4 أ – كِتَابُ الصَّلَاةِ
4A. నమా’జు (’సలాహ్) పుస్తకం
ఇస్లామ్ ప్రధాన అంశాల్లో నమా’జు ప్రధాన అంశం. దీన్ని విధించటం జరిగిందని ఖుర్ఆన్, హదీసుల్లో పేర్కొనడం జరిగింది. అల్లాహ్‌ను ఆరాధించే ప్రత్యేక పద్ధతిని నమా’జ్ అంటారు. దీన్ని ప్రవక్త (స) ఆచరించి చూపారు. దీనికి అనేక షరతులు ఉన్నాయి. వీటి గురించి ముందు పేజీల్లో పేర్కొనటం జరిగింది. దీనికి చాలా గొప్ప ప్రత్యేకత ప్రాధాన్యత ఉంది.
—–
اَلْفَصْلُ الْأَوَّلُ మొదటి విభాగం
564 – [ 1 ] ( صحيح ) (1/179)
وَعَنْ أَبِيْ هُرَيْرَةَ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “الصَّلَوَاتُ الْخَمْسُ وَالْجُمُعَةُ إِلَى الْجُمُعَةِ وَرَمَضَانُ إِلَى رَمْضَانِ مُكَفِّرَاتٌ لِمَا بَيْنَهُنَّ إِذَا اِجْتَنَبَتِ الْكَبَائِرَ”. رَوَاهُ مُسْلِمٌ.
564. (1) [1/179–దృఢం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”5 పూటల నమా’జులు, జుము’అహ్ నుండి జుము ’అహ్ వరకు మరియు రమ’దాన్ నుండి రమ’దాన్, మధ్య జరిగే పాపాలు క్షమించబడతాయి. అయితే మహా పాపాలకు పాల్పడనంత వరకు.” [1] (ముస్లిమ్)
565 – [ 2 ] ( متفق عليه ) (1/179)
وَعَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “أَرَأَيْتُمْ لَوْ أَنَّ نَهْرًا بِبَابِ أَحَدِكُمْ يَغْتَسِلُ فِيْهِ كُلَّ يَوْمٍ خَمْسًا هَلْ يَبْقَى مِنْ دَرَنِهِ شَيْءٌ؟ قَالُوْا: لَا يَبْقَى مِنْ دَرَنِهِ شَيْءٌ. قَالَ: فَذَلِكَ مِثْلُ الصَّلَوَاتِ الْخَمْسِ يَمْحُو اللهُ بِهِنَّ الْخَطَايَا”.
565. (2) [1/179–ఏకీభవితం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) తన అనుచరులతో, ‘మీలో ఒకరి ఇంటిముందు కాలువ పారుతుంటే, ప్రతి రోజు 5 సార్లు అందులో స్నానంచేస్తే, అతని శరీరంపై మాలిన్యాలు ఏమైనా ఉంటాయా,’ అని అడిగారు. దానికి అనుచరులు, ‘అటువం టప్పుడు అతని శరీరంపై ఎటువంటి మాలిన్యం ఉండదు,’ అని అన్నారు. దానికి ప్రవక్త (స), ‘5 పూటల నమాజులు కూడా ఇటువంటివే, అల్లాహ్ వీటి ద్వారా చిన్నచిన్న పాపాలను క్షమించివేస్తాడు,’ అని అన్నారు. (బు’ఖారీ, ముస్లిమ్)
566 – [ 3 ] ( متفق عليه ) (1/179)
وَعَنِ ابْنِ مَسْعُوْدٍ قَالَ: إِنَّ رَجُلًا أَصَابَ مِنِ امْرَأَةٍ قُبْلَةً فَأَتَى النَّبِيَّ صلى الله عليه وسلم فَأَخْبَرَهُ فَأَنْزَلَ اللهُ تعالى: (وَأَقِمِ الصَّلَاةَ طَرَفَيِ النَّهَارِ وَزُلَفًا مِّنَ اللَّيْلِ إِنَّ الْحَسَنَاتَ يُذْهِبْنَ السَّيِئَّاتِ؛ 11: 114) فَقَالَ الرَّجُلُ: يَا رَسُوْلَ اللهِ ألي هَذَا؟ قَالَ: “لِجَمِيْعِ أُمَّتِيْ كُلِّهِمْ”. وَفِيْ رِوَايَةِ : “لمِنْ عَمِلَ بِهَا مِنْ أُمَّتِيْ”.
566. (3) [1/179–ఏకీభవితం]
ఇబ్నె-మస్’ఊద్ (ర) కథనం: ఒక వ్యక్తి పరాయి స్త్రీని ముద్దుపెట్టుకున్నాడు. అనంతరం ప్రవక్త (స) వద్దకువచ్చి విన్నవించుకోగా ప్రవక్త (స) మౌనంగా ఉండిపోయారు. అంటే దైవవాణి కోసం వేచి ఉన్నారు. అప్పుడు అల్లాహ్ ఈ వాక్యాన్ని అవతరింపజేశాడు: ”నమాజు స్థాపించండి, పగటి రెండు అంచుల్లో ఉదయం సాయంత్రంలో కూడా. నిస్సందేహంగా సత్కార్యాలు, పాపాలను చెరిపివేస్తాయి.”(సూ. హూద్, 11:114)
అప్పుడు ఆ వ్యక్తి, ‘ఓ ప్రవక్తా! ఈ ఆదేశం నా కోసమా?’ అని విన్నవించుకున్నాడు. దానికి ప్రవక్త (స), ‘ఇది నా అనుచర సమాజం కోసం.’ మరో ఉల్లేఖ నంలో, ‘ఇటువంటి పాపాలకు పాల్పడిన వారందరికీ,’ అని అన్నారు. [2] (బు’ఖారీ, ముస్లిమ్)
567 – [ 4 ] ( متفق عليه ) (1/179)
وَعَنْ أَنَسٍ قَالَ: جَاءَ رَجُلٌ. فَقَالَ يَا رَسُوْلُ اللهِ إِنِّيْ أَصَبْتُ حَدًّا فَأَقِمْهُ عَلَيَّ. قَالَ وَلَمْ يَسْأَلْهُ عَنْهُ. قَالَ وَحَضَرَتِ الصَّلَاةُ فَصَلَّى مَعَ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم. فَلَمَّا قَضَى النَّبِيُّ صلى الله عليه وسلم الصَّلَاةَ قَامَ إِلَيْهِ الرَّجُلُ. فَقَالَ يَا رَسُوْلُ اللهِ إِنِّيْ أَصَبْتُ حَدًّا فَأَقِمْ فِيْ كِتَابِ اللهِ. قَالَ أَلَيْسَ قَدْ صَلَّيْتَ مَعَنَا. قَالَ نَعَمْ. قَالَ فَإِنَّ اللهَ قَدْ غَفَرَ لَكَ ذَنْبَكَ أَوْ قَالَ حَدَّكَ”.
567. (4) [1/179–ఏకీభవితం]
అనస్ (ర) కథనం: ప్రవక్త (స) వద్దకు ఒక వ్యక్తి వచ్చి, ప్రవక్తా! ‘నేను పాపానికి పాల్పడ్డాను. నన్ను శిక్షించండి,’ అని విన్నవించుకున్నాడు. ప్రవక్త (స) ఏమీ మాట్లాడలేదు. ఇంతలో నమా’జు సమయం అయిపోయింది. ఆ వ్యక్తి ప్రవక్త (స) వెంట నమా’జు చదివాడు. నమా’జు తరువాత మళ్ళీ, ‘ప్రవక్తా! నా వల్ల పొరపాటు జరిగిపోయింది. నన్ను శిక్షించండి,’ అని విన్నవించుకున్నాడు. దానికి ప్రవక్త (స), ‘నీవు మాతో కలసి నమా’జు చదవలేదా,’ అని అన్నారు. ‘అవును, చదివాను,’ అని అన్నాడు. అప్పుడు ప్రవక్త (స), అల్లాహ్ (త) నీ పాపాలను క్షమించాడు అని అన్నారు.’ [3] (బు’ఖారీ, ముస్లిమ్)
568 – [ 5 ] ( متفق عليه ) (1/180)
وَعَنْ عَبْدِ اللهِ بْنِ مَسْعُوْدٍ قَالَ: سَأَلْتُ النَّبِيَّ صلى الله عليه وسلم أَيُّ الْأَعْمَالِ أَحَبُّ إِلَى اللهِ قَالَ: “اَلصَّلَاةُ لِوَقْتِهَا”. قُلْتُ ثُمَّ أَيُّ قَالَ: “بِرُّ الْوَالِدَيْنِ”. قُلْتُ ثُمَّ أُيُّ. قَالَ: “اَلْجِهَادُ فِيْ سَبِيْلِ اللهِ”. قَالَ حَدَّثَنِيْ بِهِنَّ وَلَوْ اسْتَزَدْتُّهُ لَزَادَنِيْ .
568. (5) [1/180–ఏకీభవితం]
’అబ్లుల్లాహ్ బిన్ మస్’ఊద్ (ర) కథనం: నేను ప్రవక్త (స)ను, ‘కర్మలన్నిటిలోకెల్లా అల్లాహ్(త)కు అత్యంత ప్రీతికరమైన కర్మ ఏది,’ అని అడిగాను. దానికి ప్రవక్త (స), ‘సమయం కాగానే నమా’జ్ చదవటం అన్నిటి కంటే ఉత్తమమైనది,’ అని అన్నారు. ‘ఆ తరువాత,’ అని అడి గాను. ప్రవక్త (స), ‘తల్లి-దండ్రులకు మేలు చేయటం,’ అని అన్నారు. ‘ఆ తరువాత ఏ కర్మ,’ అని అడిగాను. ప్రవక్త (స), ‘దైవ మార్గంలో పోరాడటం,’ అని అన్నారు. ఈ విషయాలను గురించి నేను అడిగాను. వీటి గురించి ప్రవక్త (స) తెలిపారు. ఒకవేళ నేను ఇంకా అడిగితే ప్రవక్త (స) ఇంకా బోధించేవారు.’ [4] (బు’ఖారీ, ముస్లిమ్)
569 -[ 6 ] ( صحيح ) (1/180)
وَعَنْ جَابِرٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “بَيْنَ الْعَبْدِ وَبَيْنَ الْكُفْرِ تَرَكُ الصَّلَاةِ”. رَوَاهُ مُسْلِمٌ .
569. (6) [1/180-దృఢం]
జాబిర్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”విధేయునికి, అవిధేయునికి మధ్య తేడా నమా’జును వదలి వేయటమే.” [5] (ముస్లిమ్)
—–
اَلْفَصْلُ الثَّانِيْ రెండవ విభాగం
570 – [ 7 ] ( صحيح ) (1/180)
عَنْ عُبَادَةَ بْنِ الصَّامِتِ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “خَمْسُ صَلَواتٍ اِفْتَرَضَهُنَّ اللهُ تَعَالى مَنْ أَحْسَنَ وُضُوْءَ هُنَّ وَصَلَّاهُنَّ لِوَقْتِهِنَّ وَأَتَمَّ رُكُوْعَهُنَّ خُشُوْعَهُنَّ كَانَ لَهُ عَلَى اللهِ عَهْدٌ أَنْ يَّغْفِرَ لَهُ وَمَنْ لَّمْ يَفْعَلْ فَلَيْسَ لَهُ عَلَى اللهِ عَهْدِ إِنْ شَاءَ غَفَرَ لَهُ وَإِنْ شَاءَ عَذَّبَهُ”. رَوَاهُ أَحْمَدُ وَأَبُوْ دَاوُدَ وَرَوَى مَالِكٌ وَالنَّسَائِيُّ نَحْوَهُ .
570. (7) [1/180–దృఢం]
’ఉబాదహ్ బిన్ ’సామిత్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”అల్లాహ్ (త) ఐదు నమాజులను విధించాడు. పరిపూర్ణంగా వు’జూచేసి, వాటి సమయాల్లో ఆచరిస్తూ రుకూ’లను పూర్తిగా ఆచరిస్తూ, శ్రద్ధాసక్తులతో ఆచరించిన వారిని క్షమిస్తా నని అల్లాహ్ (త) వాగ్దానం చేశాడు. ఇలా చేయని వారిని గురించి అల్లాహ్ (త) వాగ్దానం చేయలేదు. అంటే క్షమించనూ వచ్చు, శిక్షించనూ వచ్చు.” (అ’హ్మద్, అబూ దావూద్, మాలిక్, నసాయి’)
571 – [ 8 ] ( صحيح ) (1/180)
وَعَنْ أَبِيْ أَمَامَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “صَلُّوْا خَمْسَكُمْ وَصُوْمُوْا شَهْرَكُمْ وَأَدُّوْا زَكَاةً أَمْوَالِكُمْ وَأَطيْعُوْا ذَا أَمْرِكُمْ تَدْخُلُوْا جَنَّةَ رَبِّكُمْ”. رَوَاهُ أَحْمَدُ وَالتِّرْمِذِيُّ .
571. (8) [1/180–దృఢం]
అబూ ఉమామహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మీరు మీ ఐదు పూటల నమా’జులు చదవుతూ, మీ రమ’దాన్ ఉపవాసాలు పాటిస్తూ, ఇంకా మీరు మీ ధనంలో నుండి విధిగా దానాన్ని చెల్లిస్తూ, ఇంకా మీ పాలకులకు విధేయత చూపిస్తూ ఉంటే, మీ ప్రభువు స్వర్గంలోకి ప్రవేశిస్తారు.” [6] (అ’హ్మద్, తిర్మిజి’)
572 – [ 9 ] ( حسن ) (1/181)
وَعَنْ عَمْرِو بْنِ شُعَيْبٍ عَنْ أَبِيْهِ عَنْ جَدِّهِ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مُرُوْا أَوْلَادَكُمْ بِالصَّلَاةِ وَهُمْ أَبْنَاءُ سَبْعِ سِنِيْنَ وَاضْرِبُوْهُمْ عَلَيْهَا وَهُمْ أَبْنَاءُ عَشْرِ سِنِيْنَ وَفَرِّقُوْا بَيْنَهُمْ فِيْ الْمَضَاجِعِ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ وَكَذَا رَوَاهُ فِيْ شَرْحِ السُّنَّةِ عَنْهُ.
572. (9) [1/181-ప్రామాణికం]
’అమ్రూ బిన్ షు’ఐబ్ తన తండ్రిగారి ద్వారా, అతను తన తాత గారి ద్వారా కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మీ పిల్లలు 7 సంవత్సరాల వయస్సుకు చేరుకుంటే, నమా’జు చదవమని ఆదేశించండి. 10 సంవత్సరాల వయస్సుకు చేరుకొని నమా’జు చదవక పోతే దండించండి, ఇంకా వారి పడకలను వేరు చేయండి. అంటే ఒంటరిగా పడుకోబెట్టండి.” (అబూ దావూద్, షర్’హుస్సున్నహ్)
573 – [ 10 ] ( حسن ) (1/181)
وَفِيْ الْمِصَابِيْحِ عَنْ سَبْرَةَ بْنِ مَعْبَدٍ .
573. (10) [1/181–ప్రామాణికం]
మసాబీహ్ లో సబ్రహ్ బిన్ మ’అబది ఉల్లేఖనం. [7]
574 – [ 11 ] ( صحيح ) (1/181)
وَعَنْ بُرِيْدَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “الْعَهْدُ الَّذِيْ بَيْنَنَا وَبَيْنَهُمْ الصَّلَاةُ فَمَنْ تَرَكَهَا فَقَدْ كَفَرَ”. رَوَاهُ أَحْمَدُ وَالتِّرْمِذِيُّ وَالنَّسَائِيُّ وَابْنُ مَاجَهُ.
574. (11) [1/181–దృఢం]
బురైదహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మనకూ ఇతరులకు అంటే కపటాచారులకు మధ్య ఒప్పందం నమా’జు, నమా’జును వదలిన వాడు అవిశ్వాసానికి పాల్పడినట్టే.” (అ’హ్మద్, తిర్మిజి’, నసాయి’, ఇబ్నె మాజహ్)
—–
اَلْفَصْلُ الثَّالِثُ మూడవ విభాగం
575 – [ 12 ] ( صحيح ) (1/182)
عَنْ عَبْدِ اللهِ بْنِ مَسْعُوْدٍ قَالَ: جَاءَ رَجُلٌ إِلَى النَّبِيِّ صلى الله عليه وسلم. فَقَالَ يَا رَسُوْلَ اللهِ إِنِّيْ عَالَجْتُ امْرَأَةً فِيْ أَقْصَى الْمَدِيْنَةِ وَإِنِّيْ أَصبْتُ مِنْهَا مَا دُوْنَ أَنْ أَمَسَّهَا فَأَنَا هَذَا فَاَقْضِ فِيْ مَا شِئْتَ. فَقَالَ عُمَرُ لَقَدْ سَتَرَكَ اللهُ لَوْ سَتَرْتَ نَفْسَكَ. قَالَ وَلَمْ يَرَدَّ النَّبِيُّ صلى الله عليه وسلم عَلَيْهِ شَيْئًا. فَقَامَ الرَّجُلُ فَانْطَلَقَ فَأَتْبَعَهُ النَّبِيُّ صلى الله عليه وسلم رَجُلَا فَدَعَاهُ وَتَلَا عَلَيْهِ هَذِهِ الْآيَةِ (أَقِمِ الصَّلَاةَ طَرَفَيِ النَّهَارِ وَزُلْفًا مِّنَ اللَّيْلِ إِنَّ الْحَسَنَاتِ يَذْهَبْنَ السَّيِّئَاتِ ذَلِكَ ذِكْرَى لِلذَّاكِرِيْنَ؛ 11: 114). فَقَالَ رَجُلٌ مِنَ الْقَوْمِ يَا نَبِيَّ اللهَ هَذَا لَهُ خَاصَةً قَالَ: “بَلْ لِّلنَّاسِ كَافَّةً”. رَوَاهُ مُسْلِمٌ .
575. (12) [1/182–దృఢం]
’అబ్దుల్లాహ్ బిన్ మస్’ఊద్ (ర) కథనం: ప్రవక్త (స) వద్దకు ఒక వ్యక్తి వచ్చి, ‘ఓ ప్రవక్తా! నేను మదీనహ్ పొలిమేరల్లో, పరాయి స్త్రీతో ముద్దుముచ్చట తీర్చు కున్నాను. అయితే సంభోగం చేయలేదు. కనుక నేను మీముందు హాజరయ్యాను. నాకు తగిన శిక్ష విధిం చండి,’ అని విన్నవించుకున్నాడు. అది విన్న ప్రవక్త (స) అల్లాహ్ (త) నీ తప్పులను కప్పిపుచ్చాడు, నీవు కూడా నీ తప్పులను కప్పి ఉంచితే బాగుండేది,’ అని అన్నారు. ప్రవక్త (స) ఎటువంటి సమాధానం ఇవ్వ లేదు. ఆ వ్యక్తి లేచి వెళ్ళిపోయాడు. అనంతరం ప్రవక్త (స) ఒక వ్యక్తిని పంపి పిలిపించారు. ఆ వ్యక్తి వచ్చిన తర్వాత ప్రవక్త (స) అతని ముందు: ”వ అఖిమి స్సలాత తరఫయిన్నహారి వజుల్ఫన్ మినల్లైలి, ఇన్నల్ హసనాతి యుజ్హిబ్న స్సయ్యిఆతి, జాలిక జిక్రా లిజ్జాకిరీన్,” (సూ. హూద్, 11:114) అనే ఆయతు పఠించారు. – ‘మరియు దినపు చివరి రెండు భాగాల్లోనూ మరియు రాత్రిపూట కొంత భాగంలో కూడా నమా’జ్ సలపండి. నిశ్చయంగా సత్కార్యాలు దుష్కార్యాలను దూరం చేస్తాయి. జ్ఞాపకం ఉంచుకునే వారికి ఇది ఒక ఉపదేశం (జ్ఞాపిక).’ అక్కడున్న వారిలో ఒక వ్యక్తి, ఓ ప్రవక్తా! ఈ అవకాశం ఆవ్యక్తికేనా, లేక అందరికీ వర్తిస్తుందా!’ అని అడిగాడు. ప్రవక్త (స), ‘అందరికోసం,’ అని అన్నారు. (ముస్లిమ్)
576 – [ 13 ] ( حسن ) (1/182)
وَعَنْ أَبِيْ ذَرٍ أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم: خَرَجَ زَمَنِ الشِّتَاءِ وَالْوَرْقُ يَتَهَافَتُ فَأَخَذَ بِغُصْنَيْنِ مِنْ شَجَرَةٍ. قَالَ فَجَعَلَ ذَلِكَ الْوَرْقُ يَتَهَافَتُ. قَالَ فَقَالَ: “يَا أَبَا ذَرٍّ “قُلْتُ لَبَّيْكَ يَا رَسُوْلَ اللهِ قَالَ: “إِنَّ الْعَبْدَ الْمُسْلِمَ لَيُصَلِّ الصَّلَاةَ يُرِيْدُ بِهَا وَجْهَ اللهِ فَتَهَافَتْ عَنْهُ ذُنُوْبُهُ كَمَا يَتَهَافَتُ هَذَا الْوَرْقُ عَنْ هَذِهِ الشَّجَرَةِ”. رَوَاهُ أَحْمَدُ .
576. (13) [1/182–ప్రామాణికం]
అబూ-జ‘ర్ (ర) కథనం: ఒకసారి ప్రవక్త (స) సీతా కాలంలో అంటే ఆకులురాలే కాలంలో బయటకు వెళ్ళారు. ప్రవక్త (స) ఒక చెట్టు కొమ్మలను పట్టుకొని లాగారు. వెంటనే ఆకులు రాలసాగాయి. అప్పుడు ప్రవక్త (స), ‘అబూ-’జర్! ఇటు రా,’ అన్నారు. ‘నేనిక్కడే ఉన్నాను,’ అని అన్నాను. అప్పుడు ప్రవక్త (స), ‘ఒక ముస్లిమ్ కేవలం అల్లాహ్ ప్రీతి కోసమే నమా’జు చదివితే, అతని పాపాలు కూడా ఈ చెట్టు ఆకుల్లా రాలి పోతాయి,’ అని అన్నారు. (అ’హ్మద్)
577 – [ 14 ] ( حسن ) (1/182)
وَعَنْ زَيْدِ بْنِ خَالِدٍ اَلْجُهَنِيِّ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَنْ صَلَّى سَجْدَتَيْنِ لَا يَسْهُوْ فِيْهِمَا غَفَرَ اللهُ لَهُ مَا تَقَدَّمَ مِنْ ذَنْبِهِ”. رَوَاهُ أَحْمَدُ.
577. (14) [1/182–ప్రామాణికం]
’జైద్ బిన్ ’ఖాలిద్ జుహ్నీ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఎవరైనా నిర్మలమైన మనస్సుతో, భక్తి-శ్రద్ధలతో నమా’జు చదివితే, అల్లాహ్ అతని వెనుకా, ముందు పాపాలన్నీ క్షమించివేస్తాడు.” (అ’హ్మద్)
578 – [ 15 ] ( صحيح ) (1/183)
وَعَنْ عَبْدِ اللهِ بْنِ عَمْرِو بْنِ الْعَاصٍ عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم: أَنَّهُ ذَكَرَ الصَّلَاةَ يَوْمًا فَقَالَ: “مَنْ حَافَظَ عَلَيْهَا كَانَتْ لَهُ نُوْرًا وَبُرْهَانًا وَنَجَاةً يَوْمَ الْقِيَامَةِ وَمَنْ لَّمْ يُحَافِظْ عَلَيْهَا لَمْ يَكُنْ لَهُ نُوْرًاوَلَا بُرْهَاناً لَا نَجَاةً وَكَانَ يَوْمَ الْقِيَامَةِ مَعَ قَارُوْنَ وَفِرْعَوْنَ وَهَامَانَ وَأُبَيِّ بْنِ خَلْفٍ”. رَوَاهُ أَحْمَدُ وَالدَّارَمِيُّ وَالْبَيْهَقِيُّ فِيْ شُعَبِ الْإِيْمَانِ .
578. (15) [1/182–దృఢం]
’అబ్దుల్లాహ్ బిన్-’అమ్ర్ బిన్-’ఆస్ (ర) కథనం: ప్రవక్త (స) ఒకరోజు నమా’జు గురించి ప్రస్తావించారు. అంటే నమా’జు ప్రత్యేకత గురించి వివరిస్తూ, క్రమం తప్పకుండా నమా’జు చదివే వ్యక్తికి, ఈ నమా’జు తీర్పుదినం నాడు వెలుగుగా, పరిపూర్ణ విశ్వాస చిహ్నంగా, క్షమాపణకు కారకంగా తోడ్పడుతుంది. అదేవిధంగా క్రమం తప్పకుండా పాటించని వారికి వెలుగుగా, విశ్వాస చిహ్నంగా, సాఫల్యానికి కారకంగా సహకరించదు. ఇంకా ఆ వ్యక్తి తీర్పుదినం నాడు ఖారూన్, పిర్’ఔన్, హామాన్ మరియు ఉబయ్ బిన్-’ఖల్ఫ్లతో కలసి ఉంటాడు.” అని ప్రవచించారు. (అ’హ్మద్, దార్మీ, బైహఖీ – షు’అబిల్ఈమాన్)
579 – [ 16 ] ( صحيح ) (1/183)
وَعَنْ عَبْدِ اللهِ بْنِ شَقِيْقٍ قَالَ: كَانَ أَصْحَابُ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم لَا يَرَوْنَ شَيْئًا مِّنَ الْأَعْمَالِ تَرْكُهُ كُفْرٌ غَيْرَ الصَّلَاةِ. رَوَاهُ التِّرْمِذِيُّ .
579. (16) [1/183–దృఢం]
’అబ్దుల్లాహ్ బిన్-షఖీఖ్(ర) కథనం: ప్రవక్త (స) అనుచరులు నమా’జు తప్ప, ఇతర ఏ సత్కార్యాన్ని వదలి వేసినా అవిశ్వాసంగా భావించే వారు కాదు. నమా’జు వదలితే మాత్రం అవిశ్వాసిగా భావించే వారు. (తిర్మిజి‘)
580 – [ 17 ] ( حسن ) (1/183)
وَعَنْ أَبِيْ الدَّرْدَاءِ قَالَ: أَوْصَانِيْ خَلِيْلِيْ أَنْ لَّا تُشْرِكَ بِاللهِ شَيْئًا وَّإِنْ قُطِعْتَ وَحُرِّقْتَ وَلَا تَتْرُكْ صَلَاةً مَكْتُوْبَةً مُتَعَمِّدًا فَمَنْ تَرَكَهَا مُتَعَمِّدًا فَقَدْ بَرِئَتْ مِنْهُ الذِّمَّةُ وَلَا تَشْرَبِ الْخَمْرَ فَإِنَّهَا مِفْتَاحُ كُلِّ شَرٍّ. رَوَاهُ ابْنُ مَاجَهُ.
580. (17) [1/183–ప్రామాణికం]
అబూ-దర్దా (ర) కథనం: ‘నా మిత్రులు అంటే ప్రవక్త (స) నాకు ఇలా ఉపదేశించారు, ”నిన్ను ముక్కలు ముక్కలు చేసి వేసినా, మంటల్లో కాల్చి వేసినా, నీవు అల్లాహ్‌కు సాటి కల్పించకు. ఇంకా విధి నమా’జులను ఉద్దేశ్యపూర్వకంగా ఎన్నడూ వదలకు. ఎందుకంటే ఉద్దేశ్యపూర్వకంగా విధి నమా’జులను వదలివేసిన వాడిపై నుండి ఇస్లామ్ బాధ్యత తొలగి పోతుంది. ఇంకా నీవు ఎన్నడూ, మద్యం సేవించ కూడదు. ఎందుకంటే మద్యపానం చెడులన్నిటికీ తాళంచెవి వంటిది.” [8] (ఇబ్నె మాజహ్)
=====
1– بابُ مَوَاقِيْت الصَّلاةِ
- నమా’జు వేళలు
నమా’జుకు కొన్ని సమయాలు నిర్దేశించబడి ఉన్నాయి. సమయానికి ముందు చదివితే, స్వీక రించబడదు. సమయం తరువాత చదివితే అది పూర్తిచేయడం అవుతుంది. పాటించడం అవదు. అందు వల్ల ప్రతి నమా’జును దాని నిర్దిష్ట సమయంలో ఆచరించాలి. నమా’జు సమయాలను గురించి ఖుర్ఆన్లో సంక్షిప్తంగా, హదీసుల్లో వివరంగా పేర్కొనడం జరిగింది. దీన్ని గురించి ఖుర్ఆన్లోని రెండు ఆయాతులను పేర్కొనడం జరిగింది. అంటే అవి మూలం, క్రింద పేర్కొనబడిన ‘హదీసు’లు వాటి వివరణ. అల్లాహ్ ఆదేశం: 1. ”నిశ్చయంగా, నమా’జు విశ్వాసులకు నియమిత సమయాల్లో పాటించటానికి విధిగా నియమించబడింది.” (సూ. అన్నిసా, 4 –103). 2. ”మరియు దినపు చివరి రెండు భాగాల్లోనూ మరియు రాత్రి పూట కొంత భాగంలో కూడా నమా’జు సలపండి.” – (సూ. హూద్, 11:114). దినపు మొదటి అంచు అంటే ఫజ్ర్ నమా’జు, రెండవ అంచు అంటే ’అస్ర్ మరియు మ’గ్రిబ్, నమా’జులు. రాత్రి వేళ అంటే ‘ఇషా’ నమా’జులు. 3. ”మధ్యాహ్నం సూర్యుడు వాలినప్పటి నుండి, రాత్రి అయి చీకటి పడేవరకూ నమా’జ్లను సలుపు. (”జుహ్ర్, ‘అ’స్ర్, మ’గ్రిబ్ మరియు ‘ఇషా’ నమా’జులు) మరియు ప్రాతః కాలంలో (నమా’జ్లో) ఖుర్ఆన్ పఠించు. నిశ్చయంగా ప్రాతఃకాల ఖుర్ఆన్ పఠనం (దేవదూతల ద్వారా) వీక్షింపబడుతుంది.” (సూ. ఇస్రా, 17:78) దులూక్ అంటే ”జుహ్ర్ మరియు ’గసఖల్లైల్ అంటే ’అస్‘ర్, మ’గ్రిబ్, ’ఇషా‘ మరియు ఖుర్ఆన్ ఫజ్ర్ అంటే ఫజ్ర్ నమా’జ్.
اَلْفَصْلُ الْأَوَّلُ మొదటి విభాగం
581 – [ 1 ] ( صحيح ) (1/184)
عَنْ عَبْدِ اللهِ ابْنِ عَمْرٍو قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “وَقْتُ الظُّهْرِ إِذَا زَالَتِ الشَّمْسُ وَكَانَ ظِلُّ الرَّجُلِ كَطُوْلِهِ مَا لَمْ يَحْضُرِ الْعَصْرِ وَوَقْتُ الْعَصْرِ مَا لَمْ تَصْفَرَّ الشَّمْسُ وَوَقْتُ صَلَاةِ الْمَغْرِبَ مَا لَمْ يَغِبِ الشَّفَقُ وَوَقْتُ صَلَاةِ الْعِشَاءِ إِلَى نِصْفِ اللَّيْلِ الْأَوْسَطِ وَوَقْتُ صَلَاةِ الصُّبْحِ مِنْ طُلُوْعِ الْفَجْرِ مَا لَمْ تَطْلُعِ الشَّمْسُ فَإِذَا طَلَعَتِ الشَّمْسُ فَأمْسِكْ عَنِ الصَّلَاةِ فَإِنَّهَا تَطْلَعُ بَيْنَ قَرَنَيِ شَيْطَانِ”. رَوَاهُ مُسْلِمٌ .
581. (1) [1/184–దృఢం]
‘అబ్దుల్లాహ్ బిన్ ’అమ్ర్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”జుహ్ర్ నమా’జు సమయం సూర్యుడు వాలి నపుడు ప్రారంభం అవుతుంది. ఒక్కనీడ వరకు ఉంటుంది. ’అస్ర్ నమాజు సమయం ఒకనీడ నుండి ప్రారంభం అవుతుంది. ఎండలో పసుపు వర్ణం వచ్చే వరకు ’అస్ర్ సమయం ఉంటుంది. సూర్యుడు అస్తమించిన తర్వాత మ’గ్రిబ్ సమయం ప్రారంభం అవుతుంది. ఎర్రదనం ఉన్నంత వరకు ఉంటుంది. ఎర్రదనం ముగిసి నప్పటి నుండి మధ్సరాత్రి వరకు ‘ఇషా’ సమయం. ఉషోదయం ప్రారంభం కాగానే ఫజ్ర్ సమయం ప్రారంభం అవుతుంది. సూర్యోదయానికి ముందు వరకు ఉంటుంది. సూర్యోదయం సమయంలో నమా’జు చదవకండి. ఎందుకంటే సూర్యుడు షై’తాన్ రెండు కొమ్ముల మధ్య నుండి ఉదయిస్తాడు.” [9] (ముస్లిమ్)
582 – [ 2 ] ( صحيح ) (1/184)
وَعَنْ بُرَيْدَةَ قَالَ: إِنَّ رَجُلًا سَأَلَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم عَنْ وَقْتِ الصَّلَاةِ فَقَالَ لَهُ: “صَلِّ مَعَنَا هَذَيْنِ “يَعْنِيْ الْيَوْمَيْنِ فَلَمَّا زَالَتِ الشَّمْسُ أَمَرَ بِلَالًا فَأَذَّنَ ثُمَّ أَمَرَهُ فَأَقَامَ الظُّهْرَ ثُمَّ أَمَرَهُ فَأَقَامَ الْعَصْرَ وَالشَّمْسُ مُرْتَفِعَةٌ بَيْضَاءُ نَقِيَّةُ ثُمَّ أَمَرَهُ فَأَقَامَ الْمَغْرِبَ حِيْنَ غَابَتِ الشَّمْسُ ثُمَّ أَمَرَهُ فَأَقَامَ الْعِشَاءَ حِيْنَ غَابَ الشَّفْقَ ثُمَّ أَمَرَهُ فَأَقَامَ الْفَجْرَ حِيْنَ طَلَعَ الْفَجْرُ فَلَمَّا أَنْ كَانَ الْيَوْمُ الثَّانِيْ أَمَرَهُ فَأَبْرِدْ بِالظُّهْرِ فَأَبْرَدَ بِهَا فَأَنْعَمَ أَنْ يُّبْرِدَ بِهَا وَصَلَّى الْعَصْرَ وَالشَّمْسُ مُرْتَفِعَةٌ أَخَّرَهَا فَوْقَ الَّذِيْ كَانَ وَصَلَّى الْمَغْرِبَ قَبْلَ أَنْ يَّغِيْبَ الشَّفْقُ وَصَلَّى الْعِشَاءَ بَعْدَمَا ذَهَبَ ثُلُثُ اللَّيْلِ وَصَلَّى الْفَجْرَ فَأَسْفَرَ بِهَا. ثُمَّ قَالَ أَيْنَ السَّائِلُ عَنْ وَقْتِ الصَّلَاةِ. فَقَالَ الرَّجُلُ أَنَا يَا رَسُوْلَ اللهِ. قَالَ: “وَقْتُ صَلَاتِكُمْ بَيْنَ مَا رَأَيْتُمْ”. رَوَاهُ مُسْلِمٌ.
582. (2) [1/184–దృఢం]
బురైదహ్ (ర)కథనం: ప్రవక్త (స)ను ఒక వ్యక్తి నమా’జు సమయాలను గురించి అడిగాడు. దానికి ప్రవక్త (స), ‘నువ్వు రెండు రోజులు మాతో కలసి నమా’జు చదువు,’ అని అన్నారు. అనంతరం మొదటి రోజు సూర్యుడు వాలిన తర్వాత బిలాల్‌ను అజా‘న్ ఇవ్వమని ఆదేశించారు. బిలాల్ అజా‘న్ ఇచ్చారు. ఆ తరువాత ప్రవక్త (స) ఇఖామతు ఇవ్వమని ఆదేశించారు. బిలాల్ ఇఖామత్ ఇచ్చారు. ప్రవక్త (స) ప్రారంభ సమయంలో ”జుహ్ర్ నమా’జు చదివించారు. ఆ తరువాత సూర్యుడు ఒకనీడ వరకు వాలినప్పుడు బిలాల్‌ను ఆదేశించారు. బిలాల్ అజా‘న్, ఆ తరువాత ఇఖామత్ ఇచ్చారు. ప్రవక్త (స) ’అ’స్ర్ ప్రారంభ కాలంలో నమా’జు చదివించారు. ఆ తరువాత మళ్ళీ సూర్యాస్తమయం అయిన తరువాత బిలాల్‌ను అజా‘న్, ఇఖామత్ ఇవ్వమని ఆదేశించారు. బిలాల్ అజా‘న్, ఇఖామత్ ఇచ్చారు. ప్రవక్త (స) నమా’జు చదివించారు. ఆ తరువాత ఎర్ర దనం పోయిన తర్వాత బిలాల్‌ను అజా‘న్, ఇఖామత్ ఇవ్వమని ఆదేశించారు. తర్వాత ప్రవక్త (స) ’ఇషా’ నమా’జు చదివించారు. మళ్ళీ ఉషోదయం అయిన తర్వాత బిలాల్‌ను అజా‘న్, ఇఖామత్ ఇవ్వమని ఆదేశించారు. అయిన తర్వాత ప్రవక్త (స) ఫజ్ర్ నమాజు చదివించారు. మొదటి రోజు 5 నమా’జులను ప్రారంభ సమయాల్లో చదివించారు. రెండవ రోజు బిలాల్‌ను ఆలస్యం చేసి అజా‘న్, ఇఖామత్‌లు ఇవ్వమని ఆదేశించారు. బిలాల్ (ర) ఆలస్యం చేసి అజా‘న్, ఇఖామత్‌లు ఇచ్చారు. ప్రవక్త (స) నమా’జు చదివించారు. అదేవిధంగా ‘అ ‘స్ర్ నమాజును చివరి సమయంలో చదివించారు. అదేవిధంగా మ’గ్రిబ్ నమాజును ఎర్రదనం అదృశ్యం కావటానికి ముందు చదివించారు. అదే విధంగా ’ఇషా నమా’జు 1/3 వంతు రాత్రి గడచిన తర్వాత చదివించారు. అదేవిధంగా ఫజ్ర్ నమా’జు వెలుగు వ్యాపించిన తర్వాత చదివించారు. ఆ తరువాత, ‘ఆ వ్యక్తి ఏడి,’ అని అడిగారు. ‘నేను ఇక్కడే ఉన్నానని’ ఆ వ్యక్తి సమాధానం ఇచ్చాడు. అప్పుడు ప్రవక్త (స) మీ నమా’జుల సమయం ఈ రెండు సమయాల మధ్య ఉంది అని అన్నారు. (ముస్లిమ్)
—–
اَلْفَصْلُ الثَّانِيْ రెండవ విభాగం
583 – [ 3 ] ( صحيح ) (1/185)
عَنِ ابْنِ عَبَّاسٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “أَمَّنِيْ جِبْرِيْلُ عِنْدَ الْبَيْتِ مَرَّتَيْنِ فَصَلَّى بِيَ الظُّهْرَ حِيْنَ زَالَتِ الشَّمْسُ وَكَانَتْ قَدْرِ الشِّرَاكِ وَصَلَّى بِيْ الْعَصْرَ حِيْنَ كَانَ ظِلُّ كُلِّ شَيْءٍ مِّثْلِهُ وَصَلَّى بِيَ يَعْنِيْ الْمَغْرِبَ حِيْنَ أَفْطَرَ الصَّائِمُ وَصَلَّى بِيْ الْعِشَاءَ حِيْنَ غَابَ الشَّفَقُ وَصَلَّى بِيْ الْفَجْرَ حِيْنَ حَرُمَ الطَّعَامَ وَالشَّرَابُ عَلَى الصَّائِمِ فَلَمَّا كَانَ الْغَدُ صَلَّى بِيَ الظُّهْرَ حِيْنَ كَانَ ظِلُّهُ مِثْلَهُ وَصَلَّى بِيَ الْعَصْرَ حِيْنَ كَانَ ظِلُّهُ مِثْلَيْهِ. وَصَلَّى بِيَ الْمَغْربَ حِيْنَ أَفْطَر الصَّائِمُ. وَصَلَّى بِيْ الْعِشَاءَ إِلَى ثُلُثِ اللَّيْلِ. وَصَلَّى بِيْ الْفَجْرَ فَأَسْفَرَ. ثُمَّ الْتَفَتَ إِلَيَّ فَقَالَ يَا مُحَمَّدٌ هَذَا وَقْتُ الْأَنْبِيَاءِ مِنْ قَبْلِكَ وَالْوَقْتُ مَا بَيْنَ هَذَيْنِ الْوَقْتَيْنِ”. رَوَاهُ أبُو دَاوُدَ وَالتِّرْمِذِيُّ .
583. (3) [1/185–దృఢం]
ఇబ్నె ’అబ్బాస్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”జిబ్రీల్ (అ) బైతుల్లాహ్ వద్ద నాకు రెండుసార్లు ఇమామత్ చేశారు. అంటే రెండురోజులు నాకు నమా’జుచదివి చూపెట్టారు. ఒక రోజు ప్రారంభ సమయంలో రెండవరోజు చివరి సమయంలో. మొదటి రోజు సూర్యుడు వాలిన వెంటనే ”జుహ్ర్ నమా’జు చదివించారు. ఇంకా నీడ వస్తువుకు సమానంగా ఉన్నప్పుడు ’అస్ర్ నమా’జు చదివించారు. అదేవిధంగా ఉపవాసం విరమించే సమయాన మ’గ్రిబ్ నమా’జు చదివించారు. అదేవిధంగా ఎర్రదనం అదృశ్యమైన వెంటనే ’ఇషా నమా’జును చదివించారు. అదేవిధంగా ఫజ్ర్ నమా’జును ఉపవాసిపై అన్న పానీయాలు నిషిద్ధం అయిన సమయాన చదివించారు. రెండవరోజు ”జుహ్ర్ నమా’జు ను వస్తువునీడ దానికి సమానంగా ఉన్నప్పుడు చది వించారు. ’అస్ర్ నమాజును వస్తువు నీడ దానికి రెండింతలు అయినప్పుడు చదివించారు. అదే విధంగా మ’గ్రిబ్ నమా’జును ఆలస్యం చేసి చదివించారు. ఇషా నమా’జును 1/3 వంతు రాత్రి గడిచిన తర్వాత చదివించారు. ఫజ్ర్ నమా’జు వెలుగు వ్యాపించిన తర్వాత చదివించారు. అనంతరం జిబ్రీల్ (అ) నావైపు తిరిగి ఓ ము’హమ్మద్! ఇది మీకంటే ముందు ప్రవక్తల సమయం, మీ సమయం ఈ రెండు సమయాలకు మధ్య ఉంది అని అన్నారు. (అబూ-దావూద్, తిర్మిజి‘, ఇబ్నె-మాజహ్)
—–
الْفَصْلُ الثَّالِثُ మూడవ విభాగం
584 – [ 4 ] ( متفق عليه ) (1/186)
وَعَنِ ابْنِ شِهَابٍ أَنَّ عَمَرَ بْنَ عَبْدِ الْعَزِيْزِ أَخَّرَ الْعَصْرَ شَيْئًا. فَقَالَ لَهُ عُرْوَةُ: أَمَّا إِنَّ جِبْرِيْلَ قَدْ نَزَلَ فَصَلَّى أَمَامَ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم. فَقَالَ لَهُ عُمَرُ: اِعْلَمْ مَا تَقُوْلُ يَا عُرْوَةُ. فَقَالَ: سَمِعْتُ بَشِيْرَ بْنَ أَبِيْ مَسْعُوْدٍ يَقُوْلُ سمَعِتُ أَبَا مَسْعُوْد يَقُوْلُ: سَمِعْتُ رَسُوْلَ الله صلى الله عليه وسلم يَقُوْلُ: “نَزَلَ جِبْرِيْلُ فَأَمَّنِيْ فَصَلَّيْتُ مَعَهُ ثُمَّ صَلَّيْتُ مَعَهُ ثُمَّ صَلَّيْتُ مَعَهُ ثُمَّ صَلَّيْتُ مَعَهُ ثُمَّ صَلَّيْتُ مَعَهُ” يَحْسِبُ بِأَصَابِعِهِ خَمْسَ صَلَوَاتٍ.
584. (4) [1/186–ఏకీభవితం]
’ఇబ్నె షిహాబ్ ‘జుహ్రీ కథనం: ఒకరోజు ’ఉమర్ బిన్ ’అబ్దుల్-’అజీజ్ ’అస్ర్ నమా’జును ఆలస్యం చేసి చదివారు. అప్పుడు ’ఉర్వ అతనితో, ‘జిబ్రీల్ (అ) వచ్చి ప్రవక్త(స)కు నమా’జు చదివించారు,’ అని అన్నారు. దానికి ’ఉమర్ బిన్ ’అబ్దుల్-’అజీజ్, ”నీవు ఏమంటున్నావో కొద్దిగా ఆలోచించి చెప్పు,” అని అన్నారు. దానికి ఉర్వ, ”నేను బషీర్ బిన్ అబీ మస్’ఊద్ ద్వారా ఇలా విన్నాను.’ బషీర్ కథనం: ప్రవక్త (స) ఇలా ప్రవచిస్తూ ఉండగా నేను విన్నాను: ”జిబ్రీల్ (అ) వచ్చారు. నాకు ఇమామత్ చేశారు. నేను అతనితో కలసి నమా’జు చదివాను. ఆ తరువాత మళ్ళీ నేను అతనితో కలసి నమా’జు చదివాను. మళ్ళీ నేను అతనితో కలసి నమా’జు చదివాను. మళ్ళీ నేను అతనితో కలసి నమా’జు చదివాను. మళ్ళీ నేను అతని తో కలసి నమా’జు చదివాను. ప్రవక్త (స) ఈ విధంగా తన చేతి వ్రేళ్ళ ద్వారా లెక్కించారు. అంటే ఐదు నమా’జులు చదివారు.[10] (బు’ఖారీ, ముస్లిమ్)
585 – [ 5 ] ( ضعيف ) (1/186)
وَعَنْ عُمَرَ بْنْ الْخَطَّابِ رَضِيَ اللهُ عَنْهُ: أَنَّهُ كَتَبَ إِلَى عُمَّالِهِ إِنَّ أَهَمَّ أُمُوْرَكُمْ عِنْدِيْ الصَّلَاةُ فَمَنْ حَفَظَهَا وَحَافَظَ عَلَيْهَا حَفِظَ دِيْنَهُ وَمَنْ ضَيَّعَهَا فَهُوَ لِمَا سَوَاهَا أَضْيَعُ. ثُمَّ كَتَبَ أَنْ صَلُّوا الظُّهْرَ إِذَا كَانَ اَلْفَيْء ذِرَاعًا إِلَى أَنْ يَّكُوْنَ ظِلُّ أَحَدِكُمْ مِثْلَهُ وَالْعَصْرُ وَالشَّمْسُ مُرْتَفِعَةٌ بَيْضَاءٌ نَقِيَّةٌ قَدْرَ مَا يَسِيْرُ الرَّاكِبُ فَرْسَخَيْنِ أَوْ ثَلَاثَةً قَبْلَ مَغِيْبِ الشَّمْسِ وَالْمَغْرِبَ إِذَا غَربت الشَّمْسُ وَالْعِشَاءَ إِذَا غَابَ الشَّفَقُ إِلَى ثُلُثِ اللَّيْلِ. فَمَنْ نَامَ فَلَا نَامَتْ عَيْنُهُ. فَمَنْ نَامَ فَلَا نَامَتْ عَيْنُهُ. فَمَنْ نَامَ فَلَ انَامَتْ عَيْنُهُ. وَالصُّبْحَ وَالنَّجُوْمُ بَادِيَةٌ مُّشْتَبِكَةٌ. رَوَاهُ مَالِكٌ .
585. (5) [1/186–బలహీనం]
’ఉమర్ (ర) తన పరిపాలనా కాలంలో తన రాష్ట్రాల పాలకులకు, తహ్సీల్దార్లకు ఇలా ఉత్తరం వ్రాశారు, ”నా దృష్టిలో బాధ్యతలన్నిటి కంటే ముఖ్య బాధ్యత నమా’జ్. నమా’జ్ను పరిరక్షించే వాడు, ఎల్లప్పుడూ క్రమం తప్పకుండా పాటించేవాడు తన ధర్మాన్ని పరిరక్షించినట్లే. ఇంకా నమా’జును పరిరక్షించలేని వాడు, ఇతర వ్యవహారాలను కూడా పరిరక్షించలేడు.” ఆ తరువాత మళ్ళీ ఇలా వ్రాశారు.” ”జుహ్ర్ నమా’జును నీడ ఒకగజం నుండి మీకు సమానంగా ఉండే వరకు చదవండి. అంటే సూర్యుడు వాలిన తర్వాత నుండి తనకు సమానంగా నీడ ఉండే వరకు ”జుహ్ర్ సమయం ఉంటుంది. మీరు సూర్యుడు వాలిన తర్వాత ”జుహ్ర్ నమా’జు చదువుకోండి. అదేవిధంగా మీరు ’అస్ర్ నమా’జును సూర్యుడు తెల్లగా, స్పష్టంగా ఉన్నప్పుడు చదవండి. అంటే ’అస్ర్ నమా’జు చదివిన తర్వాత ఒక వ్యక్తి సూర్యాస్తమయానికి ముందు 6 లేక 9 మైళ్ళు ప్రయాణం చేయగలిగాలి. ఇంకా మ’గ్రిబ్ నమా’జు సూర్యుడు అస్తమించిన తర్వాత చదవండి. అదేవిధంగా ‘ఇషా’ నమా’జు ఎర్రదనం అదృశ్యం అయిన తర్వాత నుండి 1/3 వంతు రాత్రి వేళ వరకు చదవగలరు. ’ఇషా’ నమా’జు చదవకుండా పడుకున్న వారికి నిద్ర రాకూడదు గాక, ’ఇషా నమాజు చదవకుండా పడుకున్న వారికి నిద్ర రాకూడదుగాక, ఇషానమా’జు చదవకుండా పడుకున్న వారికి నిద్ర రాకూడదు గాక, ఇంకా ఉదయం నమా’జు చుక్కలు స్పష్టంగా కనబడుతున్నప్పుడు అంటే చీకటిలో చదవండి. (మువ’త్తా ఇమామ్ మాలిక్)
586 – [ 6 ] ( صحيح ) (1/187)
وَعَنِ ابْنِ مَسْعُوْدٍ قَالَ: كَانَ قَدْرُ صَلَاةِ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم اَلظُّهْرِ فِيْ الصَّيْفِ ثَلَاثَةَ أَقْدَامٍ إِلَى خَمْسَةِ أَقْدَامٍ وَفِيْ الشِّتَاءِ خَمْسَةَ أَقْدَامٍ إِلَى سَبْعَةِ أَقْدَامٍ. رَوَاهُ أَبُوْ دَاوُدَ وَالنَّسَائِيُّ .
586. (6) []1/187–దృఢం]
’అబ్దుల్లాహ్ బిన్ మస్’ఊద్ (ర) కథనం: ప్రవక్త (స) ”జుహ్ర్ నమా’జు వేసవిలో 3 అడుగుల నుండి 5 అడుగుల వరకు, శీతాకాలంలో 5 అడుగుల నుండి 7 అడుగుల వరకు ఉండేది. [11] (అబూ-దావూద్, నసాయి’)
=====
- بَابُ تَعْجِيْلِ الصَّلَواتِ
- ప్రారంభవేళలో నమా’జ్ ఆచరించటం
మంచి విషయాల్లో ఆలస్యం చేయకూడదు. సాధ్య మైనంత తొందరగా చేసుకోవాలి. అల్లాహ్ ఆదేశం: “…ఫస్తబిఖుల్ ఖైరాత్…” (సూ. అల్ మాఇదహ్, 5:48) – ‘…మంచి పనులు చేయటంలో ఒకరితో నొకరు పోటీపడండి…’ సత్కార్యాలన్నిటిలో నమా’జు అత్యుత్తమ సత్కార్యం. దీన్ని కూడా ప్రారంభ కాలంలోనే నెరవేర్చుకోవాలి. ప్రవక్త (స)ను ‘కార్యా లన్నిటిలో అత్యుత్తమమైన కార్యం ఏది అని ప్రశ్నించడం జరిగింది. ప్రవక్త (స), ‘ప్రారంభ కాలంలో నమా’జ్ ఆచరించటం,’ అని అన్నారు. (తిర్మిజి‘) మరోచోట, ప్రవక్త (స) ఇలా అన్నారు, ”ప్రారంభ కాలంలో నమా’జ్ చదవడం వల్ల దైవప్రీతి లభిస్తుంది. చివరి సమయంలో చదివితే అల్లాహ్ (త) తప్పులను మన్నిస్తాడు.’
—–
اَلْفَصْلُ الْأَوَّلُ మొదటి విభాగం
587 – [ 1 ] ( متفق عليه ) (1/188)
عَنْ سَيَّارِ بْنِ سَلَامَةَ قَالَ: دَخَلْتُ أَنَا وَأَبِيْ عَلَى أَبِيْ بَرْزَةَ الْأَسْلَمِيِّ. فَقَالَ لَهُ أَبِيْ كَيْفَ كَانَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم يُصَلِّيْ الْمَكْتُوْبَةَ. فَقَالَ كَانَ يُصَلِّيْ الْهَجِيْرَ الَّتِيْ تَدْعُوْنَهَا الْأُوْلَى حِيْنَ تَدْحَضُ الشَّمْسَ وَيُصَلِّيْ الْعَصْرَ ثُمَّ يَرْجِعُ أَحَدُنَا إِلَى رَحْلِهِ فِيْ أَقْصَى الْمَدِيْنَةَ وَالشَّمْسُ حَيَّةٌ وَنَسِيْتُ مَا قَالَ فِيْ الْمَغْرِبِ وَكَانَ يَسْتَحِبُّ أَنْ يُّؤْخَّرَ الْعِشَاءَ الَّتِيْ تَدْعُوْنَهَا الْعَتَمَةَ وَكَانَ يَكْرَهُ النَّوْمَ قَبْلَهَا وَالْحَدِيْثَ بَعْدَهَا. وَكَانَ يَنْفَتِلُ مِنْ صَلَاةِ الْغَدَاةِ حِيْنَ يَعْرِفُ الرَّجُلُ جَلِيْسَهُ وَيَقْرَأُ بِالسِّتِّيْنَ إِلَى الْمَائِةَ.
وَفِيْ رِوَايَةِ: وَلَا يُبَالِيْ بِتَأْخِيْرِ الْعِشَاءِ إِلَى ثُلُثِ اللَّيْلِ وَلَا يُحِبُّ النَّوْمَ قَبْلَهَا وَالْحَدِيْثُ بَعْدَهَا.
587. (1) [1/188–ఏకీభవితం]
సయ్యార్ బిన్ సలామహ్ (ర) కథనం: నేనూ మా నాన్నగారు అబూ-బర్’జహ్ గారి వద్దకు వెళ్ళాము. మానాన్నగారు అబూ-బర్’జహ్ అస్లమీని ప్రవక్త (స) విధి నమా’జులను ఎలా పాటించేవారు,’ అని అడిగారు. దానికి అబూ-బర్’జహ్ అస్లమీ మీరు అల్’ఊలా అని పిలిచే ”జుహ్ర్ నమాజును సూర్యుడు వాలిన తర్వాత చదివేవారు. ఇంకా ’అస్ర్ నమా’జ్ను సూర్యాస్తమయానికి ఇంకా చాలా సమయం ఉండగానే చదివేవారు. ఒక వ్యక్తి ’అస్ర్ నమా’జ్ చదివి ఊరి పొలిమేరల వరకు వెళ్ళినా ఇంకా సూర్యుడు అస్తమించేవాడు కాదు. అయితే మ’గ్రిబ్ గురించి వివరించింది నేను మరచిపోయాను. ఇంకా అబూ-బర్జహ్, ‘ప్రవక్త (స) ’ఇషా‘ నమా’జ్లో ఆలస్యం చేసేవారు, దాన్ని మీరు అతమహ్ అంటారు,’ అని అన్నారు. ఇషాకు ముందు నిద్ర పోవటాన్ని అసహ్యించుకునేవారు. ’ఇషా‘ తరువాత అనవసరమైన విషయాలు మాట్లాడ టాన్ని అసహ్యించుకునేవారు. ఇంకా ఫజ్ర్ నమా’జ్ చదివి ప్రక్కన కూర్చున్న వారిని గుర్తుపట్టి నప్పుడు ఖుర్ఆన్ పఠనం ముగించేవారు. ఫజ్ర్ నమా’జ్లో 60 నుండి 100 ఆయతుల వరకు పఠించేవారు. మరో ఉల్లేఖ నంలో ఇలా ఉంది, ”ప్రవక్త (స) ఇషా నమా’జ్ను రాత్రి వరకు ఆలస్యం చేసి చదవటాన్ని ఫరవాలేదని భావించేవారు. ’ఇషా‘కు ముందు నిద్రపోవటాన్ని అసహ్యించుకునే వారు. అదే విధంగా ’ఇషా‘ తర్వాత అనవసరంగా మాట్లాడటాన్ని కూడా అసహ్యించు కునే వారు. (బు’ఖారీ, ముస్లిమ్)
588 – [ 2 ] ( متفق عليه ) (1/188)
وَعَنْ مُحَمَّدِ بْنِ عَمْرِو هُوَ ابن الحسن بن علي قَالَ: سَأَلْنَا جَابِرٍ بْنِ عَبْدِاللهِ عَنْ صَلَاةِ النَّبِيِّ صلى الله عليه وسلم. فَقَالَ: كَانَ يُصَلِّي الظُّهْرَ بِالْهَاجَرَةِ وَالْعَصْرَ وَالشَّمْسُ حَيَّةٌ وَالْمَغْرِبَ إَذَا وَجَبَتْ وَالْعِشَاءَ إِذَا كَثُرَ النَّاسُ عَجَّلَ وَإِذَا قَلُّوْا أَخَّرَ وَالصُّبْحَ بِغَلَسٍ.
588. (2) [1/188–ఏకీభవితం]
ము’హమ్మద్ బిన్ ’అమ్ర్ బిన్ ’హసన్ బిన్ ’అలీ (ర) కథనం: ‘మేము జాబిర్ బిన్ ’అబ్దుల్లాహ్‌ను ప్రవక్త (స) నమా’జ్ను గురించి అడిగాము. అంటే ఏ సమయాల్లో చదివేవారని. దానికి అతను, ”ప్రవక్త (స) సూర్యుడు వాలగానే ”జుహ్ర్ నమా’జు చదువుకునే వారు. సూర్యుడు తెల్లగా, వెలుగుగా ఉన్నప్పుడే ’అస్ర్ నమా’జు చదివేవారు. సూర్యుడు అస్తమించిన తరువాత మ’గ్రిబ్ నమాజు చదివే వారు. ’ఇషా‘ నమాజును అందరూ చేరుకుంటే తొందరగా చదువు కునే వారు. కొందరు మాత్రమే ఉంటే ఆలస్యం చేసి చదివే వారు. ఇంకా ఫజ్ర్ నమా’జు చీకట్లో చదివే వారు. (బు’ఖారీ, ముస్లిమ్)
589 – [ 3 ] ( متفق عليه ) (1/189)
وَعَنْ أَنَسٍ قَالَ: كُنَّا إِذَا صَلَّيْنَا خَلْفَ النَّبِيِّ صلى الله عليه وسلم بِالظَّهَائِرِ سَجَدَنَا عَلَى ثِيَابِنَا اِتِّقَاءَ الْحَرِّ.
589. (3) [1/189–ఏకీభవితం]
అనస్ (ర) కథనం: మేము ప్రవక్త (స) వెనుక వేసవి కాలంలో ”జుహ్ర్ నమా’జు చదివితే, వేడినుండి తప్పించుకోవటానికి తమ తమ వస్త్రాలపైనే సజ్దా చేసేవాళ్ళం. [12] (బు’ఖారీ, ముస్లిమ్)
590 – [ 4 ] ( متفق عليه ) (1/189)
وَعَنْ أَبِيْ هُرَيْرَةَ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِذَا اشْتَدَّ الْحَرُّ فَأَبْرِدُوْا بِالصَّلَاةِ”.
590. (4) [1/189–ఏకీభవితం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఎండ తీవ్రంగా ఉంటే ఆలస్యం చేసి నమా’జ్ చదవండి.” (బు’ఖారీ, ముస్లిమ్)
591 – [ 5 ] ( صحيح ) (1/189)
وَفِيْ رِوَايَةِ لِّلْبُخَارِيِّ عَنْ أَبِيْ سَعِيْدٍ: “بِالظُّهْرِ فَإِنَّ شِدَّةَ الْحَرِّ مِنْ فَيْحِ جَهَنَّمَ وَاشْتَكَتِ النَّارُ إِلَى رَبِّهَا. فَقَالَتْ: رَبِّ أَكَلَ بَعْضِيْ بَعْضًا فَأَذِنَ لَهَا بِنَفسَيْنِ نَفْسٍ فِيْ الشِّتَاءِ وَنَفْسٍ فِيْ الصَّيْفِ أَشَدَّ مَا تَجِدُوْنَ مِنَ الْحَرِّ وَأَشَدَّ مَا تَجِدُوْنَ مِنَ الزَّمْهَرِيْرِ”.
وَفِيْ رِوَايَةٍ لِلْبُخَارِيِّ: “فَأَشَدَّ مَا تَجِدُوْنَ مِنَ الْحَرِّ فَمِنْ سَمُوْمِهَا وَأَشَدَّ مَا تَجِدُوْنَ مِنَ الْبَرَدِ فَمَنْ زَمْهَرِيْرِهَا”.
591. (5) [1/189–దృఢం]
అబూ స’యీద్ (ర) కథనం: వేడి తగ్గిన తర్వాత ”జుహ్ర్ నమాజు చదవండి. ఎందుకంటే తీవ్రమైన వేడి నరక ఆవిరివల్ల వస్తుంది. నరకం తన ప్రభువుకు నాలో చాలావేడి ఉందని, నాలో కొంత భాగం, కొంత భాగాన్ని తినేస్తుందని ఫిర్యాదు చేసింది. అల్లాహ్ (త) దాన్ని రెండుసార్లు ఊపిరి పీల్చడానికి అనుమతి ఇచ్చాడు. ఒకసారి శీతాకాలంలో, ఒకసారి వేసవి కాలంలో. అందువల్లే వేసవిలో అధికవేడి, శీత కాలంలో అధిక చల్లదనం ఉంటుంది. అంటే నరకం ఊపిరి వదలితే అధికవేడి కలుగుతుంది. ఊపిరి పీల్చినపుడు అధిక చల్లదనం ఉంటుంది.
592 – [ 6 ] ( متفق عليه ) (1/189)
وَعَنْ أَنَسٍ قَالَ: كَانَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم يُصَلِّيْ الْعَصْرَ وَالشَّمْسُ مُرْتَفِعَةٌ حَيَّةٌ فَيَذْهَبُ الذَّاهِبُ إِلَى الْعَوَالِيْ فَيَأْتِيْهِمْ وَالشَّمْسُ مُرْتَفِعَةٌ وَبَعْضُ الْعَوَالِيْ مِنَ الْمَدِيْنَةِ عَلَى أَرْبَعَةِ أَمْيَالٍ أَوْ نَحْوِهِ .
592. (6) [1/189–ఏకీభవితం]
అనస్ (ర) కథనం: ప్రవక్త (స) ’అస్ర్ నమా’జును సూర్యుడు వెలుగుతో నిగనిగ లాడుతు ప్పుడు చదివేవారు. వెళ్ళేవాడు అవాలీ వెళ్ళినా సూర్యా స్తమయం అయ్యేది కాదు. ఈ ప్రాంతం మదీనాకు సుమారు 4 మైళ్ళ దూరంలో ఉండేది. [13] (బు’ఖారీ, ముస్లిమ్)
593 – [ 7 ] ( صحيح ) (1/189)
وَعَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “تِلْكَ صَلَاةُ الْمُنَافِقِ: يَجْلِسُ يَرْقَبُ الشَّمْس حَتَّى إِذَا اصْفَرَّتْ وَكَانَتْ بَيْنَ قَرَنَيِ الشَّيْطَانِ قَامَ فَنَقَرَ أَرْبَعًا لَا يَذْكُرُ اللهُ فِيْهَا إِلَّا قَلِيْلًا”. رَوَاهُ مُسْلِمٌ .
593. (7) [1/189–దృఢం]
అనస్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”కపటాచారి నమా’జ్ ఎలా ఉంటుందంటే, కూర్చొని సూర్యుని కోసం వేచి ఉంటాడు. చివరికి సూర్యుడు పసుపుపచ్చగా మారి, అస్త మించేటపుడు షై’తాన్ రెండు కొమ్ముల మధ్యకు చేరు కుంటాడు. అప్పుడు ఈ కపటాచారి నమా’జ్ కోసం నిలబడతాడు. నాలుగు సార్లు తల నేలకు కొట్టుకుంటాడు. చాలా తక్కువగా అల్లాహ్(త)ను ప్రార్థిస్తాడు.” [14] (ముస్లిమ్)
594 – [ 8 ] ( متفق عليه ) (1/189)
وَعَنِ ابْنِ عُمرَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “الَّذِيْ تَفُوْتَهُ صَلَاةُ الْعَصْرِ فَكَأنَّمَا وُتِرَ أَهْلُهُ وَمَالُهُ”.
594. (8) [1/189–ఏకీభవితం]
’అబ్దుల్లాహ్ బిన్ ’ఉమర్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవ చనం, ” ’అస్ర్ నమా’జ్ తప్పిన వాడు అంటే దాని సమ యంలో పాటించని వాడు, అతడి భార్యాబిడ్డలు, ధన సంప దలు నాశనం అయినట్టే. అంటే దొంగలు అతని ఇంటిని దోచుకుని అతని భార్యాబిడ్డలను చంపివేసినట్లే.” [15] (బు’ఖారీ, ముస్లిమ్)
595 – [ 9 ] ( صحيح ) (1/190)
وعَنْ بُرَيْدَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَنْ تَرَكَ صَلَاةَ الْعَصْرِ فَقَدْ حَبِطَ عَمَلَهُ. رَوَاهُ الْبُخَارِيُّ.
595. (9) [1/190–దృఢం]
బురైదహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం,” ’అ’స్ర్ నమా’జును వదలిన వారి సత్కార్యాలు వృథా అవుతాయి.” (బు’ఖారీ)
596 – [ 10 ] ( متفق عليه ) (1/190)
وَعَنْ رَافِعِ بْنِ خُدَيْجٍ قَالَ: كُنَّا نُصَلِّيْ الْمَغْرِبَ مَعَ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم فَيَنْصَرِفُ أَحَدَنَا وَإِنَّهُ لَيُبْصِرَ مَوَاقِعَ نَبْلَهُ”.
596. (10) [1/190–ఏకీభవితం]
రా’ఫె బిన్-‘ఖుదైజ్ (ర) కథనం: మేము ప్రవక్త (స)తో కలసి మ’గ్రిబ్ నమా’జ్ చదివిన తర్వాత మాలో ఎవరైనా బయటకు వెళ్ళి బాణం వదలి, మళ్ళీ బాణం ఎక్కడ పడిందో చూసుకునేవాడు. [16] (బు’ఖారీ, ముస్లిమ్)
597 – [ 11 ] ( متفق عليه ) (1/190)
وَعَنْ عَائِشَةَ رَضِيَ اللهُ عَنْهَا قَالَتْ: كَانُوْا يُصَلُّوْنَ الْعَتَمَةَ فِيْمَا بَيْنَ أَنْ يَّغِيْبَ لَاشَفَقُ إِلَى ثُلُثِ اللَّيْلِ الْأَوَّلِ.
597. (11) [1/190–ఏకీభవితం]
’ఆయి‘షహ్ (ర) కథనం: ప్రవక్త (స) మరియు ఆయన అనుచరులు ’ఇషా‘ నమా’జ్ ఎర్రదనం అదృశ్యం అయినప్పటి నుండి 1/3 రాత్రివరకు చదివే వారు. [17] (బు’ఖారీ, ముస్లిమ్)
598 – [ 12 ] ( متفق عليه ) (1/190)
وعَنْهَا قَالَتْ: كَانَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم لَيُصَلِّي الْصُّبْحَ فَتَنْصَرِفُ النِّسَاءُ مُتَلَفِّعَاتٍ بِمُرُوْطِهِنَّ مَا يُعْرَفْنَ مِنَ الْغَلَسِ.
598. (12) [1/190–ఏకీభవితం]
’ఆయి‘షహ్ (ర) కథనం: ప్రవక్త (స) ఫజ్ర్ నమా’జు ముగించి న తర్వాత నమా’జ్లో పాల్గొన్న స్త్రీలు నమా’జ్ చదివి దుప్పట్లు కప్పుకొని తిరిగి వెళ్ళే వారు. చీకటి వల్ల గుర్తించబడేవారు కాదు. [18] (బు’ఖారీ)
599 – [ 13 ] ( صحيح ) (1/190)
وَعَنْ قَتَادَةَ وَعَنْ أَنَسٍ: أَنَّ نَبِيُّ الله صلى الله عليه وسلم وَزَيْدَ بْنَ ثَابِتٍ تَسَحَّرَا. فَلَمَّا فَرَغَا مِنْ سُحُوْرِهِمَا قَامَ نَبِيُّ اللهِ صلى الله عليه وسلم إِلَى الصَّلَاةِ فَصَلَّى. قُلْنَا لِأَنَسٍ: كَمْ كَانَ بَيْنَ فَرَاغِهِمَا مِنْ سُحُوْرِهِمَا وَدُخُوْلِهِمَا فِيْ الصَّلَاةِ؟ قَالَ: قَدْرَ مَا يَقْرَأُ الرَّجُلُ خَمْسِيْنَ آيةً. رَوَاهُ الْبُخَارِيُّ .
599. (13) []1/190–దృఢం]
ఖతాదహ్ (ర), అనస్ (ర) ద్వారా కథనం: ప్రవక్త (స) మరియు ’జైద్ బిన్-సా‘బిత్ ఉపవాసం కోసం స’హ్రీ తిన్నారు. స’హ్రీ తిన్న తరువాత ప్రవక్త (స) ఫజ్ర్ నమా’జుకు నిలబడ్డారు. నమా’జు చదివించారు. మేము అనస్‌ను, ‘స’హ్రీకి నమా’జ్‌కు మధ్య ఎంత సమయం ఉండేది,’ అని అడిగాము. దానికి అతను, ’50 ఆయతుల సమయం,’ అని అన్నారు. (బు’ఖారీ)
600 – [ 14 ] ( صحيح ) (1/190)
وَعَنْ أَبِيْ ذَرٍّ قَالَ: قَالَ لِيْ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “كَيْفَ أَنْتَ إِذَا كَانَتْ عَلَيْكَ أُمَرَاءٌ يُّمْيتُوْنَ الصَّلَاةَ. أَوْ قَالَ: يُؤَخِّرُوْنَ الصَّلَاةَ عَنْ وَقْتِهَا؟ قُلْتُ: فَمَا تَأْمُرُنِيْ؟ قَالَ: “صَلِّ الصَّلَاةَ لِوَقْتِهَا فَإِنْ أَدْرَكْتَهَا مَعَهُمْ فَصَلِّ فَإِنَّهَا لَكَ نَافِلَةٌ. رَوَاهُ مُسْلِمٌ .
600. (14) [1/190–దృఢం]
అబూ-జ‘ర్ (ర) కథనం: ప్రవక్త (స) నాతో, ‘ఓ అబూ-జ‘ర్! నీపై ఎలాంటి పాలకులు వస్తారంటే, వాళ్ళు నమా’జ్ను చంపినట్టు చదువుతారు. లేదా ఆలస్యం చేసి చదువుతారు,’ అని అన్నారు. అప్పుడు నేను, ‘అటువంటప్పుడు తమ ఆదేశం ఏమిటి,’ అని అడిగాను. దానికి ప్రవక్త (స), ‘నీవు ప్రారంభ సమయంలో నమా’జ్ చదువుకో, ఒకవేళ ఈ నమా’జ్ వారితో కలిసి చదివే అవకాశం ఉంటే మళ్ళీ చదువుకో. మళ్ళీ చదివిన నమా’జ్ నఫిల్ అయి పోతుంది. మొదట చదివిన నమా’జ్ ఫర్జ్ (విధి) నమా’జ్ అయిపోతుంది. (ముస్లిమ్)
601- [ 15 ] ( متفق عليه ) (1/191)
وَعَنْ أَبِيْ هُرَيْرَةَ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَنْ أَدْرَكَ رَكْعَةً مِنَ الصُّبْحِ قَبْلَ أَنْ تَطْلُعَ الشَّمْسُ فَقَدْ أَدْرَكَ الصُّبْحُ. وَمَنْ أَدْرَكَ رَكْعَةً مِّنَ الْعَصْرِ قَبْلَ أَنْ تَغْرِبَ الشَّمْسُ فَقَدْ أَدْرَكَ الْعَصْرَ”.
601. (15) [1/191–ఏకీభవితం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”సూర్యుడు ఉదయించక ముందు ఒక్క రక’అతు దొరికినా, అతడికి ఫజ్ర్ నమా’జు దొరికినట్టే. అదేవిధంగా సూర్యాస్తమయానికి ముందు ఒక్క రక’అతు దొరికినా అతనికి ’అ’స్ర్ నమా’జ్ దొరికినట్టే.” [19] (బు’ఖారీ, ముస్లిమ్)
602 – [ 16 ] ( صحيح ) (1/191)
وَعَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِذَا أَدْرَكَ أَحْدُكُمْ سَجْدَةً مِّنْ صَلَاةِ الْعَصْرِ قَبْلَ أَنْ تَغْرُبَ الشَّمْسُ فَلْيُتِمَّ صَلَاتَهُ وَإِذَا أَدْرَكَ سَجْدَةً مِّنْ صَلَاةِ الصُّبْحِ قَبْلَ أَنْ تَطْلُعَ الشَّمْسُ فَلْيُتِمَّ صَلَاتَهُ”. رواه البخاري .
602. (16) [1/191–దృఢం]
అబూ-హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మీలో ఎవరికైనా ఒక్క రక’అత్ సూర్యాస్తమయానికి ముందు దొరికితే, అతను తన నమా’జ్ను పూర్తి చేసు కోవాలి. అదేవిధంగా ఎవరికైనా సూర్యోదయానికి ముందు ఒక్క రక’అత్ దొరికినా అతను తన నమా’జును పూర్తిచేసుకోవాలి.” (బు’ఖారీ)
603 – [17] (متفق عليه) (1/191)
وَعَنْ أَنَسٍ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَنْ نَسِيَ صَلَاةً أَوْ نَامَ عَنْهَا فَكَفَّارَتُهُ أَنْ يُّصَلِّيْهَا إِذَا ذَكَرَهَا”. وَفِيْ رِوَايَةٍ: “لَا كَفَّارَةَ لَهَا إِلَّا ذَلِكَ”.
603. (17) [1/191–ఏకీభవితం]
అనస్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”నమా’జ్ను మరచి పోయినా, నిద్ర పోయినా దాని పరిహారం ఏమిటంటే, గుర్తుకు రాగానే చదువు కోవాలి.” (బు’ఖారీ, ముస్లిమ్)
604 – [ 18 ] ( صحيح ) (1/191)
وَعَنْ أَبِيْ قَتَادَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَيْسَ فِي النَّوْمِ تَفْرِيْطٌ إِنَّمَا التَّفْرِيْطُ فِيْ الْيَقْظَةِ. فَإِذَا نَسِيَ أَحَدُكُمْ صَلَاةً أَوْ نَامَ عَنْهَا فَلْيُصَلِّهَا إِذَا ذَكَرَهَا. فَإِنَّ اللهَ تعالى قَالَ: (وَأَقِمِ الصَّلَاةَ لِذِكْرِيْ؛ 20: 14) .رواه مسلم .
604. (18) [1/191–దృఢం]
అబూ-ఖతాదహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”నిద్రపోవటం వల్ల నమా’జ్ను ఆలస్యం చేయటం పొరపాటు కాదు, అయితే మేల్కొని ఉండి కూడా నమా’జ్ను ఆలస్యం చేసి చదవటం అపరాధం. కనుక మరచిపోయినా, నిద్ర పోయినా గుర్తుకు రాగానే నమా’జ్ చదువుకోవాలి. ఎందుకంటే అల్లాహ్: ‘నా స్మరణ కోసం నమా’జ్ను స్థాపించండి’ అని ఆదేశించాడు.” సూ. (తా-హా, 20:14). (ముస్లిమ్)
—–
اَلْفَصْلُ الثَّانِيْ రెండవ విభాగం
605 – [ 19 ] ( حسن ) (1/192)
عَنْ عَلِيٍّ رَضِيَ اللهُ عَنْهُ: أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم قَالَ: “يَا عَلِيُّ ثَلَاثٌ لَا تُؤَخِّرْهَا الصَّلَاةُ إِذَا أَتَتْ وَالْجَنَازَةُ إِذَا حَضَرَتْ وَالْأَيِّمُ إِذَا وَجَدْتَّ لَهَا كُفُؤًا”. رَوَاهُ التِّرْمِذِيُّ .
605. (19) [1/192–ప్రామాణికం]
’అలీ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మూడు విషయాల్లో ఆలస్యం చేయవద్దు. 1. నమా’జు సమయం, 2. జనా’జహ్, 3. వితంతువుల వివాహం వెంటనే చేసివేయాలి. [20] (తిర్మిజి’)
606 – [ 20 ] ( موضوع ) (1/192)
وَعَنِ ابْنِ عُمَرَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “اَلْوَقْتُ الْأَوَّلُ مِنَ الصَّلَاةِ رِضْوَانُ اللهِ وَالْوَقْتُ الْآخَرُ عَفْوُ اللهِ”. رَوَاهُ التِّرْمِذِيُّ .
606. (20) [1/192–కల్పితం]
’అబ్దుల్లాహ్ బిన్ ’ఉమర్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ప్రారంభకాలంలో నమా’జ్ ఆచరిస్తే దైవ ప్రీతి లభిస్తుంది. చివరి సమయంలో నమా’జ్ ఆచరిస్తే క్షమాపణ లభిస్తుంది.” [21] (తిర్మిజి’)
607 – [ 21 ] ( صحيح ) (1/192)
وَعَنْ أُمِّ فَرْوَةَ قَالَتْ: سُئِلَ النَّبِيُّ صلى الله عليه وسلم: أَيُّ الْأَعْمَالِ أَفْضَلُ؟ قَالَ: “اَلصَّلَاةُ لِأَوَّلِ وَقْتِهَا”. رَوَاهُ أَحْمَدُ وَالتِّرْمِذِيُّ وَأَبُوْ دَاوُدَ. وَقَالَ التِّرْمِذِيُّ: لَا يُرْوَى الْحَدِيْثُ إِلَّا مِنْ حَدِيْثِ عَبْدِ اللهِ بْنِ عُمَرَ الْعُمَرِيِّ وَهُوَ لَيْسَ بِالْقَوِيِّ عِنْدَ أَهْلِ الْحَدِيْثِ .
607. (21) [1/192–దృఢం]
ఉమ్మె ఫర్వ (ర) కథనం: ప్రవక్త (స)ను సత్కార్యాల్లో అత్యుత్తమ కార్యం ఏది అని ప్రశ్నించటం జరిగింది. దానికి ప్రవక్త (స) ప్రారంభ సమయంలో నమా’జ్ ఆచరించటం అన్నిటికంటే ఉత్తమమైనది అని ప్రవచించారు. (అ’హ్మద్, తిర్మిజి‘, అబూ దావూద్). కొందరు ధర్మవేత్తలు దీన్ని ప్రామాణికమైన ’హదీసు‘గా పేర్కొన్నారు.
608 – [ 22 ] ( صحيح ) (1/193)
وَعَنْ عَائِشَةَ رَضِيَ اللهُ عَنْهَا قَالَتْ: مَا صَلَّى رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم صَلَاةً لِوَقْتِهَا الْآخَرِ مَرَّتَيْنِ حَتَّى قَبْضَهُ اللهُ تَعَالى. رَوَاهُ التِّرْمِذِيُّ.
608. (22) [1/193–దృఢం]
’ఆయి‘షహ్ (ర) కథనం: ప్రవక్త (స) తనజీవితంలో ఏనాడూ చివరి సమయంలో రెండు నమా’జులైనా చదవలేదు. [22] (తిర్మిజి‘)
609 – [ 23 ] ( حسن ) (1/193)
وَعَنْ أَبِيْ أَيُّوْبَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَا تَزَالُ أُمَّتِيْ بِخَيْرٍ أَوْ قَالَ: عَلَى الْفِطْرَةِ مَا لَمْ يُؤَخِّرُوا الْمَغْرِبَ إِلَى أَنْ تَشْتَبِكَ النُّجُوْمُ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ.
609. (23) [1/193–ప్రామాణికం]
అబూ అయ్యూబ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”నా అనుచర సమాజం మ’గ్రిబ్ నమా’జ్ విషయంలో చుక్కలు కనబడేవరకు ఆలస్యం చేయకుండా ఉంటే, ఎల్లప్పుడూ మేలుతో లేదా సహజ గుణంతో కూడు కొని ఉంటుంది.” (అబూ-దావూద్)
610 – [ 24 ] ( ضعيف ) (1/193)
وَرَوَاهُ الدَّارَمِيُّ عَنِ الْعَبَّاسِ.
610. (24) [1/193–బలహీనం]
దీన్నే దార్మీ ’అబ్బాస్ (ర) ద్వారా ఉల్లేఖించారు.
611 – [ 25 ] ( صحيح ) (1/193)
وَعَنْ أَبِيْ هُرَيْرَةَ رَضِيَ اللهُ عنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَوْلَا أَنْ أَشُقَّ عَلَى أُمَّتِيْ لَأَمَرْتُهُمْ أَنْ يُّؤَخِّرُوْا الْعِشَاءَ إِلَى ثُلُثِ اللَّيْلِ أَوْ نِصْفِهِ”. رَوَاهُ أَحْمَدُ وَالتِّرْمِذِيُّ وَابْنُ مَاجَهُ .
611. (25) [1/193–దృఢం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఒకవేళ నేను నా అనుచర సమాజంపై భారం కాదను కుంటే నేను’ఇషా‘ నమాజును 1/3 వంతు రాత్రి గడి చిన తర్వాత లేదా అర్థ రాత్రి వేళలో ఆచరించమని ఆదేశించేవాడిని.” (అ’హ్మద్, తిర్మిజి‘, ఇబ్నె మాజహ్)
612 – [ 26 ] ( صحيح ) (1/193)
وَعَنْ مَعَاذِ بْنِ جَبَلٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “أَعْتِمُوْا بِهَذِهِ الصَّلَاةِ فَإِنَّكُمْ قَدْ فُضِّلْتُمْ بِهَا عَلَى سَائِرِ الْأُمَمِ وَلَمْ تُصَلِّهَا أُمَّةٌ قَبْلَكُمْ. رَوَاهُ أَبُوْ دَاوُدَ .
612. (26) [1/193–దృఢం]
ము’ఆజ్ బిన్ జబల్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మీరు ’ఇషా‘ నమా’జ్ను ఆలస్యం చేసి చదవండి. ఎందుకంటే వెనుకటి జాతులన్నిటి కంటే ’ఇషా‘ నమా’జ్ ద్వారా మీకు ప్రాధాన్యత ఇవ్వటం జరిగింది. మీ కంటే ముందు జాతులేవీ ’ఇషా‘ నమా’జ్ చదవలేదు.” (అబూ దావూద్)
613 – [ 27 ] ( صحيح ) (1/194)
وَعَنْ النُّعْمَانِ بْنِ بَشِيْرٍ قَالَ: أَنَا أَعْلَمُ بِوَقْتِ هَذِهِ الصَّلَاةِ صَلَاةِ الْعِشَاءِ الْآخَرَةِ: كَانَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم يُصَلِّيْهَا لِسَقُوْطِ الْقَمَرِ لثَالِثَةٍ. رَوَاهُ أَبُوْ دَاوُدَ وَالدّارَمِيُّ.
613. (27) [1/194–దృఢం]
నోమాన్ బిన్ బషీర్ (ర) కథనం: ’ఇషా‘ ’నమాజ్ సమయం నాకు బాగా తెలుసు. ప్రవక్త (స) మూడవ తేదీ చంద్రుడు అస్తమించినప్పుడు ఈ నమా’జ్ను చదివేవారు. (అబూ దావూద్, దార్మీ)
614 – [ 28 ] ( حسن ) (1/194)
وَعَنْ رَافِعِ بْنِ خَدِيْجٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “أَسْفِرُوْا بِالْفَجْرِ فَإِنَّهُ أَعْظَمُ لِلْأَجْرِ”. رَوَاهُ التِّرْمَذِيُّ وَأَبُوْ دَاوُدَ وَالدَّارَمِيُّ وَلَيْسَ عِنْدَ النَّسَائِيُّ: “فَإِنُّهُ أَعْظَمُ لِلْأَجْرِ”.
614. (28) [1/194–ప్రామాణికం]
రా’ఫె బిన్ ’ఖదీజ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఫజ్ర్ నమా’జ్ను అస్ఫార్లో చదవండి. ఎందుకంటే అస్ఫార్లో చదవటంవల్ల అధికపుణ్యం లభిస్తుంది.” [23] (తిర్మిజి‘, అబూ దావూద్, దార్మీ)
నసాయిలో అ’అ”జము లిల్అజ్ర్ అనే పదం లేదు.
—–
اَلْفَصْلُ الثَّالِث మూడవ విభాగం
615 – [ 29 ] ( متفق عليه ) (1/194)
عَنْ رَافِعِ بْنِ خَدِيْجٍ قَالَ: “كُنَّا نُصَلِّي الْعَصْرَ مَعَ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم ثُمَّ تُنْحَرُ الْجُزُوْرُ فَتُقْسَمُ عَشَرَ قِسْمٍ ثُمَّ تُطْبَخُ فَنَأْكُلُ لَحْمًا نَضِيْجًا قَبْلَ مَغِيْبِ الشَّمْسِ”.
615. (29) [1/194–ఏకీభవితం]
రా’ఫె బిన్ ’ఖదీజ్(ర) కథనం: ప్రవక్త(స)తో కలసి మేము ’అ’స్ర్ నమా’జ్ చదివి, ఒంటెను జి‘బహ్ చేసి, దాన్ని పది వంతులు చేసి, మాంసాన్ని వండి తినేవారం. ఇదంతా సూర్యాస్తమయానికి ముందే. [24] (బు’ఖారీ, ముస్లిమ్)
616 – [ 30 ] ( صحيح ) (1/194)
وَعَنْ عَبْدِ اللهِ بْنِ عُمَرَ قَالَ: مَكَثْنَا ذَاتَ لَيْلَةٍ نَنْتَظِرُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم لِصَلَاةِ الْعِشَاءِ الْآخِرَةِ فَخَرَجَ إِلَيْنَا حِيْنَ ذَهَبَ ثُلُثُ اللَّيْلِ أَوْ بَعْدَهُ فَلَا نَدْرِيْ أَشَيْءٌ شَغَلَهُ فِيْ أَهْلِهِ أَوْ غَيْرُ ذَلِكَ فَقَالَ حِيْنَ خَرَجَ: “إِنَّكُمْ لَتَنْتَظِرُوْنَ صَلَاةً مَا يَنْتَظِرُهَا أَهْلُ دِيْنِ غَيْرُكُمْ وَلَوْلَا أَنْ يَّثْقُلَ عَلَى أُمَّتِيْ لَصَلَّيْتُ بِهِمْ هَذِهِ السَّاعَةَ”. ثُمَّ أَمَرَ الْمُؤْذِّنَ فَأَقَامَ الصَّلَاةَ وَصَلَّى. رَوَاهُ مُسْلِمٌ .
616. (30) [1/194–దృఢం]
’అబ్దుల్లాహ్ బిన్ ’ఉమర్ (ర) కథనం: ఒక రోజు మేము ’ఇషా‘ నమా’జ్ కోసం ప్రవక్త (స) కోసం ఎదురుచూస్తూ ఉన్నాం. 1/3 వ వంతు రాత్రి గడిచి వెంటనే లేదా ఆ తరువాత ప్రవక్త (స) వచ్చారు. దేనివల్ల ఆలస్యంగా వచ్చారో మాకు తెలియదు. ప్రవక్త (స) మా వద్దకు వచ్చి, మీరు ఎలాంటి నమా’జు గురించి వేచి ఉన్నారంటే, మీ తప్ప మరెవ్వరూ దీన్ని గురించి వేచి ఉండలేదు. ఒకవేళ నేను నా అనుచర సమాజంపై భారంకాదని భావిస్తే, ’ఇషా‘ నమా’జ్ను ఈ సమయంలోనే చదివేవాడిని. అంటే ఈ సమయంలోనే చదవమని ఆదేశించేవాడిని అని పలికి, ముఅజ్జి‘న్ను అజా‘న్ ఇవ్వమని ఆదేశించారు. అనంతరం అజా‘న్, ఇఖామత్ అయ్యింది. ప్రవక్త (స) నమా’జ్ చదివించారు. [25] (ముస్లిమ్)
617 – [ 31 ] ( صحيح ) (1/195)
وَعَنْ جَابِرِ بْنِ سُمْرَةَ قَالَ: كَانَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم يُصَلِّي الصَّلَوَاتِ نَحْوًا مِّنْ صَلَاتِكُمْ وَكَانَ يُؤَخِّرُ الْعَتْمَةَ بَعْدَ صَلَاتِكُمْ شَيْئًا وَكَانَ يُخَفِّفُ الصَّلَاةَ. رَوَاهُ مُسْلِمٌ .
617. (31) [1/195–దృఢం]
జాబిర్ బిన్ సమురహ్ (ర) కథనం: ప్రవక్త (స) ఇంచుమించు మీ నమా’జ్ల లాగే చదివేవారు. అయితే ’ఇషా‘ నమా’జ్లో మాత్రం కొంత ఆలస్యం చేసేవారు. ఇంకా ప్రవక్త (స) తేలికైన నమా’జ్ చదివించేవారు. [26] (ముస్లిమ్)
618 – [ 32 ] ( صحيح ) (1/195)
وَعَنْ أَبِيْ سَعِيْدٍ رضى الله عنهُ قَالَ: صَلَّى بِنَا رَسُوْل الله صلى الله عليه وسلم صَلَاةَ الْعَتَمَةِ فَلَمْ يَخْرُجْ إِلَيْنَا حَتَّى مَضَى نَحْوِ مِّنْ شَطْرِ اللَّيْلِ فَقَالَ: “خُذُوْا مَقَاعِدَكُمْ”. فَأَخَذَنَا مَقَاعِدَنَا فَقَالَ: “إِنَّ النَّاسَ قَدْ صَلُّوْا وَأَخَذُوْا مَضَاجِعَهُمْ وَإِنَّكُمْ لَمْ تَزَالُوْا فِيْ صَلَاةٍ مَّا انْتَظَرْتُمْ الصَّلَاةَ وَلَوْلَا ضُعْفُ الضَّعِيْفِ وَسَقَمُ السَّقِيْمِ لَأَخَّرْتُ هَذِهِ الصَّلَاةَ إِلَى شَطْرِ اللَّيْلِ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ وَالنَّسَائِيُّ.
618. (32) [1/195–దృఢం]
అబూ స’యీద్ ’ఖుద్రీ (ర) కథనం: ప్రవక్త (స)తో కలసి మేము ’ఇషా‘ నమా’జ్ చదివేవాళ్ళం. ఒకరోజు ప్రవక్త (స) ‘ఇషా’ నమా’జ్ చదివించడానికి రాలేదు. ఇంచుమించు సగం రాత్రి గడిచిపోయింది. ప్రవక్త (స) వచ్చి , ‘మీ స్థానాల్లో మీరు కూర్చోండి,’ అని అన్నారు. మా స్థానాల్లో మేము కూర్చొనే ఉన్నాం. ఇతర ప్రజలు నమా’జు చదివి నిద్రపోయారు. కాని మీరు నమా’జు గురించి వేచిఉన్నారు. కనుక మీకో విషయం తెలియాలి. అదేమిటంటే, మీరు నమా’జ్ కోసం వేచిఉంటే, మీరు నమా’జ్లో ఉన్నట్టే. ఒకవేళ నాకు బలహీనుల, రోగుల ఆలోచన లేకుంటే ‘ఇషా’ నమా’జ్ సమయాన్ని అర్థరాత్రి వరకు పొడిగించే వాడిని.” (అబూ దావూద్, నసాయి’)
619 – [ 33 ] ( ضعيف ) (1/195)
وَعَنْ أُمِّ سَلْمَةَ قَالَتْ: كَانَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم أَشَدُّ تَعْجِيْلًا لِّلظُّهْرِ مِنْكُمْ وَأَنْتُمْ أَشَدُّ تَعْجِيْلًا لِلْعَصْرِ مِنْهُ. رَوَاهُ أَحْمَدُ وَالتِّرْمِذِيُّ .
619. (33) [1/195–బలహీనం]
ఉమ్మె సలమహ్ (ర) కథనం: ప్రవక్త (స) ”జుహ్ర్ నమా’జును మీకంటే చాలా త్వరగా చదివేవారు. మరి మీరు ’అ’స్ర్ నమా’జును ఆయన కంటే త్వరగా చదువుతున్నారు. [27] (అ’హ్మద్, తిర్మిజి‘)
620 – [ 34 ] ( صحيح ) (1/195)
وَعَنْ أَنَسٍ قَالَ: كَانَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم إِذَا كَانَ الْحَرُّ أَبْرَدَ بِالصَّلَاةِ وَإِذَا كَانَ الْبَرْدُ عَجَّلَ. رَوَاهُ النَّسَائِيُّ .
620. (34) [1/195–దృఢం]
అనస్ (ర)కథనం: తీవ్ర వేసవికాలంలో ప్రవక్త (స) ”జుహ్ర్ నమా’జును చల్లార్చి చదివేవారు. అంటే ఆలస్యం చేసి చదివే వారు. శీతాకాలంలో త్వరగా చదివేవారు. (నసాయి’)
621 – [ 35 ] ( صحيح ) (1/195)
وَعَنْ عُبَادَةَ بْنِ الصَّامتِ قَالَ: قَالَ لِيْ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِنَّهَا سَتَكُوْنَ عَلَيْكُمْ بَعْدِيْ أُمْرَاءُ يَشْغَلُهُمْ أَشْيَاءُ عَنِ الصَّلَاةِ لَوَقْتِهَا حَتَّى يَذْهَبَ وَقْتَهَا فَصَلُّوا الصَّلَاةَ لِوَقْتِهَا”. فَقَالَ رَجُلٌ: يَا رَسُوْلَ اللهِ أُصَلِّيْ مَعَهُمْ؟ قَالَ: “نَعَمْ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ.
621. (35) [1/195–దృఢం]
’ఉబాదహ్ బిన్ ’సామిత్ (ర) కథనం: ప్రవక్త (స) నాతో, ”నా తరువాత ఎటువంటి ఇమాములు, నాయకులు వస్తా రంటే, వారి ప్రాపంచిక వ్యవహారాలు వారిని ప్రారంభ సమయంలో నమా’జ్ చదవకుండా చేస్తాయి. అంటే ప్రారంభ సమయంలో నమా’జ్ చదవలేరు. సమయం పోతూ ఉంటుంది. ఒకవేళ మీరు ఇటువంటి కాలంలో ఉంటే మీరు మీ నమా’జ్ను అసలు సమయంలోనే చదువుకోండి,’ అని అన్నారు. దానికి ఒకవ్యక్తి, ‘ప్రవక్తా! నేను మళ్ళీ వారితో కలసి చదువుకోవచ్చా?’ అని అడిగాడు. దానికి ప్రవక్త (స), ”అవును, నఫిల్ సంకల్పంతో వారితో కలసి చదువుకో,” అని అన్నారు. (అబూ దావూద్)
622 – [ 36 ] ( ضعيف ) (1/196)
وَعَنْ قَبِيْصَةَ بْنِ وَقَّاصٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “يَكُوْنُ عَلَيْكُمْ أُمَرَاءُ مِنْ بَعْدِيْ يُؤَخِّرُوْنَ الصَّلَاةَ فَهِيَ لَكُمْ وَهِيَ عَلَيْهِمْ فَصَلُّوْا مَعَهُمْ مَا صَلّوا الْقِبْلَةَ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ.
622. (36) [1/196–బలహీనం]
ఖబీ’స బిన్-వఖ్ఖా’స్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”నాఅనంతరం మీపై ఎలాంటి ఇమాములు, నాయకులు వస్తారంటే, వారు నమా’జును ఆలస్యం చేసి చదువుతారు. ఆ నమా’జ్ మీకు లాభదాయకం అవుతుంది, వారికి ప్రాణాంతకంగా తయారవుతుంది. అయితే వారు ఖిబ్లావైపు తిరిగి నమా’జ్ చదువు తున్నంత వరకు, మీరు వారితో కలసి నమా’జ్ చదువుతూ ఉండండి,” అని ఉపదేశించారు. [28] (అబూ దావూద్)
623 – [ 37 ] ( صحيح ) (1/196)
وَعَنْ عُبَيْدِ اللهِ بْنِ عَدِي بْنِ الْخَيَارِ: أَنَّهُ دَخَلَ عَلَى عُثْمَانَ وَهُوَ مَحْصُوْرٌ فَقَالَ: إِنَّكَ إِمَامُ عَامَةٍ وَنَزَلَ بِكَ مَا تَرَى وَيُصَلِيْ لَنَا إِمَامُ فِتْنَةٍ وَنَنَحَّرَجُ.فَقَالَ: الصَّلَاةُ أَحْسَنُ مَا يَعْمُلُ النَّاسُ فَإِذَا أَحْسَنَ النَّاسُ فَأَحْسِنْ مَعَهُمْ وَإِذَا أَسَاؤُوْا فَاجْتَنِبْ إِسَاءَتْهُمْ. رَوَاهُ الْبُخَارِيُّ.
623. (37) [1/196–దృఢం]
’ఉబైదుల్లాహ్ బిన్ ’అదీ బిన్ అల్-’ఖియార్ (ర) కథనం: నేను ’ఉస్మా‘న్ (ర) వద్దకు వెళ్ళాను. అప్పటికి అతను ముట్టడించబడి ఉన్నారు. అంటే తన ఇంటిలో బందీగా ఉన్నారు. అతన్ని చంపాలని నిశ్చయించుకొని ఉన్నారు. అప్పుడు ద్రోహి ఇమా ముగా నమా’జు చదివిస్తున్నాడు. అప్పుడు నేను ’ఉస్మా‘న్ (ర) తో, ‘మీరు ప్రజలందరి నాయకులు, మీపైనే ఈ ప్రమాదం వచ్చింది. ద్రోహి, కల్లోలాలు రేకెత్తించేవాడు మాకు నమా’జ్ చదివిస్తున్నాడు. ఇటువంటివాడి వెనుక నమా’జ్ చదవటం మాకు నచ్చటం లేదు. పుణ్యం కాదు, పాపం అనిపిస్తుంది,’ అని అన్నాను. దానికి ’ఉస్మా‘న్ (ర), ‘మానవుని కార్యాలన్నిటిలో ఉత్తమమైనది నమాజ్. ప్రజలు మంచి పనులు చేస్తూ ఉంటే, నీవు కూడా వారితో కలసి మంచి చేయి. అంటే వారు నమా’జు చదివితే నీవూ నమా’జు చదువు. ఒకవేళ వారు పాపాలు చేస్తే, నీవు దూరంగా ఉండు,’ అని అన్నారు. (బు’ఖారీ)
=====
3– بَابُ فَضَائِلُ الصَّلَاةِ
- నమా’జు ఘనతావిశిష్టతలు
اَلْفَصْلُ الْأَوَّلُ మొదటి విభాగం
624 – [ 1 ] ( صحيح ) (1/197)
عَنْ عُمَارَةَ بْنِ رُوَيْبَةَ قَالَ: سَمِعْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ: “لَنْ يَّلِجَ النَّارَ أَحَدٌ صَلَّى قَبْلَ طُلُوْعِ الشَّمْسِ وَقَبْلَ غُرُوْبِهَا”. يَعْنِيْ الْفَجْرَ وَالْعَصْرَ. ( رَوَاهُ مُسْلِمٌ)
624. (1) [1/197–దృఢం]
’ఉమారహ్ బిన్ రువైబహ్ (ర) కథనం: ప్రవక్త (స) ఇలా ప్రవచిస్తూ ఉండగా నేను విన్నాను, ”ఫజ్ర్ మరియు ’అ’స్ర్ నమా’జులను చదివేవాడు ఎన్నడూ నరకంలో ప్రవేశిచడు.” [29] (ముస్లిమ్)
625 – [ 2 ] ( متفق عليه ) (1/197)
وعَنْ أَبِيْ مُوْسَى قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَنْ صَلَّى الْبَرْدَيْنِ دَخَلَ الْجَنَّة”.
625. (2) [1/197–ఏకీభవితం]
అబూ మూసా (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”చల్లని నమా’జ్లను క్రమం తప్పకుండా చదివేవారు స్వర్గంలో ప్రవేశిస్తారు.” [30] (బు’ఖారీ, ముస్లిమ్)
626 – [ 3 ] ( متفق عليه ) (1/197)
وَعَنْ أَبِيْ هُرَيْرَةَ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم قَالَ: “يَتَعَاقَبُوْنَ فِيْكُمْ مَلَائِكَةٌ بِاللَّيْلِ وَمَلَائِكَةٌ بِالنَّهَارِ وَيَجْتَمِعُوْنَ فِيْ صَلَاةِ الْفَجْرِ وَصَلَاةِ الْعَصْرِ ثُمَّ يَعْرُجُ الَّذِيْنَ بَاتُوْا فِيْكُمْ فَيَسْأَلُهُمْ رَبُّهُمْ وَهُوَ أَعْلَمُ بِهِمْ كَيْفَ تَرَكْتُمْ عِبَادِيْ فَيَقُوْلُوْنَ تَرَكْنَاهُمْ وَهُمْ يصَلُّوْنَ وَأَتَيْنَاهُمْ وَهُمْ يُصَلُّوْنَ”.
626. (3) [1/197–ఏకీభవితం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”రాత్రీ పగటి దైవదూతలు సత్కార్యాలు తీసుకోవటానికి మీ వద్దకు వస్తుంటారు. ఫజ్ర్ మరియు ’అస్ర్‘ నమా ‘జుల్లో కలుసు కుంటారు. మీ వద్ద నుండి సత్కార్యాలను తీసుకొని అల్లాహ్ (త) ముందు హాజరౌతారు. అన్నీ తెలిసినా అల్లాహ్ (త) వారిని, ‘నా దాసులు ఏ స్థితిలో ఉన్నారు,’ అని అడగ్గా, దైవదూతలు, ‘వారు నమా’జ్ చదువు తుండగా మేము వచ్చాము, ఇంకా మేము వెళ్ళి నప్పుడు కూడా వారు నమా’జ్ చదువుతూ ఉండే వారు,’ అని చెబుతారు. (బు’ఖారీ, ముస్లిమ్)
627 – [ 4 ] ( صحيح ) (1/197)
وَعَنْ جُنْدُبِ الْقَسْرِيِّ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَنْ صَلَّى صَلَاةَ الصُّبْحِ فَهُوَ فِيْ ذِمَّةِ اللهِ فَلَا يَطْلُبَنَّكُمْ اللهُ مِنْ ذِمَّتِهِ بِشَيْءٍ فَإِنَّهُ مَنْ يَّطْلُبُهُ مِنْ ذِمَّتِهِ بِشَيْءٍ يُدْرِكُهُ ثُمَّ يُكِبُّهُ عَلَى وَجْهِهِ فِيْ نَارِ جَهَنَّمَ”. رَوَاهُ مُسْلِمٌ.
وَفِيْ بَعْضِ نُسَخِ الْمَصَابِيْحِ الْقُشَيْرِيِّ بَدَلَ الْقَسْرِيِّ .
627. (4) [1/197–దృఢం]
జున్దుబ్ ఖస్రీ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఫజ్ర్ నమా’జ్ చదివినవాడు అల్లాహ్ రక్షణలో చేరినట్టే. కనుక అటువంటి వ్యక్తిని హింసించకండి. అతని ధనాన్ని దోచుకోకండి. అతని గురించి పరోక్షంగా నిందించకండి, చాడీలు చెప్పకండి, ఇంకా అతన్ని అవమానపరచకండి. ఎందుకంటే అతడు అల్లాహ్ (త) రక్షణలో ఉన్నాడు. ఇలా చేస్తే అల్లాహ్ (త) మిమ్మల్ని విచారించడు, తన హక్కును గురించి అడగడు. ఒకవేళ మీరు అతనికి హాని చేకూరిస్తే, అల్లాహ్ (త) తన హక్కును అడిగి, దాన్ని వసూలు చేస్తాడు. తన హక్కు లభించక పోతే, బోర్లా పడవేసి నరకంలో పడవేస్తాడు.” [31] (ముస్లిమ్)
628 – [ 5 ] ( متفق عليه ) (1/198)
وَعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَوْ يَعْلَمُ النَّاسُ مَا فِي النِّدَاءِ وَالصَّفِ الْأَوَّلِ ثُمَّ لَمْ يَجِدُوْا إِلَّا أَنْ يَّسْتَهِمُوْا عَلَيْهِ. لَاسَتَهَمُوْا وَلَوْ يَعْلَمُوْنَ مَا فِيْ التَّهْجِيْرِ لَاسَتبقُوْا إِلَيْهِ وَلَوْ يَعْلَمُوْنَ مَا فِيْ الْعَتَمَةِ وَالصُّبْحِ لَأتَوْهُمَا وَلَوْ حَبْوًا”.
628. (5) [1/198–ఏకీభవితం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఒకవేళ ప్రజలకు అజా‘న్ ఇవ్వటం, మొదటి పంక్తిలో నిలబడటం యొక్క పుణ్యం గురించి తెలిస్తే, చీటిలు వేసుకునేవారు. అదేవిధంగా ”జుహ్ర్ నమా’జ్ ప్రారంభ కాలంలో చదవడానికి గల పుణ్యం తెలిస్తే పరిగెత్తు కుంటూ వచ్చేవారు. అదేవిధంగా ’ఇషా‘ మరియు ఫజ్ర్ నమా’జ్ల పుణ్యం తెలుసుకుంటే, నడవటానికి శక్తి లేక పోయినా కూర్చొని ప్రాకుతూ వచ్చేవారు.” [32] (బు’ఖారీ, ముస్లిమ్)
629 – [ 6 ] ( متفق عليه ) (1/198)
وَعَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَيْسَ صَلَاةٌ أَثْقَلَ عَلَى الْمُنَافِقِ مِنَ الْفَجْرِوَالْعِشَاءِ وَلَوْ يَعْلَمُوْنَ مَا فِيْهِمَا لَأتَوْهُمَا وَلَوْحَبْوًا”.
629. (6) [1/198–ఏకీభవితం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”కపటాచారులపై ఫజ్ర్ మరియు ‘ఇషా’ నమా’జుల కంటే భారమైన నమా’జ్ మరేదీ లేదు. ఒకవేళ వాటి ప్రాముఖ్యత వారికి తెలిస్తే, మోకాళ్ళ ద్వారా, పిరుదుల ద్వారా ప్రాకుకుంటూ రావలసివచ్చినా వస్తారు.” (బుఖారీ, ముస్లిమ్)
630 – [ 7 ] ( صحيح ) (1/198)
وَعَنْ عُثْمَانَ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَنْ صَلَّى الْعِشَاءَ فِيْ جَمَاعَةٍ فَكَأَنَّمَا قَامَ نِصْفَ اللَّيْلِ وَمَنْ صَلَّى الصُّبْحَ فِيْ جَمَاعَةٍ فَكَأَنَّمَا صَلَّى اللَّيْلَ كُلَّهُ”. رَوَاهُ مُسْلِمٌ .
630. (7) [1/198–దృఢం]
’ఉస్మా‘న్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”సామూహికంగా ’ఇషా‘ నమా’జు చదివినవారు, అర్థ-రాత్రి వరకు నమా’జ్ చదివినట్లు, ఇంకా సామూహికంగా ఫజ్ర్ నమా’జ్ చదివినవారు రాత్రంతా నమా’జ్ చదివినట్లే.” (ముస్లిమ్)
631 – [ 8 ] ( صحيح ) (1/198)
وَعَنِ ابْنِ عُمَرَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَا يَغْلِبَنَّكُمْ الْأَعْرَابُ عَلَى اسْمِ صَلَاتِكُمُ الْمَغْرِبَ”. قَالَ: “وَتَقُوْلُ الْأَعْرَابُ هِيَ الْعِشَاءُ”.
631. (8) [1/198–దృఢం]
ఇబ్నె ’ఉమర్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, బద్దూలు మీ మ’గ్రిబ్ నమా’జు పేరుపై మిమ్మల్ని అధిగమించకూడదు సుమా! వారు మ’గ్రిబ్ను ’ఇషా‘ నమా’జు అని అంటారు.”
632 – [ 9 ] ( صحيح ) (1/198)
وَقَالَ: “لَا يَغْلِبَنَّكُمْ الْأَعْرَابُ عَلَى اسْمِ صَلَاتُكُمُ الْعِشَاءَ فَإِنَّهَا فِيْ كِتَابِ اللهِ الْعِشَاءُ فَإِنَّهَا تُعْتِمُ بِحِلَابِ الْإِبْلِ. رَوَاهُ مُسْلِمٌ.
632. (9) [1/198–దృఢం]
అనుచరుని కథనం: ”బద్దూలు మ’గ్రిబ్ నమాజును ’ఇషా‘ నమా’జ్ అంటారు.” ప్రవక్త (స) ప్రవచనం: ”బద్దూలు మీ ’ఇషా‘ నమా’జు పట్ల మిమ్మల్ని మోసగించరాదు, అల్లాహ్ (త) దీని పేరు ’ఇషా‘ అని పెట్టాడు.” ఖుర్ఆన్ లో ఇలా ఉంది: ”…బ’అద ‘సలాతుల్ ’ఇషా‘…” (సూ. అన్-నూర్, 24:58) బద్దూలు ఒంటెల పాలు పితకడానికి మ’గ్రిబ్ నమా’జును ఆలస్యం చేసేవారు.” [33] (ముస్లిమ్)
633 – [ 10 ] ( صحيح ) (1/199)
وَعَنْ عَلِيٍّ رَضِيَ اللهُ عَنْهُ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم قَالَ يَوْمُ الْخَنْدَقِ: “حَبَسُوْنَا عَنْ صَلَاةِ الْوُسْطَى: صَلَاةِ الْعَصْرِ مَلَأَ اللهُ بُيُوْتَهُمْ وَقُبُوْرَهُمْ نَارا (متفق عليه)
633. (10) [1/199–దృఢం]
’అలీ (ర) కథనం: ప్రవక్త (స) కందకం యుద్ధంనాడు ”ఈ అవిశ్వాసులు మమ్మల్ని ’అ’స్ర్ నమా’జ్ చదవకుండా చేశారు. అల్లాహ్ (త) వీరి గృహాలను, సమాధులను అగ్నికి ఆహుతి చేయుగాక!” అని అన్నారు. [34] (బు’ఖారీ, ముస్లిమ్)
—–
اَلْفَصْلُ الثَّانِيْ రెండవ విభాగం
634 – [ 11 ] ( صحيح ) (1/199)
عَنِ ابْنِ مَسْعُوْدٍ وَسَمُرَةَ بْنِ جُنْدُبٍ قَالَا: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “صَلَاةُ الْوُسْطَى صَلَاةُ الْعَصْرِ”. رَوَاهُ التِّرْمِذِيُّ.
634. (11) [1/199–దృఢం]
ఇబ్నె మస్’ఊద్ (ర) మరియు సమురహ్ బిన్ జున్దుబ్ (ర) కథనం: ప్రవక్త (స), ‘సలాతె వుస్తా అంటే ’అ’స్ర్ నమా’జ్,’ అని ప్రవచించారు. (తిర్మిజి‘)
635 – [ 12 ] ( صحيح ) (1/199)
وَعَنْ أَبِيْ هُرَيْرَةَ رَضِيَ اللهُ عَنْهُ عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم فِيْ قَوْلِهِ تَعَالَى: (إِنَّ قُرْآنَ الْفَجْرِ كَانَ مَشْهُوْدًا؛ 17: 78) قَالَ: “تَشْهَدُهُ مَلَائِكَةُ اللَّيْلِ وَمَلَائِكَةُ النَّهَارِ”. رَوَاهُ التِّرْمِذِيُّ .
635. (12) [1/199–దృఢం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) ఖుర్ఆన్ లోని ”…ఇన్న ఖుర్ఆనల్ ఫజ్రి కాన మష్హూదా” (సూ. అల్-ఇస్రా, 17:78) అనే ఆయతును గురించి వ్యాఖ్యానిస్తూ ఫజ్ర్ నమా’జ్లో రాత్రీ-పగల దైవ దూతలు హాజరౌతారని, అన్నారు. (తిర్మిజి‘)
—–
اَلْفَصْلُ الثَّالِثُ మూడవ విభాగం
636 – [ 13 ] ( حسن ) (1/200)
عَنْ زَيْدِ بْنِ ثَابِتٍ وَعَائِشَةَ قَالَا: الصَّلَاةُ الْوُسْطَى صَلَاةُ الظُّهْرِ رَوَاهُ مَالِكٌ عَنْ زَيْدِ وَالتِّرْمِذِيُّ عَنْهُمَا تَعْلِيْقًا .
636. (13) [1/200–ప్రామాణికం]
’జైద్ బిన్ సా‘బిత్ (ర) మరియు ’ఆయి‘షహ్ (ర) కథనం: ”మధ్యస్థ నమా’జ్ అంటే ”జుహ్ర్ నమా’జ్.” (మాలిక్, తిర్మిజి‘)
637 – [ 14 ] ( صحيح ) (1/200)
وَعَنْ زَيْدِ بْنِ ثَابِتٍ قَالَ: كَانَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم يُصَلِّي الظُّهْر بِالْهَاجِرَةِ وَلَمْ يَكُنْ يُّصَلِّيْ صَلَاةً أَشَدُّ عَلَى أَصْحَابِ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم مِنْهَا فَنَزَلَتْ (حَافِظُوْا عَلَى الصَّلَوَاتِ وَالصَّلَاةِ الْوُسْطَى؛ 2: 238) وَقَالَ إِنَّ قَبْلَهَا صَلَاتَيْنِ وَبَعْدَهَا صَلَاتَيْنِ. رَوَاهُ أَحْمَدُ وَأَبُوْ دَاوُدَ .
637. (14) [1/200–దృఢం]
’జైద్ బిన్ సా‘బిత్ (ర) కథనం: ప్రవక్త (స) ”జుహ్ర్ నమా’జును సమయం కాగానే చదివేవారు. అయితే అనుచరులకు ”జుహ్ర్ నమా’జ్ ఇతర నమా’జుల కంటే చాలా భారంగా ఉండేది. అప్పుడు ” ‘హాఫి”జూ అలస్సలవాతి, వస్సలాతిల్ వుస్తా” అనే ఆయతు అవతరింపజేయబడింది. అంటే నమా’జులన్నింటినీ పరిరక్షించండి. ఇంకా మధ్యస్థ నమా’జును అన్నిటి కంటే అధికంగా పరిరక్షించండి. ’జైద్ కథనం: సలా తుల్ వుస్తాకు ముందు రెండు నమా’జులు, దాని తరువాత రెండు నమా’జులు. (’అహ్మద్, అబూ దావూద్)
638 – [ 15 ] ( ضعيف ) (1/200)
وَعَنْ مَالِكٍ بَلَغَهُ أَنَّ عَلِيَّ بْنَ أَبِيْ طَالِبٍ وَعَبْدَ اللهِ بْنِ عَبَّاسٍ كَانَا يَقُوْلَانِ: اَلصَّلَاةُ الْوُسْطَى صَلَاةُ الصُّبْحِ. رَوَاهُ فِيْ الْمُوُطَّأ .
638. (15) [1/200–బలహీనం]
మాలిక్ కథనం: ’అలీ (ర), ’అబ్దుల్లాహ్ బిన్ ’అబ్బాస్ (ర)ల వద్ద మధ్యస్థ నమా’జ్ ఫజ్ర్ నమా’జ్.
639 – [ 16 ] ( لم تتم دراسته ) (1/200)
وَرَوَاهُ التِّرْمِذِيُّ عَنِ ابْنِ عَبَّاسٍ وَابْنِ عُمَرَ تَعْلِيْقًا .
639. (16) [1/200–అపరిశోధితం]
దీన్నే తిర్మిజి‘ ఇబ్నె ’అబ్బాస్ మరియు ఇబ్నె ’ఉమర్ ద్వారా ఉల్లేఖించారు. [35]
640 – [ 17 ] ( ضعيف ) (1/201)
وَعَنْ سَلْمَانَ قَالَ: سَمِعْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ: “مَنْ غَدَا إِلَى صَلَاةِ الصُّبْحِ غَدَا بِرَايَةِ الْإِيْمَانِ وَمَنْ غَدَا إِلَى السُّوْقِ غَدَا بِرَايَةِ إِبْلِيْسَ”. رَوَاهُ ابْنُ مَاجَهُ .
640. (17) [1/201–బలహీనం]
సల్మాన్ (ర) కథనం: ప్రవక్త (స) ఇలా ప్రవచిస్తూ ఉండగా నేను విన్నాను, ”వేకువజామున ఫజ్ర్ నమా’జ్‌కు వెళ్ళే వ్యక్తి తనవెంట విశ్వాసం జండాను తీసుకొని వెళతాడు. కాని ఉదయం బజారుకు వెళ్ళే వ్యక్తి తనవెంట షై’తాన్ జెండా తీసుకొనివెళతాడు.” [36] (ఇబ్నె- మాజహ్)
=====
4– بابُ الْأَذَانِ
4. అజా‘న్ (నమాజ్ కై పిలుపు)
అజా‘న్ అంటే ప్రకటన, తెలియపరచటం, వార్త అందించటం అని అర్థం. ధార్మిక పరిభాషలో నమా’జ్ కోసం ప్రత్యేక పదాల ద్వారా పిలవటం అని అర్థం. అదేవిధంగా బిడ్డ పుట్టగానే కుడిచెవిలో అజా‘న్, ఎడమ చెవిలో ఇఖామత్ పలకాలి. నమా’జ్ కోసం అజా‘న్ ఇవ్వటం ప్రవక్త సాంప్రదాయం. ఇది ఇస్లామ్ చిహ్నాల్లో ఒక చిహ్నం. ఐదుపూటల నమా’జుకు, శుక్రవారంనాడు అజా‘న్ ఇవ్వటం ప్రవక్త సాంప్రదాయం.
అజా‘న్ ప్రారంభం: ప్రవక్త (స) మక్కహ్ జీవితం అంతా ఆపదలతో, కష్టాలతో, బాధలతో గడిచింది. ఆ సమయంలో ఒక్క నమా’జు మాత్రమే విధి అయి ఉండేది. మదీనహ్ వచ్చిన తరువాత కొంత వరకు శాంతి భద్రతలు చోటు చేసుకున్న తరువాత విధులు, నిబంధనలు, బాధ్యతలు అవతరించటం ప్రారంభం అయ్యాయి. అనంతరం ’జకాత్, ఉపవాసాలు విధించబడ్డాయి. హద్దులు నిర్దేశించ బడ్డాయి. ధర్మాధర్మాలను వివరించటం జరిగింది. ఆ కాలంలో ప్రతి నమా’జుకు ప్రజలు ఒకచోట చేరుకునే వారు. ప్రజలందరూ వచ్చిన తర్వాత నమా’జును ప్రవక్త (స) చదివించేవారు. అయితే ప్రజలకు నమా’జు సమయం గురించి తెలియపరిచే సాధనాలేవీ ఉండేవి కావు. అందువల్ల ప్రవక్త (స) నమా’జు సమయం కాగానే యూదుల్లా డప్పులు కొట్టటం, లేదా బాకా ఊదడం చేద్దామని నిశ్చయించుకున్నారు. ఇంతలో అన్సారుల్లోని ’అబ్దుల్లాహ్ బిన్-’జైద్ బిన్- ’అబ్దురబ్బిహ్ స్వప్నంలో అజా‘న్ పదాలు చూశారు. మేల్కొని ప్రవక్త (స) వద్దకు వచ్చి, వివరించారు. దానికి ప్రవక్త (స) నీకల సత్యమైనది, బిలాల్ కు అజా‘న్ నేర్పించవలసిందిగా ఆదేశించారు. బిలాల్ అజా‘న్ ఇస్తున్నారు. ఇంతలో ’ఉమర్ (ర) వచ్చి తన స్వప్నాన్ని గురించి వివరిస్తూ, ‘నేను కూడా స్వప్నంలో ఈ పదాలనే విన్నాను,’ అని అన్నారు. ప్రవక్త (స) అది విని చాలా సంతోషించారు. ఇద్దరు ముస్లిముల ఏకాభిప్రాయంపై అల్లాహ్ (త) కృతజ్ఞతలు తెలుపుకున్నారు. (ఇబ్నె హిషామ్ – 283, జామె తిర్మిజి’ – 37)
اَلْفَصْلُ الْأَوَّلُ మొదటి విభాగం
641 – [ 1 ] ( متفق عليه ) (1/202)
عَنْ أَنَسٍ قَالَ: ذَكَرُوا النَّارَ وَالنَّاقُوْسَ فَذَكَرُوْا الْيَهُوْدَ وَالنَّصَارَى فَأُمِرَ بِلَالٌ أَنْ يَّشْفَعَ الْأَذَانَ وَأَنْ يُّوْتِرَ الْإِقَامَةَ. قَالَ إِسْمَاعِيْلُ: فَذَكَرْتُهُ لِأَيُّوْبَ. فَقَالَ: إِلَّا الْإِقَامَةَ.
641. (1) [1/202–ఏకీభవితం]
అనస్ (ర) కథనం: నమా’జ్ వేళలను గుర్తించటం గురించి ప్రజలు మంటలు, మరియు బాకాలను గురించి పేర్కొంటూ, ‘యూదులు, క్రైస్తవులు కూడా ఇలాగే చేస్తారు,’ అని అన్నారు. ఏమీ నిర్థారించనిదే సభ ముగిసింది. రాత్రి ’అబ్దుల్లాహ్ కలలో అజా‘న్ పదాలు విని, ప్రవక్త (స)కు వినిపించారు. ప్రవక్త (స) బిలాల్‌కు నేర్పించమని, ఆదేశించారు. అనంతరం బిలాల్‌కు అజా‘న్లో రెండుసార్లు ఇఖామత్ లో ఒకసారి పలకమని ఆదేశించారు. [37] (బు’ఖారీ, ముస్లిమ్)
642 – [ 2] ( صحيح ) (1/202)
وَعَنْ أَبِيْ مَحْذُوْرَةَ قَالَ: أَلْقَى عَلَيَّ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم اَلتَّأذِيْنَ هُوَ بِنَفْسِهِ فَقَالَ: قُلِ: “اللهُ أَكْبَرُ، اللهُ أَكْبَرُ. اللهُ أَكْبَرُ، اللهُ أَكْبَرُ. أَشْهَدُ أَنْ لَّا إِلَهَ إِلَّا اللهُ، أَشْهَدُ أَنْ لَّا إِلَهَ إِلَّا اللهُ. أَشْهَدُ أَنَّ مُحَمَّدًا رَّسُوْلُ اللهِ، أَشْهَدُ أَنَّ مُحَمَّدًا رَّسُوْلُ اللهِ. ثُمَّ تَعُوْدُ فَتَقُوْلُ: أَشْهَدُ أَنْ لَّا إِلَهَ إِلَّا اللهُ، أَشْهَدُ أَنْ لَّا إِلَهَ إِلَّا اللهُ. أَشْهَدُ أَنَّ مُحَمَّدًا رَّسُوْلُ اللهِ، أَشْهَدُ أَنَّ مُحَمَّدًا رَّسُوْلُ اللهِ. حَيَّ عَلَى الصَّلَاةِ، حَيَّ عَلَى الصَّلَاةِ. حَيَّ عَلَى الْفَلَاحِ، حَيَّ عَلَى الْفَلَاحِ. اللهُ أَكْبَرُ، اللهُ أَكْبَرُ، لَا إِلَهَ إِلَّا اللهُ”. رَوَاهُ مُسْلِمٌ .
642. (2) [1/202–దృఢం]
అబూ మ’హ్జూ‘రహ్ (ర) కథనం: ”ప్రవక్త (స) స్వయంగా నాకు అజా‘న్ నేర్పారు. నాతో ఇలా పలుకు,’ అని అన్నారు. ”అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్.- అల్లాహ్ గొప్పవాడు. అష్హదు అల్లాయిలాహ ఇల్లల్లాహ్, అష్హదు అల్లాయిలాహ ఇల్లల్లాహ్. – అల్లాహ్ తప్ప ఆరాధ్యులెవరూ లేరని నేను సాక్ష్యం ఇస్తున్నాను. అష్హదు అన్న ము’హమ్మదర్రసూ లుల్లాహ్, అష్హదు అన్న ము’హమ్మద ర్రసూ లుల్లాహ్.” -ముహమ్మద్(స) అల్లాహ్ ప్రవక్త అని నేను సాక్ష్యం ఇస్తున్నాను. మళ్ళీ ‘పలికిన పదాల్ని ఉచ్చరించు’ అని అన్నారు. అష్హదు అల్లా యిలాహ ఇల్లల్లాహ్, అష్హదుఅల్లా యిలాహ ఇల్లల్లాహ్. అష్హదు అన్న ము’హమ్మదర్ర సూలుల్లాహ్, అష్హదు అన్న ముహ మ్మద ర్రసూలుల్లాహ్. ’హయ్యా ’అల’స్సలాహ్, ’హయ్యా ’అల’స్సలాహ్. నమా’జుకు రండి, ’హయ్యా ’అలల్ ’ఫలాహ్, ’హయ్యా’ అలల్ ’ఫలాహ్ – మోక్షానికి (ముక్తికి) రండి. – అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, లా ఇలాహ ఇల్లల్లాహ్. [38]
—–
اَلْفَصْلُ الثَّانِيْ రెండవ విభాగం
643 – [ 3 ] ( حسن ) (1/203)
عَنْ أبْنِ عُمَرَ قَالَ: كَانَ الْأَذَانُ عَلَى عَهْدِ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم مَرَّتَيْنِ مَرَّتَيْنِ وَالْإِقَامَةُ مَرَّةً مَرَّةً غَيْرَ أَنَّهُ كَانَ يَقُوْلُ: قَدْ قَامَتِ الصَّلَاةُ قَدْ قَامَتِ الصَّلَاةُ. رَوَاهُ أَبُوْ دَاوُدَ وَالنَّسَائِيُّ وَالدَّارَمِيُّ .
643. (3) [1/203–ప్రామాణికం]
‘అబ్దుల్లాహ్ బిన్ ‘ఉమర్ (ర) కథనం: ప్రవక్త (స) కాలంలో అ’జాన్ పదాలు రెండుసార్లు, ఇఖామత్ పదాలు ఒకసారి మరియు ఖద్ఖామతి’స్సలాహ్ రెండు సార్లు పలుకబడేవి. (అబూ దావూద్, నసాయి’, దార్మీ)
644 – [ 4 ] ( حسن ) (1/203)
وَعَنْ أَبِيْ مَحْذُوْرَةَ: أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم عَلَّمَهُ الْأَذَانَ تِسْعَ عَشَرَةَ كَلِمَةً وَالْإِقَامَةَ سَبْعَ عَشَرَةَ كَلِمَةً. رَوَاهُ أَحْمَدُ وَالتِّرْمِذِيُّ وَأَبُوْ دَاوُدَ وَالنِّسَائِيُّ وَالدَّارَمِيُّ وَابْنُ مَاجَهُ .
644 [1/203–ప్రామాణికం]
అబూ మ’హ్జూ‘రహ్ (ర) కథనం: ప్రవక్త (స) అతనికి అ’జాన్ పదాలు19, ఇఖామత్ పదాలు17, నేర్పారు. [39] (అ’హ్మద్, తిర్మిజి’, అబూ దావూద్, నసాయి’, దార్మీ, ఇబ్నె మాజహ్)
645 – [ 5 ] ( صحيح ) (1/203)
وَعَنْهُ قَالَ: قُلْتُ يَا رَسُوْلَ اللهِ عَلِّمْنِيْ سُنَّةَ الْأذَانِ قَالَ: فَمَسَحَ مُقَدَّمَ رَأْسِهِ. وَقَالَ: وَتَقُوْلُ: “اللهُ أَكْبَرُ، اللهُ أَكْبَرُ. اللهُ أَكْبَرُ، اللهُ أَكْبَرُ”. تَرْفَعُ بِهَا صَوْتَكَ ثُمَّ تَقُوْلُ: “أَشْهَدُ أَنْ لَّا إِلَهَ إِلَّا اللهُ، أَشْهَدُ أَنْ لَّا إِلَهَ إِلَّا اللهُ. أَشْهَدُ أَنَّ مُحَمَّدًا رَسُوْلُ اللهِ، أَشْهَدُ أَنَّ مُحَمَّدًا رَسُوْلُ اللهِ”. تَخْفِضُ بِهَا صَوْتَكَ ثُمَّ تَرْفَعُ صَوْتَكَ بِالشَّهَادَةِ: “أَشْهَدُ أَنَّ لَا إِلَهَ إِلَّا اللهُ، أَشْهَدُ أَنَّ لَّا إلَهَ إِلَّا اللهُ. أَشْهَدُ أَنَّ مُحَمَّدًا رَّسُوْلُ اللهِ، أَشْهَدُ أَنَّ مُحَمَّدًا رَّسُوْلُ اللهِ. حَيَّ عَلَى الصَّلَاةِ، حَيَّ عَلَى الصَّلَاةِ. حَيَّ عَلَى الْفَلَاحِ، حَيَّ عَلَى الْفَلَاحِ”. فَإِنْ كَانَ صَلَاةُ الصُّبْحِ قُلْتَ: “الصَّلَاةُ خَيْر مِّنَ النَّوْمِ، الصَّلَاةُ خَيْر مِّنَ النَّوْمِ. اللهُ أَكْبَرُ، اللهُ أَكْبَرُ، لَا إِلَهَ إِلَّا اللهُ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ.
645. (5) [1/203–దృఢం]
అబూ మ’హ్జూ‘రహ్ (ర) కథనం: నేను ప్రవక్త(స) ను, ‘ఓ ప్రవక్తా! నాకు అజా‘న్ నేర్పించండి,’ అని అన్నాను. ప్రవక్త (స) అతని నుదురుపై చేతితో నిమిరి, ”అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్; అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్.” అని బిగ్గరగా పలుకు. మళ్ళీ ప్రవక్త ఇలా పలుకు అన్నారు, ”అష్హదు అల్లాయిలాహ ఇల్లల్లాహ్, అష్హదు అల్లాయి లాహ ఇల్లల్లాహ్; అష్హదు అన్న ముహమ్మదర్రసూ లుల్లాహ్, అష్హదు అన్న ముహమ్మ దర్రసూలు ల్లాహ్; హయ్య అలస్సలాహ్, ’హయ్య ’అల ’స్సలాహ్. ’హయ్య ’అలల్ ’ఫలాహ్; ’హయ్య ’అలల్ ’ఫలాహ్.” ఫజ్ర్ నమా’జు అయితే, ”అ’స్సలాతు ఖైరుమ్మి నన్నౌమ్,” రెండుసార్లు. అంటే -నమా’జు నిద్రకంటే మేలైనది.” ఆ తరువాత, ”అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్; లా ఇలాహ ఇల్లల్లాహ్.” (అబూ-దావూద్)
646 – [ 6 ] ( ضعيف ) (1/204)
وَعَنْ بِلَالٍ قَالَ: قَالَ لِيْ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَا تُثَوِّبَنَّ فِيْ شَيْءٍ مِّنَ الصَّلَوَاتِ إِلَّا فِيْ صَلَاةِ الْفَجْرِ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَابْنُ مَاجَهُ. وَقَالَ التِّرْمِذِيُّ: أَبُوْ إِسْرَائِيْلَ الرَّاوِيْ لَيْسَ هُوَ بِذَاكَ الْقَوِيِّ عِنْدَ أَهْلِ الْحَدِيْثِ.
646. (6) [1/204–బలహీనం]
బిలాల్ (ర) కథనం: ప్రవక్త (స) నన్ను, ‘ఫజ్ర్ నమా’జుల్లో తప్ప మరే నమా’జ్లో తస్వీబ్ చేయకు,’ అని అన్నారు. [40] (తిర్మిజి‘ – బలహీనం, ఇబ్నె-మాజహ్)
647 – [ 7 ] ( ضعيف ) (1/204)
وَعَنْ جَابِرٍ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم قَالَ لِبِلَالٍ: “إِذَا أَذَنْتَ فَتَرَسَّلْ وَإِذَا أَقَمْتَ فَاحْدُرْ وَاجْعَلْ بَيْنَ أَذَانِكَ وَإِقَامَتِكَ قَدْرَ مَا يَفْرُغُ الْآكِلُ مِنْ أَكْلِهِ وَالشَّارِبِ مِنْ شُرْبِهِ وَالْمُعْتَصِرُ إِذَا دَخَلَ لِقَضَاءِ حَاجتِهِ وَلَا تَقُوْمُوْا حَتَّى تَرَوْنِيْ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَقَالَ: لَا نَعْرِفُهُ إِلَّا مِنْ حَدِيْثِ عَبْدِ الْمُنْعِمِ وَهُوَ إِسْنَادٌ مَجْهُوْلٌ.
647. (7) [1/204–బలహీనం]
జాబిర్ (ర) కథనం: ప్రవక్త (స) బిలాల్‌ను ”నీవు అజా‘న్ ఇచ్చునపుడు నిదానంగా బిగ్గరగా పలుకు, ఇఖామత్ ఇచ్చునపుడు త్వరత్వరగా పలుకు. అజా‘న్ మరియు ఇఖామత్ ల మధ్య భోజనం చేసేవాడు భోజనం చేసినంత, త్రాగేవాడు త్రాగినంత, కాలకృత్యాలను తీర్చుకునేవాడు తీర్చుకున్నంత సమయం ఉంచు. ఇంకా నేను రావటం చూడనంత వరకు నమా’జు కోసం నిలబడకు,” అని అన్నారు. (తిర్మిజి‘ – ఈ ’హదీసు‘ ఉల్లేఖన కర్త ’అబ్దుల్ మున్యిమ్ అస్పష్టంగా ఉన్నాడు).
648 – [ 8 ] ( ضعيف ) (1/204)
وَعَنْ زَيَادِ بْنِ الْحَارِثِ الصُّدَائِيِّ قَالَ: أَمَرَنِيْ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “أَنْ أَذِّنْ فِيْ صَلَاةِ الْفَجْرِ”. فَأَذَّنْتُ فَأَرَادَ بِلَالٌ أَنْ يُّقِيْمَ. فَقَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِنَّ أَخَا صُدَاءٍ قَدْ أَذَّنَ وَمَنْ أَذَّنَ فَهُوَ يُقِيْمُ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَأَبُوْ دَاوُدَ وَابْنُ مَاجَهُ
648. (8) [1/204–బలహీనం]
‘జియాద్ బిన్ ‘హారిస్’ సుదాయీ’ (ర) కథనం: ప్రవక్త (స) నన్ను ఫజ్ర్ అజా’న్ ఇవ్వమని ఆదేశించారు. అనంతరం నేను ఫజ్ర్ అజా’న్ ఇచ్చాను. బిలాల్ (ర) ఇఖామత్ ఇవ్వడానికి ప్రయత్నించారు. అప్పుడు, ప్రవక్త (స) అజా’న్ మీ సుదాయీ’ సోదరుడు ఇచ్చాడు. అజా’న్ ఇచ్చిన వారే ఇఖామత్ పలకాలి, అని అన్నారు. (తిర్మిజి’, అబూ-దావూద్, ఇబ్నె-మాజహ్)
—–
اَلْفَصْلُ الثَّالِثُ మూడవ విభాగం
649 – [ 9 ] ( متفق عليه ) (1/205)
عَنِ ابْنِ عُمَرَ قَالَ: كَانَ الْمُسْلِمُوْنَ حِيْنَ قَدِّمُوا الْمَدِيْنَةَ يَجْتَمِعُوْنَ فَيتحينونَ الصَلَاة لَيْسَ يُنَادِىْ بِهَا أَحَدٌ فَتَكَلَّمُوْا يَوْمًا فِيْ ذَلِكَ. فَقَالَ بَعْضُهُمْ: اِتّخِذُوْا مِثْلَ نَاقُوْسِ النَّصَارَى. وَقَالَ بَعْضُهُمْ: قُرْنًا مِّثْلَ قَرْنِ الْيَهُوْدِ. فَقَالَ عُمَرُ أَوَلا تَبْعَثُوْنَ رَجُلًا يَّنَادِيْ بِالصَّلَاةِ؟ فَقَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “يَا بِلَالُ قُمْ فَنَادَ بِالصَّلَاةِ”.
649. (9) [1/205–ఏకీభవితం]
’అబ్దుల్లాహ్ బిన్-’ఉమర్ (ర) కథనం: ముస్లింలు వలసపోయి మదీనహ్ వచ్చినపుడు, అందరూ ఒకచోట చేరి, నమా’జ్ సమయాన్ని గుర్తించి, ఒక సమయం నిర్ణయించే వారు. ప్రకటించే వారెవరూ ఉండేవారు కాదు. ఒకరోజు ప్రజలందరూ దీన్ని గురించి సంప్రదించారు. ఒక వ్యక్తి, ‘క్రైస్తవుల్లా శబ్దం చేద్దాము,’ అని అన్నాడు. మరోవ్యక్తి, ‘యూదుల్లా శంఖం ఊదాలి,’ అని అన్నాడు. ‘ఉమర్ (ర) ఒక వ్యక్తిని పంపి ప్రజలకు నమా’జ్ గురించి తెలియ జేద్దామని, అన్నారు. ఏ విషయమూ నిర్థారించ కుండా అందరూ వెళ్ళిపోయారు. రాత్రి కొందరు ప్రవక్త (స) అనుచరులు కలలో అజా‘న్ చూశారు. ఉదయం వచ్చి ప్రవక్త (స)కు తెలియపరిచారు. ప్రవక్త (స) ఆ కల నిజమని అన్నారు. ప్రవక్త (స) బిలాల్‌ను నిలబడి అజా‘న్ ఇవ్వమని అన్నారు. అనంతరం బిలాల్ (ర) నిలబడి అజా‘న్ ఇచ్చారు. (బు’ఖారీ, ముస్లిమ్)
650 – [ 10 ] ( صحيح ) (1/205)
وَعَنْ عَبْدِ اللهِ بْنِ زَيْدِ بْنِ عَبْدِ رَبِّهِ قَالَ: لَمَّا أَمَرَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم بِالنَّاقُوْسِ يُعْمَلُ لِيُضْرَبَ بِهِ لِلنَّاسِ لِجَمْعِ الصَّلَاةِ طَافَ بِيْ وَأَنَا نَائِمٌ رَجُلٌ يَحْمِلُ نَاقُوْسًا فِيْ يَدِهِ. فَقُلْتُ يَا عَبْدَ اللهِ أَتَبِيْعُ النَّاقُوْسَ. قَالَ وَمَا تَصْنَعُ بِهِ. فَقُلْتُ نَدْعُوْ بِهِ إِلَى الصَّلَاةِ. قَالَ: أَفَلَا أَدُلُّكَ عَلَى مَا هُوَ خَيْرٌ مِّنْ ذَلِكَ فَقُلْتُ لَهُ بَلَى قَالَ فَقَالَ: تَقُوْلُ اللهُ أَكْبَرُ إِلَى آخِرِهِ وَكَذَا الْإِقَامَةُ فَلَمَّا أَصْبَحْتُ أَتَيْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم فَأَخْبَرْتُهُ بِمَا رَأَيْتُ فَقَالَ: “إِنَّهَا لَرُؤْيَا حَقٌّ إِنْ شَاءَ اللهُ فَقُمْ مَعَ بِلَالٍ فَأَلْقَ عَلَيْهِ مَا رَأَيْتَ فَلْيُؤَذِّنْ بِهِ فَإِنَّهُ أَنْدَى صَوْتًا مِّنْكَ ” فَقُمْتُ مَعَ بِلَالٍ فَجَعَلْتُ أُلْقِيْهِ عَلَيْهِ وَيُؤَذِّنُ بِهِ. قَالَ: فَسَمِعَ بِذَلِكَ عُمْرُ بْنُ الْخَطَّابِ وَهُوَ فِيْ بَيْتِهِ فَخَرَجَ يَجُرُّ رِدَاءَهُ وَيَقُوْلُ وَالَّذِيْ بَعَثَكَ بِالْحَقِّ لَقَدْ رَأَيْتُ مِثْلَ مَا أُرِيَ. فَقَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “فَللهِ الْحَمْدُ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ وَالدَّارَمِيُّ وَابْنُ مَاجَهُ إِلَّا أَنَّهُ لَمْ يَذْكُرِ الْإِقَامَةُ. وَقَالَ التِّرْمِذِيُّ: هَذَا حَدِيْثٌ صَحِيْحٌ لَكِنَّهُ لَمْ يُصَرِّحْ قِصَّةَ النَّاقُوْسِ .
650. (10) [1/205–దృఢం]
’అబ్దుల్లాహ్ బిన్ ’జైద్ బిన్ ’అబ్దురబ్బిహ్ (ర) కథ నం: ప్రవక్త (స) నమా’జు సమయంలో ప్రజలను సమీక రించటానికి చేతిగంట (నాఖూస్) వాయించమని ఆదేశించినపుడు, నేను కలలో ఒకవ్యక్తి చేతిలో చేతి గంట ఉండటం చూచి, అతనితో, ‘ఓ అబ్దుల్లాహ్! ఈ చేతిగంటను అమ్ముతావా?’ అని అడిగాను. దానికి ఆ వ్యక్తి దీన్ని, ‘నీవు ఏం చేస్తావు?’ అని అన్నాడు. దానికి నేను, ‘దాన్ని వాయించి ప్రజలను నమా’జుకు పిలుస్తాను,’ అని అన్నాను. దానికి ఆ వ్యక్తి, ‘నేను నీకు ఇంతకంటే మంచి విషయాన్ని చూపెడతాను,’ అని అన్నాడు. నేను, ‘చూపెట్టండి,’ అని అన్నాను. అప్పుడు ఆవ్యక్తి అజా‘న్ మరియు ఇఖామత్‌ల యొక్క పదాలన్నీ నేర్పించాడు. ఉదయం నేను ప్రవక్త (స) వద్దకు వెళ్ళి జరిగినదంతా చెప్పాను. అది విని, ప్రవక్త (స) ఇది నిజమైన కల, నిలబడి బిలాల్‌కు నేర్పించు, ఎందుకంటే అతని గొంతు నీకంటే బిగ్గరగా ఉంది,’ అని అన్నారు. అనంతరం బిలాల్‌కు చూపెడుతూ ఉంటే, అతను అజా‘న్ ఇస్తూ పోయారు. తన ఇంట్లో ఉన్న ’ఉమర్ (ర) బిలాల్ అజా‘న్ విని దుప్పటి ఈడ్చుకుంటూ తొందరగా ప్రవక్త (స) వద్దకు వచ్చి, ‘అల్లాహ్ సాక్షి! నేను కలలో ఇలాగే చూశాను,’ అని అన్నారు. అప్పుడు ప్రవక్త (స) ”ఫలిల్లాహిల్ హమ్ద్” అని అన్నారు. (అబూ-దావూద్, దార్మీ, ఇబ్నె-మాజహ్, తిర్మిజి’)
651 – [ 11 ] ( ضعيف ) (1/206)
وَعَنْ أَبِيْ بَكْرَةَ قَالَ: خَرَجْتُ مَعَ النَّبِيَّ صَلَى اللهُ عَلَيْهِ وَسلم لِصَلَاةِ الصُّبْحِ فَكَانَ لَا يَمُرُّ بِرَجُلٍ إِلَّا نَادَاهُ بِالصَّلَاةِ أَوْ حَرَّكَهُ بِرِجْلِهِ. رَوَاهُ أَبُوْ دَاوُدَ .
651. (11) [1/206–బలహీనం]
అబూ-బక్రహ్ (ర) కథనం: నేను ప్రవక్త (స) వెంట ఫజ్ర్ నమా’జు కోసం బయలుదేరాను. ప్రవక్త (స) దారిలో కలసిన వారిని, నమా’జుకోసం పిలిచేవారు. ఎవరైనా పడుకొని ఉంటే, తనకాలితో అతనికాలిని కదిపేవారు. (అబూ దావూద్)
652 – [ 12 ] ( ضعيف ) (1/206)
وَعَنْ مَالِكٍ بَلَغَهُ أَنَّ الْمُؤَذِّنَ جَاءَ عُمَرَ يُؤَذّنُهُ لِصَلَاةِ الصُّبْحِ فَوَجَدَهُ نَائِمًا فَقَالَ: الصَّلَاةُ خَيْرٌ مِّنَ النَّوْمِ فَأَمَرَهُ عُمَرُ أَنْ يَّجْعَلَهَا فِيْ نِدَاءِ الصُّبْحِ. رَوَاهُ فِيْ الْمُوَطَّأ .
652. (12) [1/206–బలహీనం]
మాలిక్‌కు ఈ వార్త అందింది: ము’అజ్జి’న్ ఉదయం నమా’జు గురించి తెలియపరచటానికి ‘ఉమర్ (ర) వద్దకు వచ్చే వారు. ఒకరోజు ము’అజ్జి’న్ ‘ఉమర్ (ర) పడుకొని ఉండటం చూచి లేపటానికి ”అస్సలాతు ఖైరు మ్మినన్నౌమ్” అని అన్నాడు. అప్పుడు ‘ఉమర్ (ర) దీన్ని ఫజ్ర్ అజా’న్లో చేర్చుకో అని అన్నారు.[41](మువత్తా’ మాలిక్)
653 – [ 13 ] ( ضعيف ) (1/206)
وَعَنْ عَبْدِ الرَّحْمَنِ بْنِ سَعْدِ بْنِ عَمَّارِ بْنِ سَعْدٍ مُؤَذّنِ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم قَالَ: حَدَّثَنِيْ أَبِيْ عَنْ أَبِيْهِ عَنْ جَدِّهِ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم أَمَرَ بِلَالًا أَنْ يَّجْعَلَ أصْبَعَيْهِ فِيْ أُذُنَيْهِ وَقَالَ: “إِنَّهُ أَرْفَعُ لِصَوْتِكَ”. رَوَاهُ ابْنُ مَاجَهُ.
653. (13) [1/206–బలహీనం]
‘అబ్దుర్ర’హ్మాన్ బిన్ స’అద్ బిన్ ‘అమ్మార్ బిన్ స’అద్ (ర) ప్రవక్త (స) ము’అజ్జి’న్ కథనం: మా తండ్రిగారు స’అద్, నాతో ఇలా అన్నారు, అతను తన తండ్రి ‘అమ్మార్ ద్వారా, అతను తన తండ్రి స’అద్ ద్వారా కథనం: ప్రవక్త (స) బిలాల్‌ను అజా’న్ ఇచ్చినపుడు, తన చూపుడు వ్రేళ్ళను చెవులలో పెట్టుకోమని, దానివల్ల మీ శబ్దం మరింత బిగ్గర అవుతుందని అన్నారు. (ఇబ్నె మాజహ్)
=====
5– بَابُ فَضْلِ الْأَذَانِ وَإِجَابَةِ الْمُؤَذِّنِ
5. అజా‘న్ ఘనత, అజా‘న్ పిలుపుకు జవాబు
అజా‘న్ మరియు అజా‘న్ ఇచ్చేవాని గురించి ఖుర్ఆన్, ‘హదీసు’ల్లో చాలాప్రాధాన్యతఉంది. అల్లాహ్ ఆదేశం: ”మరియు (ప్రజలను) అల్లాహ్ వైపునకు పిలుస్తూ, సత్కా ర్యాలు చేస్తూ: “నిశ్చయంగా నేను అల్లాహ్‌కే విధేయుడను (ముస్లింను)!” అని పలికేవాని మాటకంటే మంచి మాట మరెవరిది?” (సూ. హా-మీమ్ అస్సజ్దహ్ (సూ. ఫుస్సిలత్), 41:33)
హాఫిజ్ ఇబ్నె కసీర్ వ్యాఖ్యానం: ‘దైవదాసులను అల్లాహ్(త) వైపు పిలుస్తూ, సత్కార్యాలు చేస్తూ, నేను ముస్లిమ్నని చెప్పేవాని కంటే మంచి మాట మరెవరిది కాగలదు.’ ఈ ఆయతు అందరికి వర్తిస్తుంది. అందరికంటే ప్రవక్త (స) దీనికి తగినవారు. కొందరు అజా‘న్ ఇచ్చేవారని భావించారు. ’సహీ ముస్లిమ్ లో ఇలా ఉంది, ”తీర్పుదినం నాడు ముఅజ్జి‘న్ అందరి కంటే పొడవైన మెడలు కలిగి ఉంటారు. ఇంకా సునన్‌లో ముఅజ్జి‘న్ నిజాయితీ పరుడని ఉంది. అల్లాహ్ ఇమాములను సన్మార్గం చూపాలి, ముఅజ్జి‘న్లను క్షమించాలి అని ఉంది. ఇబ్నె ’అబీ ’హాతిమ్లో ఇలా ఉంది, స’అద్ బిన్ వఖ్ఖాస్ (ర) అభిప్రాయం: ”అజా’న్ ఇచ్చేవారికి తీర్పు దినం నాడు అల్లాహ్ వద్ద జిహాద్ చేసిన వారికి లభించినంత పుణ్యం లభిస్తుంది. అజా‘న్ ఇఖామత్‌ల మధ్యకాలం పోరాటం చేయటం, రక్తసిక్తమై ఉండటంతో సమానం.” ఇబ్నె మస్’ఊద్ (ర) కథనం: ”ఒకవేళ నేను ముఅజ్జి‘న్ అయితే, మరి నాకు ’హజ్జ్, ’ఉమ్రహ్, జిహాద్‌లు అన్నా ఫరవాలేదు.” ’ఉమర్ (ర) ఒకవేళ నేను ముఅజ్జి‘న్ అయితే, నా కోరిక తీరి పోయేది, ఇంకా నేను రాత్రి అదనపు ఆరాధనలు, పగలు అదనపు ఉపవాసాలు గురించి ప్రయత్నించే వాడిని కాను. ఇంకా నేను, ”ప్రవక్త (స) ముఅజ్జి‘న్ క్షమాపణ గురించి మూడుసార్లు ప్రార్థించారని విన్నాను. అప్పుడు నేను, ప్రవక్తా! తమరు తమ ప్రార్థనల్లో మమ్మల్ని గురించి పేర్కొనటం లేదు, ”మేము అజా‘న్ ఇవ్వటానికి ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటున్నాము,” అని అన్నాము. దానికి ప్రవక్త (స) అవును, కాని ఓ ’ఉమర్! ఒక కాలం రాబోతుంది. అజా‘న్ ఇవ్వటం కేవలం పేదల వరకే పరిమితమై పోతుంది. ’ఉమర్! విను నరకాగ్ని నిషేధించబడిన వారిలో ముఅజ్జి‘న్లు కూడా ఉన్నారు అని అన్నారు. ’ఆయి‘షహ్ (ర) కథనం: ఈ ఆయతులో కూడా ముఅజ్జి‘న్ల గొప్పతనం ఉంది. ’హయ్య ’అల’స్సలాహ్ అని పిలవటం దేవుని గొప్పతనం వైపు పిలవటం అవుతుంది. ఇబ్నె ’ఉమర్ (ర) మరియు ఇక్రమ (ర)ల కథనం: ఇది ముఅజ్జి‘న్లకు కూడా వర్తిస్తుంది. అతడు సత్కార్యాలు చేస్తాడు. అంటే అ’జాన్ మరియు తక్బీర్ల మధ్య రెండు రకాతులు నమా’జు చదవటం. ప్రవక్త (స) ప్రవచనం, ”రెండు అజా‘నుల మధ్య నమా’జు ఉంది. రెండు అజా‘నుల మధ్య నమా’జు ఉంది, రెండు అజా’నుల మధ్య నమా’జు ఉంది. కోరిన వారు అని ఉంది.” మరో ’హదీసు‘లో, ‘అజా‘న్ మరియు ఇఖామత్‌ల మధ్య దు’ఆ (ప్రార్థన) తిరస్కరించబడదు,’ అని ఉంది. అందువల్ల ఈ ఆయతు అల్లాహ్ వైపు పిలిచే వారందరికీ వర్తిస్తుంది. ’హసన్ బ’స్రీ ఈ ఆయతు పఠించి, ‘వీరు దైవప్రియ భక్తులు, వీరే అల్లాహ్ (త) సన్నిహితులు అల్లాహ్ (త) ప్రేమించేవారు, వీరు విశ్వసించి, ఇతరులకు కూడా వాటిని అందజేస్తారు. సత్కార్యాలు చేస్తారు. వీరే దైవప్రతినిధులు,’ అని వ్యాఖ్యానించారు.
اَلْفَصْلُ الْأَوَّلُ మొదటి విభాగం
654 – [ 1 ] ( صحيح ) (1/207)
عَنْ مُعَاوِيَةَ قَالَ: سَمِعْتُ رَسُولَ اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ: “الْمُؤَذِّنُوْنَ أَطْوَلُ النَّاسِ أَعْنَاقًا يَوْمَ الْقِيَامَةِ”. رَوَاهُ مُسْلِمٌ.
654. (1) [1/207–దృఢం]
ము’ఆవియహ్ (ర) కథనం: ప్రవక్త (స) ఇలా ప్రవచిస్తూ ఉండగా నేను విన్నాను, ”అజా‘న్ ఇచ్చే వారు తీర్పుదినం నాడు పొడవైన మెడలు కలిగి ఉంటారు.” [42] (ముస్లిమ్)
655 – [ 2 ] ( متفق عليه ) (1/207)
وَعَنْ أَبِيْ هُرَيْرَةَ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِذَا نُوْدِيَ لِلصَّلَاةِ أَدْبَرَ الشَّيْطَانُ وَلَهُ ضُرَاطٌ حَتَّى لَا يَسْمَعُ التَّأْذِيْنَ فَإِذَا قُضِىَ النِّدَاءُ أَقْبَلَ حَتَّى إِذَا ثُوِّبَ بِالصَّلَاةِ أَدْبَرَ حَتَّى إِذَا قُضِىَ التَّثْوِيْبُ أَقْبَلَ حَتَّى يَخْطِرَ بَيْنَ الْمَرْءِ وَنَفْسِهِ يَقُوْلُ اُذْكُرْ كَذَا اُذْكُرْ كَذَا لِمَا لَمْ يَكُنْ يَّذْكُرُ حَتَّى يَظَلُّ الرَّجُلُ لَا يَدْرِيْ كَمْ صَلَّى”.
655. (2) [1/207–ఏకీభవితం]
అబూ-హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”నమా’జుకోసం అజా‘న్ ఇస్తే, షై’తాన్ అజా‘న్ వినబడనంత దూరం పారిపోతాడు. అజా‘న్ పూర్తవ గానే మళ్ళీ తిరిగి వస్తాడు, ఇఖామత్ అయిన వెంటనే పారిపోతాడు, పూర్తవగానే మళ్ళీ తిరిగి వస్తాడు. నమా’జీల హృదయాల్లో కలతలు సృష్టిస్తాడు. ఇంకా ఆ వ్యక్తికి మరచి పోయిన పనులను గుర్తుచేస్తాడు. ఈ విధంగా ఆ వ్యక్తి ఎన్ని రకాతులు చదివాడో తెలియకుండా చేస్తాడు. [43] (బు’ఖారీ, ముస్లిమ్)
656 – [ 3 ] ( صحيح ) (1/207)
وَعَنْ أَبِيْ سَعِيْدِ الْخُدْرِيْ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَا يَسْمَعُ مَدَى صَوْتِ الْمُؤْذِّنِ جِنٌّ وَلَا إِنْسٌ وَلَا شَيْءٌ إِلَّا شَهِدَ لَهُ يَوْمَ الْقِيَامَةِ”. رَوَاهُ الْبُخَارِيُّ .
656. (3) [1/207–దృఢం]
అబూ-స’యీద్ ’ఖుద్రీ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ముఅజ్జి‘న్ శబ్దం విన్న జిన్నులు, మానవులు, ఇతరులు, తీర్పుదినం నాడు అజా‘న్కు సాక్ష్యం ఇస్తారు. అంటే అజా‘న్ శబ్దం చెవిలో పడిన వారు తీర్పుదినం నాడు ముఅజ్జి‘న్ కోసం సాక్ష్యం ఇస్తారు.” [44] (బు’ఖారీ)
657 – [ 4 ] ( صحيح ) (1/207)
وعَنْ عَبْدِ اللهِ بْنِ عَمْرِو بْنِ الْعَاصِ أَنَّهُ سَمِعَ النَّبِيَ صلى الله عليه وسلم يَقُوْلُ: “إِذَا سَمِعْتُمْ الْمُؤَذِّنَ فَقُوْلُوْا مِثْلَ مَا يَقُوْلُ ثُمَّ صَلُّوْا عَلَيَّ فَإِنَّهُ مَنْ صَلَّى عَلَيَّ صَلَاةً صَلَّى اللهُ عَلَيْهِ بِهَا عَشْرًا ثُمَّ سَلُوا الله لِيَ الْوَسِيْلَةَ فَإِنَّهَا مَنْزِلَةٌ فِيْ الْجَنَّةِ لَا تَنْبَغِيْ إِلَّا لِعَبْدٍ مِّنْ عِبَادِ اللهِ وَأَرْجُوْ أَنْ أَكُوْنَ أَنَا هُوَ فَمَنْ سَأَلَ لِيَّ الْوَسِيْلَةَ حَلَّتْ عَلَيْهِ الشَّفَاعَةُ. رَوَاهُ مُسْلِم .
657. (4) [1/207–దృఢం]
‘అబ్దుల్లాహ్ బిన్-‘అమ్ర్ బిన్-‘ఆస్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ముఅజ్జి‘న్ అజా‘న్ విని అలాగే వల్లించండి, అజా‘న్ తరువాత నాకొరకు దరూద్ చదవండి, నాపై ఒకసారి దరూద్ పంపినవారిపై అల్లాహ్ 10 సార్లు కారుణ్యం అవతరింపజేస్తాడు. ఇంకా నాకోసం వసీలహ్ను పొందటానికి దు’ఆ చేయండి. ఎందుకంటే వసీలహ్ అనేది స్వర్గంలోని ఒకస్థానం పేరు. అది కేవలం ఒక్క దాసుని కొరకే ఉంది. అయితే నేను దాని అభ్యర్థిని. నా గురించి వసీలహ్ విషయంలో అల్లాహ్‌ను ప్రార్థిస్తే, అతని గురించి నా సిఫారసు ధర్మసమ్మతం అయిపోతుంది. అంటే అతని గురించి నా వసీలహ్ తప్పనిసరి అయిపోతుంది. ఇన్షా‘అల్లాహ్ అతని గురించి నేను తప్పనిసరిగా సిఫారసు చేస్తాను. (ముస్లిమ్)
658 – [ 5 ] ( صحيح ) (1/208)
وَعَنْ عُمَرَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِذَا قَالَ الْمُؤَذِّنَ اللهُ أَكْبَرُ، اللهُ أَكْبَرُ. فَقَالَ أَحَدُكُمْ اللهُ أَكْبَرُ، اللهُ أَكْبَرُ. ثُمَّ قَالَ: أَشْهَدُ أَنْ لَّا إِلَهَ إِلَّا اللهُ. قَالَ: أَشْهَدُ أَنْ لَّا إِلَهَ إِلَّا اللهُ. ثُمَّ قَالَ: أَشْهَدُ أَنَّ مُحَمَّدًا رَّسُوْلَ اللهِ. قَالَ: أَشْهَدُ أَنَّ مُحَمَّدًا رَّسُوْلَ اللهِ. ثُمَّ قَالَ: حَيَّ عَلَى الصَّلَاةِ. قَالَ: لَا حَوْلَ وَلَا قُوَّةَ إِلَّا بِاللهِ. ثُمَّ قَالَ: حَيَّ عَلَى الْفَلَاحِ. قَالَ: لَا حَوْلَ وَلَا قُوَّةَ إِلَّا بِاللهِ. ثُمَّ قَالَ: اللهُ أَكْبَرُ، اللهُ أَكْبَرُ. قَالَ: اللهُ أَكْبَرُ، اللهُ أَكْبَرُ. ثُمَّ قَالَ: لَا إِلَهَ إِلَّا اللهُ. قَالَ: لَا إِلَهَ إِلَّا اللهُ. مِنْ قَلْبِهِ دَخَلَ الْجَنَّةَ”. رَوَاهُ مُسْلِمٌ.
658. (5) [1/208–దృఢం]
’ఉమర్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ముఅ’జ్జి’న్, ‘అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్,’ అని అంటే, మీలోని వినేవారు కూడా, ‘అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్,’ అని పలకాలి. ముఅ’జ్జి’న్ ‘అష్హదు అల్లాయిలాహ ఇల్లల్లాహ్, అష్హదు అల్లాయి లాహ ఇల్లల్లాహ్’ అని అంటే, వినేవారు కూడా, ‘అష్హదు అల్లాయిలాహ ఇల్లల్లాహ్, అష్హదు అల్లాఇలాహ ఇల్లల్లాహ్,’ అని అనాలి. ముఅజ్జిన్, ‘అష్హదు అన్న ము’హమ్మదర్రసూ లుల్లాహ్, అష్హదు అన్న ము’హ మ్మదర్రసూ లుల్లాహ్’ అని అంటే, వినేవారు కూడా, ‘అష్హదు అన్న ముహమ్మదర్రసూ లుల్లాహ్, ‘అష్హదు అన్న ముహమ్మ దర్రసూలుల్లాహ్,’ అని అనాలి. ముఅజ్జిన్ ‘హయ్య అలస్సలాహ్, ‘హయ్య అలస్సలాహ్,’ అని అంటే వినేవారు, ‘లా’హౌల వలా ఖువ్వత ఇల్లాబిల్లాహ్, లా’హౌల వలా ఖువ్వత ఇల్లాబిల్లాహ్,’ అని అనాలి. ముఅజ్జిన్ ‘హయ్యా అలల్ ఫలా’హ్, ‘హయ్యా అలల్ ఫలా’హ్,’ అని అంటే, వినేవారు, ‘లా’హౌల వలా ఖువ్వత ఇల్లాబిల్లాహ్, ‘లా’హౌల వలా ఖువ్వత ఇల్లాబిల్లాహ్,’ అని పలకాలి. ఆ తరువాత, అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, లా ఇలాహ ఇల్లల్లాహ్,’ అని అంటే, వినే వారు, ‘అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, లా ఇలాహ ఇల్లల్లాహ్,’ అని పలకాలి. ఈ విధంగా నిర్మలమైన మనస్సుతో పలికిన వారు స్వర్గంలో ప్రవేశిస్తారు. (ముస్లిమ్)
659 – [ 6 ] ( صحيح ) (1/208)
وعَنْ جَابِرٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَنْ قَالَ حِيْنَ يَسْمَعُ النِّدَاءَ: ”اللَّهُمَّ رَبَّ هَذِهِ الدَّعْوَةِ التَّامَّةِ وَالصَّلَاةِ الْقَائِمَةِ آتِ مُحَمَّدَا الْوَسِيْلَةَ وَالْفَضِيْلَةَ وَابْعَثْهُ مَقَامًا مُحْمُوْدَانِ الِّذِيْ وَعَدْتَّهُ حَلَّتْ لَهُ شَفَا عَتِيْ يَوْمَ الْقِيَامَةِ”. رَوَاهُ الْبُخَارِيُّ.
659. (6) [1/208–దృఢం]
జాబిర్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”అజా’న్ విని ఈ దు’ఆను పఠించేవ్యక్తికి నా సిఫారసు తప్పనిసరి అయిపోతుంది: ”అల్లాహుమ్మ రబ్బ హాజిహి ద్ద’అవతి త్తామ్మతి, వ’స్సలాతిల్ ఖాయి‘మతి, ఆతి ము’హమ్మదనిల్ వసీలత వల్ ఫ’దీలత, వబ్’అస్హు మఖామమ్ మ’హ్మూద నిల్లజీ వ ’అద్ తహూ. ‘హుల్లత్ లహూ షిఫా’అతి యౌమల్ ఖియామహ్.” – ‘ఓ అల్లాహ్! ఈ పరిపూర్ణ పిలుపును మరియు నమా’జు యొక్క ప్రభువువు. ము’హమ్మద్‌కు నీవు వాగ్దానం చేసిన వ’సీలహ్, ప్రత్యేకతలను ప్రసాదించి, ఉన్నత స్థానానికి చేర్చు.[45](బు’ఖారీ)
660 – [ 7 ] ( صحيح ) (1/208)
وَعَنْ أَنَسٍ قَالَ: كَانَ النَّبِيُّ صلى الله عليه وسلم يُغِيْرُ إِذَا طَلَعَ الْفَجْرُ وَكَانَ يَسْتَمِعُ الْأَذَانَ فَإِنْ سَمِعَ أَذَانًا أَمْسَكَ وَإِلَّا أَغَارَ فَسَمِعَ رَجُلًا يَقُوْلُ: اللهُ أَكْبَرُ، اللهُ أَكْبَرُ. فَقَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “عَلَى الْفِطْرَةِ”. ثُمَّ قَالَ: أَشْهَدُ أَنْ لَا إِلَهَ إِلَّا اللهُ. قَالَ رَسُوْلُ الله صلى الله عليه وسلم: “خَرَجْتَ مِنَ النَّارِ”. فَنَظَرُوْا فَإِذَا هُوَ رَاعِيْ مِعْزًى. رواه مسلم .
660. (7) [1/208–దృఢం]
అనస్ (ర) కథనం: ప్రవక్త (స) జిహాద్‌కు వెళ్ళి నపుడు, ప్రతిపక్షంతో తలపడినపుడు ఉదయం వరకు వేచి ఉంటారు. అజా‘న్ను శ్రద్ధగా చెవులప్పగించి వింటారు. అజా‘న్ వినబడితే యుద్ధం చేయరు. లేకుంటే వారిపై దాడిచేస్తారు. ఒకసారి ప్రవక్త (స) ముఅ’జ్జి’న్, ‘అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్,’ అని అంటూ ఉండగా విని, ‘ఈ వ్యక్తి ఇస్లామ్ ధర్మంపై ఉన్నాడు,’ అని అన్నారు. ఆ వ్యక్తి మళ్ళీ, ‘అష్హదు అల్లా యిలాహ ఇల్లల్లాహ్,’ అని పలకడం విని, ‘ఇతడు నరకం నుండి తప్పించుకున్నాడు,’ అని అన్నారు. ప్రవక్త (స) అనుచరులు చూసే సరికి అతను మేకల కాపరివాడు. [46] (ముస్లిమ్)
661 – [ 8 ] ( صحيح ) (1/209)
وَعَنْ سَعْدِ بْنِ أَبِيْ وَقَاصٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم أَنَّهُ قَالَ: “مَنْ قَالَ حِيْنَ يَسْمَعُ الْمُؤَذِّنَ: أَشْهَدُ أَنْ لَّا إِلَهَ إِلَّا اللهُ وَحْدَهُ لَا شَرِيْكَ لَهُ وَأَنَّ مُحَمَّدًا عَبْدَهُ وَرَسُوْلُهُ رَضِيْتُ بِاللهِ رَبًّا وَبِمُحَمَّدٍ رَّسُوْلًا وَّبِالْإِسْلامِ دِيْنًا غُفِرَ لَهُ ذَنْبُهُ”. رَوَاهُ مُسْلِمٌ .
661. (8) [1/209–దృఢం]
స’అద్ బిన్ అబీ-వఖ్ఖా’స్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ముఅ’జ్జి‘న్ పలుకు ‘అష్హదు అల్లా యిలాహ ఇల్లల్లాహ్’ విని ఈ దు’ఆను పఠించిన వ్యక్తి పాపాలన్నీ క్షమించబడతాయి, ‘అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహు వ’హ్దహు లా షరీకలహు, వ అష్హదు అన్న ము’హమ్మ దన్ ’అబ్దహూ వ రసూ లహూ, ర’దీతు బిల్లాహి రబ్బన్ వ బి ము’హ మ్మదిన్ రసూలన్ వబిల్ ఇస్లామి దీనన్,” – ‘అల్లాహ్ తప్ప ఆరాధ్యులెవరూ లేరని, ఆయన ఒక్కడే అని, ఆయనకు సాటి ఎవ్వరూ లేరని, నేను సాక్ష్యం ఇస్తున్నాను. ఇంకా ము’హమ్మద్ (స) ఆయన దాసుడు మరియు ఆయన ప్రవక్త, అని నేను సాక్ష్యం ఇస్తున్నాను. అల్లాహ్‌ను నా ప్రభువుగా, ము’హమ్మద్‌ను నా ప్రవక్తగా, ఇస్లామ్‌ను నా ధర్మంగా స్వీకరిస్తున్నాను.’ (ముస్లిమ్)
662 – [ 9 ] ( متفق عليه ) (1/209)
وَعَنْ عَبْدِاللهِ بْنِ مُغَفَّلٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “بَيْنَ كُلِّ أَذَانَيْنِ صَلَاةٌ بَيْنَ كُلِّ أَذَانَيْنِ صَلَاةٌ”. ثُمَّ قَالَ فِيْ الثَّالِثَةِ: “لِمَنْ شَاءَ”.
662. (9) [1/209–ఏకీభవితం]
’అబ్దుల్లాహ్ బిన్-ము’గఫ్ఫల్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రతి రెండు అజా‘నుల మధ్య నమా’జు ఉందని మూడుసార్లు అన్నారు. మూడవసారి కోరినవారు చదవచ్చు,’ అని అన్నారు. [47] (బు’ఖారీ, ముస్లిమ్)
—–
اَلْفَصْلُ الثَّانِيْ రెండవ విభాగం
663 – [ 10 ] ( صحيح ) (1/209)
عَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “اَلْإِمَامُ ضَامِنٌ وَالْمُؤَذِّنُ مُؤْتَمَنٌ اللهُ أَرْشِدِ الْأَئِمَةَ وَاغْفِرْ لِلْمُؤْذِّنِيْنَ”. رَوَاهُ أَحْمَدُ وَأَبُوْ دَاوُدَ وَالتِّرْمِذِيُّ وَالشَّافِعِيُّ. وَفِيْ أُخْرَى لَهُ بِلَفْظِ الْمَصَابِيْحِ .
663. (10) [1/209–దృఢం]
అబూ-హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఇమాము బాధ్యుడు, ముఅజ్జి‘న్ నిజాయితీపరుడు. ఓ అల్లాహ్! నీవు ఇమాములకు రుజుమార్గం చూపించు. ముఅజ్జి‘న్లను క్షమించు. [48] (అ’హ్మద్, అబూ-దావూద్, తిర్మిజి’, షాఫ’యీ)
664 – [ 11 ] ( ضعيف ) (1/210)
وَعَنِ ابْنِ عَبَّاسٍ أنَّ النَّبِيَّ صلى الله عليه وسلم قَالَ: “مَنْ أَذَّنَ سَبْعَ سِنِيْنَ مُحْتَسِبًا كُتِبَ لَهُ بَرَاءَةٌ مِّنَ النَّارِ”. رَوَاهُ التَّرْمِذِيُّ وَأَبُوْ دَاوُدَ وَابْنُ مَاجَه .
664. (11) [1/210–బలహీనం]
ఇబ్నె-’అబ్బాస్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ప్రతిఫలాపేక్షతో 7 సంవత్సరాలు అజా‘న్ ఇస్తే అతనికి నరకాగ్ని నిషేధించబడింది. అంటే అతనికి నరక విముక్తి ప్రసాదించబడుతుంది.” (తిర్మిజి’, అబూ-దావూద్, ఇబ్నె-మాజహ్,)
665 [ 12 ] ( صحيح) (1/210)
وَعَنْ عُقْبَةَ بْنِ عَامِرٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “يَعْجَبُ رَبُّكَ مِنْ رَّاعِيْ غَنَمٍ فِيْ رَأْسِ شَظِيَّةٍ لِلْجَبَلِ يُؤَذِّنُ بِالصَّلَاةِ وَيُصَلِّيْ فَيَقُوْلُ اللهُ عز وجل اُنْظُرُوْا إِلَى عَبْدِيْ هَذَا يُؤَذِّنُ وَيُقِيْمُ الصَّلَاةَ يَخَافُ مِنِّيْ قَدْ غَفَرْتُ لِعَبْدِيْ وَأَدْخَلْتُهُ الْجَنَّةَ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ وَالنَّسَائِيُّ .
665. (12) [1/210–దృఢం]
’ఉఖ్‌బ బిన్-’ఆమిర్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవ చనం, ”అల్లాహ్ కొండ శిఖరాలపై మేకలు మేపుతూ, అజా‘న్ ఇచ్చి, నమా’జ్ చదివే మేకల కాపరి పట్ల సంతోషిస్తాడు. ఇంకా అల్లాహ్ దైవ దూతలతో, ‘ఈ నా దాసుణ్ణి చూడండి, అజా‘న్ ఇచ్చి నమా’జు చదువు తున్నాడు. ఇంకా నాకు భయ పడుతూ ఉన్నాడు, నేను నా దాసుణ్ణి క్షమించి వేసాను. ఇంకా నేను ఇతన్ని స్వర్గంలో ప్రవేశింప జేస్తాను,’ అని అంటాడు. [49] (అబూ-దావూద్, నసాయి’)
666 – [ 13 ] ( ضعيف ) (1/210)
وَعَنِ ابْنِ عُمَرَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “ثَلَاثَةٌ عَلَى كُثْبَانِ الْمِسْكِ يَوْمَ الْقِيَامَةِ عَبْدٌ أَدَّى حَقَّ اللهُ وَحَقَّ مَوْلَاهُ وَرَجُلٌ أمَّ قَوْمًا وَهُمْ بِهِ رَاضُوْنَ وَرَجُلٌ ينادي بالصلوات الخمس في كل يوم وليلة”. رواه الترمذي. وقَالَ: هذا حديث غريب.
666. (13) [1/210–బలహీనం]
’అబ్దుల్లాహ్ బిన్ ’ఉమర్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ముగ్గురు వ్యక్తులు కస్తూరి కొండలపై ఉంటారు: 1. అల్లాహ్ హక్కును మరియు తన యజ మాని హక్కును నెరవేర్చిన సేవకుడు, 2. తన జాతికి ఇమామత్ చేసి, ముఖ్తదీలందరూ ఆయన పట్ల సంతోషంగా ఉన్న వ్యక్తి, 3. ప్రతిరోజు ఐదు పూటలు అజా‘న్ ఇచ్చేవాడు. (తిర్మిజి‘ – ఏకోల్లేఖనం)
667 – [ 14 ] ( صحيح ) (1/211)
وَعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “اَلْمُؤَذِّنُ يُغْفَرُ لَهُ مَد صَوْتِهِ وَيَشْهَدُ لَهُ كُلُّ رَطْبٍ وَّيَابِسٍ وَشَاهِدُ الصَّلَاةَ يُكْتَبُ لَهُ خَمْسٌ وَّعِشْرُوْنَ حَسَنَةً وَيُكَفَّرُعَنْهُ مَا بَيْنَهُمَا”. رَوَاهُ أَحْمَدُ وَأَبُوْ دَاوُدَ وَابْنُ مَاجَهُ. وَرَوَى النَّسَائِيُّ إِلَى قَوْلِهِ:”كُلُّ رَطْبٍ وَّيَابِسٍ”. وَقَالَ: “وَلَهُ مِثْلُ أَجْرِ مَنْ صَلَّى”.
667. (14) [1/211–దృఢం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ముఅజ్జి‘న్ శబ్దం చేరే దూరం వరకు అతన్ని క్షమించటం జరుగుతుంది. అతని అజా‘న్ శబ్దం పరిధిలో ఉన్న ప్రతి వస్తువూ, నమా’జులో వచ్చేవారూ అతనికోసం సాక్ష్యం ఇస్తారు. ఇంకా అతని కర్మల పత్రంలో 25 నమాజుల పుణ్యం వ్రాయబడుతుంది. ఇంకా రెండు నమా’జుల మధ్య చేసిన పాపాలను క్షమించడం జరుగుతుంది.” [50] (అ’హ్మద్, అబూ దావూద్, ఇబ్నె మాజహ్, నసాయి’)
668 – [ 15 ] ( صحيح ) (1/211)
وَعَنْ عُثْمَانَ بْنِ أَبِيْ الْعَاصِ قَالَ قُلْتُ: يَا رَسُوْلَ اللهِ اِجْعَلْنِيْ إِمَامَ قَوْمِيْ فَقَالَ: “أَنْتَ إِمَامُهُمْ وَاقْتَدِ بِأَضْعَفِهِمْ وَاتَّخِذْ مُؤَذِّنًا لَا يَأْخُذُ عَلَى أَذَانِهِ أَجْرًا”. رَوَاهُ أَحْمَدُ وَأَبُوْ دَاوُدَ وَالنَّسَائِيُّ.
668. (15) [1/211–దృఢం]
’ఉస్మాన్ బిన్ అబుల్ ’ఆ’స్ (ర) కథనం: నేను ప్రవక్త (స) ను, ‘ఓ ప్రవక్తా! నన్ను నా జాతికి ఇమాముగా నియమించండని,’ విన్నవించుకున్నాను. ప్రవక్త (స) నీవు, ‘నీ జాతికి ఇమామువు, అంటే నిన్ను నీ జాతికి ఇమాముగా నియమించాను,’ అని చెప్పి, ‘నీవు బలహీనులను దృష్టిలో పెట్టుకో ఇంకా ప్రతిఫలం కోరని ముఅజ్జి‘న్ను పెట్టుకో,’ అని అన్నారు. [51] (అ’హ్మద్, అబూ దావూద్, నసాయి’)
669 – [ 16 ] ( ضعيف ) (1/211)
وَعَنْ أُمِّ سَلَمَةَ رَضِيَ اللهُ عَنْهَا قَالَتْ: عَلَّمَنِيْ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم أَنْ أَقُوْلَ عِنْدَ أَذَانِ الْمَغْرِبِ: “اللَّهُمَّ إِنْ هَذَا إِقْبَالُ لَيْلِكَ وَإِدْبَارُ نَهَارِكَ وَأَصْوَاتُ دُعَاتِكَ فَاغْفِرْ لِيْ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ وَالْبَيْهَقِيُّ فِيْ الدَّعْوَاتِ الْكَبِيْرِ.
669. (16) [1/211–బలహీనం]
ఉమ్మె సలమహ(ర) కథనం:ప్రవక్త(స) నాకు మ’గ్రిబ్ అజా‘న్ సమయంలో చదవమని ఈ దు’ఆ నేర్పారు. (అబూ దావూద్, బైహఖీ-ద’అవాత్ అల్-కబీర్)
ఆ దు’ఆ ఇది: అల్లాహుమ్మ హాజా ఇఖ్బాలు లైలిక వ ఇద్బారు నహారిక వ అ’స్వాతు దు’ఆతిక ఫ’గ్ఫిర్లీ.”- ‘ఓ అల్లాహ్! ఇది నీ రాత్రి వచ్చే సమయం, పగలు పోయే సమయం, ఇంకా ఇది నీ పిలుపు ఇచ్చే వాళ్ళ సమయం, నన్ను క్షమించు.’
670 – [ 17 ] ( ضعيف ) (1/212)
وَعَنْ أَبِيْ أَمَامَةَ أَوْ بَعْضِ أَصْحَابِ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم: “إِنَّ بِلَالًا أَخَذَ فِيْ الْإِقَامَةِ فَلَمَّا أَنْ قَالَ: قَدْ قَامَتِ الصَّلَاةُ. قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “أَقَامَهَا اللهُ وَأَدَامَهَا”. وَ قَالَ فِيْ سَائِرِ الْإِقَامَةِ: كَنَحْوِ حَدِيْثِ عُمَرَ رَضِيَ اللهُ عَنْهُ فِيْ الْأَذَانِ. رَوَاهُ أَبُوْ دَاوُدَ .
670. (17) [1/212–బలహీనం]
అబూ ఉమామ లేదా కొందరు అనుచరుల కథనం: బిలాల్ (ర) ఇఖామత్ పలకటం ప్రారంభించారు. ఖద్ ఖామ తిస్సలాహ్ పలికే సరికి ప్రవక్త (స), ”అఖామ హల్లాహు వ అదామహా,” అని పలికారు. అంటే – ‘ఓ అల్లాహ్! నీవు ఈ నమా’జును ఎల్లప్పుడూ వర్థిల్లి నట్లు ఉంచు.’ మిగిలిన ఇఖామత్లో ’ఉమర్ (ర) ’హదీసు‘లో ఉన్నట్లుగానే ఉంది. (అబూ దావూద్)
671 – [ 18 ] ( صحيح ) (1/212)
وَعَنْ أَنَسٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَا يُرَدُّ الدُّعَاءُ بَيْنَ الْأَذَانِ وَالْإِقَامَةِ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ وَالتِّرْمِذِيُّ.
671. (18) [1/212 – దృఢం]
అనస్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”అజా‘న్ మరియు ఇఖామత్‌ల మధ్య దు’ఆను తిరస్క రించడం జరుగదు. అంటే తప్పకుండా స్వీకరించ బడుతుంది.” (అబూ దావూద్, తిర్మిజీ’)
672 – [ 19 ] ( صحيح ) (1/212)
وَعَنْ سَهْلِ بْنِ سَعْدٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “ثِنْتَانِ لَا تُرَدَّانِ أَوْ قَلَّمَا تُرَدَّانِ الدُّعَاءُ عِنْدَ النِّدَاءِ وَعِنْدَ الْبَأْسِ حِيْنَ يُلْحِمُ بَعْضُهُمْ بَعْضًا”.
وَفِيْ رِوَايَةٍ: “وَتَحْتَ الْمَطَرِ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ وَالدَّارَمِيُّ إِلَّا أَنّهُ لَمْ يَذْكُرْ”وَتَحْتَ الْمَطَرِ” .
672. (19) [1/212–దృఢం]
సహల్ బిన్ స’అద్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”రెండు సమయాల్లో దు’ఆ రద్దు చేయబడదు. 1. అజాన్ సమయం లో చేసే దు’ఆ, 2. జి’హాద్ చేసేటప్పుడు చేసే దు’ఆ. అంటే హోరాహోరీ పోరాటం జరుగుతున్నప్పుడు. మరో ఉల్లేఖనంలో వర్షంలో అని ఉంది. (అబూ దావూద్, దార్మీ)
దార్మీలో ”తహ్తల్ మ’తర్” అనే పదం లేదు.”
673 – [ 20 ] ( حسن ) (1/213)
وَعَنْ عَبْدِ اللهِ بْنِ عَمْرٍو قَالَ: قَالَ رَجُلٌ:يَا رَسُوْلَ اللهِ إِنَّ الْمُؤَذِّنِيْنَ يَفْضُلُوْنَنَا. فَقَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “قُلْ كَمَا يَقُوْلُوْنَ فَإِذَا اِنْتَهَيْتَ فَسَلْ تُعْطَ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ .
673. (20) [1/213–ప్రామాణికం]
’అబ్దుల్లాహ్ బిన్ ’అమ్ర్ (ర) కథనం: ప్రవక్త (స) ను ఒక వ్యక్తి, ఓ ప్రవక్తా! అజా‘న్ ఇచ్చేవారు మమ్మల్ని అధిగమించారు అని విన్నవించుకున్నాడు. దానికి ప్రవక్త (స) వాళ్ళు పలికిన విధంగానే నీవూ పలుకు. అజా‘న్ పదాలను వల్లించు, ఇంకా అజా‘న్ పూర్తయిన తర్వాత అల్లాహ్‌ను నీవు కోరింది అడుగు, ఇవ్వబడుతుంది,’ అని అన్నారు. (అబూ దావూద్)
—–
اَلْفَصْلُ الثَّالِثُ మూడవ విభాగం
674 – [ 21 ] ( صحيح ) (1/213)
عَنْ جَابِرٍ قَالَ: سَمِعْتُ النَّبِيَّ صلى الله عليه وسلم يَقُوْلُ: “إِنَّ الشَّيْطَانَ إِذَا سَمِعَ النِّدَاءَ بِالصَّلَاةِ ذَهَبَ حَتَّى يَكُوْنَ مَكَانَ الرَّوْحَاءِ”. رَوَاهُ مُسْلِمٌ .
674. (21) [1/213–దృఢం]
జాబిర్ (ర) కథనం: ప్రవక్త (స) ఇలా ప్రవచిస్తూ ఉండగా నేను విన్నాను. ‘నమా’జు అజా‘న్ను విని షై’తాన్ రౌహా ప్రాంతం వరకు పారిపోతాడు. ఉల్లేఖన కర్త రౌహా మదీనహ్ కు 36 మైళ్ళదూరంలో ఉంది,‘ అని అన్నారు. (ముస్లిమ్)
675 – [ 22 ] ( ضعيف ) (1/213)
وَعَنْ عَلْقَمَةَ بْنِ وَقّاصٍ قَالَ: إِنِّيْ لَعِنْدَ مُعَاوِيَةَ إِذْ أَذَّنَ مُؤَذِّنُهُ. فَقَالَ مُعَاوِيَةُ كَمَا قَالَ مُؤَذِّنُهُ حَتَّى إِذَا قَالَ: حَيَّ عَلَى الصَّلَاةِ: قَالَ: لَا حَوْلَ وَلَا قُوَّةَ إِلَّا بِاللهِ. فَلَمَّا قَالَ: حَيَّ عَلَى الْفَلَاحِ قَالَ: لَا حَوْلَ وَلَا قُوَّةَ إِلَّا بِاللهِ الْعَلِيِّ الْعَظِيْم. وَقَالَ بَعْدَ ذَلِكَ مَا قَالَ الْمُؤَذِّنُ ثُمَّ قَالَ: سَمِعْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم قَالَ ذَلِكَ. رَوَاهُ أَحْمَدُ.
675. (22) [1/213–బలహీనం]
అల్‌ఖమహ్ బిన్ వఖ్ఖా’స్ (ర) కథనం: నేను ము’ఆవియహ్ (ర) వద్ద కూర్చొని ఉన్నాను. అతని ముఅజ్జి‘న్ అజా‘న్ పలికాడు. ము’ఆవియహ్ కూడా అజా‘న్ పదాలను వల్లించారు. ముఅజ్జి‘న్ ‘హయ్య ’అల’స్సలాహ్’ అని పలికితే ము’ఆవియహ్ (ర), ‘లా ’హౌల వలా ఖువ్వత ఇల్లాహ్ బిల్లాహ్’ అని, ‘హయ్య ’అలల్‌ఫలాహ్’ అని పలికితే ‘లా హౌల వలాఖువ్వత ఇల్లాబిల్లాహిల్ ’అ”జీమ్,’ అని పలికారు. ఆ తరువాత ముఅజ్జి‘న్ పలికిన పదాలనే ము’ఆవియహ్ పలికారు. అనంతరం ప్రవక్త (స) ఇలాగే వల్లించడం నేను చూసానని,’ అన్నారు. (అ’హ్మద్)
676 – [ 23 ] ( حسن ) (1/214)
وعَنْ أبي هريرة قَالَ: كنا مع رسول الله صلى الله عليه وسلم فقام بلال ينادي فلما سكت. قَالَ رسول الله صلى الله عليه وسلم: “من قَالَ مثل هذا يقينا دخل الجنة”. رواه النسائي.
676. (23) [1/214–ప్రామాణికం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) వద్ద కొంత మంది ఉన్నారు. ఇంతలో బిలాల్ (ర) నిలబడి అజా‘న్ ఇవ్వసాగారు. అజా‘న్ పూర్తయిన తర్వాత ప్రవక్త (స), ”నిర్మలమైన మనస్సుతో, దృఢమైన నమ్మకంతో అజా‘న్కు సమాధానంగా అజా‘న్ పదాలను వల్లించిన వ్యక్తి, స్వర్గంలో ప్రవేశిస్తాడు” అని అన్నారు. (నసాయి’)
677 – [ 24 ] ( صحيح ) (1/214)
وَعَنْ عَائِشَةَ رَضِيَ اللهُ عَنْهَا قَالَتْ: كَانَ النَّبِيُّ صلى الله عليه وسلم إِذَا سَمِعَ الْمُؤَذِّنُ يَتَشَهَّدُ قَالَ: “وَأَنَا وَأَنَا”. رواه أبو داود.
677. (24) [1/214–దృఢం]
’ఆయి‘షహ్ (ర) కథనం: ప్రవక్త (స) ముఅజ్జి‘న్ షహాదతైన్ పలకటం విని సమాధానంగా ”వఅనా, వఅనా,” అని పలికేవారు. [52] (అబూ దావూద్)
678 – [ 25 ] ( صحيح ) (1/214)
وَعَنِ ابْنِ عُمَرَ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم قَالَ: “مَنْ أَذَّنَ ثِنْتَيْ عَشْرَةَ سَنَةً وَجَبَتْ لَهُ الْجَنَّةُ وَكَتَبَ لَهُ بِتَأْذِيْنِهِ فِيْ كُلِّ يَوْمٍ سِتُّوْنَ حَسَنَةً وَلِكُلّ إِقَامَةٍ ثَلَاثُوْن حَسَنَةً” .رَوَاهُ ابْنُ مَاجَهُ.
678. (25)[1/214–దృఢం]
’అబ్దుల్లాహ్ బిన్ ’ఉమర్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”12 సంవత్సరాల వరకు అజా‘న్ ఇచ్చిన వ్యక్తి కోసం స్వర్గం తప్పనిసరి అయిపోయింది. అతని అజా’న్కు బదులు ప్రతిరోజు 60 పుణ్యాలు లిఖించ బడతాయి. ప్రతి తక్బీర్కు బదులుగా 30 పుణ్యాలు లిఖించబడతాయి.” (ఇబ్నె మాజహ్)
679 – [ 26 ] ( لم تتم دراسته ) (1/214)
وَعَنْهُ قَالَ: كُنَّا نُؤْمَرُ بِالدُّعَاءِ عِنْدَ أَذَانِ الْمَغْرِبِ. رَوَاهُ الْبَيْهَقِيُّ.
679. (26) [1/214-అపరిశోధితం]
ఇబ్నె ‘ఉమర్ (ర) కథనం: మాకు మ’గ్రిబ్ అజా‘న్ సమయాన దు’ఆ చేయమని ఆదేశించడం జరిగింది. (బైహఖీ – ద’అవాతుల్ కబీర్)
మగ్రిబ్ అజాన్ సమయంలో ”అల్లాహుమ్మ్ హాజా ఇఖ్బాలు లైలిక …” ఇది ఇంతకు ముందు ‘హదీసు’లో వచ్చింది.
=====
6– بَابُ تَأخِير الْأَذَانِ
6. అజా‘న్ ఆలస్యంగా ఇవ్వటం
اَلْفَصْلُ الْأَوَّلُ మొదటి విభాగం
680 – [ 1 ] ( متفق عليه ) (1/215)
وَعَنِ ابْنِ عُمَرَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِنَّ بِلَالًا يُؤَذِّن بِلَيْلٍ فَكُلُوْا وَاشْرَبُوْا حَتَّى يُنَادِيَ اِبْنُ أُمِّ مَكْتُوْمٍ”. ثُمَّ قَالَ: وَكَانَ رَجُلًا أَعْمَى لَا يُنَادِيْ حَتَّى يُقَالَ لَهُ: أَصْبَحْتَ أَصْبَحْتَ
680. (1) [1/215–ఏకీభవితం]
ఇబ్నె ’ఉమర్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”బిలాల్ రమ’దాన్లో రాత్రి అజా‘న్ ఇచ్చినపుడు స’హ్రీ తినండి, త్రాగండి ఇబ్నె ఉమ్మె మక్తూమ్ అజా‘న్ ఇచ్చి నపుడు ఆపి వేయండి. ఉమ్మె మక్తూమ్ గ్రుడ్డివారు. అతనితో మీరు సుబ’హ్ ’సాదిఖ్లో ప్రవేశించారు,’ అని అన్నప్పుడు అతను అజా‘న్ ఇచ్చేవారు. [53] (బు‘ఖారీ, ముస్లిమ్)
681 – [ 2 ] ( صحيح ) (1/215)
وَعَنْ سَمْرَةَ بْنِ جُنْدُبِ قَالَ: قَالَ رسولُ الله صلى الله عليه وسلم: “لَا يَمْنَعَنَّكُمْ مِنْ سُحُوْرِكُمْ أَذَانُ بِلَالٍ وَلَا الْفَجْرُ الْمُسْتَطِيْلُ وَلَكِنَّ الْفَجْرَ الْمُسْتَطِيْرَ فِيْ الْأُفُقِ “. رَوَاهُ مُسْلِمٌ وَلَفْظُهُ لِلتِّرْمِذِيُّ
681. (2) [1/215–దృఢం]
సమురహ్ బిన్ జున్దుబ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”బిలాల్ అజా‘న్ ఇచ్చినా, ఉషోదయకాలం రాకున్నా మీరు స’హ్రీ తినండి, త్రాగండి, ఉషోదయ కాలం ప్రారంభమవగానే తినడం, త్రాగడం మానివేయండి.” (ముస్లిమ్, తిర్మిజి‘)
682 – [ 3 ] ( صحيح ) (1/215)
وَعَنْ مَالِكِ بْنِ الْحُوَيْرِثِ قَالَ: أَتَيْتُ النَّبِيَّ صلى الله عليه وسلم أَنَا وَابْنُ عَمٍّ لِّيْ فَقَالَ: “إِذَا سَافَرْتُمَا فَأَذِّنَا وَأَقِيْمَا وَلْيَؤُمَّكُمَا أَكْبَرُكَمَا”. رَوَاهُ الْبُخَارِيُّ.
682. (3) [1/215–దృఢం]
మాలిక్ బిన్ హువైరిస్‘ (ర) కథనం: నేనూ మా చిన్నాన్న కొడుకు ఇద్దరం ప్రవక్త (స) వద్దకు వెళ్ళాము. కొన్ని రోజుల తర్వాత బయలుదేరాము. అప్పుడు ప్రవక్త (స), ‘మీరిద్దరూ ప్రయాణానికి వెళితే మీలో ఒకరు అజా‘న్ మరియు ఇఖామత్ పలకాలి. మీలో పెద్దవాడు ఇమామత్ చేయాలి,’ అని ఉపదేశించారు. (బు’ఖారీ)
683 – [ 4 ] ( متفق عليه ) (1/215)
وَعَنْهُ قَالَ: قَالَ لَنَا رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “صَلُّوا كَمَا رَأَيْتُمُوْنِيْ أُصَلِّيْ فَإِذَا حَضَرَتِ الصَّلَاةُ فَلِيُؤَذِّنْ لَكُمْ أَحَدُكُمْ وَلِيَؤُمِّكُمْ أَكْبَرُكُمْ” .
683. (4) [1/215–ఏకీభవితం]
మాలిక్ బిన్ హువైరిస్‘ (ర) కథనం: ప్రవక్త (స) మాతో ఇలా అన్నారు, ”నన్ను నమా’జ్ చేస్తూ ఉండగా చూచినట్టే, మీరూ నమా’జ్ చదవండి. నమా’జు సమయం అయితే మీలో ఒకరు అజా‘న్ ఇవ్వాలి. మీలో అందరికంటే పెద్దవారు ఇమామత్ చేయాలి.” (బు’ఖారీ, ముస్లిమ్)
684 – [ 5 ] ( صحيح ) (1/216)
وَعَنْ أَبِيْ هُرَيْرَةَ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: إِنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم حِيْنَ قَفَلَ مِنْ غَزْوَةِ خَيْبَرَ سَارَ لَيْلَةً حَتَّى إِذَا أَدْرَكَهُ الْكَرَى عَرَّسَ. وَقَالَ لِبَلَالٍ: “اكْلَأ لَنَا اللَّيْلَ. فَصَلَّى بِلَالٌ مَا قُدِّرَ لَهُ. وَنَامَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم. وَأَصْحَابِهِ فَلَمَّا تَقَارَبَ الْفَجْرُ اِسْتَنَدَ بِلَالُ إِلَى رَاحِلَتِهِ مُوَجِّهَ الْفَجْرَ فَغَلَبَتْ بِلَالًا عَيْنَاهُ وَهُوَ مُسْتَنِدٌ إِلَى رَاحِلَتِهِ فَلَمْ يَسْتَيْقِظْ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم وَلَا بِلَالٌ وَلَا أَحَدٌ مِّنْ أَصْحَابِهِ حَتَّى ضَرَبَتْهُمْ الشَّمْسُ فَكَانَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم أَوَّلَهُمْ اِسْتِيْقَاظًا. فَفَزِعَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم. فَقَالَ: “أَيْ بِلَالُ”. فَقَالَ بَلَالٌ أَخَذَ بِنَفْسِيْ الِّذِيْ أَخَذَ بِنَفْسِكَ. قَالَ: “اِقْتَادُوْا” فَاقْتَادُوْا رَوَاحِلَهُمْ شَيْئًا ثُمَّ تَوَضَّأَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم. وَأَمَرَ بِلَالًا فَأَقَامَ الصَّلَاةَ. فَصَلَّى بِهِمُ الصُّبْحَ فَلَمَّا قَضَى الصَّلَاةَ قَالَ: “مَنْ نَسِيَ الصَّلَاةَ فَلْيُصَلِّهَا إِذَا ذَكَرَهَا. فَإِنَّ اللهَ قَالَ: (أَقِمِ الصَّلَاةَ لِذِكْرِيْ؛ 20: 14). رواه مسلم .
684. (5) [1/216–దృఢం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) తబూక్ యుద్ధం నుండి తిరిగి వస్తున్నప్పుడు, రాత్రివేళ నడుస్తూ నడుస్తూ రాత్రి చివరి భాగంలో నిద్ర రాసాగితే, విశ్రాంతి తీసుకోవటానికి ఒక ప్రాంతంలో దిగారు. ప్రవక్త (స) బిలాల్‌తో నీవు మాకు కాపలా కాస్తూ ఉండు. ఉదయం మాకు నమా’జు కోసం మేల్కొలపాలి,’ అని అన్నారు. అందరూ నిద్ర పోయారు. బిలాల్ రాత్రి నమా’జు లో నిమగ్నమయి పోయారు. నమా’జు చదువుతూ ఉన్నారు. ఉషోదయ కాలం దగ్గర రాగానే బిలాల్ (ర) తన వాహనానికి ఆనుకొని తూర్పువైపు ముఖంత్రిప్పి చూడసాగారు. ‘ఉషోదయ కాలం కాగానే ప్రవక్త (స) మరియు అందరినీ లేపుతాను,’ అనుకున్నారు. కాని బిలాల్‌కు నిద్ర ముంచుకొచ్చింది. వాహనానికి చేరబడి నిద్రపోయారు. ఎవ్వరూ మేల్కొనలేదు. అలసట వల్ల అందరూ నిద్రలోనే ఉన్నారు. ఉషోదయకాలం పోయి సూర్యుడు కూడా ఉదయించాడు. అందరిపై ఎండ పడసాగింది. అందరికంటే ముందు ప్రవక్త (స) మేల్కొన్నారు. నమా’జు తప్పినందు వల్ల ప్రవక్త (స) చాలా ఆందోళనకు గురయ్యారు. బిలాల్‌తో, ‘బిలాల్ నీ కేమయింది, మమ్మల్ని ఎందుకు లేపలేదు,’ అని అన్నారు. అప్పుడు బిలాల్ (ర), ‘ఓ ప్రవక్తా(స)! తమరికి నిద్ర ముంచుకొచ్చినట్లే, నాకు కూడా నిద్ర ముంచుకొచ్చింది. అందువల్ల లేపలేక పోయాను,’ అని అన్నారు. అప్పుడు ప్రవక్త (స), ‘వాహనాలను ఇక్కడి నుండి లాక్కువెళ్లండి,’ అని అన్నారు. అందరూ తమ వాహనాలను కొంతదూరం లాక్కొని వెళ్ళారు. ప్రవక్త (స) వు’దూ చేశారు. బిలాల్‌ను అజా‘న్ మరియు ఇఖామత్ గురించి ఆదేశించారు. అనంతరం ప్రవక్త (స) ఫజ్ర్ నమా’జు చదివించారు. నమా’జు అనంతరం ప్రజలనుద్దేశించి, మరచిపోయినా, నిద్రపోయినా గుర్తుకురాగానే, మేల్కొన్న వెంటనే ఆ నమా’జును చదువుకోవాలి. ఎందుకంటే అల్లాహ్: ‘నన్ను స్మరించటానికి నమా’జు స్థాపించండి,’ (సూ. తా-హా, 20:14) అని అంటున్నాడు.” అని అన్నారు. (ముస్లిమ్)
685 – [ 6 ] ( متفق عليه ) (1/216)
وَعَنْ أَبِيْ قَتَادَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: إِذَا أَقِيْمَتِ الصَّلَاةُ فَلَا تَقُوْمُوْا حَتَّى تَرَوْنِيْ قَدْ خَرَجْتُ”.
685. (6) [1/216–ఏకీభవితం]
అబూ ఖతాదహ్ (ర) కథనం: ప్రవక్త (స), ”నమా’జు కోసం ఇఖామత్ పలికితే, నేను ఇంటి నుండి బయలుదేరటం చూడనంత వరకు నిలబడకండి,” అని హితబోధ చేశారు. [54] (బు’ఖారీ, ముస్లిమ్)
686 – [ 7 ] ( متفق عليه ) (1/216)
وَعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: قَالَ رَسُوْلُ الله صلى الله عليه وسلم: “إِذَا أَقِيْمَتِ الصَّلَاةُ فَلَا تَأْتُوْهَا تَسْعَوْنَ وَأَتُوْهَا تَمْشُوْنَ وَعَلَيْكُمُ السَّكِيْنَةُ فَمَا أَدْرَكْتُمْ فَصَلُّوْا وَمَا فَاَتَكُمْ فَأَتِمُّوْا”. وَفِيْ رَوَايَةٍ لِّمُسْلِمٍ: “فَإِنَّ أَحَدَكُمْ إِذَا كَانَ يَعْمِدُ إِلَى الصَّلَاةِ فَهُوَ فِيْ صَلَاةٍ”.
686. (7) [1/216–ఏకీభవితం]
అబూహురైరహ్ (ర) కథనం: ప్రవక్త(స) ప్రవచనం, ”తక్బీర్ పలికినపుడు నమా’జు కోసం పరిగెత్తుతూ రాకండి. నిదానంగా, ప్రశాంతంగా నడచిరండి, దొరికిన నమా’జు చదువుకోండి. మిగిలింది ఇమాము సలామ్ చేసిన తర్వాత పూర్తిచేసుకోండి.” (బు’ఖారీ, ముస్లిమ్)
ముస్లిమ్ ఉల్లేఖనంలో ఇలా ఉంది, ”మీలో ఎవరైనా నమా’జు చదివే ఉద్దేశ్యంతో నడిస్తే అతడు నమా’జులో ఉన్నట్టే.
—–
وَهَذَا الْبَابُ خَالٍ عَنِ الْفَصْلِ الثَّانِيْ
ఇందులో రెండవ విభాగం లేదు.
—–
اَلْفَصْلُ الثَّالِثُ మూడవ విభాగం
687 – [ 8 ] ( صحيح ) (1/217)
عَنْ زيْدِ بْنِ أَسْلَمَ أَنَّهُ قَالَ: عَرَّسَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم لَيْلَةً بِطَرِيْقِ مَكَّةَ وَوَكَلَ بِلَالًا أَنْ يُّوْقِظَهُمْ لِلصَّلَاةِ فَرَقَدَ بِلَالٌ وَرَقَدُوْا حَتَّى اِسْتَيْقَظُوْا وَقَدْ طَلَعَتْ عَلَيْهِمُ الشَّمْسُ فَاسْتَيْقَظَ الْقَوْمُ وَقَدْ فَزِعُوْا. فَأَمَرَهُمْ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم أَنْ يَّرْكَبُوْا حَتَّى يَخْرُجُوْا مِنْ ذَلِكَ الْوَادِيْ. وَقَالَ: “إِنَّ هَذَا وَادٍ بِهِ شَيْطَانٌ”. فَرَكِبُوْا حَتَّى خَرَجُوْا مِنْ ذَلِكَ الْوَادِيْ ثُمَّ أَمَرَهُمْ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم أَنْ يَّنْزِلُوْا وَأَنْ يَّتَوَضَّئُوْا وَأَمَرَ بِلَالًا أَنْ يُّنَادِيَ لِلصَّلَاةِ أَوْ يُقِيْمَ. فَصَلَّى رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم بِالنَّاسِ. ثُمَّ انْصَرَفَ إِلَيْهم وَقَدْ رَأَىَ مِنْ فَزَعِهِمْ. فَقَالَ: “يَا أَيُّهَا الناسُ إِنَّ اللهَ قَبَضَ أَرْوَاحَنَا وَلَوْ شَاءَ لَرَدَّهَا إِلَيْنَا فِيْ حِيْنَ غَيْرِ هَذَا فَإِذَا رَقَدَ أَحَدُكُمْ عَنِ الصَّلَاةِ أَوْ نَسِيَهَا ثُمَّ فَزَعَ إِلَيْهَا فَلْيُصَلِّهَا كَمَا كَانَ يُصَلِّيْهَا فِيْ وَقْتِهَا”. ثُمَّ الْتَفَتَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم إِلَى أَبِيْ بَكْرِ الصدِيْقِ فَقَالَ: “إِنَّ الشَّيْطَانَ أَتَى بِلَالًا وَهُوَ قَائِمٌ يُّصَلِّيْ فَأَضْجَعَهُ فَلَمْ يَزَلْ يُهْدِئُهُ كَمَا يُهْدَأُ الصَّبِيُّ حَتَّى نَامَ”. ثُمَّ دَعَا رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم بِلَالًا فَأَخْبَرَ بِلَالٌ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم مِثْلَ الَّذِيْ أَخْبَرَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم أَبَا بَكْرٍ. فَقَالَ أَبُوْ بَكْرٍ: أَشْهَدُ أَنَّكَ رَسُوْلُ اللهِ. رَوَاهُ مَالِكٌ مُرْسَلًا .
687. (8) [1/217-దృఢం]
’జైద్ బిన్ అస్లమ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రయా ణంలో మక్కహ్ మార్గంలో రాత్రి చివరి భాగంలో విశ్రాంతి కోసం దిగారు. బిలాల్‌ను ఉదయం మమ్మల్ని నమా’జుకు అందరినీ లేపమని ఆదేశించారు. బిలాల్ మేల్కొని ఉన్నారు. కాని అలసట వల్ల కొంతసేపు తర్వాత బిలాల్ కూడా నిద్రపోయారు. అందరూ నిద్రలో ఉన్నారు. సూర్యుడు ఉదయించిన తర్వాత మేల్కొన్నారు. అందువల్ల అందరూ ఆందోళన చెందారు. ప్రవక్త (స) అందరినీ, ‘ఇక్కడి నుండి బయలుదేరండి, ఇక్కడ షై’తానుల ఆధిక్యత ఉంది,’ అని అన్నారు. అందరూ అక్కడి నుండి బయలుదేరి మరికొంత దూరంలో ఆగారు. ప్రవక్త (స) అందరినీ దిగి వు’దూ చేయమని ఆదేశించారు. అందరూ దిగి వు’దూ చేయడం ప్రారంభించారు. బిలాల్‌ను అజా‘న్ మరియు ఇఖా మత్ చెప్పమని ఆదేశించడం జరిగింది. అనంతరం ప్రవక్త(స) నమా’జు చదివించారు. నమా’జు అయిన తర్వాత ప్రజల ఆందోళన చూసి ప్రవక్త (స), ”ప్రజలారా! అల్లాహ్ మన ఆత్మలను ఆపివేశాడు అంటే నిద్రపోనిచ్చాడు. ఒకవేళ ఆయన కోరితే మన ఆత్మలను మరో సమయంలో లేపేవాడు. మీలో ఎవరైనా నిద్రపోయినా లేక మరచిపోయినా నిద్రనుండి మేల్కొన్నా, గుర్తుకు వచ్చినా వెంటనే నమా’జ్ చదువుకోవాలి.
ఆ తరువాత ప్రవక్త (స), ‘అబూ బకర్ వైపు తిరిగి, బిలాల్ (ర) నిలబడి నమా’జు చదువుతుండగా షై’తాన్ అతని వద్దకు వచ్చి, పడుకుందామనే కోరికను రేకెత్తించాడు. అనంతరం అతను చేర బడ్డారు. షై’తాన్ చాలాసేపు వరకు అతన్ని బుజ్జ గించాడు. పిల్లల్ని పడుకోబెట్టినట్టు. బిలాల్ కూడా నిద్రముంచుకొచ్చి పడుకున్నాడు. అనంతరం ఈ సంఘటన ధృవీకరణకు ప్రవక్త (స) బిలాల్‌ను పిలిపించి అడిగారు. బిలాల్ సరిగ్గా అలాగే సమాధానం ఇచ్చారు. అబూ బకర్ (ర) బిలాల్ మాటలు విని, ‘ఓ ప్రవక్తా! నిస్సందే హంగా మీరు అల్లాహ్ ప్రవక్త అని నేను సాక్ష్యం ఇస్తున్నాను,” అని అన్నారు. (ఇమామ్ మాలిక్ / తాబయీ ప్రోక్తం)
688 – [ 9 ] ? (1/218)
وَعَنِ ابْنِ عُمَرَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “خَصْلَتَانِ مُعَلَّقَتَانِ فِيْ أَعْنَاقِ الْمُؤَذِّنِيْنَ لِلْمُسْلِمِيْنَ: صِيَامُهُمْ وَصَلَاتُهُمْ”. رَوَاهُ ابْنُ مَاجَهُ.
688. (9) [1/218–?]
’అబ్దుల్లాహ్ బిన్ ’ఉమర్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం,”ముఅజ్జి‘న్ల మెడల్లో ముస్లిముల రెండు విషయాలు వ్రేలాడుతున్నాయి. అంటే ఈ రెండు విషయాలకు ముఅజ్జి‘న్లు బాధ్యులు. ఈ రెంటికి ముఅజ్జి‘న్లు బాధ్యులు: 1. ముస్లిముల ఉపవాసాలు, 2. వారినమా’జులు.(ఇబ్నెమాజహ్)
ఒకవేళ వారు సరైన సమయంలో అజా‘న్ ఇస్తే, అందరూ నమా’జ్ కూడా సరైన సమయంలో చదువుతారు. ఇంకా సరైన సమయంలో ఉపవాస విరమణచేస్తారు. ఒకవేళ తప్పుడు సమయంలో అజా‘న్ ఇస్తే వారి నమా’జ్, ఉపవాసాల్లో లోపం ఉంటుంది. దీని బాధ్యత ముఅజ్జి‘న్లపై ఉంది. వారే దానికి బాధ్యులు, నేరస్తులు, పాపాత్ములు అవుతారు. అందువల్ల ముఅజ్జి‘న్లు తమ బాధ్యతలు గుర్తించి సరైన సమయాల్లో అజా‘న్ ఇవ్వాలి. (ఇబ్నె మాజహ్)
=====
7– بَابُ الْمَسَاجِدِ وَمَوَاضِعِ الصَّلَاةِ
7. మస్జిదులు, నమా’జు చేసే స్థలాలు
మస్జిద్ అంటే సజ్దా చేసే స్థలం. అదేవిధంగా నమా’జ్ చదివే, అంటే అల్లాహ్(త)ను ఆరాధించే స్థలాన్ని కూడా మస్జిద్ అంటారు. భూమిపై ఎక్కడైనా నమా’జు చదవ వచ్చును. అయితే 7 రకాల స్థలాల్లో నమా’జు చదవటం నిషిద్ధం. మస్జిదులు అన్నిటికంటే ఉత్తమమైనవి. బు’ఖారీలో ఇలా ఉంది, ప్రవక్త (స), ”అల్లాహ్ వద్ద అన్నిటికంటే ఉత్తమ మైనవి మస్జిదులు ఇంకా అన్నిటికంటే నీచమైనవి బజారులు. అల్లాహ్ (త) ప్రీతి కోసం మస్జిద్ తయారు చేసేవారి కోసం అల్లాహ్ (త) స్వర్గంలో ఒక భవనం తయారుచేస్తాడు” అని ప్రవచించారు. (బు’ఖారీ)
అన్నిటి కంటే ముందు నిర్మించబడిన మస్జిద్ క’అబహ్ (బైతుల్లాహ్). ఇది మక్కహ్ లో ఉంది. దీని 40 సంవత్సరాల తర్వాత బైతుల్ ముఖద్దస్ నిర్మించబడింది. ఇంటిలో చదివే నమా’జు కంటే మస్జిద్లో సామూహికంగా చదివే నమా’జుకు 25 రెట్లు పుణ్యం లభిస్తుంది. బైతుల్లాహ్లో ఒక రక’అతు చదివితే లక్ష రకాతులు చదివినంత పుణ్యం లభిస్తుంది. బైతుల్ ముఖద్దస్‌లో 50 వేల రకాతులు చదివినంత పుణ్యం లభిస్తుంది. ఎవరైనా ఇంటినుండి వు’దూ చేసి మస్జిద్ వెళ్ళి నమా’జు చదివితే, ఒక్కో అడుగుకు ఒక పుణ్యం, వ్రాయబడుతుంది, ఒక పాపం క్షమించటం జరుగుతుంది. ఎల్లప్పుడూ దైవ ధ్యానంలో ఉన్న వ్యక్తి తీర్పుదినంనాడు దైవ సింహాసనం నీడలో ఉంటాడు. ఎంతదూరం నుండి వస్తే అంత అధికంగా పుణ్యం లభిస్తుంది. మస్జిద్లో ప్రవేశించేటప్పుడు: ”అల్లాహుమ్మఫ్త’హ్లీ అబ్ వాబ ర’హ్మతిక” పలకాలి. మస్జిద్ నుండి బయటకు వెళ్ళి నపుడు, ”అల్లాహుమ్మ ఇన్నీ అస్అలుక మిన్ ఫ’ద్లిక్” పలకాలి. మస్జిద్ను పరిశుభ్రంగా ఉంచితే అధిక పుణ్యం లభిస్తుంది. మస్జిద్లోకి ప్రవేశించిన తరువాత కూర్చోవడానికి ముందు రెండు రకాతులు ”తహియ్యతుల్ మస్జిద్” చదివితే పుణ్యం లభిస్తుంది. తెల్లఉల్లి, ఉల్లి, బీడీ, సిగరెట్, హుక్క మొదలైన మత్తు పదార్థాలు సేవించి మస్జిద్లోకి వెళ్ళరాదు. ఎందుకంటే దైవగృహంలోకి వచ్చి, దైవాన్ని కలవటం, సంభాషించటం జరుగు తుంది. నోటి నుండి దుర్వాసన వస్తే, అల్లాహ్ ముఖం త్రిప్పుకుంటాడు. మస్జిద్ నియమాలు అనేకం ఉన్నాయి. వాటిని గురించి ఇస్లామీ తాలీమ్ 1, 2, 3 భాగాల్లో పేర్కొనడం జరిగింది.
اَلْفَصْلُ الْأَوَّلُ మొదటి విభాగం
689 – [ 1 ] ( صحيح ) (1/219)
عَنِ ابْنِ عَبَّاسٍ قَالَ: لَمَّا دَخَلَ النَّبِيُّ صلى الله عليه وسلم الْبَيْتَ دَعَا فِيْ نَوَاحِيْهِ كُلِّهَا وَلَمْ يَصِلْ حَتَّى خَرَجَ مِنْهُ فَلَمَّا خَرَجَ رَكَعَ رَكْعَتَيْنِ فِيْ قُبُلِ الْكَعْبَةِ وَقَالَ: “هَذَهِ الْقَبِلْةُ”. رَوَاهُ الْبُخَارِيُّ.
689. (1) [1/219–దృఢం]
ఇబ్నె ’అబ్బాస్ (ర) కథనం: మక్కహ్ విజయం నాడు ప్రవక్త (స) బైతుల్లాహ్లో ప్రవేశించినపుడు, బైతుల్లాహ్ మూలలన్నిటిలో ప్రవక్త (స) దు’ఆ చేశారు. నమా’జు చదవకుండా బయటకు వచ్చారు. బయటకు వచ్చి రెండు రకా’తులు నమా’జ్ చేసారు. అనంతరం బైతుల్లాహ్ వైపు సైగ చేస్తూ ”ఈ కా’బా ఖిబ్లా” అని అన్నారు. (బు’ఖారీ)
690 – [ 2 ] ( صحيح ) (1/219)
وَرَوَاهُ مُسْلِمٌ عَنْهُ عَنْ أُسَامَةَ بْنِ زَيْدٍ.
690. (2) [1/219–దృఢం]
ముస్లిమ్, దీనినే ’ఉసామహ్ బిన్ ’జైద్ ద్వారా కూడా ఉల్లేఖించారు.
691 – [ 3 ] ( متفق عليه ) (1/219)
وَعَنْ عَبْدِاللهِ بْنِ عُمَرَ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم دَخَلَ الْكَعْبَةَ هُوَ وَأُسَامَةُ بْنُ زَيْدٍ وَعُثْمَانُ بْنُ طَلْحَةَ الْحَجَبِيُّ وَبِلَالُ بْنُ رَبَاحٍ فَأغْلَقَهَا عَلَيْهِ وَمَكَثَ فِيْهَا فَسَأَلْتُ بِلَالًا حِيْنَ خَرَجَ مَاذَا صَنَعَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم. فَقَالَ: جَعَلَ عَمُوْدًا عَنْ يَسَارِهِ وَعَمُوْدَيْنِ عَنْ يَّمِيْنِهِ وَثَلَاثَةَ أَعْمِدَةٍ وَرَاءَهُ وَكَانَ الْبَيْتُ يَوْمَئِذٍ عَلَى سِتَّةِ أَعْمِدَةٍ ثُمَّ صَلَّى.
691. (3) [1/219–ఏకీభవితం]
’అబ్దుల్లాహ్ బిన్ ’ఉమర్ (ర) కథనం: ప్రవక్త (స) మరియు ’ఉసామా బిన్ ’జైద్, ’ఉస్మాన్ బిన్ ’తల్’హా అల్-’హజబియ్యు మరియు బిలాల్ బిన్ రిబాహ్, బైతుల్లాహ్ గృహంలో ప్రవేశించారు. బిలాల్ లేదా ’ఉస్మాన్ లోపలి నుండి తలుపులు మూసుకున్నారు. కొంతసేపు తర్వాత బిలాల్ బయటకు వచ్చారు. అప్పుడు బిలాల్‌ను నేను, ‘లోపల ప్రవక్త (స) ఏమి చేశారు,’ అని అడిగాను. దానికి బిలాల్ సమాధానం ఇస్తూ, ప్రవక్త (స) లోపల ఒక స్తంభాన్ని తన కుడి వైపున ఉంచి, రెండు స్తంభాలను ఎడమ వైపు ఉంచి, 3 స్తంభాలను వెనుక ఉంచి, అంటే అప్పుడు బైతుల్లాహ్లో 6 స్తంభాలు ఉండేవి. ప్రవక్త (స) నమా’జు చదివారు అని సమాధానం ఇచ్చారు. [55] (బు’ఖారీ, ముస్లిమ్)
692 – [ 4 ] ( متفق عليه ) (1/219)
وَعَنْ أَبِيْ هُرَيْرَةَ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “صَلَاةُ فِيْ مَسْجِدِيْ هَذَا خَيْرٌ مِّنْ أَلْفِ صَلَاةٍ فِيْمَا سَوَاهُ إِلَّا الْمَسْجِدَ الْحَرَامَ “.
692. (4) [1/219–ఏకీభవితం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మస్జిదుల్ ’హరామ్ తప్ప, ఇతర మస్జిదుల కంటే ఈ నామస్జిదులో వేయినమాజుల పుణ్యం లభిస్తుంది.” [56] (బు’ఖారీ, ముస్లిమ్)
693 – [ 5 ] ( متفق عليه ) (1/219)
وَعَنْ أَبِيْ سَعِيْدِنِ الْخُدْرِيِّ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَا تُشَدُّ الرِّحَالُ إِلَّا إِلَى ثَلَاثَةِ مَسَاجِدٍ: مَسْجِدِ الْحَرَامِ وَالْمَسْجِدِ الْأَقْصَى وَمَسْجِدِيْ هَذَا”.
693. (5) [1/219–ఏకీభవితం]
అబూ స’యీద్ ’ఖుద్రీ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఈ మూడు మస్జిదులకు తప్ప మరెక్కడికీ తీర్థ యాత్రకు వెళ్ళకండి: 1. మక్కాలో ఉన్న మస్జిద్ అల్-’హరామ్, 2. మస్జిద్ అల్-అఖ్సా (బైతుల్ ముఖద్దస్), 3. నా ఈ మస్జిద్ (మస్జిద్ అన్నబవీ). [57] (బు’ఖారీ, ముస్లిమ్)
694 – [ 6 ] ( متفق عليه ) (1/219)
وَعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَا بَيْنَ بَيْتِيْ وَمِنْبَرِيْ رَوْضَةٌ مِّنْ رِيَاضِ الْجَنَّةِ وَمِنْبَرِيْ عَلَى حَوْضِيْ.
694. (6) [1/219–ఏకీభవితం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”నా ఇంటికి మరియు మెంబరుకు మధ్య స్వర్గం తోటల్లోని ఒక తోట ఉంది. ఇంకా నా మెంబరు నా సరస్సుపై ఉంది. [58] (బు’ఖారీ, ముస్లిమ్)
695 – [ 7 ] ( متفق عليه ) (1/220)
وَعَنِ ابْنِ عُمَرَ قَالَ: كَانَ النَّبِيُّ صلى الله عليه وسلم يَأْتِيْ مَسْجِدَ قُبَاءٍ كُلَّ سَبْتٍ مَا شِيًا وّرَاكِبًا فَيُصَلِّيْ فِيْهِ رَكْعَتِيْنِ.
695. (7) [1/220–ఏకీభవితం]
’అబ్దుల్లాహ్ బిన్ ’ఉమర్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రతి శనివారం మస్జిదె ఖుబాకు కాలినడకన, ఒక్కోసారి వాహనంపై ఎక్కి వెళ్ళేవారు. అందులో రెండు రకాతులు చదివే వారు. [59] (బు’ఖారీ, ముస్లిమ్)
696 – [ 8 ] ( صحيح ) (1/220)
وَعَنْ أَبِيْ هُرَيْرَةَ رضي الله عَنْه قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “أَحَبُّ الْبِلَادِ إِلَى اللهِ مَسَاجِدُهَا وَأَبْغَضُ الْبِلَادِ إِلَى اللهِ أَسْوَاقِهَا”. رَوَاهُ مُسْلِمٌ .
696. (8) [1/220–దృఢం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”అల్లాహ్ వద్ద అన్నిటికంటే ఉత్తమమైనవి మస్జిదులు. ఇంకా అన్నిటికంటే నీచమైనవి బజారులు.” [60](ముస్లిమ్)
697 – [ 9 ] ( متفق عليه ) (1/220)
وَعَنْ عُثْمَانَ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَنْ بَنَى للهِ مَسْجِدًا بَنَى اللهُ لَهُ بَيْتًا فِيْ الْجَنَّةِ”.
697. (9) [1/220–ఏకీభవితం]
’ఉస్మాన్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”అల్లాహ్ ప్రీతికోసం మస్జిద్ నిర్మించిన వారికోసం అల్లాహ్ స్వర్గంలో ఒకభవనం నిర్మిస్తాడు.”(బు’ఖారీ, ముస్లిమ్)
698 – [ 10 ] ( متفق عليه ) (1/220)
وَعَنْ أَبِيْ هُرَيْرَةَ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَنْ غَدَا إِلَى الْمَسْجِدِ أَوْ رَاحَ أَعَدَّ اللهُ لَهُ نَزَلَهُ مِنَ الْجَنَّةِ كُلَّمَا غَدًا أَوْ رَاحَ” .
698. (10) [1/220–ఏకీభవితం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”దినం ప్రారంభంలో అంటే ఉదయం, దినం చివరి సమయం అంటే సాయంత్రం సమయంలో, మస్జిద్కు వచ్చే వారికోసం అల్లాహ్ స్వర్గంలో ప్రత్యేక విందు ఏర్పాటు చేస్తాడు. అంటే అతడు ఉదయం వెళ్ళినా, సాయంత్రం వెళ్ళినా.” [61] (బు’ఖారీ, ముస్లిమ్)
699 – [ 11 ] ( متفق عليه ) (1/220)
وَعَنْ أَبِيْ مُوْسَى الْأَشْعَرِيْ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “أَعْظَمُ النَّاسَ أَجْرًا فِيْ الصَّلَاةِ أَبْعَدُهُمْ فَأَبْعَدُهُمْ مَمْشًى وَالَّذِيْ يَنْتَظِرُ الصَّلَاةَ حَتَّى يُصَلِّيْهَا مَعَ الْإِمَامِ أَعْظَمِ أَجْرًا مِّنَ الَّذِيْ يُصَلِّيْ ثُمَّ يَنَامُ”.
699. (11) [1/220–ఏకీభవితం]
అబూ మూసా (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మస్జిద్కు చాలా దూరం నుండి నడిచి వచ్చి నమా’జు చదివేవారికి అందరికంటే అధికంగా పుణ్యం లభిస్తుంది. అదేవిధంగా నమా’జు కోసం వేచిఉండి, ఇమాముతో కలసి నమా’జు చదివేవారికి ఒంటరిగా నమా’జు చదివి నిద్రపోయే వారికంటే అధికంగా పుణ్యం లభిస్తుంది.” (బు’ఖారీ, ముస్లిమ్)
700 – [ 12 ] ( صحيح ) (1/220)
وَعَنْ جَابِرٍ قَالَ: خَلَتِ الْبِقَاعُ حَوْلَ الْمَسْجِدِ فَأَرَادَ بَنُوْ سَلَمَةَ أَنْ يَّنْتَقِلُوْا قُرْبَ الْمَسْجِدِ فَبَلَغَ ذَلِكَ النَّبِيَّ صلى الله عليه وسلم. فَقَالَ لَهُمْ: “بَلَغنِيْ أَنَّكُمْ تُرِيْدُوْنَ أَنْ تَنْتَقِلُوْا قُرْبَ الْمَسْجِدِ”. قَالُوْا: نَعَمْ يَا رَسُوْلُ اللهِ قَدْ أَرَدْنَا ذَلِكَ. فَقَالَ: “يَا بَنِيْ سَلَمَةَ ديَارَكُمْ تُكْتَبُ آثَارُكُمْ دَيَارَكُمْ تُكْتَبُ آثَارُكُمْ”. رَوَاهُ مُسْلِمٌ.
700. (12) [1/220–దృఢం]
జాబిర్ (ర) కథనం: మస్జిదె నబవీ దగ్గర కొన్ని ఇళ్ళు ఖాళీ అయిపోయాయి. మస్జిద్కు దూరంగా ఉన్న బనూ సలమహ్ వారు, ‘మస్జిద్కు దగ్గర అవుదాం,’ అని నిశ్చయించుకున్నారు. ప్రవక్త (స)కు ఈ వార్త అందింది. ప్రవక్త (స) వారి నుద్దేశించి, ‘మీరు మస్జిద్కు దగ్గర అవుదామని అనుకుంటున్నారట,’ అని అడిగారు. దానికి వారు, ‘అవునని,’ అన్నారు. అప్పుడు ప్రవక్త (స), ‘మీరు ఇప్పుడు ఏ వీధిలో ఉన్నారో అక్కడే ఉండండి, మస్జిద్కు దగ్గరవ్వాలనే ఆలోచన మానివేయండి. ఎందుకంటే, మస్జిద్కు రావటంలో మీరు వేసే అడుగులకు పుణ్యం వ్రాయ బడుతుంది. అంటే ఎంతదూరం నడచివస్తే, అంతే అధికంగా మీకు పుణ్యం లభిస్తుంది.” (ముస్లిమ్)
701 – [ 13 ] ( متفق عليه ) (1/220)
وَعَنْ أَبِيْ هُرَيْرَةَ رَضِيَ اللهُ عَنْهُ عَنْ النَّبِي صلى الله عليه وسلم قَالَ: “سَبْعَةٌ يُّظِلُّهُمُ اللهُ تعالى فِيْ ظِلِّهِ يَوْمَ لَا ظِلَّ إِلَّا ظِلَّهُ إِمَامٌ عَادِلٌ، وَشَابٌ نَشَأَ فِيْ عِبَادَةِ اللهِ، وَرَجُلٌ قَلْبُهُ مُعَلَّقٌ بِالْمَسْجِدِ، وَرَجُلَانِ تَحَابَا فِيْ اللهِ اجْتَمَعَا عَلَيْهِ، وَتَفَرَّقَا عَلَيْهِ، وَرَجُلٌ ذِكْرُ اللهِ خَالِيًا فَفَاضَتْ عَيْنَاهُ، وَرَجُلٌ دَعَتْهُ امْرَأَةٌ ذَاتَ حَسْبٍ وَّجَمَالٍ فَقَالَ إِنِّيْ أَخَافُ اللهُ، وَرَجُلٌ تَصَدَّقَ بِصَدَقَةٍ فَأَخْفَاهَا حَتَّى لَا تَعْلَم شِمَالُهُ مَا تُنْفِقُ يَمِيْنُهُ”.
701. (13) [1/220–ఏకీభవితం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”7 రకాల వ్యక్తులకు అల్లాహ్ తన కారుణ్యనీడలో చోటు కల్పిస్తాడు. ఆరోజు ఆయన నీడ తప్ప మరే నీడ ఉండదు. అంటే తీర్పుదినంనాడు వారికి తన నీడలో చోటు కల్పిస్తాడు. వారిలో ఒకరు: 1. న్యాయ పరిపాలకుడు, 2. తన యవ్వనాన్ని అల్లాహ్ ఆరాధనలో గడిపిన యువకుడు, 3. ఎల్లప్పుడూ మస్జిద్ గురించి ఆలోచన ఉండి, నమా’జు చదివి మస్జిద్ నుండి వచ్చినా, మళ్ళీ వెళ్ళే వరకు ఆందోళన కరంగా ఉండే వ్యక్తి, 4. అల్లాహ్ కోసమే కలిసే, విడిపోయే ఇద్దరు వ్యక్తులు, 5. ఏకాంతంలో అల్లాహ్‌ను స్మరించి ఏడ్చి, దైవభీతి వల్ల అశ్రువులు కార్చే వ్యక్తి, 6. యవ్వనం, అందం ఉన్న ఒక స్త్రీ వ్యభిచారానికి పిలిచినా నేను దైవానికి భయపడు తున్నాను అని చెప్పే వ్యక్తి, 7. ఎడమ చేతికి తెలియ కుండా కుడి చేతితో దానధర్మాలు చేసే వ్యక్తి. (బు’ఖారీ, ముస్లిమ్)
702 – [ 14 ] ( متفق عليه ) (1/221)
وَعَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “صَلَاةُ الرَّجُلِ فِيْ الْجَمَاعَةِ تُضَعَّفُ عَلَى صَلَاتِهِ فِيْ بَيْتِهِ. وَفِيْ سُوْقِهِ خَمْسًا وَّعِشْرِيْنَ ضِعْفًا وَذَلِكَ أَنَّهُ إِذَا تَوَضَّأَ فَأَحْسَنَ الْوُضُوْءَ ثُمَّ خَرَجَ إِلَى الْمَسْجِدِ لَا يَخْرُجُهُ إِلَّا الصَّلَاةُ لَمْ يَخْطُ خُطْوَةُ إِلَّا رُفِعَتْ لَهُ بِهَا دَرَجَةٌ. وَحطٌّ عَنْهُ بِهَا خَطِيْئَةٌ فَإِذَا صَلَى لَمْ تَزِلِ الْمَلَائِكَةُ تُصَلِّيْ عَلَيْهِ مَا دَامَ فِيْ مُصَلَّاهُ. اللَّهُمَّ صَلِّ عَلَيْهِ الله اَرْحَمُهُ. وَلَا يَزَالُ أَحَدُكُمْ فِيْ صَلَاةِ مَاانْتَظَرَ الصَّلَاةَ”.
وَفِيْ رِوَايَةِ: قَالَ: “إِذَا دَخَلَ الْمَسْجِدَ كَانَتِ الصَّلَاةُ تَحْبِسُهُ”.
وَزَادَ فِيْ دُعَاءِ الْمَلَائِكَةِ: “اللهم اغْفِرْ لَهُ اللَّهُمَّ تُبْ عَلَيْهِ. مَا لَمْ يُؤْذِ فِيْهِ مَا لَمْ يُحْدِثْ فِيْهِ.
702. (14) [1/221–ఏకీభవితం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మనిషి ఒంటరిగా ఇంట్లో లేదా బజారులో చదివే నమా’జు కంటే, సామూహికంగా చదివే నమా’జుకు 25 రెట్లు అధిక పుణ్యం లభిస్తుంది. ఎందుకంటే అతడు పరిపూర్ణంగా వు’దూ చేసి, మస్జిద్ వైపు బయలుదేరితే, నమా’జు కోసమే అతడు ఇంటినుండి బయలు దేరుతాడు. అంటే అతడు నమా’జు సంకల్పంతోనే ఇంటి నుండి బయలుదేరుతాడు. మస్జిద్ వైపు అతను వేసే ఒక్కొక్క అడుగుకు అతడి పాపాలు తొలగిపోతాయి, ఇంకా అతని ఉన్నత స్థానాలు పెరుగుతాయి. ఇంకా అతడు నమా’జులో ఉన్నంతసేపు దైవదూతలు అతని కోసం: ”అల్లాహుమ్మ ’సల్లి ’అలైహి, అల్లాహుమ్మ అర్’హమ్ హు” – ‘ఓ అల్లాహ్! ఈ నమా’జీని కనిక రించు, ఇంకా అతని పాపాలను క్షమించు,’ అని ప్రార్థిస్తూ ఉంటారు. మీలో నమా’జు కోసం వేచి ఉన్నవారు నమా’జులో ఉన్నట్టే.
మరో ఉల్లేఖనంలో ఇలా ఉంది, ”ఎవరైనా మస్జిద్లోకి వస్తే, నమా’జ్ అతన్ని ఆపి ఉంచితే, అంటే సామూహిక నమా’జ్ కోసం ఎదురుచూస్తూ ఉంటే, అతడు నమా’జులో ఉన్నట్టే. దైవదూతల ప్రార్థన యొక్క పదాలు ఇలా ఉన్నాయి: ”అల్లాహు మ్మ’గ్ఫిర్లహు, అల్లాహుమ్మతుబ్ ’అలైహి” — ‘ఓ అల్లాహ్! ఇతన్ని క్షమించు, ఇంకా ఇతని పశ్చాత్తాపాన్ని స్వీకరించు.’ అయితే అతడు మస్జిద్లో ఎవరినీ ఏవిధంగానూ హింసించి ఉండ రాదు. ఇంకా వు’దూ భంగం కాకుండా ఉండాలి. (బు’ఖారీ, ముస్లిమ్)
703 – [ 15 ] ( صحيح ) (1/221)
وَعَنْ أَبِيْ أُسَيْدٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِذَا دَخَلَ أَحْدُكُمْ الْمَسْجِدَ فَلْيَقُلْ: “اللَّهُمَّ افْتَحْ لِيْ أَبْوَابَ رَحْمَتِكَ”. وَإِذَا خَرَجَ فَلْيَقُلْ: “اللهمَّ إِنِّيْ أَسْأَلُكَ مِنْ فَضْلِكَ”. رَوَاهُ مُسْلِمٌ .
703. (15) [1/221–దృఢం]
అబూ ఉసైద్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం: మీలో ఎవరైనా మస్జిద్లో ప్రవేశిస్తే, ఈ దు’ఆ పఠించాలి, ”అల్లా హుమ్మఫ్త’హ్లీ అబ్వాబర ’హ్మతిక” – ‘ఓ అల్లాహ్! నా కోసం నీ కారుణ్య ద్వారాలు తెరువు.’ అదే విధంగా మస్జిద్ నుండి బయటకు వచ్చినపుడు ఈ దు’ఆ పఠించాలి. ”అల్లా హుమ్మ ఇన్నీ అస్అలుక మిన్ ఫ’ద్లిక‘‘ -‘ఓ అల్లాహ్! నేను నీనుండి నీ అను గ్రహాన్ని కోరుతున్నాను.’ (ముస్లిమ్)
704 – [ 16 ] ( متفق عليه ) (1/221)
وَعَنْ أَبِيْ قَتَادَةَ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم قَالَ: “إِذَا دَخَلَ أَحْدُكُمْ الْمَسْجِدَ فَلْيَرْكَعُ رَكْعَتَيْنِ قَبْلَ أَنْ يَّجْلِسَ”.
704. (16) [1/221–ఏకీభవితం]
అబూ ఖతాదహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మీలో ఎవరైనా మస్జిద్లో ప్రవేశిస్తే, కూర్చోవడానికి ముందు (త’హియ్యతుల్ మస్జిద్)గా రెండు రకాతులు చదువుకోవాలి.” (బు’ఖారీ, ముస్లిమ్)
705 – [ 17 ] ( متفق عليه ) (1/221)
وَعَنْ كَعْبِ بْنِ مَالِكٍ قَالَ: كَانَ النَّبِيُّ صلى الله عليه وسلم لَا يَقْدَمُ مِنْ سَفَرٍ إِلَّا نَهَارًا فِيْ الضُّحَى فَإِذَا قَدِمَ بَدَأَ بِالْمَسْجِدِ فَصَلَّى فَيْهِ رَكْعَتَيْنِ ثُمَّ جَلَسَ فِيْهِ”.
705. (17) [1/221–ఏకీభవితం]
క’అబ్ బిన్ మాలిక్ (ర) కథనం: ప్రవక్త (స) సాధారణంగా ప్రయాణం నుండి వస్తే, చాష్త్ సమయంలో వచ్చే వారు. అన్నిటి కంటే ముందు మస్జిద్లోకి వెళ్ళి రెండు రకా‘తులు నమా’జ్ చదివి, కొంత సేపు మస్జిద్లో ఉండేవారు. [62] (బు’ఖారీ, ముస్లిమ్)
706 – [ 18 ] ( صحيح ) (1/221)
وَعَنْ أَبِيْ هُرَيْرَةَ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَنْ سَمِعَ رَجُلًا يَنْشُدُ ضَالَّةً فِيْ الْمَسْجِدِ فَلْيَقُلْ: لَا رَدَّهَا اللهُ عَلَيْكَ فَإِنَّ الْمَسَاجِدَ لَمْ تُبْنَ لِهَذَا”. رَوَاهُ مُسْلِمٌ .
706. (18) [1/221–దృఢం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మస్జిద్లో ఎవరైనా పోయిన వస్తువును వెతుకు తున్నారని మీకు తెలిస్తే, ‘నీ వస్తువు దొరక్కూడదు గాక! మస్జిదులు ఇందుకోసం నిర్మించబడలేదు,’ ” అని అనాలి. [63](ముస్లిమ్)
707 – [ 19 ] ( متفق عليه ) (1/222)
وَعَنْ جَابِرٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَنْ أَكَلَ مِنْ هَذِهِ الشَّجَرَةِ الْمُنْتِنَةِ فَلَا يَقْرَبَنَّ مَسْجِدَنَا فَإِنَّ الْمَلَائِكَةَ تَتَأَذَّى مِمَّا يَتَأَذَّى مِنْهُ الْإِنْسُ”.
707. (19) [1/222–ఏకీభవితం]
జాబిర్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఎవరైనా దుర్వాసన గల వస్తువు తిని ఉంటే, మా మస్జిదు దరికి కూడా రాకూడదు. ఈ దుర్వాసన వల్ల మానవులకు కలిగే ఇబ్బంది వల్ల దైవదూతలకు ఇబ్బంది కలుగు తుంది.” [64] (బు’ఖారీ, ముస్లిమ్)
708 – [ 20 ] ( متفق عليه ) (1/222)
وَعَنْ أَنَسٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “الْبُزَّاقُ فِيْ الْمَسْجِدِ خَطِيْئَةٌ وَكَفَّارَتُهَا دَفَنَهَا”.
708. (20) [1/222–ఏకీభవితం]
అనస్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మస్జిద్లో ఉమ్మివేయడం పాపం, దీన్ని కప్పివేయడమే దాని పరి హారం.” [65] (బు’ఖారీ, ముస్లిమ్)
709 – [ 21 ] ( صحيح ) (1/222)
وَعَنْ أَبِيْ ذَرٍّ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “عُرِضَتْ عَلَيَّ أَعْمَالُ أُمَّتِيْ حَسَنُهَا وَسَيِّئُهَا فَوَجَدْتُّ فِيْ مَحَاسِنِ أَعْمَالِهَا الْأَذَى يُمَاطُ عَنِ الطَّرِيْقِ وَوَجَدْتُّ فِيْ مَسَاوِئْ أَعْمَالِهَا النُّخَاعَةَ تَكُوْن فِيْ الْمَسْجِدِ لَا تُدْفَنُ”. رَوَاهُ مُسْلِمٌ .
709. (21) [1/222–దృఢం]
అబూజ‘ర్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”నా అనుచర సమాజం యొక్క మంచి పనులు, చెడు పనులు నాముందు పెట్టబడ్డాయి. (రెంటినీ చూశాను) మంచి పనుల్లో దారిలో నుండి హానికరమైన వస్తువు లను తొలగించటం, చెడుపనుల్లో మస్జిద్లో ఉమ్మి వేసి, కప్పక పోవటం కూడా ఉన్నాయి.” (ముస్లిమ్)
710 – [ 22 ] ( متفق عليه ) (1/222)
وَعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِذَا قَامَ أَحْدُكُمْ إِلَى الصَّلَاةِ فَلَا يَبْصُقْ أَمَامَهُ فَإِنَّمَا يُنَاجِيْ اللهَ مَا دَامَ فِيْ مُصَلَّاهُ وَلَا عَنْ يَمِيْنِهِ فَإِنَّ عَنْ يَمِيْنِهِ مَلَكًا وَّلْيَبْصُقْ عَنْ يَسَارِهِ أَوْ تَحْتَ قَدَمِهِ فَيَدْفِنُهَا”.
710. (22) [1/222–ఏకీభవితం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త(స) ప్రవచనం, ”మీలో ఎవరైనా నమా’జు చదవడానికి నిలబడి, ఉమ్మివేసే అవసరం ఏర్పడితే, తన ముందు ఉమ్మి వేయరాదు, ఎందుకంటే, నమా’జులో ఉన్నంత వరకు అల్లాహ్‌తో సంభాషించినట్లవుతుంది. అదేవిధంగా కుడివైపు కూడా ఉమ్మివేయ రాదు. ఎందుకంటే కుడి వైపు దైవదూత ఉంటాడు. అందువల్ల ఎడమ వైపు లేదా ఎడమ పాదం క్రింద ఉమ్మి వేయాలి. నమాజు తర్వాత దాన్ని కప్పివేయాలి.” (బు’ఖారీ, ముస్లిమ్)
711 – [ 23 ] ( متفق عليه ) (1/222)
وَفِيْ رِوَايَةِ أَبِيْ سَعِيْدٍ: “تَحْتَ قَدَمِهِ الْيُسْرَى” .
711.(23) [1/222–ఏకీభవితం]
అబూస’యీద్ ఉల్లేఖనలో ఎడమ పాదం క్రింద అని ఉంది. (బు’ఖారీ, ముస్లిమ్)
712 – [ 24 ] ( متفق عليه ) (1/222)
وَعَنْ عَائِشَةَ رَضِيَ اللهُ عَنْهَا أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم قَالَ فِيْ مَرْضِهِ الَّذِيْ لمْ يَقُمْ مِّنْهُ: “لَعَنَ اللهُ الْيَهُوْدَ وَالنَّصَارَى اِتَّخَذُوْا قُبُوْرَ أَنْبِيَائِهِمْ مَسَاجِدَ”.
712. (24) [1/222–ఏకీభవితం]
’ఆయి‘షహ్ (ర) కథనం: ప్రవక్త (స) తన అంతిమ దశలో ”యూదులు మరియు క్రైస్తవులపై అల్లాహ్ శాపం అవతరించు గాక! ఎందుకంటే వారు తమ ప్రవక్తల సమాధులను ఆరాధనాలయాలుగా చేసుకున్నారు.” [66] (బు’ఖారీ, ముస్లిమ్)
713 – [ 25 ] ( صحيح ) (1/223)
وَعَنْ جُنْدُبٍ قَالَ: سَمِعْتُ النَّبِيَّ صلى الله عليه وسلم يَقُوْلُ: “أَلَا وَإِنَّ مَنْ كَانَ قَبْلَكُمْ كَانُوْا يَتَّخِذُوْنَ قُبُوْرَ أَنْبِيَائِهِمْ وَصَالِحِيْهِمْ مَسَاجِدَ أَلَا فَلَا تَتَّخِذُوْا الْقُبُوْرَ مَسَاجِدَ إِنِّيْ أَنْهَاكُمْ عَنْ ذَلِكَ”. رواه مسلم.
713. (25) [1/223–దృఢం]
జున్దుబ్ (ర) కథనం: ప్రవక్త (స) ఇలా ప్రవచిస్తూ ఉండగా నేను విన్నాను, ”మీకంటే ముందు తరాల వారు తమ ప్రవక్తల, మహాపరుషుల సమాధులను ఆరాధనాలయాలుగా చేసుకున్నారు. గుర్తుంచు కోండి! మీరు మాత్రం మీ ప్రవక్తల సమాధులను ఆరా ధనాలయాలుగా, సజ్దాచేసే స్థానాలుగా చేసుకోకండి. నేనుమిమ్మల్నిదీన్నుండివారిస్తున్నాను.” (ముస్లిమ్)
714 – [ 26 ] ( متفق عليه ) (1/223)
وَعَنِ ابْنِ عُمَرَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “اِجْعَلُوْا فِيْ بُيُوْتِكُمْ مِنْ صَلَاتِكُمْ وَلَا تَتَّخِذُوْهَا قُبُوْرًا”.
714. (26) [1/223–ఏకీభవితం]
’అబ్దుల్లాహ్ బిన్ ’ఉమర్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మీరు మీ ఇండ్లలో నమా’జులు చదువుతూ ఉండాలి. వాటిని సమాధులుగా చేసుకో కండి.” [67] (బు’ఖారీ, ముస్లిమ్)
—–
اَلْفَصْلُ الثَّانِيْ రెండవ విభాగం
715 – [ 27 ] ( صحيح ) (1/223)
عَنْ أَبِيْ هُرَيْرَةَ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَا بَيْنَ الْمَشْرِقِ وَالْمَغْرِبِ قِبْلَةٌ”. رَوَاهُ التِّرْمِذِيُّ.
715. (27) [1/223–దృఢం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”తూర్పూ, పడమరల మధ్య ఖిబ్లా ఉంది.” [68] (తిర్మిజి‘)
716 – [ 28 ] ( حسن ) (1/223)
وعَنْ طَلْقِ بْنِ عَلِيٍّ قَالَ: خَرَجْنَا وَفْدًا إِلَى رَسُوْلِ الله صلى الله عليه وسلم. فَبَايَعْنَاهُ وَصَلَّيْنَا مَعَهُ. وَأَخْبَرْنَاهُ أَنَّ بِأَرْضِنَا بَيْعَةً لَّنَا فَاسْتَوْهَبْنَاهُ مِنْ فَضْلِ طُهُوْرِهِ. فَدَعَا بِمَاءٍ فَتَوَضَّأَ وَتَمَضْمَضَ ثُمَّ صَبَّهُ فِيْ إِدَاوَةٍ وَأَمَرَنَا. فَقَالَ: “اُخْرُجُوْا فَإِذَا أَتَيْتُمْ أَرْضَكُمْ فَاكْسِرُوْا بَيْعَتَكُمْ وَانْضَحُوْا مَكَانَهَا بِهَذَا الْمَاءِ وَاتَّخَذُوْهَا مَسْجِدًا”. قُلْنَا: إِنَّ الْبَلَدَ بَعِيْدٌ وَّالْحَرُّ شَدِيْدٌ وَالْمَاءُ يُنْشَفُ. فَقَالَ: “مُدُّوْهُ مِنَ الْمَاءِ فَإِنَّهُ لَا يَزِيْدُهُ إِلَّا طَيِّبًا”. رَوَاهُ النَّسَائِيُّ.
716. [1/223–ప్రామాణికం]
’తల్ఖ్ బిన్’అలీ (ర) కథనం:“ప్రవక్త (స) వద్దకు మేము ఒక బృందం రూపంలో వెళ్ళాము. ప్రవక్త(స) చేతిపై బై’అత్ చేశాము. అనంతరం ప్రవక్త (స)తో కలసి నమా’జు చదివాము. ఇంకా, ‘మా ప్రాంతంలో చర్చ్ ఉంది, మేము క్రైస్తవులముగా ఉన్నప్పుడు మేము అక్కడే ఆరాధించే వారము’ అని తెలియ పరిచాము. ఇప్పుడు మేము ఇస్లామ్ స్వీక రించాం గనుక దాన్ని ఉంచాలా లేక కూల్చి మస్జిద్ నిర్మించు కోవాలా, నీళ్ళు చల్లి పరిశుభ్రంగా చేసుకోవాలా?’ అని అడిగాం. మేము తిరిగి బయలు దేరునపుడు ప్రవక్త (స)ను మిగిలిన వు’దూ నీళ్ళను అడిగాం. ప్రవక్త (స) నీళ్ళు తెప్పించి వు’దూచేసి, నీళ్ళు పుక్కిలించి ఆ నీటిని మా దగ్గరున్న చేదలోనే వేశారు. ‘ఈ నీటిని తీసుకువెళ్ళి, ఆ చర్చిని కూల్చి, అక్కడ ఈనీటిని చిలకరించండి. అక్కడ మస్జిద్ నిర్మించుకోండి,’ అని అన్నారు. అప్పుడు మేము, ‘మా ఊరు ఇక్కడికి చాలా దూరంగా ఉంది. మేము అక్కడికి వెళ్ళేసరికి ఈ నీళ్ళు ఎండిపోవచ్చు,’ అని విన్నవించుకున్నాం. అప్పుడు ప్రవక్త (స), ‘ఇందులో మరికొన్ని నీళ్ళు వేసుకోండి. ఎందుకంటే నీళ్ళు వేయటం వల్ల నీళ్ళు పెరుగుతాయి, శుభం కూడా కలుగుతుంది,’ అని అన్నారు.” [69](నసాయి‘)
717 – [ 29 ] ( صحيح ) (1/223)
وعَنْ عائِشَةَ قَالَتْ: أمَرَ رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ بِبِنَاء الْمَسْجِدِ فِي الدُّوْرِ وَأَنْ يُنَظَّفَ وَيُطَيَّبَ. رَوَاهُ أَبُوْ دَاؤدَ وَالتِّرْمِذِيُّ وَابْنُ مَاجَةَ .
717. (29) [1/223–దృఢం]
’ఆయి‘షహ్ (ర) కథనం: ప్రవక్త (స) మాకు వీధుల్లో మస్జిదులు నిర్మించాలని, వాటిని పరిశుభ్రంగా, సువాసనలతో ఉంచాలని ఆదేశించారు. (అబూ దావూ‘ద్, ఇబ్నె మాజహ్, తిర్మిజి‘)
718 – [ 30 ] ( صحيح ) (1/224)
وَعَنِ ابْنِ عَبَّاسٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَا أُمِرْتُ بِتَشْيِيْدِ الْمَسَاجِدِ”. قَالَ ابْنُ عَبَّاسٍ: لتزَخْرِفَنَهَا كَمَا زَخْرَفَتِ الْيَهُوْدُ وَالنَّصَارَى. رَوَاهُ أَبُوْ دَاوُدَ
718. (30) [1/224–దృఢం]
ఇబ్నె ’అబ్బాస్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”నన్ను మస్జిదులను ఎత్తుగా, అందంగా నిర్మించమని ఆదేశించలేదు. యూదులు, క్రైస్తవులు తమ చర్చీలను అందంగా అలంకరించినట్లు. భవిష్యత్తులో మీరు మస్జిదులను అందంగా అలంకరించడం చూస్తారు.” [70](అబూ దావూద్)
719 – [ 31 ] ( صحيح ) (1/224)
وَعَنْ أَنَسٍ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مِنْ أَشْرَاطِ السَّاعَةِ أَنْ يَّتَبَاهِىَ النَّاسُ فِيْ الْمَسَاجِدِ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ وَالنَّسَائِيُّ وَالدَّارَمِيُّ وَابْنُ مَاجَهُ .
719. (31) [1/224–దృఢం]
అనస్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”చివరి ఘడియ సూచనల్లో ఒక సూచన ఏమిటంటే, ప్రజలు మస్జిదుల విషయంలో గర్వాహంకారాలకు గురవుతారు.” [71] (అబూ దావూ‘ద్, నసాయి‘. దార్మీ, ఇబ్నె మాజహ్)
720 – [ 32 ] ( ضعيف ) (1/224)
وَعَنْ أَنَسٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “عُرِضَتْ عَلَيَّ أُجُوْرُ أُمَّتِيْ حَتَّى الْقَذَاةِ يَخْرُجُهَا الرَّجُلُ مِنَ الْمَسْجِدِ وَعُرِضَتْ عَلَيَّ ذُنُوْبُ أُمَّتِيْ فَلَمْ أَرَ ذَنْبًا أَعْظَمُ مِنْ سُوْرَةٍ مِّنَ الْقُرْآنِ أَوْ آيَةٍ أُوْتِيَهَا رَجُلٌ ثُمَّ نَسِيَهَا”. رَوَاهُ التِّرْمِذِيُّ وَأَبُوْ دَاوُدَ.
720. (32) [1/224–బలహీనం]
అనస్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”నా అనుచర సమాజం యొక్క సత్కార్యాల పుణ్యం నా ముందు ఉంచబడింది. మరియు మస్జిద్ను, ఊడ్చి, పరిశుభ్రంగా ఉంచటం వల్ల దొరికే పుణ్యం కూడా చూప బడింది. మరియు నా అనుచర సమాజం యొక్క చెడుకార్యాల పాపం కూడా నా ముందు ఉంచబడింది. వాటిలో అన్నిటి కంటే పెద్ద పాపం ఖుర్ఆన్ చదివి కంఠస్తం చేసి, నిర్లక్ష్యం, కృతఘ్నత వల్ల దాన్ని మరచిపోవటమని కూడా తెలుపడం జరిగింది. (తిర్మిజి‘, అబూ దావూ‘ద్)
721 – [ 33 ] ( صحيح ) (1/224)
وَعَنْ بُرِيْدَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “بَشِّرِ الْمَشَائِيْنَ فِيْ الظُّلْمِ إِلَى الْمَسَاجِدِ بِالنُّوْرِالتَّامِ يَوْمَ الْقِيَامَةِ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَأَبُوْدَاوُدَ.
721. (33) [1/224–దృఢం]
బురైదహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”చీకటిలో మస్జిదులకు వెళ్ళే వారికి శుభవార్త తెలియ జేయండి. దీనివల్ల తీర్పుదినం నాడు వారికి పరిపూర్ణ వెలుగు లభిస్తుంది.” (తిర్మిజి‘, అబూ దావూ‘ద్)
722 – [ 34 ] ( صحيح ) (1/224)
وَرَوَاهُ ابْنُ مَاجَهَ عَنْ سَهْلِ بْنِ سَعْدٍ وَأَنَسٍ .
722. [1/224–దృఢం]
దీన్నే ఇబ్నె మాజహ్, సహల్ బిన్ స’అద్ మరియు అనస్ ద్వారా ఉల్లేఖించారు. [72]
723 – [ 35 ] ( ضعيف ) (1/225)
عَنْ أَبِيْ سَعِيْدِ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِذَا رَأَيْتُمْ الرَّجُلَ يَتَعَاهَدُ الْمَسْجِدَ فَاشْهَدُوْا لَهُ بِالْإِيْمَانِ. فَإِنَّ اللهَ تعالى يَقُوْلُ: (إِنَّمَا يَعْمُرُمَسَاجِدَ اللهِ من آَمَنَ بِاللهِ وَالْيَوْمِ الْآخِرِ؛9: 18) رَوَاهُ التِّرْمِذِيُّ وَابْنُ مَاجَهُ وَالدّارمي .
723. (35) [1/225–బలహీనం]
అబూ స’యీద్ ’ఖుద్రీ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మీరు ఎవరికైనా మస్జిద్ నిర్వాహకులుగా ఉండటం చూస్తే, అతని విశ్వాసాన్ని గురించి సాక్ష్యం ఇవ్వండి. ఎందుకంటే అల్లాహ్: ”మస్జిదులను — అల్లాహ్‌ను, తీర్పు దినాన్ని విశ్వసించిన వారే — నిర్వ హిస్తారు” (సూ. అత్-తౌబహ్, 9:18) అని పేర్కొన్నాడు. [73] (తిర్మిజి‘, ఇబ్ను మాజహ్, దార్మీ)
724 – [ 36 ] ( ضعيف ) (1/225)
وَعَنْ عُثْمَانَ بْنِ مَظْعُوْنٍ قَالَ: يَا رَسُوْلَ اللهِ ائْذَنْ لَّنَا فِيْ الْاِخْتِصَاءِ. فَقَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَيْسَ مِنَّا مَنْ خَصَى وَلَا اخْتَصَى. إِنَّ خَصَاءُ أُمَّتِي الصِّيَامِ”. فَقَالَ ائْذَنْ لَنَا فِيْ السَّيَاحَةِ. فَقَالَ: “إِنَّ سَيَاحَةَ أُمَّتِيْ الْجِهَادُ فِيْ سَبِيْلِ اللهِ”. فَقَالَ: ائْذَنْ لَنَا فِيْ التَّرَهُّبِ. فَقَالَ: “إِنَّ تَرَهُّبَ أُمَّتِيْ الْجُلُوْسُ فِيْ الْمَسَاجِدِ انْتِظَارُ الصَّلَاةِ”. رَوَاهُ فِيْ شَرْحِ السُّنَّةِ.
724. (36) [1/225–బలహీనం]
’ఉస్మా‘న్ బిన్ మ”జ్’ఊన్ (ర) ప్రవక్త (స)ను, ‘ఓ ప్రవక్తా! మమ్మల్ని మగతనం తొలగించుకునే అనుమతి ఇవ్వండి,’ అని విన్నవించుకోవటం జరిగింది. ప్రవక్త (స) సమాధానం ఇస్తూ, ‘వాడు మా వాడు కాడు అంటే తన్ను తాను మగతనానికి దూరం చేసుకున్నవాడు ముస్లిమ్ కాడు. నా అనుచర సమాజం కోసం ఉపవాసం పాటించ టమే పరిష్కారం.’ ఆ తరువాత ’ఉస్మా‘న్ (ర) పర్యటించే అనుమతి ఇవ్వమని కోరారు. దానికి ప్రవక్త (స) నా అనుచర సమాజానికి పర్యటించటం అంటే దైవమార్గంలో జిహాద్ చేయటం,’ అని అన్నారు. ఆ తరువాత ’ఉస్మా‘న్ (ర) సన్యాసత్వానికి అనుమతి ఇవ్వమని విన్నవించుకున్నారు.’ దానికి ప్రవక్త (స) మస్జిదుల్లో కూర్చొని నమా’జు కొరకు వేచి ఉండటం నా అనుచర సమాజ సన్యాసత్వం,’ అని అన్నారు. [74] (షర్’హ్ అస్సున్నహ్)
725 – [ 37 ] ( صحيح ) (1/225)
وَعَنْ عَبْدِ الرَّحْمَنِ بْنِ عَائِشٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “رَأَيْتُ رَبِّيْ عَزَّ وَجَلَّ فِيْ أَحْسَنِ صُوْرَةٍ قَالَ: فَبِمَ يَخْتَصِمُ الْمَلَأُ الْأَعْلَى؟ قُلْتُ: أَنْتَ أَعْلَمُ قَالَ: فَوَضْعَ كَفَّهُ بَيْنَ كَتَفِيَّ فَوَجَدْتُ بَرْدَهَا بَيْنَ ثَدْيَيَّ. فَعَلِمْتُ مَا فِيْ السَّمَاوَاتِ وَالْأَرْضِ وَتَلَا: (وَكَذَلِكَ نُرِيْ إِبْرَاهِيْمَ مَلَكُوْتَ السَّمَاوَاتِ وَالْأَرْضِ وَلِيَكُوْنَ مِنَ الْمُوْقِنِيْنَ؛ 6: 75) رَوَاهُ الدَّارَمِيُّ مُرْسَلًا وَلِلتِّرْمِذِيِّ نَحْوَهُ عَنْهُ.
725. (37) [1/225–దృఢం]
’అబ్దుర్రహ్మాన్ బిన్ ’ఆయి‘ష్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”కలలో నేను అల్లాహ్ (త)ను మంచి రూపంలో చూశాను. అల్లాహ్, ‘నా సన్నిహిత దైవదూతలు దేన్ని గురించి చర్చించు కుంటున్నారు,’ అని అడిగాడు. దానికి నేను, ‘ఓ అల్లాహ్! అది నీకే బాగా తెలుసు,’ అని అన్నాను. అల్లాహ్ (త) తన చేతిని నా భుజంపై పెట్టాడు. దాని వల్ల గుండెలో చల్లదనం కలిగింది. ఇంకా భూమ్యా కాశాల వస్తువులను నేను గ్రహించాను. ఆ తరువాత ప్రవక్త (స) ఈ ఆయతును పఠించారు: ” మరియు ఈ విధంగా దృఢనమ్మకం ఉన్నవారిలో చేరాలని, మేము ఇబ్రాహీమ్ కు భూమ్యాకాశాలపై ఉన్న మా సామ్రాజ్య వ్యవస్థను చూపించాము.” (సూ. అల్ అన్’ఆమ్, 6:75). (దార్మీ – తాబయీ ప్రోక్తం, తిర్మిజి‘)
726- (38) ? (1/226)
وعن ابن عَبَّاس, ومعاذ بن جبل رضي الله عنهم, وزاد فيه: “قال يا محمد! هل تدري فيم يختصم الملأ الأعلي؟ قلت: “نعم, في الكفارات”. والكفارات: المكث في المساجد بعد الصَّلواتِ, والمشْيُ علي الأقدامِ الي الجماعات, وابلاغُ الوُضوءِ في المَسكاره, فَمن فَعلَ ذلكَ عاشَ بخيرٍ, وماتَ بخيرٍ, وكانَ منْ خطيئتِه كيَومَ ولَدتْه اُمُّه, وقال: “يا محمَّدُ! اِذا صلَّيت فَقُلْ: (اللَّهُمَّ اِنِّي أسْاَلُكَ فِعْلَ الخَيرَاتِ, و ترْكَ المُنْكَرَاتِ, وحُبِّ المَسَاكِينِ, وإذا اردتَّ بِعِبَادِكَ فِتنةً فَاقْبِضني إليكَ غيرَ مَفتونٍ)”. قال: والَدَّرجَاتُ: إفشاءُ السَّلامِ, وإطْعَامُ الطَّعامِ, والصَّلاةُ بالليلِ والنَّاسُ نِيَامُ, ولفظُ هذا الحديثِ كما في “المصابيح” لم اَجدْه عن عبد الرَّحمنِ اِلَّا في “شرح السنَّة”.
726. (38) [1/226-?]
ఇబ్నె ’అబ్బాస్ మరియు ము’ఆజ్‘ బిన్ జబల్ల ద్వారా ఈ ’హదీసు‘ ఉల్లేఖించబడింది. అందులో ఈ పదాలు అధికంగా ఉన్నాయి, అల్లాహ్(త) : ”ఓ ముహమ్మద్! సన్నిహిత దైవదూతలు దేన్ని గురించి చర్చించుకుంటారో నీకు తెలుసా?” అని ప్రశ్నించాడు. దానికి నేను, ‘అవును, వాళ్ళు పాపాల పరిహారం గురించి చర్చించుకుంటారు, వాటివల్ల వారికి క్షమాపణ లభిస్తుంది. అవి నమాజుల తర్వాత మస్జిదుల్లో కూర్చొని, మరో నమాజు కోసం వేచి ఉండటం, సామూహిక నమాజుకోసం నడచి, బాధలను, ఆటంకాలను భరిస్తూ వెళ్ళడం, పరిపూర్ణ వు’దూ చేయటం. ఇలా చేసేవారు మేలులోనే జీవిస్తారు. మేలులోనే మరణిస్తారు. పాపాల నుండి పరిశుద్ధు లౌతారు. అంటే అతని తల్లి అతన్ని జన్మ మెచ్చి నట్లు.” ఆ తరువాత అల్లాహ్ ఇలా ఆదేశించాడు: ”ఓ ము’హమ్మద్! నమా’జు ముగించిన తర్వాత ఈ దు’ఆ పఠించు, ”అల్లాహుమ్మ ఇన్నీ అస్అలుక ఫి’అలల్ ’ఖైరాతి, వతరకల్ మున్కరాతి వ ’హుబ్బల్ మసాకీని, ఫఇజా‘ అరద్ త బి’ఇబాదిక ఫిత్నతన్ ఫఖ్బి’ద్నీ ఇలైక ’గైరమఫ్తూన్” – ‘ఓ అల్లాహ్! నేను నిన్ను సత్కార్యాలు చేసే భాగ్యం, చెడు పనులకు దూరంగా ఉండే, పేదలను ప్రేమించే భాగ్యం ప్రసాదించమని కోరుతున్నాను. ఒకవేళ నీవు నీ దాసులను కల్లోలాలకు గురిచేయాలని నిశ్చయించు కున్నప్పుడు, అంతకు ముందే నన్ను లేపుకో.’ ఆ తరువాత ఈ విషయాలు ఉన్నత స్థానాలు ప్రసాదిస్తాయని అన్నారు: ఇస్లామీయ సంస్కృతులను వ్యాపింపజేయటం, అన్నం తినిపించటం, అందరూ పడుకొని ఉండగా రాత్రిపూట నమా’జు చేయటం. ఈ ‘హదీసు’లో ఉన్న పదాలు మసాబిహ్లో ఉన్నట్లు ’అబ్దుర్ర’హ్మాన్ ద్వారా నాకు లభించలేదు, ఇవి షర్హ్ సున్నహ్లో ఉన్నాయి. [75]
727 – [ 39 ] ( صحيح ) (1/226)
وَعَنْ أَبِيْ أُمَامَةَ رضى الله عنه عَنْ رَسُوْلِ الله صلى الله عليه وسلم قَالَ: “ثَلَاثَةٌ كُلُّهُمْ ضَامِنٌ عَلَى اللهِ عز وجل رَجُلٌ خَرَجَ غَازِيًا فِيْ سَبِيْلِ اللهِ فَهُوَ ضَامِنٌ عَلَى اللهِ حَتَّى يَتَوَفَّاهُ فَيُدْخِلُهُ الْجَنَّةَ أَوْ يَرُدَّهُ بِمَا نَالَ مِنْ أَجْرٍأَوْغَنِيْمَةٍ وَرَجُلٌ رَاحَ إِلَى الْمَسْجِدِ فَهُوَ ضَامِنٌ عَلَى اللهِ حَتَّى يَتَوَفَّاهُ فَيَدْخِلُهُ الْجَنَّةَ. أَوْ يَرُدَّهُ بِمَا نَالَ مِنْ أَجْرٍ وَغَنِيْمَةٍ. وَرَجُلٌ دَخَلَ بَيْتَهُ بِسَلَامٍ فَهُوَ ضَامِنٌ عَلَى اللهِ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ.
727. (39) [1/226-దృఢం]
అబూ ఉమామ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ముగ్గురు వ్యక్తుల బాధ్యత అల్లాహ్(త) తనపై వేసుకున్నాడు. 1. అల్లాహ్ మార్గంలో పోరాటం చేసేందుకు తన ఇంటి నుండి బయలు దేరిన వ్యక్తి, ఒకవేళ అతడు వీరమరణం పొందితే స్వర్గంలో ప్రవేశిస్తాడు. ఒకవేళ సజీవంగా ఉంటే ప్రతిఫలం మరియు యుద్ధధనంతో తిరిగివస్తాడు, 2. నమా’జు కోసం మస్జిద్కు వెళ్ళే వ్యక్తి, 3. తనఇంటి లోకి సలామ్ చేసి ప్రవేశించే వాడు. (అబూ దావూ‘ద్)
728 – [ 40 ] ( حسن ) (1/227)
وَعَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَنْ خَرَجَ مِنْ بَيْتِهِ متَطَهِّرًا إِلَى صَلَاةٍ مَكْتُوْبَةٍ فَأَجْرُهُ كَأَجْرِ الْحَاجِّ الْمُحْرِمِ وَمَنْ خَرَجَ إِلَى تَسْبِيْحِ الضُّحَى لَا يُنْصِبُهُ إِلَّا إِيَّاهُ فَأَجْرُهُ كَأَجْرِ الْمُعْتَمَرِ وَصَلَاة عَلَى أَثْرِ صَلَاةٍ لَا لَغْوَ بَيْنَهُمَا كِتَابٌ فِيْ عِلِّيِّيْنَ”. رَوَاهُ أَحْمَدُ وَأَبُوْ دَاوُدَ.
728. (39) [1/227–ప్రామాణికం]
అబూ ఉమామహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”తన ఇంటి నుండి వు’దూ చేసి బయలుదేరి విధి నమా’జు కొరకు మస్జిద్లోకి వచ్చిన వ్యక్తికి ఇ’హ్రామ్ ధరించిన ’హాజీకి లభించినంత పుణ్యం లభిస్తుంది. అదేవిధంగా చాష్త్ నమా’జు కోసం ఇంటి నుండి బయలుదేరిన వ్యక్తికి ’ఉమ్రహ్ చేసినంత పుణ్యం లభిస్తుంది. అదేవిధంగా ఒక నమా’జు తర్వాత మరో నమా’జు కోసం వేచి ఉండటం, రెండు నమా’జుల మధ్య అశ్లీల విషయాలు మాట్లాడకుండా ఉండటం అనే సత్కార్యం ఇల్లియ్యీన్‌లో వ్రాయబడుతుంది. [76](’అ ‘హ్మద్, అబూ దావూద్)
729 – [ 41 ] ( ضعيف ) (1/227)
وَعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِذَا مَرَرْتُمْ بِرِيَاضِ الْجَنَّةِ فَارْتَعُوْا”. قِيْلَ: يَا رَسُوْلَ اللهِ وَمَا رِيَاضُ الْجَنَّةِ؟ قَالَ: “اَلْمَسَاجِدُ”. قُلْتُ: وَمَا الرَّتْعُ يَا رَسُوْلَ اللهِ؟ قَالَ: “سُبْحَانَ اللهِ وَالْحَمْدُ للهِ ولَا إِلَهَ إِلَّا اللهُ وَاللهُ أَكْبَرُ”. رَوَاهُ التِّرْمِذِيُّ.
729. (41) [1/227–బలహీనం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స), ”మీరు స్వర్గవనాల్లో ప్రవేశిస్తే, అక్కడి ఫలాలను తినండి,’ అని ప్రవచించారు. ‘ఓ ప్రవక్తా! స్వర్గవనాలు అంటే ఏమిటి?’ అని విన్నవించుకోవటం జరిగింది. దానికి ప్రవక్త (స) మస్జిదులు,’ అని అన్నారు. ‘అక్కడి ఫలాలు అంటే ఏమిటి?’ అని ప్రశ్నించటం జరిగింది. దానికి ప్రవక్త (స), “సుబ్’హానల్లాహి, వల్’హమ్దు లిల్లాహి, వలా ఇలాహ ఇల్లల్లాహు వల్లాహు అక్బర్,’ అని పలకటం అని అన్నారు.” [77](తిర్మిజి‘)
730 – [ 42 ] ( حسن ) (1/227)
وَعَنْ أَبِيْ هُرَيْرَةَ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَنْ أَتَى الْمَسْجِدَ لِشَيْءٍ فَهُوَ حَظُّهُ”.رَوَاهُ أَبُوْ دَاوُدَ.
