قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَنْ كَانَتْ لَهُ حَاجَةٌ إِلَى اللهِ أَوْ إِلَى أَحَدٍ مِّنْ بَنِيْ آدَمَ فَلْيَتَوَضَّأَ فَلْيُحْسِنِ الْوُضُوْءَ ثُمَّ ليُصَلِّ رَكْعَتَيْنِ. ثُمَّ لْيُثْنِ عَلَى اللهِ تَعَالى وَلْيُصَلِّ عَلَى النَّبِيِّ صَلى الله عليه وسلم. ثُمَّ لْيَقُلْ: لَا إِلَهَ إِلَّا اللهُ الْحَلِيْمُ الْكَرِيْمُ سُبْحَانَ اللهِ رَبِّ الْعَرْشِ الْعَظِيْمِ وَالْحَمْدُ لِلّهِ رَبِّ الْعَالَمِيْنَ أَسْأَلُكَ مُوْجِبَاتِ رَحْمَتِكَ وَعَزَائِمَ مَغْفِرَتِكَ وَالْغَنِيْمَةَ مِنْ كُلِّ بِرٍّ وَالسَّلَامَةَ مِنْ كُلِّ إِثْمٍ لَا تَدَعْ لِيْ ذَنْبًا إِلَّا غَفَرْتَهُ وَلَا هُمَا إِلَّا فَرَّجْتَهُ وَلَا حَاجَةَ هِيَ لَكَ رَضِىَ إِلَّا قَضَيْتَهَا يَا أَرْحَمَ الرَّاحِمِيْنَ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَابْنُ مَاجَهُ. وَقَالَ التِّرْمِذِيُّ: هَذَا حَدِيْثٌ غَرِيْبٌ .

1327. (6) [1/417-కల్పితం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ అబీ అవ్‌ఫా (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”అల్లాహ్‌ నుండి, లేదా ఎవరైనా వ్యక్తి నుండి అవసరం ఉన్నవ్యక్తి పరిపూర్ణంగా వు’దూ చేసి, 2 రకా’తులు నమా’జు చదవాలి. ఆ తరువాత అల్లాహ్‌ను స్తుతించి, ప్రవక్త (స) పై దరూద్‌ పంపి, ఆ తరువాత ఇలా ప్రార్థించాలి. ”లా ఇ’లాహ ఇల్లల్లాహు అల్ ‘హలీముల్‌ కరీము, సుబ్‌’హానల్లాహి రబ్బిల్ ‘అర్‌షిల్‌ ‘అ”జీమ్‌. వల్‌’హమ్‌దు లిల్లాహి రబ్బిల్‌ ‘ఆలమీన్‌. అస్‌అలుక మూజిబాతి ర’హ్మతిక, వ అ’జాయి’మ మ’గ్‌ఫిరతిక, వల్‌’గనీమత మిన్‌ కుల్లి బిర్రిన్‌, వస్సలామత మిన్‌కుల్లి ఇస్మిన్‌, లా తద’అలీ ‘జన్‌బన్‌ ఇల్లా ‘గఫర్తహ్, వలా హమ్మన్‌ ఇల్లా ఫర్రజ్‌తహ్, వలా’హాజతన్‌ హియ లక రి’దియ్యన్‌ ఇల్లా ఖ’దైతహా, యా అర్‌’హమర్రా’హిమీన్‌.” — ‘అల్లాహ్‌ తప్ప ఆరాధనకు అర్హులెవరూ లేరు. ఆయన శాంత స్వభావుడు, పరమదాత. ఆయన పరిశుద్ధతను కొనియాడుతున్నాము. ఆయన సర్వోత్తమ సింహాసనానికి అధిపతి. సమస్త స్తోత్రాలు, సర్వలోకాల ప్రభువైన అల్లాహ్‌ కొరకే. ఓ అల్లాహ్‌! నాకు నీ కారుణ్యం పొందే మార్గాలను చూపు. క్షమాపణ పొందే, మంచిని పొందే అవకాశాలను కోరుతున్నాను. ప్రతి పాప భారం నుండి నాకు విముక్తి ప్రసాదించు. నా ప్రతిపాపాన్ని క్షమించు. నా ప్రతి చింతను దూరం చేయి.  నీకు నచ్చిన నా ప్రతి అవసరాన్ని పూర్తిచేయి. ఓ కారుణ్యమూర్తి! నా ఈ అవసరాన్ని పూర్తిచేయి.’ (ఇబ్ను మాజహ్, తిర్మిజీ – ఏకోల్లేఖనం)

=====

40- بَابُ صَلَاةِ التَّسْبِيْحِ

40. సలాతుత్తస్బీహ్

తస్‌బీ’హ్‌ నమా’జులో, ఖియామ్‌, రుకూ’, ఖామహ్‌, సజ్దాలలో అత్యధికంగా — సుబ్‌’హానల్లాహ్‌, అల్‌’హమ్దు లిల్లాహ్‌, వలా లాహ ఇల్లల్లాహ్‌, అల్లాహు అక్బర్ — పలకాలి. అందువల్ల దీన్ని’సలాతుత్తస్‌బీ’హ్‌ అంటారు. దీని వల్ల చిన్న పెద్ద పాపాలన్నీ క్షమించబడతాయి.

1328 – [ 1 ] ( ضعيف ) (1/418)

عَنِ ابْنِ عَبَّاسٍ أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم قَالَ: لِلْعَبَّاسِ بْنِ عَبْدِ الْمُطَّلِبِ: “يَا عَبَّاسُ يَا عَمَّاهُ أَلَا أُعْطِيْكَ؟ أَلَا أَمْنَحُكَ؟ أَلَا أَخْبِرُكَ؟ أَلَا أَفْعَلُ بِكَ عَشْرَ خِصَالِ إِذَا أَنْتَ فَعَلْتَ ذَلِكَ غَفَرَ اللهُ لَكَ ذَنْبَكَ أَوَّلَهُ وَآخِرَهُ قَدِيْمَهُ وَحَدِيْثَهُ خَطَأهُ وَعَمَدَهُ صَغِيْرَهُ وَكَبِيْرَهُ سِرَّهُ وَعَلَانِيَتَهُ. أَنْ تُصَلِّيَ أَرْبَعَ رَكَعَاتٍ تَقْرَأُ فِيْ كُلِّ رَكْعَةٍ فَاتِحَةَ الْكِتَابِ وُسُوْرَةً. فَإِذَا فَرَغْتَ مِنَ الْقِرَاءَةِ فِيْ أَوَّلِ رَكْعَةٍ وَأَنْتَ قَائِمٌ قُلْتَ سُبْحَانَ اللهِ وَالْحَمْدُ لِلّهِ وَلَا إِلَهَ إِلَّا اللهُ وَاللهُ أَكْبَرُ خَمْسَ عَشَرَةَ مَرَّةً ثُمَّ تَرْكَعُ فَتَقُوْلُهَا وَأَنْتَ رَاكِعٌ عَشْرًا ثُمَّ تَرْفَعُ رَأْسَكَ مِنَ الرُّكُوْعِ فَتَقُوْلُهَا عَشْرًا ثُمَّ تَهْوِيْ سَاجِدًا فَتَقُوْلُهَا وَأَنْتَ سَاجِدٌ عَشْرًا ثُمَّ تَرْفَعُ رَأْسَكَ مِنَ السُّجُوْدِ فَتَقُوْلُهَا عَشْرًا ثُمَّ تَسْجُدُ فَتَقُوْلُهَا عَشْرًا ثُمَّ تَرْفَعُ رَأْسَكَ فَتَقُوْلُهَا عَشْرًا فَذَلِكَ خَمْسٌ وَّسَبْعُوْنَ فِيْ كُلِّ رَكْعَةٍ. تَفْعَلُ ذَلِكَ فِيْ أَرْبَعِ رَكَعَاتٍ إِنَ اسْتَطَعْتَ أَنْ تُصَلِّيْهَا فِيْ كُلِّ يَوْمٍ فَافْعَلْ. فَإِنْ لَّمْ تَفْعَلْ فَفِيْ كُلِّ جُمُعَةٍ مَّرَّةً. فَإِنْ لَمْ تَفْعَلْ فَفِيْ كُلِّ شَهْرٍ مَّرَّةً. فَإِنْ لَمْ تَفْعَلْ فَفِيْ كُلِّ سَنَةٍ مَّرَّةً. فَإِنْ لَمْ تَفْعَلْ فَفِيْ عُمُرِكَ مَرَّةً”. رَوَاهُ أَبُوْ دَاوُدَ وَابْنُ مَاجَهُ وَالْبَيْهَقِيُّ فِيْ الدَّعْوَاتِ الْكَبِيْرِ.

1328. (1) [1/418బలహీనం]

ఇబ్నె’అబ్బాస్‌ (ర) కథనం: ప్రవక్త (స) ‘అబ్బాస్‌ బిన్‌ ‘అబ్దుల్‌ ము’త్తలిబ్‌ను, ”ఓ ‘అబ్బాస్‌! నేను మీకు కానుక ఇవ్వనా, నేను మీకు కానుక ఇవ్వనా, నేను మీకు చూపెట్టనా, నేను మీపట్ల ఉత్తమంగా ప్రవర్తించనా, అంటే ఒక మంచి కానుక ఇస్తాను. దాన్ని మీరు తీసుకోండి. పది విషయాలు ఉన్నాయి. ఒక వేళ మీరు వాటిని ఆచరిస్తే, అల్లాహ్‌ మీ ఇంతకు ముందు, ఇక ముందు పాపాలన్నిటినీ, చిన్న పెద్ద పాపాలన్నింటినీ, బహిరంగమైన, రహస్యమైన పాపా లన్నింటినీ క్షమించివేస్తాడు. అదేమిటంటే: ‘మీరు 4 రకా’తుల నమా’జు చదవండి, ప్రతి రకా’తులో సూరహ్‌ ఫాతి’హాతో పాటు మరో సూరహ్‌ చదవండి. ఖిరా’అత్‌ అయిన తర్వాత ‘సుబ్‌’హానల్లాహ్‌ వల్‌’హమ్‌దులిల్లాహ్‌ వలాయి’లాహ ఇల్లల్లాహ్‌, అల్లాహు అక్బర్‌’ 15 సార్లు చదవండి; ఆ తరువాత రుకూ’ చేసి, రుకూ’లోనే (దీనిని) 10 సార్లు చదవండి; ఆ తరువాత రుకూ’ నుండి లేచి, ఖామలో నిలబడి (దీనిని) 10 సార్లు చదవండి; ఆ తరువాత సజ్దాలోకి వెళ్ళి సజ్దాలో (దీనిని) 10 సార్లు చదవండి; సజ్దా నుండి లేచి కూర్చోని (దీనిని) 10 సార్లు చదవండి; తరువాత  రెండవ సజ్దా చేసి అందులో (దీనిని) 10 సార్లు చదవండి; మళ్ళీ రెండవ సజ్దా నుండి తలఎత్తి (దీనిని) 10 సార్లు చదవండి. ఇవన్నీ కలసి 75 సార్లు అవుతాయి. ఇలా 4 రకాతుల్లోనూ చేయండి. సాధ్యమైతే ప్రతిరోజు ఒకసారి చదువుకోండి. లేక వారానికి ఒకసారి చదుకోండి, లేదా నెలకు ఒకసారి చదువుకోండి. అది కాకున్నా సంవత్సరానికి ఒకసారైనా చదువుకోండి. ఒకవేళ అదీ సాధ్యం కాకుంటే జీవితంలో ఒక్కసారైనా చదువుకోండి అని హితబోధ చేసారు.” (అబూ దావూద్‌, ఇబ్నె మాజహ్, బైహఖీ-ద’అవాతుల్ కబీర్).

1329 – [ 2 ] ( ضعيف ) (1/419)

وَ رَوَاهُ التِّرْمِذِيُّ عَنْ أَبِيْ رَافِعٍ نَحْوَهُ.

1329. (2) [1/419బలహీనం]

తిర్మిజి’ దీనిని అబూ రా’ఫె కథనం ఆధారంగా కూడా ఉల్లేఖించారు.

1330 – [ 3 ] ( صحيح ) (1/419)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ قَال: سَمِعْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ: “إِنَّ أَوَّلَ مَا يُحَاسَبُ بِهِ الْعَبْدُ يَوْمَ الْقِيَامَةِ مِنْ عَمَلِهِ صَلَاتُهُ فَإِنْ صَلُحَتْ فَقَدْ أَفْلَحَ وَأَنْجَحَ وَإِنْ فَسَدَتْ فَقَدْ خَابَ وَخَسِرَ فَإِنِ انْتَقَصَ مِنْ فَرِيْضَتِهِ شَيْءٌ. قَالَ الرَّبُّ تَبَارَكَ وَتَعَالى: انْظُرُوْا هَلْ لِعَبْدِيْ مِنْ تَطَوُّعِ؟ فَيُكَمَّلُ بِهَا مَا انْتَقَصَ مِنَ الْفَرِيْضَةِ ثُمَّ يَكُوْنُ سَائِرُعَمَلِهِ عَلَى ذَلِكَ”.وَفِيْ رِوَايَةٍ: “ثُمَّ الزَّكَاةُ مِثْلَ ذَلِكَ ثُمَّ تُؤْخَذُ الْأَعْمَالُ حَسْبِ ذَلِكَ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ.

1330. (3) [1/419దృఢం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ఇలా ప్రవచిస్తూ ఉండగా నేను విన్నాను, ”పునరుత్థాన దినమున, కర్మలన్నింటి కంటే ముందు నమా’జును గురించి విచారించడం జరుగుతుంది. ఒకవేళ నమా’జు సరిగ్గా ఆచరించి ఉంటే సాఫల్యం పొందటం జరుగుతుంది. ఒకవేళ నమా’జు సరిగ్గా ఆచరించ కుండా ఉంటే నష్టానికి గురికావటం జరుగుతుంది. ఒకవేళ విధి నమాజులను అన్నింటినీ ఆచరించ టంలో లోపం ఉంటే అల్లాహ్,నాదాసుని నఫిల్ నమాజులను చూడండి, అతడు నఫిల్నమాజులు చదివి ఉంటే వాటిద్వారా అతని విధి నమాజులను పూర్తిచేయండి, అని ఆదేశిస్తాడు. అదేవిధంగా ఇతర కర్మలను కూడా విచారించటం జరుగుతుంది.” [141](అబూ దావూద్‌)

మరో ఉల్లేఖనలో, ‘ఆ తరువాత ‘జకాత్ ను గురించి అదేవిధంగా ఇతర కర్మల గురించి విచారించటం జరుగుతుంది,’ అని ఉంది.  

1331 – [ 4 ] ( صحيح ) (1/419)

وَرَوَاهُ أَحْمَدُ وَ حَاكِمْ ، عَنْ رَجُلٍ.

1331. (4) [1/419దృఢం]

అ’హ్మద్‌, ‘హాకిమ్,  ఒక ‘సా’హబీ (ర) ద్వారా దీనిని ఉల్లేఖించారు. దీనిని ‘స’హీ’హ్ అన్నారు.

1332 – [ 5 ] ( ضعيف ) (1/420)

وَعَنْ أَبِيْ أُمَامَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَا أَذِنَ اللهُ لِعَبْدٍ فِيْ شَيْءٍ أَفْضَلَ مِنَ الرَّكْعَتَيْنِ يُصَلِّيْهِمَا وَإِنَّ الْبِرَّ لَيُذَرُّ عَلَى رَأْسِ الْعَبْدِ مَا دَامَ فِيْ صَلَاتِهِ وَمَا تَقَرَّبَ الْعِبَادُ إِلَى اللهِ بِمِثْلِ مَا خَرَجَ مِنْهُ”. يَعْنِيْ الْقُرْآنَ. رَوَاهُ أَحْمَدُ وَالتِّرْمِذِيُّ

1332. (5) [1/420బలహీనం]

అబూ ఉమామహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం: ”అల్లాహ్‌ (త) తన దాసుని ఆరాధనల్లో రెండు రకాతుల వైపు తప్ప మరి దేనివైపు ఆసిక్తితో చూడడు. అంటే నమా’జు వైపు చాలా ఆసక్తితో చూస్తాడు. ఇంకా తన ప్రత్యేక కారుణ్యం అతనిపై అవతరింపజేస్తాడు. నమా’జులో ఉన్నంత వరకు ఇంకా దాసునిపై మేలు చిలకరించ బడుతుంది. దాసులు ఖుర్‌ఆన్‌ తప్పమరే వస్తువు ద్వారా అల్లాహ్‌ (త) సాన్నిహిత్యాన్ని పొందలేరు. అంటే ఖుర్‌ఆన్‌ పఠనం అవుతుంది. ఈ ఖుర్‌ఆన్‌ పఠనం ద్వారానే అల్లాహ్‌ (త) సాన్నిహిత్యం లభిస్తుంది. మరే వస్తువు ద్వారా లభించదు.” (అ’హ్మద్, తిర్మిజి’)

=====

41 – بَابُ صَلَاةُ السَّفَرِ

41. ప్రయాణపు నమాజు

48 మైళ్ళు ప్రయాణం చేసినా, చేసే ఉద్దేశ్యంతో తన పట్టణం నుండి బయలుదేరినా ఒక ముస్లిమ్‌పై కొన్ని నియమ నిబంధనలు వర్తిస్తాయి: 1. ప్రయాణంలో నమా’జును ఖ’స్ర్‌ చేయవచ్చును. 2. ఉపవాసాలను వదలవచ్చును. 3. మూడురోజుల వరకు సాక్సులపై మసహ్‌ చేయవచ్చును. 4. జుమ’అహ్‌ తప్పనిసరి కాదు. 4 రకాతుల నమా’జును 2 రకాతులు మాత్రమే చదవడాన్ని ఖ’స్ర్‌ అంటారు. ”జుహ్ర్‌, ‘అ’స్ర్‌, ‘ఇషా’ నమా’జుల్లో ఇలా చేయాలి. ఖుర్‌ఆన్‌లో అల్లాహ్‌ ఆదేశం: ”మరియు మీరు భూమిలో ప్రయాణం చేసేటపుడు నమాజులను సంక్షిప్తం (ఖ’స్ర్‌) చేస్తే, అది పాపం కాదు. (అంతే గాక) సత్య-తిరస్కారులు మిమ్మల్ని వేధిస్తారు అనే భయం మీకు కలిగి నపుడు కూడా! ఎందుకంటే, సత్య-తిరస్కారులు నిశ్చయంగా మీకు బహిరంగశత్రువులు.” (సూ. అన్నిసా, 4 :101)

اَلْفَصْلُ الْأَوَّلُ  మొదటి విభాగం  

1333 – [ 1 ] ( متفق عليه ) (1/421)

عَنْ أَنَسٍ: أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم صَلَّى الظُّهْرَ بِالْمَدِيْنَةِ أَرْبَعًا وَصَلَّى الْعَصْرَ بِذِيْ الْحُلَيْفَةِ رَكْعَتَيْنِ

1333. (1) [1/421ఏకీభవితం]

అనస్‌ (ర) కథనం: ప్రవక్త (స) మదీనహ్ లో ”జుహ్ర్‌ నమా’జు 4 రకాతులు చదివారు. ఇంకా జు’ల్‌ ‘హులై ఫహ్ లో ‘అ’స్ర్‌ నమా’జు 2 రకాతులు చదివారు. [142] (బు’ఖారీ, ముస్లిమ్‌)

1334 – [2] (متفق عليه) (1/421)

وَعَنْ حَارِثَةَ بْنِ وَهْبِ الْخُزَاعِيِّ قَالَ: صَلَّى بِنَا رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم وَنَحْنُ أَكْثَرُمَا كُنَّا قَطُّ وَآمَنَهُ بِمِنًا رَكْعَتَيْنِ .

1334. (2) [1/421ఏకీభవితం]

హారిస’హ్ బిన్‌ వహబ్‌ ‘ఖు’జాయీ (ర) కథనం: ప్రవక్త (స) మినాలోమాకు 2 రకా’తుల నమా’జు చదివించారు. అప్పుడు మేము చాలామంది ఉన్నాం. ఇంకా శాంతి భద్రతల స్థితిలో ఉన్నాం. [143] (బు’ఖారీ, ముస్లిమ్‌)

1335 – [ 3 ] ( صحيح ) (1/421)

وَعَنْ يَعْلَى بْنِ أُمَيَّةَ قَالَ: قُلْتُ لِعُمَرَ بْنِ الْخَطَّابِ: إِنَّمَا قَالَ اللهُ تَعَالى: (أَنْ تَقْصُرُوْا مِنَ الصَّلَاةِ إنْ خِفْتُمْ أَنْ يَّفْتَنِكُمُ الَّذِيْنَ كَفَرُوْا-) فَقَدْ أَمِنَ النَّاسُ. قَالَ عُمَرُ: عَجِبْتُ مِمَّاعَجِبْتَ مِنْهُ فَسَأَلْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم.فَقَالَ:”صَدَقَةٌ تَصَدَّقَ اللهُ بِهَا عَلَيْكُمْ فَاقْبَلُوْا صَدَقَتَهُ “. رَوَاهُ مُسْلِمٌ .

1335. (3) [1/421దృఢం]

య’అలా బిన్‌ ఉమయ్య (ర) కథనం: నేను ‘ఉమర్‌ (ర)ను, ”మరియు మీరు భూమిలో ప్రయాణం చేసి నపుడు నమా’జులను సంక్షిప్తం చేయటంలో తప్పు లేదు,” అని అన్నాను. అదేవిధంగా సత్య-తిరస్కా రులు మిమ్మల్ని వేధిస్తారనే భయం మీకు కలిగి నపుడు కూడా,” (సూ. అన్నిసా, 4:101) ఆయతు యొక్క అర్థం అడిగి, ”ఇప్పుడు అందరూ శాంతి భద్రతలతో ఉన్నారు, అవిశ్వాసుల వైపు నుండి భయం కూడా లేదు ఇప్పుడు ఖ’స్ర్‌ చేయకపోవడం మంచిది కదా?” అని అడిగాను. దానికి ఉమర్‌(ర) సమాధానమిస్తూ, ”మీకు సందేహం కలిగినట్లే, నాకూ సందేహం కలిగింది. మీరు నన్ను అడిగినట్టే నేను ప్రవక్త (స)ను దీన్ని గురించి అడిగాను. దానికి ప్రవక్త (స), ‘ఈ ఖ’స్ర్‌ అల్లాహ్‌ తరఫున దానం, మరియు ఆయన అనుగ్రహం, దీన్ని స్వీకరించండి,’ అని అన్నారు,” అని చెప్పారు. [144]  (ముస్లిమ్‌)

1336 – [ 4 ] ( متفق عليه ) (1/421)

وَعَنْ أَنَسٍ قَالَ: خَرَجْنَا مَعَ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم مِنَ الْمَدِيْنَةِ إِلَى مَكَّةَ. فَكَانَ يُصَلِّيْ رَكْعَتَيْنِ رَكْعَتَيْنِ حَتَّى رَجَعْنَا إِلَى الْمَدِيْنَةِ. قَيْلَ لَهُ: أَقَمْتُمْ بِمَكَّةَ شَيْئًا. قَالَ:”أَقَمْنَا بِهَا عَشْرًا”.

1336. (4) [1/421ఏకీభవితం]

అనస్‌ (ర) కథనం: ”ప్రవక్త (స) వెంట మక్కహ్ వెళ్ళాము. ఈ ప్రయాణంలో ప్రవక్త (స) కేవలం రెండేసి రకా’తులు మాత్రమే చదివారు. చివరికి మేము ‘హజ్జ్ చేసి తిరిగి మదీనహ్ చేరుకున్నాం.” అతన్ని మీరు మక్కహ్ లో ఎన్ని రోజులు ఉన్నారని అడగటం జరి గింది. దానికి అతను, ‘మేము మక్కహ్ లో 10 రోజులు ఉన్నాం” అని అన్నారు. [145] (బు’ఖారీ, ముస్లిమ్‌)

1337 – [ 5 ] ( صحيح ) (1/421)

وَعَنِ ابْنِ عَبَّاسٍ قَالَ: سَافَرَ النَّبِيُّ صلى الله عليه وسلم سَفَرًا فَأَقَامَ تِسْعَةَ عَشَرَ يَوْمًا يُّصَلِّيْ رَكْعَتَيْنِ رَكْعَتَيْنِ. قَالَ ابْنُ عَبَّاسٍ: فَنَحْنُ نُصَلِّيْ فِيْمَا بَيْنَنَا وَبَيْنَ مَكَّةَ تِسْعَةَ عَشَرَ، رَكْعَتَيْنِ رَكْعَتَيْنِ، فَإِذَا أَقَمْنَا أَكْثَرَ مِنْ ذَلِكَ صَلَّيْنَا أَرْبَعًا. رَوَاهُ الْبُخَارِيُّ.

