30. ప్రత్యేకతలు (మునాఖిబ్) | మిష్కాతుల్ మసాబీహ్

30- كِتَابُ الْمَنَاقِبِ

30. ప్రత్యేకతలు

—–

1 بَابُ مَنَاقِبِ قُرَيْشٍ وَذِكْرِ الْقَبَائِلِ

1. ఖురైష్మరియు ఇతర తెగల ప్రత్యేకతలు

اَلْفَصْلُ الْأَوَّلُ  మొదటి విభాగం   

5979 – [ 1 ] ( مُتَّفَقٌ عَلَيْهِ ) (3/1687)

عَنْ أَبِيْ هُرَيْرَةَ أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم قَالَ: “النَّاسُ تَبَعٌ لِقُرَيْشٍ فِيْ هَذَا الشَّأْنِ مُسْلِمُهُمْ تَبَعٌ لُمُسْلِمِهِمْ وَكَافِرُهُمْ تَبَعٌ لِكَافِرِهِمْ”. مُتَّفَقٌ عَلَيْهِ.

5979. (1) [3/1687 ఏకీభవితం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఇస్లామ్లో ప్రజలు ఖురైష్‌ నాయకత్వాన్ని అనుసరిస్తారు. సాధారణ ముస్లిములు ఖురైష్‌ ముస్లిములను అనుసరిస్తారు. ఇంకా సాధారణ అవిశ్వాసులు ఖురైష్‌ అవిశ్వాసుల్ని అనుసరిస్తారు.” (బు’ఖారీ, ముస్లిమ్‌)

5980 – [ 2 ] ( صحيح ) (3/1687)

وَعَنْ جَابِرٍ أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم قَالَ: “اَلنَّاسُ تَبَعٌ لِقُرَيْشٍ فِي الْخَيْرِ وَالشَّرِّ”. رَوَاهُ مُسْلِمٌ.  

5980. (2) [3/1687దృఢం]

జాబిర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మంచిలో చెడులో ప్రజలు ఖురైషులను అనుసరించాలి.” (ముస్లిమ్‌)

5981 – [ 3 ] ( مُتَّفَقٌ عَلَيْهِ ) (3/1687)

وَعَنِ ابْنِ عُمَرَ أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم قَالَ: “لَا يَزَالُ هَذَا الْأَمْرُ فِيْ قُرَيْشٍ مَا بَقِيَ مِنْهُمْ اِثْنَانِ”. مُتَّفَقٌ عَلَيْهِ.

5981. (3) [3/1687ఏకీభవితం]

ఇబ్నె ‘ఉమర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, పరి పాలన ఎల్లప్పుడూ ఖురైష్‌లోనే ఉంటుంది. చివరికి ప్రపంచంలో ఇద్దరు వ్యక్తులు ఉన్నాసరే. (బు’ఖారీ, ముస్లిమ్‌)

5982 – [ 4 ] ( صحيح ) (3/1687)

وَعَنْ مُعَاوِيَةَ قَالَ: سَمِعْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ: “إِنَّ هَذَا الْأَمْرُ فِيْ قُرَيْشٍ لَا يُعَادِيْهِمْ أَحَدٌ إِلَّا كَبَّهُ اللهُ عَلَى وَجْهِهِ مَا أَقَامُوا الدِّيْنَ”. روَاهُ الْبُخَارِيُّ.

5982. (4) [3/1687దృఢం]

ము’ఆవియహ్ (ర) కథనం: ప్రవక్త (స) ఇలా ప్రవచిస్తూ ఉండగా నేను విన్నాను, ”నిస్సందేహంగా పరిపాలన ఖురైష్‌ లలోనే ఉంటుంది. వారితో శత్రుత్వం వహించిన వారిని అల్లాహ్‌(త) తలక్రిందులుచేస్తాడు. అయితే వారు ధర్మాన్ని అనుసరిస్తున్నంత కాలం.” [1] (బు’ఖారీ)

5983 – [ 5 ] ( مُتَّفَقٌ عَلَيْهِ ) (3/1687)

وَعَنْ جَابِرِ بْنِ سَمُرَةَ قَالَ: سَمِعْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ: “لَا يَزَالُ الْإِسْلَامُ عَزِيْزًا إِلى اثْنَيْ عَشَرَ خَلِيْفَةً كُلُّهُمْ مِنْ قُرَيْشٍ”.

وَفِيْ رِوَايَةٍ: “لَا يَزَالُ أَمْرُ النَّاسِ مَاضِيًا مَا وَلِيَهُمْ اِثْنَا عَشَرَ رَجُلًا كُلُّهُمْ مِنْ قُرَيْشٍ”.

وَفِيْ رِوَايَةٍ: “لَا يَزَالُ الدِّيْنُ قَائِمًا حَتّى تَقُوْمُ السَّاعَةُ أَوْ يَكُوْنَ عَلَيْهِمْ اثْنَا عَشَرَ خَلِيْفَة كُلُّهُمْ مِنْ قُرَيْشٍ”. مُتَّفَقٌ عَلَيْهِ.

5983. (5) [3/1687 ఏకీభవితం]

జాబిర్‌ బిన్‌ సమురహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ఇలా ప్రవచిస్తూ ఉండగా విన్నాను, ”12 మంది ఖలీఫాల పరిపాలనా కాలం వరకు ఇస్లామ్‌ ఎల్లప్పుడూ ఆధిక్యత కలిగి ఉంటుంది. వీరందరూ ఖురైషుకు చెందిన వారై ఉంటారు.

మరో ఉల్లేఖనంలో ఎల్లప్పుడూ ప్రజల వ్యవహారాలు నడుస్తూ ఉంటాయి, 12 మంది వారిని పరిపాలిస్తారు. వీరందరూ ఖురైషులై ఉంటారు,  అని ఉంది.

మరో ఉల్లేఖనంలో ఈ ధర్మం ఎల్లప్పుడూ వర్థిల్లుతూ ఉంటుంది. చివరికి ప్రళయం సంభవిస్తుంది. లేదా మీపై 12 మంది ఖలీఫాలు పరిపాలిస్తారు. వీరందరూ ఖురైషులై  ఉంటారు.  (బు’ఖారీ, ముస్లిమ్‌)

5984 – [ 6 ] ( مُتَّفَقٌ عَلَيْهِ ) (3/1688)

وَعَنِ ابْنِ عُمَرَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “غِفَارٌ غَفَرَ اللهُ لَهَا. وَأَسْلَمَ سَالَمَهَا اللهُ وَعُصَيَّةُ عَصَتِ اللهَ وَرَسُوْلَهُ”. مُتَّفَقٌ عَلَيْهِ.

5984. (6) [3/1688 ఏకీభవితం]

ఇబ్నె ‘ఉమర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ‘ ‘గిఫ్ఫార్‌ తెగవారిని అల్లాహ్‌(త) క్షమించివేసాడు, ఇంకా అస్‌లమ్‌ తెగవారిని అల్లాహ్‌(త) అసహ్య కరమైన వాటి నుండి రక్షించాడు. అయితే ఉ’సయ్యహ్ అల్లాహ్‌కు ఆయన ప్రవక్త (స) కూ అవిధేయత చూపారు. (బు’ఖారీ, ముస్లిమ్‌)

5985 – [ 7 ] ( مُتَّفَقٌ عَلَيْهِ ) (3/1688)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: قَالَ رَسُوْلُ الله صلى الله عليه وسلم: “قُرَيْشُ وَالْأَنْصَارُ وَجُهَيْنَةُ وَمُزَيْنَةُ وَأَسْلَمُ وَغِفَارٌ وَأَشْجَعُ مَوَالِيَّ لَيْسَ لَهُمْ مَوْلَى دُوْنَ اللهِ ورَسُوْلِهِ”. مُتَّفَقٌ عَلَيْهِ.

5985. (7) [3/1688 ఏకీభవితం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఖురైషులు, అ’న్సార్‌, జుహైనహ్, ము’జైనహ్, అస్‌లమ్‌, ‘గిఫార్‌ మరియు అష్‌జ’అ తెగలవారు నా మిత్రులు. అల్లాహ్‌ (త) మరియు ఆయన ప్రవక్త తప్ప వారికి మిత్రులెవరూ లేరు.” (బు’ఖారీ, ముస్లిమ్‌)

5986 – [ 8 ] ( مُتَّفَقٌ عَلَيْهِ ) (3/1688)

وَعَنْ أَبِيْ بَكْرَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “أَسْلَمَ وَغِفَارٌ وَمُزَيْنَةُ وَجُهَيْنَةُ خَيْرٌ مِنْ بَنِيْ تَمِيْمٍ وَبَنِيْ عَامِرٍ وَالْحَلِيَفَيْنِ بَنِيْ أَسْدٍ وَغَطْفَانَ”. مُتَّفَقٌ عَلَيْهِ .

5986. (8) [3/1688ఏకీభవితం]

అబూ బక్‌ర (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”అస్లమ్‌, ‘గిఫార్‌, ము’జైనహ్‌, జుహైనహ్ మొదలైనవి, బనూ తమీమ్‌, బనూ ‘ఆమిర్‌ వారి మిత్రులు బనూ అసద్, ‘గిత్‌ఫాన్‌ కంటే ఉత్తమమైనవి. (బు’ఖారీ, ముస్లిమ్‌)

5987 – [ 9 ] ( مُتَّفَقٌ عَلَيْهِ ) (3/1688)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: “مَا زِلْتُ أُحِبُّ بَنِيْ تَمِيْمٍ مُنْذُ ثَلَاثٍ سَمِعْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ: فِيْهِمْ سَمِعْتُهُ يَقُوْلُ: “هُمْ أَشَدُّ أُمَّتِيْ عَلَى الدَّجَّالِ”. قَالَ: وَجَاءَتْ صَدَقَاتُهُمْ فَقَالَ رَسُوْلُ الله صلى الله عليه وسلم: “هَذِهِ صَدَقَاتُ قَوْمِنَا”. وَكَانَتْ سَبِيَّةٌ مِنْهُمْ عِنْدَ عَائِشَةَ فَقَالَ: “اَعْتِقِيْهَا فَإِنَّهَا مِنْ وُلْدِ إِسْمَاعِيْلَ”. مُتَّفَقٌ عَلَيْهِ .

5987. (9) [3/1688 ఏకీభవితం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: బనూ తమీమ్‌ మూడు విశేషాలను ప్రవక్త (స) ప్రస్తావించినప్పటి నుండి నేను వారిని ప్రేమిస్తున్నాను. ప్రవక్త (స) వారి గురించి, ”నా అనుచర సమాజంలో ఈ తెగవారు దజ్జాల్‌కు వ్యతిరేకంగా ఎదురొడ్డి పోరాడుతారు,” అని అన్నారు. ఇంకా వీరి తరఫున దాన ధర్మాలు వస్తే, ‘ఇవి మా దానధర్మాలు’ అని అన్నారు. ఇంకా ‘ఆయి ‘షహ్‌ (ర) వద్ద, బనీ తమీమ్‌కు చెందిన ఒక ఖైదీ స్త్రీ ఉండేది. ప్రవక్త (స), ” ‘ఆయి’షహ్‌! ఈమెను విడుదల చేసి వేయి. ఎందుకంటే ఈమె ఇస్మా’యీల్‌ (అ) సంత తికి చెందినది,” అని అన్నారు. (బు’ఖారీ, ముస్లిమ్‌)

—–

اَلْفَصْلُ الثَّانِيْ రెండవ విభాగం   

5988 – [ 10 ] ( لم تتم دراسته ) (3/1688)

عَنْ سَعْدٍ عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ: “مَنْ يُرِدُ هَوَانَ قُرَيْشٍ أَهَانَهُ اللهُ”. رَوَاهُ التِّرْمِذِيُّ .

5988. (10) [3/1688 అపరిశోధితం]

స’అద్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఖురైషులను అవమానరచ ఉద్దేశించే వ్యక్తిని అల్లాహ్‌ (త) అవమాన పరుస్తాడు.” (తిర్మిజి’)

5989- [ 11 ] ( حسن صحيح ) (3/1688)

وَعَنِ ابْنِ عَبَّاسٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “اَللّهُمَّ أَذَقْتَ أَوَّلَ قُرَيْشٍ نَكَالًا. فَأَذِقْ آخِرَهُمْ نَوَالًا”. رَوَاهُ التِّرْمِذِيُّ.

5989. (11) [3/1688 ప్రామాణికం, దృఢం]

ఇబ్నె ‘అబ్సాస్‌ (ర) కథనం: ప్రవక్త (స) ఇలా ప్రార్థించారు, ”ఓ అల్లాహ్‌! ఖురైషుల్లోని మొదటి తరం వారికి నీ  శిక్షను రుచి చూపించావు. ఇప్పుడు వారి చివరితరం వారికి నీ దయాదాక్షిణ్యాల, అనుగ్రహాల రుచి చూపించు.” (తిర్మిజి’)  

5990 – [ 12 ] ( ضعيف ) (3/1689)

وعَنْ أَبِيْ عَامِرٍ الْأَشْعَرِيِّ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “نِعْمَ الْحَيُّ الْأَسْدُ وَالْأَشْعَرُوْنَ لَا يَفِرُّوْنَ فِي الْقِتَالِ. وَلَا يَغُلُّوْنَ هُمْ مِنِّيْ وَأَنَا مِنْهُمْ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَقَالَ: هَذَا حَدِيْثٌ غَرِيْبٌ

5990. (12) [3/1689 బలహీనం]

అబూ ‘ఆమిర్‌ అష్‌’అరీ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”అస్‌అద్‌ మరియు అష్‌’అరీ తెగలు చాలా మంచి తెగలు. వీళ్ళు యుద్ధమైదానం నుండి పారిపోరు, ఇంకా యుద్ధ ధనంలో నమ్మక ద్రోహం చేయరు. వారు నా మార్గం పై ఉన్నారు. నేను వారి మిత్రుణ్ణి.” (తిర్మిజి’ / ఏకోల్లేఖనం)

5991 – [ 13 ] ( ضعيف ) (3/1689)

وعَنْ أَنَسٍ قَالَ: قَالَ رَسُوْلُ الله صلى الله عليه وسلم: “اَلْأَزْدُ أَزْدُ اللهِ فِيْ الْأَرْضِ يُرِيْدُ النَّاسُ أَنْ يَضَعُوْهُمْ وَيَأْبى اللهُ إِلَّا أَنْ يَرْفَعَهُمْ وَ لَيَأْتِيَنَّ عَلَى النَّاسِ زَمَانٌ. يَقُوْلُ الرَّجُلُ: يَا لَيْتَ أَبِيْ كَانَ أَزْدِيًا وَيَا لَيْتَ أُمِّيْ كَانَتْ أَزْدِيَةً” .رَوَاهُ التِّرْمِذِيُّ وَقَالَ: هَذَا حَدِيْثٌ غَرِيْبٌ.

5991. [3/1689 బలహీనం]

(13) అనస్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”అ’జ్ద్‌ద్ తెగవారు భూమిపై అల్లాహ్‌(త) సైన్యం వంటివారు. ప్రజలు వీరిని అవమానానికి గురి చేయాలని ప్రయత్నిస్తున్నారు. అయితే అల్లాహ్‌ (త) వీరికి గౌరవం, ఔన్నత్యం ప్రసాదించ గోరు తున్నాడు. నిస్సందేహంగా ప్రజలపై ఒక కాలం రాబోతుంది. అప్పుడు ప్రజలు ”మా తల్లిదండ్రులు అ’జ్ద్‌ద్ తెగవారై ఉంటే ఎంత బాగుండు” అని చెప్పుకుంటూ ఉంటారు. (తిర్మిజి’  –  ఏకోల్లేఖనం)

5992 – [ 14 ] ( ضعيف ) (3/1689)

وعَنْ عِمْرَانَ بْنِ حُصَيْنٍ قَالَ: مَاتَ النَّبِيُّ صلى الله عليه وسلم وَهُوَ يَكْرَهُ ثَلَاثَةَ أَحْيَاءٍ: ثَقِيْفٍ وَبَنِيْ حَنِيْفَةَ وَبَنِيْ أُمَيَّةَ. رَوَاهُ التِّرْمِذِيُّ وَقَالَ: هَذَا حَدِيْثٌ غَرِيْبٌ.

5992. (14) [3/1689 బలహీనం]

‘ఇమ్రాన్‌ బిన్‌ ‘హు’సైన్‌ (ర) కథనం: ప్రవక్త (స) మరణించటానికి ముందు మూడు తెగలను అంటే బనూ స’ఖీఫ్‌, బనూ ‘హనీఫహ్, బనూ ఉమయ్యహ్లను మంచి తెగలుగా భావించేవారు కారు.” (తిర్మిజి’ – ఏకోల్లేఖనం)

5993 – [ 15 ] ( لم تتم دراسته ) (3/1689)

وعَنِ ابْنِ عُمَرَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “فِيْ ثَقِيْفٍ كَذَّابٌوَمُبيْرٌ”. قَالَ عَبْدُ اللهِ بْنِ عَصْمَةُ يُقَالُ: اَلْكَذَّابُ هُوَ الْمُخْتَارُ بْنُ أَبِيْ عُبَيْدٍ وَالْمُبِيْرُ هُوَ الْحَجَّاجُ بْنُ يُوْسَفَ. وَقَالَ هَشّامُ بْنُ حَسَّانٍ: أَحْصَوْا مَا قَتَلَ الْحَجَّاجُ صَبْرًا فَبَلَغَ مِائَةَ أَلْفٍ وَعِشْرِيْنَ أَلْفًا. رَوَاهُ التِّرْمِذِيُّ.

5993. (15) [3/1689అపరిశోధితం]

ఇబ్నె ‘ఉమర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”సఖీఫ్‌ తెగలో ఒక పరమ అబద్ధాల రాయుడు ఉంటాడు, ఇంకా ఒక పరమ దుర్మార్గుడు, పాపాత్ముడు ఉంటాడు.” ఉల్లేఖనకర్త, ‘ఆ అబద్ధాల రాయుడు ముఖ్తార్‌ బిన్‌ ‘ఉబైద్‌, పరమ దుర్మార్గుడు, పాపాత్ముడు ‘హజ్జాజ్‌ బిన్‌ యూసుఫ్‌,’ అని అన్నారు. హిషామ్‌ బిన్‌ ‘హస్సాన్‌ అన్నారు, ” ‘హజ్జాజ్‌ బిన్‌ యూసుఫ్‌ జైలులో వేయించి చంపిన వారి సంఖ్య లక్షా, ఇరవై వేలు ఉంటుందని.” (తిర్మిజి’)

5994 – [ 16 ] ( صحيح ) (3/1689)

وَرَوَى مُسْلِمٌ فِيْ “الصَّحِيْحِ” حِيْنَ قَتَلَ الْحَجَّاجُ عَبْدَ اللهِ بْنِ الزُّبَيْرِ قَالَتْ أَسْمَاءُ: إِنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم حَدَّثَنَا “أَنَّ فِيْ ثَقِيْفٍ كَذَّابًا وَمُبِيْرًا”. فَأَمَّا الْكَذَّابُ فَرَأَيْنَاهُ وَأَمَّا الْمُبِيْرُ فَلَا إِخَالُكَ إِلَّا إِيَّاهُ. وَسَيَجِيْءُ تَمَامُ الْحَدِيْثِ فِي الْفَصْلِ الثَّالِثِ.

5994. (16) [3/1689 దృఢం]

ముస్లిమ్‌ తన సహీ ముస్లిమ్‌లో ఇలా పేర్కొన్నారు: ” ‘హజ్జాజ్‌ బిన్‌ యూసుఫ్‌ ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘జుబైర్‌ను చంపాడు. అతని తల్లియైన అస్మా (ర), ”సఖీఫ్‌ తెగలో ఒక పరమ అబద్ధాలకోరు జన్మిస్తాడని, ఒక పాపాత్ముడు, దుర్మార్గుడు జన్మిస్తాడని ప్రవక్త(స) మాకు తెలియ పరిచారు. అయితే పరమ అబద్ధాలకోరును మేము చూస్తు న్నాము. మిగిలింది దుర్మార్గుడైన పాపాత్ముడు, ఓ ‘హజ్జాజ్‌  అది  నువ్వే,” అని  అన్నారు.

5995 – [ 17 ] ( لم تتم دراسته ) (3/1690)

وَعَنْ جَابِرٍ قَالَ: قَالُوْا: يَا رَسُوْلَ اللهِ أَحْرَقَتْنَا نَبَالُ ثَقِيْفٍ فَادْعُ اللهَ عَلَيْهِمْ. قَالَ: “اَللّهُمَّ اهْدِ ثَقِيْفًا”. رَوَاهُ التِّرْمِذِيُّ.

5995. (17) [3/1690 అపరిశోధితం]

జాబిర్‌ (ర) కథనం: ప్రవక్త (స) అనుచరులు, ”ఓ ప్రవక్తా! మమ్మల్ని స’ఖీఫ్‌ తెగవారి బాణాలు మాడ్చి వేసాయి, వారికి వ్యతిరేకంగా అల్లాహ్‌(త)ను ప్రార్థించండి,” అని విన్నవించుకున్నారు. అప్పుడు ప్రవక్త (స) ఓ అల్లాహ్‌ (త)! స’ఖీఫ్‌ తెగ వారికి రుజుమార్గ భాగ్యం ప్రసాదించు అని ప్రార్థించారు. (తిర్మిజి’)

5996 – [ 18 ] ( ضعيف ) (3/1690)

وعَنْ عَبْدِ الرَّزَّاقِ عَنْ أَبِيْهِ عَنْ مِيْنَاءِ عَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: كُنَّا عِنْدَ النَّبِيِّ صلى الله عليه وسلم. فَجَاءَ رَجُلٌ أَحْسِبُهُ مِنْ قَيْسٍ فَقَالَ: يَا رَسُوْلَ اللهِ اِلْعَنْ حَمِيْرًا فَأَعْرَضَ عَنْهُ ثُمَّ جَاءَهُ مِنَ الشِّقِّ الْآخَرِ فَأَعْرَضَ عَنْهُ ثُمَّ جَاءَهُ مِنَ الشِّقِّ الْآخَرِ فَأَعْرَضَ عَنْهُ. فَقَالَ النَّبِيُّ صلى الله عليه وسلم: “رَحِمَ اللهُ حَمِيْرًا أَفْوَاهُهُمْ سَلَامٌ وَأَيْدِيْهِمْ طَعَامٌ وَهُمْ أَهْلُ أَمْنٍ وَإِيْمَانٍ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَقَالَ: هَذَا حَدِيْثٌ غَرِيْبٌ لَا نَعْرِفُهُ إِلَّا مِنْ حَدِيْثِ عَبْدِ الرَّزَّاقِ وَيُرْوَى عَنْ مِيْنَاءِ هَذَا أَحَادِيْثُ مَنَاكِيْرُ.

5996. (18) [3/1690 బలహీనం]

‘అబ్దుర్రజ్జాఖ్‌ తన తండ్రి ద్వారా, అతడు మీనాఅ’ ద్వారా, అతడు అబూ హురైరహ్‌ (ర) ద్వారా కథనం: మేము ప్రవక్త (స) వద్ద కూర్చొని ఉన్నాము. ప్రవక్త(స) వద్దకు ఒక వ్యక్తి వచ్చాడు. అతడు ఖైస్‌ తెగకు చెందినవాడు. అతడు, ‘ఓ దైవ ప్రవక్తా(స)! తమరు ‘హమీర్‌ తెగవారిని శపించండి,’ అని అన్నాడు. అది విన్న ప్రవక్త (స) అతని వైపునుండి తల త్రిప్పు కున్నారు. ఆ వ్యక్తి మరో వైపు నుండి వచ్చాడు. ప్రవక్త (స) మళ్ళీ తలత్రిప్పుకున్నారు. ఆ వ్యక్తి మళ్ళీ మరోవైపు నుండి వచ్చాడు. ప్రవక్త (స) మళ్ళీ తల త్రిప్పుకున్నారు. ఇంకా  ఓ అల్లాహ్‌(త)! ‘హమీర్‌ తెగ వారిని కనికరించు, వారి నోరు శాంతి వచనాలు కురిపిస్తుంది, వారి చేతులు అన్నం పెట్టేవి, ఇంకా వారు శాంతీ, విశ్వాసాలు గలవారు,” అని అన్నారు. (తిర్మిజి’ – ఏకోల్లేఖనం – తిరస్కృతం).

‘ఇంకా ఇది మాకు కేవలం ‘అబ్దుర్రజ్జాఖ్‌ ద్వారా మాత్రమే  తెలుసు’  అని  అన్నారు.

5997 – [ 19 ] ( صحيح ) (3/1690)

وعَنْهُ قَالَ: قَالَ لِيَ النَّبِيُّ صلى الله عليه وسلم: “مِمَّنْ أَنْتَ؟ قُلْتُ: مِنْ دَوْسٍ. قَالَ: “مَا كُنْتُ أَرَى أَنَّ فِيْ دَوْسٍ أَحَدًا فِيْهِ خَيْرٌ”. رَوَاهُ التِّرْمِذِيُّ.  

5997. (19) [3/1690 దృఢం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) నన్ను, ‘నీవు ఏ తెగకు చెందినవాడవు,’ అని అడిగారు. నేను, ‘దౌస్‌ తెగకు చెందిన వాడినని, అన్నాను. దానికి ప్రవక్త (స) ”దౌస్‌ తెగలో ఇటువంటి మంచి వ్యక్తి ఉంటాడని నాకు అనుమానం కూడా ఉండేది కాదు.” (తిర్మిజి’)

5998 – [ 20 ] ( ضعيف ) (3/1690)

وعَنْ سَلْمَانَ قَالَ: قَالَ لِيْ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَا تَبْغُضْنِيْ فَتُفَارِقَ دِيْنَكَ”. قُلْتُ: يَا رَسُوْلَ اللهِ كَيْفَ أَبْغُضُكَ وَبِكَ هَدَانَا اللهُ؟ قَالَ: “تَبْغُضُ الْعَرَبَ فَتَبْغُضَنِيْ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَقَالَ: هَذَا حَدِيْثٌ حَسَنٌ غَرِيْبٌ

5998. (20) [3/1690బలహీనం]

సల్మాన్‌ (ర) కథనం: ఒకరోజు ప్రవక్త (స) నాతో, ”నాతో శత్రుత్వం పెట్టుకోకు, నీ ధర్మానికి దూరమై పోతావు,” అని అన్నారు. దానికి నేను, ”ఓ ప్రవక్తా! నేను మీతో శత్రుత్వం ఎలా పెట్టుకోగలను? మీ వల్లే అల్లాహ్‌(త) మాకు రుజుమార్గం చూపాడు,” అని విన్నవించు కున్నాను. దానికి ప్రవక్త (స), ‘నువ్వు అరబ్బులతో శత్రుత్వం పెట్టుకుంటే, నాతో శత్రుత్వం పెట్టుకున్నట్టే,’ అని అన్నారు.  (తిర్మిజి’ –  ప్రామాణికం – ఏకోల్లేఖనం)

5999 – [ 21 ] ( موضوع ) (3/1690)

وَعَنْ عُثْمَانَ بْنِ عَفَّانَ قَالَ: قَالَ رَسُوْلُ الله صلى الله عليه وسلم: “مَنْ غَشَّ الْعَرَبَ لَمْ يَدْخُلْ فِيْ شَفَاعَتِيْ وَلَمْ تَنَلْهُ مَوَدَّتِيْ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَقَالَ: هذَا حَدِيْثٌ غَرِيْبٌ لَا نَعْرِفُهُ إِلَّا مِنْ حَدِيْثِ حُصَيْنِ بْنِ عُمَرَ وَلَيْسَ هُوَ عِنْدَ أَهْلِ الْحَدِيْثِ بِذَاكَ الْقَوِيُّ.

5999. (21) [3/1690 కల్పితం] 

‘ఉస్మాన్‌ బిన్‌ ‘అఫ్ఫాన్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”అరబ్బుల పట్ల మోసం, ద్రోహం తలపెట్టే వాడు, నా సిఫారసుకు అర్హుడు కాడు, నా ప్రేమకు అర్హుడు కాడు.” (తిర్మిజి’-524 – ఏకోల్లేఖనం, అల్‌బానీ 545 – ‘దయీఫ్)

6000 – [ 22] ( ضعيف ) (3/1691)

وعَنْ أُمِّ حَرِيْرِ مَوْلَاةِ طَلْحَةَ بْنِ مَالِكٍ قَالَتْ: سَمِعْتُ مَوْلَايَ يَقُوْلُ: قَالَ رَسُوْلُ الله صلى الله عليه وسلم يَقُوْلُ: “مِنِ اقْتِرَابِ السَّاعَةِ هَلَاكُ الْعَرَبِ”. رَوَاهُ التِّرْمِذِيُّ.

6000. (22) [3/1691 బలహీనం]

తల్‌’హా బిన్‌ మాలిక్‌ యొక్క బానిసరాలు ఉమ్ముల్‌ ‘హరీర్‌ కథనం: మా యజమాని ‘తల్‌’హా బిన్‌ మాలిక్‌ ఇలా అంటూ ఉండగా నేను విన్నాను, ”ప్రవక్త (స) ప్రవచనం, ప్రళయచిహ్నాల్లో ఒక చిహ్నం అరబ్బులు నశించటం.”  (తిర్మిజి’)

6001 – [ 23 ] ( موقوف ) (3/1691)

وعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: قَالَ رَسُوْلُ الله صلى الله عليه وسلم: “اَلْمُلْكُ فِي قُرَيْشٍ وَالْقَضَاءُ فِي الْأَنْصَارِ .وَالْأَذَانُ فِي الْحَبَشَةِ وَالْأَمَانَةُ فِي الْأَزْدِ” .يَعْنِي الْيَمَنُ.

وَفِيْ رِوَايَةٍ مَوْقُوْفًا. رَوَاهُ التِّرْمِذِيُّ وقَالَ: هَذَا أَصَحُّ

6001. (23) [3/1691సహచరుని  ప్రోక్తం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ” ‘ఖిలాఫత్‌, అధికారం ఖురైష్‌లో ఉంటుంది. న్యాయం అ’న్సారుల్లో ఉంటుంది, అ’జాన్‌ హబషీల్లో ఉంటుంది, నిజాయితీ అ’జ్‌ద్‌ అంటే యమన్‌కు చెందిన వారిలో ఉంటుంది.

మరో ఉల్లేఖనంలో ఈ ‘హదీసు’ను  (అబూ హురైరహ్‌ – సహచరుని  ప్రోక్తం, తిర్మిజి’ – దృఢం).

—–

اَلْفَصْلُ الثَّالِثُ మూడవ విభాగం   

6002 – [ 24 ] ( صحيح ) (3/1691)

عَنْ عَبْدِ اللهِ بْنِ مُطِيْعٍ عَنْ أَبِيْهِ قَالَ: سَمِعْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ: يَوْمَ فَتْحِ مَكَّةَ “لَا يُقْتَلُ قُرَشِيٌّ صَبْرًا بَعْدَ هَذَا الْيَوْمِ إِلى يَوْمِ الْقِيَامَةِ”. رَوَاهُ مُسْلِمٌ.

6002. (24) [3/1691దృఢం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ము’తీ’అ తన తండ్రి ద్వారా కథనం: ”ప్రవక్త (స) మక్కహ్ విజయం నాడు ఇలా ప్రవచిస్తుండగా విన్నాను, ఈనాటి నుండి తీర్పుదినం వరకు ఖురైష్‌కు చెందిన ఏ వ్యక్తిని బంధించి చంపటం జరుగదు.” (ముస్లిమ్‌)

6003 – [ 25 ] ( صحيح ) (3/1691)

وعَنْ أَبِيْ نَوْفَلٍ مُعَاوِيَةَ بْنِ مُسْلِمٍ قَالَ: رَأَيْتُ عَبْدَ اللهِ بْنِ الزُّبَيْرِ عَلَى عَقَبَةِ الْمَدِيْنَةِ. قَالَ: فَجَعَلَتْ قُرَيْشٌ تَمُرُّ عَلَيْهِ وَالنَّاسُ حَتّى مَرَّ عَلَيْهِ عَبْدُ اللهِ بْنُ عُمَرَ فَوَقَفَ عَلَيْهِ فَقَالَ: السَّلَامُ عَلَيْكَ أَبَا  خُبَيْبٍ السَّلَامُ عَلَيْكَ أَبَا خُبَيْبٍ السَّلَامُ عَلَيْكَ أَبَا خُبَيْبٍ. أَمَّا وَاللهِ لَقَدْ كُنْتُ أَنْهَاكَ عَنْ هَذَا أَمَّا وَاللهِ لَقَدْ كُنْتُ أَنْهَاكَ عَنْ هَذَا أَمَا وَاللهِ لَقَدْ كُنْتُ أَنْهَاكَ عَنْ هَذَا أَمَا وَاللهِ إِنْ كُنْتَ مَا علمتُ صَوَّامًا قَوَّامًا وَصُوْلًا لِلرَّحِمِ. أَمَا وَاللهِ لَأُمَّةُ أَنْتَ شَرُّهَا لَأُمَّةُ سَوْءٍ –

وَفِيْ رِوَايَةٍ لَأُمَّةُ خَيْرٍ – ثُمَّ نَفَذَ عَبْدُ اللهِ بْنِ عُمَرَ فَبَلَغَ الْحَجَّاجَ مَوْقِفُ عَبْدِ اللهِ وَقَوْلُهُ فَأَرْسَلَ إِلَيْهِ فَأَنْزَلَ عَنْ جَذْعِهِ فَألْقِيَ فِيْ قُبُوْرِ الْيَهُوْدِ ثُمَّ أَرْسَلَ إِلى أُمِّهِ أَسْمَاءَ بِنْتِ أَبِيْ بَكْرٍ فَأَبَتْ أَنْ تَأْتِيَهُ فَأَعَادَ عَلَيْهَا الرَسُوْل لَتَأْتِيَنِيْ أَوْ لَأَبْعَثَنَّ إِلَيْكِ مَنْ يَسْحَبُكِ بِقُرُوْنِكِ. قَالَ: فَأَبَتْ وَقَالَتْ: وَاللهِ لَا آتِيْكَ حَتّى تَبْعَثَ إِلَيَّ مَنْ يَسْحَبُنِيْ بِقُرُوْنِيْ. قَالَ: فَقَالَ: أَرُوْنِيْ سِبْتَيُ فَأَخَذَ نَعْلَيْهِ ثُمَّ انْطَلَقَ يَتَوَذَّفُ حَتّى دَخَلَ عَلَيْهَا فَقَالَ: كَيْفَ رَأَيْتِنِيْ صَنَعْتُ بِعَدُوِّ اللهِ؟ قَالَتْ: رَأَيْتُكَ أَفْسَدْتَ عَلَيْهِ دُنْيَاهُ وَأَفْسَدَ عَلَيْكَ آخِرَتَكَ بَلَغَنِيْ أَنَّكَ تَقُوْلُ لَهُ: يَا ابْنَ ذَاتِ النَّطَاقَيْنِ. أَنَا وَاللهِ ذَاتَ النَّطَاقَيْنَ أَمَّا أَحَدُهُمَا فَكُنْتُ أَرْفَعُ بِهِ طَعَامَ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم وَطَعَامَ أَبِيْ بَكْرِ مِنَ الدَّوَابِ وَأَمَّا الْآخَرُ فَنَطَاقُ الْمَرْأَةِ الَّتِيْ لَا تَسْتَغْنِيْ عَنْهُ أَمَا إِنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم حَدَّثَنَا: “أَنَّ فِيْ ثَقِيْفٍ كَذَّابًا وَمُبِيْرًا”. فأَمَّا الْكَذَّابُ فَرَأَيْنَاهُ وَأَمَّا الْمُبِيْرُ فَلَا إِخَالُكَ إِلَّا إِيَّاهُ. قَالَ فَقَامَ عَنْهَا وَلَمْ يُرَاجِعُهَا. رَوَاهُ مُسْلِمٌ.

6003. (25) [3/1691దృఢం]

అబూ నౌఫిల్‌, ము’ఆవియహ్‌ బిన్‌ ముస్లిమ్‌ కథనం: ‘అబ్దుల్లాహ్‌ బిన్‌’జుబైర్‌ను నేను మదీనహ్ కొండపై చూచాను. అతన్ని శిలువపై వ్రేలాడగట్టబడి ఉంది. ఖురైషులకు చెందిన వారు, ఇతరులు అతని ప్రక్క నుండి వెళుతున్నారు. ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘ఉమర్‌ కూడా అతనికి సమీపంగా వెళుతూ నిలబడి మూడుసార్లు అస్సలాము అలైక యా అబా ఖుబైబ్‌! అల్లాహ్ సాక్షి! దీన్నుండి నేను నిన్ను వారించేవాడ్ని,  అల్లాహ్ సాక్షి! దీన్నుండి నేను నిన్ను వారించే వాడ్ని,  అల్లాహ్ సాక్షి! దీన్నుండి నేను నిన్ను వారించేవాడ్ని (అంటే ఖిలాఫత్‌, అధికారాల నుండి). అల్లాహ్ సాక్షి! నాకు తెలిసినంత వరకు నువ్వు ఉపవాసాలు పాటించేవాడివి, రాత్రిళ్ళు ఆరాధించేవాడివి, బంధుత్వ సంబంధాలను కలిపేవాడివి. అల్లాహ్ సాక్షి! నిన్ను అపార్థం చేసుకున్న వారు చాలా చెడ్డవారు.

మరో ఉల్లేఖనంలో విమర్శగా వారు మంచివారు అని ఉంది. ఆ తరువాత ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘ఉమర్‌ వెళ్ళి పోయారు. ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘ఉమర్‌ అక్కడ నిలబడి ఇలా అన్నారని ‘హజ్జాజ్‌కు తెలిసింది. అనంతరం ‘హజ్జాజ్‌, ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘జుబైర్‌ శవాన్ని అక్కడి నుండి తీసి యూదుల స్మశానంలో  పారవేయించాడు. ఆ తరువాత ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘జుబైర్‌ తల్లిగారు అస్మా బిన్‌తె అబూ బకర్‌ వద్దకు ఒక వ్యక్తిని పంపి ‘హజ్జాజ్‌ వద్దకు రమ్మని కబురుపంపాడు. కాని ఆమె నిరాకరించింది. ‘హజ్జాజ్‌  మళ్ళీ మనిషిని, ”నువ్వు తప్పకుండా నా దగ్గరకు రావాలి, లేదా నీ దగ్గరకు ఎటువంటి వ్యక్తుల్ని  పంపుతానంటే వాళ్ళు నీ జుత్తు పట్టి ఈడ్చుకు వస్తారు,” అని కబురు పంపాడు, అప్పుడు అస్మా (ర), ”నా జుత్తు పట్టుకొని ఈడ్చేవరకు నేను నీ దగ్గరకు రాను,” అని కబురు పంపింది.

అప్పుడు ‘హజ్జాజ్‌ ఆగ్రహం చెంది, నా చెప్పులు తీసుకురండి అని చెప్పులు ధరించి సిద్ధమై గర్వంగా నడుస్తూ, అస్మా (ర) వద్దకు వచ్చి, ”అల్లాహ్ సాక్షి! నేను అల్లాహ్‌ (త) శత్రువులతో ఎలా వ్యవహ రించానో, నువ్వు చూసావు కదా!” అని అన్నాడు. దానికి అస్మా (ర), ”నువ్వు ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘జుబైర్‌ ప్రపంచాన్ని నాశనం చేసావు, అతడు నీ పరలోకాన్ని నాశనం చేసాడు, నువ్వు ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘జుబైర్‌ను రెండు ఓణీల దాని కొడుకువు, అని అనేవాడివని ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘జుబైర్‌ చెప్పేవాడు. నిస్సందేహంగా నేను రెండు ఓణీల దాన్నే. ఒక ఓణీతో ప్రవక్త (స), అబూ బకర్‌ల భోజానాన్ని జంతువుల నుండి కాపాడేదాన్ని, రెండవ దాన్ని నడుముకు కట్టుకునే దాన్ని. అది లేకుండా ఏ స్త్రీ ఉండలేదు. అంతేకాదు, ఇది కూడా గుర్తుంచుకో, ప్రవక్త (స) మాకు సఖీఫ్‌ తెగలో ఒక పరమ అబద్ధాలకోరు జన్మిస్తాడని, ఇంకా ఒక దుర్మార్గుడు, పాపాత్ముడు జన్మిస్తాడని ప్రవచించారు. ఆ పరమ అబద్ధాలకోరును మేము చూసి ఉన్నాము, మరి నీ గురించి మా అభిప్రాయం ఏమిటంటే ఆ దుర్మార్గుడు, పాపాత్ముడు నీవే,” అని పలికారు. ఈ మాటలు విని ఏమీ అనకుండా ‘హజ్జాజ్‌ లేచి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. (ముస్లిమ్‌)

6004 – [ 26 ] ( صحيح ) (3/1692)

وعَنْ نَافِعِ اَنَّ ابْنَ عُمَرَأَتَاهُ رَجُلَانِ فِيْ فِتْنَةِ ابْنِ الزُّبَيْرِفَقَالَا: إِنَّ النَّاسَ صَنَعُوْا مَا تَرَى وَأَنْتَ ابْنُ عُمَرَ وَصَاحِبُ رَسُوْلُ الله صلى الله عليه وسلم. فَمَا يَمْنَعُكَ أَنْ تَخْرُجَ؟ فَقَالَ: يَمْنَعُنِيْ أَنَّ اللهَ حَرَّمَ دَمَ أَخِي الْمُسْلِمِ. قَالَا: أَلَمْ يَقُلِ اللهُ: [وَقَاتِلُوْهُمْ حَتّى لَا تَكُوْنَ فِتْنَةٌ ؛ 2: 193]. فَقَالَ ابْنُ عُمَرَ: قَدْ قَاتَلْنَا حَتّى لَمْ تَكُنْ فِتْنَةٌ وَكَانَ الدِّيْنُ لِلّهِ وَأَنْتُمْ تُرِيْدُوْنَ أَنْ تُقَاتِلُوْا حَتّى تَكُوْنَ فِتْنَةٌ وَيَكُوْنَ الدِّيْنُ لِغَيْرِ اللهِ. روَاهُ الْبُخَارِيُّ

6004. (26) [3/1692 దృఢం]

నాఫె’అ (ర) కథనం: ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘జుబైర్‌ ఉపద్రవ కాలంలో ఇద్దరు వ్యక్తులు ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘ఉమర్‌ వద్దకు వచ్చి, ‘ప్రజలు చేసింది మీరు చూసారు. మీరు ‘ఉమర్‌ (ర) కుమారులు, ప్రవక్త (స) అనుచరులు మరి మీరెందుకు ఇందులో స్పందించ లేదు,’ అని అడిగారు. అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘ఉమర్‌ (ర) అది విని, ”అల్లాహ్‌ (త) ఒక ముస్లిమ్‌ రక్తాన్ని చిందించటం నా కోసం నిషిద్ధం చేసాడు,” అని అన్నారు. దానికి వారిద్దరూ, ‘మరి అల్లా కల్లోలం పరిష్కరించబడేవరకు పోరాడండి, అని ఆదేశించాడు కదా,’ అని అన్నారు. దానికి ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘ఉమర్‌, ”నిస్సందేహంగా మేము పోరాడాము, కల్లోలాలు అంటే అవిశ్వాసం, విగ్రహారాధన తొలగి పోయాయి. ఇప్పుడు కేవలం అల్లాహ్‌ (త) జీవన వ్యవస్థ మాత్రమే మిగిలి ఉంది. ఇప్పుడు మీరు పోరాడి కల్లోలాన్ని వ్యాపింపజేయగోరుతున్నారా? అల్లాహ్‌ (త)  ధర్మానికి బదులు మానవులధర్మం వ్యాపించా లని  కోరుతున్నారా? ” అని  అడిగారు. (బు’ఖారీ)

6005 – [ 27] ( مُتَّفَقٌ عَلَيْهِ ) (3/1693)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: جَاءَ الطُّفَيْلُ بْنُ عَمْرٍو الدَّوْسِيُّ إِلى رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم. فقَالَ: إِنَّ دَوْسًا قَدْ هَلَكَتْ عَصَتْ وَأَبَتْ فَادْعُ اللهَ عَلَيْهِمْ فَظَنَّ النَّاسُ أَنَّهُ يَدْعُوْ عَلَيْهِمْ فَقَالَ: “اَللّهُمَّ اهْدِ دَوْسًا وَأْتِ بِهِمْ”. مُتَّفَقٌ عَلَيْهِ.

6005. (27) [3/1693ఏకీభవితం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ‘తుఫైల్‌ బిన్‌ ‘అమ్ర్‌ దోసీ ప్రవక్త (స) వద్దకు వచ్చారు. ”దౌస్‌ తెగవారు నాశనం అయ్యారని, అవిధేయత చూపారని, తిరస్కరించారని, తమరు వారిని శపించమని,” కోరారు. ప్రవక్త (స) దౌస్‌ తెగవారిని శపిస్తారని అందరూ అనుకున్నారు. కాని ప్రవక్త (స), ”ఓ అల్లాహ్‌! దౌస్‌ తెగవారికి సన్మార్గం ప్రసాదించు,” అని ప్రార్థించారు. (బు’ఖారీ, ముస్లిమ్‌)

6006 – [ 28 ] ( موضوع ) (3/1693)

وعَنِ ابْنِ عَبَّاسٍ قَالَ: قَالَ رَسُوْلُ الله صلى الله عليه وسلم: “أَحِبُّوا الْعَرَبَ لِثَلَاثٍ: لِأَنِّيْ عَرَبِيٌّ وَالْقُرْآنُ عَرَبِيٌّ وَكَلَامُ أَهْلِ الْجَنَّةِ عَرَبِيٌّ”. رَوَاهُ الْبَيْهَقِيُّ فِيْ “شُعَبِ الْإِيْمَانِ”.

6006. (28) [3/1693కల్పితం]

ఇబ్నె ‘అబ్బాస్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మూడు కారణాలవల్ల మీరు అరబ్‌లను ప్రేమించాలి. ఒకటి నేను కూడా అరబ్బునే, రెండవది ఖుర్‌ఆన్‌ అరబ్బీ భాషలో ఉంది, మూడు స్వర్గవాసుల భాష అరబ్బీ  ఉంటుంది. (బైహఖీ – షు’అబిల్ ఈమాన్)

=====

2 بَابُ مَنَاقِبِ الصَّحَابَةِ رَضِي الله عَنْهُم

2. ప్రవక్త () సహచరులు (. అన్హుంల) ప్రత్యేకతలు

اَلْفَصْلُ الْأَوَّلُ   మొదటి విభాగం   

6007 – [ 1 ] ( مُتَّفَقٌ عَلَيْهِ ) (3/1694)

عَنْ أَبِيْ سَعِيْدٍ الْخُدْرِيِّ قَالَ: قَالَ النَّبِيُّ صلى الله عليه وسلم: “لَا تَسُبُّوا أَصْحَابِيْ فَلَوْ أَنَّ أَحَدَكُمْ أَنْفَقَ مِثْلَ أُحُدٍ ذَهَبًا مَا بَلَغَ مُدَّ أَحَدِهِمْ وَلَا نَصِيْفَهُ”. مُتَّفَقٌ عَلَيْهِ.

6007. (1) [3/1694ఏకీభవితం]

అబూ స’యీద్‌ ‘ఖుద్రీ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మీరు నా అనుచరులవిషయంలో నోరు పారేసుకోకండి. ఎందుకంటే మీలో ఎవరైనా ఉ’హుద్‌ కొండంత బంగారం ఖర్చుపెట్టినా, వారి ముద్‌ లేదా సగం ముద్‌కు సమానం కాజాలదు.” [2] (బు’ఖారీ, ముస్లిమ్‌)

6008 – [ 2 ] ( صحيح ) (3/1694)

وَعَنْ أَبِيْ بُرْدَةَ عَنْ أَبِيْهِ قَالَ: رَفَعَ – يَعْنِي النَّبِيّ صلى الله عليه وسلم – رَأْسَهُ إِلى السَّمَاءِ وَكَانَ كَثِيْرًا مَا يَرْفَعُ رَأْسَهُ إِلى السَّمَاءِ. فَقَالَ: “اَلنُّجُوْمُ أَمَنَةٌ لِلسَّمَاءِ فَإِذَا ذَهَبَتِ النُّجُوْمُ أَتَى السَّمَاءَ مَا تُوْعَدُ وَأَنَا أَمَنَةٌ لِأَصْحَابِيْ فَإِذَا ذَهَبْتُ أَنَا أَتَى أَصْحَابِيْ مَا يُوْعَدُوْنَ وَأَصْحَابِيْ أَمَنَةٌ لِأُمَّتِيْ فَإِذَا ذَهَبَ أَصْحَابِيْ أَتَى أُمَّتِيْ مَا يُوْعَدُوْنَ”. رَوَاهُ مُسْلِمٌ.

6008. (2) [3/1694దృఢం]

అబూ బుర్‌దహ్ తన తండ్రి ద్వారా కథనం: అబూ మూసా అష్‌’అరీ కథనం: ప్రవక్త (స) తన తలను ఆకాశం వైపు ఎత్తారు. ప్రవక్త (స) తరచూ దైవవాణి గురించి ఎదురు చూస్తూ ఆకాశం వైపు చూసేవారు. ఆ తర్వాత నక్షత్రాలు ఆకాశ శాంతికి కారకాలని, ఇవన్నీ నశించినపుడు వాగ్దానం చేయబడింది వస్తుందని, నేను నా అనుచరుల శాంతికి కారకుడ్ని, నేను వెళ్ళిపోగానే, నా అనుచరులపై వాగ్దానం చేయబడినవి సంభ విస్తాయి. నా అనుచరులు నా అనుచర సమాజ రక్షకులు, శాంతి కారకులు నా అనుచరులు వెళ్ళి పోగానే నా అనుచర సమాజంపై వాగ్దానం చేయ బడింది సంభవిస్తుంది (అంటే మంచి నశిస్తుంది, కల్లోలాలు, ఉపద్రవాలు, విభేదాలు, యుద్ధాలు, అవిశ్వాసం, దురాచారాలు, కల్పితాలు విజృం భిస్తాయి). (ముస్లిమ్‌)

6009 – [ 3 ] ( مُتَّفَقٌ عَلَيْهِ ) (3/1694)

وَعَنْ أَبِيْ سَعِيْدِ الْخُدْرِيِّ قَالَ: قَالَ رَسُوْلُ الله صلى الله عليه وسلم: “يَأْتِيْ عَلَى النَّاسِ زَمَانٌ فَيَغْزُو فِئَامٌ مِنَ النَّاسِ فَيَقُوْلُوْنَ: هَلْ فِيْكُمْ مَنْ صَاحَبَ رَسُوْلَ الله صلى الله عليه وسلم. فَيَقُوْلُوْنَ: نَعَمْ. فَيُفْتَحُ لَهُمْ ثُمَّ يَأْتِيْ عَلَى النَّاسِ زَمَانٌ فَيَغْزُو فِئَامٌ مِنَ النَّاسِ فَيُقَالُ: هَلْ فِيْكُمْ مَنْ صَاحَبَ أَصْحَابَ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم؟ فَيَقُوْلُوْنَ: نَعَمْ. فَيُفْتَحُ لَهُمْ ثُمَّ يَأْتِيْ علَى النَّاسِ زَمَانٌ فَيَغْزُوْ فِئَامٌ مِنَ النَّاسِ فَيُقَالُ: هَلْ فِيْكُمْ مَنْ صَاحَبَ مَنْ صَاحَبَ أَصْحَابَ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم؟ فَيَقُوْلُوْنَ: نَعَمْ. فَيُفْتَحُ لَهُمْ”. مُتَّفَقٌ عَلَيْهِ.

وَفِيْ رِوَايَةٍ لِمُسْلِمٍ قَالَ: “يَأْتِيْ عَلَى النَّاسِ زَمَانٌ يَبْعَثُ مِنْهُمُ الْبَعْثُ فَيَقُوْلُوْنَ: اُنْظُرُوْا هَلْ تَجِدُوْنَ فِيْكُمْ أَحَدًا مِنْ أَصْحَابِ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم؟ فَيُفْتَحُ لَهُمْ بِهِ. ثُمَّ يُبْعَثُ الْبَعْثُ الثَّانِيْ فَيَقُوْلُوْنَ: هَلْ فِيْهِمْ مَنْ رَأَى أَصْحَابَ النَّبِيِّ صلى الله عليه وسلم؟ فَيُفْتَحُ لَهُمْ بِهِ. ثُمَّ يُبْعَثُ الْبَعْثُ الثَّالِثُ فَيُقَالُ: اُنْظُرُوْا هَلْ تَرَوْنَ فِيْهِمْ مَنْ رَأَى مَنْ رَأَى أَصْحَابَ النَّبِيِّ صلى الله عليه وسلم؟ ثُمَّ يَكُوْنَ الْبَعْثُ الرَّابِعُ فَيُقَالُ: اُنْظُرُوْا هَلْ تَرَوْنَ فِيْهِمْ أَحَدًا رَأَى مَنْ رَأَى أَحَدًا رَأَى أَصْحَابُ النَّبِيِّ صلى الله عليه وسلم؟ فَيُوْجَدُ الرَّجُلُ فَيُفْتَحُ لَهُمْ بِهِ”.

6009. (3) [3/1694 ఏకీభవితం]

అబూ స’యీద్‌ ‘ఖుద్రీ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ప్రజలపై  ఒక కాలం రాబోతున్నది. ప్రజల్లో ఒకబృందం పోరాడుతుంది. పోరాడేవారు తమ బృందం వారితో, ‘మీలో ఎవరైనా ప్రవక్త (స) అనుచరులు ఉన్నారా?’ అని అడుగుతారు. దానికి వారు, ‘అవునని,’ అంటారు. అనంతరం వారికి విజయం సహాయం లభిస్తుంది. ఆ తరువాత ప్రజలపై ఒక కాలం వస్తుంది. వాళ్ళు దైవమార్గంలో పోరాడుతారు. ఆ తరువాత పరస్పరం, ”మీలో ఎవరైనా ప్రవక్త (స) అనుచరుల శిష్యుల్లో ఎవరైనా ఉన్నారా?” అని అడుగుతారు. దానికి వారు, ‘అవును ఉన్నారు,’ అని అంటారు. అనంతరం వారికి విజయం ప్రాప్తిస్తుంది. ఆ తరువాత ప్రజలపై ఒక కాలం వస్తుంది. ప్రజల్లోని ఒక బృందం పోరాడుతుంది. వారిని, ”మీలో ఎవరైనా ప్రవక్త (స) అనుచరుల శిష్యుల  శిష్యులు ఎవరైనా ఉన్నారా?” అని అడగటం జరుగుతుంది. దానికి వారు, ‘అవును ఉన్నారు,’ అని సమాధానం ఇస్తారు. అనంతరం వారికి విజయం  ప్రాప్తిస్తుంది. (బు’ఖారీ, ముస్లిమ్‌)

ముస్లిమ్‌ ఉల్లేఖనంలో ఇలా ఉంది, ”ప్రజలపై ఒక కాలం వస్తుంది. వారిలో నుండి ఒక సైన్యం శత్రువులతో పోరాడ టానికి పంపడం జరుగుతుంది. వారు పరస్పరం, ‘మీలో ప్రవక్త (స) అనుచరుల్లోని వారెవరైనా ఉన్నారా?’ అని ప్రశ్నిస్తారు. దానికి వారు, ‘ఒకరున్నారు,’ అని అంటారు. అనంతరం వారికి విజయం ప్రాప్తిస్తుంది. ఆ తరువాత మరో సైన్యం పంపబడుతుంది. వారు కూడా పరస్పరం, ‘మీలో ప్రవక్త (స) అనుచరుల శిష్యులు ఎవరైనా ఉన్నారా?’ అని ప్రశ్నిస్తారు. ఒక వ్యక్తి, ‘ఉన్నారని,’ సమాధానం ఇస్తాడు. అనంతరం వారికి విజయం ప్రాప్తిస్తుంది. మూడవ సైన్యం పంపబడుతుంది. వారు కూడా పరస్పరం, ‘ప్రవక్త (స) అనుచరుల శిష్యుల శిష్యులు మీలో ఎవరైనా ఉన్నారా?’ అని అడుగుతారు. దానికి, ‘అవునని,’ సమాధానం వస్తుంది. వారికి విజయం ప్రాప్తిస్తుంది. ఆ తరువాత మరో సైన్యం పంపబడు తుంది. ‘మీలో ఎవరైనా తబేతాబయీ ఉన్నారా?’ అని అడుగుతారు. ఉన్నారని సమా ధానం వస్తుంది. వారికి కూడా విజయం ప్రాప్తిస్తుంది.

6010 – [ 4 ] ( مُتَّفَقٌ عَلَيْهِ ) (3/1695)

وَعَنْ عِمْرَان بْنِ حُصَيْنٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “خَيْرُ أُمَّتِيْ قَرْنِيْ ثُمَّ الَّذِيْنَ يَلُوْنَهُمْ ثُمَّ الَّذِيْنَ يَلُوْنَهُمْ ثُمَّ إِنَّ بَعْدَهُمْ قَوْمًا يَشْهَدُوْنَ وَلَا يُسْتَشْهَدُوْنَ وَيَخُوْنُوْنَ وَلَا يُؤْتَمنُوْنَ وَيَنْذُرُوْنَ وَلَا يَفُوْنَ وَيَظْهَرُ فِيِهْمُ السِّمْنُ”.

 وَفِيْ رِوَايَةٍ: “وَيَحْلِفُوْنَ وَلَا يُسْتَحْلَفُوْنَ”. مُتَّفَقٌ عَلَيْهِ.

6010. (4) [3/1695ఏకీభవితం]

ఇమ్రాన్‌ బిన్‌ ‘హు’సైన్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”నా అనుచర సమాజంలోని ఉత్తమ వ్యక్తులు నాకాలం వారు. ఆ తరువాత, వారి తరు వాతి తరంవారు (అంటే తాబయీ), ఆ తరువాత వారి తరువాత తరం వారు (అంటే తబె-తాబయీ). ఆ తరువాత ఎటువంటివారు ఉంటారంటే, వారు సాక్ష్యం ఇస్తారు. కాని వారిని సాక్ష్యం కోరటం జరుగదు. వాళ్ళు అవినీతికి పాల్పడతారు. వారి నిజాయితీని, అమానతును నమ్మరాదు. ఇంకా ప్రజలు మొక్కు కుంటారు కాని తమమొక్కుబడులను చెల్లించుకోరు. వారిలో క్రొవ్వు అధికమై దుడ్డుగా తయారవుతారు. మరో ఉల్లేఖనం ప్రకారం వారు ప్రమాణాలు చేస్తారు. అయితే వారిని ప్రమాణం చేయమని కోరడం జరుగదు. (బు’ఖారీ, ముస్లిమ్‌)

6011 – [ 5 ] ( صحيح ) (3/1695)

وَفِيْ رِوَايَةٍ لِمُسْلِمٍ عَنْ أَبِيْ هُرَيْرَةَ: “ثُمَّ يَخلُفُ قَوْمٌ يُحِبُّوْنَ السَّمَانَةَ”.

6011. (5) [3/1695దృఢం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ఆతరువాత తరంవారు దుడ్డుతనాన్ని మంచిగా భావిస్తారు. [3] (ముస్లిమ్)

—–

اَلْفَصْلُ الثَّانِيْ  రెండవ విభాగం   

6012 – [ 6 ] ( صحيح ) (3/1695)

عَنْ عُمَرَ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “أَكْرِمُوا أَصْحَابِيْ فَإِنَّهُمْ خِيَارُكُمْ ثُمَّ الَّذِيْنَ يَلُوْنَهُمْ ثُمَّ الَّذِيْنَ يَلُوْنَهُمْ ثُمَّ يَظْهَرُ الْكَذِبُ حَتَّى إِنَّ الرَّجُلَ لَيَحْلِفُ وَلَا يَسْتَحْلَفُ وَيَشْهَدُ وَلَا يَسْتَشْهَدُ أَلَا مَنْ سَرَّهُ بُحْبُوْحَةُ الْجَنَّةِ فَلْيَلْزَمِ الْجَمَاعَةَ فَإِنَّ الشَّيْطَانَ ثَالِثُهُمْ وَمَنْ سَرَّتْهُ حَسَنَتْهُ وَسَاءَتْهُ سَيِّئَتُهُ فَهُوَ مُؤْمِنٌ”.

6012. (6) [3/1695 దృఢం]

‘ఉమర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”నా అనుచరులను గౌరవించండి. ఎందుకంటే వీరు మీలోని మహానుభావులు. ఆ తరువాత వారికి సన్ని హితులైన వారు, ఆ తరువాత వారికి సన్నిహితు లైనవారు. ఆ తరువాత అసత్యం సర్వసాధారణమై పోతుంది. చివరికి ఒక వ్యక్తి తనంతటతాను ప్రమాణం చేస్తాడు. వాడిని ప్రమాణం చేయమని కోరటం జరుగదు. తనంతట తాను సాక్ష్యం ఇస్తాడు. అతన్ని సాక్ష్యం ఇవ్వమని కోరటం జరుగదు. గుర్తుంచుకోండి! స్వర్గంలోని మధ్య ప్రాంతాన్ని కోరేవారు సంఘాన్ని అంటిపెట్టుకొని ఉండాలి. ఎందుకంటే షై’తాన్‌ ఒంటరిగా ఉన్న వ్యక్తికి సహచరుడైపోతాడు. ఇద్దరు వ్యక్తులు కలసి ఉన్నా షై’తాన్‌ దూరంగా పారిపోతాడు. అదేవిధంగా పరాయి పురుషుడు ఒక పరాయి స్త్రీతో ఒంటరిగా గడపరాదు. ఎందుకంటే వారిలో మూడవ వ్యక్తి షై’తాన్‌ ఉంటాడు. ఇంకా తన సత్కార్యం నచ్చి, తన చెడుపట్ల విచారించే వ్యక్తి ముస్లిమ్‌. [4]  (నసాయి’  – దృఢం)

బు’ఖారీ, ముస్లిమ్‌లు ఈ ‘హదీసు’ను తమ గ్రంథాల్లో పేర్కొనలేదు.

6013 – [ 7 ] ( حسن ) (3/1695)

وَعَنْ جَابِرٍ عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ: “لَا تَمَسُّ النَّارُ مُسْلِمًا رَآنِيْ أَوْ رَأى مَنْ رَآنِيْ”. رَوَاهُ التِّرْمِذِيُّ.

6013. (7) [3/1695ప్రామాణికం]

జాబిర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”నన్ను చూసిన వారికి, నన్ను చూసిన వ్యక్తిని చూచిన వారికి నరకాగ్ని ముట్టుకోదు.” (తిర్మిజి’)

6014 – [ 8 ] ( لم تتم دراسته ) (3/1696)

وَعَنْ عَبْدِ اللهِ بْنِ مُغَفَّلٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “اللهُ الله فِيْ أَصْحَابِيْ لَا تَتَّخِذُوْهُمْ غَرَضًا مِنْ بَعْدِيْ فَمَنْ أَحَبَّهُمْ فَبِحُبِّيْ أَحَبَّهُمْ وَمَنْ أَبْغَضَهُمْ فَبِبُغْضِيْ أَبْغَضَهُمْ وَمَنْ آذَاهُمْ فَقَدْ آذَانِيْ وَمَنْ آذَانِيْ فَقَدْ آذَى اللهَ وَمَنْ آذَى اللهَ فَيُوْشِكُ أَنْ يَأْخُذَهُ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَقَالَ: هَذَا حَدِيْثٌ غَرِيْبٌ  

6014. (8) [3/1696అపరిశోధితం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ము’గప్ఫల్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”దైవానికి భయపడండి, నా అనుచరుల విషయంలో అల్లాహ్‌(త)కు భయపడండి. నా తరువాత వారిని దూషించకూడదు. వారిని గౌరవ దృష్టితో చూడాలి. వారిని ప్రేమించేవారు నన్ను ప్రేమించి నట్టే, వారిని దూషించేవారు నన్ను దూషించే నట్లే. అదే విధంగా వారికి హాని తలపెట్టే వారు, నాకు హాని తలపెట్టి నట్టే, నాకు హాని తలపెట్టినవారు, అల్లాహ్‌ (త) కు హాని తలపెట్టినట్టే, అల్లాహ్‌ (త) కు హాని తలపెట్టిన వారిని అల్లాహ్‌(త)  శిక్షిస్తాడు. (తిర్మిజి’  – ఏకోల్లేఖనం)

6015 – [ 9 ] ( لم تتم دراسته ) (3/1696)

وَعَنْ أَنَسٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَثَلُ أَصْحَابِيْ فِي أُمَّتِيْ كَالْمِلْحِ فِي الطَّعَامِ لَا يَصْلُحُ الطَّعَامُ إِلَّا بِالْمِلْحِ”. قَالَ الْحَسَنُ: فَقَدْ ذَهَبَ مِلْحُنَا فَكَيْفَ نَصْلُحُ؟ رَوَاهُ فِيْ “شَرْحِ السُّنَّةِ”.

6015. (9) [3/1696 అపరిశోధితం]

అనస్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”నా అనుచర సమాజంలో నా అనుచరులు అన్నంలో ఉప్పులాంటి వారు, ఉప్పు లేకుండా అన్నం రుచించదు. ‘హసన్‌  బ’స్రీ ”మన ఉప్పు క్రమంగా పోతూ ఉంటే, మనం తమ్ము తాము ఎలా సంస్క రించుకోగలం?” అని అన్నారు. (షర్‌’హుస్సున్నహ్‌)

6016 – [ 10 ] ( لم تتم دراسته ) (3/1696)

وَعَنْ عَبْدِ اللهِ بْنِ بُرَيْدَةَ عَنْ أَبِيْهِ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَا مِنْ أَحَدٍ مِنْ أَصْحَابِيْ يَمُوْتُ بِأَرْضٍ إِلَّا بُعِثَ قَائِدًا وَنُوْرًا لَهُمْ يَوْمَ الْقِيَامَةِ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَقَالَ: هَذَا حَدِيْثٌ غَرِيْبٌ وَذُكِرَحَدِيْثُ ابْنُ مَسْعُوْدٍ “لَا يَبْلُغُنِي أَحَدٌ” فِيْ بَابِ “حِفْظِ اللِّسَانِ”.

6016. (10) [3/1696 అపరిశోధితం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ బురైదహ్‌ తన తండ్రి ద్వారా కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”నా అనుచరుల్లో ఎవరు ఎక్కడ మరణిస్తే, తీర్పుదినంనాడు వారిని అక్కడే స్వర్గంవైపు తీసుకువెళ్ళడానికి సిద్ధంగా ఉన్న స్థితిలో లేపుతాడు. ఇంకా వారికోసం వెలుగు అవుతాడు.” (తిర్మిజి’ – ఏకోల్లేఖనం)

—–

اَلْفَصْلُ الثَّالِثُ   మూడవ విభాగం 

6017 – [ 11 ] ( لم تتم دراسته ) (3/1696)

عَنِ ابْنِ عُمَرَقَالَ: قَالَ رَسُوْلُ الله صلى الله عليه وسلم: “إِذَا رَأَيْتُمُ الَّذِيْنَ يَسُبُّوْنَ أَصْحَابِيْ فَقُوْلُوْا: لَعَنَةُ اللهِ عَلَى شَرِّكُمْ”. رَوَاهُ التِّرْمِذِيُّ.

6017. (11) [3/1696అపరిశోధితం]

ఇబ్నె ‘ఉమర్‌ (ర) కథనం: ప్రవక్త (స), ”నా అనుచరుల గురించి ఎవరైనా దూషిస్తూ ఉండగా చూస్తే, ‘నీపై అల్లాహ్‌(త) అభిశాపం అవతరించుగాక!’ అని అనండి” అని  ప్రవచించారు. (తిర్మిజి’)

6018 – [ 12 ] ( باطل ) (3/1696)

وَعَنْ عُمَرَ بْنِ الْخَطَّابِ قَالَ: سَمِعْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ: “سَأَلْتُ رَبِّيْ عَنْ اِخْتِلَافِ أَصْحَابِيْ مِنْ بَعْدِيْ فَأَوَحَى إِلَيَّ: يَا مُحَمَّدَ إِنَّ أَصْحَابَكَ عِنْدِيْ بِمَنْزِلَةِ النُّجُوْمِ فِيْ السَّمَاءِ بَعْضُهَا أَقْوَى مِنْ بَعْضٍ وَلِكُلِّ نُوْرٌ فَمَنْ أَخَذَ بِشَيْءٍ مِمَّا هُمْ عَلَيْهِ مِنِ اخْتِلَافِهِمْ فَهُوَ عِنْدِيْ عَلَى هُدى”. قَالَ: وَقَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “أَصْحَابِيْ كَالنُّجُوْمِ فَبَأَيِّهِمُ اقْتَدَيْتُمْ اِهتَدَيْتُمْ”. رَوَاهُ رَزِيْنٌ.

6018. (12) [3/1696అసత్యం]

‘ఉమర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ఇలా ప్రవచిస్తూ ఉండగా నేను విన్నాను, ”నా మరణానంతరం నా అనుచరుల విభేదాల గురించి అల్లాహ్‌(త)ను విన్నవించుకోగా, అల్లాహ్‌(త) నా వైపునకు ఇలా దైవవాణి అవతరింప జేసాడు.” ఓ ము’హమ్మద్‌! నీ అనుచరులు నా దృష్టిలో ఆకాశంలోని నక్షత్రాల వంటి వారు. వారిలో హెచ్చు తగ్గులు ఉన్నా, అందరిలో వెలుగు ఉంది. వీరిలో ఎవరిని అనుసరించినా వారు నా వద్ద సన్మార్గంపై ఉన్నట్టే. (ర’జీన్‌)

=====

3 بَابُ مَنَاقِبِ أَبِيْ بَكْرٍ رَضِي الله عَنْهُ

3. అబూబకర్‌ () ప్రత్యేకతలు, ప్రాధాన్యతలు

اَلْفَصْلُ الْأَوَّلُ  మొదటి విభాగం    

6019 – [ 1 ] ( مُتَّفَقٌ عَلَيْهِ ) (3/1697)

عَنْ أَبِيْ سَعِيْدِ الْخُدْرِيِّ عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ: “إِنَّ مِنْ أَمَن النَّاسِ عَلَيَّ فِيْ صُحْبَتِهِ وَمَالِهِ أَبُوْ بَكْرٍ- وَعِنْدَ الْبُخَارِيِّ أَبَا بَكرٍ – وَلَوْ كُنْتُ مُتَّخِذًا خَلِيْلًا لَاتَّخَذْتُ أَبَا بَكْرٍ خَلِيْلًا وَلَكِنْ أخُوَّةُ الْإِسْلَامِ وَمَوَدَّتُهُ لَا تُبْقَيَنَّ فِي الْمَسْجِدِ خَوْخَةٌ إِلَّا خَوْخَةَ أَبِيْ بَكْرٍ”.

 وَفِيْ رِوَايَةٍ: “لَوْ كُنْتُ مُتَّخِذًا خَلِيْلًا غَيْرَ رَبِّيْ لَاتَّخَذْتُ أبَا بَكْرٍ خَلِيْلًا”. مُتَّفَقٌ عَلَيْهِ.

6019. (1) [3/1697ఏకీభవితం]

అబూ స’యీద్‌ (ర) కథనం: ప్రవక్త (స) ”మిత్రత్వ పరంగా ధనపరంగా అందరికంటే అధికంగా అబూ బకర్‌ ఉపకారాలు నాపై ఉన్నాయి. ఒకవేళ నేను ఎవరినైనా ప్రాణస్నేహితుడిగా చేస్తే, అబూ బకర్‌ను చేస్తాను. కాని మా మధ్య ఇస్లామీయ సోదరభావం మాత్రమే ఉంది. మస్జిదె నబవీలో అబూ బకర్‌ కిటికీ తప్ప ఇతర కిటికీ లన్నిటినీ మూసివేయాలి. ఒకవేళ నేను అల్లాహ్‌(త) తప్ప మరొకర్ని ఎవరినైనా నా ప్రాణ స్నేహితుడుగా చేస్తే అబూ బకర్‌ను చేసే వాడిని,” అని ప్రవచించారు. [5] (బు’ఖారీ, ముస్లిమ్‌)

6020 – [ 2] ( صحيح ) (3/1697)

وَعَنْ عَبْدِ اللهِ بْنِ مَسْعُوْدٍ عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ: “لَوْ كُنْتُ مُتَّخِذًا خَلِيْلًا لَاتَّخَذْتُ أَبَا بَكْرٍخَلِيْلًا وَلَكِنَّهُ أَخِيْ وَصَاحِبِيْ وَقَدْ اتَّخَذَ اللهُ صَاحِبَكُمْ خَلِيْلًا”. رَوَاهُ مُسْلِمٌ.

6020. (2) [3/1697 దృఢం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ మస్‌’ఊద్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఒకవేళ నేను ఎవరినైనా ప్రాణ మిత్రునిగా చేస్తే అబూ బకర్‌ను  చేసే వాడ్ని.” (ముస్లిమ్‌)

6021 – [ 3 ] ( صحيح ) (3/1697)

وَعَنْ عَائِشَةَ قَالَتْ: قَالَ لِيْ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم فِيْ مَرْضِهِ: اُدْعِيْ لِيء أَبَا بَكْرٍ أَبَاكِ وَأَخَاكِ حَتّى أَكْتُبَ كِتَابًا فَإِنِّيْ أَخَافُ أَنْ يَتَمَنّى مُتَمَنِّ. وَيَقُوْلُ قَائِلٌ: أَنَا وَلَا وَيَأْبَى اللهُ وَالْمُؤْمِنُوْنَ إِلَّا أَبَا بَكْرٍ”. رَوَاهُ مُسْلِمٌ وَفِيْ”كِتَابِ الْحُمَيْدِيِّ”: “أَنَاأَوْلَى” .بَدْلَ “أَنَاولَا”.

6021. (3) [3/1697దృఢం]

‘ఆయి’షహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) తన చివరిదశలో, ‘మీనాన్నగారు అబూ బకర్‌ను, నీ సోదరుడు ‘అబ్దుర్ర ‘హ్మాన్‌ను పిలవు, నేను వారికోసం ఒక వీలునామా వ్రాస్తాను, ఎందుకంటే మరొకరెవరైనా నేను ‘ఖలీఫహ్ అవుతానని వాదించకుండా ఉండాలని. అయితే అల్లాహ్‌(త) మరియు విశ్వాసులు అబూ బకర్‌నే సమర్థిస్తున్నారు,’  అని  అన్నారు. (ముస్లిమ్‌)

6022 – [ 4 ] ( مُتَّفَقٌ عَلَيْهِ ) (3/1697)

وَعَنْ جُبَيْرِبْنِ مُطْعِمٍ قَالَ: أَتَتِ النَّبِيّ صلى الله عليه وسلم اِمْرَأَةٌ فَكَلَّمَتْهُ فِيْ شَيْءٍ فَأَمَرَهَا أَنْ تَرْجِعَ إِلَيْهِ. قَالَ: يَا رَسُوْلَ اللهِ أَرَأَيْتَ إِنْ جِئْتَ وَلَمْ أَجِدْكَ؟ كَأَنَّهَا تُرِيْدُ الْمَوْتَ. قَالَ: “فَإِنْ لَمْ تَجِدِيْنِيْ فَأُتِيَ أَبَا بَكْرٍ”. مُتَّفَقٌ عَلَيْهِ.

6022. (4) [3/1697ఏకీభవితం]

జుబైర్‌ బిన్‌ ము’త్‌’యిమ్‌ (ర) కథనం: ప్రవక్త (స) వద్దకు ఒక స్త్రీ వచ్చింది. ఏదో విషయంలో ప్రవక్త (స)తో మాట్లా డింది. ప్రవక్త (స) ఆమెను మరో సమయంలో రమ్మని అన్నారు. దానికి ఆమె, ‘ప్రవక్తా(స)! ఒకవేళ నేను తరువాత వచ్చినప్పుడు మీరు లేకపోతే?’ అని విన్నవించుకుంది. దానికి ప్రవక్త (స), ‘నేను లేకపోతే అబూ బకర్‌తో మాట్లాడు,’ అని సమాధానం ఇచ్చారు.[6]  (బు’ఖారీ, ముస్లిమ్‌)

6023 – [ 5 ] ( مُتَّفَقٌ عَلَيْهِ ) (3/1698)

وَعَنْ عَمْرِوبْنِ الْعَاصِ أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم بَعَثَهُ عَلَى جَيْشِ ذَاتِ السَّلَاسِلِ قَالَ: فَأَتَيْتُهُ فَقُلْتُ: أَيُّ النَّاسِ أَحَبُّ إِلَيْكَ؟ قَالَ: “عَائِشَةُ”. قُلْتُ: مِنَ الرِّجَالِ؟ قَالَ:”أَبُوْهَا”. قُلْتُ: ثُمّ مَنْ؟ قَالَ: “عُمَرُ”. فَعَدَّ رِجَالًا فَسَكَت مَخَافَةَ أَنْ يَجْعَلَنِيْ فِيْ آخِرِهِمْ.

6023. (5) [3/1698 ఏకీభవితం]

అమ్ర్‌ బిన్‌ ‘ఆ’స్‌ (ర) కథనం: ప్రవక్త (స) నన్ను ”జా’తు స్సలాసిల్‌” సైన్యానికి నాయకునిగా చేసి పంపారు. వెళ్ళే ముందు నేను ప్రవక్త (స) వద్దకు వచ్చాను. ప్రవక్త (స) ను, ‘మీరు అందరికంటే అధికంగా ఎవరిని ప్రేమిస్తారు,’ అని అడిగాను. దానికి ప్రవక్త (స), ‘ ‘ఆయి’షహ్‌ను’ అని అన్నారు. మళ్ళీ నేను, ‘పురుషుల్లో ఎవరిని అధికంగా ప్రేమిస్తారు,’ అని అడిగాను. దానికి ప్రవక్త (స) ‘ ‘ఆయి’షహ్‌ తండ్రి అబూ బకర్‌ను,’ అని అన్నారు.’ఆ తరువాత ఎవరిని,’ అని అడిగాను. ప్రవక్త (స), ‘ఉమర్‌ను,’ అని అన్నారు. ఆ తరువాత కొంతమంది పేర్లు పేర్కొన్నారు. నా పేరు ఎక్కడ ప్రస్తావిస్తారోనని నేను మౌనం  వహించాను.” (బు’ఖారీ, ముస్లిమ్‌)

6024 – [ 6 ] ( صحيح ) (3/1698)

وَعَنْ مُحَمَّدِ بْنِ الْحَنَفِيَّةِ قَالَ: قُلْتُ لِأَبِيْ: أَيُّ النَّاسِ خَيْرٌ بَعْدَ النَّبِيِّ صلى الله عليه وسلم؟ قَالَ: أَبُوْ بَكْرٍ. قُلْتُ: ثُمَّ مَنْ؟ قَالَ: عُمَرُ. وَخَشِيْتُ أَنْ يَقُوْلَ: عُثْمَانُ. قُلْتُ: ثُمَّ أَنْتَ. قَالَ: “مَا أَنَا إِلَّا رَجُلٌ مِنَ الْمُسْلِمِيْنَ”. روَاهُ الْبُخَارِيُّ.