730. (42) [1/227–ప్రామాణికం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మనిషి ఏ ఉద్దేశ్యంతో మస్జిద్కు వస్తే, అదే అతనికి లభిస్తుంది.” [78](అబూ దావూ‘ద్)
731 – [ 43 ] ( ضعيف ) (1/228)
وَعَنْ فَاطِمَةَ بِنْتِ الْحُسَيْنِ عَنْ جَدَّتِهَا فَاطِمَةُ الْكُبْرَى رَضِيَ اللهُ عَنْهُمْ قَالَتْ: كَانَ النَّبِيُّ صَلَى الله عليه وسلم إِذَا دَخَلَ الْمَسْجِدَ صلى على محمد وسلم وَقَالَ: “رَبِّ اغْفِرْ لِيْ ذُنُوْبِيْ وَافْتَحْ لِيْ أَبْوَابَ رَحْمَتِكَ” .وَإِذَا خَرَجَ صلى على محمد وسلم وَقَالَ: رَبِّ اغْفِرْ لِيْ ذُنُوْبِيْ وَافْتَحْ لِيْ أَبْوَابَ فَضْلِكَ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَأَحْمَدُ وَابْنُ مَاجَهُ. وَفِيْ رَوَايَتِهِمَا قَالَتْ: إِذَا دَخَلَ الْمَسْجِدَ وَكَذَا إِذَا خَرَجَ قَالَ: “بِسْمِ اللهِ وَالسَّلَامُ عَلَى رَسُوْلِ اللهِ” .بَدَلَ: صَلَّى عَلَى مُحَمَّدٍ وَسَلَّمَ. وَقَالَ التِّرْمِذِيُّ لَيْسَ إِسْنَادُهُ بِمُتَّصِلٍ وَفَاطِمَةُ بِنْتُ الْحُسَيْنِ لَمْ تَدْرُكْ فَاطِمَةَ الْكُبْرَى.
731. (43) [1/228–బలహీనం]
ఫా’తిమహ్ బిన్తె ’హుసైన్ (ర) తన నాన్నమ్మ ఫా’తిమహ్ (ర) ద్వారా కథనం: ప్రవక్త(స) మస్జిద్లోకి ప్రవేశించినపుడు ము’హమ్మద్‌పై దరూద్, సలామ్ పంపుతారు. అంటే ఇలా అంటారు, ”అల్లా హుమ్మ ’సల్లి అలా ము’హమ్మదిన్ వ సల్లిమ్” ఆ తరువాత ఈ దు’ఆ చదువుతారు. ”రబ్బి’గ్ఫిర్లీ జు‘నూబీ వఫ్త’హ్లీ అబ్వాబ రహ్మతిక” – ‘ఓ నా ప్రభూ! నా పాపాలను క్షమించు, ఇంకా నీ కారుణ్య ద్వారాలను నా కొరకు తెరువు.’ (తిర్మిజి‘, అ’హ్మద్, ఇబ్నె మాజహ్)
ఇంకా అ’హ్మద్, ఇబ్నె మాజహ్ లో ఈ పదాలు ఉన్నాయి, ”ప్రవక్త (స) మస్జిద్లోకి వెళ్ళినా, బయటకు వచ్చినా, ”బిస్మి ల్లాహి వస్సలాము అలా రసూలిల్లాహి,” అని పలుకుతారు. అంటే, ”సల్లి అలా ము’హమ్మదిన్”కి బదులు ”బిస్మిల్లాహి వస్సలాము అలా రసూలుల్లాహ్,” అని పలుకుతారు.
తిర్మిజీ‘ దీని పరంపర సరిగా లేదని ఫా’తిమ నాన్నమ్మ ఫా’తిమతో కలవలేదని, వీరిద్దరి మధ్య పరంపరలో ఒక ఉల్లేఖన కర్త తప్పిపోయాడని పేర్కొన్నారు.
732 – [ 44 ] ( حسن ) (1/228)
وَعَنْ عَمْرِو بْنِ شُعَيْبٍ عَنْ أَبِيْهِ عَنْ جَدِّهِ قَالَ:نَهَى رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم عَنْ تَنَاشُدِ الْأَشْعَارِ فِيْ الْمَسْجِدِ وعَنِ الْبَيْعِ وَالْاِشْتِرَاءِ فِيْهِ وَأَنْ يَّتَحَلَّقَ النَّاسُ يَوْمَ الْجُمْعَةِ قَبْلَ الصَّلَاةِ فِيْ الْمَسْجِدِ.رَوَاهُ أَبُوْ دَاوُدَ وَالتِّرْمِذِيُّ
732. (44) [1/228–ప్రామాణికం]
అమ్ర్ బిన్ షు’ఐబ్ తన తండ్రి, తాతల ద్వారా కథనం: ప్రవక్త (స) మస్జిదులో అసత్యపు కవిత్వం పలకటాన్ని, అమ్మటాన్ని, కొనటాన్ని, శుక్రవారం నాడు నమా’జుకు ముందు వృత్తాకారంగా కూర్చోవ టాన్ని నిషేధించారు. (అబూ దావూ‘ద్, తిర్మిజి‘)
733 – [ 45 ] ( صحيح ) (1/228)
وَعَنْ أَبِيْ هُرَيْرَةَ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِذَا رَأَيْتُمْ مَنْ يَّبِيْعُ أَوْ يَبْتَاعُ فِيْ الْمَسْجِدِ فَقُوْلُوْا: لَا أَرْبَحَ اللهُ تِجَارَتَكَ. وَإِذَا رَأَيْتُمْ مَنْ يَنْشُدُ فِيْهِ ضَالَّةً فَقُوْلُوْا: لَارَدَّ اللهُ عَلَيْكَ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَالدَّارَمِيُّ.
733. (45) [1/228–దృఢం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మస్జిద్లో ఎవరైనా వ్యాపారం చేస్తూ ఉండగా మీరు చూస్తే, ‘నీ వ్యాపారంలో అల్లాహ్ లాభం ప్రసాదించ కూడదు గాక!’ అని చెప్పండి. అదేవిధంగా ఎవరైనా మస్జిద్లో పోయిన వస్తువును వెతుకుతుంటే, ‘అల్లాహ్ నీ వస్తువును నీకు తిరిగి అప్పగించకూడదు గాక!’ అని చెప్పండి.” [79] (తిర్మిజి‘, దార్మీ)
734 – [ 46 ] ( حسن ) (1/228)
وَعَنْ حَكِيْمِ بْنِ حِزَامٍ قَالَ: نَهَى رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم أَنْ يُّسْتَقَادَ فِيْ الْمَسْجِدِ وَأنْ يُّنْشَدَ فِيْهِ الْأَشْعَارُ وَأَنْ تُقَامَ فِيْهِ الْحُدُوْدُ. رَوَاهُ أَبُوْ دَاوُدَ فِيْ سُنَنِهِ.
وَصَاحِبُ جَامِعِ الْأُصُوْلِ فِيْهِ عَنْ حَكِيْمٍ .
734. (46) [1/228–ప్రామాణికం]
’హకీమ్ బిన్ ’హి’జామ్ (ర) కథనం: ప్రవక్త (స) మస్జిద్లో ప్రతీకారం తీర్చుకోవటం, అధర్మ కవిత్వాన్ని చదవటం, శిక్షలు జారీ చేయటం మొదలైన వాటిని నిషేధించారు. (అబూ దావూ‘ద్)
మరియు జామి’ఉల్ ఉ’సూల్లో ’హకీమ్ బిన్ ’హి’జామ్ ద్వారాకూడా ఈ’హదీసు’ పేర్కొన బడింది.
735 – [ 47 ] ( لم تتم دراسته ) (1/229)
وَفِيْ الْمَصَابِيْحِ عَنْ جَابِر.
735. (47) [1/229–అపరిశోధితం]
మరియు మ’సాబీ’హ్లో జాబిర్ (ర) ద్వారా కూడా ఈ ‘హదీసు’ పేర్కొనబడినది.
736 – [ 48 ] ( صحيح ) (1/229)
وَعَنْ مُعَاوِيَةَ بْنِ قَرَّةٍ عَنْ أَبِيْهِ: أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم نَهَى عَنْ هَاتَيْنِ الشَّجَرَتَيْنِ يَعْنِيْ الْبَصَلَ وَالثُّوْمَ وَقَالَ: “مَنْ أَكَلَهُمَا فَلَا يَقْرَبَنَّ مَسْجِدَنَا”. وَقَالَ:” إِنْ كُنْتُمْ لَابُدَّ آكِلِيْهِمَا فَأَمِيْتُوْهُمَا طَبْخًا”. رَوَاهُ أَبُوْ دَاوُدَ.
736. (48) [1/229–దృఢం]
ము’ఆవియహ్ బిన్ ఖుర్రహ్ తన తండ్రి ద్వారా కథనం: ప్రవక్త (స) పచ్చి వెల్లుల్లి, ఉల్లి తినటాన్ని నిషేధించారు. ఇంకా పచ్చి ఉల్లి, వెల్లుల్లి తిన్నవారు మా మస్జిద్ దరికి రాకూడదు, ఒకవేళ తినాలను కుంటే వండి తినవచ్చు,’ అని అన్నారు. (అబూ దావూ‘ద్)
737 – [ 49 ] ( صحيح ) (1/229)
وَعَنْ أَبِيْ سَعِيْدٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “اَلْأَرْضُ كُلُّهَا مَسْجِدٌ إِلَّا الْمَقْبَرَةَ وَالْحَمَّامَ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ وَالتِّرْمِذِيُّ وَالدَّارَمِيُّ.
737. (49) [1/229–దృఢం]
అబూ స’యీద్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”భూమంతా మస్జిద్ వంటిదే. అంటే భూమంతా నమా’జుకు యోగ్యమైనదే. స్మశానం, స్నానాల గది (బాత్రూమ్) తప్ప.” (అబూ దావూ‘ద్, తిర్మిజి‘)
738 – [ 50 ] ( ضعيف ) (1/229)
وَعَنْ ابْنِ عمَرَ قَالَ: نَهَى رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم أَنْ يُّصَلَى فِيْ سَبْعَةِ مَوَاطِنَ: فِيْ الْمَزْبَلَةِ وَالْمَجْزَرَةِ وَالْمَقْبَرَةِ وَقَارِعَةِ الطَّرِيْقِ وَفِيْ الْحَمَامِ وَفِيْ مَعَاطِنِ الْإِبْلِ وَفَوْقَ ظَهْرِ بَيْتِ اللهِ”. رواه الترمذي وابن ماجه.
738. (50) [1/229–బలహీనం]
’అబ్దుల్లాహ్ బిన్ ’ఉమర్ (ర) కథనం: ప్రవక్త (స) 7 ప్రదేశాల్లో నమా’జు చదవటాన్ని నిషేధించారు: 1. చెత్త, మలమూత్రాలు వేసే చోట, 2. జంతువులను జిబహ్ చేసే స్థలం, 3. సమాధులు ఉన్న ప్రదేశం అంటే స్మశానం, 4. మార్గం మధ్య, 5. మరుగు దొడ్డి మరియు స్నానాల గది, 6. ఒంటెలను కట్టి ఉంచే ప్రదేశం, 7. కాబా గృహం కప్పుపైన. [80] (తిర్మిజి‘, ఇబ్నె మాజహ్)
739 – [ 51 ] ? (1/229)
وعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “صَلُّوْا فِيْ مَرَابِضِ الْغَنَمِ وَلَا تُصَلُّوْا فِيْ أَعْطَانِ الْإِبْلِ”. رواه الترمذي.
739. (51) [1/229–?]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మేకలను కట్టే ప్రదేశంలో నమా’జు చదవవచ్చు. ఒంటెలను కట్టే ప్రదేశంలో నమా’జు చదవకండి.” [81](తిర్మిజి‘)
740 – [ 52 ] ( حسن ) (1/230)
وَعَنِ ابْنِ عَبَّاسٍ رَضِيَ اللهُ عَنْهُمَا قَالَ: لَعَنَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم زَائِرَاتِ الْقُبُوْرِ وَالْمُتَّخِذِيْنَ عَلَيْهَا الْمَسَاجِدَ وَالسُّرُجَ. رَوَاهُ أَبُوْ دَاوُدَ وَالتِّرْمِذِيُّ وَالنَّسَائِيُّ .
740. (52) [1/230–ప్రామాణికం]
ఇబ్నె ’అబ్బాస్ (ర) కథనం: ప్రవక్త (స) సమాధులను దర్శించే స్త్రీలను, సమాధులపై మస్జిదులు నిర్మించే వారిని, సమాధులపై దీపాలు వెలిగించే వారిని శపించారు. (అబూ దావూ‘ద్, తిర్మిజి‘, నసాయి‘)
741 – [ 53 ] ( حسن ) (1/230)
وَعَنْ أَبِيْ أَمَامَةَ قَالَ: إِنَّ حِبْرًا مِّنَ الْيَهُوْدِ سَأَلَ النَّبِيَّ صلى الله عليه وسلم: أَيُّ الْبِقَاعِ خَيْرٌ؟ فَسَكَتَ عَنْهُ وَقَالَ: “أَسْكُتُ حَتَّى يَجِيْءَ جِبْرِيْلُ”. فَسَكَتَ وَجَاءَ جِبْرِيْلُ عَلَيْهِ السَّلَامُ. فَسَأَلَ. فَقَالَ: مَا الْمَسْؤُوْلُ عَنْهَا بأَعْلَمَ مِنْ السَّائِلِ وَلَكِنَّ أَسْأَلَ رَبِّيْ تَبَارَكَ وَتَعَالى. ثُمَّ قَالَ جِبْرِيْلُ: يَا مُحَمَّدٌ إِنّيْ دَنَوْتُ مِنَ اللهِ دُنْوا مَا دَنَوْتُ مِنْهُ قَطُّ. قَالَ: وَكَيْفَ كَانَ يَاجِبْرِيْلُ؟ قَالَ: كَانَ بَيْنِيْ وَبَيْنَهُ سَبْعُوْنَ أَلْفَ حِجَابٍ مِّنْ نُّوْرٍ. فَقَالَ: شَرُّ الْبِقَاعِ أَسْوَاقُهَا وَخَيْرُ الْبِقَاعِ مَسَاجِدُهَا، و رَوَاهُ ايْنُ حَبَّانَ فِي صَحِيْحِ عَنْ ابْنِ عُمَر.
741. (53) [1/230–ప్రామాణికం]
అబూ ఉమామహ్ (ర) కథనం: ప్రవక్త (స) వద్దకు యూదుల బృందం ఒకటి వచ్చి, అన్ని ప్రదేశాల కంటే మంచిది, ఉన్నతమైన ప్రదేశం ఏది,’ అని విన్నవించు కున్నారు. అప్పుడు ప్రవక్త (స) మౌనంగా ఉన్నారు. జిబ్రీల్ (అ) వచ్చే వరకు మౌనంగా ఉందామని సంకల్పించుకున్నారు. జిబ్రీల్ (అ) రానే వచ్చారు. ప్రవక్త (స) అతన్ని అడిగారు. దానికి జిబ్రీల్ (అ), ‘నాకూ తెలియదు, అయితే నేను అల్లాహ్(త) తో కనుక్కొని చెప్పగలను,’ అని అన్నారు. జిబ్రీల్ (అ) అల్లాహ్ (త) వద్దకు వెళ్ళి కనుక్కొని తిరిగి వచ్చి, ప్రవక్త (స) తో, ”ఈ నాడు అల్లాహ్ ఎంత దగ్గరయ్యాడంటే, ఇంతకు ముందు ఎన్నడూ అంత దగ్గర కాలేదు” అని అన్నారు. దానికి ప్రవక్త (స), ‘ఎంత దగ్గర అయ్యాడు,’ అని అడిగారు. దానికి జిబ్రీల్ (అ), ‘ఎంత దగ్గర అయ్యాడంటే నాకూ అల్లాహ్ (త) కు మధ్య కేవలం వెలుగు యొక్క 70 వేల తెరలు మాత్రమే మిగిలి ఉన్నాయి.’ ‘అప్పుడు అల్లాహ్ (త) ప్రదేశాలన్నిటిలో నీచమైనది బజారు, ప్రదేశాలన్నిటిలో ఉత్తమమైనది మస్జిద్,’ అని ఆదేశించాడని తెలిపారు. [82] (ఇబ్నె ’హిబ్బాన్ / దృఢం)
—–
الْفَصْلُ الثَّالِثُ మూడవ విభాగం
742 – [ 54 ] ( صحيح ) (1/231)
عَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: سَمِعْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ: “مَنْ جَاءَ مَسْجِدِيْ هَذَا لَمْ يَأْتِ إِلَّا لِخَيْرٍ يَّتَعَلَّمُهُ أَوْ يُعَلِّمُهُ فَهُوَ بِمَنْزِلَةِ الْمُجَاهِدِ فِيْ سَبِيْلِ اللهِ وَمَنْ جَاءَ لِغَيْرِ ذَلِكَ فَهُوَ بِمَنْزِلَةِ الرَّجُلِ يَنْظُرُ إِلَى مَتَاعِ غَيْرِهِ”. رَوَاهُ ابْنُ مَاجَهُ وَالْبَيْهَقِيُّ فِيْ شُعَبِ الْإِيْمَانِ.
742. (54) [1/231–దృఢం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) ఇలా ప్రవచిస్తూ ఉండగా నేను విన్నాను, ”నా మస్జిదైన, మస్జిదె నబవీకి ఏదైనా మంచి నేర్చుకోవటానికి, లేదా నేర్పించటానికి లేదా మంచి చేయటానికి లేదా చేయించటానికి వచ్చిన వ్యక్తి దైవమార్గంలో పోరాటం చేస్తున్న వీరుడి వంటివాడు. ఇవి తప్ప మరే ఉద్దేశ్యంతో వచ్చినా వాడు ఇతరుల సామాన్ల వైపు చూసే అసూయపరుడి వంటివాడు.” [83] (ఇబ్నె మాజహ్, బైహఖీ-షు’అబిల్ ఈమాన్)
743 – [ 55 ] ( ضعيف ) (1/231)
وَعَنْ الْحَسَنِ مُرْسَلًا قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “يَأْتِيْ عَلَى النَّاسِ زَمَانٌ يَكُوْنُ حَدِيْثُهُمْ فِيْ مَسَاجِدِهِمْ فِيْ أَمْرِ دُنْيَاهُمْ. فَلَا تُجَالِسُوْهُمْ فَلَيْسَ للهِ فِيْهِمْ حَاجَّةٌ”. رَوَاهُ الْبَيْهَقِيُّ فِيْ شُعَبِ الْإِيْمَانِ.
743. (55) [1/231–బలహీనం]
హసన్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”భవిష్య త్తులో ఒకకాలం రాబోతుంది. ప్రజలు మస్జిదుల్లో ప్రాపంచిక విషయాల గురించి మాట్లాడుతారు. ఇటు వంటి కాలం మీకు దక్కితే, ఇటువంటి వారి వద్ద మీరు కూర్చోకండి. ఎందుకంటే అల్లాహ్‌కు ఇటువంటి వారి అవసరం లేదు.” (బైహఖీ- షు’అబిల్ ఈమాన్)
744 – [ 56 ] ( صحيح ) (1/231)
وَعَنِ السَّائِبِ بْنِ يَزِيْدٍ قَالَ: كُنْتُ نَائِمًا فِيْ الْمَسْجِدِ فَحَصَبَنِيْ رَجُلٌ فَنَظَرْتُ فَإِذَا عُمَرُ بْنُ الْخَطَّابِ فَقَالَ اذْهَبْ فَأْتِنِيْ بِهَذَيْنِ فَجِئْتُهُ بِهِمَا. فَقَالَ: مِمَّنْ أَنْتُمُا أَوْ مِنْ أَيْنَ أَنْتُمَا. قَالَا: مِنْ أَهْلِ الطَّائِفِ. قَالَ: لَوْ كُنْتُمَا مِنْ أَهْلِ الْمَدِيْنَةِ لَأوْجَعْتُكُمَا تَرْفَعَانِ أَصْوَاتَكُمَا فِيْ مَسْجِدِ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم. رواه البخاري.
744. (56) [1/231–దృఢం]
సాయిబ్ బిన్ య’జీద్ (ర) కథనం: నేను మస్జిద్లో పడుకుని ఉన్నాను. ఒక వ్యక్తినన్ను పిలుస్తూ కంకర రాయి విసిరాడు. నేను చూసేసరికి ఆ కంకర రాయి విసిరిన వారు ’ఉమర్ (ర). నేను అతని (ర) వద్దకు వెళ్ళాను. అతను నన్ను మస్జిద్లో కూర్చొని మాట్లాడుకుంటున్న ఆ ఇద్దరు వ్యక్తుల్ని పిలుచుకు రమ్మని, చెప్పారు. నేను వెళ్ళి ఆ ఇద్దరు వ్యక్తుల్ని పిలుచుకొనివచ్చాను. ’ఉమర్ (ర) వారితో, ‘మీరెవరు? మీరు ఎక్కడి నుండి వచ్చారు,’ అని అడిగారు. దానికి వారు, ‘మేము ’తాయిఫ్ నుండి వచ్చాము,’ అని అన్నారు. అప్పుడు ’ఉమర్ (ర), ‘ఒక వేళ మీరు మదీనహ్ వాసులయి ఉంటే, మిమ్మల్ని శిక్షించేవాడిని, ప్రవక్త (స) యొక్క ఈ మస్జిద్లో కూర్చొని మీరు బిగ్గరగా మాట్లాడుతారా?’ అని అన్నారు. [84](బు’ఖారీ)
745 – [ 57 ] ( لم تتم دراسته ) (1/232)
وَعَنْ مَالِكٍ قَالَ: بَنَى عُمَرَ رَحْبَةً فِيْ نَاحِيَةِ الْمَسْجِدِ تُسَمَّى الْبُطَيْحَاءُ. وَقَالَ مَنْ كَانَ يُرِيْدُ أَنْ يَّلْغَطَ أَوْ يُنْشَدَ شِعْرًا أَوْ يَرْفَعَ صَوْتَهُ فَلْيَخْرُجْ إِلَى هَذِهِ الرَّحْبَةِ. رَوَاهُ فِيْ الْمُوَطَّأ .
745. (57) [1/232–అపరిశోధితం]
మాలిక్ (ర) కథనం: ’ఉమర్ (ర) మస్జిద్లో ఒక మూల ఒక గట్టులా చేయించారు. దాన్ని బు’తై’హా‘ అని అనేవారు. ’ఉమర్ (ర) ప్రజల నుద్దేశించి, శబ్దం చేయదలుచుకున్నవారు, మాట్లాడదలచు కున్న వారు, కవిత్వం చదవాలనుకున్న వారు, బిగ్గరగా మాట్లాడాలనుకున్న వారు, ఈ గట్టుపైకి వచ్చి తమ ఉద్దేశ్యం పూర్తిచేసుకోవాలి,’ అని అన్నారు. (మువ’త్తా)
ఇది ’ఉమర్ (ర) ముందు చూపు. మస్జిద్లో ఒక మూల గట్టులా నిర్మించారు. ప్రజలు అక్కడ కూర్చొని ప్రాపంచిక విషయాలు మాట్లాడుకునే వారు. ఈ ఆధునిక కాలంలో కూడా ఇలాంటి ఏర్పాటు ఉంటే మస్జిద్ను అవమాన పరచటం జరుగదు.
746 – [ 58 ] ( صحيح ) (1/232)
وَعَنْ أَنَسٍ: رَأَى النَّبِيُّ صلى الله عليه وسلم نُخَامَةً فِيْ الْقِبْلَةِ فَشَقَّ ذَلِكَ عَلَيْهِ حَتَّى رُئِيَ فِيْ وَجْهِهِ فَقَامَ فَحَكَّهُ بِيَدِهِ فَقَالَ: “إِنَّ أَحَدَكُمْ إِذَا قَامَ فِيْ صَلَاتِهِ فَإِنَّمَا يُنَاجِيْ رَبَّهُ أَوْ إِنَّ رَبَّهُ بَيْنَهُ وَبَيْنَ الْقِبْلَةِ فَلَا يَبْزُقَنَّ أَحْدَكُمْ قبلَ قِبْلَتِهِوَلَكِنْ عَنْ يَّسَارِهِ أَوْ تَحْتَ قَدَمِهِ ” ثُمَّ أَخَذَ طَرَفَ رَدَائِهِ فَبَصَقَ فِيْهِ ثُمَّ رَدَّ بَعْضَهُ عَلَى بَعْضٍ فَقَالَ: “أَوْ يَفْعَلُ هَكَذَا”. رَوَاهُ الْبَخَارِيُّ.
746. (58) [1/232–దృఢం]
అనస్ (ర) కథనం: ప్రవక్త (స) ఖిబ్లావైపు ముక్కు చీమిడి, మలం పడి ఉండటాన్ని చూసి చాలా ఆందోళనకు గురయ్యారు. ముఖవర్చస్సు మారి పోయింది. ప్రవక్త (స) నిలబడి దాన్ని తన చేత్తో గోకి శుభ్రపరిచారు. ఆ తరువాత, ‘ఒకవ్యక్తి నమా’జుకు నిలబడితే, అతడు తన ప్రభువుతో సంభాషిస్తాడు. అప్పుడు అతని ప్రభువు అతనికి ఖిబ్లాకు మధ్య ఉంటాడు. అందువల్ల ఎవరూ ఖిబ్లావైపు ఉమ్మివేయ రాదు. తన ఎడమవైపుగాని లేదా తన పాదం క్రిందగానీ ఉమ్మివేయాలి. అనంతరం తన దుప్పటి ఒక చివర చేత్తో పట్టుకొని అందులో ఉమ్మి, దాన్ని నలిపి వేసి, ఈ విధంగా చేయండి,’ అని అన్నారు. [85] (బు’ఖారీ)
747 – [ 59 ] ( صحيح ) (1/232)
وَعَنِ السَّائِبِ بْنِ خَلَّادٍ – وَهُوَ رَجُلٌ مِنْ أَصْحَابِ رَسُوْلِ الله صلى الله عليه وسلم. أَنَّ رَجُلًا أُمَّ قَوْمًا فَبَصَقَ فِيْ الْقِبْلَةِ وَرُسُوْلُ اللهِ صلى الله عليه وسلم يَنْظُرُ. فَقَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم حِيْنَ فَرَغَ: “لَا يُصَلِّيْ لَكُمْ”. فَأَرَادَ بَعْدَ ذَلِكَ أَنْ يُّصَلِّيْ لَهُمْ فَمَنَعُوْهُ وَأَخْبَرُوْهُ بَقُوْلُ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم فَذَكَرَ ذَلِكَ لِرَسُوْلِ اللهِ صلى الله عليه وسلم. فَقَالَ: نَعَمْ وَحَسِبْتُ أَنَّهُ قَالَ: “إِنَّكَ آذَيْتَ اللهَ وَرَسُوْلَهُ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ.
747. (59) [1/232–దృఢం]
సాయి‘బ్ బిన్ ’ఖల్లాద్ (ర) కథనం: ఒక వ్యక్తి తన జాతివారికి నమా’జు చదివిస్తున్నాడు. నమా’జులో ఖిబ్లావైపు ఉమ్మివేసాడు. ప్రవక్త(స) అతడు ఉమ్మి వేస్తుండగా చూశారు. నమా’జు ముగించిన తర్వాత ప్రవక్త (స) నమా’జు చదివిన వారితో, ‘ఇక ముందు ఈ ఇమాము నమా’జు చదివించరాదు,’ అని అన్నారు. తరువాత ఆ వ్యక్తి నమా’జు చదివించ డానికి సిద్ధమయ్యాడు. ముఖ్తదీలు అతన్ని అడ్డుకొని ప్రవక్త (స) చెప్పిన విషయాన్ని అతనికి తెలిపారు. అనంతరం ఆ వ్యక్తి ప్రవక్త (స) వద్దకు వెళ్ళి జరిగింది విన్నవించుకున్నాడు. దానికి ప్రవక్త (స), ‘అవును, నేనే నిన్ను నమా’జు చదివించరాదని చెప్పాను. ఎందుకంటే నీవు చాలా పెద్ద అపరాధివి. నమా’జులో ఖిబ్లావైపు ఉమ్మి, అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తకు అవిధేయత చూపావు,’ అని అన్నారు. (అబూ దావూ‘ద్)
748 – [ 60 ] ( صحيح ) (1/232)
وَعَنْ مَعَاذِ بْنِ جَبَل قَالَ: احْتَبَسَ عَنَّا رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم ذَاتَ غَدَاةٍ عَنْ صَلَاةِ الصُّبْحِ حَتَّى كِدْنَا نَتَرَاءَى عَيْنَ الشَّمْسِ فَخَرَجَ سَرِيْعًا فَثُوِّبَ بِالصَّلَاةِ فَصَلّى رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم وَتَجَوَّزَ فِيْ صَلَاتِهِ فَلَمَّا سَلَّمَ دَعَا بِصَوْتِهِ. فَقَالَ لَنَا عَلَى مَصَافِكُمْ كَمَا أَنْتُمْ. ثُمَّ انْفَتَلَ إِلَيْنَا ثُمَّ قَالَ: أَمَّا إِنِّيْ سَأُحَدِّثُكُمْ مَا حَبَسَنِيْ عَنْكُمْ الْغَدَاةَ أنِّيْ قُمْتُ مِنَ اللَّيْلِ فَتَوَضَّأْتُ وَصَلَّيْتُ مَا قُدِّرَ لِيْ فَنَعَسْتُ فِيْ صَلَاتِيْ حَتَّى اسْتَثْقَلْتُ فَإِذَا أَنَا بِرَبِّيْ تَبَارَكَ وَتَعَالى فِيْ أَحْسَنِ صُوْرَةٍ. فَقَالَ يَا مُحَمَّدٌ قُلْتُ لَبَّيْكَ رَبِّ. قَالَ: فِيْمَ يَخْتَصِمُ الْمَلَأُ الْأَعْلَى. قُلْتُ لَا أَدْرِيْ رَب. قَالَهَا: ثَلَاثًا. قَالَ: فَرَأْيَتُهُ وَضَعَ كَفَّهُ بَيْنَ كَتِفَيَّ حَتَّى وَجَدْتُ بَرْدَ أَنَامِلِهِ بَيْنَ ثَدْيَيَّ. فَتَجَلَّى لِيْ كُلِّ شَيْءٍ وَّعَرَفْتُ. فَقَالَ يَا مُحَمَّدٌ. قُلْتُ لَبَّيْكَ رَبِّ. قَالَ: فِيْمَ يَخْتَصِمُ الْمَلَأُ الْأَعْلَى. قُلْتُ فِيْ الْكَفَّارَاتِ. قَالَ: مَا هُنَّ قُلْتُ مَشْيُ الْأَقْدَامِ إِلَى الْجَمَاعَاتِ وَالْجُلُوْسُ فِيْ الْمَسَاجِدِ بَعْدَ الصَّلَوَاتِ وَإِسْبَاغُ الْوُضُوْءِ حِيْنَ الْكَرِيْهَاتِ. قَالَ ثُمَّ فِيْمَ؟ قُلْتُ: فِيْ الدَّرَجَاتِ. قَالَ: وَمَا هُنَّ؟ إِطْعَامُ الطَّعَامِ وَلِيْنُ الْكَلَامِ وَالصَّلَاةُ وَالنَّاسُ نِيَامٌ. ثُمَّ قَالَ: سَلْ. قُلِ اللّهُمَّ إِنِّيْ أَسْأَلُكَ فِعْلَ الْخَيْرَاتِ وَتَرْكَ الْمُنْكَرَاتِ وَحُبَّ الْمَسَاكِيْنِ وَأَنْ تَغْفِرَ لِيْ وَّتَرْحَمَنِيْ وَإِذَا أَرَدْتُّ فِتْنَةً قَوْمٍ فَتَوَفَّنِيْ غَيْرَ مَفْتُوْنٍ أَسْأَلُكَ حُبَّكَ وَحُبَّ مَنْ يُّحِبُّكَ وَحُبُّ عَمَلٍ يُّقَرِّبُنِيْ إِلَى حُبِّكَ”. فَقَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِنَّهَا حَقٌّ فَادْرُسُوْهَا. ثُمَّ تُعَلِّمُوْهَا”. رَوَاهُ أَحْمَدُ وَالتِّرْمِذِيُّ. وَقَالَ: هَذَا حَدِيْثٌ حَسَنٌ صَحِيْحٌ وَّسَأَلْتُ مُحَمَّدَ ابْنِ إِسْمَاعِيْلَ عَنْ هَذَا الْحَدِيْثِ فَقَالَ: هَذَا حَدِيْثُ صَحِيْحٌ.
748. (60) [1/232–దృఢం]
మ’ఆజ్‘ బిన్ జబల్ (ర) కథనం: ఒకరోజు ’ఫజ్ర్ నమా’జుకు ప్రవక్త (స) ఆలస్యంగా వచ్చారు. కాసేపట్లో సూర్యోదయం అవుతున్నట్టుగా ఉంది. ప్రవక్త (స) చాలా తొందరగా వచ్చారు. నమా’జు కోసం తక్బీర్ పలకబడింది. ప్రవక్త (స) నమా’జు చదివించారు. చాలా తొందరగా పూర్తిచేశారు. నమా’జు ముగించిన తర్వాత బిగ్గరగా, ‘పంక్తుల్లో కూర్చొని ఉన్నవారు అలాగే కూర్చోండి,’ అని అన్నారు. ఆ తరువాత మా వైపు తిరిగి, ’ఫజ్ర్ నమా’జులో నేనెందుకు ఆలస్యంగా వచ్చానో నేను మీకు చెప్తాను, దానికి కారణం ఏమిటంటే, ఈ రోజురాత్రి నేను తహజ్జుద్ నమా’జుకు లేచి వు’దూ చేశాను. చదవగలిగినంత నమా’జు చదివాను. నమా’జులోనే నాకు కునుకు వచ్చేసింది. చివరికి గాఢ నిద్ర ముంచుకొచ్చింది. ఈ గాఢ నిద్రలో నేను కలలో అల్లాహ్(త)ను మంచి రూపంలో చూశాను. కలలో అల్లాహ్ (త) నన్ను ఇలా ఆదేశించాడు, ‘ఓ ముహమ్మద్!’ అని అన్నాడు, దానికి నేను, ‘ఓ ప్రభూ! నేనిక్కడే ఉన్నాను,’ అని అన్నాను. దానికి అల్లాహ్, ‘సన్నిహిత దైవదూతలు దేన్ని గురించి చర్చించుకుంటున్నారు,’ అని అడిగాడు. దానికి నేను, ‘నాకు తెలియదు,’ అని అన్నాను. అల్లాహ్ మూడుసార్లు ప్రశ్నించాడు. నేను మూడుసార్లు, ‘తెలియదని,’ సమాధానం ఇచ్చాను. ఆ తరువాత అల్లాహ్ తన చేతిని నా మెడ వెనుక భాగంపై పెట్టాడు. దాని చల్లదనం నా గుండెలో కలిగింది. ప్రతి వస్తువు నాకు కనబడసాగింది. ప్రతి వస్తువును నేను గుర్తించాను. అప్పుడు అల్లాహ్ ఇలా ఆదేశించాడు. ‘ఓ ము’హమ్మద్! అని అన్నాడు. దానికి నేను, ‘నేనిక్కడే ఉన్నానని,’ అన్నాను. అప్పుడు అల్లాహ్, ”సన్నిహిత దైవదూతలు దేన్ని గురించి చర్చించుకుంటున్నారు,” అని అడిగాడు. దానికి నేను, పరిహారాల గురించి,’ అని అన్నాను. అల్లాహ్, ‘ఈ పరిహారాలు అంటే ఏమిటి,’ అని అడిగాడు. దానికి నేను, ‘సామూహిక నమా’జు కోసం నడచి వెళ్ళడం, ఒక నమా’జు తర్వాత మరో నమా’జు కోసం వేచి ఉండటం, కష్టంగా ఉన్నాసరే పరిపూర్ణ వు’దూ చేయటం,’ అని అన్నాను. ఆ తరువాత మళ్ళీ, అల్లాహ్, ‘సన్నిహిత దైవదూతలు దేన్ని గురించి చర్చించుకుంటున్నారో చెప్పు,’ అని అన్నాడు. దానికి నేను, ‘ఉన్నత స్థానాలు గురించి,’ అని అన్నాను. అల్లాహ్ నన్ను, ‘ఆ స్థానాలు ఏమిటని,’ అడిగాడు. దానికి నేను, ‘అన్నం పెట్టటం, వినయంగా, నిదానంగా మాట్లాడటం, అందరూ నిద్ర పోతున్నప్పుడు నమా’జు చదవటం,’ అని అన్నాను. అప్పుడు అల్లాహ్ ”నీవేం కోరుకుంటావో కోరుకో” అని అన్నాడు. అప్పుడు నేను, ”అల్లాహుమ్మ ఇన్నీ అస్అలుక ఫి’అలల్ ‘ఖైరాతి వ తర్కల్ మున్కరాతి, వ ‘హుబ్బల్ మసాకీన్, వ అన్ త’గఫర్లీ వ తర్హమ్నీ, వ ఇజా’ అరద్ త ఫిత్నతన్ ఫీ ఖౌమిన్ ఫతవఫ్ఫనీ గైరమఫ్తూన్. వ అస్అలుక ‘హుబ్బక, వ ‘హుబ్బ మన్యు’హిబ్బుక వ’హుబ్బ అమలిన్ యుఖర్రిబునీ ఇలా హుబ్బిక.” – ‘ఓ అల్లాహ్! నేను నిన్ను మంచి పనులు చేసే, చెడుపనులకు దూరంగా ఉండే, పేదలను ప్రేమించే, నీవు నన్ను క్షమించే, నన్ను కనికరించే భాగ్యాన్ని కోరుతున్నాను. ఒకవేళ నీవు నా జాతిని ఉపద్రవానికి గురిచేయదలచుకుంటే, అంతకు ముందే నన్ను అంతంచేయి. ఇంకా నేను నీ ప్రేమను, నీవు ప్రేమించేవారి ప్రేమను, ఇంకా నీప్రేమను చేకూర్చే మంచి పనుల ప్రేమను కోరుతున్నాను.” ఆ తర్వాత ప్రవక్త (స) మమ్మల్ని ఉద్దేశించి, ‘ఇది సత్య స్వప్నం, దీన్ని మీరు జ్ఞాపకం చేసుకొని ఇతరులకు నేర్పండి,’ అని అన్నారు. (అ’హ్మద్, తిర్మిజి‘ / ప్రామాణికం, దృఢం, బు’ఖారీ (ము’హమ్మద్ బిన్ ఇస్మా’ఈల్) కూడా దీన్ని ’స’హీహ్ ’హదీసు‘గా పేర్కొన్నారు.
749 – [ 61 ] ( صحيح ) (1/234)
وَعَنْ عَبْدِ اللهِ بْنِ عَمْرِو بْنِ الْعَاصِ قَالَ: كَانَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ إِذَا دَخَلَ الْمَسْجِدُ قَالَ: “أَعُوْذُ بِاللهِ الْعَظِيْمِ وَبِوَجْهِهِ الْكَرِيْمِ وَسُلْطَانِهِ الْقَدِيْمِ مِنَ الشَّيْطَانِ الرَّجِيْمِ”. قَالَ: “فَإِذَا قَالَ ذَلِكَ. قَالَ: الشَّيْطَانُ حُفِظَ مِنِّيْ سَائِرَ الْيَوْمِ.“ رَوَاهُ أَبُوْدَاوُدَ.
749. (61) [1/234–దృఢం]
’అబ్దుల్లాహ్ బిన్ ’అమ్రూ బిన్ ’ఆ’స్ (ర) కథనం: ప్రవక్త (స) మస్జిద్లో ప్రవేశించినప్పుడు, “అ’ఊజు బిల్లాహిల్ ’అజీమ్ వబివజ్హిహిల్ కరీమ్ వ సుల్’తానిహిల్ ఖదీమ్ మినష్షై’తానిర్రజీమ్,” –‘సర్వోత్తముడైన అల్లాహ్ తో, ఆయన అనుగ్రహ ముఖాకృతితో, ఆయన యొక్క ఎడతెగని సామ్రా జ్యాధికారం ద్వారా, ధిక్కరించబడిన షై’తాన్ నుండి శరణు కోరుతున్నాను.’ ప్రవక్త (స) ప్రవచనం, ”మస్జిద్లో ప్రవేశించినపుడు ఎవరైనా ఈ దు’ఆ పఠిస్తే, ‘ఈవ్యక్తి నా నుండి పగలంతా రక్షించుకోబడ్డాడు,’ అని షై’తాన్ విచారిస్తాడు.” (అబూ దావూ‘ద్)
750 – [ 62 ] ( صحيح ) (1/234)
وَعَنْ عَطَاءِ بْنِ يَسَارٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “اللَّهُمَّ لَا تَجْعَلُ قَبْرِيْ وَثْنًا يَعْبُدُ اشْتَدَّ غَضَبَ اللهِ عَلَى قَوْمٍ اتَّخَذُوْا قُبُوْرَ أَنْبِيَائِهِمْ مَسَاجِدَ”. رَوَاهُ مَالِكٌ مُرْسَلًا.
750. (62) [1/234–దృఢం]
’అ’తా బిన్ యసార్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”అల్లాహుమ్మ లా తజ్’అల్నీ ఖబ్రీ వస‘నన్ యు’అబదు” — ‘ఓ అల్లాహ్! నా సమాధిని ఆరాధించబడే విగ్రహంగా చేయకు. ప్రవక్తల సమాధులను ఆరాధనాలయాలుగా చేసుకున్న వారిపై దైవాగ్రహం విరుచుకుపడుతుంది.’ (మాలిక్)
751 – [ 63 ] ( لم تتم دراسته ) (1/234)
وَعَنْ مُّعَاذِ بْنِ جَبَلٍ قَالَ: كَانَ النَّبِيُّ صلى الله عليه وسلم يَسْتَحِبُّ الصَّلَاةِ فِيْ الْحِيْطَانِ. قَالَ بَعْضُ رُوَاتِهِ يَعْنِيْ الْبَسَاتِيْنَ رَوَاهُ التِّرْمِذِيُّ. وَقَالَ: هَذَا حَدِيْثٌ غَرِيْبٌ لَا نَعْرِفُهُ إِلَّا مِنْ حَدِيْثِ الْحَسَنِ بْنِ أَبِيْ جَعْفَرٍ وَقَدْ ضَعَّفَهُ يَحْيَى ابْنُ سَعِيْدٍ وَغَيْرُهُ.
751. (63) [1/234–అపరిశోధితం]
ము’ఆజ్ బిన్ జబల్ (ర) కథనం: ప్రవక్త (స) తోటల్లో నమా’జ్ చదవటాన్ని అభిలషించేవారు. (తిర్మిజి‘ / ఏకోల్లేఖనం. ’హసన్ బిన్ అబీ జ’అఫర్‌ను య’హ్యా బిన్ స’యీద్ మొదలైన వారు బలహీన రావీగా పేర్కొన్నారు).
752 – [ 64 ] ( ضعيف ) (1/234)
وَعَنْ أَنَسٍ بْنِ مَالِكٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “صَلَاةُ الرَّجُلِ فِيْ بَيْتِهِ بِصَلَاةٍ وَصَلَاتُهُ فِيْ مَسْجِدِ الْقَبَائِلِ بِخَمْسٍ وَّعِشْرِيْنَ صَلَاةً وَصَلَاتُهُ فِيْ الْمَسْجِدِ الذي يُجَمَّعُ فِيْهِ بِخَسِمِائَةِ صَلَاةٍ وَصَلَاتُهُ فِيْ الْمَسْجِدِ الْأَقْصَى بِخَمْسِيْنَ أَلْفَ صَلَاةٍ وَصَلَاتُهُ فِيْ مَسْجِدِيْ بِخَمْسِيْنَ أَلْفَ صَلَاةٍ وَصَلَاتُهُ فِيْ الْمَسْجِدِ الْحَرَامِ بِمِائَةِ أَلْفِ صَلَاةٍ”. رَوَاهُ ابْنُ مَاجَهُ.
752. (64) [1/234–బలహీనం]
అనస్ బిన్ మాలిక్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మనిషి ఇంటిలో నమా’జ్ చదివితే, ఒక్క నమా’జ్ పుణ్యమే లభిస్తుంది. వీధిలో ఉన్న మస్జిద్కు వెళ్ళి చదివితే 25 నమా’జ్ల పుణ్యం లభిస్తుంది. జామి’అ మస్జిద్లో నమా’జ్ చదివితే 500 నమా’జ్ల పుణ్యం లభిస్తుంది. మస్జిద్ అల్‌అ’ఖ్సా లో నమాజ్ చదివితే 50 వేల నమా’జ్ల పుణ్యం లభిస్తుంది. నా మస్జిద్లో నమాజ్ చదివితే 50 వేలనమా’జ్ల పుణ్యం లభిస్తుంది. ఇంకా మస్జిద్ అల్ ‘హరామ్లో నమా’జ్ చదివితే లక్ష నమా’జుల పుణ్యం లభిస్తుంది.” (ఇబ్నె మాజహ్)
753 – [ 65 ] ( متفق عليه ) (1/235)
وَعَنْ أَبِيْ ذَرٍّ قَالَ: قُلْتُ: يَا رَسُوْلَ اللهِ أَيُّ مَسْجِدٍ وُضِعَ فِيْ الْأَرْضِ أَوَّلَ؟ قَالَ: “اَلْمَسْجِدُ الْحَرَامُ”. قَالَ: قُلْتُ: ثُمَّ أَيٌّ؟ قَالَ: “ثُمَّ الْمَسْجِدُ الْأَقْصَى”. قُلْتُ: كَمْ بَيْنَهُمَا؟ قَالَ: “أَرْبَعُوْنَ عَامًا ثُمَّ الْأَرْضُ لَكَ مَسْجِدٌ فَحَيْثُمَا أَدْرَكَتْكَ الصَّلَاةُ فَصَلِّ”.
753. (65) [1/235–ఏకీభవితం]
అబూ జ‘ర్ (ర) కథనం: నేను ప్రవక్త (స) ను, ‘ఓ ప్రవక్తా! అన్నిటి కంటే ముందు భూమిపై ఏ మస్జిద్ నిర్మించబడింది,’ అని ప్రశ్నించాను. దానికి ప్రవక్త (స), మస్జిద్ అల్ హరామ్,’ అని అన్నారు. ‘ఆ తరువాత ఏ మస్జిద్!’ అని నేనడిగాను. ప్రవక్త (స), ‘మస్జిద్ అల్ అఖ్సా,’ అని అన్నారు. మళ్ళీ నేను, ‘ఈ రెంటి నిర్మాణంలో ఎంత తేడా ఉంది,’ అని అడిగాను. ప్రవక్త (స), ‘40 సంవత్సరాలు,’ అని అన్నారు. ఆ తరువాత ప్రవక్త (స) ఇప్పుడు భూమంతా మీ కోసం సజ్దా చేసే ప్రాంతమే, ఎక్కడ కోరితే అక్కడ నమా’జ్ చదువుకోవచ్చు,’ అని అన్నారు. [86] (బు’ఖారీ, ముస్లిమ్)
=====
8 – بَابُ السَّتْرِ
8. ఆచ్ఛాదన
అంటే మర్మాంగాన్ని కప్పి ఉంచటం అత్యంత అవసరం. మానవులకు జంతువులకు ఉన్న తేడాల్లో ఇది ఒకటి. జంతువులు వస్త్రాలు ధరించి మర్మాంగాన్ని కప్పి ఉంచవు. కాని మానవుడు తన మర్మాంగాల్ని తప్పనిసరిగా కప్పి ఉంచుతాడు. అల్లాహ్ (త) వస్త్రాలను మానవులు ధరించటానికి సృష్టించాడు.
ఖుర్ఆన్లో ఇలా ఉంది, ”ఓ ఆదమ్ సంతానమా! వాస్తవానికి మేము మీకొరకు వస్త్రాలను కల్పించాము, అవి మీ మర్మాంగాలను కప్పుతాయి మరియు మీకు అలంకార మిస్తాయి….” (సూ. అల్-అ’అరాఫ్, 7:26)
ఆరాధనా సమయంలో వస్త్రాలు తప్పకుండా ధరించాలి. ఖుర్ఆన్లో అల్లాహ్ ఆదేశం, ”ఓ ఆదమ్ సంతానమా ప్రతి మస్జిద్లో (నమా’జ్లో) మీ వస్త్రా లంకరణ పట్ల శ్రధ్ధ వహించండి….” (సూ. అల్-అ’అరాఫ్, 7:31)
అకారణంగా నగ్నంగా నమా’జు చదివితే నమా’జు స్వీకరించబడదు.
ప్రవక్త (స) ప్రవచనం, ”యుక్త వయస్సుకు చేరిన స్త్రీ యొక్క నమా’జు తలపై వస్త్రం లేకుండా స్వీకరించ బడదు.”
ప్రవక్త (స) ప్రవచనం, ”ఎవ్వరూ నగ్నంగా బైతుల్లాహ్ తవాఫ్ చేయరాదు.” అదేవిధంగా నమా’జ్ సమయంలో కూడా ఎవ్వరూ నగ్నంగా ఉండరాదు. ప్రవక్త (స) ప్రవచనం, ”మీ రెప్పుడూ నగ్నంగా ఉండకండి. ఎందుకంటే మీకు వేరుకాని వారు మీవెంట ఉన్నారు. అయితే మలమూత్ర విసర్జన మరియు సంభోగ సమయాల్లో తప్ప.” (తిర్మిజి’)
اَلْفَصْلُ الْأَوَّلُ మొదటి విభాగం
754 – [ 1 ] ( متفق عليه ) (1/236)
عَنْ عُمَرَ بْنِ أَبِيْ سَلَمَةَ قَالَ: رَأَيْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يُصَلِّيْ فِيْ ثَوْبٍ وَّاحِدٍ مُّشْتَمِلًا بِهِ فِيْ بَيْتِ أُمِّ سَلَمَةَ وَاضِعًا طَرَفَيْهِ عَلَى عَاتِقَيْهِ .
754. (1) [1/236–ఏకీభవితం]
’ఉమర్ బిన్ అబీ సలమహ్ (ర) కథనం: ప్రవక్త (స) ఉమ్మె సలమహ్ ఇంటిలో ఒకే వస్త్రంలో నమా’జు చదువుతుండగా నేను చూశాను. ప్రవక్త (స) ఆ వస్త్ర్రాన్ని ఎలా ధరించి ఉన్నారంటే, దాని రెండు మూలలు ప్రవక్త (స) రెండు భుజాలపై ఉన్నాయి. [87] (బు’ఖారీ, ముస్లిమ్)
755 – [ 2 ] ( متفق عليه ) (1/236)
وَعَنْ أَبِيْ هُرَيْرَةَ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَا يُصَلِّيْنَّ أَحْدُكُمْ فِيْ الثَّوْبِ الْوَاحِدِ لَيْسَ عَلَى عَاتِقَيْهِ مِنْهُ شَيْءٌ”.
755. (2) [1/236–ఏకీభవితం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఎవ్వరూ ఒక్క వస్త్రం ధరించి, రెండు భుజాలు కప్పకుండా నమా’జు చదవరాదు. అంటే భుజాలపై వస్త్రం ఉండాలి. [88] (బు’ఖారీ, ముస్లిమ్)
756 – [ 3 ] ( صحيح ) (1/236)
وَعَنْهُ قَالَ: سَمِعْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ: “مَنْ صَلَّى فِيْ ثَوْبِ وَاحِدٍ فَلْيُخَالِفْ بَيْنَ طَرَفَيْهِ”. رَوَاهُ الْبُخَارِيُّ .
756. (3) [1/236–దృఢం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) ఇలా ప్రవచిస్తూ ఉండగా నేను విన్నాను, ”ఒకే వస్త్రంలో నమా’జు చదివేవారు, వస్త్రం రెండు ప్రక్కలను మార్చివేయాలి అంటే కుడివైపు ఉన్నది ఎడమ భుజంపై, ఎడమవైపు ఉన్నది కుడి భుజంపై వేయాలి.” (బు’ఖారీ)
757 – [ 4 ] ( متفق عليه ) (1/236)
وَعَنْ عَائِشَةَ رَضِيَ اللهُ عَنْهَا قَالَتْ: صَلَّى رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم فِيْ خَمِيْصَةٍ لَهَا أَعْلَامٌ فَنَظَرَ إِلَى أَعْلَامِهَا نَظْرَةً فَلَمَّا انْصَرَفَ قَالَ: “اذْهَبُوْا بِخَمِيْصَتِيْ هَذِهِ إِلَى أَبِيْ جَهْمٍ وَأتُوْنِيْ بِأَنْبِجَانِيَّةِ أَبِيْ جَهْمٍ فَإِنَّهَا أَلْهَتَنِيْ آنِفًا عَنْ صَلَاتِيْ”.
وَفِيْ رِوَايَةِ لِلْبُخَارِيِّ قَالَ: “كُنْتُ أنْظُر إِلَى عَلَمِهَا وَأَنَا فِيْ الصَّلَاةِ فَأَخَافَ أَنْ يَّفْتِنَنِيْ”.
757. (4) [1/236–ఏకీభవితం]
’ఆయి‘షహ్ (ర) కథనం: ప్రవక్త (స) పువ్వుల చిత్రం ఉన్న దుప్పటి ధరించి నమా’జు చదివారు. నమా’జులో ఆ పువ్వుల చిత్రాలపై దృష్టి పడింది. భక్తిశ్రద్ధలకు అంతరాయం కలిగింది. నమా’జు ముగించిన తర్వాత, ‘ఈ చిత్రాలుగల దుప్పటిని అబూ జహమ్ వ్యాపారి వద్దకు తీసుకువెళ్ళి, దానికి బదులుగా సాధారణ దుప్పటి తీసుకురండి. ఈరంగు చిత్రాల దుప్పటి నన్ను నమా’జు పట్ల అశ్రద్ధకు గురిచేసింది,’ అని అన్నారు. [89] (బు’ఖారీ, ముస్లిమ్)
బు’ఖారీలోని మరో ఉల్లేఖనంలో, ”నమాజులో నేను ఆ పువ్వులవైపు చూశాను. దానివల్ల నమా’జులో అంతరాయం కలిగింది,” అని ఉంది.
758 – [ 5 ] ( صحيح ) (1/237)
وَعَنْ أَنَسٍ قَالَ: كَانَ قِرَامٌ لِعَائِشَةَ سَتَرَتْ بِهِ جَانِبَ بَيْتِهَا. فَقَالَ لَهَا النَّبِيَّ صلى الله عليه وسلم: “أَمِيْطِيْ عَنَّا قِرَامَكِ هَذَا فَإِنَّهُ لَا يَزَالُ تَصَاوِيْرُهُ تَعْرِضُ لِيْ فِيْ صَلَاتِيْ”.رَوَاهُ الْبُخَارِيُّ.
758. (5) [1/237–దృఢం]
అనస్ (ర) కథనం: ’ఆయి‘షహ్ (ర) ఇంటిలోని ఒక మూల ఒక తెర అమర్చారు. ప్రవక్త (స) ’ఆయి‘షహ్ (ర)తో నీవు నీ తెరను నా ముందు నుండి తొలగించు, ఎందుకంటే దానిపై ఉన్న బొమ్మలు నమా’జులో నాకు కనబడుతున్నాయి. దానివల్ల నమా’జులోని భక్తిశ్రద్ధల్లో అంతరాయం కలుగుతుంది అని అన్నారు. (బు’ఖారీ)
759 – [ 6 ] ( متفق عليه ) (1/237)
وَعَنْ عُقْبَةَ بْنِ عَامِرٍ قَالَ: أُهْدِيَ لِرَسُوْلِ اللهِ صلى الله عليه وسلم فَرُّوْجُ حَرِيْرٍ فَلَبِسَهُ ثُمَّ صَلَّى فِيْهِ ثُمَّ انْصَرَفَ فَنَزَعَهُ نَزَعًا شَدِيْدًا كَالْكَارِهِ لَهُ ثُمَّ قَالَ: “لَا يَنْبَغِيْ هَذَا لِّلْمُتَّقِيْنَ .
759. (6) [1/237–ఏకీభవితం]
’ఉఖ్బహ్ బిన్ ’ఆమిర్ (ర) కథనం: ప్రవక్త (స)కు ఒక పట్టు జుబ్బ కానుకగా ఇవ్వబడింది. ప్రవక్త(స) దాన్ని ధరించి నమా’జు చదివారు. నమా’జు తర్వాత అసహ్యించుకుంటూ దాన్ని తొలగించారు. ఇంకా, ”ఈ పట్టు వస్త్రాలు దైవభీతి పరులకు తగవు,” అని అన్నారు. [90] (బు’ఖారీ, ముస్లిమ్)
—–
اَلْفَصْلُ الثَّانِيْ రెండవ విభాగం
760 – [ 7 ] ( حسن ) (1/237)
عَنْ سَلَمَةَ بْنِ الْأَكْوَعِ قَالَ: قُلْتُ: يَا رَسُوْلَ اللهِ إِنِّيْ رَجُلٌ أَصِيْدُ أَفَأُصَلِّيْ فِيْ الْقَمِيْصِ الْوَاحِدِ؟ قَالَ: نَعَمْ وَاْزَرُرْهُ وَلَوْ بِشَوْكَةٍ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ وَرَوَى النَّسَائِيُّ نَحْوَهُ .
760. (7) [1/237–ప్రామాణికం]
సలమహ్ బిన్ అక్వ’ (ర) కథనం: నేను ప్రవక్త (స) ను, ‘ఓ ప్రవక్తా! నేను వేటగాడిని, నేను ఒక ఖమీస్‘లో నమా’జు చదవ వచ్చా,’ అని విన్నవించుకున్నాను. దానికి ప్రవక్త (స), ‘అవును, ముళ్ళతో నైనా గుండీ పెట్టుకో,’ అని అన్నారు. (అబూ దావూ‘ద్, నసాయి‘)
761 – [ 8 ] ( ضعيف ) (1/237)
وَعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: بَيْنَمَا رَجُلٌ يُّصَلِّيْ مُسْبِلٌ إِزَارَهُ. قَالَ لَهُ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “اِذْهَبْ فَتَوَضَّأَ”. فَذَهَبَ وَتَوَضَّأَ ثُمَّ جَاءَ. فَقَالَ رَجُلٌ: يَا رَسُوْلَ اللهِ مَا لَكَ أَمَرْتَهُ أَنْ يَّتَوَضَّأَ؟ قَالَ: “إِنَّهُ كَانَ يُصَلِّيْ وَهُوَ مُسْبِلٌ إِزَارَهُ وَإِنَّ اللهَ تعالى لَا يَقْبَلُ صَلَاةَ رَجُلٍ مُسْبِلٍ إِزَارَهُ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ .
761. (8) [1/237–బలహీనం]
అబూ హురైరహ్ (ర) కథనం: ఒక వ్యక్తి చీల మండల కంటే క్రింద లుంగీ వ్రేలాడ గట్టి నమా’జు చదవసాగాడు. ప్రవక్త (స) అతన్ని, ‘వెళ్ళి వు’దూ చేసిరా, వు’దూ చేసిరా,’ అని అన్నారు. ఒక వ్యక్తి, ఓ ప్రవక్తా! అతన్ని వు’జూ చేయమని ఎందుకు ఆదేశించారు,’ అని విన్నవించుకున్నాడు. దానికి ప్రవక్త (స), ‘ఇతడు చీలమండల క్రింద లుంగీ వ్రేలాడ గట్టి నమా’జు చేస్తుండే వాడు. అల్లాహ్ చీల మండల క్రింద వస్త్రాన్ని వ్రేలాడగట్టి చదవబడే నమా’జు స్వీకరించడు’ అని అన్నారు. [91] (అబూ దావూ‘ద్)
762 – [ 9 ] ( صحيح ) (1/238)
وَعَنْ عَائِشَةَ رَضِيَ اللهُ عَنْهَا قَالَتْ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَا تُقْبَلُ صَلَاةُ حَائِضٍ إِلَّا بِخِمَارٍ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ وَالتِّرْمِذِيُّ.
762. (9) [1/238–దృఢం]
’ఆయి‘షహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”యుక్త వయస్సుకు చేరిన స్త్రీ నమా’జు తలపై దుపట్టా కప్పకుండా స్వీకరించబడదు.” [92] (అబూ దావూ‘ద్, తిర్మిజి‘)
763 – [ 10 ] ( ضعيف ) (1/238)
وَعَنْ أُمِّ سَلَمَةَ أَنَّهَا سَأَلْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم: أَتُصَلِّيْ الْمَرْأَةُ فِيْ دِرْعٍ وَّخِمَارٍ لَيْسَ عَلَيْهَا إِزَارٌ؟ قَالَ: “إِذَا كَانَ الدِّرْعُ سَابِغًا يُّغَطّيْ ظُهُوْرَ قَدَمَيْهَا”. رَوَاهُ أَبُوْ دَاوُدَ وَذَكَرَ جَمَاعَةً وَّقَفُوْهُ عَلَى أُمِّ سَلَمَةَ.
763. (10) [1/238–బలహీనం]
ఉమ్మె సలమహ్ (ర) కథనం: ప్రవక్త (స)ను, ‘స్త్రీ ఒక ఖమీసు‘, ఒక దుపట్టాతో నమా’జు చదవవచ్చా?’ అని అడిగాను. దానికి ప్రవక్త (స), ‘ఒకవేళ ఖమీసు‘ రెండు పాదాల వెనుక భాగాన్ని కప్పివేసేటంత పొడవుగా ఉంటే, ఒక్క ఖమీసు‘లో నమా’జు చదవ వచ్చు. శరీరం కప్పటం అసలు ఉద్దేశం. వస్త్రాల సంఖ్య కాదు అని ప్రవచించారు.’ (అబూ దావూ‘ద్)
764 – [ 11 ] ( حسن ) (1/238)
وَعَنْ أَبِيْ هُرَيْرَةَ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: نَهَى عَنِ السَّدْلِ فِيْ الصَّلَاةِ وَأَنْ يُّغَطِّيَ الرَّجُلُ فَاهُ. رَوَاهُ أَبُوْ دَاوُدَ وَالتِّرْمِذِيُّ .
764. (11) [1/238–ప్రామాణికం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) సద్ల్ చేయటాన్ని నిషేధించారు. అంటే నమా’జు చదివి నప్పుడు ముఖం కప్పుకోవటం. [93] (అబూ దావూ‘ద్, తిర్మిజి‘)
765 – [ 12 ] ( صحيح ) (1/238)
وَعَنْ شَدَّادِ بْنِ أَوْسٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “خَالِفُوْا الْيَهُوْدَ فَإِنَّهُمْ لَا يُصَلُّوْنَ فِيْ نِعَالِهِمْ وَلَا خِفَافِهِمْ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ.
765. (12) [1/238–దృఢం]
షద్దాద్ బిన్ ఔస్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”యూదులను వ్యతిరేకించండి. ఎందుకంటే యూదులు చెప్పులు, మేజోళ్ళతో నమా’జు చదవరు. అంటే పరిశుభ్రమైన బూట్లు, మేజోళ్ళతో నమా’జు చదవండి.” (అబూ దావూ‘ద్)
766 – [ 13 ] ( صحيح ) (1/238)
وعَنْ أَبِيْ سَعِيْدُ الْخُدْرِيِّ قَالَ: بَيْنَمَا رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم يُصَلِّيْ بِأَصْحَابِهِ إِذْ خَلَعَ نَعْلَيْهِ فَوَضَعَهُمَا عَنْ يَسَارِهَ فَلَمَّا رَأَىَ ذَلِكَ الْقَوْمُ أَلْقُوْانِعَالُهُمْ فَلَمَّا قَضَى رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم صَلَاتَهُ قَالَ: “مَا حَمَلَكُمْ عَلَى إِلْقَائِكُمْ نِعَالَكُمْ؟” قَالُوْا: رَأَيْنَاكَ أَلْقَيْتَ نَعْلَيْكَ فَأَلْقَيْنَا نِعَالَنَا. فَقَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِنَّ جِبْرِيْلَ أَتَانِيْ فَأَخْبَرَنِيْ أَنَّ فِيْهِمَا قَذْرًا إِذَا جَاءَ أَحْدُكُمْ إِلَى الْمَسْجِدِ فَلْيَنْظُرْ فَإِنْ رَأَى فِيْ نَعْلَيْهِ قَذَرًا أَوْ أَذَى فَلْيَمْسَحْهُ وَلْيُصَلِّ فِيْهِمَا”. رَوَاهُ أَبُوْ دَاوُدَ وَالدَّارَمِيُّ .
766. (13) [1/238–దృఢం]
అబూ స’యీద్ ’ఖుద్రీ (ర) కథనం: ప్రవక్త (స) చెప్పులు ధరించి నమా’జు చదివించసాగారు. నమా’జలోనే ప్రవక్త (స) తన చెప్పులను తీసి ఎడమవైపు పెట్టారు. అది చూసిన అనుచరులు కూడా తమ చెప్పులను తీసివేశారు. నమా’జు ముగిసిన తర్వాత, ‘మీరెందుకు చెప్పులు తీసివేశారు,’ అని అడిగారు. దానికి వారు, ‘తమరు తీయటం చూసి మేము కూడా తీసివేశామని అన్నారు.’ అప్పుడు ప్రవక్త (స) నమా’జులో నా వద్దకు జిబ్రీల్ వచ్చి, ‘చెప్పులకు అశుద్ధం అంటుకొని ఉంది, వాటిని తీసివేయమని,’ చెప్పారు. అందువల్ల నేను నా చెప్పులను తీసివేశాను. మీలో ఎవరైనా నమా’జు చదవటానికి మస్జిదుకు వస్తే, తన చెప్పులను చూసుకోవాలి. ఏదైనా అశుద్ధం అంటుకొని ఉంటే, దాన్ని తుడిచి శుభ్రం చేసుకొని నమా’జు చదవాలి,’ అని అన్నారు. (అబూ దావూద్, తిర్మిజి‘)
767 – [ 14 ] ( صحيح ) (1/239)
وَعَنْ أَبِيْ هُرَيْرَةَ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِذَا صَلَّى أَحْدُكُمْ فَلَا يَضَعُ نَعْلَيْهِ عَنْ يَمِيْنِهِ وَلَا عَنْ يَسَارِهِ فَتَكُوْنُ عَنْ يَّمِيْنِ غَيْرِهِ إِلَّا أَنْ لَا يَكُوْنَ عَنْ يَسَارِهِ أَحَدٌ وَّلْيَضَعْهُمَا بَيْنَ رِجْلَيْهِ”. وَفِيْ رِوَايَةِ: “أَوْ لِيُصَلِّ فِيْهِمَا”. رَوَاهُ أَبُوْ دَاوُدَ وَرَوَى ابْنُ مَاجَهُ مَعْنَاهُ .
767. (14) [1/239–దృఢం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మీలో ఎవరైనా మస్జిద్లో నమా’జు చదవడానికి వస్తే, తన చెప్పులను కుడిప్రక్కన ఉంచకూడదు. ఎడమ ప్రక్కన ఉంచకూడదు. చెప్పులను రెండు కాళ్ళమధ్య లేదా చెప్పులు ధరించి నమా’జు చదవాలి.” (అబూ దావూ‘ద్, ఇబ్నె మాజహ్)
—–
اَلْفَصْلُ الثَّالِثُ మూడవ విభాగం
768 – [ 15 ] ( صحيح ) (1/239)
عَنْ أَبِيْ سَعِيْدِ الْخُدْرِيِّ قَالَ: دَخَلْتُ عَلَى النَّبِيِّ صلى الله عليه وسلم فَرَأَيْتُهُ يُصَلِّيْ عَلَى حَصِيْرٍ يَّسْجُدُ عَلَيْهِ. قَالَ: وَرَأَيْتُهُ يُصَلِّيْ فِيْ ثَوْبٍ وَّاحِدٍ مُتَوَشِّحًا بِهِ. رَوَاهُ مُسْلِمٌ .
768. (15) [1/239–దృఢం]
అబూ స’యీద్ ’ఖుద్రీ (ర) కథనం: నేను ప్రవక్త (స) వద్దకు వెళ్ళాను. అప్పుడు ప్రవక్త (స) ఒక చాపపై నమా’జు చేస్తూ దానిపై సజ్దా చేస్తున్నారు. ఇంకా ఒక వస్త్రం ధరించి అంటే చుట్టుకొని ఉన్నారు. [94](ముస్లిమ్)
769 – [ 16 ] ( صحيح ) (1/239)
وَعَنْ عَمْرِو بْنِ شُعَيْبٍ عَنْ أَبِيْهِ عَنْ جَدِّهِ قَالَ: رَأَيْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يُصَلِّيْ حَافِيًا وَّمُتْنَعِلًا. رَوَاهُ أَبُوْ دَاوُدَ .
769. (16) [1/239–దృఢం]
’అమ్ర్ బిన్ షు’ఐబ్ తన తండ్రి తాతల ద్వారా కథనం: ”నేను ప్రవక్త (స) ను ఒక్కోసారి చెప్పులతో, ఒక్కోసారి చెప్పులు లేకుండా నమా’జు చదవడం చూశాను.” (అబూ దావూ‘ద్)
770 – [ 17 ] ( صحيح ) (1/240)
وَعَنْ مُّحَمَّدِ بْنِ الْمُنْكَدِرِ قَالَ: صَلَّى جَابِرٌ فِيْ إِزَارِ قَدْ عَقَدَهُ مِنْ قِبَلِ قَفَاهُ وَثِيَابُهُ مَوْضُوْعَةٌ عَلَى الْمِشْجَبِ. قَالَ لَهُ قَائِلٌ تُصَلِّيْ فِيْ إِزَارٍ وَاحِدٍ. فَقَالَ إِنَّمَا صَنَعْتُ ذَلِكَ لِيُرَانِيْ أَحْمَقُ مِثْلُكَ وَأَيُّنَا كَانَ لَهُ ثَوْبَانِ عَلَى عَهْدِ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم. رَوَاهُ الْبُخَارِيُّ .
770. (17) [1/240–దృఢం]
ము’హమ్మద్ బిన్ మున్కదిర్ (ర) కథనం: జాబిర్ (ర) ఒక్క లుంగీలో నమా’జు చదివారు. దాన్ని మెడకు కట్టి ఉంచారు. ఇంకా అతని వద్ద వేరే బట్టలు కూడా ఉన్నాయి. ఒక వ్యక్తి, ‘మీరు ఒక్క వస్త్రంలో నమా’జు చదువుతున్నారు,’ అని అన్నాడు. దానికి జాబిర్ (ర), ‘నేను మీలాంటి అజ్ఞానులకు చూపించ టానికే ఇలా చదివాను, ప్రవక్త (స) కాలంలో ఎవరివద్ద రెండుజతలు ఉండేవి?” అని అన్నారు. [95](బు’ఖారీ)
771 – [ 18 ] ( ضعيف ) (1/240)
وَعَنْ أَبَيِّ بْنِ كَعْبٍ قَالَ: الصَّلَاةُ فِيْ الثَّوْبِ الْوَاحِدِ سُنَّةٌ كُنَّا نَفْعَلُهُ مَعَ رَسُوْلِ الله صلى الله عليه وسلم. وَلَا يُعَاب عَلَيْنَا. فَقَالَ ابْنُ مَسْعُوْدٍ: إِنَّمَا كَانَ ذَاكَ إِذْ كَانَ فِيْ الثِّيَابِ قِلَّةٌ فَأَمَّا إِذْ وَسَّعَ اللهُ فَالصَّلَاةُ فِيْ الثَّوْبَيْنِ أَزْكى. رَوَاهُ أَحْمَدُ.
771. (18) [1/240–బలహీనం]
ఉబయ్ బిన్ క’అబ్ (ర) కథనం: ఒక్క వస్త్రంలో నమా’జు చదవటం ప్రవక్త (స) సాంప్రదాయం. మేము ఒక్క వస్త్రంలోనే ప్రవక్త (స)తో కలసి నమా’జు చదివే వాళ్ళం. మమ్మల్ని ఎవ్వరూ అభ్యంతరం చేసేవారు కాదు. అయితే ’అబ్దుల్లాహ్ బిన్ మస్’ఊద్ (ర) అన్నారు, ‘బట్టలు తక్కువగా ఉండటం వల్ల అలా జరిగేది. కాని అల్లాహ్ (త) అధికంగా అనుగ్రహించ టంతో రెండు దుస్తుల్లో నమా’జు చదవటం మంచి దనిపించింది.’ (అ’హ్మద్)
=====
9– بَابُ السُّتْرَةِ
9. అడ్డుతెర (సుత్రహ్) అధ్యాయము
సుత్రహ్ అంటే అడ్డుతెర అని అర్థం. ఇక్కడ సుత్రహ్ అంటే మైదానంలో నమా’జు చదివినప్పుడు, ముందు నుండి ఎవరైనా వెళ్ళవచ్చనే భయం ఉన్నప్పుడు మీరు మీ ముందు బెత్తంగాని, చేతికర్రగాని, ఏదైనా వస్తువును గాని ఉంచుకోండి. దీనివల్ల మీ ముందు నుండి వెళ్ళే వ్యక్తి పాపానికి గురికాడు, మీ నమా’జుల్లోనూ అంతరాయం కలుగదు. ఒకవేళ మీరు సుత్రాగా ఏ వస్తువునైనా ఉంచకుంటే, ఎవరైనా మీ ముందు నుండి వెళితే మీ నమా’జుకు అంతరాయం కలుగుతుంది. దానివల్ల అతనికి పాపం చుట్టు కుంటుంది. ఒకవేళ అతనికి దాని పాపం తెలిస్తే 100 సంవత్సరాల వరకు వేచి ఉంటాడు గాని, నమా’జీ ముందు నుండి వెళ్ళడు. నమా’జులో ఎవరైనా మీ ముందు నుండి వెళ్ళే ప్రయత్నం చేస్తే, అతన్ని సైగచేసి ఆపండి. ఒకవేళ వినకపోతే చేత్తో అడ్డుకోండి. ఒకవేళ మీ ముందు చెట్టుగాని, స్తంభంగాని ఉంటే అదే సుత్రహ్ అవుతుంది. వేరే సుత్రహ్ ఉంచవలసిన అవసరం లేదు.
ఒకవేళ ఇమామ్ ముందు సుత్రహ్ ఉంటే, అది అందరి సుత్రహ్ గా సరిపోతుంది. ప్రతిఒక్కరికి ఒక సుత్రహ్ అవసరం లేదు. ఇమామ్ ముందు సుత్రహ్ ఉండగా ముఖ్తదీ ముందు నుండి ఎవరైనా వెళితే ఎటువంటి అభ్యంతరం లేదు. ఎందుకంటే ఇమామ్ యొక్క సుత్రహ్ అందరికీ వర్తిస్తుంది. దీన్ని గురించి క్రింది ‘హదీసు’లు పేర్కొనబడ్డాయి.
اَلْفَصْلُ الْأَوَّلُ మొదటి విభాగం
772 – [ 1 ] ( صحيح ) (1/241)
عَنِ ابْنِ عُمَرَ قَالَ: كَانَ النَّبِيُّ صلى الله عليه وسلم يَغْدُوْ إِلَى الْمُصَلى وَالْعَنَزَةُ بَيْنَ يَدَيْهِ تُحْمَلُ وَتُنْصَبُ بِالْمُصَلّى بَيْنَ يَدَيْهِ فَيُصَلِّيْ إِلَيْهَا. رَوَاهُ الْبُخَارِيُّ .
772. (1) [1/24–దృఢం]
ఇబ్నె ’ఉమర్ (ర) కథనం: ప్రవక్త (స) ఉదయం ప్రారంభ సమయంలో ’ఈద్గాహ్లో నమా’జు చదవ టానికి వెళ్ళి నపుడు, ఒక బల్లెం తీసుకుని వెళ్ళే వారు. ’ఈద్గాహ్లో దానిని ఖిబ్లవైపు నిలబెట్టి, దాని వైపు నమా’జు చదివేవారు. [96] (బు’ఖారీ)
773 – [ 2 ] ( متفق عليه ) (1/241)
وَعَنْ أَبِيْ جُحَيْفَةَ قَالَ: رَأَيْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم بِمَكَّةَ وَهُوَ بِالْأَبْطَحِ فِيْ قُبَّةِ حَمْرَاءٍ مِنْ أَدَمٍ وَرَأَيْتُ بِلَالًا أَخَذَ وُضُوْءَ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم. وَرَأَيْتُ النَّاسَ يَبْتَدِرُوْنَ ذَاكَ الْوُضُوْءَ فَمَنْ أَصَابَ مِنْهُ شَيْئًا تَمَسَّحَ بِهِ وَمَنْ لَمْ يُصِبْ مِنْهُ شَيْئًا أَخَذَ مِنْ بَلَلِ يَدِ صَاحِبِهِ. ثُمَّ رَأَيْتُ بِلَالًا أَخَذَ عَنْزَةً فَرَكَزَهَا. وَخَرَجَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم فِيْ حُلَّةٍ حَمْرَاءَ مُشَمِّرًا صَلَّى إِلَى الْعَنَزَةِ بِالنَّاسِ رَكْعَتَيْنِ. وَرَأَيْتُ النَّاسَ وَالدَّوَابَّ يَمُرُّوْنَ بَيْنَ يَدَي الْعَنَزَةِ .
773. (2) [1/241–ఏకీభవితం]
అబూ జు’హైఫ (ర) కథనం: నేను మక్కహ్ లో ప్రవక్త (స)ను అబ్’తహ్లో చర్మపు ఎర్రని ఖైమలో ఉండటం చూశాను. ఇంకా బిలాల్(ర) ప్రవక్త(స) వు’దూ చేయగా మిగిలిన నీటిని పట్టుకొని ఉండటం, ప్రజలు ఆ నీటిని పొందటానికి పరిగెత్తి వస్తూ, ఒకరిపై ఒకరు పోటీపడుతూ ఆ నీళ్ళు దొరికిన వారు ఆ నీటిని తమ ముఖాలకు, చేతులకు పులుముకుంటున్నారు. దొరకని వారు తన మిత్రుని తడి చేతులను తన చేతులతో తుడుచుకుంటూ ఉండగా చూశాను. ఆ తరువాత బిలాల్ (ర) ఒక బల్లాన్ని తీసుకొని వచ్చి పాతిపెట్టారు. అనంతరం ప్రవక్త (స) ఎర్రని దుస్తులు ధరించి వచ్చారు, బల్లెం వైపు నిలబడి రెండు రకాతులు నమా’జు చదివించారు. ఆ సమయంలో ప్రజలు, జంతువులు బల్లెం ముందు నుండి వస్తూపోతూ ఉండటం నేను చూశాను.” [97] (బు’ఖారీ, ముస్లిమ్)
774 – [ 3 ] ( متفق عليه ) (1/241)
وَعَنْ نَّافِعٍ عَنِ ابْنِ عُمَرَ: أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم كَانَ يَعْرُضُ رَاحِلَتَهُ فَيُصَلِّيْ إِلَيْهَا. وزَادَ الْبُخَارِيُّ قُلْتُ: أَفَرَأَيْتَ إِذَا هَبَّتِ الرِّكَابُ. قَالَ: كَانَ يَأْخُذُ الرَّحْلَ فَيُعَدِّلُهُ فَيُصَلِّيْ إِلَى آخِرَتِهِ.
774. (3) [1/241–ఏకీభవితం]
’అబ్దుల్లాహ్ బిన్ ’ఉమర్ ద్వారా నా’ఫె కథనం: ప్రవక్త (స) ఒక్కోసారి తన ఒంటెను సుత్రాగా ముందు కూర్చో బెట్టి దానివైపు నమా’జు చదివేవారు. (బు’ఖారీ, ముస్లిమ్)
బు’ఖారీలోని మరో ఉల్లేఖనంలో ఇలా ఉంది, ”నా’ఫె కథనం: ‘అబ్దుల్లాహ్ బిన్ ‘ఉమర్‌ను నేను, ‘ఒకవేళ ఈ ఒంటె మేతకు లేదా నీళ్ళకు వెళ్ళిపోతే, తమరు (స) దేన్ని సుత్రాగా చేసుకునే వారు,’ అని అడిగాను. దానికి అతను, ‘అటువంటప్పుడు కళ్లెం సరిచేసి ఉంచుకుని, దాన్ని సుత్రాగా చేసుకొని నమాజు చదివే వాడిని,’ అని అన్నారు.
775 – [ 4 ] ( صحيح ) (1/242)
وَعَنْ طَلْحَةَ بْن عُبَيْدِ اللهِ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِذَا وَضَعَ أَحْدُكُمْ بَيْنَ يَدَيْهِ مِثْلَ مُؤَخِّرَةِ الرَّحْلِ فَلْيُصَلِّ وَلَا يُبَالَ مَنْ مَرَّ وَرَاءَ ذَلِكَ”. رَوَاهُ مُسْلِمٌ.
775. (4) [1/242–దృఢం]
’తల్’హా బిన్ ’ఉబైదుల్లాహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మీలో ఎవరైనా తన ముందు మావటి వెనుక భాగం కర్రలాంటి ఎత్తైన వస్తువును సుత్రాగా ఉంచుకొని నమా’జు చదివితే ముందు నుండి ఎవరు వెళ్ళినా ఫర్వాలేదు. అంటే, నమా’జు చదువు తున్నవారికి లేదా ముందు నుండి వెళ్ళేవారికి ఎటు వంటి అభ్యంతరం లేదు. (ముస్లిమ్)
776 – [ 5 ] ( متفق عليه ) (1/242)
وَعَنْ أَبِيْ جُهَيْمٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَوْ يَعْلَمُ الْمَارُّ بَيْنَ يَدَيِ الْمُصَلِّيْ مَاذَا عَلَيْهِ لَكَانَ أَنْ يَّقِفَ أَرْبَعِيْنَ خَيْرًا لَّهُ مَنْ أَنْ يَّمُرَّ بَيْنَ يَدَيْهِ”. قَالَ أبُوْ النَّضْرِ: لَا أَدْرِيْ قَالَ: “أَرْبَعِيْنَ يَوْمًا أَوْ شَهْرًا أَوْ سَنَةً”.
776. (5) [1/242–ఏకీభవితం]
అబూ జుహైమ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”నమా’జు చదివేవాడి ముందు నుండి వెళ్ళేవారు అలా వెళ్ళడం వల్ల కలిగే పాపం గురించి తెలిస్తే, వారు, 40 వరకు వేచి ఉండడమే మేలనుకుంటారు.
అబూ నద్ర్ (ర) కథనం: నలభై అంటే ఏమిటో నాకు తెలియదు 40 రోజులు, లేదా 40 నెలలు లేదా 40 సంవ త్సరాలు కావచ్చు.” (బు’ఖారీ, ముస్లిమ్)
777 – [ 6 ] ( صحيح ) (1/242)
وَعَنْ أَبِيْ سَعِيْدٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِذَا صَلَّى أَحَدُكُمْ إِلَى شَيْءٍ يَسْتُرُهُ مِنَ النَّاسِ فَأَرَادَ أَحَدٌ أَنْ يَّجْتَازَ بَيْنَ يَدَيْهِ فَلْيَدْفَعْهُ فَإِنْ أَبَى فَلْيُقَاتِلْهُ فَإِنَّمَا هُوَ شَيْطَانٌ”. هَذَا لَفْظُ الْبُخَارِيُّ وَلِمُسْلِمٍ مَعْنَاهُ .
777. (6) [1/242–దృఢం]
అబూ స’యీద్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మీలో ఎవరైనా తన ముందు ఏదైనా వస్తువు ఉంచి నమా’జు చదువుతున్నప్పటికీ, అతని ముందు నుండి ఎవరైనా వెళ్ళదలచుకుంటే, నమా’జు చదివే వ్యక్తి అతన్ని ఆపాలి, అయినా ఆ వ్యక్తి వినకపోతే కఠినంగా వ్యవహ రించి ఎలాగైనా ఆపాలి. ఎందుకంటే ఆ వెళ్ళేవాడు తల బిరుసుతనం గల షై’తాన్ వంటి వాడు. [98] (బు’ఖారీ, ముస్లిమ్)
778 – [ 7 ] ( صحيح ) (1/242)
وَعَنْ أَبِيْ هُرَيْرَةَ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “تَقْطَعُ الصَّلَاةُ الْمَرْأَةُ وَالْحِمَارُ وَالْكَلْبُ. وَبَقَى ذَلِكَ مِثْلُ مُؤَخِّرَةِ الرَّحْلِ”. رَوَاهُ مُسْلِمٌ .
778. (7) [1/242–దృఢం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”నమా’జు చదువుతున్న వ్యక్తి ముందు నుండి స్త్రీలు, గాడిదలు, కుక్కలు వెళితే నమా’జుకు అంతరాయం కలుగుతుంది. మావటి వెనుక భాగం కర్రలాంటి వస్తువు ముందు ఉంచుకుంటే, నమా’జుకు అంత రాయం కలుగదు.” [99] (ముస్లిమ్)
779 – [ 8 ] ( متفق عليه ) (1/242)
وَعَنْ عَائِشَةَ قَالَتْ: كَانَ النَّبِيُّ صلى الله عليه وسلم يصَلِّيْ مِنَ اللَّيْلِ وَأَنَا مُعْتَرِضَةٌ بَيْنَهُ وَبَيْنَ الْقِبْلَةِ كَاِعْتِرَاضِ الْجَنَازَةِ .
779. (8) [1/242–ఏకీభవితం]
’ఆయి‘షహ్ (ర) కథనం: ప్రవక్త (ర) రాత్రి పూట నమా’జు చదివేవారు. అప్పుడు నేను ఆయనకు ఖిబ్లాకు మధ్య జనా’జహ్ వలే పడుకొని ఉండే దాన్ని. [100](బు’ఖారీ, ముస్లిమ్)
780 – [ 9 ] ( متفق عليه ) (1/243)
وَعَنِ ابْنِ عَبَّاسٍ قَالَ: أَقْبَلْتُ رَاكِبًا عَلَى أَتَانٍ وَأَنَا يَوْمَئِذٍ قَدْ نَاهَزْتُ الْاِحْتِلَامَ وَرَسُوْلُ اللهِ صلى الله عليه وسلم يُصَلِّيْ بِالنَّاسِ بِمِنى إِلَى غَيْرِ جِدَارٍ فَمَرَرْتُ بَيْنَ يَدَيْ الصَّفِّ فَنَزَلْتُ فَأَرْسَلْتُ الْأَتَانَ تَرْتَعُ وَدَخَلْتُ فِيْ الصَّفِّ فَلَمْ يُنْكِرْ ذَلِكَ عَلَى أَحَدٍ
780. (9) [1/243–ఏకీభవితం]
ఇబ్నె ’అబ్బాస్ (ర) కథనం: నేనొకసారి గాడిదపై ఎక్కి వచ్చాను. అప్పుడు నేను యుక్త వయస్సుకు చేరుకో బోతున్నాను. ప్రవక్త (స) మినాలో ప్రజలకు నమా’జు చదివిస్తున్నారు. అప్పుడు అక్కడ సుత్రా ఏమీ లేదు. నేను ముఖ్తదీల పంక్తి ముందు కొంత దూరం వెళ్ళి, గాడిదపై నుండి దిగి, గాడిదను మేయ డానికి వదలివేసి, పంక్తిలో కలసి పోయాను. దీనిపై నాకు ఎవ్వరూ ఏమీ అనలేదు. [101] (బు’ఖారీ, ముస్లిమ్)
—–
اَلْفَصْلُ الثَّانِيْ రెండవ విభాగం
781 – [ 10 ] ( ضعيف ) (1/243)
وَعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِذَا صَلَّى أَحَدُكُمْ فَلْيَجْعَلْ تِلْقَاءَ وَجْهِهِ شَيْئًا فَإِنْ لَّمْ يَجِدْ فَلْيَنْصِبْ عَصَاهُ فَإِنْ لَمْ يَكُنْ مَّعَهُ عَصَى فَلْيَخْطُطْ خَطًّا ثُمَّ لَا يَضُرُّهُ مَا مَرَّ أَمَامَهُ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ وَابْنُ مَاجَهُ .
781. (10) [1/243–బలహీనం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మీలో ఎవరైనా నమా’జు చదివినపుడు, తన ముందు ఏదైనా వస్తువు ఉంచుకోవాలి. ఏదీ దొరక్క పోతే చేతికర్ర అయినా పెట్టుకోవాలి. ఒకవేళ చేతి కర్ర కూడా లేకపోతే నేలపై గీత అయినా గీసుకోవాలి. ముందు నుండి ఎవరు వెళ్ళినా అతని నమా’జుకు ఎటువంటి అంతరాయం కలుగదు. (అబూ దావూ‘ద్, ఇబ్నె మాజహ్)
782 – [ 11 ] ( صحيح ) (1/243)
وَعَنْ سَهْلِ بْنِ أَبِيْ حَثْمَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِذَا صَلَى أَحْدُكُمْ إِلَى سُتْرَةٍ فَلْيَدْنُ مِنْهَا لَا يَقْطَعُ الشَّيْطَانُ عَلَيْهِ صَلَاتِهِ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ.
782. (11) [1/243–దృఢం]
సహల్ బిన్ అబీ ’హస‘మహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మీలో ఎవరైనా సుత్రా వైపు నమా’జు చదివితే, సుత్రాకు దగ్గరగా నిలబడాలి. షై’తాన్, అల్లరి మూకలు అతని నమా’జును అంతరాయం కలిగించలేరు.” (అబూ దావూ‘ద్)
83 – [ 12 ] ( ضعيف ) (1/243)
وَعَنِ الْمِقْدَادِ بْنِ الْأَسْوَدِ قَالَ: مَا رَأَيْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يُصَلِّيْ إِلَى عَوْدٍ وَلَا عَمُودٍ وَلَا شَجَرَةٍ إِلَّا جَعَلَهُ عَلَى حَاجِبِهِ الْأَيْمَنِ أَوِ الْأَيْسَرِ وَلَا يَصْمُدُ لَهُ صَمْدًا. رَوَاهُ أَبُوْ دَاوُدَ .
783. (12) [1/243–బలహీనం]
మిఖ్దాద్ బిన్ అస్వద్ (ర) కథనం: ప్రవక్త (స) నమా’జు చదివినపుడు కర్రనుగాని, సుత్రానుగాని, చెట్టును గాని సరిగ్గా తన ముందు ఉంచుకోవటం నేను చూడలేదు. కాని ప్రవక్త (స) కొంత కుడిప్రక్కకు, లేదా కొంచెం ఎడమ ప్రక్కకు తప్పించి ఉంచుకునే వారు. కాని సరిగ్గా తనముందు నిటారుగా ఉంచుకునేవారు కాదు. [102](అబూ దావూ‘ద్)
784 – [ 13 ] ( ضعيف ) (1/244)
وَعَنِ الْفَضْلِ بْنِ عَبَّاسٍ قَالَ: أَتَانَا رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم وَنَحْنُ فِيْ بَادِيَةِ لَنَا وَمَعَهُ عَبَّاسٌ فَصَلَّى فِيْ صَحْرَاءِ لَيْسَ بَيْنَ يَدَيْهِ سُتْرَةٌ وَحِمَارَةٌ لَنَا وَكَلْبَةٌ تَعْبَثَانِ بَيْنَ يَدَيْهِ فَمَا بَالَى ذَلِكَ. رَوَاهُ أَبُوْ دَاوُدَ وَلِلنَّسَائِيُّ نَحْوَهُ .
784. (13) [1/244–బలహీనం]
ఫ’దల్ బిన్ ’అబ్బాస్ (ర) కథనం: మేము అడవిలో ఉన్నాం. మా వెంట ’అబ్బాస్ (ర) కూడా ఉన్నారు. ప్రవక్త (స) మా వద్దకు వచ్చారు. ప్రవక్త (స) అక్కడే నమా’జు చదివించారు. ఆయన ముందు సుత్రా లేదు. మా గాడిద మరియు కుక్క ఆయన ముందు తిరుగాడుతూ ఉన్నాయి. ప్రవక్త (స) ఏమాత్రం పట్టించుకోలేదు. [103](అబూ దావూ‘ద్, నసాయి‘)
785 – [ 14 ] ( ضعيف ) (1/244)
وَعَنْ أَبِيْ سَعِيْدٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَا يَقْطَعُ الصَّلَاةَ شَيْءٌ وَاَدْرَؤُوْا مَا اسْتَطَعْتُمْ فَإِنَّمَا هُوَ شَيْطَانٌ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ.
785. (14) [1/244–బలహీనం]
అబూ స’యీద్ ’ఖుద్రీ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”నమా’జీ ముందు నుండి వెళ్ళే ఏ వస్తువు నమా’జుకు భంగం కలిగించదు. అయితే సాధ్యం అయినంత వరకు నమా’జీ ముందు నుండి వెళ్ళే వారిని అడ్డుకోండి. ఎందు కంటే వెళ్ళేవాడు తలబిరుసుతనం గల షై’తాన్ అయి ఉంటాడు.” [104](అబూ దావూద్)
—–
اَلْفَصْلُ الثَّالِثُ మూడవ విభాగం
786 – [ 15 ] ( متفق عليه ) (1/244)
عَنْ عَائِشَةَ قَالَتْ: كُنْتُ أُنَامُ بَيْنَ يَدَيْ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم وَرِجْلَايَ فِيْ قِبْلَتِهِ فَإِذَا سَجَدَ غمَزَنِيْ فَقَبَضْتُ رِجْلَيَّ وَإِذَا قَامَ بَسَطْتّهُمَا قَالَتْ: وَالْبُيُوْتُ يَوْمَئِذٍ لَيْسَ فِيْهَا مَصَابِيْحُ .
786. (15) [1/244–ఏకీభవితం]
’ఆయి‘షహ్ (ర) కథనం: ప్రవక్త (స) రాత్రి తహజ్జుద్ నమా’జు చదివినపుడు, నేను పండుకొని ఉండేదాన్ని. ప్రవక్త (స) సజ్దా చేసినపుడు నా కాళ్ళను నొక్కేవారు. వెంటనే నేను నా కాళ్ళను ముడుచుకునేదాన్ని. ప్రవక్త (స) సజ్దాచేసి లేవగానే మళ్ళీ నా కాళ్ళను తిన్నగా చేసుకునే దాన్ని. అప్పుడు మా ఇంటిలో దీపం ఉండేది కాదు. [105](బు’ఖారీ, ముస్లిమ్)
787 – [ 16 ] ( ضعيف ) (1/244)
وَعَنْ أَبِيْ هُرَيْرَةَ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَوْ يَعْلَمُ أَحَدُكُمْ مَا لَهُ فِيْ أَنْ يَّمُرَّ بَيْنَ يَدَيْ أَخِيْهِ مُعْتَرِضًا فِيْ الصَّلَاةِ كَانَ لأنَ يُّقِيْمَ مِائَةَ عَامٍ خَيْرٌ لَهُ مِنَ الْخُطْوَةِ الَّتِيْ خَطَا”. رواه ابن ماجه.
787. (16) [1/244–బలహీనం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”నమా’జీ ముందు నుండి వెళ్ళేవారికి అలా వెళ్ళడం ఎంత పాపమో తెలిస్తే 100 సంవత్సరాలైనా వేచి ఉండటం నమా’జీ ముందు నుండి వెళ్ళడం కంటే మంచిది అని భావిస్తారు.” (ఇబ్నె మాజహ్)
788 – [ 17 ] ( موقوف ) (1/245)
وَعَنْ كَعْبِ الْأَحْبَارِ قَالَ: لَوْ يَعْلَمُ الْمَارُّ بَيْنَ يَدَيِ الْمصَلِّيْ مَاذَا عَلَيْهِ لَكَانَ أَنْ يُّخْسَفَ بِهِ خَيْرًا مَنْ أَنْ يَّمُرَّ بَيْنَ يَدَيْهِ.
وَفِيْ رِوَايَةٍ: أَهْوَنَ عَلَيْهِ. رَوَاهُ مَالِكٌ .
788. (17) [1/245–సహచరుని ప్రోక్తం]
క’అబ్ అల్ అ’హ్బార్ (ర) కథనం: నమా’జీ ముందు నుండి వెళ్ళేవారికి అలా వెళ్ళడం ఎంత పాపమో తెలిస్తే, తాను భూమిలో కూరుకుపోవడం నమా’జీ ముందునుండి వెళ్ళడంకంటే మంచిదని భావిస్తాడు. (మాలిక్)
789 – [ 18 ] ( ضعيف ) (1/245)
وَعَنِ ابْنِ عَبَّاسٍ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِذَا صَلَّى أَحَدُكُمْ إِلى غَيْرِ السُّتْرَةِ فَإِنَّهُ يَقْطَعُ صَلَاتَهُ الْحِمَارُ وَالْخِنْزِيْرُ وَالْيَهُوْدِيُّ وَالْمَجُوْسِيُّ وَالْمَرْأَةُ وَتُجْزِئُ عَنْهُ إِذَا مَرُّوْا بَيْنَ يَدَيْهِ عَلَى قَذْفَةٍ بِحَجْرٍ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ .
789. (18) [1/245–బలహీనం]
ఇబ్నె ’అబ్బాస్ (ర) కథనం: మీలో ఎవరైనా సుత్రా పెట్టకుండా నమా’జు చదివితే, ఒకవేళ అతని ముందు నుండి గాడిద, పంది, యూదుడు, మజూసీ లేక స్త్రీ అడ్డుగా వెళితే అతని భక్తిశ్రద్ధలకు భంగం కలుగు తుంది. అదే ఒకవేళ ఒకరాయి విసిరినంత దూరం నుండి అడ్డుగా వెళితే, నమా’జులో ఎటువంటి లోపంరాదు. [106] (అబూ దావూ‘ద్)
=====
10– بَابُ صِفَةِ الصَّلَاةِ
10. నమా’జు విధానం
నమా’జు ఆచరించటానికి దాని షరతులు, విధానాలు, నియమనిబంధనలు తెలుసుకోవడం తప్పనిసరి. నమా’జుకు 7 షరతులు ఉన్నాయి. ఇవి లేకుండా నమా’జు నెరవేర జాలదు.
7 షరతులు (ఫ’ర్ద్): 1. శరీరం పరిశుభ్రంగా ఉండాలి. 2. దుస్తులు పరిశుభ్రంగా ఉండాలి. 3. నమా’జు చదివే స్థలం పరిశుభ్రంగా ఉండాలి. 4. మర్మాంగాలు కప్పబడి ఉండాలి. 5. నమా’జు సమయం కావాలి. 6. ఖిబ్లాకు అభిముఖంగా ఉండాలి. 7. నమా’జు సంకల్పం చేయాలి.
నమా’జులో 10 ముఖ్య విధులు (అర్కాన్ / వాజిబ్) ఉన్నాయి: 1. తక్బీరె త’హ్రీమ, 2. ఖియామ్, 3. సూ. ఫాతి’హా మరియు ఖుర్ఆన్ పఠనం, 4. రుకూ‘, 5. రెండు సజ్దాలు, 6. విధులను సరిగ్గా ఆచరించటం, 7. క్రమం, 8. సంఖ్య, 9. తషహ్హుద్, 10. తస్లీమ్.
ఇంకా 31 సున్నతులు ఉన్నాయి. షరతులు (ఫ’ర్ద్), విధులు (వాజిబ్), సున్నతులు మొదలైన వాటిని దృష్టిలో పెట్టుకొని నమా’జును ఆచరించాలి. నమా’జు విధానాన్ని సంక్షిప్తంగా ఇక్కడ పేర్కొనడం జరిగింది.
నమా’జు వేళ అయితే, నమా’జు సంకల్పం చేసు కోండి. ముందు శరీరాన్ని శుభ్రపరచుకోండి. అంటే స్నానం అవసరమయితే స్నానం చేసుకోండి, వు’దూ అవసరం అయితే వు’దూ చేసుకోండి. పరిశుభ్రమైన బట్టలు ధరించండి. మస్జిద్లో లేదా మరెక్కడైనా పరిశుభ్రమైన స్థలంలో ఖిబ్లావైపు తిరిగి నిటారుగా నిలబడండి. రెండు అడుగుల మధ్య ఇంచుమించు జానెడు దూరం ఉండాలి. రెండు కాళ్ళ వ్రేళ్ళు ఖిబ్లా వైపు ఉండాలి. హృదయం నుండి ప్రాపంచిక విష యాలను తీసి వేసి, ఏ నమా’జు చదవగోరు తున్నారో మనసులో దాని సంకల్పం చేయండి. ఒకవేళ విధి నమా’జు చదవాలనుకుంటే విధి నమా’జు చేయండి. నమా’జు చదివే ప్రతిసారి సంకల్పం చేయాలి. ఆ తరువాత రఫ’అ యదైన్ చేయండి. అంటే రెండు చేతులను భుజాల వరకు లేదా రెండు చెవుల క్రింది భాగం వరకు ఎత్తాలి. అరచేతులు ఖిబ్లావైపు ఉండాలి. అప్పుడు అల్లాహు అక్బర్ అని పలికి రెండు చేతులను గుండెపై కుడి చేతిని ఎడమ చేతిపై కట్టు కోవాలి. అంటే ఎడమ అరచేయి మరియు మణికట్టుపై కుడి అరచేయి మరియు మణికట్టు ఉండాలి. తన దృష్టిని సజ్దా స్థలంపై కేంద్రీకరించి ఉంచాలి. అటూఇటూ క్రిందమీద చూడరాదు. ఆ తరువాత మెల్లగా, ”అల్లాహుమ్మ బాయిద్ బైనీ వ బైన ఖతాయాయా…” చివరి వరకు చదవాలి. ఆ తరువాత మెల్లగా, ”అ’ఊజు బిల్లాహి మినష్షై’తానిర్రజీమ్” మరియు ”బిస్మిల్లాహిర్ర’హ్మా నిర్ర’హీమ్” పఠించిన తర్వాత సూరహ్ ఫాతి’హా పఠించాలి. బిగ్గరగాచదివే నమా’జులో అయితే బిగ్గరగా, మెల్లగా చదివే నమా’జులో అయితే మెల్లగా.
సూరహ్ ఫాతి’హా పూర్తయిన తర్వాత అందరూ ఆమీన్ అని పలకాలి. బిగ్గరగా చదివే నమా’జులో ఆమీన్ అని బిగ్గరగా, మెల్లగా చదివే నమా’జులో అయితే మెల్లగా ఆమీన్ అని పలకాలి. ఆ తరువాత కొంతసేపు ఆగి, ”బిస్మిల్లాహిర్ర’హ్మా నిర్ర’హీమ్” పలికి ఖుర్ఆన్లో నుండి ఎంతో కొంత మీకు గుర్తున్నది పఠించాలి. దాన్ని ముగించిన తర్వాత, ”అల్లాహు అక్బర్” అని పలుకుతూ రఫ’అ యదైన్ చేస్తూ రుకూ‘లోకి వెళ్ళాలి. రుకూలో వీపు బల్లపరుపుగా ఉంచి, రెండు చేతులతో మోకాళ్ళ ను పట్టుకొని ఉండాలి. చంకలు పూర్తిగా విప్పి ఉంచాలి. చేతి వ్రేళ్ళను దూరంగా ఉంచాలి. మోచేతులు తిన్నగా ఉంచాలి. దృష్టి సజ్దా స్థలంపై ఉంచాలి. ఇంకా రుకూ‘ లోని దు’ఆ ”సుబ్’హాన రబ్బియల్అ”జీమ్” 3 నుండి 10 సార్లు వరకు పలకాలి. అయితే మూడు కంటే తక్కువ ఉండరాదు. ”సమి అల్లాహులిమన్ ’హమిదహ్” అని పలుకుతూ రఫ’అ యదైన్ చేస్తూ తిన్నగా నిలబడి చేతులు దించివేయాలి. ఇలా నిలబడటాన్ని ఖామ అంటారు. ఇందులో ”రబ్బనా లకల్ ’హమ్దు ’హమ్దన్, కసీ‘రన్ తయ్యిబన్ ముబారకన్ ఫీహ్,” అని పలకాలి.
ఆ తరువాత ”అల్లాహు అక్బర్,” అని పలుకుతూ సజ్దాలోకి వెళ్ళాలి. నేలపై ముందు చేతులు ఉంచాలి. తరువాత మోకాళ్ళు ఉంచాలి. తరువాత ముక్కు మరియు నుదురు ఉంచాలి. రెండు చేతులను చెవులకు లేదా భుజాలకు సమానంగా, కొంత దూరంగా, అరచేతులు క్రింద ఉండి, చేతివ్రేళ్ళు కలసి ఉండాలి. ఇంకా అరచేయి, వ్రేళ్ళు, మోకాళ్ళు, కాళ్ళవ్రేళ్ళు నేలపై ఆనించి ఉంచాలి. కాళ్ళవ్రేళ్ళు ఖిబ్లావైపు ఉండాలి. మోచేతులను, ప్రక్కటెముకలకు, కడుపుకు తొడలకు దూరంగా ఉంచాలి. మోచేతులను నేలపై ఆనించి ఉంచరాదు. సజ్దాలో ఈదు’ఆను 3 నుండి 10సార్లు వరకు పలకాలి. ”సుబ్హానకల్లాహుమ్మ రబ్బనా వబి ’హమ్దిక అల్లాహుమ్మ’గ్ ఫిర్లీ సుబ్బూ’హున్ ఖుద్దూసున్ రబ్బుల్ మలాయికతి వర్రూహ్.”
ఈ దు’ఆ పఠించిన తర్వాత ”అల్లాహు అక్బర్,” అని పలుకుతూ ముందు తల ఆవెంటనే రెండు చేతులు నేలపై నుండి ఎత్తాలి. తిన్నగా కూర్చోవాలి. అయితే ఎడమకాలు పరచి దానిపై కూర్చొని, కుడికాలు వ్రేళ్ళు ఖిబ్లావైపు ఉండేటట్టు నిలబెట్టాలి. కుడిచేతిని కుడిమోకాలిపై, ఎడమచే తిని ఎడమ మోకాలిపై పెట్టాలి. నిదానంగా ఈ దు’ఆను చదవాలి.
”అల్లాహుమ్మ’గ్ఫిర్లీ వర్’హమ్నీ వహ్దినీ వ’ఆఫినీ వర్ ’జుఖ్నీ.” — ‘ఓ అల్లాహ్! నన్ను క్షమించు, నన్ను కనికరించు, నాకు రుజుమార్గం చూపించు, నాకు క్షేమాన్ని ప్రసాదించు, ఇంకా నాకు ఉపాధి ప్రసాదించు.’
ఆ తరువాత ”అల్లాహు అక్బర్,” అని పలుకుతూ రెండవ సజ్దాలోకి వెళ్ళాలి. మొదటి సజ్దాలా రెండవ సజ్దాను పూర్తిచేయాలి. ఆ తరువాత, ”అల్లాహు అక్బర్,” అని లేచి కూర్చొని, రెండవ రకాత్ కోసం లేచి నిలబడాలి. ముందు మోకాళ్ళు, తరువాత రెండు చేతులను లేపి తిన్నగా నిలబడాలి. ఇంతకు ముందులా చేతులు కట్టుకొని, ”బిస్మిల్లాహ్…” పఠించి సూరహ్ ఫాతి’హా మరియు మరో సూరహ్ ఏదైనా చదవాలి. ఒకవేళ ఇమామ్ వెనుక ఉంటే కేవలం సూరహ్ ఫాతి’హా మాత్రమే చదవాలి. ఒంటరిగా ఉంటే సూరహ్ ఫాతి’హా మరియు మరో సూరహ్ చదవాలి. మొదటి రక’అత్లా రుకూ‘, ఖామహ్, సజ్దా, జల్సా చేయాలి. రెండవ రక’అత్ తర్వాత ఖ’అదహ్ చేయాలి. అంటే కుడికాలు నిలబెట్టి, ఎడమకాలు పరచి దానిపై కూర్చోండి. కుడికాలి వ్రేళ్ళు ఖిబ్లావైపు ఉండాలి. కుడి చేతిని కుడిమోకాలిపై, ఎడమచేతిని ఎడమ మోకాలిపై ఉంచాలి. కుడిచేతి మధ్యవేలు, బొటనవ్రేలు రెంటిని కలిపి గుండ్రంగా చేసి, చూపుడువేలుతో సైగచేస్తూ ఉండాలి. అప్పుడు చూపుడు వ్రేలుపై దృష్టి ఉంచాలి. రెండు మోచేతులను తొడలకు దూరంగా ఉంచాలి. తషహ్హుద్ అంటే ”అత్తహియ్యాతు…” చదవాలి. తషహ్హుద్ పూర్తిచేసిన తర్వాత ”దరూద్…” చదవాలి.
దరూద్ తర్వాత అనేక దు’ఆలు ఉన్నాయి. వాటిని చదవండి. వీటిని చదివిన తర్వాత ముందు కుడివైపు తలత్రిప్పి ”అస్సలాము ‘అలైకుమ్ వర’హ్మతుల్లాహి వ బరకా తుహూ,” అని పలికిన తరువాత ఎడమప్రక్క తలత్రిప్పి అదేవిధంగా పలకాలి.
ఒకవేళ 4 రక’అతుల నమా’జు అయితే తషహ్హుద్ తర్వాత అల్లాహు అక్బర్ అని పలుకుతూ, మూడవ రక’అత్ కోసం నిలబడాలి. రఫ’అ యదైన్ చేసి గుండెపై చేతులు కట్టుకోవాలి. కేవలం సూరహ్ ఫాతి’హా చదవాలి. మరో సూరహ్ అంతకు ముందు రెండు రక’అతుల్లా చదవనవసరం లేదు. ఇమామ్, ముఖ్తదీలకు ఒకే ఆదేశం. తరువాతి రెండు రక’అతుల్లో రుకూలోనికి వెళ్ళినపుడు, రుకూ నుండి లేచినపుడు రఫ్ఉల్ యదైన్ చేయాలి. ఇంకా ఖామహ్, సజ్దా, జల్సాలో మొదటి దు’ఆలే చదవాలి. చివరి ఖా’అదహ్ లో తవర్రుక్ చేసి కూర్చోవాలి. ఇంకా తషహ్హుద్, దరూద్ మొదలైనవి చదివి ఇంతకు ముందులా సలామ్ పలకాలి. ఒక వేళ సున్నత్ లేదా నఫిల్ 4రక’అతులు చదివితే 4 రక’అతుల్లోనూ సూరహ్ ఫాతి’హా తోపాటు మరో సూరహ్ తప్పకుండా చదవాలి. ఒకవేళ మ’గ్రిబ్ నమా’జు 3 రక’అతులు చదివితే, రెండు రక’అతులు చదివి కూర్చోని తషహ్హుద్ చదివి అల్లాహు అక్బర్ అని పలుకుతూ నిలబడాలి. రఫ్’ఉల్ యదైన్ చేసి చేతులు గుండెపై కట్టుకోవాలి. సూరహ్ ఫాతి’హా చదివి, రుకూ, సజ్దాలు చేసి కూర్చోని తషహ్హుద్, దరూద్ చదివి సలామ్ పలికి నమా’జు ముగించాలి.
ఒకవేళ విత్ర్ మూడు రక’అతులు చదివితే, మూడు రక’అతులు వరుసగా చదవాలి, మధ్య కూర్చోరాదు మూడవ రక’అతు రుకూ‘ తర్వాత లేచి నిలబడి దు’ఆయె ఖునూత్ చదవాలి: ”అల్లాహుమ్మహ్దినీ ఫీమన్ హదైత వ ’ఆఫినీ ఫీమన్ ’ఆఫైత వతవల్లనీ ఫీమన్ తవల్లైత, వ బారిక్‌లీ ఫీమా ఆతైత, వఖినీ షర్రమా ఖ’దైత, ఫ ఇన్నక తఖ్’దీ వలా యుఖ్’దా అలైక. ఇన్నహు, లాయజి‘ల్లు మన్ వా లైత, వలా య’ఇ’జ్జు మన్ ’ఆదైత. తబారక్త రబ్బనా వత’ఆలైత. నస్త’గ్ఫిరుక వ నతూబు ఇలైక వ సల్లల్లాహు అలన్నబీ.”
విత్ర నమా’జ్ తర్వాత మూడుసార్లు ”సుబ్’హానల్ మలికిల్ ఖుద్దూస్” అని పలకాలి. మూడవసారి బిగ్గరగా పలకాలి. అదేవిధంగా విధి నమా’జుల తర్వాత ఒకసారి బిగ్గరగా ”అల్లాహు అక్బర్,” అని పలకాలి. ఆ తరువాత మూడుసార్లు అస్తగ్ఫిరుల్లాహ్ అని పలకాలి. ఆ తరువాత క్రింద పేర్కొనబడిన దు’ఆలు చదవాలి. వీటన్నిటి సాక్ష్యాధారాలు క్రింద పేర్కొనబడ్డాయి. ఇదే ప్రవక్త (స) నమా’జు విధానం.
اَلْفَصْلُ الْأَوَّلُ మొదటి విభాగం
790 – [ 1 ] ( متفق عليه ) (1/246)
عَنْ أَبِيْ هُرَيْرَةَ رَضِيَ اللهُ عَنْهُ: أَنَّ رَجُلًا دَخَلَ الْمَسْجِدُ وَرَسُوْلُ اللهِ صلى الله عليه وسلم جَالِسٌ فِيْ نَاحِيَةَ الْمَسْجِدِ فَصَلّى ثُمَّ جَاءَ فَسَلَّمَ عَلَيْهِ. فَقَالَ لَهُ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “وَعَلَيْكَ السَّلَامُ اِرْجِعْ فَصَلِّ فَإِنَّكَ لَمْ تُصَلِّ”. فَرَجَعَ فَصَلَّى ثُمَّ جَاءَ فَسَلَّمَ فَقَالَ: “وَعَلَيْكَ السَّلَامُ اِرْجِعْ فَصَلِّ فَإِنَّكَ لَمْ تُصَلِّ”. فَقَالَ فِيْ الثَّالِثَةِ أَوْ فِيْ الَّتِيْ بَعْدَهَا عَلَّمْنِيْ يَا رَسُوْلَ اللهِ. فَقَالَ: “إِذَا قُمْتَ إِلَى الصَّلَاةِ فَأَسْبَغِ الْوُضُوْءَ ثُمَّ اسْتَقْبَلَ الْقِبْلَةَ فَكَبَّرَ ثُمَّ اقْرَأَ بِمَا تَيَسَّرَ مَعَكَ مِنَ الْقُرْآنِ ثُمَّ ارْكَعْ حَتَّى تَطْمَئِنَّ رَاكِعًا ثُمَّ ارْفَعْ حَتَّى تَسْتَوِيْ قَائِمًا ثُمَّ اسْجَدَ حَتَّى تَطْمَئِنَّ سَاجِدًا ثُمَّ ارْفَعْ حَتَّى تَطْمَئِنَّ جَالِسًا ثُمَّ اسْجُدَ حَتَّى تَطْمَئِنَّ سَاجِدًا ثُمَّ ارْفَعْ حَتَّى تَطْمَئِنَّ جَالِسًا”.
وَفِيْ رِوَايَةِ: “ثُمَّ ارْفَعْ حَتَّى تَسْتَوِيْ قَائِمًا ثُمَّ افْعَلَ ذَلِكَ فِيْ صَلَاتِكَ كُلِّهَا”.
790. (1) [1/246–ఏకీభవితం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) మస్జిద్లో ఒక మూల కూర్చొని ఉన్నారు. ఒక వ్యక్తి వచ్చి నమా’జు ముగించుకొని ప్రవక్త (స) వద్దకు వచ్చి సలామ్ చేశాడు. ప్రవక్త (స) అతనికి సలాముకు సమాధానం ఇచ్చి, ‘నువ్వు నమా’జును మళ్ళీ తిరిగి చదువు, ఎందుకంటే నువ్వు నమా’జు చదవనే లేదు,’ అని అన్నారు. ఆ వ్యక్తి తిరిగి మళ్ళీ నమా’జు చదివాడు. ఆ వ్యక్తి ప్రవక్త (స) వద్దకు వచ్చి సలామ్ చేశాడు. ప్రవక్త (స) అతని సలామ్‌కు సమాధానం ఇచ్చి, ‘నమా’జును తిరిగి మళ్ళీ చదువు, ఎందు కంటే నీవు నమా’జు చదవనే లేదు,’ అని అన్నారు. అదేవిధంగా ఆ వ్యక్తి మూడు లేక నాలుగు సార్లు చేశాడు. మూడవ లేక నాల్గవ సారి ఆ వ్యక్తి, ‘ఓ ప్రవక్తా! నమా’జు ఎలా చదవాలో నాకు నేర్పండి,’ అని విన్నవించుకున్నాడు. అప్పుడు ప్రవక్త (స), ‘నీవు నమా’జుకు సిద్ధమైనపుడు అన్నిటికంటే ముందు పరిపూర్ణంగా వు’దూ చేసుకో. ఆ తరువాత ఖిబ్లా వైపు ముఖంచేసి నిలబడి, ”అల్లాహు అక్బర్” అని పలుకు, ఆ తరువాత ఖుర్ఆన్ లోనీకు గుర్తు ఉన్నది పఠించు. ఆ తరువాత రుకూ‘ చేయి, అయితే రుకూ‘ నిదానంగా చేయి. ఆ తరువాత రుకూ నుండి తలఎత్తి నిటారుగా నిలబడు. ఆ తరువాత సజ్దా చేయి, అయితే నిదానంగా సజ్దాచేయి. సజ్దానుండి లేచి నిదానంగా కూర్చో. మళ్ళీ రెండవ సజ్దా చేయి. అయితే నిదానంగా సజ్దాచేయి. రెండవ సజ్దా చేసి నిదానంగా కూర్చో. మళ్ళీ రెండవరక’అతు కోసం లేచి నిలబడు. ఈ విధంగానే ప్రతి రక’అతులో ప్రతి నమా’జులో చేయి,’ అని అన్నారు. [107] (బు’ఖారీ, ముస్లిమ్)
791 – [ 2 ] ( صحيح ) (1/246)
وَعَنْ عَائِشَةَ قَالَتْ: كَانَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم يَسْتَفْتِحْ الصَّلَاةَ بِالتَّكْبِيْرِ وَالْقِرَاءَةِ بِ (اَلْحَمْدُ للهِ رَبِّ الْعَالَمِيْنَ؛1) وَكَانَ إِذَا رَكَعَ لَمْ يُشْخِصْ رَأْسَهُ وَلَمْ يُصَوِّبْهُ وَلَكِنْ بَيْنَ ذَلِكَ وَكَانَ إِذَا رَفَعَ رَأْسَهُ مِنَ الرُّكُوْعِ لَمْ يَسْجُدْ حَتَّى يَسْتَوِيْ قَائِمًا وَكَانَ إِذَا رَفَعَ رَأْسُهُ مِنَ السَّجْدَةِ لَمْ يَسْجُدْ حَتَّى يَسْتَوِيْ جَالِسًا. وَكَانَ يَقُوْلُ فِيْ كُلِّ رَكْعَتَيْنِ التُّحِيَّةَ. وَكَانَ يَفْرِشُ رِجْلَهُ الْيُسْرَى وَيَنْصِبُ رِجْلَهُ الْيُمْنَى. وَكَانَ يَنْهَى عَنْ عُقْبَةِ الشَّيْطَانِ وَيَنْهَى أَنْ يَّفْتَرِشَ الرَّجُلُ ذِرَاعَيْهِ افْتِرَاشَ السُّبُعِ وَكَانَ يَخْتِمُ الصَّلَاةَ بِالتَّسْلِيْمِ. رَوَاهُ مُسْلِمٌ .
791. (2) [1/246–దృఢం]
’ఆయి‘షహ్ (ర) కథనం: ప్రవక్త (స) నమా’జును తక్బీర్ ద్వారా ప్రారంభించే వారు. అంటే తక్బీరె త’హ్రీమ్ ద్వారా నమా’జు ప్రారంభించేవారు. ఖిరాఅత్ అల్’హమ్దు లిల్లాహ్ (సూ.1) ద్వారా ప్రారంభించేవారు. అంటే ఖుర్ఆన్ సూరాలు చదవ డానికి ముందు సూరహ్ ఫాతి’హా చదివే వారు. రుకూ‘ చేసి నపుడు తలను క్రిందా, మీదా కాకుండా సరిగ్గా ఉంచే వారు. రుకూ’ నుండి లేచిన తర్వాత నిటారుగా నిలబడనంత వరకు సజ్దా చేసేవారు కారు. సజ్దా నుండి లేచి నపుడు నిదానంగా, ప్రశాంతంగా కూర్చోనంత వరకు రెండవ సజ్దా చేసేవారు కారు. ప్రతి రెండు రకాతుల తర్వాత తహియ్యాతు చదివే వారు. తషహ్హుద్లలో కూర్చున్నప్పుడు ఎడమ కాలును పరచుకొని, కుడి కాలును నిలబెట్టి ఉంచేవారు. ఇంకా ఉఖ్బతు ష్షై’తాన్ నుండి వారించే వారు. సజ్దాలో రెండు మోచేతులను నేలపై పరచటాన్ని వారించే వారు. అంటే జంతువులు పరచినట్లు. ఇంకా నమా’జును సలామ్ ద్వారా ముగించేవారు.” [108](ముస్లిమ్)
792 – [ 3 ] ( صحيح ) (1/248)
وَعَنْ أَبِيْ حُمَيْدِ السَّاعِدِيِّ قَالَ: فِيْ نَفَرٍ مِّنْ أَصْحَابِ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم: أَنَا أَحْفَظُكُمْ لِصَلَاةِ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم. رَأَيْتُهُ إِذَا كَبَّرَ جَعَلَ يَدَيْهِ حِذَاءَ مَنْكِبَيْهِ. وَإذَا رَكَعَ أَمْكَنَ يَدَيْهِ مِنْ رُكْبَتَيْهِ. ثُمَّ هَصَرَ ظَهْرَهُ. فَإِذَا رَفَعَ رَأْسُهُ اسْتَوى حَتَّى يَعُوْدَ كُلُّ فَقَارٍ مَّكَانَهُ. فَإِذَا سَجَدَ وَضَعَ يَدَيْهِ غَيْرَ مُفْتَرِشٍ وَلَا قَابِضِهِمَا وَاسْتَقْبَلَ بِأَطْرَافِ أَصَابِعِ رِجْلَيْهِ الْقِبْلَةَ. فَإِذَا جَلَسَ فِيْ الرَّكْعَتَيْنِ جَلَسَ عَلَى رِجْلِهِ الْيُسْرَى وَنَصَبَ الْيُمْنَى وَإِذَا جَلَسَ فِيْ الرَّكْعَةِ الْآخِرَةِ قَدَمَ رِجْلَهُ الْيُسْرَى وَنَصَبَ الْأُخْرَى وَقَعَدَ عَلَى مَقْعَدَتِهِ. رَوَاهُ الْبُخَارِيُّ.
792. (3) [1/248–దృఢం]
అబూ ’హుమైది సా’అదీ (ర) కథనం: ప్రవక్త (స) అనుచరుల వద్ద నేను కూర్చొని ఉండగా ప్రవక్త (స) నమా’జు ప్రస్తావన వచ్చింది. అప్పుడు ప్రవక్త (స)ను గురించి, ‘మీ అందరికంటే నాకే బాగా తెలుసు,’ అని అన్నాను. ‘ప్రవక్త (స) తక్బీరె తహ్రీమ పలికినపుడు రఫ’అ యదైన్ చేసేవారు. అంటే తన రెండు చేతులను తన రెండు భుజాల వరకు ఎత్తే వారు. ఇంకా రుకూ‘లోకి వెళ్ళి నపుడు తన రెండు చేతులతో తన రెండు మోకాళ్ళను గట్టిగా పట్టుకునేవారు. ఇంకా తన వీపును పరచి వేసేవారు. ఇంకా రుకూ‘ నుండి లేచి నిటారుగా నిలబడే వారు. అంటే వీపు తిన్నగా అయిపోయేది. ఇంకా ప్రవక్త (స) సజ్దా చేసినపుడు రెండు చేతులను భూమిపై ఎలా పెట్టే వారంటే, మోచేతులను భూమిపై పరిచేవారు కాదు, ప్రక్కలకు తగిలించేవారు కాదు. ఇంకా కాళ్ళ వ్రేళ్ళు ఖిబ్లావైపు ఉంచేవారు. రెండు రకాతులు చదివి కూర్చు న్నప్పుడు ఎడమకాలు పరచి దానిపై కూర్చునే వారు. ఇంకా కుడికాలును నిలబెట్టి ఉంచేవారు. చివరి ఖ’అదహ్లో కూర్చున్నప్పుడు ఎడమ కాలును కుడి కాలు ముందుకు తీసుకొని, కుడి పాదాన్ని నిలబెట్టి ఎడమ పిరుదుపై కూర్చునేవారు. [109] (బు’ఖారీ)
793 – [ 4 ] ( متفق عليه ) (1/248)
وَعَنِ ابْنِ عُمَرَ: أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم كَانَ يَرْفَعُ يَدَيْهِ حَذْوَ مَنْكِبَيْهِ إِذَا افْتَتَحَ الصَّلَاةَ وَإِذَا كَبَّرَ لِلرَّكُوْعِ وَإِذَا رَفَعَ رَأْسَهُ مِنَ الرَّكُوْعِ رَفَعَهُمَا كَذَلِكَ. وَقَالَ: سَمِعَ اللهُ لِمَنْ حَمِدَه رَبَّنَا لَكَ الحَمْدُ وَكَانَ لَا يَفْعَلُ ذَلِكَ فِيْ السُّجُوْدِ.
793. (4) [1/248–ఏకీభవితం]
’అబ్దుల్లాహ్ బిన్ ’ఉమర్ (ర) కథనం: ప్రవక్త (స) నమా’జు ప్రారంభించినపుడు రఫ’అ యదైన్ చేసేవారు. అంటే రెండు చేతులను రెండు భుజాల వరకు ఎత్తేవారు. ఇంకా రుకూ‘లో వెళ్ళినపుడు రఫ’అ యదైన్ చేసేవారు. ఇంకా రుకూ నుండి లేచేటప్పుడు రఫ’అయదైన్ చేసే వారు. ఇంకా సమిఅల్లా హులిమన్ ‘హమిదహ్ అని పలికే వారు. అయితే సజ్దాలో అలా చేసేవారు కారు. (బు’ఖారీ, ముస్లిమ్)
794 – [ 5 ] ( صحيح ) (1/248)
وَعَنْ نَافِعٍ: أَنَّ ابْنَ عُمَرَ كَانَ إِذَا دَخَلَ فِيْ الصَّلَاةِ كَبَّرَ وَرَفَعَ يَدِيْهِ وَإِذَا رَكَعَ رَفَعَ يَدَيْهِ. وَإِذَا قَالَ سَمِعَ اللهُ لِمَنْ حَمِدَهُ رَفَعَ يَدَيْهِ وَإِذَا قَامَ مِنَ الرَّكْعَتَيْنِ رَفَعَ يَدَيْهِ. وَرَفَعَ ذَلِكَ ابْنُ عُمَرَ إِلَى النَّبِيِّ الله صلى الله عليه وسلم. رَوَاهُ الْبُخَارِيُّ .
794. (5) [1/248–దృడం]
నా’ఫె (ర) కథనం: ’అబ్దుల్లాహ్ బిన్ ’ఉమర్ (ర) నమా’జు ప్రారంభించినపుడు తక్బీరె తహ్రీమ పలికి, రఫ’అ యదైన్ చేసేవారు. ఇంకా రుకూ’లోకి వెళ్ళి నపుడు రఫ’అ యదైన్ చేసేవారు, ఇంకా సమి అల్లాహు లిమన్హమిదహ్ అని పలికి నప్పుడు కూడా రఫ’అ యదైన్ చేసేవారు. ఇంకా రెండు రక’అతులు చదివి మూడో రకాతుకు నిలబడి నప్పుడు కూడా రఫ’అయదైన్ చేసే వారు. ’అబ్దుల్లాహ్ బిన్ ’ఉమర్ కూడా ప్రవక్త (స) ద్వారానే దీన్ని ఉల్లేఖించారు. (బు’ఖారీ)
795 – [ 6 ] ( متفق عليه ) (1/248)
وَعَنْ مَالِكِ بْنِ الْحُوَيْرِثِ قَالَ: كَانَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم إِذَا كَبَّرَ رَفَعَ يَدَيْهِ حَتَّى يُحَاذِيَ بِهِمَا أُذُنَيْهِ وَإِذَا رَفَعَ رَأْسَهُ مِنَ الرَّكُوْعِ فَقَالَ: سَمِعَ اللهُ لِمَنْ حَمِدَهُ فَعَلَ مِثْلَ ذَلِكَ.
وَفِيْ رِوَايَةِ: حَتَّى يُحَاذِيَ بِهِمَا فُرُوْعَأُذُنَيْهِ.
795. (6) [1/248–ఏకీభవితం]
మాలిక్ బిన్ ’హువైరిస్‘ (ర) కథనం: ప్రవక్త (స) మొదటి తక్బీర్ పలికినపుడు రెండు చేతులను, రెండు చెవుల క్రింది భాగం వరకు ఎత్తేవారు. ఇంకా రుకూ‘ నుండి లేచినపుడు, ”సమిఅల్లా హులిమన్ హమిదహ్” అని పలికేవారు. ఇంకా చెవుల క్రింది భాగం వరకు చేతులను ఎత్తేవారు. [110] (బు’ఖారీ, ముస్లిమ్)
796 – [ 7 ] ( صحيح ) (1/249)
وَعَنْه أَنَّهُ رَأَى النَّبِيَّ صَلى الله عليه وسلم يُصَلِّيْ فَإِذَا كَانَ فِيْ وِتْرٍ مِّنْ صَلَاتِهِ لَمْ يَنْهَضْ حَتَّى يَسْتَوِيْ قَاعِدًا. رَوَاهُ الْبُخَارِيُّ.
796. (7) [1/249–దృఢం]
మాలిక్ బిన్ ’హువైరిస్‘ (ర) కథనం: ప్రవక్త (స) నమా’జు చదువుతుండగా అతను చూశారు. మొదటి రకా’త్లో, మూడవ రకాత్‌లో సజ్దా నుండి లేచి కూర్చున్న తరువాత నిలబడ్డారు. [111] (బు’ఖారీ)
797 – [ 8 ] ( صحيح ) (1/249)
وَعَنْ وَائِلِ بْنِ حُجْرٍأَنَّهُ رَأَى النَّبِيَّ صلى الله عليه وسلم رَفَعَ يَدَيْهِ حِيْنَ دَخَلَ فِيْ الصَّلَاةِ كَبَّرَ ثُمَّ الْتَحَفَ بِثَوْبِهِ ثُمَّ وَضَعَ يَدَهُ الْيُمْنَى عَلَى الْيُسْرَى فَلَمَّا أَرَادَ أَنْ يَرْكَعَ أَخْرَجَ يَدَيْهِ مِنَ الثَّوْبِ ثُمَّ رَفَعَهُمَا ثُمَّ كَبَّرَ فَرَكَعَ. فَلَمَّا قَالَ سَمِعَ اللهُ لِمَنْ حَمِدَهُ رَفَعَ يَدَيْهِ. فَلَمَّا سَجَدَ سَجَدَ بَيْنَ كَفَّيْهِ. رَوَاهُ مُسْلِمٌ.
797. (8) [1/249–దృఢం]
వాయి‘ల్ బిన్ ’హుజ్రి (ర) కథనం: ప్రవక్త (స)ను నమా’జు చదువుతుండగా చూశాను. అతను (స) తన ప్రత్యక్ష సంఘటనను ఇలా పేర్కొన్నారు, ”ప్రవక్త (స) నమా’జు ప్రారంభించినపుడు రఫ’అ యదైన్ చేసి, ‘అల్లాహు అక్బర్,’ అని పలికేవారు. ఆ తరువాత ఖిరాత్ చేసేవారు. ఖిరాత్ తర్వాత రుకూ’ చేసినపుడు రఫ’అ యదైన్ చేసి అల్లాహు అక్బర్ అని పలికేవారు, రుకూ’ నుండి లేచినపుడు, ”సమిఅల్లాహులిమన్ హమిదహ్” అని పలికి రఫ’అ యదైన్ చేసేవారు. సజ్దా చేస్తే రెండు అరచేతుల మధ్య సజ్దా చేసే వారు. [112](ముస్లిమ్)
798 – [ 9 ] ( صحيح ) (1/249)
وَعَنْ سَهْلِ بْنِ سَعْدٍ قَالَ: كَانَ النَّاسُ يُؤْمَرُوْنَ أَنْ يَّضَعَ الرَّجُلُ الْيَدَ الْيُمْنَى عَلَى ذِرَاعِهِ الْيُسْرَى فِيْ الصَّلَاةِ. رَوَاهُ الْبُخَارِيُّ .
798. (9) [1/249–దృఢం]
సహల్ బిన్ స’అద్ (ర) కథనం: కుడిచేతిని ఎడమ చేతిపై పెట్టి కట్టుకోమని ప్రజలను ఆదేశించటం జరిగేది. (బు’ఖారీ)
799 – [ 10 ] ( متفق عليه ) (1/249)
وَعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: كَانَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم إِذَا قَامَ إِلَى الصَّلَاةِ يُكَبِّرُ حِيْنَ يَقُوْمُ ثُمَّ يُكَبِّرُ. حِيْنَ يَرْكَعُ ثُمَّ يَقُوْلُ: “سَمِعَ اللهُ لِمَنْ حَمِدَهُ” .حِيْنَ يَرْفَعُ صُلْبَهُ مِنَ الرَّكْعَةِ ثُمَّ يَقُوْلُ وَهُوَ قَائِمٌ: “رَبَّنَا لَكَ الْحَمْدُ”. ثُمَّ يُكَبِّرُ. حِيْنَ يَهْوِيْ ثُمَّ يُكَبِّرُ. حِيْنَ يَسْجُدُ ثُمَّ يُكَبِّرُ. حِيْنَ يَرْفَعُ رَأْسَهُ. يَفْعَلُ ذَلِكَ فِيْ الصَّلَاةِ كُلِّهَا حَتَّى يَقْضِيْهَا وَيُكَبِّرُحِيْنَ يَقُوْمُ مِنَ الثِّنْتَيْنِ بَعْدَ الْجُلُوْسِ .
799. (10) [1/249–ఏకీభవితం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) నమా’జు చేసినపుడు నిలబడి ”అల్లాహు అక్బర్” అని, రుకూ’ చేసినపుడు కూడా ”అల్లాహు అక్బర్” అని రుకూ’ నుండి లేచి నపుడు ”సమిఅల్లాహులిమన్ ’హమిదహ్” అని, ఆ తరువాత ”రబ్బనా వలకల్ హమ్ద్” అని, మొదటి సజ్దా చేసినపుడు ”అల్లాహు అక్బర్” అని, సజ్దానుండి లేచినపుడు ”అల్లాహు అక్బర్” అని, రెండవ సజ్దా చేసినపుడు కూడా ”అల్లాహు అక్బర్” అని, ప్రతి నమా’జులో పలికేవారు. రెండు రకాతుల అనంతరం మూడవ రకాతు కోసం నిలబడినపుడు కూడా ”అల్లాహు అక్బర్” అని పలికేవారు. (బు’ఖారీ, ముస్లిమ్)
800 – [ 11 ] ( صحيح ) (1/250)
وَعَنْ جَابِرٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “أَفْضَلُ الصَّلَاةِ طُوْلُ الْقُنُوْتِ”. رَوَاهُ مُسْلِمٌ .
800. (11) [1/250–దృఢం]
జాబిర్ (ర) కథనం: ప్రవక్త(స) దీర్ఘంగా నిలుచునే నమా’జు నమా’జులన్నిటికంటే శ్రేష్ఠమైనది.(ముస్లిమ్)
—–
اَلْفَصْلُ الثَّانِيْ రెండవ విభాగం
801 – [ 12 ] ( صحيح ) (1/250)
عَنْ أَبِيْ حُمَيْدِ السَّاعِدِيِّ قَالَ فِيْ عَشْرَةٍ مِّنْ أَصْحَابِ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم: أَنَا أَعْلَمُكُمْ بِصَلَاةِ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم قَالُوْا: فَاعْرِضْ. قَالَ: كَانَ النَّبِيُّ صلى الله عليه وسلم إِذَا قَامَ إِلَى الصَّلَاةِ يَرْفَعُ يَدَيْهِ حَتَّى يُحَاذِيَ بِهِمَا مَنْكِبَيْهِ ثُمَّ يُكَبِّرُ ثُمَّ يَقْرَأُ ثُمَّ يُكَبِّرُ وَيَرْفَعُ يَدَيْهِ حَتَّى يُحَاذِيَ بِهِمَا مَنْكِبَيْهِ ثُمَّ يَرْكَعُ وَيَضَعُ رَاحَتَيْهِ عَلَى رَكْبَتَيْهِ ثُمَّ يَعْتَدِلُ فَلَا يُصَبِّيْ رَأْسَهُ وَلَا يُقْنِعُ ثُمَّ يَرْفَعُ رَأْسَهُ فَيَقُوْلُ: “سَمِعَ اللهُ لِمَنْ حَمِدَهُ”. ثُمَّ يَرْفَعُ يَدَيْهِ حَتَّى يُحَاذِي بِهِمَا مَنْكِبَيْهِ مُعْتَدِلًا ثُمَّ يَقُوْلُ: “اللهُ أَكْبَرُ” .ثُمَّ يَهْوِيْ إِلَى الْأَرْضِ سَاجِدًا فَيُجَافِيْ يَدَيْهِ عَنْ جَنْبَيْهِ وَيَفْتَحُ أَصَابِعَ رِجْلَيْهِ ثُمَّ يَرْفَعُ رَأْسَهُ وَيَثْنِيْ رِجْلَهُ اليُسْرَى فَيَقْعُدُ عَلَيْهَا ثُمَّ يَعْتَدِلُ حَتَّى يَرْجِعَ كُلُّ عَظْمٍ إِلَى مَوْضِعِهِ مُعْتَدِلًا ثُمَّ يَسْجُدُ ثُمَّ يَقُوْلُ: “اللهُ أَكْبَرُ”. وَيَرْفَعُ وَيَثْنِيْ رِجْلَهُ الْيُسْرَى فَيَقْعُدُ عَلَيْهَا ثُمَّ يَعْتَدِلُ حَتَّى يَرْجِعَ كُلُّ عَظْمٍ إِلَى مَوْضِعِهِ. ثُمَّ يَنْهَضُ ثُمَّ يَصْنَعُ فِيْ الرَّكْعَةِ الثَّانِيَةِ مِثْلَ ذَلِكَ. ثُمَّ إِذَا قَامَ مِنَ الرَّكْعَتَيْنِ كَبَّرَ وَرَفَعَ يَدَيْهِ حَتَّى يُحَاذِيَ بِهِمَا مَنْكِبَيْهِ كَمَا كَبَّرَ عِنْدَ افْتِتَاحِ الصَّلَاةِ ثُمَّ يَصْنَعُ ذَلِكَ فِيْ بَقِيَّةِ صَلَاتِهِ حَتَّى إِذَا كَانَتْ السَّجْدَةُ الَّتِيْ فِيْهَا التَّسْلِيْمُ أَخْرَجَ رِجْلَهُ الْيُسْرَى وَقَعَدَ مُتَوَرِّكًا عَلَى شِقِّهِ الْأَيْسَرِ ثُمَّ سَلَّمَ. قَالُوْا: صَدَقْتَ هَكَذَا كَانَ يُصَلِّيْ. رَوَاهُ أَبُوْ دَاوُدَ وَالدَّارَمِيُّ وَرَوَى التِّرْمِذِيُّ. وَابْنُ مَاجَهُ مَعْنَاهُ. وَقَالَ التِّرْمذي: هَذَا حَدِيْثٌ حَسَنٌ صَحِيْحٌ.
وَفِيْ رِوَايِةِ لِّأَبِيْ دَاوُدَ مِنْ حَدِيْثِ أَبِيْ حُمَيْدٍ: ثُمَّ رَكَعَ فَوَضَعَ يَدَيْهِ عَلَى رُكْبَتَيْهِ كَأَنَّهُ قَابِضٌ عَلَيْهِمَا وَوَتَرَ يَدَيْهِ فَنَحَّاهُمَا عَنْ جَنْبَيْهِ وَقَالَ: ثُمَّ سَجَدَ فَأَمْكَنَ أَنْفَهُ وَجَبْهَتَهُ الْأَرْضَ وَنَحَّى يَدَيْهِ عَنْ جَنْبَيْهِ وَوَضَعَ كَفَّيْهِ حَذَوَ مَنْكِبَيْهِ وَفَرَجَ بَيْنَ فَخِذَيْهِ غَيْرَ حَامِلٍ بَطْنَهُ عَلَى شَيْء مِّنْ فَخِذَيْهِ حَتَّى فَرَغَ ثُمَّ جَلَسَ فَافْتَرَشَ رِجْلَهُ الْيُسْرَى وَأَقْبَلَ بِصَدْرِ الْيُمْنَى عَلَى قِبْلَتِهِ وَوَضَعَ كَفَّهُ الْيُمْنَى عَلَى رُكْبَتِهِ الْيُمْنَى وَكَفَّهُ الْيُسْرَى عَلَى رُكْبَتِهِ الْيُسْرَى وَأَشَارَ بِأَصْبَعِهِ يَعْنِيْ السَّبَابَةَ.
وَفِيْ أُخْرَى لَهُ: وَإِذَا قَعَدَ فِيْ الرَّكْعَتَيْنِ قَعَدَ عَلَى بَطْنِ قَدَمِهِ الْيُسْرَى وَنَصَبَ الْيُمْنَى وَإِذَا كَانَ فِيْ الرَّابِعَةِ أَفْضَى بِوَرَكِهِ الْيُسْرَى إِلَى الْأَرْضِ وَأَخَرَجَ قَدَمَيْهِ مِنْ نَاحِيَةٍ وَّاحِدَةٍ.
801. (12) [1/250–దృఢం]
అబూ ‘హుమైది అస్సా’అదీ (ర) కథనం: నేను 10 మంది ప్రవక్త (స) అనుచరులతో, ‘ప్రవక్త (స) యొక్క నమా’జు మీ అందరికంటే నాకు బాగాతెలుసు,’ అని అన్నాను. ఆ పదిమంది, ‘అయితే దాన్ని వివరించండి,’ అని నాతో అన్నారు. అప్పుడు నేను, ‘వినండి! ప్రవక్త (స) నమా’జు చదవడానికి నిలబడినపుడు అన్నిటికంటే ముందు, రెండు చేతులను రెండు భుజాల వరకు ఎత్తేవారు. అంటే రఫ’అ యదైన్ చేస్తూ, ”అల్లాహు అక్బర్” అని పలికేవారు. ఆ తరువాత ఖుర్ఆన్ పఠించే వారు. ఖుర్ఆన్ పఠనం అయిన తరువాత, ”అల్లాహు అక్బర్” అని పలుకుతూ రెండు చేతులను భుజాల వరకు ఎత్తేవారు. అంటే రుకూ’ చేసినపుడు రఫ’అ యదైన్ చేసేవారు. రుకూ’లో తన రెండు అరచేతులను తన మోకాళ్ళపై ఉంచేవారు. నడుమును తిన్నగా ఉంచేవారు. తలను సమానంగా ఉంచేవారు. అనంతరం రుకూ’ నుండి తల ఎత్తి నపుడు, ”సమిఅల్లాహులిమన్’హమిదహ్,” అని పలుకుతూ రెండు చేతులను భుజాల వరకు ఎత్తేవారు. రుకూ నుండి లేచి నిటారుగా నిలబడి, ”అల్లాహు అక్బర్,” అని పలుకుతూ నేలవైపు వంగి సజ్దా చేసేవారు. అంటే తన రెండు చేతులను తన రెండు ప్రక్కలకు దూరంగా ఉంచి, కాళ్ళ వేళ్ళను ఖిబ్లా వైపు ఉంచేవారు. అనంతరం సజ్దా నుండి లేచి ఎడమ పాదాన్ని పరచి కూర్చుని ప్రశాంతంగా కూర్చొని అంటే జల్స ఇస్తిరాహత్ చేస్తారు. ఆ తరువాత రెండవ రకాత్ కోసం నిలబడేవారు. రెండవ రకా’త్లో కూడా ఇలాగే చేసేవారు. రెండు రకా’త్ల తర్వాత, మూడవ రకా’త్ కోసం నిలబడినపుడు, ”అల్లాహు అక్బర్,” అని పలుకుతూ రెండు చేతులను భుజాల వరకు ఎత్తేవారు. నమా’జు ప్రారంభంలో చేసినట్లు. అదేవిధంగా మిగిలిన నమా’జులో చేసేవారు. చివరికి సజ్దా తర్వాత సలామ్ చేసేవారు. సజ్దా చేసిన తర్వాత ఎడమకాలును బయటకు తీసుకొని, ఎడమ పిరుదుపై కూర్చునే వారు. ఆ తరువాత సలామ్ పలికి నమా’జు ముగించేవారు,’ అని అన్నారు. అది విని, ఆ పదిమంది ప్రవక్త (స) అనుచరులు మీరు నిజం పలికారు, ప్రవక్త (స) ఈ విధంగానే నమా’జు చదివేవారు.’ అని అన్నారు. [113] (అబూ దావూ‘ద్, దార్మీ, తిర్మిజి‘, ఇబ్నె మాజహ్)
(తిర్మిజి‘ దీన్ని ప్రామాణికం, దృఢంగా పేర్కొన్నారు).
అబూ’హుమైది ’హదీసు‘ అబూదావూ‘ద్లో కూడా ఉంది. దాని పదాలు ఇలా ఉన్నాయి, ”అనంతరం ప్రవక్త (స) రుకూ’ చేశారు. రుకూ’లో తమ రెండు చేతులతో తమ రెండు మోకాళ్ళను దృఢంగా పట్టు కున్నారు. తమ చేతులను బాణం విల్లులా తిన్నగా ఉంచారు. తమ రెండు చేతులను ప్రక్కలకు దూరంగా ఉంచారు. ప్రవక్త (స) సజ్దా చేస్తూ తమ నుదురును, ముక్కును నేలపై పెట్టి, రెండు చేతులను ప్రక్కలకు దూరంగా ఉంచి, రెండు చేతులను రెండు భుజాలకు సమానంగా ఉంచి, రెండు తొడలను సమాంతరంగా దూరంగా కడుపుకు తగలకుండా ఉంచారు. చివరికి నమా’జు ముగించారు. అనంతరం ఖ’అదహ్లో కూర్చున్నారు. అంటే ఎడమ కాలును బయటకు తీసి పరచుకొని, కుడిపాదం ముందు భాగాన్ని ఖిబ్లా వైపు ఉంచి, కుడిచేతిని కుడి మోకాలుపై ఎడమ చేతిని ఎడమమోకాలుపై ఉంచి, కుడిచేతి చూపుడు వ్రేలుతో సైగచేశారు.
అబూ దావూ’ద్ ఉల్లేఖనంలో ఇలా కూడా ఉంది, ”రెండు రక’అత్లు చదివి కూర్చున్నపుడు, ఎడమ పిరుదుపై కూర్చునేవారు. కుడికాలును నిలబెట్టి ఉంచేవారు. అయితే నాల్గవ రక’అత్‌లో కూర్చుంటే తవర్రుక్ చేసేవారు. అంటే ఎడమ పిరుదుపైకూర్చొని రెండుకాళ్ళను కుడివైపు పెట్టుకునేవారు.”
802 – [ 13 ] ( ضعيف ) (1/251)
وَعَنْ وَائِلِ بْنِ حُجْرٍ: أَنَّهُ أَبْصَرَ النَّبِيِّ صلى الله عليه وسلم حِيْنَ قَامَ إِلَى الصَّلَاةِ رَفَعَ يَدَيْهِ حَتَّى كَانَتَا بِحَيَالِ مَنْكِبَيْهِ وَحَاذَى بِإِبْهَامَيْهِ أُذُنَيْهِ ثُمَّ كَبَّرَ. رَوَاهُ أَبُوْ دَاوُدَ. وَفِيْ رِوَايَةِ لَهُ: يَرْفَعُ إِبْهَامَيْهِ إِلَى شَحْمَةِ أُذُنَيْهِ.
802. (13) [1/251–బలహీనం]
వాయి‘ల్ బిన్ ’హుజ్రి (ర) కథనం: ప్రవక్త(స) నమా’జు చదువుతుండగా నేను చూశాను, ”ప్రవక్త (స) నమా’జుకు నిలబడినపుడు రెండు చేతులను రెండు భుజాలవరకు ఎత్తేవారు, అరచేతుల బొటన వ్రేళ్ళను చెవులకు సమానంగా ఉంచి ”అల్లాహు అక్బర్” అని పలికేవారు. (అబూ దావూ’ద్)
అబూదావూ‘ద్‌లోని ఒక ఉల్లేఖనంలో ఇలా ఉంది, ”రెండు చేతుల బొటన వ్రేళ్ళను చెవుల క్రింది భాగం వరకు ఎత్తేవారు.”
803 – [ 14 ] ( حسن ) (1/252)
وَعَنْ قَبِيْصَةَ بْنِ هُلْبٍ عَنْ أَبِيْهِ قَالَ: كَانَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم يَؤُمَّنَا فَيَأْخُذُ شِمَالَهُ بِيَمِيْنِهِ.رَوَاهُ التِّرْمِذِيُّ وَابْنُ مَاجَهُ.
803. (14) [1/252–ప్రామాణికం]
ఖబీస’హ్ బిన్ హుల్బి (ర) తన తండ్రి ద్వారా కథనం, అతని తండ్రిగారి కథనం: ప్రవక్త (స) ప్రజలకు నమా’జు చదివించినపుడు ఎడమచేతిని కుడిచేతితో పట్టుకునే వారు. అంటే నమా’జులో నిలబడినపుడు కుడిచేతిని ఎడమచేతిపై పెట్టుకొని ఇమామత్ చేసే వారు, నమా’జు చదివించేవారు. (తిర్మిజి‘, ఇబ్నె మాజహ్)
804 – [ 15 ] ( صحيح ) (1/252)
وَعَنْ رِفَاعَةَ بْنِ رَافِعٍ قَالَ: جَاءَ رَجُلٌ فَصَلَّى فِيْ الْمَسْجِدِ ثُمَّ جَاءَ فَسَلَّمَ عَلَى النَّبِيِّ صلى الله عليه وسلم. فَقَالَ النَّبِيُّ صلى الله عليه وسلم: “أَعِدْ صَلَاتَكَ فَإِنَّكَ لَمْ تُصَلِّ”. فَقَالَ:عَلِّمْنِيْ يَا رَسُوْلَ اللهِ كَيْفَ أُصَلِّيْ؟ قَالَ: “إِذَا تَوَجَّهْتَ إِلَى الْقِبْلَةِ فَكَبِّرْ ثُمَّ اقْرَأْ بِأُمِّ الْقُرْآنِ وَمَا شَاءَ اللهُ أَنْ تَقْرَأَ فَإِذَا رَكَعْتَ فَاجْعَلْ رَاحَتَيْكَ عَلَى رُكْبَتَيْكَ وَمَكِّنْ رُكُوْعَكَ وَامْدُدْ ظَهْرَكَ فَإِذَا رَفَعْتَ فَأَقِمْ صُلْبَكَ وَارْفَعْ رَأْسَكَ حَتَّى تَرْجِعَ الْعِظَامُ إِلَى مَفَاصِلِهَا فَإِذَا سَجَدْتَّ فَمَكِّنْ السُّجُوْد فَإِذَا رَفَعْتَ فَاجْلِسْ عَلَى فَخِذَكَ الْيُسْرَى ثُمَّ اصْنَعْ ذَلِكَ فِيْ كُلِّ رَكْعَةٍ وَسَجَدَةٍ حَتَّى تَطْمَئِنّ. هَذَا لَفْظُ” الْمَصَابِيْحِ”.
وَرَوَاهُ أَبُوْ دَاوُدَ مَعَ تَغْيِيْرٍ يَّسِيْرٍ وَّرَوَى التِّرْمِذِيُّ وَالنَّسَائِيُّ مَعْنَاهُ.
وَفِيْ رِوَايَةٍ لِّلتِّرْمِذِيِّ قَالَ: “إِذَا قُمْتَ إِلَى الصَّلَاةِ فَتَوَضَّأْ كَمَا أَمَرَكَ اللهُ بِهِ ثُمَّ تَشَهَّدْ. فَأَقِمْ فَإِنْ كَانَ مَعَكَ قُرْآنٌ فَاقْرَأْ وَإِلَّا فَاحْمَدِ اللهَ وَكَبِّرْهُ وَهَلِّلْهُ ثُمَّ ارْكَعَ”.
804. (15) [1/252–దృఢం]
రిఫా’అహ్ బిన్ రా’ఫె (ర) కథనం: ఒక వ్యక్తి మస్జిద్లోకి వచ్చి, నమా’జ్ చదివి, ప్రవక్త (స) వద్దకు వచ్చి, సలామ్ చేశాడు. ప్రవక్త (స) అతని సలామ్‌కు ప్రతి సలామ్ చేసిన తర్వాత, ‘నువ్వు నమా’జ్ మళ్ళీ చదువు, నువ్వు అసలు నమా’జు చదవనే లేదు,’ అని అన్నారు. అప్పుడా వ్యక్తి, ‘ఓ ప్రవక్తా! దయచేసి నమా’జు చదవటం నాకు నేర్పండి,’ అని అన్నాడు. అప్పుడు ప్రవక్త (స), ”నువ్వు ఖిబ్లావైపు తిరిగిన తర్వాత ”అల్లాహు అక్బర్” అని పలుకు, సూరహ్ ఫాతి ’హా పఠించు, రుకూ’లోకి వెళ్ళినపుడు రెండు చేతులను రెండు మోకాళ్ళపై ఉంచు. రుకూ’లో ప్రశాంతంగా నిలబడు. వీపును బాగా విశాలపరచు, రుకూ’ నుండి లేచినపుడు వీపును తిన్నగా చేసుకో, అంటే నిటారుగా నిలబడు, నడుము తిన్నగా అయి పోవాలి. సజ్దా చేసినపుడు నిదానంగా సజ్దా చేయి. సజ్దా నుండి తల ఎత్తిన తర్వాత, నీ ఎడమ తొడపై కూర్చో. ప్రతి రుకూ’, ప్రతి సజ్దాలో అలాగే చేయి. ప్రతి ముఖ్య విధిని నిదానంగా చేయి.” ఇవి మసాబీహ్ పదాలు.
అబూ దావూ’ద్ కొంత తేడాతో దీన్ని ఉల్లేఖించారు. తిర్మిజి’ మరియు నసాయి’ దీన్ని యథాతథంగా ఉల్లే ఖించారు. [114]
తిర్మిజీ‘లోని ఒక ఉల్లేఖనంలో ఇలా ఉంది, ప్రవక్త (స) ప్రవచనం: ”నీవు నమా’జుకు నిలబడినపుడు, అన్నిటికంటే ముందు అల్లాహ్ ఆదేశించిన విధంగా వు’దూ చేయి. ఆ తర్వాత కలిమ షహాదహ్ పలుకు. అంటే వు’దూ తర్వాత దు’ఆ పలుకు. అందులో కలిమ షహాదహ్ ఉంది. లేక కలిమహ్ షహదహ్ అంటే అజా‘న్ అయి ఉండవచ్చు. అంటే వు’దూ చేసిన తర్వాత అజా‘న్ ఇవ్వు, ఆ తర్వాత నిదానంగా నమా’జు చదువు. ఒకవేళ నీకు ఖుర్ఆన్ గుర్తుంటే చదువు. లేకుంటే ”అల్’హమ్దులిల్లాహ్, అల్లాహు అక్బర్, లా యిలాహ ఇల్లల్లాహ్” అని పలుకు. అనంతరం రుకూ’ చేయి.”
805 – [ 16 ] ( ضعيف ) (1/253)
وَعَنِ الْفَضْلِ بْنِ عَبَّاسٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “اَلصَّلَاةُ مَثْنَى مَثْنَى تَشَهُّدٌ فِيْ كُلِّ رَكْعَتَيْنِ وَتَخَشَّعٌ وَتَضَرُّعٌ وَتَمَسْكُنٌ. ثُمَّ تُقْنِعُ يَدَيْكَ يَقُوْلُ تَرْفَعَهُمَا إِلَى رَبِّكَ مُسْتَقْبِلًا بِبُطُوْنِهِمَا وَجْهَكَ. وَتَقُوْلُ يَا رَبِّ يَا رَبِّ. وَمَنْ لَّمْ يَفْعَلْ ذَلِكَ فَهُوَ كَذَا وَكَذَا”. وَفِيْ رِوَايَةٍ: “فَهُوَ خِدَاجٌ”. رَوَاهُ التِّرْمِذِيُّ.
805. (16) [1/253–బలహీనం]
ఫ’ద్ల్ బిన్ ’అబ్బాస్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవ చనం, ”నమా’జు రెండు రెండు రకా’తులు, ప్రతి రెండు రకా’తుల తరువాత, తషహ్హుద్ అంటే అత్త’హియ్యాతు ఉంది. ఇంకా నమా’జులో వినయ విధేయతలు, దీనత్వం, అసహాయత బహిర్గతం కావాలి. నమా’జు పూర్తయిన తర్వాత రెండు చేతులను అరచేతులు తనవైపు ఉండేటట్లు అంటే ముఖం ముందు ఉండాలి. దైవాన్ని ఇలా ప్రార్థించండి, ”ఓ నా ప్రభూ! నా పాపాలను మన్నించు, నన్ను క్షమించు,” సరైన విధంగా ప్రార్థించండి, అలా చేయనివారి నమా’జు అసంపూ ర్ణంగా ఉంటుంది. [115] (తిర్మిజి’)
—–
اَلْفَصْلُ الثَّالِثُ మూడవ విభాగం
806 – [ 17 ] ( صحيح ) (1/253)
عَنْ سَعِيْدِ بْنِ الْحَارِثِ بْنِ الْمُعَلَّى قَالَ: صَلَّى لَنَا أَبُوْ سَعِيْدِ الْخُدْرِيُّ. فَجَهَرَ بِالتَّكْبِيْرِ حِيْنَ رَفَعَ رَأْسَهُ مِنَ السُّجُوْدِ وَحِيْنَ سَجَدَ وَحِيْنَ رَفَعَ مِنَ الرَّكْعَتَيْنِ. وَقَالَ: هَكَذَا رَأَيْتُ النَّبِيَّ صلى الله عليه وسلم. رَوَاهُ الْبُخَارِيُّ .
806. (17) [1/253–దృఢం]
స’యీద్ బిన్ ’హారిస్‘బిన్ ముఅల్లా‘(ర) కథనం: అబూ స’యీద్ ’ఖుద్రీ (ర) మాకు నమా’జు చదివించారు. సజ్దా నుండి తల ఎత్తినపుడు బిగ్గరగా ”అల్లాహు అక్బర్” అని పలికారు. సజ్దాలో వెళ్ళినపుడు కూడా బిగ్గరగా ”అల్లాహు అక్బర్” అని పలికారు. ఇంకా రెండు రకాతులు చదివి మూడవ రకాత్ కోసం నిలబడినపుడు బిగ్గరగా ”అల్లాహు అక్బర్” అని పలికారు. నమా’జు పూర్తయిన తర్వాత, ‘ప్రవక్త (స) ఇలాగే చేస్తూ ఉండటం నేను చూశాను’ అనిఅన్నారు. [116] (బు’ఖారీ)
807 – [ 18 ] ( صحيح ) (1/253)
وَعَنْ عِكْرَمَةَ قَالَ: صَلَّيْتُ خَلْفَ شَيْخٍ بِمَكَّةَ فَكَبَّرَ ثِنْتَيْنٍ وَّعِشْرِيْنَ تَكْبِيْرَةً فَقُلْتُ لِاِبْنِ عَبَّاسٍ: إِنَّهُ أَحْمَقُ فَقَالَ: ثَكِلَتْكَ أُمُّكَ سُنَّةُ أَبِي الْقَاسِمِ صلى الله عليه وسلم. رَوَاهُ الْبُخَارِيُّ .
807. (18) [1/253–దృఢం]
’ఇక్రమ (ర) కథనం: మక్కాలో నేనొక పండితుని వెనక నమా’జ్ చదివాను. అతను (4 రకాతులలో) 22 తక్బీర్లు పలికారు. అనంతరం నేను మా గురువు గారు ఇబ్నె ’అబ్బాస్ (ర) తో ఇతనికి నమా’జు చదివించడం తెలియదు,’ అని అన్నాను. అప్పుడు ఇబ్నె ’అబ్బాస్ (ర) నాతో, ‘నీ పాడుగాను! ఇది ప్రవక్త (స) పద్ధతి,’ అని అన్నారు. [117] (బు’ఖారీ)
808 – [ 19 ] ( صحيح ) (1/254)
وَعَنْ عَلِيٍّ بْنِ الْحُسَيْنِ مُرْسَلًا قَالَ: كَانَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم يُكَبِّرُ فِيْ الصَّلَاةِ كُلَّمَا خَفَضَ وَرَفَعَ فَلَمْ تَزَلْ صَلَاتُهُ حَتَّى لَقِيَ اللهُ تَعَالَى. رَوَاهُ مَالِكٌ .
808. (19) [1/254–దృఢం]
’అలీ బిన్ ’హుసైన్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రతి నమా’జ్లో తక్బీర్ పలికేవారు. అంటే ప్రవక్త(స) రుకూ’ చేసినపుడు, సజ్దా చేసినపుడు ”అల్లాహు అక్బర్” అని పలికేవారు. లేచి నపుడు కూడా ”అల్లాహు అక్బర్” అని పలికేవారు. మరణం వరకు ప్రవక్త (స) నమా’జు ఇలాగే ఉండేది. (మువత్తా ఇమామ్ మాలిక్)
809 – [ 20 ] ( صحيح ) (1/254)
وَعَنْ عَلْقَمَةَ قَالَ: قَالَ لَنَا ابْنُ مَسْعُوْدٍ: أَلَا أُصَلِّيْ بِكُمْ صَلَاةَ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم؟ فَصَلَّى وَلَمْ يَرْفَعْ يَدَيْهِ إِلَّا مَرَّةً وَّاحِدَةً مَعَ تَكْبِيْرَةِ الْاِفْتِتَاحِ. رَوَاهُ التِّرْمِذِيُّ وَأَبُوْ دَاوُدَ وَالنَّسَائِيُّ. وَقَالَ أَبُوْ دَاوُدَ: لَيْسَ هُوَ بِصَحْيِحِ عَلَى هَذَا الْمَعْنَى.
809. (20) [1/254–దృఢం]
’అల్ ఖమహ్ (ర) కథనం: ఇబ్నె మస్’ఊద్ (ర) మాతో మీకు ప్రవక్త (స) నమా’జ్ చదివించనా! అని అతను నమా’జు చదివించారు. ”తక్బీరె త’హ్రీమ చేసినపుడు రఫ’అయదైన్ చేశారు.” (తిర్మిజి‘, అబూ దావూ‘ద్, నసాయి‘)
810 – [ 21 ] ( صحيح ) (1/254)
وَعَنْ أَبِيْ حُمَيْدِ السَّاعِدِيِّ قَالَ: كَانَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم إِذَا قَامَ إِلَى الصَّلَاةِ اسْتَقْبَلَ الْقِبْلَةَ وَرَفَعَ يَدَيْهِ وَقَالَ: اللهُ أَكْبَرُ. رَوَاهُ ابْنُ مَاجَهُ .
810. (21) [1/254–దృఢం]
అబూ ‘హుమైది అస్సా’అదీ (ర) కథనం: ప్రవక్త (స) నమా’జుకోసం నిలబడినపుడు ఖిబ్లావైపు తిరిగి, రెండు చేతులను ఎత్తి, ”అల్లాహు అక్బర్,” అని పలికే వారు. (ఇబ్నె మాజహ్)
811 – [ 22 ] ( صحيح ) (1/254)
وَعَنْ أَبِيْ هُرَيْرَةَ رَضِيَ الله عَنْهُ قَالَ: صَلّى بِنَا رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم الظُّهْرَ وَفِيْ مُؤَخِّرِالصُّفُوْفِ رَجُلٌ فَأَسَاءَ الصَّلَاةَ فَلَمَّا سَلَّمَ. نَادَاهُ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “يَا فُلَانُ أَلَا تَتَّقِي اللهَ؟ أَلَا تَرَى كَيْفَ تُصَلِّيْ؟ إِنَّكُمْ تَرَوْنَ أَنَّهُ يَخْفَى عَلَيَّ شَيْءٌ مِمَّا تَصْنَعُوْنَ. وَاللهِ إِنِّيْ لَأَرى مِنْ خَلْفِيْ كَمَا أَرَى مِنْ بَيْنَ يَدَيَّ” .رَوَاهُ أَحْمَدُ .
811. (22) [1/254–దృఢం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) మాకు “జుహ్ర్ నమా’జు చదివించారు. వెనుక పంక్తిలో ఒక వ్యక్తికి నమా’జు చదవటం సరిగా తెలియదు. ప్రవక్త (స) నమా’జు ముగించి, అతన్ని పిలిచి, ‘అల్లాహ్ కు భయపడు. నువ్వు నమా’జు ఎలా చదువు తున్నావు, నీవు చేస్తున్నది నాకు తెలియదను కుంటున్నావా? అల్లాహ్ సాక్షి! ఏవిధంగా ముందు చూస్తానో, అదే విధంగా వెనుకకూడా చూస్తాను,’ అని అన్నారు. [118] (అ’హ్మద్)
=====
11– بَابُ مَا يَقْرَأُ بَعْدَ التَّكْبِيْرِ
11. తక్బీర్ తరువాత పఠించే దు’ఆలు
اَلْفَصْلُ الْأَوَّلُ మొదటి విభాగం
812 – [ 1 ] ( متفق عليه ) (1/256)
عَنْ أَبِيْ هُرَيْرَةَ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: كَانَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم يَسْكُتُ بَيْنَ التَّكْبِيْرِ وَبَيْنَ الْقَرَاءَةِ إِسْكَاتَةً فَقُلْتُ بِأَبِيْ وَأُمِّيْ يَا رَسُوْلَ اللهِ إِسْكَاتُكَ بَيْنَ التَّكْبِيْرِ وَالْقِرَاءَةِ مَا تَقُوْلُ قَالَ: “أَقُوْلُ اللَّهُمَّ بَاعِدْ بَيْنِيْ وَبَيْنَ خَطَايَايَ كَمَا بَاعَدْتَّ بَيْنَ الْمَشْرِقِ وَالْمَغْرِبِ اَللَّهُمَّ نَقِّنِيْ مِنَ الْخَطَايَا كَمَا يُنَقَّى الثَّوْبُ الْأَبْيَضُ مِنَ الدَّنَسِ. اللَّهُمَّ اغْسِلْ خَطَايَايَ بِالْمَاءِ وَالثَّلْجِ وَالْبَرَدِ”.
812. (1) [1/256–ఏకీభవితం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) తక్బీరె త’హ్రీమ మరియు ఖిరాఅత్ల మధ్య మౌనంగా ఉండే వారు. ‘నా తల్లిదండ్రులు మీకోసం త్యాగంకాను. తక్బీరె తహ్రీమ్ మరియు ఖిరాఅత్ల మధ్య నిశ్శబ్దంగా తమరు ఏం చదువుతారు,’ అని విన్నవించుకున్నాను. దానికి ప్రవక్త (స), ‘తక్బీరె తహ్రీమ్ తరువాత నేను ఈ దు’ఆ పఠిస్తాను అని చెప్పారు. ”అల్లాహుమ్మ బా’ఇద్ బైనీ వబైన ’ఖ’తాయాయ కమా బా’అద్ త బైనల్ మష్రిఖి వల్ మ’గ్రిబి. అల్లాహుమ్మ నఖ్ఖినీ మినల్ ’ఖ’తాయా, కమా యునఖ్ఖస్సౌ‘బుల్ అబ్య’ద్ మినద్దనసి. అల్లాహుమ్మ’గ్సిల్ ’ఖ’తాయాయ బిల్ మాఇ‘ వస్స‘ల్జి, వల్ బరది.” — ‘ఓ నా ప్రభూ! నాకూ నా పాపాలకు మధ్య తూర్పు-పడమరల మధ్య ఉన్నంత దూరం చేయి. ఓ నాప్రభూ! నన్ను పాపాల నుండి వస్త్రాలు మాలిన్యాల నుండి పరిశుభ్ర పరచబడినట్టు పరిశుభ్రపరచు. ఓ అల్లాహ్! నా పాపాలను నీళ్ళతో, మంచుతో మరియు వడగండ్లతో పరిశుభ్ర పరచు.” [119] (బు’ఖారీ, ముస్లిమ్)
813 – [ 2 ] ( صحيح ) (1/256)
وَعَنْ عَلِيٍّ بْنِ أَبِيْ طَالِبٍ رضي الله عَنْهُ قَالَ: كَانَ النَّبِيُّ صلى الله عليه وسلم إِذَا قَامَ إِلَى الصَّلَاةِ. وَفِيْ رِوَايَةٍ: كَانَ إِذَا افْتَتَحَ الصَّلَاةَ كَبَّرَ. ثُمَّ قَالَ: “وَجَّهْتُ وَجْهِيَ لِلَّذِيْ فَطَرَ السَّمَاوَاتِ وَالْأَرْضِ حَنِيْفًا وَّمَا أَنَا مِنَ الْمُشْرِكِيْنَ. إِنَّ صَلَاتِيْ وَنُسُكِيْ وَمَحْيَايَ وَمَمَاتِيْ للهِ رَبِّ الْعَالَمِيْنَ. لَا شَرِيْكَ لَهُ. وَبِذَلِكَ أُمِرْتُ وَأَنَا مِنَ الْمُسْلِمِيْنَ. اللَّهُمَّ أَنْتَ الْمَلِكَ. لَا إِلَهَ إِلَّا أَنْتَ. أَنْتَ رَبِّيْ وَأَنَا عَبْدُكَ. ظَلَمْتُ نَفْسِيْ وَاعْتَرَفْتُ بِذَنْبِيْ. فَاغْفِرْ لِيْ ذُنُوْبِيْ جَمِيْعًا. إِنَّهُ لَا يَغْفِرُ الذُّنُوْبَ إِلَّا أَنْتَ. وَاهْدِنِيْ لِأَحْسَنِ الْأَخْلَاقِ. لَا يَهْدِيْ لِأَحْسَنِهَا إِلَّا أَنْتَ. وَاصْرِفْ عَنِّيْ سَيِّئَهَا. لَا يَصْرِفُ عَنِّيْ سَيِّئَهَا إِلَّا أَنْتَ. لَبَّيْكَ وَسَعْدَيْكَ وَالْخَيْرُ كُلُّهُ فِيْ يَدَيْكَ. وَالشَّرُ لَيْسَ إِلَيْكَ. أَنَا بِكَ وَإِلَيْكَ تَبَارَكْتَ وَتَعَالَيْتَ أَسْتَغْفِرُكَ وَأَتُوْبُ إِلَيْكَ”.
وَإِذَا رَكَعَ قَالَ: “اللَّهُمَّ لَكَ رَكَعْتُ وَبِكَ آمَنْتُ وَلَكَ أَسْلَمْتُ خَشَعَ لَكَ سَمْعِيْ وَبَصَرِيْ وَمُخِّيْ وَعَظْمِيْ وَعَصَبِيْ”.
فَإِذَا رَفَعَ قَالَ: “اللَّهُمَّ رَبَّنَا لَكَ الْحَمْدُ مِلْءَ السَّمَاوَاتِ وَملء الْأَرْضِ وملء مَا بَيْنَهُمَا وَمِلْءَ مَا شِئْتَ مِنْ شَيْءٍ بَعْدُ”.
وَإِذَا سَجَدَ قَالَ: “اللَّهُمَّ لَكَ سَجَدْتُّ وَبِكَ آمَنْتُ وَلَكَ أَسْلَمْتُ سَجَدَ وَجْهِيَ لِلَّذِيْ خَلَقَهُ وَصَوَّرَهُ وَشَقَّ سَمْعَهُ وَبَصَرَهُ تَبَارَكَ اللهُ أَحْسَنُ الْخَالِقِيْنَ”.
ثُمَّ يَكُوْنَ مِنْ آخِرٍ مَّا يَقُوْلُ بَيْنَ التَّشَهُّدِ وَالتَّسْلِيْمِ: “اَللَّهُمَّ اغْفِرْ لِيْ مَا قَدَّمْتُ وَمَا أَخَّرْتُ وَمَا أَسْرَرْتُ وَمَا أَعْلَنْتُ وَمَا أَسْرَفْتُ وَمَا أَنْتَ أَعْلَمُ بِهِ مِنِّيْ أَنْتَ الْمُقْدِّمُ وَأَنْتَ الْمُؤَخِّرُ لَا إِلَهَ إِلَّا أَنْتَ”. رَوَاهُ مُسْلِمٌ.
وَفِيْ رِوَايَةٍ للشَّافِعِيٍّ: “وَالشَّرُّ لَيْسَ إِلَيْكَ وَالْمَهْدِيُّ مَنْ هَدَيْتَ أَنَا بِكَ وَإِلَيْكَ لَا مَنْجَى مِنْكَ وَلَا مَلْجَأَ إِلَّا إِلَيْكَ تَبَارَكْتَ”.
813. (2) [1/256–దృఢం]
’అలీ (ర) కథనం: ప్రవక్త (స) నమా’జుకు నిలబడి నపుడు, మరో ఉల్లేఖనంలో నమా’జు ప్రారంభించి నపుడు తక్బీరె త’హ్రీమ్ తరువాత ఈ దు’ఆ పఠించే వారు: ”వజ్జహ్తు వజ్హియ లిల్లజీ ఫ’తరస్సమా వాతి వల్ అర్’ద ’హనీఫఫన్ వ మా అనా మినల్ ముష్రికీన్. ఇన్న’స్సలాతీ వ నుసుకీ వ మ’హ్ యాయ వమమాతీ లిల్లాహి రబ్బిల్’ఆలమీన్. లాషరీక లహు, వ బిజా‘లిక ఉమిర్తు వ అనా మినల్ ముస్లిమీన్. అల్లాహుమ్మ అన్తల్ మలికు, లా ఇలాహ ఇల్లా అంత. అంత రబ్బీ వఅనా అబ్దుక. ”జలమ్తు నఫ్సీ. వ అ’అతరఫ్తు బి జ‘న్బీ, ఫ’గ్ఫిర్లీ జు‘నూబీ జమీఅన్. ఇన్నహు లాయ’గ్ ఫిరుజ్జు‘నూబ ఇల్లా అంత. వహ్దినీ లి అ’హ్సనిల్ అ’ఖ్లాఖి. లా యహ్దీ లిఅ’హ్సనిహా ఇల్లా అంత. వ’స్రిఫ్ ’అన్నీ సయ్యిఅ‘హా. లా య’స్రిఫ్ ’అన్నీ సయ్యిఅ‘హా ఇల్లా అంత. “లబ్బయ్ క వ స’అదయ్ క, వల్ ’ఖైరు కుల్లుహూ ఫి యదయ్ క. వష్షర్రు లైస ఇలైక. అనా బిక వ ఇలైక్. తబారక్త వ త’ఆలైత. అస్త’గ్ఫిరుక వ అతూబు ఇలైక.” — ‘నేను నా ముఖాన్ని భూమ్యాకాశాలను సృష్టించిన ఆయన వైపునకు త్రిప్పుకున్నాను. నేను ఒక్క దైవాన్నే ఆరాధించేవాడిని, నేను అవిశ్వాసిని కాను. నిస్సందేహంగా నా నమా’జు, నా ఖుర్బానీ, నా జీవితం, నా మరణం, అన్నీ, సమస్త లోకాలకు ప్రభువైన అల్లాహ్ కొరకే. అతనికి భాగస్వాము లెవ్వరూ లేరు. నన్ను దీన్ని గురించే ఆదేశించడం జరిగింది. నేను ముస్లిమును. ఓ ప్రభూ! నీవే వాస్తవ పాలకుడవు, నీవు తప్ప మరొక ఆరాధ్యుడు లేడు, నీవే నా ప్రభువువు, నేను నీ దాసుణ్ణి. నా ఆత్మకు నేను అన్యాయం చేసుకున్నాను. నేను నా పాపాలను ఒప్పుకుంటున్నాను. కనుక నీవూ నా పాపాలన్నిటినీ క్షమించు. నిశ్చయంగా, నీవు మాత్రమే పాపాలను క్షమించగలవాడవు. నాకు మంచి గుణాల వైపు మార్గం చూపించు. నీవే మంచి గుణాల వైపు మార్గం చూపించే వాడవు. ఇంకా నా నుండి నా పాపాలను దూరం చేయి. నీవు మాత్రమే పాపాలను దూరంచేసే వాడవు. నీ ఆజ్ఞాపాలన చేస్తున్నాను. నీ సహాయాన్ని అర్థిస్రున్నాను. మేలంతా నీ చేతుల్లోనే ఉంది. చెడు నీ నుండి రాదు. నేను నీ ఆధీనంలో ఉన్నాను. నీవు అత్యంత శుభకరుడవు. అత్యున్నతుడవు. నేను నిన్ను క్షమాపణ కోరుతున్నాను. నీ సన్నిధిలో పశ్చాత్తాప పడుతున్నాను.’
ప్రవక్త (స) రుకూలో ఈ దు’ఆ పఠించేవారు: ”అల్లాహుమ్మ లక రక’అతు, వ బిక ఆమన్తు. వలక అస్లమ్తు. ’ఖష’అలక సమ్’యీ, వబ’సరీ, వము’ఖ్ఖీ, వఅ”జమీ, వ ’అ’సబీ.” — ‘ఓ అల్లాహ్! నేను నీ ముందు వంగాను. నిన్ను విశ్వసించాను. నీకు విధేయుడనయ్యాను. నా చెవులు, నా కళ్ళు, నా మెదడు, నా ఎముకలు, నా నరాలు అన్నీ నీ ఆధీనంలో ఉన్నాయి.’
ప్రవక్త (స) రుకూ నుండి లేచినపుడు ఈ దు’ఆ పఠించే వారు: ”అల్లాహుమ్మ రబ్బనా లకల్ హమ్దు మిల్ అస్సమా వాతి వల్అర్’ది వమా బైనహుమా, వమిల్అ మా షీఅ’త మిన్ షైయిన్ బ’అదు.” — ‘ఓ అల్లాహ్ నా ప్రభూ! భూమ్యాకాశాల నిండా మరియు వాటి మధ్య అంతా, నీ స్తోత్రమే ఉంది. వాటి అంతటి లోనూ మరియు వాటి తర్వాతనూ, నీవు కోరిందే ఉంది.’
ప్రవక్త (స) సజ్దాలో ఈ దు’ఆ చదివేవారు: ”అల్లాహుమ్మ లక సజద్ తు, వ బిక ఆమన్తు, వలక అస్లమ్తు. సజద వజ్హియ లిల్లజీ ఖలఖహు వ సవ్వరహు వ షఖ్ఖ సమ్అహు వబ’సరహు. తబార కల్లాహు అ’హ్సనల్ ‘ఖాలిఖీన్.” — ‘ఓ అల్లాహ్! నేను నీకు సజ్దాచేశాను, నిన్ను విశ్వసించాను, నీకు విధేయుడ నయ్యాను. నా ముఖం, దాన్ని సృష్టించి, దాని రూపాన్ని తీర్చిదిద్ది, దాని వినికిడినీ, దృష్టినీ విప్పిన ఆయనకు సజ్దా చేసింది. అల్లాహ్ శుభకరుడు, సర్వ శ్రేష్ట సృష్టికర్త.’
ప్రవక్త (స) అత్త’హియ్యాతు మరియు సలామ్‌ల మధ్య ఈ దు’ఆ పఠించేవారు: ”అల్లాహుమ్మ’గ్ ఫిర్లీ మా ఖద్దమ్తు, వ మా అ’ఖ్ఖర్తు, వ మా అస్రర్తు, వ మా అ’అలన్తు, వ మా అస్రఫ్తు, వ మా అన్త అ’అలము బిహి మిన్నీ. అన్తల్ ముఖద్దిము, వ అన్తల్ ముఅ’ఖ్ఖిరు, లాఇ’లాహ ఇల్లా అంత.” — ‘ఓఅల్లాహ్! నేను చేసిన, ఇంకా చేయని, రహస్యంగా ఉన్న, బహిర్గతంగా ఉన్న పాపాలను, నా దుర్మా ర్గాలను, నీకు తెలిసి ఉన్న వాటిని, అన్నిటిని క్షమించు. నీవే వెనుక ముందూ చేసే వాడవు. నీవు తప్ప ఆరాధ్యులెవరూ లేరు.’ (ముస్లిమ్)
షాఫయీ ఉల్లేఖనంలో తక్బీరె త’హ్రీములో చదివిన ‘వల్ ఖైరుకుల్లహు ఫీ యదైక’ తరువాత ఈ పదాలు ఉన్నాయి. ”వష్షర్రు లైస ఇలైక, వల్ మహ్దియ్యు మన్ హదైత. అనా బిక, వ ఇలైక, లామన్జా మిన్క వలా మల్జాఅ ఇల్లా ఇలైక తబారక్త.” — ‘చెడును నీపై మోపడం జరుగదు, నీవు సన్మార్గం చూపినవాడే సన్మార్గగాముడు. నేను, నీ సహాయంతోనే ఉన్నాను, మరియు నీ వైపుకే మరలుతున్నాను. సాఫల్యం మరియు శరణం నీ నుండే లభిస్తాయి. నీవే చాలా శుభాలమయుడవు.’
814 – [ 3 ] ( صحيح ) (1/257)
وَعَنْ أَنَسٍ: أَنَّ رَجُلًا جَاءَ فَدَخَلَ الصَّفّ وَقَدْ حَفَزَهُ النَّفْسُ فَقَالَ: “الله اكبر.الْحَمْدُ للهِ حَمْدًا كَثِيْرًا طَيِّبًا مُّبَارَكًا فِيْهِ”. فَلَمَّا قَضَى رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم صَلَاتَهُ قَالَ: “أَيُّكُمْ الْمُتَكَلِمُ بِالْكَلِمَاتِ؟” فَأَرَمُ الْقَوْمُ. فَقَالَ: “أَيُّكُمْ الْمُتَكَلِّمُ بِالْكَلِمَاتِ؟” فَأَرَمَّ الْقَوْمُ. فَقَالَ: “أَيُّكُمُ الْمُتَكَلِّمُ بِهَا فَإِنَّهُ لَمْ يَقُلْ بَأْسًا”. فَقَالَ رَجُلٌ: جِئْتُ وَقَدْ حَفَزَنِيْ النَّفْسُ فَقُلْتُهَا. فَقَالَ: “لَقَدْ رَأَيْتُ اثْنَيْ عَشَرَ مَلَكًا يَّبْتَدِرُوْنَهَا أَيُّهُمْ يَرْفَعُهَا”. رَوَاهُ مُسْلِمٌ .
814. (3) [1/257–దృఢం]
అనస్ (ర) కథనం: ఒక వ్యక్తి వచ్చాడు, పంక్తిలో కలిశాడు. ఆయాసంతో ఉన్నాడు. ఆ స్థితిలోనే అతని నోట ఈ పదాలు వెలువడ్డాయి. ”అల్లాహుఅక్బర్, అల్’హమ్దు లిల్లాహి ‘హమ్దన్ కసీ’రన్ ‘తయ్యిబన్ ముబారకన్ ఫీహ్.” — ‘అల్లాహ్ గొప్పవాడు, అత్యధిక, మంచి, శుభకర స్తోత్రాలన్నీ అల్లాహ్ కొరకే.’ ప్రవక్త (స) నమా’జు అనంతరం ప్రజలవైపు తిరిగి, ‘ఈ దు’ఆ ఎవరు చదివారు,’ అని అడిగారు. అందరూ నిశ్శబ్దంగా ఉన్నారు. ఎవరూ సమాధానం ఇవ్వలేదు. మూడుసార్లు అడిగారు. అనంతరం, ‘ఇందులో భయపడవలసిన పని లేదు. అతడు తప్పు ఏమీ చేయలేదు,’ అని అన్నారు. ఒక వ్యక్తి లేచి, ‘నేనన్నాను. నేను మస్జిదులో ప్రవేశించాను అప్పుడు ఆయాసంతో ఉన్నాను,’ అని అన్నాడు. అప్పుడు ప్రవక్త (స) నేను 12 మంది దైవదూతలను ఆ వచనాలను అల్లాహ్ వద్దకు తీసుకొని వెళ్ళడానికి తొందరపడుతూ ఉండటం చూశాను.
అంటే ఈ వచనాలు దైవం వద్ద స్వీకృతి పొందాయి. వీటిని పఠించటం అభిలషణీయమే. (ముస్లిమ్)
—–
اَلْفَصْلُ الثَّانِيْ రెండవ విభాగం
815 – [ 4 ] ( صحيح ) (1/258)
وَعَنْ عَائِشَةَ رَضِيَ اللهُ عَنْهَا قَالَتْ: كَانَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم إِذَ افْتَتَحَ الصَّلَاةَ قَالَ: “سُبْحَانَكَ اللَّهُمَّ وَبِحَمْدِكَ وَتَبَارَكَ اسْمُكَ وَتَعَالَى جَدُّكَ وَلَا إِلَهَ غَيْرُكَ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَأَبُوْ دَاوُدَ.
815. (4) [1/258–దృఢం]
’ఆయి‘షహ్ (ర) కథనం: ప్రవక్త (స) నమా’జు ప్రారం భిస్తే ఈదు’ఆ చదివేవారు: ”సుబ్హానక అల్లాహుమ్మ వబి’హమ్దిక వతబారకస్ముక వత’ఆలా జద్దుక వలా యిలాహ ’గైరుక” — ‘ఓ అల్లాహ్! నీవు పరిశుద్ధుడవు, సర్వస్తోత్రాలూ నీ కొరకే, నీ నామం శుభనామం, నీవు మహోన్నతుడవు, నీవు తప్ప ఆరాధ్యులెవరూ లేరు.’ (తిర్మిజి’, అబూ దావూ’ద్)
816 – [ 5 ] ( صحيح ) (1/258)
وَرَوَاهُ ابْنُ مَاجَه عَنْ أَبِيْ سَعِيْدٍ. وَقَالَ التِّرْمِذِيُّ: هَذَا حَدِيْثٌ لَا نَعْرِفُهُ إِلَّا مِنْ حَدِيْثِ حَارِثَةَ وَقَدْ تُكَلِّمَ فِيْهِ مِنْ قبلِ حَفِظَهُ.
816. (5) [1/258–దృఢం]
దీనినే ఇబ్నె మాజహ్, అబూ స’యీద్ ద్వారా కూడా ఉల్లేఖించారు.
817 – [ 6 ] ( ضعيف ) (1/259)
وَعَنْ جُبَيْرِ بْنِ مُطْعِمٍ: أَنَّهُ رَأَىَ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يُصَلِّيْ صَلَاةً قَالَ: “اللهُ أَكْبَرُ كَبِيْرًا. اللهُ أَكْبَرُ كَبِيْرًا. اللهُ أَكْبَرُ كَبِيْرًا. وَالْحَمْدُ للهِ كَثِيْرًا. وَالْحَمْدُ للهِ كَثِيْرًا. وَالْحَمْدُ للهِ كَثِيْرًا. وَّسُبْحَانَ اللهِ بُكْرَةً وَأَصِيْلًا: “ثَلَاثًا” أَعُوْذُ بِاللهِ مِنَ الشَّيْطَانِ مِنْ نَفْخِهِ وَنَفْثِهِ وَهَمْزِهِ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ وَابْنُ مَاجَهُ؛ إِلَّا أَنَّهُ لَمْ يَذْكُرْ: “وَالْحَمْدُ للهِ كَثِيْرًا”. وَذَكَرَ فِيْ آخِرِهِ: “مِنَ الشَّيْطَانِ الرَّجِيْمِ”. وَقَالَ عَمْرُ رَضِيَ اللهُ عَنْهُ: نَفْخُهُ الْكِبْرُ وَنَفْثُهُ الشِّعْرُ وَهَمْزَهُ الْمُوْتَةُ.
817. (6) [1/259–బలహీనం]
జుబైర్ బిన్ ము’త్’ఇమ్ (ర) కథనం: ప్రవక్త (స)ను నమా’జు చదువుతుండగా చూశాను. ప్రవక్త (స) తక్బీరె త’హ్రీమ్ తర్వాత ఈ దు’ఆను పఠించేవారు.
”అల్లాహు అక్బర్ కబీరా, అల్లాహు అక్బర్ కబీరా, అల్లాహు అక్బర్ కబీరా, వల్’హమ్దులిల్లాహి కసీ‘రా, వల్’హమ్దు లిల్లాహి కసీ‘రా, వల్’హమ్దు లిల్లాహి కసీ‘రా, సుబ్’హానల్లాహి బుక్రతన్ వ అ‘సీలా, స‘లాస‘హ్. అ‘ఊజుబిల్లాహి మినష్షై‘తాన్, మిన్ నఫ్’ఖిహి, వ నఫ్సి‘హి వ హమ్’జిహి.” — ‘అల్లాహ్ చాలా గొప్పవాడు, అల్లాహ్ చాలా గొప్పవాడు, అల్లాహ్ చాలా గొప్పవాడు. సర్వ స్తోత్రాలూ అల్లాహ్ కొరకే, సర్వ స్తోత్రాలూ అల్లాహ్ కొరకే, సర్వస్తోత్రాలు అల్లాహ్కొరకే, నేను ఉదయం సాయంత్రం అల్లాహ్ పరిశుద్ధతను కొనియాడుతున్నాను, మూడుసార్లు. నేను షై’తాన్ నుండి, వాడి అహంకారం నుండి, వాడి చెడు నుండి, వాడి కలతల నుండి అల్లాహ్ శరణుకోరు తున్నాను.’ (అబూ దావూ’ద్, ఇబ్నె మాజహ్)
అతడు ఈ వాక్యాలు పేర్కొన లేదు: ”వల్’హమ్దు లిల్లాహి కసీ‘రా,” చివరలో అన్నారు: ”మినష్షై‘తా నిర్రజీమ్,” మరియు ‘ఉమర్ (ర) అన్నారు: ‘నేను షైతాను పుట్టించే దురహంకారము నుండి, వాడి దుష్ట కవిత్వం నుండి మరియు వాడి పిచ్చి చేష్టలనుండి (అల్లాహ్ శరణుకోరుతున్నాను.’)
818 – [ 7 ] ( ضعيف ) (1/259)
وَعَنْ سَمُرَةَ بْنِ جُنْدُبٍ: أَنَّهُ حَفِظَ عَنْ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم سكتتين: سَكْتَةً إِذَا كَبَّرَ وَسَكْتَةً إِذَا فَرَغَ مِنْ قِرَاءَةِ (غَيْرِ الْمَغْضُوْبِ عَلَيْهِمْ وَلَا الضَّالِّيْن) فَصَدَّقَهُ أَبِيْ بْنِ كَعْبٍ. رَوَاهُ أَبُوْ دَاوُدَ وَرَوَى التِّرْمِذِيُّ وَابْنُ مَاجَهُ. وَالدَّارِمِيُّ نَحْوَهُ.
818. (7) [1/259–బలహీనం]
సమురహ్ బిన్ జున్దుబ్ (ర) కథనం: ప్రవక్త (స) యొక్క రెండు మౌనాలు గుర్తించారు. ఒకటి తక్బీరె త’హ్రీమ తర్వాత, రెండవది సూరహ్ ఫాతి’హా ” ‘గైరిల్ మ’గ్’దూబి అలైహిమ్ వల’ద్దాల్లీన్” తర్వాత. ‘ఉబయ్ బిన్ క’అబ్ దీన్ని ధృవీకరించారు. [120] (అబూ దావూ’ద్, తిర్మిజి’, ఇబ్నె మాజహ్, దార్మీ)
819 – [ 8 ] ( صحيح ) (1/260)
وَعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: كَانَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم إِذَا نَهَضَ مِنَ الرَّكْعَةِ الثَّانِيَةِ اسْتَفْتَحَ الْقِرَاءَةَ بِ: “الْحَمْدُ للهِ رَبِّ الْعَالَمِيْنَ” وَلَمْ يَسْكُتْ. هَكَذَا فِيْ صَحِيْحِ مُسْلِمٍ. وَذَكَرَهُ الْحُمَيْدِيُّ فِيْ اَفْرَادِهِ وَكَذَا صَاحِبُ الْجَامِعِ عَنْ مُسْلِمٍ وَحْدَهُ .
819. (8) [1/260–దృఢం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) రెండవ రకా’తు పూర్తిచేసి మూడవరకా’తు కోసం నిలబడిన తరువాత మౌనంగా ఉండకుండా సూరహ్ ఫాతి’హా ప్రారంభించే వారు. ఇక్కడ మౌనంగా ఉండేవారు కారు. (ముస్లిమ్)
—–
اَلْفَصْلُ الثَّالِثُ మూడవ విభాగం
820 – [ 9 ] ( صحيح ) (1/260)
عَنْ جَابِرٍ قَالَ: كَانَ النَّبِيُّ صلى الله عليه وسلم إِذَا اسْتَفْتَحَ الصَّلَاةُ كَبَّرَ ثُمَّ قَالَ: “إِنَّ صَلَاتِيْ وَنُسُكِيْ وَمَحْيَايَ وَمَمَاتِيْ للهِ رَبِّ الْعَالَمِيْنَ. لَا شَرِيْكَ لَهُ وَبِذَلِكَ أُمِرْتُ وَأَنَا مِنَ الْمُسْلِمِيْن. اَللَّهُمَّ اهْدِنِيْ لِأَحْسَنِ الْأَعْمَالِ وَأَحْسَنِ الْأَخْلَاقِ. لَا يَهْدِيْ لِأَحْسَنِهَا إِلَّا أَنْتَ. وَقِنِيْ سَيِّئَ الْأَعْمَالِ. وَسَيِّئَ الْأَخْلَاقِ. لَا يَقِيْ سَيِّئَهَا إِلَّا أَنْتَ”. رَوَاهُ النَّسَائِيُّ .
820. (9) [1/260–దృఢం]
జాబిర్ (ర) కథనం: ప్రవక్త (స) నమా’జు ప్రారంభించి నపుడు ‘అల్లాహు అక్బర్’ అని పలికిన తరువాత ఈ దు’ఆ చదివేవారు:
”ఇన్న‘సలాతీ, వనుసుకీ, వమ‘హ్యాయ, వ మమాతీ లిల్లాహి రబ్బిల్ ‘ఆలమీన్. లా షరీక లహు, వబిజా‘లిక ఉమిర్తు, వ అనా అవ్వలుల్ ముస్లిమీన్. అల్లాహుమ్మహ్దినీ, లిఅ‘హ్సనిల్ అ‘అమాలి వ అ‘హ్సనిల్ అ‘ఖ్లాఖి. లాయహ్దీ లి అ‘హ్సనిహా ఇల్లా అన్త. వఖినీ సయ్యిఅల్ అ‘అమాలి, వ సయ్యి అల్ అ‘ఖ్లాఖి, లా యఖీ సయ్యిఅహా ఇల్లా అంత.” — ‘నిస్సందేహంగా నా నమా’జు, నా ఆరాధన, నా జీవితం, నా మరణం కేవలం అల్లాహ్ కొరకే. ఆయన సర్వలోకాలకు ప్రభువు. ఆయనకు సాటి ఎవ్వరూ లేరు. దీన్ని గురించే నాకు ఆదేశించడం జరిగింది. అందరికంటే నేనే మొట్ట మొదటి విధేయుడను. ఓ అల్లాహ్! నాకు సత్కార్యాలు, సద్గుణాల మార్గం చూపు. ఎందుకంటే నీవు తప్ప మరెవ్వరూ సద్దుణాలు చూపించలేరు. ఇంకా నా నుండి దుర్గుణా లను దూరం చేయి, నీవు తప్ప మరెవ్వరూ దుర్గుణాలను దూరం చేయలేరు.” (నసాయి’)
821 – [ 10 ] ( صحيح ) (1/260)
وَعَنْ مُحَمَّدٍ بْنِ مَسْلَمَةَ قَالَ: إِنّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم كَانَ إِذَا قَامَ يُصَلِّيْ تَطَوُعًا قَالَ: “اللهُ أَكْبَرُ وَجَّهْتُ وَجْهِيَ لِلَّذِيْ فَطَرَ السَّمَاوَاتِ وَالْأَرْضَ حَنِيْفًا مُسْلِمًا وَمَا أَنَا مِنَ الْمُشْرِكِيْنَ”. وَذَكَرَ الْحَدِيْثَ مِثْلٌ حَدِيْثِ جَابِرٍ إِلَّا أَنَّهُ قَالَ: “وَأَنَا مِنَ الْمُسْلِمِيْنَ”. ثُمَّ قَالَ: “اَللَّهُمَّ أَنْتَ الْمَلِكُ لَا إِلَهَ إِلَّا أَنْتَ سُبْحَانَكَ وَبِحَمْدِكَ”. ثُمَّ يَقْرَأُ. رَوَاهُ النَّسَائِيُّ .
821. (10) [1/260–దృఢం]
ము’హమ్మద్ బిన్ మస్లమహ్ (ర) కథనం: ప్రవక్త (స) నఫిల్ నమా’జు చదవడానికి నిలబడినప్పుడు: ”అల్లాహు అక్బర్, వజ్జహ్తు వజ్హియ లిల్లజీ ఫతరస్సమా వాతి వల్అర్’ద ‘హనీఫన్ వమా అనా మినల్ ముష్రికీన్.” — ‘అల్లాహ్ గొప్పవాడు, నేను నా ముఖాన్ని చిత్తశుద్ధితో భూమ్యాకాశాలను సృష్టించిన ఆయనవైపు త్రిప్పుతున్నాను. నేను అవిధేయుడను కాను.’ ఆ తరువాత జాబిర్ (ర) ‘హదీసు’లా పేర్కొన్నారు. కాని ము’హమ్మద్ బిన్ మస్లమహ్: ”అనా మినల్ ముస్లిమీన్” అని పేర్కొన్నారు. దాని తర్వాత ”అల్లాహుమ్మ అంతల్ మలికు లాయి లాహ ఇల్లా అంత సుబ్’హానక వ బి’హమ్ దిక” — ‘ఓ అల్లాహ్ నీవే సార్వభౌముడవు, నీవు తప్ప ఆరాధ్యు లెవరూ లేరు. నీవు పరిశుద్ధుడవు, నీవే ప్రసంశలకు తగినవాడవు.’ ఆ తరువాత ఖిరా’అత్ చేసేవారు. (నసాయి’)
=====
12– بَابُ الْقِرَاءَةِ فِيْ الصَّلَاةِ
12. నమా’జులో ఖుర్ఆన్ పఠనం
اَلْفَصْلُ الْأَوَّلُ మొదటి విభాగం
822 – [ 1 ] ( متفق عليه ) (1/262)
عَنْ عُبَادَةَ بْنِ الصَّامِتِ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَا صَلَاةَ لِمَنْ لَمْ يَقْرَأْ بِفَاتِحَةِ الْكِتَابِ”. وَفِيْ رِوَايَةِ لِّمُسْلِمٍ: “لِمَنْ لَمْ يَقْرَأْ بِأُمِّ الْقُرْآنِ فَصَاعِدًا.
822. (1) [1/260–ఏకీభవితం]
’ఉబాదహ్ బిన్ ’సామిత్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”సూరహ్ ఫాతి’హా చదవని వారి నమా’జు కాదు.” (బు’ఖారీ, ముస్లిమ్)
ముస్లిమ్ ఉల్లేఖనంలో ఇలా ఉంది, ”సూరహ్ ఫాతి’హా చదవకుండా ఎంత ఖుర్ఆన్ పఠించినా అతని నమా’జు అవదు.”
823 – [ 2 ] ( صحيح ) (1/262)
وَعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَنْ صَلَّى صَلَاةً لَمْ يَقْرَأْ فِيْهَا بِأُمِّ الْقُرْآنِ فَهِيَ خِدَاجٌ ثَلَاثًا غَيْرَ تَمَامٍ”. فَقِيْلَ لِأَبِيْ هُرَيْرَةَ: إِنَّا نَكُوْنَ وَرَاءَ الْإِمَامِ. فَقَالَ اِقْرَأْ بِهَا فِيْ نَفْسِكَ. فَإِنِّيْ سَمِعْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ: “قَالَ اللهُ تعالى قَسَمْتُ الصَّلَاةَ بَيْنِيْ وَبَيْنَ عَبْدِيْ نِصْفَيْنِ وَلِعَبْدِيْ مَا سَأَلَ. فَإِذَا قَالَ الْعَبْدُ (الْحَمْدُ للهِ رَبِّ الْعَالَمِيْنَ) قَالَ اللهُ تَعَالَى حَمَدَنِيْ عَبْدِيْ وَإِذَا قَالَ: (الرَّحْمَنِ الرَّحِيْمِ). قَالَ اللهُ تَعَالى أَثْنَى عَلَيَّ عَبْدِيْ وَإِذَا قَالَ: (مَالِكِ يَوْمِ الدِّيْنِ). قَالَ: مَجَّدَنِيْ عَبْدِيْ. فَإِذَا قَالَ: (إِيَّاكَ نَعْبدُ وَإِيَّاكَ نَسْتَعِيْنَ). قَالَ: هَذَا بَيْنِيْ وَبَيْنَ عَبْدِيْ. وَلِعَبْدِيْ مَا سَأَلَ. فَإِذَا قَالَ: (اِهْدِنَا الصِّرَاطَ الْمُسْتَقِيْمَ صِرَاطَ الَّذِيْنَ أَنْعَمْتَ عَلَيْهِمْ غَيْرِ الْمَغْضُوْبِ عَلَيْهِمْ وَلَا الضَّالِيْنَ). قَالَ: هَذَا لِعَبْدِيْ وَلِعَبْدِيْ مَا سَأَلَ”. رَوَاهُ مُسْلِم.
823. (2) [1/262–దృఢం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఎవరైనా నమా’జు చదివి, అందులో సూరహ్ ఫాతి’హా చదవకపోతే అతని నమా’జు అసంపూర్ణంగా ఉంటుంది. మూడు సార్లు ప్రవక్త (స): ‘అతని నమా’జు అసంపూర్ణం,’ అని అన్నారు. అనంతరం అబూ హురైరహ్ ”మేము ఇమాము వెనుక ఉంటాం” అని అంటే, ‘అప్పుడు మనసులో సూరహ్ ఫాతిహా చదువు కోండి,’ అని అన్నారు. ఎందుకంటే ప్రవక్త (స) ఇలా ప్రవచిస్తూ ఉండగా నేను విన్నాను. అల్లాహ్(త) ఆదేశం: ”నేను నమాజును నాకు దాసునికి మధ్య సగం, సగం పంచివేసాను.” ఇంకా నా దాసుడు కోరింది అతని కోసం. దాసుడు: ‘అల్’హమ్దు లిల్లాహి రబ్బిల్ ‘ఆలమీన్,’ అంటే అల్లాహ్(త): ‘దాసుడు నా స్తోత్రం పలికాడు,’ అని అంటాడు. దాసుడు: ‘అర్ర’హ్మా నిర్ర’హీమ్,’ అని అంటే, అల్లాహ్(త) ‘నా దాసుడు నన్ను ప్రశంసించాడు,’ అని అంటాడు. దాసుడు: ‘మాలికి యౌమిద్దీన్,’ అని అంటే, అల్లాహ్(త): ‘నా దాసుడు నా గొప్పతనాన్ని కొనియాడాడు,’ అని అంటాడు. దాసుడు: ‘ఇయ్యాకన’అబుదు వ ఇయ్యాక నస్తయీ’న్,’ అని అంటే, అల్లాహ్(త): ‘ఇది నాకు, నా దాసునికి మధ్య ఉంది, అతను నన్ను కోరినపుడు.’ దాసుడు: ‘ఇహ్‌దినస్సిరాతల్ ముస్తఖీమ్,’ అని అంటే, అల్లాహ్(త): ‘ఇది నాకూ అర్థించే దాసులకు మధ్య ఉంది,’ అని అంటాడు. [121] (ముస్లిమ్)
824 – [ 3 ] ( صحيح ) (1/262)
وَعَنْ أَنَسٍ: أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم وَأَبَا بَكْرٍ وَعُمَرَ رَضِيَ اللهُ عَنْهُمَا كَانُوْا يَفْتَتِحُوْنَ الصَّلَاةَ ب: “اَلْحَمْدُ للهِ رَبِّ الْعَالَمِيْنَ”. رَوَاهُ مُسْلِمٌ.
824. (3) [1/262–దృఢం]
అనస్ (ర) కథనం: ప్రవక్త (స) అబూ బకర్, ‘ఉమర్, నమా’జును అల్’హమ్దులిల్లాహ్ ద్వారా ప్రారంభించే వారు. [122] (ముస్లిమ్)
825 – [ 4 ] ( متفق عليه ) (1/263)
وَعَنْ أَبِيْ هُرَيْرَةَ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِذَا أَمَّنَ الْإِمَامُ فَأَمِّنُوْا فَإِنَّهُ مَنْ وَافَقَ تَأْمِيْنُهُ تَأْمِيْنَ الْمَلَائِكَةِ غُفِرَ لَهُ مَا تَقَدَّمَ مِنْ ذَنْبِهِ“.
وَفِيْ رِوَايَةٍ قَالَ: “إِذَا قَالَ الْإِمَامُ: (غَيْرِ الْمَغْضُوْبِ عَلَيْهِمْ وَلَا الضَّالِيْن) فَقُوْلُوْا: آمِيْنَ فَإِنَّهُ مَنْ وَافَقَ قَوْلُهُ قَوْلَ الْمَلَائِكَةِ غُفِرَ لَهُ مَا تَقَدَّمَ مِنْ ذَنْبِهِ”. هَذَا لَفْظُ الْبُخَارِيِّ وَلِمُسْلِمٍ نَحْوَهُ.
وَفِيْ أُخْرَى لِلْبُخَارِيِّ قَالَ: “إِذَا أَمَّنَ الْقَارِئْ فَأَمِّنُوْا فَإِنَّ الْمَلَائِكَةَ تُؤْمِنُ فَمَنْ وَافَقَ تَأْمِيْنُهُ تَأْمِيْنَ الْمَلَائِكَةِ غُفِرَ لَهُ مَا تَقَدَّمَ مِنْ ذَنْبِهِ”.
825. (4) [1/263–ఏకీభవితం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఇమాము ఆమీన్ అని అంటే మీరు కూడా ఆమీన్ అనండి. ఎందుకంటే ఒకని ఆమీన్ దైవదూతల ఆమీన్తో కలిస్తే, అతని వెనుకటి పాపాలన్నీ క్షమించ బడతాయి.” [123] (బు’ఖారీ, ముస్లిమ్)
మరో ఉల్లేఖనంలో ఇలా ఉంది, ఇమాము, ”గైరిల్ మగ్’దూబి అలైహిమ్ వల’ద్దాల్లీన్,” పఠిస్తే మీరు ‘ఆమీన్’ పలకండి. ఒకని ఆమీన్ దైవదూతల ఆమీన్తో కలిస్తే, అతని వెనుకటి పాపాలన్నీ క్షమించ బడతాయి. (బు’ఖారీ, ముస్లిమ్)
బుఖారీలోని మరో ఉల్లేఖనలో ఇలా ఉంది, ”ఇమాము ఆమీన్ అని పలికితే మీరూ ఆమీన్ పలకండి. దైవదూతలు కూడా ఆమీన్ అంటారు. ఎవరి ఆమీన్ దైవదూతల ఆమీన్ తో కలిస్తే, వారి వెనుకటి పాపాలన్నీ క్షమించబడతాయి.
826 – [ 5 ] ( صحيح ) (1/263)
وَعَنْ أَبِيْ مُوْسَى الْأَشْعَرِيِّ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِذَا صَلَّيْتُمْ فَأَقِيْمُوْا صُفُوْفَكُمْ ثُمَّ لَيَؤُمَّكُمْ أَحَدُكُمْ فَإِذَا كَبَّرَ فَكَبِّرُوْا وَإِذَا قَالَ: (غَيْرِ الْمَغْضُوْبِ عَلَيْهِمْ وَلَا الضَّالِيْنَ) فَقُوْلُوْا آمِيْنَ يُجِبْكُمُ اللهُ فَإِذَا كَبَّرَ وَرَكَعَ فَكَبِروْا وَارْكَعُوْا. فَإِنَّ الْإِمَامَ يَرْكَعُ قَبْلَكُمْ وَيَرْفَعُ قَبْلَكُمْ. فَقَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “فَتِلْكَ بِتِلْكَ”. قَالَ: “وَإِذَا قَالَ سَمِعَ اللهُ لِمَنْ حَمِدَهُ. فَقُوْلُوْا اللَّهُمَّ رَبَّنَا لَكَ الْحَمْدُ يَسْمَعُ اللهُ لَكُمْ”. رَوَاهُ مُسْلِمٌ.
826. (5) [1/263–దృఢం]
అబూ మూసా అష్’అరీ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మీరు సామూహికంగా నమా’జు చదివినప్పుడు పంక్తులను సరిచేసుకోండి. ఆ తరువాత మీలో ఒకరు ఇమాముగా ఉండాలి. అతడు తక్బీరె త’హ్రీమ కోసం ‘అల్లాహు అక్బర్’ అని పలకాలి. మీరు కూడా ‘అల్లాహు అక్బర్’ అని పలకాలి. ఇమాము, ‘గైరిల్ మ’గ్’దూబి అలైహిమ్ వల’ద్దాల్లీన్’ చదివితే, మీరు ‘ఆమీన్’ అని అనండి. అల్లాహ్ మీ ప్రార్థన స్వీకరిస్తాడు. ఆ తరువాత ఇమాము ‘అల్లాహు అక్బర్’ అని పలికి రుకూ’ చేస్తే, మీరు కూడా ‘అల్లాహు అక్బర్’ అని పలకండి. రుకూ’ చేయండి. ఇమాము మీకంటే ముందు రుకూ’ చేయాలి. తల ఎత్తాలి. ఎందుకంటే ఇమాము మీకంటే ముందు ఆచరించాలి. మీరు అతని తరువాత ఆచరించాలి. ఇమాము ‘సమిఅల్లా హులిమన్ ‘హమిదహ్’ అని అంటే మీరు ‘రబ్బనా వలకల్’హమ్దు’ అని పలకండి. అల్లాహ్ మీరు స్తోత్రించటం వింటాడు. (ముస్లిమ్)
827 – [ 6 ] ( صحيح ) (1/263)
وَفِيْ رِوَايَةٍ لَهُ عَنْ أَبِيْ هُرَيْرَةَ وَقَتَادَةَ: “وَإِذَا قَرَأَ فَأَنْصِتُوْا”
827. (6) [1/263–దృఢం]
అబూ హురైరహ్ మరియు ఖతాదహ్ల ద్వారా మరో ఉల్లేఖనంలో ”ఇమాము పఠించినపుడు నిశ్శబ్దంగా ఉండండి” అని ఉంది. [124]
828 – [ 7 ] ( متفق عليه ) (1/264)
وَعَنْ أَبِيْ قَتَادَةَ قَالَ: كَانَ النَّبِيُّ صلى الله عليه وسلم يَقْرَأُ فِيْ الظُّهْرِ فِيْ الْأُوْلَيَيْنِ بِأُمِّ الْكِتَابِ وَسُوْرَتَيْنِ. وَفِيْ الرَّكْعَتَيْنِ الْأَخَرَيَيْنِ بِأُمِّ الْكِتَابِ وَيُسْمِعُنَا الْآيَةَ أَحْيَانًا وَيُطَوِّلُ فِيْ الرَّكْعَةِ الْأُوْلَى مَا لَايُطِيْلُ فِيْ الرَّكْعَةِ الثَّانِيَةِ. وَهَكَذَا فِيْ الْعَصْرِ وَهَكَذَا فِيْ الصُّبْحِ .
828. (7) [1/264–ఏకీభవితం]
అబూ ఖతాదహ్ (ర) కథనం: ప్రవక్త (స) ”జుహర్ మొదటి రెండు రకాతుల్లో సూరహ్ ఫాతి’హాతో పాటు సూరాలు చదివేవారు. తరువాతి రెండు రకాతుల్లో కేవలం సూరహ్ ఫాతి’హా మాత్రమే చదివేవారు. ఒక్కో సారి ఏదైనా వాక్యాన్ని బిగ్గరగా చదివేవారు. రెండవ రకా’తుకంటే మొదటి రకా’తు కొంతదీర్ఘంగా ఉండేది. ‘అ’సర్ నమా’జులో ఇలాగే చేసేవారు. ఫజ్ర్ నమా’జులో కూడా ఇలాగే చేసేవారు. (బు’ఖారీ, ముస్లిమ్)
829 – [ 8 ] ( صحيح ) (1/264)
وَعَنْ أَبِيْ سَعِيْدِ الْخُدْرِيِّ قَالَ: كُنَّا نَحْزُرُ قِيَامَ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم فِيْ الظُّهْرِ وَالْعَصْرِ فَحَزَرْنَا قِيَامَهُ فِيْ الرَّكْعَتَيْنِ الْأَوْلَيَيْنِ مِنَ الظُّهْرِ قَدْرِ قرَاءَةِ ،(الم تَنْزِيْلُ) السَّجْدَةِ- ، – وَفِيْ رِوَايَةٍ فِيْ كُلِّ رَكْعَةٍ قَدْرَ ثَلَاثِيْنَ آيَةً- وَحَزَرْنَا قِيَامَهُ فِيْ الْأُخْرَيَيْنِ قَدْرَ النِّصْفِ مِنْ ذَلِكَ وَحَزَرْنَا فِيْ الرَّكْعَتَيْنِ الْأُوْلَيَيْنِ مِنَ الْعَصْرِ عَلَى قَدْرِ قِيَامِهِ فِيْ الْأَخِرِيَيْنِ مِنَ الظُّهْرِ وَفِيْ الْأَخِرِيَيْنِ مِنَ الْعَصْرِ عَلَى النِّصْفِ مِنْ ذَلِكَ. رَوَاهُ مُسْلِمٌ.
829. (8) [1/264–దృఢం]
అబూ సయీద్ అల్ ’ఖుదురీ (ర) కథనం: ప్రవక్త (స) ”జుహ్ర్ మరియు ‘అస్ర్’ నమా’జుల్లోని ఖియామ్ మరియు ఖిరా’అత్‌లను గమనించే వాళ్ళం. ”జుహ్ర్ మొదటి రెండు రకా’తులు అలిఫ్ లామ్ మీమ్ తన్జీలు అస్-సజ్దా (32), అంత దీర్ఘంగా ఉండటం గమనించాము. మరో ఉల్లేఖనంలో ఇలా ఉంది, ”ప్రతి రకాతులో 30 ఆయతులు చదివేటంత ఉంటాయి. ”జుహర్లో తరువాత రెండు రకా’తులు, మొదటి రకా’తులకు సగం ఉండటం గమనించాము. అదేవిధంగా ‘అ’స్ర్ మొదటి రెండు రకా’తులు ”జుహ్ర్ తరువాతి రెండు రకా’తులకు సగం ఉండటం గమనించాము. (ముస్లిమ్)
830 – [ 9 ] ( صحيح ) (1/264)
وَعَنْ جَابِرٍ بْنِ سَمُرَةَ قَالَ: كَانَ النَّبِيُّ صلى الله عليه وسلم يَقْرَأُ فِيْ الظُّهْرِ ب) اَللَّيْلِ إِذَا يَغْشَى) ؛ وَفِيْ رِوَايَةِ بِ(سَبِّحِ اسْمَ رَبِّكَ الْأَعْلَى-) ؛ وَفِيْ الْعَصْرِ نَحْوَ ذَلِكَ؛ وَفِيْ الصُّبْحِ أَطْوَلُ مِنْ ذَلِكَ. رَوَاهُ مُسْلِم .
830. (9) [1/264–దృఢం]
జాబిర్ బిన్ సమురహ్ (ర) కథనం: ప్రవక్త (స) ఒక్కోసారి ”జుహ్ర్ నమా’జులో వల్లైలి ఇ’జాయ’గ్షా (అల్లైల్, 92), ఒక్కోసారి సబ్బిహిస్మరబ్బికల్ అ’అలా (అల్-అ’అలా’, 87) చదివేవారు. అస్ర్లో కూడా ఇలాగే చేసేవారు. ఫజ్ర్ నమా’జులో దీర్ఘంగా పఠించే వారు. (ముస్లిమ్)
831 – [ 10 ] ( متفق عليه ) (1/264)
وَعَنْ جُبَيْرِ بْنِ مُطْعِمٍ قَالَ: سَمِعْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يَقْرَأُ فِيْ الْمَغْرِبِ بِ(الطُّوْرِِ) ؛“
831. (10) [1/264–ఏకీభవితం]
జుబైర్ బిన్ ము’త్’ఇమ్ (ర) కథనం: ప్రవక్త (స) మ’గ్రిబ్ నమా’జులో సూరహ్ అ’త్-‘తూర్, (52) పటించటం విన్నాను. (బు’ఖారీ, ముస్లిమ్)
832 – [ 11 ] ( متفق عليه ) (1/265)
وَعَنْ أُمِّ اَلْفَضْلِ بِنْتِ الْحَارِثِ قَالَتْ: سَمِعْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يَقْرَأُ فِيْ الْمَغْرِبِ بِ (اَلْمُرْسَلَات عُرْفًا)- ؛ متفق عليه؛
832. (11) [1/265–ఏకీభవితం]
ఉమ్ముల్ ఫ’జ్ల్ బిన్తె ’హారిస్‘ (ర) కథనం: ప్రవక్త (స) మ’గ్రిబ్ నమా’జులో సూరహ్ అల్-ముర్సలాత్, (77) పఠించటం విన్నాను. (బు’ఖారీ, ముస్లిమ్)
833 – [ 12 ] ( متفق عليه ) (1/265)
وَعَنْ جَابِرٍ قَالَ: كَانَ مُعَاذُ يُصَلِّيْ مَعَ النَّبِيِّ صلى الله عليه وسلم. ثُمَّ يَأْتِيْ فَيَؤُمُّ قَوْمَهُ فَصَلَّى لَيْلَةً مَعَ النَّبِيِّ صلى الله عليه وسلم اَلْعِشَاءَ. ثُمَّ أَتَى قَوْمُهُ فَأَمَّهُمْ فَافْتَتَحَ بِسُوْرَةِ الْبَقْرَةِ فَانْحَرَفَ رَجُلٌ فَسَلَّمَ. ثُمَّ صَلَّى وَحْدَهُ وَانْصَرَفَ. فَقَالُوْا لَهُ أَنَافقت يَا فُلَانُ. قَالَ: لَا وَاللهِ وَلَآتِيَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم فَلَأُخْبِرَنَّهُ. فَأَتَى رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم. فَقَالَ: يَا رَسُوْلَ اللهِ إِنَّا أَصْحَابُ نَوَاضِحَ نَعْمَلُ بِالنَّهَارِ وَإِنَّ مَعَاذًا صَلَّى مَعَكَ الْعِشَاءَ. ثُمَّ أَتَى قَوْمَهُ فَافْتَتَحَ بِسُوْرَةِ الْبَقْرَةِ. فَأَقْبَلَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم عَلَى مُعَاذُ فَقَالَ: “يَا مُعَاذُ أَفَتَّانٌ أَنْتَ اِقْرَأْ (وَالشَّمْسِ وَضُحَاهَا-)‘ (وَضُحَى)‘ (وَاللَّيْلِ إِذَا يَغْشَى-) ، وَ (سَبِّحِ اسْمِ رَبِّكَ الْأَعْلَى-)؛ متفق عليه؛
833. (12) [1/265–ఏకీభవితం]
జాబిర్ (ర) కథనం: ముఆజ్ బిన్ జబల్ ప్రవక్త (స)తో కలసి నమా’జు చదివిన అనంతరం తన జాతి వారి మస్జిద్కు వెళ్ళి, వారికి ఇమామత్ చేసేవారు. ఒకరోజు రాత్రి ప్రవక్త (స)తో కలసి ‘ఇషా’ నమా’జు చదివిన తరువాత తన జాతివారి మస్జిద్కు వెళ్ళి ‘ఇషా’ నమా’జు చదివించటం ప్రారంభించారు. సూరహ్ బఖరహ్ చదవసాగారు. ఒక వ్యక్తి భరించ లేక మధ్యలో విరమించి ఒంటరిగా నమా’జు చదువుకొని వెళ్ళిపోయాడు. తరువాత ప్రజలు అతనితో, ‘ఒరే! నువ్వు కపటాచారివి అయిపోయావు,’ అని అన్నారు. దానికి ఆ వ్యక్తి, ‘నేను కపటాచారిని కాలేదు, అల్లాహ్ సాక్షి! నే నిప్పుడు ప్రవక్త (స) వద్దకు వెళ్ళి జరిగింది విన్నవించుకుంటాను,’ అని అన్నాడు. అనంతరం ఆ వ్యక్తి ప్రవక్త (స) వద్దకు వచ్చి, ‘ఓ ప్రవక్తా! నేను ‘ఇషా’ నమా’జులో పాల్గొన్నాను. ము’ఆ’జ్ (ర) సూరహ్ బఖరహ్ లాంటి పెద్ద సూరహ్ చదవటం ప్రారంభించారు. నేను అలసి ఉన్నాను. ఎక్కువసేపు నిలబడలేక పోయాను. అందు వల్ల నమా’జు విరమించి, ఒంటరిగా నమా’జు చదువుకున్నాను. అది విన్న ప్రవక్త (స) ము’ఆ’జ్ వైపు తిరిగి ఓ ము’ఆ’జ్! నువ్వు ప్రజలను కల్లోలాలకు గురిచేస్తున్నావు, నువ్వు ఇషా నమా’జులో సూరహ్ షమ్స్ (91), సూరహ్ అద్-దుహా (91) సూరహ్ అల్ లైల్ (92), సూరహ్ అ’అలా (87) పఠిస్తూ ఉండు,’ అని చెప్పారు. [125] (బు’ఖారీ, ముస్లిమ్)
834 – [ 13 ] ( متفق عليه ) (1/265)
وَعَنْ الْبَرَاءِ قَالَ: سَمِعْتُ النَّبِيَّ صلى الله عليه وسلم يَقْرَأُ فِيْ الْعِشَاءِ (وَالتِّيْنِ وَالزَّيْتُوْنِ-)؛ وَمَا سَمِعْتُ أَحَدًا أَحْسَنَ صَوْتًا مِّنْهُ ؛ متفق عليه.
834. (13) [1/265–ఏకీభవితం]
బరా‘ (ర) కథనం: ప్రవక్త (స) ‘ఇషా’ నమా’జులో సూరహ్ తీన్ (95) పఠించడం విన్నాను. అతనిలా మధురమైన కంఠస్వరం నేనుఎవరిదీవినలేదు. [126] (బు’ఖారీ, ముస్లిమ్)
835 – [ 14 ] ( صحيح ) (1/265)
وَعَنْ جَابِرِ بْنِ سَمُرَةَ قَالَ: كَانَ النِّبِيُّ صلى الله عليه وسلم يَقْرَأُ فِيْ الْفَجْرِ بِ: (ق وَالْقُرْآنِ الْمَجِيْدِ-)؛ وَنَحْوِهَا وَكَانَتْ صَلَاتُهُ بَعْدُ تَخْفِيْفًا. رَوَاهُ مُسْلِمٌ.
835. (14) [1/265–దృఢం]
జాబిర్ బిన్ సమురహ్ (ర) కథనం: ప్రవక్త (స) ఫజ్ర్ నమాజులో సూరహ్ ఖాఫ్ (50), అదే విధమైన మరో సూరహ్ పఠించేవారు. ఆ తరువాత ప్రవక్త (స) నమా’జు చాలా తేలిగ్గా ఉండేది. (ముస్లిమ్)
అంటే ఫజ్ర్ నమాజులో దీర్ఘంగా ఖిరాఅత్ చేసేవారు, ఇంకా జుహ్ర్, అస్ర్ మొదలైన వాటిలో ఖిరాఅత్ సంక్షిప్తంగా చేసేవారు.
836 – [ 15 ] ( صحيح ) (1/265)
وَعَنْ عَمْرِو بْنِ حُرَيْثٍ: أَنَّهُ سَمِعَ النَّبِيُّ صلى الله عليه وسلم يَقْرَأُ فِيْ الْفَجْرِ :(وَاللَّيْلِ إِذَا عَسْعَسَ)؛ رَوَاهُ مُسْلِمٌ
836. (15) [1/265–దృఢం]
’అమ్రూ బిన్ ’హురైస్‘ (ర) కథనం: ప్రవక్త (స) ఫజ్ర్ నమా’జులో ఇజష్షమ్స్సు కువ్విరత్ (81) చదువు తుండగా నేను విన్నాను. (ముస్లిమ్)
837 – [ 16 ] ( صحيح ) (1/265)
وَعَنْ عَبْدِ اللهِ بْنِ السَّائِبِ قَالَ: صَلَّى لَنَا رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم الصُّبْحَ بِمَكَّةَ فَاسْتَفْتَحَ سُوْرَةَ (اَلْمُؤْمِنِيْنَ-)،حَتَّى جَاءَ ذِكْرُ مُوْسَى وَهَارُوْنَ أَوْ ذِكْرُ عِيْسَى أَخَذَتِ النَّبِيَّ صلى الله عليه وسلم سَعْلَةٌ فَرَكَعَ. رَوَاهُ مُسْلِمٌ .
837. (16) [1/265–దృఢం]
’అబ్దుల్లాహ్ బిన్ సాయి‘బ్ (ర) కథనం: ప్రవక్త (స) మక్కహ్ లో మాకు ఫజ్ర్ నమా’జు చదివించారు. సూరహ్ ము’మినూన్ (23) చదవసాగారు. చదు వుతూ మూసా మరియు హారూన్ లేదా ఈసా ప్రస్తావన వచ్చినపుడు ప్రవక్త (స)కు దగ్గు వచ్చింది. ప్రవక్త (స) పఠనం ఆపి రుకూ’లోకి వెళ్ళిపోయారు. [127](ముస్లిమ్)
838 – [ 17 ] ( متفق عليه ) (1/266)
وَعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: كَانَ النَّبِيُّ صلى الله عليه وسلم يَقْرَأُ فِيْ الْفَجْرِ يَوْمَ الْجُمْعَةِ ب: (الم تَنْزِيْلُ-) فِيْ الرَّكْعَةِ الْأُوْلَى وِفِيْ الثَّانِيَةِ: (هَلْ أَتَى عَلَى الْإِنْسَانِ)- ؛ متفق عليه .
838. (17) [1/266–ఏకీభవితం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) శుక్రవారం ఫజ్ర్ నమా’జ్‌లోకి మొదటి రకా’త్లో సూరహ్ అలిఫ్ లామ్ మీమ్ తన్జీల్-సజ్దా (32) మరియు రెండవ రకాతులో హల్అతా ‘అలల్ ఇన్సాన్ (76) పఠించే వారు. (బు’ఖారీ, ముస్లిమ్)
839 – [ 18 ] ( صحيح ) (1/266)
وَعَنْ عُبَيْدِ اللهِ بْنِ أَبِيْ رَافِعٍ قَالَ: اسْتَخْلَفَ مَرْوَانُ أَبَا هُرَيْرَةَ عَلَى الْمَدِيْنَةِ وَخَرَجَ إِلَى مَكَّةَ. فَصَلَّى لَنَا أَبُوْ هُرَيْرَةَ (الْجُمْعَةِ) فَقَرَأَ سُوْرَةَ (اَلْجُمْعَةِ-) فِيْ السَّجْدَةِ الْأُوْلَى وَفِيْ الْآخِرَةِ: (إِذَا جَاءَكَ الْمُنَافِقُوْنَ-)؛ فَقَالَ: سَمِعْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يَقْرَأُ بِهِمَا يَوْمَ الْجُمْعَة. رَوَاهُ مُسْلِمٌ .
839. (18) [1/266–దృఢం]
’ఉబైదుల్లాహ్ బిన్ ’అబీ రా’ఫె (ర) కథనం: మర్వాన్ చక్రవర్తి ప్రవక్త (స) సహచరులైన అబూ హురైరహ్ (ర)ను మదీనహ్ గవర్నర్‌గా నియమించాడు. అనంతరం మర్వాన్ మక్కహ్ వెళ్ళి పోయారు. అబూ హురైరహ్ (ర) మాకు జుమ’అహ్ నమా’జు చదివించారు. మొదటి రకాతులో సూరహ్ ఫాతి’హా (1) తర్వాత సూరహ్ జుమ’అహ్ (62), రెండవ రకాతులో సూరహ్ మునాఫిఖూన్ (63) పఠించారు. అనంతరం ప్రవక్త (స) జుమ’అహ్ రోజు జుమ’అహ్ నమా ‘జులో ఈ రెండు సూరాలను పఠిస్తూ ఉండగా నేను విన్నాను,’ అని అన్నారు. (ముస్లిమ్)
840 – [ 19 ] ( صحيح ) (1/266)
وَعَنِ النُّعْمَانِ بْنِ بَشِيْرٍ قَالَ: كَانَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم يَقْرَأُ فِيْ الْعِيْدِيْنِ وَفِيْ الْجُمْعَةِ بِ: (سَبِّحِ اسْمِ رَبِّكَ الْأَعْلَى-) وَ (هَلْ أَتَاكَ حَدِيْثُ الْغَاشِيَةِ-)؛ قَالَ: وَإِذَا اجْتَمَعَ الْعِيْدُ وَالْجُمْعَةُ فِيْ يَوْمِ وَّاحِدٍ قَرَأَ بِهِمَا فِيْ الصَّلَاتَيْنِ. رَوَاهُ مُسْلِمٌ .
840. (19) [1/266–దృఢం]
నో’మాన్ బిన్ బషీర్ (ర) కథనం: ప్రవక్త (స) ఈదైన్ల మరియు జుము’అహ్ నమా’జులో సూరహ్ అల్ అ’అ లా (87) మరియు సూరహ్ అల్ ‘గాషియహ్ (88) చదివే వారు. ఇంకా ‘ఈదైన్లు మరియు జుమ’అహ్ ఒకేరోజు పడితే అప్పుడు కూడా ఆ రెండు సూరాలను ఆ రెండు నమా’జుల్లో చదివేవారు. (ముస్లిమ్)
841 – [ 20 ] ( صحيح ) (1/266)
وَعَنْ عُبَيْدِ اللهِ: أَنَّ عُمَرَبْنَ الْخَطَّابِ سَأَلَ أَبَا وَاقِدٍ اللَّيْثِيَّ: مَا كَانَ يَقْرَأُ بِهِ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم فِيْ الْأَضْحَى وَالْفِطْرِ؟ فَقَالَ: كَانَ يَقْرَأُ فِيْهِمَا؛ ب-(ق وَالْقُرْآنِ الْمَجِيْدِ) وَ (اِقْتَرَبَتِ السَّاعَةِ) ؛ رَوَاهُ مُسْلِمٌ .
841. (20) [1/266–దృఢం]
’ఉబైదుల్లాహ్ (ర) కథనం: ‘ఉమర్ (ర) వాఖిద్ లైసీను ప్రవక్త (స) ‘ఈదుల్ ఫి’త్ర్ మరియు ‘ఈదుల్ అ’ద్హాలలో ఏ సూరాలు చదివేవారు అని అడిగారు. దానికి అతను ప్రవక్త (స), ఈ రెండు పండుగల్లో సూరహ్ ఖాఫ్ (50), ఇఖ్తరబతిస్సాఅతు అంటే సూరహ్ ఖమర్ (54) చదివే వారని సమాధానం ఇచ్చారు. (ముస్లిమ్)
842 – [ 21 ] ( صحيح ) (1/267)
وَعَنْ أَبِيْ هُرَيْرَةَ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: إِنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم قَرأَ فِيْ رَكْعَتَيِ الْفَجْرِ: (قُلْ يَا أَيُّهَا الْكَافِرُوْنَ-)؛ وَ (قُلْ هُوَ اللهُ أَحْدٌ)-؛ رَوَاهُ مُسْلِمٌ .
842. (21) [1/267–దృఢం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) ఒక్కో సారి ఫజర్ నమా’జు రెండు రకా’తుల్లో, సూరతుల్ కాఫిరూన్ (109), ఖుల్హువ ల్లాహు అహద్ (112) చదివేవారు. [128] (ముస్లిమ్)
843 – [ 22 ] ( صحيح ) (1/267)
وَعَنِ ابْنِ عَبَّاسٍ قَالَ: كَانَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم يَقْرَأُ فِيْ رَكْعَتَيِ الْفَجْرِ: (قُوْلُوْا آمَنَّا بِاللهِ وَمَا أُنْزِلَ إِلَيْنَا…‘ 2:136) وَالَّتِيْ فِيْ :(آلِ عِمْرَانَ) وَ (قُلْ يَا أَهْلَ الْكِتَابِ تَعَالَوْا إِلَى كَلِمَةٍ سَوَاءٍ بَيْنَنَا وَبَيْنَكُمْ.. .‘ 3:64)؛ رواه مسلم .
843. (22) [1/267–దృఢం]
ఇబ్నె ’అబ్బాస్ (ర) కథనం: ప్రవక్త (స) అప్పు డప్పుడూ ఫజ్ర్‌లోని రెండు రకాతులలో, బఖరలోని ”ఖూలూ ఆమన్నా బిల్లాహి వమా ఉన్జిల అలైనా…” (2:136) మరియు ఆలి ఇమ్రాన్ లోని ”ఖుల్ యా అహ్లల్ కితాబి తఆలౌ ఇలా కలిమతిన్ సవాయిన్ బైననా వ బైనకుమ్…” (3:64) పఠించేవారు. (ముస్లిమ్)
—–
اَلْفَصْلُ الثَّانِيْ రెండవ విభాగం
844 – [23] ( لم تتمدراسته) (1/267)
عَنِ ابْنِ عَبَّاسٍ قَالَ: كَانَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم يَفْتَتَحُ صَلَاتَهُ ب: (بِسْمِ اللهِ الرَّحْمَنِ الرَّحِيْمِ) رَوَاهُ التِّرْمِذِيُّ وَقَالَ: هَذَا حَدِيْثٌ لَيْسَ إِسْنَادُهُ بِذَاكَ .
844. (23) [1/267-అపరిశోధితం]
ఇబ్నె ’అబ్బాస్ (ర) కథనం: ప్రవక్త (స) తన నమా’జును ”బిస్మిల్లా’హిర్రహ్మా నిర్ర’హీమ్” ద్వారా ప్రారంభించేవారు. [129](తిర్మిజి‘ – ఆధారాలు బలహీనం)
845 – [ 24 ] ( صحيح ) (1/267)
وَعَنْ وَائِلِ بْنِ حَجْرٍ قَالَ: سَمِعْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يَقْرَأُ: (غَيْرَ الْمَغْضُوْبِ عَلَيْهِمْ وَلَا الضَّالِيْنَ) فَقَالَ: آمِيْنَ مَدَّ بِهَا صَوْتَهُ. رَوَاهُ التِّرْمِذِيُّ وَأَبُوْ دَاوُدَ وَالدَّارَمِيُّ وَابْنُ مَاجَهُ.
845. (24) [1/267–దృఢం]
వాయి’ల్ బిన్ ‘హజ్ర్ (ర) కథనం: ప్రవక్త (స) ” ‘గైరిల్ మ’గ్’దూబి ‘అలైహిమ్ వల’ద్దాల్లీన్” తరువాత బిగ్గరగా ఆమీన్ పలుకుతుండగా నేను విన్నాను. [130] (తిర్మిజి’, అబూ దావూ’ద్, దార్మీ, ఇబ్నె మాజహ్)
846 – [ 25 ] ( ضعيف ) (1/267)
وَعَنْ أَبِيْ زُهِيْرِ النُّمَيْرِيِّ قَالَ: خَرَجْنَا مَعَ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم ذَاتَ يَوْم فَأَتَيْنَا عَلَى رَجُلٍ قَدْ أَلَحَ فِيْ الْمَسْأَلَةِ. فَقَالَ النَّبِيُّ صلى الله عليه وسلم: أَوْجَبَ إِنْ خَتَمَ”. فَقَالَ: رَجُلٌ مِّنَ الْقَوْمِ: بِأَيِّ شَيْءٍ يَّخْتُمُ؟ قَالَ: “بِآمِيْنَ”. رَوَاهُ أَبُوْ دَاوُد.
846. (25) [1/267–బలహీనం]
అబూ ’జుహైర్ అన్నుమైరీ (ర) కథనం: ప్రవక్త (స) వెంట ఒక రోజు రాత్రి మేము బయలుదేరాము. అధి కంగా ప్రార్థించే ఒక వ్యక్తి వద్దకువెళ్ళాము. అది చూసిన ప్రవక్త (స) ఒకవేళ ఇతడు ముద్రవేస్తే స్వర్గం తప్పని సరి చేసుకునేవాడు,’ అని అన్నారు. ఒక వ్యక్తి, ‘దేనిద్వారా ముద్రవేసుకోవాలి,’ అని విన్నవించు కున్నాడు. దానికి ప్రవక్త (స) ఆమీన్ అనే పదం ద్వారా,’ అని సమాధానం ఇచ్చారు. [131] (అబూ దావూ‘ద్)
847 – [ 26 ] ( صحيح ) (1/268)
وَعَنْ عَائِشَةَ رَضِيَ اللهُ عَنْهَا قَالَتْ: إِنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم صَلَّى الْمَغْرِبَ بِسُوْرَةِ (الْأَعْرَافِ-)، فَرَّقَهَا فِيْ رَكْعَتَيْنِ. رَوَاهُ النَّسَائِيُّ.
847. (26) [1/268–దృఢం]
’ఆయి‘షహ్ (ర) కథనం: ప్రవక్త (స) మ’గ్రిబ్ నమా’జులో సూరహ్ అల్-అ’అరాఫ్ (7) చదివారు. అంటే రెండు రకాతుల్లోనూ దీన్ని విభజించి పఠించారు.[132](నసాయి‘)
848 – [ 27 ] ( صحيح ) (1/268)
وَعَنْ عُقْبَةَ بْنِ عَامِرٍ قَالَ: كُنْتُ أَقُوْدُ لِرَسُوْلِ اللهِ صلى الله عليه وسلم نَاقَتَهُ فِيْ السَّفَرِ فَقَالَ لِيْ: “يَا عُقْبَةُ أَلَا أُعَلِّمُكَ خَيْرَ سُوْرَتَيْنِ قُرِئَتَا؟” فَعَلَّمَنِيْ: (قُلْ أَعُوْذُ بِرَبِّ الْفَلَقِ)-؛ وَ(قُلْ أَعُوْذُ بِرَبِّ النَّاسِ-)؛ قَالَ: فَلَمْ يَرَنِيْ سُرِرْتُ بِهِمَا جِدًّا فَلَمَّا نَزَلَ لِصَلَاةِ الصُّبْحِ صَلَّى بِهِمَا صَلَاةَ الصُّبْحِ لِلنَّاسِ فَلَمَّا فَرَغَ اَلْتَفَتَ إِلَيَّ فَقَالَ: “يَا عُقْبَةَ كَيْفَ رَأَيْتَ؟” رَوَاهُ أَحْمَدُ وَأَبُوْ دَاوُدَ وَالنَّسَائِيُّ .
848. (27) [1/268–దృఢం]
’ఉఖ్‌బ బిన్ ’ఆమిర్ (ర) కథనం: ఒక ప్రయాణంలో నేను ప్రవక్త (స) కూర్చొని ఉన్న ఒంటె కళ్ళెం పట్టుకొని లాగుతూ నడవసాగాను. అప్పుడు ప్రవక్త (స) నాతో ఉఖ్బహ్! నేను నీకు రెండు మంచి సూరాలు నేర్పనా? అని పలికి, సూరహ్ ఫలఖ్ (113), సూరహ్ నాస్ (114) లను నేర్పారు. దీనివల్ల నా ముఖంపై సంతోష చిహ్నాలు కనబడక పోవటం గమనించారు. అనంతరం ఒకచోట దిగి, ఫజ్ర్ నమా’జు చది వించారు. ఆ రెండు సూరాలను రెండు రకాతుల్లో చదివారు. అనంతరం నా వైపు తిరిగి ఉఖ్బహ్ ఏమి గ్రహించావు?’ అని అన్నారు. [133] (‘అ’హ్మద్, అబూ దావూ’ద్, నసాయి’)
849 – [ 28 ] ( صحيح ) (1/268)
وَعَنْ جَابِرِ بْنِ سَمُرَةَ قَالَ: كَانَ النَّبِيُّ صلى الله عليه وسلم يَقْرَأُ فِيْ صَلَاةِ الْمَغْرِبِ لَيْلَةَ الْجُمْعَةِ: (قُلْ يَا أَيُّهَا الْكَافِرُوْنَ)-؛ وَ (قُلْ هُوَ اللهُ أَحْدٌ-)؛ رَوَاهُ فِيْ شَرْحِ السُّنَّةِ .
849. (28) [1/268–దృఢం]
జాబిర్ బిన్ సమురహ్ (ర) కథనం: ప్రవక్త (స) జుమ’అహ్ రోజు మ’గ్రిబ్ నమా’జులో సూరహ్ అల్ కాఫిరూన్ (109), సూరహ్ ఇ’ఖ్లాస్ (112) చదివే వారు. (షర’హు స్సున్నహ్)
850 – [ 29 ] ( ضعيف ) (1/269)
وَرَوَاهُ ابْنُ مَاجَهُ عَنِ ابْنِ عُمَرَ إِلَّا أَنَّهُ لَمْ يَذْكُرْ. “لَيْلَةَ الْجُمْعَةِ”.
850. (29) [1/269–బలహీనం]
ఇబ్నె మాజహ్ ఈ ‘హదీసు’ను ఇబ్నె ’ఉమర్ ద్వారా ఉల్లేఖించారు. కావున అందులో జుము’అహ్ రాత్రి ప్రస్తావన లేదు.
851 – [ 30 ] ( حسن ) (1/269)
وَعَنْ عَبْدِ اللهِ بْنِ مَسْعُوْدٍ قَالَ: مَا أَحْصِيْ مَا سَمِعْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يَقْرَأُ فِيْ الرَّكْعَتَيْنِ بَعْدَ الْمَغْرِبِ. وَفِيْ الرَّكْعَتَيْنِ قَبْلَ صَلَاةِ الْفَجْرِ: ب :(قُلْ يَا أَيُّهَا الْكَافِرُوْنَ-)؛ وَ (قُلْ هُوَا للهُ أَحْدٌ)-؛ رواه الترمذي.
851. (30) [1/269–ప్రామాణికం]
’అబ్దుల్లాహ్ బిన్ మస్’ఊద్ (ర) కథనం: ప్రవక్త(స) మ’గ్రిబ్ తరువాత సున్నతుల్లో, ఫజ్ర్ సున్నతుల్లో సూరహ్ కాఫిరూన్ (109), సూరహ్ ఇ’ఖ్లాస్ (112) ఎన్నిసార్లు పఠించడం విన్నానో నేను లెక్కపెట్టలేను. (తిర్మిజి’)
852 – [ 31 ] ( صحيح ) (1/269)
وَرَوَاهُ ابْنُ مَاجَهُ عَنْ أَبِيْ هُرَيْرَةَ إِلَّا أَنَّهُ لَمْ يَذْكُرْ:”بَعْدَ الْمَغْرِبِ”
852. (31) [1/269–దృఢం]
అబూ హురైరహ్ (ర) ద్వారా కథనం: అంటే రెండు నమా’జుల సున్నతుల్లో అధికంగా ఈ రెండు సూరా లను అత్యధికంగా చదివేవారు. (ఇబ్నె మాజహ్)
853 – [ 32 ] ( حسن ) (1/269)
وَعَنْ سُلَيْمَانَ بْنِ يَسَارٍ عَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: مَا صَلَّيْتُ وَرَاءَ أَحَدَ أَشْبَهَ صَلَاةً بِرَسُوْلِ اللهِ صلى الله عليه وسلم مِنْ فُلَانٍ. قَالَ سُلَيْمَانُ: صَلَّيْتُ خَلْفَهُ فَكَانَ يُطِيْلُ الرَّكْعَتَيْنِ الْأُوْلَيَيْنِ مِنَ الظُّهْرِ وَيُخَفِّفُ الْأَخَرَيَيْنِ وَيُخَفِّفُ الْعَصْرَ وَيَقْرَأُ فِيْ الْمَغْرِبِ بِقِصَارِ الْمُفَصَّلِ وَيَقْرَأُ فِيْ الْعِشَاءِ بِوَسَطِ الْمُفَصَّلِ وَيَقْرَأُ فِيْ الصُّبْحِ بِطِوَالِ الْمُفَصَّلِ. رَوَاهُ النَّسَائِيُّ وَرَوَى ابْنُ مَاجَهُ إِلَى وَيُخَفِّفُ الْعَصْرَ.
853. (32) [1/269–ప్రామాణికం]
సులైమాన్ బిన్ యసార్ (ర), అబూ హురైరహ్ (ర) ద్వారా కథనం: ప్రవక్త (స) వెనుక చదివిన విధంగా నమా’జు మరెవరి వెనుక చదవలేదు. ఫలానా వ్యక్తి తప్ప. అంటే అతని నమా’జు ప్రవక్త(స) నమా’జులా ఉండేది. సులైమాన్ కథనం: ”నేను కూడా ఆ వ్యక్తి వెనుక నమా’జు చదివాను. అతను ”జుహ్ర్ మొదటి రెండు రక’అతుల్లో ఖిరా’అత్ దీర్ఘంగా చేసే వారు. వెనుకటి రెండు రకాతుల్లో తేలిగ్గా ఖిరా’అత్ చేసే వారు. అస్ర్ నమా’జులో కూడా ఖిరా’అత్ తేలికగ్గా చేసేవారు. ఇంకా మ’గ్రిబ్ నమా’జులో చిన్న చిన్న సూరాలు చదివేవారు. ‘ఇషా’ నమా’జులో మధ్యస్థంగా వ్యవహరించేవారు. ఫజ్ర్ నమా’జులో దీర్ఘమైన సూరాలు చదివేవారు. (నసాయి’, ఇబ్నె మాజహ్)
854 – [ 33 ] ( حسن ) (1/269)
وَعَنْ عُبَادَةَ بْنِ الصَّامِتِ قَالَ: كُنَّا خَلْفَ النَّبِيّ صلى الله عليه وسلم فِيْ صَلَاةِ الْفَجْرِ فَقَرَأَ فَثَقُلَتْ عَلَيْهِ الْقِرَاءَةُ. فَلَمَّا فَرغَ قَالَ: “لَعَلَّكُمْ تَقْرَؤُوْنَ خَلْفَ إِمَامِكُمْ؟ “قُلْنَا: نَعَمْ يَا رَسُوْلَ اللهِ. قَالَ: “لَا تَفْعَلُوْاإِلَّا بِفَاتِحَةِ الْكِتَابِ. فَإِنَّهُ لَا صَلَاةَ لِمَنْ لَمْ يَقْرَأْ بِهَا”. رَوَاهُ أَبُوْ دَاوُدَ وَالتِّرْمِذِيُّ وَلِلَّنَسائِيِّ. مَعْنَاهُ وَفِيْ رِوَايَةٍ لِأَبِيْ دَاوُدَ قَالَ: “وَأَنَا أَقُوْلُ مَالِيْ يُنَازِعْنِيْ الْقُرْآنُ؟ فَلَا تَقْرَؤُوْا بِشَيْءٍ مِّنَ الْقُرْآنِ إِذَا جَهَرْتُ إِلَّا بِأُمِّ الْقُرْآنِ”.
854. (33) [1/269–ప్రామాణికం]
’ఉబాదహ్ బిన్ ’సామిత్ (ర) కథనం: ఫజ్ర్ నమా’జులో మేము ప్రవక్త (స) వెనుక ఉన్నాం. ప్రవక్త (స) పఠనం ప్రారంభించారు. ప్రవక్త (స)కు పఠనంలో ఆటంకం ఏర్పడింది. నమా’జు ముగిసిన పిదప, ‘మీరు ఇమాము వెనుక చదువుతున్నట్టు ఉంది,’ అని అడిగారు. దానికి మేము, అవును మేము చదువుతున్నాం,’ అని అన్నాం. అప్పుడు ప్రవక్త (స), ‘కేవలం సూరహ్ ఫాతి’హా చదవండి. ఇది తప్ప మరేమీ చదవకండి. ఎందుకంటే, సూరహ్ ఫాతి’హా చదవని వ్యక్తి నమా’జు నెరవేరదు,’ అని అన్నారు.[134](అబూ దావూ’ద్, తిర్మిజి’, నసాయి’)
అబూ దావూద్‌లోని ఒక ఉల్లేఖనంలో ఇలా ఉంది, ”ఖుర్ఆన్ పఠనంలో ఎందుకు కష్టం కలుగుతుంది,” అని అనుకుంటున్నాను. దీనిక్కారణం ఇదే. కనుక నేను బిగ్గరగా చదివినపుడు సూరహ్ ఫాతి’హా తప్ప మరేమీ చదవకండి.”
855 – [ 34 ] ( صحيح ) (1/270)
وَعَنْ أَبِيْ هُرَيْرَةَ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم اِنْصَرَفَ مِنْ صَلَاةٍ جَهَرَ فِيْهَا بِالْقِرَاءَةِ فَقَالَ: “هَلْ قَرأَ مَعِيَ أَحْدٌ مِّنْكُمْ آنِفًا؟ “فَقَالَ رَجُلٌ: نَعَمْ يَا رَسُوْلَ اللهِ. قَالَ: “إِنِّيْ أَقُوْلُ: مَا لِيْ أُنَازِعُ الْقُرْآنُ؟” قَالَ: فَانْتَهَى النَّاسُ عَنِ الْقِرَاءَةِ مَعَ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم فِيْمَا جَهَرَ فِيْهِ بِالْقِرَاءَةِ مِنَ الصَّلَواتِ حِيْنَ سَمِعُوْا ذَلِكَ مِنْ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم”. رَوَاهُ مَالِكٌ وَأَحْمَدُ وَأَبُوْ دَاوُدَ وَالتِّرْمِذِيُّ وَالنَّسَائِيُّ وَرَوَى ابْنُ مَاجَهُ نَحْوَهُ .
855. (34) [1/270–దృఢం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) ఒక నమా’జు ముగించారు. అందులో బిగ్గరగా ఖిరా’అత్ చేశారు. ప్రవక్త (స), ‘మీలో ఎవరైనా నాతోపాటు చదువుతుండేవారా?’ అని అడిగారు. ఒక వ్యక్తి ‘అవును, నేను చదివాను,’ అని అన్నాడు. అప్పుడు ప్రవక్త (స) అందుకే నాకు చదవడంలో ఆటంకం కలిగేది. ప్రజలు ఇది విన్న తరువాత మాని వేశారు.[135] (మాలిక్, అ’హ్మద్, అబూ దావూ’ద్, తిర్మిజి’, నసాయి’, ఇబ్నె మాజహ్)
856 – [ 35 ] ( صحيح ) (1/271)
وَعَنِ ابْنِ عُمَرَ والْبَيَاضِيِّ قَالَا: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِنَّ الْمُصَلِّيْ يُنَاجِيْ رَبَّهُ فَلْيَنْظُرْ مَا يُنَاجِيْهِ بِهِ وَلَا يَجْهَرْ بَعْضُكُمْ عَلَى بَعْضِ بِالْقُرْآنِ”. رَوَاهُ أَحْمَدُ .
856. (35) [1/271–దృఢం]
’అబ్దుల్లాహ్ బిన్ ’ఉమర్ (ర) మరియు బయా’దీ కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”నమా’జీ నమా’జులో తన ప్రభువుతో మాట్లాడుతాడు. ఎవరితో మాట్లాడు తున్నాను అనేది గుర్తించాలి. అంటే నిర్మలమైన మనస్సుతో, భక్తి శ్రద్ధలతో పఠించాలి. నేను అల్లాహ్ (త)తో మాట్లాడుతున్నాను, అల్లాహ్ (త) నా మాటలు వింటాడు, అందువల్ల బిగ్గరగా చదవరాదు.” (అ’హ్మద్)
857 – [ 36 ] ( صحيح ) (1/271)
وَعَنْ أَبِيْ هُرَيْرَةَ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِنَّمَا جَعَلَ الْإِمَامُ لِيُؤْتَمَّ بِهِ فَإِذَا كَبَّرَ فَكَبِّرُوْا وَإِذَا قَرَأَ فَأَنْصِتُوْا”. رَوَاهُ أَبُوْ دَاوُدَ وَالنَّسَائِيُّ وَابْنُ مَاجَهُ
857. (36) [1/271–దృఢం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”అనుసరించటానికే ఇమాము నియమించబడ్డాడు. ఇమాము ‘అల్లాహు అక్బర్’ అని అంటే మీరు కూడా ‘అల్లాహు అక్బర్’ అని పలకండి. ఇంకా అతడు ఖిరా’అత్ చేసినపుడు మీరు నిశ్శబ్దంగా ఉండండి.[136](అబూ దావూ‘ద్, నసాయి‘, ఇబ్నె మాజహ్)
858 – [ 37 ] ( حسن ) (1/271)
وَعَنْ عَبْدِ اللهِ بْنِ أَبِيْ أَوْفَى قَالَ: جَاءَ رَجُلٌ إِلَى النَّبِيِّ صلى الله عليه وسلم فَقَالَ: إِنِّيْ لَا أَسْتَطِيْعُ أَنْ آخُذَ مِنَ الْقُرْآنِ شَيْئًا فَعَلِّمْنِيْ مَا يُجْزِئُنِيْ قَالَ: “قُلْ: سُبْحَانَ اللهِ وَالْحَمْدُ للهِ وَلَا إِلَهَ إِلّا اللهُ وَاللهُ أَكْبَرُ وَلَا حَوْلَ وَلَا قُوَّةَ إِلَّا بِاللهِ”. قَالَ: يَا رَسُوْلَ اللهِ هَذَا لِلهِ فَمَا ذَا لِيْ؟ قَالَ: “قُلْ: اللَّهُمَّ ارْحَمْنِيْ وَعَافِنِيْ وَاهْدِنِيْ وَارْزُقْنِيْ”. فَقَالَ هَكَذَا بِيَدَيْهِ وَقَبَضَهُمَا. فَقَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “أَمَا هَذَا فَقَدْ مَلَأَ يَدَيْهِ مِنَ الْخَيْرِ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ وَانْتَهَتْ رِوَايَةِ النَّسَائِيِّ عِنْدِ قَوْلِهِ: “إِلَّا بِاللهِ”.
858. (37) [1/271–ప్రామాణికం]
’అబ్దుల్లాహ్ బిన్ అబీ అవ్ ఫా (ర) కథనం: ప్రవక్త (స) వద్దకు ఒక వ్యక్తి వచ్చి, ‘ఓ ప్రవక్తా! నేను ఖుర్ఆన్ నుండి ఏమీ చదవలేక పోతున్నాను. ఎందుకంటే ఖుర్ఆన్ నుండి నాకేమీ జ్ఞాపకకం లేదు. అందువల్ల నమాజులో చదవడానికి నాకేమైనా నేర్పించండి’ అని విన్నవించుకున్నాడు. అప్పుడు ప్రవక్త (స), ” ‘సుబ్హానల్లాహ్, వల్హమ్దు లిల్లాహ్, వలా యిలాహ ఇల్లల్లాహ్, వల్లాహు అక్బర్, వలా హౌల వలా ఖువ్వత ఇల్లాబిల్లాహ్,’ మొదలైన వాటిని చదువుతూ ఉండు,” అని అన్నారు. దానికి ఆ వ్యక్తి ఇవి అయితే అల్లాహ్ కోసం, మరి నా కోసం అని అన్నాడు. దానికి ప్రవక్త (స) మరి, ”అల్లాహు మ్మర్హమ్నీ, వఆఫినీ వహ్దినీ, వర్జుఖ్నీ” — ‘ఓ అల్లాహ్! నన్ను క్షమించు, నాకు క్షేమం ప్రసాదించు, నాకు రుజుమార్గం ప్రసాదించు, ఇంకా నాకు ఉపాధిని ప్రసాదించు,’ అని చదువమని అన్నారు. ఆవ్యక్తి రెండుచేతులతో సైగచేసి వాటిని మూసుకున్నాడు. అప్పుడు ప్రవక్త (స) అతడు తనరెండు చేతుల్లో పుణ్యాన్ని నింపుకున్నాడు అని అన్నారు. [137](అబూ దావూద్, నసాయి’)
859 – [ 38 ] ( صحيح ) (1/271)
وَعَنِ ابْنِ عَبَّاسٍ رَضِيَ اللهُ عَنْهُ: أَنَّ النَّبِيَّ صَلى الله عليه وسلم: كَانَ إِذَا قَرَأَ (سَبِّحِ اسْمِ رَبِّكَ الْأَعْلَى–) قَالَ: (سُبْحَانَ رِبِّيَ الْأَعْلَى). رَوَاهُ أَحْمَدُ وَأَبُوْ دَاوُدَ .
859. (38) [1/271–దృఢం]
ఇబ్నె ’అబ్బాస్ (ర) కథనం: ప్రవక్త (స), ”సబ్బి ‘హిస్మ రబ్బికల్ అ’అలా (87)” చదివితే, దాని సమాధానంలో, ”సుబ్హాన రబ్బియల్ అ’అలా” అని పలికేవారు.[138] (అబూ దావూ‘ద్)
860 – [ 39 ] ( ضعيف ) (1/272)
وَعَنْ أَبِيْ هُرَيْرَةَ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَنْ قَرَأَ مِنْكُمْ ب (التِّيْنِ وَالزَّيْتُوْنِ-) فَانْتَهَى إِلَى (أَلَيْسَ اللهُ بِأَحْكَمِ الْحَاكِمِيْنِ) فَلْيَقُلْ: “بَلَى وَأَنَا عَلَى ذَلِكَ مِنَ الشَّاهِدِيْنَ”. وَمَنْ قَرَأَ: (لَا أُقْسِمُ بِيَوْمِ الْقِيَامَةِ-) فَانْتَهَى إِلَى (أَلَيْسَ ذَلِكَ بِقَادِرٍ عَلَى أَنْ يُّحْيِيَ الْمَوْتَى ( فَلْيَقُلْ “بَلَى”. وَمَنْ قَرَأَ (وَالْمُرْسَلَاتِ-). فَبَلَغَ: (فَبِأَيِّ حَدِيْثٍ بَعْدَهُ يُؤْمِنُوْنَ) فَلْيَقُلْ: “آمَنَّا بِاللهِ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ وَالتِّرْمِذِيُّ إِلَى قَوْلِهِ: ((وَأَنَا عَلَى ذَلِكَ مِنَ الشَّاهِدِيْنَ)).
860. (39) [1/272–బలహీనం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”సూరహ్ తీన్ (95) చదివిన వారు చివర్లో ”అలైసల్లాహు బిఅ’హ్కమిల్ ‘హాకిమీన్,” పఠించిన తరువాత, ”బలా వఅనా ‘అలా ‘జాలిక మినష్షాహిదీన్” — ‘అవును నేను దీనిపై సాక్షిగా ఉన్నాను,’ అని పలకాలి. అదేవిధంగా లా ఉఖ్సిము బియౌమిల్ ఖియామహ్ (75) సూరహ్ చదివిన వారు ”అయ్యుహ్యిల్ మౌతా” కు చేరితే దానికి సమాధానంగా, ”బలా” అంటే — ‘అల్లాహ్ దానికి తగిన శక్తి కలిగి ఉన్నాడు.’ అని పలకాలి. అదేవిధంగా, సూరహ్ ముర్’సలాత్ (77) చదివేవారు చివర్లో, ”ఆమన్నా బిల్లాహి,” అంటే — ‘మేము దీన్ని విశ్వసించాము,’ అని పలకాలి. (అబూ దావూ’ద్)
861 – [40] ( حسن ) (1/272)
وَعَنْ جَابِرٍ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: خَرَجَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم عَلَى أَصْحَابِهِ فَقَرَأَ عَلَيْهِمْ سُوْرَةَ (الرَّحْمَنِ) مِنْ أَوَّلَهَا إِلَى آخِرِهَا فَسَكَتُوْا. فَقَالَ: “لَقَدْ قَرَأْتُهَا عَلَى الْجِنِّ لَيْلَةِ الْجِنِّ فَكَانُوْا أَحْسَنَ مَرْدُوْدًا مِّنْكُمْ كُنْتُ كُلَّمَا أَتَيْتُ عَلَى قَوْلِهِ (فَبِأَيِّ آلاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ) قَالُوْا: “لَا بِشَيْءٍ مِنْ نِّعَمِكَ رَبَّنَا نُكَذِّبُ فَلَكَ الْحَمْدُ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَقَالَ: هَذَا حَدِيْثٌ غَرِيْبٌ.
861. (40) [1/272–ప్రామాణికం]
జాబిర్ (ర) కథనం: ప్రవక్త (స) తన అనుచరుల వద్దకు వచ్చారు. వారి ముందు సూరహ్ అర్-ర’హ్మాన్ (55) మొదటి నుండి చివరి వరకు చదివారు. అనుచరులు నిశ్శబ్దంగా ఉండి వింటూ ఉన్నారు. ఎటు వంటి సమాధానం ఇవ్వలేదు. ప్రవక్త (స) పూర్తిగా చదివిన తర్వాత, ఈ సూరహ్‌ను నేను రాత్రి జిన్నుల ముందు చదివాను. మీకంటే మంచిగా వారు సమాధానం ఇచ్చారు. నేను, ”ఫబిఅయ్యి ఆలాయి రబ్బికుమా తుకజ్జిబాన్,” చదివినప్పుడల్లా, ”లాబిషయ్ యిన్ మిన్ ని’అమతిక రబ్బనా నుకజ్జిబు ఫలకల్’హమ్దు,” అని సమాధానం ఇచ్చే వారు అని అన్నారు. [139](తిర్మిజి’ / ఏకోల్లేఖనం)
—–
اَلْفَصْلُ الثَّالِثُ మూడవ విభాగం
862 – [ 41 ] ( صحيح ) (1/273)
عَنْ مُعَاذِ بْنِ عَبْدِ اللهِ الْجُهْنِيِّ قَالَ: إِنَّ رَجُلًا مِّنْ جُهَيْنَةَ أَخْبَرَهُ أَنَّهُ سَمِعَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: قَرَأَ فِيْ الصُّبْحِ (إِذَا زُلْزِلَتِ-) فِيْ الرَّكْعَتَيْنِ كِلْتَيْهِمَا فَلَا أَدْرِيْ أَنَسِيَ أَمْ قَرَأَ ذَلِكَ عَمْدًا. رَوَاهُ أَبُوْدَاوُدَ.
862. (41) [1/273–దృఢం]
ము’ఆజ్’ బిన్ ’అబ్దుల్లాహ్ జుహ్నీ (ర) కథనం: జుహైన తెగకు చెందిన ఒక వ్యక్తి కథనం: ప్రవక్త (స) ఫజ్ర్ నమా’జులో సూరహ్ ‘జిల్’జాల్ (99)ను రెండు రకాతుల్లోనూ చదవటం విన్నాడు. అయితే ఉద్దేశ్య పూర్వకంగా చదివారో లేక మరచిపోయి చదివారో నాకు తెలియదు. [140] (అబూ దావూ‘ద్)
863 – [ 42 ] ( ضعيف ) (1/273)
وَعَنْ عُرْوَةَ قَالَ: إِنَّ أَبَا بَكْرٍ الصِّدِّيْقِ رَضِيَ اللهُ عَنْهُ صَلَّى الصُّبْحَ. فَقَرَأَ فِيْهِمَا ب: (سُوْرَةُ الْبَقْرَةِ-) فِيْ الرَّكْعَتَيْنِ كِلْتَيْهِمَا. رَوَاهُ مَالِكٌ.
863. (42) [1/273–బలహీనం]
’ఉర్వహ్ (ర) కథనం: అబూబకర్ (ర) ఫజ్ర్ నమా’జులోని రెండు రకాతుల్లోనూ సూరహ్ బఖరహ్ (2) చదివారు. [141] (మాలిక్)
864 – [ 43 ] ( صحيح ) (1/273)
وَعَنِ الْفِرَافِصَةِ بْنِ عُمَيْرِ الْحَنْفِيِّ قَالَ: مَا أَخَذْتُ سُوْرَةَ (يُوْسُفَ ) إِلَّا مِنْ قِرَاءَةِ عُثْمَانَ بْنِ عَفَّانَ إِيَّاهَا فِيْ الصُّبْحِ وَمِنْ كَثْرَةِ مَا كَانَ يُرَدِّدُهَا. رَوَاهُ مَالِكٌ.
864. (43) [1/273–దృఢం]
ఫరాఫి’స’ బిన్ ’ఉమైర్ అల్ ’హన్ఫి(ర) కథనం: ’ఉస్మా‘న్ బిన్ ’అఫ్ఫాన్ (ర) ఫజ్ర్ నమా’జులో సూరహ్ యూసుఫ్ (12) అధికంగా చదవటం వల్ల విని జ్ఞాపకం చేసుకున్నాను. (మాలిక్)
865 – [ 44 ] ( صحيح ) (1/274)
وَعَنْ عَبْدِ اللهِ بْنِ عَامِرٍ بْنِ رَبِيْعَةَ قَالَ: صَلّيْنَا وَرَاءَ عُمَرَ ابْنِ الْخَطَّابِ الصُّبْحِ فَقَرَأَ فِيْهَا بِسُوْرَةِ (يُوْسُفَ) وَسُوْرَةُ (الْحَجِّ) قِرَاءَةً بَطِيْئَةً قِيْلَ لَهُ: إِذَا لَقَدْ كَانَ يَقُوْمُ حِيْنَ يَطْلُعُ الْفَجْرُ قَالَ: أَجَلْ. رَوَاهُ مَالِكٌ.
865. (44) [1/274–దృఢం]
’ఆమిర్ బిన్ రబీ’అహ్ (ర) కథనం: మేము ’ఉమర్ (ర) వెనుక నమా’జ్ చదివాము. అతను రెండు రకా తుల్లో సూరహ్ యూసుఫ్ (12), సూరహ్’హజ్జ్ (22) లను ఆగి ఆగి చదివారు. ’ఆమిర్‌ను, “ ’ఉమర్ (ర), ఫజ్ర్ ప్రారంభ సమయంలో చదువుతారా,’ అని అడి గితే, ‘అవునని,’ సమాధానం ఇచ్చారు. (మాలిక్)
866 – [ 45 ] ( ضعيف ) (1/274)
وَعَنْ عَمْرٍو بْنِ شُعَيْبٍ عَنْ أَبِيْهِ عَنْ جَدِّهِ قَالَ: مَا مِنَ الْمُفَصَّلِ سُوْرَةٌ صَغِيْرَةٌ وَلَا كَبِيْرَةٌ إِلَّا قَدْ سَمِعْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يَؤَمُّ بِهَا النَّاسَ فِيْ الصَّلَاةِ الْمَكْتُوْبَةِ. رَوَاهُ مَالِكٌ .
866. (45) [1/274–బలహీనం]
’అమ్ర్ బిన్ షు’ఐబ్ తన తండ్రి ద్వారా, అతను తన తండ్రి ద్వారా కథనం: ప్రవక్త (స) ముఫ’స్సల్ చిన్నాపెద్దా సూరాల్లో దేన్నీ చదవకుండా, నేను వినకుండా ఉండలేదు. [142] (మాలిక్)
867 – [ 46 ] ( مرسل حسن ) (1/274)
وَعَنْ عَبْدِ اللهِ بْنِ عُتْبَةَ بْنِ مَسْعُوْدٍ قَالَ: قَرَأَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم فِيْ صَلَاةِ الْمَغْرِبِ ب: (حَمّ الدُّخَان) رَوَاهُ النَّسَائِيُّ مُرْسَلًا.
867.(46)[1/274– తాబయీ ప్రోక్తం–ప్రామాణికం]
’అబ్దుల్లాహ్ బిన్ ’ఉత్బహ్ బిన్ మస్’ఊద్ (ర) కథనం: ప్రవక్త (స) మగ్రిబ్ నమా’జులో ’హా మీమ్ దు’ఖాన్ (44) చదివారు. (నసాయి‘)
=====
13- بَابُ الرُّكُوْعِ
13. వంగుట (రుకూ‘)
నమా’జు ముఖ్య విధుల్లో రుకూ‘ కూడా ఒక ముఖ్య విధి. దీన్ని గురించి క్రింది ’హదీసు‘ల్లో వివరంగా పేర్కొ నడం జరిగింది. రుకూ’ అంటే వంగటం. ఇస్లామీయ పరిభాషలో వంగి, రెండు అరచేతులను రెండు మోకాళ్ళపై ఉంచటం, ఇంకా వీపు బల్లపరుపుగా ఉంచటం.
—–
اَلْفَصْلُ الْأَوَّل మొదటి విభాగం
868 – [ 1 ] ( متفق عليه ) (1/275)
عَنْ أَنَسٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “أَقِيْمُوا الرُّكُوْعَ وَالسُّجُوْدَ. فَوَاللهِ إِنِّيْ لَأَرَاكُمْ مِن بَعْدِيْ”.
868. (1) [1/275–ఏకీభవితం]
అనస్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”రుకూ’ సజ్దాలను సరిగ్గా చేయండి. అంటే ఆగి ఆగి నిదానంగా చేయండి. రుకూ’ సజ్దా చేయడంలో తొందర పడకండి. అల్లాహ్ సాక్షి! మహిమతో నేను నావెనుక చూడగలను.” (బు’ఖారీ, ముస్లిమ్)
869 – [ 2 ] ( متفق عليه ) (1/275)
وَعَنِ الْبَرَاءِ قَالَ: كَانَ رُكُوْعُ النَّبِيِّ صلى الله عليه وسلم وَسُجُوْدُهُ وَبَيْنَ السَّجْدَتَيْنِ وَإِذَا رَفَعَ مِنَ الرُّكُوْعِ مَا خَلَا الْقِيَامَ وَالْقُعُوْدَ قَرِيْبًا مِّنَ السَّوَاءِ.
869. (2) [1/275–ఏకీభవితం]
బరా‘ (ర) కథనం: ప్రవక్త (స) యొక్క రుకూ’, సజ్దా, రెండు సజ్దాల మధ్య కూర్చోవడం, రుకూ’ తర్వాత నిలబడటం, సమానంగా ఉండేవి. ఖియామ్ మరియు ఖు’ఊద్ తప్ప. [143] (బు’ఖారీ, ముస్లిమ్)
870 – [ 3 ] ( صحيح ) (1/275)
وَعَنْ أَنَسٍ قَالَ: كَانَ النَّبِيُّ صلى الله عليه وسلم إِذَا قَالَ: “سَمِعَ اللهُ لِمَنْ حَمْدَهُ”. قَامَ حَتَّى نَقُوْلُ: قَدْ أَوْهَمَ ثُمَّ يَسْجُدُ وَيَقْعُدُ بَيْنَ السَّجْدَتَيْنِ حَتَّى نَقُوْلُ: قَدْ أَوْهَمَ. رَوَاهُ مُسْلِمٌ.
870. (3) [1/275–దృఢం]
అనస్ (ర) కథనం: ప్రవక్త (స), ‘సమిఅల్లా హులి మన్ ’హమిదహ్,’ అని పలికి నిలబడి చాలాసేపు వరకు నిలబడే ఉంటారు. అది గ్రహించి మేము ప్రవక్త (స) మరచిపోయారని అనుకుంటాము. ఆ తరువాత ప్రవక్త (స) సజ్దా చేస్తారు. ఇంకా రెండు సజ్దాల మధ్య చాలాసేపు కూర్చుంటారు. మేము మళ్ళీ ప్రవక్త (స) మరచిపోయారని అనుకుంటాము. [144] (ముస్లిమ్)
871 – [ 4 ] ( متفق عليه ) (1/275)
وَعَنْ عَائِشَةَ رَضِيَ اللهُ عَنْهَا قَالَتْ: كَانَ النَّبِيُّ صلى الله عليه وسلم يُكْثِرُ أَنْ يَّقُوْلَ فِيْ رُكُوْعِهِ وَسُجُوْدِهِ: “سُبْحَانَكَ اللَّهُمَّ رَبَّنَا وَبِحَمْدِكَ اللَّهُمَّ اغْفِرْ لِيْ” . يَتَأَوَّلُ الْقُرْآنَ.
871. (4) [1/275–ఏకీభవితం]
’ఆయి‘షహ్ (ర) కథనం: ప్రవక్త (స) రుకూ’, సజ్దాలలో చాలా ఎక్కువగా దు’ఆ చేసేవారు: ”సుబ్’హాన కల్లాహుమ్మ రబ్బనా వ బి’హమ్దిక అల్లాహుమ్మ’గ్ ఫిర్లీ,” — ‘ఓ అల్లాహ్ నీవు పరిశుద్ధుడవు, ఓ మా ప్రభూ! మేము నీ స్తోత్రాన్ని కొనియాడుతున్నాము. నీవు మా పాపాలను క్షమించు’. ఇంకా ఈ పని ఖుర్ఆన్కు అనుగుణంగా చేసే వారు. [145] (బు’ఖారీ, ముస్లిమ్)
872 – [ 5 ] ( صحيح ) (1/276)
وَعَنْهَا أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم كَانَ يَقُوْلُ فِيْ رُكُوْعِهِ وَسُجُوْدِهِ: “سُبُّوْحٌ قُدُّوْسٌ رَبُّ الْمَلَائِكَةِ وَالرُّوْحِ”.رَوَاهُ مُسْلِمٌ.
872. (5) [1/276–దృఢం]
’ఆయి‘షహ్ (ర) కథనం: ప్రవక్త (స) రుకూ’, సజ్దాలలో ”సుబ్బూ’హున్, ఖుద్దూసున్, రబ్బుల్ మలా యి‘కతి వర్రూ’హ్,” అని పలికేవారు. — అంటే, ‘అల్లాహ్ పరిశుద్ధుడు, దైవదూతలకు, రూ’హ్కు ప్రభువు.’ (ముస్లిమ్)
873 – [ 6 ] ( صحيح ) (1/276)
وَعَنِ ابْنِ عَبَّاسٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “أَلَا إِنِّيْ نُهِيْتُ أَنْ أَقْرَأَ الْقُرْآنَ رَاكِعًا أَوْ سَاجِدًا فَأَمَّا الرُّكُوْعُ فَعَظِّمُوْا فِيْهِ الرَّبَّ وَأَمَّا السُّجُوْدُ فَاْجْتَهِدُوْا فِيْ الدُّعَاءِ فَقَمِنٌ أَنْ يُّسْتَجَابَ لَكُمْ”. رَوَاهُ مُسْلِمٌ .
873. (6) [1/276–దృఢం]
ఇబ్నె ’అబ్బాస్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”గుర్తుంచుకోండి! నన్ను రుకూ’, సజ్దాలలో ఖుర్ఆన్ పఠించరాదని వారించడం జరిగింది. కనుక రుకూ, సజ్దాలలో ఖుర్ఆన్ పఠించకండి. రుకూ’లో అల్లాహ్ గొప్పతనాన్ని కొనియాడండి, సజ్దాలో ప్రార్థించేందుకు ప్రయత్నించండి. ఎందుకంటే సజ్దాలో ప్రార్థన స్వీకరించబడుతుంది.” (ముస్లిమ్)
874 – [ 7 ] ( صحيح ) (1/276)
وَعَنْ أَبِيْ هُرَيْرَةَ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِذَا قَالَ الْإِمَامُ: سَمِعَ اللهُ لِمَنْ حَمِدَهُ فَقُوْلُوْا: “اَللَّهُمَّ رَبَّنَا لَكَ الْحَمْدُ”. فَإِنَّهُ مَنْ وَافَقَ قَوْلُهُ قَوْلَ الْمَلَائِكَةِ غُفِرَ لَهُ مَا تَقَدَّمَ مِنْ ذَنْبِهِ”.
874. (7) [1/276–దృఢం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఇమాము, ‘సమి’అల్లాహులిమన్ ’హమిదహ్ ‘ అని పలికినపుడు, మీరు, ‘అల్లాహుమ్మ రబ్బనా లకల్ ’హమ్దు’ అని పలకండి. ఎందుకంటే, ఎవరి పలుకు దైవదూతల పలుకులకు అనుగుణంగా ఉంటే, అతని అంతకు ముందు పాపాలన్నీ క్షమించబడతాయి. (బు’ఖారీ, ముస్లిమ్)
875 – [ 8 ] ( صحيح ) (1/276)
وَعَنْ عَبْدِ اللهِ بْنِ أَبِيْ أَوْفَى قَالَ: كَانَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم إِذَا رَفَعَ ظَهْرَهُ مِنَ الرُّكُوْعِ قَالَ: “سَمِعَ اللهُ لِمَنْ حَمِدَهُ” اللَّهُمَّ رَبَّنَا لَكَ الْحَمْدُ”. مِلْءَ السَّمَاوَاتِ وَمِلْءَ الْأَرْضِ وَمِلْءَ مَا شِئْتَ مِنْ شَيْءٍ بَعْدُ”. رَوَاهُ مُسْلِمٌ.
875. (8) [1/276–దృఢం]
’అబ్దుల్లాహ్ బిన్ అబీ అవ్ఫా (ర) కథనం: ప్రవక్త (స) రుకూ నుండి లేచినపుడు, ”సమి’అల్లాహులిమన్ ’హమిదహ్, అల్లాహుమ్మ రబ్బనా లకల్’హమ్దు, మిల్ అ’స్సమా వాతి వ మిల్అ’ల్ అ’ర్’ది, వ మిల్అ’ మాషీత మిన్ షైఇ’న్ బ’అదు.” అని పలికేవారు. – అంటే, రుకూ నుండి లేచినపుడు ఈ దు’ఆను చదివే వారు: ‘అల్లాహ్ తనను ప్రశంసించిన వాని పలుకు విన్నాడు. ఓ మా ప్రభూ! భూమ్యా-కాశాల నిండా, ఇంకా నీవు కోరినంత నీ స్తోత్రం ఉంది. దీని ద్వారా ఇమాము ’సమిఅల్లాహు లిమన్ ’హమిదహ్’ అని అంటే – ’రబ్బనా వలకల్ ’హమ్దు,’ అని పలకాలి. (ముస్లిమ్)
876 – [ 9 ] ( صحيح ) (1/276)
وَعَنْ أَبِيْ سَعِيْدِ الْخُدْرِيِّ قَالَ: كَانَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم إِذَا رَفَعَ رَأْسَهُ مِنَ الرُّكُوْعِ قَالَ: “اَللَّهُمَّ رَبَّنَا لَكَ الْحَمْدُ مِلْءَ السَّمَاوَاتِ وَمِلْءَ الْأَرْضِ وَمِلْءَ مَا شِئْتَ مِنْ شَيْءٍ بَعْدُ أَهْلَ الثَّنَاءِ وَالْمَجْدِ أَحَقُّ مَا قَالَ اَلْعَبْدُ وَكُلُّنَا لَكَ عَبْدٌ اللّهُمَّ لَا مَانِعَ لِمَا أَعْطَيْتَ وَلَا مُعْطِيَ لِمَا مَنَعتَ وَلَا يَنْفَعُ ذَا الْجَدِّ مِنْكَ الْجَدُّ”. رَوَاهُ مُسْلِمٌ.
876. (9) [1/276–దృఢం]
అబూ స’యీద్ ’ఖుద్రీ (ర) కథనం: ప్రవక్త (స) రుకూ’ నుండి లేచిన తరువాత ఈ దు’ఆను పలికే వారు. ”అల్లాహుమ్మ రబ్బనా లకల్’హమ్దు మిల్అ’స్సమావాతి వ మిల్ అల్ అర్’ది, వమిల్అ’ మాషిఅ‘త మిన్ షైఇ‘న్ బ’అదు, అహ్లస్సనాఇ‘ వల్మజ్ది, అ’హఖ్ఖు మా ఖాలల్ ’అబ్దు, వ కుల్లునా లక ’అబ్దున్. అల్లాహుమ్మ లా మాని’అ లిమా అ’తైత, వలా ము’అతియ లిమా మన’అత, వలాయన్ఫ’ఉ జ‘ల్జద్ది మిన్కల్ జద్దు.” — ‘ఓ మా ప్రభూ! సర్వస్తోత్రాలు నీ కొరకే. భూమ్యాకాశాల నిండా, నీవు కోరినంత, ఆ తరువాత నీవే సోత్రానికి, గొప్పతనానికి తగినవాడవు. నీ దాసుడు పలికింది సత్యం. మే మంతా నీ దాసులమే. నీవు ఇచ్చిన వారికి ఎవరూ ఆపలేరు. నీవు ఆపినవారికి ఎవరూ ఇవ్వలేరు. నీ శిక్ష నుండి ధనవంతుని ధనం అతన్ని కాపాడలేదు.” (ముస్లిమ్)
877 – [ 10 ] ( صحيح ) (1/276)
وَعَنْ رِفَاعَةَ بْنِ رَافِعٍ قَالَ: كُنَّا نُصَلِّيْ وَرَاءَ النَّبِيِّ صلى الله عليه وسلم فَلَمَّا رَفَعَ رَأْسَهُ مِنَ الرَّكْعَةِ قَالَ: “سَمِعَ اللهُ لِمَنْ حَمِدَهُ”. فَقَالَ رَجُلٌ وَرَاءَهُ: رَبَّنَا وَلَكَ الْحَمْدُ حَمْدًا كَثِيْرًا طَيِّبًا مُبَارَكًا فِيْهِ فَلَمَّا انْصَرَفَ قَالَ: “مَنِ الْمُتَكَلِّمُ آنِفًا؟” قَالَ: أَنَا. قَالَ: “رَأَيْتُ بِضْعَةً وَثَلَاثَيْنِ مَلَكًا يَّبْتَدِرُوْنَهَا أَيُّهُمْ يَكْتُبُهَا أَوَّلُ”. رَوَاهُ الْبُخَارِيُّ.
877. (10) [1/276–దృఢం]
రిఫా’అ బిన్ రా’ఫె (ర) కథనం: ప్రవక్త (స) వెనుక మేము నమా’జు చదివేవాళ్ళం. ప్రవక్త (స) రుకూ’నుండి తల ఎత్తిన తర్వాత, ”సమిఅల్లాహు లిమన్ ’హమిదహ్,” అని అనేవారు. ఒకసారి అనుకోకుండా ప్రవక్త(స), రుకూ నుండి లేచిన తర్వాత, ‘సమిఅల్లాహు లిమన్ ’హమిదహ్,’ అని అన్న వెంటనే ఒక ముఖ్తదీ, ‘రబ్బనా లకల్ ’హమ్దు ’హమ్దన్ కసీ’రన్ తయ్యిబన్ ముబారకన్ ఫీహ్’ — ‘ఓ మా ప్రభూ! పరిశుద్ధమైన స్తోత్రాలన్నీ నీ కొరకే’ అని పలికాడు. నమా’జు తర్వాత ప్రవక్త (స), ’ఆ దు’ఆ ఎవరు పలికారు?’ అని అడిగారు. ఆ వ్యక్తి నేను పలికాను అని అన్నాడు. అప్పుడు ప్రవక్త (స), ’30 మంది దైవదూతలు దాని పుణ్యాన్ని తీసుకొని వెళ్ళడానికి, వ్రాయడానికి పోటీపడుతూ ఉండటం నేను చూశాను,’ అని ప్రవచించారు.’ (బు’ఖారీ)
—–
اَلْفَصْلُ الثَّانِيْ రెండవ విభాగం
878 – [ 11 ] ( صحيح ) (1/277)
عَنْ أَبِيْ مَسْعُوْدٍ الْأَنْصَارِيِّ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَا تُجْزِئُ صَلَاةُ الرَّجُلِ حَتَّى يُقِيْمَ ظَهْرَهُ فِيْ الرُّكُوْعِ وَالسُّجُوْدِ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ وَالتِّرْمِذِيُّ وَالنَّسَائِيُّ وَابْنُ مَاجَهُ وَالدَّارِمِيُّ. وَقَالَ التِّرْمِذِيُّ : هَذَا حَدِيْثٌ حَسْنٌ صَحِيْحٌ .
878. (11) [1/277–దృఢం]
అబూ మస్’ఊద్ అన్సా‘రీ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం , ”ఒక వ్యక్తి యొక్క నమా’జు రుకూ’, సజ్దాలలో తన నడుము, వీపులను సరిగ్గా ఉంచనంత వరకు నెరవేరదు.” [146] (అబూ దావూ‘ద్, తిర్మిజి‘- ప్రామాణికం-దృఢం, నసాయి‘, ఇబ్నె మాజహ్, దార్మీ)
879 – [ 12 ] ( حسن ) (1/277)
وَعَنْ عُقْبَةَ بْنِ عَامِرٍ قَالَ: لَمَّا نَزَلَتْ (فَسَبِّحْ بِاسْمِ رَبِّكَ الْعَظِيْمِ–). قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “اِجْعَلُوْهَا فِيْ رُكُوْ عِكُمْ”. فَلَمَّا نَزَلَتْ (سَبِّحِ اسْمِ رَبِّكَ الْأَعْلَى-) .قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “اِجْعَلُوْهَا فِيْ سُجُوْدِكُمْ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ وَابْنُ مَاجَهُ وَالدَّارِمِيّ.
879. (12) [1/277–ప్రామాణికం]
’ఉఖ్బహ్ బిన్ ’ఆమిర్ (ర) కథనం: ‘ఫసబ్బి’హ్ బి ఇస్మి రబ్బి కల్ ‘అ”జీమ్’ (అల్-హాఖ్ఖహ్, 69:52) అవతరించబడినపుడు ప్రవక్త (స) ఈ అంశాన్ని రుకూ‘లో పలకండి. అంటే, ”సుబ్’హాన రబ్బియల్ ‘అ”జీమ్.” ఇంకా, ‘సబ్బి’హిస్మ రబ్బికల్ ఆలా,’ (అల్-అఅలా’, 87:1) అవతరించబడినపుడు, ”సుబ్’హాన రబ్బి యల్అ‘అలా,” అని సజ్దాలో పఠించండి,’ అని అన్నారు. (అబూ దావూ‘ద్, ఇబ్నె మాజహ్, దార్మీ)
880 – [ 13 ] ( لم تتم دراسته ) (1/277)
وعَنْ عَوْنِ بْنِ عَبْدِ اللهِ عَنِ ابْنِ مَسْعُوْدٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِذَا رَكَعَ أَحْدُكُمْ. فَقَالَ فِيْ رُكُوْعِهِ: سُبْحَانَ رَبِّيْ الْعَظِيْمِ ثَلَاثَ مَرَّاتٍ فَقَدْ تَمَّ رُكُوْعُهُ. وَذَلِكَ أَدْنَاهُ وَإِذَا سَجَدَ. فَقَالَ فِيْ سُجُوْدِهِ: سُبْحَانَ رَبِّيَ الْأَعْلَى ثَلَاثَ مَرَّاتٍ. فَقَدْ تَمَّ سُجُوْدُهُ وَذَلِكَ أَدْنَاهُ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَأَبُوْ دَاوُدَ ابْنُ مَاجَهُ. وَقَالَ التِّرْمِذِيُّ: لَيْسَ إِسْنَادُهُ بِمُتَّصِلٍ لِأَنَّ عَوْنًا لَمْ يَلْقَ ابْنَ مَسْعُوْدٍ.
880. (13) [1/277–అపరిశోధితం]
’ఔన్ బిన్ ’అబ్దుల్లాహ్ (ర), ‘అబ్దుల్లాహ్ బిన్ మస్’ఊద్ ద్వారా కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ‘మీలో ఎవరైనా రుకూ’ చేసి, రుకూలో మూడుసార్లు, ”సుబ్’హాన రబ్బియల్ ‘అ”జీమ్,” అని అంటే, అతని రుకూ పూర్తయ్యింది. మూడుసార్లు కనిష్ట సంఖ్య. అదేవిధంగా సజ్దా చేసి, సజ్దాలో, ”సుబ్’హాన రబ్బియల్ అ’అలా,” అని మూడుసార్లు పలికితే, అతని సజ్దా పూర్తయ్యింది. మూడుసార్లు కనిష్ట సంఖ్య.” (తిర్మిజి‘ – తాబయీ ప్రోక్తం, అబూ దావూ‘ద్, ఇబ్నె మాజహ్)
881 – [ 14 ] ( صحيح ) (1/278)
وَعَنْ حُذَيْفَةِ: أَنَّهُ صَلَّى مَعَ النَّبِيِّ صلى الله عليه وسلم. فَكَانَ يَقُوْلُ فِيْ رُكُوْعِهِ: ” سُبْحَانَ رَبِّيَ الْعَظِيْمِ”. وَفِيْ سُجُوْدِهِ: “سُبْحَانَ رَبِّيَ الْأَعْلَى”. وَمَا أَتَى عَلَى آيَةِ رَحْمَةٍ إِلَّا وَقَفَ وَسَأَلَ وَمَا أَتَى عَلَى آيَةٍ عَذَابٍ إِلَّا وَقَفَ وَتَعَوَّذَ. رَوَاهُ التِّرْمِذِيُّ وَأَبُوْ دَاوُدَ وَالدَّارِمِيُّ وَرَوَى النَّسَائِيُّ وَابْنُ مَاجَهُ إِلَى قَوْلِهِ: “الْأَعْلَى”. وَقَالَ التِّرْمِذِيُّ: هَذَا حَدِيْثٌ حَسْنٌ صَحِيْحٌ .
881. (14) [1/278–దృఢం]
’హుజై‘ఫా (ర) కథనం: ప్రవక్త (స) తో కలసి అతను నమా’జు చదివారు. ప్రవక్త (స) రుకూ’లో ‘సుబ్’హాన రబ్బియల్ ‘అ”జీమ్’ అని పఠించేవారు. ఇంకా సజ్దాలో సుబ్’హాన రబ్బియల్ అ’అలా అని పఠించేవారు. ఇంకా కారుణ్య వాక్యాలు పఠిస్తే, ఆగి కారుణ్యాన్ని అర్థిస్తారు, అదేవిధంగా దైవశిక్ష గల వాక్యాలు పఠిస్తే, దైవశిక్ష నుండి శరణు వేడుకుంటారు. (తిర్మిజి‘ – ప్రామాణికం, దృఢం; అబూ దావూ‘ద్, దార్మీ, నసాయి‘, ఇబ్నె మాజహ్)
—–
اَلْفَصْلُ الثَّالِثُ మూడవ విభాగం
882 – [ 15 ] ( صحيح ) (1/278)
عَنْ عَوْفِ بْنِ مَالِكٍ قَالَ: قُمْتُ مَعَ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم فَلَمَّا رَكَعَ مَكَثَ قَدْرَ سُوْرَةُ (الْبَقْرَةِ). وَيَقُوْلُ فِيْ رُكُوْعِهِ “سُبْحَانَ ذِيْ الْجَبَرُوْتِ وَالْمَلَكُوْتِ وَالْكِبْرِيَاءِ وَالْعَظْمَةِ”. رَوَاهُ النَّسَائِيُّ .
882. (15) [1/278–దృఢం]
‘ఔఫ్ బిన్ మాలిక్ (ర) కథనం: నేను ప్రవక్త (స)తో కలసి నమా’జు చదివాను. ప్రవక్త (స) రుకూ’ చేసి, రుకూ’లో సూరహ్ బఖరహ్(2) చదివినంతసేపు ఈ దు’ఆ చదివారు: ”సుబ్’హాన జిల్జబరూత్ వల్ మలకూత్ వల్ కిబ్రియాయి’, వల్ ‘అ”జ్మహ్,” –’సార్వభౌముడు అయిన అల్లాహ్‌యే పరిశుద్ధుడు, గొప్పవాడు, అధికారం గలవాడు.’ (నసాయి’)
అంటే అప్పుడప్పుడూ ప్రవక్త(స) రుకూ’ దీర్ఘంగా ఉండేది.
883 – [ 16 ] ( ضعيف ) (1/278)
وَعَنِ ابْنِ جُبَيْرٍ قَالَ: سَمِعْتُ أَنَسِ بْنِ مَالِكٍ يَقُوْلُ: مَا صَلَّيْتُ وَرَاءَ أَحَدٍ بَعْدَ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم أَشْبَهَ صَلَاةً بِصَلَاةِ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم مِنْ هَذَا الْفَتَى يَعِنِيْ عُمَرُ بْنَ عَبْدِ الْعَزِيْزِ قَالَ: قَالَ: فَحَزَرْنَا رَكُوْعَهُ عَشْرَ تَسْبِيْحَاتٍ وَسُجُوْدَهُ عَشْرَ تَسْبِيْحَاتٍ. رَوَاهُ أَبُوْ دَاوُدَ وَالنَّسَائِيُّ.
883. (16) [1/278–బలహీనం]
ఇబ్నె జుబైర్ (ర) కథనం: అనస్ బిన్ మాలిక్ (ర) ఇలా అంటూ ఉండగా నేను విన్నాను, ”ప్రవక్త (స) తర్వాత ఆయన లాంటి నమా’జు చదివించే ఎవరి వెనుకా నేను నమా’జు చదవలేదు,అయితే ‘ఉమర్ బిన్ ‘అబ్దుల్ ‘అ’జీ’జ్ తప్ప. మేము అతని నమా’జులోని రుకూ’ను గమనించాము. 10 సార్లు సుబ్’హానల్లాహ్ చదివేలా ఉండేది సజ్దా కూడా అంతే దీర్ఘంగా ఉండేది.” (అబూ దావూ’ద్, నసాయి’)
884 – [ 17 ] ( صحيح ) (1/278)
وَعَنْ شَقِيْقٍ قَالَ: إِنَّ حُذَيْفَةَ رَأَى رَجُلًا لَا يُتِمُّ رُكُوْعَهُ وَلَا سُجُوْدَهُ فَلَمَّا قَضَى صَلَاتهُ دَعَاهُ. فَقَالَ لَهُ حُذَيْفَةُ: مَا صَلَّيْتَ. قَالَ: وَأَحْسَبُهُ قَالَ: وَلَوْ مُتَّ مُتَّ عَلَى غَيْرِ الْفِطْرَةِ الَّتِيْ فَطَرَ اللهُ مُحَمَّدًا صلى الله عليه وسلم. رَوَاهُ الْبُخَارِيُّ.
884. (17) [1/278–దృఢం]
షఖీఖ్ కథనం: హుజై’ఫా (ర) ఒక వ్యక్తి నమా’జు చదువుతుండగా చూశారు. అతడు రుకూ’, సజ్దాలను నిదానంగా చేయడం లేదు. ఆవ్యక్తి నమా’జు ముగించిన తర్వాత అతన్ని పిలిచి, ‘నువ్వు నమా’జు చదవలేదు, ఉల్లేఖనకర్త కథనం, నా అనుమానం హుజైఫహ్ ఒకవేళ నువ్వు ఇలాగే నమా’జు చదువుతూ మరణిస్తే, అల్లాహ్ ప్రవక్త(స)ను సృష్టించిన ధర్మానికి వ్యతిరేకంగా మరణిస్తావు, అంటే ఇస్లామ్ వ్యతిరేక స్థితిలో మరణిస్తావు,’ అని కూడా అన్నారు. (బు’ఖారీ)
అంటే నమా’జులోని ముఖ్య విధులను సరిగా, నిదానంగా ఆచరించడం తప్పనిసరి విధి.
885 – [ 18 ] ( صحيح ) (1/279)
وَعَنْ أَبِيْ قَتَادَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “أسْوَأُ النَّاسِ سَرِقَةً الَّذِيْ يَسْرِقُ مِنْ صَلَاتِهِ”. قَالُوْا: “يَا رَسُوْلَ اللهِ وَكَيْفَ يَسْرِقُ مِنْ صَلَاتِهِ؟” قَالَ: “لَا يُتِمُّ رُكُوْعَهَا وَلَا سُجُوْدَهَا”. رَوَاهُ أَحْمَدُ.
885. (18) [1/279–దృఢం]
అబూ ఖతాదహ్ (ర) కథనం: ప్రవక్త (స), ‘నమా’జును దొంగలించేవాడు అందరికంటే నీచమైన దొంగ,’ అని ప్రవచించారు. దానికి అక్కడున్నవారు, ‘ఓ ప్రవక్తా! నమా’జును ఎలా దొంగలిస్తాడు,’ అని విన్నవించుకున్నారు. అప్పుడు ప్రవక్త (స), ‘అంటే రుకూ’, సజ్దాలను సరిగా ఆచరించడు. అలాంటి వాడు నమా’జు దొంగ,’ అని అన్నారు. (అ’హ్మద్)
886 – [ 19 ] ( صحيح ) (1/279)
وعَنِ النُّعْمَانِ بْنِ مُرَّةَ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم قَالَ: مَا تَرَوْنَ فِيْ الشَّارِبِ وَالزَّانِيْ وَالسَّارِقِ؟” وَذَلِكَ قَبْلَ أَنْ تُنْزَلَ فِيْهِمُ الْحُدُوْدُ. قَالُوْا: “اللهُ وَرَسُوْلُهُ أَعْلَمُ”. قَالَ: “هُنَّ فَوَاحِشَ وَفِيْهِنَّ عُقُوْبَةٌ وَأَسْوَأَ السَّرِقَةِ الِّذِيْ يَسْرِقُ مِنْ صَلَاتِهِ”. قَالُوْا: “وَكَيْفَ يَسْرِقُ مِنْ صَلَاتِهِ يَا رَسُوْلَ اللهِ؟” قَالَ: “لَا يُتِمُّ رَكُوْعَهَا وَلَا سُجُوْدَهَا”. رَوَاهُ مَالِكٌ. وَروَى الدَّارِمِيُّ نَحْوَهُ.
886. (19) [1/279–దృఢం]
నో’మాన్ బిన్ ముర్రహ్ (ర) కథనం: ప్రవక్త (స), ‘సారాయి త్రాగేవాడి గురించి, వ్యభిచారం చేసేవాడి గురించి, దొంగ తనం చేసేవాడి గురించి మీ అభిప్రాయం ఏమిటి?’ అని తన అనుచరులను అడిగారు. దానికి అనుచరులు: ‘అల్లాహ్‌కు, ఆయన ప్రవక్తకే బాగా తెలియాలి,’ అని విన్నవించుకున్నారు. అప్పుడు ప్రవక్త(స): ‘ఇవన్నీ పాపకార్యాలే, వీటికి శిక్షలూ ఉన్నాయి. కాని అందరికంటే నీచమైనవాడు నమా’జును దొంగలించేవాడు,’ అని అన్నారు. దానికి అనుచరులు: ‘నమా’జును ఎలా దొంగలిస్తాడు,’ అని విన్నవించుకోగా, ప్రవక్త (స): ‘రుకూ మరియు సజ్దాలను సరిగా ఆచరించనివాడే నమా’జు దొంగ,’ అని అన్నారు. (మాలిక్, దార్మీ)
=====
14- بَابُ السُّجُوْدِ وَفَضْلِهِ
14. సజ్దా దాని ఘనత
اَلْفَصْلُ الْأَوَّلُ మొదటి విభాగం
887 – [ 1 ] ( متفق عليه ) (1/280)
عَنِ ابْنِ عَبَّاسٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “أُمِرْتُ أَنْ أَسْجُدَ عَلَى سَبْعَةِ أَعْظُمٍ عَلَى الْجَبْهَةِ وَالْيَدَيْنِ وَالرُّكْبَتَيْنِ وَأَطْرَافِ الْقَدَمَيْنِ وَلَا نَكْفِتَ الثِّيَابَ وَلَا الشَّعْرَ”.
887. (1) [1/2780–ఏకీభవితం]
ఇబ్నె ’అబ్బాస్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”నన్ను 7 ఎముకలపై సజ్దాచేయమని ఆదేశమివ్వ బడింది. 1. నుదురు, 2. రెండు చేతులు, 3. రెండు మోకాళ్ళు, 4. రెండు పాదాలు ఇంకా నమా’జులో తమ దుస్తులను, వెంట్రుకలను సరిచేసుకోకూడదని కూడా ఆదేశమివ్వబడింది. (బు’ఖారీ, ముస్లిమ్)
888 – [ 2 ] ( متفق عليه ) (1/280)
وَعَنْ أَنَسٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “اِعْتَدِلُوْا فِيْ السُّجُوْدِ وَلَا يَبْسُطُ أَحْدُكُمْ ذِرَاعَيْهِ اِنْبِسَاطَ الْكَلْبِ”.
888. (2) [1/280–ఏకీభవితం]
అనస్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మీరు సజ్దాను మధ్యస్థంగా చేయండి. అంటే నిదానంగా చేయండి. మీలో ఎవరూ సజ్దాలో కుక్కలా చేతులను పరచకండి.” (బు’ఖారీ, ముస్లిమ్)
889 – [ 3 ] ( صحيح ) (1/280)
وَعَنْ الْبَرِاءِ بْنِ عَازِبٍ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم اِذَا سَجَدْتَّ فَضَعْ كَفَّيْكَ، وَارْفَعْ مِرْفَقَيْكَ”. رَوَاهُ مُسْلِمٌ.
889. (3) [1/280–దృఢం]
బరా‘ బిన్ ’ఆ’జిబ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ‘మీరు సజ్దా చేసినపుడు రెండు అరచేతులను నేలపై ఉంచండి. రెండు మోచేతులను పైకి లేపి ఉంచండి.’ (ముస్లిమ్)
ఈ ఆదేశం స్త్రీ పురుషులందరికీ వర్తిస్తుంది.
890 – [ 4 ] ( صحيح ) (1/280)
وَعَنْ مَيْمُوْنَةَ قَالَتْ: كَانَ النَّبِيُّ صلى الله عليه وسلم إِذَا سَجَدَ جَافَى بَيْنَ يَدَيْهِ حَتَّى لَوْ أَنَّ بَهْمَةً أَرَادَتْ أَنْ تَمُرَّ تَحْتَ يَدَيْهِ مَرَّتْ. هَذَا لَفْظُ أَبِيْ دَاوُدَ كَمَا صَرَّحَ فِيْ شَرْحِ السُّنَّةِ بِإِسْنَادِهِ وَلِمُسْلِمٍ بِمَعْنَاهُ: قَالَتْ: كَانَ النَّبِيُّ صلى الله عليه وسلم إِذَا سَجَدَ لَوْشَاءَتْ بَهْمَةٌ أَنْ تَمُرَّ بَيْنَ يَدَيْهِ لَمَرَّتْ .
890. (4) [1/280–దృఢం]
మైమూనహ్ (ర) కథనం: ప్రవక్త (స) సజ్దాలో తన చేతులను ఎంత ఎడంగా ఉంచే వారంటే, మేకపిల్ల వెళ్ళాలను కుంటే వెళ్ళగలిగేది. (అబూ దావూ’ద్, ష’ర్హుస్సున్నహ్)
ముస్లిమ్‌లో ఇలా ఉంది, ”ప్రవక్త (స) సజ్దా చేసి నపుడు చేతులు, కడుపు ఎంతదూరంగా ఉండేవంటే, మేకపిల్ల ఒక వైపు నుండి మరో వైపునకు వెళ్ళాలనుకుంటే వెళ్ళగలిగేది.
891 – [ 5 ] ( متفق عليه ) (1/281)
وعَنْ عَبْدِ اللهِ بْنِ مَالِكِ بْنِ بُحَيْنَةَ قَالَ: كَانَ النَّبِيُّ صلى الله عليه وسلم إِذَا سَجَدَ فَرَّجَ بَيْنَ يَدَيْهِ حَتَّى يَبْدُوَ بَيَاضُ إِبْطَيْهِ.
891. (5) [1/281–ఏకీభవితం]
’అబ్దుల్లాహ్ బిన్ మాలిక్ (ర) కథనం: ప్రవక్త (స) సజ్దా చేసినపుడు, రెండు చేతుల మధ్య చంకలలో ఉన్న తెల్ల దనం కనబడేంత దూరం ఉంచేవారు. (బు’ఖారీ, ముస్లిమ్)
892 – [ 6 ] ( صحيح ) (1/281)
وَعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: كَانَ النَّبِيُّ صلى الله عليه وسلم يَقُوْلُ فِيْ سُجُوْدِهِ: “اَللّهُمَّ اغْفِرْ لِيْ ذَنْبِيْ كُلَّهُ دِقَّهُ وَجِلَّهُ وَأَوَّلَهُ وَآخِرَهُ وَعَلَانِيَتَهُ وَسِرَّهُ”. رَوَاهُ مُسْلِمٌ.
892. (6) [1/281–దృఢం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) సజ్దాలో ఈ దు’ఆ పఠించేవారు: ”అల్లాహుమ్మ’గ్ఫిర్లీ జ’మ్బీ కుల్లహు దిఖ్ఖహు వజిల్లహు వ అవ్వలహు వ ఆ’ఖిరహు వ ‘అలాని యతహు వ సిర్రహు,” — ‘ఓ మా ప్రభూ! నా చిన్న, పెద్ద, ఇంతకు ముందువి, వెనుకటివి, రహస్యంగా ఉన్నవి, బహిర్గతంగా ఉన్న పాపాలన్నింటినీ క్షమించు.’ (ముస్లిమ్)
893 – [ 7 ] ( صحيح ) (1/281)
وَعَنْ عَائِشَةَ رَضِيَ اللهُ عَنْهَا قَالَتْ: فَقَدْتُّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم لَيْلَةً مِّنَ الْفِرَاشِ فَالْتَمَسْتُهُ فَوَقَعَتْ يَدِيْ عَلَى بَطْنِ قَدَمَيْهِ وَهُوَ فِيْ الْمَسْجِدِ وَهُمَا مَنْصُوْبَتَانِ وَهُوَ يَقُولُ: “اَللَّهُمَّ إِنِّيْ أَعُوْذُ بِرِضَاكَ مِنْ سَخطِكَ وَبِمُعَافَاتِكَ مِنْ عُقُوْبَتِكَ وَأَعُوْذُ بِكَ مِنْكَ لَا أَحْصَيْ ثَنَاءً عَلَيْكَ أَنْتَ كَمَا أَثْنَيْتَ عَلَى نَفْسِكَ”. رَوَاهُ مُسْلِمٌ .
893. (7) [1/281–దృఢం]
’ఆయి‘షహ్ (ర) కథనం: ఒకరోజు రాత్రి ప్రవక్త (స) పడకపై లేరు. వెతకటం ప్రారంభించాను. నాచేయి ప్రవక్త (స) పాదాలపై పడ్డింది. అప్పుడు ప్రవక్త (స) సజ్దా స్థితిలో ఉన్నారు. రెండు పాదాలు నిలబడి ఉన్నాయి. ఇంకా సజ్దాలో ప్రవక్త (స) ఈ దు’ఆ చదువుతున్నారు: ”అల్లాహుమ్మ ఇన్ని అ’ఊజు’బి ర’దాకమిన్ స’ఖతిక వబి ము’ఆ ఫాతిక, మిన్ ‘ఉఖూబతిక వ అ’ఊజు’బిక మిన్క లా ‘ఉహ్ సా స’నాఅ’న్ అలైక, అన్త కమా అస్’నైత అలా నఫ్సిక.” — ‘ఓ మా ప్రభూ, నేను నీ ద్వారా, నీ ఆగ్రహం నుండి, నీ క్షేమం ద్వారా నీ శిక్ష నుండి, శరణు కోరుతున్నాను. ఇంకా నీ ఆగ్రహం నుండి, నీ కారుణ్యం ద్వారా శరణు కోరుతున్నాను. నీ గొప్పతనాన్ని లెక్కించలేను. నీవు పేర్కొన్న విధంగానే నువ్వు ఉన్నావు.’ (ముస్లిమ్)
894 – [ 8 ] ( صحيح ) (1/281)
وَعَنْ أَبِيْ هُرَيْرَةَ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “أَقْرَبَ مَا يَكُوْنَ الْعَبْدُ مِنْ رَبِّهِ وَهُوَ سَاجِدٌ فَأَكْثِرُوْا الدُّعَاءَ”. رَوَاهُ مُسْلِمٌ .
894. (8) [1/281–దృఢం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ‘దాసుడు సజ్దా స్థితిలో అల్లాహ్‌కు చాలా దగ్గరయి పోతాడు. అందువల్ల సజ్దాలో అత్యధికంగా ప్రార్థించండి.’ (ముస్లిమ్)
895 – [ 9 ] ( صحيح ) (1/281)
وَعَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: ” إِذَا قَرَأَ ابْنُ آدَمَ السَّجْدَةَ فَسَجَدَ اِعْتَزَلَ الشَّيْطَانُ يَبْكِيْ يَقُوْلُ: يَا وَيْلَتِيْ أُمِرَ ابْنُ آدَمَ بِالسُّجُوْدِ فَسَجَدَ فَلَهُ الْجَنَّةُ وَأُمِرْتُ بِالسُّجُوْدِ فَأَبَيْتُ فَلِيَ النَّارُ”. رَوَاهُ مُسْلِمٌ.
895. (9) [1/281–దృఢం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మనిషి సజ్దా వాక్యం చదివి, సజ్దా తిలావత్ చేస్తే, షై’తాన్ ఏడుస్తూ ప్రక్కకు తప్పుకొని, నా పాడుగాను మానవునికి సజ్దా చేయమని ఆదేశిస్తే సజ్దా చేశాడు. అతడికి స్వర్గం లభించింది. నాకు సజ్దా గురించి ఆదేశమివ్వబడింది. కాని నేను తిరస్కరించాను. నా కోసం నరకం ఉంది,” అని విచారిస్తాడు. (ముస్లిమ్)
896 – [ 10 ] ( صحيح ) (1/281)
وَعَنْ رَبِيْعَة بْنِ كَعْبٍ قَالَ: كُنْتُ أَبِيْتُ مَعَ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم فَأَتَيْتُهُ بِوُضُوْئِهِ وَحَاجَتِهِ فَقَالَ لِيْ: “سَلْ”. فَقُلْتُ: أَسْأَلُكَ مُرَافَقَتَكَ فِيْ الْجَنَّةِ. قَالَ: “أَوْ غَيْرَ ذَلِكَ؟” قُلْتُ: هُوَ ذَاكَ. قَالَ: “فَأَعِنِيْ عَلَى نَفْسِكَ بِكَثْرَةِ السُّجُوْدِ”. رَوَاهُ مُسْلِمٌ.
896. (10) [1/281–దృఢం]
రబీ’అ బిన్ క’అబ్ (ర) కథనం: ఒకరోజు రాత్రి నేను ప్రవక్త (స) వద్దకు వెళ్ళాను. నేను ప్రవక్త (స) వద్దకు వు’జూ నీళ్ళు, ఇంకా ఇతర వస్తువులు తీసుకొని వచ్చాను. అప్పుడు ప్రవక్త (స) నీవు కోరింది అడుగు,’ అని అన్నారు. దానికి నేను, ‘ఓ ప్రవక్తా! నేను స్వర్గంలో మీ వెంటే ఉండాలని కోరుకుంటున్నాను, ‘అని విన్నవించుకున్నాను. ప్రవక్త (స), ‘దీని తరువాత మరేదైనా,’ అని అన్నారు. దాని కి నేను, ‘ఇదే నా కోరిక,’ అని అన్నాను. దానికి ప్రవక్త (స), ‘ఈ విషయంలో అత్యధికంగా సజ్దాలు చేసి నాకు సహకరించు,’ అని అన్నారు. (ముస్లిమ్)
‘అంటే సజ్దాలు అధికంగా చేస్తూ ఉండు. దాని వల్ల నాకు సిఫారసు చేసే అవకాశం లభిస్తుంది,’ అని అన్నారు.
897 – [ 11 ] ( صحيح ) (1/281)
وَعَنْ مَعْدَانَ بْنِ طَلْحَةَ قَالَ: لَقِيْتُ ثَوْبَانَ مَوْلَى رَسُوْلِ الله صلى الله عليه وسلم فَقُلْتُ: أَخْبِرْنِيْ بِعَمَلٍ أَعْمَلُهُ يُدْخِلُنِيْ اللهُ بِهِ الْجَنَّةَ فَسَكَتَ. ثُمَّ سَأَلْتُهُ فَسَكَتَ. ثُمَّ سَأَلْتُهُ الثَّالِثَةَ. فَقَالَ: سَأَلْتُ عَنْ ذَلِكَ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم فَقَالَ: “عَلَيْكَ بِكَثْرِةِ السُّجُوْدِ للهِ. فَإِنَّكَ لَا تَسْجُدُ للهِ سَجْدَةً إِلَّا رَفَعَكَ اللهُ بِهَا دَرَجَةً وَحَطَّ عَنْكَ بِهَا خَطِيْئَةً”. قَالَ مَعْدَانُ: ثُمَّ لَقِيْتُ أَبَا الدَّرْدَاءِ فَسَأَلْتُهُ. فَقَالَ لِيْ مِثْلَ مَا قَالَ لِيْ ثَوْبَانُ. رَوَاهُ مُسْلِمٌ
897. (11) [1/281–దృఢం]
మ’అదాన్ బిన్ ’తల్’హా (ర) కథనం: నేను ప్రవక్త (స) విడుదల చేసిన బానిస సౌ’బాన్ (ర)ను కలిశాను. నేను అతన్ని: ‘ఏదైనా ఉత్తమ వాక్యం చూపెట్టండి, దాని ద్వారా నేను స్వర్గంలో ప్రవేశించగలగాలి,’ అని అన్నాను. అతను మౌనంగా ఉండిపోయారు. మళ్ళీ నేను అలాగే ప్రశ్నించాను. మళ్ళీ అతను మౌనంగా ఉండిపోయారు. మళ్ళీ మూడవసారి నేను ప్రశ్నించాను. అప్పుడతను: ”నేను ప్రవక్త (స)ను ఇదే ప్రశ్న అడిగాను. దానికి ప్రవక్త (స): ‘నువ్వు అత్యధికంగా సజ్దాలు చేస్తూ ఉండు, నమా’జులు చదువుతూ ఉండు, ఎందుకంటే, నువ్వు ఒక సజ్దా చేస్తే, దానికి బదులు అల్లాహ్ నీ స్థానాన్ని ఉన్నతం చేస్తాడు, పాపాలను క్షమిస్తాడు,’ అని అన్నారు.” ఆ తరువాత అబూ దర్దా (ర)ను కలసి ఇలాగే ప్రశ్నిస్తే, అతను కూడా సౌ’బాన్ ఇచ్చినట్లే సమాధానం ఇచ్చారు. (ముస్లిమ్)
—–
اَلْفَصْلُ الثَّانِيْ రెండవ విభాగం
898 – [ 12 ] ( ضعيف ) (1/282)
عَنْ وَائِلِ بْنِ حُجْرٍ قَالَ: رَأَيْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم إِذَا سَجَدَ وَضَعَ رُكْبَتَيْهِ قَبْلَ يَدَيْهِ وَإِذَا نَهَضَ رَفَعَ يَدَيْهِ قَبْل رُكْبَتَيْهِ. رَوَاهُ أَبُوْ دَاوُدَ وَالتِّرْمِذِيُّ وَالنَّسَائِيُّ وَابْنُ مَاجَهُ وَالدَّارِمِيُّ .
898. (12) [1/282–బలహీనం]
వాయి‘ల్ బిన్ ’హుజ్రి (ర) కథనం: నేను ప్రవక్త (స)ను చూశాను. ప్రవక్త (స) సజ్దా చేసినపుడు చేతుల కంటే ముందు మోకాళ్ళు నేలపై పెట్టేవారు, సజ్దా నుండి లేచినపుడు మోకాళ్ళకంటే ముందు రెండు చేతులను ఎత్తేవారు. (అబూ దావూ‘ద్, ఇబ్నె మాజహ్, తిర్మిజి‘, నసాయి‘, దార్మీ)
899 – [ 13 ] ( صحيح ) (1/282)
وَعَنْ أَبِيْ هُرَيْرَةَ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِذَا سَجَدَ أَحْدُكُمْ فَلَا يَبْرُكُ كَمَا يَبْرُكُ الْبَعِيْرُ وَلْيَضَعْ يَدَيْهِ قَبْلَ رُكْبَتَيْهِ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ وَالنَّسَائِيُّ. وَالدَّارِمِيُّ. قَالَ أَبُوْ سُلَيْمَانَ الْخَطَّابِيُّ: حَدِيْثُ وَائِلِ بْنِ حُجْرٍ أَثْبَتُ مِنْ هَذَا وَقِيْلَ: هَذَا مَنْسُوْخٌ .
899. (13) [1/282–దృఢం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మీలో ఎవరైనా సజ్దా చేస్తే ఒంటెలా కూర్చోకండి. అంటే, మోకాళ్ళ కంటే ముందు రెండుచేతులను పెట్టాలి.” [147] (అబూ దావూ‘ద్, నసాయి‘, దార్మీ)
అబూ సులైమాన్ ఖత్తాబీ వాయి‘ల్ బిన్ ’హుజ్రి ’హదీసు‘ను ప్రామాణికమైనదిగా పేర్కొన్నారు. ఈ హదీసు రద్దుచేయబడిందని అంటారు.
900 – [ 14 ] ( صحيح ) (1/283)
وَعَنِ ابْنِ عَبَّاسٍ قَالَ: كَانَ النَّبِيُّ صلى الله عليه وسلم يَقُوْلُ بَيْنَ السَّجْدَتَيْنِ: “اَللَّهُمَّ اغْفِرْ لِيْ وَارْحَمْنِيْ وَاهْدَنِيْ وَعَافِنِيْ وَارْزُقْنِيْ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ وَالتِّرْمِذِيُّ .
900. (14) [1/283–దృఢం]
ఇబ్నె ’అబ్బాస్ (ర) కథనం: ప్రవక్త (స) రెండు సజ్దాల మధ్య ఈ దు’ఆ పఠించేవారు: ”అల్లా హుమ్మ’గ్ఫిర్లీ వర్’హమ్నీ, వహ్దినీ, వ ’ఆఫినీ, వర్’జుఖ్నీ,” — ‘ఓ అల్లాహ్! నన్ను క్షమించు, నన్ను కరుణించు, నాకు రుజుమార్గం వైపుకు మార్గదర్శ కత్వం ప్రసాదించు, నాకు క్షేమాన్ని ప్రసాదించు, ఇంకా నాకు ఉపాధి ప్రసాదించు.’ (అబూ దావూద్, తిర్మిజి‘)
901 – [ 15 ] ( صحيح ) (1/283)
وَعَنْ حُذَيْفَةَ أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم كَانَ يَقُوْلُ بَيْنَ السَّجْدَتَيْنِ: “رَبِّ اغْفِرْ لِيْ”. رَوَاهُ النَّسَائِيُّ وَالدَّارِمِيُّ .
901. (15) [1/283–దృఢం]
’హుజై ‘ఫా (ర) కథనం: ప్రవక్త (స) రెండు సజ్దాల మధ్య ఈ దు’ఆను కూడా పఠించేవారు: ”రబ్బి ’గ్ఫిర్లీ” — ‘ఓ నా ప్రభూ నన్ను క్షమించు’. (నసాయి‘, దార్మీ)
ఇబ్నెమాజలో ‘మూడుసార్లు పలికే వారని’ ఉంది.
—–
اَلْفَصْلُ الثَّالِثُ మూడవ విభాగం
902 – [ 16 ] ( حسن ) (1/283)
عَنْ عَبْدِ الرَّحْمنِ بْنِ شِبْلٍ قَالَ: نَهَى رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم عَنْ نُقْرَةِ الْغُرَابِ وَافْتِرَاشِ السَّبْعِ وَأَنْ يُّوَطِّنَ الرَّجُلُ الْمَكَانَ فِيْ الْمَسْجِدِ كَمَا يُوَطِّنُ الْبَعِيْرُ. رَوَاهُ أَبُوْ دَاوُدَ وَالنَّسَائِيُّ وَالدَّارَمِيُّ .
902. (16) [1/283-ప్రామాణికం]
’అబ్దుర్ర’హ్మాన్ బిన్ షిబ్లి (ర) కథనం: ప్రవక్త (స) నమా’జులో కాకిలా సజ్దాలు చేయటాన్ని వారించారు. అంటే కాకి గింజల్ని కొట్టి తిన్నట్టు. ఇంకా సజ్దాలో జంతువుల్లా చేతులు పరచటాన్ని కూడా వారించారు. ఇంకా మస్జిద్లో నమా’జు కోసం ఒక ప్రత్యేక స్థలాన్ని ఎంచుకోవటాన్ని అంటే ఒంటె తాను కూర్చోవటానికి ప్రత్యేక స్థలాన్ని ఎంచుకున్నట్టు, వారించారు. (అబూ దావూ‘ద్, నసాయి‘, దార్మీ)
903 – [ 17 ] ( ضعيف ) (1/283)
وَعَنْ عَلِيٍّ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “يَا عَلِيٌّ إِنِّيْ أُحِبُّ لَكَ مَا أُحِبُّ لِنَفْسِيْ وَأَكْرَهُ لَكَ مَا أَكْرَهُ لِنَفْسِيْ لَا تُقِعْ بَيْنَ السَّجْدَتَيْنِ”. رَوَاهُ التِّرْمِذِيُّ .
903. (17) [1/283–బలహీనం]
‘అలీ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ‘ఓ ‘అలీ! నాకోసం ఇష్టపడే వాటినీ నీకోసం కూడా ఇష్టపడు తున్నాను. అదేవిధంగా నాకోసం చెడుగా భావించే వాటినే, నీకోసం కూడా చెడుగా భావిస్తున్నాను. నీవు రెండు సజ్దాల మధ్య ‘ఇఖ్ఆ’ చేసి కూర్చోకు.” [148] (తిర్మిజి‘)
904 – [ 18 ] ( صحيح ) (1/284)
وعَنْ طلق بن علي الحنفي قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَا يَنْظُرُ اللهُ عَزَّ وَجَلَّ إِلَى صَلَاةِ عَبْدٍ لَا يُقِيْمُ فِيْهَا صُلْبَهُ بَيْنَ رُكُوْعِهَا وَسُجُوْدِهَا”. رَوَاهُ أَحْمَدُ .
904. (18) [1/284–దృఢం]
’తల్ఖ్ బిన్ ’అలీ ’హనఫి (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ‘తన నమా’జులో రుకూ’, సజ్దాలు సరిగా చేయని వ్యక్తి నమా’జు వైపు అల్లాహ్ (త) చూడడు అంటే స్వీకరించడు.’ (’అ’హ్మద్)
905 – [ 19 ] ( صحيح ) (1/284)
وَعَنْ نَافِعٍ أَنَّ ابْنَ عُمَرَ كَانَ يَقُوْلُ: مَنْ وَضَعَ جَبْهَتَهُ بِالْأَرْضِ فَلْيَضَعُ كَفَّيْهِ عَلَى الَّذِيْ وَضَعَ عَلَيْهِ جَبْهَتَهُ ثُمَّ إِذَا رَفَعَ فَلْيَرْفَعْهُمَا فَإِنَّ الْيَدَيْنِ تَسْجُدَانِ كَمَا يَسْجُدُ الْوَجْهُ. رَوَاهُ مَالِكٌ .
905. (19) [1/284–దృఢం]
నా’ఫె (ర) కథనం: ’అబ్దుల్లాహ్ బిన్ ’ఉమర్ ఇలా అనే వారు, ‘సజ్దా చేసేవారు తమ చేతులను కూడా నుదురు పెట్టిన చోట పెట్టాలి. అంటే సజ్దా స్థితిలో రెండు అర చేతులను నేలపై పెట్టాలి. అవి భుజాలకు సమానంగా ఉండాలి. సజ్దా నుండి లేచినప్పుడు రెండు చేతులను కూడా లేపాలి. ఎందు కంటే ముఖం సజ్దా చేసినట్టే, చేతులు కూడా సజ్దా చేస్తాయి.’ (మాలిక్)
=====
15- بَابُ التَّشَهُّدِ
15. తషహ్హుద్ (అత్త’హియ్యాత్)
اَلْفَصْلُ الْأَوَّلُ మొదటి విభాగం
906 – [ 1 ] ( صحيح ) (1/285)
عَنِ ابْنِ عُمَرَ قَالَ: كَانَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم إِذَا قَعَدَ فِيْ التَّشَهُّدِ وَضَعَ يَدَهُ الْيُسْرَى عَلَى رُكْبَتِهِ الْيُسْرَى وَوَضَعَ يَدَهُ الْيُمْنَى عَلَى رَكْبَتِهِ الْيُمْنَى وَعَقَدَ ثَلَاثَةً وَّخَمْسِيْنَ وَأَشَارَ بِالسَّبَّابَةِ
906. (1) [1/285–దృఢం]
’అబ్దుల్లాహ్ బిన్ ’ఉమర్ (ర) కథనం: ప్రవక్త (స) తష హ్హుద్లో కూర్చున్నప్పుడు, తన ఎడమ చేతిని ఎడమ మోకాలిపై, కుడిచేతిని కుడి మోకాలిపై పెట్టి, 53 సంఖ్యలా చేతిని ముడిచి, చూపుడు వ్రేలితో సైగ చేసేవారు.
907 – [ 2 ] ( صحيح ) (1/285)
وَفِيْ رِوَايَةٍ: كَانَ إِذَا جَلَسَ فِيْ الصَّلَاةِ وَضَعَ يَدَيْهِ عَلَى رُكْبَتَيْهِ وَرَفَعَ أَصْبَعَهُ الْيُمْنَى الَّتِيْ تَلَي الْإِبْهَامَ يَدْعُوْ بِهَا وَيَدُهُ الْيُسْرَى عَلَى رُكْبَتَيْهِ بِاسِطَهَا عَلَيْهَا . رَوَاهُ مُسْلِمٌ .
907. (2) [1/285–దృఢం]
మరో ఉల్లేఖనంలో ఇలా ఉంది, ”ప్రవక్త (స) నమా’జులో కూర్చున్నప్పుడు తన రెండుచేతులను తన రెండు మోకాళ్ళపై పెట్టి, తన కుడిచేతి చూపుడు వ్రేలును ఎత్తి సైగచేస్తూ, ఎడమచేతిని ఎడమ మోకాలిపై పెట్టేవారు.” [149] (ముస్లిమ్)
908 – [ 3 ] ( صحيح ) (1/285)
وَعَنْ عَبْدِ اللهِ بْنِ الزُّبَيْرِ قَالَ: كَانَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم إِذَا قَعَدَ يَدْعُوْ وَضَعَ يَدَهُ الْيُمْنَى عَلَى فَخِذِهِ الْيُمْنَى وَيَدَهُ الْيُسْرَى عَلَى فَخِذِهِ الْيُسْرَى وَأَشَارَ بِأِصْبَعِهِ السَّبَّابَةِ وَوَضَعَ إِبْهَامَهُ عَلَى أصْبَعِهِ الْوُسْطَى وَيُلْقِمُ كَفَّهُ الْيُسْرَى رُكْبَتَهُ. رَوَاهُ مُسْلِمٌ .
908. (3) [1/285–దృఢం]
’అబ్దుల్లాహ్ బిన్ ’జుబైర్ (ర) కథనం: ప్రవక్త (స) నమా’జులో తషహ్హుద్‌లో కూర్చుంటే, కుడిచేతిని కుడి మోకాలిపై, ఎడమచేతిని ఎడమ మోకాలిపై పెట్టి, చూపుడు వ్రేలితో సైగచేస్తూ బొటన వ్రేలును మధ్య వ్రేలుతో కలిపి వృత్తాకారంగా చేసి ఉంచుతూ, ఎడమ చేతిని ఎడమ మోకాలిపై పెట్టేవారు. (ముస్లిమ్)
909 – [ 4 ] ( متفق عليه ) (1/286)
وَعَنْ عَبْدِاللهِ بْنِ مَسْعُوْدٍ قَالَ: كُنَّا إذَا صَلَّيْنَا مَعَ النَّبِيِّ صلى الله عليه وسلم قُلْنَا السَّلَامُ عَلَى اللهِ قَبْلَ عِبَادِهِ السَّلَامُ عَلَى جِبْرَيْلَ السَّلَامُ عَلَى مِيْكَائِيْلَ السَّلَامُ عَلَى فُلَانٍ وَفُلَانٍ. فَلَمَّا انْصَرَفَ النَّبِيُّ صلى الله عليه وسلم أَقْبَلَ عَلَيْنَا بِوَجْهِهِ قَالَ: “لَا تَقُوْلُوْا السَّلَامُ عَلَى اللهِ فَإِنَّ اللهَ هُوَ السَّلَامُ. فَإِذَا جَلَسَ أَحْدُكُمْ فِيْ الصَّلَاةِ فَلْيَقُلْ: “التَّحِيَّاتُ للهِ وَالصَّلوَاتُ وَالطَّيِّبَاتُ السَّلَامُ عَلَيْكَ أَيُّهَا النَّبِيُّ وَرَحْمَةُ اللهِ وَبَرْكَاتُهُ. السَّلَامُ عَلَيْنَا وَعَلَى عِبَادِ اللهِ الصَّالِحِيْنَ”. فَإِنَّهُ إِذَا قَالَ ذَلِكَ أَصَابَ كُلَّ عَبْدٍ صَالِحٍ فِيْ السَّمَاءِ وَالْأَرْضِ. “أَشْهَدُ أَنْ لَا إِلَهَ إِلَّا اللهُ وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُوْلُهُ”. ثُمَّ لِيَتَخَيَّرْ مِنَ الدُّعَاءِ أَعْجَبَهُ إِلَيْهِ فَيَدْعُوْهُ”.
909. (4) [1/286–ఏకీభవితం]
‘అబ్దుల్లాహ్ బిన్ మస్’ఊద్ (ర) కథనం: ప్రవక్త (స)తో కలసి మేము నమా’జు చదివినపుడు ఇలా పఠించేవాళ్ళం: ”అస్సలాము ‘అలల్లాహి ఖబ్ల ‘ఇబాదిహీ, అస్సలాము ‘అలా జిబ్రీల, అస్సలాము ‘అలా మీకాయీ’ల, అస్సలాము ఫులానిన్” — ‘దాసుల కంటే ముందు అల్లాహ్‌పై శాంతి, ఇంకా జిబ్రీల్, మీకాయీ’ల్ మరియు ఫలానా వ్యక్తిపై సలామ్.’ ప్రవక్త (స) నమా’జు ముగించి, మా వైపు తిరిగి ఇలా అన్నారు, ”అస్సలాము ‘అలల్లాహ్,” అని అనకండి. ఎందుకంటే అల్లాహ్ స్వయంగా శాంతి. నమా’జులో తషహ్హుద్‌లో కూర్చుంటే ఇలా చదవండి: ”అత్త’హియ్యాతు లిల్లాహి వస్సలవాతు వ’త్తయ్యి బాతు, అస్సలాము ‘అలైక అయ్యు హన్నబియ్యు వ ర’హ్మతుల్లాహి వ బరకాతుహు, అస్సలాము అలైనా వ’అలా ’ఇబాదిల్లా హిస్సాలి’హీన్.” — ‘అన్నిరకాల ఆరాధనలన్నీ అల్లాహ్ కొరకే. ఓ ప్రవక్తా! నీపై అల్లాహ్ కారుణ్యం, శుభం కురియు గాక, మాపై ఇంకా ఇతర దాసులపై కూడా.’ అనంతరం ప్రవక్త (స) ఇలా అన్నారు, ”అష్హదు అల్లాఇలాహ ఇల్లల్లాహు వ అష్హదు అన్న ము’హమ్మదన్ ’అబ్దుహూ వ రసూలుహు” — ‘అల్లాహ్ తప్ప ఆరాధ్యులెవరూ లేరని నేను సాక్ష్యం ఇస్తున్నాను. ఇంకా ము’హమ్మద్ (స) అల్లాహ్ (త) దాసులు మరియు ఆయన ప్రవక్త అని నేను సాక్ష్యం ఇస్తున్నాను.’ ఆ తరువాత ఏదైనా మంచి దు’ఆ గుర్తుంటే చదవండి,’ అని, అన్నారు. (బు’ఖారీ, ముస్లిమ్)
910 – [ 5 ] ( صحيح ) (1/286)
وَعَنْ عَبْدِ اللهِ بْنِ عَبَّاسٍ أَنَّهُ قَالَ: كَانَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم يُعَلِّمُنَا التَّشَهُّدَ كَمَا يُعَلِّمُنَا السُّوْرَةَ مِنَ الْقُرْآنِ فَكَانَ يَقُوْلُ: “اَلتَّحِيَّاتُ الْمُبَارَكَاتُ الصَّلَواتُ الطِّيِّبَاتِ للهِ السَّلَامُ عَلَيْكَ أَيُّهَا النَّبِيُّ وَرَحْمَةُ اللهِ وَبَرْكَاتُهُ السَّلَامُ عَلَيْنَا وَعَلَى عِبَادِ اللهِ الصَّالِحِيْنَ أَشْهَدُ أَنْ لَّا إِلَهَ إِلَّا اللهُ وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا رَّسُوْلُ اللهِ”. رَوَاهُ مُسْلِمٌ وَلَمْ أَجِدْ فِيْ الصَّحِيْحَيْنِ وَلَا فِيْ الْجَمْعِ بَيْنَ الصَّحِيْحَيْنِ: “سَلَامٌ عَلَيْكَ”. وَ “سَلَامٌ عَلَيْنَا” بِغَيْرِ أَلْفٍ وَلَامٍ وَلَكِنْ رَوَاهُ صَاحِبُ الْجَامِعِ عَنِ التِّرْمِذِيِّ .
910. (5) [1/286–దృఢం]
‘అబ్దుల్లాహ్ బిన్ ‘అబ్బాస్ (ర) కథనం: ప్రవక్త (స) నమా’జు లోని తషహ్హుద్‌ను ఖుర్ఆన్లోని సూరహ్‌ను నేర్పించినట్టు నేర్పించేవారు. ప్రవక్త (స) ఇలా నేర్పేవారు, ‘అత్తహియ్యాతు ముబారకాతు అస్సలాతు అత్తయ్యిబాతు అస్సలాము ‘అలైక అయ్యు హన్నబియ్యు వరహ్మతుల్లాహి వబర కాతుహు, అస్స లాము ‘అలైనా వ ‘అలా ‘ఇబాదిల్లా హిస్సాలిహీన్. అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహ్ వ అష్హదు అన్న ము’హమ్మదర్ర సూలుల్లాహ్.’ — ‘వాక్పరమైన, శుభకరమైన, శారీరకమైన, ధనపర మైన ఆరాధనలన్నీ అల్లాహ్ కొరకే. ఓ ప్రవక్తా! నీపై శాంతి, కారుణ్యం, శుభం కురియు గాక! మాపై మరియు అల్లాహ్ ప్రియ భక్తులపైననూ. అల్లాహ్ తప్ప ఆరాధ్యులెవరూ లేరని నేను సాక్ష్యం ఇస్తున్నాను. ఇంకా ము’హమ్మద్ (స) అల్లాహ్ ప్రవక్త అని నేను సాక్ష్యం ఇస్తున్నాను.’ [150] (ముస్లిమ్)
‘స’హీ’హైన్ మరియు జమ్ ‘ఉబైన ‘స్స’హీ’హైన్లో నాకు ఈ ఉల్లేఖనాలు లభించలేదు. సలామున్ అలైక, సలామున్ అలైనా. ఈ ఉల్లేఖనంలో ఉన్నాయి. కాని ‘సాహిబుల్ జామి దీన్ని తిర్మిజి’ ద్వారా ఉల్లేఖించారు.
—–
اَلْفَصْلُ الثَّانِيْ రెండవ విభాగం
911 – [ 6 ] ( صحيح ) (1/287)
وَعَنْ وَائِلِ بْنِ حُجْرِ عَنْ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم قَالَ: ثُمَّ جَلَسَ فَافْتَرَشَ رِجْلَهُ الْيُسْرَى وَوَضَعَ يَدَهُ الْيُسْرَى عَلَى فَخِذِهِ الْيُسْرَى وَحَدَّ مِرْفَقَهُ الْيُمْنَى عَلَى فَخِذِهِ الْيُمْنَى وَقَبَضَ ثِنْتَيْنِ وَحَلَقَ حَلْقَةً ثُمَّ رَفَعَ أصْبَعَهُ فَرَأَيْتُهُ يُحَرِّكُهَا يَدْعُوْ بِهَا. رَوَاهُ أَبُوْ دَاوُدَ وَالدَّارَمِيُّ .
911. (6) [1/287–దృఢం]
వాయి‘ల్ బిన్ ’హుజ్రి నమా’జును గురించి ప్రస్తావించిన తర్వాత కథనం: ప్రవక్త (స) మళ్ళీ నమా’జ్లో కూర్చున్నారు. ఎడమ కాలు పరచి, ఎడమ చేతిని ఎడమ తొడపై ఉంచారు. ఇంకా తన కుడి మోచేతిని ప్రక్కకు దూరంగా ఉంచి, కుడి తొడపై ఉంచారు. చిన్న రెండు వ్రేళ్ళను మూసి, మధ్య వేలును బొటన వ్రేలితో కలిపి వృత్తంగా చేశారు. చూపుడు వ్రేలును ఎత్తి సైగ చేస్తూ ఉండటం నేను చూశాను. [151] (అబూ దావూ‘ద్)
912 – [ 7 ] ( حسن ) (1/287)
وَعَنْ عَبْدِ اللهِ بْنِ الزُّبَيْرِ قَالَ: كَانَ النَّبِيُّ صلى الله عليه وسلم يُشِيْرُ بِأِصْبَعِهِ إِذَا دَعَا وَلَا يُحَرِّكُهَا. رَوَاهُ أَبُوْ دَاوُدَ وَالنَّسَائِيُّ وَزَادَ أَبُوْ دَاوُدَ وَلَا يُجَاوِزُ بَصَرُهُ إِشَارَتَهُ.
912. (7) [1/287–ప్రామాణికం]
’అబ్దుల్లాహ్ బిన్ ’జుబైర్ (ర) కథనం: ప్రవక్త(స) చూపుడు వేలును ఎత్తి సైగ చేసేవారు. కూర్చున్నంత సేపు చేసేవారు కాదు. సైగ చేస్తున్నప్పుడు దానివైపే దృష్టి పెట్టేవారు. పైనుండి దృష్టి మరలేది కాదు. (అబూ-దావూ‘ద్, నసాయి‘)
913 – [ 8 ] ( حسن ) (1/288)
وَعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: إِنَّ رَجُلًا كَانَ يَدْعُوْ بِأصْبَعَيْهِ. فَقَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “أحد أحد”. رَوَاهُ التِّرْمِذِيُّ وَالنَّسَائِيُّ وَالْبَيْهَقِيُّ فِيْ الدَّعْوَاتِ الْكَبِيْرِ .
913. (8) [1/288–ప్రామాణికం]
అబూ హురైరహ్ (ర) కథనం: ఒక వ్యక్తి నమా’జులో రెండు వ్రేళ్ళతో సైగ చేసేవాడు.అది చూచిన ప్రవక్త (స), ‘ఒక వేలుతో సైగచేయి, రెండు వేళ్ళతో సైగ చేయకు. ఒక వ్రేలుతో ఒకే అల్లాహ్ ఒక్కడే అని సైగ చేయటం,’ అని అన్నారు. (తిర్మిజి’, నసాయి’, బైహఖీ-ద’అతుల్ కబీర్)
914 – [ 9 ] ( صحيح ) (1/288)
وَعَنِ ابْنِ عُمَرَ قَالَ: نَهَى رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم أَنْ يَّجْلِسَالرَّجُلُ فِيْ الصَّلَاةِ وَهُوَ مُعْتَمِدٌ عَلَى يَدِهِ. رَوَاهُ أَحْمَدُ وَأَبُوْ دَاوُدَ.
وَفِيْ رِوَايِةٍ لَّهُ: نَهَى أَنْ يَّعْتَمِدَ الرَّجُلُ عَلَى يَدَيْهِ إِذَا نَهَضَ فِيْ الصَّلَاةِ.
914. (9) [1/288–దృఢం]
ఇబ్నె ’ఉమర్ (ర) కథనం: ప్రవక్త(స) నమా’జులో చేతులు నేలపై ఆనించి కూర్చోకూడదని ప్రవక్త (స) వారించారు. (’అ’హ్మద్, అబూ దావూ‘ద్)
మరో ఉల్లేఖనంలో ఇలా ఉంది, ‘సజ్దా నుండి లేచినపుడు రెండు చేతులను భూమికి ఆనించి లేవకూడదు,’ అని ప్రవక్త (స) వారించారు. [152]
915 – [ 10 ] ( حسن ) (1/288)
وَعَنْ عَبْدِ اللهِ بْنِ مَسْعُوْدٍ قَالَ: كَانَ النَّبِيُّ صلى الله عليه وسلم فِيْ الرَّكْعَتَيْنِ الْأَوْلَيَيْنِ كَأَنَّهُ عَلَى الرَّضْفِ حَتَّى يَقُوْمَ. رَوَاهُ التِّرْمِذِيُّ وَأَبُوْ دَاوُدَ وَالنَّسَائِيُّ .
915. (10) [1/288–దృఢం]
’అబ్దుల్లాహ్ బిన్ మస్’ఊద్ (ర) కథనం: ప్రవక్త (స) మొదటి రెండు రకాతుల ఖ’అదహ్లో వేడి బండపై కూర్చున్నంతసేపు కూర్చునేవారు. చివరికి నిలబడి పోయేవారు.[153](తిర్మిజి‘, అబూ దావూ‘ద్, నసాయి’)
—–
اَلْفَصْلُ الثَّالِثُ మూడవ విభాగం
916 – [ 11 ] ( ضعيف ) (1/288)
عَنْ جَابِرٍ قَالَ: كَانَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم يُعَلِّمُنَا التَّشَهُّدَ كَمَا يُعَلِّمُنَا السُّوْرَةَ مِنَ الْقُرْآنِ: “بِسْمِ اللهِ، وَبِاللهِ، التَّحِيَّاتُ للهِ وَالصَّلَواتُ وَالطَّيِّبَاتُ السَّلَامُ عَلَيْكَ أَيُّهَا النَّبِيُّ وَرْحَمةُ اللهِ وَبَرْكَاتُهُ، السَّلَامُ عَلَيْنَا وَعَلَى عِبَادِ اللهِ الصَّالِحِيْنَ، أَشْهَدُ أَنْ لَّا إِلَهَ إِلَّا اللهُ، وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُوْلُهُ، أَسْأَلُ اللهَ الْجَنَّةَ، وَأَعُوْذُ بِاللهِ مِنَ النَّارِ”. رَوَاهُ النَّسَائِي.
916. (11) [1/288–బలహీనం]
జాబిర్ (ర) కథనం: ప్రవక్త (స) మాకు అత్త’హియ్యాతు (తషహ్హుద్)ను ఖుర్ఆన్ సూరాలు నేర్పించినట్టు నేర్పించే వారు. అంటే తషహ్హుద్‌ను కూడా ప్రత్యేక శ్రద్ధతో నేర్పించే వారు. ఆ తషహ్హుద్ ఇది:
”బిస్మిల్లాహి, వబిల్లాహి, అత్త’హి య్యాతు లిల్లాహి వ’స్సలవాతు వ’త్తయ్యిబాతు అస్సలాము అలైక అయ్యుహన్నబియ్యు వర’హ్మ తుల్లాహి వ బరకా తుహు, అస్సలాము ’అలైనావ’అలా ’ఇబాదిల్లా హి’స్సాలి’హీన్. అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహు వఅష్హదు అన్న ము’హ మ్మదన్ ’అబ్దుహు వ రసూలుహు. అస్అలుల్లాహల్ జన్నత, వ అ’ఊ’జుబిల్లాహి మినన్నారి.” — ‘అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. అల్లాహ్ భాగ్యంతో, ఆరాధనలన్నీ అల్లాహ్ కొరకే. ఓ ప్రవక్తా! మీపై శాంతి మరియు అల్లాహ్ కారుణ్య శుభాలు కురియు గాక! మాపై మరియు ఇతర అల్లాహ్ దాసులపై కూడా. అల్లాహ్ తప్ప ఆరాధ్యులెవరూ లేరని సాక్ష్యం ఇస్తున్నాను. ఇంకా ము’హమ్మద్ (స) అల్లాహ్ ప్రవక్త అని నేను సాక్ష్యం ఇస్తున్నాను. ఇంకా నేను అల్లాహ్‌ను స్వర్గం కోరుతున్నాను. ఇంకా నేను నరకం నుండి విముక్తి కోరుతున్నాను.’ (నసాయి‘)
అయితే మొదటి తషహ్హుద్ మాత్రమే సరైనది.
917 – [ 12 ] ( حسن ) (1/289)
وَعَنْ نَافِعٍ قَالَ: كَانَ عَبْدُ اللهِ بْنِ عُمَرَ إِذَا جَلَسَ فِيْ الصَّلَاةِ وَضَعَ يَدَيْهِ عَلَى رُكْبَتَيْهِ وَأَشَارَ بِأَصْبَعِهِ وَأَتْبَعَهَا بَصَرَهُ ثُمَّ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَهِيَ أَشَدُّ عَلَى الشَّيْطَانِ مِنَ الْحَدِيْدِ”. يَعْنِيْ السَّبَّابَةَ. رَوَاهُ أَحْمَدُ .
917. (12) [1/289–ప్రామాణికం]
నా’ఫె (ర) కథనం: ‘’అబ్దుల్లాహ్ బిన్ ’ఉమర్(ర) 1/289 నమా’జులో కూర్చున్నప్పుడు, రెండు చేతులను రెండు మోకాళ్ళపై ఉంచేవారు. వేలుతో సైగచేస్తూ, వేలిపైనే దృష్టిని కేంద్రీకరించి ఉంచేవారు. ఇంకా ప్రవక్త (స) ప్రవచనం, ‘షహాదత్ వ్రేలితో దేవుని ఏకత్వం వైపు సైగచేయటం షై’తాన్కు భారంగా ఉంటుంది. కరవాలం, బల్లెంతో కొట్టినంతగా కఠినంగా ఉంటుంది,’ అని అన్నారని, ” అన్నారు. (’అ’హ్మద్)
918 – [ 13 ] ( صحيح ) (1/289)
وَعَنِ ابْنِ مَسْعُوْدٍ كَانَ يَقُوْلُ: مِنَ السُّنَّةِ إِخْفَاءُ التَّشَهُّدِ. رَوَاهُ أَبُوْ دَاوُدَ وَالتِّرْمِذِيُّ وَقَالَ: هَذَا حِدِيْثٌ حَسَنٌ غَرِيْبٌ .
918. (13) [1/289–దృఢం]
’అబ్దుల్లాహ్ బిన్ మస్’ఊద్ (ర) కథనం: తషహ్హుద్ మెల్లగా చదవటం ప్రవక్త సాంప్రదాయం. (అబూ దావూ‘ద్, తిర్మిజి‘ – ప్రామాణికం – ఏకోల్లేఖనం)
అంటే అత్త’హియ్యాతు మరియు దరూద్ను మెల్లగా చదవాలి. బిగ్గరగా చదవరాదు.
=====
16– بَابُ الصَّلَاةِ عَلَى النَّبِيِّ صلى الله عليه وسلم وَفَضْلِهَا
16. ప్రవక్త (స)పై దరూద్, దాని ప్రాధాన్యత
’సలాత్ అంటే నమా’జు, దు’ఆ, ప్రార్థన, కారుణ్యం, దరూద్ అని అర్థం. ప్రవక్త (స)పై దరూద్ పంపటం తప్పనిసరి విధి. అల్లాహ్ ఆదేశం: ”ఇన్నల్లాహ వ మలాయి కతహు యు’స్సల్లూన ’అలన్నబియ్యి, యా అయ్యుహల్ల’జీన ఆమనూ ’సల్లూ ’అలైహి వ’సల్లిమూ తస్లీమా” (సూ. అల్-అహ్జాబ్, 33:56) –‘అల్లాహ్ మరియు ఆయన దైవదూతలు ప్రవక్త (స)పై దరూద్ పంపుతుంటారు. ఓ విశ్వాసులారా! మీరు కూడా ప్రవక్త (స)పై దరూద్, సలాములు పంపండి.’ దీన్ని గురించి అనేక ‘హదీసు’లు ఉన్నాయి. కొన్నింటిని పేర్కొంటాము.
దరూద్ పఠించటం వల్ల శుభం కలుగుతుంది. ఉభయ లోకాల్లో సాఫల్య భాగ్యం కలుగుతుంది. దీన్ని అత్యధికంగా పఠిస్తూ ఉండాలి. ప్రత్యేకంగా 25 సమయాల్లో దీన్ని తప్పకుండా పఠించాలని గుచ్చి చెప్పటం జరిగింది: 1. నమా ’జులోని చివరి తషహ్హుద్‌లో, 2. దు’ఆయె ఖునూత్ చివర, 3. జనా’జా నమా’జులో రెండవ తక్బీర్ తర్వాత, 4. ప్రసంగం (ఖుత్బా)లో, 5. అ’జాన్ తర్వాత ఇఖామత్ తర్వాత, 6. దు’ఆ చేసేటప్పుడు ప్రారంభంలో, మధ్యలో, చివర్లో, 7. మస్జిద్లో ప్రవేశించినపుడు, బయటకు వచ్చినపుడు, 8. సఫా మర్వాలపై, 9. సభలు, సమావేశాల్లో, 10. ప్రవక్త (స) పేరు విన్న వెంటనే, 11. లబ్బయక్ అని పలికిన తర్వాత, 12. హజరె అస్వద్‌ను ముద్దు పెట్టుకున్నప్పుడు, 13. బజారుకు వెళ్ళినపుడు, తిరిగి వచ్చినప్పుడు, 14. రాత్రి పడుకొని నిద్రలేచినపుడు, 15. ఖుర్ఆన్ పఠనం పూర్తిచేసిన తర్వాత, 16. దుఃఖ, విచారాల్లో, 17. జుము’అహ్ రోజు, 18. మస్జిద్ ప్రక్క నుండి వెళ్ళి నప్పుడు, చూసినప్పుడు, 19. ప్రవక్త (స) పేరు వ్రాసి నప్పుడు. ప్రవక్త (స) ప్రవచనం, ‘ఎవరైనా ఏమైనా వ్రాసినప్పుడు నాపై దరూద్ వ్రాస్తే, దైవ దూతలు నా పేరు ఆ పుస్తకంలో ఉన్నంత వరకు, ఎల్లప్పుడూ అతని కోసం ఇస్తి’గ్‌ఫార్ చేస్తూ ఉంటారు.’ చూడండి, దరూద్ కు ఎంత గొప్ప ప్రాముఖ్యత ఉందో. ఆధునిక యుగంలో రచయితలు, ప్రవక్త (స) పేరు తర్వాత కేవలం (సల్లం) అని వ్రాస్తారు. ఈ విధమైన పిసినారి తనాన్ని ‘ఉలమా ఖండించారు. 20. ఉదయం, సాయంత్రం, 21. పాపాల పట్ల పశ్చాత్తాపపడే టప్పుడు, 22. దారిద్ర్యానికి గురయినప్పుడు, 23. పెండ్లి ఒప్పందం (నిశ్చితార్థం), నికా’హ్ సమయంలో, 24. వు’దూ చేసిన తరువాత, 25. విధి నమా’జుల తర్వాత, 26. ప్రతి పని ప్రారంభించేటపుడు.
—–
اَلْفَصْلُ الْأَوَّلُ మొదటి విభాగం
919 – [ 1 ] ( متفق عليه ) (1/290)
وَعَنْ عَبْدِ الرَّحْمنِ بْنِ أَبِيْ لَيْلَى قَالَ: لَقِيَنِيْ كَعْبُ بْنُ عُجْرَةَ فَقَالَ: أَلَا أُهْدِيْ لَكَ هَدِيَّةً سَمِعْتُهَا مِنَ النَّبِيٍّ صلى الله عليه وسلم. فَقُلْتُ: بَلَى فَأَهْدِهَا لِيْ. فَقَالَ: سَأَلْنَا رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم. فَقُلْنَا: يَا رَسُوْلَ اللهِ كَيْفَ الصَّلَاةُ عَلَيْكُمْ أَهْلَ الْبَيْتِ. فَإِنَّ اللهَ قَدْ عَلَّمْنَا كَيْفَ نُسَلِّمُ عَلَيْكُمْ. قَالَ: قُوْلُوْا “اللَّهُمَّ صَلِّ عَلَى مُحَمَّدٍ وَعَلَى آل مُحَمَّدٍ كَمَا صَلَّيْتَ عَلَى إِبْرَاهِيْمَ وَعَلَى آلِ إِبْرَاهِيْمَ إِنَّكَ حَمِيْدٌ مَجِيْدٌ؛ اللَّهُمَّ بَارِكْ عَلَى مُحَمَّدٍ وَّعَلَى آلِ مُحَمَّدٍ كَمَا بَارَكْتَ عَلَى إِبْرَاهِيْمَ وَعَلَى آلِ إِبْرَاهِيْمَ إِنَّكَ حَمِيْدٌ مَّجِيْدٌ”. إِلَّا أَنَّ مُسْلِمًا لَمْ يَذْكُرْ “عَلَى إِبْرَاهِيْمَ فِيْ الْمَوْضِعَيْنِ.
919. (1) [1/290–ఏకీభవితం]
’అబ్దుర్ర’హ్మాన్ బిన్ అబీ లైలా (ర) కథనం: క’అబ్ బిన్ ’ఉజ్ర (ర) నన్ను కలిశారు. ‘ప్రవక్త (స) ద్వారా విషయం మీకు తెలియపరచనా!’ అని అన్నారు. దానికి నేను తప్ప కుండా వినిపించండి,’ అని అన్నాను. అప్పుడతను, ‘మేము ప్రవక్త (స)ను, ఓ ప్రవక్తా! తమరిపై, తమ ఇంటి వారిపై ఎలా దరూద్ పంపాలి. ఎందుకంటే అల్లాహ్ సలామ్ పంపించే పద్ధతి మాకు నేర్పాడు,’ అని విన్నవించుకున్నాం. అప్పుడు ప్రవక్త (స) ఇలా పంపాలి అని అన్నారు:
”అల్లాహుమ్మ ‘సల్లి ‘అలా ము‘హమ్మదిన్ వ ‘అలా ‘ఆలి ము‘హమ్మదిన్ కమా ‘సల్లైత ‘అలా ఇబ్రాహీమ వ‘అలా ‘ఆలి ఇబ్రాహీమ ఇన్నక ‘హమీదుమ్మజీద్. అల్లాహుమ్మ బారిక్ ‘అలా ము‘హమ్మదిన్ వ‘అలా ‘ఆలి ముహమ్మదిన్ కమా బారక్త ‘అలా ఇబ్రాహీమ వ‘అలా ఆలి ఇబ్రాహీమ ఇన్నక ‘హమీదుమ్మజీద్.” — ‘ఓ మా ప్రభూ! ము’హమ్మద్ (స) మరియు ము’హమ్మద్ కుటుంబంపై కారుణ్యాన్ని అవతరింప జేయి. ఇబ్రాహీమ్పై మరియు ఇబ్రాహీమ్ కుటుంబంపై కారుణ్యాన్ని అవతరింపజేసినట్టు. నిస్సందేహంగా నీవే ప్రశంసించదగ్గ గొప్పవాడవు. ఓ మా ప్రభూ! ము’హమ్మద్‌పై మరియు ము’హమ్మద్ కుటుంబంపై శుభాన్ని అవతరింపజేయి. ఇబ్రాహీమ్పై మరియు ఇబ్రాహీమ్ కుటుంబంపై శుభాన్ని అవతరింపజేసి నట్టు. నిస్సందేహంగా నీవే ప్రశంసించదగ్గ గొప్ప వాడవు.’ (బు’ఖారీ, ముస్లిమ్)
ముస్లిమ్‌లో రెండవ చోటులో ఇబ్రాహీమ్ అనే పదం లేదు.
920 – [ 2 ] ( متفق عليه ) (1/290)
وَعَنْ أَبِيْ حُمَيْدِ السَّاعِدِيِّ قَالَ: قَالُوْا: يَا رَسُوْلَ اللهِ كَيْفَ نُصَلِّيْ عَلَيْكَ؟ فَقَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: ” قُوْلُوْا: اَللَّهُمَّ صَلى عَلَى مُحَمَّدٍ وَّأَزْوَاجِهِ وَذُرِّيَّتِهِ كَمَا صَلَّيْتَ عَلَى آلِ إِبْرَاهِيْمَ وَبَارَكَ عَلَى مُحَمَّدٍ وَّأَزْوَاجِهِ وَذُرِّيِتَّهِ كَمَا بَارَكْتَ عَلَى آلِ إِبْرَاهِيْمَ إِنَّكَ حَمِيْدٌ مَّجِيْدٌ”.
920. (2) [1/290–ఏకీభవితం]
అబూ ’హుమైద్ సా’ఇదీ (ర) కథనం: ప్రవక్త (స)ను అనుచరులు, ‘ఓ ప్రవక్తా! మేము తమపై దరూద్ ఎలా పంపాలి,’ అని విన్నవించుకున్నారు. అప్పుడు ప్రవక్త (స), ‘ఇలా పంపాలి అని ప్రవచించారు:
”అల్లాహుమ్మ ’సల్లి ’అలా ము’హమ్మదిన్ వ అ’జ్వాజిహీ, వ ‘జు‘ర్రియ్యాతిహీ కమా సల్లైత ’అలా ‘ఆల ఇబ్రాహీమ, వ బారిక్ ’అలా ము’హమ్మదిన్ వ అ’జ్వాజిహీ వ’జుర్రియాతిహి కమా బారక్త ’అలా ‘ఆల ఇబ్రాహీమ ఇన్నక ’హమీదు మ్మజీద్.” — ‘ఓ మా ప్రభూ! ము’హమ్మద్‌పై, ఆయన భార్యలపై, ఆయన బిడ్డలపై కారుణ్యం అవతరింపజేయి. ఇబ్రాహీమ్ కుటుంబం వారిపై కారుణ్యం అవతరింప జేసినట్టు. ఓ మా ప్రభూ! ము’హమ్మద్‌పై, ఆయన భార్యలపై, ఆయన బిడ్డలపై శుభం అవతరింపజేయి, ఇబ్రాహీమ్ కుటుంబం వారిపై శుభం అవతరింపజేసి నట్లు.’ (బు’ఖారీ, ముస్లిమ్)
921 – [ 3 ] ( صحيح ) (1/291)
وَعَنْ أَبِيْ هُرَيْرَةَ رَضِيَ اللهُ عَنْه قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَنْ صَلَّى عَلَيَّ وَاحِدَةً صَلَّى اللهُ عَلَيْهِ عَشْرًا”. رَوَاهُ مُسْلِمٌ .
921. (3) [1/291–దృఢం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ‘నాపై ఒకసారి దరూద్ పంపినవారిపై అల్లాహ్ 10 సార్లు కారుణ్యం అవతరింపజేస్తాడు.’ (ముస్లిమ్)
ఎందుకంటే అల్లాహ్ ఒక పుణ్యం చేస్తే, 10 పుణ్యాలు ప్రసాదిస్తాడు.
—–
اَلْفَصْلُ الثَّانِيْ రెండవ విభాగం
922 – [ 4 ] ( صحيح ) (1/291)
عَنْ أَنَسٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَنْ صَلَّى عَلَيَّ صَلَاةً وَّاحِدَةً صَلَّى اللهُ عَلَيْهِ عَشْرَ صَلَواتٍ وَحُطَّتْ عَنْهُ عَشْرُ خَطِيْئَاتٍ وَرُفِعَتْ لَهُ عَشْرُ دَرَجَاتٍ”. رَوَاهُ النَّسَائِيُّ.
922. (4) [1/291–దృఢం]
అనస్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ‘ఒకసారి నాపై దరూద్ పంపిన వాడిపై అల్లాహ్ 10 సార్లు కారుణ్యం అవతరింపజేస్తాడు, ఇంకా అతని 10 పాపాలు క్షమిస్తాడు, 10 స్థానాలు ఉన్నతం చేస్తాడు.” (నసాయి‘)
923 – [ 5 ] ( ضعيف ) (1/291)
وَعَنِ ابْنِ مَسْعُوْدٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “أَوْلَى النَّاسِ بِيْ يَوْمَ الْقِيَامَةِ أَكْثَرُهُمْ عَلَيَّ صَلَاةً”. رَوَاهُ التِّرْمِذِيُّ.
923. (5) [1/291–బలహీనం]
ఇబ్నె మస్’ఊద్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ‘తీర్పుదినం నాడు – అందరికంటే నాకు సమీపంగా – నాపై అధికంగా దరూద్ పంపేవాడే, ఉంటాడు.’ (తిర్మిజి’)
924 – [ 6 ] ( صحيح ) (1/291)
وَعَنِ ابْنِ مَسْعُوْدٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِنَّ لِلهَ مَلَائِكَةً سَيَّاحِيْنَ فِيْ الْأَرْضِ يُبَلِّغُوْنِيْ مِنْ أُمَّتِيْ السَّلَامَ”. رَوَاهُ النَّسَائِيُّ وَالدَّارَمِيُّ .
924. (6) [1/291–దృఢం]
ఇబ్నె మస్’ఊద్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ‘అల్లాహ్ కారుణ్య దూతలు భూమిపై సంచరిస్తూ ఉంటారు. నా అనుచర సమాజం పంపే దరూద్ను నాకు అందజేస్తూ ఉంటారు.’ (నసాయి‘, దార్మీ)
925 – [ 7 ] ( حسن ) (1/291)
وَعَنْ أَبِيْ هُرَيْرَةَ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَا مِنْ أَحَدٍ يُسَلِّمُ عَلَيَّ إِلَّا رَدَّ اللهُ عَلَيَّ رُوْحِيْ حَتَّى أَرُدَّ عَلَيْهِ السَّلَام”. رَوَاهُ أَبُوْ دَاوُدَ وَ الْبَيْهَقِيُّ فِيْ الدَّعْوَاتِ الْكَبِيْرِ.
925. (7) [1/291–ప్రామాణికం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ‘మీలో ఎవరు నాపై దరూద్ పంపినా, అల్లాహ్ నా ఆత్మను తిరిగి పంపివేస్తాడు, నేనతని సలాముకు సమాధానం ఇస్తాను.’ [154] (అబూదావూ’ద్, బైహఖీ-ద’అవాతిల్ కబీర్)
926 – [ 8 ] ( حسن ) (1/291)
وَعَنْهُ قَالَ: سَمِعْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ: “لَا تَجْعَلُوْا بُيُوْتَكُمْ قُبُوْرًا. وَلَا تَجْعَلُوْا قَبْرِيْ عِيْدًا وَصَلُّوْا عَليَّ. فَإِنَّ صَلَاتَكُمْ تَبْلُغُنِيْ حَيْثُ كُنْتُمْ”. رَوَاهُ النَّسَائِيُّ .
926. (8) [1/291–ప్రామాణికం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) ఇలా ప్రవచిస్తూ ఉండగా నేను విన్నాను, ”మీరు మీ ఇళ్ళను సమాధులుగా చేసుకోకండి. ఇంకా నా సమాధిపై జాతరలు (ఉత్సవాలు) చేయకండి. నాపై దరూద్ పంపిస్తూ ఉండండి. ఎందుకంటే, మీరు ఎక్కడున్నాసరే, మీరు పంపిన దరూద్ నాకు చేరుతుంది.” [155] (నసాయి‘)
927 – [ 9 ] ( صحيح ) (1/292)
وَعَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “رَغِمَ أَنْفُ رَجُلٍ ذُكِرْتُ عِنْدَهُ فَلَمْ يُصَلِّ عَلَيَّ. وَرَغَمَ أَنْفُ رَجُلٍ دَخَلَ عَلَيْهِ رَمْضَاَنَ ثُمَّ انْسَلَخَ قَبْلَ أَنْ يُّغْفَرَ لَهُ. وَرَغِمَ أَنْفُ رَجُلٍ أَدْرَكَ عِنْدَهُ أَبَوَاهُ الْكِبَرَ أَوْ أَحَدُهُمَا فَلَمْ يُدْخِلَاهُ الْجَنَّةَ”. رَوَاهُ التِّرْمِذِيُّ.
927. (9) [1/292–దృఢం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స), ”తన ముందు నా పేరు ప్రస్తావించబడినా, నాపై దరూద్ పఠించని వ్యక్తి పరాభవం పాలుగాను. అదేవిధంగా రమజాన్ మాసాన్ని పొందికూడా, తన పాపాలకు క్షమాపణ పొందని వ్యక్తి పరాభవం పాలుగాను. అదే విధంగా వృద్ధాప్యంలో తల్లి-దండ్రులను పొంది కూడా, తల్లి-దండ్రులు స్వర్గంలో ప్రవేశింపజేయని వ్యక్తి అగౌరవం పాలుగాక!” అని ప్రవచించారు. [156] (తిర్మిజి‘)
928 – [ 10 ] ( صحيح ) (1/292)
وَعَنْ أَبِيْ طَلْحَةَ: أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم جَاءَ ذَاتَ يَوْمٍ وَالْبِشُرُ فِيْ وَجْهِهِ فَقَالَ: “إِنَّهُ جَاءَنِيْ جِبْرِيْلُ فَقَالَ: إِنَّ رَبَّكَ يَقُوْلُ: أَمَا يُرْضِيْكَ يَا مُحَمَّدُ: “أَنْ لَّا يُصَلِّيْ عَلَيْكَ أَحْدٌ مِّنْ أُمَّتِكَ إِلَّا صَلَّيْتُ عَلَيْهِ عَشْرًا. وَلَا يُسَلِّمُ عَلَيْكَ أَحْدٌ مِّنْ أُمَّتِكَ إِلَّا سَلَّمْتُ عَلَيْهِ عَشْرًا؟” رَوَاهُ النَّسَائِيُّ وَالدَّارِمِيُّ.
928. (10) [1/292–దృఢం]
అబూ ’తల్’హా (ర) కథనం: ఒకరోజు ప్రవక్త (స) తన అనుచరుల వద్దకు సంతోషకరమైన స్థితిలో వచ్చి, ఇప్పుడిప్పుడే నావద్దకు జిబ్రీల్ (అ) వచ్చారు. ఒక శుభవార్త వినిపించారు. అదేమిటంటే, అల్లాహ్ అంటున్నాడు: ”ఓ ముహమ్మద్! నీ అనుచర సమాజంలో నుండి ఎవరు నీ పై ఒకసారి దరూద్ పంపుతారో, నేను అతనిపై 10 సార్లు కారుణ్యం అవత రింపజేస్తాను. ఇంకా ఎవరు ఒకసారి సలామ్‌ను పంపుతారో, నేనతనిపై 10 సార్లు సలామ్ పంపుతాను,’ అనే విషయం పట్ల మీరు సంతోషించరా?” (నసాయి‘, దార్మీ)
929 – [ 11 ] ( حسن ) (1/293)
وَعَنْ أُبَيِّ بْنِ كَعْبٍ قَالَ: قُلْتُ: يَا رَسُوْلَ اللهِ إِنِّيْ أُكْثِرُ الصَّلَاةَ عَلَيْكَ فَكَمْ أَجْعَلُ لَكَ مِنْ صَلَاتِيْ؟ فَقَالَ:”مَا شِئْتَ”.قُلْتُ: الرُّبْعَ؟ قَالَ: “مَا شِئْتَ فَإِنْ زِدْتَّ فَهُوَ خَيْرٌ لَكَ”. قُلْتُ: اَلنِّصْفَ؟ قَالَ: “مَا شِئْتَ فَإِنْ زِدْتَّ فَهُوَ خَيْرٌ لَكَ”. قُلْتُ: فَالثُّلُثَيْنِ؟ قَالَ: “مَا شِئْتَ فَإِنْ زِدْتَّ فَهُوَ خَيْرٌ لَكَ”. قُلْتُ: اَجْعَلُ لَكَ صَلَاتِيْ كُلُّهَا؟ قَالَ: “إِذَا يُكْفَى هَمُّكَ وَيُكَفَّرُ لَكَ ذَنْبُكَ”. رَوَاهُ التِّرْمِذِيُّ .
929. (11) [1/293–ప్రామాణికం]
ఉబయ్ బిన్ క’అబ్ (ర) కథనం: ప్రవక్త (స)ను నేను, ‘ఓ ప్రవక్తా! తమపై అత్యధికంగా దరూద్ పంపుతూ ఉంటాను. మరి నేను ప్రార్థించే సమయాల్లో దరూద్ కోసం ఎంత సమయం కేటాయించను?’ అని విన్నవించుకున్నాను. దానికి ప్రవక్త(స), ‘నీవు ఎంత కోరితే అంత,’ అని అన్నారు. దానికి నేను, ‘1/4 వంతు కేటాయించాలా?’ అని విన్నవించుకున్నాను. దానికి ప్రవక్త(స), ‘నీ ఇష్టం ఎంతైనా కేటాయించు. అంత కంటే ఎక్కువ నిర్ణయిస్తే నీకే మంచిది,’ అని అన్నారు. దానికి నేను, ‘సగం సమయాన్ని దరూద్ పఠించటానికి కేటాయించాలా?’ అని విన్నవించు కున్నాను. దానికి ప్రవక్త (స), ‘నీ ఇష్టం, కాని అంత కంటే ఎక్కువ నిర్ణయిస్తే నీకే మంచిది,’ అని అన్నారు. అప్పుడు నేను, ‘2/3వవంతు కేటాయించాలా?’ అని విన్నవించుకున్నాను. దానికి ప్రవక్త (స), ‘నీ ఇష్టం, అంత కంటే ఎక్కువ కేటాయిస్తే నీకే మంచిది,’ అని అన్నారు. దానికి నేను, ‘పూర్తి సమయాన్ని దరూద్ కోసం కేటాయించాలా?’ అని అడిగాను. దానికి ప్రవక్త (స), ‘మరయితే నీ ఉభయలోకాల కార్యాలు పరిష్కరించబడినట్టే. ఇంకా ఉభయలోకాల కష్టాలన్నీ తొలగిపోతాయి. ఇంకా నీ పాపాలన్నీ క్షమించ బడతాయి,’ అని అన్నారు.” [157] (తిర్మిజి‘)
930 – [ 12 ] ( صحيح ) (1/293)
وَعَنْ فَضَالَةَ بْنِ عُبَيْدٍ قَالَ: بَيْنَمَا رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم قَاعِدٌ إِذْ دَخَلَ رَجُلٌ فَصَلَّى فَقَالَ:اَللَّهُمَّ اغْفِرْ لِيْ وَارْحَمْنِيْ. فَقَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “عَجِلْتَ أَيُّهَا الْمُصَلِّيْ إِذَا صَلَّيْتَ فَقَعَدْتَّ فَاحْمَدِ اللهَ بِمَا هُوَ أَهْلُهُ وَصَلِ عَلَيَّ ثُمَّ ادْعُهُ”. قَالَ: ثُمَّ صَلّى رَجُلٌ آخَرُ بَعْدَ ذَلِكَ فَحَمِدَ اللهَ وَصَلَّى عَلَى النَّبِيِّ صلى الله عليه وسلم. فَقَالَ النَّبِيُّ صلى الله عليه وسلم: “أَيُّهَا الْمَصَلِّيْ اُدْعُ تُجَبْ”. رَوَاهُ التِّرْمِذيُّ وَرَوَى أَبُوْ دَاوُدَ وَالنَّسَائِيُّ نَحْوَهُ
930. (12) [1/293–దృఢం]
’ఫు’దాల బిన్ ’ఉబైద్ (ర) కథనం: ప్రవక్త (స) కూర్చొని ఉన్నారు. ఒక వ్యక్తి వచ్చి ప్రవక్త (స) వద్ద నమా’జు చదివాడు. అనంతరం ఇలా ప్రార్థించాడు. ”అల్లాహమ్మ’గ్ ఫిర్లీ వర్’హమ్నీ” — ‘ఓ అల్లాహ్! నన్ను క్షమించు, ఇంకా నన్ను కరుణించు.” అది విన్న ప్రవక్త (స), ‘ఓ నమా’జీ, నువ్వు తొందరపడు తున్నావు. నమా’జు చదివిన తరువాత అల్లాహ్ స్తోత్రం పలుకు, తరువాత నాపై దరూద్ పఠించు, ఆ తరువాత కోరింది అడుగు,’ అని అన్నారు. ఆ తరువాత మరో వ్యక్తి వచ్చాడు. అతడు నమా’జు చదివి, అల్లాహ్ స్తోత్రం పఠించి, ప్రవక్త (స)పై దరూద్ పఠించాడు. అది విని ప్రవక్త (స), ‘ఓ నమా’జీ! ఇప్పుడు నువ్వు దు’ఆ చేయి, నీ దు’ఆ స్వీకరించ బడుతుంది,’ అని అన్నారు. [158] (తిర్మిజి‘, అబూ దావూద్, నసాయి‘)
931 – [ 13 ] ( حسن ) (1/293)
وَعَنْ عَبْدِ اللهِ بْنِ مَسْعُوْدٍ قَالَ: كُنْتُ أُصَلِّيْ وَالنَّبِيُّ صلى الله عليه وسلم وَأَبُوْ بَكْرٍ وَعُمَرُ مَعَهُ. فَلَمَّا جَلَسْتُ بَدَأْتُ بِالثَّنَاءِ عَلَى اللهِ تَعَالَى ثُمَّ الصَّلَاةِ عَلَى النَّبِيِّ صلى الله عليه وسلم. ثُمَّ دَعَوْتُ لِنَفْسِيْ. فَقَالَ النَّبِيُّ صلى الله عليه وسلم: “سَلْ تُعْطَهُ سَلْ تُعْطَهُ”. رَوَاهُ التِّرْمِذِيُّ .
931. (13) [1/293–ప్రామాణికం]
‘అబ్దుల్లాహ్ బిన్ మస్’ఊద్ (ర) కథనం: నేను నమా’జు చదువుతున్నాను. ప్రవక్త (స) అక్కడే ఉన్నారు. ప్రవక్త (స) వెంట అబూ బకర్ (ర), ‘ఉమర్ (ర) కూడా ఉన్నారు. నమా’జు ముగించిన తరువాత కూర్చొని ముందు అల్లాహ్ స్తోత్రం చేశాను. ఆ తరు వాత ప్రవక్త (స)పై దరూద్ పంపాను. ఆ తరువాత నా కోసం దు’ఆ చేశాను. అది చూసి ప్రవక్త (స), ”అర్థించు, ఇవ్వబడతావు” – అంటే, ‘దైవాన్ని ప్రార్థించు, స్వీకరించబడుతుంది,’ అని అన్నారు. (తిర్మిజి’)
—–
اَلْفَصْلُ الثَّالِثُ మూడవ విభాగం
932 – [ 14 ] ( ضعيف ) (1/294)
وَعَنْ أَبِيْ هُرَيْرَةَ عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ: “مَنْ سَرَّه أَنْ يُّكْتَالَ بِالْمِكْيَالِ الْأَوْفَى إِذَا صَلَّى عَلَيْنَا أَهْلَ الْبَيْتِ فَلْيَقُلْ: “اَللَّهُمَّ صَلِّ عَلَى مُحَمّدٍ وَأَزْوَاجِهِ أُمَّهَاتِ الْمُؤْمِنِيْنَ وَذُرِّيَّتِهِ وَأَهْلِ بَيْتِهِ كَمَا صَلَّيْتَ عَلَى آلِ إِبْرَاهِيْمَ إِنَّكَ حَمِيْدٌ مَّجِيْدٌ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ.
932. (14) [1/294–బలహీనం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”నిండుగా పుణ్యం పొందాలని కోరుకునేవారు, మా అహ్లెబైత్ కుటుంబంపై దరూద్ పంపితే, ఇలా పలకాలి, ”అల్లాహుమ్మ సల్లిఅలా ముహమ్మదిని న్నబియ్యిల్ ఉమ్మియ్యి వ అజ్వాజిహి, ఉమ్మహాతిల్ మూమినీన వజు’ర్రియ్యతిహి, వ అహ్లి బైతిహి కమా సల్లైత ‘అలా ఇబ్రాహీమ ఇన్నక హమీదుమ్మజీద్.” [159] (అబూ దావూద్)
933 – [ 15 ] ( صحيح ) (1/294)
وَعَنْ عَلِيٍّ رضي الله عَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “اَلْبَخْيِلُ الَّذِيْ ذُكِرْتُ عِنْدَهُ فَلَمْ يُصَلِّ عَلَيَّ”. رَوَاهُ التِّرْمِذِيُّ. وَرَوَاهُ أَحْمَدُ عَنِ الْحُسَيْنِ بْنِ عَلِيٍّ رَضِيَ اللهُ عَنْهُمَا. وَقَالَ التِّرْمِذِيُّ: هَذَا حَدِيْثٌ حَسَنٌ صَحِيْحٌ غَرِيْبٌ .
933. (15) [1/294–దృఢం]
అలీ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”తన ముందు నా పేరు ప్రస్తావించబడినా, నాపై దరూద్ పంపని వ్యక్తి పిసినారి.” (తిర్మిజి’- ప్రామాణికం, దృఢం, ఏకోల్లేఖనం)
దీన్నే అహ్మద్, ‘హుసైన్ బిన్’అలీ ద్వారా ఉల్లేఖించారు.
934 – [ 16 ] ( ضعيف ) (1/295)
وَعَنْ أَبِيْ هُرَيْرَةَ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَنْ صَلّى عَلَيَّ عِنْدَ قَبْرِيْ سَمِعْتُهُ وَمَنْ صَلَّى عَلَيَّ نَائِيًا أُبْلِغْتُهُ”. رَوَاهُ الْبَيْهَقِيُّ فِيْ شُعَبِ الْإِيْمَانِ .
934. (16) [1/295–బలహీనం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”నా సమాధి వద్దకు వచ్చి, పఠించిన దరూద్ను నేను వింటాను. అదేవిధంగా దూరం నుండి దరూద్ పంపితే, దాన్ని నాకు చేర్చడం జరుగుతుంది.” [160] (బైహఖీ-షు’అబిల్ ఈమాన్)
935 – [ 17 ] ( ضعيف ) (1/295)
وَعَنْ عَبْدِ اللهِ بْنِ عَمْرٍو قَالَ: مَنْ صَلَّى عَلَى النَّبِيِّ صلى الله عليه وسلم وَاحِدَةً صَلَّى اللهُ عَلَيْهِ وَمَلَائِكَتَهُ سَبْعِيْنَ صَلَاةً. رَوَاهُ أَحْمَدُ .
935. (17) [1/295–బలహీనం]
’అబ్దుల్లాహ్ బిన్ ’ఉమర్ (ర) కథనం: ప్రవక్త (స)పై ఒక సారి దరూద్ పంపిన వ్యక్తిపై అల్లాహ్ (త) మరియు ఆయన దూతలు70 సార్లు దరూద్ పంపుతారు. [161] (’అ’హ్మద్)
936 – [ 18 ] ( ضعيف ) (1/295)
وَعَنْ رُويْفِعٍ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم قَالَ: مَنْ صَلَّى عَلَى مُحَمَّدٍ وَقَالَ: “اَللَّهُمَّ أَنْزَلْهُ الْمَقْعَدَ الْمُقَرَّبَ عِنْدَكَ يَوْمَ الْقِيَامَةِ وَجَبَتْ لَهُ شَفَاعَتِيْ”. رَوَاهُ أَحْمَدُ .
936. (18) [1/295–బలహీనం]
రువై’ఫీ’అ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ము’హమ్మద్‌పై దరూద్ పఠించి, ”అల్లా’హుమ్మ అన్ ’జల్హుల్ మఖ్’అదల్ ముఖర్రబ ’ఇన్దక యౌమల్ ఖియామహ్ వజబత్ లహూషఫా’అతి” — ‘ఓ అల్లాహ్! తీర్పుదినం నాడు ప్రవక్త (స)కు మఖామె మ’హ్మూద్ మరియు ఉన్నత స్థానాన్ని ప్రసాదించు,’ అని దు’ఆ పఠించే వ్యక్తికోసం నా సిఫారసు తప్పనిసరి అయిపోతుంది. (అ’హ్మద్)
937 – [ 19 ] ( حسن ) (1/295)
وَعَنْ عَبْدُ الرَّحْمَنِ بْنِ عَوْفٍ قَالَ: خَرَجَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم حَتَّى دَخَلَ نَخْلًا فَسَجَدَ. فَأَطَالَ السُّجُوْدَ حَتَّى خَشِيْتُ أَنْ يَّكُوْنَ اللهُ تَعَالَى قَدْ تَوَفَّاهُ. قَالَ: فَجِئْتُ أَنْظُرُ فَرَفَعَ رَأْسَهُ. فَقَالَ: “مَا لَكَ؟ “فَذَكَرْتُ لَهُ ذَلِكَ. قَالَ: فَقَالَ: “إِنَّ جِبْرَيْلَ عَلَيْهِ السَّلَامُ قَالَ لِيْ: “أَلَا أُبَشِّرُكَ أَنَّ اللهَ عَزَّ وَجَلَّ يَقُوْلُ لَكَ مَنْ صَلَّى عَلَيْكَ صَلَاةً صَلَّيْتُ عَلَيْهِ. وَمَنْ سَلَّمَ عَلَيْكَ سَلَّمْتُ عَلَيْهِ”. رَوَاهُ أَحْمَدُ .
937. (19) [1/295–ప్రామాణికం]
’అబ్దుర్రహ్మాన్ బిన్ ’ఔఫ్ (ర) కథనం: ప్రవక్త (స) ఇంటి నుండి బయలుదేరి ఒక ఖర్జూరపు తోటలోకి వెళ్ళారు. అక్కడ నమా’జు చదివారు. దీర్ఘంగా సజ్దా చేశారు. చివరికి నేను ప్రవక్త (స) మరణించారేమోనని భయపడ్డాను. దగ్గరకు వచ్చి చూశాను. ప్రవక్త (స) తలఎత్తారు. ఏమైంది,’ అని అన్నారు. దానికి నేను తమరు ఇంత దీర్ఘంగా సజ్దా చేశారు. తమరు మరణించారేమోనని నేను ఆందోళన చెందాను. అందు వల్లే దగ్గరకు వచ్చాను.’ అప్పుడు ప్రవక్త (స), ఇప్పు డిప్పుడే జిబ్రీల్(అ) నా వద్దకు వచ్చారు. ఒక శుభవార్త వినిపించనా, అల్లాహ్ (త) మీపై దరూద్ పంపిన వ్యక్తిపై నేను దరూద్ పంపుతాను, అదేవిధంగా మీపై సలామ్ పంపిన వ్యక్తిపై నేను సలామ్ పంపుతాను,” అని ఆదేశించాడు. (అ’హ్మద్)
938 – [ 20 ] ( ضعيف ) (1/296)
وَعَنْ عُمَرَ بْنِ الْخَطَّابِ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: إِنَّ الدُّعَاءَ مَوْقُوْفٌ بَيْنَ السَّمَاءِ وَالْأَرْضِ لَا يَصْعُدُ مِنْهُ شَيْءٌ حَتَّى تُصَلِّيْ عَلَى نَبِيِّكَ. رَوَاهُ التِّرْمِذِيُّ .
938. (20) [1/296–బలహీనం]
’ఉమర్ (ర) కథనం: మీరు మీ ప్రవక్తపై దరూద్ పంప నంత వరకు మీ దు’ఆ ఆకాశంపై ఎక్కకుండా భూమ్యాకాశాల మధ్య వ్రేలాడుతూ ఉంటుంది. [162] (తిర్మిజి‘)
=====
17- بَابُ الدُّعَاءِ فِيْ التَّشَهُّدِ
17. తషహ్హుద్ లో దు’ఆలు
అంటే అత్తహియ్యాతు మరియు దరూద్ తర్వాత సలామ్ పలకడానికి ముందు కొన్ని ప్రత్యేక దు’ఆలు పఠించాలి.
اَلْفَصْلُ الْأَوَّلُ మొదటి విభాగం
939 – [ 1 ] ( متفق عليه ) (1/297)
عَنْ عَائِشَةَ قَالَتْ: كَانَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم يَدْعُوْ فِيْ الصَّلَاةِ يَقُوْلُ: “اَللَّهُمَّ إِنِّيْ أَعُوْذُ بِكَ مِنْ عَذَابِ الْقَبْرِ وَأَعُوْذُ بِكَ مِنْ فِتْنَةِ الْمَسِيْحِ الدَّجَّالِ وَأَعُوْذُ بِكَ مِنْ فِتْنَةِ الْمَحْيَا وَفِتْنَةِ الْمَمَاتِ اللَّهُمَّ إِنِّيْ أَعُوْذُ بِكَ مِنَ الْمَأْثِمِ وَالْمَغْرَمِ” .فَقَالَ لَهُ قَائِلٌ مَا أَكْثَرَ مَا تَسْتَعِيْذُ مِنَ الْمَغْرَمِ يَا رَسُوْلَ اللهِ. فَقَالَ: “إِن الرَّجُلَ إِذَا غَرِمَ حَدَّثَ فَكَذَبَ وَوَعَدَ فَأَخْلَفَ”.
939. (1) [1/297–ఏకీభవితం]
’ఆయి‘షహ్ (ర) కథనం: ప్రవక్త (స) నమా’జులో తషహ్హుద్ తర్వాత ఈ దు’ఆ పఠించేవారు: ”అల్లాహుమ్మ ఇన్నీ అ’ఊజు‘బిక మిన్ అజా‘బిల్ ఖబ్రి వఅ’ఊజు‘బిక మిన్ పిత్నతిల్ మసీ’హి- ద్దజ్జాల్, వఅ’ఊజు‘ బిక మిన్ ఫిత్నతిల్ మ’హ్యా వఫిత్నతిల్ మమాతి అల్లాహుమ్మ ఇన్నీ అ’ఊజు‘బిక మినల్ మాస‘మి వమినల్ మ’గ్ రమి.” — ‘ఓ అల్లాహ్! సమాధి శిక్ష నుండి నేను నీ శరణు కోరుతున్నాను. మరియు దజ్జాల్ ఉపద్రవం నుండి నేను నీ శరణు కోరుతున్నాను. ఇంకా జీవన్మరణాల ఉపద్రవాల నుండి నేను నీ శరణు కోరుతున్నాను. ఓ అల్లాహ్! పాపాల నుండి, రుణం నుండి నేను నీ శరణు కోరుతున్నాను.’
అది విని ఒక వ్యక్తి ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ, ‘తమరు రుణం నుండి చాలా అధికంగా అల్లాహ్‌ను శరణు కోరుతుంటారు,’ అని అన్నాడు. దానికి ప్రవక్త (స), ‘మనిషి రుణభారానికి గురైతే అసత్యం పలుకుతాడు, వాగ్దానం చేస్తే వాగ్దాన భంగం చేస్తాడు,’ అని సమాధానం ఇచ్చారు. (బు’ఖారీ, ముస్లిమ్)
940 – [ 2 ] ( صحيح ) (1/297)
وَعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِذَا فَرَغَ أَحْدُكُمْ مِنَ التَّشَهُّدِ الْآخِرِ فَلْيَتَعَوَّذُ بِاللهِ مِنْ أَرْبَعٍ مِنْ عَذَابِ جَهَنَّمَ وَمِنْ عَذَابِ الْقَبْرِ وَمِنْ فِتْنَةِ الْمَحْيَا وَالْمَمَاتِ وَمِنْ شَرِّ الْمَسِيْحِ الدَّجَّالِ”. رَوَاهُ مُسْلِمٌ .
940. (2) [1/297–దృఢం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం: ‘మీరు చివరి తషహ్హుద్ పఠించిన తర్వాత నాలుగు విషయాల నుండి శరణు కోరాలి: 1. నరక శిక్ష నుండి, 2. సమాధి శిక్ష నుండి, 3. జీవన్మరణాల ఉపద్రవాల నుండి, 4. మసీహ్ దజ్జాల్ చెడునుండి.’ (ముస్లిమ్ )
941 – [ 3 ] ( صحيح ) (1/297)
وَعَنِ ابْنِ عَبَّاسٍ رَضِيَ اللهُ عَنْهُمَا: أَنَّ النَّبِيَّ صَلَى اللهُ عَلَيْهِ وَسلم كَانَ يُعَلِّمُهُمْ هَذَا الدُّعَاءِ كَمَا يُعَلِّمُهُمُ السُّوْرَةَ مِنَ الْقُرْآنِ يَقُوْلُ: قُوْلُوْا “اَللَّهُمَّ إِنِّيْ أَعُوْذُ بِكَ مِنْ عَذَابِ جَهَنَّمَ وَأَعُوْذُ بِكَ مِنْ عَذَابِ الْقَبْرِ وَأَعُوْذُ بِكَ مِنْ فِتْنَةِ الْمَسِيْحِ الدَّجَالِ وَأَعُوْذُ بِكَ مِنْ فِتْنَةِ الْمَحْيَا وَالْمَمَاتِ”. رَوَاهُ مُسْلِمٌ .
941. (3) [1/297–దృఢం]
ఇబ్నె ’అబ్బాస్ (ర) కథనం: ప్రవక్త (స) ఈ దు’ఆను ఖుర్ఆన్ సూరహ్ నేర్పించినట్టు నేర్పించే వారు, ”అల్లా హుమ్మ ఇన్నీ అఊజు‘ బిక మిన్ అజా‘బి జ’హన్నమ వ అఊజు‘బిక మిన్ అజా‘బిల్ ఖబ్రి వ అవూజు‘బిక మిన్ ఫిత్నతిల్ మసీ’హి ద్దజ్జాల్, వ అఊ‘జుబిక మిన్ ఫిత్నతిల్ మహ్యా వల్ మమాతి.” — ‘ఓ అల్లాహ్! నరక శిక్ష నుండి నేను నీ శరణు కోరుతున్నాను. ఇంకా సమాధి శిక్ష నుండి నేను నీ శరణు కోరుతున్నాను. ఇంకా మసీ’హు ద్దజ్జాల్ ఉపద్రవాల నుండి నీ శరణు కోరుతున్నాను, ఇంకా జీవన్మ రణాల కల్లోలాల నుండి నేను నీ శరణు కోరుతున్నాను.’ (ముస్లిమ్)
942 – [ 4 ] ( متفق عليه ) (1/297)
وَعَنْ أَبِيْ بَكْرٍ اَلصِّدِّيْقِ رَضِيَ اللهُ عَنْهُ أَنَّهُ قَالَ: قُلْتُ: يَا رَسُوْلَ اللهِ عَلِّمْنِيْ دُعَاءً أَدْعُوْ بِهِ فِيْ صَلَاتِيْ. قَالَ: قُلْ “اَللَّهُمَّ إِنِّيْ ظَلَمْتُ نَفْسِيْ ظُلْمًا كَثِيْرًا وَلَا يَغْفِرُ الذُّنُوْبِ إِلَّا أَنْتَ فَاغْفِرْ لِيْ مَغْفِرَةً مِّنْ عِنْدَكَ وَارْحَمْنِيْ إِنَّكَ أَنْتَ الْغَفُوْرُالرَّحِيْم”.
942. (4) [1/297–ఏకీభవితం]
అబూ బకర్ (ర) కథనం: నేను ఓ ప్రవక్తా! నమా’జు లో చదవడానికి ఏదైనా దు’ఆ నేర్పండి అని విన్నవించుకున్నాను. దానికి ప్రవక్త (స), ‘ఈ దు’ఆను పఠిస్తూ ఉండు,’ అని అన్నారు: ”అల్లా హుమ్మ ఇన్నీ ’జలమ్తు నఫ్సీ ’జుల్మన్ కసీ’రన్ వలా య’గ్ఫిరు’జ్జునూబ ఇల్లా అంత, ఫ’గ్ఫిర్లీ మ’గ్ఫిరతన్ మిన్ ‘ఇందిక, వర్’హమ్నీ ఇన్నక అనతల్ ‘గఫూరు ర్రహీమ్.” — ‘ఓ అల్లాహ్! నాకు నేను చాలా అన్యాయం చేసుకున్నాను. నీవు తప్ప పాపాలను క్షమించే వారెవరూ లేరు. మరి నీవు ప్రత్యేక క్షమాపణతో నన్ను క్షమించు మరియు కరుణించు, ఎందుకంటే నిస్సందేహంగా నీవే క్షమించేవాడవూ, కరుణించేవాడవూను.’ (బు’ఖారీ, ముస్లిమ్)
943 – [ 5 ] ( صحيح ) (1/298)
وَعَنْ عَامِرِ بْنِ سَعْدٍ عَنْ أَبِيْهِ قَالَ: كُنْتُ أَرَى رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يُسَلِّمُ عَنْ يَمِيْنِهِ وَعَنْ يَسَارِهِ حَتَّى أَرَى بَيَاضَ خَدِّهِ. رَوَاهُ مُسْلِمٌ .
943. (5) [1/298–దృఢం]
’ఆమిర్ బిన్ స’అద్ (ర) తన తండ్రి ద్వారా కథనం: ప్రవక్త (స)ను కుడి ప్రక్క, ఎడమ ప్రక్క సలామ్ పలుకుతూ ఉండగా చూశాను. చివరికి ఆయన బుగ్గల తెల్లదనాన్ని కూడా చూశాను. [163] (ముస్లిమ్)
944 – [ 6 ] ( صحيح ) (1/298)
وَعَنْ سَمُرَةَ بْنِ جُنْدُبٍ قَالَ: كَانَ رَسُوْلُ اللهِ صلَّى الله عليه وسلم إِذَا صَلَّى صَلَاةً أَقْبَلَ عَلَيْنَا بِوَجْهِهِ. رَوَاهُ الْبُخَارِيُّ .
944. (6) [1/298–దృఢం]
సమురహ్ బిన్ జున్దుబ్ (ర) కథనం: ప్రవక్త (స) నమా’జు ముగిసిన పిదప మా వైపు తిరిగి కూర్చునే వారు. (బు’ఖారీ)
945 – [ 7 ] ( صحيح ) (1/298)
وَعَنْ أَنَسٍ قَالَ: كَانَ النَّبِيُّ صلى الله عليه وسلم يَنْصَرِفُ عَنْ يَمِيْنِهِ. رَوَاهُ مُسْلِمٌ .
945. (7) [1/298–దృఢం]
అనస్ (ర) కథనం: ప్రవక్త (స) నమా’జు ముగిసిన పిదప కుడివైపు తిరిగేవారు. (ముస్లిమ్)
946 – [ 8 ] ( متفق عليه ) (1/298)
وَعَنْ عَبْدِاللهِ بْنِ مَسْعُوْدٍ قَالَ: لَا يَجْعَلُ أَحَدُكُمْ لِلشَّيْطَانِ شَيْئًا مِّنْ صَلَاتِهِ يَرَى أَنَّ حَقًّا عَلَيْهِ أَنَّ لَا يَنْصَرِفَ إِلَّا عَنْ يَمِيْنِهِ لَقَدْ رَأَيْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم كَثِيْرًا يَّنْصَرِفُ عَنْ يَسَارِهِ.
946. (8) [1/298–ఏకీభవితం]
’అబ్దుల్లాహ్ బిన్ మస్’ఊద్ (ర) కథనం: ”మీలో ఎవరూ నమా’జులోని ఏ భాగాన్ని షై’తాన్ కోసం నిర్థారించకూడదు. నమా’జు అయిన తర్వాత కేవలం కుడివైపు నుండే తిరగటానికి ప్రాధాన్యత ఇవ్వ కూడదు. నేను ప్రవక్త (స)ను అధికంగా ఎడమ ప్రక్కకు తిరగటం కూడా చూశాను. [164] (బు’ఖారీ, ముస్లిమ్)
947 – [ 9 ] ( صحيح ) (1/298)
وَعَنِ الْبَرَاءِ قَالَ: كُنَّا إِذَا صَلَّيْنَا خَلْفَ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم أَحْبَبْنَا أَنْ نَكُوْنَ عَنْ يَمِيْنِهِ يُقْبِلُ عَلَيْنَا بِوَجْهِهِ. قَالَ: فَسَمِعْتُهُ يَقُوْلُ: “رَبِّ قِنِيْ عَذَابَكَ يَوْمَ تَبْعَثُ– أَوْ تَجْمَعُ– عِبَادَكَ”. رَوَاهُ مُسْلِمٌ .
947. (9) [1/298–దృఢం]
బరా‘ బిన్ ’ఆ’జిబ్ (ర) కథనం: మేము ప్రవక్త (స) వెనుక నమా’జు చదివితే, మేము ఆయనకు కుడివైపు ఉండాలని కోరుకునేవాళ్ళం. ఎందుకంటే నమా’జు తర్వాత ఆయన దృష్టి మాపై పడాలని. నేను ప్రవక్త (స)ను ఈ దు’ఆ పఠిస్తూ ఉండగా విన్నాను: ”రబ్బి ఖినీ అజా‘బక యౌమతబ్అసు‘ – అవ్ తజ్మ’ఉ – ఇబాదక.” – ‘ఓ మా ప్రభూ! నీవు అందరినీ తిరిగి లేపే లేదా ఒకచోట చేర్చే రోజు శిక్ష నుండి నన్ను కాపాడు.’ (ముస్లిమ్)
948 – [ 10 ] ( صحيح ) (1/299)
وَعَنْ أُمِّ سَلَمَةَ قَالَتْ: إِنَّ النِّسَاءَ فِيْ عَهْدِ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم. كُنَّ إِذَا سَلَّمْنَ مِنَ الْمَكْتُوْبَةِ قُمْنَ وَثَبَتَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم. وَمَنْ صَلَّى مِنَ الرِّجَالِ مَا شَاءَ اللهُ فَإِذَا قَامَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم قَامَ الرِّجَالُ . رَوَاهُ الْبُخَارِيُّوَ سَنَذْكُرُ حَدِيْثَ جَابِرِ بْنِ سَمُرَةَ فِيْ بَابِ الضِّحْكِ إْنِ شَاءَ اللهُ تَعَالَى
948. (10) [1/299–దృఢం]
ఉమ్మె సలమహ్ (ర) కథనం: ప్రవక్త(స) కాలంలో ప్రవక్త (స) వెనుక నమా’జు చదివితే, నమా’జు పూర్తయిన వెంటనే లేచి ఇంటికి వెళ్ళిపోయేదాన్ని. ప్రవక్త (స) మరియు ఇతరులు తాము కోరినంతసేపు కూర్చొని ఉండేవారు. ప్రవక్త (స) నిలబడితే ఇతరులు కూడా నిలబడేవారు. (బు’ఖారీ)
—–
اَلْفَصْلُ الثَّانِيْ రెండవ విభాగం
949 – [ 11 ] ( صحيح ) (1/299)
عَنْ مُعَاذَ بْنِ جَبَلٍ قَالَ: أَخَذَ بِيَدِيْ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم فَقَالَ: “إِنِّيْ لَأُحِبّكَ يَا مُعَاذُ”. فَقُلْتُ: وَأَنَا أُحِبُّكَ يَا رَسُوْلَ اللهِ. قَالَ: “فَلَا تَدَعْ أَنْ تَقُوْلَ فِيْ دُبُرِ كُلِّ صَلَاةٍ: “رَبِّ أَعِنِّيْ عَلَى ذِكْرِكَ وَشُكْرِكَ وَحُسْنِ عِبَادَتِكَ”. رَوَاهُ أَحْمَدُ وَأَبُوْ دَاوُدَ وَالنَّسَائِيُّ. إِلَّا أَنَّ أَبَا دَاوُدَ لَمْ يَذْكُرْ: قَالَ مُعَاذٌ وَأَنَا أُحِبُّكَ.
949. (11) [1/299–దృఢం]
ము’ఆజ్‘ బిన్ జబల్ (ర) కథనం: ఒకరోజు ప్రవక్త (స) నా చేతిని తన చేతిలో తీసుకొని, ‘ఓ ము’ఆజ్‘! నేను నిన్ను ప్రేమిస్తున్నాను,’ అని అన్నారు. దానికి నేను, ‘ఓ ప్రవక్తా! నేను కూడా మిమ్మల్ని ప్రేమిస్తున్నాను,’ అని అన్నాను. అప్పుడు ప్రవక్త (స), ‘ఓ ము’ఆజ్‘! నీవు ఈ దు’ఆను ఎల్లప్పుడూ నమా’జు తర్వాత పఠిస్తూ ఉండు, ఎన్నడూ వదలకు, ”రబ్బీ అ’ఇన్నీ అలా జి‘క్రిక వషుక్రిక వ’హుస్ని ’ఇబాదతిక,” — ‘ఓ నా ప్రభూ! నిన్ను స్మరించటంలోనూ, నీకు కృతజ్ఞుడనై ఉండటంలో, నిన్ను ఉత్తమంగా ఆరాధించటంలోనూ నన్ను సహకరించు.’ అంటే, ‘నిన్ను స్మరించే, నీకు కృతజ్ఞత తెలిపే, ఆరాధించే భాగ్యం ప్రసా దించు’ అని అర్థం. (అ’హ్మద్, అబూ దావూ‘ద్, నసాయి‘)
కాని అబూ దావూ‘ద్లో ‘వ అనా ఉహిబ్బుక’ అనే పదాలు పేర్కొనబడ లేదు.
950 – [ 12 ] ( صحيح ) (1/299)
وَعَنْ عَبْدِ اللهِ بْنِ مَسْعُوْدٍ قَالَ: إِنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم كَانَ يُسَلِّمُ عَنْ يَمِيْنِهِ: “اَلسَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ اللهِ” حَتَّى يُرَى بَيَاضُ خَدِّهِ الْأَيْمَنِ وَعَنْ يَسَارِهِ: “اَلسَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ اللهِ” حَتَّى يَرَى بَيَاضُ خَدِّهِ الْأَيْسَرِ. رَوَاهُ أَبُوْ دَاوُدَ وَالنَّسَائِيُّ وَالتِّرْمِذِيُّ وَلَمْ يَذْكُرِ التِّرْمِذِيُّ حَتَّى يُرَى بَيَاضُ خَدِّهِ.
950. (12) [1/299–దృఢం]
’అబ్దుల్లాహ్ బిన్ మస్’ఊద్ (ర) కథనం: ప్రవక్త (స) కుడివైపు అస్సలాము ‘అలైకుమ్ వ రహ్మతుల్లాహ్,’ అని పలుకుతూ తన ముఖాన్ని కుడివైపు త్రిప్పేవారు. ముఖంపై గల తెలుపుదనం కనిపించేది. ఇంకా ఎడమవైపు ముఖం త్రిప్పుతూ అస్సలాము ‘అలైకుమ్ వ రహ్మతుల్లాహ్ పలికేవారు. ఎడమ వైపు ఉన్న వారికి కూడా ముఖంపై గల తెలుపు కనబడేది. (అబూదా వూ‘ద్, తిర్మిజి‘, నసాయి‘)
అయితే తిర్మిజీ‘లో, ‘ ‘హత్తా యురా‘ బయా’దు ఖద్దిహీ’ అనే పదాలు లేవు.
951 – [ 13 ] ( صحيح ) (1/300)
وَرَوَاهُ ابْنُ مَاجَهُ عَنْ عَمَّارِ بْنِ يَاسِرٍ.
951. (13) [1/300–దృఢం]
ఇబ్నె మాజహ్ ఈ ’హదీసు‘ను ’అమ్మార్ బిన్ యాసిర్ ద్వారా ఉల్లేఖించారు.
952 – [ 14 ] ( صحيح ) (1/300)
وَعَنْ عَبْدِ اللهِ بْنِ مَسْعُوْدٍ قَالَ: كَانَ أَكْثَرُ اِنْصِرَافِ النَّبِيِّ صلى الله عليه وسلم مِنْ صَلَاتِهِ إِلَى شِقِّهِ الْأَيْسَرِ إِلَى حُجْرَتِهِ. رَوَاهُ فِيْ شَرْحِ السُّنَّةِ .
952. (14) [1/300–దృఢం]
’అబ్దుల్లాహ్ బిన్ మస్’ఊద్ (ర) కథనం: ప్రవక్త (స) నమా’జు తర్వాత అధికంగా ఎడమవైపు తిరిగేవారు. ఎందుకంటే ప్రవక్త(స) గది ఎడమవైపు ఉండేది. (షర్హు స్సున్నహ్)
953 – [ 15 ] ( صحيح ) (1/300)
وَعَنْ عَطَاءٍ الْخُرَاسَانِيِّ عَنْ الْمُغِيْرَةِ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَا يُصَلِي الْإِمَامُ فِيْ الْمَوْضِعِ الَّذِيْ صَلَّى فِيْهِ حَتَّى يَتَحَوَّلَ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ وَقَالَ عَطَاءُ الْخُرَسَانِيُّ لَمْ يُدْرِكِ الْمُغِيْرَةَ .
953. (15) [1/300–దృఢం]
’అ’తా‘ అల్-’ఖురాసానీ, ము’గైరహ్ ద్వారా కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఇమాము ఇప్పు డిప్పుడే నమా’జు చదివినచోట నమా’జు చదవరాదు. ఆ స్థలానికి కుడి ప్రక్కగాని, ఎడమ ప్రక్కగాని, ముందు గాని, వెనుకగాని జరగాలి.” [165](అబూ దావూ‘ద్)
అయితే, అబూ దావూ‘ద్, ‘అ’తా అల్-‘ఖురాసానీ ము’గీరను కలవలేదని పేర్కొన్నారు.
954 – [ 16 ] ( صحيح ) (1/300)
وَعَنْ أَنَسٍ: أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم حَضَّهُمْ عَلَى الصَّلَاةِ وَنَهَاهُمْ أَنْ يَّنْصَرِفُوْا قَبْلَ انْصِرَافِهِ مِنَ الصَّلَاةِ. رَوَاهُ أَبُوْ دَاوُدَ.
954. (16) [1/300–దృఢం]
అనస్ (ర) కథనం: ప్రవక్త (స) అనుచరులను నమా’జు చదవటం పట్ల ప్రోత్సహించే వారు. ఇంకా ఇమాము ముగించక ముందు నమా’జు ముగించ రాదని వారించే వారు. [166] (అబూ దావూ‘ద్)
—–
اَلْفَصْلُ الثَّالِثُ మూడవ విభాగం
955 – [ 17 ] ( ضعيف ) (1/301)
وَعَنْ شَدَّادِ بْنِ أَوْسٍ قَالَ: كَانَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ فِيْ صَلَاتِهِ: “اَللَّهُمَّ إِنِّيْ أَسَأَلُكَ الثَّبَاتَ فِيْ الْأَمْرِ وَالْعَزِيْمَةَ عَلَى الرُّشْدِ وَأَسْأَلُكَ شُكْرَ نِعْمَتِكَ وَحُسْنَ عِبَادَتِكَ وَأَسْأَلُكَ قَلْبًا سَلِيْمًا وَلِسَانًا صَادِقًا .وَأَسْأَلُكَ مِنْ خَيْرِ مَا تَعْلَمُ وَأَعُوْذُ بِكَ مِنْ شَرِّ مَا تَعْلَمُ وَأَسْتَغْفِرُكَ لِمَا تَعْلَمُ”. رَوَاهُ النَّسَائِيُّ وَرَوَى أَحْمَدُ نَحْوَهُ .
955. (17) [1/301–బలహీనం]
షద్దాద్ బిన్ ఓస్ (ర) కథనం: ప్రవక్త (స) నమా’జులో ఈ దు’ఆను చదివేవారు.
”అల్లాహుమ్మ ఇన్నీ అస్ అలుకస్స‘బాత ఫిల్ అమ్రి, వల్ అ‘జీమత అలా ర్రుష్ది, వఅస్అలుక షుక్ర ని‘అమతిక, వ‘హుస్న ‘ఇబాదతిక, వ అస్అలుక ఖల్బన్ సలీమన్, వ లిసానన్ సాదిఖన్. వఅస్అలుక మిన్ ఖైరి మాత‘అలము. వ అ‘ఊజు‘బిక మిన్ షర్రిమా త‘అలము, వ అంత‘గ్ఫిరుక లిమా త‘అలము.” — ‘ఓ అల్లాహ్! నిన్ను ధార్మిక విషయాల్లో స్థిరత్వాన్ని రుజుమార్గంపై దృఢత్వాన్ని అర్థిస్తున్నాను. ఇంకా నీ అనుగ్రహాల పట్ల కృతజ్ఞతను, నిన్ను చిత్త శుద్ధితో ఆరాధించే భాగ్యాన్ని అర్థిస్తున్నాను. ఇంకా పరిశు ద్ధమైన హృదయాన్ని, సత్యం పలికే నోటిని అర్థిస్తున్నాను. ఇంకా నీకు తెలిసిన మేలును అర్థిస్తున్నాను. ఇంకా నీకు తెలిసిన చెడునుండి శరణు కోరుతున్నాను. ఇంకా నీకు తెలిసిన పాపాలకు నేను క్షమాపణ కోరుతున్నాను.’ (నసాయి‘, అ’హ్మద్)
956 – [ 18 ] ( صحيح ) (1/301)
وَعَنْ جَابِرٍ قَالَ: كَانَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ فِيْ صَلَاتِهِ بَعْدَ التَّشَهُّدِ: “أَحْسَنُ الْكَلَامِ كَلَامُ اللهِ وَأَحْسَنُ الْهَدْيِ هَدْيُ مُحَمَّدٍ”. رَوَاهُ النَّسَائِيُّ .
956. (18) [1/301–దృఢం]
జాబిర్ (ర) కథనం: ప్రవక్త (స) తన నమా’జులో అత్త’హియ్యాతు తర్వాత ఈ దు’ఆను పఠించే వారు:
”అహ్ సనుల్ కలామి కలాముల్లాహి, వ అ‘హ్సనుల్ హద్యి హద్యు ము‘హమ్మదిన్ సల్లల్లాహు అలైహి వసల్లమ్.” — ‘అన్నిటి కంటే గొప్పది దైవగ్రంథం (అల్లాహ్ ప్రవచనం), అన్నిటి కంటే ఉత్తమమైనది ప్రవక్త (స) పద్ధతి.’ (నసాయి’)
957 – [ 19 ] ( ضعيف ) (1/302)
وَعَنْ عَائِشَةَ رَضِيَ اللهُ عَنْهَا قَالَتْ: كَانَ رَسُوْلُ اللهِ صلى يُسَلِّمُ فِيْ الصَّلَاةِ تَسْلِيْمَةً تِلْقَاءَ وَجْهِهِ ثُمَّ تَمِيْلُ إِلَى الشَّقِّ الْأَيْمَنِ شَيْئًا. رَوَاهُ التِّرْمِذِيُّ .
957. (19) [1/302–బలహీనం]
’ఆయి‘షహ్ (ర) కథనం: ప్రవక్త (స) నమా’జులో తన ముఖం ముందు ఒక సలామ్ పలికి, ఆ తరువాత కుడి వైపు కొంత వంగేవారు. [167] (తిర్మిజి‘)
958 – [ 20 ] ( ضعيف ) (1/302)
وَعَنْ سَمُرَةَ قَالَ: أَمَرَنَا رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم أَنْ نَرُدَّ عَلَى الْإِمَامِ وَنَتَحَابَّ وَأَنْ يُّسَلِّمَ بَعْضُنَا عَلَى بَعْضٍ. رَوَاهُ أَبُوْ دَاوُدَ .
958. (20) [1/302–బలహీనం]
సమురహ్ (ర) కథనం: ప్రవక్త (స) మాకు ఇమాము యొక్క సలామ్‌కు ప్రతి సలామ్ ఇవ్వాలని ఆదేశించారు. అంటే ఇమాము, ”అస్సలాము అలైకుమ్ వ ర‘హ్మతుల్లాహి వ బరకాతుహ్,” అని అంటే మేము కూడా అతనికి సమాధానంగా, ”అస్సలాము అలైకుమ్ వ ర‘హ్మతుల్లాహ్,” అని పలకాలని ఆదేశించారు. ఇంకా మేము పరస్పరం ప్రేమించాలని, కలుసుకున్నప్పుడు కూడా సలామ్ చేసుకోవాలని ఆదేశించారు. (అబూ దావూ‘ద్)
=====
18- بَاب الذِّكْر بَعد الصَّلَاة
18. నమా’జు తర్వాత దు‘ఆలు
సలామ్ పలికి నమా’జు ముగించిన తర్వాత, ఈ క్రమంలో దు’ఆలను పఠించాలి. ”ఒకసారి, అల్లాహు అక్బర్, 3 సార్లు అస్తగ్ఫిరుల్లాహ్, 33 సార్లు అల్హమ్దులిల్లాహ్, 33 సార్లు సుబ్హానల్లాహ్, 33 సార్లు, అల్లాహు అక్బర్ మరియు ఒకసారి, లా ఇలాహ ఇల్లల్లాహు వ’హ్దహు, లా షరీకలహు లహుల్ ముల్కు, వలహుల్ ’హమ్దు, వహువ అలాకుల్లి షైయిన్ ఖదీర్.”
ఆ తరువాత సూరహ్ ఇ’ఖ్లాస్ (112), సూరహ్ ఫలఖ్ (113), సూరహ్ నాస్ (114) పఠించాలి.
—–
اَلْفَصْلُ الْأَوَّلُ మొదటి విభాగం
959 – [ 1 ] ( متفق عليه ) (1/303)
عَنِ ابْنِ عَبَّاسٍ رَضِيَ اللهُ عَنْهُمَا قَالَ: كُنْتُ أَعْرِفُ أَنْقِضَاءُ صَلَاةِ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم بِالتَّكْبِيْرِ.
959. (1) [1/303–ఏకీభవితం]
ఇబ్నె ’అబ్బాస్ (ర) కథనం: ”ప్రవక్త (స) నమా’జు పూర్తయ్యిందని నేను అల్లాహు అక్బర్ ద్వారా తెలుసుకునే వాడ్ని. అంటే సలామ్ పలికిన తర్వాత ప్రవక్త (స) బిగ్గరగా అల్లాహు అక్బర్ అని పలుకు తారు, ముఖ్తదీలు కూడా బిగ్గరగా పలుకుతారు. అప్పుడు నేను నమా’జ్ పూర్త య్యిందని తెలుసు కునేవాడిని.” [168] (బు’ఖారీ, ముస్లిమ్)
960 – [ 2 ] ( صحيح ) (1/303)
وَعَنْ عَائِشَةَ رَضِيَ اللهُ عَنْهَا قَالَتْ: كَانَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم إِذَا سَلَّمَ لَمْ يَقْعُدْ إِلَّا مِقْدَارَ مَا يَقُوْلُ: “اَللَّهُمَّ أَنْتَ السَّلَامُ وَمِنْكَ السَّلَامُ تَبَارَكْتَ يَا ذَا الْجَلَالِ وَالْإِكْرَامِ”. رَوَاهُ مُسْلِمٌ .
960. (2) [1/303–దృఢం]
’ఆయిష‘హ్ (ర) కథనం: ”ప్రవక్త (స) సలాము పలికిన తర్వాత ఈ దు’ఆను చదివినంతసేపు ముసల్లాపై కూర్చునే వారు,
”అల్లాహుమ్మ అంతస్సలాము వమిన్క స్సలా ము, తబారక్త యా జ‘ల్జలాలి వల్ ఇక్రామ్.” — ‘ఓ అల్లాహ్! నీవే శాంతివి, శాంతి నీవద్ద నుండే లభిస్తుంది. నీవు శుభసాగరుడవు, ఓ ఔన్నత్యం, గౌరవం గలవాడా!’ (ముస్లిమ్)
961 – [ 3 ] ( صحيح ) (1/303)
وَعَنْ ثَوْبَانَ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: كَانَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم إِذَا اِنْصَرَفَ مِنْ صَلَاتِهِ اسْتغَفْرَ ثلَاَثًا وَقَالَ: “اَللَّهُمَّ أَنْتَ السَّلَامُ وَمِنْكَ السَّلَامُ تَبَارَكْتَ يَا ذَا الْجَلَالِ وَالْإِكْرَامِ”. رَوَاهُ مُسْلِمٌ.
961. (3) [1/303–దృఢం]
సౌ’బాన్ (ర) కథనం: ”ప్రవక్త (స) నమా’జు ముగించిన తర్వాత మూడుసార్లు, ‘అస్తగ్ఫిరుల్లాహ్’ అని పలికిన తర్వాత ఈ దు’ఆ పఠించేవారు,
”అల్లాహుమ్మ అన్తస్సలాము వ మిన్కస్సలాము, తబారక్త యా జ‘ల్జలాలి వల్ ఇక్రామ్” — ‘ఓ అల్లాహ్! నీవు శాంతిమయుడవు, శాంతి నీ వద్ద నుండే లభిస్తుంది. నీవు శుభసాగరుడవు, ఓ ఔన్నత్యం, గౌరవం కలవాడా!’ (ముస్లిమ్)
962 – [ 4 ] ( متفق عليه ) (1/303)
وَعَنِ الْمُغَيْرَةَ بْنِ شُعْبَةَ أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم: كَانَ يَقُوْلُ فِيْ دُبُرِ كُلِّ صَلَاةٍ مَّكْتُوْبَةٍ: “لَا إِلَهَ إِلَّا اللهُ وَحْدَهُ لَا شَرِيْكَ لَهُ لَهُ الْمُلْكُ وَلَهُ الْحَمْدُ وَهُوَ عَلَى كُلِّ شَيْءٍ قَدِيْرٌ، اَللَّهُمَّ لَا مَانِعَ لِمَا أَعْطَيْتَ وَلَا مُعْطِيَ لِمَا مَنَعْتَ وَلَا يَنْفَعُ ذَا الْجَدِّ مِنْكَ الْجَدُّ”.
962. (4) [1/303–ఏకీభవితం]
ము’గీర బిన్ ష’అబ (ర) కథనం: ”ప్రవక్త (స) ప్రతి ఫర్’ద్ నమా’జు తర్వాత ఈ దు’ఆను పఠించేవారు,
”లా ఇలాహ ఇల్లల్లాహు వ‘హ్దహు లాషరీకలహు, లహుల్ ముల్కు వలహుల్ హమ్దు వహువ అలాకుల్లి షైయిన్ ఖదీర్. అల్లాహుమ్మ లామాని‘అ లిమా అ‘అతైత వలా మ‘అతియ లిమా మన‘అత వలా యన్ఫ‘ఉ జ‘ల్జద్ది మిన్కల్జద్దు.” — ‘అల్లాహ్ తప్ప ఆరాధనకు అర్హులు ఎవరూ లేరు. ఆయన ఒకే ఒక్కడు. ఆయనకు సాటి ఎవ్వరూ లేరు, సర్వాధి కారాలు ఆయనవే, సర్వస్తోత్రాలు ఆయనవే. ఆయనకు సమస్త విషయాలన్నిటిపై అధికారం ఉంది. ఓ అల్లాహ్! నీవు ఇచ్చేదాన్ని ఆపేవాడెవ్వడూ లేడు. ఇంకా నీవు ఆపేదాన్ని ఇచ్చేవాడెవ్వడూ లేడు. ఇంకా ధనవంతునికి అతని ధనం నీ శిక్ష నుండి రక్షించ లేదు.’ (బుఖారీ, ముస్లిమ్)
963 – [ 5 ] ( صحيح ) (1/304)
وَعَنْ عَبْدِ اللهِ بْنِ الزُّبَيْرِ قَالَ: كَانَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم إِذَا سَلَّمَ مِنْ صَلَاتِهِ يُقُوْلُ بِصَوْتِهِ الْأَعْلَى: “لَا إِلَهَ إِلَّا اللهُ وَحْدَهُ لَا شَرِيْكَ لَهُ لَهُ الْمُلْكُ وَلَهُ الْحَمْدُ وَهُوَ عَلَى كُلِّ شَيْءٍ قَدِيْرٌ، لَا حَوْلَ وَلَا قُوَّةَ إِلَّا بِاللهِ، لَا إِلَهَ إِلَّا اللهُ، لَا إِلَهَ إِلَّا اللهُ، وَلَا نَعْبُدُ إِلَّا إِيَّاهُ، لَهُ النِّعْمَةُ وَلَهُ الْفَضْلُ، وَلَهُ الثَّنَاءُ الْحَسَنُ، لَا إِلَهُ إِلَّا اللهُ مُخْلِصِيْنَ لَهُ الدِّيْنَ وَلَوْ كَرِهَ الْكَافِرُوْنَ”. رَوَاهُ مُسْلِمٌ.
963. (5) [1/303–దృఢం]
‘అబ్దుల్లాహ్ బిన్ ‘జుబైర్ (ర) కథనం: ”ప్రవక్త (స) నమా’జు చదివిన తర్వాత, బిగ్గరగా ఈ దు’ఆ చదివేవారు.
‘లా ఇలాహ ఇల్లల్లాహు వ‘హ్దహు లాషరీక లహు లహుల్ ముల్కు వలహుల్ హమ్దు వహువ ‘అలాకుల్లి షైఇ‘న్ ఖదీర్. లాహౌల వలా ఖువ్వత ఇల్లాబిల్లాహి, లాఇలాహ ఇల్లల్లాహు వలా న‘అబుదు ఇల్లా ఇయ్యాహు లహున్నె‘అమతు వలహుల్ ఫ‘ద్లు, వలహుస్స‘నా ఉల్’హసను, లాఇలాహ ఇల్లల్లాహు ము‘ఖ్లిసీన లహుద్దీన వలౌ కరిహల్ కాఫిరూన్.’ — ‘అల్లాహ్ తప్ప ఆరాధ్యు లెవరూ లేరు, ఆయన ఒకే ఒక్కడు. ఆయనకు ఎవరూ సాటిలేరు. ఆయనే యజమాని, సర్వ స్తోత్రాలూ ఆయనవే. ఆయనే ప్రతీది చేయగల సమర్థుడు. పాపాల నుండి దూరంగా ఉండే శక్తి కేవలం అల్లాహ్ సహాయం ద్వారానే లభిస్తుంది. అల్లాహ్ తప్ప ఆరాధ్యులెవరూ లేరు. మేము ఆయన్నే ఆరాధిస్తున్నాము. అనుగ్రహాలు, దయా, స్తోత్రాలు అన్నీ ఆయనవే. అల్లాహ్ తప్ప ఆరాధ్యులెవరూ లేరు. మేము ఆయన్నే ఆరా ధిస్తాము. అవిశ్వాసులు ఎలా భావించినా సరే.’ (ముస్లిమ్)
964 – [ 6 ] ( صحيح ) (1/304)
وَعَنْ سَعْدٍ أَنَّ كَانَ يُعَلِّمُ بَنِيْهِ هَؤُلَاءِ الْكَلِمَاتِ وَيَقُوْلُ: إِنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم كَانَ يَتَعَوَّذُ بِهِنَّ دُبَرَ الصَّلَاةِ: “اَللَّهُمَّ إِنِّيْ أَعُوْذُ بِكَ مِنَ الْجُبْنِ وَأَعُوْذُ بِكَ مِنَ الْبُخْلِ وَأَعُوْذُ بِكَ مِنْ أَرْذَلِ الْعُمْرِ وَأَعُوْذُ بِكَ مِنْ فِتْنَةِ الدُّنْيَا وَعَذَابِ الْقَبْرِ”. رَوَاهُ الْبُخَارِيُّ .
964. (6) [1/304–దృఢం]
స’అద్ (ర) తన కుమారులకు ఈ వచనాలు నేర్పేవారు. ‘ఇంకా ప్రవక్త (స) నమా’జు తరువాత ఈ దు’ఆ ను చదివి ఈ చెడుల నుండి శరణుకోరేవారు,’ అని అనేవారు.
”అల్లాహుమ్మ ఇన్నీ అ‘ఊజు‘బిక మినల్ జుబ్ని, వఅ‘ఊజు‘ బిక మినల్ బు‘ఖ్లి, వఅ ‘ఊజు‘బిక మిన్అర్జ‘లిల్ ఉమ్రి, వఅ‘ఊజు‘బిక మిన్ ఫిత్న తిద్దునియా వ అజా‘బిల్ ఖబ్రి.” — ‘ఓ అల్లాహ్! నేను అధైర్యం నుండి నీ శరణు కోరు తున్నాను. ఇంకా నేను పిసినారితనం నుండి నీ శరణు కోరుతున్నాను. ఇంకా నీచ వృద్ధాప్యం నుండి నీ శరణు కోరు తున్నాను. ఇంకా ప్రాపంచిక కల్లోలాల నుండి, సమాధి శిక్ష నుండి నీ శరణు కోరుతున్నాను.’ (బుఖారీ)
965 – [ 7 ] ( متفق عليه ) (1/304)
وَعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: إِنَّ فُقَرَاءِ الْمُهَاجِرِيْنَ أَتَوْا رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم فَقَالُوْا: قَدْ ذَهَبَ أَهْلُ الدُّثُوْرِ بِالدَّرَجَاتِ الْعُلَى وَالنَّعِيْمِ الْمُقِيْمِ. فَقَالَ: وَمَا ذَاكَ قَالُوْا يُصَلُّوْنَ كَمَا نُصَلِّيْ وَيَصُوْمُوْنَ كَمَا نَصُوْمُ وَيَتَصَدَّقُوْنَ وَلَا نَتَصَدَّقُ وَيُعْتِقُوْنَ وَلَا نُعْتِقُ. فَقَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “أَفَلَا أُعَلِّمُكُمْ شَيْئًا تُدْرِكُوْنَ بِهِ مَنْ سَبَقَكُمْ وَتَسْبِقُوْنَ بِهِ مَنْ بَعْدَكُمْ وَلَا يَكُوْنَ أَحَدٌ أَفْضَلَ مِنْكُمْ إِلَّا مَنْ صَنَعَ مِثْلَ مَا صَنَعْتُمْ”. قَالُوْا بَلَى يَا رَسُوْلَ اللهِ قَالَ: “تُسَبِّحُوْنَ وَتُكَبِّرُوْنَ وَتَحْمَدُوْنَ دُبُرَ كُلِّ صَلَاةٍ ثَلَاثًا وَّثَلَاثِيْنَ مَرَّةً”. قَالَ أَبُوْ صَالِحٍ: فَرَجَعَ فُقَرَاءُ الْمُهَاجِرِيْنَ إِلَى رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم. فَقَالُوْا سَمِعَ إِخْوَانُنَا أَهْلُ الْأَمْوَالِ بِمَا فَعَلْنَا فَفَعَلُوْا مِثْلَهُ. فَقَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “ذَلِكَ فَضْلُ اللهِ يُؤْتِيْهِ مَنْ يَّشَاءُ”. وَلَيْسَ قَوْلُ أَبِيْ صَالِحٍ إِلَى آخِرِهِ إِلَّا عِنْدَ مُسْلِمٍ.
وَفِيْ رِوَايَةٍ لِّلْبُخَارِيِّ: “تُسَبِّحُوْنَ فِيْ دُبُرِ كُلِّ صَلَاةٍ عَشْرًا وَتَحْمَدُوْنَ عَشْرًا وَتُكَبِّرُوْنَ عَشْرًا”. بَدْلَ ثَلَاثًا وَثَلَاثِيْنَ.
965. (7) [1/304–ఏకీభవితం]
అబూ హురైరహ్ (ర) కథనం: పేద ముహాజిరీన్లు ప్రవక్త (స) వద్దకు వచ్చి, ”ధనవంతులు ఉన్నత స్థానాలు, స్వర్గ అనుగ్రహాలు పొందారు,” అని అన్నారు. అప్పుడు ప్రవక్త(స) ”అదెలా,” అని అన్నారు. దానికి వారు, ”మేము నమా’జు చదివినట్టే వారూ నమా’జు చదువుతారు. మేము ఉపవాసం ఉన్నట్టే వారూ ఉపవాసం ఉంటారు. కాని వారు ధన వంతులు కావటం వల్ల దానధర్మాలు చేస్తారు. ‘జకాత్ చెల్లిస్తారు. కాని మేము పేదరికం వల్ల దానధర్మాలు చేయలేం. వాళ్ళు బానిసలను విడుదల చేస్తారు. మేము చేయలేము,” అని అన్నారు. అప్పుడు ప్రవక్త (స), ”నేను మీకు ఎలాంటి విషయం తెలుపుతా నంటే, ఒకవేళ మీరు ఆచరించసాగితే, వారికంటే ముందు అయిపోతారు. మీరు మీ పూర్వీకులను, మీ తర్వాత వచ్చేవారిని అధిగమిస్తారు. మీకంటే ఉన్నతులు ఎవరూ ఉండరు. అయితే మీలా ఆచరించినవారు తప్ప.” దానికి వారు, ”సరే, ఓ ప్రవక్తా! తెలుపండి,” అని అన్నారు. అప్పుడు ప్రవక్త (స), ”మీరు ప్రతి నమా’జు తరువాత 33 సార్లు సుబ్హానల్లాహ్, 33 సార్లు అల్లాహు అక్బర్, 33 సార్లు అల్హమ్దులిల్లాహ్, అని పలకండి,” అని హితబోధ చేశారు. ఆ పేద ముహాజిర్లు మళ్ళీ ప్రవక్త (స) వద్దకు వచ్చి, ”ఓ ప్రవక్తా! ఆ సోదర ధనవంతులు మీరు మాకు నేర్పిన దు’ఆ విని, వారు కూడా దాన్ని చదవసాగారు. మరి వాళ్ళు మేము సమానం అయిపోయాము. దానధర్మాల వల్ల వాళ్ళు మమ్మల్ని అధిగమించారు.” అది విని ప్రవక్త (స), ”ఇది అల్లాహ్ దయ, తాను కోరిన వారికి ప్రసాదిస్తాడు,” అని అన్నారు. (బు’ఖారీ, ముస్లిమ్)
బు’ఖారీ కొన్ని ఉల్లేఖనాల్లో 33 సార్లుకు బదులు 10 సార్లు అని ఉంది.
966 – [ 8 ] ( صحيح ) (1/305)
وَعَنْ كَعْبِ بْنِ عُجْرَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مُعَقِّبَاتٌ لَا يُخِيْبُ قَائِلُهُنَّ أَوْ فَاعِلُهُنَّ دُبُرٍ كُلِّ صَلَاةٍ مَّكْتُوْبَةٍ: ثَلَاثٌ وَثَلَاثُوْنَ تَسْبِيْحَةً ثَلَاثٌ وَثَلَاثُوْنَ تَحْمِيْدَةً وَأَرْبَعٌ وَثَلَاثُوْنَ تَكْبِيْرَةً”. رَوَاهُ مُسْلِمٌ .
966. (8) [1/305–దృఢం]
క’అబ్ బిన్ ‘ఉజ్ర (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ‘ఈ కొన్ని వచనాలు ఉన్నాయి, వీటిని నమా’జు తర్వాత పలికిన వారికి పుణ్యమే పుణ్యం లభిస్తుంది. ఏమాత్రం నిరాశ కలుగదు. ”33 సార్లు సుబ్హానల్లాహ్, 33 సార్లు అల్హమ్దులిల్లాహ్, 34 సార్లు అల్లాహు అక్బర్.” (ముస్లిమ్)
967 – [ 9 ] ( صحيح ) (1/305)
وَعَنْ أَبِيْ هُرَيْرَةَ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَنْ سَبَّحَ اللهُ فِيْ دُبُرِ كُلِّ صَلَاةٍ ثَلَاثًا وَثَلَاثِيْنَ وَحَمِدَ اللهُ ثَلَاثًا وَّثَلَاثِيْنَ وَكَبَّرَ اللهُ ثَلَاثًا وَثَلَاثِيْنَ فَتِلْكَ تِسْعَةٌ وَّتِسْعُوْنَ. وَقَالَ تَمَامُ الْمَائَةِ: “لَا إِلَهَ إِلَّا اللهُ وَحْدَهُ لَا شَرِيْكَ لَهُ لَهُ الْمُلْكُ وَلَهُ الْحَمْدُ وَهُوَ عَلَى كُلِّ شَيْءٍ قَدِيْرٌ”. غُفِرَتْ خَطَايَاهُ وَإِنْ كَانَتْ مِثْلَ زَبَدِ الْبَحْرِ. رَوَاهُ مُسْلِمٌ .
967. (9) [1/305–దృఢం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ‘ప్రతి విధి నమాజుల తర్వాత: ”33 సార్లు సుబ్హానల్లాహ్, 33 సార్లు అల్హమ్దులిల్లాహ్, 33 సార్లు అల్లాహు అక్బర్, ఒకసారి: ‘లా ఇలాహ ఇల్లల్లాహు వ’హ్దహు లాషరీకలహు, లహుల్ ముల్కు వలహుల్ ‘హమ్దు, వహువ ‘అలాకుల్లి షయ్యిన్ ఖదీర్’ ” .పఠించిన వ్యక్తి పాపాలన్నీ క్షమించ బడతాయి. ఒకవేళ సముద్రంపై నురుగుకు సమానంగా ఉన్నాసరే. [169] (ముస్లిమ్)
—–
اَلْفَصْلُ الثَّانِيْ రెండవ విభాగం
968 – [ 10 ] ( حسن ) (1/305)
وَعَنْ أَبِيْ أُمَامَةَ قَالَ: قِيْلَ: يَا رَسُولَ اللهِ أَيُّ الدُّعَاءِ أَسْمَعُ؟ قَالَ: “جَوْفُ اللَّيْلِ الْآخَرِ وَدُبُرِ الصَّلَواتِ الْمَكْتُوْبَاتِ”. رَوَاهُ التِّرْمِذِيُّ.
968. (10) [1/305–ప్రామాణికం]
అబూ ఉమామహ్ (ర) కథనం: ప్రవక్త (స)ను, ‘ఓ ప్రవక్తా! ఏ సమయంలో దు’ఆ తప్పకుండా స్వీకరించబడుతుంది,’ అని ప్రశ్నించడం జరిగింది. దానికి ప్రవక్త (స), ‘రాత్రి మధ్య భాగంలో, రాత్రి చివరి భాగానికి ముందు. ఇంకా విధి నమా’జుల తర్వాత,’ అని సమాధానం ఇచ్చారు. (తిర్మిజి’)
969 – [ 11 ] ( صحيح ) (1/306)
وَعَنْ عُقْبَةَ بْنِ عَامِرٍ قَالَ: أَمَرَنِيْ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم أَنْ أَقْرَأَ بِالْمُعَوِّذَاتِ فِيْ دُبُرِ كُلِّ صَلَاةٍ. رَوَاهُ أَحْمَدُ وَأَبُوْ دَاوُدَ وَالنَّسَائِيُّ وَالْبَيْهَقِيُّ فِيْ الدَّعْوَاتِ الْكَبِيْرِ.
969. (11) [1/306–దృఢం]
‘ఉఖ్‌బ బిన్ ‘ఆమిర్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రతి విధి నమా’జుల తర్వాత ము’అవిజ్జా’త్ లను పఠించమని ఆదేశించారు. అంటే సూరహ్ ఫలఖ్ (113), సూరహ్ నాస్ (114). (‘అ’హ్మద్, అబూ దావూ’ద్, నసాయి’, బైహఖీ-ద’అవాతిల్ కబీర్)
970 – [ 12 ] ( حسن ) (1/306)
وَعَنْ أَنَسٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَأَنْ أَقْعُدَ مَعَ قَوْمٍ يَّذْكُرُوْنَ اللهَ مِنْ صَلَاةِ الْغَدَاةِ حَتَّى تَطْلُعَ الشَّمْسُ أُحَبُّ إِلَيَّ مِنْ أَنْ أُعْتِقَ أَرْبَعَةً مِّنْ ولْدِ إِسْمَاعِيْلَ وَلَأَنْ أَقْعُدَ مَعَ قَوْمٍ يَذْكُرُوْنَ اللهَ مِنْ صَلَاةِ الْعَصْرِ إِلَى أَنْ تَغْرُبَ الشَّمْسُ أَحَبُّ إِلَيَّ مَنْ أَنْ أُعْتِقَ أَرْبَعَةً”. رَوَاهُ أَبُوْ دَاوُدُ .
970. (12) [1/306–ప్రామాణికం]
అనస్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ‘ఫజ్ర్ నమా’జు నుండి సూర్యోదయం అయ్యేవరకు దైవ స్మరణలో ఉన్న వారితో కలసి కూర్చోవటం, నాలుగు ఇస్మాయీలీ బానిసలను విడుదల చేయటం కంటే శ్రేష్ఠమైనది. అదేవిధంగా అస్ర్ నమా’జు నుండి సూర్యాస్తమయం వరకు దైవస్మరణలో ఉన్న వారితో కలసి కూర్చోవటం, నాలుగు అరబీ, ఇస్మాయీలీ బానిసలను విడుదలచేయటం కంటే శ్రేష్టమైనది. [170] (అబూ దావూద్)
971 – [ 13 ] ( حسن ) (1/306)
وَعَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَنْ صَلّى الْفَجْرَ فِيْ جَمَاعَةٍ ثُمَّ قَعَدَ يَذْكُرُ اللهَ حَتَّى تَطْلُعَ الشَّمْسُ ثُمَّ صَلَّى رَكْعَتَيْنِ كَانَتْ لَهُ كَأَجْرِ حَجَّةٍ وَّعُمْرَةٍ”. قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “تَامَّةٍ تَامَّةٍ تَامَّةٍ”. رَوَاهُ التِّرْمِذِيُّ.
971. (13) [1/306–ప్రామాణికం]
అనస్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఫజ్ర్ నమా’జును సామూహికంగా ఆచరించి, సూర్యోదయం అయ్యేవరకు కూర్చొని అల్లాహ్(త) స్మరణచేసి, సూర్యోదయం తరువాత రెండు రకాతులు (ఇష్రాఖ్) చదివితే, ‘హజ్జ్ మరియు ఉమ్ర్ల పుణ్యం లభిస్తుంది. పరిపూర్ణంగా లభిస్తుంది అని మూడుసార్లు అన్నారు.” [171](తిర్మిజి’)
—–
اَلْفَصْلُ الثَّالِثُ మూడవ విభాగం
972 – [ 14 ] ( ضعيف ) (1/306)
عَنْ الْأَزْرَقِ بْنِ قَيْسٍ قَالَ: صَلَّى بِنَا إِمَامٌ لَنَا يُكَنّى أَبَا رِمْثَةَ. قَالَ صَلَّيْتُ هَذِهِ الصَّلَاةَ أَوْ مِثْلَ هَذِهِ الصَّلَاةَ مَعَ رسول الله صلى الله عليه وسلم. قَالَ: وَكَانَ أَبُوْ بَكْرٍ وَعُمَرُ يَقُوْمَانِ فِيْ الصَّفِّ الْمُقَدَّمِ عَنْ يَمِيْنِهِ وَكَانَ رَجُلٌ قَدْ شَهِدَ التَّكْبِيْرَةِ الْأَوْلَى مِنَ الصَّلَاةِ فَصَلَّى نَبِيُّ اللهِ صلى الله عليه وسلم. ثُمَّ سَلَّمَ عَنْ يَّمِيْنِهِ وَعَنْ يَّسَارِهِ حَتَّى رَأَيْنَا بَيَاضَ خَدَّيْهِ. ثُمَّ انْفَتَلَ كَاْنِفِتَالِ أَبِيْ رِمْثَةَ. يَعْنِيْ نَفْسَهُ فَقَامَ الرَّجُلُ الَّذِيْ أَدْرَكَ مَعَهُ التَّكْبِيْرَةَ الْأَوْلَى مِنَ الصَّلَاةِ يَشْفَعُ فَوَثَبَ إِلَيْهِ عُمَرُ. فَأَخَذَ بِمَنْكِبَيْهِ فَهَزَّهُ. ثُمَّ قَالَ اِجْلِسْ فَإِنَّهُ لَمْ يَهْلِكْ أَهْلُ الْكِتَابِ إِلَّا أَنَّهُ لَمْ يَكُنْ بَيْنَ صَلَاتِهِمْ فَصْل. فَرَفَعَ النَّبِيُّ صلى الله عليه وسلم بَصَرَهُ. فَقَالَ: “أَصَابَ اللهُ بِكَ يَا ابْنَ الْخَطَّاب”. رَوَاهُ أَبُوْ دَاوُدُ .
972. (14) [1/306–బలహీనం]
అజ్రఖ్ బిన్ ఖైస్ (ర) కథనం: మా ఇమాము అబూ రిమ్స’ మాకు నమా’జు చదివించారు. నమా’జు తర్వాత ఈ నమా’జు లేదా ఇటువంటి నమా’జును నేను ప్రవక్త (స)తో కలసి చదివాను. ఆ నమా’జులో అబూ బకర్ (ర), ‘ఉమర్ (ర) ఉన్నారు. వీరు మొదటి పంక్తిలో ప్రవక్త (స)కు కుడి ప్రక్కల నిలబడ్డారు. మరోవ్యక్తి మొదటి తక్బీర్ నుండి ఆ నమా’జులో ఉన్నాడు. ప్రవక్త (స) నమా’జు చదివించి, కుడి, ఎడమలు సలామ్ పలికారు. చివరికి మేము ప్రవక్త (స) బుగ్గల తెల్లదనాన్ని చూశాము. ఆ తరువాత ప్రవక్త (స) తిరిగారు. మొదటి తక్బీర్ నుండి ఉన్న వ్యక్తి సలామ్ పలికిన తరువాత రెండు రకాతులు చదవడానికి నిలబడ్డాడు. అది చూచి వెంటనే ‘ఉమర్ (ర) అతనితోపాటు నిలబడి, అతని రెండు భుజాలను పట్టుకొని కదిలించి, కూర్చో, ఫర్ద్ మరియు నఫిల్ నమా’జుల్లో కొంత తేడా ఉంచక పోవటం వల్లనే గ్రంథప్రజలు నాశనం అయ్యారు,’ అని అన్నారు. అది విన్న ప్రవక్త (స) వాళ్ళవైపు చూసి, ‘ఉమర్‌ను అల్లాహ్ సరైన విషయం వైపుకు నిర్దేశించాడు అని అన్నారు. [172] (అబూ దావూ’ద్)
973 – [ 15 ] ( صحيح ) (1/307)
وَعَنْ زَيْدِ بْنِ ثَابِتٍ قَالَ: أَمِرْنَا أَنْ نُسَبِّحَ فِيْ دُبُرِ كُلِّ صَلَاةٍ ثَلَاثًا وَّثَلَاثِيْنَ وَنَحْمِدُ ثَلَاثًا وَثَلَاثِيْنَ وَنُكَبِّرُ أَرْبَعًا وَثَلَاثِيْنَ. فَأَتَي رَجُلٌ فِيْ الْمَنَامِ مِنَ الْأَنْصَارِ فَقِيْلَ لَهُ: أَمَرَكُمْ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم أَنْ تُسَبِّحُوْا فِيْ دُبُرِ كُلِّ صَلَاةٍ كَذَا وَكَذَا. قَالَ الْأَنْصَارِيُّ فِيْ مَنَامِهِ: نَعَمْ. قَالَ: فَاجْعَلُوْهَا خَمْسًا وَّعِشْرِيْنَ خَمْسًا وَّعِشْرِيْنَ وَاجْعَلُوْا فِيْهَا التَّهْلِيْل فَلَمَّا أَصْبَحَ غَدَا عَلَى النَّبِيِّ صلى الله عليه وسلم. فَأَخْبَرَهُ. فَقَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “فَافْعَلُوْا”. رَواهُ أَحْمَدُ وَالنَّسَائِيُّ وَالدَّارِمِيُّ .
973. (15) [1/307–దృఢం]
’జైద్ బిన్ సా‘బిత్ (ర) కథనం: మమ్మల్ని ప్రతి విధి నమా’జు తర్వాత 33 సార్లు సుబ్హానల్లాహ్, 33 సార్లు అల్హమ్దులిల్లాహ్, 34 సార్లు అల్లాహు అక్బర్ పలకాలని ఆదేశించడం జరిగింది. మేము ఇలాగే చేసేవాళ్ళం. ఒక అ’న్సారీ కలలో ఇలా చూశాడు, ‘ఒక వ్యక్తి అతన్ని ప్రవక్త (స) మిమ్మల్ని నమా’జు తర్వాత ఈ విధంగా త’స్బీ’హ్ చదవమన్నారా?’ అని అడి గాడు. అ’న్సారీ అవునని,’ సమా ధానం ఇచ్చాడు. దానికి ఆ వ్యక్తి నువ్వు 33సార్లకు బదులు, 25 సార్లు పఠించి, దీనికి తోడు ‘లాయిలాహ ఇల్లల్లాహ్‘ను 25 సార్లు కూడా, చదవటాన్ని చేర్చుకో,’ అని అన్నాడు. ఉదయం ఆ అ’న్సారీ ప్రవక్త (స) వద్దకు వచ్చి, తన కల గురించి విన్నవించుకున్నాడు. దానికి ప్రవక్త (స) నువ్వు దీన్ని ఆచరించు,’ అని అన్నారు. [173] (‘అ’హ్మద్, నసాయి’, దార్మీ)
974 – [ 16 ] ( موضوع ) (1/308)
وَعَنْ عَلِيٍّ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: سَمِعْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم عَلَى أَعْوَادِ الْمَنْبَرُ يَقُوْلُ: “مَنْ قَرَأَ آيَةَ الْكُرْسِيُّ فِيْ دُبُرِ كُلِّ صَلَاةٍ لَمْ يَمْنَعْهُ مِنْ دُخُوْلِ الْجَنَّةِ إِلَّا الْمَوْتُ وَمَنْ قَرَأَهَا حِيْنَ يَأْخُذُ مَضْجعَهُ آمِنَهُ اللهُ عَلَى دَارِهِ وَدَارِ جَارِهِ وَأَهْل دُوَيْرَاتٍ حَوْلَهُ”. رَوَاهُ الْبَيْهَقِيُّ فِيْ شُعَبِ الْإِيْمَانِ. وَقَالَ إِسْنَادُهُ ضَعِيْفٌ .
974. (16) [1/308–కల్పితం]
’అలీ (ర) కథనం: నేను ప్రవక్త (స)ను ఈ కట్టె మెంబరుపై ఇలా ప్రవచిస్తూ ఉండగా విన్నాను, ‘ప్రతి విధి నమా’జు తర్వాత ఆయతుల్ కుర్సీ చదివే వ్యక్తి స్వర్గంలో ప్రవేశించటానికి మరణం తప్ప మరేదీ ఆపలేదు. (అంటే మరణం తరువాత మాత్రమే స్వర్గంలో ప్రవేశిస్తాడు). అదేవిధంగా ప్రతిరోజు రాత్రి పడుకున్నప్పుడు ఆయతుల్ కుర్సీ చదివే వ్యక్తి ఇరుగు పొరుగు వారిని, చుట్టుప్రక్కల వారిని అందరినీ అల్లాహ్ (త) శాంతిభద్రతలతో ఉంచు తాడు.’ (బైహఖీ – ఆధారాలు బలహీనం)
975 – [ 17 ] ( لم تتم دراسته ) (1/308)
وَعَنْ عَبْدِ الرَّحْمَنِ بْنِ غَنَمٍ عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم أَنَّهُ قَالَ: “مَنْ قَالَ قَبْلَ أَنْ يَّنْصَرِفَ وَيُثْني رِجْلَيْهِ مِنْ صَلَاةِ الْمَغْرِبِ وَالصُّبْحُ: “لَا إِلَهَ إِلَّا اللهُ وَحْدَهُ لَا شَرِيْكَ لَهُ لَهُ الْمُلْكُ وَلَهُ الْحَمْدُ بِيَدِهِ الْخَيْرِ يُحْيِيْ وَيُمِيْتُ وَهُوَ عَلَى كُلِّ شَيْءٍ قَدِيْرٌ” عَشْرَ مَرَّاتٍ كُتِبَ لَهُ بِكُلِّ وَاحْدَةٍ عَشْرُ حَسَنَاتٍ وَمُحِيْتُ عَنْهُ عَشْرُ سَيِّئَاتٍ وَرُفِعَ لَهُ عَشْرُ دَرَجَاتٍ وَكَانَتْ حِرْزًا مِّنْ كُلِّ مَكْرُوْهٍ وَحِرْزًا مِّنَ الشَّيْطَانِ الرَّجِيْمِ وَلَمْ يَحُلْ لِذَنْبِ يُدْرِكَهُ إِلَّا الشِّرْكَ وَكَانَ مِنْ أَفْضَلِ النَّاسِ عَمَلَا إِلَّا رَجُلًا يُفَضِّلَهُ يَقُوْلُ أَفْضَلُ مِمَّا قَالَ”. رَوَاهُ أَحْمَدُ .
975. (17) [1/308–అపరిశోధితం]
’అబ్దుర్ర’హ్మాన్ బిన్ ’గనమ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ‘నమా’జు చోటు నుండి లేవడానికి ముందు, ఇంకా మ’గ్రిబ్ మరియు ఫజ్ర్ నమా’జు తర్వాత వెనుతిరగటానికి ముందు ఈ దు’ఆను 10 సార్లు చదివితే, అతనికి ప్రతి వచనానికి బదులు 10 పుణ్యాలు లిఖించబడతాయి. 10 పాపాలు క్షమించ బడతాయి, 10 స్థానాలు ఉన్నతం చేయబడతాయి. ఇంకా ఆ వచనాలు ప్రతిచెడు నుండి, షై’తాను ప్రేరణల నుండి రక్షణగా ఉంటాయి. షిర్క్ తప్ప మరే పాపం అతన్ని నష్టం కలిగించలేదు. ఇంకా అంతకు మించిన ఆచరణ చేసేవాడెవడూ ఉండడు. అయితే అతని కంటే ఎక్కువసార్లు పలికినవాడు తప్ప. ఆ దు’ఆ ఇది: ”లా ఇలాహ ఇల్లల్లాహు వ‘హ్దహు లాషరీక లహు లహుల్ ముల్కు వలహుల్ ‘హమ్దు, బియదిహిల్ ‘ఖైరు యుహ్యీ వ యుమీతు వహువ అలాకుల్లి షైయిన్ ‘ఖదీర్.” (అ’హ్మద్)
976 – [ 18 ] ( ضعيف ) (1/308)
وَرَوَى التِّرْمِذِيُّ نَحْوَهُ عَنْ أَبِيْ ذَرٍّ إِلَى قَوْلِهِ: “إِلَّا الشِّرْك” وَلَمْ يَذْكُرْ:”صَلَاةُ الْمَغْرِبِ وَلَا بِيَدِهِ الْخَيْرِ”. وَقَالَ: هَذَا حَدِيْثٌ حَسَنٌ صَحِيْحٌ غَرِيْبٌ .
976. (18) [1/308–బలహీనం]
అబూ జ’ర్ ద్వారా తిర్మిజి’ ఇదేవిధంగా ఉల్లేఖించారు. అతని వాక్యాలు ఇల్లా ష్షిర్క్ వరకు ఉన్నాయి, మ’గ్రిబ్ నమా’జు గురించి, బియదిహిల్ ఖైర్ పదాన్ని పేర్కొన లేదు. (తిర్మిజి’ – ప్రామాణికం, దృఢం, ఏకోల్లేఖనం)
977 – [ 19 ] ( ضعيف ) (1/309)
وَعَنْ عُمَرَ بْنِ الْخَطَّابِ رضي الله عَنْه. أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم بَعَثَ بَعْثًا قَبْلَ نَجْدٍ فَغَنِمُوْا غَنَائِمُ كَثِيْرَةً. وَأَسْرَعُوْا الرَّجْعَةَ.فَقَالَ رَجُلٌ مِنَّا لَمْ يَخْرُجْ مَا رَأَيْنَا بَعْثًا أَسْرَعُ رَجْعَةً وَلَا أَفْضَلُ غَنِيْمَةً مِّنْ هَذَا الْبَعْثِ. فَقَالَ النَّبِيُّ صلى الله عليه وسلم: “أَلَا أَدُلُّكُمْ عَلَى قَوْمٍ أَفْضَلُ غَنِيْمَةً وَأَفْضَلُ رَجْعَةً؟ قَوْمًا شَهِدُوْا صَلَاةُ الصُّبْحِ ثُمَّ جَلَسُوْا يَذْكُرُوْنَ اللهَ حَتَّى طَلَعَتِ الشَّمْسُ أُوْلَئِكَ أَسْرَعُ رَجْعَةً وَأَفْضَلُ غَنِيْمَةً”. رَوَاهُ التِّرْمِذِيُّ. وَقَالَ هَذَا حَدِيْثٌ غَرِيْبٌ. وَحَمَادُ بْنُ أَبِيْ حُمَيْدِ هُوَضَعِيْفٌ فِيْ الْحَدِيْثِ.
977. (19) [1/309–బలహీనం]
’ఉమర్ (ర) కథనం: నజ్ద్ వైపు ఒక సైన్యాన్ని పంపారు. ఆ సైన్యం విజయం పొంది చాలా యుద్ధ ధనాన్ని పొందింది. ఇంకా చాలా త్వరగా వచ్చింది. ఆ సైన్యంలో వెళ్ళని మాలో ఒక వ్యక్తి, ఇంత త్వరగా ఇంత యుద్ధ ధనాన్నితెచ్చే సైన్యం వంటి సైన్యం నేను చూడనేలేదు,’ అని అన్నాడు. అది విన్న ప్రవక్త (స) అత్యధికంగా యుద్ధ ధనాన్ని తీసుకువచ్చే, ‘ఇంకా త్వరగా వచ్చే సైన్యం నేను నీకు చూపెట్టనా? అదేమిటంటే ఉదయం ఫజ్ర్ నమా’జుకు ‘హాజరై, కూర్చొని సూర్యోదయం వరకు దైవధ్యానం చేస్తూ ఉన్నవారు. వీరే తొందరగా తిరిగి వచ్చేవారు, ఇంకా అత్యధికంగా యుద్ధధనం పొందేవారు. అంటే వారికి పరలోక సంపద లభించింది. అదే శాశ్వతంగా ఉంటుంది,’ అని అన్నారు. (తిర్మిజి’)
=====
19- اَلْعَمْلُ فِيْ الصَّلَاةِ وَمَا يُبَاحُ مِنْهُ
19. నమా’జులో సమ్మత, అసమ్మత విషయాలు
నమా’జులోని ధర్మసమ్మతమైన విషయాలను ముబా‘హాతుస్సలాహ్ అంటారు. వీటిని చేయటం వల్ల నమా’జుకు ఏ మాత్రం నష్టం కలుగదు, నమా’జు అయిపోతుంది. నమా’జులోని నిషిధ్ధాలు రెండు రక