1337. (5) [1/421దృఢం]

ఇబ్నె’అబ్బాస్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రయాణంలో 19 రోజులు ఉన్నారు. రెండేసి రకాతులు చదువుతూ ఉన్నారు. మేము మక్కహ్, మదీనహ్ ల మధ్య 19 రోజుల వరకు రెండేసి రక’అతులు చదివే వాళ్ళం. అంత కంటే ఎక్కువ దినాలు ప్రయాణం చేస్తే నమా’జును పూర్తిగా చదివే వాళ్ళం. [146](బు’ఖారి)

1338 – [ 6 ] ( متفق عليه ) (1/422)

وَعَنْ حَفْصِ بْنِ عَاصِمٍ قَالَ:صَحِبْتُ ابْنَ عُمَرَ فِيْ طَرِيْقِ مَكَّةَ فَصَلَّى لَنَا الظُّهْرَرَكْعَتَيْنِ ثُمَّ جَاءَ رَحْلَهُ وَجَلَسَ فَرَأَى نَاسًا قِيَامًا فَقَالَ : مَا يَصْنَعُ هؤُلَاءِ ؟ قُلْتُ : يُسَبِّحُوْنَ . قَالَ : لَوْ كُنْتُ مُسَبِّحًا أَتْمَمْتُ صَلَاتِيْ . صَحِبْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم فَكَانَ لَا يَزِيْدُ فِيْ السَّفَرِ عَلَى رَكْعَتَيْنِ وَأَبَا بَكْرٍ وَعُمَرَ وَعُثْمَانَ كَذِلَكَ .

1338. (6) [1/422ఏకీభవితం]

‘హఫ్‌’స్‌ బిన్‌ ‘ఆసిమ్‌ (ర) కథనం:  నేను మక్కహ్ ప్రయాణంలో ‘ఉమర్‌ (ర) వెంట ఉన్నాను. ”జుహ్ర్‌ నమా’జు రెండు రకాతులు చదివించారు. ఆ తరువాత తన నివాసానికి వచ్చి కూర్చొని చూస్తే, చాలామంది నిలబడి ఉన్నారు. ‘ఉమర్‌ (ర), ‘వాళ్ళు ఏం చేస్తున్నారు’ అని అడిగారు. నేను, ”వాళ్ళు నఫిల్‌, సున్నతు నమా’జు చదువుతున్నారు,” అని అన్నాను. దానికి ఉమర్‌ (ర), ”ఒకవేళ నేను నఫిల్‌ చదవగోరితే నమా’జునే పూర్తిగా చదువుకునేవాడిని,” అని అన్నారు. నేను ప్రవక్త (స) వెంట ఉన్నాను. అబూ బకర్‌, ‘ఉమర్‌, ‘ఉస్మాన్‌లు వెంట ఉన్నారు. కాని వీరందరూ ప్రయాణంలో రెండు రకాతుల కంటే ఎక్కువ చదవ లేదు. [147] (బు’ఖారీ, ముస్లిమ్‌)

1339 – [ 7 ] ( صحيح ) (1/422)

وَعَنِ ابْنِ عَبَّاسٍ قَالَ : كَانَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم يَجْمَعُ بَيْنَ الظُّهْرِ وَالْعَصْرِ إِذَا كَانَ عَلَى ظَهْرِ سَيْرٍ وَّيَجْمَعُ بَيْنَ الْمَغْرِبِ وَالْعِشَاءِ . رَوَاهُ الْبُخَارِيُّ .

1339. (7) [1/422దృఢం]

ఇబ్నె’అబ్బాస్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రయాణంలో ”జుహ్ర్‌, ‘అస్ర్‌’లను కలిపి చదివేవారు. అదే విధంగా మ’గ్రిబ్‌, ‘ఇషా’లను కలిపి చదివేవారు. [148] (బు’ఖారీ)

1340 – [ 8 ] ( متفق عليه ) (1/422)

وَعَنِ ابْنِ عُمَرَ قَالَ: كَانَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم يُصَلِّيْ فِيْ السَّفَرِ عَلَى رَاحِلَتِهِ حَيْثُ تَوَجَّهَتْ بِهِ يُوْمِئُ إِيْمَاءُ صَلَاةَ اللَّيْلِ إِلَّا الْفَرَائِضَ وَيُوْتِرُ عَلَى رَاحِلَتِهِ.

1340. (8) [1/422ఏకీభవితం]

ఇబ్నె’ఉమర్‌ (ర) కథనం: ”ప్రవక్త (స) ప్రయాణంలో తన వాహనంపై తహజ్జుద్‌ నమా’జు చదువుకునేవారు. వాహనం ఎటు వెళుతున్నా సైగలతో నమా’జు చదివే వారు. కాని ఫర్ద్ నమా’జులు మాత్రం క్రిందికి దిగి చదివేవారు. విత్ర్‌ను వాహనంపైనే చదువుకునే వారు. [149] (బు’ఖారీ, ముస్లిమ్‌)

—–

اَلْفَصْلُ الثَّانِيْ   రెండవ విభాగం

1341 – [ 9 ] ( ضعيف ) (1/423)

وَعَنْ عَائِشَةَ رَضِيَ اللهُ عَنْهَا قَالَتْ: كَانَ ذَلِكَ قَدْ فَعَلَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم قَصَرَ الصَّلَاةَ وَأَتَمَّ. رَوَاهُ فِيْ شَرْحِ السُّنَّةِ.

1341. (9) [1/423బలహీనం]

‘ఆయి’షహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రయాణంలో ఖ’స్ర్‌ చేశారు, పూర్తిగా కూడా చదివారు. అన్నీ ధర్మ సమ్మతమే. [150]  (షర్‌’హుస్సున్నహ్‌)

1342 – [ 10 ] ( ضعيف ) (1/423)

وَعَنْ عِمْرَانِ بْنِ حُصَيْنٍ قَالَ: غَزَوْتُ مَعَ النَّبِيِّ صلى الله عليه وسلم وَشَهِدْتُّ مَعَهُ الْفَتْحَ. فَأَقَامَ بِمَكَّةِ ثَمَانِيَ عَشَرَةَ لَيْلَةً لَّا يُصَلِّيْ إِلَّا رَكْعَتَيْنِ يَقُوْلُ: “يَا أَهْلَ الْبَلَدِ صَلُّوْا أَرْبَعًا فَإِنَّا سَفَرٌ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ .

1342. (10) [1/423బలహీనం]

‘ఇమ్రాన్‌ బిన్‌ ‘హు’సైన్‌ (ర) కథనం: ”ప్రవక్త (స) తో కలసి నేను జిహాద్‌ చేశాను. ఇంకా మక్కహ్ విజయం లో కూడా నేను ప్రవక్త (స) వెంట ఉన్నాను. ప్రవక్త (స) మక్కహ్ లో 18 రోజులు ఉన్నారు. ఈ మధ్య కాలంలో కేవలం రెండు రకాతులు మాత్రమే చదివే వారు. అంటే ఖ’స్ర్‌  చేసేవారు. పట్టణ ప్రజలతో, ‘మీరు 4 రకాతులు చదవండి, మేము ప్రయాణీకులం,’ అని అనే వారు.” [151](అబూ దావూద్‌)

1343 – [ 11 ] ( ضعيف ) (1/423)

وَعَنِ ابْنِ عُمَرَ قَالَ: صَلَّيْتُ مَعَ النَّبِيّ صلى الله عليه وسلم الظُّهْرَ فِيْ السفَرِرَكْعَتَيْنِ وَبَعْدَهَا رَكْعَتَيْنِ.

وَفِيْ رِوَايَةٍ قَالَ: صَلَّيْتُ مَعَ النَّبِيِّ صلى الله عليه وسلم فِيْ الْحَضَرِ وَالسَّفَرِ فَصَلَّيْتُ مَعَهُ فِيْ الْحَضَرِ الظُّهْرَ أَرْبَعًا وَبَعْدَهَا رَكْعَتَيْنِ وَصَلَّيْتُ مَعَهُ فِيْ السَّفَرِالظُّهْرَ رَكْعَتَيْنِ وَبَعْدَهَا رَكْعَتَيْنِ وَالْعَصْرَرَكْعَتَيْنِ وَلَمْ يَصِلْ بَعْدَهَا شَيْئًا وَالْمَغْرِبَ فِيْ الْحَضَرِ وَالسَّفَرِ سَوَاءً ثَلَاثَ رَكْعَاتٍ وَلَا يَنْقُصُ فِيْ حَضَرٍ وَلَا سَفَرٍ وَهِيَ وِتْرُ النَّهَارِ وَبَعْدَهَا رَكْعَتَيْنِ. رَوَاهُ التِّرْمِذِيُّ .

1343. (11) [1/423బలహీనం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘ఉమర్‌ (ర) కథనం: ప్రవక్త (స) వెంట నేను ప్రయాణంలో 2 రకాతులు చదివాను. ఆ తరువాత 2 రకాతులు సున్నతులు కూడా చదివాను. మరో ఉల్లేఖనంలో ప్రవక్త (స)తో కలసి ప్రయాణంలోనూ, నివాసంలోనూ నేను నమా’జు చదివాను.

నివాసంలో ”జుహ్ర్‌ 4 రకాతులు, ఆ తరువాత 2 రకాతులు సున్నత్‌ చదివాను. ప్రయాణంలో ప్రవక్త (స)తో కలసి 2 రకాతులు చదివాను. ఆతరువాత 2 రకాతుల సున్నత్‌ చదివాను. అయితే అ’స్ర్‌ 2 రకాతులు మాత్రమే చదివాను. ఆ తరువాత ఏమీ చదవలేదు. మ’గ్రిబ్‌ నమా’జు స్థానికంగా, ప్రయాణంలో సమానమే. అంటే 3 రకాతులు ఈ మ’గ్రిబ్‌ నమా’జు పగటి విత్ర్‌ 2 రకాతులు దాని సున్నత్‌లు చదవాలి. (తిర్మిజి’)

1344 – [ 12 ] ( صحيح ) (1/424)

وَعَنْ مُعَاذِ بْنِ جَبَلٍ قَالَ: كَانَ النَّبِيُّ صلى الله عليه وسلم فِيْ غَزْوَةِ تَبُوْكَ. إِذَا زَاغَتِ الشَّمْسُ قَبْلَ أَنْ يَّرْتَحِلَ جَمْعَ بَيْنَ الظُّهْرِ وَالْعَصْرِ وَإِنْ ارْتَحَلَ قَبْلَ أَنْ تَزِيْغَ الشَّمْسُ أَخَّرَ الظُّهْرَحَتَّى يَنْزِلَ لِلْعَصْرِوَفِيْ الْمَغْرِبِ مِثْلَ ذَلِكَ إِذَا غَابَتِ الشَّمْسُ قَبْلَ أَنْ يَّرْتَحِلَ جَمَعَ بَيْنَ الْمَغْرِبِ وَالْعِشَاءِ وَإِنْ ارْتَحَلَ قَبْلَ أَنْ تَغِيْبَ الشَّمْسَ آخَّرَالْمَغْرِبَحَتَّى يَنْزِلَ لِلْعِشَاءِ ثُمَّ يَجْمَعُ بَيْنَهُمَا. رَوَاهُ أَبُوْ دَاوُدَ وَالتِّرْمِذِيُّ .

1344. (12) [1/424దృఢం]

ము’ఆజ్‌’ బిన్‌ జబల్‌ (ర) కథనం: ప్రవక్త (స) తబూక్‌ యుద్ధంలో సూర్యుడు వాలిన తర్వాత ప్రయాణానికి ముందు ”జుహ్ర్‌, ‘అ’సర్‌లను కలిపి చదివారు. ఇంకా ఒక వేళ సూర్యుడు వాలడానికి ముందు బయలుదేరితే ”జుహ్ర్‌ను ఆలస్యంగా చదివే వారు. మ’గ్రిబ్‌లోనూ ఇలాగే చేసేవారు. మ’గ్రిబ్‌ తరువాత బయలుదేరితే మ’గ్రిబ్‌ ‘ఇషా’లను కలిపి చదివేవారు. ఒకవేళ మ’గ్రిబ్‌కు ముందు బయలు దేరితే మ’గ్రిబ్‌ను ఆలస్యం చేసి ‘ఇషా’ సమయంలో మ’గ్రిబ్‌ ‘ఇషా’లను ఆచరించేవారు. (అబూ దావూద్‌, తిర్మిజి’)

1345 – [ 13 ] ( حسن ) (1/424)

وَعَنْ أَنَسٍ قَالَ: كَانَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم إِذَا سَافَرَ وَأَرَادَ أَنْ يَّتَطَوَّعَ اسْتَقْبَلَ الْقِبْلَةَ بِنَاقَتِهِ فَكَبَّرَ ثُمَّ صَلَّى حَيْثُ وَجَّهَهُ رِكَابُهُ. رَوَاهُ أَبُوْ دَاوُدَ .

1345. (13) [1/424ప్రామాణికం]

అనస్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రయాణంలో, నఫిల్‌ నమా’జు చదివినప్పుడు వాహనాన్ని ఖిబ్లావైపు త్రిప్పి తక్‌బీరె త’హ్రీమ్ పలికేవారు.

ఆ తరువాత వాహనం ఎటువెళ్ళినా తన నమా’జును కొనసాగించే వారు. (అబూ దావూద్‌)

1346 – [ 14 ] ( صحيح ) (1/424)

وَعَنْ جَابِرٍ قَالَ: بَعَثَنِيْ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم فِيْ حَاجَةٍ فَجِئْتُ وَهُوَ يُصَلِّيْ عَلَى رَاحِلَتِهِ نَحْوَ الْمَشْرِقِ وَيَجْعَلُ السُّجُوْدَ أَخْفَضَ مِنَ الرُّكُوْعِ. رَوَاهُ أَبُوْ دَاوُدَ .

1346. (14) [1/424దృఢం]

జాబిర్‌ (ర) కథనం: ప్రవక్త (స) నన్ను ఏదో పని మీద పంపారు. పని పూర్తిచేసుకొని నేను తిరిగి వచ్చి నప్పటికి ప్రవక్త (స) తన వాహనంపై నమా’జు చదువు తున్నారు. వాహనం తూర్పువైపు తిరిగి ఉంది. రుకూ’, సజ్దాలు వంగి సైగచేసేవారు. సజ్దాలో రుకూ’ కంటే కొంత క్రిందకి వంగేవారు. (అబూ దావూ’ద్‌)

—–

اَلْفَصْلُ الثَّالِثُ   మూడవ విభాగం 

1347 – [ 15 ] ( متفق عليه ) (1/425)

عَنِ ابْنِ عُمَرَ قَالَ: صَلَّى رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم بِمِنَى رَكْعَتَيْنِ وَأَبُوْ بَكْرٌ بَعْدَهُ وَعُمَرُ بَعْد أَبِيْ بَكْرٍ وَعُثْمَانُ صَدْرًا مِّنْ خِلَافَتِهِ ثُمَّ إِنَّ عُثْمَانَ صَلَّى بَعْدُ أَرْبَعًا فَكَانَ ابْنُ عُمَرَ إِذَا صَلَّى مَعَ الْإِمَامِ صَلَّى أَرْبَعًا وَإِذَا صَلَّاهَا وَحْدَهُ صَلَّى رَكْعَتَيْنِ.

1347. (15) [1/425ఏకీభవితం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘ఉమర్‌ (ర) కథనం: ప్రవక్త (స) మినాలో 2 రకాతులు ఫ’ర్ద్ చదివారు. తరువాత అబూ బకర్‌ (ర) కూడా 2 రకాతులు ఫ’ర్ద్ చదివారు. ‘ఉమర్‌ కూడా 2 రకా’తులు చదివారు. ‘ఉస్మాన్‌ (ర) కూడా 2 రకా’తులే చదివారు. ఆ తరువాత ‘ఉస్మాన్‌ 4 రకా’తులు చదివారు. ఇబ్నె ‘ఉమర్‌ (ర) ఇమాముతో కలసి చదివితే 4 రకా’తులు చదివేవారు. ఒంటరిగా చదివితే కేవలం 2 రకా’తులే చదివే వారు. [152](బు’ఖారీ, ముస్లిమ్‌)

1348 – [ 16 ] ( متفق عليه ) (1/425)

وَعَنْ عَائِشَةَ قَالَتْ: فُرِضَتِ الصَّلَاةُ رَكْعَتَيْنِ ثُمَّ هَاجَرَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم فَفُرِضَتْ أَرْبَعًا وَتُرِكَتْ صَلَاةُ السَّفَرِ عَلَى الْفَرِيْضَةِ الْأُوْلَى. قَالَ الزُّهْرِيُّ: قُلْتُ لِعُرْوَةَ: مَا بَالَ عَائِشَةَ تُتِمُّ؟ قَالَ: تَأَوَّلَتْ كَمَا تَأَوَّلَ عُثْمَانُ.

1348. (16) [1/425ఏకీభవితం]

‘ఆయి’షహ్‌ (ర) కథనం: ప్రారంభంలో రెండేసి రక’అ తులు విధించబడ్డాయి. ప్రవక్త (స) హిజ్రత్‌ చేసి మదీనహ్ వచ్చిన తర్వాత 4 రకా’తులు విధించ బడ్డాయి. ప్రయాణ నమా’జు రెండు రక’అతులు యథాతథంగా ఉంచడం జరిగింది. ‘జుహ్‌రీ ‘ఉర్‌వ’హ్‌తో, ‘ ‘ఆయి’షహ్‌ (ర) ప్రయాణంలో కూడా నమా’జు పూర్తిగా చదువుతున్నారు ఏంటి సంగతి?’ అని అడిగాడు. దానికి ‘ఉర్‌వ’హ్‌, ‘ ‘ఉస్మాన్‌ ఆధారం పొందినట్లు ‘ఆయి’షహ్‌ కూడా ఆధారం పొందారు,’ అని అన్నాడు. (బు’ఖారీ, ముస్లిమ్‌)

1349 – [ 17 ] ( صحيح ) (1/425)

وَعَنِ ابْنِ عَبَّاسٍ قَالَ: فَرَضَ اللهُ الصَّلَاةَ عَلَى لِسَانِ نَبِيِّكُمْ صَلى الله عليه وسلم فِيْ الْحَضْرِ أَرْبَعًا وَفِيْ السَّفَرِ رَكْعَتَيْنِ وَفِيْ الْخَوْفِ رَكْعَةً. رَوَاهُ مُسْلِمٌ  

1349. (17) [1/425దృఢం]

ఇబ్నె’అబ్బాస్‌ (ర) కథనం: అల్లాహ్‌ ప్రవక్త (స) నోట తన పట్టణంలో 4 రకా’తులు, ప్రయాణంలో 2 రకా’తులు విధించబడ్డాయి. భయాందోళనల్లో సామూ హికంగా ఒక్క రక’అతు మాత్రమే విధించబడింది. [153] (ముస్లిమ్‌)

1350 – [ 18 ] ( ضعيف جدا ) (1/425)

وَعَنِ ابْنِ عَبَّاسٍ وَعَنِ ابْنِ عُمَرَ قَالَا: سَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم صَلَاةَ السَّفَرِ رَكْعَتَيْنِ وَهُمَا تَمَامٌ غَيْرُ قَصْرٍ وَالْوِتْرُ فِيْ السَّفَرِ سُنَّةٌ. رَوَاهُ ابْنُ مَاجَهُ .

1350. (18) [1/425అతి బలహీనం]

ఇబ్నె’ఉమర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రయాణంలో కేవలం 2 రకా’తులు మాత్రమే నిర్ణయించారు. ఈ రెండు రకా’తులు పరిపూర్తమైనవి. అంటే వీటికి 4 రక’అతుల పుణ్యం లభిస్తుంది. ప్రయాణంలో వి’త్ర్‌  సున్నత్‌. సున్నతె ము’అక్కదహ్‌ లేవు. (ఇబ్నె మాజహ్)

1351 – [ 19 ] ( ضعيف ) (1/425)

وَعَنْ مَالِكٍ بَلَغَهُ أَنَّ ابْنَ عَبَّاسٍ كَانَ يَقْصُرُ فِيْ الصَّلَاةِ فِيْ مِثْلِ مَا يَكُوْنُ بَيْنَ مَكَّةَ وَالطَّائِفِ وَفِيْ مِثْلِ مَا يَكُوْنُ بَيْنَ مَكَّةَ وَعَسْفَانَ وَفِيْ مِثْلِ مَا بَيْنَ مَكَّةَ وَجَدَّةَ. قَالَ مَالِكٌ: وَذَلِكَ أَرْبَعَةُ بُرُدٍ. رَوَاهُ فِيْ الْمُوَطَّأ .

1351. (19) [1/425- బలహీనం]

మాలిక్‌ కథనం: ఇబ్నె’అబ్బాస్‌ (ర) మక్కహ్ మరియు ‘తాయి’ఫ్‌ల మధ్య ఉన్నంత దూరం లేదా మక్కహ్ మరియు ‘అస్‌ఫాన్‌ల మధ్య లేదా మక్కహ్ మరియు జిద్దహ్‌ల మధ్య ఉన్నంత దూరం ప్రయాణం చేస్తే ఖ’స్ర్‌ చేసే వారు. ఇవన్నీ 48 మైళ్ళుదూరంలో ఉన్నాయి. [154] (మువ’త్తా మాలిక్‌)

1352 – [ 20 ] ( ضعيف ) (1/426)

وَعَنِ الْبَرَاءِ قَالَ: صَحِبْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم ثَمَانِيَةَ عَشَرَ سَفَرًا فَمَا رَأَيْتُهُ تَرَكَ رَكْعَتَيْنِ إِذَا زَاغَتِ الشَّمْسُ قَبْلَ الظُّهْرِ. رَوَاهُ أَبُوْ دَاوُدَ وَالتِّرْمِذِيُّ وَقَالَ: هَذَا حَدِيْثٌ غَرِيْبٌ

1352. (20) [1/426- బలహీనం]

బరా’ (ర) కథనం: నేను ప్రవక్త (స) వెంట 18 రోజుల వరకు ప్రయాణంలో ఉన్నాను. సూర్యుడు వాలిన తర్వాత ”జుహ్ర్‌కు ముందు 2 రకా’తులు సున్నతులు చదివేవారు. ఏ నాడూ వదలటం చూడ లేదు. (అబూ దావూ’ద్‌, తిర్మిజి’ / ఏకోల్లేఖనం)

1353 – [ 21 ] ( ضعيف ) (1/426)

وَعَنْ نَافِعٍ قَالَ: إِنَّ عَبْدَ اللهِ بْنِ عُمَرَ كَانَ يَرَى ابْنَهُ عُبَيْدَ اللهِ يَتَنَفَّلَ فِيْ السَّفَرِ فَلَا يُنْكِرُ عَلَيْهِ. رَوَاهُ مَالِكٌ .

1353. (21) [1/426బలహీనం]

నాఫె’ (ర) కథనం: ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘ఉమర్‌ (ర) తన కుమారుడు ‘ఉబైదల్లాహ్‌ను ప్రయాణంలో నఫిల్‌ నమా’జు చదువుతుండగా చూచి వారించే వారు కాదు, వ్యతిరేకించే వారు కాదు. [155](మాలిక్‌)  

=====

42 – بَابُ الْجُمُعَةِ

42. జుమఅహ్అధ్యాయం

ప్రతి ముస్లిమ్‌ — యుక్త వయస్కుని, బుద్ధీ జ్ఞానం గలవాడి, స్థానికుడి, ఆరోగ్యవంతుని — పై జుమ’అహ్ నమా’జు ఫ’ర్ద్ గా విధించబడింది. దీన్ని గురించి ఖుర్‌ఆన్‌, ‘హదీసు’ల్లో ఆదేశించడం జరిగింది. ప్రవక్త (స) ప్రవచనాలు: 

1. జుమ’అహ నమా’జు ప్రతి ముస్లిమ్‌పై సామూహికంగా విధించబడింది. అయితే సేవకులపై, స్త్రీలపై, పిల్లలపై, వ్యాధిగ్రస్తులపై మినహాయించ బడింది. (అబూ దావూ’ద్)

2. అల్లాహ్‌ను, తీర్పుదినాన్ని విశ్వసించే వ్యక్తిపై జుము’అహ్ నమా’జు విధించబడింది. అయితే వ్యాధి గ్రస్తులకు, ప్రయాణీకులకు, స్త్రీలకు, పిల్లలకు, సేవకు లకు మినహాయించడం జరిగింది. (దారు ఖుత్నీ)

అకారణంగా జుము’అహ్ నమాజును వదిలే వ్యక్తి మహా నేరస్తుడు. అదేవిధంగా జుము’అహ్ నమా’జు వదిలే వ్యక్తి కపటాచారి. ఫర్ద్ నమా’జులకు వర్తించే షరతులే జుమా’హ్ నమా’జుకు కూడా వర్తిస్తాయి. ఇంకా అదనంగా ఈ నాలుగు షరతులు వర్తిస్తాయి: 1. జుమ’అహ్ రోజు ఉండటం, 2. ”జుహ్ర్‌ సమయం ఉండటం, 3. సామూహికంగా ఆచరించటం,  4. నమా’జుకు ముందు ప్రసంగం చేయటం. ఈ షరతులు ఎక్కడ వర్తించినా అక్కడ జుమ’అహ్ తప్పనిసరి అవుతుంది. పట్టణం అయినా గ్రామం అయినా సరే.

اَلْفَصْلُ الْأَوَّلُ  మొదటి విభాగం 

1354 – [ 1 ] ( متفق عليه ) (1/427)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “نَحْنُ الآخِرُوْنَ السَّابِقُوْنَ يَوْمَ الْقِيَامَةِ بَيْدَ أَنَّهُمْ أُوْتُوا الْكِتَابَ مِنْ قَبْلِنَا وَأَوْتِيْنَاهُ مِنْ بَعْدِهِمْ. ثُمَّ هَذَا يَوْمُهُمْ الَّذِيْ فَرَضَ عَلَيْهِمْ يَعْنِيْ يَوْمُ الْجُمُعَةِ. فَاخْتَلَفُوْا فِيْهِ. فَهَدَانَا اللهُ لَهُ وَالنَّاسُ لَنَا فِيْهِ تَبَعٌ الْيَهُوْدُ غَدًا وَالنَّصَارَى بَعْدَ غَدٍ”.

وَفِيْ رِوَايَةٍ لِمُسْلِمٍ قَالَ: “نَحْنُ الْآخِرُوْنَ الْأَوَّلُوْنَ يَوْمَ الْقِيَامَةِ وَنَحْنُ أَوَّلُ مَنْ يَّدْخُلُ الْجَنَّةَ بَيْدَ أَنَّهُمْ”. وَذَكَرَ نَحْوَهُ إِلَى آخِرِهِ.

1354. (1) [1/427-ఏకీభవితం]

అబూహురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మేము అందరికంటే చివరవచ్చాము. కాని తీర్పు దినంనాడు అందరికంటే ముందు లేపబడతాము. అయితే గ్రంథప్రజలకు మనకంటే ముందు గ్రంథం ఇవ్వబడింది. మనకు వారి తరువాత ఇవ్వబడింది. ఆ తరువాత ఈ శుక్రవారం వారిపై కూడా విధించబడింది. అంటే శుక్రవారం ఆరాధించటం ప్రతి గ్రంథవహుల వారిపై విధించబడింది. వారు అందులో భేదాభిప్రాయాలకు గురయ్యారు. అల్లాహ్‌ మనకు సన్మార్గంపై ఉంచాడు. అందరూ జుము’అహ్ విషయంలో మన అనుచరులు వెనుక ఉన్నారు. యూదులది శనివారం, క్రైస్తవులది ఆదివారం. (బు’ఖారీ, ముస్లిమ్‌)

ముస్లిమ్‌ ఉల్లేఖనంలో ఇలా ఉంది, ”ప్రవక్త (స) ప్రవచనం, ”మనం ప్రపంచంలోకి అందరికంటే వెనుక వచ్చాము. కాని తీర్పుదినం నాడు అందరికంటే ముందు ఉంటాం. అందరికంటే ముందు మనమే స్వర్గంలోకి ప్రవేశిస్తాం. కాని గ్రంథప్రజలకు మనకంటే ముందు గ్రంథం లభించింది.

1355 – [ 2 ] ( صحيح ) (1/427)

وَفِيْ رِوَايَةِ لِمُسْلِمِ عَنْ أَبِيْ هُرَيْرَةَ وَعَنْ حُذَيْفَةَ قَالَا: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم فِيْ آخِرِ الْحَدِيْثِ: “نَحْنُ الآخِرُوْنَ مِنْ أَهْلِ الدُّنْيَا وَالْأَوَّلُوْنَ يَوْمَ الْقِيَامَةِ الْمَقْضِيِّ لَهُمْ قَبْلَ الْخَلَائِقِ”.

1355. (2) [1/427దృఢం]

మరో ఉల్లేఖనంలో అబూ హురైరహ్‌ (ర) మరియు హుజై’ఫహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ప్రాపంచికపరంగా మనం ప్రపంచంలోకి అందరికంటే వెనుక వచ్చాము. కాని తీర్పు దినంనాడు మనం అందరికంటే ముందు ఉంటాం. సృష్టితాలన్నింటి కంటే ముందు మన గురించి తీర్పు ఇవ్వడం జరుగుతుంది.

1356 – [ 3 ] ( صحيح ) (1/427)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “خَيْرُ يَوْمٍ طَلَعَتْ عَلَيْهِ الشَّمْسُ يَوْمُ الْجُمُعَةِ فِيْهِ خُلِقَ آدَمُ وَفِيْهِ أُدْخِلَ الْجَنَّةَ وَفِيْهِ أُخْرِجَ مِنْهَا. وَلَا تَقُوْمُ السَّاعَةُ لَا فِيْ يَوْمِ الْجُمْعَةِ”. رَوَاهُ مُسْلِمٌ .

1356. (3) [1/427దృఢం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”సూర్యుడు ఉదయించే దినాలన్నింటికంటే ఉత్తమ మైనది జుము’అహ్. ఈ రోజే ఆదమ్‌ (అ) సృష్టించ బడ్డారు. ఈ రోజే ఆయన్ను స్వర్గంలో ప్రవేశింప జేయటం జరిగింది. ఈ రోజే స్వర్గం నుండి బహిష్క రించటం జరిగింది. ఈ రోజే పునరుత్థానం సంభవిస్తుంది.” [156] (ముస్లిమ్‌)

1357 – [ 4 ] ( متفق عليه ) (1/427)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِنَّ فِيْ الْجُمُعَةِ لَسَاعَةً لَا يُوَافِقُهَا عَبْدٌ مُّسْلِمٌ يَسْأَلُ اللهَ فِيْهَا خَيْرًا إِلَّا أَعْطَاهُ إِيَّاهُ.

وَزَادَ مُسْلِمٌ: “وَهِيَ سَاعَةٌ خَفِيْفَةٌ”.

 وَفِيْ رِوَايَةٍ لَّهُمَا قَالَ: “إِنَّ فِيْ الْجُمُعَةِ لَسَاعَةً لَا يُوَافِقُهَا مُسْلِمٌ قَائِمٌ يُّصَلِيْ يَسْأَلُ اللهَ خَيْرًا إِلَّا أَعْطَاهُ إِيَّاه”.

1357. (4) [1/427-ఏకీభవితం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”జుము’అహ్ దినంలో ఒక సమయం ఉంది. అందులో ఎవరైనా ముస్లిమ్‌ దు’ఆ చేస్తే, అల్లాహ్‌ అతని దు’ఆను స్వీకరిస్తాడు. కోరినదాన్ని ప్రసాదిస్తాడు. ఆ సమయం చాలా స్వల్పంగా ఉంటుంది.” (బు’ఖారీ, ముస్లిమ్)

మరో ఉల్లేఖనంలోఇలా ఉంది: ”జుము’అహ్ రోజు ఒక శుభఘడియ ఉంది.

ముస్లిముల్లో, ఎవరికైనా నమా’జు స్థితిలో అది లభిస్తే, కోరిన మేలును అల్లాహ్‌ ప్రసాదిస్తాడు.”

1358 – [ 5 ] ( صحيح ) (1/428)

وَعَنْ أَبِيْ بُرْدَةَ بْنِ أَبِيْ مُوْسَى قَالَ: سَمِعْتُ أَبِيْ يَقُوْلُ: سَمِعْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ فِيْ شَأْنِ سَاعَةِ الْجُمُعَةِ: “هِيَ مَا بَيْنَ أَنْ يَّجْلِسَ الْإِمَامُ إِلَى أَنْ تُقْضَى الصَّلَاةُ”. رَوَاهُ مُسْلِمٌ .

1358. (5) [1/428దృఢం]

అబూ బుర్‌దహ్‌ (ర) కథనం: మా తండ్రి అబూ మూసా (ర) ఇలా అంటూ ఉండగా నేను విన్నాను: ప్రవక్త (స) జుము’అహ్ గురించి ఇలా ప్రవచిస్తూ ఉండగా విన్నాను. ”దు’ఆ స్వీకరించబడే ఆ శుభ ఘడియ ఇమాము ఖుత్బా ఇవ్వడానికి మెంబరుపై ఎక్కినప్పటి నుండి నమాజు పూర్తయ్యే వరకు ఉంటుంది.” [157] (ముస్లిమ్‌)

اَلْفَصْلُ الثَّانِيْ   రెండవ విభాగం

1359 – [ 6 ] ( صحيح ) (1/428)

عَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: خَرَجْتُ إِلَى الطُّوْرِ فَلَقِيْتُ كَعْبَ الْأَحْبَارِ فَجَلَسْتُ مَعَهُ فَحَدَّثَنِيْ عَنِ التَّوْرَاةِ. وَحَدَّثْتُهُ عَنِ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم. فَكَانَ فِيْمَا حَدَّثْتُهُ أَنْ قُلْتُ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “خَيْرُ يَوْمٍ طَلَعَتْ عَلَيْهِ الشَّمْسُ يَوْمُ الْجُمُعَةِ. فِيْهِ خُلِقَ آدَمُ وَفِيْهِ أُهْبِطَ وَفِيْهِ تِيْبَ عَلَيْهِ وَفِيْهِ مَاتَ وَفِيْهِ تَقُوْمُ السَّاعَةُ. وَمَا مِّنْ دَابَّةٍ إِلَّاوَ هِيَ مُسِيْخَةٌ يَّوْمَ الْجُمُعَةِ. مِنْ حِيْنَ تُصْبِحُ حَتَّى تَطْلُعَ الشَّمْسُ شَفَقًا مِّنَ  السَّاعَةِ إِلَّا الْجِنُّ وَالْإِنْسُ وَفِيْهَا سَاعَةٌ لَا يُصَادِفُهَا عَبْدٌ مُّسْلِمٌ وَهُوَ يُصَلِّيْ يَسْأَلُ اللهَ شَيْئًا إِلَّا أَعْطَاهُ إِيَّاهَا. قَالَ كَعْبٌ: ذَلِكَ فِيْ كُلِّ سَنَةٍ يَّوْمٌ. فَقُلْتُ: بَلْ فِيْ كُلِّ جُمُعَةٍ. قَالَ فَقَرَأَ كَعْبٌ التَّوْرَاةَ. فَقَالَ: صَدَقَ رَسُوْلُ الله صلى الله عليه وسلم. قَالَ أَبُوْ هُرَيْرَةَ: لَقِيْتُ عَبْدَاللهِ بْنِ سَلَامٍ فَحَدَّثْتُهُ بِمَجْلِسِيْ مَعَ كَعْبِ وَمَا حَدَّثْتُهُ فِيْ يَوْمِ الْجُمُعَةِ. فَقُلْتُ لَهُ: قَالَ كَعْبٌ: ذَلِكَ كُلِّ سَنَةٍ يَوْمٌ؟ قَالَ عَبْدُ اللهِ بْنِ سَلَامٍ:كَذَبَ كَعْبٌ. فَقُلْتُ لَهُ: ثُمَّ قَرَأَ كَعْبٌ التَّوْرَاةَ. فَقَالَ: بَلْ هِيَ فِيْ كُلِّ جُمُعَةٍ. فَقَالَ عَبْدُ  اللهِ بْنُ سَلَامٍ: صَدَقَ كَعْبٌ. ثُمَّ قَالَ عَبْدُاللهِ بْنِ سَلَامٍ: قَدْ عَلِمْتُ أيَة سَاعَةٍ هِيَ. قَالَ أَبُوْ هُرَيْرَةَ فَقُلْتُ لَهُ: فَأَخْبَرَنِيْ بِهَا. فَقَالَ عَبْدُاللهِ بْنُ سَلَامٍ: هِيَ آخِرُ سَاعَةٍ فِيْ يَوْمِ الْجُمُعَةِ. قَالَ أبُوْ هُرَيْرَةَ: فَقُلْتُ: وَكَيْفَ تَكُوْنُ آخِرُ سَاعَةٍ فِيْ يَوْمِ الْجُمُعَةِ وَقَدْ قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَا يُصَادِفُهَا عَبْدٌ مُّسْلِمٌ وَهُوَ يُصَلِّيْ وَتِلْكَ السّاعة لَا يُصَلِّىْ فِيْهَا؟ “فَقَالَ عَبْدُاللهِ بْنِ سَلَامٍ: أَلَمْ يَقُلْ رَّسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَنْ جَلَسَ مَجْلِسًا يَّنْتَظِرُ الصَّلَاةَ فَهُوَ فِيْ صَلَاةٍ حَتَّى يُصَلِّيَ؟” قَالَ أَبُوْ هُرَيْرَةَ: فَقُلْتُ: بَلَى. قَالَ: فَهُوَ ذَالِكَ. رَوَاهُ مَالِكٌ وَأَبُوْ دَاوُدَ وَالتِّرْمِذِيُّ وَالنَّسَائِيُّ وَرَوَى أَحْمَدُ إِلَى قَوْلِهِ: صَدَقَ كَعْبٌ .

1359. (6) [1/428దృఢం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: నేను ‘తూర్‌ కొండపైకి వెళ్ళినపుడు క’అబ్‌ అ’హ్‌బార్‌ను కలిశాను. నేను అతని వద్ద కూర్చున్నాను. అతను నాకు తౌరాతు విషయాలను వినిపించసాగారు, నేనతనికి ప్రవక్త (స) యొక్క ‘హదీసు’లను వినిపించసాగాను. వాటిలో ఒక ‘హదీసు’ ఇలా ఉంది, ప్రవక్త (స) ప్రవచనం, ”సూర్యుడు ఉదయించే దినాలలో అన్నిటి కంటే ఉత్తమమైనది జుమ’అహ్ రోజు. ఈ రోజే ఆదమ్‌ (అ) సృష్టించబడ్డారు. ఈ నాడే అతన్ని స్వర్గంనుండి భూమిపైకి దించటం జరిగింది, ఈ నాడే అతని పశ్చాత్తాపం అంగీకరించబడింది. ఈనాడే అతను మర ణించారు. ఈరోజే పునరుత్థానం సంభవిస్తుంది. ప్రతిప్రాణి జుమ’అహ్ రోజు సూర్యోదయం అయ్యేవరకు చెవియొగ్గి ఎక్కడ పునరుత్థానం సంభవిస్తుందో అని భయంతో వేచి ఉంటారు. అయితే జిన్నులు మరియు మానవులు తప్ప. ఇంకా ఈ జుమ’అహ్ దినంలో ఒక శుభఘడియ ఉంది. ఏ ముస్లిమ్‌కైనా నమా’జు స్థితిలో లభించి, అల్లాహ్‌ను ప్రార్థిస్తే, అల్లాహ్‌ తప్పకుండా అతని కోరికను స్వీకరించి కోరింది ప్రసాదిస్తాడు,’ అని అన్నాను. అదివిని క’అబ్‌ ‘అ’హ్‌బార్‌ శుభఘడియ ప్రతిశుక్రవారం వస్తుందా?’ అని అన్నాడు. అప్పుడు క’అబ్‌ అ’హ్‌బార్‌ తౌరాతు చదివి ప్రవక్త (స) సత్యం పలికారు, అంటే ప్రతి వారం జుమ’అహ్ రోజు వస్తుందని’ అన్నారు.

ఆ తరువాత నేను ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ సలామ్‌ను కలిశాను. జుమ’అహ్ లోని శుభఘడియ గురించి నాకూ క’అబ్‌ అ’హ్‌బార్‌కూ మధ్య జరిగిన చర్చను గురించి ప్రస్తావించాను. ఇంకా, ‘ఇది సంవత్సరంలో ఒకసారి ఉంటుందని క’అబ్‌ అ’హ్‌బార్‌ అన్నారు’ అని అన్నాను. అది విని అబ్దుల్లాహ్‌ బిన్‌ సలామ్‌ కఅబ్‌ అ’హ్‌బార్‌ తప్పు పలికారు,’ అని అన్నారు.

ఆ తరువాత నేను ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ సలామ్‌తో క’అబ్, తౌరాతు చదివి ఆ శుభఘడియ ప్రతివారం జుమ’అహ్ రోజు వస్తుందని తెలిపారు’ అని చెప్పాను. అది విని ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ సలామ్‌, క’అబ్‌ సత్యం పలికాడు’ అని అన్నారు. ఆ తరువాత ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ సలామ్‌, ‘ఈ శుభఘడియ ఎప్పుడు వస్తుందో నాకు తెలుసు’ అని అన్నారు. అప్పుడు నేను ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ సలామ్‌తో, ‘ఆ శుభ ఘడియను గురించి నాకు తెలియజెయ్యండి, పిసినారితనం చూపకండి’ అని అన్నాను. అప్పుడు ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ సలామ్‌, ‘ఆ శుభ ఘడియ జుమ’అహ్ రోజు చివరి భాగంలో ఉంది,’ అని అన్నారు. దానికి నేను అతనితో ఈ శుభఘడియ జుము’అహ్ రోజు చివరి భాగంలో ఎలా ఉంటుంది. ప్రవక్త (స) ఒక ముస్లిమ్‌ నమా’జు స్థితిలో ఉండాలి’ అని అన్నారు. ఈ చివరి భాగంలో నమా’జు చదవడం నిషిద్ధం’ అని అన్నాను. దానికి ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ సలామ్‌, ‘ప్రవక్త (స) నమా’జుకు వేచి ఉన్నవ్యక్తి నమా’జులో ఉన్నట్టు అని అనలేదా? అంటే నమా’జు గురించి ఎదురు చూడటం నమా’జులో ఉన్నట్టే కదా?’ అని అన్నారు. దానికి నేను ‘అవును ప్రవక్త(స) ఇలా ప్రవచించారు’ అని అన్నాను. దానికి ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ సలామ్‌ నమా’జులో ఉండటం అంటే నమా’జుకు వేచి ఉండటం అని అర్థం’ అని అన్నారు. (మాలిక్, అబూ దావూ’ద్‌, తిర్మిజి’, నసాయి’, అ’హ్మద్‌)

1360 – [ 7 ] ( صحيح ) (1/429)

وَعَنْ أَنَسٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “اِلْتَمِسُوْا السَّاعَةَ  الَّتِيْ تُرْجَى فِيْ وَيَوْمِ الْجُمُعَةِ بَعْدَ الْعَصْرِإِلَى غَيُبْوبَةِ الشَّمْسِ”. رَوَاهُ التِّرْمِذِيُّ .

1360. (7)  [1/429దృఢం]

అనస్‌(ర) కథనం: ప్రవక్త(స) ప్రవచనం,”దు’ఆస్వీకార యోగ్యం పొందే శుభ ఘడియను అన్వేషించండి. ఆ శుభఘడియ జుము’అహ్రోజు ‘అ’స్ర్‌ తరువాత నుండి సూర్యాస్తమయం వరకు ఉంటుంది.” (తిర్మిజి’)

1361 – [ 8 ] ( صحيح ) (1/429)

وَعَنْ أَوْسِ بْنِ أَوْسٍ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِنَّ مِنْ أَفْضَلِ أَيَّامِكُمْ يَوْمَ الْجُمُعَةِ فِيْهِ خُلِقَ آدَمُ وَفِيْهِ قُبِضَ وَفِيْهِ النَّفْخَةُ فَأَكْثِرُوْا عَلَيَّ مِنَ الصَّلَاةِ فِيْهِ فَإِنَّ صَلَاتِكُمْ مَعْرُوْضَةٌ عَلَيَّ”. فَقَالُوْا: يَا رَسُوْلَ اللهِ وَكَيْفَ تُعْرَضْ صَلَاتُنَا عَلَيْكَ وَقَدْ أَرِمْتَ؟ قَالَ: يَقُوْلُوْنَ: بَلِيْتَ قَالَ: “إِنَّ اللهَ حَرَّمَ عَلَى الْأَرْضِ أَجْسَادَ الْأَنْبِيَاءِ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ وَالنَّسَائِيُّ وَابْنُ مَاجَهُ وَالدَّارَمِيُّ وَالْبَيْهَقِيُّ فِيْ الدَّعْوَاتِ الْكَبِيْرِ.

1361. (8) [1/429దృఢం]

ఔస్‌ బిన్‌ ఔస్‌ (ర) కథనం: ప్రవక్త (స), ”మీ దినాల్లో అన్నిటి కంటే ఉత్తమమైనది జుమ’అహ్ దినం. జుమ’అహ్ రోజే ఆదమ్‌ (అ) జన్మించారు. ఈ దినం నాడే, ఆదమ్ (అ) మరణించారు, ఈ దినం నాడే, పునరుత్థానం సంభవిస్తుంది. అందువల్ల ఈ దినం నాడు మీరు నాపై అత్యధికంగా దరూద్‌ పంపండి. మీ దరూద్‌ నాకు అందజేయబడుతుంది’ అని అన్నారు. దానికి ప్రజలు మేము పంపిన దరూద్‌ తమకు ఎలా అందుతాయి, అప్పటికి తమరు మరణించి ఉంటారు కదా, తమరి శరీరం క్రుళ్ళి క్రుశించి ఉంటుంది కదా?’ అని విన్నవించుకున్నారు. దానికి ప్రవక్త (స), ‘అల్లాహ్‌ ప్రవక్తల శరీరాలను భూమిపై నిషేధించాడు,’ అని సమాధానం ఇచ్చారు.[158] (అబూ దావూ’ద్‌, నసాయి’, ఇబ్నె మాజహ్, దార్మి,  బైహఖీ-ద’అవాతిల్ కబీర్)

1362 – [ 9 ] ( لم تتم دراسته ) (1/430)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “اَلْيَوْمُ الْمَوْعُوْدُ يَوْمُ الْقِيَامَةِ. وَالْيَوْمُ الْمَشْهُوْدُ يَوْمُ عَرَفَةَ .وَالشَّاهِدُ يَوْمُ الْجُمُعَةِ. وَمَا طَلَعَتِ الشَّمْسُ وَلَا غَرَبَتْ عَلَى يَوْمٍ أَفْضَلَ مِنْهُ فِيْهِ سَاعَةٌ لَا يُوَافِقُهَا عَبْدٌ مُّؤْمِنٌ يَدْعُوْ اللهُ بِخَيْرٍ إِلَّا اسْتَجَابَ اللهُ لَهُ. وَلَا يَسْتَعِيْذُ مِنْ شَيْءٍ إِلَّا أَعَاذَهُ مِنْهُ”. رَوَاهُ أَحْمَدُ وَالتِّرْمِذِيُّ وَقَالَ: هَذَا حَدِيْثٌ غَرِيْبٌ لَا يُعْرَفُ إِلَّا مِنْ حَدِيْثِ مُوْسَى بْنِ عُبَيْدَةَ وَهُوَ يُضَعَّفُ.

1362. (9) [1/430అపరిశోధితం]

అబూహురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మౌ’ఊద్‌ దినం అంటే తీర్పుదినం అని అర్థం. మష్‌’హూద్‌ దినం అంటే ‘అరఫహ్’ రోజు అంటే ‘జుల్‌’హిజ్జ’హ్‌ 9వ తేదీ. షాహిద్‌ అంటే జుమ’అహ్ రోజు. జుమ’అహ్ కన్నా ఉత్తమమైన దినం లేదు. ఈ జుమ’అహ్ రోజు ఒక శుభ ఘడియ ఉంది. ఇది లభించిన ముస్లిమ్‌ అల్లాహ్‌ను ఉత్తమ వస్తువు అర్థిస్తే, అల్లాహ్‌ తప్పకుండా ప్రసాదిస్తాడు. దేన్నుండైనా శరణు కోరితే దాన్నుండి శరణు ప్రసాదిస్తాడు.” [159] (అ’హ్మద్‌, తిర్మిజి’)

అయితే ఇది మాకు కేవలం మూసా బిన్‌ ‘ఉబైదీ ద్వారా లభించింది. అతడు బలహీనమైన ఉల్లేఖన కర్త. (‘దయీఫ్‌)

—–

اَلْفَصْلُ الثَّالِثُ   మూడవ విభాగం 

1363 – [ 10 ] ( حسن ) (1/430)

عَنْ أَبِيْ لُبَابَةَ بْنِ عَبْدِ الْمُنْذِرِ قَالَ: قَالَ النَّبِيُّ صلى الله عليه وسلم: “إِنَّ يَوْمَ الْجُمُعَةِ سَيِّدُ الْأَيَّامِ وَأَعْظَمُهَا عِنْدَ اللهِ وَهُوَ أَعْظَمُ عِنْدَ اللهِ مِنْ يَّوْمِ الْأَضْحَى وَيَوْمِ الْفِطْرِ فِيْهِ خَمْسُ خَلَالٍ: خَلَقَ اللهُ فِيْهِ آدَمَ وَأَهْبَطَ اللهُ فِيْهِ آدَمَ إِلَى الْأَرْضِ وَفِيْهِ تَوَفَّي اللهُ آدَمَ وَفِيْهِ سَاعَةٌ لَا يَسْاَلُ الْعَبْدُ فِيْهَا شَيْئًا إِلَّا أَعْطَاهُ مَا لَمْ يَسْاَلْ حَرَامًا وَفِيْهِ تَقُوْمُ السَّاعَةُ مَا مَنْ مَّلَكٍ مُّقَرَّبٍ وَّلَا سَمَاءٍ وَّلَا أَرْضٍ وَّلَا رِيَاحٍ وَّلَا جِبَالٍ وَّلَا بَحْرٍ إِلَّا هُوَ مُشْفِقٌ مِّنْ يَوْمٍ الْجُمُعَةِ” . رَوَاهُ ابْنُ مَاجَهُ .

1363. (10) [1/430ప్రామాణికం]

అబూ లుబాబహ్ బిన్‌ ‘అబ్దుల్‌ మున్‌జి’ర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”దినాలన్నింటికీ జుమ’అహ్ రోజు నాయకుని వంటిది. ఇంకా అల్లాహ్‌(త) వద్ద దినాలన్నిటి కంటే పెద్దది. ఇంకా ‘ఈదుల్‌ ఫి’త్ర్‌ మరియు ‘ఈదుల్‌ అ’ద్హాహ్ కంటే పెద్ద దినం. ఈ రోజే 5 సంఘటనలు జరిగాయి: 1. ఈ రోజే అల్లాహ్‌(త) ఆదమ్‌ (అ)ను సృష్టించాడు, 2. ఈ రోజే భూమిపై దించాడు, 3. ఈ రోజే ఆదమ్‌ (అ) మరణించారు, 4. ఈ రోజులో ఒక శుభఘడియ ఉంది. దాసుడు అందులో ధర్మసమ్మతమైన విషయం అర్థిస్తే, అల్లాహ్‌ తప్పకుండా ప్రసాదిస్తాడు. 5. ఈ రోజే పునరు త్థానం సంభవిస్తుంది. జుమ’అహ్ రోజు, అల్లాహ్ (త) కు సన్నిహితులైన దైవదూతలు, భూమ్యా కాశాలు, గాలి, పర్వతాలు, సముద్రాలు, అన్నీ భయంతో వణుకుతూ ఉంటాయి, ఎక్కడ పునరుత్థానం సంభవిస్తుందోనని. (ఇబ్నె మాజహ్)

1364 – [ 11 ] ( حسن ) (1/431)

وَرَوَى أَحْمَدُ عَنْ سَعْدِ بْنِ عُبَادَةَ: أَنَّ رَجُلًا مِّنَ الْأَنْصَارِ أَتَى النَّبِيَّ صلى الله عليه وسلم فَقَالَ: أَخْبِرْنَا عَنْ يَّوْمِ الْجُمُعَةٍ مَاذَا فِيْهِ مِنَ الْخَيْرِ؟ قَالَ: ” فِيْهِ خَمْسُ خِلَالٍ”. وَسَاقَ الْحَدِيْثِ.

1364. (11) [1/431ప్రామాణికం]

అ’హ్‌మద్‌ కూడా స’అద్‌ బిన్ ఉబాదహ్ ద్వారా ఈ విధంగా ఉల్లేఖించారు. అందులో ఇలా ఉంది, ”ఒక అన్సారీ ప్రవక్త (స) వద్దకు వచ్చి, ఓ ప్రవక్తా! జుమ’అహ్ ప్రత్యేకతలను వివరించండి’ అని విన్నవించుకున్నాడు. దానికి ప్రవక్త (స) ఇతర దినాల్లో జరగని ఐదు విషయాలు జుమ ‘అహ్ రోజు జరిగాయి, అని అన్నారు.

1365 – [ 12 ] ( ضعيف ) (1/431)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: قِيْلَ لِلنَّبِيِّ صلى الله عليه وسلم: لِأَيِّ شَيْءٍ سُمِّيَ يَوْمُ الْجُمُعَةِ؟ قَالَ: “لِأَنَّ فِيْهَا طُبِعَتْ طِيْنَةُ أَبِيْكَ آدَمَ. وَفِيْهَا الصَّعْقَةُ وَالْبَعْثَةُ. وَفِيْهَا الْبَطْشَةُ. وَفِيْ آخِرِ ثَلَاثِ سَاعَاتٍ مِّنْهَا سَاعَةٌ مَّنْ دَعَا اللهُ فِيْهَا اسْتُجِيْبَ لَهُ”. رَوَاهُ أَحْمَدُ.

1365. (12) [1/431బలహీనం]

అబూహురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స)ను జుమ’అహ్ రోజుకు జుమ’అహ్ అని ఎందుకు పేరు పెట్టబడిందని ప్రశ్నించడం జరిగింది. దానికి, ‘జుమ’అహ్ రోజే మట్టి కలపడం జరిగింది. ఈ రోజే బాకా ఊదడం జరుగుతుంది. దానివల్ల సృష్టితాలన్నీ మరణిస్తాయి. ఈ రోజే అందరినీ సజీవపరచటం జరుగుతుంది. ఈ రోజే పునరుత్థానం సంభవిస్తుంది. ఇంకా ఈ రోజు చివరి మూడు ఘడియల్లోని ఒక ఘడియలో అల్లాహ్‌ను ఏది కోరినా తప్పకుండా ఇవ్వటం జరుగుతుంది. (అ’హ్మద్‌)

1366 – [ 13 ] ( صحيح ) (1/431)

وَعَنْ أَبِيْ الدَّرْدَاءِ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “أَكْثِرُوْا الصَّلَاةَ عَلَيَّ يَوْمَ الْجُمُعَةِ. فَإِنَّهُ مَشْهُوْدٌ تَشْهَدُهُ الْمَلَائِكَةُ وَإِنَّ اَحَدًا لَنْ يُّصَلِّيْ عَلَيَّ إِلَّا عُرِضَتْ عَلَيَّ صَلَاتُهُ حَتَّى يَفْرُغَ مِنْهَا”. قَالَ: قُلْتُ: وَبَعْدَ الْمَوْتِ؟ قَالَ: “إِنَّ اللهَ حَرُمَ عَلَى الْأَرْضِ أَنْ تَأْكُلَ أَجْسَادَ الْأَنْبِيَاءِ فَنَبِيُّ اللهِ حَيٌّ يُرْزُِقُ”. رَوَاهُ ابْنُ مَاجَهُ .

1366. (13) [1/431దృఢం]

అబూ దర్‌దా’ (ర) కథనం: ప్రవక్త (స), ”మీరు జుమ’అహ్ రోజు నాపై అత్యధికంగా దరూద్‌ పంపుతూ ఉండండి. ఎందుకంటే ఇది హాజరయ్యేదినం, దైవ దూతలు ఇందులో హాజరౌతారు. మీలో ఎవరు జుమ’అహ్ రోజు నాపై దరూద్‌ పంపినా నాకు అంద జేయడం జరుగుతుంది’ అని అన్నారు. దానికి నేను తమరు మరణించిన తరువాత కూడా దరూద్‌ అంద జేయడం జరుగుతుందా’ అని విన్నవించుకున్నాను. దానికి ప్రవక్త (స), ”అవును, అల్లాహ్() భూమిని  ప్రవక్తల శరీరాలను తినటం నుండి నిషేధించాడు. కావున ప్రవక్తలు () సజీవంగా ఉంటారు. వారికి ఆహారం లభిస్తుంటుంది.” (ఇబ్నె మాజహ్)

1367 – [ 14 ] ( حسن ) (1/431)

وَعَنْ عَبْدِ اللهِ بْنِ عَمْرٍوقَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَا مِنْ مُّسْلِمٍ يَّمُوْتُ يَوْمَ الْجُمُعَةِ أَوْ لَيْلَةَ الْجُمُعَةِ إِلَّا وَقَاهُ اللهُ فِتْنَةَ الْقَبْر”. رَوَاهُ أَحْمَدُ وَالتِّرْمِذِيُّ. وَقَالَ: هَذَا حَدِيْثٌ غَرِيْبٌ وَلَيْسَ إِسْنَادُهُ بِمُتَّصِلٍ .

1367. (14) [1/431ప్రామాణికం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘ఉమర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”జుమ’అహ్ మరియు గురువారం (జుమేరాత్‌) రోజు చనిపోయిన వారిని అల్లాహ్‌ సమాధి పరీక్షల నుండి, శిక్షల నుండి రక్షిస్తాడు.” (అ’హ్మద్‌, తిర్మిజి’ / ఏకోల్లేఖనం దీని ఆధారాలు సరిగ్గా లేవు).

1368 – [ 15 ] ( صحيح ) (1/432)

وَعَنِ ابْنِ عَبَّاسٍ أَنَّهُ قَرَأَ: (اَلْيَوْمَ أَكْمَلْتُ لَكُمْ دِيْنَكُمْ-5: 3) الآية  وَعِنْدَهُ  يَهُوْدِيٌّ. فَقَالَ: لَوْ نَزَلَتْ هَذِهِ الْآيَةُ عَلَيْنَا لَاتَّخَذْنَاهَا عِيْدًا. فَقَالَ ابْنُ عَبَّاسٍ: فَإِنَّهَا نَزَلَتْ فِيْ يَوْمِ عِيْدَيْنِ فِيْ وَيَوْمِ جُمُعَةٍ وَيَوْمِ عَرَفَةَ. رَوَاهُ التِّرْمِذِيُّ. وَقَالَ هَذَا حَدِيْثٌ حَسَنٌ غَرِيْبٌ .

1368. (15) [1/432దృఢం]

ఇబ్నె’అబ్బాస్‌ (ర) ”…అల్‌ యౌమ అక్‌మల్‌తు లకుమ్‌ దీనకుమ్‌…” (సూ. అల్‌ మాయిదహ్‌, 5:3) చివరి వరకు పఠించారు. అప్పుడు అతని వద్ద ఒక యూదుడు కూర్చొని ఉన్నాడు. అది విని, అతడు ఈ ఆయతు ఒకవేళ మా యూదులపై అవతరించ బడితే, అది అవతరించిన దినాన్ని పండుగ చేసుకుంటాం’ అని అన్నాడు. దానికి ఇబ్నె’అబ్బాస్‌ (ర) ఈ ఆయతు రెండు పండుగల నాడు అవతరించ బడింది. అంటే జుమ’అహ్‌ మరియు జు’ల్‌’హిజ్జహ్‌ 9వ తేదీనాడు అని అన్నారు. [160] (తిర్మిజి’ / ప్రామాణికం, ఏకోల్లేఖనం)

1369 – [ 16 ] ( ضعيف ) (1/432)

وَعَنْ أَنَسٍ قَالَ: كَانَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم إِذَا دَخَلَ رَجَبُ قَالَ: “اَللَّهُمَّ بَارِكْ لَنَا فِيْ رَجَبَ وَشَعْبَانَ وَبَلِّغْنَا رَمَضَانَ” .قَالَ: وَكَانَ يَقُوْلُ: “لَيْلَةٌ الْجُمُعَةِ لَيْلَةٌ أَغَرُّوَيَوْمُ الْجُمُعَةِ يَوْمٌ أَزْهَرُ”. رَوَاهُ الْبَيْهَقَيُّ فِيْ الدَّعْوَاتِ الْكَبِيْرِ .

1369. (16) [1/432బలహీనం]

అనస్‌ (ర) కథనం: రజబ్‌ నెల ప్రారంభం అయితే ప్రవక్త (స) ఈ దు’ఆ చదివేవారు. ”అల్లాహుమ్మ బారిక్‌ లనా ఫీ రజబిన్‌ వ ష’అబాన్‌, వ బల్లి’గ్‌ లనా రమ’దాన్‌.” — ‘ఓ అల్లాహ్! రజబ్‌ మరియు ష’అబాన్‌లలో మాకు శుభం ప్రసాదించు మరియు మమ్మల్ని రమ’దాన్‌లోకి చేర్చు.’ ఇంకా, ‘జుమ’అహ్ రాత్రి వెలుగు రాత్రి, జుమ’అహ్ దినం మెరిసే దినం’ అని అనేవారు. (బైహఖీ -ద’అవాతుల్ కబీర్)

=====

43 – بَابُ وُجُوْبِهَا

43. జుముఅహ్ విధింపు

జుము’అహ్ నమా’జు తప్పనిసరి విధి. దీన్ని విధించబడటం గురించి ఖుర్‌ఆన్‌, ‘హదీసు’ల్లో ఆధారాలు ఉన్నాయి. జుమ ‘అహ్ ను తిరస్కరించిన వారు అవిశ్వాసానికి గురవుతారు. అల్లాహ్‌ ఆదేశం: ”ఓ విశ్వాసులారా! శుక్రవారం (జుము’అహ్) రోజు నమా’జ్‌ కొరకు పిలుపు ఇవ్వబడినప్పుడు, మీరు మీ వ్యాపారాలను విడిచి అల్లాహ్‌ స్మరణ వైపునకు పరు గెత్తండి. మీరు తెలుసుకోగలిగితే, ఇది మీకు ఎంతో ఉత్తమమైనది!” (సూ. అల్‌ జుము’అహ్‌, 62:9)

اَلْفَصْلُ الْأَوَّلُ  మొదటి విభాగం   

1370 – [ 1 ] ( صحيح ) (1/433)

عَنِ ابْنِ عُمَرَ وَأَبِيْ هُرَيْرَةَ أَنَّهُمَا قَالَا: سَمِعْنَا رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ عَلَى أَعْوَادِ مِنْبَرِهِ: “لَيَنْتَهِيَنَّ أَقْوَامٌ عَنْ وَّدْعِهِمُ الْجُمُعَاتِ أَوْ لَيَخْتِمَنَّ اللهُ عَلَى قُلُوْبِهِمْ ثُمَّ لَيَكُوْنَنَّ مِنَ الْغَافِلَيْنَ”. رَوَاهُ مُسْلِمٌ.

1370. (1) [1/433దృఢం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘ఉమర్‌ మరియు అబూ హురైరహ్‌ (ర)ల కథనం: ప్రవక్త (స) కట్టె మెంబరుపై ఇలా ప్రవచిస్తూ ఉండగా నేను విన్నాను, ”ప్రజలు జుమ ‘అహ్ చదవకుండా ఉండరాదు. లేకపోతే అల్లాహ్‌ వారి హృదయాలపై సీలువేస్తాడు. మరియు వారు ఏమరు పాటుకు గురైన వారిలో చేరిపోతారు.” [161] (ముస్లిమ్‌)

—–

اَلْفَصْلُ الثَّانِيْ   రెండవ విభాగం  

1371 – [ 2 ] ( صحيح ) (1/433)

عَنْ أَبِيْ الْجَعْدِ الضُّمَرِيِّ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَنْ تَرَكَ ثَلَاثَ جُمَعٍ تَهَاوُنَا بِهَا طَبَعَ اللهُ عَلَى قَلْبِهِ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ وَالتِّرْمِذِيُّ وَالنَّسَائِيُّ وَابْنُ مَاجَهُ وَالدَّارَمِيُّ.  

1371. (2) [1/433దృఢం]

అబీ జ’అద్‌ ‘దమరీ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం: ”సోమరితనం వల్ల వరుసగా మూడు జుమ’అలు వదలి వేసిన వాడి హృదయంపై అల్లాహ్‌ సీలువేస్తాడు.” (అబూ దావూద్‌, తిర్మిజి’, నసాయి’, ఇబ్నె మాజహ్, దార్మీ)

1372 – [ 3 ] ( صحيح ) (1/433)

وَروَاهُ مَالِكٌ عَنْ صَفْوَانَ بْنِ سُلَيْمٍ .

 1372. (3) [1/433దృఢం]

సఫ్వాన్‌ బిన్‌ సులైమ్‌ (ర) కథనం (మాలిక్‌)

1373 – [ 4 ] ( صحيح ) (1/434)

وَرَوَاهُ أَحْمَدُ عَنْ أَبِيْ قَتَادَةَ .

 1373. (4) [1/434దృఢం]

అబూ ఖతాదహ్‌ (ర) కథనం. (అ’హ్మద్‌)

1374 – [ 5 ] ( ضعيف ) (1/434)

وَعَنْ سَمُرَةَ بْنِ جُنْدُبٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَنْ تَرَكَ الْجُمُعَةِ مِنْ غَيْرِ عُذْرٍ فَلْيَتَصَدَّقْ بِدِيْنَارٍ. فَإِنْ لَّمْ يَجِدْ فَبِنِصْفِ دِيْنَارٍ”. رَوَاهُ أَحْمَدُ وَأَبُوْ دَاوُدَ وَابْنُ مَاجَهُ .

1374. (5) [1/434బలహీనం]

సమురహ్‌ బిన్‌ జున్‌దుబ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం: ”అకారణంగా జుమ’అహ్ వదలిన వ్యక్తి పరి హారంగా ఒక దీనార్‌ దానం చేయాలి. ఒకవేళ ఒక దీనార్‌ లేకపోతే సగం దీనార్‌ దానం చేయాలి.” (అ’హ్మద్‌, అబూ దావూద్‌, ఇబ్నె మాజహ్)

1375 – [ 6 ] ( ضعيف ) (1/434)

وَعَنْ عَبْدِ اللهِ بْنِ عَمْرٍو عَنْ النَّبِيِّ صلى الله عليه وسلم: “اَلْجُمُعَةُ عَلَى مَنْ سَمِعَ النِّدَاءَ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ.

1375. (6) [1/434బలహీనం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘ఉమర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”జుమ’అహ్ అజా’న్‌ విన్న ప్రతి వ్యక్తిపై జుమ’అహ్ నమా’జ్‌ తప్పనిసరివిధి.” (అబూ దావూ’ద్‌)

1376 – [ 7 ] ( ضعيف جدا ) (1/434)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ: “اَلْجُمُعَةُ عَلَى مَنْ آوَاهُ اللَّيْلُ إِلَى أَهْلِهِ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَقَالَ: هَذَا حَدِيْثٌ إِسْنَادُهُ ضَعِيْفٌ.

1376. (7) [1/434-అతి బలహీనం]

అబూహురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”రాత్రి వరకు తన ఇంటికి రాగలిగే వ్యక్తిపై జుమ’అహ్ తప్పనిసరి విధి.” [162] (తిర్మిజి’ – ఆధారాలు బలహీనం)

1377 – [ 8 ] ( ضعيف ) (1/434)

وَعَنْ طَارِقِ بْنِ شِهَابٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “اَلْجُمُعَةُ حَقٌّ وَاجِبٌ عَلَى كُلِّ مُسْلِمٍ فِيْ جَمَاعَةٍ إِلَّا عَلَى أَرْبَعَةٍ: عَبْدٍ مَّمْلُوْكٍ أَوْ امْرَأَةٍ أَوْ صَبِيٍّ أَوْ مَرِيْضٍ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ وَفِيْ شَرْحِ السُّنَّةِ بِلَفْظِ الْمَصَابِيْحِ عَنْ رَجُلٍ مِّنْ بَنِيْ وَائِلٍ.

1377. (8) [1/434బలహీనం]

‘తారిఖ్‌ బిన్‌ షిహాబ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ప్రతి ముస్లిమ్‌పై జుమ’అహ్ సామూహి కంగా తప్పనిసరి విధి. కాని ఈ నలుగురిపై తప్పనిసరి కాదు: 1. సేవకులు, 2. స్త్రీలు, 3. యుక్త వయస్సుకు చేరని యువకులు, 4. వ్యాధిగ్రస్థులు” (అబూ దావూద్‌, షర’హ్ సున్నహ్)

—–

اَلْفَصْلُ الثَّالِثُ   మూడవ విభాగం 

1378 – [ 9 ] ( صحيح ) (1/435)

عَنِ ابْنِ مَسْعُوْدٍ أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم قَالَ لِقَوْمٍ يَّتَخَلَّفُوْنَ عَنِ الْجُمُعَةِ: “لَقَدْ هَمَمْتُ أَنْ آمُرَ رَجُلًا يُصَلِّيْ بَالنَّاسِ ثُمَّ أُحْرِقَ عَلَى رِجَالٍ يَّتَخَلَّفُوْنَ عَنِ الْجُمُعَةِ بُيُوْتَهِمْ”. رَوَاهُ مُسْلِمٌ

1378. (9) [1/435దృఢం]

ఇబ్నె మస్‌’ఊద్‌ (ర) కథనం: ప్రవక్త (స) జుమ’అహ్ నమా’జుకు రాకుండా ఉండేవారి గురించి మాట్లాడుతూ, ‘ఒక వ్యక్తిని ప్రజలకు నమా’జు చదివించడానికి నియమించి, నమా’జుకు రానివారి ఇళ్ళను తగలబెడదామని అనుకుంటున్నాను’ అని అన్నారు. (ముస్లిమ్‌)

1379 – [ 10 ] ( ضعيف ) (1/435)

وَعَنِ ابْنِ عَبَّاسٍ أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم قَالَ: “مَنْ تَرَكَ الْجُمُعَةَ مِنْ غَيْرٍ ضَرُوْرَةٍ كُتِبَ مُنَافِقًا فِيْ كِتَابٍ لَّا يُمْحَى وَلَا يُبَدَّلُ”. وَفِيْ بَعْضِ الرِّوَايَاتِ ثَلَاثًا. رَوَاهُ الشَّافِعِيُّ .

1379. (10) [1/435బలహీనం]

ఇబ్నె ‘అబ్బాస్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”అకారణంగా మూడు జుమ’అహ్ లు వదలి వేసిన వ్యక్తి కపటాచారి (మునాఫిఖ్‌)గా వ్రాయబడతాడు. దాన్ని చెరపడంగాని, మార్చడంగాని జరుగదు.” (షాఫయీ)

1380 – [ 11 ] (ضعيف) (1/435)

وَعَنْ جَابِرٍ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم قَالَ: “مَنْ كَانَ يُؤْمِنُ بِاللهِ وَالْيَوْمِ الْآخِرِ فَعَلَيْهِ الْجُمُعَةِ يَوْمَ الْجُمُعَةِ إِلَّا مَرِيْضٌ أَوْ مُسَافِرٌ أَوْ صَبِيٌّ أَوْ مَمْلُوْكٌ فَمَنِ اسْتَغَنَى بَلَهْوٍ أَوْ تِجَارَةٍ اسْتَغْنَى اللهُ عَنْهُ وَاللهُ غَنِيٌّ حَمِيْدٌ”. رَوَاهُ الدَّرَاقُطْنِيُّ.

1380. (11) [1/435బలహీనం]

జాబిర్‌ (ర) కథనం: ప్రవక్త(స) ప్రవచనం, ”అల్లాహ్‌ను, తీర్పుదినాన్ని విశ్వసించే వ్యక్తిపై జుమ’అహ్ రోజు నమా’జు విధించబడింది. కాని రోగి లేదా ప్రయాణీకుడు, లేదా యుక్త వయస్సుకు చేరని పిల్లలు, సేవకులు మొదలైన వారిపై తప్పని సరి విధికాదు. ఆటపాటల వల్ల, వ్యాపారం వల్ల, అశ్రద్ధ వల్ల నమా’జు వదలే వారి పట్ల అల్లాహ్‌(త) కూడా అశ్రద్ధగా ప్రవర్తిస్తాడు. అల్లాహ్‌ నిరపేక్షా పరుడు, గొప్పవాడూను. (దారు ఖుతునీ)

=====

44 –  بَابُ التَّنْظِيْفِ وَالتَّبْكِيْرِ

44. పరిశుభ్రత (స్నానాలు) మరియు (నమాజు కోసం) త్వరగా వెళ్ళడం

జుమ’అహ్ రోజు గొప్పశుభదినం. జుము’అహ్ నమా’జు కోసం వెంట్రుకలు కత్తిరించటం, గోళ్ళు కత్తిరించటం, స్నానం చేయడం, పరిశుభ్రమైన దుస్తులు ధరించటం, మిస్వాక్‌ చేయడం, సువాసన పులుము కోవటం మొదలైనవి అభిలషణీయం.

اَلْفَصْلُ الْأَوَّلُ  మొదటి విభాగం   

1381 – [ 1 ] ( صحيح ) (1/436)

عَنْ سَلْمَانَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَا يَغْتَسِلُ رَجُلٌ يَّوْمُ الْجُمُعَةِ وَيَتَطّهَرُ مَا اسْتَطَاعَ مِنْ طُهْرٍ وَّيَدَّهِنُ مِنْ دُهْنِهِ أَوْ يَمَسُّ مِنْ طِيْبِ بَيْتِهِ. ثُمَّ يَخْرُجُ فَلَا يُفَرِّقُ بَيْنَ اثْنَيْنِ. ثُمَّ يُصَلِّي مَا كُتِبَ لَهُ. ثُمَّ يُنْصِتُ إِذَا تَكَلَّمَ الْإِمَامُ إِلَّا غُفِرَ لَهُ مَا بَيْنَهُ وَبَيْنَ الْجُمُعَةِ الْأُخْرَى”. رَوَاهُ الْبُخَارِيُّ .

1381. (1) [1/436దృఢం]

సల్మాన్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”జుమ’అహ్ రోజు స్నానంచేసి, పరిశుభ్రంగా తయారై, సువాసన పులుముకొని జుమ’అహ్ నమా’జు కోసం బయలుదేరి, మస్జిద్‌లోకిచేరి, ఇద్దరు వ్యక్తులను వేరు చేయకుండా, సాధ్యమైనంత నమా’జు చదివి, ఇమాము ఖుత్బా ఇచ్చినపుడు నిశ్శబ్దంగా కూర్చొని ఉంటే ఆ జుమ’అహ్ నుండి మరో జుమ’అహ్ వరకు జరిగే పాపాలు క్షమించబడతాయి.” [163] (బు’ఖారీ)

1382 – [ 2 ] ( صحيح ) (1/436)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ رَضِيَ اللهُ عَنْهُ. عَنْ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم قَالَ: “مَنِ اغْتَسَلَ ثُمَّ أَتَى الْجُمُعَةَ فَصَلَّى مَا قُدِّرَ لَهُ ثُمَّ أَنْصَتَ  حَتَّى يَفْرُغَ مِنْ خُطْبَتِهِ ثُمَّ يُصَلِّيْ مَعَهُ غُفِرَ لَهُ مَا بَيْنَهُ وَبَيْنَ الْجُمُعَةِ الْأُخْرَى وَفَضْلُ ثَلَاثَةِ أَيَّامٍ”. رَوَاهُ مُسْلِمٌ .

1382. (2) [1/436దృఢం]

అబూహురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”జుమ’అహ్ రోజు స్నానం చేసి, జుమ’అహ్ నమా’జు చదవడానికి వచ్చి, సాధ్యమైనన్ని రకాతులు చదివి, నిశ్శబ్దంగా కూర్చొని, ఖతీబ్ ఖుత్బా పూర్తిచేసిన తర్వాత, అతనితో కలసి జుమ’అహ్ నమా’జు చదివితే, ఈ జుమ’అహ్ నుండి వచ్చే జుమ’అహ్ వరకు మరియు మరో మూడు రోజుల  పాపాలన్నీ క్షమించబడతాయి. అంటే 10 రోజుల పాపాలు క్షమించబడతాయి. ఎందుకంటే ఒక సత్కార్యానికి 10 సత్కార్యాలంత పుణ్యం లభిస్తుంది.” (ముస్లిమ్‌)

1383 – [ 3 ] ( صحيح ) (1/436)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَنْ تَوَضَّأَ فَأَحْسَنَ الْوُضُوْءَ ثُمَّ أَتَى الْجُمُعَةَ فَاسْتَمَعَ وَأَنْصَتَ غُفِرَ لَهُ مَا بَيْنَهُ وَبَيْنَ الْجُمُعَةِ وَزِيَادَةُ ثَلَاثَةِ أَيَّامٍ وَمَنْ مَّسَّ الْحَصَى فَقَدْ لَغَا”. رَوَاهُ مُسْلِمٌ .

1383. (3) [1/436దృఢం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”చక్కగా వు’దూచేసి జుమ’అహ్ నమా’జు చదవడానికి వచ్చి, శ్రద్ధగా నిశ్శబ్దంగా ఖుత్బా వింటే ఈ జుమ’అహ్ నుండి మరో జుమ’అహ్ ల మధ్య పాపాలన్నీ క్షమించ బడతాయి. ఇంకా మరో మూడు రోజుల పాపాలు కూడా. ఎవరైనా కంకర రాయితో ఆడితే, అతడు వ్యర్థపని చేసినట్టే.” [164] (ముస్లిమ్‌)

1384 – [ 4 ] ( متفق عليه ) (1/436)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِذَا كَانَ يَوْمُ الْجُمُعَةِ وَقَفَتِ الْمَلَائِكَةُ عَلَى بَابِ الْمَسْجِدِ يَكْتُبُوْنَ الْأَوَّلَ فَالْأَوَّلَ وَمَثَلُ الْمُهَجِّرِكَمَثَلِ الَّذِيْ يُهْدِيْ بَدَنَةً ثُمَّ كَالَّذِيْ  يُهْدِيْ بَقَرَةً ثُمَّ كَبْشًا ثُمَّ دَجَاجَةً ثُمَّ بَيْضَةً فَإِذَا خَرَجَ الْإِمَامُ طَوَوْا صُحُفَهُمْ وَيَسْتَمِعُوْنَ الذِّكْرَ”.

1384. (4) [1/436ఏకీభవితం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”జుమ’అహ్ రోజు దైవదూతలు మస్జిద్‌ ద్వారం వద్ద నిలబడతారు. నమా’జు చదవడానికి వచ్చే వారి పేర్లు వ్రాస్తారు. అందరికంటే ముందు వచ్చినవారి పేరు మొదటి స్థానంలో వ్రాస్తారు. ఆ తరువాత వచ్చిన వారి పేరు తరువాత వ్రాస్తారు. మొదట వచ్చిన వ్యక్తి ఖుర్‌ బానీ కోసం ఒంటె పంపినట్లు, తరువాత వచ్చిన వాడు ఖుర్‌బానీ కోసం ఆవు పంపినట్లు, ఆ తరువాత వచ్చిన వ్యక్తి మేక ఖుర్‌బానీ ఇచ్చినట్టు, ఆ తరువాత వచ్చిన వ్యక్తి కోడి పంపినట్టు, ఆ తరువాత వచ్చిన వ్యక్తి గ్రుడ్డు పంపినట్టు. ఇమామ్‌ ఖుత్బా ఇవ్వడానికి రాగానే దైవదూతలు తమ ఖాతాలను మూసి వేసి ఖుత్బా వినడానికి సిద్ధమౌతారు. [165] (బు’ఖారీ, ముస్లిమ్‌)

1385 – [ 5 ] ( متفق عليه ) (1/437)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِذَا قُلْتَ لِصَاحِبِكَ يَوْمَ الْجُمُعَةِ أَنْصِتْ وَالْإِمَامُ يَخْطُبُ فَقَدْ لَغَوْتَ.

1385. (5) [1/437ఏకీభవితం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”జుమ’అహ్ రోజు ఇమామ్‌ ఖుత్బా ఇస్తున్నప్పుడు ఎవరైనా తన స్నేహితునితో మాట్లాడి, అతన్ని ‘నీవు నిశ్శబ్దంగా ఉండు’ అని అన్నా, అతడు కూడా అపరాధం చేసినట్టే.” [166] (బు’ఖారీ)

1386 – [ 6 ] ( صحيح ) (1/437)

وَعَنْ جَابِرٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَا يُقِيْمَنَّ أَحَدُكُمْ أَخَاهُ يَوْمُ الْجُمُعَةِ. ثُمَّ يُخَالِفُ إِلَى مَقْعَدِهِ فَيَقْعُدُ فِيْهِ وَلَكِنْ يَّقُوْلُ: افْسَحُوْا”. رَوَاهُ مُسْلِمٌ .

1386. (6) [1/437దృఢం]

జాబిర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”జుమ’అహ్ రోజు ఒక ముస్లిమ్‌ను అతని స్థానం నుండి లేపి, అతని స్థానంలో కూర్చోకూడదు. అయితే అతన్ని ‘కొద్దిగా జరగండి’ అని చెప్పవచ్చు.” [167] (ముస్లిమ్‌)

—–

اَلْفَصْلُ الثَّانِيْ  రెండవ విభాగం 

1387 – [ 7 ] ( صحيح ) (1/437)

عَنْ أَبِيْ سَعِيْدٍ وَأَبِيْ هُرَيْرَةَ قَالَا: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه و سلم: “مَنِ اغْتَسَلَ يَوْمَ الْجُمُعَةِ وَلَبِسَ مِنْ أَحْسَنِ ثِيَابِهِ وَمَسَّ مِنْ طِيْبٍ إِنْ كَانَ عِنْدَهُ ثُمَّ أَتَى الْجُمُعَةَ. فَلَمْ يَتَخَطَّ أَعْنَاقَ النَّاسِ. ثُمَّ صَلَّى مَا كَتَبَ اللهُ لَهُ. ثُمَّ أَنْصَتَ إِذَا خَرَجَ إِمَامُ حَتَّى يَفْرُغَ مِنْ صَلَاتِهِ كَانَتْ كَفَّارَةً لِّمَا بَيْنَهَا وَبَيْنَ جُمُعَتِهِ الَّتِيْ قَبْلَهَا”. رَوَاهُ أَبُوْ دَاوُدَ .

1387. (7) [1/437దృఢం]

అబూ స’యీద్‌ (ర) మరియు అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”జుమ’అహ్ రోజు స్నానం చేసి, పరిశుభ్రమైన బట్టలుధరించి, వీలైతే సువాసన పులుముకొని జుమ’హ్ నమా’జు కోసం వచ్చి, ప్రజల మెడలపై నుండి గెంతకుండా, సాధ్యమై నన్ని సున్నతులు చదివి, ఇమామ్‌ వచ్చి నప్పటి నుండి నమా’జు పూర్తయ్యే వరకు నిశ్శబ్దంగా ఉంటే, ఈ జుమ’అహ్ నుండి వచ్చే జుమ’అహ్ వరకు చేసిన పాపాలన్నీ క్షమించబడతాయి.” (అబూ దావూద్‌)

1388 – [ 8 ] ( صحيح ) (1/437)

وَعَنْ أَوْسِ بْنِ أَوْسٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَنْ غَسَّلَ يَوْمَ الْجُمُعَةِ وَاغْتَسَلَ وَبَكَّرَ وَابْتَكَرَوَمَشَى وَلَمْ يَرْكَبْ وَدَنَا مِنَ الْإِمَامِ وَاسْتَمَعَ وَلَمْ يَلْغُ كَانَ لَهُ بِكُلِّ خُطُوَةٍ عَمَلُ سَنَةٍ: أَجْرُ صِيَامِهَا وَقِيَامِهَا”. رَوَاهُ التِّرْمِذِيُّ وَأَبُوْ دَاوُدَ وَالنَّسَائِيُّ وَابْنُ مَاجَهُ.

1388. (8)  [1/437దృఢం]

ఔస్‌ బిన్‌ ఔస్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”జుమ’అహ్ రోజు స్నానం చేయించి , తాను కూడా స్నానం చేసి, ఉదయాన్నే ప్రారంభ సమయంలో మస్జిద్‌కు వాహనంపై రాకుండా నడచి వచ్చి, ఇమామ్‌కు దగ్గరగా కూర్చొని శ్రద్ధగా ఖుత్బా విని ఎటువంటి చెడుపని చేయ కుండా ఉంటే, అతని  ప్రతి అడుగుకు బదులు సంవత్సర మంతా ఉపవాసాలు మరియు రాత్రంతా ఆరాధనలు చేసినంత పుణ్యం లభిస్తుంది.” (తిర్మిజి’, అబూ దావూద్‌, నసాయి’, ఇబ్నె మాజహ్)

1389 – [ 9 ] ( صحيح ) (1/438)

وَعَنْ عَبْدِ اللهِ بْنِ سَلَامٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَا عَلَى أَحَدِكُمْ إِنْ وَّجَدَ أَنْ يَّتَّخِذَ ثَوْبَيْنِ لِيَوْمِ الْجُمُعَةِ سِوَى ثَوْبَيْ مِهْنَتِهِ”. رَوَاهُ ابْنُ مَاجَهُ.

1389. (9) [1/438దృఢం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ సలామ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఒకవేళ ఎవరైనా జుమ’అహ్ నమా’జు కోసం సామాన్య దుస్తులు కాక, ప్రత్యేక దుస్తులు ఏర్పాటుచేసు కుంటే అభ్యంతరం ఏమీలేదు.” [168](ఇబ్నె మాజహ్).

1390 – [ 10 ] ( ضعيف ) (1/438)

وَرَوَاهُ مَالِكٌ عَنْ يَحْيَى بْنِ سَعِيْدٍ .

1390. (10) [1/438బలహీనం]

పైవిధంగా య’హ్‌యా బిన్‌ స’యీద్‌ ఉల్లేఖనం (మాలిక్‌)

1391 – [ 11 ] ( صحيح ) (1/438)

وَعَنْ سَمُرَةَ بْنِ جُنْدُبٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “احْضُرُوا الذِّكْر وادْنُوْا مِنَ الْإِمَامِ. فَإِنَّ الرَّجُلَ لَا يَزَالُ يَتَبَاعَدُ حَتَّى يُؤَخَّرَ فِيْ الْجَنَّةِ وَإِنْ دَخَلَهَا”. رَوَاهُ أَبُوْ دَاوُدَ .

1391. (11) [1/438దృఢం]

సమురహ్‌ బిన్‌ జున్‌దుబ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మీరు జుమ’అహ్ రోజు అల్లాహ్ స్మరణకు ఖుత్బా వినడానికి వెళ్ళండి, ఇమామ్‌కు దగ్గరగా ఉండండి. ఎందుకంటే, ఎంత దూరం ఉంటే, అంత ఆలస్యంగా స్వర్గంలోకి ప్రవేశిస్తారు.” (అబూ దావూద్‌)

1392 – [ 12 ] ( ضعيف ) (1/438)

وَعَنْ سَهْلِ بْنِ مَعَاذٍ بْنِ أَنَسٍ الْجُهَنِيِّ عَنْ أَبِيْهِ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَنْ تَخَطَّى رِقَابَ النَّاسِ يَوْمَ الْجُمُعَةِ اتَّخَذَ جَسْرًا إِلَى جَهَنَّمَ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَقَالَ:هَذَا حَدِيْثٌ غَرِيْبٌ

1392. (12) [1/438బలహీనం]

సహల్ బిన్ ము’ఆజ్‌’ బిన్‌ అనస్‌ జు’హని (ర) తన తండ్రి ద్వారా కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”జుమ’అహ్ రోజు ప్రజల మెడలపై నుండి గెంతుతూ వచ్చే వ్యక్తి కోసం నరకంలో ఒక వంతెన తయారు చేయబడుతుంది.” [169] (తిర్మిజి’ – ఏకోల్లేఖనం)

1393 – [ 13 ] ( حسن ) (1/439)

وعَنْ مُعَاذِ بْنِ أَنَسٍ: أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم نَهَى عَنِ الْحَبْوَةِ يَوْمَ الْجُمُعَةِ وَالْإِمَامُ يَخْطُبُ. رَوَاهُ التِّرْمِذِيُّ وَأَبُوْ دَاوُدَ .

1393. (13) [1/439ప్రామాణికం]

ము’ఆజ్‌’ బిన్‌ అనస్‌ (ర) కథనం: ‘ప్రవక్త (స) జుమ’అహ్ రోజు ఇమాము ఖు’త్బా ఇస్తున్నప్పుడు మోకాళ్ళను నిలబెట్టి చేతులతో చుట్టుకొని కూర్చోవ టాన్ని వారించారు. ‘ [170] (తిర్మిజి’, అబూ దావూద్‌)

1394 – [ 14 ] ( صحيح ) (1/439)

وَعَنِ ابْنِ عُمَرَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِذَا نَعَسَ أَحَدُكُمْ يَوْم الْجُمُعَةِ فَلْيَتَحَوَّلْ مِنْ مَّجْلِسِهِ ذَلِكَ”. رَوَاهُ التِّرْمِذِيُّ .

1394. (14) [1/439దృఢం]

ఇబ్నె’ఉమర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”జుము’అహ్ రోజు మస్జిద్‌లో నిద్రగాని, కునుకుగాని వస్తే, కూర్చున్నచోటు మార్చుకోవాలి. దానివల్ల నిద్ర రాకుండా ఉంటుంది.”

—–

اَلْفَصْلُ الثَّالِثُ   మూడవ విభాగం 

1395 – [ 15 ] ( متفق عليه ) (1/439)

عَنْ نَافِعٍ قَالَ: سَمِعْتُ ابْنَ عُمَرَ يَقُوْلُ: نَهَى رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم أَنْ يُّقِيْمَ الرَّجُلَ الرَّجُلَ مِنْ مَّقْعِدَهِ وَيَجْلِسُ فِيْهِ. قِيْلَ لِنَافِعٍ: فِيْ الْجُمُعَةِ. قَالَ: فِيْ الْجُمُعَةِ وَغَيْرِهَا.

1395. (15) [1/439ఏకీభవితం]

నా’ఫె (ర) కథనం: ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘ఉమర్‌ (ర) ఇలా ప్రవచిస్తూ ఉండగా నేను విన్నాను, ”ప్రవక్త (స), ఒకరిని తను కూర్చున్నచోటునుండి లేపి, తాను కూర్చోరాదు. నన్ను ‘ఈ వారింపు జుమ’రోజుకేనా’ అని ప్రశ్నించడం జరిగింది. దానికి నేను ‘జుమ’అహ్ కు, ఇతర సమయాలకు’ అని సమాధానం ఇచ్చాను.[171] (బు’ఖారీ, ముస్లిమ్‌)

1396 – [ 16 ] ( حسن ) (1/439)

وَعَنْ عَبْدِ اللهِ بْنِ عَمْرٍو قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “يَحْضُرُالْجُمُعَةَ ثَلَاثَةُ نَفَرٍ. فَرَجُلٌ حَضَرَهَا بِلَغْوٍ فَذَلِكَ حَظُّهُ مِنْهَا. وَرَجُلٌ حَضَرَهَا بِدُعَاءٍ فَهُوَ رَجُلٌ دَعَا اللهَ إِنْ شَاءَ أَعْطَاهُ وَإِنْ شَاءَ مَنَعَهُ. وَرَجُلٌ حَضَرَهُ بِإِنْصَاتٍ وَّسَكُوْتٍ وَلَمْ يَتَخَطَّ رَقَبَةَ مُسْلِمٍ وَلَمْ يُؤْذِ أَحَدًا فَهِيَ كَفَارَةٌ إِلَى الْجُمُعَةِ الَّتِيْ تَلِيْهَا وَزِيَادَةُ ثَلَاثَةٍ أَيامٍ وَذَلِكَ بِأَنَّ اللهَ يَقُوْلُ:(مَنْ جَاءَ بِالْحَسَنَةِ فَلَهُ عَشَرُ أَمْثَالِهَا..6: 160). رَوَاهُ أَبُوْ دَاوُدَ

1396. (16) [1/439ప్రామాణికం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘ఉమర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”జుమ’అహ్ రోజు మూడు రకాల మను షులు వస్తారు. ఒక రకం వారు వ్యర్థంగా ఆట్లాటకోసం వస్తారు. వారికి ఇదే దక్కుతుంది. వారికి జుమ’అహ్ పుణ్యం లభించదు. వారు చేసిన చెడుచేష్టల పాపం వారిపైనే పడుతుంది. 2 వ రకంవారు దు’ఆ కోసం వస్తారు. వారు దు’ఆ చేస్తారు. అల్లాహ్‌ను అర్థిస్తారు. అయితే ఇవ్వడం, ఇవ్వక పోవటం అల్లాహ్‌ ఇష్టం. 3వ రకానికి చెందిన వారు శ్రద్ధగా ఖుత్బా వినడానికి, నమా ‘జు చదవడానికి వస్తారు. వీరు మెడలపై నుండి గెంత కుండా, ఎవరికీ హాని కలిగించకుండా ఉంటే, ఈ జుమ’అహ్ నుండి వచ్చే జుమ’అహ్ వరకు జరిగే పాపాలకు పరిహారం అయిపోతుంది. అంటే ఈ జుమ’అహ్ నుండి వచ్చే జుమ’అహ్ వరకు జరిగే పాపాలు క్షమించబడతాయి. ఇంకా మూడు రోజుల పాపాలు అధికంగా క్షమించబడతాయి. ఇలా ఎందుకు జరుగుతుందంటే అల్లాహ్‌ ” ఎవడు ఒక సత్కార్యం చేస్తాడో, అతనికి దానికి పదిరెట్లు ప్రతిఫలం ఉంటుంది..” (సూ. అల్-అన్-ఆమ్, 6:160)  (అబూ దావూద్‌)

1397 – [ 17 ] ( ضعيف ) (1/440)

وَعَنِ ابْنِ عَبَّاسٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَنْ تَكَلَّمَ يَوْمَ الْجُمُعَةِ وَالْإِمَامُ يَخْطُبُ فَهُوَ كمَثَلِ الْحِمَارِ يَحْمِلُ أَسْفَارًا. وَالَّذِيْ يَقُوْلُ لَهُ أَنْصِتْ لَيْسَ لَهُ جُمُعَةٌ”. رَوَاهُ أَحْمَدُ.

1397. (17) [1/440బలహీనం]

ఇబ్నె’అబ్బాస్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”జుమ’అహ్ ఖుత్బా సమయంలో ఇతరులతో మాట్లాడిన వ్యక్తి, చాలా పుస్తకాలు మోస్తున్న గాడిద వంటి వాడు. ఇంకా తన ప్రక్కవాణ్ణి నిశ్శబ్దంగా ఉండు అని చెప్పినవాని జుమ’హ్ స్వీకరించబడదు.”  [172] (అ’హ్మద్‌)

1398 – [ 18 ] ( صحيح ) (1/440)

وَعَنْ عُبَيْدِ بْنِ السَّبَّاقِ مُرْسَلًا قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم فِيْ جُمُعَةٍ مِّنَ الْجُمَعِ: ” يَا مَعْشَرَ الْمُسْلِمِيْنَ إِنَّ هَذَا يَوْمٌ جَعَلَهُ اللهُ عِيْدًا فَاغْتَسِلُوْا وَمَنْ كَانَ عِنْدَهُ طِيْبٌ فَلَا يَضُرُّهُ أَنْ يَّمَسَّ مِنْهُ وَعَلَيْكُمْ بَالسِّوَاكِ”. رَوَاهُ مَالِكٌ وَرَوَاهُ ابْنُ مَاجَهُ عَنْهُ .

1398. (18) [1/440దృఢం]

‘ఉబైద్‌ బిన్‌ సబ్బాఖ్‌ (ర) కథనం: ప్రవక్త (స) జుము ‘అహ్ లో ఇలా ఆదేశించారు: ”ఓ ముస్లిములారా! అల్లాహ్‌ జుమ’అహ్ రోజును పండుగ దినంగా నిర్ణయించాడు. కనుక జుమ’అహ్ రోజు స్నానం చేయండి, సాధ్యం అయితే సువాసన పులుముకోండి. తప్పకుండా మిస్వాక్‌ చేసుకోండి.” (మాలిక్‌, ఇబ్నె మాజహ్). 

1399 – [ 19 ] ( لم تتم دراسته ) (1/440)

وَهُوَ عَنِ ابْنِ عَبَّاسٍ مُّتَّصِلًا .

1399. (19) [1/440అపరిశోధితం]

పై ‘హదీసు’ ఇబ్నె’అబ్బాస్‌ ద్వారా కూడా ఉల్లేఖించ బడింది.

1400 – [ 20 ] ( حسن ) (1/440)

وَعَنِ الْبَرَاءِ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “حَقًّا عَلَى الْمُسْلِمِيْنَ أَنْ يَّغْتَسِلُوْا يَوْمَ الْجُمُعَةِ وَلَيَمَسَّ أَحَدُهُمْ مِنْ طِيْبٍ أَهْلِهِ فَإِنْ لَمْ يَجِدْ فَالْمَاءُ لَهُ طِيْبٌ”. رَوَاهُ أَحْمَدُ وَالتِّرْمِذِيُّ وَقَالَ: هَذَا حَدِيْثٌ حَسَنٌ.

1400. (20) [1/440ప్రామాణికం]

బరా’ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ముస్లిములు జుమ’అహ్ రోజు స్నానం చేయడం తప్పని సరి, ఇంట్లో పరిమళం ఉంటే పులుముకోవాలి. ఒకవేళ సువాసన ద్రవ్యాలు లేకపోతే, నీళ్ళే పరిమళంగా ఉంటుంది. అంటే స్నానం చేసి పరిశుభ్రంగా ఉండటం సువాసనకు బదులుగా పనికి వస్తుంది.” (తిర్మిజి’ – ప్రామాణికం)

=====

45 – بَابُ الْخُطْبَةِ وَالصَّلَاةِ الْجُمُعَةِ

45. జుమాఅహ్ ఉపన్యాసం (ఖుత్బ),

జుమాఅహ్ నమాజు

اَلْفَصْلُ الْأَوَّلُ  మొదటి విభాగం 

1401 – [ 1 ] ( صحيح ) (1/441)

عَنْ أَنَسٍ: أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم كَانَ يُصَلِّيْ الْجُمُعَةَ حِيْنَ تَمِيْلُ الشَّمْسُ. رَوَاهُ الْبُخَارِيُّ .

1401. (1) [1/441దృఢం]

అనస్‌ (ర) కథనం: ప్రవక్త (స) సూర్యుడు వాలిన తర్వాత జుమ’అహ్ నమా’జు చదివేవారు.[173](బు’ఖారీ)

1402 – [ 2 ] ( متفق عليه ) (1/441)

وَعَنْ سَهْلِ بْنِ سَعْدٍ قَالَ: مَا كُنَّا نُقِيْلُ وَلَا نَتَغَدَّى إِلَّا بَعْدَ الْجُمُعَة

1402. (2) [1/441దృఢం]

సహల్ బిన్ స’అద్ (ర) కథనం: మేము జుము’అహ్ నమా’జు చదివిన తర్వాత భోజనం చేసే వాళ్ళం. (బు’ఖారీ)

1403 – [ 3 ] ( صحيح ) (1/441)

وَعَنْ أَنَسٍ قَالَ: كَانَ النَّبِيُّ صلى الله عليه وسلم إِذَا اشْتَدَّ الْبَرْدُ بَكَّرَ بِالصَّلَاةِ وَإِذَا اشْتَدَّ الْحَرُّأَبْرَدَ بِالصَّلَاةِ.يَعْنِيْ الْجُمُعَةِ. رَوَاهُ الْبُخَارِيُّ .

1403. (3) [1/441దృఢం]

అనస్‌ (ర) కథనం: ప్రవక్త (స) తీవ్ర చలికాలంలో జుమ’అహ్ నమా’జును త్వరగా, తీవ్ర ఎండా కాలంలో ఆలస్యం చేసి చదివేవారు. (బు’ఖారీ)

1404 – [ 4 ] ( صحيح ) (1/441)

وَعَنِ السَّائِبِ بْنِ يَزِيْدَ قَالَ: كَانَ النِّدَاءُ يَوْمَ الْجُمُعَةِ أَوَّلُهُ إِذَا جَلَسَ الْإِمَامُ عَلَى الْمِنْبَرِ عَلَى عَهْدِ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم وَأَبِيْ بَكْرٍ وَعُمَرَ فَلَمَّا كَانَ عُثْمَانُ وَكَثُرَ النَّاسُ زَادَ النِّدَاءَ الثَّانِيْ عَلَى الزَّوْرَاءِ. رَوَاهُ الْبُخَارِيُّ.

1404. (4) [1/441దృఢం]

సాయిబ్‌ బిన్‌ య’జీద్‌ (ర) కథనం: ”జుమ’అహ్ రోజు మొదటి అజా’న్‌ ఇమాము ‘ఖు’త్బా ఇవ్వడానికి మెంబరుపై కూర్చున్న తర్వాత అయ్యేది. ప్రవక్త (స), అబూ బకర్‌ (ర), ‘ఉమర్‌ (ర) కాలాల్లో ఇలాగే కొనసాగింది. అయితే ‘ఉస్మాన్‌ (ర) ‘ఖలీఫహ్ అయిన తర్వాత ప్రజల సంఖ్య కూడా పెరిగింది. ఉస్మాన్‌ () ‘జురాఅ’ ప్రాంతంలో మూడవ అజాన్ను అధికం చేశారు. [174] (బు’ఖారీ)

1405 – [ 5 ] ( صحيح ) (1/441)

وعَنْ جابر بن سمرة قَالَ: كانت للنبي صلى الله عليه وسلم خطبتان يجلس بينهما يقرأ القرآن ويذكر الناس فكانت صلاته قصدا وخطبته قصدا. رواه مسلم.

1405. (5) [1/441దృఢం]

జాబిర్‌ బిన్‌ సమురహ్‌ (ర) కథనం: ప్రవక్త (స), జుమ ‘అహ్ రోజు రెండు ఖుత్బాలు ఇచ్చేవారు. ప్రవక్త (స) రెండు ‘ఖు’త్బాల మధ్య కూర్చునేవారు. ఈ ‘ఖు’త్బాల్లో ఖుర్‌ఆన్‌ పఠనం, హితబోధ చేసేవారు. ప్రవక్త (స) ‘ఖు’త్బా, నమా’జు మధ్యస్థంగా ఉండేవి.[175] (ముస్లిమ్‌)

1406 – [ 6 ] ( صحيح ) (1/442)

وَعَنْ عَمَّارَ قَالَ: سَمِعْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ: “إِنَّ طُوْلَ صَلَاةِ الرَّجُلِ وَقِصْرَ خُطْبَتِهِ مَئِنَّةٌ مِنْ فِقْهِهِ فَأَطِيْلُوْا الصَّلَاةَ وَاقْصُرُوْا الْخُطْبَةَ وَإِنَّ مِنَ الْبَيَانِ سِحْرًا”. رَوَاهُ مُسْلِمٌ.

1406. (6) [1/442దృఢం]

‘అమ్మార్‌ (ర) కథనం: ప్రవక్త (స) ఇలా ప్రవచిస్తూ ఉండగా నేను విన్నాను, ”మనిషి నమా’జు దీర్ఘంగా చదవటం, ‘ఖు’త్బాహ్‌ సంక్షిప్తంగా ఇవ్వడం అతడు వివేకవంతుడని సూచిస్తుంది. కనుక నమా’జు దీర్ఘంగా చదవండి. ‘ఖు’త్బాహ్‌ను సంక్షిప్తంగా ఇవ్వండి. కొన్ని ప్రసంగాలు మాంత్రిక ప్రభావం చూపుతాయి.” [176] (ముస్లిమ్‌)

1407 – [ 7 ] ( صحيح ) (1/442)

وَعَنْ جَابِرٍقَالَ: كَانَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم إِذَا خَطَبَ احْمَرَّتْ عَيْنَاهُ وَعَلَا صَوْتُهُ وَاشْتَدَّ غَضَبُهُ حَتَّى كَأَنَّهُ مُنْذِرُجَيْشٍ يَقُوْلُ:”صَبَّحَكُمْ  وَمَسَّاكُمْ”. وَيَقُوْلُ: “بُعِثْتُ أَنَا وَالسَّاعَةُ كَهَاتَيْنِ”. وَيَقْرِنُ بَيْنَ أَصْبَعَيْهِ السَّبَابَةِ وَالْوُسْطَى. رَوَاهُ مُسْلِمٌ.

1407. (7) [1/442దృఢం]

జాబిర్‌ (ర) కథనం: ”ప్రవక్త (స) ‘ఖు’త్బాహ్‌ ఇచ్చి నపుడు, ఆయన కళ్ళు ఎర్రబడేవి. గొంతు కూడా బిగ్గరగా అయ్యేది. ఆగ్రహం కూడా అధికం అయ్యేది. శత్రు సైన్యాల నుండి హెచ్చరించినట్టుగా ఉండేది. అంటే ప్రవక్త (స), ‘ఉదయం మరియు సాయంత్రం మీపై దాడిచేసి మిమ్మల్ని దోచుకునే శత్రుసైన్యాల నుండి రక్షించుకోండి’ అని హెచ్చరించే వారు. ఇంకా నేనూ మరియు పునరుత్థానం ఒకేసారి పంపబడ్డాము అని చెప్పి మధ్యవేలు మరియు చూపుడు వేలు చూపించే వారు. ” [177](ముస్లిమ్‌)

1408 – [ 8 ] ( متفق عليه ) (1/442)

وَعَنْ يَعْلَى بْنَ أُمَيَّةَ قَالَ: سَمِعْتُ النَّبِيَّ صلى الله عليه وسلم يَقْرَأُ عَلَى الْمِنْبَرِ: (وَنَادُوْا يَا مَالِكُ لِيَقْضِ عَلَيْنَا رَبُّكَ؛43: 77)

1408. (8) [1/442ఏకీభవితం]

య’అలా బిన్ ‘ఉమయ్య (ర) కథనం: ప్రవక్త (స) మెంబరుపై ఇలా పలుకుతూ ఉండటం విన్నాను, ”వ నాదవ్‌ యా మాలికు లియఖ్‌’ది అలైనా రబ్బుక,” — అంటే నరకవాసులు నరకంలో మాలిక్‌ అనే దైవదూతను పిలుస్తూ, ‘ఓ నరక పాలకుడా (మాలిక్)! నీ ప్రభువును మమ్మల్ని అంతం చేయమను,’ అని మొరపెట్టు కుంటారు.” [178] (బు’ఖారీ, ముస్లిమ్‌)

1409 – [ 9 ] ( صحيح ) (1/442)

وَعَنْ أُمِّ هِشَّامٍ بِنْتِ حَارِثَةَ بْنِ النُّعْمَانَ قَالَتْ: مَاأَخَذْتُ (ق. وَالْقُرْآنِ الْمَجِيْدِ-50) إِلَّا عَنْ لِسَانِ  رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم  يَقْرَؤُهَا  كُلَّ جُمُعَةٍ عَلَى الْمِنْبَرِ إِذَا خَطَبَ النَّاسَ . رَوَاهُ مُسْلِمٌ .

1409.  (9) [1/442దృఢం]

ఉమ్ము హిషామ్ బిన్‌తె ‘హారిసహ్ (ర) కథనం: ”ప్రవక్త (స) నోటి ద్వారా నేను సూరహ్‌ ఖాఫ్‌(50)ను కంఠస్తం చేసుకున్నాను. ప్రవక్త (స) ప్రతి జుమ’అహ్ లో ఈ సూరహ్‌ను పఠించేవారు. ప్రతివారం విని ఈ సూరహ్‌ను జ్ఞాపకం చేసుకున్నాను.” (ముస్లిమ్‌)

1410 – [ 10 ] ( صحيح ) (1/442)

وَعَنْ عَمْرِو بْنِ حُرَيْثٍ: أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم خَطَبَ وَعَلَيْهِ عَمَامَةٌ سَوْدَاءُ قَدْ أَرْخَى طَرَفَيْهَا بَيْنَ كَتِفَيْهِ يَوْمَ الْجُمُعَةِ. رَوَاهُ مُسْلِمٌ .

1410. (10) [1/442దృఢం]

‘అమ్ర్‌ బిన్‌ ‘హురైస్‌ (ర) కథనం: ప్రవక్త (స) జుమ’అహ్ రోజు ‘ఖు’త్బా ఇచ్చినపుడు ఆయన తలపై నల్లని అమామ ఉండేది. దాని రెండు చివరలు రెండు భుజాల మధ్య  వ్రేలాడుతూ ఉండేవి. [179] (ముస్లిమ్‌)

1411 – [ 11 ] ( صحيح ) (1/442)

وَعَنْ جَابِرٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم وَهُوَ يَخْطُبُ: “إِذَا جَاءَ أَحُدُكُمْ يَوْمَ الْجُمُعَةِ وَالْإِمَام يَخْطُبُ فَلْيَرْكَعْ رَكْعَتَيْنِ وَلْيَتَجَوَّزْ فِيْهِمَا”. رَوَاهُ مُسْلِمٌ .

1411.  (11) [1/442దృఢం]

జాబిర్‌ (ర) కథనం: ప్రవక్త (స) జుమ’అహ్ ‘ఖు’త్బాలో, ”మీలో ఎవరైనా జుమ’అహ్ రోజు ఇమాము ‘ఖు’త్బాహ్ ఇస్తున్నప్పుడు వస్తే, తేలిగ్గా రెండు రకా’తులు చదివి కూర్చోవాలి.” [180] (ముస్లిమ్‌)

1412 – [ 12 ] ( متفق عليه ) (1/443)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: مَنْ أَدْرَكَ رَكْعَةً مِّنَ الصَّلَاةِ مَعَ الْإِمَامِ فَقَدْ أَدَرَكَ الصَّلَاةَ”.

1412. (12) [1/443ఏకీభవితం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఇమాముతో కలసి ఒక్క రకా’తు లభిస్తే మొత్తం నమా’జు లభించి నట్లే.” [181] (బు’ఖారీ, ముస్లిమ్‌)

—–

اَلْفَصْلُ الثَّانِيْ   రెండవ విభాగం 

1413 – [ 13 ] ( ضعيف ) (1/443)

عَنِ ابْنِ عُمَرَ قَالَ: كَانَ النَّبِيُّ صلى الله عليه وسلم يَخْطُبُ خُطْبَتَيْنِ كَانَ يَجْلِسُ إِذَا صَعِدَ الْمِنْبَرَ حَتَّى يَفْرُغُ أُرَاهُ الْمُؤَذِّنُ ثُمَّ يَقُوْمُ فَيَخْطُبُ ثُمَّ يَجْلِسُ وَلَا يَتَكَلَّمُ ثُمَّ يَقُوْمُ فَيَخْطُبُ. رَوَاهُ أَبُوْ دَاوُدَ .

1413. (13) [1/443బలహీనం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘ఉమర్‌ (ర) కథనం: ప్రవక్త (స) జుమ’అహ్ రోజు రెండు ‘ఖు’త్బాలు ఇచ్చేవారు. మొద టిది ప్రవక్త (స) మెంబరుపై ఎక్కి కూర్చున్న తర్వాత ముఅ’జ్జి’న్‌ అజా’న్‌ ఇచ్చిన తర్వాత ప్రవక్త (స) నిలబడి ‘ఖు’త్బాహ్ ఇచ్చి కూర్చొని ఏమీ మాట్లాడ కుండా మళ్ళీ నిలబడి రెండవ’ఖు’త్బాహ్ ఇచ్చే వారు. [182] (అబూ దావూద్‌)

1414 – [ 14 ] ( ضعيف ) (1/443)

وَعَنْ عَبْدِ اللهِ بْنِ مَسْعُوْدٍ قَالَ: كَانَ النَّبِيُّ صلى الله عليه وسلم إِذَا اسْتَوَى عَلَى الْمِنْبَرِاسْتَقْبَلْنَاهُ بِوُجُوْهِنَا. رَوَاهُ التِّرْمِذِيُّ وَقَالَ: هَذَاحَدِيْثُ لَا نَعْرِفُهُ إِلَّا مِنْ حَدِيْثِ مُحَمَّدِ بْنِ الْفَضْلِ وَهُوَ ضَعِيْفُ ذَاهِبُ الْحَدِيْثِ .

1414. (14) [1/443బలహీనం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ మస్‌’ఊద్‌ (ర) కథనం : ప్రవక్త (స) మెంబరుపై కూర్చున్న తరువాత మేము ఆయనకు అభిముఖంగా ఆయన ముందు కూర్చునే వాళ్ళం. (తిర్మిజి’ / ”ఈ ‘హదీసు’ మాకు ము’హమ్మద్‌ బిన్‌ ఫ’ద్ల్ ద్వారా చేరింది, అతను బలహీన ఉల్లేఖన కర్త,” అని పేర్కొన్నారు.

—–

اَلْفَصْلُ الثَّالِثُ   మూడవ విభాగం 

1415 – [ 15 ] ( صحيح ) (1/444)

عَنْ جَابِرٍ بْنِ سَمُرَةَ قَالَ: كَانَ النَّبِيُّ صلى الله عليه وسلم يَخْطُبُ قَائِمًا ثُمَّ يَجْلِسُ ثُمَّ يَقُوْمُ فَيَخْطُبُ قَائِمًا فَمَنْ نَبَّأَكَ أَنَّهُ كَانَ يَخْطُبُ جَالِسًا فَقَدْ كَذَبَ فَقَدْ وَاللهِ صَلَّيْتُ مَعَهُ أَكْثَرَ مِنْ أَلْفَيْ صَلَاةٍ. رَوَاهُ مُسْلِمٌ.

1415. (15) [1/444దృఢం]

జాబిర్‌ బిన్‌ సమురహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) నిలబడి జుమ’అ ‘ఖు’త్బా ఇచ్చేవారు. ఆ తరువాత కొంతసేపు తర్వాత కూర్చొని, మళ్ళీ లేచి నిలబడి రెండవ ‘ఖు’త్బా ఇచ్చే వారు. మీలోఎవరైనా ప్రవక్త (స) కూర్చొని ‘ఖు’త్బా ఇచ్చే వారని అంటే అతడు అసత్యం పలికాడు. రెండువేల నమా’జుల కంటే అధికంగా నేను ప్రవక్త (స) తో కలసి చదివాను. [183] (ముస్లిమ్‌)

1416 – [ 16 ] ( صحيح ) (1/444)

وَعَنْ كَعْبِ بْنِ عُجْرَةَ: أَنَّهُ دَخَلَ الْمَسْجِدَ وَعَبْدُ الرَّحْمَنِ بْنُ أُمِّ الْحَكَمِ يَخْطُبُ قَاعِدًا فَقَالَ: انْظُرُوْا إِلَى هَذَا الْخَبِيْثِ يَخْطُبُ قَاعِدًا وَقَدْ قَالَ اللهُ تَعَالى: (وَإِذَا رَأَوْا تِجَارَةً أَوْ لَهْوَا اِنْفَضُّوْا إِلَيْهَا وَتَركُوْكَ قَائِمًا-62: 11).  رَوَاهُ مُسْلِمٌ.

1416. (16) [1/444దృఢం]

క’అబ్‌ బిన్‌ ‘ఉజ్‌రహ్‌ (ర) కథనం: అతను మస్జిద్‌లో ప్రవేశించారు. అప్పుడు ‘అబ్దుర్ర’హ్మాన్‌ బిన్‌ ఉమ్ముల్‌  ‘హకమ్‌ ‘ఖు’త్బాహ్ కూర్చొని ఇస్తున్నారు. అది చూసి అతను ఈ నీచుడ్ని చూడండి, కూర్చొని ‘ఖు’త్బా ఇస్తున్నాడు. కాని అల్లాహ్‌ ఆదేశం ఇలా ఉంది: ”మరియు (ఓ ము’హమ్మద్‌!) వారు వ్యాపారాన్నిగానీ లేదా వినోదక్రీడను గానీ చూసి నప్పుడు, నిన్ను నిలబడివున్న స్థితిలోనే వదలి పెట్టి, దాని చుట్టు గుమిగూడుతారు.” [184] (సూ. అల్‌ జుమ’అహ్‌, 62:11) (ముస్లిమ్‌)

1417 – [ 17 ] (صحيح ) (1/444)

وَعَنْ عَمَارَةَ بْنِ رُوَيْبَةَ: أَنَّهُ رَأَى بِشْرَ بْنَ مَرْوَانَ عَلَى الْمِنْبَرِ رَافِعًا يَدَيْهِ فَقَالَ: قَبَّحَ اللهُ هَاتَيْنَئِ الْيَدَيْنِ لَقَدْ رَأَيْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم مَا يَزِيْدُ عَلَى أَنْ يَّقُوْلَ بِيَدِهِ هَكَذَا وَأَشَارَ بِأَصْبَعِهِ الْمُسَبِّحَةِ. رَوَاهُ مُسْلِمٌ .

1417. (17) [1/444దృఢం]

‘అమారహ్‌ బిన్‌ రువైబహ్‌ (ర) కథనం: అతను బిష్ర బిన్‌ మర్వాన్‌ను మెంబరుపై రెండుచేతులు ఎత్తటం చూసి, అల్లాహ్‌(త) రెండుచేతులను నాశనం చేయుగాక, ప్రవక్త (స) మెంబరుపై ఒక చేయి ఎత్తటం, ఒకవేలుతో సైగ చేయడం నేను చూశాను. [185] (ముస్లిమ్‌)

1418 – [ 18 ] ( ضعيف ) (1/444)

وَعَنْ جَابِرٍ قَالَ:لَمَّا اسْتَوَى رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم يَوْمَ الْجُمُعَةِ عَلَى الْمِنْبَرِ قَالَ:”اجْلِسُوْا”فَسَمِعَ ذَلِكَ ابْنُ مَسْعُوْدٍ فَجَلَسَ

عَلَى  بَابِ الْمَسْجِدِ فَرَآهُ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم فقال: “تَعَالَ يَا عَبْدَ اللهِ بْنَ مَسْعُوْدٍ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ.

1418. (18) [1/444బలహీనం]

జాబిర్‌ (ర) కథనం: ఒకసారి ప్రవక్త (స) జుమ’అహ్ రోజు నిశ్చింతగా మెంబరుపై కూర్చున్నారు. ప్రజలు నిల్చొని ఉండటం చూసి, ప్రవక్త (స), ‘కూర్చోండి’ అని అన్నారు. ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ మస్‌’ఊద్‌ ఆ పదాన్ని వినగానే మస్జిద్‌ తలుపు వద్ద కూర్చుండి పోయారు. ప్రవక్త (స) అతను మస్జిద్‌ తలుపు వద్ద కూర్చొని ఉండటం చూసి ‘అబ్దుల్లాహ్‌! లోపలికిరా! అని అన్నారు. [186] (అబూ దావూద్‌)

1419 – [ 19 ] ( ضعيف ) (1/445)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَنْ أَدْرَكَ مِنَ الْجُمُعَةِ رَكْعَةً فَلْيَصِلْ إِلَيْهَا أُخْرَى وَمَنْ فَاتَتْهُ الرَّكْعَتَانِ فَلْيُصَلِّ أَرْبَعًا”. أَوْقَالَ: “الظُّهْرَ”. رَوَاهُ الدَّارَقُطْنِيُّ .

1419. (19) [1/445బలహీనం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) జుమ’అహ్ ఒక రకా’తు లభించిన వారు మరో రకాతు చదువు కోవాలి, జుమ’అహ్ 2 రకాతులు తప్పిన వారు 4 రకా’తులు చదువుకోవాలి అంటే ”జుహ్‌ర్‌ నమా’జు చదువుకోవాలి అని ప్రవచించారు. [187] (దారు ఖుతునీ)

=====

46 –  بَابُ صَلَاةِ الْخَوْفِ

46. భయాందోళనలలో నమాజు

భయం అంటే అపాయం, ఆందోళన, శత్రువుల నుండి అపాయం ఉన్నప్పుడు, నమా’జు స్థితిలో వారు దాడి చేస్తారని భయం ఉన్నప్పుడు నమా’జు చదివే పద్ధతి ఏమిటంటే. ”ఇమాము ప్రజలను రెండు వర్గాలుగా చేయాలి. ఒక వర్గం ఇమాము వెనుక నిలబడాలి. మరో వర్గం శత్రువులవైపు తిరిగి దాడి చేయకుండా చూస్తూ ఉండాలి. ఇమాము వెనుక ఉన్న బృందం ఒక (మొదటి) రక’అతు చదివి, శత్రువులకు ఎదురొడ్డి నిలబడాలి. శత్రువులకు ఎదురుగా ఉన్న బృందం వచ్చి ఇమాముతో కలసి ఒక (రెండవ) రక’అతు చదివి తిరిగి వెళ్ళిపోవాలి. ముందు వెళ్ళిన బృందం తిరిగి వచ్చి, తమ మిగిలిన (రెండవ) రకాతు ఒంటరిగా చదువుకొని ఇమాముతో కలసి సలామ్‌ పలకాలి. రెండవ బృందం తిరిగి వచ్చి తమ (మొదటి) రకాతును ఒంటరిగా పూర్తిచేసుకోవాలి.

‘హదీసు’ల్లో సలాతుల్‌ ‘ఖౌఫ్‌ అనేక విధాలుగా ఉంది. అవసరాన్ని బట్టి వివిధ పద్ధతులు ఉపయోగించ వచ్చును. (తిర్మిజి’, అబూ దావూద్‌)

‘హాకిమ్‌, అ’హ్మద్‌, నసాయి’, ఇబ్నె మాజహ్ లో ఇలా ఉంది, ” ‘గత్‌ఫాన్‌ యుద్ధంలో ప్రవక్త (స) ”జుహ్ర్‌ నమా’జు చదివించారు. నమా’జు చదివిన తర్వాత అప్పటికి ఇంకా ఇస్లామ్‌ స్వీకరించని ‘ఖాలిద్‌ బిన్‌ వలీద్‌ తన అవిశ్వాస మిత్రులతో ‘ముస్లిములు నమా ‘జులో ఉన్నప్పుడు మంచి అవకాశం చేజిక్కి జారి పోయింది,’ అని అన్నారు. దానికి మిత్రులు ‘విచారించవలసిన అవసరం లేదు. మరికొంత సేపటిలో నమా’జు సమయం అవుతుంది. అప్పుడు వెనుకనుండి దాడి చేద్దాం’ అని పథకం వేసుకున్నారు. అప్పుడు అల్లాహ్‌ ‘అస్ర్‌’ నమా’జుకు ముందు ఈ నమా’జు గురించి ఆదేశించాడు: ”మరియు మీరు భూమిలో ప్రయాణం చేసేటపుడు నమాజులను సంక్షిప్తం (ఖ’స్ర్‌) చేస్తే, అది పాపం కాదు. (అంతేగాక) సత్య-తిరస్కారులు మిమ్మల్ని వేధిస్తారు అనే భయం మీకు కలిగినపుడు కూడా! ఎందుకంటే, సత్య- తిరస్కారులు నిశ్చయంగా, మీకు బహిరంగ శత్రువులు. మరియు నీవు (ఓ ప్రవక్తా!) వారి (ముస్లింల) మధ్య ఉండి (పోరాటం జరుగుతూ ఉండగా) నమా’జ్‌ చేయించడానికి వారితో నిలబడితే, వారిలోని ఒక వర్గం నీతోపాటు నిలబడాలి. మరియు వారు అస్త్రధారులై ఉండాలి. వారు తమ సజ్‌దాను పూర్తి చేసుకొని వెనక్కి వెళ్ళిపోవాలి. అప్పుడు ఇంకా నమా’జ్‌ చేయని రెండోవర్గం వచ్చి నీతోపాటు నమా’జ్‌ చేయాలి. వారు కూడా జాగరూకులై ఉండి, తమ ఆయుధాలను ధరించి ఉండాలి. ఎందుకంటే, మీరు మీ ఆయుధాల పట్ల, మరియు మీ సామగ్రి పట్ల, ఏ కొద్ది అజాగ్రత్త వహించినా మీపై ఒక్క సారిగా విరుచుకుపడాలని సత్య-తిరస్కారులు కాచుకొని ఉంటారు. అయితే, వర్షం వల్ల మీకు ఇబ్బందిగా ఉంటే! లేదా మీరు అస్వస్థులైతే, మీరు మీ ఆయుధాలను దించి పెట్టడం పాపం కాదు. అయినా మీ జాగ్రత్తలో మీరు ఉండాలి. నిశ్చయంగా, అల్లాహ్‌ సత్య-తిరస్కారుల కొరకు అవమాన-కరమైన శిక్షను సిధ్ధపరచి ఉంచాడు. ఇక నమా’జ్‌ను పూర్తిచేసిన తరువాత నిలుచున్నా, కూర్చున్నా, పరుండినా, అల్లాహ్‌ను స్మరిస్తూ ఉండండి. కాని శాంతి భద్రతలు నెలకొన్న తరువాత నమా’జ్‌ను స్థాపించండి. నిశ్చయంగా, నమా’జ్‌ విశ్వాసులకు నియమిత సమయాలలో పాటించటానికి విధిగా నియమించ బడింది. ” (సూ. అన్నిసా, 4:101-103)

ఈ ఆయతులు అవతరించబడిన తరువాత ప్రవక్త (స) ఈ నమా’జు చదివి ఇలా చదవాలని చూపించారు. ఖుర్‌ ఆన్‌లో సలాతుల్‌ ‘ఖౌఫ్‌కు చెందిన ఒక్క పద్ధతి ఖుర్‌ఆన్‌ లో పేర్కొనడం జరిగింది. కాని అవసరాన్నిబట్టి వివిధ పద్ధతులను ఉపయోగించవచ్చును. దీన్ని గురించి పూర్తి వివరాలు అబూ దావూద్‌లో ఉన్నాయి. అబూ దావూద్ ప్రతి ఒక్క విధానానికి ఒక అధ్యాయం పేర్కొన్నారు. మిష్కాత్ రచయిత ఒకటి, రెండు విధానాలను పేర్కొన్నారు. వాటి అనువాదం ముందు పేజీల్లో వస్తుంది.

اَلْفَصْلُ الْأَوَّلُ మొదటి విభాగం   

1420 – [ 1 ] ( صحيح ) (1/446)

عَنْ سَالِمِ بْنِ عَبْدِ اللهِ بْنِ عُمَرَ عَنْ أَبِيْهِ قَالَ: غَزَوْتُ مَعَ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم قِبَلَ نَجْدٍ فَوَازَيْنَا الْعَدُوَّ فَصَافَفْنَا لَهُمْ فَقَامَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم يُصَلِّيْ لَنَا فَقَامَتْ طَّائِفَةٌ مَّعَهُ وَأَقْبَلَتْ طَائِفَةٌ عَلَى الْعَدُوِّ وَرَكَعَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم بِمَنْ مَّعَهُ وَسَجَدَ سَجْدَتَيْنِ ثُمَّ انْصَرَفُوْا مَكَانَ الطَّائِفَةِ الَّتِيْ لَمْ تُصَلِّ فَجَاؤُوْا فَرَكَعَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم بِهِمْ رَكْعَةً وَّسَجَدَ سَجْدَتَيْنِ وَرَوَى نَافِعٌ نَحْوَهُ وَزَادَ: فَإِنْ كَانَ خَوْفٌ هُوَ أَشَدُّ مِنْ ذَلِكَ صَلَّوْا رِجَالًا قِيَامًا عَلَى أَقْدَامِهِمْ أَوْ رُكْبَانًا مُّسْتَقْبِلِيْ الْقِبْلَةِ أَوْ غَيْرَ مُسْتَقْبِلِيْهَا. قَالَ نَافِعٌ: لَا أُرَى ابْنُ عُمَرَ ذَكَرَ ذَلِكَ إِلَّا عَنْ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم. رَوَاهُ الْبُخَارِيُّ.

1420. (1) [1/446దృఢం]

సాలిమ్‌ బిన్ ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘ఉమర్‌ (ర) తన తండ్రి ద్వారా కథనం: ‘నేనుప్రవక్త (స)తో కలసి జిహాద్‌ కోసం నజ్‌ద్‌ వెళ్ళాను. మేము శత్రువుల ఎదురుగా పంక్తులు కట్టాము. ప్రవక్త (స) మాకు నమా’జ్‌ చదివించటానికి నిలబడ్డారు. మాలో ఒక వర్గం ప్రవక్త (స) తో కలసి నమా’జ్‌ చదవడానికి నిలబడింది. ఒక వర్గం శత్రువుల వైపు తిరిగి నిలబడింది. అనంతరం ప్రవక్త (స) మొదటి వర్గం వారితో, రుకూ’ 2 సజ్దాలుచేశారు. ఒక రకాతు చదివిన తరువాత వారు, రెండవ వర్గంవారు ఉన్నచోటికి వచ్చిశత్రువులకు అభిముఖంగా నిలబడ్డారు. రెండవ వర్గం వారు ప్రవక్త (స) వెనుకకు వచ్చారు. ప్రవక్త (స) వారికి రెండవ రకా’తు చదివించి, సలామ్‌ పలికారు. దీనితో ప్రవక్త (స) రెండు రకాతులు పూర్తయ్యాయి. తరువాత వారిలో ప్రతి ఒక్కరు ఒంటరిగా ఒక రకాతు చదివి సలామ్‌ పలికారు.

నాఫె ఈ విధంగా ఉల్లేఖించారు. అయితే ఇది అధికంగా ఉంది, ”ఒకవేళ ఇంకా పరిస్థితి ఉద్రిక్తంగా ఉంటే ప్రజలు తాము ఉన్నచోటే నిలబడి నమా’జు చదువుకోవాలి. వాహనంపై ఉన్నవారు వాహనంపైనే నమా’జు చదువుకోవాలి. ఖిబ్లావైపు ఉన్నా లేక పోయినా ఫర్వాలేదు. ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘ఉమర్‌ (ర) ఈ ‘హదీసు’ను ప్రవక్త (స) ద్వారా ఉల్లేఖించారని నా అభిప్రాయం అని నాఫె పేర్కొన్నారు. (బు’ఖారీ)

1421 – [ 2 ] ( متفق عليه ) (1/446)

وَعَنْ يَزِيْدِ بْنِ رُوْمَانَ عَنْ صَالِحٍ بْنِ خَوَّاتٍ عَمَّنْ صَلّى مَعَ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم يَوْمَ ذَاتِ الرِّقَاعِ صَلَاةَ الْخَوْفِ: أَنَّ طَائِفَةً صَفَّتْ مَعَهُ وَطَائِفَةً وِّجَاهَ الْعَدُوِّ فَصَلَّى بِالَّتِيْ مَعَهُ رَكْعَةً ثُمَّ ثَبَتَ قَائِمًا وَأَتَمُّوْا لِأَنْفُسِهِمْ ثُمَّ انْصَرَفُوْا فَصَفُّوْا وِجَاهَ الْعَدُوِّوَجَاءَتِ الطَّائِفَةُ الْأُخْرَى فَصَلَّى بِهِمُ الرَّكْعَةَ الَّتِيْ بَقِيَتْ مِنْ صَلَاتِهِ ثُمَّ ثَبَتَ جَالِسًا وَأَتَمُّوْا لِأَنْفُسِهِمْ ثُمَّ سَلَّمَ بِهِمْ وَأَخْرَجَ الْبُخَارِيُّ بِطَرْيِقٍ آخَرَعَنِ الْقَاسِمِ عَنْ صَالِحِ بْنِ خَوَّاتٍ عَنْ سَهْلِ بْنِ أَبِيْ حَثْمَةَ عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم.

1421. (2) [1/446ఏకీభవితం]

య’జీద్‌ బిన్‌ రూమాన్‌ ‘సాలిహ్‌ బిన్‌ ‘ఖవ్వాత్‌ ద్వారా కథనం: ఇంకా అతను ప్రవక్త (స)తో కలసి జాతు-ర్రిఖా’ పోరాటంలో సలాతుల్‌-‘ఖౌఫ్‌ చదివిన వ్యక్తి ద్వారా ఉల్లేఖిస్తున్నారు, అంటే సహ్‌ల్‌ బిన్‌ అబీ ఖస్మ్‌ కథనం: ”ఒక వర్గం ప్రవక్త (స)తో కలసి నమా’జు చదవడానికి పంక్తులు కట్టారు. మరో వర్గం శత్రువులకు వ్యతిరేకంగా నిలబడిఉంది. ప్రవక్త (స) ఈ వర్గాన్ని ఒకరకాతు నమా’జు చదివించారు. ఒక రకాతు చదివిన తర్వాత ప్రవక్త (స) నిలబడ్డారు. ప్రవక్త (స) వెనుక ఉన్న వారు మిగిలిన ఒక రకా’తు ఒంటరిగా చదువుకొని శత్రువులవైపు వెళ్ళి నిలబడ్డారు. రెండవ వర్గం ప్రవక్త వెనుక వచ్చి నిలబడింది. ప్రవక్త (స) వారికి మిగిలిన ఒక రకా’తు చదివించి కూర్చున్నారు. వాళ్ళు ఒంటరిగా ఒక రకా’తు పూర్తిచేసుకొని కూర్చున్నారు. అత్తహి య్యాతు, దరూద్‌ చదివి అందరూ సలామ్‌ పలికారు. (బు’ఖారీ, ముస్లిమ్‌)

1422 – [ 3 ] ( متفق عليه ) (1/447)

وَعَنْ جَابِرٍ قَالَ: أَقْبَلْنَا مَعَ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم حَتَّى إِذَا كُنَّا بِذَاتِ الرِّقَاعِ قَالَ: كُنَّا إِذَا أَتَيْنَا عَلَى شَجَرَةٍ ظِلِيْلَةٍ تَرَكْنَاهَا لِرَسُوْلِ اللهِ صلى الله عليه وسلم قَالَ: فَجَاءَ رَجُلٌ مِّنَ الْمُشْكِيْنَ وَسَيْفُ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم مُعَلَّقٌ بِشَجَرَةٍ فَأَخَذَ سَيْفَ نَبِيَّ اللهِ صلى الله عليه وسلم فَاخْتَرَطَهُ. فَقَالَ لِرَسُوْلِ اللهِ صلى الله عليه وسلم: أَتَخَافُنِيْ؟ قَالَ: ” لَا”. قَالَ: فَمَنْ يَّمْنَعُكَ مِنِّيْ؟ قَالَ: “اللهُ يَمْنَعُنِيْ مِنْكَ”. قَالَ: فَتَهَدَّدَهُ أَصْحَابُ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم فَغَمَّدَ السَّيْفَ وَعَلَّقَهُ قَالَ: فَنُوْدِيَ بِالصَّلَاةِ فَصَلَّى بِطَائِفَةٍ رَكْعَتَيْنِ ثُمَّ تَأَخَّرُوْا وَصَلَّى بِالطَّائِفَةِ الْأُخْرَى رَكْعَتَيْنِ قَالَ: فَكَانَتْ لِرَسُوْلِ اللهِ صلى الله عليه وسلم أَرْبَعُ رَكْعَاتٍ وَلِلْقَوْمِ رَكْعَتَانِ .

1422. (3) [1/447ఏకీభవితం]

జాబిర్‌ (ర) కథనం: మేము ప్రవక్త (స) వెంట జిహాద్‌ కోసం బయలుదేరాము. జా’తు-ర్రిఖా’అ చేరిన తర్వాత ఒక నీడ ఉన్న చెట్టు వద్దకు వచ్చాము. ఆ నీడగల చెట్టును ప్రవక్త (స) కోసం వదలివేశాము. ప్రవక్త (స) దాని క్రింద విశ్రాంతి తీసుకుంటారని. ప్రవక్త (స) ఆ చెట్టుక్రింద విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇంతలో ఒక అవిశ్వాసి వచ్చి, చెట్టుపై వ్రేలాడుతున్న కరవాలాన్ని తీసుకొని, ఒరలో నుండి కరవాలాన్ని తీసి, ‘నాకు భయపడతావా లేదా?’ అని ప్రవక్త(స)ను హెచ్చరించాడు. ప్రవక్త (స), ‘నేను నీకు భయపడను.’ అన్నారు. ఆ అవిశ్వాసి మళ్ళీ, ‘ఇప్పుడు నిన్ను నా నుండి ఎవరు రక్షిస్తారు?’ అని అన్నాడు. ప్రవక్త (స) ‘నన్ను నీ నుండి అల్లాహ్‌ రక్షిస్తాడు’ అని అన్నారు. ఆ తరువాత అనుచరులు ఆ అవిశ్వాసిని హెచ్చరించారు. ఆ వ్యక్తి కరవాలాన్ని ఒరలో పెట్టి చెట్టుకు ఇంతకు ముందు ఉన్నట్లు వ్రేలాడగట్టాడు. ఇంతలో నమా’జుకు అజా’న్‌ ఇవ్వబడింది. ప్రవక్త (స) ఒక బృందానికి రెండు రకా’తులు నమా’జు చది వించారు. ఆ బృందం వెళ్ళిపోయింది. మరో బృందం వచ్చింది. ప్రవక్త (స) దానికి కూడా రెండు రకాతులు చదివించారు. ప్రవక్త(స) 4 రక’అతులు చదివారు. అనుచరులు 2 రక’అతులు చదివారు. [188]  (బు’ఖారీ, ముస్లిమ్‌)

1423 – [ 4 ] ( صحيح ) (1/448)

وَعَنْ جَابِرٍ قَالَ: صَلَى رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم صَلَاةَ الْخَوْفِ فَصَفَفْنَا خَلْفَهُ صَفَّيْنِ وَالْعَدُوُّ بَيْنَنَا وَبَيْنَ الْقِبْلَةِ فَكَبَّرَ النَّبِيُّ صلى الله عليه وسلم. وَكَبَّرْنَا جَمِيْعًا ثُمَّ رَكَعَ وَرَكَعْنَا جَمِيْعًا ثُمَّ رَفَعَ رَأْسَهُ مِنَ الرُّكُوْعِ وَرَفَعْنَا جَمِيْعًا. ثُمَّ انْحَدَرَ بِالسُّجُوْدِ وَالصَّفُّ الَّذِيْ يَلِيْهِ وَقَامَ الصَّفُ الْمُؤَخَّرُ فِيْ نَحْرِ الْعُدُوِّ فَلَمَّا قَضَى النَّبِيُّ صلى الله عليه وسلم السُّجُوْدَ وَقَامَ الصَّفُّ الَّذِيْ يَلِيْهِ انْحَدَرَ الصَّفُّ الْمُؤَخَّرُ بِالسُّجُوْدِ ثُمَّ قَامُوْا ثُمَّ تَقَدَّمَ الصَّفُّ الْمُؤَخَّرُ وَتَأَخَّرَ الْمُقَدِّمُ ثُمَّ رَكَعَ النَّبِيُّ صلى الله عليه وسلم وَرَكَعْنَا جَمِيْعًا ثُمَّ رَفَعَ رَأْسَهُ مِنَ الرُّكُوْعِ وَرَفَعْنَا جَمِيْعًا ثُمَّ انْحَدَرَ بِالسُّجُوْدِ وَالصَّفُ الَّذِيْ يَلِيْهِ الَّذِيْ كَانَ مُؤَخِرًّا فِيْ الرَّكْعَةِ الْأَوْلَى وَقَامَ الصَّفُّ الْمُؤَخِّرُ فِيْ نَحْرِ الْعُدُوِّ فَلَمَّا قَضَى النَّبِيُّ صلى الله عليه وسلم اَلسُّجُوْدَ وَالصَّفُّ الَّذِيْ يَلِيْهِ انْحَدَرَ الصَّفُّ الْمُؤَخِّرُ بِالسُّجُوْدِ فَسَجَدُوْا ثُمَّ سَلَّمَ النَّبِيُّ صلى الله عليه وسلم وَسَلَّمْنَا جَمِيْعًا. رَوَاهُ مُسْلِمٌ .

1423. (4) [1/448దృడం]

జాబిర్‌ (ర) కథనం: ప్రవక్త (స) మాకు సలాతుల్‌ ‘ఖౌఫ్‌ చదివించాలని సంకల్పించుకున్నారు. మేము, ప్రవక్త (స) వెనుక రెండు పంక్తులుగా నిలబడ్డాము. శత్రువులు మాకూ ఖిబ్లాకు మధ్య ఉన్నారు. ప్రవక్త (స) తక్‌బీరె త’హ్రీమ పలికారు. మేమందరం తక్‌బీరె త’హ్రీమ పలికాము. ప్రవక్త (స) ఖిరా’అత్‌ చేసిన తర్వాత రుకూ’ చేశారు. మేమందరం రుకూ’ చేశాము. ప్రవక్త (స) రుకూ’ నుండి తల ఎత్తారు. మేము కూడా రుకూ’ నుండి తల ఎత్తాము. ఆ తరువాత ప్రవక్త (స) సజ్దా చేశారు. ప్రవక్త (స) వెనుక ఉన్న పంక్తి కూడా సజ్దా చేసింది. దాని వెనుక ఉన్నపంక్తి శత్రువులకు ఎదురుగా నిలబడింది. అంటే వాళ్ళు సజ్దా చేయలేదు. ప్రవక్త (స) మొదటి రకా’తు సజ్దా చేసిన తరువాత, ప్రవక్త (స) వెనుక ఉన్నపంక్తి నిలబడింది. అప్పుడు వెనుక ఉన్నపంక్తి సజ్దా కోసం వంగి సజ్దా చేసింది. ఆ తరువాత నిలబడింది. వెనుక ఉన్న పంక్తి ముందుకు వచ్చింది, ముందు ఉన్న పంక్తి వెనుకకు తగ్గింది. మళ్ళీ ప్రవక్త (స) రెండవ రకా’తు కోసం రుకూ’ చేశారు. మేమందరం రుకూ’ చేశాము. ఆ తరువాత ప్రవక్త (స) రుకూ’ నుండి తల ఎత్తారు. మేమందరం తల ఎత్తాము. ప్రవక్త (స) సజ్దా చేశారు. మొదటి రకాతులో వెనుక ఉన్న పంక్తి కూడా సజ్దా చేసింది. వెనుక ఉన్న పంక్తి శత్రువులను గమనిస్తూ నిలబడింది. ప్రవక్త (స) సజ్దాలు చేశారు. ప్రవక్త (స) వెనుక ఉన్నపంక్తి కూడా సజ్దా చేసింది. తరువాత వెనుక ఉన్న పంక్తి కూడా సజ్దా చేసింది. రెండు సజ్దాలు చేసింది. ఆ తరువాత ప్రవక్త (స) సలామ్‌ పలికారు, మేము కూడా సలామ్‌ పలికాము. [189](ముస్లిమ్‌)

—–

اَلْفَصْلُ الثَّانِيْ  రెండవ విభాగం 

1424 – [ 5 ] ( ضعيف ) (1/448)

عَنْ جَابِرٍ: أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم كَانَ يُصَلِّيْ بِالنَّاسِ صَلَاةَ الظُّهْرِ فِيْ الْخَوْفِ بِبَطَنِ نَخْلٍ فَصَلَّى رَكْعَتَيْنِ ثُمَّ سَلَّمَ ثُمَّ جَاءَ طَائِفَةٌ أُخْرَى فَصَلَّى بِهِمْ رَكْعَتَيْنِ ثُمَّ سَلَّمَ. رَوَاهُ فِيْ”شَرْحِ السُّنَّةِ”.

1424. (5) [1/448బలహీనం]

జాబిర్‌ (ర) కథనం: ప్రవక్త (స) బ’త్‌న్ అన్ న’ఖ్ల్‌లో ప్రజలకు ”జుహ్‌ర్‌ నమా’జు చదివించారు. ఇది భయాందోళనల పరిస్థితిలో చదవబడింది. ప్రవక్త (స) ఒక బృందానికి 2 రక’అతులు నమా’జు చదివించి సలామ్‌ పలికారు. మళ్ళీ రెండవ బృందానికి 2 రక’అతులు నమా’జు చదివించారు. సలామ్‌ పలికారు. [190] (షర్‌’హుస్సున్నహ్‌)

—–

اَلْفَصْلُ الثَّالِثُ  మూడవ విభాగం 

1425 – [ 6 ] ( صحيح ) (1/449)

عَنْ أَبِيْ هُرَيْرَةَ: أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم نَزَلَ بَيْنَ ضَجْنَانَ وَعُسْفَانَ. فَقَالَ الْمُشْرِكُوْنَ: لهَؤُلَاءِ صَلَاةٌ هِيَ أَحَبُّ إِلَيْهِمْ مِّنْ آبَائِهِمْ وَأَبْنَائِهِمْ وَهِيَ الْعَصْرُ فَأَجْمَعُوْا أَمْرَكُمْ فَتَمِيْلُوْا عَلَيْهِمْ مَّيْلَةً وَّاحِدَةً. وَإِنَّ جِبْرِيْلَ أَتَى النَّبِيَّ صلى الله عليه وسلم فَأَمَرَهُ أَنْ يَّقْسِمَ أَصْحَابَهُ شَطْرَيْنِ فَيُصَلِّيْ بِهِمْ وَتَقُوْم طَائِفَةٌ أُخْرَى وَرَاءَهُمْ وَلْيَأْخُذُوْا حِذْرَهُمْ وَاسْلِحَتَهُمْ فَتَكُوْنُ لَهُمْ رَكْعَةٌ وَلِرَسُوْلِ اللهِ صلى الله عليه وسلم رَكْعَتَانِ . رَوَاهُ التِّرْمِذِيُّ وَالنَّسَائِيُّ .

1425. (6) [1/449దృఢం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ‘దజ్‌నాన్‌, మరియు ‘ఉస్‌ఫాస్‌ల మధ్య దిగారు. విశ్రాంతి తీసు కున్నారు. అక్కడి అవిశ్వాసులు ఈ ముస్లింల వద్ద ఒక నమా’జు ఉంది. అది వారికి తల్లిదండ్రులు, సంతా నం కంటే ప్రియమైనది. అది ‘అస్ర్‌’ నమా’జు. మీరు సిద్ధంగా ఉండండి. నమా’జు స్థితిలో ఒక్కసారిగా వారిపై దాడిచేద్దాం’ అని కుట్ర పన్నారు. జిబ్రీల్‌ (అ) ప్రవక్త (స) వద్దకు వచ్చి, ప్రవక్త (స)ను తన అనుచరులను 2 బృందాలుగా విభజించారు, అంటే ఒక బృందానికి నమా’జు చదివించారు, రెండో బృందాన్ని శత్రువులకు ఎదురుగా నిలబెట్టారు. వారు సాయుధులై ఉన్నారు. ప్రవక్త (స) ఆ రెండు బృందాలకు ఒక్కొక్క రకా’తు చదివించారు. వారు రెండవ రకా’తు పూర్తిచేసు కున్నారు. (తిర్మిజి’, నసాయి’)

=====

47 – بَابُ صَلَاةِ الْعِيْدَيْنِ

47. రెండు పండుగల (‘ఈదైన్‌) నమాజు

‘ఈద్‌ అంటే ఎల్లప్పుడూ తిరిగి వచ్చేది. ప్రతి సంవ త్సరం తిరిగి వస్తుంది కనుక దాన్ని’ఈద్‌ అంటారు. సంవత్సరానికి రెండు పండుగలు ఉన్నాయి. 1. ‘ఈదుల్‌ ఫి’త్ర్‌. రమ’దాన్‌ నెలంతా ఉపవాసాలు పాటించిన తరువాత షవ్వాల్‌ 1వ తేదీన జరుపు కుంటారు. 2. ‘ఈదుల్‌ అ’ద్హా. ఇది జి’ల్‌ ‘హిజ్జహ్‌ 10వ తేదీన జరుపుకుంటారు.

ఇది సంతోషకరమైన దినం. అనస్‌ (ర) కథనం: ప్రవక్త (స) హిజ్రత్‌ చేసి మదీనహ్ వచ్చిన తరువాత మదీనహ్ ముస్లింలు పండుగరోజు జరుపుకోవటాన్ని చూసి, ‘ఇదేమిటి’ అని అన్నారు. దానికి వారు ”చాలా కాలం నుండి ఈ దినాలలో మేము పండుగ జరుపుకుంటున్నాము,” అని అన్నారు. దానికి ప్రవక్త (స) అల్లాహ్‌ మీకు ఈ దినాల కంటే ఉత్తమమైన రెండు దినాలను నిర్ణయించాడు. మీరు ఈ దినాల్లో సంతోషాలు పంచుకోండి. 1. ‘ఈదుల్‌ ఫి’త్ర్‌ 2. ‘ఈదుల్‌ అ’ద్హా. (అబూ దావూద్‌)

ప్రవక్త (స) ప్రవచనం: ”ప్రతి జాతికి ఒక పండుగ ఉంటుంది. ఇది మన పండుగ. (బు’ఖారీ).

పండుగ రోజు పండుగ నమా’జు కంటే ముందు క్రింది పనులు చేయటం ప్రవక్త సాంప్రదాయం. మిస్వాక్‌ చేయటం, స్నానం చేయటం, సువాసన పులుము కోవటం, మంచి దుస్తులు ధరించటం. పండుగ నమా’జుకు వెళ్ళే ముందు ఖర్జూరాలు తినటం, ఒకవేళ ఖర్జూరాలు లేకపోతే తీపి వస్తువు తిని వెళ్ళటం. దారి మార్చి వెళ్ళడం, రావటం. వెళ్ళే మార్గంలో, ‘ఈద్గాహ్‌లో అత్యధికంగా తక్‌బీర్లు చదవటం, ఊరి వెలుపల మైదానంలో పండుగ నమా’జు చదవటం. ‘ఈద్గాహ్‌కు కాలి నడకన వెళ్ళడం. ‘ఈదుల్‌  అ’ద్హాలో నమా’జు తర్వాత అన్నిటి కంటే ముందు తన ఖుర్‌బానీ మాంసం తినటం. వివరాలు క్రింద పేర్కొనటం జరిగింది.

اَلْفَصْلُ الْأَوَّلُ మొదటి విభాగం   

1426 – [ 1 ] ( متفق عليه ) (1/450)

عَنْ أَبِيْ سَعِيْدِ الْخُدْرِيِّ قَالَ: كَانَ النِّبِيُّ صلى الله عليه وسلم يَخْرُجُ يَوْمَ الْفِطْرِ وَالْأَضْحَى إِلَى الْمُصَلِّىْ فَأَوَّلُ شَيْءٌ يَّبْدَأُ بِهِ الصَّلَاةُ ثُمَّ يَنْصَرِفُ فَيَقُوْمُ مُقَابِلَ النَّاسِ وَالنَّاسُ جُلُوْسٌ عَلَى صُفُوْفِهِمْ فَيَعِظُهُمْ وَيُوْصَيْهِمْ وَيَأْمُرُهُمْ وَإِنْ كَانَ يُرِيْدُ أَنْ يَّقْطَعَ بَعْثًا قَطَعَهُ أَوْ يَأْمُرُ بِشَيْءٍ أَمَرَ بِهِ ثُمَّ يَنْصَرِفُ .

1426. (1) [1/450ఏకీభవితం]

అబూ స’యీద్‌ ‘ఖుద్రీ (ర) కథనం: ప్రవక్త (స) ‘ఈదుల్‌ ఫి’త్ర్‌ మరియు ‘ఈదుల్‌ అ’ద్హాలో ‘ఈద్గాహ్‌కు వెళ్ళి అన్నిటికంటే ముందు నమా’జు ఆచరించిన తరువాత రెండు వైపులు చూస్తూ ‘ఖు’త్బాహ్ ఇస్తారు. ప్రజలు తమతమ పంక్తుల్లో కూర్చొని ఉంటారు. ప్రవక్త (స) వారికి హితబోధ, ఉపదేశంచేస్తారు, ఇంకా అవసరమైన విషయాలను గురించి ఆదేశిస్తారు. ఒకవేళ ఎక్కడికైనా సైన్యం పంపాలని ఉంటే, దాన్ని గురించి ఆదేశించే వారు. ఆ తరువాత తిరిగి వెళ్ళే వారు. (బు’ఖారీ, ముస్లిమ్‌)

1427 – [ 2 ] ( صحيح ) (1/450)

وَعَنْ جَابِرِ بْنِ سَمُرَةَ قَالَ: صَلَّيْتُ مَعَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم اَلْعِيْدَيْنِ غَيْرَ مَرَّةٍ وَّلَا مَرَّتَيْنِ بِغَيْرِ أَذَانٍ وَلَا إِقَامَةٍ. رَوَاهُ مُسْلِمٌ .

1427. (2) [1/450దృఢం]

జాబిర్‌ బిన్‌ సమురహ్‌ (ర) కథనం: ప్రవక్త (స)తో కలసి నేను అనేకసార్లు పండుగ నమా’జులను చదివాను. అయితే అందులో అజా’న్‌ గాని ఇఖామత్‌ గాని ఉండేవి కావు. [191] (ముస్లిమ్‌)

1428 – [ 3 ] ( متفق عليه ) (1/450)

وَعَنِ ابْنِ عُمَرَ قَالَ: كَانَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم وَأَبُوْ بَكْرٍ وَّعُمَرَ يُّصَلُّوْنَ الْعِيْدَيْنِ قَبْلَ الْخُطْبَةِ.

1428. (3) [1/450ఏకీభవితం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘ఉమర్‌ (ర) కథనం: ప్రవక్త (స), అబూ బకర్‌ ‘ఉమర్‌ రెండు పండుగల్లోనూ నమా’జును ఖుత్బాకు ముందు చదివేవారు. (బు’ఖారీ, ముస్లిమ్‌)

1429 – [ 4 ] ( متفق عليه ) (1/450)

وَسُئِلَ ابْنُ عَبَّاسٍ: أَشَهِدْتَّ مَعَ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم اَلْعِيْدَ؟ قَالَ: نَعَمْ خَرَجَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم فَصَلَّى ثُمَّ خَطَبَ وَلَمْ يَذْكُرْ أَذَانًا وَلَا إِقَامَةً ثُمَّ أَتَى النِّسَاءَ فَوَعَظَهُنَّ وَذَكَّرَهُنَّ وَأَمَرَهُنَّ بِالصَّدَقَةِ فَرَأَيْتُهُنَّ يُهْوِيْنَ إِلَى آذَانِهِنَّ وَحُلُوْقِهِنَّ يَدْفَعْنَ إِلَى بِلَالٍ ثُمَّ ارْتَفَعَ هُوَ وَبِلَالٌ إِلَى بَيْتِهِ.

1429. (4) [1/450ఏకీభవితం]

ఇబ్నె ‘అబ్బాస్‌ (ర) కథనం: మీరు ప్రవక్త (స)తో కలసి ‘ఈద్‌ నమా’జు చదివారా?’ అని ప్రశ్నించటం జరిగింది. దానికి అతను అవును, ప్రవక్త (స) ఇంటి నుండి బయలుదేరి ‘ఈద్గాహ్‌ వచ్చారు. రెండు రకాతులు చదివించారు. ఆ తరువాత ‘ఖు’త్బా ఇచ్చారు. అజా’న్‌, ఇఖామత్‌లను గురించి ప్రస్తావించ లేదు. ఆ తరువాత స్త్రీల వద్దకు వచ్చారు. వారికి హితబోధ చేశారు. దానధర్మాలు చేయమని ఆదేశించారు. అప్పుడు స్త్రీలు తమ చేతులను తమ చెవులు, మెడలవైపు తీసుకు వెళ్ళటం నేను చూశాను. కొన్ని ఆభరణాలు తీసి బిలాల్‌కు ఇవ్వ సాగారు. ఆ తరువాత ప్రవక్త (స) బిలాల్‌ (ర) ఇంటికి తిరిగి వచ్చారు. (బు’ఖారీ, ముస్లిమ్‌)

1430 – [ 5 ] ( متفق عليه ) (1/450)

وَعَنِ ابْنِ عَبَّاسٍ: أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم صَلَّى يَوْمَ الْفِطْرِ رَكْعَتَيْنِ لَمْ يُصَلِّ قَبْلَهُمَا وَلَا بَعْدَهُمَا.

1430. (5) [1/450ఏకీభవితం]

ఇబ్నె ‘అబ్బాస్‌ (ర) కథనం: ప్రవక్త (స) ‘ఈదుల్‌ ఫి’త్ర్‌ నాడు రెండు రకాతులు నమా’జు చదివించారు. దానికి ముందు గాని, తరువాత గాని ఏ నమా’జు చదవలేదు. [192] (బు’ఖారీ, ముస్లిమ్‌)

1431 – [ 6 ] ( متفق عليه ) (1/451)

وَعَنْ أُمِّ عَطِيَّةَ رَضِيَ اللهُ عَنْهَا قَالَتْ: أُمِرْنَا أَنْ نَّخْرُجَ الْحُيَّضَ يَوْمَ الْعِيْدَيْنِ وَذَوَاتِ الْخُدُوْرِ فَيَشْهَدْنَ جَمَاعَةَ الْمُسْلِمِيْنَ وَدَعْوَتَهُمْ وَتَعْتَزِلُ الْحُيَّضُ عَنْ مُّصَلَّاهُنَّ.قَالَتِ امْرِأَةٌ :يَا رَسُوْلَ اللهِ إِحْدَاَنَا لَيْسَ لَهَا جِلْبَابٌ؟ قَالَ:”لِتُلْبِسْهَا صَاحِبَتُهَا مِنْ جِلْبَابِهَا”

1431. (6) [1/451ఏకీభవితం]

ఉమ్మె ‘అతియ్య (ర) కథనం: మా లోని బహిష్టు స్థితిలో ఉన్న స్త్రీలు, యువతులు ‘ఈద్గాహ్‌లో హాజరవ్వాలని ఇంకా ముస్లిముల సమావేశంలో, వారి ప్రార్థనల్లో పాల్గొనాలని, బహిష్టురాళ్ళు, నమా’జుకు దూరంగా ఉండాలని ఆదేశించడం జరిగింది. అది విని ఒకస్త్రీ, ఓ ప్రవక్తా! మాలోని కొందరి వద్ద కప్పుకోవ టానికి దుప్పట్లు లేకుంటే ఏమి చేయాలి? అని విన్నవించుకుంది. దానికి ప్రవక్త (స) ఆమె తన మిత్రురాలి వద్ద నుండి అవసరానికి అడిగి తీసుకొని రావాలి’ అని అన్నారు. [193] (బు’ఖారీ, ముస్లిమ్‌)

1432 – [ 7 ] ( متفق عليه ) (1/451)

وَعَنْ عَائِشَةَ قَالَتْ: إِنَّ أَبَا بَكْرٍ دَخَلَ عَلَيْهَا وَعِنْدَهَا جَارِيَتَانِ فِيْ أَيَّامٍ مِّنًى تُدَفِّفَانِ وَتَضْرِبَانِ.

وَفِيْ رِوَايَةٍ: تُغَنِّيَانِ بِمَا تَقَاوَلَتْ الْأَنْصَارُ يَوْمَ بُعَاثَ وَالنَّبِيُّ صلى الله عليه وسلم مُتَغَشٍّ بِثَوْبِهِ فَانْتَهَرَهُمَا أَبُوْ بَكْرٍ فَكَشَفَ النَّبِيُّ صلى الله عليه وسلم عَنْ وَّجْهِهِ فَقَالَ: “دَعْهُمَا يَا أَبَا بَكْرٍ فَإِنَّهَا أَيَّامُ عِيْدٍ

وَّفِيْ رِوَايَةٍ: يَا أَبَا بَكْرٍ إِنَّ لِكُلِّ قَوْمٍ عِيْدًا وَّهَذَا عِيْدُنَا”.

1432. (7) [1/451ఏకీభవితం]

‘ఆయి’షహ్‌ (ర) కథనం: ఆమె తండ్రి అబూ బకర్‌ (ర) ఆమె ఇంటికివచ్చారు. అది ‘ఈదుల్‌ అ’ద్హా దినం. అప్పుడు అక్కడ ఇద్దరు అమ్మాయిలు పండుగ సంతోషంలో డప్పు వాయించుతూ అన్సారులు బు’ఆస్‌’ యుద్ధంలో పలికిన పద్యాన్ని పాడుతున్నారు. ప్రవక్త (స) దుప్పటి కప్పుకొని పడు కున్నారు. అబూ బకర్‌ (ర) ఆ ఇద్దరు అమ్మాయిలను వారించారు. ప్రవక్త (స) తన ముఖంపై నుండి వస్త్రాన్ని తొలగించి ”అబూ బకర్‌! వారిని వదలివేయి. ఎందుకంటే ఈనాడు పండుగ రోజు’ అని అన్నారు. మరో ఉల్లేఖనంలో ”ప్రతి జాతికి ఒక సంతోష కరమైనదినం ఉంది. మన సంతోషం ఈ నాడు” అని అన్నారు. [194] (బు’ఖారీ, ముస్లిమ్‌)

1433 – [ 8 ] ( صحيح ) (1/451)

وَعَنْ أَنَسٍ قَالَ: كَانَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم لَا يَغْدُوْ يَوْمَ الْفِطْرَ حَتَّى يَأْكُلَ تَمَرَاتٍ وَيَأْكُلُهُنَّ وِتْرًا. رَوَاهُ الْبُخَارِيُّ .

1433. (8) [1/451దృఢం]

అనస్‌ (ర) కథనం: ”ప్రవక్త (స) ఈదుల్‌ ఫిత్ర్‌ నాడు పండుగ నమాజుకు ముందు బేసి ఖర్జూరాలు తిని వెళ్ళే వారు.” [195] (బు’ఖారీ)

1434 – [ 9 ] ( صحيح ) (1/451)

وَعَنْ جَابِرٍ قَالَ: كَانَ النِّبِيُّ صلى الله عليه وسلم إِذَا كَانَ يَوْمُ عِيْدٍ خَالَفَ الطَّرِيْقَ. رَوَاهُ الْبُخَارِيُّ .

1434. (9) [1/451దృఢం]

అనస్‌ (ర) కథనం :ప్రవక్త (స) పండుగల్లో ఒక దారి గుండా వెళ్ళి, మరో దారి గుండా వచ్చే వారు. [196] (బు’ఖారీ)

1435 – [ 10 ] ( متفق عليه ) (1/451)

وَعَنْ الْبَرَاءِ قَالَ: خَطَبْنَا النَّبِيُّ صلى الله عليه وسلم يَوْمَ النَّحْرِ فَقَالَ: “إِنَّ أَوَّلَ مَا نَبْدَأُ بِهِ فِيْ يَوْمِنَا هَذَا أَنْ نُّصَلِّيَ ثُمَّ نَرْجِعَ فَنَنْحَرَ. فَمَنْ فَعَلَ ذَلِكَ فَقَدْ أَصَابَ سُنَّتَنَا وَمَنْ ذَبَحَ قَبْلَ أَنْ نُّصَلِّيْ فَإِنَّمَا هُوَ شَاةُ لَحْمٍ عَجَّلَهُ لِأَهْلِهِ لَيْسَ مِنَ النُّسُكِ فِيْ شَيْءٍ”.

1435. (10) [1/451ఏకీభవితం]

బరా’ (ర) కథనం: యౌమున్నహర్  అంటే 10వ తేదీ ‘ఈదుల్‌ అ’ద్హా నాడు ప్రవక్త (స) మాకు ‘ఖు’త్బా ఇచ్చారు. అందులో, ”ఈ రోజు అన్నిటికంటే ముందు మన పని ఈదుల్‌ అ’ద్హా నమా’జు చదవటం, ఆ తరువాత తిరిగి వెళ్ళి ఖుర్‌బానీ ఇవ్వటం. ఇలా చేసిన వారు మా సాంప్రదాయాన్ని అనుసరించినట్లే, నమా’జుకు ముందు ఖుర్‌బానీ ఇచ్చిన వారు ఖుర్‌బానీ ఇవ్వనట్లే. అది భార్యా బిడ్డలకు తినిపించటానికి జ’బహ్‌  చేసినట్లవుతుంది. దీనికి ఖుర్‌బానీకి ఎటువంటి సంబంధం లేదు.”  [197]  (బు’ఖారీ, ముస్లిమ్‌)

1436 – [ 11 ] ( متفق عليه ) (1/451)

وَعَنْ جُنْدُبِ بْنِ عَبْدِ اللهِ الْبَجَلِّيِ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَنْ ذَبَحَ قَبْلَ الصَّلَاةِ فَلْيَذْبَحْ مَكَانَهَا أُخْرَى وَمَنْ لَمْ يَذْبَحْ حَتَّى صَلَّيْنَا فَلْيَذْبَحْ عَلَى اسْمِ اللهِ”.  

1436. (11) [1/451ఏకీభవితం]

జున్‌దుబ్‌ బిన్‌ ‘అబ్దుల్లాహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”నమా’జుకు ముందు జు’బ’హ్‌ చేసిన వారు దాని స్థానంలో మరో జంతువును జు’బ’హ్‌ చేయాలి. మేము నమా’జు చదివే వరకు జు’బ’హ్‌ చేయని వారు నమా’జు తరువాత అల్లాహ్‌(త) పేరుపై జుబ’హ్‌ చేయాలి.” (బు’ఖారీ, ముస్లిమ్‌)

1437 – [ 12 ] ( متفق عليه ) (1/452)

وَعَنِ الْبَرَاءِ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَنْ ذَبَحَ قَبْلَ الصَّلَاةِ فَإِنَّمَا يَذْبَحُ لِنَفْسِهِ وَمَنْ ذَبَحَ بَعْدَ الصَّلَاةِ فَقَدْ تَمَّ نُسْكُهُ وَأَصَابَ سُنَّةَ الْمُسْلِمِيْنَ”.

1437. (12) [1/452ఏకీభవితం]

బరా’ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”నమా’జుకు ముందు జు’బ’హ్‌ చేసిన వారు తమకోసం జు’బ’హ్‌ చేసినట్టే, నమా’జు తర్వాత జు’బ’హ్‌ చేసిన వారు తన ఖుర్బానీ ఇచ్చినట్టు, ముస్లిముల పద్ధతి ప్రకారం ఆచరించినట్టు.” (బు’ఖారీ, ముస్లిమ్‌)

1438 – [ 13 ] ( صحيح ) (1/452)

وَعَنِ ابْنِ عُمَرَ قَالَ: كَانَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم يَذْبَحُ وَيَنْحَرُ بِالْمُصَلَّى. رَوَاهُ الْبَخَارِيُّ .

1438. (13) [1/452దృఢం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘ఉమర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ‘ఈద్గాహ్‌లో జు’బ’హ్‌ చేసే వారు, ఒంటెలను న’హర్‌ చేసే వారు. [198] (బు’ఖారీ)

—–

اَلْفَصْلُ الثَّانِيْ  రెండవ విభాగం 

1439 – [ 14 ] ( صحيح ) (1/452)

عَنْ أَنَسٍ قَالَ: قَدِمَ النَّبِيُّ صلى الله عليه وسلم الْمَدِيْنَةَ وَلَهُمْ يَوْمَانِ يَلْعَبُوْنَ فِيْهِمَا. فَقَالَ: “مَا هَذَانِ الْيَوْمَانِ؟”  قَالُوْا: كُنَّا نَلْعَبُ فِيْهِمَا فِيْ الْجَاهِلِيَّةِ. فَقَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “قَدْ أَبْدَلَكُمُ اللهُ بِهِمَا خَيْرًا مِّنْهُمَا: يَوْمَ الْأَضْحَى وَيَوْمَ الْفِطْرِ”.رَوَاهُ أَبُوْ دَاوُدَ.  

1439. (14) [1/452దృఢం]

అనస్‌ (ర) కథనం: ప్రవక్త (స) మదీనహ్ వచ్చి నప్పుడు మదీనహ్ వారు రెండు పండుగలు జరుపు కునే వారు. వాటిలో వారు సంతోషం, ఉత్సాహం తెలుపుకునే వారు. ప్రవక్త (స) ఈ 2 రోజులు ఏమిటని అడిగారు. దానికి వారు అజ్ఞాన కాలం నుండి మేము ఈ రెండు దినాల్లో పండుగ జరుపుకుంటున్నాం. ‘ఒకటి నౌరోజ్‌, రెండవది మహర్జాన్‌’ అని అన్నారు. అప్పుడు ప్రవక్త (స) ‘ఈ రెండు దినాలకు బదులుగా అల్లాహ్‌ మీకు రెండు ఉత్తమ దినాలను ప్రసాదించాడు. ఒకటి ఈదుల్‌ అ’ద్హా, రెండవది ‘ఈదుల్‌ ఫి’త్ర్‌ అని అన్నారు. [199] (అబూ దావూద్‌)

1440 – [ 15 ] ( صحيح ) (1/452)

وَعَنْ بُرَيْدَةَ قَالَ: كَانَ النَّبِيُّ صلى الله عليه وسلم لَا يَخْرُجُ يَوْمَ الْفِطْرِ حَتَّى يَطْعَمَ وَلَا يَطْعَمُ يَوْمَ الْأَضْحَى حَتَّى يُصَلِّيْ.رَوَاهُ التِّرْمِذِيُّ وَابْنُ مَاجَهُ وَالدَّارَمِيُّ .

1440. (15) [1/452దృఢం]

బురైదహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ‘ఈదుల్‌ ఫి’త్ర్‌లో అల్పాహారం చేసి వెళ్ళేవారు, మరియు ‘ఈదుల్‌ అ’ద్హాలో నమా’జు తర్వాత తినేవారు. (తిర్మిజి’, ఇబ్నె మాజహ్, దార్మీ)

1441 – [ 16 ] ( حسن ) (1/452)

وَعَنْ كَثِيْرِ بْنِ عَبْدِ اللهِ عَنْ أَبِيْهِ عَنْ جَدِّهِ أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم كَبَّرَ فِيْ الْعِيْدَيْنِ فِيْ الْأَوْلَى سَبْعًا قَبْلَ الْقَرَاءَةِ وَفِيْ الْآخِرَةِ خَمْسًا قَبْلَ الْقِرَاءَةِ.رَوَاهُ التِّرْمِذِيُّ وَابْنُ مَاجَهُ وَالدَّارَمِيُّ.

1441. (16) [1/452దృఢం]

కసీ’ర్‌ బిన్‌ ‘అబ్దుల్లాహ్‌ (ర) తన తండ్రి ద్వారా, అతను తన తాత ద్వారా కథనం: ”ప్రవక్త (స) పండు గల నమా’జులో మొదటి రకాతులో ఖిరాఅత్కు ముందు తక్‌బీరె త’హ్రీమ తరువాత 7 తక్‌బీర్లు పలికే వారు. రెండవ రకాతులో ఖిరాఅత్‌కు ముందు 5 తక్‌బీర్లు పలికేవారు. (తిర్మిజి’, ఇబ్నె మాజహ్, దార్మీ)

1442 – [ 17 ] ( ضعيف جدا ) (1/453)

وَعَنْ جَعْفَرِ بْنِ مُحَمَّدٍ مُرْسَلًا أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم وَأَبَابَكْرٍ وَعُمَرَ كَبَّرُوْا فِيْ الْعِيْدَيْنِ وَالْاِسْتَسْقَاءِ سَبْعًا وَّخَمْسًا وَّصَلَّوْا قَبْلَ الْخُطْبَةِ وَجَهَرُوْا بِالْقَرَاءَةِ. رَوَاهُ الشَّافِعِيُّ .

1442. (17) [1/453అతి బలహీనం]

జాఫర్‌ బిన్‌ ము’హమ్మద్‌ (ర) కథనం: ప్రవక్త (స), అబూ బకర్‌ (ర), ‘ఉమర్‌ (ర) ‘ఈదైన్‌ మరియు ఇస్‌తిస్‌ఖా’ నమా’జులో మొదటి రకాతులో 7 తక్‌బీర్లు, రెండవ రకాతు లో 5 తక్‌బీర్లు పలికేవారు. ఖుత్బాకు ముందు నమాజు చదివే వారు. బిగ్గరగా ఖిరా’అత్‌ చేసేవారు. (షాఫయీ)

1443 – [ 18 ] ( ضعيف ) (1/453)

وَعَنْ سَعِيْدِ بْنِ الْعَاصِ قَالَ: سَأَلْتُ أَبَا مُوْسَى وَحُذَيْفَةَ: كَيْفَ كَانَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم يُكَبِّرُ فِيْ الْأَضْحَى وَالْفِطْرِ؟ فَقَالَ أَبُوْ مُوْسَى: كَانَ يُكَبِّرُ أَرْبَعًا تَكْبِيْرَهُ عَلَى الْجَنَائِزِ. فَقَالَ حُذَيْفَةُ: صَدَقَ. رَوَاهُ أَبُوْ دَاوُدَ .

1443. (18) [1/453బలహీనం]

స’యీద్‌ బిన్‌ ‘ఆస్‌ (ర) కథనం: నేను అబూ మూసాను, ‘హుజై’ఫను,  ప్రవక్త (స) ‘ఈదుల్‌ అ’ద్హా మరియు ‘ఈదుల్‌ ఫి’త్ర్‌లో ఎన్ని తక్‌బీర్లు పలికే వారని అడిగాను. దానికి అబూ మూసా (ర) ప్రవక్త (స) 4 తక్‌బీర్లు అంటే జనా’జహ్ నమా’జులో పలికినట్లు పలికేవారని అన్నారు. హుజై’ఫా (ర) ‘అబూ మూసా నిజం చెప్పారు’ అని అన్నారు. [200] (అబూ దావూద్‌)

1444 – [ 19 ] ( ضعيف ) (1/453)

وَعَنِ الْبَرَاءِ أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم نُوِّلَ يَوْمَ الْعِيْدِ قَوْسًا فَخَطَبَ عَلَيْهِ. رَوَاهُ أَبُوْ دَاوُدَ .

1444. (19) [1/453బలహీనం]

బరా’ (ర) కథనం: పండుగ రోజు ప్రవక్త (స)కు ఒక విల్లు ఇవ్వబడేది. దాని సహాయంతో ప్రవక్త (స) ఖుత్బా ఇచ్చేవారు. (అబూ దావూద్‌)

1445 – [ 20 ] ( ضعيف ) (1/453)

وَعَنْ عَطَاء مُّرْسَلًا أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم كَانَ إِذَا خَطَبَ يَعْتَمِدُ عَلَى عَنَزَتِهِ اِعْتِمَادًا. رَوَاهُ الشَّافِعِيُّ .

1445. (20) [1/453బలహీనం]

‘అ’తా కథనం: ప్రవక్త(స) ‘ఖు’త్బాఇచ్చినపుడు తన బల్లెం సహాయంతో నిలబడేవారు. [201] (షాఫ’యీ)

1446 – [ 21 ] ( صحيح ) (1/454)

وَعَنْ جَابِرٍ قَالَ: شَهِدْتُّ الصَّلَاةَ مَعَ النَّبِي صلى الله عليه وسلم فِيْ يَوْمِ عِيْدٍ فَبَدَأَ بِالصَّلَاةِ قَبْلَ الْخُطْبَةِ بِغَيْرِ أَذَانٍ وَلَا إِقَامَةٍ فَلَمَّا قَضَى الصَّلَاةَ قَامَ مُتَّكِئًا عَلَى بِلَالِ فَحَمِدَ اللهَ وَأَثْنَى عَلَيْهِ وَوَعَظَ النَّاسَ وَذَكَّرَهُمْ وَحَثَّهُمْ عَلَى طَاعَتِهِ. ثُمَّ قَالَ: وَمَضَى إِلَى النِّسَاءِ وَمعَهُ بِلَالٌ فَأَمَرَهُنَّ بِتَقَوَى اللهِ وَوَعَظَهُنَّ وَذَكَّرَهُنَّ. رَوَاهُ النَّسَائِيُّ.

1446. (21) [1/454దృఢం]

జాబిర్‌ (ర) కథనం: పండుగ రోజు నేను ప్రవక్త (స)తో కలసి నమా’జు చదివాను. ప్రవక్త (స) అజా’న్‌, ఇఖామత్‌ లు లేకుండా ‘ఖు’త్బా కంటే ముందు నమా’జు ప్రారంభించారు. నమా’జు పూర్తయిన తర్వాత బిలాల్‌ (ర) సహాయంతో నిలబడ్డారు. అనంతరం అల్లాహ్‌(త)ను స్తుతించి, స్తోత్రాలను పఠించి, ప్రజలకు హితబోధ చేశారు. పాప కార్యాల గురించి, పుణ్యకార్యాల గురించి పేర్కొన్నారు. దైవ విధేయత పట్ల ప్రోత్సహించారు. ఆ తరువాత స్త్రీలు ఉన్న చోటికి వెళ్ళారు. ప్రవక్త (స) వెంట బిలాల్‌ కూడా ఉన్నారు. స్త్రీలకు దైవభీతి, దైవభక్తి గురించి ఆదేశించారు. హితబోధ చేశారు. సత్కార్యాలు చేయాలని ప్రోత్సహించారు. (నసాయి’)

1447 – [ 22 ] ( صحيح ) (1/454)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: كَانَ النَّبِيُّ صلى الله عليه وسلم إِذَا خَرَجَ يَ