6024. (6) [3/1698 దృఢం]

ము’హమ్మద్‌ బిన్‌ ‘హనఫియ్యహ్ కథనం: నేను మా నాన్నగారైన (అలీ -ర)ను, ప్రవక్త (స) తర్వాత ఎవరు ఉత్తములని అడిగాను. దానికి అతను, ‘అబూ బకర్‌,’ అని అన్నారు. మళ్ళీ నేను, ‘అబూ బకర్‌ తర్వాత ఎవరని,’ అడిగాను. ‘ ‘ఉమర్‌ (ర) ,’ అని అన్నారు. ‘ఆ తరువాత ‘ఉస్మాన్‌’ అని అంటారని భయపడి, ‘ఆతరువాత  మీరు,’ అని అన్నాను. దానికి అతను (ర), ‘నేను కేవలం ముస్లిముల్లోని ఒక వ్యక్తిని,’ అని అన్నారు.[7](బు’ఖారీ)

6025- [ 7 ] ( صحيح ) (3/1698)

وَعَنِ ابْنِ عُمَرَ قَالَ: كُنَّا فِيْ زَمَنِ النَّبِيِّ صلى الله عليه وسلم لَا نَعْدِلُ بِأَبِيْ بَكْرٍ أَحَدًا ثُمَّ عُمَرَ ثُمَّ عُثْمَانَ ثُمَّ نَتْرُكُ أَصْحَابَ النَّبِيِّ صلى الله عليه وسلم لَا نُفَاضِلُ بَيْنَهُمْ. روَاهُ الْبُخَارِيُّ.

وَفِيْ رِوَايَةٍ لِأَبِيْ دَاوُدَ قَالَ: كُنَّا نَقُوْلُ وَرَسُوْلُ اللهِ صلى الله عليه وسلم حَيٌّ: أَفْضَلُ أُمَّةِ النَّبِيِّ صلى الله عليه وسلم بَعْدَهُ أَبُوْ بَكْرٍ ثُمَّ عُمَرُ ثُمَّ عُثْمَانُ رَضِيَ اللهُ عَنْهُمْ.

6025. (7) [3/1698దృఢం]

ఇబ్నె ‘ఉమర్‌ (ర) కథనం: మేము ప్రవక్త (స) కాలంలో ఎవరినీ అబూ బకర్‌ (ర)కు సమానంగా భావించే వారం కాము. వారి తర్వాత ‘ఉమర్‌ (ర)కు సమానంగా ఎవరినీ భావించేవారం కాము. వారి తర్వాత ‘ఉస్మాన్‌కు సమానంగా ఎవరినీ భావించేవారం కాము. ‘ఉస్మాన్‌ తర్వాత ప్రవక్త (స) అనుచరులను వారి పరిస్థితిపై వదలి వేసేవారము, వారిలో ఒకరిని మరొకరిపై ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళం  కాము. (బు’ఖారీ)

అబూ దావూద్‌లో ఈ పదాలు ఉన్నాయి, ”ప్రవక్త (స) కాలంలో మేము ప్రవక్త (స) అనుచర సమాజంలో ప్రవక్త (స) తర్వాత అబూ బకర్‌, అందరికంటే ఉత్తములు, ఆ తర్వాత ‘ఉమర్‌ (ర), ఆ తర్వాత ‘ఉస్మాన్‌ (ర)” అని చర్చించుకునేవాళ్ళం.

—–

اَلْفَصْلُ الثَّانِيْ  రెండవ విభాగం   

6026 – [ 8 ] ( ضعيف ) (3/1699)

عَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: قَالَ رَسُوْلُ الله صلى الله عليه وسلم: “مَا لِأَحَدٍ عِنْدَنَا يَدُ إِلَّا وَقَدْ كَافَيْنَاهُ مَا خَلَا أَبَا بَكْرٍ فَإِنَّ لَهُ عِنْدَنَا يَدًا يُكَافِيْهِ اللهُ بِهَا يَوْمَ الْقِيَامَةِ وَمَا نَفَعَنِيْ مَالُ قَطُّ مَا نَفَعَنِيْ مَالُ أَبِيْ بَكْرٍ ولَوْ كُنْتُ مُتَّخِذًا خَلِيْلًا لَاتَّخَذْتُ أَبَا بَكْرٍ خَلِيْلًا أَلَا وَإِنَّ صَاحِبَكُمْ خَلِيْلُ اللهِ”. رَوَاهُ التِّرْمِذِيُّ .

6026. (8) [3/1699 బలహీనం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మాకు ఉపకారం చేసిన ప్రతి వ్యక్తికి మేము ప్రత్యుపకారం చేసాము. అయితే అబూ బకర్‌ (ర) మా పట్ల చేసిన ఉపకారానికి ప్రతిఫలం అల్లాహ్‌ (త) తీర్పుదినంనాడు ప్రసాదిస్తాడు. ఇంకా ఎవరి ధనమూ నాకు అంత లాభం చేకూర్చలేదు. కాని అబూ బకర్‌ (ర) ధనం నాకు చాలా లాభం చేకూర్చింది. ఒకవేళ నేను ఎవరినైనా ప్రాణ స్నేహితుడిగా చేయదలచు కుంటే అబూ బకర్‌ను చేసుకునేవాడిని. గుర్తుంచు కోండి, మీ సహచరుడు అల్లాహ్‌(త) మిత్రుడు.”  (తిర్మిజి’ – ప్రామాణికం – ఏకోల్లేఖనం)

6027 – [ 9 ] ( إسناده جيد ) (3/1699)

وَعَنْ عُمَرَ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: أَبُوْ بَكْرٍ سَيِّدُنَا وَخَيْرُنَا وَأَحَبُّنَا إِلَى رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم. رَوَاهُ التِّرْمِذِيُّ.

6027. (9) [3/1699ఆధారాలు  ఆమోద యోగ్యం]

‘ఉమర్‌ (ర) కథనం: అబూ బకర్‌ (ర) మా నాయకులు. మా కంటే ఉత్తములు. మా కంటే ప్రవక్త (స)కు చాలా ప్రియ మైనవారు. (తిర్మిజి’)

6028 – [ 10 ] ( ضعيف ) (3/1699)

وعَنِ ابْنِ عُمَرَعَنْ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم قَالَ: لِأَبِيْ بَكْرٍ: “أَنْتَ صَاحِبِيْ فِي الْغَارِ وَصَاحِبِي عَلَى الْحَوْضِ”. رَوَاهُ التِّرْمِذِيُّ.

6028. (10) [3/1699 బలహీనం]

ఇబ్నె ‘ఉమర్‌ (ర) కథనం: ప్రవక్త (స) అబూ బకర్‌ (ర)తో, ‘నువ్వు సౌ’ర్‌ గుహలో నాకు తోడుగా ఉన్నావు, కౌస’ర్‌ సరస్సు వద్ద కూడా తోడుగా ఉంటావు,’ అని అన్నారు. (తిర్మిజి’ – ప్రామాణికం – దృఢం – ఏకోల్లేఖనం)

6029 – [ 11 ] ( لم تتم دراسته ) (3/1699)

وَعَنْ عَائِشَةَ قَالَتْ: قَالَ رَسُوْلُ الله صلى الله عليه وسلم: “لَا يَنْبَغِيْ لِقَوْمٍ فِيْهِمْ أَبُوْ بَكْرٍ أَنْ يَؤُمَّهُمْ غَيْرُهُ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَقَالَ: هَذَا حَدِيْثٌ غَرِيْبٌ

6029. (11) [3/1699అపరిశోధితం]

‘ఆయి’షహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”అబూ బకర్‌ (ర) ఉన్న సభలో అతను తప్ప మరొకరు ఇమామత్‌ చేయటం ధర్మం కాదు.” (తిర్మిజి’ – ప్రామాణికం)

6030 – [ 12 ] ( حسن ) (3/1699)

وعَنْ عُمَرَ قَالَ: أَمَرَنَا رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم أَنْ نَتَصَدَّقَ وَوَافَقَ ذَلِكَ عِنْدِيْ مَالًا فَقُلْتُ: الْيَوْمَ أَسْبِقُ أَبَا بَكْرٍ إِنْ سَبَقْتُهُ يَوْمًا. قَالَ: فَجِئْتُ بِنِصْفِ مَالِيْ. فَقَالَ رَسُوْلُ الله صلى الله عليه وسلم: “مَا أَبْقَيْتُ لِأَهْلِكَ؟” فَقُلْتُ: مِثْلَهُ. وَأَتَى أَبُوْ بَكْرٍ بِكُلِّ مَا عِنْدَهُ. فَقَالَ: “يَا أَبَا بَكْرٍ؟ مَا أَبْقَيْتَ لِأَهْلِكَ؟” فَقَالَ: أَبْقَيْتُ لَهُمُ اللهَ وَرَسُوْلَهُ. قُلْتُ: لَا أَسْبِقُهُ إِلى شَيْءٍ أَبَدًا. رَوَاهُ التِّرْمِذِيُّ وَأَبُوْ دَاوُدَ.

6030. (12) [3/1699 ప్రామాణికం]

‘ఉమర్‌ (ర) కథనం: ప్రవక్త (స) మాకు దైవమార్గంలో దానధర్మాలు ఇవ్వమని ఆదేశించారు. అనుకోకుండా నా వద్ద చాలా ధనం ఉండేది. నేను నా మనసులో ‘అబూ బకర్‌ను మించాలంటే ఈ రోజు మంచి అవకాశం వచ్చింది’ అనుకొని నా ధనంలోని సగం ధనాన్ని తీసుకొని ప్రవక్త(స) వద్దకు వెళ్ళాను. ప్రవక్త(స) నాతో, ‘ఇంటి వారికి ఎంత వదిలావు,’ అని అడిగారు. దానికి నేను, ‘దీనంత అంటే సగం వదిలాను,’ అని అన్నాను. ఆ తరువాత అబూ బకర్‌ (ర) తనవద్ద ఉన్నదంతా తీసుకొని వచ్చారు. అప్పుడు ప్రవక్త (స) అతనితో ఓ అబూ బకర్‌! ‘ఇంటివారికి ఏమి వదిలావు’ అని అడిగారు. దానికి అబూ బకర్‌, ‘ఇంటి వారికి అల్లాహ్‌(త)నూ, ఆయన ప్రవక్త(స)నూ వదలి వచ్చాను’ అని అన్నారు. అప్పుడు నేను మనసులో నేనెన్నడూ అబూ బకర్‌ను అధిగమించలేనని అనుకున్నాను. (తిర్మిజి’)

6031 – [ 13 ] ( ضعيف ) (3/1700)

وعَنْ عَائِشَةَ أَنَّ أَبَا بَكْرٍ دَخَلَ عَلَى رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم فَقَالَ: “أَنْتَ عَتِيْقُ اللهِ مِنَ النَّارِ”. فَيَوْمَئِذٍ سُمِّيَ عَتِيْقًا. رَوَاهُ التِّرْمِذِيُّ .

6031. (13) [3/1700 బలహీనం]

‘ఆయి’షహ్‌ (ర) కథనం: అబూ బకర్‌ (ర) ప్రవక్త (స) వద్దకు వచ్చారు. ప్రవక్త (స) అతనితో, ‘నువ్వు నరకాగ్ని నుండి విముక్తి పొందావు,’ అని అన్నారు. ఆ రోజు నుండి అబూ బకర్‌ (ర) పేరు బాగా ప్రచారం అయిపోయింది. (తిర్మిజి’)

6032 – [ 14 ] ( ضعيف ) (3/1700)

وَعَنِ ابْنِ عُمَرَقَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “أَنَا أَوَّلُ مَنْ تَنْشَقُّ عَنْهُ الْأَرْضُ ثُمَّ أَبُوْبَكْرٍثُمَّ عُمَرُثُمَّ آتِيْ أَهْلَ الْبَقِيْعِ فَيُحْشَرُوْنَ مَعِيْ ثُمَّ أَنْتَظِرُ أَهْلَ مَكَّةَ حَتّى أُحْشَرَ بَيْنَ الْحَرْمَيْنِ”. رَوَاهُ التِّرْمِذِيُّ .

6032. (14) [3/1700 బలహీనం]

ఇబ్నె ‘ఉమర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ప్రళయ దినంనాడు అందరికంటే ముందు నాసమాధి పగులుతుంది, ఆ తరువాత అబూ బకర్‌ సమాధి పగులుతుంది, ఆ తరువాత ‘ఉమర్‌ (ర) సమాధి పగులుతుంది. ఆ తరువాత బఖీ స్మశానంలో ఉన్నవారి వద్దకు వస్తాను. వారిని నాతో పాటు లేపబడటం, ప్రోగుచేయడం జరుగుతుంది. ఆ తరు వాత మక్కహ్వారిని గురించి వేచి ఉంటాను. చివరికి నేను తీర్పు మైదానంలో వారి వెంట మక్కహ్ మదీనహ్ల మధ్య  ఉంటాను. (తిర్మిజి’)

6033 – [ 15 ] ( ضعيف ) (3/1700)

وعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “أَتَانِيْ جِبْرَيْلُ فَأخَذَ بِيَدِيْ فَأَرَانِيْ بَابَ الْجَنَّةِ الَّذِيْ يَدْخُلُ مِنْهُ أُمَّتِيْ”فَقَالَ أَبُوْ بَكْرٍ: يَا رَسُوْلَ اللهِ ودِدْتُ أَنِّيْ كُنْتُ مَعَكَ حَتّى أُنْظُر إِلَيْهِ. فَقَالَ رَسُوْلُ الله صلى الله عليه وسلم: “أَمَّا أَنَّكَ يَا أَبَا بَكْرٍ أَوَّلُ مَنْ يَدْخُلُ الْجَنَّةَ مِنْ أُمَّتِيْ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ.

6033. (15) [3/1700బలహీనం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”నా వద్దకు జిబ్రీల్‌ (అ) వచ్చారు, నా చేయి పట్టు కున్నారు, ఇంకా నన్ను స్వర్గద్వారం చూపించారు. దాని గుండానే నా అనుచర సమాజం స్వర్గంలో ప్రవేశిస్తుంది. అప్పుడు అబూ బకర్‌ (ర), ‘ఓ ప్రవక్తా! మీ వెంట ఉంటే నేను కూడా మీతోపాటు స్వర్గద్వారం చూడాలని ఉంది,’ అని అన్నారు. దానికి ప్రవక్త (స), ‘ఓ అబూ బకర్‌! నా అనుచర సమాజంలో నుండి స్వర్గంలో ప్రవేశించే వారిలో అందరికంటే ముందు ప్రవేశించేది నీవే,’ అని అన్నారు. (అబూ దావూద్‌)

—–

اَلْفَصْلُ الثَّالِثُ   మూడవ విభాగం 

6034 – [ 16 ] ( لم تتم دراسته ) (3/1700)

عَنْ عُمَرَ ذُكِرَ عِنْدَهُ أَبُوْ بَكْرٍ فَبَكَى وَقَالَ: وَدِدْتُ أَنَّ عَمَلِيْ كُلَّهُ مِثْلُ عَمَلِهِ يَوْمًا وَاحِدًا مِنْ أَيَّامِهِ وَلَيْلَةً وَاحِدَةً مِنْ لَيَالِيْهِ أَمَّا لَيْلَتُهُ فَلَيْلَةٌ سَارَ مَعَ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم إِلى الْغَارِ فَلَمَّا انْتَهَيْنَا إِلَيْهِ قَالَ: وَاللهِ لَا تَدْخُلُهُ حَتّى أدْخُلَ قَبْلَكَ فَإِنْ كَانَ فِيْهِ شَيْءٌ أَصَابَنِيْ دُوْنَكَ فَدَخَلَ فَكَسَحَهُ وَوَجَدَ فِيْ جَانِبِهِ ثُقَبًا فَشَقَّ إِزَارَهُ وَسَدَّهَا بِهِ وَبَقِيَ مِنْهَا اثْنَانِ فَأَلْقَمَهَا رِجْلَيْهِ. ثُمَّ قَالَ لِرَسُوْلِ اللهِ صلى الله عليه وسلم اُدْخُلْ : فَدَخَلَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم وَوَضَعَ رَأْسَهُ فِيْ حِجْرِهِ وَنَامَ فَلُدِغَ أَبُوْ بَكْرٍ فِيْ رِجْلِهِ مِنَ الْجُحْرِ وَلَمْ يَتَحَرَّكْ مَخَافَةَ أَنْ يَنْتَبِهَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم فَسَقَطَتْ دُمُوْعُهُ عَلَى وَجْهِ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم. فَقَالَ: “مَا لَكَ يَا أَبَا بَكْرٍ؟” قَالَ: لُدِغْتُ فَدَاكَ أَبِيْ وَأُمِّيْ. فَتَفَلَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم. فَذَهَبَ مَا يَجِدُهُ ثُمَّ انْتَقَضَ عَلَيْهِ وَكَانَ سَبَبَ مَوْتِهِ. وَأَمَّا يَوْمُهُ فَلَمَّا قُبِضَ رَسُوْلُ الله صلى الله عليه وسلم اِرْتَدَّتِ الْعَرَبُ وَقَالُوْا: لَا نُؤَدِّيْ زَكَاةً. فَقَالَ: لَوْ مَنَعُوْنِيْ عِقَالًا لَجَاهَدْتُهُمْ عَلَيْهِ. فَقُلْتُ: يَا خَلِيْفَةَ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم تَأَلَّفِ النَّاسَ وَأَرْفُقُ بِهِمْ. فَقَالَ لِيْ: أَجَبَّارٌ فِي الْجَاهِلَيَّةِ وَخَوَّارٌ فِي الْإِسْلَامِ؟ إِنَّهُ قَدِ انْقَطَعَ الْوَحْيُ وَتَمَّ الدِّيْنُ أَيُنْقَصُ وَأَنَا حَيٌّ؟ روَاهُ رَزِيْنٌ.

6034. (16) [3/1700అపరిశోధితం]

‘ఉమర్‌ (ర) కథనం: అతని ముందు అబూ బకర్‌ (ర)ను గురించి ప్రస్తావించబడింది. ‘ఉమర్‌ (ర) ఏడ్చి, ‘నా కర్మలన్నీ అబూ బకర్‌ యొక్క ఒక రోజు కర్మలుగా అయిపోవాలని నేను కోరుకుంటున్నాను. అతని ఆ హిజ్రత్‌ నాటి రాత్రి, ఆ రోజు రాత్రి అబూ బకర్‌ (ర) ప్రవక్త (స) వెంట సౌ’ర్‌ గుహవైపు బయలుదేరారు. అక్కడికి చేరుకున్న తరువాత, ‘నేను లోపలికి వెళ్ళిన తర్వాత మీరు ప్రవేశించండి, ఒకవేళ హాని చేకూర్చేది ఏదైనా ఉంటే నాకు హాని చేకూర్చుతుంది. తమరు సురక్షితంగా ఉంటారు,’ అని అన్నారు. అబూ బకర్‌ (ర) ముందు గుహలో ప్రవేశించారు. దాన్ని శుభ్రపరిచారు. అందులో ఒకవైపు అనేక కన్నాలు ఉన్నాయి. అబూ బకర్‌ (ర) తన వస్త్రాన్ని చించి ఆ కన్నాలను కప్పారు. రెండు కన్నాలు మిగిలాయి. అబూబకర్‌ తన పాదాలతో వాటిని కప్పిఉంచి ప్రవక్త (స)కు లోపలికి రమ్మని చెప్పారు. ప్రవక్త (స) ప్రవేశించి తన తల అబూబకర్‌ ఒడిలో పెట్టి నిద్రపోయారు. ఇంతలో అబూబకర్‌ పాదా నికి కన్నం లోపలినుండి కాటు వేయబడింది. కాని ప్రవక్త (స)కు అంతరాయం కలుగుతుందని లేపలేదు. బాధ అధికం అవటం వల్ల అబూ బకర్‌ కన్నీళ్ళు ప్రవక్త (స)పై పడ్డాయి. ప్రవక్త (స) లేచి ‘ఏమయింది?’ అని అడిగారు.అప్పుడు అబూ బకర్‌(ర), ‘నా తల్లి దండ్రులు మీపై త్యాగంకాను, ఏదో కాటుకు గురయ్యాను,’ అని అన్నారు. అనంతరం ప్రవక్త (స) కాటువేసిన చోట తన ఉమ్మిని పూసారు. బాధ తగ్గుతూ పోయింది. ఈ సంఘటన జరిగిన చాలా కాలం తర్వాత ఆ విషం మళ్ళీ బాధకు గురిచేసింది. ఇదే మరణానికి కారణం అయ్యింది. ఇంకా అబూ బకర్‌ ఒక రోజు సత్కా ర్యం ఏమిటంటే, ప్రవక్త (స) మరణానంతరం అరబ్బుల్లోని కొంతమంది ఇస్లామ్‌ను త్యజించారు. ఇంకా మేము ‘జకాత్‌ ఇవ్వమని అన్నారు. అప్పుడు అబూ బకర్‌ (ర), ‘ఒకవేళ ప్రజలు ఒంటెత్రాడు ఇవ్వడానికి కూడా వెనుకాడినా నేను వారితో పోరాడుతాను,’ అని అన్నారు. అప్పుడు నేను ఓ ‘ఖలీఫహ్! ప్రజలను ఐకమత్యంగా ఉండనివ్వండి, వారిపట్ల సున్నితంగా ప్రవర్తించండి,’ అని అన్నాను. దానికి అతను ‘కఠినంగా వ్యవ హరిస్తూ, ఆశ్చర్యంగా ఉంది, అజ్ఞానకాలంలో చాలా ధైర్యం కలిగి, ఇప్పుడు ఇస్లామ్‌లో ఇంత పిరికితనం,’ అని పలికి, ‘దైవవాణి పరంపర నిలిచిపోయింది, ఇస్లామ్‌ పరిపూర్ణ మయ్యిందనటంలో ఎంతమాత్రం సందేహం లేదు. ధర్మం పరిపూర్ణం అయిన తర్వాత నా జీవితం అర్థాంతరం అయి పోవాలా? ఎంత మాత్రం కాదు,’ ” అని అన్నారు. (ర’జీన్‌)

=====

4 بَابُ مَنَاقِبِ عُمَرَ رَضِي الله عَنْهُ

4. ఉమర్‌ () ప్రత్యేకతలు

اَلْفَصْلُ الْأَوَّلُ   మొదటి విభాగం   

6035 – [ 1 ] ( مُتَّفَقٌ عَلَيْهِ ) (3/1702)

عَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَقَدْ كَانَ فِيْمَا قَبْلَكُمْ مِنَ الْأُمَمِ مُحَدَّثُوْنَ. فَإِنْ يَكُ فِيْ أُمَّتِيْ أَحَدٌ فَإِنَّهُ عُمَرُ”. مُتَّفَقٌ عَلَيْهِ.  

6035. (1) [3/1702ఏకీభవితం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మీ పూర్వీకుల్లో కొందరు దైవప్రేరణ గలవాళ్ళు ఉండేవారు. ఒక వేళ నా అనుచర సమాజంలో అటు వంటి వారెవరైనా ఉంటే, అతడు ‘ఉమర్‌ (ర)” అని అన్నారు. (బు’ఖారీ, ముస్లిమ్‌)

6036 – [ 2 ] ( مُتَّفَقٌ عَلَيْهِ ) (3/1702)

وَعَنْ سَعْدِ بْنِ أَبِيْ وَقَّاصٍ قَالَ: اسْتَأْذَنَ عُمَرُ رضي الله عَنْهُ عَلَى رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم وَعِنْدَهُ نِسْوَةٌ مِنْ قُرَيْشٍ يُكَلِّمْنَهُ وَيَسْتَكْثِرْنَهُ عَالِيَةً أَصْوَاتُهُنَّ. فلَمَّا اسْتَأَذَنَ عُمَرُ قُمْنَ فَبَادَرْنَ الْحِجَابَ فَدَخَلَ عُمَرُ وَرَسُوْلُ اللهِ صلى الله عليه وسلم يَضْحَكُ فَقَالَ: أَضْحَكَ اللهُ سِنَّكَ يَا رَسُوْلَ اللهِ. فَقَالَ النَّبِيُّ صلى الله عليه وسلم: “عَجِبْتُ مِنْ هَؤُلَاءِ اللَّاتِيْ كُنَّ عِنْدِيْ فَلَمَّا سَمِعْنَ صَوْتَكَ اِبْتَدَرْنَ الْحِجَابَ”. قَالَ عُمَرُ: يَا عدُوَّاتِ أَنْفُسِهِنَّ أَتَهَبْنَنِيْ وَلَا تَهَبْنَ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم؟ قُلْنَ: نَعَمْ أَنْتَ أَفَظُّ وَأَغْلَظُ. فَقَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِيْهٍ يَا ابْنَ الْخَطَّابِ وَالَّذِيْ نَفْسِيْ بِيَدِهِ مَا لَقِيَكَ الشَّيْطَانُ سَالِكًا فَجًّا قَطُّ إِلَّا سَلَكَ فَجًّا غَيْرَ فَجِّكَ”. مُتَّفَقٌ عَلَيْهِ. وَقَالَ الحميدي: زَادَ الْبُرْقَانِيُّ بَعْدَ قَوْلِهِ: يَا رَسُوْلَ اللهِ: مَا أَضْحَكَكَ.

6036. (2) [3/1702 ఏకీభవితం]

స’అద్‌ బిన్‌ అబీ వఖ్ఖా’స్‌ (ర) కథనం: ‘ఉమర్‌ (ర) ప్రవక్త (స) వద్దకు రావడానికి అనుమతికోరారు. ఆ సమయంలో ప్రవక్త (స)వద్ద కొందరు ఖురైషీ స్త్రీలు ఉన్నారు. ప్రవక్త (స)తో బిగ్గరగా మాట్లాడు తున్నారు. ‘ఉమర్‌ (ర) అనుమతి కోరడం చూచి లేచి తెరవెనక్కి వెళ్ళిపోయారు. ‘ఉమర్‌(ర) లోపలికి వచ్చారు, అప్పుడు ప్రవక్త (స) చిరునవ్వు నవ్వు తున్నారు. ‘ఉమర్‌ (ర), ప్రవక్త (స) చిరునవ్వు చూచి, అల్లాహ్‌(త) తమర్ని ఎల్లప్పుడూ సంతోషంగానే ఉంచుగాక!” అని అన్నారు. అప్పుడు ప్రవక్త (స), ‘ఆ స్త్రీలపై ఆశ్చర్యం వేస్తుంది, నీవు వచ్చావని తెలియగానే తెరవెనక్కి వెళ్ళిపోయారు,’ అని అన్నారు. ‘ఉమర్‌ (ర) స్త్రీల నుద్దేశించి, ‘మహిళల్లారా! తమ ప్రాణాల శత్రువులారా! మీరు నాకు భయపడి, ప్రవక్త (స)కు భయపడటం లేదా?’ దానికి వారు, ‘మీరు కఠినంగా వ్యవరిస్తారు,’ అని అన్నారు. అప్పుడు ప్రవక్త (స) ‘ఉమర్‌తో, ‘ఓ ఉమర్‌! ఈ విషయం వదలి వేరేవిషయం మాట్లాడు, ఎవరి చేతిలో నా ప్రాణం ఉందో ఆయన సాక్షి! ఒక దారిలో నువ్వు వస్తుంటే షై’తాన్‌ నీ మార్గం వదలి మరోదారిని అనుసరిస్తాడు,’ అని  అన్నారు.  (బు’ఖారీ, ముస్లిమ్‌)

6037 – [ 3 ] ( مُتَّفَقٌ عَلَيْهِ ) (3/1702)

وَعَنْ جَابِرٍ قَالَ: قَالَ رَسُوْلُ الله صلى الله عليه وسلم: “دَخَلْتُ الْجَنَّةَ فَإِذَا أَنَا بِالرُّمَيْضَاءِ اِمْرَأَةِ أَبِيْ طَلْحَةَ وَسَمِعْتُ خَشْفَةً فَقُلْتُ: مَنْ هَذَا؟ فَقَالَ: هَذَابِلَالٌ وَرَأْيُت قَصْرًا بِفِنَائِهِ جَارِيَةٌ فَقُلْتُ: لِمَنْ هَذَا؟ فَقَالُوْا: لِعُمَرَ بْنِ الْخَطَّابِ. فَأَرَدْتُ أَنْ أَدْخُلَهُ فَأَنْظُرَإِلَيْهِ فَذَكَرْتُ غَيْرَتَكَ”. فَقَالَ عُمَرُ: بِأَبِيْ أَنْتَ وَأُمِّيْ يَا رَسُوْلَ اللهِ أَعَلَيْكَ أَغَارُ؟ مُتَّفَقٌ عَلَيْهِ.

6037. (3) [3/1702ఏకీభవితం]

జాబిర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మే’అరాజ్‌ రాత్రి స్వర్గంలో ప్రవేశించాను. అక్కడ అబూ ‘తల్‌’హా భార్య రమీ’దాహ్ ను చూచాను. ఇంకా నేను అడుగుల చప్పుడు విన్నాను. ఇతనెవరు అని జిబ్రీల్‌ను అడి గాను. దానికి జిబ్రీల్‌, ‘అతడు బిలాల్‌,’ అని అన్నారు. ఇంకా ముందుకు పోయి నేనొక భవనం చూచాను. దాని ప్రాంగణంలో ఒక అందమైన యువతి కూర్చుంది. నేను ఈ భవనం ఎవరిదని అడిగాను. స్వర్గవాసులు, ‘ఇది ‘ఉమర్‌ భవనం,’ అని అన్నారు. ‘నేను అందులోకి ప్రవేశించి చూద్దామనుకున్నాను. కాని నాకు పౌరుషం గుర్తుకు వచ్చింది,’ అని అన్నారు. అప్పుడు ‘ఉమర్‌, ఓ ప్రవక్తా! ‘నా తల్లి దండ్రులు మీ కోసం త్యాగం కాను, మీరు ప్రవేశిస్తే నేను అభ్యంతరం పడతానా?’ అని అన్నారు. (బు’ఖారీ, ముస్లిమ్‌)

6038 – [4 ] ( مُتَّفَقٌ عَلَيْهِ ) (3/1703)

وَعَنِ ابْنِ عُمَرَ قَالَ: سَمِعْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ: “بَيْنَا أَنَا نَائِمٌ رَأَيْتُ النَّاسَ يُعْرَضُوْنَ عَلَيَّ وَعَلَيْهِمْ قُمُصٌ مِنْهَا مَا يَبْلُغُ الثُّدْيَ وَمِنْهَا مَا دُوْنَ ذَلِكَ وَعُرِضَ عَلَيَّ عُمَرُ بْنُ الْخَطَّابِ وَعَلَيْهِ قَمِيْصٌ يَجُرُّهُ”. قَالُوْا: فَمَا أَوَّلْتَ ذَلِكَ يَا رَسُوْلَ اللهِ؟ قَالَ: “اَلدِّيْنَ”. مُتَّفَقٌ عَلَيْهِ.

6038. (4) [3/1703ఏకీభవితం]

అబూ స’యీద్‌ ‘ఖుద్రీ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”నేను నిద్రపోతున్నాను, నేను నిద్రలో ఇలా చూసాను, ”ప్రజలను నా ముందుకు తీసుకురావటం జరుగుతుంది. వారందరూ ఖమీజులు ధరించి ఉన్నారు. కొందరి ఖమీజులు వారి గుండెల వరకు ఉన్నాయి. మరి కొందరివి దానికంటే క్రిందికి ఉన్నాయి. ఆ తరువాత ‘ఉమర్‌ను నా ముందు ప్రవేశపెట్టటం జరిగింది. అతని కమీజు నేలకు రాస్తూ ఉంది,’ అని అన్నారు. అప్పుడు ప్రజలు, ”ఓ ప్రవక్తా! ఈ స్వప్నానికి అర్థం ఏమిటీ?” అని అడిగారు. దానికి ప్రవక్త (స), ”అతని కాలంలో ధర్మం ఆధిక్యత కలిగి ఉంటుంది.” అని అన్నారు. (బు’ఖారీ, ముస్లిమ్‌)

6039 – [5 ] ( مُتَّفَقٌ عَلَيْهِ ) (3/1703)

وَعَنِ ابْنِ عُمَرَ قَالَ: سَمِعْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ: “بَيْنَا أَنَا نَائِمٌ أُتِيْتُ بِقَدْحِ لَبَنٍ فَشَرِبْتُ حَتّى إِنِّيْ لَأَرَى الرَّيَّ يَخْرُجُ فِيْ أَظْفَارِيْ ثُمَّ أَعْطَيْتُ فَضْلِيْ عُمَرَ بْنَ الْخَطَّابِ”. قَالُوْا: فَمَا أَوَّلْتَهُ يَا رَسُوْلَ اللهِ؟ قَالَ: “اَلْعِلْمَ”. مُتَّفَقٌ عَلَيْهِ.

6039. (5) [3/1703 ఏకీభవితం]

ఇబ్నె ‘ఉమర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ఇలా అంటూ ఉండటం నేను విన్నాను, ”నేను నిద్రలో ఉన్నాను. కలలో నా వద్దకు ఒక పాల గిన్నె తీసుకురావడం జరిగింది. నేను ఆ పాలన్నీ త్రాగాను. ఆ పాల ప్రభావం నా గోర్ల నుండి బయల్పడటం చూసాను. ఆ తరువాత మిగిలిన పాలను ‘ఉమర్‌కు ఇచ్చాను. అనుచరులు, ‘ఓ ప్రవక్తా! ఈ స్వప్న పరమార్థం ఏమిటి?’ అని అడిగారు. దానికి ప్రవక్త (స) విద్యాజ్ఞానాలు అని అన్నారు. (బు’ఖారీ, ముస్లిమ్‌)

6040 – [ 6 ] ( مُتَّفَقٌ عَلَيْهِ ) (3/1703)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: سَمِعْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ: “بَيْنَا أَنَا نَائِمٌ رَأَيْتُنِيْ عَلَى قَلِيْبٍ عَلَيْهَا دَلْوٌ؟ فَنَزَعْتُ مِنْهَا مَا شَاءَ اللهُ ثُمَّ أَخَذَهَا ابْنُ أَبِيْ قُحَافَةَ فَنَزَعَ مِنْهَا ذَنُوْبًا أَوْ ذَنُوْبَيْنِ وَفِيْ نَزِعِهِ ضَعْفٌ وَاللهِ يَغْفِرُ لَهُ ضَعْفَهُ ثُمَّ اسْتَحَالَتْ غَرْبًا فَأَخَذَهَا ابْنُ الْخَطَّابِ فَلَمْ أَرَ عَبْقَرِيًّا مِنَ النَّاسِ يَنْزَعُ نَزْعَ عُمَرَ حَتَّى ضَرَبَ النَّاسَ بِعَطَنٍ”.

6040. (6) [3/1703 ఏకీభవితం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ఇలా ప్రవచిస్తూ ఉండగా నేను విన్నాను. ”నేను నిద్రలో ఉన్నాను, కలలో ఇలా చూసాను, నేను గట్టులేని బావివద్ద ఉన్నాను. అక్కడ ఒక చేద కూడా ఉంది. అల్లాహ్‌(త) కోరినంత నేను నీటినితోడాను. నా తరువాత ఇబ్నె అబీ ఖహాఫహ్ అంటే అబూ బకర్‌ పట్టుకున్నారు. అతను కూడా చేదను నీటిలో వేసి ఒకటి లేక రెండు చేదల నీళ్ళు తీసారు. అబూ బకర్‌ నీటిని తీయటంలో బలహీనత ఉంది. అల్లాహ్‌(త) అతని బలహీనతను క్షమించు గాక! ఆ తరువాత ఆ చేద ఒక పెద్ద చేదగా మారిపోయింది. దాన్ని ‘ఉమర్‌ (ర)  తీసుకున్నారు. ఆ పెద్ద చేదను లాగటం ‘ఉమర్‌ను తప్ప మరెవరినీ చూడలేదు. చివరికి ప్రజలందరూ తమ అవసరాలు తీర్చుకున్నారు. అక్కడ నీరు పుష్కలంగా ఉండటం వల్ల ఆ ప్రాంతాన్ని ఒంటెల విశ్రాంతి ప్రదేశంగా ప్రజలు చేసుకున్నారు.”

6041 – [ 7 ] ( مُتَّفَقٌ عَلَيْهِ ) (3/1703)

وَفِيْ رِوَايَةِ ابْنِ عُمَرَ قَالَ: “ثُمَّ أَخَذَهَا ابْنُ الْخَطَّابِ مِنْ يَدِ أَبِيْ بَكْرٍ فَاسْتَحَالَتْ فِيْ يَدِهِ غَرْبًا فَلَمْ أَرَ عَبْقَرِيًّا يَفْرِيْ فَرِيَّهُ حَتّى رَوِيَ النَّاسُ وَضَرَبُوْا بِعَطَنٍ”. مُتَّفَقٌ عَلَيْهِ.

6041. (7) [3/1703ఏకీభవితం]

ఇబ్నె ‘ఉమర్‌ (ర) ఉల్లేఖనంలో ఇలా ఉంది: ”ప్రవక్త (స) ప్రవచనం, ఆ తరువాత ఆ చేదను ‘ఉమర్‌ (ర) అబూ బకర్‌ నుండి తీసుకున్నారు. ఆ చేద పెద్దదిగా మారి పోయింది. అంత పెద్దచేదను ‘ఉమర్‌ తీస్తున్నట్టు ఎవరినీ నేను చూడలేదు. ప్రజలందరూ తమ అవసరాలు తీర్చుకున్నారు. అక్కడ నీరు పుష్కలంగా ఉండటం వల్ల ఆ ప్రదేశాన్ని ప్రజలు ఒంటెలు కూర్చునే ప్రదేశంగా మార్చుకున్నారు. (బు’ఖారీ, ముస్లిమ్‌)

—–

اَلْفَصْلُ الثَّانِيْ   రెండవ విభాగం 

6042 – [ 8 ] ( حسن ) (3/1704)

عَنِ ابْنِ عُمَرَ قَالَ: قَالَ رَسُوْلُ الله صلى الله عليه وسلم: “إِنَّ اللهَ جَعَلَ الْحَقَّ عَلَى لِسَانِ عُمَرَ وَقَلْبِهِ”. رَوَاهُ التِّرْمِذِيُّ.

6042. (8) [3/1704ప్రామాణికం]

ఇబ్నె ‘ఉమర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”అల్లాహ్‌ సత్యాన్ని ‘ఉమర్‌ (ర) హృదయంలో, నోటిలో వికశింప జేసాడు.” (తిర్మిజి’)

6043 – [9 ] ( ضعيف ) (3/1704)

وَفِيْ رِوَايَةٍ أَبِيْ دَاوُدَعَنْ أَبِيْ ذَرٍّ قَالَ: سَمِعْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ: “إِنَّ اللهَ وَضَعَ الْحَقُّ عَلَى لِسَانِ عُمَرَ يَقُوْلُ بِهِ”

6043. (9) [3/1704 బలహీనం]

అబూ దావూద్‌లో ఇలా ఉంది, అబూ జ’ర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ”అల్లాహ్‌(త) సత్యాన్ని ‘ఉమర్‌ (ర) నోటిలో ఉంచాడు, అందువల్లే అతడు సత్యం పలుకుతాడు” అని అన్నారు.

6044 – [ 10 ] ( لم تتم دراسته ) (3/1704)

وَعَنْ عَلِيٍّ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: مَا كُنَّا نُبْعِدُ أَنَّ السَّكِيْنَةَ تَنْطِقُ عَلَى لِسَانِ عُمَرَ. رَوَاهُ الْبَيْهَقِيُّ فِيْ “دَلَائِلِ النُّبُوَّةِ”.

6044. (10) [3/1704 అపరిశోధితం]

‘అలీ (ర) కథనం: మేము పరస్పరం విషయాల గురించి మాట్లాడుకునేటప్పుడు చివరగా ‘ఉమర్‌ సరైన నిర్ణయాన్ని తెలిపేవారు. (బైహఖీ – దలాయి’లి న్నుబువ్వహ్)

6045 – [ 11 ] ( حسن صحيح ) (3/1704)

وَعَنِ ابْنِ عَبَّاسٍ عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ: “اَللّهُمَّ أَعِزَّ الْإِسْلَامِ بِأَبِيْ جَهْلِ بْنِ هِشَّامٍ أَوْ بِعُمَرَ بْنِ الْخَطَّابِ” فَأَصْبَحَ عُمَرُ فَغَدَا عَلَى النَّبِيِّ صلى الله عليه وسلم فَأَسْلَمَ ثُمَّ صَلّى فِيْ الْمَسْجِدِ ظَاهِرًا. رَوَاهُ أَحْمَدُ وَالتِّرْمِذِيُّ.

6045. (11) [3/1704 ప్రామాణికం, దృఢం]

ఇబ్నె ‘అబ్బాస్‌ (ర) కథనం: ప్రవక్త (స) ఇలా దు’ఆ చేసారు: ”ఓ అల్లాహ్‌ (త)! ఇస్లామ్‌కు గౌరవాదరణలు ప్రసాదించు, అబూ జహల్‌ బిన్‌ హిషామ్‌ ద్వారా లేదా ఉమర్‌ బిన్‌ ‘ఖ’త్తాబ్‌ ద్వారానైనా సరే.” ఈ దు’ఆ తరు వాత ఉదయం ‘ఉమర్‌ (ర) ప్రవక్త (స) వద్దకు వచ్చి ఇస్లామ్‌ స్వీకరించారు. ఆతరువాత ‘ఉమర్‌(ర) ‘హరమ్‌ లో బహిరంగంగా నమా’జు  చేసారు. (అ’హ్మద్‌, తిర్మిజి’)

6046 – [ 12 ] ( باطل ) (3/1704)

وعَنْ جَابِرٍقَالَ: قَالَ عُمَرُلِأَبِيْ بَكْرٍ: يَا خَيْرَالنَّاسِ بَعْدَ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم. فَقَالَ أَبُوْبَكْرٍ: أَمَّا إِنَّكَ إِنْ قُلْتَ ذَلِكَ فَلَقَدْ سَمِعْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ: “مَا طَلَعَتِ الشَّمْسُ عَلَى رَجُلٍ خَيْرٍ مِنْ عُمَرَ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَقَالَ: هَذَا حَدِيْثٌ غَرِيْبٌ.

6046. (12) [3/1704 అసత్యం]

జాబిర్‌ (ర) కథనం: ‘ఉమర్‌ (ర) అబూ బకర్‌ (ర)తో ”మానవుల్లో ప్రవక్త (స) తరువాత అందరికంటే ఉత్తము డైన మానవుడా?” అని అన్నారు. దానికి, అబూ బకర్‌ (ర), ఓ ‘ఉమర్‌! జాగ్రత్త! ఒకవేళ నువ్వు ఇలా అంటే, నేను ప్రవక్త (స) ద్వారా ‘ఉమర్‌ కంటే ఉత్తములైన వారిపై సూర్యుడు ఉదయించలేదని అనటం విన్నాను,’ అని అన్నారు. (తిర్మిజి’ / ఏకోల్లేఖనం)

6047 – [ 13 ] ( حسن ) (3/1704)

وَعَنْ عُقْبَةَ بْنِ عَامِرٍ قَالَ: قَالَ النَّبِيُّ صلى الله عليه وسلم: “لَوْكَانَ بَعْدِيْ نَبِيُّ لَكَانَ عُمَرُ بْنُ الْخَطَّابِ”. رَوَاهُ التِّرْمِذِيُّ. وَقَالَ: هَذَا حَدِيْثٌ غَرِيْبٌ.

6047. (13) [3/1704 ప్రామాణికం]

ఉఖ్‌బహ్ బిన్‌ ‘ఆమిర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ఒకవేళ నా తరువాత ఎవరైనా ప్రవక్త అయితే, అది ‘ఉమర్‌ (ర) అని అన్నారు. (తిర్మిజి’ – ఏకోల్లేఖనం)

6048 – [ 14 ] ( حسن صحيح ) (3/1705)

وَعَنْ بُرَيْدَةَ قَالَ: خَرَجَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم فِيْ بَعْضٍ مَغَازِيْهِ فَلَمَّا انْصَرَفَ جَاءَتْ جَارِيَةٌ سَوْدَاءُ. فَقَالَتْ: يَا رَسُوْلَ اللهِ إِنِّيْ كُنْتُ نَذَرْتُ إِنْ رَدَّكَ اللهُ سَالِمًا أَنْ أَضْرِبَ بَيْنَ يَدَيْكَ بِالدُّفِّ وَأَتَغَنّى. فَقَالَ لَهَا رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِنْ كُنْتِ نَذَرْتِ فَاضْرِبِيْ وَإِلَّا فَلَا”. فَجَعَلَتْ تَضْرِبُ فَدَخَلَ أَبُوْ بَكْرٍ وَهِيَ تَضْرِبُ ثُمَّ دَخَلَ عَلَيَّ وَهِيَ تَضْرِبُ ثُمَّ دَخَلَ عُثْمَانُ وَهِيَ تَضْرِبُ ثُمَّ دَخَلَ عُمَرُ فَأَلْقَتِ الدُّفَّ تَحْتَ اِسْتِهَا ثُمَّ قَعَدَتْ عَلَيْهَا. فَقَالَ رَسُوْلُ الله صلى اللهِ عليه وسلم: “إِنَّ الشَّيْطَانَ لَيَخَافُ مِنْكَ يَا عُمَرُ إِنِّيْ كُنْتُ جَالِسًا وَهِيَ تَضْرِبُ فَدَخَلَ أَبُوْ بَكْرٍ وَهِيَ تَضْرِبُ ثُمَّ دَخَلَ عَلِيُّ وَهِيَ تَضْرِبُ ثُمَّ دَخَلَ عُثْمَانُ وَهِيَ تَضْرِبُ. فَلَمَّا دَخَلْتَ أَنْتَ يَا عُمَرُ أَلْقَتِ الدَّفّ”. رَوَاهُ التِّرْمِذِيُّ . وَقَالَ: هَذَا حَدِيْثٌ حَسَنٌ صَحِيْحٌ غَرِيْبٌ.

6048. (14) [3/1705 ప్రామాణికం,  దృఢం]

బురైదహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ఒక యుద్ధానికి వెళ్ళారు. తిరిగి వచ్చిన తర్వాత ఒక నల్లజాతి బానిసరాలు వచ్చి, ‘ఓ ప్రవక్తా! తమరు సురక్షితంగా తిరిగి వస్తే, నేనుదఫ్‌ వాయిస్తానని మ్రొక్కు కున్నాను,’ అని విన్నవించుకుంది. దానికి ప్రవక్త (స), ‘ఒకవేళ నువ్వు మొక్కుకుంటే దఫ్‌ వాయించు, ఒకవేళ మొక్కుకోకపోతే వాయించకు,’ అని అన్నారు. ఆమె దఫ్‌ వాయించడం ప్రారంభించింది. ఆమె వాయి స్తుండగా అబూ బకర్‌ (ర) వచ్చారు. ఆమె వాయి స్తూనే ఉంది. ఇంతలో ‘అలీ (ర) వచ్చారు. ఆమె వాయిస్తూనే ఉంది. ‘ఉస్మాన్‌ (ర) వచ్చినా ఆమె దఫ్ వాయిస్తూనే ఉంది. కాని ‘ఉమర్ రాగానే దఫ్‌ను తన క్రిందపెట్టి దానిపై కూర్చుంది. ప్రవక్త (స) అది చూచి ‘ ‘ఉమర్‌! షై’తాన్‌ నీకు భయపడుతున్నాడు. నేను కూర్చుని ఉండగా ఆమె వాయించింది, అబూ బకర్‌ వచ్చారు. అప్పుడు కూడా ఆమె వాయిస్తూ ఉంది. ‘అలీ వచ్చినా వాయిస్తూ ఉంది. ‘ఉస్మాన్‌ వచ్చినా వాయిస్తూ ఉంది. కాని నీవు రాగానే ఆమె దఫ్‌ వాయిం చడం ఆపి, దాన్ని దాచుకుంది,’ అని అన్నారు. (తిర్మిజి’ – ప్రామాణికం – దృఢం – ఏకోల్లేఖనం)

6049- [ 15 ] ( حسن ) (3/1705)

وعَنْ عَائِشَةَ قَالَتْ: كَانَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم جَالِسًا فَسَمِعْنَا لَغَطًا وَصَوْتَ صِبْيَانٍ. فَقَامَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم فَإِذَا حَبَشِيَّةٌ تَزْفِنُ وَالصِّبْيَانُ حَوْلَهَا. فَقَالَ: “يَا عَائِشَةَ تَعَالِيْ فَانْظُرِيْ”. فَجِئْتُ فَوَضَعْتُ لَحْيَيَّ عَلَى مَنْكِبِ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم. فَجَعَلْتُ أَنْظُرُ إِلَيْهَا مَا بَيْنَ الْمَنْكِبِ إِلى رَأْسِهِ. فَقَالَ لِيْ: “أَمَا شَبِعْتِ؟ أَمَا شَبِعْتِ؟” فَجَعَلْتُ أَقُوْلُ: لَا لِأَ نْظُرَ مَنْزِلَتِيْ عِنْدَهُ إِذْ طَلَعَ عُمَرُ .قَالَتْ فَارْفَضَّ النَّاسُ عَنْهَا قَالَتْ فقَالَ رَسُوْلُ الله صلى الله عليه وسلم:” إِنِّيْ لَأَنْظُرُإِلى شَيَاطِيْنِ الْإِنْسِ  وَالْجِنِّ قَدْ فَرُّوْا مِنْ عُمَرَ”. قَالَتْ: فَرَجَعْتُ. رَوَاهُ التِّرْمِذِيُّ وقَالَ: هْذا حَدِيْثٌ حَسَنٌ صَحِيْحٌ غَرِيْبٌ .

6049. (15) [3/1705 ప్రామాణికం]

‘ఆయి’షహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) కూర్చుని ఉన్నారు. మేము పిల్లల కేరింతలు, కేకలు, కోలాహలం విన్నాం. ప్రవక్త (స) నిలబడ్డారు. ఒక నల్ల జాతి స్త్రీ డాన్సు చేస్తూ ఉండటం, పిల్లలు ఆమె చుట్టూ చేరి చూస్తూ ఉండటం చూసారు. అప్పుడు ప్రవక్త (స), ‘ ‘ఆయి’షహ్‌! రా ఈ గారడి నువ్వు కూడా చూడు,’ అని అన్నారు. అనంతరం నేను ప్రవక్త (స) వెనుక నిలబడి, ప్రవక్త (స) భుజంపై ముఖం పెట్టి ఆ స్త్రీని చూడసాగాను. కొంచెం సేపు తర్వాత ప్రవక్త (స), ‘ఇంకా తనివితీర లేదా, ఇంకా తనివితీర లేదా?’ అని అన్నారు. దానికి నేను, ‘లేదు,’ అని అన్నాను. అంటే ప్రవక్త (స) వద్ద నాకు ఎంతటి స్థానం ఉందో తెలుసుకోవాలని. అకస్మాత్తుగా ‘ఉమర్‌ (ర) వచ్చారు. ఆమెను చూస్తున్న ప్రేక్షకు లందరూ అటూ ఇటూ వెళ్ళిపోయారు. అప్పుడు ప్రవక్త (స), ‘మానవుల్లోని, జిన్నుల్లోని, షై’తానులు ‘ఉమర్‌కు భయపడి పారిపోతారు,’ అని అన్నారు. ఆ తరువాత నేను ఇంటికి తిరిగి వచ్చేసాను. (తిర్మిజి’ – ప్రామాణికం – దృఢం – ఏకోల్లేఖనం)

—–

اَلْفَصْلُ الثَّالِثُ మూడవ విభాగం   

6050 – [ 17 ] ( مُتَّفَقٌ عَلَيْهِ ) (3/1706)

عَنْ أَنَسٍ وَابْنِ عُمَرَ أَنَّ عُمَرَ قَالَ: وَافَقْتُ رَبِّيْ فِيْ ثَلَاثٍ: قُلْتُ: يَا رَسُوْلَ اللهِ لَوِ اتَّخَذْنَا مِنْ مَقَامِ إِبْرَاهِيْمَ مُصَلَّى؟ فَنَزَلَتْ [وَاتَّخِذُوْا مِنْ مَّقَامِ إِبْرَاهِيْمَ مُصَلّى؛ 2: 125]. وَقُلْتُ: يَا رَسُوْلَ اللهِ يَدْخُلُ عَلَى نِسَائِكَ الْبَرُّ وَالْفَاجِرُ فَلَوْ أَمَرْتَهُنَّ يَحْتَجِبْنَ؟ فَنَزَلَتْ آيَةً الْحِجَابِ وَاجْتَمَعَ نِسَاءُ النَّبِيِّ صلى الله عليه وسلم فِي الْغَيْرَةِ فَقُلْتُ [عَسَى رَبُّهُ إِنْ طَلَّقَكُنَّ أَنْ يُّبْدِلَهُ أَزْوَاجًا خَيْرًا مِّنْكُنَّ؛66: 5] فَنَزَلَتْ كَذَلِكَ.

6050. (17) [3/1706ఏకీభవితం]

అనస్‌ (ర) మరియు ఇబ్నె ‘ఉమర్‌ (ర) కథనం: ‘ఉమర్‌ (ర) కథనం ”నేను మూడు విషయాల్లో నా ప్రభువును అనుక రించాను. ఒకటేమిటంటే, నేను ప్రవక్త (స)ను, ‘ఓ ప్రవక్తా! ఒకవేళ మనం మఖామె ఇబ్రాహీమ్‌ను నమా’జు చేసేస్థలంగా చేసుకుంటే బాగుణ్ను,’ అని విన్నవించు కున్నాను. అనంతరం అల్లాహ్‌(త), ”వత్తఖజా మిన్‌ మఖామి ఇబ్రాహీమ ముసల్లా,” – (అల్-బఖరహ్, 2:125)’ – అంటే మఖామె ఇబ్రాహీంను నమా’జు స్థలంగా చేసుకోండి,’ అని ఆదేశం అవతరింపజేసాడు. రెండవ విషయం ఏమిటంటే, నేను ప్రవక్త (స) తో, ‘ఓ ప్రవక్తా! తమరి ఇంటికి మంచివారూ, చెడ్డవారూ అందరూ వస్తుంటారు. తమరు మీ భార్యలకు పరదా ఆదేశం ఇస్తే బాగుణ్ను,’ అని అన్నాను. అనంతరం పరదా ఆదేశం అవతరించింది. మూడవ విషయం ఏమి టంటే, ప్రవక్త (స) భార్యలు ప్రవక్త (స)తో వాదోపవాదాలకు దిగారు. అప్పుడు నేను వారితో, ”ఒకవేళ ప్రవక్త (స) మీకు విడాకులు ఇస్తే అల్లాహ్‌(త) మీ కంటే ఉత్తమ భార్యలను ప్రసాదిస్తాడు,” (అత్-తహ్రీమ్, 66:5) అని అన్నాను. అనంతరం అదేవిధంగా దైవవాణి అవతరించింది.[8]

6051 – [ 18 ] ( مُتَّفَقٌ عَلَيْهِ ) (3/1706)

وَفِيْ رِوَايَةٍ لِاِبْنِ عُمَرَ قَالَ: قَالَ عُمَرُ: وَافَقْتُ رَبِّيْ فِيْ ثَلَاثٍ: فِيْ مَقَامٍ إِبْرَاهِيْمَ وَفِي الْحِجَابِ وَفِيْ أُسَارَى بَدْرٍ. مُتَّفَقٌ عَلَيْهِ.

6051. (18) [3/1706ఏకీభవితం]

ఇబ్నె ‘ఉమర్‌ (ర) ఉల్లేఖనంలో ఇలా ఉంది, ”నేను మూడువిషయాల్లో అల్లాహ్‌(త)తో,ఏకాభిప్రాయం కలిగి ఉన్నాను. ఒకటి మఖామె ఇబ్రాహీమ్‌, రెండు పర్దా విషయంలో, మూడు బద్ర్‌ యుద్ధ ఖైదీల విషయంలో,” అని ‘ఉమర్‌ (ర) అన్నారు. (బు’ఖారీ, ముస్లిమ్‌)

6052 – [ 18 ] ( ضعيف ) (3/1706)

وعَنْ ابْنِ مَسْعُوْدٍ قَالَ: فُضِّلَ النَّاسَ عُمَرُ بْنُ الْخَطَّابٍ بِأَرْبَعٍ: بِذِكْرِ الْأُسَارَى يَوْمَ بَدْرٍأَمَرَبِقَتْلِهِمْ. فَأَنْزَلَ اللهُ تَعَالى [لَوْلَا كِتَابٌ مِّنَ اللهِ سَبَقَ لَمَسَّكُمْ فِيْمَا أَخَذْتُمْ عَذَابٌ عَظِيْمٌ؛ 8: 68] وَبذِكْرِهِ الْحِجَابَ أَمَرَ نِسَاءَ النَّبِيِّ صلى الله عليه وسلم أَنْ يَحْتَجِبْنَ فَقَالَتْ لَهُ زَيْنَبُ: وَإِنَّكَ عَلَيْنَا يَا ابْن الْخَطَّابِ وَالْوَحْيُ يَنْزِلُ فِيْ بُيُوْتِنَا؟ فَأَنْزَلَ اللهُ تَعَالى [وَإِذَا سَأَلْتُمُوْهُنَّ مَتَاعًا فَاسْأَلُوْهُنَّ مِنْ وَّرَاءِ حِجَابٍ؛ 33:53 ] وَبِدَعْوَةِ النَّبِيِّ صلى الله عليه وسلم: “اَللّهُمَّ أَيْدِ الْإِسْلَامِ بِعُمَرَ”. وَبِرَأْيِهِ فِيْ أَبِيْ بَكْرٍ كَانَ أَوَّلَ نَاسٍ بَايَعَهُ. رَوَاهُ أَحْمَدُ.

6052. (18) [3/1706బలహీనం]

ఇబ్నె మస్‌’ఊద్‌ (ర) కథనం: నాలుగు విషయాల వల్ల ‘ఉమర్‌ (ర)కు ఇతరులపై ప్రాధాన్యత ఇవ్వ బడింది. 1. బద్ర్‌ యుద్ధంనాడు యుద్ధఖైదీలను ‘ఉమర్‌ (ర) చంపివేయమని సలహాఇచ్చారు. అనంతరం దానికి అనుకూలంగా అల్లాహ్‌(త) దైవనిర్ణయం జరిగి ఉండకపోతే మీరు పరిహారం తీసుకున్నందుకు మిమ్మల్ని  కఠినంగా శిక్షించడం జరిగి ఉండేది అనే ఆయతు అవతరించింది. 2వది ‘ఉమర్‌ (ర) పర్దాగురించి సలహా ఇచ్చినందు వల్ల ప్రవక్త (స) భార్యలకు అల్లాహ్‌ పర్దా ఆదేశాలు జారీచేసారు. 3 విషయం ఏమిటంటే, ప్రవక్త (స) ‘ఉమర్‌ ద్వారా ఇస్లామ్‌కు  బలం చేకూర్చమని ప్రార్థించారు. 4 విషయం ఏమిటంటే, అబూ బకర్‌ ‘ఖలీఫహ్ కావాలని కోరుకునే మొట్టమొదటి వ్యక్తి ‘ఉమర్‌, ఇంకా అందరి కంటే ముందు అబూ బకర్‌ చేతిపై బైఅత్‌ చేసిన వ్యక్తి ‘ఉమర్‌ (ర). [9]  (అ’హ్మద్‌)

6053 – [ 19 ] ( واه ) (3/1706)

وَعَنْ أَبِيْ سَعِيْدٍقَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “ذَاكَ الرَّجُلُ أَرْفَعُ أُمَّتِيْ دَرَجَةً فِي الْجَنَّةِ”. قَالَ أَبُوْ سَعِيْدٍ: وَاللهِ مَا كُنَّا نُرَى ذَلِكَ الرَّجُلَ إِلَّا عُمَرَ بْنَ الْخَطَّابِ حَتّى مَضَى لِسَبِيْلِهِ. رَوَاهُ ابْنُ مَاجَهُ .

6053. (19) [3/1706అత్యంత బలహీనం]

అబూ స’యీద్‌ ‘ఖుద్రీ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”నా అనుచర సమాజంలో ఆ వ్యక్తి స్వర్గంలో అందరి కంటే అధిక తరగతులు గలవాడు. అల్లాహ్ (త) సాక్షి! మేము ఆ వ్యక్తి ‘ఉమర్‌ (ర) గానే భావించేవారం. అతను మరణించేవరకు మేము అలాగే భావించే వాళ్ళం. [10]  (ఇబ్నె  మాజహ్)

6054 – [ 20 ] ( صحيح ) (3/1707)

وعَنْ أَسْلَمَ قَالَ: سَأَلَنِيَ ابْنُ عُمَرَبَعْضَ شَأْنِهِ- يَعْنِيْ عُمَرَ-فَأَخْبَرْتُهُ فَقَالَ: مَارَأَيْتُ أَحَدًاقَطُّ بَعْدَ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم مِنْ حِيْنَ قُبِضَ كَانَ أَجَدَّ وَأَجْوَدُ حَتّى انْتَهَى مِنْ عُمَرَ. روَاهُ الْبُخَارِيُّ.

6054. (20) [3/1707దృఢం]

అస్‌లమ్‌ (ర) కథనం: ఇబ్నె ‘ఉమర్‌, నన్ను ‘ఉమర్‌ (ర) గురించి అడిగారు. దానికి అస్‌లమ్‌ (ర) ప్రవక్త (స) మరణానంతరం ‘ఉమర్‌ కంటే కృషి, ప్రయత్నాలు చేసే వారెవరినీ చూడలేదు. చివరికి ‘ఉమర్‌ (ర) తన చివరి వయస్సుకు చేరుకున్నారు. (బు’ఖారీ)

6055 – [ 21 ] ( صحيح ) (3/1707)

وعَنِ الْمِسْوَرِ بْنِ مَخْرَمَةَ قَالَ: لَمَّا طُعِنَ عُمَرُ جَعَلَ يَأْلَمُ فَقَالَ لَهُ ابْنُ عَبَّاسٍ وَكَأَنَّهُ يُجَزِّعُهُ: يَا أَمِيْرَ الْمُؤْمِنِيْنَ وَلَا كُلُّ ذَلِكَ لَقَدْ صَحِبْتَ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم فَأَحْسَنْتَ صُحْبَتَهُ ثُمَّ فَارَقَكَ وَهُوَ عَنْكَ رَاضٍ ثُمَّ صَحِبْتَ أَبَا بَكْرٍ فَأَحْسَنْتَ صُحْبَتَهُ ثُمَّ فَارَقَكَ وَهُوَ عَنْكَ رَاضٍ ثُمَّ صَحِبْتَ الْمُسْلِمِيْنَ فَأَحْسَنْتَ صُحْبَتَهُمْ وَلَئِنْ فَارَقْتَهُمْ لَتُفَارِقَنَّهُمْ وَهُمْ عَنْكَ رَاضُوْنَ. قَالَ: أَمَّا مَا ذَكَرْتَ مِنْ صُحْبَةِ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم وَرِضَاهُ فَإِنَّمَا ذَاكَ مَن مِنَ اللهِ مَنَّ بِهِ عَلَيَّ وَأَمَّا مَا ذَكَرْتَ مِنْ صُحْبَةِ أَبِيْ بَكْرٍ وَرِضَاهُ فَإِنَّمَا ذَلِكَ مَنٌّ مِنَ اللهِ جَلَّ ذكره مَنَّ بِهِ عَلَيُّ. وَأَمَّا مَا تَرَى مِنْ جَزْعِيْ فَهُوَ مِنْ أَجْلِكَ وَأَجَلِ أَصْحَابِكَ وَاللهِ لَوْ أَنَّ لِيْ طِلَاعَ الْأَرْضِ ذَهَبًا لَاَفْتَدَيْتُ بِهِ مِنْ عَذَابِ اللهِ عَزَّ وَجَلَّ قَبْلَ أَنْ أَرَاهُ. روَاهُ الْبُخَارِيُّ.

6055. (21) [3/1707దృఢం]

మిస్‌వర్‌ బిన్‌ మ’ఖ్‌రమహ్‌ (ర) కథనం: ‘ఉమర్‌ (ర) గాయపడి చాలా బాధను వెలిబుచ్చారు. ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘అబ్బాస్‌ అది చూసి, ఓదార్చి ఓ అమీరుల్‌ ము’అమినీన్‌! ఈ విధంగా బాధను బహిర్గతం చేయడం మీకు తగదు. మీరెంతటి గొప్పవారంటే, మీకు ప్రవక్త (స) సాన్నిహిత్యం లభించింది. ఆయన సహవాసంలోనే గడిపారు. ప్రవక్త (స) మరణించినపుడు మీపట్ల ఎంతో సంతోషంగా, ప్రేమగా ఉన్నారు. ఆ తరువాత మీరు అబూ బకర్‌ (ర) సహవాసంలో ఉన్నారు. మీరు ఆయన సాన్నిహిత్యంలో కూడా ఉన్నారు. ఆయన మరణించి నపుడు కూడా మీ పట్ల ఎంతో సంతోషంగా ఉన్నారు. ఆ తరువాత పరిపాలనా కాలంలో తమరు ప్రజల వెంట ఉన్నారు. వారితో కూడా మీ సహవాసం చాలా బాగుండేది. ఇప్పుడు మీరు ముస్లిములతో వేరవు తున్నప్పుడు ముస్లిములందరూ మీ పట్ల సంతోషంగా ఉండేటట్లు వెళ్ళాలి, అన్నారు. ‘ఉమర్‌ (ర) అది విని, మీరు ప్రవక్త (స) సహవాసం గురించి ప్రస్తావించారు. అదొక అల్లాహ్‌(త) గొప్ప ఉపకారం. ఆ తరువాత మీరు అబూ బకర్‌ (ర) సాన్నిహిత్యాన్ని గురించి ప్రస్తావించారు. అది కూడా అల్లాహ్‌(త) ఉపకారమే. నేను ఆందోళన చెందుతున్నది గాయాల బాధవల్ల కాదు. నేను విచారిస్తున్నది మీ గురించి, మీ సన్నిహితుల గురించి. అల్లాహ్ (త) సాక్షి! ఒకవేళ నా దగ్గర భూమి నిండా బంగారం ఉంటే, దాన్ని పరిహారంగా ఇచ్చి  దైవశిక్షను చూడకముందే దాన్నుండి విముక్తుడ్ని అయ్యేవాడిని. (బు’ఖారీ)

=====

5 بَابُ مُنَاقِبِ أَبِيْ بَكْرٍ وَعُمَرَ رَضِيَ اللهُ عَنْهُمَا

5. అబూబకర్, ఉమర్‌ (.అన్హుం) ప్రత్యేకతలు

اَلْفَصْلُ الْأَوَّلُ   మొదటి విభాగం    

6056 – [ 1 ] ( مُتَّفَقٌ عَلَيْهِ ) (3/1708)

عَنْ أَبِيْ هُرَيْرَةَ عَنْ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم قَالَ: ” بَيْنَا رَجُلٌ يَسُوْقث بَقَرَةً إِذْ أَعْيي فَرَكِبَهَا فَقَالَتْ: إِنَّا لَمْ نُخْلَقْ لِهَذَا إِنَّمَا خُلِقْنَا لِحَرَاثَةِ الْأَرْضِ. فَقَالَ النَّاسُ: سُبْحَانَ اللهِ بَقَرَةٌ تَكَلَّمْ”. فَقَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “فِإِنِّيْ أُوْمِنُ بِهَذَا أَنَا وَأَبُوْ بَكْرٍوَعُمَرُ”. ومَا هُمَا ثُمَّ وَقَالَ: “بَيْنَمَا رَجُلٌ فِيْ غَنَمٍ لَهُ إِذْ عَدَا الذِّئْبُ فَذَهَبَ عَلَى شَاةٍ مِنْهَا فَأَخَذَهَا فَأَدْرَكَهَا صَاحِبُهَا فَاسْتَنْقُذَهَا فَقَالَ لَهُ الذِّئْبُ: فَمَنْ لَهَا يَوْمَ السَّبع يَوْمَ لَا رَاعِيَ لَهَا غَيْرِيْ؟ فَقَالَ النَّاسُ: سُبْحَانَ اللهِ ذِئْبَ يَتَكَلَّمُ؟ قَالَ: “أُوْمِنُ بِهِ أَنَا وَأَبُوْبَكْرٍوَعُمَرَ” وَمَا هُمَا ثُمَّ. مُتَّفَقٌ عَلَيْهِ.

6056. (1) [3/1708 ఏకీభవితం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఒక వ్యక్తి ఆవును తోలుకుపోతూ ఉన్నాడు. అలసిపోయి దానిపై ఎక్కి కూర్చున్నాడు. అప్పుడు ఆవు, ‘మాపై ఎక్కడానికి మమ్మల్ని సృష్టించడం జరగలేదు. మమ్మల్ని వ్యవసాయం కోసం సృష్టించడం జరిగింది,’ అని పలికింది . ప్రజలు ఆశ్చర్యంగా, ‘ఆవు కూడా మాట్లాడుతుందే’ అని చూడసాగారు. దానిపట్ల ప్రవక్త (స) దీనిపై నేను, అబూ బకర్‌, ‘ఉమర్‌లను విశ్వసిస్తున్నాం. అయితే అబూ బకర్‌, ‘ఉమర్‌లు అక్కడలేరు,’ అని అన్నారు. ఒక వ్యక్తి తన మేకల మందలో ఉన్నాడు. ఒక తోడేలు దాడిచేసి ఒక మేకను తీసుకుపోయింది. మేకల యజమాని వచ్చి, దాన్నుండి మేకను విడిపించాడు. అప్పుడు తోడేలు కాపరితో, ‘తీర్పుదినం దగ్గరిలో మేకలను మేపేవాడు నా తప్ప ఎవరూ ఉండరు.’ ప్రజలు తోడేలు మాట్లాడుతుందని ఆశ్చర్యంగా చూడ సాగారు. ప్రవక్త (స) ‘ఈ సంఘటనపై నేను, అబూ బకర్‌, ‘ఉమర్‌లను విశ్వసిస్తున్నాను, అయితే వారిద్దరూ అక్కడ లేరు,’ అని అన్నారు. (బు’ఖారీ, ముస్లిమ్‌)

6057 – [ 2 ] ( مُتَّفَقٌ عَلَيْهِ ) (3/1708)

وَعَنِ ابْنِ عَبَّاسٍ قَالَ: إِنِّيْ لَوَاقِفٌ فِيْ قَوْمٍ فَدَعَوُا اللهَ لِعُمَرَ وَقَدْ وُضِعَ عَلَى سَرِيْرِهِ إِذَا رَجُلٌ مِنْ خَلْفِيْ قَدْ وَضَعَ مِرْفَقَهُ عَلَى مَنْكِبِيْ يَقُوْلُ: يَرْحَمُكَ اللهُ. إِنِّيْ لَأَرْجُو أَنْ يَجْعَلَكَ اللهُ مَعَ صَاحِبَيْكَ. لِأَنِّيْ كَثِيْرًا مَا كُنْتُ أَسْمَعُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ: “كُنْتُ وَأَبُوْ بَكْرٍ وَعُمَرَ وَفَعَلْتُ وَأَبُوْ بَكْرٍ وَعُمَرُ وَانْطَلَقْتُ وَأَبُوْ بَكْرٍ وَعُمَرُ وَدَخَلْتُ وَأَبُوْ بَكْرٍ وَعُمَرُ وَخَرَجْتُ وَأَبُوْ بَكْرٍ وَعُمَرُ”. فَالْتَفَتُّ فَإِذَا هُوَ عَلِيُّ بْنِ أَبِيْ طَالِبٍ رضي الله عَنْه. مُتَّفَقٌ عَلَيْهِ.

6057. (2) [3/1708 ఏకీభవితం]

ఇబ్నె ‘అబ్బాస్‌ (ర) కథనం: నేను కొంత మంది మధ్య నిలబడి ఉన్నాను. ‘ఉమర్‌ (ర) మృతదేహాన్ని మంచంపై ఉంచిన అనంతరం వారు ‘ఉమర్‌ (ర) గురించి దు’ఆ చేసారు. అకస్మాత్తుగా నా వెనుక ఒక వ్యక్తి తన మోచేతులను నా భుజంపై ఉంచి, ఇలా అనసాగారు, ”అతని(ర)పై అల్లాహ్‌(త) కారుణ్యం కురియుగాక! నిస్సందేహంగా అల్లాహ్‌(త) అతనిని, అతని ఇద్దరు మిత్రులతో కలుపుతాడని ఆశిస్తున్నాను. ఎందుకంటే చాలాసార్లు ప్రవక్త (స) నేనూ, అబూ బకర్‌, ‘ఉమర్‌లు ఉన్నప్పుడు నేను, అబూ బకర్‌, ‘ఉమర్‌లు ఈ పని చేసాము, నేను అబూ బకర్‌, ‘ఉమర్‌ వెళ్ళాము, నేను అబూ బకర్‌ ‘ఉమర్‌ ప్రవేశించాము. ఇంకా నేను, అబూ బకర్‌, ‘ఉమర్‌లు బయలుదేరాము,’ అని అంటూ ఉండగా విన్నాను. నేను వెనక్కి తిరిగి చూడగా ఆ చెప్పే వ్యక్తి, ‘అలీ  బిన్‌  అబీ  ‘తాలిబ్‌. (బు’ఖారీ, ముస్లిమ్‌)

—–

اَلْفَصْلُ الثَّانِيْ   రెండవ విభాగం 

6058 – [ 3 ] ( ضعيف ) (3/1709)

عَنْ أَبِيْ سَعِيْدِ الْخُدْرِيِّ أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم قَالَ: “إِنَّ أَهْلَ الْجَنَّةِ لَيَرَاءَوْنَ أَهْلَ عِلِّيِّيْنَ كَمَا تَرَوْنَ الْكَوْكَبَ الدُّرِّيَّ فِي أُفُقِ السَّمَاءِ وَإِنَّ أَبَا بَكْرٍ وَعُمَرَ مِنْهُمْ وَأُنْعِمَا”. رَوَاهُ فِيْ “شَرْحِ السُّنَّةِ”. وَرَوَي نَحْوَهُ أَبُوْ دَاوُدَ وَالتِّرْمِذِيُّ وَابْنُ مَاجَهُ

6058. (3) [3/1709బలహీనం]

అబూ స’యీద్‌ ‘ఖుద్రీ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”నిస్సందేహంగా స్వర్గవాసులు ఇల్లియ్యూన్‌  వారిని, మీరు ఆకాశంలో నక్షత్రాలను చూచినట్టు చూస్తారు. నిస్సందేహంగా అబూ బకర్‌, ‘ఉమర్‌లు కూడా ఇల్లియ్యీన్‌ వారిలోనే ఉన్నారు. వారు దాని కంటే ఉత్తమస్థానం కలిగి ఉన్నారు.” (బ’గవీ – షర్‌’హు స్సున్నహ్‌, అబూ దావూద్‌, తిర్మిజి’, ఇబ్నె మాజహ్)

6059 – [ 4 ] ( صحيح لشواهده ) (3/1709)

وَعَنْ أَنَسٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “أَبُوْ بَكْرٍ وَعُمَرُ سَيِّدًا كَهُوْلِ أَهْلِ الْجَنَّةِ مِنَ الْأَوَّلِيْنَ وَالْآخِرِيْنَ إِلَّا النَّبِيِّيْنَ وَالْمُرْسَلِيْنَ”. رَوَاهُ التِّرْمِذِيُّ.

6059. (4) [3/1709సాక్షులచే  దృఢం]

అనస్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”స్వర్గంలో ఉన్న అధిక వయస్సు గల వారందరికీ, వారు ఏ అనుచర సమాజానికి చెందినవారైనా, వారికి అబూ బకర్‌ ‘ఉమర్‌లు నాయ కులుగా ఉంటారు. ప్రవక్తలకు సందేశహరులకు  తప్ప.”  (తిర్మిజి’)

6060 – [ 5 ] ( صحيح ) (3/1709)

وَرَوَاهُ ابْنُ مَاجَهُ عَنْ عَلِيٍّ رَضِيَ اللهُ عَنْهُ

6060. (5) [3/1709–  దృఢం]

ఈ ‘హదీసు’ను ఇబ్నె మాజహ్, ‘అలీ (ర) ద్వారా ఉల్లేఖించారు.[11]

6061 – [ 6 ] ( حسن ) (3/1709)

وَعَنْ حُذَيْفَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِنِّيْ لَا أَدْرِيْ مَا بَقَائِيْ فِيْكُمْ؟ فَاقْتَدَوْا بِاللَّذَيْنِ مِنْ بَعْدِيْ: أَبِيْ بَكْرٍ وَعُمَرَ”. رَوَاهُ التِّرْمِذِيُّ .

6061. (6) [3/1709–  ప్రామాణికం]

హుజై’ఫా (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”నేను మీ మధ్య ఎన్నిరోజులు ఉంటానో, నాకు తెలియదు. కనుక మీరు నా అనంతరం అబూ బకర్‌, ‘ఉమర్‌లను అనుసరించండి.”  (తిర్మిజి’)

6062 – [ 7 ] ( لم تتم دراسته ) (3/1709)

وَعَنْ أَنَسٍ قَالَ: كَانَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم إِذَا دَخَلَ الْمَسْجِدَ لَمْ يَرْفَعْ أَحَدٌ رَأْسَهُ غَيْرَ أَبِيْ بَكْرٍ وَعُمَرَ كَانَا يَتَبَسَّمَانِ إِلَيْهِ وَيَتَبَسَّمُ إِلَيْهِمَا. رَوَاهُ التِّرْمِذِيُّ. وَقَالَ: هَذَا حَدِيْثٌ غَرِيْبٌ.

