3. శుచీ శుభ్రతల పుస్తకం | మిష్కాతుల్ మసాబీహ్

3كِتَابُ الطَّهَارَةِ
3. శుచీ శుభ్రతల పుస్తకం

విషయసూచిక

3.0 – పుస్తక పరిచయం
3.1 – వు’దూను తప్పనిసరిచేసే విషయాలు
3.2 – మలమూత్ర విసర్జనా నియమాలు
3.3 – పండ్లు తోముకోవటం (సివాక్)
3.4 – వు’దూ’లో సాంప్రదాయాలు
3.5 – సంపూర్ణ స్నానం
3.6 – అపరిశుద్ద స్థితిలో ఉన్న వ్యక్తిని కలవటం
3.7 – నీటి ఆదేశాలు
3.8 – శుద్ధి
3.9 – మేజోళ్ళపై తడిచేతితో తుడవటం
3.10 – పరిశుభ్రతా సంకల్పం (తయమ్ముమ్)
3.11 – సాంప్రదాయ స్నానం
3.12 – బహిష్టు (స్త్రీల నెలసరి)
3.13 – అనారోగ్య రక్తస్రావం (ఇస్తి’హాదహ్)

మొదటి విభాగం  اَلْفَصْلُ الْأَوَّلُ

281 – [ 1 ] ( صحيح ) (1/93)

عَن أَبِي مَالِكٍ الْأَشْعَرِيِّ، قَالَ: قَالَ رَسُولُ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: “الطُّهُورُ شَطْرُ الْإِيمَانِ، وَالْحَمْدُ لِلَّهِ تَمْلَأُ الْمِيزَانَ، وَسُبْحَانَ اللَّهِ وَالْحَمْدُ لِلَّهِ تَمْلَآنِ – أَوْ تَمْلَأُ – مَا بَيْنَ السَّمَاوَاتِ وَالْأَرْضِ، وَالصَّلَاةُ نُورٌ، وَالصَّدَقَةُ بُرْهَانٌ، وَالصَّبْرُ ضِيَاءٌ، وَالْقُرْآنُ حُجَّةٌ لَكَ أَوْ عَلَيْكَ. كُلُّ النَّاسِ يَغْدُو: فَبَائِعٌ نَفْسَهُ فَمُعْتِقُهَا أَوْ مُوبِقُهَا”. رَوَاهُ مُسْلِمٌ.

وَفِي رِوَايَةٍ: “لَا إِلَهَ إِلَّا اللَّهُ وَاللَّهُ أَكْبَرُ، تَمْلَآنِ مَا بَيْنَ السَّمَاءِ وَالْأَرْضِ”. لَمْ أَجِدْ هَذِهِ الرِّوَايَةَ فِي “الصَّحِيحَيْنِ”، وَلَا فِي كِتَابِ الْحُمَيْدِيِّ، وَلَا فِي “الْجَامِعِ”؛ وَلَكِنْ ذَكَرَهَا الدَّارِمِيُّ بدل “سُبْحَانَ الله وَالْحَمْد لله”.  

281. (1) [1/93-దృఢం]

అబూ మాలిక్‌ అష్‌’అరీ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”పరిశుభ్రంగా ఉండటం అర్థ విశ్వాసం, అల్‌’హమ్‌దులిల్లాహ్‌, తూనికను నింపివేస్తుంది, సుబ్‌’హానల్లాహ్‌, వల్‌’హమ్‌దులిల్లాహ్‌ భూమ్యా కాశాలను నింపివేస్తాయి. నమా’జు వెలుగు వంటిది, విధిదానాలు నిదర్శనాలు. సహనం వెలుగు వంటిది. ఇంకా ఖుర్‌ఆన్‌ నీ కోసం సాక్ష్యాధారం లేదా నీపై ఆపద వంటిది. ప్రతి వ్యక్తి పడుకొని ఉదయం లేచి, తన ప్రాణాన్ని తన కర్మలకు బదులుగా అమ్మివేస్తాడు. దాన్ని విడుదల చేస్తాడు. లేదా దాన్ని నాశనం చేసుకుంటాడు.” [1]

ముస్లిమ్‌, మరో ఉల్లేఖనంలో, ”లా ఇలాహ ఇల్లల్లాహు, వల్లాహు అక్బర్‌” భూమ్యాకాశాలను నింపివేస్తాయి” అని ఉంది. (దార్మీ)

282 – [ 2 ] ( صحيح ) (1/93)

وَعَنْ أَبِي هُرَيْرَةَ، قَالَ: قَالَ رَسُولُ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: “أَلَا أَدُلُّكُمْ عَلَى مَا يَمْحُو اللَّهُ بِهِ الْخَطَايَا. وَيَرْفَعُ بِهِ الدَّرَجَاتِ”. قَالُوا: بَلَى يَا رَسُولَ اللَّهِ! قَالَ: “إِسْبَاغُ الْوُضُوءِ عَلَى الْمَكَارِهِ، وَكَثْرَةُ الْخُطَى إِلَى الْمَسَاجِدِ، وَانْتِظَارُ الصَّلَاةِ بَعْدَ الصَّلَاة، فذلكم الرِّبَاطُ “.

282. (2) [1/93-దృఢం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స), ”మీకు ఒక విషయం తెలుపనా? దాన్ని ఆచరిస్తే, అల్లాహ్‌(త) మీ పాపాలను క్షమించివేస్తాడు. ఇంకా స్వర్గంలో మీ స్థానాలను ఉన్నతం చేస్తాడు,” అని అన్నారు. దానికి అనుచరులు, ‘తప్ప కుండా ఓ ప్రవక్తా!’ అని విన్నవించుకున్నారు. అప్పుడు, ప్రవక్త (స), ”ఆటంకాలు కలిగినా పరిపూర్ణంగా వు’దూ చేయడం, మస్జిదుల వైపు అధికంగా నడవటం, ఒక నమా’జు తర్వాత మరో నమా’జు కోసం వేచి ఉండటం ఇదే దృఢత్వం.”

283 – [ 3 ]؟ (1/93)

وَفِي حَدِيث مَالك بن أنس: “فَذَلِك الرِّبَاطُ فَذَلِكُمُ الرِّبَاطُ”. رَدَّدَ مَرَّتَيْنِ. رَوَاهُ مُسْلِمٌ . وَفِي رِوَايَة التِّرْمِذِيّ: ثَلَاثًا.

283. (3) [1/93- ?]

మాలిక్‌ బిన్‌ అనస్‌ ’హదీసు‘లో రిబా’త్‌ అనే పదం రెండు సార్లు వచ్చింది. దీన్ని ముస్లిమ్‌ ఉల్లేఖించారు. తిర్మిజీలో ఈ పదం మూడుసార్లు వచ్చింది. [2]

284 – [ 4 ] ( متفق عليه ) (1/94)

عَنْ عُثْمَانَ رَضِيَ اللَّهُ عَنْهُ، قَالَ: قَالَ رَسُولُ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: “مَنْ تَوَضَّأَ فَأَحْسَنَ الْوُضُوءَ، خَرَجَتْ خَطَايَاهُ مِنْ جَسَدِهِ حَتَّى تخرج من تَحت أَظْفَاره”.

284. (4) [1/94ఏకీభవితం]

‘ఉస్మాన్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”చక్కగా పరిపూర్ణంగా వు’దూ చేసిన వారి పాపాలు, అతని శరీరం నుండి తొలగిపోతాయి. చివరికి గోర్ల ద్వారా కూడా బయట పడతాయి.” (బు’ఖారీ, ముస్లిమ్‌)

285 – [ 5 ] ( صحيح ) (1/94)

وَعَنْ أَبِي هُرَيْرَةَ، قَالَ: قَالَ رَسُولُ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: “إِذَا تَوَضَّأَ الْعَبْدُ الْمُسْلِمُ – أَوِ الْمُؤْمِنُ – فَغَسَلَ وَجْهَهُ، خَرَجَ مِنْ وَجْهِهِ كُلُّ خَطِيئَةٍ نَظَرَ إِلَيْهَا بِعَيْنَيْهِ مَعَ المَاء – مَعَ آخِرِ قَطْرِ الْمَاءِ – فَإِذَا غَسَلَ يَدَيْهِ خرج من يَدَيْهِ كل خَطِيئَة كان بَطَشَتْهَا يَدَاهُ مَعَ الْمَاءِ – أَوْ مَعَ آخِرِ قَطْرِ الْمَاءِ – فَإِذَا غَسَلَ رِجْلَيْهِ؛ خَرَجَ كُلُّ خَطِيئَةٍ مَشَتْهَا رِجْلَاهُ مَعَ الْمَاءِ – أَوْ مَعَ آخِرِ قَطْرِ الْمَاءِ – حَتَّى يَخْرُجَ نَقِيًّا مِنَ الذُّنُوب”. رَوَاهُ مُسلم

285. (5) [1/94దృఢం]

అబూ హురైరహ్‌ (ర)కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఒక ముస్లిమ్‌ లేదా ము‘మిన్‌ వు’దూ చేసినపుడు, అతడు తన ముఖాన్ని కడిగితే, కళ్ళతో చేసిన పాపాలన్నీ ఆ నీటితో లేదా ఆ నీటి చివరి బొట్టుతో పాటు కొట్టుకుపోతాయి. అతడు చేతులు కడిగితే, చేతుల ద్వారా చేసిన పాపాలన్నీ ఆ నీటి ద్వారా లేదా ఆ నీటి చివరి బొట్టుతో తొలగిపోతాయి. అతడు తన కాళ్ళు కడిగితే, కాళ్ళద్వారా చేసిన పాపాలన్నీ నీటితో పాటు లేదా ఆ నీటి చివరి బొట్టుతో పాటు కొట్టుకుపోతాయి. చివరికి అతడు పరిశుద్ధుడైపోతాడు.” (ముస్లిమ్‌)

286 – [ 6 ] ( صحيح ) (1/94)

وَعَنْ عُثْمَانَ، قَالَ: قَالَ رَسُولُ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: “مَا مِنَ امْرِئٍ مُسْلِمٍ تَحْضُرُهُ صَلَاةٌ مَكْتُوبَةٌ، فَيُحْسِنُ وُضُوءَهَا وَخُشُوعَهَا وَرُكُوعَهَا؛ إِلَّا كَانَتْ كَفَّارَةً لِمَا قَبْلَهَا مِنَ الذُّنُوبِ، مَا لَمْ يُؤْتِ كَبِيرَةً، وَذَلِكَ الدَّهْرَ كُلَّهُ”. رَوَاهُ مُسلم.

286. (6) [1/94దృఢం]

‘ఉస్మాన్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ముస్లిముల్లో ఎవరైనా విధి నమాజులకు హాజరై, చక్కగా వు’దూ చేసి, భక్తి శ్రద్ధలతో నమా’జు చేస్తే, అతని పాపాలన్నీ తొలగి పోతాయి. అయితే అతడు మహా పాపాలకు పాల్పడ కుండా ఉండాలి. ఇలా ఎల్లప్పుడూ జరుగుతూ ఉంటుంది.” [3] (ముస్లిమ్‌)

287 – [ 7 ] ( متفق عليه ) (1/95)

وَعَنْهُ، أَنَّهُ تَوَضَّأَ فَأَفْرَغَ عَلَى يَدَيْهِ ثَلَاثًا، ثُمَّ تَمَضْمَضَ وَاسْتَنْثَرَ، ثُمَّ غَسَلَ وَجْهَهُ ثَلَاثًا، ثُمَّ غَسَلَ يَدَهُ الْيُمْنَى إِلَى الْمِرْفَقِ ثَلَاثًا، ثُمَّ غَسَلَ يَدَهُ الْيُسْرَى إِلَى الْمِرْفَقِ ثَلَاثًا، ثُمَّ مَسَحَ بِرَأْسِهِ، ثُمَّ غَسَلَ رِجْلَهُ الْيُمْنَى ثَلَاثًا، ثُمَّ الْيُسْرَى ثَلَاثًا، ثُمَّ قَالَ: رَأَيْتُ رَسُولَ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ تَوَضَّأَ نَحْوَ وُضُوئِي هَذَا. ثُمَّ قَالَ: “مَنْ تَوَضَّأَ وُضُوئِي هَذَا، ثُمَّ يُصَلِّي رَكْعَتَيْنِ لَا يُحَدِّثُ نَفسه فيهمَا بِشَيْء، غُفِرَ لَهُ مَا تقدم من ذَنبه”. متفق عليه. وَلَفظه للْبُخَارِيّ .

287. (7) [1/94ఏకీభవితం]

‘ఉస్మాన్‌ (ర) కథనం: అతను (ర) వు’దూ చేయటానికి సిద్ధమై ముందు మూడుసార్లు తన చేతులు కడిగారు. ఆ తరువాత నోరు, ముక్కు శుభ్రం చేశారు, మూడుసార్లు ముఖం కడిగారు. మూడుసార్లు కుడిచేతిని కడిగారు, మూడు సార్లు ఎడమచేతిని మోచేతుల వరకు కడిగారు. ఆ తరువాత తలపై మసహ్‌ చేశారు. అనంతరం కుడి కాలును మూడు సార్లు కడిగారు. ఎడమ కాలును మూడుసార్లు కడిగారు. అనంతరం ‘ఉస్మాన్‌ (ర) ప్రవక్త (స) ఈ విధంగా వు’దూ చేస్తూ ఉండగా చూశాను. ఆ విధంగా నేను వు’దూ చేశాను. ఇంకా ప్రవక్త (స)అన్నారు, ”నాలా వు’దూ చేసి, ఈ విధంగా రెండు రక’అతులు నమా’జుచదివి, మనసులో ఎటువంటి ప్రాపంచిక ఆలోచన రాకుండా ఉంటే, అతని వెనుకటి పాపాలన్నీ క్షమించబడతాయి.” (బు’ఖారీ)

288 – [ 8 ] ( صحيح ) (1/95)

وَعَنْ عُقْبَةَ بْنِ عَامِرٍ، قَالَ: قَالَ رَسُولُ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: “مَا مِنْ مُسْلِمٍ يَتَوَضَّأُ، فَيُحْسِنُ وُضُوءَهُ، ثُمَّ يَقُومُ فَيُصَلِّي رَكْعَتَيْنِ، مقبلًا عَلَيْهِمَا بِقَلْبِهِ وَوَجْهِهِ، إِلَّا وَجَبَتْ لَهُ الْجَنَّةُ”. رَوَاهُ مُسلم.

288. (8) [1/95దృఢం]

ఉఖ్‌బహ్ బిన్‌ ’ఆమిర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ముస్లిముల్లోని ఎవరైనా చక్కగా, పరిపూర్ణంగా వు’దూ చేసి, రెండు రక’అతులు చిత్తశుద్ధితో ఆచరిస్తే, అతని కోసం స్వర్గం తప్పనిసరి అయిపోతుంది.” (ముస్లిమ్‌)

289 – [ 9 ] ( صحيح ) (1/95)

وَعَنْ عُمَرَ بْنِ الْخَطَّابِ رَضِيَ اللَّهُ عَنْهُ، قَالَ: قَالَ رَسُولُ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: “مَا مِنْكُمْ مِنْ أَحَدٍ يَتَوَضَّأُ فَيُبْلِغُ – أَوْ فَيُسْبِغُ – الْوُضُوءَ، ثُمَّ يَقُولُ: أَشْهَدُ أَنْ لَا إِلَهَ إِلَّا اللَّهُ، وَأَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُهُ – وَفِي رِوَايَةٍ: أَشْهَدُ أَنْ لَا إِلَهَ إِلَّا اللَّهُ، وَحْدَهُ لَا شَرِيكَ لَهُ، وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُهُ – إِلَّا فُتِحَتْ لَهُ أَبْوَابُ الْجَنَّةِ الثَّمَانِيَةُ، يَدْخُلُ مِنْ أَيِّهَا شَاءَ”. هَكَذَا رَوَاهُ مُسْلِمٌ فِي “صَحِيحِهِ”، وَالْحُمَيْدِيُّ فِي “أَفْرَاد مُسلم”، وَكَذَا ابْن الْأَثِير فِي “جَامع الْأُصُول”.

وَذكر الشَّيْخ مُحي الدِّينِ النَّوَوِيُّ فِي آخِرِ حَدِيثِ مُسْلِمٍ عَلَى مَا روينَاهُ، وَزَاد التِّرْمِذِيّ: “الله اجْعَلْنِي مِنَ التَّوَّابِينَ، وَاجْعَلْنِي مِنَ الْمُتَطَهِّرِينَ”.

وَالْحَدِيثُ الَّذِي رَوَاهُ مُحْيِي السُّنَّةِ فِي “الصِّحَاحِ”. “مَنْ تَوَضَّأَ فَأَحْسَنَ الْوُضُوءَ “إِلَى آخِرِهِ، رَوَاهُ التِّرْمِذِيُّ فِي “جَامِعِهِ” بِعَيْنِهِ إِلَّا كَلِمَةَ “أَشْهَدُ” قَبْلَ “أَن مُحَمَّدًا”.

289. (9) [1/95దృఢం]

’ఉమర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మీలో ఎవరైనా చక్కగా, పరిపూర్ణంగా వు’దూచేసి, ‘అష్‌హదు అల్లాఇలాహ ఇల్లల్లాహు వ అష్‌హదు అన్న ముహమ్మ దన్‌ అబ్దుహు వ రసూలుహు’ మరో ఉల్లేఖనంలో ”అష్‌హదు అల్లాయిలాహ ఇల్లల్లాహు వ’హ్‌దహు లాషరీక లహు, వ అష్‌హదు అన్న ము’హమ్మదన్‌ అబ్దుహు వ రసూలుహు” అని పఠిస్తే, ఈ దు’ఆ శుభం వల్ల అతని కోసం స్వర్గద్వారాలు తెరువబడతాయి, తాను కోరిన ద్వారం ద్వారా అతను స్వర్గంలో ప్రవేశించవచ్చు.” (ముస్లిమ్‌, హమీదీ, జామిఉల్‌ ఉసూల్‌, నవవీ, తిర్మిజి’)  

తిర్మిజి ”అల్లాహుమ్మజ్‌’అల్‌నీ మినత్తవ్వాబీన వజ్‌అల్‌నీ మినల్‌ ముత’తహ్హిరీన్‌” అధికం చేశారు.

290 – [ 10 ] ( متفق عليه ) (1/96)

وَعَنْ أَبِي هُرَيْرَةَ، قَالَ: قَالَ رَسُولُ اللَّهِ صلى الله عَلَيْهِ وَسلم: “إِنَّ أُمَّتِي يُدْعَوْنَ يَوْمَ الْقِيَامَةِ غُرًّا مُحَجَّلِينَ مِنْ آثَارِ الْوُضُوءِ. فَمَنِ اسْتَطَاعَ مِنْكُمْ أَنْ يُطِيلَ غرته فَلْيفْعَل”. متفق عليه.

290. (10) [1/96ఏకీభవితం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”నా అనుచర సమాజాన్ని తీర్పుదినం నాడు తెల్ల నుదురు, అవయవాల ప్రజలారా! అని పిలవటం జరుగుతుంది. ఈ తెల్లదనం వు’దూ వల్ల ఉంటుంది. మీలో వెలుగును పెంచు కోవాలనుకున్నవారు ఇలాచేయాలి.” (బు’ఖారీ ముస్లిమ్‌)

291 – [ 11 ] ( صحيح ) (1/96)

وَعَنْهُ، قَالَ: قَالَ رَسُولُ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: “تَبْلُغُ الْحِلْيَةُ مِنَ الْمُؤْمِنَ حَيْثُ يبلغ الْوضُوء”. رَوَاهُ مُسلم.

291. (11) [1/96దృఢం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”నీరు చేరినంత భాగం ఆభరణాలు నిండిఉంటాయి.” [4](ముస్లిమ్‌)

—–

రెండవ విభాగం الْفَصْلُ الثَّانِيْ

292 – [ 12 ] ( صحيح ) (1/96)

عَنْ ثَوْبَانَ، قَالَ: قَالَ رَسُولُ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: “اسْتَقِيمُوا وَلَنْ تُحْصُوا، وَاعْلَمُوا أَنَّ خَيْرَ أَعْمَالِكُمُ الصَّلَاةُ، وَلَا يُحَافِظُ عَلَى الْوُضُوءِ إِلَّا مُؤْمِنٌ”. رَوَاهُ مَالِكٌ وَأَحْمَدُ وَابْنُ مَاجَهْ وَالدَّارِمِيُّ.

292. (12) [1/96దృఢం]

సౌ‘బాన్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”తిన్నగా ఉండండి. మీరెంత మాత్రం తిన్నగా ఉండలేరు. గుర్తుంచు కోండి, మీ కర్మలన్నిటిలో కెల్లా అత్యుత్తమమైన కార్యం నమా’జు మాత్రమే. అయితే కేవలం విశ్వాసులే వు’దూను పరిరక్షించగలరు.” [5] (మాలిక్‌, దార్మీ, అ’హ్మద్‌, ఇబ్నె మాజహ్)

293 – [ 13 ] ( ضعيف ) (1/96)

وَعَنِ ابْنِ عُمَرَ، قَالَ: قَالَ رَسُولُ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: “مَنْ تَوَضَّأَ عَلَى طُهْرٍ، كُتِبَ لَهُ عَشْرُ حَسَنَاتٍ”. رَوَاهُ التِّرْمِذِيُّ.

293. [1/96బలహీనం]

ఇబ్నె ‘ఉమర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఎవరైనా వు’దూపై వు’దూ చేస్తే, అతని కర్మల పత్రంలో 10 పుణ్యాలు వ్రాయబడతాయి.” (తిర్మిజి’)

—–

మూడవ విభాగం اَلْفَصْلُ الثَّالِثُ  

294 – [ 14 ] ( ضعيف ) (1/97)

عَنْ جَابِرٍ، قَالَ: قَالَ رَسُولُ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: “مِفْتَاحُ الْجَنَّةِ الصَّلَاةُ، وَمِفْتَاحُ الصَّلَاة الطّهُور”. رَوَاهُ أَحْمد.

294. (14) [1/97బలహీనం]

జాబిర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”నమా’జు స్వర్గపు తాళంచెవి వంటిది. నమా’జు తాళం చెవి పరిశుభ్రత మరియు వు’దూ.” [6] (అ’హ్మద్‌)

295 – [ 15 ] ( ضعيف ) (1/97)

عَن شبيب بن أبي روح، عَنْ رَجُلٍ مِنْ أَصْحَابِ رَسُولِ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: أَنَّ رَسُولَ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ صَلَّى صَلَاةَ الصُّبْحِ، فَقَرَأَ الرُّومَ، فَالْتُبَسَ عَلَيْهِ. فَلَمَّا صَلَّى، قَالَ: “مَا بَالُ أَقْوَامٍ يُصَلُّونَ مَعَنَا لَا يُحْسِنُونَ الطَّهُورَ؟ و إِنَّمَا يُلَبِّسُ علينا الْقُرْآن أُولَئِكَ”. رَوَاهُ النَّسَائِيّ.

295. (15) [1/97బలహీనం]

షబీబ్‌ బిన్‌ అబీ రౌ’హ్‌ (ర) మరో ప్రవక్త (స) అనుచరుని ద్వారా ఉల్లేఖనం: ప్రవక్త (స) ఫజ్ర్‌ నమా’జు చదివారు, అందులో సూరహ్‌ అర్-రూమ్‌ (30) పఠించారు. అందులో సంశయానికి గుర య్యారు. నమా’జు ముగిసిన తర్వాత, “ప్రజల కేమయింది! మాతో పాటు నమా’జు చదువుతారు కాని, వు’దూ సరిగ్గా చేయకుండా వస్తున్నారు. వీరి వల్లే మేము సంశయానికి గురవుతున్నాము,” అని అన్నారు. [7] (నసాయి’)

296 – [ 16 ] ( ضعيف ) (1/97)

وَعَنْ رَجُلٍ مِنْ بَنِي سُلَيْمٍ، قَالَ: عَدَّهُنَّ رَسُولِ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ فِي يَدِي – أَوْ فِي يَدِهِ – قَالَ: “التَّسْبِيحُ نِصْفُ الْمِيزَانِ، وَالْحَمْدُ لِلَّهِ يَمْلَؤُهُ، وَالتَّكْبِيرُ يَمْلَأُ مَا بَيْنَ السَّمَاءِ وَالْأَرْضِ، وَالصَّوْمُ نِصْفُ الصَّبْرِ، وَالطُّهُورُ نِصْفُ الْإِيمَانِ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَقَالَ: هَذَا حَدِيثٌ حَسَنٌ.

296. (16) [1/97బలహీనం]

బనీ సులైమ్‌ తెగకు చెందిన ఒక వ్యక్తి ఉల్లేఖనం: ప్రవక్త (స) ఈ విషయాలను నా చేతిపై లేదా తన చేతిపై లెక్క పెట్టారు. 1. సుబ్‌’హానల్లాహ్‌ పలకటం సగం తూనికను నింపివేస్తుంది. 2. అల్‌’హమ్‌దు లిల్లాహ్‌ తూనికను నింపివేస్తుంది. 3. అల్లాహ్‌ అక్బర్‌ పలకటం భూమ్యాకాశాల మధ్య భాగాన్ని నింపి వేస్తుంది. 4. ఉపవాసం సగం సహనం 5. పరిశుభ్రత సగం విశ్వాసం.” (తిర్మిజి / ప్రామాణికం)

297 – [ 17 ] ( صحيح ) (1/97)

عَن عبد الله الصُّنَابحِي، قَالَ: قَالَ رَسُولُ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسلم قَالَ: “إِذَا تَوَضَّأَ الْعَبْدُ الْمُؤْمِنُ فَمَضْمَضَ، خَرَجَتِ الْخَطَايَا مِنْ فِيهِ. وَإِذَا اسْتَنْثَرَ، خَرَجَتِ الْخَطَايَا مِنْ أَنفه. وَإِذَا غَسَلَ وَجْهَهُ، خَرَجَتِ الْخَطَايَا مِنْ وَجْهِهِ، حَتَّى تَخْرُجَ مِنْ تَحْتِ أَشْفَارِ عَيْنَيْهِ. فَإِذَا غسل يَدَيْهِ، خرجت الْخَطَايَا مِنْ تَحْتِ أَظْفَارِ يَدَيْهِ. فَإِذَا مَسَحَ بِرَأْسِهِ، خَرَجَتِ الْخَطَايَا مِنْ رَأْسِهِ حَتَّى تَخْرُجَ مِنْ أُذُنَيْهِ. فَإِذَا غَسَلَ رِجْلَيْهِ، خَرَجَتِ الْخَطَايَا مِنْ رِجْلَيْهِ، حَتَّى تَخْرُجَ مِنْ تَحْتِ أَظْفَارِ رِجْلَيْهِ . ثُمَّ كَانَ مَشْيُهُ إِلَى الْمَسْجِدِ وَصَلَاتُهُ نَافِلَةً لَهُ” رَوَاهُ مَالك وَالنَّسَائِيّ .

297. (17) [1/97దృఢం]

’అబ్దుల్లాహ్‌ ’సునాబి’హియ్యి (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”విశ్వాసి వు’దూ చేసినపుడు నీళ్ళు పుక్కిలిస్తే, నోటిద్వారా చేసిన పాపాలు తొలగి పోతాయి. ముక్కు శుభ్ర పరిస్తే, ముక్కుద్వారా చేసిన పాపాలు తొలగిపోతాయి. ముఖం కడిగితే, ముఖం ద్వారా చేసిన పాపాలు తొలగి పోతాయి. చేతులు కడిగితే చేతుల ద్వారా చేసిన పాపాలు తొలగిపోతాయి. చివరికి కంటి రెప్పల ద్వారా కూడా పాపాలు తొలగిపోతాయి. అదేవిధంగా పాపాలు చేతిగోర్ల ద్వారా కూడా తొలగిపోతాయి. తలపై మసహ్ చేస్తే తల ద్వారా పాపాలు తొలగిపోతాయి. రెండు చెవుల నుండి కూడా పాపాలు తొలగిపోతాయి. కాళ్ళను కడిగినపుడు, కాళ్ళ పాపాలు కూడా తొలగి పోతాయి. చివరికి కాళ్ళ గోళ్ళ నుండి కూడా పాపాలు తొలగిపోతాయి. ఇంకా అతను మస్జిద్‌ వైపు నడవడం వల్ల, నమా’జు చదవటం వల్ల అతని స్థానాలు ఉన్నతం అవుతాయి.” (మాలిక్‌, నసాయి’)

298 – [ 18 ] ( صحيح ) (1/98)

وَعَنْ أَبِي هُرَيْرَةَ، أَنَّ رَسُولَ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسلم أَتَى الْمَقْبَرَةَ فَقَالَ: “السَّلَامُ عَلَيْكُمْ دَارَ قَوْمٍ مُؤْمِنِينَ، وَإِنَّا إِنْ شَاءَ اللَّهُ بِكُمْ لَاحِقُونَ، وَدِدْتُ أَنَّا قَدْ رَأَيْنَا إِخْوَانَنَا”. قَالُوا: أَوَلَسْنَا إِخْوَانَكَ يَا رَسُولَ اللَّهِ؟ قَالَ: “أَنْتُمْ أَصْحَابِي، وَإِخْوَانُنَا الَّذِينَ لَمْ يَأْتُوا بَعْدُ”. فَقَالُوا: كَيْفَ تَعْرِفُ مَنْ لَمْ يَأْتِ بَعْدُ مِنْ أُمَّتِكَ يَا رَسُولَ اللَّهِ؟ فَقَالَ: “أَرَأَيْتَ لَوْ أَنَّ رَجُلًا لَهُ خَيْلٌ غُرٌّ مُحَجَّلَةٌ، بَيْنَ ظَهْرَيْ خَيْلٍ دُهْمٍ بُهْمٍ، أَلَا يَعْرِفُ خَيْلَهُ؟” قَالُوا: بَلَى، يَا رَسُولَ اللَّهِ! قَالَ: “فَإِنَّهُمْ يَأْتُونَ غُرًّا مُحَجَّلِينَ مِنَ الْوُضُوءِ وَأَنَا فَرَطُهُمْ عَلَى الْحَوْض”. رواه مسلم.

298. (18) [1/98-దృఢం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) బఖీ’ స్మశానంలోకి వచ్చి, అక్కడి మృతులను గురించి ఇలా దు’ఆ చేశారు, ”అస్సలాము ‘అలైకుమ్‌ దారఖౌమిన్‌ ము‘మినీన్‌ వ ఇన్నా ఇన్‌షా అల్లాహు బికుమ్‌ లా’హిఖూన్‌” — అంటే, ‘ఓ విశ్వాసులారా! మీపై శాంతి కురియు గాక! ఇన్‌షాఅల్లాహ్‌ మేము కూడా మిమ్మల్ని కలవబోతున్నాము.’ అనంతరం ప్రవక్త (స), ‘నా సోదరులను కళ్ళారా చూసుకోవాలని చాలా కోరికగా ఉంది,’ అని అన్నారు. అది విని అనుచరులు, ‘ప్రవక్తా! మేము కూడా మీ సోదరులమే కదా!’ అని విన్న వించుకున్నారు. దానికి ప్రవక్త (స), ‘మీరు నా మిత్రులు, అనుచరులు, కాని సోదరులు ఇంకా భూలోకానికి రాలేదు. భవిష్యత్తులో వారు వస్తారు,’ అని అన్నారు. అప్పుడు అనుచరులు, ప్రవక్తా! తీర్పుదినం నాడు తమరు తమ అనుచర సమాజాన్ని ఎలా గుర్తుపడతారు. వారింకా ప్రపంచంలోకి రాలేదు కదా!’ అని విన్నవించు కున్నారు. దానికి ప్రవక్త (స), ‘ఒక వ్యక్తి వద్ద తెల్ల గుర్రాలు, నల్లగుర్రాలు ఉంటే, ఆ వ్యక్తి తెల్ల గుర్రాలను గుర్తు పట్టలేడా?’ అని అడిగారు. అనుచరులు, ‘తప్పకుండా గుర్తుపట్టగలడు,’ అని అన్నారు. అప్పుడు ప్రవక్త (స), ‘తీర్పుదినం నాడు వు’దూవల్ల వీరి నుదురు, చేతులు, ముఖం, కాళ్ళు మెరుస్తూ ఉంటాయి. వారు నన్ను ‘హౌ’దె కౌస’ర్‌ వద్ద కలుసుకుంటారు,’ అని అన్నారు. (ముస్లిమ్‌)

299 – [ 19 ] ( صحيح ) (1/98)

عَن أبي الدَّرْدَاء، قَالَ: قَالَ رَسُولُ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: “أَنَا أَوَّلُ مَنْ يُؤْذَنُ لَهُ بِالسُّجُودِ يَوْمَ الْقِيَامَةِ، وَأَنَا أَوَّلُ مَنْ يُؤْذَنُ لَهُ أَنْ يرفع رَأسه، فَأنْظر إِلَى بَيْنَ يَدِي، فَأَعْرِفُ أُمَّتِي مِنْ بَيْنِ الْأُمَمِ، وَمِنْ خَلْفِي مِثْلُ ذَلِكَ، وَعَنْ يَمِينِي مِثْلُ ذَلِك، وَعَن شمَالي مثل ذَلِك”. فَقَالَ رَجُلٌ: يَا رَسُولَ اللَّهِ! كَيْفَ تَعْرِفُ أُمَّتَكَ مِنْ بَيْنِ الْأُمَمِ  فِيمَا بَيْنَ نُوحٍ إِلَى أُمَّتِكَ؟ قَالَ: “هُمْ غُرٌّ مُحَجَّلُونَ مِنْ أَثَرِ الْوُضُوءِ، لَيْسَ أَحَدٌ كَذَلِكَ غَيْرَهُمْ، وَأَعْرِفُهُمْ أَنَّهُمْ يُؤْتونَ كتبهمْ بأيمانهم، وأعرفهم يسْعَى بَين أَيْديهم ذُرِّيتهمْ”. رَوَاهُ أَحْمد.

299. (19) [1/98దృఢం]

అబూ దర్‌దా’ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”తీర్పుదినం నాడు అందరికంటే ముందు నాకు, సజ్దా చేయడానికి అనుమతి లభిస్తుంది. అందరికంటే ముందు నాకు సజ్దా నుండి తల ఎత్తమని ఆదేశం ఇవ్వబడుతుంది. నేను నా ముందు చూసి, నా అనుచర సమాజాన్ని గుర్తు పడతాను. ఇంకా వెనుక, కుడివైపు ఎడమవైపు అన్నిచోట్ల నా అనుచర సమాజాన్ని గుర్తుపడతాను,” అని అన్నారు. అప్పుడు ఒక వ్యక్తి, ప్రవక్తా! ‘అప్పుడు ప్రజలు, ‘నూహ్‌ (అ) నుండి తమరి అనుచర సమాజం వరకు ఉంటారు. తమరు ఎలా గుర్తుపట్టగలరు?’ అని విన్నవించుకున్నారు. దానికి ప్రవక్త (స), ‘తెల్లగుర్రాల్లా ముఖం, చేతులు, కాళ్ళు మెరుస్తూ ఉంటాయి. ఇంకా వారి కర్మపత్రాలు కుడిచేతిలో ఇవ్వబడి ఉంటాయి, ఇంకా వారి ఉత్తమ సంతానం వారి ముందు పరిగెడుతూ ఉంటుంది, వీటిద్వారా వారిని గుర్తుపడతాను,’ అని అన్నారు. (అ’హ్మద్‌)

—–

  1. بَابُ مَا يُوْجِبُ الْوَضُوْءَ
  2. వుదూను తప్పనిసరిచేసే విషయాలు

క్రింద పేర్కొనబడిన విషయాల నుండి వు’దూ భంగమవు తుంది: 1. మలమూత్ర విసర్జన, 2. అపాన వాయువుల విసర్జన, 3. చేరబడి, పరుండి నిద్ర పోవటం, 4. పూర్తిగా స్పృహ కోల్పోవటం, 5. వాంతి చేసుకోవటం, 6. మర్మాంగాన్ని ముట్టుకోవటం, 7. ఒంటె మాంసం తినటం, 8. కామ ఉద్రేకంతో స్త్రీని ముట్టుకోవటం.

اَلْفَصْلُ الْأَوَّلُ మొదటి విభాగం 

300 – [ 1 ] ( مُتَّفَقٌ عَلَيْهِ ) (1/100)

وَعَنْ أَبِي هُرَيْرَةَ رَضِيَ اللَّهُ عَنْهُ، قَالَ: قَالَ رَسُولُ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: “لَا تُقْبَلُ صَلَاةُ مَنْ أَحْدَثَ حَتَّى يتَوَضَّأ”.

300. (1) [1/100ఏకీభవితం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”వు’దూ లేకుండా నమా’జు స్వీకరించబడదు.” (బు’ఖారీ, ముస్లిమ్‌)    

అంటే పరిపూర్ణం కాదు.

301 – [ 2 ] ( صحيح ) (1/100)

وَعَنِ ابْنِ عُمَرَ، قَالَ: قَالَ رَسُولُ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: “لَا تُقْبَلُ صَلَاةُ بِغَيْرِ طُهُورٍ، وَلَا صَدَقَةٌ مِنْ غُلُولٍ”. رَوَاهُ مُسلم.

301. (2) [1/100దృఢం]

ఇబ్నె ‘ఉమర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”పరిశుభ్రత లేకుండా, వు’దూ లేకుండా నమా’జు స్వీకరించ బడదు, పరిపూర్ణం కాదు, అదేవిధంగా అధర్మ సంపాదన నుండి చేసే దానధర్మాలు స్వీకరించబడవు.” (ముస్లిమ్‌)

302 – [ 3 ] ( متفق عليه ) (1/100)

وَعَن عَليّ، قَالَ: كُنْتُ رَجُلًا مَذَّاءً، فَكُنْتُ أَسْتَحْيِي أَنْ أَسْأَلَ النَّبِيَّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ لِمَكَانِ ابْنَتِهِ، فَأَمَرْتُ الْمِقْدَادَ، فَسَأَلَهُ، فَقَالَ: “يَغْسِلُ ذَكَرَهُ وَيتَوَضَّأ”

302. (3) [1/100ఏకీభవితం]

‘అలీ (ర) కథనం: నాకు (మజీ’) అధికంగా వచ్చేది. కాని నేను ప్రవక్త (స) అల్లుడ్ని అయినందువల్ల దాన్ని గురించి చెప్పటానికి సిగ్గుగా ఉండేది. నేను మిఖ్‌దాద్‌ను దీన్ని గురించి ప్రవక్త (స)ను అడగమని చెప్పాను. మిఖ్‌దాద్‌ ప్రవక్త (స)ను దీన్ని గురించి అడిగారు. దానికి ప్రవక్త (స), ‘మజీ’ వెలువడటం వల్ల వు’దూ భంగమవుతుంది, మర్మాంగాన్ని కడుక్కోవాలి, మళ్ళీ వు’దూ చేసుకోవాలి,’ అని ప్రవచించారు. (బు’ఖారీ, ముస్లిమ్‌)

303 – [ 4 ] ( صحيح ) (1/100)

وَعَنْ أَبِي هُرَيْرَةَ رَضِيَ اللَّهُ عَنْهُ، قَالَ: قَالَ رَسُولُ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: “توضؤوا مِمَّا مَسَّتِ النَّارُ”. رَوَاهُ مُسْلِمٌ.

قَالَ الشَّيْخُ الإِمَام الْأَجَلُّ محيي السّنة، رحمه الله: هَذَا مَنْسُوخ بِحَدِيث ابْن عَبَّاس.   

303. (4) [1/100దృఢం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ఇలా ప్రవచిస్తూ ఉండగా నేను విన్నాను, ”వండబడిన వస్తువు తినటం వల్ల వు’దూ భంగమయిపోతుంది.” (ముస్లిమ్‌)

 ముహియ్యుస్సున్నహ్‌ ఇది క్రింది ‘హదీసు’ ద్వారా రద్దు చేయబడిందని పేర్కొన్నారు.

304 – [ 5 ] ( متفق عليه ) (1/100)

قَالَ: إِنَّ رَسُولَ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ أَكَلَ كَتِفَ شَاةٍ ثُمَّ صلى وَلم يتَوَضَّأ. متفق عليه.

304. (5) [1/100ఏకీభవితం]

ఇబ్నె ’అబ్బాస్‌ (ర) కథనం: ప్రవక్త (స) మేక తొడ మాంసం తిన్నారు. అనంతరం వు’దూ చేయకుండానే నమా’జు చదివారు. (బు’ఖారీ, ముస్లిమ్‌)

305 – [ 6 ] ( صحيح ) (1/101)

وَعَن جَابر بن سَمُرَة، أَنَّ رَجُلًا سَأَلَ رَسُولَ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: أَنَتَوَضَّأُ مِنْ لُحُومِ الْغَنَمِ؟ قَالَ: “إِنْ شِئْتَ فَتَوَضَّأْ، وَإِنْ شِئْتَ فَلَا تَتَوَضَّأْ”. قَالَ: أَنَتَوَضَّأُ مِنْ لُحُومِ الْإِبِلِ؟ قَالَ: “نَعَمْ! فَتَوَضَّأْ مِنْ لُحُومِ الْإِبِلِ”. قَالَ: أُصَلِّي فِي مَرَابِضِ الْغَنَمِ؟ قَالَ: “نَعَمْ”. قَالَ: أُصَلِّي فِي مبارك الْإِبِل؟ قَالَ: “لَا”. رَوَاهُ مُسلم.

305. (6) [1/101దృఢం]

జాబిర్‌ బిన్‌ సమురహ్‌(ర) కథనం: ప్రవక్త (స)ను ఒక వ్యక్తి,‘మేము మేక మాంసం తిన్న తర్వాత తప్పనిసరిగా వు’దూ చేసుకోవాలా,’ అని విన్నవించు కున్నాడు. దానికి ప్రవక్త (స), ‘నీవు కోరితే చేసుకో, లేకపోతే లేదు,’ అని అన్నారు. ఆ వ్యక్తి మళ్ళీ, ‘ఒంటె మాంసం తిని వు’దూచేసు కోవాలా,’అని విన్న వించుకున్నాడు. దానికి ప్రవక్త (స), అవును, ఒంటె మాంసం తిని వు’దూచేసుకో,’ అని అన్నారు. మళ్ళీ ఆ వ్యక్తి, ‘మేకల కొట్టులో నమా’జు చదువు కోవచ్చునా,’అని విన్నవించుకున్నాడు. దానికి ప్రవక్త (స), ‘చదువుకోవచ్చును,’ అని అన్నారు. ఆ వ్యక్తి మళ్ళీ, ‘ఒంటెలు కట్టబడి ఉన్న చోట నమా’జు చదువుకో వచ్చునా,’ అని అడిగాడు. దానికి ప్రవక్త (స), ‘వద్దు,’ అని అన్నారు. [8] (ముస్లిమ్‌)

306 – [ 7 ] ( صحيح ) (1/101)

وَعَنْ أَبِي هُرَيْرَةَ، قَالَ: قَالَ رَسُولُ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: “إِذَا وَجَدَ أَحَدُكُمْ فِي بَطْنِهِ شَيْئًا، فَأَشْكَلَ عَلَيْهِ أَخَرَجَ مِنْهُ شَيْءٌ أَمْ لَا. فَلَا يَخْرُجَنَّ مِنَ الْمَسْجِدِ حَتَّى يَسْمَعَ صَوْتًا أَوْ يَجِدَرِيحًا”.  رَوَاهُ مُسلم.

306. (7) [1/101దృఢం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మీలో ఎవరూ కేవలం అపానవాయువు వెలువడిందనే అనుమానం వచ్చినంత మాత్రాన శబ్దం విననంత వరకు లేదా దుర్వాసన గ్రహించనంత వరకు మస్జిద్‌ నుండి బయటకు వెళ్ళేఅవసరం లేదు.” [9] (ముస్లిమ్‌)

307 – [ 8 ] ( متفق عليه ) (1/101)

وَعَنْ عَبْدِ اللَّهِ بْنِ عَبَّاسٍ، قَالَ: إِنَّ رَسُولَ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ شَرِبَ لَبَنًا فَمَضْمَضَ، وَقَالَ: “إِنَّ لَهُ دَسَمًا” .متفق عليه.

307. (8) [1/101ఏకీభవితం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘అబ్బాస్‌ (ర) కథనం: ప్రవక్త (స) పాలు త్రాగిన తర్వాత నీటితో పుక్కిలించారు. ఇంకా, ‘పాలలో కొంత జిడ్డుతనముంటుంది,’ అని అన్నారు. (బు’ఖారీ, ముస్లిమ్‌)

308 – [ 9 ] ( صحيح ) (1/101)

وَعَنْ بُرَيْدَةَ: أَنَّ النَّبِيَّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ صَلَّى الصَّلَوَات يَوْم الْفَتْح بِوضُوء، وَاحِد وَمسح عل خُفَّيْهِ، فَقَالَ لَهُ عُمَرُ: لَقَدْ صَنَعْتَ الْيَوْمَ شَيْئًا لَمْ تَكُنْ تَصْنَعُهُ! فَقَالَ: “عَمْدًا صَنَعْتُهُ يَا عمر!” رَوَاهُ مُسلم.

308. (9) [1/101దృఢం]

బురైదహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) మక్కహ్ విజయం నాడు ఒక్క వు’దూతో చాలా నమా’జులు చదివారు. ఇంకా మేజోళ్ళపై మసహ్‌ చేశారు. అప్పుడు ‘ఉమర్‌ (ర), ‘ఓ ప్రవక్తా! తమరు ఎన్నడూ చేయని పని ఈనాడు చేశారు,’ అని విన్నవించుకున్నారు. దానికి ప్రవక్త (స), ‘ఓ ‘ఉమర్‌! నేను ఉద్దేశ్యపూర్వకంగా ఇలా చేశాను,’ అని అన్నారు. [10]   (ముస్లిమ్‌)

309 – [ 10 ] ( صحيح ) (1/101)

وَعَن سُوَيْد ابْن النُّعْمَان: أَنَّهُ خَرَجَ مَعَ رَسُولِ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ عَامَ خَيْبَرَ حَتَّى إِذَا كَانُوا بالصَّهباءِ – وَهِي أَدْنَى خَيْبَرَ – صَلَّى الْعَصْرَ، ثُمَّ دَعَا بِالْأَزْوَادِ، فَلَمْ يُؤْتَ إِلَّا بِالسَّوِيقِ، فَأَمَرَ بِهِ فَثُرِيَ، فَأَكَلَ رَسُولُ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، وَأَكَلْنَا، ثُمَّ قَامَ إِلَى الْمَغْرِبِ. فَمَضْمَضَ وَمَضْمَضْنَا، ثمَّ صلى وَلم يتَوَضَّأ. رَوَاهُ البُخَارِيّ.

309. (10) [1/101దృఢం]

సువైద్‌ బిన్‌ నో’మాన్‌ (ర) కథనం: నేను ప్రవక్త (స) వెంట ‘ఖైబర్‌ సంవత్సరం ప్రయాణానికి బయలు దేరాము. ’సహ్‌బా‘ ప్రాంతానికి  చేరుకున్నాము. అది ఖైబర్‌కు దగ్గరలోనే ఉంది. ప్రవక్త ’అస్ర్‌ నమా’జు చదివి ఆహార సామాగ్రి తెప్పించారు. సత్తూను తీసుకురావటం జరిగింది. ప్రవక్త (స) పిండి తయారుచేయమని ఆదేశించారు. అనంతరం ప్రవక్త (స) మరియు మేము తిన్నాము. ఆ తరువాత మగ్రిబ్‌ నమా’జు కోసం సిద్ధ మయ్యాము. ప్రవక్త (స) నీటితో పుక్కిలించారు. మేము కూడా నీటితో పుక్కిలించాము. ఆ వెంటనే నమా’జు చదివాము. అయితే వు’దూ చేయలేదు. (బు’ఖారీ)  

అంటే వండబడిన వస్తువు తినటం వల్ల వు’దూ భంగంకాదు.

—–

రెండవ విభాగం  اَلْفَصْلُ الثَّانِيْ  

310 – [ 11 ] ( صحيح ) (1/102)

وَعَنْ أَبِي هُرَيْرَةَ رَضِيَ اللَّهُ عَنْهُ، قَالَ: قَالَ رَسُولُ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: “لَا وُضُوءَ إِلَّا مِنْ صَوْتٍ أَوْ رِيحٍ”. رَوَاهُ أَحْمد وَالتِّرْمِذِيّ.

310. (11) [1/102దృఢం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”శబ్దంవల్ల మాత్రమే వు’దూ భంగమవుతుంది.” [11] (అ’హ్మద్‌, తిర్మిజి’)

311 – [ 12 ] ( صحيح ) (1/102)

وَعَن عَلِيٍّ، قَالَ: سَأَلَتْ رَسُولَ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ مَنْ الْمَذْيِ، فَقَالَ: “مِنَ الْمَذْيِ الْوُضُوءُ، وَمِنَ الْمَنِيِّ الْغُسْلُ”. رَوَاهُ التِّرْمِذِيّ.

311. (12) [1/102దృఢం]

‘అలీ (ర) కథనం: నేను ప్రవక్త (స)ను మజీ గురించి అడిగాను. దానికి ప్రవక్త (స), ‘మజీ’ వెలువటం వల్ల వు’దూ తప్పనిసరి అవుతుందని, వీర్యం వెలువడటం వల్ల సంపూర్ణ స్నానం తప్పనిసరి అవుతుంది,’ అని అన్నారు. (తిర్మిజి’)

312 – [ 13 ] ( حسن ) (1/102)

وَعَنْهُ، قَالَ: قَالَ رَسُولُ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسلم: “مِفْتَاحُ الصَّلَاةِ الطُّهُورُ، وَتَحْرِيمُهَا التَّكْبِيرُ، وَتَحْلِيلُهَا التَّسْلِيمُ”. رَوَاهُ أَبُو دَاوُد وَالتِّرْمِذِيّ والدارمي.  

312. (13) [1/102ప్రామాణికం]

‘అలీ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”నమా’జ్‌ తాళపుచెవి పరిశుభ్రత మరియు వు’దూ. నమా’జ్‌ ప్రారంభం అల్లాహు అక్బర్‌ ద్వారా అవుతుంది, సలామ్‌ ద్వారా ముగుస్తుంది.’ (అబూ దావూద్‌, తిర్మిజి’, దార్మీ)

313 – [ 14 ] ( حسن ) (1/103)

وَرَوَاهُ ابْنُ مَاجَهْ عَنْهُ وَعَنْ أَبِي سَعِيدٍ.

313. (14) [1/103ప్రామాణికం]

ఇబ్నె మాజహ్ ఈ ‘హదీసు’నే, ‘అలీ మరియు అబూ స’యీద్‌ (ర) ద్వారా కూడా ఉల్లేఖించారు. [12]

314 – [ 15 ] ( حسن ) (1/103)

وَعَن عَليّ بن طلق، قَالَ: قَالَ رَسُولُ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسلم: “إِذا فسا أحدكُم فَليَتَوَضَّأ، وَلَا تأتو النِّسَاءَ فِي أَعْجَازِهِنَّ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَأَبُو دَاوُدَ.

314. (15) [1/103ప్రామాణికం]

‘అలీ బిన్‌ ‘తలఖ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మీలో ఎవరికైనా శబ్దం లేకుండా అపాన వాయువు వెలువడితే, వు’దూ చేసుకోవాలి, ఇంకా స్త్రీలతో మలద్వారం ద్వారా సంభోగించకండి.” (అబూ దావూద్‌, తిర్మిజి’)

315 – [ 16 ] ( حسن لغيره ) (1/103)

وَعَن مُعَاوِيَة بن أبي سُفْيَان، أَنَّ النَّبِيَّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ: “إِنَّمَا الْعَيْنَانِ وِكَاءُ السَّهِ، فَإِذَا نَامَتِ الْعَيْنُ اسْتطْلقَ الوكاء”. رَوَاهُ الدِّرَامِي.  

315. (16) [1/103పరా ప్రామాణికం]

ము’ఆవియహ్‌ బిన్‌ అబీ సుఫియాన్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”కళ్ళు మేల్కొని ఉంటే, మలద్వారం మూసుకొని ఉంటుంది. కళ్ళు నిద్రపోతే మలద్వారం తెరచు కుంటుంది.” [13] (దార్మీ)

316 – [ 17 ] ( صحيح ) (1/103)

وَعَنْ عَلِيٍّ، قَالَ: قَالَ رَسُولُ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: “وِكَاءُ السَّهِ الْعَيْنَانِ، فَمَنْ نَامَ فَليَتَوَضَّأ”. رَوَاهُ أَبُو دَاوُد.

قَالَ الشَّيْخ الإِمَام محيي السّنة رحمه الله: هَذَا فِي غير الْقَاعِد، لما صَحَّ:

316. (17) [1/103దృఢం]

‘అలీ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మల ద్వారం కళ్ళ అదుపులో ఉంటుంది, అందువల్ల నిద్ర పోతే మళ్ళీ వు’దూ చేసుకోవాలి.” (అబూ దావూద్‌)

ము’హ్‌యియ్ స్సు‘న్నహ్‌ కథనం: ఇది పరుండి నిద్ర పోయిన వారికి వర్తిస్తుంది. కూర్చొని, కునుకు వచ్చేవారికి కాదు.

317 – [ 18 ] ( صحيح ) (1/103)

عَن أنس، قَالَ: كَانَ أَصَابَ رَسُولِ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ يَنْتَظِرُونَ الْعشَاء حَتَّى تخفق رؤوسهم، ثمَّ يصلونَ وَلَا يتوضؤون. رَوَاهُ أَبُو دَاوُد وَالتِّرْمِذِيّ، إِلَّا أَنه ذكرفيه: ينامون. بدل: ينتظرون الْعشَاء حَتَّى تخفق رؤوسهم.

317. (18) [1/103దృఢం]

అనస్‌ (ర) కథనం: ప్రవక్త (స) అనుచరులు ‘ఇషా’ నమా’జు కోసం కూర్చొని వేచి ఉండేవారు, వారి తలలు కునుకుతో అటూ ఇటూ వాలిపోయేవి. ఆ తరువాత నిలబడి నమా’జు చదివేవారు. మళ్ళీ వు’దూ చేసేవారు కారు. (అబూ దావూద్‌, తిర్మిజి’)

318 – [ 19 ] ( ضعيف ) (1/104)

وَعَنِ ابْنِ عَبَّاسٍ، قَالَ: قَالَ رَسُولُ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: “إِنَّ الْوُضُوءَ عَلَى مَنْ نَامَ مُضْطَجِعًا، فَإِنَّهُ إِذَا اضْطَجَعَ اسْتَرْخَتْ مفاصله”. رَوَاهُ التِّرْمِذِيّ وَأَبُو دَاوُد.  

318. (19) [1/104బలహీనం]

ఇబ్నె ‘అబ్బాస్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”వెల్లకిలా పడుకొని నిద్రపోయిన వ్యక్తిపై వు’దూ తప్పని సరి అవుతుంది. ఎందుకంటే వెల్లకిలా పడుకొని నిద్రపోతే శరీర కీళ్ళు సడలిపోతాయి.” (తిర్మిజి’, అబూ దావూద్)

319 – [ 20 ] ( صحيح ) (1/104)

وَعَن بُسْرَةَ، قَالَتْ: قَالَ رَسُولُ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: “إِذَا مَسَّ أَحَدُكُمْ ذَكَرَهُ، فَلْيَتَوَضَّأْ”. رَوَاهُ مَالِكٌ وَأَحْمَدُ وَأَبُو دَاوُدَ وَالتِّرْمِذِيُّ وَالنَّسَائِيُّ وَابْنُ مَاجَه والدارمي.

319. (20) [1/104దృఢం]

బుస్రహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”తన మర్మాంగాన్ని ముట్టుకున్న వ్యక్తి తప్పని సరిగా వు’దూ చేయాలి.” [14] (మాలిక్‌, అ’హ్మద్‌, అబూ దావూద్‌, తిర్మిజి’, నసాయి’, ఇబ్నె మాజహ్, దార్మీ)

320 – [ 21 ] ( صحيح ) (1/104)

وَعَن طلق بن عَليّ، قَالَ: سُئِلَ رَسُولُ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ عَنْ مَسِّ الرَّجُلِ ذَكَرَهُ بَعْدَمَا يَتَوَضَّأُ. قَالَ: “وَهَلْ هُوَ إِلَّا بَضْعَةٌ مِنْهُ؟” رَوَاهُ أَبُو دَاوُدَ وَالتِّرْمِذِيُّ وَالنَّسَائِيُّ وَرَوَى ابْنُ مَاجَهْ نَحوه.

قَالَ الشَّيْخُ الْإِمَامُ مُحْيِي السُّنَّةِ رَحِمَهُ اللَّهُ: هَذَا مَنْسُوخٌ؛ لِأَنَّ أَبَا هُرَيْرَةَ أَسْلَمَ بَعْدَ قدوم طلق.

320. (21) [1/104దృఢం]

‘తలఖ్‌ బిన్‌ ‘అలీ (ర) కథనం: ప్రవక్త (స)ను ‘వు’దూ చేసిన తర్వాత ఎవరైనా తన మర్మాంగాన్ని ముట్టు కుంటే, మళ్ళీ వు’దూ చేయాలా వద్దా?’ అని ప్రశ్నించటం జరిగింది. దానికి ప్రవక్త (స), ‘అది కూడా  మానవుని శరీరంలోని ఒక భాగమే’ అని అన్నారు. (అబూ దావూద్‌, తిర్మిజి’, నసాయి, ఇబ్నె మాజహ్)

ఇమాము ము’హ్‌యియ్ అస్సు‘న్నహ్‌ ఈ ఆదేశం రద్దయిందని పేర్కొన్నారు. ఎందుకంటే అబూ హురైరహ్‌ (ర) ‘తలఖ్‌ వచ్చిన తర్వాత ఇస్లామ్‌ స్వీకరించారు.

321 – [ 22 ] ( ضعيف ) (1/105)

وَقد روى أَبُو هُرَيْرَةَ عَنْ رَسُولِ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، قَالَ: “إِذَا أَفْضَى أَحَدُكُمْ بِيَدِهِ إِلَى ذَكَرِهِ لَيْسَ بَيْنَهُ وَبَيْنَهَا شَيْءٌ فَلْيَتَوَضَّأْ”. رَوَاهُ الشَّافِعِيُّ والداراقطني.

321. (22) [1/105బలహీనం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఎవరైనా తన చేతితో మధ్య ఎటువంటి అడ్డుతెర లేకుండా, మర్మాంగాన్ని ముట్టుకుంటే, మళ్ళీ వు’దూ చేసుకోవాలి.” (షాఫ’యీ, దారు ఖు’త్నీ)

322 – [ 23 ] ( ضعيف ) (1/105)

وَرَوَاهُ النَّسَائِيُّ عَنْ بُسْرَةَ؛ إِلَّا أَنَّهُ لَمْ يذكر: “لَيْسَ بَينه بَينهَا شَيْء”.

322. (23) [1/105బలహీనం]

నసాయి’, బుస్రహ్ (ర) ద్వారా ఉల్లేఖించారు. అయితే, ”మధ్య ఎటువంటి అడ్డుతెర లేకుండా” అనే వాక్యం లేదు.

323 – [ 24 ] ( صحيح ) (1/105)

وَعَنْ عَائِشَةَ، قَالَتْ: كَانَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ يُقَبِّلُ بَعْضَ أَزْوَاجِهِ ثُمَّ يُصَلِّي وَلَا يَتَوَضَّأُ. رَوَاهُ أَبُو دَاوُدَ وَالتِّرْمِذِيُّ وَالنَّسَائِيُّ وَابْنُ مَاجَهْ. وَقَالَ التِّرْمِذِيُّ: لَا يَصِحُّ عِنْدَ أَصْحَابِنَا بِحَالٍ إِسْنَادُ عُرْوَةَ عَنْ عَائِشَةَ، وَأَيْضًا إِسْنَادُ إِبْرَاهِيمَ التَّيْمِيِّ عَنْهَا.

وَقَالَ أَبُودَاوُدَ: هَذَا مُرْسل وَإِبْرَاهِيم التَّيْمِيّ لم يسمع من عَائِشَة.

323. (24) [1/105దృఢం]

‘ఆయి’షహ్‌ (ర) కథనం: ”ప్రవక్త (స) తన భార్యలలో కొందరిని ముద్దుపెట్టుకొని, వు’దూ చేయకుండానే నమా’జు చదువుకునే వారు.” [15] (అబూ దావూద్‌, తిర్మిజి’, నసాయి’, ఇబ్నె మాజహ్)

అయితే తిర్మిజి’, ”హదీసువేత్తల వద్ద, ‘ఆయి’షహ్‌ ద్వారా ఉర్వ, ఇబ్రాహీమ్‌ తైమీల ఉల్లేఖనం ఎంత మాత్రం నిజం కాదు,’ అని పేర్కొన్నారు. అబూ దావూద్‌ దీన్ని తాబయీ ప్రోక్తం అని, ఇబ్రాహీమ్‌ తైమీ ‘ఆయి’షహ్‌ ద్వారా వినలేదని పేర్కొన్నారు.”

324 – [ 25 ] ( حسن ) (1/105)

وَعَن ابْن عَبَّاس، قَالَ: أَكَلَ رَسُولُ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ كَتِفًا ثُمَّ مَسَحَ  يَده بِمِسْحٍ كَانَ تَحْتَهُ، ثُمَّ قَامَ فَصَلَّى. رَوَاهُ أَبُو دَاوُد وَابْن مَاجَه وَأحمد.

324. (25) [1/105ప్రామాణికం]

ఇబ్నె ‘అబ్బాస్‌ (ర) కథనం: ప్రవక్త (స) మేక తొడమాసం తిన్నారు. తరువాత చేతులు తుడుచు కున్నారు, నిలబడ్డారు, నమా’జు చదివారు. (అబూ దావూద్, ఇబ్నె మాజహ్, అ’హ్మద్)

325 – [ 26 ] ( صحيح ) (1/106)

وَعَن أم سَلمَة، أَنَّهَا قَالَتْ: قَرَّبْتُ إِلَى النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ جَنْبًا مَشْوِيًّا فَأَكَلَ مِنْهُ، ثُمَّ قَامَ إِلَى الصَّلَاةِ وَلَمْ يَتَوَضَّأْ. رَوَاهُ أَحْمَدُ.

325. (26) [1/106దృఢం]

ఉమ్మె సలమహ్ (ర) కథనం: ”నేను ప్రవక్త (స) ముందు వేపబడిన తొడ మాంసాన్ని పెట్టాను. ప్రవక్త (స) దాన్ని తిన్న తరువాత నిలబడి నమా’జు చదివారు. మళ్ళీ వు’దూ చేయలేదు.” (అ’హ్మద్‌)

—–

మూడవ విభాగం  اَلْفَصْلُ الثَّالِثُ

326 – [ 27 ] ( صحيح ) (1/106)

عَن أبي رَافع، قَالَ: أَشْهَدُ لَقَدْ كُنْتُ أَشْوِي لِرَسُولِ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ بَطْنَ الشَّاةِ، ثُمَّ صلى وَلم يتَوَضَّأ. رَوَاهُ مُسلم.

326. (27) [1/106దృఢం]

అబూ రాఫె’ (ర) కథనం: ‘నేను ప్రమాణం చేసి చెబు తున్నాను. నేను ప్రవక్త (స) కోసం మేక కార్జం, హృదయం మొదలైనవి వేపేవాడిని. ప్రవక్త (స) దాన్ని తిని నమా’జు చదివేవారు. వు’దూ చేసేవారు కాదు.’ (ముస్లిమ్‌)

327 – [ 28 ] ( ضعيف ) (1/106)

وَعَنْهُ، قَالَ: أُهْدِيَتْ لَهُ شَاةٌ، فَجَعَلَهَا فِي الْقِدْرِ، فَدَخَلَ رَسُولُ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ فَقَالَ: “مَا هَذَا يَا أَبَا رَافِعٍ؟” فَقَالَ: شَاةٌ أُهْدِيَتْ لَنَا يَا رَسُولَ اللَّهِ! فَطَبَخْتُهَا فِي الْقِدْرِ. قَالَ: “نَاوِلْنِي الذِّرَاعَ يَا أَبَا رَافِعٍ! “فَنَاوَلْتُهُ الذِّرَاعَ. ثُمَّ قَالَ: “نَاوِلْنِي الذِّرَاعَ الْآخَرَ”. فَنَاوَلْتُهُ الذِّرَاعَ الْآخَرَ. ثُمَّ قَالَ: “ناولني الآخر”. فَقَالَ: يَا رَسُولَ اللَّهِ! إِنَّمَا لِلشَّاةِ ذِرَاعَانِ. فَقَالَ لَهُ رَسُولُ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: “أَمَا إِنَّكَ لَوْ سَكَتَّ لَنَاوَلْتَنِي ذِرَاعًا فَذِرَاعًا مَا سَكَتُّ”. ثُمَّ دَعَا بِمَاءٍ فَتَمَضْمَضَ فَاهُ، وَغَسَلَ أَطْرَافَ أَصَابِعِهِ، ثُمَّ قَامَ فَصَلَّى، ثُمَّ عَادَ إِلَيْهِمْ، فَوَجَدَ عِنْدَهُمْ لَحْمًا بَارِدًا، فَأَكَلَ، ثُمَّ دَخَلَ الْمَسْجِدَ فَصَلَّى وَلَمْ يَمَسَّ مَاءً. رَوَاهُ أَحْمد

327. (28) [1/106బలహీనం]

అబూ రాఫె’ (ర) కథనం: మేక మాంసం కానుకగా వచ్చింది. దాన్ని గిన్నెలో వేసి వండుతున్నాను. ఇంతలో ప్రవక్త (స) వచ్చారు. ‘అబూ రాఫె! ఏం వండ తున్నావు,’ అని అడిగారు. దానికి నేను, ‘ప్రవక్తా!  మేక మాంసం కానుకగా వచ్చింది, దాన్ని వండు తున్నాను,’ అని అన్నాను. అప్పుడు ప్రవక్త (స), ‘ఒక తొడ నాకు ఇవ్వు’ అన్నారు. నేను పాత్రలో నుండి ఒకతొడ తీసి ఇచ్చాను. ప్రవక్త (స) దాన్ని తిన్నారు. మరోతొడ తీసి ఇమ్మని అన్నారు. నేను మరో తొడ ఇచ్చాను. ప్రవక్త (స) దాన్ని కూడా తిన్నారు. ఇంకా మరోతొడ ఇమ్మన్నారు. దానికి నేను, ‘ప్రవక్తా! మేకకు రెండే తొడలు ఉంటాయి. మూడవది ఎలా ఇవ్వను,’ అని అన్నాను. దానికి ప్రవక్త (స), ”ఒకవేళ నీవు మౌనంగా ఉండి నేను చెప్పినట్టు చేస్తే, తొడలు ఒక్కొక్కటిగా తెచ్చే వాడివి.’ అనంతరం నీళ్ళు తెప్పించి నోరు కడిగారు, నీటితో పుక్కిలించారు, చేతులు కడుక్కున్నారు. ఆ తరువాత నమా’జు చదివారు. నమా’జు తర్వాత చల్లగా ఉన్న మాంసం తిన్నారు. అందులో నుండి కొంత తిన్నారు. ఆ తరువాత సజ్దా చేశారు. నమా’జు చదివారు. నీటిని ఉపయో గించలేదు. (అ’హ్మద్‌)

328 – [ 29 ] ( ضعيف ) (1/107)

وَرَوَاهُ الدَّارِمِيُّ عَنْ أَبِي عُبَيْدٍ إِلَّا أَنَّهُ لَمْ يَذْكُرْ: “ثُمَّ دَعَا بِمَاءٍ” إِلَى آخِرِهِ.

328. (29) [1/107బలహీనం]

ఈ ‘హదీసు’నే, దార్మీ అబూ ‘ఉబైదహ్‌ (ర) ద్వారా ఉల్లేఖించారు. కాని అందులో, “సుమ్మ దఆబిమాఇన్,” లేదు.

329 – [ 30 ] ( جيد الإسناد ) (1/107)

وَعَنْ أَنَسِ بْنِ مَالِكٍ، قَالَ: كُنْتُ أَنَا وَأَبِي وَأَبُو طَلْحَةَ جُلُوسًا، فَأَكَلْنَا لَحْمًا وَخُبْزًا، ثُمَّ دَعَوْتُ بِوَضُوءٍ، فَقَالَا: لِمَ تَتَوَضَّأُ؟ فَقُلْتُ: لِهَذَا الطَّعَامِ الَّذِي أَكَلْنَا. فَقَالَا أَتَتَوَضَّأُ مِنَ الطَّيِّبَاتِ؟ لَمْ يَتَوَضَّأْ مِنْهُ مَنْ هُوَ خَيْرٌ مِنْك. رَوَاهُ أَحْمد.

329. (30) [1/107ఉత్తమ ఆధారాలు]

అనస్‌ బిన్‌ మాలిక్‌ (ర) కథనం: నేనూ, ‘ఉబై బిన్‌ క’అబ్‌, అబూ ‘తల్‌హా కూర్చొని, రొట్టె మాంసం తిన్నాము. అనంతరం వు’దూ చేయడానికి నేను నీళ్ళు తెప్పించాను. అప్పుడు ‘ఉబై బిన్‌ క’అబ్‌, అబూ ‘తల్‌హా ఇద్దరూ, ‘వు’దూ ఎందుకు చేస్తున్నావు?’ అని అన్నారు. దానికి నేను, ‘మాంసం తిన్నాను కదా, అందుకు,’ అని అన్నాను. దానికి వారిద్దరూ, ”ఈ పరిశుభ్రమైన వస్తువులను తినికూడా వు’దూ చేస్తావా? ఇవి అన్నిటి కంటే ఉన్నతమైనవి, ప్రవక్త (స) వీటిని తిని వు’దూ చేయలేదు.’ అంటే ప్రవక్త (స) మాంసం, రొట్టె తిని వు’దూ చేసేవారు కాదు, అని అన్నారు.” (అ’హ్మద్‌)

330 – [ 31 ] ( صحيح ) (1/107)

وَعَن ابْن عمر، كَانَ يَقُولُ: قُبْلَةُ الرَّجُلِ امْرَأَتَهُ وَجَسُّهَا بِيَدِهِ مِنَ الْمُلَامَسَةِ. وَمَنْ قَبَّلَ امْرَأَتَهُ أَوْ جَسَّهَا بِيَدِهِ، فَعَلَيهِ الْوضُوء. رَوَاهُ مَالك وَالشَّافِعِيّ.

330. (31) [1/107దృఢం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘ఉమర్‌ (ర) కథనం: “మనిషి తన భార్యను ముద్దుపెట్టుకోవటం, చేత్తో ముట్టుకోవటం ములా మసహ్ అనబడుతుంది. కనుక భార్యను ముద్దు పెట్టుకున్నా, ముట్టుకున్నా అతనికి వు’దూ తప్పనిసరి అవుతుంది.” [16] (మాలిక్‌, నసాయి’)

331 – [ 32 ] ( صحيح ) (1/107)

وَعَن ابْن مَسْعُود، كَانَ يَقُولُ: مِنْ قُبْلَةِ الرَّجُلِ امْرَأَتَهُ الْوُضُوءُ. رَوَاهُ مَالك.

331. (32) [1/107దృఢం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ మస్‌’ఊద్‌ (ర) కథనం: భర్త తన భార్యను ముద్దుపెట్టుకుంటే వు’దూ తప్పనిసరి అవుతుంది. (మాలిక్‌)

332 – [ 33 ] ( ضعيف ) (1/108)

وَعَن ابْن عُمَرَ، أَنَّ عُمَرَ بْنَ الْخَطَّابِ رَضِيَ اللَّهُ عَنْهُ، قَالَ: إِن الْقبْلَة من اللَّمْس، فتوضؤوا مِنْهَا.

332. (33) [1/108బలహీనం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌’ఉమర్‌(ర) కథనం:’ఉమర్‌ (ర), ”ముద్దు పెట్టుకోవటం లమ్స్‌లోని భాగమే. కనుక ముద్దు పెట్టుకుంటే, వు’దూ చేసుకోవాలి.” (దారు ఖు’త్నీ)

333 – [ 34 ] ( ضعيف ) (1/108)

وَعَنْ عُمَرَ بْنِ عَبْدِ الْعَزِيزِ، عَنْ تَمِيمِ الدَّارِيّ، قَالَ: قَالَ رَسُولُ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: “الْوُضُوءُ مِنْ كُلِّ دَمٍ سَائِلٍ”. رَوَاهُمَا الدَّارَقُطْنِيُّ، وَقَالَ: عُمَرُ بْنُ عَبْدِ الْعَزِيزِ لَمْ يَسْمَعْ مِنْ تَمِيمٍ الدَّارِيِّ وَلَا رَآهُ، وَيَزِيدُ بن خَالِد وَيزِيد بن مُحَمَّد مَجْهُولَانِ.

333. (34) [1/108-బలహీనం]

 ‘ఉమర్‌ బిన్‌ ‘అబ్దుల్‌ ‘అ’జీ’జ్‌, తమీమ్‌ ద్వారా ఉల్లేఖనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ప్రవహించే ప్రతి రక్తం వల్ల వు’దూ తప్పనిసరి అవుతుంది.” (దారు ఖు’తునీ)

 ‘ఉమర్‌ బిన్‌ ‘అబ్దుల్‌’అ’జీ’జ్‌, తమీమ్‌ దారీ నుండి వినలేదు, చూడలేదు. య’జీద్ బిన్ ‘ఖాలిద్, య’జీద్ బిన్ ము’హమ్మద్ లు మజ్హూల్ రావీలు.

=====

2۔  بَابُ آدَابُ الْخَلَاءِ

  • మలమూత్ర విసర్జనా నియమాలు

మొదటి విభాగం  اَلْفَصْلُ الْأًوَّلُ

334 – [ 1 ] ( متفق عليه ) (1/109)

عَنْ أَبِي أَيُّوبَ الْأَنْصَارِيِّ، قَالَ: قَالَ رَسُولُ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: “إِذَا أَتَيْتُمُ الْغَائِطَ فَلَا تَسْتَقْبِلُوا الْقِبْلَةَ، وَلَا تَسْتَدْبِرُوهَا، وَلَكِنْ شَرِّقُوا أَوْ غَرِّبُوا”. متفق عليه.

قَالَ الشَّيْخ الإِمَام محيي السّنة رحمه الله: هَذَا الْحَدِيثُ فِي الصَّحْرَاءِ وَأَمَّا فِي الْبُنْيَانِ فَلَا بَأْس لما رُوِيَ.

334. (1) [1/109-ఏకీభవితం]

అబూ అయ్యూబ్‌ అ’న్సారీ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మీరు మలమూత్ర విసర్జనకు వెళితే, ఖిబ్లా వైపుగానీ, ఖిబ్లాకు వ్యతిరేకంగాగాని కూర్చోకండి. ఉత్తరం లేదా దక్షిణం వైపు తిరిగి కూర్చోండి.” (బు’ఖారీ, ముస్లిమ్‌)

ము’హియుస్సున్నహ్‌ ఈ ఆదేశాన్ని అడవులకు మాత్రమే పరిమితం అని అభిప్రాయపడ్డారు. కాని జన వాసాల్లో ఇలా కూర్చోవటంలో ఎటువంటి అభ్యంతరం లేదు. దీని కొరకు, ముందు రాబోయె ’హదీసు‘ (335) చూడండి.

335 – [ 2 ] ( متفق عليه ) (1/109)

عَن عبد الله بن عمر، قَالَ: ارْتَقَيْتُ فَوْقَ بَيْتِ حَفْصَةَ لِبَعْضِ حَاجَتِي، فَرَأَيْتُ رَسُولَ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ يقْضِي حَاجته مستدبر الْقبْلَة مُسْتَقْبل الشَّام.  متفق عليه.

335. (2) [1/109-ఏకీభవితం]

’అబ్దుల్లాహ్‌ బిన్‌ ’ఉమర్‌ (ర) కథనం: ”ఏదో పని ఉండి, నేను నా సోదరి హ’ఫ్‌సహ్ ఇంటి పైకప్పు ఎక్కాను. అప్పుడు ప్రవక్త (స)ను ఖిబ్లావైపు వీపు, సిరియా వైపు ముఖం ఉన్నట్లుగా కూర్చొని మల మూత్ర విసర్జన చేస్తున్నారు.” (బు’ఖారీ, ముస్లిమ్‌)

336 – [ 3 ] ( صحيح ) (1/109)

وَعَن سلمَان، قَالَ: نَهَانَا – يَعْنِي رَسُولَ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ – أَنْ نَسْتَقْبِلَ الْقِبْلَةَ لِغَائِطٍ أَوْ بَوْل، أَو أَن نستنتجي بِالْيَمِينِ، أَوْ أَنْ نَسْتَنْجِيَ بِأَقَلَّ مِنْ ثَلَاثَةِ أَحْجَارٍ، أَوْ أَنْ نَسْتَنْجِيَ بِرَجِيعٍ أَوْ بِعَظْمٍ. رَوَاهُ مُسلم.

336. (3) [1/109దృఢం]

సల్మాన్‌ ఫారసీ (ర) కథనం: ప్రవక్త (స) మాకు ఖిబ్లావైపు తిరిగి మలమూత్ర విసర్జన చేయటాన్ని, మలమూత్రాలను కుడిచేతితో లేదా మూడుకంటే తక్కువ రాళ్ళతో లేదా పేడతో, లేదా ఎముకలతో శుభ్రపరచటాన్ని వారించారు. (ముస్లిమ్‌)

337 – [ 4 ] ( متفق عليه ) (1/110)

وَعَنْ أَنَسٍ، قَالَ: كَانَ رَسُولُ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ إِذَا دَخَلَ الْخَلَاءَ يَقُولُ: “اللَّهُمَّ إِنِّي أَعُوذُ بِكَ مِنَ الْخبث والخبائث”.

337. (4) [1/110ఏకీభవితం]

అనస్‌ (ర) కథనం: ప్రవక్త (స) మలమూత్ర విసర్జనకు వెళ్ళినపుడు, ప్రవేశించేముందు ఈ దు’ఆ పఠించేవారు. అల్లాహుమ్మ ఇన్నీ ఊజుబిక మినల్‌ ’ఖుబుసి, వల్‌ ’ఖబాయిసీ‘. — ‘ఓ అల్లాహ్! అపరిశుద్ధ మగ జిన్నుల నుండి, స్త్రీ జిన్నుల నుండి నీ శరణు కోరుతున్నాను.’ [17] (బు’ఖారీ, ముస్లిమ్‌)

338 – [ 5 ] ( متفق عليه ) (1/110)

وَعَنِ ابْنِ عَبَّاسٍ، قَالَ: مَرَّ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ بِقَبْرَيْنِ، فَقَالَ: “إِنَّهُمَا لَيُعَذَّبَانِ، وَمَا يُعَذَّبَانِ فِي كَبِيرٍ؛ أَمَّا أَحدهمَا فَكَانَ لَا يَسْتَتِرُ مِنَ الْبَوْلِ – وَفِي رِوَايَةٍ لمُسلم: لَا يستنزه مِنَ الْبَوْلِ – وَأَمَّا الْآخَرُ فَكَانَ يَمْشِي بِالنَّمِيمَةِ” ثمَّ أَخذ جَرِيدَة رطبَة، فَشَقهَا نِصْفَيْنِ، ثُمَّ غَرَزَ فِي كُلِّ قَبْرٍ وَاحِدَةً. قَالُوا: يَا رَسُول الله! لم صنعت هَذَا؟ فَقَالَ: “لَعَلَّه يُخَفف عَنْهُمَا مَا لم ييبسا”.

338. (5) [1/110ఏకీభవితం]

ఇబ్నె ’అబ్బాస్‌ (ర) కథనం: ఒకసారి ప్రవక్త (స) రెండు సమాధుల ప్రక్కనుండి వెళ్ళడం జరిగింది. అప్పుడు ప్రవక్త (స) ఈ రెండు సమాధుల్లో శిక్షించడం జరుగుతోంది. ఏదో పెద్ద విషయంపై శిక్షించబడటం లేదు. చిన్నవిషయాలపైనే శిక్షించ బడుతున్నారు. వీరిలో ఒకరు మూత్ర తుంపరల నుండి జాగ్రత్త పడేవాడు కాడు. మరొకరు చాడీలు చెప్పే వాడు. అనంతరం ప్రవక్త (స) పచ్చి ఖర్జూరంకొమ్మ తీసు కొని దాన్ని రెండుగా చేసి వాటిని ఆ రెండు సమాధులపై పాతిపెట్టారు. దానికి ప్రజలు అలా ఎందుకు చేసారని విన్నవించుకున్నారు. దానికి ప్రవక్త (స) వారి శిక్ష తగ్గ వచ్చు — ఆశాఖలు ఎండిపోయేవరకు — అని అన్నారు.[18]  (బు’ఖారీ, ముస్లిమ్‌)

339 – [ 6 ] ( صحيح ) (1/110)

وَعَنْ أَبِي هُرَيْرَةَ رَضِيَ اللَّهُ عَنْهُ، قَالَ: قَالَ رَسُولُ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: “اتَّقُوا اللَّاعِنَيْنِ”. قَالُوا: وَمَا اللَّاعِنَانِ يَا رَسُولَ اللَّهِ؟ قَالَ: “الَّذِي يَتَخَلَّى فِي طَرِيقِ النَّاس أَو فِي ظِلِّهِم”. رَوَاهُ مُسلم.

339. (6) [1/110దృఢం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స), ”శాపానికి గురిచేసే రెండు విషయాలకు దూరంగా ఉండండి,” అని ప్రవచించారు. దానికి అనుచరులు, ‘ఏమిటి,’ అని అడిగారు. అప్పుడు ప్రవక్త (స), ”ప్రజల దారిలో మల మూత్ర విసర్జన చేయటం, ప్రజలు విశ్రాంతి తీసుకునే చెట్ల నీడల్లో మలమూత్ర విసర్జన చేయటం.” (ముస్లిమ్‌)

340 – [ 7 ] ( متفق عليه ) (1/111)

وَعَنْ أَبِي قَتَادَةَ، قَالَ: قَالَ رَسُولُ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسلم: “إِذا شرب أحدكُم فَلَا ينتنفس فِي الْإِنَاءِ، وَإِذَا أَتَى الْخَلَاءَ، فَلَا يَمَسَّ ذَكَرَهُ بِيَمِينِهِ، وَلَا يَتَمَسَّحْ بِيَمِينِهِ”.

340. (7) [1/111ఏకీభవితం]

అబూ ఖతాదహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఎవరైనా నీరు త్రాగితే గిన్నెలో ఊపిరి పీల్చరాదు. ఇంకా ఎవరైనా మలమూత్ర విసర్జనకు వెళితే తన కుడిచేతితో మర్మాంగాన్ని ముట్టుకోకూడదు. ఎడమ చేతితో శుభ్రపరచుకోవాలి.” (బు’ఖారీ, ముస్లిమ్‌)

341 – [ 8 ] ( متفق عليه ) (1/111)

وَعَنْ أَبِي هُرَيْرَةَ رَضِيَ اللَّهُ عَنْهُ، قَالَ: قَالَ رَسُولُ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: “مَنْ تَوَضَّأَ فَلْيَسْتَنْثِرْ، وَمَنِ اسْتَجْمَرَ فليوتر”.

341. (8) [1/111ఏకీభవితం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”వు’దూ చేసేవారు ముక్కును బాగా దులిపి శుభ్రపరచాలి, మట్టితో, రాయితో ఇస్తిన్‌జా చేసేవారు మూడు రాళ్ళు తీసుకోవాలి.” (బు’ఖారీ, ముస్లిమ్‌)

342 – [ 9 ] ( متفق عليه ) (1/111)

وَعَنْ أَنَسٍ، قَالَ: كَانَ رَسُولُ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ يَدْخُلُ الْخَلَاءَ، فَأَحْمِلُ أَنَا وَغُلَامٌ إِدَاوَةً مِنْ مَاءٍ وَعَنَزَةً يستنجي بِالْمَاءِ.

342. (9) [1/111ఏకీభవితం]

అనస్‌ (ర) కథనం: ప్రవక్త (స) మలమూత్ర విసర్జన కోసం బయటకు వెళితే, నేనూ మరో అబ్బాయి నీళ్ళు, దుడ్డుకర్ర తీసుకొని వెళ్ళేవారం. ప్రవక్త (స) నీటితో ఇస్తిన్‌జా చేసేవారు. [19] (బు’ఖారీ, ముస్లిమ్‌)

—–

రెండవ విభాగం اَلْفَصْلُ الثَّانِيْ

343 – [ 10 ] ( ضعيف ) (1/111)

عَنْ أَنَسٍ، قَالَ: كَانَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ إِذَا دَخَلَ الْخَلَاءَ نَزَعَ خَاتَمَهُ. رَوَاهُ أَبُو دَاوُدَ وَالنَّسَائِيُّ وَالتِّرْمِذِيُّ . وَقَالَ: هَذَا حَدِيثٌ حَسَنٌ صَحِيحٌ غَرِيبٌ.

 وَقَالَ أَبُو دَاوُدَ: هَذَا حَدِيثٌ مُنْكَرٌ. وَفِي رِوَايَتِهِ : وَضَعَ بَدَلَ نزع.

343. (10) [1/111బలహీనం]

అనస్‌ (ర) కథనం: ప్రవక్త (స) మలమూత్ర విసర్జనకు వెళ్ళినపుడు తన ఉంగరాన్ని తీసి పెట్టుకునే వారు.[20] (అబూ దావూద్‌, నసాయి’, తిర్మిజి’ / ప్రామాణికం, దృఢం, ఏకోల్లేఖనం)

344 – [ 11 ] ( صحيح ) (1/111)

وَعَنْ جَابِرٍ، قَالَ: كَانَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ إِذَا أَرَادَ الْبَرَازَ انْطَلَقَ حَتَّى لَا يرَاهُ أحد. رَوَاهُ أَبُو دَاوُد.

344. (11) [1/111దృఢం]

జాబిర్‌ (ర) కథనం: ప్రవక్త (స) బయట అడవిలో మల మూత్ర విసర్జనకు వెళితే, ఇతరులు చూడ లేనంత దూరం వెళ్ళేవారు. (అబూ దావూద్‌)

345 – [ 12 ] ( ضعيف ) (1/112)

وَعَنْ أَبِي مُوسَى، قَالَ: كُنْتُ مَعَ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ ذَاتَ يَوْمٍ فَأَرَادَ أَنْ يَبُولَ، فَأَتَى دَمِثًا فِي أَصْلِ جِدَارٍ، فَبَال. ثُمَّ قَالَ: “إِذَا أَرَادَ أَحَدُكُمْ أَنْ يَبُولَ، فليرتد لبوله”. رَوَاهُ أَبُو دَاوُد.

345. (12) [1/1121బలహీనం]

అబూ మూసా ’అష్‌’అరీ (ర) కథనం: ఒక రోజు నేను ప్రవక్త (స) వెంట ఉన్నాను. ప్రవక్త (స) గోడ ప్రక్కన మెత్తని నేలపై మూత్ర విసర్జన చేశారు. అనంతరం, ‘మీలో ఎవరైనా మూత్ర విసర్జన చేస్తే, మెత్తని నేలపై చేయాలి.’ అని అన్నారు. (అబూ దావూద్‌)

అంటే మూత్ర తుంపరలు పడకుండా జాగ్రత్తపడాలి.

346 – [ 13 ] ( صحيح ) (1/112)

وَعَنْ أَنَسٍ رَضِيَ اللَّهُ عَنْهُ، قَالَ: كَانَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ إِذَا أَرَادَ الْحَاجَةَ لَمْ يَرْفَعْ ثَوْبَهُ حَتَّى يَدْنُوَ مِنَ الأَرْض. رَوَاهُ التِّرْمِذِيّ وَأَبُو دَاوُد والدارمي.

346. (13) [1/112దృఢం]

అనస్‌ (ర) కథనం: ప్రవక్త (స) మలమూత్ర విసర్జనకు వెళ్ళినపుడు కూర్చోనంత వరకు దుస్తులు ఎత్తేవారు కాదు. (తిర్మిజి’, అబూ దావూద్‌, దార్మీ)

347 – [ 14 ] ( حسن ) (1/112)

وَعَنْ أَبِي هُرَيْرَةَ، قَالَ: قَالَ رَسُولُ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: “إِنَّمَا أَنَا لَكُمْ مِثْلُ الْوَالِدِ لِوَلَدِهِ، أُعَلِّمُكُمْ: إِذَا أَتَيْتُمُ الْغَائِطَ، فَلَا تَسْتَقْبِلُوا الْقِبْلَةَ، وَلَا تَسْتَدْبِرُوهَا”. وَأَمَرَ بِثَلَاثَةِ أَحْجَارٍ. وَنَهَى عَنِ الرَّوْثِ وَالرِّمَّةِ. وَنَهَى أَنْ يَسْتَطِيبَ الرَّجُلُ بِيَمِينِهِ. رَوَاهُ ابْنُ مَاجَهْ وَالدَّارِمِيُّ.

347. (14) [1/112ప్రామాణికం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”నేను మీకు తండ్రివంటి వాడిని. మీలో ఎవరైనా మల మూత్ర విసర్జనకు వెళితే, ఖిబ్లా వైపుగాని, వ్యతిరేక దిశలోగాని కూర్చోకండి. ఇంకా మూడు మట్టి పెడ్డలతో శుభ్రపరచుకోండి, ఇంకా ఎముక, పేడద్వారా ఇస్తిన్‌జా చేయకండి. ఇంకా కుడిచేత్తో ఇస్తిన్‌జా చేయరాదు.” (ఇబ్నె మాజహ్, దార్మీ)

348 – [ 15 ] ( صحيح ) (1/112)

وَعَن عَائِشَة، قَالَتْ: كَانَتْ يَدُ رَسُولِ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ الْيُمْنَى لِطَهُورِهِ  وَطَعَامِهِ، وَكَانَتْ يَدُهُ الْيُسْرَى لِخَلَائِهِ وَمَا كَانَ مِنْ أَذًى. رَوَاهُ أَبُو دَاوُد.

348. (15) [1/112దృఢం]

’ఆయి‘షహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) తన కుడిచేతిని అన్నపానీయాలకు, వు’దూకు ఉపయోగించేవారు. ఎడమ చేతిని మలమూత్రాలు మరియు ఇతర అశుద్ధాలను శుభ్ర పరచడానికి ఉపయోగించేవారు. [21] (అబూ దావూద్‌)

349 – [ 16 ] ( حسن ) (1/113)

وَعَنْهَا، قَالَتْ: قَالَ رَسُولُ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: “إِذَا ذَهَبَ أَحَدُكُمْ إِلَى الْغَائِطِ فَلْيَذْهَبْ مَعَهُ بِثَلَاثَةِ أَحْجَارٍ يَسْتَطِيبُ بِهِنَّ، فَإِنَّهَا تُجْزِئُ عَنْهُ”. رَوَاهُ أَحْمَدُ وَأَبُو دَاوُدَ وَالنَّسَائِيُّ وَالدَّارِمِيُّ.

349. (16) [1/113ప్రామాణికం]

’ఆయి‘షహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మీలో ఎవరైనా మలమూత్ర విసర్జనకు వెళితే, తనవెంట మూడు రాళ్ళు, లేక మూడు మట్టిపెడ్డలను తీసుకొని వెళ్ళాలి, వాటి ద్వారా పరిశుభ్రత పొందటానికి. ఎందుకంటే ఆ మూడు సరిపోతాయి.” [22] (అ’హ్మద్‌, అబూ దావూద్‌, నసాయి‘, దార్మీ)

350 – [ 17 ] ( صحيح ) (1/113)

وَعَنِ ابْنِ مَسْعُودٍ، قَالَ: قَالَ رَسُولُ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: “لَا تَسْتَنْجُوا بِالرَّوْثِ وَلَا بِالْعِظَامِ، فَإِنَّهَا زَادُ إِخْوَانِكُمْ مِنَ الْجِنِّ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَالنَّسَائِيُّ؛ إِلَّا أَنَّهُ لَمْ يَذْكُرْ: “إخْوَانكُمْ من الْجِنّ”.

350. (17) [1/113దృఢం]

’అబ్దుల్లాహ్‌ బిన్‌ మస్‌’ఊద్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”పేడ, ఎముకల ద్వారా ఇస్తిన్‌జా చేయకండి. ఎందుకంటే అవి మీసోదరులు జిన్నుల ఆహారం.” [23] (తిర్మిజి’, నసాయి‘)

351 – [ 18 ] ( صحيح ) (1/113)

وَعَن رويفع بن ثَابت، قَالَ: قَالَ لِي رَسُولُ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: “يَا رُوَيْفِعُ! لَعَلَّ الْحَيَاةَ سَتَطُولُ بِكَ بَعْدِي، فَأَخْبِرِ النَّاسَ أَنَّ مَنْ عَقَدَ لِحْيَتَهُ، أَوْ تَقَلَّدَ وَتَرًا، أَوِ اسْتَنْجَى بِرَجِيعِ دَابَّة، أَو عظم؛ فَإِن مُحَمَّدًا بَرِيء مِنْهُ”. رَوَاهُ أَبُو دَاوُد.

351. (18) [1/113దృఢం]

రువైఫ’అ బిన్‌ సా‘బిత్‌ (ర) కథనం: ప్రవక్త (స) నన్ను, “ఓ రువైఫ‘! నా తరువాత నీవు దీర్ఘకాలం బ్రతికితే నీవు ప్రజలకు ఈ విషయాన్ని గురించి అందజేయి! ‘ఎవరైనా తన గడ్డంలో ముడివేసినా, మెడలో తావీజు ధరించినా, పశువు పేడతో లేదా ఎముకతో ఇస్తిన్‌జా చేసినా ము’హమ్మద్‌ (స) వారిపట్ల విసుగు చెందినట్లే.’ ” [24] (అబూ దావూద్‌)

352 – [ 19 ] ( ضعيف ) (1/114)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ رضي الله عَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم قَالَ: “مَنِ اكْتَحَلَ فَلْيُوْتَرْ مَنْ فَعَلَ فَقَدْ أَحْسَنَ وَمَنْ لَّا فَلَا حَرَجَ وَمَنِ اسْتَجْمَرَ فَلْيُوْتَرْ مَنْ فَعَلَ فَقَدْ أَحْسَنَ وَمَنْ لَا فَلَا حَرَجَ وَمَنْ أَكَلَ فَمَا تَخَلَّلَ فَلْيَلْفِظْ وَمَا لَكَ بِلِسَانِهِ فَلْيَبْتَلِعْ مَنْ فَعَلَ فَقَدْ أَحْسَنَ وَمَنْ لَّا فَلَا حَرَجَ وَمَنْ أَتَى الْغَائِطَ فَلْيَسْتَتِرْ وَمَنْ لَّمْ يَجِدْ إِلَّا أَنْ يَّجْمَعَ كَثِيْبًا مِّنْ رَمْلٍ فَلْيَسْتَدْبِرْهُ فَإِنَّ الشَّيْطَانَ يَلْعَبُ بِمَقَاعِدِ بَنِيْ آدَمَ مَنْ فَعَلَ فَقَدْ أَحْسَنَ وَمَنْ لَّا فَلَا حَرَجَ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ وَابْنُ مَاجَهُ وَالدَّارَمِيُّ .

352. (19) [1/114బలహీనం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”తన కళ్ళకు సుర్మా పెట్టుకున్నవాడు బేసి సంఖ్యగా పెట్టు కోవాలి. అంటే 3 లేదా 5 లేదా 7. ప్రతి కంటిలో ఇలా చేసే వాడు మంచిపని చేశాడు. ఇలా చేయనివాడు పాపకార్యం చేయలేదు. అదేవిధంగా ఇస్తిన్‌జా చేస్తే బేసి పెడ్డలతో చేయాలి. దీన్ని ఆచరించినవాడు మంచిపని చేశాడు. ఇలా చేయని వాడిపై ఎటువంటి పాపమూ లేదు. అంటే బేసి పెడ్డలతో ఇస్తిన్‌జా చేయాలి. ఒకవేళ మూడింటితో చేయకపోతే, మరేం ఫర్వాలేదు. అయితే ఆ తర్వాత నీటితో కడుక్కోవాలి. ఎవరైనా ఏదైనా తిని ఉంటే, నీటితో పుక్కిలించాలి. అలా చేయటం వల్ల పండ్లమధ్య ఏదైనా ఉంటే బయట పడవేయాలి, నాలుకపై ఉంటే దాన్ని మింగి వేయాలి. ఇలాచేస్తే మంచి పని చేసినట్టే. ఇలా చేయని వానిపై ఎటువంటి ఆరోపణ లేదు. అదేవిధంగా ఎవరైనా మలమూత్ర విసర్జనకు వెళితే, తెరచాటు చేసుకోవాలి. అంటే తెరచాటుగా కూర్చొని మలమూత్ర విసర్జన చేయాలి. ఒకవేళ తెరచాటు ఏమీ లేకపోతే, తన వెనుక ఇసుక దిబ్బలా చేసుకోవాలి. దాని తెరచాటులో కూర్చోవాలి. ఎందుకంటే, షై’తాన్‌ మానవుని మల ద్వారంతో ఆడుకుంటాడు. ఇలా చేసినవాడు మంచిపని చేశాడు. ఇలా చేయనివారిపై ఎటువంటి అభ్యంతరం లేదు.” (అబూ దావూద్‌, ఇబ్నె మాజహ్, దార్మీ)

353 – [ 20 ] ( ضعيف ) (1/114)

وَعَنْ عَبْدِ اللهِ بْنِ مُغَفَّلٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَا يَبُوْلَنَّ أَحْدُكُمْ فِيْ مُسْتَحَمِّهِ ثُمَّ يَغْتَسِلُ فِيْهِ أَوْ يَتَوَضَّأُ فِيْهِ فَإِنَّ عَامَةَ الْوَسْوَاسِ مِنْهُ”. رَوَاهُ أَبُوْ دَاوُدِ وَالتِّرْمِذِيْ وَالنَّسَائِيْ. إِلَّا أَنَّهُمَا لَمْ يَذْكُرَا: “ثُمَّ يَغْتَسِلُ فِيْهِ أَوْيَتَوَضَّأُ فِيْهِ” .

353. (20) [1/114బలహీనం]

’అబ్దుల్లాహ్‌ బిన్‌ ము’గఫ్ఫల్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మీలో ఎవ్వరూ తన స్నానగదిలో మలమూత్ర విసర్జన చేసి, ఆ తరువాత స్నానం చేయడంగాని, వు’దూ చేయడం గాని చేయరాదు. దానివల్ల కలతలకు గురికావటం జరుగుతుంది.” [25] (తిర్మిజి’, అబూ దావూద్‌, నసాయి‘)

అయితే తిర్మిజి’, నసాయీ‘ల ఉల్లేఖనాల్లో, సుమ్మ గ్తసిలు ఫీహి అవ్ యతవద్దా ఫీహ్ అనే పదాలు లేవు.

354 – [ 21 ] ( لم تتم دراسته ) (1/115)

وَعَنْ عَبْدِ اللهِ بْنِ سَرْجَسٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَا يَبُوْلَنَّ أَحْدُكُمْ فِيْ جُحْرٍ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ وَالنَّسَائِيُّ

354. (21) [1/115అపరిశోధితం]

’అబ్దుల్లాహ్‌ బిన్‌ సర్‌జస్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”కన్నాలలో మూత్రవిసర్జన చేయరాదు.” [26](అబూ దావూ‘ద్‌, నసాయి‘)

355 – [ 22 ] ( ضعيف ) (1/115)

وَعَنْ مُعَاذٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “اِتَّقُوا الْمَلَاعِنَ الثَّلَاثَةَ: اَلْبَرَازَ فِيْ الْمَوَارِدِ وَقَارِعَةِ الطَّرِيْقِ وَالظِّلِ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ وَابْنُ مَاجَهُ .

355. (22) [1/115బలహీనం]

ము’ఆజ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”శాపానికి గురిచేసే మూడు విషయాలకు దూరంగా ఉండండి. అంటే వాటిని చేయటం వల్ల ప్రజలు శాపనార్థాలు, చీవాట్లు పెడతారు. 1. స్నానాలు చేసే రేవులలో మలమూత్ర విసర్జన చేయటం, 2. నడిచే మార్గంలో మలమూత్ర విసర్జన చేయటం, 3. ప్రజలు విశ్రాంతి పొందే నీడగల చెట్టు క్రింద మలమూత్ర విసర్జన చేయటం.” (అబూ దావూద్‌, ఇబ్నె మాజహ్)

356 – [ 23 ] ( ضعيف ) (1/115)

وَعَنْ أَبِيْ سَعِيْدٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَا يَخْرُجُ الرجُلَانِ يَضْرِبَانِ الْغَائِطَ كَاشِفَيْنِ عَنْ عَوْرَتِهِمَا يَتَحَدَّثَانِ فَإِنَّ اللهَ يَمْقُتُ عَلَى ذَلِكَ”. رَوَاهُ أَحْمَدُ وَأَبُوْ دَاوُدَ وَابْنُ مَاجَهُ .

356. (23) [1/115బలహీనం]

అబూ స’యీద్‌ ఖుద్రీ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఇద్దరు వ్యక్తులు కలసి మలమూత్ర విసర్జన కోసం బయలు దేరాదు. ఇద్దరూ ఒకేచోటకూర్చొని తమ మర్మాంగాలను ఒకరికొకరు చూపెడుతూ మాట్లాడు కోరాదు. ఎందుకంటే దీని వల్ల అల్లాహ్‌ (త) ఆగ్రహం చెందుతాడు.” [27] (అ’హ్మద్, అబూ దావూద్‌, ఇబ్నె మాజహ్)

357 – [ 24 ] ( صحيح ) (1/115)

وَعَنْ زَيْدِ بْنِ أَرْقَمَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِنَّ هَذِهِ الْحُشُوْشَ مُحْتَضَرَةٌ فَإِذَا أَتَى أَحْدُكُمْ الْخَلَاءَ فَلْيَقُلْ: أَعُوْذُ بِاللهِ مِنَ الْخُبُثِ وَالْخَبَائِثِ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ وَابْنُ مَاجَهُ .

357. (24) [1/115దృఢం]

’జైద్‌ బిన్‌ అర్‌ఖమ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఈ మలమూత్ర విసర్జనచేసే స్థలాలు షైతానులు, జిన్నులు వచ్చే స్థలాలు. మీలో ఎవరైనా మలమూత్ర విసర్జనకు వెళితే ఈ దు’ఆ పఠించాలి, ”అల్లాహుమ్మ ఇన్నీ ఊజుబిక మినల్‌ ’ఖుబుసి వల్‌ ’ఖబాయిసి‘,”  — ‘ఓ అల్లాహ్‌,  అశుద్దులైన స్త్రీ పురుషజిన్నుల నుండి నీ శరణు కోరుతున్నాను.’ (అబూ దావూ‘ద్‌, ఇబ్నె మాజహ్)

358 – [ 25 ] ( صحيح لغيره ) (1/116)

وَعَنْ عَلِيٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “سَتْرُ مَا بَيْنَ أَعْيُنِ الْجِنِّ وَعَوْرَاتِ بَنِيْ آدَمَ إِذَا دَخَلَ أَحْدُهُمْ الْخَلَاءَ أَنْ يَقُوْلَ بِسْمِ اللهِ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَقَالَ: هَذَا حَدِيْثٌ غَرِيْبٌ وَإِسْنَادُهَ لَيْسَ بِقَوِيٍّ .

358. (25) [1/116పరాప్రామాణికం]

‘అలీ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఎవరైనా మల మూత్ర విసర్జనకు బయలుదేరితే, బిస్మిల్లాహ్ అని పలికి బయలుదేరాలి. ఎందుకంటే బిస్మిల్లాహ్ పఠించటం జిన్నుల కళ్ళకు, మానవుల మర్మాంగా లకు మధ్య తెరచాటుగా ఉంటుంది.” [28] (తిర్మిజి’ – ఏకోల్లేఖనం, ఆధారాలు దృఢమైనవి కావు)

359 – [ 26 ] ( صحيح ) (1/116)

وَعَنْ عَائِشَةَ قَالَتْ: كَانَ النَّبِيُّ صلى الله عليه وسلم إِذَا خَرَجَ مِنَ الْخَلَاءِ قَالَ. “غُفْرَانَكَ”. رَوَاهُ التّرْمِذِيُّ وَابْنُ مَاجَهُ وَالدَّارَمِيُّ.

359. (26) [1/116-దృఢం]

‘ఆయి’ష‘హ్‌ (ర) కథనం: ప్రవక్త (స) మరుగుదొడ్డి (లెట్రిన్‌) నుండి బయటకు వచ్చిన తర్వాత గుఫ్రానకఅని పఠించేవారు. అంటే ఓ అల్లాహ్‌! నేను నీ క్షమాపణ కోరుతున్నాను. [29] (తిర్మిజి’, ఇబ్నె మాజహ్, దార్మీ)

360 – [ 27 ] ( حسن ) (1/116)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ رضي الله عَنْهُ قَالَ: كَانَ النَّبِيُّ صلى الله عليه وسلم إِذَا أَتَى الْخَلَاءَ أَتَيْتُهُ بِمَاءٍ فِيْ تَوْرٍ أَوْ رَكْوَةٍ فَاسْتَنْجَى ثُمَّ مَسَحَ يَدَهُ عَلَى الْأَرْضِ ثُمَّ أَتَيْتُهُ بِإِنَاءٍ آخَرَ فَتَوَضَّأَ. رَوَاهُ أَبُوْ دَاوُدَ وَرَوَى الدَّارَمِيُّ وَالنَّسَائِيُّ مَعْنَاهُ .

360. (27) [1/116ప్రామాణికం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) మలమూత్ర విసర్జనకు వెళితే, నేను జగ్గులో లేదా చర్మపు చేదలో నీళ్ళు తీసుకువెళ్ళేవాడిని. ప్రవక్త (స) ఆ నీటితో ఇస్తిన్జా చేసే వారు. అనంతరం చేతిని నేలపై రుద్దేవారు. నేను తెచ్చిన మరో చేదలో నీటితో చేతిని కడిగి, ఆ తరువాత వు’దూ చేసే వారు.[30] (అబూ దావూద్‌, నసాయి‘, దార్మీ)

361 – [ 28 ] ( صحيح ) (1/116)

وَعَنْ الْحَكْمِ بْنِ سُفْيَانَ قَالَ: كَانَ النَّبِيُّ صلى الله عليه وسلم إِذَا بَالَ تَوَضَّأَ وَنَضَحَ فَرْجَهُ. رَوَاهُ أَبُو دَاوُدَ وَالنَّسَائِيُّ .

361. (27) [1/116దృఢం]

’హకమ్‌ బిన్‌ సుఫ్యాన్‌ (ర) కథనం: ప్రవక్త (స) మూత్ర విసర్జన చేసిన వెంటనే వు’దూ చేసుకునేవారు. ఇంకా తన మర్మాంగంపై కలతలు రాకుండా ఉండటానికి నీళ్ళు చిలకరించేవారు. (అబూ దావూద్‌, నసాయి‘)

362 – [ 29 ] ( حسن ) (1/116)

وَعَنْ أُميْمَةَ بِنْتِ رَقِيْقَةَ قَالَتْ: كَانَ لِلنَّبِيِّ صلى الله عليه وسلم قَدَحٌ مِّنْ عِيْدَانِ تَحْتَ سَرِيْرِهِ يَبُوْلُ فِيْهِ بِاللَّيْلِ. رَوَاهُ أَبُوْ دَاوُدَ وَالنَّسَائِيُّ.

362. (29) [1/116ప్రామాణికం]

ఉమైమహ్ బిన్‌తె రుఖైఖహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) వద్ద ఒక కర్ర, గిన్నె ఉండేది. అది ప్రవక్త (స) మంచం క్రింద ఉండేది. రాత్రి పూట అందులో మూత్ర విసర్జన చేసేవారు. (అబూ దావూద్‌, నసాయి‘)

363 – [ 30 ] ( ضعيف ) (1/117)

وَعَنْ عُمَرَ قَالَ: رَآنِي النَّبِيُّ صلى الله عليه وسلم وَأَنَا أَبُوْلُ قَائِمًا فَقَالَ: “يَا عُمَرُ لَا تَبُلْ قَائِمًا”. فَمَا بُلْتُ قَائِمًا بَعْدُ. رَوَاهُ التِّرْمِذِيُّ وَابْنُ مَاجَهُ.

قَالَ الشَّيْخُ الْإِمَامُ مُحْييُ السُّنَّةِ رَحِمَهُ اللهُ: قَدْ صَحَّ .

363. (30) [1/117బలహీనం]

’ఉమర్‌ (ర) కథనం: నేను నిలబడి మూత్ర విసర్జన చేస్తున్నాను. ప్రవక్త (స), నన్ను నిలబడి మూత్ర విసర్జన చేయడం చూసుకున్నారు. అప్పుడు ప్రవక్త (స), ‘ఓ ’ఉమర్‌! నిలబడి మూత్రవిసర్జన చేయకు,’ అని అన్నారు. ఆ తరువాత నేను నిలబడి ఎన్నడూ మూత్ర విసర్జన చేయలేదు. (తిర్మిజి’, ఇబ్నె మాజహ్. ము’హియి అస్సున్నహ్ – సహీహ్)

364 – [ 31 ] ( متفق عليه ) (1/117)

عَنْ حُذَيْفَةَ قَالَ: أَتَى النَّبِيُّ صلى الله عليه وسلم سُبَاطَةَ قَوْمٍ فَبَالَ قَائِمًا. قِيْلَ: كَانَ ذَلِكَ لِعُذْرٍ.

364. (31) [1/117ఏకీభవితం]

’హుజై‘ఫహ్ (ర) కథనం: ప్రవక్త (స), ఒక జాతి వద్దకు వెళ్ళారు. అక్కడ నిలబడి మూత్రవిసర్జన చేశారు. (బు’ఖారీ, ముస్లిమ్‌). ‘ఏదో కారణం ఉండి ఇలా చేశారు,’ అని ప్రజలు అన్నారు.

—–

మూడవ విభాగం اَلْفَصْلُ الثَّالِثُ

365 – [ 32 ] ( ضعيف ) (1/117)

عَنْ عَائِشَةَ رضي الله عَنْهَا قَالَتْ: “مَنْ حَدَّثَكُمْ أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم كَانَ يَبُوْلُ قَائِمًا فَلَا تُصَدِّقُوْهُ مَا كَانَ يَبُوْلُ إِلَّا قَاعِدًا”. رَوَاهُ أَحْمَدُ وَالتِّرْمِذِيُّ وَالنَّسَائِيُّ.

365. (32) [1/117బలహీనం]

’ఆయి‘షహ్‌(ర) కథనం: ‘ఎవరైనా ప్రవక్త (స) నిలబడి మూత్ర విసర్జన చేసేవారని అంటే, వారి మాటలు ధృవీకరించకండి. దాన్ని నిజమని నమ్మకండి. ఎందుకంటే ప్రవక్త (స) ఎల్లప్పుడూ కూర్చొని మూత్ర విసర్జన చేసేవారు.’ [31] (’అహ్మద్, తిర్మిజి’, నసాయి‘)

366 – [ 33 ] ( حسن ) (1/117)

وَعَنْ زَيْدٍ بْنِ حَارِثَةَ عَنْ النَّبِيِّ صلى الله عليه وسلم: “أَنَّ جِبْرِيْلَ أَتَاهُ فِيْ أَوَّلَ مَا أَوْحَى إِلَيْهِ فَعَلَّمَهُ الْوَضُوْءَ وَالصَّلَاةَ فَلَمَّا فَرَغَ مِنَ الْوُضُوْءِ أَخَذَ غُرْفَةً مِّنَ الْمَاءِ فَنَضَحَ بِهَا فَرْجَهُ”. رَوَاهُ أَحْمَدُ وَالدَّارَقُطْنِيُّ .

366. (33) [1/117ప్రామాణికం]

’జైద్‌ బిన్‌ ’హారిస‘హ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”జిబ్రీల్‌ (అ) మొట్ట మొదటి సారి దైవవాణి తీసుకొని వచ్చి, నాకు వు’దూ చేసే పద్ధతి నేర్పారు, ఇంకా నమా’జు చేసే పద్ధతి నేర్పారు. నేను వు’దూ చేసిన తర్వాత అరచేతిలో నీళ్ళు తీసుకొని నా మర్మాం గంపై చిలకరించాను. [32] (అ’హ్మద్‌, దార ఖు’త్నీ)

367 – [ 34 ] ( لم تتم دراسته ) (1/118)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ رضي الله عَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “جَاءَنِيْ جِبْرِيْلُ فَقَالَ: يَا مُحَمَّدٌ إِذَا تَوَضَّأَتَ فَانْتَضِحْ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَقَالَ: هَذَا حَدِيْثٌ غَرِيْبٌ

وَسَمِعْتُ مُحَمَّدًا يَعْنِيْ الْبُخَارِيَّ يَقُوْلُ: اَلْحَسَنُ بْنُ عَلي الْهَاشِمِيُّ الرَّاوِيْ مُنْكَرُ الْحَدِيْثِ.

367. (34) [1/118అపరిశోధితం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”జిబ్రీల్‌ (అ) నా దగ్గరకు వచ్చి, ‘ఓ ము’హమ్మద్‌! వు’దూ చేసిన తర్వాత, మర్మాంగంపై గల బట్టపై చేతితో నీళ్ళు తీసుకొని చిలకరించుకో,’ అని అన్నారు. (తిర్మిజి‘ / ఏకోల్లేఖనం, బు’ఖారీ దీన్ని తిరస్కృత మైనదిగా పేర్కొన్నారు)

368 – [ 35 ] ( ضعيف ) (1/118)

وَعَنْ عَائِشَةَ رَضِيَ اللهُ عَنْهَا قَالَتْ: “بَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم فَقَامَ عُمَرُ خَلْفَهُ بِكُوْزٍ مِّنْ مَّاءٍ فَقَالَ: مَا هَذَا يَا عُمَرُ؟ قَالَ: مَاءٌ تَتَوَضَّأُ بِهِ. قَالَ: مَا أَمِرْتُ كُلَّمَا بُلْتُ أَنْ أَتَوَضَّأَ وَلَوْ فَعَلْتُ لَكَانَتْ سُنَّةً”. رَوَاهُ أَبُوْ دَاوُدَ وَابْنُ مَاجَهُ.

368. (35) [1/118బలహీనం]

’ఆయి‘షహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) మూత్ర విసర్జన చేశారు. ’ఉమర్‌ (ర) నీళ్ళముంత తీసుకొని ప్రవక్త (స) వెనుక నిలబడ్డారు. ప్రవక్త (స), ‘ ’ఉమర్‌! ఇదేంటి?’ అని అడిగారు. దానికి ‘ఉమర్‌ (ర), ‘తమరు వు’దూ చేయటానికి నీళ్ళు,’ అని అన్నారు. అప్పుడు ప్రవక్త (స), ‘నేను మూత్ర విసర్జన చేసినప్పుడల్లా వు’దూ చేయాలని నన్ను ఆదేశించడం జరగలేదు. ఒకవేళ నేను ఇలా చేస్తే, అది సాంప్రదాయం అయిపోతుంది. ప్రజలు దాన్ని తప్పని సరిగా భావిస్తారు. వాస్తవం ఏమిటంటే, మూత్ర విసర్జన చేసిన తర్వాత వు’దూ చేయడం తప్పనిసరి కాదు,’ అని అన్నారు. (అబూ దావూ‘ద్‌, ఇబ్నె మాజహ్)

369 – [ 36 ] ( صحيح لغيره ) (1/118)

وَعَنْ أَبِيْ أَيُّوْبَ وَجَابِرٍ وَأَنَسٍ: أَنَّ هَذِهِ الْآيَةَ نَزَلَتْ (فِيْهِ رِجَالُ يُّحِبُّوْنَ أَنْ يَّتَطَهُرْواوَاللهُ يُحِبُّ الْمُطَّهِّرِيْنَ؛ 9: 108) قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “يَا مَعْشَرَ الْأَنْصَارِ إِنَّ اللهَ قَدْ أَثْنَى عَلَيْكُمْ فِيْ الطُّهُوْرِ فَمَا طُهُوْرِكُمْ قَالُوْا نَتَوَضَّأُ لِلصَّلَاةِ وَنَغْتَسِلُ مِنَ الْجَنَاَبةِ وَنَسْتَنْجِيْ بِالْمَاءِ. قَالَ فَهُوَ ذَاكَ فَعَلَيْكُمُوْهُ”. رَوَاهُ ابْنُ مَاجَهُ .

369. (36) [1/118ఇతరులచే దృఢం]

అబూ అయ్యూబ్‌ (ర) మరియు జాబిర్‌ (ర) మరియు అనస్‌ (ర) కథనం: ”అందులో పరిశుద్ధులుకాగోరేవారున్నారు. మరియు అల్లాహ్‌ పరిశుద్ధులు కాగోరేవారిని ప్రేమిస్తాడు.” (సూ. అత్-తౌబహ్, 9:108) అనే ఆయతు అవతరించినపుడు ప్రవక్త (స) మాతో, ‘ఓ అ’న్సారుల్లారా! అల్లాహ్‌ (త) పరిశుద్ధత విషయంలో మిమ్మల్ని పొగిడాడు. మీ పరిశుద్ధత ఏమిటి,’ అని అన్నారు. దానికి వారు, ‘నమా’జ్‌ కోసం మేము వు’దూ చేస్తాం, జనాబత్‌ కోసం స్నానం చేసి, నీటితో ఇస్తిన్‌జా చేస్తాం,’ అని అన్నారు. దానికి ప్రవక్త (స), ‘ఇదే ఆ పరిశుద్ధత, అందువల్లే అల్లాహ్‌(త) మిమ్మల్ని ప్రశంసి స్తున్నాడు. అందువల్ల మీరు ఇలాగే చేస్తూ ఉండండి,’ అని అన్నారు. [33] (ఇబ్నె మాజహ్)

370 – [ 37 ] ( صحيح ) (1/119)

وَعَنْ سَلْمَانَ قَالَ قَالَ لَهُ بَعْضُ الْمُشْرِكِيْنَ وَهُوَ يَسْتَهْزِئُ بِهِ إِنِّيْ لَأَرَى صَاحِبْكُمْ يُعَلِّمُكُمْ كُل شيء حَتَّى الْخَرَاءَةَ. قَالَ أَجَلْ أَمَرَنَا أَنْ لَا نَسْتَقْبِلَ الْقِبْلَةُ وَلَا نَسْتَنْجِيَ بِأَيْمَانِنَا وَلَا نَكْتَفِيَ بِدوْنِ ثَلَاثَةِ أَحْجَارٍ لَيْسَ فِيْهَا رَجِيْعٌ وَلَا عَظْمٌ. رَوَاهُ مُسْلِمٌ وَأَحْمَدُ وَاللَّفْظُ لَهُ.

370. (37) [18/119దృఢం]

సల్మాన్‌ (ర) కథనం: కొందరు అవిశ్వాసులు ఎగతాళి చేస్తూ, ‘మీ గురువుగారు అంటే ప్రవక్త (స), మీకు ప్రతి విష యాన్ని గురించి, అంటే మల మూత్రాల విసర్జనా నియమాలు కూడా నేర్పుతూ ఉండటం మేము చూస్తున్నాం,’ అని అన్నారు. దానికి నేను, ‘అవును, ప్రవక్త (స) మాకు మల మూత్రాలు విసర్జించేటప్పుడు ఖిబ్లావైపు తిరిగి కూర్చోకూడదని, కుడిచేత్తో మల మూత్రాలు శుభ్రపరచకూడదనీ, ఇంకా మూడు కంటే తక్కువ పెడ్డలతో ఇస్తిన్‌జా చేయరాదని, ఇంకా పేడ, ఎముకలతో ఇస్తిన్‌జా చేయ రాదని ఉపదేశించారు,’ అని అన్నాను. (ముస్లిమ్‌)

371 – [ 38 ] ( صحيح ) (1/119)

وَعَنْ عَبْدِ الرَّحْمَنِ بْنِ حَسَنَةَ قَالَ: “خَرَجَ عَلَيْنَا رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم وَفِيْ يَدِهِ كهيئة الدَّرَقَةُ فَوَضَعَهَا ثُمَّ جَلَسَ فَبَالَ إِلَيْهَا. فَقَالَ بَعْضُهُمْ: اُنْظُرُوْا إِلَيْهِ يَبُوْلُ كَمَا تَبُوْلُ الْمَرْأَةُ فَسَمِعَهُ. فَقَالَ أَوْ مَا عَلِمْتَ مَا أَصَابَ صَاحِبَ بَنِيْ إِسْرَائِيْلَ كَانُوْا إِذَا أَصَابَهُمُ شيء من الْبَوْلُ قَرَضُوْهُ بِالْمَقَارِيْضِ فَنَهَاهُمْ فَعُذِّبَ فِيْ قَبْرِهِ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ وَابْنُ مَاجَهُ.

371. (38) [1/119దృఢం]

’అబ్దుర్ర’హ్మాన్‌ బిన్‌ ’హసనహ్ (ర) కథనం: ప్రవక్త (స) ఇంటి నుండి బయలుదేరి మా వద్దకు వచ్చారు. అప్పుడు ప్రవక్త (స) చేతిలో ఢాలు ఉంది. ప్రవక్త (స) దాన్ని నేలపై అడ్డుగా పెట్టి, దాని ముందు మూత్ర విసర్జనచేశారు. కొందరు చూచి, ‘చూడండి స్త్రీలవలె ఎలా మూత్రవిసర్జన చేస్తున్నారో,’ అని అన్నారు. ప్రవక్త (స) అది విని, ‘మీపై జాలి వేస్తుంది. బనీ ఇస్రాయీ’ల్‌లోని వ్యక్తులకు పడిన శిక్ష గురించి మీకు తెలియదా, అంటే అతనిపై దైవశిక్ష అవతరించింది. మూత్రవిసర్జన చేసినపుడు బట్టలకు అంటు కుంటే ఆ భాగాన్ని కత్తిరించి వేయాలని నియమం ఉండేది. బనీ ఇస్రాయీ’ల్‌లోని ఒక వ్యక్తి ఆ ధార్మిక ఆదేశాన్ని వారించాడు. అందువల్ల అతన్ని సమాధిలో శిక్షించటం జరిగింది,’ అని అన్నారు. [34] (ఇబ్నె మాజహ్, అబూ దావూద్‌, నసాయి‘)

372 – [ 39 ]  ؟ (1/119)

 وَرَوَاهُ النَّسَائِيُّ عَنْهُ عَنْ أَبِيْ مُوْسَى .

372. (39) [1/119 ? ]

దీనినే నసాయీ’, అబూ మూసా ద్వారా కూడా ఉల్లేఖించారు.

373 – [ 40 ] ( حسن ) (1/119)

عَنْ مَرْوَانَ الْأَصْفَرِ قَالَ: “رَأَيْتُ ابْنِ عُمَرَ أَنَاخَ رَاحِلَتَهُ مُسْتَقْبِلَ الْقِبْلَةِ ثُمَّ جَلَسَ يَبُوْلُ إِلَيْهَا فَقُلْتُ يَا أَبَا عَبْدِ الرَّحْمَنِ أَلَيْسَ قَدْ نَهَي عَنْ هَذَا. قَالَ: بَلَى إِنَّمَا نَهَي عَنْ ذَلِكَ فِيْ الْفِضَاءِ فَإِذَا كَانَ بَيْنَكَ وَبَيْنَ الْقِبْلَةِ شَيْءٌ يَسْتُرُكَ فَلَا بَأْسَ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ .

373. (40) [1/119-ప్రామాణికం]

మర్‌వాన్‌ అల్‌ అ’స్‌ఫర్‌ (ర) కథనం: ’అబ్దుల్లాహ్‌ బిన్‌ ’ఉమర్‌ (ర) తన ఒంటెను ఖిబ్లా వైపు కూర్చోబెట్టి, అనంతరం దానివైపు కూర్చొని మూత్ర విసర్జన చేయడం నేను చూశాను. నేనతనితో, ‘ఓ అబ్దుర్రహ్మాన్‌ నాన్నగారు, ఖిబ్లావైపు తిరిగి మూత్రవిసర్జన చేయటాన్ని వారించారు కదా, మరి మీరు ఖిబ్లావైపు తిరిగి చేస్తున్నారే!’ అని అన్నాను. దానికి ’అబ్దుల్లాహ్‌ బిన్‌ ’ఉమర్‌ (ర), ‘ఈ నిషిద్ధం విశాలమైదానంలో ఉంది. కాని మీరు ఖిబ్లాకు మధ్య ఏదైనా అడ్డుఉంటే మరేం ఫరవాలేదు,’ అని అన్నారు. (అబూ దావూద్‌)

374 – [ 41 ] ( ضعيف ) (1/120)

وَعَنْ أَنَسٍ قَالَ: كَانَ النَّبِيُّ صلى الله عليه وسلم: إِذَا خَرَجَ مِنَ الْخَلَاءِ قَالَ: “اَلْحَمْدُ للهِ الَّذِيْ أَذْهَبَ عَنِّيْ الْأَذَى وَعَافَانِيْ”. رَوَاهُ أبْنُ مَاجَهُ.

374. (41) [1/120బలహీనం]

అనస్‌ (ర) కథనం: ప్రవక్త (స) మరుగుదొడ్డి నుండి బయటకు వచ్చిన తర్వాత ఈ దు’ఆ పఠించేవారు: అల్‌’హమ్దులిల్లాహిల్లజీ, అజ్హబ అన్ని అల్అజా ఆఫానీ అంటే, – ‘స్తోత్రాలన్నీ అల్లాహ్‌ కొరకే. ఆయనే నన్ను బాధనుండి విముక్తి ప్రసా దించాడు, నాకు క్షేమాన్ని చేకూర్చాడు.’ (ఇబ్నె మాజహ్)

375 – [ 42 ] ( صحيح ) (1/120)

وَعَنْ ابْنِ مَسْعُوْدٍ قَالَ: “لَمَّا قَدِمَ وَفْدُ الْجِنِّ عَلَى النَّبِيِّ صلى الله عليه وسلم قَالُوْا: يَا رَسُوْلَ اللهِ اِنْهُ أُمَّتَكَ أَنْ يَّسْتَنْجُوْا بِعَظْمِ أَوْ رَوْثَةٍ أَوْ حُمَمَةٍ فَإِنَّ اللهَ جَعَلَ لَنَا فِيْهَا رِزْقًا فَنَهَانَا رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم عَنْ ذَلِكَ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ.

375. (42) [1/120దృఢం]

’అబ్దుల్లాహ్‌ బిన్‌ మస్‌’ఊద్‌ (ర) కథనం: ప్రవక్త (స) వద్దకు ఒక జిన్నుల బృందం వచ్చి, ‘దయచేసి తమరు తమ అనుచర సమాజానికి పేడ, బొగ్గు, ఎముకలు మొదలైన వాటితో ఇస్తిన్‌ చేయకూడదని ఆదేశించండి. ఎందుకంటే అల్లాహ్‌ (త) వాటిలోనే మా ఆహారం పెట్టాడు,’ అని విన్నవించుకుంది. అందువల్ల ప్రవక్త (స) వాటి నుండి మమ్మల్నివారించారు.[35]  (అబూ దావూ‘ద్‌)

=====

.3بابُ السِّوَاكِ

  • పండ్లు తోముకోవటం

మిస్వాక్‌ చేయటం ప్రవక్త సాంప్రదాయం. మిస్వాక్‌ అంటే కుంచే, కుచ్చ, కూర్చ (బ్రష్). ప్రాచీన మిస్వాక్ ఒకరకమైన చెట్టు యొక్క వేరు. దీనివల్ల నోరు శుభ్రంగా ఉంటుంది. దైవప్రీతి కూడాలభిస్తుంది. ఐదుపూటల నమా’జులకు ముందు మిస్వాక్‌ చేయటం వల్ల చాలా పుణ్యం లభిస్తుంది. ఒకవేళ మిస్వాక్‌ లభించకపోతే చేతివ్రేలితో శుభ్రపరచుకోవాలి.

—–

మొదటి విభాగం  اَلْفَصْلُ الْأَوَّلُ  

376 – [ 1 ] ( متفق عليه ) (1/121)

عَنْ أَبِيْ هُرَيْرَةَ رضي الله عَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَوْلَا أَنْ أَشُقَّ عَلَى أُمَّتِيْ لَأَمَرْتُهُمْ بِتَأْخِيْرِ الْعِشَاءِ وَبِالسِّوَاكِ عِنْدَ كُلِّ صَلَاةٍ”.

376. (1) [1/121ఏకీభవితం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఒకవేళ నేను నా అనుచర సమాజంపై కష్టంకాదని భావిస్తే, ఇషా‘ నమా’జు ఆలస్యంగా చదవమని, ప్రతి నమా’జ్‌కు ముందు మిస్వాక్‌ చేయమని ఆదేశించే వాడిని.” [36](బు’ఖారీ, ముస్లిమ్‌)

377 – [ 2 ] ( صحيح ) (1/121)

وعَنْ شُرَيْحٍ بْنِ هَانِئْ قَالَ: سَأَلْتُ عَائِشَةَ: بِأَيِّ شَيْءٍ كَانَ يَبْدَأُ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم إِذَا دَخَلَ بَيْتَهُ؟ قَالَتْ: بِالسِّوَاكِ. رَوَاهُ مُسْلِمٌ.

377. (2) [1/121దృఢం]

షురై’హ్‌ బిన్‌ హానీ (ర) కథనం: ‘ప్రవక్త (స) ఇంట్లోకి వచ్చిన తర్వాత ఏం చేసేవారని, ’ఆయి‘షహ్‌ (ర)ను అడిగాను. దానికి ’ఆయి‘షహ్‌ (ర), ‘అన్నిటి కంటే ముందు మిస్‌వాక్‌ చేసేవారని,’ అన్నారు. [37]  (ముస్లిమ్‌)

378 – [ 3 ] ( متفق عليه ) (1/121)

وَعَنْ حُذَيْفَةَ قَالَ: كَانَ النَّبِيُّ صلى الله عليه وسلم إِذَا قَامَ لِلتَّهَجُّدِ مِنَ اللَّيْلِ يَشُوْصُ فَاهُ بِالسِّوَاكِ.

378. (3) [1/121ఏకీభవితం]

’హుజై’ఫా (ర) కథనం: ప్రవక్త (స) రాత్రి తహజ్జుద్‌ నమా’జుకు మేల్కొని తన నోటిని మిస్వాక్‌తో శుభ్ర పరుస్తారు. (బు’ఖారీ, ముస్లిమ్‌)

379 – [ 4 ] ( صحيح ) (1/121)

وَعَنْ عَائِشَةَ رَضِيَ اللَّهُ عَنْهَا قَالَتْ: قَالَ رَسُولِ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: “عَشْرَ مِنَ الْفِطْرَةِ: قَصُّ الشَّارِبِ وَإِعْفَاءُ اللِّحْيَةِ وَالسِّوَاكُ وَاسْتِنْشَاقُ الْمَاءِ وَقَصُّ الْأَظْفَارِ وَغَسْلُ الْبَرَاجِمِ وَنَتْفُ الْإِبِطِ وَحَلْقُ الْعَانَةِ وَانْتِقَاصُ الْمَاءِ. يَعْنِي الِاسْتِنْجَاءَ – قَالَ الرَّاوِي: ونسيت الْعَاشِرَة إِلَّا أَن تكون الْمَضْمَضَة. رَوَاهُ مُسلم.

وَفِي رِوَايَةٍ «الْخِتَانُ» بَدَلَ «إِعْفَاءُ اللِّحْيَةِ» لَمْ أَجِدْ هَذِهِ الرِّوَايَةَ [ص:122] فِي «الصَّحِيحَيْنِ» وَلَا فِي كِتَابِ الْحُمَيْدِيِّ
وَلَكِنْ ذَكَرَهَا صَاحِبُ «الْجَامِعِ» وَكَذَا الْخطابِيّ فِي «معالم السّنَن»

379. (4) [1/121దృఢం]

‘ఆయి’షహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”10 గుణాలు ప్రకృతి సహజమైనవి, ప్రవక్తలందరూ వీటిని ఆచరించారు మరియు ఇవి ధార్మిక విషయాలు: 1. మీసాలు కత్తిరించటం, 2. గడ్డం పెంచటం, 3. మిస్వాక్‌ చేయటం, 4. నీటితో ముక్కు శుభ్రపరచటం, 5. గోళ్ళు కత్తిరించటం, 6. వేళ్ళ మధ్య భాగాన్ని కడగటం, 7. చంకలోని వెంట్రుకలను తీయటం, 8. నాభిక్రింది వెంట్రుకలను గీయటం, 9. నీటితో ఇస్తిన్‌జా చేయటం, 10.వ విషయం నేను మరచిపోయాను. అయితే నీటిని పుక్కిలించటం కావచ్చు.” (ముస్లిమ్‌)

మరో ఉల్లేఖనంలో గడ్డం పెంచడానికి బదులు సున్నత్ చేయటం అనే పదాలు ఉన్నాయి. కాని ఈ ఉల్లేఖన నాకు బు’ఖారీ, ముస్లిములలో లభించలేదు. ’హమీదీ పుస్తకం లోనూ లభించలేదు. కాని సాహిబుల్‌ జామిలో దీన్ని పేర్కొన్నారు. అదేవిధంగా ఖత్తాబీ మఆలిముస్సునన్‌లో కూడా పేర్కొన్నారు.

380 – [ 5 ] ( صحيح ) (1/122)

عَنْ أَبِيْ دَاوُدَ بِرَوَايَةِ عَمَّارِ بْنِ يَاسِرٍ.

380. (5) [1/122దృఢం]

దీన్నే అబూ దావూద్‌, ’అమ్మార్ బిన్ యాసిర్  కథనంగా, కూడా ఉల్లేఖించారు.

—–

  రెండవ విభాగం    ا  َلْفَصْلُ الثَّانِيْ

381 – [ 6 ] ( صحيح ) (1/122)

عَنْ عَائِشَةَ قَالَتْ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “السِّوَاكُ مَطْهَرَةٌ لِّلْفَمِ مَرْضَاةٌ لِلرَّبِّ”. رَوَاهُ الشَّافِعِيْ وَأحْمَدُ وَالدَّارِمِيُّ وَالنَّسَائِيُّ وَرَوَاهُ الْبُخَارِيُّ فِيْ صَحِيْحِهِ بِلَا إِسْنَادٍ .

381. (6) [1/122దృఢం]

’ఆయి‘షహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మిస్వాక్‌ వల్ల నోరు శుభ్రంగా ఉంటుంది, దుర్వాసన దూరమౌతుంది మరియు దైవప్రీతి లభిస్తుంది.” (షాఫ’యి, అ’హ్మద్‌, దార్మీ, నసాయి‘, బు’ఖారీ)

382 – [ 7 ] ( حسن ) (1/122)

وَعَنْ أَبِيْ أَيُوْبَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “أَرْبَعٌ مِّنْ سُنَنِ الْمُرْسَلِيْنَ: اَلْحَيَاءُ وَيُرْوَى الْخَتَانُ وَالتَّعطُّرُ وَالسِّوَاكُ وَالنِّكَاحُ”. رَوَاهُ التِّرْمِذِيُّ .

382. (7) [1/122ప్రామాణికం]

అబూ అయ్యూబ్‌ అ’న్సారీ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం: ”4 విషయాలు ప్రవక్తల సాంప్రదాయాలు, పద్ధతులు. 1. సిగ్గుపడటం, మరో ఉల్లేఖనంలో ఉంది, సున్నత్ చేయటం, 2. సువాసన పులుముకోవటం, 3. మిస్వాక్‌ చేయటం, 4. నికాహ్‌ చేయటం. (తిర్మిజి’)

ఈ నాలుగు విషయాలు ప్రవక్తల సాంప్రదాయాలు.

383 – [ 8 ] ( حسن ) (1/122)

وَعَنْ عَائِشَةَ قَالَتْ: كَانَ النَّبِيُّ صلى الله عليه وسلم لَا يَرْقَدُ مِنْ لَّيْلٍ وَلَا نَهَارٍ فَيَسْتَيْقِظُ إِلَّا يَتَسَوَّكُ قَبْلَ أَنْ يَّتَوَضَّأَ. رَوَاهُ أَحْمَدُ وَأَبُوْ دَاوُدَ.

383. (8) [1/122ప్రామాణికం]

‘ఆయి’షహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) పగటిపూట లేదా రాత్రిపూట పడుకొనిలేస్తే, వు’దూచేయటానికి ముందు మిస్వాక్‌ చేసుకునేవారు. (అ’హ్మద్‌, అబూ దావూద్‌)

384 – [ 9 ] ( حسن ) (1/122)

وَعَنْهَا قَالَتْ: كَانَ النَّبِيُّ صلى الله عليه وسلم يَسْتَاكُ فَيُعْطِيْنِيْ السِّوَاكُ لِأَغْسِلَهُ فَأَبْدَأُ بِهِ فَأسْتَاكُ ثُمَّ أَغْسِلْهُ وَأَدْفَعُهُ إِلَيْهِ. رَوَاهُ أَبُوْ دَاوُدَ .

384. (9) [1/122-ప్రామాణికం]

 ’ఆయి‘షహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) మిస్వాక్‌ చేసి కడిగి ఉంచమని నాకు ఇచ్చేవారు. కాని నేను దాన్ని కడిగే ముందు, నేను కూడా మిస్వాక్‌ చేసుకునేదాన్ని. అనంతరం దాన్ని కడిగి ప్రవక్త (స)కు ఇచ్చేదాన్ని.[38] (అబూ దావూద్‌)

—–

మూడవ విభాగం اَلْفَصْلُ الثَّالِثُ

385 – [ 10 ] ( متفق عليه ) (1/123)

عَنِ ابْنِ عُمَرَ أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم قَالَ: “أَرَانِيْ فِيْ الْمَنَامِ أَتَسَوَّكَ بِسِوَاكِ فَجَاءَنِيْ رَجُلَانِ أَحَدُهُمَا أَكْبَرُ مِنَ الْآخَرِ فَنَاوَلْتُ السِّوَاكَ الْأَصْغَرُ مِنْهُمَا فَقِيْلَ لِيْ: كَبِّرْ فَدَف.

385. (10) [1/123ఏకీభవితం]

’అబ్దుల్లాహ్‌ బిన్‌ ’ఉమర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”కలలో నేను మిస్వాక్‌ చేస్తున్నాను. ఇంతలో ఇద్దరు వ్యక్తులు నా వద్దకు వచ్చారు. వారిలో ఒక వ్యక్తి వయస్సు పెద్దది. చిన్న వయస్సుగల వ్యక్తికి నేను మిస్వాక్‌ ఇద్దామని అనుకున్నాను. పెద్ద వానికి ఇవ్వమని చెప్పబడింది. అనంతరం నేను పెద్దవానికి మిస్వాక్‌ ఇచ్చాను.” [39] (బు’ఖారీ, ముస్లిమ్‌)

386 – [ 11 ] ( ضعيف جدا ) (1/123)  

وَعَنْ أَبِيْ أَمَامَةَ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم قَالَ: “مَا جَاءَنِيْ جِبْرِيْلُ عَلَيْهِ السَّلَامُ قُطُّ إِلَّا أَمَرَنِيْ بِالسِّوَاكِ لَقَدْ خَشِيْتُ أَنْ أُحْفِيَ مُقَدَّمَ فِيْ”. رَوَاهُ أَحْمَدُ .

386. (11) [1/123అతి బలహీనం]

అబూ ఉమామహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”జిబ్రీల్‌ (అ) వచ్చి నాకు మిస్వాక్‌ చేయమని ఆదేశించే వారు. అందువల్ల నేను చాలా అధికంగా మిస్వాక్‌ చేసే వాడిని. అధికంగా మిస్వాక్‌ చేయడం వల్ల నోటి ముందు భాగం ఎక్కడ గాయమవుతుందోనని భయపడేవాడిని.” [40] (అ’హ్మద్‌)

387 – [ 12 ] ( صحيح ) (1/123)

وَعَنْ أَنَسٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَقَدْ أَكْثَرْتُ عَلَيْكُمْ فِي السِّوَاكِ”. رَوَاهُ الْبُخَارِيُّ .

387. (12) [1/123-దృఢం]

అనస్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”నేను మీకు మిస్వాక్‌ చేయమని ఖచ్చితంగా, పూస గుచ్చినట్లు చెప్పాను.” (బు’ఖారీ)

388 – [ 13 ] ( صحيح ) (1/123)

وَعَنْ عَائِشَةَ رضي الله عَنْهَا قَالَتْ: كَانَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم يَسْتَنُّ وَعِنْدَهُ رَجُلَانِ أَحَدُهُمَا أَكْبَرُ مِنَ الْآخَرِ فَأَوْحَي إِلَيْهِ فِيْ فَضْلِ السِّوَاكِ أَنْ كَبِّرُ أَعْطِ السِّوَاكَ أَكْبَرَهُمَا. رَوَاهُ أَبُوْ دَاوُدَ .

388. (13) [1/123-దృఢం]

’ఆయి‘షహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) మిస్వాక్‌ చేస్తున్నారు. అప్పుడు ఇద్దరు వ్యక్తులు ఆయన వద్ద కూర్చున్నారు. ఒకరు పెద్దవారు, మరొకరు చిన్నవారు. మిస్వాక్‌ ప్రత్యేకతను గురించి దైవవాణి అవతరించ బడుతూ పెద్దవానికి మిస్వాక్‌ ఇవ్వమని ఆదేశించబడింది. (అబూ దావూద్‌)

389 – [ 14 ] ( ضعيف ) (1/123)

وَعَنْهَا قَالَتْ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “تَفْضُلُ الصَّلَاةُ الِّتِيْ يُسْتَاكُ لَهَا عَلَى الصَّلَاةِ الَّتِيْ لَا يُسْتَاكُ لَهَا سَبْعِيْنَ ضِعْفًا”. رَوُاهُ الْبَيْهَقِيُّ فِيْ شُعَبِ الْإِيْمَانِ .

389. (14) [1/123బలహీనం]

’ఆయి‘షహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మిస్వాక్‌ చేయకుండా చదవబడే నమా’జు కంటే, మిస్వాక్‌ చేసి చదవబడే నమాజుకు 70 రెట్ల పుణ్యం అధికంగా లభిస్తుంది.” (బైహఖీ)

390 – [ 15 ] ( صحيح ) (1/124)

وَعَنْ أَبْيْ سَلْمَةَ عَنْ زَيْدِ بْنِ خَالِدٍ الْجُهَنِيِّ قَالَ سَمِعْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ: “لَوْلَا أَنْ أَشُقَّ عَلَى أُمَّتِيْ لَأَمَرْتُهُمْ بِالسِّوَاكِ عِنْدَ كُلِّ صَلَاةٍ وَلَأَخَّرْتُ صَلَاةَ الْعِشَاءِ إِلَى ثُلُثِ اللَّيْلِ”. قَالَ فَكَانَ زَيْدُ بْنُ خَالِدٍ يَّشْهَدُ الصَّلَوَاتِ فِيْ الْمَسْجِدِ وَسِوَاكُهُ عَلَى أُذُنِهِ مُوْضِعَ الْقَلَمِ مِنْ أُذُنِ الْكَاتِبِ لَا يَقُوْمُ إِلَى الصَّلَاةِ إِلَّا أَسْتَنَّ ثُمَّ رَدَّهُ إِلَى مَوْضِعِهِ. رَوَاهُ التِّرْمِذِيُّ وَأَبُوْ دَاوُدُ إِلَّا أَنَّهُ لَمْ يَذْكُرْ: “وَلَأَخَّرْتُ صَلَاةَ الْعِشَاءِ إِلَى ثُلُثِ اللَّيْلِ”.

وَقَالَ التِّرْمِذِيُّ: هَذَا حَدِيْثٌ حَسَنٌ صَحِيْحٌ.

390. (15) [1/124దృఢం]

అబూ సల్మా, ’జైద్‌ బిన్‌ ’ఖాలిద్‌ జుహని (ర) ద్వారా కథనం: ప్రవక్త (స) ఇలా ప్రవచిస్తూ ఉండగా నేను విన్నాను, ”ఒకవేళ నా అనుచర సమాజంపై భారం అని భావించ కుండా ఉండి ఉంటే, ప్రతి నమా’జుకు తప్పనిసరిగా మిస్వాక్‌ చేయమని ఆదేశించేవాడిని, ఇంకా ఇషా‘ నమా’జును ఒక వంతు రాత్రి పూర్తయినపుడు చదవమని ఆదేశించేవాడిని.”

హదీసు ఉల్లేఖకుని కథనం: ’జైద్‌ బిన్‌ ’ఖాలిద్‌ (ర) నమా’జు చదవడానికి మస్జిద్‌లోకి వచ్చినపుడు మిస్వాక్‌ అతని చెవి ప్రక్కన తగిలి ఉంటుంది. గుమస్తా కలం చెవిలో ఉన్నట్టు. ఇంకా నమా’జుకు నిలబడినపుడు మిస్వాక్‌ చేసు కునేవారు. మళ్ళీ తన చెవిదగ్గర పెట్టుకునేవారు. (తిర్మిజి / ప్రామాణికం, దృఢం, అబూ దావూ‘ద్‌)

=====

4- بَابُ سُنَنِ الْوُضُوْءَ

  • వుదూలో సాంప్రదాయాలు

ఇస్లామీయ ధార్మిక పరిభాషలో ఫర్’ద్, వాజిబ్‌, సున్నత్‌ అనే పదాలు ఉపయోగించబడతాయి. దైవాదేశాలను ఫర్’ద్ అంటారు. ఇందులో ఎటువంటి సంశయం లేదు. దీన్ని తిరస్కరించినవాడు, అవిశ్వాసి అవుతాడు. అకారణంగా వదలివేసినవాడు పాపాత్ముడవుతాడు. వాజిబ్‌ ను తిరస్కరించినవాడు అవిశ్వాసికాడు, కాని దాన్ని వదలివేయటం వల్ల పాపాత్ముడు అవుతాడు, శిక్షకు అర్హుడవుతాడు. దీన్ని సున్నతె ముఅక్కద అని కూడా అంటారు. ఇక సున్నత్‌ అంటే ప్రవక్త (స) ఆచరించినది, ఆదేశించినది, ప్రవక్త (స)  సమక్షంలో జరిగి, ప్రవక్త (స) మౌనం వహించినది.

సున్నత్‌ను వదలటం వల్ల మనిషి పాపాత్ము డవుతాడు, కాని అవిశ్వాసి కాడు. సున్నత్‌ రెండు రకాలు. 1. సున్నతె ముఅక్కద 2. సున్నతె గైర్‌ ముఅక్కద. సున్నతె ముఅక్కద అంటే ప్రవక్త (స) ఆదేశించి, ఎల్లప్పుడూ ఆచరించినది, అకారణంగా వదలనిది. అనవసరంగా వదలితే పాపం చుట్టు కుంటుంది. సున్నతె గైర్‌ ముఅక్కద అంటే ప్రవక్త (స) అప్పు డప్పుడూ ఆచరించినది. దాన్ని వదలటంలో పాపం లేదు. చేస్తే పుణ్యం లభిస్తుంది. ప్రతి విషయంలో సున్నతులు ఉన్నాయి. వు’దూ’ సున్నతులు ఉన్నాయి. నమా’జ్‌ సున్నతులు ఉన్నాయి. రో’జహ్ సున్నతులు ఉన్నాయి.

ధార్మిక ఆదేశాల్లో కొన్ని ఫ’ర్దులు, కొన్ని సున్నతులు ఉన్నాయి.

వుదూలో 6 ఫర్జ్లు ఉన్నాయి. 1. వు’దూ’ సంక ల్పం, 2. ముఖాన్ని పూర్తిగా కడగటం, అంటే నుదుటి వెంట్రుకల నుండి, గడ్డము క్రింది వరకు, మరియు ఒక చెవినుండి రెండవ చెవి వరకు, 3. రెండు చేతులను మోచేతుల వరకు పూర్తిగా – ఒక్కసారైనా – కడగటం,  4. తలకు సంపూర్ణ మసహ్‌ చేయటం, 5. రెండు కాళ్ళు చీలమండలతో సహా కడగటం, 6. వరుస క్రమంగా కడగటం అంటే ముందు రెండు చేతులను  మణికట్ల వరకు కడగటం, ముఖం కడగటం, మోచేతుల వరకు రెండు చేతులను కడగటం, తలకు మ’స్హ్‌ చేయటం, రెండు కాళ్ళనూ చీల మండలతో సహా కడగటం.

అల్లాహ్‌ ఆదేశం: “ఓ విశ్వాసులారా! మీరు నమా’జ్‌కు లేచినపుడు, మీ ముఖాలను, మరియు మీ చేతులను మో చేతుల వరకు కడుక్కోండి. మరియు మీ తలలను (తడి చేతులతో) తుడుచుకోండి. మరియు మీకాళ్ళను చీల మండల వరకు కడుక్కోండి..”(సూ. అల్‌ మాయి‘దహ్‌, 5:6)

అదేవిధంగా వుదూలో 10 సున్నత్లు ఉన్నాయి: 1. బిస్మిల్లాహ్‌ పఠించటం, 2. మిస్వాక్‌ చేయటం, 3. మూడు సార్లు చేతులను మణికట్ల వరకు కడగటం, 4. మూడుసార్లు నీళ్లను పుక్కిలించటం, 5. మూడుసార్లు నీళ్ళను ముక్కులో వేసి ముక్కును శుభ్రపరచటం, 6. ప్రతి అవయవాన్ని మూడు సార్లు కడగటం, 7. చేతులు, కాళ్ళ వ్రేళ్ళలో, గడ్డంలో ఖిలాల్‌ చేయటం, 8. రెండు చెవులను మ’స్హ్‌ చేయటం, 9. వరుస క్రమంలో పరంపరతో చేయటం, 10. కుడివైపు నుండి ప్రారంభించటం. ముందు పేజీల్లో వీటిని గురించి తెలుసుకుందాం.

—–

  మొదటి  విభాగం   اَلْفَصْلُ الْأَوَّلُ

391 – [ 1 ] ( متفق عليه ) (1/125)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ رضي الله عَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِذَا اسْتَيْقَظَ أَحْدُكُمْ مِنْ نَّوْمِهِ فَلَا يَغْمِسَنَّ يَدَهُ فِيْ الْإِنَاءِ حَتَّى يَغْسِلَهَا فَإِنَّهُ لُا يَدْرِيْ أَيْنَ بَاتَتْ يَدَهُ”.

391. (1) [1/125ఏకీభవితం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మీలో ఎవరైనా పడుకొని లేస్తే, మూడుసార్లు తన చేతులను కడుక్కోనంత వరకు పాత్రలను ముట్టుకోరాదు. ఎందుకంటే, రాత్రి అతని చేయి ఎక్కడెక్కడ పోయిందో అతనికి తెలియదు.” [41] (బు’ఖారీ, ముస్లిమ్‌)

392 – [ 2 ] ( متفق عليه ) (1/125)

وَعَنْه قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِذَا اسْتَيْقَظَ أَحَدُكُمْ مِنْ مَّنَامِهِ فَلْيَسْتَنْثِرْ ثَلَاثًا فَإِنَّ الشَّيْطَانَ يَبِيْتُ عَلَى خَيْشُوْمِهِ” .

392. (2) [1/125ఏకీభవితం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మీలో ఎవరైనా నిద్రనుండి మేల్కొని, వు’దూ’ చేయగోరి నపుడు మూడు సార్లు ముక్కులో నీళ్ళు వేసి శుభ్రపరచు కోవాలి. ఎందుకంటే షై’తాన్‌ అతని ముక్కుపై రాత్రి గడుపుతాడు.” [42] (బు’ఖారీ, ముస్లిమ్‌)

393 – [ 3 ] ( صحيح ) (1/125)

وَقِيْلَ لِعَبدِاللهِ بْنِ زَيْدٍ: كَيْفَ كَانَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم يَتَوَضَّأُ؟ فَدَعَا بِوْضُوْءٍ فَأَفْرَغَ عَلَى يَدَيْهِ فَغَسَلَ يَدْيِهِ مَرَّتَيْنِ مَرَّتَيْنِ ثُمَّ مَضْمَضَ وَ اسْتَنْثَرَ ثَلَاثًا ثُمَّ غَسَلَ وَجْهَهُ ثَلَاثًا ثُمَّ غَسَلَ يَدَيْهِ مَرَتَّيْنِ مَرَتَّيْنِ إِلَى الْمِرْفَقَيْنِ ثُمَّ مَسَحَ رَأْسَهُ بِيِدَيْهِ فَأَقْبَلَ بِهِمَا وَأَدْبَرَ بَدَأَ بِمُقَدَّمِ رَأْسِهِ ثُمَّ ذَهَبَ بِهِمَا إِلَى قَفَاهُ ثُمَّ رَدَّهُمَا حَتَّى يَرْجِع إِلَى الْمَكَانِ الَّذِيْ بَدَأَ مِنْهُ ثُمَّ غَسَلَ رِجْلَيْهِ . رَوَاهُ مَالِكُ وَالنَّسَائِيُّ وَلِأَبِيْ دَاوُدَ نَحْوُهُ ذَكَرَهُ صَاحِبُ الْجَامِعِ .

393. (3) [1/125దృఢం]

’అబ్దుల్లాహ్‌ బిన్‌ ’జైద్‌ బిన్‌ ’ఆసిమ్‌ (ర) ను ప్రవక్త (స) వు’దూ’ ఎలా చేసేవారని ప్రశ్నించటం జరిగింది. అది విని, ‘అబ్దుల్లాహ్‌ వు’దూ’ చేయటానికి నీళ్ళు తెప్పించారు. ముందు రెండు చేతులపై నీళ్ళు వేసారు.  రెండుసార్లు వాటిని కడిగారు, ఆ తరువాత పుక్కిలించారు. ఆ తరువాత మూడు సార్లు ముక్కులో నీళ్ళువేసి కడిగారు. ఆ తరువాత మూడు సార్లు సంపూర్ణంగా ముఖాన్ని కడిగారు. ఆ తరువాత రెండు చేతులను మోచేతులతో సహా రెండు సార్లు కడిగారు. ఆ తరువాత రెండు చేతులతో తలపై మ’స్హ్‌ చేశారు. అంటే రెండు చేతులను నుదురు నుండి తలవెనుక భాగం వైపు తీసుకు వెళ్ళి, మళ్ళీ తల వెనుక భాగం నుండి నుదురు వైపు తిరిగి తెచ్చారు. ఆ తరువాత రెండు కాళ్ళను కడిగారు. (మాలిక్, నసాయి‘)

అబూ దావూ‘ద్‌లోనూ ఇలాగే ఉంది. దీన్ని అల్‌ జామి రచయిత పేర్కొన్నారు.

394 – [ 4 ] ( متفق عليه ) (1/125)

وَفِي الْمُتَّفَقِ عَلَيْهِ: قِيلَ لِعَبْدِ اللَّهِ بْنِ زَيْدِ بْنِ عَاصِمٍ: تَوَضَّأْ لَنَا وُضُوءَ رَسُولِ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ فَدَعَا بِإِنَاءٍ فَأَكْفَأَ مِنْهُ عَلَى يَدَيْهِ فَغَسَلَهُمَا ثَلَاثًا ثُمَّ أَدْخَلَ يَدَهُ [ص:126] فَاسْتَخْرَجَهَا فَمَضْمَضَ وَاسْتَنْشَقَ مِنْ كَفٍّ وَاحِدَةٍ فَفَعَلَ ذَلِكَ ثَلَاثًا ثُمَّ أَدْخَلَ يَدَهُ فَاسْتَخْرَجَهَا فَغَسَلَ وَجْهَهُ ثَلَاثًا ثُمَّ أَدْخَلَ يَدَهُ فَاسْتَخْرَجَهَا فَغَسَلَ يَدَيْهِ إِلَى الْمِرْفَقَيْنِ مَرَّتَيْنِ ثُمَّ أَدْخَلَ يَدَهُ فَاسْتَخْرَجَهَا فَمَسَحَ بِرَأْسِهِ فَأَقْبَلَ بِيَدَيْهِ وَأَدْبَرَ ثُمَّ غَسَلَ رِجْلَيْهِ إِلَى الْكَعْبَيْنِ ثُمَّ قَالَ: هَكَذَا كَانَ وُضُوءُ رَسُولُ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْه وَسَلَّمَ.

وَفِي رِوَايَةٍ: فَأَقْبَلَ بِهِمَا وَأَدْبَرَ بَدَأَ بِمُقَدَّمِ رَأْسِهِ ثُمَّ ذَهَبَ بِهِمَا إِلَى قَفَاهُ ثُمَّ رَدَّهُمَا حَتَّى رَجَعَ إِلَى الْمَكَانِ الَّذِي بَدَأَ مِنْهُ ثُمَّ غَسَلَ رجلَيْهِ.
وَفِي رِوَايَة : فَمَضْمض واستنشق واستنثر ثَلَاثًا بِثَلَاث غَرَفَاتٍ مِنْ مَاءٍ.
وَفِي رِوَايَةٍ أُخْرَى: فَمَضْمَضَ وَاسْتَنْشَقَ مِنْ كَفَّةٍ وَاحِدَةٍ فَفَعَلَ ذَلِكَ ثَلَاثًا.
وَفِي رِوَايَةٍ لِلْبُخَارِيِّ: فَمَسَحَ رَأْسَهُ فَأَقْبَلَ بِهِمَا وَأَدْبَرَ مَرَّةً وَاحِدَةً ثُمَّ غَسَلَ رِجْلَيْهِ إِلَى الْكَعْبَيْنِ.

وَفِي أُخْرَى لَهُ: فَمَضْمَضَ وَاسْتَنْثَرَ ثَلَاثَ مَرَّات من غرفَة وَاحِدَة .

394. (4) [1/125ఏకీభవితం]

బు’ఖారీ, ముస్లిమ్‌లలో ’అబ్దుల్లాహ్‌ బిన్‌ ’జైద్‌ బిన్‌ ’ఆసిమ్‌ యొక్క ఉల్లేఖనం ఈ విధంగా ఉంది, ”అతన్ని వు’దూ’ పద్ధతి గురించి, ప్రశ్నించడం జరిగింది. అప్పుడు ’అబ్దుల్లాహ్‌ వు’జూ చేయటానికి నీటి చేద తెప్పించారు. దానితో నీటిని తన రెండు చేతులపై వేసి మూడుసార్లు రెండు చేతులను మణికట్ల వరకు కడిగారు. అనంతరం తన చేతిని అందులోవేసి నీళ్ళుతీసి మూడుసార్లు పుక్కిలించారు, ఆ తరువాత ముక్కులో నీళ్ళు వేసి శుభ్రపరిచారు. అంటే మూడు సార్లు చేశారు. ఒకేచేతితో నోటిలోనూ ముక్కులోనూ నీళ్ళు వేశారు. ఎడమ చేతితో ముక్కు శుభ్ర పరిచారు. ఆ తరువాత తన చేతిని ముంతలో వేసి నీళ్ళు తీసి మూడు సార్లు ముఖమంతా కడిగారు. ఆ తరువాత తన చేతిని ముంతలో వేసి నీళ్ళు తీసి తన చేతులను రెండుసార్లు మోచేతుల వరకు కడిగారు. ఆ తరువాత చేతితో నీళ్ళు తీసి తలపై మ’స్హ్‌ చేశారు. అంటే, రెండు చేతులను నుదురు పై నుండి తల వెనుక భాగం వరకు తీసుకొని వెళ్ళి, మళ్ళీ అక్కడి నుండి ముందుకు తీసుకొని వచ్చారు. ఆ తరువాత రెండు కాళ్ళను చీలమండలతో సహా కడిగారు. అనంతరం ప్రవక్త (స) వు’దూ’ ఇలా ఉండేదని,’ అన్నారు.

మరో ఉల్లేఖనంలో ఇలా ఉంది, ”మ’స్హ్‌లో రెండు చేతులను నుదురు పైనుండి తల వెనుక భాగం వరకు తీసుకొని వెళ్ళి, మళ్ళీ నుదురు వైపుకు తీసుకొని వచ్చారు. ఆ తరువాత రెండు కాళ్ళను కడిగారు.

మరో ఉల్లేఖనంలో ఇలా ఉంది. చేత్తో మూడుసార్లు నీళ్ళు తీసుకొని పుక్కిలించారు. ముక్కులో నీళ్ళు వేశారు. అంటే మూడుసార్లు చేత్తో నీళ్ళు తీసుకొని పుక్కిలించారు. మరియు మూడుసార్లు నీళ్ళు తీసుకొని ముక్కులో వేసి శుభ్రపరిచారు.

 మరో ఉల్లేఖనంలో, చేత్తో ఒకేసారి నీళ్ళు తీసుకొని పుక్కి లించారు మరియు ముక్కులో నీళ్ళు వేశారు. ఇలా మూడు సార్లు చేశారు.

బు’ఖారీలోని ఒక ఉల్లేఖనంలో ఇలాఉంది, తల మసహ్‌ ఎలా చేశారంటే, రెండు చేతులను ముందు నుండి వెనుక తీసుకొని వెళ్ళి మళ్ళీ ముందుకు తీసుకొని వచ్చారు. కేవలం ఒక్కసారి మాత్రమే. ఆ తరువాత రెండు కాళ్ళను చీల మండలతో సహా కడిగారు.”

మరో ఉల్లేఖనంలో, చేత్తో నీళ్ళుతీసుకొని పుక్కి లించారు ముక్కులోనూ వేశారు. ఇలా మూడు సార్లు చేశారు.

395 – [ 5 ] ( صحيح ) (1/126)

وَعَنْ عَبْدِ اللهِ بْنِ عَبَّاسٍ قَالَ: تَوَضَّأَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم مَرَّةً مَرَّةً لَمْ يَزِدْ عَلَى هَذَا. رَوَاهُ الْبُخَارِيُّ.

395. (5) [1/126దృఢం]

’అబ్దుల్లాహ్‌ బిన్‌ ’అబ్బాస్‌ (ర) కథనం: ప్రవక్త (స) వు’దూ’లో ప్రతి అవయవాన్ని ఒక్కసారే కడిగారు. అంతకు మించి చేయలేదు. [43](బు’ఖారీ)

396 – [ 6 ] ( صحيح ) (1/126)

وَعَنْ عَبْدِ اللهِ بْنِ زَيْدٍ: أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم تَوَضَّأَ مَرَّتَيْنِ مَرَّتَيْنِ. رَوَاهُ الْبُخَارِيُّ  .

396. (6) [1/126దృఢం]

’అబ్దుల్లాహ్‌ బిన్‌ ’జైద్‌ (ర) కథనం: ప్రవక్త (స) వు’దూ’లో రెండేసిసార్లు కడిగారు. (బు’ఖారీ)

397 – [ 7 ] ( صحيح ) (1/126)

وَعَنْ عُثْمَانَ رَضِيَ اللهُ عَنْهُ أَنَّهُ تَوَضَّأَ بِالْمَقَاعِدِ فَقَالَ: أَلَا أُرِيْكُمْ وُضُوْءَ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم؟ فَتَوَضَّأَ ثَلَاثًا ثَلَاثًا. رَوَاهُ مُسْلِمٌ.

397. (7) [1/126దృఢం]

’ఉస్మా‘న్‌ (ర) కథనం: అతను కూర్చునేచోట కూర్చొని, ‘నేను మీకు ప్రవక్త (స) వు’దూ’ పద్ధతిని తెలపనా?’ అని అన్నారు. అనంతరం ’ఉస్మా‘న్‌ (ర) ప్రతి అవయవాన్ని మూడుసార్లు కడిగారు. (ముస్లిమ్‌)

ఈ ’హదీసు‘లతో తెలిసిందేమిటంటే, వు’దూ’ చేసే టప్పుడు వు’దూ’ అంగాలను, ఒక్కొక్కసారి, రెండు సార్లు లేక మూడుసార్లు కడకటం సమంజసమే. (జాయ’జ్)

398 – [ 8 ] ( صحيح ) (1/127)

وَعَنْ عَبْدِ اللهِ بْنِ عَمْرٍو قَالَ: رَجَعْنَا مَعَ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم مِنْ مَّكَّةَ إِلَى الْمَدِيْنَةِ حَتَّى إِذَا كُنَّا بمَاءٍ بِالطَّرِيْقِ تَعَجَّلَ قَوْمٌ عِنْدَ الْعَصْرِ فَتَوَضَّؤُوْا وَهُمْ عُجَّالٌ فَانْتَهَيْنَا إِلَيْهِمْ وَأَعْقَابُهُمْ تَلُوْحُ لَمْ يَمَسَّهَا الْمَاءُ. فَقَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “وَيْلٌ لِلْأَعْقَابِ مِنَ النَّارِ أَسْبِغُوا الْوُضُوْءَ”. رَوَاهُ مُسْلِمٌ.

398. (8) [1/127దృఢం]

’అబ్దుల్లాహ్‌ బిన్‌ ’అమ్ర్ (ర) కథనం: మేము ప్రవక్త (స) వెంట మక్కహ్ నుండి మదీనహ్ తిరిగి వస్తున్నాము. దారిలో నీరు ఉన్నచోటుకు చేరాము. కొందరు ’అ’స్ర్‌ నమా’జును చదువుదామని అక్కడ ఆగి తొందరపడి వు’దూ’ చేశారు. మేము అక్కడ చేరుకున్న తరువాత చూస్తే, వారి చీలమండలు ఎండుగా ఉన్నాయి. అప్పుడు ప్రవక్త(స), ‘చీల మండలు పొడిగా ఉన్నవారు నరకానికి గురవుతారు. పరిపూర్ణంగా వు’దూ’చేయండి,’ అని అన్నారు. [44] (ముస్లిమ్‌)

399 – [ 9 ] ( صحيح ) (1/127)

وَعَنْ الْمُغَيْرَةَ بْنِ شُعْبَةَ قَالَ: إِنَّ النَّبِيَّ صلى الله عليه وسلم تَوَضَّأَ فَمَسَحَ بِنَاصِيَتِهِ وَعَلَى الْعَمَامَةِ وَعَلَى الْخُفَّيْنِ. رَوَاهُ مُسْلِمٌ .

399. (9) [1/127దృఢం]

ము’గైర బిన్‌ షు’అబహ్ (ర) కథనం: ప్రవక్త (స) వు’దూ’ చేశారు, తన నుదురుపై మ’స్హ్‌ చేశారు. పగిడీలపై మ’స్హ్‌ చేశారు. ఇంకా తనసాక్సులపై మ’స్హ్‌ చేశారు.[45](ముస్లిమ్‌)

400 – [ 10 ] ( متفق عليه ) (1/127)

وَعَنْ عَائِشَةَ رَضِيَ اللهُ عَنْهَا قَالَتْ: كَانَ النَّبِيُّ صلى الله عليه وسلم يُحِبُّ التَّيَمُّنَ مَا اسْتَطَاعَ فِيْ شَأْنِهِ كُلِّهِ: فِيْ طُهُوْرِهِ وَتَرَجُّلِهِ وَتَنَعُّلِهِ.

400. (10) [1/127ఏకీభవితం]

’ఆయి‘షహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) సాధ్యమైనంత వరకు తన పనులన్నిటినీ తన కుడిచేత్తోనే చేయటాన్ని ఇష్టపడే వారు. పరిశుభ్రత, వు’దూ’, స్నానం, దువ్వెన చేయటంలో, చెప్పులు ధరించటంలోనూ కుడిప్రక్కకు ప్రాధాన్యత ఇచ్చే వారు. [46] (బు’ఖారీ, ముస్లిమ్‌)

—–

రెండవ విభాగం اَلْفَصْلُ الثَّانِي   

401 – [ 11 ] ( صحيح ) (1/127)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ رضي الله عَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِذَا لَبِسْتُمْ وَإِذَا تَوَضَّأْتُمْ فَابْدَؤُوْا بِأَيَامِنْكُمْ”. رَوَاهُ أَحْمَدُ وَأَبُوْ دَاوُدَ .

401. (11) [1/127దృఢం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మీరు దుస్తులుధరించినా, వు’దూ’చేసినా, కుడిచేయి ద్వారా ప్రారంభించండి.” (అ’హ్మద్‌, అబూ దావూ‘ద్‌)

402 – [ 12 ] ( لم تتم دراسته ) (1/127)

وَعَنْ سَعِيْدِ بْنِ زَيْدِ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَا وُضُوْءَ لِمَنْ لَمْ يَذْكُرِ اسْمَ اللهِ عَلَيْهِ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَابْنُ مَاجَهُ .

402. (12) [1/127అపరిశోధితం]

స’యీద్‌ బిన్‌ ’జైద్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, బిస్మిల్లాహ్‌,” అని పలకకుండా వు’దూ’ చేస్తే, వు’దూ’ కాదు.” (తిర్మిజి’, ఇబ్నె మాజహ్)

403 – [ 13 ] ( لم تتم دراسته ) (1/127)

وَرَوَاهُ أَحْمَدُ وَأَبُوْ دَاوُدَ عَنْ أَبِيْ هُرَيْرَةَ.

403. (13) [1/127అపరిశోధితం]

దీన్ని అ’హ్మద్‌, అబూ దావూద్‌ కూడా, అబూ హురైరహ్‌ (ర) కథనంగా, ఉల్లేఖించారు.

404 – [ 14 ] ( لم تتم دراسته ) (1/127)

وَالدَّارَمِيُّ عَنْ أَبِيْ سَعِيْدِ الْخُدْرِيِّ عَنْ أَبِيْهِ وَزَادُوْا فِيْ أَوَّلِهِ.

404. (14) [1/127అపరిశోధితం]

దార్మీ కూడా అబూ స’యీద్‌ ’ఖుద్రీ (ర) ద్వారా ఉల్లే ఖించారు. అయితే, అందులో ఎవరి వు’దూ’ కాదో వారి నమా’జు కూడా కాదు అని ఉంది. అందువల్ల వు’దూ’ ప్రారంభించటానికి ముందు ‘బిస్మిల్లాహ్‌’ అని పలకాలి.

405 – [ 15 ] ( صحيح ) (1/128)

وَعَنْ لَقِيْطِ بْنِ صَبُرَةَ قَالَ: قُلْتُ:يَارَسُوْلَ اللهِ أَخْبِرْنِيْ عَنْ الْوُضُوْءِ. قَالَ: “أَسْبِغِ الْوُضُوْءَ وَخَلِّلْ بَيْنَ الْأَصَابِعِ وَبَالِغْ فِيْ الْاِسْتِنْشَاقِ إِلَّا أَنْ تَكُوْنَ صَائِمًا”. رَوَاهُ أَبُوْ دَاوُدَ وَالتِّرْمِذِيُّ وَ النَّسَائِيُّ وَرَوَى ابْنُ مَاجَهُ وَالدَّارِمِيُّ إِلَى قَوْلِهِ: بَيْنَ الْأَصَابِعِ.

405. (15) [1/128దృఢం]

లఖీ’త్‌ బిన్‌ ’సబుర (ర) కథనం: నేను ప్రవక్త (స)ను వు’దూ’ నేర్పమని విన్నవించుకున్నాను. దానికి ప్రవక్త (స), నీవు పరిపూర్ణంగా వు’దూ’ చేసుకుంటూ ఉండు. వ్రేళ్ళమధ్య ’ఖిలాల్‌ చేసు కుంటూ ఉండు, ముక్కును నీటితో శుభ్రంగా కడుక్కుంటూ ఉండు. అయితే ఉపవాస స్థితిలో మాత్రం అలాచేయకు అని ప్రవచించారు. [47]  (అబూ దావూద్‌, నసాయి‘, ఇబ్నె మాజహ్, తిర్మిజి’)

406 – [ 16 ] ( حسن ) (1/128)

وَعَنِ ابْنِ عَبَّاسٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِذَا تَوَضَّأْتَ فَخَلِّلْ بَيْنَ أَصَابِعَ يَدَيْكَ وَرِجْلَيْكَ”. رَوَاهُ التِّرْمِذِيُّ.

وَرَوَى ابْنُ مَاجَهُ نَحْوُهُ وَقَالَ التِّرْمِذِيُّ: هَذَا حَدِيْثٌ غَرِيْبٌ .

406. (16) [1/128ప్రామాణికం]

ఇబ్నె ’అబ్బాస్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మీరు వు’దూ’ చేసినపుడు చేతుల, కాళ్ళ వ్రేళ్లలో ’ఖిలాల్‌ చేసుకోండి.” (తిర్మిజి’ – ఏకోల్లేఖనం, ఇబ్నె మాజహ్)

407 – [ 17 ] ( صحيح ) (1/128)

وَعَنِ الْمُسْتَوْرَدِ بْنِ شَدَّادٍ قَالَ: رَأَيْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم إِذَا تَوَضَّأَ يَدُلُكَ أَصَابِعَ رِجْلَيْهِ بِخِنْصَرِهِ. رَوَاهُ التِّرْمِذِيُّ وَأَبُوْ دَاوُدَ وَابْنُ مَاجَهُ .

407. (17) [1/128దృఢం]

ముస్తవ్‌రిద్‌ బిన్‌ షద్దాద్‌ (ర) కథనం: నేను ప్రవక్త (స)ను వు’దూ’ చేసినపుడు తన కాళ్ళ వ్రేళ్ళలో చేతి వ్రేళ్ళతో ఖిలాల్ చేస్తూ ఉండగా చూచే వాడిని. (తిర్మిజి’, అబూ దావూ‘ద్‌, ఇబ్నె మాజహ్)

408 – [ 18 ] ( صحيح ) (1/128)

وَعَنْ أَنَسٍ قَالَ: كَانَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم إِذَا تَوَضَّأَ أَخَذَ كَفَّا مِّنْ مَّاءٍ فَأَدْخَلَهُ تَحْتَ حَنَكِهِ فَخَلَّلَ بِهِ لِحْيَتَهُ وَقَالَ: “هَكَذَا أَمَرَنِيْ رَبِّيْ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ.

408. (18) [1/128దృఢం]

అనస్‌ (ర) కథనం: ప్రవక్త (స) వు’దూ’ చేసినపుడు గుక్కెడు నీరు చేతిలో తీసుకొని తన గడ్డం క్రింద చేర్చి ’ఖిలాల్‌ చేసారు. ఇంకా నా ప్రభువు నన్ను ఇలాగే చేయమని ఆదేశించాడు,’ అని అన్నారు. (అబూ దావూద్‌)

దీన్ని బట్టి గడ్డం క్రింద ‘ఖిలాల్‌ చేయటం కూడా ప్రవక్త సాంప్రదాయమే.

409 – [ 19 ] ( لم تتم دراسته ) (1/129)

وَعَنْ عُثْمَانَ رضي الله عَنْهُ: أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم كَانَ يُخَلِّلُ لِحْيَتَهُ. رَوَاهُ التِّرْمِذِيُّ وَالدَّارَمِيُّ .

409. (19) [1/129అపరిశోధితం]

’ఉస్మాన్‌ (ర) కథనం: ప్రవక్త (స) తన గడ్డంలో ’ఖిలాల్‌ చేసేవారు. (తిర్మిజి’, దార్మీ)

410 – [ 20 ] ( صحيح ) (1/129)

وَعَنْ أَبِيْ حَيَّةَ قَالَ: رَأَيْتُ عَلِيًّا تَوَضَّأَ فَغَسَلَ كَفَيْهِ حَتَّى أَنْقَاهُمَا ثُمَّ مَضْمَضَ ثَلَاثًا وَاسْتَنْشَقَ ثَلَاثًا وَغَسَلَ وَجْهَهُ ثَلَاثًا وَذِرْاعَيْهِ ثَلَاثًا وَمَسَحَ بِرَأْسِهِ مَرَّةً ثُمَّ غَسَلَ قَدْمَيْهِ إِلَى الْكَعْبَيْنِ ثُمَّ قَامَ فَأَخَذَ فَضْلَ طُهُوْرِهِ فَشَرِبَهُ وَهُوَ قَائِمٌ ثُمَّ قَالَ أَحْبَبْتُ أَنْ أُرِيْكُمْ كَيْفَ كَانَ طُهُوْرُ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم. رَوَاهُ التِّرْمِذِيُّ وَالنَّسَائِيُّ.

410. (20) [1/129దృఢం]

అబూ ’హయ్య (ర) కథనం: నేను ’అలీ(ర) ను వు’దూ’ చేస్తూ ఉండగా చూశాను. అతను ముందు రెండు అరచేతు లను కడిగారు, 3 సార్లు నీళ్ళు పుక్కిలించారు, మూడుసార్లు ముక్కులో నీళ్ళువేసి శుభ్రపరిచారు, మూడుసార్లు ముఖం కడిగారు, మూడుసార్లు రెండు చేతులను మోచేతులతో సహా కడిగారు, ఒకసారి తల మ’స్హ్‌ చేశారు, 3 సార్లు రెండు కాళ్ళను చీలమండలతో సహా కడిగారు. అనంతరం నిలబడి మిగిలిన నీటిని త్రాగారు. ”ప్రవక్త (స) వు’దూ’ ఎలా చేసేవారో చేసి చూపించడం అంటే నాకు చాలా ఇష్టం,” అని అన్నారు. (తిర్మిజి’, నసాయి‘)

411 – [ 21 ] ( صحيح ) (1/129)

وَعَنْ عَبْدِ خَيْرٍ قَالَ: نَحْنُ جُلُوْسٌ نَّنْظُرُ إِلَي عَلِيٍّ حِيْنَ تَوَضَّأَ فَأَدْخَلَ يَدَهُ الْيُمْنَى فَمَلَأَ فَمَهُ فَمَضْمَضَ وَاسْتَنْشَقَ وَنَثَرَ بِيَدِهِ الْيُسْرَى فَعَلَ هَذَا ثَلَاثَ مَرَّاتٍ. ثُمَّ قَالَ: مَنْ سَرَّهُ أَنْ يَّنْظُرَ إِلَى طُهُوْرِ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم فَهَذَا طُهُوْرُهُ. رَوَاهُ الدَّارَمِيُّ .

411. (21) [1/129దృఢం]

’అబ్దు ’ఖైర్‌ (ర) కథనం: మేము కూర్చొని, ’అలీ (ర) వు’దూ’ వైపు చూస్తూ ఉన్నాం. ’అలీ (ర) ముందు తన కుడి చేతిని ముంతలో వేసి, చేత్తో నీళ్ళు తీసుకొని నోటిలో వేసి పుక్కిలించారు, ముక్కులో నీళ్ళువేసి, ఎడమచేతితో ముక్కును శుభ్రపరిచారు. ఈ విధంగా మూడు సార్లు చేశారు. అనంతరం, ‘ఎవరైనా ప్రవక్త (స) వు’దూ’ చూడాలను కుంటే, ఆయన వు’దూ’ ఇలా ఉండేది,’ అని అన్నారు. (దార్మీ)

412 – [ 22 ] ( صحيح ) (1/130)

وَعَنْ عَبْدِ اللهِ بْنِ زَيْدٍ قَالَ: رَأَيتْ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم مَضْمَضَ وَاسْتَنْشَقَ مِنْ كَفٍّ وَّاحِدَةٍ فَعَلَ ذَلِكَ ثَلَاثًا. رَوَاهُ أَبُوْ دَاوُدَ وَالتِّرْمِذِيُّ .

412. (22) [1/130దృఢం]

’అబ్దుల్లాహ్‌ బిన్‌ ’జైద్‌ కథనం: నేను ప్రవక్త (స)ను వు’దూ’ చేస్తుండగా చూశాను. ఆయన ఒక చేత్తోనే నీళ్ళు పుక్కిలించారు, ముక్కులోనూ వేసారు. ఈ విధంగా మూడు సార్లు చేశారు. అంటే ఒక చేత్తో తీసుకున్న నీటితోనే పుక్కి లించారు, ముక్కులో నీళ్ళువేశారు. ఈ విధంగా మూడు సార్లు చేశారు. (అబూ దావూద్‌, తిర్మిజి’)

413 – [ 23 ] ( صحيح ) (1/130)

وَعَنِ ابْنِ عَبَّاسٍ أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم مَسَحَ بِرَأْسِهِ وَأُذُنَيْهِ: بَاطِنَهُمَا بِالسَّبَّاحَتَيْنِ وَظَاهِرَهُمَا بِإِبْهَامَيْهِ.  رَوَاهُ النَّسَائِيُّ.

413. (23) [1/130దృఢం]

ఇబ్నె ’అబ్బాస్‌ (ర) కథనం: ప్రవక్త (స) తన తలపై మ’స్హ్‌ చేశారు. ఇంకా రెండు చెవుల లోపలి భాగాలను చూపుడు వ్రేలితో, బయటి భాగాలను తన బొటన వ్రేలితో మ’స్హ్‌ చేశారు. (నసాయి‘)

414 – [24]( حسن ) (1/130)

وَعَنِ الرُّبِيّعِ بِنْتِ مُعَوَّذٍ: أَنَّهَا رَأَتِ النَّبِيَّ صلى الله عليه وسلم يَتَوَضَّأُ قَالَتْ فَمَسَحَ رَأْسَهُ مَا أَقْبَلَ مِنْهُ وَمَا أَدْبَرَ وَصُدْغَيْهِ وَأُذُنَيْهِ مَرَّةٌ وَّاحِدَةً.

وَفِيْ رَوَايَةٍ أَنَّهُ تَوَضَّأَ فَأَدْخَلَ أصْبَعَيْهِ فِيْ جُحْرَيْ أُذُنَيْهِ. رَوَاهُ أَبُوْ دَاوُدَ وَرَوَى التِّرْمِذِيّ الرَّوَايَةَ الْأَوْلَى. وَأَحْمَدُ وَابْنُ مَاجَه الثَّانِيَةَ .

414. (24) [1/130ప్రామాణికం]

రుబీ’అ బిన్‌తె ము’అవ్విజ్‌‘ (ర) కథనం: ఆమె ప్రవక్త (స)ను వు’దూ’ చేస్తుండగా చూశారు. ప్రవక్త (స) తన తల ముందు భాగం, వెనుక భాగం మ’స్హ్‌ చేశారు. ఇంకా రెండు చెవులపై భాగాలపై, లోపలి భాగాలలో ఒకసారి మ’స్హ్‌ చేశారు.

మరో ఉల్లేఖనంలో ఇలా ఉంది, ‘ప్రవక్త వు’దూ’ చేశారు. తన రెండు చూపుడు వ్రేళ్ళతో చెవుల లోపలి భాగాలను శుభ్రపరిచారు.’ (అబూ దావూద్‌, తిర్మిజి’-మొదటిది. అ’హ్మద్, ఇబ్నె మాజహ్-రెండవది.)

415 – [ 25 ] ( صحيح ) (1/130)

وَعَنْ عَبْدِ اللهِ بْنِ زَيْدٍ: أَنَّهُ رَأَى النَّبِيَّ صلى الله عليه وسلم تَوَضَّأَ وَأَنَّهُ مَسَحَ رَأْسَهُ بِمَاءٍ غَيْرِ فَضْلِ يَدَيْهِ. رَوَاهُ التِّرْمِذِيُّ وَرَوَاهُ مُسْلِمٌ مَعَ زَوَائِدِ .

415. (25) [1/130దృఢం]

’అబ్దుల్లాహ్‌ బిన్‌ ’జైద్‌ (ర) కథనం: అతను ప్రవక్త (స)ను వు’దూ’ చేస్తుండగా చూశారు. ప్రవక్త (స) ప్రత్యేక నీటితో తలపై మ’స్హ్‌ చేశారు. (తిర్మిజి‘, ముస్లిమ్‌)

ముస్లిమ్‌లో కొన్ని పదాలు ‘బి మాఇన్ గైరి ఫ’ధ్లి’అధికంగా ఉన్నాయి.

ఈ ’హదీసు‘ ద్వారా తల మ’స్హ్‌ కోసం ప్రత్యేకంగా నీటిని తీసుకోవటం. ఉత్తమం, అని తెలుస్తుంది.

416 – [ 26 ] ( صحيح ) (1/130)

وَعَنْ أَبِيْ أَمَامَةَ ذَكَرَ وُضُوْءَ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم قَالَ: وَكَانَ يَمْسَحُ الْمَاقَيْنِ وَقَالَ: اَلْأُذُنَانِ مِنَ الرَّأْسِ. رَوَاهُ ابْنُ مَاجَهُ وَأَبُوْ دَاوُدَ وَالتِّرْمِذِيُّ وَذَكرا: قَالَ حَمَّادٌ: لَا أَدْرِيْ اَلْأُذُنَانِ مِنَ الرَّأْسِ مِنْ قَوْلِ أَبِيْ أُمَامَةَ أَمْ مِّنْ قَوْلِ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم.

416. (26) [1/130దృఢం]

అబూ ’ఉమామహ్ (ర) ప్రవక్త (స) వు’దూ’ గురించి ప్రస్తావిస్తూ, ప్రవక్త (స) కళ్ళ చివరల మ’స్హ్‌ చేసి, రెండు చెవులు తలలోని భాగాలే అని అన్నారు. [48] (ఇబ్నె మాజహ్, అబూ దావూద్‌, తిర్మిజి’)

అయితే ’హమ్మాద్‌, ‘రెండు చెవులు తల భాగాలు’ అనే పలుకు ప్రవక్త (స) చెప్పారా? లేక అబూ ఉమామహ్ చెప్పారా అనేది నాకు తెలియదు,’ అని అన్నారు.

417 – [ 27 ] ( حسن ) (1/131)

وَعَنْ عَمْرِو بْنِ شُعَيْبٍ عَنْ أَبِيْهِ عَنْ جَدِّهِ قَالَ: جَاءَ أَعْرَابِيٌّ إِلَى النَّبِيِّ صلى الله عليه وسلم يَسْأَلُهُ عَنْ اَلْوُضُوْءِ فَأَرَاهُ ثَلَاثًا ثَلَاثًا ثُمَّ قَالَ: “هَكَذَا الْوُضُوْءُ فَمَنْ زَادَ عَلَى هَذَا فَقَدْ أَسَاءَ وَتَعَدَّى وَظَلَمَ”. رَوَاهُ النَّسَائِيُّ وَابْنُ مَاجَهُ وَرَوَى أَبُوْ دَاوُدَ مَعْنَاهُ.

417. (27) [1/131ప్రామాణికం]

’అమ్ర్ బిన్‌ షు’ఐబ్‌ (ర) తన తండ్రి తాతల ద్వారా కథనం: ఒక బదూ వ్యక్తి వచ్చి, ప్రవక్త (స)ను వు’దూ’ పద్ధతి గురించి అడిగాడు. అప్పుడు ప్రవక్త (స) వు’దూ’ చేస్తూ ప్రతి భాగాన్ని 3సార్లు కడిగి చూపించారు. ఇంకా, ‘ఇలాగే వు’దూ’ చేయాలని, మూడు కంటే ఎక్కువసార్లు చేసినవారు అపరాధం చేశారు, హద్దుమీరి ప్రవర్తించారు.’ అని అన్నారు (నసాయి‘, ఇబ్నె మాజహ్, అబూ దావూద్‌)

418 – [ 28 ] ( صحيح ) (1/131)

وَعَنْ عَبْدِ اللهِ بْنِ الْمُغَفَّلِ أَنَّهُ سَمِعَ ابْنَهُ يَقُوْلُ: اللهُمَّ إِنِّيْ أَسْأَلُكَ الْقَصْرَ الْأَبْيَضَ عَنْ يَّمِيْنِ الْجَنَّةِ قَالَ: أَيْ بُنَيَّ سَلِ اللهَ الْجَنَّةَ وَتَعُوْذُ بِهِ مِنَ النَّارِ فَإِنِّيْ سَمِعْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ: “إِنَّهُ سَيَكُوْنُ فِيْ هَذِهِ الْأُمَّةِ قَوْمٌ يَّعْتَدُوْنَ فِيْ الطُّهُوْرِ وَالدُّعَاءِ”. رَوَاهُ أَحْمَدُ وَأَبُوْ دَاوُدَ وَابْنُ مَاجَهُ.

418. (28) [1/131దృఢం]

’అబ్దుల్లాహ్‌ బిన్‌ ము’గప్ఫల్‌ (ర) తన కుమారుడు ఈ దు’ఆ పఠిస్తూ ఉండగా విన్నారు, అల్లాహుమ్మ, ఇన్నీ, అస్అలుక అల్స్రల్అబ్ద్ అన్యమీనిల్జన్నహ్‌.” – ‘ఓ అల్లాహ్‌! నేను నిన్ను స్వర్గానికి కుడివైపు ఉన్న తెల్లని భవనాన్ని కోరుతున్నాను.’ ’అబ్దుల్లాహ్‌ తన కుమారునితో, “ఓ కుమారా! నీవు అల్లాహ్‌(త)ను స్వర్గంకోరు, నరకంనుండి శరణుకోరు. ఎందుకంటే, భవిష్యత్తులో ఈ అనుచర సమాజంలో పరిశుభ్రతలో, దు’ఆలో హద్దులుమీరి ప్రవర్తించేవారు ఉంటారని ప్రవచిస్తూ ఉండగా నేను విన్నాను. అంటే మూడు సార్లకంటే అధికంగా కడగటం జరుగుతుంది. అదేవిధంగా దు’ఆలో కూడా హద్దులుమీరి ప్రవర్తించటం జరుగుతుంది,” అని అన్నారు. (అ’హ్మద్‌, అబూ దావూద్‌, ఇబ్నె మాజహ్)

419 – [ 29 ] ( ضعيف ) (1/131)

وَعَنْ أَبَيِّ بْنِ كَعْبٍ عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ: “إِنَّ لِلْوُضُوْءِ شَيْطَانًا يُقَالَ لَهُ الْوَلَهَانُ فَاتَّقُوْا وَسْوَاسَ الْمَاءِ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَابْنُ مَاجَهُ وَقَالَ التِّرْمِذِيُّ: هَذَا حَدِيْثٌ غَرِيْبٌ وَلَيْسَ إِسْنَادِهِ بِالْقَوِيِّ عِنْدَ أَهْلِ الْحَدِيْثِ لِأَناَّ لَا نَعْلَمُ أَحَدًا أَسْنَدَهُ غَيْرُ خَارِجَةَ وَهُوَ لَيْسَ بِالْقَوِيِّ عِنْدَ أَصْحَابِنَا .

419. (29) [1/131బలహీనం]

’ఉబై బిన్‌ క’అబ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”వు’దూ’పై ఒక షై’తాన్‌ నియమించబడి ఉన్నాడు. వాడిని వలహాన్ అంటారు. అతడు ప్ర్జజల మనస్సులలో కలతలు పుట్టిస్తుంటాడు.  కనుక నీటి గురించి వచ్చే కలతలకు దూరంగా ఉండండి.” (తిర్మిజి’ – ఏకోల్లేఖనం, ఇబ్నె మాజహ్)

420 – [ 30 ] ( ضعيف ) (1/131)

وَعَنْ مُعَاذِ بْنِ جَبَلٍ قَالَ: رَأَيْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم إِذَا تَوَضَّأَ مَسَحَ وَجْهَهُ بِطَرْفِ ثَوْبِهِ. رَوَاهُ التِّرْمِذِيُّ .

420. (30) [1/131బలహీనం]

ము’ఆజ్‌‘ బిన్‌ జబల్‌ (ర) కథనం: ప్రవక్త (స) వు’దూ’ చేసిన తర్వాత వస్త్రం యొక్క ఒక చివరి భాగంతో ముఖాన్ని తుడుచుకుంటూ ఉండగా నేను చూశాను. (తిర్మిజి’)

421 – [ 31 ] ( لم تتم دراسته ) (1/132)

وَعَنْ عَائِشَةَ رضي الله عَنْها قَالَتْ: كَانَتْ لِرَسُوْلِ اللهِ صلى الله عليه وسلم خِرْقَةٌ يَّنَشِّفُ بِهَا أَعْضَاءَهُ بَعْدَ الْوُضُوْءِ. رَوَاهُ التِّرْمِذِيُّ وَقَالَ: هَذَا حَدِيْثٌ لَيْسَ بِالْقَائِمِ وَأَبُوْ مَعَاذٍ الرَّاوِيْ ضَعِيْفٌ عِنْدَ أَهْلِ الْحَدِيْثِ .

421. (31) [1/132అపరిశోధితం]

’ఆయి‘షహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) వద్ద ఒక వస్త్రం ఉండేది. వు‘దూ’ తర్వాత దానితో తుడుచుకునే వారు. (తిర్మిజి’ / బలహీనం)

—–

  మూడవ విభాగం  الْفَصْلُ الثَّالِثُ  

422 – [ 32 ] ( ضعيف ) (1/132)

عَنْ ثَابِتِ بْنِ أَبِيْ صَفِيَّةَ قَالَ: قُلْتُ لِأَبِيْ جَعْفَرٍ هُوَ مُحَمَّدُ الْبَاقِرُ حَدَّثَكَ جَابِرٌ: أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم تَوَضَّأَ مَرَّةً مَرَّةً وَمَرَتَيْنِ مَرَتَيْنِ وَثَلَاثًا ثَلَاثًا. قَالَ: نَعَمْ . رَوَاهُ التِّرِمِذِيُّ وَابْنُ مَاجَهُ .

422. (32) [1/132బలహీనం]

సా‘బిత్‌ బిన్‌ అబీ ’సఫియ్యహ్‌ (ర) కథనం: నేను అబూ జ’అఫర్‌తో, మీ ద్వారా జాబిర్‌ (ర) ఒక ’హదీసు‘ ఉల్లేఖించారు. అదేమిటంటే, ‘ప్రవక్త (స) వు’దూ’లో వేరు వేరు సమయాలలో, అవయవాలను ఒకసారి, రెండుసార్లు లేక మూడుసార్లు కడిగారు,’ అని అన్నారు. దానికి అతను, ‘అవును,’ అని అన్నారు. (తిర్మిజి’, ఇబ్నె మాజహ్)

423 – [ 33 ] ( لا أصل له ) (1/132)

وعَنْ عَبِدِ اللهِ بْنِ زَيْدٍ قَالَ: إِنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم تَوَضَّأَ مَرَّتَيْنِ مَرَّتَيْنِ وقَالَ: هُوَ “نُوْرٌ عَلَى نُوْرٌ” .

423. (33) [1/132నిరాధారితం]

’అబ్దుల్లాహ్‌ బిన్‌ ’జైద్‌ (ర) కథనం: ప్రవక్త (స) వు’దూ’ భాగాలను రెండుసార్లు కడిగారు. ఇంకా ఇది రెట్టింపు వెలుగు అన్నారు. అంటే ఒకసారి కడిగితే విధి పూర్తవు తుంది. ఇది ఒక వెలుగు. రెండుసార్లు కడగటం వల్ల సాంప్రదాయం పూర్తవుతుంది. ఇది రెండవ వెలుగు ఫలితంగా రెట్టింపు వెలుగు నిరూపించబడింది. (ర’జీన్‌)

424 – [ 34 ] ( صحيح ) (1/132)

وَعَنْ عُثْمَانَ رضي الله عَنْهُ قَالَ: إِنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم تَوَضَّأَ ثَلَاثًا ثَلَاثًا وَقَالَ: “هَذَا وُضُوْئِيْ وَوُضُوْءُ الْأَنْبِيَاءِ قَبْلِيْ وَوُضُوْءُ إِبْرَاهِيْمَ”. رَوَاهُمَا رَزِيْنٌ وَالنَّوِوْيُّ ضَعَّفَ الثَّانِيَ فِيْ شَرْحِ مُسْلِم.

424. (34) [1/132దృఢం]

’ఉస్మాన్‌ (ర) కథనం: ప్రవక్త (స) వు’దూ’ భాగాలను మూడుసార్లు కడిగారు. ఇంకా, ‘ఇదే నా వు’దూ’, నా కంటే ముందు ప్రవక్తల, ఇబ్రాహీమ్‌ల వు’దూ’ ఇదే,’ అన్నారు. (ర’జీన్‌, నవవీ) ధార్మిక పండితులు, ‘హదీసు‘వేత్తలు నవవీ రెండవ ‘హదీసు‘ను బలహీన మైనదని ముస్లిమ్‌ వివరణలో పేర్కొన్నారు.

425 – [ 35 ] ( صحيح ) (1/132)

وَعَنْ أَنَسٍ قَالَ:كَانَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم يَتَوَضَّأُ لِكُلِّ صَلَاةٍ وَكَانَ أَحَدُنَا يَكْفِيْهِ الْوُضُوْءُ مَا لَمْ يُحْدِثْ. رَوَاهُ الدَّرَامِيُّ.

425. (35) [1/132దృఢం]

 అనస్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రతి నమా’జుకు వు’దూ’ చేసుకునేవారు. మాకు ఒకే ఒక్క వు’దూ’ సరిపోయేది. [49]  (దార్మీ)

426 – [ 36 ] ( حسن ) (1/133)

وَعَنْ مُحَمَّدِ بْنِ يَحْيَى بْنِ حَبَّانِ الْأَنْصَارِي ثم المازني مازن بني النجار عَنْ عُبَيْدِ اللهِ بْنِ عَبْدِ اللهِ بْنِ عُمَرَ قَالَ: قُلْتُ لَهُ أَرَأَيْتَ وُضُوْءَ عَبْدِ اللهِ بْنِ عُمَرَ لِكُلِّ صَلَاةٍ طَاهِرًا كَانَ أَوْ غَيْرَ طَاهِرٍ عَمَّنْ أَخَذَهُ؟ فَقَالَ: حَدَّثَتْهُ أَسْمَاءُ بِنْتُ زَيْدِ بْنِ الْخَطَّابِ أَنَّ عَبْدَ اللهِ بْنَ حَنْظَلَةَ بْنِ أَبِيْ عَامِرٍ ابْنِ الْغَسِيْلَ حَدَّثَهَا أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم كَانَ أَمَرَ بِالْوُضُوْءِ لِكُلِّ صَلَاةٍ طَاهِرًا كَانَ أَوْ غَيْرَ طَاهِرٍ فَلَمَّا شَقَّ ذَلِكَ عَلَى رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم أَمَرَ بِالسِّوَاكِ عِنْدَ كُلِّ صَلَاةٍ وَّوُضِعَ عَنْهُ الْوُضُوْءُ إِلَّا مِنْ حَدَثٍ قَالَ: فَكَانَ عَبْدُ اللهِ يَرَى أَنَّ بِهِ قُوَّةً عَلَى ذَلِكَ كَانَ يَفْعَلُهُ حَتَّى مَاتَ. رَوَاهُ أَحْمَدُ.

426. (36) [1/133ప్రామాణికం]

ము’హమ్మద్‌ బిన్‌ య’హ్‌యా బిన్‌ ’హబ్బాన్‌ కథనం: నేను ’ఉబైదుల్లాహ్‌ బిన్‌ ’అబ్దుల్లాహ్‌ బిన్‌ ’ఉమర్‌ (ర) ను ’అబ్దుల్లాహ్‌ బిన్‌ ’ఉమర్‌ వు’జూతో ఉన్నా లేకున్నా ప్రతి నమా’జుకు వు’జూ చేసేవారా? ఇంకా ఆ విషయాన్ని ఎక్కడ నుండి పొందారు,” అని ప్రశ్నించారు. దానికి ఆయన తనకు అస్మా బిన్‌తె ’జైద్‌ బిన్‌ ’ఖ ‘త్తాబ్‌ ఇలా వినిపించారు, ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ’హన్‌’జలహ్‌ బిన్‌అబీ ’ఆమిర్‌ అల్‌ ’గసీల్‌ తనకు ఇలా తెలిపారు,”ప్రవక్త (స) వు’దూ’తో ఉన్నా లేకున్నా ప్రతి నమా’జుకు వు’దూ’ చేయమని ఆదేశించబడ్డారు. కాని ఇది ప్రవక్త (స) కు కష్టంగా ఉండేది. అప్పుడు ప్రవక్త (స) కు మిస్వాక్‌ చేయమని ఆదేశించబడింది. ప్రతి నమా’జుకు వు’దూ’ రద్దు చేయబడింది. అయితే ’అబ్దుల్లాహ్‌కు ప్రతి నమా’జుకు వు’దూ’ చేసే శక్తి ఉండేది. అందువల్ల ప్రతి నమా’జుకు వు’దూ చేసుకునేవారు. చివరి శ్వాస వరకు ఇలాగే కొనసాగించారు.” [50] (అ’హ్మద్‌)

427 – [ 37 ] ( ضعيف ) (1/133)

وَعَنْ عَبْدِ اللهِ بْنِ عَمْرِو بْنِ الْعَاصِ أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم: مَرَّ بِسَعْدٍ وَهُوَ يَتَوَضَّأُ فَقَالَ: “مَا هَذَا السَّرَفُ يَا سَعْدُ”. قَالَ: أَفِيْ الْوُضُوْءِ سَرَفٌ؟ قَالَ: “نَعَمْ وَإِنْ كُنْتَ عَلَى نَهْرٍ جَارٍ”. رَوَاهُ أَحْمَدُ وَابْنُ مَاجَهُ.

427. (37) [1/133-బలహీనం]

’అబ్దుల్లాహ్‌ బిన్‌ ’అమ్ర్‌ బిన్‌ అల్‌ ’ఆస్‌ (ర) కథనం: ప్రవక్త (స) స’అద్‌ ప్రక్క నుండి వెళ్ళడం జరిగింది. అప్పుడతను వు’దూ’ చేస్తున్నారు. అది చూసిన ప్రవక్త (స), ‘వు’దూ’లో దుబారా ఖర్చు చేస్తున్నావా ఓ స’అద్‌!’ అని అన్నారు. దానికి అతను, ‘వు’దూ’లో దుబారా ఖర్చు ఏంటి?’ అని అన్నారు. దానికి ప్రవక్త (స), ‘నీటిని వృథా ఖర్చు చేయటం దుబారా ఖర్చు అవుతుంది, ఒకవేళ నీవు పారుతున్న కాలువ వద్ద వు’దూ’ చేసినా సరే,’ అని అన్నారు. (అ’హ్మద్‌, ఇబ్నె మాజహ్)

428 – [ 38 ] ( ضعيف ) (1/133)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ وَابْنِ مَسْعُوْدٍ وَابْنِ عُمَرَ عَنِ النَّبِيَّ صلى الله عليه وسلم قَالَ: “مَنْ تَوَضَّأَ وَذَكَرَ اسْمَ اللهِ فَإِنَّهُ يُطَهِّرُ جَسَدَهُ كُلَّهُ وَمَنْ تَوَضَّأَ وَلَمْ يُذْكَرِ اسْمَ اللهِ لَمْ يَطْهُرْ إِلَّا مَوْضِعُ الْوُضُوْءِ”.

428. (38) [1/133బలహీనం]

అబూ హురైరహ్‌ (ర) మరియు ఇబ్నె మస్‌’ఊద్‌ మరియు ఇబ్నె ’ఉమర్‌ (ర) ప్రవక్త (స) ద్వారా కథనం: ప్రవక్త (స) ప్రవచనం, బిస్మిల్లాహ్‌” అని పలికి వు’దూ’ చేసిన వ్యక్తి తన శరీరాన్నంతటిని పరిశుద్ధ పరచు కున్నాడు, బిస్మిల్లాహ్‌ పఠించకుండా వు’దూ’ చేసిన వాడు కేవలం వు’దూ’ భాగాలనే పరిశుద్ధపరచు కున్నాడు. (దార ఖు’త్నీ)

అందువల్ల వు’దూ’కు ముందు బిస్మిల్లాహ్‌ పలకటం చాలా మంచిది.

429 – [ 39 ] ( ضعيف ) (1/133)

وَعَنْ أَبِيْ رَافِعٍ قَالَ: كَانَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: إِذَا تَوَضَّأَ وُضُوْءَ الصَّلَاةِ حَرَّكَ خَاتَمَهُ فِيْ أصْبَعِهِ. رَوَاهُمَا الدَّارَ قُطْنِيُّ وَرَوَى ابْنُ مَاجَهُ الْأَخِيْرَ.

429. (39) [1/133బలహీనం]

అబూ రా’ఫె (ర) కథనం: ప్రవక్త (స) నమా’జు కోసం వు’దూ’ చేసినపుడు, ఒకవేళ చేతిలో ఉంగరం ఉంటే, తన ఉంగరాన్ని అటూ ఇటూ కదుపుతారు. ఉంగరం క్రింద భాగం కూడా నీటితో తడవాలని. (దార ఖు’త్నీ, ఇబ్నె మాజహ్)

=====

5-بَابُ الْغُسْلِ

  • సంపూర్ణ స్నానం 

మొదటి విభాగం  اَلْفَصْلُ الْأَوَّلُ  

430 – [ 1 ] ( متفق عليه ) (1/135)

عَنْ أَبِيْ هُرَيْرَةَ عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ: “إِذَاجَلَسَ بَيْنَ شُعَبِهَا الْأَرْبَعِ ثُمَّ جَهَدَهَا فَقَدْ وَجَبَ الْغُسْلُ وَإِنْ لَّمْ يُنْزِلْ”.

430. (1) [1/135ఏకీభవితం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మీలో ఎవరైనా తన భార్యతో సంభోగం చేస్తే, సంపూర్ణ స్నానం తప్పనిసరి అవుతుంది. వీర్యం వెలువడక పోయినా సరే.” [51] (బు’ఖారీ, ముస్లిమ్‌)

431 – [ 2 ] ( صحيح ) (1/135)

وَعَنْ أَبِيْ سَعِيْدٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِنَّمَا الْمَاءُ مِنَ الْمَاءِ”. رَوَاهُ مُسْلِمٌ.

قَالَ الشَّيْخُ الْإِمَامُ مُحْييُ السُّنَّةِ رَحِمَهُ اللهُ: هَذَا مَنْسُوْخٌ.

431. (2) [1/135దృఢం]

అబూ స’యీద్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”నీళ్ళు, నీటికి కారణం అవుతాయి. అంటే వీర్యం వెలు వడితే స్నానం తప్పనిసరి అయిపోతుంది.” [52] (ముస్లిమ్‌)

432 – [ 3 ] ( لم تتم دراسته ) (1/135)

وَقَالَ ابْنُ عَبَّاسٍ: إِنَّمَا الْمَاءُ مِنَ الْمَاءِ فِيْ الْاِحْتِلَامِ. رَوَاهُ التِّرْمِذِيُّ وَلَمْ أَجِدْهُ فِيْ الصَّحِيْحَيْنِ .

432. (3) [1/135అపరిశోధితం]

ఇబ్నె ’అబ్బాస్‌ (ర) కథనం: నీరు, నీరు వల్ల కలుగు తుంది. అంటే వీర్య స్ఖలనం కోసం ఉంది. అంటే ఎవరైనా స్వప్నం చూసి వీర్యస్ఖలనం అయితే, అంటే వీర్యం వెలు వడితే స్నానం తప్పనిసరి అవుతుంది. కలలో ఒకవేళ వీర్య స్ఖలనం జరగకపోతే స్నానం తప్పనిసరికాదు. (తిర్మిజి’. బు’ఖారీ, ముస్లిమ్‌లలో ఈ ఉల్లేఖనం దొరకలేదు).

433 – [ 4 ] ( متفق عليه ) (1/135)

وَعَنْ أُمِّ سَلَمَةَ قَالَتْ: قَالَتْ أُمُّ سُلَيْمٍ: يَا رَسُوْلَ اللهِ إِنَّ اللهَ لَا يَسْتَحْيِيْ مِنَ الْحَقِّ فَهَلْ عَلَى الْمَرْأَةِ مِنْ غُسْلٍ إِذَا احْتَلَمَتْ. قَالَ النَّبِيُّ صلى الله عليه وسلم: “إِذَا رَأَتِ الْمَاءَ”. فَغَطَّتْ أُمُّ سَلَمَةَ وَجْهَهَا وَقَالَتْ يَا رَسوْلَ اللهِ أَوْتَحْتَلِمُ الْمَرْأَةُ. قَالَ: “نَعَمْ تَرِبَتْ يَمِيْنُكَ فَبِمَ يُشْبِهُهَا وَلَدُهَا؟”

433. (4) [1/135ఏకీభవితం]

ఉమ్మె సలమహ్ (ర) కథనం: ఉమ్ము సులైమ్ ప్రవక్త (స) ను, ‘ఓ ప్రవక్తా! అల్లాహ్‌(త) వాస్తవాన్ని పేర్కొనటంలో సిగ్గుపడడు. స్త్రీకి వీర్య స్ఖలనం జరిగితే స్నానం తప్పనిసరి అవుతుందా?’ అని విన్నవించు కున్నారు. దానికి ప్రవక్త (స), ‘అవును, నీటిని అంటే వీర్యాన్ని చూస్తే,’ అని అన్నారు. ఉమ్మె సలమహ్ సిగ్గుతో తన ముఖాన్ని కప్పుకొని, ‘ఓ ప్రవక్తా! స్త్రీకి కూడా వీర్య స్ఖలనం జరుగుతుందా?’ అని విన్న వించుకున్నారు. దానికి ప్రవక్త (స) ‘నీ కుడిచేయి నాశనం గాను, అందువల్లే కదా బిడ్డ తల్లి పోలికలు కలిగి ఉంటాడు.’ అని అన్నారు. (బు’ఖారీ, ముస్లిమ్‌)

434 – [ 5 ] ( صحيح ) (1/135)

وَزَادَ مُسْلِمٌ بِرَوَايَةِ أُمِّ سَلَيْمٍ: “إِنَّ مَاءَ الرَّجُلِ غَلِيْظٌ أَبْيَضُ وَمَاءُ الْمَرْأَةِ رَقِيْقٌ أَصْفَرُ فَمَنْ أَيُّهُمَا عَلَا أَوْ سَبَقَ يَكُوْنُ مِنْهُ الشُّبَهُ”.

434. (5) [1/135దృఢం]

ముస్లిములో ఉమ్మె సులైమ్‌ ఉల్లేఖనం ఉంది. అందులో ఈ పదాలు అధికంగా ఉన్నాయి. ”పురుషుడి వీర్యం చిక్కగా తెల్లగా ఉంటుంది. స్త్రీ యొక్క వీర్యం పలుచగా, పసుపు పచ్చగా ఉంటుంది. ఎవరి వీర్యం అధిగమిస్తే లేదా ముందు వెలువడితే, బిడ్డ వారిలా ఉంటాడు.” [53]

435 – [ 6 ] ( متفق عليه ) (1/136)

وَعَنْ عَائِشَةَ زَوْجُ النَّبِيِّ صلى الله عليه وسلم أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم:كَانَ إِذَا اغْتَسَلَ مِن الْجَنَابَةِ بَدَأَ فَغَسَلَ يَدَيْهِ ثُمَّ يَتَوَضَّأُ كَمَا يَتَوَضَّأُ لِلصَّلَاةِ ثُمَّ يُدْخِلُ أَصَابِعَهُ فِيْ الْمَاءِ فَيُخَلِّلُ بِهَا أَصُوْلَ شَعْرِهِ ثُمَّ يَصُبُّ عَلَى رَأْسِهِ ثَلَاثَ غُرَفَاتٍ بِيَدَيْهِ ثُمَّ يُفِيْضُ الْمَاءَ عَلَى جِلْدِهِ كُلِّهِ وَفِيْ رَوَايَةٍ لِمُسْلِم: يَبْدَأُ فَيَغْسِلُ يَدَيْهِ قَبْلَ أَنْ يَّدْخُلُهُمَا الْإِنَاءَ ثُمَّ يُفْرِغُ بِيَمِيْنِهِ عَلَى شِمَالِهِ فَيَغْسِلُ فَرْجَهُ ثُمَّ يَتَوَضَّأُ .

435. (6) [1/136ఏకీభవితం]

’ఆయి‘షహ్‌ (ర) కథనం: “ప్రవక్త (స) జనాబత్‌ నుండి స్నానం చేయాలనుకున్నప్పుడు ముందు రెండు చేతులను మణికట్ల వరకు కడుగుతారు. ఆ తరువాత మర్మాంగాన్ని కడుగుతారు. మర్మాంగం కడిగిన చేతిని నేలపై గీసి కడుగుతారు. ఆ తరువాత నమా’జు కొరకు వు’దూ’ చేసినట్లు వు’దూ’ చేస్తారు. ఆ తరువాత తలవెంట్రుకలను, గడ్డం వెంట్రుకలను వ్రేళ్ళను చొప్పించి కడుగుతారు. ఆ తరువాత మూడు దోసెళ్ళ నీరు తలపై వేస్తారు. అనంతరం శరీరాన్నంతా నీటితో కడుగుతారు.” (బు’ఖారీ, ముస్లిమ్‌)

ముస్లిమ్‌ ఉల్లేఖనలో ఇలా ఉంది, ”ప్రవక్త (స) స్నానం ప్రారంభిస్తారు. స్నానం చేసే నీటిలో చేయివేసే ముందు తన రెండు చేతులను కడుక్కుంటారు. ఆ తరువాత కుడి చేతితో ఎడమ చేతిపై నీళ్ళు వేస్తారు. మర్మాంగం కడుగుతారు. ఆ తర్వాత వు’దూ’ చేస్తారు.”

436 – [ 7 ] ( متفق عليه ) (1/136)

وَعَنْ ابْنِ عَبَّاسٍ قَالَ: قَالَتْ مَيْمُوْنَةُ: وَضَعْتُ لِلنَّبِيِّ صلى الله عليه وسلم غُسْلًا فَسَتَرْتُهُ بِثَوْبِ وصَبَّ عَلَى يَدَيْهِ فَغَسَلُهُمَا ثُمَّ صَبَّ بيمينه عَلَى شِمَالِهِ فَغَسَلَ فَرْجَهُ فَضَرَبَ بِيَدِهِ الْأَرْضَ فَمَسَحَهَا ثُمَّ غَسَلَهَا فَمَضْمَضَ وَاسْتَنْشَقَ وَغَسَلَ وَجْهَهُ وَذِرَاعَيْهِ ثُمَّ صَبَّ عَلَى رَأْسِهِ وَأَفَاضَ عَلَى جَسَدِهِ ثُمَّ تَنَحَّى فَغَسَلَ قَدَمَيْهِ فَنَاوَلْتُهُ ثَوْبًا فَلَمْ يَأْخُذْهُ فَانْطَلَقَ وَهُوَ يَنْفُضُ يَدَيْهِ. وَلَفْظُهُ لِلْبُخَارِي.

436. (7) [1/136ఏకీభవితం]

ఇబ్నె ’అబ్బాస్‌ (ర) కథనం: మైమూనహ్(ర) నాతో ఇలా అన్నారు, ”ప్రవక్త (స) స్నానం చేయటానికి నేను నీళ్ళు పెట్టాను. ఒక వస్త్రాన్ని తెరచాటుగా ఉంచాను. ప్రవక్త (స) స్నానం చేయటం ప్రారంభించారు. ముందు రెండు చేతులపై నీళ్ళువేసి చేతులను కడిగారు. ఆ తరువాత కుడిచేతితో ఎడమ చేతిపై నీళ్ళు వేశారు. మర్మాంగాన్ని కడిగారు. మర్మాంగాన్ని కడిగిన చేతిని నేలపై గీసి, దాన్ని కడిగారు. ఆ తరువాత నీళ్ళు పుక్కిలించారు, ముక్కులో నీళ్ళు వేశారు, ముఖాన్ని కడిగారు, రెండు చేతులను మోచేతులతో సహా కడిగారు, తలపై నీళ్ళు వేశారు. అంటే తల కడిగారు, శరీరంపై నీళ్ళు పోశారు. తాను నిల్చున్న చోటు నుండి ప్రక్కకు జరిగి రెండు కాళ్ళను కడిగారు. నేను శరీరం తుడుచుకోవటానికి వస్త్రం ఇచ్చాను. కాని ప్రవక్త (స) దాన్ని తీసుకోలేదు. రెండు చేతులతో తుడుచు కుంటూ అక్కడి నుండి వెళ్ళారు.” [54] (బు’ఖారీ, ముస్లిమ్‌)

437 – [ 8 ] ( متفق عليه ) (1/136)

وَعَنْ عَائِشَةَ قَالَتْ: أَنَّ اِمْرَأَةً مِنَ الْأَنْصَارِ سَأَلَتْ النَّبِيَّ صلى الله عليه وسلم: عَنْ غُسْلِهَا مِنَ الْمَحِيْضِ فَأَمَرَهَا كَيْفَ تَغْتَسِلُ قَالَ: “خُذِيْ فِرْصَةً مِّنْ مِّسْكِ فَتَطَهِّرِيْ بِهَا”. قَالَتْ كَيْفَ أَتَطَهَّرُ. قَالَ: “تَطَهِّرِيْ بِهَا”. قَالَتْ كَيْفَ. قَالَ: “سُبْحَانَ اللهِ تَطَهِّرِيْ”. فَاجْتَذَبْتُهَا إِلَيَّ فَقُلْتُ تَتَبَّعِيْ بِهَا أَثَرَ الدَّمِ .

437. (8) [1/136ఏకీభవితం]

’ఆయి‘షహ్‌ (ర) కథనం: “ఒక అ’న్సారీ స్త్రీ ప్రవక్త (స)ను బహిష్టు స్నానం పద్ధతి గురించి అడిగింది. అంటే, ‘బహిష్టు దశ ముగిసిన తర్వాత ఎలా స్నానం చేయాలని,’ అడిగింది. ప్రవక్త (స) ఆమెకు పై విధంగా తెలియపరిచారు. ప్రవక్త (స) స్నానం పద్థతి చెప్పిన తర్వాత, ‘నీవు స్నానం చేసిన తర్వాత సువాసన గల వస్త్రం లేదా దూది గల పుల్ల ద్వారా పరిశుద్ధత పొందు,’ అని అన్నారు. దానికి ఆమె, ‘ఆ వస్త్రంతో నేనెలా పరిశుద్ధత పొందను,’ అని సందేహం వెలిబుచ్చింది. ప్రవక్త (స), ‘దాని ద్వారా పరిశుద్ధతపొందు,’ అన్నారు. ఆమెకు అర్థం కాలేదు, మళ్ళీ ఆమె మూడవసారి, ‘ఆ వస్త్రంతో నేనెలా పరిశుద్ధత పొందను,’ అని విన్నవించుకుంది. అప్పుడు ప్రవక్త (స) సిగ్గుపడుతూ, ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ, సుబ్హానల్లాహ్‌’ అని పలికి, ‘నువ్వు ఆ సువాసన గల వస్త్రం ద్వారా పరిశుద్ధత పొందు,’ అని అన్నారు. నేను ప్రవక్త (స) మాటలను అర్థం చేసుకున్నాను. ఆమెకు ఆ విషయం అర్థం కావటం లేదు. నేను ఆమెను నా వైపుకు లాక్కున్నాను. ‘ఇంకా నువ్వు ఆ సువాసన గల వస్త్రాన్ని మర్మాంగం దగ్గర ఉంచుకో, దానివల్ల రక్తం దుర్వాసన తొలగిపోతుంది,’ అని అన్నాను. (బు’ఖారీ, ముస్లిమ్‌)

438 – [ 9 ] ( صحيح ) (1/137)

وَعَنْ أُمِّ سَلَمَةَ قَالَتْ قُلْتُ: يَا رَسُوْلَ اللهِ إِنِّيْ اِمْرَأَةٌ أَشُدُّ ضَفَرَ رَأْسِيْ فَأَنْقُضُهُ لِغُسْلِ الْجَنَابَةِ قَالَ: “لَا إِنَّمَا يَكْفِيْكَ أَنْ تَحْثِيْ عَلَى رَأْسِكَ ثَلَاثَ حَثَيَاتٍ ثُمَّ تُفِيْضِيْنَ عَلَيْكَ الْمَاءَ فَتَطَهَّرِيْنَ”. رَوَاهُ مُسْلِمٌ.

438. (9) [1/137దృఢం]

ఉమ్మె సలమహ్ (ర) కథనం: నేను ప్రవక్త (స)ను, ‘ఓ ప్రవక్తా! ‘నేను తల వెంట్రుకలను, జడను గట్టిగా కట్టు కుంటాను. జనాబత్‌ స్నానం చేసినపుడు వాటిని విప్పాలా,’ అని విన్నవించుకున్నాను. దానికి ప్రవక్త (స), ‘విప్పవలసిన అవసరం లేదు. నీవు నీ తలపై మూడుసార్లు వెంట్రుకలన్నీ తడిసినట్లు నీళ్ళు వేయి, ఆ తరువాత శరీరంపై నీళ్ళు వేసి కడుక్కో,’ అని సమాధానం ఇచ్చారు. (ముస్లిమ్‌)

439 – [ 10 ] ( متفق عليه ) (1/137)

وَعَنْ أَنَسٍ قَالَ: كَانَ النَّبِيُّ صلى الله عليه وسلم يَتَوَضَّأُ بِالْمُدِّ وَيَغْتَسِلُ بِالصَّاعِ إِلَى خَمْسَةِ أَمْدَادٍ .

439. (10) [1/137-ఏకీభవితం]

అనస్‌ (ర) కథనం: “ప్రవక్త (స) ఒక ముద్ నీటితో వు’జూ చేసేవారు. ఇంకా ఒక సా లేదా అంతకంటే ఎక్కువ 5 ముద్‌ల నీటితో స్నానం చేసేవారు.” [55]  (బు’ఖారీ, ముస్లిమ్‌)

440 – [ 11 ] ( متفق عليه ) (1/137)

وَعَنْ عَائِشَةَ قَالَتْ: كُنْتُ أَغْتَسِلُ أَنَا وَرَسُوْلُ اللهِ صلى الله عليه وسلم مِنْ إِنَاءٍ بَيْنِيْ وَبَيْنَهُ وَّاحِدٍ فَيُبَادِرُنِيْ حَتَّى أَقُوْلَ دَعْ لِيْ دَعْ لِيْ قَالَتْ وَهُمَا جُنُبَانِ  .

440. (11)[1/137ఏకీభవితం]

 ము’ఆజ (ర) కథనం: ’ఆయి‘షహ్‌ (ర) నాతో, ”ప్రవక్త (స) మరియు నేను ఒకే తొట్టె నుండి స్నానం చేసే వాళ్ళం, దాన్ని మా ఇద్దరి మధ్య ఉంచేవారం. ప్రవక్త (స) నీళ్ళు తీసుకోవటంలో నా కంటే తొందర పడేవారు. చివరికి నేను, ‘నా కోసం నీళ్ళు ఉంచండి, నా కోసం నీళ్ళు ఉంచండి,’ అని అనేదాన్ని,” అని అన్నారు. అయితే వీరిద్దరూ జనాబత్‌ స్నానం చేసేవారు. (బు’ఖారీ, ముస్లిమ్‌)

—–

రెండవ విభాగం اَلْفَصْلُ الثَّانِيْ   

441 – [ 12 ] ( ضعيف ) (1/137)

وَعَنْ عَائِشَةَ قَالَتْ: سُئِلَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم عَنِ الرَّجُلِ يَجِدُ الْبَلَلَ وَلَا يَذْكُرُ اِحْتِلَامًا قَالَ: “يَغْتَسِلُ” وَعَنِ الرَّجُلِ يَرَى أَنَّهُ قَدْ احْتَلَمَ وَلَمْ يَجِدُ بَلَلًا قَالَ: “لَا غَسَلَ عَلَيْهِ”. قَالَتْ أُمُّ سُلَيم يا رسول الله هَلْ عَلَى الْمَرْأَةِ تَرَى ذَلِكَ غُسْلٌ قَالَ: “نَعَمْ إِنَّ النِّسَاءَ شَقَائِقٌ الرِّجَالِ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَأَبُوْ دَاوُدَ وَرَوَى الدَّارَمِيُّ وَابْنُ مَاجَه إِلَى قَوْلِهِ: “لَا غُسْلَ عَلَيْهِ”.

441. (12) [1/137బలహీనం]

’ఆయి‘షహ్‌ (ర) కథనం: ప్రవక్త (స)ను బట్టల్లో తడి గమనించిన వ్యక్తి గురించి అడగటం జరిగింది. దానికి ప్రవక్త (స), ‘స్నానం చేయాలి,’ అని అన్నారు. అదే విధంగా బట్టలో తడి కనబడని వ్యక్తి గురించి ప్రశ్నించటం జరిగింది. దానికి ప్రవక్త (స), ‘స్నానం చేయవలసిన అవసరం లేదు,’ అని అన్నారు. ఉమ్ము సులైమ్‌ (ర), ‘స్త్రీలు కూడా తడి చూస్తే స్నానం చేయాలా,’ అని అడిగారు. దానికి ప్రవక్త (స), ‘అవును, స్త్రీలు కూడా పురుషులవంటి వారే,’ అని అన్నారు. (తిర్మిజి’, అబూ దావూద్‌, దార్మీ’, ఇబ్నె మాజహ్)

442 – [ 13 ] ( صحيح ) (1/137)

وَعَنْ عَائِشَةَ قَالَتْ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: إِذَا جَاوَزَ الْخِتَانُ الْخِتَانَ وَجَبَ الْغُسْلُ. فَعَلْتُهُ أَنَا وَرَسُوْلُ اللهِ صلى الله عليه وسلم فَاغْتَسَلْنَا. رَوَاهُ التِّرْمِذِيُّ وَابْنُ مَاجَهُ .

442. (13) [1/137దృఢం]

’ఆయి‘షహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”పురుషుని మర్మాంగం, స్త్రీ మర్మాంగంలో ప్రవేశిస్తే స్నానం తప్పనిసరి అయిపోతుంది. నేను ప్రవక్త (స) ఇలాచేసి, స్నానం చేశాము.”(తిర్మిజి’, ఇబ్నె మాజహ్)

443 – [ 14 ] ( ضعيف ) (1/138)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “تَحْتَ كُلِّ شَعْرَةٍ جَنَابَةً فَاغْسِلُوا الشَّعْرَ وَأَنْقُوا الْبَشَرَةَ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ وَالتِّرْمِذِيُّ وَابْنُ مَاجَهُ. وَقَالَ التِّرْمِذِيُّ: هَذَا حَدِيْثٌ غَرِيْبٌ وَالْحَارِثُ بْنُ وَجِيْهٍ الرَّاوِيْ وَهُوَ شَيْخٌ لَيْسَ بِذَلِكَ.

443. (14) [1/138బలహీనం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ప్రతి వెంట్రుక క్రింద అపరిశుద్ధత ఉంటుంది. అందువల్ల వెంట్రుకలను కడగండి, ఇంకా శరీరాన్ని చేతులతో రాసి శుభ్రపరచండి.” (అబూ దావూద్‌, ఇబ్నె మాజహ్,  తిర్మిజి’ / ఏకోల్లేఖనం, ఈ రావి ’హారిస్‘ బిన్ వజీహ్ వృద్ధులు, కాబట్టి ఇది నిర్ధారించ బడనిది)

444 – [ 15 ] ( ضعيف ) (1/138)

وَعَنْ عَلِيٍّ رضي الله عَنْهُ: أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم قَالَ: “مَنْ تَرَكَ مَوْضِعَ شَعْرَةٍ مِّنْ جَنَابَةٍ لَّمْ يَغْسِلْهَا فُعِلَ بِهَا كَذَا وَكَذَا مِنَ النَّارِ”. قَالَ عَلِيٌّ فَمِنْ ثُمَّ عَادَيْتُ رَأْسِيْ ثَلَاثًا فَمِنْ ثُمَّ عَادَيْتُ رَأْسِيْ ثَلَاثًا فَمِنْ ثَمَّ عَادَيْتُ رَأْسِيْ ثَلَاثًا. رَوَاهُ أَبُوْ دَاوُدَ وَأَحمد والدارمي إِلَّا أَنَّهُمَا لَمْ يُكَرِّرَا: فَمِنْ ثُمَّ عَادَيْتُ رَأْسِي.

444. (15) [1/138బలహీనం]

’అలీ (ర) కథనం: ప్రవక్త (స), ”ఎవరైనా స్నానం చేసి నపుడు, వెంట్రుకంత స్థలం అయినా ఎండుగా వదలి వేస్తే, నరకంలో అతనికి ఈవిధంగా శిక్షించడం జరుగుతుంది,’ అని అన్నారు. ప్రవక్త (స) యొక్క ఈ మాటలు విని నేను నా తలను శత్రువుగా భావించాను. అంటే ఆ మాటలు విన్న తర్వాత నేను నా వెంట్రుకలను గీయించేవాడిని, స్నానం చేసే టప్పుడు ఎండుగా ఉండదని.” (అబూ దావూద్‌, అ’హ్మద్‌, దార్మీ’)

445 – [ 16 ] ( صحيح ) (1/139)

وَعَنْ عَائِشَةَ رَضِيَ اللهُ عَنْهَا قَالَتْ: كَانَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم لَا يَتَوَضَّأُ بَعْدَ الْغُسْلِ. رَوَاهُ أَبُوْ دَاوُدَ وَالتِّرْمِذِيُّ وَالنَّسَائِيُّ وَابْنُ مَاجَهُ .

445. (16) [1/139దృఢం]

’ఆయి‘షహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) స్నానం చేసిన తర్వాత మళ్ళీ వు’దూ’ చేసేవారు కారు. స్నానంలో చేసిన వు’దూ’తోనే సరిపెట్టుకునేవారు, మర్మాం గాన్ని ముట్టు కుంటేనే తప్ప. (అబూ దావూద్‌, తిర్మిజి’, నసాయి‘, ఇబ్నె మాజహ్)

446 – [ 17 ] ( ضعيف ) (1/139)

وَعَنْ عَائِشَةَ قَالَتْ: كَانَ النَّبِيُّ صلى الله عليه وسلم يَغْسِلُ رَأْسِهِ بِالْخَطَمِيِّ وَهُوَ جُنُبٌ يَّجْتَزِئْ بِذَلِكَ وَلَا يَصُبُّ عَلَيْهِ الْمَاءَ. رَوَاهُ أَبُوْ دَاوُدَ .

446. (17) [1/139బలహీనం]

’ఆయి‘షహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) అశుద్ధ స్థితిలో ఖత్మీతో తల కడుక్కునేవారు. మళ్ళీ తలపై నీళ్ళు వేసేవారు కారు. [56] (అబూ దావూద్‌)

447 – [ 18 ] ( حسن ) (1/139)

وَعَنْ يَعْلَى: إِنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم رَأَى رَجُلًا يَّغْتَسِلُ بِالْبَرَازِ فَصَعِدُ الْمَنْبَرَ فَحَمِدَ اللهَ وَأَثْنَى عَلَيْهِ وَقَالَ: “إِنَّ اللهَ عز وجل حَيِّيٌ حَيِّيٌ سِتِّيرٌ يُّحِبُّ الْحَيَاءَ وَالسَّتَرَ فَإِذَا اغْتَسَلَ أَحْدُكُمْ فَلْيَسْتَتِرْ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ وَالنَّسَائِيُّ.

وَفِيْ رِوَايَتِهِ قَالَ: “إِنَّ اللهَ سِتِّيْرٌ فَإِذَا أَرَادَ أَحَدُكُمْ أَنْ يَّغْتَسِلَ فَلْيَتَوَارَ بِشَيْءٍ” .

447. (18) [1/139ప్రామాణికం]

య’అలా‘ (ర) కథనం: ప్రవక్త (స) ఒక వ్యక్తిని నగ్నంగా మైదానంలో స్నానం చేస్తుండగా చూశారు. అనంతరం ప్రవక్త (స) మెంబరుపై ఎక్కి దైవస్తోత్రం పఠించిన తరువాత, ‘అల్లాహ్‌ (త) సిగ్గుగలవాడు, తెరచాటు గలవాడు. సిగ్గు లజ్జ, తెరచాటును అభిలషిస్తాడు. మీలో ఎవరైనా స్నానం చేస్తే తెరచాటు పెట్టుకొని స్నానం చేయాలి,’ అని ఉపదే శించారు. (అబూ దావూద్‌, నసాయి‘)

మరో ఉల్లేఖనంలో ఇలా ఉంది, ”అల్లాహ్‌(త) తెరచాటుగా ఉంటాడు. కనుక మీలో ఎవరైనా స్నానం చేస్తే, తెరచాటుగా ఉండి స్నానం చేయాలి.”

—–

మూడవ విభాగం  اَلْفَصْلُ الثَّالِثُ

448 – [ 19 ] ( صحيح ) (1/140)

عَنْ أُبَيِّ بْنِ كَعْبٍ قَالَ: إِنَّمَا كَانَ الْمَاءُ مِنَ الْمَاءِ رُخْصَةً فِيْ أَوَّلِ الْإِسْلَامِ ثُمَّ نُهِيَ عَنْهَا.

448. (19) [1/140దృఢం]

ఉబయ్‌ బిన్‌ క’అబ్‌ (ర) కథనం: ఇస్లామ్‌ ప్రారంభ కాలంలో (భార్యా భర్తలు కలిస్తే) వీర్యం వెలువడితేనే స్నానం తప్పనిసరి అయ్యేది. [57](తిర్మిజి’, అబూ దావూద్‌, దార్మీ’)

449 – [ 20 ] ( ضعيف ) (1/140)

وَعَنْ عَلِيٍّ قَالَ: جَاءَ رَجُلٌ إِلَى النَّبِيِّ صلى الله عليه وسلم فَقَالَ إِنِّيْ اِغْتَسَلْتُ مِنَ الْجَنَابَةِ وَصَلَّيْتُ الْفَجْرَ ثُمَّ أصبحت فَرَأَيْتُ قَدْرَ مَوْضِعِ الظُّفْرِ لَمْ يُصِبْهُ الْمَاءُ. فَقَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَوْ كُنْتَ مَسَحْتَ عَلَيْهِ بِيَدِكَ أَجْزَأكَ”. رَوَاهُ ابْنُ مَاجَهُ.

449. (20) [1/140బలహీనం]

’అలీ (ర) కథనం: ప్రవక్త (స) వద్దకు ఒక వ్యక్తి వచ్చి, ‘నేను జనాబత్‌ స్నానం చేసి ఉన్నాను, ఫజ్‌ర్‌ నమా’జు కూడా చదివి ఉన్నాను. ఆ తరువాత నేను గోరంత చోటు నీళ్ళు అందలేదు అంటే తడిగా లేదు,’ అని విన్నవించుకున్నాడు. దానికి ప్రవక్త (స), ‘ఒకవేళ నువ్వు తడిచేత్తో నిమురుకుంటే (అంటే దాన్ని కడిగితే) సరిపోతుంది, మళ్ళీ స్నానంచేసే అవసరంఉండదు,’ అని అన్నారు. (ఇబ్నె మాజహ్)

450 – [ 21 ] ( لم تتم دراسته ) (1/140)

وَعَنِ بْنِ عُمَرَ قَالَ: كَانِتْ الصَّلَاةُ خَمْسِيْنَ وَالْغُسْلُ مِنَ الْجَناَبَةِ سَبْعَ مَرَّاتٍ وَغَسْلُ الْبَوْلِ مِنَ الثَّوْبِ سَبْعَ مَرَّاتٍ فَلَمْ يَزِلْ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم يَسْأَلُ حَتَّى جُعِلَتِ الصَّلَاةُ خَمْسًا وَالغسل مِنَ الْجَنَابَةِ مَرَّةً وَغَسْلُ الْبَوْلِ مِنَ الثَّوْبِ مَرَّةً. رَوَاهُ أَبُوْ دَاوُدَ .

450. (21) [1/140అపరిశోధితం]

ఇబ్నె ’ఉమర్‌ (ర) కథనం: “ఇస్లామ్‌ ప్రారంభ కాలంలో 50 పూటల నమా’జు విధిగా ఉండేది, జనాబత్‌ స్నానం 7 సార్లు చేయాలని ఉండేది. వస్త్రం నుండి మూత్రం కడగటం కూడా 7 సార్లు ఉండేది. ప్రవక్త (స) అల్లాహ్‌(త)ను తగ్గించమని అనేకసార్లు ప్రార్థించి కోరగా  చివరికి 5 పూటల నమా’జ్‌, స్నానం ఒకసారిచేయడం, అశుద్ధత నుండి వస్త్రాన్ని ఒకసారి కడగటంతో సరిపెట్టటం జరిగింది.” [58] (అబూ దావూద్‌)

=====

6 -بَابُ مُخَالَطَةِ الْجُنُبِ

6. అపరిశుద్ధ స్థితిలో ఉన్న వ్యక్తిని కలవటం

(సలామ్చేయటం, కరచాలనంచేయటం ధర్మసమ్మతమే)

మొదటి విభాగం اَلْفَصْلُ الْأَوَّلُ

451 – [ 1 ] ( صحيح ) (1/141)

عَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: لَقِيَنِيْ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم وَأَنَا جُنُبٌ فَأَخَذَ بِيَدِيْ فَمَشَيْتُ مَعَهُ حَتَّى قَعَدَ فَانْسَلَلْتُ فَأَتَيْتُ الرَّحْلَ فَاغْتَسَلْتُ ثُمَّ جِئْتُ وَهُوَ قَاعِدٌ فَقَالَ: “أَيَنْ كُنْتَ يَا أَبَا هُرَيْرَةَ” فَقُلْتُ لَهُ فَقَالَ: “سُبْحَانَ اللهِ إِنَّ الْمُؤْمِنَ لَا يَنْجَسُ”. هَذَا لَفْظُ الْبُخَارِيِّ.

وَلِمُسْلِمٍ مَّعْنَاهُ وَزَادَ بَعْدَ قَوْلِهِ: فَقُلْتُ لَهُ: لَقَدْ لَقِيْتَنِيْ وَأَنَا جُنُبٌ فَكَرِهْتُ أَنْ أَجَالِسَكَ حَتَّى أَغْتَسِلَ. وَكَذَا الْبُخَارِيُّ فِيْ رِوَايَةٍ أُخْرَى.

451. (1) [1/141దృఢం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: “ప్రవక్త (స) నన్ను కలిశారు. అప్పుడు నేను అశుద్ధావస్థలో ఉన్నాను. ప్రవక్త (స) నా చేయిపట్టుకొని నడవసాగారు. చివరికి ఒకచోట కూర్చున్నారు. నేను మెల్లగా ప్రవక్త (స) వద్దనుండి లేచి బయటకు వచ్చాను, మా ఇంటికి వెళ్ళి స్నానం చేసి తిరిగి వచ్చాను. ప్రవక్త (స) అక్కడే కూర్చొని ఉన్నారు. నేను రావటం చూసిన ప్రవక్త (స), ‘అబూ హురైరహ్‌ ఇప్పటి వరకు ఎక్కడ ఉన్నావు,’ అని అడిగారు. దానికి నేను, ‘అశుద్ధావస్థలో ఉండేవాడిని, వెళ్ళి స్నానంచేసి వచ్చాను,’ అని అన్నాను. అప్పుడు ప్రవక్త (స), “ ‘సుబహానల్లాహ్ (అల్లాహ్‌ పరిశుద్ధుడు)! విశ్వాసి అపరిశుద్ధుడు కాడు,” అని అన్నారు. (బు’ఖారి) 

ముస్లిమ్‌లో ఈ పదాలు అధికంగా ఉన్నాయి, ”నేను ప్రవక్త (స)ను కలిశాను. అప్పుడు నేను అశుద్ధావస్థలో ఉన్నాను. స్నానం చేయకుండా ప్రవక్త (స) వెంట కూర్చోవటం మంచిది కాదని భావించాను.” బు’ఖారీ లోని మరో ఉల్లేఖనంలో ముస్లిమ్‌ ఈ పదాలు కూడా ఉన్నాయి.

452 – [ 2 ] ( متفق عليه ) (1/141)

وَعَنْ عَبْدِاللهِ بْنِ عُمَرَ أَنَّهُ قَالَ: ذَكَرَ عُمَرُ بْنُ الْخَطَّابِ لِرَسُوْلِ اللهِ صلى الله عليه وسلم أَنَّهُ تُصِيْبُهُ الْجَنَابَةُ مِنَ اللَّيْلِ. فَقَالَ لَهُ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “تَوَضَّأُ وَاغْسِلْ ذَكَرَكَ ثُمَّ نَمْ”.

452. (2) [1/141ఏకీభవితం]

ఇబ్నె ’ఉమర్‌ (ర) కథనం: ’ఉమర్‌ (ర) ప్రవక్త (స)ను, ”నేను రాత్రివేళ అశుద్ధావస్థకు గురవు తున్నానని విన్నవించుకున్నారు. దానికి ప్రవక్త (స) మర్మాంగాన్ని కడుక్కో, వు’దూ’చేసుకొని, పడుకో” అని ఉపదేశించారు. [59] (బు’ఖారీ, ముస్లిమ్‌)

453 – [ 3 ] ( متفق عليه ) (1/141)

وَعَنْ عَائِشَةَ رَضِيَ اللهُ عَنْهَا قَالَتْ: كَانَ النَّبِيُّ صلى الله عليه وسلم إِذَا كَانَ جُنُبًا فَأَرَادَ أَنْ يَّأْكُلَ أَوْ يَنَامَ تَوَضَّأَ وُضُوْءَهُ لِلصَّلَاةِ.

453. (3) [1/141ఏకీభవితం]

’ఆయి‘షహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) అశుద్ధ స్థితిలో ఉన్న ప్పుడు అన్నపానీయాలు, నిద్రకు ముందు నమా’జుకు చేసినట్లు వు’దూ’ చేసుకునేవారు. (బు’ఖారీ, ముస్లిమ్‌)

454 – [ 4 ] ( صحيح ) (1/141)

وَعَنْ أَبِيْ سَعِيْدِ الْخُدْرِيِّ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِذَا أَتَى أَحَدُكُمْ أَهْلَهُ ثُمَّ أَرَادَ أَنْ يَّعُوْدَ فَلْيَتَوَضَّأُ بَيْنَهُمَا وُضُوْءًا”. رَوَاهُ مُسْلِمٌ .

454. (4) [1/141దృఢం]

అబూ స’యీద్‌ ’ఖుద్రీ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మీలో ఎవరైనా తన భార్యతో సంభోగం చేసి, తర్వాత మళ్ళీ సంభోగం చేయాలనుకుంటే వు’దూ’ చేసుకోవాలి.” [60] (ముస్లిమ్‌)

455 – [ 5 ] ( صحيح ) (1/142)

وَعَنْ أَنَسٍ قَالَ: كَانَ النَّبِيُّ صلى الله عليه وسلم يَطُوْفُ عَلَى نِسَائِهِ وَبِغُسْلٍ وَّاحِدٍ. رَوَاهُ مُسْلِمٌ .

455. (5) [1/142దృఢం]

అనస్‌ (ర) కథనం: ప్రవక్త (స) ఒకే రాత్రిలో తన భార్య లందరి వద్దకు వెళ్ళి, ఒకే స్నానం చేసే వారు.[61] (ముస్లిమ్‌)

456 – [ 6 ] ( صحيح ) (1/142)

وَعَنْ عَائِشَةَ قَالَتْ: كَانَ النَّبِيُّ صلى الله عليه وسلم يَذْكُرُ اللهُ عَزَّ وَجَلَّ عَلَى كُلِّ أَحْيَانِهِ. رَوَاهُ مُسْلِمٌ .

وَحَدِيْثُ ابْنِ عَبَّاسٍ سَنَذْكُرُهُ فِيْ كِتَابِ الْأَطْعِمَةِ إِنْ شَاءَ اللهُ.

456. (6) [1/142దృఢం]

’ఆయి‘షహ్‌(ర) కథనం: ప్రవక్త(స) ఎల్లప్పుడూ దైవాన్ని స్మరించే వారు. [62] (ముస్లిమ్‌)

—–

  రెండవ విభాగం اَلْفَصْلُ الثَّانِيْ 

457 – [ 7 ] ( صحيح ) (1/142)

عَنِ ابْنِ عَبَّاسٍ قَالَ: اغْتَسَلَ بَعْضُ أَزْوَاجُ النَّبِيِّ صلى الله عليه وسلم فِيْ جَفْنَةٍ فَأَرَادَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم أَنْ يَّتَوَضَّأَ مِنْهُ فَقَالَتْ: يَا رَسُوْلَ اللهِ إِنِّيْ كُنْتُ جُنُبًا فَقَالَ: “إِنَّ الْمَاءَ لَا يَجْنُبُ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَأَبُوْ دَاوُدُ وَابْنُ مَاجَهُ. وَرَوَى الدَّارَمِيُّ نَحْوَهُ.

457. (7) [1/142దృఢం]

ఇబ్నె ’అబ్బాస్‌ (ర) కథనం: ప్రవక్త (స) భార్యల్లో ఒకరు బకెట్‌లో నీళ్ళు తీసుకొని స్నానం చేశారు. కొన్ని నీళ్ళు మిగలగా ప్రవక్త (స) ఆ మిగిలిన నీటితో వు’దూ’ చేయాలనుకున్నారు. అది చూసిన ఆమె, ‘ఓ ప్రవక్తా! నేను అశుద్ధస్థితిలో ఆ బకెట్‌ నుండి నీళ్ళు తీసుకొని స్నానం చేశాను. ఇవి మిగిలిన నీరే,’ అని అన్నారు. అప్పుడు ప్రవక్త (స), ‘ఈ మిగిలిన నీరు అశుద్ధమైనవి కావు,’ అని అన్నారు. (తిర్మిజి’, అబూ దావూద్‌, దార్మీ, ఇబ్నె మాజహ్)

458 – [ 8 ] ( لم تتم دراسته ) (1/142)

وَفِيْ شَرْحِ السُّنَّةَ عَنْهُ عَنْ مَّيْمُوْنَةَ بِلَفْظِ الْمَصَابِيْحِ .

458. [1/142అపరిశోధితం]

షర్‌హుస్సున్నహ్‌లో మసా‘బీహ్‌ ప్రకారం ఇబ్నె ‘అబ్బాస్‌ (ర) మైమూనహ్ (ర) ద్వారా ఉల్లేఖించారు.

459 – [ 9 ] ( ضعيف ) (1/142)

وَعَنْ عَائِشَةَ قَالَتْ: كَانَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم يَغْتَسِلُ مِنَ الْجَنَابَةِ ثُمَّ يَسْددْفِئ بِيْ قَبْلَ أَنْ أَغْتَسِلَ. رَوَاهُ ابْنُ مَاجَهُ وَرَوَى التِّرْمِذِيُّ نَحْوَهُ .

459. (9) [1/142బలహీనం]

’ఆయిషహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) జనాబత్‌ స్నానం చేసి నేను స్నానం చేయకముందే నా దగ్గరకు వచ్చి, పరుండి, వెచ్చదనాన్ని పొందేవారు. [63] (ఇబ్నె మాజహ్, తిర్మిజి’)

460 – [ 10 ] ( ضعيف ) (1/143)

وَعَنْ عَلِيٍّ قَالَ: كَانَ النَّبِيُّ صلى الله عليه وسلم يَخْرُجُ مِنَ الْخَلَاءِ فَيَقْرَئُنَا الْقُرْآنَ وَيَأْكُلُ مَعَنَا اللَّحْمَ وَلَمْ يَكُنْ يَحْجُبُهُ أَوْ يَحْجُزُهُ عَنِ الْقُرْآنِ شَيْءٌ لَيْسَ الْجَنَابَةَ. رَوَاهُ أَبُوْ دَاوُدَ وَالنَّسَائِيُّ وَرَوَى ابْنُ مَاجَهُ نَحْوَهُ .

460. (10) [1/143బలహీనం]

’అలీ (ర) కథనం: ప్రవక్త (స) మలమూత్ర విసర్జన ముగించుకొని బయటకు వచ్చిన తర్వాత మాకు ఖుర్‌ ఆన్‌ బోధించే వారు. ఇంకా మాతో పాటు మాంసం మొద లైన తిను బండారాలు తినేవారు. జనాబత్‌ తప్ప మరే విషయం ఖుర్‌ఆన్‌ పఠనం నుండి ఆయన్ను వారించేది కాదు.[64] (అబూ దావూద్‌, ఇబ్నె మాజహ్, తిర్మిజి’)

461 – [ 11 ] ( ضعيف ) (1/143)

وَعَنِ ابْنِ عُمَرَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَا تَقْرَأُ الْحَائِضُ وَلَا الْجُنُبُ شَيْئًا مِّنَ الْقُرْآنِ”. رَوَاهُ التِّرْمِذِيُّ

461. (11) [1/143బలహీనం]

ఇబ్నె ’ఉమర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”బహిష్టురాలు, జునుబీ ఖుర్‌ఆన్‌లో ఏమీ చదవ కూడదు.” (తిర్మిజి‘)

462 – [ 12 ] ( ضعيف ) (1/143)

وَعَنْ عَائِشَةَ قَالَتْ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “وَجِّهُوْا هَذِهِ الْبُيُوْتَ عَنِ الْمَسْجِدِ فَإِنِّيْ لَا أُحِلُّ الْمَسْجِدَ لِحَائِضٍ وَلَا جُنُبٍ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ.

462. (12) [1/143బలహీనం]

’ఆయి‘షహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మీరు మస్జిద్‌ వైపు ఉన్న మీ ఇళ్ళ ద్వారాలు మూసివేసి మరో వైపు నుండి ద్వారాలు తెరవండి. ఎందుకంటే మస్జిద్‌ వైపు ద్వారం ఉంటే ఆ మార్గం ద్వారానే బహిష్టురాలు, జునుబీ వస్తూ పోతూ ఉంటారు. నేను బహిష్టురాలును, జునుబీని మస్జిద్‌లో రావటానికి అనుమతించను, ధర్మసమ్మతంగా భావించను.” (అబూ దావూద్‌)

463 – [ 13 ] ( ضعيف ) (1/143)

وَعَنْ عَلِيٍّ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَا تَدْخُلُ الْمَلَائِكَةُ بَيْتًا فِيْهِ صُوْرَةٌ وَلَا كَلُبٌ وَلَا جُنُبٌ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ وَالنَّسَائِيُّ.

463. [1/143బలహీనం]

’అలీ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ప్రాణుల బొమ్మలు, ఫోటోలు, కుక్క మరియు అపరిశుద్ధ వ్యక్తి ఉన్న ఇంట్లో కారుణ్య దైవదూతలు ప్రవేశించరు.” [65] (అబూ దావూద్‌, నసాయీ’)

464 – [ 14 ] ( ضعيف ) (1/144)

وَعَنْ عَمَّارِ بْنِ يَاسِرٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “ثَلَاثٌ لَا تَقْرَبُهُمُ الْمَلَائِكَةُ جِيْفَةُ الْكَافِرِ وَالْمُتَضَمِّخُ بِالْخُلُوْقِ وَالْجُنُبُ إِلَّا أَنْ يَّتَوَضَّأَ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ .

464. (14) [1/144బలహీనం]

’అమ్మార్‌ బిన్‌ యాసిర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ముగ్గురు వ్యక్తుల వద్దకు కారుణ్య దైవదూతలు రారు. 1. అవిశ్వాసి శరీరం వద్దకు, సజీవంగా ఉన్నా మరణించి ఉన్నా, 2. స్త్రీలు ఉపయోగించే సువాసన ఉపయోగించే వ్యక్తి వద్దకు, 3. జునుబీ వ్యక్తి వద్దకు, అతడు స్నానం లేదా వు’దూ’ చేసుకునే వరకు. (అబూ దావూద్‌)

465 – [ 15 ] ( لم تتم دراسته ) (1/144)

وَعَنْ عَبْدِ اللهِ بْنِ أَبِيْ بَكْرِ بْنِ مُحَمَّدِ بْنِ عُمْرِو بْنِ حَزْمٍ: أَنَّ فِيْ الْكِتَابِ الَّذِيْ كَتَبَهُ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم لِعَمْرِو بْنِ حَزْمٍ: “أَنْ لَا يَمَسَّ الْقُرْآنِ إِلَّا طَاهِرٌ”. رَوَاهُ مَالِكٌ وَالدَّارَقُطْنِيُّ .

465. (15) [1/144అపరిశోధితం]

’అబ్దుల్లాహ్‌ బిన్‌ అబీ బక్‌ర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ’అమ్ర్‌ బిన్‌ ’హ’జ్మ్‌కు వ్రాసిన ఉత్తరంలో ఖుర్‌ఆన్‌ను పరిశుద్ధవ్యక్తులే ముట్టుకోవాలి, అపరిశుద్ధ వ్యక్తులు ముట్టుకోరాదు,’ అని కూడా ఉండేది. [66] (మాలిక్‌, దార ఖు’త్నీ)

466 – [ 16 ] ( ضعيف ) (1/144)

وَعَنْ نَّافِعٍ قَالَ: اِنْطَلَقْتُ مَعَ ابْنِ عُمَرَ فِيْ حَاجَةٍ إِلَى ابْنُ عَبَّاسٍ فَقَضَى اْبُن عُمَرَ حَاجَتَهُ وَكَانَ مِنْ حَدِيْثِهِ يَوْمَئِذٍ أَنْ قَالَ مَرَّ رَجُلٌ فِيْ سِكَّةٍ مِّنَ الْسِكَكِ فَلَقِيَ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم وَقَدْ خَرَجَ مِنْ غَائِطٍ أَوْ بَوْلٍ فَسَلَّمَ عَلَيْهِ فَلَمْ يَرُدَّ عَلَيْهِ حَتَّى كَادَ الرَّجُلُ أَنْ يَّتَوَارَىَ فِيْ السِّكَةِ ضَرَبَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم بِيَدَيْهِ عَلَى الْحَائِطِ وَمَسَحَ بِهِمَا وَجْهَهُ ثُمَّ ضَرَبَ ضَرْبَةً أُخْرَى فَمَسَحَ ذِرَاعَيْهِ ثُمَّ رَدَّ عَلَى الرَّجُلِ السَّلَامَ وَقَالَ: “إِنَّهُ لَمْ يَمْنَعْنِيْ أَنْ أَرُدَّ عَلَيْكَ السَّلَامَ إِلَّا أَنَّنِيْ لَمْ أَكُنْ عَلَى طُهْرٍ”. رواه أبو داود.

466. (16) [1/144బలహీనం]

నా’ఫె (ర) కథనం: ఒకరోజు నేను ’అబ్దుల్లాహ్‌ బిన్‌ ’ఉమర్‌ వెంట మలమూత్ర విసర్జనకు బయటకు వెళ్ళాను. మలమూత్ర విసర్జన అనంతరం ’అబ్దుల్లాహ్‌ బిన్‌ ’ఉమర్‌ (ర) ఒక ’హదీసు‘ పేర్కొన్నారు. ఒక వ్యక్తి వీధిలో వెళుతుండగా ప్రవక్త (స)ను కలవటం జరిగింది. అప్పుడు ప్రవక్త (స) మలమూత్ర విసర్జన ముగించుకొని వస్తున్నారు. ఆ వ్యక్తి ప్రవక్త (స)కు సలామ్‌ చేశాడు. కాని ప్రవక్త (స) ఆ వ్యక్తి సలామ్‌కు ప్రతిసలామ్‌ ఇవ్వలేదు. చివరికి ఆ వ్యక్తి దాక్కోసాగాడు. అప్పుడు ప్రవక్త (స) తన రెండు చేతులను గోడపైకొట్టి తన ముఖంపై తుడుచుకున్నారు. మళ్ళీ తన రెండుచేతులను గోడపై కొట్టి తన రెండు చేతులపై తుడుచుకున్నారు. అంటే ప్రవక్త (స) తయమ్ముమ్‌ చేసిన తర్వాత, ఆ వ్యక్తి సలామ్‌కు ప్రతి సలామ్‌ చేశారు. అనంతరం ఆ వ్యక్తితో, ”క్షమించాలి, వు’దూ’తో లేను, అందువల్లే ప్రతిసలామ్‌ ఇవ్వడంలో ఆలస్యం అయింది. ఇప్పుడు తయమ్ముమ్‌ చేసి ప్రతిసలామ్‌ చేశాను,” అని  అన్నారు. [67] (అబూ దావూద్‌)

467 – [ 17 ] ( صحيح ) (1/145)

وَعَنِ الْمُهَاجِرِ بْنِ قُنْفُذٍ: أَنَّهُ أَتَى النَّبِيَّ صلى الله عليه وسلم وَهُوَ يَبُوْلُ فَسَلَّمَ عَلَيْهِ فَلَمْ يَرُدَّ عَلَيْهِ حَتَّى تَوَضَّأَ ثُمَّ اعْتَذَرَ إِلَيْهِ فَقَالَ: “إِنِّيْ كَرِهْتُ أَنْ أَذْكُرَ اللهَ عز وجل إِلَّا عَلَى طُهْرٍ أَوْ قَالَ عَلَى طُهْرٍ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ وَرَوَى النَّسَائِيُّ إِلَى قَوْلِهِ: حَتَّى تَوَضَّأَ وَقَالَ: فَلَمَّا تَوَضَّأَ رَدَّ عَلَيْهِ.

467. (17) [1/145-దృఢం]

ముహాజిర్‌ బిన్‌ ఖున్‌ఫు’జ్‌ (ర) కథనం: నేను ప్రవక్త (స) వద్దకు వెళ్ళాను. అప్పుడు ప్రవక్త (స) మూత్రవిసర్జన చేస్తున్నారు. అప్పుడే నేను సలామ్‌ చేశాను. కాని ప్రవక్త (స) ప్రతి సలామ్‌ చేయలేదు. చివరికి ప్రవక్త (స) వు’దూ’ చేసి ప్రతి సలామ్‌ చేశారు. ఇంకా వివరణ ఇస్తూ ‘పరిశుద్ధత, వు’జూ లేకుండా దైవస్మరణ చేయడం మంచిదనిపించదు. అందువల్లే వు’దూ’ లేకుండా సమాధానం ఇవ్వబడలేదు. ఎందుకంటే సలామ్‌ కూడా అల్లాహ్‌ పేరే,’ అని అన్నారు. (అబూ దావూ‘ద్‌, నసాయీ’)

—–

మూడవ విభాగం  اَلْفَصْلُ الثَّالِثُ  

468 – [ 18 ] ( ضعيف ) (1/145)

عَنْ أُمِّ سَلَمَةَ رضي الله عَنْهَا قَالَتْ: كَانَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم يَجْنُبُ ثُمَّ يَنَامُ ثُمَّ يَنْتَبِهُ ثُمَّ يَنَامُ. رَوَاهُ أَحْمَدُ.

468. (18) [1/145బలహీనం]

ఉమ్మె సలమహ్ (ర) కథనం: ప్రవక్త (స) జనాబత్‌ స్థితిలోనే పడుకునేవారు. అంటే వు’దూ’చేసి పడుకునే వారు, మళ్ళీ ఉదయం స్నానం చేసేవారు. (అ’హ్మద్‌)

469 – [ 19 ] ( ضعيف ) (1/146)

وَعَنْ شُعْبَةَ قَالَ: إِنَّ ابْنَ عَبَّاسٍ رضي الله عَنْهُ كَانَ إِذَا اغْتَسَلَ مِنَ الْجَنَابَةِ يُفْرِغُ بِيَدِهِ الْيُمْنَى عَلَى يَدِهِ الْيُسْرَى سَبْعَ مِرَارٍ ثُمَّ يَغْسِلُ فَرْجَهُ فَنَسِيَ مَرَّةً كَمْ أَفْرَغَ فَسَأَلَنِيْ كَمْ أفرغت فَقُلْتُ لَا أَدْرِيْ فَقَالَ لَا أُمَّ لَكَ وَمَا يَمْنَعُكَ أَنْ تَدْرِيَ ثُمَّ يَتَوَضَّأُ وُضُوْءَهُ لِلصَّلَاةِ ثُمَّ يُفِيْضُ عَلَى جِلْدِهِ الْمَاءَ ثُمَّ يَقُوْلُ هَكَذَا كَانَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم يَتَطَهَّرُ. رَوَاهُ أَبُوْ دَاوُدَ.

469. (19) [1/146బలహీనం]

షు’అబహ్ (ర) కథనం: ఇబ్నె ’అబ్బాస్‌ (ర) జనాబత్‌ స్నానం చేయాలనుకున్నప్పుడు ముందు కుడిచేతితో ఎడమ చేతిపై 7 సార్లు నీళ్ళు వేసి, అంటే 7 సార్లు కడిగి, 7 సార్లు మర్మాంగాన్ని కడిగేవారు. ఒకసారి అనుకోకుండా మరచిపోయారు. ఇబ్నె ’అబ్బాస్‌ నన్ను, ‘నేను ఎన్ని సార్లు నీళ్ళువేశాను,’ అని అడిగారు. నేను, ‘నాకు తెలి యదు,’ అని అన్నాను. దానికి అతను, ‘నీకెలా తెలి యదు,’ అని అన్నారు. ఆ తరువాత ఇబ్నె ’అబ్బాస్‌ నమా’జులా వు’దూ’ చేసి, శరీరంపై నీళ్ళువేశారు. అంటే శరీరాన్ని కడిగారు. ఇంకా, ‘ప్రవక్త (స) ఇలాగే పరిశుభ్రత పొందారని,’ అన్నారు. (అబూ దావూద్‌)

ప్రవక్త (స) స్నానం పద్ధతి ఇంతకుముందు పేర్కొనడం జరిగింది. అప్పుడప్పుడూ ఇలా స్నానం చేసి ఉండవచ్చు.

470 – [ 20 ] ( حسن ) (1/146)

وَعَنْ أَبِيْ رَافِعٍ:أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم طَافَ ذَاتَ يَوْمٍ عَلَى نِسَائِهِ يَغْتَسِلُ عِنْدَ هَذِهِ وَعِنْدَ هَذِهِ. قَالَ: فَقُلْتُ لَهُ يَا رَسُوْلَ اللهِ أَلَا تَجْعلُهُ غُسْلًا وَّاحِدًا آخِرًا قَالَ: “هَذَا أَزْكَى وَأَطْيَبُ وَأَطْهَرُ”. رَوَاهُ أَحْمَدُ وَأَبُوْ دَاوُد .

470. (20) [1/146ప్రామాణికం]

అబూ రా’ఫె (ర) కథనం: ఒక రోజు ప్రవక్త (స) తన భార్యలందరి వద్దకు వెళ్ళారు. అంటే అందరితో సంభోగం చేశారు. ఒక భార్యతో సంభోగం చేసిన తర్వాత స్నానం చేసి మరో భార్య దగ్గరకు వెళ్ళేవారు. ఈ విధంగా అందరి దగ్గరకు వెళ్ళారు. అప్పుడు నేను, ‘ప్రవక్తా! తమరు అందరి దగ్గరకు వెళ్ళి చివర్లో ఒక్కసారి స్నానం చేసుకుంటే సరిపోయేది,’ అని అన్నాను. దానికి ప్రవక్త (స) ప్రతి సంభోగం తరువాత స్నానం చేస్తే ఉత్తమంగా ఉంటుంది, పరిశుభ్రంగా ఉంటుంది. (అబూ దావూద్‌)

471 – [ 21 ] ( صحيح ) (1/146)

وَعَنِ الْحَكَمِ بْنِ عَمْرٍو قَالَ: نَهَى رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم أَنْ يَّتَوَضَّأَ الرَّجُلُ بِفَضْلِ طُهُوْرِ الْمَرْأَةِ. رَوَاهُ أَبُوْ دَاوُدَ وَابْنُ مَاجَهُ وَالتِّرْمِذِيُّ، وَزَادَ: أَوْ قَالَ: بِسُؤْرِهَا. وَقَالَ: هَذَا حَدِيْثٌ حَسَنٌ صَحِيْحٌ .

471. (21) [1/146దృఢం]

’హకమ్‌ బిన్‌ ’అమ్ర్ కథనం: ప్రవక్త (స) స్త్రీలు మిగిల్చిన నీటితో పురుషులు వు’దూ’గాని, స్నానం గాని చేయరాదని వారించారు. [68](అబూ దావూద్‌, ఇబ్నె మాజహ్, తిర్మిజి’ / ప్రామాణికం, దృఢం)

తిర్మిజీ‘లో ‘బిఫ’ద్ లి తహూరిల్‌ మర్‌అతి’ తరువాత, ‘బిసూరిహా’ అనే పదం ఉంది.

472 – [ 22 ] ( صحيح ) (1/146)

وَعَنْ حُمَيْدِ الْحَمْيَرِيِّ قَالَ: لَقِيْتُ رَجُلًا صَحِبَ النَّبِيَّ صلى الله عليه وسلم أَرْبَعَ سِنِيْنَ كَمَا صَحِبَهُ أَبُوْ هُرَيْرَةَ قَالَ: نَهَى رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم أَنْ تَغْتَسِلَ وَالْمَرْأَةُ بِفَضْلِ الرَّجُلِ أَوْ يَغْتَسِلُ الرَّجُلُ بِفَضْلِ الْمَرْأَةِ. زَادَ مُسَدَّدٌ: وَلْيَغْتَرِفَا جَمِيْعًا رَوَاهُ أَبُوْ دَاوُدَ وَالنَّسَائِيُّ وَزَادَ أَحْمَدُ فِيْ أَوَّلِهِ: نَهَى أَنْ يَّمْتَشِطَ أَحَدُنَا كُلَّ يَوْمٍ أَوْ يَبُوْلَ فِيْ مُغْتَسَلٍ.

472. (22) [1/146దృఢం]

’హుమైద్‌ అల్‌ ’హమ్‌యరీ (ర) కథనం: నేనొక అనుచ రున్ని కలిశాను. అతడు కూడా అబూ హురైరహ్‌లా ప్రవక్త (స) వద్ద 4 సంవత్సరాలు సేవచేశాడు. అతడు ఇలా పేర్కొన్నాడు, ”ప్రవక్త (స) స్త్రీ-పురుషు లిరువురూ ఒకరు మిగిల్చిన నీటితో మరొకరు స్నానం చేయటాన్ని వారించారు. ముసద్దస్‌ ఉల్లేఖనకర్త ఈ ’హదీసు‘ చివర్లో, ”భార్యా భర్తలిద్దరూ ఒకే బకెట్‌ నుండి నీళ్ళు తీసుకొని స్నానం చేయటం” అనేదాన్ని అధికం చేశారు. (అబూ దావూద్‌, నసాయి‘)

’అహ్మద్‌ ఈ ’హదీసు‘ ప్రారంభంలో, ”ప్రవక్త (స) ప్రతిరోజు తల దువ్వుకోవటాన్ని స్నానాల గదిలో మూత్ర విసర్జన చేయటాన్ని వారించారు” అనే పదాలను, అధికం చేశారు.

473 – [ 23 ] ( صحيح ) (1/147)

وَرَوَاهُ ابْنُ مَاجَهُ عَنْ عَبْدِ اللهِ بْنِ سَرْجِسٍ

473. (23) [1/147దృఢం]

దీన్నే ’అబ్దుల్లాహ్‌ బిన్‌ సర్‌జిస్‌ ద్వారా ఇబ్నె మాజహ్ కూడా ఉల్లేఖించారు.

=====

7- بَابُ الْمِيَاهِ

7. నీటి ఆదేశాలు

మొదటి విభాగం اَلْفَصْلُ الْأَوَّلُ    

474 – [ 1 ] ( متفق عليه ) (1/148)

عَنْ أَبِيْ هُرَيْرَةَ رضي الله عَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَا يَبُوْلَنَّ أَحَدُكُمْ فِيْ الْمَاءِ الدَّائِمِ الَّذِيْ لَا يَجْرِيْ ثُمَّ يَغْتَسِلُ فِيْهِ”.

وَفِيْ رِوَايَةِ لِمُسْلِمٍ قَالَ: “لَا يَغْتَسِلُ أَحْدُكُمْ فِيْ الْمَاءِ الدَّائِمِ وَهُوَ جُنُبٌ”. قَالُوْا: “كَيْفَ يَفْعَلُ يَا أَبَا هُرَيْرَةَ؟” قَالَ: “يَتَنَاوُلُهُ تَنَاوُلًا”.

474. (1) [1/148ఏకీభవితం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మీలో ఎవరూ నిలిచి ఉన్న నీటిలో అంటే ప్రవహించని నీటిలో మూత్రవిసర్జన చేయరాదు, ఇంకా స్నానం చేయ రాదు.” (బు’ఖారీ, ముస్లిమ్‌)

ముస్లిమ్‌లోని ఒక ఉల్లేఖనంలో ఇలా ఉంది, ”ప్రవక్త (స) ప్రవచనం, ‘మీలో ఎవరూ అశుద్ధస్థితిలో నిలిచి ఉన్న నీటిలో స్నానం చేయరాదు.’ ప్రజలు అబూ హురైరహ్‌ (ర)ను మరెలా స్నానం చేయాలి అని అడగ్గా, అబూ హురైరహ్‌ (ర), అందులో నుండి ఒక తొట్టెలో తీసుకొని స్నానం చేయాలి అని అన్నారు.”

475 – [ 2 ] ( صحيح ) (1/148)

وَعَنْ جَابِرٍ قَالَ: نَهَى رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم أَنْ يُّبَالَ فِيْ الْمَاءِ الرَّاكِدِ. رَوَاهُ مُسْلِمٌ .

475. (2) [1/148దృఢం]

జాబిర్‌ (ర) కథనం: ప్రవక్త (స) నిలిచి ఉన్న నీటిలో మూత్ర విసర్జన చేయటాన్ని వారించారు. (ముస్లిమ్‌)

476 – [ 3 ] ( متفق عليه ) (1/148)

وَعَنِ السَّائِبِ بْنِ يَزِيْدَ قَالَ: ذَهَبَتْ بِيْ خَالَتِيْ إِلَى النَّبِيِّ صلى الله عليه وسلم. فَقَالَتْ يَا رَسُوْلَ الله إِنَّ ابْنَ أُخْتِيْ وَجِعٌ فَمَسَحَ رَأْسِيْ وَدَعَا لِيْ بِالْبَرْكَةَ ثُمَّ تَوَضَّأَ فَشَرِبْتُ مِنْ وُضُوْئِهِ ثُمَّ قُمْتُ خَلْفَ ظَهْرِهِ فَنَظَرْتُ إِلَى خَاتَمِ النُّبُوَّةِ بَيْنَ كَتِفَيْهِ مِثْلَ زِرِّ الْحَجَلَةِ

476. (3) [1/148ఏకీభవితం]

సాయి‘బ్‌ బిన్‌ య’జీద్‌ (ర) కథనం: ”నన్ను మా పిన్నిగారు ప్రవక్త (స) వద్దకు తీసుకొని వెళ్ళి, ‘ప్రవక్తా! ఈ మా అక్కకొడుకు అనారోగ్యంగా ఉన్నాడు,’ అని అన్నారు. ప్రవక్త (స) తన చేత్తో నా తల నిమిరారు. ఇంకా నన్ను దీవించారు. ఆ తరువాత వు’దూ’ చేశారు. మిగిలిన నీటిని నేను త్రాగాను. ఆ తరువాత నేను ప్రవక్త (స) వీపు వెనుక నిలబడ్డాను, దైవదౌత్య ముద్రికను చూశాను. అది రెండుభుజాల మధ్య గుండీలా ఉన్నది.” [69] (బు’ఖారీ, ముస్లిమ్‌)

—–

రెండవ విభాగం اَلْفَصْلُ الثَّانِيْ      

477 – [ 4 ] ( صحيح ) (1/149)

عَنِ ابْنِ عُمَرَ قَالَ: سُئِلَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم عَنِ الْمَاءِ يَكُوْنُ فِيْ الْفَلَاةِ مِنَ الْأَرْضِ وَمَا يَنُوْبُهُ مِنَ الدَّوَابِ وَالسِّبَاعِ. فَقَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِذَا كَانَ الْمَاءُ قُلَّتَيْنِ لَمْ يَحْمِلِ الْخبَثَ”. رَوَاهُ أَحْمَدُ وَأَبُوْ دَاوُدَ وَالتِّرْمِذِيُّ وَالنَّسَائِيُّ وَالدَّارَمِيُّ وِابْنُ مَاجَهُ وَفِيْ أُخْرَى لِأَبِيْ دَاوُدَ: “فَإِنَّهُ لَا يَنْجَسُ”.

477. (4) [1/149దృఢం]

’అబ్దుల్లాహ్‌ బిన్‌ ’ఉమర్‌ (ర) కథనం: ప్రవక్త (స)ను అడవుల్లో మైదానాల్లోని గోతుల్లో ఉండే నీటిని గురించి ప్రశ్నించడం జరిగింది. అక్కడ పశువులు, క్రూర మృగాలు వస్తూపోతూ ఉంటాయి. కొన్ని అక్కడే మలమూత్ర విసర్జన చేసివేస్తాయి. అటువంటి నీరు పరిశుభ్రంగా ఉన్నాయా లేక అపరిశుభ్రంగా ఉన్నాయా అని. దానికి ప్రవక్త (స) ఒకవేళ ఆ నీరు రెండు పెద్ద కుండలంత ఉంటే, అవి అపరిశుభ్రం కావు, అవి పరిశుభ్రంగా ఉంటాయని అన్నారు. [70] (అ’హ్మద్‌ అబూ దావూద్‌, నసాయి’, దార్మీ, ఇబ్నె మాజహ్)

అబూ దావూద్ లోని మరో ఉల్లేఖనలో, ”ఫఇన్నహూ లా యన్జిస్” అని ఉంది. అంటే రెండు ఖుల్లాల నీరుంటే అపరిశుధ్ధం కాదు.

478 – [ 5 ] ( صحيح ) (1/149)

وَعَنْ أَبِيْ سَعِيْدِ الْخُدْرِيّ قَالَ: قِيْلَ يَا رَسُوْلَ اللهِ أَنَتَوَضَّأُ مِنْ بِئْرِ بُضَاعَةَ وَهِيَ بِئْرٌ يُلْقَى فِيْهَا الْحِيْضُ وَلُحُوْمُ الْكِلَابِ وَالنَّتْنُ. فَقَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِنَّ الْمَاءَ طُهُوْرٌ لَا يَنْجِّسُهُ شَيْءٌ”. رَوَاهُ أَحْمَدُ وَالتِّرْمِذِيُّ وَأَبُوْ دَاوُدَ وَالنَّسَائِيُّ .

478. (5) [1/149దృఢం]

అబూ స’యీద్‌ ’ఖుద్రీ (ర) కథనం: ప్రవక్త (స)ను, ‘ఓ ప్రవక్తా! మేము బు’దాఅ బావి నీటితో వు’దూ’ మరియు స్నానం చేసుకోవచ్చా?’ అని విన్నవించు కోవటం జరిగింది. ‘అందులో బహిష్టు వస్త్రాలు, కుక్క మాంసం, అశుద్ధాలు వేయబడేవి.’ దానికి ప్రవక్త (స), ‘నీళ్ళు పరిశుద్దమైనవి, దాన్ని ఏవస్తువూ అశుద్దం చేయదు,’ అని అన్నారు. [71] (అ’హ్మద్‌, తిర్మిజి’, అబూ దావూ‘ద్‌, నసాయి‘)

479 – [ 6 ] ( صحيح ) (1/149)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: سَأَلَ رَجُلٌ رَسُوْلُ اللهِ صلى الله عليه و سلم. فَقَالَ يَا رَسُوْلَ اللهِ إِنَّا نَرْكَبُ الْبَحْرَ وَنَحْمِلُ مَعَنَا الْقَلِيْلَ مِنَ الْمَاءِ فَإِنْ تَوَضَّأْنَا بِهِ عَطِشْنَا أَفَنَتَوَضَّأُ مِنْ مَاءِ الْبَحْر .فَقَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “هُوَ الطُّهُوْرُ مَاؤُهُ الْحِلُّ مَيْتَتُهُ”. رَوَاهُ مَالِكٌ وَالتِّرْمِذِيُّ وَالنَّسَائِيُّ وَابْنُ مَاجَهُ وَالدَّارَمِيُّ

479. (6) [1/149దృఢం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) వద్దకు ఒక వ్యక్తి వచ్చి, ‘మేము సముద్రాల్లో, నదుల్లో ఓడలపై ప్రయాణం చేస్తూ ఉంటాం. త్రాగటానికి కొంచెం నీరు వెంట ఉంచు కుంటాం. మా దగ్గర ఉన్న నీటితో వు’దూ’ చేస్తే, నీళ్ళు అయిపోతాయి. మరి మాకు త్రాగటానికి ఉండవు. కనుక మేము సముద్రపు నీటితో వు’దూ’ చేసుకోవచ్చునా,’ అని విన్నవించు కున్నాడు. దానికి ప్రవక్త (స), ‘సముద్రపు నీరు పరిశుభ్రమైనది, ఇంకా దానిలో చనిపోయిన ప్రాణులు ధర్మ సమ్మతమైనవి. అవసరార్థం తినవచ్చును,’ అని అన్నారు. (మాలిక్, తిర్మిజి, నసాయి‘, ఇబ్నె మాజహ్, దార్మీ)

480 – [ 7 ] ( ضعيف ) (1/150)

وَعَنْ أَبِيْ زَيِدٍ عَنْ عَبْدِ اللهِ بْنِ مَسْعُوْدٍ أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم قَالَ لَهُ لَيْلَةَ الْجِنِّ: “مَا فِيْ إِدَاوَتِكَ” قَالَ: قُلْتُ: نَبِيْذٌ. فَقَالَ: “تَمْرَةٌ طَيِّبَةٌ وَمَاءٌ طُهُوْرٌ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ وَزَادَ أَحْمَدُ وَالتِّرْمِذِيُّ: فَتَوَضَّأَ مِنْهُ وَقَالَ التِّرْمِذِيُّ: أَبُوْ زَيْدٍ مَجْهُوْلٌ وَصَحَّ.

480. (7) [1/150బలహీనం]

అబూ ’జైద్‌, ’అబ్దుల్లాహ్‌ బిన్‌ మస్‌’ఊద్‌ (ర) ద్వారా కథనం: ఇబ్నె మస్‌’ఊద్‌ (ర) కథనం: జిన్నుల రాత్రి ప్రవక్త (స) నన్ను, ‘సంచిలో ఏముంది,’ అని అడిగారు. దానికి నేను, ‘నబీజ్‌‘ అంటే ఖర్జూరాల నీరు ఉందని,’ అన్నాను. దానికి ప్రవక్త (స) ఖర్జూరం పరిశుద్ధమైన ఫలం, దాని నీరు  పరిశుద్ధ మైనది, పరిశుద్ధపరిచేది,’ (అబూ దావూ‘ద్‌.(

‘ఇలా పలికిన తరువాత, ‘దానితో వు’జూ చేశారు, ’అనే పదాలను, తిర్మిజి’, అ’హ్మద్, అధికంచేసారు. తిర్మిజి’, అంటారు, అబూ’జైద్‌, అప్రసిద్ధ కథకుడు.

481 – [ 8 ] ( صحيح ) (1/150)

و صَحَّ عَنْ عَلْقَمَةَ عَنْ عَبْدِ اللهِ بْنِ مَسْعُوْدٍ قَالَ: لَمْ أَكُنْ لَيْلَةَ الْجِنِّ مَعَ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم. رَوَاهُ مُسْلِمٌ .

481. (8) [1/150దృఢం]

’అబ్దుల్లాహ్‌ బిన్‌ మస్‌’ఊద్‌ ఆధారంగా, ’అల్‌ ఖమహ్‌ (ర) కథనం: ఇబ్నె-మస్‌’ఊద్‌ (ర) అన్నారు: జిన్నుల రాత్రి ప్రవక్త (స) వెంట మాలో నుండి ఎవ్వరూలేరు. [72](ముస్లిమ్‌)

482 – [ 9 ] ( صحيح ) (1/150)

وَعَنْ كَبْشَةَ بِنْتِ كَعْبِ بْنِ مَالِكٍ – وَكَانَتْ تَحْتَ ابْنِ أَبِيْ قَتَادَةَ- أَنَّ أَبَا قَتَادَةَ دَخَلَ عليها، فَسَكَبَتْ لَهُ وَضُوْءًا فَجَاءَتْ هِرَّةٌ تَشْرَبُ مِنْهُ فَأَصْغَى لَهَا الْإِنَاءَ حَتَّى شَرِبَتْ قَالَتْ كَبْشَةُ: فَرَآنِيْ أَنْظُرُ إِلَيْهِ، فَقَالَ أَتَعْجَبِيْنَ يَا ابْنَةَ أَخِيْ؟ قالت: فَقُلْتُ نَعَمْ، فَقَالَ: إِنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم قَالَ: “إِنَّهَا لَيْسَتْ بِنَجْسٍ، إِنَّهَا مِنَ الطَّوَافِيْنَ عَلَيْكُمْ وَالطَّوَّافَاتِ”. رَوَاهُ مَالِكٌ وَأَحْمَدُ وَالتِّرْمِذِيُّ وَأَبُوْ دَاوُدَ وَالنَّسَائِيُّ وَابْنُ مَاجَهُ وَالدَّارَمِيُّ .

482. (9) [1/150దృఢం]

అబూ ఖతాదహ్‌ కుమారుని భార్య అయిన, కబ్‌షహ్‌ బిన్తె కఅబ్‌ బిన్‌ మాలిక్‌ కథనం: మా మామగారు అబూ ఖతాదహ్‌ మా ఇంటికి వచ్చారు. నేను అతని కోసం వు’దూ’కు ఒక గిన్నెలో నీళ్ళు ఉంచాను. ఎక్కడి నుండో పిల్లి వచ్చి ఆ నీటిలో నుండి త్రాగసాగింది. అబూ ఖతాదహ్‌ ఆ గిన్నెను పిల్లి సరిగ్గా త్రాగడానికి కొద్దిగా వంచారు. ఆ పిల్లి నీళ్ళు త్రాగుతూ ఉంది. నేను ఆశ్చర్యంగా చూడసాగాను. మా మామగారు అది చూసి, ”ఓ కూతురా! నీవు దీన్ని ఆశ్చర్యంగా చూస్తున్నావా?’ అని అడిగారు. దానికి నేను, ‘అవునని,’ అన్నాను. దానికి అతను, ‘ఇందులో ఆశ్చర్యపడవలసింది ఏమీ లేదు. ప్రవక్త (స) ‘పిల్లి అపరిశుద్ధమైన జంతువు కాదు, అది మీ మధ్య తిరిగే జంతువు,’ అని అన్నారు,” అని చెప్పారు. [73] (మాలిక్‌, అ’హ్మద్‌, తిర్మిజి’, అబూ దావూ‘ద్‌, నసాయి‘, ఇబ్నె మాజహ్, దార్మీ)

483 – [ 10 ] ( صحيح ) (1/150)

وَعَنْ دَاوُدَ بْنِ صَالِحِ بْنِ دِيْنَارعَنْ أُمِّهِ أَنَّ مَوْلَاتَهَا أَرْسَلَتْهَا بِهَرِيْسَةٍ إِلَى عَائِشَةَ قَالَتْ: فَوَجَدْتُّهَا تُصَلِّيْ فَأَشَارَتْ إِلَيَّ أَنْ ضَعِيْهَا فَجَاءَتْ هِرَّةٌ فَأَكَلَتْ مِنْهَا فَلَمَّا انْصَرَفَتْ عَائِشَةُ مِنْ صَلَاتِهَا أَكَلَتْ مِنْ حَيْثُ أَكَلَتِ الْهِرَّةُ. فَقَالَتْ إِنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم قَالَ: “إِنَّهَا لَيْسَتْ بِنَجَسٍ إِنَّمَا هِيَ مِنَ الطَّوَّافِيْنَ عَلَيْكُمْ”. وَقَدْ رَأَيْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يَتَوَضَّأُ بِفَضْلِهَا. رَوَاهُ أَبُوْ دَاوُدَ.

483. (10) [1/150దృఢం]

దావూ‘ద్‌ బిన్‌ ’సాలిహ్‌ బిన్‌ దీనార్‌ (ర) తన తల్లి ద్వారా కథనం: ఆమెను విడుదల చేసిన యజమానురాలు ఆమె ద్వారా ’ఆయి‘షహ్‌ (ర) వద్దకు హరీసహ్ భోజన పదార్థాన్ని పంపారు. ఆమె చేరినపుడు ’ఆయి‘షహ్‌ (ర) నమా’జు చదువు తున్నారు. ‘ఆయి’షహ్‌ (ర) నమా’జు లోనే ఆ వంటకాన్ని అక్కడ పెట్టమని సైగచేశారు. పిల్లి వచ్చి ఆ వంటకాన్ని ఎంగిలిచేసింది. ’ఆయి‘షహ్‌ (ర) నమా’జు ముగించుకొని వచ్చి, పిల్లి ఎంగిలి చేసిన చోటునుండే తిన సాగారు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అప్పుడు ’ఆయి‘షహ్‌ (ర) ”ప్రవక్త (స) పిల్లిఎంగిలి పరిశుద్ధమే, ఈ పిల్లులు మీ మధ్య తిరుగుతూ ఉంటాయి,’ అని, అన్నారు,” ‘నేను ప్రవక్త (స)ను పిల్లి ఎంగిలి చేసిన నీటితో వు’దూ’ చేస్తుండగా చూశాను,’ అని అన్నారు. (అబూ దావూద్‌)

ఈ ’హదీసు‘ ద్వారా పిల్లి ఎంగిలి పరిశుద్ధమని, అత్య వసర పరిస్థితుల్లో నమా’జుస్థితిలో చేత్తో సైగచేయ వచ్చని తెలిసింది.

484 – [ 11 ] ( ضعيف ) (1/151)

وَعَنْ جَابِرٍ قَالَ: سُئِلَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم أَنَتَوَضَّأُ بِمَا أَفْضَلَتِ الْحُمُرُ؟ قَالَ: “نَعَمْ وَبِمَا أَفْضَلَتِ السِّبَاعُ كُلُّهَا”. رَوَاهُ فِيْ شَرْحِ السُّنَّةِ .

484. (11) [1/151బలహీనం]

జాబిర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ను గాడిదల ఎంగిలి చేసిన నీటితో వు’దూ’ చేసుకోవచ్చునా, అని ప్రశ్నించడం జరిగింది. దానికి ప్రవక్త (స), ‘అవును, క్రూరమృగాలన్నీ ఎంగిలి చేసిన నీటితో వు’దూ’ చేయవచ్చు,’ అని అన్నారు. (షర్హుస్సున్నహ్‌)

485 – [ 12 ] ( حسن ) (1/151)

وَعَنْ أُمِّ هَانِئٍ قَالَتْ:اِغْتَسَلَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم هُوَ وَمَيْمُوْنَةُ فِيْ قَصْعَةٍ فِيْهَا أَثَرُالْعَجِيْنِ. رَوَاهُ النَّسَائِيُّ وَابْنُ مَاجَهُ

485. (12) [1/150ప్రామాణికం]

ఉమ్మె హానీ (ర) కథనం: ప్రవక్త (స) మరియు ఆయన భార్య మైమూనహ్ ఇద్దరూ కలసి ఒకే తొట్టెలో నీళ్ళతో స్నానం చేశారు. అందులో పిండి మరక ఉండేది. (నసాయి‘, ఇబ్నె మాజహ్)

—–

మూడవ విభాగం  اَلْفَصْلُ الثَّالِثُ   

486 – [ 13 ] ( ضعيف ) (1/151)

عَنْ يَحْيَى بْنِ عَبْدِ الرَّحْمَنِ قَالَ: إِنَّ عُمَرَ خَرَجَ فِيْ رَكْبٍ فِيْهِمْ عَمْرُو بْنُ الْعَاصِ حَتَّى وَرَدُوْا حَوْضًا. فَقَالَ عَمْرٌو: يَا صَاحِبَ الْحَوْضِ هَلْ تَرِدُ حَوْضَكَ السِّبَاعُ. فَقَالَ عُمَرُ بْنُ الْخَطَّابِ يَا صَاحِبَ الْحَوْضِ لَا تُخْبِرْنَا فَإِنَّا نَرِدُ عَلَى السِّبَاعِ وَترِدُ عَلَيْنَا. رَوَاهُ مَالِكٌ.

486. (13) [1/151బలహీనం]

య’హ్‌యా బిన్‌ ‘అబ్దుర్ర’హ్మాన్‌ (ర) కథనం: ’ఉమర్‌ (ర) ఒక బృందంలో వెళ్ళారు. అందులో ’అమ్ర్ బిన్‌ ’ఆ’స్‌ కూడా ఉన్నారు. మార్గంలో ఒక చెరువు వద్ద వు’దూ’ స్నానాదుల కోసం ఆగారు. ’అమ్ర్ బిన్‌ ’ఆ’స్‌ ఆ చెరువు యజమానితో, ‘ఇక్కడకు క్రూరమృగాలు వస్తాయా,’ అని అడిగారు. అది విన్న ’ఉమర్‌ (ర), ‘ఓ యజమాని! ఇతనికి చెప్పవలసిన అవసరం లేదు. ఎందు కంటే, మేము క్రూరమృగాలు వదలిన నీటిని ఉపయోగిస్తాం. క్రూరమృగాలు మేము వదలిన నీటిని ఉపయో గిస్తాయి. అంటే పరస్పరం మిగిల్చిన నీటిని ఉపయో గిస్తాం,’ అని అన్నారు. (మాలిక్‌)

487 –]14 [ ( لم تتم دراسته ) (1/152)

وَزَادَ رَزِيْنٌ قَالَ: زَادَ بَعْضُ الرُّوَاةِ فِيْ قَوْلِ عُمَرِ: وَإِنِّيْ سَمِعْتُ رَسُوْلَ الله صلى الله عليه وسلم يَقُوْلُ: “لَهَا مَا أَخَذَتْ فِيْ بُطُوْنِهَا وَمَا بَقِيَ فَهُوَ لَنَا طُهُوْرٌ وَّشَرَابٌ”.

487. (14) [1/152అపరిశోధితం]

ర’జీన్‌ (ర) కథనం: కొందరు ఉల్లేఖనకర్తలు ’ఉమర్‌ (ర) మాటల్లో దీన్ని అధికం చేశారు, ”నేను ప్రవక్త (స)ను ఇలా ప్రవచిస్తూ ఉండగా విన్నాను, ‘క్రూర మృగాలు త్రాగి తమ కడుపు నింపుకున్నది వారి హక్కు, మిగిలింది మా కోసం పరిశుద్ధమైనది, పరిశుభ్ర పరిచేది. మేము త్రాగటానికి యోగ్యమైనది.’ ”

488 – [ 15 ] ( ضعيف جدا ) (1/152)

وَعَنْ أَبِيْ سَعِيْدِ الْخُدْرِيِّ أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم سُئِلَ عَنِ الْحَيَاضِ الَّتِيْ بَيْنَ مَكَّةَ وَالْمَدِيْنَةِ تَرِدُهَا السِّبَاعُ وَالْكِلَابُ وَالْحُمُرُ وَعَنِ الطُّهْرِ مِنْهَا. فَقَالَ: “لَهَا مَا حَمَلْتْ فِيْ بُطُوْنِهَا وَلَنَا مَا غَبَرَ طُهُوْرٌ. رَوَاهُ ابْنُ مَاجَهُ .

488.(15) [1/152అతి బలహీనం]

అబూ స’యీద్‌ ’ఖుద్రీ (ర) కథనం: ప్రవక్త (స)ను మక్కహ్ మరియు మదీనహ్ ల మధ్య ఉన్న చెరువుల పరిశుభ్రత గురించి ప్రశ్నించడం జరిగింది. ఈ చెరువుల వద్దకు క్రూరమృగాలు, కుక్కలు, గాడిదలు, పక్షులు వస్తూ పోతూ ఉంటాయి. దానికి ప్రవక్త (స) సమాధానమిస్తూ, క్రూరమృగాలు త్రాగి తమ కడుపు నింపుకున్నది వారి వంతు, వదలివేసినది మా కోసం పరిశుద్ధమైనది. పరిశుద్ధ పరిచేది,’ అని ప్రవచించారు. (ఇబ్నె మాజహ్)

489 – [ 16 ] ( ضعيف ) (1/152)

وَعَنْ عُمَرَ بْنِ الْخَطّابِ رضي الله عَنْهُ قَالَ: لَا تَغْتَسِلُوْا بِالْمَاءِ الْمُشَمَّسِ فَإِنَّهُ يُوْرِثُ الْبَرَصَ. رَوَاهُ الدَّارَقُطْنِيُّ

489. (16) [1/152బలహీనం]

’ఉమర్‌ (ర) కథనం: ఎండవల్ల వేడెక్కిన నీళ్ళతో స్నానం చేయకండి. ఎందుకంటే ఎండవల్ల వేడెక్కిన నీటి వల్ల తెల్ల మచ్చల రోగం వస్తుంది. (దార ఖు’త్నీ)

ఇటువంటి నీరు పరిశుభ్రమైనవి, ఉపయోగించ వచ్చును. వ్యాధివచ్చే ప్రమాదముంటే అప్రమత్తంగా ఉండాలి.

=====

8- باَبُ تَطْهِيْرِ النَّجَاسَاتِ

8. శుద్ధి

మొదటి విభాగం اَلْفَصْلُ الْأَوَّلُ       

490 – [ 1 ] ( متفق عليه ) (1/153)

عَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِذَا شَرِبَ الْكَلْبُ فِيْ إِنَاءِ أَحَدِكُمْ فَلْيَغْسِلْهُ سَبْعَ مَرَّاتٍ”.

وَفِيْ رَوَايَةٍ لِمُسْلِمٍ: “طُهُوْرُ إِنَاءِ أَحَدِكُمْ إِذَا وَلَغَ فِيْهِ الْكَلْبُ أَنْ يَّغْسِلَهُ سَبْعَ مَرَّاتٍ أَوْلَاهُنَّ بِالتُّرَابِ”.  

490. (1) [1/153ఏకీభవితం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, మీ గిన్నెలను కుక్క ఎంగిలిచేస్తే, ఆగిన్నెను 7 సార్లు కడగాలి. [74]

ముస్లిమ్‌లోని ఒక ఉల్లేఖనంలో, ‘పాత్రను కుక్క ఎంగిలి చేస్తే, ఆ పాత్రను ముందు మట్టితో తోమి 7 సార్లు నీటితో కడగాలి,’  అని ఉంది.

491 – [ 2 ] ( صحيح ) (1/153)

وَعَنْهُ قَالَ: قَامَ أَعْرَابِيٌّ فَبَالَ فِيْ الْمَسْجِدِ فَتَنَاوَلَهُ النَّاسُ فَقَالَ لَهُمُ النَّبِيُّ صلى الله عليه وسلم: “دَعُوْهُ وَهَرِيْقُوْا عَلَى بَوْلِهِ سَجْلًا مِّنْ مَّاءٍ أَوْ ذُنُوْبًا مِّنْ مَّاءٍ فَإِنَّمَا بُعِثْتُمْ مُيَسِّرِيْنَ وَلَمْ تُبْعَثُوْا مُعَسِّرِيْنَ”. رَوَاهُ الْبُخَارِيُّ .

491. (2) [1/153దృఢం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ఒక బదూ మస్జిద్‌లో నిలబడి మూత్ర విసర్జన చేసివేశాడు. ప్రజలు అతని వెంట పడ్డారు, కొట్టడానికి ప్రయత్నించారు. ప్రవక్త (స) కలగజేసు కొని, ”అతన్ని వదలివేయండని, పొరపాటున తప్పు జరిగి పోయింది, దానిపై నీళ్ళు వేయిండి, అంటే నీటితో ఆ స్థలాన్ని కడిగివేయండి. మీరు సులభతరం చేయటానికి పంపబడ్డారు, కష్టతరం చేయటానికి పంపబడలేదు,” అని, అన్నారు. [75](బు’ఖారీ)

492 – [ 3 ] ( متفق عليه ) (1/153)

وعَنْ أَنَسٍ قَالَ: بَيْنَمَا نَحْنُ فِيْ الْمَسْجِدِ مَعَ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم إِذَ جَاءَ أَعْرَابِيٌّ فَقَامَ يَبُوْلُ فِيْ الْمَسْجِدِ فَقَالَ أَصْحَابُ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم مَهْ مَهْ قَالَ. فَقَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَا تُزْرِمُوْهُ دَعُوْهُ” فَتَرَكُوْهُ حَتَّى بَالَ ثُمَّ إِنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم دَعَاهُ فَقَالَ لَهُ: “إِنَّ هَذِهِ الْمَسَاجِدَ لَا تَصْلَحُ لِشَيْءٍ مِّنْ هَذَا الْبَوْلِ وَّلَا الْقَذْرِ إِنَّمَا هِيَ لِذِكْرِ اللهِ عز وجل وَالصَّلَاةِ وَقِرَاءَةٍ الْقُرْآنِ. “أَوْ كَمَا قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم قَالَ: فَأَمَرَ رَجُلًا مِّنَ الْقَوْمِ فَجَاءَ بِدَلْوٍ مِّنْ مَّاءٍ فَسَنَّهُ عَلَيْهِ.

492. (3) [1/153ఏకీభవితం]

అనస్‌ (ర) కథనం: ప్రవక్త (స) వెంట మేమందరం మస్జిద్‌లో ఉన్నాము. ఒక బదూ మస్జిద్‌లో నిలబడి మూత్ర విసర్జన చేయసాగాడు. అది చూసిన అనుచరులు, ‘ఆగు ఆగు,’ అన్నారు. ప్రవక్త (స), ‘అతన్ని వదలివేయండి. పని పూర్తికానివ్వండి,’ అని అన్నారు. అతడు మూత్ర విసర్జన ముగించాడు. అనంతరం ప్రవక్త (స) అతన్ని తన దగ్గరకు పిలిచారు. ‘మస్జిదుల్లో ఈ విధంగా మలమూత్ర విసర్జనచేయటం మంచిదికాదు, ఈ మస్జిదులు దైవారాధన ఖుర్‌ఆన్‌ పఠనం, నమా’జులు చేయటం కోసం ఉన్నాయి,’ అని అన్నారు. ఆ తరువాత ఒక వ్యక్తిని, ‘నీళ్ళు తెమ్మని చెప్పారు.’ అతడు ఒక చేద నీళ్ళు తెచ్చాడు. మూత్రం ఉన్నచోట వేశాడు. (బు’ఖారీ, ముస్లిమ్‌)

493 – [ 4 ] ( متفق عليه ) (1/154)

وَعَنْ أَسْمَاءٍ بِنْتِ أَبِيْ بَكْرٍ أَنَّهَا قَالَتْ: سَأَلْتِ امْرَأَةٌ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم. فَقَالَتْ يَا رَسُوْلَ اللهِ أَرَأَيْتَ إِحْدَانَا إِذَا أَصَابَ ثَوْبَهَا الدَّمُ مِنَ الْحَيْضَةِ كَيْفَ تَصْنَعُ فَقَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِذَا أَصَابَ ثَوْبَ إِحْدَاكُنَّ الدَّمُ مِنَ الْحَيْضَةِ فَلْتَقْرُصْهُ ثُمَّ لِتَنْضَحْهُ بِمَاءِ ثُمَّ لِتُصَلِّيْ فِيْهِ”.

493. (4) [1/154ఏకీభవితం]

అస్మా బిన్‌తె అబీ బకర్‌ (ర) కథనం: ప్రవక్త (స)ను ఒక స్త్రీ, ‘ఓ ప్రవక్తా! స్త్రీ వస్త్రాల్లో బహిష్టు రక్తం అంటుకుంటే ఏం చేయాలి,’ అని విన్నవించుకుంది. దానికి ప్రవక్త (స), ‘వస్త్రాల్లో బహిష్టురక్తం అంటుకుంటే, దాన్ని బాగా కడిగి శుభ్రంచేసి, ఆ వస్త్రాలతోనే నమా’జు చదవవచ్చు. అవి తడిగా ఉన్నా లేదా పొడిగా ఉన్నా,’ అని అన్నారు. (బు’ఖారీ, ముస్లిమ్‌)

494 – [ 5 ] ( متفق عليه ) (1/154)

وَعَنْ سُلَيْمَانَ بْنِ يَسَارٍ قَالَ: سَأَلْتُ عَائِشَةَ عَنِ الْمَنِيِّ يُصِيْبُ الثَّوْبَ. فَقَالَتْ كُنْتُ أَغْسِلُهُ مِنْ ثَوْبِ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم فَيَخْرُجُ إِلَى الصَّلَاةِ وَأَثَرُ الْغَسَلِ فِيْ ثَوْبِهِ بقع الْمَاءِ.

494. (5) [1/154ఏకీభవితం]

సులైమాన్‌ బిన్‌ యసార్‌ (ర) కథనం: ’ఆయి‘షహ్‌ (ర) ను, ‘నేను వీర్యం వస్త్రాలకు అంటుకుంటే ఏం చేయాలి,’ అని అడిగాను. దానికి ’ఆయిషహ్‌ (ర), ‘కడిగి శుభ్రపరచు కోవాలని, ప్రవక్త (స) వస్త్రాల్లో వీర్యం అంటుకున్న వాటిని నేను నీటితో కడిగి శుభ్రపరిచేదాన్ని, ప్రవక్త (స) తడిగా ఉన్న వస్త్రాలే ధరించి నమా’జుకు వెళ్ళేవారు, అని సమాధానం ఇచ్చారు.’ ” (బు’ఖారీ, ముస్లిమ్‌)

495 – [ 6 ] ( صحيح ) (1/154)

وَعَنِ الْأَسْوَدِ وَهَمَّامٍ عَنْ عَائِشَةَ قَالَتْ: كُنْتُ أَفْرُكُ الْمَنِيَّ مِنْ ثَوْبِ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم. رَوَاهُ مُسْلِمٌ .

495. (6) [1/154దృఢం]

అస్వద్‌ మరియు హమ్మామ్‌ (ర)లు, ’ఆయి’షహ్‌ (ర) ద్వారా కథనం: ’ఆయి’షహ్‌ (ర) ఇలా అన్నారు, ”ప్రవక్త (స) వస్త్రాలకు వీర్యం అంటుకొని ఎండిపోతే నేను దాన్ని గోకి శుభ్రపరచేదాన్ని, ప్రవక్త (స) వాటితోనే నమా’జు చదివేవారు.

496 – [ 7 ] ( لم تتم دراسته ) (1/154)

وَبِرَوَايَةِ عَلْقَمَةَ وَالْأَسْوَدِ عَنْ عَائِشَةَ نَحْوَهُ وَفِيْهِ: ثُمَّ يُصَلِّيْ فِيْهِ.

496. (7) [1/154అపరిశోధితం]

అ’ల్ఖమహ్, మరియు అస్వద్ లు, ‘ఆయి’షహ్‌ (ర) ద్వారా, ఈ రెండు ‘హదీసు’లలో, ‘ఒకవేళ వీర్యం తడిగా ఉంటే నీటితో కడిగితే, ఎండుగా ఉంటే గోకితే శుభ్రమై పోతుంది,’ అని తెలిసిందన్నారు.

497 – [ 8 ] ( متفق عليه ) (1/154)

وَعَنْ أُمِّ قَيْسٍ بِنْتِ مِحْصَنٍ: أَنَّهَا أَتَتْ بِاِبْنِ لَهَا صَغِيْرٍ لَّمْ يَأْكُلِ الطَّعَامَ إِلَى رَسُوْلِ الله صلى الله عليه وسلم فَأَجْلَسَهُ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم فِيْ حِجْرِهِ فَبَالَ عَلَى ثَوْبِهِ فَدَعَا بِمَاءِ فَنَضَحَهُ وَلَمْ يَغْسِلْهُ .

497. (8) [1/154ఏకీభవితం]

ఉమ్మె ఖైస్‌ బిన్‌తె మె’హ్‌’సన్‌ (ర) కథనం: ఆమె తన పసిబిడ్డను ప్రవక్త (స) వద్దకు తీసుకొని వెళ్ళారు. ఆ బిడ్డ ఇంకా అన్నం తినటం లేదు. ప్రవక్త (స) ఆ బిడ్డను తన ఒడిలో కూర్చోబెట్టుకున్నారు. ఆ పసిబిడ్డ ప్రవక్త (స) ఒడిలో మూత్ర విసర్జన చేసివేశాడు. ప్రవక్త (స) నీళ్ళు తెప్పించి, దానిపై చిలకరించారు. కడగలేదు. [76] (బు’ఖారీ, ముస్లిమ్‌)

498 – [ 9 ] ( صحيح ) (1/155)

وَعَنْ عَبْدِ اللهِ بْنِ عَبَّاسٍ قَالَ: سَمِعْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ: “إِذَا دُبِغَ الْإِهَابُ فَقَدْ طَهُرَ”. رَوَاهُ مُسْلِمٌ .

498. (9) [1/155దృఢం]

ఇబ్నె ’అబ్బాస్‌ (ర) కథనం: ప్రవక్త (స) ఇలా ప్రవ చిస్తూ ఉండగా నేను విన్నాను, ”జంతువు చర్మాన్ని పదను చేస్తే అది పరిశుద్ధమైపోతుంది.” [77] (ముస్లిమ్‌)

499 – [ 10 ] ( متفق عليه ) (1/155)

وَعَنِ ابْنِ عَبَّاسٍ قَالَ: تُصُدِّقَ عَلَى مَوْلَاةٍ لِمَيْمُوْنَةَ بِشَاةٍ فَمَاتَتْ فَمَرَّ بِهَا رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم فَقَالَ: “هَلَّا أَخَذْتُمْ إِهَابَهَا فَدَبَغْتُمُوْهُ فَانْتَفَعْتُمْ بِهِ”. فَقَالُوْا: إِنَّهَا مَيْتَةٌ. فَقَالَ: “إِنَّمَا حُرِّمَ أَكْلُهَا”.

499. (10) [1/155ఏకీభవితం]

ఇబ్నె ’అబ్బాస్‌ (ర) కథనం: మైమూనహ్ (ర) విడుదల చేసిన బానిసరాలికి దానంగా ఒక మేక ఇవ్వటం జరిగింది. ఆ మేక మైమూనహ్ వద్ద చని పోయింది. ప్రజలు దాన్ని పార వేశారు. ప్రవక్త (స) ఆ మరణించిన మేక ప్రక్క నుండి వెళుతూ, ‘నువ్వు ఈ మేక తోలును శుభ్రపరచి ఎందుకు వినియో గించవు?’ అని అన్నారు. దానికి ప్రజలు, ‘ఓ ప్రవక్తా! అది చనిపోయింది కదా, ఎలా ఉపయోగించాలి,’ అని విన్నవించుకున్నారు. దానికి ప్రవక్త (స), ‘దాని మాంసం తినటం నిషిద్ధం. కాని చర్మాన్ని పరిశుభ్ర పరిస్తే దాన్ని ఉపయోగించుకోవచ్చు,’ అని అన్నారు. (బు’ఖారీ, ముస్లిమ్‌)

 500 – [ 11 ] ( صحيح ) (1/155)

وَعَنْ سَوْدَةَ زَوْجِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَتْ: مَاتَتْ لَنَا شَاةٌ فَدَبَغْنَا مَسْكَهَا ثُمَّ مَا زَلْنَا نَنْبِذُ فِيْهِ حَتَّى صَارَ شَنًّا. رَوَاهُ الْبُخَارِيُّ.

500. (11) [1/155దృఢం]

ఉమ్ముల్ ము’అమినీన్, సౌదహ్ (ర) కథనం: మా ఒక మేక చని పోయింది. మేము దాని చర్మాన్ని పదను చేసి శుభ్రపరచుకున్నాం. తరువాత దానితో నీటి సంచి చేసు కొన్నాం. అందులో నబీజ్‌‘ తయారు చేసే వాళ్ళం. చివరికి ఆ సంచి పాతదైపోయింది. (బు’ఖారీ)

—–

రెండవ విభాగం  اَلْفَصْلُ الثَّانِيْ    

501 – [ 12 ] ( صحيح ) (1/155)

عَنْ لُبَابَةَ بِنْتِ الْحَارِثِ قَالَتْ: كَانَ الْحُسَيْنُ بْنُ عَلِيٍّ رضي الله عَنْهُمَا فِيْ حِجْرِ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم. فَبَالَ عَلَيْهِ فَقُلْتُ اِلْبَسْ ثَوْبًا وَأَعْطَنِيْ إِزَارَكَ حَتَّى أَغْسِلَهُ قَالَ: “إِنَّمَا يُغْسَلُ مِنْ بَوْلِ الْأُنْثَى وَيُنْضَحُ مِنْ بَوْلِ الذَّكَرِ”. رَوَاهُ أَحْمَدُ وَأَبُوْ دَاوُدَ وَابْنُ مَاجَهُ .

501. (12) [1/155దృఢం]

లుబాబహ్‌ బిన్‌తె ’హారిస్‌ (ర) కథనం: ’హుసైన్‌ బిన్‌ ’అలీ (ర) ప్రవక్త (స) ఒడిలో కూర్చున్నారు. ప్రవక్త (స) దుస్తులపై మూత్ర విసర్జనచేశారు. అప్పుడు నేను, ‘వేరే దుస్తులు తొడుక్కోమని, మూత్రవిసర్జన చేసిన దుస్తులను ఇస్తే, నేను వాటిని కడిగి శుభ్ర పరుస్తానని,’ అన్నాను. దానికి ప్రవక్త (స), ‘ఆడబిడ్డ మూత్రం కడగాలని, మగబిడ్డ మూత్రంపై కేవలం నీళ్ళు చిలకరిస్తే సరిపోతుందని, అయితే ఇది కేవలం పాలు త్రాగే స్థితిలో మాత్రమే. మగబిడ్డ అన్నం తినటం ప్రారంభిస్తే తప్పనిసరిగా కడగాలి,’ అని అన్నారు. (అ’హ్మద్ అబూ దావూ‘ద్‌, ఇబ్నె మాజహ్)

502 – [ 13 ] ( صحيح ) (1/156)

وَفِيْ رِوَايَةِ لِأَبِيْ دَاوُدَ وَالنَّسَائِي عَنْ أَبِيْ السَّمْحِ قَالَ : يُغْسِلُ مِنْ بَوْلِ الْجَارِيَةِ وَيُرَشُّ مِنْ بَوْلِ الْغُلَامِ .

502. (13) [1/156దృఢం]

అబూ దావూద్‌ మరియు నసాయి’లలో, అబి అస్సమ్’హి ద్వారా ఈ విధమైన పదాలు ఉన్నాయి. ప్రవక్త (స) ప్రవచనం, ”ఆడబిడ్డ మూత్రం కడగాలి, మగ బిడ్డ మూత్రంపై నీళ్ళు చిలకరించాలి.”

503 – [ 14 ] ( صحيح ) (1/156)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ رضي اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِذَا وَطِئَ أَحَدُكُمْ بِنَعْلِهِ الْأَذَى فَإِنَّ التُّرَابَ لَهُ طَهُوْرٌ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ. وَلِاِبْنِ مَاجَهُ مَعْنَاهُ .

503. (14) [1/156దృఢం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఎవరైనా అపరిశుద్ధమైన చెప్పులు ధరించి నేలపైన నడిస్తే, మట్టి దాన్ని శుభ్రపరుస్తుంది.” [78] (అబూ దావూద్‌, ఇబ్నె మాజహ్)  

504 – [ 15 ] ( صحيح ) (1/156)

وَعَنْ أُمِّ سَلَمَةَ قَالَتْ لَهَا امْرَأَةٌ: إِنِّيْ امْرَأَةٌ أُطِيْلُ ذَيْلِيْ وَأَمْشِيْ فِيْ الْمَكَانِ الْقَذِرِ قَالَتْ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “يُطَهّرُهُ مَا بَعْدَهُ”. رَوَاهُ مَالِكٌ وَأَحْمَدُ وَالتِّرْمِذِيُّ وَأَبُوْ دَاوُدَ وَالدَّارَمِيُّ. وَقَالَا: الْمَرْأَةُ أُمُّ وَلَدٍ لِإِبْرَاهِيْمَ ابْنِ عَبْدِ الرَّحْمَنِ بْنِ عَوْفٍ.

504. (15) [1/156దృఢం]

ఉమ్మె సలమహ్ (ర) కథనం: ఆమె వద్దకు ఒక స్త్రీ వచ్చి, ‘నా కొంగు పొడవుగా ఉంటుంది. ఒక్కోసారి అపరిశుద్ధమైన నేలపైన నడవవలసి వస్తుంది,’ అని విన్నవించుకుంది. అది విన్న ప్రవక్త (స), ‘ఆ తరువాత వచ్చిన పరిశుద్ధ నేల దానిని పరిశుభ్రపరుస్తుంది,’ అని అన్నారు. (మాలిక్‌, అ’హ్మద్, తిర్మిజి’, అబూ దావూద్‌, దార్మీ)

అబూ దావూద్‌ మరియు దార్మీ ఉల్లేఖనంలో, ‘ఆ స్త్రీ ఇబ్రాహీమ్‌ బిన్‌ ’అబ్దుర్ర’హ్మాన్‌ బిన్‌ ’ఔఫ్‌ సేవకురాలు,’ అని ఉంది.

505 – [ 16 ] ( ضعيف ) (1/157)

وَعَنْ الْمَقْدَامِ بْنِ مَعْدِيْ كَرَبَ قَالَ: نَهَى رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم عَنْ لُبْسِ جُلُوْدِ السِّبَاعِ وَالرَّكُوْبِ عَلَيْهَا. رَوَاهُ أَبُوْ دَاوُدَ وَالنَّسَائِيُّ.

505. (16) [1/157బలహీనం]

మిఖ్‌దామ్ బిన్‌ మ’అదీ కరబ్‌ (ర) కథనం: ప్రవక్త (స) క్రూరమృగాల చర్మాన్ని ధరించటాన్ని, వాటిపై ప్రయాణించటాన్ని (కూర్చోవటాన్ని) వారించారు. [79] (అబూ దావూద్‌, నసాయి‘)

506 – [ 17 ] ( صحيح ) (1/157)

وَعَنْ أَبِيْ الْمَلِيْحِ بْنِ أُسَامَةَ عَنْ أَبِيْهِ عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم: نَهَى عَنْ جُلُوْدِ السِّبَاعِ. رَوَاهُ أَحْمَدُ وَأَبُوْ دَاوُدَ وَالنَّسَائِيُّ وَزَادَ التِّرْمِذِيُّ وَالدَّارَمِيُّ: أَنْ تَفْتَرِشَ .

506. (17) [1/157దృఢం]

అబుల్‌ మలీ’హ్‌ బిన్‌ ఉసామహ్ (ర) తన తండ్రి ద్వారా కథనం: ప్రవక్త (స) క్రూరమృగాల చర్మాన్ని ఉపయోగించ రాదని ప్రవచించారు. (అ’హ్మద్‌, అబూ దావూద్‌, నసాయి’)

తిర్మిజీ’ మరియు దార్మీలలో ఇది అధికంగా ఉంది, ”ప్రవక్త (స) క్రూరమృగాల చర్మాన్ని పడకగా ఉపయో గించటం నుండి కూడా వారించారు.”

507 – [ 18 ] ( صحيح ) (1/157)

وَعَنْ أَبِيْ الْمَلِيْحِ: أَنَّهُ ذَكَرَهُ ثَمَنَ جُلُوْدِ السِّبَاعِ. رَوَاهُ التِّرْمِذِيُّ فِيْ اللِّبَاسِ مِنْ جَامِعِهِ وَسَنَدَهُ جَيِّدٌ.

507. (18) [1/157-దృఢం]

అబుల్‌ మలీ’హ్‌ (ర) క్రూరమృగాల చర్మం విలువను చెడుగా భావించేవారు. (తిర్మిజి’)

అంటే క్రూరమృగాలచర్మాన్నిఅమ్మటం కొనటం చెడుగా భావించేవారు. ఎందుకంటే వాటిని ఉపయోగించటం నిషిద్ధం. కనుక అమ్మటం-కొనటం కూడా నిషిద్ధమే.

508 – [ 19 ] ( ضعيف ) (1/157)

وَعَنْ عَبْدِ اللهِ بْنِ عُكَيْمٍ قَالَ: أَتَانَا كِتَابُ رَسُوْلِ الله صلى الله عليه وسلم: “أَنْ لَا تَنْتَفِعُوْا مِنَ الْمَيْتَةِ بِإِهَابِ وَلَا عَصَبٍ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَأَبُوْ دَاوُدَ وَالنَّسَائِيُّ وَابْنُ مَاجَهُ.

508. (19) [1/157బలహీనం]

’అబ్దుల్లాహ్‌ బిన్‌ ’ఉకైమ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ఉత్తరం మా వద్దకు వచ్చింది. అందులో ఇలా వ్రాసి ఉంది, ”మీరు మరణించిన జంతువు చర్మాన్నిగాని, కాళ్ళనుగాని, పదను చేయనంత వరకు ఉపయోగించ కండి, (తిర్మిజి’, అబూ దావూద్‌, నసాయి‘, ఇబ్నె మాజహ్)

509 – [ 20 ] ( حسن ) (1/158)

وَعَنْ عَائِشَةَ رَضِيَ اللهُ عَنْهَا أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم: أَمَرَ أَنْ يُّسْتَمْتَعَ بِجُلُوْدِ الْمَيْتَةِ إِذَا دُبِغَتْ. رَوَاهُ مَالِكٌ وَأَبُوْ دَاوُدَ.

509. (20) [1/158ప్రామాణికం]

’ఆయి’షహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) మరణించిన జంతువు యొక్క చర్మం ఉపయోగించవచ్చని అనుమ తించారు. అయితే దాన్ని శుభ్రపరచిన తరువాత. (మాలిక్‌, అబూ దావూద్‌)

510 – [ 21 ] ( حسن ) (1/158)

وَعَنْ مَيْمُوْنَةَ مَرَّ عَلَى النَّبِيِّ الله صلى الله عليه وسلم رِجَالٌ مِّنْ قُرَيْشٍ يَجُرُّوْنَ شَاةً لَهُمْ مِّثْلَ الْحِمَارِ. فَقَالَ لَهُمْ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَوْ أَخَذْتُمْ إِهَابَهَا”. قَالُوْا إِنَّهَا مَيْتَةٌ. فَقَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “يُطَهِّرُهَا الْمَاءُ وَالْقَرَظُ”. رَوَاهُ أَحْمَدُ وَأَبُوْ دَاوُدَ .

510. (21) [1/158ప్రామాణికం]

మైమూనహ్ (ర) కథనం: ఖురైషుల మేక ఒకటి మరణిం చింది. వాళ్ళు దాన్ని ఈడ్చుకుంటూ ప్రవక్త (స) సమీపం నుండి తీసుకొని వెళుతున్నారు. ప్రవక్త (స) అది చూసి, ‘మీరు దీని చర్మాన్ని తీసి పదును చేసి (శుభ్ర పరచి) ఉప యోగించుకుంటేబాగుండేది,’ అని అన్నారు. దానికి వారు ‘ప్రవక్తా! ఇది మరణించింది,’ అని అన్నారు. అప్పుడు ప్రవక్త (స), ‘నీళ్ళు, తుమ్మచెట్టు తొక్క (బెరడు) దీన్ని శుభ్ర పరుస్తాయి,’ అనిఅన్నారు.(అ’హ్మద్‌ అబూ దావూద్‌)

511 – [ 22 ] ( حسن ) (1/158)

وَعَنْ سَلَمَةَ ابْنِ الْمُحَبِّقِ: أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم فِيْ غَزْوَةِ تَبُوْكَ أَتَى عَلَى بَيْتِ فَإِذَا قِرْبَةٌ مُّعَلَّقَةٌ. فَسَأَلَ الْمَاءَ. فَقَالُوْا يَا رَسُوْلَ اللهِ إِنَّهَا مَيْتَةٌ: “فَقَالَ دِبَاغُهَا طُهُوْرُهَا”. رَوَاهُ أَحْمَدُ وَأَبُوْ دَاوُدَ.

511. (22) [1/158ప్రామాణికం]

సలమహ బిన్‌ అల్‌ ము’హబ్బిఖ్‌ (ర) కథనం: ప్రవక్త (స) తబూక్‌ యుద్ధంలో ఒక వ్యక్తి ఇంటికి వెళ్ళారు. అక్కడ ఒక పాత చర్మపు సంచి వ్రేలాడుతూ ఉండటం చూశారు. ప్రవక్త (స) నీళ్ళు అడిగారు. ఇంటివారు, ‘ఓ ప్రవక్తా! ఇది మరణించిన జంతువు యొక్క చర్మంతో చేసినది,’ అని అన్నారు. దానికి ప్రవక్త (స), ‘దాన్ని ఊరబెడితే (పదును చేస్తే), అది శుభ్రమైపోతుంది,’ అని అన్నారు. (అ’హ్మద్‌, అబూ దావూద్‌)

—–

మూడవ విభాగం  اَلْفَصْلُ الثَّالِثُ   

512 – [ 23 ] (صحيح) (1/158)

وَعَنْ إِمْرَأةٍ مِّنْ بَنِيٍّ عَبْدِ الْأَشْهَلِ قَالَتْ: قُلْتُ: يَا رَسُوْلَ اللهِ إِنَّ لَنَا طَرِيْقًا إِلَى الْمَسْجِدِ مُنْتِنَةً فَكَيْفَ نَفْعَلُ إِذَا مُطِرْنَا. قَالَ: “أَلَيْسَ بَعْدَهَا طَرِيْقٌ هِيَ أَطْيَبُ مِنْهَا. قَالَتْ قُلْتُ بِلَى. قَالَ فَهَذِهِ بِهَذِهِ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ.

512. (23) [1/158దృఢం]

బనూ ’అబ్దుల్‌ అష్‌హల్‌ తెగకు చెందిన ఒక స్త్రీ కథనం: నేను ప్రవక్త (స)ను, ‘ఓ ప్రవక్తా! మస్జిద్‌కు వచ్చే మార్గంలో అపరిశుద్ధం ఉంటుంది. వర్షాకాలంలో మేము ఎలా రావాలి’ దానికి ప్రవక్త (స), ‘అది విడిచి, మరొక మంచి మార్గం లేదా,’ అని అడిగారు.’ నేను, ‘ఉంది,’ అని అన్నాను. అప్పుడు ప్రవక్త (స), ‘ఈ మంచి మార్గం ఆ చెడ్డ మార్గాని కంటే ఉత్తమమైనది,’ అని అన్నారు. [80] (అబూ దావూద్‌)

513 – [ 24 ] ( صحيح ) (1/159)

وَعَنْ عَبْدِ اللهِ بْنِ مَسْعُوْدٍ قَالَ: كُنَّا نُصَلِّيْ مَعَ رَسُوْلِ الله صلى الله عليه وسلم وَلَا نَتَوَضَّأُ مِنَ الْمَوْطِئِ. رَوَاهُ التِّرْمِذِيُّ .

513. (24) [1/159దృఢం]

’అబ్దుల్లాహ్‌ బిన్‌ మస్‌’ఊద్‌ (ర) కథనం: మేము ప్రవక్త (స) వెంట నమా’జు చదివేవాళ్ళం. చెప్పులు లేకుండా నేలపై నడవటం వల్ల మళ్ళీ వు’దూ’ చేసేవాళ్ళం కాము. (తిర్మిజి’)

514 – [ 25 ] ( صحيح ) (1/159)

وَعَنِ ابْنِ عُمَرَ قَالَ: كَانَتِ الْكِلَابُ تُقْبِلُ وَتُدْبِرُ فِيْ الْمَسْجِدِ فِيْ زَمَانِ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم. فَلَمْ يَكُوْنُوْا يَرْشُوْنَ شَيْئًا مِّنْ ذَلِكَ. رَوَاهُ الْبُخَارِيُّ .

514. (25) [1/159దృఢం]

’అబ్దుల్లాహ్‌ బిన్‌ ’ఉమర్‌ (ర) కథనం: ప్రవక్త (స) కాలంలో కుక్కలు మస్జిద్‌లోకి వస్తూపోతూ ఉండేవి. దానికి ప్రజలు మస్జిద్‌ను కడిగేవారు కాదు. [81] (బు’ఖారీ)

515 – [ 26 ] (ضعيف) (1/159)

وَعَنِ الْبَرَاءِ بْنِ عَازِبٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَا بَأْسَ بِبَوْلِ مَا يُؤْكَلُ لَحْمُهُ”.

515. (26) [1/159-బలహీనం]

బరాఅ‘ ఇబ్నె ’ఆ’జిబ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం ”మాంసం తినబడే జంతువుల మూత్రం మరేం ఫర్వా లేదు.”

516 – [ 27 ] ( ضعيف ) (1/159)

وَفِيْ رِوَايَةِ جَابِرٍ قَالَ: “مَا أَكَلَ لَحْمُهُ فَلَا بَأْسَ بِبَوْلِهِ”. رَوَاهُ أَحْمَدُ وَالدَّارَقُطْنِيُّ .

516. (27) [1/159బలహీనం]

జాబిర్‌ (ర) కథనం: ధర్మసమ్మతమైన జంతువుల మూత్రం పరిశుద్ధమైనది. (అ’హ్మద్‌, దార ఖు’త్నీ)

=====

9- بَابُ الْمَسْحِ عَلَى الْخُفَّيْنِ

9. మేజోళ్ళపై తడిచేతితో తుడవటం

మస్’హ్‌ అంటే నిమరటం. ఇక్కడ రెండు కాళ్ళకు మేజోళ్ళు లేదా బూట్లు (చెప్పులు) ఉంటే కాళ్ళను కడగటం తప్పనిసరి కాదు. తడి చేతులతో వాటి పై భాగాన్ని తుడిచివేస్తే సరిపోతుంది. చేతి ఐదు-వ్రేళ్ళను నీటితో తడిపి బూట్లు లేదా మేజోళ్ళ పై కాలి వ్రేళ్ళ వద్ద నుండి చీలమండలవరకు తుడిస్తే సరి పోతుంది. ముందు కుడికాలిని, ఆ తరువాత ఎడమ కాలిని కడగటానికి బదులుగా తుడిచివేస్తే సరిపోతుంది.

ప్రామాణిక ‘హదీసు’ల ద్వారా దీన్ని నిరూపించడం జరిగింది. ఒకవేళ ఎవరైనా దీన్నిధర్మసమ్మతం కాదని భావిస్తే పండితుల అభిప్రాయం ప్రకారం అవిశ్వాసి అయి పోతాడు. స్థానికుడు ఒకదినం, ఒకరాత్రి వరకు, ప్రయాణీకుడు మూడు రాత్రులు, మూడు దినాల వరకు మస్’హ్‌ చేసుకోవచ్చు. ఇది ఈ క్రింది ‘హదీసు’లలో పేర్కొన బడింది.

—–

మొదటి విభాగం اَلْفَصْلُ الْأَوَّلُ      

517 – [ 1 ] ( صحيح ) (1/160)

عَنْ شُرَيْحِ بْنِ هَانِئْ قَالَ: سَأَلْتُ عَلِيٍّ بْنَ أَبِيْ طَالِبٍ رَضِيَ اللهُ عَنْهُ عَنِ الْمَسْحِ عَلَى الْخُفَيْنِ فَقَالَ: جَعَلَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم ثَلَاثَةَ أَيَّامٍ وَّلَيَالِيَهُنَّ لِلْمُسَافِرِ وَيَوْمًا وَلَيْلَةً لِّلْمُقِيْمِ . رَوَاهُ مُسْلِمٌ .

517. (1) [1/160దృఢం]

షురై’హ్‌ బిన్‌ హానీ (ర) కథనం: నేను ‘అలీ (ర)ను మేజోళ్ళపై మస్’హ్‌ చేయటాన్ని గురించి అడిగాను. దానికి ‘అలీ (ర), ‘ప్రవక్త (స) ప్రయాణీకులకు మూడు దినాలు, మూడు రాత్రులు, స్థానికునికి ఒక దినం, ఒక రాత్రి గడువు నియమించారు,’ అని అన్నారు. (ముస్లిమ్‌)

518 – [ 2 ] ( صحيح ) (1/160)

وَعَنِ الْمُغِيْرَةِ بْنِ شُعْبَةَ عَنْ أَبِيْهِ قَالَ: أَنَّهُ غَزَا مَعَ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم غَزْوَةَ تَبُوْكَ. قَالَ الْمُغِيْرَةَ: فَتَبَرَّزَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم قِبَلَ الْغَائِطِ فَحَمَلْتُ مَعَهُ إِدَوَاةً قَبْلَ الْفَجْرِ فَلَمَّا رَجَعَ أَخَذْتُ أُهْرِيْقُ عَلَى يَدَيْهِ مِنَ الْإِدَوَاةِ فَغَسَلَ كفيه وَوَجْهَهُ وَعَلَيْهِ جُبَّةٌ مِّنْ صُوْفٍ ذَهَبَ يَحْسُرُ عَنْ ذِرَاعَيْهِ فَضَاقَ كُمُّ الْجُبَّةِ فَأَخْرَجَ يَدَهُ مِنْ تَحْتَ الْجُبَّةِ وَأَلْقَى الْجُبَّةَ عَلَى مَنْكِبَيْهِ وَغَسَلَ ذِرَاعَيْهِ وَمَسَحَ بِنَاصِيَتِهِ وَعَلَى الْعِمَامَةِ وَعَلَى خفيه. ثُمَّ رَكِبَ وَرَكِبْتُ فَانْتَهَيْنَا إِلَى الْقَوْمِ. وَقَدْ قَامُوْا فِيْ الصَّلَاةِ يُصَلِّيْ بِهِمْ عَبْدُ الرَّحْمَنِ بْنِ عَوْفٍ وَقَدْ رَكَعَ بِهِمْ رَكْعَةً فَلَمَّا أَحَسَّ بِالنَّبِيِّ صلى الله عليه وسلم ذَهَبَ يَتَأَخَّرُ فَأَوْمَأ إِلَيْهِ فَصَلَى بِهِمْ فَلَمَّا سَلَّمَ قَامَ النَّبِيُّ صلى الله عليه وسلم وَقُمْتُ فَرَكَعْنَا الرَّكْعَةَ الَّتِيْ سَبَقَتْنَا. رَوَاهُ مُسْلِمٌ .

518. (2) [1/160దృఢం]

ము’గీరహ్ బిన్‌ షు’అబహ్ (ర) కథనం: అతను ప్రవక్త (స) వెంట తబూక్‌ యుద్ధంలో పాల్గొన్నారు. ము’గీరహ్ ఇలా అన్నారు, ”ప్రవక్త (స) ఫజ్ర్‌ నమా’జుకు ముందు మలమూత్ర విసర్జన కోసం మైదానంలోకి వెళ్ళారు. నేను ఆయన వెంట సంచిలో నీళ్ళు తీసుకొని వెళ్ళాను. ఆయన తిరిగి వచ్చిన తర్వాత నేను సంచిలోనుండి నీళ్ళను ఆయన చేతులపై వేయసాగాను. ప్రవక్త (స) రెండు చేతులను, ముఖాన్ని కడిగారు. అప్పుడు ఆయన శరీరంపై ఉన్ను జుబ్బా ఉండేది. అంటే ఉన్ని జుబ్బ ధరించి ఉన్నారు. ప్రవక్త (స) చేతులు కడగటానికి మోచేతులను ఎత్తసాగారు. కాని అవి బిగుతుగా ఉండటం వల్ల పైకి రాలేదు. చేసేదిలేక క్రింది నుండి చేతిని బయటకు తీసి, జుబ్బాను తన భుజాలపై వేసుకున్నారు. చేతులను మోచేతుల వరకు కడిగారు. ఆ తరువాత తల ముందు భాగంపై మస్’హ్‌ చేశారు. ఇంకా అమామహ్ పై కూడా మస్’హ్‌ చేశారు. ఆ తరువాత నేను ఆయన కాళ్ళనుండి మేజోళ్ళు తీద్దామని ప్రయత్నించాను.” అప్పుడు ప్రవక్త (స), ‘వాటిని వదలివేయి, ఎందుకంటే నేను వాటిని పరిశుద్ధ స్థితిలోనే ధరించాను,’ అని అన్నారు. ప్రవక్త (స) రెంటిపై మసహ్చేశారు. ఆ తరువాత వాహనం ఎక్కారు. నేను కూడా వాహనం ఎక్కాను. వెళ్ళి ముజాహిదీన్ సైన్యంలోకి చేరుకున్నాము. అప్పటికి వారు నమా’జుకు నిలబడ్డారు. ’అబ్దుర్ర’హ్మాన్‌ బిన్‌ ’ఔఫ్‌ నమా’జు చదివిస్తున్నారు. ఒక రక’అతు అయి పోయింది. ప్రవక్త (స) వచ్చారని తెలిసి, తాను వెనక్కితగ్గాలని ప్రయత్నించారు. కాని ప్రవక్త (స) అతన్ని వద్దని వారించారు. ప్రవక్త (స) మిగిలిన నమా’జు అతని వెనుక చదివారు. సామూహిక నమా’జు పూర్తయిన తరువాత ప్రవక్త (స) మిగిలిన నమా’జు చదవడానికి నిలబడ్డారు. ఆయన వెంట నేనూ నిలబడ్డాను. మిగిలిన నమా’జును పూర్తి చేసు కున్నాము.  [82]  (ముస్లిమ్‌)

—–

రెండవ విభాగం اَلْفَصْلُ الثَّانِيْ      

519 – [ 3 ] ( حسن ) (1/161)

عَنْ أَبِيْ بَكْرَةَ عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم: أَنَّهُ رَخَّصَ لِلْمُسَافِرِ ثَلَاثَةَ أَيَّامٍ وَّلَيَالِيَهُنَّ وَلِلْمُقِيْمِ يَوْمًا وَلَيْلَةً إِذَا تَطَهَّرَ فَلَبِسَ خُفَّيْهِ أَنْ يَّمْسَحَ عَلَيْهِمَا. رَوَاهُ الْأَثْرَمُ فِيْ سُنَنِهِ وَابْنُ خُزَيْمَةَ وَالدَّارَ قُطْنِيُّ وَقَالَ الْخَطَّابِيُّ: هُوَ صَحِيْحُ الْإِسْنَادِ هَكَذَا فِيْ الْمُنْتَقَى .

519. (3) [1/161ప్రామాణికం]

అబూ-బక్ర్‌ (ర) కథనం: ప్రవక్త (స)మేజోళ్ళపై మస్’హ్‌ విషయంలో ప్రయాణీకునికి మూడుదినాలు, మూడు రాత్రులు, స్థానికునికి ఒకదినం, ఒకరాత్రి వరకు అను మతించారు. అయితే వు’దూ’ చేసి మేజోళ్ళు ధరించి ఉండాలి. (అస్ర‘మ్‌, ఇబ్ను ’ఖుజైమ, దార ఖు’త్నీ)

‘ఖ’త్తాబీ దీని ఆధారాలు దృఢమని పేర్కొన్నారు. మున్‌తఖాలో ఈ విధంగా వ్రాయబడి ఉంది.

520 – [ 4 ] ( صحيح ) (1/161)

وَعَنْ صَفْوَانَ بْنِ عَسَّالٍ قَالَ: كَانَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم يَأْمُرُنَا إِذَا كُنَّا سَفْرًا أَنْ لَّا نَنْزِعْ خِفَافَنَا ثَلَاثَةَ أَيَّامٍ وَّلَيَالِيَهُنَّ إِلَّا مِنْ جَنَابَةِ وَّلَكِنْ مِّنْ غَائِطٍ وَّبَوْلٍ وَنَوْمٍ. رَوَاهُ التِّرْمِذِيُّ وَالنَّسَائِيُّ .

520. (4) [1/161దృఢం]

’సఫ్వాన్‌ బిన్‌ ’అస్సాల్‌ (ర) కథనం: మేము ప్రయాణంలో ఉన్నప్పుడు ప్రయాణస్థితిలో మూడు దినాలు, మూడు రాత్రులు) మేజోళ్ళను కాళ్ళనుండి తీయరాదని ధరించి ఉండాలని ఆదేశించేవారు. అయితే సంభోగ, లైంగిక క్రియ అపరిశుద్ధత (జనాబత్) స్నానం సమయంలో వాటిని తీసి స్నానం చేయమనేవారు. కాని మలమూత్ర విసర్జన, నిద్ర తరువాత తీసే అవసరం లేదు. (తిర్మిజి’, నసాయి’)

521 – [ 5 ] ( ضعيف ) (1/162)

وَعَنِ الْمُغِيْرَةَ بْنِ شُعْبَةَ قَالَ: وَضَّأْتُ النَّبِيَّ صلى الله عليه وسلم فِيْ غَزْوَةِ تَبُوْكَ فَمَسَحَ أَعْلَى الْخُفِ وَأَسْفَلَهُ. رَوَاهُ أَبُوْ دَاوُدَ وَالتِّرْمِذِيُّ وَابْنُ مَاجَهُ. وَقَالَ التِّرْمِذِيُّ هَذَا حَدِيْثٌ مَّعْلُوْلٌ وَسَأَلْتُ أَبَا زُرَعَةَ وَمُحَمَّدًا يَعْنِيْ الْبُخَارِيَّ عَنْ هَذَا الْحَدِيْثِ. فَقَالَا: لَيْسَ بِصَحِيْحٍ. وَكَذَا ضَعَّفَهُ أَبُوْ دَاوُدَ.

521. (5) [1/162బలహీనం]

ము’గీర బిన్‌ షు’అబహ్ (ర) కథనం: తబూక్‌ యుద్ధంలో ప్రవక్త (స)కు నేను వు’దూ’ చేయించాను. అప్పుడు ప్రవక్త (స) మేజోళ్ళ పైన క్రింద కూడా మస్హ్చేశారు. (తిర్మిజి’ – మ’అలూల్‌, ఇబ్నె మాజహ్, అబూ దావూ‘ద్‌ – అబూ జు’ర’అహ్, బు’ఖారీ – బలహీనం)

522 – [ 6 ] ( صحيح ) (1/162)

وَعَنْهُ قَالَ: رَأَيْتُ النَّبِيَّ صلى الله عليه وسلم يَمْسَحُ عَلَى الْخُفَّيْنِ عَلَى ظَاهِرهِمَا. رَوَاهُ التَّرْمِذِيُّ وأَبُوْ دَاوُدَ .

522. (6) [1/162దృఢం]

ము’గీర బిన్‌ షు’అబహ్ (ర) కథనం: ప్రవక్త (స)ను మేజోళ్ళ పైభాగంపై మస్హ్ చేస్తూ ఉండగా చూశాను. (తిర్మిజి‘, అబూ దావూద్‌)

523 – [ 7 ] ( صحيح ) (1/162)

وَعَنِ الْمُغَيْرَةَ بْنِ شُعْبَةَ قَالَ: تَوَضَّأَ النَّبِيُّ صلى الله عليه وسلم وَمَسَحَ عَلَى الْجَوْرَبَيْنِ وَالنَّعْلَيْنِ. رَوَاهُ أَحْمَدُ وَالتِّرْمِذِيُّ وَأَبُوْ دَاوُدَ وَابْنُ مَاجَهُ.

523. (7) [1/162దృఢం]

ము’గీర బిన్‌ షు’అబహ్ (ర) కథనం: ప్రవక్త (స) వు’దూ’ చేశారు, మేజోళ్ళపై బూట్లతో సహా మస్‘హ్‌ చేశారు. [83] (అ’హ్మద్‌, తిర్మిజి’, ఇబ్నె మాజహ్, అబూ దావూద్‌)

—–

మూడవ విభాగం اَلْفَصْلُ الثَّالِثُ   

524 – [ 8 ] ( ضعيف ) (1/162)

وَعَنِ الْمُغَيْرَةَ بْنِ شُعْبَةَ قَالَ: مَسَحَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم عَلَى الْخُفَّيْنِ فَقُلْتُ: يَا رَسُوْلَ اللهِ نَسِيْتَ؟ قَالَ: بَلْ أَنْتَ نَسِيْتَ بِهَذَا أَمُرَنِيْ رَبِّيْ عَزَّ وَجَلَّ. رَوَاهُ أَحْمَدُ وَأَبُوْ دَاوُدَ .

524. (8) [1/162బలహీనం]

ము’గీరహ్ బిన్‌ షు’అబహ్ (ర) కథనం: ప్రవక్త (స) మేజోళ్ళపై మస్’హ్‌ చేశారు. అదిచూచి నేను, ‘ప్రవక్తా! మీరు మరచిపోయారు,’ అని అన్నాను. అప్పుడు ప్రవక్త (స), ‘నీవు మరచిపోయావు, నేను మరవలేదు, నా ప్రభువు నన్ను ఈ విధంగానే చేయమని ఆదేశించాడు,’ అని అన్నారు.(అ’హ్మద్‌, అబూ దావూద్‌)

525 – [ 9 ] ( صحيح ) (1/163)

وَعَنْ عَلِيٍّ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: لَوْ كَانَ الدِّيْنُ بِالرَّأْيِ لَكَانَ أَسْفَلُ الْخُفِّ أَوْلَى بِالْمَسْحِ مِنْ أَعْلَاهُ وَقَدْ رَأَيْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يَمْسَحُ عَلَى ظَاهِرِ خُفَّيْهِ. رَوَاهُ أَبُوْ دَاوُدَ لِلدَّارَمِيِّ مَعْنَاهُ .

525. (9) [1/163దృఢం]

’అలీ (ర) కథనం: ఒకవేళ ధర్మం అభిప్రాయం, భావనపై ఆధారపడి ఉంటే, మేజోళ్ళ మీదకంటే, క్రింద మస్’హ్‌ చేయవలసి ఉండేది. వాస్తవం ఏమిటంటే, నేను ప్రవక్త (స)ను మేజోళ్ళ మీద మస్హ్చేస్తూ ఉండగా చూశాను. (అబూ దావూద్‌, దార్మీ)

అంటే ధర్మం భావనపై ఆధారపడి లేదు.

=====

10-  بَابُ التَّيَمُّمِ

10. పరిశుభ్రతా సంకల్పం (తయమ్ముమ్)

ఒకవేళ వ్యాధివల్ల నీటి ఉపయోగం హానికరమైన దైనా లేదా వెతికినా నీరు దొరక్కపోయినా పరిశుభ్ర మైన మట్టితో తయమ్ముమ్‌ చేసుకోవచ్చును. తయమ్ముమ్‌ అంటే సంక ల్పం, ఉద్దేశ్యం. ధార్మిక పరిభాషలో శుద్ధిసంకల్పంతో పరి శుద్ధమైన మట్టిపై అరచేతులతో కొట్టి ముఖం మరియు అరచేతులను తుడుచుకోవాలి. దీనిపద్ధతి ఏమిటంటే: ”బిస్మిల్లాహ్‌ పఠించి మనసులో శుద్ధి, నమా’జు చదివే సంకల్పం చేసుకొని, రెండు చేతులను పరిశుభ్రమైన మట్టిపై కొట్టి, ఊది రెండు చేతులతో ముఖాన్ని తుడుచుకొని, ఆ తరువాత ఎడమచేతితో కుడిచేతిని, కుడిచేతితో ఎడమ చేతిని ముందూ వెనుకా తుడవాలి.” దీన్ని తయమ్ముమ్‌ అంటారు. వు’దూ’కు, స్నానానికి రెంటికీ పద్ధతి ఇదే. అదేవిధంగా ఏ విషయాల వల్ల వు’దూ’ భంగమవుతుందో, వాటివల్లే తయమ్ముమ్‌ కూడా భంగమవుతుంది. అదే విధంగా నీళ్ళు లభించటం వల్ల, నీళ్ళు ఉపయోగించే శక్తి లభించటం వల్ల కూడా తయమ్ముమ్‌ భంగమవుతుంది.

తయమ్ముమ్‌ గురించి ఖుర్‌ఆన్‌, ’హదీసు‘ల్లో ఆదేశించటం జరిగింది. అల్లాహ్‌ ఆదేశం: “…కాని ఒకవేళ మీరు రోగ పీడితులై ఉంటే, లేదా ప్రయాణంలో ఉంటే, లేక మలమూత్ర విసర్జన చేసిఉంటే, లేక స్త్రీలతో సంభోగం చేసి ఉంటే – మీకు నీళ్ళు దొరక్క పోతే – పరిశుధ్ధమైన మట్టిని చేతులతో స్పర్శించి ఆచేతులతో మీ ముఖాలను మరియు మీ చేతులను, తుడుచుకోండి (తయమ్ముమ్‌ చేయండి). నిశ్చయంగా అల్లాహ్ తప్పులను మన్నించే వాడు, క్షమించేవాడు.” (సూ. అన్నిసా, 4:43)

క్రింది ’హదీసు‘ల్లో తయమ్ముమ్‌ గురించి పేర్కొనడం జరిగింది.

—–

మొదటి విభాగం  اَلْفَصْلُ الْأَوَّلُ    

526 – [ 1 ] ( صحيح ) (1/164)

عَنْ حُذَيْفَةَ قَالَ. قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “فُضِّلْنَا عَلَى النَّاسِ بِثَلَاثِ جُعِلَتْ صُفُوْفُنَا كَصُفُوْفِ الْمَلَائِكَةِ وَجُعِلَتْ لَنَا الْأَرْضُ كُلُّهَا مَسْجِدًا وَجُعِلَتْ تُرْبَتَهَا لَنَا طُهُوْرًا إِذَا لَمْ نَجِدِ الْمَاءَ”. رَوَاهُ مُسْلِمٌ.

526. (1) [1/164దృఢం]

’హుజై’ఫహ్(ర) కథనం: ప్రవక్త(స) ప్రవచనం, మూడు విషయాల్లో మనకు ప్రజలందరిపై ప్రాధాన్యత ఇవ్వబడింది: 1. మన పంక్తులు దైవదూతల పంక్తుల్లా చేయబడ్డాయి, 2. భూమంతా మనకోసం సజ్దాచేసే చోటుగా చేయబడింది, 3. పరిశుభ్రమైన మట్టి మనకొరకు నీళ్ళు దొరకనప్పుడు పరిశుభ్రపరిచేదిగా చేయబడింది. [84] (ముస్లిమ్‌)

527 – [ 2 ] ( متفق عليه ) (1/164)

وَعَنْ عِمْرَانَ بْن حصين الخزاعي أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم: رَأَى رَجُلًا مُعْتَزِلًا لَمْ يُصَلِّ فِيْ الْقَوْمِ فَقَالَ: “يَا فُلَانُ مَا مَنَعَكَ أَنْ تُصَلِّيَ فِيْ الْقَوْمِ. فَقَالَ يَا رَسُوْلَ الله أَصَابَتْنِيْ جَنَابَةٌ وَلَا مَاءَ. قَالَ عَلَيْكَ بِالْصَّعِيْدِ فَإِنَّهُ يَكْفِيْكَ”.

527. (2) [1/164ఏకీభవితం]

’ఇమ్‌రాన్‌ బిన్ ’హు’సైన్ (ర) కథనం: ప్రవక్త (స) వెంట మేము ప్రయాణంలో ఉన్నాం. ప్రవక్త (స) ప్రజలకు నమా’జు చదివించారు. నమా’జు ముగించిచూస్తే, ఒక వ్యక్తి జమా’అత్‌ నుండి వేరుగా కూర్చొని ఉండటం చూశారు. ఆ వ్యక్తి ప్రజలతో నమా’జు చదవలేదు. ప్రవక్త (స) అతన్ని పిలిచి, ‘నీవెందుకు కలసి నమా’జు చదవలేదు’ అని అడిగారు. దానికి ఆ వ్యక్తి, ‘నేను సంభోగ అపరిశుద్ధత (జనాబత్‌)కు గురయ్యాను. అంటే నేను అపరిశుద్ధంగా ఉన్నాను. నీళ్ళులేవు. అందువల్లే నేను నమాజులో పాల్గొన లేదు,’ అని అన్నాడు. అప్పుడు ప్రవక్త (స), ‘నీవు పరిశుభ్రమైన మట్టితో తయమ్ముమ్‌ చేసుకుంటే సరిపోయేది కదా,’ అని అన్నారు. (బు’ఖారీ, ముస్లిమ్‌)

అంటే జునుబీ వ్యక్తి కూడా తయమ్ముమ్‌ చేయవచ్చు.

528 – [ 3 ] ( صحيح ) (1/164)

وَعَنْ عَمَّارٍ قَالَ: جَاءَ رَجُلٌ إِلَى عُمَرَ بْنِ الْخَطَّابِ فَقَالَ: إِنِّيْ أَجْنَبْتُ فَلَمْ أُصِبِ الْمَاءَ. فَقَالَ عَمَّارُ أَمَا تَذْكُرُ أَنَا كُنَّا فِيْ سَفْرٍ أَنَا وَأَنْتَ. فَأَمَّا أَنْتَ فَلَمْ تُصَلِّ وَأَمَّا أَنَا فَتَمَعَّكْتُ فَصَلَّيْتُ فَذَكَرْتُ لِلنَّبِيِّ صلى الله عليه وسلم. فَقَالَ النَّبِيُّ صلى الله عليه وسلم إِنَّمَا كَانَ يَكْفِيْكَ هَكَذَا. فَضَرَبَ النَّبِيُّ صلى الله عليه وسلم بِكَفَّيْهِ الْأَرْضَ وَنَفَخَ فِيْهِمَا ثُمَّ مَسَحَ بِهِمَا وَجْهَهُ وَكَفَّيْهِ. رَوَاهُ الْبُخَارِيُّ وَلِمُسْلِمٍ نَحْوَهُ وَفِيْهِ قَالَ: إِنَّمَا يَكْفِيْكَ أَنْ تَضْرِبَ بِيَدَيْكَ الْأَرْضَ ثُمَّ تَنْفُخَ ثُمَّ تَمْسَحَ بِهِمَا وَجْهَكَ وَكَفَّيْكَ.

528. (3) [1/164దృఢం]

’అమ్మార్‌ (ర) కథనం: ’ఉమర్‌ (ర) వద్దకు ఒక వ్యక్తి వచ్చి, ‘నేను అపరిశుభ్రంగా ఉన్నాను. నీళ్ళు కూడా దొరకటం లేదు. నేనేమి చేయాలి,’ అని అన్నాడు.’ (ఈ ’హదీసు‘లో సమాధానం లేదు. మరో ’హదీసు‘లో, ‘’ఉమర్‌ (ర) సమాధానం ఇస్తూ నీళ్ళు దొరకనంత వరకు నమా’జు చదవకు,’ అని అన్నారు. ఈ సమాధానం విని ‘అమ్మార్‌ (ర), “మీకు గుర్తులేదా? నేను, మీరూ ఒకసారి ప్రయాణంలో ఉన్నాం. మనం అశుద్ధానికి గురయ్యాము. అప్పుడు మీరు నమా’జు చదవలేదు. కాని నేను నేలపైదొర్లి నమా’జు చదివాను. మనం తిరిగి ప్రవక్త (స) వద్దకు వెళ్ళి జరిగింది విన్నవించుకున్నాం. అప్పుడు ప్రవక్త (స), ‘ఈ విధంగా చేస్తే సరిపోయేది.’ అని పలికి రెండు అరచేతులను నేలపైకొట్టారు. ఆ తరువాత రెండు అరచేతులను ఊదారు. రెండు అరచేతులతో ముఖాన్ని చేతుల మణి కట్ల వరకు తుడుచు కున్నారు. అంటే తయమ్ముమ్‌ చేసి చూపారు.” (బు’ఖారీ)

అయితే ముస్లిమ్‌లో ఈ పదాలు అధికంగా ఉన్నాయి, ”ప్రవక్త (స) నువ్వు, నీ రెండు చేతులను భూమిపై కొట్టి, ఊది, నీ ముఖాన్ని తుడుచుకుంటే సరిపోయేది,” అని అన్నారు.

529 – [ 4 ] ( ضعيف ) (1/165)

وَعَنْ أَبِيْ الْجُهَيْمِ بْنِ الْحَارِثِ بْنِ الصِّمْةِ قَالَ: مَرَرْتُ عَلَى النَّبِيِّ صلى الله عليه وسلم وَهُوَ يَبُوْلُ فَسَلَّمْتُ عَلَيْهِ فَلَمْ يَرُدَّ عَلَيَّ حَتَى قَامَ إِلَى جِدَارٍ فَحَتَّهُ بِعَصَى كَانَتْ مَعَهُ ثُمَّ وَضَعَ يَدَيْهِ عَلَى الْجِدَارِ فَمَسَحَ وَجْهَهُ وَذِرَاعَيْهِ ثُمَّ رَدَّ عَلَيَّ.

وَلَمْ أَجِدْ هَذِهِ الرِّوَايَةِ فِيْ الصَحِيْحَيْنِ وَلَا فِيْ كِتَابِ الْحُمَيْدِيِّ وَلَكِنْ ذَكَرَهُ فِيْ شَرَحِ السُّنَّةِ. وَقَالَ: هَذَا حَدِيْثٌ حَسَنٌ .

529. (4) [1/165బలహీనం]

అబూ జుహైమ్‌ బిన్‌ ’హారిస్‌‘బిన్ ’సమ్మహ్(ర) కథనం: నేను ప్రవక్త (స) ప్రక్క నుండి వెళ్ళటం జరిగింది. అప్పుడు ప్రవక్త (స) మూత్ర విసర్జన చేస్తున్నారు. అప్పుడు నేను ప్రవక్త (స)కు సలామ్‌ చేశాను. ప్రవక్త (స) నా సలాము కు ప్రతిసలామ్‌ చెయ్యలేదు. ప్రవక్త (స) అక్కడి నుండి గోడ వద్దకు వచ్చారు. తన చేతి కర్రతో గోడనుగోకారు. తన రెండు చేతులను గోడపై పెట్టారు. తరువాత తన ముఖాన్ని, రెండుచేతులను తుడుచుకున్నారు. ఆ తరువాత సలామ్‌కు ప్రతిసలామ్‌ చేశారు.

ఈ ‘హదీసు’ బు’ఖారీ, ముస్లిమ్‌లో కనబడలేదు. ’హుమైది పుస్తకంలో కూడా లేదు. ఇది షర్‌హు స్సున్నహ్‌లో, హసన్ గా పేర్కొనబడింది.

అంటే సలామ్‌కు ప్రతి సలామ్‌ ఇవ్వటానికి తయమ్ముమ్‌ చేయటం అభిలషణీయం.

—–

రెండవ విభాగం  الْفَصْلُ الثَّانِيْ   

530 – [ 5 ] ( صحيح ) (1/165)

عَنْ أَبِيْ ذَرٍّ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِنَّ الصَّعِيْدَ الطَّيِّبَ وَضُوْءُ الْمُسْلِمِ وَإِنْ لَمْ يَجِدِ الْمَاءَ عَشْرَ سِنِيْنَ فَإِذَا وَجَدَ الْمَاءُ فَلْيُمِسَّهُ بَشَرَهُ فَإِنَّ ذَلِكَ خَيْرٌ”. رَوَاهُ أَحْمَدُ وَالتِّرْمِذِيُّ وَأَبُوْ دَاوُدَ. وَرَوَى  النَّسَائِيُّ  نَحْوَهُ  إِلَى  قَوْلِهِ : عَشْرَ سِنِيْنَ .

530. (5) [1/165దృఢం]

అబూ జ‘ర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”పరి శుభ్రమైన మట్టి ముస్లిమ్‌ను పరిశుభ్ర పరుస్తుంది. ఒకవేళ 10 సంవత్సరాల వరకు నీళ్ళు దొరక్క పోయినా సరే. అయితే నీళ్ళు దొరగ్గానే నీళ్ళతో తన శరీరాన్ని కడుక్కోవాలి. ఇదే అతనికి శ్రేయస్కరం.” (అ’హ్మద్‌, తిర్మిజి’, అబూ దావూద్‌, నసాయి‘)

 అయితే నసాయి‘లో చివరి వాక్యం లేదు.

531 – [ 6 ] ( حسن لغيره ) (1/165)

وَعَنْ جَابِرٍ قَالَ: خَرَجْنَا فِيْ سَفْرٍ فَأَصَابَ رَجُلًا مِّنَّا حَجَرٌ فَشَجَّهُ فِيْ رَأْسِهِ ثُمَّ احْتَلَمَ فَسَأَلَ أَصْحَابَهُ. فَقَالَ هَلْ تَجِدُوْنَ لِيْ رُخْصَةً فِيْ التَّيَمُّمِ فَقَالُوْا مَا نَجِدَ لَكَ رُخْصَةً وَأَنْتَ تَقْدِرُ عَلَى الْمَاءِ. فَاغْتَسَلَ فَمَاتَ فَلَمَّا قَدِمْنَا عَلَى النَّبِيِّ صلى الله عليه وسلم. أُخْبِرَ بِذَلِكَ. فَقَالَ قَتَلُوْهُ قَتَلَهُمْ اللهُ أَلَا سَأَلُوْا إِذْ لَمْ يَعْلَمُوْا فَإِنَّمَا شِفَاءُ الْعِيِّ السُّؤالُ إِنَّمَا كَانَ يَكْفِيْهِ أَنْ يَّتَيَمَّمَ وَيَعْصْرَ أَوْ يَعْصِبَ شَك مُوسى عَلَى جُرْحِهِ خِرْقَةً ثُمَّ يَمْسَحَ عَلَيْهَا وَيَغْسِلَ سَائِرَ جَسَدِهِ. رَوَاهُ أَبُوْ دَاوُدَ.

531. (6) [1/165పరాప్రామాణికం]

జాబిర్‌ (ర) కథనం: మేము ప్రయాణానికి వెళ్ళాము. మాలో ఒక వ్యక్తికి రాయి తగిలింది. తీవ్రమైన గాయం తగిలింది. ఆ వ్యక్తికి వీర్యస్ఖలనం అయ్యింది. అప్పుడా వ్యక్తి తన మిత్రులతో ఇప్పుడు ఏం చేయాలి అని సంప్రదించాడు. దానికి వాళ్ళు, ‘తయమ్ముమ్‌ తగదు,’ అన్నారు. ఆ వ్యక్తి స్నానం చేసుకున్నాడు, మరణించాడు. మేము ప్రవక్త (స) వద్దకు వెళ్ళి జరిగింది విన్నవించు కున్నాం. అది విన్న ప్రవక్త (స), ‘వారు అతన్ని చంపివేశారు, వారిని దేవుడు శిక్షించాలి, వారికి తెలియ నపుడు ఇతరులను ఎందుకు అడగలేదు. తెలియని వ్యక్తి అడిగి తెలుసుకోవాలి. ఇటువంటి సమయంలో తయమ్ముమ్‌ సరిపోయేది. ఒకవేళ స్నానమే చేయాలను కుంటే గాయంపై కట్టుకట్టి, దానిపై మస్’హ్‌ చేసుకొని, మిగిలిన శరీరభాగాన్ని కడుక్కుంటే సరి పోయేది.’ అని ప్రవచించారు.

532 – [ 7 ] ( حسن ) (1/166)

وَرَوُاهُ ابْنُ مَاجَهُ عَنْ عَطَاءِ بْنِ أَبِيْ رَبَاحٍ عَنِ ابْنِ عَبَّاسٍ.

532. (7) [1/166ప్రామాణికం]

ఇబ్నె మాజహ్, ఈ ’హదీసు‘ను, ’అ’తా బిన్ అబీ రబా’హ్, మరియు అతడు ఇబ్నె’అబ్బాస్ ద్వారా ఉల్లేఖించారు.

533 – [ 8 ] ( صحيح ) (1/166)

وَعَنْ أَبِيْ سَعِيْدِ الْخُدْرِيِّ قَالَ: خَرَجَ رَجُلَانِ فِيْ سَفْرٍ فَحَضَرَتِ الصَّلَاةُ وَلَيْسَ مَعَهُمَا مَاءٌ فَتَيَمَّمَا صَعِيْدًا طَيِّبًا فَصَلَّيَا ثُمَّ وَجَدَا الْمَاءَ فِيْ الْوَقْتِ فَأَعَادَ أَحْدُهُمَا الصَّلَاةَ وَالْوَضُوْءَ وَلَمْ يُعِدْ الْآخَرُ ثُمَّ أَتَيَا رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم فَذَكَرَا ذَلِكَ لَهُ. فَقَالَ لِلَّذِيْ لَمْ يُعِدْ: “أَصَبْتَ السُّنَّةَ وَأَجْزَأَتْكَ صَلَاتُكَ”. وَقَالَ لِلَّذِيْ تَوَضَّأَ وَأَعَادَ: “لَكَ الْأَجْرُ مَرَّتَيْنِ”. رَوَاه أَبُوْ دَاوُدَ وَالدَّارَمِيُّ وَرَوَى النَّسَائِيُّ نَحْوَهُ.

533. (8) [1/166దృఢం]

అబూ స’యీద్‌ ’ఖుద్రీ (ర) కథనం: ఇద్దరు వ్యక్తులు ప్రయాణంలో వెళ్ళారు. నమా’జు సమయం అయ్యింది. కాని వారివద్ద నీళ్ళు లేవు. అందువల్ల వారిద్దరూ తయమ్ముమ్‌ చేసి నమా’జు చదివారు. ఆ తరువాతి సమయంలో వారికి నీళ్ళు లభించాయి. వారిలో ఒకరు వు’దూ’ చేసి చదివిన నమా’జును మళ్ళీ చదివాడు. మరో వ్యక్తి అలా చేయలేదు. అనంతరం వారిద్దరూ ప్రవక్త (స) వద్దకు వచ్చి, విన్నవించుకోగా, మళ్ళీ చదవని వ్యక్తితో, ‘నీవు సున్నత్‌ను ఆచరించావు, నీ నమా’జు అయి పోయింది,’ అని, ఆచరించని వ్యక్తితో, ‘నీకు రెండు పుణ్యాలు లభిస్తాయని, ఒకటి ఫ’ర్ద్ ఆచరించి నందుకు, మరొకటి నఫిల్‌గా,’ అని అన్నారు. (అబూ దావూద్‌, దార్మీ, నసాయి‘)

534 – [ 9 ] ( لم تتم دراسته ) (1/166)

وَقَدْ رَوَى هُوَ وَأَبُوْ دَاوُدَ أَيْضًا عَنْ عَطَاءِ بْنِ يَسَارٍ مُرْسَلًا.

534. (9) [1/166అపరిశోధితం]

అబూ దావూద్‌ మరియు నసాయి’ ఈ ’హదీసు‘ను ’అ’తా బిన్‌ యసార్‌ ద్వారా ఉల్లేఖించారు.

—–

మూడవ విభాగం الْفَصْلُ الثَّالِثِ   

535 – [ 10 ] ( متفق عليه ) (1/167)

عَنْ أَبِيْ الْجُهَيْمِ الْأَنْصَارِيْ قَالَ: أَقْبَلَ النَّبِيَّ صلى الله عليه وسلم مِنْ نَّحْوِ بِئْرٍ جَمَلٍ فَلَقِيَهُ رَجُلٌ فَسَلَّمَ عَلَيْهِ فَلَمْ يَرُدَّ عَلَيْهِ النَّبِيِّ صلى الله عليه وسلم حَتَّى أَقْبَلَ عَلَى الْجِدَارِ فَمَسَحَ بِوَجْهِهِ وَيَدَيْهِ ثُمَّ رَدَّ عَلَيْهِ السَّلَامَ.

535. (10) [1/167ఏకీభవితం]

అబూ జుహైమ్‌ అల్ అ’న్సారి (ర) కథనం: ప్రవక్త (స) జమల్‌ అనే బావి వైపు నుండి వస్తున్నారు. దారిలో ఒక వ్యక్తి, ప్రవక్త (స)ను కలసి సలామ్‌ చేశాడు. కాని ప్రవక్త(స) అతనికి సమాధానం ఇవ్వలేదు. ఒక గోడవద్దకు వచ్చి, తయమ్ముమ్‌ చేసి సలామ్‌కు ప్రతిసలామ్‌ చేశారు. (బు’ఖారీ, ముస్లిమ్‌)

536 – [ 11 ] ( صحيح ) (1/167)

وَعَنْ عَمَّارِ بْنِ يَاسِرٍ: أَنَّهُ كَانَ يُحَدِّثُ أَنَّهُمْ تَمَسَّحُوْا وَهُمْ مَعَ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم بِالصَّعِيْدِ لِصَلَاةِ الْفَجْرِ فَضَرَبُوْا بِأَكُفِّهِمُ الصَّعِيْدَ ثُمَّ مَسَحُوْا وُجُوْههم مَسْحَةً وَاحِدَةً ثُمَّ عَادُوْا فَضَرَبُوْا بِأكْفِهِمُ الصَّعِيْدَ مَرَّةً أُخْرَى فَمَسَحُوْا بِأَيْدِيْهِمْ كُلِّهَا إِلَى الْمَنَاكِبِ وَالْآبَاطِ مِن بُطُوْنِ أَيْدِيْهِمْ. رَوَاهُ أَبُوْ دَاوُدَ .

536. (11) [1/167దృఢం]

’అమ్మార్‌ బిన్‌ యాసిర్‌ (ర) కథనం: ప్రవక్త (స) వెంట ప్రయాణంలో ఆయన అనుచరులు కూడా ఉన్నారు. ఫజర్‌ నమా’జుకోసం వారు తయమ్ముమ్‌ చేశారు. ఎలా అంటే, వారు తమ రెండు చేతులను పరిశుభ్రమైన మట్టిపై కొట్టి, ముఖంపై తుడుచు కున్నారు. మళ్ళీ తమ రెండు చేతులను మట్టిపై కొట్టి రెండు చేతులను భుజాలపై తుడుచు కున్నారు. (అబూ దావూద్‌)

అంటే తమకు తోచిన విధంగా ఆచరించారు. తరువాత ప్రవక్త (స) తయమ్ముమ్‌ పద్ధతి నేర్పారు.

=====

11- بَابُ الْغُسْلِ الْمَسْنُوْنِ

11. సాంప్రదాయ స్నానం

స్నానం రెండు రకాలు: 1. విధి స్నానం, 2. సున్నత్‌ స్నానం. విధి స్నానం ఐదు రకాలు: 1. సంభోగ (జనాబత్) స్నానం, 2. బహిష్టు తరువాతి స్నానం, 3. ప్రసవం (నిఫాస్‌) తరువాతి స్నానం, 4. జునుబీ, బహిష్టురాలు లేదా ప్రసవం తరువాత, ఇస్లాం స్వీకరించుటకు చేయవలసిన స్నానం, 5. శవానికి చేయించే స్నానం.

సున్నత్‌ స్నానం ఆరు రకాలు: 1. జుమ’అ నమా’జుకు స్నానం చేయటం సున్నతె ముఅక్కద, 2. పండుగలకు స్నానం, 3. ‘హజ్జ్ ఇ’హ్‌రామ్‌ ధరించటానికి ముందు స్నానం, 4. ‘అరఫాత్‌లో ఉన్నప్పుడు స్నానం, 5. శస్త్ర చికిత్స చేయించుకున్న తర్వాత స్నానం, 6. మక్కహ్ లో ప్రవేశించినపుడు స్నానం.

క్రింద వాటిని గురించిన ’హదీసు‘లను పేర్కొనడం జరుగుతుంది.

—–

మొదటి విభాగం  اَلْفَصْلُ الْأَوَّلُ      

537 – [ 12 ] ( متفق عليه ) (1/168)

عَنِ أبْنِ عُمَرَ رضي اللهُ عَنْهُمَا قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِذَا جَاءَ أَحْدُكُمْ الْجُمْعَةَ فَلِيَغْتَسِلْ”.

537. (12) [1/168ఏకీభవితం]

’అబ్దుల్లాహ్‌ బిన్‌ ’ఉమర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”జుమ’అహ్ నమా’జుకు వచ్చేవారు స్నానం చేసి రావాలి.” [85] (బు’ఖారీ, ముస్లిమ్‌)

538 – [ 13 ] ( متفق عليه ) (1/168)

وَعَنْ أَبِيْ سَعِيْدِ الْخُدْرِيِّ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “غُسِلُ يَوْمِ الْجُمْعَةِ وَاجِبٌ عَلَى كُلِّ مُحْتَلِمٍّ”.

538. (13) [1/168ఏకీభవితం]

అబూ స’యీద్‌ ’ఖుద్రీ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”యుక్త వయస్సుకు చేరిన ప్రతి వ్యక్తి శుక్రవారం స్నానం చేయటం తప్పనిసరి (వాజిబ్),” అని అన్నారు.[86] (బు’ఖారీ, ముస్లిమ్‌)

539 – [ 14 ] ( متفق عليه ) (1/168)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “حَقٌّ عَلَى كُلِّ مُسْلِمٍ أَنْ يَّغْتَسَلَ فِيْ كُلِّ سَبْعَةَ أَيَّامٍ يَوْمًا يَغْسِلُ فِيْهِ رَأْسَهُ وَجَسَدَهُ”.

539. (14) [1/168ఏకీభవితం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”వారానికి ఒకసారి స్నానం చేయటం ప్రతి ముస్లిమ్‌కు తప్పనిసరి. అంటే తలను, శరీరాన్ని శుభ్రపరచుకోవాలి.” (బు’ఖారీ, ముస్లిమ్‌)

—–

రెండవ విభాగం   اَلْفَصْلُ الثَّانِيْ  

540 – [ 4 ] ( حسن ) (1/168)

عَنْ سَمُرَةَ  بِنْ جُنْدُبٍ قَالَ، قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَنْ تَوَضَّأَ يَوْمَ الْجُمْعَةِ فِبْهَا وَنِعْمَتْ وَمَنِ اغْتَسَلَ فَالْغُسْلُ أَفْضُلُ”. رَوَاهُ أَحْمَدُ وَأَبُوْ دَاوُدَ وَالتِّرْمِذِيُّ وَالنَّسَائِيُّ وَالدَّارَمِيُّ.

540. (4) [1/168-ప్రామాణికం]

సమురహ్‌ బిన్‌ జున్‌దుబ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”జుమ’అహ్ రోజు వు’దూ’చేసినవాడు తన విధిని నిర్వర్తించాడు. మంచిపనిచేశాడు. మరి స్నానం చేసిన వాడు, స్నానం చేయటం అన్నిటికంటే మంచిది.” [87] (అ’హ్మద్‌, అబూ దావూద్‌, తిర్మిజి’, నసాయి‘, దార్మీ)

541 – [ 5 ] ( صحيح ) (1/169)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَنْ غَسَّلَ مَيِّتًا فَلْيَغْتَسِلْ”. رَوَاهُ ابْنُ مَاجَهُ.

وَزَادَ أَحْمَدُ وَالتِّرْمِذِيُّ وَأَبُوْ دَاوُدَ: “وَمَنْ حَمَلَهُ فَلْيَتَوَضَّأُ”.

541. (5) [1/169-దృఢం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”శవాన్ని స్నానం చేయించినవారు తాను కూడా స్నానం చేసుకోవాలి.” (ఇబ్నె మాజహ్)

ఇంకా, అ’హ్మద్‌, తిర్మిజి’, అబూ-దావూద్ లలో, ”శవాన్ని ఎత్తుకోవాలనుకున్న వారు వు’దూ’ చేసి ఉండాలి,” అని అధికంగా ఉంది.

542 – [ 6 ] ( ضعيف ) (1/169)

وَعَنْ عَائِشَةَ رَضِيَ اللهُ عَنْهَا أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم: كَانَ يَغْتَسِلَ مِنْ أَرْبَعٍ: مِّنَ الْجَنَابَةِ وَمِنْ يَوْمِ الْجُمْعَةِ وَمِنَ الْحَجَامةِ مِنْ غُسْلِ الْمَيِّتِ. رَوَاهُ أَبُوْ دَاوُدَ.

542. (6) [1/169బలహీనం]

’ఆయి‘షహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ఈ నాలుగు విషయాల వల్ల స్నానం చేసేవారు. మరియు స్నానం చేయమని ఆదేశించేవారు: 1. జనాబత్‌, 2. శుక్రవారం నాడు, 3. కొమ్ముచికిత్స చేయించుకున్న తరువాత, 4. శవాన్ని స్నానం చేయించిన తరువాత. (అబూ-దావూద్‌)

543 – [ 7 ] ( صحيح ) (1/169)

وَعَنْ قَيْسِ بْنِ عَاصِمٍ: أَنَّهُ أَسْلَمَ فَأَمَرَهُ النَّبِيُّ صلى الله عليه وسلم أَنْ يَّغْتَسِلَ بِمَاءٍ وَّسِدْرٍ. رَوَاهُ التِّرْمِذِيُّ وَأَبُوْ دَاوُدَ وَالنَّسَائِيُّ

543. (7) [1/169-దృఢం]

ఖైస్‌ బిన్‌ ’ఆ’సిమ్‌ (ర), ఇస్లామ్‌ స్వీకరించాలని సంకల్పించుకున్నారు. అప్పుడు ప్రవక్త (స) అతన్ని రేగి ఆకులు గల నీటితో స్నానం చేయమని, అంటే రేగి ఆకులతో వేడిచేయబడిన నీటితో స్నానం  చేయమని ఆదేశించారు. [88] (తిర్మిజి’, అబూ దావూద్, నసాయి‘)

—–

మూడవ  విభాగం  اَلْفَصْلُ الثَّالِثُ    

544 – [ 8 ] ( حسن ) (1/170)

عَنْ عِكْرَمَةَ: أَنَّ نَاسًا مِّنْ أَهْلِ الْعِرَاقِ جَاءُوْا فَقَالُوْا: يَا ابْنَ عَبَّاسٍ أَتَرَى الْغُسْلَ يَوْمَ الْجُمْعَةِ وَاجِبًا. قَالَ: لَا وَلَكِنَّهُ أَطْهَرُ وَخَيْرٌ لِّمَنِ اغْتَسَلَ وَمَنْ لَمْ يَغْتَسِلُ فَلَيْسَ عَلَيْهِ بِوَاجِبِ. وَسَأُخْبِرُكم كَيْفَ بَدَءَ الْغُسْلُ: كَانَ النَّاسُ مَجْهُوْدِيْنَ يَلْبَسُوْنَ الصُّوْفَ وَيَعْمَلُوْنَ عَلَى ظُهُوْرِهِمْ وَكَانَ مَسْجِدُ هُمْ ضَيِّقًا مُّقَارِبَ السَّقْفِ إِنَّمَا هُوَ عَرِيْشٌ فَخَرَجَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم فِيْ يَوْمِ حَارٍ وَعَرِقَ النَّاسُ فِيْ ذَلِكَ الصُّوْفِ حَتَّى ثَارَتْ مِنْهُمْ رِيَاحٌ آذَى بِذَلِكَ بَعْضُهُمْ بَعْضًا . فَلَمَّا وَجَدَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم تِلْكَ الرِّيْحَ قَالَ: “أَيُّهَا النَّاسُ إِذَا كَانَ هَذَا الْيَوْمُ فَاغْتَسِلُوْا وَلْيُمِسَّ أَحَدُكُمْ أَفْضَلَ مَا يَجِدُ مِنْ دُهْنِهِ وَطِيْبِهِ”. قَالَ ابْنُ عَبَّاسٍ: ثُمَّ جَاءَ اللهُ بِالْخَيْرِ وَلَبِسُوْا غَيْرَ الصُّوْفِ وَكُفُوا الْعَمَلَ وَوُسِّعَ مَسْجِدُهُمْ وَذَهَبَ بَعْضُ الَّذِيْ كَانَ يُؤْذِيْ بَعْضُهُمْ بَعْضًا مِنَ الْعَرَقِ. رَوَاهُ أَبُوْ دَاوُد .

544. (8) [1/170ప్రామాణికం]

’ఇక్రమ (ర) కథనం: ’ఇరాఖ్‌ నుండి కొంత మంది వచ్చారు. వాళ్ళు ఇబ్నె’అబ్బాస్‌ను, ”శుక్రవారం నాడు తప్పనిసరిగా స్నానం చేయాలి అనేది మీ అభిప్రా యమా,” అని అడిగారు. దానికి ఇబ్నె ’అబ్బాస్‌, “కాదు, కాని పరిశుభ్రంగా ఉంటుంది. స్నానం చేసుకుంటే చాలా మంచిది. ఒకవేళ ఎవరైనా స్నానం చేయకపోతే అతనిపై తప్పనిసరి కాదు. నేను మీకు స్నానం ప్రారంభం గురించి తెలుపుతాను: ‘ప్రారంభంలో శుక్రవారం స్నానం ఎలా ఉండేది. ప్రజలు ప్రవక్త(స) కాలంలో పేదలు, అక్కర గలవారు, దీనులు, బలహీనులుగా ఉండేవారు. ఉన్ని వస్త్రాలు ధరించేవారు. ఇంకా తమ వీపులపై వ్యాపారం చేసేవారు. అంటే బరువు ఎత్తుకొని శ్రమకు గురయ్యేవారు. మస్జిద్‌ కూడా చాలా ఇరుకుగా ఉండేది. దాని కప్పు కూడా చాలా క్రిందికి ఉండేది. అది కూడా ఖర్జూరం ఆకులతో చేయబడి ఉండేది. వేసవికాలంలో ప్రవక్త (స) జుమ’అహ్ నమా’జుకోసం వచ్చారు. ప్రజలు ఉన్ని బట్టలతో చెమటలో ఉన్నారు. దుర్వాసన గ్రహించిన ప్రవక్త (స) ప్రజలారా! శుక్రవారం స్నానంచేసిరండి, ఒకవేళ సువాసన ఉంటే, పులుముకొని రావచ్చు.” ఇబ్నె ’అబ్బాస్‌ (ర) కథనం: “ఆ తరువాత అల్లాహ్‌ ప్రజలకు ధన సంపదలు ప్రసాదించాడు. ప్రజలు పత్తి దుస్తులు ధరించసాగారు. పని కోసం సేవకులను ఉంచుకో సాగారు. వారికి తీరిక లభించ సాగింది. మస్జిద్‌ కూడా విశాలపరచబడింది. ఈ విధంగా వారు పరిశుభ్రంగా మస్జిదుకు రాసాగారు.” (అబూ దావూద్‌)

=====

12-  بَابُ الْحَيْضِ

12. బహిష్టు (స్త్రీల నెలసరి)

ఎటువంటి వ్యాధి లేకుండా స్త్రీలకు మర్మాంగం ద్వారా ప్రతి నెల రక్తం రావటాన్ని బహిష్టు అంటారు. బహిష్టు రక్తం వాస్తవంగా మలం వంటి పదార్థం. ఇది ఒకవేళ శరీరం నుండి విడుదల కాకుండా ఉంటే, అనేక రోగాలు సంభవిస్తాయి. ఇది 12-16 సంవత్సరాల మధ్య ఉన్న అమ్మాయిలకు రావటం ప్రారంభం అవుతుంది. ప్రతి నెల కొందరికి 4, మరికొందరికి 5, మరికొందరికి 7 రోజులు రక్తస్రావం ఉంటుంది. అదే విధంగా 35 నుండి 55 సంవత్సరాల స్త్రీలకు ఆగిపోతుంది. స్త్రీలు గర్భవతిగా ఉన్నప్పుడు, పాలు పట్టేకాలంలో ఈ రక్తం బిడ్డ సంరక్షణలో ఖర్చవు తుంది. గర్భం ధరించగానే రక్త స్రావం ఆగిపోతుంది. దీని ద్వారా 9 మాసాలు బిడ్డకు పోషణ లభిస్తుంది. మిగిలిన భాగం బిడ్డను కన్న తరువాత బయటకు విడుదల అయి పోతుంది. పాలుపట్టే కాలంలో ఈ రక్తం స్త్రీ యొక్క రొమ్ములలో ప్రవేశించి పాలుగా మారిపోతుంది. దీని ద్వారా బిడ్డ ఆహారం పొంది సంరక్షణ పొందుతాడు. ఈ పరిస్థితులు తప్ప ఒకవేళ రక్తం ఆగిపోతే వ్యాధిగానే పరిగణించాలి. ఏ ’హదీసు‘లోనూ దీని గడువు లేదు. కాని సాధారణంగా దీని కనిష్ట పరిమితి 2 రోజులు, గరిష్ట పరిమితి 10 రోజులు. ప్రతి స్త్రీకి దీని గడువు వేర్వేరుగా ఉంటుంది. అందువల్ల ప్రతి స్త్రీ తన ప్రత్యేక గడువు ప్రకారం ఆచరించాలి. దీనికి భిన్నంగా రక్తస్రావంవస్తే వ్యాధిగా పరిగణించాలి.

—–

మొదటి విభాగం اَلْفَصْلُ الْأَوَّلُ  

545 – [ 1 ] ( صحيح) (1/171)

عَنْ أَنَسٍ: أَنَّ الْيَهُوْدَ كَانُوْا إِذَا حَاضَتِ الْمَرْأَةُ فِيْهِمْ لَمْ يُؤَاكِلُوْهَا وَلَمْ يُجَامِعُوْهُنَّ فِيْ الْبُيُوْتِ فَسَأَلَ أَصْحَابُ النَّبِيِّ صلى الله عليه وسلم فَأَنْزَلَ اللهُ تعالى (وَيَسْأَلُوْنَكَ عَنِ الْمَحِيْضِ…؛ 2: 222) فَقَالَ رَسُوْلُ اللهِ اِصْنَعُوْا كُلَّ شَيْئٍ الَّا النِّكَاحَ فَبَلَغَ ذَلِكَ الْيَهُوْدَ فَبَلَغَ ذَلِكَ الْيَهُوْدَ. فَقَالُوْا: مَا يُرِيْدُ هَذَا الرَّجُلُ أَنْ يَّدَعَ مِنْ أَمْرِنَا شَيْئًا إِلَّا خَالَفَنَا فِيْهِ فَجَاءَ أُسَيْدُ بْنُ حُضَيْرٍ وَّعَبَّاد بْنُ بِشْرٍ. فَقَالَا يَا رَسُوْلَ اللهِ إِنَّ الْيَهُوْدَ تَقُوْلُ كَذَا وَكَذَا أَفَلَا نُجَامِعُهُنّ؟ فَتَغَيَّرَ وَجْهُ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم حَتَّى ظَنَّنَا أَنْ قَدْ وَجَدَ عَلَيْهِمَا. فَخَرَجَا فَاسْتَقْبَلَتْهُمَا هَدِيَّةٌ مِّنْ لَّبَنٍ إِلَى النَّبِيِّ صلى الله عليه وسلم فَأَرْسَلَ فِيْ آثَارِهِمَا فَسَقَاهُمَا فَعَرَفَا أَنَّ لَمْ يَجِدُ عَلَيْهِمَا. رَوَاهُ مُسْلِمٌ.

545. (1) [1/171దృఢం]

అనస్‌ (ర) కథనం: యూదుల్లో స్త్రీలు బహిష్టుకు గురైతే, ఆమెకు దూరంగా ఉంటారు. ఆమెకు తోడుగా తినరు, త్రాగరు. తమతోపాటు ఉంచరు. ఆమెను వేరుగా ఉంచు తారు. ప్రవక్త (స) అనుచరులు ప్రవక్త (స)ను బహిష్టు స్త్రీల గురించి అడిగారు. అప్పుడు అల్లాహ్‌ ఖుర్‌ఆన్‌లో ఈ ఆయతులు అవతరింప జేశాడు. అంటే: ”మిమ్మల్ని ప్రజలు బహిష్టు గురించి అడుగుతున్నారు,” (సూ. అల్ బఖరహ్, 2: 222) అప్పుడు ప్రవక్త(స), ‘మీరు బహిష్టులో ఉన్న స్త్రీలతో అన్నివిధాలా ప్రవర్తించవచ్చు. అంటే వారితో పాటు తినగలరు, త్రాగగలరు. అయితే బహిష్టు స్థితిలో వారితో సంభోగం చేయరాదు,’ అని అన్నారు. ఈ విషయం యూదులకు తెలిసి, ఈ వ్యక్తి మా ధార్మిక విష యాలను వ్యతిరేకిస్తున్నాడు,’ అని అన్నారు. అది విన్న ’ఉసైద్‌ బిన్‌ ’హుజైర్‌, ’అబ్బాద్‌ బిన్‌ బిష్ర్‌ ఇద్దరూ వచ్చి, ‘ఓ ప్రవక్తా! యూదులు ఇలా అంటున్నారు మరి మేము స్త్రీలకు దూరంగా ఉండాలా? మనమూ యూదులతో సమానంగా ఉండటానికి,’ అని అన్నారు. అది విన్న ప్రవక్త (స) ముఖం కోపంతో ఎర్రబారింది. అంటే ప్రవక్త (స) చాలా అసహ్యించుకున్నారు. ప్రవక్త (స) పరిస్థితిని చూసి వారి ద్దరూ బయటకువెళ్ళిపోయారు. ఎవరో ప్రవక్త (స)కు పాలు కానుకగాపంపారు. ప్రవక్త (స) ఒక వ్యక్తిని పంపి వారిని పిలి పించి పాలు త్రాపించారు. వారిద్దరూ ప్రవక్త (స), ‘మా పట్ల ఆగ్రహం కలిగిలేరు,’ అనిసంతోషించారు. [89] (ముస్లిమ్‌)

546 – [ 2 ] ( متفق عليه ) (1/171)

وَعَنْ عَائِشَةَ قَالَتْ: كُنْتُ أَغْتَسِلُ أَنَا وَالنَّبِيُّ صلى الله عليه وسلم مِنْ إِنَاءٍ وَّاحِدٍ وَكِلَانَا جُنُبٌ وَكَانَ يَأْمُرَنِيْ فَأَتَّزِرُ فَيُبَاشِرُنِيْ وَأَنَا حَائِضٌ وَكَانَ يُخْرِجُ رَأْسَهُ إِلَيَّ وَهُوَ مُعْتَكِفٌ فَأغْسِلْهُ وَأَنَا حَائِضٌ .

546. (2) [1/171ఏకీభవితం]

’ఆయి‘షహ్‌ (ర) కథనం: నేనూ, ప్రవక్త (స) ఒక తొట్టెలో నుండి స్నానం చేసేవాళ్ళం. అప్పుడు మేము ఇద్దరం అపరి శుద్ధ స్థితిలోనే ఉండేవాళ్ళం. ఇంకా నేను దుస్తులు ధరించి పడకపై పండుకుంటే ప్రవక్త (స) నా ప్రక్కన పండుకునే వారు. ప్రవక్త (స) శరీరం నా శరీరానికి తగిలేది. అప్పుడు నేను బహిష్టుస్థితిలో ఉండేదాన్ని. ఇంకా ప్రవక్త (స) ’ఏతెకాఫ్‌ స్థితిలో తన తలను మస్జిద్‌ నుండి బయటకు తీసేవారు. నేను ప్రవక్త (స) తలను కడిగేదాన్ని. అప్పుడు నేను బహిష్టుస్థితిలో ఉండేదాన్ని. [90] (బు’ఖారీ, ముస్లిమ్‌)

547 – [ 3 ] ( صحيح ) (1/172)

وَعَنْهَا قَالَتْ: كُنْتُ أَشْرَبُ وَأَنَا حَائِضٌ ثُمَّ أُنَاوِلُهُ النَّبِيَّ صلى الله عليه وسلم فَيَضَعُ فَاهُ عَلَى مَوْضِعٍ فِيْ فَيَشْرَبُ وَأَتَعَرَّقَ الْعَرْقَ وَأَنَا حَائِضٌ ثُمَّ أُنَاوِلُهُ النَّبِيَّ صلى الله عليه وسلم فَيَضَعُ فَاهُ عَلَى مَوْضِعِ فِيْ. رَوَاهُ مُسْلِمٌ.

547. (3) [1/172దృఢం]

’ఆయి‘షహ్‌ (ర) కథనం: నేను బహిష్టు స్థితిలో నీళ్ళు త్రాగి, మిగిలిన నీటిని ప్రవక్త (స)కు ఇచ్చేదాన్ని, ప్రవక్త (స) నేను త్రాగిన చోటినుండే త్రాగేవారు. ఇంకా నేను ఎము కలను చప్పరించి, వాటిని ప్రవక్త (స)కు ఇస్తే, ప్రవక్త (స) నేను చప్పరించినచోటనే చప్పరించే వారు. [91] (ముస్లిమ్)

548 – [ 4 ] ( متفق عليه ) (1/172)

وَعَنْهَا قَالَتْ: كَانَ النَّبِيُّ صلى الله عليه وسلم يَتَّكِئُ عَلَى حِجْرِيْ وَأَنَا حَائِضٌ ثُمَّ يَقْرَأُ الْقُرْآنَ .

548. (4) [1/172ఏకీభవితం]

’ఆయి‘షహ్‌ (ర) కథనం: నేను బహిష్టు స్థితిలో ఉన్నప్పుడు ప్రవక్త (స) నా ఒడిలో తలగడ పెట్టి కూర్చుని ఖుర్‌ఆన్‌ పఠించేవారు. (బు’ఖారీ, ముస్లిమ్‌)

549 – [ 5 ] ( صحيح ) (1/172)

وَعَنْهَا قَالَتْ: قَالَ لِيْ النَّبِيُّ صلى الله عليه وسلم: “نَاوِلِيْنِيْ الْخُمْرَةَ مِنَ الْمَسْجِدِ”. فَقُلْتُ: إِنِّيْ حَائِضٌ فَقَالَ: “إِنَّ حَيْضَتَكَ لَيْسَتْ فِيْ يَدِكَ”. رَوَاهُ مُسْلِمٌ .

549. (5) [1/172దృఢం]

’ఆయి‘షహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) నాతో ఇలా అన్నారు, ‘మస్జిద్‌లో నుండి చాపతెచ్చి నాకివ్వు,’ అని అన్నారు. ‘నేను బహిష్టురాలిని,’ అని అన్నాను. ప్రవక్త (స) నీ బహిష్టు నీ చేతిలో లేదు కదా! అంటే మస్జిద్‌ బయట నిలబడి చేయిచాచి మస్జిద్‌లోని చాప అందు కోవటంలో అభ్యంతరం ఏమీలేదు. ఎందుకంటే చేయి పరిశుభ్రంగా ఉంది. (ముస్లిమ్‌)

550 – [ 6 ] ( متفق عليه ) (1/172)

وَعَنْ مَيْمُوْنَةَ رضي الله عَنْها قَالَتْ: كَانَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم يُصَلِّيْ فِيْ مِرْطٍ بَعْضُهُ عَلَيَّ وَبَعْضُهُ عَلَيْهِ وَأَنَا حَائِضٌ .

550. (6) [1/172ఏకీభవితం]

మైమునహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) దుప్పటి పైన కూడా నమాజు చదివే వారు. దానిసగం నేను కప్పుకొని ఉంటాను. అప్పుడు నేను బహిష్టులో ఉంటాను, సగం ప్రవక్త (స) కోసం ఉంటుంది. (బు’ఖారీ, ముస్లిమ్‌)

—–

రెండవ విభాగం  اَلْفَصْلُ الثَّانِيْ    

551 – [ 7 ] ( صحيح ) (1/173)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ رضي الله عَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَنْ أَتَى حَائِضًا أَوْ اِمْرَأَةً فِيْ دُبُرِهَا أَوْ كَاهِنًا فَقَدْ كَفَرَ بِمَا أُنْزِلَ عَلَى مُحَمَّدٍ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَابْنُ مَاجَهُ وَالدَّارَمِيُّ.

وَفِيْ رِوَايَتِهِمَا: “فَصَدَّقَهُ بِمَا يَقُوْلُ فَقَد كَفَرَ”. وَقَالَ التِّرْمِذِيُّ: لَا نَعْرِفُ هَذَا الْحَدِيْثَ إِلَّا مِنْ حَدِيْثِ حَكِيْمِ الْأَثْرَمِ عَنْ أَبِيْ تَمِيْمَةَ عَنْ أَبِيْ هُرَيْرَةَ.

551. (7) [1/173దృఢం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”బహిష్టు రాలితో సంభోగం చేసినా, మలద్వారంలో సంభో గంచేసినా జ్యోతిష్యుని వద్దకు వెళ్ళినా, ప్రవక్త (స)పై అవత రించబడిన దాన్ని ధిక్కరించి నట్టే. అంటే ఖుర్‌ఆన్‌ను తిరస్కరించి నట్టే.” (తిర్మిజి’, ఇబ్నె మాజహ్, దార్మీ)

ఇబ్నె మాజహ్ మరియు దార్మీలో ఇలా ఉంది, ”జ్యోతిష్యుని వద్దకు వెళ్ళినా అంటే, జ్యోతిష్యుడు చెప్పింది నమ్మడం,” అని ఉంది.

ఇంకా తిర్మిజి‘లో ”మా ’హదీసు‘వేత్తలకు ఈ ’హదీసు‘ ’హకీమ్‌ అస్ర‘మ్‌ అబీ తమీమహ్‌ ద్వారా కేవలం అబూ హురైరహ్‌ ద్వారా మాత్రమే తెలిసింది” అని అన్నారు.

552 – [ 8 ] ( ضعيف ) (1/173)

وَعَنْ مُعَاذِ بْنِ جَبَلٍ قَالَ: قُلْتُ: يَا رَسُوْلَ اللهِ مَا تَحِلُّ لِيْ مِنِ امْرَأَتِيْ وَهِيَ حَائِضٌ؟ قَالَ: “مَا فَوْقَ الْإِزَارِ وَالتَّعَفُّفُ عَنْ ذَلِكَ أَفْضَلَ”. رَوَاهُ رَزِيْنٌ وَقَالَ مُحْييُ السُّنَّةِ: إِسْنَادُهُ لَيْسَ بِقَوِيٍّ.

552. (8) [1/173బలహీనం]

ము’ఆజ్‌‘ బిన్‌ జబల్‌ (ర) కథనం: ‘ఓ ప్రవక్తా! భార్య బహిష్టులో ఉన్నప్పుడు ధర్మసమ్మతమైనది ఏమిటి?’ అని విన్నవించుకున్నాను. దానికి ప్రవక్త (స), ‘నడుముకు పైన ఉన్నది నీ కోసం ధర్మసమ్మతమైనది. క్రిందిభాగం నుండి దూరంగా ఉండాలి. అయితే పైభాగం నుండి కూడా దూరంగా ఉంటే మంచిది. ఎందుకంటే దాని వల్ల క్రింది భాగంపై దాడిచేసే భయం ఉంటుంది,’ అని హితబోధ చేశారు. (ర’జీన్‌)

అయితే ఈ ’హదీసు‘ అంత ప్రామాణిక మైనది కాదని ముహ్‌యియ్ అస్సున్నహ్‌ పేర్కొన్నారు.

553 – [ 9 ] ( صحيح ) (1/173)

وَعَنِ ابْنِ عَبَّاسٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِذَا وَقَعَ الرَّجُلُ بِأَهْلِهِ وَهِيَ حَائِضٌ فَلْيَتَصَدَّقْ بِنِصْفِ دِيْنَارٍ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَأَبُوْ دَاوُدَ النَّسَائِيُّ وَالدَّارَمِيُّ وَابْنُ مَاجَهُ.

553. (9) [1/173దృఢం]

ఇబ్నె ’అబ్బాస్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”బహిష్టుస్థితిలో ఉన్న భార్యతో సంభోగించిన వారు పరి హారంగా సగం దీనార్‌ దానం చేయాలి.” (తిర్మిజి’, అబూ దావూ‘ద్‌, నసాయి‘, దార్మీ, ఇబ్నె మాజహ్)

554 – [ 10 ] ( ضعيف ) (1/174)

وَعَنِ ابْنِ عَبَّاسٍ عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ: “إِذَا كَانَ دَمًا أَحْمَرَ فَدِيْنَارٌ وَإِذَا كَانَ دَمًا أَصْفَرَ فَنِصْفُ دِيْنَارٍ”. رَوَاهُ التِّرْمِذِيُّ.

554. (10) [1/174బలహీనం]

ఇబ్నె ’అబ్బాస్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”రక్తం ఎర్రగా ఉన్నప్పుడు సంభోగం చేస్తే, ఒక దీనార్‌, పసుపు రంగు మిశ్రమంలో ఉంటే సగం దీనార్‌ దానం చేయండి.” (తిర్మిజి’)

—–

మూడవ విభాగం  اَلْفَصْلُ الثَّالِثُ  

555 – [ 11 ] ( صحيح ) (1/174)

عَنْ زَيْدِ بْنِ أَسْلَمِ قَالَ: إِنَّ رَجُلًا سَأَلَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم فَقَالَ: مَا يَحِلُّ لِيْ مِنِ امْرَأَتِيْ وَهِيَ حَائِضٌ؟ فَقَالَ لَهُ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “تَشُدُّ عَلَيْهَا إِزَارَهَا ثُمَّ شَأْنَكَ بِأَعلْاَهَا”. رَوَاهُ مَالِكٌ وَالدَّارَمِيُّ مُرْسَلًا .

555. (11) [1/174దృఢం]

’జైద్‌ బిన్‌ అస్లమ్‌ (ర) కథనం: ప్రవక్త (స) వద్దకు ఒక వ్యక్తి వచ్చి, ‘బహిష్టు స్థితిలో ఉన్న నా భార్య నుండి నేను ఏం సుఖం పొందగలను,’ అని విన్నవించు కున్నాడు. దానికి ప్రవక్త (స), ‘నీవు నీ భార్య నడుము మొలత్రాడును గట్టిగా కట్టివేయి. ఆ తరువాత మొలతాడుకు పై భాగం నుండి లాభం పొందవచ్చు,’ అని అన్నారు. (దార్మీ)

556 – [ 12 ] ( ضعيف ) (1/174)

وَعَنْ عَائِشَةَ قَالَتْ: كُنْتُ إِذَا حِضْتُ نَزَلْتُ عَنِ الْمِثَالِ عَلَى الْحَصِيْرِ فَلَمْ نَقْرَبَ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم وَلَمْ نَدْنُ مِنْهُ حَتَّى نَطْهُرَ. رَوَاهُ أَبُوْ دَاوُدَ.

556. (12) [1/174బలహీనం]

’ఆయి‘షహ్‌ (ర) కథనం: నాకు బహిష్టు దశ ప్రారంభ మైతే, నేను పడకపై నుండి దిగి నేలపై ఉన్న చాపపైకి వస్తాను. అంటే ప్రవక్త (స) నుండి వేరైపోతాను. అది గ్రహించిన ప్రవక్త (స) దగ్గరకు రారు. అదేవిధంగా బహిష్టు స్థితిలో ఉన్న స్త్రీలు, పరిశుద్ధులైనంత వరకు ప్రవక్త (స) వద్దకు వెళ్ళరు.’ [92] (అబూ-దావూద్‌)

=====

13- بَابُ الْمُسْتَحَاضَةِ

13. అనారోగ్య రక్తస్రావం (ముస్తహాదహ్)

స్త్రీల మర్మాంగం నుండి ప్రత్యేక దినాల్లో కాక ఇతర దినాల్లో అనారోగ్యం కారణంగా రక్తం రావటాన్ని ఇస్తి’హా’దహ్ అంటారు. ప్రవక్త (స) ఇస్తి’హా’దహ్ రక్తం నరాల నుండి వస్తుందని, గర్భం నుండి రాదని, ఎందుకంటే బహిష్టురక్తం గర్భం నుండి వస్తుందని, ఇస్తి’హా’దహ్ ఉన్న స్త్రీ నమా’జు చదవ గలదు, ఉపవాసం ఉండగలదు, ఖుర్‌ఆన్‌ పఠించగలదు. ఇస్తి’హా’దహ్ వల్ల నమా’జు వదలటం ధర్మం కాదు. ముస్త’హా’దహ్ స్త్రీ ప్రతి నెల నిర్ణీత బహిష్టు దినాలు నమా’జు చదవరాదు, ఉపవాసం పాటించరాదు. ఇతర కార్యాలూ చేయరాదు. బహిష్టు దశనుండి పరిశుద్ధమైన తర్వాత నమా’జు చదవాలి. ఇస్తి’హా’దహ్ స్థితిలో ప్రతి నమా’జుకు క్రొత్తవు’దూ’ చేయాలి. ఒకవేళ సాధ్యం అయితే, ప్రతి రోజు మూడు సార్లు స్నానం చేయాలి. ఒక స్నానంతో ”జుహర్‌ మరియు ’అ’స్‌ర్‌ నమా’జులు చదవాలి. రెండవ స్నానంతో మ’గ్రిబ్‌, ’ఇషా‘ నమా’జులు చదవాలి. మూడవ స్నానంతో ఫజ్‌ర్‌ నమా’జు చదవాలి. ఒకవేళ మరీ సాధ్యం అయితే ప్రతి నమా’జుకు ప్రత్యేక స్నానం చేయాలి. జుహైనహ్‌ బిన్‌తె జహష్‌కు ప్రవక్త (స) ఈ విధంగా ఉపదేశించారు. (అబూ దావూద్‌, తిర్మిజి’)

ముస్త’హా’దహ్ స్త్రీపై కేవలం అనారోగ్యం వల్లనే స్నానం తప్పనిసరి కాదు. ముస్త’హా’దహ్ తో సంభోగం కూడా చేయవచ్చును. కాని దూరంగా ఉంటే మంచిది. ఒకవేళ వు’దూ’ చేసిన వెంటనే రక్తం కారినా వు’దూ’ భంగంకాదు. నమా’జు స్థితిలో కూడా కారు తున్నా, నమా’జ్‌ భంగం చేయకుండా పూర్తిచేయాలి.

—–

మొదటి విభాగం  اَلْفَصْلُ الْأَوَّلُ  

557 – [ 1 ] ( متفق عليه ) (1/175)

عَنْ عَائِشَةَ قَالَتْ: جَاءَتْ فَاطِمَةُ بِنْتُ أَبِيْ حُبَيْشٍ إِلَى النَّبِيِّ صلى الله عليه وسلم. فَقَالَتْ يَا رَسُوْلَ اللهِ إِنَّيْ اِمْرَأَةٌ أَسْتَحَاضُ فَلَا أَطْهُرُ أَفَأَدَعِ الصَّلَاةَ. فَقَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَا إِنَّمَا ذَلِكَ عِرْقٌ وَلَيْسَ بِحَيْضِ فَإِذَا أَقْبَلَتْ حَيْضَتُكَ فَدَعِي الصَّلَاةَ وَإِذَا أَدْبَرَتْ فَاغْسِلِيْ عَنْكِ الدَّمَ ثُمَّ صَلِّي”.

557. (1) [1/175ఏకీభవితం]

’ఆయి‘షహ్‌ (ర) కథనం: ఫా’తిమ బిన్‌తె అబీ ’హుబైష్‌ ప్రవక్త (స) వద్దకు వచ్చి, ‘ఓ ప్రవక్తా! నాకు ఇస్తి’హా’దహ్ వ్యాధి ఉంది. రక్త స్రావం అవుతూ ఉంటుంది. ఆగటం లేదు. ఇటువంటి స్థితిలో నమా’జు వదలవచ్చా?’ అని విన్నవించుకుంది. దానికి ప్రవక్త (స), ‘ఇది నరాల రక్తం, బహిష్టు (హాయద్) రక్తం కాదు, బహిష్టుకాలంలో నమా’జు వదలివేయ వచ్చు, దాని తరువాత రక్తంవస్తే కడుక్కొని స్నానం చేసి నమా’జు చదువుకో,’ అని హితబోధ చేశారు. (బు’ఖారీ, ముస్లిమ్‌)

—–

  రెండవ విభాగం  اَلْفَصْلُ الثَّانِيْ    

558 – [ 2 ] ( حسن ) (1/175)

عَنْ عُرْوَةَ بْنِ الزُّبَيْرِ عَنْ فَاطِمَةُ بِنْتِ أَبِيْ حُبَيْشٍ: أَنَّهَا كَانَتْ تُسْتَحَاضُ. فَقَالَ لَهَا النَّبِيُّ صلى الله عليه وسلم: “إِذَا كَانَ دَمُ الْحَيْضِ فَإِنَّهُ دَمٌ أَسْوَدٌ يُعْرِفُ فَأَمْسِكِيْ عَنِ الصَّلَاةِ فَإِذَا كَانَ الْآخَرُ فَتَوَضَّئِيْ وَصَلِيْ فَإِنَّمَا هُوَ عِرْقٌ. رَوَاهُ أَبُوْ دَاوُدَ وَالنَّسَائِيُّ.

558. (2) [1/175ప్రామాణికం]

’ఉర్వ బిన్‌ ’జుబైర్‌,ఫా’తిమహ్ బిన్‌తె అబీ ’హుబైష్‌ (ర) ద్వారా కథనం: ఫా’తిమహ్ బిన్‌తె అబీ ’హుబైష్‌కు ఇస్తి’హా’దహ్ వ్యాధి ఉండేది. ప్రవక్త (స) ఆమెతో, ‘బహిష్టు రక్తం నల్లగా ఉంటుంది. దాన్ని గుర్తించవచ్చు. ఒకవేళ బహిష్టు రక్తం వస్తే నమా’జు చదవకు. ఒకవేళ రక్తం నల్లగా ఉండకపోతే, అది ఇస్తిహా’దహ్ రక్తం. అప్పుడు వు’దూ’ చేసి నమా’జు చదువుకో, ఎందుకంటే అది నరాలరక్తం,’ అని అన్నారు. (అబూ దావూద్‌, నసాయి‘)

559 – [ 3 ] ( صحيح ) (1/175)

وَعَنْ أُمِّ سَلَمَةَ: أَنَّ امْرَأَة كَانَتْ تُهْرَاقُ الدَّمَ عَلَى عَهْدِ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم. فَاسْتَفْتَتْ لَهَا أُمُّ سَلَمَةَ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم فَقَالَ: “لِتَنْظُرْ عَدَدَ اللَّيَالِيْ وَالْأَيَّامِ الَّتِيْ كَانَتْ تَحِيْضُهُنَّ مِنَ الشَّهْرِ قَبْلَ أَنْ يُّصِيْبَهَا الَّذِيْ أَصَابَهَا فَلْتَتْرُكِ الصَّلَاةَ قَدْرَ ذَلِكَ مِنْ الشَّهْرِ فَإِذَا خَلَّفَتْ ذَلِكَ فَلْتَغْتَسِلْ ثُمَّ لِتَسْتَثْفِرْ بِثَوْبِ ثُمَّ لِتُصَلِّ”. رَوَاهُ مَالِكٌ وَأَبُوْ دَاوُدَ وَالدَّارمي وَرَوَى النَّسَائِيُّ مَعْنَاهُ .

559. (3) [1/175దృఢం]

ఉమ్మె సలమహ్ (ర) కథనం: ప్రవక్త (స) కాలంలో ఒక స్త్రీకి ఇస్తి’హా’దహ్ రక్తం వచ్చేది. ఉమ్మె సలమహ్ ఆ స్త్రీ గురించి ప్రవక్త (స)ను అడిగారు. దానికి ప్రవక్త (స),‘ప్రతి నెల బహిష్టు వచ్చినన్ని రోజులు నమా’జులు వదలి వేయాలి. బహిష్టు దినాల తర్వాత స్నానం చేసి, వస్త్రంతో లంగోట్‌ ధరించి నమా’జులు చదువుకోవాలి. (మాలిక్‌, అబూ దావూద్‌, దార్మీ, నసాయి‘)

560 – [ 4 ] ( صحيح ) (1/176)

وَعَنْ عَدِيِّ بْنِ ثَابِتٍ عَنْ أَبِيْهِ عَنْ جَدِّهِ – قَالَ يَحْيُى بْنُ مُعِيْنٍ: جَدُّ عَدِيٍّ اِسْمُهُ دِيْنَارٌ – عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم أَنَّهُ قَالَ فِيْ الْمُسْتَحَاضَةِ: “تَدَعُ الصَّلَاةَ أَيَّامَ أَقْرَائِهَا الَّتِيْ كَانَتْ تَحِيْضُ فِيْهَا ثُمَّ تَغْتَسِلُ وَتَتَوَضَّأُ عِنْدَ كُلِّ صَلَاةٍ وَتَصُوْمُ وَتُصَلِّيْ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَأَبُوْ دَاوُدَ .

560. (4) [1/176దృఢం]

’అదీ బిన్‌ సా‘బిత్‌ తన తాత ద్వారా కథనం: ప్రవక్త (స), ‘ఇస్తి’హా’దహ్ రోగం ఉన్న స్త్రీ గురించి మాట్లాడుతూ, ‘ప్రతినెల బహిష్టు వచ్చినన్ని రోజులు నమా’జు వదలి వేయాలి. తరువాత దినాల్లో స్నానం చేసి అంటే ప్రతి నమా’జుకు స్నానం చేసి నమా’జులు, ఉపవాసాలు పాటించాలి,’ అని అన్నారు.[93] (తిర్మిజి’, అబూ దావూద్‌)

561 – [ 5 ] ( حسن ) (1/176)

وَعَنْ حَمْنَةَ بِنْتِ جَحْش قَالَتْ: كُنْتُ أُسْتَحَاضُ حَيْضَةً كَثِيْرَةً شَدِيْدَةً فَأَتَيْتُ النَّبِيَّ صلى الله عليه وسلم أَسْتَفْتِيْهِ وَأُخْبِرُهُ فَوَجَدْتُّهُ فِيْ بَيْتِ أُخْتِيْ زَيْنَبَ بِنْتِ جَحْشٍ فَقُلْتُ يَا رَسُوْلَ اللهِ إِنَّيْ أُسْتَحَاضُ حَيْضَةً كَثِيْرَةً شَدِيْدَةً فَمَا تَأمُرُنِيْ فِيْهَا؟ قَدْ مَنَعَتْنِيْ الصَّلَاةَ وَالصِّيَامَ. قَالَ: “أَنْعَتُ لَكِ الْكُرْسُفَ فَإِنَّهُ يُذْهِبُ الدَّمَ”. قَالَتْ: هُوَ أَكْثَرُ مِنْ ذَلِكَ. قَالَ: “فَتَلَجَّمِيْ”. قَالَتْ هُوَ أَكْثَرُ مِنْ ذَلِكَ. قَالَ: “فَاتَّخِذِيْ ثَوْبًا”. قَالَتْ هُوَ أَكْثَرُ مِنْ ذَلِكَ إِنَّمَا أُثَجُ ثَجًّا. فَقَالَ النَّبِيُّ صلى الله عليه وسلم: “سَآمُرْكِ بِأَمْرَيْنِ أَيَّهُمَا صَنَعْتِ أَجْزَأَ عَنْكِ مِنَ الْآخَرِ وَإِنْ قَوِيْتِ عَلَيْهِمَا فَأَنْتِ أَعْلَمُ” فَقَالَ لَهَا: “إِنَّمَا هَذِهِ رَكْضَةٌ مِّنْ رَّكْضَاتِ الشَّيْطَانِ فَتَحَيَّضِيْ سِتَّةَ أَيَّامٍ أَوْ سَبْعَةَ أَيَّامٍ فِيْ عِلْمِ اللهِ ثُمَّ اغْتَسِلِيْ حَتَّى إِذَا رَأَيْتِ أَنَّكَ قَدْ طَهرْتِ وَاسْتَنْقَأتِ فَصَلِّيْ ثَلَاثا وَّعِشْرِيْنَ لَيْلَةً أَوْ أَرْبَعًا وَّعِشْرِيْنَ لَيْلَةً وَأَيَّامَهَا وَصُوْمِيْ وَصلي فَإِنَّ ذَلِكَ يُجْزِئُكِ وَكَذَلِكَ فَافْعَلِيْ كَمَا تَحِيْضُ النِّسَاءُ وَكَمَا يَطْهُرْنَ مِيْقَاتَ حَيْضِهِنَّ وَطَهْرِهِنَّ وَإِنْ قَوِيْتِ عَلَى أَنْ تُؤَخِّرِيْنَ الظُّهْرَ وَتُعَجِّلِيْنَ الْعَصْرَ فَتَغْتَسِلِيْنَ وَتَجْمَعِيْنَ الصَّلَاتَيْنِ: اَلظُّهْرِ وَالْعَصْرِ وَ تُؤَخِّرِيْنَ الْمَغْرَبَ وَتُعَجِّلِيْنَ الْعِشَاءَ ثُمَّ تَغْتَسِلِيْنَ وَتَجْمَعِيْنَ بَيْنَ الصَّلَاتَيْنِ فَافْعَلِيْ وَتَغْتَسِلِيْنَ مَعَ الْفَجْرِ فَافْعَلِيْ وَصُوْمِيْ إِنَّ قَدَرْتِ عَلَى ذَلِكَ”. فَقَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “وَهَذَا أَعْجَبُ الْأَمْرَيْنِ إِلَيَّ”. رَوَاهُ أَحْمَدُ وَأَبُوْ دَاوُدَ وَالتِّرْمِذِيُّ .

561. (5) [1/176ప్రామాణికం]

హమ్నహ్ బిన్తె హష్ (ర) కథనం: నాకు ఇస్తి’హా’దహ్ వ్యాధి ఉండేది. నేను ప్రవక్త (స) వద్దకు వెళ్ళాను. అప్పుడు ప్రవక్త (స) మా చెల్లెలు జైనబ్ ఇంట్లో ఉన్నారు. అప్పుడు నేను, ‘ఓ ప్రవక్తా! నాకు ఇస్తి’హా’దహ్‌ వ్యాధి ఉంది. దాని వల్ల నేను నమా’జులు, ఉపవాసాలు పాటించలేక పోతున్నాను,’ అని విన్నవించుకున్నాను. అప్పుడు ప్రవక్త (స), ‘నీవు మర్మాంగం వద్ద దూది ఉంచుకో. అది పీల్చుతుంది,’ అని అన్నారు. దానికి నేను, ‘అది చాలా ఎక్కువ వస్తోంది,’ అని అన్నాను. ప్రవక్త (స), ‘అయితే లంగోట్‌ కట్టుకో,’ అని అన్నారు. దానికి ఆమె, ‘దానివల్ల కూడా ఆగదు,’ అని చెప్పింది. దానికి ప్రవక్త (స), ‘అయితే దూదిపెట్టి లంగోట్‌ కట్టుకో,’ అని అన్నారు. దానికి ఆమె, ‘అది అంతకంటే అధికంగా ఉంది,’ అన్నారు. అప్పుడు ప్రవక్త (స), ‘నేను నీకు రెండు విషయాల గురించి ఆదేశించాను. వాటిలో ఏది చేసినా అది నీకు సరిపోతుంది. ఒకవేళ నీకు శక్తిఉంటే ఏదైనా చేయవచ్చు.’

ఆ తరువాత ప్రవక్త (స) ఇస్తి’హా’దహ్ అంటే షై’తాన్‌ కాలితో తన్నడం వల్ల జరుగుతుంది. దీనివల్లే ఇస్తి’హా ’దహ్ రక్తం వెలువడుతుంది. బహిష్టు 6 లేక 7 రోజులు వస్తుంది. అందువల్ల ప్రతి నెల బహిష్టు దినాలను వదలి మిగిలిన రోజులు స్నానం చేసి నమా’జు ఉపవాసాలు పాటిస్తూ ఉండు. అదే విధంగా ప్రతి నెల చేస్తూ ఉండు.

 ఒకవేళ నీకు శక్తి ఉంటే ”జుహర్‌ నమా’జు ఆలస్యం చేసి ’అ’స్ర్‌ నమా’జుతో కలిపి చదువుకో. అదేవిధంగా మ’గ్రిబ్‌ ఆలస్యం చేసి ’ఇషా‘ తొందరగా రెండు నమా’జులను కలిపి చదువుకో. అదేవిధంగా ఫజ్‌ర్‌ నమా’జు కోసం స్నానం చేసుకో. అదేవిధంగా ప్రతి నెల చదువుకో, రెంటిలో రెండవ దాన్ని నేను ప్రాధాన్యత ఇస్తున్నాను,’ అని అన్నారు. (అ’హ్మద్‌, అబూ దావూద్‌, తిర్మిజి’)

—–

మూడవ విభాగం  الْفَصْلُ الثَّالِثُ  

562 – [ 6 ] ( صحيح ) (1/178)

عَن أَسمَاء بنت عُمَيْس قَالَتْ: قُلْتُ يَا رَسُولَ اللَّهِ إِنَّ فَاطِمَةَ بِنْتَ أَبِي حُبَيْشٍ اسْتُحِيضَتْ مُنْذُ كَذَا وَكَذَا فَلَمْ تُصَلِّ فَقَالَ رَسُولُ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: «سُبْحَانَ اللَّهِ إِنَّ هَذَا مِنَ الشَّيْطَانِ لِتَجْلِسَ فِي مِرْكَنٍ فَإِذَا رَأَتْ صُفَارَةً فَوْقَ الْمَاءِ فَلْتَغْتَسِلْ لِلظُّهْرِ وَالْعَصْرِ غُسْلًا وَاحِدًا وَتَغْتَسِلْ لِلْمَغْرِبِ وَالْعِشَاءِ غُسْلًا وَاحِدًا وَتَغْتَسِلْ لِلْفَجْرِ غُسْلًا وَاحِدًا وَتَوَضَّأُ فِيمَا بَيْنَ ذَلِكَ» . رَوَاهُ أَبُو دَاوُد وَقَالَ:

562. (6) [1/178దృఢం]

అస్మా‘ బింత్ ’ఉమైస్ (ర) కథనం: నేను, ‘ఓ ప్రవక్తా! ఫా’తిమహ్ బిన్తె అబీ ’హుబైష్‌ చాలారోజుల నుండి ఇస్తి’హా ’దహ్ వ్యాధికి గురయి ఉంది. నమా’జు చదవలేక పోతుంది అని,’ విన్నవించుకున్నాను. దానికి ప్రవక్త (స) అల్లాహ్ (త) పరిశుద్ధుడని, ఈ ఇస్తిహా’దహ్ షై’తాన్‌ వల్ల వస్తుందని ఆమె నీటితొట్టెలో కూర్చోవాలి, నీటిపై పసుపుపచ్చ దనాన్ని చూస్తే, ”జుహర్‌ మరియు ’అ’స్ర్‌ కోసం ఒక సారి స్నానంచేయాలి. వాటిమధ్య వు’దూ’ అవసరం ఉంటే వు’దూ’ చేయాలి అని ఉపదేశించారు.(అబూ దావూద్‌)

563 – [ 7 ] ( موقوف ) (1/178)

رَوَى مُجَاهِدٌ عَنِ ابْنِ عَبَّاٍس: لَمَّا اشْتَدَّ عَلَيْهَا الْغُسْلُ أَمَرَهَا أَنْ تَجْمَعَ بَيْنَ الصَّلَاتَيْنِ.

563. (7) [1/178సహచరుని ప్రోక్తం]

ఇబ్నె ’అబ్బాస్‌ ద్వారా ముజాహిద్‌ కథనం: ప్రతి నమా’జ్‌ కోసం వు’దూ’ చేయటం ఆమెకు కష్టంగా ఉందని తెలిసి, ప్రవక్త (స) స్నానంచేసి రెండు నమా’జులను ఒకేసారి చదువుకోమని ఆదేశించారు.

*****


[1]) వివరణ-281: ఈ ‘హదీసు’ను ఉల్లేఖించిన వారు అబూ మాలిక్‌. ఇతని పేరు అబ్ బిన్ఆసిమ్. ‘ఉమర్‌ (ర) కాలంలో వీరు మరణించారు: 1. పరిశుభ్రత అర్థవిశ్వాసం. అంటే విశ్వాసం వల్ల చిన్న, పెద్ద పాపాలు తొలగిపోయినట్లు, పరిశుభ్రత వల్ల కూడా చిన్నాపెద్ద పాపాలు తొలగిపోతాయి. అందువల్ల పరిశుభ్రత అర్థ విశ్వాసం. 2. విశ్వాసం అంటే నమా’జ్‌, అల్లాహ్‌ ఆదేశం: ”అల్లాహ్‌ మీ విశ్వాసాన్ని (బైతుల్ మఖ్దిస్ వైపునకు చేసిన నమాజులను) ఎన్నడూ వృథాచేయడు.” (సూ. అల్-బఖరహ్, 2:143) అందువల్ల పరిశుభ్రత అర్థ విశ్వాసం అంటే పరిశుభ్రత సగం నమా’జు, ఎందుకంటే నమా’జు కోసం పరిశుభ్రత తప్పనిసరి. 3. తర్ అంటే భాగం అని కూడా అవుతుంది. పరిశుభ్రత నమా’జులోని ఒక భాగమే. అల్హమ్దులిల్లాహ్ పుణ్యం తూనికను నింపివేస్తుంది. అంటే తీర్పుదినం నాడు పుణ్యం తూయబడుతుంది. అప్పుడు తూనిక నిండిపోతుంది. సుబ్హానల్లాహ్‌, అల్హమ్దు లిల్లాహ్ పలకటం వల్ల భూమ్యాకాశాల మధ్య భాగం అంతా పుణ్యంతో నిండిపోతుంది. ఇంకా నమా’జు వెలుగు వంటిది. దీనివల్ల సమాధిలో వెలుగు ఉంటుంది. లేదా తీర్పుదినం నాడు దానివల్ల వెలుగు ఉంటుంది. అదేవిధంగా నమా’జు చెడుల నుండి, అశ్లీల విషయాల నుండి దూరంగా ఉంచుతుంది. నమా’జు మంచి వైపు మార్గం చూపుతుంది. ఇంకా నమా’జు చదివేవారి ముఖాలు వెలుగుతో నిండి ఉంటాయి. అదేవిధంగా దాన ధర్మాలు తీర్పుదినం నాడు సాక్షులుగా వస్తాయి. ఇంకా సహనం ఓర్పులు వెలుగు అవుతుంది. అంటే శిక్షకు కారణం అవుతుంది. అదేవిధంగా ప్రతి వ్యక్తి తన కర్మలకు బదులుగా తన్ను తాను అమ్మివేస్తాడు. మంచిచేస్తే విడిపించుకుంటాడు. చెడుచేస్తే తన్ను తాను శిక్షకు గురిచేస్తాడు.

[2]) వివరణ-283: పరిపూర్ణ వు’దూ అంటే ప్రతి భాగాన్ని పూర్తిగా కడగటం, 3 సార్లు కడగటం. చలికాలంలో కూడా భాగాలను పూర్తిగా కడగటం. తయమ్ముమ్‌ చేయక పోవటం. రిబాత్ అంటే ముడి వేయటం, శత్రువులకు వ్యతిరేకంగా సరిహద్దుల్లో కట్టు దిట్టంగా కాపలా కాయటం. అంటే వీటిని చేయటం వల్ల జిహాద్‌కు సమానంగా పుణ్యం లభిస్తుంది. ఈ అలవాట్లు వ్యక్తిని పాపాలవైపు పోకుండా ఆపుతాయి.

[3]) వివరణ-286: అంటే అతడు వినయ విధేయతలతో, నియమం ప్రకారం రుకూ’, సజ్దాలు చేయాలి. అంటే సరిగ్గా నమా’జు చదవాలి.

[4]) వివరణ-291: అంటే వు’దూ వల్ల నీరు చేరినంత భాగం తీర్పుదినం నాడు స్వర్గంలో శరీరభాగాలు మెరుస్తూ ఉంటాయి.

[5]) వివరణ-292: సాధ్యమైనంత వరకు సరిగ్గా, తిన్నగా ఉండండి, సిరాతెముస్తఖీమ్పై నడవండి. అటూ ఇటూ తిరగ కండి. అయితే తిన్నగా ఉండటం చాలా కష్టమైన పనే. అందు వల్ల నమా’జ్‌ ఆచరించండి, దానివల్ల మీ పాపాలు క్షమించ బడతాయి. ఎందుకంటే కర్మల్లో కెల్లా అత్యుత్తమమైనది నమా’జ్‌. అయితే విశ్వాసి మాత్రమే వు’దూను పరిరక్షిస్తాడు.

[6]) వివరణ-294: తాళపుచెవి లేకుండా తలుపు తెరువ బడదు, తలుపు తెరవకుండా ఇంటిలోపలికి వెళ్ళడం జరుగదు. అదే విధంగా నమా’జు లేకుండా స్వర్గం లోపలికి వెళ్ళలేము. పరి శుభ్రత, వు’దూ లేకుండా నమా’జు స్వీకరించడం జరుగదు.

[7]) వివరణ-295: అంటే వు’దూ సరిగ్గా చేయకపోవటం వల్ల నమా’జు చెడిపోతుందని, ఈ ‘హదీసు’ ద్వారా తెలిసింది. దీనివల్ల ఖుర్‌ఆన్‌ మరచిపోవటం జరుగుతుంది. దాని ప్రభావం ఇమామ్‌పై పడుతుంది.

[8]) వివరణ-305: ఈ ‘హదీసు’ ద్వారా ఒంటె మాంసం తినటం వల్ల వు’దూ భంగమవుతుందని తెలిసింది. ‘హదీసు ‘వేత్తలందరి అభిప్రాయం కూడా ఇదే.

[9]) వివరణ-306: అంటే కేవలం వు’దూ భంగమయిందని అనుమానం వస్తే వు’దూ భంగమవదు. శబ్దం లేదా దుర్వా సనల ద్వారా పూర్తి నమ్మకం కలిగిన తర్వాతనే వు’దూ భంగ మయిందని నిర్థారించి వు’దూ చేయాలి.

[10]) వివరణ-308: ప్రవక్త (స) అంతకు ముందు ప్రతి నమా’జుకు వేర్వేరుగా వు’దూ చేసేవారు. కాని మక్కహ్ విజయం నాడు ఒకే వు’జూతో అనేక నమా’జులు చదివారు. ‘ఉమర్‌ (ర) వివరణ అడగ్గా, నేను ఉద్దేశ్య పూర్వకంగా ఇలా చేశానని అన్నారు. వు’దూ భంగం కానంతవరకు ఎన్ని నమా’జులైనా చదవవచ్చు.

[11]) వివరణ-310: అంటే అనుమానం వల్ల వు’దూ భంగం కాదు. శబ్దం లేదా దుర్వాసనవల్ల పూర్తినమ్మకం కలిగితేనే వు’దూ తప్పనిసరి అవుతుంది.

[12]) వివరణ-313: పరిశుభ్రత మరియు వు’దూ నమా’జ్‌ తాళపు చెవులు. పరిశుభ్రత, వు’దూలు లేకుండా నమా’జు ప్రారంభించటం జరుగదు. అల్లాహు అక్బర్ అనటం వల్ల నమా’జు ప్రారంభం అవుతుంది. దానివల్ల పనులన్నీ నిషిద్ధం అవుతాయి. అందువల్లే దీన్ని తక్బీరె తహ్రీమా అంటారు. అదేవిధంగా సలామ్ ద్వారా నమా’జ్‌ను సమాప్తం అవుతుంది. నిషిద్ధాలన్నీ ధర్మ సమ్మతాలవుతాయి.

[13]) వివరణ-315: అంటే మానవుడు మేల్కొని ఉన్నంత వరకు మలద్వారం అదుపులో ఉంటుంది, నిద్రపోతే అవయవాలన్నీ అదుపు తప్పి ఉంటాయి. అపాన వాయువు వెలువడే అవకాశం ఉంటుంది. అందువల్లే నిద్రపోతే వు’దూ భంగమవుతుంది. మళ్ళీ వు’దూ చేయటం తప్పనిసరి అయిపోతుంది.

[14]) వివరణ-319: అంటే మర్మాంగాలను అంటే మలమూత్ర విసర్జనా ప్రదేశాలను చేతితో ముట్టుకుంటే, వు’దూ భంగ మవుతుంది. మళ్ళీ వు’దూ చేసుకోవాలి. ఇదే ఉత్తమం.

[15]) వివరణ-323: ఖుర్‌ఆన్‌లో, ” అవ్ లామస్తుము న్నిసాఅ” అని ఉంది. అంటే దీనివల్ల స్త్రీలను ముట్టుకుంటే వు’దూ భంగమవుతుందని తెలుస్తుంది. కొందరు పండితులు వు’దూ భంగమవదని అభిప్రాయపడ్డారు. అందువల్ల భేదాభి ప్రాయాలకు గురికాకుండా ఉండడానికి  వు’దూ చేసుకోవడమే మంచిది .

[16]) వివరణ-330: దీనికి సంబంధించిన ఆయతు ఇది. ”ఓ విశ్వాసులారా! మీరు మత్తులో ఉంటే, మీరు పలికేది గ్రహించనంత వరకు మరియు మీకు ఇంద్రియ స్ఖలనం (జునుబున్) అయి ఉంటే – స్నానం చేయనంత వరకు – నమాజ్  సమీపానికి వెళ్లకండి; కాని నడుస్తూ (మస్జిద్) నుండి దాటవలసి వస్తే తప్ప. కాని ఒకవేళ మీరు రోగ పీడితులై ఉంటే, లేదా ప్రయాణంలో ఉంటే, లేక మలమూత్ర విసర్జన చేసిఉంటే, లేక స్త్రీలతో సంభోగం చేసి ఉంటే – మీకు నీళ్ళు దొరక్కపోతే – పరిశుధ్ధమైన మట్టిని చేతులతో స్పర్శించి ఆచేతులతో మీ ముఖాలను మరియు మీ చేతులను, తుడుచుకోండి (తయమ్మమ్ చేయండి). నిశ్చయంగా, అల్లాహ్ తప్పులను మన్నించే వాడు, క్షమించేవాడు.” (సూ. అన్నిసా, 4:43

ఈ ఆయతులో ”లామస్తుమున్నిసాఅ” అనే పదం ఉంది. కొందరు పండితులు దీన్ని సంభోగంగా భావిస్తున్నారు. మరికొందరు ముట్టుకోవటంగా భావిస్తున్నారు.

[17]) వివరణ-337: ఒకవేళ భవనంలో మరుగు దొడ్డి (లెట్రిన్‌) నిర్మించి ఉంటే, అందులో ప్రవేశించేముందు దు’ఆ చదవాలి. ఒకవేళ అడవుల్లో, మైదానాల్లో అయితే, కూర్చోవడానికి ముందు పఠించాలి.

[18]) వివరణ-338: మూత్రం పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలని ఈ ‘హదీసు’ ద్వారా తెలిసింది. మూత్ర తుంపరలు పడకుండా జాగ్రత్త పడాలి. మూత్ర విసర్జన తర్వాత మర్మాంగాన్ని పిండి, ఆ తరువాత నీటితో శుభ్రపరచుకోవాలి. అదేవిధంగా చాడీలు పరోక్షనింద చేయడం మహాపాపాలు. వీటికి దూరంగా ఉండాలి.

[19]) వివరణ-342: దుడ్డుకర్ర ఎందుకంటే మార్గంలో పాములు, తేళ్ళు మొదలైన హానికరమైన జంతువులు, కీటకాలు కనబడితే, రక్షించుకోవడానికి లేదా ఇస్తిన్‌జా కొరకు మట్టి, పెడ్డలు లేదా రాళ్ళు తీయడానికి.

[20]) వివరణ-343: ఎందుకంటే ఆ ఉంగరంలో ము’హమ్మద్‌ రసూలుల్లాహ్‌ అని వ్రాయబడి ఉంది. అటువంటి దాన్ని తీసు కొని మలమూత్ర విసర్జనకు వెళ్ళడం సబబు కాదు. ఈ ’హదీసు‘ ద్వారా మల మూత్ర విసర్జనకు వెళ్ళినపుడు జేబులో ఖుర్‌ఆన్‌ వాక్యాలు గల కాగితాలు, దు’ఆలు, ఏవైనా ఉంటే తీసిపెట్టాలి.

[21]) వివరణ-348: అంటే ప్రవక్త (స) కుడిచేతితో తినటం, త్రాగటం, వు’దూ చేయటం, ఇంకా ఇతర మంచి విషయాలు చేసేవారు. ఇతరులకు ఏదైనా ఇచ్చినా, పుచ్చుకున్నా కుడిచేతిని ఉపయోగించేవారు. ఎడమ చేతితో మల మూత్రాలను, ఇతర అశుద్ధాలను కడిగేవారు.

[22]) వివరణ-349: అంటే మలమూత్ర విసర్జనకు వెళ్ళి నపుడు నీళ్ళు లేకపోతే, మూడు రాళ్ళు లేదా పెడ్డలు తీసుకొని వెళ్ళి వాటితో పరిశుభ్రత పొందాలి.

[23]) వివరణ-350: అంటే ఎముకలు వారి ఆహారం, పేడ వారి జంతువుల ఆహారం.

[24]) వివరణ-351: ప్రవక్త (స) రువైఫ‘తో ”నీవు నా తదనంతరం ఎక్కువ కాలం జీవించవచ్చు. ప్రజలను ఈ పనులు చేస్తూ ఉండగా చూస్తే, నా తరఫున ఇలా ప్రకటించు అని అన్నారు, ”ఎవరైనా తన గడ్డంలో ముడివేస్తే, అది నా సాంప్రదాయానికి వ్యతిరేకం. అతనికీ నాకూ ఎటువంటి సంబంధం లేదు. ఎందుకంటే అతడు ఇతరులను అనుక రిస్తున్నాడు. అదేవిధంగా ఎవరైనా తావీజులను మెడలో వేసుకున్నా, పశువుల మెడల్లో లేదా భార్యాబిడ్డల మెడల్లో వేసినా ఇవన్నీ అజ్ఞాన కాలపు మూఢాచారాలే.”

[25]) వివరణ-353: ఒకవేళ స్నానగది (బాత్‌రూమ్‌)లో నీరు వెళ్ళే కాలువలేక పోతే, అక్కడ మూత్రవిసర్జన చేయ రాదు. ఎందుకంటే, మూత్రం ఉన్నచోట స్నానం చేస్తే పరిశుభ్రత లభించదు. దానివల్ల కలతలకు గురి కావటం జరుగుతుంది. ఒకవేళ స్నానగదిలో నీరు వెళ్ళే మార్గం ఉంటే, మూత్ర విసర్జన చేయడంలో అభ్యంతరం లేదు.

[26]) వివరణ-354: ఎందుకంటే, వాటిలో హానికరమైన పాములు, తేళ్ళు, కందిరీగలు ఉండవచ్చు. అవి కాటువేయ వచ్చు. మరి కొందరి అభిప్రాయం ప్రకారం వాటిలో జిన్నులు ఉంటాయని, వాటిలో మూత్ర విసర్జన చేయటం వల్ల అవి హాని చేకూరుస్తాయి. ఒక ప్రఖ్యాత సంఘటన ప్రకారం స’అద్‌ బిన్‌ ‘ఉబాదహ్‌ ‘ఖజ్‌రజీ (ర) ఒక కన్నంలో మూత్ర విసర్జన చేశారు. జిన్నులు ఆయన్ను చంపివేశాయి.

[27]) వివరణ-356: పురుషులైనా, స్త్రీలయినా మలమూత్ర విసర్జనకు బయటకు వెళ్ళి తమ మర్మాంగాలను ఒకరి నొకరు చూపెట్టుకుంటూ, మాట్లాడుకుంటూ ఉండరాదు. ఇది చాలా సిగ్గుమాలిన పని. దీని వల్ల అల్లాహ్‌ (త) ఆగ్రహానికి గురికావటం జరుగుతుంది.

[28]) వివరణ-358: అంటే జిన్నులు, షైతానులు మానవుల మర్మాంగాలవైపు చూస్తారు. కాని బిస్మిల్లాహ్ పఠించటం వల్ల ఒక తెర ఏర్పడుతుంది. దానివల్ల వారు మానవుల మర్మాంగాలను చూడలేరు. అందువల్ల మలమూత్ర విసర్జనకు వెళ్ళినపుడు బిస్మిల్లాహి, అల్లాహుమ్మ ఇన్నీ ఊజుబిక మినల్‌ ’ఖుబుసి వల్‌ ’ఖబాయిసి‘, పఠించాలి. దీనివల్ల షైతానుల చెడునుండి రక్షించుకోవచ్చు.

[29]) వివరణ-359: ఇంతసేపు దైవధ్యానం చేయకపోయి నందుకు క్షమాపణ కోరుతున్నాను. అనేక అనుగ్రహాలు తినిపించి నందుకు, వాటి మలం నుండి విముక్తి ప్రసా దించి నందుకు కృతజ్ఞతగా క్షమాపణ కోరుతున్నాను. అదేవిధంగా మరో ఉల్లేఖనంలో అల్‌’హమ్దు లిల్లాహిల్లజీ అజ్హబఅన్ని అల్అజా ఆఫానీఅని కూడా ఉంది. ఈ రెండు దు’ఆలను చదువుకోవాలి.

[30]) వివరణ-360: మలమూత్ర విసర్జన తరువాత నీటితో శుభ్ర పరచుకున్న తరువాత చేతిని భూమిపై రుద్ది చేతిని కడుక్కోవాలి. దానివల్ల దుర్వాసన పోతుంది.

[31]) వివరణ-365: ముందు హుజై’ఫా (ర) ’హదీసు‘ ద్వారా ప్రవక్త (స) నిలబడి మూత్ర విసర్జన చేశారని తెలిసింది. ’ఆయి‘షహ్‌ (ర) ’హదీసు‘ ద్వారా ప్రవక్త (స) నిలబడి మూత్ర విసర్జన చేయలేదని తెలిసింది. ఈ రెండు ’హదీసు‘ల్లో ఎటు వంటి వ్యతిరేకత లేదు. ’ఆయి ‘షహ్‌(ర) తనకు తెలిసినంత వరకు ప్రవక్త (స) కూర్చొనే మూత్ర విసర్జన చేసేవారని అన్నారు. అంతే ప్రత్యేక పరిస్థితుల్లో నిలబడి మూత్రవిసర్జన చేశారని తెలుస్తోంది. అందువల్ల ఈ రెంటిలో ఎలాంటి వ్యతిరేకత లేదు.

[32]) వివరణ-366: ఒక్కోసారి జిబ్రీల్‌ (అ) ప్రవక్త (స) వద్దకు మానవ రూపంలో వచ్చేవారు. దైవవాణి తెచ్చేవారు. నమా’జు విధించబడిన తర్వాత, నమా’జు పద్ధతి, వు’దూ పద్ధతి నేర్పడానికి మానవ రూపంలో వచ్చారు. వు’దూ పద్ధతి నేర్పారు. వు’దూ చేసిన తర్వాత మర్మాంగంపై చేతిలో నీళ్ళు తీసుకొని చిలకరించ మన్నారు, కలతలు రాకుండా ఉండాలని.

[33]) వివరణ-369: అరబ్బులు రాళ్ళు, మట్టిపెడ్డల ద్వారా ఇస్తిన్జా చేసేవారు. నీటిని చాలా తక్కువగా ఉపయోగించే వారు, కాని ఈ ఖుబా’ వారు ముందు రాళ్ళ ద్వారా, పెడ్డల ద్వారా ఇస్తిన్జా చేసిన తర్వాత, నీటితో కడుక్కునేవారు. ఇలా చేయటం వల్ల అధిక పరిశుద్ధత లభిస్తుంది. అందువల్లే అల్లాహ్‌(త) వారిని పొగడటం జరిగింది. ప్రవక్త (స), ‘ఈ విధానాన్నే కొనసా గించండి,’ అని ప్రోత్సహించారు.

[34]) వివరణ-371: చాటుగా ఏదైనా ఉంచి మూత్ర విసర్జన చేయాలని ఈ ’హదీసు‘ ద్వారా తెలిసింది. అదేవిధంగా మూత్ర తుంపరల నుండి అప్రమత్తంగా ఉండాలి. మూత్ర తుంపరల నుండి ఏమాత్రం అప్రమత్తంగా ఉండనివారికి, చాటుగా ఏది ఉంచకుండా మూత్ర విసర్జన చేసేవారు సమాధి శిక్షకు గురవుతారు. బనీ ఇస్రాయీ’ల్‌లో బట్టలకు అశుద్ధం అంటుకుంటే అంత భాగాన్ని కోయమని ఆదేశం ఉండేది. వారిలో ఒకవ్యక్తి ఆ ఆదేశాన్నుండి వారించాడు. ఫలితంగా అతన్ని సమాధి శిక్షకు గురిచేయడం జరిగింది.

[35]) వివరణ-375: ఎముకలు జిన్నుల ఆహారం. పేడ వారి జంతువుల ఆహారం. వారు బొగ్గునుండి కూడా లాభం పొందుతారు.

[36]) వివరణ-376: అంటే ఇషా నమా’జు ఆలస్యం చేసి చదవటం మంచిది. ఇంకా ప్రతి నమా’జుకు మిస్వాక్‌ చేయటం ఉత్తమం. కాని ఇషా నమా’జు ఆలస్యం చేసి చదవటం కష్టంగా ఉంటుంది. అదేవిధంగా ప్రతి నమా ’జుకు మిస్వాక్‌ చేయడం కూడా కష్టమే. ఈ భయం నాకు లేకుంటే వీటి గురించి ఆదేశించేవాడిని. అయితే దీన్ని సాంప్రదాయంగా, అభిలషణీయంగా ఆదేశిస్తున్నాను.

[37]) వివరణ-377: అంటే మనిషి బయటనుండి ఇంటిలోకి వచ్చిన తర్వాత అన్నిటికంటే ముందు మిస్వాక్‌ చేయాలి.

[38]) వివరణ-384: ఇతరుల మిస్వాక్‌ తాను ఉపయో గించటం ధర్మసమ్మతమే. ప్రసాదం పొందే ఉద్దేశంతో ’ఆయి‘షహ్‌ (ర) ప్రవక్త (స) పవిత్ర ఉమ్మి యొక్క శుభం పొందటానికి ఆయన మిస్వాక్‌ చేసేవారు.

[39]) వివరణ-385: అంటే పెద్దవారిని గౌరవించాలి. ఒకవేళ ఇచ్చినపుడు పెద్దవారు కుడిప్రక్క ఉంటే, పెద్దవారికి ఇవ్వాలి.

[40]) వివరణ-386: అంటే జిబ్రీల్‌ (అ) ఎప్పుడు వచ్చినా నన్ను మిస్వాక్‌ చేయమని ఆదేశించేవారు. ప్రాముఖ్యత ఇచ్చి మరీ ఆదేశించారు. అందువల్ల నేను అధికంగా మిస్వాక్‌ చేసేవాడిని. చివరికి ఎక్కడ నోరు గాయాల పాలవు తుందోనని భయం వేసింది.

[41]) వివరణ-391: ఈ ’హదీసు‘ ద్వారా వు’దూ’ చేసే టప్పుడు చేతులను మూడుసార్లు కడుక్కోవాలని తెలిసింది. పడుకొని లేచినా, మేల్కొని ఉన్నా 3 సార్లు కడగాలి.

[42]) వివరణ-392: దీనివల్ల ముక్కు పరిశుభ్రంగా ఉంటుంది. రోగాల నుండి రక్షణ కలుగుతుంది.

[43]) వివరణ-395: వు’దూ’లో ప్రతి అవయవాన్ని ఒక్కో సారి కడగటం తప్పనిసరి విధి. ఇక్కడ కేవలం విధిగా ఒక సారితో సరిపెట్టారు. అయితే రెండు సార్లు, మూడు సార్లు కడగటం ప్రవక్త (స) సంప్రదాయం. అంటే ఒక్కోసారి, రెండేసిసార్లు, మూడేసిసార్లు కడగటం ధర్మసమ్మతమే.

[44]) వివరణ-398: అంటే కొందరు త్వరగా నీటివద్దకు చేరి, ’అ’స్ర్‌ నమా’జు కొరకు త్వరగా వు’దూ’చేశారు. త్వరగా వు’దూ’ చేయటం వల్ల వు’దూ’ సరిగ్గా చేయలేదు. ఫలితంగా వారి చీలమండలు పొడిగా ఉన్నాయి. అంటే అసంపూర్ణంగా వు’దూ’ చేసి ఉన్నారు. అసంపూర్ణ వు’దూ’తో నమా’జు స్వీకరించబడదు. నమా’జు స్వీకరించ బడనివాడు నరకానికి గురవుతాడు. అందు వల్ల ప్రవక్త (స) అసంపూర్ణంగా వు’దూ’ చేసిన వారు నరకపు వైల్‌ కు గురవుతారని హెచ్చరించారు. వైల్‌ అనేది నరకంలోని ఒక కాలువ. అందులో చీము రక్తాలు ప్రవహిస్తూ ఉంటాయి. వాటి నుండి రక్షణ పొందాలంటే పరి పూర్ణ వు’దూ’ చేయాలి.

[45]) వివరణ-399: వు’దూ’లో తలపై మ’స్హ్‌ చేయటం తప్పని సరి. ఒకవేళ తలపై పగిడి ఉంటే దానిపై కూడా మ’స్హ్‌ చేయవచ్చు, సాక్సులపై కూడా మ’స్హ్‌ చేయవచ్చు.

[46]) వివరణ-400: అంటే సాధ్యమైనంత వరకు పనులను కుడివైపు నుండి ప్రారంభించేవారు. వు’దూ’చేస్తే ముందు కుడి చేతిని కడిగేవారు. కాలు కడిగితే ముందు కుడి కాలు కడిగే వారు. వస్త్రాలు ధరిస్తే ముందు కుడిచేతిలో తొడిగేవారు. తల దువ్వుకుంటే ముందు కుడివైపు చేసేవారు, ఉంగరాన్ని కుడి చేతిలో ధరించే వారు. కరచాలనం కుడిచేత్తో చేసేవారు. కుడి చేత్తో తినేవారు అదే విధంగాఇతర పనులు కూడా కుడిచేత్తో చేసేవారు.

[47]) వివరణ-405: అంటే ప్రతి అవయవం 3 సార్లు కడుక్కుంటూ ఉండు. చేతి మరియు కాళ్ళ వ్రేళ్ళ మధ్య ‘ఖిలాల్‌ చేసుకో, చిన్న భాగమైనా ఎండుగా ఉండకుండా చూసుకో. ముక్కును కూడా మూడుసార్లు నీళ్ళువేసి శుభ్ర పరచుకో. అయితే ఉపవాసం స్థితిలో మాత్రం అలా చేయకు. నీళ్ళు గొంతులోనికి పోయే ప్రమాదముంది.

[48]) వివరణ-416: అంటే కళ్ళతో సహా ముఖాన్ని పరిపూర్ణంగా కడగాలి. తలపై మ’స్హ్‌ చేసినట్టే, చెవుల మ’స్హ్‌ కూడాచేయాలి.

[49]) వివరణ-425: అంటే ముందు ప్రవక్త (స) ప్రతి నమా’జుకు వు’దూ’ చేసుకునేవారు. అంటే వు’దూ’ ఉన్నా లేకపోయినా సరే. కాని తరువాత వు’దూ’ ఉన్నంత వరకు ఎన్ని నమా’జులైనా చదువుకునే వారు. ఒక్కోసారి వు’జూ ఉన్నా, మళ్ళీ వు’దూ’ చేసుకునే వారు. అనుచరులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకునే వారు. వు’దూ’ ఎన్ని నమా’జుల వరకు ఉంటే అన్ని నమా’జులు చేసుకునేవారు.

[50]) వివరణ-426: ఈ ’హదీసు‘లో హన్‌’జల బిన్అబీఆమిర్అల్‌ ’గసీల్మలాయికహ్ ప్రస్తావన ఉంది. ఇతడు ప్రముఖ అ’న్సారీ, ప్రవక్త (స) అనుచరులు. కొన్ని కారణాల వల్ల బద్ర్‌ యుద్ధంలో పాల్గొనలేక పోయారు. అయితే ’ఉహద్‌ యుద్ధంలో పాల్గొన్నారు. ఇదే అతనికి మొదటి మరియు చివరి యుద్ధం అయ్యింది. భార్యతో సంభోగంలో ఉండగా యుద్ధ ప్రకటన విని, అప్పటికప్పుడే యుద్ధానికి సిద్ధమై కరవాలం పట్టుకొని బయలుదేరారు. ఈ సందర్భంగా స్నానం చేయవలసి ఉందని కూడా అతనికి గుర్తుకు రాలేదు. యుద్ధ మైదానంలోనికి ప్రవేశించి, అవిశ్వాస నాయకుడైన అబూ-’సుఫియాన్‌ బిన్‌ ‘హరబ్‌తో తలపడ్డారు. ఇంతలో మరో అవిశ్వాసి, షద్దాద్‌ బిన్‌ అస్‌వద్‌ లైసీ కనిపెట్టి, ముందుకు వచ్చి ’హన్‌’జల తలను శరీరం నుండి వేరుచేశాడు. అశుద్ధావస్థలో వీరమరణం పొందారు. కనుక దైవదూతలు అతన్ని స్నానం చేయించారు. ప్రవక్త (స) అతని భార్యను విషయం ఏమిటని, కనుక్కో మన్నారు. అతని భార్య జరిగింది పేర్కొన్నారు. ‘అందు వల్లే దైవదూతలు స్నానం చేయించారు,’ అని అన్నారు. అందువల్ల అతనికి ‘గసీల్మలాయిక అనే బిరుదు లభించింది.

[51]) వివరణ-430: నాలుగు శాఖలు అంటే, రెండు కాళ్ళూ, చేతులు శ్రమ అంటే సంభోగం. అంటే భార్యతో సంభోగం చేస్తే స్నానం తప్పనిసరి అయిపోతుంది. ఒకవేళ భర్త మర్మాంగం నుండి వీర్యం వెలువడక పోయినాసరే. ధార్మిక పండితులందరి అభిప్రాయం ఇదే.

[52]) వివరణ-431: అంటే వీర్యం వెలువడనిదే స్నానం తప్పని సరి కాదు. కాని ము’హ్‌యుస్సున్నహ్‌ ఈ ’హదీసు‘ రద్దయిందని పేర్కొన్నారు. ఇస్లామ్‌ ప్రారంభంలో ఈ ఆదేశం ఉండేది. ఆ తరువాత ఈ ’హదీసు‘  రద్దుచేయబడింది.

[53]) వివరణ-434: ఉమ్మె సులైమ్ ముందు మాటగా అల్లాహ్‌ సత్యాన్ని గురించి అడగటంలో ఎంత మాత్రం సిగ్గుపడడు. అంటే సత్యం పలకటాన్ని వారించడు. ఎందు కంటే అది ఒక సిగ్గుతో కూడిన విషయం గనుక. వీర్యం పురుషులకు వెలువడినట్లే స్త్రీలకూ వెలువడుతుంది. ఖుర్‌ఆన్‌లో అల్లాహ్‌ ఆదేశం: “కావున మానవుడు తాను దేనితో సృష్టించబడ్డాడో గమనించాలి! అతడు విసర్జించబడే (చిమ్ముకుంటూ వెలువడే) ద్రవపదార్థంతో సృష్టించ బడ్డాడు. అది వెన్ను మరియు రొమ్ము ఎముకల మధ్య భాగం నుండి బయటికి వస్తుంది. (సూ. అ’త్తారిఖ్‌, 86:57)

తఫ్‌సీ’ర్‌ ఇబ్నె కసీ‘ర్‌లో ఇలా ఉంది: మానవుడు ఎగిరే నీటి చుక్క అంటే స్త్రీ పురుషుల మిశ్రమ వీర్యంద్వారా సృష్టించ బడ్డాడు. ఇది పురుషుని వెన్నెముక నుండి, స్త్రీ రొమ్ము భాగంనుండి వెలువడుతుంది. స్త్రీల వీర్యం పలుచగా, పసుపు పచ్చగా ఉంటుంది. వీరిద్దరి ద్వారా బిడ్డ జన్మిస్తాడు. ఇక్కడ ప్రవక్త (స) ఒకవేళ స్త్రీ వీర్యం అధిగమించినా, ముందు వెలువడినా బిడ్డ తల్లిని పోలి ఉంటాడు. ఒకవేళ పురుషుని వీర్యం అధిగమిస్తే తండ్రిలా ఉంటాడు. అంటే స్త్రీలకు వీర్యం వెలువడుతుందని, వీర్య స్ఖలనం జరుగు తుందని ప్రవక్త (స) పేర్కొన్నారు. ఉమ్మె సలమహ్ () ప్రవక్త () భార్యల్లో ఒకరు. ఇందులో ఉమ్ము సులైమ్‌ ప్రస్తావన కూడా ఉంది.

 ఉమ్మె సలమహ్ (ర): ఈమె పేరు హిందహ్, బిరుదు ఉమ్మె సలమహ్ ఉండేది. ఈమె మొదటి భర్త అబూ సలమహ్ ప్రఖ్యాత ప్రవక్త (స) అనుచరులు. వీరిద్దరూ ఇస్లామ్‌ ప్రారంభంలోనే, ఇస్లామ్‌ స్వీకరించారు. అనంతరం భార్యా భర్త లిద్దరూ ’హబ్‌షా వైపై వలస వెళ్ళారు. అక్కడి నుండి తిరిగి వచ్చిన తర్వాత మదీనహ్ వైపు వలస వెళ్ళారు.

ఉమ్మె సలమహ్ కథనం: అబూ సలమహ్ వలస పోవటానికి నిశ్చయించుకొని ఒంటెపై సామాన్లు వేసి నన్నూ, నా కుమారుణ్ణి ఒంటెపై కూర్చోబెట్టుకున్నారు. తాను ఒంటె కళ్ళెం పట్టుకొని నడవసాగాడు. ఇంతలో మా కుటుంబం వారు చూసి, నీ గురించి నువ్వు స్వతంత్రుడివి. కాని నీ వెంట మా అమ్మాయిని వెళ్ళనివ్వము, దేశదిమ్మరుల్లా తిరగటానికి. ‘ఉమ్మె సలమహ్ ను భర్త, కొడుకుల నుండి వేరుచెయ్యండి,’ అని ఒంటె కళ్ళాన్ని పట్టుకొని నన్ను బలవంతంగా తిరిగి తీసుకొనివచ్చారు. ఇంతలో అబూ సలమహ్ కుటుంబం వారు ‘అబ్దుల్‌ అసద్‌ తెగవారు వచ్చి, మా కుటుంబం వారితో వివాదపడి, సలమహ్ ను తీసుకొని వెళ్ళిపోయారు. అప్పుడు నేను, నా భర్త, నా కుమారుడు వేరై పోయాము. భర్త మదీనహ్ వెళ్ళిపోయారు. నేను నా కన్నవారి ఇంట్లో, నా కొడుకు అత్త వారింట్లో సంవత్సరం వరకు ఏడుస్తూ గడిపాను. మా చిన్నాన్న కొడుకుకు నాపై జాలివేసి, ‘ఈ బలహీనురాలిని ఈ విధంగా హింసిస్తున్నారు. ఇది ఏమైనా బాగుందా?’ అని అన్నాడు. చివరికి అందరికీ ఒప్పించడం జరిగింది. వారు నన్ను, ‘నీవు నీ భర్త దగ్గరకు వెళ్ళాలనుకుంటే వెళ్ళవచ్చు,’ అని అన్నారు. అది విన్న అత్తవారు కూడా నా బిడ్డను తిరిగి ఇచ్చివేశారు. ఒక ఒంటె ఏర్పాటు చేసి, బిడ్డను ఒడిలో వేసుకొని ఒంటెపై మదీనహ్ కు బయలుదేరాను. మూడు లేదా నాలుగు మైళ్ళు వెళ్ళానో లేదో ఉస్మాన్బిన్‌ ’తల్‌’హా కలిశారు. ‘ఒంటరిగా ఎక్కడికి వెళుతున్నావు’ అని అడిగారు. ‘నా భర్త వద్దకు మదీనహ్ వెళుతున్నా నని,’ చెప్పాను. ‘మీ వెంట ఎవరైనా ఉన్నారా,’ అని అడిగారు. ‘దేవుడు తప్ప ఎవ్వరూ లేరు,’ అని అన్నాను. అనంతరం అతను మా ఒంటె కళ్ళెం పట్టుకొని ముందుకు నడవసాగారు. దైవం సాక్షి! ’ఉస్మా‘న్ కంటే ఉత్తమ వ్యక్తి నాకు ఎక్కడా కనబడలేదు. నేను దిగినప్పుడు ఒంటెను కూర్చో బెట్టి చెట్టు చాటుకు వెళ్ళిపోయేవారు. నేను ఎక్కినప్పుడు ఒంటెపై సామాన్లు పెట్టి ఒంటెను నా దగ్గర కూర్చోబెట్టేవారు. నేను ఎక్కిన తర్వాత వచ్చి, దాని కళ్ళెం పట్టుకొని ముందు ముందు నడిచేవారు. ఈ విధంగా మేము మదీనహ్ చేరుకున్నాము. ఖుబాలోకి వెళ్ళిన తర్వాత, ‘మీ భర్త ఇక్కడే ఉన్నారు,’ అని అన్నారు. అప్పుడు అబూ సలమహ్ అక్కడే ఉన్నారు. నన్ను మదీనహ్ చేర్చిన తర్వాత ’ఉస్మాన్‌ (ర) మక్కహ్ తిరిగి వెళ్ళిపోయారు. అయితే ’ఉస్మాన్‌ కంటే ఉత్తమ వ్యక్తిని నేను చూడలేదు. ఆ సంవత్సరం నేను పడిన కష్టాలు మరొకరు పడిఉండరు. (అసదుల్‌ ’గాబహ్‌, ’జర్‌ఖానీ)

ఆమె భర్త అబూ సలమహ్ చాలా వీరోచితంగా పోరాడేవారు. బద్ర్‌ యుద్ధంలో పాల్గొన్నారు. ఉ’హుద్‌ యుద్ధంలో పాల్గొ న్నారు. అయితే హుద్ యుద్ధంలో గాయపడ్డారు. దానివల్ల 3 హిజ్రీ శకంలో జమాదుల్‌ ఆ’ఖిర్‌లో వీరమరణం పొందారు. మరణించినపుడు ఈ విధంగా దు’ఆ చేశారు. ”అల్లాహుమ్మ ఖ్లుఫ్నీ ఫీ అహ్లీ బిఖైరిన్” – ‘ఓ అల్లాహ్‌! నా భార్యాబిడ్డలను మంచిగా కనిపెట్టుకొని ఉండు.’ అని ప్రార్థించారు. అల్లాహ్‌ అబూ సలమహ్ దు’ఆను స్వీకరించాడు. ఆమె ఇలా అన్నారు, ”కష్టాల్లో ఉన్న వ్యక్తి ఈ దు’ఆను పఠిస్తే అల్లాహ్‌ అతనికి అంతకంటే అత్యుత్తమ వస్తువును ప్రసాదిస్తాడు. అది, ”ఇన్నాలిల్లాహి ఇన్నా ఇలైహి రాజిఊన్‌, అల్లాహుమ్మ అజుర్నీ ఫీ ముసీబతీ, వఅఖ్లుఫ్లీ ఖైరమ్మిన్హుమా.” (ముస్లిమ్‌).

నా భర్త మరణించినపుడు, అతనికంటే మంచి వారెవ రుంటారని అనుకున్నాను. ఎందుకంటే వలస వెళ్ళిన వారిలో ఆయన మొట్ట మొదటి వారు. కాని నేను ఈ దు’ఆ పఠిస్తే, అల్లాహ్‌ (త) అతనికంటే ఎన్నోరెట్లు మంచి వ్యక్తి అయిన ప్రవక్త ()ను నాకు ప్రసాదించాడు. (ముస్లిమ్‌)

ఉమ్మె సలమహ్ గొప్ప పండితురాలు, ఆమె చాలా అధికంగా దానధర్మాలు చేసేవారు. ఆమె 803 ‘హదీసు’లను ఉల్లేఖించారు. ఈ వృత్తాంతం ద్వారా మనం ”సహనం పాటించే వ్యక్తికి అల్లాహ్‌(త) మంచి ప్రతిఫలం ప్రసాదిస్తాడనే” గుణపాఠం నేర్చుకోవాలి.

ఉమ్ము సులైమ్ (ర): ఈమె ప్రవక్త (స)కు వరుసలో పిన్ని (తల్లి చెల్లెలు) అవుతుంది. ముందు ఈమె పెళ్ళి మాలిక్బిన్దర్తో జరిగింది. మదీనహ్ ప్రారంభదశలో ఇస్లామ్‌ స్వీకరించారు. భర్త తాత-ముత్తాతల ధర్మాన్నే అవలం బించడం వల్ల, ఆమె భర్తను మతం మార్చుకోమని చెబుతూ ఉండేది. అందువల్ల ఇద్దరి మధ్య అభిప్రాయభేదాలు తలెత్తాయి. అందువల్ల మాలిక్‌ అయిష్టత వ్యక్తం చేస్తూ సిరియా వెళ్ళిపోయారు. అక్కడే మరణించారు. అబూతల్హా కూడా ఆ తెగకు చెందినవారే. కనుక పెళ్ళి సంబంధం పంపారు. కాని ఇప్పుడు కూడా ఇస్లామ్‌ స్వీకరణ పట్లే ప్రాధాన్యత ఇచ్చారు. అబూ ’తల్‌హా కొన్ని రోజులు ఆలోచించి, ఇస్లామ్‌ స్వీకరించారు. ఉమ్ము సులైమ్‌ ముందుకు వచ్చి పవిత్ర వచనం పలికారు. ఉమ్ము సులైమ్‌ తన కుమారుడైన అనస్తో, ‘ఇతనితో నా పెళ్ళి చేయించు,’ అని అన్నారు. దానికి బదులు మహర్‌ క్షమించారు. ‘నా మహర్‌ ఇస్లామ్‌,’ అని అన్నారు. అనస్‌ (ర), ‘చాలా విచిత్రమైన మహర్‌,’ అని అనేవారు. నికా’హ్‌ తర్వాత అబూ ’తల్‌’హా బై’అతె ’ఉఖ్‌బలో పాల్గొన్నారు. కొన్ని నెలల తర్వాత ప్రవక్త (స) మదీనహ్ వచ్చిన తర్వాత ఉమ్ము-సులైమ్‌ తన కుమారుడు అనస్ను తీసుకొని వచ్చి, ‘అనస్‌ను తమరి సేవలో వదులుతున్నాను. వీడు నా కొడుకు, తమరు వీడి గురించి దు’ఆ చేయమని అ’న్సార్ల మధ్య సోదరభావం ఏర్పరిచారు.’ ఇదంతా ఆమె ఇంటిలోనే జరిగింది. ఉమ్ము సులైమ్‌ అనేక యుద్ధాల్లో పోరాటాల్లో చురుకుగా పాల్గొన్నారు.

ప్రవక్త (స) ఉమ్ము సులైమ్ను ఇంకా అ’న్సార్లకు చెందిన కొంత మంది స్త్రీలను యుద్ధాల్లో తోడుగా ఉంచేవారు. వీళ్ళు నీళ్ళు త్రాపించేవారు, గాయపడినవారికి కట్లు కట్టే వారు. ఉ’హుద్‌ యుద్ధంలో ముస్లిములు అస్థిరతకు గురైనపుడు ఆమె చాలా కృషి ప్రయత్నాలు ప్రదర్శించారు. అనస్‌ (ర) ”నేను ’ఆయి’షహ్‌ (ర)ను, ఉమ్ము-సులైమ్‌ను కుండల్లో నీరునింపి తీసుకురావటం చూశాను” అని అన్నారు.

5వ హిజ్రీలో ప్రవక్త (స) జైనబ్(ర)ను వివాహం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఉమ్ము సులైమ్(ర) ఒక కంచంలో మలీదహ్ చేసి అనస్‌ ద్వారా పంపి, ఈ చిరు కానుకను స్వీకరించమని చెప్పారు.

7వ హిజ్రీలో ’ఖైబర్ సంఘటన జరిగింది. ఉమ్ము సులైమ్ అందులో పాల్గొన్నారు. ప్రవక్త (స) సఫియ్య(ర)ను నికా’హ్‌ చేసుకున్నారు. ఉమ్ము సులైమ్‌ ఆమెను అలంకరించారు. ‘హునైన్‌ యుద్ధంలో ఉమ్ము సులైమ్‌ ఒక కరవాలం పట్టు కున్నారు. అది చూసిన అబూ-’తల్‌’హా ప్రవక్త (స)తో, ‘ఉమ్ము-సులైమ్‌ తన చేతిలో కరవాలం పట్టుకొని ఉంది,’ అని అన్నారు. ప్రవక్త (స), ‘దీనితో ఏం చేస్తావు,’ అని అడిగారు. దానికి ఆమె, ‘ఎవరైనా అవిశ్వాసి వస్తే చంపేస్తాను,’ అని అన్నారు. అది విని ప్రవక్త (స) చిరునవ్వు నవ్వారు. ఉమ్ము సులైమ్‌, ‘ఓ ప్రవక్తా! పారిపోయిన మక్కహ్ అవిశ్వాసులను చంపమని ఆదేశించండి,’ అని అన్నారు. దానికి ప్రవక్త (స), ‘అల్లాహ్‌(త) దాని ఏర్పాట్లు చేసి ఉన్నాడు,’ అని అన్నారు. ఉమ్ము సులైమ్‌ కొన్ని ‘హదీసు’లను ఉల్లేఖించారు. వాటిని అనస్‌ (ర), ఇబ్ను ’అబ్బాస్‌ (ర), ’జైద్‌ బిన్‌ సా‘బిత్‌, అబూ సలమహ్ (ర), ’అమ్ర్‌ బిన్‌ ’ఆస్‌ (ర) మొదలైనవారు ఉల్లేఖించారు. ప్రజలు ఆమెను ధార్మిక విషయాలను గురించి అడిగి తెలుసుకునే వారు. అబ్దుల్లాహ్బిన్అబ్బాస్ మరియు జైద్బిన్సాబిత్ మధ్య ఒక విషయంలో అభిప్రాయ భేదాలు తలెత్తాయి. వారిద్దరూ ఈమె తీర్పును స్వీకరించారు. ధార్మిక విషయాలను అడిగి తెలుసు కోవటంలో ఏమాత్రం సిగ్గుపడే వారు కారు. ఒకసారి ప్రవక్త (స) వద్దకు వచ్చి, ‘ఓ ప్రవక్తా! అల్లాహ్‌(త) సత్యం విషయంలో ఏమాత్రం సిగ్డుపడడు. స్త్రీలకు కూడా స్నానం తప్పనిసరి అవుతుందా,’ అని విన్నవించుకున్నారు.” ఉమ్మెసలమహ్ అదివిని ఫక్కున నవ్వారు. ‘స్త్రీలకు కూడా ఇలా జరుగుతుందా,’ అని అన్నారు. అప్పుడు ప్రవక్త (స), ‘ఎందుకు కాదు, మరి బిడ్డలో తల్లి పోలికలు ఎలా వస్తాయి,’ అని అన్నారు. (ముస్నద్‌)

ఉమ్మె సులైమ్ చాలా విశిష్ఠతలు కలిగి ఉండేవారు. ఆమె విశ్వాస దారుఢ్యం ఎటువంటిదంటే ఇస్లామ్‌ కోసం తన భర్తనే వదులుకున్నారు. అదే విధంగా అబూతల్‌’హా కూడా పెళ్ళి చేసుకుంటానని ముందుకు వచ్చారు. కాని, ఆయన అవిశ్వాసి అని తెలిసి కాదన్నారు. అబూ’తల్‌’హా కు ఇస్లామ్‌ సందేశం ఇస్తూ, ‘నీవు ఆరాధిస్తున్న దైవం నేల నుండే ఉనికిలోకి వచ్చాడని నమ్ముతున్నావు కదా,’ అని అన్నారు. దానికి అబూ ’తల్‌’హా, ‘అవును,’ అన్నారు. ‘మరి నీకు చెట్టును పూజించడంలో సిగ్గురావటం లేదా?’ అని అన్నారు. అబూ’తల్‌’హా ఈ మాటకు ప్రభావితులై వెంటనే ఇస్లామ్‌ స్వీకరించారు.

ఉమ్ము సులైమ్ ప్రవక్త (స)ను చాలా అధికంగా ప్రేమించేవారు. ప్రవక్త (స) తరచూ ఆమె ఇంటికి వెళ్ళేవారు. మధ్యాహ్నం వేళ అక్కడ విశ్రాంతి తీసుకునేవారు. ఆయన లేచి వెళ్ళిపోగానే ఆమె ఆయన చెమట, వెంట్రుకలను తీసి భద్రపరిచేవారు. (బు’ఖారీ)

ఒకసారి ప్రవక్త (స) ఆమె నీటి సంచిని ఎత్తి నోరు పెట్టి త్రాగారు. అనంతరం ఆమె దాని మూతిని కోసి భద్రపరచు కున్నారు, ప్రవక్త (స) ఎంగిలి తగిలిందని. (ముస్నద్‌ అ’హ్మద్‌)

ప్రవక్త (స)కూడా ఆమెను ప్రత్యేకంగా ప్రేమించేవారు. సహీ ముస్లిములో ఇలా ఉంది. ప్రవక్త (స) తన భార్యల ఇళ్లకు తప్ప మరెక్కడికీ వెళ్ళేవారు కాదు. అయితే ఉమ్మె సులైమ్ ఇంటికి కూడా వెళ్ళేవారు. ప్రజలు కారణం అడగ్గా, ఆమెపై జాలి వేస్తుంది. ఆమె సోదరుడు హరామ్ నా వెంట ఉండి వీరమరణంపొందారు. ప్రవక్త (స) తరచూ ఆమె వద్దకు వెళ్ళేవారు. ఈమె చాలా సహనశీలి, స్థిరత్వం గలది. అబూ ఉమైర్ వారి ముద్దుల కొడుకు. కాని అతడు మరణించి నపుడు చాలా సహనం, ఓర్పులను ప్రదర్శించారు. ఈమె ఒక ఉత్తమ భార్యగా పేరుగాంచారు. ఈ విషయాన్ని ఈ క్రింది సంఘటన సూచిస్తుంది.

ఒక సారి అబూతల్‌’హా వచ్చి, ‘ప్రవక్త (స)కు ఆకలిగా ఉంది, ఏదైనా పంపు,’ అని అన్నారు. ఉమ్ము సులైమ్ కొన్ని రొట్టెలు ఒక వస్త్రంలో చుట్టి అనస్‌ (ర)కు ఇచ్చి, ప్రవక్త (స)కు ఇవ్వమని పంపారు. అప్పుడు ప్రవక్త (స) మస్జిద్‌లో ఉన్నారు. ఆయనతో పాటు అనుచరులు కూడా ఉన్నారు. ప్రవక్త (స) అనస్‌ను చూసి, ‘అబూ’తల్‌’హా పంపారా,’ అని అడిగారు. అనస్‌ (ర), ‘అవునని,’ అన్నారు. ప్రవక్త (స), ‘అన్నం తినడానికా?’ అని అన్నారు. అనస్‌ (ర), ‘అవును,’ అని అన్నారు. ప్రవక్త (స) అనుచరులందరినీ తీసుకొని అబూతల్‌’హా ఇంటికి వచ్చారు. అది చూసిన అబూ’తల్‌’హా ఆందోళన చెందారు. ఉమ్ము సులైమ్ వద్దకు వెళ్ళి, ‘అన్నం చాలా తక్కువగా ఉందే, ఏం చేద్దాం. ఇటు ప్రవక్త (స) ఒక బృందంతో వచ్చారు,’ అని అన్నారు. అప్పుడు ఉమ్ము సులైమ్‌, ‘ఈ విషయం మనకంటే అల్లాహ్‌(త), ఆయన ప్రవక్తకే బాగా తెలుసు,’ అని నిశ్చింతగా అన్నారు. ప్రవక్త (స) లోపలికి వచ్చారు. ఉమ్ము సులైమ్‌ ఆ రొట్టెనూ, కూరను ప్రవక్త (స) ముందు పెట్టారు. దైవకృపవల్ల అందులో శుభం అవతరించింది. అందరూ కడుపునిండా తిన్నారు.

ఉమ్ము సులైమ్ చాలా దైవభక్తురాలు, సహనశీలి, ఉత్తమురాలు. వారికి అబూఉమైర్ అనే కొడుకు ఉండేవాడు. అతడు కోకిలతో ఆడుకునేవాడు. అనుకో కుండా ఆ కోకిల చనిపోయింది. ఆ అబ్బాయికి చాలా బాధ కలిగింది. ప్రవక్త (స) హాస్యంగా, ‘ఓ అబూ ’ఉమైర్‌! ఏమయింది నీ కోకిల,’ అని అన్నారు. అతడు తల్లిదండ్రుల గారాల కొడుకు. అబూ’తల్‌’హా  ఆ అబ్బాయిని చాలా ప్రేమించేవారు. అకస్మాత్తుగా ఆ అబ్బాయి అనారోగ్యానికి గురయ్యాడు. అబూ’తల్‌’హా అతనికి చికిత్స చేయిస్తూనే ఉన్నారు. ఒకసారి ఏదో అవసరం ఉండి ఇంటి నుండి బయటకు వెళ్ళారు. ఆ రోజు అబూ’తల్‌’హా ఉపవాసం ఉన్నారు. అప్పుడు ఆ బిడ్డ మరణించాడు. ఉమ్ము సులైమ్‌ అంతా ఆలోచించి, సహనం ఓర్పులను ప్రదర్శిస్తూ బిడ్డకు స్నానం చేయించింది, కఫన్‌ తొడిగించారు, మంచంపై పరుండబెట్టారు. పైనుండి దుప్పటి కప్పివేశారు. ఇంటిలోని ఒక మూల పెట్టారు. అనంతరం మంచి వంటకం వండారు. తాను కూడా అలంకరించుకున్నారు. సువాసనను పులుముకున్నారు. రాత్రి అబూ’తల్‌’హా వచ్చారు. ‘అబ్బాయి ఎలా ఉన్నాడు,’ అని అడిగారు. ‘నిశ్చింతగా పడుకున్నాడు,’ అని అన్నారు. అబూ ’తల్‌’హా నిజమను కొని నిశ్చింతగా భోజనం చేసి, రాత్రి భార్యా భర్తలిద్దరూ సంభోగం చేసి సంతోషంతో పడుకున్నారు. ఉదయం స్నానం చేసి నమా’జుకు వెళ్ళినపుడు ఉమ్ము సులైమ్‌ కొంచెం ఆగండి, ఒక ప్రశ్నకు సమాధానం ఇచ్చి వెళ్ళండని అన్నారు. ”ఒకవేళ ఎవరైనా కొన్ని రోజుల కొరకు ఏదైనా వస్తువు ఇస్తే, మళ్ళీ అతను తన వస్తువును అడిగితే, తిరస్కరించవచ్చునా” అని అడిగారు. అప్పుడు, ‘అల్లాహ్‌(త) కొన్ని రోజుల కోసం ఇచ్చిన బిడ్డను తిరిగి తీసుకున్నాడు, బిడ్డ మరణించాడు, ఓర్పు సహనాలను పాటించండి,’ అని అన్నారు. అది విన్న అబూ’తల్‌’హా, ఇన్నా లిల్లాహి.. పఠిస్తూ నమా’జుకు వెళ్ళి, నమా’జు తర్వాత జరిగిన దంతా ప్రవక్త (స)కు తెలియజేశారు. ప్రవక్త (స) శుభం కలగాలని ప్రార్థించారు. ఆ రాత్రి జరిగిన సంభోగం వల్ల ఆమె గర్భం ధరించారు. అబ్దుల్లాహ్అనే బిడ్డ జన్మించాడు. ఆ తరువాత వరుసగా 9 మంది మగ బిడ్డలు జన్మించారు. వీరందరూ ఉత్తమ సంతానం, ఖుర్‌ఆన్‌ పాఠకులు. (బు’ఖారీ, ముస్లిమ్‌, ఫత్‌’హుల్‌ బారీ)

[54]) వివరణ-436: ఈ ‘హదీసు’ ద్వారా జనాబత్‌ స్నానం పద్ధతి తెలుస్తుంది. ఎలా అంటే జనుబీ వ్యక్తి చేతికి అశుద్ధం అంటుకొని ఉంటే, ముందు తప్పనిసరిగా చేతులు కడగాలి. ఎందుకంటే ఇటువంటి పరిస్థితిలో వాటిని నీటిలో ముంచితే, నీరు కూడా మురికి అయిపోతాయి. అందువల్ల ముందు చేతులను కడగాలి. ఒకవేళ చేతులు మురికిగా లేకపోయినా కడుక్కోవటం మంచిది. ఆ తరువాత ఎడమ చేతితో మర్మాంగాన్ని కడగాలి. కుడి చేతితో నీళ్ళు వేస్తూ ఎడమ చేతితో మర్మాంగాన్ని కడగాలి. ఆ తరువాత ఎడమ చేతిని నేలపై గీసి అంటే మట్టితో తోమి కడగాలి. లేదా సబ్బుతో కడగాలి. ఆ తరువాత మూడుసార్లు పుక్కిలించాలి, మూడు సార్లు ముక్కులో నీల్ళు వేసి కడగాలి, ముఖాన్ని పూర్తిగా కడగాలి, రెండు చేతులను మోచేతులతో సహా కడగాలి, తలను చేతులతో గోకి కడగాలి. ఆ తరువాత శరీరాన్నంతా నీటితో కడగాలి. అక్కడి నుండి ప్రక్కకు జరిగి వు’జూ మరియు స్నానం సంకల్పంతో కాళ్ళు కడగాలి. ఈ స్నానంలోని వు’దూ’ ద్వారా నమా’జు చదవవచ్చును. అయితే వు’దూ’ తరువాత స్నానం చేసినప్పుడు మర్మాంగాన్ని ముట్టుకో కుండా ఉండాలి. ఒకవేళ స్నానం చేసినపుడు మర్మాంగాన్ని ముట్టుకుంటే స్నానం చేసిన తర్వాత మళ్ళీ వు’దూ’ చేయాలి. ఎందు కంటే మర్మాంగాన్ని ముట్టుకుంటే వు’దూ’ భంగమవుతుంది.

[55]) వివరణ-439: ముద్ ఒక కొలమానం. అందులో ఒక సేరు ఆహార ధాన్యాలు వస్తాయి. ’సా’అ సుమారు పావు తక్కువ మూడు సేర్లు ఉంటుంది. అంటే ప్రవక్త (స) ఒక సేరు నీటితో వు’దూ’ చేసేవారు. ఇంకా మూడుసేర్ల నీటితో స్నానం చేసేవారు. అంటే వు’దూ’ మరియు స్నానంలో నీటిని చాలా తక్కు వగా ఖర్చుచేసేవారు.

[56]) వివరణ-446: అంటే ఆధునిక యుగంలో సబ్బును, షాంపూను ఉపయోగించటం జరుగుతుంది. మళ్ళీ తల కడిగే అవసరం ఉండదు. అదేవిధంగా ప్రాచీన కాలంలో ’ఖత్‌మీని తలకు పట్టించి తల శుభ్రపరిచేవారు. స్నానం చేసినపుడు మళ్ళీ తలపై నీళ్ళు వేసేవారు కారు.

[57]) వివరణ-448: అంటే ఇస్లామ్‌ ప్రారంభకాలంలో భార్యా భర్తలు కలిస్తే వీర్యం వెలువడితేనే స్నానం తప్పనిసరి అయ్యేది. వీర్యం వెలువడకపోతే తప్పనిసరి అయ్యేది కాదు. కాని పైన పేర్కొన్న ‘హదీసు’ ద్వారా ఈ ఆదేశం రద్దయిపోయింది. వీర్యంవెలువడినా వెలువడకపోయినా సంభోగం చేస్తే స్నానం తప్పనిసరి అయి పోతుంది.

  [58]) వివరణ-450: మే’రాజ్‌ రాత్రి ప్రవక్త (స) యొక్క అను చర సమాజంపై 50పూటల నమాజులు విధించ బడ్డాయి. మూసా (అ) చెప్పటం వల్ల ప్రవక్త (స) అల్లాహ్‌(త)ను తగ్గించమని అనేకసార్లుకోరగా తగ్గుతూ తగ్గుతూ చివరికి 5 నమా’జులు విధించడం జరిగింది. అదేవిధంగా జనాబత్‌ స్నానం, వస్త్ర పరిశుద్ధతలో తగ్గించడం జరిగింది.

[59]) వివరణ-452: ఒకవేళ రాత్రి స్నానం చేసే అవకాశం లేనపుడు మర్మాంగాన్ని కడుక్కొని వు’జూ చేసి పడుకుంటే సరిపోతుంది. తెల్లవారిన వెంటనే తప్పకుండా స్నానం చేయాలి.

[60]) వివరణ-454: ఇలా చేస్తే మంచిది. వు’దూ’ చేయకుండా మళ్ళీ సంభోగం చేయవచ్చును.

[61]) వివరణ-455: అంటే  భార్యలందరితో సంభోగంచేసి చివరకు స్నానం చేసుకునేవారు. లేదా ప్రతి ఒక్కరి అనుమతితో ఇలా చేసేవారు. ఈ ‘హదీసు’ విషయంలో పండితులు అనేక అభిప్రాయాలు తెలిపి ఉన్నారు. 1. ప్రవక్త(స) ప్రతిరోజు క్షేమ సమాచారం తెలుసుకోవడానికి  భార్యలందరి వద్దకు వెళ్ళి, చివరకు వంతున్న భార్య వద్దకు వెళ్ళి, సంభోగంచేసి స్నానం చేసేవారు. 2. ప్రతి ఒక్క భార్యతో సంభోగం చేసి చివరికి ఒకే ఒక్క స్నానం చేసేవారు. ఇది కేవలం ప్రవక్త(స) ఒక్కరికే ధర్మసమ్మతం చేయబడింది. ఇతరులకు తగదు. ఎందుకంటే వంతులు పంచటం ప్రవక్త (స)పై తప్పనిసరి చేయబడ లేదు. 3. లేదా ప్రతి ఒక్కరి అనుమతి, ఇష్టంతో ఇలా చేసేవారా? లేదా ఇలా చేయటం ధర్మసమ్మతం అని తెలియ పరచటానికి ఇలా చేసేవారా? అయితే వాస్తవం అల్లాహ్ (త) కే తెలుసు.

[62]) వివరణ-456: పరిశుద్ధస్థితిలో హృదయంతో, నోటితో స్మరించేవారు. అపరిశుద్దస్థితిలో హృదయంలో అల్లాహ్() ను స్మరించుకునే వారు. ఎటువంటి సమయంలోనూ దైవ ధ్యానాన్ని వదిలేవారు కారు.

[63]) వివరణ-459: అంటే చలికాలంలో ఇలా చేసేవారు. అశుద్ధ శరీరం, శుద్ధ శరీరానికి తాకితే అశుద్ధం కాదు. అయితే అశుద్ధం ఏదీ అంటకుండా ఉండాలి.

[64]) వివరణ-460: అంటే జనాబత్‌ స్థితిలో ఖుర్‌ఆన్‌ పఠించే వారు కారు. వు’జూతో ఉన్నా లేకపోయినా.

[65]) వివరణ-463: బొమ్మలు, ఫోటోలు అంటే ప్రాణుల, జంతువుల, మానవుల ఫోటోలు. కుక్క అంటే వేట శిక్షణ ఇవ్వబడని కుక్క. అయితే వేట, కాపలా కుక్క పెంచవచ్చును. జునుబీ అంటే సోమరితనం వల్ల స్నానం చేయక నమా’జు చదవక ఉన్న వ్యక్తి.

[66]) వివరణ-465: ప్రవక్త(స) ’ఉమ్ర్‌ బిన్‌ ’హ’జ్మ్‌ను యమన్‌కు గవర్నరుగా నియమించి పంపారు. అతనికి ఒక పుస్తకం  వ్రాసి ఇచ్చారు. అందులో అనేక నియమ నిబంధనలు, ఆదేశాలు నియమాలు ఉండేవి. వాటిలో ఖుర్‌ఆన్‌ను పరిశుద్ధ వ్యక్తులే ముట్టుకోవాలని, అపరిశుద్ధ వ్యక్తులు ముట్టుకోరాదని ఉంది.

[67]) వివరణ-466: ప్రవక్త(స) ఉత్తమ పద్ధతిని అనుస రించారు. వు’దూ’ లేకుండా కూడా సలామ్‌ చేయడం ధర్మ సమ్మతమే. అశుద్ధపరిస్థితి తప్ప ఎల్లప్పుడూ ప్రవక్త (స) దైవధ్యానంలో ఉండేవారు.

[68]) వివరణ-471: ఫ’ద్ల్, మరియు ‘సూర్‌’ అంటే, స్నానం, మరియు వు’దూ’ తరువాత మిగిలిన నీరు. ఇది నిషేధాజ్ఞ మాత్రం కాదు. ఎందుకంటే, ఇంతకు ముందు ’హదీసు‘లో అనుమతి ఉంది.

[69]) వివరణ-476: ఈ దైవదౌత్య ముద్రిక సహజంగా బాల్యం నుండి ఉండేది. ఇది రెండుభుజాల మధ్య ఉండేది. పావురం గుడ్డు అంత వెడల్పుగా ఉండేది. దాని మధ్య ”వహదహూ లా షరీక లహూ,” పైన ”తవజ్జహ్ హైసుమా కుంత, ఇన్నక మన్సూరున్” అని వ్రాయబడి ఉండేది. ప్రాచీన గ్రంథాలలో అంతిమ ప్రవక్త చిహ్నం ఆవిధంగా వ్రాయబడి ఉండేది.

[70]) వివరణ-477: ’ఖుల్ల అంటే పెద్దకుండ. అందులో (2½) రెండున్నర ముష్కుల నీళ్ళుపడతాయి. 2 ఖుల్లాలు అంటే 5 ముష్కుల నీళ్ళు. 5 ముష్కుల నీళ్ళు 625 లీటర్లల బరువు ఉంటాయి. స్వల్ప పరిమాణంలో అశుద్ధం పడితే దానిరంగు, రుచి, వాసన మారకుండా ఉంటే అది పరిశుద్ధంగానే ఉంటుంది.

[71]) వివరణ-478: మదీనహ్ లో బుదాఅ అనే బావి ఉండేది. అది ఒక మైదానంలో ఉండేది. వర్షాకాలంలో నీటితో పాటు చెత్తా చెదారం కొట్టుకువచ్చి అందులో పడేవి. ప్రవక్త (స) అనుచరులు ఆ నీరు అపరిశుద్ధ మైనదేమోనని అనుమానం వచ్చింది. ఎందు కంటే దానివల్ల వు’దూ’, స్నానం అవవు గనుక. ప్రవక్త (స)ను దీన్ని గురించి ప్రశ్నించడం జరిగింది. ప్రవక్త (స) ఆ బావి నీరు పరిశుద్ధమైనవని చెప్పారు. ఎందు కంటే ఆనీళ్ళు ’ఖుల్లతైన్‌ కంటే అధికంగా ఉన్నాయి. అందులో అపరిశుద్ధం పడితే ఆ నీళ్ళు అపరిశుద్ధం కావు. అవి పరిశుద్ధంగానే ఉంటాయి. ఈ బు’దాఅ అనే బావి చాలా లోతుగా వెడల్పుగా ఉండేది. 1369 హిజ్రీ శకంలో స్వయంగా అబ్దుస్సలాంగారు కొలిచారు. 3 గజాల వెడల్పు, 30 చేతుల లోతు ఇంకా నీళ్ళు 13 చేతుల వరకు ఉండేవి.

[72]) ధార్మిక పండితుల అభిప్రాయం ప్రకారం నీళ్శు లభించక పోతే తయమ్ముమ్‌ చేసుకోవాలి. ఖర్జూరాల నీటితో వు’దూ’ చేయకూడదు. ఎందుకంటే అది నీరు కాదు, పానీయం. పానీయంతో వు’దూ’ ధర్మసమ్మతం కాదు.

[73]) వివరణ-482: సూరహ్‌ నూర్‌లో బానిసల, సేవకుల గురించి ‘ ’తవ్వాఫూన ’అలైకుమ్‌” అనే పదం వచ్చింది. అంటే వారు మీ వద్దకు ఎల్లప్పుడూ వస్తూ పోతూ ఉంటారు. వారి నుండి తెరచాటుగా ఎల్లప్పుడూ ఉండటం కష్టం. అదేవిధంగా ఈ పిల్లులు కూడా మీ మధ్య ఎల్లప్పుడూ తిరుగుతూ ఉంటాయి. అందువల్ల పిల్లులు తినే, త్రాగే పదార్థాల్లో నోరు పెడితే అది అపరిశుద్ధం కాజాలదు. అంటే పిల్లి ఎంగిలి పరిశుద్ధమైనదే.

  [74]) వివరణ-490: కుక్క అపరిశుద్ధ జంతువు. కుక్క ఆహార పదార్థాల్లో నోరు పెడితే అవి అపరిశుద్ధమై పోతాయి. వాటిని పారవేయాలి. ఇంకా ఆ గిన్నెను మట్టితో తోమి 7 సార్లు నీటితో కడగాలి.

[75]) వివరణ-491: ఈ ’హదీసు‘ ద్వారా అపరిశుభ్రమైన భూమిని, నీటిద్వారా కడిగి పరిశుభ్రపరచవచ్చని తెలిసింది.

[76]) వివరణ-497: ఈ ’హదీసు‘ ద్వారా అన్నం తినని పసిబిడ్డ మూత్రాన్ని నీళ్ళు చిలకరించటం ద్వారా శుభ్రపరచవచ్చును. కడగవలసిన అవసరం లేదని తెలిసింది.

[77]) వివరణ-498: దబాగహ్ అంటే పచ్చి చర్మాన్ని పదను చేయటం. అంటే పచ్చి చర్మాన్ని ఉప్పు తుమ్మచెట్టు తొక్క (బెరడు) మొదలైనవి పెట్టి శుభ్రపరచిన తర్వాత దాన్ని ఎండలో ఆరబెడితే, అది పరిశుద్ధమైపోతుంది. దాన్ని కడిగే అవసరం ఉండదు. దానిపై నమా’జు చదవవచ్చును.  

[78]) వివరణ-503: అంటే అపరిశుభ్రమైన చెప్పులు ధరించి అపరిశుద్ధమైన నేలపై నడిచి, తరువాత పరిశుద్ధమైన నేలపై నడిచి, తగిలి ఉన్న అపరిశుద్ధాన్ని దులుపుకుంటే ఆ చెప్పులు పరిశుద్ధమైపోతాయి. వాటిని కడిగే అవసరం లేదు. ఒకవేళ అపరిశుద్ధం తడిగా ఉంటే కడుక్కోవాలి.

[79]) వివరణ-505: క్రూరమృగాలు నిషిద్ధమైన జంతువులు. వాటి చర్మాన్ని ఉపయోగించరాదు. వాటిని పరుపుగా ఉపయోగించరాదు, ఇంకా దాన్ని వాహనంపై పెట్టి కూర్చోరాదు. ఎందుకంటే ఇది అహంకారుల లక్షణం.

[80]) వివరణ-512: అంటే అశుద్ధం ఉన్న మార్గంపై నడవటం వల్ల చెప్పులు అపరిశుభ్రమైతే, పరిశుభ్రమైన మార్గంపై నడవటం వల్ల ఆ అశుద్ధం తొలగిపోతుంది.

  [81]) వివరణ-514: అంటే కుక్క ఎండు పాదాలతో మస్జిద్‌ లోకి రావటం వల్ల మస్జిద్‌ అపరిశుభ్రం కాదు. అందువల్ల కడిగే అవసరం లేదు.

[82]) వివరణ-518: ఈ’హదీసు’లో క్రింది విషయాలు పేర్కొన బడ్డాయి: 1. నమాజుకు ముందు మలమూత్ర విసర్జన అవసరమయితే, వెళ్ళిరావాలి, 2. సేవకుడు యజమాని కోసం వెంట నీళ్ళు తీసుకొని వెళ్ళవచ్చును. ఇంకా యజమానికి వు’దూ’ చేయించవచ్చు, 3. మేజోళ్ళపై మస్’హ్‌ చేయవచ్చును, 4. తలపై ఒకవేళ అమామహ్ ఉంటే అమామహ్ పై మస్’హ్‌ చేయవచ్చు, 5. సామూహిక నమా’జు ప్రారంభమయిన తర్వాత వెళితే సామూహిక నమా’జులో పాల్గొని సలామ్‌ తర్వాత మిగిలిన నమా’జును పూర్తి చేసుకోవాలి.

[83]) వివరణ-523: మేజోళ్ళనే జుర్రాబ్ అని కూడా అంటారు. వీటిని చర్మం లేదా ఉన్ని, దూది (పత్తి/కాటన్‌) తో తయారు చేస్తారు. కొన్ని జరాబులకు క్రింద చర్మం ఉంటుంది. దాన్ని మన్అల్  అంటారు. కొన్నిటికిపైన చర్మం ఉంటుంది. దాన్ని ముజల్లద్ అంటారు. ఈ రెంటిపై మస’హ్ చేయటం ధర్మ సమ్మతమే. ఇవి ఖుఫ్ పరిధిలోనికి వస్తాయి. అయితే పలుచని జరాబులపై  మస’హ్ చేయడం సరికాదు. అయితే  నిజం అల్లాహ్(త) కే తెలుసు.

[84]) వివరణ-526: ము’హమ్మద్‌ (స) అనుచర సమాజానికి ఇతర అనుచర సమాజాలపై అనేక విషయాల్లో ప్రాధాన్యత ఇవ్వటం జరిగింది. ఇక్కడ మూడు విషయాలను పేర్కొనటం జరిగింది: 1. నమా’జులో, జిహాద్‌లో ము’హమ్మద్‌ అనుచర సమాజం పంక్తులు, దైవదూతల పంక్తుల్లా నిర్దేశించబడ్డాయి. అంటే ఇతర అనుచర సమాజాల పంక్తులు ఇలా ఉండేవి కావని తెలిసింది, 2. కొన్ని ప్రత్యేక స్థలాలు తప్ప భూమంతా మస్జిద్‌గా నిర్దేశించబడింది. ఎక్కడ నమా’జు వేళ అయితే అక్కడ నమా’జు ఆచరించవచ్చు, 3. ము’హమ్మద్‌ (స) అనుచర సమాజంకోసం తయమ్ముమ్‌ అనుమతి లభించింది. ఈ అనుమతి ఇతర సమాజాలలో ఉండేది కాదు.

[85]) వివరణ-537: పండుగల కంటే జుమా’కు అధిక ప్రాధాన్యత ఉంది. కొందరు పండితులు శుక్రవారం స్నానాన్ని తప్పనిసరిగా భావిస్తారు. మరికొందరు సున్నత్‌, అభిలష ణీయంగా భావిస్తారు.

[86]) వివరణ-538: ఇస్లామ్‌ ప్రారంభంలో ప్రజలు పత్తి దుస్తులు లేనందున ఉన్ని దుస్తులు ధరించేవారు. సేవకులు లేనందున తమపని తామే చేసేవారు. వీటిని ఎక్కువ రోజులు ధరించటం వల్ల దుర్వాసన వచ్చేది. మస్జిద్‌ కూడా చాలా చిన్నది. అందువల్ల చెమటవల్ల ప్రజలు ఇబ్బంది కలిగేది. అందువల్ల ప్రవక్త (స) శుక్రవారం స్నానం తప్పనిసరి అని నిర్దేశించారు. తరువాత సౌకర్యాలు కలగటంవల్ల, ‘శుక్రవారం స్నానం చేయటం మంచిది,’ అని అన్నారు.

[87]) వివరణ-540: అంటే వు’దూ’ చేసి విధిని నెరవేర్చాడు. చాలా మంచిపని చేశాడు. దీని ద్వారా శుక్రవారం నాడు స్నానం చేయటం తప్పనిసరి కాదని తెలిసింది.

[88]) వివరణ-543: అవిశ్వాసి ఒకవేళ ఇస్లామ్‌ స్వీకరించ దలచుకుంటే స్నానం చేయాలి, తల వెంట్రుకలు గీయించు కోవాలి.

[89]( అల్లాహ్‌ ఆదేశం: “మరియు వారు నిన్ను స్త్రీల ఋతుకాలం గురించి అడుగుతున్నారు. నీవు వారికి ఇలా తెలుపు: ”అదొక అపరిశుద్ధ (హానికరమైన) స్థితి. కనుక ఋతుకాలంలో స్త్రీలతో (సంభోగానికి) దూరంగా ఉండండి. వారు పరిశుద్ధులు కానంత వరకు వారివద్దకు పోకండి. వారు పరిశుద్దులు అయిన తరువాత అల్లాహ్‌ ఆదేశించిన చోటు నుండి మీరు వారి వద్దకు పోవచ్చు.” నిశ్చయంగా, అల్లాహ్‌ పశ్చాత్తాపపడేవారిని ప్రేమిస్తాడు మరియు పరిశుధ్ధులుగా ఉండేవారిని ప్రేమిస్తాడు.” (సూ. అల్‌ బఖరహ్‌, 2:222). దీని ద్వారా బహిష్టుస్థితిలో సంభోగంచేయరాదని తెలిసింది.

[90]) వివరణ-546: అంటే ఒక పెద్ద తొట్టెలో నీళ్ళు నింపుకొని భార్యా భర్తలిద్దరూ నీళ్ళుతీసుకొని స్నానం చేసేవారు, బహిష్టు స్థితిలో సంభోగం చేయరాదు. బహిష్టు స్థితిలో ఉన్న స్త్రీలకు తోడుగా పండుకోవటం, కూర్చోవటం, శరీరానికి తగలటంలో అభ్యంతరం ఏమీలేదు. సారాంశం ఏమిటంటే, సంభోగం తప్ప అన్ని విధాలుగా బహిష్టుస్త్రీల నుండి సేవలు పొందవచ్చును.

[91]) వివరణ-547: అంటే బహిష్టుస్థితిలో ఉన్న స్త్రీ ఎంగిలి పరిశుభ్రమని, ఆమెతో పాటు తినటం, త్రాగటం ధర్మసమ్మతమని తెలిసింది.

[92]) వివరణ-556: పై ’హదీసు‘ల ద్వారా ప్రవక్త (స) బహిష్టు స్థితిలో ఉన్న భార్యలతో సాధారణంగా వ్యవహరించేవారని తెలుస్తుంది. అయితే ఈ ‘హదీసు’ ద్వారా వారి దగ్గరకు వెళ్ళేవారు కారని కూడా తెలుస్తుంది. ఈరెండు ‘హదీసు’ల్లో వ్యతిరేకత ఉన్నట్టు కనబడుతుంది. పండితులు ఈ రెండు ‘హదీసు’లను ఒకచోట చేర్చి, బహిష్టుస్ధితిలో ఉన్న భార్యల ప్రక్కన పడుకోవడం తప్పనిసరి కాదని, ప్రవక్త(స) ఒక్కోసారి పడుకునే వారని, ఒక్కోసారి పడుకునేవారు కారని. మరో విషయం ఏమిటంటే సంభోగ ఉద్దేశంతో ప్రక్కన పడుకునే వారు కారని పేర్కొన్నారు. అంటే పగలు సాధారణం గానూ రాత్రి దూరంగా పడుకునేవారు. ఎందుకంటే సంభోగ భయం ఉంటుంది.

[93]) వివరణ-560: అంటే ఇస్తి’హా’దహ్ వ్యాధి ఉన్న స్త్రీ ప్రతి నెల బహిష్టు వచ్చినన్ని రోజులు వదలి మిగిలిన దినాల్లో స్నానం చేసి నమా’జులు, ఉపవాసాలు పాటించాలి.

***

%d bloggers like this: