29- كِتَابُ الْفَضَائِلِ وَالشَّمَائِلِ
29. మహిమోన్నతులు
1– بَابُ فَضَائِلِ سَيِّدِ الْمُرْسِلِيْنَ صَلَوَاتُ اللهِ وَسَلَامُهُ عَلَيْهِ
1. ము‘హమ్మద్ (స) మహిమోన్నతులు
اَلْفَصْلُ الْأَوَّلُ మొదటి విభాగం
5739 – [ 1 ] ( صحيح ) (3/1600)
عَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: قَالَ رَسُوْلُ الله صلى الله عليه وسلم: “بُعِثْتُ مِنْ خَيْرِ قُرُوْنِ بَنِيْ آدَمَ قَرْنًا فَقَرْنَا حَتَّى كُنْتُ مِنَ الْقَرْنِ الَّذِيْ كُنْتُ مِنْهُ”. روَاهُ الْبُخَارِيُّ.
5739. (1) [3/1600– దృఢం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ప్రతి యుగంలోని ఉత్తమకాలంలో నన్ను పంపటం జరిగింది. చివరికి నన్ను ప్రస్తుతకాలంలో సృష్టించటం జరిగింది.” [1] (బు’ఖారీ)
5740 – [ 2 ] ( صحيح ) (3/1600)
وَعَنْ وَاثِلَةَ بْنِ الْأَسْقَعِ قَالَ: سَمِعْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ: “إِنَّ اللهَ اصْطَفَى كَنَانَةَ مِنْ وُلدِ إِسْمَاعِيْلَ وَاصْطَفَى قُرَيْشًا مِنْ كَنَانَةَ وَاصْطَفَى مِنْ قُرْيَشَ بَنِيْ هَاشِمٍ وَاصْطَفَانِيْ مِنْ بَنِيْ هَاشِمٍ”. رَوَاهُ مُسْلِمٌ.
وَفِيْ رِوَايَةٍ لِلتِّرْمِذِيِّ: “إِنَّ اللهَ اصْطَفَى مِنْ وُلدِ إِبْرَاهِيْمَ إِسْمَاعِيْلَ وَاصْطَفَى مِنْ وُلْدِ إِسْمَاعِيْلَ بَنِيْ كَنَانَةَ”.
5740. (2) [3/1600– దృఢం]
వాసి’లహ్ బిన్ అస్‌ఖ’ఇ (ర) కథనం: ప్రవక్త (స) ఇలా ప్రవచిస్తూ ఉండగా నేను విన్నాను, ”అల్లాహ్ (త) ఇస్మా’యీల్ సంతతిలోని కనాన్‌ను ఎన్ను కున్నాడు. కనాన సంతతిలోని ఖురైష్‌లను ఎన్ను కున్నాడు, ఖురైషుల్లో బనీ హాషిమ్‌ను ఎన్ను కున్నాడు, బనీ హాషిమ్‌లో నన్ను ఎన్ను కున్నాడు.” [2] (ముస్లిమ్)
తిర్మిజీ’లోని ఒక ఉల్లేఖనంలో ఇలా ఉంది, ”అల్లాహ్ (త) ఇబ్రాహీమ్ సంతతిలో నుండి ఇస్మా’యీల్‌ను ఎన్నుకున్నాడు. ఇంకా ఇస్మా’యీల్ సంతతిలో నుండి బనీ కనాన్‌ను ఎన్నుకున్నాడు.
5741 – [ 3 ] ( صحيح ) (3/1600)
وَعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: أَنَا سَيِّدُ وُلْدِ آدَمَ يَوْمَ الْقِيَامَةِ وَأَوَّلُ مَنْ يَنْشَقُّ عَنْهُ الْقَبْرُ وَأَوَّلُ شَافِعٍ وَأَوَّلُ مُشفَّعٍ”. رَوَاهُ مُسْلِمٌ.
5741. (3) [3/1600 –దృఢం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”తీర్పు దినం నాడు నేను మానవులందరి నాయకుడిగా ఉంటాను, అందరికంటే ముందు నేను సమాధి నుండి లేపబడతాను. అందరికంటే ముందు నేను సిఫారసు చేస్తాను. అందరికంటే ముందు నా సిఫారసు స్వీకరించ బడు తుంది.” (ముస్లిమ్)
5742 – [ 4 ] ( صحيح ) (3/1600)
وَعَنْ أَنَسٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “أَنَا أَكْثَرُ الْأَنْبِيَاءِ تَبَعًا يَوْمَ الْقِيَامَةِ وَأَنَا أَوَّلُ مَنْ يَقْرَعُ بَابَ الْجَنَّةِ” .رَوَاهُ مُسْلِمٌ .
5742. (4) [3/1600–దృఢం]
అనస్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”తీర్పు దినం నాడు ప్రవక్తలందరికంటే నా అనుచర సమాజ సంఖ్య మాత్రమే అధికంగా ఉంటుంది. అందరికంటే ముందు నేనే స్వర్గద్వారాలను తడతాను.” (ముస్లిమ్)
5743 – [ 5 ] ( صحيح ) (3/1600)
وَعَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “آتِيْ بَابَ الْجَنَّةِ يَوْمَ الْقِيَامَةِ فَأَسْتَفْتِحُ فَيَقُوْلُ الْخَازِنُ: مَنْ أَنْتَ؟ فَأَقُوْلُ: مُحَمَّدٌ. فَيَقُوْلُ: بِكَ أُمِرْتُ أَنْ لَاأَفْتَحَ لِأَحَدٍ قَبْلَكَ”. رَوَاهُ مُسْلِمٌ.
5743. (5) [3/1600–దృఢం]
అనస్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”తీర్పుదినం నాడు నేను స్వర్గద్వారం వద్దకు వచ్చి తెరచినపుడు, స్వర్గ ద్వారపాలకుడు నన్ను ‘నీవెవరవు?’ అని అడుగుతాడు. నేను, ‘ము’హమ్మద్‌ను,’ అని సమా ధానం ఇస్తాను. అప్పుడు ఆ ద్వారపాలకుడు, ‘నీవు తప్ప ఎవరు వచ్చినా ద్వారం తెరవ కూడదని నాకు ఆదేశం ఇవ్వబడింది,’ అని అంటాడు.” (ముస్లిమ్)
5744- [ 6 ] ( صحيح ) (3/1601)
وَعَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “أَنَا أَوَّلُ شَفِيْعٍ فِي الْجَنَّةِ لَمْ يُصَدَّقْ نَبِيٌّ مِنَ الْأَنْبِيَاءِ مَا صُدِّقْتُ وَإِنَّ مِنَ الْأَنْبِيَاءِ نَبِيًّا مَا صَدَّقَهُ مِنْ أُمَّتِهِ إِلَّا رَجُلٌ وَاحِدٌ”. رَوَاهُ مُسْلِمٌ.
5744. (6) [3/1601–దృఢం]
అనస్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”స్వర్గంలో అందరి కంటే ముందు నేను సిఫారసు చేస్తాను. ప్రవక్తల్లో నేను ధృవీకరించబడినంత అధికంగా మరెవరూ ధృవీకరించబడలేదు. అదేవిధంగా తన అనుచర సమాజంలో కేవలం ఒక్క వ్యక్తి ధృవీకరించే ప్రవక్త కూడా ఉన్నాడు. (ముస్లిమ్)
5745 – [ 7 ] ( مُتَّفَقٌ عَلَيْهِ ) (3/1601)
وَعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَثَلِيْ وَمَثَلُ الْأَنْبِيَاءِ كَمَثَلِ قَصْرٍ أُحْسِنَ بُنْيَانُهُ تَرِكَ مِنْهُ مَوْضِعُ لَبِنَةٍ فَطَافَ النّظَّارُ يَتَعَجَّبُوْنَ مِنْ حُسْنِ بُنْيَانِهِ إِلّا مَوْضِعَ تِلْكَ اللَّبِنَةِ فَكُنْتُ أَنَا سَدَدْتُ مَوْضَعَ اللّبِنَةِ خُتِمَ بِيَ الْبُنْيَانُ وَخُتِمَ بِيَ الرُّسُلُ”.
وَفِيْ رِوَايَةٍ: “فَأَنَا اللَّبِنَةُ وَأَنَا خَاتِمُ النَّبِيِّيْنَ”. مُتَّفَقٌ عَلَيْهِ.
5745. (7) [3/1601-ఏకీభవితం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”నేను మరియు ఇతర ప్రవక్తల ఉపమానం ఒక భవనాన్ని పోలి ఉంది. దాన్ని చాలా గొప్పగా నిర్మించడం జరిగింది. కాని గోడలో ఒక్క ఇటుకంత స్థలం ఖాళీగా వదలి వేయటం జరిగింది. ప్రజలు ఆ భవనాన్ని చుట్టూ తిరిగి చూసారు. దాని గొప్పతనాన్ని చూసి సంతోషించారు. కాని ఒక్క ఇటుకంత ఖాళీ స్థలాన్ని చూసి ఆశ్చర్యపోయారు. ఆ ఇటుకంత స్థలాన్ని నింపేవాడిని నేనే. నా ద్వారానే ఆ భవన నిర్మాణం పూర్తవుతుంది. అంటే ప్రవక్తల పరంపర నాతో అంతమయింది.
మరో ఉల్లేఖనంలో, ”నేనే ఆ చివరి ఇటుకను, నేనే ఆ చివరి ప్రవక్తను.” (బు’ఖారీ, ముస్లిమ్)
5746- [ 8 ] ( مُتَّفَقٌ عَلَيْهِ ) (3/1601)
وَعَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَا مِنَ الْأَنْبِيَاءِ مِنْ نَبِيٍّ إِلَّا قَدْ أُعْطِيَ مِنَ الْآيَاتِ مَا مِثْلُهُ آمَنَ عَلَيْهِ الْبَشَرُ وَإِنَّمَا كَانَ الَّذِيْ أُوْتِيْتُ وَحْيًا أَوْحَى اللهُ إِلَيَّ وَأَرْجُوْ أَنْ أَكُوْنَ أَكْثَرَهُمْ تَابِعًا يَوْمَ الْقِيَامَةِ”. مُتَّفَقٌ عَلَيْهِ .
5746. (8) [3/1501-ఏకీభవితం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ప్రవక్తల్లో ప్రతి ఒక్కరికి, మనిషి విశ్వసించడానికి సరిపోయే మహిమలు మాత్రమే ఇవ్వబడ్డాయి. కాని నాకు ఇవ్వబడిన మహిమలు: దైవవాణి. నా వైపు దైవవాణి పంపడం జరిగింది. అందువల్ల తీర్పుదినం నాడు నా అనుచరుల సంఖ్య ఇతర ప్రవక్తల అనుచరుల సంఖ్యకంటే అధికంగా ఉంటుంది.” (బు’ఖారీ, ముస్లిమ్)
5747 – [ 9 ] ( مُتَّفَقٌ عَلَيْهِ ) (3/1601)
وَعَنْ جَابِرٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “أُعْطِيْتُ خَمْسًا لَمْ يُعْطَهُنَّ أَحَدٌ قَبْلِيْ: نُصِرْتُ بِالرُّعْبِ مَسِيْرَةَ شَهْرٍ وَجُعِلَتْ لِيَ الْأَرْضُ مَسْجِدًا وَطَهُوْرًا فَأَيُّمَا رَجُلٍ مِنْ أُمَّتِيْ أَدْرَكَتْهُ الصَّلَاةُ فَلْيُصَلِّ وَأُحِلَّتْ لِيَ الْمَغَانِمُ وَلَمْ تَحِلّ لِأَحَدٍ قَبْلِيَ وَأُعْطِيْتُ الشَّفَاعَةَ وَكَانَ النَّبِيُّ يَبْعَثُ إِلى قَوْمِهِ خَاصَّةً وَبُعِثْتُ إِلى النَّاسِ عَامَّةً”. مُتَّفَقٌ عَلَيْهِ.
5747. (9) [3/1601-ఏకీభవితం]
జాబిర్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”నాకు ఐదు మహిమలు ఇవ్వబడ్డాయి, నా కంటే ముందు ఏ ప్రవక్తకూ ఇవ్వబడలేదు. 1. భయం ద్వారా సహాయం చేయడం జరిగింది. అంటే నెల రోజుల ప్రయాణ దూరం నుండే శత్రువు నా పట్ల భయపడతాడు. 2. భూమంతా నా కోసం ప్రార్థనా స్థలంగా, పరిశుభ్రమైన స్థలంగా చేయబడింది. నా అనుచర సమాజంలో ఎవరికి నమా’జు వేళ అయితే వారు నమా’జు చేసుకోవచ్చు. 3. యుధ్ధధనం నా కోసం ధర్మ సమ్మతం చేయబడింది. నాకంటే ముందు ఎవ్వరికీ యుధ్ధ ధనం ధర్మసమ్మతం చేయబడలేదు. 4. నాకు సిఫారసు చేసే అనుమతి ఇవ్వబడింది. 5. నాకంటే ముందు ప్రవక్తలను తమ జాతి వైపునకే పంపడం జరిగేది. కాని నేను ప్రపంచ ప్రజలందరి వైపునకు పంపబడ్డాను. (బు’ఖారీ, ముస్లిమ్)
5748 – [ 10 ] ( صحيح ) (3/1601)
وعَنْ أَبِيْ هُرَيْرَةَ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم قَالَ: “فُضِّلْتُ عَلَى الْأَنْبِيَاءِ بِسِتٍّ: أُعْطِيْتُ جَوَامِعَ الْكَلِمِ وَنُصِرْتُ بِالرُّعْبِ وَأُحِلَّتْ لِيَ الْغَنَائِمُ وَجُعِلَتْ لِيَ الْأَرْضُ مَسْجِدًا وَطَهُوْرًا وَأُرْسِلْتُ إِلى الْخَلْقِ كَافَّةً وَخُتِمَ بِيَ النَّبِيُّوْنَ”. رَوَاهُ مُسْلِمٌ.
5748. (10) [3/1601– దృఢం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఆరు విషయాల ద్వారా నాకు ఇతర ప్రవక్తలపై విశిష్ఠత ప్రసాదించబడింది. 1. నాకు శుభవచనాలు ప్రసాదించ బడ్డాయి. 2. శత్రువుపైన భయం ద్వారా నాకు సహాయం చేయబడింది. 3. యుద్ధధనం నా కోసం ధర్మసమ్మతం చేయబడింది. 4. నేల నాకోసం ప్రార్థనా స్థలం, పరిశుభ్రతా సాధనంగా చేయబడింది. 5. నేను మానవు లందరి వైపునకు ప్రవక్తగా పంపబడ్డాను. 6. దైవదౌత్యం నా ద్వారా అంతం చేయబడింది.” (ముస్లిమ్)
5749 – [ 11 ] ( مُتَّفَقٌ عَلَيْهِ ) (3/1602)
وَعَنْهُ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم قَالَ: “بُعِثْتُ بِجَوَامِعِ الْكَلِمِ وَنُصِرْتُ بِالرُّعْبِ وَبَيْنَا أَنَا نَائِمٌ رَأَيْتُنِيْ أُوْتِيْتُ بِمَفَاتِيْحِ خَزَائِنِ الْأَرْضِ فَوُضِعَتْ فِيْ يَدِيْ”. مُتَّفَقٌ عَلَيْهِ.
5749. (11) [3/1602- ఏకీభవితం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”నన్ను ఉత్తమ వచనాల ద్వారా ప్రవక్తగా పంపడం జరిగింది. భయంద్వారా నాకు సహాయం చేయడం జరిగింది, ఇంకా నేను పడుకొని ఉండగా గుప్తనిధుల తాళాలు నా చేతిలో ఉంచడం జరిగింది.” (బు’ఖారీ, ముస్లిమ్)
5750 [ 12 ] ( صحيح ) (3/1602)
وعَنْ ثَوْبَانَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِنَّ اللهَ زَوَى لِي الْأَرْضَ فَرَأَيْتُ مَشَارِقَهَا وَمَغَارِبَهَا وَإِنَّ أُمَّتِيْ سَيَبْلُغُ مُلْكُهَا مَا زُوِيَ لِيْ مِنْهَا وَأُعْطِيْتُ الْكَنْزَيْنِ: اَلْأَحْمَرَ وَالْأَبْيَضَ وَإِنِّيْ سَأَلْتُ رَبِّيْ لِأُمَّتِيْ أَنْ لَا يُهْلِكَهَا بِسَنَةٍ عَامَّةٍ وَأَنْ لَا يُسَلِّطَ عَلَيْهِمْ عَدُوًّا مِنْ سِوى أَنْفُسِهِمْ فَيَسْتَبِيْحَ بَيْضَتَهُمْ وَإِنَّ رَبِّيْ قَالَ: يَا مُحَمَّدُ إِذَا قَضَيْتُ قَضَاءً فَإِنَّهُ لَا يُرَدُّ وَإِنِّيْ أَعْطَيْتُكَ لِأُمَّتِكَ أَنْ لَا أُهْلِكَهُمْ بِسَنَةٍ عَامَّةٍ وَأَنَّ لَا أُسَلِّطَ عَلَيْهِمْ عَدُوًّا سِوى أَنْفُسِهِمْ فَيَسْتَبِيْحَ بَيْضَتَهُمْ وَلَوِ اجْتَمَعَ عَلَيْهِمْ مَنْ بِأَقْطَارِهَا حَتّى يَكُوْنَ بَعْضُهُمْ يُهْلِكُ بَعْضًا وَيَسْبِيْ بَعْضُهُمْ بَعْضًا”. رَوَاهُ مُسْلِمٌ.
5750 . (12) [3/1602– దృఢం]
సౌ’బాన్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”అల్లాహ్(త) నా కోసం భూమిని దగ్గర చేసాడు. నేను భూమిని తూర్పు నుండి పడమర వరకు చూచాను. నా అనుచర సమాజ అధికారం నాకు చూపించిన ప్రాంతంవరకు వ్యాపిస్తుంది. ఇంకా నాకు ఎర్రని, తెల్లని రెండు నిధులు ప్రసాదించ బడ్డాయి. నేను నా ప్రభువును నా అనుచర సమాజాన్ని కరవుకాటకాల ద్వారా నాశనం చేయవద్దని కోరాను. ఇంకా నా అనుచర సమాజాన్ని ముస్లిమేతర శత్రువుల ద్వారా, వారి ఐక్యతను ఛిన్నా భిన్నం చేయవద్దని ప్రార్థించాను. దానికి నా ప్రభువు, ‘ఓ ము’హమ్మద్! నేను ఒక విషయాన్ని గురించి నిర్ణయించుకుంటే దాన్ని మార్చటం జరుగదు. సరే, నీ అనుచర సమాజం గురించి నీకు నాతీర్పు ఇస్తున్నాను, ”ముస్లిములను కరవుకాటకాల ద్వారా నాశనం చేయను, వారిపై ముస్లిమేతర దుర్మార్గ పాలకుడ్ని విధించను, అయితే మీ అనుచర సమాజంలోని వారే పరస్పరం ఒకరినొకరు చంపుకుంటారు. ఒకరికొకరు హాని చేకూరుస్తారు.” (ముస్లిమ్)
5751 – [ 13 ] ( صحيح ) (3/1602)
وَعَنْ سَعْدٍ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم مَرَّ بِمَسْجِدِ بَنِيْ مُعَاوِيَةَ دَخَلَ فَرَكَعَ فِيْهِ رَكْعَتَيْنِ وَصَلَّيْنَا مَعَهُ وَدَعَا رَبَّهُ طَوِيْلًا ثُمَّ انْصَرَفَ فَقَالَ: “سَأَلْتُ رَبِّيْ ثَلَاثًا فَأَعْطَانِيْ ثِنْتَيْنِ وَمَنَعَنِيْ وَاحِدَةً سَأَلْتُ رَبِّيْ أَنْ لَا يُهْلِكَ أُمَّتِيْ بِالسَّنَةِ فَأَعْطَانِيْهَا وَسَأَلْتُهُ أَنْ لَا يُهْلِكَ أُمَّتِيْ بِالْغَرَقِ فَأَعْطَانِيْهَا وَسَأَلْتُهُ أَنْ لَا يَجْعَلَ بَأْسَهُمْ بَيْنَهُمْ فَمَنَعَنِيْهَا”. رواه مسلم.
5751. (13) [3/1602– దృఢం]
స’అద్ (ర) కథనం: ప్రవక్త (స) అన్సారుల్లోని బనీ ము’ఆవియహ్ తెగకు చెందిన మస్జిద్ ప్రక్కనుండి వెళుతూ, మస్జిద్‌లో ప్రవేశించి రెండు రకాతులు నమా’జ్ చేసారు. మేము కూడా ప్రవక్త (స) తో పాటు నమా’జు చేసాము. ప్రవక్త (స) చాలా సేపు వరకు దు’ఆ చేసారు. అనంతరం ప్రవక్త (స) మావైపు తిరిగి, ”నేను నా ప్రభు వును మూడు విషయాలు కోరాను. వాటిలో రెండు నాకు ఇవ్వబడ్డాయి, ఒకదాని నుండి వారించడం జరిగింది. ‘నేను నా ప్రభువును నా అనుచర సమాజాన్ని కరువు కాటకాల ద్వారా నాశనం చేయకూడదని ప్రార్థించాను. నా ప్రార్థన స్వీకరించబడింది. ఇంకా నా అనుచర సమాజాన్ని ముంచివేసి నాశనం చేయ కూడదని కోరాను. దాన్ని కూడా స్వీకరించడం జరిగింది. ఇంకా ముస్లిములు పరస్పరం చంపుకోరాదని కోరాను, కాని దీన్ని తిరస్కరించడం జరిగింది.” (ముస్లిమ్)
5752 – [ 14 ] ( صحيح ) (3/1602)
وعَنْ عَطَاءِ بْنِ يَسَارٍ قَالَ: لَقِيْتُ عَبْدِ اللهِ بْنَ عَمْرِو بْنِ الْعَاصِ قُلْتُ: أَخْبِرْنِيْ عَنْ صِفَةِ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم فِي التَّوْرَاةِ قَالَ: أَجَلْ وَاللهِ إِنَّهُ لَمَوْصُوْفٌ بِبَعْضِ صِفَتِهِ فِي الْقُرْآنِ: (يَا أَيُّهَا النَّبِيُّ إِنَّا أَرْسَلْنَاكَ شَاهِدًا وَّمُبَشِّرًا وَّنَذِيْرًا؛ 33: 45) وَحِرْزًا لِلْأُمِّيِّيْنَ أَنْتَ بَعْدِيْ وَرَسُوْلِيْ سَمَّيْتُكَ الْمُتَوَكِّلَ لَيْسَ بِفَظٍ وَّلَا غَلِيْظٍ وَلَا سَخابٍ فِيْ الْأَسْوَاقِ وَلَا يَدْفَعُ بِالسَّيِّئَةِ السَّيِّئَةَ وَلَكِنْ يَعْفُو وَيَغْفِرُ وَلَنْ يَقْبِضَهُ اللهُ حَتّى يُقِيْمَ بِهِ الْمِلَّةَ الْعَوْجَاءَ بِأَنْ يَقُوْلُوْا: لَا إِلَهَ إِلَّا اللهَ وَيَفْتَحُ بِهَا أَعْيُنًا عُمْيًا وَآذَانًا صُمًّا وَقُلُوْبًا غُلْفًا. روَاهُ الْبُخَارِيُّ.
5752. (14) [3/1602 –దృఢం]
‘అ’తాఅ’ బిన్ యసార్ (ర) కథనం: నేను ‘అబ్దుల్లాహ్ బిన్ ‘అమ్ర్ బిన్ అల్’ఆ’స్‌ను కలిసాను. నేనతన్ని తౌరాతులో గల ప్రవక్త (స) గుణాలను గురించి అడిగాను. దానికి ‘అబ్దుల్లాహ్ బిన్ ‘అమ్ర్, ”అల్లాహ్ సాక్షి! తౌరాతులో, ఖుర్ఆనులో ప్రవక్త (స) ను గురించి ఉన్నట్లు: ”ఓ ప్రవక్తానిశ్చయంగా మేము నిన్ను సాక్షిగా, శుభవార్త అందజేసేవానిగా మరియు హెచ్చరిక చేసేవానిగా పంపాము.” (అల్ అహ్జాబ్, 33:45) ఇంకా ‘నీవు నా దాసుడవు, నా ప్రవక్తవు నేను నీ పేరు ముతవక్కిల్ పెట్టాను, నీవు దుర్గుణాలు గలవాడవు కావు, కఠిన హృదయుడవు కావు, ఇంకా బజారుల్లో కల్లోలం సృష్టించే వాడివి అంతకన్నా కావు, నీవు చెడును చెడు ద్వారా తొలగించవు, ఇంకా చెడుకు చెడు ద్వారా ప్రతీకారం తీర్చుకోవు. నీవు క్షమించేవాడవు, చెడు చేసేవాని కొరకు క్షమాపణ కోరేవాడవు. ప్రార్థించేవాడవై ఉంటావు.’ వాటిద్వారా అతడు అంధకారంలో ఉన్న ఆ జాతిని రుజుమార్గంపై తీసుకురానంత వరకు అల్లాహ్ అతన్ని మరణం ప్రసాదించడు. ఈ విధంగా వారు, ‘లా ఇలాహ ఇల్లల్లాహ్‘ను స్వీకరిస్తారు. అల్లాహ్ (త) ఆ శుభవచనం ద్వారా వారికళ్ళకు చూపు ప్రసాదిస్తాడు, చెవులకు వినికిడి ప్రసాదిస్తాడు, వారి హృదయాలను సరిదిద్దుతాడు.” (బు’ఖారీ)
5753 – [ 15 ] ( صحيح ) (3/1603)
وَكَذَا الدَّارَمِيُّ عَنْ عَطَاءٍ عَنِ ابْنِ سَلَامٍ نَحْوَهُ وَذُكِرَ حَدِيْثُ أَبِيْ هُرَيْرَةَ: “نَحْنُ الْآخِرُوْنَ” فِي”بَابِ الْجُمُعَةِ”.
5753. (15) [3/1603–దృఢం]
‘అబ్దుల్లాహ్ బిన్ సలామ్ (ర) కథనం: పై ‘హదీసు’ ఈ మార్గం ద్వారా కూడా ఉల్లేఖించడం జరిగింది. (దార్మీ)
—–
اَلْفَصْلُ الثَّانِيْ రెండవ విభాగం
5754 – [ 16 ] ( صحيح ) (3/1603)
عَنْ خَبَّابِ بْنِ الْأَرْتِ قَالَ: صَلّى بِنَا رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم فَأَطَالَهَا. قَالُوْا: يَا رَسُوْلَ اللهِ صَلَّيْتَ صَلَاةً لَمْ تَكُنْ تُصَلِّيْهَا قَالَ: “أَجَلْ إِنَّهَا صَلَاةُ رَغْبَةٍ وَرَهْبَةٍ وَإِنِّيْ سَأَلْتُ اللهَ فِيْهَا ثَلَاثًا فَأَعْطَانِيْ اِثْنَتَيْنِ وَمَنَعَنِيْ وَاحِدَةً سَأَلْتُهُ أَنْ لَا يُهْلِكَ أُمَّتِيْ بِسَنَةٍ فَأَعْطَانِيْهَا وَ سَأَلْتُهُ أَنْ لَا يُسَلِّطَ عَلَيْهِمْ عَدُوًّا مِنْ غَيْرِهِمْ فَأَعْطَانِيْهَا وَسَأَلْتُهُ أَنْ لَا يُذِيْقَ بَعْضَهُ بَأْسَ بَعْضٍ فَمَنَعَنِيْهَا”. رَوَاهُ التِّرْمِذِيُّ وَالنَّسَائِيُّ.
5754. (16) [3/1603 –దృఢం]
‘ఖబ్బాబ్ బిన్ అర్త్ (ర) కథనం: ప్రవక్త (స) మాకు నమా’జు చదివించారు. అయితే నమా’జు చాలా దీర్ఘంగా చదివించారు. అనుచరులు, ‘ప్రవక్తా! ఈ రోజు మీరు చాలా దీర్ఘమైన నమా’జు చదివించారు,’ అని అన్నారు. దానికి ప్రవక్త (స), ‘ఎందుకంటే ఇది పుణ్య ఫలాపేక్ష, భయాల నమా’జు, నేను ఈ నమా’జులో అల్లాహ్(త)ను మూడు విషయాలు కోరాను. వాటిలో రెండు నాకు ఇవ్వబడ్డాయి. ఒకదాని గురించి తిరస్కరించడం జరిగింది. నేను అల్లాహ్(త) ను నా అనుచర సమాజాన్ని కరవుకాటకాలకు గురిచేసి చంపవద్దని ప్రార్థించాను. అల్లాహ్(త) దాన్ని స్వీకరించాడు. ఇంకా నేను ముస్లిములపై ముస్లిమేతర శత్రువును విధించవద్దని ప్రార్థించాను. ఈ ప్రార్థన కూడా స్వీకరించడం జరిగింది. ఇంకా నేను ముస్లిములు పరస్పరం నాశనం చేసుకో కూడదని, శిక్షలకు గురిచేసుకోకూడదని ప్రార్థించాను. అంటే పరస్పర వివాదాలకు గురికాకూడదని ప్రార్థించాను. కాని ఈ ప్రార్థన తిరస్కరించబడింది.” (తిర్మిజి’, నసాయి)
5755 – [ 17 ] ( لم تتم دراسته ) (3/1603)
وعَنْ أَبِيْ مَالِكٍ الْأَشْعَرِيِّ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِنَّ اللهَ عَزَّ وَجَلَّ أَجَارَكُمْ مِنْ ثَلَاثِ خِلَالٍ: أَنْ لَا يَدْعُوَ عَلَيْكُمْ نَبِيُّكُمْ فَتُهْلَكُوْا جَمِيْعًا وَأَنْ لَا يَظْهَرَ أَهْلُ الْبَاطِلِ عَلَى أَهْلِ الْحَقِّ وَأَنْ لَا تَجْتَمِعُوْا عَلَى ضَلَالَةٍ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ.
5755. (17) [3/1603 –అపరిశోధితం]
అబూ మాలిక్ అష్’అరీ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”అల్లాహ్(త) మిమ్మల్ని మూడు వస్తువుల నుండి రక్షించాడు. 1. మీ ప్రవక్త మిమ్మల్ని శపించ కుండా అల్లాహ్ రక్షించాడు. 2. మార్గభ్రష్టులు, సన్మార్గ గాము లను అధిగమించలేరు. 3. నా అనుచర సమాజం అంతా మార్గభ్రష్టత్వానికి గురికారు.” (అబూ దావూద్)
5756 – [ 18 ] ( لم تتم دراسته ) (3/1603)
وَعَنْ عَوْفِ بْنِ مَالِكٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَنْ يَجْمَعَ اللهُ عَلَى هَذِهِ الْأُمَّةِ سَيْفَيْنِ: سَيْفًا مِنْهَا وَسَيْفًا مِنْ عَدُوِّهَا”. رَوَاهُ أَبُوْ دَاوُدَ.
5756. (18) [3/1603 –అపరిశోధితం]
‘ఔఫ్ బిన్ మాలిక్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”అల్లాహ్(త) ఈ అనుచర సమాజంపై ఒకేసారి రెండు కరవాలాలు విధించడు. ఒక కరవాలం ముస్లిములది. రెండవది వారి శత్రువులది.” [3] (అబూ దావూద్)
5757 – [ 19 ] ( صحيح ) (3/1604)
وعَنِ الْعَبَّاسِ أَنَّهُ جَاءَ إِلى النَّبِيِّ صلى الله عليه وسلم فَكَأَنَّهُ سَمِعَ شَيْئًا فَقَامَ النَّبِيُّ صلى الله عليه وسلم عَلَى الْمِنْبَرِ فَقَالَ: “مَنْ أَنَا؟” فَقَالُوْا: أَنْتَ رَسُوْلُ اللهِ. فَقَالَ: “أَنَا مُحَمَّدُ بْنَ عَبْدِ اللهِ بْنِ عَبْدِ الْمُطَّلَبِ إِنَّ اللهَ خَلَقَ الْخَلْقَ فَجَعَلَنِيْ فِيْ خَيْرِهِمْ ثُمَّ جَعَلَهُمْ فِرْقَتَيْنِ فَجَعَلَنِيْ فِي خَيْرِفِرْقَةٍ ثُمَّ جَعَلَهُمْ قَبَائِلَ فَجَعَلَنِيْ فِيْ خَيْرِهِمْ قَبِيْلَةً ثُمَّ جَعَلَهُ بُيُوْتًا فَجَعَلَنِيْ فِي خَيْرِهِمْ بَيْتًا فَأَنَا خَيْرُهُمْ نَفْسًا وَخَيْرُهُمْ بَيْتًا.” رَوَاهُ التِّرْمِذِيُّ.
5757. (19) [3/1604 –దృఢం]
‘అబ్బాస్ (ర) కథనం: అవిశ్వాసులు ప్రవక్త (స)ను ఎత్తి పొడవటం అతను (స) విన్నారు. నేను ఆగ్రహంతో ప్రవక్త (స) వద్దకు వచ్తాను, అప్పుడు ప్రవక్త (స) మెంబరుపై ఉన్నారు. ప్రవక్త (స), ‘నేనెవరను’ అని అడిగారు. దానికి అనుచరులు, ‘తమరు అల్లాహ్ (త) ప్రవక్త,’ అని అన్నారు. దానికి ప్రవక్త (స) నేను, ‘ ‘అబ్దుల్లాహ్ బిన్ ‘అబ్దుల్ ము’త్తలిబ్ కుమారుణ్ణి. అల్లాహ్ (త) నన్ను తన ఉత్తమ సృష్టితాల్లో సృష్టించాడు. ఆ ఉత్తమ సృష్టితాలను రెండు వర్గాలుగా విభజించాడు. ఒకటి ‘అరబ్ మరొకటి ‘అజమ్, నన్ను ఆ రెండు వర్గాల్లో ఉత్తమ వర్గంలో అంటే ‘అరబ్బుల్లో సృష్టించాడు. ఆయన ‘అరబ్బులను అనేక వర్గాలుగా చేసాడు. నన్ను ఆ వర్గాల్లోని ఉత్తమవర్గం ఖురైషుల్లో సృష్టించాడు. ఆ తరువాత ఖురైష్‌లలో అనేక వంశాలు చేసాడు. అందులో నన్ను బనూ హాషిమ్‌లో సృష్టించాడు. అందువల్ల నేను వంశంలో, తెగలో, కుటుంబంలో, అందరికంటే ఉత్తముణ్ణి,’ అని అన్నారు.” (తిర్మిజి’)
5758 – [ 20] ( صحيح ) (3/1604)
وعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: قَالُوْا: يَا رَسُوْلَ اللهِ مَتَى وَجَبَتْ لَكَ النُّبُوَّةُ؟ قَالَ: “وَآدَمُ بَيْنَ الرُّوْحِ وَالْجَسَدِ”. رَوَاهُ التِّرْمِذِيُّ.
5758. (20) [3/1604 –దృఢం]
అబూ హురైరహ్(ర) కథనం: అనుచరులు, ‘ఓ ప్రవక్తా(త)! దైవదౌత్యం కోసం తమరు ఎప్పుడు ఎన్నుకోబడ్డారు,’ అని అడిగారు. దానికి ప్రవక్త (స), ‘ఆదమ్ (అ) శరీరం మరియు ఆత్మకు మధ్య ఉన్నప్పుడు,’ అని అన్నారు. [4] (తిర్మిజి’)
5759 – [ 21 ] ( صحيح ) (3/1604)
وعَنِ الْعِرْبَاضِ بْنِ سَارِيَةَ عَنْ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم أنه قَالَ: “إِنِّيْ عِنْدَ اللهِ مَكْتُوْبٌ: خَاتَمُ النَّبِيِّيْنَ وَإِنَّ آدَمَ لَمُنْجَدِلٌ فِيْ طِيْنَتِهِ وَسَأُخْبِرُكُمْ بِأَوَّلِ أَمْرِيْ دَعْوَةُ إِبْرَاهِيْمَ وَبَشَارَةُ عِيْسَى وَرُؤْيَا أُمِّيْ الَّتِيْ رَأَتْ حِيْنَ وَضَعَتِنِيْ وَقَدْ خَرَجَ لَهَا نُوْرٌ أَضَاءَ لَهَا مِنْهُ قُصُوْرَ الشَّامِ”. رَوَاهُ فِيْ “شَرْح السُّنَّةِ”.
5759. (21) [3/1604– దృఢం]
‘ఇర్‌బా’ద్ బిన్ సారియహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఆదమ్ (అ) మట్టి రూపంలో ఉన్నప్పుడే నేను అంతిమ ప్రవక్తగా నిర్ణయించబడి ఉన్నాను. నా గురించి మొదటి విషయం ఇబ్రాహీమ్ (అ) ప్రార్థన. ఆ తరువాత ‘ఈసా (అ) శుభవార్త. ఆ తరువాత నా తల్లి స్వప్నం. అంటే నేను జన్మించేటప్పుడు ఆమె స్వప్నం చూసింది. నా తల్లి ముందు ఒక వెలుగు ప్రత్యక్షం అయ్యింది. సిరియా భవనాలను చూపించటం జరిగింది.” (బ’గవీ/ షర్‌హు స్సున్నహ్)
5760 – [ 22 ] ( صحيح ) (3/1604)
وَرَوَاهُ أَحْمَدُ عَنْ أَبِيْ أُمَامَةَ مِنْ قَوْلِهِ: “سَأُخْبِرُكُمْ “إِلى آخِرِهِ.
5760. (22) [3/1604–దృఢం]
ఈ ‘హదీసు’ను అబూ ఉమామహ్ ద్వారా అ’హ్మద్ కూడా ఉల్లేఖించారు.[5]
5761 – [ 23 ] ( لم تتم دراسته ) (3/1604)
وَعَنْ أَبِيْ سَعِيْدٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “أَنَا سَيِّدٌ وُلِد آدَمَ يَوْمَ الْقِيَامَةِ وَلَا فَخَرَ وَبِيَدِيْ لِوَاءُ الْحَمْدِ وَلَا فَخَرَ. وَمَا مِنْ نَبِيٍّ يَوْمَئِذٍ آدَمُ فَمَنْ سِوَاهُ إِلَّا تَحْتَ لِوَائِيْ وَأَنَا أَوَّلُ مَنْ تَنْشَقُّ عَنْهُ الْأَرْضُ وَلَا فَخَرَ”. رَوَاهُ التِّرْمِذِيُّ.
5761. (23) [3/1604 –అపరిశోధితం]
అబూ స’యీద్ ‘ఖుద్రీ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”తీర్పుదినం నాడు నేను మానవులందరి నాయకునిగా ఉంటాను, ఈ మాట నేను గర్వంగా అనటం లేదు. తీర్పుదినం నాడు మఖామె మ’హ్‌మూద్ లోని ‘హమ్‌ద్ జండా నా చేతిలో ఉంటుంది, ఈ మాట కూడా నేను గర్వంగా అనటం లేదు. ఆ రోజు ఆదమ్ (అ)తో సహా ప్రవక్తలందరూ నా జెండా క్రింద ఉంటారు, తీర్పుదినం నాడు భూమి పగిలి అందరికంటే ముందు నేను లేపబడతాను. ఈ మాట కూడా నేను గర్వంగా పలకటం లేదు.” [6] (తిర్మిజి’)
5762 – [ 24 ] ( ضعيف ) (3/1604)
وعَنِ ابْنِ عَبَّاسٍ قَالَ: جَلَسَ نَاسٌ مِنْ أَصْحَابِ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم فَخَرَجَ حَتّى إِذَا دَنَا مِنْهُمْ سَمِعْهُمْ يَتَذَاكَرُوْنَ قَالَ بَعْضُهُمْ: إِنَّ اللهَ اتَّخَذَ إِبْرَاهِيْمَ خَلِيْلًا وَقَالَ آخَرُ: مُوْسَى كَلَّمَهُ اللهُ تَكْلِيْمًا وَقَالَ آخَرُ: فَعِيْسَى كَلِمَةُ اللهِ وَرُوْحُهُ. وَقَالَ آخَرُ: آدَمُ اصْطَفَاهُ اللهُ فَخَرَجَ عَلَيْهِمْ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم وَقَالَ: “قَدْ سَمِعْتُ كَلَامَكُمْ وَعَجَبَكُمْ إِنَّ إِبْرَاهِيْمَ خَلِيْلُ اللهِ وَهُوَ كَذِلَكَ وَآدَمُ اصْطَفَاهُ اللهُ وَهُوَ كَذَلِكَ أَلَا وَأَنَا حَبِيْبُ اللهِ وَلَا فَخَرَ وَأَنَا حَامِلُ لِوَاءِ الْحَمْدِ يَوْمَ الْقِيَامَةِ تَحْتَهُ آدَمُ فَمَنْ دُوْنَهُ وَلَا فَخَرَ وَأَنَا أَوَّلُ شَافِعٍ وَأَوَّلُ مُشَفَّعٍ يَوْمَ الْقِيَامَةِ وَلَا فَخَرَ وَأَنَا أَوَّلُ مَنْ يُحَرِّكُ حَلَقَ الْجَنَّةِ فَيَفْتَحُ اللهُ لِيْ فَيُدْخِلُنِيْهَا وَمَعِيَ فُقَرَاءُ الْمُؤْمِنِيْنَ وَلَا فَخَرَ وَأَنَا أَكْرَمُ الْأَوَّلِيْنَ وَالْآخِرِيْنَ عَلَى اللهِ وَلَا فَخَرَ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَالدَّارَمِيُّ .
5762. (24) [3/1604– బలహీనం]
ఇబ్నె ‘అబ్బాస్ (ర) కథనం: కొంతమంది అనుచరులు కూర్చొని ఉన్నారు. ప్రవక్త (స) తనగది లోపలినుండి వారి దగ్గరకు వచ్చారు. అనుచరులు పరస్పరం చర్చించుకుంటూ ఉండటం విన్నారు. ప్రవక్త (స) ఒక వ్యక్తి ఇలా అంటూ ఉండగా గమనించారు. ”అల్లాహ్ (త) ఇబ్రాహీమ్ (అ)ను తన మిత్రునిగా చేసుకున్నాడు.” మరో వ్యక్తి, ”అల్లాహ్ (త) మూసాను తనతో సంభాషించే ప్రత్యేకతను ప్రసాదించాడు. ”మరో వ్యక్తి, ” ‘ఈసా (అ) అల్లాహ్(త) వచనం, ఆయన ఆత్మ,” అని అన్నాడు. మరో వ్యక్తి, ”అల్లాహ్ (త) ఆదమ్ను ఎన్నుకున్నాడు,” అని అన్నాడు. ప్రవక్త (స) వారివద్దకు వెళ్ళి, ”నేను మీ మాటలు, మీ ఆశ్చర్యపడటం విన్నాను. ఇబ్రాహీమ్ (అ) అల్లాహ్(త) మిత్రులు, ఆయన దానికి తగినవారే, మూసా (అ) అల్లాహ్(త)తో మాట్లాడారు, ఇది కూడా మంచిదే. ‘ఈసా (అ) అల్లాహ్ (త) ఆత్మ, ఇది కూడా మంచిదే. ఆదమ్ (అ)ను అల్లాహ్ (త) ఎన్నుకున్నాడు. ఇది కూడా సరైనదే. గుర్తుంచుకోండి! నేను అల్లాహ్(త) ప్రియుడ్ని. ఈ మాట నేను గర్వంగా అనటం లేదు. తీర్పుదినం నాడు ‘హమ్‌ద్ జండా నేనే ఎత్తుకొని ఉంటాను. దీని క్రింద ఆదమ్ (అ) మరియు ప్రవక్తలందరూ ఉంటారు. దీనిపై కూడా నాకు గర్వం లేదు. ఇంకా తీర్పుదినం నాడు అందరికంటే ముందు సిఫారసు చేసేది నేనే. ఇంకా స్వర్గద్వారాలను అందరి కంటే ముందు తట్టేవాడ్ని నేనే. అనంతరం అల్లాహ్ (త) స్వర్గద్వారాలను నా కోసం తెరచి వేస్తాడు. ఇంకా నన్ను ప్రవేశింపజేస్తారు. ఆ సమయంలో నావెంట పేద విశ్వాసులు ఉంటారు. దీనిపట్ల కూడా నాకు గర్వం లేదు. అల్లాహ్ (త) వద్ద అందరి కంటే ప్రియమైన వాడ్ని, ఉన్నతమైన వాడ్ని నేనే, అయితే నేను గర్వంగా అనటం లేదు.” (తిర్మిజి’, దార్మీ)
5763 – [ 25 ] ( لم تتم دراسته ) (3/1605)
وَعَنْ عَمْرِو بْنِ قَيْسٍ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم قَالَ: “نَحْنُ الْآخِرُوْنَ وَنَحْنُ السَّابِقُوْنَ يَوْمَ الْقِيَامَةِ .وَإِنِّيْ قَائِلٌ قَوْلًاغَيْرَفَخَرٍ: إِبْرَاهِيْمُ خَلِيْلُ اللهِ وَمُوْسَى صَفِيُّ اللهِ وَأَنَا حَبِيْبُ اللهِ وَمَعِيَ لِوَاءُ الْحَمْدِ يَوْمَ الْقِيَامَةِ. وَإِنَّ اللهَ وَعَدَنِيْ فِي أُمَّتِيْ وَأَجَارَهُمْ مِنْ ثَلَاثٍ: لَا يَعُمُّهُمْ بِسَنَةٍ وَلَا يَسْتَأْصِلُهُمْ عَدُوٌّ وَلَا يَجْمَعُهُمْ عَلَى ضَلَالَةٍ”. رَوَاهُ الدَّارَمِيُّ.
5763. (25) [3/1605– అపరిశోధితం]
‘అమ్ర్ బిన్ ఖైస్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మనం ప్రపంచంలోకి వచ్చే విషయంలో అందరికంటే వెనుక ఉన్నాం. కాని తీర్పుదినం నాడు స్వర్గంలో ప్రవేశించే విషయంలో అందరికంటే ముందు ఉంటాం. మీకొక విషయం చెబుతాను, ఈ మాట గర్వంగా అనటం లేదు. ఇబ్రాహీమ్(అ) అల్లాహ్(త) మిత్రులు. మూసా (అ) అల్లాహ్(త)తో సంభాషించారు, నేను అల్లాహ్(త) ప్రియుడ్ని, తీర్పుదినం నాడు ‘హమ్‌ద్ జండా నా వద్ద ఉంటుంది. అల్లాహ్(త) నా అనుచర సమాజం విషయంలో ”ఖైరున్ కసీ’ర్” విషయంలో నాకు వాగ్దానం చేసాడు. మూడు విషయాల నుండి రక్షిస్తానని వాగ్దానం చేసాడు. 1. ముస్లిములను కరువు కాటకాల ద్వారా నాశనం చేయడు. 2. శత్రువు లెవరూ వారిని పూర్తిగా నాశనం చేయలేరు. 3. భ్రష్ట్రత్వంపై ముస్లిములందరూ ఏకం కారు. (దార్మీ)
5764 – [ 26 ] ( لم تتم دراسته ) (3/1605)
وَعَنْ جَابِرٍ أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم قَالَ: “أَنَا قَائِدُ الْمُرْسِلِيْنَ وَلَا فَخَرَ وَأَنَا خَاتِمُ النَّبِيِّيْنَ وَلَا فَخَرَ وَأَنَا أَوَّلُ شَافِعٍ وَمُشَفَّعٍ وَلَا فَخَرَ”. روَاهُ الدَّارَمِيُّ.
5764. (26) [3/1605– అపరిశోధితం]
జాబిర్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”తీర్పుదినం నాడు నేను ప్రవక్తలందరి నాయకుడిగా ఉంటాను. ఈ మాట నేను గర్వంగా అనటం లేదు. ప్రవక్తల పరంపర నాతో అంతమయింది. అంటే నేను అంతిమ ప్రవక్తను. దీనిపై నాకు ఎటువంటి గర్వం లేదు. తీర్పుదినం నాడు అందరికంటేముందు సిఫారసు నేనుచేస్తాను. ఇంకా అందరి కంటే ముందు నా సిఫారసు స్వీకరించబడు తుంది. ఈ మాట నేను గర్వంగా అనటం లేదు.” (దార్మీ)
5765 – [ 27 ] ( ضعيف ) (3/1605)
وعَنْ أَنَسٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “أَنَا أَوَّلُ النَّاسِ خُرُوْجًا إِذَا بُعِثُوْا وَأَنَا قَائِدُهُمْ إِذَا وَفَدوْا وَأَنا خَطِيْبُهُمْ إِذَا أَنْصَتُوْا وَأَنَا مُسْتَشْفِعُهُمْ إِذَا حُبِسُوْا وَأَنَا مُبَشِّرُهُمْ إِذَا أَيِسُوا الْكَرَامَةَ وَالْمَفَاتِيْحُ يَوْمَئِذٍ بِيَدِيْ وَلِوَاءُ الْحَمْدِ يَوْمَئِذٍ بِيَدِيْ وَأَنَا أَكْرَمُ وُلدِ آدَمَ عَلَى رَبِّيْ يَطُوْفُ عَلَيَّ أَلْفُ خَادِمٍ كَأَنَّهُنَّ بَيْضٌ مَكْنُوْنٌ أَوْ لُؤْلُؤٌ مَنْثُوْرٌ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَالدَّارَمِيُّ وَقَالَ التِّرْمِذِيُّ: هَذَا حَدِيْثٌ غَرِيْبٌ
5765. (27) [3/1605 –బలహీనం]
అనస్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”తీర్పు దినం నాడు ప్రజలు సమాధుల నుండి లేపబడి నపుడు, అందరికంటే ముందు నేను సమాధినుండి లేపబడతాను. ప్రజలందరూ బృందం రూపంలో దైవ సన్నిధిలోకి వెళ్ళినపుడు నేను నాయకునిగా ఉంటాను. ప్రజలు మౌనంగా ఉన్నప్పుడు నేను మాట్లాడుతాను. ఇంకా ప్రజలను ఆపివేసినపుడు నేను వారి గురించి సిఫారసు చేస్తాను. ప్రజలు నిరాశా నిస్పృ హలతో ఉంటే నేను శుభవార్త ఇస్తాను. పెత్తనం తాళాలు నా చేతిలో ఉంటాయి. ఆ రోజు ‘హమ్‌ద్ జండా నా చేతిలో ఉంటుంది. ఇంకా నా ప్రభువు వద్ద మానవులందరిలో కెల్లా, అందరికంటే గొప్పతనం, గౌరవం నాకే లభిస్తాయి. 1000 మంది సేవకులు నా ముందూ వెనుకా ఉంటారు. వారు గ్రుడ్డులా లేదా ముత్యాలులా ఉంటారు.” (తిర్మిజి’ -ఏకోల్లేఖనం, దార్మీ)
5766 – [ 28 ] ( ضعيف ) (3/1606)
وعَنْ أَبِيْ هُرَيْرَةَ عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ: “فَأُكْسَى حُلَّةً مِنْ حُلَلِ الْجَنَّةِ ثُمَّ أَقُوْمُ عَنْ يَمِيْنِ الْعَرْشِ لَيْسَ أَحَدٌ مِنَ الْخَلَائِقِ يَقُوْمُ ذَلِكَ الْمَقَامَ غَيْرِيْ”. رَوَاهُ التِّرْمِذِيُّ.
وَفِيْ رِوَايَةٍ “جَامِعِ الْأُصُوْلِ” عَنْهُ: “أَنَا أَوَّلُ مَنْ تَنْشَقُ عَنْهُ الْأَرْضُ فَأُكْسَى”.
5766. (28) [3/1606 –బలహీనం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”తీర్పు దినం నాడు స్వర్గం దుస్తులు నేను ధరించటం జరుగుతుంది. ఆ తరువాత నేను దైవ సింహసనం కుడి ప్రక్క నిలబడి ఉంటాను. అక్కడ నేను తప్ప ఎవ్వరూ నిలబడరు.” [7] (తిర్మిజి’)
జామి’ఉల్ ఉ’సూల్‌లో ఒక ఉల్లేఖనం ఇలా ఉంది: ”అబూ హురైరహ్ (ర) కథనం: అందరికంటే ముందు నా సమాధి తెరచుకుంటుంది, నేను బయటకు వస్తాను. ఆ తరువాత నాకు స్వర్గదుస్తులు తొడిగించటం జరుగు తుంది.”
5767 – [ 29 ] ( صحيح ) (3/1606)
وعَنْهُ عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ: “سَلُوا اللهَ الْوَسِيْلَةَ” قَالُوْا: يَا رَسُوْلَ اللهِ. وَمَا الْوَسِيْلَةُ؟ قَالَ: “أَعْلَى دَرَجَةٍ فِي الْجَنَّةِ لَا يَنَالَهَا إِلَّا رَجُلٌ وَاحِدٌ وَأَرْجُوْ أَنْ أَكُوْنَ أَنَا هُوَ”.رَوَاهُ التِّرْمِذِيُّ
5767. (29) [3/1606 –దృఢం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స), ”మీరు అల్లాహ్(త)ను నా గురించి వసీలహ్ అర్థించండి,” అని అన్నారు. అనుచరులు, ”ఓ ప్రవక్తా! వసీలహ్ అంటే ఏమిటి?” అని అడిగారు. దానికి ప్రవక్త (స) స్వర్గంలో అన్నిటి కంటే ఉన్నతస్థానం, అది కేవలం ఒక్క వ్యక్తికి లభిస్తుంది. ఆ ఒక్క వ్యక్తి నేనే కావాలని ఆశిస్తున్నాను,” అని అన్నారు. (తిర్మిజి’)
5768 – [ 30 ] ( حسن ) (3/1606)
وَعَنْ أُبَيِّ بْنِ كَعْبٍ عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ: “إِذَا كَانَ يَوْمَ الْقِيَامَةِ كُنْتُ إِمَامَ النَّبِيِّيْنَ وَخَطِيْبَهُمْ وَصَاحِبَ شَفَاعَتِهِمْ غَيْرَ فَخَرٍ”. رَوَاهُ التِّرْمِذِيُّ.
5768. (30) [3/1606 –ప్రామాణికం]
ఉబయ్ బిన్ క’అబ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”తీర్పుదినం నాడు నేను ప్రవక్తలందరి నాయకునిగా ఉంటాను, వారి తరఫున మాట్లాతాను. వారి గురించి సిఫారసు చేస్తాను. ఇది నేను గర్వంతో అనటం లేదు.” (తిర్మిజి’)
5769 – [ 31 ] ( لم تتم دراسته ) (3/1606)
وَعَنْ عَبْدِ اللهِ بْنِ مَسْعُوْدٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِنَّ لِكُلِّ نَبِيٍّ وُلَاةً مِنَ النَّبِيِّيْنَ وَإِنَّ وَلِيِّيْ أَبِيْ وَخَلِيْلُ رَبِّيْ ثُمَّ قَرَأَ: [إِنَّ أَوْلَى النَّاسِ بِإِبْرَاهِيْمَ للَّذِيْنَ اتَّبَعُوْهُ وَهَذَا النَّبِيُّ وَالَّذِيْنَ آمَنُوْا وَاللهِ وَلِيُّ الْمُؤْمِنِيْنَ؛ 3: 68]. رَوَاهُ التِّرْمِذِيُّ.
5769. (31) [3/1606 –అపరిశోధితం]
‘అబ్దుల్లాహ్ బిన్ మస్’ఊద్(ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ” ప్రతి ప్రవక్తకు ప్రవక్తల్లో నుండి మిత్రు లుంటారు. నా మిత్రులు నా తండ్రిగారైన నా ప్రభువు మిత్రులు. అనంతరం ప్రవక్త(స) ఈ ఆయతును పఠిం చారు, ”నిశ్చయంగా, ఇబ్రాహీమ్‌తో దగ్గరి సంబంధం గలవారంటే, అతనిని అనుసరించే వారు మరియు ఈ ప్రవక్త (ము’హమ్మద్) మరియు (ఇతనిని) విశ్వ సించిన వారు. మరియు అల్లాహ్‌యే విశ్వాసుల సంరక్షకుడు.” (ఆల ఇమ్రాన్, 3:68). (తిర్మిజి’)
5770 – [ 32 ] ( لم تتم دراسته ) (3/1606)
وَعَنْ جَابِرٍأَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم قا ل: “إِنَّ اللهَ بَعَثَنِيْ لِتَمَامِ مَكَارِمِ الْأَخْلَاقِ وَكَمَالِ مَحَاسِنِ الْأَفْعَالِ”. رَوَاهُ فِيْ شَرْحِ السُّنَّةِ.
5770. (32) [3/1606 –అపరిశోధితం]
జాబిర్ బిన్ ‘అబ్దుల్లాహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”సద్గుణాల సంపన్నత కొరకు, కార్యాల ఉత్తమ పరిపూర్ణత కొరకు నేను పంపబడ్డాను.” (షర్’హు స్సున్నహ్)
5771 – [ 33 ] ( لم تتم دراسته ) (3/1606)
وَعَنْ كَعْبٍ يَحْكِيْ عَنِ التَّوْرَاةِ قَالَ: نَجِدُ مَكْتُوْبًا مُحَمَّدٌ رَسُوْلُ اللهِ عَبْدِي الْمُخْتَارُ لَا فَظٌّ وَلَا غَلِيْظٌ وَلَا سَخَّابٌ فِي الْأَسْوَاقِ وَلَا يَجْزِيْ بِالسَّيِّئَةِ السَّيِّئَةَ وَلَكِنْ يَعْفُوْ وَيَغْفِرُ مَوْلِدُهُ بِمَكَّةَ وَهِجْرَتُهُ بِطَيْبَةَ وَمُلْكُهُ بِالشَّامِ وَأُمَّتُهُ الْحَمَّادُوْنَ يَحْمَدُوْنَ اللهَ فِي السَّرَّاءِ وَالضَّرَّاءِ يَحْمَدُوْنَ اللهَ فِيْ كُلِّ مَنْزِلَةٍ وَيُكَبَّرُوْنَهُ عَلَى كُلِّ شَرَفٍ رُعَاةٌ لِلشَّمْسِ يُصَلُّوْنَ الصَّلَاةَ إِذَا جَاءَ وَقْتُهَا يَتَأزرُوْنَ عَلَى أَنْصَافِهِمْ وَيَتَوَضَّؤُوْنَ عَلَى أَطْرَافِهِمْ مُنَادِيْهِمْ يُنَادِيْ فِي جَوِّ السَّمَاءِ صَفُّهُمْ فِي الْقِتَالِ وَصَفُّهُمْ فِي الصَّلَاةِ سَوَاءٌ لَهُمْ بِاللَّيْلِ دَوِيٌّ كَدَوِيِّ النَّحْلِ”. هَذَا لَفْظُ “الْمَصَابِيْحِ”. وَرَوَي الدَّارَمِيُّ مَعَ تَغْيِيْرٍ يَسِيْرٍ.
5771. (33) [3/1606 –అపరిశోధితం]
క’అబ్ అ’హ్‌బార్ (ర) తౌరాతు ద్వారా కథనం: నేను తౌరాతులో ము’హమ్మద్(స) అల్లాహ్(త) ప్రవక్త, ఆయన ప్రియభక్తులు, కఠిన హృదయులు కారు, కఠినంగా సంభాషించరు, చెడుకు చెడుద్వారా ప్రతీకారం తీర్చుకోరు, క్షమించేవారయి ఉంటారు. అతను(స) మక్కహ్లో జన్మిస్తారు. అతను (స) వలస వెళ్ళే ప్రాంతం మదీనహ్ అయి ఉంటుంది. అతని (స) రాజ్యం సిరియా దేశం వరకు వ్యాపించి ఉంటుంది. అతని అనుచర సమాజం అల్లాహ్(త) ను అత్యధికంగా ప్రశంసించేదిగా ఉంటుంది. వారు కష్టాల్లోసుఖాల్లో అల్లాహ్ (త)ను స్తుతిస్తారు. వారు ఎక్కడ దిగినా అల్లాహ్ కు కృతజ్ఞతలు తెలుపుతారు. ఎక్కడ ఎక్కినా అల్లాహ్ గొప్ప తనాన్ని స్తుతిస్తారు. సూర్యుణ్ణి దృష్టిలో పెట్టు కుంటారు. నమా’జు వేళ అయితే నమా’జు చదువు తారు. తమ నడుంకు వస్త్రాన్ని ధరిస్తారు. అది వారి సగం పిక్కల దాకా ఉంటుంది. వాళ్ళు వు’దూ చేస్తారు. వారి ము’అజ్జిన్ ఎత్తైన ప్రదేశంపై అ’జాన్ వచనాలు పలుకుతారు. యుద్ధంలోనూ, నమా’జులోనూ వారి పంక్తులు ఒకేలా ఉంటాయి. రాత్రివేళల్లో వారి గొంతు తక్కువ శబ్దం కలిగి ఉంటుంది, తేనెటీగల శబ్దంలా ఉంటుంది,’ అని అన్నారు.” (మసాబీ’హ్, దార్మీ)
5772 – [ 34 ] ( ضعيف ) (3/1607)
وعَنْ عَبْدِ اللهِ بْنِ سَلَامٍ قَالَ: مَكْتُوْبٌ فِي التَّوْرَاةِ صِفَةُ مُحَمَّدٍ وَعِيْسَى بْنِ مَرْيَمَ يُدْفَنُ مَعَهُ قَالَ أَبُوْ مَوْدُوْدٍ: وَقَدْ بَقِيَ فِي الْبَيْتِ مَوْضِعُ قَبْرٍ. رَوَاهُ التِّرْمِذِيُّ.
5772. (34) [3/1607– బలహీనం]
‘అబ్దుల్లాహ్ బిన్ సలామ్ (ర) కథనం: తౌరాతులో ము’హమ్మద్ (స) గుర్తులు పేర్కొనబడ్డాయి. ఇంకా ‘ఈసా బిన్ మర్యమ్, ము’హమ్మద్ (స) గదిలోనే సమాధి చేయబడతారు. అబూ మౌదూద్ కథనం: ప్రవక్త (స) సమాధి ఉన్న ‘ఆయి’షహ్ (ర) గదిలో మరో సమాధి అంత చోటు మిగిలిఉంది. [8] (తిర్మిజి’)
—–
اَلْفَصْلُ الثَّالِثُ మూడవ విభాగం
5773 – [ 35 ] ( لم تتم دراسته ) (3/1607)
عَنِ ابْنِ عَبَّاسٍ قَالَ: إِنَّ اللهَ تَعَالى فَضَّلَ مُحَمَّدًا صلى الله عليه وسلم عَلَى الْأَنْبِيَاءِ وَعَلَى أَهْلِ السَّمَاءِ فَقَالُوْا يَا أَبَا عَبَّاسٍ بِمَ فَضَّلَهُ اللهُ عَلَى أَهْلِ السَّمَاءِ؟ قَالَ: إِنَّ اللهَ تَعَالى قَالَ لِأَهْلِ السَّمَاءِ: [وَمَنْ يَّقُلْ مِنْهُمْ إِنِّيْ إِلَهٌ مِّنْ دُوْنِهِ فَذَلِكَ نَجْزِيْهِ جَهَنَّمَ كَذَلِكَ نَجْزِي الظَّالِمِيْنَ؛21: 29]. وَقَالَ اللهُ تَعَالى لَمُحَمَّدٍ صلى الله عليه وسلم: [إِنَّا فَتَحْنَا لَكَ فَتْحًا مُّبِيْنًا لِيَغْفِرَ لَكَ اللهُ مَا تَقَدَّمَ مِنْ ذَنْبِكَ وَمَا تَأَخَّرَ؛ 48: 1-2]. قَالُوْا: وَمَا فَضْلُهُ عَلَى الْأَنْبِيَاءِ؟ قَالَ: قَالَ اللهُ تَعَالى: [وَمَا أَرْسَلْنَا مِنْ رَّسُوْلِ إِلَّا بِلِسَانِ قَوْمِهِ لِيُبَيّنَ لَهُمْ فَيُضِلُّ اللهُ مَنْ يَّشَاءُ؛14: 4]. الْآيَة. وَقَالَ اللهُ تَعَالى لِمُحَمَّدٍ صلى الله عليه وسلم: [وَمَا أَرْسَلْنَاكَ إِلَّا كَافَّةً لِلنَّاسِ؛34: 28]. فَأَرْسَلَهُ إِلى الْجَنِّ وَالْإِنْسِ. رَواهُ الدَّارَمِيُّ.
5773. (35) [3/1607–అపరిశోధితం]
ఇబ్నె ‘అబ్బాస్ (ర): ‘అల్లాహ్(త) ము’హమ్మద్ (స)కు ప్రవక్తలందరిపై, దైవదూతలపై విశిష్ఠత ప్రసాదించాడు’ అని అన్నారు. దానికి ప్రజలు, ”అబూ ‘అబ్బాస్! దైవదూతలపై ము’హమ్మద్‌కు ఎటువంటి విశిష్ఠత లభించింది,” అని అడిగారు. అప్పుడు ఇబ్నె ‘అబ్బాస్ అల్లాహ్(త) ఆకాశ వాసులను ఆదేశించాడు: ” వారిలో (దైవదూతలలో) ఎవరైనా: “నిశ్చయంగా, ఆయనేకాక, నేనుకూడా ఒక ఆరాధ్య దైవాన్ని.” అని అంటే, అలాంటి వానికి మేము నరక శిక్ష విధిస్తాము. మేము దుర్మార్గులను ఇదే విధంగా శిక్షిస్తాము. (అల్-అంబియా’, 21:29).
అల్లాహ్(త), ము’హమ్మద్ (స) విషయంలో ఇలా ఆదేశించాడు: ”(ఓ ప్రవక్తా!) నిశ్చయంగా, మేము నీకు స్పష్టమైన విజయాన్ని ప్రసాదించాము; అల్లాహ్! నీ పూర్వపు మరియు భావికాలపు తప్పులను క్షమించ టానికి మరియు నీపై తన అనుగ్రహాన్ని పూర్తిచేయ టానికి మరియు నీకు ఋజుమార్గం వైపునకు మార్గ దర్శకత్వం చేయటానికి.” (అల్-ఫ:త్హ్, 48:1-2)
ఆ తరువాత ప్రజలు, ”ము’హమ్మద్ (స)కు ప్రవక్తలపై ఎటువంటి విశిష్ఠత లభించింది,” అని అడిగారు. దానికి ఇబ్నె ‘అబ్బాస్ (ర), అల్లాహ్(త) ఇతర ప్రవక్తల గురించి: ”మరియు మేము ప్రతి ప్రవక్తను, అతని జాతివారి భాషతోనే పంపాము; అతను వారికి స్పష్టంగా బోధించటానికి. మరియు అల్లాహ్ తాను కోరిన వారిని మార్గభ్రష్టత్వంలో వదలుతాడు. మరియు తాను కోరిన వారికి మార్గదర్శ కత్వం చేస్తాడు.” (ఇబ్రాహీం, 14:4)
కాని ముహమ్మద్(స) గురించి అల్లాహ్ ఇలా ఆదేశించాడు, ” మరియు (ఓ ము’హమ్మద్!) మేము నిన్ను సర్వమానవులకు శుభవార్త నిచ్చేవానిగా మరియు హెచ్చరిక చేసేవానిగా మాత్రమే పంపాము…” (సబా’, 34:28) అంటే అల్లాహ్ (త), ము’హమ్మద్ (స) ను, మానవులు జిన్నులు ఇద్దరి వైపునకు ప్రవక్తగా పంపాడు. (దార్మీ)
5774- [ 36 ] ( لم تتم دراسته ) (3/1608)
وَعَنْ أَبِيْ ذَرِّ الْغِفَارِيِّ قَالَ: قُلْتُ: يَا رَسُوْلَ اللهِ كَيْفَ عَلِمْتَ أَنَّكَ نَبِيٌّ حَتّى اسْتَيْقَنْتَ؟ فَقَالَ: “يَا أَبَا ذَرٍّ أَتَانِيْ مَلَكَانَ وَأَنَا بِبَعْضِ بَطْحَاءِ مَكَّةَ فَوَقَعَ أَحَدُهُمَا عَلَى الْأَرْضِ وَكَانَ الْآخَرُ بَيْنَ السَّمَاءِ وَالْأَرْضِ فَقَالَ أَحَدُهُمَا لِصَاحِبِهِ: أَهُوَ هُوَ؟ قَالَ: نَعَمْ . قَالَ: فَزِنْهُ بِرَجُلٍ فَوُزِنْتُ بِهِ فَوَزَنْتهُ ثُمَّ قَالَ: زِنْهُ بِعَشَرَةٍ فَوُزِنْتُ بِهِمْ فَرَجَحْتُهُمْ ثُمَّ قَالَ: زِنْهُ بِمِائَةٍ فَوُزِنْتُ بِهِمْ فَرَجَحْتُهُمْ كَأَنِّيْ أنْظُرُ إِلَيْهِمْ يَنْتَثِرُوْنَ عَلَيَّ مِنْ خِفَّةِ الْمِيْزَانِ . قَالَ: فَقَالَ أَحَدُهُمَا لِصَاحِبِهِ: لَوْ وَزَنْتَهُ بِأُمَّتِهِ لَرَجَحَهَا”. رَوَاهُمَا الدَّارَمِيُّ .
5774. (36) [3/1608– అపరిశోధితం]
అబూ జ’ర్ ‘గిఫారీ (ర) కథనం: ”ఓ ప్రవక్తా! మీరు ప్రవక్త అని మీకు ఎలా తెలిసింది. ఇంకా మీకు దైవదౌత్యం లభించిందని ఎలా తెలిసింది?” అని విన్నవించు కున్నాను. దానికి ప్రవక్త (స), ”ఓ అబూ జ’ర్! నేను బ’త్’హాఅ’ మక్కహ్లో ఒకచోట ఉన్నాను. నా వద్దకు ఇద్దరు దైవదూతలు వచ్చారు. ఒక దైవదూత భూమిపై దిగాడు, మరో దైవదూత భూమ్యాకాశాల మధ్య వ్రేలాడుతూ ఉన్నాడు. ఒక దైవదూత మరో దైవదూతతో, ‘ఇతడు అతనేనా?’ అని అడిగాడు. దానికి ఆ దైవదూత, ‘అవును ఇతడు అతనే,’ అని అన్నాడు. ఆ తరువాత మొదటి దైవదూత రెండవ దైవదూతతో, ‘ఒక వ్యక్తితో, ‘ఇతన్ని తూచిచూడు,’ అని అన్నాడు. అనంతరం, నన్ను ఒక వ్యక్తితో తూచి చూడడం జరిగింది. నేనా వ్యక్తి కంటే బరువుగా ఉన్నాను. ఆ తరువాత ఆ దైవదూత ఇప్పుడు 10 మందితో తూయడం జరిగింది. నేను ఆ పదిమంది కంటే బరువుగా ఉన్నాను. అనంతరం ఆ దైవదూత, ‘మంచిది 100 మందితో ఇతన్ని తూద్దాం’, అని అన్నాడు. అనంతరం 100 మందితో నన్ను తూయటం జరిగింది. నేను 100 మందికన్నా బరువుగా ఉన్నాను. మళ్ళీ ఆ దైవదూత 1000 మందితో తూయటం జరిగింది. నేను 1000 మందికన్నా బరువుగా ఉన్నాను. తూనిక తేలిక అవటంవల్ల వారు నాపై పడతారనిపించింది. ఆ తరువాత ఒక దైవదూత మరో దైవదూతతో, ‘ఒకవేళ నువ్వు ఇతన్ని అనుచర సమాజమంతటితో తూచినా అతను వారికంటే బరువుగానే ఉంటారు,’ అని అన్నాడు.” (దార్మీ)
5775 – [ 37 ] ( ضعيف ) (3/1608)
وعَنِ ابْنِ عَبَّاسٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “كُتِبَ عَلَيَّ النَّحْرُ وَلَمْ يُكْتَبْ عَلَيْكُمْ وَأُمِرْتُ بِصَلَاةِ الضُّحَى وَلَمْ تُؤْمَرُوْا بِهَا”. رَوَاهُ الدَّارَقُطْنِيُّ.
5775. (37) [3/1608 –బలహీనం]
ఇబ్నె ‘అబ్బాస్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”నాపై జంతు బలి విధిగా చేయబడింది. కాని మీపై విధిగా చేయబడ లేదు. నన్ను సూర్యోదయం తరువాత నమా’జు గురించి ఆదేశించటం జరిగింది. కాని మీకు ఆదేశించబడలేదు.” (దారు ఖు’తునీ)
=====
2 – بَابُ أَسْمَاءِ النَّبِيِّ صلى الله عليه وسلم وَصِفَاتِهِ
2. ప్రవక్త (స) శుభ నామాలు, గుణగణాలు
اَلْفَصْلُ الْأَوَّلُ మొదటి విభాగం
5776 – [ 1 ] ( مُتَّفَقٌ عَلَيْهِ ) (3/1609)
عَنْ جُبَيْرِ بْنِ مُطْعِمٍ قَالَ: سَمِعْتُ النَّبِيَّ صلى الله عليه وسلم يقول: “إِنَّ لِيْ أَسْمَاءٌ: أَنَا مُحَمَّدٌ وَأَنَا أَحْمَدُ وَأَنَا الْمَاحِيْ الَّذِيْ يَمْحُو اللهُ بِيَ الْكُفْرَ وأَنَا الْحَاشِرُ الَّذِيْ يُحْشَرُ النَّاسُ عَلَى قَدَمَيَّ وَأَنَا الْعَاقِبُ”. وَالْعَاقِبُ: الَّذِيْ لَيْسَ بَعْدَهُ شَيْءٌ. مُتَّفَقٌ عَلَيْهِ.
5776. (1) [3/1609 –ఏకీభవితం]
జుబైర్ బిన్ ము’త్’యిమ్ (ర) కథనం: ప్రవక్త (స) ఇలా ప్రవచిస్తూ ఉండగా నేను విన్నాను, ”నిస్సందేహంగా నాకు అనేక పేర్లు ఉన్నాయి. వాటిలో నా ప్రఖ్యాత పేరు ము’హమ్మద్, రెండవది అ’హ్మద్. ఇంకా నాకు మా’హీ అనే పేరు కూడా ఉంది. ఎందుకంటే నా ద్వారా అల్లాహ్(త) అవిశ్వాసాన్ని తొలగిస్తాడు. ఇంకా నాకు ‘హాషిర్ అనే పేరు కూడా ఉంది. ఎందుకంటే ప్రజలు నా అడుగుజాడలపై మరల లేపబడుదురు. ఇంకా నాకు ‘ఆఖిబ్ అనే పేరు కూడా ఉంది. అంటే నా తరువాత మరే ప్రవక్తా రాడు.” [9] (బు’ఖారీ, ముస్లిమ్)
5777 – [ 2 ] ( صحيح ) (3/1609)
وَعَنْ أَبِيْ مُوْسَى الْأَشْعَرِيِّ قَالَ: كَانَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم يُسَمِّيْ لَنَا نَفْسَهُ أَسْمَاءٌ فَقَالَ: ” أَنَا مُحَمَّدٌ وأَحْمَدُ وَالْمُقَفّي وَالْحَاشِرُ وَنَبِيُّ التَّوْبَةِ وَنَبِيُّ الرَّحْمَةِ”.رَوَاهُ مُسْلِمٌ.
5777. (2) [3/1609 –దృఢం]
అబూ మూసా అష్’అరీ (ర) కథనం: ప్రవక్త (స) మాకు తన అనేక పేర్లను గురించి తెలిపారు. అనంతరం ఒకరోజు, ”నేను ము’హమ్మద్, నేను అ’హ్మద్, నేను ముఖఫ్ఫీ, నేను ‘హాషిర్, నేను తౌబహ్ ప్రవక్తను, నేను కారుణ్య ప్రవక్తను,” అని అన్నారు. (ముస్లిమ్)
5778 – [ 3 ] ( صحيح ) (3/1609)
وعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “أَلَا تَعْجَبُوْنَ كَيْفَ يَصْرِفُ اللهُ عَنِّيْ شَتَمَ قُرَيْشٍ وَلَعَنَهُمْ؟ يَشْتِمُوْنَ مُذَمَّمًا وَيَلْعَنُوْنَ مُذَمَّمًا وَأَنَا مُحَمَّدٌ”. روَاهُ الْبُخَارِيُّ.
5778. (3) [3/1609 –దృఢం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”అల్లాహ్ నన్ను ఖురైషుల తిట్ల నుండి ఎలా తప్పించాడో మీకు తెలుసా? వాళ్ళు ముజ’మ్మమ్‌ను తిడుతున్నారు. వాళ్ళ ముజ’మ్మమ్‌ను శాపనార్థాలు పెడుతున్నారు. అయితే నేను ము’హమ్మద్‌ను.” [10] (బు’ఖారీ)
5779 – [ 4 ] ( صحيح ) (3/1609)
وَعَنْ جَابِرِ بْنِ سَمُرَةَ قَالَ: كَانَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم قَدْ شَمَطَ مُقَدَّمُ رَأْسِهِ وَلِحْيَتِهِ وَكَانَ إِذَا ادَّهَنَ لَمْ يَتَبَيَّنْ وَإِذَا شَعِثَ رَأْسُهُ تَبَيَّنَ وَكَانَ كَثِيْرَ شَعْرِ اللِّحْيَةِ. فَقَالَ رَجُلٌ: وَجْهُهُ مِثْلُ السَّيْفِ؟ قَالَ: لَا بَلْ كَانَ مِثْلَ الشَّمْسِ وَالْقَمَرِ وَكَانَ مُسْتَدِيْرًا وَرَأَيْتُ الْخَاتَمَ عِنْدَ كَتِفِهِ مِثْلَ بَيْضَةَ الْحَمَامَةِ يُشْبِهُ جَسَدَهُ”. رَوَاهُ مُسْلِمٌ .
5779. (4) [3/1609 –దృఢం]
జాబిర్ బిన్ సమురహ్ (ర) కథనం: ప్రవక్త (స) తలపై, గడ్డం ముందు భాగంలో కొన్ని తెల్లని వెంట్రుకలు వచ్చాయి. ప్రవక్త (స) నూనె రాస్తే ఆ తెల్లని వెంట్రుకలు కనబడేవి కావు. కాని తలవెంట్రుకలు అటూ ఇటూ ఉంటే తెల్లని వెంట్రుకలు కనబడేవి. ప్రవక్త (స) గడ్డం దట్టంగా ఉండేది. జాబిర్ (ర) ప్రవక్త (స) రూపురేఖల్ని వివరిస్తే ఒక వ్యక్తి ప్రవక్త (స) ముఖం మెరుపులో కరవాలంలా ఉండేది అన్నాడు. అప్పుడు జాబిర్ (ర), ”కాదు సూర్య చంద్రుల్లా ఎర్రగా, గుండ్రంగా ఉండేది. ఇంకా భుజం వద్ద దైవదౌత్య ముద్రను చూసాను. అది పావురం గ్రుడ్డులా గుండ్రంగా ఉండేది. అతని(స) శరీరం రంగు కలిగి ఉండేది,”అని అన్నారు. (ముస్లిమ్)
5780 – [ 5 ] ( صحيح ) (3/1610)
وَعَنْ عَبْدِ اللهِ بْنِ سَرْجِسٍ قَالَ: رَأَيْتُ النَّبِيَّ صلى الله عليه وسلم وَأَكَلْتُ مَعَهُ خُبْزًا وَلَحْمًا – أَوْ قَالَ: ثَرِيْدًا – ثُمَّ دُرْتُ خَلْفَهُ فَنَظَرْتُ إِلى خَاتَمِ النُّبُوَّةِ بَيْنَ كَتِفَيْهِ عِنْدَ نَاغِضِ كَتفِهِ الْيُسْرَى جُمْعًا عَلَيْهِ خِيْلَانٌ كَأَمْثَالِ الثَّآلِيْلِ. رَوَاهُ مُسْلِمٌ.
5780. (5) [3/1610- దృఢం]
‘అబ్దుల్లాహ్ బిన్ సర్‌జిస్ (ర) కథనం: నేను ప్రవక్త (స)ను దర్శించాను. అతని(స)తో పాటు మాంసం రొట్టె తిన్నాను లేదా సరీద్ తిన్నాను. ఆ తరువాత అతని(స) వెనుక దైవదౌత్య ముద్రను చూచాను. అది రెండు భుజాల మధ్య ఎడమవైపు ఉంది. పిడికిలిలా ఉంది. దానిపై పుట్టుమచ్చల్లా నల్లని మచ్చలు ఉన్నాయి. (ముస్లిమ్)
5781 – [ 6 ] ( صحيح ) (3/1610)
وَعَنْ أُمِّ خَالِدٍ بِنْتِ خَالِدِ بْنِ سَعِيْدٍ قَالَتْ: أُتِيَ النَّبِيّ صلى الله عليه وسلم بِثِيَابٍ فِيْهَا خَمِيْصَةٌ سَوْدَاءُ صَغِيْرَةٌ فَقَالَ: “ائْتُوْنِيْ بِأُمِّ خَالِدٍ”. فَأُتِيَ بِهَا تُحْمَلُ فَأَخَذَ الْخَمِيْصَةَ بِيَدِهِ فَأَلْبَسَهَا. قَالَ : “ابْلِيْ وَأَخْلُقِيْ. ثُمَّ أَبْلِيْ وَأَخْلُقِيْ”. وَكَانَ فِيْهَا عَلَمٌ أَخْضَرُ أَوْ أَصْفَرُ. فَقَالَ: “يَا أُم خَالِدٍ هَذَا سَنَاهُ”. وَهِيَ بِالْحَبَشِيَّةِ حَسَنَةً. قَالَتْ: فَذَهَبْتُ أَلْعَبُ بِخَاتَمِ النُّبُوَّةِ فَزَ بَرَنِيْ أَبِيْ. فَقَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “دَعْهَا”. روَاهُ الْبُخَارِيُّ.
5781. (6) [3/1610– దృఢం]
‘ఖాలిద్ బిన్ స’యీద్ కుమార్తె, ఉమ్మె ‘ఖాలిద్ (ర) కథనం: ప్రవక్త (స) వద్దకు కొన్ని దుస్తులు వచ్చాయి. వాటిలో నల్లని ఒక చిన్న దుప్పటి కూడా ఉండేది. ప్రవక్త (స), ‘ఉమ్మె ‘ఖాలిద్‌ను నా దగ్గరకు తీసుకురండి’ అన్నారు. ఉమ్మె ‘ఖాలిద్‌ను ఎత్తుకొని తీసుకురావటం జరిగింది. ప్రవక్త (స) దుప్పటిని తన చేతులతో ఎత్తి ఉమ్మె ‘ఖాలిద్‌ను కప్పుతూ, ”ఈ దుప్పటినివాడి పాతదిచేయి, ఈ దుప్పటినివాడి పాతదిచేయి,” అని దీవించారు. అంటే దీర్ఘాయుష్షు పొందుగాక! అని దీవించారు. ఆ దుప్పటిలో పచ్చని చిహ్నాలు ఉండేవి. ప్రవక్త (స) ఇలా అన్నారు, ”ఓ ఉమ్మె ‘ఖాలిద్! ఈ దుప్పటి చాలా బాగుంది,” ఉమ్మె ‘ఖాలిద్ కథనం: ఆ తరువాత నేను ప్రవక్త (స) వెనుక వెళ్ళి దైవదౌత్య ముద్రతో ఆడుకుంటూ ఉన్నాను. మా నాన్నగారు చూచి నన్ను వారించారు. అప్పుడు ప్రవక్త (స), ”పాపను ఆడుకో నివ్వు, వారించకు,” అని అన్నారు. (బు’ఖారీ)
5782- [ 7 ] ( مُتَّفَقٌ عَلَيْهِ ) (3/1610)
وَعَنْ أَنَسٍ قَالَ: كَانَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم لَيْسَ بِالطَّوِيْلِ الْبَائِنِ وَلَا بِالْقَصِيْرِ وَلَيْسَ بِالْأَبْيَضِ الْأَمْهَقِ وَلَا بِالْآدَمِ وَلَيْسَ بِالْجَعْدِ الْقَطِطِ وَلَا بِالسَّبِطِ بَعَثَهُ اللهُ عَلَى رَأْسِ أَرْبَعِيْنَ سَنَةً فَأَقَامَ بِمَكَّةَ عَشْرَ سِنِيْنَ وَبِالْمَدِيْنَةِ عَشْرَ سِنِيْنَ وَتَوَفَّاهُ اللهُ عَلَى رَأْسِ سِتِّيْنَ سَنَةً وَلَيْسَ فِيْ رَأْسِهِ وَلِحْيَتِهِ عِشْرُوْنَ شَعْرَةً بَيْضَاءَ وَفِيْ رِوَايَةٍ يَصِفُ النَّبِيَّ صلى الله عليه وسلم قَالَ: كَانَ رَبْعَةً مِنَ الْقَوْمِ لَيْسَ بِالطَّوِيْلِ وَلَا بِالْقَصِيْرِ أَزْهَرَ اللَّوْنِ. وَقَالَ: كَانَ شَعْرُ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم إِلى أَنْصَافِ أُذُنَيْهِ وَفِيْ رِوَايَةٍ: بَيْنَ أُذُنَيْهِ وَعَاتِقِهِ. مُتَّفَقٌ عَلَيْهِ.
وَفِيْ رِوَايَةٍ لِلْبُخَارِيِّ قَالَ: كَانَ ضَخْمَ الرَّأْسِ وَالْقَدَمَيْنِ لَمْ أَرَ بَعْدَهُ وَلَا قَبْلَهُ مِثْلَهُ وَكَانَ سَبِطَ الْكَفَّيْنِ. وَفِيْ أُخْرَى لَهُ قَالَ: كَانَ شَئْنَ الْقَدَمَيْنِ وَالْكَفَّيْنِ.
5782. (7) [3/1610– ఏకీభవితం]
అనస్ (ర) కథనం: ప్రవక్త (స) అంత పొడవుగా కాకుండా, అంత పొట్టిగా కాకుండా ఒక మోస్తరు పొడవు కలిగి ఉండేవారు. ప్రవక్త (స) లేత గోధుమరంగు కలిగి ఉండే వారు. ప్రవక్త (స) వెంట్రుకలు అంత ఉంగరాల జుట్టు కాకుండా, అంత తిన్నగా కాకుండా ఉండేవి. అల్లాహ్(త) 40 సంవత్సరాల వయస్సులో ప్రవక్త పదవి ప్రసాదించాడు. ఆ తరువాత ప్రవక్త (స) మక్కహ్లో 10 సంవత్సరాలు గడిపారు. మదీనహ్లో 10 సంవత్సరాలు గడిపారు. అల్లాహ్ (త), అతనికి (స), 60 సంవత్సరాల వయస్సులో మరణం ప్రసాదించాడు. ప్రవక్త (స) తలలో, గడ్డంలో తెల్లని 20 వెంట్రుకలు కూడా ఉండేవి కావు.
మరో ఉల్లేఖనంలో అనస్ (ర) ప్రవక్త (స) రూపు రేఖల్ని గురించి ప్రస్తావిస్తూ ప్రవక్త (స) మధ్యస్థ పొడవు కలిగి ఉండేవారు, స్వచ్ఛమైన రంగు కలిగి మెరుస్తూ ఉండేవారు.” అనస్ (ర) ఇలా కూడా ఉల్లేఖించారు, ”ప్రవక్త (స) వెంట్రుకలు సగం చెవుల వరకు ఉండేవి. మరో ఉల్లేఖనంలో ప్రవక్త (స) వెంట్రుకలు చెవులకు మెడకు మధ్య ఉండేవి,” అని అన్నారు.[11](బు’ఖారీ, ముస్లిమ్)
బు’ఖారీలోని ఒక ఉల్లేఖనంలో అనస్ (ర) కథనం: ప్రవక్త (స) తల పెద్దదిగా ఉండేది, కాళ్ళు దృఢంగా ఉండేవి. అటువంటి వ్యక్తిని అంతకు ముందు చూడలేదు. తరువాత చూడలేదు. అతని(స) అరచేతులు విశాలంగా ఉండేవి.
బు’ఖారీలోని మరో ఉల్లేఖనంలో, ”ప్రవక్త (స) కాళ్ళూ మరియు అరచేతులు చాలా దృఢంగా మాంసంతో నిండి ఉండేవి,” అని ఉంది.
5783 – [ 8 ] ( مُتَّفَقٌ عَلَيْهِ ) (3/1610)
وَعَنِ الْبَرَاءِ قَالَ: كَانَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم مَرْبُوْعًا بَعِيْدَ مَا بَيْنَ الْمَنْكَبَيْنِ لَهُ شَعْرٌ بَلَغَ شَحْمَةَ أُذُنَيْهِ رَأَيْتُهُ فِيْ حُلَّةٍ حَمْرَاءَ لَمْ أَرَ شَيْئًا قَطُّ أَحْسَنَ مِنْهُ. مُتَّفَقٌ عَلَيْهِ.
وَفِيْ رِوَايَةٍ لِمُسْلِمٍ قَالَ: مَا رَأَيْتُ مِنْ ذِيْ لِمَّةٍ أَحْسَنَ فِيْ حُلَّةٍ حَمْرَاءَ مِنْ رَسُوْلِ الله صلى الله عليه وسلم شَعْرُهُ يَضْرِبُ مَنْكِبَيْهِ بَعِيْدٌ مَا بَيْنَ الْمَنْكِبَيْنِ لَيْسَ بِالطَّوِيْلِ وَلَا بِالْقَصِيْرِ.
5783. (8) [3/1610– ఏకీభవితం]
బరా’ బిన్ ‘ఆజిబ్ (ర) కథనం: ప్రవక్త (స) మధ్యస్థ పొడవు కలిగి ఉండేవారు. ప్రవక్త (స) భుజాల మధ్య భాగం చాలా విశాలంగా ఉండేది. ప్రవక్త (స) వెంట్రుకలు చెవుల చివరి వరకు ఉండేవి. ఇంకా నేను ప్రవక్త (స)ను ఎర్రని దుస్తుల్లో చూచాను, ప్రవక్త (స) కంటే అందమైన వస్తువును నేను చూడనే లేదు.[12](బు’ఖారీ, ముస్లిమ్)
ముస్లిమ్ ఉల్లేఖనంలో ఇలా ఉంది, ”బరా’ (ర) కథనం: పొడవైన వెంట్రుకలు కలిగి, ఎర్రని దుస్తుల్లో ప్రవక్త (స) కంటే అందమైన వ్యక్తిని నేను చూడలేదు. ప్రవక్త (స) వెంట్రుకలు భుజాల వరకు ఉండేవి. ప్రవక్త (స) భుజాల మధ్యభాగం విశాలంగా ఉండేది. ఇంకా ప్రవక్త (స) సాధారణమైన పొడవు కలిగి ఉండేవారు.
5784 – [ 9 ] ( صحيح ) (3/1611)
وَعَنْ سَمَاكِ بْنِ حَرْبٍ عَنْ جَابِرِ بْنِ سَمُرَةَ قَالَ: كَانَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم ضَلِيْعَ الْفَمِ أَشْكَلَ الْعَيْنَيْنِ مَنْهُوْشَ الْعَقِبَيْنِ قِيْلَ لِسِمَاكٍ: مَا ضَلِيْعُ الْفَمِ؟ قَالَ: عَظِيْمُ الْفَم. قِيْلَ: مَا أَشْكَلُ الْعَيْنِ؟ قَالَ: طَوِيْلُ شِقِّ الْعَيْنِ. قِيْلَ: مَا مَنْهُوْشُ الْعَقِبَيْنِ؟ قَالَ: قَلِيْلُ لَحْمِ الْعَقِبِ. رَوَاهُ مُسْلِمٌ
5784. (9) [3/1611–దృఢం]
సిమాక్ బిన్ ‘హర్బ్, జాబిర్ బిన్ సమురహ్ (ర) కథనం: ప్రవక్త (స) విశాలమైన ముఖం కలిగి ఉండే వారు, ప్రవక్త (స) కళ్ళు ఎరుపు రంగు కలిగి ఉండేవి, చీల మండలపై తక్కువ మాంసం కలిగి ఉండేవారు. సిమాక్‌ను ‘దలీఉల్‌ఫమ్, అంటే ఏమిటని ప్రశ్నించటం జరిగింది. దానికతను, ‘పెద్దతల గలవారు,’ అని అన్నారు. ఇంకా అతన్ని కళ్ళ గురించి అడగ్గా పెద్ద కళ్ళు గలవారని అన్నారు. ఇంకా అతన్ని చీల మండల గురించి ప్రశ్నించగా పైన మాంసము లేని చీలమండలు, అని అన్నారు. (ముస్లిమ్)
5785 – [ 10 ] ( صحيح ) (3/1611)
وعَنْ أَبِي الطُّفَيْلِ قَالَ: رَأَيْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم كَانَ أَبْيَضُ مَلِيْحًا مُقَصَّدًا”. رَوَاهُ مُسْلِمٌ.
5785. (10) [3/1611–దృఢం]
అబూ ‘తుఫైల్ (ర) కథనం: ప్రవక్త (స) తెల్లగా ఉప్పు లవణాకారంలో ఉండేవారు. ఇంకా మధ్యస్థ శరీరం కలిగి ఉండేవారు. (ముస్లిమ్)
5786 – [ 11 ] ( مُتَّفَقٌ عَلَيْهِ ) (3/1611)
وَعَنْ ثَابِتٍ قَالَ: سُئِلَ أَنَسٌ عَنْ خِضَابِ رَسُوْلِ الله صلى الله عليه وسلم فَقَالَ: إِنَّهُ لَمْ يَبْلُغْ مَا يَخْضِبُ لَوْ شِئْتُ أَنْ أَعُدَّ شَمَطَاتِهِ فِيْ لِحْيَتِهِ –
وَفِيْ رِوَايَةٍ: لَوْ شِئْت أَنْ أَعُدَّ شَمَطَاتٍ كُنَّ فِيْ رَأْسِهِ – فَعَلْتُ. مُتَّفَقٌ عَلَيْهِ.
وَ فِي رِوَيَةٍ لِمًسْلِمٍ: قَال إنَّمَا كانَ البِيَاضُ فِي أنْفَقَتِهِو فيِالصُّدغينِ و في الرَّاسِ نَبْذٌ.
5786. (11) [3/1611– ఏకీభవితం]
సా’బిత్ (ర) కథనం: అనస్ (ర)ను ప్రవక్త (స) వెంట్రుకలకు వేసే రంగు గురించి ప్రశ్నించటం జరిగింది. దానికి అతను రంగు ఉపయోగించేటటు వంటి వయస్సుకు ప్రవక్త ఇంకా చేరలేదు. ఒకవేళ నేను ప్రవక్త (స) గడ్డంలోని తెల్లని వెంట్రుకలను లెక్కపెట్ట గోరితే లెక్కపెట్ట గలిగే వాణ్ణి.
మరో ఉల్లేఖనంలో ఇలా ఉంది, ”ఒకవేళ నేను ప్రవక్త (స) తలలోని తెల్లవెంట్రుకలను లెక్క పెట్టాలనుకుంటే లెక్క పెట్ట గలిగే వాణ్ణి.” (బు’ఖారీ, ముస్లిమ్)
ముస్లిమ్‌లోని ఒక ఉల్లేఖనంలో ఇలా ఉంది, ”అనస్ (ర) కథనం: ప్రవక్త (స) గడ్డం క్రింద భాగంలో కొన్ని వెంట్రుకలు, చెవి గూబల వద్ద కొన్ని వెంట్రుకలు, తలలో కొన్ని వెంట్రుకలు తెల్లగా ఉండేవి.
5787 – [ 12 ] ( مُتَّفَقٌ عَلَيْهِ ) (3/1611)
وَعَنْ أَنَسٍ قَالَ: كَانَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم أَزْهَرَ اللَّوْنِ كَأَنَّ عِرَقَهُ اللُّؤْلُؤُ إِذَا مَشَى تَكَفَّأَ وَمَا مَسِسْتُ دِيْبَاجَةً وَلَا حَرِيْرًا أَلْيَنَ مِنْ كَفِّ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم وَلَا شَمَمْتُ مِسْكًا وَلَا عَنْبَرَةَ أَطْيَبَ مِنْ رَائِحَةِ النَّبِيِّ صلى الله عليه وسلم. مُتَّفَقٌ عَلَيْهِ.
5787. (12) [3/1611 –ఏకీభవితం]
అనస్ (ర) కథనం: ప్రవక్త (స) రంగులో మెరుపు ఉండేది. ప్రవక్త (స) చెమట చుక్కలు ముత్యాల్లా ఉండేవి. ప్రవక్త (స) నడిచేటప్పుడు ముందుకు వంగి నడిచేవారు. నేను పట్టు, జరీని కూడా ప్రవక్త (స) అరచేతులంత మెత్తగా ఉండటం చూడలేదు. ఇంకా కస్తూరిని కూడా ప్రవక్త (స) శరీరమంత సువాసన గలదిగా ఉండటం చూడలేదు. (బు’ఖారీ, ముస్లిమ్)
5788 – [ 13 ] ( مُتَّفَقٌ عَلَيْهِ ) (3/1611)
وَعَنْ أُمِّ سُلَيْمٍ أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم كَانَ يَأْتِيْهَا فَيَقِيْلُ عِنْدَهَا فَتَبْسُطُ نِطْعًا فَيَقِيْلُ عَلَيْهِ وَكَانَ كَثِيْرَ الْعَرَقِ فَكَانَتْ تَجْمَعُ عَرَقَهُ فَتَجْعَلَهُ فِي الطِّيْبِ. فَقَالَ النَّبِيُّ صلى الله عليه وسلم: “يَا أُمّ سُلَيْمٍ مَا هَذَا؟” قَالَتْ: عَرَقُكَ نَجْعَلُهُ فِيْ طِيْبِنَا وَهُوَ مِنْ أَطْيَبِ الطِّيْبِ.
وَفِيْ رِوَايَةٍ قَالَتْ: يَا رَسُوْلَ اللهِ نَرْجُوْ بَرَكَتَهُ لِصِبْيَانِنَا قَالَ: “أَصَبْتِ”. مُتَّفَقٌ عَلَيْهِ.
5788. (13) [3/1611 –ఏకీభవితం]
ఉమ్మె సులైమ్ (ర) కథనం: ప్రవక్త (స) ఆమె ఇంటికి వెళ్ళి ఖైలూలహ్ చేసేవారు. ఉమ్మె సులైమ్ ప్రవక్త (స) కొరకు చర్మం పరిచేవారు. దానిపై ప్రవక్త (స) మధ్యాహ్నం విశ్రాంతి తీసుకునేవారు. ప్రవక్త (స)కు చెమట అధికంగా వచ్చేది. ఉమ్మె సులైమ్ ప్రవక్త (స) చెమటను భద్రపరచుకునే వారు. దాన్ని అత్తరులో కలుపుకునేవారు. ఒకసారి ప్రవక్త (స) ఆమె చెమట భద్రపరచటం చూచి, ‘ఓ ఉమ్మె సులైమ్ ఇది ఏమిటి?’ అని అడిగారు. దానికి ఉమ్మె సులైమ్, ‘ఇది తమరి చెమట, దాన్ని నేను అత్తరులో కలుపు కుంటాను. ఎందుకంటే తమరి చెమట సువాసన లన్నిటిలో ఉత్తమ సువాసన,’ అని అన్నారు. మరో కథనంలో ఉమ్మె సులైమ్, ‘ఓ అల్లాహ్ ప్రవక్తా! మేము మా పిల్లల కోసం దీన్ని శుభంగా భావిస్తాం,’ అని అన్నారు. దానికి ప్రవక్త (స), ‘నువ్వు మంచి పనిచేసావు,’ అని అన్నారు. [13] (బు’ఖారీ, ముస్లిమ్)
5789 – [ 14 ] ( صحيح ) (3/1612)
وعَنْ جَابِرِ بْنِ سَمُرَةَ قَالَ: صُلَّيْتُ مَعَ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم صَلَاةَ الْأُوْلَى ثُمَّ خَرَجَ إِلى أَهْلِهِ وَخَرَجْتُ مَعَهُ فَاسْتَقْبَلَهُ وِلْدَانٌ فَجَعَلَ يَمْسَحُ خَدَّيْ أَحَدِهُمْ وَاحِدًا وَاحِدًا وَأَمَّا أَنَا فَمَسَحَ خَدَّيَّ فَوَجَدْتُ لِيَدِهِ بَرْدًا وَرِيْحًا كَأَنَّمَا أَخْرَجَهَا مِنْ جُؤْنَةِ عَطَّارٍ. رَوَاهُ مُسْلِمٌ.
وَذُكِرَ حَدِيْثُ جَابِرٍ:”سَمُّوْا بِاِسْمِيْ” فِيْ “بَابِ الْأَسَامِيْ”
وَحَدِيْثُ السَّائِبِ بْنِ يَزِيْدَ: نَظَرْتُ إِلى خَاتَمِ النُّبُوَّةِ فِيْ”بَابِ أَحْكَامِ الْمِيَاهِ”.
5789. (14) [3/1612 –దృఢం]
జాబిర్ బిన్ సమురహ్ (ర) కథనం: ఒక రోజు నేను ప్రవక్త (స) వెంట ”జుహ్‌ర్ నమా’జు చదివాను. నమా’జు ముగిసిన తరువాత ప్రవక్త (స) తన ఇంటికి వెళ్ళడానికి బయలు దేరారు. ఆయన వెంట నేను కూడా బయటకు వచ్చాను. ప్రవక్త (స) ముందుకు కొంతమంది పిల్లలు వచ్చారు. ప్రవక్త (స) వారిలో ప్రతి ఒక్కరి బుగ్గపై చేయితో నిమిరారు. ఆ తరువాత నా బుగ్గపై కూడా చేయితో నిమిరారు. అప్పుడు నేను అతని(స) చేతి చల్లదనాన్ని సువాసనను పొందాను. అంటే సువాసనలో నుండి చేయిని తీసినట్టు అనిపించింది. (ముస్లిమ్)
జాబిర్ (ర) ఉల్లేఖనంలో ఇలా ఉంది, ”నాలాంటి పేరు పెట్టండి” అని ఉంది.
ఇంకా సాయిబ్ బిన్ య’జీద్ ఉల్లేఖనంలో ఇలా ఉంది, ”నేను దైవదౌత్య ముద్రను చూసాను” అని ఉంది. అయితే దీన్ని, ”బాబు అహ్‌కామిల్ మియా‘ ”లో ఇంతకు ముందు పేర్కొనడం జరిగింది.
—–
اَلْفَصْلُ الثَّانِيْ రెండవ విభాగం
5790 – [ 15 ] ( صحيح ) (3/1612)
عَنْ عَلِيِّ بْنِ أَبِيْ طَالِبٍ قَالَ: كَانَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم لَيْسَ بِالطَّوِيْلِ وَلَا بِالْقَصِيْرِضَخْمَ الرَّأْسِ وَاللِّحْيَةِ شَئَنَ الْكَفَّيْنِ وَالْقَدَمَيْنِ مُشْرَبًا حُمْرَةً ضَخْمَ الْكَرَادِيْسِ طَوِيْلَ الْمَسْرُبَةِ إِذَا مَشَى تَكَفّأً تَكَفُّأً كَأَنَّمَا يَنْحَطُّ مِنْ صَبَبٍ لَمْ أَرَقَبْلَهُ وَلَا بَعْدَهُ مِثْلَهُ صَلى الله عليه وسلم. رَوَاهُ التِّرْمِذِيُّ وَقَالَ :هَذَا حَدِيْثٌ حَسَنٌ صَحِيْحٌ.
5790. (15) [3/1612 –దృఢం]
‘అలీ బిన్ అబీ ‘తాలిబ్ (ర) కథనం: ప్రవక్త (స) అంత పొడవుగా లేదా అంత పొట్టిగా ఉండేవారు కారు. సాధారణ మైన పొడవు కలిగి ఉండేవారు. ప్రవక్త (స) తల పెద్దదిగా, గడ్డం దట్టంగా ఉండేది. ప్రవక్త (స) కాళ్ళూ, అరచేతులూ మాంసంతో నిండి ఉండేవి. ప్రవక్త (స) రంగు తెలుపు, ఎరుపుల మిశ్రమ రంగులో ఉండేవారు. ప్రవక్త (స) కీళ్ళు చాలా దృఢంగా ఉండేవి. ఛాతీనుండి నాభివరకు వెంట్రుకల పొడవైన గీత ఉండేది. ప్రవక్త (స) నడచినపుడు ముందుకు వంగి నడిచేవారు. అంటే ఎత్తు నుండి పల్లానికి వస్తున్నట్లు నేను ప్రవక్త (స) వంటి వ్యక్తిని ఆయనకు ముందు గానీ ఆయన తరువాత గానీ చూడలేదు.” (తిర్మిజి’ / ప్రామాణికం, దృఢం)
5791 – [ 16 ] ( ضعيف ) (3/1612)
وعَنْهُ كَانَ إِذَا وَصَفَ النَّبِيُّ صلى الله عليه وسلم قَالَ: لَمْ يَكُنْ بِالطَّوِيْلِ الْمُمَغَّطِ وَلَا بِالْقَصِيْرِ المُتَرَدِّدِ وَكَانَ رَبْعَةً مِنَ الْقَوْمِ وَلَمْ يَكُنْ بِالْجَعْدِ الْقَطِطِ وَلَا بِالسَّبْطِ كَانَ جَعْدًا رَجْلًا وَلَمْ يَكُنْ بِالْمُطَهَّمِ وَ لَا بِالْمُكَلثَمِ وَكَانَ فِي الْوَجْهِ تَدْوِيْرٌ أَبْيَضُ مُشْرَبٌ أَدْعَجُ الْعَيْنَيْنِ أَهْدَبُ الْأَشْفَارِ جَلِيْلُ الْمُشَاشِ وَالْكَتِدِ أَجْرَدُ ذُوْ مَسْرُبَةٍ شَئَنُ الْكَفَّيْنِ وَ الْقَدَمَيْنِ إِذَا مَشَى يَتَقَلَّعُ كَأَنَّمَا يَمْشِيْ فِيْ صَبَبٍ وَإِذَا الْتَفَتَ الْتَفَتَ مَعًا بَيْنَ كَتِفَيْهِ خَاتَمُ النَّبُوَّةِ وَهُوَ خَاتَمُ النَّبِيِّيْنَ أَجْوَدُ النَّاسِ صَدْرًا وَأَصْدَقُ النَّاسِ لَهْجَةً وَأَلْيَنُهُمْ عَرِيْكَةً وَأَكْرَمُهُمْ عَشِيْرَةً مِنْ رَآهُ بَدِيْهَةً هَابَهُ وَمَنْ خَالَطَهُ مَعْرِفَةً أَحَبَّهُ يَقُوْلُ نَاعِتُهُ: لَمْ أَرَ قَبْلَهُ وَلَا بَعْدَهُ مِثْلَهُ صلى الله عليه وسلم. رَوَاهُ التِّرْمِذِيُّ.
5791. (16) [3/1612 –బలహీనం]
‘అలీ బిన్ అబీ ‘తాలిబ్ (ర) కథనం: అతడు(ర), ప్రవక్త (స) గురించి వివరించదలిస్తే, ఇలా అనేవారు, ”ప్రవక్త (స) అంత పొడుగ్గా కాకుండా, అంత పొట్టిగా కాకుండా మధ్యస్థ పొడవు కలిగి ఉండేవారు. ప్రవక్త (స) వెంట్రుకలు ఉంగరాల జుట్టుకు, తిన్నని జుట్టుకు మధ్య ఉండేవి. అదేవిధంగా ప్రవక్త (స) తల పూర్తిగా గుండ్రంగా కాక కొంత గుండ్రంగా ఉండేది, బుగ్గలు కూడా ఉబ్బి ఉండేవి కావు. ప్రవక్త (స) తెలుపు, ఎరుపు మిశ్రమ రంగు కలిగి ఉండేవారు. కళ్ళు నల్లగా ఉండేవి. కనురెప్పల వెంట్రుకలు పొడవుగా ఉండేవి. కీళ్ళు ఉబ్బి దృఢంగా ఉండేవి. భుజాలు దృఢంగా ఉండేవి. శరీరంపై వెంట్రుకలు ఉండేవికావు. అయితే ఛాతీనుండి నాభి వరకు వెంట్రుకల గీత ఉండేది. ప్రవక్త (స) అరచేతులు, రెండు కాళ్ళూ నిండి ఉండేవి. అంటే మాంసంతో నిండి ఉండేవి. నడచినపుడు అడుగు బలంతో వేసేవారు, పై నుండి క్రిందికి దిగుతున్నట్టు. ఇంకా ప్రవక్త (స) కుడి లేదా ఎడమ వైపు తిరిగినపుడు పూర్తి శరీరంతో తిరిగే వారు. ఇంకా ప్రవక్త (స) రెండు భుజాల మధ్య దైవదౌత్య ముద్ర ఉండేది. ఇంకా ప్రవక్త (స) అంతిమ ప్రవక్త. ప్రవక్త (స) అందరికంటే దాతృత్వం మరియు అందరికంటే అధికంగా సత్యం పలికేవారు. ప్రవక్త (స) అందరికంటే ఎక్కువ సున్నిత స్వభావం, అందరికంటే గౌరవ మర్యాదలు కలిగి ఉండేవారు. ఎవరైనా అకస్మాత్తుగా చూస్తే అతనిపై భయం ఆవరించేది. ఇంకా ఎవరైనా ప్రవక్త (స)తో పరిచయం అయితే, ప్రవక్త (స)ను చాలా అధికంగా ప్రేమించేవారు. ప్రవక్త (స) గుణగణాలను గురించి తెలిపే ‘అలీ (ర) ప్రవక్త (స) వంటి వ్యక్తిని అతనికి ముందు గానీ, అతని తర్వాత గానీ చూడ లేదు, అతని (స) పై శాంతి వర్ధిల్లుగాక!” అని అన్నారు. (తిర్మిజి’)
5792 – [ 17 ] ( لم تتم دراسته ) (3/1613)
وَعَنْ جَابِرٍ أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم لَمْ يَسْلُكْ طَرِيْقًا فَيَتْبَعُهُ أَحَدٌ إِلَّا عَرَفَ أَنَّهُ قَدْ سَلَكَهُ مِنْ طِيْبِ عَرَقِهِ – أَوْ قَالَ: مِنْ رِيْحِ عَرَقِهِ –. روَاهُ الدَّارَمِيُّ.
5792. (17) [3/1613– అపరిశోధితం]
జాబిర్ (ర) కథనం: ప్రవక్త (స) ఏదైనా మార్గం నుండి నడచినపుడు, అతని(స) తర్వాత ఆ మార్గం గుండా ఎవరైనా వెళితే, ప్రవక్త (స) శరీర సువాసన లేదా ప్రవక్త (స) చెమట సువాసన ద్వారా ఈ మార్గం గుండా ప్రవక్త (స) వెళ్ళి ఉన్నారని తెలుసుకునేవారు. (దార్మీ)
5793 – [ 18 ] ( لم تتم دراسته ) (3/1613)
وعَنْ أَبِيْ عُبَيْدَةَ بْنِ مُحَمَّدِ بْنِ عَمَّارِ بْنِ يَاسِرٍ قَالَ: قُلْتُ لِلرُّبَيْعِ بِنْتِ مُعَوِّذِ بْنِ عَفْرَاءَ: صِفِيْ لَنَا رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم. قَالَتْ: يَا بُنَيَّ لَوْ رَأَيْتَهُ رَأَيْتَ الشَّمْسَ طَالِعَةً. رَوَاهُ الدَّارَمِيُّ .
5793. (18) [3/1613– అపరిశోధితం]
అబూ ‘ఉబైదహ్ ము’హమ్మద్ బిన్ ‘అమ్మార్ బిన్ యాసిర్ (ర) కథనం: నేను ము’అవ్వజ్’ బిన్ ‘అఫ్రా కూతురు రబీ’అను ప్రవక్త (స) రూపురేఖల్ని గురించి తెలుపమని కోరాను. దానికి ఆమె, ”ఓ కుమారా! ఒక వేళ నువ్వు ప్రవక్త(స)నుచూస్తే, మెరుస్తున్న సూర్యుణ్ణి చూచినట్లు భావిస్తావు,” అని అన్నారు. (దార్మీ)
5794 – [ 19 ] ( لم تتم دراسته ) (3/1613)
وعَنْ جَابِرٍ بْنِ سَمُرَةَ قَالَ: رَأَيْتُ النَّبِيَّ صلى الله عليه وسلم فِيْ لَيْلَةٍ إِضْحِيَانٍ فَجَعَلْتُ أَنْظُرُ إِلى رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم وَإِلَى الْقَمَرِ وَعَلَيْهِ حُلَّةٌ حَمْرَاءُ فَإِذَا هُوَ أَحْسَنُ عِنْدِيْ مِنَ الْقَمَرِ. رَوَاهُ التِّرْمِذِيُّ وَالدَّارَمِيُّ .
5794. (19) [3/1613– అపరిశోధితం]
జాబిర్ బిన్ సమురహ్ (ర) కథనం: నేను ప్రవక్త (స) ను వెన్నెల రాత్రిలో చూచాను. అప్పుడు నా పరిస్థితి ఎలా ఉందంటే అటు చంద్రుణ్ణి చూస్తాను, ఇటు ప్రవక్త (స)ను చూస్తాను. అప్పుడు ప్రవక్త (స) ఎర్రని దుస్తులు ధరించి ఉన్నారు. నా దృష్టిలో ప్రవక్త (స) చంద్రుని కంటే ఎంతో అందంగా ఉన్నారు. [14] (తిర్మిజి’, దార్మీ)
5795 – [ 20 ] ( ضعيف ) (3/1614)
وعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: مَا رَأَيْتُ شَيْئًا أَحْسَنَ مِنْ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم كَأَنَّ الشَّمْسَ تَجْرِيْ عَلَى وَجْهِهِ وَمَا رَأَيْتُ أَحَدًا أَسْرَعَ فِيْ مَشْيِهِ مِنْ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم كَأَنَّمَا الْأَرْضُ تُطْوَى لَهُ إِنَّا لَنَجْهَدُ أَنْفُسَنَا وَإِنَّهُ لَغَيْرُ مُكْتَرِثٍ. رَوَاهُ التِّرْمِذِيُّ .
5795. (20) [3/1614 బలహీనం]
అబూ హురైరహ్ (ర) కథనం: నేను ప్రవక్త (స)కంటే అందంగా ఉన్నవారినెవరినీ చూడలేదు. సూర్యుడు ప్రవక్త (స) ముఖారవిందం నుండి ఉదయిస్తున్నట్టు ఉండేది. అదే విధంగా ప్రవక్త (స) కంటే వేగంగా నడిచే వారెవరినీ నేను చూడలేదు. భూమి చుట్టు కుంటున్నట్టు అనిపించేది. మేము శ్రమతో, కృషితో నడిచే వాళ్ళం కాని ప్రవక్త (స) ఎటువంటి ఆపేక్షాభావం లేకుండా నడిచేవారు. (తిర్మిజి’)
5796 – [ 21 ] ( لم تتم دراسته ) (3/1614)
وعَنْ جَابِرِ بْنِ سَمُرَةَ قَالَ: كَانَ فِيْ سَاقَيْ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم حَمُوْشَةٌ وَكَانَ لَا يَضْحَكُ إِلَّا تَبَسُّمًا وَكُنْتُ إِذَا نَظَرْتُ إِلَيْهِ قُلْتُ: أَكْحَلُ الْعَيْنَيْنِ وَلَيْسَ بِأَكْحَلَ. رَوَاهُ التِّرْمِذِيُّ.
5796. (21) [3/1614– అపరిశోధితం]
జాబిర్ బిన్ సమురహ్ (ర) కథనం: ప్రవక్త (స) చీల మండలు సన్నంగామెత్తగాఉండేవి. సాధారణంగా ప్రవక్త (స) నవ్వేవారు కారు. చిరునవ్వు నవ్వేవారు. నేను ప్రవక్త (స) ను చూచినపుడు ప్రవక్త (స) కళ్ళకు సుర్మా పెట్టు కున్నారని అనుకునేవాణ్ణి. అయితే ప్రవక్త (స) కళ్ళకు సుర్మా పెట్టుకొని ఉండేవారు కాదు. (తిర్మిజి’)
—–
اَلْفَصْلُ الثَّالِثُ మూడవ విభాగం
5797 – [ 22 ] ( لم تتم دراسته ) (3/1614)
عَنِ ابْنِ عَبَّاسٍ قَالَ: كَانَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم أَفْلَجَ الثَّنِيَّتَيْنِ إِذَا تَكَلَّمَ رُئِيَ كَالنُّوْرِ يَخْرُجُ مِنْ بَيْنَ ثَنَايَاهُ. رَوَاهُ الدَّارَمِيُّ .
5797. (22) [3/1614 –అపరిశోధితం]
ఇబ్నె ‘అబ్బాస్ (ర) కథనం: ప్రవక్త (స) ముందు రెండు పళ్ళ మధ్య కొంత ఖాళీగా ఉండేది. ప్రవక్త (స) మాట్లాడి నపుడు ఆ రెండు పళ్ళమధ్య నుండి వెలుగు చిమ్ముతున్నట్టు అనిపించేది. (దార్మీ)
5798 – [ 23 ] ( مُتَّفَقٌ عَلَيْهِ ) (3/1614)
وَعَنْ كَعْبِ بْنِ مَالِكٍ قَالَ: كَانَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم إِذَا سُرَّ اِسْتَنَارَ وَجْهَهُ حَتّى كَأَنَّ وَجْهَهُ قِطْعَةُ قَمَرٍ وَكُنَّا نَعْرِفُ ذَلِكَ. مُتَّفَقٌ عَلَيْهِ.
5798. (23) [3/1614– ఏకీభవితం]
క’అబ్ బిన్ మాలిక్ (ర) కథనం: ప్రవక్త (స) సంతో షించి నపుడు, అతని (స) ముఖవర్చస్సు వెలుగుతో నిండిపోయేది. అతని (స) ముఖం చంద్రుడిలా ఉండేది. దాని ద్వారా అతని (స) హృదయ పరిస్థితిని గ్రహించే వాళ్ళం. (బు’ఖారీ, ముస్లిమ్)
5799 – [ 24 ] ( لم تتم دراسته ) (3/1614)
وعَنْ أَنَسٍ أَنَّ غُلَامًا يَهُوْدِيًّا كَانَ يَخْدِمُ النَّبِيّ صلى الله عليه وسلم فَمَرِضَ فَأَتَاهُ النَّبِيُّ صلى الله عليه وسلم يَعُوْدُهُ فَوَجَدَ أَبَاهُ عِنْدَ رَأْسِهِ يَقْرَأُ التَّوْرَاةَ. فَقَالَ لَهُ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “يَا يَهُوْدِيُّ أُنْشِدُكَ بِاللهِ الَّذِيْ أَنْزَلَ التَّوْرَاةَ عَلَى مُوْسَى هَلْ تَجِدُ فِي التَّوْرَاةِ نَعْتِيْ وَصِفَتِيْ وَمَخْرَجِيْ؟” قَالَ: لَا. قَالَ اَلْفَتَى: بَلَى وَاللهِ يَا رَسُوْلَ اللهِ إِنَّا نَجِدُ لَكَ فِي التَّوْرَاةِ نَعْتَكَ وَصِفَتَكَ وَمَخْرَجَكَ وَإِنِّيْ أَشْهَدُ أَنْ لَا إِلَهَ إِلَّا اللهُ وَأَنَّكَ رَسُوْلُ اللهِ. فَقَالَ النَّبِيُّ صلى الله عليه وسلم لِأَصْحَابِهِ: “أَقِيْمُوْا هَذَا مِنْ عِنْدَ رَأْسِهِ وَلَوْا أَخَاكُمْ” . رَوَاهُ الْبَيْهَقِيُّ فِيْ “دَلَائِلِ النُّبُوَّةِ”.
5799. (24) [3/1614– అపరిశోధితం]
అనస్ (ర) కథనం: ఒక యూద బాలుడు ప్రవక్త (స)కు సేవకుడుగా ఉండేవాడు. అతడు అనారోగ్యానికి గురైతే ప్రవక్త (స) అతన్ని పరా మర్శించడానికి వెళ్ళారు. ఆ బాలుని తండ్రి తలవద్ద కూర్చొని తౌరాతు పఠిస్తున్నాడు. అది చూచిన ప్రవక్త (స) ఆ యూదునితో, ”మూసా (అ)కు తౌరాతు ప్రసా దించిన ఆ అల్లాహ్(త) సాక్షి! నువ్వు తౌరాతులో నా గుణగణాలనుగురించి చూసావా?” అని ప్రశ్నించారు. ఆ యూదుడు, ”లేదు,” అని సమాధానం ఇచ్చాడు. కాని ఆ బాలుడు, ”అవును ఓ ప్రవక్తా! మేము తౌరా తులో మీ గుణ గణాలను గురించి, మీ దైవదౌత్యం గురించి చూసాము, మరి నేను అల్లాహ్ (త) తప్ప ఆరాధ్యులెవరూ లేరని, మీరు అల్లాహ్ (త) ప్రవక్తలని సాక్ష్యం ఇస్తున్నాను,” అని అన్నాడు.
అప్పుడు ప్రవక్త (స) తన అనుచరులతో, ”అతని తండ్రిని అక్కడి నుండి తొలగించి, మీరు మీ ధార్మిక సోదరుని సంరక్షకులు కండి. ఒకవేళ ఈ బాలుడు మరణిస్తే, అతని ఖనన సంస్కారాలు మీరు నిర్వర్తించండి,” అని అన్నారు. (బైహఖీ-దలాయిలు న్నుబువ్వహ్)
5800 – [ 25 ] ( صحيح ) (3/1615)
وَعَنْ أَبِيْ هُرَيْرَةَ عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم أَنَّهُ قَالَ: “إِنَّمَا أَنَا رَحْمَةٌ مُهْدَاةٌ”. رَوَاهُ الدَّارَمِيُّ وَالْبَيْهَقِيُّ فِيْ”شُعَبِ الْإِيْمَانِ”.
5800. (25) [3/1615 –దృఢం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”వాస్తవం ఏమిటంటే, నేను అల్లాహ్(త) తరఫు నుండి పంపబడిన కారుణ్యాన్ని.” (దార్మీ, బైహఖీ / -షు’అబిల్ ఈమాన్)
=====
3 – بَابٌ فِيْ أَخْلَاقِهِ وَشَمَائِلِهِ صلى الله عليه وسلم
3. ప్రవక్త (స) నైతికత, అలవాట్లు
اَلْفَصْلُ الْأَوَّلُ మొదటి విభాగం
5801 – [ 1 ] ( مُتَّفَقٌ عَلَيْهِ ) (3/1616)
عَنْ أَنَسٍ قَالَ: خَدَمْتُ النَّبِيَّ صلى الله عليه وسلم عَشْرَ سِنِيْنَ فَمَا قَالَ لِيْ: أُفٍّ وَلَا: لَمْ صَنَعْتَ؟ وَلَا: أَلَا صَنَعْتَ؟ مُتَّفَقٌ عَلَيْهِ.
5801. (1) [3/1616– ఏకీభవితం]
అనస్ (ర) కథనం: ప్రవక్త (స) సేవలో నేను 10 సంవత్సరాలు ఉన్నాను. ఈ మధ్య కాలంలో అతను(స) నన్ను రవ్వంత విధంగానైనా కసరలేదు, ఇంకా, ”ఈ పని ఎందుకు చేసావు? లేదా ఈ పని ఎందుకు చేయలేదు,” అని కూడా అనలేదు. (బు’ఖారీ, ముస్లిమ్)
5802 – [ 2 ] ( صحيح ) (3/1616)
وَعَنْهُ قَالَ: كَانَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم مِنْ أَحْسَنِ النَّاسِ خُلُقًا فَأَرْسَلَنِيْ يَوْمًا لِحَاجَةٍ فَقُلْتُ: وَاللهِ لَا أَذْهَبَ. وَفِيْ نَفْسِيْ أَنْ أَذْهَبَ لِمَا أَمَرَنِيْ بِهِ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم فَخَرَجْتُ حَتّى أَمُرَّ عَلَى صِبْيَانٍ وَهُمْ يَلْعَبُوْنَ فِي السُّوْقِ فَإِذَا بِرَسُوْلِ الله صلى الله عليه وسلم قَدْ قَبَضَ بِقَفَايَ مِنْ وَرَائِيْ. قَالَ: فَنَظَرْتُ إِلَيْهِ وَهُوَ يَضْحَكُ فَقَالَ: “يَا أُنَيْسُ ذَهَبْتَ حَيْثُ أَمَرْتُكَ؟” قُلْتُ: نَعَمْ أَنَا أَذْهَبُ يَا رَسُوْلَ اللهِ. رَوَاهُ مُسْلِمٌ.
5802. (2) [3/1616– దృఢం]
అనస్ (ర) కథనం: ప్రవక్త (స) అందరికంటే ఎక్కువ సద్గుణ సంపన్నులు. ఒకరోజు ప్రవక్త (స) ఒక పని మీద నన్ను పంపారు. దానికి నేను నా మనసులో తప్ప కుండా వెళ్ళాలి అని ఉన్నా, అల్లాహ్ సాక్షి! ‘నేను వెళ్ళను,’ అని అన్నాను. అనంతరం నేను బయలు దేరాను. బజారు ప్రక్కనుండి వెళుతూఉండగా, అక్కడ కొందరు పిల్లలు ఆడుకుంటున్నారు. అక్కడ నేను నిలబడిపోయాను. అకస్మాత్తుగా ప్రవక్త (స) నా వెనుక నుండి నా తల క్రింది భాగాన్ని పట్టు కున్నారు. నేను మరలి చూసేసరికి ప్రవక్త (స) చిరునవ్వు నవ్వి, ”ఓ ఉనైస్! నేను చెప్పిన చోటికి నీవు వెళుతున్నావా?” అని అడిగారు, నేను, ”అవును ప్రవక్తా! నేను వెళుతున్నాను” అని అన్నాను. (ముస్లిమ్)
5803 – [ 3 ] ؟ (3/1616)
وَعَنْهُ قَالَ : كُنْتُ أَمْشِيْ مَعَ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم وَعَلَيْهِ بُرْدٌ نَجْرَانِيٌّ غَلِيْظُ الْحَاشِيَةِ فَأَدْرَكَهُ أَعْرَابِيٌّ فَجَبَذَهُ جَبْذَةً شَدِيْدَةً وَرَجَعَ نَبِيُّ اللهِ صلى الله عليه وسلم فِيْ نَحْرِ الْأَعْرَابِيِّ حَتّى نَظَرْتُ إِلى صَفْحَةِ عَاتِقِ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم قَدْ أَثَرَتْ بِهِ حَاشِيَةُ الْبُرْدِ مِنْ شِدّةِ جَبْذَتِهِ ثُمَّ قَالَ : يَا مُحَمَّدُ مُرْ لِيْ مِنْ مَالِ اللهِ الَّذِيْ عِنْدَكَ فَالْتَفَتَ إِلَيْهِ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم ثُمَّ ضَحَكَ ثُمَّ أَمَرَ لَهُ بِعَطَاءٍ. مُتَّفَقٌ عَلَيْهِ .
5803. (3) [3/1616– ? ]
అనస్ (ర) కథనం: ఒకరోజు నేను ప్రవక్త (స) వెంట నడుస్తున్నాను. ఆ సమయంలో ఆయన శరీరంపై గీతలు గల నజ్‌రాన్ దుప్పటి ఉంది. దాని మూలల్లో దారపు గిలకలు ఉన్నాయి. దారిలో ఒక బదూ’ ప్రవక్త (స)ను కలిసాడు. వాడు ప్రవక్త (స) దుప్పటి పట్టుకొని బలంగా లాగాడు. ప్రవక్త (స) జరిగి వాడికి చాలా దగ్గర య్యారు. ఆ వ్యక్తి అంత బలంగా లాగటం వల్ల ఆయన మెడపై దుప్పటి గీసుకోవటం వల్ల కొన్ని చిహ్నాలు పడ్డాయి. ఆ తరువాత ఆ బదూ’, ”ఓ ము’హమ్మద్! మీ దగ్గర ఉన్న అల్లాహ్ (త) ధనంలో నుండి నాకు ఇప్పించండి,” అని అన్నాడు. ప్రవక్త (స) అతని వైపు చూసి చిరునవ్వు నవ్వారు. ఆ తరువాత, అతనికి కొంత ఇవ్వమని ఆదేశించారు. (బు’ఖారీ, ముస్లిమ్)
5804 – [ 4 ] ( مُتَّفَقٌ عَلَيْهِ ) (3/1616)
وَعَنْهُ قَالَ: كَانَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم أَحْسَنَ النَّاسِ وَأَجْوَدَ النَّاسِ وَأَشْجَعَ النَّاسِ وَلَقَدْ فَزِعَ أَهْلُ الْمَدِيْنَةِ ذَاتَ لَيْلَةٍ فَانْطَلَقَ النَّاسُ قَبْلَ الصَّوْتِ فَاسْتَقْبَلَهُمُ النَّبِيُّ صلى الله عليه وسلم قَدْ سَبَقَ النَّاسَ إِلى الصَّوْتِ هُوَ يَقُوْلُ: “لَمْ تُرَاعُوْا لَمْ تُرَاعُوْا”. وَهُوَ عَلَى فَرَسٍ لِأَبِيْ طَلْحَةَ عُرْيٍ مَا عَلَيْهِ سَرْجٌ وَفِيْ عُنُقِهِ سَيْفٌ. فَقَالَ: “لَقَدْ وَجَدْتُهُ بَحْرًا”. مُتَّفَقٌ عَلَيْهِ.
5804. (4) [3/1616– ఏకీభవితం]
అనస్ (ర) కథనం: ప్రవక్త (స) అందరికంటే అందంగా ఉండేవారు, అందరికంటే దాతృత్వగుణం గలవారు ఇంకా అందరికంటే సాహసం, వీరత్వం గలవారు. ఒకరోజు రాత్రి మదీనహ్ ప్రజలు శత్రువు యొక్క శబ్దం విని ఆందోళన చెందారు, ప్రజలు శబ్దం వచ్చిన వైపునకు వెళ్ళారు. అక్కడ ప్రవక్త (స) ఉండటం చూచారు. అంటే ప్రవక్త (స) అందరికంటే ముందు శబ్దం వచ్చిన వైపునకు చేరుకున్నారు. ప్రవక్త (స) వారితో భయపడకండి! భయపడకండి! అని ఓదారు స్తున్నారు. అప్పుడు ప్రవక్త (స) అబూ ‘తల్’హా గుర్రంపై కూర్చొని ఉన్నారు. దానిపై జీను లేదు. ప్రవక్త (స) మెడలో కరవాలం ఉంది. ఆ తరువాత ప్రవక్త (స), ”నాకైతే ఈ గుర్రం చాలా వేగవంతమైనదిగా అనిపించింది,” అని అన్నారు. (బు’ఖారీ, ముస్లిమ్)
5805 – [ 5 ] ( مُتَّفَقٌ عَلَيْهِ ) (3/1617)
وَعَنْ جَابِرٍ قَالَ: مَا سُئِلَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم شَيْئًا قَطُّ فَقَالَ: لَا. مُتَّفَقٌ عَلَيْهِ.
5805. (5) [3/1617– ఏకీభవితం]
జాబిర్ (ర) కథనం: ప్రవక్త (స)ను ఎవరైనా ఏమైనా అడగటం, ప్రవక్త (స) తిరస్కరించటం ఎన్నడూ జరగ లేదు. (బు’ఖారీ, ముస్లిమ్)
5806 – [ 6 ] ( صحيح ) (3/1617)
وَعَنْ أَنَسٍ أَنَّ رَجُلًا سَأَلَ النَّبِيُّ صلى الله عليه وسلم غَنَمًا بَيْنَ جَبَلَيْنِ فَأَعْطَاهُ إِيَّاهُ فَأَتَى قَوْمَهُ فَقَالَ: أَيْ قَوْمٍ أَسْلِمُوْا فَوَ اللهِ إِنَّ مُحَمَّدًا لَيُعْطِيْ عَطَاءً مَا يَخَافُ الْفَقَرَ. رَوَاهُ مُسْلِمٌ .
5806. (6) [3/1617– దృఢం]
అనస్ (ర) కథనం: ప్రవక్త (స)ను ఒక వ్యక్తి వచ్చి లోయ నిండా అంటే అధిక సంఖ్యలో మేకలు కోరాడు. అనంతరం అతడు అడిగినన్ని మేకలు ప్రవక్త (స) ఇచ్చారు. ఆ తరువాత ఆ వ్యక్తి తన జాతి వారి వద్దకు వచ్చి, ఓ నా జాతి ప్రజలారా! ”ఇస్లామ్ స్వీకరించండి. అల్లాహ్(త) సాక్షి! నిస్సందేహంగా ప్రవక్త (స) ఎంత అధికంగా ఇస్తారంటే, ఆయన దారిద్య్రానికి కూడా భయపడరు,” అని అన్నాడు. (ముస్లిమ్)
5807 – [ 7 ] ( صحيح ) (3/1617)
وَعَنْ جُبَيْرِ بْنِ مُطْعِمٍ بَيْنَمَا هُوَ يَسِيْرُ مَعَ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم مَقْفَلَهُ مِنْ حُنَيْنٍ فَعَلِقَتِ الْأَعْرَابُ يَسْأَلُوْنَهُ حَتّى اضْطَرُّوْهُ إِلى سَمُرَةٍ فَخَطَفَتْ رِدَاءَهُ فَوَقَفَ النَّبِيُّ صلى الله عليه وسلم فَقَالَ: “أَعْطُوْنِيْ رِدَائِيْ لَوْ كَانَ لِيْ عَدَدُ هَذِهِ الْعِضَاةِ نَعَمٌ لَقَسَمْتُهُ بَيْنَكُمْ ثُمَّ لَا تَجِدُوْنِيْ بَخِيْلًا وَلَا كَذُوْبًا وَلَا جَبَانًا”. روَاهُ الْبُخَارِيُّ.
5807. (7) [3/1617 –దృఢం]
జుబైర్ బిన్ ము’త్’యిమ్ (ర) ప్రవక్త (స) వెంట ‘హునైన్ యుద్ధం నుండి తిరిగి వస్తున్నప్పటి సంఘటన కథనం: మార్గంలోని ఒక ప్రదేశంలో కొందరు పల్లెవాసులు ప్రవక్త (స) తో ఆలింగనం చేసారు. ప్రవక్త (స) యుద్ధ ధనం నుండి అడగసాగారు. మంకుపట్టు పట్టారు. ప్రవక్త (స)ను లాక్కుంటూ ఒక ముళ్ళ చెట్టు వద్దకు తీసుకువెళ్ళారు. అక్కడ ప్రవక్త (స) దుప్పటి ముళ్ళచెట్టులో చిక్కుకుంది. ప్రవక్త (స) అక్కడ ఆగి పోయారు. ఇంకా, ”నాకు నా దుప్పటి ఇచ్చివేయండి” అని అన్నారు. ”నేను వాటన్నిటినీ మీకు పంచుతాను, అప్పుడు మీరు నన్ను పిసినారి, అబద్ధాలకోరు, ఇరుకు హృదయం గలవాడుగా భావించరు,” అని అన్నారు. (బు’ఖారీ)
5808 – [ 8 ] ( صحيح ) (3/1617)
وَعَنْ أَنَسٍ قَالَ: كَانَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم إِذَا صَلّى الْغَدَاةَ جَاءَ خَدَمُ الْمَدِيْنَةِ بِآنِيَتِهِمْ فِيْهَا الْمَاءُ فَمَا يَأْتُوْنَ بِإِنَاءٍ إِلَّا غَمَسَ يَدَهُ فِيْهَا فَرُبَّمَا جَاؤُوْهُ بِالْغَدَاةِ الْبَارِدَةِ فَيَغْمِسُ يَدَهُ فِيْهَا. رَوَاهُ مُسْلِمٌ.
5808. (8) [3/1617– దృఢం]
అనస్ (ర) కథనం: ప్రవక్త (స) ఫజ్ర్ నమా’జ్ చదివిన తర్వాత, మదీనహ్ వాసుల సేవకులు (స్త్రీలు, పురుషులు) తమ గిన్నెల్లో నీళ్ళుతీసుకొని ప్రవక్త(స) వద్దకు చేరుకుంటారు. ప్రతి ఒక్కరి నీళ్ళలో ప్రవక్త (స) తన చేతిని ముంచుతారు. ఒక్కోసారి చలికాలంలో కూడా ప్రజలు ఉదయాన్నే గిన్నెలతో నీళ్ళు తీసుకొని వస్తారు. ప్రవక్త (స) తన చేతిని నీటిలో పెడతారు. (ముస్లిమ్)
5809 – [ 9 ] ( صحيح ) (3/1617)
وَعَنْهُ قَالَ: كَانَتْ أَمَةٌ مِنْ إِمَاءِ أَهْلِ الْمَدِيْنَةِ تَأْخُذُ بِيَدِ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم فَتَنْطَلِقُ بِهِ حَيْثُ شَاءَتْ. روَاهُ الْبُخَارِيُّ.
5809. (9) [3/1617 –దృఢం]
అనస్ (ర) కథనం: మదీనహ్ వాసుల సేవకురాళ్ళలో ఒకామె ప్రవక్త (స) చేయి పట్టుకొని తాను కోరిన చోటికి తీసుకువెళ్ళేది. [15] (బు’ఖారీ)
5810 – [ 10 ] ( صحيح ) (3/1618)
وعَنْهُ أَنَّ امْرَأَةً كَانَتْ فِيْ عَقْلِهَا شَيْءٌ فَقَالَتْ: يَا رَسُوْلَ اللهِ إِنِّيْ لِيْ إِلَيْكَ حَاجَةً فَقَالَ: “يَا أُمَّ فُلَانٍ اُنْظُرِيْ أَيَّ السِّكَكِ شِئْتِ حَتّى أَقْضِي لَكِ حَاجَتكِ”. فَخَلَا مَعَهَا فِيْ بَعْضِ الطُّرُقِ حَتّى فَرَغَتْ مِنْ حَاجَتِهَا. روَاهُ مُسْلِمٌ.
5810. (10) [3/1618 –దృఢం]
అనస్ (ర) కథనం: మానసికంగా అనారోగ్యానికి గురైన ఒక స్త్రీ ఒక రోజు, ”ఓ దైవప్రవక్తా! మీతో అవసరం ఉంది,’ అని చెప్పింది. దానికి ప్రవక్త (స), ”ఓ ఫలానా తల్లి, నీ అవసరం తీర్చటానికి నీవు కోరిన చోటికి వస్తాను,” అని అన్నారు. అనంతరం ప్రవక్త (స) ఆమె వెంట ఒక మూలకు వెళ్ళి ఆమెతో మాట్లాడవలసింది మాట్లాడారు. (ముస్లిమ్)
5811 – [ 11 ] ( صحيح ) (3/1618)
وعَنْهُ قَالَ: لَمْ يَكُنْ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم فَاحِشًا وَلَا لَعَانًا وَلَا سَبَّابًا كَانَ يَقُوْلُ عِنْدَ الْمَعْتَبَةِ: “مَا لَهُ تَرِبَ جَبِيْنُهُ؟” روَاهُ الْبُخَارِيُّ.
5811. (11) [3/1618 –దృఢం]
అనస్ (ర) కథనం: ప్రవక్త (స) అశ్లీల విషయాలు పలికే వారు కాదు, శాపనార్థాలు పెట్టేవారూ కాదు, తిట్టేవారూ కాదు. ఒకవేళ ఇతరులపై కోపం వస్తే కేవలం, ‘అతనికి ఏమయింది? వాడి ముఖానికి మన్నుతగల,’ అని అనేవారు. (బు’ఖారీ)
5812 – [ 12 ] ( صحيح ) (3/1618)
وعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ قِيْلَ: يَا رَسُوْلَ اللهِ اُدْعُ عَلَى الْمُشْرِكِيْنَ. قَالَ: “إِنِّيْ لَمْ أُبْعثَ لَعَّانًا وَإِنَّمَا بُعِثْتُ رَحْمَةً”. رَوَاهُ مُسْلِمٌ.
5812. (12) [3/1618 –దృఢం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స)ను, ‘ఓ ప్రవక్తా! తమరు అవిశ్వాసులను శపించండి,’ అని కోరటం జరిగింది. అప్పుడు ప్రవక్త (స), ‘నన్ను శపించేవానిగా చేసి పంపడం జరుగలేదు, నన్ను కారుణ్యంగా చేసి పంపడం జరిగింది” అని అన్నారు. (ముస్లిమ్)
5813 – [ 13 ] ( مُتَّفَقٌ عَلَيْهِ ) (3/1618)
وَعَنْ أَبِيْ سَعِيْدٍ الْخُدْرِيِّ قَالَ: كَانَ النَّبِيُّ صلى الله عليه وسلم أَشَدُّ حَيَاءً مِنَ الْعَذْرَاءِ فِيْ خِدْرِهَا فَإِذَا رَأَى شَيْئًا يَكْرَهُهُ عَرَفْنَاهُ فِيْ وَجْهِهِ. مُتَّفَقٌ عَلَيْهِ.
5813. (13) [3/1618 –ఏకీభవితం]
అబూ స’యీద్ ‘ఖుద్రీ (ర) కథనం: ప్రవక్త (స) తెర చాటులో ఉన్న కన్నె పిల్లకన్నా అధికంగా సిగ్గు లజ్జ కలిగి ఉండే వారు. ప్రవక్త (స) అయిష్టానికి, అసహ్యానికి గురయితే, ఆయన ముఖవర్చస్సును చూచి మనస్త త్వాన్ని గుర్తుపట్టే వాళ్ళం. (బు’ఖారీ, ముస్లిమ్)
5814 – [ 14 ] ( صحيح ) (3/1618)
وعَنْ عَائِشَةَ رَضِيَ اللهُ عَنْهَا قَالَتْ: مَا رَأضيْتُ النَّبِيَّ صلى الله عليه وسلم مُسْتَجْمِعًا قَطُّ ضَاحِكًا حَتّى أَرَى مِنْهُ لَهَوَاتِهِ وَإِنَّمَا كَانَ يَتَبَسَّمُ. روَاهُ الْبُخَارِيُّ.
5814. (14) [3/1618 –దృఢం]
‘ఆయి’షహ్ (ర) కథనం: ప్రవక్త (స)ను నేను ఎన్నడూ తీవ్రంగా నవ్వటం చూడలేదు. ప్రవక్త (స) కేవలం చిరునవ్వు నవ్వేవారు. (బు’ఖారీ, ముస్లిమ్)
5815 – [ 15 ] ( مُتَّفَقٌ عَلَيْهِ ) (3/1618)
وَعَنْهَا قَالَتْ: إِنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم لَمْ يَكُنْ يَسْرِدُ الْحَدِيْثَ كَسَرْدِكُمْ كَانَ يثحَدِّثُ حَدِيْثًا لَوْ عَدَّهُ الْعَادُّ لَأَحْصَاهُ. مُتَّفَقٌ عَلَيْهِ .
5815. (15) [3/1618 –ఏకీభవితం]
‘ఆయి’షహ్ (ర) కథనం: ప్రవక్త (స) నిరంతరంగా మాట్లాడే వారు కాదు, మీరు మాట్లాడినట్టు. ప్రవక్త (స) ఆగి ఆగి మాట్లాడేవారు. ఒకవేళ ఎవరైనా పదాలు లెక్క పెట్టాలను కుంటే లెక్కపెట్టగలరు. (బు’ఖారీ, ముస్లిమ్)
5816 – [ 16 ] ( صحيح ) (3/1618)
وعَنِ الْأَسْوَدِ قَالَ: سَأَلْتُ عَائِشَةَ: مَا كَانَ النَّبِيُّ صلى الله عليه وسلم يَصْنَعُ فِيْ بَيْتِهِ؟ قَالَتْ: كَانَ يَكُوْنُ فِيْ مِهْنَةِ أَهْلِهِ – تَعْنِيْ خِدْمَةِ أَهْلِهِ – فَإِذَا حَضَرَتِ الصَّلَاة خَرَجَ إِلى الصَّلَاةِ. روَاهُ الْبُخَارِيُّ .
5816. (16) [3/1618– దృఢం]
అస్‌వద్ కథనం: నేను ప్రవక్త (స) ఇంట్లో ఏం చేసే వారని ‘ఆయి’షహ్ (ర)ను అడిగాను. దానికి ఆమె సమాధాన మిస్తూ ప్రవక్త(స) ఇంట్లో ఇంటిపనులు చేసేవారు, అంటే ఇంటివారికి సేవచేసేవారు. నమా’జు సమయం అయితే నమా’జుకు వెళ్ళేవారు,’ అని చెప్పారు. (బు’ఖారీ)
5817 – [ 17 ] ( مُتَّفَقٌ عَلَيْهِ ) (3/1618)
وَعَنْ عَائِشَةَ قَالَتْ: مَا خُيِّرَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم بَيْنَ أَمَرَيْنِ قَطُّ إِلَّا أَخَذَ أَيْسَرَهُمَا مَا لَمْ يَكُنْ إِثْمًا فَإِنْ كَانَ إِثْمًا كَانَ أَبْعَدُ النَّاسِ مِنْهُ وَمَا انْتَقَمَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم لِنَفْسِهِ فِيْ شَيْءٍ قَطُّ إِلَّا أَنْ يُنْتَهَكَ حُرْمَةُ اللهِ فَيَنْتَقِمُ لِلّهِ بِهَا.
5817. (17) [3/1618 –ఏకీభవితం]
‘ఆయి’షహ్ (ర) కథనం: ప్రవక్త (స) ఎప్పుడైనా రెండు పనులలో ఒకదాన్ని ఎన్నుకునే అవకాశం లభిస్తే ఆయన ఎప్పుడూ సులువైన పనిని ఎన్నుకునే వారు, అయితే అది పాప కార్యం కాకుండా ఉంటేనే. ఒకవేళ ఆ సులువైన పని పాపకార్యం అయితే ప్రజలందరికంటే ఆయన దాన్నుండి దూరంగా ఉండేవారు. ఇంకా ప్రవక్త (స) తన కోసం ఏ విషయంలోనూ ప్రతీకారం తీర్చుకునే వారు కారు. అయితే నిషిద్ధాలకు గురిఅయితే మాత్రం దైవప్రీతి కోసం ప్రతీకారం తీర్చుకునేవారు, శిక్షించేవారు.[16] (బు’ఖారీ, ముస్లిమ్)
5818 – [ 18 ] ( صحيح ) (3/1619)
وعَنْهَا قَالَتْ: مَا ضَرَبَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم لِنَفْسِهِ شَيْئًا قَطُّ بِيَدِهِ وَلَا امْرَأَةً وَلَا خَادِمًا إِلَّا أَنْ يُجَاهِدَ فِيْ سَبِيْلِ اللهِ وَمَا نِيْلَ مِنْهُ شَيْءٌ قَطُّ فَيَنْتَقِمُ مِنْ صَاحِبِهِ إِلَّا أَنْ يُنْتَهَكَ شَيْءٌ مِنْ مَحَارِمِ اللهِ فَيَنْتَقِمُ لِلّهِ. رَوَاهُ مُسْلِمٌ.
5818. (18) [3/1619 –దృఢం]
‘ఆయి’షహ్ (ర) కథనం: ప్రవక్త (స) ఏనాడూ ఎవరినీ తన చేత్తో శిక్షించలేదు. అంటే మనిషిని, స్త్రీని, సేవకుల్ని. అయితే, అల్లాహ్ (త) మార్గంలో పోరాడుతూ ఆయన చేతుల్లో చంపబడేవారు. ప్రవక్త (స)కు ఒకరివల్ల హానికలిగి, ప్రవక్త (స) ఆ వ్యక్తితో ప్రతీకారం తీర్చుకున్నట్టు ఏనాడూ జరగలేదు. అయితే ఒకవేళ నిషిద్ధాలకు గురయితే అల్లాహ్(త) ఆదేశాన్ని పూర్తిచేయటానికి, దైవప్రీతి కోసం ప్రతీకారం తీర్చుకునేవారు, అంటే, శిక్షించేవారు. (ముస్లిమ్)
—–
اَلْفَصْلُ الثَّانِيْ రెండవ విభాగం
5819 – [ 19 ] ( لم تتم دراسته ) (3/1619)
عَنْ أَنَسٍ قَالَ: خَدَمْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم وَأَنَا ابْنُ ثَمَانٍ سِنِيْنَ خَدَمْتُهُ عَشْرَ سِنِيْنَ فَمَا لَامَنِيْ عَلَى شَيْءٍ قَطُّ أتَي فِيْهِ عَلَى يَدَيَّ فَإِنْ لَامَنِيْ لَائِمٌ مِنْ أَهْلِهِ قَالَ: “دَعُوْهُ فَإِنَّهُ لَوْ قُضِيَ شَيْءٌ كَانَ”. هَذَا لَفْظُ “الْمَصَابِيْحِ” وَرَوَى الْبَيْهَقِيُّ فِيْ “شُعَبِ الْإِيْمَانِ”. مَعَ تَغْيِيْرِ يَسِيْرٍ.
5819. (19) [3/1619 –అపరిశోధితం]
అనస్ (ర) కథనం: నాకు 8 సంవత్సరాల వయస్సు ఉన్నప్పటి నుండి ప్రవక్త (స)కు సేవచేస్తున్నాను. అప్పటి నుండి నిరంతరంగా 10 సంవత్సరాల వరకు ప్రవక్త (స) కు సేవచేసాను. ఈ మధ్య కాలంలో నావల్ల పొరపాటు జరగటం, ప్రవక్త (స) నన్ను కోప్పడటం జరగలేదు. ఒకవేళ ఇంటి వారిలో నుండి ఎవరైనా నన్ను చీవాట్లుపెడితే, ప్రవక్త (స), ”పోనీ, వాడిని చీవాట్లు పెట్టకండి, వాస్తవం ఏమిటంటే జరగవలసింది ఎలాగూ జరుగుతుంది,” అని అనేవారు. (మసాబీహ్, బైహఖీ / -షు’అబిల్ ఈమాన్)
5820 – [ 20 ] ( صحيح ) (3/1619)
وعَنْ عَائِشَةَ رَضِيَ اللهُ عَنْهَا قَالَتْ: لَمْ يَكُنْ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم فَاحِشًا وَلَا مُتَفَحِّشًا وَلَا سَخَّابًا فِيْ الْأَسْوَاقِ وَلَا يَجْزِيْ بِالسَّيِّئَةِ السَّيِّئَةَ وَلَكِنْ يَعْفُوْ وَيَصْفَحُ. رَوَاهُ التِّرْمِذِيُّ.
5820. (20) [3/1619 –దృఢం]
‘ఆయి’షహ్ (ర) కథనం: ప్రవక్త (స) అశ్లీలం మాట్లాడే వారు కాదు. ఇంకా విచ్చలవిడిగా అశ్లీల పలుకులు పలికేవారు కాదు. ఇంకా బజారుల్లో కోలాహలం చేసేవారు కాదు. ఇంకా ప్రవక్త (స) చెడుకు చెడుద్వారా ప్రతీకారం తీర్చుకునేవారు కాదు. అయితే క్షమించటం, మన్నించటం చేసేవారు. (తిర్మిజి’)
5821 – [ 21 ] ( لم تتم دراسته ) (3/1619)
وَعَنْ أَنَسٍيُحَدِّثُ عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم أَنَّهُ كَانَ يَعُوْدُ الْمَرِيْضَ وَيَتْبَعُ الْجَنَازَةَ وَيُجِيْبُ دَعْوَةَ الْمَمْلُوْكِ وَيَرْكَبُ الْحِمَارُ لَقَدْ رَأَيْتُهُ يَوْمَ خَيْبَرَ عَلَى حِمَارٍ خِطَامُهُ لِيْفٌ. رَوَاهُ ابْنُ مَاجَهُ وَالْبَيْهَقِيُّ فِيْ “شُعَبِ الْإِيْمَانِ”.
5821. (21) [3/1619 –అపరిశోధితం]
అనస్ (ర) ప్రవక్త (స) గురించి మాట్లాడుతూ, ”ప్రవక్త (స) వ్యాధిగ్రస్తున్ని పరామర్శించే వారు, జనా’జహ్ వెంట వెళ్ళేవారు, సేవకుల ఆహ్వానాన్ని స్వీకరించే వారు, గాడిదపై కూర్చుని వెళ్ళేవారు, నేను ఖైబర్ నాడు ప్రవక్త (స)ను గాడిదపై కూర్చోవటం చూసాను, దాని కళ్ళెం ఖర్జూరపు ఆకులతో చేయబడి ఉంది,” అని అన్నారు. (ఇబ్నె మాజహ్, బైహఖీ -/ షు’అబిల్ ఈమాన్)
5822 – [ 22] ( لم تتم دراسته ) (3/1619)
وعَنْ عَائِشَةَ قَالَتْ: كَانَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم يَخْصِفُ نَعْلَهُ وَيَخِيْطُ ثَوْبَهُ وَيَعْمَلُ فِيْ بَيْتِهِ كَمَا يَعْمَلُ أَحَدُكُمْ فِيْ بَيْتِهِ وَقَالَتْ: كَانَ بَشَرًا مِنَ الْبَشَرِ يَفْلِيْ ثَوْبَهُ وَيَحْلِبُ شَاتَهُ وَيَخْدِمُ نَفْسَهُ. رَوَاهُ التِّرْمِذِيُّ.
5822. (22) [3/1619– అపరిశోధితం]
‘ఆయి’షహ్ (ర) కథనం: ప్రవక్త (స) తన చెప్పులను తాను స్వయంగా కుట్టుకునేవారు, తన బట్టలను తాను స్వయంగా కుట్టుకునే వారు, మీలాగే ప్రవక్త (స) తన ఇంట్లో పనులు చేసేవారు, ఇంకా ప్రవక్త (స) మనుషుల్లో ఎటువంటి వ్యక్తి అంటే తన పేళ్ళు తానే తీసుకునేవారు. మేకపాలు స్వయంగా తానే పితికేవారు. ఇంకా తనపని తానే, చేసుకునే వారు. (తిర్మిజి’)
5823 – [ 23 ] ( لم تتم دراسته ) (3/1620)
وَعَنْ خَارِجَةَ بْنِ زَيْدِ بْنِ ثَابِتٍ قَالَ: دَخَل نَفَرٌ عَلَى زَيْدِ بْنِ ثَابِتٍ فَقَالُوْا لَهُ: حَدّثَنَا أَحَادِيْثَ رَسُوْلِ الله صلى الله عليه وسلم قَالَ: كُنْتُ جَارَهُ فَكَانَ إِذَا نَزَلَ الْوَحْيُ بَعَثَ إِلَيَّ فَكَتَبْتُهُ لَهُ فَكَانَ إِذَا ذَكَّرَنَا الدُّنْيَا ذَكَرَهَا مَعَنَا وَإِذَا ذَكَّرْنَا الْآخِرَةَ ذَكَرَهَا مَعَنَا وَإِذَا ذَكَّرْنَا الطَّعَامَ ذَكَرَهُ مَعَنَا فَكُلُّ هَذَا أُحَدِّثُكُمْ عَنْ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم. رَوَاهُ التِّرْمِذِيُّ.
5823. (23) [3/1620 –అపరిశోధితం]
‘ఖారిజహ్ బిన్ ‘జైద్ బిన్ సా’బిత్ (ర) కథనం: కొందరు ఒక బృందంగా ‘జైద్ బిన్ సా’బిత్ (ర) దగ్గరకు వచ్చారు. వారు ప్రవక్త (స)కు సంబంధించిన ‘హదీసు’ లను వినిపించమని కోరారు. అప్పుడు అతడు(స) ఇలా తెలిపాడు, ”నేను ప్రవక్త (స) పొరుగునే ఉండేవాణ్ణి. ప్రవక్త (స)పై దైవవాణి అవత రించినపుడు, నన్ను పిలిపించే వారు, నేను ప్రవక్త (స) ఆదేశానుసారం దైవవాణిని రాసే వాణ్ణి. ఇంకా ప్రవక్త (స) మేము ప్రాపంచిక విషయాలు మాట్లాడితే, అతను (స) కూడా ప్రాపంచిక విషయాలు మాట్లాడే వారు. ఒకవేళ మేము పరలోక విషయాలు మాట్లాడితే ప్రవక్త (స)కూడా పరలోకవిషయాలు మాట్లాడే వారు. ఇంకా మేము అన్న పానీయాల గురించి మాట్లాడితే, ప్రవక్త (స) కూడా అన్న పానీయాల గురించి మాట్లాడే వారు. ఈ విషయా లన్ని ప్రవక్త (స)కు చెందినవని మీకు చెబు తున్నాను.” (తిర్మిజి’)
5824 – [ 24 ] ( لم تتم دراسته ) (3/1620)
وَعَنْ أَنَسٍ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم كَانَ إِذَا صَافَحَ الرَّجُلَ لَمْ يَنْزِعْ يَدَهُ مِنْ يَدِهِ حَتّى يَكُوْنُ هُوَ الَّذِيْ يَنْزِعُ يَدَهُ وَلَا يَصْرِفُ وَجْهَهُ عَنْ وَجْهِهِ حَتّى يَكُوْنُ هُوَ الَّذِيْ يَصْرِفُ وَجْهَهُ عَنْ وَجْهِهِ وَلَمْ يُرَ مُقَدّمًا رُكْبَتَيْهِ بَيْنَ يَدَيْ جَلِيْسٍ لَهُ. رَوَاهُ التِّرْمِذِيُّ .
5824. (24) [3/1620 –అపరిశోధితం]
అనస్ (ర) కథనం: ప్రవక్త (స) ఇతరులతో కరచాలనం (ముసాఫహ్) చేస్తే, ఆ వ్యక్తి తన చేతిని తనవైపు లాక్కో నంత వరకు ప్రవక్త (స) తన చేతిని లాక్కునేవారు కాదు. అదేవిధంగా ప్రవక్త (స) ఒక వ్యక్తి తన ముఖాన్ని త్రిప్పు కోనంత వరకు తన ముఖాన్ని త్రిప్పుకునేవారు కాదు. అదేవిధంగా ప్రవక్త (స) తన ముందు ఉన్నవారి వైపు కాళ్ళు చాచి కూర్చోవడం నేను చూడలేదు.” (తిర్మిజి’)
5825 – [ 25 ] ( لم تتم دراسته ) (3/1620)
وعَنْهُ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم كَانَ لَا يَدَّخِرُ شَيْئًا لِغَدٍ. رَوَاهُ التِّرْمِذِيُّ.
5825. (25) [3/1620 –అపరిశోధితం]
అనస్ (ర) కథనం: ప్రవక్త (స) తన కోసం రేపటికి ఏ వస్తువునూ ఉంచేవారు కారు.[17] (తిర్మిజి’)
5826 – [ 26 ] ( لم تتم دراسته ) (3/1620)
وَعَنْ جَابِرِ بْنِ سَمُرَةَ قَالَ: كَانَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم طَوِيْلَ الصَّمْتِ. رَوَاهُ فِيْ “شَرْحِ السُّنَّةِ”.
5826. (26) [3/1620 –అపరిశోధితం]
జాబిర్ బిన్ సమురహ్ (ర) కథనం: ప్రవక్త (స) సాధా రణంగా మౌనంగా ఉండేవారు. (షర్’హుస్సున్నహ్)
5827 – [ 27] ( لم تتم دراسته ) (3/1620)
وَعَنْ جَابِرٍ قَالَ: كَانَ فِيْ كَلَامِ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم تَرْتِيْلٌ وَتَرْسِيْلٌ. رَوَاهُ أَبُوْ دَاوُدَ.
5827. (27) [3/1620– అపరిశోధితం]
జాబిర్ (ర) కథనం: ప్రవక్త (స) మాట్లాడినప్పుడు ఒక్కో పదం విడివిడిగా స్పష్టంగా ఆగిఆగి మాట్లాడే వారు. (అబూ దావూద్)
5828 – [ 28 ] (إسناده جيد) (3/1620)
وَعَنْ عَائِشَةَ قَالَتْ: مَا كَانَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم يَسْرِدُ سَرْدَكُمْ هَذَا وَلَكِنَّهُ كَانَ يَتَكَلَّمُ بِكَلَامٍ بَيْنَهُ فَصْلٌ يَحْفَظْهُ مَنْ جَلَسَ إِلَيْهِ. رَوَاهُ التِّرْمِذِيُّ.
5828. (28) [3/1620 –ఆధారాలు ఆమోదయోగ్యం]
‘ఆయి’షహ్ (ర) కథనం: ప్రవక్త (స) మీలా నిరంతరం మాట్లాడేవారు కాదు. ప్రవక్త (స) మాట్లాడితే, ఒక్కో పదం, వాక్యం ఆగిఆగి పలికేవారు. శ్రద్ధగా వినేవాడు, వాటిని గుర్తు చేసుకోగలడు. (తిర్మిజి’)
5829 – [ 29 ] ( لم تتم دراسته ) (3/1620)
وَعَنْ عَبْدِ اللهِ بْنِ الْحَارِثِ بْنِ جَزْءٍ قَالَ: مَا رَأَيْتُ أَحَدًا أَكْثَرَ تَبَسُّمًا مِنْ رَسُوْلِ الله صلى الله عليه وسلم. رَوَاهُ التِّرْمِذِيُّ.
5829. (29) [3/1620– అపరిశోధితం]
‘అబ్దుల్లాహ్ బిన్ ‘హారిస్’ బిన్ జు’జ్‌ఇ’ (ర) కథనం: నేను ప్రవక్త (స) కంటే అధికంగా చిరునవ్వు నవ్వే వారిని ఎవరినీ చూడలేదు. (తిర్మిజి’)
5830 – [ 30 ] ( لم تتم دراسته ) (3/1621)
وَعَنْ عَبْدِ اللهِ بْنِ سَلَامٍ قَالَ:كان رَسُوْلُ الله صلى الله عليه وسلم إِذَا جَلَسَ يَتَحَدَّثُ يُكْثِرُأَنْ يَرْفَعَ طَرْفَهُ إِلى السَّمَاءِ.رَوَاهُ أَبُوْ دَاوُدَ
5830. (30) [3/1621–అపరిశోధితం]
‘అబ్దుల్లాహ్ బిన్ సలామ్ (ర) కథనం: ప్రవక్త (స) కూర్చొని మాట్లాడినపుడు, అప్పుడప్పుడూ ఆకాశం వైపు చూసేవారు. (అబూ దావూద్)
—–
اَلْفَصْلُ الثَّالِثُ మూడవ విభాగం
5831 – [ 31 ] ( صحيح ) (3/1621)
عَنْ عَمْرِو بْنِ سَعِيْدٍ عَنْ أَنَسٍ قَالَ: مَا رَأَيْتُ أَحَدًا كَانَ أَرْحَمَ بِالْعِيَالِ مِنْ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم. كَانَ إِبْرَاهِيْمُ ابْنُهُ مُسْتَرْضَعًا فِيْ عَوَالِي الْمَدِيْنَةِ فَكَانَ يَنْطَلِقُ وَنَحْنُ مَعَهُ فيَدْخُلُ الْبَيْتَ وَإِنَّهُ لَيُدَّخَنُ وَكَانَ ظِئْرُهُ قَيْنًا فَيَأْخُذُهُ فَيُقَبِّلُهُ ثُمَّ يَرْجِعُ. قَالَ عَمْرٌو: فَلَمَّا تُوِفِّيَ إِبْرَاهِيْمُ. قَالَ رَسُوْلُ الله صلى الله عليه وسلم: “إِنَّ إِبْرَاهِيْمَ ابْنِيْ وَإِنَّهُ مَاتَ فِيْ الثَّدْيِ وَإِنَّ لَهُ لَظِئْرَيْنِ تُكْمِلَان رَضَاعَهُ فِي الْجَنَّةِ”. رَوَاهُ مُسْلِمٌ.
5831. (31) [3/1621–దృఢం]
‘అమ్ర్ బిన్ స’యీద్, అనస్ (ర) ద్వారా కథనం: తన భార్యాబిడ్డలపై ప్రవక్త (స) కంటే దయా మయులు, ఆదర ణీయులను నేను ఎవరినీ చూడలేదు. ప్రవక్త (స) కుమారుడు ఇబ్రాహీమ్‌ను మదీనహ్లోని ఒక వీధిలో ఒక దాయివద్దకు పాలు పట్టటానికి పంపడం జరిగేది. ప్రవక్త (స) అతనిని చూడ్డానికి వెళ్ళినపుడు మేము ప్రవక్త (స) వెంట వెళ్ళే వాళ్ళం. ప్రవక్త (స) అక్కడకు చేరి ఇంటి లోపలికి వెళ్ళి తన బిడ్డను ఎత్తుకొని ముద్దాడి తిరిగి వచ్చేవారు. ఇబ్రాహీమ్ మరణించినపుడు ఇబ్రాహీమ్ నా కొడుకు, పాలుత్రాగే వయస్సులో మరణించాడు. స్వర్గంలో వాడి కోసం పాలు పట్టే స్త్రీలు ప్రత్యేకించబడి ఉన్నారు. వారు స్వర్గంలో అతడి పాలు పట్టే గడు వును పూర్తి చేస్తున్నారు,’ అని అన్నారు. (ముస్లిమ్)
5832 – [ 32 ] ( لم تتم دراسته ) (3/1621)
وَعَنْ عَلِيٍّ أَنَّ يَهُوْدِيًّا يُقَالُ لَهُ: فُلَانٌ حَبرٌ كَانَ لَهُ عَلَى رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم فِيْ دَنَانِيْرُ فَتَقَاضَى النَّبِيّ صلى الله عليه وسلم. فَقَالَ لَهُ: “يَا يَهُوْدِيُّ مَا عِنْدِيْ مَا أُعْطِيْكَ”. قَالَ: فَإِنِّيْ لَا أُفَارِقُكَ يَا مُحَمَّدُ حَتّى تُعْطِيَنِيْ. فَقَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِذَا أَجْلِسُ مَعَكَ”. فَجَلَسَ مَعَهُ فَصَلّى رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم الظُّهْرَ وَالْعَصْرَ وَالْمَغْرِبَ وَالْعِشَاءَ الْآخِرَةَ وَالْغَدَاةَ. وَكَانَ أَصْحَابُ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم يَتَهَدَّدُوْنَهُ وَيَتَوَعّدُوْنَهُ. فَفَطِنَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم مَا الَّذِيْ يَصْنَعُوْنَ بِهِ. فَقَالُوْا: يَا رَسُوْلَ اللهِ يَهُوْدِيٌّ يَحْبِسُكَ. فَقَالَ رَسُوْلُ الله صلى الله عليه وسلم: “مَنَعَنِيْ رَبِّيْ أَنْ أَظْلِمَ مُعَاهَدًا وَغَيْرَهُ”. فَلَمَّا تَرَجَّلَ النَّهَارُ. قَالَ الْيَهُوْدِيُّ: أَشْهَدُ أَنْ لَا إِلَهَ إِلَّا اللهُ وَأَشْهَدُ أَنَّكَ رَسُوْلُ اللهِ وَشَطْرُ مَالِيْ فِيْ سَبِيْلِ اللهِ. أَمَا وَاللهِ مَا فَعَلْتُ بِكَ الَّذِيْ فَعَلْتُ بِكَ إِلّا لِأَنْظُرُ إِلى نَعْتِكَ فِيْ التَّوْرَاةِ: مُحَمَّدُ بْنُ عَبْدِ اللهِ مَوْلِدُهُ بِمَكَّةَ وَمُهَاجَرُهُ بِطَيْبَةً وَمُلْكُهُ بِالشَّامِ لَيْسَ بلَفْظِ ولَا غَلِيْظٍ وَلَا سَخابٍ فِي الْأَسْوَاقِ وَلَا مُتَزَيٍّ بِالْفُحْشِ وَلَا قَوْلِ الْخَنَا. أَشْهَدُ أَنْ لَا إِلَهَ إِلَّا اللهُ وَأَنَّكَ رَسُوْلُ اللهِ وَهَذَا مَالِيْ فَاحُكُمْ فِيْهِ بِمَا أَرَاكَ اللهُ. وَكَانَ الْيَهُوْدِيُّ كَثِيْرَ الْمَالِ. رَوَاهُ الْبَيْهَقِيُّ فِيْ “دَلَائِلِ النُّبُوَّةِ”.
5832. (32) [3/1621 –అపరిశోధితం]
‘అలీ (ర) కథనం: ఒక యూదుడు ఉండేవాడు, అతన్ని పండితుడిగా భావించటం జరిగేది. ప్రవక్త (స) పై అతని బాకీ ఉండేది. అతడు వచ్చి అడిగాడు, ప్రవక్త (స) అతనితో, ‘ప్రస్తుతం నీకు ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేదు’ అని అన్నారు. దాని కావ్యక్తి, ‘ఓ ము’హమ్మద్ నువ్వు నా బాకీ ఇవ్వనంత వరకు నేను నీ దగ్గరనుండి కదలను,’ అని అన్నాడు. అప్పుడు ప్రవక్త (స), ‘సరే, నేను నీ దగ్గర కూర్చుండిపోతాను,’ అని పలికి, ఆ వ్యక్తి ప్రక్కన కూర్చున్నారు. ఆ కూర్చున్న చోటే ప్రవక్త (స) ”జుహర్, ‘అ’స్‌ర్, మ’గ్రిబ్, ‘ఇషా’ మరుసటి రోజు ఫజ్‌ర్ నమా’జులు చదివారు. ఈ పరిస్థితి చూచి అనుచరులు ఆ యూదుణ్ణి హెచ్చరించారు. అది గమనించిన ప్రవక్త (స) వారిని వారించారు. అప్పుడు అనుచరులు, ‘ఓ అల్లాహ్ ప్రవక్తా! ఒక యూదుడు మిమ్మల్ని ఆపి ఉంచాడు.’ అప్పుడు ప్రవక్త (స) వారితో, ”వాగ్దానం చేయబడిన వారెవరైనా సరే, వారిపై అత్యాచారం చేయడాన్ని అల్లాహ్ (త) వారించాడని అన్నారు. పగలు కొంత గడచిన తర్వాత ఆ యూదుడు, ‘అల్లాహ్ తప్ప ఆరాధ్యులెవరూ లేరని, తమరు అల్లాహ్ ప్రవక్త అని నేను సాక్ష్యం ఇస్తున్నాను. నా ధనంలోని సగం భాగం అల్లాహ్ మార్గంలో ఇస్తున్నాను. అల్లాహ్ సాక్షి! నేను మీ పట్ల ఇలా ఎందుకు ప్రవర్తించానంటే తౌరాతులో ఉన్న గుణగణాలు మీలో ఉన్నాయా లేదా చూద్దామని అలా చేసాను. తౌరాతులో ముహమ్మద్ బిన్ అబ్దుల్లాహ్ మక్కహ్ లో జన్మిస్తారు, మదీనహ్ వైపు వలస వెళతారు, అతని (స) అధికారం సిరియా వరకు ఉంటుంది, అతడు అశ్లీల పలుకులు పలకడు, కఠిన హృదయుడుకాడు, బజారుల్లో కల్లోలం సృష్టించేవాడు కాడు, బూటకమాటలు మాట్లాడేవాడు కాడు,’ అని ఉంది. నేను అల్లాహ్ తప్ప ఆరాధ్యులెవరూ లేరని, తమరు అల్లాహ్ ప్రవక్త అని సాక్ష్యం ఇస్తున్నాను. ఇది నా ధనం అల్లాహ్ ఆదేశంతో దీన్ని మీరు కోరిన చోట ఖర్చు చేయండి,’ అని అన్నాడు. ఎందుకంటే ఆ యూదుడు ధనవంతుడు. (బైహఖీ-దలాయిలు న్నబువ్వహ్)
5833 – [ 33 ] ( صحيح ) (3/1622)
وعَنْ عَبْدِ اللهِ بْنِ أَبِيْ أَوْفَى قَالَ: كَانَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم يُكْثِرُ الذِّكْرَ وَيُقِلُّ اللَّغْوَ وَيُطِيْلُ الصَّلَاةَ وَيُقَصِّرُ الْخُطْبَةَ وَلَا يَأْنِفُ أَنْ يَمْشِيَ مَعَ الْأَرْمِلَةِ وَالْمَسْكِيْنِ فَيَقْضِيَ الْحَاجَةَ. رَوَاهُ النَّسَائِيُّ وَالدَّارَمِيُّ.
5833. (33) [3/1622 –దృఢం]
అబ్దుల్లాహ్ బిన్ అబీ అవ్ఫా (ర) కథనం: ప్రవక్త (స) దైవ ధ్యానంలో అధికంగా, అనవసరమైన మాటల్లో చాలా తక్కువగా ఉండేవారు, నమా’జును దీర్ఘంగా, ఖుత్బా ను సంక్షిప్తంగా చేసేవారు. అనాథలు, వితంతువుల వెంట నడవటాన్ని ఏ విధమైన అవమానంగా భావించేవారు కారు. ఇంకా వారి అవసరాలను తీర్చేవారు. (నసాయి’, దార్మీ)
5834 – [ 34 ] ( ضعيف ) (3/1622)
وعَنْ عَلِيٍّ أَنَّ أَبَا جَهْلِ قَالَ لِلنَّبِيِّ صلى الله عليه وسلم: إِنَّا لَا نُكَذِّبُكَ وَلَكِنْ نُكَذِّبُ بِمَا جِئْتَ بِهِ. فَأَنْزَلَ اللهُ تَعَالى فِيهِمْ: [فَإِنَّهُمْ لَا يُكَذِّبُوْنَكَ وَلَكِن الظَّالِمِيْنَ بِآيَاتِ اللهِ يَجْحَدُوْنَ؛ 6: 33]. رَوَاهُ التِّرْمِذِيُّ.
5834. (34) [3/1622 –బలహీనం]
‘అలీ (ర) కథనం: ప్రవక్త (స)ను అబూ జహల్, ”ఓ ము’హమ్మద్! మేము నిన్ను వ్యతిరేకించటం లేదు, కేవలం మేము నీవు తెచ్చిన ధర్మాన్ని వ్యతిరే కిస్తున్నాము” అని అన్నాడు. అప్పుడు అల్లాహ్ (త) వారి గురించి: ”కాని నిశ్చయంగా, వారు అసత్య వంతుడవని తిరస్కరించేది నిన్ను కాదు. వాస్తవానికి ఆ దుర్మార్గులు అల్లాహ్ సూచనలను తిరస్క రిస్తున్నారు.” (అల్ అన్ఆమ్, 6:33). (తిర్మిజి’)
5835 – [ 35 ] ( لم تتم دراسته ) (3/1622)
وعَنْ عَائِشَةَ قَالَتْ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “يَا عَائِشَةَ لَوْ شِئْتُ لَسَارَتْ مَعِيَ جِبَالُ الذَّهَبِ جَاءَنِيْ مَلَكٌ وَإِنْ حُجْزَتَهُ لَتُسَاوِي الْكَعْبَةَ فَقَالَ: إِنَّ رَبَّكَ يُقْرِأُ عَلَيْكَ السَّلَامَ وَيَقُوْلُ: “إِنْ شِئْتَ نَبِيًّا عَبْدًا وَإِنْ شِئْتَ نَبِيًّا مَلِكًا”. فَنَظَرْتُ إِلى جِبْرَيْل عَلَيْهِ السَّلَامُ فَأَشَارَ إِلَيَّ أَنْ ضَعْ نَفْسَكَ”.
5835. (35) [3/1622 –అపరిశోధితం]
‘ఆయి’షహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఓ ‘ఆయి’షహ్! ఒకవేళ నేను అల్లాహ్(త)ను ధన సంపదలు కోరితే, నా వెంట బంగారు కొండలు నడుస్తాయి. నా దగ్గరకు ఒక దైవదూత వచ్చాడు. అతని నడుము క’అబహ్ అంత వెడల్పు ఉంది. ఆ దైవదూత, ‘మీ ప్రభువు మీకు సలామ్ చెబు తున్నాడు. ఇంకా మీరు కోరితే, మిమ్మల్ని సాధారణ మానవునిగా, ప్రవక్తగా చేస్తాము, లేదా మీరు కోరితే మిమ్మల్ని చక్రవర్తిగా చేస్తాము,’ అని అన్నాడు. అది విని నేను జిబ్రీల్ వైపు చూచాను. ఆయన నన్ను వినయ విధేయతలను అనుస రించవలసిందిగా సలహా ఇచ్చారు.”
5836 – [ 36 ] ( لم تتم دراسته ) (3/1622)
وَفِيْ رِوَايَةِ ابْنِ عَبَّاسٍ: فَالْتَفَتَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم إِلى جِبْرَيْلَ كَالْمُسْتَشِيْرِ لَهُ فَأَشَارَ جِبْرِيْلُ بِيَدِهِ أَنْ تَوَاضَعَ. فَقُلْتُ: “نَبِيًّا عَبْدًا”. قَالَتْ: فَكَانَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم بَعْدَ ذَلِكَ لَا يَأْكُلُ مُتَّكِأ يَقُوْلُ: “آكُلُ كَمَا يَأْكُلُ الْعَبْدُ وَأَجْلِسُ كَمَا يَجْلِسُ الْعَبْدُ”. رَوَاهُ فِيْ “شَرْحِ السُّنَّةِ”.
5836. (36) [3/1622– అపరిశోధితం]
ఇబ్నె ‘అబ్బాస్ (ర) కథనం: ప్రవక్త (స) జిబ్రీల్ వైపు సలహా కోరుతూ చూచారు. అప్పుడు జిబ్రీల్ (అ) తన చేత్తో సైగచేస్తూ అణకువ, వినయవిధేయతలను అనుసరించమని సలహా ఇచ్చారు. అప్పుడు ప్రవక్త (స), ”నిస్సందేహంగా నేను అల్లాహ్(త) దాసుణ్ణి, ఆయన ప్రవక్తను,’ అని అన్నారు.”
‘ఆయి’షహ్ (ర) కథనం: ఆ తరువాత ప్రవక్త (స) ఎన్నడూ చేరబడి తినేవారు కాదు. ఇంకా ప్రవక్త (స) ”నేను సేవకునిలా తింటాను, సేవకునిలా కూర్చుం టాను,” అని అనేవారు. (షర్’హు స్సున్నహ్)
=====
4- بَابُ الْمَبْعَثِ وَبَدْءِ الْوَحْيِ
4. ముహమ్మద్ (స) దైవదౌత్యం, దైవవాణి ప్రారంభం
اَلْفَصْلُ الْأَوَّلُ మొదటి విభాగం
5837 – [ 1 ] ( مُتَّفَقٌ عَلَيْهِ ) (3/1623)
عَنِ ابْنِ عَبَّاسٍ قَالَ: بُعِثَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم لِأَرْبَعِيْنَ سَنَةً فَمَكَثَ بِمَكَّةَ ثَلَاثَ عَشَرَةَ سَنَةً يُوْحَى إِلَيْهِ ثُمَّ أُمِرَ بِالْهِجْرَةِ فَهَاجَرَ عَشْرَ سِنِيْنَ وَمَاتَ وَهُوَ ابْنُ ثَلَاثٍ وَّسِتِّيْنَ سَنَةً.
5837. (1) [3/1623 –ఏకీభవితం]
ఇబ్నె ‘అబ్బాస్ (ర) కథనం: ప్రవక్త (స)కు 40 సంవత్సరాల వయస్సులో దైవదౌత్యం లభించింది. ఆ తరు వాత 13 సంవత్సరాల వరకు ప్రవక్త (స) మక్క హ్లో ఉన్నారు. ఈ కాలంలో ప్రవక్త (స) పై దైవవాణి అవతరిస్తూ ఉంది. ఆ తరువాత ప్రవక్త (స)కు వలసపోయే ఆదేశం ఇవ్వబడింది. అనంతరం ప్రవక్త (స) మక్కహ్ నుండి వలస వెళ్ళారు. మదీనహ్లో 10 సంవత్సరాల వరకు ఉన్నారు. మరణించి నపుడు ప్రవక్త (స) వయస్సు 63 సంవత్సరాలు. (బు’ఖారీ, ముస్లిమ్)
5838 – [ 2 ] ( مُتَّفَقٌ عَلَيْهِ ) (3/1623)
وَعَنْهُ قَالَ: أَقَامَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم بِمَكَّةَ خَمْسَ عَشَرَةَ سَنَةً يَسْمَعُ الصَّوْتَ وَيَرَى الضَّوْءَ سَبْعَ سِنِيْنَ وَلَا يَرَى شَيْئًا وَثَمَانُ سِنِيْنَ يُوْحَى إِلَيْهِ وَأَقَامَ بِالْمَدِيْنَةِ عَشْرًاوَتُوُفِّيَ وَهُوَ ابْنُ خَمْسٍ وَّسِتيْنَ. مُتَّفَقٌ عَلَيْهِ.
5838. (2) [3/1623– ఏకీభవితం]
ఇబ్నె ‘అబ్బాస్ (ర) కథనం: ప్రవక్త (స) దైవదౌత్యం లభించిన తరువాత మక్కాలో 15 సంవత్సరాలు ఉన్నారు. ప్రవక్త (స) మొదటి 7 సంవత్సరాలు జిబ్రీల్ పలుకులు వినేవారు. ఆశ్చర్యకరమైన వెలుగును చూచేవారు. అది తప్ప మరేమీ కనిపించేది కాదు. తరువాత 8 సంవత్సరాలలో దైవవాణి అవతరించేది. ఆ తరువాత ప్రవక్త (స) మదీనహ్లో 10 సంవత్స రాలు ఉన్నారు. మరణించి నపుడు అతని(స) వయస్సు 65 సంవత్సరాలు.[18] (బు’ఖారీ, ముస్లిమ్)
5839 – [ 3 ] ( مُتَّفَقٌ عَلَيْهِ ) (3/1623)
وَعَنْ أَنَسٍ قَالَ: تَوَفَّاهُ اللهُ عَلَى رَأْسِ سِتِّيْنَ سَنَةً. مُتَّفَقٌ عَلَيْهِ.
5839. (3) [3/1623 –ఏకీభవితం]
అనస్ (ర) కథనం: అల్లాహ్(త) ప్రవక్త (స)కు 60 సంవత్సరాలు పూర్తవగానే మరణం ప్రసాదించాడు. (బు’ఖారీ, ముస్లిమ్)
5840 – [ 4 ] ( صحيح ) (3/1623)
وَعَنْهُ قَالَ: قُبِضَ النَّبِيُّ صلى الله عليه وسلم وَهُوَ ابْنُ ثَلَاثٍ وَّسِتِّيْنَ وَأَبُوْ بَكْرٍوَهُوَ ابْنُ ثَلَاثٍ وَّسِتِّيْنَ وَعُمَرُ وَهُوَ ابْنُ ثَلَاثٍ وَّسِتِّيْنَ. رَوَاهُ مُسْلِمٌ. قَالَ مُحَمَّدُ بْنُ إِسْمَاعِيْلَ الْبُخَارِيُّ: ثَلَاثٍ وَّسِتِّيْنَ أَكْثَرُ.
5840. (4) [3/1623– దృఢం]
అనస్ (ర) కథనం: ప్రవక్త (స) 63 సంవత్సరాల వయస్సులో మరణించారు. ఇంకా అబూ బకర్ (ర) కూడా 63 సంవత్సరాల వయస్సులో మరణించారు. ఇంకా ఉమర్ (ర) కూడా 63 సంవత్సరముల వయస్సులో మరణించారు. (ముస్లిమ్)
ము’హమ్మద్ బిన్ ఇస్మా’యీల్ ”ప్రవక్త (స) 63 సంవత్సరాల వయస్సులో మరణించారని అనేక ఉల్లేఖనాలు నిరూపిస్తున్నాయి,” అని అన్నారు.
5841 – [ 5 ] ( مُتَّفَقٌ عَلَيْهِ ) (3/1623)
وَعَنْ عَائِشَةَ رَضِيَ اللهُ عَنْهَا قَالَتْ: أَوَّلُ مَا بُدِئَ بِهِ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم مِنَ الْوَحْيِ الرُّؤْيَا الصَّادِقَةُ فِي النَّوْمِ فَكَانَ لَا يُرَى رُؤْيَا إِلّا جَاءَتْ مِثْلَ فَلَقِ الصُّبْحِ ثُمَّ حُبِّبَ إِلَيْهِ الْخَلَاءُ وَكَانَ يَخْلُوْ بِغَارِ حِرَاءٍ فَيَتَحَنَّثُ فِيْهِ – وَهُوَ التَّعَبُّدُ اللِّيَالِيَ ذَوَاتِ الْعَدَدِ – قَبْلَ أَنْ يَنْزِعَ إِلى أَهْلِهِ وَيَتَزَوَّدُ لِذَلِكَ ثُمَّ يَرْجِعُ إِلى خَدِيْجَةَ فَيَتَزَوَّدُ لِمِثلِهَا حَتّى جَاءَهُ الْحَقُّ وَهُوَ فِيْ غَارِ حِرَاءِ فَجَاءَهُ الْمَلَكُ فَقَالَ: اقْرَأْ. فَقَالَ: “مَا أَنَا بِقَارِئٍ”. قَالَ: ” فَأَخَذَنِيْ فَغَطَّنِيْ حَتّى بَلَغَ مِنِّي الْجُهْدَ ثُمَّ أَرْسَلَنِيْ. فَقَالَ: اقْرَأْ. فَقُلْتُ: مَا أَنَا بِقَارِئٍ. فَأَخَذَنِيْ فَغَطَّنِيَ الثَّانِيَةَ حَتّى بَلَغَ مِنِّي الْجُهْدَ. ثُمَّ أَرْسَلَنِيْ. فَقَالَ: اقْرَأْ. فَقُلْتُ: مَا أَنَا بِقَارِئٍ. فَأَخَذَنِيْ فَغَطَّنِيَ الثَّالِثَةَ حَتّى بَلَغَ مِنِّي الْجُهْدَ ثُمَّ أَرْسَلَنِيْ. فَقَالَ: [اقْرَاْ بِاسْمِ رَبِّكَ الَّذِيْ خَلَقَ. خَلَقَ الْإِنْسَانَ مِنْ عَلقٍ. اقْرَأْ وَرَبُّكَ الْأَكْرَم. الَّذِيْ عَلَّمَ بِالْقَلَمِ. عَلَّمَ الْإِنْسَانَ مَا لَمْ يَعْلَمْ؛ 96: 1-5]”. فَرَجَعَ بِهَا رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم يَرْجُفُ فُؤَادُهُ فَدَخَلَ عَلَى خَدِيْجَةَ. فَقَالَ: “زَمْلُوْنِيْ، زَمْلُوْنِيْ”، فَزَمَّلُوْهُ حَتّى ذَهَبَ عَنْهُ الرَّوْعُ. فَقَالَ لِخَدِيْجَةَ وَأَخْبَرَهَا الْخَبْرَ: “لَقَدْ خَشِيْتُ عَلَى نَفْسِيْ”. فَقَالَتْ خَدِيْجَةُ: كَلّا وَاللهِ لَا يُخْزِيْكَ اللهُ أَبَدًا إِنَّكَ لَتَصِلُ الرَّحِمَ وَتَصْدُقُ الْحَدِيْثَ وَتَحْمِلُ الْكَلَّ وَتُكْسِبُ الْمَعْدُوْمَ وَتَقْرِي الضَّيْفَ وَتُعِيْنُ عَلَى نَوَائِبِ الْحَقِّ. ثُمَّ انْطَلَقَتْ بِهِ خَدِيْجَةُ إِلى وَرَقَة بْنِ نَوْفَلٍ ابْنِ عمّ خَدِيْجَةَ. فَقَالَتْ لَهُ: يَا ابْنَ عَمِّ اسْمَعْ مِنَ ابْنِ أَخِيْكَ. فَقَالَ لَهُ وَرَقَةُ: يَا ابْنَ أَخِيْ مَا ذَا تَرَى؟ فَأَخْبَرَهُ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم خَبَرَ مَا رَأَى. فَقَالَ وَرَقَةُ: هَذَا هُوَ النَّامُوْسُ الَّذِيْ أَنْزَلَ اللهُ عَلى مُوْسَى. يَا لَيْتَنِيْ فِيْهَا جَذَعًا يَا لَيْتَنِيْ أَكُوْنُ حَيًّا إِذْ يُخْرِجُكَ قَوْمُكَ. فَقَالَ رَسُوْلُ الله صلى الله عليه وسلم: “أَوْ مُخْرِجِيَّ هُمْ؟” قَالَ: نَعَمْ. لَمْ يَأْتِ رَجُلٌ قَطُّ بِمِثْلِ مَا جِئْتَ بِهِ إِلَّا عُوْدِيَ وَإِنْ يُدْرِكُنِيْ يَوْمُكَ أَنْصُرْكَ نَصْرًا مُؤَزَّرًا. ثُمَّ لَمْ يَنْشَبْ وَرَقَة أَنْ تُوُفِّيَ. وَفَتَرَ الْوَحْيُ. مُتَّفَقٌ عَلَيْهِ.
5841. (5) [3/1623– ఏకీభవితం]
‘ఆయి’షహ్ (ర) కథనం: ప్రవక్త (స) పై దైవవాణి అవతరించటం నిద్రలో నిజమైన స్వప్నాలు రావటం ద్వారా ప్రారంభమయింది. ప్రవక్త (స) నిద్రలో చూచిన స్వప్నం యొక్క పరమార్థం వెలుగులా జరిగితీరేది. ఆ తరువాత ప్రవక్త (స) ఏకాంత జీవితం ప్రారంభించారు. అనంతరం ప్రవక్త (స) ‘హిరా గుహలో ఏకాంతంగా గడపసాగారు. అందులో ప్రవక్త (స) అల్లాహ్(త)ను ఆరాధించేవారు. అనేక రాత్రులు అక్కడే దైవారాధనలో గడిపే వారు, ఇంటికి వెళ్ళే ఆలోచన వచ్చేవరకు అక్కడే గడిపేవారు. ప్రవక్త (స) ‘హిరా గుహ వెళ్ళినపుడు అన్న పానీయాలు తీసుకువెళ్ళేవారు. అవి అయిపోయిన తరువాత మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చేవారు. ఈ పరంపర ఇలాగే కొనసాగుతూ ఉండేది. చివరకు ప్రవక్త (స)పై దైవవాణి అవతరించింది. అప్పుడు ప్రవక్త(స) ‘హిరా గుహలోనే ఉన్నారు. ప్రవక్త (స) వద్దకు దైవదూత జిబ్రీల్(అ) వచ్చి, ‘చదువు,’ అన్నారు. ప్రవక్త (స), ‘నాకు చదవడంరాదు,’ అన్నారు. ప్రవక్త (స) కథనం: ‘ఆ దైవదూత నన్ను గట్టిగా పట్టుకున్నాడు. గట్టిగా అన్నివైపుల నుండి నొక్కాడు. చివరికి నా ప్రాణం పోయినట్టయింది. ఆ తరువాత నన్ను వదలి, ‘చదువు,’ అన్నాడు. నేను మళ్ళీ, ‘చదవడంరాదు,’ అని అన్నాను. మళ్ళీ గట్టిగా పట్టుకొని నొక్కాడు, నేను భరించలేక పోయాను. మళ్ళీ ఆ దైవదూత వదలి, ‘చదువు,’ అన్నాడు. దానికి నేను, ‘నాకు చదవడం రాదు,’ అని అన్నాను. ఆ దైవదూత మూడవసారి నన్ను గట్టిగా పట్టుకొని పిసికాడు. నాకు ప్రాణం పోయినట్లు అయింది. మళ్ళీ ఆ దైవదూత నన్ను వదలి: ” చదువు నీ ప్రభువు పేరుతో, ఆయనే (సర్వాన్ని) సృష్టించాడు. ఆయనే మానవుణ్ణి రక్తముద్ద (జీవకణం)తో సృష్టించాడు. చదువు, నీ ప్రభువు పరమదాత. ఆయన కలము ద్వారా నేర్పాడు, మానవుడు ఎరుగని జ్ఞానాన్నీ అతనికి బోధించాడు.” (అల్-అలఖ్, 96:1-5) అని పలికారు. ఆ తరువాత ప్రవక్త (స) ఈ ఆయతులను తీసుకొని మక్కహ్ వైపు తిరిగివెళ్ళి పోయారు. అప్పుడు ప్రవక్త (స) వణుకుతున్నారు. ‘ఖదీజహ్(ర) వద్దకు వెళ్ళి, ‘నాకు దుప్పటి కప్పు, దుప్పటి కప్పు,’ అని అన్నారు. అనంతరం అతనికి, దుప్పటి కప్పటం జరిగింది. క్రమంగా భయం తొలగిపోయింది. ఆ తరు వాత ‘ఖదీజహ్కు(ర) జరిగినదంతా చెప్పారు. ఇంకా నాకు చాలా భయంగా ఉందన్నారు. దానికి ‘ఖదీజహ్ (ర) మీరు ఏమాత్రం భయపడకండి, అలా ఎంత మాత్రం జరగదు. అల్లాహ్ సాక్షి! అల్లాహ్ (త) మిమ్మల్ని ఎన్నడూ అవమానం పాలుచేయడు. మీరు బంధువులతో మంచిగావ్యవహరిస్తారు. సత్యమే పలుకుతారు, ఇతరుల భారాన్ని ఎత్తుతారు. మీరు పేదలు, అగత్యపరుల కోసం సంపాదిస్తారు. తమరు అతిథులను సత్కరిస్తారు. తమరు ప్రజలకు ప్రమాదాల్లో, కష్టాల్లో సహాయం చేస్తారు.
ఆ తరువాత ‘ఖదీజహ్ (ర) ప్రవక్త (స)ను తన చిన్నాన్న కొడుకు వరఖహ్ బిన్ నౌఫిల్ వద్దకు తీసుకొని వెళ్ళారు. అతనితో, ‘తమ్ముడూ! నీ కొడుకు (అంటే ము’హమ్మద్) మాటలు విను,’ అని అన్నారు. వరఖహ్ ప్రవక్త (స) తో, ‘కుమారా! ఏమయింది?’ అని అడిగారు. ప్రవక్త (స), జరిగిన దంతా చెప్పారు. అది విని వరఖహ్, ”అల్లాహ్ (త), మూసా (అ)పై అవతరింప జేసినది ఈ దూతనే, ” అని అన్నారు. ఇంకా, ”నే నప్పుడు యువకునిగా ఉంటే ఎంత బాగుండు, నే నప్పుడు సజీవంగా ఉంటే ఎంత బాగుండు. అప్పుడు నీ జాతి నిన్ను గెంటివేస్తుంది,” అని అన్నాడు. అది విన్న ప్రవక్త (స) ఆశ్చర్యంగా, ”నిజంగా నా జాతి ప్రజలు నన్ను గెంటివేస్తారా?” అని అడిగారు. దానికి వరఖహ్, ”అవును, ఎందుకంటే, నీలా దైవదౌత్యం తీసుకువచ్చిన వారితో ఈ ప్రపంచం శత్రువుగానే పరిగణించింది. అప్పుడు నేనే గనుక బ్రతికి ఉంటే, పూర్తి శక్తియుక్తులతో నీకు సహాయం చేస్తాను,” అని అన్నాడు. కాని ఆ తరువాత కొన్ని రోజులకే వరఖహ్ మరణించాడు. తరువాత దైవవాణి అవతరించటం కొన్ని రోజులు ఆగిపోయింది. (బు’ఖారీ, ముస్లిమ్)
5842 – [ 6 ] ( صحيح ) (3/1624)
وَزَادَ الْبُخَارِيُّ: حَتّى حَزِنَ النَّبِيُّ صلى الله عليه وسلم – فِيْمَا بَلَغَنَا- حُزْنًا غَدَا مِنْهُ مِرَارًا. كَيْ يَتَرَدّى مِنْ رُؤُوْسِ شَوَاهِقِ الْجَبَلِ فَكُلَّمَا أَوْفَى بِذَروْةِ جَبَلٍ لِكَيْ يُلْقِيَ نَفْسَهُ مِنْهُ تَبَدَّى لَهُ جِبْرِيْلُ. فَقَالَ: يَا مُحَمَّدُ إِنَّكَ رَسُوْلُ اللهِ حَقًّا. فَيَسْكُنُ لِذَلِكَ جَأْشُهُ وَتَقَرُّ نَفْسُهُ.
5842. (6) [3/1624– దృఢం]
బు’ఖారీలో ఈ పదాలు అధికంగా ఉన్నాయి. ప్రవక్త (స)పై కొన్ని రోజుల వరకు దైవవాణి అవతరించడం ఆగిపోయింది. దీనివల్ల ప్రవక్త (స) చాలా విచారించే వారు. ఆ విచారం భరించలేక ప్రవక్త (స) అనేకసార్లు ఆత్మహత్య చేసుకోవటానికి ప్రయత్నించారు. కాని ఎప్పుడు ప్రయత్నించినా జిబ్రీల్(అ) వచ్చి, ”ఓ ము’హమ్మద్! నిస్సందేహంగా మీరు అల్లాహ్(త) ప్రవక్త,” అని చెప్పేవారు. జిబ్రీల్ ఓదార్చటం వల్ల ప్రవక్త (స) విచారం తగ్గు ముఖం పట్టింది. అతనికి(స) మనశ్శాంతి కలిగింది. [19]
5843 – [ 7 ] ( مُتَّفَقٌ عَلَيْهِ ) (3/1625)
وَعَنْ جَابِرٍأَنَّهُ سَمِعَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم يُحَدِّثُ عَنْ فَتْرَةِ الْوَحْيِ قَالَ: “فَبْيَنَا أَنَا أَمْشِيْ سَمِعْتُ صَوْتًا مِنَ السَّمَاءِ فَرَفَعْتُ بَصَرِيْ فَإِذَا الْمَلَكُ الَّذِيْ جَاءَنِيْ بِحَرَاءِ قَاعِدٌ عَلَى كُرْسِيَ بَيْنَ السَّمَاءِ وَالْأَرْضِ. فَجُئِثْتُ مِنْهُ رُعْبًا حَتّى هَوَيْتُ إِلى الْأَرْضِ. فَجِئْتُ أَهْلِيْ فَقُلْتُ: زَمِّلُوْنِيْ زَمِّلُوْنِيْ فَأَنْزَلَ اللهُ تَعَالى: [يَا أَيُّهَا الْمُدَّثِرُ. قُمْ فَأَنْذِرْ وَرَبَّكَ فَكَبِّرْ. وَثِيَابَكَ فَطَهِّرْ. وَالرُّجْزَ فَاهْجُرْ؛ 74: 1-5]. ثُمَّ حَمِيَ الْوَحْيُ وَتَتَابَعَ”. مُتَّفَقٌ عَلَيْهِ.
5843. (7) [3/1625 –ఏకీభవితం]
జాబిర్ (ర) కథనం: అతను దైవవాణి ఆగిపోవటం, మళ్ళీ ప్రారంభం కావటం గురించి ప్రవక్త (స) ద్వారా ఇలా విన్నారు: ”ప్రవక్త (స) ఇలా ప్రవచించారు, ఒకసారి నేను నడుస్తున్నాను. అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక శబ్దం విన్నాను. నేను తల పైకెత్తి చూస్తే, ‘హిరా గుహలో వచ్చిన దైవదూత ఇక్కడ నాకు కనబడ్డాడు. భూమ్యాకాశాల మధ్య ఒక పాన్పుపై కూర్చున్నాడు. నేను వెంటనే భయపడి క్రిందపడ్డాను. ఆ తరువాత లేచి ఇంటికి తిరిగి వచ్చాను. ఇంటివారితో, ‘నాకు దుప్పటి కప్పండి, నాకు దుప్పటి కప్పండి,’ అని అన్నాను. అప్పుడు అల్లాహ్(త) ఈ ఆయతులు అవతరింపజేసాడు: ” ఓ దుప్పటిలో చుట్టుకున్నవాడా! లే! ఇక హెచ్చరించు! మరియు నీ ప్రభువు గొప్పతనాన్ని (ఘనతను) కొనియాడు (చాటి చెప్పు)! మరియు నీ వస్త్రాలను పరిశుభ్రంగా ఉంచుకో! మరియు మాలిన్యానికి దూరంగా ఉండు!” (అల్ ముద్దస్సిర్, 74:1-5) ఆ తరువాత దైవవాణి పరంపర నిరంతరంగా కొనసాగింది. (బు’ఖారీ, ముస్లిమ్)
5844 – [ 8 ] ( مُتَّفَقٌ عَلَيْهِ ) (3/1625)
وَعَنْ عَائِشَةَ أَنَّ الْحَارِثَ بْنِ هِشَامٍ سَأَلَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم. فَقَالَ: يَا رَسُوْلَ اللهِ كَيْفَ يَأْتِيْكَ الْوَحْيُ؟ فَقَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “أَحْيَانًا يَأْتِيْنِيْ مِثْلَ صَلْصَلَةِ الْجَرَسِ وَهُوَ أَشَدُّهُ عَلَيَّ فَيَفْصِمُ عَنِّيْ وَقَدْ وَعَيْتُ عَنْهُ مَا قَالَ وَأَحْيَانًا يَتَمَثَّلُ لِيْ الْمَلَكُ رَجُلًا فَيُكَلِّمُنِيْ فَأَعِيْ مَا يَقُوْلُ”. قَالَتْ عَائِشَةَ: وَلَقَدْ رَأَيْتُهُ يَنْزِلُ عَلَيْهِ الْوَحْيُ فِي الْيَوْمِ الشَّدِيْدِ الْبَرْدِ فَيُفْصَمُ عَنْهُ وَإِنْ جَبِيْنَهُ لَيَتَفَصَّدُ عَرَقًا. مُتَّفَقٌ عَلَيْهِ.
5844. (8) [3/1625 –ఏకీభవితం]
‘ఆయి’షహ్ (ర) కథనం: హారిస్’ బిన్ హిషామ్ ప్రవక్త (స)ను, ‘ఓ ప్రవక్తా! మీపై దైవవాణి ఎలా అవతరిస్తుంది,’ అని విన్నవించుకున్నాడు. దానికి ప్రవక్త (స) ”దైవవాణి నాపై ఒక్కోసారి గంటలశబ్దం రూపంలో వస్తుంది. అయితే ఇది నాకు చాలా కష్టంగా ఉంటుంది. ఆ తరువాత అది ఆగిపోతుంది. నేను దైవదూత ద్వారా విన్నదంతా జ్ఞాపకం చేసు కుంటాను. ఒక్కోసారి దైవదూత నా వద్దకు మానవ రూపంలో వస్తాడు, నాతో సంభాషిస్తాడు, అతడు చెప్పింది నేను జ్ఞాపకం చేసుకుంటాను. ‘ఆయి’షహ్ (ర) కథనం: ”మంచి చలికాలంలో కూడా ప్రవక్త (స)పై దైవవాణి అవతరించినపుడు, దైవదూత దైవవాణి అందించి వెళ్ళిపోయిన తర్వాత నేను ప్రవక్త (స) నుదుటిపై చెమట చుక్కలు రాలటం చూసేదాన్ని.” (బు’ఖారీ, ముస్లిమ్)
5845 – [ 9 ] ( صحيح ) (3/1625)
وَعَنْ عُبَادَةَ بْنِ الصَّامِتِ قَالَ: كَانَ النَّبِيُّ صلى الله عليه وسلم إِذَا نَزَلَ عَلَيْهِ الْوَحْيُ كُرِبَ لِذَلِكَ وَتَرَبَّدَ وَجْهُهُ.
وَفِيْ رِوَايَةٍ: نَكَسَ رَأْسُهُ وَنَكَسَ أَصْحَابُهُ رُؤُوْسَهُمْ فَلَمَّا أُتْلِيَ عَنْهُ رَفَع رَأْسَهُ. رَوَاهُ مُسْلِمٌ.
5845. (9) [3/1625– దృఢం]
‘ఉబాదహ్ బిన్ ‘సామిత్ (ర) కథనం: ప్రవక్త (స)పై దైవవాణి అవతరించినపుడు దాని తీవ్రత వల్ల ప్రవక్త (స) చాలా ఆందోళనకు గురయ్యేవారు. ప్రవక్త (స) ముఖ వర్చస్సు మారిపోయేది. మరికొన్ని ఉల్లేఖనాల్లో ”ప్రవక్త (స)పై దైవవాణి అవతరించి నపుడు ప్రవక్త (స) తన తలను దించుకునే వారు. ప్రవక్త (స) అనుచరులు కూడా తలలు దించుకునే వారు” అని ఉంది. దైవవాణి ముగిసిన తరువాత తలలు ఎత్తుకునేవారు. (ముస్లిమ్)
5846 – [ 10 ] ( مُتَّفَقٌ عَلَيْهِ ) (3/1625)
وَعَنِ ابْنِ عَبَّاسٍ قَالَ: لَمَّا نَزَلَتْ [وَأَنْذِرْ عَشِيْرَتَكَ الْأَقْرَبِيْنَ؛ 26: 214] خَرَجَ النَّبِيُّ صلى الله عليه وسلم حَتّى صَعِدَ الصَّفَا فَجَعلَ يُنَادِيْ: “يَا بَنِيْ فَهْرٍ يَا بَنِيْ عَدِيٍّ “لِبُطُوْنِ قُرَيْشٍ حَتّى اِجْتَمَعُوْا. فَجَعَلَ الرَّجُلُ إِذَا لَمْ يَسْتَطِعْ أَنْ يَخْرُجَ أَرْسَلَ رَسُوْلًا لِيَنْظُرَ مَا هُوَ فَجَاءَ أَبُوْ لَهْبٍ وَقُرَيْشٌ فَقَالَ: “أَرَأَيْتُمْ إِنْ أَخْبَرْتُكُمْ أَنَّ خَيْلًا تَخْرُجُ مِنْ سَفْحٍ هَذَا الْجَبَلِ –
وَفِيْ رِوَايَةٍ: أَنَّ خَيْلًا تَخْرُجُ بِالْوَادِيْ تُرِيْدُ أَنْ تُغِيْرَ عَلَيْكُمْ – أَكُنْتُمْ مُصدَّقِيَّ؟” قَالُوْا: نَعَمْ مَا جَرَّبْنَا عَلَيْكَ إِلَّا صِدْقًا.قَالَ:”فَإِنِّيْ نَذِيْرٌ لَكُمْ بَيْنَ يَدَيْ عَذَابٍ شَدِيْدٍ”. قَالَ أَبُوْ لَهْبٍ: تَبًّا لَكَ أَلِهَذَا جَمَعْتَنَا؟ فَنَزَلَتْ: [تَبَّتْ يَدَا أَبِيْ لَهَبٍ وَتَبّ؛111] مُتَّفَقٌ عَلَيْهِ.
5846. (10) [3/1625 –ఏకీభవితం]
ఇబ్నె ‘అబ్బాస్ (ర) కథనం: ”మీరు మీ దగ్గరి బంధువులను హెచ్చరించండి” (అష్ షు’అరా’, 26:214) అనే ఆయతు అవతరించినపుడు, ప్రవక్త (స) దాన్ని నిర్వర్తించడానికి బయలుదేరారు. సఫా కొండపై ఎక్కి ఇలా పిలవటం ప్రారంభించారు. ”ఓ ఫహ్‌ర్ సంతానమా! ఓ అదీసంతానమా! ఇదే విధంగా తెగలన్నిటినీ ఉద్దేశించి పిలవసాగారు. చివరికి అన్ని తెగల వారూ వచ్చారు. రాలేనివారు తన తరఫున ఒక వ్యక్తిని పంపారు. అనంతరం అబూ లహబ్, ఇంకా ఖురైష్‌కు చెందిన వారందరూ వచ్చారు. ప్రవక్త (స) వారి నుద్దేశించి, ” ‘ఒకవేళ నేను ఒక సైన్యం వస్తుంది, అది మీపై దాడిచేస్తుంది, హత్యలు, దోపిడీలకు పాల్పడుతుంది,’ అని అంటే, మీరు నా మాట నమ్ముతారా?” అని అడిగారు. అందరూ ముక్త కంఠంతో, ‘నమ్ముతాము, ఎందుకంటే నువ్వు ఎప్పుడూ సత్యమే పలికావు,’ అని అన్నారు. అప్పుడు ప్రవక్త (స), ‘నేను మీకు, మీముందు ఉన్న కఠిన శిక్ష గురించి భయపెడుతున్నాను,’ అని అన్నారు. అది విన్న అబూ లహబ్, ‘నీ పాడుగాను, దీనికోసమేనా మమ్మల్ని అందరినీ ఇక్కడ ప్రోగుచేసావు,’ అని అన్నాడు.” అప్పుడు సూరహ్ లహబ్ / మసద్ (111) అవతరింపజేయబడింది. (బు’ఖారీ, ముస్లిమ్)
5847 – [ 11 ] ( مُتَّفَقٌ عَلَيْهِ ) (3/1626)
وَعَنْ عَبْدِ اللهِ بْنِ مَسْعُوْدٍ قَالَ: بَيْنَمَا رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم يُصَلَّيْ عِنْدَ الْكَعْبَةِ وَجَمْعُ قُرَيْشٍ فِيْ مَجَالِسِهِمْ إِذْ قَالَ قَائِلٌ : أَيُّكُمْ يَقُوْمُ إِلى جَزُوْرِ آلِ فُلَانٍ فَيَعْمِدُ إِلى فَرَثِهَا وَدَمِهَا وَسَلَاهَا ثُمَّ يُمْهِلُهُ حَتّى إِذَا سَجَدَ وَضَعَهُ بَيْنَ كَتِفَيْهِ وَثَبَتَ النَّبِيُّ صلى الله عليه وسلم سَاجِدًا فَضَحِكُوْا حَتّى مَالَ بَعْضُهُمْ عَلَى بَعْضٍ مِنَ الضِّحْكِ فَانْطَلَقَ مُنْطَلِقٌ إِلى فَاطِمَةَ. فَأَقْبَلَتْ تَسْعَى وَثَبَتَ النَّبِيُّ صلى الله عليه وسلم سَاجِدًا حَتّى أَلْقَتْهُ عَنْهُ وَأَقْبَلَتْ عَلَيْهِمْ تَسُبُّهُمْ فَلَمَّا قَضَى رَسُوْلُ الله صلى اللهِ عليه وسلم الصَّلَاةَ قَالَ: “اللّهُمَّ عَلَيْكَ بِقُرَيْشٍ” ثَلَاثًا – وَكَانَ إِذَا دَعَا دَعَا ثَلَاثًا وَإِذَا سَأَلَ سَأَلَ ثَلَاثًا – “اللّهُمَّ عَلَيْكَ بِعُمْرِو بْنِ هَشَّامٍ وَشَيْبَةَ بْنِ رَبِيْعَةَ وَالْوَلِيْدِ بْنِ عُتْبَةَ وَأُميَّةَ بْنِ خَلْفٍ وَعُقْبَةَ بْنِ أَبِيْ مُعِيْطٍ وَعُمَارَةَ بْنِ الْوَلِيْدِ”. قَالَ عَبْدُ اللهِ: فَوَ اللهِ لَقَدْ رَأَيْتُهُمْ صَرْعَى يَوْمَ بَدْرٍ ثُمَّ سُحِبُوْا إِلى الْقَلِيْبِ قَلِيْبِ بَدْرٍ. ثُمَّ قَالَ رَسُوْلُ الله صلى الله عليه وسلم: “وَأتبِعَ أَصْحَابُ الْقَلِيْبِ لَعْنَة”. مُتَّفَقٌ عَلَيْهِ.
5847. (11) [3/1626 –ఏకీభవితం]
‘అబ్దుల్లాహ్ బిన్ మస్’ఊద్ (ర) కథనం: ప్రవక్త (స) ఒకసారి క’అబహ్కు సమీపంగా నమా’జు చదువు తున్నారు. కొంతమంది ఖురైష్ ప్రజలు క’అబహ్ చుట్టూ సభ ఏర్పరచుకొని ఉన్నారు. అకస్మాత్తుగా వారిలో ఒక వ్యక్తి, ”మీలో ఎవరైనా ఫలానా కుటుం బంలో ఒంటె జి’బహ్ చేయబడింది. దాని వ్యర్థ పదా ర్థాలను తీసుకువచ్చి ఉంచుకొని ము’హమ్మద్ సజ్దాలోనికి వెళ్ళినపుడు వాటన్నిటినీ అతనిపై వేసేవారు ఉన్నారా?” అని అన్నాడు. అది విని ఒక పాపాత్ముడు వాటిని తీసుకొని వచ్చి ఉంచుకొని ప్రవక్త (స) సజ్దాలోకి వెళ్ళినపుడు ఆయన వీపుపై పెట్టాడు. ప్రవక్త (స) సజ్దా స్థితిలోనే ఉండి పోయారు. అది చూచి ఆ పాపాత్ములు నవ్వసాగారు. విరగబడి నవ్వుతూ ఒకరిపై ఒకరు పడ్డారు. ఒక వ్యక్తి వెళ్ళి ఈ విషయం ఫాతిమహ్కు తెలియపరిచాడు. ఫాతిమహ్ (ర) పరిగెత్తుకుంటూ వచ్చి వాటిని తీసిపారవేసి వారిని చీవాట్లు పెట్టింది. ఆ తరువాత ప్రవక్త (స) నమా’జు ముగించుకుని ”ఓ అల్లాహ్ (త)! ఖురైషులపట్ల కఠినంగా వ్యవహరించు” అని మూడుసార్లు ప్రార్థించారు. సాధారణంగా ప్రవక్త (స) దు’ఆను మూడుసార్లు చేసేవారు. అదేవిధంగా అల్లాహ్ (త)ను ఏదైనా అర్థిస్తే మూడుసార్లు అర్థించే వారు. ఆ తరు వాత వారి పేర్లు పలికి, ”ఓ అల్లాహ్(త)! ‘అమ్ర్ బిన్ హిషామ్, ‘ఉత్బహ్ బిన్ రబీ’అహ్, షయ్బహ్ బిన్ రబీ ‘అహ్, వలీద్ బిన్ ‘ఉత్‌బహ్, ఉమయ్యహ్ బిన్ ‘ఖలఫ్, ‘ఉఖ్‌బహ్ బిన్ ము’యీ’త్, ‘ఉమారహ్ బిన్ వలీద్‌ల పట్ల కఠినంగా వ్యవహరించు,” అని ప్రార్థించారు.
‘అబ్దుల్లాహ్ బిన్ మస్’ఊద్ (ర) కథనం: ”అల్లాహ్ (త) సాక్షి! బద్ర్ యుద్ధం నాడు ఈ అవిశ్వాసులను నాశనమై నేలపై పడి ఉండటాన్ని నేను చూసాను. ఆ తరువాత వారిని ఈడ్చుకొని తీసుకువెళ్ళి బద్ర్ బావిలో పడవేయటం జరిగింది. ఆ తరువాత ప్రవక్త (స) వారి గురించి మాట్లాడుతూ, ‘బావిలో వేయ బడిన బృందం శిక్షకు, శాపానికి గురి చేయబడింది,’ అని అన్నారు. ” (బు’ఖారీ, ముస్లిమ్)
5848 – [ 12 ] ( مُتَّفَقٌ عَلَيْهِ ) (3/1626)
وَعَنْ عَائِشَةَ أَنَّهَا قَالَتْ: هَلْ أَتَى عَلَيْكَ يَوْمٌ كَانَ أَشَدُّ مِنْ يَوْمٍ أُحَدٍ؟ فَقَالَ: “لَقَدْ لَقِيْتُ مِنْ قَوْمِكَ فَكَانَ أَشَدُّ مَا لَقِيْتُ مِنْهُمْ يَوْمَ الْعَقَبَةِ. إِذْ عَرَضْتُ نَفْسِيْ عَلَى ابْنِ عَبْدِ يَا لَيْلَ بْنِ كُلَالٍ. فَلَمْ يُجِبْنِيْ إِلى مَا أَرَدْتُ فَانْطَلَقْتُ – وَأَنَا مَهْمُوْمٌ – عَلَى وَجْهِيْ فَلَمْ أَسْتَفِقْ إِلَّا فِي قَرْنِ الثَّعَالِبِ. فَرَفَعْتُ رَأْسِيْ فَإِذَا أَنَا بِسَحَابَةٍ قَدْ أَظَلَّتْنِيْ فَنَظَرْتُ فَإِذَا فِيْهَا جِبْرَيْلُ فَنَادَانِيْ فَقَالَ: إِنَّ اللهَ قَدْ سَمِعَ قَوْلُ قَوْمِكَ وَمَا رَدُّوْا عَليْكَ وَقَدْ بَعَثَ إِلَيْكَ مَلَكَ الْجِبَالِ لِتَأْمُرَهُ بِمَا شِئْتَ فِيْهِمْ”. قَالَ: “فَنَادَانِيْ مَلَكُ الْجِبَالِ فَسَلَّمَ عَلَيَّ ثُمَّ قَالَ: يَا مُحَمَّدُ إِنَّ اللهَ قَدْ سَمِعَ قَوْلَ قَوْمِكَ وَأَنَا مَلَكُ الْجِبَالِ وَقَدْ بَعَثَنِيْ رَبُّكَ إِلَيْكَ لِتَأْمُرَنِيْ بِأَمْرِكَ إِنْ شِئْتَ أُطْبِقَ عَلَيْهِمُ الْأَخْشَبَيْنِ”. فَقَالَ رَسُوْلُ الله صلى الله عليه وسلم: “بَلْ أَرْجُوْ أَنْ يُخْرِجَ اللهُ مِنْ أَصْلَابِهِمْ مَنْ يَعْبُدُ اللهض وَحْدُهُ وَلَا يُشْرِكُ بِهِ شَيْئًا”.
5848. (12) [3/1626 –ఏకీభవితం]
‘ఆయి’షహ్ (ర) కథనం: ఒకరోజు ‘ఆయి’షహ్ (ర) ప్రవక్త (స) తో, ”ఓ ప్రవక్తా! మీపై ఉ’హుద్ యుద్ధ దినం కన్నా కఠినమైన దినం వచ్చిందా?” అని విన్నవించు కున్నాను. దానికి ప్రవక్త (స), ”మీ జాతి ప్రజల తరఫున నాకు ఉ’హుద్ దినంకన్నా కఠినమైన బాధ కలిగింది. అన్నిటికంటే చాలా బాధ ‘అఖ్‌బహ్ నాడు కలిగింది. నేను ఇబ్నె అబ్ద్ లేదా లైల్ బిన్ కలాల్ ముందు ఇస్లామ్ సందేశాన్ని పెట్టాను. కాని వారు దానికి ఎటువంటి సమాధానం ఇవ్వలేదు. నేను విచారంగా తిన్నగా వెళ్ళి, ఖర్న్ స’ఆలిబ్ చేరుకున్నాను. కొంచెం స్పృహ వచ్చిన తర్వాత తల పైకెత్తి చూసాను. ఒక మేఘం ఉంది. అది నాకు నీడ కల్పిస్తుంది. ఆ తరువాత నా దృష్టి జిబ్రీల్‌పై పడింది. జిబ్రీల్ నన్ను పిలిచి, ‘మీరు మీ జాతి వారితో చెప్పింది, వారు మీకు ఇచ్చిన సమాధానం గురించి అల్లాహ్(త) విన్నాడు. అల్లాహ్(త) మీకోసం కొండల దూతను పంపాడు. మీరు ఆదేశించింది చేయమని అన్నాడు.’ అని అన్నారు. ప్రవక్త (స) కథనం: ‘ఆ తరువాత కొండల దైవదూత నాకు సలామ్ చేసాడు. తరువాత ఓ ము’హమ్మద్! అల్లాహ్(త) మీ జాతివారి మాటలు విన్నాడు. నేను పర్వతాల దూతను, మీ ప్రభువు నన్ను మీ వద్దకు పంపాడు. వారి గురించి నేను మీ ఆదేశం పాలించాలని, ఒకవేళ మీరు కోరితే మీ జాతి ప్రజలను రెండుకొండల క్రింద పడవేయ గలను,’ అని అన్నాడు. దానికి ప్రవక్త (స) అల్లాహ్(త) వీరి తరాలలో ఏక దైవారాధన చేసే వాళ్ళను, ఆయన(త)కు సాటి కల్పించని వారిని సృష్టిస్తాడని ఆశిస్తున్నాను,’ అని అన్నారు. [20] (బు’ఖారీ, ముస్లిమ్)
5849 – [ 13 ] ( صحيح ) (3/1627)
وعَنْ أَنَسٍ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم كُسِرَتْ رَبَاعِيَتُهُ يَوْمَ أُحُدٍ وَشُجَّ فِيْ رَأْسِهِ فَجَعَلَ يَسْلُتُ الدَّمَ عَنْهُ وَيَقُوْلُ: “كَيْفَ يُفْلِحُ قَوْمٌ شَجُّوا رَأسَ نَبِيِّهِمْ وَكَسَرُوْا رُبَاعِيَتَهُ”. رَوَاهُ مُسْلِمٌ.
5849. (13) [3/1627 –దృఢం]
అనస్ (ర) కథనం: ఉ’హుద్ యుద్ధంనాడు ప్రవక్త(స) ముందుపళ్లలోని ఒక పన్ను విరిగిపోయింది. తలకు గాయాలు తగిలాయి. ప్రవక్త (స) తన తల నుండి రక్తం తుడుస్తూ, ‘తమ ప్రవక్తనే గాయపరచి, పళ్ళు విరగ్గొట్టిన వారు ఎలా సాఫల్యం పొందుతారు,’ అని అన్నారు.[21] (ముస్లిమ్)
5850 – [ 14 ] ( مُتَّفَقٌ عَلَيْهِ ) (3/1627)
وَعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “اِشْتَدَّ غَضَبُ اللهِ عَلَى قَوْمٍ فَعَلُوْا بِنَبِيِّهِ “يُشِيْرُ إِلى رُبَاعِيَتِهِ” اِشْتَدَّ غَضَبُ اللهِ عَلَى رَجُلٍ يَقْتُلُهُ رَسُوْلُ اللهِ فِيْ سَبِيْلِ اللهِ”. مُتَّفَقٌ عَلَيْهِ.
5850. (14) [3/1627 –ఏకీభవితం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”తమ ప్రవక్త పట్ల కఠినంగా ప్రవర్తించిన జాతిపై అల్లాహ్(త) తీవ్రంగా ఆగ్రహం చెందాడు. ఇంకా ప్రవక్త(స) తన పళ్ళవైపు సైగచేస్తూ, దైవప్రవక్త (స) దైవమార్గంలో చంపిన వ్యక్తిని అల్లాహ్(త) కఠినంగా శిక్షిస్తాడు.” (బు’ఖారీ, ముస్లిమ్)
هَذَا الْبَابُ خَالٍ عَنِ الْفَصْلِ الثَّانِيْ.
ఇందులో రెండవ విభాగం లేదు
—–
اَلْفصْلُ الثَّالِثُ మూడవ విభాగం
5851 – [ 15 ] ( مُتَّفَقٌ عَلَيْهِ ) (3/1628)
عَنْ يَحْيَى بْنِ أَبِيْ كَثِيْرٍ قَالَ: سَأَلْتُ أَبَا سَلَمَةَ بْنِ عَبْدِ الرّحْمنِ عَنْ أَوَّلِ مَا نَزَلَ مِنَ الْقُرْآنِ؟ قَالَ: [يَا أَيُّهَا الْمُدَّثِّرُ؛ 74] قُلْتُ: يَقُوْلُوْنَ: [إِقْرَأْ بِاسْمِ رَبِّكَ؛ 96] قَالَ أَبُوْ سَلَمَةَ: سَأَلْتُ جَابِرًا عَنْ ذَلِكَ. وَقُلْتُ لَهُ مِثْلَ الَّذِيْ قُلْتُ لِيْ. فَقَالَ لِيْ جَابِرٌ: لَا أُحَدِّثُكَ إِلَّا بِمَا حَدَّثَنَا رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم. قَالَ: “جَاوَرْتُ بِحِرَاءِ شَهْرًا فَلَمَّا قَضَيْتُ جَوَارِيْ هَبَطْتُ فَنُوْدِيْتُ فَنَظَرْتُ عَنْ يَمِيْنِيْ فَلَمْ أَرْ شَيْئًا وَنَظَرْتُ عَنْ شِمَالِيْ فَلَمْ أَرَ شَيْئًا وَنَظَرْتُ عَنْ خَلْفِيْ فَلَمْ أَرَ شَيْئًا فَرَفَعْتُ رَأْسِيْ فَرَأَيْتُ شَيْئًا فَأَتَيْتُ خَدِيْجَةَ فَقُلْتُ: دَثرُوْنِيْ فَدَثَّرُوْنِيْ وَصَبُّوْا عَلَيَّ مَاء بَارِدًا فَنَزَلَتْ: [يَا أَيُّهَا الْمَدَّثِرُ. قُمْ فَأَنْذِرْ وَرَبَّكَ فَكَبِّرْ. وَثِيَابَكَ فَطَهِّر. وَالرُّجْزَ فَاهْجُرْ؛ 74: 1-5]. وَذَلِكَ قَبْلَ أَنْ تُفْرَضَ الصَّلَاةُ. مُتَّفَقٌ عَلَيْهِ.
5851. (15) [3/1627 –ఏకీభవితం]
యహ్‌యా బిన్ అబీ కసీ’ర్ (ర) కథనం: నేను అబూ సలమహ్, ‘అబ్దు’ర్రహ్మాన్‌ను ఖుర్‌ఆన్‌లో ఏ భాగం అన్నిటికంటే ముందు అవతరింపజేయ బడిందని అడిగాను. దానికి అతను ‘యా అయ్యుహల్ ముద్దస్సిర్ (74)’ అని అన్నారు. నేను, ”కాని అందరూ ముందు, ‘ఇఖ్‌రా బిస్మికరబ్బిక (96)’ అని అంటు న్నారు,” అని అన్నాను. దానికి అబూ సలమహ్, దీన్ని గురించి నేను జాబిర్ (ర)ను అడిగాను. ఇంకా అతనితో నీవన్నట్టే నేనన్నాను. దానికి జాబిర్ (ర), ”ప్రవక్త (స) మాకు చెప్పిందే నేను నీకు చెబుతున్నాను,” అని అన్నారు. ప్రవక్త (స), ”నేను ‘హిరా గుహలో నెలరోజుల వరకు ఏకాంతంగా ఉన్నాను. నా గడువు పూర్తవగానే, నేను కొండపై నుండి దిగాను. నన్ను పిలవటంజరిగింది. నేను కుడి ప్రక్క చూచాను, కాని ఎవరూ కనిపించ లేదు. ఇంకా నేను ఎడమ ప్రక్క చూచాను. అటుకూడా ఎవరూ కనబడలేదు. వెనుక చూచాను. అటు కూడా ఎవరూ లేరు. నేను తల ఎత్తి చూస్తే ఒక దైవదూత కన పడ్డాడు. నేనతన్ని చూచి భయపడ్డాను. ఆ తరు వాత నేను ‘ఖదీజహ్ వద్దకు వచ్చి, ‘దుప్పటి కప్పండి,’ అని అన్నాను. నాకు దుప్పటి కప్పడం జరిగింది. ఇంకా నాపై చన్నీరు పోయటం జరిగింది. ఆ తరువాత ఈ ఆయతు అవతరింపజేయబడింది, ” ఓ దుప్పటిలో చుట్టుకున్న వాడా! లే! ఇక హెచ్చరించు! మరియు నీ ప్రభువు గొప్పతనాన్ని (ఘనతను) కొనియాడు (చాటి చెప్పు)! మరియు నీ వస్త్రాలను పరిశుభ్రంగా ఉంచుకో! మరియు మాలిన్యానికి దూరంగా ఉండు!”(ముద్దస్సిర్, 74:1-5)” అని అన్నారు. ఉల్లేఖన కర్త కథనం: దైవవాణి అవతరణ సంఘటన నమా’జు విధికాక ముందుది. [22] (బు’ఖారీ, ముస్లిమ్)
=====
5 – بَابُ عَلَامَاتِ النُّبُوَّةِ
5. దైవదౌత్య చిహ్నాలు
اَلْفَصْلُ الْأَوَّلُ మొదటి విభాగం
5852 – [ 1 ] ( صحيح ) (3/1629)
عَنْ أَنَسٍ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم أَتَاهُ جِبْرَيْلُ وَهُوَ يَلْعَبُ مَعَ الْغِلْمَانِ فَأَخَذَهُ فَصَرَعَهُ فَشَقَّ عَنْ قَلْبِهِ فَاسْتَخْرَجَ مِنْهُ عَلَقَةً. فَقَالَ: هَذَا حَظُّ الشَّيْطَانِ مِنْكَ ثُمَّ غَسَلَهُ فِيْ طَسْتٍ مِنْ ذَهَبٍ بِمَاءِ زَمْزَمَ ثُمَّ لَأُمَهُ وَأَعَادَهُ فِيْ مَكَانِهِ وَجَاءَ الْغِلْمَانُ يَسْعَوْنَ إِلى أُمِّهِ يَعْنِيْ ظِئْرَهُ. فَقَالُوْا: إِنَّ مُحَمَّدًا قَدْ قُتِلَ فَاسْتَقْبَلُوْهُ وَهُوَ مُنْتَقَعُ اللَّوْنِ. قَالَ أَنَسٌ: فَكُنْتُ أَرَى أَثَرَ الْمَخِيْطِ فِيْ صَدْرِهِ. رَوَاهُ مُسْلِمٌ.
5852. (1) [3/1629 –దృఢం]
అనస్ (ర) కథనం: ఒకరోజు ప్రవక్త (స) పిల్లలతో ఆడుతున్నారు. ఇంతలో జిబ్రీల్ (అ) వచ్చారు. ప్రవక్త (స)ను పట్టుకున్నారు. వెల్లకిలా పడుకోబెట్టారు. ఆ తరువాత ఛాతీని చీల్చి గుండె నుండి చిక్కటి రక్తాన్ని తీసి, నీ శరీరంలోని షై’తాన్ భాగం అని చెప్పి, ప్రవక్త (స) హృదయాన్ని బంగారు పళ్ళెంలో ‘జమ్ ‘జమ్ నీటితో కడిగి, మళ్ళీ గుండెను దాని స్థానంలో పెట్టి సరిచేసారు. ప్రవక్త (స)తో ఆడుకుంటున్న ఇతర పిల్లలు ఈ దృశ్యం చూచి, భయపడి పరిగెత్తుకుంటూ వచ్చి పాలుపట్టే తల్లి హలీమహ్ తో, ‘ము’హమ్మద్ ను చంపడం జరిగింది,’ అని చెప్పారు. ప్రజలు అది విని పరిగెత్తుకుంటూ వచ్చారు. చూసే సరికి ప్రవక్త (స) ముఖం మారి ఉంది. అనస్ (ర), ‘నేను ప్రవక్త (స) ఛాతీపైన కుట్టు చిహ్నాలు చూసేవాడిని,’ అని అన్నారు. (ముస్లిమ్)
5853 – [ 2 ] ( صحيح ) (3/1629)
وَعَنْ جَابِرِ بْنِ سَمُرَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِنِّيْ لَأَعْرِفُ حَجَرًا بِمَكَّةَ كَانَ يُسَلِّمُ عَلَيَّ قَبْلَ أَنْ أَبْعَثَ إِنِّيْ لَأَعْرِفُهُ الآنَ”. رَوَاهُ مُسْلِمٌ.
5853. (2) [3/1629 –దృఢం]
జాబిర్ బిన్ సమురహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”నేను ప్రవక్త కాకముందు మక్కహ్ లో నాకు సలామ్ చేసేరాయిని నేను గుర్తుపట్టగలను. ఇప్పుడు కూడా నేను దాన్ని గుర్తు పట్టగలను.” (ముస్లిమ్)
5854 – [ 3 ] ( مُتَّفَقٌ عَلَيْهِ ) (3/1629)
وَعَنْ أَنَسٍ قَالَ: إِنَّ أَهْلَ مَكَّةَ سَأَلُوْا رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم أَنْ يُرِيَهُمْ آيَةً فَأَرَاهُمُ الْقَمَرَ شِقَّتَيْنِ حَتّى رَأَوْا حَرَاءً بَيْنَهُمَا. مُتَّفَقٌ عَلَيْهِ.
5854. (3) [3/1629 –ఏకీభవితం]
అనస్ (ర) కథనం: మక్కహ్ అవిశ్వాసులు ప్రవక్త (స)ను, ‘ఒకవేళ నీవు ప్రవక్తవేఅయితే ఏదైనా మహిమ చూపెట్టు,’ అని అన్నారు. ప్రవక్త (స) తన చేతి సైగ ద్వారా చంద్రుణ్ణి రెండు ముక్కలుగా చేసి చూపెట్టారు. చివరికి అవిశ్వాసులు ‘హిరా కొండను చంద్రుని రెండు ముక్కల మధ్య చూసారు. (బు’ఖారీ, ముస్లిమ్)
5855 – [ 4 ] ( مُتَّفَقٌ عَلَيْهِ ) (3/1629)
وَعَنِ ابْنِ مَسْعُوْدٍ قَالَ: اِنْشَقّ الْقَمَرُ عَلَى عَهْدِ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم فِرءقَتَيْنِ: فِرْقَةٌ فَوْقَ الْجَبَلِ وَفِرْقَةٌ دُوْنَهُ. فَقَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “اِشْهَدُوْا”. مُتَّفَقٌ عَلَيْهِ.
5855. (4) [3/1629– ఏకీభవితం]
ఇబ్నె మస్’ఊద్ (ర) కథనం: ప్రవక్త (స) కాలంలో చంద్రుడు రెండు ముక్కలు అయ్యాడు. అంటే మధ్య నుండి రెండు ముక్కలు అయ్యాయి. ప్రవక్త (స) ఈ మహిమను చూపెట్టి, ‘సాక్ష్యం ఇవ్వండి,’ అని అన్నారు. (బు’ఖారీ, ముస్లిమ్)
5856 – [ 5 ] ( صحيح ) (3/1629)
وَعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: قَالَ أَبُوْ جَهْلٍ: هَلْ يُعَفِّرُ مُحَمَّدٌ وَجْهَهُ بَيْنَ أَظْهُرِكُمْ؟ فَقِيْلَ: نَعَمْ . فَقَالَ: وَاللَّاتِ وَالْعُزَّى لَئِنْ رَأَيْتُهُ يَفْعَلُ ذَلِكَ لَأَطأنّ عَلَى رَقَبَتِهِ. فَأَتَى رَسُوْل اللهِ صلى الله عليه وسلم وَهُوَ يُصَلِّيْ – زَعَمَ لَيَطَأُ عَلَى رَقَبَتِهِ – فَمَا فَجَئَهُمْ مِنْهُ إِلَّا وَهُوَ يَنْكُصُ عَلَى عَقِبَيْهِ وَيَتَّقِيْ بِيَدَيْهِ فَقِيْلَ لَهُ مَالَك؟ فَقَالَ: إِنَّ بَيْنِيْ وَبَيْنَهُ لَخَنْدَقًا مِنْ نَارٍ وَهَوْلًا وَأَجْنِحَةً. فَقَالَ رَسُوْلُ الله صلى اللهِ عليه وسلم: “لَوْ دَنَا مِنِّيْ لَاخْتَطَفَتْهُ الْمَلَائِكَةُ عُضْوًا عُضْوًا”. رَوَاهُ مُسْلِمٌ
5856. (5) [3/1629 –దృఢం]
అబూ హురైరహ్ (ర) కథనం: అబూ జహల్ ప్రజలతో, ‘ము’హమ్మద్ మీ ముందు తన ముఖాన్ని మట్టిలో కలుపుతున్నాడా?’ అంటే ‘నమా’జులు, సజ్దాలు చేస్తున్నాడా?’ అనిఅడిగాడు. దానికి ప్రజలు, ‘అవును,’ అని అన్నారు. అప్పుడు అబూ జహల్, ‘లాత్ మరియు ‘ఉ’జ్జాల సాక్షి! ఒకవేళ అలా చేస్తూ నా కంట పడితే, నలిపివేస్తాను,’ అని పలికి, ఆ ఉద్దేశ్యం తోనే ప్రవక్త (స) వద్దకు వచ్చాడు. అప్పుడు ప్రవక్త (స) నమా’జు చదువుతున్నారు. వాడు ప్రవక్త (స) మెడపై కాళ్ళు పెడదామని ముందుకు వెళ్ళి, కాలు ఎత్తి వెంటనే వెనక్కు తగ్గి తన్నుతాను రక్షించుకోసాగాడు. ‘నీ కేమయింది,’ అని ప్రజలు అడిగారు. దానికి వాడు, ‘నాకు ముహమ్మద్‌కు మధ్య అగ్ని కందకం ఉంది. అది చాలా భయంకరమైన దృశ్యం ఇంకా దైవదూతల రెక్కలు ఉన్నాయి,’ అని అన్నాడు. ప్రవక్త (స) దీన్ని గురించి, ‘ఒకవేళ అబూ జహల్ నా దగ్గరకు వస్తే, దైవదూతలు వాడి శరీరాన్ని ముక్కలు ముక్కలు చేసేవారు,’ అని అన్నారు. (ముస్లిమ్)
5857 – [ 6 ] ( صحيح ) (3/1630)
وَعَنْ عَدِيِّ بْنِ حَاتِمٍ قَالَ: بَيْنَا أَنَا عِنْدَ النَّبِيِّ صلى الله عليه وسلم إِذَا أَتَاهُ رَجُلٌ فَشَكَا إِلَيْهِ الْفَاقَةَ ثُمَّ أَتَاهُ الْآخَرُ فَشَكَا إِلَيْهِ قَطْعَ السَّبِيْلِ. فَقَالَ: “يَا عَدِيُّ هَلْ رَأَيْتَ الْحِيْرَةَ؟ فَإِنْ طَالَتْ بِكَ حَيَاةٌ فَلَتَرَيَنَّ الظَّعِيْنَةَ تَرْتَحِلُ مِنَ الْحِيْرَةِ حَتّى تَطُوْفَ بِالْكَعْبَةِ لَا تَخَافُ أَحَدًا إِلَّا اللهَ وَلَئِنْ طَالَتْ بِكَ حَيَاةٌ لَتُفْتَحَنَّ كُنُوْزُ كِسْرَى وَلَئِنْ طَالَتْ بِكَ حَيَاةٌ لَتَرَيَنَّ الرَّجُلَ يُخْرِجُ مِلْءَ كَفِّهِ مِنْ ذَهَبٍ أَوْ فِضَّةٍ يَطْلُبُ مَنْ يَقْبَلُهُ. فَلَا يَجِدُ أَحَدًا يَقْبَلُهُ مِنْهُ وَلَيَلْقَيَنَّ اللهَ أَحَدُكُمْ يَوْمَ يَلْقَاهُ وَلَيْسَ بَيْنَهُ وَبَيْنَهُ تَرْجُمَانٌ يُتَرْجِمُ لَهُ فَلَيَقُوْلَنَّ: أَلَمْ أَبْعَثْ إِلَيْكَ رَسُوْلًا فَيُبَلِّغَكَ؟ فَيَقُوْلُ: بَلَى. فَيَقُوْلُ: أَلَمْ أُعْطِكَ مَالًا وَأُفَضِّلُ عَلَيْكَ؟ فَيَقُوْلُ: بَلَى. فَيَنْظُرُ عَنْ يَمِيْنِهِ فَلَا يَرَى إِلَّا جَهَنَّمَ ويَنْظُرُ عَنْ يَسَارِهِ فَلَا يَرَى إِلَّا جَهَنَّمَ اتَّقُوْا النَّارَ وَلَوْ بِشِقِّ تَمْرَةٍ فَمَنْ لَمْ يَجِدْ فَبِكَلِمَةٍ طَيِّبَةٍ”. قَالَ عَدِيٌّ: فَرَأَيْتُ الظَّعِيْنَةَ تَرْتَحِلُ مِنَ الْحِيْرَةِ حَتّى تَطُوْفَ بِالْكَعْبَةِ لَا تَخَافُ إِلَّا اللهَ وَكُنْتُ فِيْمَنِ افْتَتَحَ كُنُوْزَ كِسْرَى بْنِ هُرْمُزَ وَلَئِنْ طَالَتْ بِكُمْ حَيَاةٌ لَتَرَوُنَّ مَا قَالَ النَّبِيُّ أَبُوْ الْقَاسِمِ صلى الله عليه وسلم: ” يُخْرِجُ مِلْءَ كَفهِ”. روَاهُ الْبُخَارِيُّ .
5857. (6) [3/1630 –దృఢం]
‘అదీ బిన్ ‘హాతిమ్ (ర) కథనం: నేను ప్రవక్త (స) వద్ద ఉన్నాను. ఒక వ్యక్తి వచ్చి, తన దారిద్య్రాన్ని గురించి చెప్పుకున్నాడు. ఆ తరువాత మరో వ్యక్తి వచ్చాడు, దారి దోపిడీ గురించి ఫిర్యాదు చేశాడు. అప్పుడు ప్రవక్త (స), ‘ఓ అదీ! నువ్వు ‘హీరహ్ పట్టణం చూసావా? ఒకవేళ నీకు దీర్ఘాయుష్షు ఉంటే, నువ్వు తప్పకుండా ఒక స్త్రీ ఒంటరిగా ఒంటెపై ‘హిరహ్ నుండి మక్కహ్ వెళ్ళి క’అబహ్ ప్రదక్షిణం చేస్తుంది. ఆమెకు అల్లాహ్(త) భయంతప్ప మరేభయం ఉండదు. ఇంకా నీకు దీర్ఘాయుష్షు ఉంటే కిస్రా నిధులు ముస్లిముల కోసం యుద్ధధనంగా తెరవటం జరుగుతుంది. ఇంకా ఒకవేళ నీకు దీర్ఘాయుష్షు ఉంటే, ఒక వ్యక్తి పిడికెడు బంగారం లేదా వెండి తీసుకొని దానం చేయడానికి బయలు దేరుతాడు, కాని తీసుకునే వాడెవడూ ఉండడు. ఇంకా నిస్సందేహంగా తీర్పుదినం నాడు మీలో ప్రతి ఒక్కరూ మధ్యవర్తి లేకుండా అల్లాహ్(త)ను కలుసుకుంటారు. ఆ తరువాత అల్లాహ్(త) అతన్ని, ‘నేను నీ వద్దకు ప్రవక్తను పంపలేదా, నీకు ధర్మ విషయాలు తెలుపటానికి?’ అని అంటాడు. దానికి ఆ వ్యక్తి, ‘అవును,’ అంటాడు. మళ్ళీ అల్లాహ్(త), ‘నీకు నేను ధనసంపదలు ప్రసాదించలేదా, నీకు నేను ఉపకారం చేయలేదా?’ అని అంటాడు. ‘అవును,’ అని అంటాడు. ఆ తరువాత ఆ వ్యక్తి తన కుడివైపు చూస్తాడు, అతనికి నరకం కనబడుతుంది. ఎడమవైపు చూస్తాడు, నరకమే కనబడుతుంది.” ఆ తరువాత ప్రవక్త (స) ఇలా అన్నారు, ‘ప్రజలారా! నరకాగ్నినుండి మిమ్మల్ని మీరు కాపాడుకోండి. ఖర్జూరపు ఒక్కముక్క ఇచ్చి అయినా సరే. ఎవరి దగ్గరైతే ఇదీ లేకపోతే అడిగే వాడితో మంచిగా మాట్లాడండి,” అని అన్నారు.
‘అదీ కథనం: ప్రవక్త (స) ప్రవచించినట్లు ‘హీరహ్ నుండి మక్కహ్ వరకు స్త్రీ ఒంటరిగా ప్రయాణంచటం, ఆమె అల్లాహ్ (త) తప్ప మరెవరికీ భయపడక పోవటం చూసాను. ఇంకా కిస్రా నిధులను తెరచిన వారిలో నేను కూడా ఉన్నాను. అవి ముస్లిములకు లభించాయి. ఒకవేళ మీరు బ్రతికుంటే ప్రవక్త (స) భవిష్యవాణి నిజం కావటం చూస్తారు. అంటే ఒక వ్యక్తి బంగారు లేదా వెండి చేతుల్లో తీసుకొని బయలు దేరుతాడు. కాని తీసుకునేవాడెవడూ ఉండడు. (బు’ఖారీ)
5858 – [ 7 ] ( صحيح ) (3/1630)
وَعَنْ خَبَّابِ بْنِ الْأَرَتِّ قَالَ: شَكَوْنَا إِلى النَّبِيِّ صلى الله عليه وسلم وَهُوَ مُتَوَسِّدٌ بُرْدَةٌ فِيْ ظِلِّ الْكَعْبَةِ وَقَدْ لَقِيْنَا مِنَ الْمُشْرِكِيْنَ شِدَّةً فَقُلْنَا: اَلَا تَدْعُو اللهَ فَقَعَدَ وَهُوَ مُحَمَّرٌ وَجْهُهُ وَقَالَ: “كَانَ الرَّجُلُ فِيْمَنْ كَانَ قَبْلَكُمْ يُحْفَرُ لَهُ فِي الْأَرْضِ فَيُجْعَلُ فِيْهِ فَيُجَاءُ بِمِنْشَارٍ فَيُوْضَعُ فَوْقَ رَأْسِهِ فَيَشَقُّ بِاثْنَيْنِ فَمَا يَصُدُّهُ ذَلِكَ عَنْ دِيْنِهِ وَاللهِ لَيَتِمَّنَّ هَذَا الْأَمْرُ حَتّى يَسِيْرَ الرَّاكِبُ مِنْ صَنَعَاءِ إِلى حَضْرَمَوْتَ لَا يَخَافُ إِلّا اللهَ أَوِ الذِّئْبَ عَلَى غَنَمِهِ وَلَكِنَّكُمْ تَسْتَعْجِلُوْنَ”. روَاهُ الْبُخَارِيُّ.
5858. (7) [3/1630– దృఢం]
‘ఖబ్బాబ్ బిన్ అర్త్ (ర) కథనం: ఒకరోజు మేము ప్రవక్త (స) క’అబహ్ నీడలో ఒక దుప్పటిని తలగడగా చేసుకొని విశ్రాంతి తీసుకుంటుండగా అవిశ్వాసుల గురించి ఫిర్యాదు చేస్తూ, ‘అవిశ్వాసుల నుండి మనకు అనేక బాధలు కలిగాయి, మరి తమరు వారికి వ్యతిరేకంగా అల్లాహ్(త)ను ఎందుకు ప్రార్థించలేదు,’ అని విన్నవించుకున్నాం. అది విన్న ప్రవక్త (స) లేచి కూర్చున్నారు, ముఖంలో ఆగ్రహం కనిపించింది. అప్పుడు ప్రవక్త (స), ‘మీ పూర్వీకులను పాతిపెట్టి తలలను రంపాలతో కోసి రెండు ముక్కలు చేసేవారు. కాని ఈ భయంకరమైన శిక్ష వారిని వారి ధర్మం నుండి వేరుచేసేది కాదు. వారు తమ ధర్మంపై స్థిరంగా ఉండే వారు. ఇంకా ప్రజలు శరీరాలపై ఇనుప దువ్వెనలతో వారి మాంసాన్ని వలచటం జరిగేది. వారి మాంసం దుమ్ముల వరకు తెగి పడేది. ఇటువంటి భయంకర మైన శిక్షలు కూడా వారిని వారి ధర్మం నుండి దూరం చేసేది కాదు. అల్లాహ్ సాక్షి! ఈ ధర్మం పరిపూర్ణతకు చేరుకుంటుంది. చివరకు ఒక ప్రయాణీకుడు ‘సన’ఆ’ నుండి హ’దరమౌత్ వరకు ఒంటరిగా ప్రయాణం చేస్తాడు. అతడు అల్లాహ్(త)కు తప్ప మరెవరికీ భయపడడు. లేదా ఎవరూ తమ మేకలగురించి తోడేళ్ళకు భయపడరు. అయితే మీరు తొందర పడుతున్నారు. అంటే ఓర్పు సహనంతో మెలగటం లేదు,’ అని అన్నారు. (బు’ఖారీ)
5859 – [ 8 ] ( مُتَّفَقٌ عَلَيْهِ ) (3/1631)
وَعَنْ أَنَسٍ قَالَ: كَانَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم يَدْخُلُ عَلَى أُمِّ حَرَامٍ بِنْتِ مَلْحَانَ وَكَانَتْ تَحْتَ عُبَادَةَ بْنِ الصَّامِتِ فَدَخَلَ عَلَيْهَا يَوْمًا فَأَطْعَمْتُهُ ثُمَّ جَلَسَتْ تَفَلِّيْ رَأْسَهُ فَنَامَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم ثُمَّ اسْتَيْقَظَ وَهُوَ يَضْحَكُ قَالَتْ: فَقُلْتُ: مَا يَضْحَكُك يَا رَسُوْلَ اللهِ؟ قَالَ: ” نَاسٌ مِنْ أُمَّتِيْ عُرِضُوْا عَلَيَّ غُزَاةً فِيْ سَبِيْلِ اللهِ يَرْكَبُوْنَ ثَبَجَ هَذَا الْبَحْرِ مُلُوْكًا عَلَى الْأسِرَّةِ أَوْ مِثْلَ الْمُلُوْكِ عَلَى الْأَسِرَّةِ”. فَقُلْتُ: يَا رَسُوْلَ اللهِ اُدْعُ اللهَ أَنْ يَجْعَلَنِيْ مِنْهُمْ فَدَعَا لَهَا ثُمَّ وَضَعَ رَأْسُهُ فَنَامَ ثُمَّ اسْتَيْقَظَ وَهُوَ يَضْحَكُ فَقُلْتُ: يَا رَسُوْلَ اللهِ مَا يُضْحِكُكَ؟ قَالَ: “نَاسٌ مِنْ أُمَّتِيْ عُرِضُوْا عَلَيَّ غُزَاةٌ فِيْ سَبِيْلِ اللهِ”. كَمَا قَالَ فِي الْأُوْلِى. فَقُلْتُ: يَا رَسُوْلَ اللهِ اُدْعُ اللهَ أَنْ يَجْعَلَنِيْ مِنْهُمْ.قَالَ: “أَنْتَ مِنَ الْأَوَّلِيْنَ”. فَرَكِبَتْ أُمُّ حَرَامٍ الْبَحْرَ فِيْ زَمَنِ مُعَاوِيَةَ فَصُرِعَتْ عَنْ دَابَّتِهَا حِيْنَ خَرَجَتْ مِنَ الْبَحْرِ فَهَلَكَتْ. مُتَّفَقٌ عَلَيْهِ.
5859. (8) [3/1631– ఏకీభవితం]
అనస్ (ర) కథనం: ప్రవక్త (స) ఉమ్మె ‘హరామ్ బిన్‌తె మిల్’హాన్ (ర) ఇంటికి వచ్చేవారు. ఉమ్మె ‘హరామ్ ‘ఉబాదహ్ బిన్ సా’మిత్ (ర) భార్య. అలవాటు ప్రకారం ఒక రోజు ఆమె ఇంటికి వెళ్ళారు. ఉమ్మె ‘హరామ్ ప్రవక్త (స)కు భోజనం పెట్టారు. ఆ తరువాత తలలో పేళ్ళు చూడటానికి కూర్చుండి పోయారు. ప్రవక్త (స) నిద్ర పోయారు. ఆ తర్వాత ప్రవక్త (స) నవ్వుతూ లేచారు. ఉమ్మె ‘హరామ్ ప్రవక్త (స)ను, ‘ఎందుకు నవ్వు వచ్చింది,’ అని అడిగారు. దానికి ప్రవక్త (స), ‘నా అనుచరుల్లో ఒక బృందం దైవమార్గంలో జిహాద్ చేస్తూ చూపించబడింది. వాళ్ళు సముద్రంపై రాజుల్లా కూర్చున్నారు,’ అని అన్నారు.
ఉమ్మె ‘హరామ్ కథనం: అప్పుడు నేను, ‘ఓ ప్రవక్తా! నేను కూడా వారిలో ఉండేటట్లు అల్లాహ్(త)ను ప్రార్థించండి,’ అని అన్నాను. ప్రవక్త (స) ప్రార్థించారు. ఆ తరువాత ప్రవక్త (స) తలగడపై చేరబడి నిద్రపోయారు. కొంత సేపు తర్వాత మళ్ళీ నవ్వుతూ లేచారు. అప్పుడు నేను, ‘ఓ ప్రవక్తా! నవ్వుకు కారణం ఏమిటి,’ అని అన్నాను. దానికి ప్రవక్త (స) నా అనుచర సమాజంలోని కొందరు అల్లాహ్(త) మార్గంలో జిహాద్ చేస్తున్నారు. అంతకు ముందు చెప్పినట్టే చెప్పారు. అప్పుడు కూడా నేను, ‘ఓ ప్రవక్తా! వారిలో నేను కూడా ఉండాలని ప్రార్థించండి,’ అని అన్నాను. దానికి ప్రవక్త (స), ‘నువ్వు మొదటి బృందంలో ఉన్నావు,’ అని అన్నారు. ము’ఆవియహ్ కాలంలో ఉమ్మె ‘హరామ్ సముద్ర ప్రయాణం చేసారు. సముద్రంపై నుండి దిగి వాహనంపై ఎక్కుతుండగా వాహనం పైనుండి క్రిందపడి మరణించారు. (బు’ఖారీ, ముస్లిమ్)
5860 – [ 9 ] ( صحيح ) (3/1631)
وَعَنِ ابْنِ عَبَّاسٍ قَالَ: إِنَّ ضِمَادًا قَدِمَ مَكَّةَ وَكَانَ مِنْ أَزْدِ شَنُوْءَةَ وَكَانَ يَرْقِيْ مِنْ هَذَا الرِّيْحِ فَسَمِعَ سُفَهَاءَ أَهْلِ مَكَّةَ يَقُوْلُوْنَ: إِنَّ مُحَمَّدًا مَجْنُوْنٌ. فَقَالَ: لَوْ أَنِّيْ رَأَيْتُ هَذَا الرَّجُلَ لَعَلّ اللهَ يَشْفِيْهِ عَلَى يَدِيْ. قَالَ: فَلَقِيَهُ. فَقَالَ: يَا مُحَمَّدُ إِنِّيْ اَرْقِيْ مِنْ هَذَا الرِّيْحِ فَهَلْ لَكَ؟ فَقَالَ رَسُوْلُ الله صلى الله عليه وسلم: “إِنَّ الْحَمْدَ لِلّهِ نَحْمَدُهُ وَنَسْتَعِيْنُهُ مَنْ يَهْدِهِ اللهُ فَلَا مُضِلَّ لَهُ وَمَنْ يُضْلِلْ فَلَا هَادِيَ لَهُ وَأَشْهَدُ أَنْ لَا إِلَهَ إِلَّا اللهُ وَحْدَهُ لَا شَرِيْكَ لَهُ وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُوْلُهُ. أَمَّا بَعْدُ “فَقَالَ: أَعِدْ عَلَيَّ كَلِمَاتِكَ هَؤُلَاءِ فَأَعَادَهُنَّ عَلَيْهِ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم ثَلَاثَ مَرَّاتٍ. فَقَالَ: لَقَدْ سَمِعْتُ قَوْلَ الْكَهنَةِ وَقَوْلَ السَّحَرَةِ وَقَوْلَ الشُّعَرَاءِ فَمَا سَمِعْتُ مِثْلَ كَلِمَاتِكَ هَؤُلْاَءِ. وَلَقَدْ بَلَغْنَ قَامُوْسَ الْبَحْرِ هَاتِ يَدَكَ أُبَايِعْكَ عَلَى الْإِسْلَامِ. قَالَ: فَبَايَعَهُ. رَوَاهُ مُسْلِمٌ.
وَفِيْ بَعْضِ نُسَخِ “الْمَصَابِيْحِ”: بَلَغْنَا نَاعُوْسَ الْبَحْرِوَذُكِرَ حَدِيْثَا أَبِيْ هُرَيْرَةَ وَجَابِرِ بْنِ سَمُرَةَ “يُهْلَكُ كِسْرَى” وَالْآخَرُ”لَيَفَتَحَنَّ عِصَابَةٌ” فِيْ بَابٍ “الْمَلَاحِمِ”.
5860. (9) [3/1631–దృఢం]
ఇబ్నె ‘అబ్బాస్ (ర) కథనం: ‘దిమాద్ అనే వ్యక్తి మక్కహ్ వచ్చాడు. అతడు అ’జ్‌ది షనూఅ’ తెగకు చెందినవాడు. అతడు జిన్నాతుల విషయంలో మంత్రించేవాడు. మక్కహ్ ముకర్రమహ్ కు చెందిన అల్లరి మూకల ద్వారా ము’హమ్మద్ పిచ్చివాడై పోయాడని విన్నాడు. అది విని, ‘ఆ వ్యక్తిని చూస్తే బాగుండు, నా వల్ల అల్లాహ్(త) అతనికి ఆరోగ్యం ప్రసాదించవచ్చు,’ అని అన్నాడు. ఇబ్నె ‘అబ్బాస్(ర) కథనం: ఆతరువాత ‘దిమాద్ ప్రవక్త (స)ను కలిసాడు. ఇంకా, ‘ఓ ము’హమ్మద్! నేను మంత్రాల ద్వారా మానసిక రోగాలను నయంచేస్తాను, నేను మీకు చికిత్స చేయనా, మంత్రించనా?’ అని అన్నాడు. దానికి ప్రవక్త (స) ”స్తోత్రాలన్నీ అల్లాహ్ కొరకే, మేము ఆయన్నే స్తుతిస్తున్నాము, ఇంకా ఆయన్నే సహాయం కొరకు అర్థిస్తున్నాం. ఆయన సన్మార్గం చూపినవారు మార్గ భ్రష్టత్వానికి గురికారు. ఆయన మార్గభ్రష్ఠత్వానికి గురిచేసిన వారికి ఎవ్వరూ సన్మార్గం చూపలేరు.” ఇంకా, ”నేను అల్లాహ్ తప్ప ఆరాధ్యులెవరూ లేరని, సాక్ష్యం ఇస్తున్నాను. ఇంకా నేను ము’హమ్మద్ (స) అల్లాహ్ దాసులు మరియు ఆయన ప్రవక్త అని సాక్ష్యం ఇస్తున్నాను.” అని అన్నారు. అది విన్న ‘దిమాద్ మీరు మళ్ళీ ఆ ఆయతులు చదవండి అన్నాడు. ప్రవక్త (స) మూడుసార్లు పలికారు. ఆ తరువాత ‘దిమాద్, ”నేను జ్యోతిష్కులు, మాంత్రికులు మరియు కవుల వచనాలు విన్నాను. కాని తమరు పలికినట్టి వచనాలు ఈనాటి వరకు ఎక్కడా వినలేదు. నిస్సందే హంగా ఇవి చాలా ప్రభావవంతమైన వచనాలు. ఏది మీ చేయి చాచండి! నేను మీ చేతిపై ఇస్లామ్ స్వీకరిస్తాను,” అని ఇస్లామ్ స్వీకరించాడు. (ముస్లిమ్)
మసాబీహ్‌కు చెందిన కొన్ని ప్రతుల్లో ఖామూస్‌కు బదులు నామూస్ ఉంది. ఇంకా అబూ హురైర మరియు జాబిర్ బిన్ సమురహ్‌ల ఉల్లేఖనంలోని, ఒక ఉల్లేఖనంలో, ”కిస్రా నాశనం అవుగాక,” మరో ఉల్లేఖనంలో ”ఒక బృందం జయిస్తుంది” అని ఉంది.
وَهَذَا الْبَابُ خَالٍ عَنِ الْفَصْلِ الثَّانِيْ.
ఇందులో రెండవ విభాగం లేదు
—–
اَلْفَصْلُ الثَّالِثُ మూడవ విభాగం
5861 – [ 10 ] ( مُتَّفَقٌ عَلَيْهِ ) (3/1632)
عَنِ ابْنِ عَبَّاسٍ قَالَ: حَدَّثَنِيْ أَبُوْ سُفْيَانَ بْنُ حَرْبٍ مِنْ فِيْهِ إِلى فِيَّ قَالَ: اِنْطَلَقْتُ فِي الْمُدَّةِ الَّتِيْ كَانَتْ بَيْنِيْ وَبَيْنَ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم. قَالَ: فَبَيْنَا أَنَا بِالشَّامِ إِذْ جِيْءَ بِكِتَابٍ النَّبِيِّ صلى الله عليه وسلم إِلى هِرَقْلِ. قَالَ: وَكَانَ دِحْيَةُ الْكَلْبِيُّ جَاءَ بِهِ فَدَفَعَهُ إِلى عَظِيْمِ بُصْرَى فَدَفعَهُ عَظِيْمُ بُصْرَى إِلى هِرَقْلِ. فَقَالَ هِرَقْلُ: هَلْ هُنَا أَحَدٌ مِنْ قَوْمِ هَذَا الرَّجُلِ الَّذِيْ يَزْعَمُ أَنَّهُ نَبِيُّ؟ قَالُوْا: نَعَمْ فَدُعِيْتُ فِيْ نَفَرٍ مِنْ قُرَيْشٍ فَدَخَلْنَا عَلَى هِرَقْلَ فَأَجْلَسَنَا بَيْنَ يَدَيْهِ. فَقَالَ: أَيُّكُمْ أَقْرَبُ نَسَبًا مِنْ هَذَا الرَّجُلِ الَّذِيْ يَزْعَمُ أَنَّهُ نَبِيٌّ؟ قَالَ أَبُوْ سُفْيَانُ: فَقُلْتُ: أَنَا فَأَجْلَسُوْنِيْ بَيْنَ يَدَيْهِ وَأَجْلِسُوْا أَصْحَابِيْ خَلْفِيْ. ثُمَّ دَعَا بِتَرْجُمَانِهِ فَقَالَ: قُلْ لَهُمْ: إِنِّيْ سَائِلٌ هَذَا عَنْ هَذَا الرَّجُلِ الَّذِيْ يَزْعُمُ أَنَّهُ نَبِيٌّ فَإِنْ كَذَبَنِيْ فَكَذِّبُوْهُ. قَالَ أَبُوْ سُفْيَانَ: وَأَيْمُ اللهِ لَوْلَا مَخَافَةُ أَنْ يُؤْثَرَ عَلَيَّ الْكَذِبُ لِكَذَبْتُهُ. ثُمَّ قَالَ لِتَرْجُمَانِهِ: سَلْهُ كَيْفَ حَسَبُهُ فِيْكُمْ؟ قَالَ: قُلْتُ: هُوَ فِيْنَا ذُوْ حَسَبٍ. قَالَ: فَهَلْ كَانَ مِنْ آبَائِهِ مِنْ مَلِكٍ؟ قُلْتُ: لَا. قَالَ: فَهَلْ كُنْتُمْ تَتَّهِمُوْنَهُ بِالْكَذِبِ قَبْلَ أَنْ يَقُوْلَ مَا قَالَ؟ قُلْتُ: لَا. قَالَ: وَمَنْ يَتَّبِعُهُ؟ أَشْرَافُ النَّاسِ أَمْ ضَعَفَاؤُهُمْ؟ قَالَ: قُلْتُ: بَلْ ضُعَفَاؤُهُمْ. قَالَ: أَيَزِيْدُوْنَ أَمْ يَنْقُصُوْنَ؟ قُلْتُ: لَا بَلْ يَزِيْدُوْنَ. قَالَ: هَلْ يَرْتَدُّ أَحَدٌ مِنْهُمْ عَنْ دِيْنِهِ بَعْدَ أَنْ يَدْخُلَ فِيْهِ سَخْطَةً لَهُ؟ قَالَ: قُلْتُ: لَا. قَالَ: فَهَلْ قَاتَلْتُمُوْهُ؟ قُلْتُ: نَعَمْ. قَالَ: فَكَيْفَ كَانَ قِتَالُكُمْ إِيَّاهُ؟ قَالَ: قُلْتُ: يَكُوْنُ الْحَرْبُ بَيْنَنَا وَبَيْنَهُ سِجَالًا يُصِيْبُ مِنَّا وَنُصِيْبُ مِنْهُ. قَالَ: فَهَلْ يَغْدِرُ؟ قُلْتُ: لَا وَنَحْنُ مِنْهُ فِيْ هَذِهِ الْمُدَّةِ لَا نَدْرِيْ مَا هُوَ صَانِعٌ فِيْهَا؟ قَالَ: وَاللهِ مَا أَمْكَنَنِيْ مِنْ كَلِمَةٍ أَدْخُلُ فِيْهَا شَيْئًا غَيْرَ هَذِهِ. قَالَ: فَهَلْ قَالَ هَذَا الْقَوْلَ أَحَدٌ قَبَلَهُ؟ قُلْتُ: لَا. ثُمَّ قَالَ لِتَرْجُمَانِهِ: قُلْ لَهُ: إِنِّيْ سَأَلْتُكَ عَنْ حَسَبِهِ فِيْكُمْ فَزَعَمْت أَنَّهُ فِيْكُمْ ذُوْ حَسَبٍ وَكَذَلِكَ الرُّسُلُ تُبْعَثُ فِيْ أَحْسَابٍ قَوْمِهَا. وَسَأَلْتُكَ هَلْ كَانَ فِيْ آبَائِهِ مَلِكٌ؟ فَزَعَمْتَ أَنْ لَا فَقُلْتُ: لَوْ كَانَ مِنْ آبَائِهِ مَلِكٌ. قُلْتُ: رَجُلٌ يَطْلُبُ مُلْكَ آبَائِهِ. وَسَأَلْتُكَ عَنْ أَتْبَاعِهِ أضُعَافَاؤُهُمْ أَمْ أَشْرَافُهُمْ؟ فَقُلْتَ: بَلْ ضُعَفَاؤُهُمْ وَهُمْ أَتْبَاعُ الرُّسُلِ. وَسَأَلْتُكَ: هَلْ كُنْتُمْ تَتَّهِمُوْنَهُ بِالْكَذِبِ قَبْلَ أَنْ يَقُوْلَ مَا قَالَ؟ فَزَعَمْتَ أَنْ لَا فَعَرَفْتُ أَنَّهُ لَمْ يَكُنْ لِيَدَعِ الْكَذِبَ عَلَى النَّاسِ ثُمَّ يَذْهَبَ فَيَكْذِبَ عَلَى اللهِ. وَسَأَلْتُكَ: هَلْ يَرْتَدُّ أَحَدٌ مِنْهُمْ عَنْ دِيْنِهِ بَعْدَ أَنْ يَدْخُلَ فِيْهِ سَخْطَةً لَهُ؟ فَزَعَمْتَ أَنَّ لَا وَكَذَلِكَ الْإِيْمَانُ إِذَا خَالَطَ بِشَاشَتُهُ الْقُلُوْبَ. وَسَأَلْتُكَ هَلْ يَزِيْدُوْنَ أَمْ يَنْقُصُوْنَ؟ فَزَعَمْتَ أَنَّهُمْ يَزِيْدُوْنَ وَكَذَلِكَ الْإِيَمَانِ حَتَّى يَتِمَّ وَسَأَلْتُكَ هَلْ قَاتَلْتُمُوْهُ؟ فَزَعَمْتَ أَنَّكُمْ قَاتَلْتُمُوْهُ فَتَكُوْنُ الْحَرْبُ بَيْنَكُمْ وَبَيْنَهُ سِجَالًا يَنَالُ مِنْكُمْ وَتَنَالُوْنَ مِنْهُ وَكَذَلِكَ الرُّسُلُ تُبْتَلي ثُمَّ تَكُوْنُ لَهَا الْعَاقِبَةُ. وَسَأَلْتُكَ هَلْ يَغْدِرُ فَزَعَمْتَ أَنَّهُ لَا يَغْدِرُ وَكَذِلَكَ الرُّسُلُ لَا تَغْدِرُ وَسَأَلْتُكَ هَلْ قَالَ هَذَا الْقَوْلَ أَحَدٌ قَبْلَهُ؟ فَزَعَمْتَ أَنْ لَا فَقُلْتُ: لَوْ كَانَ قَالَ هَذَا الْقَوْلَ أَحَدٌ قَبْلَهُ قُلْتُ: رَجُلٌ أِئْتَمَّ بِقَوْلٍ قِيْلَ قَبْلَهُ. قَالَ: ثُمَّ قَالَ: بِمَا يَأْمُرُكُمْ؟ قُلْنَا: يَأْمُرُنَا بِالصَّلَاةِ وَالزَّكَاةِ وَالصِّلَةِ وَالْعَفَافِ. قَالَ: إِنْ يَكُ مَا تَقُوْلُ حَقًّا فَإِنَّهُ نَبِيٌّ وَقَدْ كُنْتُ أَعْلمُ أَنَّهُ خَارِجٌ وَلَمْ أَكُنْ أَظُنُّهُ مِنْكُمْ وَلَوْ أَنِّيْ أَعْلَمُ أَنِّيْ أَخْلُصُ إِلَيْهِ لَأَحْبَبْتُ لِقَاءَهُ وَلَوْ كُنْتُ عِنْدَهُ لَغَسَلْتُ عَنْ قَدَمَيْهِ وَلَيَبْلُغَنَّ مُلْكُهُ مَا تَحْتَ قَدَمَيَّ. ثُمَّ دَعَا بِكِتَابِ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم فَقَرَأَهُ. مُتَّفَقٌ عَلَيْهِ. وَقَدْ سَبَقَ تَمَامُ الْحَدِيْثِ فِيْ “بَابِ الْكِتَابِ إِلى الْكُفَّارِ”.
5861. (10) [3/1632– ఏకీభవితం]
ఇబ్నె ‘అబ్బాస్ (ర) కథనం: అబూ సుఫియాన్ బిన్ ‘హర్బ్ స్వయంగా తన నోటితో నాకు చేసిన కథనం: నాకు ప్రవక్త (స)కు మధ్య జరిగిన హుదైబియ ఒప్పం దం కాలంలో నేను సిరియా వెళ్ళి అక్కడ ఉన్నాను. అప్పుడు ప్రవక్త (స) ఉత్తరం హిరాకల్ రాజు వద్దకు చేరింది. ఆ ఉత్తరాన్ని ది’హియహ్ కల్బీ తీసుకు వచ్చారు. అతడు బ’స్రా గవర్నర్ వద్దకు తీసుకొని వచ్చారు. బ’స్రా పాలకుడు ఆ ఉత్తరాన్ని హిరాకల్ వద్దకు పంపారు. అప్పుడు ఆ రాజు, ”తన్ను తాను ప్రవక్త చెప్పుకునే ఈ వ్యక్తిజాతికి చెందిన వారెవరైనా ఉన్నారా?” అని అడి గారు. సభా సేవకులు ‘ఉన్నారు,’ అని అన్నారు. నన్ను ఖురైషుల బృందంతో పాటు పిలవటం జరిగింది. మేము ఆ రాజు వద్దకు చేరగానే మమ్మల్ని ఆయన ముందు కూర్చో బెట్టటం జరిగింది. అన్నిటికంటే ముందు హిరాకల్, ‘నేను ప్రవక్తనని, చెప్పిన ఆ వ్యక్తికి మీలో దగ్గరి బంధువులెవరు?’ అని అడిగాడు. దానికి ‘నేను,’ అని అన్నాను. ఆ తరువాత నన్ను హిరాకల్ ముందు కూర్చోబెట్టటం జరిగింది. మా బృందాన్ని నా వెనుక కూర్చో బెట్టటం జరిగింది.
ఆ తర్వాత హిరాకల్ తన అనువాదరకునితో నువ్వు ఇతని మిత్రులతో నేనితన్ని, ‘అతని,’ గురించి అడుగుతాను, ఒకవేళ ఇతడు ఏదైనా తప్పు చెబితే, మీరు వెంటనే ఖండించి సత్యం తెలియపరచాలని చెప్పమని చెప్పాడు. ఒకవేళ నన్ను అబద్ధాలకోరుగా ప్రచారం చేయడం జరుగుతుందనే భయం నాకు లేకుంటే నిస్సందేహంగా అతని ముందు అబద్ధాలు చెప్పేవాడిని. ఆ తరువాత హిరాకల్ తన అనువాద కునితో, ‘అబూ సుఫియాన్‌ను ఆవ్యక్తి వంశంగురించి అడుగు’ అని అన్నాడు. దానికి నేను, ‘అతడు ఉన్నత వంశానికి చెందినవాడు,’ అని అన్నాను.
ఆ తరువాత హిరాకల్, ‘అతని తండ్రి తాతల్లో ఎవరైనా రాజులు ఉన్నారా?’ అని అడిగాడు. దానికి నేను ‘లేదు,’ అని అన్నాను. ఆ తరువాత ఆ రాజు, ‘ఇంతకు ముందు అతడు ఏదైనా అబద్ధం పలికి ఉన్నాడా? ‘ అని అడిగాడు. దానికి నేను ‘లేదు’ అని అన్నాను. ఆ తరువాత ఆ రాజు, ‘అతన్ని అనుసరిస్తున్నది గొప్పవారా లేక బలహీనులా? ‘ అని అడిగాడు. దానికి, ‘అతన్ని బలహీనులే అనుస రిస్తున్నారు,’ అని అన్నాను. మళ్ళీ ఆ మహారాజు, ‘అతని అనుచరుల సంఖ్య అధికం అవుతుందా లేక తగ్గుతుందా?’ అని అడిగాడు. దానికి నేను, ‘అధికం అవుతుందని’ అన్నాను. మళ్ళీ రాజు, ‘ఆ ధర్మాన్ని అనుసరించే వారెవరైనా విసుగుచెంది దాన్ని త్యజిస్తున్నారా?’ అని అడిగాడు. దానికి నేను ‘లేదు,’ అని అన్నాను. మళ్ళీ ఆ రాజు, ‘మీకు ఆయనకూ వివాదం జరిగిందా?’ అని అన్నాడు. ‘అవును, జరిగిందని,’ అన్నాను. మళ్ళీ రాజు, ‘మీకూ వారికి జరిగిన వివాదం ఎలా ఉంది?’ అని అడిగాడు. దానికి నేను, ‘ఒక్కోసారి వాళ్ళు ఒక్కోసారి మేము గెలిచాము.’ మళ్ళీ ఆ రాజు, ‘అతడు వాగ్దానభంగం చేస్తాడా?’ అని అడిగాడు. దానికి నేను, ‘లేదు, కాని మాకు ఈ హుదైబియా ఒప్పందం కాలంలో ఏమి చేస్తాడో, అని భయంగా ఉంది,’ అని అన్నాను. నేను ఈ వాక్యం తప్ప మరే అసత్యాన్ని కలప లేక పోయాను. మళ్ళీ ఆ రాజు, ‘ఇంతకుముందు కూడా ఎవరైనా ఈ విధంగా అన్నారా?’ అని అడిగాడు. దానికి నేను, ‘లేదు,’ అని అన్నాను.
ఆ తరువాత హిరాకల్ తన అనువాదకుణ్ణి, ”నేను నిన్ను అతని వంశం గురించి అడిగాను. నువ్వు ‘అతడు ఉన్నత వంశానికి చెందినవాడని’ అన్నావు. వాస్తవంగా ప్రవక్తలు ఉన్నత వంశానికి చెందినవారై ఉంటారు. ఆ తరువాత ‘అతని తండ్రి తాతల్లో ఎవరైనా రాజులు ఉండేవారా?’ అంటే ‘లేదు’ అన్నావు. ఒకవేళ ఉంటే మళ్ళీ రాజరికాన్ని కోరుతూ ఇలా చేసాడని అనవచ్చు. మళ్ళీ నేను నిన్ను ‘అతన్ని అనుసరిస్తున్నది గొప్పవారా లేక బలహీనులా?’ అంటే నువ్వు ‘బలహీనులు’ అని అన్నావు. వాస్తవం కూడా ఇదే, బలహీనులే ప్రవక్తలను అనుసరిస్తారు. ఇంకా నేను ‘అతను అబద్ధాలు పలుకుతాడా?’ అంటే ‘లేదు’ అన్నావు. అతడు ప్రజలపై అబద్ధం పలకనప్పుడు అల్లాహ్‌పై ఎలా అబద్ధం పలుకుతాడు. ఇంకా నేను నిన్ను ‘అతని ధర్మాన్ని అనుసరించి విసుగుచెంది త్యజిస్తున్నారా?’ అంటే, నువ్వు ‘లేదు’ అన్నావు. వాస్తవం కూడా ఇదే. విశ్వాసం హృదయాల్లో చోటు చేసుకుంటే, అది తొలగదు. నేను నిన్ను అతని అనుచరుల సంఖ్య పెరుగుతుందా? లేక తగ్గుతుందా?’ అంటే ‘పెరుగుతుంది’ అని అన్నావు. వాస్తవంగా విశ్వాసం పరిస్థితి కూడా ఇలాగే ఉంటుంది. ఇంకా నేను నిన్ను ‘అతనితో యుద్ధం జరిగిందా?’ అంటే ‘జరిగిందని ఒక్కోసారి అతడు ఒక్కోసారి మేము గెలుస్తున్నామని’ అన్నావు. ఈ విధంగానే ప్రవక్తలను పరీక్షించడం జరుగుతుంది. ఆ తరువాత మంచి జరుగుతుంది. ఇంకా నేను నిన్ను ‘అతడు వాగ్దాన భంగం చేస్తాడా?’ అంటే, నువ్వు ‘లేదు’ అని అన్నావు. ప్రవక్తలు కూడా వాగ్దాన భంగం చేయరు. ఇంకా నేను నిన్ను ‘మీ జాతిలో ఇంతకు ముందు ఎవరైనా ఇలా ప్రవక్తనని వాదించారా?’ అంటే ‘లేదు’ అని అన్నావు. ‘అలా ఎవరైనా చేసి ఉంటే, అతన్ని అనుసరిస్తూ ఇతను కూడా నేను ప్రవక్తనని వాదిస్తున్నాడని’ ” అనుకోవచ్చు అని అన్నాడు. ఆ తరువాత ఆ రాజు అబూ సుఫియాన్‌ను ‘అతడు ఏ విషయాల గురించి ఆదేశిస్తున్నాడు’ అని అడిగాడు. దానికి నేను, ‘అతడు మమ్మల్ని నమా’జ్, ‘జకాత్, బంధువుల హక్కు, సత్యసంధతల గురించి ఆదేశిస్తున్నాడని,’ అన్నాను. అప్పుడు ఆ రాజు ‘ఒకవేళ నీ మాటలు నిజమైతే అతడు నిస్సందేహంగా ప్రవక్తే. చివరికాలంలో ఒక ప్రవక్త ప్రభవిస్తాడని నాకు ముందే తెలుసు, కాని ఆ ప్రవక్త మీ జాతిలో ప్రభవిస్తాడని నాకు తెలియదు. ఒకవేళ నేను అతని వద్దకు వెళ్ళ గలిగితే, అతన్ని కలవటం నాకెంతో ప్రియమైనదిగా ఉంటుంది. ఒకవేళ నేను అతని దగ్గర ఉంటే, అతని పాదాలు కడుగుతాను. నిస్సందేహంగా అతని అధికారం నా పాదాల వరకు చేరుతుంది,’ అని పలికి ప్రవక్త (స) ఉత్తరం తెప్పించి చదివాడు. (బు’ఖారీ, ముస్లిమ్)
దీన్ని ఇంతకు ముందు కూడా ”అల్ కితాబు ఇలల్ కుప్ఫార్” లో ప్రస్తావించటం జరిగింది.
=====
6 – بَابٌ فِي الْمِعْرَاجِ
6. మె‘అరాజ్
ఇక్కడ ఒక విషయాన్ని గురించి వివరించడం తప్పనిసరిగా భావించడం జరిగింది. అదేమిటంటే, ఆ రాత్రి ప్రవక్త (స) బైతుల్లాహ్ నుండి మస్జిదె అఖ్’సా వరకు చేసిన ప్రయాణాన్ని ‘ఇస్రా’ అంటారు. ఇంకా మస్జిదె అఖ్’సా నుండి ఆకాశం వైపునకు చేసిన ప్రయాణాన్ని మే’అరాజ్ అంటారు.
ప్రవక్త (స)కు మే’అరాజ్ జరిగింది. అది కలా, నిజమా? ఈ సంఘటన ఒకసారి జరిగిందా? లేక అనేకసార్లు జరిగిందా అనే విషయాన్ని గురించి పండితుల మధ్య అభిప్రాయ భేదాలు ఉన్నాయి. కాని వాస్తవం ఏమిటంటే, మే’అరాజ్ సంఘటన ఒకసారి జరిగింది. నిజంగానే అంటే ఆత్మ, శరీరం రెంటితోనూ ప్రవక్త (స) , క’అబతుల్లాహ్ నుండి మస్జిదె అ’ఖ్సా వరకు, ఆ తరువాత మస్జిదె అఖ్’సా నుండి ఆకాశంలో ఉన్న అల్లాహ్ (త) కోరిన ప్రదేశాల వరకు ప్రయాణం చేసారు. ప్రామాణిక ‘హదీసు’ల ద్వారా దీన్నే నిరూ పించడం జరిగింది. ఈ విషయంలో ప్రవక్త (స) ప్రవచ నాల, అనుచరుల ఉల్లేఖనాలు అనేకం ఉన్నాయి. ఇందులో ఎటువంటి అనుమానానికి తావులేదు.
اَلْفَصْلُ الْأَوَّلُ మొదటి విభాగం
5862 – [ 1 ] ؟ (3/1635)
عَنْ قَتَادَةَ عَنْ أَنَسِ بْنِ مَالِكِ عَنْ مَالِكِ بْنِ صَعْصَعَةَ أَنَّ نَبِيَّ الله صلى الله عليه وسلم حَدَّثَهُمْ لَيْلَةَ أُسْرِيَ بِهِ: “بَيْنَمَا أَنَا فِي الْحَطِيْمِ – وَرُبَمَا قَالَ فِي الْحِجْرِ- مُضْطَجِعًا إِذْ أَتَانِيْ آتٍ فَشَقَّ مَا بَيْنَ هَذِهِ إِلَى هَذِهِ. “يَعْنِيْ مِنْ ثُغْرَةِ نَحْرِهِ إِلى شِعْرَتِهِ”. فَاسْتَخْرَجَ قَلْبِيْ ثُمَّ أُتِيْتُ بِطَسْتٍ مِنْ ذَهَبٍ مَمْلُوْءٍ إِيْمَانًا فَغُسِلَ قَلْبِيْ ثُمَّ حُشِيَ ثُمَّ أُعِيْدَ”. وَفِيْ رِوَايَةٍ: “ثُمَّ غُسِلَ الْبَطْنُ بِمَاءِ زَمْزَمَ ثُمَّ مُلِئَ إِيْمَانًا وَحِكْمَةُ ثُمَّ أَتَيْتُ بِدَابَّةِ دُوْنَ الْبَغْلِ وَفَوْقَ الْحِمَارِ أَبْيَضَ يُقَالُ لَهُ: الْبُرَاقُ يَضَعُ خُطْوَهُ عِنْدَ أَقْصَى طَرْفِهِ فَحُمِلْتُ عَلَيْهِ فَانْطَلَقَ بِيْ جِبْرَيْلُ حَتّى أَتَى السَّمَاءَ الدُّنْيَا فَاسْتَفْتَحَ قِيْلَ: مَنْ هَذَا؟ قَالَ: جِبْرِيْلُ. قِيْلَ: وَمَنْ مَعَكَ؟ قَالَ: مُحَمَّدٌ. قِيْلَ وَقَدْ أَرْسَلَ إِلَيْهِ. قَالَ: نَعَمْ. قِيْلَ: مَرْحَبًا بِهِ فَنِعْمَ الْمَجِيْءُ جَاءَ فَفُتِحَ. فَلَمَّا خَلصْتُ فَإِذَا فِيْهَا آدَمُ. فَقَالَ: هَذَا أَبُوْكَ آدَمُ فَسَلِّمْ عَلَيْهِ. فَسَلَّمْتُ عَلَيْهِ. فَرَدَّ السَّلَامَ. ثُمَّ قَالَ: مَرْحَبًا بِالْاِبْنِ الصَّالِحِ وَالنَّبِيِّ الصَّالِحِ. ثُمَّ صَعِدَ بِيْ حَتّى السَّمَاءَ الثَّانِيَةَ. فَاسْتَفْتَحَ قِيْلَ: مَنْ هَذَا؟ قَالَ: جِبْرَيْلُ. قِيْلَ: وَمَنْ مَعَكَ؟ قَالَ: مُحَمَّدُ. قِيْلَ: وَقَدْ أُرْسِلَ إِلَيْهِ؟ قَالَ: نَعَمْ. قِيْلَ: مَرْحَبَا بِهِ فَنِعْمَ الْمَجِيْءَ. جَاءَ فَفُتِحَ. فَلَمَّا خَلَصْتُ إِذَا يَحْيَى وَعِيْسَى وَهُمَا ابْنَا خَالَةٍ. قَالَ: هَذَا يَحْيَى وَهَذَا عِيْسَى فَسَلِّمْ عَلَيْهِمَا. فَسَلَّمْتُ فَرَدًّا. ثُمَّ قَالَا: مَرْحَبًا بِالْأَخِ الصَّالِحِ وَالنَّبِيِّ الصَّالِحِ. ثُمَّ صَعِدَ بِيْ إِلى السَّمَاءِ الثَّالِثَة فَاسْتَفْتَحَ قِيْلَ: مَنْ هَذَا؟ قَالَ: جِبْرَيْلُ. قِيْلَ: وَمَنْ مَعَكَ؟ قَالَ: مُحَمَّدُ. قِيْلَ: وَقَدْ أَرْسَلَ إِلَيْهِ؟ قَالَ: نَعَمْ. قِيْلَ: مَرْحَبًا بِهِ فَنِعْمَ الْمَجِيْءَ جَاءَ فَفُتِحَ. فَلَمَّا خَلَصْتُ إِذَا يُوْسُفُ قَالَ: هَذَا يُوْسُفُ فَسَلَّمْ عَلَيْهِ فَسَلَّمْتُ عَلَيْهِ فَرَدَّ. ثُمَّ قَالَ: مَرْحَبًا بِالْأَخِ الصَّالِحِ وَالنَّبِي الصَّالِحِ. ثُمَّ صَعِدَ بِيْ حَتّى أَتَى السَّمَاءَ الرَّابِعَةَ فَاسْتَفَتْحَ قِيْلَ: مَنْ هَذَا؟ قَالَ: جِبْرِيْلُ. قِيْلَ: وَمَنْ مَعَكَ؟ قَالَ: مُحَمَّدٌ. قِيْلَ: وَقَدْ أَرْسَلَ إِلَيْهِ؟ قَالَ: نَعَمْ. قِيْلَ: مَرْحَبًا بِهِ فَنِعْمِ الْمَجِيْءَ. جَاءَ فَفُتِحَ فَلَمَّا خَلَصْتُ فَإِذَا إِدْرِيْسُ فَقَالَ: هَذَا إِدْرِيْسُ فَسَلِّمْ عَلَيْهِ فَسَلَّمْتُ عَلَيْهِ فَرَدَّ. ثُمَّ قَالَ: مَرْحَبًا بِالْأَخِ الصَّالِحِ وَالنَّبِيِّ الصَّالِحِ ثُمَّ صَعِدَ بِيْ حَتَّى أَتَى السَّمَاءَ الْخَامِسَةَ فَاسْتَفْتَحَ قِيْلَ: مَنْ هَذَا؟ قَالَ: جِبْرَيْلُ. قِيْلَ: وَمَنْ مَعَكَ؟ قَالَ: مُحَمَّدٌ. قِيْلَ: وَقَدْ أَرْسَلَ إِلَيْهِ؟ قَالَ: نَعَمْ. قِيْلَ: مَرْحَبَا بِهِ فَنِعْمَ الْمَجِيْءَ جَاءَ. فَفُتِحَ. فَلَمَّا خَلَصْتُ فَإِذَا هَارُوْنُ قَالَ: هَذَا هَارُوْنُ فَسَلِّمْ عَلَيْهِ فَسَلَّمْتُ عَلَيْهِ فَرَدَّ ثُمَّ قَالَ: مَرْحَبًا بِالْأَخِ الصَّالِحِ وَالنَّبِيِّ الصَّالِحِ. ثُمَّ صَعِدَ بِيْ إِلَى السَّمَاءِ السَّادِسَةَ فَاسْتَفْتَحَ قِيْلَ: مَنْ هَذَا؟ قَالَ: جِبْرَيْلُ. قِيْلَ: وَمَنْ مَعَكَ؟ قَالَ: مُحَمَّدٌ. قِيْلَ: وَهَلْ أَرْسَلَ إِلَيْهِ؟ قَالَ: نَعَمْ. قَالَ: مَرحَبًا بِهِ فَنِعْمَ الْمَجِيْءَ جَاءَ. فَلَمَّا خَلَصْتُ فَإِذَا مُوْسَى قَالَ: هَذَا مُوْسَى فَسَلِّمْ عَلَيْهِ. فَسَلَّمْتُ عَلَيْهِ فَرَدَّ ثُمَّ قَالَ: مَرْحَبًا بِالْأَخِ الصَّالِحِ وَالنَّبِيِّ الصَّالِحِ. فَلَمَّا جَاوَزْتُ بَكَى قِيْلَ: مَا يُبْكِيْكَ؟ قَالَ: أَبْكِيْ لِأَنَّ غُلَامًا بُعِثَ بَعْدِيْ يَدْخُلُ الْجَنَّةُ مِنْ أُمَّتِهِ أَكْثَرُ مِمَّنْ يَدْخُلُهَا مِنْ أُمَّتِيْ ثُمَّ صَعِدَ بِيْ إِلى السَّمَاءِ السَّابِعَةِ. فَاسْتَفْتَحْ جِبْرَيْلُ قِيْلَ: مَنْ هَذَا؟ قَالَ: جِبْرَيْلُ. قِيْلَ: وَمَنْ مَعَكَ؟ قَالَ: مُحَمَّدٌ. قِيْلَ: وَقَدْ بُعِثَ إِلَيْهِ؟ قَالَ: نَعَمْ. قِيْلَ: مَرْحَبَا بِهِ فَنِعْمَ الْمَجِيْءَ جَاءَ. فَلَمَّا خَلَصْتُ. فَإِذَا إِبْرَاهِيْمُ قَالَ: هَذَا أَبُوْكَ إِبْرَاهِيْمُ فَسَلِّمْ عَلَيْهِ فَسَلَّمْتُ عَلَيْهِ فَرَدَّ السَّلَامَ ثُمَّ قَالَ: مَرْحَبًا بِالْاِبْنِ الصَّالِحِ وَالنَّبِيِّ الصَّالِحِ. ثُمَّ رُفِعْتُ إِلى سِدْرَةِ الْمُنْتَهَى. فَإِذَا نَبِقُهَا مِثْلَ قِلَال هَجَرٍ وَإِذَا وَرقُهَا مِثْلَ آذَانِ الْفِيْلَةِ. قَالَ: هَذَا سِدْرَةُ الْمُنْتَهَى. فَإِذَا أَرْبَعَةُ أَنْهَارٍ: نَهْرَانِ بَاطِنَانِ وَنَهْرَانِ ظَاهِرَانِ. قُلْتُ: مَا هَذَانِ يَا جِبْرَيْلُ؟ قَالَ: أَمَّا الْبَاطِنَانِ فَنَهْرَانِ فِي الْجَنَّةِ وَأَمَّا الظَّاهِرَانِ فَالنِّيْلُ وَالْفُرَاتُ. ثُمَّ رُفِعَ لِيَ الْبَيْتُ الْمَعْمُوْرُ ثُمَّ أَتَيْتُ بِإِنَاءٍ مِنْ خَمْرٍ وَإِنَاءٍ مِنْ لَبَنٍ وَإِنَاءٍ مِنْ عَسَلٍ فَأَخَذْتُ اللَّبَنَ. فَقَالَ: هِيَ الْفِطْرَةُ أَنْتَ عَلَيْهَا وَأُمَّتُكَ. ثُمَّ فُرِضَتْ عَلَيَّ الصَّلَاةُ خَمْسِيْنَ صَلَاةً كُلّ يَوْمٍ. فَرَجَعْتُ فَمَرَرْتُ عَلَى مُوْسَى فَقَالَ: بِمَا أُمِرْتَ؟ قُلْتُ: أُمِرْتُ بِخَمْسِيْنَ صَلَاةً كُلَّ يَومٍ. قَالَ: إِنَّ أُمَّتَكَ لَا تَسْتَطِعُ خَمْسِيْنَ صَلَاةً كُلَّ يَوْمٍ وَإِنِّيْ وَاللهِ قَدْ جَرَّبْتُ النَّاسَ قَبْلَكَ وَعَالَجْتُ بَنِيْ إِسْرَائِيْلَ أَشَدَّ الْمُعَالَجَةِ فَارْجِعْ إِلى رَبِّكَ فَسَلْهُ التَّخْفِيْفَ لِأُمَّتِكَ فَرَجَعْتُ فَوَضَعَ عَنِّيْ عَشْرًا فَرَجَعْتُ إِلى مُوْسَى فَقَالَ مِثْلَهُ فَرَجَعْتُ فَوَضَعَ عَنِّيْ عَشْرًا فَرَجَعْتُ إِلى مُوْسَى فَقَالَ مِثْلَهُ فَرَجَعْتُ فَوَضَعَ عَنِّيْ عَشْرًا فَرَجَعْتُ إِلى مُوْسَى فَقَالَ مِثْلَهُ فَرَجَعْتُ فَوَضَعَ عَنِّيْ عَشْرًا فَأُمِرْتُ بِعَشْرِ صَلَوَاتٍ كُلَّ يَوْمٍ فَرَجَعَتُ إِلى مُوْسَى فَقَالَ مِثْلَهُ فَرَجَعْتُ فَأُمِرْتُ بِخَمْسِ صَلَوَاتٍ كُلَّ يَوْمٍ فَرَجَعْتُ إِلى مُوْسَى فَقَالَ: بِمَا أُمِرْتَ؟ قُلْتُ: أُمِرْتُ بِخَمْسِ صَلَوَاتٍ كُلَّ يَوْمٍ. قَالَ: إِنَّ أُمَّتَكَ لَا تَسْتَطِيْعُ خَمْسَ صَلَوَاتٍ كُلَّ يَوْمٍ وَإِنِّيْ قَدْ جَرَّبْتُ النَّاسَ قَبْلَكَ وَعَالَجْتُ بَنِيْ إِسْرَائِيْلَ أَشَدَّ الْمُعَالَجَةِ فَارْجِعْ إِلى رَبِّكَ فَسَلْهُ التَّخْفِيْفَ لِأُمَّتِكَ. قَالَ: سَأَلْتُ رَبِّيْ حَتّى اِسْتَحْيَيْتُ وَلَكِنِّيْ أَرْضَى وَأُسَلِّمُ. قَالَ: فَلَمَّا جَاوَزْتُ نَادَى مُنَادٍ: أَمْضَيْتُ فَرِيْضَتِيْ وَخَفَّفْتُ عَنْ عِبَادِيْ”. مُتَّفَقٌ عَلَيْهِ.
5862. (1) [3/1635 ? ]
ఖతాదహ్ (ర) అనస్ బిన్ మాలిక్ (ర) ద్వారా, అతను మాలిక్ బిన్ ‘సఅ’సఅహ్ ద్వారా కథనం: ప్రవక్త (స) అనుచరులకు ఇస్రా రాత్రి గురించి ఇలా తెలిపారు, ”నేను ఆ రాత్రి ‘హ’తీమ్‌లో పడుకొని ఉన్నాను. మరికొన్ని సందర్భాలలో ‘హిజ్ర్‌లో పడుకొని ఉండగా నా వద్దకు దైవదూత వచ్చాడు, ఇక్కడి నుండి ఇక్కడి వరకు నా శరీరాన్ని పరిశుద్ధపరిచాడు. మెడ నుండి అంటే గొంతు దగ్గర నుండి నాభి క్రింది వరకు. ఆ దైవదూత నా గుండె తీసాడు, ఒక బంగారు పళ్ళెం తీసుకురావటం జరిగింది. అది విశ్వాసంతో నిండి ఉంది. దానితో నా గుండెను శుభ్రపరచి, అందులో అల్లాహ్(త) ప్రేమను నింపి, గుండెను దాని స్థానంలో ఉంచడం జరిగింది. మరో ఉల్లేఖనంలో ఇలా ఉంది, ”ఆ తరువాత నా కడుపును ‘జమ్’జమ్ నీటితో పరిశుభ్రపరచటం జరిగింది. దాన్ని విశ్వాసం, వివేకాలతో నింపటం జరిగింది. ఆ తరువాత నా వద్దకు తెల్లని వాహనం తీసుకు రావటం జరిగింది. అది కంచరగాడిద కన్నా చిన్నది, గాడిదకన్నా పెద్దదిగా ఉంది. దాన్ని బుర్రాఖ్ అంటారు. దాని కనుచూపు మేరకు దాని అడుగులు పడేవి. నన్ను దానిపై కూర్చోబెట్టటం జరిగింది. జిబ్రీల్ (అ) నన్ను తీసుకొని బయలుదేరారు. చివరికి మేము ప్రాపంచిక ఆకాశంపై చేరుకున్నాము. జిబ్రీల్ (అ) ద్వారం తెరవమని కోరారు. అతన్ని, ‘ఎవరు?’ అని ప్రశ్నించడం జరిగింది. దానికి జిబ్రీల్ ‘నేను జిబ్రీల్‌ను’ అని అన్నారు. మళ్ళీ, ‘నీవెంట ఎవరున్నారు?’ అని ప్రశ్నించడం జరిగింది. దానికి జిబ్రీల్, ‘ము’హమ్మద్(స)’ అని సమాధానం ఇచ్చారు. అప్పుడు, ‘ఇతన్ని పిలవడానికి ఎవరినైనా పంపటం జరిగిందా?’ అని ప్రశ్నించటం జరిగింది. జిబ్రీల్, ‘అవును,’ అని అన్నారు. అప్పుడు ఆ దైవదూత, ‘ము’హమ్మద్‌కు స్వాగతం,’ అని అన్నాడు. ఆ తరువాత ఆకాశద్వారాలు తెరవబడ్డాయి. నేను ఆకాశంలో ప్రవేశిస్తే అక్కడ ఆదమ్ (అ) ఉన్నారు. అప్పుడు జిబ్రీల్, ‘వీరు మీతండ్రి ఆదమ్ (అ), వీరికి సలామ్ చేయండి,’ అని అన్నారు. నేను ఆదమ్ (అ)కు సలామ్ చేసాను. ఆయన సలామ్‌కు సమాధానం ఇచ్చారు. ఇంకా ‘నేను ఉత్తమ సంతా నానికి, ఉత్తమ ప్రవక్తకు స్వాగతం పలుకు తున్నాను,’ అని అన్నారు.
ఆ తరువాత జిబ్రీల్ నన్ను తీసుకొని పైకి వెళ్ళారు. చివరికి రెండవ ఆకాశం వచ్చింది. జిబ్రీల్ ద్వారం తెరవమని అన్నారు. ఎవరని అడగటం జరిగింది. జిబ్రీల్ (అ), ‘నేను జిబ్రీల్‌ను’ అని చెప్పటం జరిగింది. ‘మీ వెంట ఎవరున్నారని’ అడగటం జరిగింది. దానికి అతను(అ), ‘నా వెంట ము’హమ్మద్ ఉన్నారని’ చెప్పటం జరిగింది. ‘అతన్ని పిలిపించటం జరిగిందా? ‘ అని ప్రశ్నించటం జరిగింది. దానికి జిబ్రీల్ ‘అవునని’ అన్నారు. అప్పుడు, ‘మేము ము’హమ్మద్‌కు స్వాగతం పలుకుతున్నాం,’ అని, ‘వారు రావడం శుభకరమని,’ చెప్పటం జరిగింది. ఆ తరువాత ఆకాశ ద్వారాలు తెరువబడ్డాయి. నేను రెండవ ఆకాశంలో ప్రవేశిస్తే, య’హ్‌యా మరియు ‘ఈసా (అ)లు నిలబడి ఉన్నారు. వీరిరువురు పరస్పరం సోదరులు. అప్పుడు జిబ్రీల్, ‘వీరు య’హ్‌యా, వీరు ‘ఈసా (అ), వారికి సలామ్ చేయమని’ చెప్పారు. నేను ఇద్దరికి సలామ్ చేసాను. ఇద్దరూ సలామ్‌కు సమాధానం ఇచ్చారు. ఇంకా, ‘ఉత్తమ సోదరులు, ఉత్తమ ప్రవక్త రావటం శుభకరం’ అని అన్నారు. ఆ తర్వాత జిబ్రీల్ నన్ను తీసుకొని ముందుకు సాగి, మూడవ ఆకాశం వద్దకు వచ్చారు. తలుపు తెరవమని అన్నారు. ఎవరని అడగటం జరిగింది. జిబ్రీల్ (అ), ‘నేను జిబ్రీల్,’ అని అన్నారు. ఆ తరువాత, ‘మీ వెంట ఎవరున్నారని,’ అడగటం జరిగింది. జిబ్రీల్ (అ), ‘ము’హమ్మద్,’ అని చెప్పారు. ‘అతన్ని పిలవటం జరిగిందా?’ అని ప్రశ్నించటం జరిగింది. జిబ్రీల్ (అ) ‘అవునని’ అన్నారు. అప్పుడు దైవదూతలు, ‘ము’హమ్మద్‌కు స్వాగతం, వారు విచ్చేయడం శుభసూచకం,’ అని అన్నారు. ఆ తరువాత ఆకాశ ద్వారాలు తెరువబడ్డాయి. మూడవ ఆకాశంపైకి వెళ్ళగా అక్కడ యూసుఫ్ (అ) ఉన్నారు. అప్పుడు జిబ్రీల్ (అ), ‘వీరు యూసుఫ్ (అ) వీరికి సలామ్ చేయండి,’ అని అన్నారు. నేను అతనికి సలామ్ చేసాను. అతను నా సలామ్‌కు సమాధానం ఇచ్చారు. ఇంకా ‘ఉత్తమ సోదరునికి, ఉత్తమ ప్రవక్తకు స్వాగతం పలుకుతున్నాను,’ అని అన్నారు. ఆ తరువాత జిబ్రీల్ (అ) నన్ను తీసుకొని నాల్గవ ఆకాశం పైకి వెళ్ళారు. అతడు తలుపు తెరవమని అన్నారు. ఎవరు అని ప్రశ్నించటం జరిగింది. దానికి జిబ్రీల్, ‘నేను జిబ్రీల్,’ అని అన్నారు. ‘మీ వెంట ఎవరున్నారని,’ అడగటం జరిగింది. దానికి అతను(అ), ‘ము’హమ్మద్,’ అని అన్నారు. ‘అతన్ని పిలవటం జరిగిందా?’ అని ప్రశ్నించటం జరిగింది. దానికి జిబ్రీల్ (అ), ‘అవునని,’ అన్నారు. అప్పుడు దైవదూతలు, ‘ము’హమ్మద్‌కు స్వాగతం, ఆయన రాక శుభసూచకం,’ అని అన్నారు. ఆ తరువాత ఆకాశ ద్వారాలు తెరువబడ్డాయి. నాల్గవ ఆకాశంపై వెళ్ళగా అక్కడ ఇద్రీస్ (అ) ఉన్నారు. అప్పుడు జిబ్రీల్ (అ), ‘వీరు ఇద్రీస్ (అ) వీరికి సలామ్ చేయండి,’ అని అన్నారు. నేనతనికి సలామ్ చేసాను. అతను నా సలామ్‌కు సమాధానం ఇచ్చారు. ఇంకా ,’ఉత్తమ సోదరులకు, ఉత్తమ ప్రవక్తకు స్వాగతం,’ అని అన్నారు. ఆ తరువాత జిబ్రీల్ నన్ను తీసుకొని ఐదవ ఆకాశం వద్దకు వెళ్ళారు. తలుపులు తెరవమని కోరారు. ఎవరని ప్రశ్నించటం జరిగింది. నేను జిబ్రీల్‌ను అని సమాధానం ఇచ్చారు. మీ వెంట ఎవరున్నారని ప్రశ్నించటం జరిగింది. ‘ము’హమ్మద్’ అని చెప్పారు. అతన్ని పిలవటం జరిగిందా? అని చెప్పటం జరిగింది. దానికి జిబ్రీల్ ‘అవును’ అని అన్నారు. అప్పుడు దైవదూతలు, ‘ము’హమ్మద్‌కు స్వాగతం, ఆయన రాక శుభసూచకం,’ అని అన్నారు. ఆ తర్వాత ఆకాశ ద్వారాలు తెరువబడ్డాయి. ఐదవ ఆకాశంపైకి వెళ్ళగా అక్కడ (ఐదవ ఆకాశంపై) హారూన్ (అ) ఉన్నారు. అప్పుడు జిబ్రీల్ (అ) ‘వీరు హారూన్ (అ), వీరికి సలామ్ చేయండి’ అని అన్నారు. నేను ఆయనకు సలామ్ చేశాను. అతను నా సలామ్‌కు సమాధానం ఇచ్చి, ‘ఉత్తమ సోదరులు, ఉత్తమ ప్రవక్తకు స్వాగతం’ అని అన్నారు. ఆ తరువాత జిబ్రీల్ నన్ను తీసుకొని ఆరవ ఆకాశం వద్దకు వెళ్ళారు. ద్వారాలు తెరవమని కోరారు. ఎవరని ప్రశ్నించటం జరిగింది. జిబ్రయీల్’ నేను జిబ్రీల్‌ను’ అని అన్నారు. ‘మీ వెంట ఎవరున్నారని’ అన్నారు. దానికి జిబ్రీల్ ‘ము’హమ్మద్’ అని అన్నారు. ‘అతన్ని పిలవటం జరిగిందా? ‘ అని ప్రశ్నించటం జరిగింది. దానికి జిబ్రీల్ ‘అవునని’ అన్నారు. అప్పుడు దైవదూతలు ‘ము’హమ్మద్‌కు స్వాగతం, వారు విచ్చేయడం శుభకరం’ అని అన్నారు. ద్వారం తెరువబడింది. ఆరవ ఆకాశంపై వెళ్ళగా అక్కడ మూసా (అ) ఉన్నారు. అప్పుడు జిబ్రీల్ (అ) ‘వీరు మూసా (అ)వీరికి సలామ్ చేయండి’ అని అన్నారు. నేనాయనకు సలామ్ చేసాను. ఆయన నా సలామ్‌కు సమాధానం ఇచ్చి, ‘ఉత్తమ సోదరులు, ఉత్తమ ప్రవక్తకు స్వాగతం’ అని పలికారు. ఆ తరువాత నేను ముందుకు వెళుతుండగా మూసా (అ) ఏడ్వసాగారు. ‘ఎందుకు ఏడుస్తున్నారని’ అడగ్గా, ”ఎందుకంటే నా తరువాత ఒక యువకున్ని ప్రవక్తగా పంపటం జరిగింది. అతని అనుచర సమాజంలోని ప్రజలు నా అనుచర సమాజంలోని ప్రజలకంటే అధికంగా స్వర్గంలోనికి ప్రవేశిస్తారు” అని అన్నారు. ఆ తర్వాత జిబ్రీల్ (అ) నన్ను తీసుకుని ముందుకుసాగి ఏడవ ఆకాశం వద్దకు వచ్చి, జిబ్రీల్ (అ) ‘ద్వారం తెరవమని’ కోరారు. ‘ఎవరని’ ప్రశ్నించటం జరిగింది. జిబ్రీల్ (అ) ‘నేను జిబ్రీల్’ అని సమాధానం ఇచ్చారు. ‘మీ వెంట ఎవరున్నారని’ ప్రశ్నించటం జరిగింది. దానికి జిబ్రీల్, ‘ము’హమ్మద్’ అని సమాధానం ఇచ్చారు. ‘అతను పిలవబడ్డారా?’ అని ప్రశ్నించటం జరిగింది. జిబ్రీల్ (అ) ‘అవును’ అని అన్నారు. అప్పుడు దైవదూతలు, ‘వారికి స్వాగతం, వారు విచ్చేయడం శుభకరం,’ అని అన్నారు. ఆతరువాత ద్వారం తెరువబడింది. ఏడవ ఆకాశంపై వెళ్ళగా అక్కడ ఇబ్రాహీమ్ (అ) ఉన్నారు. జిబ్రీల్ (అ) ఇతను మీ తండ్రి ఇబ్రాహీమ్ (అ) అని అతనికి సలామ్ చేయమని అన్నారు. నేను ఆయనకు సలామ్ చేసాను. ఆయన నా సలామ్‌కు సమాధానం ఇచ్చారు. ఇంకా ‘ఉత్తమ సంతానం, ఉత్తమ ప్రవక్తకు సుస్వాగతం’ అని అన్నారు. ఆ తరువాత నన్ను సిద్‌రతుల్ మున్‌తహా వైపు తీసుకువెళ్ళడం జరిగింది. దాని పళ్ళు హిజ్‌ర్ ప్రాంతానికి చెందిన కుండల్లా ఉన్నాయి. దాని ఆకులు ఏనుగు చెవుల్లా ఉన్నాయి. జిబ్రీల్ ఇది ”సిద్‌రతుల్ మున్‌తహా” అని అన్నారు. అక్కడ నాలుగు కాలువలు ఉన్నాయి. రెండు గుప్తంగా, రెండు బహిర్గతంగా ఉన్నాయి. ‘ఇవి ఏమిటని’ జిబ్రీల్‌ను అడిగాను. దానికి అతను(అ), ‘ఇవి స్వర్గంలోని గుప్త కాలువలు, ఇంకా ఈ రెండూ నైలు మరియు ఫురాత్ నదులు’ అని అన్నారు. ఆ తరువాత నాకు బైతుల్ మా’మూర్ చూపెట్టటం జరిగింది. ఆ తరువాత నాకు ఒక గ్లాసులో మద్యం, మరో గ్లాసులో పాలు, మూడవ గ్లాసులో తేనె ఇవ్వడం జరిగింది. అనంతరం నేను పాలను తీసు కున్నాను. అప్పుడు జిబ్రీల్ (అ), ‘ఇది ప్రకృతి,’ అన్నారు. అంటే, ‘దీనిపైనే మీరూ, మీ అనుచర సమాజం ఉంది,’ అని అన్నారు. ఆ తరువాత నాపై రోజుకు 50 నమా’జులు ఆదేశించబడ్డాయి. నేను తిరిగి వస్తుండగా మూసా (అ) కలిసారు. మూసా(అ) నన్ను, ‘ఏమి ఆదేశించబడింది’ అని అన్నారు. దానికి నేను, ‘రాత్రీ పగల్లో 50 నమా’జులు ఆదేశించబడ్డాయని,’ అన్నాను. దానికి మూసా (అ) మీ అనుచర సమాజం రాత్రీ పగల్లో 50 నమా’జులు ఆచరించలేరు. అల్లాహ్ సాక్షి! మీ పూర్వీకులను నేను చూచి ఉన్నాను. ఇంకా బనీ ఇస్రాయీ’ల్‌ను సరిదిద్దటంలో చాలా ప్రయత్నించి ఉన్నాను, కాని వారు తమ్ముతాము సరిదిద్దు కోలేక పోయారు. మీరు మీ ప్రభువు వైపునకు మళ్ళీ తిరిగి వెళ్ళండి, అల్లాహ్ (త)ను తగ్గించమని ప్రార్థించండి,’ అని అన్నారు.
నేను తిరిగి వెళ్ళి దైవసన్నిధిలో హాజరయ్యాను. నాకు 10 నమా’జులు తగ్గించబడ్డాయి. మళ్ళీ నేను మూసా (అ) వద్దకు వచ్చాను. ఆయన ఇంతకుముందు చెప్పినట్లే చెప్పారు. మళ్ళీ నేను దైవసన్నిధిలోనికి వెళ్ళాను. అల్లాహ్(త) మరో 10 నమా’జులు తగ్గించాడు. మళ్ళీ నేను మూసా (అ) వద్దకు వచ్చాను. ఆయన మళ్ళీ ముందు చెప్పిన విధంగానే చెప్పారు. మళ్ళీ నేను తిరిగి వెళ్ళాను. అల్లాహ్(త) మరో 10 నమా’జులు తగ్గించాడు. మళ్ళీ నేను మూసా (అ) వద్దకు వచ్చాను. ఆయన మళ్ళీ ఇంతకు ముందు చెప్పినట్లే చెప్పారు. మళ్ళీ నేను దైవ సన్నిధిలోకి వెళ్ళాను. మరో 5 నమా’జులు తగ్గించబడ్డాయి. ప్రతిరోజు 5 నమా’జులు చదవాలని ఆదేశించడం జరిగింది. మళ్ళీ నేను మూసా (అ) వద్దకు వచ్చాను. అతను, ‘ఏమి ఆదేశించబడిందని’ అడిగారు. దానికి నేను, ‘నాకు 5 నమా’జులు ఆదేశించబడ్డాయని’ అన్నాను. దానికి మూసా (అ), ‘మీ అనుచర సంఘం రోజూ 5 పూటల నమా’జులు చదవలేరు, నేను మీ కంటే ముందు తరాల వారిని చూచి ఉన్నాను, బనీ ఇస్రాయీల్‌ను సరిదిద్దే ప్రయత్నం చేసి ఉన్నాను, మీరు తిరిగి మీ ప్రభువు వద్దకు వెళ్ళి తగ్గించమని కోరు,’ అని చెప్పారు. దానికి ప్రవక్త (స), ‘నేను అనేక సార్లు నా ప్రభువును తగ్గించమని కోరాను, ఇప్పుడు నాకు సిగ్గుగా ఉంది. ఇప్పుడు నా ప్రభువు యొక్క ఈ ఆదేశాన్ని స్వీకరిస్తున్నాను. ఇంకా నేను నా వ్యవహారాన్ని, నా అనుచర సమాజ వ్యవహారాన్ని అల్లాహ్(త)కు అప్పజెపుతున్నాను,’ అని అన్నాను. నేను అక్కడి నుండి ముందుకు సాగాను. అప్పుడు ”నేను నా తరఫున విధించాను, ఆ తరువాత నా దాసులకోసం తగ్గించాను. అంటే వాళ్ళు 5 పూటలు నమా’జ్ చేస్తారు. కాని 50 నమా’జుల పుణ్యం పొందుతారు” అనే దైవవాణి వినిపించింది. (బు’ఖారీ, ముస్లిమ్)
5863 – [ 2 ] ( صحيح ) (3/1637)
وَعَنْ ثَابِتِ الْبُنَانِيِّ عَنْ أَنَسٍ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم قَالَ: “أَتَيْتُ بِالْبُرَاقِ وَهُوَ دَابَّةٌ أَبْيَضُ طَوِيْلٌ فَوْقَ الْحِمَارِ وَدُوْنَ الْبَغْلِ يَقَعُ حَافِرُهُ عِنْدَ مُنْتَهَى طَرْفِهِ فَرَكِبْتُهُ حَتّى أَتَيْتُ بَيتَ الْمَقْدِسِ فَرَبَطْتُهُ بِالْحَلْقَةِ الَّتِيْ تَرْبِطُ بِهَا الْأَنْبِيَاءُ”. قَالَ: “ثُمَّ دَخَلْتُ الْمَسْجِدَ فَصَلَّيْتُ فِيْهِ رَكْعَتَيْنِ ثُمَّ خَرَجْتُ فَجَاءَنِيْ جِبْرِيْلُ بِإِنَاءٍ مِنْ خَمْرٍ وَإِنَاءٍ مِنْ لَبَنٍ فَاخْتَرْتُ اللَّبَنَ. فَقَالَ جِبْرَيْلُ: اخْتَرتَ الْفِطْرَةَ ثُمَّ عُرِجَ بِنَا إِلى السَّمَاءِ”. وَسَاقَ مِثْلَ مَعْنَاهُ قَالَ: “فَإِذَا أَنَا بِآدَمَ فَرَحَّبَ بِيْ وَدَعَا لِيْ بِخَيْرٍ”. وَقَالَ فِي السَّمَاءِ الثَّالِثَةِ: ” فَإِذَا أَنَا بِيُوْسُفَ إِذَا أُعْطِيَ شَطْرَ الْحُسْنِ فَرَحَّبَ بِيْ وَدَعَا لِيْ بِخَيْرٍ”. وَلَمْ يَذْكُرْ بُكَاءَ مُوْسَى وَقَالَ فِي السَّمَاءِ السَّابِعَةِ: “فَإِذَا أَنَا بِإبْرَاهِيْمَ مُسْنِدًا ظَهْرَهُ إِلى الْبَيْتِ الْمَعْمُوْرِ وَإِذَا هُوَ يَدْخُلُهُ كُلّ يَوْمٍ سَبْعُوْنَ أَلْفٍ مَلَكٌ لَا يَعُوْدُوْنَ إِلَيْهِ ثُمَّ ذَهَبَ بِيْ إِلَى سِدْرَةِ الْمُنْتَهَى فَإِذَا وَرَقُهَا كَآذَانِ الْفِيْلَةِ وَإِذَا ثَمَرُهَا كَالْقِلَالِ فَلَمَّا غَشِيَهَا مِنْ أَمْرِ اللهِ مَا غَشِيَ تَغَيَّرَتْ فَمَا أَحَدٌ مِنْ خَلْقِ اللهِ يَسْتَطِيْعُ أَنْ يَنْعِتَهَا مِنْ حُسْنِهَا وَأَوْحَى إِلَيَّ مَا أَوْحَى فَفَرَضَ عَلَيَّ خَمْسِيْنَ صَلَاةً كُلِّ يَوْمٍ وَلَيْلَةٍ فَنَزَلْتُ إِلى مُوْسَى فَقَالَ: مَا فَرَضَ رَبُّكَ عَلَى أُمَّتِكَ؟ قُلْتُ: خَمْسِيْنَ صَلَاة كُلّ يَوْمٍ وَلَيْلَةٍ. قَالَ: ارْجِعْ إِلى رَبِّكَ فَسَلْهُ التَّخْفِيْفَ فَإِنَّ أُمَّتَكَ لَا تُطِيْقُ ذَلِكَ فَإِنِّيْ بَلَوْتُ بَنِيْ إِسْرَائِيْلَ وَخَبَّرْتُهُمْ. قَالَ: “فَرَجَعْتُ إِلى رَبِّيْ فَقُلْتُ: يَا رَبِّ خَفِّفْ عَلَى أُمَّتِيْ فَحَطَّ عَنِّيْ خَمْسًا فَرَجَعْتُ إِلى مُوْسَى فَقُلْتُ: حَطَّ عَنِّيْ خَمْسًا. قَالَ: إِنَّ أُمَّتَكَ لَا تُطِيْقُ ذَلِكَ فَارْجِعْ إِلى ربِّكَ فَسَلْهُ التَّخْفِيْفَ”. قَالَ: “فَلَمْ أَزَلْ أَرْجِعُ بَيْنَ رَبِّيْ وَبَيْنَ مُوْسَى حَتَّى قَالَ: يَا مُحَمَّدُ إِنَّهُنَّ خَمْسَ صَلَوَاتٍ كُلَّ يَوْمٍ وَلَيْلَةٍ لِكُلِّ صَلَاةٍ عَشْرٌ فَذَلِكَ خَمْسُوْنَ صَلَاةً مَنْ هَمَّ بِحَسَنَةٍ فَلَمْ يَعْمَلْهَا كُتِبَتْ لَهُ حَسَنَةٌ. فَإِنْ عَمِلَهَا كُتِبَتْ لَهُ عَشْرًا وَمَنْ هَمَّ بِسَيّئَةٍ فَلَمْ يَعْمَلْهَا لَمْ تُكْتَبْ لهَ شَيْئًا فَإِنْ عَمِلَهَا كُتِبَتْ لَهُ سَيِّئَةً وَاحِدَةً”. قَالَ: “فَنَزَلْتُ حَتّى أنْتَهَيْتُ إِلى مُوْسَى فَأَخْبَرْتُهُ فَقَالَ: اِرْجِعْ إِلى رَبِّكَ فَسَلْهُ التَّخْفِيْفَ”. فَقَالَ رَسُوْلُ الله صلى الله عليه وسلم: “فَقُلْتُ: قَدْ رَجَعْتُ إِلَى رَبِّيْ حَتّى اسْتَحْيَيْتُ مِنْهُ”. رَوَاهُ مُسْلِمٌ.
5863. (2) [3/1637– దృఢం]
సా’బిత్ బునానీ, అనస్ (ర) ద్వారా కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”నా వద్దకు బుర్రాఖ్ తీసుకు రావడం జరిగింది. ఇది ఒక తెల్లరంగు జంతువు. గాడిదకన్నా పెద్దది. కంచరగాడిదకన్నా చిన్నది. దాని ఒక్కో అడుగు కనుచూపుమేర పడేది. నేను దానిపైకి ఎక్కాను. బైతుల్ ముఖద్దస్ చేరుకున్నాను. ఇంకా నేను బుర్రాఖ్‌ను ప్రవక్తలు తమ బుర్రాఖ్‌లను కట్టే ప్రదేశంలో కట్టాను. ఆ తరువాత నేను మస్జిదె అఖ్సాలో ప్రవేశించాను. రెండు రక’అతుల నమా’జ్ చేసాను. మళ్ళీ నేను బయటకు వచ్చాను. జిబ్రీల్ (అ) నా వద్దకు ఒక గ్లాసులో మద్యం, మరో గ్లాసులో పాలు తీసుకువచ్చారు. నేను పాలు తీసుకున్నాను. అప్పుడు జిబ్రీల్(అ), ‘మీరు ప్రకృతిని అనుసరించారు,’ అని అన్నారు. ఆ తరువాత జిబ్రీల్ నన్ను ఆకాశంవైపు తీసుకువెళ్ళారు. ఆ తరువాత అనస్ (ర) పై ‘హదీసు’లో ఉన్న విషయాలే పేర్కొన్నారు. ఇంకా ఆయన కథనం: ప్రవక్త (స), ‘నేను ఆదమ్ (అ)ను చూచాను. ఆయన నన్ను స్వాగతం పలికారు. ఇంకా నా గురించి ప్రార్థించారు,’ అని అన్నారు. ఇంకా ప్రవక్త (స) మూడవ ఆకాశం గురించి ప్రస్తావిస్తూ అక్కడ నాకు యూసుఫ్ (అ) కనిపించారు. వారికి సగం అందం ప్రసాదించబడింది. ఆయన కూడా నాకు స్వాగతం పలికారు. ఇంకా నా గురించి దు’ఆ చేసారు అని అన్నారు. కాని ఈ ‘హదీసు’ ఉల్లేఖనకర్త అనస్ ద్వారా మూసా (అ) గారి గురించి ప్రస్తావించలేదు. ఇంకా ప్రవక్త (స) ఏడవ ఆకాశంలో ఇబ్రాహీమ్ (అ)ను చూచానని, అతను బైతుల్ మామూర్‌కు వీపు ఆనించి కూర్చున్నారు. బైతుల్ మామూర్‌లో ప్రతి రోజు 70 వేలమంది దైవదూతలు తవాఫ్ చేయడానికి లోపలికి వెళతారు, కాని రెండవ సారి వెళ్ళడానికి వారి వంతు రాదు. ఆతరువాత నన్ను సిద్‌రతుల్ మున్‌తహా దగ్గరకు తీసుకు వెళ్ళడం జరిగింది. అంటే అదిరేగిచెట్టు. దాని ఆకులు ఏనుగు చెవుల్లా ఉన్నాయి. దాని పండ్లు నీటి కుండల్లా ఉన్నాయి. ఆ తరువాత సిద్‌రతుల్ మున్‌తహాను ఒక వస్తువు కప్పివేసింది. దాని స్థితి మారిపోయింది. మానవుల్లో ఎవరూ దాన్ని గురించి వర్ణించలేరు. ఆ తరువాత అల్లాహ్(త) నా వైపు దైవవాణి పంపాడు. ఆ తరువాత నాకు రాత్రీ పగల్లో 50 నమా’జులు విధించబడ్డాయి. నేను మూసా (అ) వద్దకు వచ్చాను. ఆయన ‘మీ ప్రభువు ఏమి ఆదే శించారని’ అడిగారు. దానికి నేను ‘రాత్రీ పగల్లో 50 నమా’జులు విధించారు’ అని అన్నాను. అది విని మూసా (అ) తిరిగి మీ ప్రభువు వద్దకు వెళ్ళండి తగ్గించమని ప్రార్థించండి, ఎందుకంటే మీ అనుచర సమాజం దీన్ని నిర్వర్తించ లేదు. నేను బనీ ఇస్రా యీల్‌ను చూచాను, వారిని పరీక్షించాను. నేను వెళ్ళాను, ‘ఓ అల్లాహ్ (త)! నా అనుచర సమాజం కోసం తగ్గించు,’ అని అన్నాను. అనంతరం అల్లాహ్ 5 నమా’జులను తగ్గించారు. మళ్ళీ నేను మూసా (అ) వద్దకు వచ్చాను. అల్లాహ్ 5 నమా’జులను తగ్గించా డని చెప్పాను. దానికి మూసా (అ) మీ అనుచర సమాజం దీన్ని కూడా నిర్వర్తించలేరు. మీరు మీ ప్రభువు దగ్గరకు వెళ్ళి ఇంకా తగ్గించండి అని అన్నారు. నేను అదే విధంగా అనేకసార్లు వచ్చాను, వెళ్ళాను. చివరికి అల్లాహ్(త), ”ఓ ము’హమ్మద్! రాత్రీ పగల్లో 5 నమా’జులు విధి చేయబడు తున్నాయి. కాని వీటిలో ప్రతి ఒక్క నమాజు 10 నమా’జులకు సమానం. ఈ విధంగా ఈ ఐదు నమా’జులు ప్రతిఫలంలో 50 నమాజులకు సమానం. ఎవరైనా పుణ్యకార్యాన్ని ఉద్దేశించి చేయలేకపోతే అతనికి ఒక పుణ్యం లభిస్తుంది. ఒకవేళ చేస్తే అతనికి 10 పుణ్యాలు లభిస్తాయి. అలాగే చెడు ఉద్దేశించి చేయకపోతే ఏమీ వ్రాయడం జరుగదు. ఒకవేళ పాపం చేస్తే ఒక పాపం వ్రాయడం జరుగు తుంది” అని ఆదేశించడం జరిగింది. ఆ తరువాత నేను దైవసన్నిధి నుండి తిరుగు ప్రయాణమయ్యాను. మూసా (అ) వద్దకు వచ్చాను. వారికి తెలియ పరిచాను. వారు మళ్ళీ వెళ్ళ మని తగ్గించమని చెప్పారు. అప్పుడు నేను మూసా (అ) తో, ”నేను నా ప్రభువు వద్దకు చాలాసార్లు వెళ్ళాను. ఇప్పుడు నాకు వెళ్ళాలంటే సిగ్గుగా ఉంది,” అని అన్నాను. (ముస్లిమ్)
5864- [ 3] ( مُتَّفَقٌ عَلَيْهِ ) (3/1639)
وَعَنِ ابْنِ شِهَابٍ عَنْ أَنَسٍ قَالَ: كَانَ أَبُوْ ذَرٍّ يُحَدِّثُ أَنَّ رَسُوْلَ الله صلى الله عليه وسلم قَالَ: ” فُرِجَ عَنِّيْ سَقْفُ بَيْتِيْ وَأَنَا بِمَكَّةَ فَنَزَلَ جِبْرَيْلُ فَفَرَجَ صَدْرِيْ ثُمَّ غَسَلَهُ بِمَاءِ زَمْزَمَ ثُمَّ جَاءَ بِطَسْتٍ مِنْ ذَهَبٍ مُمْتَلِئٍ حِكْمَةً وَإِيْمَانًا فَأَفْرَغَهُ فِيْ صَدْرِيْ ثُمَّ أَطْبَقَهُ ثُمَّ أَخَذَ بِيَدِيْ فَعَرَجَ بِيْ إِلى السَّمَاءِ الدُّنْيَا. قَالَ جِبْرَيْلُ لِخَازِنِ السَّمَاءِ: اِفْتَحْ. قَالَ: مَنْ هَذَا؟ قَالَ جِبْرَيْلُ. قَالَ: هَلْ مَعَكَ أَحَدٌ؟ قَالَ: نَعَمْ مَعِيَ مُحَمَّدٌ صلى الله عليه وسلم. فَقَالَ: أُرْسِلَ إِلَيْهِ؟ قَالَ: نَعَمْ فَلَمَّا فُتِحَ عَلَوْنَا السَّمَاءَ الدُّنْيَا إِذَا رَجُلٌ قَاعِدٌ عَلَى يَمِيْنِهِ أَسْوِدَةٌ وَعَلَى يَسَارِهِ أَسْوِدَةٌ إِذَا نَظَرَ قِبَلَ يَمِيْنِهِ ضَحِكَ وَإِذَا نَظَرَ قِبَلَ شِمَالِهِ بَكَى. فَقَالَ مَرْحَبًا بِالنَّبِيِّ الصَّالِحِ وَالْابْنِ الصَّالِحِ. قُلْتُ لِجِبْرِيْلِ: مَنْ هَذَا؟ قَالَ: هَذَا آدَمُ وَهَذِهِ الْأَسْوِدَةُ عَنْ يَمِيْنِهِ وَعَنْ شِمَالِهِ نَسمُ بَنِيْهِ فَأَهْلُ الْيُمْنِ مِنْهُمْ أَهْلُ الْجَنَّةِ وَالْأَسْوِدَةُ عَنْ شِمَالِهِ أَهْلُ النَّارِ فَإِذَا نَظَرَ عَنْ يَمِيْنِهِ ضَحِكَ وَإِذَا نَظَرَ قِبَلَ شِمَالِهِ بَكَى حَتّى عَرَجَ بِيْ إِلى السَّمَاءِ الثَّانِيَةِ فَقَالَ لِخَازِنِهَا: اِفْتَحْ فَقَالَ لَهُ خَازِنُهَا مِثْلَ مَا قَالَ الْأَوَّلُ”. قَالَ أَنَسٌ: فَذَكَرَ أَنَّهُ وَجَدَ فِي السَّمَاوَاتِ آدَمَ وَإِدْرِيْسَ وَمُوْسَى وَعِيْسَى وَإِبْرَاهِيْمَ وَلَمْ يُثْبِتْ كَيْفَ مَنَازِلُهُمْ غَيْرَ أَنَّهُ ذَكَرَ أَنَّهُ وَجَدَ آدَمَ فِي السَّمَاءِ الدُّنْيَا وَإِبْرَاهِيْمَ فِي السَّمَاءِ السَّادِسَةِ. قَالَ ابْنِ شِهَابٍ: فَأَخْبَرَنِيَ ابْنُ حَزْمٍ أَنَّ ابْنَ عَبَّاسٍ وَأَبَا حَبَّةَ الْأَنْصَارِيَّ كَانَا يَقُوْلَانِ. قَالَ النَّبِيُّ صلى الله عليه وسلم: “ثُمَّ عُرِجَ بِيْ حَتّى وَصلت لِمُسْتَوى أَسْمَعُ فِيْهِ صَرِيْفَ الْأَقْلَامِ”. وَقَالَ ابْنُ حَزْمٍ وَأَنَسٌ: قَالَ النَّبِيُّ صلى الله عليه وسلم: “فَفَرَضَ اللهُ عَلَى أُمَّتِيْ خَمْسِيْنَ صَلَاةً فَرَجَعْتُ بِذَلِكَ حَتّى مَرَرْتُ عَلَى مُوْسَى. فَقَالَ: مَا فَرَضَ اللهُ لَكَ عَلَى أُمَّتِكَ؟ قُلْتُ: فَرَضَ خَمْسِيْنَ صَلَاةً. قَالَ : فَارْجِعْ إِلى رَبِّكَ فَإِنَّ أُمَّتَكَ لَا تُطِيْقُ فَرَاجَعْتُ فَوَضَعَ شَطْرَهَا فَرَجَعْتُ إِلى مُوْسَى فَقُلْتُ: وَضَعَ شَطْرَهَا فَقَالَ: رَاجِع رَبَّكَ فَإِنَّ أُمَّتَكَ لَا تُطِيْقُ ذَلِكَ فَرَجَعْتُ فَرَاجَعْتُ فَوَضَعَ شَطْرَهَا فَرَجَعْتُ إِلَيْهِ فَقَالَ: ارْجِعْ إِلى رَبِّكَ فَإِنَّ أُمَّتَكَ لَا تُطِيْقُ ذَلِكَ فَرَاجَعْتُهُ فَقَالَ: هِيَ خَمْسٌ وَهِيَ خَمْسُوْنَ لَا يُبَدَّلُ الْقَوْلُ لَدَيَّ فَرَجَعْتُ إِلى مُوْسَى فَقَالَ: رَاجِعْ رَبَّكَ. فَقُلْتُ: اِسْتَحْيَيْتُ مِنْ رَبِّيْ ثُمَّ انْطَلَقَ بِيْ حَتّى اِنْتَهَى إِلَى سِدْرَةِ الْمُنْتَهَى وَغَشِيَهَا أَلْوَانٌ لَا أَدْرِيْ مَا هِيَ؟ ثُمَّ أُدْخِلْتُ الْجَنَّةَ فَإِذَا فِيْهَا جَنَابِذُ اللُّؤْلُؤِ وَإِذَا تُرَابُهَا الْمِسْكُ” مُتَّفَقٌ عَلَيْهِ.
5864. (3) [3/1639 –ఏకీభవితం]
అనస్ (ర) ద్వారా, ఇబ్నె షిహాబ్ కథనం: అబూ జ’ర్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”నేను మక్కహ్లో ఉన్నప్పుడు నా ఇంటి పైకప్పు తెరచు కుంది. పైనుండి జిబ్రీల్ (అ) అవతరించారు. అతను (అ) నా గుండెను చీల్చారు. దాన్ని ‘జమ్’జమ్ నీటితో కడిగారు. ఆ తరువాత బంగారు పళ్ళెం తీసుకు రాబడింది. అది విశ్వాసం, వివేకాలతో నిండి ఉంది. దాన్ని నా గుండెలో తిరగివేయబడింది. ఆ తరువాత నా గుండెను కప్పి వేయడం జరిగింది. ఆ తరువాత జిబ్రీల్ (అ) నా చేయిపట్టుకొని ఆకాశం వైపు తీసుకువెళ్ళారు. మేము ప్రాపంచిక ఆకాశం చేరుకొని జిబ్రీల్ (అ) ద్వార పాలకునితో ద్వారం తెరవమని కోరారు. అప్పుడు ఎవరు అని ప్రశ్నించడం జరిగింది. జిబ్రీల్ నేను జిబ్రీల్‌ను అని అన్నారు. మళ్ళీ ఆ దైవదూత మీ వెంట ఎవరైనా ఉన్నారా? అని అన్నారు. దానికి జిబ్రీల్ (అ)ను ‘వెంట ము’హమ్మద్ (స) ఉన్నారని’ అన్నారు. మళ్ళీ ‘అతను పిలవబడ్డారా?’ అని ప్రశ్నించడం జరిగింది. దానికి జిబ్రీల్ ‘అవును,’ అన్నారు. ద్వారం తెరచిన తర్వాత మేము మొదటి ఆకాశం పైకి వెళ్ళాము. అక్కడ ఒక వ్యక్తి కూర్చొని ఉన్నాడు. అతనికి కుడి ప్రక్క కొంతమంది ఎడమ ప్రక్క కొంతమంది కూర్చొని ఉన్నారు. అతను కుడి ప్రక్క తల త్రిప్పి నవ్వుతాడు, ఎడమ ప్రక్క తల త్రిప్పి ఏడుస్తాడు. అతను ‘ఉత్తమ సంతానం, ఉత్తమ ప్రవక్తకు స్వాగతం’ అన్నారు. ఇతనెవరని నేను జిబ్రీల్‌ను అడిగాను. జిబ్రీల్ (అ) ‘ఇతను ఆదమ్ (అ) ‘ అని అన్నారు. అతని కుడి, ఎడమ ప్రక్క ఉన్నది అతని సంతానం, కుడి ప్రక్క ఉన్నవారు స్వర్గ వాసులు, ఎడమ ప్రక్క ఉన్నవారు నరకవాసులు. అతను కుడిప్రక్క చూచి చిరునవ్వు నవ్వుతారు, ఎడమప్రక్క చూచి ఏడుస్తారు. ఆ తరువాత జిబ్రీల్ (అ) నన్ను రెండవ ఆకాశం వద్దకు తీసుకువెళ్ళారు. ద్వార పాలకునితో ద్వారం తెరవమని కోరారు. అతడు కూడా ఇంతకు ముందు అడిగిన ప్రశ్నలే అడిగాడు. అనస్ (ర) కథనం: ఆ తరువాత ప్రవక్త (స) ఆకాశాల్లో ఆదమ్, ఇద్రీస్, మూసా, ‘ఈసా, మరియు ఇబ్రాహీమ్ (అ) లను కలిసానని అన్నారు. కాని వారిని ఎక్కడ కలిసారు, ఇతర వివరాలేవీ ప్రస్తావించలేదు. కేవలం ఆదమ్ (అ)ను మొదటి ఆకాశంపై మరియు ఇబ్రాహీమ్ (అ)ను 6వ ఆకాశంపై కలిసానని అన్నారు. ఇబ్నె షిహాబ్ ఇలా అంటున్నారు, ”ఇబ్నె హజ్‌మ్ కథనం: ఇబ్నె ‘అబ్బాస్ మరియు అబూ హబ్బ అన్సారీల కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఆ తరువాత నన్ను పైకి తీసుకుపోవటం జరిగింది. చివరికి నేను చాలా ఎత్తైన ప్రదేశానికి చేరుకున్నాను. కలములతో వ్రాసే శబ్దం నాకు వినబడుతుంది. ఇబ్నె హజ్‌మ్ మరియు అనస్‌ల కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”అల్లాహ్(త) నా అనుచర సమాజంపై 50 వేళల నమా’జు విధించాడు. నేను ఆదేశంతో తిరిగి వచ్చాను. మూసా (అ)ను కలిసాను. ‘అల్లాహ్(త) మీ అనుచర సమాజంపై ఏమి విధించాడని’ అడిగారు. నేను ’50 నమా’జులు విధించబడ్డాయని’ అన్నాను. మూసా (అ) నన్ను ‘తిరిగి మీ ప్రభువు వద్దకు వెళ్ళండి, మీ అనుచర సమాజం రోజుకు 50 నమాజులు చదవ లేరని’ అన్నారు. అనంతరం నేను దైవసన్నిధిలో హాజ రయ్యాను. వాటిలో కొన్ని నమా’జులు తగ్గించ బడ్డాయి. మళ్ళీ నేను మూసా (అ) వద్దకు వచ్చాను. కొన్ని నమా’జులు తగ్గాయని చెప్పాను. దానికి మూసా (అ) ‘మీ ప్రభువు వద్దకు మళ్ళీ వెళ్ళండి. ఎందుకంటే మీ అనుచర సమాజం ఇన్ని నమా’జులు కూడా చదవలేరు’ అని అన్నారు. నేను మళ్ళీ అల్లాహ్(త) వద్దకు వెళ్ళాను. అప్పుడు అల్లాహ్(త) నామ మాత్రం నమా’జులు 5 ఉన్నాయి. కాని 50 నమా’జుల ప్రతిఫలం లభిస్తుంది, నా ఆదేశం మారదు. మళ్ళీ మూసా (అ) వద్దకు వెళ్ళాను. మూసా (అ) మీరు మళ్ళీ తిరిగి మీ ప్రభువు వద్దకు వెళ్ళండి’ అని అన్నారు. అయితే ‘నేను ఇప్పుడు అల్లాహ్(త) వద్దకు వెళ్ళడానికి నాకు సిగ్గువేస్తుంది’ అని అన్నాను. ఆ తరువాత నన్ను సిద్‌రతుల్ మున్‌తహా వద్దకు చేర్చడం జరిగింది. దాన్ని రంగులతో, తేజస్సు, వెలుగులకు కప్పి ఉంచడం జరిగింది. దాని వాస్తవం ఏమిటో నాకు తెలియదు. ఆ తరువాత నన్ను స్వర్గంలోనికి తీసుకు వెళ్ళడం జరిగింది. అక్కడ నేను పక్షుల గోపురాలను చూచాను, ఇంకా అక్కడి నేల కస్తూరిమయంగా ఉంది. (బు’ఖారీ, ముస్లిమ్)
5865 – [ 4 ] ( صحيح ) (3/1640)
وَعَنْ عَبْدِ اللهِ قَالَ: لَمَّا أُسْرِيَ بِرَسُوْلِ اللهِ صلى الله عليه وسلم اُنْتُهِىَ بِهِ إِلى سِدْرَةِ الْمُنْتَهَى وَهِيَ فِي السَّمَاءِ السَّادِسَةِ إِلَيْهَا يَنْتَهِيْ مَا يُعْرَجُ بِهِ مِنَ الْأَرْضِ فَيُقْبَضُ مِنْهَا وَإِلَيْهَا يَنْتَهِيْ مَا يُهْبَطُ بِهِ مِنْ فَوْقِهَا فَيُقْبَضُ مِنْهَا قَالَ: [إِذْ يَغْشَى السِّدْرَةَ مَا يَغْشَى ؛ 53: 16] . قَالَ: فِرَاشٌ مِنْ ذَهَبٍ قَالَ: فَأُعْطِيَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم ثَلَاثًا: أُعْطِيَ الصَّلَوَاتِ الْخَمْسَ وَأُعْطِيَ خَوَاتِيْمَ سُوْرَةِ الْبَقَرَةِ وَغُفِرَ لِمَنْ لَا يُشْرِكُ بِاللهِ مِنْ أُمَّتِهِ شَيْئًا الْمُقْحِمَاتِ. رَوَاهُ مُسْلِمٌ .
5865. (4) [3/1640– దృఢం]
‘అబ్దుల్లాహ్ బిన్ మస్’ఊద్ (ర) కథనం: ప్రవక్త (స) మే’రాజ్‌కు వెళ్ళినపుడు, ప్రవక్త (స)ను సిద్‌రతుల్ మున్‌తహా వరకు తీసుకు వెళ్ళడం జరిగింది. సిద్‌రతుల్ మున్‌తహా 6వ ఆకాశంలో ఉంది. భూమి నుండి పైకి వెళ్ళే ప్రతి వస్తువు సిద్‌రతుల్ మున్‌తహా వద్దకు చేరుతుంది. అదేవిధంగా పైనుండి భూమిపై దిగే ప్రతి వస్తువు కూడా సిద్‌రతుల్ మున్‌తహా వద్దకే చేరుతుంది. ఇక్కడ దాన్ని ఆపివేయడం జరుగు తుంది. ఆ తరువాత ఇబ్నె మస్‌ఊద్ ”ఇజ్’య’గస్సిద్‌రత మా య’గ్‌షా” (అన్-నజ్మ్, 53:16) అనే ఆయతు పఠించారు. ఇంకా సిద్‌రతుల్ మున్‌తహాను కప్పివేసింది బంగారు నగలు. ఇంకా మే’రాజ్ రాత్రి ప్రవక్త (స)కు 3 వస్తువులు ఇవ్వ బడ్డాయి. 1. 5 పూటల నమా’జులు. 2. సూరహ్ బఖరహ్‌లోని చివరి ఆయతులు. 3. అల్లాహ్‌కు సాటి కల్పించని, మహా పాపాలకు పాల్పడిన వ్యక్తిని క్షమాపణ. (ముస్లిమ్)
5866- [ 5 ] ( صحيح ) (3/1640)
وعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: قَالَ رَسُوْلُ الله صلى الله عليه وسلم: “لَقَدْ رَأَيْتُنِيْ فِي الْحِجْرِ وَقُرَيْشٌ تَسْأَلُنِيْ عَنْ مَسْرَايَ فَسَأَلَتْنِيْ عَنْ أَشْيَاءَ مِنْ بَيْتِ الْمُقْدِسِ لَمْ أُثْبِتْهَا فَكُرِبْتُ كَرَبًا مَا كُرِبْتُ مِثْلَهُ فَرَفَعَهُ اللهُ لِيْ أَنْظُرُ إِلَيْهِ مَا يَسْأَلُوْنِيْ عَنْ شَيْءٍ إِلَّا أَنْبَأُتُهُمْ وَقَدْ رَأَيْتُنِيْ فِي جَمَاعَةٍ مِنَ الْأَنْبِيَاءِ فَإِذَا مُوْسَى قَائِمٌ يُصَلِّيْ. فَإِذَا رَجُلٌ ضَرْبٌ جَعْدٌ كَأَنَّهُ أَزد شَنُوْءَةَ وَإِذَا عِيْسَى قَائِمٌ يُصَلِّيْ أَقْرَبُ النَّاسِ بِهِ شَبَهًا عُرْوَةُ بْنُ مَسْعُوْدٍ الثَّقَفِيُّ فَإِذَا إِبْرَاهِيْمُ قَائِمٌ يُصَلِّيْ أَشْبَهُ النَّاسِ بِهِ صَاحِبُكُمْ – يَعْنِيْ نَفْسَهُ – فَحَانَتِ الصَّلَاةُ فَأَمَمْتُهُمْ فَلَمَّا فَرَغْتُ مِنَ الصَّلَاةِ قَالَ لِي قَائِلٌ: يَا مُحَمَّدُ هَذَا مَالِكُ خَازِنُ النَّارِ فَسَلِّمْ عَلَيْهِ فَالْتَفَت إِلَيْهِ فَبَدَأَنِيْ بِالسَّلَامِ”. رواه مسلم .
5866. (5) [3/1640 –దృఢం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”నన్ను నేను ‘హ’తీమ్‌లో నిలబడి ఉండగా చూసాను. ఖురైషులు నన్ను మే’రాజ్ గురించి అడుగు తున్నారు. వారు నన్ను బైతుల్ ముఖద్దస్‌లోని వస్తువుల గురించి, చిహ్నాల గురించి అడగటం ప్రారంభించారు. కాని అవి నాకు గుర్తులేవు. దానివల్ల నేను చాలా ఆందోళనకు గురయ్యాను. ఎంత ఆందోళనకు గురయ్యానంటే అంతకుముందు నే నెప్పుడూ ఆందోళనకు గురికాలేదు. అయితే అల్లాహ్ (త) బైతుల్ ముఖద్దస్‌ను నా కళ్ళ ముందుకు తెచ్చాడు. దాన్ని నేను చూస్తున్నాను. వాళ్ళు అడుగుతున్న ప్రశ్నలకు చూచి సమాధానం ఇస్తున్నాను. ఇంకా నేను మే’రాజ్‌లో ప్రవక్తలను చూచాను. నేను మూసా (అ)ను చూచాను. అతను నిలబడి నమా’జు చదువుతున్నారు. మూసా (అ) సాధారణమైన పొడుగు కలిగి ఉన్నారు. షనూఅ’ హ్ వర్గానికి చెందిన వారులా ఉన్నారు. నేను ‘ఈసా (అ) ను కూడా చూచాను. ఆయన నిలబడి నమా’జు చదువుతున్నారు. అతను అచ్చం ‘ఉర్‌వ బిన్ మస్’ఊద్ స’ఖఫీలా ఉన్నారు. ఇంకా నేను ఇబ్రాహీమ్ (అ)ను చూచాను. అతను నిలబడి నమా’జు చదువు తున్నారు. అందరికంటే అతనిలా ఉన్నవాడు మీ స్నేహితుడు అంటే నేను. ఆ తరువాత నమా’జు సమయం అయితే, నేను వారందరికి ఇమాము నయ్యాను. నమా’జు ముగిసిన తరువాత, ”ఓ ము’హ మ్మద్! ఇతడు నరక అధికారి, ఇతనికి సలామ్ చేయండి,” అనే దైవవాణి వినిపించింది. నేను అతని వైపు చూచాను. అతడు ముందు సలామ్ చేసాడు. (ముస్లిమ్)
—–
وَهَذَا الْبَابُ خَالٍ عَنِ الْفَصْلِ الثَّانِيْ
ఇందులో రెండవ విభాగం లేదు.
—–
اَلْفَصْلُ الثَّالِثُ మూడవ విభాగం
5867 – [ 6 ] ( مُتَّفَقٌ عَلَيْهِ ) (3/1641)
عَنْ جَابِرٍ أَنَّهُ سَمِعَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ: “لَمَّا كَذَّبَنِيْ قُرَيْشٌ قُمْتُ فِي الْحِجْرِ فَجَلّى اللهُ لِيْ بَيْتَ الْمَقْدِسِ فَطَفِقْتُ أُخْبِرُهُمْ عَنْ آيَاتِهِ وَأَنَا أَنْظُرُ إِلَيْهِ”. مُتَّفَقٌ عَلَيْهِ.
5867. (6) [3/1641–ఏకీభవితం]
జాబిర్ (ర) కథనం: ప్రవక్త (స) ఇలా ప్రవచిస్తూ ఉండగా అతను విన్నారు, ”ఖురైషులు మే’రాజ్ గురించి నన్ను వ్యతిరేకిస్తున్నప్పుడు, నేను ‘హతీమ్‌లో నిలబడి ఉన్నాను. అల్లాహ్(త) బైతుల్ ముఖద్దస్‌ను నా ముందుకు తెప్పించాడు. అప్పుడు నేను దానివైపు చూస్తూ దాని చిహ్నాలను గురించి ప్రజలకు చెబుతూ పోయాను.” (బు’ఖారీ, ముస్లిమ్)
=====
7 – بَابٌ فِي ا لْمُعْجَزَاتِ
7. ప్రవక్త (స) మహిమలు
اَلْفَصْلُ الْأَوَّلُ మొదటి విభాగం
5868 – [ 1 ] ( مُتَّفَقٌ عَلَيْهِ ) (3/1642)
عَنْ أَنَسِ بْنِ مَالِكٍ أَنَّ أَبَا بَكْرِ الصِّدِّيْقِ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: نَظَرْتُ إِلى أَقْدَامِ الْمُشْرِكِيْنَ عَلَى رُؤُوْسِنَا وَنَحْنُ فِي الْغَارِ فَقُلْتُ يَا رَسُوْلَ اللهِ لَوْ أَنَّ أَحَدَهُمْ نَظَرَ إِلى قَدَمِهِ أَبْصَرَنَا فَقَالَ: “يَا أَبَا بَكْرٍ مَا ظَنُّكَ بِاثْنَيْنِ اللهُ ثَالِثُهُمَا”. مُتَّفَقٌ عَلَيْهِ.
5868. (1) [3/1642 –ఏకీభవితం]
అనస్ బిన్ మాలిక్ (ర) కథనం: అబూ బకర్ (ర) ఇలా తెలిపారు, ”మేము గుహలో దాక్కొని ఉన్నప్పుడు, అవిశ్వాసుల కళ్ళు మాపై ఉన్నట్టు ఉన్నాయి. అప్పుడు నేను ప్రవక్త (స)తో, ‘ఓ ప్రవక్తా! వీరిలో ఎవరైనా తమ కాళ్ళవైపు చూస్తే, మనల్ని చూసినట్టే,’ అని అన్నాను. అది విని ప్రవక్త (స), ‘ఓ అబూ బకర్! మూడవ వాడు అల్లాహ్(త) అయిన ఆ ఇద్దరి గురించి నీ అభిప్రాయం ఏమిటి?’ అని అన్నారు? (బు’ఖారీ, ముస్లిమ్)
5869 – [ 2 ] ( مُتَّفَقٌ عَلَيْهِ ) (3/1642)
وَعَنِ الْبَرَاءِ بْنِ عَازِبٍ عَنْ أَبِيْهِ أَنَّهُ قَالَ لِأَبِيْ بَكْرٍ: يَا أَبَا بَكْرٍ حَدِّثْنِيْ كَيْفَ صَنَعْتُمَا حِيْنَ سَرَيْتَ مَعَ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم قَالَ: أَسْرَيْنَا لَيْلَتَنَا وَمِنَ الْغَدِ حَتّى قَامَ قَائِمُ الظَّهِيْرَةِ وَخَلَا الطَّرِيْقُ لَا يَمُرُّ فِيْهِ أَحَدٌ فَرُفِعَتْ لَنَا صَخْرَةٌ طَوِيْلَةٌ لَهَا ظِلٌّ لَمْ يَأْتِ عَلَيْهَا الشَّمْسُ فَنَزَلْنَا عِنْدَهَا وَسَوَّيْتُ لِلنَّبِيِّ صلى الله عليه وسلم مَكَانًا بِيَدَيَّ يَنَامُ عَلَيْهِ وَبَسَطْتُ عَلَيْهِ فَرَوَةً وَقُلْتُ نَمْ يَا رَسُوْلَ اللهِ وَأَنَا أَنْفُضُ مَا حَوْلَكَ فَنَامَ وَخَرَجْتُ أَنْفُضُ مَا حَوْلَهُ فَإِذَا أَنَا بِرَاعٍ مُقْبِلٍ قُلْتُ: أَفِيْ غَنَمِكَ لَبَنٌ؟ قَالَ: نَعَمْ. قُلْتُ: أَفَتَحْلِبُ؟ قَالَ: نَعَمْ. فَأَخَذَ شَاةً فَحَلَبَ فِيْ قَعْبٍ كُثْبَةً مِنْ لَبَنٍ وَمَعِيَ إِدَاوَةٌ حَمَلْتُهَا لِلنَّبِيِّ صلى الله عليه وسلم يَرْتَوِيْ فِيْهَا يَشْرَبُ وَيَتَوَضَّأُ فَأَتَيْتُ النَّبِيَّ صلى الله عليه وسلم فَكَرِهْتُ أَنْ أُوْقِظَهُ فَوَافَقْتُهُ حَتّى اسْتَيْقَظَ فَصَبَبْتُ مِنَ الْمَاءِ عَلَى اللَّبَنِ حَتّى بَرَدَ أَسْفَلُهُ فَقُلْتُ: اِشْرَبْ يَا رَسُوْلَ اللهِ فَشَرِبَ حَتّى رَضِيْتُ ثُمَّ قَالَ: “أَلَمْ يَأْنِ الرَّحِيْلِ؟” قُلْتُ: بَلَى قَالَ: فَارْتَحَلْنَا بَعْدَ مَا مَالَتِ الشَّمْسُ وَاتَّبَعَنَا سُرَاقَةُ بْنُ مَالِكٍ فَقُلْتُ: أَتَيْنَا يَا رَسُوْلَ اللهِ فَقَالَ: “لَا تَحْزَنْ إِنَّ اللهَ مَعَنَا”. فَدَعَا عَلَيْهِ النَّبِيّ صلى الله عليه وسلم فَارْتَطَمَتْ بِهِ فَرَسُهُ إِلى بَطْنِهَا فِيْ جَلَدٍ مِنَ الْأَرْضِ فَقَالَ: إِنِّيْ أَرَاكُمَا دَعَوْتُمَا عَلَيَّ فَادْعُوْا لِيْ فَاللهِ لَكُمَا أَنْ أَرُدَّ عَنْكُمَا الطَّلَبَ فَدَعَا لَهُ النَّبِيُّ صلى الله عليه وسلم فَنَجَا فَجَعَلَ لَا يَلْقَى أَحَدًا إِلَّا قَالَ: كَفَيْتُمْ مَا هَهُنَا فَلَا يَلْقَى أَحَدًا إِلَّا رَدّهُ. مُتَّفَقٌ عَلَيْهِ.
5869. (2) [3/1642 –ఏకీభవితం]
బరా’ బిన్ ‘ఆ’జిబ్ తన తండ్రిద్వారా కథనం: అతడు (ర) అబూ బకర్ (ర)తో ఇలా అన్నారు, ‘ఓ అబూ బకర్! ఆ రోజు మీరు ప్రవక్త (స) వెంట మక్కహ్ నుండి మదీనహ్ బయలు దేరారు కదా! అప్పుడు ఏం జరిగింది?’ అని అన్నారు. దానికి అబూ బకర్ (ర) మేము రాత్రంతా నడిచాము. ఇంకా మరుసటి రోజు మధ్నాహ్నం వరకు ప్రయాణంలో గడిచింది. మిట్ట మధ్యాహ్నం కాగానే మాకు ఒక బండరాయి కనబడింది. దాని క్రింద నీడ ఉంది. అనంతరం మేము బండరాయి క్రింద దిగాము. ఇంకా నేను అక్కడ ప్రవక్త (స) విశ్రాంతి తీసు కుంటారని కొంత స్థలాన్ని సరిచేసాను, అక్కడ నేను చర్మం పరిచాను. ఆ తరువాత, ‘ఓ ప్రవక్తా! విశ్రాంతి తీసుకోండి, నేను కాపలా కాస్తాను,’ అని అన్నాను. ప్రవక్త (స) నిద్ర పోయారు. నేనక్కడి నుండి కాపలా కాయడానికి లేచాను. అకస్మాత్తుగా నేను ఒక పశువుల కాపరిని చూచాను. అతడు ఇటుగా వస్తున్నాడు, నేనతనితో, ‘నీ మేకల్లో పాలున్నాయా?’ అని అడిగాను. దానికి ఆ వ్యక్తి, ‘అవును,’ అని అన్నాడు. నేనతనితో, ‘పాలు పితుకుతావా?’ అని అడిగాను. అతడు, ‘అవును’ అని అన్నాడు. అనంతరం ఆ వ్యక్తి తన మేకను పట్టి చెక్క పాత్రలో కొన్ని పాలు పితికాడు. నా దగ్గర ఒక చిన్న సంచి ఉండేది. నేను ప్రవక్త (స) కోసం అందులో నీళ్ళు ఉంచాను. ప్రవక్త (స) ఆ నీటిని త్రాగేవారు, వు’దూ చేసే వారు. నేను వచ్చి చూస్తే ప్రవక్త (స) నిద్రపోతున్నారు. నేను లేపటం మంచిదికాదని భావించి, నేను కూడా నిద్రపోయాను. చివరికి ప్రవక్త (స) తానంతట తాను మేల్కొన్నారు. ఆ తరువాత నేను పాలలో కొన్ని నీళ్ళు కలిపి చల్లారగా, ‘ప్రవక్తా! సేవించండి,’ అని అన్నాను. ప్రవక్త (స) ఆ పాలను త్రాగారు. నేను చాలా సంతోషించాను. ఆ తరువాత ప్రవక్త (స), ‘బయలుదేరే సమయం రాలేదా,’ అని అడిగారు. నేను, ‘అవును వచ్చింది,’ అన్నాను. సూర్యుడు వాలగానే మేము అక్కడి నుండి బయలు దేరాము. వెనుక నుండి సురాఖహ్ బిన్ మాలిక్ వచ్చాడు. నేను ప్రవక్త (స)తో, ‘ప్రవక్తా! శత్రువు వచ్చి ఉన్నాడు,’ అని అన్నాను. దానికి ప్రవక్త (స), ‘ఏమాత్రం విచారించకు, అల్లాహ్(త) మనతో ఉన్నాడు. ఆ తరువాత ప్రవక్త (స) సురాఖహ్ను శపించారు. సురాఖహ్ గుర్రం అకస్మాత్తుగా భూమిలో దిగబడి పోయింది. సురాఖహ్, ‘మీరిద్దరూ నా గురించి శపించి ఉంటారు, మీరు నా గురించి దు’ఆ చేయండి, నేను అవిశ్వాసులను మిమ్మల్ని వెంటాడటం నుండి ఆపివేస్తాను,’ అని అన్నాడు. ప్రవక్త (స) ప్రార్థించారు, అతడు కష్టం నుండి బయటపడ్డాడు. ఆ తరువాత దారిలో కలిసిన ప్రతివ్యక్తికి నేనంతా వెతికాను, ఇటు ఆ వ్యక్తి లేడు అని చెబుతూ పోయాడు. వారిని వెనక్కి పంపాడు. (బు’ఖారీ, ముస్లిమ్)
5870 – [ 3 ] ( صحيح ) (3/1643)
وَعَنْ أَنَسٍ قَالَ سَمِعَ عَبْدُ اللهِ بْنِ سَلَامٍ بِمَقْدَمِ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم وَهُوَ فِي أَرْضٍ يَخْتَرِفُ فَأَتَى النَّبِيُّ صلى الله عليه وسلم. فَقَالَ إِنِّيْ سَائِلُكَ عَنْ ثَلَاثٍ لَا يَعْلَمُهُنَّ إِلَّا نَبِيٌّ: فَمَا أَوَّلُ أَشْرَاطِ السَّاعَةِ وَمَا أَوَّلُ طَعَامٍ أَهْلِ الْجَنَّةِ؟ وَمَا يَنْزَعُ الْوَلَدُ إِلى أَبِيْهِ أَوْ إِلى أُمِّهِ؟ قَالَ: “أَخْبَرَنِيْ بِهِنَّ جِبْرَيْلُ آنِفًا أَمَّا أَوَّلُ أَشْرَاطِ السَّاعَةِ فَنَارٌ تَحْشُرُ النَّاسَ مِنَ الْمَشْرِقِ إِلى الْمَغْرِبِ وَأَمَّا أَوَّلُ طَعَامٍ يَأْكُلُهُ أَهْلُ الْجَنَّةِ فَزِيَادَةُ كَبِدِ الْحُوْتِ وَإِذَا سَبَقَ مَاءُ الرَّجُلِ مَاءَ الْمَرْأَةِ نَزَعَ الْوَلَدُ وَإِذَا سَبَقَ مَاءُ الْمَرْأَةِ نَزَعَتْ”. قَالَ: أَشْهَدُ أَنْ لَاإِلَهَ إِلَّا اللهُ وَأَنَّكَ رَسُوْلُ اللهِ يَا رَسُوْلَ اللهِ إِنَّ الْيَهُوْدَ قَوْمٌ بُهْتٌ وَإِنَّهُمْ إِنْ يَعْلَمُوْا بِإِسْلَامِيْ مِنْ قَبْلِ أَنْ تَسْأَلَهُمْ يَبْهَتُوْنِيْ فَجَاءَتِ الْيَهُوْدُ فَقَالَ: “أَيُّ رَجُلٍ عَبْدُ اللهِ فِيْكُمْ؟” قَالُوْا: خَيْرُنَا وَابْنُ خَيْرِنَا وَسَيِّدُنَا وَابْنُ سَيِّدِنَا فَقَالَ: “أَرَأَيْتُمْ إِنْ أَسْلَمَ عَبْدُ اللهِ بْنِ سَلَامٍ؟ “قَالُوْا أَعَاذَهُ اللهُ مِنْ ذَلِكَ. فَخَرَجَ عَبْدُ اللهِ. فَقَالَ أَشْهَدُ أَنْ لَا إِلَهَ إِلَّا اللهُ وَأَنَّ مُحَمَّدًا رَسُوْلُ اللهِ. فَقَالُوْا: شَرُّنَا وَابْنُ شَرِّنَا فَانْتَقَصُوْهُ قَالَ: هَذَا الَّذِيْ كُنْتُ أَخَافُ يَا رَسُوْلَ الله روَاهُ الْبُخَارِيُّ.
5870. (3) [3/1643– దృఢం]
అనస్ (ర) కథనం: ‘అబ్దుల్లాహ్ బిన్ సలామ్ ఒక చోట చెట్టు నుండి పళ్ళు తెంపుతున్నారు. ఇంతలో ప్రవక్త (స) మక్కహ్ నుండి మదీనహ్ వస్తున్నారని విన్నారు. అతను ప్రవక్త (స) వద్దకు వచ్చారు. ‘నేను మిమ్మల్ని మూడు విషయాలు అడుగుదామని అనుకుంటున్నాను,’ అని అన్నారు. ‘అవి ప్రవక్తలకే తప్ప మరెవ్వరికీ తెలియవు. ఒకటేమిటంటే, మొట్ట మొదటి ప్రళయసూచన ఏమిటి? రెండవది స్వర్గ వాసుల మొట్టమొదటి భోజనంలో ఏముం టుంది? మూడవది దేనివల్ల సంతానం తల్లిదండ్రులను పోలి ఉంటుంది.’ అప్పుడు ప్రవక్త (స) జిబ్రీల్ (అ) ఇప్పు డిప్పుడే వచ్చి వీటిగురించి తెలిపారు. మొట్ట మొదటి ప్రళయ సూచన ఏమిటంటే ప్రజలను తూర్పు నుండి పడమర వైపు లాక్కుపోయే అగ్ని. స్వర్గవాసుల మొట్టమొదటి భోజనం చేప పదార్థం, ఒకవేళ పురు షుని వీర్యం స్త్రీ వీర్యాన్ని అధిగమించినా, స్త్రీ వీర్యం పురుషుని వీర్యాన్ని అధిగమించినా తల్లి లేక తండ్రిని పోలి ఉంటారు,’ అని అన్నారు. అది విని ‘అబ్దుల్లాహ్ బిన్ సలామ్ ‘అల్లాహ్(త) తప్ప ఇతరులెవ్వరూ ఆరాధ్యులుకారని, తమరు దైవప్రవక్త అని నేను సాక్ష్యం ఇస్తున్నాను,’ అని అన్నారు. ఆ తరువాత ‘అబ్దుల్లాహ్ బిన్ సలామ్, ‘ఓ ప్రవక్తా! యూదులు చాలా కల్లోల పూరిత మనుషులు. నేను ఇస్లాం స్వీక రించానని తెలిస్తే నాపై అభాండాలు కల్పిస్తారు. అందు వల్ల నేను ఇస్లాం స్వీకరించానని తెలియక ముందు వారిని నా గురించి అడగండని,’ అన్నారు. అనంతరం యూదులు వచ్చారు. అప్పుడు ‘అబ్దుల్లాహ్ బిన్ సలామ్ లోపల దాక్కున్నారు. ప్రవక్త (స) యూదు లను, ‘ ‘అబ్దుల్లాహ్ బిన్ సలామ్ ఎటువంటి వ్యక్తి?’ అని అడిగారు. దానికి వారు, ‘అతడు చాలా ఉత్త ముడు, అతని తల్లిదండ్రులు కూడా ఉత్తములే, అతడు మా నాయకుడు, మా నాయకుని ఉత్తమ సంతానం,’ అని అన్నారు. అప్పుడు ప్రవక్త (స), ‘ఒకవేళ ‘అబ్దుల్లాహ్ బిన్ సలామ్ ఇస్లామ్ స్వీకరిస్తే, మీరు కూడా ఇస్లామ్ స్వీకరిస్తారా?’ అని అడిగారు. దానికి వారు, ‘అల్లాహ్ (త) అతన్ని ఇస్లామ్ నుండి కాపాడు గాక, ఇంకా తన శరణులో ఉంచు గాక!’ అని అన్నారు. అది విన్న ‘అబ్దుల్లాహ్ బిన్ సలామ్ వారి ముందుకు వచ్చి, అల్లాహ్ (త) తప్ప ఆరాధ్యు లెవరూ లేరు, ము’హమ్మద్ అల్లాహ్ (త) ప్రవక్త అని నేను సాక్ష్యం ఇస్తున్నాను,’ అని అన్నారు. అది విని యూదులు, ‘ఈ వ్యక్తి మాలో అందరికంటే నీచుడు, నీచవ్యక్తి సంతానం,’ అని అనేక లోపాలు కల్పించారు. అప్పుడు ‘అబ్దుల్లాహ్ బిన్ సలామ్, ‘ప్రవక్తా! ఈ విషయం గురించే నేను భయపడేవాడ్ని,’ అని అన్నారు. (బు’ఖారీ)
5871 – [ 4 ] ( صحيح ) (3/1644)
وَعَنْهُ قَالَ: إِنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم شَاوَرَ حِيْنَ بَلَغَنَا إِقْبَالُ أَبِيْ سُفْيَانَ. وَقَامَ سَعْدُ بْنُ عُبَادَةَ. فَقَالَ: يَا رَسُوْلَ اللهِ وَالَّذِيْ نَفْسِيْ بِيَدِهِ لَوْ أَمَرْتَنَا أَنْ نُخِيْضَهَا الْبَحْرَ لَأَخَضْنَاهَا ولَوْ أَمَرْتَنَا أَنْ نَضْرِبَ أَكْبَادَهَا إِلى بَرْكِ الْغَمَادِ لَفَعَلْنَا. قَالَ: فَنَدَبَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم النَّاسَ فَانْطَلَقُوْا حَتّى نَزَلُوْا بَدْرًا. فَقَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم:”هَذَا مَصْرَعُ فُلَانٍ”. وَيَضَعُ يَدَهُ عَلَى الْأَرْضِ هَهُنَا وَهَهُنَا قَالَ: فَمَا مَاطَ أَحَدُ هُمْ عَنْ مَوْضِعٍ يَدٍ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم.رَوَاهُ مُسْلِم.
5871. (4) [3/1644 –దృఢం]
అనస్ (ర) కథనం: ప్రవక్త (స)కు అబూ సుఫియాన్ సిరియా నుండి తిరిగి వస్తున్నాడని తెలియగానే, మదీనహ్ ప్రజలతో సంప్రదించారు. అప్పుడు స’అద్ బిన్ ‘ఉబాదహ్ నిలబడి అన్నారు, ”ప్రవక్తా! ఎవరి చేతిలో నా ప్రాణం ఉందో ఆయన(త) సాక్షి! ఒకవేళ తమరు మమ్మల్ని వాహనాలను సముద్రంలో పడ వేయమని ఆదేశిస్తే, నిస్సందేహంగా మేము సము ద్రంలో పడవేస్తాము. ఒకవేళ తమరు మమ్మల్ని, ‘మేము మా గుర్రాల ఛాతీలపై కొడుతూ బర్‌కుల్ ‘గమాద్ వరకు వెళ్ళమన్నా మేము సిద్ధంగా ఉన్నాం.’
” అనస్ (ర) కథనం: ఆ తరువాత ప్రవక్త (స) ప్రజలను యుద్ధంకోసం సిద్ధంచేసారు. ప్రజలు ప్రవక్త (స) వెంట బయలుదేరారు, బద్ర్ ప్రాంతానికి చేరు కున్నారు. అప్పుడు ప్రవక్త (స) ప్రజలారా! ఇక్కడ ఫలానా వ్యక్తి మరణిస్తాడు, ఈ స్థలంలో ఫలానా వ్యక్తి హతమార్చ బడతాడు. ఇలా ప్రవక్త (స) సూచిస్తూ తన చేతితో తాకుతూ వెళ్ళారు. ఇంకా ఈ చోట్ల అవిశ్వాసుల శవాలు పడతాయని చెప్పారు. అనస్ (ర) ప్రవక్త (స) చేయిపెట్టిన చోట్లలో సరిగ్గా అక్కడే అవిశ్వాసులు హతమార్చబడ్డారు. (ముస్లిమ్)
5872 – [ 5 ] ( صحيح ) (3/1644)
وَعَنِ ابْنِ عَبَّاسٍ أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم قَالَ وَهُوَ فِيْ قُبَّةٍ يَوْمَ بَدْرٍ: “اَللّهُمَّ أَنْشُدُكَ عَهْدَكَ وَوَعْدَكَ اللّهُمَّ إِنْ تَشَأ لَا تُعْبَدُ بَعْدَ الْيَوْمِ”. فَأَخَذَ أَبُوْ بَكْرٍ بَيَدِهِ. فَقَالَ حَسْبُكَ يَا رَسُوْلَ اللهِ أَلْحَحتَ عَلَى رَبِّكَ فَخَرَجَ وَهُوَ يَثِبُ فِي الدِّرْعِ وَهُوَ يَقُوْلُ: “[سَيُهْزَمُ الْجَمْعُ وَيُوَلُّوْنَ الدُّبُر؛ 54: 45]”. روَاهُ الْبُخَارِيُّ.
5872. (5) [3/1644– దృఢం]
ఇబ్నె ‘అబ్బాస్ (ర) కథనం: ప్రవక్త (స) బద్ర్ నాడు టెంట్‌లో ఉన్నప్పుడు ఇలా ప్రార్థించారు, ”ఓ అల్లాహ్(త)! నేను నీ నుండి నీ రక్షణ కోరుతున్నాను. నీవు చేసిన వాగ్దానం కోరుతున్నాను. ఓ అల్లాహ్(త)! మా తరువాత నీ ఆరాధన జరగకూడదని కోరు కుంటున్నావా?” అని అన్నారు. ఇంతలో అబూ బకర్ (ర) ప్రవక్త (స) చేయిపట్టుకొని, ‘ప్రవక్తా! ఇంత చాలు, తమరు ప్రార్థనలో చాలా ఆవేశంతో దు’ఆ చేసారు,’ అని అన్నారు. ఆ తరువాత ప్రవక్త (స) చాలా వేగంగా టెంట్ నుండి బయటకు వచ్చారు. ప్రవక్త (స) కవచం ధరించి ఉన్నారు. బిగ్గరగా ఇలా పలుకుతూ ఉన్నారు, ”కాని త్వరలోనే ఈ శక్తిగల వర్గం పరాజయం పొందగలదు. మరియు వారు వెన్నుచూపి పారిపోతారు.” (అల్ ఖమర్, 54:45) (బు’ఖారీ)
5873 – [ 6 ] ( صحيح ) (3/1644)
وَعَنْهُ أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم قَالَ يَوْمَ بَدْرٍ: “هَذَا جِبْرَيْلُ آخِذٌ بِرَأسِ فَرَسِهِ عَلَيْهِ أَدَاةُ الْحَرْبِ”. روَاهُ الْبُخَارِيُّ.
5873. (6) [3/1644– దృఢం]
ఇబ్నె ‘అబ్బాస్ (ర) కథనం: బద్ర్ నాడు ప్రవక్త (స) ప్రవచనం, ”వీరు జిబ్రీల్ (అ), వీరు తమ గుర్రపు కళ్ళెం పట్టుకొని ఉన్నారు, యుద్ధసామగ్రి గుర్రంపై ఉంది.” (బు’ఖారీ)
5874 – [ 7 ] ( صحيح ) (3/1644)
وَعَنْهُ قَالَ: بَيْنَمَا رَجُلٌ مِنَ الْمُسْلِمِيْنَ يَوْمَئِذٍ يَشْتَدُّ فِيْ إثرِ رَجُلٍ مِنَ الْمُشْرِكِيْنَ أَمَامَهُ إِذْ سَمِعَ ضَرْبَةً بِالسَّوْطِ فَوْقَهُ وَصَوْتُ الْفَارِسِ يَقُوْلُ: أَقْدِمْ حَيْزُوْمُ. إِذْ نَظَرَ إِلى الْمُشْرِكِ أَمَامَهُ خَرَّ مُسْتَلْقِيًا فَنَظَرَ إِلَيْهِ فَإِذَا هُوَ قَدْ خُطِمَ أَنْفُهُ وَشُقَّ وَجْهُهُ كَضَرْبَةِ السَّوْطِ فَاخْضَرَّ ذَلِكَ أَجْمَعُ فَجَاءَ الْأَنْصَارِيُّ فَحَدَّثَ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم فَقَالَ: “صَدَقْتَ ذَلِكَ مِنْ مَدَدِ السَّمَاءِ الثَّالِثَةِ”. فَقَتَلُوْا يَوْمَئِذٍ سَبْعِيْنَ وَأَسَرُوْا سَبْعِيْنَ. رَوَاهُ مُسْلِمٌ.
5874. (7) [3/1644– దృఢం]
ఇబ్నె ‘అబ్బాస్ (ర) కథనం: బద్ర్ యుద్ధం నాడు ఒక ముస్లిమ్, ఒక అవిశ్వాసి వెనుక పరిగెడుతున్నాడు. ఇంతలో ఆ ముస్లిమ్, అవిశ్వాసికి కొరడా తగిలినట్టు శబ్దం విన్నాడు, ఇంకా గుర్రంపై ఉన్న వ్యక్తి, ‘హైజూమ్ ముందుకు పద,’ అని అంటున్నాడు. ఆ తరువాత ఆ ముస్లిమ్ దృష్టి తన ముందు పారిపోతున్న అవిశ్వాసిపై పడింది. చూస్తే, వాడు నేలపై వెల్లకిలా పడి ఉన్నాడు. ఇంకా అవిశ్వాసి ముక్కు గాయపడి, ముఖం తెగి ఉంది, అంటే కొరడా దెబ్బ తగిలి గాయపడి ఉంది. అనంతరం ఆ అ’న్సారీ వ్యక్తి ప్రవక్త (స) వద్దకు వచ్చి జరిగిన సంఘటన గురించి చెప్పాడు. దానికి ప్రవక్త (స) నువ్వు నిజమే చెబుతున్నావు, వీళ్ళు దైవదూతలు, మూడవ ఆకాశం నుండి సహాయం కోసం వచ్చారు. ఆ రోజు ముస్లిములు 70 మంది అవిశ్వాసులను చంపారు, 70 మందిని పట్టు కున్నారు. [23] (ముస్లిమ్)
5875 – [ 8 ] ( مُتَّفَقٌ عَلَيْهِ ) (3/1645)
وَعَنْ سَعْدِ بْنِ أَبِيْ وَقَّاصٍ قَالَ: رَأَيْتُ عَنْ يَمِيْنِ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم وَعَنْ شِمَالِهِ يَوْمَ أُحُدٍ رَجُلَيْنِ عَلَيْهِمَا ثِيَابٌ بِيْضٌ يُقَاتِلَانِ كَأَشَدِّ الْقِتَالِ مَا رَأَيْتُهُمَا قَبْلُ وَلَا بَعْدُ يَعْنِيْ جِبْرِيْلَ وَمِيْكَائِيْلَ. مُتَّفَقٌ عَلَيْهِ.
5875. (8) [3/1645– ఏకీభవితం]
స’అద్ బిన్ అబీ వఖ్ఖా’స్ (ర) కథనం: ఉ’హుద్ యుద్ధం నాడు నేను ప్రవక్త (స)కు ఇరువైపుల ఇద్దరు వ్యక్తుల్ని చూసాను. వారిద్దరూ తెల్లని దుస్తులు ధరించి ఉన్నారు, వారిద్దరూ చాలా వీరోచితంగా పోరాడుతున్నారు. అయితే నేను వారిద్దరినీ అంతకుముందు గానీ, ఆ తరువాత గానీ చూడలేదు. వారు దైవదూతలు జిబ్రీల్ మరియు మీకాయీ’ల్. (బు’ఖారీ, ముస్లిమ్)
5876 – [ 9 ] ( صحيح ) (3/1645)
وَعَنِ الْبَرَاءِ قَالَ بَعَثَ النَّبِيُّ صلى الله عليه وسلم رَهْطًا إِلى أَبِيْ رَافِعٍ فَدَخَلَ عَلَيْهِ عَبْدُ اللهِ بْنِ عَتِيْكٍ بَيْتَهُ لَيْلًا وَهُوَ نَائِمٌ فَقَتَلَهُ فَقَالَ عَبْدُ اللهِ بْنِ عَتِيْكٍ: فَوَضَعْتُ السَّيْفَ فِيْ بَطْنِهِ حَتَّى أَخَذَ فِيْ ظَهْرِهِ فَعَرَفْتُ أَنِّيْ قَتَلْتُهُ فَجَعَلْتُ أَفْتَحُ الْأَبْوَابَ حَتّى أنْتَهيْتُ إِلى دَرَجَةٍ فَوَضَعْتُ رِجْلِيْ فَوَقَعَتْ فِيْ لَيْلَةٍ مُقْمِرَةٍ فَانْكَسَرَتْ سَاقِيْ فَعَصَبْتُهَا بِعَمَامَةٍ فَانْطَلَقْتُ إِلى أَصْحَابِيْ فَانْتَهَيْتُ إِلى النَّبِيِّ صلى الله عليه وسلم فَحَدَّثْتُهُ. فَقَالَ: “اُبْسُطْ رِجْلَكَ”. فَبَسَطْتُ رِجْلِيْ فَمَسَحَهَا فَكَأَنَّمَا لَمْ أَشْتَكِهَا قَطُّ. روَاهُ الْبُخَارِيُّ .
5876. (9) [3/1645– దృఢం]
బరా’ (ర) కథనం: ప్రవక్త (స) అనుచరుల బృందాన్ని అబూ రాఫె’అ అనే యూదున్ని చంపటానికి పంపారు. ‘అబ్దుల్లాహ్ బిన్ ‘అతీక్, నిద్రలో ఉన్నప్పుడు, వాడి ఇంట్లో ప్రవేశించి, వాడిని చంపివేసారు. ‘అబ్దుల్లాహ్ బిన్ అతీక్ కథనం: ”నేను అబూ రాఫె’అ కడుపుపై కరవాలం పెట్టాను, అది ముందునుండి వెళ్ళి వెనుక నుండి వచ్చింది. అప్పుడు నేను అతన్ని చంపినట్టు నిర్థారించు కున్నాను. ఆ తరువాత నేను కోట ద్వారాలు తెరవ సాగాను. అనంతరం ఒక అంతస్తు పైకి చేరాను. కాలు పెట్టగానే అకస్మాత్తుగా పడ్డాను. నా చీల మండ విరిగి యింది. నేను నా అమామ విప్పి చీలమండకు కట్టుకున్నాను, నా సహచరుల వద్దకు చేరాను. ఆ తరువాత నేను ప్రవక్త (స) వద్దకు వచ్చాను, జరిగినదంతా చెప్పాను. ప్రవక్త (స) కాలు చూపమన్నారు. నేను నా కాలు చూపాను. ప్రవక్త (స) చేత్తో నా కాలును నిమిరారు. అప్పటి కప్పుడే నా కాలు నయమయి పోయింది. అంతకు ముందు ఎన్నడూ గాయం తగలనట్టు అయిపోయింది. [24] (బు’ఖారీ)
5877 – [ 10 ] ( مُتَّفَقٌ عَلَيْهِ ) (3/1645)
وَعَنْ جابِرٍ قَال إِنَّا يَوْمَ الْخَنْدَقِ نَحْفِرُ فَعَرَضَتْ كُدْيَةٌ شَدِيْدَةٌ فَجَاؤُوا النَّبِيَّ صلى الله عليه وسلم فَقَالُوْا: هَذِهِ كُدْيَةٌ عَرَضَتْ فِي الْخَنْدَقِ فَقَالَ: “أَنَا نَازِلٌ” ثُمَّ قَامَ وَبَطْنُهُ مَعْصُوْبٌ بِحَجَرٍ وَلَبِثْنَا ثَلَاثَةَ أَيَّامٍ لَانَذُوْقُ ذَوَقًا فَأَخَذَ النَّبِيُّ صلى الله عليه وسلم اَلْمِعْوَلَ فَضَرَبَ فَعَادَ كَثِيْبًا أَهْيَلَ فَانْكَفَأْتُ إِلى امْرَأَتِيْ فَقُلْتُ: هَلْ عِنْدَكَ شَيْءٌ؟ فَإِنِّيْ رَأَيْتُ بِالنَّبِيِّ صلى الله عليه وسلم خَمْصًا شَدِيْدًا فَأَخْرَجَتْ جُرَابًا فِيْهِ صَاعٌ مِنْ شَعِيْرٍ وَلَنَا بَهْمَةٌ دَاجِنٌ فَذَبَحْتُهَا وَطَحِنْتُ الشَّعِيْرَ حَتَّى جَعَلْنَا اللَّحْمَ فِي الْبُرْمَةِ ثُمَّ جِئْتُ النَّبِيَّ صلى الله عليه وسلم فَسَارَرْتُهُ فَقُلْتُ: يَا رَسُوْلَ اللهِ؟ ذَبَحْنَا بَهِيْمَةً لَنَا وَطَحَنْتُ صَاعًا مِنْ شَعِيْرٍ فَتَعَالَ أَنْتَ وَنَفَرٌ مَعَكَ فَصَاحَ النَّبِيُّ صلى الله عليه وسلم: “يَا أَهْلَ الْخَنْدَقِ إِنَّ جَابِرًا صَنَعَ سُوْرًا فَحَيَّ هَلّا بِكُمْ”. فَقَالَ رَسُوْلُ الله صلى الله عليه وسلم: “لَا تُنْزِلُنَّ بُرْمَتَكُمْ وَلَا تَخْبِزُنَّ عَجِيْنَكُمْ حَتّى أَجِيْءَ “. وَجَاءَ فَأَخْرَجْتُ لَهُ عَجِيْنًا فَبَصَقَ فِيْهِ وَبَارَكَ ثُمَّ عَمَدَ إِلى بُرْمَتِنَا فَبَصَقَ وَبَارَكَ ثُمَّ قَالَ: “اُدْعِيْ خَابِزَةً فَلْتَخْبِزْ مَعِيْ وَاقْدَحِيْ مِنْ بُرْمَتِكُمْ وَلَا تُنْزِلُوْهَا”. وَهُمْ أَلْفٌ فَأَقْسَمَ بِاللهِ لَأَكَلُوْا حَتّى تَرَكُوْهُ وَانْحَرَفُوْا وَإِنَّ برمَتَنَا لَتَغِطُّ كَمَا هِيَ وَإِنَّ عَجِيْنَنَا لَيُخْبَزُ كَمَا هُوَ. مُتَّفَقٌ عَلَيْهِ.
5877. (10) [3/1645 –ఏకీభవితం]
జాబిర్ (ర) కథనం: కందక యుద్ధం నాడు మేము కందకం త్రవ్వుతున్నాం. ఒక గట్టి బండరాయి తగిలింది. అనుచరులు వచ్చి, గట్టి బండరాయి తగిలిందని ప్రవక్త (స)కు తెలియపరిచారు. దానికి ప్రవక్త (స), ‘ఏదీ! నేను దిగుతాను,’ అని పలికి వెంటనే సిద్ధమై ఆ ఆకలి పరిస్థితిలోనే కందకంలోకి దిగి గున పము పట్టుకొని రాయిపై కొట్టారు. ఆ రాయి ముక్క లయ్యింది. ఆ తరువాత నేను నా భార్య దగ్గరకు వెళ్ళాను, ‘తినడానికి ఏమైనా ఉందా, ఎందు కంటే ప్రవక్త (స)కు చాలా ఆకలిగా ఉంది,’ అని అన్నాను. అది విన్న నా భార్య ఒక సంచి తీసింది, అందులో ఒక ‘సా’అ యవ్వలు ఉన్నాయి. ఇంకా మా దగ్గర ఒక చిన్న గొర్రెపోతు ఉండేది. నేను దాన్ని జి’బహ్ చేసాను. నా భార్య యవ్వలను పిండిచేసింది. మేము మాంసాన్ని కుండలో వేసి పొయ్యి మీద పెట్టాము.
ఆ తరువాత నేను ప్రవక్త (స) వద్దకు వచ్చి, రహస్యంగా ఆయనతో, ఓ ప్రవక్తా(స)! మేము ఒక చిన్న గొర్రెపోతును జి’బహ్ చేసాము, ఇంకా నా భార్య యవ్వరొట్టెలు చేస్తుంది, తమరు, ‘తమరి కొంతమంది సహచరులను ఆహ్వాని స్తున్నాను,’ అని అన్నాను. అది విన్న ప్రవక్త (స) బిగ్గరగా కేక వేసి, ‘కందకం త్రవ్వుతున్న ప్రజలారా! జాబిర్ మీ అందరినీ విందుకు ఆహ్వానించాడు. తొందరగా పదండి అని చెప్పి, నాతో, ‘నేను వచ్చినంత వరకు కుండను పొయ్యిపై నుండి దించకు, రొట్టెలు కూడా చేయకు,’ అని అన్నారు. ఆ తరువాత ప్రవక్త (స) మా ఇంటికి రాగానే, పిండిని అతని వద్దకు తెచ్చాను. ప్రవక్త (స) తన ఉమ్మిని అందులోవేసి శుభం కోసం ప్రార్థించారు. ఆ తరువాత మాంసం కుండ వద్దకు వచ్చి అందులో కూడా తన ఉమ్మిని వేసి శుభం కోసం దు’ఆ చేసారు. ఆ తరువాత రొట్టె వండే ఆమెను పిలవు, ఆమె నీతో పాటు రొట్టెలు చేస్తుంది, కుండలో నుండి కూర తీస్తూ ఉండు, అయితే కుండను పొయ్యి మీద నుండి దించవద్దు,’ అని అన్నారు. ఆ సమయంలో కందకం త్రవ్వేవారు 1000 మంది ఉన్నారు. నేను అల్లాహ్(త) సాక్షిగా చెబుతున్నాను, వారందరూ తృప్తిగా తిన్న తరువాత కూడా అంతా మిగిలి ఉంది. అందరూ తిరిగి వెళ్ళి పోయిన తర్వాత కుండ మొదట ఉన్నట్లే నిండుగా ఉంది. పిండి కూడ మొదట ఉన్నట్టే ఉంది. (బు’ఖారీ, ముస్లిమ్)
5878 – [ 11 ] ( صحيح ) (3/1646)
وعَنْ أَبِيْ قَتَادَةَ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم قَالَ لِعَمَّارٍ: حِيْنَ يَحْفِرُ الْخَنْدَقَ فَجَعَلَ يَمْسَحُ رَأْسَهُ وَيَقُوْلُ: “بُؤْسَ بْنِ سُمَيَّةَ تَقْتُلُكَ الْفِئةُ الْبَاغِيَةُ”. روَاهُ مُسْلِمٌ .
5878. (11) [3/1646–దృఢం]
అబూ ఖతాదహ్ (ర) కథనం: ‘అమ్మార్ బిన్ యాసిర్ కందకం త్రవ్వుతున్నారు. ప్రవక్త (స) అతని తలపై చేత్తో నిమురుతూ, ఓ సమియ్యహ్ కుమారుడా! నిన్ను ద్రోహుల ఒక వర్గం చంపుతుంది అన్నారు. (ముస్లిమ్)
5879 – [ 12 ] ( صحيح ) (3/1646)
وعَنْ سُلَيْمَانَ بْنِ صُرَدٍ قَالَ: قَالَ النَّبِيُّ صلى الله عليه وسلم حِيْنَ أُجْلِيَ الْأَحْزَابُ عَنْهُ: “اَلْآنَ نَغْزُوْهُمْ وَلَا يَغْزُوْنَا نَحْنُ نَسِيْرُ إِلَيْهِمْ”. روَاهُ الْبُخَارِيُّ.
5879. (12) [3/1646 –దృఢం]
సులైమాన్ బిన్ ‘సర్ద్ (ర) కథనం: అహ్’జాబ్ యుద్ధం నుండి శత్రువుల సైన్యం పారిపోయిన పిమ్మట ప్రవక్త (స), ‘ఇప్పుడు శత్రువులు మనపై దాడిచేయగలరు. మేము వారితో యుద్ధం ఎలా చేయగలం. వారు యుద్ధం ప్రారం భించరు. మనమే వారిపై దాడిచేద్దాం’ అని అన్నారు. (బు’ఖారీ)
5880 – [ 13 ] ( مُتَّفَقٌ عَلَيْهِ ) (3/1646)
وَعَنْ عَائِشَةَ قَالَتْ: لَمَّا رَجَعَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم مِنَ الْخَنْدَقِ وَضَعَ السِّلَاحَ وَاغْتَسَلَ أَتَاهُ جِبْرَيْلُ وَهُوَ يَنْفُضُ رَأْسَهُ مِنَ الْغُبَارِ. فَقَالَ قَدْ وَضَعْتَ السِّلَاحَ وَاللهِ مَا وَضَعْتُهُ أخرُجُ إِلَيْهِمْ. قَالَ النَّبِيُّ صلى الله عليه وسلم. فَأَيْنَ فَأَشَارَ إِلى بَنِيْ قُرَيْظَةَ فَخَرَجَ النَّبِيُّ صلى الله عليه وسلم. مُتَّفَقٌ عَلَيْهِ.
5880. (13) [3/1646– ఏకీభవితం]
‘ఆయి’షహ్ (ర) కథనం: ప్రవక్త (స) కందక యుద్ధం నుండి వెనుతిరిగినపుడు ప్రవక్త(స) ఆయుధాలుదించి, స్నానం చేద్దామని అనుకున్నారు. అప్పుడు జిబ్రీల్ (అ) వచ్చారు. అప్పుడు ప్రవక్త (స) తన తల నుండి ధూళిని తుడుస్తున్నారు. అప్పుడు జిబ్రీల్ (అ) ప్రవక్త (స)తో, ‘తమరు అప్పుడే ఆయుధాలు దించివేసారా? అల్లాహ్ (త) సాక్షి! నేనింకా ఆయుధాలు తొలగించనే లేదు, పైగా నేను వారివైపు వెళుతున్నాను,’ అని అన్నారు. అప్పుడు ప్రవక్త (స), ‘ఎవరివైపు?’ అని అన్నారు. దానికి జిబ్రీల్, ‘బనూ ఖురై”జహ్ వైపు,’ అని సైగ చేసారు. ప్రవక్త (స) తన అనుచరులతో పాటు బనూ ఖురై”జహ్ వైపు బయలుదేరారు.
5881 – [ 14 ] ( صحيح ) (3/1647)
وَفِيْ رِوَايَةٍ لِلْبُخَارِيِّ قَالَ أَنَسُ: كَأَنِّيْ أَنْظُرُ إِلى الْغُبَارِ سَاطِعًا فِيْ زَقَاقِ بَنِيْ غَنَمٍ مُوْكِبَ جِبْرَيْلَ عَلَيْهِ السَّلَامُ حِيْنَ سَارَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم إِلى بَنِيْ قُرَيْظَةَ.
5881. (14) [3/1647–దృఢం]
బు’ఖారీలోని ఒక ఉల్లేఖనంలో ఇలా ఉంది, ”అనస్ (ర) కథనం: జిబ్రీల్ (అ) తన సైన్యంతో బనూ ఖురై”జహ్ వైపు వెళ్తుండగా ఎగిరే ధూళిని నేను చూస్తున్నట్టు అనిపించింది. ఆ వెంటనే ప్రవక్త (స) బనూ ఖురై”జహ్ వైపు బయలుదేరారు.”
5882 – [ 15 ] ( مُتَّفَقٌ عَلَيْهِ ) (3/1647)
وَعَنْ جَابِرٍ قَالَ عَطِشَ النّاسُ يَوْمَ الْحُدَيْبِيَةِ وَرَسُوْلُ اللهِ صلى الله عليه وسلم بَيْنَ يَدَيْهِ رَكْوَةٌ فَتَوَضَّأَ مِنْهَا ثُمَّ أَقْبَلَ النَّاسُ نَحْوَهُ قَالُوْا: لَيْسَ عِنْدَنَا مَاءٌ نَتَوَضَّأُ بِهِ وَنَشْرَبُ إِلَّا مَا فِيْ رَكوَتِكَ فَوَضَعَ النَّبِيُّ صلى الله عليه وسلم يَدَهُ فِي الرَّكْوَةِ فَجَعَلَ الْمَاءُ يَفُوْرُ مِنْ بَيْنِ أَصَابِعِهِ كَأَمْثَالِ الْعُيُوْنِ قَالَ فَشَربْنَا وَتَوَضَّأْنَا قِيْلَ لِجَابِرٍ كَمْ كُنْتُمْ. قَالَ: لَوْ كُنَّا مِائَةٍ أَلْفٍ لَكَفَانَا كُنَّا خَمْسَ عَشَرَةَ مَائَةٍ. مُتَّفَقٌ عَلَيْهِ.
5882. (15) [3/1647 –ఏకీభవితం]
జాబిర్ (ర) కథనం: హుదైబియా రోజు ప్రజలకు చాలా దాహం వేసింది. ప్రవక్త (స) వద్ద ఒక వు’దూ చేసే గిన్నె ఉంది. ప్రవక్త (స)దానితో వు’దూ చేసారు. ఆ తరువాత అనుచరులు ప్రవక్త (స) వద్దకు వచ్చి, ‘మా వద్ద వు’దూకి, త్రాగటానికి నీళ్ళు లేవు, మీ గిన్నెలో ఉన్న నీళ్ళే ఉన్నాయి,’ అని అన్నారు. ప్రవక్త (స) తన చేతిని గిన్నెలో వేసారు. ప్రవక్త (స) వ్రేళ్ళ మధ్య నుండి నీళ్ళు కాలువలా ప్రవహించసాగాయి. మేము నీళ్ళు త్రాగాము, వు’దూ చేసాము. అప్పుడు మేము ఎంతమందని ప్రశ్నించటం జరిగింది. దానికి అతను 1500 మందని చెప్పడం జరిగింది. ఒకవేళ మేము ఒక లక్ష మంది ఉన్నా ఆ నీళ్ళు మాకు సరిపోయేవి. (బు’ఖారీ, ముస్లిమ్)
5883 – [ 16 ] ( صحيح ) (3/1647)
وعَنِ الْبَرَاءِ بْنِ عَازِبٍ قَالَ: كُنَّا مَعَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم أَرْبَعَ عَشَرَةَ مائَةً يَوْمَ الْحُدَيْبِيَةِ وَالْحُدَيْبِيَةُ بِئْرٌ فَنَزَحْنَاهَا فَلَمْ نَتْرُكْ فِيْهَا قَطْرَةٌ. فَبَلَغَ النَّبِيَّ صلى الله عليه وسلم فَأَتَاهَا فجَلَسَ عَلَى شَفِيْرِهَا ثُمَّ دَعَا بِإِنَاءٍ مِّنْ مَّاءٍ فَتَوَضَّأَ ثُمَّ مَضْمَضَ وَدَعَا ثُمَّ صَبَّهُ فِيْهَا ثُمَّ قَالَ: دَعَوْهَا سَاعَةً”. فَأَرْوَوْا أَنْفُسَهُمْ وَرِكَابَهُمْ حَتّى ارْتَحَلُوْا. روَاهُ الْبُخَارِيُّ.
5883. (16) [3/1647 –దృఢం]
బరాఅ’ బిన్ ‘ఆ’జిబ్ (ర) కథనం: ‘హుదైబియాలో ప్రవక్త (స) వెంట మేము1400 మంది ఉన్నాము, ‘హుదైబియాలో ఒక నుయ్యి ఉండేది. మేము అందులో ఉన్న నీటిని పూర్తిగా వాడుకున్నాము. ఒక చుక్క కూడా వదలలేదు. ప్రవక్త (స)కు ఈ విషయం తెలియగానే బావి దగ్గరకు వచ్చారు. దాని గట్టు మీద కూర్చొని, వు’దూ చేసే జగ్గు తెప్పించారు. వు’దూ చేసారు. వు’దూ తర్వాత నోటిలో నీళ్ళు తీసుకొని ప్రార్థించి బావిలో వేసారు. ఒక గంట కాలం వదలివేయండి అన్నారు. ఒక గంట తర్వాత అందులో ఎంత నీరు వచ్చిందంటే ఆ తరువాత ప్రవక్త (స) ఉపయోగించారు. వాహనాలకూ ఉపయో గించారు. అక్కడి నుండి వెళ్ళే వరకు ఆ బావి నుండే నీళ్ళు తీసుకోవటం జరిగింది. (బు’ఖారీ)
5884 – [ 17 ] ( مُتَّفَقٌ عَلَيْهِ ) (3/1647)
وَعَنْ عَوْفٍ عَنْ أَبِيْ رِجَاءٍ عَنْ عِمْرَانَ بْنِ حُصَيْنٍ قَالَ: كُنَّا فِيْ سَفَرٍ مَعَ النَّبِيِّ صلى الله عليه وسلم. فَاشْتَكَى إِلَيْهِ النَّاسُ مِنَ الْعَطْشِ فَنَزَلَ فَدَعَا فُلَانًا كَانَ يُسَمِّيْهِ أَبُوْ رَجَاءٍ وَنَسِيَهُ عَوْفٌ وَدَعَا عَلِيًّا فَقَالَ: “اذْهَبَا فَابْتَغِيَا الْمَاءَ”. فَانْطَلَقَا فَتَلَقَّيَا اِمْرَأَةً بَيْنَ مَزَادَتَيْنِ أَوْسَطْحِتَيْنِ مِنْ مَاءٍ فَجَاءَا بِهَاإِلى النَّبِيِّ صلى الله عليه وسلم فَاسْتَنْزَلُوْهَاعَنْ بَعِيْرِهَا وَدَعَا النَّبِيُّ صلى الله عليه وسلم بِإِنَاءٍ فَفَرَغَ فِيْهِ مِنْ أَفْوَاهِ الْمَزَادَتَيْنِ وَنُوْدِيَ فِي النَّاسِ: اِسْقُوْا فَاسْتَقَوْا. قَالَ: فَشَرِبْنَا عِطَاشًا أَرْبَعِيْنَ رَجُلًا حَتَّى رَوِيْنَا فَمَلَأنَا كُلَّ قِرْبَةٍ مَعَنَا وَإِدَاوَةٍ وَاَيْمُ اللهِ لَقَدْ أُقْلِعَ عَنْهَا وَإِنَّهُ لَيُخَيَّلُ إِلَيْنَا أَنَّهَا أَشَدُّ مِلْئَةً مِنْهَا حِيْنَ اِبْتَدَأَ. مُتَّفَقٌ عَلَيْهِ.
5884. (17) [3/1647 –ఏకీభవితం]
‘ఔఫ్ (ర), అబూ రజాఅ’ (ర) ద్వారా అతడు ‘ఇమ్రాన్ బిన్ ‘హు’సైన్ (ర) ద్వారా కథనం: మేము ఒక ప్రయాణంలో ప్రవక్త (స)వెంట ఉన్నాం. ప్రజలు, చాలా దాహం వేస్తుందని అన్నారు. ప్రవక్త (స) అక్కడే దిగి ఒక వ్యక్తిని – అతని పేరు అబూ రజాఅ’ – ప్రస్తావించారు. కాని ‘ఔఫ్ ఆ వ్యక్తి పేరు మరచి పోయారు. అందువల్ల అతను ఫలానా వ్యక్తి అని పేర్కొన్నారు. అనంతరం ప్రవక్త (స) ‘అలీ (ర)ను కూడా పిలిచారు. ప్రవక్త (స), ‘మీరిద్దరూ వెళ్ళండి, నీళ్ళు వెతకండి,’ అని అన్నారు. వారిద్దరూ వెళ్ళారు. వారికి ఒక స్త్రీ కలిసింది. ఆమె ఒంటెపై రెండు వైపులా వ్రేలాడుతున్న రెండు కుండల మధ్య కూర్చుంది. ఇద్దరూ ఆమెను ప్రవక్త (స) వద్దకు తీసుకు వచ్చారు. ఆమెను ఒంటెపై నుండి దించటం జరిగింది. ప్రవక్త (స) ఒక పెద్ద తొట్టె తెప్పించి ఆ రెండు కుండల నీళ్ళు అందులో వేయమని ఆదేశించారు. ఆ తరువాత రండి, నీళ్ళు త్రాగండి అని అందరినీ పిలవటం జరిగింది. అందరూ వచ్చి నీళ్ళు త్రాగారు.
‘ఇమ్రాన్ (ర) కథనం: అప్పుడు మేము 40 మంది ఉన్నాం. అందరూ తృప్తిగా నీళ్ళు త్రాగారు. మేము మా సంచులను, తొట్టెలను నింపుకున్నాము. అల్లాహ్ (త) సాక్షి! ప్రజలు ఆ తొట్టె నుండి నీళ్ళు తీసు కొని ప్రయాణమయ్యారు. ఆ తొట్టె ముందు కన్నా ఎక్కువగా నిండి ఉన్నట్టు అని పించింది. (ముస్లిమ్)
5885 – [ 18 ] ( صحيح ) (3/1648)
وعَنْ جَابِرٍ قَالَ: سِرْنَا مَعَ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم حَتَّى نَزَلْنَا وَادِيًا أَفْيَحَ فَذَهَبَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم يَقْضِيْ حَاجَتَهُ فَلَمْ يَرَ شَيْئًا يَسْتَتِرُ بِهِ وَإِذَا شَجَرَتَيْنِ بِشَاطِئِ الْوَادِيْ فَانْطَلَقَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم إِلى إِحْدَاهُمَا فَأَخَذَ بِغُصْنٍ مِنْ أَغْصَانِهَا. فَقَالَ انْقَادِيْ عَلَيَّ بِإِذْنِ اللهِ فَانْقَادَتْ مَعَهُ كَالْبَعِيْرُ الْمَخْشُوْشِ الَّذِيْ يُصَانِعُ قَائِدَهُ حَتّى أَتَى الشَّجَرَةَ الْأُخْرَى فَأَخَذَ بِغُصْنِ مِنْ أَغْصَانِهَا. فَقَالَ اِنْقَادِيْ عَلَيَّ بِإِذْنِ اللهِ فَانْقَادَتْ مَعَهُ كَذَلِكَ حَتّى إِذَا كَانَ بِالْمَنْصَفِ مِمَّا بَيْنَهُمَا. قَالَ الْتَئِمَا عَلَيَّ بِإِذْنِ اللهِ فَالْتَأَمَتَا فَجَلَسْتُ أُحَدِّثُ نَفْسِيْ فَحَانَتْ مِنِّيْ لِفْتَةٌ فَإِذَا أَنَا بِرَسُوْلِ اللهِ صلى الله عليه وسلم مُقْبِلًا وَإِذَا الشَّجَرَتَيْنِ قَدِ افْتَرَقَتَا فَقَامَتْ كُلُّ وَاحِدَةٍ مِنْهُمَا عَلَى سَاقٍ. رَوَاهُ مُسْلِمٌ .
5885. (18) [3/1648 –దృఢం]
జాబిర్ (ర) కథనం: మేము ప్రవక్త (స) వెంట ప్రయాణం చేస్తున్నాము. ఒక విశాలమైన లోయలో దిగాము. ప్రవక్త (స) మలమూత్ర విసర్జన కోసం వెళ్ళి పోయారు. అక్కడ తెరచాటు ఏమీ లేదు. అకస్మాత్తుగా ఒక ప్రక్క ఉన్న రెండు చెట్లపై ప్రవక్త (స) దృష్టిపడింది. ప్రవక్త (స) ఒక చెట్టువద్దకు వెళ్ళారు. దాని ఒకకొమ్మ పట్టుకొని, ‘దైవాజ్ఞతో నా మాట విను,’ అన్నారు. ఆ చెట్టు ప్రవక్త (స) వెంట నడవసాగింది. ప్రవక్త (స) మరో చెట్టుతో కూడా ఇలాగే అన్నారు. ఆ చెట్టు కూడా విధేయత చూపింది. ప్రవక్త (స) ఆ రెండు చెట్ల మధ్య వచ్చి, ‘దైవాజ్ఞతో మీరిద్దరూ కలసిపోండి,’ అన్నారు. ఆ రెండూ కలసి పోయాయి. ప్రవక్త (స) తన అవసరాన్ని తీర్చుకున్నారు. జాబిర్ (ర) కథనం: ”నేను కూర్చొని నాలో నేను మాట్లాడు కుంటున్నాను. అకస్మాత్తుగా నేను ప్రవక్త (స) వైపు చూచాను. ప్రవక్త (స) వస్తున్నారు, అటు ఆ రెండు వృక్షాలు వేరై ఉన్నాయి. ప్రతి ఒక్కటి తన స్థానంలో ఉంది.”(ముస్లిమ్)
5886 – [ 19 ] ( صحيح ) (3/1648)
عَنْ يَزِيْدَ بْنِ أَبِيْ عُبَيْدٍ قَالَ: رَأَيْتُ أَثَرَضَرْبَةٍ فِيْ سَاقٍ سَلَمَةَ بْنِ الْأَكْوَعِ. فَقُلْتُ: يَا أَبَا مُسْلِمٍ مَا هَذِهِ الضَّرْبَةُ؟ فَقَالَ: هَذِهِ ضَرْبَةٌ أَصَابَتْنِيْ يَوْمَ خَيْبَرَ. فَقَالَ النَّاسُ أُصِيْبَ سَلَمَةُ فَأَتَيْتُ النَّبِيّ صلى الله عليه وسلم فَنَفَثَ فِيْهِ ثَلَاثَ نَفَثَاتٍ فَمَا اشْتَكَيْتُهَا حَتَّى السَّاعَةَ. روَاهُ الْبُخَارِيُّ .
5886. (19) [3/1648 –దృఢం]
య’జీద్ బిన్ అబీ ‘ఉబైద్ (ర) కథనం: సలమహ్ బిన్ అక్వ’అ (ర) కాలి చీలమండపై గాయం మచ్చ చూచాను. ‘ఓ సలమహ్! ఈ గాయం ఎలా తగిలింది,’ అని అడిగాను. దానికి అతను, ”ఇది ఖైబర్ యుద్ధం నాడు తగిలింది, గాయం తీవ్రంగా ఉండటం వల్ల ప్రజలు సలమహ్ చంపబడ్డాడని అన్నారు. నేను ప్రవక్త (స) వద్దకు వెళ్ళాను. ప్రవక్త (స) ఆ గాయంపై మూడుసార్లు ఊదారు. ఆ రోజు నుండి ఈనాటి వరకు ఎటువంటి నొప్పి ఎరుగను,” అని అన్నాడు. (బు’ఖారీ)
5887 – [ 20 ] ( صحيح ) (3/1648)
وعَنْ أَنَسٍ قَالَ: نَعَى النَّبِيُّ صلى الله عليه وسلم زَيْدًا وَجَعْفَرًا وَابْنَ رَوَاحَةَ لِلنَّاسِ قَبْلَ أَنْ يَأْتِيَهُمْ خَبَرُهُمْ. فَقَالَ: أَخَذَ الرَّايَةَ زَيْدٌ فَأُصِيْبَ. ثُمَّ أَخَذَ جَعْفَرٌ فَأُصِيْبَ ثُمَّ أَخَذَ ابْنُ رَوَاحَةَ فَأُصِيْبَ. وَعَيْنَاهُ تَذْرِفَانِ حَتّى أَخَذَ الرَّايَةَ سَيْفُ مِنْ سُيُوْفِ اللهِ حَتَّى فَتَحَ اللهُ عَلَيْهِمْ. روَاهُ الْبُخَارِيُّ.
5887. (20) [3/1648– దృఢం]
అనస్ (ర) కథనం: ప్రవక్త (స) ‘జైద్, జ’అఫర్, ఇబ్నె రవా’హల వీరమరణం వార్త రాకముందే ప్రజలకు వారి వీరమరణం గురించి తెలియపరిచారు. ప్రవక్త (స) ” ‘జైద్ (ర) జెండా పట్టారు, వీర మరణం పొందారు. ఆ తరువాత జ’అఫర్ (ర) జెండా పట్టారు, వీరమరణం పొందారు. ఆ తరువాత ఇబ్నె రవా’హ జండా పట్టారు, ఆయన కూడా వీరమరణం పొందారు.’ ప్రవక్త (స) ఈ విషయం తెలుపు తున్నప్పుడు అతని కళ్ళవెంట అశ్రుధారలు ప్రవహిస్తున్నాయి. ఆ తరువాత అల్లాహ్(త) కరవాలాల్లో ఒక కరవాలం అయిన వ్యక్తి పట్టుకున్నాడు. అంటే ‘ఖాలిద్ బిన్ వలీద్ జండా పట్టుకున్నారు. చివరికి అల్లాహ్(త) ముస్లిములకు విజయం ప్రసాదించాడు. [25] (బు’ఖారీ)
5888 – [ 21 ] ( صحيح ) (3/1649)
وعَنْ عَبَّاسٍ قَالَ: شَهِدْتُ مَعَ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم يَوْمَ حُنَيْنٍ فَلَمَّا الْتَقَى الْمُسْلِمُوْنَ وَالْكُفَّارُ وَلَّى الْمُسْلِمُوْنَ مُدْبِرُيْنَ فَطَفِقَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم يَرْكُضُ بَغلَتَهُ قِبْلَ الْكُفَّارِ وَأَنَا آخِذٌ بِلِجَامِ بَغْلَةِ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم أَكُفُّهَا إِرَادَةَ أَنْ لَا تُسْرِعَ وَأَبُوْ سُفْيَانَ آخِذٌ بِرِكَابِ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم فَقَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم أَيْ عَبَّاسُ نَادِ أَصْحَابَ السَّمُرَةِ. فَقَالَ عَبَّاسٌ: وَكَانَ رَجُلًا صَيِّتًا فَقُلْتُ: بِأَعْلَى صَوْتِيْ أَيْنَ أَصْحَابُ السَّمُرَةِ فَقَالَ وَاللهِ لَكَأنَ عَطْفَتَهُمْ حِيْنَ سَمِعُوْا صَوْتِيْ عَطْفَةَ الْبَقَرِ عَلَى أَوْلَادِهَا. فَقَالُوْا: يَا لَبَّيْكَ يَا لَبَّيْكَ. قَالَ: فَاقْتَتَلُوْا وَالْكُفَّارَ وَالدَّعْوَةُ فِي الْأَنْصَارِ يَقُوْلُوْنَ يَا مَعْشَرَ الْأَنْصَارِ يَا مَعْشَرَ الْأَنْصَارِ. قَالَ ثُمَّ قَصَرْتُ الدَّعْوَةَ عَلَى بَنِيْ الْحاَرِثِ بْنِ الْخَزْرَجِ فَنَظَرَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم وَهُوَ عَلَى بَغْلَتِهِ كَالْمُتَطَاوِلِ عَلَيْهَا إِلى قِتَالِهِمْ فَقَالَ حِيْنَ حَمِيَ الْوَطِيْسُ ثُمَّ أَخَذَ حَصَيَاتٍ فَرَمَى بِهِنَّ وُجُوْهَ الْكُفَّارِ. ثُمَّ قَالَ اِنْهَزِمُوْا وَرَبَّ مُحَمَّدٍ فَوَاللهِ مَا هُوَ إِلَّا أَنْ رَمَاهُمْ بِحَصَيَاتِهِ فَمَا زِلْتُ أَرَى حَدَّهُمْ كَلِيْلًا وَأَمْرَهُمْ مُدْبِرًا. رَوَاهُ مُسْلِمٌ.
5888. (21) [3/1649– దృఢం]
‘అబ్బాస్ (ర) కథనం: నేను ప్రవక్త (స) వెంట ‘హునైన్ యుద్ధంలో పాల్గొన్నాను. అప్పుడు ముస్లిములకు, అవిశ్వాసులకు యుద్ధం జరుగు తుండగా కొంతమంది ముస్లిములు వెనుతిరిగి పారిపో సాగారు. ప్రవక్త (స) తన కంచర గాడిదపై అవిశ్వాసుల వైపునకు పోతున్నారు. ఆ సమయంలో నేను ప్రవక్త (స) కంచర గాడిద కళ్ళెం పట్టుకొని ఉన్నాను. అది శత్రువుల్లోకి దూసుకుపోకుండా దాని కళ్ళెం పట్టుకొని ఉన్నాను. అబూ ‘సుఫియాన్ బిన్ ‘హారిస్’ ప్రవక్త (స) మావటిని పట్టుకొని ఉన్నారు. అప్పుడే ప్రవక్త (స), ‘ఓ ‘అబ్బాస్! సమురహ్ వాళ్ళను పిలువు,’ అని అన్నారు. ఎందుకంటే ‘అబ్బాస్ (ర) గొంతుక చాలా పెద్దది. నేను బిగ్గరగా కేకవేసి, ‘ఓ సమురహ్ ప్రజలారా! ఎక్క డున్నారు?’ అని అన్నాను. అల్లాహ్ సాక్షి! వాళ్ళు నా పిలుపు విని ఆవు తన దూడల వైపు తిరిగినట్టు తిరిగారు. ఇంకా, ‘మేము సిద్ధంగా ఉన్నాం, మేము సిద్ధంగా ఉన్నాం,’ అని అన్నారు. ముస్లిములు, అవిశ్వాసులు పరస్పరం యుద్ధం చేస్తూ ఉన్నారు. అన్సార్లు పరస్పరం, ‘ఓ అన్సారుల బృందం, ఓ అన్సారుల బృందం,’ అని పిలవసాగారు. ఆ తరువాత ఆ పిలుపు బనూ ‘హారిస్’ బిన్ ‘ఖ’జ్‌రజ్ వరకే పరిమితం అయిపోయింది. ఇటు ప్రవక్త (స) తన కంచర గాడిదపై మెడఎత్తి కూర్చొని ఉన్నారు. యుద్ధం చేస్తున్న ముస్లిములను చూచి ఇలా అన్నారు, ‘ఇది భీకరమైన యుద్ధ సమయం. యుద్ధం భయంకరంగా జరుగుతున్నది.’ ఆ తరు వాత ప్రవక్త (స) కొన్ని కంకర రాళ్ళను చేతిలో తీసుకొని అవిశ్వాసుల ముఖాలపై కొట్టారు, ‘ము’హమ్మద్ ప్రభువు సాక్షి! అవిశ్వాసులు ఓడి పోయారు,’ అని అన్నారు. అల్లాహ్ సాక్షి! ప్రవక్త (స) కంకరరాళ్ళు విసరటం వల్లనే అవిశ్వాసులు ఓడి పోయారు. నేను ప్రవక్త (స) కంకర రాళ్ళు విసిరినప్పుడు చివరి వరకు చూస్తూ ఉన్నాను. అవిశ్వాసులు కరవాలాలు సాన కోల్పో తున్నాయి. అవిశ్వాసులు ఓడిపోతూ అవమానం పాలయ్యారు. (ముస్లిమ్)
5889 – [ 22 ] ( صحيح ) (3/1649)
وعَنْ أَبِيْ إِسْحَاقَ قَالَ: قَالَ رَجُلٌ لِلْبَرَاءِ يَا أَبَا عُمَارَةَ فَرَرْتُمْ يَوْمَ حُنَيْنَ. قَالَ: لَا وَاللهِ. مَا وَلّى رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم وَلَكِنْ خَرَجَ شُبَّانُ أَصْحَابِهِ لَيْسَ عَلَيْهِمْ كَثِيْرُ سَلَاحٍ فَلَقَوْا قَوْمًا رُمَاةً لَا يَكَادُ يَسْقُطُ لَهُمْ سَهْمٌ فَرَشَقُوْهُمْ رَشْقًا مَا يَكَادُوْنَ يُخْطِئُوْنَ. فَأَقْبَلُوْا هُنَاكَ إِلَى رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم. وَرَسُوْلُ اللهِ صلى الله عليه وسلم عَلَى بَغْلَتِهِ الْبَيْضَاءِ وَأَبُوْ سُفْيَانَ بْنُ الْحَارِثِ يَقُوْدُهُ فَنَزَلَ وَاسْتَنْصَرَ. وَقَالَ: أَنَا النَّبِيُّ لَا كَذِبَ أَنَا ابْنُ عَبْدِ الْمُطَّلَبِ ثُمَّ صَفَّهُمْ. رَوَاهُ مُسْلِمٌ. وَلِلْبُخَارِيِّ مَعْنَاهُ.
5889. (22) [3/1649 –దృఢం]
అబూ ఇస్’హాఖ్ (ర) కథనం: ఒక వ్యక్తి, బరాఅ’ బిన్ ‘ఆ’జిబ్‌ను, ‘ఓ అబూ ‘ఉమారహ్! ‘హునైన్ యుద్ధం నాడు అవిశ్వాసులతో యుద్ధం చేయటా న్నుండి నీవు పారిపోవటానికి సిద్ధం అయ్యావా?’ అని అడిగారు. దానికి బరాఅ’ బిన్ ‘ఆ’జిబ్ లేదు, అల్లాహ్ సాక్షి! ప్రవక్త (స) వెన్ను చూపలేదు. అయితే కొందరు యువకుల వద్ద ఆయుధాలు లేకపోయినా విల్లు గలవారితో తల పడ్డారు. ఆ విల్లుగల అవిశ్వాసులు ఆ యువకులపై బాణాలు కురిపించారు. ఈ యువకులు ప్రవక్త (స) వద్దకు వచ్చారు. అప్పుడు ప్రవక్త (స) తన కంచర గాడిదపై కూర్చొని ఉన్నారు. అబూ సుఫియాన్ బిన్ ‘హారిస్’, ప్రవక్త (స) వాహన కళ్ళెం పట్టుకుని ఉన్నారు. ప్రవక్త (స) వాహనం పైనుండి దిగి, విజయం కోసం ప్రార్థిస్తూ, ‘నేను దైవ ప్రవక్తను, ఇది అసత్యం కాదు, నేను ‘అబ్దుల్ ముత్త లిబ్ సంతానాన్ని,’ అని పలికి ముస్లిము లను ఏకం చేసి యుద్ధానికి సిద్ధం చేసారు. (ముస్లిమ్)
బు’ఖారీలో దీని సారాంశం ఉంది.
5890 – [ 23 ] ( مُتَّفَقٌ عَلَيْهِ ) (3/1650)
وَفِيْ رِوَايَةٍ لَهُمَا قَالَ: الْبَرَاءُ كُنَّا وَاللهِ إِذَا احْمَرَّ الْبَأْسُ نَتَّقِيْ بِهِ وَإِنَّ الشُّجَاعَ مِنَّا لَلَّذِيْ يُحَاذِيْهِ يَعْنِيْ النَّبِيَّ صلى الله عليه وسلم.
5890. (23) [3/1650– ఏకీభవితం]
బుఖారీ, ముస్లిమ్‌లలో ఒక ఉల్లేఖనం ఇలా ఉంది: ”బరాఅ’ (ర) కథనం: అల్లాహ్(త) సాక్షి! యుద్ధం చాలా భీకరంగా జరిగినపుడు మేము ప్రవక్త (స) వద్దకు వచ్చి శరణు కోరే వాళ్ళం. ప్రవక్త (స)కు తోడుగా నిలబడేవాడే మాలో వీరుడుగా పరిగణింప బడేవాడు.” (బు’ఖారీ, ముస్లిమ్)
5891 – [ 24 ] ( صحيح ) (3/1650)
وعَنْ سَلَمَةَ بْنِ الْأَكْوَعِ قَالَ: غَزَوْنَا مَعَ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم حُنَيْنًا فَوَلَّى صَحَابَةُ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم. فَلَمَّا غَشَوْا رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم نَزَلَ عَنِ الْبَغْلَةِ ثُمَّ قَبَضَ قَبْضَةً مِنْ تُرَابٍ مِنَ الْأَرْضِ ثُمَّ اسْتَقْبَلَ بِهِ وُجُوْهَهُمْ. فَقَالَ شَاهَتِ الْوُجُوْهُ. فَمَا خَلَقَ اللهُ مِنْهُمْ إِنْسَانًا إِلَّا مَلَأَ عَيْنَيْهِ تُرَابًا بِتِلْكَ الْقُبْضَةِ. فَوَلّوْا مُدْبِرِيْنَ فَهَزَمَهُمُ اللهُ عَزَّ وَجَلَّ. وَقَسَمَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم غَنَائِمَهُمْ بَيْنَ الْمُسْلِمِيْنَ رَوَاهُ مُسْلِمٌ.
5891. (24) [3/1650– దృఢం]
సలమహ్ బిన్ అక్వ’అ (ర) కథనం: మేము ప్రవక్త (స) వెంట ‘హునైన్ యుద్ధంలో పాల్గొన్నాము. కొందరు అనుచరులు వెన్నుచూపి పారిపోసాగారు. ఆ తరువాత అవిశ్వాసులు ప్రవక్త (స)ను చుట్టుముట్టి నపుడు ప్రవక్త (స) వాహనం నుండి క్రిందికి దిగి నేలపై నుండి ఒక పిడికెడు మన్ను తీసుకొని వాళ్ళ ముఖాలపై విసిరారు. ఇంకా వారి ముఖాలు మాడి పోవాలని శపించారు. అనంతరం అల్లాహ్(త) ఆ మట్టిని వారి కళ్ళల్లో పడినట్టు చేసాడు. వాళ్ళు వెనుతిరిగి పారిపోయారు. అల్లాహ్(త) వారిని ఓడించాడు. ప్రవక్త (స) వారి ధనాన్ని ముస్లిములకు పంచి పెట్టారు. (ముస్లిమ్)
5892 – [ 25 ] ( صحيح ) (3/1650)
وعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ شَهِدْنَا مَعَ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم حُنَيْنًا. فَقَالَ رَسُوْلُ الله صلى الله عليه وسلم لِرَجُلٍ مِمَّنْ مَعَهُ يَدَّعِي الْإِسْلَامَ هَذَا مِنْ أَهْلِ النَّارِ. فَلَمَّا حَضَرَ الْقِتَالُ قَاتَلَ الرَّجُلُ مِنْ أَشَدِّ الْقِتَالِ وَكَثُرَتْ بِهِ الْجَرَاحُ فَجَاءَ رَجُلٌ فَقَالَ يَا رَسُوْلَ اللهِ أَرَأَيْتَ الَّذِيْ تُحَدِّثُ أَنَّهُ مِنْ أَهْلِ النَّارِ قَدْ قَاتَلَ فِيْ سَبِيْلِ اللهِ مِنْ أَشَدِّ الْقِتَالِ. فَكَثُرَتْ بِهِ الْجِرَاحُ. فَقَالَ: أَمَا إِنَّهُ مِنْ أَهْلِ النَّارِ فَكَادَ بَعْضُ النَّاسِ يَرْتَابُ فَبَيْنَمَا هُوَ عَلَى ذَلِكَ إِذْ وَجَدَ الرَّجُلُ أَلَمَ الْجَرَاحِ فَأَهْوَى بِيَدِهِ إِلى كَنَانَتِهِ فَانْتَزَعَ سَهْمًا فَانْتَحَرَ بِهَا فَاشْتَدَّ رِجَالٌ مِنَ الْمُسْلِمِيْنَ إِلَى رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم. فَقَالُوْا يَا رَسُوْلَ اللهِ صَدَّقَ اللهُ حَدِيْثَكَ قَدِ انْتَحَرَ فُلَانٌ وَقَتَلَ نَفْسَهُ. فَقَالَ رَسُوْلُ الله صلى الله عليه وسلم اللهُ أَكْبَرُ أَشْهَدُ أَنِّيْ عَبْدُ اللهِ وَرَسُوْلُهُ يَا بِلَالُ قُمْ فَأَذِّنْ لَا يَدْخُلُ الْجَنَّةَ إِلَّا مُؤْمِنٌ وَإِنَّ اللهَ لَيُؤَيِّدُ هَذَا الدِّيْنَ بِالرَّجُلِ الْفَاجِرِ. روَاهُ الْبُخَارِيُّ.
5892. (25) [3/1650 –దృఢం]
అబూ హురైరహ్ (ర) కథనం: మేము ప్రవక్త (స) వెంట ‘హునైన్ యుద్ధంలో పాల్గొన్నాము. ప్రవక్త (స) తమ వెంట ఉన్న ఒకవ్యక్తి గురించి, ‘ఇతడు నరకవాసి,’ అని అన్నారు. యుద్ధం ప్రారంభం అయినపుడు ఆ వ్యక్తి చాలా వీరోచితంగా పోరాడాడు. అతనికి అనేక గాయాలు తగిలాయి. ఒక వ్యక్తి ప్రవక్త (స) వద్దకు వచ్చి, ‘ఓ ప్రవక్తా! తమరు నరకవాసి అని చెప్పిన వ్యక్తి చాలా వీరోచితంగా పోరాడాడు, అతనికి అనేక గాయాలు తగిలాయి,’ అని అన్నాడు. దానికి ప్రవక్త (స), ‘గుర్తుంచుకో! అతడు నరకవాసి,’ అని అన్నారు. ఆ తరువాత అకస్మాత్తుగా ఆ వ్యక్తి గాయాలను భరించలేక ఒక బాణం తీసి తన్ను తాను గుండెలో పొడుచుకున్నాడు. అది చూచిన కొంతమంది ముస్లిములు పరుగెత్తుకుంటూ వచ్చి, ప్రవక్త (స)తో, ‘ఓ ప్రవక్తా! తమరి మాట నిజమయింది. ఆ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు,’ అని అన్నారు. ఆ తరువాత ప్రవక్త (స) అల్లాహు అక్బర్, నేను అల్లాహ్(త) దాసుణ్ణని, ఇంకా ఆయన ప్రవక్తనని సాక్ష్యం ఇస్తున్నాను. ‘ఓ బిలాల్! నిలబడు స్వర్గంలో కేవలం విశ్వాసులే ప్రవేశిస్తారని ప్రకటించు. అయితే అల్లాహ్(త) పాపాత్ముల ద్వారా కూడా ఈ ధర్మాన్ని బలపరుస్తాడు,’ ” అని అన్నారు. (బు’ఖారీ)
5893 – [ 26 ] ( مُتَّفَقٌ عَلَيْهِ ) (3/1651)
وَعَنْ عَائِشَةَ قَالَتْ: سُحِرَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم حَتَّى إِنَّهُ لَيُخَيَّلُ إِلَيْهِ أَنَّهُ فَعَلَ الشَّيْءَ وَمَا فَعَلَهُ حَتّى إِذَا كَانَ ذَاتَ يَوْمٍ وَهُوَ عِنْدِيْ دَعَا الله ودَعَاهُ. ثُمَّ قَالَ: أَشَعَرْتِ يَا عَائِشَةَ أَنَّ اللهَ قَدْ أَفْتَانِيْ فِيْمَا اسْتَفْتَيْتُهُ جَاءَنِيْ رَجُلَانِ فَجَلَسَ أَحَدُهُمَا عِنْدَ رَأْسِيْ وَالْآخَرُ عِنْدَ رِجْلَيَّ ثُمَّ قَالَ: أَحَدُهُمَا لِصَاحِبِهِ مَا وَجَعُ الرَّجُلِ قَالَ: مَطْبُوْبٌ. قَالَ: وَمَنْ طَبهُ. قَالَ: لَبِيْدُ بْنُ الْأَعْصَمِ الْيَهُوْدِيُّ قَالَ: فِيْ مَاذَا قَالَ: فِيْ مُشْطٍ وَمُشَاطَةٍ وَجُفِّ طَلْعَةِ ذَكَرٍ قَالَ: فَأَيْنَ هُوَ. قَالَ: فِيْ بِئْرِ ذَرْوَانَ. فَذَهَبَ النَّبِيُّ صلى الله عليه وسلم فِيْ أُنَاسٍ مِنْ أَصْحَابِهِ إِلى الْبِئْرِ. فَقَالَ: هَذِهِ الْبِئْرُ الَّتِيْ أُرِيْتُهَا وَكَأَنَّ مَاءَهَا نُقَاعَةُ الْحِنَّاءِ وَلَكَأَنَّ نَخْلَهَا رُءُوْسُ الشَّيَاطِيْنِ فَاسْتَخْرَجَهُ
5893. (26) [3/1651– ఏకీభవితం]
‘ఆయి’షహ్ (ర) కథనం: ప్రవక్త (స)పై చేతబడి చేయబడింది. దానివల్ల చేయని విషయాలు చేసినట్లు అనిపించేది. అనంతరం ఒకరోజు ప్రవక్త (స) నా దగ్గర కూర్చొని, అల్లాహ్(త)ను ప్రార్థించారు, ఇంకా ప్రార్థించారు. ఆ తరువాత, ”ఓ ‘ఆయి’షహ్! నీకు తెలుసా? నేను అల్లాహ్(త)ను అడిగిన విషయాన్ని గురించి అల్లాహ్(త) నాకు తెలియపరిచాడు. నా వద్దకు ఇద్దరు దైవదూతలు వచ్చారు. వారిలో ఒకరు నా తల వద్ద కూర్చున్నారు. మరొకరు నా కాళ్ళ వద్ద కూర్చున్నారు. ఆ తరువాత వారిలో ఒకరు మరొ కరితో, ‘ఈ వ్యక్తి రోగం ఏమిటి?’ అని అడిగాడు. రెండవ వ్యక్తి, ‘ఇతనిపై చేతబడి చేయబడింది,’ అని అన్నాడు. మొదటి వ్యక్తి, ‘ఎవరు చేసారు’ అని అన్నాడు. దానికి, ‘ఆ వ్యక్తి లబీద్ బిన్ అ’అసమ్ అనే యూదుడు చేసాడు,’ అని అన్నాడు. మొదటి వ్యక్తి, ‘ఎందులో చేసాడు,’ అని అడిగాడు. దానికి రెండవ వ్యక్తి, ‘మొదట దువ్వెనలో ఇంకాదువ్వెన నుండి రాలే వెంట్రుకల్లో ఇంకా పురుష బీజం గల ఖర్జూరం చెట్టు కాండములో,’ అని అన్నాడు. మొదటి వ్యక్తి, ‘అది ఎక్కడ ఉంది,’ అని అన్నాడు. రెండవ వ్యక్తి, ‘దర్‌వాన్‌అనే పేరుగల బావిలో,’ అని అన్నాడు. ఆ తరువాత ప్రవక్త (స) తన అనుచరుల వెంట ఆ బావి వద్దకు వెళ్ళి, ‘ఈ బావే నాకు చూపించబడింది,’ ” అని చెప్పారు. ఆ బావినీరు గోరింటాకు రంగులో ఉండేది. దాని ఖర్జూరాలు షై’తాన్ తలలా ఉండేవి. ప్రవక్త (స) ఆ బావిలో నుండి చేతబడి చేసిన వస్తువులను తీసారు. (బు’ఖారీ, ముస్లిమ్)
5894 – [ 27 ] ( مُتَّفَقٌ عَلَيْهِ ) (3/1652)
وَعَنْ أَبِيْ سَعِيْدِ الْخُدْرِيِّ قَالَ: بَيْنَمَا نَحْنُ عِنْدَ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم وَهُوَ يَقْسِمُ قَسْمًا أَتَاهُ ذُو الْخُوَيْصَرَةِ وَهُوَ رَجُلٌ مِنْ بَنِيْ تَمِيْمٍ. فَقَالَ: يَا رَسُوْلَ اللهِ اعْدِلْ. فَقَالَ: وَيْلَكَ وَمَنْ يَعْدِلُ إِذَا لَمْ أَعْدِلْ قَدْ خِبْتَ وَخَسَرْتَ إِنْ لَمْ أَكُنْ أَعْدِلُ. فَقَالَ: عُمَرُ لَهُ اِئْذَنَ لِيْ أَضْرِبَ عُنُقَهُ. فَقَالَ: دَعْهُ فَإِنَّ لَهُ أَصْحَابًا يُحَقِّرُ أَحَدُكُمْ صَلَاتَهُ مَعَ صَلَاتِهِمْ وَصِيَامَهُ مَعَ صِيَامِهِمْ يَقْرَءُوْنَ الْقُرْآنَ لَا يُجَاوِزُ تَرَاقِيْهِمْ يَمْرُقُوْنَ مِنَ الدِّيْنَ كَمَا يَمْرُقُ السَّهْمُ مِنَ الرِّمْيَةِ يُنْظَرُ إِلى نَصْلِهِ إِلى رُصَافِهِ إِلى نَضْيِهِ وَهُوَ قِدْحُهُ إِلى قُذَذِهِ فَلَا يُوْجَدُ فِيْهِ شَيْءٌ قَدْ سَبَقَ الْفَرْثَ وَالدَّمَ آيَتُهُمْ رَجُلٌ أَسْوَدُ إِحْدَى عَضُدَيْهِ مِثْلُ ثَدْيِ الْمَرْأَةِ أَوْ مِثْلُ الْبَضْعَةِ تَدَرْدَرُ وَيَخْرُجُوْنَ عَلَى خَيْرِ فِرْقَةٍ مِنَ النَّاسِ. قَالَ: أَبُوْ سَعِيْدٍ أَشْهَدُ أَنِّيْ سَمِعْتُ هَذَا الْحَدِيْثَ مِنْ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم وَأَشْهَدُ أَنَّ عَلِيَّ بْنَ أَبِيْ طَالِبٍ قَاتَلَهُمْ وَأَنَا مَعَهُ فَأَمَرَ بِذَلِكَ الرَّجُلِ فَالْتُمِسَ فَأُتِيَ بِهِ حَتّى نَظَرْتُ إِلَيْهِ عَلَى نَعْتِ النَّبِيِّ صلى الله عليه وسلم الَّذِيْ نَعْتَهُوَفِيْ رِوَايَةٍ: أَقْبَلَ رَجُلٌ غَائِرُ الْعَيْنَيْنِ نَاتِئُ الْجَبْهَةِ كَثُّ اللِّحْيَةَ مُشْرِفُ الْوَجَنَتَيْنِ مَحْلُوْقُ الرَّأْسِ. فَقَالَ يَا مُحَمَّدُ اتَّقِ اللهَ فَقَالَ: “فَمَنْ يُطِعِ اللهَ إِذَا عَصَيْتُهُ فَيَأْمَنُنِيَ اللهُ عَلَى أَهْلِ الْأَرْضِ وَلَا تَأْمَنُوْنِّيْ”. فَسَأَلَ رَجُلٌ قَتْلَهُ فَمَنَعَهُ فَلَمَّا وَلَّى قَالَ: “إِنَّ مِنْ ضِئْضِئِ هَذَا قَوْمًا يَقْرَءُوْنَ الْقُرْآنَ لَا يُجَاوِزُ حَنَاجِرَهُمْ يَمْرُقُوْنَ مِنَ الْإِسَلَامِ مُرُوْقَ السَّهْمِ مِنَ الرَّمْيَّةِ. يَقْتُلُوْنَ أَهْلَ الْإِسْلَامِ وَيَدْعُوْنَ أَهْلَ الْأَوْثَانِ لَئِنْ أَدْرَكْتُهُمْ لَأَقْتُلَنَّهُمْ قَتْلَ عَادٍ”مُتَّفَقٌ عَلَيْهِ
5894. (27) [3/1652– ఏకీభవితం]
అబూ స’యీద్ ‘ఖుద్రీ (ర) కథనం: మేము ‘హునైన్ యుద్ధంలో ప్రవక్త (స)వెంట ఉన్నప్పుడు ప్రవక్త (స) యుద్ధ ధనాన్ని పంచిపెడుతుండగా, ఆయన వద్దకు జు’ల్ ‘ఖువైసిరహ్ అనే వ్యక్తి వచ్చాడు. అతడు బనూ తమీమ్ తెగకు చెందినవాడు. అతడు, ‘ఓ ప్రవక్తా! తమరు న్యాయంగా వ్యవహరించండి,’ అని అన్నాడు. అది విన్న ప్రవక్త (స), ‘నీ పాడుగాను! ధర్మంగా న్యాయంగా నేను వ్యవహరించకపోతే మరెవరు వ్యవహరిస్తారు? ఒకవేళ నేను ధర్మంగా న్యాయంగా వ్యవహరించకుంటే నిస్సందేహంగా నీవు కోల్పోతావు. నీకు నష్టం జరుగుతుంది.’ అప్పుడు ‘ఉమర్ (ర), ‘ప్రవక్తా! నాకు అనుమతి ఇవ్వండి, నేను వీడి మెడ నరుకుతాను,’ అన్నారు. అప్పుడు ప్రవక్త (స), ‘వాడిని వదిలెయ్యి. ఎందుకంటే వీడికి కొంతమంది అనుచరులు ఉన్నారు. నీవు వారి నమా’జుల కన్నా నీ నమా’జును, వారి ఉపవాసాల కన్నా నీ ఉపవాసాల్ని అల్పంగా చూస్తావు. వీళ్ళు ఖుర్‌ఆన్ పఠిస్తారు. కాని ఖుర్‌ఆన్ గొంతు క్రిందికి దిగదు. వీళ్ళు ధర్మం నుండి వేటగాడి నుండి బాణం దూసుకెళ్ళి వేటకు తగిలి బయటకు వచ్చినట్లు వేరై పోతారు. ఆవిధంగా వారు ఇస్లామ్ నుండి దూరమై పోతారు. అతడి అనుచరుల చిహ్నం ఏమిటంటే, వారు నల్లగా ఉంటారు. వారి ఒక భుజంలో స్త్రీ చనులాంటి అంటే ఉబ్బి ఉన్న మాంసం ముక్క ఉంటుంది. వాళ్ళు ఒక ఉత్తమ బృందానికి వ్యతిరేకంగా ద్రోహానికి పాల్పడతారు.’
అబూ స’యీద్ ‘ఖుద్రీ కథనం: నేను దీన్ని గురించి సాక్ష్యం ఇస్తున్నాను. నేను స్వయంగా ఈ ‘హదీసు’ను ప్రవక్త (స) ద్వారా విన్నాను. ఇంకా నేను సాక్ష్యం ఇస్తున్నాను. ‘అలీ (ర) ఈ వర్గం వారితో యుద్ధం చేసారు. నేను ఆ యుద్ధంలో ‘అలీ (ర) వెంట ఉన్నాను. ఆయన ఇటువంటి వ్యక్తులను వెదకమని ఆదేశించారు. అతన్ని తీసుకురావటం జరిగింది. నేను ఆ వ్యక్తిలో ప్రవక్త (స) పేర్కొన్న గుణాలను చూసాను.
మరో ఉల్లేఖనంలో ఇలా ఉంది, ”ఒక వ్యక్తి వచ్చాడు. అతని కళ్ళు చొచ్చుకొని పోయినట్టు ఉన్నాయి. నుదురు పొడవుగా ఉంది, దట్టమైన గడ్డం ఉంది, బుగ్గలు ఉబ్బి ఉన్నాయి, తల గీయించబడి ఉంది. ఈ వ్యక్తి ప్రవక్త(స)తో, ‘ఓ ము’హమ్మద్ పంచటంలో అల్లాహ్(త)కు భయపడు,’ అని అన్నాడు. దానికి ప్రవక్త (స), ‘నేను అల్లాహ్(త)కు భయపడక పోతే మరెవరు భయపడేది?’ అని అన్నారు. ‘అల్లాహ్(త) నన్ను నిజాయితీ పరునిగా, ప్రజలు నన్ను నిజాయితీ పరునిగా భావిస్తున్నారు. కాని నువ్వు నన్ను నిజాయితీ పరునిగా భావించటం లేదు. ఇంకా నన్ను నమ్మటం లేదు,’ అని అన్నారు. ఒక వ్యక్తి ఆ వ్యక్తిని చంపే అనుమతి కోరాడు. కాని ప్రవక్త (స) అతన్ని వారించారు. ఆ వ్యక్తి వెళ్ళిపోయిన తర్వాత ప్రవక్త (స) ఆ వ్యక్తి సంతతిలో ఇటువంటి వ్యక్తులు ఉంటారు, ఖుర్‌ఆన్‌ను పఠిస్తారు, కాని ఖుర్‌ఆన్ వారి గొంతు క్రిందికి దిగదు. వారు బాణం విల్లునుండి వేరైనట్టు ఇస్లామ్ నుండి వేరయిపోతారు, వాళ్ళు ముస్లిములను చంపుతారు, విగ్రహారాధకులను వదలివేస్తారు, ఒకవేళ నేను వారిని పట్టుకుంటే నేను వారిని ‘ఆద్ జాతి వారు చంపబడి నట్టు చంపుతాను,’ అని అన్నారు. (బు’ఖారీ, ముస్లిమ్)
5895 – [ 28 ] ( صحيح ) (3/1653)
وعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: كُنْتُ أَدْعُو أُمِّيْ إِلى الْإِسْلَامِ وَهِيَ مُشْرِكَةٌ فَدَعَوْتُهَا يَوْمًا فَأَسْمَعَتْنِيْ فِيْ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم مَا أَكْرَهُ. فَأَتَيْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم وَأَنَا أَبْكِيْ قُلْتُ يَا رَسُوْلَ اللهِ: اُدْعُ اللهَ أَنْ يَهْدِيَ أُمَّ أَبِيْ هُرَيْرَةَ فَقَالَ: “اَللّهُمَّ اهْدِ أُمَّ أَبِيْ هُرَيْرَةَ”. فَخَرَجْتُ مُسْتَبْشِرًا بِدَعْوَةِ النَّبِيِّ صلى الله عليه وسلم. فَلَمَّا صِرْتُ إِلى الْبَابِ فَإِذَا هُوَ مُجَافٌ فَسَمِعْتْ أُمِّيْ خَشفَ قَدَمَيَّ. فَقَالَتْ مَكَانَكَ يَا أَبَا هُرَيْرَةَ وَسَمِعْت خَضْخَضَةَ الْمَاءِ. قَالَ فَاغْتَسَلَتْ فَلَبِسَتْ دِرْعَهَا وَعَجِلَتْ عَنْ خِمَارِهَا فَفَتَحَتِ الْبَابَ ثُمَّ قَالَتْ: يَا أَبَا هُرَيْرَةَ أَشْهَدُ أَنْ لَا إِلَهَ إِلَّا اللهُ وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُوْلُه فَرَجَعْتُ إِلى رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم وَأَنَا أَبْكِيْ مِنَ الْفَرْحِ فَحَمِدَ اللهَ فَحَمِدَ اللهَ. وَقَالَ خَيْرًا. رَوَاهُ مُسْلِمٌ.
5895. (28) [3/1653– దృఢం]
అబూ హురైరహ్ (ర) కథనం: నేను నా తల్లికి ఇస్లామ్ సందేశాన్ని అందజేసేవాణ్ణి. అయితే ఒక రోజు ఆమెను ఇస్లామ్ స్వీకరించమని విన్నవించుకున్నాను. దానికి ఆమె ప్రవక్త (స) పట్ల చాలా నీచంగా మాట్లాడారు. నేను ఏడుస్తూ ప్రవక్త (స) వద్దకు వచ్చాను. నేను, ‘ఓ ప్రవక్తా! అబూ హురై రహ్ తల్లికి ఇస్లామ్ భాగ్యం ప్రసాదించమని అల్లాహ్ (త)ను ప్రార్థించండి,’ అని కోరాను. అప్పుడు ప్రవక్త (స), ‘ఓ అల్లాహ్ (త)! అబూ హురైరహ్ తల్లికి ఇస్లాం భాగ్యం ప్రసాదించు,’ అని ప్రార్థించారు. ప్రవక్త (స) ప్రార్థించిన తర్వాత నేను సంతోషంగా అక్కడి నుండి బయలు దేరాను. నేను ఇల్లు చేరుకునేసరికి తలుపులు మూసి ఉన్నాయి. నా తల్లి నా చప్పుడు విని, ‘ఓ అబూ హురైరాహ్ ఆగు,’ అని అన్నారు. నేను నీళ్ళు పడిన శబ్దం విన్నాను. నా తల్లి స్నానం చేసి, దుస్తులు ధరించి తొందరలో వాటిని కప్పుకోకుండా తలుపు తెరచి, ‘అల్లాహ్ తప్ప ఆరాధ్యులెవరూ లేరనినేను సాక్ష్యం ఇస్తున్నాను. అదేవిధంగా ముహమ్మద్ (స) అల్లాహ్ దాసులని, ఆయన ప్రవక్త అని నేను సాక్ష్యం ఇస్తున్నాను,’ అని పలికింది. సంతోషం పట్టలేక నేను కన్నీరు కార్చుతూ ప్రవక్త (స) వద్దకు వెళ్ళి జరిగినదంతా చెప్పాను. ప్రవక్త (స) దైవాన్ని స్తుతించారు. ‘చాలా మంచిదే జరిగింది,’ అని అన్నారు. (ముస్లిమ్)
5896 – [ 29 ] ( مُتَّفَقٌ عَلَيْهِ ) (3/1654)
وَعَنْهُ إِنَّكُمْ تَقُوْلُوْنَ أَكْثَرَ أَبُوْ هُرَيْرَةَ عَنِ النَّبِيّ صلى الله عليه وسلم و اللهِ الْمَوْعِدُ وَإِنَّ إِخْوَتِيْ مِنَ الْمُهَاجِرِيْنَ كَانَ يَشْغَلُهُمُ الصَّفْقُ بِالْأَسْوَاقِ وَإِنَّ إِخْوَتِيْ مِنَ الْأَنْصَارِ كَانَ يَشْغَلُهُمْ عَمَلُ أَمْوَالِهِمْ وَكُنْتُ امْرَأً مِسْكِيْنًا أَلْزَمُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم عَلَى مِلْءِ بَطْنِيْ. وَقَالَ النَّبِيُّ صلى الله عليه وسلم يَوْمًا: “لَنْ يَبْسُطَ أَحَدٌ مِنْكُمْ ثَوْبَهُ حَتَّى أَقْضِيَ مَقَالَتِيْ هَذِهِ ثُمَّ يَجْمَعُهُ إِلى صَدْرِهِ فَيَنْسَى مِنْ مَقَالَتِيْ شَيْئًا أَبَدًا”. فَبَسَطْتُ نَمِرَةً لَيْسَ عَلَيَّ ثَوْبٌ غَيْرَهَا حَتَّى قَضَى النَّبِيُّ صلى الله عليه وسلم مَقَالَتَهُ ثُمَّ جَمَعْتُهَا إِلى صَدْرِيْ فَوَالَّذِيْ بَعَثَهُ بِالْحَقِّ مَا نَسِيْتُ مِنْ مَقَالَتِهِ تِلْكَ إِلى يَوْمِيْ هَذَا. مُتَّفَقٌ عَلَيْهِ.
5896. (29) [3/1654 –ఏకీభవితం]
అబూ హురైరహ్ (ర) ప్రవక్త (స) అనుచరులను, తాబియీనులను ఉద్దేశించి ఇలా అన్నారు, అబూ హురైరహ్ (ర), ప్రవక్త (స) ద్వారా చాలా అధికంగా ‘హదీసు’లను పేర్కొంటున్నారని మీ అనటంగాని, అల్లాహ్ వద్ద మనల్ని విచారించటం జరుగుతుంది. వాస్తవం ఏమిటంటే, మన ముహాజిర్ సోదరులు బజారుల్లో వ్యాపారంలో నిమగ్నులయి ఉండేవారు. ఇంకా మన అ’న్సార్ సోదరులు వ్యాపార లావాదేవీల్లో నిమగ్నులయి ఉండేవారు. నేనొక్కడినే ఎటు వెళ్ళలేక అక్కడే పడి ఉండేవాణ్ని. కడుపు నిండా అన్నం దొరికితే చాలు తిని, ప్రవక్త (స) వద్దే పడిఉండే వాణ్ణి. ఒకసారి ప్రవక్త (స) ”ఒకవేళ మీలో ఎవరైనా తన వస్త్రాన్ని పరచి నా మాటలు పూర్తిగా విన్న తరువాత దాన్ని మడచి తన గుండెకు హత్తుకుంటే, అతడు నా మాటలను, సూక్తులను ఎన్నడూ మరు వడు,” అని అన్నారు. అనంతరం నేను నా దుప్ప టిని పరిచాను. అది తప్ప నా దగ్గర మరే వస్త్రం లేదు. ప్రవక్త (స) తన హితబోధలను పూర్తిచేసారు. నేను దుప్పటిని మడచి గుండెకు హత్తు కున్నాను. ప్రవక్త (స)ను సత్యం ఇచ్చి పంపిన అల్లాహ్ సాక్షి! ఆ నాటి నుండి ఈనాటి వరకు ప్రవక్త (స) నుండి విన్న ఏ విషయమూ మరువలేదు. (బు’ఖారీ, ముస్లిమ్)
5897 – [ 30 ] ( مُتَّفَقٌ عَلَيْهِ ) (3/1655)
وَعَنْ جَرِيْرِ بْنِ عَبْدِ اللهِ قَالَ: قَالَ لِيْ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “أَلَا تُرِيْحُنِيْ مِنْ ذِيْ الْخَلَصَةِ؟” فَقُلْتُ: بَلَى وَكُنْتُ لَا أَثْبُتُ عَلَى الْخَيْلِ فَذَكَرْتُ ذَلِكَ لِلنَّبِيِّ صلى الله عليه وسلم فَضَرَبَ يَدَهُ عَلَى صَدْرِيْ حَتّى رَأَيْتُ أَثَرَ يَدِهِ فِيْ صَدْرِيْ وَقَالَ: “اَللّهُمَّ ثَبِّتْهُ وَاجْعَلْهُ هَادِيًا مَهْدِيًّا”. قَالَ فَمَا وَقَعْتُ عَنْ فَرَسِيْ بَعْدُ فَانْطَلَقَ فِيْ مِائَةٍ وَ خَمْسِيْنَ فَارِسًا مِنْ أَحْمَسَ فَحَرَّقَهَا بِالنَّارِ وَكَسَرَهَا. مُتَّفَقٌ عَلَيْهِ.
5897. (30) [3/1655– ఏకీభవితం]
జరీర్ బిన్ ‘అబ్దుల్లాహ్ (ర) కథనం: ప్రవక్త (స) నన్ను ఉద్దేశించి, ”నువ్వు జు’ల్‌ఖల’సహ్ను ధ్వంసం చేసి నాకు మనశ్శాంతి కలిగించవా?” అని అన్నారు. దానికి నేను ‘అవును,’ అని అన్నాను. అప్పటికి ఇంకా నాకు గుర్రపు స్వారీ పూర్తిగా రాదు. దాన్ని గురించి నేను ప్రవక్త (స)తో చెప్పాను. అది విన్న ప్రవక్త (స) తన చేతితో నా గుండెపై కొట్టారు. చేతి చిహ్నాలు కూడా పడ్డాయి. ఇంకా ప్రవక్త (స) ప్రార్థిస్తూ, ‘ఓ అల్లాహ్(త)! ఇతనికి స్థిరత్వం ప్రసాదించు, ఇతన్ని రుజుమార్గం చూపేవానిగా ఇంకా రుజుమార్గంపై ఉండే వాడిలా చేయి,’ అని అన్నారు. ఈ ప్రార్థన తర్వాత గుర్రంపై నుండి ఎన్నడూ క్రిందపడలేదు. ఆ తరువాత 150 మంది సైన్యాన్ని తీసుకొని జు’ల్‌ఖల్’సహ్ అనే విగ్రహంగల గుడిని ధ్వంసం చేయటానికి బయలుదేరాను. అక్కడకు చేరిన తర్వాత దానికి నిప్పంటించి ధ్వంసం చేసాను. (బు’ఖారీ, ముస్లిమ్)
5898 – [ 31 ] ( مُتَّفَقٌ عَلَيْهِ ) (3/1655)
وَعَنْ أَنَسٍ قَالَ: إِنَّ رَجُلًا كَانَ يَكْتُبُ لِلنَّبِيِّ صلى الله عليه وسلم فَارْتَدَّ عَنِ الْإِسْلَامِ وَلَحِقَ بِالْمُشْرِكِيْنَ. فَقَالَ النَّبِيُّ صلى الله عليه وسلم: “إِنَّ الْأَرْضَ لَا تَقْبَلُهُ”. فَأَخْبَرَنِيْ أَبُوْ طَلْحَةَ أَنَّهُ أَتَى الْأَرْض الَّتِيْ مَاتَ فِيْهَا فَوَجَدَهُ مَنْبُوْذًا فَقَالَ: مَا شَأْنُ هَذَا؟ فَقَالُوْا: دَفَنَّاهُ مِرَارًا فَلَمْ تَقْبَلْهُ الْأَرْضُ. مُتَّفَقٌ عَلَيْهِ.
5898. (31) [3/1655 –ఏకీభవితం]
అనస్ (ర) కథనం: ప్రవక్త (స) దైవవాణి వ్రాసే ఒక వ్యక్తి ఇస్లామ్‌ను త్యజించి అవిశ్వాసులతో కలసి పోయాడు. ప్రవక్త (స), ‘అతన్ని నేల స్వీకరించదు,’ అని అన్నారు. అబూ ‘తల్’హా కథనం ప్రకారం మేము అతని మరణం సంభవించిన చోటికివెళ్ళి చూడగా అతడు సమాధి బయట పడి ఉన్నాడు. అతనికి ఏమయిందని ప్రజలను అడగ్గా, ప్రజలు, ‘మేము అనేక సార్లు ఖననం చేసినా నేల అతన్ని స్వీకరించటం లేదు,’ అని అన్నారు. (బు’ఖారీ, ముస్లిమ్)
5899 – [ 32 ] (مُتَّفَقٌ عَلَيْهِ) (3/1655)
وَعَنْ أَبِيْ أَيُّوْبَ قَالَ: خَرَجَ النَّبِيُّ صلى الله عليه وسلم وَقَدْ وَجَبَتِ الشَّمْسُ فَسَمِعَ صَوْتًا فَقَالَ: “يَهُوْدُ تُعَذَّبُ فِيْ قُبُوْرِهَا”.
5899. (32) [3/1655– ఏకీభవితం]
అబూ అయ్యూబ్ అ’న్సారీ (ర) కథనం: ఒకరోజు ప్రవక్త (స) ఇంటినుండి బయలుదేరారు. అప్పటికి సూర్యాస్తమయం అయి ఉంది. ప్రవక్త (స) ఒక శబ్దం విని, ‘వీళ్ళు యూదులు, వీళ్లను సమాధిలో శిక్షించడం జరుగుతున్నది,’ అనిఅన్నారు. (బు’ఖారీ, ముస్లిమ్)
5900 – [ 33 ] ( صحيح ) (3/1655)
وعَنْ جَابِرٍ قَالَ: قَدِمَ النَّبِيُّ صلى الله عليه وسلم مِنْ سَفَرٍ فَلَمَّا كَانَ قُرْبَ الْمَدِيْنَةِ هَاجَتْ رِيْحٌ تَكَادُ أَنْ تَدْفِنَ الرَّاكِبَ. فقَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “بُعِثَتْ هَذِهِ الرِّيْحُ لِمَوْتِ مُنَافِقٍ”. فَقَدِمَ الْمَدِيْنَةَ فَإِذَا عَظِيْمٌ مِنَ الْمُنَافِقِيْنَ قَدْ مَاتَ. رَوَاهُ مُسْلِمٌ .
5900. (33) [3/1655 –దృఢం]
జాబిర్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రయాణం నుండి తిరిగి వచ్చారు. మదీనహ్ సమీపానికి రాగానే ఒక పెద్త తుఫాను గాలి వచ్చింది. వాహనాలతో పాటు మనుషులను కప్పివేసే టంతటి తీవ్రంగా ఉండేది. అప్పుడు ప్రవక్త (స), ‘ఈ తుఫాను కపటాచారి మరణం కొరకు పంపబడి నట్టుంది,’ అని అన్నారు. అనంతరం మదీనహ్ చేరగానే ఒక కపటాచారి మరణించి ఉన్నాడు. (ముస్లిమ్)
5901 – [ 34] ( صحيح ) (3/1655)
وَعَنْ أَبِيْ سَعِيْدِ الْخُدْرِيِّ قَالَ: خَرَجْنَا مَعَ النَّبِيِّ صلى الله عليه وسلم حَتَّى قَدِمْنَا عُسْفَانَ. فَأَقَامَ بِهَا لَيَالِيَ فَقَالَ النَّاسُ: مَا نَحْنُ هَهُنَا فِيْ شَيْءٍ وَإِنَّ عِيَالَنَا لَخَلُوْفٌ مَا نَأْمَنُ عَلَيْهِمْ فَبَلَغَ ذَلِكَ النَّبِيّ صلى الله عليه وسلم. فَقَالَ: “وَالَّذِيْ نَفْسِيْ بِيَدِهِ مَا فِي الْمَدِيْنَةِ شِعْبٌ وَلَا نَقَبٌ إِلَّا عَلَيْهِ مَلَكَانِ يَحْرِسَانِهَا حَتَّى تَقْدَمُوْا إِلَيْهَا”. ثُمَّ قَالَ: “ارْتَحِلُوْا”. فَارْتَحَلْنَا وَأَقْبَلْنَا إِلى الْمَدِيْنَةِ فَوَالَّذِيْ يُحْلَفُ بِهِ مَا وَضَعْنَا رِحَالَنَا حِيْنَ دَخَلْنَا الْمَدِيْنَةَ حَتَّى أَغَارَ عَلَيْنَا بَنُوْ عَبْدِ اللهِ بْنِ غَطْفَانَ وَمَا يُهِيْجُهُمْ قَبْلَ ذَلِكَ شَيْءٌ. رَوَاهُ مُسْلِمٌ.
5901. (34) [3/1655 –దృఢం]
అబూ స’యీద్ ‘ఖుద్రీ (ర) కథనం: మేము ప్రవక్త (స) వెంట బయలుదేరాము. ‘ఉస్ఫాన్ అనే ప్రాంతానికి చేరుకున్నాం. ప్రవక్త (స) అక్కడ అనేక రాత్రులు ఉన్నారు. కొందరు కపటాచారులు, ‘మన కిక్కడ ఏం పనిలేదు, మన భార్యాబిడ్డలు అక్కడ ఒంటరిగా ఉన్నారు, మేము వారి గురించి భయపడు తున్నాం,’ అని అన్నారు. ఈ మాట ప్రవక్త (స)కు చేరింది. అప్పుడు ప్రవక్త (స), ‘ఎవరి చేతిలో నా ప్రాణం ఉందో ఆయన (త)సాక్షి! దైవదూతల కాపలా లేకుండా మదీనహ్ నగర వీధులేవీ లేవు. మీరు మదీనహ్ చేరేవరకు ఆ దైవదూతలు కాపలా కాస్తుంటారు. ఆ తరువాత ప్రవక్త (స) పదండి,’ అని అన్నారు. మేము మదీనహ్ బయలు దేరాము. మదీనహ్ చేరు కున్నాము. అల్లాహ్ సాక్షి! మేము మదీనహ్లో ప్రవే శించగానే, మేమింకా మా ఆయుధాలను దించకముందే అకస్మాత్తుగా మాపై బనూ ‘అబ్దుల్లాహ్ బిన్ ‘గత్‌ఫాన్ ప్రజలు దాడిచేసారు. అయితే మేము రాకముందు వారిని యద్ధానికి పురికొలిపే విషయమేదీ సంభ వించలేదు. (ముస్లిమ్)
5902 – [ 35] ( مُتَّفَقٌ عَلَيْهِ ) (3/1656)
وَعَنْ أَنسٍ قَالَ: أَصَابَتِ النَّاسَ سَنَةٌ عَلَى عَهْدِ النَّبِيِّ صلى الله عليه وسلم فَبَيْنَا النَّبِيُّ صلى الله عليه وسلم يَخْطُبُ فِيْ يَوْمِ جُمُعَةِ قَامَ أَعْرَابِيٌّ. فَقَالَ: يَا رَسُوْلَ اللهِ هَلَكَ الْمَالُ وَجَاعَ الْعِيَالُ فَادْعُ اللهَ لَنَا فَرَفَعَ يَدَيْهِ وَمَا نَرَى فِي السَّمَاءِ قَزْعَةً فَوَالَّذِيْ نَفْسِيْ بِيَدِهِ مَا وَضَعَهَا حَتَّى ثَارَ السَّحَابُ أَمْثَالُ الْجِبَالِ ثُمَّ لَمْ يَنْزِلْ عَنْ مِنْبَرِهِ حَتّى رَأَيْتُ الْمَطَرَ يَتَحَادَرُ عَلَى لِحْيَتِهِ صلى الله عليه وسلم فَمُطِرْنَا يَوْمَنَا ذَلِكَ وَمِنْ الْغَدِ وَبَعْدِ الْغَدِ وَالَّذِيْ يَلِيْهِ حَتَّى الْجُمُعَةَ الْأُخْرَى. وَقَامَ ذَلِكَ الْأَعْرَابِيُّ أَوْ قَالَ غَيْرُهُ. فَقَالَ: يَا رَسُوْلَ اللهِ تَهَدَّمَ الْبِنَاءُ وَغَرِقَ الْمَالُ فَادْعُ اللهَ لَنَا فَرَفَعَ يَدَيْهِ. فَقَالَ: اللّهُمَّ حَوَالَيْنَا وَلَا عَلَيْنَا فَمَا يُشِيْرُ بِيَدِهِ إِلى نَاحِيَةٍ مِنَ السَّحَابِ إِلَّا انْفَرَجَتْ وَصَارَتِ الْمَدِيْنَةُ مِثْلَ الْجَوْبَةِ وَسَالَ الْوَادِيْ قَنَاةُ شَهْرًا وَلَمْ يَجِئَ أَحَدٌ مِنْ نَاحِيَةٍ إِلَّا حَدَّثَ بِالْجَوْدِ.
وَفِيْ رِوَايَةٍ قَالَ: ” اللّهُمَّ حَوَالَيْنَا وَلَا عَلَيْنَا اللّهُمَّ عَلَى الْآكَامِ وَالظِّرَابِ وَبُطُوْنِ الْأَوُدِيَةِ وَمَنَابِتِ الشَّجَرِ”. قَالَ: فَأَقْلَعَتِ وَخَرَجْنَا نَمْشِيْ فِي الشَّمْسِ. مُتَّفَقٌ عَلَيْهِ.
5902. (35) [3/1656 –ఏకీభవితం]
అనస్ (ర) కథనం: ప్రవక్త (స) కాలంలో ప్రజలు కరవు కాటకాలకు గురయ్యారు. ప్రవక్త (స) శుక్రవారం నాడు ప్రసంగిస్తున్నారు. ఒక పల్లెవాసి నిలబడి, ‘ఓ దైవప్రవక్తా! ధనసంపదలన్నీ నాశనం అయిపోయాయి. భార్యాబిడ్డలు ఆకలితో అలమ టిస్తున్నారు. మాకోసం దైవాన్ని ప్రార్థించండి,’ అని వేడుకున్నాడు. ప్రవక్త (స) తన చేతులు ఎత్తారు. అప్పటికి ఆకాశంలో ఎక్కడా మేఘాలు లేవు. ఎవరి చేతిలో నా ప్రాణం ఉందో ఆయన సాక్షి! ప్రవక్త (స) ఇంకా తన చేతులను దించనేలేదు. కొండల్లాంటి మేఘాలు వ్యాపించాయి. ప్రవక్త (స) ఇంకా మెంబరుపై నుండి క్రిందికి దిగనేలేదు. వర్షం నీరు ప్రవక్త (స) గడ్డంపై పడసాగింది. ఆ తరువాత ఆరోజు, రెండవ రోజు మూడవరోజు మళ్ళీ శుక్రవారంవరకు వర్షం పడు తూనే ఉంది. మరుసటి శుక్రవారం ఆ వ్యక్తి లేదా మరోవ్యక్తి వచ్చి, ‘ఓ అల్లాహ్ ప్రవక్తా! ఇళ్ళు పడిపోతున్నాయి. ధనసంపదలు మునిగి పోతున్నాయి. తమరు మా గురించి అల్లాహ్‌ను ప్రార్థించండి,’ అని విన్నవించు కున్నాడు. అనంతరం ప్రవక్త (స) చేతులెత్తి ఇలా దు’ఆ చేసారు, ”ఓ అల్లాహ్! మాపై కాక మా చుట్టు ప్రక్కల వర్షం కురిపించు.’ ఈ దు’ఆ చేసిన తరువాత ప్రవక్త (స) సైగ చేసిన వైపు మేఘాలు వేరవటం మొదలయ్యింది. చివరికి మదీనహ్ అంతా నీటిమయం అయిపోయింది. ఖనాత్ లోయ నెల రోజుల వరకు ప్రవహించసాగింది. చుట్టు ప్రక్కల నుండి మదీనహ్ వచ్చే ప్రతి వ్యక్తి వర్షం అధికంగా పడిందనే అంటున్నాడు.
మరో ఉల్లేఖనంలో ఇలా ఉంది, ”ప్రవక్త (స) ఇలా దు’ఆ చేసారు. ”ఓ అల్లాహ్! మా చుట్టుప్రక్కల కురిపించు. మాపై కురిపించకు. ఓ అల్లాహ్! కొండలపై, గుట్టలపై, కాలువల్లో, పొలాల్లో, తోటల్లో కురిపించు.” అనస్ (ర) ‘మేఘాలు తొలగిపోయాయి, మేము బయటకు వచ్చి చూడగా ఎండ ఉంది,’ అని అన్నారు. (బు’ఖారీ, ముస్లిమ్)
5903 – [36 ] ( صحيح ) (3/1656)
وعَنْ جَابِرٍ قَالَ: كَانَ النَّبِيُّ صلى الله عليه وسلم إِذَا خَطَبَ اسْتَنَدَ إِلى جِذْعٍ نَخْلَةٍ مِنْ سَوَارِيْ الْمَسْجِدِ فَلَمَّا صُنِعَ لَهُ الْمِنْبَر فَاسْتَوَى عَلَيْهِ صَاحَتِ النَّخْلَةُ الَّتِيْ كَانَ يَخْطُبُ عِنْدَهَا حَتّى كَادَتْ تَنْشَقَّ فَنَزَلَ النَّبِيُّ صلى الله عليه وسلم حَتَّى أَخَذَهَا فَضَمَّهَا إِلَيْهِ فَجَعَلَتْ تَئِنُّ أَنِيْنَ الصَّبِيِّ الَّذِيْ يُسَكَّتُ حَتّى اسْتَقَرَّتْ قَالَ بَكَتْ عَلَى مَا كَانَتْ تَسْمَعْ مِنَ الذِّكْرِ. روَاهُ الْبُخَارِيُّ.
5903. (36) [3/1656 –దృఢం]
జాబిర్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రసంగించినపుడు మస్జిద్ స్తంభంగా ఉన్న ఎండిపోయిన ఖర్జూరం కొమ్మను పట్టుకొని, నిలబడేవారు. ప్రవక్త (స) కోసం మెంబరు చేయబడిన తర్వాత ప్రవక్త (స) మెంబరుపై ప్రసంగించ టానికి నిలబడితే, ఆ ఎండిపోయిన ఖర్జూరపు స్తంభం కేకలు వేయసాగింది. ముక్కలై పోతుందేమో ననిపించింది. ప్రవక్త (స) మెంబరుపై నుండి క్రిందికి దిగి దాని వద్దకు వెళ్ళి చేతులతో పట్టుకొని, దానితో ఆలింగనం చేసారు. ఆ తరువాత ఆ కొమ్మ పసివాడిలా ఎక్కిళ్ళు తీస్తూ ఏడ్వసాగింది. దాన్ని ఓదార్చటం జరిగింది. ఏడ్పు ఆపివేసింది. ప్రవక్త (స), ”ఈ స్తంభం ఏడ్వటానికి కారణం అది దైవస్మరణ వినేది, దానికి దూరమైనందుకు ఏడ్చింది,” అని అన్నారు. (బు’ఖారీ)
5904 – [ 37 ] ( صحيح ) (3/1657)
وعَنْ سَلَمَةَ بْنِ الْأَكْوَعِ أَنَّ رَجُلًا أَكَلَ عِنْدَ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم بِشِمَالِهِ فَقَالَ: “كُلْ بِيَمِيْنِكَ”قَالَ: لَاأَسْتَطِيْعُ. قَالَ: “لَا اسْتَطَعْتَ”. مَا مَنَعَهُ إِلَّا الْكِبْرُ. قَالَ: فَمَا رَفَعَهَا إِلى فِيْهِ. رَوَاهُ مُسْلِمٌ.
5904. (37) [3/1657 –దృఢం]
సలమహ్ బిన్ అక్వ’అ (ర) కథనం: ప్రవక్త (స) ముందు ఒకవ్యక్తి తనఎడమచేతితో అన్నం తిన్నాడు. ప్రవక్త (స) అతనితో, ‘కుడిచేతితో తిను,’ అని అన్నారు. దానికి ఆ వ్యక్తి, ‘కుడిచేతితో తిన లేను,’ అన్నాడు. అప్పుడు ప్రవక్త (స), ‘నీవు ఎన్నడూ కుడిచేతితో తినలేవు,’ అని అన్నారు. అసలు విషయం ఏమిటంటే, ఆ వ్యక్తి అహంకారంగా కుడిచేతితో తినలేదు. ఉల్లేఖన కర్త కథనం ప్రకారం ఆ వ్యక్తి ఎన్నడూ తన కుడిచేతితో తిన లేక పోయాడు. (ముస్లిమ్)
5905 –] 38[ ( صحيح ) (3/1657)
وَعَنْ أَنَسٍ أَنَّ أَهْلَ الْمَدِيْنَةِ فَزِعُوْا مَرَّةً فَرَكِبَ النَّبِيُّ صلى الله عليه وسلم فَرَسًا لِأَبِيْ طَلْحَةَ بَطِيْئًا وَكَانَ يَقْطِفُ فَلَمَّا رَجَعَ قَالَ: “وَجَدْنَا فَرَسَكُمْ هَذَا بَحْرًا”. فَكَانَ بَعْدَ ذَلِكَ لَا يُجَارَى
وَفِيْ رِوَايَةٍ: فَمَا سَبَقَ بَعْدَ ذَلِكَ الْيَوْمِ. روَاهُ الْبُخَارِيُّ.
5905. (38) [3/1657– దృఢం]
అనస్ (ర) కథనం: ఒకసారి మదీనహ్ ప్రజలు ఆందో ళనకు గురై కేకలు పుకార్లు చేయసాగారు. ప్రవక్త (స) బలహీనమైన అబూ ‘తల్’హా గుర్రంపై ఎక్కి వెళ్ళారు. తిరిగి వచ్చిన తర్వాత ప్రవక్త (స) అబూ ‘తల్’హాతో, ‘నీ గుర్రంతో ఎవరూ పోటీ పడేవారు లేరు,’ అని అన్నారు. మరో ఉల్లే ఖనంలో, ‘ఆ రోజు నుండి ఏ గుర్రమూ దాన్ని ఓడించ లేక పోయింది.’ (బు’ఖారీ)
5906 – [ 39 ] ( صحيح ) (3/1657)
وعَنْ جَابِرٍ قَالَ: تُوُفِّيَ أَبِيْ وَعَلَيْهِ دَيْنٌ فَعَرَضْتُ عَلَى غُرَمَائِهِ أَنْ يَأْخُذُوْ ا التَّمْرَ بِمَا عَلَيْهِ. فَأَبَوْا. فَأَتَيْتُ النَّبِيَّ صلى الله عليه وسلم فَقُلْتُ: قَدْ عَلِمْتَ أَنَّ وَالِدِيْ اُسْتُشْهِدَ يَوْمَ أُحُدٍ وَتَرَكَ عَلَيْهِ دَيْنًا كَثِيْرًا وَإِنِّيْ أُحِبُّ أَنْ يَرَاكَ الْغُرَمَاءُ. فَقَالَ لِيْ: “اِذْهَبْ فَبَيْدِرُ كُلَّ تَمْرٍ عَلَى نَاحِيَةٍ فَفَعَلْتُ ثُمَّ دَعَوْتُهُ فَلَمَّا نَظَرُوْا إِلَيْهِ كَأَنَّهُمْ أُغْرُوْا بِيْ تِلْكَ السَّاعَةِ فَلَمَّا رَأَى مَا يَصْنَعُوْنَ طَافَ حَوْلَ أَعْظَمِهَا بَيدَرَاَ ثَلَاثَ مَرَّاتٍ ثُمَّ جَلَسَ عَلَيْهِ ثُمَّ قَالَ: “اُدْعُ لِيْ أَصْحَابَكَ”. فَمَا زَالَ يَكِيْلُ لَهُمْ حَتّى أَدَّى اللهُ عَنْ وَالِدِيْ أَمَانَتَهُ وَأَنَا أَرْضَى أَنْ يُؤَدِّي اللهُ أَمَانَةَ وَالِدِيْ وَلَا أَرْجِعُ إِلى أَخَوَاتِيْ بِتَمْرَةٍ فَسَلَّمَ اللهُ الْبَيَادِرَ كُلُّهَا وَحَتّى إِنِّيْ أَنْظُرُ إِلى الْبَيْدَرِ الَّذِيْ كَانَ عَلَيْهِ النَّبِيِّ صلى الله عليه وسلم كَأَنَّهَا لَمْ تَنْقُصْ تَمْرَةٌ وَاحِدَةٌ. روَاهُ الْبُخَارِيُّ .
5906. (39) [3/1657– దృఢం]
జాబిర్ బిన్ ‘అబ్దుల్లాహ్ (ర) కథనం: మా నాన్నగారు మరణించినపుడు, అతనిపై చాలా రుణం ఉంది. అనంతరం నేను వారందరితో, ‘మా దగ్గర ఉన్న ఖర్జూరాలను ఆ బాకీ ధనానికి బదులు తీసుకో మని కోరాను.’ కాని వారు దాన్ని తిరస్కరించారు. చివరికి నేను ప్రవక్త (స) వద్దకు వెళ్ళి, ‘ప్రవక్తా! మా నాన్నగారు ఉ’హుద్ యుద్ధంలో వీరమరణం పొందారు. అతనిపై చాలా రుణం ఉంది. మీ ద్వారా వాళ్ళు నాపట్ల ఉదారంగా వ్యవహరించాలని కోరుతున్నాను,’ అని విన్నవించుకున్నాను. దానికి ప్రవక్త (స), ‘వివిధ రకాల ఖర్జూరాలు కుప్పలుగా పెట్టి ఉంచు,’ అని అన్నారు. నేను వెళ్ళి అలాగే చేసాను. ఆ తరువాత నేను ప్రవక్త (స) ను పిలిచాను. అప్పు ఇచ్చిన వారు ప్రవక్త (స)ను చూచి ఆగ్రహం వ్యక్తం చేసారు. ప్రవక్త(స) వారి ఈ పరిస్థితి చూచి అన్నిటికంటే పెద్ద కుప్ప చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణ చేసి దానిపై కూర్చొని నువ్వు బాకీ ఉన్న వారిని పిలవమని అన్నారు. వాళ్ళు వచ్చారు. ప్రవక్త (స) ఆదేశంతో ఆ ఖర్జూరాల నుండి తూచి వారికి ఇవ్వసాగారు. అల్లాహ్(త) నా తండ్రిగారి అప్పంతా తీర్చివేసాడు. అల్లాహ్(త) మా తండ్రిగారి అప్పును తీర్చి వేసాడని, నా చెల్లెళ్ళు కోసం ఒక్క ఖర్జూరం కూడా తీసుకొని వెళ్ళక పోయినా ఫరవాలేదని సంతోషించాను. కాని అల్లాహ్(త) ఖర్జూరాల కుప్పలను అలాగే మిగిల్చి ఉంచాడు. అంతేకాదు, ప్రవక్త (స) కూర్చున్న కుప్ప ఒక్క ఖర్జూరం తీయనట్టుగా ఉండటం గమనించాను. (బు’ఖారీ)
5907 – [ 40 ] ( صحيح ) (3/1658)
وَعَنْهُ قَالَ: إِنَّ أُمَّ مَالِكٍ كَانَتْ تُهْدِيْ لِلنَّبِيِّ صلى الله عليه وسلم فِيْ عُكَّةٍ لَهَا سَمَنًا فَيَأْتِيْهَا بَنُوْهَا فَيَسْأَلُوْنَ الْأَدمَ وَلَيْسَ عِنْدَهُمْ شَيْءٌ فَتَعْمِدُ إِلى الَّذِيْ كَانَتْ تُهْدِيْ فِيْهِ لِلنَّبِيِّ صلى الله عليه وسلم فَتَجِدُ فِيْهِ سَمَنًا فَمَا زَالَ يُقِيْمُ لَهَا أَدَمَ بَيْتِهَا حَتّى عَصَرَتْهُ فَأَتَتِ النَّبِيّ صلى الله عليه وسلم فَقَالَ: “عَصَرْتِيْهَا”. قَالَتْ نَعَمْ. قَالَ: ” لَوْ تَرَكْتِيْهَا مَا زَالَ قَائِمًا”. روَاهُ مُسْلِمٌ.
5907. (40) [3/1658 –దృఢం]
జాబిర్ (ర) కథనం: మాలిక్ తల్లిగారు ప్రవక్త(స)కు ఒక గిన్నెలో నెయ్యి పంపేవారు. ఆమె పిల్లలు వచ్చి కూర అడిగే వారు. ఆమె వద్ద అటువంటి వస్తువు ఏదీ కానరాక ఆ గిన్నెను చూచి అందులో ఉన్న నెయ్యిని పిల్లలకు ఇచ్చేవారు. ఒకసారి ఆమె ఆ గిన్నెలో ఉన్న నెయ్యినంతా ఉపయోగించుకున్నారు. అంటే అందులో ఉన్న నెయ్యినంతా తీసుకున్నారు. ఆమె ప్రవక్త (స) వద్దకు వచ్చి, ఆ గిన్నెలో శుభం అంత రించటాన్ని గురించి విన్నవించుకున్నారు. అప్పుడు ప్రవక్త (స) ‘ఇందులో ఉన్న నెయ్యినంతా పిండేసావా?’ అని అడిగారు. దానికి ఆమె ‘అవునని’ అన్నారు. దానికి ప్రవక్త (స), ‘ఒకవేళ నువ్వు దాన్ని అలాగే ఉంచితే, ఎప్పుడూ అందులో నెయ్యి ఉండేది’ అని అన్నారు. (ముస్లిమ్)
5908 – [ 41 ] ( صحيح ) (3/1658)
وعَنْ أَنَسٍ قَالَ: قَالَ أَبُوْ طَلْحَةَ لِأُمِّ سُلَيْمٍ لَقَدْ سَمِعْتُ صَوْتَ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم ضَعِيْفًا أَعْرِفُ فِيْهِ الْجُوْعَ فَهَلْ عِنْدَكَ مِنْ شَيْءٍ؟ فَأَخْرَجَتْ أَقْرَاصًا مِنْ شَعِيْرٍ ثُمَّ أَخْرَجَت خِمَارًا لَهَا فَلَفَّتِ الْخُبْزَ بِبَعْضِهِ ثُمَّ دَسَّتْهُ تَحْتَ يَدِيْ وَلَاثَتْنِيْ بِبَعْضِهِ ثُمَّ أَرْسَلَتْنِيْ إِلى رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم قَالَ: فَذَهَبْتُ بِهِ فَوَجَدْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم فِي الْمَسْجِدِ وَمَعَهُ النَّاسُ فَقُمْتُ عَلَيْهِمْ فَقَالَ لِيْ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “أَرْسَلَكَ أَبُوْ طَلْحَةَ؟ “قُلْتُ نَعَمْ. فَقَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: لِمَنْ مَعَهُ قُوْمُوْا فَانْطَلَقَ وَانْطَلَقْتُ بَيْنَ أَيْدِيْهِمْ حَتَّى جِئْتُ أَبَا طَلْحَةَ فَقَالَ أَبُوْ طَلْحَةَ يَا أُمَّ سُلَيْمٍ قَدْ جَاءَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم بِالنَّاسِ وَلَيْسَ عِنْدَنَا مَا نُطْعِمُهُمْ. فَقَالَتْ اللهُ وَرَسُوْلُهُ أَعْلَمُ. قَالَ: فَانْطَلَقَ أَبُوْ طَلْحَةَ حَتّى لَقِيَ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم. فَأَقْبَلَ رَسُوْلُ الله صلى الله عليه وسلم وَأَبُوْ طَلْحَةَ مَعَهُ. فَقَالَ رَسُوْلُ الله صلى الله عليه وسلم: هَلُمِّيْ يَا أُمَّ سُلَيْمٍ مَا عِنْدَكَ فَأَتَتْ بِذَلِكَ الْخُبْزِ فَأَمَرَ بِهِ فَفُتَّ وَعَصَرَتْ أُمُّ سُلَيْمٍ عُكّة لَهَا فَأَدَمَتْهُ. ثُمَّ قَالَ: فِيْهِ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم مَا شَاءَ اللهُ أَنْ يَقُوْلَ ثُمَّ قَالَ: ائْذَنْ لِعَشَرَةٍ فَأَذِنَ لَهُمْ فَأَكَلُوْا حَتّى شَبِعُوْا ثُمَّ خَرَجُوْا ثُمَّ قَالَ: ائْذَنْ لِعَشَرَةٍ فَأَذِنَ لَهُمْ فَأَكَلُوْا حَتَّى شَبِعُوْا ثُمَّ خَرَجُوْا ثُمَّ قَالَ: ائْذَنْ لِعَشَرَةٍ فَأَذِنَ لَهُمْ فَأَكُلُوْا حَتّى شَبِعُوْا ثُمَّ خَرَجُوْا. ثُمَّ أذن لِعَشَرَةٍ فَأَكَلَ الْقَوْمُ كُلُّهُمْ وَشَبِعُوْا وَالْقَوْمُ سَبْعُوْنَ أَوْ ثَمَانُوْنَ رَجُلًا. مُتَّفَقٌ عَلَيْهِ.
وَفِيْ رِوَايَةٍ لِمُسْلِمٍ أَنَّهُ قَالَ: “أذَنْ لِعَشَرَةٍ “فَدَخَلُوْا فَقَالَ: “كُلُوْا وَسَمُّوْا اللهَ”. فَأَكَلُوْا حَتّى فَعَلَ ذَلِكَ بِثَمَانِيْنَ رَجُلًا ثُمَّ أَكَلَ النَّبِيُّ صلى الله عليه وسلم وَأَهْلَ الْبَيْتِ وَتَرَكَ سُؤْرًا.
وَفِيْ رِوَايَةٍ لِلْبُخَارِيِّ قَالَ: “أَدْخِلْ عَلَيَّ عَشَرَةً”. حَتّى عَدّ أَرْبَعِيْنَ ثُمَّ أَكَلَ النَّبِيُّ صلى الله عليه وسلم فَجَعَلْتُ أَنْظُرُ هَلْ نَقَصَ مِنْهَا شَيْءٌ؟
وَفِيْ رِوَايَةٍ لِمُسْلِمٍ: ثُمَّ أَخَذَ مَا بَقِيَ فَجَمَعَهُ ثُمَّ دَعَا فِيْهِ بِا لْبَرَكَةِ فَعَادَ كَمَا كَانَ فَقَالَ: “دُوْنَكُمْ هَذَا”.
5908. (41) [3/1658 –దృఢం]
అనస్ (ర) కథనం: అబూ ‘తల్’హా (ర) ‘ఉమ్మె సులైమ్‌తో ”ప్రవక్త (స) గొంతుక చాలా బలహీనంగా ఉంది. ఆకలితో ఉన్నారని నేననుకుంటున్నాను. మీ దగ్గర తినటానికి ఏమైనా ఉందా?’ అని అడిగారు. ఉమ్మె సులైమ్ (ర), ‘ఉంది’ అన్నారు. ఇలా చెప్పి ఆమె కొన్ని యవ్వ రొట్టెలు తీసుకొని వచ్చి, తన ఓణీలో ఒక వైపు చుట్టి నా చేతిలో పెట్టి రెండవ వైపు భాగాన్ని నా తలపై పగిడిలా చుట్టివేసారు. ఇంకా నన్ను ప్రవక్త(స) వద్దకు పంపారు. నేను ఆ రొట్టెలు తీసుకొని ప్రవక్త (స) వద్దకు వెళ్ళాను. అప్పుడు ప్రవక్త (స) మస్జిద్‌లో కూర్చొని ఉన్నారు. చాలామంది ఆయన చుట్టూ కూర్చొని ఉన్నారు. నేను వారి ముందు నిలబడ్డాను. ప్రవక్త (స) నన్ను ‘అబూ ‘తల్’హా నిన్ను పంపించాడా?’ అని అడిగారు. నేను ‘అవునని’ అన్నాను. అతను(స) అక్కడున్న వారితో ‘తినటానికి నిలబడండి,’ అని అన్నారు. ఆ తరువాత ప్రవక్త (స) ఇంకా ఇతరులందరూ అబూ ‘తల్’హా ఇంటికి బయలుదేరారు. నేను కూడా వారి ముందు ముందు నడిచాను. అబూ ‘తల్’హా వద్దకు వెళ్ళి, వచ్చినట్టు తెలియ పరచటం జరిగింది. అబూ ‘తల్’హా ఉమ్మె సులైమ్‌తో, ‘ప్రవక్త (స) వస్తున్నారు, ఆయన వెంట అనుచరులు కూడా ఉన్నారు. అందరికీ తినిపించినంత సరుకు మనవద్ద లేదు,’ అని అన్నారు. దానికి ఉమ్మె సులైమ్ ‘అల్లాహ్(త) మరియు ఆయన ప్రవక్తకే బాగా తెలుసు,’ అని అన్నారు. అనంతరం అబూ ‘తల్’హా స్వాగతం పలకటానికి ఇంటినుండి బయటకు వచ్చి ప్రవక్త (స)ను కలిసారు. ఆ తరువాత ప్రవక్త (స) అబూ ‘తల్’హా వెంట వచ్చారు. ఆ తరువాత ఉమ్మె సులైమ్! ‘మీ దగ్గర ఉన్న రొట్టె తీసుకురండి,’ అని అన్నారు. ఆమె తన వద్ద ఉన్న రొట్టెలను తీసుకు వచ్చారు. ప్రవక్త (స) అబూ ‘తల్’హాను ఆ రొట్టెలను ముక్కలు చేయమని చెప్పారు. రొట్టెలు ముక్కలు చేయబడ్డాయి. ఉమ్మె సులైమ్ గిన్నెలో నుండి నెయ్యి తీసుకొని వచ్చి పెట్టారు. ఆ తర్వాత ప్రవక్త (స) అన్నంలో శుభం కోసం దు’ఆ చేసారు. ఆ తరువాత ప్రవక్త (స) అబూ ‘తల్’హాతో 10 మందిని భోజనానికి పిలవండి అని అన్నారు. అతను 10 మందిని పిలుచుకు వచ్చారు. వారు కడుపు నిండా తిన్నారు. వారు లేచిన తర్వాత మరో పదిమందిని పిలిచారు. వారూ కడుపు నిండా తిన్నారు. ఆ తరువాత మరో 10 మందిని పిలవమని అన్నారు. వాళ్ళు వచ్చి కడుపునిండా తిని వెళ్ళిపోయారు. ఈ విధంగా అనుచరులందరూ కడుపు నిండా తిన్నారు. అప్పుడు వారి సంఖ్య 70 లేక 80 ఉంటుంది. (బు’ఖారీ, ముస్లిమ్)
ముస్లిమ్ ఉల్లేఖనంలో ఇలా ఉంది, ”ప్రవక్త (స) 10 మందిని పిలవమన్నారు. వాళ్ళు వచ్చారు. ప్రవక్త (స) వారితో ‘అల్లాహ్ పేరుతో ప్రారంభించండి,’ అని అన్నారు. వారు తిని లేచారు. చివరికి 80 మంది వరకు కడుపునిండా తిన్నారు. ఆ తరువాత ప్రవక్త (స) మరియు ఇంటివారు తిన్నారు. అయితే భోజనం ఇంకా మిగిలే ఉంది.
బు’ఖారీ ఉల్లేఖనంలో ఇలా ఉంది, ”నా వద్దకు 10 మందిని తీసుకురండి అని ప్రవక్త (స) అన్నారు. ఈ విధంగా ప్రవక్త (స) 40 వరకు లెక్కపెట్టారు. ఆ తరువాత ప్రవక్త(స) తిన్నారు. భోజనం ఏమాత్రం తగ్గనట్టు చూస్తూ ఉండి పోయాను.
ముస్లిమ్ ఉల్లేఖనంలో ఇలా ఉంది, ”ఆ తరువాత మిగిలిన భోజనాన్ని ఒకచోట చేర్చి, మళ్ళీ దు’ఆ చేసారు. భోజనం అంతకు ముందు ఉన్న పరిమాణంలో ఉన్నట్టే ఉంది. అప్పుడు ప్రవక్త (స) ”దీన్ని తీసుకొని ఉంచుకొని తినండి,” అని అన్నారు.
5909 – [ 42 ] ( مُتَّفَقٌ عَلَيْهِ ) (3/1659)
وَعَنْهُ قَالَ: أُتِيَ النَّبِيُّ صلى الله عليه وسلم بِإِنَاءٍ وَهُوَ بِالزَّوْرَاءِ فَوَضَعَ يَدَهُ فِي الْإِنَاءِ فَجَعَلَ الْمَاءُ يَنْبُعُ مِنْ بَيْنَ أَصَابِعِهِ فَتَوَضَّأَ الْقَوْمُ قَالَ قَتَادَةُ: قُلْتُ لِأَنَسٍ: كَمْ كُنْتُمْ؟ قَالَ: ثَلَاثُمِائَةِ أَوْ زَهَاءَ ثَلَاثِمِائَةٍ. مُتَّفَقٌ عَلَيْهِ.
5909. (42) [3/1659– ఏకీభవితం]
అనస్ (ర) కథనం: ప్రవక్త (స) ‘జౌరాఅ’ అనే గ్రామం వెళ్ళి నపుడు, ఆయన వద్దకు ఒక గిన్నె తీసుకు రావటం జరిగింది. ప్రవక్త (స) తన చేతిని అందులో పెట్టారు. ప్రవక్త (స) చేతి వ్రేళ్ళ మధ్య నుండి నీళ్ళు ప్రవహించ సాగాయి. అనంతరం ప్రజలందరూ ఆ నీటితో వు’దూ చేసారు. ఖతాదహ్ (ర) కథనం: నేను అనస్ (ర) ను ‘అప్పుడు మీరు ఎంతమంది ఉన్నారు’ అని అడిగాను. దానికి అనస్ (ర), ‘300 లేదా సుమారు 300,’ అని సమాధానం ఇచ్చారు. (బు’ఖారీ, ముస్లిమ్)
5910 – [ 43 ] ( صحيح ) (3/1659)
وعَنْ عَبْدِ اللهِ بْنِ مَسْعُوْدٍ قَالَ: كُنَّا نَعُدُّ الْآيَاتِ بِرَكَةً وَأَنْتُمْ تَعُدُّوْنَهَا تَخْوِيْفًا كُنَّا مَعَ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم فِيْ سَفَرٍ. فَقَلَّ الْمَاءُ فَقَالَ: “اُطْلُبُوْا فَضْلَةً مِنْ مَاءٍ”. فجَاءُوْا بِإِنَاءٍ فِيْهِ مَاءٌ قَلِيْلٌ فَأَدْخَلَ يَدَهُ فِيْ الْإِنَاءٍ ثُمَّ قَالَ: “حَيَّ عَلَى الطَّهُوْرِ الْمُبَارَكِ وَالْبَرَكَةِ مِنَ اللهِ”. فَلَقَدْ رَأَيْتُ الْمَاءَ يَنْبُعُ مِنْ بَيْنَ أَصَابِعِ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم. وَلَقَدْ كُنَّا نَسْمَعُ تَسْبِيْحَ الطَّعَامِ وَهُوَ يُؤْكَلُ. روَاهُ الْبُخَارِيُّ.
5910. (43) [3/1659– దృఢం]
‘అబ్దుల్లాహ్ బిన్ మస్’ఊద్ (ర) కథనం: మేము మహిమలను శుభానికి కారకాలుగా భావించే వాళ్ళం. మీరు భయపెట్టటానికి కారకాలుగా భావిస్తున్నారు. మేము ఒక ప్రయాణంలో ప్రవక్త (స) వెంట ఉన్నాం. నీళ్ళ కొరత ఏర్పడింది. అప్పుడు ప్రవక్త (స) ఎక్కడి నుండైనా కొన్ని నీళ్ళు తీసుకురమ్మని ఆదేశించారు. అనుచరులు ప్రవక్త (స) వద్దకు చాలా తక్కువగా నీళ్ళు ఉన్న గిన్నెను తీసుకువచ్చారు. ప్రవక్త (స) తన చేతిని అందులో పెట్టారు. ఇంకా, ‘రండి! తొంద రగా ఈ పరిశుభ్రమైన శుభకరమైన నీటిని తీసుకోండి. ఈ శుభం అల్లాహ్ (త) తరఫు నుండే అవతరింప జేయబడింది.’ ‘అబ్దుల్లాహ్ బిన్ మస్’ఊద్ (ర) నీళ్ళు ప్రవక్త (స) చేతి వ్రేళ్ళ మధ్యనుండి నీటి ఊటలా ప్రవహించసాగాయి. మేము భోజనం చేసినపుడు అన్నం తస్‌బీహ్ శబ్దం వినబడేది. (బు’ఖారీ)
5911 – [ 44 ] ( صحيح ) (3/1659)
وَعَنْ أَبِيْ قَتَادَةَ قَالَ: خَطَبَنَا رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم فقَالَ: إِنَّكُمْ تَسِيْرُوْنَ عَشِيَّتَكُمْ وَلَيْلَتَكُمْ وَتَأْتُوْنَ الْمَاءَ إِنْ شَاءَ اللهُ غَدًا فَانْطَلَقَ النَّاسُ لَا يَلْوِيْ أَحَدٌ عَلَى أَحَدٍ قَالَ: أَبُوْ قَتَادَةَ فَبَيْنَمَا رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم يَسِيْرُ حَتّى اِبْهَار اللَّيْلَ فَمَالَ عَنِ الطَّرِيْقِ فَوَضَعَ رَأْسَهُ ثُمَّ قَالَ اِحْفَظُوْا عَلَيْنَا صَلَاتنَا فَكَانَ أَوَّلَ مَنِ اسْتَيْقَظَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم وَالشَّمْسُ فِيْ ظَهْرِهِ. ثُمَّ قَالَ: ارْكَبُوْا فَرَكِبْنَا فَسِرْنَا حَتّى إِذَا ارْتَفَعَتِ الشَّمْسُ نَزَلَ ثُمَّ دَعَا بِمِيْضَأةٍ كَانَتْ مَعِيَ فِيْهَا شَيْءٌ مِنْ مَاءٍ. قَالَ: فَتَوَضَّأَ مِنْهَا وُضُوْءًا دُوْنَ وُضُوْءٍ. قَالَ: وَبَقِيَ فِيْهَا شَيْءٌ مِنْ مَاءٍ ثُمَّ قَالَ: اِحْفَظْ عَلَيْنَا مِيْضَأتَكَ فَسَيَكُوْنُ لَهَا نَبْأٌ ثُمَّ أَذَّنَ بِلَالٌ بِالصَّلَاةِ فَصَلّى رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم رَكْعَتَيْنِ ثُمَّ صَلّى الْغَدَاةَ وَرَكِبَ وَرَكِبْنَا مَعَهُ فَانْتَهَيْنَا إِلى النَّاسِ حِيْنَ امْتَدَّ النَّهَارُ وَحَمِيَ كُلَّ شَيْءٍ وَهُمْ يَقُوْلُوْنَ: يَا رَسُوْلَ اللهِ هَلَكْنَا وَعَطِشْنَا. فَقَالَ: لَا هُلْكَ عَلَيْكُمْ وَدَعَا بِالْمِيْضَأةِ فَجَعَلَ يَصُبُّ وَأَبُوْقَتَادَةَ يَسْقِيْهِمْ فَلَمْ يَعْدُ أَنْ رَأَى النَّاسُ مَاءُ فِي الْمِيْضَأةِ تَكَابَّوْا عَلَيْهَا. فَقَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: أَحْسِنُوْا الْمَلَأَ كُلُّكُمْ سَيُرْوَى. قَالَ: فَفَعَلُوْا فَجَعَلَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم يَصُبُّ وَأَسْقِيْهِمْ حَتّى مَا بَقِيَ غَيْرِيْ وَغَيْرُ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم ثُمَّ صَبَّ. فَقَالَ لِيْ اِشْرَبْ فَقُلْتُ لَا أَشْرَبُ حَتّى تَشْرَبَ يَا رَسُوْلَ اللهِ. قَالَ: إِنَّ سَاقِيَ الْقَوْمِ آخِرُهُمْ شربا. قَالَ: فَشَرِبْتُ وَشَرِبَ. قَالَ: فَأَتَى النَّاسُ الْمَاءَ جَامِّيْنَ رِوَاءً. رَوَاهُ مُسْلِمٌ هَكَذَا فِيْ صَحِيْحِهِ وَكَذَا فِيْ كِتَابِ الْحَمِيْدِيِّ وَجَامِعِ الْأُصُوْلِ وَزَادَ فِي الْمَصَابِيْحِ بَعْدَ قَوْلِهِ آخِرُهُمْ لَفْظَةَ شُرْبًا.
5911. (44) [3/1659 –దృఢం]
అబూ ఖతాదహ్ (ర) కథనం: ప్రవక్త (స) మా ముందు ప్రసంగిస్తూ, ”మీరు ఈ రాత్రి మొదటి నుండి చివరి వరకు ప్రయాణిస్తారు. అల్లాహ్ కృప ఉంటే రేపు నీటి దగ్గరకు చేరుకుంటారు,” అని అన్నారు. అనంతరం అందరూ బయలు దేరారు. అప్పుడు ఒకర్ని ఇంకొకరు పట్టించు కోకుండా ఉన్నారు. ప్రవక్త (స) కూడా వెళ్ళి పోతున్నారు. అర్థ రాత్రి కాగానే ప్రవక్త (స) మార్గానికి ఒక ప్రక్క దిగారు. తలగడ వేసుకొని విశ్రాంతి తీసుకున్నారు. ఇంకా, ‘మా నమా’జు గురించి గుర్తుంచండి’ అని అన్నారు. ఆ తరువాత అందరికంటే ముందు ప్రవక్త (స) మేల్కొన్నారు. అప్పటికి ఎండ వీపుపై పడసాగింది. ఆ తరువాత ప్రవక్త (స) వాహనాలపై ఎక్కండి అన్నారు. మేము ఎక్కి నడవ సాగాము. చివరికి సూర్యుడు చాలా ఎత్తుకు చేరుకున్నాడు. ప్రవక్త (స) వాహనంపై నుండి దిగారు. ప్రవక్త(స) వు’దూ చేసే గిన్నె తెప్పించారు. అది నా దగ్గర ఉంది. అందులో కొన్ని నీళ్ళు మాత్రమే ఉండేవి. ప్రవక్త (స) ఆ నీటి ద్వారా అతి తక్కువ నీటితో వు’దూ చేసారు. గిన్నెలో కొన్ని నీళ్ళు మాత్రమే మిగిలాయి. ప్రవక్త (స) మా కోసం ఆ వు’దూ నీటిని భద్రపరచి ఉంచండి, ఎందుకంటే త్వరలో ఆ గిన్నెకు ఔన్నత్యం లభించబోతుంది. ఆ తరువాత బిలాల్ (ర), ఫజ్‌ర్ నమా’జు కోసం అజా’న్ ఇచ్చారు. ప్రవక్త (స) రెండు రకాతులు సున్నత్ చదివారు. ఆ తరువాత ఫజ్‌ర్ నమా’జు చదివించారు. ఆ తర్వాత ప్రవక్త (స) వాహనంపై ఎక్కారు. మేము కూడా ప్రవక్త (స)తో పాటు మా వాహనాలపై ఎక్కాము. మా కంటే ముందుగా దిగి ఉన్నవారి వద్దకు చేరుకున్నాము. అప్పటికి చాలా పొద్దు ఎక్కి ఉంది. ప్రతి వస్తువు వేడిగా ఉంది. ప్రవక్త (స) అనుచరులు, ‘ఓ ప్రవక్తా! మనం ఎండ వేడికి నాశనం అయిపోతాము, ఎందుకంటే అందరికీ తీవ్ర దాహంగా ఉంది,’ అని అనసాగారు. దానికి ప్రవక్త (స), ‘మీరు నాశనం ఎంతమాత్రం కారు,’ అని అన్నారు. ప్రవక్త (స) ఆ వు’దూ గిన్నెను తెప్పించారు, ఇంకా ఆ గిన్నెతో నీటిని త్రాపించటం ప్రారంభించారు. అబూ ఖతాదహ్ ప్రజలకు నీళ్ళు త్రాపించటం ప్రారంభిం చారు. అనుచరు లందరూ ఆ గిన్నెలో నుండి నీళ్ళు పడటం చూడగానే ఆ గిన్నెపై విరుచుకుపడ్డారు. అప్పుడు ప్రవక్త (స) నిదా నంగా రండి, నీళ్ళు అంద రికీ లభిస్తాయి. వెంటనే ప్రజలు నిదానంగా వ్యవహ రించారు. ఆ తర్వాత ప్రవక్త (స) నీళ్ళు వేయటం, నేను నీళ్ళు త్రాగించటం ప్రారం భించాను. చివరికి అందరూ సంతృప్తిగా నీళ్ళు త్రాగారు. నేనూ మరియు ప్రవక్త (స) తప్ప అందరూ నీళ్ళు త్రాగారు. ప్రవక్త (స) నీల్ళు పోసి నీళ్ళు త్రాగు అన్నారు. దానికి నేను, ‘ఓ ప్రవక్తా! తమరు త్రాగే వరకు నేను త్రాగలేను,’ అని అన్నాను. అప్పుడు ప్రవక్త (స) ‘ప్రజలకు త్రాగించే వాడు చివరివ్యక్తి అవుతాడు.’ అంటే ‘ప్రజలకు త్రాపించేవాడు అందరి తరువాత త్రాగు తాడు,’ అని అన్నారు. నేను త్రాగాను, ప్రవక్త (స) త్రాగారు. ఆ తరువాత నీరు ఉన్న చోటుకు చేరు కున్నప్పుడు మాలో ప్రతి ఒక్కరూ తృప్తిగా నీళ్ళు త్రాగి, విశ్రాంతి తీసుకొని ఉన్నారు. [26] (‘స’హీ’హ్ ముస్లిమ్)
5912 – [ 45 ] ( صحيح ) (3/1660)
وعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: لَمَّا كَانَ يَوْمُ غَزْوَةِ تَبُوْكَ أَصَابَ النَّاسَ مَجَاعَةٌ فَقَالَ عُمَرُ: يَا رَسُوْلَ اللهِ اُدْعُهُمْ بِفَضْلِ أَزْوَادِهِمْ ثُمَّ ادْعُ اللهَ لَهُمْ عَلَيْهَا بِالْبَرَكَةِ فَقَالَ: نَعَمْ قَالَ فَدَعَا بِنِطْعٍ فَبُسِطَ ثُمَّ دَعَا بِفَضْلِ أَزْوَادِهِمْ فَجَعَلَ الرَّجُلُ يَجِيْءُ بِكَفِّ ذُرَةٍ وَيَجِيْءُ الْآخَرُ بِكَفِّ تَمْرٍ وَيَجْيْءُ الْآخَرُ بِكِسْرَةٍ حَتّى اجْتَمَعَ عَلَى النِّطْعِ شَيْءٌ يَسِيْرٌ فَدَعَا رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم بِالْبَرَكَةِ ثُمَّ قَالَ: خُذُوْا فِي أَوْعِيَتِكُمْ فَأَخَذُوْا فِيْ أَوْعِيَتِهِمْ حَتَّى مَا تَرَكُوْا فِي الْعَسْكَرِ وَعَاءً إِلّا مَلَؤُوْهُ قَالَ: فَأَكَلُوْا حَتّى شَبِعُوْا وَفَضِلتْ فَضْلَةٌ فَقَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “أَشْهَدُ أَنْ لَا إِلَهَ إِلَّا اللهُ وَأَنِّيْ رَسُوْلُ اللهِ لَا يَلْقَى الله بِهِمَا عَبْدٌ غَيْرَ شَاكٍ فَيُحْجَبَ عَنِ الْجَنَّةِ”. رَوَاهُ مُسْلِمٌ.
5912. (45) [3/1660 –దృఢం]
అనస్ (ర) కథనం : ప్రవక్త (స)కు ‘జైనబ్ (ర)తో నికా’హ్ జరిగింది. మా తల్లిగారు ఉమ్మె సులైమ్ ఖర్జూరం, నెయ్యి, పనీర్‌లు కలిపి మలీదహ్ చేసి ఒక గిన్నెలో పెట్టి నన్ను అనస్! దీన్ని ప్రవక్త (స) వద్దకు తీసుకొని వెళ్ళు, ఇంకా మా అమ్మగారు తమరికి పంపించారు అని చెప్పి, ఇంకా నా తరఫున సలామ్ చెప్పు అని చెప్పి పంపారు. అనస్ (ర) ప్రవక్త (స) వద్దకు వెళ్ళి మా అమ్మగారు చెప్పినదంతా చెప్పాను. ప్రవక్త (స) దాన్ని అక్కడ ఉంచు అని పలికి, ‘ఫలానా, ఫలానా వ్యక్తులను పిలుచుకు రా, ఇంకా దారిలో నీకు కలసిన వారిని కూడా పిలుచుకు రా,’ అని అన్నారు. అనంతరం నేను వెళ్ళాను. పిలవమని చెప్పిన వారిని, నన్ను కలిసిన వారిని పిలుచుకు వచ్చాను. నేను ఇంటికి తిరిగి వచ్చి చూస్తే ఇల్లు ప్రజలతో నిండి ఉంది. అనస్ (ర)ను, ‘మీరంతా ఎంతమంది ఉన్నారు,’ అని ప్రశ్నించడం జరిగింది. దానికి అతను, ‘సుమారు 300 మంది,’ అని అన్నారు. ఆ తరువాత ప్రవక్త (స) ఆ మలీదహ్‌పై తన చేయిని ఉంచారు. శుభం కోసం దు’ఆ చేసారు. ఆ తరువాత 10 మందిని పిలిచారు. వాళ్ళు అందులో నుండి తినసాగారు. ప్రవక్త (స) వారితో తినే ముందు అల్లాహ్ (త)ను స్మరించండి అని, ప్రతి వ్యక్తి తన ముందు నుండి తినాలని చెబుతూ పోయారు. పది మంది తిని వెళ్ళిన తర్వాత 10 మంది తినటానికి వచ్చే వారు. అందరూ తృప్తిగా తిన్నారు. ఆ తరువాత ప్రవక్త (స), ‘అనస్! ఈ గిన్నెను తీసుకో,’ అన్నారు. అయితే ఆ గిన్నె తీసినపుడు అందులో మలీదహ్ అధికంగా ఉందో, లేక కంచం ఎత్తినపుడు అందులో అన్నం ఎక్కువగా ఉందో తెలియదు. (బు’ఖారీ, ముస్లిమ్)
5913 – [ 46 ] ( مُتَّفَقٌ عَلَيْهِ ) (3/1661)
وَعَنْ أَنَسٍ: كَانَ النَّبِيُّ صلى الله عليه وسلم عُرُوْسًا بِزَيْنَبَ فَعَمِدَتُ أُمِّيْ أُمُّ سُلَيْمٍ إِلى تَمْرٍ وَسَمَنٍ وَأَقِطٍ فَصَنَعَتْ حَيْسًا فَجَعَلَتْهُ فِي تَوْرٍ. فَقَالَتْ: يَا أَنَس اِذْهَبْ بِهَذَا إِلى رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم فَقُلْ: بَعَثَتْ بِهَذَا إِلَيْكَ أُمِّيْ وَهِيَ تُقْرِئُكَ السَّلَامَ وَتَقُوْلُ إِنَّ هَذَا لَكَ مِنَّا قَلِيْلٌ يَا رَسُوْلَ اللهِ قَالَ: فَذَهَبْتُ فَقُلْتُ: فَقَالَ ضَعْهُ ثُمَّ قَالَ اِذْهَبْ فَادْعُ لِيْ فُلَانًا وَفُلَانًا وَفُلَانًا رِجَالًا سَمَّاهُمْ وَادْعُ مَنْ لَقِيْتَ فَدَعَوْتُ مَنْ سَمّى وَمَنْ لَقِيْتُ فَرَجَعْتث فَإِذَا الْبَيْتُ غَاصٌّ بِأَهْلِهِ. قِيْلَ لِأَنَسٍ عَدَدُكُمْ كَانُوْا؟ قَالَ زُهَاءُ ثَلَاثِ مِاَئةٍ. فَرَأَيْتُ النَّبِيَّ صلى الله عليه وسلم وَضَعَ يَدَهُ عَلَى تِلْكَ الْحِيْسَةِ وَتَكَلَّمَ بِمَا شَاءَ اللهُ ثُمَّ جَعَلَ يَدْعُوْ عَشَرَةً عَشَرَةً يَأْكُلُوْنَ مِنْهُ وَيَقُوْلُ لَهُمْ: “اُذْكُرُوْا اسْمَ اللهِ وَلْيَأْكُلْ كُلُّ رَجُلٍ مِمَّا يَلِيْهِ”. قَالَ: فَأَكَلُوْا حَتَّى شَبِعُوْا. فَخَرَجَتْ طَائِفَةٌ وَدَخَلَتْ طَائِفَةٌ حَتّى أَكَلُوْا كُلُّهُمْ. قَالَ لِيْ يَا أَنَسُ اِرْفَعْ. فَرَفَعْتُ فَمَا أَدْرِيْ حِيْنَ وَضَعْتُ كَانَ أَكْثَرَ أَمْ حِيْنَ رَفَعْتُ. مُتَّفَقٌ عَلَيْهِ.
5913. (46) [3/1661 –ఏకీభవితం]
అబూ హురైరహ్ (ర) కథనం: తబూక్ యుద్ధం నాడు, ప్రజలకు చాలా తీవ్ర ఆకలిగా ఉండేది. అప్పుడు ‘ఉమర్ (ర), ‘ప్రవక్తా! తమరు ప్రజలను వారి దగ్గర మిగిలి ఉన్న ఆహారాన్ని తెప్పించి, వాటిపై శుభం కోసం దు’ఆ చేస్తే బాగుణ్ణు’ అని అన్నారు. దానికి ప్రవక్త (స), ‘మంచిది,’ అని అన్నారు. అనంతరం ప్రవక్త (స) చర్మం చాప తెప్పించారు. దాన్ని పరచటం జరిగింది. ఆ తరువాత ప్రవక్త (స) ప్రజలను వారి మిగిలిన ఆహారా లన్నిటినీ తీసుకురమ్మని ఆదేశించారు. కొందరు పిడికెడు యవ్లలు, కొందరు పిడికెడు ఖర్జూరాలు కొందరు రొట్టె ముక్కలు తీసుకువచ్చారు. ఈ విధంగా చాపపై కొన్ని వస్తువులు చేర్చటం జరిగింది. ప్రవక్త (స) శుభం కోసం దు’ఆ చేసారు. ఆ తరువాత మీ గిన్నెల్లోకి తీసుకోండి అన్నారు. అనంతరం ప్రజలు తమతమ ప్లేట్లలో నింపుకున్నారు. సైన్యంలో ఉన్నవారందరూ తమ గిన్నెల్లో, కంచాల్లో నింపుకున్నారు. ఆ తరువాత సైన్యమంతా కడుపు నిండా ఆరగించింది. ఇంకా చాలా అన్నం మిగిలింది. ఆ తరువాత ప్రవక్త (స), ‘అల్లాహ్ తప్ప ఆరాధ్యులెవరూ లేరని, నేను అల్లాహ్(త) ప్రవక్తనని సాక్ష్యం ఇస్తున్నాను. ఎవరైనా ఎటువంటి సందేహం లేకుండా ఈ రెండు విషయాలను విశ్వసిస్తే, స్వీకరిస్తే, అల్లాహ్(త)ను కలుసుకున్నప్పుడు అతడు స్వర్గంలో వెళ్ళకుండా ఆపడం జరగదు,’ అని ప్రవచించారు.” (ముస్లిమ్)
5914 – [ 47 ] ( مُتَّفَقٌ عَلَيْهِ ) (3/1661)
وَعَنْ جَابِرٍ قَالَ: غَزَوْتُ مَعَ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم وَأَنَا عَلَى نَاضِحٍ لَنَا قَدْ أَعْيَا فَلَا يَكَادُ يَسِيْرُ فَتَلَاحَقَ بِيَ النَّبِيُّ صلى الله عليه وسلم. فَقَالَ لِيْ: مَا لِبَعِيْرِكَ. قُلْتُ : قَدْعَيي فَتَخَلَّفَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم فَزَجَرَهُ وَدَعَا لَهُ فَمَا زَالَ بَيْنَ يَدَيِ الْإِبِلِ قُدَّامَهَا يَسِيْرُ فَقَالَ لِيْ كَيْفَ تَرَى بَعِيْرَكَ قَالَ: قُلْتُ بِخَيْرٍ قَدْ أَصَابَتْهُ بَرَكَتُكَ. قَالَ: أَفَتَبِيْعُنِيْهِ بِوُقِيَّةٍ. فَبِعَتُهُ عَلَى أَنْ لِيْ فَقَارَ ظَهْرِهِ حَتّى الْمَدِيْنَةَ فَلَمَّا قَدِمَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم اَلْمَدِيْنَةُ غَدَوْتُ عَلَيْهِ بِالْبَعِيْرِ فَأَعْطَانِيْ ثَمَنَهُ وَرَدَّهُ عَلَيَّ. مُتَّفَقٌ عَلَيْهِ.
5914. (47) [3/1661 –ఏకీభవితం]
జాబిర్ (ర) కథనం: నేను ఒక యుద్ధంలో ప్రవక్త (స) వెంట ఉన్నాను. నేను నీళ్ళు తోడే ఒక బలహీనమైన ఒంటెపై కూర్చుని ఉన్నాను. అది చాలా అలసి పోయింది, నడవలేకపోతుంది. ప్రవక్త (స)నన్ను కలిసారు. ‘నీ ఒంటెకు ఏమయింది?’ అని అడిగారు. దానికి నేను, ‘అలసిపోయింది,’ అని అన్నాను. అనంతరం ప్రవక్త (స) వెనక్కితగ్గారు. ప్రవక్త(స) ఒంటెను తోలి, దాని గురించి దు’ఆ చేసారు. వెంటనే ఆ ఒంటె ఒంటెలన్నింటి కంటే ముందు నడిచేది. ఆ తరువాత ప్రవక్త (స), ‘నీ ఒంటె ఎలా నడుస్తుందని,’ అడిగారు. దానికి నేను, ‘బాగా నడుస్తుంది, దానికి మీ శుభవచనాలు తగిలాయి,’ అని అన్నాను. అప్పుడు ప్రవక్త (స) నాతో, ‘ఆ ఒంటెను ఒక ‘ఊఖియకి అమ్ముతావా,’ అన్నారు. అయితే నేను మదీనహ్ వరకు దానిపై ప్రయాణిస్తాను అనే షరతుతో ప్రవక్త (స)కు అమ్మివేసాను. మదీనహ్ చేరిన తర్వాత ఉదయం నేను ఆ ఒంటెను ప్రవక్త (స) వద్దకు తీసుకొని వెళ్ళాను. ప్రవక్త (స) దాని వెల ఇచ్చారు, ఇంకా ఒంటెను కూడా తిరిగి ఇచ్చివేసారు. (బు’ఖారీ)
5915 – [ 48 ] ( مُتَّفَقٌ عَلَيْهِ ) (3/1662)
وَعَنْ أَبِيْ حُمَيْدِ السَّاعِدِيِّ قَالَ: خَرَجْنَا مَعَ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم غَزْوَةَ تَبُوْكَ فَأَتَيْنَا وَادِيَ الْقُرَى عَلَى حَدِيْقَةِ لِامْرَأَةٍ فَقَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “اُخْرُصُوْهَا”فَخَرَصْنَاهَا وَخَرَصَهَا رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم عَشَرَةَ أَوْسُقٍ وَقَالَ: “أَحْصِيْهَا حَتّى نَرْجِعَ إِلَيْكَ إِنْ شَاءَ اللهُ”. وَانْطَلَقْنَا حَتَّى قَدِمْنَا تَبُوْكَ. فَقَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “سَتَهُبُّ عَلَيْكُمُ اللَّيْلَةَ رِيْحٌ شَدِيْدَةٌ فَلَا يَقُمْ فِيْهَا أَحَدٌ مِنْكُمْ فَمَنْ كَانَ لَهُ بَعِيْرٌ فَلْيَشُدُّ عِقَالَهُ ” فَهَبَّتْ رِيْحٌ شَدِيْدَةٌ. فَقَامَ رَجُلٌ فَحَمَلَتْهُ الرِّيْحُ حَتَّى أَلْقَتْهُ بِجَبَلَيْ طَيَئٍ. ثُمَّ أَقْبَلْنَا حَتّى قَدِمْنَا وَادِيَ الْقُرَى. فَسَأَلَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: اَلْمَرْأَةَ عَنْ حَدِيْقَتِهَا كَمْ بَلَغَ ثَمَرُهَا فَقَالَتْ: عَشَرَةَ أَوْسُقٍ. مُتَّفَقٌ عَلَيْهِ
5915. (48) [3/1662- ఏకీభవితం]
అబూ ‘హుమైద్ సా’యిదీ (ర) కథనం: మేము ప్రవక్త (స) వెంట తబూక్ యుద్ధానికి బయలుదేరాము. మేము ఖురాఅ’ లోయలో ఒక మహిళ తోటలోనికి చేరాము. ప్రవక్త (స) ”లెక్కపెట్టి చెప్పండి, ఈ తోటలో ఎన్ని పళ్ళు ఉండవచ్చు,” అని అన్నారు. మేమందరం తమతమ అభిప్రాయాల ప్రకారం, ’10 వసఖ్‌లు ఉంటాయని’ అన్నాం. ఆ తరువాత ఆ మహిళతో, ‘నువ్వు వీటిని తూచుకో, మేము మళ్ళీ వస్తాము, ఇన్‌షాఅల్లాహ్,’ అని ప్రవక్త (స) అన్నారు. అక్కడి నుండి బయలుదేరి మేము తబూక్ చేరుకున్న తరువాత ప్రవక్త (స), ‘ఈ రోజు రాత్రి తీవ్రమైన తుఫాను వస్తుందని,’ అన్నారు. అయితే రాత్రిపూట ఎవరూ నిలబడకూడదు. ఒంటె ఉన్నవారు దాన్ని త్రాడుతో గట్టిగా కట్టి వేయాలి,’ అని అన్నారు. అనంతరం తీవ్రమైన సుడిగాలి వచ్చింది. ఒక వ్యక్తి నిలబడ్డాడు. సుడిగాలి అతన్ని ఎత్తుకొని పోయి బనూతై వర్గం ఉన్న రెండు కొండల మధ్య విసిరి వేసింది. మేము తబూక్ నుండి తిరిగి మదీనహ్ బయలుదేరి ఖురాఅ’ లోయ చేరు కున్నాము. అప్పుడు ప్రవక్త (స) ఆ మహిళతో, ‘ఈ తోటలో ఎన్ని పళ్ళు అయ్యాయి,’ అని అడిగారు. దానికి ఆ మహిళ, ’10 వసఖ్‌ల పళ్ళు ఉన్నాయని,’ చెప్పింది. [27] (బు’ఖారీ, ముస్లిమ్)
5916 – [ 49 ] ( صحيح ) (3/1662)
وعَنْ أَبِيْ ذَرٍّ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِنَّكُمْ سَتَفْتَحُوْنَ مِصْرَ وَهِيَ أَرَضٌ يُسَمَّى فِيْهَا الْقِيْرَاطُ فَإِذَا فَتَحْتُمُوْهَا فَأَحْسِنُوْا إِلى أَهْلِهَا فَإِنَّ لَهَا ذِمَّةً وَرَحِمًا أَوْ قَالَ: ذِمَّةً وَصِهْرًا فَإِذَا رَأَيْتُمْ رَجُلَيْنِ يَخْتَصِمَانِ فِي مَوْضِعِ لَبِنَةٍ فَاخْرُجْ مِنْهَا”. قَالَ: فَرَأَيْتُ عَبْدَ الرَّحْمنِ بْنِ شُرَحْبِيْلَ بْنِ حَسَنَةَ وَأَخَاهُ يَخْتَصِمَانِ فِي مَوْضِعِ لَبِنَةٍ فَخَرَجْتُ مِنْهَا. رَوَاهُ مُسْلِمٌ.
5916. (49) [3/1662–దృఢం]
అబూ జ’ర్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”అతి త్వరలో మీరు ఈజిప్టును జయిస్తారు. అక్కడ ఖీరా’త్ ఉంది. మీరు ఈజిప్టును జయిస్తే అక్కడి ప్రజల పట్ల మంచిగా వ్యవహరించాలి. ఎందుకంటే వారికి రక్షణ ఉంది. వారితో బంధుత్వం ఉంది. లేదా వారికి రక్షణ ఉంది, వారితో మేనరికం సంబంధం ఉంది,” అని అన్నారు. కాని మీరు ఇద్దరు వ్యక్తులు ఒక్క ఇటుకంత స్థలం విషయంలో వివాదపడితే, మీరు అక్కడి నుండి వెళ్ళిపోవాలి. అబూ జ’ర్ (ర) నేను అబ్దుర్ర’హ్మాన్ బిన్ షర్‌జిల్ బిన్ ‘హసనహ్ మరియు అతని సోదరుడు రబీ’అహ్ను ఒక్క ఇటుకంత స్థలం విషయంలో వివాదపడుతుండగా చూసాను. వెంటనే నేను అక్కడి నుండి వెళ్ళి పోయాను,” అని అన్నారు.[28](ముస్లిమ్)
5917 – [50 ] ( صحيح ) (3/1663)
وعَنْ حُذَيْفَةَ عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ: “فِيْ أَصْحَابِيْ وَفِيْ رِوَايَةٍ قَالَ: فِيْ أُمَّتِيْ اِثْنَا عَشرَ مُنَافِقًا لَا يَدْخُلُوْنَ الْجَنَّةَ وَلَا يَجِدُوْنَ رِيْحَهَا حَتّى يَلِجَ الْجَمَلُ فِي سَمِّ الْخِيَاطِ. ثَمَانِيَةَ مِنْهُمْ تَكْفِيْهِمُ الدُّبَيْلَةُ سَرَاجٌ مِنْ نَارٍ يَظْهَرُ فِيْ أَكْتَافِهِمْ حَتّى تَنْجُمَ فِيْ صُدُوْرِهِمْ”. رَوَاهُ مُسْلِمٌ.
وَسَنَذْكُرُحَدِيْثَ سَهْلِ بْنِ سَعْدٍ: “لَأُعْطِيَنَّ هَذِهِ الرَّايَةَ غَدًا” فِيْ “بَابِ مَنَاقِبِ عَلِيٍ” رَضِيَ اللهُ عَنْهُ. وَحَدِيْثُ جَابِرٍ “مَنْ يَصْعدُ الثَّنِيَّة” فِيْ “بَابِ جَامِعِ الْمَنَاقِبِ” إِنْ شَاءَ اللهُ تَعَالى.
5917. (50) [3/1663– దృఢం]
హుజై’ఫహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”నా అను చరుల్లో, మరో ఉల్లేఖనంలో నా అనుచర సమాజంలో 12 మంది కపటాచారులు ఉంటారు. సూది రంధ్రం నుండి ఒంటె వెళ్ళనంతవరకు వాళ్ళు స్వర్గంలో ప్రవేశించలేరు. ఇంకా స్వర్గ సువాసనను కూడా పొందలేరు. వీరిలో 8 మందిని దబీల సంహరిస్తుంది. దబీల అంటే ఒక అగ్ని జ్వాల. అది వారి భుజాలపై పుట్టుతుంది. రొమ్ము భాగం వైపుకు వస్తుంది. [29] (ముస్లిమ్)
—–
اَلْفَصْلُ الثَّانِيْ రెండవ విభాగం
5918 – [ 51 ] ( صحيح ) (3/1663)
عَنْ أَبِيْ مُوْسَى قَالَ: خَرَجَ أَبُوْ طَالِبٍ إِلى الشَّامِ وَخَرَجَ مَعَهُ النَّبِيِّ صلى الله عليه وسلم فِيْ أَشْيَاخٍ مِنْ قُرَيْشٍ فَلَمَّا أَشْرَفُوْا عَلَى الرَّاهِبِ هَبَطُوْا فَحَلُّوْا رِحَالَهُمْ فَخَرَجَ إِلَيْهِمُ الرَّاهِبُ وَكَانُوْا قَبْلَ ذَلِكَ يَمُرُّوْنَ بِهِ فَلَا يَخْرُجُ إِلَيْهِمْ. قَالَ: فَهُمْ يَحُلُّوْنَ رِحَالَهُمْ فجَعَلَ يَتَخَلَّلُهُمُ الرَّاهِبُ حَتّى جَاءَ فَأَخَذَ بِيَدِ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم. قَالَ: هَذَا سَيِّدُ الْعَالَمِيْنَ هَذَا رَسُوْلُ رَبِّ الْعَالَمِيْنَ يَبْعَثُهُ اللهُ رَحْمَة لِلْعَالَمِيْنَ. فَقَالَ لَهُ: أَشْيَاخٌ مِنْ قُرَيْشٍ مَا عَلِمُكَ. فَقَالَ: إِنَّكُمْ حِيْنَ أَشْرَفْتُمْ مِنَ الْعَقَبَةِ لَمْ يَبْقَ شَجَرٌ وَلَا حَجَرٌ إِلَّا خَرَّ سَاجِدًا وَلَا يَسْجُدَانِ إِلَّا لِنَبِيٍّ وَإِنِّيْ أَعْرِفُهُ بِخَاتَمِ النُّبُوَّةِ أَسْفَلَ مِنْ غُضْرُوْفِ كَتِفِهِ مِثْلَ التُّفَّاحَةِ ثُمَّ رَجَعَ فَصَنَعَ لَهُمْ طَعَامًا. فَلَمَّا أَتَاهُمْ بِهِ وَكَانَ هُوَ فِيْ رَعْيَةِ الْإِبِلِ. فَقَالَ: أَرْسِلُوْا إِلَيْهِ فَأَقْبَلَ وَعَلَيْهِ غَمَامَةُ تُظِلُّهُ. فَلَمَّا دَنَا مِنَ الْقَوْمِ وَجَدَهُمْ قَدْ سَبَقُوْهُ إِلى فِيْءِ الشَّجَرَةِ. فَلَمَّا جَلَسَ مَالَ فِيْءُ الشَّجَرَةِ عَلَيْهِ. فَقَالَ: اُنْظُرُوْا إِلَى فَيْءِ الشَّجَرَةِ مَالَ عَلَيْهِ. فَقَالَ أَنْشُدُكُمْ بِاللهِ أَيُّكُمْ وَلِيُّهُ. قَالُوْا أَبُوْ طَالِبٍ فَلَمْ يَزَلْ يُنَاشِدُهُ حَتَّى رَدَّهُ أَبُوْ طَالِبٍ وَبَعَثَ مَعَهُ أَبُوْ بَكْرٍ بِلَالًا وَزَوَّدَهُ الرَّاهِبُ مِنَ الْكَعْكِ وَالزَّيْتِ. رَوَاهُ التِّرْمِزِيُّ.
5918. (51) [3/1663– దృఢం]
అబూ మూసా అష్’అరీ (ర) కథనం: అబూ ‘తాలిబ్ సిరియా వెళ్ళారు. ప్రవక్త (స) మరికొందరు ఖురైష్ ప్రముఖులు ఆయనతో వెళ్ళారు. ఒక క్రైస్తవ పండితుని (రాహిబ్) వద్దకు వెళ్ళారు. అతని పేరు బు’హైరహ్. అందరూ తమ తమ మావటీలు విప్పివేసారు. ఆ క్రైస్తవ పండితుడు వారిని కలవడానికి వచ్చాడు. అంతకు ముందు ఎన్నడూ వారు అటుగా వచ్చి అతని వద్ద బసచేసినపుడు కలవడానికి రాలేదు. ఉల్లేఖనకర్త కథనం: ప్రజలు తమ ఒంటెల మావటిలు విప్పుతున్నారు. ఆ క్రైస్తవ పండితుడు వారిలో ఎవరినో వెతుకుతున్నాడు. చివరికి అతను ప్రవక్త (స) వద్దకు వచ్చాడు. ప్రవక్త (స) చేయి పట్టుకొని, ‘ఇతడే సర్వలోక నాయకుడు, ఇతడే సమస్తలోకాల ప్రభువు యొక్క ప్రవక్త, అల్లాహ్ (త) సర్వమానవాళి కొరకు కారుణ్యంగా పంపింది ఇతన్నే,’ అని అన్నాడు. ఖురైష్ ప్రముఖులు నీకెలా తెలుసు,’ అని అతన్ని అడిగారు. దానికతడు, ‘మీరు కొండపై నుండి దిగుతున్నప్పుడు చెట్లు, రాళ్ళు సజ్దా చేయసాగాయి. చెట్లు, రాళ్ళు మహాప్రవక్తకు తప్ప మరెవరికీ సజ్దా చేయవు. అంతే కాదు, ఇతన్ని నేను దైవదౌత్య ముద్రద్వారా కూడా గుర్తించాను. అది అతని భుజం ఎముక క్రింద ఏపిల్ పండులా ఉంది.’ ఆ తరువాత ఆ పండితుడు తిరిగి వెళ్ళిపోయాడు. ఆ బిడారు వారందరి కొరకు భోజనం తయారుచేసి తెచ్చాడు. అతడు వచ్చినపుడు ప్రవక్త (స) ఒంటెను మేపటానికి వెళ్ళి ఉన్నారు. అప్పుడు ఆ పండితుడు, ‘అతన్ని పిలుచుకురండి,’ అని అన్నాడు. అనంతరం ప్రవక్త (స) వచ్చారు. ప్రవక్త (స)పై ఒక మేఘం నీడ కల్పించి ఉంది. ప్రజల వద్దకు వచ్చి చూసేసరికి ప్రజలు చెట్టునీడ క్రింద కూర్చున్నారు. మరెక్కడా నీడలేదు. ప్రవక్త (స) నీడ లేనిచోట కూర్చోగానే చెట్టు అతనివైపు వంగింది. అది చూచిన పండితుడు, ‘ఈ చెట్టు నీడను చూడండి అతని వైపు వంగిపోయింది.’ ఆ తరువాత ఆ వ్యక్తి, ‘అల్లాహ్(త) సాక్షి! మీలో ఇతని సంరక్షకులెవరు?’ అని అన్నాడు. దానికి ప్రజలు, ‘అబూ ‘తాలిబ్,’ అని అన్నారు. ఆ పండితుడు అతనితో, ‘ఇతన్ని మక్కహ్ పంపివేయండి,’ అని అన్నాడు. అనంతరం అబూ ‘తాలిబ్ ప్రవక్త (స)ను మక్కహ్ పంపివేశారు. అబూ బక్‌ర్ (ర) ప్రవక్త (స)వెంట బిలాల్‌ను పంపించారు. ఇంకా ఆ పండితుడు ప్రవక్త (స) కోసం రొట్టె, నెయ్యి, ప్రయాణసద్దెనూ ఇచ్చాడు.[30] (తిర్మిజి’)
5919 – [ 52 ] ( لم تتم دراسته ) (3/1664)
وَعَنْ عَلِيِ بْنِ أَبِيْ طَالِبٍ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: كُنْتُ مَعَ النَّبِيَّ صلى الله عليه وسلم بِمَكَّةَ فَخَرَجْنَا فِيْ بَعْضِ نَوَاحِيْهَا فَمَا اسْتَقْبَلَهُ جَبَلٌ وَلَا شَجَرٌ إِلَّا وَهُوَ يَقُوْلُ: السَّلَامُ عَلَيْكَ يَا رَسُوْلَ اللهِ. رَوَاهُ التِّرْمِذِيُّ وَالدَّارَمِيُّ
5919. (52) [3/1664 –అపరిశోధితం]
‘అలీ బిన్ అబీ ‘తాలిబ్ (ర) కథనం: నేను మక్కహ్లో ప్రవక్త (స) వెంట ఉన్నాను. ఒకరోజు మేము మక్కహ్ చుట్టు ప్రక్కల ప్రాంతంలోనికి వెళ్ళాము. దారిలో కనబడే రాళ్ళు, చెట్లు అస్సలాము అలైక యా రసూలుల్లాహ్ అని పలికాయి. (తిర్మిజి’, దార్మీ)
5920 – [ 53 ] ( صحيح ) (3/1664)
وعَنْ أَنَسٍ أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم أُتِيَ بِالْبُرَاقِ لَيْلَةَ أُسْرِيَ بِهِ مُلْجَمًا مُسْرَجًا فَاسْتَصْعَبَ عَلَيْهِ. فَقَالَ لَهُ جِبْرَيْلُ: أَبِمُحَمَّدٍ تَفْعَلُ هَذَا؟ قَالَ: فَمَا رَكِبَكَ أَحَدٌ أَكْرَمُ عَلَى اللهِ مِنْهُ قَالَ: فَارْفَضَّ عَرَقًا. رَوَاهُ التِّرْمِذِيُّ وَقَالَ هَذَا حَدِيْثٌ غَرِيْبٌ.
5920. (53) [3/1664– దృఢం]
అనస్ (ర) కథనం: మే’అరాజ్ రాత్రి ప్రవక్త (స) కోసం బుర్రాఖ్ తీసుకురావటం జరిగింది. దానికి జీను, కళ్ళెం చేర్చి ఉన్నాయి. ప్రవక్త (స) దానిపై ఎక్క దలచు కున్నప్పుడు అది వయ్యారంగా కదల సాగింది. ప్రవక్త (స)కు దానిపై ఎక్కటం కష్టం అయి పోయింది. అప్పుడు జిబ్రీల్ బుర్రాఖ్‌తో, ”నువ్వు ము’హమ్మద్ పట్ల ఇలా ప్రవర్తిస్తావా? ఇప్పటి వరకు అతని కంటే ఉత్తమ వ్యక్తి నీపై ఎక్కలేదు.” అది విని ఆ బుర్రాఖ్ సిగ్తుతో చెమటలు కక్కింది. (తిర్మిజి’ – ఏకోల్లేఖనం)
5921 – [ 54 ] ( ضعيف ) (3/1664)
وعَنْ بُرَيْدَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَمَّا انْتَهَيْنَا إِلى بَيْتِ الْمُقْدِسِ. قَالَ: جِبْرَيْلُ بِأَصْبَعِهِ فَخَرَقَ بِهَا الْحَجَرَ فَشَدَّ بِهِ الْبُرَاقَ”. رَوَاهُ التِّرْمِذِيُّ .
5921. (54) [3/1664– బలహీనం]
బురైదహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మేము మే’అరాజ్ రాత్రి బైతుల్ ముఖద్దస్ చేరిన తర్వాత జిబ్రీల్ (అ) తన వేలితో సైగచేసారు. ఆ సైగద్వారా రాతి బండలో కన్నం అయ్యింది. బుర్రాఖ్‌ను దానికి కట్టివేసారు.” (తిర్మిజి’)
5922 – [ 55 ] ( صحيح لشواهده ) (3/1664)
وَعَنْ يَعْلَى بْنِ مُرَّةَ الثَّقَفِيِّ قَالَ: ثَلَاثَةُ أَشْيَاءَ رَأَيْتُهَا مِنْ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم بَيْنَا نَحْنُ نسِيْرُ مَعَهُ إِذْ مَرَرْنَا بِبَعِيْرٍ يُسْنَى عَلَيْهِ. فَلَمَّا رَآهُ الْبَعِيْرُ جَرْجَرَ فَوَضَعَ جِرَانَهُ فَوَقَفَ عَلَيْهِ النَّبِيُّ صلى الله عليه وسلم. فَقَالَ أَيْنَ صَاحِبُ هَذَا الْبَعِيْر فَجَاءَهُ. فَقَالَ: بِعَنِيْهِ. فَقَالَ: بَلْ نَهَبُهُ لَكَ يَا رَسُوْلَ اللهِ. وَإِنَّهُ لِأَهْلِ بَيْتٍ مَا لَهُمْ مَعِيْشَةٌ غَيْرُهُ. قَالَ أَمَّا إِذْ ذَكَرْتَ هَذَا مِنْ أَمْرِهِ فَإِنَّهُ شَكَا كَثْرَةَ الْعَمَلِ وَقِلَّةَ الْعَلَفِ فَأَحْسِنُوْا إِلَيْهِ. قَالَ: ثُمَّ سِرْنَا فَنَزَلْنَا مَنْزِلًا فَنَامَ النَّبِيُّ صلى الله عليه وسلم. فَجَاءَتْ شَجَرَةٌ تَشُقُّ الْأَرْضَ حَتّى غَشِيَتْهُ. ثُمَّ رَجَعَتْ إِلى مَكَانِهَا فَلَمَّا اسْتَيْقَظَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم ذَكَرْتُ لَهُ. فَقَالَ هِيَ شَجَرَةٌ اِسْتَأْذَنَتْ رَبَّهَا عَزَّ وَجَلَّ أَنْ تُسَلِّمَ عَلَى رَسُوْلِ الله صلى الله عليه وسلم. فَأَذِنَ لَهَا. قَالَ ثُمَّ سِرْنَا فَمَرَرْنَا بِمَاءٍ فَأَتَتْهُ امْرَأَةٌ بِابْنِ لَهَا بِهِ جَنَّةٌ. فَأَخَذَ النَّبِيُّ صلى الله عليه وسلم بِمَنْخَرِهِ. فَقَالَ: اُخْرُج إِنِّيْ مُحَمَّدٌ رَسُوْلُ اللهِ. قَالَ ثُمَّ سِرْنَا فَلَمَّا رَجَعْنَا مَرَرْنَا بِذَلِكَ الْمَاءِ فَسَأَلَهَا عَنِ الصَّبِيِّ. فَقَالَتْ: وَالَّذِيْ بَعَثَكَ بِالْحَقِّ مَا رَأَيْنَا مِنْهُ رَيْبًا بَعْدَكَ. رَوَاهُ فِيْ شَرْحِ السُّنَّةِ.
5922. (55) [3/1664 –సాక్షులచే దృఢం]
య’అలా బిన్ ముర్రహ్ స’ఖఫీ (ర) కథనం: నేను ఒకే ప్రయాణంలో ప్రవక్త (స) మూడు మహిమలను చూచాను. అది ఎలా అంటే, మేము ప్రవక్త (స) వెంట వెళుతున్నాము. అకస్మాత్తుగా నీరులాగే ఒంటె ప్రక్క నుండి వెళ్ళడం జరిగింది. ఒంటె ప్రవక్త (స)ను చూచి అరవసాగింది. ఆ తరువాత తన మెడను నేలపై పరచివేసింది. ప్రవక్త (స) ఒంటె దగ్గర నిలబడి ఒంటె యజమాని ఎవరని అడిగారు. యజమాని ప్రవక్త (స) వద్దకు వచ్చాడు. ప్రవక్త (స) అతనితో ‘ఈ ఒంటెను నాకు అమ్మివేయండి,’ అని అన్నారు. దానికి యజమాని, ‘ఓ ప్రవక్తా! ఈ ఒంటె యజమానికి ఇది తప్ప మరో ఆదాయం లేదు, అయినా మేము తమకు కానుకగా ఇచ్చివేస్తాం,’ అని అన్నాడు. అప్పుడు ప్రవక్త (స), ”పరిస్థితి ఇలా ఉంటే నేను దాన్ని కొనను. ఒంటె, ‘పని అధికంగా ఉందని, ఆహారం చాలటం లేదని ఫిర్యాదు చేస్తుంది.’ నువ్వు దానిపట్ల మంచిగా ప్రవర్తించు,” అని అన్నారు. ఆ తరువాత మేము ముందుకు సాగాము. ఒకచోట దిగి విశ్రాంతి తీసుకుం టున్నాము. ప్రవక్త (స) నిద్రపోయారు. ఒక చెట్టు భూమిని చీల్చుతూ వచ్చింది. ప్రవక్త (స)పై నీడ కల్పించింది. ఆ తరువాత అది తన స్థానానికి వెళ్ళిపోయింది. ప్రవక్త (స) మేల్కొన్న తరువాత నేను జరిగింది ప్రస్తావించాను. అప్పుడు ప్రవక్త (స) ఈ చెట్టు తన ప్రభువును ప్రవక్త (స)కు సలామ్‌చేసే అనుమతి కోరింది. అల్లాహ్(త) దానికి అనుమతి ఇచ్చాడు. ఆ తరువాత మేము ముందుకు వెళ్ళసాగాము. ఒక కాలువ అక్కడ ప్రవహిస్తోంది. అంటే అక్కడ జనసంచారం ఉంది. ఒక స్త్రీ తన కొడుకును తీసుకొని ప్రవక్త (స) వద్దకు వచ్చింది. ఆమె కొడుకు మానసిక వ్యాధికి గురై ఉన్నాడు. ప్రవక్త (స) ఆ అబ్బాయి ముక్కు పట్టుకొని, ”బయటకు పో, నేను ము’హమ్మద్‌ను, అల్లాహ్(త) ప్రవక్తను,” అని అన్నారు. ఆ తరువాత మేము ముందుకువెళ్ళాం. తిరుగు ప్రయాణంలో మళ్ళీ అక్కడకు వచ్చిన తర్వాత ప్రవక్త (స) ఆ మహిళను అతని కొడుకు గురించి అడిగారు. దానికి ఆమె, ”మిమ్మల్ని సత్యం ఇచ్చి పంపిన అల్లాహ్(త) సాక్షి! తమరు వెళ్ళిన తర్వాత వాడికి ఎటువంటి రోగం లేదు. రోగం అంతా పోయింది.” (షర్’హుస్సున్నహ్)
5923 – [ 56 ] ( ضعيف ) (3/1665)
وعَنِ ابْنِ عَبَّاسٍ قَالَ: إِنَّ امْرَأَةً جَاءَتْ بِاِبْنِ لَهَا إِلَى رَسُوْلِ الله صلى الله عليه وسلم. فَقَالَتْ يَارَسُوْلَ اللهِ إِنَّ ابْنِيْ بِهِ جُنُوْنٌ وَإِنَّهُ لَيَأْخُذُهُ عِنْدَ غَدَائِنَا وَعَشَائِنَا(فَيَخْبِثُ عَلَيْنَا) فَمَسَحَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم صَدْرَهُ وَدَعَا فَثَعَّ ثَعَّةً وَخَرَجَ مِنْ جَوْفِهِ مِثْلَ الْجَرْوِ الْأَسْوَدِ يَسْعَى. رَوَاهُ الدَّارِمِيّ.
5923. (56) [3/1665– బలహీనం]
ఇబ్నె ‘అబ్బాస్ (ర) కథనం: ఒక స్త్రీ తన కొడుకును తీసు కొని ప్రవక్త (స) వద్దకు వచ్చింది. ‘ఓ ప్రవక్తా! నా కొడుక్కు పిచ్చిపట్టింది. మధ్యాహ్నం, రాత్రి వస్తుంది అని’ విన్నవించుకుంది. ప్రవక్త (స) ఆ యువకుని గుండెపై చేత్తో నిమిరారు. ఇంకా ప్రార్థించారు. వెంటనే ఆ యువకుడు వాంతి చేసు కున్నాడు. ఆ యువకుని కడుపులో నుండి నల్లని కుక్కపిల్ల వంటి వస్తువు బయ టకు వచ్చింది. చాలా వేగంగా పారిపోయింది. (దార్మీ)
5924 – [ 57 ] ( صحيح ) (3/1665)
وعَنْ أَنَسٍ قَالَ جَاءَ جِبْرَيْلُ إِلى النَّبِيِّ صلى الله عليه وسلم وَهُوَ جَالِسٌ حَزِيْنٌ وَقَدْ تَخضبَ بِالدَّمِ مِنْ فِعْلِ أَهْلِ مَكَّةَ مِنْ قُرَيْشٍ. فَقَالَ: جِبْرِيْلُ يَا رَسُوْلَ اللهِ هَلْ تُحِبُّ أَنْ نُرِيَكَ آيَةً. قَالَ: نَعَمْ. فَنَظَرَ إِلى شَجَرَةٍ مِنْ وَرَائِهِ. فَقَالَ: اُدْعُ بِهَا فَدَعَا بِهَا فَجَاءَتْ وَقَامَتْ بَيْنَ يَدَيْهِ. فَقَالَ: مُرْهَا فَلْتَرْجِعْ فَأَمَرَهَا فَرَجَعَتْ. فَقَالَ رَسُوْلُ الله صلى الله عليه وسلم: حَسْبِيْ حَسْبِيْ. رَوَاهُ الدَّارَمِيُّ.
5924. (57) [3/1665– దృఢం]
అనస్ (ర) కథనం: జిబ్రీల్ (అ) ప్రవక్త (స) వద్దకు వచ్చారు. అప్పుడు ప్రవక్త (స) విచారంగా కూర్చొని ఉన్నారు. మక్కహ్ ప్రజల హింసకు గురై రక్తసిక్తమై ఉన్నారు. జిబ్రీల్ (అ), ‘ఓ దైవప్రవక్తా! నేనొక మహిమ తమరికి చూపెట్టనా,’ అని అన్నారు. ‘చూపెట్టండి,’ అని ప్రవక్త (స) అన్నారు. జిబ్రీల్ (అ) తన వెనుక ఉన్న చెట్టును చూపి, ప్రవక్త (స)తో, ‘ఈ చెట్టును పిలవండి,’ అని అన్నారు. ప్రవక్త (స) ఆ చెట్టును పిలిచారు. వెంటనే ఆ చెట్టు ప్రవక్త (స) ముందుకు వచ్చి నిలబడింది. అప్పుడు జిబ్రీల్ (అ), ‘ఇప్పుడు దాన్ని తిరిగి వెళ్ళమని ఆదేశించండి,’ అని అన్నారు. ప్రవక్త (స) ఆదేశించగానే అది తిరిగి వెళ్ళిపోయింది. అప్పుడు ప్రవక్త (స), ‘ఇది నాకుచాలు, ఇది నాకు చాలు,’ అని అన్నారు. (దార్మీ)
5925 – [ 58 ] ( صحيح ) (3/1666)
وَعَنِ ابْنِ عُمَرَ قَالَ: كُنَّا مَعَ النَّبِيِّ صلى الله عليه وسلم فِيْ سَفَرٍ فَأَقْبَلَ أَعْرَابِيٌّ فَلَمَّا دَنَا مِنْهُ قَالَ لَهُ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: تَشْهَدُ أَنْ لَا إِلَهَ إِلَّا اللهُ وَحْدَهُ لَا شَرِيْكَ لَهُ وَأَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُوْلُهُ: قَالَ: وَمَنْ يَشْهَدُ عَلَى مَا تَقُوْلُ؟ قَالَ: “هَذِهِ السَّلَمَةُ”. فَدَعَاهَا رَسُوْلُ الله صلى الله عليه وسلم وَهُوَ بِشَاطِئِ الْوَادِيْ فَأَقْبَلَتْ تَخُدُّ الْأَرْضَ حَتّى قَامَتْ بَيْنَ يَدَيْهِ فَاسْتَشْهَدَهَا ثَلَاثًا فَشَهِدَتْ ثَلَاثًا أَنَّهُ كَمَا قَالَ: ثُمَّ رَجَعَتْ إِلَى مَنْبَتِهَا. رَوَاهُ الدَّارَمِيُّ .
5925. (58) [3/1666 –దృఢం]
ఇబ్నె ‘ఉమర్ (ర) కథనం: ఒక ప్రయాణంలో మేము ప్రవక్త (స) వెంటఉన్నాం. ఒక పల్లెవాసి వచ్చాడు. అతడు దగ్గరకు రాగానే ప్రవక్త (స) అతన్ని, ”అల్లాహ్ (త) తప్ప ఆరాధనకు ఎవరూ అర్హులుకారని, ము’హమ్మద్ (స) అల్లాహ్ ప్రవక్త అని సాక్ష్యం ఇవ్వగలవా?” అని అన్నారు. ఆ బదూ, ‘మరెవరైనా దీనికి సాక్ష్యం ఇస్తారా,’ అని అడిగాడు. దానికి ప్రవక్త (స), ‘ఈ జిల్లేడు చెట్టు సాక్ష్యం ఇస్తుంది,’ అని చెప్పి ప్రవక్త (స) ఆ చెట్టును పిలిచారు. ప్రవక్త (స) లోయ అంచు వద్ద నిలబడి ఉన్నారు. ఆ చెట్టు భూమిని చీల్చుతూ వచ్చి ప్రవక్త (స) ముందు నిలబడింది. ప్రవక్త (స) ఆ చెట్టును మూడుసార్లు సాక్ష్యం ఇవ్వమని కోరారు. ఆ చెట్టు మూడుసార్లు సాక్ష్యం ఇచ్చింది. ఇంకా, ”వాస్తవం ప్రవక్త (స) చెప్పినట్టే ఉంది,” అని పలికి తన చోటుకు చేరుకుంది. (దార్మీ)
5926 – [ 59 ] ( صحيح ) (3/1666)
وعَنِ ابْنِ عَبَّاسٍ قَالَ: جَاءَ أَعْرَابِيٌّ إِلَى رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم قَالَ: بِمَا أَعْرِفُ أَنَّكَ نَبِيٌّ؟ قَالَ: “إِنْ دَعَوْتُ هَذَا الْعِذْقَ مِنْ هَذِهِ النَّخْلَةِ يَشْهَدُ أَنِّيْ رَسُوْلُ اللهِ”. فَدَعَاهُ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم فَجَعَلَ يَنْزِلُ مِنَ النَّخْلَةِ حَتّى سَقَطَ إِلى النَّبِيِّ صلى الله عليه وسلم. ثُمَّ قَالَ: “اِرْجِعْ”. فَعَادَ فَأَسْلَمَ الْأَعْرَابِيُّ. رَوَاهُ التِّرْمِذِيُّ وَصَحَّحَهُ.
5926. (59) [3/1666 –దృఢం]
ఇబ్నె ‘అబ్బాస్ (ర) కథనం: ఒక బదూ ప్రవక్త (స) వద్దకు వచ్చి, ‘మీరు దైవప్రవక్తలని నాకెలా తెలుస్తుంది?’ అని అన్నాడు. దానికి ప్రవక్త (స), ‘నేనిప్పుడే ఖర్జూరం చెట్టుపై ఉన్న ఖర్జూరాల గుత్తిని పిలుస్తాను. అది నేను అల్లాహ్ (త) ప్రవక్తనని సాక్ష్యం ఇస్తుంది,’ అని అన్నారు. అనంతరం ప్రవక్త (స), ఆ ఖర్జూరాల గుత్తిని పిలిచారు. ఆ ఖర్జూరాల గుత్తి చెట్టు నుండి వేరై దిగసాగింది. ప్రవక్త (స) వద్దకు వచ్చి పడింది. ఆ తరువాత ప్రవక్త (స) దాన్ని వెళ్ళమని ఆదేశించగా, అది తిరిగి వెళ్ళిపోయింది. అది చూచి ఆ ఆ బదూ ఇస్లామ్ స్వీకరించాడు. (తిర్మిజి’)
5927 – [ 60 ] ( صحيح ) (3/1666)
وعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: جَاءَ ذِئْبٌ إِلى رَاعِيْ غَنَمٍ فَأَخَذَ مِنْهَا شَاةً فَطَلَبَهُ الرَّاعِيْ حَتّى اِنْتَزَعَهَا مِنْهُ. قَالَ: فَصَعِدَ الذِّئْبُ عَلَى تَلَ فَأَقْعَى وَاسْتَذْفَرَ. فَقَالَ: عَمِدْتُ إِلى رِزْقٍ رَزَقَنِيْهِ اللهُ عز وجل أَخَذْتُهُ ثُمَّ انْتَزَعْتَهُ مِنِّيْ. فَقَالَ الرَّجُلُ: تَاللهِ إِنْ رَأَيْتُ كَالْيَوْمِ ذِئْبٌ يَتَكَلَّمُ. فَقَالَ الذِّئْبُ: أَعْجَبُ مِنْ هَذَا رَجُلٌ فِي النَّخَلَاتِ بَيْنَ الْحَرَّتَيْنِ يُخْبِرُكُمْ بِمَا مَضَى وَبِمَا هُوَ كَائِنٌ بَعْدَكُمْ وَكَانَ الرَّجُلُ يَهُوْدِيًا. فَجَاءَ الرَّجُلُ إِلى النَّبِيِّ صلى الله عليه وسلم فَأَسْلَمَ فَصَدَّقَهُ النَّبِيُّ صلى الله عليه وسلم. ثُمَّ قَالَ النَّبِيُّ صلى الله عليه وسلم: إِنَّهَا أَمَارَةٌ من أَمَارَاتٌ بَيْنَ يَدَيِ السَّاعَةِ قَدْ أَوْشَكَ الرَّجُلُ أَنْ يَخْرُجَ فَلَا يَرْجِعَ حَتّى تُحَدِّثَهُ نَعْلَاهُ وَسَوْطُهُ مَا أَحْدَثَ أَهْلَهُ بَعْدَهُ”. رَوَاهُ فِيْ شَرْحِ السُّنَّةِ.
5927. (60) [3/1666 –దృఢం]
అబూ హురైరహ్ (ర) కథనం: ఒక తోడేలు మేకల మంద వైపు వచ్చింది. అది ఒక మేకను తీసుకొని వెళ్ళి పోయింది. పశువులకాపరి దాన్ని వెంటాడి మేకను విడిపించుకొని వచ్చాడు. ఆ తరువాత ఆ తోడేలు ఒక గుట్టపై ఎక్కింది. కూర్చొని రెండు కాళ్ళు నిలబెట్టి తన తోకను రెండు కాళ్ళ మధ్య ఉంచి పశువుల కాపరితో, ”నేను అల్లాహ్(త) ప్రసాదించిన నా ఉపాధిని పొందాలనుకున్నాను. కాని నువ్వు దాన్ని నా నుండి లాక్కున్నావు,” అని చెప్పింది. ఆ పశువుల కాపరి ఆశ్చర్యంగా, ‘అల్లాహ్ సాక్షి! తోడేలు మాట్లాడటం ఇంత వరకు నేను చూడలేదు,’ అని అన్నాడు. దానికి తోడేలు, ”ఇంతకంటే ఆశ్చర్యకరమైన విషయం మరొకటి ఉంది, రెండు లోయల మధ్య ఖర్జూరాల ప్రాంతంలో ఒక వ్యక్తి ఉన్నాడు. అతడు వర్తమాన, భవిష్యత్ కాలాల విషయాలను తెలియపరుస్తాడు.” ఆ పశువుల కాపరి యూదుడు. అతడు ప్రవక్త (స) వద్దకు వచ్చి జరిగిన సంఘటన గురించి చెప్పాడు. ఇంకా ఇస్లామ్ స్వీకరించాడు. ప్రవక్త (స) అతడి మాటలను ధ్రువీకరించారు. ఆ తరువాత ప్రవక్త (స) ‘ఇవన్నీ ప్రళయ సూచనలని చెబుతూ మనిషి బయటకు వెళ్ళి తిరిగి వచ్చినపుడు అతని చెప్పులు, కొరడా మొదలైనవి అతడు ఇంట్లో లేనపుడు జరిగినవన్నీ చెప్పే రోజు కూడా వస్తుంది,’ అని అన్నారు. (షర్’హుస్సున్నహ్)
5928 – [ 61 ] ( صحيح ) (3/1667)
وعَنْ أَبِيْ الْعَلَاءِ عَنْ سَمُرَةَ بْنِ جُنْدُبٍ قَالَ: كُنَّا مَعَ النَّبِيِّ صلى الله عليه وسلم نَتَدَاوَلَ مِنْ قَصْعَةٍ مِنْ غُدْوَةٍ حَتّى اللَّيْلِ يَقُوْمُ عَشَرَةٌ وَيَقْعُدُ عَشَرَةً. قُلْنَا: فَمِمَّا كَانَتْ تُمَدُّ؟ قَالَ: مِنْ أَيِّ شَيْءٍ تَعْجَبُ؟ مَا كَانَتْ تُمَدُّ إِلَّا مِنْ هَهُنَا وَأَشَارَبِيَدِهِ إِلى السَّمَاءِ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَالدَّارَمِيُّ .
5928. (61) [3/1667– దృఢం]
అబూ య’అలా స’ముర బిన్ జున్‌దుబ్ (ర) కథనం: మేము ప్రవక్త (స)తో కలసి ఒక పెద్ద గిన్నెలో ఉదయం నుండి రాత్రి వరకు అన్నం తింటూనే ఉన్నాం. 10 మంది తిని లేచిన తర్వాత మరో 10 మంది తినటానికి కూర్చునే వారు. అన్నంలో పెరుగుదల ఎలా అవు తుందని మేము అడిగాము. దానికి స’మురహ్ సమా ధానమిస్తూ, మీరు దేన్ని గురించి ఆశ్చర్యం వ్యక్తం చేస్తు న్నారు, ఇందులో పెరుగుదల అక్కడి నుండి అవు తుందని ఆకాశం వైపు సైగ చేసారు. (తిర్మిజి’, దార్మీ)
5929 – [ 62 ] ( حسن ) (3/1667)
وعَنْ عَبْدِ اللهِ بْنِ عَمْرٍو: أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم خَرَجَ يَوْمَ بَدْرٍ فِيْ ثَلَاثِمِائَةٍ وَخَمْسَةَ عَشَرَ قَالَ: “اَللّهُمَّ إِنَّهُمْ حُفَاةٌ فَاحْمِلْهُمْ. اللّهُمَّ إِنَّهُمْ عُرَاةٌ فَاكْسُهُمْ. اَللّهُمَّ إِنَّهُمْ جِيَاعٌ فَأَشْبِعْهُمْ.” فَفَتَحَ اللهُ لَهُ فَانْقَلَبُوْا وَمَا مِنْهُمْ رَجُلٌ إِلَّا وَقَدْ رَجَعَ بِجَمَلٍ أَوْ جَمَلَيْنِ وَاُكْسُوْا وَشَبِعُوْا. رَوَاهُ أَبُوْ دَاوُدَ.
5929. (62) [3/1667 –ప్రామాణికం]
‘అబ్దుల్లాహ్ బిన్ ‘అమ్ర్ (ర) కథనం: ప్రవక్త (స) బద్ర్ యుద్ధం నాడు 315 మందిని తీసుకొని బయలుదేరారు. ఇంకా ఇలా ప్రార్థించారు, ”ఓ అల్లాహ్! వీరు నగ్నపాదాలతో ఉన్నారు, వీరికి వాహనాలు ప్రసాదించు. ఓ అల్లాహ్! వీరు నగ్న శరీరాలతో ఉన్నారు, వీరికి దుస్తులు ప్రసాదించు, ఓ అల్లాహ్! వీరు ఆకలితో ఉన్నారు, వీరికి ఆహారం ప్రసాదించు. అనంతరం అల్లాహ్ (త) అవిశ్వాసులపై విజయం ప్రసాదించాడు. ప్రవక్త (స)అనుచరులు తిరిగివచ్చారు. వారిలో ప్రతిఒక్కరికి ఒకటి లేక రెండు ఒంటెలు లభించాయి. అందరికీ దుస్తులు లభించాయి. కడుపు నిండా ఆహారం కూడా లభించింది. (అబూ దావూద్)
5930 – [ 63 ] ( لم تتم دراسته ) (3/1667)
وعَنِ ابْنِ مَسْعُوْدٍ عَنْ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم قال: “إِنَّكُمْ مَنْصُوْرُوْنَ وَمُصِيْبُوْنَ وَمَفْتُوْحٌ لَكُمْ فَمَنْ أَدْرَكَ ذَلِكَ مِنْكُمْ فَلْيَتَّقِ اللهَ وَلْيَأْمُرْ بِالْمَعْرُوْفِ وَلْيَنْهُ عَنِ الْمُنْكَرِ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ.
5930. (63) [3/1667 –అపరిశోధితం]
ఇబ్నె మస్’ఊద్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”నిస్సందేహంగా మీకు శత్రువులపై విజయం ప్రాప్తిస్తుంది, మీకు యుద్ధధనం రూపంలో చాలా లభిస్తాయి. ఇంకా మీరు అనేక దేశాలను జయిస్తారు. మీలో ఎవరైనా అప్పుడు ఉంటే, భయభక్తులు కలిగి ఉండాలి. మంచి విషయాలను ఆదేశించాలి, చెడు విషయాల నుండి వారించాలి. (అబూ దావూద్)
5931 – [ 64 ] ( صحيح ) (3/1667)
وعَنْ جَابِرٍ بِأَنَّ يَهُوْدِيَّةً مِنْ أَهْلِ خَيْبَرَ سَمَّتْ شَاةً مُصْلِيَّةً ثُمَّ أَهْدَتْهَا لِرَسُوْلِ اللهِ صلى الله عليه وسلم فَأَخَذَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم الذِّرَاعَ فَأَكَلَ مِنْهَا وَأَكَلَ رَهْطٌ مِنْ أَصْحَابِهِ مَعَهُ فَقَالَ رَسُوْلُ الله صلى الله عليه وسلم: اِرْفَعُوْا أَيْدِيَكُمْ وَأَرْسَلَ إِلى الْيَهُوْدِيَّةِ فَدَعَاهَا. فَقَالَ: سَمَمْتِ هَذِهِ الشَّاةَ. فَقَالَتْ مَنْ أَخْبَرَكَ. قَالَ: أَخْبَرَتُنِيْ هَذِهِ فِيْ يَدِيْ لِلذِّرَاعِ. قَالَتْ: نَعَمْ. قَالَتْ: قُلْتُ إِنْ كَانَ نَبِيًّا فَلَنْ يَضُرَّهُ وَإِنْ لَمْ يَكُنْ نَبِيًّا اِسْتَرَحْنَا مِنْهُ. فَعَفَا عَنْهَا رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم وَلَمْ يُعَاقِبْهَا. وتُوُفِّيَ بَعْض أَصْحَابُهُ الَّذِيْنَ أَكَلُوْا مِنَ الشَّاةِ. وَاحْتَجَمَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم عَلى كَاهِلِهِ مِنْ أَجْلِ الَّذِيْ أَكَلَ مِنَ الشَّاةِ حَجَمَهُ أَبُوْ هِنْدٍ بِالْقَرْنِ وَالشَّفْرَةِ وَهُوَ مَوْلَى لِبَنِيْ بِيَاضَةٍ مِنَ الْأَنْصَارِ. رَوَاهُ أَبُوْ دَاوُدَ وَالدَّارَمِيُّ.
5931. (64) [3/1667– దృఢం]
జాబిర్ (ర) కథనం: ‘ఖైబర్‌కు చెందిన ఒక యూద స్త్రీ, కాల్చిన మేక మాంసంలో విషంకలిపి ప్రవక్త (స)కు కానుకగా పంపింది. ప్రవక్త (స) ఆ మాంసంలో నుండి ఒక కాలు భాగాన్ని తీసుకొని తినటం ప్రారంభించారు. ప్రవక్త (స)తో పాటు అనుచరులు కూడా తినటం ప్రారం భించారు. అకస్మాత్తుగా ప్రవక్త (స), ‘మీ చేతులను ఎత్తుకోండి, తినకండి,’ అని అన్నారు. ఆ తరువాత ప్రవక్త (స) ఆ యూద స్త్రీని పిలిపించారు. ప్రవక్త (స) ఆమెతో, ‘నువ్వు ఈ మాంసంలో విషం కలిపావా?’ అని అడిగారు. దానికి ఆమె, ‘మీకెలా తెలిసింది?’ అని ప్రశ్నించింది. దానికి ప్రవక్త (స), ”నాకు నా చేతిలో ఉన్న మాంసం ముక్క చెప్పింది” అని అన్నారు. అప్పుడు ఆమె, ‘అవును’ అని పలికి, ‘ఒకవేళ ము’హ మ్మద్ ప్రవక్త అయితే ఆ విషం అతనికి నష్టం కలిగించదు. ఒకవేళ ప్రవక్త కాకపోతే పీడ విరగడవుతుందని ఆలోచించాను,’ అని చెప్పింది. ప్రవక్త (స) ఆమెను క్షమించి వేసారు. ఆమెను శిక్షించలేదు. ఆ మాంసం తిన్న అనుచరుల్లోని ఒకరు మరణించారు. ప్రవక్త (స) దానివల్ల భుజంపై కొమ్ముచికిత్స చేసి చెడురక్తం తీయించారు. అబూ హింద్ అనే అనుచరుడు ప్రవక్త (స)కు వెడల్పయిన కత్తి ద్వారా కొమ్ము చికిత్స చేసారు. ఈ వ్యక్తి అ’న్సారుల్లో బనూ బయా’దహ్ బానిసగా ఉండే వాడు. (అబూ దావూద్, దార్మీ)
5932 – [ 65 ] ( صحيح ) (3/1668)
وعَنْ سَهْلِ ابْنِ الْحَنْظَلِيَّةِ أَنَّهُمْ سَارُوْا مَعَ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم يَوْمَ حُنَيْنٍ فَأَطْنَبُوْا السَّيْرَ حَتّى كَانَ عَشِيَّةً فَجَاءَ فَارِسٌ. فَقَالَ: يَا رَسُوْلَ اللهِ إِنِّيْ طَلَعْتُ عَلَى جَبَلِ كَذَا وَكَذَا فَإِذَا أَنَا بِهَوَازِنَ عَلَى بُكْرَةِ أَبِيْهِمْ بِظُعْنِهِمْ وَنَعَمِهِمْ اِجْتَمَعُوْا إِلى حُنَيْنٍ فَتَبَسَّمَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم. وَقَالَ: تِلْكَ غَنِيْمَةُ الْمُسْلِمِيْنَ غَدَا إِنْ شَاءَ اللهُ. ثُمَّ قَالَ: مَنْ يَحْرُسُنَا اللَّيْلَةَ. قَالَ: أَنَسُ بْنُ أَبِيْ مَرْثَدٍ الْغَنَوِيُّ: أَنَا يَا رَسُوْلَ اللهِ. قَالَ: اِرْكَبْ فَرَكِبَ فَرَسًا لَهُ فَقَالَ: “اِسْتَقْبِلْ هَذَا الشِّعْبَ حَتَّى تَكُوْنَ فِيْ أَعْلَاهُ”. فَلَمَّا أَصْبَحْنَا خَرَجَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم إِلى مُصَلَّاهُ فَرَكَعَ رَكْعَتَيْنِ. ثُمَّ قَالَ: هَلْ حَسَسْتُمْ فَارِسَكُمْ قَالُوْا: يَا رَسُوْلَ اللهِ مَا حَسَسنَا فَثُوِّبَ بِالصَّلَاةِ. فَجَعَلَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم يُصَلِّيْ وَهُوَ يَلْتَفِتُ إِلى الشِّعْبِ حَتَّى إِذَا قَضَى الصَّلَاةَ قَالَ: أَبْشِرُوْا فَقَدْ جَاءَ فَارِسُكُمْ فَجَعَلْنَا نَنْظُرُ إِلى خِلَالِ الشَّجَرِ فِي الشِّعْبِ فَإِذَا هُوَ قَدْ جَاءَ حَتّى وَقَفَ عَلَى رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم فَسَلَّمَ. فَقَالَ: إِنِّيْ انْطَلَقْتُ حَتّى كُنْتُ فِيْ أَعْلَى هَذَا الشِّعْبِ حَيْثُ أَمَرَنِيْ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم. فلَمَّا أَصْبَحْتُ طَلَعْتُ الشِّعْبَيْن كِلَيْهِمَا. فَلَمْ أَرَ أَحَدًا فَقَالَ لَهُ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: هَلْ نَزَلْتَ اللَّيْلَةَ. قَالَ: لَا إِلَّا مُصَلِّيًا أَوْ قَاضِيَ حَاجَةٍ. قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “فَلَا عَلَيْكَ أَنْ لَا تَعْمَلَ بَعْدَهَا”. رَوَاهُ أَبُوْ دَاوُدَ.
5932. (65) [3/1668 –దృఢం]
సహల్ బిన్ ‘హం”జల (ర) కథనం: ‘హునైన్ యుద్ధానికి ప్రవక్త (స) అనుచరులందరూ ప్రవక్త (స) వెంట బయలుదేరారు. దీర్ఘకాలం వరకు నడుస్తూనే ఉన్నారు. చివరికి సాయంత్రం అయ్యింది. ఇంతలో ఒక వ్యక్తి గుర్రంపై వచ్చి, ”ఓ ప్రవక్తా! ఫలానా కొండల్లో ‘హవా’జున్ ప్రజలందరూ పురుషులు స్త్రీలు పశువులు ‘హునైన్ ప్రాంతంలో ఉన్నారు,” అని అన్నాడు. ప్రవక్త (స) చిరునవ్వు నవ్వుతూ, ‘ఇన్‌షా అల్లాహ్ రేపు ఈ సంపదలన్నీ ముస్లిముల యుద్ధధనం అవుతాయి,’ అని అన్నారు. ఆ తర్వాత, ‘ఈ రోజురాత్రి ఎవరు మాకు కాపలాకాస్తారు,’ అని అన్నారు. అనస్ బిన్ అబీ మర్‌స’ద్ ‘గనవీ, ”ఓ ప్రవక్తా! నేనున్నాను,” అని అన్నారు. అప్పుడు ప్రవక్త (స) ‘మరి వాహనంపైకి ఎక్కు’ అని అన్నారు. అనస్ వాహనంపైకి ఎక్కిన తర్వాత, ప్రవక్త (స), ‘నువ్వు ఈ కొండ ప్రాంతం గుండా వెళ్ళి ఆ కొండ శిఖరం పైకి చేరుకో,’ అని అన్నారు. తెల్లవారగానే ప్రవక్త (స) నమా’జ్ చదవడానికి వచ్చారు. ప్రవక్త (స) రెండు రకాతులు చదివారు, ఇంకా, ‘మీ కాపలా ఉన్నవాడి గురించి ఏమైనా తెలుసా?’ అని అడిగారు. ఒక వ్యక్తి, ‘లేదు దైవప్రవక్తా! మాలో ఎవరూ చూడలేదు,’ అన్నాడు. ఇంతలో ఫజ్‌ర్ నమా’జు కోసం తక్‌బీర్ పలక బడింది. ప్రవక్త (స) నమా’జు చదువుతూ కొండవైపు చూసారు. చివరికి నమా’జ్ పూర్తయిన వెంటనే సంతో షించండి, మీ కాపలావాడు వస్తున్నాడు. అనంతరం మేము చెట్లపొదల్లో చూడసాగాము. అతడు వస్తూ ఉండటం కనిపించింది. అతను వచ్చి ప్రవక్త (స) ముందు నిలబడ్డాడు. ఇంకా, ‘నేను బయలుదేరి ప్రవక్త (స) ఆదేశించిన ఆ కొండ శిఖరాన్ని చేరుకున్నాను. తెల్లవారగానే నేను చుట్టుప్రక్కల అంతా చూచాను. ఎవరూ కనిపించలేదు,’ అని అన్నాడు. అప్పుడు ప్రవక్త (స), ‘నువ్వు రాత్రి వాహనంపై నుండి దిగావా?’ అని అడిగారు. దానికి అతను, ‘లేదు, కేవలం నమా’జులు, కాలకృత్యాలకు కొంతసేపు దిగాను,’ అని అన్నాడు. అప్పుడు ప్రవక్త (స) ‘ఇప్పుడు నీపై ఏమీలేదు. దీని తర్వాత ఏమీ చేయకపోయినా ఫరవాలేదు.’ అంటే ‘నీ కోసం నేటి ఆచరణే చాలు’ అని అన్నారు. (అబూ దావూద్)
5933 – [ 66 ] ( لم تتم دراسته ) (3/1668)
وَعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: أَتَيْتُ النَّبِيَّ صلى الله عليه وسلم بِتَمَرَاتٍ. فَقُلْتُ يَا رَسُوْلَ اللهِ اُدْعُ اللهَ فِيْهِنَّ بِالْبَرَكَةِ فَضَمَّهُنَّ ثُمَّ دَعَا لِيْ فِيْهِنَّ بِالْبَرَكَةِ. فَقَالَ خُذْهُنَّ وَاجْعَلْهُنَّ فِيْ مَزْوَدِكَ. كُلَّمَا أَرَدْتَ أَنْ تَأْخُذَ مِنْهُ شَيْئًا فَأَدْخِلْ فِيْهِ يَدَكَ فَخُذْهُ وَلَا تَنْثُرْهُ نَثْرًا. فَقَدْ حَمَلْتُ مِنْ ذَلِكَ التَّمْرِكَذَا وَ كَذَا مِنْ وَسْقٍ فِيْ سَبِيْلِ اللهِ فَكُنَّا نَأْكُلُ مِنْهُ وَنَطْعِمُ وَكَانَ لَا يُفَارِقُ حِقْوِيْ حَتّى كَانَ يَوْمُ قُتِلَ عُثْمَانَ فَإِنَّهُ انْقَطَعَ. رَوَاهُ التِّرْمِذِيُّ.
5933. (66) [3/1668– అపరిశోధితం]
అబూ హురైరహ్ (ర) కథనం: ఒకసారి నేను కొన్ని ఖర్జూ రాలు తీసుకొని ప్రవక్త (స) వద్దకు వచ్చాను. ఇంకా, ‘ఓ ప్రవక్తా! వీటిపై శుభం కోసం ప్రార్థించండి,’ అని విన్నవించ కున్నాను. ప్రవక్త (స) వాటిని తన చేతిలోకి తీసుకొని, నా కోసం వాటిపై శుభంకోసం దు’ఆ చేసారు. ఇంకా, ‘వీటిని తీసుకొని భద్రపరచుకో, నీకు అవసరం ఉన్నప్పుడు చేయిపెట్టి నీకు కావలసి నన్ని తీసుకో. కాని దీన్ని ఖాళీ చేయకూడదు,’ అని అన్నారు. మేము ఆ ఖర్జూరాల నుండి దానధర్మాలు చేసేవాళ్ళం, మేమూ తినేవాళ్ళం, ఇతరులకూ తినిపించేవాళ్ళం. ఆ సంచి ఎప్పుడూ నా నడుముకు కట్టబడి ఉండేది. నేనెప్పుడూ దాన్ని వదలేవాడ్ని కాను. అయితే ‘ఉస్మాన్ (ర) వీరమరణం రోజు ఆ సంచి నా నడుమునుండి జారిపోయింది. (తిర్మిజి’)
—–
اَلْفَصْلُ الثَّالِثُ మూడవ విభాగం
5934 – [ 67 ] ( ضعيف ) (3/1669)
وعَنِ ابْنِ عَبَّاسٍ قَالَ: تَشَاوَرَتْ قُرَيْشٌ لَيْلَةً بِمَكَّةَ. فَقَالَ بَعْضُهُمْ: إِذَا أَصْبَحَ فَأَثْبِتُوْهُ بِالْوَثَاقِ يُرِيْدُوْنَ النَّبِيَّ صلى الله عليه وسلم. وَقَالَ بَعْضُهُمْ: بَلِ اقْتُلُوْهُ. وَقَالَ بَعْضُهُمْ: بَلْ أَخْرِجُوْهُ. فَأَطَّلَعَ اللهُ عَز وجل نَبِيَّهُ صلى الله عليه وسلم عَلى ذَلِكَ. فَبَاتَ عَلِيٌّ عَلَى فِرَاشِ النَّبِيِّ صلى الله عليه وسلم تِلْكَ اللَّيْلَةَ وَخَرَجَ النَّبِيُّ صلى الله عليه وسلم حَتَّى لَحِقَ بِالْغَارِ. وَبَاتَ الْمُشْرِكُوْنَ يَحْرُسُوْنَ عَلِيًّا يَحْسَبُوْنَهُ النَّبِيَّ صلى الله عليه وسلم فَلَمَّا أَصْبَحُوْا ثَارُوْا إِلَيْهِ. فَلَمَّا رَأَوْا عَلِيًّا رَدَّ اللهُ مَكْرَهُمْ. فَقَالُوْا: أَيْنَ صَاحِبُكَ هَذَا. قَالَ: لَا أَدْرِيْ. فَاقْتَصُّوْا أَثَرَهُ فَلَمَّا بَلَغُوْا الْجَبَلَ اِخْتَلَطَ عَلَيْهِمْ فَصَعِدُوْا فِي الْجَبَلِ فَمَرُّوْا بِالْغَارِ فَرَأَوْا عَلَى بَابِهِ نَسَجَ الْعَنْكَبُوْتِ. فَقَالُوْا لَوْ: دَخَلَ هَاهُنَا لَمْ يَكُنْ نَسْجُ الْعَنْكَبُوْتِ عَلَى بَابِهِ فَمَكَثَ فِيْهِ ثَلَاثَ لِيَالٍ. رَوَاهُ أَحْمَدُ.
5934. (67) [3/1669 –బలహీనం]
ఇబ్నె ‘అబ్బాస్ (ర) కథనం: ఒకరోజు రాత్రి ఖురైషీలు దారున్నద్‌వలో రహస్య పన్నాగాలు చేసారు. కొందరు, ‘తెల్లవారగానే ఆ వ్యక్తిని త్రాళ్ళతో కట్టివేద్దాం,’ అని అన్నారు. ఆ వ్యక్తి అంటే ప్రవక్త (స). మరి కొందరు, ‘అతన్ని చంపివేద్దాం,’ అని సలహా ఇచ్చారు. మరి కొందరు, ‘అతన్ని ఇక్కడి నుండి బహిష్కరిద్దాం,’ అని అన్నారు. అల్లాహ్ (త) తన ప్రవక్తకు అవిశ్వాసుల ఈ పన్నాగాలను గురించి తెలియపరిచాడు. ఆ రాత్రి ‘అలీ (ర) ప్రవక్త (స) పడకపైన పడుకున్నారు. ప్రవక్త (స) మక్కహ్ నుండి బయలుదేరి సౌ’ర్ గుహలో దాక్కున్నారు. ఇటు అవిశ్వాసులు రాత్రంతా ‘అలీ (ర)ను కాపలా కాసి అతన్ని కాచుకొని ఉన్నారు. ఆ పడు కున్నది ప్రవక్త (స) అని వారు అనుకున్నారు. చివరికి తెల్ల వారిన తర్వాత దాడి జరిగింది. వారు చూసేసరికి ‘అలీ (ర) కనబడ్డారు. అల్లాహ్ వారి కుట్రను భంగం చేసాడు. వారు ఆందోళనకు గురై, ‘మీ స్నేహితుడు ఎక్కడ,’ అని అడిగారు. దానికి ‘అలీ (ర), ‘నాకు తెలియదు,’ అని అన్నారు. అది విన్న అవిశ్వాసులు ప్రవక్త (స) అడుగు జాడలను అనుసరిస్తూ వెతకసాగారు. సౌ’ర్ గుహ చేరిన తర్వాత అడుగు జాడలను నిర్థారించ లేక పోయారు. కొండపైకి ఎక్కారు. సౌ’ర్ గుహద్వారం వద్దకు వెళ్ళారు. ద్వారంపై సాలెగూడు ఉండటంవల్ల ఇందులో ఎవరైనా ప్రవేశించి ఉంటే ద్వారంపై ఈ సాలెగూడు ఉండదు అని నిర్థారించుకొని వెనుతిరిగారు. ప్రవక్త (స) మూడురోజులు ఆ గుహలో ఉన్నారు. (అ’హ్మద్)
5935 – [ 68 ] ( صحيح ) (3/1669)
وعَنْ أَبِيْ هُرَيْرَةَ أَنَّهُ قَالَ: لَمَّا فُتِحَتْ خَيْبَرُ أُهْدِيَتْ لِرَسُوْلِ اللهِ صلى الله عليه وسلم شَاةٌ فِيْهَا سُمٌّ. فَقَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: اِجْمَعُوْا لِيْ مَنْ كَانَ هَا هنا مِنَ الْيَهُوْدِ فَجَمَعُوْا لَهُ. فَقَالَ لَهُمْ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: إِنِّيْ سَائِلُكُمْ عَنْ شَيْءٍ فَهَلْ أَنْتُمْ صَادِقِيَّ عَنْهُ؟ فَقَالُوْا: نَعَمْ يَا أَبَا الْقَاسِمِ. فَقَالَ لَهُمْ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: مَنْ أَبُوْكُمْ. قَالُوْا: فُلَانٌ. فَقَالَ رَسُوْلُ الله صلى الله عليه وسلم: كَذَبْتُمْ بَلْ أَبُوْكُمْ فُلَانٌ. فَقَالُوْا صَدَقْتَ وَبَرَرْتَ. قَالَ: “هَلْ أَنْتُمْ مُصَدِّقِيَّ عَنْ شَيْءٍ إِنْ سَأَلْتُكُمْ عَنْهُ”. قَالُوْا: نَعَمْ يَا أَبَا الْقَاسِمِ وَإِن كَذَبْنَاكَ. عَرَفْتَ كَمَا عَرَفْتَهُ فِي أَبِيْنَا. قَالَ لَهُمْ رَسُوْلُ الله صلى الله عليه وسلم: مَنْ أَهْلُ النَّارِ. قَالُوْا: نَكُوْنُ فِيْهَا يَسِيْرًا ثُمَّ تَخْلُفُوْنَنَا فِيْهَا. فَقَالَ لَهُمْ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: اخْسَئُوْا فِيْهَا وَاللهِ لَا نَخْلُفُكُمْ فِيْهَا أَبَدًا. ثُمَّ قَالَ لَهُمْ: فَهَلْ أَنْتُمْ مُصَدِّقِيَّ عَنْ شَيْءٍ إِنْ سَأَلْتُكُمْ عَنْهُ. قَالُوْا: نَعَمْ يَا أَبَا الْقَاسِمِ. قَالَ: “هَلْ جَعَلْتُمْ فِيْ هَذِهِ الشَّاةِ سَمًّا”. قَالُوْا: نَعَمْ. فَقَالَ: مَا حَمَلَكُمْ عَلَى ذَلِكَ. فَقَالُوْا: أَرَدْنَا إِنْ كُنْتَ كَاذِبًا نَسْتَرِيْحُ مِنْكَ وَإِنْ كُنْتَ صَادِقًا لَمْ يَضُرَّكَ. روَاهُ الْبُخَارِيُّ.
5935. (68) [3/1669 –దృఢం]
అబూ హురైరహ్ (ర) కథనం: ఖైబర్ విజయం నాడు ప్రవక్త (స) వద్దకు కాల్చిన మేక తీసుకు రావటం జరిగింది. అందులో విషం కలిపి ఉంది. ప్రవక్త (స) ఇక్కడ ఉన్న యూదులందరినీ నా వద్దకు తీసుకు రమ్మని ఆదేశించారు. వారందరినీ తీసుకురావటం జరిగింది. ప్రవక్త (స) వారితో, ‘నేను మీకో విషయం అడుగుతాను. మీరు నన్ను ధ్రువీకరిస్తారా?’ అని అడిగారు. దానికి వారు, ‘అవును అబుల్ ఖాసిమ్,’ అని అన్నారు. అప్పుడు ప్రవక్త (స), ‘మీ తెగ నాయకుడెవరు?’ అని అడిగారు. దానికి వారు, ‘ఫలానా వ్యక్తి,’ అని అన్నారు. అప్పుడు ప్రవక్త (స), ‘మీరు అసత్యం పలుకుతున్నారు. మీ నాయకుడు ఫలానా వ్యక్తి,’ అని అన్నారు. దానికి వారు, ‘తమరు నిజం పలికారు,’ అని అన్నారు. ఆ తర్వాత ప్రవక్త (స), ‘ఒకవేళ నేను మిమ్మల్ని ఏదైనా అడిగితే, నిజం చెబుతారా?’ అని అన్నారు. దానికి వారు, ‘అవును, ఒకవేళ మేము అసత్యం పలికితే తమరు తెలుసు కుంటారు. ఇంతకు ముందు తెలుసు కున్నట్టు,’ అని అన్నారు. ప్రవక్త (స) వారిని, ‘నరకవాసు లెవరని,’ అడిగారు. దానికి వారు, ‘నరకంలో మేము కొన్ని రోజులు ఉంటాం. ఆ తరువాత మీరు మా తర్వాత నరకంలో ప్రవేశిస్తారు,’ అని అన్నారు. అప్పుడు ప్రవక్త (స), ‘నీచులారా! దూరంకండి, అల్లాహ్ సాక్షి! మేమెన్నడూ మీ తర్వాత నరకంలోనికి వెళ్ళము,’ అని అన్నారు. ఆ తరువాత ప్రవక్త (స), ‘ఒకవేళ నేను మిమ్మల్ని అడిగితే సత్యం పలుకుతారా?’ అని అడిగారు. దానికి వారు, ‘అవును అబుల్ ఖాసిమ్,’ అని అన్నారు. ప్రవక్త (స), ‘మీరు ఈ మేక మాంసంలో విషం కలిపారా?’ అని అడిగారు. దానికి వారు, ‘అవునని’ అన్నారు. ప్రవక్త (స), ‘విషం ఎందుకు కలిపారు,’ అని అన్నారు. దానికి వారు ఒకవేళ మీరు ప్రవక్త కాకపోతే, పీడ విరగడవుతుంది, విషం మిమ్మల్ని సమాప్తం చేస్తుంది, ఒకవేళ మీరు ప్రవక్త లయితే విషం మిమ్మల్ని ఏమాత్రం హాని చేకూర్చదు,’ అని అన్నారు. (బు’ఖారీ)
5936 – [ 69 ] ( صحيح ) (3/1670)
وعَنْ عَمْرِو بْنِ أَخْطَبَ الْأَنْصَارِيِّ قَالَ: صَلّى بِنَا رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم يَوْمًا الْفَجْرِ وَصَعِدَ الْمِنْبَرِ فَخَطَبَنَا حَتّى حَضَرَتِ الظُّهْرُ. فَنَزَلَ فَصَلّى ثُمَّ صَعِدَ الْمَنْبَرَ فَخَطَبَنَا حَتّى حَضَرَتِ الْعَصْرُ. ثُمَّ نَزَلَ فَصَلَّى ثُمَّ صَعِدَ الْمِنْبَرَ حَتّى غَرَبَتِ الشَّمْسُ. فَأَخْبَرَنَا بِمَا هُوَ كَائِنٌ إِلى يَوْمِ الْقِيَامَةِ فَأَعْلَمُنَا أَحْفَظُنَا. روَاهُ مُسْلِمٌ .
5936. (69) [3/1670–దృఢం]
అమ్ర్ బిన్ అ’ఖ్’తబ్ అ’న్సారీ (ర) కథనం: ప్రవక్త (స) ఒకరోజు మాకు ఫజ్‌ర్ నమా’జు చదివించారు. ఆ తరువాత మెంబరుపై నిలబడి మా ముందు ప్రసంగించారు. చివరికి ”జుహ్‌ర్ సమయం అయ్యింది. ప్రవక్త (స) మెంబరుపై నుండి క్రిందికి దిగి నమా’జు చదివించారు. మళ్ళీ ప్రవక్త (స) మెంబరుపైకి ఎక్కారు. మాకు హితోపదేశాలు చేస్తూనే ఉన్నారు. చివరికి అస్ర్ నమా’జు వేళ అయ్యింది. ప్రవక్త (స) మెంబరుపై నుండి క్రిందికి దిగారు. అస్ర్ నమా’జు చదివించారు. ఆ తరువాత మళ్ళీ మెంబరుపైకి ఎక్కారు. చివరికి సూర్యాస్తమయం అయ్యింది. ఆ ప్రసంగంలో తీర్పు దినం వరకు జరగబోయే విషయాలను పేర్కొన్నారు. ఈ నాడు మాలో వాటిని అందరికంటే అధికంగా గుర్తుంచుకున్న వాడే గొప్పవాడు. (ముస్లిమ్)
5937 – [ 70 ] ( مُتَّفَقٌ عَلَيْهِ ) (3/1670)
وَعَنْ مَعْنِ بْنِ عَبْدِ الرَّحْمنِ قَالَ: سَمِعْتُ أَبِيْ قَالَ: سَأَلْتُ مَسْرُوْقًا: مَنْ آذَنَ النَّبِيّ صلى الله عليه وسلم بِالْجِنِّ لَيْلَةَ اسْتَمَعُوا الْقُرْآنَ؟ قَالَ: حَدَّثَنِيْ أَبُوْكَ يَعْنِيْ عَبْدَ الله ابْنَ مَسْعُوْدٍ أَنَّهُ قَالَ: آذَنْتُ بِهِمْ شَجَرَةً. مُتَّفَقٌ عَلَيْهِ.
5937. (70) [3/1670– ఏకీభవితం]
మ’అన్ బిన్ ‘అబ్దుర్ర’హ్మాన్ (ర) కథనం: నేను మా నాన్నగారి ద్వారా ఇలా విన్నాను, ”నేను మస్‌రూఖ్ (ర)ను, జిన్నులు ఖుర్‌ఆన్ విన్నారని ప్రవక్త (స)కు ఎవరు తెలియపరిచారు,” అని అడిగాను. దానికి మస్‌రూఖ్, నాకు మీ తండ్రిగారు ‘అబ్దుల్లాహ్ బిన్ మస్’ఊద్, ప్రవక్త (స)కు ఒక చెట్టు తెలియపరచిందని తెలిపారు. (బు’ఖారీ, ముస్లిమ్)
5938 – [ 71 ] ( صحيح ) (3/1670)
وعَنْ أَنَسٍ قَالَ: كُنَّا مَعَ عُمَرَ بَيْنَ مَكَّةَ وَالْمَدِيْنَةَ فَتَرَاءَيْنَا الْهِلَالَ وَكُنْتُ رَجُلًا حَدِيْدَ الْبَصَرِ فَرَأَيْتُهُ وَلَيْسَ أَحَدٌ يَزْعَمُ أَنَّهُ رَآهُ غَيْرِيْ. قَالَ: فَجَعَلْتُ أَقُوْلُ لِعُمَرَ أَمَا تَرَاهُ فَجَعَلَ لَا يَرَاهُ. قَالَ: يَقُوْلُ عُمَرُ سَأَرَاهُ وَأَنَا مُسْتَلْقٍ عَلَى فِرَاشِيْ ثُمَّ أَنْشَأَ يُحَدِّثُنَا عَنْ أَهْلِ بَدْرٍ. فَقَالَ: إِنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم كَانَ يُرِيْنَا مَصَارِعَ أَهْلِ بَدْرٍ بِالْأَمْسِ. يَقُوْلُ هَذَا مَصْرَعُ فُلَانٍ غَدَا إِنْ شَاءَ اللهُ. قَالَ: فَقَالَ عُمَرُ فَوَالَّذِيْ بَعَثَهُ بِالْحَقِّ مَا أَخْطَئُوْا الْحُدُوْدَ الَّتِيْ حَدَّ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم. قَالَ: فَجُعِلُوْا فِيْ بِئْرٍ بَعْضُهُمْ عَلَى بَعْضٍ فَانْطَلَقَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم حَتّى اِنْتَهَى إِلَيْهِمْ. فَقَالَ يَا فُلَانُ بْنَ فُلَانٍ وَيَا فُلَانُ بْنَ فُلَانٍ هَلْ وَجَدْتُمْ مَا وَعَدَكُمْ اللهُ وَرَسُوْلُهُ حَقًّا فَإِنِّيْ قَدْ وَجَدْتُ مَا وَعَدَنِيَ اللهُ حَقًّا. قَالَ عُمَرُ: يَا رَسُوْلَ اللهِ كَيْفَ تُكَلِّمُ أَجْسَادًا لَا أَرْوَاحَ فِيْهَا. قَالَ: مَا أَنْتُمْ بِأَسْمَعَ لِمَا أَقُوْلُ مِنْهُمْ غَيْرَ أَنَّهُمْ لَا يَسْتَطِيْعُوْنَ أَنْ يَرُدُّوْا عَلَيَّ شَيْئًا”. روَاهُ مُسْلِمٌ.
5938. (71) [3/1670– దృఢం]
అనస్ (ర) కథనం: మేము ‘ఉమర్ (ర) వెంట మక్కహ్ మదీనహ్ల మధ్య ఉన్నప్పుడు నెలవంకను చూడటానికి ప్రయత్నించాము. నా దృష్టి చాలా బాగుండేది. కనుక నేను నెలవంకను చూసుకున్నాను. నేను తప్ప మరెవ్వరూ చూడలేదు. అనంతరం నేను ‘ఉమర్ (ర)ను, ‘మీకు చంద్రుడు కనబడలేదా,’ అని అడిగాను. అతను(ర) ప్రయత్నించారు. కాని నెలవంక కనబడలేదు. అయితే ‘ఉమర్ (ర), ‘త్వరలో నేను పడకపై పరుండి చూస్తాను,’ అని అన్నారు. ఆ తరువాత ‘ఉమర్ (ర) మా ముందు బద్ర్ యుద్ధంలో మరణించినవారిగురించి ప్రస్తావించటం ప్రారంభించారు. ప్రవక్త (స) మాకు రేపు బద్ర్ యుద్ధంలో మరణించ బోయే వారి స్థానాలను గురించి ప్రస్తావిస్తూ ఇన్‌షా అల్లాహ్ రేపు ఇక్కడ ఫలానా వ్యక్తి చంప బడతాడు, ఫలానా వ్యక్తి ఇక్కడ చంపబడతాడు అని అన్నారు. ప్రవక్త (స)ను సత్యం ఇచ్చి పంపిన అల్లాహ్ సాక్షి! చూపించబడిన స్థానాలలోనే వారు చంపబడ్డారు. ఆ తరువాత అవిశ్వాసుల శవాలను బావిలో విసరి వేయబడడం జరిగింది. అనంతరం ప్రవక్త (స) వారి వద్దకు వెళ్ళి, వారి నుద్దేశించి, ‘ఓ ఫలానా వ్యక్తీ! అల్లాహ్ (త) మరియు ఆయన ప్రవక్త(స) చేసిన వాగ్దానాలను సత్యమైనవిగా పొందారా? నేను మాత్రం అల్లాహ్(త) చేసిన వాగ్దానాన్ని సత్యమైనదిగా పొందాను,’ అని అన్నారు. అప్పుడు ‘ఉమర్ (ర), ‘ఓ ప్రవక్తా! శవాలతోతమరు ఎలామాట్లాడు తున్నారు? వారిలో ప్రాణంలేదుకదా?’ అని అన్నారు. దానికి ప్రవక్త (స), ‘వారు బాగా వింటున్నారు, కాని సమా ధానం ఇచ్చే శక్తి వారికి లేదు,’ అని అన్నారు. (ముస్లిమ్)
5939 – [ 72 ] ( لم تتم دراسته ) (3/1671)
وَعَنْ أُنِيْسَةَ بِنْتِ زَيْدِ بْنِ أَرْقَمَ عَنْ أَبِيْهَا أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم دَخَلَ عَلَى زَيْدٍ يَعُوْدُهُ مِنْ مَرَضٍ كَانَ بِهِ قَالَ: “لَيْسَ عَلَيْكَ مِنْ مَرَضِكَ بَأسٌ وَلَكِنْ كَيْفَ لَكَ إِذَاعُمِّرْتَ بَعْدِيْ فَعَمِيْتَ؟” قَالَ: أَحْتَسِبُ وَأَصْبِرْ. قَالَ: “إِذَا تَدْخُلُ الْجَنَّةَ بِغَيْرِ حِسَابٍ”. قَالَ: فَعَمِيَ بَعْدَ مَا مَاتَ النَّبِيُّ صلى الله عليه وسلم. ثُمَّ رَدَّ اللهُ بَصَرَهُ ثُمَّ مَاتَ.
5939. (72) [3/1671– అపరిశోధితం]
అనీసహ్ బిన్‌తె ‘జైద్ బిన్ అర్‌ఖమ్ తన తండ్రి ద్వారా కథనం: ప్రవక్త (స), అనారోగ్యంగా ఉన్న ‘జైద్ బిన్ అర్‌ఖమ్‌ను పరామర్శించటానికి ఆయన వద్దకు వెళ్ళారు. ప్రవక్త (స) అతనితో, ‘నీ వ్యాధి అంత ప్రమాద కరమైనదిగా లేదు, కాని నా మరణానంతరం నీ చూపు బలహీనపడినపుడు నీ పరిస్థితి ఎలా ఉంటుంది,’ అని అన్నారు. దానికి ‘జైద్ బిన్ అర్‌ఖమ్, ‘పుణ్య ఫలాపేక్షతో సహనం వహిస్తాను,’ అని అన్నారు. అప్పుడు ప్రవక్త (స), ‘మరి అప్పుడైతే నీవు ఎటువంటి విచారణ లేకుండా స్వర్గంలో ప్రవేశిస్తావు,’ అని అన్నారు. ప్రవక్త (స) మరణా నంతరం ‘జైద్ బిన్ అర్‌ఖమ్ అంధులై పోయారు. అనంతరం అల్లాహ్ (త) అతనికి మళ్ళీ చూపు ప్రసాదించాడు. ఆ తరువాత అతను మరణించారు. (బైహఖీ-దలాయిలు న్నుబువ్వహ్)
5940 – [ 73 ] ( لم تتم دراسته ) (3/1671)
وَعَنْ أُسَامَةَ بْنِ زَيْدٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَنْ تَقُوْلُ عَلَيَّ مَالَمْ أَقُلْ فَلْيَتَبَوَّأْ مَقْعَدَهُ مِنَ النَّارِ”. وَذَلِكَ أَنَّهُ بَعَثَ رَجُلًا فَكَذَبَ عَلَيْهِ فَدَعَا عَلَيْهِ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم فَوَجَدَ مَيِّتًا وَقَدِ انْشَقَّ بَطنُهُ وَلَمْ تَقْبَلُهُ الْأَرْضُ. روَاهُمَا الْبَيْهَقِيُّ فِيْ دَلَائِلِ النُّبُوَّةِ.
5940. (73) [3/1671– అపరిశోధితం]
‘ఉసామా బిన్ ‘జైద్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”నేను పలకని మాటను పలికిన వ్యక్తి తన నివాసం నరకంలో ఏర్పరచుకోవాలి. దీనికి కారణం ఏమిటంటే, ప్రవక్త (స) ఒక వ్యక్తిని పంపారు. ఆ వ్యక్తి ప్రవక్త (స) చెప్పని విషయాన్ని అంటగట్టాడు. ప్రవక్త (స) అతన్ని శపించారు. అనంతరం ఆ వ్యక్తి మరణిం చాడు. అతని కడుపు చీల్చబడింది. భూమి కూడా అతన్ని స్వీకరించలేదు. (బైహఖీ- దలాయిలు న్నుబువ్వహ్)
5941 – [ 74 ] ( صحيح ) (3/1671)
وعَنْ جَابِرٍ أَنَّ رَسُوْلَ اللهِ جَاءَهُ رَجُلٌ يَسْتَطْعِمُهُ فَأَطْعَمَهُ شَطْرَ وَسْقِ شَعِيْرٍ. فَمَا زَالَ الرَّجُلُ يَأْكُلُ مِنْهُ وَامْرَأَتُهُ وَضَيْفُهُمَا حَتّى كَالَهُ فَفَنِيَ فَأَتَى النَّبِيّ صلى الله عليه وسلم فَقَالَ: “لَوْ لَمْ تَكِلْهُ لَأَكَلْتُمْ مِنْهُ وَلَقَامَ لَكُمْ”. رَوَاهُ مُسْلِمٌ.
5941. (74) [3/1671– దృఢం]
జాబిర్ (ర) కథనం: ప్రవక్త (స) వద్దకు ఒక వ్యక్తి వచ్చాడు. అతడు ప్రవక్త (స)ను అన్నం అడిగాడు. ప్రవక్త (స) అతనికి సగం వసఖ్ యవ్వలు ఇచ్చారు. అనంతరం ఆ వ్యక్తి, అతడి భార్య, అతిథులు తినేవారు. అనంతరం ఆ వ్యక్తి మిగిలిన యవ్వలను తూచాడు. అవి చాలా తొందరగా అయిపోయాయి. ఆ తరువాత ఆ వ్యక్తి ప్రవక్త (స) వద్దకు వచ్చాడు. అప్పుడు ప్రవక్త (స) ”నువ్వు వాటిని తూయకుండా ఉంటే, వాటి నుండి మీరు తింటూ ఉండేవారు. ఇంకా అవి ఎల్లప్పుడూ మిగిలి ఉండేవి,” అని అన్నారు.
5942 – [ 75 ] ( صحيح ) (3/1671)
وعَنْ عَاصِمِ بْنِ كُلَيْبٍ عَنْ أَبِيْهِ عَنْ رَجُلٍ مِنَ الْأَنْصَارِ قَالَ: خَرَجْنَا مَعَ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم فِيْ جَنَازَةٍ. فَرَأَيْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم وَهُوَ عَلَى الْقَبَرِ يُوْصِي الْحَافِرَ يَقُوْلُ: “أَوْسِعْ مِنْ قِبَلِ رِجْلَيْهِ أَوْسِعْ مِنْ قِبَلِ رَأْسِهِ”. فَلَمَّا رَجَعَ اِسْتَقْبَلَهُ دَاعِي امْرَأَتِهِ. فَأَجَابَ وَنَحْنُ مَعَهُ وَجِيْءَ بِالطَّعَامِ فَوَضَعَ يَدَهُ ثُمَّ وَضَعَ الْقَوْمُ فَأَكَلُوْا فَنَظَرْنَا إِلَى رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم يَلُوْكُ لُقمَةً فِي فَيْهِ. ثُمَّ قَالَ: أَجِدُ لَحْمَ شَاةٍ أُخِذَتْ بِغَيْرِ إِذْنِ أَهْلِهَا فَأَرْسَلَتِ الْمَرْأَةُ تَقُوْلُ: يَا رَسُوْلَ اللهِ إِنِّيْ أَرْسَلْتُ إِلَى النَّقِيْعِ وَهُوَ مَوْضِعٌ يُبَاعُ فِيْهِ الْغَنَمُ لِيَشْتَرِىَ لِيْ شَاةً فَلَمْ تُوْجَدُ فَأَرْسَلْتُ إِلى جَارٍ لِيْ قَدِ اشْتَرَى شَاةً أَنْ يُرْسِلَ إِلَيَّ بِهَا بِثَمَنِهَا فَلَمْ يُوْجَدْ فَأَرْسَلْتُ إِلى امْرَأَتِهِ فَأَرْسَلَتْ إِلَيَّ بِهَا. فَقَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “أَطْعِمِيْ هَذَا الطَّعَامَ الْأُسْرَى”. رَوَاهُ أَبُوْ دَاوُدَ وَالْبَيْهَقِيُّ فِيْ دَلَائِلِ النُّبُوَّةِ
5942. (75) [3/1671 –దృఢం]
‘ఆ’సిమ్ బిన్ కలీబ్ తన తండ్రి ద్వారా, అతడు ఒక అ’న్సారీ వ్యక్తి ద్వారా కథనం: మేము ప్రవక్త (స) వెంట ఒక జనా’జహ్లో వెళ్ళాము. ప్రవక్త (స) సమాధి వద్ద నిలబడి, సమాధి త్రవ్వేవ్యక్తితో కాళ్ళవైపు కొంత విశాలంగాత్రవ్వు, తలదగ్గర కొంతవిశాలంగా త్రవ్వు అని అంటున్నారు. ప్రవక్త (స) స్మశానం నుండి తిరిగి వచ్చిన తర్వాత మృతుని భార్య తరఫున ప్రవక్త (స)ను ఒక వ్యక్తి వచ్చి భోజనానికి పిలిచాడు. ప్రవక్త (స) ఆహ్వానాన్ని స్వీకరించారు. మేము కూడా ప్రవక్త (స) వెంట ఉన్నాం. అనంతరం భోజనం తీసుకు రావటం జరిగింది. ప్రవక్త (స) తినటం ప్రారంభించారు. అనుచరులు కూడా తినటం ప్రారంభించారు. తింటూ ప్రజలు ప్రవక్త (స) వైపు చూసారు. ప్రవక్త (స) తన నోటిలో అన్నం ముద్ద తిప్పుతున్నారు. మ్రింగటం లేదు. ఆ తరువాత ప్రవక్త (స), ‘యజమాని అనుమతి లేకుండా పొందిన మేక మాంసంలా ఉంది,’ అన్నారు. అనంతరం ఆ ఇంటి ఇల్లాలు ప్రవక్త (స) వద్దకు ఒక వ్యక్తిని పంపి, ‘ప్రవక్తా! నఖీ సంతకు మేక తీసుకు రమ్మని మనిషిని పంపాను. కాని అక్కడ మేక దొరకలేదు. పొరుగు వ్యక్తి కూడా లేడు. ఆ తర్వాత నేను పొరుగావిడ వద్దకు పంపితే ఆ మేకను ఆమె పంపింది,’ అని చెప్పింది. అది విన్న ప్రవక్త (స) ఈ అన్నం ఖైదీలకు తినిపించండి అన్నారు. [31] (అబూ దావూద్, బైహఖీ /- దలాయిలు న్నుబువ్వహ్)
5943 – [ 76 ] ضعيف (3/1672)
وَعَن حَازِم بْنِ هِشَامٍ عَنْ أَبِيهِ عَنْ جَدِّهِ حُبَيْشِ بن خَالِد – وَهُوَ أَخُو أمِّ مَعْبَد – أَنَّ رَسُولَ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ حِينَ أُخْرِجَ مِنْ مَكَّةَ خَرَجَ مُهَاجِرًا إِلَى الْمَدِينَةِ هُوَ وَأَبُو بَكْرٍ وَمَوْلَى أَبِي بَكْرٍ عَامِرُ بْنُ فُهَيْرَةَ وَدَلِيلُهُمَا عَبْدُ اللَّهِ اللَّيْثِي مَرُّوا عَلَى خَيْمَتَيْ أُمِّ مَعْبَدٍ فَسَأَلُوهَا لَحْمًا وَتَمْرًا لِيَشْتَرُوا مِنْهَا فَلَمْ يُصِيبُوا عِنْدَهَا شَيْئًا من ذَلِك وَكَانَ الْقَوْمُ مُرْمِلِينَ مُسْنِتِينَ فَنَظَرَ رَسُولُ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ إِلَى شَاةٍ فِي كِسْرِ الْخَيْمَةِ فَقَالَ: «مَا هَذِهِ الشَّاةُ يَا أُمَّ معبد؟» قَالَتْ: شَاةٌ خَلَّفَهَا الْجَهْدُ عَنِ الْغَنَمِ. قَالَ: «هَلْ بِهَا مِنْ لَبَنٍ؟» قَالَتْ: هِيَ أَجْهَدُ مِنْ ذَلِكَ. قَالَ: «أَتَأْذَنِينَ لِي أَنْ أَحْلِبَهَا؟» قَالَتْ: بِأَبِي أَنْتَ وَأُمِّي إِنْ رَأَيْتَ بِهَا حَلباً فاحلبها. فَدَعَا رَسُولُ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ فَمَسَحَ بِيَدِهِ ضَرْعَهَا وَسَمَّى اللَّهَ تَعَالَى وَدَعَا لَهَا فِي شَاتِهَا فتفاجت عَلَيْهِ وَردت وَاجْتَرَّتْ فَدَعَا بِإِنَاءٍ يُرْبِضُ [ص:1673] الرَّهْطَ فَحَلَبَ فِيهِ ثجَّاً حَتَّى علاهُ الْبَهَاءُ ثُمَّ سَقَاهَا حَتَّى رَوِيَتْ وَسَقَى أَصْحَابَهُ حَتَّى رَوُوا ثُمَّ شَرِبَ آخِرَهُمْ ثُمَّ حَلَبَ فِيهِ ثَانِيًا بَعْدَ بَدْءٍ حَتَّى مَلَأَ الْإِنَاءَ ثُمَّ غَادَرَهُ عِنْدَهَا وَبَايَعَهَا وَارْتَحَلُوا عَنْهَا. رَوَاهُ فِي «شَرْحِ السُّنَّةِ» وَابْنُ عَبْدِ الْبَرِّ فِي «الِاسْتِيعَابِ» وَابْنُ الْجَوْزِيِّ فِي كِتَابِ «الْوَفَاءِ» وَفِي الحَدِيث قصَّةٌ.
5943. (76) [3/1672 –బలహీనం]
‘హా’జిమ్ బిన్ హిషామ్ (ర) తన తండ్రి ద్వారా అతడు తనతండ్రి ద్వారా కథనం: ప్రవక్త (స) వలసిపోయి నప్పుడు మదీనహ్కు బయలుదేరారు. ప్రవక్త (స) వెంట అబూ బకర్, విడుదలైన అబూ బకర్ స్వతంత్ర బానిస ‘ఆమిర్ బిన్ ఫుహైరహ్, ‘అబ్దుల్లాహ్ లీసీ’ ఉన్నారు. దారి చూపెట్టేవారు ముగ్గురున్నారు. మార్గంలో వారు ఉమ్మె మ’అబద్ టెంట్లను చూసారు. ఆమెను మాంసం, ఖర్జూరాలను కొందామని అడిగారు. కాని అక్కడ ఏమీ లభించలేదు. ఎందుకంటే ఆ కాలంలో కరువు కాటకాలు ఏర్పడి ఉన్నాయి. ప్రవక్త (స) దృష్టి టెంట్‌కి ఒక వైపు కట్టి వేయబడి ఉన్న మేకపై పడింది. ప్రవక్త (స) ‘ఓ ఉమ్మె మ’అబద్ ఈ మేకకు ఏమయింది?’ అని అడిగారు. దానికి ఆమె బలహీనంగా ఉండటం వల్ల మందలో పంపలేదు. ప్రవక్త (స), ‘ఇది పాలు ఇస్తుందా?’ అని అడిగారు. ‘ఏమీ ఇవ్వటం లేదని’ అన్నారు. పాలు పితక డానికి అనుమతిస్తావా అని అడిగారు ప్రవక్త (స). దానికి ఆమె, ‘నా తల్లిదండ్రులు తమకోసం త్యాగంకాను. పాలుంటే పితకండి,’ అని విన్నవించుకుంది. ప్రవక్త (స) మేకను తెప్పించారు. దాని సిరాలను చేత్తో నిమిరారు. బిస్మిల్లాహ్ పఠించి, ఆమెకోసం వాటిలో శుభం కలగాలని ప్రార్థించారు. అనంతరం మేకపాలు పితకటానికి తన కాళ్ళను ఎడంచేసింది. పాలు విడిచిపెట్టి నెమరు వేయసాగింది. ప్రవక్త (స) చాలా మందికి సరిపడేటంతటి గిన్నె తెప్పించారు. దానినిండా పాలు పితికారు. నురుగు గిన్నె అంచుల వరకు వచ్చే సింది. ఆ తరువాత ప్రవక్త (స) పాలను ఉమ్మె మ’అబద్‌కు త్రాపించారు. ఆమె కడుపునిండా త్రాగింది. ఆ తర్వాత అనుచరులకు త్రాపించారు. చివరగా ప్రవక్త (స) త్రాగారు. కొంతసేపు తర్వాత మళ్ళీ పాలుపితికారు. ఆ గిన్నె పాలతో నిండి పోయింది. ఆ పాలను ప్రవక్త (స) ఉమ్మె మ’అబద్‌కు ఇచ్చి వేసారు. ఆ తర్వాత ఉమ్మె మ’అబద్ ఇస్లాం స్వీకరించారు. ఆ తరువాత ప్రవక్త (స) అక్కడి నుండి బయలు దేరారు. [32] (షర్’హుస్సున్నహ్)
=====
8 – بَابُ الْكَرَامَاتِ
8. మహత్యాలు
విశ్వాసులారా! ప్రకృతికి విరుద్ధంగా జరిగే విషయాలను మహత్యం అంటారు. అయితే అందులో నేను ప్రవక్తననే వాదన ఉండకూడదు. ఇంకా అవిశ్వాసులతో పోటీ పడకూడదు. దైవదౌత్యంతో పాటు, ప్రకృతికి విరుద్ధంగా జరిగే విషయాన్ని మహిమలు (ము’అజి’జాత్) అంటారు. దైవప్రియ భక్తులవల్ల ఇటువంటి మహత్యాలు జరగడం సహజం. అల్లాహ్(త) ఎవరి ద్వారానైనా మహిమలను బహిర్గతం చేయవచ్చు. ‘హదీసు’ల్లో ప్రవక్త (స) మహత్యాల గురించి పేర్కొనడం జరిగింది. క్రింది ‘హదీసు’లను అధ్యయనం చేయండి.
اَلْفَصْلُ الْأَوَّلُ మొదటి విభాగం
5944 – [ 1 ] ( صحيح ) (3/1674)
عَنْ أَنَسٍ أَنَّ أُسَيْدَ بْنَ حُضَيْرِ وَعَبَّادَ بْنَ بِشْرٍ تَحَدَّثَا عِنْدَ النَّبِيِّ صلى الله عليه وسلم فِيْ حَاجَةٍ لَهُمَا حَتّى ذَهَبَ مِنَ اللَّيْلِ سَاعَةٌ فِيْ لَيْلَةٍ شَدِيْدَةِ الظُّلُمَةِ ثُمَّ خَرَجَا مِنْ عِنْدَ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم يَنْقَلِبَانِ وَبِيَدِ كُلِّ مِنْهُمَا عُصَيَّةٌ فَأَضَاءَتْ عَصَى أَحَدِهِمَا لَهُمَا حَتّى مَشَيَا فِيْ ضَوْئِهَا حَتّى إِذَا افْتَرَقَتْ بِهِمَا الطَّرِيْقُ أَضَاءَتْ لِلْآخَرِ عَصَاهُ فَمَشَى كُلُّ وَاحِدٍ مِنْهُمَا فِيْ ضَوْءِ عَصَاهُ حَتّى بَلَغَ أَهْلَهُ. روَاهُ الْبُخَارِيُّ.
5944. (1) [3/1674– దృఢం]
అనస్ (ర) కథనం: ఒకరోజు ఉసైద్ బిన్ ‘హు’దైర్ మరియు ‘అబ్బాద్ బిన్ బష్ర్ ప్రవక్త (స) వద్ద కూర్చొని ఉన్నారు. ఏదో వ్యవహారం గురించి మాట్లాడు తున్నారు. చివరికి రాత్రి ఒకభాగం గడిచిపోయింది. ఆ రాత్రి దట్టమైన చీకటి ఉంది. వారిద్దరూ తమ ఇళ్ళకు వెళ్ళటానికి ప్రవక్త (స) వద్ద నుండి లేచి బయటకు వచ్చినపుడు వారిద్దరి చేతుల్లో లాఠీకర్రలు ఉన్నాయి. ఆ రెంటిలో ఒకటి వెలుగు చిమ్మసాగింది. వారు ఆ వెలుగులో నడవసాగారు. ఇద్దరి దారులు వేరైన వెంటనే రెండవది కూడా వెలుగు ప్రసరింపజేయసాగింది. ఇద్దరూ తమ లాఠీల వెలుగులో తమ ఇళ్ళకు చేరుకున్నారు. (బు’ఖారీ)
5945 – [ 2 ] ( صحيح ) (3/1674)
وَعَنْ جَابِرٍ قَالَ: لَمَّا حَضَرَ أحدٌ دَعَانِيْ أَبِيْ مِنَ اللَّيْلِ. فَقَالَ: مَا أَرَانِيْ إِلَّا مَقْتُوْلًا فِيْ أَوَّلِ مَنْ يُقْتَلُ مِنْ أَصْحَابِ النَّبِيِّ صلى الله عليه وسلم. وَإِنِّيْ لَا أَتْرُكُ بَعْدِيْ أَعَزَّ عَلَيَّ مِنْكَ غَيْرَ نَفْسِ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم. فَإِنَّ عَلَيَّ دَيْنًا فَاقْضِ وَاسْتَوْصِ بِأخَوَاتِكَ خَيْرًا فَأَصْبَحْنَا فَكَانَ أَوَّلَ قَتِيْلٍ وَدَفَنْتُهُ مَعَ آخَرَ فِيْ قَبَرٍ. روَاهُ الْبُخَارِيُّ.
5945. (2) [3/1674–దృఢం]
జాబిర్ (ర) కథనం: ‘ఉ’హుద్ యుద్ధం సంభవించి నప్పుడు మా నాన్నగారు రాత్రివేళ నన్ను పిలిచి, ప్రవక్త (స) అనుచరుల్లో యుద్ధంలో అందరికంటే ముందు నేను మరణిస్తానని అనుమానంగా ఉంది. అయితే ప్రవక్త (స) తరువాత నీకంటే ప్రియమైన వారెవరూ నాకు లేరు. నాపై ఉన్న అప్పును తీర్చాలి. చెల్లాయిల పట్ల మంచిగా వ్యవహరించాలి,’ అని ఉపదేశించారు. అనంతరం ఉదయం యుద్ధం జరిగింది. అందరికంటే ముందు మా నాన్నగారు వీరమరణం పొందారు. నేనతన్ని మరో వ్యక్తితో సహా ఖననంచేసాను. [33] (బు’ఖారీ)
5946 – [ 3 ] ( مُتَّفَقٌ عَلَيْهِ ) (3/1675)
وَعَنْ عَبْدِ الرَّحْمنِ بْنِ أَبِيْ بَكْرِ أَنَّ أَصْحَابَ الصُّفَةِ كَانُوْا أُنَاسًا فُقَرَاءَ وَإِنَّ النَّبِيَّ صلى الله عليه وسلم قَالَ: “مَنْ كَانَ عِنْدَهُ طَعَامُ اثْنَيْنِ فَلْيَذْهَبُ بِثَالِثٍ ومَنْ كَانَ عِنْدَهُ طَعَامُ أَرْبَعَةٍ فَلْيَذْهَبْ بِخَامِسٍ أَوْ سَادِسٍ”. وَأَنَّ أَبَا بَكْرٍ جَاءَ بِثَلَاثَةٍ فَانْطَلَقَ النَّبِيُّ صلى الله عليه وسلم بِعَشَرِةٍ. وَإِنَّ أَبَا بَكْرٍ تَعَشَّى عِنْدَ النَّبِيِّ صلى الله عليه وسلم. ثُمَّ لَبِثَ حَتّى صُلِّيَتِ الْعِشَاءُ ثُمَّ رَجَعَ فَلَبِثَ حَتّى تَعَشَّى النَّبِيُّ صلى الله عليه وسلم. فَجَاءَ بَعْدَ مَا مَضَى مِنَ اللَّيْلِ مَا شَاءَ اللهُ. قَالَتْ لَهُ امْرَأَتُهُ: وَمَا حَبَسَكِ عَنْ أَضْيَافِكِ؟ قَالَ: أَوَمَا عَشَّيْتِيْهِمْ؟ قَالَتْ: أَبَوْا حَتّى تَجِيْءَ فَغَضِبَ وَقَالَ: لَا أَطْعَمُهُ أَبَدًا فَحَلَفَتِ الْمَرَأَةُ أَنْ لَا تَطْعَمَهُ وَحَلَفَ الْأَضْيَافُ أَنْ لَا يَطْعَمُوْهُ. قَالَ أَبُوْ بَكْرٍ: كَانَ هَذَا مِنَ الشَّيْطَانِ فَدَعَا بِالطَّعَامِ فَأَكَلَ وأَكَلُوْا فَجَعَلُوْا لَا يَرْفَعُوْنَ لُقْمَةً إِلَّا رَبَتْ مِنْ أَسْفَلِهَا أَكْثَرُ مِنْهَا. فَقَالَ لِأمْرَأَتِهِ: يَا أُخْتَ بَنِيْ فِرَاسٍ مَا هَذَا؟ قَالَتْ: وَقُرَّةِ عَيْنِيْ إِنَّهَا الْآنَ لَأَكْثَر مِنْهَا قَبْلَ ذَلِكَ بِثَلَاثِ مِرَارٍ فَأَكَلُوْا وَبَعَثَ بِهَا إِلى النَّبِيِّ صلى الله عليه وسلم فَذُكِرَ أَنَّهُ أَكَلَ مِنْهَا. مُتَّفَقٌ عَلَيْهِ.
وَذُكِرَ حَدِيْثُ عَبْدِ اللهِ بْنِ مَسْعُوْدٍ: كُنَّا نَسْمَعُ تَسْبِيْحَ الطَّعَامِ فِيْ “الْمُعْجِزَاتِ”.
5946. (3) [3/1675 –ఏకీభవితం]
‘అబ్దుర్ర’హ్మాన్ బిన్ అబూ బకర్ (ర) కథనం: ‘సుఫ్ఫహ్ వారు చాలా నిరుపేదలు, దరిద్రులు. ఒక రోజు ప్రవక్త (స) తన అనుచరులతో, ‘ఇద్దరు వ్యక్తులకు సరిపడే అన్నం ఉన్న వారు సుప్ఫహ్ వారిలోని ఒక వ్యక్తిని మూడో వ్యక్తిగా తీసుకువెళ్ళండి. అదేవిధంగా నలుగురు వ్యక్తులకు సరిపడే భోజనం ఉన్నవారు ఐదవ వ్యక్తిగా వీళ్ళలో ఒకరిని తీసుకువెళ్ళండి లేదా ఆరవవ్యక్తిని కూడా తీసుకు వెళ్ళండి’ అని అన్నారు. అబూ బకర్ (ర) ముగ్గురు వ్యక్తుల్ని తీసుకొని వెళ్ళారు. ప్రవక్త (స) తన వెంట 10 మందిని తీసుకువెళ్ళారు. అబూ బకర్ (ర) రాత్రి భోజనం ప్రవక్త (స) వద్ద చేసారు. తిన్న తరువాత అక్కడే ఆగిపోయారు. ‘ఇషాఅ’ నమాజు కూడా అయిపోయింది. నమా’జు తర్వాత కూడా తన ఇంటికి వెళ్ళలేదు. ప్రవక్త (స) ఇంటికి వెళ్ళి పోయారు. అక్కడే ఉన్నారు. ప్రవక్త (స) కూడా భోజనం చేసారు. అప్పుడు అబూ బకర్ తన ఇంటికి చేరగానే, రాత్రి కొంత సమయం గడిచిపోయింది. ఇంటిలోపలికి ప్రవేశించగానే అతని భార్య అతిథులను ఎందుకు మరచిపోయారని అడిగింది. అబూ బకర్ (ర) తన భార్యను, ‘అతిథులకు అన్నం పెట్టలేదా’ అని అడిగారు. దానికి ఆమె, ‘మీరు రానంత వరకు తినమని అన్నారు,’ అని చెప్పింది. అది విని అబూ బకర్ (ర) చాలా ఆగ్రహం చెందారు. ‘అల్లాహ్ సాక్షి! నేను అన్నం తినను,’ అని అన్నారు. అతని భార్య కూడా, ‘అల్లాహ్ సాక్షి! నేను కూడా అన్నం తినను,’ అన్నది. ఇటు అతిథులు కూడా, అన్నం తినమని ప్రమాణం చేసారు. ఆ తరువాత అబూ బకర్ (ర) చాలా విచారించారు. షై’తాన్ వల్ల ఈ ప్రమాణం చేయటం జరిగిందని అన్నారు. ఆ తరువాత అబూ బకర్ (ర) భోజనం తెప్పించారు. అబూ బకర్, అతిథులు తినటం ప్రారం భించారు. ఒక ముద్ద తినటానికి ఎత్తితే దాని స్థానంలో మరో ముద్ద బహిర్గతం అయ్యేది. అబూ బకర్ (ర) తన భార్యతో ఓ బనూ ఫిరాన్ సోదరి! చాలా ఆశ్చర్యంగా ఉంది. దానికి ఆమె నా కంటిచలువ సాక్షి! ఈ భోజనం మూడురెట్లు పెరిగిపోయింది. అందరూ తృప్తిగా తిన్నారు. ఆ తర్వాత ప్రవక్త (స)కు కూడా పంపడం జరిగింది. ప్రవక్త (స) కూడా దాన్ని ఆరగించారు. (బు’ఖారీ, ముస్లిమ్)
‘అబ్దుల్లాహ్ బిన్ మస్’ఊద్ (ర) ఉల్లేఖనంలో ఇలా ఉంది, ”మేము అన్నంలో నుండి సుబ్’హానల్లాహ్ అనే శబ్దాన్ని వింటూ ఉన్నాం,” అని ఉంది.
—–
اَلْفَصْلُ الثَّانِيْ రెండవ విభాగం
5947 – [ 4] ( لم تتم دراسته ) (3/1675)
عَنْ عَائِشَةَ قَالَتْ: لَمَّا مَاتَ النَّجَاشِيُّ كُنَّا نَتَحَدَّثُ أَنَّهُ لَا يَزَالُ يُرَى عَلَى قَبَرِهِ نُوْرٌ. رَوَاهُ أَبُوْ دَاوُدَ.
5947. (4) [3/1675– అపరిశోధితం]
‘ఆయి’షహ్ (ర) కథనం: నజాషీ మరణానంతరం మేము అతని సమాధిపై ఎల్లప్పుడూ వెలుగు ఆవరించి ఉండేదని చర్చించుకునే వాళ్ళం. [34] (అబూ దావూద్)
5948 – [ 5 ] ( حسن ) (3/1675)
وَعَنْهَا قَالَتْ: لَمَّا أَرَادُوْا غُسْلَ النَّبِيِّ صلى الله عليه وسلم قَالُوْا: لَا نَدْرِيْ أَنُجَرِّدُ رَسُوْلَ الله صلى الله عليه وسلم مِنْ ثِيَابِهِ كَمَا تُجَرِّدُ مَوْتَانَا أَمْ نَغْسِلُهُ وَعَلَيْهِ ثِيَابُهُ؟ فَلَمَّا اخْتَلَفُوْا أَلْقَى اللهُ عَلَيْهِمُ النَّوْمَ حَتّى مَا مِنْهُمْ رَجُلٌ إِلَّا وَذَقْتُهُ فِيْ صَدْرِهِ ثُمَّ كَلَّمَهُمْ مُكَلِّمٌ مِنْ نَاحِيَةِ الْبَيْتِ لَا يَدْرُوْنَ مَنْ هُوَ؟ اِغْسِلُوا النَّبِيَّ صلى الله عليه وسلم وعَلَيْهِ ثِيَابُهُ فَقَامُوْا فَغَسَلُوْهُ وَعَلَيْهِ قَمِيْصُهُ يَصُبُّوْنَ الْمَاءَ فَوْقَ الْقَمَيْصِ وَيَدْلُكُوْنَهُ بِالْقَمِيْصِ. رَوَاهُ الْبَيْهَقِيُّ فِيْ “دَلَائِلِ النُّبُوَّةِ”.
5948. (5) [3/1675– ప్రామాణికం]
‘ఆయి’షహ్ (ర) కథనం: ప్రవక్త (స) మరణించినపుడు అనుచరులు ఆయన్ను స్నానం చేయించగోరినపుడు దుస్తులు తొలగించి స్నానం చేయించాలా? లేక దుస్తు లతోనే స్నానం చేయించాలా అనే ప్రశ్న తలెత్తింది. వారిలో అభి ప్రాయ భేదాలు తలెత్తాయి. అప్పుడు అల్లాహ్ (త) వారిని నిద్రకు గురిచేసాడు. ఆ తరువాత ఇంటిలోని ఒక మూల నుండి ఒక వ్యక్తి మాట్లాడుతూ ప్రవక్త (స)ను దుస్తులతోనే స్నానం చేయించమని అన్నాడు. అనంతరం అందరూ అకస్మాత్తుగా మేల్కొ న్నారు. లేచి నిలబడ్డారు. ప్రవక్త (స)ను దుస్తులతోనే స్నానం చేయించారు. శరీరంపై ఉన్న కమీసుపైనే నీళ్ళు పోస్తూ కమీసుతోనే శరీరాన్ని శుభ్రపరుస్తూ ఉన్నారు. (బైహఖీ – దలాయిలు న్నుబువ్వహ్)
5949 – [6 ] ( صحيح ) (3/1676)
وَعَنِ ابْنِ الْمُنْكَدِرِ أَنَّ سَفِيْنَةَ مَوْلَى رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم أَخْطَأَ الْجَيْشَ بِأَرْضِ الرُّوْمِ أَوْ أُسِرَ فَانْطَلَقَ هَارِبًا يَلْتَمِسُ الْجَيْشَ فَإِذَا هُوَ بِالْأَسَدِ. فَقَالَ: يَا أَبَا الْحَارِثِ أَنَا مَوْلَى رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم. كَانَ مِنْ أَمْرِيْ كَيْتَ وَكَيْتَ فَأَقْبَلَ الْأَسَدُ لَهُ بَصْبَصَةٌ حَتّى قَامَ إِلى جَنْبِهِ كُلَّمَا سَمِعَ صَوْتًا أَهْوَى إِلَيْهِ ثُمَّ أَقْبَلَ يَمْشِيْ إِلى جَنْبِهِ حَتّى بَلَغَ الْجَيْشَ ثُمَّ رَجَعَ الْأَسَدُ. رَوَاهُ فِيْ”شَرْحِ السُّنَّةِ”.
5949. (6) [3/1676 –దృఢం]
ఇబ్నుల్ మున్‌కదిర్ (ర) కథనం: ప్రవక్త (స) విడుదల చేసిన బానిస సఫీనహ్ (ర) రూమ్ ప్రాంతంలో, సైన్యం మార్గం మరచిపోయారు. లేదా శత్రువుకు పట్టుబడ్డారు, మళ్ళీ శత్రువు చిక్కునుండి తప్పించుకొని తన సైన్యం మార్గం వెతకసాగారు. ఈ మధ్య అతను ఒక సింహాన్ని కలిసారు. సఫీనహ్ (ర) సింహంతో, ఓ అబూ ‘హారిస్! నేను ప్రవక్త (స) విడుదల చేసిన బానిసను. ఇలా జరిగి నేను సైన్యం దారి మరచిపోయాను. అనంతరం సింహం తోక ఊపుతూ వచ్చి సఫీనహ్ ప్రక్కన నిలబడింది. సింహం శబ్దం వినే వైపునకు వెళ్ళి తిరిగి వచ్చేది. ఈవిధంగా సఫీనహ్ వెంట నడవసాగింది. చివరకు సఫీనహ్ తన సైన్యాన్ని చేరుకున్నారు. సింహం తిరిగి వెళ్ళి పోయింది. (షర్’హుస్సున్నహ్)
5950 – [ 7 ] ( ضعيف ) (3/1676)
وَعَنْ أَبِي الْجَوْزَاءِ قَالَ: قُحِطَ أَهْلُ الْمَدِيْنَةِ قَحْطًا شَدِيْدًا فَشَكَوْا إِلى عَائِشَةَ فَقَالَتْ: اُنْظُرُوْا قَبَرَ النَّبِيِّ صلى الله عليه وسلم فَاجْعَلُوْا مِنْهُ كُوىّ إِلى السَّمَاءِ حَتَّى لَا يَكُوْنَ بَيْنَهُ وَبَيْنَ السَّمَاءِ سَقْفٌ فَفَعَلُوْا فَمُطِرُوْا مَطَرًا حَتّى نَبَتَ الْعُشْبُ وَسَمِنَتِ الْإِبِلُ حَتّى تَفَتَّقَتْ مِنَ الشَّحْمِ فَسُمِّيَ عَامَ الْفَتْقِ. رَوَاهُ الدَّارَمِيُّ .
5950. (7) [3/1676– బలహీనం]
అబూ జౌ’జాఅ’ (ర) కథనం: మదీనహ్ వాసులు తీవ్ర కరువు కాటకాలకు గురయ్యారు. వారు ‘ఆయి’షహ్ (ర)కు ఫిర్యాదు చేసారు. దానికి ‘ఆయి’షహ్ (ర), ‘మీరు ప్రవక్త (స) సమాధి ఉన్న గది పై కప్పును విప్పివేయండి, అంటే సమాధికి ఆకాశానికి మధ్య ఎటువంటి తెర ఉండకూడదు,’ అని సలహా ఇచ్చారు. అనంతరం ప్రజలు అలాగే చేసారు. ఆ తర్వాత భారీ వర్షాలు కురిసాయి. పచ్చగడ్డి మొలిచింది. పశువులు ఆరోగ్యవంతంగా తయార య్యాయి. క్రొవ్వుతో బలిష్టంగా తయారయ్యాయి. ఆ సంవత్సరానికి ఆమ్ అల్–ఫత్‌ఖ్ అంటే సుఖ సంతోషాల సంవత్సరం అనే పేరు పెట్టటం జరిగింది.[35] (దార్మీ)
5951 – [ 8 ] ( ضعيف ) (3/1676)
وَعَنْ سَعِيْدِ بْنِ عَبْدِ الْعَزِيْزِ قَالَ: لَمَّا كَانَ أَيَّامُ الْحَرَّةِ لَمْ يُؤَذَّنْ فِيْ مَسْجِدِ النَّبِيِّ صلى الله عليه وسلم ثَلَاثًا. وَلَمْ يُقَمْ وَلَمْ يَبْرَحْ سَعِيْدُ بْنُ الْمُسَيَّبِ الْمَسْجِدَ وَكَانَ لَا يَعْرِفُ وَقْتَ الصَّلَاةِ إِلَّا بِهَمْهَمَةٍ يَسْمَعُهَا مِنْ قَبَرِ النَّبِيِّ صلى الله عليه وسلم. رَوَاهُ الدَّارَمِيُّ.
5951. (8) [3/1676– బలహీనం]
స’యీద్ బిన్ ‘అబ్దుల్ ‘అ’జీ’జ్ (ర) కథనం: ‘హర్రహ్ సంఘటన జరిగినపుడు మూడురోజుల వరకు మస్జిదె నబవీలో అజా’న్, తక్‌బీర్లు ఇవ్వబడలేదు. ఇంకా స’యీద్ బిన్ ముసయ్యబ్ కూడా మస్జిద్ నుండి బయటకు రాలేదు. స’యీద్ బిన్ ముసయ్యబ్ నమా’జుల సమయాలను ఒక చిన్న శబ్దం ద్వారా గుర్తించేవారు. అది ప్రవక్త (స) సమాధి గదిలో నుండి వచ్చేది. [36] (దార్మీ)
5952 – [ 9 ] ( ضعيف ) (3/1677)
وَعَنْ أَبِيْ خَلْدَةَ قَالَ: قُلْتُ لِأَبِي الْعَالِيَةِ: سَمِعَ أَنَسٌ مِنَ النَّبِيِّ صلى الله عليه وسلم؟ قَالَ: خَدَمَهُ عَشْرَ سِنِيْنَ وَدَعَا لَهُ النَّبِيُّ صلى الله عليه وسلم وَكَانَ لَهُ بُسْتَانٌ يَحْمِلُ فِيْ كُلِّ سَنَةٍ الْفَاكِهَةَ مَرَّتَيْنِ وَكَانَ فِيْهَا رَيْحَانٌ يَجِيْءُ مِنْهُ رِيْحُ الْمِسْكِ. رَوَاهُ التِّرْمِذِيُّ وَقَالَ: هَذَا حَدِيْثٌ حَسَنٌ غَرِيْبٌ.
5952. (9) [3/1677– బలహీనం]
అబూ ‘ఖల్‌దహ్ కథనం: నేను ‘అబుల్ ‘ఆలియహ్ను, ”అనస్ (ర) ప్రవక్త (స) నుండి ‘హదీసు’లు విన్నారా?” అని అడిగాను. దానికి ‘అబుల్ ‘ఆలియహ్ సమాధానమిస్తూ, అనస్ (ర) 10 సంవత్సరాల వరకు ప్రవక్త (స) సేవచేసారు. ఇంకా ప్రవక్త (స) అతని కోసం దు’ఆ చేసారు. అనస్‌కు ఒక తోట ఉండేది. అందులో సంవత్సరానికి రెండు పంటలు పండేవి. ఇంకా ఆ తోటలో రై’హాన్ చెట్టు ఉండేది. దాన్నుండి కస్తూరి సువాసన వచ్చేది అని అన్నారు. [37] (తిర్మిజి’ – ప్రామాణికం – ఏకోల్లేఖనం).
—–
الفصل الثالث మూడవ విభాగం
5953 – [ 10 ] ( مُتَّفَقٌ عَلَيْهِ ) (3/1677)
عَنْ عُرْوَةَ بْنِ الزبَيرِ أَنَّ سَعِيْدَ بْنَ زَيْدِ بْنِ عَمْرٍو بْنِ نُفَيْلٍ خَاصَمَتْهُ أَرْوَى بِنْتُ أَوْسٍ إِلى مَرْوَانَ بْنِ الْحَكَمِ وَادَّعَتْ أَنَّهُ أَخَذَ شَيْئًا مِنْ أَرْضِهَا. فَقَالَ سَعِيْدٌ: أَنَا كُنْتُ آخُذُ مِنْ أَرْضِهَا شَيْئًا بَعْدَ الَّذِيْ سَمِعْتُ مِنْ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم. قَالَ: وَمَاذَا سَمِعْتُ مِنْ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم. قَالَ: سَمِعْتُ رَسُوْلَ الله صلى الله عليه وسلم يَقُوْلُ: مَنْ أَخَذَ شَبْرًا مِنَ الْأَرْضِ ظُلْمًا طُوِّقَهُ إِلى سَبْعِ أَرْضِيْنَ. فَقَالَ لَهُ مَرْوَانُ: لَا أَسْأَلُكَ بَيْنَةً بَعْدَ هَذَا. فَقَالَ اللّهُمَّ إِنْ كَانَتْ كَاذِبَةً فَاَعم بَصَرَهَا وَاقْتُلْهَا فِيْ أَرْضِهَا. قَالَ فَمَا مَاتَتْ حَتَّى ذَهَبَ بَصَرُهَا ثُمَّ بَيْنَا هِيَ تَمْشِيْ فِيْ أَرْضِهَا إِذْ وَقَعَتْ فِيْ حُفْرَةٍ فَمَاتَتْ. مُتَّفَقٌ عَلَيْهِ.
وَفِيْ رِوَايَةٍ لِمُسْلِمٍ عَنْ مُحَمَّدِ بْنِ زَيْدِ بْنِ عَبْدِ اللهِ بْنِ عُمَرَ بِمَعْنَاهُ وَأَنَّهُ رَآهَا عَمْيَاءَ تَلْتَمِسُ الْجُدُرَ تَقُوْلُ: أَصَابَتْنِيْ دَعْوَةُ سَعِيْدٍ وَأَنَّهَا مَرَّتْ عَلَى بِئْرٍ فِي الدَّارِ الَّتِيْ خَاصَمَتْهُ فَوَقَعَتْ فِيْهَا فَكَانَتْ قَبَرَهَا.
5953. (10) [3/1677–ఏకీభవితం]
‘ఉర్‌వహ్ బిన్ ‘జుబైర్ (ర) కథనం: స’యీద్ బిన్ ‘జైద్ బిన్ ‘అమ్ర్ బిన్ నుఫైల్‌తో అర్‌వహ్ బిన్‌తె ఔస్ వివాదం తలెత్తింది. అర్‌వహ్ బిన్‌తె ఔస్ ఈ వ్యవహారాన్ని మర్వాన్ బిన్ అల్ ‘హకమ్ వద్దకు తీసుకువెళ్ళింది. ఇంకా స’యీద్ బిన్ ‘జైద్ నా భూమిని ఆక్రమించు కున్నాడని ఫిర్యాదు చేసింది. దానికి స’యీద్ బిన్ ‘జైద్ ”ప్రవక్త (స) ప్రవచనం విన్న తర్వాత నేనెలా ఈ మహిళ యొక్క భూమిని ఆక్ర మించుకోగలను,” అని అన్నారు. దానికి మర్వాన్, ‘నువ్వు ప్రవక్త (స) ద్వారా ఏమి విన్నావు?’ అని అడిగారు. అప్పుడు స’యీద్ బిన్ ‘జైద్ నేను ప్రవక్త (స)ను, ”ఎవరైనా మరొకరి జానెడు భూమిని అధర్మంగా ఆక్రమించుకుంటే, తీర్పుదినం నాడు అల్లాహ్ (త) ఏడు భూముల బరువుగల హారాన్ని అతనిమెడలో వేస్తాడు,” అని ప్రవచిస్తూ ఉండగా విన్నానని అన్నారు. అప్పుడు మర్వాన్ స’యీద్‌తో, ‘దీని తర్వాత నేను నిన్ను సాక్ష్యాధారాలు అడగను,’ అని అన్నారు. అప్పుడు స’యీద్, ‘ఓ అల్లాహ్(త)! ఒకవేళ ఈ స్త్రీ అసత్య వాది అయితే, ఈమెను అంధత్వానికి గురిచేయి, ఈమెను తన భూమిలోనే హతమార్చు,’ అని అన్నారు. అదేవిధంగా ఆ స్త్రీ మరణించటానికి ముందు చూపు కోల్పోయింది, ఒకరోజు తన భూమిలోనే నడుస్తూ అకస్మాత్తుగా ఒక గోతిలో పడి మరణించింది. (బు’ఖారీ, ముస్లిమ్)
అయితే ముస్లిమ్ ఉల్లేఖనంలో ము’హమ్మద్ బిన్ ‘జైద్ బిన్ ‘అబ్దుల్లాహ్ బిన్ ‘ఉమర్ (ర) ద్వారా ఇటు వంటి ఉల్లేఖనమే ఉంది. అదేమిటంటే, ము’హమ్మద్ బిన్ ‘జైద్ ఆ స్త్రీని అంధురాలై పోవటం, తడుము కుంటూ నడవటం, ఇంకా నన్ను స’యీద్ బిన్ ‘జైద్ శాపం తగిలింది అనిఅనటం గమనించారు. ఆ తర్వాత ఆ స్త్రీ వివాదపడిన తన ఇంటి బావి ప్రక్క నుండి వెళుతూ, అకస్మాత్తుగా బావిలో పడి మర ణించింది. ఆ బావి ఆవిడ సమాధి అయి పోయింది.
5954 – [ 11 ] ( حسن ) (3/1678)
وعَنِ ابْنِ عُمَرَ أَنَّ عُمَرَ بَعَثَ جَيْشًا وَأَمَّرَ عَلَيْهِمْ رَجُلًا يُدْعى سَارِيَةَ فَبَيْنَمَا عُمَرُ يَخْطُبُ فَجَعَلَ يَصِيْحُ: يَا أَمِيْرُ الْمُؤْمِنِيْنَ لَقِيْنَا عَدُوَّنَا فَهَزَمُوْنَا فَإِذَا بِصَائِحِ يَصِيْحُ: يَا سَارِيَ الْجَبَلَ. فَأَسْنَدْنَا ظُهُوْرَنَا إِلى الْجَبَلِ فَهَزَمَهُمْ اللهُ تَعَالى. رَوَاهُ الْبَيْهَقِيُّ فِيْ “دَلَائِلِ النَّبُوَّةِ”.
5954. (11) [3/1678 –ప్రామాణికం]
ఇబ్నె ‘ఉమర్ (ర) కథనం: ‘ఉమర్ (ర) ఒక సైన్యం పంపారు. ఆ సైన్యంపై ఒక నాయకుణ్ణి నియమించారు. అతన్ని సారియహ్ అనేవారు. ఒకసారి ‘ఉమర్ (ర) ప్రసంగిస్తూ, అకస్మాత్తుగా, ‘ఓ సారియహ్! కొండవైపు నుండి తిరుగు,’ అని అన్నారు. కొన్ని రోజుల తర్వాత సైన్యం వద్ద నుండి ఒక వ్యక్తి వచ్చి, ”ఓ ఖలీఫా! మేము శత్రువులతో యుద్ధం చేసాము. కాని శత్రువులు మమ్మల్ని ఓడించారు. అకస్మాత్తుగా మేము ఒక వ్యక్తి కేక విన్నాం, అతడు కేకవేసి, ‘సారియహ్! కొండవైపు వెళ్ళు,’ అని అన్నాడు. ఆ కేక విని కొండకు అభిముఖంగా ఉన్న మేము వెనక్కి తిరిగాము. ఆ తర్వాత అల్లాహ్ (త) శత్రువులను ఓడించాడు,” అని అన్నాడు. (బైహఖీ-దలాయిలు న్నుబువ్వహ్)
5955 – [ 12 ] ( ضعيف ) (3/1678)
وعَنْ نُبَيْهَةَ بْنِ وَهْبٍ أَنَّ كَعْبًا دَخَلَ عَلَى عَائِشَةَ فَذَكَرُوْا رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم. فَقَالَ كَعْبٌ: مَا مِنْ يَوْمٍ يَطْلُعُ إِلّا نَزَلَ سَبْعُوْنَ أَلْفًا مِنَ الْمَلَائِكَةِ حَتّى يَحُفُّوا بِقَبَرِ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم يَضْرِبُوْنَ بِأَجْنِحَتِهِمْ وَيُصَلُّوْنَ عَلَى رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم حَتّى إِذَا أَمْسَوْا عَرَجُوْا وَهَبَطَ مِثْلُهُمْ فَصَنَعُوْا مِثْلَ ذَلِكَ حَتّى إِذَا انْشَقَّتْ عَنْهُ الْأَرْضُ خَرَجَ فِيْ سَبْعِيْنَ أَلْفًا مِنَ الْمَلَائِكَةِ يَزِفُّوْنَهُ. روَاهُ الدَّارَمِيُّ.
5955. (12) [3/1678 –బలహీనం]
నుబైహహ్ బిన్ వహబ్ కథనం: క’అబ్ అ’హ్‌బార్ ‘ఆయి’షహ్ (ర) వద్దకు వచ్చారు. ప్రజలు ప్రవక్త (స) గుణగణాలను గురించి చర్చించారు. అప్పుడు క’అబ్ అ’హ్‌బార్ ”ప్రతి రోజు ఆకాశం నుండి 70 వేల మంది దైవదూతలు దిగుతారు, ఇంకా ప్రవక్త (స) సమాధిని చుట్టుముడతారు, ఇంకా తమ రెక్కలతో సమాధి చుట్టూ శుభ్రపరుస్తారు. ఇంకా ప్రవక్త (స) పై దురూద్ పంపుతారు. సాయంత్రం కాగానే ఆకాశంపైకి వెళ్ళిపోతారు. ఆ వెంటనే మరో 70 వేల మంది దైవదూతలు దిగి, వారిలాగే చేస్తారు. ఇదేవిధంగా ఎల్లప్పుడూ దైవదూతలు వస్తూ ఉంటారు. చివరికి తీర్పుదినం నాడు ప్రవక్త (స) సమాధి పగిలి 70 వేల మంది దైవదూతలు ప్రవక్త (స)ను దైవసన్నిధిలోకి చేర్చుతారు. (దార్మీ)
=====
9 – بَاب هِجْرَة النَّبِي صلى الله عَلَيْهِ وَسلم من مَكَّة إلى مدينة وَوَفَاتِهِ
9. ప్రవక్త (స) మక్కహ్ నుండి మదీనహ్ ప్రస్థానం, మరణం
اَلْفَصْلُ الْأَوَّلُ మొదటి విభాగం
5956 – [ 1 ] ( صحيح ) (3/1679)
عَنِ الْبَرَاءِ قَالَ: أَوَّلُ مَنْ قَدِمَ عَلَيْنَا مِنْ أَصْحَابِ النَّبِيِّ صلى الله عليه وسلم مُصْعَبُ بْنُ عُمَيْرٍ وَابْنُ أُمِّ مَكْتُوْمٍ فَجَعَلَا يُقْرِآنِنَا الْقُرْآنَ ثُمَّ جَاءَ عَمَّارُ وَبِلَالٌ وَسَعْدٌ ثُمَّ جَاءَ عُمَرُ بْنُ الْخَطَّابِ فِيْ عِشْرِيْنَ مِنْ أَصْحَابِ النَّبِيِّ صلى الله عليه وسلم ثُمَّ جَاءَ النَّبِيُّ صلى الله عليه وسلم. فَمَا رَأَيْتُ أَهْلَ الْمَدِيْنَةِ فَرِحُوْا بِشَيْءٍ فَرَحَهُمْ بِهِ حَتّى رَأَيْتُ الْوَلَائِدَ وَالصِّبْيَانَ يَقُوْلُوْنَ: هَذَا رَسُوْلُ الله صلى الله عليه وسلم قَدْ جَاءَ فَمَا جَاءَ حَتّى قَرَأْتُ: [سَبِّحِ اسْمَ رَبِّكَ الْأَعْلَى؛ 87] فِيْ سُورٍ مِثْلِهَا مِنَ الْمُفَصَّلِ. روَاهُ الْبُخَارِيُّ.
5956. (1) [3/1679 –దృఢం]
బరాఅ’ (ర) కథనం: ప్రవక్త (స) వలస వెళ్ళటానికి ముందు ప్రవక్త (స) అనుచరుల్లో అందరికంటే ముందు మా వద్దకు అంటే మదీనహ్కు వచ్చింది, ము’స్’అబ్ బిన్ ‘ఉమైర్ మరియు ఇబ్నె ఉమ్మె మక్‌తూమ్. వీరిద్దరూ మాకు ఖుర్‌ఆన్ బోధించటం ప్రారంభించారు. ఆ తరువాత ‘అమ్మార్ బిన్ యా’సిర్, బిలాల్ బిన్ రిబా’హ్, స’అద్ బిన్ అబీ వఖ్ఖా’స్‌లు వచ్చారు. ఆ తరువాత ప్రవక్త(స) వచ్చారు. మదీనహ్ ప్రజలు ప్రవక్త (స) రాకపై సంతోషించినట్లు మరే విషయంపై సంతోషం వ్యక్తం చేయలేదు. చివరికి చిన్నచిన్న బాలికలు కూడా సంతోషంతో ”ప్రవక్త (స) మా ఊరికి విచ్చేస్తున్నారు, అతను (స) రాకముందే మేము, ”సబ్బిహి స్మరబ్బికల్ అ’అలా(87), ఇంకా ఇటువంటి సూరాలు కంఠస్తం చేసుకున్నాము, ” అని పాడేవారు. (బు’ఖారీ)
5957 – [ 2 ] ( مُتَّفَقٌ عَلَيْهِ ) (3/1679)
وَعَنْ أَبِيْ سَعِيْدٍ الْخُدْرِيِّ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم جَلَسَ عَلَى الْمِنْبَرِ فَقَالَ: “إِنَّ عَبْدًا خَيَّرَهُ اللهُ بَيْنَ أَنْ يُؤْتِيَهُ مِنْ زَهْرَةِ الدُّنْيَا مَا شَاءَ وَبَيْنَ مَا عِنْدَهُ فَاخْتَارَ مَا عِنْدَهُ”. فَبَكَى أَبُوْ بَكْرٍ قَالَ: فَدَيْنَاكَ بِآبَائِنَا وَأُمَّهَاتِنَا فَعَجِبْنَا لَهُ. فَقَالَ النَّاسُ: اُنْظُرُوْا إِلى هَذَا الشَّيْخ يُخْبِرُ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم عَنْ عَبْدٍ خَيَّرَهُ اللهُ بَيْنَ أَنْ يُؤْتِيَه مِنْ زَهْرَةِ الدُّنْيَا وَبَيْنَ مَا عِنْدَهُ وَهُوَ يَقُوْلُ: فَدَيْنَاكَ بِآبَائِنَا وَأُمَّهَاتِنَا فَكَانَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم هُوَ الْمُخَيَّرَ وَكَانَ أَبُوْ بَكْرٍ هُوَ أَعْلَمَنَا. مُتَّفَقٌ عَلَيْهِ.
5957. (2) [3/1679– ఏకీభవితం]
అబూ స’యీద్ ‘ఖుద్రీ (ర) కథనం: ప్రవక్త (స) మరణ దినాల్లోని ఒకరోజు మెంబరుపై ఎక్కి, అల్లాహ్ (త) ఒక దాసునికి రెండు విషయాల్లో ఏదైనా ఒకటి కోరుకునే అనుమతి ఇచ్చాడు, అంటే అతడు ఈ ప్రాపంచిక భోగ విలాసాలు లేదా తనవద్ద ఉన్న శుభా లను రెంటిలో ఒకటి కోరుకోవాలి. కాని ఆ దాసుడు అల్లాహ్(త) వద్ద ఉన్నదాన్ని కోరు కున్నాడు. అబూ బకర్ (ర) అది విని ఏడ్వసాగారు. ఇంకా, ”ఓ ప్రవక్తా! మేము మీపై త్యాగం కాను, మా తల్లి దండ్రులు తమపై త్యాగం కాను,” అని అన్నారు. మాకు అబూ బకర్ (ర)పై చాలా ఆశ్చర్యం వేసింది. మరికొందరు ఈ ముసలివాడ్ని చూడండి, ప్రవక్త (స) ఒక వ్యక్తిని గురించి చెబుతున్నారు. అల్లాహ్ (త) అతనికి రెండు విషయాల్లో ఒకటి ఎంచుకునే అనుమతి ఇచ్చాడు. అంటే ప్రాపంచిక భోగభాగ్యాలు లేదా అల్లాహ్ (త) వద్ద ఉన్న అనుగ్రహాలు. ఈ ముసలి వ్యక్తి, ‘ఓ ప్రవక్తా! మేము మీపై త్యాగంకాను, మా తల్లిదండ్రులు మీపై త్యాగంకాను,’ అని అంటున్నాడు అని అన్నారు. ఆ తరువాత, ”రెంటిలో ఒకటి కోరుకోమని అనుమతించబడిన వ్యక్తి ప్రవక్త (స) అని, అబూ బకర్ (ర) మాలో అందరికంటే బుద్ధీ జ్ఞానాలు కలవారని తెలిసింది. (బు’ఖారీ, ముస్లిమ్)
5958 – [ 3 ] ( مُتَّفَقٌ عَلَيْهِ ) (3/1679)
وَعَنْ عُقْبَةَ بْنِ عَامِرٍ قَالَ: صَلّى رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم عَلَى قَتْلَى أُحَدٍ بَعْدَ ثَمَانِي سِنِيْنَ كَالْمُوَدِّع لِلْأَحْيَاءِ وَالْأَمْوَاتِ ثُمَّ طَلَعَ الْمنبرَ فَقَالَ: “إِنِّيْ بَيْنَ أَيْدِيَكُمْ فَرَطٌ وَأَنَا عَلَيْكُمْ شَهِيْدٌ وَإِنّ مَوْعِدَكُمُ الْحَوْضُ وَإِنِّيْ لَأَنْظُرُ إِلَيْهِ مِنْ مَقَامِيْ هَذَا وَإِنِّيْ قَدْ أُعْطِيْتُ مَفَاتِيْحَ خَزَائِنِ الْأَرْضِ وَإِنِّيْ لَسْتُ أَخْشَى عَلَيْكُمْ أَنْ تُشْرِكُوْا بَعْدِيْ وَلَكِنِّيْ أَخْشَى عَلَيْكُمُ الدُّنْيَا أَنْ تَنَافَسُوْهَا فِيْهَا”. وَزَادَ بَعْضُهُمْ:”فَتَقْتَتِلُوْا فَتَهْلِكُوْا كَمَا هَلَكَ مَنْ كَانَ قَبْلَكُمْ”. مُتَّفَقٌ عَلَيْهِ.
5958. (3) [3/1679– ఏకీభవితం]
‘ఉఖ్‌బ బిన్ ‘ఆమిర్ (ర) కథనం: ప్రవక్త (స) ఉ’హుద్ యుద్ధంలో వీరమరణం పొందినవారి జనా’జహ్ నమాజు 8 సంవత్సరాల తరువాత చదివారు. అంటే ప్రవక్త (స) మృతులను, సజీవులను వీడ్కోలు పలుకుతున్నారు. ఆ తరువాత ప్రవక్త (స) మెంబరుపై నిలబడ్డారు. ఇంకా నేను మీ ముందు మీకంటే ముందుగా వెళ్ళనున్నాను. నేను మీకు సాక్షిని, మీతో చేసిన వాగ్దానం పూర్తయ్యే చోటు కౌస’ర్ సరస్సు, నేను ఇక్కడి నుండి కౌస’రు సరస్సును చూస్తున్నాను ఇంకా నాకు భూమిలోని గుప్తనిధుల తాళాలు ఇవ్వబడ్డాయి, ఇంకా నా తరువాత మీరందరూ అవిశ్వాసానికి గురవుతారనే భయం నాకు లేదు, అయితే ప్రాపంచిక వ్యవహారాల పట్ల శ్రద్ధాసక్తులు మీలో అధికం అవుతాయని నేను భయపడుతున్నాను,” అని అన్నారు. కొంతమంది ఉల్లేఖనకర్తలు ”ప్రాపంచిక వ్యవహారాల్లో మీరు అత్యధికంగా శ్రద్ధచూపుతారు. ఫలితంగా మీరు పరస్పరం చంపుకుంటారు, ఇంకా మీరు పూర్వీకులు నాశనం అయినట్లు మీరు కూడా నాశనం అవుతారు,” అని అన్నారు. (బు’ఖారీ, ముస్లిమ్)
5959 – [ 4 ] ( صحيح ) (3/1680)
وَعَنْ عَاِئشَةَ قَالَتْ: إِنَّ مِنْ نِعَمِ اللهِ عَلَيَّ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم تُوُفِّيَ فِيْ بَيْتِيْ. وَفِيْ يَوْمِيْ وَبَيْنَ سَحْرِيْ وَنَحْرِيْ. وَأَنَّ اللهَ جَمَعَ بَيْنَ رِيْقِيْ وَرِيْقِهِ عِنْدَ مَوْتِهِ دَخَلَ عَلَيَّ عَبْدُ الرَّحْمنِ بْنُ أَبِيْ بَكْرٍ. وَبِيَدِهِ سِوَاكٌ وَأَنَا مُسْنِدَةٌ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم فَرَأَيْتُهُ يَنْظُرُ إِلَيْهِ وَعَرَفْتُ أَنَّهُ يُحِبُّ السِّوَاكَ. فَقُلْتُ: آخْذُهُ لَكَ؟ فَأَشَارَ بِرَأْسِهِ أَنْ نَعَمْ فَتَنَاوَلْتُهُ فَاشْتَدَّ عَلَيْهِ وَقُلْتُ: أُلَيِّنُهُ لَكَ؟ فَأَشَارَ بِرَأْسِهِ أَنْ نَعَمْ فَلَيَّنْتُهُ فَأَمَرَّهُ وَبَيْنَ يَدَيْهِ رَكْوَةٌ فِيْهَا مَاءٌ فَجَعَلَ يُدْخِلُ يَدَيْهِ فِي الْمَاءِ فَيَمْسَحُ بِهِمَا وَجْهَهُ وَيَقُوْلُ: “لَا إِلَهَ إِلَّا اللهُ إِنَّ لِلْمَوْتِ سَكَرَاتٍ”. ثُمَّ نَصَبَ يَدَيْهِ فَجَعَلَ يَقُوْلُ: “فِي الرَّفِيْقِ الْأَعْلَى”. حَتّى قُبِضَ وَماَلَتْ يَدُهُ. روَاهُ الْبُخَارِيُّ.
5959. (4) [3/1680– దృఢం]
‘ఆయి’షహ్ (ర) కథనం: నాపై అల్లాహ్(త) అను గ్రహాల్లో గొప్ప అనుగ్రహం ఏమిటంటే, ప్రవక్త (స) నా ఇంటిలో, నా వంతునాడు, నా గుండెలపై మర ణించారు. అల్లాహ్ (త) ప్రవక్త (స) మరణించినపుడు మా ఇద్దరి ఉమ్మిని ఒకచోట కలిపాడు. అదెలా అంటే ‘అబ్దుర్ర’హ్మాన్ బిన్ అబూ బకర్ (ర) నా వద్దకు వచ్చారు. అతని చేతిలో మిస్వాక్ ఉంది. ఇటు ప్రవక్త (స) నా గుండెకు ఆనుకొని కూర్చొని ఉన్నారు. ప్రవక్త (స) మిస్వాక్‌ను చూడటం నేను చూసాను. ఎందుకంటే మిస్వాక్‌ను ఎంతో ఇష్టపడేవారు. అందువల్ల నేను ” ‘అబ్దుర్ర’హ్మాన్ నుండి మిస్వాక్ తీసుకోనా?” అని అడిగాను. ప్రవక్త (స) తలతో సైగచేసి తీసుకోమని అన్నారు. నేను ‘అబ్దు ర్ర’హ్మాన్ నుండి మిస్వాక్ తీసుకొని ప్రవక్త (స)కు ఇచ్చాను.
ప్రవక్త (స) మిస్వాక్ చేయాలని ప్రయత్నించారు. కాని కష్టం అనిపించింది. అప్పుడు నేను దాన్ని మెత్తగా చేసి ఇవ్వనా అన్నాను. ప్రవక్త (స) తలతో సైగచేసి సరేనన్నారు. నేను మిస్వాక్‌ను పల్లతో నమిలి ఇచ్చాను, ప్రవక్త (స) దానితో పళ్ళపై రుద్దుకున్నారు. ప్రవక్త (స) ముందు నీటితో ఒక గిన్నె ఉంచబడిఉంది. ప్రవక్త (స) తన రెండుచేతులు అందులో ముంచి తన ముఖంపై పులుముకుంటూ, ”లా ఇలాహ ఇల్లల్లాహ్” మరణ సమయం కష్టంగా ఉంది. ఆ తరువాత ప్రవక్త (స) తన చేయిఎత్తి, ”ఓ అల్లాహ్(త) నన్ను ఆప్త మిత్రత్వంలో చేర్చు,” అని అనసాగారు. చివరికి ఆత్మ శరీరాన్ని విడిచి వెళ్ళి పోయింది. ప్రవక్త (స) చేతులు క్రింద పడ్డాయి. (బు’ఖారీ)
5960 – [ 5 ] ( مُتَّفَقٌ عَلَيْهِ ) (3/1680)
وَعَنْهَا قَالَتْ: سَمِعْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ: “مَامِنْ نَبِيٍّ يَمْرَضُ إِلَّا خُيِّرَ بَيْنَ الدُّنْيَا وَالْآخِرَةِ”. وَكَانَ فِي شَكْوَاهُ الَّذِيْ قُبِضَ أَخَذَتْهُ بُحةٌ شَدِيْدَةٌ فَسَمِعْتُهُ يَقُوْلُ: مَعَ الَّذِيْنَ أَنْعَمْتَ عَلَيْهِمْ مِنَ الصِّدِّيْقِيْنَ وَالنَّبِيِّيْنَ وَالشُّهَدَاءِ وَالصَّالِحِيْنَ. فَعَلِمْتُ أَنَّهُ خُيِّرَ. مُتَّفَقٌ عَلَيْهِ.
5960. (5) [3/1680 –ఏకీభవితం]
‘ఆయి’షహ్ (ర) కథనం: ప్రవక్త (స) ఇలా ప్రవచించగా నేను విన్నాను, ”ప్రవక్తల్లో ఎవరైనా మరణించినపుడు, అతనికి ప్రాపంచిక సుఖాలు, లేదా పరలోక అనుగ్రహాలు ఎన్నుకునే అవకాశం ఇవ్వబడు తుంది. అంటే అతడు ప్రాపంచిక జీవితాన్ని కోరుకో వాలి, లేదా పరలోక ప్రయాణం స్వీకరించాలి, ప్రవక్త (స)కు మరణ సమయంలో గొంతుబాధ ఉండేది. అప్పుడు ఇలా అంటూ ఉండటం నేను విన్నాను, ”ఓ అల్లాహ్! నన్ను నువ్వు అనుగ్రహించినవారిలో చేర్చు.” అంటే వారు ప్రవక్తలు, సత్యవంతులు, అమరవీరులు, పుణ్యాత్ములు. అప్పుడు నేను ప్రవక్త (స)కు ప్రాపంచిక జీవితం లేదా పరలోకం ఎన్నుకునే అవకాశం ఇవ్వబడిందని అనుకున్నాను. (బు’ఖారీ, ముస్లిమ్)
5961 – [ 6 ] ( صحيح ) (3/1680)
وَعَنْ أَنَسٍ قَالَ: لَمَّا ثَقُلَ النَّبِيُّ صلى الله عليه وسلم جَعَلَ يَتَغَشَّاهُ الْكَرْبُ. فَقَالَتْ فَاطِمَةُ: وَاكْرُبَ أَبَاهُ فَقَالَ لَهَا: “لَيْسَ عَلَى أَبِيْكِ كَرْبٌ بَعْدَ الْيَوْمِ”. فَلَمَّا مَاتَ قَالَتْ: يَا أَبَتَاهُ أَجَابَ رَبًّا دَعَاهُ يَا أَبَتَاهُ مَنْ جَنَّةُ الْفِرْدُوْسِ مَأْوَاهُ يَا أَبَتَاهُ إِلى جِبْرَيْلَ نَنْعَاهُ. فَلَمَّا دُفِنَ قَالَتْ فَاطِمَةُ: يَا أَنَسُ أَطَابَتْ أَنْفُسُكُمْ أَنْ تَحْثُوا عَلَى رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم التُّرَاب؟ روَاهُ الْبُخَارِيُّ.
5961. (6) [3/1680– దృఢం]
అనస్ (ర) కథనం: ప్రవక్త (స) తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ప్రవక్త (స)కు వ్యాధి తీవ్రతవల్ల మత్తు ఆవరించసాగింది. ఫాతిమహ్ (ర) బాధాకరమైన స్వరంతో నాన్నగారికి ఎంతకష్టం వచ్చింది అని పలికింది. ప్రవక్త (స) ఫాతిమహ్తో, ‘ఈ రోజు తర్వాత నీ తండ్రిపై ఎటువంటి ఆపదా రాదు,’ అని అన్నారు. ప్రవక్త (స) మరణించిన తర్వాత ఫాతిమహ్ (ర), ‘నాన్నగారూ! మీరు అల్లాహ్(త) ఆహ్వానాన్ని స్వీకరించారు, తమ ప్రభువువద్దకు వెళ్ళిపోయారు. ఓ నాన్నగారూ! జన్నతుల్ ఫిర్‌దౌస్ మీ నివాసం, ఓ నాన్నగారూ! మేము జిబ్రీల్‌కు మీ మరణవార్త తెలియపరుస్తాము,’ అని పలికారు. ప్రవక్త (స)ను ఖననం చేసిన తర్వాత ఫాతిమహ్ (ర) అనస్‌తో, ‘ఓ అనస్! ప్రవక్త (స)పై మట్టి వేయడానికి నీ మనసెలా ఒప్పింది,’ అని బాధ వ్యక్తం చేసారు. (బు’ఖారీ)
—–
اَلْفَصْلُ الثَّانِيْ రెండవ విభాగం
5962 – [ 7 ] ( صحيح ) (3/1681)
عَنْ أَنَسٍ قَالَ: لَمَّا قَدِمَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم اَلْمَدِيْنَةَ لَعِبَتِ الْحَبَشَةُ بِحِرَابِهِمْ فَرَحًا لِقُدُوْمِهِ. رَوَاهُ أَبُوْ دَاوُدَ.
وَفِيْ رِوَايَةِ الدَّارَمِيِّ (صحيح) قَالَ: مَا رَأَيْتُ يَوْمًا قَطُّ كَانَ أَحْسَنَ وَلَا أَضْوَأَ مِنْ يَوْمٍ دَخَلَ عَلَيْنَا فِيْهِ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم وَمَا رَأَيْتُ يَوْمًا كَانَ أَقْبَحَ وَأَظْلَمَ مِنْ يَوْمٍ مَاتَ فِيْهِ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم.
وَفِيْ رِوَايَةِ التِّرْمِذِيِّ قَالَ: لَمَّا كَانَ الْيَوْمُ الَّذِيْ دَخَلَ فِيْهِ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم اَلْمَدِيْنَةَ أَضَاءَ مِنْهَا كُلُّ شَيْءٍ فَلَمَّا كَانَ الْيَوْمُ الَّذِيْ مَاتَ فِيْهِ أَظْلَمَ مِنْهَا كُلُّ شَيْءٍ وَمَا نَفَضْنَا أَيْدِيَنَا عَنِ التُّرَابِ وَإِنَّا لَفِيْ دَفْنِهِ حَتَّى أَنْكَرْنَا قُلُوْبَنَا.
5962. (7) [3/1681– దృఢం]
అనస్ (ర) కథనం: ప్రవక్త (స) మదీనహ్ వచ్చినపు డు ప్రవక్త (స) రాకపట్ల సంతోషం వ్యక్తంచేస్తూ నీగ్రోలు బల్లాలతో గారడిచేసి చూపెట్టారు. (అబూ దావూద్)
దార్మీ ఉల్లేఖనంలో ఇలా ఉంది, ”అనస్ (ర) కథనం: ప్రవక్త (స) మా మధ్య మదీనహ్ వచ్చినప్పటి రోజు కంటే సంతోష కరమైన రోజు నేను ఎన్నడూ చూడలేదు. అదే విధంగా ప్రవక్త (స)మరణించినప్పటి రోజుకంటే చెడ్డరోజు నేను చూడలేదు.”
తిర్మిజి’ ఉల్లేఖనంలో ఇలా ఉంది, అనస్ (ర) కథనం: ప్రవక్త (స) మదీనహ్ వచ్చేరోజు వచ్చింది. మదీనహ్ అంతా వెలుగుతో నిండిపోయింది. అదే విధంగా ప్రవక్త (స) మరణం వచ్చేరోజు మదీనహ్ అంతా అంధకారం వ్యాపించింది. ప్రవక్త (స)ను ఖననం చేసిన తర్వాత, ఇంకా మేము చేతులైనా కడుక్కో లేదు. మేము ఖననంలో నిమగ్నమై ఉన్నాం. మా హృదయాల్లో మార్పు రాసాగింది.
5963 – [ 8 ] ( ضعيف وروي صحيحا من وجه آخر) (3/1681)
وَعَنْ عَائِشَةَ قَالَتْ: لَمَّا قُبِضَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم اِخْتَلَفُوْا فِيْ دَفْنِهِ. فَقَالَ أَبُوْ بَكْرٍ: سَمِعْتُ مِنْ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم شَيْئًا. قَالَ: “مَا قَبَضَ اللهُ نَبِيًّا إِلَّا فِي الْمَوْضِعِ الَّذِيْ يُحِبُّ أَنْ يُدْفَنَ فِيْهِ”. اِدْفِنُوْهُ فِيْ مَوْضِعِ فِرَاشِهِ. رَوَاهُ التِّرْمِذِيُّ.
5963. (8) [3/1681– బలహీనం]
‘ఆయి’షహ్ (ర) కథనం: ప్రవక్త (స) మరణించినపుడు ఆయన ఖనన విషయంలో అనుచ రుల్లో అభిప్రాయ భేదాలు తలెత్తాయి. అప్పుడు అబూ బకర్ (ర) ఈ విషయంలో ప్రవక్త (స) నుండి ఇలా విన్నాను, ”అల్లాహ్(త) ప్రతి ప్రవక్తయొక్క ప్రాణాన్ని, ఆ ప్రవక్త ఎక్కడ ఖననం చేయబడాలని కోరుకుంటాడో అక్కడే తీస్తాడు. అందువల్ల ప్రవక్త (స)ను ఈ స్థానంలో ఖననం చేయాలి. అంటే ప్రవక్త (స)ను ఆయన పడక ఉన్నచోటే ఖననం చేయాలి,” అని అన్నారు. (తిర్మిజి’)
—–
اَلْفَصْلُ الثَّالِثُ మూడవ విభాగం
5964 – [ 9 ] ( مُتَّفَقٌ عَلَيْهِ ) (3/1682)
عَنْ عَائِشَةَ قَالَتْ: كَانَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ وَهُوَ صَحِيْحٌ: “لَنْ يُقْبَضَ نَبِيٌّ حَتّى يُرَى مَقْعَدَهُ مِنَ الْجَنَّةِ ثُمَّ يُخَيَّرَ”. قَالَتْ عَائِشَةَ: فَلَمَّا نَزَلَ بِهِ وَرَأْسُهُ عَلَى فَخِذِيْ غُشِيَ عَلَيْهِ ثُمَّ أَفَاقَ فَأَشْخَصَ بَصَرَهُ إِلى السَّقْفِ ثُمَّ قَالَ: “اللّهُمَّ الرَّفِيْقَ الْأَعْلَى”. قُلْتُ: إِذَنْ لَا يَخْتَارُنَا. قَالَتْ: وَعَرَفْتُ أَنَّهُ الْحَدِيْثُ الَّذِيْ كَانَ يُحَدِّثُنَا بِهِ وَهُوَ صَحِيْحٌ فِيْ قَوْلِهِ: “إِنَّهُ لَنْ يُقْبَضَ نَبِيٌّ قَطُّ حَتَّى يُرَى مَقْعَدَهُ مِنَ الْجَنَّةِ ثُمَّ يُخَيَّرَ”. قَالَتْ عَائِشَةَ: فَكَانَ آخِرَ كَلِمَةٍ تَكَلَّمَ بِهَا النَّبِيُّ صلى الله عليه وسلم: “اَللّهُمَّ الرَّفِيْقَ الْأَعْلَى”. مُتَّفَقٌ عَلَيْهِ.
5964. (9) [3/1682 –ఏకీభవితం]
‘ఆయి’షహ్ (ర) కథనం: ప్రవక్త (స) ఆరోగ్యంగా ఉన్న రోజుల్లో ఇలా ప్రవచించేవారు, ”ఏ ప్రవక్తకూ స్వర్గంలోని అతని నివాసం చూపెట్టనంత వరకు అతనికి మరణం రాదు.” మరణ సమయం దగ్గర పడినపుడు ప్రవక్త (స) తల నా తొడపై ఉంది. ప్రవక్త (స) స్పృహ కోల్పోయారు. మళ్ళీ స్పృహలోకి వచ్చారు. ప్రవక్త (స)పై కప్పువైపు చూసారు. ఇంకా, ”ఓ అల్లాహ్(త) నేను సన్నిహిత మిత్ర స్థానాన్ని కోరుకుంటున్నాను,” అని అన్నారు. అప్పుడు నేను, ”ఇప్పుడు ప్రవక్త (స) మనమంటే ఇష్టపడరు,” అని అన్నాను. అప్పుడు నేను ఇది ఆ విషయమే, అంటే ఏ ప్రవక్తకూ స్వర్గంలోని అతని నివాసం చూపెట్టనంత వరకు అతనికి మరణం సంభవించదు. ఆ తరువాత అతనికి అవకాశం ఇవ్వబడుతుంది,’ అని అను కున్నాను. ప్రవక్త (స) నోట చివరిగా వెలువడిన పదాలు ఇవే, ”అల్లాహుమ్మ అర్రఫీఖల్ అ’అలా” అంటే — పరమ సాన్నిహిత్యం కోరుకుంటున్నాను. (బు’ఖారీ, ముస్లిమ్)
5965 – [ 10 ] ( صحيح ) (3/1682)
وعَنْهَا قَالَتْ: كَانَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ فِيْ مَرْضِهِ الَّذِيْ مَاتَ فِيْهِ: “يَا عَائِشَةَ مَا أَزَالُ أَجِدُ أَلَمَ الطَّعَامِ الَّذِيْ أَكَلْتُ بِخَيْبَرَ وَهَذَا أَوَانُ وَجَدْتُ انْقِطَاعَ أَبْهَرِيْ مِنْ ذَلِكَ السَّمِّ”. روَاهُ الْبُخَارِيُّ .
5965. (10) [3/1682– దృఢం]
‘ఆయి’షహ్ (ర) కథనం: ప్రవక్త (స) తన మరణ సమయంలో ఇలా అనేవారు, ” ‘ఆయి’షహ్! ‘ఖైబర్‌లో నేను తిన్న విషపూరితమైన ఆహారం బాధను గ్రహిస్తున్నాను. ఇప్పుడు ఆ వ్యాధిలో ఆ విష ప్రభావం వల్ల నా గుండెలోని ప్రధాన నరం తెగిపోతుందని అనుకుంటున్నాను.” (బు’ఖారీ)
5966 – [ 11 ] ( مُتَّفَقٌ عَلَيْهِ ) (3/1682)
وَعَنِ ابْنِ عَبَّاسٍ قَالَ: لَمَّا حُضِرَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم وَفِيْ الْبَيْتِ رِجَالٌ فِيْهِمْ عُمَرُ بْنُ الْخَطَّابِ. قَالَ النَّبِيُّ صلى الله عليه وسلم: “هَلُّمُّوْا أكْتُبْ لَكُمْ كِتَابًا لَنْ تَضِلُّوْا بَعْدَهُ”. فَقَالَ عُمَرُ: إِنَّ رَسُوْلَ الله صلى الله عليه وسلم قَدْ غَلَبَ عَلَيْهِ الْوَجَعُ وَعِنْدَكُمُ الْقُرْآنُ حَسْبُكُمْ كِتَابُ اللهِ فَاخْتَلَفَ أَهْلُ الْبَيْتِ وَاخْتَصَمُوْا فَمِنْهُمْ مَنْ يَقُوْلُ: قَرِّبُوْا يَكْتُبُ لَكُمْ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم. وَمِنْهُمْ يَقُوْلُ مَا قَالَ عُمَرُ. فَلَمَّا أَكْثَرُوْا اللَّغَطَ وَالْاِخْتِلَافَ. قَالَ رَسُوْلُ الله صلى الله عليه وسلم: “قُوْمُوْا عَنِّيْ”. قَالَ عُبَيْدُ اللهِ: فَكَانَ ابْنُ عَبَّاسٍ يَقُوْلُ: إِنَّ الرَّزِيْئَةَ كُلَّ الرَّزِيْئَةَ مَا حَالَ بَيْنَ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم وَبَيْنَ أَنْ يَكْتُبَ لَهُمْ ذَلِكَ الْكِتَابَ لِاِخْتَلَافِهِمْ وَلَغَطِهِمْ
وَفِيْ رِوَايَةِ سُلَيْمَانَ بْنِ أَبِيْ مُسْلِمٍ الْأَحْوَلِ قَالَ ابْنُ عَبَّاسٍ: يَوْمَ الْخَمِيْسِ وَمَا يَوْمَ الْخَمِيْسِ؟ ثُمَّ بَكَى حَتّى بَلْ دَمْعُهُ الْحِصى. قُلْتُ: يَا ابْنَ عَبَّاسٍ وَمَا يَوْمَ الْخَمِيْسِ؟ قَالَ: اِشْتَدَّ بِرَسُوْلِ اللهِ صلى الله عليه وسلم وَجْعُهُ. فَقَالَ: “اِئْتُوْنِيْ بِكَتَفٍ أَكْتُبْ لَكُمْ كِتَابًا لَا تَضِلُّوْا بَعْدَهُ أَبَدًا”. فَتَنَازَعُوْا وَلَا يَنْبَغِيْ عِنْدَ نَبِيٍّ تَنَازُعٌ. فَقَالُوْا: مَا شَأْنُهُ أَهجَرَ؟ اِسْتَفْهِمُوْهُ فَذَهَبُوْا يَرُدُّوْنَ عَلَيْهِ. فَقَالَ: “دَعُوْنِيْ ذَرُوْنِيْ فَالَّذِيْ أَنَا فِيْهِ خَيْرٌ مِمَّا تَدْعُوْنَنِيْ إِلَيْهِ”. فَأَمَرَهُمْ بِثَلَاثٍ: فَقَالَ: “أَخْرِجُوا الْمُشْرِكِيْنَ مِنْ جَزِيْرَةِ الْعَرَبِ وَأَجِيْزُوا الْوَفْدَ بِنَحْوِ مَا كُنْتُ أُجِيْزُهُمْ”. وَسكَتَ عَنْ الثَّالِثَةِ أَوْ قَالَهَا فَنَسِيْتُهَا. قَالَ سُفْيَانُ: هَذَا مِنْ قَوْلِ سُلَيْمَانَ. مُتَّفَقٌ عَلَيْهِ.
5966. (11) [3/1682 –ఏకీభవితం]
ఇబ్నె ‘అబ్బాస్ (ర) కథనం: ప్రవక్త (స) మరణించినపుడు ఇంట్లో ప్రవక్త (స) వద్ద ‘ఉమర్‌తో పాటు అనేకమంది ఉన్నారు. అప్పుడు ప్రవక్త (స), ‘తీసుకు రండి, మీ కోసం వీలునామా రాస్తాను, దానివల్ల మీరెలాంటి మార్గభ్రష్టత్వానికి గురికారు,’ అని అన్నారు. అది విన్న ‘ఉమర్ (ర) ప్రజలతో, ‘ప్రవక్త (స) ఇప్పుడు చాలా అనారోగ్యంగా ఉన్నారు. అయితే మీ వద్ద ఖుర్‌ఆన్ ఉంది. ఈ అల్లాహ్ గ్రంథం చాలదా?’ అని అన్నారు. కాని ఇంట్లో ఉన్నవారిలో అభిప్రాయభేదాలు ఏర్పడ్డాయి. వారు పరస్పరం చర్చించుకోసాగారు. వారిలో కొందరు, ”కలం, సిరా ప్రవక్త (స)కు ఇవ్వండి, ఆయన మీ కోసం వీలునామా వ్రాస్తారు” అని అన్నారు. ఒక వ్యక్తి ‘ఉమర్ (ర) చెప్పిందే చెప్పారు. కోలాహలం అధికంగా ఉండటం వల్ల ప్రవక్త (స), ”నా దగ్గరి నుండి వెళ్ళిపోండి, నేనేమి రాయ దలచుకోలేదు.” అన్నారు.
‘ఉబైదుల్లాహ్ కథనం: ఇబ్నె ‘అబ్బాస్ (ర), ”కష్టం అంతా ఎలా వచ్చిందంటే ప్రజల అభిప్రాయభేదాలు, కోలాహలం ప్రవక్త (స)కు వీలునామా వ్రాసే సంకల్పానికి మధ్య ఆవరించాయి.”
ఇంకా సులైమాన్ బిన్ ముస్లిమ్ అ’హ్‌వల్ ఉల్లేఖనంలో ఇలా ఉంది, ”ఇబ్నె ‘అబ్బాస్ (ర) ఆ గురువారం రోజు, ఆ గురువారం రోజు ఎంత ఆశ్చర్యకరంగా ఉండేది,” అని పలికి ఏడ్వసాగారు. ఎంతగా ఏడ్చారంటే, అతని కన్నీళ్ళకు కంకరరాళ్ళు తడిచిపోయాయి. అప్పుడు నేను, ‘ఓ ఇబ్నె ‘అబ్బాస్! గురువారం అంటే అర్థం ఏమిటి’, అని అడిగాను. దానికి ఇబ్నె ‘అబ్బాస్ (ర), ‘ఆ రోజు ప్రవక్త (స) ఆరోగ్యం మరింత క్షీణించింది. అప్పుడు ప్రవక్త (స) నా వద్దకు ఒక దుమ్ము తీసుకురండి. ఒక వీలునామా వ్రాస్తాను. దానివల్ల మీరు మార్గభ్రష్టత్వానికి గురికారు,’ అని అన్నారు. కాని ప్రజలు అది విని పరస్పరం చర్చించుకుంటూ తమ తమ అభిప్రాయాలకు ప్రాధాన్యత ఇవ్వసాగారు. ప్రజలు ప్రవక్త (స) వద్ద చర్చలు, వాదనలు, కోలాహలం చేయకుండా ఉండవలసింది. కొందరు అనుచరులు, ‘మీకేమ యింది? అనారోగ్యంవల్ల మాటలు రావటం లేదా,’ అని అడిగారు. ప్రవక్త (స) చెప్పింది శ్రద్ధగా వినవలసింది. కొందరు అనుచరులు ప్రవక్త (స) వద్దకు వెళ్ళి చర్చించటం ప్రారంభించారు. అప్పుడు ప్రవక్త (స) చేసేది లేక నన్ను వదలివేయండి. ఈ పరిస్థితే నాకు బాగుంది. ఆ తరువాత ప్రవక్త (స) మూడు విషయాల గురించి ఆదేశించారు: 1. అవిశ్వాసులను అరబ్ ప్రాంతం నుండి తీసివేయండి. 2. ఇతర దేశాల నుండి రాయబారులు వస్తే నేను చేసినట్లు వారిని గౌరవించండి. 3వ విషయం చెప్పలేదు లేదా నేను మరచిపోయి ఉంటాను. అయితే ఇది సులైమాన్ పలుకు,’ అని అన్నారు. (బు’ఖారీ, ముస్లిమ్)
5967 – [ 12 ] ( صحيح ) (3/1683)
وعَنْ أَنَسٍ قَالَ: قَالَ أَبُوْ بَكْرٍ لِعُمَرَ رَضِيَ اللهُ عَنْهُمَا بَعْدَ وَفَاةِ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم: اِنْطَلِقْ بِنَا إِلى أُمِّ أَيْمَنَ نَزُوْرُهَا كَمَا كَانَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم يَزُوْرُهَا. فَلَمَّا انْتَهَيْنَا إِلَيْهَا بَكَتْ. فَقَالَا لَهَا: مَا يُبْكِيْكِ؟ أَمَا تَعْلَمِيْنَ أَنْ مَا عِنْدَ اللهِ خَيْرٌ لِرَسُوْلِ اللهِ صلى الله عليه وسلم؟ فَقَالَتْ: إِنِّيْ لَا أَبْكِيْ أَنِّيْ لَا أَعْلَمُ أَنْ مَا عِنْدَ اللهِ تَعَالى خَيْرٌ لِرَسُوْلِ اللهِ صلى الله عليه وسلم وَلَكِنْ أَبْكِيْ أَنَّ الْوَحْيَ قَدِ انْقَطَعَ مِنَ السَّمَاءِ فَهَيَّجَتْهُمَا عَلَى الْبُكَاءِ فَجَعَلَا يَبْكِيَانِ مَعَهَا. رَوَاهُ مُسْلِمٌ.
5967. (12) [3/1683– దృఢం]
అనస్ (ర) కథనం: ప్రవక్త (స) మరణానంతరం అబూ బకర్ (ర) ‘ఉమర్ (ర)తో, ”రండి మనం ఉమ్మె అయ్‌మన్ వద్దకు వెళదాం, ప్రవక్త (స) కూడా ఆమె దగ్గరకు వెళ్ళేవారు కదా,” అని అన్నారు. అనంతరం మేము ఉమ్మె అయ్‌మన్ వద్దకు చేరుకున్నాము. ఆమె మమ్మల్ని చూసి ఏడ్వసాగారు. అబూ బకర్ మరియు ‘ఉమర్, ”ఎందుకు ఏడుస్తున్నారు, ప్రవక్త (స) కోసం అల్లాహ్ (త) వద్ద అంతా మంచే ఉందనే సంగతి మీకు తెలియదా?” అని అన్నారు. దానికి ఉమ్మె అయ్‌మన్, ‘నే నందుకు ఏడ్వటం లేదు. అల్లాహ్(త) వద్ద ప్రవక్త (స)కు ఉన్న గొప్ప స్థానం గురించి నాకు తెలుసు. నేనెందుకు ఏడుస్తున్నానంటే ఆకాశం నుండి దైవవాణి అవతరించటం ఆగిపోయింది,’ అని చెప్పారు. అది విన్న అబూ బకర్, ఉమర్‌లు ఏడ్వ కుండా ఉండలేక పోయారు. వారు కూడా ఆమెతో పాటు ఏడ్వ సాగారు.[38] (ముస్లిమ్)
5968 – [ 13 ] ( لم تتم دراسته ) (3/1683)
وعَنْ أَبِيْ سَعِيْدِ الْخُدْرِيِّ قَالَ: خَرَجَ عَلَيْنَا رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم فِيْ مَرَضِهِ الَّذِيْ مَاتَ فِيْهِ وَنَحْنُ فِي الْمَسْجِدِ عَاصِبًا رَأْسَهُ بِخِرْقَةٍ حَتّى أَهْوَى نَحْوَ الْمِنْبَرِ فَاسْتَوَى عَلَيْهِ وَاتَّبَعْنَاهُ. قَالَ: “وَالَّذِيْ نَفْسِيْ بِيَدِهِ إِنِّيْ لَأَنْظُرُ إِلى الْحَوْضِ مِنْ مَقَامِيْ هَذَا” .ثُمَّ قَالَ: “إِنَّ عَبْدًا عُرِضَتْ عَلَيْهِ الدُّنْيَا وَزِيْنَتُهَا فَاخْتَاَرَ الْآخِرَةَ”. قَالَ: فَلَمْ يَفْطَنْ لَهَا أَحَدٌ غَيْرَ أَبِيْ بَكْرٍ فَذَرَفَتْ عَيْنَاهُ فَبَكَى. ثُمَّ قَالَ: بَلْ نَفْدِيْكَ بِآبَائِنَا وَأُمَّهَاتِنَا وَأَنْفُسِنَا وَأَمْوَالِنَا يَا رَسُوْلَ اللهِ. قَالَ: ثُمَّ هَبَطَ فَمَا قَامَ عَلَيْهِ حَتّى السَّاعَةِ. رَوَاهُ الدَّارَمِيُّ .
5968. (13) [3/1683 –అపరిశోధితం]
అబూ స’యీద్ ‘ఖుద్రీ (ర) కథనం: ప్రవక్త (స) తన చివరి రోజుల్లో ఒక రోజు తన గదిలో నుండి మస్జిద్ లోనికి వచ్చారు. మేము మస్జిద్‌లో ఉన్నాం. అప్పుడు ప్రవక్త (స) తన తలను వస్త్రంతో కట్టి ఉంచారు. ప్రవక్త (స) మెంబరు వైపు వంగి కూర్చున్నారు. ప్రవక్త (స)తో పాటు మేము కూడా కూర్చున్నాము. అప్పుడు ప్రవక్త (స) ఇలా అన్నారు, ”ఎవరి చేతిలో నా ప్రాణం ఉందో ఆయన (త) సాక్షి! నేను ఇక్కడి నుండి హౌ’దె కౌస’ర్‌ను చూస్తున్నాను. ఒక దైవదాసు డున్నాడు, అతని ముందు ప్రాపంచిక సుఖాలు ఉంచడం జరిగింది. కాని అతడు పరలోకానికి ప్రాధాన్యత ఇచ్చాడు,’ అని అన్నారు. ఈ మాటలకు అర్థం అబూ బకర్ తప్ప ఇతరులెవ్వరూ గ్రహించ లేదు. అనంతరం అబూ బకర్ కళ్ళంట చుక్కలు రాలసాగాయి, ఏడ్వసాగారు, ఇంక ఇలా అన్నారు, ”ఓ ప్రవక్తా (స)! మేము మీ కోసం మమ్మల్ని, మా తల్లిదండ్రులు త్యాగం చేస్తున్నాము,” అని అన్నారు. ఆ తరువాత ప్రవక్త (స) మెంబరుపై నుండి దిగారు. మరణం వరకు మరి మెంబరుపై ఎక్కలేదు. (దార్మీ)
5969 – [ 14 ] ( حسن ) (3/1684)
وعَنِ ابْنِ عَبَّاسٍ قَالَ: لَمَّا نَزَلَتْ [إِذَا جَاءَ نَصْرُ اللهِ وَالْفَتْحُ ؛ 110] دَعَا رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم. فَاطِمَةَ قَالَ: “نُعِيْت إِلَيَّ نَفْسِيْ” فَبَكَتْ. قَالَ: “لَا تَبْكِيْ فَإِنَّكِ أَوَّلُ أَهْلِيْ لَاحِقٌ بِيْ”. فَضَحِكَتْ فَرَآهَا بَعْضُ أَزْوَاجِ النَّبِيِّ صلى الله عليه وسلم فَقُلْنَ: يَا فَاطِمَةَ رَأَيْنَاكِ بَكَيْتِ ثُمَّ ضَحِكْتِ. قَالَتْ: إِنَّهُ أَخْبَرَنِيْ أَنَّهُ قَدْ نُعِيَتْ إِلَيْهِ نَفْسُهُ فَبَكَيْتُ. فَقَالَ لِيْ: لَا تَبْكِيْ فَإِنَّكَ أَوَّلُ أَهْلِيْ لَاحِقٌ بِيْ فَضَحِكْتُ. وَقَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِذَا جَاءَ نَصْرُ اللهِ وَالْفَتْحُ وَجَاءَ أَهْلُ الْيَمَنِ هُمْ أَرَقّ أَفْئِدَةً وَالْإِيْمَانِ يَمَانٍ وَالْحِكْمَةُ يَمَانِيَةٌ”. رَوَاهُ الدَّارَمِيُّ.
5969. (14) [3/1684 –ప్రామాణికం]
ఇబ్నె ‘అబ్బాస్ (ర) కథనం: సూరహ్ ”ఇజా’ జాఅ న’స్‌రుల్లాహి వల్ ఫత్’హ్” (అన్-నస్ర్, 110) అవతరించినపుడు ప్రవక్త (స) ఫాతిమహ్ (ర)ను పిలిపించి, ‘నాకు నా మరణాన్ని గురించి తెలియజేయ బడింది,’ అని అన్నారు. అది విన్న వెంటనే ఫాతిమహ్ (ర) ఏడ్వసాగింది. అప్పుడు ప్రవక్త(స) ‘ఓ నా కూతురా! ఏడ్వకు నా ఇంటివారిలో అందరికంటే ముందు నువ్వే నన్ను కలుస్తావు,’ అని అన్నారు. అది విన్న ఫాతిమ నవ్వసాగారు. ఆ సమయంలో ప్రవక్త (స) భార్యలు కొందరు ఫాతిమహ్ను ముందు ఏడుస్తూ, తరువాత నవ్వుతూ ఉండటం చూచారు. అప్పుడు వారు, ‘ఫాతిమహ్ నువ్వు ముందు ఏడ్చావు, ఆ తర్వాత నవ్వావు అసలు సంగతేంటి?’ అని అడిగారు. దానికి ఫాతిమహ్ (ర), ”ప్రవక్త (స) ముందు నాకు తమ మరణాన్ని గురించి తెలియపరచారు, అది విని నేను ఏడ్వ సాగాను. ఆ వెంటనే ప్రవక్త (స) ‘ఏడ్వకు, నా ఇంటి వారిలో అందరికంటే నువ్వే ముందు నన్ను కలుస్తావు’ అని అన్నారు. అప్పుడు నేను నవ్వసాగాను.”
ఇంకా ప్రవక్త (స) ”అల్లాహ్(త) సహాయం మరియు మక్కహ్ విజయం లభించింది. యమన్ ప్రజలు ఇస్లామ్ స్వీకరించారు, యమన్ ప్రజలు సున్నిత మనస్కులు, యమన్ ప్రజల్లో విశ్వాసం ఉంది, వివేకం కూడా ఉంది,” అని అన్నారు. (దార్మీ)
5970 – [ 15 ] ( صحيح ) (3/1684)
وعَنْ عَائِشَةَ أَنَّهَا قَالَتْ: وَارَأْسَاهُ قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “ذَاكَ لَوْ كَانَ وَأَنَا حَيٌّ فَأَسْتَغْفِرُ لَكِ وَأَدْعُوْ لَكِ” فَقَالَتْ عَائِشَةَ: وَاثُكْلَيَاهُ وَاللهِ إِنِّيْ لَأَظُنُّكَ تُحِبُّ مَوْتِيْ فَلَوْ كَانَ ذَلِكَ لَظَلِلْت آخِرَ يَوْمِكَ مُعْرِسًا بِبَعْضِ أَزْوَاجِكَ. فَقَالَ النَّبِيُّ صلى الله عليه وسلم: “بَلْ أَنَا وَا رَأْسَاهُ لَقَدْ هَمَمْتُ أَوْ أَرَدْتُ أَنْ أُرْسِلَ إِلى أَبِيْ بَكْرٍ وَابْنِهِ وَأَعْهدَ أَنْ يَقُوْلَ الْقَائِلُوْنَ أَوْ يَتَمَنّى الْمُتَمَنُّوْنَ ثُمَّ قُلْتُ: يَأُبَى اللهُ وَيَدْفَعُ الْمُؤْمِنُوْنَ أَوْ يَدْفَعُ اللهُ وَيَأُبَى الْمُؤمِنُوْنَ”. روَاهُ الْبُخَارِيُّ
5970. (15) [3/1684 –దృఢం]
‘ఆయి’షహ్ (ర) కథనం: తల నొప్పి అధికంగా ఉండ టం వల్ల, ”ఓహ్ నా తలనొప్పి” అని అన్నాను. అది విని ప్రవక్త (స), ”ఒకవేళ నీవు మరణించి, నేను బ్రతికి ఉంటే నీ క్షమాపణ కోసం, అంతస్తుల పెరుగుదల కోసం దు’ఆ చేస్తాను,” అని అన్నారు. అది విని నేను, ‘ఓ నా మరణం! అల్లాహ్ సాక్షి! మీరు నా మరణాన్ని కోరు కుంటున్నారని నేను అనుకుంటున్నాను, ఒకవేళ నేను మరణిస్తే, మీరు ఆ రోజే రాత్రి మరో భార్యతో సంభోగం చేస్తారు,’ అని అన్నాను. అది విన్న ప్రవక్త (స), ”ఓ నా తలనొప్పి! అసలు నా ఉద్దేశ్యం నేను మీ తండ్రి అబూ బకర్‌ను ‘అబ్దు ర్ర’హ్మాన్‌ను పిలిచి వీలునామా వ్రాయించాలని అను కున్నాను. ఎందుకంటే ఎవరూ అనకుండా, కోర కుండా ఉండాలని,’ అన్నారు. ఆ తరువాత నేను నా మనసులో అల్లాహ్ (త) మరియు ప్రజలు దీనికి సమ్మతించరు. లేదా ప్రవక్త (స) ”అల్లాహ్(త) ఎదుర్కొంటాడు మరియు విశ్వాసులు కూడా తిరస్కరిస్తారు,” అని అంటారు. (బు’ఖారీ)
5971 – [ 16 ] ( حسن ) (3/1684)
وعَنْهَا: قَالَتْ: رَجَعَ إِلَيَّ رَسُوْلُ الله صلى الله عليه وسلم ذَاتَ يَومٍ مِنْ جِنَازَةٍ مِنَ الْبَقِيْعِ فَوَجَدَنِيْ وَأَنَا أَجِدُ صُدَاعًا وَأَنَا أَقُوْلُ: وَارَأْسَاهُ قَالَ: “بَلْ أَنَا يَا عَائِشَةَ وَارَأْسَاهُ” قَالَ: “ومَا ضَرَّكِ لَوْ مِتّ قَبْلِيْ فَغَسَلْتُكِ وَكَفَّنْتُكِ وَصَلَّيَتُ عَلَيْكَ وَدَفَنْتُكِ؟” قُلْتُ: لَكَأَنِّيْ بِكَ وَاللهِ لَوْ فَعَلْتَ ذَلِكَ لَرَجَعْتَ إِلى بَيْتِيْ فَعَرَّسْتَ فِيْهِ بِبَعْضِ نِسَائِكَ فَتَبَسَّمَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم ثُمَّ بُدِيءَ فِيْ وَجْعِهِ الَّذِيْ مَاتَ فِيْهِ. رَوَاهُ الدَّارَمِيُّ.
5971. (16) [3/1684 –ప్రామాణికం]
‘ఆయి’షహ్ (ర) కథనం: ఒకరోజు ప్రవక్త (స) బఖీ స్మశానంలో ఒక జనా’జహ్ ఖనన సంస్కారాలు పూర్తి చేసి నా వద్దకు వచ్చారు. అప్పుడు నాకు తల నొప్పిగా ఉండేది. అప్పుడు నేను, ‘ఓహ్! నా తల నొప్పి,’ అని పలుకుతూ ఉన్నాను. ప్రవక్త (స) అది విని, ‘నీకు తలనొప్పిగా ఉంది, ఇందులో వచ్చిన నష్టం ఏమిటి? ఒకవేళ నీవు నాకన్నా ముందు చనిపోతే, నేను నీకు స్నానం చేయిస్తాను, శవ వస్త్రాలు కడతాను, నేను నీ నమా’జె జనా’జహ్ చదువుతాను. ఇంకా నీ ఖనన సంస్కారాలు పూర్తిచేస్తాను,’ అని అన్నారు. అది విన్న నేను ,’అల్లాహ్ సాక్షి! మీ గురించి నాకు ముందే తెలుసు, ఒకవేళ ఇలా జరిగితే తమరు తిరిగి నా ఇంటికి వచ్చిన తర్వాత మీ భార్యల్లోని ఒకరితో సంభోగం చేస్తారు,’ అని అన్నాను. అది విని ప్రవక్త (స) చిరునవ్వు నవ్వారు. ఆ తరువాత ప్రవక్త (స) అంతిమ అనారోగ్య దశ ప్రారంభ మయింది. అందులోనే ప్రవక్త (స) మరణించారు. (దార్మీ)
5972 – [ 17 ] ( واه ) (3/1685)
وعَنْ جَعْفَرِ بْنِ مُحَمَّدٍ عَنْ أَبِيْهِ أَنَّ رَجُلًا مِنْ قُرَيْشٍ دَخَلَ عَلَى أَبِيْهِ عَلِيِّ بْنِ الْحُسَيْنِ. فَقَالَ أَلَا أُحَدِّثُكَ عَنْ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم؟ قَالَ: بَلَى حَدِّثْنَا عَنْ أَبِي الْقَاسِمِ صلى الله عليه وسلم. قَالَ: لَمَّا مَرَضَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم أَتَاهُ جِبْرَيْلُ فَقَالَ: “يَا مُحَمَّدُ إِنَّ اللهَ أَرْسَلَنِيْ إِلَيْكَ تَكْرِيْمًا لَكَ وَتَشْرِيْفًا لَكَ خَاصَّةً لَكَ يَسْأَلُكَ عَمَّا هُوَ أَعْلَمُ بِهِ مِنْكَ يَقُوْلُ: كَيْفَ تَجِدُكَ؟ قَالَ: أَجِدُنِيْ يَا جِبْرِيْلُ مَغْمُوْمًا وَأَجِدُنِيْ يَا جِبْرَيْلُ مَكْرُوْبًا”. ثُمَّ جَاءَهُ الْيَوْمَ الثَّانِيْ فَقَالَ لَهُ ذَلِكَ فَرَدَّ عَلَيْهِ النَّبِيُّ صلى الله عليه وسلم كَمَا رَدَّ أَوَّلَ يَوْمٍ ثُمَّ جَاءَهُ الْيَوْمَ الثَّالِثَ. فَقَالَ لَهُ كَمَا قَالَ أَوَّلَ يَوْمٍ وَرَدَّ عَلَيْهِ كَمَا رَدَّ عَلَيْهِ وَجَاءَ مَعَهُ مَلَكٌ يُقَالُ لَهُ: إِسْمَاعِيْلُ عَلَى مِائَةِ أَلْفِ مَلَكٍ كُلُّ مَلَكٍ عَلَى مِائَةِ أَلْفِ مَلَكٍ فَاسْتَأْذَنَ عَلَيْهِ فَسَأَلَهُ عَنْهُ. ثُمَّ قَالَ جِبْرَيْلُ: هَذَا مَلَكُ الْمَوْتِ يَسْتَأْذِنُ عَلَيْكَ. مَا اسْتَأْذَنَ عَلَى آدَمِيٍّ قَبْلَكَ وَلَا يَسْتَأْذِنُ عَلَى آدَمِيٍّ بَعْدَكَ. فَقَالَ: اِئْذَنْ لَهُ فَأَذِنَ لَهُ فَسَلَّمَ عَلَيْهِ ثُمَّ قَالَ: يَا مُحَمَّدُ إِنَّ اللهَ أَرْسَلَنِيْ إِلَيْكَ فَإِنْ أَمَرْتَنِيْ أَنْ أَقْبِضَ رُوْحَكَ قَبَضْتُ وَإِنْ أَمَرْتَنِيْ أَنْ أَتْرُكَهُ تَرَكْتُهُ فَقَالَ: وَتَفْعَلُ يَا مَلَكَ الْمَوْتِ؟ قَالَ: نَعَمْ بِذَلِكَ أُمِرْتُ وَأُمِرْتُ أَنْ أُطِيْعَكَ. قَالَ: فَنَظَرَ النَّبِيُّ صلى الله عليه وسلم إِلى جِبْريْلَ عَلَيْهِ السَّلَامُ فَقَالَ جِبْرِيْلُ: يَا مُحَمَّدَ إِنَّ اللهَ قَدِ اشْتَاقَ إِلى لِقَائِكَ. فَقَالَ النَّبِيُّ صلى الله عليه وسلم لِمَلَكِ الْمَوْتِ: “اِمْضِ لَمَا أُمِرْتَ بِهِ”. فَقَبَضَ رُوْحَهُ. فلَمَّا تُوُفِّيَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم وَجَاءَتِ التَّعْزِيَةُ سَمِعُوْا صَوْتًا مِنْ نَاحِيَةِ الْبَيْتِ: السَّلَامُ عَلَيْكُمْ أَهْلَ الْبَيْتِ وَرَحْمَةُ اللهِ وَبَرْكَاتُهُ إِنَّ فِي اللهِ عَزَاءً مِنْ كُلِّ مُصِيْبَةٍ وَخَلَفًا مِنْ كُلِّ هَالِكٍ وَدَرَكًا مِنْ كُل فَائِتٍ فَبِاللهِ فَاتَّقُوْا وَإِيَّاُه فَارْجُوْا فَإِنَّمَا الْمُصَابُ مَنْ حُرِمَ الثَّوَابَ. فَقَالَ عَلِيٌّ: أَتَدْرُوْنَ مَنْ هَذَا؟ هُوَ الْخَضِرُ عَلَيْهِ السَّلَامُ. رَوَاهُ الْبَيْهَقِيُّ فِيْ “دَلَائِلِ النُّبُوَّةِ”.
5972. (17) [3/1685– అత్యంత బలహీనం ]
జ’అఫర్ బిన్ ము’హమ్మద్ తన తండ్రి ద్వారా కథనం: ఖురైషుల్లోని ఒక వ్యక్తి అతని తండ్రి ‘అలీ బిన్ ‘హుసైన్ వద్దకు వెళ్ళాడు. ‘అలీ బిన్ ‘హుసైన్ ఆ వ్యక్తితో ‘నేను నీకు ప్రవక్త (స) ‘హదీసు’ గురించి తెలుపనా?’ అని అన్నారు. దానికి ఆ వ్యక్తి, ‘అవును, చెప్పండి,’ అని అన్నాడు. అప్పుడు ‘అలీ బిన్ ‘హుసైన్ ఇలా అన్నారు, ”ప్రవక్త (స) అనారోగ్యానికి గురైనపుడు జిబ్రీల్ (అ) ప్రవక్త (స)ను పరామర్శించటానికి వచ్చారు. ఇంకా ఇలా అన్నారు, ”ఓ ము’హమ్మద్! అల్లాహ్ (త) మీ గౌరవార్థం నన్ను మీ దగ్గరికి పంపాడు. ఇది కేవలం మీ ఒక్కరికే ప్రత్యేకం. అల్లాహ్(త) మీరెలా ఉన్నారని, ఆయనకు మీ కంటే ఎక్కువ తెలిసి ఉన్నా అడుగు తున్నాడు. దానికి ప్రవక్త (స), ‘ఓ జిబ్రీల్ చాలా విచారంగా ఉన్నాను. ఇంకా నేను బాధలో ఉన్నట్టు భావిస్తున్నాను,’ అని సమాధానం ఇచ్చారు. ఆ తరువాత మరుసటి రోజు కూడా జిబ్రీల్ (అ) వచ్చారు. మళ్ళీ అలాగే ప్రశ్నించారు. ప్రవక్త (స) కూడా అలాగే సమాధానం ఇచ్చారు. ఆ తరువాత మూడవ రోజు కూడా జిబ్రయీల్ (అ) వచ్చారు. మొదటి విధంగానే ప్రశ్నించారు. ప్రవక్త(స) కూడా అలాగే సమాధానం ఇచ్చారు. చివరి రోజు జిబ్రీల్ వెంట ఒక దైవదూత వచ్చాడు, అతని పేరు ఇస్మా’యీల్, అతడు లక్ష మంది దైవదూతలకు నాయకుడు. ఇంకా వారిలో ప్రతి ఒక్కరూ లక్షమంది దైవదూతలకు నాయకులు. ఆ దైవదూత ప్రవక్త (స) వద్దకు రావటానికి అనుమతి కోరాడు. ప్రవక్త (స) అతని గురించి జిబ్రీల్ (అ)ను అడిగారు. జిబ్రీల్ (అ) కొంతసేపు ఆగి ఇతడు మరణదైవదూత మీ వద్దకు రావటానికి అనుమతి కోరుతున్నాడు. అయితే ఇంతకు ముందు ఏ మానవుణ్ణి అనుమతి కోరలేదు. మీ తర్వాత కూడా ఎవరినీ అనుమతి కోరడు.
ప్రవక్త (స) జిబ్రీల్‌తో, ‘అతనికి అనుమతివ్వు,’ అని అన్నారు. అనంతరం అతనికి అనుమతి ఇవ్వ బడింది. మరణదూత ప్రవక్త (స)కు సలామ్ చేసాడు. ప్రవక్త (స) సమాధానం ఇచ్చారు. ఆ తర్వాత మరణదూత, ‘ఓ ము’హమ్మద్! అల్లాహ్(త) నాకు మీ దగ్గరకు పంపాడు, మీరు అనుమతిస్తే నేను మీ ఆత్మను తీసుకుంటాను. ఒకవేళ మీరు అనుమతి ఇవ్వకపోతే, నేను మీ ఆత్మను తీసుకోలేను,’ అని అన్నాడు. దానికి ప్రవక్త (స), ‘ఓ మలకుల్ మౌత్! నువ్వు అలాగే చేస్తావా?’ అని అడిగారు. దానికి మరణదూత, ‘నిస్సందేహంగా నాకు అలాగే ఆదేశించడం జరిగింది. ఇంకా మీ ఆదేశాన్ని పాలించమని, నేని ఆజ్ఞాపించ బడ్డాను.’
ఈ ‘హదీసు’ ఉల్లేఖనకర్త ‘అలీ బిన్ అల్ ‘హుసైన్ కథనం: ప్రవక్త (స) జిబ్రీల్ వైపు చూసారు. అప్పుడు జిబ్రీల్ (అ), ‘ఓ ము’హమ్మద్! వాస్తవం ఏమిటంటే, అల్లాహ్(త) మిమ్మల్ని కలవాలని ఎదురు చూస్తున్నాడు,’ అని అన్నారు. అది విన్న ప్రవక్త (స) మరణదూతతో, ‘నిన్ను ఆదేశించబడినదాన్ని అమలు చేయి,’ అని అన్నారు. అనంతరం మరణ దూత ప్రవక్త (స) ఆత్మను వశపరచుకున్నాడు. ప్రవక్త (స) మరణించిన తర్వాత ఓదార్పుకు వచ్చిన వారు ఇంటిలోని ఒక మూల నుండి ”ఓ ప్రవక్త (స) కుటుంబం వారలారా! మీపై శాంతి కురియుగాక! ఇంకా అల్లాహ్(త) దయా, ఆయన శుభాలు కురియుగాక!” అనే శబ్దం రావటం విన్నారు.
వాస్తవం ఏమిటంటే దైవగ్రంథంలో లేదా, దైవ ధర్మంలో ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంది. అల్లాహ్ (త) ప్రతి పోగొట్టుకునే దానికి ప్రతిఫలం ప్రసాదిస్తాడు. వాస్తవం ఇదైనప్పుడు అల్లాహ్ (త) సహాయంద్వారా దైవభక్తి, దైవభీతులు అవలం బించండి. ఆయనపైనే ఆశలు పెట్టుకోండి. ప్రతిఫలం దక్కనివాడే అసలు కష్టాల్లో ఉన్న వాడు. ‘అలీ బిన్ అల్ ‘హుసైన్ ఓదార్పు వచనాలు పలికిందెవరో మీకు తెలుసా? అని అన్నారు. ఆ తర్వాత తానే ఖి’దర్ (అ) అని సమాధానం ఇచ్చారు. [39] (బైహఖీ-దలాయిలు న్నుబువ్వహ్)
=====
10- ميراث النَّبي صلى الله عليه وسلم
10. ప్రవక్త (స) ఆస్తి
اَلْفَصْلُ الْأَوَّلُ మొదటి విభాగం
5973 – [1 ] ( صحيح ) (3/1686)
عَنْ عَائِشَةَ قَالَتْ:مَا تَرَكَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم دِيْنَارًا وَلَا دِرْهِمًا وَلَا شَاةً وَلَا بَعِيْرًا وَلَا أَوْصَى بِشَيْءٍ. روَاهُ مُسْلِمٌ.
5973. (1) [3/1686 –దృఢం]
‘ఆయి’షహ్ (ర) కథనం: ప్రవక్త (స) మరణించి నపుడు దీనార్లు గానీ, దిర్‌హమ్‌లు గానీ, పశువులు గానీ వదలి వెళ్ళ దు, ఇంకా వీలునామా కూడా ఆదేశించి వెళ్ళ లేదు. (ముస్లిమ్)
5974 – [ 2 ] ( صحيح ) (3/1686)
عَنْ عَمْرِو بْنِ الْحَارِثِ أَخِيْ جُوَيْرِيَةَ قَالَ: مَا تَرَكَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم عِنْدَ مَوْتِهِ دِيْنَارًا وَلَا دِرْهَمًا وَلَا عَبْدًا وَلَا أَمَةً وَلَا شَيْئًا إِلَّا بَغْلَتَهُ الْبَيْضَاءَ وَسَلَاحَهُ وَأَرْضًا جَعَلَهَا صَدَقَةً. روَاهُ الْبُخَارِيُّ .
5974. (2) [3/1686– దృఢం]
జువైరియ (ర) సోదరుడు ‘అమ్ర్ బిన్ ‘హారిస్’ (ర) కథనం: ప్రవక్త (స) మరణించేటప్పుడు దీనార్ గాని, దిర్‌హమ్ గాని, బానిసను గాని, బానిసరాలిని గాని, ఏదైనా వస్తువును గాని వదలి వెళ్ళలేదు. అయితే ఒక తెల్లని కంచరగాడిద, ఆయుధాలు, కొంత భూమి ఉండేవి. వాటిని ప్రవక్త (స) దానం చేసివేసారు. (బు’ఖారీ)
5975 – [ 3 ] ( مُتَّفَقٌ عَلَيْهِ ) (3/1686)
وَعَنْ أَبِيْ هُرَيْرَةَ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم قَالَ: “لَا يَقْتَسِمُ وَرَثَتِيْ دِيْنَارًا مَا تَرَكْتُ بَعْدَ نَفَقَةِ نِسَائِيْ وَمَؤْنَةِ عَامِلِيْ فَهُوَ صَدَقَةٌ”. مُتَّفَقٌ عَلَيْهِ.
5975. (3) [3/1686 –ఏకీభవితం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”నా వారసులు (నా అనంతరం) దీనార్లు పంచుకోరు. నా ఆస్తి ఎంత ఉన్నా, అది నా భార్యల ఖర్చులు, వసూలు చేసేవాని పారితోషికం పోగా మిగిలినదంతా దాన ధర్మాలకు పోవాలి. (బు’ఖారీ, ముస్లిమ్)
5976 – [ 4 ] ( مُتَّفَقٌ عَلَيْهِ ) (3/1686)
وَعَنْ أَبِيْ بَكْرٍ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَا نُوْرَثُ مَا تَرَكْنَاهُ صَدَقَةٌ”. مُتَّفَقٌ عَلَيْهِ.
5976. (4) [3/1686 –ఏకీభవితం]
అబూ బకర్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మేము ఆస్తిని (వారసులకు) వదలిపెట్టి వెళ్ళం, మేము వదలినదంతా దానధర్మాల కొరకు ఉంటుంది.” (బు’ఖారీ, ముస్లిమ్)
5977 – [ 5 ] ( صحيح ) (3/1686)
وَعَنْ أَبِيْ مُوْسَى عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم أَنَّهُ قَالَ: “إِنَّ اللهَ إِذَا أَرَادَ رَحْمَةَ أُمَّةٍ مِنْ عِبَادِهِ قَبَضَ نَبِيَّهَا قَبْلَهَا فَجَعَلَهُ لَهَا فَرَطًا وَسَلَفًا بَيْنَ يَدَيْهَا وَإِذَا أَرَادَهَلَكَةَ أُمَّةٍ عَذَّبَهَا وَنَبِيُّهَا حَيٌّ فَأَهْلَكَهَا وَهُوَ يَنْظُرُ فَأَقَرَّ عَيْنَيْهِ بِهَلَكَتِهَا حِيْنَ كَذَّبُوْهُ وَعَصَوْا أَمْرَهُ”. رَوَاهُ مُسْلِمٌ.
5977. (5) [3/1686 –దృఢం]
అబూ మూసా అష్’అరీ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”అల్లాహ్ తన దాసుల బృందంపై దయా కారుణ్యాలను అవతరింపజేయ కోరినపుడు, ముందు వారి ప్రవక్తను ఎత్తు కుంటాడు. ఈ విధంగా అల్లాహ్ (త) ఈ అనుచర సమాజ సిఫారసు దారునిగా చేసివేసాడు. అదేవిధంగా అల్లాహ్ (త) ఒక అనుచర సమాజాన్ని నాశనం చేయగోరినపుడు వారి ప్రవక్త బ్రతికి ఉండగానే వారిని దైవశిక్షకు గురిచేస్తాడు. అనంతరం ఆ సమాజం నాశనం అయిపోతుంది. ఆ ప్రవక్త తన అనుచర సమాజ వినాశనాన్ని కళ్ళారా చూస్తాడు. దానివల్ల అతనికి కంటి చలువ లభిస్తుంది. ఎందుకంటే ఆ అనుచర సమాజం తన ప్రవక్తను తిరస్కరిస్తుంది. ఇంకా అతనికి అవిధేయత చూపుతుంది. (ముస్లిమ్)
5978 – [ 6] ( صحيح ) (3/1686)
وَعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “وَالَّذِيْ نَفْسُ مُحَمَّدٍ بِيَدِهِ لَيَأْتِيَنَّ عَلَى أَحَدِكُمْ يَوْمٌ وَلَا يَرَانِيْ ثُمَّ لَأَنْ يَرَانِيْ أَحَبُّ إِلَيْهِ مِنْ أَهْلِهِ وَمَالِهِ مَعَهُمْ”. رَوَاهُ مُسْلِمٌ.
5978. (6) [3/1686– దృఢం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఎవరి చేతిలో ము’హమ్మద్ ప్రాణం ఉందో ఆయన సాక్షి! మీపై ఒకరోజు రాబోతున్నది, నన్ను చూడని వ్యక్తికి నన్ను చూడటం తన భార్యాబిడ్డలను తన సంపదలతో సహా చూడ టం కన్నా ఎంతో ప్రియమైనదిగా భావిస్తాడు. (ముస్లిమ్)
—–
هذ الباب خال من الفصل الثاني و الثَّالث
ఇందులో రెండవ, మూడవ విభాగాలు లేవు
*****
[1]) వివరణ-5739: అంటే ప్రవక్త (స) వంశపరంపర ప్రారంభం నుండి ఇప్పటి వరకు చాలా ఉత్తమ, మహా వ్యక్తులతో కూడుకొని ఉంది. ప్రవక్త (స) పూర్వీకులు తమ కాలాల్లో చాలా ఉత్తములు, గౌరవనీయులు, ఆదర్శవంతులు. ప్రవక్త (స) తరతరాలుగా మారుతూ ఈ ఉత్తమ కాలంలో జన్మించారు.
[2]) వివరణ-5740: ప్రవక్త (స) ఇస్మా‘యీల్ వంశానికి చెందినవారు. ఇస్మా’యీల్ కుమారులు ఖైదార్ సంతా నంలో, అద్నాన్ అనే వ్యక్తి ఉండేవారు. అద్‌నాన్ సంతతి ఇస్మా’యీల్ వంశానికి చెందిన అనేక ప్రఖ్యాత తెగలపై ఆధారపడి ఉంది. ఈ అద్‌నాన్ సంతతిలోనే ప్రవక్త (స) జన్మించారు. ప్రవక్త (స) వంశ వృక్షం ఈ విధంగా ఉంది: ము‘హమ్మద్ బిన్ ‘అబ్దుల్లాహ్ బిన్ అబ్దుల్ ముత్త లిబ్ బిన్ హాషిమ్ బిన్ అబ్దుమునాఫ్ బిన్ ఖుసా బిన్ కిలాబ్ బిన్ ముర్ర బిన్ కఅబ్ బిన్ లువీ బిన్ ‘గాలిబ్ బిన్ ఫహ్‌ర్ బిన్ మాలిక్ బిన్ న‘దర్ బిన్ కనానహ్ బిన్ ఖుజైమహ్ బిన్ ముద్‌రిక్ బిన్ ఇల్‌యాస్ బిన్ ము‘దర్ బిన్ న‘జార్ బిన్ సఅద్ బిన్ అద్‌నాన్.
[3]) వివరణ-5756: రెండు కరవాలాలు ఒకచోట చేరటం అంటే, ఒక వైపు ముస్లిములు పరస్పరం వివాదాలకు గురికావటం, వివాదాల్లో నిమగ్నం కావటం, మరోవైపు శత్రువులు వారిపై దాడి చేయటం, వారిపై దండెత్తి రావటం జరుగదు. తయ్యిబీ అభిప్రాయం: అల్లాహ్(త) ఈ అనుచర సమాజాన్ని ఒకేసారి రెండు యుద్ధాలకు గురిచేయడం జరగదని నిర్ణయించాడు. పరస్పరం కలహాలకు గురికావటం, శత్రువులు దాడి చేయటం రెండూ ఒకేసారి జరగవు. వారిపై శత్రువులు దాడిచేస్తే ముస్లిములందరూ తమ వ్యతిరేకతలను మరచి అందరూ కలసికట్టుగా శత్రువుతో పోరాడుతారు.
[4]) వివరణ-5758: ఆదమ్ (అ) ఉనికిలోనికి రావటానికి ముందే ప్రవక్త (స) దైవదౌత్యం నిర్ణయించబడింది.
[5]) వివరణ -5760: నా విషయం గురించి మొదటి మెట్టు ఇబ్రాహీమ్ (అ) ప్రార్థన, ఇబ్రాహీమ్ (అ) ప్రవక్త (స) గురించి క’అబహ్ నిర్మాణం జరిగినప్పుడు ప్రార్థించారు. ఇది ఖుర్‌ఆన్‌లో ఈవిధంగా ఉంది: ”ఓ మా ప్రభూ! వీరిలో నుండి నీ సందే శాలను చదివి వినిపించుటకునూ, నీ గ్రంథాన్ని నేర్పుటకునూ, దివ్యజ్ఞానాన్ని బోధించు టకునూ మరియు వారిని పరిశుధ్ధులుగా మార్చు టకునూ ఒక సందేశహరుణ్ణి పంపు. నిశ్చయంగా, నీవే సర్వ శక్తిమంతుడవు, మహా వివేకవంతుడవు.” (అల్-బఖరహ్, 2:129)
అదేవిధంగా ఈ ప్రపంచంలో ప్రవక్త (స) రాక ముందు ‘ఈసా (అ) బనీ ఇస్రాయీ’ల్‌ను ఉద్దేశించి ప్రసంగిస్తూ, మన ప్రవక్త (స) దైవదౌత్య శుభవార్త ఇచ్చారు. ఖుర్‌ఆన్‌లో ఇలా ఉంది, ”…మరియు నా తరువాత అ’హ్మద్ అనే సందేశహరుడు రాబోతున్నాడు, అనే శుభవార్తను ఇస్తున్నాను…” (అ’స్-‘సఫ్ఫ్, 61:6)
[6]) వివరణ-5761: ఇది బలహీనమైన ‘హదీసు’.
[7]) వివరణ-5766: నాసిరుద్దీన్ అల్బానీ దీన్ని బలహీనమైన (‘దయీఫ్) హదీసుగా పరిగణించారు. (తిర్మిజి’ / ‘దయీఫ్)
[8]) వివరణ-5772: నాసిరుద్దీన్ అల్ బానీ దీన్ని’దయీఫ్ ‘హదీసు’గా నిర్థారించారు. (తిర్మిజి’ – ‘దయీఫ్ – 483)
[9]) వివరణ-5776: ఇందులో రెండు భాగాలున్నాయి. ఒకటి ప్రవక్త (స) ఉత్తమమైన పేర్లు. రెండవది గుణగుణాలు అంటే ప్రవక్త (స) రంగు, రూపం, గుణగణాలు, అలవాట్లు మొదలైనవి. ప్రవక్త (స)కు ఉత్తమమైన పేర్లు అనేకం ఉన్నాయి. కొన్ని ఖుర్‌ఆన్‌లో ఉన్నాయి. కొన్ని ఇంతకు ముందు గ్రంథాలలో ఉన్నాయి. మరికొన్ని ‘హదీసు’ల్లో ఉన్నాయి. వీటి సంఖ్య విషయంలో అభిప్రాయ భేదాలు ఉన్నాయి. కొందరు పండితులు 99 పేర్లు కూడబెట్టారు. ఇవి అల్లాహ్ (త) శుభనామముల సంఖ్యకు సమానంగా ఉన్నాయి. ఖా’దీ అబూ బకర్ బిన్ అల్’గర్‌బీ అభిప్రాయం: అల్లాహ్‌కు 1000 పేర్లు ఉన్నాయి. ప్రవక్త (స)కు కూడా 1000 పేర్లు ఉన్నాయి. సుయూ‘తీ ప్రత్యేకంగా ఒక పుస్తకాన్నే వ్రాసారు. అతను అందులో ప్రవక్త (స) పేర్లను ఒకచోట చేర్చారు. ఇంకా వీటిని వివరించారు. ప్రవక్త (స) పేర్లంటే అతని ఒక్క గుణానికి ఒక్కోపేరు పెట్టడం జరిగింది. మా’హీ అంటే చెరిపేవాడు అంటే అల్లాహ్(త) అతని ద్వారా అవిశ్వాసాన్ని రూపుమాపేవాడు. ‘హాషిర్ అంటే ఒకచోట చేర్చేవాడు అంటే తీర్పుదినం నాడు అందరికంటే ముందు ప్రవక్త (స) తన సమాధి నుండి లేచి తీర్పు మైదానంలోకి వస్తారు. ఆయన తర్వాత అందరూ లేచి తీర్పు మైదానంలోకి వస్తారు. ‘ఆఖిబ్ అంటే అందరికన్నా వెనుక వచ్చేవాడు, అంటే ప్రవక్త (స) అంతిమ ప్రవక్త, అతని తరువాత ఏ ప్రవక్తా రాడు.
[10]) వివరణ-5778: ముజ‘మ్మమ్ అంటే చీవాట్లు పెట్టబడిన వ్యక్తి, ము’హమ్మద్ దానికి విరుద్ధం. ఖురైషులు ప్రవక్త (స)ను ము’హమ్మద్‌కు బదులు ముజ’మ్మమ్ అని పిలిచేవారు. ప్రవక్త (స) అనుచరులను ఓదార్చేవారూ వీళ్ళ ముజ’మ్మమ్‌ను తిడుతున్నారని చెప్పేవారు. ఈ విధంగా అల్లాహ్(త) నన్ను వీరి తిట్ల నుండి దూరంగా ఉంచాడు.
[11]) వివరణ-5782: ఈ ‘హదీసు’లో ప్రవక్త (స)కు 40 సంవ త్సరాల వయస్సులో దైవదౌత్యం లభించిందని ఉంది. ఆ తరువాత 10 సంవత్సరాలు మక్కహ్లో, 10 సంవత్స రాలు మదీనాలో గడిపారని, 60 సంవత్సరాల వయస్సు లో మరణం సంభవించిందని ఉంది. అయితే వాస్తవం ఏమి టంటే మక్కహ్లో 13 సంవత్సరాలు గడిపారు. మరణ సమయాన ప్రవక్త (స)వయస్సు 63 సంవత్సరాలు.
[12]) వివరణ-5783: ఎర్రని దుస్తులంటే ప్రవక్త (స) దుస్తులపై ఎర్రని గీతలు ఉండేవి.
[13]) వివరణ-5788: ఉమ్మె సులైమ్ (ర), అనస్ (ర) తల్లి గారు. ఇతడు ప్రవక్త (స) ప్రత్యేక సేవకులు. ఉమ్మె సులైమ్ ప్రవక్త(స)కు పాలు పట్టిన తల్లి చెల్లెలు, అంటే పిన్ని. ఈ పాలు బంధంవల్లే ఆమె ప్రవక్త(స)కు పిన్ని అయ్యారు. అందువల్లే ప్రవక్త (స) మధ్యాహ్నం వేళ ఆమె ఇంటికి వెళ్ళి విశ్రాంతి తీసుకునేవారు.
[14]) వివరణ-5794: ఎర్రని దుస్తులంటే, ఎర్రని తెల్లని గీతలు గలవి. యమన్ దుప్పట్లు ఇలాగే ఉండేవి.
[15]) వివరణ-5809: అంటే అవసరం అనుకుంటే దూరం తీసుకువెళ్ళి అక్కడ తన బాధలను వ్యక్తపరచుకునేది. దీనివల్ల ప్రవక్త(స) వినయవిధేయతలు, అణుకువ ఉట్టి పడుతున్నాయి. దీనివల్ల తెలిసిన విషయం ఏమిటంటే ప్రవక్త (స) ప్రతి చిన్న పెద్ద అందరిపట్ల ప్రేమాభి మానాలతో వ్యవహరించే వారని తెలుస్తుంది.
[16]) వివరణ-5817: దైవప్రీతి కోసం నిషిద్ధాలకు గురయ్యే వారిని శిక్షించే వారు. అంటే ధార్మిక నిషిద్ధాలకు పాల్పడిన వారిని అంటే దొంగతనం, వ్యభిచారం మొదలైన వాటికి తగిన విధంగా శిక్షించేవారు.
[17]) వివరణ-5825: ప్రవక్త (స)కు అల్లాహ్(త)పై పూర్తి నమ్మకం ఉండేది. అందువల్లే ప్రవక్త (స) తనకోసం రేపటికి ఏ వస్తువునూ ఉంచేవారు కారు.
[18]) వివరణ-5838: ప్రవక్త (స) వయస్సు విషయంలో అనేక ఉల్లేఖనాలు ఉన్నాయి. దీనికంటే ముందు ‘హదీసు’లో 63 సంవత్సరాలు అని ఉంది. ఈ ‘హదీసు’లో 65 సంవత్సరాలు అని ఉంది. రాబోయే ‘హదీసు’లో 60 సంవత్సరాలు అని ఉంది. ఇబ్నె ‘అబ్బాస్ (ర) ఉల్లేఖనంలో జనన, మరణ సంవత్సరాలను కూడా లెక్కించడం జరిగింది. ఈ రెండు సంవత్స రాలను కలిపి 65 గా పేర్కొనడం జరిగింది. కాని అనస్ (ర) ఉల్లేఖనంలో 60 సంవత్సరాలని ఉంది. అతడు మిగిలిన 3ను వదలి 60 సంవత్సరాలుగా పేర్కొనడం జరిగింది. ఈ విధంగా అనస్ (ర) ప్రవక్త (స) వయస్సును 60 సంవత్సరాలుగా పేర్కొన్నారు. అయితే ప్రామాణిక ఆధారాలతో 63 సంవత్సరాల వయస్సులో ప్రవక్త (స) మరణించారని నిర్థారించటం జరిగింది. అంటే ప్రవక్త (స) దైవదౌత్యం లభించిన తర్వాత మక్కహ్లో 13 సంవత్సరాలు ఉన్నారు. మదీనహ్లో 10 సంవత్సరాలు ఉన్నారు. ఈవిధంగా ప్రవక్త (స) వయస్సు 63 సంవత్సరాలు. ఈ నిర్థారణే ప్రామాణికమైనది, సరియైనది.
[19]) వివరణ-5842: ఇది మున్ఖత‘ ‘హదీసు‘. ‘ఆయి’ షహ్ (ర) దైవదౌత్య ప్రారంభకాలం నాటి విషయాలు ప్రవక్త (స) నుండి విని లేదా అనుచరుల నుండి విని తెలిపారు. ఎందుకంటే దైవదౌత్య ప్రారంభ కాలంలో ‘ఆయి’షహ్ (ర) ఉనికే లేదు. (మిష్‌కాత్ / అల్‌బానీ)
[20]) వివరణ-5848: ప్రవక్త (స) సాధారణంగా ‘హజ్ కాలంలో, సామాన్య సభల్లో ప్రజలకు ఇస్లామ్ సందేశాన్ని గురించి తెలిపేవారు. ఒక రోజు ‘ఉఖ్‌బహ్ ప్రాంతంలో ఉన్న ప్రజలకు ఇస్లామ్ సందేశాన్ని అందజేసారు. ఆ తరువాత సఖీఫ్ తెగవారి వద్దకు వెళ్ళారు. ఆ తెగ నాయకుడు ఇబ్నె అబ్దు యాలీల్ బిన్ కలాల్‌కు ఇస్లామ్ సందేశం ఇచ్చారు. కాని ఎవరూ ప్రవక్త (స) మాట వినలేదు. ఇంకా ప్రవక్త (స) పట్ల చాలా దుర్మార్గంగా వ్యవహరించారు. ప్రవక్త (స)ను తిట్టారు. అనేక బాధలకు గురిచేసారు. ప్రవక్త (స)పై రాళ్ళవర్షం కురిపించారు. దానివల్ల శరీరమంతా రక్తసిక్తం అయ్యింది. వీటన్నిటి వల్ల ప్రవక్త (స)కు మతి పోయినంత పనయింది. అక్కడి నుండి నడవసాగారు. కొంతదూరం వెళ్ళిన తర్వాత కొంత ఉప శమనం కలిగింది. ఖర్న్ స‘ఆలిబ్‌కు చేరుకున్నాను. అక్కడ మేఘంలో జిబ్రీల్ (అ) కనబడ్డారు. ఇంకా పర్వతాల దైవదూత, దుర్మార్గులను శిక్షించే అనుమతికోరాడు. కాని ప్రవక్త (స) వారిని శిక్షించదలచు కోలేదు ఇంకా వారి సంతానంలో పుణ్మాత్ములను సృష్టించమని ప్రార్థించారు.
[21]) వివరణ-5849: అరబీలో పై రెండు, క్రింద రెండు పళ్ళను రుబాయియ్యహ్ అంటారు. క్రింది పళ్ళలోని క్రింది, కుడిపన్ను కొంత విరిగింది. దానితో పాటు నోరుకూడా గాయపడింది.
[22]) వివరణ-5851: వాస్తవం ఏమిటంటే, అన్నిటికంటే ముందు అవతరించబడిన దైవవాణి ”ఇఖ్‌రహ్ బిస్మిరబ్బికల్లజీ‘ (96:1-5)’ దీని తరువాత కొంతకాలం వరకు దైవవాణి అవతరించలేదు. మళ్ళీ దైవవాణి అవతరించడం ప్రారంభమయింది. అప్పుడు అన్నిటి కంటే ముందు ‘యా అయ్యు హల్ ముద్దస్సిర్ (74)’ అవతరింపజేయబడింది. ఈ విధంగా ఇది మొదట అవతరింపజేయబడిందని భావించబడింది.
[23]) వివరణ-5874: ఆ అన్సారీ వ్యక్తి దైవదూత యొక్క చర్య గ్రహించటం దైవానుగ్రహం, ప్రవక్త (స) ఆ సంఘటనను ధృవీకరించటం అతనికి ప్రసాదించబడిన మహిమ.
[24]) వివరణ-5876: అబూ రాఫె‘అ ఒక యూద వ్యాపారి. వాడు ప్రవక్త (స)కు బద్ధశత్రువు. వాడు అనేక సార్లు వాగ్దానభంగం చేసాడు. అనేక విధాలుగా కల్లోలాలను రేకెత్తించాడు. ప్రవక్త (స) గురించి అనేక విధాలుగా దూషించాడు. ప్రాణ భయం వల్ల తనకోటలో దాక్కున్నాడు. ప్రవక్త (స) అతన్ని చంపటానికి ఒక బృందాన్ని పంపారు. ‘అబ్దుల్లాహ్ బిన్ ‘అతీక్ రాత్రిపూట అతని కోటలో ప్రవేశించారు. రాత్రి భోజనం చేసిన తర్వాత అతడు నిద్రపోయిన తర్వాత, అతడి పడక గదిలో ప్రవేశించి అతడి పని పూర్తిచేసారు.
[25]) వివరణ-5887: ఈ సంఘటన మౌతహ్ యుద్ధంలో జరిగింది. ఇది 8 హిజ్రీ సంవత్సరంలో రూమీలతో జరిగింది. ప్రవక్త (స) పంపుతూ ఈ ముగ్గురు అనుచరుల పేర్లు ప్రస్తావిస్తూ ఒకవేళ యుద్ధంలో సైన్యాధికారి ‘జైద్ బిన్ ‘హారిస‘హ్ (ర) వీరమరణం పొందితే, ఆయన తరువాత జ‘అఫర్ సైన్యాధికారి అవుతారని, ఇస్లాం జండా ఆయన చేతిలో ఉంటుందని, ఒకవేళ ఆయన కూడా వీరమరణం పొందితే, ‘అబ్దుల్లాహ్ బిన్ రవా‘హ సైన్యాధికారిగా ఉంటారని పేర్కొన్నారు. అనంతరం ఆ యుద్ధంలో ఈ ముగ్గురూ ఒకరి తరువాత ఒకరు వీరమరణం పొందారు. ఆ తరువాత ఇస్లామీయ సైన్యం ‘ఖాలిద్ బిన్ వలీద్‌ను సైన్యాధికారిగా ఎన్నుకుంది. అల్లాహ్(త) అతడి(ర) ద్వారా ముస్లిములకు విజయం ప్రసాదించాడు. ప్రవక్త మౌతహ్ యుద్ధం ప్రాంతానికి నెలరోజుల ప్రయాణ దూరంలో ఉన్న మదీనహ్లో ఉంటూ వీరి వీరమరణం గురించి ప్రజలకు తెలియపరిచారు. ఇది ప్రవక్త (స)కు ప్రసాదించబడిన మహిమ.
[26]) వివరణ-5911: తబూక్ అనేది ఒక పట్టణం పేరు. ఇది మదీనహ్ నుండి 465 మైళ్ళ దూరంలో ఉంది. 9వ హిజ్రీ, రజబ్ నెలలో ప్రవక్త (స) యుద్ధం కోసం ఇస్లామీయ సైన్యంతో అక్కడికి వెళ్ళారు. ఇందులో లక్షమంది సైనికులు పాల్గొన్నారు. ఇది ప్రవక్త (స) చివరి యుద్ధం.
[27]) వివరణ-5915: ఈ ‘హదీసు’లో ప్రవక్త (స) యొక్క మూడు మహిమలు ప్రస్తావించబడ్డాయి. 1. చెట్టుపై ఉన్న పళ్ళను సరిగ్గా నిర్థారించారు. 2.తుఫాను గాలి. 3. ప్రవక్త (స) మాట వినకుండా నిలబడిన వ్యక్తిని సుడిగాలి విసిరి పారేసింది.
[28]) వివరణ-5916: ఖీరా‘త్ ఒక నాణెం పేరు. ఇది ఒక దీనారుకు 24వ వంతు. ఖీరాత్ ప్రస్తావన ఎందుకు వచ్చిం దంటే ఇక్కడి ప్రజలు చాలా నీచులు. దీని చిహ్నం ఏమిటంటే, వారి నాలుకపై ఖీరాత్ మాత్రమే ఉండేది. ఈజిప్టు ప్రజలపట్ల మంచిగా ప్రవర్తించాలంటే, దీనికి రెండు ప్రత్యేకతలు ఉన్నాయి. ఒకటి ప్రవక్త (స) కుమారుడు ఇబ్రాహీమ్ బానిసరాలు మారియ ఖిబ్తియహ్ గర్భం నుండి జన్మించారు. ఈమె ఈజిప్టుకు చెందినది. ఈవిధంగా ఈజిప్టు వారు ప్రవక్త (స)కు మామ తరఫు వారవుతారు. రెండవది, ఇస్మా’యీల్ (అ) తల్లి ఈజిప్టుకు చెందినవారు. అందువల్ల ఈజిప్టు వారి పట్ల మంచిగా ప్రవర్తించమన్నారు. ఈజిప్టు ‘ఉమర్ (ర) కాలంలో జయించడం జరిగింది. అబూ జ’ర్ (ర) అక్కడ ఉన్న కాలంలో ఇద్దరు వ్యక్తులు ఒక్క ఇటుకంత ప్రదేశాన్ని గురించి వివాదపడటం చూసారు. వెంటనే ఈజిప్టు వదలి వెళ్ళిపోయారు.
[29]) వివరణ-5917: అంటే వారిలో 8 మంది ప్లేగు వ్యాధితో మరణిస్తారు. దుబుల్ అంటే కష్టం, ఆపద అని కూడా అర్థం వస్తుంది.
[30]) వివరణ-5918: పండితులు జ’జ్‌రీ ఈ ‘హదీసు’ను ప్రామాణికమైనదిగా పేర్కొన్నారు. ఈ ‘హదీసు’లో అబూ బకర్ (ర) ప్రస్తావన నుండి చివరి వరకు ఉన్నదంతా ఉల్లేఖనకర్త పొరపాటు, హాఫిజ్ ఇబ్నె ‘హజర్ ఈ ‘హదీసు’ ఉల్లేఖనకర్తల గురించి వారందరూ సత్యవంతులేనని పేర్కొన్నారు.
[31]) వివరణ-5942: ప్రవక్త (స) మేక మాంసం తినలేదు. ఎందుకంటే ఆ మేక సరైన విధంగా విక్రయం జరగలేదు. యజమాని అనుమతి లభించలేదు. అందువల్ల ఆ మేక మాంసం అనుమానాస్పదమైనది. అందువల్లే అల్లాహ్ (త) ఆ మాంసాన్ని ప్రవక్త (స) కడుపులోనికి వెళ్ళకుండా చేసాడు.
[32]) వివరణ-5943: ఉమ్మె మ’అబద్ పేరు ‘ఆతిక బింతే ‘ఖాలిద్ ఖుజా’యియహ్. ‘హదీసు’ చివరిలో సంఘటన గురించి ఉంది. అదేమిటంటే, ప్రవక్త (స) అక్కడి నుండి ముందుకు బయలుదేరిన తరువాత ఆమె భర్తవచ్చి, ‘పాలు ఎక్కడి నుండి వచ్చాయని,’ అడిగారు. ఆమె వివరిస్తూ ఒక మహా వ్యక్తి మనఖైమలో వచ్చారు. ఆయన రాకవల్లే ఈ పాలు వచ్చాయి. ఇది విని, ‘నిస్సందేహంగా ఆ వ్యక్తిత్వం ఖురైష్ వంశంలోనిది. ఆయనకు సంబంధించిన అనేక గుణాలు నేను మక్కహ్లో విన్నాను. ఒకవేళ నేను వెళ్ళగలిగితే తప్పకుండా అతన్ని కలుసుకుంటాను.’ అని అన్నాడు.
[33]) వివరణ-5945: అతను చెప్పినట్టే జరిగింది. అందరికంటే ముందు అతనే వీరమరణం పొందారు. అతను తన గురించి ఇలా పలకడం అగోచర జ్ఞానం వల్లకాదు. ఎందుకంటే అగోచరాల జ్ఞానం కేవలం అల్లాహ్(త)కే ఉంది. అల్లాహ్(త) ప్రవక్తలకే అగోచర విషయాల గురించి తెలియజేస్తాడు. ఇది సత్య ప్రేరణ తప్ప మరేమీ కాదు.
[34]) వివరణ-5947: నజాషీ ‘హబ్‌షహ్ రాజు. అతడు క్రైస్తవుడు. ఆ తర్వాత ఇస్లామ్ స్వీకరించి ముస్లిమ్ అయిపోయాడు. నజాషీ మరణవార్త విని ప్రవక్త (స) మదీ నహ్లో తన అనుచరులతోపాటు పరోక్షంగా జనా‘జహ్ నమా‘జ్ చదివించారు. నజాషీ సమాధిపై వెలుగు ఆవ రించి ఉండేదంటే అది కేవలం అల్లాహ్(త) తరఫు నుండే.
[35]) వివరణ-5950: ఇది చాలా బలహీనమైన ‘హదీసు’. ఇబ్నె తైమియ దీన్ని కల్పితంగా పేర్కొన్నారు.
[36]) వివరణ-5951: మదీనహ్ బయట ఒక ప్రాంతం ఉంది. దాన్ని ‘హర్రహ్ అనేవారు. అది నల్లనిరాళ్ళు, కొండలు గల ప్రాంతం. ఈ ప్రాంతంగుండానే య‘జీద్ సైన్యం మదీనహ్పై దాడిచేసింది. అందుకే ఈ సంఘనను ‘హర్రహ్ సంఘటన అని అంటారు. య‘జీద్ బిన్ ము‘ఆవియహ్ మదీనహ్పై దండయాత్ర చేసి భయంకర మైన హింసా దౌర్జన్యాలకు పాల్పడ్డాడు. ఫలితంగా మదీనహ్ వాసులు తీవ్రనష్టాలకు, హత్యలకు, హింసలకు గురయ్యారు. ఈ ‘హర్రహ్ సంఘటన భయంకరమైన ఇస్లామీయ సంఘటనల్లో ఒకటి. ఇది ఎంత భయంకరంగా ఉండేదంటే నిరంతరం మూడు రోజుల వరకు మస్జిదె నబవీలో అజా’న్, ఇఖామత్, నమా’జులు జరగలేదు.
[37]) వివరణ-5952: అబూ ‘ఖల్‌దహ్-అబుల్ ‘ఆలియహ్ను, అనస్ (ర) ప్రవక్త (స) ద్వారా ‘హదీసు’లు వినటాన్ని గురించి అడిగారు. దానికి అబుల్ ‘ఆలియహ్ ఎలాంటి విషయం చెప్పారంటే దానివల్ల అనస్ (ర) ప్రాధాన్యత వెల్లడౌతుంది. అంటే 10 సంవత్సరాలు ప్రవక్త (స) సేవచేసిన వ్యక్తి ప్రవక్త (స) నుండి ‘హదీసు’లు ఎలా వినకుండా ఉంటాడు. ఉల్లేఖించకుండా ఎలా ఉంటాడు.
[38]) వివరణ-5967: ఉమ్మె అయ్మన్ ఉసామా బిన్ ‘జైద్కు తల్లిగారు. ఇంకా ప్రవక్త (స) విడుదల చేసిన బానిసరాలు. ప్రవక్త (స)కు ఈమె తండ్రి ఆస్తిగా లభించింది. ప్రవక్త (స) ఈమెను విడుదల చేసివేసారు. ఇంకా ‘జైద్ బిన్ ‘హారిస‘హ్కు ఇచ్చి వివాహం చేసారు, ‘జైద్ కూడా ముందు బానిసగా ఉండేవారు. అంటే ‘ఖదీజహ్ (ర) వద్ద బానిసగా ఉండేవారు. ఆమె ‘జైద్‌ను ప్రవక్త (స)కు కానుకగా ఇచ్చారు. ప్రవక్త (స) అతన్ని విడుదల చేసివేసారు. అబూ బకర్ (ర) తన పరిపాలనా కాలంలో ప్రవక్త (స) పద్ధతిని అనుసరించారు. ప్రవక్త (స) గౌరవించేవారిని, ఆదరించేవారిని అబూ బకర్ (ర) కూడా తన పరిపాలనా కాలంలో వారిపట్ల ప్రత్యేకంగా కనిపెట్టుకొని ఉండేవారు. వారి వద్దకు వెళుతుండేవారు.
[39]) వివరణ-5972: ఇది చాలా బలహీనమైన ‘హదీసు’. (తన్‌ఖీహుర్రువాత్ 199/4)
***