6062. (7) [3/1709అపరిశోధితం]

అనస్‌ (ర) కథనం: ప్రవక్త (స) మస్జిద్‌లోనికి ప్రవేశిస్తే, అబూ బకర్‌ (ర), ‘ఉమర్‌ (ర) తప్ప మరెవ్వరూ తల పైకి ఎత్తే వారు కాదు. వీరిద్దరూ ప్రవక్త (స)ను చూచి చిరునవ్వు నవ్వేవారు. ప్రవక్త (స) వారిద్దరిని చూచి చిరునవ్వు  నవ్వేవారు.  (తిర్మిజి’  –  ఏకోల్లేఖనం)

6063 – [ 8 ] ( ضعيف ) (3/1709)

وَعَنِ ابْنِ عُمَرَ أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم خَرَجَ ذَاتَ يَوْمٍ وَدَخَلَ الْمَسْجِدَ وَأَبُوْ بَكْرٍ وَعُمَرُ أَحَدُهُمَا عَنْ يَمِيْنِهِ وَالْآخَرُ عَنْ شِمِالِهِ وَهُوَ آخِذٌ بِأَيْدِيْهِمَا. فَقَالَ: “هَكَذَا نُبْعَثُ يَوْمَ الْقِيَامَةِ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَقَالَ: هَذَا حَدِيْثٌ غَرِيْبٌ.

6063. (8) [3/1709బలహీనం]

ఇబ్నె ‘ఉమర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ఒక రోజు తన గది నుండి బయలుదేరి మస్జిద్‌లో ప్రవేశించారు. అప్పుడు అబూ బకర్‌ (ర), ‘ఉమర్‌ (ర) ప్రవక్త (స)కు ఇరువైపుల ఉన్నారు. ఇంకా వారిద్దరి చేతులను తనచేతుల్లో పట్టుకొని ఉన్నారు. ఇంకా తీర్పుదినం నాడు మమ్మల్ని ఇలాగే లేపడం జరుగుతుందని అంటూ ఉన్నారు.  (తిర్మిజి’ –  ఏకోల్లేఖనం)

6064- [ 9 ] ( لم تتم دراسته ) (3/1710)

وَعَنْ عَبْدِ اللهِ بْنِ حَنْطَبٍ أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم رَأَى أَبَا بَكْرٍ وَعُمَرَفَقَالَ:”هَذَانِ السَّمْعُ وَالْبَصَرُ” .رَوَاهُ التِّرْمِذِيُّ مُرْسَلًا.

6064. (9) [3/1710అపరిశోధితం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘హన్‌’తబ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ప్రవక్త (స) అబూ బకర్‌, ‘ఉమర్‌లను చూచి, వీరిద్దరూ నాకు కళ్ళు, చెవుల వంటివారు.” (తిర్మిజి’ – తాబయీ  ప్రోక్తం)

6065 – [ 10 ] ( ضعيف ) (3/1710)

وعَنْ أَبِيْ سَعِيْدِ الْخُدْرِيِّ قَالَ: قَالَ رَسُوْلُ الله صلى الله عليه وسلم: “مَا مِنْ نَبِيٍّ إِلَّا وَلَهُ وَزِيْرَانِ مِنْ أَهْلِ السَّمَاءِ وَوَزِيْرَانِ مِنْ أَهْلِ الْأَرْضِ. فَأَمَّا وَزِيْرَايَ مِنْ أَهْلِ السَّمَاءِ فَجِبْرَيْلُ وَمِيْكَائِيْلُ وَأَمَّا وَزِيْرَايَ مِنْ أَهْلِ الْأَرْضِ فَأَبُوْبَكْرٍوَعُمَرُ”. رَوَاهُ التِّرْمِذِيُّ.

6065. (10) [3/1710 బలహీనం]

అబూ స’యీద్‌ ‘ఖుద్రీ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ప్రతి ప్రవక్తకు ఇద్దరు మంత్రులు ఉండేవారు. ఆకాశవాసుల్లో ఇద్దరు మంత్రులు, జిబ్రీల్‌ (అ), మీకాయీ’ల్‌ (అ), భూవాసుల్లో నా ఇద్దరు మిత్రులు అబూ బకర్‌ (ర), ‘ఉమర్‌ (ర).” (తిర్మిజి’)

6066- [ 11 ] ( ضعيف – صحيح إن  سلم  من  عَنْعَنْة  الحسن  البصري) (3/1710)

وَعَنْ أَبِيْ بَكْرَةَ أَنَّ رَجُلًا قَالَ لِرَسُوْلِ اللهِ صلى الله عليه وسلم: رَأَيْتُ كَأَنَّ مِيْزَانًا نَزَلَ مِنَ السَّمَاءِ فَوُزِنْتَ أَنْتَ وَأَبُوْ بَكْرٍ فَرَجَحْتَ أَنْتَ وَوُزِنَ أَبُوْ بَكْرٍ وَعُمَرُ فَرَجَحَ أَبُوْ بَكْرٍ وَوُزِنَ عُمَرُ وَعُثْمَانُ فَرَجَحَ عُمَرُ ثُمَّ رُفِعَ الْمِيْزَانُ ” فَاسْتَاءَ لَهَا رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم يَعْنِيْ فَسَاءَهُ ذَلِكَ. فَقَالَ: “خِلَافَةُ نَبُوَّةٍ ثُمَّ يُؤْتِى اللهُ الْمُلْكَ مَنْ يَشَاءُ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَأَبُوْ دَاوُدَ.

6066. (11) [3/1710 బలహీనం]

అబూ బకర్‌ (ర) కథనం: ఒక వ్యక్తి ప్రవక్త (స) వద్దకు వచ్చి, ‘నేనొక స్వప్నం చూసాను, అందులో ఒక తూనిక ఆకాశం నుండి దిగింది. ఆ తూనికలో తమర్ని, అబూ బకర్‌ను తూయటం జరిగింది. తమరే అధిక బరువు కలిగి ఉన్నారు. ఆ తరువాత అబూ బకర్‌ను, ‘ఉమర్‌ను తూయటం జరిగింది. అబూ బకర్‌ అధిక బరువు కలిగి ఉన్నారు. ఆ తరువాత ‘ఉమర్‌ను, ‘ఉస్మాన్‌నూ తూయటం జరిగింది. ‘ఉమర్‌ అధిక బరువు కలిగి ఉన్నారు. ఆ తరువాత తూనికను ఎత్తుకోవటం జరిగింది,’ అని అన్నాడు. ప్రవక్త (స) అతని స్వప్నం గురించి విని విచారానికి గురయ్యారు. అనంతరం ప్రవక్త (స), ‘ఇది దైవదౌత్య ‘ఖిలాఫత్‌,’ ఆ తరువాత, ‘అల్లాహ్‌(త) తాను కోరినవారికి అధికారం ప్రసాదిస్తాడు,’ అని అన్నారు. (తిర్మిజి’, అబూ దావూద్‌)

—–

اَلْفَصْلُ الثَّالِث   మూడవ విభాగం 

6067 – [ 12 ] ( ضعيف ) (3/1710)

عَنِ ابْنِ مَسْعُوْدٍ أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم قَالَ: “يَطَّلِعُ عَلَيْكُمْ رَجُلٌ مِنْ أَهْلِ الْجَنَّةِ”. فَاطَّلَعَ أَبُوْبَكْرٍثُمَّ قَالَ: “يَطَّلِعُ عَلَيْكُمْ رَجُلٌ مِنْ أَهْلِ الْجَنَّةِ” .فَاطَّلَعَ عُمَرُ. رَوَاهُ التِّرْمِذِيُّ وَقَالَ: هَذَا حَدِيْثٌ غَرِيْبٌ.

6067. (12) [3/1710బలహీనం]

ఇబ్నె మస్‌’ఊద్‌ (ర) కథనం: ప్రవక్త (స), ‘స్వర్గవాసుల్లోని ఒక వ్యక్తి మీ వద్దకు వస్తాడు,’ అని అన్నారు. వెంటనే అబూ బకర్‌ (ర) వచ్చారు. ప్రవక్త (స) మళ్ళీ, ‘స్వర్గవాసుల్లోని ఒక వ్యక్తి మీ వద్దకు వస్తాడు,’ అని అన్నారు. అనంతరం ‘ఉమర్‌ (ర) వచ్చారు. (తిర్మిజి’ – ఏకోల్లేఖనం)

6068 – [ 13 ] ( موضوع ) (3/1711)

وعَنْ عَائِشَةَ قَالَتْ: بَيْنَا رَأْسُ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم فِيْ حِجْرِيْ لَيْلَةٍ ضَاحِيَةٍ إِذْ قُلْتُ: يَا رَسُوْلَ اللهِ هَلْ يَكُوْنُ لِأَحَدٍ مِنَ الْحَسَنَاتِ عَدَدَ نُجُوْمِ السَّمَاءِ؟ قَالَ: “نَعَمْ عُمَرُ”. قُلْتُ: فَأَيْنَ حَسَنَاتُ أَبِيْ بَكْرٍ؟ قَالَ: “إِنَّمَا جَمِيْعُ حَسَنَاتٍ عُمَرَ كَحَسَنَةٍ وَاحِدَةٍ مِنْ حَسَنَاتٍ أَبِيْ بَكْرٍ”. رَوَاهُ رَزِيْنٌ.

6068. (13) [3/1711కల్పితం]

‘ఆయి’షహ్‌ (ర) కథనం: ఒక వెన్నెల రాత్రిలో ప్రవక్త (స) తల నా ఒడిలో ఉంది. అప్పుడు నేను, ‘ఓ ప్రవక్తా! ఎవరి పుణ్యాలైనా ఆకాశంలోని నక్షత్రాలన్ని ఉన్నాయా?’ అని అడిగాను. ప్రవక్త (స), ‘ ‘ఉమర్‌వి,’ అని అన్నారు. నేను మళ్ళీ, ‘అబూ బకర్‌ (ర) పుణ్యాలు ఎన్ని ఉన్నాయి,’ అని అడిగాను. దానికి ప్రవక్త (స), ‘ ‘ఉమర్‌ పుణ్యాలన్నీ అబూ బకర్‌ (ర) ఒక్క పుణ్యానికి సమానంగా ఉన్నాయని,’  అన్నారు.  (ర’జీన్‌)

=====

6 بَابُ مَنَاقِبِ عُثْمَانَ رَضِيَ اللهُ عَنْهُ

6. ‘ఉస్మాన్‌ () ప్రత్యేకతలు

اَلْفَصْلُ الْأَوَّلُ   మొదటి విభాగం   

6069 – [ 1 ] ( صحيح ) (3/1712)

عَنْ عَائِشَةَ قَالَتْ: كَانَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم مُضْطَجِعًا فِيْ بَيْتِهِ كَاشِفًا عَنْ فَخِذَيْهِ – أَوْ سَاقَيْهِ – فَاسْتَأْذَنَ أَبُوْ بَكْرٍ فَأَذِنَ لَهُ وَهُوَ عَلَى تِلْكَ الْحَالِ فَتَحَدَّثَ ثُمَّ اسْتَأْذَنَ عُمَرُ. فَأَذِنَ لَهُ وَهُوَ كَذَلِكَ فَتَحَدَّثَ ثُمَّ اسْتَأْذَنَ عُثْمَانُ فَجَلَسَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم وَسَوّى ثِيَابَهُ فَلَمَّا خَرَجَ قَالَتْ عَائِشَةَ: دَخَلَ أَبُوْ بَكْرٍ فَلَمْ تَهْتَشَّ لَهُ وَلَمْ تُبَالِهِ ثُمَّ دَخَلَ عُمَرُ فَلَمْ تَهْتَشَّ لَهُ وَلَمْ تُبَالِهِ ثُمَّ دَخَلَ عُثْمَانُ فَجَلَسْتَ وَسَوَّيْتَ ثِيَابَكَ فَقَالَ: “أَلَا أَسْتَحْيِيْ مِنْ رَجُلٍ تَسْتَحْيِيْ مِنْهُ الْمَلَائِكَةُ؟”

وَفِيْ رِوَايَةٍ قَالَ: “إِنَّ عُثْمَانَ رَجُلٌ حَيِيٌّ وَإِنِّيْ خَشِيْتُ إِنْ أَذِنْتُ لَهُ عَلَى تِلْكَ الْحَالَةِ أَنْ لَا يَبْلُغَ إِلَيَّ فِيْ حَاجِتِهِ”.رَوَاهُ مُسْلِمٌ

6069. (1) [3/1712దృఢం]

‘ఆయి’షహ్‌ (ర) కథనం: ప్రవక్త (స)  ఒకరోజు తన ఇంట్లో చీలమండలు లేదా ముడుకులు విప్పి పడకపై చేరబడి ఉన్నారు. ఇంతలో అబూ బకర్‌ (ర) రావటానికి అనుమతి కోరారు. ప్రవక్త (స) అతనికి అనుమతి ఇచ్చారు. ప్రవక్త (స) ఆ స్థితిలోనే ఉన్నారు. అబూ బకర్‌తో మాట్లాడుతున్నారు. ఆ తరువాత ‘ఉమర్‌ (ర) లోపలికి రావడానికి అనుమతి కోరారు. ప్రవక్త (స) అనుమతి ఇచ్చారు. ప్రవక్త (స) అలాగే పరుండి ఉన్నారు. ‘ఉమర్‌ (ర) తో మాట్లాడుతున్నారు. ఆ తరువాత ‘ఉస్మాన్‌ (ర) వచ్చి అనుమతి కోరారు. లోపలికి వచ్చారు. ప్రవక్త (స) లేచి కూర్చున్నారు. తన బట్టలు సరిచేసుకున్నారు. అందరూ వెళ్ళిపోయిన తర్వాత ‘ఆయి’షహ్‌ (ర), ”అబూ బకర్‌ (ర) వచ్చారు. మీరు అలాగే ఉన్నారు, ‘ఉమర్‌ వచ్చారు, కాని తమరు అలాగే ఉన్నారు. కాని ‘ఉస్మాన్‌ (ర) రాగానే తమరు లేచి కూర్చుండి పోయారు. బట్టలను సరిచేసు కున్నారు,” అని సందేహం వెలిబుచ్చారు. దానికి ప్రవక్త (స), ‘దైవదూతలు కూడా సిగ్గుపడే వ్యక్తితో నేనెందుకు సిగ్గుపడ  కూడదు,’ అని అన్నారు. 

మరో ఉల్లేఖనంలో ఇలా ఉంది, ”ప్రవక్త (స) ‘ఉస్మాన్‌ చాలా సిగ్గుపడే వ్యక్తి. ఒకవేళ నేను అదే స్థితిలో ఉంటే, అతడు సిగ్గుతో కూర్చోకుండానే వెళ్ళిపోయేవారు,” అని అన్నారు. (ముస్లిమ్‌)

—–

اَلْفَصْلُ الثَّانِيْ  రెండవ విభాగం 

6070 – [ 2 ] ( لم تتم دراسته ) (3/1712)

عَنْ طَلْحَةَ بْنِ عُبَيْدِ اللهِ قَالَ: قَالَ رَسُوْلُ الله صلى الله عليه وسلم: ” لِكُلِّ نَبِيٍّ رَفِيْقٌ وَرَفِيْقِيْ – يَعْنِيْ فِي الْجَنَّةِ – عُثْمَانُ”. رَوَاهُ التِّرْمِذِيُّ.

6070. (2) [3/1712అపరిశోధితం]

‘తల్‌’హా బిన్‌ ‘అబ్దుల్లాహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ప్రతి ప్రవక్తకు ఒక సహచరుడుంటాడు. నా సహ చరుడు స్వర్గంలో  ‘ఉస్మాన్‌.”  (తిర్మిజి’)

6071 – [ 3 ] ( لم تتم دراسته ) (3/1712)

وَرَاهُ ابْنُ مَاجَهُ عَنْ أَبِيْ هُرَيْرَةَ وَقَالَ التِّرْمِذِيُّ: هَذَا حَدِيْثٌ غَرِيْبٌ وَلَيْسَ إِسْنَادُهُ بِالْقَوِيِّ وَهُوَ مُنْقَطِعٌ .

6071. (3) [3/1712 అపరిశోధితం]

ఇబ్నె మాజహ్ దీన్ని అబూ హురైరహ్‌ (ర) ద్వారా ఉల్లేఖించారు. తిర్మిజి’ దీన్ని బలహీనమైనదిగా పేర్కొన్నారు.

6072 – [ 4 ] ( ضعيف ) (3/1713)

وَعَنْ عَبْدِ الرَّحْمنِ بْنِ خَبَّابٍ قَالَ: شَهِدْتُ النَّبِيَّ صلى الله عليه وسلم وَهُوَ يَحُثُّ عَلَى جَيْشِ الْعُسْرَةِ. فَقَامَ عُثْمَانُ فَقَالَ: يَا رَسُوْلَ اللهِ عَلَيَّ مِائَةُ بِعِيْرٍ بِأَحْلَاسِهَا وَأَقْتَابِهَا فِيْ سَبِيْلِ اللهِ. ثُمَّ حَضَّ عَلَىَّ الْجَيْشِ. فَقَامَ عُثْمَانُ فَقَالَ: عَلَيُّ مِائَتَا بِعَيْرٍ بِأَحْلَاسِهَا وَأَقْتَابِهَا فِيْ سَبِيْلِ اللهِ. ثُمَّ حَضَّ. فَقَامَ عُثْمَانُ فَقَالَ: عَلَيَّ ثَلَاثُمِائَةِ بِعِيْرٍ بِأَحْلَاسِهَا وَأَقْتَابِهَا فِيْ سِبِيْلِ اللهِ. فَأَنَا رَأَيْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يَنْزِلُ عَنِ الْمِنْبَرِ وَهُوَ يَقُوْلُ: “مَا عَلَى عُثْمَانَ مَا عَمِلَ بَعْدَ هَذِهِ مَا عَلَى عُثْمَانَ مَا عَمِلَ بَعْدَ هَذِهِ”. رَوَاهُ التِّرْمِذِيُّ.

6072. (4) [3/1713 బలహీనం]

‘అబ్దుర్ర’హ్మాన్‌ బిన్‌ ‘ఖబ్బాబ్‌ (ర) కథనం: నేను ప్రవక్త (స) వద్దకు వెళ్ళాను. అప్పుడు ప్రవక్త (స) తబూక్‌ యుద్ధంకోసం ప్రజలను ప్రోత్సహిస్తున్నారు. ఉత్తేజ పరుస్తున్నారు. అప్పుడు ‘ఉస్మాన్‌ (ర) నిలబడి, ‘ప్రవక్తా! అల్లాహ్ (త) మార్గంలో 100 ఒంటెలకు వాటి సామాన్లతో సహా నేను బాధ్యత వహి స్తున్నాను.’ ప్రవక్త (స) మళ్ళీ ప్రభావపూరితంగా ప్రసంగించారు. అప్పుడు ‘ఉస్మాన్‌ (ర) నిలబడి, ‘200 ఒంటెలకు, వాటి సామాన్లతో సహా నేను బాధ్యత వహిస్తాను,’ అని అన్నారు. మళ్ళీ ప్రవక్త (స) మూడవసారి ప్రసంగించారు. మూడవసారి మళ్ళీ, ‘ఉస్మాన్‌ (ర) నిలబడి, ‘300 ఒంటెలకు వాటి సామాన్లతో సహా నేను బాధ్యత వహిస్తున్నాను,’ అని అన్నారు. నేను చూస్తూ ఉన్నాను. ప్రవక్త (స) మెంబరుపై నుండి దిగుతూ దీని తర్వాత ‘ఉస్మాన్‌ (ర) ఏమీ చేయక పోయినా అతనిపై ఎటువంటి పాపం ఉండదు. ‘ఉస్మాన్‌ (ర) దీని తర్వాత ఏమి చేయకపోయినా అతనిపై ఎటు వంటి పాపం లేదు,’ అని అంటూఉన్నారు.” [12] (తిర్మిజి’)

6073 – [ 5 ] ( حسن ) (3/1713)

وَعَنْ عَبْدِ الرَّحْمنِ بْنِ سَمُرَةَ قَالَ: جَاءَ عُثْمَانُ إِلى النَّبِيِّ صلى الله عليه وسلم بِأَلْفِ دِيْنَارٍ فِيء كُمِّهِ حِيْنَ جَهَّزَ جَيْشَ الْعُسْرَةِ فَنَثَرَهَا فِي حِجْرِهِ فَرَأَيْتُ النَّبِيَّ صلى الله عليه وسلم يُقَلِّبُهَا فِيْ حِجْرِهِ وَيَقُوْلُ: “مَا ضَرَّ عُثْمَانَ مَا عَمِلَ بَعْدَ الْيَوْمِ”. مَرَّتَيْنَ. رَوَاهُ أَحْمَدُ .

6073. (5) [3/1713–  ప్రామాణికం]

‘అబ్దుర్ర’హ్మాన్‌ బిన్‌ సమురహ్‌ (ర) కథనం: తబూక్‌ యుద్ధ సందర్భంగా ‘ఉస్మాన్‌ (ర) వెయ్యి దీనార్లు తన చొక్కాలో పెట్టి ప్రవక్త (స) వద్దకు తెచ్చారు. వాటిని ప్రవక్త (స) ఒడిలోవేసారు. నేను చూస్తూ ఉన్నాను. ప్రవక్త (స) వాటిని క్రింద, మీద చేస్తున్నారు. ఇంకా ఈ నాటి ఈ పుణ్యం తరువాత ‘ఉస్మాన్‌ (ర) ఏమి చేసినా, అది అతనికి నష్టం కలిగించదు, అని రెండు సార్లు పలికారు. (అ’హ్మద్‌)

6074 – [6] ( ضعيف ) (3/1713)

وَعَنْ أَنَسٍ قَالَ: لَمَّا أَمَرَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم بِبَيْعَةِ الرِّضْوَانِ كَانَ عُثْمَانُ رضي الله عَنْهُ رَسُوْلَ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم إِلى مَكَّةَ فَبَايَعَ النَّاسَ. فَقَالَ رَسُوْلُ الله صلى الله عليه وسلم: “إِنَّ عُثْمَانَ فِيْ حَاجَةِ اللهِ وَحَاجَةِ رَسُوْلِهِ”. فَضَرَبَ بِإِحْدَى يَدَيْهِ عَلَى الْأُخْرَى فَكَانَتْ يَدُ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم لِعُثْمَانَ خَيْرًا مِنْ أَيْدِيْهِمْ لِأَنْفُسِهِمْ. رَوَاهُ التِّرْمِذِيُّ.

6074. (6) [3/1713  బలహీనం]

అనస్‌ (ర) కథనం: ప్రవక్త (స) బై’అతె రి’ద్వాన్‌ గురించి ఆదేశించినపుడు ‘ఉస్మాన్‌ (ర) ప్రవక్త (స) ప్రతినిధిగా మక్కహ్ వెళ్ళి ఉన్నారు. ప్రజలు ప్రవక్త (స) చేతిపై బై’అత్‌ చేసారు. అందరూ బై’అత్‌ చేసిన తర్వాత ప్రవక్త (స) ‘ఉస్మాన్‌, అల్లాహ్‌(త) మరియు ఆయన ప్రవక్త(స) పనిమీద వెళ్ళి ఉన్నారు,’ అని పలికి, ‘ఇది ‘ఉస్మాన్‌ బైఅత్‌,’ అని పలికి తన ఒక చేతిని మరో చేతిపై కొట్టారు. ‘ఉస్మాన్‌ (ర) తరఫున ప్రవక్త (స) కొట్టిన చేయి ఇతరుల కంటే ఎంతో శ్రేష్ఠమయింది. (తిర్మిజి’ – ప్రామాణికం, దృఢం)

6075 – [ 7 ] ( ضعيف ) (3/1714)

وَعَنْ ثُمَامَةَ بْنِ حَزْنٍ الْقُشَيْرِيِّ قَالَ: شَهِدْتُ الدَّارَ حِيْنَ أَشْرَفَ عَلَيْهِمْ عُثْمَانُ فَقَالَ: أُنْشِدُكُمُ بِاللهِ وَالْإِسْلَامِ هَلْ تَعْلَمُوْنَ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم قَدِمَ الْمَدِيْنَةَ وَلَيْسَ بِهَا مَاءُ يُسْتَعْذَبُ غَيْرُ بِئْرِ رُوْمَةَ؟ فَقَالَ: “مَنْ يَشْتَرِيْ بِئْرَ رُوْمَةَ يَجْعَلُ دَلْوَهُ مَعَ دِلَاءِ الْمُسْلِمِيْنَ بِخَيْرٍ لَهُ مِنْهَا فِي الْجَنَّةِ؟” فَاشْتَرَيْتُهَا مِنْ صُلْبٍ مَالِيَ وَأَنْتُمُ الْيَوْمَ تَمْنَعُوْنَنِيْ أَنْ أَشْرَبَ مِنْهَا حَتّى أَشْرَبَ مِنْ مَاءِ الْبَحْرِ؟ قَالُوْا: اَللّهُمَّ نَعَمْ. فَقَالَ: أَنْشُدُكُمْ بِاللهِ وَالْإِسْلَامِ هَلْ تَعْلَمُوْنَ أَنَّ الْمَسْجِدَ ضَاقَ بِأَهْلِهِ. فَقَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَنْ يَشْتَرِيْ بُقْعَةَ آلِ فُلَانٍ فَيَزِيْدُهَا فِي الْمَسْجِدِ بِخَيْرٍ مِنْهَا فِي الْجَنَّةِ؟” فَاشْتَرَيْتُهَا مِنْ صُلْبٍ مَالِيْ فَأَنْتُمُ الْيَوْمَ تَمْنَعُوْنَنِيْ أَنْ أُصَلِّيَ فِيْهَا رَكْعَتَيْنِ؟ فَقَالُوْا: اَللّهُمَّ نَعَمْ. قَالَ: أَنْشُدُكُمْ بِاللهِ وَالْإِسْلَامِ هَلْ تَعْلَمُوْنَ أَنّي جَهَّزْتُ جَيْشَ الْعُسْرَةِ مِنْ مَالِيْ؟ قَالُوْا: اَللّهُمَّ نَعَمْ. قَالَ: أَنْشُدُكُمْ بِاللهِ وَالْإِسْلَامِ هَلْ تَعْلَمُوْنَ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم كَانَ عَلَى ثَبِيْرٍ مَكَّةَ وَمَعَهُ أَبُوْ بَكْرٍ وَعُمَرُ وَأَنَا فَتَحَرَّكَ الْجَبَلُ حَتّى تَسَاقَطَتْ حِجَارَتُهُ بِالْحَضِيْضِ فَرَكَضَهُ بِرِجْلِهِ قَالَ: “اُسْكُنْ ثَبِيْرُ فَإِنَّمَا عَلَيْكَ نَبِيٌّ وَصِدِّيْقٌ وَشَهِيْدَانِ”. قَالُوْا: اَللّهُمَّ نَعَمْ. قَالَ: اللهُ أَكْبَرُ شَهِدُوْا وَرَبِّ الْكَعْبَةِ أَنِّيْ شَهِيْدٌ ثَلَاثًا. رَوَاهُ التِّرْمِذِيُّ وَالنَّسَائِيُّ وَالدَّارَقُطْنِيُّ

6075. (7) [3/1714  బలహీనం]

సు’మామహ్ బిన్‌ ‘హ’జ్ని ఖుషైరీ (ర) కథనం: నేను ‘ఉస్మాన్‌ (ర) ఇంటి వద్ద ఉన్నాను. అప్పుడు ‘ఉస్మాన్‌ (ర) నేను మిమ్మల్ని ఇస్లామ్‌, మరియు అల్లాహ్‌(త) ద్వారా అడుగుతున్నాను. ప్రవక్త (స) మదీనహ్ వచ్చినప్పుడు రూమహ్ బావి తప్ప మరేదీ మంచినీటి బావి ఉండేది కాదు. ప్రవక్త (స) ఎవరు దీన్ని కొని ముస్లిముల కొరకు దైవమార్గంలో దానంచేస్తారో, వారికి 72 రెట్లు అధిక పుణ్యంగా స్వర్గం లభిస్తుంది, అని అంటే నేను నా సొంత ధనంతో కొన్నాను. ఈ రోజు మీరు ఆ బావినీరే నాకు త్రాగనీయటం లేదా? చివరికి నేను సముద్రపు ఉప్పు నీరు త్రాగుతున్నాను,’ అని అన్నారు.  దానికి ప్రజలు, ‘అవును ఓ అల్లాహ్‌ (త)! మాకు తెలుసు,’ అని అన్నారు. ఆ తరువాత ‘ఉస్మాన్‌ (ర), ‘నేను మీకు అల్లాహ్‌ (త) మరియు ఇస్లామ్‌ ద్వారా అడుగు తున్నాను. మస్జిదె నబవీ అధిక నమా’జీల వల్ల చాలకుండా ఉంటే, ప్రవక్త (స) ఎవరు మస్జిద్‌ కోసం భూమిని కొని మస్జిద్‌లో కలుపుతారో అతనికి స్వర్గంలో అంతకంటే ఉత్తమ ప్రతిఫలం లభిస్తుంది, అని అంటే నేను నా సొంత ధనాన్ని ఖర్చుపెట్టి దాన్ని కొన్నాను. కాని ఈనాడు మీరు నన్ను అందులో రెండు రకాతులు నమా’జుకూడా చదవనివ్వటం లేదు,’ అని అన్నారు. ప్రజలు అది విని, ‘అవును ఓ అల్లాహ్‌(త) అది మాకు తెలుసు,’ అని అన్నారు. ఆ తరువాత ‘ఉస్మాన్‌ (ర), ‘మిమ్మల్ని ఇస్లామ్‌ మరియు అల్లాహ్‌(త) ద్వారా అడుగుతున్నాను, మీకు తెలుసా తబూక్‌ యుద్ధానికి వెళ్ళే సైన్యాన్ని నా ధనం ద్వారా సిద్ధం చేసాను.’ అది విని ప్రజలు, ‘అవును ఓ అల్లాహ్‌(త) అది మాకు తెలుసు. ప్రవక్త (స) మక్కహ్లోని సబీర్‌ కొండపై ఉన్నారు. ఆయనవెంట అబూబకర్‌, ‘ఉమర్‌ ఇంకా నేను ఉన్నాను. అకస్మాత్తుగా కొండ కదలసాగింది. దానిపైన రాళ్ళు క్రింది పడసాగాయి. అనంతరం ప్రవక్త (స) కొండపై తన కాలితో కొట్టి, ‘ఓ సబీర్‌ కొండ ఆగు, ఇప్పుడు నీపై ఒక ప్రవక్త, ఒక సత్యవంతుడు, ఇద్దరుఅమరవీరులు నిలబడి ఉన్నారు, ‘ అని అన్నారు. ప్రజలు అది విని, ‘ఓ అల్లాహ్‌(త)! అవును,’ అని అన్నారు. ‘ఉస్మాన్‌ (ర) మూడుసార్లు, ”అల్లాహు అక్బర్‌! క’అబహ్ ప్రభువు సాక్షి! ప్రజలు సాక్ష్యం ఇస్తున్నారు. నేను నిజంగా అమర వీరుడ్నే,” అని అన్నారు. (తిర్మిజి’, నసాయి, దారుఖు’తునీ)

6076 – [ 8 ] ( صحيح ) (3/1714)

وَعَنْ مُرَّةَ بْنِ كَعْبٍ قَالَ: سَمِعْتُ مِنْ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم وَذَكَرَالْفِتَنَ فَقَرَّ بَهَا فَمَرَّرَجُلٌ مُقَنَّعٌ فِيْ ثَوْبٍ فَقَالَ: “هَذَا يَوْمَئِذٍ عَلَى هُدَى”. فَقُمْتُ إِلَيْهِ فَإِذَا هُوَ عُثْمَانُ بْنَ عَفَّانَ. قَالَ: فَأَقْبَلْتُ عَلَيْهِ بِوَجْهِهِ. فَقُلْتُ: هَذَا؟ قَالَ: “نَعَمْ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَابْنُ مَاجَهُ. وقَالَ التِّرْمِذِيُّ: هَذَا حَدِيْثٌ حَسَنٌ صَحِيْحٌ .

6076. (8) [3/1714 దృఢం]

ముర్రహ్ బిన్‌ క’అబ్‌ (ర) కథనం: ప్రవక్త  (స) ఉపద్రవాల గురించి ప్రస్తావించటం నేను విన్నాను, అవి అతి త్వరలో సంభవిస్తాయని ప్రవచించారు. అనంతరం అక్కడి నుండి ఒక వ్యక్తి తలపై వస్త్రం కప్పుకొని వెళ్ళడం జరిగింది. అప్పుడు ప్రవక్త (స), ‘ఈ వ్యక్తి ఆ రోజు సన్మార్గంపై ఉంటాడు,’ అని అన్నారు. నేను (ముర్రహ్ బిన్‌ క’అబ్‌), ఆ వ్యక్తి వద్దకు వెళ్ళాను. ఆ వ్యక్తి మరెవరో కాదు, ‘ఉస్మాన్‌ (ర). నేను ‘ఉస్మాన్‌ ముఖం ప్రవక్త (స)కు చూపించి, ఈ వ్యక్తియే సన్మార్గంపై ఉంటాడు కదా?’ అని అన్నాను. దానికి ప్రవక్త (స), ‘అవును,’ అని అన్నారు. (ఇబ్నె మాజహ్; తిర్మిజి’  –  ప్రామాణికం – దృడం).

6077 – [ 9 ] ( صحيح ) (3/1715)

وَعَنْ عَائِشَةَ أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم قَالَ: “يَا عُثْمَانُ إِنَّهُ لَعَلَّ اللهَ يُقَمِّصُكَ قَمِيْصًافَإِنْ أَرَادُوْكَ عَلَى خَلْعِهِ فَلَا تَخْلَعْهُ لَهُمْ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَابْنُ مَاجَهُ. وَقَالَ التِّرْمِذِيُّ فِي الْحَدِيْثِ قِصَّةٌ طَوِيْلَةٌ.

6077. (9) [3/1715దృఢం]

‘ఆయి’షహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ‘ఉస్మాన్‌ (ర)ను ఉద్దేశించి, ‘ఓ ‘ఉస్మాన్‌! అల్లాహ్‌ (త) నీకు పరిపాలనా పురస్కారాన్నిప్రసాదించవచ్చు. ఒకవేళ ప్రజలు దాన్ని నీ నుండి తొలగించాలని కోరినా, నువ్వు దాన్ని నీ నుండి తొలగించకు,’ అని అన్నారు. (తిర్మిజి’, ఇబ్నె మాజహ్)

6078 – [ 10 ] ( لم تتم دراسته ) (3/1715)

وعَنِ ابْنِ عُمَرَ قَالَ: ذَكَرَرَسُوْلُ اللهِ صلى الله عليه وسلم فِتْنَةٌ فَقَالَ: “يُقْتَلُ هَذَا فِيْهَا مَظْلُوْمًا” لِعُثْمَانَ. رَوَاهُ التِّرْمِذِيُّ وَقَالَ: هَذَا حَدِيْثٌ حَسَنٌ غَرِيْبٌ إِسْنَادًا

6078. (10) [3/1715అపరిశోధితం]

ఇబ్నె ‘ఉమర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ఉపద్రవాల గురించి ప్రస్తావించారు. ఇంకా ‘ఉస్మాన్‌ (ర) గురించి మాట్లాడుతూ, ‘ఈ వ్యక్తి దుర్మార్గులచే హతమార్చ బడతాడు,’ అని అన్నారు. (తిర్మిజి’ – ప్రామాణిక ఆధారాలు – ఏకోల్లేఖనం)

6079 – [ 11 ] ( صحيح ) (3/1715)

وعَنْ أَبِيْ سَهْلَةَ قَالَ: قَالَ لِيْ عُثْمَانَ يَوْمَ الدَّارِ: إِنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم قَدْ عَهِدَ إِلَيَّ وَأَنَا صَابِرٌعَلَيْهِ. رَوَاهُ التِّرْمِذِيُّ. وَقَالَ: هَذَا حَدِيْثٌ حَسَنٌ صَحِيْحٌ.

6079. (11) [3/1715దృఢం]

అబూ సహ్‌లహ్‌ (ర) కథనం: ‘ఉస్మాన్‌ (ర) తన ఇంటిని చుట్టుముట్టిన రోజు, నాతో, ‘వాస్తవం ఏమిటంటే ప్రవక్త (స) గారు ఉపదేశించిన విధంగానే నేను ఓర్పూ సహనాలను ప్రదర్శిస్తున్నాను,’ అని అన్నారు. (తిర్మిజి’ –  ప్రామాణికం – దృఢం)

—–

اَلْفَصْلُ الثَّالِثُ   మూడవ విభాగం 

6080 – [ 12 ] ( صحيح ) (3/1715)

عَنْ عُثْمَانَ بْنِ عَبْدِ اللهِ بْنِ مَوْهَبٍ قَالَ: جَاءَ رَجُلٌ مِنْ أَهْلِ مِصْرَ يُرِيْدُ حَجَّ الْبَيْتِ فَرَأَى قَوْمًا جُلُوْسًا. فَقَالَ: مَنْ هَؤُلَاءِ الْقَوْمُ؟ قَالُوْا: هَؤُلَاءِ قُرَيْشٌ. قَالَ فَمَنِ الشَّيْخُ فِيْهِمْ؟ قَالُوْاعَبْدُ اللهِ بْنِ عُمَرَ. قَالَ: يَا ابْنَ عُمَرَ إِنِّيْ سَائِلُكَ عَنْ شَيْءٍ فَحَدِّثْنِيْ: هَلْ تَعْلَمُ أَنَّ عُثْمَانَ فَرَّيَوَمَ أُحُدٍ؟ قَالَ: نَعَمْ. قَالَ: هَلْ تَعْلَمُ أَنَّهُ تَغَيَّبَ عَنْ بَدْرٍوَلَمْ يَشْهَدْهَا؟ قَالَ:نَعَمْ. قَالَ: هَلْ تَعْلَمُ أَنَّهُ تَغَيَّبَ عَنْ بَيْعَةِ الرِّضْوَانِ فَلَمْ يَشْهَدْهَا؟ قَالَ: نَعَمْ؟ قَالَ: اللهُ أَكْبَرُ. قَالَ ابْنُ عُمَرَ: تَعَالَ أُبَيِّنْ لَكَ أَمَّا فِرَارُهُ يَوْمَ أُحُدٍ فَأَشْهَدُ أَنَّ اللهَ عَفَا عَنْهُ وَأَمَّا تَغَيُّبُهُ عَنْ بَدْرٍفَإِنَّهُ كَانَتْ تَحْتَهُ رُقَيَّةُ بِنْتُ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم وَكَانَتْ مَرِيْضَةً. فَقَالَ لَهُ رَسُوْلُ الله صلى الله عليه وسلم: “إِنَّ لَكَ أَجْرَ رَجُلٍ مِمَّنْ شَهِدَ بَدْرًا وَسَهْمَهُ”. وَأَمَّا تَغَيُّبُهُ عَنْ بَيْعَةِ الرِّضْوَانِ. فَلَوْ كَانَ أَحَدٌ أَعَزَّ بِبَطْنِ مَكَّةَ مِنْ عُثْمَانَ لَبَعَثَهُ. فَبَعَثَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم عُثْمَانَ وَكَانَتْ بَيْعَةُ الرِّضْوَانِ بَعْدَ مَا ذَهَبَ عُثْمَانُ إِلى مَكَّةَ. فَقَالَ رَسُوْلُ الله صلى الله عليه وسلم بِيَدِهِ الْيُمْنَى: “هَذِهِ يَدُ عُثْمَانَ”. فَضَرَبَ بِهَا عَلَى يَدِهِ وَقَالَ: “هَذِهِ لِعُثمَانَ”. فَقَالَ لَهُ ابْنُ عُمَرُ: اِذْهَبْ بِهَا الْآنَمعَكَ. روَاهُ الْبُخَارِيُّ.

6080. (12) [3/1715 దృఢం]

‘ఉస్మాన్‌ బిన్‌ ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ మౌహిబ్‌ (ర) కథనం: ఈజిప్టు నుండి ఒక వ్యక్తి ‘హజ్‌ ఉద్దేశ్యంతో మక్కహ్ వచ్చాడు. అతడు కొంత మందిని కూర్చొని ఉండగా చూచి, ‘వీరెవరని,’ అడిగాడు. దానికి ప్రజలు, ‘వీరు ఖురైష్‌ పెద్దలు,’ అని అన్నారు. ఆ వ్యక్తి మళ్ళీ, ‘వీరిలో అందరి కంటే గొప్ప పండితులెవరు,’ అని అడిగాడు. దానికి వారు, ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘ఉమర్‌,’ అని అన్నారు. అప్పుడావ్యక్తి, ‘ఓ ఇబ్నె ‘ఉమర్‌! నేను మిమ్మల్ని కొన్ని విషయాలు అడుగుతాను. సమాధానం ఇవ్వండి,’ అని చెప్పి, ‘ఉస్మాన్‌ (ర) ఉ’హుద్‌ యుద్ధం నుండి పారిపోవటం మీకు తెలుసా?’ అని  అడిగాడు. దానికి ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘ఉమర్‌ (ర), ‘అవును,’ అని అన్నారు. మళ్ళీ ఆ వ్యక్తి, ‘ఉస్మాన్‌ (ర) బద్ర్‌ యుద్ధంలో కూడా లేనట్టు మీకు తెలుసా?’ అని అడిగాడు. దానికి ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘ఉమర్‌ (ర), ‘అవునని,’ అన్నారు. మళ్ళీ ఆ వ్యక్తి, ‘బైఅతె రి’ద్వాన్‌లో కూడా లేనట్టు మీకు తెలుసా?’ అని అడిగాడు. దానికి ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘ఉమర్‌ (ర), ‘అవును,’ అని అన్నారు. అప్పుడా వ్యక్తి, ‘అల్లాహు అక్బర్‌,’ అని అన్నాడు. అనంతరం అబ్దుల్లాహ్‌ బిన్‌ ఉమర్‌ అతనితో, ‘ఇలా రా! వాటి వాస్తవాల గురించి నేను నీకు తెలియపరుస్తాను,’ అని ఇలా చెప్పారు, ఉ’హుద్‌ యుద్ధంలో అతను లేకపోవటాన్ని అల్లాహ్‌ () క్షమించివేసాడని, నేను సాక్ష్యం ఇస్తాను, బద్ర్‌ యుద్ధంలో అతని భార్య, ప్రవక్త (స) కుమార్తె రుఖయ్య అనారోగ్యంగా ఉండటం వల్ల అతను పాల్గొనలేక పోయారు. ప్రవక్త (స) అతనితో, ‘బద్ర్‌ యుద్ధంలో ఉన్నట్టే నీకు పుణ్యం లభిస్తుంది, యుద్ధ ధనంలో వంతు కూడా లభిస్తుంది,’ అని, అన్నారు. అదేవిధంగా బైఅతె రి’ద్వాన్‌లో పాల్గొన లేక పోవడం అంటే, ఒకవేళ మక్కహ్లో ‘ఉస్మాన్‌ కంటే అధిక పలుకు బడి గలవారెవరైనా ఉంటే  ప్రవక్త (స) అతన్నే పంపే వారు. కాని ఎవరూ లేకపోవటం వల్ల ప్రవక్త (స) ‘ఉస్మాన్‌నే పంపవలసి వచ్చింది. ‘ఉస్మాన్‌ (ర) వెళ్ళిన తర్వాత బైఅతె రి’ద్వాన్‌ సంఘటన జరిగింది.  బైఅతె రి’ద్వాన్‌లో ప్రవక్త (స) తన కుడిచేతి వైపు సైగ చేసి, ఇది నా చేయి, ఇది ‘ఉస్మాన్‌ చేయి స్థానంలో ఉంది. ప్రవక్త (స) తన కుడి చేయిని తన ఎడమ చేయిపై కొట్టి, ‘ఈ బైఅత్‌ ‘ఉస్మాన్‌ తరఫు నుండి,’ అని అన్నారు. అనంతరం ఇబ్నె ‘ఉమర్‌ (ర) ఆ వ్యక్తితో, ”ఇప్పుడు నేను చెప్పిన సమాచారం తీసుకొని వెళ్ళు,” అని అన్నారు. (బు’ఖారీ)

6081 – [ 13 ] ( لم تتم دراسته ) (3/1716)

وَعَنْ أَبِيْ سَلْهَةَ مَوْلى عُثْمَانَ رَضِيَ اللهُ عَنْهُمَا قَالَ: جَعَلَ النَّبِيُّ صلى الله عليه وسلم يُسِرُّ إِلى عُثْمَانَ وَلَوْنُ عُثْمَانَ يَتَغَيَّرُفَلَمَّا كَانَ يَوْمَ الدَّارِ قُلْنَا: أَلَا نُقَاتِلُ؟ قَالَ: لَا إِنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم عَهِدَ إِلَيَّ أَمْرًا فَأَنَا صَابِرٌ نَفْسِيْ عَلَيْهِ.

6081. (13) [3/1716 అపరిశోధితం]

‘ఉస్మాన్‌ (ర) సేవకులు అబూ సహ్‌లహ్ (ర) కథనం: ప్రవక్త (స) ఒకరోజు ‘ఉస్మాన్‌ (ర)తో ఒంటరిగా ఏదో మాట్లాడుతున్నారు. ‘ఉస్మాన్‌ ముఖవర్చస్సు గంభీరంగా  తయారవుతుంది. ఆ తరువాత ‘ఉస్మాన్‌ (ర) ఇంటిని చుట్టుముట్టే రోజు వచ్చింది. నేను ‘ఉస్మాన్‌ (ర)తో, ‘మనం వీరితో యుద్ధం చేద్దామా?’ అని అన్నాను. దానికి ‘ఉస్మాన్‌ (ర), ‘వద్దు, ప్రవక్త (స) నాకు ఉపదేశించిన విధంగా నేను ఈ వ్యవహారంలో సహనం, ఓర్పులను పాటిస్తున్నాను,’ అని అన్నారు. (బైహఖీ – దలాయి’లున్నుబువ్వహ్‌)

6082 – [ 14 ] ( لم تتم دراسته ) (3/1716)

وَعَنْ أَبِيْ حَبِيْبَةَ أَنَّهُ دَخَلَ الدَّارَوَعُثْمَانُ مَحْصُوْرٌ فِيْهَا وَأَنَّهُ سَمِعَ أَبَا هُرَيْرَةَ يَسْتَأْذِنُ عُثْمَانَ فِي الْكَلَامِ. فَأَذِنَ لَهُ. فَقَامَ فَحَمِدَ اللهُ وَأَثْنَى عَلَيْهِ. ثُمَّ قَالَ: سَمِعْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ: “إِنَّكُمْ سَتَلْقَوْنَ بَعْدِيْ فِتْنَةً وَاخْتِلَافًا أَوْ قَالَ: اِخْتِلَافًا وَفِتْنَةً فَقَالَ لَهُ قَائِلٌ مِنَ النَّاسِ: فَمَنْ لَنَا يَا رَسُوْلَ اللهِ؟ أَوْمَا تَأْمُرُنَا بِهِ؟ قَالَ: “عَلَيْكُمْ بِالْأَمِيْرِوَأَصْحَابِهِ” وَهُوَ يُشِيْرُإِلى عُثْمَانَ بِذَلِكَ. رَوَاهُمَا الْبَيْهَقِيُّ فِيْ “دَلَائِلِ النُّبُوِّةِ”.

6082. (14) [3/1716 అపరిశోధితం]

అబూ ‘హబీబహ్ (ర) కథనం: ‘ఉస్మాన్‌ (ర) ఇంటిని చుట్టుముట్టి ఉన్న సమయంలో, నేను అతని ఇంటిలోకి వెళ్ళాను. అబూ హురైరహ్‌ (ర) ‘ఉస్మాన్‌ను కొన్ని విషయాలను గురించి మాట్లాడే అనుమతిని కోరటం విన్నాను. ‘ఉస్మాన్‌ (ర) అతనికి అనుమతి ఇచ్చారు. అబూ హురైరహ్‌ (ర) నిలబడి, దైవస్తోత్రాలు పలికి నేను ప్రవక్త (స)ను, ”నా తర్వాత ఉపద్రవాలు విభేదాలు చూస్తారు,” అని అన్నారు. అప్పుడు ఒక వ్యక్తి, ‘ఓ ప్రవక్తా! అప్పుడు మాకోసం ఎవరుంటారు? లేదా అప్పుడు తమ ఆదేశం ఏమిటి?’ అని అడిగాడు. దానికి ప్రవక్త (స), ‘నాయకునికి, అతని సహచరులకు విధేయత చూపాలి,’ అని అన్నారు. నాయకుడు అని అంటూ ప్రవక్త (స) ‘ఉస్మాన్‌ వైపు సైగ చేసారు. [13]  (బైహఖీ – దలాయి’లున్నుబువ్వహ్‌)

=====

7 بَابُ مَنَاقِبِ هَؤُلَاءِ الثَّلَاثَةِ رَضِيَ اللهُ عَنْهُمَ

7. అబూ బకర్‌, ‘ఉమర్‌, ‘ఉస్మాన్ (.అన్హుం) ప్రత్యేకతలు

اَلْفَصْلُ الْأَوَّلُ   మొదటి విభాగం 

6083 – [ 1 ] ( صحيح ) (3/1717)

عَنْ أَنَسٍ أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم صَعِدَ أُحُدًا وَأَبُوْ بَكْرٍ وَعُمَرُ وَعُثْمَانُ فَرَجَفَ بِهِمْ فَضَرَبَهُ بِرِجْلِهِ فَقَالَ:  اُثْبُتْ أُحُدُ فَإِنَّمَا عَلَيْكَ نَبِيٌّ وَصِدِّيْقٌ وَشَهِيْدَانِ”. روَاهُ الْبُخَارِيُّ.

6083. (1) [3/1717 దృఢం]

అనస్‌ (ర) కథనం: ప్రవక్త (స), అబూ బకర్‌, ‘ఉమర్‌, ‘ఉస్మాన్‌లు ఉ’హుద్‌ కొండపై ఎక్కారు. కొండ కంపించ సాగింది. ప్రవక్త (స) తన కాలితో నొక్కి, ఓ ఉ’హుద్‌! ఆగిపో! నీపై ఒక ప్రవక్త, ఒక సత్యవంతుడు, ఇద్దరు అమర వీరులు ఉన్నారు,’ అని అన్నారు. (బు’ఖారీ)

6084 – [ 2 ] ( مُتَّفَقٌ عَلَيْهِ ) (3/1717)

وَعَنْ أَبِيْ مُوْسَى الْأَشْعَرِيِّ قَالَ: كُنْتُ مَعَ النَّبِيِّ صلى الله عليه وسلم فِيْ حَائِطٍ مِنْ حِيْطَانِ الْمَدِيْنَةِ فَجَاءَ رَجُلٌ فَاسْتَفْتَحَ. فَقَالَ النَّبِيُّ صلى الله عليه وسلم: “اِفْتَحْ لَهُ وَبَشِّرْهُ بِالْجَنَّةِ”فَفَتَحْتُ لَهُ فَإِذَا أَبُوْ بَكْرٍ فَبَشَّرْتُهُ بِمَا. قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم فَحَمِدَ اللهُ. ثُمَّ جَاءَ رَجُلٌ فَاسْتَفْتَحَ. فَقَالَ النَّبِيُّ صلى الله عليه وسلم: “اِفْتَحْ لَهُ وَبَشِّرْهُ بِالْجَنَّةِ”. فَفَتَحْتُ لَهُ فَإِذَا هُوَ عُمَرُ فَأَخْبَرْتُهُ بِمَا قَالَ النَّبِيُّ صلى الله عليه وسلم. فَحَمِدَ اللهُ. ثُمَّ اسْتَفْتَحَ رَجُلٌ. فَقَالَ لِيْ: “اِفْتَحْ لَهُ وَبَشِّرْهُ بِالْجَنَّةِ عَلَى بَلْوَى تُصِيْبُهُ”. فَإِذَا عُثْمَانُ فَأَخْبَرْتُهُ بِمَا قَالَ النَّبِيُّ صلى الله عليه وسلم. فَحَمِدَ اللهُ. ثُمَّ قَالَ: اللهُ الْمُسْتَعَانُ. مُتَّفَقٌ عَلَيْهِ.

6084. (2) [3/1717ఏకీభవితం]

అబూ మూసా అష్‌’అరీ (ర) కథనం: మదీనహ్ తోటల్లోని ఒక తోటలో నేను ప్రవక్త (స) వెంట ఉన్నాను. ఇంతలో ఒక వ్యక్తి వచ్చి, ‘తలుపు తెరవండి,’ అని అన్నాడు. ప్రవక్త (స), ‘తలుపు తెరచి, అతనికి స్వర్గ శుభవార్త వినిపించు,’ అని అన్నారు. నేను తలుపు తెరచాను. చూస్తే అబూ బకర్‌ (ర), నేనతనికి స్వర్గ శుభవార్త ఇచ్చాను. అతడు అల్లాహ్‌(త)కు కృతజ్ఞతలు తెలుపు కున్నారు. ఆ తరువాత మరో వ్యక్తి వచ్చి, ‘తలుపు తెరవమని,’ అన్నాడు, ప్రవక్త (స), ‘తలుపు తెరచి, అతనికి కూడా స్వర్గశుభవార్త ఇవ్వమని,’ ఆదేశించారు. నేను తలుపు తెరచేసరికి ‘ఉమర్‌ ఉన్నారు. అతనికి కూడా నేను స్వర్గ శుభవార్త తెలియ జేసాను. అతను కూడా అల్లాహ్‌(త)కు కృతజ్ఞతలు తెలుపుకున్నారు. ఆ తరువాత మరో వ్యక్తి వచ్చాడు. ‘తలుపు తెరవమని,’ అన్నాడు. ప్రవక్త(స), ‘తలుపు తెరచి, అతనికి కలిగే కష్టాలవల్ల అతనికి స్వర్గ శుభవార్త వినిపించు,’ అని అన్నారు. నేను తలుపు తెరచి చూసేసరికి ‘ఉస్మాన్‌ (ర) ప్రవక్త (స) ఆదేశించిన విధంగా నేను చెప్పాను. ఉస్మాన్‌ (ర) కూడా అల్లాహ్‌ (త)కు కృతజ్ఞతలు తెలుపు కున్నారు. ఇంకా, ‘కష్టాలన్నిటిలో అల్లాహ్‌ (త)నే సహాయం కోరటం జరుగు తుంది,’ అని అన్నారు.  (బు’ఖారీ, ముస్లిమ్‌)

—–

اَلْفَصْلُ الثَّانِيْ   రెండవ విభాగం   

6085 – [ 3 ] ( حسن صحيح ) (3/1717)

عَنِ ابْنِ عُمَرَ قَالَ: كُنَّا نَقُوْلُ وَرَسُوْلُ اللهِ صلى الله عليه وسلم حَيٌّ: أَبُوْ بَكْرٍ وَعُمَرُ وَعُثْمَانُ رَضِيَ اللهُ عَنْهُمْ. رَوَاهُ التِّرْمِذِيُّ.

6085. (3) [3/1717 ప్రామాణికం, దృఢం]

ఇబ్నె’ఉమర్‌(ర) కథనం: ప్రవక్త (స) కాలంలో మేము ”అబూ బకర్‌, ‘ఉమర్‌, ‘ఉస్మాన్‌ల పట్ల అల్లాహ్‌(త) సంతృప్తి చెందుగాక!” అని అనేవాళ్ళం. [14]  (తిర్మిజి’)

—–

اَلْفَصْلُ الثَّالِثُ   మూడవ విభాగం 

6086 – [ 4 ] ( ضعيف ) (3/1718)

عَنْ جَابِرٍ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم قَالَ: “أُرِيَ اللَّيْلَةَ رَجُلٌ صَالِحٌ كَأَنَّ أَبَا بَكْرٍ نِيْطَ بِرَسُوْلِ اللهِ صلى الله عليه وسلم وَنِيْطَ عُمَرُ بِأَبِيْ بَكْرٍ وَنِيْطَ عُثْمَانُ بِعُمَرَ”. قَالَ جَابِرٌ: فَلَمَّا قُمْنَا مِنْ عِنْدِ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم قُلْنَا: أَمَّا الرَّجُلُ الصَّالِحُ فَرَسُوْلُ اللهِ وَأَمَّا نَوْطُ بَعْضِهِمْ بِبَعْضٍ فَهُمْ وُلَاةُ الْأَمْرِ الَّذِيْ بَعَثَ اللهُ بِهِ نَبِيّهُ صلى الله عليه وسلم. رَوَاهُ أَبُوْ دَاوُدَ.

6086. (4) [3/1718బలహీనం]

జాబిర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఈ రోజు రాత్రి ఒక పుణ్య వ్యక్తిని చూపెట్టడం జరిగింది. అంటే అబూ బకర్‌ (ర) ప్రవక్త (స)తో పాటు వ్రేలాడు తున్నారు. ఇంకా ‘ఉమర్‌, అబూ బకర్‌ (ర)తో పాటు వ్రేలాడుతున్నారు. ఇంకా ‘ఉస్మాన్‌, ‘ఉమర్‌ వెంట వ్రేలాడుతున్నారు. మేము ప్రవక్త (స) వద్ద నుండి లేస్తూ ఆ పుణ్యవ్యక్తి ఎవరని అడిగితే, ‘అది ప్రవక్త (స) ‘ అని, ఇంకా ఒకరితో ఒకరు వ్రేలాడటం ఈ ముగ్గురిని సూచిస్తుందని, వారు ఈ షరీఅత్‌కు సహాయకులని, వారి వెంట అల్లాహ్‌ (త) తన ప్రవక్త (స)ను పంపాడని తెలియ పర్చడం జరిగింది.

=====

8 – بَابُ مَنَاقِبِ عَلِيِّ بْنِ أَبِيْ طَالِبٍ رَضِيَ اللهُ عَنْهُ

8. ‘అలీ బిన్అబీతాలిబ్() ప్రత్యేకతలు

اَلْفَصْلُ الْأَوَّلُ   మొదటి విభాగం  

6087 – [ 1 ] ( مُتَّفَقٌ عَلَيْهِ ) (3/1719)

عَنْ سَعْدِ بْنِ أَبِيْ وَقَّاصٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم لِعَلِيٍّ: “أَنْتَ مِنِّيْ بِمَنْزِلَةِ هَارُوْنَ مِنْ مُوْسَى إِلَّا أَنَّهُ لَا نَبِيَّ بَعْدِيْ”. مُتَّفَقٌ عَلَيْهِ .

6087. (1) [3/1719ఏకీభవితం]

 స’అద్‌ బిన్‌ అబీ వఖ్ఖా’స్‌ (ర) కథనం: ప్రవక్త (స) ‘అలీ (ర)తో ”నా కోసం నువ్వు, మూసా (అ) కోసం హారూన్‌ (అ) లాంటి వాడవు. అయితే నా తరువాత ప్రవక్తలెవరూ లేరు,” అని అన్నారు.[15]  (బు’ఖారీ, ముస్లిమ్‌)

6088 – [ 2 ] ( صحيح ) (3/1719)

وَعَنْ زِرِّ بْنِ حُبَيْشٍ قَالَ: قَالَ عَلِيٌّ رَضِيَ اللهُ عَنْهُ: وَالَّذِيْ فَلَقَ الْحَبَّةَ وَبَرَأَ النِّسْمَةَ إِنَّهُ لَعَهْدُ النَّبِيِّ الْأُمِّيِّ صلى الله عليه وسلم إِلَيَّ: أَنْ لَا يُحِبُّنِيْ إِلَّا مُؤْمِنٌ وَلَا يُبْغِضُنِيْ إِلَّا مُنَافِقٌ. رَوَاهُ مُسْلِمٌ

6088 . (2) [3/1719 దృఢం]

‘జిర్రి బిన్ ‘హుబైష్‌ (ర) కథనం: ‘అలీ (ర) ఇలా అన్నారు, ”గింజను చీల్చే, ప్రాణులను సృష్టించే అల్లాహ్‌ (త) సాక్షి! వాస్తవం ఏమిటంటే, నన్ను కేవలం విశ్వాసులే ప్రేమిస్తారు, నన్ను కేవలం కపటాచారులే ద్వేషిస్తారు,’ అని ప్రవక్త (స)  ప్రవచించారు. (ముస్లిమ్‌)

6089 – [ 3 ] ( مُتَّفَقٌ عَلَيْهِ ) (3/1719)

وَعَنْ سَهْلِ بْنِ سَعْدِ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم قَالَ يَوْمَ خَيْبَرَ: “لَأُعْطِيَنَّ هَذِهِ الرَّايَةَ غَدًا رَجُلًا يَفْتَحُ اللهُ عَلَى يَدَيْهِ يُحِبُّ اللهَ وَرَسُوْلَهُ وَيُحِبُّهُ اللهُ وَرَسُوْلُهُ”. فَلَمَّا أَصْبَحَ النَّاسُ غَدَوْا عَلَى رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم كُلُّهُمْ يَرْجُونَ أَنْ يُعْطَاهَا فَقَالَ: “أَيْنَ عَلِيُّ بْنُ أَبِيْ طَالِبٍ؟” فَقَالُوْا: هُوَ يَا رَسُوْلَ اللهِ يَشْتَكِيْ عَيْنَيْهِ. قَالَ: “فَأَرْسِلُوْا إِلَيْهِ”. فَأُتِيَ بِهِ فَبَصَقَ رَسُوْلُ الله صلى اللهِ عليه وسلم فِيْ عَيْنَيْهِ فَبَرَأَ حَتّى كَأَنْ لَمْ يَكُنْ بِهِ وَجْعٌ. فَأَعْطَاهُ الرَّايَةَ. فَقَالَ عَلِيٌّ: يَا رَسُوْلَ اللهِ أُقَاتِلُهُمْ حَتّى يَكُوْنُوْا مِثْلَنَا؟ فَقَالَ: “اُنْفُذْ عَلَى رِسْلِكَ حَتّى تَنْزِلَ بِسَاحَتِهِمْ ثُمَّ ادْعُهُمْ إِلى الْإِسْلَامِ وَأَخْبِرْهُمْ بِمَا يَجِبُ عَلَيْهِمْ مِنْ حَقِّ اللهِ فِيْهِ فَوَاللهِ لَأَنْ يَهْدِيَ اللهُ بِكَ رَجُلًا وَاحِدًا خَيْرٌ لَكَ مِنْ أَنْ يَكُوْنَ لَكَ حُمَرُ النَّعَمِ”. مُتَّفَقٌ عَلَيْهِ.

 وَذُكِرَ حَدِيْثُ الْبَرَاءِ قَالَ لِعَلِيٍّ: “أَنْتَ مِنِّيْ وَأَنَا مِنْكَ”. فِيْ بَابِ “بُلُوْغِ الصَّغِيْرِ”.

6089. (3) [3/1719 ఏకీభవితం]

సహల్‌ బిన్‌ స’అద్‌ (ర) కథనం: ఖైబర్‌ నాడు ప్రవక్త (స) ఇలా ప్రవచించారు, ”రేపు నేను ఈ జండా ఎటువంటి వ్యక్తికి ఇస్తానంటే, అతని చేతుల మీదుగా అల్లాహ్‌ (త) విజయం ప్రసాదిస్తాడు. ఇంకా ఆ వ్యక్తి అల్లాహ్‌ (త) మరియు ఆయన ప్రవక్తను ప్రేమిస్తున్నాడు. ఇంకా అల్లాహ్‌ (త) మరియు ఆయన ప్రవక్త అతన్ని ప్రేమిస్తున్నారు. ఉదయం కాగానే అందరూ ప్రవక్త (స) దగ్గరకు వెళ్ళారు. ప్రతి ఒక్కరూ ఆ జెండా తనకు ఇవ్వబడుతుందని భావించారు. కాని ప్రవక్త (స), ” ‘అలీ బిన్‌ అబీ తాలిబ్‌ ఎక్కడ?’ అని అడిగారు. అప్పుడు అనుచరులు, ‘ఓ ప్రవక్తా! అతని కళ్ళు నొప్పిగా ఉన్నాయి,’ అని అన్నారు. ప్రవక్త (స) ‘అతని వద్దకు ఎవరినైనా పంపమని’ అన్నారు. అతన్ని తీసుకు రావటం జరిగింది. ప్రవక్త (స) అతని కళ్ళలో తన లాలా జలాన్ని వేసారు. అతని కళ్ళు బాగయి పోయాయి. ఇంతకు ముందు ఎన్నడూ అనారోగ్యంగా లేనట్టు. అనంతరం ప్రవక్త (స) జండాను అతనికి ఇచ్చారు. అప్పుడు ‘అలీ (ర), ”వారు ఇస్లామ్‌ స్వీకరించేవరకు వారితో యుద్ధం చేస్తాను,” అని అన్నారు. ప్రవక్త (స) అతన్ని, ”నిదానంగా వెళ్ళు, వారి ప్రాంతంలోకి ప్రవేశించిన తర్వాత, వారికి ఇస్లామ్‌ సందేశాన్ని అందజేయి. ఇంకా వారిపై ఉన్న అల్లాహ్‌ (త) హక్కులను గురించి వారికి తెలుపు. అల్లాహ్‌ (త)  సాక్షి! అల్లాహ్‌ (త) నీ ద్వారా ఎవరికైనా సన్మార్గం ప్రసాదిస్తే, నీకు మేలు రకం ఒంటెలు లభించటం కంటే ఎంతో మేలు,” అని అన్నారు.  (బు’ఖారీ, ముస్లిమ్‌)

—–

اَلْفَصْلُ الثَّانِيْ  రెండవ విభాగం 

6090 – [ 4 ] ( صحيح ) (3/1720)

عَنْ عِمْرَانِ بْنِ حُصَيْنٍ أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم قَالَ: “إِنَّ عَلِيًّا مِنِّيْ وَأَنَا مِنْهُ وَهُوَ وَلِيٌّ كُلِّ مُؤْمِنٍ”. رَوَاهُ التِّرْمِذِيُّ.

6090. (4) [3/1720 దృఢం]

‘ఇమ్రాన్‌ బిన్‌ ‘హు’సైన్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”నా నుండి ‘అలీ ఉన్నాడు, ‘అలీ నుండి నేనున్నాను. ఇంకా ‘అలీ  ప్రతి విశ్వాసికి మిత్రుడు.”  (తిర్మిజి’)

6091 – [ 5 ] ( صحيح ) (3/1720)

وَعَنْ زَيْدِ بْنِ أَرْقَمَ أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم قَالَ: “مَنْ كُنْتُ مَوْلَاهُ فَعَلِيٌّ مَوْلَاهُ”. رَوَاهُ أَحْمَدُ وَالتِّرْمِذِيُّ .

6091. (5) [3/1720దృఢం]

‘జైద్‌ బిన్‌ అర్‌ఖమ్‌(ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”నేను మిత్రుడైన వాడికి ‘అలీ కూడా మిత్రుడే.” [16](అ’హ్మద్‌, తిర్మిజి’)

6092 – [6 ] ( لم تتم دراسته ) (3/1720)

وَعَنْ حُبْشِيِّ بْنِ جُنَادَةَ قَالَ: رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “عَلِيٌّ مِنِّيْ وَأَنَا مِنْ عَلِيٍّ وَلَا يُؤَدِّيْ عَنِّيْ إِلَّا أَنَا وَعَلِيٌّ”. رَوَاهُ التِّرْمِذِيُّ ورواه أحمد عَنْ أبي جنادة.

6092. (6) [3/1720 అపరిశోధితం]

‘హబ్‌షీ బిన్‌ జునాదహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ” ‘అలీ నానుండి, నేను ‘అలీనుండి నా తరఫున కేవలం నేనైనా లేదా ‘అలీ అయినా చెల్లించాలి.” [17] (తిర్మిజి’, అహ్మద్‌ – అబూ  జునాదహ్‌  ద్వారా)

6093 – [ 7 ] ( ضعيف ) (3/1720)

وَعَنِ ابْنِ عُمَرَقَالَ: آخَى رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم بَيْنَ أَصْحَابِهِ فَجَاءَ عَلِيٌّ تَدْمَعُ عَيْنَاهُ فَقَالَ: آخَيْتَ بَيْن أَصْحَابِكَ وَلَمْ تُؤَاخِ بَيْنِيْ وَبَيْنَ أَحَدٍ. فَقَالَ رَسُوْلُ الله صلى الله عليه وسلم: “أَنْتَ أَخِيْ فِي الدُّنْيَا وَالْآخِرَةِ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَقَالَ: هَذَا حَدِيْثٌ حَسَنٌ غَرِيْبٌ

6093. (7) [3/1720బలహీనం]

ఇబ్నె ‘ఉమర్‌ (ర) కథనం: ప్రవక్త (స) తన అనుచరుల మధ్య సోదరభావాన్ని జనింపజేసారు. అప్పుడు ‘అలీ (ర) వచ్చారు. అతని కళ్ళంట అశ్రువులు కారుతున్నాయి. ‘ఓ ప్రవక్తా! తమరు మీ అనుచరుల మధ్య సోదర బంధుత్వాన్ని పెంపొం దించారు. కాని నాతో ఎవ్వరికీ సోదర బంధు త్వాన్ని కల్పించలేదు,’ అని అన్నారు. అప్పుడు ప్రవక్త (స), ”నీవు నా సోదరుడవు, ఇహలోకంలోనూ, పరలోకం లోనూ.”   (తిర్మిజి’ –  ప్రామాణికం –  ఏకోల్లేఖనం)

6094 – [ 8 ] ( ضعيف ) (3/1721)

وَعَنْ أَنَسٍ قَالَ: كَانَ عِنْدَ النَّبِيِّ صلى الله عليه وسلم طَيْرٌ فَقَالَ: “اَللّهُمَّ ائْتِنِيْ بِأَحَبِّ خَلْقِكَ إِلَيْكَ يَأْكُلُ مَعِيْ هَذَا الطَّيْرَ”. فَجَاءَ عَلِيٌّ فَأَكَلَ مَعَهُ. رَوَاهُ التِّرْمِذِيُّ وَقَالَ: هذَا حَدِيْثٌ غَرِيْبٌ

6094. (8) [3/1721 బలహీనం]

అనస్‌ (ర) కథనం: ప్రవక్త (స) ముందు వేపబడిన ఒక పక్షి ఉంచబడింది. అప్పుడు ప్రవక్త (స), ”ఓ అల్లాహ్(త)! నీకు అత్యంత ప్రియమైన వ్యక్తిని నా వద్దకు పంపు,” అని ప్రార్థించారు. అనంతరం ‘అలీ (ర) వచ్చారు. ప్రవక్త (స) తో పాటు కూర్చొని తిన్నారు. (తిర్మిజి’ – ఏకోల్లేఖనం)

6095 – [ 9 ] ( ضعيف ) (3/1721)

وَعَنْ عَلِيٍّ رضي الله عَنْهُ قَالَ: كُنْتُ إِذَا سَأَلْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم أَعْطَانِيْ. وَإِذَا سَكَتُّ اِبْتَدَأَنِيْ. رَوَاهُ التِّرْمِذِيُّ وَقَالَ: هَذَا حَدِيْثٌ “حَسَنٌ غَرِيْبٌ”.

6095. (9) [3/1721 బలహీనం]

‘అలీ (ర) కథనం: నేను ప్రవక్త (స)ను ఎప్పుడు ఏమి అడిగినా ఇచ్చేవారు. ఇంకా నేను మౌనంగా ఉంటే, తాను స్వయంగా నాకు ఇచ్చివేసేవారు. (తిర్మిజి’ – ప్రామాణికం,  ఏకోల్లేఖనం)

6096 – [ 10 ] ( لم تتم دراسته ) (3/1721)

وعَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “أَنَا دَارُ الْحِكْمَةِ وعَلِيٌّ بِابُهَا”. رَوَاهُ التِّرْمِذِيُّ. وقَالَ :هذا حديث غريب.

وقَالَ روى: بعضهم هذا الحديث عَنْ شَرِيْكٍ وَلَمْ يَذْكُرُوْا فِيْهِ عَنْ الصُّنَابِحِيِّ وَلَا نَعْرِفُ هَذَا الْحَدِيْثَ عَنْ أَحَدٍ مِنَ الثِّقَاتِ غَيْرَ شَرِيْكٍ.

6096. (10) [3/1721అపరిశోధితం]

అలీ (ర) కథనం : ప్రవక్త (స) ప్రవచనం, ”నేను వివేకాల నిధిని, అలీ ఆ నిధికి ద్వారం వంటివాడు.” (తిర్మిజి)

ఇంకా తిర్మిజి దీన్ని అసాధారణమైన హదీసుగా పేర్కొంటూ, కొందరు దీన్ని షరీక్ ద్వారా ఉల్లేఖిం చారని, కాని సనాబిహియ్యి ద్వారా పేర్కొనలేదని, అయితే దీన్ని షరీక్ ద్వారా తప్ప, ప్రామాణిక ఉల్లే ఖకుల ద్వారా మాకు  తెలియదని  పేర్కొన్నారు.

6097 – [ 11 ] ( ضعيف ) (3/1721)

وعَنْ جَابِرٍقَالَ: دَعَا رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم عَلِيًّا يَوْمَ الطَّائِفِ فَانْتَجَاهُ فَقَالَ النَّاسُ: لَقَدْ طَالَ نَجْوَاهُ مَعَ ابْنِ عَمِّهِ. فَقَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَا انْتَجَيْتُهُ وَلَكِنَّ اللهَ انْتَجَاهُ”. رَوَاهُ التِّرْمِذِيُّ .

6097. (11) [3/1721బలహీనం]

జాబిర్‌ (ర) కథనం: ‘తాయిఫ్‌ రోజు ప్రవక్త (స) ‘అలీని పిలిపించారు. అతనితో రహస్యంగా మాట్లాడారు. ప్రజలు, ‘తన చిన్నాన్న కుమారునితో చాలాసేపు వరకు గుసగుసలు జరిపారు,’ అని అన్నారు. ప్రవక్త (స) అది విని, ‘నేనతనితో రహ స్యంగా మాట్లాడలేదు, అల్లాహ్‌ (త) అతనితో రహ స్యంగా సంభాషించాడు,’ అని అన్నారు.  (తిర్మిజి’)

6098 – [ 12 ] ( ضعيف ) (3/1722)

وعَنْ أَبِيْ سَعِيْدٍ قَالَ: قَالَ رَسُوْلُ الله صلى الله عليه وسلم لِعَلِيّ: “يَا عَلِيُّ لَا يَحِلُّ لَأَحَدٍ يُجْنِبُ فِيْ هَذَا الْمَسْجِدِ غَيْرِيْ وَغَيْرُكَ”. قَالَ عَلِيُّ بْنِ الْمُنْذِرِ: فَقُلْتُ لِضَرَارِ بْنِ صُرَدٍ: مَا مَعْنَى هَذَا الْحَدِيْثِ؟ قَالَ: لَا يَحِلُّ لِأَحَدٍ يَسْتَطْرِقُهُ جُنُبًا غَيْرِيْ وَغَيْرُكَ. رَوَاهُ التِّرْمِذِيُّ وَقَالَ: هَذَا حَدِيْثٌ حَسَنٌ غَرِيْبٌ

6098. (12) [3/1722 బలహీనం]

అబూ స’యీద్‌ (ర) కథనం: ప్రవక్త (స) ‘అలీ (ర)తో, ”నేను, నీవూ తప్ప మరెవరికీ అశుద్ధస్థితిలో మస్జిద్‌ లోనికి ప్రవేశించే అనుమతి లేదు. ‘అలీ బిన్‌ మున్‌జి’ర్‌, ‘దరార్‌ బిన్‌ ‘సుర్ద్ ను ఈ ‘హదీసు’ అర్థం ఏమిటని అడిగారు. దానికి  అతడు, ”నేను, నీవూ [అంటే ప్రవక్త (స) ‘అలీ (ర)] తప్ప ఇతరులు అశుద్ధావస్థలో మస్జిద్‌ గుండా నడవకూడదు,” అని అర్థం, అని అన్నారు. (తిర్మిజి’ – ప్రామాణికం –  ఏకోల్లేఖనం)

6099 – [ 13 ] ( ضعيف ) (3/1722)

وعَنْ أُمِّ عَطِيَّةَ قَالَتْ: بَعَثَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم جَيْشًا .فِيْهِمُ عَلِيٌّ قَالَتْ: فَسَمِعْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم وَهُوَرَافِعٌ يَدَيْهِ يَقُوْلُ: “اَللّهُمَّ لَا تُمِتْنِيْ حَتّى تُرِيَنِيْ عَلِيًّا”. رَوَاهُ التِّرْمِذِيُّ .

6099. (13) [3/1722  బలహీనం]

ఉమ్మె అతియ్య (ర) కథనం: ప్రవక్త (స) ఒక సైనిక పటాలాన్ని ఎక్కడికో పంపారు. అందులో ‘అలీ కూడా ఉన్నారు. ‘అలీ (ర) వెళ్ళిపోయిన తర్వాత ప్రవక్త (స) చేతు లెత్తి, ”ఓ అల్లాహ్‌! ‘అలీ (ర) వచ్చేవరకు నాకు మరణం ప్రసాదించకు,”  అని  ప్రార్థించారు. (తిర్మిజి’)

—–

اَلْفَصْلُ الثَّالِثُ    మూడవ విభాగం 

6100 – [ 14 ] ( ضعيف ) (3/1722)

عَنْ أُمِّ سَلَمَةَ قَالَتْ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَا يُحِبُّ عَلِيًّا مُنَافِقٌ وَلَا يُبْغِضُهُ مُؤْمِنٌ”. رَوَاهُ أَحْمَدُ وَالتِّرْمِذِيُّ وَقَالَ: هَذَا حَدِيْثٌ حَسَنٌ غَرِيْبٌ إِسْنَادًا

6100. (14) [3/1722 బలహీనం]

ఉమ్మె సలమహ్ (ర)కథనం: ప్రవక్త(స) ప్రవచనం, ”కపటాచారులు ‘అలీ (ర)ను ప్రేమించరు. విశ్వాసులు ‘అలీతో శత్రుత్వం వహించరు.” (అ’హ్మద్‌, తిర్మిజి’ – ప్రామాణిక  ఆధారాలు  – ఏకోల్లేఖనం)

6101 – [ 15 ] ( ضعيف ) (3/1722)

وعَنْهَا قَالَتْ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَنْ سَبَّ عَلِيًّا فَقَدْ سَبَّنِيْ”. رَوَاهُ أَحْمَدُ

6101. (15) [3/1722 బలహీనం]

ఉమ్మె సలమహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ” ‘అలీ (ర) ను తిట్టినవాడు నన్ను తిట్టినట్టే.” [18] (అ’హ్మద్‌)

6102 – [ 16 ] ( ضعيف ) (3/1722)

وعَنْ عَلِيٍّ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “فِيْكَ مَثَلٌ مِنْ عِيْسَى أَبْغَضَتْهُ الْيَهُوْدُ حَتّى بَهَتُوْا أُمَّهُ وَأَحبَّتْهُ النَّصَارَى حَتّى أَنْزَلُوْهُ بِالْمَنْزِلَةِ الَّتِيْ لَيْسَتْ لَهُ”. ثُمَّ قَالَ: يَهْلِكُ فِيْ رَجُلَانِ: مُحِبٌّ مُفْرِطٌ يُقَرِّظُنِيْ بِمَا لَيْسَ فِيْ وَمُبْغِضٌ يَحْمِلُهُ شَنَآنِيْ عَلى أَنْ يَبْهَتني. رَوَاهُ أَحْمَدُ.

6102. (16) [3/1722బలహీనం] 

‘అలీ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”నీకూ ‘ఈసా (అ) కు ఒక్క పోలిక ఉంది. యూదులు ‘ఈసా (అ) పట్ల శతృత్వం వహించారు. చివరికి అతని తల్లిపై వ్యభిచార అపనింద మోపారు. క్రైస్తవులు ‘ఈసా (అ) ప్రేమలో హద్దుమీరి ప్రవర్తించారు.” అనంతరం అన్నారు: ‘అలీ (ర) విషయంలో రెండు వర్గాలు నాశనం అవుతాయి. ఒకటి హద్దులు మీరి అతన్ని (ర) ప్రేమించేవారిది. రెండ వది అతన్ని (ర)  అపనిందలకు గురిచేసేవారిది,” [19] (అ’హ్మద్‌)

6103 – [ 17 ] ( ضعيف ) (3/1723)

وعَن الْبَرَاءِ بْنِ عَازِبِ وَزَيْدِ بْنِ أَرْقَمَ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم لَمَّا نَزَلَ بِغَدِيْرِ خُمَّ أَخَذَ بِيَدٍ عَلِيٍّ فَقَالَ: “أَلَسْتُمْ تَعْلَمُوْنَ أَنِّيْ أَوْلى بِالْمُؤْمِنِيْنَ مِنْ أَنْفِسِهِمْ؟” قَالُوْا: بَلَى. قَالَ: “أَلَسْتُمْ تَعْلَمُوْنَ أَنِّيْ أَوْلَى بِكُلِّ مُؤْمِنٍ مِنْ نَفْسِهِ؟” قَالُوْا: بَلَى. قَالَ: “اَللّهُمَّ مَنْ كُنْتُ مَوْلَاهُ فَعْلِيٌّ مَوْلَاهُ. اَللّهُمَّ وَالِ مَنْ وَالَاهُ وَعَادَ مَنْ عَادَاهُ”. فَلَقِيَهُ عُمَرُ بَعْدَ ذَلِكَ. فَقَالَ لَهُ: هَنِيْئًا يَا ابْنَ أِبيْ طَالِبٍ أَصْبَحْتَ وَأَمْسَيْتَ مَوْلَى كُلِّ مُؤْمِنٌ وَمُؤْمِنَةٍ. روَاهُ أَحْمَدُ.

6103. (17) [3/1723బలహీనం]

బరాఅ’ బిన్‌ ‘ఆ’జిబ్‌ మరియు ‘జైద్‌ బిన్‌ అర్‌ఖమ్‌ల కథనం: ప్రవక్త (స) చివరి ‘హజ్జ్ నుండి తిరిగి వస్తూ, గదీరిఖుమ్మ ప్రాంతంలో దిగారు. ప్రవక్త (స) ‘అలీ (ర) చేయిపట్టుకొని, ‘విశ్వాసు లందరికీ నేను వారి ప్రాణాల కంటే, తీపిగల వాడిని కానా?’ అని అన్నారు. అనుచరులు, ‘అవును,’ అని అన్నారు. మళ్ళీ ప్రవక్త (స), ”విశ్వాసులందరికీ నేను వారి ప్రాణాలకంటే, తీపిగలవాడిని కానా?” అని అన్నారు. అనుచరులు మళ్ళీ, ‘అవును,’ అని అన్నారు. అనంతరం ప్రవక్త (స), ‘ఓ అల్లాహ్‌(త)! నాకు మిత్రుడు ‘అలీకీ మిత్రుడే, ఓ ‘అల్లాహ్‌(త)! ‘అలీని ప్రేమించే వారిని నువ్వు ప్రేమించు,’ ‘అలీని శత్రువుగా భావించేవాడిని నువ్వు శత్రువుగా భావించు. ఆ తర్వాత ‘ఉమర్‌ (ర), ‘అలీని కలిసారు. ఇంకా, ”ఓ ‘అలీ బిన్‌ అబీ ‘తాలిబ్‌! నీకు శుభం కలుగు గాక! నీవు ఎల్లప్పుడూ విశ్వాస స్త్రీ పురుషులకు మిత్రుడవూ, ప్రియమైనవాడవూనూ,” అని అన్నారు. (అ’హ్మద్‌)

6104 – [ 18] ( صحيح ) (3/1723)

وعَنْ بُرَيْدَةَ قَالَ: خَطَبَ أَبِيْ بَكْرٍ وَعُمَرُ فَاطِمَةَ. فَقَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِنَّهَا صَغِيْرَةٌ ” ثُمّض خَطَبَهَا عَلِيٌّ فَزَوَّجَهَا مِنْهُ. رَوَاهُ النَّسَائِيُّ .

6104. (18) [3/1723 దృఢం]

బురైదహ్‌ (ర) కథనం: అబూ బకర్‌, ‘ఉమర్‌ (ర) లు ఫాతిమహ్తో నికాహ్‌కు సందేశం పంపారు. ప్రవక్త (స) ఫాతిమహ్ ఇంకా చిన్నపిల్ల అని సమాధానం ఇచ్చారు. అనంతరం ‘అలీ (ర) ఫాతిమహ్తో నికాహ్‌ సందేశం పంపారు. ప్రవక్త (స) ‘అలీకి ఇచ్చి ఫాతిమహ్ వివాహం చేసివేసారు. (నసాయి)

6105 – [ 19 ] ( ضعيف ) (3/1723)

وعَنْ ابْنِ عَبَّاسٍ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم أَمَرَبِسَدِّ الْأَبْوَابِ إِلَّا بَابَ عَلِيٍّ. رَوَاهُ التِّرْمِذِيُّ وقَالَ: هَذَا حَدِيْثٌ غَرِيْبٌ.

6105. (19) [3/1723బలహీనం]

ఇబ్నె ‘అబ్బాస్‌ (ర) కథనం: ప్రవక్త (స) మస్జిద్‌లోని ‘అలీ (ర) తలుపు తప్ప, ఇతరులందరి ఇళ్ళ తలు పులను మూయించారు.[20] (తిర్మిజి’ – ఏకోల్లేఖనం)

6106 – [ 20 ] ( ضعيف ) (3/1723)

وعَنْ عَلِيٍّ قَالَ: كَانَتْ لِيْ مَنْزِلَةٌ مِنْ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم لَمْ تَكُنْ لِأَحَدٍ مِنَ الْخَلَائِقِ آتِيْهِ بِأَعْلَى سَحَرٍفَأَقُوْلُ: اَلسَّلَّامُ عَلَيْكَ يَا نَبِيَّ اللهِ فَإِنْ تَنَحْنَحَ اِنْصَرَفْتُ إِلَى أَهْلِيْ وَإِلَّا دَخَلْتُ عَلَيْهِ. رَوَاهُ النَّسَائِيُّ.

6106. (20) [3/1723 బలహీనం]

‘అలీ (ర) కథనం: ప్రవక్త (స) వద్ద నాకున్న ప్రాధాన్యత మరెవరికీ ఉండేది కాదు. నేను ఉదయం కాగానే ప్రవక్త (స) వద్దకు వెళ్ళి సలామ్‌ చేసేవాడిని, ఒకవేళ ప్రవక్త (స) నా సలామ్‌ విని దగ్గితే తిరిగి వెళ్ళిపోయేవాడిని, లేకపోతే ప్రవక్త (స) వద్దకు వెళ్ళి కూర్చునేవాడిని. (నసాయి)

6107 – [ 21 ] ( ضعيف ) (3/1724)

وعَنْهُ قَالَ: كُنْتُ شَاكِيًا فَمَرَّ بِيْ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم وَأَنَا أَقُوْلُ: اَللّهُمَّ إِنْ كَانَ أَجَلِيْ قَدْ حَضَرَفَأَرِحْنِيْ وَإِنْ كَانَ مُتَأَخِّرًا فَارْفَعْنِيْ وَإِنْ كَانَ بَلَاءً فَصَبِّرْنِيْ. فَقَالَ رَسُوْلُ الله صلى الله عليه وسلم: “كَيْفَ قُلْتَ؟” فَأَعَادَ عَلَيْهِ مَا قَالَ فَضَرَبَهُ بِرِجْلِهِ وقَالَ: “اَللّهُمَّ عَافِهِ – أَوْ اِشْفِهِ -“شَكَّ الرَّاوِيْ قَالَ: فَمَا اشْتَكَيْتُ وَجْعِيْ بَعْدُ. رَوَاهُ التِّرْمِذِيُّ وَقَالَ: هَذَا حَدِيْثٌ حَسَنٌ صَحِيْحٌ.

6107. (21) [3/1724 బలహీనం]

‘అలీ (ర) కథనం: నేను ఆనారోగ్యంగా ఉన్నాను, ప్రవక్త (స) నా ప్రక్క నుండి వెళుతున్నారు. అప్పుడు నేను, ”ఓ అల్లాహ్‌(త)! ఒకవేళ నా మరణ సమయం వచ్చిఉంటే, నాకు మరణం ప్రసాదించి శాంతి సుఖాలను ప్రసాదించు, ఒకవేళ మరణంలో ఆలస్యం ఉంటే, సుఖమయ జీవితం ప్రసాదించు, ఒకవేళ ఇది పరీక్ష అయితే ఓర్పూ సహనాలను ప్రసాదించు,” అని ప్రార్థిస్తున్నాను. అది విని, ప్రవక్త (స), ”నువ్వు ఏమని పలుకుతున్నావు?” అని అన్నారు. నేను ఆ పదాలను మళ్ళీ వల్లించాను. ప్రవక్త (స) అది విని, తన కాలితో తన్నుతూ, ‘జాగ్రత్త!’ అని చెప్పి, ”ఓ అల్లాహ్‌(త)! ఇతనికి క్షేమాన్ని ప్రసాదించు, లేదా ఇతనికి ఆరోగ్యం ప్రసాదించు,” అని ప్రార్థించారు. ఆ తరువాత నేనెప్పుడూ ఆ విధంగా అనారోగ్యానికి గురికాలేదు. (తిర్మిజి’ – ప్రమాణికం – దృఢం)

=====

9 بَابُ مَنَاقِبِ الْعَشَرَةِ رَضِيَ اللهُ عَنْهُمْ

9. శుభవార్త పొందిన పదిమంది సహచరులు (.అన్హుంల) విశేషాలు

اَلْفَصْلُ الْأَوَّلُ   మొదటి విభాగం   

6108 – [ 1 ] ( صحيح ) (3/1725)

عَنْ عُمَرَ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: مَا أَحَدٌ أَحَقُّ بِهَذَا الْأَمْرِ مِنْ هَؤُلَاءِ النَّفَرِ الَّذِيْنَ تُوُفِّيَ رَسُوْلُ الله صلى الله عليه وسلم وَهُوَ عَنْهُمْ رَاضٍ فَسَمّى عَلِيًّا وَعُثْمَانَ وَالزُّبَيْرَ وَطَلْحَةَ وَسَعْدًا وَعَبْدَ الرَّحْمنِ. روَاهُ الْبُخَارِيُّ.

6108. (1) [3/1725 దృఢం]

‘ఉమర్‌ (ర) కథనం: ఖిలాఫత్‌కు అంటే పరిపాల నకు వీరికంటే అధికంగా హక్కుగల వారెవరూ లేరు. ప్రవక్త (స) మరణించినపుడు వీరిపట్ల సంతృప్తిగా, సంతోషంగా ఉన్నారు. వారు, అలీ (ర), ఉస్మాన్‌ (ర), జుబైర్‌ (ర), తల్‌’హా (ర), స’అద్‌ (ర) మరియు అబ్దుర్ర’హ్మాన్‌. (బు’ఖారీ)

6109 – [ 2 ] ( صحيح ) (3/1725)

وَعَنْ قَيْسِ بْنِ حَازِمٍ قَالَ: رَأَيْتُ يَدَ طَلْحَةَ شَلَّاءَ وَقَى بِهَا النَّبِيَّ صلى الله عليه وسلم يَوْمَ أُحُدٍ. روَاهُ الْبُخَارِيُّ.

6109. (2) [3/1725దృఢం]

ఖైస్‌ బిన్‌ అబీ ‘హా’జిమ్‌ (ర) కథనం: నేను త’ల్హా (ర) చేయి లేకపోవటం చూసాను. దానికి కారణం ఆ చేతితో అతను ఉ’హుద్‌ పోరాటంలో ప్రవక్త (స)ను రక్షించారు. (బు’ఖారీ)

6110 – [ 3 ] ( مُتَّفَقٌ عَلَيْهِ ) (3/1725)

وَعَنْ جَابِرٍقَالَ: قَالَ النَّبِيُّ صلى الله عليه وسلم: “مَنْ يَأْتِيْنِيْ بِخَبْرِ الْقَوْمِ  يَوْمَ الْأَحْزَابِ؟”  قَالَ الزُّبَيْرُ: أَنَا فَقَالَ النَّبِيُّ صلى الله عليه وسلم : “إِنَّ لِكُلِّ نَبِيٍّ حَوَارِيًّا وَحَوَارِيّض الزُّبَيْرُ” مُتَّفَقٌ عَلَيْهِ .

6110. (3) [3/1725ఏకీభవితం]

జాబిర్‌ (ర) కథనం: ప్రవక్త (స) అ’హ్‌’జాబ్‌ పోరాటం సందర్భంగా, ”అవిశ్వాసుల రహస్యాలను గురించిన సమాచారం ఎవరు తీసుకువస్తారు?” అని అన్నారు. అందుకు జుబైర్‌ (ర), ‘నేను తీసుకువస్తాను,’ అని అన్నారు. అప్పుడు ప్రవక్త (స), ‘ప్రతి ప్రవక్తకు సహాయకులు ఉంటారు. నా సహాయకులు ‘జుబైర్‌ (ర),’ అని అన్నారు. [21] (బు’ఖారీ, ముస్లిమ్‌)

6111 – [ 4 ] ( مُتَّفَقٌ عَلَيْهِ ) (3/1725)

وَعَنِ الزُّبَيْرِقَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَنْ يَأْتِيْ بَنِيْ قُرَيْظَةَ فَيَأْتِيْنِيْ بِخَبَرِهِمْ؟” فَانْطَلَقْتُ فَلَمَّا رَجَعْتُ جَمَعَ لِيْ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم أَبَوَيْهِ فَقَالَ: “فَدَاكَ أَبِيْ وَأُمِّيْ”. مُتَّفَقٌ عَلَيْهِ.

6111. (4) [3/1725ఏకీభవితం]

‘జుబైర్‌ (ర) కథనం: ప్రవక్త (స), ” బనూ ఖురై”హ్ గురించిన సమాచారం ఎవరు తెస్తారు,” అని అన్నారు. అనంతరం నేను వెళ్ళి సమాచారం తీసుకువచ్చాను. ప్రవక్త (స) సంతోషంతో, ”నా తల్లిదండ్రులు నీ కోసం త్యాగం కాను” అని అన్నారు. (బు’ఖారీ, ముస్లిమ్‌)

6112 – [ 5 ] ( مُتَّفَقٌ عَلَيْهِ ) (3/1725)

وَعَنْ عَلِيٍّ قَالَ: مَا سَمِعْتُ النَّبِيَّ صلى الله عليه وسلم جَمَعَأَبَوَيْهِ لِأَحَدٍ إِلَّا لِسَعْدِ بْنِ مَالِكٍ فَإِنِّيْ سَمِعْتُهُ يَقُوْلُ يَوْمَ أُحُدٍ: “يَا سَعْدُ اِرْم فَدَاكَ أَبِيْ وَأُمِّيْ”. مُتَّفَقٌ عَلَيْهِ.

6112. (5) [3/1725 ఏకీభవితం]

‘అలీ (ర) కథనం: ప్రవక్త(స) స’అద్‌ బిన్‌ మాలిక్‌కు తప్ప మరెవరి కోసమూ నా తల్లిదండ్రులు నీకోసం త్యాగంకాను అని అనలేదు. అనంతరం ఉ’హుద్‌ యుద్ధం నాడు ప్రవక్త (స)ను, ”ఓ స’అద్‌! బాణం వదులు, నీ కోసం నా తల్లిదండ్రులు త్యాగం కాను” అని అనటం విన్నాను.[22]  (బు’ఖారీ, ముస్లిమ్‌)

6113 – [ 6 ] ( مُتَّفَقٌ عَلَيْهِ ) (3/1726)

وَعَنْ سَعْدِ بْنِ أَبِيْ وَقَّاصٍ قَالَ: إِنِّيْ لَأَوَّلُ الْعَرَبِ رَمَى بِسَهْمٍ فِيْ سَبِيْلِ اللهِ. مُتَّفَقٌ عَلَيْهِ.

6113. (6) [3/1726ఏకీభవితం]

స’అద్‌ బిన్‌ అబీ వఖ్ఖా’స్‌ (ర): ”దైవమార్గంలో బాణం వదలిన, అరబ్బుల్లోని మొట్టమొదటి వ్యక్తిని నేను,” అని అన్నారు. [23]  (బు’ఖారీ, ముస్లిమ్‌)

6114 – [ 7] ( مُتَّفَقٌ عَلَيْهِ ) (3/1726)

وَعَنْ عَائِشَةَ قَالَتْ: سَهِرَرَسُوْلُ اللهِ صلى الله عليه وسلم مَقْدَمَهُ الْمَدِيْنَةَ لَيْلَةُ فَقَالَ:”لَيْتَ رَجُلًا صَالِحًا يَحْرُسُنِيْ”إِذْ سَمِعْنَا صَوْتَ سَلَاحٍ فَقَالَ: “مَنْ هَذَا؟” قَالَ: أَنَا سَعْدٌ قَالَ: “مَا جَاءَ بِك؟” قَالَ: وَقَعَ فِيْ نَفْسِيْ خَوْفٌ عَلَى رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم فَجِئْتُ أَحْرُسُهُ فَدَعَا لَهُ رَسُوْلُ الله صلى الله عليه وسلم ثُمَّ نَامَ.

6114. (7) [3/1726 ఏకీభవితం]

‘ఆయి’షహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ఒక పోరాటం నుండి తిరిగి వచ్చిన తర్వాత రాత్రి నిద్రపోలేదు, ఇంకా, ‘ఎవరైనా మంచి వ్యక్తి ఈ రాత్రి నాకు కాపలా ఉంటే, బాగుండు,’ అని అన్నారు. అకస్మాత్తుగా మేము ఆయుధాల శబ్దం విన్నాము. ప్రవక్త (స) అది విని, ‘ఎవరు?’ అని అన్నారు. స’అద్‌ (ర), ‘నేను,’ అన్నారు. ‘నీవెందుకు వచ్చావు,’ అని అడిగారు. దానికి అతడు, ”మీ గురించి నా మనసులో భయం కలిగింది. అందువల్ల నేను వచ్చాను, మీకు కాపలా ఉందామని,” అని అన్నారు. అది విన్న ప్రవక్త (స) సఅద్‌ను దీవించారు. ఆ తరువాత నిద్రపోయారు. (బు’ఖారీ, ముస్లిమ్‌)

6115 – [ 8 ] ( مُتَّفَقٌ عَلَيْهِ ) (3/1726)

وَعَنْ أَنَسٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لِكُلِّ أُمَّةٍ أَمِيْنٌ. وَأَمِيْنُ هَذِهِ الْأُمَّةِ أَبُوْ عُبَيْدَةَ بْنُ الْجَرَّاحِ. مُتَّفَقٌ عَلَيْهِ.

6115. (8) [3/1726ఏకీభవితం]

అనస్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ప్రతి అనుచర సమాజానికి ఒక సత్యసంధుడు (అమీన్‌) ఉంటాడు. ఈ అనుచర సమాజపు అమీన్‌, అబూ ‘ఉబైదహ్‌ బిన్‌ జర్రా’హ్‌.”  (బు’ఖారీ, ముస్లిమ్‌)

6116 – [ 9 ] ( صحيح ) (3/1726)

وَعَنِ ابْنِ أَبِيْ مُلَيْكَةَ قَالَ: سَمِعتُ عَائِشَةَ وَسُئِلَتْ: مَنْ كَانَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم مُسْتَخْلِفًا لَوِ اسْتَخْلَفَهُ؟ قَالَتْ: أَبُوْ بَكْرٍ. فَقِيْلَ: ثُمَّ مَنْ بَعْدَ أَبِيْ بَكْرٍ؟ قَالَتْ: عُمَرُ. قِيْلَ: مَنْ بَعْدَ عُمَرَ؟ قَالَتْ: أَبُوْ عُبَيْدَةَ بْنُ الْجَرَّاحِ. رَوَاهُ مُسْلِمٌ.

6116. (9) [3/1726దృఢం]

ఇబ్ను ములైకహ్ (ర) కథనం: నేను ‘ఆయి’షహ్‌ (ర) ద్వారా ఇలా విన్నాను, ఆమెను, ‘ఒకవేళ ప్రవక్త (స) ‘ఖిలాఫత్‌ కోసం ఎవరినైనా ప్రస్తావించదలిస్తే, ఎవరిని ప్రస్తావిస్తారు?’ అని ప్రశ్నించటం జరిగింది. ‘ఆయి’షహ్‌ (ర), ‘అబూ బకర్‌ను ‘ఖలీఫాగా నియమించేవారు,’ అని సమాధానం ఇచ్చారు. మళ్ళీ ఆమెను, ‘ఆ తరువాత ఎవరిని?’ అని అడగ్గా, ‘ఆయి’షహ్‌ (ర) ‘ ‘ఉమర్‌ (ర)ను,’ అని సమాధానం ఇచ్చారు. మళ్ళీ, ‘ఆ తరువాత,’ అని అడగ్గా ‘ఆయి’షహ్‌ (ర) అబూ ‘ఉబైదహ్‌ బిన్‌ జర్రా’హ్,’ అని సమాధానం  ఇచ్చారు. (ముస్లిమ్‌)

6117 – [ 10 ] ( صحيح ) (3/1726)

وعَنْ أَبِيْ هُرَيْرَةَ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم كَانَ عَلَى حِرَاءٍ هُوَ وَأَبُوْ بَكْرٍ وَعُمَرُ وَعُثْمَانُ وَعَلِيٌّ وَطَلْحَةُ وَالزُّبَيْرُ فَتَحَرَّكَتِ الصَّخْرَةُ فَقَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “اِهْدَأُ فَمَا عَلَيْكَ إِلَّا نَبِيٌّ أَوْ صِدِّيْقٌ أَوْ شَهِيْدٌ”. وَزَادَ بَعْضُهُمْ: وَسَعْدُ بْنُ أَبِيْ وَقَّاصٍ وَلَمْ يَذْكُرْ عَلِيًّا. رَوَاهُ مُسْلِمٌ .

6117. (10) [3/1726 దృఢం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స), అబూ బకర్‌, ‘ఉమర్‌, ‘ఉస్మాన్‌, ‘అలీ, ‘తల్‌’హా, మరియు ‘జుబైర్‌ (ర. అన్హుమ్) లతో హిరాఅ’ గుట్టపై నిలబడి ఉన్నారు. అకస్మా త్తుగా అది కంపించసాగింది. అప్పుడు ప్రవక్త (స), ‘ఓ హిరాఅ’ కొండ! ఆగిపో, నీపై ప్రవక్త (స), సత్య వంతుడు, అమరవీరులు తప్ప మరెవరూ లేరు,’ అని అన్నారు. కొందరు ఉల్లే ఖకులు స’అద్‌ బిన్‌ అబీ వఖ్ఖా’స్‌ను పేర్కొన్నారు. ‘అలీ (ర)ను ప్రస్తావించలేదు,’ అని అభిప్రాయ పడ్డారు.[24]  (ముస్లిమ్)

—–

اَلْفَصْلُ الثَّانِيْ  రెండవ విభాగం  

6118 – [ 11 ] ( صحيح ) (3/1726)

عَنْ عَبْدِ الرَّحْمنِ بْنِ عَوْفٍ أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم قَالَ: “أَبُوْ بَكْرٍ فِي الْجَنَّةِ وَعُمَرُ فِي الْجَنَّةِ وَعُثْمَانُ فِي الْجَنَّةِ وَعَلِيٌّ فِي الْجَنَّةِ وَطَلْحَةُ فِي الْجَنَّةِ وَالزُّبَيْرُ فِي الْجَنَّةِ وَعَبْدُ الرَّحْمَنِ بْنُ عَوْفٍ فِي الْجَنَّةِ وَسَعْدُ بْنُ أَبِيْ وَقَّاصٍ فِي الْجَنَّةِ وَسَعِيْدُ بْنُ زَيْدٍ فِي الْجَنَّةِ وَأَبُوْ عُبَيْدَةَ بْنُ الْجَرَّاحِ فِي الْجَنَّةِ”. رَوَاهُ التِّرْمِذِيُّ

6118. (11) [3/1726 దృఢం]

‘అబ్దుర్ర’హ్మాన్‌ బిన్‌ ‘ఔఫ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”అబూ బకర్‌ (ర) స్వర్గవాసులు, ఉమర్‌ (ర) స్వర్గవాసులు, ఉస్మాన్‌ (ర) స్వర్గవాసులు, ‘అలీ (ర) స్వర్గవాసులు, తల్‌’హా (ర) స్వర్గ వాసులు, ‘జుబైర్‌ (ర) స్వర్గవాసులు, అబ్దుర్ర’హ్మాన్‌ బిన్‌ ‘ఔఫ్‌ (ర) స్వర్గ వాసులు, స’అద్‌ బిన్‌ అబీ వఖ్ఖా’స్‌ (ర) స్వర్గవాసులు, స’యీద్ బిన్జైద్ స్వర్గవాసులు, అబూ ‘ఉబైదహ్‌ బిన్‌  జర్రా’హ్‌ (ర) స్వర్గవాసులు.” (తిర్మిజి’)

6119 – [ 12 ] ( صحيح ) (3/1727)

وَرَوَاهُ ابْنُ مَاجَهُ عَنْ سَعِيْدِ بْنِ زَيْدٍ

6119. (12) [3/1727దృఢం]

ఇబ్నె మాజహ్ ఈ ‘హదీసు’ను స’యీద్‌ బిన్‌ ‘జైద్‌ ద్వారా ఉల్లేఖించారు.

6120 – [ 13 ] ( لم تتم دراسته ) (3/1727)

وعَنْ أَنَسٍ أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم قَالَ: “أَرْحَمَ أُمَّتِيْ بِأُمَّتِيْ أَبُوْ بَكْرٍ وَأَشَدُّهُمْ فِي أَمْرِ اللهِ عُمَرُ وَأَصْدَقُهُمْ حَيَاءً عُثْمَانُ وَأَفْرَضُهُمْ زَيْدُ بْنُ ثَابِتٍ وَأَقْرَؤُهُمْ أُبَيُّ بْنُ كَعْبٍ وَأَعْلَمُهُمْ بِالْحَلَالِ وَالْحَرَامِ مُعَاذُ بْنُ جَبَلٍ وَلِكُلِّ أُمَّةٍ أَمِيْنٌ وَأَمِيْنُ هَذِهِ الْأُمَّةِ أَبُوْ عُبَيْدَةَ بْنُ الْجَرَاحِ” رَوَاهُ أَحْمَدُ وَالتِّرْمِذِيُّ وَقَالَ: هَذَا حَدِيْثٌ حَسَنٌ صَحِيْحٌ. وَرَوَى مَعْمَرٍ عَنْ قَتَادَةَ مُرْسَلًا وَفِيْهِ: “وَأَقْضَاهُمْ عَلِيٌّ”.

6120. (13) [3/1727అపరిశోధితం]

అనస్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”నా అనుచర సమాజంలో అబూ బకర్‌ (ర) అందరికంటే అధికంగా అనుచర సమాజంపై దయాళువు. నా అనుచర సమాజంపై ‘ఉమర్‌ (ర) ధార్మిక వ్యవహా రాల్లో అందరి కంటే కఠినంగా వ్యవహ రించేవారు. నా అనుచర సమాజంలో అందరికంటే అధికంగా సిగ్గుపడే వారు ‘ఉస్మాన్‌ (ర), నా అనుచర సమాజంలో అందరి కంటే అధికంగా ఆస్తిపంపకాల జ్ఞానం కలిగి ఉన్నవారు జైద్‌ బిన్‌ సా’బిత్‌, నా అనుచర సమాజంలో అందరికంటే అధికంగా పఠనజ్ఞానం కలిగి ఉన్నవారు ఉబయ్‌ బిన్‌ క’అబ్‌, నా అనుచర సమాజంలో అందరికంటే అధికంగా ధర్మాధర్మజ్ఞానం గలవారు ము’ఆజ్‌ బిన్‌ జబల్‌, ప్రతీ అనుచర సమాజంలో ఒక సత్యసంధుడు ఉంటాడు. నా అనుచర సమాజ సత్యసంధుడు అబూఉబైదహ్‌ బిన్‌ జర్రా’హ్‌.” (అ’హ్మద్‌, తిర్మిజి’ – ప్రామాణికం – దృఢం)

ఇంకా దీన్ని మ’అమ్మర్‌ (ర), ఖతాదహ్‌ ద్వారా ముర్సల్ గా ఉల్లేఖించారు. ఇందులో, ”నా అనుచర సమాజంలో అందరికంటే అధికంగా న్యాయా న్యాయాల జ్ఞానం గలవారు ‘అలీ” అని ఉంది.

6121 – [ 14 ] ( حسن ) (3/1727)

وعَنِ الزُّبَيْرِ قَالَ: كَانَ عَلى النَّبِيِّ صلى الله عليه وسلم يَوْمَ أُحْدٍ دِرْعَانِ فَنَهَضَ إِلى الصَّخْرَةِ فَلَمْ يَسْتَطِعْ فَقَعَدَ طَلْحَةُ تَحْتَهُ حَتّى اسْتَوَى عَلَى الصَّخْرَةِ فَسَمِعْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ: “أَوْجَبَ طَلْحَةَ”. رَوَاهُ التِّرْمِذِيُّ.

6121. (14) [3/1727 ప్రామాణికం]

‘జుబైర్‌ (ర) కథనం: ఉ’హుద్‌ యుద్ధం నాడు ప్రవక్త (స) రెండు కవచాలు ధరించారు. ప్రవక్త (స) ఒక బండరాయిపై ఎక్కబోయారు. కాని కవచాల బరువు వల్ల ఎక్కలేక పోయారు. అనంతరం ‘తల్‌’హా(ర) క్రింద కూర్చున్నారు. ప్రవక్త (స) అతనిపై ఎక్కి బండ రాయిపై కూర్చున్నారు. అనంతరం ప్రవక్త (స), ” ‘తల్‌’హాకు స్వర్గం తప్పనిసరి అయి పోయింది,” అనటం విన్నాను. (తిర్మిజి’)

6122 – [ 15 ] ( ضعيف ) (3/1727)

وعَنْ جَابِرٍ قَالَ: نَظَرَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم إِلى طَلْحَةَ بْنِ عُبَيْدِ اللهِ قَالَ: “مَنْ أَحَبَّ أَنْ يَنْظُرَ إِلى رَجُلٍ يَمْشِيْ عَلَى وَجْهِ الْأَرْضِ وَقَدْ قَضَى نَحْبَهُ فَلْيَنْظُرْ إِلى هَذَا”.

وَفِيْ رِوَايَةٍ: “مَنْ سَرَّهُ أَنْ يَنْظُرَ إِلى شَهِيْدٍ يَمْشِيْ عَلَى وَجْهِ الْأَرْضِ فَلْيَنْظُرْ إِلى طَلْحَةَ بْنِ عُبَيْدِ اللهِ”. رَوَاهُ التِّرْمِذِيُّ.

6122. (15) [3/1727 బలహీనం]

జాబిర్‌(ర) కథనం: ప్రవక్త(స) తల్‌’హా బిన్‌ ‘ఉబైదుల్లాహ్‌ (ర)ను చూచి, ”భూమిపై తన వాగ్దానం పూర్తిచేసి, సజీవంగా ఉన్న వ్యక్తిని చూడగోరేవారు ‘తల్‌’హాను చూడాలి.”

మరో ఉల్లేఖనంలో భూమిపైనడుస్తున్న అమర వీరుణ్ణి చూడ గోరేవారు, ” ‘తల్‌’హా బిన్‌ ‘ఉబైదుల్లాహ్‌ ను చూడండి,” అని అన్నారు. (తిర్మిజి’)

6123 – [ 16] ( ضعيف ) (3/1728)

وعَنْ عَلِيٍّ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: سَمِعْتُ أُذُنَيَّ مِنْ فِيْ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ: “طَلْحَةُ وَالزُّبَيْرُ جَارَايَ فِي الْجَنَّةِ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَقَالَ: هَذَا حَدِيْثٌ غَرِيْبٌ

6123. (16) [3/1728 బలహీనం]

‘అలీ (ర) కథనం: ప్రవక్త (స) ఇలా ప్రవచిస్తూ ఉండటం నా చెవులు విన్నాయి, ” ‘త’ల్‌హా మరియు ‘జుబైర్‌లు స్వర్గంలో  నా మిత్రులు.”  (తిర్మిజి’ –  ఏకోల్లేఖనం)

6124 – [ 17 ] ( ضعيف ) (3/1728)

وعَنْ سَعْدِ بْنِ أَبِيْ وَقَّاصٍ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم قَالَ يَوْمَئِذٍ يَعْنِيْ يَوْمَ أُحُدٍ: “اَللّهُمَّ اشْدُدْ رَمْيَتَهُ وَأَجِبْ دَعْوَتَهُ”. رَوَاهُ فِيْ “شَرْحِ السُّنَّةِ”.

6124. (17) [3/1728బలహీనం]

స’అద్‌ బిన్‌ అబీ వఖ్కా’స్‌ (ర) కథనం: ప్రవక్త (స) ఉ’హుద్‌ యుద్ధం నాడు నా గురించి ఇలా ప్రార్థించారు, ”ఓ అల్లాహ్‌(త)! ఇతనికి బాణవిద్యలో ప్రావీణ్యత ప్రసాదించు, ఇంకా ఇతని ప్రార్థన స్వీకరించు.”(షర్‌’హు స్సున్నహ్‌)

6125 – [ 18 ] ( صحيح ) (3/1728)

وعَنْهُ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم قَالَ: “اَللّهُمَّ اسْتَجِبْ لِسَعْدٍ إِذَا دَعَاكَ”. رَوَاهُ التِّرْمِذِيُّ.

6125. (18) [3/1728 దృఢం]

స’అద్‌ బిన్‌ అబీ వఖ్ఖా’స్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఓ అల్లాహ్‌(త)! స’అద్‌ నిన్ను ప్రార్థిస్తే, తప్ప కుండా స్వీకరించు.”  (తిర్మిజి’)

6126 – [ 19 ] ( صحيح ) (3/1728)

وعَنْ عَلِيٍّ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: مَا جَمَعَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم أَبَاهُ وَأُمَّهُ إِلَّا لِسَعْدٍ قَالَ لَهُ يَوْمَ أُحُدٍ: “اِرْمِ فَدَاكَ أَبِيْ وَأُمِّيْ”. وَقَالَ لَهُ: “اِرْمِ أَيُّهَا الْغُلَامُ الْحَزَوَّرُ”. رَوَاهُ التِّرْمِذِيُّ.

6126. (19) [3/1728దృఢం]

‘అలీ (ర) కథనం: ప్రవక్త (స) ఎవరి గురించీ ”నా తల్లి దండ్రులు నీ కోసం త్యాగం కాను,” అని అనలేదు. కేవలం స’అద్‌ గురించి మాత్రమే. ఉ’హుద్‌ నాడు, ”బాణం వదులు, నీపై నా తల్లిదండ్రులు త్యాగంకాను,” అని అన్నారు. ఇంకా ప్రవక్త (స) స’అద్‌ను ఉద్దేశించి, ”బాణాలు వదులుతూ ఉండు, ఓ దృఢమైన యువకుడా!”  అని కూడా  అన్నారు.

6127 – [ 20 ] ( صحيح ) (3/1728)

وعَنْ جَابِرٍ قَالَ: أَقْبَلَ سَعْدٌ فَقَالَ النَّبِيُّ صلى الله عليه وسلم: “هَذَا خَالِيْ فَلْيُرِنِيْ اِمْرَؤٌ خَاَلَهُ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَقَالَ: كَانَ سَعْدٌ مِنْ بَنِيْ زُهْرَةَ وَكَانَتْ أُمُّ النَّبِيِّ صلى الله عليه وسلم مِنْ بَنِيْ زُهْرَةَ. فَلِذَلِكَ قَالَ النَّبِيُّ صلى الله عليه وسلم: “هَذَا خَالِيْ”. وَفِي “الْمَصَابِيْحِ”: “فَلْيُكْرِمَنَّ” بَدَلَ “فَلْيُرِنِيْ”.

6127. (20) [3/1728దృఢం]

జాబిర్‌ (ర) కథనం: స’అద్‌ వచ్చారు. రాగానే ప్రవక్త (స) వీరు నా మామయ్యగారు. ఎవరైనా ఇతనివంటి తన మామ య్యను  చూపించమనండి.  (తిర్మిజి’)

స’అద్‌ బనీ ‘జుహ్‌రహ్‌ తెగకు చెందిన వారు. ప్రవక్త (స) తల్లిగారు కూడా బనీ ‘జుహ్‌రహ్‌ తెగకు చెందినవారే. అందు వల్లే ప్రవక్త (స) అతన్ని, ”ఇతను నా మామయ్యగారు,” అని అన్నారు.

—–

اَلْفَصْلُ الثَّالِثُ   మూడవ విభాగం 

6128 – [ 21 ] ( مُتَّفَقٌ عَلَيْهِ ) (3/1729)

عَنْ قَيْسِ بْنِ حَازِمٍ قَالَ: سَمِعْتُ سَعْدَ بْنَ أَبِيْ وَقَّاصٍ يَقُوْلُ: إِنِّيْ لَأَوَّلُ رَجُلٍ مِنَ الْعَرَبِ رَمَى بِسَهْمٍ فِيْ سَبِيْلِ اللهِ وَرَأَيْتُنَا نَغْزُوْ مَعَ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم. وَمَا لَنَا طَعَامٌ إِلَّا الْحُبْلَةُ وَوَرَقُ السَّمُرِ. وَإِنْ كَانَ أَحَدُنَا لَيَضَعُ كَمَا تَضَعُ الشَّاةُ مَالَهُ خَلْطٌ ثُمَّ أَصْبَحَتْ بَنُوْ أَسَدٍ تُعَزِّرُنِيْ عَلَى الْإِسْلَامِ. لَقَدْ خِبْتُ إِذَا وَضَلَ عَمَلِيْ وَكَانُوْا وَشَوْا بِهِ إِلى عُمَرَ. وَقَالُوْا: لَا يَحْسِنُ يُصَلِّيْ.

6128. (21) [3/1729 ఏకీభవితం]

ఖైస్‌ బిన్‌ ‘హా’జిమ్‌ (ర) కథనం: స’అద్‌ బిన్‌ అబీ వఖ్ఖా’స్‌ ఇలా ప్రస్తావిస్తూ ఉండటం నేను విన్నాను. ”అల్లాహ్ (త) మార్గంలో మొట్టమొదటి బాణం వదలిన మొట్టమొదటి అరబ్‌ వ్యక్తిని నేనే. మేము ప్రవక్త (స) వెంట జిహాద్‌ చేసే వాళ్ళం. మా ఆహారం జిల్లేడు పళ్ళు, ఆకులే. మాలో ఎవరైనా మలవిసర్జన చేస్తే, అది మేక పెంటికల్లా ఉండేది. ఆ తరువాత బనూ అస’అద్‌ ప్రజలు నన్ను నమా’జు విషయంలో ఎత్తిపొడిచేవారు. వాస్తవం ఏమిటంటే బనూ స’అద్‌ తెగ స’అద్‌ గురించి ‘ఉమర్‌ (ర) కు ఫిర్యాదు చేసారు. అంటే అతను నమా’జు సరిగా చదివించట్లేదని.[25]  (బు’ఖారీ, ముస్లిమ్‌)

6129 – [ 22 ] ( صحيح ) (3/1729)

وعَنْ سَعْدٍ قَالَ: رَأَيْتُنِيْ وَأَنَا ثَالِثُ الْإِسْلَامِ وَمَا أَسْلَمَ أَحَدٌ إِلَّا فِي الْيَوْمِ الَّذِيْ أَسْلَمْتُ فِيْهِ وَلَقَدْ مَكَثْتُ سَبْعَةَ أَيَّامٍ وَإِنِّيْ لِثَالِثُ الْإِسْلَامِ. روَاهُ الْبُخَارِيُّ.

6129. (22) [3/1729దృఢం]

స’అద్‌ (ర) కథనం: ఇస్లామ్‌ స్వీకరించిన మూడవ వ్యక్తిని నేనని నాకు చాలా గుర్తుంది. నేను ఇస్లామ్‌ స్వీకరించిన రోజు మరెవరూ ఇస్లామ్‌ స్వీకరించలేదు. ఏడురోజుల వరకు నేను ముస్లిముల్లోని మూడవ వక్తిగా ఉన్నాను. (బు’ఖారీ)

6130 – [ 23 ] ( حسن ) (3/1729)

وَعَنْ عَائِشَةَ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم كَانَ يَقُوْلُ لِنِسَائِهِ: “إِنَّ أَمْرَكُنَّ مِمَّا يُهِمُّنِيْ مِنْ بَعْدِيْ وَلَنْ يَصْبِرَ عَلَيْكُنَّ إِلَّا الصَّابِرُوْنَ الصِّدِّيْقُوْنَ”. قَالَتْ عَائِشَةَ: يَعْنِي الْمُتَصَدِّقِيْنَ ثُمَّ قَالَتْ عَائِشَةَ لِأَبِيْ سَلَمَةَ بْنِ عَبْدِ الرَّحْمنْ سَقَى اللهُ أَبَاكَ مِنْ سَلْسَبِيْلِ الْجَنَّةِ وَكَانَ ابْنُ عَوْفٍ قَدْ تَصَدَّقَ عَلَى أُمَّهَاتِ الْمُؤْمِنِيْنَ بِحَدِيْقَةٍ بِيْعَتْ بِأَرْبَعِيْنَ أَلْفًا. رَوَاهُ التِّرْمِذِيُّ.

6130. (23) [3/1729 -ప్రామాణికం]

‘ఆయి’షహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) తన భార్యలతో ”మీ అందరి విషయం నన్ను విచారానికి గురిచేసింది, నా మరణానంతరం మీ సంగతేంటి? మీ విషయాల పట్ల సహనం, ఓర్పు గలవారు, సత్యసంధులే స్థిరంగా ఉండ గలరు. అంటే అల్లాహ్ మార్గంలో దానధర్మాలు చేసేవారు. అనంతరం ‘ఆయి’షహ్‌ (ర) అబూ సలమహ్ బిన్‌ ‘అబ్దుర్ర’హ్మాన్‌ బిన్‌ ‘ఔఫ్‌తో అల్లాహ్‌ (త) మీ తండ్రిగారికి స్వర్గ కాలువల ద్వారా దాహం తీర్చుగాక! ఎందుకంటే  ” అబ్దుర్ర’హ్మాన్‌ బిన్‌ ‘ఔఫ్‌ ప్రవక్త (స) భార్యల ఖర్చుల కోసం ఒక తోటను బహూకరించారు,” అని అన్నారు. (తిర్మిజి’)

6131 – [ 24 ] ( ضعيف ) (3/1729)

وعَنْ أُمِّ سَلَمَةَ قَالَتْ: سَمِعْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ لِأَزْوَاجِهِ: “إِنَّ الَّذِيْ يَحْثُوعَلَيْكُنَّ بَعْدِيْ هُوَ الصَّادِقُ الْبَارُّ. اللّهُمَّ اسْقِ عَبْدَ الرَّحْمنِ بْنَ عَوْفٍ مِنْ سَلْسَبِيْلِ الْجَنَّةِ”. رَوَاهُ أَحْمَدُ.

6131. (24) [3/1729బలహీనం]

ఉమ్మె సలమహ్ (ర) కథనం: ప్రవక్త (స) తన భార్యలతో ఇలా అంటూ ఉండటం విన్నాను, నా తరువాత మీకోసం పిడికెడు ఖర్చుపెట్టినవాడు సత్య వంతుడై, పుణ్యాత్ముడై ఉంటాడు. ఓ అల్లాహ్‌ (త)! ‘అబ్దుర్ర’హ్మాన్‌ బిన్‌ ‘ఔఫ్‌కు స్వర్గంలోని సల్‌సబీల్‌ కాలువ  నుండి  త్రాపించు.  (అ’హ్మద్‌)

6132 – [ 25 ] ( مُتَّفَقٌ عَلَيْهِ ) (3/1730)

وَعَنْ حُذَيْفَةَ قَالَ: جَاءَ أَهْلُ نَجْرَانَ إِلى رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم. فَقَالُوْا: يَا رَسُوْلَ اللهِ اِبْعَثْ إِلَيْنَا رَجُلًا أَمِيْنًا. فَقَالَ: “لَأَبْعَثَنَّ إِلَيْكُمْ رَجُلًا أَمِيْنًا حَقَّ أَمِيْنٍ”. فَاسْتَشْرَفَ لَهَا النَّاسُ قَالَ: فَبَعَثَ أَبَا عُبَيْدَةَ بْنَ الْجَرَّاحِ. مُتَّفَقٌ عَلَيْهِ.

6132. (25) [3/1730 ఏకీభవితం]

‘హుజై’ఫహ్ (ర) కథనం: నజ్‌రాన్‌కు చెందిన వ్యక్తులు ప్రవక్త (స) వద్దకు వచ్చి, ‘ఓ దైవప్రవక్తా! సత్యసంధుడైన వ్యక్తి నెవరినైనా మా వద్దకు పంపండి,’ అని విన్నవించుకున్నారు. దానికి ప్రవక్త (స), ‘నిజంగా సత్యసంధుడైన వ్యక్తినే మీ వద్దకు పంపిస్తాను,’ అని అన్నారు. అది విన్న ప్రజలు ఆ పదవి కోసం ఉత్సాహంగా ప్రయత్నించ సాగారు. కాని ప్రవక్త (స) అబూ ‘ఉబైదహ్‌ బిన్‌ జర్రా’హ్‌ను  పంపారు. (బు’ఖారీ)

6133 – [ 26 ] ( ضعيف ) (3/1730)

وعَنْ عَلِيٍّ قَالَ: قِيْلَ لِرَسُوْلِ اللهِ: مَنْ نُؤْمِرُ بَعْدَكَ؟ قَالَ: “إِنْ تُؤَمِّرُوْا أَبَا بَكْرٍتَجِدُوْهُ أَمِيْنًا زَاهِدًا فِيْ الدُّنْيَا رَاغِبًا فِي الْآخِرَةِ وَإِنْ تُؤَمِّرُوْا عُمَرَ تَجِدُوْهُ قَوِيًّا أَمِيْنًا لَا يَخَافُ فِيْ اللهِ لَوْمَةَ لَائِمٍ وَإِنْ تُؤَمِّرُوْا عَلِيًّا – وَلَا أَرَاكُمْ فَاعِلِيْنَ – تَجِدُوْهُ هَادِيًا مَهْدِيًا يَأْخُذُ بِكُمُ الطَّرِيْقَ الْمُسْتَقِيْمَ”. رَوَاهُ أَحْمَدُ .

6133. (26) [3/1730బలహీనం]

‘అలీ (ర) కథనం: ప్రవక్త (స)ను, ‘తమరి తరువాత ఎవరిని నాయకునిగా ఎన్నుకోవాలి,’ అని విన్నవించు కోవటం జరిగింది. దానికి ప్రవక్త (స), ”ఒకవేళ మీరు అబూ బకర్‌ను నాయకునిగా ఎన్నుకుంటే, అతన్ని సత్యవంతునిగా, ప్రాపంచిక మనోకాంక్షలు లేనివారుగా, పరలోక కాంక్ష  ఉన్న వారిగా పొందుతారు. ఒకవేళ మీరు ‘ఉమర్‌ (ర)ను నాయకునిగా ఎన్నుకుంటే దృఢం గానూ, నిజాయితీ పరునిగానూ, దైవాదేశాలను జారీచేయడంలో ఎవరినీ ఖాతరు చేయని వ్యక్తిగానూ పొందుతారు, ఒకవేళ మీరు ‘అలీని నాయకునిగా చేస్తే, నా అభిప్రాయం ప్రకారం మీరు అలా చేయరు. ఒకవేళ అలాచేస్తే, అతన్ని మీరు  రుజుమార్గంపై, సన్మార్గ గామిగా పొందుతారు. అతను మిమ్మల్ని రుజు మార్గంపైనే నడిపిస్తాడు,” అని అన్నారు. (అ’హ్మద్‌)

6134 – [ 27 ] ( ضعيف ) (3/1730)

وعَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “رَحِمَ اللهُ أَبَا بَكْرٍ زَوَّجَنِيْ اِبْنَتَهُ وَحَمَلَنِيْ إِلى دَارِ الْهِجْرَةِ وَصَحِبَنِيْ فِي الْغَارِ وَأَعْتَقَ بِلَالًا مِنْ مَالِهِ. رَحِمَ اللهُ عُمَرَ يَقُوْلُ الْحَقَّ وَإِنْ كَانَ مُرًّا تَرَكَهُ الْحَقُّ وَمَا لَهُ مِنْ صَدِيْقٍ. رَحِمَ اللهُ عُثْمَانَ تَسْتَحْيِيْهِ الْمَلَائِكَةُ. رَحِمَ اللهُ عَلِيًّا اَللّهُمَّ أَدِرِ الْحَقَّ مَعَهُ حَيْثُ دَارَ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَقَالَ: هَذَا حَدِيْثٌ غَرِيْبٌ.

6134. (27) [3/1730బలహీనం]

‘అలీ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ‘అల్లాహ్‌ అబూ బకర్‌ను కరుణించుగాక! అతడు తన కూతురును నాకిచ్చి పెళ్ళి చేసాడు, తన ఒంటెపై కూర్చోబెట్టి నన్ను మదీనహ్ తీసుకొని వచ్చాడు.  సౌ’ర్‌ గుహలో నా వెంట ఉన్నాడు. ఇంకా తన ధనం ఖర్చుపెట్టి బిలాల్‌ను విడుదల చేయించాడు. అల్లాహ్‌(త) ‘ఉమర్‌పై తన కారుణ్యం కురిపించుగాక! అతడు సత్యం పలుకుతాడు. అది చేదుగా అనిపించినా సరే. సత్యం అతన్ని ఒంటరివాడ్ని చేసింది. అతనికి స్నేహితులెవరూ లేరు. అల్లాహ్‌(త) ‘ఉస్మాన్‌పై తన కారుణ్యం అవతరింప జేయుగాక! దైవదూతలు కూడా అతనంటే సిగ్గుపడతారు. ఇంకా అల్లాహ్‌(త), ‘అలీపై తన కారుణ్యం అవతరింపజేయు గాక! ఓ అల్లాహ్‌(త) న్యాయాన్ని అతనివైపు చేయి. ‘అలీ ఎటు ఉంటే అటు న్యాయం, ధర్మం  ఉంచు.”  (తిర్మిజి’  – ఏకోల్లేఖనం)

=====

10 بَابُ مَنَاقِبِ أَهْلِ بَيْتِ النَّبِيِّ صلى الله عليه وسلم

10. ప్రవక్త () కుటుంబీకులు (.అన్హుంల) ప్రత్యేకతలు

اَلْفَصْلُ الْأَوَّلُ  మొదటి విభాగం   

6135- [ 1 ] ( صحيح ) (3/1731)

عَنْ سَعْدِ بْنِ أَبِيْ وَقَّاصٍ قَالَ: لَمَّا نَزَلَتْ هَذِهِ الْآيَةُ [نَدْعُ أَبْنَاءَنَا وَأَبْنَاءَكُمْ؛ 3: 61] دَعَا رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم عَلِيًّا وَفَاطِمَةَ وَحَسَنًا وَحُسَيْنًا فَقَالَ: “اَللّهُمَّ هَؤُلَاءِ أَهْلُ بَيْتِيْ”. رَوَاهُ مُسْلِمٌ .

6135. (1) [3/1731 దృఢం]

స’అద్‌ బిన్‌ అబీ వఖ్ఖా’స్‌ (ర) కథనం: ”..రండి! మేము మరియు మీరు కలిసి మా సంతానాన్ని మరియు మీ  సంతానాన్ని పిలుస్తాము..” (ఆల ఇమ్రాన్, 3:61) అనే ఆయతు అవతరించినపుడు, ప్రవక్త (స) ‘అలీ, ఫాతిమహ్, ‘హసన్‌, ‘హుసైన్‌ (ర.అన్హుమ్)లను పిలిచారు. ఇంకా ‘ఓ అల్లాహ్‌(త)! వీరు నా కుటుంబం వారు’ అని అన్నారు. [26] (ముస్లిమ్‌)

6136 – [ 2 ] ( صحيح ) (3/1731)

وَعَنْ عَائِشَةَ قَالَتْ: خَرَجَ النَّبِيُّ صلى الله عليه وسلم غَدَاة وَعَلَيْهِ مِرْطٌ مُرَحَّلٌ مِّنْ شَعْرٍ أَسْوَدَ فَجَاءَ الْحَسَنُ بْنُ عَلِيٍّ فَأَدْخَلَهُ ثُمَّ جَاءَ الْحُسَيْنُ فَدَخَلَ مَعَهُ ثُمَّ جَاءَتْ فَاطِمَةُ فَأَدْخَلَهَا ثُمَّ جَاءَ عَلِيٌّ فَأَدْخَلَهُ ثُمَّ قَالَ: [إِنَّمَا يُرِيْدُ اللهُ لِيَذْهِب عَنْكُمُ الرِّجْسَ أَهْلَ الْبَيْتِ وَيُطَهِّرَكُمْ تَطْهِيْرًا؛33: 33] رَوَاهُ مُسْلِمٌ.

6136. (2) [3/1731దృఢం]

‘ఆయి’షహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ఒకరోజు ఉదయం బయటకు వెళ్ళారు. అప్పుడు అతని శరీరంపై నల్లని దుప్పటి ఉంది. అప్పుడు ‘హసన్‌ బిన్‌ ‘అలీ (ర) వచ్చారు. ప్రవక్త (స) అతన్ని తన దుప్పటిలో చేర్చుకున్నారు. ఆ తరువాత ‘హుసైన్‌ వచ్చారు. అతన్ని కూడా ప్రవక్త (స) తన దుప్పటిలో చేర్చు కున్నారు. ఆ తరువాత ఫాతిమహ్ (ర) వచ్చారు. ఆమెను కూడా ప్రవక్త (స) తన దుప్పటిలో చేర్చుకున్నారు. ఆ తరువాత ‘అలీ (ర) వచ్చారు, ప్రవక్త (స) అతన్ని కూడా తన దుప్పటిలో చేర్చుకున్నారు. ఆ తరువాత, ”ఓ నా కుటుంబం వారలారా! …’నిశ్చయంగా, అల్లాహ్‌ మీ నుండి మాలిన్యాన్ని తొలగించి, మిమ్మల్ని పరిశుధ్ధులుగా చేయగోరుతున్నాడు,’ (అల్ అ’హ్ ‘జాబ్, 33:33) అని అన్నారు. (ముస్లిమ్‌)

6137 – [ 3 ] ( صحيح ) (3/1731)

وَعَنِ الْبَرَاءِ قَالَ: لَمَّا تُوُفِّيَ إِبْرَاهِيْمُ قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِنَّ لَهُ مُرْضِعًا فِيْ الْجَنَّةِ”. روَاهُ الْبُخَارِيُّ.

6137. (3) [3/1731దృఢం]

బరాఅ’ (ర) కథనం: ఇబ్రాహీమ్‌ మరణించినపుడు ప్రవక్త (స) ”స్వర్గంలో వాడికోసం పాలుపట్టే ఆయా ఉంది,” అని అన్నారు. (బు’ఖారీ)

6138 – [ 4 ] ( مُتَّفَقٌ عَلَيْهِ ) (3/1731)

وَعَنْ عَائِشَةَ: قَالَتْ: كُنَّا أَزْوَاجَ النَّبِيِّ صلى الله عليه وسلم -عِنْدَهُ. فَأَقْبَلَتْ فَاطِمَةُ مَا تَخْفَى مِشْيَتُهَا مِنْ مِشْيَةِ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم فَلَمَّا رَآهَا قَالَ: “مَرْحَبًا بِابْنَتِيْ”. ثُمَّ أَجْلَسَهَا ثُمَّ سَارَّهَا فَبَكَتْ بُكَاءً شَدِيْدًا. فَلَمَّا رَأَى حُزْنَهَا سَارَّهَا الثَّانِيَةَ فإِذَا هِيَ تَضْحَكُ. فَلَمَّا قَامَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم سَأَلْتُهَا عَمَّا سَارَّكِ؟ قَالَتْ: مَا كُنْتُ لِأُفْشِيَ عَلَى رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم سَرَّهُ فَلَمَّا تُوُفِّيَ قُلْتُ: عَزَمْتُ عَلَيْكَ بِمَا لِيْ عَلَيْكَ مِنَ الْحَقِّ لَمَّا أَخْبَرْتِنِيْ. قَالَتْ: أَمَّا الْآنَ فَنَعَمْ أَمَّا حِيْنَ سَارَّ بِيْ فِي الْأَمْرِ الْأَوَّلِ فَإِنَّهُ أَخْبَرَنِيْ: “أَنَّ جِبْرِيْلَ كَانَ يُعَارِضُهُ بِالْقُرْآنِ كُلَّ سَنَةٍ مَرَّةً وَإِنَّهُ قَدْ عَارَضَنِيْ بِهِ الْعَامَ مَرَّتَيْنِ وَلَا أَرَى الْأَجَلَ إِلَّا قَدِ اقْتَرَبَ فَاتَّقِي اللهَ وَاصْبِرِيْ فَإِنِّيْ نِعْمَ السَّلَفُ أَنَا لَكِ”. فَلَمَّا رَأَى جَزْعِيْ سَارَّنِيَ الثَّانِيَةَ قَالَ: “يَا فَاطِمَةُ أَلَا تَرْضَيْنَ أَنْ تَكُوْنِيْ سَيِّدَةَ نِسَاءِ أَهْلِ الْجَنَّةِ أَوْ نِسَاءِ الُمُؤْمِنِيْنَ؟”

وَفِيْ رِوَايَةٍ: فَسَارَّنِيْ فَأَخْبَرَنِيْ أَنَّهُ يُقْبَضُ فِيْ وَجْعِهِ فَبَكَيْتُ ثُمَّ سَارَّنِيْ فَأَخْبَرَنِيْ أَنِّيْ أَوَّلُ أَهْلِ بَيْتِهِ أَتْبَعُهُ فَضَحِكْتُ. مُتَّفَقٌ عَلَيْهِ

6138. (4) [3/1731ఏకీభవితం]

‘ఆయి’షహ్‌ (ర) కథనం: మేము ప్రవక్త (స) భార్య లందరమూ ప్రవక్త (స) వద్ద కూర్చొని ఉన్నాం. ఫాతి మహ్ (ర) వచ్చారు. ఆమె ప్రవక్త (స)లానే నడిచేది. ప్రవక్త (స) ఫాతిమహ్ రావటం చూచి, ‘నేను నా కూతురికి స్వాగతం పలుకుతున్నాను,’ అని పలికి ఆమెను తన వద్ద కూర్చో బెట్టుకున్నారు, ఆమె చెవిలో ఏదో గుసగుసలాడారు. అతని (స) మాటలు విని ఆమే ఏడ్వసాగారు. ఆమె ఏడ్వటం చూచి ప్రవక్త (స) మళ్ళీ ఆమెచెవిలో ఏదో గుసగుసలాడారు. అది విని, ఫాతిమ నవ్వసాగింది. ఆ తరువాత ప్రవక్త (స) అక్కడి నుండి లేచి వెళ్ళిపోయిన తర్వాత, ‘ప్రవక్త (స) రహస్యంగా ఏమి చెప్పారు,’ అని అడిగాను. దానికి ఫాతిమహ్ (ర), ‘ప్రవక్త (స) రహస్యాన్ని బయట పెట్టను, అని’ అన్నారు. ప్రవక్త (స) మరణించిన తర్వాత నేను ఫాతిమహ్ను, ‘నీపై ఉన్న నా హక్కు సాక్షిగా ఆ రహస్యాన్ని గురించిచెప్పు,’ అని అన్నాను. అప్పుడు ఫాతిమహ్ (ర), ‘ఇప్పుడు చెబుతాను,’ అని పలికి, ”మొదటిసారి ప్రవక్త (స) జిబ్రీల్‌ (అ) ప్రతి సంవ త్సరం ఒకసారి ఖుర్‌ఆన్‌ పఠించేవారు. ఈ సంవత్సరం నాతోపాటు రెండుసార్లు పఠించారు. కాబట్టి, నా మరణసమయం దగ్గరపడి నట్టు అనుమానంగా ఉంది. నీవు అల్లాహ్(త)పట్ల భయభక్తులు, ఓర్పూ సహనాలు కలిగి ఉండాలి, నేను నీ కోసం ముందస్తు మేలు కోరుతూ ఉంటాను,’ అని అన్నారు. అది విని నేను ఏడ్వసాగాను. నేను ఏడ్వటం చూచి మళ్ళీ ప్రవక్త (స) నా చెవిలో ఓ ఫాతిమహ్! నువ్వు స్వర్గంలో స్త్రీలందరికి నాయకు రాలివి కావటం నీకు ఇష్టం లేదా? లేదా విశ్వాస స్త్రీలకు నాయకురాలివి కావటం ఇష్టం లేదా?’ అని అన్నారు.

మరో ఉల్లేఖనంలో, ”ప్రవక్త (స) నాతో ఈ అనారోగ్యంలో తాను మరణిస్తాను,”అని అన్నారు. అది విని నేను ఏడ్వసాగాను. ప్రవక్త (స) మళ్ళీ రెండవసారి, ”మా కుటుంబంలో అందరికంటే ముందు నేను ప్రవక్త (స) ను కలుస్తానని అన్నారు. అది విని నేను నవ్వసాగాను.” (బు’ఖారీ, ముస్లిమ్‌)

6139 – [ 5 ] ( مُتَّفَقٌ عَلَيْهِ ) (3/1732)

وعَنِ الْمِسْوَرِ بْنِ مَخْرَمَةَ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم قَالَ: “فَاطِمَةُ بَضْعَةُ مِنِّيْ فَمَنْ أَغْضَبَهَا أَغْضَبَنِيْ”.

وَفِيْ رِوَايَةٍ: “يُرِيْبُنِيْ مَا أَرَابَهَا وَيُؤْذِيُنِيْ مَا آذَاهَا”.

6139. (5) [3/1732 ఏకీభవితం]

మిస్‌వర్‌ బిన్‌ మ’ఖ్‌రమహ్‌ (ర) కథనం: ప్రవక్త (స), ”ఫాతిమహ్, నా శరీర భాగం, ఆమెను బాధపెడితే, నన్ను బాధపెట్టినట్టే,” అని అన్నారు. మరో ఉల్లేఖనంలో, ”ఫాతిమహ్ను బాధ కలిగించేది, నాకూ బాధ కలిగిస్తుంది. ఫాతి మహ్కు విచారానికి గురిచేసేది, నాకూ విచారానికి గురిచేస్తుంది” అని అన్నారు. (బు’ఖారీ, ముస్లిమ్‌)

6140 – [ 6 ] ( صحيح ) (3/1732)

وَعَنْ زَيْدِ بْنِ اَرْقَمَ قَالَ: قَامَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم يَوْمًا فِيْنَا خَطِيْبًا بِمَاءٍ يُدْعَى: خُمًّا بَيْنَ مَكَّةَ وَالْمَدِيْنَةِ فَحَمِدَ اللهَ وَأَثْنَى عَلَيْهِ وَ وَعَظَ وَذَكَّرَثُمَّ قَالَ: “أَمَّا بَعْدُ أَلَا أَيُّهَا النَّاسُ فَإِنَّمَا أَنَا بَشَرٌ يُوْشِكُ أَنْ يَأْتِيَنِيْ رَسُوْلُ رَبِّيْ فَأُجِيْبَ وَأَنَا تَارِكٌ فِيْكُمُ الثَّقَلَيْنِ: أَوَّلُهُمَا كِتَابُ اللهِ فِيْهِ الْهُدَى وَالنُّوْرُ فَخُذُوْا بِكِتَابِ اللهِ وَاسْتَمْسِكُوْا بِهِ”. فَحَثَّ عَلَى كِتَابِ اللهِ وَرَغَّبَ فِيْهِ ثُمَّ قَالَ: “وَأَهْلُ بَيْتِيْ أُذَكِّرُكُمْ اللهَ فِيْ أَهْلِ بَيْتِيْ أُذَكِّرُكُمْ اللهَ فِيْ أَهْلِ بَيْتِيْ

“وَفِيْ رِوَايَةٍ: “كِتَابُ اللهِ عَزَّ وَجَلَّ هُوَ حَبْلُ اللهِ مَنِ اتَّبَعَهُ كَانَ عَلَى الْهُدَى وَمنْ تَرَكَهُ كَانَ عَلَى الضَّلَالَةِ”. رَوَاهُ مُسْلِمٌ.

6140. (6) [3/1732 దృఢం]

‘జైద్‌ బిన్‌ అర్‌ఖమ్‌ (ర) కథనం: ప్రవక్త (స) మక్కహ్ మదీనహ్ల మధ్య ఉన్న ఖమ్‌ అనే కాలువవద్ద మాకు హితబోధ చేయటానికి నిలబడ్డారు. ప్రవక్త (స) దైవస్తోత్రం పఠించి, మాకు హితబోధచేస్తూ, ఓ ప్రజ లారా! గుర్తుంచుకోండి! నేను కూడా మీలాంటి మని షినే, నా ప్రభువు తరఫునుండి పిలుపువస్తే వెళ్ళవలసి ఉంటుంది. నేను మీమధ్య రెండు విషయాలు వదలి వెళ్ళనున్నాను. వాటిలో ఒకటి దైవగ్రంథం. అందులో దైవమార్గం, వెలుగు ఉన్నాయి. మీరు దైవగ్రంథాన్ని దృఢంగా పట్టుకోండి. ఇంకా దానిపై స్థిరంగా ఉండండి. ఆ తరువాత దైవగ్రంథం పట్ల ప్రోత్సహించారు. ఇంకా ప్రవక్త (స) అన్నారు, ”రెండవది నా కుంటుంబం, నేను మిమ్మల్ని నా కుటుంబం గురించి అల్లాహ్(త)ను సాక్షిగా పెడుతున్నాను. వారి గురించి మిమ్మల్ని తాకీదు  చేస్తున్నాను.

మరో ఉల్లేఖనంలో ఇలా ఉంది, ”అల్లాహ్‌(త) గ్రంథం అల్లాహ్‌ త్రాడు వంటిది. దైవగ్రంథాన్ని అనుసరించే వారు సన్మార్గంపై ఉంటారు. దాన్ని వదలినవారు మార్గభ్రష్టత్వానికి  గురవుతారు.” (ముస్లిమ్‌)

6141 – [ 7 ] ( صحيح ) (3/1732)

وَعَنِ ابْنِ عُمَرَأَنَّهُ كَانَ إِذَا سَلَّمَ عَلَى ابْنِ جَعْفَرٍقَالَ: اَلسَّلَامُ عَلَيْكَ يَا ابْنَ ذِي الْجَنَاحَيْنِ. روَاهُ الْبُخَارِيُّ.

6141. (7) [3/1732 దృఢం]

ఇబ్నె ‘ఉమర్‌ (ర) కథనం: నేను అబ్దుల్లాహ్‌ బిన్‌ జ’ఫర్‌కు సలామ్‌ చేస్తూ, ఓ రెండు రెక్కలు గలవాడి కుమారుడా! నీపై శాంతి కురియుగాక! అని అనేవాడిని.[27]  (బు’ఖారీ)

6142 – [ 8 ] ( مُتَّفَقٌ عَلَيْهِ ) (3/1733)

وَعَنِ الْبَرَاءِ قَالَ: رَأَيْتُ النَّبِيَّ صلى الله عليه وسلم وَالْحَسَنُ بْنُ عَلِيٍّ عَلَى عَاتِقِهِ يَقُوْلُ: “اَللّهُمَّ إِنِّيْ أُحِبُّهُ فَأَحِبُّهُ”. مُتَّفَقٌ عَلَيْهِ .

6142. (8) [3/1733 ఏకీభవితం]

బరాఅ’ (ర) కథనం: నేను ప్రవక్త (స)ను చూచాను. ‘హసన్‌ బిన్‌ ‘అలీ ప్రవక్త (స) భుజాలపై ఉన్నారు. ఇంకా, ‘ఓ అల్లాహ్‌! నేను వీడిని ప్రేమిస్తున్నాను. నువ్వు కూడా వీడిని ప్రేమించు’ అని ప్రార్థిస్తున్నారు. (బు’ఖారీ, ముస్లిమ్‌)

6143 – [ 9 ] ( مُتَّفَقٌ عَلَيْهِ ) (3/1733)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: خَرَجْتُ مَعَ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم فِيْ طَائِفَةٍ مِنَ النَّهَارِ حَتَّى أَتَى خِبَاءَ فَاطِمَةَ. فَقَالَ: “أَثَمَّ لُكَعُ؟ أَثَمَّ لُكَعُ؟ “يَعْنِيْ حَسَنًا. فَلَمْ يَلْبَثْ أَنْ جَاءَ يَسْعَى حَتّى اعْتَنَقَ كُلُّ وَاحِدٍ مِنْهُمَا صَاحِبَهُ. فَقَالَ رَسُوْلُ الله صلى الله عليه وسلم: “اَللّهُمَّ إِنِّيْ أُحِبُّهُ فَأَحِبَّهُ وَأَحِبَّ مَنْ يُحِبُّهُ”. مُتَّفَقٌ عَلَيْهِ.

6143. (9) [3/1733ఏకీభవితం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: నేను పగటి పూట ప్రవక్త (స) వెంట బయటకు వెళ్ళాను. మేము ఫాతిమహ్ ఇంటికి వెళ్ళాం. ‘అబ్బాయి ఏడి? అబ్బాయి ఏడి?’ అని అన్నారు. – అంటే ‘హసన్‌ ఏడి అని. ఇంతలో ‘హసన్‌ పరుగెత్తుకుంటూ వచ్చారు. ప్రవక్త(స) ‘హసన్‌ ఇద్దరూ ఆలింగనం చేసుకున్నారు. తరువాత ప్రవక్త (స) ”ఓ అల్లాహ్‌! నేను వీడిని ప్రేమిస్తున్నాను, నీవు కూడా వీడిని ప్రేమించు, ఇంకా వీడిని ప్రేమించేవారిని ప్రేమించు” అని ప్రార్థించారు.  (బు’ఖారీ, ముస్లిమ్‌)

6144 – [ 10 ] ( صحيح ) (3/1733)

وعَنْ أَبِيْ بَكْرَةَ قَالَ: رَأَيْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم عَلَى الْمِنْبَرِ وَالْحَسَنُ بْنُ عَلِيٍّ إِلى جَنْبِهِ وَهُوَ يُقْبِلُ عَلَى النَّاسِ مَرَّةً وَعَلَيْهِ أُخْرَى وَيَقُوْلُ: “إِنَّ ابْنِيْ هَذَا سَيِّدٌ وَلَعَلَّ اللهَ أَنْ يُصْلِحَ بِهِ بَيْنَ فِئَتيْنِ عَظِيْمَتَيْنِ مِنَ الْمُسْلِمِيْنَ”. روَاهُ الْبُخَارِيُّ.

6144. (10) [3/1733 దృఢం]

అబూ బకర్‌ (ర) కథనం: నేను ప్రవక్త (స)ను మెంబరుపై నిలబడి ఉండటం చూచాను. ‘హసన్‌ (ర) ప్రవక్త (స) ప్రక్కన కూర్చుని ఉన్నారు. ప్రవక్త (స) ప్రజల్ని చూస్తున్నారు, ‘హసన్‌ను చూస్తున్నారు. ఇంకా ”నా ఈ కుమారుడు నాయకుడు. వీడి ద్వారా అల్లాహ్‌ (త) ముస్లిముల రెండువర్గాలను కలుపుతాడు” అని అన్నారు. (బు’ఖారీ)

6145 – [ 11 ] ( صحيح ) (3/1733)

وعَنْ عَبْدِ الرَّحْمنِ بْنِ أَبِيْ نُعْمٍ قَالَ: سَمِعْتُ عَبْدَ اللهِ بْنَ عُمَرَ وَسَأَلَهُ رَجًلٌ عَنِ الْمُحْرِمِ قَالَ شُعْبَةُ: أَحْسِبُهُ يَقْتَلُ الذُّبَابَ؟ قَالَ: أَهْلُ الْعِرَاقِ يَسْأَلُوْنِيْ عَنِ الذُّبَابِ وَقَدْ قَتَلُوا ابْنَ بِنْتِ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم. وَقَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “هُمَا رَيْحَانَيَّ مِنَ الدُّنْيَا”. روَاهُ الْبُخَارِيُّ.

6145. (11) [3/1733 దృఢం]

‘అబ్దుర్ర’హ్మాన్‌ బిన్‌ అబీ ను’అమి (ర) కథనం: నేను ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘ఉమర్‌ (ర) ద్వారా ఇలా విన్నాను, ”ఒకవ్యక్తి అతన్ని, ‘ఇహ్‌రామ్‌ స్థితిలో ఈగను  చంప వచ్చా?’ అని అడిగాడు. దానికి ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘ఉమర్‌ (ర) ‘ఇరాఖ్ ప్రజలు నన్ను ఈగను గురించి అడుగు తున్నారు. వాస్తవం ఏమిటంటే, వారు ప్రవక్త (స) కూతురు కొడుకును (అంటే ‘హుసైన్‌ను) చంపివేసారు. ఎవరిని గురించి అయితే ప్రవక్త (స) ప్రపంచంలో వీరిద్దరూ నా రెండు పూవులు అని పలికారో!  (బు’ఖారీ)

6146 – [ 12 ] ( صحيح ) (3/1733)

وعَنْ أَنَسٍ قَالَ: لَمْ يَكُنْ أَحَدٌ أَشْبَهَ بِالنَّبِيِّ صلى الله عليه وسلم مِنَ الْحَسَنِ بْنِ عَلِيٍّ وَقَالَ فِي الْحَسَنِ أَيْضًا: كَانَ أَشْبَهَهُمْ بِرَسُوْلِ اللهِ صلى الله عليه وسلم. روَاهُ الْبُخَارِيُّ

6146. (12) [3/1733 దృఢం]

అనస్‌ (ర) కథనం: ‘ప్రవక్త (స) పోలికలు గలవారు ‘హసన్‌ బిన్‌ ‘అలీ తప్ప మరెవరూ కారు.’ ఇంకా అనస్‌ (ర) ‘హుసైన్‌ గురించి కూడా ఇలాగే అన్నారు. (బు’ఖారీ)

6147 – [ 13 ] ( صحيح ) (3/1733)

وعَنِ ابْنِ عَبَّاسٍ قَالَ: ضَمَّنِي النَّبِيُّ صلى الله عليه وسلم إِلى صَدْرِهِ فَقَالَ: “اَللّهُمَّ عَلِّمْهُ الْحِكْمَةَ”.

وَفِيْ رِوَايَةٍ: “عَلِّمْهُ الْكِتَابَ”. روَاهُ الْبُخَارِيُّ.

6147. (13) [3/1733దృఢం]

ఇబ్నె ‘అబ్బాస్‌ (ర) కథనం: ప్రవక్త (స) నన్ను తన గుండెకు హత్తుకున్నారు. ఇంకా ఇలా ప్రార్థించారు, ”ఓ అల్లాహ్‌ (త)! వీడికి వివేకం ప్రసాదించు.” మరో ఉల్లేఖనంలో, ”ఓ అల్లాహ్‌(త)! వీడికి గ్రంథజ్ఞానం ప్రసాదించు,” అని ప్రార్థించారు.  (బు’ఖారీ)

6148 – [ 14 ] ( مُتَّفَقٌ عَلَيْهِ ) (3/1734)

وَعَنْهُ قَالَ: إِنَّ النَّبِيَّ صلى الله عليه وسلم دَخَلَ الْخَلَاءَ فَوَضَعْتُ لَهُ وَضُوْءًا فَلَمَّا خَرَجَ قَالَ: “مَنْ وَضَعَ هَذَا؟” فَأُخْبِرَ فقَالَ: “اَللّهُمَّ فَقِّهْهُ فِي الدِّيْنِ”. مُتَّفَقٌ عَلَيْهِ.

6148. (14) [3/1734ఏకీభవితం]

ఇబ్నె ‘అబ్బాస్‌ (ర) కథనం: ప్రవక్త (స) కాల కృత్యాలకు వెళ్ళారు. నేను ప్రవక్త(స) వు’దూకోసం నీళ్ళు సిద్ధం చేసాను. ప్రవక్త (స) బయటకు వచ్చిన తర్వాత, ‘ఎవరు వచ్చారు?’ అని అన్నారు. తెలియ పర్చటం జరిగింది. ప్రవక్త (స), ‘వారికి ధర్మజ్ఞానం ప్రసాదించు,’ అని దీవించారు. [28]  (బు’ఖారీ, ముస్లిమ్‌)

6149 – [ 15 ] ( صحيح ) (3/1734)

وعَنْ أُسَامَةَ بْنِ زَيْدٍ عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم أَنَّهُ كَانَ يَأْخُذُهُ وَالْحَسَنَ فَيَقُوْلُ: “اَللّهُمَّ أَحِبَّهُمَا فَإِنِّيْ أُحِبُّهُمَا”.

وَفِيْ رِوَايَةٍ: قَالَ: كَانَ رَسُوْلُ الله صلى الله عليه وسلم يَأْخُذُنِيْ فَيُقْعِدُنِيْ عَلَى فَخِذِهِ وَيُقْعِدُ الْحَسَنَ بْنَ عَلِيٍّ عَلَى فَخِذِهِ الْأُخْرَى ثُمَّ يَضُمُّهُمَا ثُمَّ يَقُوْلُ: “اَللّهُمَّ ارْحَمْهُمَا فَإِنِّيْ أَرْحَمُهُمَا”. روَاهُ الْبُخَارِيُّ .

6149. (15) [3/1734 దృఢం]

ఉసామహ్ బిన్‌ ‘జైద్‌ (ర) కథనం: ప్రవక్త (స) ఉసామహ్ను, ‘హసన్‌ను పట్టుకొని, ”ఓ అల్లాహ్‌(త)! వీరిద్దరినీ ప్రేమించు, నేను కూడా వీరిద్దరినీ ప్రేమిస్తు న్నాను,” అని ప్రార్థించారు.

మరో ఉల్లేఖనంలో ఉసామహ్ (ర), ”ప్రవక్త(స) నన్ను తన తొడలపై కూర్చోబెట్టుకొని, రెండవతొడపై ‘హసన్‌ బిన్‌ ‘అలీని కూర్చోబెట్టుకొని, రెండు తొడలను కలుపుతూ, ”ఓ అల్లాహ్‌(త)! వీరిద్దరినీ కరుణించు, ఎందుకంటే నేను వీరిద్దరినీ ప్రేమిస్తు న్నాను,’ అని అన్నారు,” అని  ప్రవచించారు. (బు’ఖారీ)

6150 – [ 16 ] ( مُتَّفَقٌ عَلَيْهِ ) (3/1734)

وَعَنْ عَبْدِ اللهِ بْنِ عُمَرَ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم بَعَثَ بَعْثًا وَأَمَّرَ عَلَيْهِمْ أُسَامَةَ بْنَ زَيْدٍ فَطَعَنَ بَعْضُ النَّاسِ فِيْ إِمَارَتِهِ. فَقَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِنَّ كُنْتُمْ تَطْعَنُوْنَ فِيْ إِمَارَتِهِ فَقَدْ كُنْتُمْ تَطْعَنُوْنَ فِيْ إِمَارَةٍ أَبِيْهِ مِنْ قَبْلِ وَأَيْمُ اللهِ إِنْ كَانَ لَخَلِيْقًا لِلْإِمَارَةِ وَإِنْ كَانَ لَمِنْ أَحَبِّ النَّاسِ إِلَيَّ وَإِنْ هَذَا لَمِنْ أَحَبِّ النَّاسِ إِلَيَّ بَعْدَهُ”. مُتَّفَقٌ عَلَيْهِ.

وَفِيْ رِوَايَةٍ لِمُسْلِمٍ نَحْوَهُ وَفِيْ آخِرِهِ: “أُوْصِيْكُمْ بِهِ فَإِنَّهُ مِنْ صَالِحِيْكُمْ”.

6150. (16) [3/1734ఏకీభవితం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘ఉమర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ఒక సైన్యాన్ని పంపుతూ, దానికి ఉసామహ్ బిన్‌ ‘జైద్‌ను నాయకునిగా నియమించారు. కొందరు దానికి అభ్యంతరం తెలిపారు. అప్పుడు ప్రవక్త (స), ”ఒకవేళ మీరు ఇతని నేతృత్వంపై అభ్యంతరం పలికితే, ఇంతకు ముందు అతని తండ్రి ‘జైద్‌ నేతృత్వంపై కూడా అభ్యంతరం, ఎత్తి పొడవటం చేసి  ఉన్నారు. అల్లాహ్ (త) సాక్షి! ఆ ‘జైద్‌ నాయకత్వానికి అర్హత కలిగి ఉండే వాడు. ఇంకా అందరికంటే నాకు ప్రియమైన వాడూను. ఆ తరువాత అతని కుమారుడు ఉసామహ్ కూడా నాకు అందరికంటే ప్రియమైనవాడూను,” అని అన్నారు. (బు’ఖారీ, ముస్లిమ్‌)

ముస్లిమ్‌లో ఇటువంటి ఉల్లేఖన ఉంది. అయితే చివర్లో ”అతడు దైవభక్తుల్లో ఒకడని నేను మీకు ఉపదేశిస్తున్నాను,” అని  ఉంది.

6151 – [ 17 ] ( مُتَّفَقٌ عَلَيْهِ ) (3/1734)

وَعَنْهُ قَالَ: إِنَّ زَيْدَ بْنِ حَارِثَةَ مَوْلَى رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم مَا كُنَّا نَدْعُوْهُ إِلَّا زَيْدَ بْنَ مُحَمَّدٍ حَتّى نَزَلَ الْقُرْآنُ [اُدْعُوْهُمْ لِآبَائِهِمْ؛ 33: 5]. مُتَّفَقٌ عَلَيْهِ.

وَذُكِرَ حَدِيْثُ الْبَرَاءِ قَالَ لِعَلِيٍّ: “أَنْتَ مِنِّيْ”. فِيْ”بَابِ بُلُوْغِ الصَّغِيْرِ وَحِضَانَتِهِ”.

6151. (17) [3/1734ఏకీభవితం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘ఉమర్‌ (ర) కథనం: ప్రవక్త (స) విడుదల చేసిన సేవకుడైన ‘జైద్‌ బిన్‌ ‘హారిసహ్ను మేము ‘జైద్‌ బిన్‌ ము’హమ్మద్‌ అని పిలిచేవాళ్ళం. అప్పుడు ఖుర్‌ఆన్‌లో ఈ ఆయతు, ”మీరు వారిని వారి తండ్రుల పేరుతో పిలవండి,” (అల్-అ’హ్జాబ్, 33:5) అని అవతరించింది. (బు’ఖారీ, ముస్లిమ్‌)

—–

اَلْفَصْلُ الثَّانِيْ  రెండవ విభాగం   

6152 – [ 18 ] ( صحيح بالذي بعده ) (3/1735)

عَنْ جَابِرٍ قَالَ: رَأَيْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم فِيْ حَجَّتِهِ يَوْمَ عَرَفَةَ وَهُوَ عَلَى نَاقَتِهِ الْقَصْوَاءِ يَخْطُبُ فَسَمِعْتُهُ يَقُوْلُ: “يَا أَيُّهَا النَّاسُ إِنِّيْ تَرَكْتُ فِيْكُمْ مَا إِنْ أَخَذْتُمْ بِهِ لَنْ تَضِلُّوْا: كِتَابُ اللهِ وَعِتْرَتِيْ أَهْلَ بَيْتِيْ”  .رَوَاهُ التِّرْمِذِيُّ .

6152. (18) [3/1735తరువాత వాక్యం వల్ల దృఢం]

జాబిర్‌ (ర) కథనం: ప్రవక్త (స) తన చివరి ‘హజ్‌లో ‘అరఫహ్ రోజు తన ఖ’స్వఅ’ ఒంటెపై కూర్చొని ప్రసంగించటం నేను చూచాను. ఇంకా, ”ఓ ప్రజలారా! నేను మీమధ్య ఒక వస్తువును వదలి వెళుతున్నాను. మీరు దాన్ని దృఢంగా పట్టుకుంటే, ఎన్నడూ మీరు మార్గ భ్రష్ఠ త్వానికి  గురికారు. అదేమిటంటే, దైవ గ్రంథం, నా సంతానం, నా కుటుంబం,” అని ప్రవచించారు. (తిర్మిజి’)

6153 – [ 19 ] ( ضعيف ) (3/1735)

وعَنْ زَيْدِ بْنِ أَرْقَمَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِنِّيْ تَارِكٌ فِيْكُمْ مَا إِنْ تَمَسَّكْتُمْ بِهِ لَنْ تَضِلُّوْا بَعْدِيْ أَحَدُهُمَا أَعْظَمُ مِنَ الْآخَرِ: كِتَابِ اللهِ حَبْلٌ مَمْدُوْدٌ مِنَ السَّمَاءِ إِلى الْأَرْضِ وَعِتْرَتِيْ أَهْلُ بَيْتِيْ وَلَنْ يَتَفَرَّقَا حَتّى يَرِدَا عَلَيَّ الْحَوْضَ فَانْظُرُوْا كَيْفَ تَخْلُفُوْنِيْ فِيْهِمَا”. رَوَاهُ التِّرْمِذِيُّ.

6153. (19) [3/1735 బలహీనం]

‘జైద్‌ బిన్‌ అర్‌ఖమ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మీలో ఇటువంటి వస్తువు వదలి వెళుతున్నాను. మీరు దాన్ని దృఢంగా పట్టుకొని ఉన్నంత వరకు నా తరువాత మార్గభ్రష్ఠత్వానికి గురికారు. వాటిలో ఒకటి ఇంకొక దాని కంటే ప్రాధాన్యత గలది. మొదటిది అల్లాహ్‌ గ్రంథం. ఇది ఎలాంటి త్రాడంటే ఆకాశం నుండి భూమి వరకు వ్యాపింపజేయబడింది. రెండవది నా సంతానం, నా కుటుంబం. ఈ రెండూ విడిపోవటం జరుగదు. చివరికి వాళ్ళు కౌస’ర్‌ కోనేరువద్ద నన్ను కలుసుకుంటారు. అయితే మీరు ఆలోచించండి. నా తరువాత వారి పట్ల, మీరు ఎలా ప్రవర్తిస్తారో, ఎలాంటి పాలకులుగా నిరూపించుకుంటారో?”  (తిర్మిజి’)

6154 – [ 20 ] ( ضعيف ) (3/1735)

وعَنْهُ أنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم قَالَ: لِعَلِيٍّ وَفَاطِمَةَ وَالْحَسَنِ وَالْحُسَيْنِ: “أَنَا حَرْبٌ لِمَنْ حَارَبَهُمْ وَسِلْمٌ لِمَنْ سَالَمَهُمْ”. رَوَاهُ التِّرْمِذِيُّ.

6154. (20) [3/1735బలహీనం]

‘జైద్‌ బిన్‌ అర్‌ఖమ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ‘అలీ, ఫాతిమహ్, ‘హసన్‌, ‘హుసైన్‌లను గురించి మాట్లా డుతూ ”వారితో వివాదపడేవారితో నేను వివాద పడ తాను, వారితో సంధి కుదుర్చుకున్న వారితో నేను సంధి కుదుర్చుకుంటాను” అని అన్నారు.  (తిర్మిజి’)

6155 – [ 21 ] ( حسن ) (3/1735)

وعَنْ جَمِيْعِ بْنِ عُمَيْرٍ قَالَ: دَخَلْتُ مَعَ عَمَّتِيْ عَلَى عَائِشَةَ فَسَأَلْتُ: أَيُّ النَّاسِ كَانَ أَحَبَّ إِلَى رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم؟ قَالَتْ: فَاطِمَةُ. فَقِيْلَ: مِنَ الرِّجَالِ؟ قَالَتْ: زَوْجُهَا إِنْ كَانَ مَاعَلِمْتُ صَوَّامًا قَوَّامًا. رَوَاهُ التِّرْمِذِيُّ.

6155. (21) [3/1735 ప్రామాణికం]

జమీ’అ బిన్‌ ‘ఉమైర్‌ (ర) కథనం: నేను మా అత్తగారి వెంట ‘ఆయి’షహ్‌ (ర) వద్దకు వెళ్ళాను. ప్రవక్త (స) అందరికంటే అధికంగా ఎవరిని ప్రేమించే వారని అడిగాను. దానికి ‘ఆయి’షహ్‌ (ర) సమాధాన మిస్తూ, ‘ఫాతిమహ్ను,’ అన్నారు. పురుషుల్లో అంటే, ‘అలీను,’ అని అన్నారు.  (తిర్మిజి’)

6156 – [22] (ضعيف إلا الجملة الأخيرة فصحيحة) (3/1735)

وَعَنْ عَبْدِ الْمُطَّلَبِ بْنِ رَبِيْعَةَ أَنَّ الْعَبَّاسَ دَخَلَ عَلَى رَسُوْلِ الله صلى الله عليه وسلم مُغْضَبًا وَأَنَا عِنْدَهُ فَقَالَ: “مَا أَغْضَبَكَ؟” قَالَ: يَا رَسُوْلَ اللهِ مَا لَنَا وَلِقُرَيْشٍ إِذَا تَلَاقَوْا بَيْنَهُمْ تَلَاقَوْا بِوُجُوْهِ مُبَشَّرَةٍ وَإِذَا لَقُوْنَا لَقُوْنَا بِغَيْرِ ذَلِكَ؟ فَغَضِبَ رَسُوْلُ الله صلى الله عليه وسلم حَتّى احْمَرَّ وَجْهُهُ ثُمَّ قَالَ: “وَالَّذِيْ نَفْسِيْ بِيَدِهِ لَا يَدْخُلُ قَلْبَ رَجُلِ الْإِيْمَانِ حَتّى يُحِبَّكُمْ لِلّهِ وَلِرَسُوْلِهِ”. ثُمَّ قَالَ: “يَا أَيُّهَا النَّاسُ مَنْ آذَى عَمِّيْ فَقَدْ آذَانِيْ فَإِنَّمَا عَمُّ الرَّجُلِ صِنْوُ أَبِيْهِ”. رَوَاهُ التِّرْمِذِيُّ. وَفِيْ “الْمَصَابِيْحِ” عَنِ الْمُطَّلَبِ.

6156. (22) [3/1735 చివరి వాక్యం దృఢం]

‘అబ్దుల్‌ ము’త్తలిబ్‌ బిన్‌ రబీ’అహ్ (ర) కథనం: ‘అబ్బాస్‌ (ర) కోపంతో ప్రవక్త (స) వద్దకు వచ్చారు. అప్పుడు నేను ప్రవక్త (స) వద్ద కూర్చొని ఉన్నాను. అప్పుడు ప్రవక్త (స), ‘నీ కోపానికి కారణం ఏమిటని,’ అడిగారు. దానికి ‘అబ్బాస్‌ (ర), ‘దైవప్రవక్తా! మనకూ, ఖురైషులకూ మధ్య ఏముంది? ఆ ఖురైషులు పర స్పరం కలిస్తే, సంతోషంగా ఉంటారు. మనతో కలిస్తే ముఖవర్చస్సు వాడిపోయి ఉంటుంది,’ అని అన్నారు. ప్రవక్త (స) అది విని, ఆగ్రహం చెందారు, ముఖ వర్చస్సు ఎర్రబారింది. అప్పుడు ప్రవక్త (స), ”ఎవరి చేతిలో నా ప్రాణం ఉందో ఆయన(త) సాక్షి! అల్లాహ్‌ (త) మరియు ఆయన ప్రవక్తకోసం నిన్ను ప్రేమించ నంత వరకు, ఏ వ్యక్తిలోనూ విశ్వాసం ప్రవే శించదు. ‘ఓ ప్రజలారా! నా చిన్నాన్నకు  బాధ కలి గిస్తే, నన్ను బాధకు గురి చేసినట్టే, ఎందుకంటే చిన్నాన్న తండ్రితో సమానం,’ అని  అన్నారు.” (తిర్మిజి’)

6157 – [ 23 ] ( ضعيف ) (3/1736)

وَعَنِ ابْنِ عَبَّاسٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “اَلْعَبَّاسُ مِنِّيْ وَأَنَا مِنْهُ”. رَوَاهُ التِّرْمِذِيُّ.

6157. (23) [3/1736బలహీనం]

ఇబ్నె ‘అబ్బాస్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ” ‘అబ్బాస్‌ నావాడు ఇంకా నేను ‘అబ్బాస్‌ వాడిని.” (తిర్మిజి’)

6158- [24] (إسناده جيد/ وزيادة رزين منكرة) (3/1736)

وَعَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم لِلْعَبَّاسِ: “إِذَا كَانَ غَدَاةُ الْاِثْنَيْنِ فَأتِنِيْ أَنْتَ وَوَلَدُكَ حَتّى أَدْعُوَ لَهُمْ بِدَعْوَةِ يَنْفَعُكَ اللهُ بِهَا وَوَلَدَكَ”. فَغَدَا وَغَدَوْنَا مَعَهُ وَأَلْبَسَنَا كِسَاءَهُ. ثُمَّ قَالَ: “اَللّهُمَّ اغْفِرْ لِلْعِبَّاسِ وَوُلْدِهِ مَغْفِرَةً ظَاهِرَةً وَبَاطِنَةً لَا تُغَادِرُ ذَنْبًا اَللّهُمَّ احْفَظْهُ فِيْ وُلْدِهِ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَزَادَ رَزِيْنٌ: “وَاجْعَلِ الْخِلَافَةَ بَاقِيَةً فِيْ عَقِبِهِ”. وَقَالَ التِّرْمِذِيُّ: هَذَا حَدِيْثٌ غَرِيْبٌ.

6158.(24)[3/1736ఆధారాలు ఆమోదయోగ్యం]

ఇబ్నె ‘అబ్బాస్‌ (ర) కథనం: ప్రవక్త (స), ‘అబ్బాస్‌ (ర)తో, ‘సోమవారం ఉదయం నీవు నీ అబ్బాయిని తీసుకొని వస్తే, నేను నీ కోసం దు’ఆ చేస్తాను. దానివల్ల నీకు, నీ సంతానానికి లాభం చేకూరుతుంది,’ అని అన్నారు. అనంతరం సోమవారం ఉదయం నేను (‘అబ్బాస్‌-) నా సంతానంతో ప్రవక్త (స) వద్దకు వెళ్ళాను. ప్రవక్త (స) మాపై తన దుప్పటిని కప్పారు. ఇంకా, ”ఓ అల్లాహ్‌(త)! ‘అబ్బాస్‌ మరియు అతని సంతానానికి మోక్షం ప్రసాదించు. వారికి పరిపూర్ణ క్షమాభిక్ష ప్రసాదించు, ఓ అల్లాహ్‌(త)! ‘అబ్బాస్‌ను అతని సంతానంలో స్థిరంగా క్షేమంగా ఉంచు,” అని ప్రార్థించారు. (తిర్మిజి’  – ఏకోల్లేఖనం)

ఇంకా ర’జీన్‌ ఉల్లేఖనంలో ఈ పదాలు అధికంగా ఉన్నాయి. ”ఇతని సంతానానికి పరిపాలన కూడా ప్రసాదించు.”  

6159 – [ 25 ] ( ضعيف ) (3/1736)

وعَنْهُ أَنَّهُ رَأَى جِبْرِيْلُ مَرَّتَيْنِ وَدَعَا لَهُ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم مَرَّتَيْنِ. رَوَاهُ التِّرْمِذِيُّ.

6159. (25) [3/1736 బలహీనం]

ఇబ్నె ‘అబ్బాస్‌ (ర) కథనం: అతను (స), రెండు సార్లు జిబ్రీల్‌ (అ)ను చూసారు. ఇంకా ప్రవక్త (స) రెండు సార్లు అతడి కోసం దు’ఆ చేసారు.  (తిర్మిజి’)

6160 – [ 26 ] ( حسن ) (3/1736)

وعَنْهُ أَنَّهُ قَالَ: دَعَا لِيْ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم أَنْ يُؤْتَيَنِيَ اللهُ الْحِكْمَةَ مَرَّتَيْنِ. رَوَاهُ التِّرْمِذِيُّ.

6160. (26) [3/1736 ప్రామాణికం]

ఇబ్నె అబ్బాస్‌ (ర) కథనం: ప్రవక్త (స) నా గురించి రెండు సార్లు, ”అల్లాహ్‌ (త) నాకు వివేకం ప్రసాదించాలని దు’ఆ  చేసారు.” (తిర్మిజి’)

6161 – [ 27 ] ( لم تتم دراسته ) (3/1737)

وعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: كَانَ جَعْفَرٌ يُحِبُّ الْمَسَاكِيْنَ وَيَجْلِسُ إِلَيْهِمْ وَيُحَدِّثُهُمْ وَيُحَدِّثُوْنَهُ وَكَانَ رَسُوْلُ الله صلى الله عليه وسلم يُكَنِّيْهِ بِأَبِيْ الْمَسَاكِيْنَ. رَوَاهُ التِّرْمِذِيُّ.

6161. (27) [3/1737అపరిశోధితం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: జ’ఫర్‌ (ర) పేదలను ప్రేమించేవారు, వారివద్దకు వచ్చి కూర్చునే వారు, వారితో మాట్లాడేవారు, ఇంకా వారు జ’అఫర్‌ (ర)తో మాట్లాడే వారు. అందువల్ల ప్రవక్త (స) అతని బిరుదు ‘అబుల్‌ మసాకీన్‌’ అని పెట్టారు. (తిర్మిజి’)

6162 – [ 28 ] ( صحيح ) (3/1737)

وَعَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ الله صلى الله عليه وسلم: “رَأَيْتُ جَعْفَرًا يَطِيْرُ فِي الْجَنَّةِ مَعَ الْمَلَائِكَةِ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَقَالَ: هَذَا حَدِيْثٌ غَرِيْبٌ.

6162. (28) [3/1737దృఢం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”నేను జ’అఫర్‌ (ర) ను స్వర్గంలో దైవదూతలవెంట ఎగురుతూ ఉండగా చూసాను.” (తిర్మిజి’ – ఏకోల్లేఖనం)

6163 – [ 29 ] ( حسن صحيح ) (3/1737)

وَعَنْ أَبِيْ سَعِيْدٍ قَالَ: قَالَ رَسُوْلُ الله صلى الله عليه وسلم: “اَلْحَسَنُ وَالْحُسَيْنُ سَيِّدًا شَبَابِ أَهْلِ الْجَنَّةِ”. رَوَاهُ التِّرْمِذِيُّ .

6163. (29) [3/1737 ప్రామాణికం,  దృఢం]

అబూ స’యీద్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ” ‘హసన్‌ మరియు ‘హుసైన్‌ స్వర్గంలోని యువకులకు నాయకులు,”  అని  అన్నారు.  (తిర్మిజి’)

6164 – [ 30 ] ( صحيح ) (3/1737)

وعَنِ ابْنِ عُمَرَ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم قَالَ: “إِنَّ الْحَسَنَ وَالْحُسَيْنَ هُمَا رَيْحَانَيَّ مِنَ الدُّنْيَا”. رَوَاهُ التِّرْمِذِيُّ وَقَدْ سَبَقَ فِي الْفَصْلِ الْأَوَّلِ.

6164. (30) [3/1737–  దృఢం]

ఇబ్నె ‘ఉమర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ” ‘హసన్‌ మరియు ‘హుసైన్‌ ప్రపంచంలో నాకు రెండు పువ్వుల వంటి వారు.” (తిర్మిజి’)

6165 – [ 31 ] ( ضعيف ) (3/1737)

وَعَنْ أُسَامَةَ بْنِ زَيْدٍ قَالَ: طَرَقْتُ النَّبِيَّ صلى الله عليه وسلم ذَاتَ لَيْلَةٍ فِي بَعْضِ الْحَاجَةِ فَخَرَجَ النَّبِيُّ صلى الله عليه وسلم وَهُوَ مُشْتَمِلٌ عَلَى شَيْءٍ وَلَا أَدْرِيْ مَا هُوَ فَلَمَّا فَرَغْتُ مِنْ حَاجَتِيْ قُلْتُ: مَا هَذَا الَّذِيْ أَنْتَ مُشْتَمِلٌ عَلَيْهِ؟ فَكَشَفَهُ فَإِذَا الْحَسَنُ وَالْحُسَيْنُ عَلَى وَرِكَيْهِ. فَقَالَ: “هَذَانِ اَبْنَايَ وَابْنَا ابْنَتِيْ. اللّهُمَّ إِنِّيْ أُحِبُّهُمَا فَأَحِبَّهُمَا وَأَحِبَّ مَنْ يُحِبُّهُمَا”. رَوَاهُ التِّرْمِذِيُّ.

6165. (31) [3/1737–  బలహీనం]

ఉసామహ్ బిన్‌ ‘జైద్‌ బిన్ హారిసహ్(ర) కథనం: ఒకసారి రాత్రిపూట, ఒక పనిమీద ప్రవక్త (స) వద్దకు వచ్చాను. ప్రవక్త (స) ఇంటిలోపలి నుండి బయటకు వచ్చారు. ప్రవక్త (స) ఏ వస్తువునో తనతోపాటు కప్పి ఉన్నారు. అదేమిటో నాకు తెలియదు. నా పని అయి పోయిన తర్వాత, ‘ఏమి కప్పి ఉంచారని’ అడిగాను. అప్పుడు ప్రవక్త(స) దాన్ని తెరిచారు. చూసేసరికి అందులో ‘హసన్‌, ‘హుసైన్‌లు ఉన్నారు. ఇద్దరూ రెండు చంకల్లో ఉన్నారు. ఇంకా ”ప్రవక్త(స) వీరిద్దరూ నా కుమారులు, నా కూతురు కొడుకులు, ఓ అల్లాహ్‌(త)! నేను వీరిద్దరినీ ప్రేమిస్తున్నాను, నీవు కూడా వీరిద్దరినీ ప్రేమించు, ఇంకా వీరిద్దరినీ ప్రేమించే వారిని కూడా నీవు ప్రేమించు,”  అని ప్రార్థించారు.  (తిర్మిజి’)

6166- [ 32 ] ( ضعيف ) (3/1737)

وَعَنْ سَلْمَى قَالَتْ: دَخَلْتُ عَلَى أُمِّ سَلَمَةَ وَهِيَ تَبْكِيْ فَقُلْتُ: مَا يُيْكِيْكَ؟ قَالَتْ: رَأَيْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم – تَعْنِيْ فِي الْمَنَامِ- وَ عَلَى رَأْسِهِ وَلِحْيَتِهِ التُّرَابُ فَقُلْتُ: مَا لَكَ يَا رَسُوْلَ اللهِ؟قَالَ: “شَهِدْتُ قَتْلَ الْحُسَيْنِ آنِفًا” .رَوَاهُ التِّرْمِذِيُّ وَقَالَ: هَذَا حَدِيْثٌ غَرِيْبٌ

6166. (32) [3/1737బలహీనం]

సల్మా (ర) కథనం: నేను ప్రవక్త (స) భార్యల్లో ఒకరైన ఉమ్మె లమహ్ (ర) వద్దకు వెళ్ళాను. అప్పుడామె ఏడుస్తున్నారు. ‘మీరెందుకు ఏడుస్తున్నారు,’ అని అడిగాను. దానికి  ఆమె, నేను ప్రవక్త (స)ను స్వప్నంలో చూసాను, అతని తల, గడ్డం ధూళితో నిండిఉన్నాయి, ఆ తరువాత నేను ప్రవక్త (స)ను మీకేమయింది,’ అనీ అడిగాను, దానికి ప్రవక్త (స) నేనిప్పుడే ‘హుసైన్‌ హత్య జరిగినపుడు అక్కడే ఉన్నాను,’ అని సమాధానం ఇచ్చారని  అన్నారు.   (తిర్మిజి’ – ఏకోల్లేఖనం)

6167 – [ 33 ] ( ضعيف ) (3/1738)

وعَنْ أَنَسٍ قَالَ: سُئِلَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: أَيُّ اَهْلِ بَيْتِكَ أَحَبُّ إِلَيْكَ؟ قَالَ: “اَلْحَسَنُ وَالْحُسَيْنُ”. وَكَانَ يَقُوْلُ لِفَاطِمَةَ: “اُدْعِيْ لِيْ اِبْنَيَّ”. فَيَشُمُّهُمَا وَيَضُمُّهُمَا إِلَيْهِ. رَوَاهُ التِّرْمِذِيُّ. وقَالَ: هَذَا حَدِيْثٌ غَرِيْبٌ

6167. (33) [3/1738 బలహీనం]

అనస్‌ (ర) కథనం: ప్రవక్త (స) ను తన ఇంటి వారిలో అందరికంటే అధికంగా ఎవరు ప్రియులని ప్రశ్నించటం జరిగింది. ప్రవక్త (స) ” ‘హసన్‌, ‘హుసైన్‌లు,” అని అన్నారు. ప్రవక్త (స) ఫాతిమహ్తో, ‘నా ఇద్దరు కుమారులను పిలువు,’ అని అన్నారు. వారు రాగానే వారిని ఆస్వాదించేవారు. ఇంకా తన గుండెకు హత్తుకునే వారు. (తిర్మిజి’ – ఏకోల్లేఖనం)

6168 – [ 34 ] ( صحيح ) (3/1738)

وعَنْ بُرَيْدَةَ قَالَ: كَانَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم يَخْطُبُنَا إِذْ جَاءَ الْحَسَنُ وَالْحُسَيْنُ عَلَيْهِمَا قَمِيْصَانِ أَحْمَرَانِ يَمْشِيَانِ وَيَعْثُرَانِ فَنَزَلَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم مِنَ الْمِنْبَرِ فَحَمَلَهُمَا وَوَضَعَهُمَا بَيْنَ يَدَيْهِ ثُمَّ قَالَ: “صَدَقَ اللهُ [إِنَّمَا أَمْوَالُكُمْ وَأَوْلَادُكُمْ فِتْنَةٌ؛ 8: 28] نَظَرْتُ إِلى هَذَيْنِ الصَّبِيَّيْنِ يَمْشِيَانِ وَيَعْثُرَانِ فَلَمْ أَصْبِرْ حَتّى قَطَعْتُ حَدِيْثِيْ وَرَفَعْتُهُمَا”. رَوَاهُ التِّرْمِذِيُّ وَأَبُوْ دَاوُدَ وَالنَّسَائِيُّ.

6168. (34) [3/1738 దృఢం]

బురైదహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రసంగిస్తున్నారు. ఇంతలో ‘హసన్‌, ‘హుసైన్‌లు వచ్చారు. వారిద్దరూ ఎర్రటి షర్ట్‌లు ధరించి ఉన్నారు. వారిద్దరూ నడుస్తూ పడుతూ ఉండే వారు. అది చూచి ప్రవక్త (స) మెంబరు పై నుండి క్రిందికి దిగి, వారిని ఎత్తుకొని తన ముందు కూర్చోబెట్టుకున్నారు. ఆ తరువాత, ‘అల్లాహ్‌(త) చెప్పింది ఎంత సత్యం: ” మరియు వాస్తవానికి మీ ఆస్తిపాస్తులు, మీ సంతానం, పరీక్షా సాధనాలు…” – (అల్ అన్ఫాల్, 8:28) ”నేను వీరిద్దరినీ నడుస్తూ పడిపోవటం చూచి, సహనం కోల్పోయి, నా ప్రసంగం ఆపి, వారిని ఎత్తుకున్నాను,’ అని ప్రవచించారు.” (తిర్మిజి’, అబూ దావూద్‌, నసాయి)

6169 – [ 35 ] ( ضعيف ) (3/1738)

وعَنْ يَعْلَى بْنِ مُرَّةَ قَالَ: قَالَ رَسُوْلُ الله صلى الله عليه وسلم: “حُسَيْنٌ مِنِّيْ وَأَنَا مِنْ حُسَيْنٍ أَحَبَّ اللهُ مَنْ أَحَبَّ حُسَيْنًا حُسَيْنٌ سَبِطٌ مِنَ الْأَسْبَاطِ”. رَوَاهُ التِّرْمِذِيُّ.

6169. (35) [3/1738బలహీనం]

య’అలా బిన్‌ ముర్రహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ” ‘హుసైన్‌ నావాడు, నేను ‘హుసైన్‌ వాడిని, ‘హుసైన్‌ను ప్రేమించేవారు అల్లాహ్‌(త)ను ప్రేమించి నట్లే, ‘హుసైన్‌ నా కూతురి కొడుకు.” (తిర్మిజి’)

6170 – [ 36 ] ( ضعيف ) (3/1738)

وعَنْ عَلِيٍّ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: اَلْحَسَنُ أَشْبَهَ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم مَا بَيْنَ الصَّدْرِ إِلى الرَّأْسِ وَالْحُسَيْنُ أَشْبَهَ النَّبِيَّ صلى الله عليه وسلم مَا كَانَ أَسْفَلَ مِنْ ذَلِكَ. رَوَاهُ التِّرْمِذِيُّ .

6170. (36) [3/1738బలహీనం]

‘అలీ (ర) కథనం: ” ‘హసన్‌ తల నుండి గుండె వరకు ప్రవక్త (స)ను పోలి ఉన్నాడు, ‘హుసైన్‌ గుండె భాగం నుండి క్రింది వరకు ప్రవక్తను పోలి ఉన్నాడు.” (తిర్మిజి’)

6171 – [ 37 ] ( إسناده جيد ) (3/1738)

وَعَنْ حُذَيْفَةَ قَالَ: قُلْتِ لِأُمِّيْ: دَعِيْنِيْ آتِي النَّبِيَّ صلى الله عليه وسلم فَأُصَلِّيْ مَعَهُ الْمَغْرِبَ. وَأَسْأَلُهُ أَنْ يَسْتَغْفِرَ لِيْ وَلَكَ. فَأَتَيْتُ النَّبِيَّ صلى الله عليه وسلم فَصَلَّيْتُ مَعَهُ الْمَغْرِبَ فَصَلَّى حَتَّى صَلَّى الْعِشَاءَ. ثُمَّ انْفَتَلَ فَتَبِعْتُهُ فَسَمِعَ صَوْتِيْ فَقَالَ: “مَنْ هَذَا؟ حُذَيْفَةُ؟” قُلْتُ: نَعَمْ. قَالَ: “مَا حَاجَتُكَ؟ غَفَرَ اللهُ لَكَ وَلِأُمِّكَ إِنَّ هَذَا مَلَكٌ لَمْ يَنْزِلِ الْأَرْضَ قَطُّ قَبْلَ هَذِهِ اللَّيْلَةِ اِسْتَأْذَنَ رَبَّهُ أَنْ يُسَلِّمَ عَلَيَّ وَيُبَشِّرَنِيْ بِأَنْ فَاطِمَةَ سَيِّدَةُ نِسَاءِ أَهْلِ الْجَنَّةِ .وَأَنَّ الْحَسَنَ وَالْحُسَيْنَ سَيِّدًا شَبَابِ أَهْلِ الْجَنَّةِ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَقَالَ: هَذَا حَدِيْثٌ غَرِيْبٌ

6171. (37) [3/1738ఆధారాలు ఆమోద యోగ్యం]

హుజై’ఫహ్ (ర) కథనం: నేను మా అమ్మతో నాకు అనుమతి ఇవ్వండని ఇలా కోరాను, ‘నేను ప్రవక్త (స) వద్దకు వెళతాను, ఆయనతో పాటు మ’గ్రిబ్‌ నమా’జు చదువుతాను, ఆ తరువాత మీగురించి, నాగురించి ప్రార్థించమని విన్నవించుకుంటాను.’ అనంతరం నేను ప్రవక్త (స) వద్దకు వెళ్ళాను. అతని(స) వెనుక మ’గ్రిబ్‌ నమా’జు చదివాను. ఆ తరువాత ప్రవక్త (స) అదనపు నమా’జులు చేస్తూ ఉన్నారు. చివరికి ‘ఇషాఅ’ నమా’జు ముగించుకొని ప్రవక్త (స) బయలుదేరారు. నేను కూడా అతని (స) వెనుక బయలుదేరాను. ప్రవక్త (స) నా అడుగుల చప్పుడు విని, ‘ఎవరు నువ్వు హుజై’ఫహ్వా?’ అని అన్నారు. నేను ‘అవును,’ అని విన్నవించుకున్నాను. ప్రవక్త (స), ‘ఎందుకొచ్చావు, ఏం పని ఉంది? అల్లాహ్‌(త) నిన్నూ, నీ తల్లిని క్షమించుగాక! ఇతడొక దైవదూత, ఇంతకు ముందు ఎన్నడూ భూమిపైకి రాలేదు. అతను తన ప్రభువును నాకు సలామ్‌ చేయడానికి అనుమతి కోరాడు. ఇంకా నాకు, ‘ఫాతిమహ్ స్వర్గంలోని స్త్రీలకు నాయకు రాలని, ‘హసన్‌ ‘హుసైన్‌లు యువకులకు నాయ కులని శుభవార్త తెలియజేసాడు,’ అని అన్నారు.” (తిర్మిజి’ – ఏకోల్లేఖనం)

6172 – [ 38 ] ( ضعيف ) (3/1739)

وعَنِ ابْنِ عَبَّاسٍ قَالَ: كَانَ رَسُوْلُ الله صلى الله عليه وسلم حَامِلًا اَلْحَسَنَ بْنَ عَلِيٍّ عَلَى عَاتِقِهِ. فَقَالَ رَجُلٌ: نِعْمَ الْمَرْكَبُ رَكِبْتَ يَا غُلَامُ. فَقَالَ النَّبِيُّ صلى الله عليه وسلم: “وَنِعْمِ الرَّاكِبُ هُوَ”. رَوَاهُ التِّرْمِذِيُّ.

6172. (38) [3/1739బలహీనం]

ఇబ్నె ‘అబ్బాస్‌ (ర) కథనం: ప్రవక్త (స) ఒక రోజు ‘హసన్‌ బిన్‌ ‘అలీని తన భుజాలపై కూర్చోబెట్టుకొని ఉన్నారు. అది చూచి ఒక వ్యక్తి, ‘నువ్వు చాలా ఉత్తమ  వాహనంపై కూర్చున్నావు,’ అని అన్నాడు. అది విన్న ప్రవక్త (స), ‘ఆ కూర్చున్నవాడుకూడా అంతే ఉత్తముడు,’ అని అన్నారు.  (తిర్మిజి’)

6173 – [ 39 ] ( ضعيف ) (3/1739)

وعَنْ عُمَرَرَضِيَ اللهُ عَنْهُ أَنَّهُ فَرَضَ لِأُسَامَةَ فِيْ ثَلَاثَةِ آلافٍ وَخَمْسِمِاَئةٍ وَفَرَضَ لِعَبْدِ اللهِ بْنِ عُمَرَ فِيْ ثَلَاثَةِ آلافٍ. فَقَالَ عَبْدُ اللهِ بْنِ عُمَرَلِأَبِيْهِ: لِمَ فَضَّلْتَ أُسَامَةَ عَلَيَّ؟ فَوَ اللهِ مَا سَبَقَنِيْ إِلى مَشْهَدٍ. قَالَ: لِأَنَّ زَيْدًا كَانَ أَحَبَّ إِلى رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم مِنْ أَبِيْكَ وَكَانَ أُسَامَةُ أَحَبَّ إِلى رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم مِنْكَ فَآثَرْتُ حِبَّ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم عَلَى حِبِّيْ. رَوَاهُ التِّرْمِذِيُّ.

6173. (39) [3/1739 బలహీనం]

‘ఉమర్‌ (ర) కథనం: నేను ఉసామహ్ బిన్‌ ‘జైద్‌ కోసం సంవత్సరానికి 3,500 దిర్‌హమ్‌లు జీతం నిర్ణయించాను. అయితే ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘ఉమర్‌ కోసం 3000 దిర్‌హమ్‌లు మాత్రమే నిర్ణయించాను. దానికి ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘ఉమర్‌ తన తండ్రిని, ‘తమరు నాపై ఉసామహ్ను ఎందుకు ప్రాధాన్యత ఇచ్చారు. అల్లాహ్ సాక్షి! ఉసామహ్ ఏ యుద్ధంలోనూ నన్ను అధిగమించ లేదు.’ దానికి ‘ఉమర్‌ (ర), ” ‘జైద్‌ను ప్రవక్త (స) నీ తండ్రి కంటే అధికంగా ప్రేమించేవారు, ఇంకా ప్రవక్త (స) ఉసామహ్ను నీకంటే అధికంగా ప్రేమించేవారు, అందువల్ల నేను ప్రవక్త (స) ప్రేమించే వాడికి, నేను ప్రేమించే వాడికంటే అధికంగా ప్రాధాన్యత ఇచ్చాను,’ అని సమాధానం  ఇచ్చారు.”   (తిర్మిజి’)

6174 – [ 40 ] ( ضعيف ) (3/1739)

وعَنْ جَبَلَةَ بْنِ حَارِثَةَ قَالَ: قَدِمْتُ عَلَى رَسُوْلِ اللهِ صلى الله عليه و سلم. فَقُلْتُ: يَا رَسُوْلَ اللهِ اِبْعَثْ مَعِيَ أَخِيْ زَيْدًا. قَالَ: “هُوَ ذَا فَإِنِ انْطَلَقَ مَعَكَ لَمْ أَمْنَعْهُ”. قَالَ زَيْدٌ: يَا رَسُوْلَ اللهِ وَاللهِ لَا أَخْتَارُ عَلَيْكَ أَحَدًا. قَالَ: فَرَأَيْتُ رَأْيَ أَخِيْ أَفْضَلَ مِنْ رَأْيِيْ. رَوَاهُ التِّرْمِذِيُّ .

6174. (40) [3/1739 బలహీనం]

జబలహ్‌ బిన్‌ ‘హారిసహ్ (ర) కథనం: నేను ప్రవక్త (స) వద్దకు వచ్చాను. ‘ఓ ప్రవక్తా(స)! తమరు నా సోదరుడు (జైద్‌ను) నా వద్దకు పంపివేయండి,’ అని విన్నవించు కున్నాను. దానికి ప్రవక్త (స), ‘ఇదిగో ‘జైద్‌ ఇక్కడే ఉన్నాడు. ఒకవేళ అతడు నీతో వెళ్తానంటే, నేనేమీ ఆపను,’ అని అన్నారు. అది విన్న ‘జైద్‌, ‘ఓ ప్రవక్తా(స)! అల్లాహ్ సాక్షి! నేను మీ వద్ద తప్ప మరెక్కడా ఉండను,’ అని అన్నారు. అప్పుడు నేను నా అభిప్రాయంపై నా సోదరుని అభిప్రాయానికి ప్రాధాన్యత ఇచ్చాను. (తిర్మిజి’)

6175 – [ 41 ] ( حسن ) (3/1739)

وَعَنْ أُسَامَةَ بْنِ زَيْدٍ قَالَ: لَمَّا ثَقُلَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم هَبَطُتُ وَهَبَطَ النَّاسُ الْمَدِيْنَةَ. فَدَخَلْتُ عَلَى رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم. وَقَدْ أُصْمِتَ فَلَمْ يَتَكَلَّمْ فَجَعَلَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم يَضَعُ عَلَيَّ يَدَيْهِ وَيَرْفَعُهُمَا فَأَعْرِفُ أَنَّهُ يَدْعُوْ لِيْ . رَوَاهُ التِّرْمِذِيُّ وَقَالَ: هَذَا حَدِيْثٌ غَرِيْبٌ.

6175. (41) [3/1739  ప్రామాణికం]

ఉసామహ్ బిన్‌ ‘జైద్‌ బిన్‌ ‘హారిసహ్ (ర) కథనం: ప్రవక్త (స) మరణవ్యాధికిగురై చాలా బలహీన పడిన పుడు నేనూ, మరికొందరు మదీనహ్ వచ్చాము. నేను ప్రవక్త (స) వద్దకు వెళ్ళాను. ప్రవక్త (స) మౌనంగా ఉన్నారు. ప్రవక్త (స) ఏమీ మాట్లాడలేదు. అయితే ప్రవక్త (స) తనరెండు చేతులూ ఎత్తి నాపై పెట్టి, మళ్ళీ ఎత్తసాగారు. అప్పుడు నేను ప్రవక్త (స) నా గురించి దు’ఆ చేస్తున్నారని  గ్రహించాను. (తిర్మిజి’-  ఏకోల్లేఖనం)

6176 – [ 42 ] ( حسن ) (3/1740)

وعَنْ عَائِشَةَ قَالَتْ: أَرَادَ النَّبِيُّ صلى الله عليه وسلم أَنْ يُنَحِّيَ مُخَاطَ أُسَامَةَ. قَالَتْ عَائِشَةَ: دَعْنِيْ حَتّى أَكُوْنَ أَنَا الَّذِيْ أَفْعَلُ. قَالَ: “يَا عَائِشَةُ أَحِبِّيْهِ فَإِنِّيْ أُحِبُّهُ”. رَوَاهُ التِّرْمِذِيُّ.

6176. (42) [3/1740  ప్రామాణికం]

‘ఆయి’షహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ఉసామహ్ బాల్యంలో అతని ముక్కు నుండి వెలువడే ద్రవాన్ని తుడవటానికి సిద్ధపడ్డారు. అప్పుడు నేను, ‘తమరు నాకు చెప్పండి, నేను చేస్తాను,’ అని అన్నాను. అప్పుడు ప్రవక్త (స), ‘ఓ ‘ఆయి’షహ్‌! నువ్వు ఉసా మహ్ ను ప్రేమించు, ఎందుకంటే నేను ఉసామహ్ను ప్రేమిస్తున్నాను.’  అని  అన్నారు.  (తిర్మిజి’)

6177 – [ 43 ] ( ضعيف ) (3/1740)

وعَنْ أُسَامَةَ قَالَ: كُنْتُ جَالِسًا إِذْ جَاءَ عَلِيٌّ وَالْعَبَّاسُ يَسْتَأْذِنَانِ. فَقَالَا لِأُسَامَةَ: اِسْتَأْذِنْ لَنَا عَلَى رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم. فَقُلْتُ: يَا رَسُوْلِ اللهِ عَلِيّ وَالْعَبَّاسُ يَسْتَأْذِنَانِ. فَقَالَ: “أَتَدْرِيْ مَا جَاءَ بِهِمَا؟” قُلْتُ: لَا. قَالَ: “لَكِنِّيْ أَدْرِيْ. فَأذن لَهُمَا”. فَدَخَلَا فَقَالَا: يَا رَسُوْلَ اللهِ جِئْنَاكَ نَسْأَلُكَ أَيُّ أَهْلِكَ أَحَبُّ إِلَيْكَ؟ قَالَ: “فَاطِمَةُ بِنْتُ مُحَمَّدٍ”. فَقَالَا: مَا جِئْنَاكَ نَسْأَلُكَ عَنْ أَهْلِكَ. قَالَ: “أَحَبُّ أَهْلِيْ إِلَيَّ مَنْ قَدْ أَنْعَمَ اللهُ عَلَيْهِ وَأَنْعَمْتُ عَلَيْهِ: أُسَامَةُ بْنُ زَيْدٍ”. قَالَا: ثُمَّ مَنْ؟ قَالَ: “ثُمَّ عَلِيُّ بْنُ أَبِيْ طَالِبٍ”. فَقَالَ الْعَبَّاسُ: يَا رَسُوْلُ اللهِ جَعَلْتَ عَمَّكَ آخِرَهُمْ؟ قَالَ: “إِنَّ عَلِيًّا سَبَقَكَ بِالْهِجْرَةِ”. رَوَاهُ التِّرْمِذِيُّ. وَذُكِرَ أَنَّ عَمَّ الرَّجُلِ صِنْوُ أَبِيْهِ فِيْ “كِتَابِ الزَّكَاةِ”.

6177. (43) [3/1740 బలహీనం]

ఉసామహ్ (ర) కథనం: నేను ప్రవక్త (స) ద్వారం వద్ద కూర్చున్నాను. ఇంతలో ‘అలీ (ర), ‘అబ్బాస్‌ (ర) వచ్చారు. ప్రవక్త (స)ను కలవడానికి అనుమతి కోరుతున్నారు. వారు ఉసామహ్ను నువ్వు ప్రవక్త (స)తో, మా కోసం అనుమతికోరు. నేను వెళ్ళి, ‘ఓ ప్రవక్తా! ‘అలీ (ర), ‘అబ్బాస్‌ (ర) ఇద్దరూ మిమ్మల్ని కలవడానికి అనుమతి కోరుతున్నారు,’ అని అన్నాను. అప్పుడు ప్రవక్త (స) ”వీరిద్దరూ ఎందుకు వచ్చారో నీకు తెలుసా?” అని అడిగారు. ‘నాకు తెలియదు,’ అని నేనన్నాను. అప్పుడు ప్రవక్త (స), ‘కాని నాకు తెలుసు, వారిని లోపలికి రానివ్వు,’ అని అన్నారు. అనంతరం వారిద్దరూ లోపలికి వచ్చారు. వారు వచ్చి, ” ‘ఓ ప్రవక్తా! తమరి కుటుంబంలో అందరికంటే తమకు ప్రియమైన వారెవరు?’ అని అడగటానికి వచ్చాం,” అని అన్నారు. దానికి ప్రవక్త (స), ‘ఫాతిమహ్ బిన్‌తె ము’హమ్మద్‌,’ అని అన్నారు. దానికి వారు, ‘మేము మీ కుటుంబం వారి గురించి అడగటం లేదు,’ అని అన్నారు. అప్పుడు ప్రవక్త (స), ‘నా ఇంటివారిలో, అల్లాహ్‌(త) అనుగ్ర హించిన వారు, ఔన్నత్యం ప్రసాదించినవారు ఇంకా నేను కూడా అనుగ్రహించినవారు నాకు అత్యంత ప్రియులు: అది ఉసామహ్ బిన్‌ ‘జైద్‌,’ అని అన్నారు. దానికి వారు, ‘ఆ తరువాత,’ అని అడగ్గా, ప్రవక్త ‘అలీ బిన్‌ అబీ ‘తాలిబ్‌,’ అని అన్నారు. అది విని, ‘అబ్బాస్‌ (ర), ‘ఓ ప్రవక్తా! తమరు తన చిన్నాన్నను చివరిలో పడవేసారు,’ అని విన్నవించుకోగా, ప్రవక్త (స), ‘అలీ (ర) హిజ్రత్‌లో నిన్ను అధిగమించాడు,’ అని అన్నారు. (తిర్మిజి’)

—–

اَلْفَصْلُ الثَّالِثُ  మూడవ విభాగం   

6178 – [ 44 ] ( صحيح ) (3/1740)

عَنْ عُقْبَةَ بْنِ الْحَارِثِ قَالَ: صَلّى أَبُوْ بَكْرٍ الْعَصْرَثُمَّ خَرَجَ يَمْشِيْ وَ مَعَهُ عَلِيٌّ فَرَأَى الْحَسَنَ يَلْعَبُ مَعَ الصِّبْيَانِ فَحَمَلَهُ عَلَى عَاتِقِهِ. وَقَالَ: بِأَبِيْ شَبِيْهٌ بِالنَّبِيِّ لَيْسَ شَبِيْهًا بِعَلِيٍّ وَعَلِيٌّ يَضْحَكُ. روَاهُ الْبُخَارِيُّ.

6178. (44) [3/1740దృఢం]

‘ఉఖ్‌బహ్ బిన్‌ ‘హారిస్‌’ (ర) కథనం: ఒక రోజు అబూ బకర్‌ (ర) ‘అ’స్ర్‌ నమా’జు చదివి, బయలుదేరి, నడవ సాగారు. అతని వెంట ‘అలీ (ర) కూడా ఉన్నారు. అబూ బకర్‌ (ర), ‘హసన్‌ (ర)ను పిల్లలతో ఆడుతూ ఉండటం చూసారు. అబూ బకర్‌ (ర), ‘హసన్‌ను తన భుజాలపై కూర్చోబెట్టుకొని, ‘నీ కోసం నా తండ్రి త్యాగంకాను నీవు అచ్చంగా ప్రవక్త (స)లా ఉన్నావు. ‘అలీలా లేవు,’ అని అన్నారు. అది విన్న ‘అలీ (ర) నవ్వసాగారు. (బు’ఖారీ)

6179 – [ 45 ] ( صحيح ) (3/1741)

وعَنْ أَنَسٍ قَالَ: أُتِيَ عُبَيْدُ اللهِ بْنِ زَيَادٍ بِرَأْسِ الْحُسَيْنِ فَجَعَلَ فِي طَسْتٍ فَجَعَلَ يَنْكُتُ. وَقَالَ فِيْ حُسْنِهِ شَيْئًا. قَالَ أَنَسٌ: فَقُلْتُ: وَاللهِ إِنَّهُ كَانَ أَشْبَهَهُمْ بِرَسُوْلِ اللهِ صلى الله عليه وسلم وَكَانَ مَخْضُوْبًا بِالْوَسْمَةِ. روَاهُ الْبُخَارِيُّ.

 وَفِيْ رِوَايَةٍ التِّرْمِذِيِّ قَالَ: كُنْتث عِنْدَ ابْنِ زِيَادٍ فَجِيْءَ بِرَأْسِ الْحُسَيْنِ. فَجَعَلَ يَضْرِبُ بِقَضِيْبٍ فِيْ أَنْفِهِ. وَيَقُوْلُ: مَا رَأَيْتُ مِثْلَ هَذَا حُسْنًا. فَقُلْتُ: أَمَا إِنَّهُ كَانَ أَشْبَهِهِمْ بِرَسُوْلِ اللهِ صلى الله عليه وسلم. وَقَالَ: هَذَا حَدِيْثٌ صَحِيْحٌ حَسَنٌ غَرِيْبٌ.

6179. (45) [3/1741దృఢం]

అనస్‌ (ర) కథనం: ఉబైదుల్లాహ్‌ బిన్‌ ‘జియాద్‌ వద్దకు హుసైన్‌ (ర) తల తీసుకురావటం జరిగింది. దాన్ని ఒక పళ్లెంలో ఉంచడం జరిగింది. ఇబ్ను ‘జియాద్‌ ఒక బెత్తంతో ఆ తలను కదపసాగాడు. ఇంకా అతని అందంగురించి కూడా అన్నాడు. అప్పుడు నేను, ‘అల్లాహ్ సాక్షి! ప్రవక్త (స) కుటుంబంలో అందరికంటే ఎక్కువ ప్రవక్త (స)కు పోలి ఉన్నవారు వీరే,’ అని అన్నాను. అప్పుడు అతని వెంట్రుకలు రంగరించబడి ఉన్నాయి. (బు’ఖారీ)

తిర్మిజీ’లో ఇలా ఉంది, ”అనస్‌ (ర) కథనం: అప్పుడు నేను ‘ఇబ్ను ‘జియాద్‌ వద్ద ఉన్నాను. ‘హుసైన్‌ (ర) తల అతడి ముందుకు తీసుకురావటం జరిగింది. ఇబ్ను ‘జియాద్‌ అతని ముక్కును కదుపుతూ ఇంతటి అందం నేనెప్పుడూ చూడలేదు,’ అని అన్నాడు. అప్పుడు నేను, ‘అందరికంటే ఎక్కువ ఇతను మాత్రమే ప్రవక్త (స)ను పోలి ఉన్నారు,’ అని అన్నాను. (తిర్మిజి’ – దృఢం – ప్రామాణికం – ఏకోల్లేఖనం)

6180 – [ 46 ] ( لم تتم دراسته ) (3/1741)

وَعَنْ أُمِّ الْفَضْلِ بِنْتِ الْحَارِثِ أَنَّهَا دَخَلَتْ عَلَى رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم. فَقَالَتْ: يَا رَسُوْلَ اللهِ إِنِّيْ رَأَيْتُ حُلُمًا مُنْكَرًا اللَّيْلَةَ. قَالَ: “وَ مَا هُوَ؟” قَالَتْ: إِنَّهُ شَدِيْدٌ. قَالَ: “وَمَا هُوَ؟” قَالَتْ: رَأَيْتُ كَأَنَّ قِطْعَةً مِنْ جَسَدِكَ قُطِعضتْ وَوُضِعَتْ فِيْ حِجْرِيْ. فَقَالَ رَسُوْلُ الله صلى الله عليه وسلم: “رَأَيْتِ خَيْرًا تَلِدُ فَاطِمَةُ إِنْ شَاءَ اللهُ غُلَامًا يَكُوْنُ فِيْ حِجْرِكَ”. فَوَلَدَتْ فَاطِمَةُ الْحُسَيْنَ. فَكَانَ فِيْ حِجْرِيْ كَمَا قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم. فَدَخَلْتُ يَوْمًا عَلَى رَسُوْلِ اللهِ صلى الله عليه و سلم فَوَضَعْتُهُ فِيْ حِجْرِهِ ثُمَّ كَانَتْ مِنِّيْ اِلْتِفَاتَةٌ فَإِذَا عَيْنَا رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم تُهْرِيْقَانِ الدُّمُوْعَ. قَالَتْ: فَقُلْتُ: يَا نَبِيَّ اللهِ بِأَبِيْ أَنْتَ وَأُمِّيْ مَالَكَ؟ قَالَ: “أَتَانِيْ جِبْرَيْلُ عَلَيْهِ السَّلَامُ فَأَخْبَرَنِيْ أَنَّ أُمَّتِيْ سَتَقْتُلُ اِبْنِيْ هَذَا فَقُلْتُ: هَذَا؟ قَالَ: نَعَمْ وَأَتَانِيْ بِتُرْبَةٍ مِنْ تُرْبَتِهِ حَمْرَاءَ”.

6180. (46) [3/1741అపరిశోధితం]

ఉమ్ముల్‌ ఫ’ద్ల్‌  బిన్‌తె ‘హారిస్‌’ (ర) కథనం: నేను ప్రవక్త (స) వద్దకు వచ్చాను, ‘ఓ ప్రవక్తా! ఈ రోజు రాత్రి నేను ఒక చెడ్డ స్వప్నం చూసాను,’ అని విన్నవించు కున్నాను. ప్రవక్త (స), ‘ఏమిటది?’ అని అన్నారు. దానికి నేను, ‘తమరి శరీరం నుండి కొంత ముక్క కోయబడిఉంది, నా ఒడిలో పెట్టటం జరిగింది,’ అని అన్నాను. దానికి ప్రవక్త (స) నీవు మంచి స్వప్నం చూసావు. ఇన్‌షా అల్లాహ్‌ ఫాతిమహ్కు ఒక బిడ్డ పుడతాడు. వాడిని నీ ఒడిలో పెట్టటం జరుగుతుంది. అనంతరం ఫాతిమహ్ ‘హుసైన్‌కు జన్మమిచ్చింది. ప్రవక్త(స) ప్రవచించినట్టే నా ఒడిలో పెట్టటం జరిగింది. అనంతరం ఒకసారి నేను ప్రవక్త (స) వద్దకు వెళ్ళి ‘హుసైన్‌ను అతని(స) ఒడిలోవేసి, మరోవ్యక్తి వైపు చూడసాగాను. అకస్మాత్తుగా ప్రవక్త (స) కళ్ళంట అశ్రువులు రాలాయి. అప్పుడు నేను, ‘ఓ ప్రవక్తా! నా తల్లిదండ్రులు మీకోసం త్యాగంకాను, తమరి కేమయింది?’ అని అడిగాను. దానికి ప్రవక్త (స), ‘ఇప్పు డిప్పుడే నా వద్దకు జిబ్రీల్‌ (అ) వచ్చి, నా అనుచర సంఘం నాయీ కొడుకును చంపివేస్తుందని తెలిపారు.’ ‘ఇతన్నా?’ అని అడిగాను. అప్పుడు ప్రవక్త(స), ‘అవును, జిబ్రీల్‌ (అ) ఆ భూమికి చెందిన కొంతమట్టిని తీసుకువచ్చారు. అది ఎర్రగా ఉంది,’ అనిఅన్నారు.” (బైహఖీ – దలాయిలున్నుబువ్వహ్‌)

6181 – [ 47 ] ( صحيح ) (3/1741)

وعَنِ ابْنِ عَبَّاسٍ قَالَ: رَأَيْتُ النَّبِيَّ صلى الله عليه وسل فِيْمَا يَرَى النَّائِمُ ذَاتَ يَوْمٍ بِنِصْفِ النَّهَارِ أَشْعَثَ أَغْبَرَ بِيَدِهِ قَارُوْرَةٌ فِيْهَا دَمٌ. فَقُلْتُ: بِأَبِيْ أَنْتَ وَأُمِّيْ مَا هَذَا؟ قَالَ: “هَذَا دَمُ الْحُسَيْنِ وَأَصْحَابِهِ وَلَمْ أَزَلْ أَلْتَقِطُهُ مُنْذُ الْيَوْمِ”. فَأَحْصِيْ ذَلِكَ الْوَقْتَ فَأَجِدُ قَبْلَ ذَلِكَ الْوَقْت. رَوَاهُمَا الْبَيْهَقِيُّ فِيْ”دَلَائِلِ النُّبُوَّةِ”. وَأَحْمَدُ الْأَخِيْرَ.  

6181. (47) [3/1741దృఢం]

ఇబ్నె ‘అబ్బాస్‌ (ర) కథనం: ఒకరోజు మధ్యాహ్నం నేను స్వప్నంలో ప్రవక్త (స)ను చూచాను. ప్రవక్త (స) వెంట్రుకలు చెల్లాచెదురుగా ఉన్నాయి. ధూళి పట్టి ఉన్నాయి. ప్రవక్త (స) చేతిలో ఒక సీసా ఉంది. అది రక్తంతో నిండిఉంది. నేను, ”నా తల్లిదండ్రులు మీకోసం త్యాగం కాను. ఇది ఏమిటి,” అని అడిగాను. దానికి ప్రవక్త (స), ‘ఇది ‘హుసైన్‌, వాడి మిత్రుల రక్తం. నేను ఈ రోజు ఉదయం నుండి దాన్ని పట్టి ఉంచాను,’ అని అన్నారు. నేను ఆ తేదీని గుర్తుంచాను. నాకు బాగా గుర్తుంది, ఆ తేదీ నాడే ‘హుసైన్‌ చంపబడ్డారు. (బైహఖీ – దలాయిలు న్నుబువ్వహ్‌)

6182 – [ 48 ] ( ضعيف ) (3/1742)

وعَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “أَحِبُّوا اللهَ لِمَا يَغْذُوْكُمْ مِنْ نِعَمِهِ فَأَحِبُّوْنِيْ لِحُبِّ اللهِ وَأَحِبُّوْا أَهْلَ بَيْتِيْ لِحُبِّيْ”. رَوَاهُ التِّرْمِذِيُّ.  

6182. (48) [3/1742  బలహీనం]

ఇబ్నె ‘అబ్బాస్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”అల్లాహ్‌(త)ను ప్రేమించండి, ఎందుకంటే అల్లాహ్‌(త) తన అనుగ్రహాలతో మిమ్మల్ని పోషిస్తున్నాడు, ఇంకా నన్ను ప్రేమించండి. ఎందుకంటే మీరు అల్లాహ్‌(త)ను ప్రేమిస్తున్నారు గనుక. ఇంకా నా ద్వారా నా కుటుంబాన్ని  ప్రేమించండి.”  (తిర్మిజి’)

6183 – [ 49 ] ( ضعيف ) (3/1742)

وعَنْ أَبِيْ ذَرٍّ أَنَّهُ قَالَ وَهُوَ آخِذٌ بِبِابِ الْكَعْبَةِ: سَمِعْتُ النَّبِيَّ صلى الله عليه وسلم يَقُوْلُ: “أَلَا إِنَّ مِثْلَ أَهْلِ بَيْتِيْ فِيْكُمْ مِثْلُ سَفِيْنَةِ نُوْحٍ مَنْ رَكِبَهَا نَجَا وَمَنْ تَخَلَّفَ عَنْهَا هَلَكَ”. رَوَاهُ أَحْمَدُ.

6183. (49) [3/1742బలహీనం]

అబూ  జ’ర్‌ (ర) కథనం: నేను ఒకరోజు క’అబహ్ ద్వారం పట్టుకొని ఉండగా, ప్రవక్త (స) ద్వారా ఇలా విని ఉన్నాను, ”గుర్తుంచుకోండి, నా కుటుంబం నూ’హ్‌ (అ) పడవను పోలి ఉంటుంది. దానిపైకి ఎక్కినవాడు ముక్తి పొందినట్టే, ఎక్కనివాడు నాశనం అయినట్టే.” [29] (అ’హ్మద్‌)

=====

11  بَابُ مَنَاقِبِ أَزْوَاجِ النَّبِيِّ صلى الله عليه وسلم

11. ప్రవక్త () సతీమణులు (.అన్హుంల) ప్రత్యేకతలు

اَلْفَصْلُ الْأَوَّلُ   మొదటి విభాగం   

6184 – [ 1 ] ( مُتَّفَقٌ عَلَيْهِ ) (3/1743)

وَعَنْ عَلِيٍّ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: سَمِعْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ: “خَيْرُ نِسَائِهَا مَرْيَمُ بِنْتُ عِمْرَانَ. وَخَيْرُ نِسَائِهَا خَدِيْجَةُ بِنْتُ خُوَيْلَدٍ”. مُتَّفَقٌ عَلَيْهِ.

وَفِيْ رِوَايَةٍ قَالَ أَبُوْ كُرَيْبٍ: وَأَشَارَ وَكِيْعٌ إِلى السَّمَاءِ وَالْأَرْضِ.

6184. (1) [3/1743ఏకీభవితం]

‘అలీ (ర) కథనం: ప్రవక్త (స) ఇలా ప్రవచిస్తూ ఉండగా నేను విన్నాను, ”మర్యమ్‌ బిన్‌తె ‘ఇమ్రాన్‌ తన కాలంలో అందరికంటే ఉత్తమ స్త్రీ, కాలంలో ఖదీజహ్ బిన్‌తె’ఖువైలిద్‌ అందరికంటే ఉత్తమ స్త్రీ.

మరో ఉల్లేఖనంలో ఇలా ఉంది, ”అబూ కురైబ్‌ కథనం: వకీ’అ భూమ్యాకాశాల వైపు సైగచేసి వీరిద్దరూ తమ తమ కాలాల్లో అందరికంటే ఉత్తమ స్త్రీలని పేర్కొన్నారు.”  (బు’ఖారీ, ముస్లిమ్‌)

6185 – [ 2 ] ( مُتَّفَقٌ عَلَيْهِ ) (3/1743)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: أَتَى جِبْرِيْلُ النَّبِيَّ صلى الله عليه وسلم فَقَالَ: “يَا رَسُوْلَ اللهِ هَذِهِ خَدِيْجَةُ قَدْ أَتَتْ مَعَهَا إِنَاءٌ فِيْهِ إِدَامٌ اَوْطَعَامٌ. فَإِذَا أَتَتْكَ فَأقْرَأْ عَلَيْهَا السَّلَامَ مِنْ رَبِّهَا وَمِنِّيْ وَبَشِّرْهَا بِبَيْتٍ فِي الْجَنَّةِ مِنْ قَصَبٍ لَا صَخَبَ فِيْهِ وَلَا نَصَبَ”.

6185. (2) [3/1743ఏకీభవితం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: జిబ్రీల్‌ (అ) ప్రవక్త (స) వద్దకు వచ్చారు. ఇంకా ఇలా అన్నారు, ”ఓ ప్రవక్తా(స)! ‘ఖదీజహ్ (ర) ‘హిరా కొండ వైపు వస్తున్నారు. ఆమె వద్ద ఒక గిన్నెలో అన్నం లేదా కూర ఉంది. ఆమె తమరి దగ్గరకు వస్తే, ఆమె ప్రభువు తరఫున, నా తరఫున సలామ్‌ అందజేయండి. ఇంకా, ‘స్వర్గంలో ఆమెకోసం గుల్లముత్యాల భవనం గురించి శుభవార్త అందజేయండి. అందులో ఎటువంటి అసౌకర్యం గాని, దుఃఖవిచారాలు గాని, ఉండవు,’ అని అన్నారు.” (బు’ఖారీ, ముస్లిమ్‌)

6186 – [ 3 ] ( مُتَّفَقٌ عَلَيْهِ ) (3/1743)

وَعَنْ عَائِشَةَ قَالَتْ: مَا غِرْتُ عَلَى أَحَدٍ مِنْ نِسَاءِ النَّبِيِّ صلى الله عليه وسلم مَا غِرْتُ عَلَى خَدِيْجَةَ وَمَا رَأَيْتُهَا وَلَكِنْ كَانَ يُكْثِرُ ذِكْرَهَا .وَرُبَّمَا ذَبَحَ الشَّاةَ ثُمَّ يَقْطَعُهَا أَعْضَاءً ثُمَّ يَبْعَثُهَا فِيْ صَدَائِقِ خَدِيْجَةَ. فَيَقُوْلُ: “إِنَّهَا كَانَتْ وَكَانَتْ وَكَانَتْ وَكَانَ لِيْ مِنْهَا وَلَدٌ”. مُتَّفَقٌ عَلَيْهِ.

6186. (3) [3/1743–  ఏకీభవితం]

‘ఆయి’షహ్‌ (ర) కథనం: నేను ప్రవక్త (స) భార్యల్లో ‘ఖదీజహ్ పట్ల ఈర్ష్య చెందినట్లు మరెవరి పట్ల ఈర్ష్య చెందలేదు. వాస్తవం ఏమిటంటే నేను ‘ఖదీజహ్ (ర)ను చూడనైనా లేదు. అయితే ప్రవక్త (స) తరచూ ఆమె గురించి ప్రస్తావించేవారు. ఒక్కోసారి ప్రవక్త (స) మేక జిబ’హ్‌ చేసి, మాంసం ముక్కలు చేసి, ‘ఖదీజహ్ (ర) స్నేహితురాళ్ళకు పంపేవారు. ఒక్కోసారి నేను ‘ఖదీజహ్(ర) తప్ప ప్రపంచంలో ఆడవాళ్ళు లేనట్టుంది అని అనేదాన్ని. ప్రవక్త (స), ‘ఆమె అలాంటిది, ఇలాంటిది. ఆమెద్వారా నా సంతానం ఉంది,’ అని అనేవారు.  (బు’ఖారీ, ముస్లిమ్‌)

6187 – [ 4 ] ( مُتَّفَقٌ عَلَيْهِ ) (3/1743)

وَعَنْ أَبِيْ سَلَمَةَ أَنَّ عَائِشَةَ قَالَتْ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم:”يَا عَائِشُ هَذَا جِبْرَيْلُ يُقْرِئُكَ السَّلَامَ”. قَالَتْ: وَعَلَيْهِ السَّلَامُ وَرَحْمَةُ اللهِ. قَالَتْ: وَهُوَ يَرَى مَا لَا أَرَى. مُتَّفَقٌ عَلَيْهِ.

6187. (4) [3/1743 ఏకీభవితం]

అబూ సలమహ్ (ర) కథనం: ప్రవక్త (స) ‘ఆయి’షహ్‌ (ర)తో, ‘ఓ ‘ఆయి’షహ్‌! జిబ్రీల్‌(అ) నీకు సలామ్‌ చేస్తున్నారు. దానికి ‘ఆయి’షహ్‌ ‘వ అలైహిస్సలామ్‌ వ రహ్మతుల్లాహ్‌,’ అని సమాధానం ఇచ్చారు. ఆ తర్వాత ప్రవక్త (స) చూస్తున్నదాన్ని నేను చూడలేక పోయేదాన్ని – అంటే జిబ్రీల్‌. (బు’ఖారీ, ముస్లిమ్‌)

6188 – [ 5 ] ( مُتَّفَقٌ عَلَيْهِ ) (3/1744)

وَعَنْ عَائِشَةَ قَالَتْ: قَالَ لِيْ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “أُرِيْتُكَ فِي الْمَنَامِ ثَلَاثَ لِيَالٍ يَجِيْءُ بِكِ الْمَلَكُ فِيْ سَرَقَةٍ مِنْ حَرِيْرٍ. فَقَالَ لِيْ: هَذِهِ امْرَأَتُكَ فَكَشَفْتُ عَنْ وَجْهِكِ الثَّوْبَ فَإِذَا أَنْتِ هِيَ. فَقُلْتُ: إِنْ يَكُنْ هَذَا مِنْ عِنْدِ اللهِ يُمْضِهِ”. مُتَّفَقٌ عَلَيْهِ.

6188. (5) [3/1744 ఏకీభవితం]

‘ఆయి’షహ్‌ (ర) కథనం: ”వరుసగా మూడు రాత్రులు కలలో నిన్ను నాకు చూపించటం జరిగింది. దైవదూత పట్టు వస్త్రం ముక్కపై నీ చిత్రం తీసుకొనివచ్చి, ‘ఈమె మీ భార్య,’ అని అనేవాడు. నేను నీ ముఖం పై నుండి కొంగు తొలగించి చూస్తే అది నువ్వే. నేను నా మనసులో ఒకవేళ ఈ స్వప్నం అల్లాహ్‌(త) తరఫు నుండి అయితే, అల్లాహ్‌(త)యే దాన్ని పూర్తిచేస్తాడు అని అనుకున్నాను,’ అని నాతో ప్రవక్త (స) అన్నారు.” (బు’ఖారీ, ముస్లిమ్‌)

6189 – [ 6 ] ( مُتَّفَقٌ عَلَيْهِ ) (3/1744)

وَعَنْهَا قَالَتْ: إِنَّ النَّاسَ كَانُوْا يَتَحَرَّوْنَ بِهَدَايَاهُمْ يَوْمَ عَائِشَةَ يَبْتَغُوْنَ بِذَلِكَ مَرْضَاةَ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم. وَقَالَتْ: إِنَّ نِسَاءَ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم كُنَّ حِزْبَيْنِ: فَحِزْبٌ فِيْهِ عَائِشَةَ وَحَفْصَةُ وَصَفِيَّةٌ وَسَوْدَةُ. وَالْحِزْبُ الْآخَرُ أُمُّ سَلَمَةَ وَسَائِرُ نِسَاءِ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم فَكَلَّمَ حِزْبٌ أُمَّ سَلَمَةَ فَقُلْنَ لَهَا: كَلِّمِيْ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يُكَلِّمُ النَّاسَ فَيَقُوْلُ: مَنْ أَرَادَ أَنْ يُهْدِيَ إِلى رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم فَلْيُهْدِهِ إِلَيْهِ حَيْثُ كَانَ. فَكَلَّمَتْهُ فَقَالَ لَهَا: “لَا تُؤْذِيْنِيْ فِيْ عَائِشَةَ. فَإِنَّ الْوَحْيَ لَمْ يَأْتِنِيْ وَأَنَا فِيْ ثَوْبٍ امْرَأَةٍ إِلَّا عَائِشَةَ”. قَالَتْ: أَتُوْبُ إِلى اللهِ مِنْ ذَاكَ يَا رَسُوْلَ اللهِ. ثُمَّ إِنَّهُنَّ دَعَوْنَ فَاطِمَةَ فَأَرْسَلْنَ إِلى رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم. فَكَلَّمَتْهُ فَقَالَ: “يَا بُنَيَّةُ أَلَا تُحِبِّيْن مَا أُحِبُّ؟” قَالَتْ: بَلَى. قَالَ: “فَأَحِبِّيْ هَذِهِ”. مُتَّفَقٌ عَلَيْهِ

وَذُكِرَ حَدِيْثُ أَنَسٍ “فَضْلُ عَائِشَةَ عَلَى النِّسَاءِ” فِيْ بَابِ “بَدْءِ الْخَلْقِ”. بِرِوَايَةٍ أَبِيْ مُوْسَى.

6189. (6) [3/1744 ఏకీభవితం]

‘ఆయి’షహ్‌ (ర) కథనం: ప్రజలు ప్రవక్త (స)కు కానుకలు పంపడానికి ‘ఆయి’షహ్‌ వంతుకు వేచి ఉండేవారు. దాని ద్వారా వారు ప్రవక్త (స) ప్రీతిని పొందాలనుకునేవారు. ప్రవక్త (స) భార్యలు రెండు వర్గాల్లో విభజించబడ్డారు. ఒక వర్గంలో, ఆయి’షహ్‌ (ర), హఫ్‌’హ్ (ర), సఫియ్యహ్ (ర), సౌదహ్‌ (ర), మరో వర్గంలో, ఉమ్మె లమహ్ (ర), ఇంకా మిగిలిన భార్యలు. అనంతరం ఉమ్మె సలమహ్ (ర) వర్గం వారు ఒకరోజు ఉమ్మె సలమహ్తో మాట్లాడారు. ‘ప్రవక్త (స)తో మాట్లాడి కానుకలు ఇవ్వవలసినవారు ప్రవక్త (స) ఎక్కడున్నా కానుకలు ఇవ్వవచ్చని ప్రజలతో చెప్పమని,’ అన్నారు. అనంతరం ఉమ్మె సలమహ్, ప్రవక్త (స) తో ఈ విషయంపై చర్చించారు. దానికి ప్రవక్త (స), ‘ ‘ఆయి’షహ్‌ విషయంలో నీవు నన్ను బాధకు గురిచేయకు. ఎందుకంటే ‘ఆయి’షహ్‌ తప్ప మరెవరి దుస్తుల్లో దైవవాణి అవతరించడం లేదు.’ దానికి ఉమ్మె సలమహ్ (ర), ‘ప్రవక్తా! మిమ్మల్ని ఆపదకు గురిచేయటం నుండి నేను క్షమాపణ కోరుతున్నాను,’ అని అన్నారు. ఆ తరువాత ఆ స్త్రీలు ఫాతిమహ్ను పిలిచి, ప్రవక్త (స) వద్దకు పంపారు. ఫాతిమహ్ ప్రవక్త (స) తో మాట్లాడారు. దానికి ప్రవక్త (స), ‘ఓ నా కూతురా! నేను ప్రేమించే స్త్రీని నువ్వు ప్రేమించవా?’ అని అన్నారు. దానికి ఫాతిమహ్, ‘ప్రేమిస్తాను,’ అని అన్నారు. ప్రవక్త (స), ‘అయితే నువ్వు ‘ఆయి’షహ్‌ను ప్రేమించు,’ అని అన్నారు. (బు’ఖారీ, ముస్లిమ్‌)

—–

اَلْفَصْلُ الثَّانِيْ  రెండవ విభాగం   

6190 – [7 ] ( صحيح ) (3/1745)

عَنْ أَنَسٍ أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم قَالَ: “حَسْبُكَ مِنْ نِسَاءِ الْعَالَمِيْنَ مَرْيَمَ بِنْتُ عِمْرَانَ وَخَدِيْجَةُ بِنْتُ خُوَيْلَدٍ وَفَاطِمَةُ بِنْتُ مُحَمَّدٍ وَآسِيَةُ امْرَأَةُ فِرْعَوْنَ”. رَوَاهُ التِّرْمِذِيُّ.

6190. (7) [3/1745దృఢం]

అనస్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ప్రపంచ ప్రజలందరిలో ఔన్నత్యం గల స్త్రీల గురించి తెలుసుకోవడం నీకు చాలు. వారు మర్యమ్‌ బిన్‌తె ‘ఇమ్రాన్‌, ఖదీజహ్ బిన్‌తె ‘ఖువైలిద్‌, ఫాతిమహ్ బిన్‌తె ము’హమ్మద్‌, ఆసియహ్ ‘జౌజతు ఫిర్‌ఔన్‌.” (తిర్మిజి’)

6191 – [ 8 ] ( صحيح ) (3/1745)

وَعَنْ عَائِشَةَ أَنَّ جِبْرِيْلَ جَاءَ بِصُوْرَتِهَا فِيْ خِرْقَةِ حَرِيْرٍ خَضْرَاءَ إِلى رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم فَقَالَ: “هَذِهِ زَوْجَتُكَ فِي الدُّنْيَا وَالْآخِرَةِ”. رَوَاهُ التِّرْمِذِيُّ.  

6191. (8) [3/1745దృఢం]

‘ఆయి’షహ్‌ (ర) కథనం: జిబ్రీల్‌ (అ) పచ్చని పట్టు వస్త్రంపై ‘ఆయి’షహ్‌ (ర)  చిత్రాన్ని ప్రవక్త (స) వద్దకు తెచ్చి, ‘ఇహపరలోకాల్లో ఈమె మీ భార్య,’ అని అన్నారు. (తిర్మిజి’)

6192 – [ 9 ] ( صحيح ) (3/1745)

وَعَنْ أَنَسٍ قَالَ: بَلَغَ صَفِيَّةَ أَنَّ حَفْصَةَ قَالَتْ: بِنْتُ يَهُوْدِيٍّ فَبَكَتْ فَدَخَلَ عَلَيْهَا النَّبِيُّ صلى الله عليه وسلم وَهِيَ تَبْكِيْ. فَقَالَ: “مَا يُبْكِيْكِ؟” فَقَالَتْ: قَالَتْ لِيْ حَفْصَةُ: إِنِّيْ اِبْنَةُ يَهُوْدِيِّ. فَقَالَ النَّبِيُّ صلى الله عليه و سلم: “إِنَّكَ ابْنَةُ نَبِيٍّ وَإِنَّ عَمَّكِ لَنَبِيٌّ وَإِنَّكِ لَتَحْتَ نَبِيٍّ فَفِيْمَ تَفْخُرُ عَلَيْكِ؟” ثُمَّ قَالَ:”اِتَّقِي اللهَ يَا حَفْصَةُ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَالنَّسَائِيُّ .

6192. (9) [3/1745దృఢం]

అనస్‌ (ర) కథనం: ‘హఫ్‌’సహ్ (ర) తనను ‘యూదుని సంతానం,’ అని చెప్పిందని సఫియ్య (ర)కు తెలిసి, ఆమె ఏడ్వసాగింది. ఇంతలో ప్రవక్త (స) వచ్చారు. ‘ఎందుకు ఏడుస్తున్నావు?’ అని అడిగారు. దానికి ఆమె, ”నన్ను ‘హఫ్‌’సహ్ (ర) ‘యూదుని కూతురు,’ అని చెప్పారని,” చెప్పింది. అప్పుడు ప్రవక్త (స), ”ఇందులో అనుమానించే విషయమే లేదు, నీవు ఒక ప్రవక్త సంతానం, మీ చిన్నాన్న కూడా ప్రవక్తే. ఇంకా నీవు ఒక ప్రవక్త భార్యవు. మరి ఏవిధంగా ఆమె నీ కంటే ఉత్తమురాలు.” ఆ తరువాత ప్రవక్త (స) ‘హఫ్‌’సహ్తో, ” ‘హఫ్‌’సహ్! అల్లాహ్‌(త)కు భయ పడు,” అని అన్నారు.[30]  (తిర్మిజి’, నసాయి)

6193 – [ 10 ] ( إسناده جيد ) (3/1745)

وَعَنْ أُمِّ سَلَمَةَ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم دَعَا فَاطِمَةَ عَامَ الْفَتْحِ فَنَاجَاهَا فَبَكَتْ ثُمَّ حَدَّثَهَا فَضَحِكَتْ فَلَمَّا تُوُفِّيَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم سَأَلْتُهَا عَنْ بُكَائِهَا وَضِحْكِهَا . قَالَتْ : أَخْبَرَنِيْ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم أَنَّهُ يَمُوْتُ فَبَكَيْتُ ثُمَّ أَخْبَرَنِيْ أَنِّيْ سَيِّدَةُ نِسَاءِ أَهْلِ الْجَنَّةِ إِلَّا مَرْيَمَ بِنْتَ عِمْرَانَ فَضَحِكْتُ.رَوَاهُ التِّرْمِذِيُّ .

6193. (10) [3/1745ఆధారాలు ఆమోదయోగ్యం]

ఉమ్మె లమహ్ (ర) కథనం: ప్రవక్త (స) మక్కహ్ విజయం తరువాత ఫాతిమహ్ను తన వద్దకు పిలిచి, ఆమెతో ఏదో గుసగుసలాడారు. ఆమె ఏడ్వసాగింది. ప్రవక్త (స) మళ్ళీ ఆమెతో గుసగుసలాడారు. ఆమె నవ్వసాగింది. ప్రవక్త (స) మరణానంతరం నేనామెను అప్పటి ఏడ్వటాన్ని, నవ్వ టాన్ని గురించి అడగ్గా, ‘ప్రవక్త (స) మరణిస్తారని తెలిపితే నేను ఏడ్వసాగాను, ఆ తర్వాత ప్రవక్త (స) మళ్ళీ మర్యమ్‌ బిన్‌తె ‘ఇమ్రాన్‌ తప్ప స్వర్గంలోని స్త్రీలందరికి నేను నాయకురాలిని అని చెబితే  నవ్వసాగాను,’ అని  అన్నారు. (తిర్మిజి’)

—–

اَلْفَصْلُ الثَّالِثُ   మూడవ విభాగం 

6194 – [ 11 ] ( صحيح ) (3/1746)

عَنْ أَبِيْ مُوْسَى قَالَ: مَا أَشْكَلَ عَلَيْنَا أَصْحَابِ رَسُوْلِ الله صلى الله عليه وسلم حَدِيْثٌ قَطُّ فَسَأَلْنَا عَائِشَةَ إِلَّا وَجَدْنَا عِنْدَهَا مِنْهُ عِلْمًا. رَوَاهُ التِّرْمِذِيُّ. وَقَالَ: هَذَا حَدِيْثٌ حَسَنٌ صَحِيْحٌ غَرِيْبٌ

6194. (11) [3/1746దృఢం]

అబూ మూసా (ర) కథనం: ప్రవక్త (స) అనుచరులకు ఎప్పుడైనా ఏదైనా ‘హదీసు’ విషయంలో సందేహం వస్తే, మేము ‘ఆయి’షహ్‌ (ర)ను అడిగే వాళ్ళం. ఎందుకంటే ఆమెకు ‘హదీసు’ల గురించి తెలిసి ఉండేది. (తిర్మిజి’ – దృఢం, ప్రామాణికం, ఏకోల్లేఖనం)

6195 – [ 12 ] ( صحيح ) (3/1746)

وعَنْ مُوْسَى بْنِ طَلْحَةَ قَالَ: مَا رَأَيْتُ أَحَدًا أَفْصَحَ مِنْ عَائِشَةَ. رَوَاهُ التِّرْمِذِيُّ وقَالَ: هَذَا حَدِيْثٌ حَسَنٌ صَحِيْحٌ غَرِيْبٌ.

6195. (12) [3/1746దృఢం]

మూసా బిన్‌ ‘తల్‌’హా (ర) కథనం: భాషా పాండి త్యంలో ‘ఆయి’షహ్‌ను తప్ప మరెవరినీ మేము చూడ లేదు. (తిర్మిజి’  –  ప్రామాణికం, దృఢం, ఏకోల్లేఖనం)

=====

12-  بَابُ جَامِعِ الْمَنَاقِبِ

12. ప్రఖ్యాత ప్రవక్త () సహచరులు (. అన్హుంల) ప్రత్యేకతలు

اَلْفَصْلُ الْأَوَّلُ   మొదటి విభాగం   

6196 – [ 1 ] ( مُتَّفَقٌ عَلَيْهِ ) (3/1747)

عَنْ عَبْدِ اللهِ بْنِ عُمَرَقَالَ: رَأَيْتُ فِي الْمَنَامِ كَأَنَّ فِيْ يَدَيَّ سَرَاقَةً مِنْ حَرِيْرٍلَا أَهْوِيْ بِهَا إِلى مَكَانِ فِي الْجَنَّةِ إِلَّا طَارَتْ بِيْ إِلَيْهِ فَقَصَصْتُهَا عَلَى حَفْصَةَ فَقَصَّتْهَا حَفْصَةُ عَلَى رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم فَقَالَ: “إِنَّ أَخَاكَ رَجُلٌ صَالِحٌ – أَوْ إِنَّ عَبْدَ اللهِ رَجُلٌ صَالِحٌ -“. مُتَّفَقٌ عَلَيْهِ.

6196. (1) [3/1747ఏకీభవితం]

అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘ఉమర్‌ (ర) కథనం: కలలో నా చేతిలో ఒక పట్టువస్త్రం ముక్క ఉంది. స్వర్గంలో ఎక్కడికి వెళ్ళాలనుకున్నా, ఆ పట్టువస్త్రం ముక్క నన్ను ఎగుర వేసుకొని పోయి అక్కడికి చేర్చివేస్తుంది. ఈ స్వప్నాన్ని గురించి నేను నా సోదరి ‘హఫ్‌’సహ్ (ర)కు తెలియ పర్చాను. ఆమె ప్రవక్త (స) వద్ద ప్రస్తావించారు. దానికి ప్రవక్త (స), ‘మీ సోదరుడు ఉత్తమ పురుషుడు లేదా ‘అబ్దుల్లాహ్‌ ఉత్తమ వ్యక్తి’ అని అన్నారు. (బు’ఖారీ, ముస్లిమ్‌)

6197 – [ 2 ] ( صحيح ) (3/1747)

وَعَنْ حُذَيْفَةَ قَالَ: إِنَّ أَشْبَهَ النَّاسِ دَلًّا وَسَمْتًا وَهَدْيًا بِرَسُوْلِ اللهِ صلى الله عليه وسلم لابْنُ أُمِّ عَبْدٍ مِنْ حِيْنَ يَخْرُجُ مِنْ بَيْتِهِ إِلى أَنْ يَرْجِعَ إِلَيْهِ لَا تَدْرِيْ مَا يَصْنَعُ فِىْ أَهْلِهِ إِذَا خَلَا. روَاهُ الْبُخَارِيُّ .

6197. (2) [3/1747దృఢం]

‘హుజై’ఫహ్ (ర) కథనం: అణకువ, వినయ విధేయ తల్లో ప్రవక్త (స)ను పోలి ఉండే వారిలో అందరికంటే అబ్దుల్లాహ్‌ బిన్‌ మస్‌’ఊద్‌ ప్రముఖులు. ఇంటి నుండి బయలు దేరి, తిరిగి ఇంటికి వచ్చేవరకు, ఇంటిలో ఉన్నప్పుడూ ఏం చేస్తారో మాకు తెలిసేది కాదు. (బు’ఖారీ)

6198 – [ 3 ] ( مُتَّفَقٌ عَلَيْهِ ) (3/1747)

وَعَنْ أَبِيْ مُوْسَى الْأَشْعَرِيِّ قَالَ: قَدِمْتُ أَنَا وَأَخِيْ مِنَ الْيَمَنِ فَمَكَثْنَا حِيْنًا مَا نَرَى إِلَّا أَنَّ عَبْدَ اللهِ بْنِ مَسْعُوْدٍ رَجُلٌ مِنْ أَهْلِ بَيْتِ النَّبِيِّ صلى الله عليه وسلم لِمَا نَرَى مِنْ دُخُوْلِهِ وَدُخُوْلِ أُمِّهِ عَلَى النَّبِيِّ صلى الله عليه وسلم. مُتَّفَقٌ عَلَيْهِ.

6198. (3) [3/1747 ఏకీభవితం]

అబూ మూసా అష్‌’అరీ (ర) కథనం: నేనూ, నా సోదరుడు యమన్‌ నుండి వచ్చాము. కొంతకాలం వరకు ఇక్కడ ఉన్నాం. మేము ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ మస్‌’ఊద్‌ను ప్రవక్త (స) కుటుంబం వారిలా భావించేవారం. ఎందు కంటే, అతడు అతడి తల్లిగారు ఇద్దరూ తరచూ ప్రవక్త (స) వద్దకు వచ్చేవారు. (బు’ఖారీ, ముస్లిమ్‌)

6199 – [ 4 ] ( مُتَّفَقٌ عَلَيْهِ ) (3/1747)

وَعَنْ عَبْدِ اللهِ بْنِ عَمْرٍو أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم قَالَ: “اِسْتَقْرِؤُوا الْقُرْآنَ مِنْ أَرْبَعَةٍ: مِنْ عَبْدِ اللهِ بْنِ مَسْعُوْدٍ وَسَالِمٍ مَوْلَى أَبِيْ حُذَيْفَةَ وَأُبَيِّ بْنِ كَعْبٍ وَمُعَاذِ بْنِ جَبْلٍ”. مُتَّفَقٌ عَلَيْهِ.

6199. (4) [3/1747ఏకీభవితం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘అమ్ర్‌ (ర) కథనం: ఈ నలుగురి నుండి ఖుర్‌ఆన్‌ చదవటం నేర్చుకోండి. ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ మస్‌’ఊద్‌, అబూ ‘హుజై’ఫహ్ సేవకులు సాలిమ్‌, ఉబయ్‌ బిన్‌ క’అబ్‌, మ’ఆజ్‌’ బిన్‌ జబల్‌ మొదలైన వారి నుండి. (బు’ఖారీ, ముస్లిమ్‌)

6200 – [ 5 ] ( صحيح ) (3/1747)

وَعَنْ عَلْقَمَةَ قَالَ: قَدِمْتُ الشَّامَ فَصَلَّيْتُ رَكْعَتَيْنِ ثُمَّ قُلْتُ: اَللّهُمَّ يَسِّرْ لِيْ جَلِيْسًا صَالِحًا فَأَتَيْتُ قَوْمًا فَجَلَسْتُ إِلَيْهِمْ فَإِذَا شَيْخٌ قَدْ جَاءَ حَتّى جَلَسَ إِلى جَنْبِيْ قُلْتُ: مَنْ هَذَا؟ قَالُوْا: أَبُوْ الدَّرْدَاءِ. قُلْتُ: إِنِّيْ دَعَوْتُ اللهَ أَنْ يُيَسِّرَ لِيْ جَلِيْسًا صَالِحًا فَيَسَّرَكَ لِيْ فَقَالَ: مَنْ أَنْتَ؟ قُلْتُ: مِنْ أَهْلِ الْكُوْفَةِ. قَالَ: أَوَ لَيْسَ عِنْدَكُم اِبْنُ أُمِّ عَبْدٍ صَاحِبُ النَّعْلَيْنِ وَالْوِسَادَةِ وَالْمِطْهَرَةِ وَفِيْكُمُ الَّذِيْ أَجَارَهُ اللهُ مِنَ الشَّيْطَانِ عَلَى لِسَانِ نَبِيِّهِ؟ يَعْنِيْ عَمَّارًا أَوْ لَيْسَ فِيْكُمْ صَاحِبُ السِّرِّ الَّذِيْ لَا يَعْلَمُهُ غَيْرُهُ؟ يَعْنِيْ حُذَيْفَةَ. روَاهُ الْبُخَارِيُّ

6200. (5) [3/1747దృఢం]

‘అల్‌ఖమహ్‌ (ర) కథనం: ”నేను సిరియా చేరిన తర్వాత  (దమిష్క్ జామె మస్జిద్లో) రెండు రకాతులు నమా’జు చదివాను. ఆ తర్వాత, ‘ఓ అల్లాహ్‌! ఎవరైనా మంచివ్యక్తి తోడు ప్రసాదించు,’ అని ప్రార్థించాను. తరువాత కొందరు వ్యక్తులు ఉన్నచోటికి పోయి, వారిలో కూర్చున్నాను. (అక్కడున్న వారితో), ‘ఈ మహావ్యక్తి ఎవరు?’ అని అడిగాను. ‘వీరు అబూ దర్దా,’ అని అన్నారు. నేను అతనితో, ‘మంచివ్యక్తి తోడు ప్రసాదించమని నేను అల్లాహ్‌ను కోరాను. అల్లాహ్‌(త) మీలాంటి ఉత్తమ వ్యక్తి తోడు ప్రసాదించాడు,’ అని అన్నాను. అప్పుడు అబూ దర్దా, ‘నీవెవరవు,’ అని అడిగారు. దానికి నేను, ‘కూఫా వాసిని,‘ అని అన్నాను. దానికి అబూ దర్దా, ‘మీ ప్రాంతంలో ఇబ్నె ఉమ్మె అబ్ద్‌, అంటే ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ మస్‌’ఊద్‌ ఉన్నారా? అతను భోజనం విషయంలో, పడక విషయంలో, వు’దూ విషయంలో ప్రవక్త (స)కు సేవ చేసేవారు. ఇంకా మీలో అల్లాహ్‌(త) తన ప్రవక్త (స) ద్వారా షై’తాన్‌ నుండి రక్షణ కల్పించిన వ్యక్తి, అమ్మార్‌ బిన్‌ యాసిర్‌ లేరా? ఇంకా మీలో ప్రవక్త (స) ప్రత్యేక రహస్య గూఢచారి అంటే హుజై’హ్ బిన్ యమాన్‌ లేరా,’ అని  అన్నారు. (బు’ఖారీ)

6201 – [ 6 ] ( صحيح ) (3/1748)

وَعَنْ جَابِرٍ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم قَالَ: “أُرِيْتُ الْجَنَّةَ فَرَأَيْتُ امْرَأَةَ أَبِيْ طَلْحَةَ وَسَمِعْتُ خَشْخَشَةً أَمَامِيْ فَإِذَا بِلَالٌ”. روَاهُ مُسْلِمٌ.

6201. (6) [3/1748 దృఢం]

జాబిర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”నాకు స్వర్గం చూపెట్టబడింది. అందులో నేను అబూ ‘తల్’హా (ర) భార్యను చూచాను. ఇంకా నాముందు అడుగుల చప్పుడు విని, చూసేసరికి అతడు బిలాల్‌, అని గుర్తించాను .” (ముస్లిమ్‌)

6202 – [ 7 ] ( صحيح ) (3/1748)

وَعَنْ سَعْدٍ قَالَ: كُنَّا مَعَ النَّبِيِّ صلى الله عليه وسلم سِتَّةَ نَفَرٍفَقَالَ الْمُشْرِكُوْنَ لِلنَّبِيِّ صلى الله عليه وسلم: اُطْرُدُ هَؤُلَاءِ لَا يَجْتَرِؤُوْنَ عَلَيْنَا. قَالَ: وَكُنْتُ أَنَا وَابْنُ مَسْعُوْدٍ وَرَجُلٌ مِنْ هُذَيْلٍ وَبِلَالٌ ورَجُلَانِ لَسْتُ أُسَمِّيْهِمَا فَوَقَعَ فِيْ نَفْسِ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم مَا شَاءَ اللهُ أَنْ يَقَعَ فَحَدَّثَ نَفْسَهُ فَأَنْزَلَ اللهُ تَعَالى: [وَلَا تَطْرُدِ الَّذِيْنَ يَدْعُوْنَ رَبَّهُمْ بِالْغَدَاةِ وَالْعَشِيِّ يُرِيْدُوْنَ وَجْهَهُ. 6: 52]. رَوَاهُ مُسْلِمٌ .

6202. (7) [3/1748 దృఢం]

స’అద్‌ (ర) కథనం: మేము ఆరుగురము ప్రవక్త (స) వెంట ఉండేవాళ్ళం. మక్కహ్ అవిశ్వాసులు ప్రవక్త (స)తో, ‘వీరు మా పట్ల భయంలేకుండా పోతున్నారు, వీరిని మీ నుండి దూరం చేయండి,’ అని అన్నారు. ఆ ఆరుగురిలో నేనొకడ్ని, 2.అబ్దుల్లాహ్‌ బిన్‌ మస్‌’ఊద్‌, 3. హుజై’ల్‌ తెగకు చెందిన ఒక వ్యక్తి, 4. బిలాల్‌, 5,6. ఇంకా ఇద్దరు, వారిపేర్లు నేను తెలుపను. అనంతరం ప్రవక్త (స) మనసులో ఒక మాట మెదిలింది. ప్రవక్త (స) ఇలా ఆలోచించారు. ఇంతలో: ”మరియు ఎవరైతే తమ ప్రభువును ఉదయం మరియు సాయంత్రం ప్రార్థిస్తూ, ఆయన ముఖాన్ని (చూడ) గోరుతున్నారో, వారిని నీవు దూరం చేయకు…” (అల్-అన్ ఆమ్, 6:52) అనే ఆయతు అవతరించింది.[31](ముస్లిమ్‌)

6203 – [ 8 ] ( مُتَّفَقٌ عَلَيْهِ ) (3/1748)

وَعَنْ أَبِيْ مُوْسَى أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم قَالَ لَهُ: “يَا أَبَا مُوْسَى لَقَدْ أُعْطِيْتَ مِزْمَارًا مِنْ مَزَامِيْرٍ آلِ دَاوُدَ”. مُتَّفَقٌ عَلَيْهِ.

6203. (8) [3/1748 ఏకీభవితం]

అబూ మూసా (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఓ అబూ మూసా! నీకు దావూద్‌ కుటుంబంలాంటి మధుర గొంతు ప్రసాదించబడింది.” (బు’ఖారీ, ముస్లిమ్‌)

6204- [ 9] ( مُتَّفَقٌ عَلَيْهِ ) (3/1748)

وَعَنْ أَنَسٍ قَالَ: جَمَعَ الْقُرْآنَ عَلَى عَهْدٍ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم أَرْبَعَةٌ: أُبَيُّ بْنُ كَعْبٍ وَمُعَاذُ بْنُ جَبَلٍ وَزَيْدُ بْنُ ثَابِتٍ وَأَبُوْ زَيْدٍ. قِيْلَ لِأَنَسٍ: مَنْ أَبُوْزَيْدٍ؟ قَالَ: أَحَدُ عُمُوْمَتِيْ.

6204. (9) [3/1748ఏకీభవితం]

అనస్‌ (ర) కథనం: ప్రవక్త (స) కాలంలో, నలుగురు అనుచరులు ఖుర్‌ఆన్‌ను ఒకచోట చేర్చారు. వారిలో 1. ఉబయ్‌ బిన్‌ క’అబ్‌, 2. మ’ఆజ్‌’ బిన్‌ జబల్‌, 3. జైద్‌ బిన్‌ సా’బిత్‌, ఇంకా 4. అబూ ‘జైద్‌. అనస్‌ (ర) ను అబూ ‘జైద్‌ ఎవరని ప్రశ్నిస్తే, దానికి అతను, ‘మా చిన్నాన్న,’ అని అన్నారు. (బు’ఖారీ, ముస్లిమ్‌)

6205 – [ 10 ] ( مُتَّفَقٌ عَلَيْهِ ) (3/1748)

وَعَنْ خَبَّابِ بْنِ الْأَرَتِّ قَالَ: هَاجَرْنَا مَعَ رَسُوْلِ اللهِ صلى الله عليه و سلم نَبْتَغِيْ وَجْهَ اللهِ تَعَالى. فَوَقَعَ أَجْرُنَا عَلَى اللهِ فَمِنَّا مَنْ مَضَى لَمْ يَأْكُلْ مِنْ أَجْرِهِ شَيْئًا مِنْهُمْ: مُصْعَبُ بْنُ عُمَيْرٍ قُتِلَ يَوْمَ أُحُدٍ فَلَمْ يُوْجَدْ لَهُ مَا يُكَفَّنُ فِيْهِ إِلَّا نَمِرَةٌ فَكُنَّا إِذَا غَطيْنَا بِهَا رَأْسَهُ خَرَجَتْ رِجْلَاهُ وَإِذَا غَطَّيْنَا رِجْلَيْهِ خَرَجَ رَأْسُهُ فَقَالَ النَّبِيُّ صلى الله عليه وسلم: “غَطُّوْاِبِهَا رَأْسَهُ وَاجْعَلُوْا عَلَى رَجْلَيْهِ الْإِذْخِر”. وَمِنَّا مَنْ أَيْنَعَتْ لَهُ ثَمَرَتُهُ فَهُوَ يَهْدِبُهَا. مُتَّفَقٌ عَلَيْهِ.

6205. (10) [3/1748 ఏకీభవితం]

ఖబ్బాబ్‌ బిన్‌ అరత్తి (ర) కథనం: మేము ప్రవక్త (స) వెంట వలస వెళ్ళాము. మా ఉద్దేశ్యం దానివల్ల దైవప్రీతి లభించాలని. దాని ప్రతిఫలం అల్లాహ్‌ (త)పై తప్పనిసరి అయిపోయింది. మాలో కొందరు మరణించారు. వాళ్ళు ప్రాపంచిక ప్రతిఫలంగానీ, బహుమతులుగానీ పొందలేదు. వారిలో ముస్‌’అబ్‌ బిన్‌ ‘ఉమైర్‌ (ర) ఉన్నాడు. అతడు ఉ’హుద్‌ నాడు వీరమరణం పొందాడు. అతని కఫన్‌ కోసం వస్త్రం లభించలేదు. కేవలం ఒక్క దుప్పటి మాత్రమే లభించింది. అది కూడా తల కప్పితే, కాళ్ళు కనబడేవి. కాళ్ళు కప్పితే తల కనబడేది. అనంతరం ప్రవక్త (స), ‘తలను దుప్పటితో కప్పి కాళ్ళను గడ్డితో కప్పమని,’ ఆదేశించారు. మనలోని కొందరు పండి పోయారు. ‘వారు పండ్లు ఏరుతున్నారు,’ అని అన్నారు. (బు’ఖారీ, ముస్లిమ్‌)

6206 – [ 11 ] ( مُتَّفَقٌ عَلَيْهِ ) (3/1749)

وَعَنْ جَابِرٍقَالَ: سَمِعْتُ النَّبِيَّ صلى الله عليه وسلم يَقُوْلُ: “اِهْتَزَّ الْعَرْشُ  لِمَوْتِ سَعْدِ بْنِ مُعَاذٍ”. مُتَّفَقٌ عَلَيْهِ .

وَفِيْ رِوَاَيَةٍ: “اِهْتَزَّ عَرْشُ الرَّحْمنِ لِمَوْتِ سَعْدِ بْنِ مُعَاذٍ”.

6206. (11) [3/1749 ఏకీభవితం]

జాబిర్‌ (ర) కథనం: నేను ప్రవక్త (స) ద్వారా ఇలా విన్నాను. ”స’అద్‌ బిన్‌ మ’ఆజ్‌ మరణం వల్ల దైవ సింహాసనం  కంపించింది.” (బు’ఖారీ, ముస్లిమ్‌)

మరో ఉల్లేఖనంలో ఇలా ఉంది, ”స’అద్‌ బిన్‌ మ’ఆజ్‌ మరణం వల్ల ర’హ్మాన్‌ సింహాసనం కంపించింది.”

6207 – [ 12 ] ( مُتَّفَقٌ عَلَيْهِ ) (3/1749)

وَعَنِ الْبَرَاءِ قَالَ: أُهْدِيَتْ لِرَسُوْلِ اللهِ صلى الله عليه وسلم حُلةُ حَرِيْرِ فَجَعَلَ أَصْحَابُهُ يَمَسُّوْنَهَا وَيَتَعَجَّبُوْنَ مِنْ لِيْنِهَا فَقَالَ: “أَتَعْجَبُوْنَ مِنْ لِيْنِ هَذِهِ؟ لَمَنَادِيْلُ سَعْدِ بْنِ مُعَاذٍ فِي الْجَنَّةِ خَيْرٌ مِنْهَا وَأَلْيَنُ”. مُتَّفَقٌ عَلَيْهِ.

6207. (12) [3/1749 ఏకీభవితం]

బరాఅ’ బిన్‌ ‘ఆ’జిబ్‌ (ర) కథనం: ప్రవక్త (స)కు పట్టు వస్త్రాలు కానుకగా ఇవ్వబడ్డాయి. అనుచరులు దాన్ని చేత్తో నిమరసాగారు. ‘అవి చాలా సున్నితంగా ఉన్నాయని  పొగిడారు.’ అది చూచిప్రవక్త (స), ‘మీరు ఈ దుస్తుల సున్నితత్వంపై ఆశ్చర్యపడు తున్నారా? స్వర్గంలో స’అద్‌ బిన్‌ మ’ఆజ్‌’కు లభించే రుమాలు ఇంతకన్నా ఎన్నోరెట్లు సున్నితంగా ఉంటుంది,’ అని అన్నారు. (బు’ఖారీ, ముస్లిమ్‌)

6208 – [ 13 ] ( مُتَّفَقٌ عَلَيْهِ ) (3/1749)

وَعَنْ أُمِّ سُلَيْمٍ أَنَّهَا قَالَتْ: يَا رَسُوْلَ اللهِ أَنَسٌ خَادِمُكَ اُدْعُ اللهَ لَهُ قَالَ: “اَللّهُمَّ أَكْثِرْمَالَهُ وَوَلَدَهُ وَبَارِكْ فِيْمَا أَعْطَيْتَهُ” .قَالَ أَنَسٌ: فَوَ اللهِ إِنَّ مَالِيْ لَكَثِيْرٌوَإِنَّ وَلَدِيْ وَوَلَدَ وَلَدِيْ لَيَتَعَادَّوْنَ عَلَى نَحْوِ الْمِائَةِ الْيَوْمَ. مُتَّفَقٌ عَلَيْهِ .

6208. (13) [3/1748ఏకీభవితం]

ఉమ్మె సులైమ్‌ (ర) కథనం: నేను, ‘ఓ ప్రవక్తా! అనస్‌ మీ సేవకుడు. తమరు వాడి గురించి దు’ఆ చేయండి,’ అని విన్నవించుకున్నాను. అప్పుడు ప్రవక్త (స), ‘ఓ అల్లాహ్‌ (త)! వీడికి ధన,సంతాన సంప దలు పుష్కలంగా ప్రసాదించు. ఇంకా వీడికి ప్రసాదించిన వాటిలో శుభం ప్రసాదించు,’ అని  ప్రార్థించారు.

అనస్‌ (ర) కథనం: అల్లాహ్(త) సాక్షి! నా దగ్గర చాలా ధనం ఉంది, ఇంకా నాకు 100 కంటే అధికంగా సంతానం ఉంది. (బు’ఖారీ, ముస్లిమ్‌)

6209 – [ 14 ] ( مُتَّفَقٌ عَلَيْهِ ) (3/1749)

وَعَنْ سَعْدِ بْنِ أَبِيْ وَقَّاص قَالَ: مَا سَمِعْتُ النَّبِيَّ صلى الله عليه وسلم يَقُوْلُ لِأَحَدٍ يَمْشِيْ عَلَى وَجْهِ الْأَرْضِ. “إِنَّهُ مِنْ أَهْلِ الْجَنَّةِ” إِلَّا لِعَبْدِ اللهِ بْنِ سَلَامٍ. مُتَّفَقٌ عَلَيْهِ.

6209. (14) [3/1749 ఏకీభవితం]

స’అద్‌ బిన్‌ అబీ వఖ్ఖా’స్‌ (ర) కథనం: నేను ‘ప్రవక్త (స) స్వర్గవాసి,’ అని అనడం, అబ్దుల్లాహ్‌ బిన్‌ సలామ్‌ గురించి తప్ప మరెవరినీ గురించీ వినలేదు. (బు’ఖారీ, ముస్లిమ్)

6210 – [ 15 ] ( مُتَّفَقٌ عَلَيْهِ ) (3/1749)

وَعَنْ قَيْسِ بْنِ عُبَادٍ قَالَ: كُنْتُ جَالِسًا فِي مَسْجِدِ الْمَدِيْنَةِ فَدَخَلَ رَجُلٌ عَلَى وَجْهِهِ أَثَرُ الْخُشُوْعِ فَقَالُوْا: هَذَا رَجُلٌ مِنْ أَهْلِ الْجَنَّةِ فَصَلّى رَكْعَتَيْنِ تَجَوَّزَ فِيْهِمَا ثُمَّ خَرَجَ وَتَبِعْتُهُ فَقُلْتُ: إِنَّكَ حِيْنَ دَخَلْتَ الْمَسْجِدَ قَالُوْا: هَذَا رَجُلٌ مِنْ أَهْلِ الْجَنَّةِ. قَالَ: وَاللهِ مَا يَنْبَغِيْ لِأَحَدٍ أَنْ يَقُوْلُ مَا لَا يَعْلَمُ فَسَأُحَدِّثُكَ لَمْ ذَاكَ؟ رَأَيْتُ رُؤْيَا عَلَى عَهْدِ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم فَقَصَصْتُهَا عَلَيْهِ وَرَأَيْتُ كَأَنِّيْ فِيْ رَوْضَةٍ ذَكَرَ مِنْ سَعَتِهَا وَخُضْرَتِهَا- وَسْطَهَا عُمُوْدٌ مِنْ حَدِيْدٍ أَسْفَلُهُ فِي الْأَرْضِ وَ أَعْلَاهُ فِي السَّمَاءِ فِيْ أَعْلَاهُ عُرْوَةٌ فَقِيْلَ لِيْ: اِرْقَهُ. فَقُلْتُ: لَا أَسْتَطِيْعُ فَأَتَانِيْ مِنْصَفٌ فَرَفَعَ ثِيَابِيْ مِنْ خَلْفِيْ فَرَقِيْتُ حَتّى كُنْتُ فِيْ أَعْلَاهُ فَأَخَذْتُ بِالْعُرْوَةِ فَقِيْلَ: اِسْتَمْسِكُ فَاسْتَيْقَظْتُ وَإِنَّهَا لَفِيْ يَدِيْ فَقَصَصْتُهَا عَلَى النَّبِيِّ صلى الله عليه وسلم. فَقَالَ: “تِلْكَ الرَّوْضَةُ الْإِسْلَامِ وَذَلِكَ الْعُمُوْدُعُمُوْدُ الْإِسْلَامِ وَتِلْكَ الْعُرْوَةَ الْعُرْوَةُ الْوُثْقَى فَأَنْتَ عَلَى الْإِسْلَامِ حَتّى تَمُوْتَ وَذَاكَ الرَّجُلُ عَبْدُ اللهِ بْنِ سَلَامٍ”.

6210. (15) [3/1749 ఏకీభవితం]

ఖైస్‌ బిన్‌ ‘ఉబాద్‌ (ర) కథనం: నేను మస్జిద్‌ నబవీలో కూర్చొని ఉన్నాను. ఇంతలో ఒక వ్యక్తి మస్జిద్‌లోనికి వచ్చాడు. అతని ముఖంపై భయ భక్తులు ఉట్టి పడుతున్నాయి. ప్రజలు అతన్ని చూచి, ‘ఇతడు స్వర్గవాసి,’ అని అన్నారు. ఆ వ్యక్తి రెండు రకాతులు సంక్షిప్తంగా చదివాడు. మస్జిద్‌ నుండి బయలుదేరాడు. నేనతన్ని అనుసరించి, ”మీరు మస్జిద్‌లో ప్రవేశించగానే ప్రజలు, ‘ఈ వ్యక్తి స్వర్గవాసి,’ అని అన్నారు,” అని అన్నాను. దానికి ఆ వ్యక్తి, ‘అల్లాహ్(త) సాక్షి! ఎవరికీ తనకు తెలియని విషయాన్ని గురించి చెప్పటం తగదు. వారలా ఎందుకు అన్నారో నేను నీకు చెబుతాను. ప్రవక్త (స) కాలంలో నేనొక స్వప్నం చూసాను. ప్రవక్త (స) ముందు దాన్ని గురించి ప్రస్తావించాను. ‘నేనొక తోటలో ఉన్నాను. అతడు దాని పొడవు వెడల్పులు, ప్రత్యేకతలను గురించి పేర్కొన్నాడు. ఇంకా ఆ తోట మధ్య ఒక ఇనుప స్తంభం ఉంది. దాని క్రింది  భాగం నేల, పై భాగం  ఆకాశం ఉంది. ఆ స్తంభంపై ఒక సీటు ఉంది. నన్ను దానిపై ఎక్కమని ఆదేశించటం జరిగింది. ‘నేను ఎక్కలేను,’ అని అన్నాను. అనంతరం ఒక సేవకుడు నా వద్దకు వచ్చాడు. నా వెనుక నుండి నా దుస్తులు ఎత్తాడు. నేను పైకి ఎక్కసాగాను. చివరికి నేను ఆ స్తంభం పైకి ఎక్కాను. నేను ఆ సీటును పట్టు కున్నాను. అనంతరం నన్ను దాన్ని గట్టిగా పట్టుకోమని చెప్పబడింది. నా చేతిలో ఆ గుండ్రని భాగం ఉంది. ఇంతలో మేల్కొన్నాను. నేను దీన్ని గురించి ప్రవక్త (స) కు తెలియ పరిస్తే ప్రవక్త (స) ఆ స్తంభం ఇస్లామ్‌, ఆ గుండ్రని పై భాగం దృఢమైన ఆధారం, నీవు మరణం వరకు ఇస్లామ్‌పై స్థిరంగా ఉంటావు,’ అని అన్నారు. ఆ వ్యక్తి ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ సలామ్‌ అని అన్నారు.”  (బు’ఖారీ, ముస్లిమ్‌)

6211 – [ 16 ] ( صحيح ) (3/1750)

عَنْ أَنَسٍ قَالَ: كَانَ ثَابِتُ بْنُ قَيْسِ بْنِ شَمَّاسٍ خَطِيْبَ الْأَنْصَارِ. فَلَمَّا نَزَلَتْ هَذِهِ الْآيَةِ:[يَا أَيُّهَا الَّذِيْنَ آمَنُوْا لَا تَرْفَعُوْا أَصْوَاتكُمْ فَوْقَ صَوْتَ النَّبِيِّ…؛49: 2 ] إِلى آخِرِ الْآيَةِ جَلَسَ ثَابِتٌ فِيْ بَيْتِهِ وَاحْتَبَسَ عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم. فَسَأَلَ النَّبِيُّ صلى الله عليه وسلم سَعْدَ بْنَ مُعَاذٍ. فَقَالَ: “مَا شَأْنُ ثَابِتٍ اَيَشْتَكِىْ؟” فَأَتَاهُ سَعْدٌ فَذَكَرَ لَهُ قَوْلَ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم. فَقَالَ ثَابِتٌ :أُنْزِلَتْ هَذِهِ الْآيَةُ وَلَقَدْ عَلِمْتُمْ أَنِّيْ مِنْ أَرْفَعِكُمْ صَوْتًا عَلَى رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم. فَأَنَا مِنْ أَهْلِ النَّارِ فَذَكَرَ ذَلِكَ سَعْدٌ لِلنَّبِيِّ صلى الله عليه وسلم. فَقَالَ رَسُوْلُ الله صلى الله عليه وسلم: “بَلْ هُوَ مِنْ أَهْلِ الْجَنَّةِ”. رَوَاهُ مُسْلِمٌ.

6211. (16) [3/1750దృఢం]

అనస్‌ (ర) కథనం: సా’బిత్‌ బిన్‌ ఖైస్‌ బిన్‌ మ్మాస్‌ అ’న్సారుల్లో ‘ఖ’తీబ్‌గా ఉండేవారు. ” ఓ విశ్వాసులారా! మీ కంఠస్వరాలను, ప్రవక్త కంఠ స్వరాని కంటే పెంచకండి మరియు మీరు పరస్పరం ఒకరితోనొకరు వెచ్చల విడిగా మాట్లాడుకునే విధంగా అతనితో మాట్లాడకండి, దానివల్ల మీకు తెలియ కుండానే, మీ కర్మలు వ్యర్థం కావచ్చు!” – (అల్ -హుజురాత్, 49:2) అనే ఆయతు అవతరించినపుడు సా’బిత్‌ తన ఇంట్లో కూర్చుండి పోయారు. ప్రవక్త (స) వద్దకు రావటం మానివేసారు. ప్రవక్త (స) స’అద్‌ బిన్‌ మ’ఆజ్‌’ను, సా’బిత్‌ గురించి అడిగారు. అనంతరం స’అద్‌ (ర), సా’బిత్‌ (ర) వద్దకు వచ్చారు. ప్రవక్త (స) అతన్ని అడిగినట్లు చెప్పారు. సాబి’త్‌ అది విని, ”ఓ విశ్వాసులారా! మీ స్వరాలను ప్రవక్త (స) స్వరాలపై  అధిగమించ నీయకండి,” అనే ఆయతు అవత రించింది, నా గొంతు ప్రవక్త (స) వద్ద మీ అందరి గొంతుకంటే చాలా బిగ్గరగా ఉండేది, కనుక నేను నరక వాసినని తన మనసులోని మాటను బయటపెట్టారు. అనంతరం స’అద్‌ ఈ విషయాన్ని ప్రవక్త (స) ముందు పెట్టారు. దానికి ప్రవక్త (స) ‘అలా కాదు, సా’బిత్‌ స్వర్గవాసి,’ అని అన్నారు. (ముస్లిమ్‌)

6212 – [ 17 ] ( مُتَّفَقٌ عَلَيْهِ ) (3/1750)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: كُنَّا جُلُوْسًا عِنْدَ النَّبِيِّ صلى الله عليه وسلم إِذْ نَزَلَتْ سُوْرَةُ الْجَمُعَةِ فَلَمَّا نَزَلَتْ [وَآخَرِيْنَ مِنْهُمْ لَمَّا يَلْحَقُوْا بِهِمْ…؛62: 3] قَالُوْا: مَنْ هَؤُلَاءِ يَا رَسُوْلَ اللهِ؟ قَالَ: وَفِيْنَا سَلْمَانُ الْفَارِسِيُّ. قَالَ: فَوَضَعَ النَّبِيُّ صلى الله عليه وسلم يَدَهُ عَلَى سَلْمَانَ ثُمَّ قَالَ: “لَوْكَانَ الْإِيْمَانُ عِنْدَ الثُّرَيَّا لَنَالَهُ رِجَالٌ مِنْ هَؤُلَاءِ”. مُتَّفَقٌ عَلَيْهِ.

6212. (17) [3/1750 ఏకీభవితం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: మేము ప్రవక్త (స) వద్ద కూర్చొని ఉన్నాం. ఇంతలో సూరహ్‌ జుము’అహ్‌ (62) అవతరించింది. ” మరియు ఇంకా వారిలో చేరని ఇతరులకు కూడా (బోధించటానికి)…” (అల్-జుము ‘అహ్, 62:3) అనే ఆయతు అవతరించినపుడు అనుచరులు, ‘ఓ ప్రవక్తా! వారెవరు?’ అని విన్నవించు కున్నారు. అప్పుడు మాలో సల్మాన్‌ ఫారిసీ కూడా ఉన్నారు. ప్రవక్త (స) తన చేతిని సల్మాన్‌పై పెట్టి, ఒకవేళ విశ్వాసం సు’రయ్యాపై ఉన్నా, వీరిలో కొంత మంది దాన్ని సంపాదిస్తారు, పొందుతారు,’ అని అన్నారు. (బు’ఖారీ, ముస్లిమ్‌)

6213 – [ 18 ] ( صحيح ) (3/1750)

وعَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “اَللّهُمَّ حَبِّبْ عُبَيْدَكَ هَذَا”. يَعْنِيْ أَبَا هُرَيْرَةَ “وَأُمَّهُ إِلَى عِبَادِكَ الْمُؤْمِنِيْنَ وَحَبَّبْ إِلَيْهِمُ الْمُؤْمِنِيْنَ”. رَوَاهُ مُسْلِمٌ .

6213. (18) [3/1750 దృఢం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఓ అల్లాహ్‌(త)! నీ ఈ దాసుణ్ణి అంటే అబూ హురైరహ్‌ను మరియు అతని తల్లిగారిని, నీ దాసులకు ప్రియమైన వారుగా ఇంకా విశ్వాసులను వారికి ప్రియమైన వారుగా చేయి.” (ముస్లిమ్‌)

6214 – [ 19 ] ( صحيح ) (3/1751)

وعَنْ عَائِذِ بْنِ عَمْرٍو أَنَّ أَبَا سُفْيَانَ أَتَى عَلَى سَلْمَانَ وَصُهَيْبٍ وَبِلَالٍ فِيْ نَفَرٍ فَقَالُوْا: مَا أَخَذَتْ سُيُوْفُ اللهِ مِنْ عُنُقِ عَدُوِّ اللهِ مَأخَذَهَا. فَقَالَ أَبُوْ بَكْرٍ: أَتَقُوْلُوْنَ هَذَا لِشَيْخِ قُرَيْشٍ وَسَيِّدِهِمْ؟ فَأَتَى النَّبِيّ صلى الله عليه وسلم فَأَخْبَرَهُ. فَقَالَ: يَا أَبَا بَكْرٍ لَعَلَّكَ أَغْضَبْتَهُمْ لَئِنْ كُنْتَ أَغْضَبْتَهُمْ لَقَدْ أَغْضَبْتَ رَبَّكَ”. فَأَتَاهُمْ فَقَالَ: يَا إِخْوَتَاهُ أَغْضَبْتُكُمْ قَالُوْا: لَا يَغْفِرُ اللهُ لَكَ يَا أُخَيَّ. رَوَاهُ مُسْلِمٌ.

6214 (19) [3/1751 దృఢం]

‘ఆఇ’జ్‌’ బిన్‌ ‘అమ్ర్‌ (ర) కథనం: అబూ సుఫియాన్‌, సల్మాన్‌, ‘సుహైబ్‌ మరియు బిలాల్‌ మొదలైన వారు కూర్చున్న ఒక సభ ప్రక్క నుండి వెళ్ళడం జరిగింది. అప్పుడు వారు, ”ఇంకా అల్లాహ్‌(త) కరవాలాలు, ఆయన (త) శత్రువుల మెడలు నరకలేదు,” అని అన్నారు. అది విని అబూ బకర్‌ (ర), ‘మీరు ఖురైషుల నాయకుల గురించి అంటున్నారా?’ అని అన్నారు. అనంతరం అబూ బకర్‌ (ర), ప్రవక్త (స) వద్దకు వచ్చారు. జరిగిన విషయం గురించి ప్రస్తా వించారు. అప్పుడు ప్రవక్త (స), ‘ఓ అబూ బకర్‌! నీవు వాళ్ళను అయిష్టానికి గురిచేసినట్లుంది, ఒకవేళ నీవు వారిని అయిష్టానికి గురిచేస్తే, నీవు అల్లాహ్(త)ను, అయిష్టానికి గురిచేసి నట్టే,’ అని అన్నారు. అనంతరం అబూ బకర్‌ (ర) వారి వద్దకు వచ్చి, ‘సోదరులారా! నేను మిమ్మల్ని అయిష్టానికి గురిచేసానా?’ అని అడిగారు. దానికి వారు సమాధానం ఇస్తూ, ‘లేదు, అల్లాహ్‌(త) మిమ్మల్ని క్షమించుగాక!’ అని  అన్నారు. (ముస్లిమ్‌)

6215 – [ 20 ] ( مُتَّفَقٌ عَلَيْهِ ) (3/1751)

وَعَنْ أَنَسٍ عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ: “آيَةُ الْإِيْمَانِ حُبُّ الْأَنْصَارِ وَآيَةُ النِّفَاقِ بُغْضُ الْأَنْصَارِ”. مُتَّفَقٌ عَلَيْهِ.

6215. (20) [3/1751 ఏకీభవితం]

అనస్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”అ’న్సారులను ప్రేమించటం విశ్వాసానికి చిహ్నం, అ’న్సారుల పట్ల ద్వేషం కలిగి ఉండటం కాపట్యానికి నిదర్శనం.”  (బు’ఖారీ, ముస్లిమ్‌)

6216 – [ 21 ] ( مُتَّفَقٌ عَلَيْهِ ) (3/1751)

وَعَنِ ا لْبَرَاءِ قَالَ: سَمِعْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ: “اَلْأَنْصَارُ لَا يُحِبُّهُمْ إِلَّا مُؤْمِنٌ وَلَا يُبْغِضُهُمْ إِلَّا مُنَافِقٌ. فَمَنْ أَحَبَّهُمْ أَحَبَّهُ اللهُ وَمَنْ أَبْغَضَهُمْ أَبْغَضَهُ اللهُ”. مُتَّفَقٌ عَلَيْهِ.

6216. (21) [3/1741 ఏకీభవితం]

బరాఅ’ బిన్‌ ‘ఆజి’బ్‌(ర) కథనం: ప్రవక్త (స) ఇలా ప్రవచిస్తూ ఉండగా నేను విన్నాను. ”విశ్వాసులు మాత్రమే అ’న్సార్లను ప్రేమిస్తారు, కపటాచారులే అ’న్సార్ల పట్ల ద్వేషం కలిగి ఉంటారు. అందువల్ల అన్సార్లను ప్రేమించే వారిని అల్లాహ్‌ (త) ప్రేమిస్తాడు. అ’న్సార్ల పట్ల శత్రుత్వం కలిగి ఉండే వ్యక్తి అల్లాహ్‌ (త)తో శత్రుత్వం కొని తెచ్చుకున్నట్టే. (బు’ఖారీ, ముస్లిమ్‌)

6217 – [ 22 ] ( مُتَّفَقٌ عَلَيْهِ ) (3/1751)

وَعَنْ أَنَسٍ قَالَ: إِنَّ نَاسًا مِنَ الْأَنْصَارِ قَالُوْا حِيْنَ أَفَاءَ اللهُ عَلَى رَسُوْلِهِ صلى الله عليه وسلم مِنْ أَمْوَالِ هَوَازِنَ مَا أَفَاءَ فَطَفِقَ يُعْطِيْ رِجَالًا مِنْ قُرَيْشٍ اَلْمِائَةَ مِنَ الْإِبِلِ فَقَالُوْا: يَغْفِرُ اللهُ لِرَسُوْلِ اللهِ صلى الله عليه وسلم يُعْطِيْ قُرَيْشًا وَيَدَعُنَا وَسُيُوْفُنَا تَقْطُرُ مِنْ دِمَائِهِمْ فَحُدِّثَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم بِمَقَالَتِهِمْ فَأَرْسَلَ إِلى الْأَنْصَارِ فَجَمَعَهُمْ فِيْ قُبَّةٍ مِنْ أَدَمٍ وَلَمْ يَدْعُ مَعَهُمْ أَحَدًا غَيْرَهُمْ. فَلَمَّا اجْتَمَعُوْا جَاءَهُمْ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم. فَقَالَ: “مَا كَانَ حَدِيْثٌ بَلَغَنِيْ عَنْكُمْ؟” فَقَالَ فُقَهَاؤُهُمْ: أَمَّا ذَوُوْ رَأَيْنَا يَا رَسُوْلَ اللهِ فَلَمْ يَقُوْلُوْا شَيْئًا وَأَمَّا أُنَاسٌ مِنَّا حَدِيْثَةُ أَسْنَانِهِمْ. قَالُوْا: يَغْفِرُ اللهُ لِرَسُوْلِ اللهِ صلى الله عليه وسلم يُعْطِيْ قُرَيْشًا وَيَدَعُ الْأَنْصَارَ وَسُيُوْفُنَا تَقْطُرُ مِنْ دِمَائِهِمْ. فَقَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِنِّيْ أُعْطِيْ رَجَالًا حَدِيْثِيْ عَهْدٍ بِكُفْرٍ أَتَأَلَّفُهُمْ أَمَا تَرْضَوْنَ أَنْ يَذْهَبَ النَّاسُ بِالْأَمْوَالِ وَتَرْجِعُوْنَ إِلى رِحَالِكُمْ بِرَسُوْلِ اللهِ صلى الله عليه وسلم”. قَالُوْا بَلَى يَا رَسُوْلَ اللهِ قَدْ رَضِيْنَا. مُتَّفَقٌ عَلَيْهِ.

6217. (22) [3/1751 ఏకీభవితం]

అనస్‌ (ర) కథనం: అల్లాహ్‌(త) తన ప్రవక్తకు హవా’జిన్‌ తెగవారి యుద్ధ ధనాన్ని ప్రసాదించి నపుడు, ప్రవక్త (స) ఖురైష్‌కు చెందిన అనేకమందికి, 100 ఒంటెలు చొప్పున పంచసాగారు. అది చూచిన అన్సారుల్లోని కొందరు, ”అల్లాహ్‌ (త) ప్రవక్త (స)ను క్షమించుగాక! అతను(స), ఖురైషులకు ఇంత ఇస్తున్నారు. కాని, మాకు ఇవ్వటం లేదు. అసలు మా కరవాలాల నుండి ఖురైషుల రక్తం కారుతుంది,” అని అన్నారు. అనంతరం అ’న్సార్లు ఇలా అంటున్నారని ప్రవక్త (స)కు తెలియ పర్చటం జరిగింది. ప్రవక్త (స) అన్సార్లను పిలిపించి, ఒక గదిలో అందరినీ ప్రోగుచేసి వారు తప్ప ఎవరూ లేరు. వారందరూ వచ్చిన తర్వాత ప్రవక్త (స) వారి వద్దకు వచ్చి, ‘మీ గురించి ఇలా విన్నాను,’ అని అన్నారు. అప్పుడు వారిలోని వివేకవంతులు, ‘ఓ ప్రవక్తా! మాలోని బుద్ధిమంతులు ఏమీ అనలేదు. అయితే యువకులు మాత్రం,” అల్లాహ్‌(త), ప్రవక్త (స)ను క్షమించుగాక! అతను (స), ఖురైషులకు చాలా అధికంగా ఇచ్చారు, కాని మాకు మాత్రం ఏమీ ఇవ్వలేదు. వాస్తవం ఏమిటంటే మా కరవాలాల నుండి ఖురైషుల రక్తం కారుతుంది,’ అని అన్నారు, అని,” విన్నవించుకున్నారు. అది విని ప్రవక్త (స), ”నిస్సందేహంగా నేను ఖురైషుల్లోని ఇప్పుడిప్పుడే ఇస్లామ్‌ స్వీకరించిన వారికి ఇస్తూ ప్రోత్సహిస్తున్నాను. అయితే, ప్రజలు తమ ఇళ్ళకు ధన సంపదలతో వెళ్ళడం, మీరు మీ ఇళ్ళకు దైవప్రవక్తను తీసుకు వెళ్ళడం మీకు ఇష్టం లేదా?” అని అడిగారు. అన్సార్లు ఈ మాటలు విని, ”తప్పకుండా ఓ ప్రవక్తా! మేము దీనికి సమ్మతి స్తున్నాం,” అని అన్నారు. (బు’ఖారీ, ముస్లిమ్‌)

6218 – [ 23 ] ( صحيح ) (3/1752)

وعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: قَالَ رَسُوْلُ الله صلى الله عليه وسلم: “لَوْلَا الْهِجْرَةُ لَكُنْتُ امْرَءًا مِنَ الْأَنْصَارِ وَلَوْ سَلَكَ النَّاسُ وَادِيًا وَسَلَكَتِ الْأَنْصَارُ وَادِيًا أَوْ شِعْبًا لَسَلَكْتُ وَادِيَ الْأَنْصَارِ وَشِعْبَهَا وَالْأَنْصَارُ شِعَارٌ وَالنَّاسُ دِثَارٌ إِنَّكُمْ سَتَرَوْنَ بَعْدِيْ أَثْرَةً فَاصْبِرُوْا حَتّى تَلْقَوْنِيْ عَلَى الْحَوْضِ”. روَاهُ الْبُخَارِيُّ.

6218. (23) [3/1752 దృఢం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఒకవేళ హిజ్రత్‌ లేకుంటే, నేను అ’న్సారుల్లో ఒకడినై ఉండేవాడిని. ఒకవేళ ప్రజలు ఒక మార్గం గుండా, అ’న్సార్లు మరో మార్గం గుండా వెళితే నేను అ’న్సారుల మార్గాన్ని అనుసరించేవాడిని. అ’న్సారులు షి’ఆర్‌ వంటివారు. ఇతరులు దిసా’ర్‌ వంటి వారు. నా తరువాత మీరు హెచ్చుతగ్గులు చూస్తారు. అప్పుడు మీరు సహనం పాటించాలి. చివరికి మీరు నన్ను కౌస’ర్‌ సరస్సు  వద్ద  కలుసుకుంటారు.”  [32]  (బు’ఖారీ)

6219 – [ 24 ] ( صحيح ) (3/1752)

وعَنْهُ قَالَ: كُنَّا مَعَ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم يَوْمَ الْفَتْحِ فَقَالَ: “مَنْ دَخَلَ دَارَ أَبِيْ سُفْيَانَ فَهُوَ آمِنٌ وَمَنْ أَلْقَى السِّلَاحَ فَهُوَ آمِنٌ”. فَقَالَتِ الْأَنْصَارُ: أَمَّا الرَّجُلُ فَقَدْ أَخَذَتْهُ رَأفَةٌ بِعَشِيْرَتِهِ وَرَغَبَةٌ فِيْ قَرْيَتِهِ. وَنَزَلَ الْوَحْيُ عَلَى رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم. قَالَ: “قُلْتُمْ أَمَّا الرَّجُلُ فَقَدْ أَخَذَتْهُ رَأفَةٌ بِعَشِيْرَتِهِ وَرَغَبَةٌ فِيْ قَرْيَتِهِ كَلّا إِنِّيْ عَبْدُ اللهِ وَرَسُوْلُهُ هَاجَرَتْ إِلى اللهِ وَإِلَيْكُمْ فَالْمَحْيَا مَحْيَاكُمْ وَالْمَمَاتُ مَمَاتُكُمْ”. قَالُوْا: وَاللهِ مَا قُلْنَا إِلَّا ضَنًّا بِاللهِ وَرَسُوْلِهِ. قَالَ: “فَإِنَّ اللهَ وَرَسُوْلَهُ يُصَدِّقَانِكُمْ وَيَعْذِرَانِكُمْ”. رَوَاهُ مُسْلِمٌ .

6219. (24) [3/1752దృఢం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: మక్కహ్ విజయం నాడు మేము ప్రవక్త (స) వెంట ఉన్నాం. అప్పుడు ప్రవక్త (స) ”అబూ సుఫియాన్‌ ఇంట్లో ప్రవేశించిన వ్యక్తికి అభయం, ఆయుధాలు వదలివేసిన వానికి అభయం,” అని ప్రకటించారు. అది విన్న అ’న్సారులు, ”ప్రవక్త (స)కు తన తెగవారి ప్రేమ వాత్సల్యం పుట్టుకొచ్చింది. అందువల్లే తమ జాతివారి పట్ల ఈవిధంగా ప్రవర్తిస్తున్నారు,” అని చెప్పుకోసాగారు. అనంతరం ప్రవక్త (స)పై దైవవాణి అవతరించింది. ప్రవక్త(స) అ’న్సారులను పిలిచి, ”ఈ విధంగా మీరు అన్నారా? అలా ఎంతమాత్రం కాదు. నేను అల్లాహ్‌(త) దాసుడను, అల్లాహ్‌ ప్రవక్తను, నేను అల్లాహ్‌(త) వైపు, మీ వైపు వలస వెళ్ళాను. జీవించడం, మరణించటం మీతోనే,” అని అన్నారు. అది విన్న అన్సారులు, ”ఓ ప్రవక్తా! మేము అపార్థానికిగురై అలా పలకసాగాము. అల్లాహ్‌(త) ప్రసాదించిన అనుగ్రహాన్ని మానుండి అల్లాహ్‌(త) దూరం చేయకూడదు గాక! మమ్మల్ని మీ నుండి వేరుచేయ కూడదని ప్రార్థిస్తున్నాము. మేము కేవలం ప్రవక్త (స) సాన్నిహిత్యాన్ని పొందే ఆశతో ఇలా అన్నాం,” అని విన్నవించుకున్నారు. అప్పుడు ప్రవక్త (స), ”అల్లాహ్‌(త) మరియు అల్లాహ్‌ ప్రవక్త మిమ్మల్ని ధృవీకరిస్తున్నారు. ఇంకా మిమ్మల్ని క్షమిస్తున్నారు,” అని  అన్నారు. (ముస్లిమ్‌)

6220 – [ 25 ] ( مُتَّفَقٌ عَلَيْهِ ) (3/1752)

وَعَنْ أَنَسٍ أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم رَأَى صِبْيَانًا وَنِسَاءً مُقْبِلِيْنَ مِنْ عُرْسٍ فَقَامَ النَّبِيُّ صلى الله عليه وسلم فَقَالَ:”اَللّهُمَّ أَنْتُمْ مِنْ أَحَبِّ النَّاسِ إِلَيَّ. اَللّهُمَّ أَنْتُمْ مِنْ أَحَبِ النَّاسِ إِلَيَّ”. يَعْنِي الْأَنْصَارَ. مُتَّفَقٌ عَلَيْهِ.

6220. (25) [3/1752ఏకీభవితం]

అనస్‌ (ర) కథనం: ప్రవక్త (స) పిల్లలను, స్త్రీలను ఒక పెండ్లి నుండి వస్తూఉండటం చూసి నిలబడ్డారు. ఇంకా, ”(ఓ అల్లాహ్‌ (త)! నేను నీ సాక్షిగా అంటున్నాను! మీరు (అ’న్సార్లు) అందరికంటే నాకు చాలా ప్రియమైనవారు. ఓ అల్లాహ్‌ (త), ఓ అన్సారులారా! ప్రజలందరిలో మీరు నాకు ప్రియమైనవారు,” అని అన్నారు. (బు’ఖారీ, ముస్లిమ్‌)

6221 – [ 26 ] ( صحيح ) (3/1752)

وعَنْهُ قَالَ: مَرَّ أَبُوْ بَكْرٍ وَالْعَبَّاس بِمَجْلِسٍ مِنْ مَجَالِسِ الْأَنْصَارِ وَهُمْ يَبْكُوْنَ فَقَالَ: مَا يُبْكِيْكُمْ؟ قَالُوْا: ذَكَرْنَا مَجْلِسَ النَّبِيِّ صلى الله عليه و سلم مِنَّا فَدَخَلَ أَحَدُهُمَا عَلَى النَّبِيِّ صلى الله عليه وسلم فَأَخْبَرَهُ بِذَلِكَ فَخَرَجَ النَّبِيُّ صلى الله عليه وسلم وَقَدْ عَصَّبَ عَلَى رَأْسِهِ حَاشِيَةَ بُرْدٍ فَصَعِدَ الْمِنْبَرَ وَلَمْ يَصْعَدْهُ بَعْدَ ذَلِكَ الْيَوْمِ. فَحَمِدَ اللهُ وَأَثْنَى عَلَيْهِ. ثُمَّ قَالَ: “أُوْصِيْكُمْ بِالْأَنْصَارِ فَإِنَّهُمْ كَرْشِيْ وَعَيْبَتِيْ وَقَدْ قَضَوُا الَّذِيْ عَلَيْهِمْ وَبَقِيَ الَّذِيْ لَهُمْ فَاقْبَلُوْا مِنْ مُحْسِنِهِمْ وَتَجَاوَزُوْا عَنْ مُسِيْئِهِمْ”. روَاهُ الْبُخَارِيُّ.

6221. (26) [3/1752 దృఢం]

అనస్‌ (ర) కథనం: అబూ బకర్‌, ‘అబ్బాస్‌ (ర. అన్హుమ్) లు, అన్సార్ల ఒకసభ ప్రక్కనుండి వెళుతూ ఉండగా, సభలోని అ’న్సారులు ఏడుస్తున్నారు. వారిద్దరూ, ‘మీరెందుకు ఏడుస్తున్నారు?’ అని అడిగారు. దానికి వారు, ‘ప్రవక్త (స) మా సమావేశాల్లో కూర్చోవటం గుర్తుకు వచ్చింది,’ అని అన్నారు. వారిద్దరిలో ఒకరు ప్రవక్త (స) వద్దకు వెళ్ళి, ఈ సంఘటన గురించి తెలిపారు. ప్రవక్త (స) బయలుదేరి వచ్చారు. అప్పుడు ప్రవక్త (స) దుప్పటి ఒక మూలతో తల కప్పుకొని ఉన్నారు. మెంబరుపై ఎక్కారు, ఆ తరువాత, ఇక ఎప్పుడూ మెంబరుపై ఎక్కలేక పోయారు. ముందు ప్రవక్త (స) అల్లాహ్ (త) స్తోత్రాలు చేసారు. ఆ తరువాత, ”నేను అ’న్సారుల గురించి మిమ్మల్ని హితబోధ చేస్తున్నాను, అదేమిటంటే, అ’న్సార్లు నా జీర్ణాశయం, అ’న్సారుల తమ హక్కులను చెల్లించారు. కాని వారి హక్కులు ఇంకా మిగిలి ఉన్నాయి. వారిలోని మంచివారి సాకులను స్వీకరించండి, వారిలోని చెడ్డవారిని క్షమించండి,” అని అన్నారు. (బు’ఖారీ)

6222 – [ 27 ] ( صحيح ) (3/1753)

وعَنِ ابْنِ عَبَّاسٍ قَالَ: خَرَجَ النَّبِيُّ صلى الله عليه وسلم فِيْ مَرَضِهِ الَّذِيْ مَاتَ فِيْهِ حَتّى جَلَسَ عَلَى الْمِنْبَرِ فَحَمِدَ اللهُ وَأَثْنَى عَلَيْهِ ثُمَّ قَالَ: ” أَمَّا بَعْدُ فَإِنَّ النَّاسَ يَكْثُرُوْنَ. وَيَقِلُ الْأَنْصَارُحَتّى يَكُوْنُوْا فِي النَّاسِ بِمَنْزِلَةِ الْمِلْحِ فِي الطَّعَامِ. فَمَنْ وَلِيَ مِنْكُمْ شَيْئًايَضُرُّفِيْهِ قَوْمًا وَيَنْفَعُ فِيْهِ آخَرِيْنَ فَلْيَقْبَلْ عَنْ مُحْسِنِهِمْ وَلْيَتَجَاوَزْ عَنْ مُسِيْئِهِمْ”. روَاهُ الْبُخَارِيُّ.

6222. (27) [3/1753 దృఢం]

ఇబ్నె ‘అబ్బాస్‌ (ర) కథనం: ప్రవక్త (స) తన మరణ వ్యాధిలో ఉన్నప్పుడు, ఇంటినుండి బయటకు వచ్చి, మెంబరుపై కూర్చున్నారు. అల్లాహ్ స్తోత్రం పఠించిన తరువాత, ఇలా అన్నారు, ”ప్రజల సంఖ్య పెరుగు తుంది, అన్సారుల సంఖ్య తరుగుతుంది, చివరికి వారు అన్నంలో ఉప్పులా అయిపోతారు. మీలో ఎవరైనా ఉన్నత పదవులు పొందితే, అ’న్సారుల్లో మంచివారికి సహాయం చేయాలి. చెడ్డ వారిని క్షమించాలి.” (బు’ఖారీ)

6223 – [28 ] ( صحيح ) (3/1753)

وعَنْ زَيْدِ بْنِ أَرْقَمَ قَالَ:  قَالَ رَسُوْلُ الله صلى الله عليه وسل : “اللهُ اغْفِرْ لِلْأَنْصَارِ وَلِأَبْنَاءِ الْأَنْصَارِ وَأَبْنَاءِ أَبْنَاءِ الْأَنْصَارِ”. رَوَاهُ مُسْلِمٌ .

6223. (28) [3/1753దృఢం]

‘జైద్‌ బిన్‌ అర్‌ఖమ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ఇలా ప్రార్థించారు, ”ఓ అల్లాహ్‌(త)! అ’న్సారులను, వారి కుమారులను, వారి మనవళ్ళను క్షమించు.” (ముస్లిమ్‌)

6224 – [ 29 ] ( مُتَّفَقٌ عَلَيْهِ ) (3/1753)

وَعَنْ أَبِيْ أُسَيْدٍ قَالَ: قَالَ رَسُوْلُ الله صلى الله عليه وسلم: “خَيْرُ دُوْرِ الْأَنْصَارِ بَنُو النَّجَّارِ ثُمَّ بَنُو عَبْدِ الْأَشْهَلِ ثُمَّ بَنُو الْحَارِثِ بْنِ الْخَزْرَجِ ثُمَّ بَنُو سَاعِدَةَ وَفِيْ كُلِّ دُوْرِالْأَنْصَارِخَيْرٌ”. مُتَّفَقٌ عَلَيْهِ.

6224. (29) [3/1753ఏకీభవితం]

అబూ ఉసైద్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”అ’న్సారుల తెగల్లో ఉత్తమమైనది బనూ నజ్జార్‌ తెగ, ఆ తరువాత బనూ ‘అబ్దుల్‌ అష్‌హల్‌ తెగ, ఆ తరువాత బనూ ‘హారిస్‌’ తెగ, ఆ తరువాత బనూ సా’యిదహ్‌ తెగ. ఇంకా అ’న్సార్ల తెగలన్నిటిలో మేలు, మంచి ఉన్నాయి. (బు’ఖారీ, ముస్లిమ్‌)

6225 – [ 30 ] ( مُتَّفَقٌ عَلَيْهِ ) (3/1753)

وَعَنْ عَلِيٍّ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: بَعَثَنِيْ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم أَنَا وَالزُّبَيْرَ وَالْمِقْدَادَ – وَفِيْ رِوَايَةٍ: أَبَا مَرْثَدٍ بَدْلَ الْمِقْدَادِ – فَقَالَ: “اِنْطَلِقُوْا حَتّى تَأْتُوْا رَوْضَةَ خَاخٍ فَإِنّض بِهَا ظَعِيْنَةً مَعَهَا كِتَابٌ فَخُذُوْا مِنْهَا”. فَانْطَلَقْنَا تَتَعَادَى بِنَا خَيْلُنَا حَتّى أَتَيْنَا الرَّوْضَةِ فَإِذَا نَحْنُ بِالظَّعِيْنَةِ. قُلْنَا لَهَا: أَخْرِجِي الْكِتَابَ. قَالَتْ: مَا مَعِيَ مِنْ كِتَابٍ. فَقُلْنَا لَتُخْرِجِنَّ الْكِتَابَ أَوْ لَتُلْقِيَنَّ الثِّيَابَ فَأَخْرَجَتْهُ مِنْ عِقَاصِهَا. فَأَتَيْنَا بِهِ النَّبِيّ صلى الله عليه وسلم. فَإِذَا فِيْهِ: مِنْ حَاطِبِ بْنِ أَبِيْ بَلْتَعَةَ إِلى نَاسٍ مِنَ الْمُشْرِكِيْنَ مِنْ أَهْلِ مَكَّةَ يُخْبِرُهُمْ بِبَعْضِ أَمْرِ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم. فَقَالَ رَسُوْلُ الله صلى الله عليه وسلم: “يَا حَاطِبِ مَا هَذَا؟” فَقَالَ: يَا رَسُوْلَ اللهِ لَا تَعْجَلْ عَلَيَّ إِنِّيْ كُنْتُ امْرَأً مُلْصَقًا فِيْ قُرَيْشٍ وَلَمْ أَكُنْ مِنْ أَنْفُسِهِمْ. وَكَانَ مَنْ مَعَكَ مِنَ الْمُهَاجِرِيْنَ لَهُمْ قَرَابَةٌ يَحْمُوْنَ بِهَا أَمْوَالَهُمْ وَأَهْلِيْهِمْ بِمَكَّةَ. فَأَحْبَبْتُ إِذْ فَاتَنِيْ ذَلِكَ مِنَ النَّسَبِ فِيْهِمْ يَدًا يَحْمُوْنَ بِهَا قَرَابَتِيْ. وَمَا فَعَلْتُ كُفْرًا وَلَا ارْتِدَادًا عَنْ دِيْنِيْ وَلَا رَضِىَ بِالْكُفْرِ بَعْدَ الْإِسْلَامِ. فَقَالَ رَسُوْلُ الله صلى الله عليه وسلم: “إِنَّهُ قَدْ صَدَقَكُمْ” فَقَالَ عُمَرُ: دَعْنِيْ يَا رَسُوْلَ اللهِ أَضْرِبْ عُنُقَ هَذَا الْمُنَاقِ. فَقَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِنَّهُ قَدْ شَهِدَ بَدْرًا وَمَا يُدْرِيْكَ لَعَلَّ اللهَ اطَّلَعَ عَلَى أَهْلِ بَدْرٍ. فَقَالَ: اعْمَلُوْا مَا شِئْتُمْ. فَقَدْ وَجَبَتْ لَكُمُ الْجَنَّةُ”

وَفِيْ رِوَايَةٍ: فَقَدْ غَفَرْتُ لَكُمْ “فَأَنْزَلَ اللهُ تَعَالى [يَا أَيُّهَا الَّذِيْنَ آمَنُوْا لَا تَتَّخِذُوْا عَدُوِّيْ وَعَدُوَّكُمْ أَوْلِيَاءَ]. مُتَّفَقٌ عَلَيْهِ.  

6225. (30) [3/1753 ఏకీభవితం]

‘అలీ (ర) కథనం: ప్రవక్త (స) నన్ను, జుబైర్‌ను, మిఖ్‌దాద్‌ను – మరో ఉల్లేఖనంలో మిఖ్‌దాద్‌కు బదులు అబూ మర్‌స’ద్‌ను – పంపుతూ ”మీరు బయలుదేరండి, ఖా’ఖె రౌ’దహ్ చేరిన తర్వాత, అక్కడ ఒంటెపై కూర్చున్న ఒకస్త్రీ వద్ద ఒక ఉత్తరం ఉంది. ఆమె వద్ద నుండి ఆ ఉత్తరాన్ని తీసుకురండి,” అని అన్నారు. అనంతరం మేము బయలుదేరాము. మా గుర్రాలు మమ్మల్ని చాలా వేగంగా తీసుకొని వెళ్లాయి. చివరికి మేము ఖా’ఖె రౌ’దహ్ చేరుకున్నాము. ఆ స్త్రీ కనబడగానే మేము ఆమెతో, ‘నీ వద్ద ఉన్న ఉత్తరం ఇవ్వు,’ అని అన్నాము. దానికి ఆమె, ‘నా వద్ద ఉత్తరం లేదు,’ అని చెప్పింది. మేము కఠినంగా వ్యవహరిస్తూ, ‘ఆ ఉత్తరం ఇస్తావా లేకపోతే నీ బట్టలు ఊడదీయ మంటావా,’ అని హెచ్చరించాము. అనంతరం ఆమె ఉత్తరాన్ని తన జడలోనుండి తీసి ఇచ్చింది. మేము ఆ  ఉత్తరాన్ని తీసుకొని ప్రవక్త (స) వద్దకు వచ్చాము.

ఆ ఉత్తరంలో ఇలా ఉంది: ” హాతి’బ్‌ బిన్‌ అబీఅహ్ బ’ల్తాహ్ తరఫు నుండి, మక్కహ్ అవిశ్వాసులకు, ఇందులో ‘హా’తిబ్‌ ప్రవక్త (స)కు సంబంధించిన కొన్ని వ్యవహారాల గురించి అవిశ్వాసులకు తెలియ పరిచాడు.” అని ఉంది. ప్రవక్త (స) ‘హా’తిబ్‌ను విచారిస్తూ, ‘ఇదేమిటి?’ అని అడిగారు. దానికి అతను, ”ప్రవక్తా! తొందరపడకండి, నేను బయటనుండి వచ్చి ఖురైషుల్లో కలసిపోయాను. నేను ఖురైషల్లోని వ్యక్తిని కాను. మీ వైపు ఉన్న ముహాజిరీన్లకు మక్కహ్లో ఉన్న అవిశ్వాసులతో బంధుత్వం ఉంది. అవిశ్వాసులు ఈ బంధుత్వం వల్ల మక్కహ్లో ఉన్న ముహాజిరీన్ల ఆస్తిపాస్తులను, కుటుంబీకులను రక్షణ కల్పిస్తారు. అయితే వారితో నాకు ఎటువంటి బంధుత్వం లేదు, నేనేదైనా ఉపకారం చేస్తే వారు మక్కహ్లో ఉన్న నా బంధు వులకు రక్షణ ఇస్తారని భావించాను. నేనీపని అవిశ్వాస పరంగా చేయలేదు. ఇంకా ఇస్లామ్‌ స్వీకరించిన తర్వాత నాకెంత మాత్రం అవిశ్వాసంపై ప్రేమ లేదు,’ అని విన్నవించుకున్నాడు, దానికి ప్రవక్త (స), ” ‘హా’తిబ్‌ సత్యం పలుకుతున్నాడు,” అని అన్నారు. అప్పుడు ‘ఉమర్‌ (ర), ‘నా కనుమతి ఇస్తే నేనీ కపటాచారి తలను నరుకుతాను,’ అని అన్నారు. అప్పుడు ప్రవక్త (స), ” ‘హా’తిబ్‌ బద్ర్‌ యుద్ధంలో పాల్గొన్నాడు. ఓ ‘ఉమర్‌! నీకు తెలి యదా! వీరిపై అల్లాహ్‌(త) ప్రత్యేక కారుణ్య కటాక్షాలు ఉన్నాయి. అందువల్లే బద్ర్‌ వారిని అల్లాహ్‌ (త), ‘మీరు ఏం చేసుకున్నా మీకు స్వర్గం తప్పనిసరి అయిపోయింది,’ అని ఆదేశించి ఉన్నాడు.”

మరో ఉల్లేఖనంలో ప్రవక్త (స) ఇలా ప్రవచించారు, ”నేనైతే క్షమించాను.” అనంతరం అల్లాహ్‌ (త) ఇలా ఆదేశించాడు: ”ఓ విశ్వాసులారా! నాకూ, మీకూ శత్రువులైన వారిని మిత్రులుగా చేసుకోకండి.” (అల్ ముమ్ త’హిననహ్, 60:01). (బు’ఖారీ, ముస్లిమ్‌)

6226 – [ 31 ] ( صحيح ) (3/1754)

وعَنْ رَفَاعَةَ بْنِ رَافِعٍ قَالَ: جَاءَ جِبْرِيْلُ إِلى النَّبِيِّ صلى الله عليه و سلم فَقَالَ: “مَا تَعُدُّوْنَ أَهْلَ بَدْرٍفِيْكُمْ”. قَالَ: “مِنْ أَفْضَلِ الْمُسْلِمِيْنَ”. أَوْ كَلِمَةً نَحْوَهَا قَالَ: “وَكَذِلَكَ مَنْ شَهِدَ بَدْرًا مِنَ الْمَلَائِكَةِ”. روَاهُ الْبُخَارِيُّ.

6226. (31) [3/1754 దృఢం]

రిఫా’అహ్ బిన్‌ రాఫె’అ(ర) కథనం: ప్రవక్త (స) వద్దకు జిబ్రీల్‌ (అ) వచ్చారు. ‘బద్ర్‌ యుద్ధంలో పాల్గొన్న వారిని మీరు ఏ తరగతికి చెందినవారుగా పరిగ ణిస్తున్నారు,’ అని అడిగారు. దానికి ప్రవక్త (స), ‘ముస్లిములందరికంటే ఉన్నతులుగా భావిస్తు న్నాను,’ అని లేదా అటువంటి వాక్యమే అన్నారు. అప్పుడు జిబ్రీల్‌ (అ) అది విని, ”అదేవిధంగా బద్ర్‌ యుద్ధంలో పాల్గొన్న దైవదూతలు కూడా ఉన్నతులే.” (బు’ఖారీ)

6227 – [ 32 ] ( صحيح ) (3/1754)

وعَنْ حَفْصَةَ قَالَتْ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِنِّيْ لَأَرْجُو أَنْ لَا يَدْخُلَ النَّارَ إِنْ شَاءَ اللهُ أَحَدٌ شَهِدَ بَدْرًا وَالْحُدَيْبِيَةَ”. قُلْتُ: يَا رَسُوْلَ اللهِ أَلَيْسَ قَدْ قَالَ اللهُ تَعَالى: [وَإِنْ مِنْكُمْ إِلَّا وَارِدُهَا] قَالَ: “فَلَمْ تَسْمَعِيْهِ يَقُوْلُ: [ثُمَّ نُنَجِّيْ الَّذِيْنَ اتَّقَوْا]”.

 وَفِيْ رِوَايَةٍ: “لَا يَدْخُلُ النَّارَ إِنْ شَاءَ اللهُ مِنْ أَصْحَابِ الشَّجَرَةِ – أَحَدٌ – اَلَّذِيْنَ بَايَعُوْا تَحْتَهَا”. رَوَاهُ مُسْلِمٌ.

6227. (32) [3/1754 దృఢం]

‘హఫ్‌’సహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”బద్ర్ యుద్ధంలో, హుదైబియాలో పాల్గొన్న వాళ్ళెవరూ ఇన్‌షా అల్లాహ్‌ నరకంలో ప్రవేశించరని నేనంటు న్నాను.” దానికి నేను ఓ ప్రవక్తా(స)! ”మరి అల్లాహ్‌ (త):  ”మరియు మీలో ఎవ్వడునూ దాని (నరకంపై గల వంతెన) మీద నుండి పోకుండా (దాటకుండా) ఉండలేడు. ఇది తప్పించుకోలేని, నీ ప్రభువు యొక్క నిర్ణయం.” (మర్యం, 19:71) అని ఆదేశించి ఉన్నాడు కదా!” అని విన్నవించు కున్నాను. అప్పుడు ప్రవక్త (స) ఆ తరువాత ఏమన్నాడో నువ్వు వినలేదా? పిదప మేము దైవభీతి గలవారిని రక్షిస్తాము.” (మర్యం, 19:72) అని  ఆదేశించాడు.

మరో ఉల్లేఖనంలో, ”హుదైబియాలో చెట్టు క్రింద ప్రమాణం చేసిన వారెవరూ నరకంలోకి వెళ్ళరని,” ఉంది. (ముస్లిమ్‌)

6228 – [ 33 ] ( مُتَّفَقٌ عَلَيْهِ ) (3/1754)

وَعَنْ جَابِرٍقَالَ: كُنَّا يَوْمَ الْحُدَيْبِيَةِ أَلْفًا وَأَرْبَعَمِائَةٍ. قَالَ لَنَا النَّبِيُّ صلى الله عليه وسلم: “أَنْتُمْ الْيَوْمَ خَيْرُأَهْلِ الْأَرْضِ”. مُتَّفَقٌ عَلَيْهِ

6228. (33) [3/1754ఏకీభవితం]

జాబిర్‌ (ర) కథనం: హుదైబియా నాడు మేము 1400 మంది ఉన్నాం. మా గురించి ప్రవక్త (స) ప్రస్తావిస్తూ, ”ఈ రోజు భూవాసులందరికంటే ఉత్తములు మీరే” అని అన్నారు. (బు’ఖారీ, ముస్లిమ్‌)

6229 – [ 34 ] ( صحيح ) (3/1754)

وَعَنْهُ قَالَ: قَالَ رَسُولُ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: «مَنْ يَصْعَدِ الثَّنِيَّةَ ثَنِيَّةَ الْمُرَارِ فَإِنَّهُ يُحَطُّ عَنْهُ مَا حُطَّ عَنْ بَنِي إِسرائيل» . وَكَانَ أَوَّلَ مَنْ صَعِدَهَا خَيْلُنَا خَيْلُ بَنِي الْخَزْرَجِ ثُمَّ تَتَامَّ النَّاسُ فَقَالَ رَسُولُ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: «كُلُّكُمْ مَغْفُورٌ لَهُ إِلَّا صَاحِبَ الْجَمَلِ الْأَحْمَرِ» . [ص:1755] فَأَتَيْنَاهُ فَقُلْنَا: تَعَالَ يَسْتَغْفِرْ لَكَ رَسُولُ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ: لَأَنْ أَجِدَ ضَالَّتِي أَحَبُّ إِلَيَّ مِنْ أَنْ يَسْتَغْفِرَ لِي صَاحِبُكُمْ. رَوَاهُ مُسْلِمٌ.

وَذَكَرَ حَدِيثَ أَنَسٍ قَالَ لِأُبَيِّ بْنِ كَعْبٍ: «إِنَّ اللَّهَ أَمَرَنِي أَنْ أَقْرَأَ عَلَيْكَ» فِي «بَابٍ» بعدَ فَضَائِل الْقُرْآن

6229. (34) [3/1754దృఢం]

జాబిర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మురార్ కొండపై ఎక్కినవాడి పాపాలు, బనీ ఇస్రాయీ’ల్‌కు చెందినవారి పాపాలు క్షమించబడినట్లు తొలగి పోయాయి.” అనంతరం, అందరికంటే ముందు మా గుర్రాలు అంటే ఖ’జ్‌రజ్‌ తెగ గుర్రాలు ఎక్కాయి. ఆ తరువాత వారి వెనుక ఇతరులు క్రమంగా ఎక్కారు. ఆ తరువాత ప్రవక్త (స), ”ఆ ఎర్రని ఒంటె యజమాని తప్ప అందరినీ క్షమించడం జరిగింది,” అని అన్నారు. ఆ ఎర్రని ఒంటె యజమాని మరెవరో కాదు, కపటాచారుల నాయకుడు ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ఉబయ్‌.’ అది విని మేము అతని దగ్గరకు వెళ్ళి, ‘మాతో రండి, మీ గురించి దు’ఆ చేయమని ప్రవక్త (స)ను విన్నవించుకుందాం,’ అని అన్నాము. దానికి వాడు, ‘నేను నా పోగొట్టుకున్న దాన్ని వెతకటం మీ మిత్రుని క్షమాపణ కోరడంకంటే శ్రేష్ఠమైనది,’ అని అన్నాడు. (ముస్లిమ్‌)

ఇంకా అనస్‌ (ర) ఉల్లేఖించిన ‘హదీసు’లో ఇలా ఉంది, ప్రవక్త (స) ఉబయ్‌ బిన్‌ క’అబ్‌ (ర)తో, ”ఖుర్‌ఆన్‌ పఠించి నీకు వినిపించమని అల్లాహ్‌(త) నన్ను ఆదేశించాడు,” అని అన్నారు. దీన్ని గురించి ఖుర్‌ఆన్‌ ప్రత్యేకతల్లో పేర్కొనడం జరిగింది.

—–

اَلْفَصْلُ الثَّانِيْ   రెండవ విభాగం 

6230 – [ 35 ] ( ضعيف ) (3/1755)

عَنِ ابْنِ مَسْعُودٍ عَنِ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ: ” اقْتَدُوا بِاللَّذَيْنِ مِنْ بَعْدِي مِنْ أَصْحَابِي: أَبِي بَكْرٍ وَعُمَرَ وَاهْتَدُوا بِهَدْيِ عمّارٍ وَتَمَسَّكُوا بِعَهْدِ ابْنِ أُمِّ عَبْدٍ”. رَوَاهُ التِّرْمِذِيُّ.

6230. (35) [3/1755 బలహీనం]  

ఇబ్నె మస్‌’ఊద్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”నా తరువాత నా అనుచరుల్లో అబూ బకర్‌, ‘ఉమర్‌ (ర)ను అనుసరించండి, ఇంకా అమ్మార్‌ బిన్‌యాసిర్‌ గుణగణాలను కలిగి రుజుమార్గంపై నడవండి. ఇంకా ఉమ్మె ‘అబ్ద్‌ కొడుకు (అబ్దుల్లాహ్‌ బిన్‌ మస్‌ ‘ఊద్‌) వాగ్దాన  గుణాన్ని కలిగి  ఉండండి.” (తిర్మిజి’)

మరో ఉల్లేఖనంలో, దీన్ని ‘హుజై’ఫహ్ (ర) ఉల్లేఖిం చారు, అందులో ”ఉమ్మె ‘అబ్ద్‌ కొడుకు వాగ్దాన గుణాన్ని కలిగి ఉండండి,” అనే దానికి బదులు ఇబ్నె మస్‌’ఊద్‌ చెప్పినదాన్ని నిజమని నమ్మండి,” అని ఉంది.

6231 – [ 36 ] ( واه ) (3/1755)

وعَنْ عَلِيٍّ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم:”لَوْ كُنْتُ مُؤَمِّرًا مِنْ غَيْرِمَشْوَرَةٍ لَأَمَّرْتُ عَلَيْهِمُ ابْنَ أُمِّ عَبْدٍ” .رَوَاهُ التِّرْمِذِيُّ وَابْنُ مَاجَهُ.  

6231. (36) [3/1755అత్యంత బలహీనం]

‘అలీ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఒక వేళ నేను సంప్రదించకుండా ఎవరినైనా నాయకునిగా నియమిస్తే, ఉమ్మె ‘అబ్ద్‌ కొడుకు అంటే ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ మస్‌’ఊద్‌ను నియమిస్తాను.” (తిర్మిజి’, ఇబ్మె మాజహ్)

6232 – [ 37 ] ( صحيح ) (3/1755)

وَعَنْ خَيْثَمَةَ بْنِ أَبِيْ سَبْرَةَ قَالَ: أَتَيْتُ الْمَدِيْنَةَ فَسَأَلْتُ اللهَ أَنْ يُيَسِّرَ لِيْ جَلِيْسًا صَالِحًا فَيَسَّرَلِيْ أَبَا هُرَيْرَةَ فَجَلَسْتُ إِلَيْهِ فَقُلْتُ: إِنِّيْ سَأَلْتُ اللهَ أَنْ يُيَسِّرَلِيْ جَلِيْسًا صَالِحًا فَوُفِّقْتَ لِيْ. فَقَالَ: مِنْ أَيْنَ أَنْتَ؟ قُلْتُ: مِنْ أَهْلِ الْكُوْفَةِ. جِئْتُ أَلْتَمِسُ الْخَيْرَ وَأَطْلُبُهُ. فَقَالَ: أَلَيْسَ فِيْكُمْ سَعْدُ بْنُ مَالِكٍ مُجَابُ الدَّعْوَةِ؟ وَابْنُ مَسْعُوْدٍ صَاحِبُ طُهُوْرِ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم وَنَعْلَيْهِ؟ وَحُذَيْفَةُ صَاحِبُ سِرُّ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم؟ وَعَمَّارُ الَّذِيْ أَجَارَهُ اللهُ مِنَ الشَّيْطَانَ عَلَى لِسَانِ نَبِيِّهِ صلى الله عليه وسلم؟ وَسَلْمَانُ صَاحِبُ الْكِتَابَيْنِ؟ يَعْنِي الْإِنْجِيْلَ وَالْقُرْآنَ. رَوَاهُ التِّرْمِذِيُّ .

6232. (37) [3/1755 దృఢం]

ఖై’స’హ్ బిన్‌ అబీ బ్రహ్‌ (ర) కథనం: నేను మదీనహ్ వచ్చాను, ‘మంచి మిత్రుణ్ణి ప్రసాదించమని,’ అల్లాహ్‌ను ప్రార్థించాను. అనంతరం అల్లాహ్‌(త) అబూ హురైరహ్‌ను ప్రసాదించాడు. నేనతని దగ్గర కూర్చొని, అతనితో, ‘ఒక మంచి స్నేహితుడ్ని ప్రసాదించమని నేను అల్లాహ్‌(త)ను ప్రార్థించాను. అల్లాహ్‌(త) మిమ్మల్ని ప్రసాదించాడు,’ అని అన్నాను. అప్పుడు అబూ హురైరహ్‌ నన్ను, ‘మీరు ఏ ప్రాంతానికి చెందినవారని,’ అడిగారు. దానికి నేను, ‘కూఫాకు చెందినవాడిని, మంచి కోరుకునేవాడిని,’ అని అన్నాను. అప్పుడు అబూ హురైరహ్‌ (ర), ‘మీ ప్రాంతంలో ప్రార్థనలు స్వీకరించబడే స’అద్‌ బిన్‌ మాలిక్‌ ఉన్నారు కదా! ఇంకా మీలో ప్రవక్త (స)కు నీళ్ళు, జీను సమకూర్చే-అబ్దుల్లాహ్‌ బిన్‌ మస్‌’ఊద్‌ ఉన్నారు కదా! ఇంకా మీలో ప్రవక్త (స) అంతరంగికుడైన-హుజై’హ్ ఉన్నారు కదా! ఇంకా మీలో అల్లాహ్‌(త) తన ప్రవక్త (స)నోట షై’తాన్‌ నుండి రక్షణ కల్పించిన –అమ్మార్‌ (ర) ఉన్నారు కదా! ఇంకా మీలో రెండు గ్రంథాలను విశ్వసించే-సల్మాన్‌ ఫారసీ ఉన్నారు కదా!’  అని అన్నారు. (తిర్మిజి’)

6233 – [ 38 ] ( صحيح ) (3/1756)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “نِعْمَ الرَّجُلُ أَبُوْ بَكْرٍ، نِعْمَ الرَّجُلُ عُمَرُ، نِعْمَ الرَّجُلُ أَبُوْ عُبَيْدَةَ بْنُ الْجَرَّاحِ، نِعْمَ الرَّجُلُ أُسَيْدُ بْنُ حُضَيْرِ، نِعْمَ الرَّجُلُ ثَابِتُ بْنُ قَيْسِ بْنِ شَمَّاسٍ، نِعْمَ الرَّجُلُ مُعَاذُ بْنُ جَبَلٍ، نِعْمَ الرَّجُلُ مُعَاذُ بْنُ عَمْرِو بْنِ الْجَمُوْحِ”. رَوَاهُ التِّرْمِذِيُّ. وَقَالَ: هَذَا حَدِيْثٌ غَرِيْبٌ.

6233. (38) [3/1756 దృఢం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”అబూ బకర్‌ (ర) మంచివారు, ‘ఉమర్‌ (ర) మంచి వారు, అబూ ‘ఉబైదహ్‌ బిన్‌ జర్రా’హ్‌ (ర) మంచి వారు, ‘ఉసైద్‌ బిన్‌ ‘హు’దైర్‌ (ర) మంచివారు, సా’బిత్‌ బిన్‌ ఖైస్‌ బిన్‌ మ్మాస్ (ర), మంచివారు, మ’ఆజ్‌ బిన్‌ జబల్‌ (ర) మంచి వారు. ఇంకా మ’ఆజ్‌ బిన్‌ ‘అమ్ర్‌ బిన్‌ జమూ’హ్‌ (ర) మంచివారు.” (తిర్మిజి’ – ఏకోల్లేఖనం)

6234 – [ 39 ] ( ضعيف ) (3/1756)

وعَنْ أَنَسٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِنَّ الْجَنَّةَ تَشْتَاقُ إِلى ثَلَاثَةٍ عَلِيٍّ وَعَمَّارٍ وَسَلْمَانَ”. رَوَاهُ التِّرْمِذِيُّ.

6234. (39) [3/1756 బలహీనం]

అనస్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”స్వర్గం ముగ్గురిని ప్రేమిస్తుంది. వారు అలీ, అమ్మార్‌ మరియు సల్మాన్‌ (ర. ‘అన్హుమ్).”  (తిర్మిజి’)

6235 – [ 40] ( حسن ) (3/1756)

وعَنْ عَلِيٍّ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: اِسْتَأْذَنَ عَمَّارٌ عَلَى النَّبِيِّ صلى الله عليه وسلم فَقَالَ: “ائْذَنُوْا لَهُ مَرْحَبًا بِالطَّيِّبِ الْمُطَيَّبِ”. رَوَاهُ التِّرْمِذِيُّ .

6235. (40) [3/1756ప్రామాణికం]

‘అలీ (ర) కథనం: ‘అమ్మార్‌ (ర) ప్రవక్త (స) వద్దకు రావటానికి అనుమతి కోరారు. అప్పుడు ప్రవక్త (స) ”అతనికి అనుమతించండి, పరిశుద్ధుడైన, పరిశుద్ధ పరచబడిన వ్యక్తికి సుస్వాగతం.” అని అన్నారు. [33] (తిర్మిజి’)

6236 – [ 41 ] ( حسن لغيره ) (3/1756)

وَعَنْ عَائِشَةَ قَالَتْ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَا خُيِّرَ عَمَّارٌ بَيْنَ أَمْرَيْنِ إِلَّا اخْتَارَ أَرْشَدَهُمَا”. رَوَاهُ التِّرْمِذِيُّ.

6236. (41) [3/1756 పరా ప్రామాణికం]

‘ఆయి’షహ్‌ (ర) కథనం: ‘అమ్మార్‌కు రెండు బాధ్యతల్లో ఒకటి ఎంచుకోమంటే కష్టతరమైన బాధ్యతనే ఎంచుకుంటారు,” అని ప్రవక్త (స) ప్రవచించారు. (తిర్మిజి’)

6237 – [ 42 ] ( صحيح ) (3/1756)

وعَنْ أَنَسٍ قَالَ: لَمَّا حُمِلَتْ جَنَازَةُ سَعْدِ بْنِ مُعَاذٍ قَالَ الْمُنَافِقُوْنَ: مَا أَخَفَّ جَنَازَتَهُ وَذَلِكَ لِحُكْمِهِ فِيْ بَنِيْ قُرَيْظَةَ فَبَلَغَ ذَلِكَ النَّبِيّ صلى الله عليه وسلم فَقَالَ: “إِنَّ الْمَلَائِكَةَ كَانَتْ تَحْمِلُهُ”. رَوَاهُ التِّرْمِذِيُّ.

6237. (42) [3/1756 దృఢం]

అనస్‌ (ర) కథనం: స’అద్‌ బిన్‌ మ’ఆజ్‌’ జనా’జహ్ ఎత్తినప్పుడు కపటాచారులు అతని జనా’జహ్ ఎంత తేలిగ్గా ఉంది! ఇదంతా బనూ ‘ఖురై”హ్ తెగవారి విషయంలో ఇచ్చిన తీర్పు వల్లే జరిగింది,’ అని అన్నారు. ప్రవక్త (స)కు ఈ వార్త అందింది. అప్పుడు ప్రవక్త (స) అతని జనా’జహ్ను దైవదూతలు ఎత్తుకొని ఉన్నారు,’ అని ప్రవచించారు. [34]  (తిర్మిజి’)

6238 – [ 43 ] ( حسن ) (3/1757)

وعَنْ عَبْدِ اللهِ بْنِ عَمْرٍو قَالَ: سَمِعْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ: “مَا أَظَلَّتِ الْخَضْرَاءُ وَلَا أَقَلَّتِ الْغَبْرَاءُ أَصْدَقَ مِنْ أَبِيْ ذَرٍّ”. رَوَاهُ التِّرْمِذِيُّ.

6238. (43) [3/1757 ప్రామాణికం]

అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘అమ్ర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ఇలా ప్రవచిస్తూ ఉండగా నేను విన్నాను, ”అబూ  జ’ర్‌ (ర) కంటే  సత్యవంతుడైన వ్యక్తికి ఆకాశం నీడను కల్గించ లేదు, భూమి  ఎత్తనూ లేదు.” (తిర్మిజి’)

6239 – [ 44 ] ( حسن ) (3/1757)

وعَنْ أَبِيْ ذَرٍّ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَا أَظَلَّتِ الْخَضْرَاءُ وَلَا أَقَلَّتِ الْغَبْرَاءُ مِنْ ذِيْ لَهَجَةٍ أَصْدَقَ وَلَا أَوْفَى مِنْ أَبِيْ ذَرٍّ شِبْهِ عِيْسَى بْنِ مَرْيَمَ”. يَعْنِيْ فِي الزُّهْدِ. رَوَاهُ التِّرْمِذِيُّ وقَالَ: حَدِيْثٌ حَسَنٌ غَرِيْبٌ.

فَقَالَ عُمَرُ بْنُ الْخَطَّابِ كَالْحَاسِدِ: يَا رَسُوْلَ اللهِ أَفَتَعْرِفُ ذَلِكَ لَهُ؟ قَالَ: “نَعَمْ فَاعْرَفُوْهُ لَهُ”.

6239. (44) [3/1757 ప్రామాణికం]

అబూ జ’ర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”అబూ జ’ర్‌ (ర) కంటే ఉత్తముడైన, వాగ్దానబద్ధుడైన వ్యక్తికి ఆకాశం నీడ కల్పించనూ లేదు, భూమి ఎత్తనూ లేదు. అబూ జ’ర్‌ (ర) దైవభక్తిలో ‘ఈసా బిన్‌ మర్యమ్‌ను పోలి ఉండేవారు.”  (తిర్మిజి’ –  ప్రామాణికం – ఏకోల్లేఖనం)

6240 – [ 45 ] ( صحيح ) (3/1757)

وَعَنْ مُعَاذِ بْنِ جَبَلٍ لَمَّا حَضَرَهُ الْمَوْتُ قَالَ: اِلْتَمِسُوا الْعِلْمَ عِنْدَ أَرْبَعَةٍ: عِنْدَ عُوَيْمِرٍ أَبِي الدَّرْدَاءِ وَعِنْدَ سَلْمَانَ وَعِنْدَ ابْنِ مَسْعُوْدٍ وَعِنْدَ عَبْدِ اللهِ بْنِ سَلَامٍ الَّذِيْ كَانَ يَهُوْدِيًا فَأَسْلَمَ.

فَإِنِّيْ سَمِعْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ: “إِنَّهُ عَاشِرُ عَشَرَةٍ فِي الْجَنَّةِ”. رَوَاهُ التِّرْمِذِيُّ.

6240. (45) [3/1757 దృఢం]

మ’ఆజ్‌’ బిన్‌ జబల్‌ (ర) కథనం: అతని మరణ సమయం ఆసన్నమయినప్పుడు, అతను ధార్మిక జ్ఞానం నలుగురు వ్యక్తుల నుండి నేర్చుకోమని అన్నారు: బూ దర్దా, సల్మాన్‌, ఇబ్నె మస్‌’ఊద్‌, అబ్దుల్లాహ్‌ బిన్‌ సలామ్‌  (ర. ‘అన్హుమ్).

మ’ఆజ్‌’ (ర) కథనం: ”నేను ప్రవక్త (స)ను అతడు అంటే ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ సలామ్‌ 10 మంది స్వర్గవాసుల్లో ఒకరని  అంటూ ఉండగా  విన్నాను.” (తిర్మిజి’)

6241 – [ 46 ] ( ضعيف ) (3/1757)

وعَنْ حُذَيْفَةَ قَالَ: قَالُوْا: يَا رَسُوْلَ اللهِ لَوِ اسْتَخْلَفْتَ؟ قَالَ: “إِنِ اسْتَخْلَفْتُ عَلَيْكُمْ فَعَصَيْتُمُوْهُ عَذِّبْتُمْ وَلَكِنْ مَا حَدَّثَكُمْ حُذَيْفَةُ فَصَدِّقُوْهُ وَمَا أَقْرَأَكُمْ عَبْدُ اللهِ فَاقْرَؤُوْهُ”. رَوَاهُ التِّرْمِذِيُّ.

6241. (46) [3/1757 బలహీనం]

‘హుజై’ఫహ్ (ర) కథనం: ప్రవక్త (స) అనుచరులు, ‘ఓ ప్రవక్తా! తమరు ఎవరినైనా ‘ఖలీఫహ్గా నియమిస్తే బాగుణ్ణు,’ అని విన్నవించుకున్నారు. దానికి ప్రవక్త (స), ‘ఒకవేళ నేను ఎవరినైనా మీపై ‘ఖలీఫహ్గా నిర్ణయించి, మీరు అతనికి అవిధేయత చూపితే, దైవశిక్షకు గురవు తారు. అయితే హుజై’హ్ మీతో చెప్పింది, సత్యంగా నమ్మండి, ఇంకా అబ్దుల్లాహ్‌ బిన్‌ మ’స్‌ఊద్‌ మీకు చది వించింది చదవండి,’ అని హితబోధ చేసారు. (తిర్మిజి’)

6242 – [ 47 ] ( صحيح ) (3/1757)

وعَنْهُ قَالَ: مَا أَحَدٌ مِنَ النَّاسِ تُدْرِكُهُ الْفِتْنَةُ إِلَّا أَنَا أَخَافُهَا عَلَيْهِ إِلَّا مُحَمَّدَ بْنَ مَسْلَمَةَ.  فَإِنِّيْ سَمِعْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ: ” لَا تَضُرُّكَ الْفِتْنَةُ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ. و سَكَتَ عَنْهُ. و أَقَرَّهُ عَبْدُالعَظِيمِ.

6242. (47) [3/1757దృఢం]

‘హుజై’ఫహ్ (ర) కథనం: ప్రజలు అందరూ ఉపద్ర వాలకు గురిఅవుతారు. అయితే దానికి ప్రభావితం కాకుండా ఎవరూ ఉండరు ము’హమ్మద్‌ బిన్ మస్‌ లమహ్ తప్ప. ఎందుకంటే ప్రవక్త (స), ము’హమ్మద్‌  బిన్‌ మస్‌లమహ్‌ గురించి, ‘ఉపద్రవాలు నీకు హాని చేకూర్చవు,’ అని అన్నారు. (అబూ దావూద్‌)  

అబూ దావూద్‌ దీన్ని గురించి మౌనం వహించారు. అయితే, ‘అబ్దుల్‌ ‘అ’జీమ్ దీన్ని నిర్ధారించారు.

6243 – [ 48 ] ( ضعيف ) (3/1758)

وعَنْ عَائِشَةَ أَنَّ النَّبِيَّ صلى الله علي وسلم رَأَى فِيْ بَيْتِ الزُّبَيْرِ مِصْبَاحًا فَقَالَ: “يَا عَائِشَةَ مَاأَرَى أَسْمَاءَ إِلَّا قَدْ نُفِسَتْ وَلَا تُسَمُّوْهُ حَتّى أُسَمِّيَهُ” فَسَمَّاهُ عَبْدَ اللهِ وَحَنَّكَهُ بِتَمْرَةٍ بِيَدِهِ. رَوَاهُ التِّرْمِذِيُّ .

   6243. (48) [3/1758 బలహీనం]

‘ఆయి’షహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) జుబైర్‌ ఇంట్లో దీపం వెలుగుతూ ఉండటం చూసి, ”ఓ ‘ఆయి’షహ్ అస్మాకు బిడ్డ కలిగినట్టుంది. మీరు ఆ బిడ్డకు పేరు పెట్టకండి, వాడికి పేరు నేను పెడతాను,” అని అన్నారు. అనంతరం ప్రవక్త (స) ఆ బిడ్డకు అబ్దుల్లాహ్‌, అని పెట్టారు. ఇంకా ఖర్జూరాన్ని నమిలి బిడ్డ నోటిలో  పెట్టారు . (తిర్మిజి’)

6244 – [ 49 ] ( صحيح ) (3/1758)

وعَنْ عَبْدِ الرَّحْمنِ بْنِ أَبِيْ عَمِيْرَةَ عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم أَنَّهُ قَالَ لِمُعَاوِيَةَ: “اَللّهُمَّ اجْعَلْهُ هَادِيًا مَهْدِيًّا وَاهْدِ بِهِ”. رَوَاهُ التِّرْمِذِيُّ .

6244. (49) [3/1758దృఢం]

‘అబ్దుర్రహ్మాన్‌ బిన్‌ అబీ ‘ఉమైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ము’ఆవియహ్ (ర) గురించి ఇలా ప్రార్థిం చారు: ”ఓ అల్లాహ్‌(త)! ఇతన్ని మార్గదర్శ కుడిగా, సన్మార్గ గామిగా, ఇంకా ఇతని ద్వారా ప్రజలకు సన్మార్గం చూపు అని  ప్రార్థించారు.” (తిర్మిజి’)

6245 – [ 50] ( حسن لشاهده ) (3/1758)

وَعَنْ عُقْبَةَ بْنِ عَامِرٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “أَسْلَمَ النَّاسُ وَآمَنَ عَمْرُو بْنُ الْعَاصِ”. رَوَاهُ التِّرْمِذِيُّ. وَقَالَ: هَذَا حَدِيْثٌ غَرِيْبٌ وَلَيْسَ إِسْنَادُهُ بِالْقَوِيِّ

6245. (50) [3/1758సాక్షులచే  ప్రామాణికం]

‘ఉఖ్‌బ బిన్‌ ‘ఆమిర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ప్రజలు ఇస్లామ్‌ స్వీకరించారు. కాని ‘అమ్ర్‌ బిన్‌ ‘ఆ’స్‌ విశ్వసించారు.” (తిర్మిజి’ – ఏకోల్లేఖనం, ఆధారాలు బలమైనవికావు)

6246 – [ 51 ] ( لم تتم دراسته ) (3/1758)

وَعَنْ جَابِرٍ قَالَ: لَقِيَنِيْ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم فَقَالَ: “يَا جَابِرُ مَا لِيْ أَرَاكَ مُنْكَسِرًا”. قُلْتُ يَا رَسُوْلَ اللهِ اُسْتُشْهِدَ أَبِيْ قَتل يوم أحد وَتَرَكَ عِيَالًا وَدَيْنًا. قَالَ أَفَلَا أُبَشِّرِكُ بِمَا لَقِيَ اللهُ بِهِ أَبَاكَ. قَالَ قُلْتُ بَلَى يَا رَسُوْلَ اللهِ. قَالَ مَا كَلَّمَ اللهُ أَحَدًا قَطُّ إِلَّا مِنْ وَرَاءِ حِجَابٍ وَأَحْيَا أَبَاكَ فَكَلَّمَهُ كِفَاحًا. فَقَالَ يَا عَبْدِيْ تَمَنَّ عَلَيَّ أُعْطِكَ. قَالَ يَا رَبِّ تُحْيِيْنِيْ. فَأقْتُل فِيْكَ ثَانِيَةً. قَالَ الرَّبُّ عَزَّ وَجَلَّ إِنَّهُ قَدْ سَبَقَ مِنِّيْ أَنَّهُمْ إِلَيْهَا لَا يَرْجِعُوْنَ. قَالَ وأَنْزَلَتْ هَذِهِ الْآيَةِ [وَلَا تَحْسَبَنَّ الَّذِيْنَ قُتِلُوْا فِيْ سَبِيْلِ اللهِ أَمْوَاتًا؛ 3: 169] الْآيَة. رَوَاهُ التِّرْمِذِيُّ .

6246. (51) [3/1758 అపరిశోధితం]

జాబిర్‌ (ర) కథనం: ప్రవక్త (స) నన్ను ”ఓ జాబిర్‌! ఏమి జరిగింది? చాలా విచారంగా కనబడు తున్నావు?” అని అన్నారు. దానికి నేను, ‘మా నాన్నగారు వీర మరణం పొందారు. అతను కుటుంబ సభ్యులను, రుణాన్ని వదలి వెళ్ళారు,’ అని అన్నాను. అప్పుడు ప్రవక్త (స), ‘అల్లాహ్‌(త) మీ తండ్రి గారితో ఎలా కలిసాడో నీకు శుభవార్త అందజేయనా?’ అని అన్నారు. నేను ‘తప్పకుండా,’ అని అన్నాను. దానికి ప్రవక్త (స), ”అల్లాహ్‌(త) అందరితో తెర వెనుక నుండి మాట్లా డాడు. కాని మీ తండ్రిని అల్లాహ్‌(త) సజీవపరచి, ముందుండి మాట్లాడాడు. అల్లాహ్‌(త) అతనితో, ‘నీకేమి కావాలో కోరుకో,’ అని అన్నాడు. నీ తండ్రి ‘ఓ ప్రభూ! నన్ను మళ్ళీ సజీవపరచు, మళ్ళీ నేను నీ మార్గంలో వీరమరణం పొందుతాను,’ అని అన్నాడు. అప్పుడు అల్లాహ్‌(త), ‘ఒకసారి మరణించిన తర్వాత మళ్ళీ పంపడమన్నది జరగదని నేను నిర్ణయించి ఉన్నాను.’ అని అన్నాడు.” ఆ తరువాత ఈ ఆయతు అవతరించింది: ”అల్లాహ్ మార్గంలో వీరమరణం పొందిన వారిని మృతులు అనకండి.” (ఆల ఇమ్రాన్, 3:169). (తిర్మిజి’)

6247- [ 52 ] ( لم تتم دراسته ) (3/1758)

وَعَنْهُ قَالَ: اِسْتَغْفَر لِيْ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم خَمْسًا وَ عِشْرِيْنَ مَرَّةً. رَوَاهُ التِّرْمِذِيُّ .

6247. (52) [3/1758 అపరిశోధితం]

జాబిర్‌ (ర) కథనం: ప్రవక్త (స) నా గురించి 25 సార్లు ప్రార్థించారు.

6248 – [ 53 ] ( حسن ) (3/1758)

وعَنْ أَنَسٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “كَمْ مِنْ أَشْعَثَ أَغْبَرَ ذِيْ طِمْرَيْنِ لَا يُؤْبَهُ لَهُ لَوْ أَقْسَمَ عَلَى اللهِ لَأَبَرَّهُ مِنْهُمُ الْبَرَاءُ بْنُ مَالِكٍ”.رَوَاهُ التِّرْمِذِيُّ وَالْبَيْهَقِيُّ فِيْ دَلَائِلِ النُّبُوَّةِ.

6248. (53) [3/1758–  ప్రామాణికం]

అనస్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఎంతోమంది ధూళిపట్టిన వెంట్రుకలతో, పాసిపోయిన పాత దుస్తులతో ఉంటారు. వారిని ఎవరూ పట్టించుకోరు. కాని ఒకవేళ వారు అల్లాహ్‌(త)పై ప్రమాణం చేస్తే, అల్లాహ్‌(త) వారి ప్రమాణాన్ని పూర్తిచేస్తాడు. వారిలో బరాఅ’ బిన్‌ మాలిక్‌ కూడా ఒకరు.” (తిర్మిజి’, బైహఖీ – దలాయిలు న్నుబువ్వహ్‌)

6249 – [ 54 ] ( ضعيف ) (3/1759)

وعَنْ أَبِيْ سَعِيْدٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “أَلَا إِنَّ عَيْبَتِي الَّتِيْ آوِيْ إِلَيْهَا أَهْلُ بَيْتِيْ وَإِنَّ كَرْشِي الْأَنْصَارُ فَاعْفُوْا عَنْ مُسِيْئِهِمْ وَاقْبَلُوْا مِنْ مُحْسِنِهِمْ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَقَالَ هَذَا حَدِيْثٌ حَسَنٌ.

6249. (54) [3/1759బలహీనం]

అబూ స’యీద్‌ ‘ఖుద్రీ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”నా అత్యంత సన్నిహితులు నా కుటుంబం వారు, ఇంకా నా మిత్రులు, స్నేహితులు అ’న్సారులు. వారిలో పొరపాటు చేసేవారిని మీరు క్షమించండి. ఇంకా వారిలో మంచివారి సాకులను స్వీకరించండి.” (తిర్మిజి’ – ప్రామాణికం)

6250 – [ 55] ( ضعيف ) (3/1759)

وعَنِ ابْنِ عَبَّاسٍ أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم قَالَ: “لَا يُبْغِضُ الْأَنْصَارَ أَحَدٌ يُؤْمِنُ بِاللهِ وَالْيَوْمِ الْآخِرِ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَقَالَ: هَذَا حَدِيْثٌ حَسَنٌ صَحِيْحٌ .

6250. (55) [3/1759–  బలహీనం]

ఇబ్నె ‘అబ్బాస్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ‘అల్లాహ్‌ (త)ను, తీర్పుదినాన్న విశ్వసించిన అ’న్సారుల వ్యక్తిపట్ల శతృత్వం కలిగి ఉండడు.’ (తిర్మిజి’  – ప్రామాణికం –  దృఢం)

6251 – [ 56 ] ( ضعيف ) (3/1759)

وعَنْ أَنَسٍ وَأَبِيْ طَلْحَةَ قَالَ: قَالَ لِيْ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “أَقْرِئْ قَوْمَكَ السَّلَامَ فَإِنَّهُمْ مَا عَلِمْتُ أَعِفَّةٌ صبْرٌ”. رَوَاهُ التِّرْمِذِيُّ.

6251. (56) [3/1759 బలహీనం]

అనస్‌ (ర), అబూ ‘తల్‌’హా (ర) ద్వారా కథనం: ప్రవక్త (స) నాతో, ”నీవు నీ జాతివారికి నా సలామ్‌ అందజేయి, ఎందుకంటే నాకు తెలిసినంతవరకు వాళ్ళు పరిశుద్ధులు, సహనపరులూను” అని అన్నారు. (తిర్మిజి’)

6252 – [ 57 ] ( صحيح ) (3/1759)

وعَنْ جَابِرٍ أَنَّ عَبْدًا لِحَاطِبٍ جَاءَ إِلى النَّبِيِّ صلى الله عليه وسلم يَشْكُوْ حَاطِبًا إِلَيْهِ فَقَالَ: يَا رَسُوْلَ اللهِ لَيَدْخُلَنَّ حَاطِبٌ النَّارَ فَقَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “كَذَّبْتَ لَا يَدْخُلُهَا فَإِنَّهُ شَهِدَ بَدْرًا وَالْحُدَيْبِيَةَ”. رَوَاهُ مُسْلِمٌ

6252. (57) [3/1759 దృఢం]

జాబిర్‌ (ర) కథనం: ‘హా’తిబ్‌ బిన్‌ బల్తా సేవకుడు ప్రవక్త (స) వద్దకు వచ్చాడు. ‘హా’తిబ్‌ గురించి ఫిర్యాదు చేసాడు. ఇంకా, ‘ఓ ప్రవక్తా! ‘హా’తిబ్‌ తప్పకుండా నరకంలోకి వెళతారు,’ అని అన్నాడు. అది విన్న ప్రవక్త (స), ‘నువ్వు అసత్యం పలుకుతున్నావు, అతడు నరకంలోకి వెళ్ళడు. ఎందుకంటే అతడు బద్ర్‌ యుద్ధంలో, ‘హుదైబియాలో పాల్గొన్నాడు,’ అని అన్నారు. (ముస్లిమ్‌)

6253 – [ 58 ] ( ضعيف ) (3/1759)

وعَنْ أَبِيْ هُرَيْرَةَ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم تَلَا هَذِهِ الْآيَةِ: [وَإِنْ تَتَوَلَّوْا يَسْتَبْدِلُ قَوْمًا غَيْرَكُمْ ثُمَّ لَا يَكُوْنُوْا أَمْثَالَكُمْ؛ 47: 38] قَالُوْا: يَا رَسُوْلَ اللهِ مَنْ هَؤُلَاءِ الَّذِيْنَ ذَكَرَ اللهُ إِنْ تَوَلَّيْنَا اُسْتُبْدِلُوْا بِنَا ثُمَّ لَا يَكُوْنُوْا أَمْثَالَنَا؟ فَضَرَبَ عَلَى فَخِذِ سَلْمَانَ الْفَارِسِيِّ ثُمَّ قَالَ: “هَذَاوَقَوْمُهُ وَلَوْ كَانَ الدِّيْنُ عِنْدَ الثُّرَيّا لَتَنَاوَلَهُ رِجَالٌ مِنَ الْفُرْسِ”. رَوَاهُ التِّرْمِذِيُّ.

6253. (58)[3/1759బలహీనం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ”ఒకవేళ మీరు ధిక్కరిస్తే, అల్లాహ్‌(త) మీ స్థానంలో మరోజాతిని నియమిస్తాడు. వారు మీలా ఉండరు,”  (ము’హమ్మద్, 47:38) అనే ఆయతు పఠించారు. అప్పుడు అనుచరులు, ‘ఓ ప్రవక్తా! అల్లాహ్‌(త) ఎవరిని గురించి ప్రస్తావించారు,’ అని అన్నారు. అప్పుడు ప్రవక్త (స) సల్మాన్‌ ఫారసీ తొడపై చేత్తో కొట్టి, ‘ఈ వ్యక్తి మరియు ఇతని జాతివారు, ఒకవేళ ధర్మం నక్షత్రాలపై ఉన్నా, ఈ ఫారిస్‌ ప్రజలు అక్కడకు వెళ్ళి నేర్చుకుంటారు,’ అని అన్నారు.  (తిర్మిజి’)

6254 – [ 59 ] ( ضعيف ) (3/1760)

وعَنْهُ قَالَ: ذُكِرَتِ الْأَعَاجِمُ عِنْدَ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم. فَقَالَ رَسُوْلُ الله صلى الله عليه وسلم: “لَأَنَا بِهِمْ أَوْ بِبَعْضِهِمْ أَوْثَقُ مِنِّيْ بِكُمْ أَوْ بِبَعْضِكُمْ. رَوَاهُ التِّرْمِذِيُّ.

6254. (59) [3/1760బలహీనం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) వద్ద అరబ్బే తరుల గురించి ప్రస్తావించటం జరిగింది. అప్పుడు ప్రవక్త (స), ‘అరబ్బేతరులపై లేదా వారిలో కొంత మందిపై, మీపైకంటే ఎక్కువ నమ్మకంఉంది నాకు,’ అని అన్నారు. (తిర్మిజి’)

—–

اَلْفَصْلُ الثَّالِثُ      మూడవ విభాగం

6255 – [ 60 ] ( لم تتم دراسته ) (3/1760)

عَنْ عَلِيٍّ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِنَّ لِكُلِّ نَبِيٍّ سَبْعَةَ نُجَبَاءَ رُقَبَاءَ وَأُعْطِيْتُ أَنَا أَرْبَعَةَ عَشَرَ. قُلْنَا: مَنْ هُمْ؟ قَالَ: “أَنَا وَابْنَايَ وَجَعْفَرٌ وَحَمْزَةُ وَأَبُوْ بَكْرٍ وَعُمَرُ وَمُصْعَبُ بْنُ عُمَيْرُ وَبِلَالٌ وَسَلْمَانُ وَعَمَّارٌ وَعَبْدُ اللهِ بْنِ مَسْعُوْدٍ وَأَبُوْ ذَرٍّ وَالْمِقْدَادُ. رَوَاهُ التِّرْمِذِيُّ.

6255. (60) [3/1760 అపరిశోధితం]

‘అలీ (ర) కథనం: ప్రవక్త (స) ”ప్రవక్తకు తోడుగా 7గురు మహా వ్యక్తులు ఉంటారు. నాకు అటువంటి 14 మందిని ప్రసాదించటం జరిగింది,” అని అన్నారు. అప్పుడు మేము, ‘వాళ్ళెవరు,’ అని అడిగాము. దానికి అలీ (ర), ”నేను, నా ఇద్దరు కుమారులు, జ’అఫర్‌, ‘హమ్‌’జహ్, అబూ బకర్‌, ‘ఉమర్‌, ముస్‌’అబ్‌ బిన్‌ ‘ఉమైర్‌, బిలాల్‌, సల్మాన్‌, ‘అమ్మార్‌, ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ మస్‌’ఊద్‌, అబూ జ’ర్‌ మరియు మిఖ్‌దాద్‌ (ర. ‘అన్హుమ్)లు,” అని అన్నారు. (తిర్మిజి’)

6256 – [ 61 ] ( صحيح ) (3/1760)

وعَنْ خَالِدِ بْنِ الْوَلِيْدِ قَالَ: كَانَ بَيْنِيْ وَبَيْنَ عَمَّارِ بْنِ يَاسِرٍ كَلَامٌ فَأَغْلَظْتُ لَهُ فِي الْقَوْلِ. فَانْطَلَقَ عَمَّارٌ يَشْكُوْنِيْ إِلى رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم. فَجَاءَ خَالِدٌ وَهُوَ يَشْكُوْهُ إِلى النَّبِيِّ صلى الله عليه و سلم. قَالَ: فَجَعَلَ يُغْلِظُ لَهُ وَلَا يَزِيْدُهُ إِلَّا غِلْظَةً. وَالنَّبِيُّ صلى الله عليه وسلم سَاكِتٌ لَا يَتَكَلَّمُ. فَبَكَى عَمَّارٌ وَقَالَ: يَا رَسُوْلَ اللهِ أَلَا تَرَاهُ؟ فَرَفَعَ النَّبِيُّ صلى الله عليه وسلم رَأْسَهُ وَقَالَ: “مَنْ عَادَى عَمَّارًا عَادَاهُ اللهُ وَمَنْ أَبْغَضَ عَمَّارًا أَبْغَضَهُ اللهُ”. قَالَ خَالِدٌ: فَخَرَجْتُ فَمَا كَانَ شَيْءٌ أَحَبَّ إِلَيَّ مِنْ رِضَى عَمَّارٍ فَلَقِيْتُهُ بِمَا رَضِيَ فَرَضِيَ .

6256. (61) [3/1760 దృఢం]

ఖాలిద్‌ బిన్‌ వలీద్‌ (ర) కథనం: నేనూ, ‘అమ్మార్‌  మాట్లాడుకుంటున్నాం. నేను అమ్మార్‌ (ర)ను కఠినంగా హెచ్చరించాను. ‘అమ్మార్‌ (ర) నా గురించి ఫిర్యాదు చేయడానికి, ప్రవక్త (స) వద్దకు వెళ్ళారు. అతను పిర్యాదు చేస్తుండగా నేను కూడా చేరాను. నా గురించి ఫిర్యాదు చేయటం విని మళ్ళీ కఠినంగా చీవాట్లు పెట్టాను. మా వివాదం పెరుగుతూనే పోయింది. ప్రవక్త (స) మౌనంగా ఉన్నారు. ఏమీ మాట్లాడలేదు. అమ్మార్‌ ఏడ్వసాగారు. ఇంకా, ‘ఓ ప్రవక్తా! మీరు చూస్తున్నారు కదా!’ అని అన్నారు. ప్రవక్త (స) తన తలపైకెత్తి, ” ‘అమ్మార్‌తో, ‘శతృత్వం ఉంచిన వ్యక్తితో అల్లాహ్‌(త) కూడా శతృత్వం ఉంచుతాడు, అదేవిధంగా ‘అమ్మార్‌తో ద్వేషం ఉంచిన వ్యక్తి పట్ల అల్లాహ్‌(త) కూడా ద్వేషం కలిగి ఉంటాడు,” అని అన్నారు. నేనక్కడి నుండి నిశ్శబ్దంగా బయటకు వచ్చాను, అప్పుడు నా వద్ద ‘అమ్మార్‌(ర)ను సంతోషపరచటం కన్నా మరొక వస్తువేదీ ప్రీతికరమైనదిగా లేదు. ఆ వెంటనే నేను అమ్మార్‌(ర) పట్ల ఎలా ప్రవర్తించానంటే, అతడు నా పట్ల సంతోషం వ్యక్తంచేసాడు. (ముస్నద్‌ అ’హ్మద్‌)

6257 – [ 62 ] ( صحيح ) (3/1761)

وَعَنْ أُبِيْ عُبَيْدَةَ أَنَّهُ قَالَ: سَمِعْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ: “خَالِدٌ سَيْفٌ مِنْ سُيُوْفِ اللهِ عَزَّ وَجَلَّ وَنِعْمَ فَتَى الْعَشِيْرَةِ”. رَوَاهُمَا أَحْمَدُ.

6257. (62) [3/1761 దృఢం]

అబూ ‘ఉబైదహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ఇలా ప్రవచిస్తూ ఉండగా నేను విన్నాను, ”ఖాలిద్‌ అల్లాహ్‌ కరవాలాల్లో ఒక కరవాలం. అతడు తన జాతిలోని ఒక ఉత్తమ యువకుడు.”  (ముస్నద్‌  అ’హ్మద్‌)

6258 – [ 63 ] ( لم تتم دراسته ) (3/1761)

وَعَنْ بُرَيْدَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِنَّ اللهَ تَبَارَكَ وَتَعَالى أَمَرَنِيْ بِحُبِّ أَرْبَعَةٍ وَأَخْبَرَنِيْ أَنَّهُ يُحِبُّهُمْ”. قِيْلَ يَا رَسُوْلَ اللهِ سَمِّهِمْ لَنَا قَالَ: “عَلِيٌّ مِنْهُمْ”. يَقُوْلُ ذَلِكَ ثَلَاثًا “وَأَبُوْ ذَرٍّ وَالْمِقْدَادُ وَسَلْمَانُ أَمَرَنِيْ بِحُبِّهِمْ وَأَخْبَرَنِيْ أَنَّهُ يُحِبُّهُمْ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَقَالَ: هَذَا حَدِيْثٌ حَسَنٌ غَرِيْبٌ

6258. (63) [3/1761అపరిశోధితం]

బురైదహ్‌ (ర) కథనం: ప్రవక్త (స), ‘అల్లాహ్‌(త) నన్ను నలుగురిని ప్రేమించమని ఆదేశించారు. అల్లాహ్‌(త) కూడా వారిని ప్రేమిస్తాడని నాకు తెలియపరిచాడు’ అని అన్నారు. ప్రవక్త (స)ను వారిపేర్లు చెప్పమని కోరడం జరిగింది. అప్పుడు ప్రవక్త (స), ” అలీ (ర) వారిలో ఉన్నారని, మూడుసార్లు వల్లించారు.” ఇంకా, అబూ జ’ర్‌ (ర), మిఖ్‌దాద్‌ (ర), సల్మాన్‌ (ర) కూడా వారిలో ఉన్నారు, నన్ను వారిని ప్రేమించమని ఆదేశించ బడిందని, ఇంకా అల్లాహ్‌ (త) కూడా వారిని ప్రేమిస్తున్నాడని తెలియ పరచబడింది,” అని అన్నారు.  (తిర్మిజి’ –  ప్రామాణికం – ఏకోల్లేఖనం)

6259 – [ 64 ] ( صحيح ) (3/1761)

وعَنْ جَابِرٍ قَالَ: كَانَ عُمَرُ يَقُوْلُ: أَبُوْ بَكْرٍ سَيِّدُنَا وَأَعْتَقَ سَيِّدَنَا يَعْنِيْ بِلَالًا. روَاهُ الْبُخَارِيُّ.

6259. (64) [3/1761దృఢం]

జాబిర్‌ (ర) కథనం: ఉమర్ (ర), అనేవారు, ”అబూ బకర్‌ (ర) మా నాయకులు, మా నాయకులు బిలాల్‌ను విడుదల చేయించారు.” (బు’ఖారీ)

6260 – [ 65 ] ( صحيح ) (3/1761)

وعَنْ قَيْسِ بْنِ أَبِيْ حَازِمٍ أَنَّ بِلَالًا قَالَ لِأَبِيْ بَكْرٍ: إِنْ كُنْتَ إِنَّمَا اشْتَرَيْتَنِيْ لِنَفْسِكَ فَأَمْسِكْنِيْ وَإِنْ كُنْتَ إِنَّمَا اشْتَرَيْتَنِيْ لِلّهِ فَدَعْنِيْ وَ عَمَلُ اللهِ. روَاهُ الْبُخَارِيُّ .

6260. (65) [3/1761 దృఢం]

ఖైస్‌ బిన్‌ అబూ ‘హా’జిమ్‌ (ర) కథనం: ”బిలాల్‌ (ర), అబూ బకర్‌ (ర)తో ఒకవేళ మీరు మీ కోసం కొని ఉంటే, మీ దగ్గరే  ఉంచుకోండి, ఒకవేళ దైవప్రీతికోసం కొనిఉంటే, నన్ను దైవకార్యాల కోసం విడుదల చేయండి,” అని అన్నారు.  (బు’ఖారీ)

6261 – [ 66 ] ( مُتَّفَقٌ عَلَيْهِ ) (3/1761)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: جَاءَ رَجُلٌ إِلَى رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم. فَقَالَ: إِنِّيْ مَجْهُوْدٌ فَأَرْسَلَ إِلى بَعْضِ نِسَائِهِ. فَقَالَتْ وَالَّذِيْ بَعَثَكَ بِالْحَقِّ مَا عِنْدِيْ إِلَّا مَاءٌ. ثُمَّ أَرْسَلَ إِلى أُخْرَى. فَقَالَتْ مِثْلَ ذَلِكَ. وَقُلْنَ كُلُّهُنَّ مِثْلَ ذَلِكَ. فَقَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَنْ يُضِيْفُهُ وَيَرْحَمُهُ اللهُ”. فَقَامَ رَجُلٌ مِنَ الْأَنْصَارِ يُقَالُ لَهُ أَبُوْ طَلْحَةَ. فَقَالَ: أَنَا يَا رَسُوْلَ اللهِ. فَانْطَلَقَ بِهِ إِلى رَحْلِهِ. فَقَالَ: لِامْرَأَتِهِ هَلْ عِنْدَكَ شَيْءٌ. قَالَتْ لَا إِلَّا قُوْتَ صِبْيَانِيْ. قَالَ فَعَلِّلِيْهِمْ بِشَيْءٍ وَنَوِّمِيْهِمْ. فَإِذَا دَخَلَ ضَيْفُنَا فَأَرِيْهِ. أَنَا نَأْكُلُ فَإِذَا أَهْوَى لِيَأْكُلَ فَقُوْمِيْ إِلى السِّرَاجِ كَيْ تُصْلِحِيْهِ فَأَطْفِئِيْهِ. فَفَعَلَتْ فَقَعَدُوْا وَأَكَلَ الضَّيْفُ. فَلَمَّا أَصْبَحَ غَدًا عَلَى رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم. فَقَالَ رَسُوْلُ الله صلى الله عليه وسلم: “لَقَدْ عَجِبَ اللهُ أَوْ ضَحِكَ اللهُ مِنْ فُلَانٍ وَفُلَانَةَ”.

وَفِيْ رِوَايَةٍ مِثْلَهُ وَلَمْ يُسَمِّ أَبَا طَلْحَةَ

وَفِيْ آخِرِهَا فَأَنْزَلَ اللهُ تَعَالى [وَيُؤْثِرُوْنَ عَلَى أَنْفُسِهِمْ وَلَوْ كَانَ بِهِمْ خَصَاصَةٌ؛ 59: 9]. مُتَّفَقٌ عَلَيْهِ.

6261. (66) [3/1761ఏకీభవితం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) వద్దకు ఒక వ్యక్తి వచ్చాడు. నేను చాలా కష్టాల్లో, ఆపదల్లో ఉన్నానని విన్నవించుకున్నాడు. ప్రవక్త (స) ఒక వ్యక్తిని, తన భార్య వద్దకు పంపారు. దానికి ఆమె ప్రవక్త (స)కు, ‘సత్యం ఇచ్చి పంపిన అల్లాహ్ సాక్షి! నా వద్ద నీళ్ళు తప్ప మరేమీ లేవు,’ అని అన్నారు. ఆ తరువాత ప్రవక్త (స) రెండవ భార్య వద్దకు పంపారు. అదే విధంగా భార్యలందరూ ఆ సమాధానమే ఇచ్చారు. ఆ తరువాత ప్రవక్త (స) అనుచరులను ఉద్దేశించి, ‘ఈ వ్యక్తికి ఆతిథ్యం ఇచ్చే వ్యక్తిని అల్లాహ్‌(త) కరుణిస్తాడు,’ అని అన్నారు. అనంతరం ఒక అ’న్సారీ వ్యక్తి నిలబడ్డాడు. అతని పేరు అబూ ‘తల్‌’హా. అతడు, ఓ ప్రవక్తా(స)! ‘నేను ఇతనికి ఆతిథ్యం ఇస్తాను,’ అని అన్నారు. అనంతరం అతన్ని, అతడు తన ఇంటికి తీసుకొనివెళ్ళాడు. తన భార్యతో, ‘తినటానికి ఏముంది?’ అని అడిగారు. దానికి ఆమె, ‘పిల్లల కోసం తప్ప మరేమీ లేదు,’ అని చెప్పింది. అతడు తన భార్యతో, ‘పిల్లల్ని బుజ్జగించి పడుకో బెట్టుకో, అతిథి వచ్చిన తర్వాత మనం కూడా అతనితో పాటు తింటున్నట్టు నటించాలి, అతడు తినటానికి చేయి ముందుకు చాచినప్పుడు, దీపాన్ని సరిచేసినట్టు ఆర్పివేయాలి,’ అని అన్నారు. ఆమె అలాగే చేసింది. ముగ్గురూ కూర్చున్నారు. కాని అన్నం అతిథి మాత్రమే తిన్నాడు. వారిద్దరూ రాత్రి ఆకలితో గడిపారు. ఉదయం అబూ ‘తల్’హా ప్రవక్త (స) వద్దకు వచ్చారు. అప్పుడు ప్రవక్త (స) ఫలానా వ్యక్తి, ఫలానా స్త్రీ యొక్క కర్మ అల్లాహ్‌(త)కు చాలా నచ్చింది, వీరిద్దరు చేసిన పనికి  అల్లాహ్‌(త)కు  నవ్వు  వచ్చేసింది.

మరో ఉల్లేఖనంలో ఈ పదాలే ఉన్నాయి. కాని అందులో అబూ ‘తల్‌’హా పేరు లేదు. ఈ ‘హదీసు’ చివర అల్లాహ్‌(త): ”వారు తమకంటే ఇతరులకు ప్రాధాన్యత ఇస్తారు. వారు అవసరం గలవారైనా సరే,” (అల్ ‘హష్ర్, 59:9) అనే ఆయాతులను అవతరింప జేసాడు. (బు’ఖారీ, ముస్లిమ్‌)

6262 – [ 67 ] ( ضعيف ) (3/1762)

وعَنْهُ قَالَ: نَزَلْنَا مَعَ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم مَنْزِلًا فَجَعَلَ النَّاسُ يَمُرُّوْنَ فَيَقُوْلُ رَسُوْلُ الله صلى الله عليه وسلم: “مَنْ هَذَا يَا أَبَا هُرَيْرَةَ؟” فَأَقُوْلُ: فُلَانٌ. فَيَقُوْلُ: “نِعْمَ عَبْدُ اللهِ هَذَا”. وَيَقُوْلُ: “مَنْ هَذَا؟”. فَأَقُوْلُ: فُلَانٌ. فَيَقُوْلُ: “بِئْسَ عَبْدُ اللهِ هَذَا”. حَتّى مَرَّ خَالِدُ بْنُ الْوَلِيْدِ فَقَالَ: “مَنْ هَذَا؟” فَقُلْتُ: خَالِدُ بْنُ الْوَلِيْدِ. فَقَالَ: “نِعْمَ عَبْدُ اللهِ خَالِدُ بْنُ الْوَلِيْدِ سَيْفٌ مِنْ سُيُوْفِ اللهِ”. رَوَاهُ التِّرْمِذِيُّ.  

6262. (67) [3/1762 బలహీనం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) వెంట మేము ఒక ప్రాంతంలో దిగాము. అక్కడ ప్రజలు వెళుతున్నారు. ప్రవక్త (స) వెళ్ళేవారి గురించి అడుగుతూ, ‘ఓ అబూ హురైరహ్‌ (ర) ఇతనెవరు?’ అని అడుగుతారు. అతడు, ‘దాసుడు,’ అని అన్నారు. మళ్ళీ ప్రవక్త (స), ‘ఇతనెవరని,’ అడుగుతారు. ‘నేను ఫలానా వ్యక్తి,’ అని అన్నాను. అప్పుడు ప్రవక్త (స), ‘ఇతడు అల్లాహ్‌(త) ఉత్తమదాసుడు’ అని అన్నారు. మళ్ళీ ప్రవక్త (స), ‘ఇతనెవరని’ అడుగుతారు. ఇతడు ఫలానా వ్యక్తని నేనన్నాను. అప్పుడు ప్రవక్త (స), ‘ఇతడు అల్లాహ్‌ (త) చెడ్డదాసుడు,’ అని అన్నారు. చివరికి ‘ఖాలిద్‌ బిన్‌ వలీద్‌ అటునుండి వెళ్ళడం జరిగింది. ప్రవక్త (స), ‘ఇతనెవరని,’ అడిగారు. దానికి నేను ‘ఇతడు ‘ఖాలిద్‌ బిన్‌ వలీద్‌,’ అని అన్నాను. అప్పుడు ప్రవక్త (స), ‘ ఖాలిద్‌ బిన్‌ వలీద్‌ అల్లాహ్‌() మంచిదాసుడు, అల్లాహ్‌() కరవాలాల్లో ఒక కరవాలం,’ అని అన్నారు. (తిర్మిజి’)

6263 – [ 68 ] ( صحيح ) (3/1762)

وعَنْ زَيْدِ بْنِ أَرْقَمَ قَالَ: قَالَتِ الْأَنْصَارُ: يَا نَبِيَّ اللهِ لِكُلِّ نَبِيٍّ أَتْبَاعٌ وَإِنَّا قَدِ اتَّبَعْنَاكَ فَادْعُ اللهَ أَنْ يَجْعَلْ أَتْبَاعَنَا مِنَّا فَدَعَا بِهِ”. روَاهُ الْبُخَارِيُّ.

6263. (68) [3/1762- దృఢం]

‘జైద్‌ బిన్‌ అర్‌ఖమ్‌ (ర) కథనం: అ’న్సార్లు, ”ఓ అల్లాహ్‌ ప్రవక్తా! ప్రతి ప్రవక్త(స)కు కొందరు అనుచరులు ఉంటారు, మేము మిమ్మల్ని అనుసరించాము, మా అనుచరులనుకూడా మాలా చేయమని అల్లాహ్‌(త) ను ప్రార్థించండి,” అని విన్నవించుకున్నారు. అనంతరం ప్రవక్త (స) వారి గురించి  దు’ఆ  చేసారు. (బు’ఖారీ)

6264 – [ 69 ] ( صحيح ) (3/1762)

وعَنْ قَتَادَةَ قَالَ: مَا نَعْلَمُ حَيًّا مِنْ أَحْيَاءِ الْعَرَبِ أَكْثَرَ شَهِيْدًا أَعَزَّ يَوْمَ الْقِيَامَةِ مِنَ الْأَنْصَارِ. قَالَ: وقَالَ أَنَسٌ: قُتِلَ مِنْهُمْ يَوْمَ أُحُدٍ سَبْعُوْنَ وَيَوْمَ بِئْرِ مَعُوْنَةَ سَبْعُوْنَ وَيَوْمَ الْيَمَامَةِ عَلَى عَهْدِ أَبِيْ بَكْرٍ سَبْعُوْنَ. روَاهُ الْبُخَارِيُّ.

 6264. (69) [3/1762దృఢం]

ఖతాదహ్‌ (ర) కథనం: ”అరబ్బుల తెగల్లో ఏ తెగలోనూ అ’న్సారుల కంటే అధికంగా అమరవీరులు  ఉన్నారని, తీర్పుదినం నాడు అ’న్సారులకన్నా ఉన్నతులుగా ఉంటారని, మేము ఎరుగము. ఎందు కంటే, అనస్‌ (ర) చెప్పారు, హుద్యుద్ధంలో 70 మంది అ’న్సారులు వీరమరణం పొందారు, బిఅరె హ్ నాడు 70 మంది అ’న్సారులు వీరమరణం పొందారు, ఇంకా అబూ బకర్‌ ‘ఖిలాఫత్ కాలంలో, యమామహ్ యుద్ధంలో, 70 మంది అన్సారులు వీరమరణం  పొందారు.”  [35] (బు’ఖారీ)

=====

6265 – [ 70 ] ( صحيح ) (3/1762)

وعَنْ قَيْسِ بْنِ حَازِمٍ قَالَ: كَانَ عَطَاءُ الْبَدْرِيِّيْنَ خَمْسَةَ آلْافٍ. وَقَالَ عُمَرُ: لَأُفَضِّلَنَّهُمْ عَلَى مَنْ بَعْدَهُمْ. روَاهُ الْبُخَارِيُّ.

6265. (70) [3/1762 దృఢం]

ఖైస్‌ బిన్‌ అబీ ‘హాజిమ్‌ (ర) కథనం: బద్ర్‌ యుద్ధంలో పాల్గొన్న వారి పెన్షన్‌ 5000 దీనార్లు ఉండేది. ఇంకా ‘ఉమర్‌ (ర), ‘బద్ర్‌ యుద్ధంలో పాల్గొన్నవారిని వారి తరువాత వచ్చే వారిపై నేను ప్రాధాన్యత ఇస్తున్నాను,’ అని అన్నారు. (బు’ఖారీ)

 تَسْمِيَةُ مَنْ سُمِّيَ مِنْ أَهْلِ الْبَدْرِفِيْ”الْجَامِعِ لِلْبُخَارِيّ”

6265 – [ 70 ] ( صحيح ) (3/1763)

1 – اَلنَّبِيُّ مُحَمَّدُ بْنُ عَبْدِ اللهِ الْهَاشِمِيُّ صلى الله عليه وسلم . 2 – عَبْدُ اللهِ بْنُ عُثْمَانَ أَبُوْ بَكْرٍ الصَّدِّيْقُ الْقُرَشِيُّ . 3 – عُمَرُ بْنُ الْخَطَّابِ الْعَدَوِيُّ . 4 – عُثْمَانُ بْنُ عَفَّانَ خَلَّفَهُ النَّبِيُّ صلى الله عليه وسلم عَلَى ابْنَتِهِ رُقَيَّةَ وَضَرَبَ لَهُ بِسَهْمِهِ . 5 – عَلِيُّ بْنُ أَبِيْ طَالِبٍ الْهَاشِمِيُّ . 6- إِيَاسُ بْنُ الْبُكَيْرٍ . 7- بِلَالُ بْنُ رِبَاحٍ مَوْلَى أَبِيْ بَكْرٍ الصِّدِّيْقِ . 8 -حَمْزَةُ بْنُ عَبْدِ الْمُطَّلِبِ الْهَاشِمِيُّ . 9- حَاطِبُ بْنُ أَبِيْ بَلْتَعَةَ حَلِيْفٌ لِقُرَيْشٍ . 10 – أَبُوْ حُذَيْفَةَ بْنُ عُتْبَةَ بْنِ رَبِيْعَةَ الْقُرَشِيُّ. 11 – حَارِثَةُ بْنُ الرُّبَيِّعِ الْأَنْصَارِيُّ قُتِلَ يَوْمَ بَدْرٍ وَهُوَ حَارِثَةُ بْنُ سُرَاقَةَ كَانَ فِي النَّظَّارَةِ  12 – خُبَيْبُ بْنُ عَدِيِّ الْأَنْصَارِيُّ . 13 – خُنَيْسُ بْنُ حُذَافَةَ السَّهْمِيُّ . 14 – رِفَاعَةُ بْنُ رَافِعٍ الْأَنْصَارِيُّ . 15 – رِفَاعَةُ بْنُ عَبْدِ الْمُنْذِرِ أَبُوْ لُبَابَةَ الْأَنْصَارِيُّ. 16- اَلزُّبَيْرُ بْنُ الْعَوَّامِ الْقُرَشِيُّ  17 – زَيْدُ بْنُ سَهْلِ أَبُوْ َطَلْحَةَ الْأَنْصَارِيُّ . 18 – أَبُوْ زَيْدِ الْأَنْصَارِيُّ. 19 – سَعْدُ بْنُ مَالِكٍ الزُّهْرِيُّ . 20 – سَعْدُ بْنُ خَوْلَةَ الْقُرَشِيُّ. 21 – سَعِيْدُ بْنُ زَيْدِ بْنِ عَمْرِو بْنِ نُفَيْلِ الْقُرَشِيُّ . 22 – سَهْلُ بْنُ حُنَيْفٍ الْأَنْصَارِيُّ . 23 – ظُهَيْرُ بْنُ رَافِعٍ الْأَنْصَارِيُّ .

6265 – [ 70 ] ( صحيح ) (3/1764):

  24- وَأَخُوْهُ . 25 – عَبْدُ اللهِ بْنِ مَسْعُوْدٍ الْهُذْلِيُّ . 26 – عَبْدُ الرّحْمنِ بْنِ عَوْفٍ الزُّهْرِيُّ . 27 – عُبَيْدَةُ بْنُ الْحَارِثِ الْقُرَشِيُّ . 28 -عُبَادَةُ بْنُ الصَّامِتِ الْأَنْصَارِيُّ . 29 – عَمْرُو بْنُ عَوْفٍ حَلِيْفُ بَنِيْ عَامِرِ بْنِ لُؤَيٍ . 30 – عُقْبَةُ بْنُ عَمْرٍو الْأَنْصَارِيُّ . 31 – عَامِرُ بْنُ رَبِيْعَةَ الْعَنَزِيُّ . 32 – عَاصِمُ بْنُ ثَابِتِ الْأَنْصَارِيُّ . 33 -عُوَيْمُ بْنُ سَاعِدَةَ الْأَنْصَارِيُّ . 34 – عُتْبَانُ بْنُ مَالِكِ الْأَنْصَارِيُّ. 35 – قُدَامَةُ بْنُ مَظْعُوْنٍ . 36 – قَتَادَةُ بْنُ النُّعْمَانِ الْأَنْصَارِيُّ. 37- مُعَاذُ بْنُ عَمْرِو بْنِ الْجَمُوْحِ  38 – مُعَوَّذُ بْنِ عَفْرَاءَ .39 – وَأَخُوْهُ. 40- مَالِكُ بْنُ رَبِيْعَةَ أَبُوْ أُسَيْدِ الْأَنْصَارِيُّ. 41 – مِسْطَحُ بْنُ أَثَاثَةَ بْنِ عَبَّادِ بْنِ الْمُطَّلِبِ بْنِ عَبْدِ مُنَافٍ. 42 – مُرَارَةُ بْنُ الرَّبِيْعِ الْأَنْصَارِيُّ . 43 – مَعْنُ بْنُ عَدِيِّ الْأَنْصَارِيُّ. 44 – مِقْدَادُ بْنُ عَمْرٍو الْكِنْدِيُّ حَلِيْفُ بَنِيْ زُهْرَةَ . 45 – هِلَالُ بْنُ أُمَيَّةَ الْأَنْصَارِيُّ رَضِيَ اللهُ عَنْهُمْ .

జామె  బుఖారీలో  ఉన్న,  బద్ర్యుద్ధంలో పాల్గొన్న ప్రవక్త () సహచరులు (. అన్హుంల) పేర్లు

6265. (70) [3/1763దృఢం]:

1. మహా ప్రవక్త (స) ము’హమ్మద్‌ బిన్‌ ‘అబ్దుల్లాహ్‌ అల్‌ హాష్మీ, 2. ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘ఉస్మాన్‌ అబూ బకర్‌ సిద్దీఖ్ ఖురైషీ, 3. ‘ఉమర్‌ బిన్‌ అల్‌ ‘ఖ’త్తాబ్‌ అల్‌ ‘అద్‌వీ, 4. ‘ఉస్మాన్‌ బిన్‌ ‘అఫ్ఫాన్‌ ఖురైషీ, (ఇతన్ని ప్రవక్త (స) తన కూతురు(రుఖయ్యహ్) బోబాగోగులు చూడటానికి అక్కడే వదలి వెళ్ళారు. యుద్ధ బూటీలో అతనికి వాటా ఇచ్చారు, 5. ‘అలీ బిన్‌ అబీ ‘తాలిబ్‌ హాష్మీ, 6. ఇయాస్‌ బిన్‌ బుక్దైర్‌, 7. బిలాల్‌ బిన్‌ రబా’హ్‌. (అబూబకర్‌ విడుదల చేయించిన బానిస), 8. ‘హమ్‌జా బిన్‌ ‘అబ్దుల్‌ ము’త్తలిబ్‌ హాష్మీ, 9. ‘హా’తిబ్‌ బిన్‌ అబీ బల్త’అహ్ (ఇతను ఖురైషుల సన్నిహితులు), 10. అబూ ‘హుజై’ఫహ్ బిన్‌ ‘ఉత్‌బహ్ బిన్‌ రబీ’అహ్ ఖురషీ, 11. ‘హారిస’హ్ బిన్‌ రబీ’అ అ’న్సారీ, (ఇతను బద్ర్‌ నాడు వీరమరణం పొందారు. (ఇతడే ‘హారిస’హ్ బిన్‌ సురాఖహ్ – శత్రువులపై గూఢచారిగా నియమించ బడ్డవారు), 12. ‘ఖుబైబ్‌ బిన్‌ ‘అదీ అ’న్సారీ, 13. ‘ఖునైస్‌ బిన్‌ ‘హుజా’ఫహ్‌ సహ్‌మీ, 14. రిఫా’అహ్ బిన్‌ రాఫె’అ అ’న్సారీ, 15. రిఫా’అహ్ బిన్‌ ‘అబ్దుల్‌ మున్‌జి’ర్‌ అబూ లుబాబహ్‌ అ’న్‌సారీ, 16. ‘జుబైర్‌ బిన్‌ ‘అవ్వామ్‌ ఖురైషీ, 17. ‘జైద్‌ బిన్‌ సహ్‌ల్‌ అబూ ‘తల్’హా అ’న్సారీ, 18. అబూ ‘జైద్‌ అ’న్సారీ, 19. స’అద్‌ బిన్‌ మాలిక్‌ ‘జహ్‌రీ, 20. స’అద్‌ బిన్‌ ‘ఖౌల ఖురైషీ, 21. స’యీద్‌ బిన్‌ ‘అమ్ర్‌ బిన్‌ నుఫైల్‌ ఖురైషీ, 22. సహల్ బిన్ ‘హనీఫ్ అ’న్సారి, 23. ”జుహైర్ బిన్ రాఫె’అ అ’న్సారి.

6265. (70) [3/1764దృఢం]:

24. ”జుహైర్‌ బిన్‌ రాఫె సోదరుడు, 25. ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ మస్‌’ఊద్‌ హజ’లీ, 26. ‘అబ్దుర్ర’హ్మాన్‌ బిన్‌ ‘ఔఫ్‌ ‘జుహ్‌రీ, 27. ‘ఉబైదహ్‌ బిన్‌ ‘హారిస్’ ఖురైషీ, 28. ‘ఉబాదహ్‌ బిన్‌ ‘సామిత్‌ అ’న్సారీ, 29. ‘అమ్ర్‌ బిన్‌ ఔఫ్ బనీ ‘ఆమిర్‌ బిన్ లుఅ’యి, 30. ‘ఉఖ్‌బహ్ బిన్‌ ‘అమ్ర్‌ అ’న్సారీ, 31. ‘ఆమిర్‌ బిన్‌ రబీ’అహ్ ‘అన్’జీ, 32. ‘ఆసిమ్‌ బిన్‌ సా’బిత్‌ అ’న్సారీ, 33. ‘ఉవైమ్‌ బిన్‌ సా’యిదహ్‌ అ’న్సారీ, 34. ‘ఇత్‌బాన్‌ బిన్‌ మాలిక్‌ అ’న్సారీ, 35. ఖదామహ్ బిన్‌ మ”జ్‌’ఊన్‌, 36. ఖతాదహ్‌ బిన్‌ ను’అమాన్‌ అ’న్సారీ, 37. మ’ఆజ్‌’ బిన్‌ ‘అమ్ర్‌ బిన్‌ జమూ’హ్‌, 38. ము’అవ్విజ్‌’ బిన్‌ ‘అఫ్రాఅ’, 39. ము’అవ్విజ్‌’ బిన్‌ ‘అఫ్రాఅ’ సోదరుడు, 40. మాలిక్‌ బిన్‌ రబీ’అహ్ అబూ ఉసైద్‌ అ’న్సారీ, 41. మిస్‌’త’హ్‌ బిన్‌ అసా’స’హ్ బిన్‌ అబ్బాద్‌ బిన్‌ అల్‌ ము’త్తలిబ్‌ బిన్‌ ‘అబ్దు మునాఫ్‌ 42. మురారహ్ బిన్‌ రబీ’అ అ’న్సారీ, 43. మ’అన్‌ బిన్‌ ‘అదీ అ’న్సారీ, 44. మిఖ్‌దాద్‌ బిన్‌ ‘అమ్ర్‌ అల్‌ కందీ (ఇతడు బనీ ‘జహ్‌రహ్‌ ‘హలీఫులు, 45. బిలాల్‌ బిన్‌ ఉమయ్యహ్‌ అ’న్సారీ. అల్లాహ్‌ వీరందరి పట్ల సంతృప్తి చెందాడు.[36]

=====

13-  بَابُ ذِكْرِ الْيَمْنِ وَالشَّامِ وَذِكْرِ أُوَيْسِ الْقَرْنِيْ

13. యమన్‌, షామ్మరియు ఒవైస్, ఖర్నీల ప్రస్తావన

اَلْفَصْلُ الْأَوَّلُ  మొదటి విభాగం 

6266 – [ 1 ] ( صحيح ) (3/1765)

عَنْ عَمْرِ بْنِ الْخَطَّابِ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم قَالَ: “إِنَّ رَجُلًا يَأْتِيْكُمْ مِنَ الْيَمَنِ يُقَالُ لَهُ: أُوَيْسٌ لَا يَدَعُ بِالْيَمَنِ غَيْرَ أُمٍّ لَهُ قَدْ كَانَ بِهِ بِيَاضٌ فَدَعَا اللهَ فَأَذْهَبَهُ إِلَّا مَوْضِعَ الدِّيْنَارِ أَوْ الدِّرْهَمِ فَمَنْ لَقِيَهُ مِنْكُمْ فَلْيَسْتَغْفِرُ لَكُمْ”.

وَفِيْ رِوَايَةٍ قَالَ: سَمِعْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ: “إِنَّ خَيْرَ التَّابِعِيْنَ رَجُلٌ يُقَالُ لَهُ: أُوَيْسٌ. وَلَهُ وَالِدَةٌ وَكَانَ بِهِ بِيَاضٌ فَمُرُوْهُ فَلْيَسْتَغْفِرْلَكُمْ”.  رَوَاهُ مُسْلِمٌ

6266. (1) [3/1765 దృఢం]

‘ఉమర్‌ బిన్‌ ‘ఖ’త్తాబ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఒక వ్యక్తి యమన్‌ నుండి మీ దగ్గరకు వస్తాడు. అతని పేరు ఒవైస్‌ ఉంటుంది. అతడు యమన్‌లో తన తల్లిని తప్ప మరెవరినీ వదలడు. అతని శరీరమంతా తెల్లమచ్చల వ్యాధి ఉంటుంది. అతడు అల్లాహ్‌(త)ను ప్రార్థించాడు. ఫలితంగా అతని వ్యాధి నయమయింది. కేవలం ఒక్క దినార్‌ లేదా దిర్‌హమ్‌ అంత చోటు మిగిలి ఉంది. మీలోని అతన్ని కలిసినవారు, అతని ద్వారా తన క్షమాపణ గురించి దు’ఆ చేయించుకోవాలి.

మరో ఉల్లేఖనంలో ఇలా ఉంది: ‘ఉమర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ఇలా ప్రవచిస్తూ ఉండగా నేను విన్నాను. ”తాబియీన్లలో ఒవైస్‌ అనే వ్యక్తి ఉత్తముడు. అతనికి తల్లి ఉంటుంది. అతని శరీరంపై తెల్లమచ్చల వ్యాధి ఉంటుంది. మీరు అతన్ని తమ గురించి దు’ఆ చేయమని  చెప్పండి. (ముస్లిమ్‌)

6267 – [ 2 ] ( مُتَّفَقٌ عَلَيْهِ ) (3/1765)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ: “أَتَاكُمْ أَهْلُ الْيَمَنِ هُوَأَرَقُّ أَفْئِدَةً وَأَلْيَنُ قُلُوْبًا الْإِيْمَانُ يَمَانٍ وَالْحِكْمَةُ يِمَانِيَةٌ وَالْفَخْرُ وَالْخُيَلَاءُ فِي أَصْحَابِ الْإِبِلِ وَالسَّكِيْنَةُ وَالْوَقَارُ فِي أَهْلِ الْغَنَمِ”. مُتَّفَقٌ عَلَيْهِ.

6267. (2) [3/1765ఏకీభవితం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”యమన్‌ నుండి ప్రజలు మీ వద్దకు వచ్చారు. వీరు చాలా సున్నిత మనస్కులు. ఇతరుల కంటే వీరు హిత ధనలు చాలా తొందరగా గ్రహిస్తారు. విశ్వాసం యమన్‌ ప్రజల్లో ఉంది, వివేకం యమన్‌ ప్రజల్లో ఉంది. అయితే గర్వాహంకారాలు ఒంటెల యజమానుల్లో ఉంటుంది. నిదానం, హుందాతనం, ఓర్పు మేకల యజమానుల్లో ఉంటుంది.  (బు’ఖారీ, ముస్లిమ్‌)

6268 – [ 3 ] ( مُتَّفَقٌ عَلَيْهِ ) (3/1765)

وَعَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم:”رَأْسُ الْكُفْرِ نَحْوَ الْمَشْرِقِ وَالْفَخْرُ وَالْخُيَلَاءُ فِي أَهْلِ الْخَيْلِ وَالْإِبْلِ وَالْفَدَّادِيْنُ أَهْلِ الْوَبَرِ وَالسَّكِيْنَةُ فِيْ أَهْلِ الْغَنَمِ”. مُتَّفَقٌ عَلَيْهِ.

6268. (3) [3/1765 ఏకీభవితం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”అవిశ్వాసం తల తూర్పువైపు ఉంది. గర్వా హంకారాలు ఒంటెల, గుర్రాల, యజమానుల్లో ఒంటెల వెంట్రుకలతో చేయబడిన టెంట్లలో ఉండే జమీం దారుల్లో ఉంటాయి. శాంతి, వినయవిధేయతలు మేకల యజమానుల్లో ఉంటాయి. (బు’ఖారీ, ముస్లిమ్‌)

6269- [ 4 ] ( مُتَّفَقٌ عَلَيْهِ ) (3/1766)

وَعَنْ أَبِيْ مَسْعُوْدِ الْأَنْصَارِيُّ عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ: “من هَهُنَا جَاءَتِ الْفِتَنُ – نَحْوَ الْمَشْرِقِ – وَالْجَفَاءُ وَغِلَظُ الْقُلُوْبِ فِي الْفَدَّادِيْنِ أَهْلِ الْوَبَرِ عِنْدَ أُصُوْلِ أَذْنَابِ الْإِبِلِ وَالْبَقَرِ فِيْ رَبِيْعَةَ وَمُضَرَ” .مُتَّفَقٌ عَلَيْهِ.

6269. (4) [3/1766ఏకీభవితం]

అబూ మస్‌’ఊద్‌ అ’న్సారీ (ర) కథనం: ప్రవక్త (స) తూర్పువైపు సైగచేస్తూ ఇలా ప్రవచించారు, ”ఉపద్రవాలు ఇటునుండి వచ్చాయి. దుర్భాషలు మరియు కాఠిన్యం ఎడారుల్లో వెంట్రుకల టెంట్లలో ఉన్నవారిలో ఉన్నాయి. వాళ్ళు ఒంటెల, ఆవుల తోకల వెనకే ఉంటారు. వీళ్ళు రబీ’ మరియు ము’ర్‌ తెగకు చెందినవాళ్ళు.  (బు’ఖారీ, ముస్లిమ్‌)

6270 – [ 5 ] ( صحيح ) (3/1766)

وَعَنْ جَابِرٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “غِلْظُ الْقُلُوْبِ وَ الْجَفَاءُ فِي المَشْرِقِ وَالْإِيْمَانِ فِيْ أَهْلِ الْحِجَاز”. رَوَاهُ مُسْلِمٌ.

6270. (5) [3/1766దృఢం]

జాబిర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”కఠి నత్వం, నోటి దురుసుతనం తూర్పువారిలో ఉంది. మరియు విశ్వాసం ‘హిజా’జ్‌ వారిలో ఉంది.”[37]  (ముస్లిమ్‌)

6271 – [ 6 ] ( صحيح ) (3/1766)

وَعَنِ ابْنِ عُمَرَ قَالَ: قَالَ النَّبِيُّ صلى الله عليه وسلم: “اَللّهُمَّ بَارِكْ لَنَا فِيْ شَامِنَا. اَللّهُمَّ بَارِكْ لَنَا فِيْ يَمَنِنَا”. قَالُوْا: يَا رَسُوْلَ اللهِ وَفِيْ نَجْدِنَا؟ فَأَظُنُّهُ. قَالَ فِي الثَّالِثَةِ: “هُنَاكَ الزَّلَازِلُ وَالْفِتَنُ وَبِهَا يَطْلُعُ قَرْنُ الشَّيْطَانِ”. روَاهُ الْبُخَارِيُّ  

6271. (6) [3/1766 దృఢం]

ఇబ్నె ‘ఉమర్‌ (ర) కథనం: ప్రవక్త (స), ”ఓ అల్లాహ్‌(త)! మా సిరియా దేశంలో శుభం ప్రసాదించు. ఓ అల్లాహ్‌(త)! మా మన్‌లో శుభం ప్రసాదించు,” అని ప్రార్థించారు. అప్పుడు అనుచరులు, ‘ఓ ప్రవక్తా(స)! మా నజ్ద్‌ గురించి కూడా ప్రార్థించండి,’ అని విన్నవించుకున్నారు. అప్పుడు మళ్ళీ ప్రవక్త (స), ఓ అల్లాహ్‌(త)! మా సిరియాలో శుభం ప్రసాదించు, ఓ అల్లాహ్‌(త)! మా యమన్‌లో శుభం ప్రసాదించు,’ అని ప్రార్థించారు. అనుచరులు రెండవసారి కూడా, ‘మా నజ్ద్‌ గురించి కూడా ప్రార్థించండి,’ అని విన్నవించుకున్నారు. కాని ప్రవక్త (స) మూడవసారి, నజ్ద్‌లో భూకంపాలు, ఉపద్రవాలు, కల్లోలాలు సంభవిస్తాయి, అక్కడి నుండే షై’తాన్‌ కొమ్ము బహిర్గతమవుతుంది,” అని ప్రవచించారు.  (బు’ఖారీ)

—–

اَلْفَصْلُ الثَّانِيْ  రెండవ విభాగం 

6272 – [ 7 ] ( لم تتم دراسته ) (3/1766)

عَنْ أَنَسٍ عَنْ زَيْدِ بْنِ ثَابِتٍ أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم نَظَرَ قِبَلَ الْيَمَنِ فَقَالَ: “اَللّهُمَّ أَقْبِلْ بِقُلُوْبِهِمْ وَبَارِكْ لَنَا فِيْ صَاعِنَا وَمُدِّنَا”. رَوَاهُ التِّرْمِذِيُّ.  

6272. (7) [3/1766అపరిశోధితం]

అనస్‌, జైద్‌ బిన్‌ సా’బిత్‌ (ర. ‘అన్హుమ్)ల ద్వారా కథనం: ప్రవక్త (స) యమన్‌ వైపు చూచి, ”ఓ అల్లాహ్‌ (త)! వీరి హృదయాలను మావైపు మళ్ళించు, ఇంకా మా ‘సా’అలో, మా ముద్‌లో మా కోసం శుభం ప్రసాదించు” అని ప్రార్థించారు. (తిర్మి’జి)

6273 – [ 8 ] ( صحيح ) (3/1766)

وَعَنْ زَيْدِ بْنِ ثَابِتٍ قَالَ: قَالَ رَسُوْلُ الله صلى الله عليه وسلم: “طُوْبَى لِلشَّامِ” .قُلْنَا: لِأَيِّ ذَلِكَ يَا رَسُوْلَ اللهِ؟ قَالَ: “لِأَنَّ مَلَائِكَةَ الرَّحْمنِ بَاسِطَةٌ أَجْنِحَتَهَا عَلَيْهَا”. رَوَاهُ أَحْمَدُ وَالتِّرْمِذِيُّ.  

6273. (8) [3/1766 దృఢం]

‘జైద్‌ బిన్‌ సా’బిత్‌ (ర) కథనం: ప్రవక్త (స) ”సిరియా ప్రజలకు శుభం కలుగుగాక” అని ప్రార్థించారు. దానికి మేము, ‘ఓ ప్రవక్తా(స)! దీనికి కారణం ఏమిటి,’ అని విన్న వించుకున్నాం. అప్పుడు ప్రవక్త (స), ”కరుణ దైవదూతలు సిరియా ప్రజలపై రక్షణ కోసం తమ రెక్కలు చాచి ఉన్నారు.” (తిర్మిజి’, అ’హ్‌మద్‌)

6274 – [ 9 ] ( صحيح ) (3/1766)

وَعَنْ عَبْدِ اللهِ بْنِ عُمَرَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “سَتَخْرُجُ نَارٌمِنْ نَحْوِ حَضْرَمَوْتَ أَوْ مِنْ حَضْرَمَوْتَ تَحْشُرُ النَّاسَ”. قُلْنَا: يَا رَسُوْلَ اللهِ فَمَا تَأْمُرُنَا؟ قَالَ: “عَلَيْكُمْ بِالشَّامِ”. رَوَاهُ التِّرْمِذِيُّ.

6274. (9) [3/1766 దృఢం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘ఉమర్‌ (ర) కథనం: ప్రవక్త (స), ”హ’రమౌత్‌ వైపు నుండి లేదా హ’దరమౌత్‌ నుండి అతి త్వరలో ఒక అగ్నిజ్వాల బహిర్గతం అవు తుంది. ఆ అగ్నిజ్వాల ప్రజలందరినీ ఒకచోట చేర్చుతుంది,” అని ప్రవచించారు. దానికి ప్రవక్త (స) అనుచరులు, ”ఓ ప్రవక్తా! ఇటువంటి పరిస్థితుల్లో మేము ఏమి చేయాలి?” అని విన్నవించుకున్నారు. అప్పుడు ప్రవక్త (స) ఇటువంటి పరిస్థితుల్లో మీరు సిరియాను దృఢంగా పట్టుకొని ఉండాలి. అంటే సిరియా దేశంలో నివాసం ఏర్పరచుకోవాలి.  (తిర్మిజి’)

6275 – [ 10 ] ( ضعيف ) (3/1767)

وعَنْ عَبْدِ اللهِ بْنِ عَمْرِو بْنَ الْعَاصِ قَالَ: سَمِعْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ: “إِنَّهَا سَتَكُوْنُ هِجْرَةٌ بَعْدَ هِجْرَةٍ فَخِيَارُ النَّاسِ إِلى مُهَاجَرِ إِبْرَاهِيْمَ”.

وَفِيْ رِوَايَةٍ: “فَخِيَارُ أَهْلِ الْأَرْضِ أَلْزَمُهُمْ مُهَاجَرَ إِبْرَاهِيْمَ وَيَبْقَى فِي الْأَرْضِ شِرَارُ أَهْلِهَا تَلْفِظُهُمْ أَرْضُوْهُمْ تَقْذَرُهُمْ نَفْسُ اللهِ تَحْشُرُهُمُ النَّارُ مَعَ الْقِرَدَةِ وَالْخَنَازِيْرِ تَبِيْتُ مَعَهُمْ إِذَا بَاتُوْا وَتَقِيْلُ مَعَهُمْ إِذَا قَالُوْا”. رَوَاهُ أَبُوْ دَاوُدَ.  

6275. (10) [3/1767 బలహీనం]

అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘అమ్ర్‌ బిన్‌ అల్‌ ‘ఆ’స్‌(ర) కథనం: ప్రవక్త (స) ఇలా ప్రవచిస్తూ ఉండగా నేను విన్నాను, ”అతి త్వరలో హిజ్రత్‌ తర్వాత హిజ్రత్‌ జరుగుతుంది. అయితే ఇబ్రాహీమ్‌ (అ) హిజ్రత్‌ చేసిన చోటికి హిజ్రత్‌ చేసిన వారే ఉత్తమ వ్యక్తులు. (అంటే సిరియా దేశం వైపు హిజ్రత్‌ చేసేవారు).

మరో ఉల్లేఖనంలో ఇలా ఉంది, ”ఇబ్రాహీమ్‌ (అ) హిజ్రత్‌ చేసిన చోటికి హిజ్రత్‌చేసిన వారే భూమిపై ఉన్న వారిలో అందరికంటే ఉత్తమ వ్యక్తులు. ఇంకా భూమిపై పాపాత్ములు, దుర్మార్గులు మిగిలిపోతారు. వారిని వారి దేశం నుండి వెడలగొట్టటం జరుగుతుంది. వారిని దైవం కూడా చెడుగా భావిస్తాడు. ఇంకా అగ్నిజ్వాల వారిని పందులతో, కోతులతో ఏకం చేస్తుంది. ఆ అగ్నిజ్వాల వారితో పాటే రాత్రి గడుపుతుంది. ఇంకా వారు ఎక్కడ విశ్రాంతి తీసుకుంటే ఆ అగ్నిజ్వాల కూడా అక్కడే విశ్రాంతి  తీసుకుంటుంది.  (అబూ  దావూద్‌)

6276 – [ 11 ] ( صحيح ) (3/1767)

عَنِ ابْنِ حَوْالَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “سَيَصِيْرُ الْأَمْرُ إِلى أَنْ تَكُوْنُوْا جُنُوْدًا مُجَنَّدَةً جُنْدٌ بِالشَّامِ وَجُنْدٌ بِالْيَمَنِ وَجُنْدٌ بِالْعِرَاقِ”. فَقَالَ ابْنُ حَوَالَةَ: خِرْ لِيْ يَا رَسُوْلَ اللهِ. إِنْ أَدْرَكْتُ ذَلِكَ. فَقَالَ: “عَلَيْكَ بِالشَّامِ فَإِنَّهَا خِيْرَةُ اللهِ مِنْ أَرْضِهِ يُجْتَبَي إِلَيْهَا خِيْرَتُهُ مِنْ عِبَادِهِ فَأَمَّا إِنْ أَبَيْتُمْ فَعَلَيْكُمْ بِيَمَنِكُمْ وَاسْقُوْا مِنْ غُدُرِكُمْ. فَإِنَّ اللهَ تَوَكَّلَ لِيْ بِالشَّامِ وَأَهْلِهِ”. رَوَاهُ أَحْمَدُ وَأَبُوْ دَاوُدَ.

6276. (11) [3/1767దృఢం]

ఇబ్నె ‘హవాలహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ధార్మిక వ్యవహారాల విషయంలో ప్రజలు వివిధ సైన్యాలుగా మారిపోతారు. ఒక సైన్యం సిరియాలో ఉంటుంది. ఒక సైన్యం మన్‌లో ఉంటుంది. ఒక సైన్యం ఇరాఖ్లో ఉంటుంది.” అప్పుడు నేను, ‘ఓ ప్రవక్తా! ఒకవేళ నేను అప్పుడు ఉంటే ఏ సైన్యాన్ని అనుసరించాలి,’ అని విన్నవించుకున్నాను. దానికి ప్రవక్త (స), ”నీవు సిరియా సైన్యాన్ని అనుసరించు. ఎందుకంటే, సిరియా భూమి ఇతర భూములన్నిటిలో కెల్లా అత్యంత ప్రియమైనది. అక్కడ అల్లాహ్‌(త) ప్రియభక్తులే ఏకమౌతారు. ఒకవేళ మీరు సిరియాలో ఉండలేమనుకుంటే యమన్‌లో ఉండాలి. మీరూ మీ పశువులూ తమ టాంకుల నుండే నీరు త్రాగాలి. అల్లాహ్‌(త) నాకు సిరియా గురించి, సిరియా ప్రజల రక్షణ గురించి అభయం ఇచ్చి ఉన్నాడు,” అని అన్నారు. (అ’హ్మద్‌,  అబూ  దావూద్‌)

—–

اَلْفَصْلُ الثَّالِثُ    మూడవ విభాగం

6277 – [ 12 ] ( ضعيف ) (3/1767)

عَنْ شُرَيْحِ بْنِ عُبَيْدٍ قَالَ: ذُكِرَ أَهْلِ الشَّامِ عِنْدَ عَلِيٍّ رَضِيَ اللهُ عَنْهُ. وَقِيْلَ: اِلْعَنْهُمْ يَا أَمِيْرُ الْمُؤْمِنِيْنَ. قَالَ: لَا إِنِّيْ سَمِعْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ: “اَلْأَبْدَالُ يَكُوْنُوْنَ بِالشَّامِ وَهُمْ أَرْبَعُوْنَ رَجُلًا كُلَّمَا مَاتَ رَجُلٌ أَبْدَلَ اللهُ مَكَانَهُ رَجُلًا يُسْقَى بِهِمُ الْغَيْثُ وَيُنْتَصَرُ بِهِمْ عَلَى الْأَعْدَاءِ وَيُصْرَفُ عَنْ أَهْلِ الشَّامِ بِهِمُ الْعَذَابُ”.  

6277. (12) [3/1767బలహీనం]

షురై’హ్‌ బిన్‌ ‘ఉబైద్‌ (ర) కథనం: ‘అలీ (ర) ముందు సిరియా ప్రజల గురించి, ”ఓ ప్రభూ! సిరియా వారిని శపించండి,” అని ప్రస్తావించటం జరిగింది. దానికి ‘అలీ (ర), ”లేదు, నేను సిరియా ప్రజలను శపించలేను. ఎందు కంటే ప్రవక్త (స)ను ఇలా ప్రవచిస్తూ ఉండగా నేను విన్నాను, ‘అల్‌అబ్‌దాల్‌ సిరియా దేశంలో ఉంటారు. వారు 40 సంఖ్యలో ఉంటారు. వారిలో ఒకరు మరణించగానే అల్లాహ్‌(త) మరొకర్ని తీసుకువస్తాడు. వీరివల్ల వర్షం కురుస్తుంది, వీరివల్ల శత్రువులపై విజయం లభిస్తుంది, ఇంకా వీరివల్ల సిరియా ప్రజల నుండి శిక్ష దూరం చేయబడుతుంది,’ అని అన్నారు.” (అ’హ్మద్‌)

6278 – [ 13] ( ضعيف ) (3/1768)

وعَنْ رَجُلٍ مِنَ الصَّحَابَةِ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم قَالَ: “سَتُفْتَحُ الشَّامُ فَإِذَا خُيِّرْتُمُ الْمَنَازِلَ فِيْهَا فَعَلَيْكُمْ بِمَدِيْنَةٍ يُقَالُ لَهُ دِمَشْقُ. فَإِنَّهَا مَعْقِلُ الْمُسْلِمِيْنَ مِنَ الْمَلَاحِمِ وَفُسْطَاطُهَا مِنْهَا أَرْضٌ يُقَالُ لَهَا: الْغُوْطَةُ”.  رَوَاهُمَا أَحْمَدُ.

6278. (13) [3/1768బలహీనం]

ప్రవక్త (స) అనుచరుల్లో ఒక అనుచరుని కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”అతి త్వరలో సిరియా దేశాన్ని జయించడం జరుగుతుంది. అప్పుడు మీకు అక్కడి ఇళ్ళల్లో, నగరాల్లో నివసించే అనుమతి ఇవ్వబడు తుంది. అయితే మీరు దిమిష్క్‌ అనే నగరాన్ని ఎన్నుకోవాలి. ఎందుకంటే దిమిష్క్‌ ముస్లిముల యుద్ధాల నుండి శరణుపొందే ప్రదేశం. దిమిష్క్‌ సిరియాలో  ఒక కేంద్ర నగరం. ఇంకా సిరియా దేశంలో మరో  ప్రదేశాన్ని గూహ్,  అంటారు.” (అ’హ్మద్‌)

6279 – [ 14 ] ( ضعيف ) (3/1768)

وعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: قَالَ رَسُوْلُ الله صلى الله عليه وسلم: “اَلْخِلَافَةُ بِالْمَدِيْنَةِ وَالْمُلْكُ بِالشَّامِ”.  

6279. (14) [3/1768బలహీనం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ” ‘ఖిలాఫత్‌ మదీనహ్లో ఉంది మరియు రాజరికం సిరియాలో ఉంది.” (బైహఖీ – దలాయిలు న్నుబువ్వహ్‌)

6280 – [ 15 ] ( صحيح ) (3/1768)

وعَنْ عُمَرَ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “رَأَيْتُ عُمُوْدًا مِنْ نُوْرٍ خَرَجَ مِنْ تَحْتِ رَأْسِيْ سَاطِعًا حَتّى اسْتَقَرَّ بِالشَّامِ”. رَوَاهُمَا الْبَيْهَقِيُّ فِيْ “دَلَائِلِ النُّبُوَّةِ”.  

6280. (15) [3/1768 దృఢం]

‘ఉమర్‌ (ర) కథనం: ప్రవక్త(స) ప్రవచనం, ”కలలో కాంతి, వెలుగుల ఒక స్తంభం నా తలక్రింద నుండి మెరుస్తూ బహిర్గతం అయి సిరియా దేశంలోనికి వెళ్ళి నిలిచింది.” (బైహఖీ – దలాయిలున్నుబువ్వహ్‌)

6281 – [ 16 ] ( صحيح ) (3/1768)

وعَنْ أَبِيْ الدَّرْدَاءِ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم قَالَ: “إِنَّ فُسْطَاطَ الْمُسْلِمِيْنَ يَوْمَ الْمَلْحَمَةِ بِالْغُوْطَةِ إِلى جَانِبِ مَدِيْنَةٍ يُقَالُ لَهَا: دِمَشْقُ مِنْ خَيْرِ مَدَائِنِ الشَّامِ. رَوَاهُ أَبُوْ دَاوُدَ .

6281. (16) [3/1768దృఢం]

అబూ దర్‌దా (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”యుద్ధంనాడు ముస్లిములందరూ చేరే ఒకచోటు పేరు గూహ్. దాని ప్రక్కనే ఉన్న మరోనగరం పేరు దిమిష్క్‌. దిమిష్క్‌ సిరియా దేశంలోని నగరాల్లో కెల్లా మంచి నగరం.[38]  (అబూ  దావూద్‌)

6282 – [ 17 ] ( ضعيف ) (3/1768)

وعَنْ عَبْدِ الرَّحْمنِ بْنِ سُلَيْمَانَ قَالَ: سَيَأْتِيْ مَلِكٌ مِنَ مُلُوْكِ الْعَجَمِ فَيُظْهِرُ عَلَى الْمَدَائِنِ كُلِّهَا إِلَّا دِمَشْقَ. رَوَاهُ أَبُوْ دَاوُدَ .

6282. (17) [3/176బలహీనం]

 ‘అబ్దుర్ర’హ్మాన్‌ బిన్‌ సులైమాన్‌ (ర) కథనం: ”అతి త్వరలో అరబ్బేతరుల్లోని ఒక రాజు దిమిష్క్‌ తప్ప మిగిలిన నగరాలన్నిటినీ జయిస్తాడు.” (అబూ దావూద్‌)

=====

14  بَابُ ثَوَابِ هَذِهِ الْأُمَّةِ

14. ముహమ్మద్‌ () అనుచర సమాజ ప్రతిఫలం

اَلْفَصْلُ الْأَوّلُ   మొదటి విభాగం 

6283 – [ 1 ] ( صحيح ) (3/1769)

عَنِ ابْنِ عُمَرَ عَنْ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم قَالَ: “إِنَّمَا أَجَلُكُمْ فِيْ أَجَلٍ مَنْ خَلَا مِنَ الْأُمَمِ مَا بَيْنَ صَلَاةِ الْعَصْرِ إِلى مَغْرِبِ الشَّمْسِ وَإِنَّمَا مَثَلُكُمْ وَمَثَلُ الْيَهُوْدِ وَالنَّصَارَى كَرَجُلٍ اسْتَعْمَلَ عُمَّالًا فَقَالَ: مَنْ يَعْمَلُ إِلى نِصْفِ النَّهَارِ عَلَى قِيْرَاطٍ قِيْرَاطٍ فَعَمِلتِ الْيَهُوْدُ إِلى نِصْفِ النَّهَارِ عَلَى قِيرَاَطٍ قِيْرَاطٍ ثُمَّ قَالَ : مَنْ يَعْمَلُ لِيْ مِنْ نِصْفِ النَّهَارِ إِلى صَلَاةِ الْعَصْرِ عَلَى قِيْرَاطٍ قِيْرَاطٍ فَعَمِلَتِ النَّصَارَى مِنْ نِصْفِ النَّهَارِ إِلى صَلَاةِ الْعَصْرِ عَلَى قِيْرَاطٍ قِيْرَاطٍ . ثُمَّ قَالَ: مَنْ يَعْمَلْ لِيْ مِنْ صَلَاةِ الْعَصْرِ إِلى مَغْرِبِ الشَّمْسِ عَلَى قِيْرَاطَيْنِ قِيْرَاطَيْنِ؟ أَلَا فَأَنْتُمُ الَّذِيْنَ يَعْمَلُوْنَ مِنْ صَلَاةِ الْعَصْرِ إِلى مَغْرِبِ الشَّمْسِ أَلَا لَكُمُ الْأَجْرُ مَرَّتَيْنِ فَغَضِبَتِ الْيَهُوْدُ وَالنَّصَارَى فَقَالُوْا: نَحْنُ أَكْثَرُ عَمَلًا وَأَقَلُّ عَطَاءً. قَالَ اللهُ تَعَالى: هَلْ ظَلَمْتُكُمْ مِنْ حَقِّكُمْ شَيْئًا؟ قَالُوْا: لَا. قَالَ الله تَعَالى: فَإِنَّهُ فَضْلِيْ أُعْطِيْهِ مَنْ شِئْتُ”. روَاهُ الْبُخَارِيُّ.  

6283. (1) [3/1769 దృఢం]

ఇబ్నె ‘ఉమర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ముస్లిములారా! పూర్వీకుల కంటే మీ ఆయుష్షులు ‘అ’స్‌ర్‌ నమా’జు నుండి సూర్యాస్తమయంలా ఉన్నాయి. అదేవిధంగా మీరు మరియు యూదులు, క్రైస్తవుల ఉదాహరణ ఎలా ఉందంటే ఒక వ్యక్తి కొంతమందిని పనిలో  పెట్టాడు. వారితో, ‘ఉదయం నుండి మధ్యాహ్నం వరకు ఒక ఖీరాత్‌ కూలిపై ఎవరు పనిచేస్తారు,’ అన్నాడు.  ఆ పనిని యూదులు చేసారు. ఆ తరువాత అతడు, ‘ఇప్పుడు నా పనిని మధ్యాహ్నం నుండి ‘అ’స్‌ర్‌ వరకు ఒక ఖీరాత్‌ కూలిపై ఎవరుచేస్తారు,’ అని అన్నాడు. దీన్ని క్రైస్తవులు చేసారు. ఆ తరువాత, ” ‘అ’స్ర్‌ నుండి మ’గ్‌రిబ్‌ వరకు రెండు ఖీరాత్‌లపై ఎవరు పనిచేస్తారు,” అని అన్నాడు . తెలుసుకోండి ‘అ’స్ర్ నుండి మ’గ్రిబ్ వరకు పనిచేసింది మీరే, మీకు రెట్టింపు పుణ్యం లభించింది. యూదులు మరియు క్రైస్తవులు తీర్పు దినం నాడు, ‘మేము అధికంగా శ్రమపడ్డాము కాని కూలి తక్కువ లభించింది,’ అని అంటారు. అప్పుడు అల్లాహ్‌ (త), ‘మీకు అన్యాయం జరిగిందా?’ అని అడుగుతాడు. దానికి వారు, ‘లేదు,’ అంటారు. అప్పుడు అల్లాహ్‌(త), ‘నేను అధికంగా ఎవరికైనా ఎంతైనా ఇస్తాను. అది నా ఇష్టం,’ అని అంటాడు. [39] (బు’ఖారీ)

6284 – [ 2] ( صحيح ) (3/1769)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم قَالَ: “إِنَّ مِنْ أَشَدِّ أُمَّتِيْ لِيْ حُبًّا نَاسًا يَكُوْنُوْنَ بَعْدِيْ يَوَدُّ أَحَدُهُمْ لَوْ رَآنِيْ بِأَهْلِهِ وَمَالِهِ”. رَوَاهُ مُسْلِمٌ.  

6284 . (2) [3/1769దృఢం]   

 అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”నా అనుచర సమాజంలో నన్ను గాఢంగా ప్రేమించేవారు నా మరణానంతరం జన్మిస్తారు. వారిలో కొందరు నన్ను చూచి తన ధన సంపదలను, తన భార్యా బిడ్డలను నా కోసం త్యాగం చేయాలని పరితపిస్తారు.” (ముస్లిమ్‌)

6285 – [ 3 ] ( مُتَّفَقٌ عَلَيْهِ ) (3/1769)

وَعَنْ مُعَاوِيَةَ قَالَ: سَمِعْتُ النَّبِيَّ صلى الله عليه وسلم يَقُوْلُ: “لَا يَزَالُ مِنْ أُمَّتِيْ أُمَّةٌ قَائِمَةٌ بِأَمْرِ اللهِ لَا يَضُرُّهُمْ مَنْ خَذَلَهُمْ وَلَا مَنْ خَالَفَهُمْ حَتّى يَأْتِيَ أَمْرُ اللهِ وَهُمْ عَلَى ذَلِكَ”. مُتَّفَقٌ عَلَيْهِ.

وَذُكِرَ حَدِيْثُ أَنَسٍ: “إِنَّ مِنْ عِبَادِ اللهِ” فِيْ “كِتَابِ الْقِصَاصِ”

6285. (3) [3/1769 ఏకీభవితం]

ము’ఆవియహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ఇలా ప్రవచిస్తూ ఉండగా నేను విన్నాను, ”నా అనుచర సమాజంలో ఒక బృందం ఎల్లప్పుడూ దైవమార్గంపై స్థిరంగా ఉంటుంది. ఎవరూ వారికి సహాయం చేయకపోయినా లేదా వారిని వ్యతిరేకించినా వారికి ఎటువంటి నష్టం వాటిల్లదు. చివరికి వారికి మరణం రానే వస్తుంది. వారు ఆ మార్గంపైనే స్థిరంగా ఉంటారు.” (బు’ఖారీ, ముస్లిమ్‌)

—–

اَلْفَصْلُ الثَّانِيْ రెండవ విభాగం   

6286 – [ 4 ] ( صحيح لطرقه ) (3/1770)

عَنْ أَنَسٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَثَلُ أُمَّتِيْ مَثْلُ الْمَطَرِ لَا يَدْرِىْ أَوَّلُهُ خَيْرٌ أَمْ آخِرُهُ”. رَوَاهُ التِّرْمِذِيُّ.

6286. (4) [3/1770 దృఢం]

అనస్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”నా అనుచర సమాజం వర్షం వంటిది. దాని ప్రారంభం ఉన్నతమైనదో, దాని సమాప్తం ఉన్నతమైనదో చెప్పలేము.” [40] (తిర్మిజి’)

—–

اَلْفَصْلُ الثَّالِثُ మూడవ విభాగం   

6278 – [ 5 ] ( لم تتم دراسته ) (3/1770)

عَنْ جَعْفَرِ عَنْ أَبِيْهِ عَنْ جَدِّهِ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “أَبْشِرُوْا إِنَّمَا مَثَلُ أُمَّتِيْ مَثَلُ الْغَيْثِ لَا يَدْرِىْ آخِرُهُ خَيْرٌ أَمْ أَوَّلَهُ؟ أَوْ كَحَدِيْقَةٍ أَطْعَمَ مِنْهَا فَوْجٌ عَامًا لَعَلَّ آخِرَهَا فَوْجًا أَنْ يَكُوْنَ أَعْرَضَهَا عَرَضًا وَأَعْمَقَهَا عُمْقًا وَأَحْسَنَهَا حُسْنًا. كَيْفَ تَهْلِكُ أُمَّةٌ أَنَا أَولُهَا وَالْمَهْدِيُّ وَسَطُهَا وَالْمَسِيْحُ آخِرُهَا وَلَكِنْ بَيْنَ ذَلِكَ فَيْجٌ أَعْوَجُ لَيْسُوْا وَلَا أَنَا مِنْهُمْ”. رَوَاهُ رَزِيْنٌ.

6287. (5) [3/1770 అపరిశోధితం]

జ’ఫర్‌ (ర) తన తండ్రి ద్వారా అతడు తన తండ్రి ద్వారా కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”సంతోషించండి, సంతోషించండి! నా అనుచర సమాజం వర్షం వంటిది. దీని మొదటి నీటి చుక్కలు మంచివో, చివరి నీటి చుక్కలు మంచివో చెప్పలేము. నా అనుచర సమాజం ఒక తోట వంటిది. దీని ద్వారా ఒక సంవత్సరం ఒక బృందానికి తినిపించడం జరుగు తుంది. మరో సంవత్సరం మరో బృందానికి తినిపిం చడం జరుగు తుంది. చివరి బృందం మొదటి బృందం కన్నా ఉత్తమ మైనది కావచ్చు. ఈ అనుచర సమాజం ఎలా నాశనం చేయబడుతుంది. దాని ప్రారంభంలో నేనున్నాను. దాని చివరిలో మహ్‌దీ (అ) ఉన్నారు, దాని చివర్లో మసీ’హ్‌ (అ) ఉన్నారు. అయితే ఈ కాలాల్లో మార్గభ్రష్టత్వానికి గురైన ఒక బృందం ఉంటుంది. దానికీ నాకు ఎటువంటి సంబంధం లేదు, దానికీ నాకు ఎటువంటి  సంబంధం లేదు.”  (ర’జీన్‌)

6288 – [ 6 ] ( ضعيف ) (3/1770)

وَعَنْ عَمْرِو بْنِ شُعَيْبٍ عَنْ أَبِيْهِ عَنْ جَدِّهِ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “أَيُّ الْخَلْقِ أَعْجَبُ إِلَيْكُمْ إِيْمَانًا؟” قَالُوْا: “اَلْمَلَائِكَةُ”. قَالَ: “وَمَالَهُمْ لَا يُؤْمِنُوْنَ وَالْوَحْيُ يَنْزِلُ عَلَيْهِمْ؟” قَالُوْا: فَنَحْنُ. قَالَ: “وَمَالَكُمْ لَا تُؤْمِنُوْنَ وَأَنَا بَيْنَ أَظْهُرِكُمْ؟” قَالَ: فَقَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِنَّ أَعْجَبَ الْخَلْقِ إِلَيَّ إِيْمَانًا لِقَوْمٍ يَكُوْنُوْنَ مِنْ بَعْدِيْ يَجِدُوْنَ صُحُفًا فِيْهَا كِتَابٌ يُؤْمِنُوْنَ بِمَا فِيْهَا”.  

6288. (6) [3/1770బలహీనం]

‘అమ్ర్‌ బిన్‌ షు’ఐబ్‌ (ర) తన తండ్రి ద్వారా, అతడు తన తండ్రిగారి ద్వారా కథనం: ప్రవక్త (స) తన అనుచరులను, ‘విశ్వాసపరంగా ఎవరు మీకు ఇష్టమైన వారు?’ అని అడిగారు. దానికి అనుచరులు, ‘దైవదూతలు,’ అని అన్నారు. దానికి ప్రవక్త (స), ‘వారు విశ్వసించకపోయినా వారికేమిటి, వారు, వారి ప్రభువు వద్ద ఉన్నారు,’ అని అన్నారు. మరికొందరు అనుచరులు, ‘దైవప్రవక్తలని,’ అన్నారు. దానికి ప్రవక్త (స), ‘వారు విశ్వసించకపోయినా వారికేమిటి? వారిపై దైవవాణి అవతరిస్తుంది,’ అని అన్నారు. అప్పుడు అనుచరులు, ‘అయితే మరి మేమే,’ అని అన్నారు. అప్పుడు ప్రవక్త (స), ‘మీరు విశ్వసించక పోయినా మీకేమిటి, మీ మధ్య నేనున్నాను,’ అని అన్నారు.  ఆ తరువాత ప్రవక్త (స), ‘విశ్వాసపరంగా అందరిలో కెల్లా గొప్పవారు నా తరువాత జన్మిస్తారు. వారు ఖుర్‌ఆన్‌ గ్రంథాలను పొంది, దానిలో ఉన్న వాటి పట్ల విశ్వసిస్తారు.”  అని అన్నారు.  (బైహఖీ)

6289 – [ 7 ] ( لم تتم دراسته ) (3/1770)

وَعَنْ عَبْدِ الرّحْمنِ بْنِ الْعَلَاءِ الْحَضْرَمِيِّ قَالَ: حَدَّثَنِيْ مَنْ سَمِعَ النَّبِيُّ صلى الله عليه وسلم يَقُوْلُ: “إِنَّهُ سَيَكُوْنُ فِيْ آخِرِ هَذِهِ الْأُمَّةِ قَوْمٌ لَهُمْ مَثَلُ أَجْرِ أَوَّلِهِمْ يَأْمُرُوْنَ بِالْمَعْرُوْفِ وَيَنْهُوْنَ عَنِ الْمُنْكَرِ وَيُقَاتِلُوْنَ أَهْلَ الْفِتَنِ”. رَوَاهُمَا الْبَيْهَقِيُّ فِيْ دَلَائِلِ النُّبُوَّةِ  

6289. (7) [3/1770అపరిశోధితం]

‘అబ్దుర్ర’హ్మాన్‌ బిన్‌ ‘అలా’ ‘హ’ద్రమీ (ర)  కథనం: ప్రవక్త (స)ను విన్న ఒక వ్యక్తి నాకు ఇలా తెలిపాడు: ప్రవక్త (స) ప్రవచనం, ‘ఈ అనుచర సమాజం చివర్లో ఒక బృందం ఉంటుంది. వారికి, మొదటి వారిలా ప్రతిఫలం ఇవ్వటం జరుగుతుంది. వారు ”మంచిని ఆదేశిస్తారు. చెడును నిర్మూలిస్తారు. ఇంకా వారు కల్లోలాలు సృష్టించేవారితో పోరాడుతారు.” (బైహఖీ  – దలాయి లున్నుబువ్వహ్‌)

6290 – [ 8 ] ( ضعيف ) (3/1771)

وَعَنْ أَبِيْ أُمَامَةَ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم قَالَ: “طُوْبَى لِمَنْ رَآنِيْ  -وَآمَنَ بِيْ – وَطُوْبَى لِمَنْ لَمْ يَرَنِيْ وَآمَنَ بِيْ”. رَوَاهُ أَحْمَدُ.  

6290. (8) [3/1771 బలహీనం]

అబీ ఉమామహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”నన్ను చూచి, విశ్వసించిన వ్యక్తికి ఒకసారి శుభవార్త నిస్తున్నాను. ఇంకా నన్ను చూడకుండా విశ్వసించిన వారికి  7 సార్లు  శుభవార్త  ఇస్తున్నాను.”  (అ’హ్మద్‌)

6291 – [ 9 ] ( صحيح ) (3/1771)

وَعَنْ أَبِيْ مُحَيْرِيْزٍ قَالَ: قُلْتُ لِأَبِيْ جُمُعَةَ رَجُلٍ مِنَ الصَّحَابَةِ: حَدِّثْنَا حَدِيْثًا سَمِعْتُهُ مِنْ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم. قَالَ: نَعَمْ أُحَدِّثُكُمْ حَدِيْثًا جَيِّدًا تَغَدَّيْنَا مَعَ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم. وَمَعَنَا أَبُوْ عُبَيْدَةَ بْنِ الْجَرَّاحِ. فَقَالَ: يَا رَسُوْلَ اللهِ. أَحَدٌ خَيْرٌ مِنَّا؟ أَسْلَمْنَا وَجَاهَدْنَا مَعَكَ. قَالَ: “نَعَمْ قَوْمٌ يَكُوْنُوْنَ مِنْ بَعْدِكُمْ يُؤْمِنُوْنَ بِيْ وَلَمْ يَرَوْنِيْ”. رَوَاهُ أَحْمَدُ وَالدَّارَمِيُّ وَرَوَى رَزِيْنٌ عَنْ أَبِيْ عُبَيْدَةَ مِنْ قَوْلِهِ: قَالَ: يَا رَسُوْلَ اللهِ. أَحَدٌ خَيْرٌ مِنَّا إِلَى آخِرِهِ .

6291. (9) [3/1771- దృఢం]

అబీ ము’హైరీ’జ్‌ (ర) కథనం: నేను ప్రవక్త (స) అనుచరులైన అబూ జుమ్‌’అహ్తో, ‘ప్రవక్త (స) ద్వారా విన్న ఒక ‘హదీసు’ను తెలియపర్చండి,’ అని అన్నాను. దానికి అతను, ‘అవును, నేను మీకు ఒక మంచి ‘హదీసు’ వినిపిస్తాను,’ అని అన్నారు. ”ఒకరోజు మేము ప్రవక్త (స) తో పాటు మధ్యాహ్న భోజనం చేసాము. మాలో అబూ ‘ఉబైదహ్‌ బిన్‌ జర్రా’హ్‌ కూడా ఉన్నారు. అబూ ‘ఉబైదహ్‌ (ర), ఓ ప్రవక్తా! మాకన్నా ఉత్తములెవరైనా ఉన్నారా? మేము  మిమ్మల్ని విశ్వసించాం, మీ వెంట జిహాద్‌లో పాల్గొన్నాం,” అని అన్నారు. అప్పుడు ప్రవక్త (స), ‘అవును మీకన్నా ఉత్తములున్నారు, వాళ్ళు మీ తర్వాత  జన్మిస్తారు. నన్ను వారు చూడకుండానే నన్ను  విశ్వసిస్తారు.’  (అ’హ్మద్‌, దార్మీ)

6292 – [ 10 ] ( صحيح ) (3/1771)

وَعَنْ مُعَاوِيَةَ بْنِ قُرَّةَ عَنْ أَبِيْهِ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه و سلم: “إِذَا فَسَدَ أَهْلُ الشَّامِ فَلَا خَيْرَ فِيْكُمْ وَلَا يَزَالُ طَائِفَةٌ مِنْ أُمَّتِيْ مَنْصُوْرِيْنَ لَا يَضُرُّهُمْ مَنْ خَذَلَهُمْ حَتّى تَقُوْمَ السَّاعَةُ”. قَالَ ابْنُ الْمَدِيْنِيِّ: هُمْ أَصْحَابُ الْحَدِيْثِ. رَوَاهُ التِّرْمِذِيُّ. وَقَالَ: هَذا حَدِيْثٌ حَسَنٌ صَحِيْحٌ.

 6292. (10) [3/1771దృఢం]

ము’ఆవియహ్‌ బిన్‌ ఖుర్రహ్‌ (ర) తన తండ్రి ద్వారా కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”సిరియా ప్రజలు దుర్మార్గులై నాశనం అయిపోతారు. అప్పుడు మీలో ఎటువంటి మేలూ ఉండదు. నాఅనుచర సమాజంలో ఎల్లప్పుడూ ఒక బృందం ఆధిక్యత కలిగి సహాయం పొందుతూ ఉంటుంది. ఎవరూ వారికి సహాయం చేయక పోయినా వారికెటువంటి నష్టం కలగదు. చివరికి ప్రళయం సంభవిస్తుంది.

ఇబ్నుల్‌ మదీనీ ”అహ్లె ‘హదీసు’లుగా” అభిప్రాయ పడ్డారు.[41]  (తిర్మిజి’ / ప్రామాణికం,  దృఢం)

6293 – [ 11 ] ( صحيح لطرقه ) (3/1771)

وَعَنِ ابْنِ عَبَّاسٍ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم قَالَ: ” إِنَّ اللهَ تَجَاوَزَ عَنْ أُمَّتِيْ الْخَطأُ وَالنِّسْيَانَ وَمَا اسْتُكْرِهُوْا عَلَيْهِ”. رَوَاهُ ابْنُ مَاجَهُ وَالْبَيْهَقِيُّ.  

6293. (11) [3/1771- దృఢం]

ఇబ్నె ‘అబ్బాస్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”అల్లాహ్‌(త)  నా అనుచర  సమాజం నుండి పొర పాటుగా, ఏమరు పాటుగా చేసే అపరాధాలను మన్నించాడు. ఇంకా బలవంతంగా చేయించబడిన పాపాలు కూడా క్షమించబడ్డాయి. (ఇబ్నె మాజహ్, బైహఖీ)

6294 – [ 12 ] ( حسن ) (3/1771)

وَعَنْ بَهْزِ بْنِ حَكِيْمٍ عَنْ أَبِيْهِ عَنْ جَدِّهِ أَنَّهُ سَمِعَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ فِيْ قَوْلِهِ تَعَالى: [كُنْتُمْ خَيْرَ أُمَّةٍ أُخْرِجَتْ لِلنَّاسِ؛ 3: 110] قَالَ: “أَنْتُمْ تُتِمُّوْنَ سَبْعِيْنَ أُمَّةً أَنْتُمْ خَيْرُهَا وَأَكْرَمُهَا عَلَى اللهِ تَعَالى”. رَوَاهُ التِّرْمِذِيُّ وَابْنُ مَاجَهُ وَالدَّارَمِيُّ .وَقَالَ التِّرْمِذِيُّ هَذَا حَدِيْثٌ حَسَنٌ.

6294. (12) [3/1771ప్రా మాణికం]

బహ’జ్‌ బిన్‌ ‘హకీమ్‌ బిన్‌ ము’ఆవియహ్‌ తన తండ్రి ద్వారా, అతడు తన తండ్రి గారి ద్వారా కథనం: ప్రవక్త (స) ఇలా ప్రవచిస్తూ ఉండగా విన్నారు, ప్రవక్త (స) ”కున్‌తుమ్‌ ‘ఖైరహ్ ఉమ్మతిన్‌” (ఆల ఇమ్రాన్, 3:110) గురించి మాట్లాడుతూ మీరు 70 అనుచర సమాజాలను పూర్తి చేస్తారు. కాని మీరు అల్లాహ్‌(త) వద్ద ఆ అనుచర సమాజాల్లో అన్నిటికంటే ఉత్తమ మరియు ఔన్నత్యం గల  అనుచర సమాజం మీదే,” అని ప్రవచించారు. (తిర్మిజి’ – ప్రామాణికం, ఇబ్నె  మాజహ్, దార్మీ)

m

[1]) వివరణ-5982: ధర్మాన్ని అనుసరిస్తున్నంత కాలం పరిపాలన ఖురైషుల్లోనే ఉంటుంది. ఒకవేళ వారు ధర్మానికి, షరీఅత్తుకు దూరమైతే వారి అధికారం కూడా చేజారిపోతుంది. ప్రవక్త (స) ప్రవచించినట్టే జరిగింది. అధికారం 600 సంవత్సరాలవరకు ఖురైష్‌కు చెందిన బనీ ‘ఉమయ్యహ్, ‘అబ్బాసియ్యీల చేతుల్లోనే ఉండేది. కాని ధర్మానికి దూరమయ్యే కొలది వారి అధికారం కూడా వారినుండి దూరమయింది. ఇతరులు రాజులయ్యారు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఖురైషులకు పరిపాలన, అధికారపగ్గాలు లభించలేదు.

[2]) వివరణ-6007: ప్రవక్త (స) అనుచరులను మనం ప్రేమించాలి. వారి గురించి దూషించకూడదు. వారి పరస్పర విషయాలకు వారు బాధ్యులు. ప్రవక్త (స) అనుచరులను దూషించటం, విమర్శించటం మహా పాపం. ఇటువంటి వారిని శిక్షించాలి.

[3]) వివరణ-6011: అంటే వారు చాలా బలంగా ఉంటారు. సుఖభోగాల వల్ల వచ్చే దుడ్డుతనం చెడ్డది. సహజమైన దుడ్డుతనం చెడ్డదేమీ కాదు.

[4]) వివరణ-6012: ఈ ‘హదీసు’లో ఇస్లామ్‌ ప్రారంభకాలం నుండి మూడు తరాల వారి గురించి అంటే ప్రవక్త (స) అనుచరుల, తాబయీన్ల, తబే-తాబయీన్ల ప్రాధాన్యతల గురించి పేర్కొనడం జరిగింది. ప్రవక్త (స) అనుచర సమా జంలోని ఉత్తమ తరాలవారు వారే. ఆ తరువాత కాలంలో అసత్యం తలెత్తుతుంది. ఈ మూడుకాలాల్లో ధర్మం తన అసలు స్థితిలో ఉంటుంది. ఆ తరువాత కల్పితాలు, మనోకాంక్షలు, ఆవేదనలు ప్రారంభం అవుతాయి.

[5]) వివరణ-6019: ప్రవక్త (స) మరణదశలో తన చివరి ప్రసంగంలో మస్జిద్‌ వైపు ఉన్న కిటికీల్లో అబూ బకర్‌ కిటికీ తప్ప మిగిలిన కిటికీలన్నిటినీ మూసివేయాలని ఆదేశించారు. ఈ ఆదేశం ద్వారా అబూ బకర్‌ (ర) ప్రాధా న్యతలు, ప్రత్యేకతలు బహిర్గతం అవుతున్నాయి. ఇంకా ఇది అబూ బకర్‌ (ర) ‘ఖిలాఫత్‌ను కూడా సూచిస్తుంది.

[6]) వివరణ-6022: ఈ ‘హదీసు’ ద్వారా ప్రవక్త (స) తర్వాత అబూ బకర్‌ మొదటి ‘ఖలీఫహ్ అవుతారని తెలుస్తుంది. ఇంకా ఇందులో అబూ బకర్‌ (ర) ప్రత్యేకత కూడా ఉంది.

  [7]) వివరణ-6024: ఈ ‘హదీసు’లో రాఫదీలను ఖండించడం జరిగింది. ఎందుకంటే వీరు అబూ బకర్‌, ‘ఉమర్‌లను దూషిస్తారు. ‘అలీ (ర)ను పొగుడుతారు.

[8]) వివరణ-6050: అంటే ప్రవక్త (స)కు ఒకసారి ‘జైనబ్‌ (ర) వద్ద ఆలస్యం అయిపోయింది. ఎవరో ఇచ్చిన తేనె ప్రవక్త (స)కు ఇచ్చారు. అది త్రాగటంలో ప్రవక్త (స)కు ఆలస్యం అయింది. ఈ విషయం ‘ఆయి’షహ్‌కు, ఇతర ప్రవక్త (స) భార్యలకు నచ్చలేదు. ‘ఆయి’షహ్‌ (ర), ‘ ‘హ’ఫ్‌’సహ్ (ర)తో కలసి ఎవరివద్దకు ప్రవక్త (స) వచ్చినా దుర్వాసన వేస్తుందని చెబుదాం,’ అని పన్నాగం పన్నారు. ప్రతి ఒక్కరూ ఇలాగే అన్నారు. ప్రవక్త (స), ‘నేను కేవలం తేనె మాత్రమే త్రాగాను,’ అని అన్నారు. వారి ఉద్దేశ్యం ఆమె వద్ద ఎక్కువసేపు ఉండకూడదని, కాని ప్రవక్త (స) తేనెను తనపై నిషిద్ధం చేసుకున్నారు. ఆ తర్వాత రహస్య మంతా బయటపడింది. ఈ సందర్భంగా ‘ఉమర్‌ (ర) ప్రవక్త (స) భార్యలను పైవిధంగా హెచ్చరించారు.

[9]) వివరణ-6052: నా మొదటి ప్రత్యేకత ఖైదీలను పరిహారం తీసుకుని వదలివేయడం జరిగింది. అయితే ‘ఉమర్‌ (ర)   వారిని చంపివేయమని సూచించారు. అల్లాహ్‌ (త) కూడా దీన్ని సమర్థించాడు. రెండవది ‘ఉమర్‌ (ర), ప్రవక్త (స) భార్యలకు పర్దాలో ఉంచమని సూచించారు. అల్లాహ్‌ (త) దీన్ని కూడా సమర్థించాడు. మూడవది ప్రవక్త (స) ‘ఉమర్‌ ద్వారా ఇస్లామ్‌కు శక్తిని ప్రసాదించమని ప్రార్థించారు. నాల్గవది అందరి కంటే ముందు ‘ఉమర్‌ అబూ బకర్‌ (ర) ‘ఖలీఫహ్ కావాలని కోరారు. అందరికంటే ముందు ‘ఉమర్‌ (ర) బైఅత్‌ చేసారు.

[10]) వివరణ-6053: ఇది ‘దయీఫ్‌ ‘హదీసు’. (మిష్‌కాత్‌, అల్‌బానీ  / 1707)

[11]) వివరణ-6060: స్వర్గంలో ఎవరూ అధిక వయస్సు కలిగి ఉండరు. అందరూ యవ్వనంలోనే ఉంటారు. అధిక వయస్కులు అంటే అధిక వయస్సులో మరణించినవారు.

[12]) వివరణ-6072: తబూక్‌ యుద్ధ సైన్యానికి జైషుల్‌ ‘ఉస్రహ్అని ఎందుకు అనడం జరిగిందంటే, ఆ కాలం లో చాలా కరువుకాటకాలు ఉండెను. అప్పుడు ఉస్మాన్ (ర) 600 ఒంటెలు తబూక్‌ యుద్ధ సైన్యం కొరకు అల్లాహ్ (త) ప్రసన్నతకొరకు అప్పగించారు. దీన్ని ప్రశంసిస్తు ప్రవక్త(స) అన్నారు, అతని వెనుకటి మరియు ముందటి పాపాలు అన్నీ క్షమించబడ్డాయి.’ అని అన్నారు.

క్లిష్టపరిస్థితులతో కూడుకొని ఉండేది. ఈ ఉల్లేఖనం ప్రకారం ‘ఉస్మాన్‌ (ర) 600 ఒంటెలను ఈ సైన్యం కోసం సమర్పించారు. ‘ఉస్మాన్‌ (ర) యొక్క ఈ త్యాగానికి ప్రవక్త (స), ” ‘ఉస్మాన్‌ (ర) యొక్క ఈ పుణ్యం అతని వెనుకటి పాపాలను చెరిపివేయటమే కాకుండా ఇక ముందు అతని వల్ల ఏదైనా పొరపాటు జరిగినా ఈ పుణ్యంవల్ల అది కూడా క్షమించి వేయబడుతుంది,” అని అన్నారు.

[13]) వివరణ-6082: ‘ఉస్మాన్‌ వైపు సైగచేసారు అంటే అబూ హురైరహ్‌ ఈ ‘హదీసు’ ద్వారా అప్పటి ముస్లిముల నాయకులు ‘ఉస్మాన్‌ (ర) కనుక అతనికే విధేయత చూపాలని నిరూపించారు.

  [14]) వివరణ-6085: అంటే, వారి ప్రస్తావన ఎప్పుడు వచ్చినా, ఈ క్రమంగా వారిని ప్రస్తావిస్తూ వారిపేర్లతో పాటు ”దియల్లాహు అన్హుమ్” అని దీవించే వాళ్ళం.

[15]) వివరణ-6087: ప్రవక్త (స) తబూక్యుద్ధానికి వెళ్ళినపుడు, ‘అలీ (ర)ను తన కుటుంబం వారి రక్షణ కోసం నియమించి వెళ్ళారు. అప్పుడు కపటాచారులు ‘అలీ (ర)తో ‘నీకేమాత్రం విలువలేదని, అందువల్లే నిన్ను మదీనహ్లో వదలి వెళ్ళారని,’ ఎత్తిపొడవసాగారు. ఈ మాటలు విని, ‘అలీ (ర)  చాలా బాధపడ్డారు. ‘అలీ (ర) ప్రవక్త (స) వద్దకు వెళ్ళి, ‘ఓ ప్రవక్తా! కపటాచారులు నా గురించి నీచంగా మాట్లాడు తున్నారు,’ అని విన్నవించు కున్నారు. అప్పుడు ప్రవక్త (స), ‘నేను నిన్ను మదీనహ్లో నా కుటుంబంపై సంరక్షకుడిగా, బాధ్యుడుగా వదలి వెళుతున్నాను. నీకూ నాకూ మధ్య ఉన్న సంబంధం మూసా (అ)కు, హారూన్‌ (అ)కు ఉన్న సంబంధం వంటిది. మూసా (అ) తూర్‌ కొండపై వెళ్ళినపుడు హారూన్‌ను బాధ్యుడుగా చేసి వెళ్ళారు. హారూన్‌ ప్రవక్త కూడా. కాని ప్రవక్త (స) తర్వాత ప్రవక్త లెవరూ లేరు.

[16]) వివరణ-6091: అంటే నాకు మిత్రుడైనవాడికి ‘అలీ కూడా మిత్రుడే.

[17]) వివరణ-6092: మక్కహ్ విజయం తరువాత 9 హిజ్రీలో ‘హజ్జ్లో ప్రవక్త (స) ‘హద్ద్కు వెళ్ళలేక పోయారు. తన స్థానంలో అబూ బకర్‌ను ‘హజ్‌కు నాయకునిగా చేసి పంపారు. అబూ బకర్‌ బయలుదేరిన తర్వాత ప్రవక్త (స) ‘అలీని మక్కహ్ పంపించారు. ఇంకా అతనికి తన తరఫున ఒక బాధ్యత ఇచ్చారు. అదేమిటంటే, 1. మూడు సంవత్సరాల క్రితం 6 హిజ్రీలో హుదైబియా ప్రాంతంలో ప్రవక్త (స) మరియు మక్కహ్ ఖురైషుల మధ్య జరిగిన ఒప్పందాన్ని రద్దుచేస్తున్నట్టు, 2. ఇంకా అవిశ్వాసులు అపరిశుద్ధులని దీని తర్వాత అవిశ్వాసులు మస్జిదె హరామ్‌లోనికి ప్రవేశించరాదని, ప్రకటించమని’ ఆదేశించారు. ఈ సందర్భంగా ప్రవక్త (స) పై ‘హదీసు’ను ప్రవచించారు.

[18]) వివరణ-6101: అంటే ‘అలీ (ర)ను దూషించినవాడు, ప్రవక్త (స)ను దూషించినట్టే.

[19]) వివరణ-6102: రవాఫిద్, షియా తెగవారు. ‘అలీ (ర) ప్రేమలో హద్దులుమీరి ప్రవర్తించారు. చివరికి అతనికి (ర)  ప్రవక్తలపై కూడా ప్రాధాన్యత ఇచ్చారు. ఇటు ఖారిజీలుఅలీ () శత్రుత్వంలో హద్దులుమీరి ప్రవర్తించి అతనిని (ర)   అనేక నిందలకు గురిచేసారు.

[20]) వివరణ-6105: కొందరు అనుచరుల ఇళ్ళ ద్వారాలు మస్జిదె నబవీలోపల ఉండేవి. ప్రవక్త (స) వారిని, ‘లోపల ఉన్న తలుపులను మూసివేయమని,’ ఆదేశించారు. అపరిశుద్ధ స్త్రీ పురుషులు ప్రవేశించకుండా ఉండాలని అలా చేసారు. ప్రవక్త (స) ‘అలీని మాత్రం లోపల ఉన్న ఇంటి తలుపులను తెరచి ఉంచుకోవచ్చని అనుమ తించారు. కాని చివరి సమయంలో అబూ బకర్‌ (ర) ద్వారం తప్ప మరెవరి ద్వారం తెరచి ఉంచకూడదని ప్రవచించారు. (దీన్ని బు’ఖారీ, ముస్లిమ్‌ కూడా పేర్కొన్నారు)

[21]) వివరణ-6110: ఇస్లామ్‌ శత్రువుల్లోని ఖురైషీలు, ఇతరులు కలసి ప్రవక్త (స)తో యుద్ధం చేయటానికి వచ్చారు. అందువల్లనే దీన్ని ”హ్‌’జాబ్యుద్ధం” అని అంటారు. ఈ యుద్ధంలో ప్రవక్త (స) అనుచరుల సహాయంతో రక్షణకోసం మదీనహ్ చుట్టూ కందకం త్రవ్వించారు. అందువల్ల దీన్ని ”కందకయుద్ధం” అని కూడా అంటారు. శత్రుసైన్యాలు ఇంచుమించు నెల రోజుల వరకు చుట్టుముట్టి ఉన్నాయి. చివరికి అల్లాహ్‌(త) దైవదూతల సైన్యాలను అవతరింపజేసాడు. ఇంకా ఎటువంటి తీవ్రమైన తుఫాన్ పంపాడంటే శత్రువుల షామియానాలు ధ్వంసం అయ్యాయి. వారి సామాన్లన్నీ చిందరవందర అయిపోయాయి. షామియా నాలకు నిప్పు అంటుకుంది. శత్రుసైన్యాలు రాత్రికి రాత్రి భయంతో పారిపోయాయి. ఈ రోజుల్లో పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉండేది. శత్రు సమాచారం లభించటం అసాధ్యంగా ఉండేది. అందువల్లే ‘జుబైర్‌ (ర) ఇంతటి ప్రమాదకర పరిస్థితిలోనూ ఆ బాధ్యతను తనపై వేసుకున్నారు. ఫలితంగా ప్రవక్త (స) అతన్ని తన సహాయకుడి స్థానం ఇచ్చి సత్కరించారు.

[22]) ఈ అదృష్టం స’అద్‌ బిన్‌ మాలిక్‌తో పాటు ‘జుబైర్‌కు కూడా లభించింది. అయితే ‘అలీ (ర)కు ఈ విషయం తెలియకుండా ఉండవచ్చు. (బు’ఖారీ, ముస్లిమ్)

[23]) వివరణ-6113: ఇది 1 హిజ్రీలో జరిగిన సంఘటన, ప్రవక్త (స) అబూ ‘ఉబైదహ్‌ బిన్‌ అల్‌ ‘హారిస్‌’ నేతృత్వం లో 60 మందితో కూడిన ఒకసైన్యాన్ని అబూ సుఫియాన్‌ బిన్‌ ‘హర్బ్‌, అతని అవిశ్వాస మిత్రులతో పోరాడ టానికి పంపారు. యుద్ధం జరగలేదు. అయితే స’అద్‌ బిన్‌ అబీ వఖ్ఖా’స్‌ శత్రువులవైపు బాణం వదిలారు. ఇది అవిశ్వాసు లపై వదలిన ముస్లిముల మొట్టమొదటి బాణం.

[24]) వివరణ-6117: ప్రవక్త అంటే, ప్రవక్త (స), సిద్దీఖ్‌ అంటే అబూ బకర్‌ (ర), షహీద్ లు అంటే, ఉమర్, ఉస్మాన్‌, అలీ, తల్‌’హా, జుబైర్లు.

[25]) వివరణ-6128: అద్బిన్అబీ వఖ్ఖాస్(ర), ‘ఉమర్‌ (ర) పరిపాలనా కాలంలో కూఫహ్ గవర్నర్గా ఉండేవారు. బనూ స’అద్‌కు చెందిన ప్రజలు స’అద్‌ సరిగ్గా నమా’జు చదివించడం లేదని ‘ఉమర్‌కు ఫిర్యాదు చేసారు. ఈ విషయంపై ‘ఉమర్‌ (ర), స’అద్‌ నుండి సమాధానం కోరారు. స’అద్‌ (ర) ‘నేను ప్రవక్త (స) పద్ధతి ప్రకారం ప్రజలకు నమాజు చదివిస్తున్నాను,’ అని సమాధానం ఇచ్చారు. ‘ఉమర్‌ (ర), అతని సమాధానం స్వీకరించారు. కాని బనూ స’అద్‌ చేసిన ఫిర్యాదు వల్ల స’అద్‌కు చాలా బాధ కలిగింది. అతను వివరిస్తూ, ‘ప్రవక్త (స) వెంట మొదటి తరంవారిలో ఉండే భాగ్యం నాకు కలిగింది, అతి కష్టకాలంలో కూడా ఎటువంటి లోపం రానియ్యకుండా వ్యవహరించాను, విధులను నిర్వర్తించాను, ఇప్పుడు నమా’జు వంటి విషయంలో పొరపాట్లు, లోపాలు ఎలా సంభవిస్తాయి,’ అని అన్నారు.

[26]) వివరణ-6135: క్రైస్తవులు ఇస్లామ్‌ విషయంలో ప్రవక్త (స)తో వాదోపవాదాలు చేస్తూ ప్రవక్త (స)ను వ్యతిరేకిస్తూ, తిరస్కరించారు. అప్పుడు అల్లాహ్‌(త), ”ఓ ప్రవక్తా! ఇలా పలుకు,: ”రండి! మేము మరియు మీరు కలిసి, మా కుమారులను మరియు మీ కుమారులను; మా స్త్రీలను మరియు మీ స్త్రీలను పిలుచుకొని, అందరమూ కలిసి: ‘అసత్యం పలికేవారిపై అల్లాహ్ శాపం (బహిష్కారం) పడుగాక!’ అని హృదయ పూర్వకంగా ప్ర్రార్థిద్దాము,” (ఆల ఇమ్రాన్, 3:61) అనే ఆయతు అవతరింపజేశాడు. అల్లాహ్‌(త), ప్రవక్త (స)ను ఈ ఆయతు ద్వారా క్రైస్తవులతో, ‘మనలో ఎవరు న్యాయంపై ఉన్నారో తేల్చుకుందాము,’ అని అన్నారు. ఈ ఆయతు అవతరించిన తరువాత ప్రవక్త (స) తన కుటుంబం వారిని తీసుకొని ”ముబాహలహ్” కోసం బయలుదేరారు. కాని క్రైస్తవుల నాయకుడు ఆ తేజోవంతమైన ముఖాలను చూచి, వీరితో ముబాహలహ్ ఎంతమాత్రం చేయకూడదని, లేకుంటే మీరు పూర్తిగా నాశనం అవుతారని సలహా ఇచ్చాడు. చివరికి వారు ప్రవక్త (స)తో ముబాహలహ్ చేయకుండా, ప్రవక్త (స)తో పన్ను చెల్లిస్తామని ఒప్పందం కుదుర్చుకొని, విధేయత స్వీకరించారు.

[27]) వివరణ-6141: జుల్జనాహైన్, జ’అఫర్‌ బిన్‌ అబూ ‘తాలిబ్‌ బిరుదు. ఫర్బిన్బూతాలిబ్, మౌహ్ యుద్ధంలో వీరోచితంగా పోరాడుతూ వీరమరణం పొందారు. అతని శరీరంపై కరవాలాల, బల్లాల 70 గాయాలు పడ్డాయి. యుద్ధంలో అతని చేతిలో జెండా ఉండేది. ఒకచేయి నరికి వేయబడితే జండాను మరోచేత్తో పట్టుకున్నారు. రెండోచేయి కూడా నరికివేయబడితే జండాను నోటితో పట్టుకున్నారు. ఈ యుద్ధంలో వీరమరణం పొందారు. ఒక ఉల్లేఖనంలో ఇలా ఉంది, ”ప్రవక్త (స) ప్రవచనం, ‘నేను జ’అఫర్‌ను స్వర్గంలో దైవదూతలతో పాటు ఎగురుతూ ఉండగా చూచాను. అనంతరం ఆ రోజు నుండి అతన్ని జు’ల్‌జనా’హైన్‌, ‘తయ్యార్‌ అనే బిరుదులతో పిలవడం జరిగింది.”

[28]) వివరణ-6148: అల్బానీ దీని పదాలు బు’ఖారీ, ముస్లిమ్‌లో లేవని, ముస్నద్‌ అ’హ్మద్‌లో ఉన్నాయని అన్నారు. ముస్లిమ్‌లోని ఒక ఉల్లేఖనంలో ”అల్లాహుమ్మ ఫఖ్ఖిహ్‌హు,” అని ఉంది.

[29]) వివరణ-6183: అల్బానీ దీన్ని గురించి వ్యాఖ్యా నిస్తూ, ఇది ముస్నద్‌ అ’హ్మద్‌లో లేదు. తబ్‌రానీ, బజ్జార్‌లలో ఇది బలహీన పరంపరతో ఉంది. (మి. త. అ-3/1742)

[30]) వివరణ-6192: సఫియ్యహ్ (ర) తండ్రి ‘హయ్యి బిన్అఖ్తబ్, హారూన్‌ (అ) సంతతికి చెందినవారు. హారూన్‌ మూసా (అ) సోదరులు. ఈ విధంగా ‘సఫి య్యహ్ ముత్తాత ప్రవక్త. ఇంకా ప్రవక్త (స) ‘సఫియ్యహ్ను ఇస్‌’హాఖ్‌ సంతతిగా, ఇస్మా’యీల్‌ (అ)ను, ఆమె చిన్నాన్నగా అనడం జరిగింది. (మి. త. అ.)

[31]) వివరణ-6202: అవిశ్వాస నాయకులు ప్రవక్త (స) తో, ‘మేము మీవద్దకు వచ్చి మీబోధనలు వినాలంటే, మీ వద్ద ఉన్న బలహీనులను, పేదలను, దరిద్రులను తరిమి వేయండి. ఎందు టే వాళ్ళు మాతో సమానంగా కూర్చోవటం మాకు ఇష్టంలేదు.’ వారి కోరిక విని ప్రవక్త (స), ‘వారు వచ్చినపుడు వీరిని దూరంగా ఉంచితే బావుంటుందని,’ ఆలోచించారు. అంతే ఇంతలో ఈ ఆయతు అవతరరింపజేయబడింది. 

[32]) వివరణ-6218: అన్సారులు షిఆర్వంటి వారంటే, లోపలి దుస్తుల్ని షి’ఆర్‌ అంటారు. బనీయన్‌, చొక్కా మొదలైనవి. దిసార్ అంటే పైన కప్పుకునే దుప్పట్లు, కంబళ్ళు మొదలైనవి. అంటే అన్సార్లు నా అత్యంత సన్నిహితులు. ప్రజల్లో అందరికంటే గౌరవ మర్యాదల్లో అన్సారులు నాకు సన్నిహితులు. ప్రవక్త (స) అన్సారులతో నా తరువాత ఒక కాలం వస్తుంది. ప్రజలు మీకంటే తమ్ముతాము అధిక ప్రాధాన్యత ఇస్తారు. మీ పట్ల అన్యాయంగా ప్రవర్తిస్తారు. మిమ్మల్ని హీనదృష్టితో చూడటం జరుగుతుంది. ఇటువంటి సమయంలో సహనం, ఓర్పులను పాటించాలి. దాని ప్రతిఫలం ప్రళయదినంనాడు మీరు నన్ను కౌసరుకోనేరు వద్ద కలుసుకున్నప్పుడు లభిస్తుంది.

[33]) వివరణ-6235: తయ్యిబ్ అంటే పరిశుద్ధుడని, ముతయ్యిబ్అంటే పరిశుద్ధ చరిత్ర, ఉత్తమ నడవడిక గలవాడని అర్థం.

[34]) వివరణ-6237: బనూ ఖురైహ్ విషయంలో అతనొక తీర్పు ఇచ్చారు. మదీనహ్లోని యూదుల బనూ ఖురై”జహ్ తెగవారు కందక యుద్ధంలో వాగ్దాన భంగం చేసారు. ప్రవక్త (స) ఆ యుద్ధం ముగిసిన తర్వాత, బనూ ఖురై”జహ్ వైపునకు వెళ్ళారు. వారి కోటను ముట్టడించారు. కాని ఆ యూదులు బయటకు వచ్చి పోరాడటానికి సిద్ధంగా లేరు మరియు విధేయులవడానికి కూడా సిద్ధంగా లేరు. ఈ ముట్టడి 25 రోజుల వరకు కొనసాగింది. చివరికి, అద్బిన్ఆజ్‌’ తీర్పు ప్రకారం మేము నడుచుకుంటాము,” అని చెప్పారు. ప్రవక్త (స) ఈ షరతును ఒప్పుకున్నారు. అప్పుడు స’అద్‌ బిన్‌ మ’ఆజ్‌’ (ర) ”బనూ ఖురై”జహ్ పురుషులను చంపివేయాలి, స్త్రీలను, పిల్లలను యుద్ధఖైదీలుగా చేసుకోవాలి, ఇంకా వారి ధనాన్ని ముస్లిముల్లో పంచి వేయాలి,” అని తీర్పు ఇచ్చారు. ప్రవక్త (స) ఈ తీర్పును అమలుచేసారు. ఇంకా స’అద్‌తో, ‘ఈతీర్పు దైవాదేశం ప్రకారం ఉంది,’ అని అన్నారు.

[35]) వివరణ-6264: తీర్పుదినం నాడు అ’న్సారుల కంటే గౌరవనీయులు ఉండరు. అంటే, ఏ తెగలో అమరవీరుల సంఖ్య అధికంగా ఉంటే, వారికే అత్యధిక గౌరవం లభిస్తుంది. అ’న్సారుల్లోనే అత్యధిక మంది దైవమార్గంలో వీరమరణం పొందారు. అంతేకాదు, ‘అరబ్బుల్లో అ’న్సారుల్లోనే వీరమరణాల సంఖ్య అత్యధికంగా ఉంది. అందువల్ల తీర్పుదినంనాడు కూడా వీరికే అందరికంటే అత్యధిక గౌరవం లభిస్తుంది.

  [36]) వివరణ: ఇందులో బద్ర్యుద్ధంలో పాల్గొన్న అనుచరులందరి పేర్లు లేవు. బు’ఖారీ కేవలం కొంత మంది ప్రఖ్యాత అనుచరుల పేర్లను ప్రస్తావించారు. వివరాల కోసం చారిత్రక పుస్తకాలు చదవండి.

[37]) వివరణ-6270: ‘హిజా’జ్‌ వారు అంటే మక్కహ్, మదీనహ్, ‘తాయిఫ్‌ మరియు చుట్టుప్రక్కల వాళ్ళు. మరికొందరు ‘హిజా’జ్‌ వారంటే అ’న్సారులని అభిప్రాయ పడ్డారు.

[38]) వివరణ-6281: యుద్దం నాడు ముస్లిములందరూ ఏకమయ్యే చోటు అంటే దజ్జాల్కు వ్యతిరేకంగా పోరాడే ముస్లిములు ఏకమయ్యే చోటు. ఇది దిమిష్క్‌ నగర వెలుపలి భాగం.

[39]) వివరణ-6283: పూర్వీకుల ఆయుష్షులు చాలా అధికంగా ఉండేవి. కాని ము’హమ్మద్‌ (స) అనుచర సమాజం ఆయుష్షు చిన్నదిగా ఉంది. పూర్వీకుల ఆయుష్షులు సూర్యోదయం నుండి ‘అ’స్ర్‌ వరకు ఉండేవి. మీ ఆయుష్షు ‘అ’స్ర్‌ నుండి మ’గ్రిబ్‌ వరకు. అంటే మీ ఆయుష్షు వారిలో నాల్గోవంతు. యూదుల, క్రైస్తవుల పూర్తి పని ఉదయం నుండి ‘అ’స్ర్‌ వరకు. ‘అ’స్ర్‌ నుండి మ’గ్‌రిబ్‌ వరకు ఉన్న సమయంకన్నా ఇది చాలా ఎక్కువ సమయం.

[40]) వివరణ-6286: అంటే ఈ అనుచర సమాజం వర్షం చుక్కలు లాంటిది. మొదటి చుక్కలు మంచివో, చివరి చుక్కలు మంచివో చెప్పలేము. అంటే చుక్కలన్నీ మంచివే. అంటే ఈ అనుచర సమాజం అంతా ఉన్నత మైనదే. ఇందులో మొదటి వారూ, చివరి వారూ అందరూ మంచివారే.

[41]) వివరణ-6292: చివరి కాలంలో సిరియా ప్రజలు ఇస్లామ్‌పై స్థిరంగా ఉంటారు. ఆ తరువాత వారిలో కూడా మార్గభ్రష్టత్వం, పాపాలు, దుర్మార్గాలు జనించి, వ్యాపించి ఉంటాయి. అప్పుడు సిరియాలో ఉండటం వల్ల, వెళ్ళటం వల్ల ఎటువంటి లాభం చేకూరదు. అంటే ఇది ప్రళయానికి సమీప కాలం. అనంతరం సిరియా నాశనం అవగానే ప్రపంచంలో మంచి ఉనికి నశిస్తుంది. అప్పుడు భూమిపై మంచివారెవరూ ఉండరు. ప్రళయం వరకు అహ్లె ‘హదీసు’ల బృందం మాత్రమే ఇస్లామ్‌ శత్రువులతో పోరాడుతూ, ఆధిక్యతా సహాయాలు కలిగి ఉంటుంది. భూమిపై ”లా ఇలాహ ఇల్లల్లాహ్‌” అని పలికే వారెవరూ ఉండరు. అంటే ప్రళయం సంభవించినపుడు పాపాత్ములే ఉంటారు.

****

%d bloggers like this: