28- احوال القِيَامَة وبَدَء الخَلْقِ
28. పునరుత్థానం, సృష్టి ఆరంభం
—–
1 – باب النَّفخ في الصُّور
1. బాకా ఊదబడటం
اَلْفَصْلُ الْأَوَّلُ మొదటి విభాగం
5521 – [ 1 ] ( متفق عليه ) (3/1530)
عَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَا بَيْنَ النَّفْخَتَيْنِ أَرْبَعُوْنَ”. قَالُوْا: يَا أَبَا هُرَيْرَةَ أَرْبَعُوْنَ يَوْمًا؟ قَالَ: أَبَيْتُ . قَالُوْا: أَرْبَعُوْنَ شَهْرًا؟ قَالَ: أَبَيْتُ. قَالُوْا: أَرْبَعُوْنَ سَنَةُ؟ قَالَ: أَبَيْتُ”. ثُمَّ يُنْزِلُ اللهُ مِنَ السَّمَاءِ مَاءُ فَيَنْبُتُوْنَ كَمَا يَنْبُتُ الْبَقْلُ”. قَالَ: “وَلَيْسَ مِنَ الْإِنْسَانِ شَيْءٌ لَا يَبْلَى إِلَّا عَظْمًا وَاحِدًا وَهُوَ عَجَبُ الذّنَبِ وَمِنْهُ يُرَكَّبُ الْخَلْقُ يَوْمَ الْقِيَامَةِ”. مُتَّفَقٌ عَلَيْهِ.
وَفِيْ رِوَايَةٍ لِمُسْلِمٍ قَالَ: “كُلُّ ابْنِ آدَمَ يَأْكُلُهُ التُّرَابُ إِلَّا عَجَبَ الذَّنَبِ مِنْهُ خُلِقَ وَفِيْهِ يُرَكَّبُ”.
5521. (1) [3/1530 –ఏకీభవితం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ‘రెండు సార్లు బాకా ఊదబడే మధ్య 40 ల వ్యవధి ఉంటుంది.’ అని అన్నారు. ప్రజలు, ‘ఓ అబూ హురైరహ్ (ర)! ఈ తేడా 40 రోజులు ఉంటుందా’ అని అడిగారు. దానికి అబూ హురైరహ్, ‘దీన్ని గురించి నాకు తెలియదు.’ ప్రజలు, ’40 నెలలు ఉంటుందా,’ అని అన్నారు. దానికి అబూ హురైరహ్, ‘నాకు తెలియదు,’ అని అన్నారు. మళ్ళీ ప్రజలు, ’40 సంవత్సరాలా?’ అని అన్నారు, అబూ హురైరహ్ (ర), ‘నేనేమీ చెప్పలేను,’ అని అన్నారు. ఆ తరువాత ‘ఆకాశం నుండి వర్షం కురుస్తుంది. దానివల్ల ప్రజలు పంటలు మొలకెత్తి నట్టు మొలకెత్తుతారు. మనిషి శరీరం అంతా కరిగిపోతుంది. కాని (ఆవగింజంత) వెన్నెముక తలభాగం నశించదు. దాని ద్వారానే ప్రళయం నాడు ప్రజలు సజీవపరచ బడతారు,’ అని ప్రవచించారు. (బు’ఖారీ, ముస్లిమ్)
‘స’హీ’హ్ ముస్లిమ్‌లోని ఒక ఉల్లేఖనం ఇలా ఉంది: ప్రవక్త (స) ప్రవచనం, ”మానవుల శరీరాలను భూమి తినివేస్తుంది. కాని వెన్నెముకను తప్ప. దీని ద్వారానే మనిషి సృష్టించబడ్డాడు, దీని ద్వారానే మనిషి మళ్ళీ తిరిగి సృష్టించ బడతాడు. (ముస్లిమ్)
5522 – [ 2 ] ( متفق عليه ) (3/1530)
وَعَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “يَقْبِضُ اللهُ الْأَرْضَ يَوْمَ الْقِيَامَةِ وَيَطْوِي السَّمَاءَ بِيَمِيْنِهِ ثُمَّ يَقُوْلُ: أَنَا الْمَلِكُ أَيْنَ مُلُوْكُ الْأَرْضِ؟” مُتَّفَقٌ عَلَيْهِ .
5522. (2) [3/1530– ఏకీభవితం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”తీర్పుదినం నాడు అల్లాహ్ (త) భూమిని తన పిడికిలిలోకి తీసుకుంటాడు. ఆకాశాన్ని తన కుడి చేతిలోకి తీసు కుంటాడు. ఇంకా నేనే చక్రవర్తిని భూమిపై పరిపాలించే చక్రవర్తులు ఏరి?” అని అంటాడు. (బు’ఖారీ, ముస్లిమ్)
5523 – [ 3 ] ( صحيح ) (3/1530)
وَعَنْ عَبْدِ اللهِ بْنِ عُمَرو قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “يَطْوِي اللهُ السَّمَاوَاتِ يَوْمَ الْقِيَامَةِ ثُمَّ يَأْخُذُهُنَّ بِيَدِهِ الْيُمْنَى ثُمَّ يَقُوْلُ: أَنَا الْمَلِكُ أَيْنَ الْجَبَّارُوْنَ؟ أَيْنَ الْمُتَكَبِّرُوْنَ؟ ثُمَّ يَطْوِي الْأَرضِيْنَ بِشِمَالِهِ –
وَفِيْ رِوَايَةٍ: يَأْخُذُهُنَّ بِيَدِهِ الْأُخْرَى – ثُمَّ يَقُوْلُ: أَنَا الْمَلِكُ أَيْنَ الْجَبَّارُوْنَ أَيْنَ الْمُتَكَبِّرُوْنَ؟” رَوَاهُ مُسْلِمٌ.
5523. (3) [3/1530 –దృఢం]
‘అబ్దుల్లాహ్ బిన్ ‘ఉమర్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”అల్లాహ్(త) తీర్పుదినం నాడు ఆకాశాలను చుట్టివేస్తాడు. ఆ తరువాత వాటిని తన కుడిచేతిలోకి తీసుకుంటాడు. ఇంకా నేనే చక్రవర్తిని, దుర్మార్గాలు చేసేవారు, ప్రపంచంలో అహంకారంగా ప్రవర్తించేవారేరి? ఆ తరువాత భూములను తన ఎడమ చేతిలోకి తీసుకుంటాడు.
మరో ఉల్లేఖనంలో మరో చేతిలోకి తీసుకుంటాడు. ఇంకా నేనే చక్రవర్తిని, దుర్మార్గాలు చేసేవారు ఎక్క డున్నారు? అహంకారంగా ప్రవర్తించే వారు ఎక్క డున్నారు? అని అంటాడు. (ముస్లిమ్)
5524 – [ 4 ] ( متفق عليه ) (3/1531)
وَعَنْ عَبْدِ اللهِ بْنِ مَسْعُوْدٍ قَالَ: جَاءَ حَبْرٌ مِّنَ الْيَهُوْدِ إِلى النَّبِيِّ صلى الله عليه وسلم فَقَالَ: يَا مُحَمَّدَ إِنَّ اللهَ يُمْسِكُ السَّمَاوَاتِ يَوْمَ الْقِيَامَةِ عَلى أَصْبَعٍ وَالْأَرْضِيْنَ عَلَى أَصْبَعٍ وَالْجِبَالَ وَالشَّجَرَ عَلَى أَصْبَعٍ وَالْمَاءَ وَالثّرَى عَلَى أَصْبَعٍ وَسَائِرَ الْخَلْقِ عَلَى أَصْبَعٍ ثُمَّ يَهُزُّهُنَّ فَيَقُوْلُ: أَنَا الْمَلِكُ أَنَا اللهُ. فَضَحِكَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم تَعَجُّبًا مِمَّا قَالَ الْحَبْرُ تَصْدِيْقًا لَهُ. ثُمَّ قَرَأَ: (وَمَا قَدَرُوا اللهَ حَقَّ قَدْرِهِ ، وَالْأَرْضُ جَمِيْعًا قَبْضَتُهُ يَوْمَ الْقِيَامَةِ وَالسَّمَاوَات مَطْوِيَّاتٌ بِيَمْيِنِهِ سُبْحَانَهُ وَتَعَالى عَمَّا يُشْرِكُوْنَ؛39: 67) مُتَّفَقٌ عَلَيْهِ.
5524. (4) [3/1531– ఏకీభవితం]
‘అబ్దుల్లాహ్ బిన్ మస్’ఊద్ (ర) కథనం: ఒక యూద పండితుడు ప్రవక్త (స) వద్దకు వచ్చాడు. ‘ఓ ము’హమ్మద్ ప్రళయదినం నాడు అల్లాహ్(త), ‘ఆకాశాలను ఒక వ్రేలుతో, భూముల్ని ఒక వ్రేలితో, వృక్షాలను, కొండలను ఒక వ్రేలితో, మట్టిని ఒక వ్రేలితో, సృష్టితాలన్నిటినీ ఒక వ్రేలితో పట్టుకొని ఊపి నేనే చక్రవర్తిని, నేనే అల్లాహ్‌ను’ అని అంటాడు,’ అని చెప్పాడు. అతని మాటలు విని ప్రవక్త (స) ఆశ్చర్యం వ్యక్తంచేస్తూ, ధృవీకరిస్తూ ఫక్కున నవ్వారు. ఇంకా ”వమా ఖదరుల్లా … అమ్మా యుషిరికూన్” ఆయతు పఠించారు. (అ’జ్జ్-‘జుమర్, 39:67)
5525 – [ 5 ] ( صحيح ) (3/1531)
وَعَنْ عَائِشَةَ قَالَتْ: سَأَلْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم عَنْ قَوْلِهِ: (يَوْمَ تُبَدَّلُ الْأَرْضُ غَيْرَ الْأَرْضِ وَالسَّمَاوَاتُ؛14: 48) فَأَيْنَ يَكُوْنُ النَّاسُ يَوْمَئِذٍ؟ قَالَ: “عَلَى الصِّرَاطِ”. رَوَاهُ مُسْلِمٌ .
5525. (5) [3/1531 -దృఢం]
‘ఆయి’షహ్ (ర) కథనం: ప్రవక్త (స)ను నేను ఈ ఆయతును గురించి ”ప్రస్తుత భూమ్యాకాశాలకు బదులు మరో భూమ్యాకాశాలు సృష్టించబడేరోజు.” (ఇబ్రాహీమ్, 14:48) – అడుగుతూ, ‘ప్రజలు అప్పుడు ఎక్కడుంటారు,’ అని అడిగాను. దానికి ప్రవక్త (స), ‘సిరా’త్ వంతెనపై ఉంటారు,’ అని అన్నారు. (ముస్లిమ్)
5526 – [ 6 ] ( صحيح ) (3/1531)
وَعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “اَلشَّمْسُ وَالْقَمَرُ مُكَوَّرَانِ يَوْمَ الْقِيَامَةِ”. رَوَاهُ الْبُخَارِيُّ .
5526. (6) [3/1531–దృఢం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”తీర్పుదినం నాడు సూర్యచంద్రులు చుట్టివేయ బడతారు.” (బు’ఖారీ)
—–
اَلْفَصْلُ الثَّانِيْ రెండవ విభాగం
5527 – [ 7 ] ( لم تتم دراسته ) (3/1531)
عَنْ أَبِيْ سَعِيْدِ الْخُدْرِيِّ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “كَيْفَ أَنْعَمُ وَصَاحِبُ الصُّوْرِقَدْ الْتَقَمَهُ وَأَصْغَى سَمْعَهُ وَحَنَى جَبْهَتَهُ يَنْتَظِرُ مَنْ يُّؤْمَرُ بِالنَّفْخِ”. فَقَالُوْا :يَا رَسُوْلَ اللهِ ومَا تَأْمُرُنَا؟ قَالَ: قَولُوْا: (“…حَسْبُنَا اللهُ وَنِعْمَ الْوَكِيْلُ؛ 3: 173)”. رَوَاهُ التِّرْمِذِيُّ.
5527. (7) [3/1531- అపరిశోధితం]
అబూ స’యీద్ ‘ఖుద్రీ (ర) కథనం: ప్రవక్త (స) ”నేను నిశ్చింతగా ప్రశాంతంగా ఎలా ఉండను? బాకా ఊదేవాడు బాకా నోట్లో పెట్టుకొని ఉన్నాడు, చెవులప్పగించి, ‘బాకా ఊదమని ఆదేశం ఎప్పుడు వస్తుందా’ అని తలవంచుకుని వేచి ఉన్నాడు” అని అన్నారు. అది విన్న ప్రవక్త (స) అనుచరులు, ‘మరి మాకు తమరి ఆదేశం ఏమిటి?’ అని అడిగారు. దానికి ప్రవక్త (స) ”..హస్‌బునల్లాహు వ ని’అమల్ వకీల్” (ఆల-ఇమ్రాన్, 3:173) – పఠిస్తూ ఉండండి” అని అన్నారు. (తిర్మిజి’)
5528 – [ 8 ] ( لم تتم دراسته ) (3/1532)
وَعَنْ عَبْدِ اللهِ بْنِ عَمْرٍوعَنِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ: “الصُّوْرُ قَرْنٌ يُنْفَخُ فِيْهِ”. رَوَاهُ التِّرْمِذِيُّ وأَبُوْ دَاوُدَ وَالدَّارَمِيُ
5528. (8) [3/1531 –అపరిశోధితం]
‘అబ్దుల్లాహ్ బిన్ ‘ఉమర్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవ చనం, ”బాకా ఒక కొమ్ము వంటిది, అందులో ఊదటం జరుగుతుంది.” (తిర్మిజి’, అబూ దావూద్, దార్మీ)
అంటే దాన్ని ఇస్రాఫీల్ (అ) ఊదుతారు. ఒకసారి అందరినీ చంపటానికి, మరోసారి అందరినీ సజీవ పరచటానికి.
—–
اَلْفَصْلُ الثَّالِثُ మూడవ విభాగం
5529 – [ 9 ] ( صحيح ) (3/1532)
عَنِ ابْنِ عَبَّاسٍ قَالَ فِيْ قَوْلِهِ تَعَالى: (فَإِذَا نُقِرَ فِي النَّاقُوْرِ؛74: 8): الصُّوْرُ قَالَ: و (اَلرَّجِفَةُ؛79: 6): اَلنَّفْخَةُ الْأُوْلَى و (الرَّادِفَةُ؛79: 7): الثَّانِيَةُ. رَوَاهُ الْبُخَارِيُّ فِيْ تَرْجَمَةِ بَابٍ .
5529. (9) [3/1532– దృఢం]
ఇబ్నె అబ్బాస్ (ర) కథనం: అల్లాహ్ ఆదేశం: ”ఫ ఇజా’ నుఖిర ఫిన్నాఖూర్” (అల్-ముద్దస్సి’ర్, 74:8) – అంటే బాకా, అర్రాజిఫతు (అన్-నా’జిఆత్, 79:6) – అంటే మొదటి సారి శంఖం ఊదటం, అర్రాదిఫహ్ (అన్-నా’జిఆత్, 79:7) అంటే రెండ వసారి బాకా ఊదటం. (బు’ఖారీ)
5530 – [ 10 ] ( لم تتم دراسته ) (3/1532)
وعَنْ أَبِيْ سَعِيْدٍ قَالَ: ذَكَرَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم صَاحِبَ الصُّوْرِ وقَالَ: “عَنْ يَمِيْنِهِ جِبْرِيْلُ عَنْ يَسَارِهِ مِيْكَائِيْلُ”.
5530. (10) [3/1532– అపరిశోధితం]
అబూ స’యీద్ (ర) కథనం: ప్రవక్త (స) ‘బాకా ఊదే వారిని గురించి ప్రస్తావిస్తూ, అతని కుడిప్రక్క జిబ్రీల్, ఎడమప్రక్క మీకాయీ’ల్ ఉంటారు’ అని ప్రవచించారు (ర’జీన్)
5531 – [ 11 ] ( لم تتم دراسته ) (3/1532)
وَعَنْ أَبِيْ رَزِيْنِ الْعُقَيْلِيِّ قَالَ: قُلْتُ: يَا رَسُوْلَ اللهِ كَيْفَ يُعِيْدُ اللهُ الْخَلْقَ؟ مَا آيَةُ ذَلِكَ فِيْ خَلْقِهِ؟ قَالَ: “أَمَا مَرَرْتَ بِوَادِيْ قَوْمِكَ جَدْبًا ثُمَّ مَرَرْتَ بِهِ يَهْتَزُّ خُضْرًا؟” قُلْتُ: نَعَمْ. قَالَ: ” فَتِلْكَ آيَةُ اللهِ فِيْ خَلْقِهِ (كَذَلِكَ يُحْيِي اللهُ الْمَوْتَى؛2: 73) رَوَاهُمَا رَزِيْنٌ.
5531. (11) [3/1532– అపరిశోధితం]
అబీ ర’జీన్ ‘అఖైలి (ర) కథనం: నేను ప్రవక్త (స)తో, ‘ఓ ప్రవక్తా! అల్లాహ్ సృష్టితాలను మరల ఎలా సజీవ పరుస్తాడు?’ అని విన్నవించుకున్నాను. దానికి ప్రవక్త (స), ‘నీవెప్పుడైనా కరవు కాలంలో అడవిలోకి వెళ్ళావా?’ ఇంకా ‘నీ వెప్పుడైనా పచ్చని పంట పొలాలను చూసావా?’ అని అడిగారు. నేను, ‘అవునన్నాను.’ అప్పుడు ప్రవక్త (స), ‘సృష్టితాల్లో దీన్ని గురించి సూచనలు ఉన్నాయి: ”అల్లాహ్(త) అదే విధంగా మృతులను సజీవ పరుస్తాడు,” (అల్-బఖరహ్, 2:73) అని అన్నారు. (ర’జీన్)
=====
2 – بَابُ الْحَشْرِ
2. సమీకరణ దినం
اَلْفَصْلُ الْأَوَّلُ మొదటి విభాగం
5532 – [ 1 ] ( متفق عليه ) (3/1533)
عَنْ سَهْلِ بْنِ سَعْدٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “يُحْشَرُ النَّاسُ يَوْمَ الْقِيَامَةِ عَلَى أَرْضٍ بَيْضَاءَ عَفْرَاءَ كَقُرْصَةِ النَّقِيَ لَيْسَ فِيْهَا عَلَمٌ لِأَحَدٍ”. مُتَّفَقٌ عَلَيْهِ.
5532. (1) [3/1533– ఏకీభవితం]
సహల్ బిన్ స’అద్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”తీర్పుదినం నాడు ప్రజలను తెల్లని లేత ఎరుపు మైదాపిండిలాంటి భూమిపై, అందరినీ ఒక చోట చేర్చటం జరుగుతుంది. ఆ భూమిపై ఎటువంటి చిహ్నాలు, నిదర్శనాలు ఉండవు. అంటే అంతా బల్లపరుపుగా ఉంటుంది.” (బు’ఖారీ, ముస్లిమ్)
5533 – [ 2 ] ( متفق عليه ) (3/1533)
وَعَنْ أَبِيْ سَعِيْدِ الْخُدْرِيِّ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “تَكُوْنُ الْأَرْضُ يَوْمَ الْقِيَامَةِ خُبْزَةً وَاحِدَةً يَتَكَفَّؤُهَا الْجَبَّارُ بِيَدِهِ كَمَا يَتَكَفَّأُ أَحَدُكُمْ خُبْزَتْهُ فِي السَّفَرِ نُزُلًا لِأَهْلِ الْجَنَّةِ”. فَأَتَى رَجًلٌ مِّنَ الْيَهُوْدِ. فَقَالَ: بَارَكَ الرَّحْمَنُ عَلَيْكَ يَا أَبَا الْقَاسِمِ أَلَا أُخْبِرُكَ بِنُزُلِ أَهْلِ الْجَنَّةِ يَوْمَ الْقِيَامَةِ؟ قَالَ: “بَلَى”. قَالَ: تَكُوْنُ الْآرَضُ خُبْزَةً وَاحِدَةً كَمَا قَالَ النَّبِيُّ صلى الله عليه وسلم. فَنَظَرَ النَّبِيُّ صلى الله عليه وسلم إِلَيْنَا ثُمَّ ضَحِكَ حَتَّى بَدَتْ نَوَاجِذُهُ ثُمَّ قَالَ: أَلَا أُخْبِرُكَ بِإِدَامِهِمْ؟ بَالَامٌ وَالنُّوَنُ. قَالُوْا: وَمَا هَذَا؟ قَالَ: ثَوْرٌ وَّنُوْنٌ يَأْكُلُ مِنْ زَائِدَةِ كَبِدِهِمَا سَبْعُوْنَ أَلْفًا. مُتَّفَقٌ عَلَيْهِ.
5533. (2) [3/1533 –ఏకీభవితం]
అబూ స’యీద్ ‘ఖుద్రీ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ప్రళయదినం నాడు భూమంతా ఒక రొట్టెలా ఉంటుంది. అల్లాహ్ దాన్ని తన చేతులతో అటూ ఇటూ త్రిప్పుతాడు. మీరు ప్రయాణంలో రొట్టెను అటూ ఇటూ త్రిప్పినట్టు. ఈ రొట్టె స్వర్గవాసులకు ఆతిథ్యంగా ఇవ్వబడుతుంది. ప్రవక్త (స) ఇది చెప్పిన తర్వాత ఒక యూదుడు వచ్చి, ”అబుల్ ఖాసిమ్ అల్లాహ్ మీపై శుభశాంతులు అవతరింపజేయుగాక! నేను మీకు చెప్పేదేమిటంటే, తీర్పుదినం నాడు స్వర్గవాసులకు ఆతిథ్యంలో మొదటి విందు ఏముంటుంది?” అనేది. దానికి ప్రవక్త (స) ”సరే చెప్పు” అన్నారు. అప్పుడా యూదుడు ‘భూమంతా ఒక రొట్టెలా ఉంటుంది,’ అని అన్నాడు. అది విని ప్రవక్త (స) మావైపు చూచి చిరునవ్వు నవ్వారు. చివరికి ఆయన ముందు పళ్ళు కనిపించాయి. ఆ తరువాత ఆ యూదుడు స్వర్గవాసుల కూర ఏముంటుందో నేను చెప్తాను, అది ‘బాలామున్ వన్నూన్’ అని అన్నాడు. అనుచరులు, ‘అదేమిటి,’ అని అన్నారు. అతడు, ‘ఎద్దు, చేపల మాంసపు ముక్కలు, కార్జం భాగాలు 70 వేల మంది తింటారు,’ అని అన్నాడు. (బు’ఖారీ, ముస్లిమ్)
5534 – [ 3 ] ( متفق عليه ) (3/1533)
وَعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “يُحْشَرُ النَّاسُ عَلَى ثَلَاثِ طَرَائِقَ: رَاغِبِيْنَ رَاهِبِيْنَ وَاِثْنَانِ عَلَى بَعِيْرٍ وَثَلَاثَةٌ عَلَى بَعِيْرٍ وَأَرْبَعَةٌ عَلَى بَعِيْرٍ وَعَشَرَةٌ عَلَى بَعِيْرٍ وَتَحْشُرُ بَقِيَّتَهُمُ النَّارُ. تَقِيْلُ مَعَهُمْ حَيْثُ قَالُوْا وَتَبِيْتُ مَعَهُمْ حَيْثُ بَاتُوْ وَتُصْبِحُ مَعَهُمْ حَيْثُ أَصْبَحُوْا وَتُمْسِيْ مَعَهُمْ حَيْثُ يَمْسَوْا”. متفق عليه.
5534. (3) [3/1533 –ఏకీభవితం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రళయ మైదానంలో ప్రజలను మూడు భాగాలుగా విభజించటం జరుగు తుంది. ఒక భాగం తమ సత్కార్యాల వల్ల సంతృప్తిగా ఉంటారు. రెండవ భాగం భయభీతులు గలవారు. వీరిలో ప్రతి ఒక్కరూ తమ స్థానాలను బట్టి ఒంటెలపై ప్రయాణమవుతారు. ఈ రెండు భాగాలకు చెంది ప్రయాణించే వారు ఒంటెలపై ఇద్దరు, ముగ్గురు, నలుగురు, పదిమంది ప్రయాణం అవుతారు. మిగిలిన వారందరినీ అగ్ని ఒకచోట చేర్చుతుంది. అది వారి వెంటే ఉంటుంది. మధ్యాహ్నం, రాత్రీ, పగలు ఎల్ల ప్పుడూ వారివెంటే ఉంటుంది. (బు’ఖారీ, ముస్లిమ్)
5535 – [ 4 ] ( متفق عليه ) (3/1534)
وعَنِ ابْنِ عَبَّاسٍ عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ: “إِنَّكُمْ مَحْشُوْرُوْنَ حُفَاةً عُرَاةً غُرْلًا “ثُمَّ قَرَأَ: (كَمَا بَدَأْنَا أَوَّلَ خَلْقٍ نُعِيْدُهُ وَعْدًا عَلَيْنَا إِنَّا كُنَّا فَاعِلِيْنَ؛21: 104) وَأَوَّلُ مَنْ يُّكْسَى يَوْمَ الْقِيَامَةِ إِبْرَاهِيْمُ وَإِنَّ نَاسًا مِّنْ أَصْحَابِيْ يُؤْخَذُ بِهِمْ ذَاتَ الشِّمَالِ فَأَقُوْلُ: أُصَيْحَابِيْ أُصَيْحَابِيْ فَيَقُوْلُ: إِنَّهُمْ لَنْ يَّزَالُوْا مُرْتَدِّيْنَ عَلَى أَعْقَابِهِمْ مُذْ فَارَقْتَهُمْ. فَأَقُوْلُ كَمَا قَالَ الْعَبْدُ الصَّالِحُ: (وَكُنْتُ عَلَيْهِمْ شَهِيْدًا ما دُمْتُ فِيْهِمْ) إِلَى قَوْلِهِ (اَلْعَزِيْزُ الْحَكِيْمُ ؛ 5: 117-118)
5535. (4) [3/1534– ఏకీభవితం]
ఇబ్నె ‘అబ్బాస్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”తీర్పుదినం నాడు మీరు, నగ్నంగా, సున్నత్ చేయబడని స్థితిలో మైదానంలో చేరటం జరుగుతుంది, ఆ తరువాత ప్రవక్త (స) ”కమా బదఅ’నా అవ్వల ‘ఖల్‌ఖిన్ ను’యీదుహూ వ’అదన్ ‘అలైనా ఇన్నా కున్నా ఫా’ఇలీన్,” (అల్- అంబియా’, 21:104), అని పఠించిన తర్వాత తీర్పుదినం నాడు అందరికంటే ముందు ఇబ్రాహీమ్ (అ)కు దుస్తులు ధరించటం జరుగుతుంది. ఇంకా నా అనుచరుల్లోని చాలామందిని ఎడమ ప్రక్క అంటే నరకంవైపు తీసుకొని వెళ్ళటం జరుగుతుంది. అది చూచి నేను, ‘వీరు నా అనుచరులు,’ అని అంటాను. అప్పుడు అల్లాహ్(త) నీవు వారినుండి విడిపోయిన తరువాత ఎప్పుడూ ధర్మానికి దూరంగా ఉండేవారు. అప్పుడు నేను ‘ఈసా (అ) పలికిన వాక్యాన్నే పలుకుతాను, ”వ కున్‌తు ‘అలైహిమ్…నుండి… అల్’అ’జీ’జిల్’హకీమ్.” వరకు.[1] )అల్-మాయి’దహ్, 5:117-118(. (బు’ఖారీ, ముస్లిమ్)
5536 – [ 5 ] ( متفق عليه ) (3/1534)
وَعَنْ عَائِشَةَ قَالَتْ: سَمِعْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ: “يُحْشَرُالنَّاسُ يَوْمَ الْقِيَامَةِ حُفَاةً عُرَاةً غُرْلًا”. قُلْتُ: يَا رَسُوْلَ اللهِ الرِّجَالُ وَالنِّسَاءُ جَمِيْعًا يَنْظُرُ بَعْضُهُمْ إِلَى بَعْضٍ؟ فَقَالَ: “يَا عَائِشَةَ الْأَمْرُ أَشَدُّ مِنْ أَنْ يَّنْظُرَ بَعْضُهُمْ إِلى بَعْضٍ”.
5536. (5) [3/1534–ఏకీభవితం]
‘ఆయి’షహ్ (ర) కథనం: ప్రవక్త (స) ఇలా ప్రవచిస్తూ ఉండగా నేను విన్నాను, ప్రళయదినం నాడు తీర్పు మైదానంలో ప్రజలు నగ్నంగా, చెప్పులు లేకుండా, సున్నత్ చేయబడని స్థితిలో చేర్చటం జరుగుతుంది. అది విని నేను, ‘ఓ ప్రవక్తా! స్త్రీలు పురుషులు అందరూ ఒకర్ని ఇంకొకరు చూస్తారా?’ అని విన్నవించు కున్నాను. దానికి ప్రవక్త (స), ‘ఓ ‘ఆయి’షహ్! ఆ రోజు వ్యవహారం చాలా భయంకరంగా ఉంటుంది. ఒకర్ని ఒకరు చూసుకోవటాన్ని అటు ఉంచు,’ అని అన్నారు.[2] (బు’ఖారీ, ముస్లిమ్)
5537 – [ 6 ] ( متفق عليه ) (3/1534)
وَعَنْ أَنَسٍ أَنَّ رَجُلًا قَالَ: يَا نَبِيَّ اللهِ كَيْفَ يُحْشَرُ الْكَافِرُ عَلَى وَجْهِهِ يَوْمَ الْقِيَامَةِ؟ قَالَ: “أَلَيْسَ الَّذِيْ أَمْشَاهُ عَلَى الرِّجْلَيْنِ فِي الدُّنْيَا قَادِرًا عَلَى أَنْ يُّمْشِيَهُ عَلَى وَجْهِهِ يَوْمَ الْقِيَامَةِ؟”
5537. (6) [3/1534 –ఏకీభవితం]
అనస్ (ర) కథనం: ఒక వ్యక్తి, ”ఓ ప్రవక్తా! తీర్పు దినం నాడు అవిశ్వాసులు తలక్రిందులుగా నడిచి తీర్పు మైదానంలోకి ఎలా వస్తారు,” అని ప్రశ్నించాడు. దానికి ప్రవక్త (స), ”ప్రపంచంలో అతన్ని కాళ్ళపై నడి పించిన ఆ దైవమే అతన్ని తీర్పుదినం నాడు తల క్రిందులుగా నడిపిస్తాడు” అన్నారు. (బు’ఖారీ, ముస్లిమ్)
5538 – [ 7 ] ( صحيح ) (3/1535)
وَعَنْ أَبِيْ هُرَيْرَةَ عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ: “يَلْقَى إِبْرَاهِيْمُ أَبَاهُ آزَرَ يَوْمَ الْقِيَامَةِ وَعَلَى وَجْهِ آزَرَ قَتَرَةٌ وَغَبَرَةٌ يَقُوْلُ لَهُ إِبْرَاهِيْمُ: أَلَمْ أَقُلْ لَكَ: لَا تَعْصِنِيْ؟ فَيَقُوْلُ لَهُ أَبُوْهُ: فَالْيَوْمَ لَا أَعْصِيْكَ. فَيَقُوْلُ إِبْرَاهِيْمُ: يَا رَبِّ إِنَّكَ وَعَدْتَنِيْ أَلَا تُخْزِيَنِيْ يَوْمَ يُبْعَثُوْنَ فَأَيّ خِزْيٍ أَخْزَى مِنْ أَبِيْ الْأَبْعَدِ. فَيَقُوْلُ اللهُ تَعَالى: إِنِّيْ حَرَّمْتُ الْجَنَّةُ عَلَى الْكَافِرِيْنَ. ثُمَّ يُقَالُ لِإِبْرَاهِيْمِ: مَا تَحْتَ رِجْلَيْكَ؟ فَيَنْظُرُ فَإِذَا هُوَ بِذِيْخٍ مُتَلَطَّخٍ فَيُؤْخَذُ بِقَوَائِمِهِ فَيُلْقَى فِي النَّارِ”. رَوَاهُ الْبُخَارِيُّ.
5538. (7) [3/1535– దృఢం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”తీర్పుదినం నాడు ఇబ్రాహీమ్ (అ) తన తండ్రి ఆ’జర్‌ను ఎటువంటి స్థితిలో కలుస్తారంటే ఆ’జర్ ముఖం నల్లగా, ధూళితో నిండి ఉంటుంది. ఇబ్రాహీమ్ (అ) అతనితో ‘నాకు అవిధేయత చూపరాదని నేను మీకు చెప్పలేదా?’ అని అడుగుతారు. దానికి ఆ’జర్, ‘ఈ రోజు నేను నీకు అవిధేయత చూపను,’ అని అంటాడు. అప్పుడు ఇబ్రాహీమ్ (అ), ‘అల్లాహ్(త)ను తీర్పుదినం నాడు నువ్వు నన్ను అవమానానికి గురిచేయవని వాగ్దానం చేసావు. ప్రజలను మరల సజీవపరిస్తే, అప్పుడు నా తండ్రి దైవకారుణ్యానికి దూరం కావటం కంటే అవమానం ఏముంది,’ అని వేడు కుంటారు. అప్పుడు అల్లాహ్(త), ‘ఓ ఇబ్రాహీమ్! నేను స్వర్గాన్ని అవిశ్వాసులపై నిషేధించాను. అది సరే, నీ కాళ్ళ క్రింద ఉన్నదాన్ని చూడు,’ అని అంటాడు. ఇబ్రాహీమ్ చూస్తారు, అతని తండ్రి పురుగు రూపంలో మలంలో కొట్టుమిట్టాడుతూ ఉంటాడు. చివరికి అతన్ని పట్టుకొని నరకంలో వేయటం జరుగుతుంది.” (బు’ఖారీ)
5539 – [ 8 ] ( متفق عليه ) (3/1535)
وَعَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “يَعْرَقُ النَّاسُ يَوْمَ الْقِيَامَةِ حَتّى يَذْهَبَ عَرَقُهُمْ فِيْ الْأَرْضِ سَبْعِيْنَ ذِرَاعًا وَيُلْجِمُهُمْ حَتّى يَبْلُغَ آذَانَهُمْ”. مُتَّفَقٌ عَلَيْهِ.
5539. (8) [3/1535 –ఏకీభవితం]
అబూ హురైరహ్ (ర) కథనం: తీర్పుదినం నాడు ప్రజలకు చెమట వస్తుంది. ఆ చెమట ఎలా ప్రవహిస్తుందంటే అది 70 గజాల లోతు వెళుతుంది. వారికోసం కళ్ళెంగా మారిపోతుంది. చివరికి వారి చెవుల వరకు, వారిని ముంచి వేస్తుంది.[3] (బు’ఖారీ, ముస్లిమ్)
5540 – [ 9 ] ( صحيح ) (3/1535)
وَعَنِ الْمِقْدَادِ قَالَ: سَمِعْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ: ” تُدْنَى الشَّمْسُ يَوْمَ الْقِيَامَةِ مِنَ الْخَلْقِ حَتّى تَكُوْنَ مِنْهُمْ كَمِقْدَارِمِيْلٍ فَيَكُوْنُ النَّاسُ عَلَى قَدْرِأَعْمَالِهِمْ فِي الْعَرَقِ فَمِنْهُمْ مَنْ يَكُوْنُ إِلى كَعْبَيْهِ وَمِنْهُمْ مَنْ يَكُوْنُ إِلى رُكْبَتَيْهِ وَمِنْهُمْ مَنْ يَكُوْنُ إِلى حِقْوَيْهِ وَمِنْهُمْ مَنْ يُلْجِمُهُمْ الْعَرَقُ إِلْجَامًا”. وَأَشَارَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم بِيَدِهِ إِلى فِيْهِ. رَوَاهُ مُسْلِمٌ.
5540. (9) [3/1535– దృఢం]
మిఖ్‌దాద్ (ర) కథనం: ప్రవక్త (స) ఇలా ప్రవచిస్తూ ఉండగా నేను విన్నాను. తీర్పుదినం నాడు ప్రళయ మైదానంలో సూర్యుణ్ణి సృష్టిరాసులకు సమీపంగా చేయటం జరుగుతుంది. చివరికి వారికి ఒక మైలు దూరం ఉంటుంది. మానవులందరూ తమ కర్మల ప్రకారం చెమటలో మునిగి ఉంటారు. కొందరు చెమ టలో చీలమండల వరకు మునిగి ఉంటారు. మరి కొందరు ముడుకుల వరకు మునిగి ఉంటారు. మరి కొందరు నడుము వరకు మునిగి ఉంటారు. కొంద రికి వారి చెమట కళ్ళెంగా ఉంటుంది. ఇలా చెబుతూ ప్రవక్త (స) తన చేత్తో ముఖం వైపు సైగచేసారు. [4] (ముస్లిమ్)
5541 – [ 10 ] ( متفق عليه ) (3/1535)
وَعَنْ أَبِيْ سَعِيْدِ الْخُدْرِيِّ عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ: “يَقُوْلُ اللهُ تَعَالى: يَا آدَمُ فَيَقُوْلُ: لَبَّيْكَ وَسَعْدَيْكَ وَالْخَيْرُ كُلُّهُ فِيْ يَدَيْكَ. قَالَ: أَخْرِجْ بَعْثَ النَّارِ. قَالَ: وَمَا بَعْثُ النَّارِ؟ قَالَ: مِنْ كُلِّ أَلْفٍ تِسْعُمِائَةٍ وَتِسْعَةً وَّتِسْعِيْنَ. فَعِنْدَهُ يَشِيْبُ الصَّغِيْرُ (وَتَضَعُ كُلُّ ذَاتِ حَمْلٍ حَمْلَهَا؛ وَتَرَى النَّاسَ سُكَارَى وَمَا هُمْ بِسُكَارَى وَلَكِنَّ عَذَابَ اللهِ شَدِيْدٌ؛22: 2) قَالَوا: يَا رَسُوْلَ اللهِ وَأَيُّنَا ذَلِكَ الْوَاحِدُ؟ قَالَ: ” أَبْشِرُوْا فَإِنَّ مِنْكُمْ رَجُلًا وَمِنْ يَأْجُوْجَ وَمَأْجُوْجَ أَلْفٌ”. ثُمَّ قَالَ: “وَالَّذِيْ نَفْسِيْ بِيَدِهِ أَرْجُوْ أَنْ تَكُوْنُوْا رُبْعَ أَهْلِ الْجَنَّةِ”. فَكَبَّرْنَا. فَقَالَ: “أَرْجُوْ أَنْ تَكُوْنُوْا ثُلُث أَهْلِ الْجَنَّةِ”. فَكَبَّرْنَا فَقَالَ: “أَرْجُوْ أَنْ تَكُوْنُوْا نِصْفَ أَهْلِ الْجَنَّةِ” فَكَبَّرْنَا. قَالَ: “مَا أَنْتُمْ فِي النَّاسِ إِلَّا كَالشَّعْرَةِ السَّوْدَاءِ فِيْ جِلْدِ ثَوْرٍ أَبْيَضَ أَوْ كَشَعْرَةٍ بَيْضَاءَ فِيْ جِلْدٍ ثَوْرٍ أَسْوَدٍ”. مُتَّفَقٌ عَلَيْهِ.
5541. (10) [3/1535 –ఏకీభవితం]
అబూ స’యీద్ ‘ఖుద్రీ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”తీర్పుదినం నాడు అల్లాహ్ (త), ‘ఓ ఆదమ్’ అని అంటాడు. అప్పుడు ఆదమ్ (అ), ‘ప్రభూ! నీసన్నిధిలో సిద్ధంగా ఉన్నాను, ఇంకా మేలంతా నీ చేతుల్లోనే ఉంది,’ అని అంటారు. అప్పుడు అల్లాహ్ (త), ‘అగ్నికి గురయ్యే సైన్యాన్ని వేరుచేయి, అంటే నరకవాసులను వేరుచేయి,’ అని అంటాడు. అప్పుడు ఆదమ్ (అ), ‘నరకాగ్ని సైన్యం ఎంత మంది?’ అని అడుగు తారు. అప్పుడు అల్లాహ్ ‘ప్రతి వెయ్యిలో 999’ అని అంటాడు. ఈ ఆదేశం విని పిల్లలు ముసలివారై పోతారు.
”గర్భవతి అయిన ప్రతి స్త్రీ, తన గర్భాన్ని కోల్పోవటాన్ని నీవు చూస్తావు. మరియు మానవు లందరినీ మత్తులో ఉన్నట్లు నీవు చూస్తావు, కానీ (వాస్తవానికి) వారు త్రాగి (మత్తులో) ఉండరు. కాని అల్లాహ్ శిక్షయే అంత తీవ్రంగా ఉంటుంది.” (అల్-‘హజ్జ్, 22:2), అని అన్నారు.
అనుచరులు, ‘ఓ ప్రవక్తా! స్వర్గంలోనికి వెళ్ళే ఆ 1000 లో ఒక్కరు మాలో ఎవరు,’ అని అడిగారు. దానికి ప్రవక్త (స) ఒక వ్యక్తి మీలో నుండి ఉంటాడు. ఇంకా 999 యా’జూజ్ మా’జూజ్‌లలో నుండి ఉంటారు. ఇంకా ఎవరిచేతిలో నా ప్రాణం ఉందో ఆయన సాక్షి! స్వర్గంలో మీరు నాల్గవ వంతు ఉంటారని నేను ఆశిస్తు న్నాను,’ అని అన్నారు. అది విని మేము, ‘అల్లాహు అక్బర్’ అని అన్నాము. ఆ తరువాత ప్రవక్త (స) మళ్ళీ, ‘స్వర్గ వాసుల్లో మీరు సగం మంది ఉండాలని నేను ఆశిస్తున్నాను,’ అని అన్నారు. మళ్ళీ మేము, ‘అల్లాహు అక్బర్’ అని అన్నాము. ఆ తరువాత మళ్ళీ, ‘వారిలో మీ సంఖ్య తెల్లని ఆవుపై ఒక నల్లని వెంట్రుక, లేదా ఒక నల్లని ఆవుపై ఒక తెల్లని వెంట్రు కలా ఉంటుంది,’ అనిఅన్నారు.[5] (బు’ఖారీ, ముస్లిమ్)
5542 – [ 11 ] ( متفق عليه ) (3/1536)
وَعَنْهُ قَالَ: سَمِعْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ: “يَكْشِفُ رَبُّنَا عَنْ سَاقِهِ فَيَسْجُدُ لَهُ كُلُّ مُؤْمِنٍ وَمُؤْمِنَةٍ وَيَبْقَى مَنْ كَانَ يَسْجُدُ فِي الدُّنْيَا رِيَاءً وَسُمْعَةً فَيَذْهَبُ لِيَسْجُدَ فَيَعُوْدُ ظَهْرُهُ طَبَقًا وَاحِدًا”. مُتَّفَقٌ عَلَيْهِ.
5542. (11) [3/1536 –ఏకీభవితం]
అబూ స’యీద్ ‘ఖుద్రీ (ర) కథనం: ప్రవక్త (స) ఇలా ప్రవచిస్తూ ఉండగా నేను విన్నాను, ”తీర్పుదినం నాడు మన ప్రభువు తన చీలమండ విప్పుతాడు. వెంటనే విశ్వాస స్త్రీ పురుషులందరూ సజ్దాలో పడిపోతారు. కాని ప్రపంచంలో ప్రదర్శనా బుద్ధితో సజ్దా చేసినవారు మాత్రం అప్పుడు సజ్దా చేయలేరు. అతడు ప్రయత్నిస్తాడు కాని అతని నడుం వంగదు.” [6] (బు’ఖారీ, ముస్లిమ్)
5543 – [ 12 ] ( متفق عليه ) (3/1536)
وَعَنْ أَبِيْ هُرَيْرَةَ قَال: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَيَأْتِي الرَّجُلُ الْعَظِيْمُ السَّمِيْنُ يَوْمَ الْقِيَامَةِ لَا يَزِنُ عِنْدَ اللهِ جَنَاحَ بَعُوْضَةٍ”. وَقَالَ: “اِقْرَؤُوْا (فَلَا نُقِيْمُ لَهُمْ يَوْمَ الْقِيَامَةِ وَزْنًا؛ 18:105).
5543. (12) [3/1536 –ఏకీభవితం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”తీర్పుదినం నాడు ప్రళయ మైదానంలో బలిష్ఠ మైన ఒక వ్యక్తి వస్తాడు. అల్లాహ్ (త) వద్ద అతని విలువ దోమ రెక్కంత కూడా ఉండదు. ఆ తరువాత దీని ధృవీకరణలో ”తీర్పుదినం నాడు మేము వారికి, ఎటువంటి విలువ ప్రసాదించము” (అల్-కహఫ్, 18:105) అనే ఆయతును పఠించారు. [7] (బు’ఖారీ, ముస్లిమ్)
—–
اَلْفَصْلُ الثَّانِيْ రెండవ విభాగం
5544 – [ 13 ] ( لم تتم دراسته ) (3/1537)
عَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: قَرَأَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم هَذِهِ الْآيَةَ: (يَوْمَئِذٍ تُحَدِّثُ أَخْبَارَهَا؛ 99: 4) قَالَ: أَتَدْرُوْنَ مَا أَخْبَارُهَا؟” قَالُوْا :اللهُ وَ رَسُوْلُهُ أَعْلَمُ. قَالَ: “فَإِنَّ أَخْبَارَهَا: أَنْ تَشْهَدَ عَلَى كُلِّ عَبْدٍ وَّأَمَةٍ بِمَا عَمِلَ عَلَى ظَهْرِهَا أَنْ تَقُوْلَ: عَمِلَ عَلَيَّ كَذَا وَكَذَا يَوْمَ كَذَا وَكَذَا”. قَالَ: “فَهَذِهِ أَخْبَارُهَا”. رَوَاهُ أَحْمَدُ وَالتِّرْمِذِيُّ وَقَالَ: هَذَا حَدِيْثٌ حَسَنٌ صَحِيْحٌ غَرِيْبٌ
5544. (13) [3/1537 –అపరిశోధితం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) ”ఆ రోజు అది (భూమి) తన సమాచారాలను వివరిస్తుంది,” (అ’జ్ ‘జల్ ‘జలహ్, 99:4) అనే ఆయతును పఠించి, ‘భూమి వార్తలేమిటో మీకు తెలుసా?’ అని అడిగారు. దానికి అనుచరులు, ‘అల్లాహ్ (త) మరియు ఆయన ప్రవక్తకే బాగా తెలుసు,’ అని అన్నారు. అప్పుడు ప్రవక్త (స), ‘ఆ వార్తలేమిటంటే, భూమి స్త్రీ పురుషు లలో ప్రతి ఒక్కరి కర్మల గురించి సాక్ష్యం ఇస్తుంది. ‘ఈ వ్యక్తి ఫలానా పనిచేసాడు, ఈ స్త్రీ ఫలానా పని చేసింది. ఇవే భూమి వార్తలవుతాయి. (అ’హ్మద్, తిర్మిజి’ – ప్రామాణికం, దృఢం, ఏకోల్లేఖనం)
5545 – [ 14 ] ( لم تتم دراسته ) (3/1537)
وَعَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَا مِنْ أَحَدٍ يَمُوْتُ إِلّا نَدِمَ”. قَالُوْا: وَمَا نَدَامَتُهُ يَا رَسُوْلَ اللهِ؟ قَالَ: “إِنْ كَانَ مُحْسِنًا نَدِمَ أَنْ لَا يَكُوْنَ ازْدَادَ وَإِنْ كَانَ مُسِيْئًا نَدِمَ أَنْ لَا يَكُوْنَ نَزَعَ”. رَوَاهُ التِّرْمِذِيُّ.
5545. (14) [3/1537 –అపరిశోధితం]
అబూ హురైరహ్ (ర) కథనం: ‘ప్రవక్త (స) మర ణించిన వారిలో, విచారించనివారు ఎవరూ ఉండరు,’ అని ప్రవచించారు. దానికి అనుచరులు, ‘ఓ ప్రవక్తా! విచారించటానికి కారణమేమిటి?’ అని విన్నవించు కున్నారు. దానికి ప్రవక్త (స), ” ‘ఒకవేళ పుణ్యాత్ము డయి ఉంటే, ఇంకా అధికంగా సత్కార్యాలు చేసి ఉంటే బాగుణ్ణు,’ అని విచారిస్తాడు. ‘ఒకవేళ పాపాత్ము డయితే, పాపాలకు పాల్పడ కుండా ఉంటే బాగుణ్ణు’ అని విచారిస్తారు” అని ప్రవచించారు. (తిర్మిజి)
5546 – [ 15 ] ( لم تتم دراسته ) (3/1537)
وعَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “يُحْشَرُ النَّاسُ يَوْمَ الْقِيَامَةِ ثَلَاثَةَ أَصْنَافٍ: صِنْفًا مُشَاةً وَصِنْفًا رُكْبَانًا وَصِنْفًا عَلَى وُجُوْهِهِمْ”. قِيْلَ: يَا رَسُوْلَ اللهِ وَكَيْفَ يُمْشُوْنَ عَلَى وُجُوْهِهِمْ؟ قَالَ: “إِنَّ الَّذِيْ أَمْشَاهُمْ عَلَى أَقْدَامِهِمْ قَادِرٌ عَلَى أَنْ يُمْشِيَهُمْ عَلَى وُجُوْهِهِمْ أَمَآ إِنَّهُمْ يَتَّقُوْنَ بِوُجُوْهِهِمْ كُلَّ حَدَبٍ وَشَوْكٍ”. رَوَاهُ التِّرْمِذِيُّ.
5546. (15) [3/1537 –అపరిశోధితం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) ”తీర్పుదినం నాడు ప్రజలు మూడు భాగాలుగా విభజింపబడతారు. ఒక భాగం వారు నడచి వస్తారు, మరో భాగం వాహనాలపై వస్తారు. మూడోభాగం తలక్రిందులుగా నడచి వస్తారు,” అని ప్రవచించారు. దానికి అనుచరులు, ‘తలక్రిందులుగా ప్రజలు ఎలా నడుస్తారు,’ అని విన్నవించుకున్నారు. అప్పుడు ప్రవక్త (స), ‘వారిని కాళ్ళపై నడిపించినవాడే తల క్రిందులుగా నడిపిస్తాడు. మీరు గుర్తుంచుకోండి, వాళ్ళు తల క్రిందులుగా నడుస్తూ ఎత్తు, పల్లాలు, ముళ్ళ నుండి తమ్ముతాము రక్షించుకుంటారు,’ అని సమాధానం ఇచ్చారు. [8] (తిర్మిజి’)
5547 – [ 16 ] ( حسن ) (3/1537)
وعَنْ ابْنِ عُمَرَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَنْ سَرَّهُ أَنْ يَّنْظُرَ إِلى يَوْمِ الْقِيَامَةِ كَأَنَّهُ رَأْيُ عَيْنٍ فَلْيَقْرَأُ: (إِذَا الشَّمْسُ كُوِّرَتْ؛81) وَ (إِذَا السَّمَاءُ انْفَطَرَتْ؛82) وَ (إِذَا السَّمَاءُ انْشَقَّتْ؛84) رَوَاهُ أَحْمَدُ وَ التِّرْمذِيُّ .
5547. (16) [3/1537 –ప్రామాణికం]
ఇబ్నె ‘ఉమర్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ప్రపం చంలోనే ప్రళయాన్ని తన కళ్ళతో చూడాలను కున్న వారు ”ఇజష్షమ్‌సు కువ్విరత్ (81), ఇజస్సమా ఉన్ ఫతరత్ (82), ఇజస్సమాఉన్ షఖ్ఖత్ (84) సూరాలు పఠించాలి.” [9] (అ’హ్మద్, తిర్మిజి’)
—–
الْفَصْلُ الثَّالِثُ మూడవ విభాగం
5548 – [ 17 ] ( لم تتم دراسته ) (3/1538)
عَنْ أَبِيْ ذَرٍّ قَالَ: إِنَّ الصَّادِقَ الْمَصْدُوْقَ صَلى الله عليه وسلم حَدَّثَنِيْ: “إِنَّ النَّاسَ يُحْشَرُوْنَ ثَلَاثَةَ أَفْوَاجٍ: فَوْجًا رَاكِبِيْنَ طَاعِمِيْنَ كَاسِيْنَ وَفَوْجًا تَسْحَبُهُمُ الْمَلَائِكَةُ عَلَى وُجُوْهِهِمْ وَتَحْشُرُهُمُ النَّارُ وَفَوْجًا يَمْشُوْنَ وَيَسْعَوْنَ وَيُلْقِي اللهُ الْآفَةَ عَلَى الظَّهْرِ فَلَا يَبْقَى حَتّى إِنَّ الرَّجُلَ لَتَكُوْنَ لَهُ الْحَدِيْقَةُ يُعْطِيْهَا بِذَاتِ الْقَتَبِ لَا يَقْدِرُ عَلَيْهَا”. رَوَاهُ النَّسَائِيُّ .
5548. (17) [3/1538 –అపరిశోధితం]
అబూ జ’ర్ (ర) కథనం: ప్రవక్త (స) నాతో ఇలా అన్నారు, ”మానవులను మూడు వర్గాలుగా చేయటం జరుగుతుంది. ఒక వర్గం వాహనాలపై ఉంటారు. ఆహారం దుస్తులతో కూడి ఉంటారు. మరో వర్గాన్ని దైవదూతలు తలక్రిందులుగా నరకం వైపునకు తోలుకుపోతారు. మరోవర్గం నడుస్తూ ఉంటారు. వాహనాలు గలవారిపై అల్లాహ్(త) శిక్షను అవతరింప జేస్తాడు. దానివల్ల వారి వాహనాలు మిగలవు. తోటలున్నవారు వాటిని ఇచ్చి, వాహనాలు పొందాలని ప్రయత్నిస్తారు. కాని అది వారికి సాధ్యం కాదు.” (నసాయి’)
=====
3 – بَابُ الْحِسَابِ وَالْقِصَاصِ وَالْمِيْزَانِ
3. విచారణ, ప్రతిఫలం, కర్మల త్రాసు
اَلْفَصْلُ الْأَوَّلُ మొదటి విభాగం
5549 – [ 1 ] ( متفق عليه ) (3/1539)
عَنْ عَائِشَةَ أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم قَالَ: “لَيْسَ أَحَدٌ يُحَاسَبُ يَوْمَ الْقِيَامَةِ إِلَّا هَلَكَ”. قُلْتُ: أَوْ لَيْسَ يَقُوْلُ اللهُ: (فَسَوْفَ يُحَاسَبُ حِسَابًا يَّسِيْرًا؛84: 8) فَقَالَ: “إِنَّمَا ذَلِكَ الْعَرَضُ وَلَكِنْ مَنْ نُوْقِشَ فِي الْحِسَابِ يَهْلِكُ”. مُتَّفَقٌ عَلَيْهِ.
5549. (1) [3/1539– ఏకీభవితం]
‘ఆయి’షహ్ (ర) కథనం: ప్రవక్త (స) ‘తీర్పు దినం నాడు విచారించబడినవాడు నాశనం అయినట్టే,’ అని అన్నారు. అప్పుడు నేను, ”మరి అల్లాహ్, అతని లెక్క అతి తేలికగా తీసుకోబడగలదు,’ అని ఆదేశించాడు కదా?” (అల్ ఇన్షిఖాఖ్, 84:8) అని విన్నవించు కున్నాను. దానికి ప్రవక్త (స), ‘విచారణ జరుగుతుంది, కానీ, గుచ్చి గుచ్చి విచారిస్తే మాత్రం వినాశనానికి గురి అయినట్టే,’ అని అన్నారు.[10] (బు’ఖారీ, ముస్లిమ్)
5550 – [ 2 ] ( متفق عليه ) (3/1539)
وَعَنْ عَدِيِّ بْنِ حَاتِمٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَا مِنْكُمْ أَحَدٌ إِلّا سَيُكَلِّمُهُ رَبُّهُ لَيْسَ بَيْنَهُ وَبَيْنَهُ تَرْجُمَانٌ وَلَا حِجَابٌ يَحْجِبُهُ فَيَنْظُرُ أَيْمَنَ مِنْهُ فَلَا يَرَى إِلَّا مَا قَدَّمَ مِنْ عَمَلِهِ وَيَنْظُرُ أَشَأَمَ مِنْهُ فَلَا يَرَى إِلَّا مَا قَدَّمَ وَيَنْظُرُ بَيْنَ يَدَيْهِ فَلَا يَرَى إِلَّا النَّارَ تَلْقَاءَ وَجْهِهِ فَاتَّقُوْا النَّارَ وَلَوْ بِشِقَّ تَمْرَةٍ”. مُتَّفَقٌ عَلَيْهِ.
5550. (2) [3/1539– ఏకీభవితం]
‘అదీ బిన్ ‘హాతిమ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”తీర్పుదినం నాడు అల్లాహ్ (త) ప్రత్యక్షంగా మాట్లాడని వాడెవడూ ఉండడు. దాసుడు తన కుడివైపు చూస్తాడు, అతడికి తాను పంపిన కర్మలు కనబడతాయి. ఎడమవైపు చూస్తాడు, అతడికి తాను పంపిన కర్మలు కనబడతాయి. ముందు చూస్తాడు, అగ్ని కనబడుతుంది. అతనికి చాలా దగ్గరగా ఉంటుంది. మిమ్మల్ని మీరు నరకాగ్ని నుండి రక్షించు కోండి. ఒక్క ఖర్జూరపు ముక్క దానం చేసయినా సరే.” [11] (బు’ఖారీ, ముస్లిమ్)
5551 – [ 3 ] ( متفق عليه ) (3/1539)
وَعَنِ ابْنِ عُمَرَقَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِنَّ اللهَ يُدْنِي الْمُؤْمِنَ فَيَضَعُ عَلَى كَنَفَهُ وَيَسْتُرُهُ فَيَقُوْلُ: أَتَعْرِفُ ذَنْبَ كَذَا؟ أَتَعْرِفُ ذَنْبَ كَذَا؟ فَيَقُوْلُ: نَعَمْ يَا رَبِّ حَتّى قَرَّرَهُ ذُنُوْبِهِ وَرَأَى نَفْسُهُ أَنَّهُ قَدْ هَلَكَ. قَالَ: سَتَرْتُهَا عَلَيْكَ فِي الدُّنْيَا وَأَنَا أَغْفِرُهَا لَكَ الْيَوْمَ فَيُعْطَى كِتَابَ حَسَنَاتِهِ وَأَمَّا الْكُفَّارُوَالْمُنَافِقُوْنَ فَيُنَادَى بِهِمْ عَلَى رُؤُوْسِ الْخَلَائِقِ: (هَؤُلَاءِ الَّذِيْنَ كَذَبُوْاعَلَى رَبِّهِمْ أَلَا لَعْنَةُ اللهِ عَلَى الظَّالِمِيْنَ؛11: 18) متفق عليه.
5551. (3) [3/1539 –ఏకీభవితం]
ఇబ్నె ‘ఉమర్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”తీర్పు దినంనాడు అల్లాహ్(త) విశ్వాసిని తన చెంతకు చేర్చి అతన్ని తన రక్షణ దుప్పటినీ కప్పుతాడు. ఇంకా ఆ విశ్వాసిని, ‘నీకు ఈ పాపం గురించి తెలుసా?’ అని అడుగుతాడు. దానికి విశ్వాసి, ‘ఓ అల్లాహ్ నాకు తెలుసు,’ అని అంటాడు. చివరికి అల్లాహ్(త) పాపా లన్నిటిని గురించి ఒప్పించుకుంటాడు. ఆ విశ్వాసి తన మనసులో, ‘ఈ పాపాలవల్ల చచ్చాను,’ అని అనుకుంటాడు. కాని అల్లాహ్(త), ‘నేను ప్రపంచంలో నీ పాపాలను కప్పి పుచ్చాను. ఇంకా ఈనాడు కూడా నిన్ను క్షమిస్తాను,’ అని పలికి అతనికి అతని కర్మల పత్రం ఇవ్వబడుతుంది. పాపాల పత్రం రద్దుచేయ బడుతుంది. ఇంకా అవిశ్వాసులను కపటాచారులను, అందరి ముందు పిలవటం జరుగుతుంది. బిగ్గరగా, ‘వీళ్ళు తమ ప్రభువును తిరస్కరించారు. తమ ప్రభువుపై అసత్యాలు పలికారు. గుర్తుంచుకోండి దుర్మార్గులపై అల్లాహ్ అభిశాపం పడుతుంది!’ అని పలకడం జరుగుతుంది. (బు’ఖారీ, ముస్లిమ్)
5552 – [ 4 ] ( صحيح ) (3/1540)
وَعَنْ أَبِيْ مُوْسَى قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: إِذَا كَانَ يَوْمَ الْقِيَامَةِ دَفَعَ اللهُ إِلى كُلِّ مُسْلِمٍ يَهُوْدِيًّا أَوْ نَصْرَانِيًا فَيَقُوْلُ: هَذَا فِكَاكُكَ مِنَ النَّارِ”. رَوَاهُ مُسْلِمٌ.
5552. (4) [3/1540–దృఢం]
అబూ మూసా (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ప్రళయం నాడు అల్లాహ్ (త) ప్రతి ముస్లిమ్‌కు ఒక యూదుణ్ణి, క్రైస్తవుణ్ణి ఇచ్చి నీకు నరకాగ్ని నుండి పరిహా రంగా వీళ్ళు ఉన్నారు,” అని అంటాడు.[12] (ముస్లిమ్)
5553 – [ 5 ] ( صحيح ) (3/1540)
وَعَنْ أَبِيْ سَعِيْدٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “يُجَاءُ بِنُوْحٍ يَوْمَ الْقِيَامَةِ فَيُقَالُ لَهُ: هَلْ بَلَّغْتَ؟ فَيَقُوْلُ: نَعَمْ يَا رَبَّ فَتُسْأَلُ أُمَّتُهُ: هَلْ بَلَّغَكُمْ؟ فَيَقُوْلُوْنَ: مَا جَاءَنَا مِنْ نَذِيْرٍ. فَيُقَالُ: مَنْ شُهُوْدِكَ؟ فَيَقُوْلُ: مُحَمَّدٌ وَأُمَّتُهُ”. فَقَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: ” فَيُجَاءُ بِكُمْ فَتَشْهَدُوْنَ عَلَى أَنَّهُ قَدْ بَلَغَ”. ثُمَّ قَرَأَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم (وَكَذِلَكَ جَعَلْنَاكُمْ أُمَّةً وَسَطًا لِتَكُوْنُوْا شُهَدَاءَ عَلَى النَّاسِ وَيَكُوْنَ الرَّسُوْلَ عَلَيْكُمْ شَهِيْدًا؛2: 143) رَوَاهُ الْبُخَارِيُّ.
5553. (5) [3/1540– దృఢం]
అబూ స’యీద్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”తీర్పుదినం నాడు నూ’హ్ (అ)ను రప్పించడం జరుగు తుంది. ఇంకా అతనితో, ‘నీవు నీ అనుచర సమాజానికి అల్లాహ్ (త) సందేశం అందజేసావా?’ అని ప్రశ్నించడం జరుగుతుంది. దానికతడు, ‘ఓనా ప్రభూ! అవును,’ అనిఅంటారు. అతని అనుచర సమాజాన్ని ప్రశ్నించటం జరుగుతుంది. అతని అనుచర సమాజం, ‘ఎవరూ రాలేదు,’ అని అంటుంది. ఆ తరు వాత నూ’హ్‌ను, ‘నీవైపు సాక్షులు ఎవరు న్నారు,’ అని అనడం జరుగుతుంది. నూ’హ్ (అ), ‘ము’హ మ్మద్ (స) మరియు ఆయన అనుచర సమాజం,’ అని అంటారు. అప్పుడు మిమ్మల్ని తీసుకు రావటం జరుగుతుంది. ‘నూ’హ్ (అ) దైవ సందేశం అంద జేసారని మీరు సాక్ష్యం ఇస్తారు,’ అని అన్న తరువాత ఈ ఆయతు పఠించారు: ”వక’జా లిక ... షహీదా.” (అల్-బఖరహ్, 2:143). (బు’ఖారీ)
5554 – [ 6 ] ( صحيح ) (3/1540)
وَعَنْ أَنَسٍ قَالَ: كُنَّا عِنْدَ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم فَضَحِكَ فَقَالَ: هَلْ تَدْرُوْنَ مِمَّا أَضْحَكُ؟” قَالَ: قُلْنَا: اللهُ وَرَسُوْلُهُ أَعْلَمُ. قَالَ: “مِنْ مُخَاطَبَةِ الْعَبْدِ رَبَّه يَقُوْلُ: يَا رَبِّ أَلَمْ تُجِرْنِيْ مِنَ الظُّلْمِ؟” قَالَ: “يَقُوْلُ: بَلَى”. قَالَ: “فَيَقُوْلُ: فَإِنِّيْ لَا أُجِيْزُ عَلَى نَفْسِيْ إِلَّا شَاهِدًا مِّنِيْ”. قَالَ: فَيَقُوْلُ: “كَفَى بِنَفْسِكَ الْيَوْمَ عَلَيْكَ شَهِيدًا وَبِالْكِرَامِ الْكَاتِبِينَ شُهُودًا”. قَالَ: “فَيُخْتَمُ عَلَى فِيْهِ فَيُقَالُ لِأَرْكَانِهِ: انْطِقِيْ”. قَالَ: “فَتَنْطِقُ بِأَعْمَالِهِ ثُمَّ يُخَلّى بَيْنَهُ وَبَيْنَ الْكَلَامِ”. قَالَ: “فيقول: بُعْدًا لَكُنَّ وَسُحْقًا فَعَنْكُنَّ كُنْتُ أُنَاضِلُ”. رَوَاهُ مُسْلِمٌ.
5554. (6) [3/1540 –దృఢం]
అనస్ (ర) కథనం: మేము ప్రవక్త (స) వద్దనే ఉన్నాం. ప్రవక్త (స) చిరునవ్వు నవ్వారు. ఇంకా, ”నేనెందుకు నవ్వుతున్నానో మీకు తెలుసా?” అని అన్నారు. దానికి మేము, ‘అల్లాహ్‌కూ, ఆయన ప్రవక్తకే బాగా తెలుసు,’ అని అన్నాం. అప్పుడు ప్రవక్త (స) ”నేను దైవానికి దాసునికి మధ్య జరిగే సంభాషణ గురించి ఆలోచిస్తూ నవ్వుతున్నాను. తీర్పుదినం నాడు దాసుడు తన ప్రభువుతో, ‘ఓ అల్లాహ్! నువ్వు నన్ను అత్యాచారం నుండి రక్షణ కల్పించలేదని విన్నవించుకుంటాడు.’ దానికి అల్లాహ్ (త), ‘ఎందుకు? నేను నీకు రక్షణ కల్పించాను. దాసుడు నా గురించి నా జాతివారిలో నుండి సాక్ష్యం కావాలి,’ అని అంటాడు. దానికి అల్లాహ్(త) ‘ఈవేళ నీ కోసం నువ్వే సాక్ష్యంగా ఉన్నావు. అంటే నీ శరీర భాగాలే సాక్ష్యం ఇస్తాయి. నీ కర్మలు వ్రాసే దైవదూతలు సాక్ష్యం ఇస్తారు,’ అని అంటాడు. అల్లాహ్ ఆదేశానుసారం దాసుని నోరు మూసి వేయబడుతుంది. అతని శరీర భాగాలతో, ‘చెప్పండి’ అని ఆదేశించడం జరుగు తుంది. అప్పుడు అతని శరీరభాగాలు అతని కర్మల గురించి సాక్ష్యం ఇస్తాయి. ఆ తరువాత అతని నోటిని తెరవటం జరుగుతుంది. దాసుడు మళ్ళీ అలాగే వాదిస్తూ, తన శరీరభాగాలతో, ‘నీచులారా! మీ గురించే నేను దైవంతో వాదిస్తున్నాను, మీకు శిక్ష నుండి రక్షించాలని,’ అని అంటాడు. (ముస్లిమ్)
5555 – [ 7 ] ( صحيح ) (3/1540)
وَعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: قَالُوْا: يَا رَسُوْلَ اللهِ هَلْ نَرَى رَبَّنَا يَوْمَ الْقِيَامَةِ؟ قَالَ: “فَهَلْ تُضَارُّوْنَ فِيْ رُؤْيَةِ الشَّمْسِ فِي الظَّهِيْرَةِ لَيْسَتْ فِي سَحَابَةٍ؟” قَالُوْا: لَا قَالَ: “فَهَلْ تُضَارُّوْنَ فِيْ رُؤْيَةِ الْقَمَرِ لَيْلَةِ الْبَدْرِ لَيْسَ فِيْ سَحَابَةٍ؟” قَالُوْا: لَا. قَالَ: “فَوَالَّذِيْ نَفْسِيْ بِيَدِهِ لَا تُضَارُّوْنَ فِيْ رُؤْيَةِ رَبِّكُمْ إِلَّا كَمَا تُضَارُّوْنَ فِي رُؤْيَةِ أَحَدِهِمَا”. قَالَ: ” فَيَلْقَى الْعَبْدَ فَيَقُوْلُ: أَيْ فُلَ: أَلَمْ أُكْرِمْكَ وَأُسَوِّدْكَ وَأُزَوِّجْكَ وَأُسْخِرْ لَكَ الْخَيْلَ وَالْإِبْلَ وَأَذَرْكَ تَرْأَسُ وَتَرْبَعُ؟ فَيَقُوْلُ بَلَى. قَالَ: “أَفَظَنَنْتَ أَنَّكَ مُلَاقِيَّ؟ فَيَقُوْلُ لَا فَيَقُوْلُ: فَإِنِّيْ قَدْ أَنْسَاكَ كَمَا نَسِيْتَنِيْ ثُمَّ يَلْقَى الثَّانِيْ فَذَكَرَ مِثْلَهُ ثُمَّ يَلْقَى الثَّالِثَ. فَيَقُوْلُ لَهُ مِثْلَ ذَلِكَ. فَيَقُوْلُ يَارَبِّ آمَنْتُ بِكَ وَبِكِتَابِكَ وَبِرُسُلِكَ وَصَلَّيْتُ وَصُمْتُ وَتَصَدَّقْتُ وَيُثْنِي بِخَيْرٍمَااسْتَطَاعَ فَيَقُوْلُ: هَهُنَا إِذَا. ثُمَّ يُقَالُ الآنَ تَبْعَثُ شَاهِدًا عَلَيْكَ وَيَتَفَكَّرُ فِي نَفْسِهِ: مَنْ ذَا الَّذِيْ يَشْهَدُ عَلَيَّ؟ فَيُخْتَمُ عَلَى فِيْهِ. وَيُقَالُ لِفَخِذِهِ: اِنْطِقِيْ فَتَنْطِقُ فَخِذُهُ وَلَحمهُ وَعِظَامُهُ بِعَمَلِهِ وَذَلِكَ لِيُعْذِرَمَنْ نَفْسِهِ وَذَلِكَ الْمُنَافِقُ وَ ذَلِكَ سَخِطَ اللهُ عَلَيْهِ”. رَوَاهُ مُسْلِمٌ وَذُكِرَ حَدِيْثُ أَبِيْ هُرَيْرَةَ: “يَدْخُلُ مِنْ أُمَّتِيْ الْجَنَّةَ”. فِيْ “بَابِ التَّوَكُّلِ” بِرِوَايَةِ ابْنِ عَبَّاسٍ.
5555. (7) [3/1540– దృఢం]
అబూ హురైరహ్ (ర) కథనం: ఒక రోజు అనుచరులు, ”ఓ ప్రవక్తా! తీర్పుదినం నాడు మేము అల్లాహ్ (త) ను చూడగలమా?’ అని విన్నవించు కున్నారు. దానికి ప్రవక్త (స), ‘మధ్యాహ్నం పూట మేఘాలు లేనప్పుడు మీరు సూర్యుణ్ణి చూడగలరా?’ అని అడిగారు. అనుచరులు, ‘అవును,’ అని అన్నారు. ఇంకా, ‘మీరు వెన్నెల రాత్రి చంద్రుణ్ణి చూడగలరా?’ అని అడిగారు. అనుచరులు, ‘అవును’ అని అన్నారు. అప్పుడు ప్రవక్త (స), ‘ఎవరి చేతిలో నా ప్రాణం ఉందో ఆయన సాక్షి! ఏ విధంగా మీకు సూర్యుణ్ణి, చంద్రుణ్ణి చూడటంలో అనుమానం లేదో అదేవిధంగా మీరు మీ ప్రభువును చూడటం లోనూ అనుమానానికి గురికారు.’ ఆ తరువాత ప్రవక్త (స) ఇలా ప్రవచించారు: ”దాసులు తమ ప్రభువును చూచినప్పుడు, మీ ప్రభువు మిమ్మల్ని ఉద్దేశించి ప్రసంగిస్తాడు. ఒక దాసుణ్ణి, ‘ఓ దాసుడా! సృష్టితా లన్నిటిపై నీకు ప్రత్యేకత ప్రసాదించ లేదా? నేను నీకు భార్యను ప్రసాదించ లేదా? ఇంకా నీ కోసం గుర్రాలు, ఒంటెలు నీ అధీనం చేయలేదా? ఇంకా నీకు నీ జాతిపై పెత్తనం ప్రసాదించలేదా?’ అని అంటాడు. అప్పుడు దాసుడు, ‘ఓ అల్లాహ్ (త)! నువ్వు ఇలాగే చేసావు,’ అని అంటాడు. అప్పుడు అల్లాహ్ (త), ‘ఒక రోజు నువ్వు నన్నుకలుసుకుంటావని నీకు గుర్తుఉండేదా?’ అని అడుగుతాడు. దాసుడు, ‘ఈ ఆలోచన నా కెప్పుడూ రాలేదు,’ అని అంటాడు. అప్పుడు అల్లాహ్ (త), ‘నీవు అక్కడ మరచి పోయినట్టు, ఈనాడు నేను నిన్ను మరచిపోతాను.’ అంటే (నాకారుణ్యానికి నిన్ను దూరం చేస్తాను) ఆ తరువాత అల్లాహ్ (త) మరో దాసునితో మాట్లాడి ఈ విధంగానే ప్రశ్నిస్తాడు. దాసుడు అలాగే సమాధానం ఇస్తాడు. మూడవ దాసునితో మాట్లాడుతాడు అల్లాహ్. అతన్ని కూడా ఇలాగే ప్రశ్నిస్తాడు. అతడు సమాధానం ఇస్తూ, ఓ అల్లాహ్(త)! నేను నిన్ను, నీ గ్రంథాన్ని, నీ ప్రవక్తను విశ్వసించాను. నేను నమా’జ్ చదివాను. దాన ధర్మాలు చేసాను. అల్లాహ్ (త) అది విని, ‘నువ్వు ఇక్కడే ఉండు, నేను సాక్ష్యం తీసుకుంటాను. నీ సాక్ష్యాన్ని పిలుస్తాను,’ అని అంటాడు. దాసుడు అది విని తన మనసులో నాకు వ్యతిరేకంగా సాక్ష్యం ఎవరిస్తారబ్బా అని వేచి ఉంటాడు. అనంతరం అతని నోటిని మూసివేయటం జరుగు తుంది. అతని తొడను సాక్ష్యం ఇవ్వవలసిందిగా కోరుతాడు. అతని శరీర అవయవాలు అన్నీ సాక్ష్యం ఇస్తాయి. అతడు కపటాచారియై ఉంటాడు. అతని పట్ల అల్లాహ్ (త) ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. [13] (ముస్లిమ్)
—–
اَلْفَصْلُ الثَّانِيْ రెండవ విభాగం
5556 – [ 8 ] ( صحيح ) (3/1541)
عَنْ أَبِيْ أُمَامَةَ قَالَ سَمِعْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ: “وَعَدَنِيْ رَبِّيْ أَنْ يُدْخِلَ الْجَنَّةَ مِنْ أُمَّتِيْ سَبْعِيْنَ أَلْفًا لَا حِسَابَ عَلَيْهِمْ وَلَا عَذَابَ مَعَ كُلِّ أَلْفٍ سَبْعُوْنَ أَلْفًا وَثَلَاث حَثَيَاتٍ مِنْ حَثْيَاتِ رَبِّيْ”. روَاهُ أَحْمَدُ وَالتِّرْمِذِيُّ وَابْنُ مَاجَهُ
5556. (8) [3/1541–దృఢం]
అబూ ఉమామహ్ (ర) కథనం: ప్రవక్త (స) ఇలా ప్రవచిస్తూ ఉండగా నేను విన్నాను, ”నా ప్రభువు నాతో నా అనుచర సమాజంలో నుండి 70 వేల మంది విచారణ, శిక్ష లేకుండా స్వర్గంలో ప్రవేశింపజేస్తానని, వాగ్దానం చేసాడు. ఇంకా ఆ 70 వేలమందిలోని ప్రతి 1000 మంది వెంట మరో 70 వేలమంది ఇంకా నా ప్రభువు దోసెళ్ళ నుండి మూడు దోసెళ్ళ నిండా ప్రజలు స్వర్గంలో ప్రవేశిస్తారు.” [14] (అ’హ్మద్, తిర్మిజి’, ఇబ్నె మాజహ్)
5557 – [ 9 ] ( ضعيف ) (3/1542)
وَعَنِ الْحَسَنِ عَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه و سلم: “يُعْرَضُ النَّاسُ يَوْمَ الْقِيَامَةِ ثَلَاثَ عَرْضَاتٍ: فَأَمَّا عَرْضَتَانِ فَجِدَالُ وَمَعَاذِيْرُ وَأَمَّا الْعَرْضَةُ الثَّالِثَةُ فَعِنْدَ ذَلِكَ تَطِيْرُ الصُّحُفُ فِيْ الْأَيْدِيْ فَآخِذٌ بِيَمِيْنِهِ وَآخِذٌ بِشِمَالِهِ”. رَوَاهُ أَحْمَدُ وَالتِّرْمِذِيُّ وَقَالَ لَا يَصِحُّ هَذَا الْحَدِيْثُ مِنْ قِبَلِ أَنَّ الْحَسَنَ لَمْ يَسْمَعْ مِنْ أَبِيْ هُرَيْرَةَ.
5557. (9) [3/1542– బలహీనం]
‘హసన్, అబూ హురైరహ్ (ర) ద్వారా కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”తీర్పుదినం నాడు అల్లాహ్ (త) సన్నిధిలో ప్రజలను మూడుసార్లు సమర్పించడం జరుగుతుంది. రెండుసార్లు సంభాషణ, వాదనకు మూడవసారి కర్మ పత్రాలను కొందరికి కుడిచేతుల్లోనూ, మరికొందరికి ఎడమ చేతుల్లోనూ ఇవ్వటానికి.” (అ’హ్మద్, తిర్మిజి’ – బలహీనం)
5558 – [ 10 ] ( ضعيف ) (3/1542)
وَقَدْ رَوَاهُ بَعْضُهُمْ عَنِ الْحَسَنِ عَنْ أَبِيْ مُوْسَى
5558. (10) [3/1542– బలహీనం]
మరికొందరు ‘హదీసు’వేత్తలు ఈ ఉల్లేఖనాన్ని ‘హసన్ బస్రీ ద్వారా, అతడు అబూ మూసా అష్’అరీ ద్వారా ఉల్లేఖించారు.[15]
5559 – [ 11 ] ( صحيح ) (3/1542)
وعَنْ عَبْدِ اللهِ بْنِ عَمْرٍو قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِنَّ اللهَ سَيُخَلِّصُ رَجُلًا مِنْ أُمَّتِيْ عَلَى رُؤُوْسِ الْخَلَائِقِ يَوْمَ الْقِيَامَةِ فَيَنْشِرُ عَلَيْهِ تِسْعَةً وَتِسْعِيْنَ سِجِلًّا كُلُّ سِجِلٍّ مِثْلُ مَدِّ الْبَصَرِ ثُمَّ يَقُوْلُ: أَتُنْكِرُ مِنْ هَذَا شَيْئًا؟ أَظلمَكَ كَتَبَتِيْ الْحَافِظُوْنَ؟ فَيَقُوْلُ: لَا يَارَبِّ فَيَقُوْلُ: أَفَلَكَ عُذْرٌ؟ قَالَ لَا يَارَبِّ. فَيَقُوْلُ بَلَى. إِنَّ لَكَ عِنْدَنَا حَسَنَةً وَإِنَّهُ لَا ظُلْمَ عَلَيْكَ الْيَوْمَ فَتُخْرَجُ بِطَاقَةٌ فِيْهَا أَشْهَدُ أَنْ لَا إِلَهَ إِلَّا اللهُ وأَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُوْلُهُ. فَيَقُوْلُ اُحْضُرْ وَزَنَكَ. فَيَقُوْلُ: يَا رَبِّ مَا هَذِهِ الْبِطَاقَةُ مَعَ هَذِهِ السِّجِلَّاتِ؟ فَيَقُوْلُ: إِنَّكَ لَا تُظْلَمُ قَالَ: فَتُوْضَعُ السَجِلَّاتُ فِيْ كِفَّةٍ وَالْبِطَاقَةُ فِيْ كِفَّةٍ فَطَاشَتِ السِّجِلَّاتِ وَثَقُلَتِ الْبِطَاقَةُ فَلَا يَثْقُلُ مَعَ اسْمِ اللهِ شَيْءٌ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَابْنُ مَاجَهُ.
5559. (11) [3/1542– దృఢం]
‘అబ్దుల్లాహ్ బిన్ ‘ఉమర్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”అల్లాహ్ (త) తీర్పుదినం నాడు నా అనుచర సమాజంలోని ఒక వ్యక్తిని పిలిచి అతని ముందు 99 రిజిష్టర్లు తెరచి ఉంచి, వాటిలోని ప్రతి రిజిష్టర్ కనుచూపు మేరకు వ్యాపించి ఉంటుంది. ఆ వ్యక్తితో, ‘ఈ రిజిష్టర్‌లలో ఉన్నదాన్ని నీవు తిరస్క రిస్తావా?’ అని అడుగుతాడు. ‘రాసిన వాళ్ళు ఏమైనా నీపై హింసకు పాల్పడ్డారా?’ అని అడుగు తాడు. దానికి ఆ వ్యక్తి, ‘లేదు ప్రభూ! ఎటువంటి సాకులు లేవు,’ అని విన్నవించుకుంటాడు. అప్పుడు అల్లాహ్ (త), ‘అయితే మా దగ్గర నీకు చెందిన ఒక చీటి ఉంది. ఈనాడు నీపై ఎటువంటి అత్యాచారం జరుగదు.’ ఒక చీటిని తీయటం జరుగుతుంది. అందులో ”అష్‌హదుఅన్‌లా ఇలాహ ఇల్లల్లాహ్ వ అష్‌హదు అన్న ము’హమ్మదన్ అబ్‌దుహు వ రసూ లుహు” అని వ్రాసి ఉంటుంది. అనంతరం అల్లాహ్(త) ఆ వ్యక్తితో, ‘నువ్వు తూనిక వద్ద ఉండు,’ అని అంటాడు. దానికి ఆ వ్యక్తి, ‘ప్రభూ! ఇన్ని రిజిస్టర్ల ముందు ఈ చీటికి ఏం విలువ ఉంటుంది,’ అని విన్నవించుకుంటాడు. దానికి అల్లాహ్ (త), ‘నీకు అన్యాయం జరుగదు,’ అని అంటాడు. అనంతరం రిజిస్టర్‌లను తూనికలో ఒక వైపు ఉంచుతారు. ఇంకా ఆ చీటీని తూనిక రెండవ పళ్ళెంలో ఉంచుతాడు. రిజిస్టర్లు ఉన్న పళ్ళెం పైకి లేచి పోతుంది. ఆ చీటీ ఉన్న పళ్ళెం క్రిందికి వంగిపోతుంది. సారాంశం ఏమి టంటే అల్లాహ్ (త) నామం కంటే బరువైన వస్తువు ఏదీ లేదు. ఎందుకంటే అల్లాహ్(త) పేరే అన్నిటికంటే విలువైనది, బరువైనది. (తిర్మిజి’, ఇబ్నె మాజహ్)
5560 – [ 12 ] ( ضعيف ) (3/1543)
وَعَنْ عَائِشَةَ أَنَّهَا ذَكَرَتِ النَّارَ فَبَكَتْ. فَقَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَا يُبْكِيْكَ؟” قَالَتْ: ذَكَرْتُ النَّارَ فَبَكَيْتُ فَهَلْ تَذْكُرُوْنَ أَهْلِيْكُمْ يَوْمَ الْقِيَامَةِ؟ فَقَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “أَمَّا فِيْ ثَلَاثَةِ مُوَاطِنَ فَلَا يَذْكُرُ أَحَدٌ أَحَدًا: عِنْدَ الْمِيْزَانِ حَتّى يَعْلَمُ: أَيَخِفُ مِيْزَانَهُ أَمْ يَثْقُلُ؟ وَعِنْدَ الْكِتَابِ حِيْنَ يُقَالُ (هَاؤُمُ اقْرَؤُوْا كِتَابِيَه) حَتّى يَعْلَمُ: أَيْنَ يَقَعْ كِتَابُهُ أَفِيْ يَمِيْنِهِ أَمْ فِيْ شِمَالِهِ؟ أَمْ مِنْ وَّرَاءِ ظَهْرِهِ؟ وَعِنْدَ الصِّرَاطِ: إِذَا وُضِعَ بَيْنَ ظَهْرَيْ جَهَنَّمَ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ.
5560. (12) [3/1543– బలహీనం]
‘ఆయి’షహ్ (ర) కథనం: నాకు నరకాగ్ని గుర్తు కొచ్చింది. నేను వెంటనే ఏడ్చాను. ప్రవక్త (స), ‘ఎందుకు ఏడుస్తున్నావు,’ అని అడిగారు. అందుకు నేను, ‘నరకాగ్ని గుర్తుకువచ్చి ఏడ్చాను, తీర్పుదినం నాడు తమరు మీ భార్యా బిడ్డలను గుర్తుంచు కుంటారా,’ అని అడిగాను. అప్పుడు ప్రవక్త (స), ‘మూడుచోట్లలో ఎవరూ ఎవరినీ గుర్తుచేసుకోరు. ఒకటి కర్మల తూనికవద్ద-కర్మల పళ్ళెం బరువుగా ఉందా లేక తేలికగా ఉందా తెలియనంత వరకు. రెండు కర్మలపత్రం చేతిలో ఇవ్వబడినప్పుడు -కర్మల పత్రం కుడిచేతిలో వెనుక నుండి లేదా కుడిచేతిలో ఇచ్చి, రండి నా కర్మల పత్రం చదవండి అని అననంతవరకు. మూడవది సిరాత్ వద్ద-సిరాత్ వంతెనను నరకంపై ఉంచబడును. (అబూ దావూద్)
—–
اَلْفَصْلُ الثَّالِثُ మూడవ విభాగం
5561 – [ 13 ] ( لم تتم دراسته ) (3/1543)
عَنْ عَائِشَةَ قَالَتْ: جَاءَ رَجُلٌ فَقَعَدَ بَيْنَ يَدَيْ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم فَقَالَ: يَا رَسُوْلَ اللهِ إِنَّ لِيْ مَمْلُوْكِيْنَ يَكْذِبُوْنَنِيْ وَيَخُوْنُوْنَنِيْ وَيَعْصُوْنَنِيْ وَأَشْتِمُهُمْ وَأَضْرِبُهُمْ فَكَيْفَ أَنَا مِنْهُمْ؟ فَقَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِذَا كَانَ يَوْمَ الْقِيَامَةِ يُحْسَبُ مَا خَانُوْكَ وَعَصَوْكَ وَكَذَّبُوْكَ وَعِقَابُكَ إِيَّاهُمْ. فَإِنْ كَانَ عِقَابُكَ إِيَّاهُمْ بِقَدَرٍ ذُنُوْبِهِمْ كَانَ كَفَافًا لَا لَكَ وَلَا عَلَيْكَ. وَإِنْ كَانَ عِقَابُكَ إِيَّاهُمْ دُوْنَ ذَنْبِهِمْ كَانَ فَضْلًا لَكَ. وَإِنْ كَانَ عِقَابُكَ إِيَّاهُمْ فَوْقَ ذُنُوْبِهِمْ اقْتُصَّ لَهُمْ مِنْكَ الْفَضْلُ فَتَنَحَّى الرَّجُلُ وَجَعَلَ يَهْتِفُ وَيَبْكِيْ. فَقَالَ لَهُ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “أَمَا تَقْرَأُ قَوْلَ اللهِ تَعَالى: (وَنَضَعُ الْمَوَازِيْنَ الْقِسْطَ لِيَوْمِ الْقِيَامَةِ فَلَا تُظْلَمُ نَفْسُ شَيْئًا وَإِنْ كَانَ مِثْقَالَ حَبَّةٍ مِنْ خَرْدَلٍ أَتَيْنَا بِهَا وَكَفَى بِنَا حَاسِبِيْنَ). فَقَالَ الرَّجُلُ: يَا رَسُوْلَ اللهِ مَا أَجِدُ لِيْ وَلِهَؤُلَاءِ شَيْئًا خَيْرًا مِنْ مُفَارَقَتِهِمْ أُشْهِدُكَ أَنَّهُمْ كُلّهُمْ أَحْرَارٌ. رَوَاهُ التِّرْمِذِيُّ.
5561. (13) [3/1543 –అపరిశోధితం]
‘ఆయి’షహ్ (ర) కథనం: ఒక వ్యక్తి వచ్చి ప్రవక్త (స) ముందు కూర్చొని, ‘ఓ ప్రవక్తా! నా దగ్గర సేవకులు ఉన్నారు, వీళ్ళు నాతో అబద్ధం పలుకుతున్నారు, నా ధనంలో అవినీతికి పాల్పడుతున్నారు, నాకు అవిధేయత చూపుతున్నారు. నేను వారికి చీవాట్లు పెడుతుంటాను, కొడుతుంటాను కూడా, తీర్పుదినం నాడు వాళ్ళవల్ల నా పరిస్థితి ఏమవుతుంది’ అని విన్నవించుకున్నాడు. అప్పుడు ప్రవక్త (స) ‘తీర్పుదినం నాడు వాళ్ళ అవినీతి, అవిధేయత, అబద్ధం, నీవు శిక్షించడం గురించి విచారించడం జరుగుతుంది. ఒకవేళ నీ శిక్ష వారి అపరాధాలకు సమానంగా ఉంటే వ్యవహారం సద్దుమణిగిపోతుంది. అంటే నీకు ఎటువంటి శిక్షా పడదు. ఒకవేళ నీశిక్ష వారి అపరాధం కంటే తక్కువ ఉంటే, వాళ్ళ పాపాల ఆధిక్యత వల్ల నీకు ప్రతిఫలం లభిస్తుంది. ఒకవేళ నీ శిక్ష వాళ్ళ అపరాధం కంటే అధికంగా ఉంటే, నీ నుండి ప్రతిఫలం వాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది,’ అని అన్నారు. అది విని ఆ వ్యక్తి ఒక ప్రక్కకు వెళ్ళి ఏడ్వటం ప్రారంభించాడు. అప్పుడు ప్రవక్త (స), ‘నువ్వు అల్లాహ్ (త) ఆదేశం వినలేదా? మేము తీర్పుదినం నాడు న్యాయమైన, ధర్మమైన తూనిక లను ఏర్పాటు చేస్తాం. ఎవరి పట్ల అన్యాయంగా ప్రవర్తించం. ఒకవేళ సత్కార్యం ఆవగింజంత ఉన్నా దాన్ని మేము తీసుకొని వస్తాము. ఇంకా విచారించ డానికి మేము చాలు.’ అప్పుడు ఆ వ్యక్తి, ‘ఓ ప్రవక్తా! నా కోసం, వాళ్ళ కోసం ఒకే విషయం మంచిదనిపిస్తుంది. అంటే వాళ్ళకు విడుదల చేయటం, నేను మిమ్మల్ని సాక్షిగా ఉంచి వీరందరినీ విడుదల చేస్తున్నాను’ అని అన్నాడు. [16] (తిర్మిజి’)
5562 – [ 14 ] ( صحيح ) (3/1544)
وَعَنْهَا قَالَتْ: سَمِعْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ فِيْ بَعْضِ صَلَاتِهِ: اللّهُمَّ حَاسِبْنِيْ حِسَابًا يَسِيْرًا”. قلت: يَا نَبِيَّ اللهِ مَا الْحِسَابُ الْيَسِيْرُ؟ قَالَ: “أَنْ يُنْظَرَ فِيْ كِتَابِهِ فَيُتَجَاوَزُ عَنْهُ إِنَّهُ مَنْ نُوْقِشَ الْحِسَابَ يَوْمَئِذٍ يَا عَائِشَةَ هَلَكَ”. رَوَاهُ أَحْمَدُ.
5562. (14) [3/1544 –దృఢం]
‘ఆయి’షహ్ (ర) కథనం: నేను ప్రవక్త (స)ను కొన్ని నమా’జుల్లో ఇలా దు’ఆ చేస్తూ ఉండటం చూసాను. ”అల్లాహుమ్మ ‘హాసిబ్‌నీ ‘హిసాబన్ యసీరా!” – ‘ఓ అల్లాహ్! నన్ను సున్నితంగా విచారించు.’ అప్పుడు నేను, ‘ఓ ప్రవక్తా! సున్నితమైన విచారం అంటే ఏమిటి?’ అని అడిగాను. దానికి ప్రవక్త(స), ‘దాసునికి అతని కర్మ (పాపా)ల పత్రం చూపించి, వాటిని క్షమించడం జరుగు తుంది.’ ‘ఆయి’షహ్! ‘ఆ రోజు కఠినంగా విచారించటం జరిగితే, వాడు చచ్చినట్టే,’ అని అన్నారు. (అ’హ్మద్)
5563 – [ 15 ] ( لم تتم دراسته ) (3/1544)
وَعَنْ أَبِيْ سَعِيْدِ الْخُدْرِيِّ أَنَّهُ أَتَى رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم فَقَالَ: أَخْبِرَنِيْ مَنْ يَقْوَى عَلَى الْقِيَامِ يَوْمَ الْقِيَامَةِ الَّذِيْ قَالَ اللهُ عَزَّ وَجَلَّ: (يَوْمَ يَقُوْمُ النَّاسُ لِرَبِّ الْعَالِمِيْنَ؛83: 6)؟ فَقَالَ: “يُخَفَّفُ عَلَى الْمُؤْمِنِ حَتّى يَكُوْنُ عَلَيْهِ كَالصَّلَاةِ الْمَكْتُوْبَةِ”.
5563. (15) [3/1544– అపరిశోధితం]
అబూ స’యీద్ ‘ఖుద్రీ (ర) కథనం: అతను ఒకరోజు ప్రవక్త (స) వద్దకు వచ్చారు. తీర్పుదినం గురించి ఈ ఆయతు, ”ప్రజలు అల్లాహ్ ముందు నిలబడిన నాడు” (అల్-ముతఫ్ఫిఫీన్, 83:6) ను ప్రస్తావిస్తూ, ‘అల్లాహ్ (త) ముందు నిలబడే ధైర్యం ఎవరికి ఉంది?’ అని విన్నవించు కున్నారు. దానికి ప్రవక్త (స) తీర్పు దినం విశ్వాసికి చాలా సున్నితంగా ఉంటుంది. చివరికి విశ్వాసి విధి నమా’జులు చదివినంత సమయంగా ఉంటుంది,’ అని సమాధానం ఇచ్చారు. (బైహఖీ)
5564 – [ 16 ] ( ضعيف ) (3/1544)
وعَنْهُ قَالَ: سُئِلَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم عَنْ(يَوْمَ كَانَ مِقْدَارُهُ خَمْسِيْنَ أَلْفَ سَنَةٍ؛70: 4) مَا طُوْلُ هَذَا الْيَوْمَ؟ فَقَالَ: “وَالَّذِيْ نَفْسِيْ بِيَدِهِ إِنَّهُ لَيُخَفَّفُ عَلَى الْمُؤْمِنِ حَتَّى يَكُوْنَ أَهْوَنَ عَلَيْهِ مِنَ الصَّلَاةِ الْمَكْتُوْبَةِ يُصَلِّيْهَا فِي الدُّنْيَا”. رَوَاهُمَا الْبَيْهَقِيُّ فِيْ كِتَابِ “الْبَعْثِ وَالنُّشُوْرِ”.
5564. (16) [3/1544– బలహీనం]
అబూ స’యీద్ ‘ఖుద్రీ (ర) కథనం: ప్రవక్త (స)ను 50 వేల సంవత్సరాలు గల ఆ దినం పొడవు గురించి ప్రశ్నించడం జరిగింది. దానికి ప్రవక్త (స), ‘ఎవరి చేతిలో నా ప్రాణం ఉందో ఆయన సాక్షి! విశ్వాసి కోసం దాన్ని తేలిక చేయడం జరుగుతుంది. చివరికి అతను ప్రపంచంలో విధినమా’జు చదివే సమయంకన్నా తక్కువగా ఉంటుంది. (బైహఖీ – కితాబుల్ బ’అసి’ వన్నుషూర్)
5565 – [ 17 ] ( لم تتم دراسته ) (3/1544)
وَعَنْ أَسْمَاءَ بِنْتِ يَزِيْدَ عَنْ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم قَالَ:” يُحْشَرُ النَّاسُ فِيْ صَعِيْدٍ وَّاحِدٍ يَوْمَ الْقِيَامَةِ فَيُنَادِيْ مُنَادٍ فَيَقُوْلُ: أَيْنَ الَّذِيْنَ كَانَتْ تَتَجَافَى جُنُوْبُهُمْ عَنِ الْمَضَاجِعِ؟ فَيَقُوْمُوْنَ وَهُمْ قَلِيْلٌ فَيَدْخُلُوْنَ الْجَنَّةَ بِغَيْرِحِسَابٍ ثُمَّ يُؤْمِرُ لِسَائِرِ النَّاسِ إِلى الْحِسَابِ”. رَوَاهُ الْبَيْهَقِيُّ فِيْ “شُعَبِ الْإِيْمَانِ”.
5565. (17) [3/1544 –అపరిశోధితం]
అస్మా బిన్‌తె య’జీద్ (ర) ప్రవక్త (స) ద్వారా కథనం: తీర్పుదినం నాడు ప్రజలు విశాలమైన బల్లపరుపు మైదానంలో చేర్చబడతారు. అనంతరం ఒక ప్రకటించే వాడు ఇలా ప్రకటిస్తాడు, ”తమ పడక నుండి మేల్కొని వేరయ్యేవారు ఎక్కడున్నారు. (అంటే తహజ్జుద్ చదివే వారు). అది విని మైదానంలో నుండి కొంతమంది నిలబడతారు. వాళ్ళు ఎటువంటి విచారం లేకుండా స్వర్గంలో ప్రవేశిస్తారు. (బైహఖీ)
=====
4 – بَابُ الْحَوْضِ وَالشَّفَاعَةِ
4. కౌసర్ సరస్సు, సిఫారసు
నిఘంటువులో హౌ’దె అంటే నీళ్ళు ఒకచోట చేరటం, పారటం అని అర్థం. ఇక్కడ హౌ’ద్ అంటే – తీర్పుదినం నాడు ప్రవక్త (స)కు ప్రసాదించబడే కోనేరు. అదేవిధంగా కౌస’ర్ అంటే అధికమేలు అని అర్థం. అంటే అనేక మేళ్ళు, అనుగ్రహాలు, ఈ కోనేరు ప్రళయ మైదానంలో కర్మల తూనికకు ముందు ఉంటుంది. ఎందుకంటే ప్రజలు తమ సమాధుల నుండి దాహంతో లేస్తారు. కర్మల తూనికకు ముందు కోనేరు ఉంటుంది. మానవులంతా ఆ కోనేరు వద్దకు వెళతారు. ప్రతి ప్రవక్త తన అనుచర సమాజం ఆధిక్యత పట్ల గర్వపడతారు. ప్రవక్త (స), ‘నా కోనేరుపై అత్యధికంగా ప్రజలు వస్తారని నేను ఆశిస్తున్నాను,’ అని అన్నారు.
షిఫా’అత్ (సిఫారసు) అంటే పాపాల మన్నింపు కోసం సిఫారసు చేయటం. ప్రవక్త (స) తన అనుచర సమాజానికి చెందిన పాపాత్ముల కొరకు సిఫారసు చేస్తారు. ప్రవక్త (స) సిఫారసు ఫలిస్తుంది, స్వీకరించబడుతుంది, దీన్ని విశ్వసించటం కూడా తప్పనిసరి అవుతుంది.
సిఫారసుకు అనేక సందర్భాలు ఉన్నట్టు పండితులు భావిస్తున్నారు. మొదటి సందర్భం, ప్రజలు తీర్పు మైదానంలో నిలబెట్టినపుడు. అప్పుడు ప్రజలు భయంతో చెమటలు పట్టి ఉంటారు. ప్రతి వ్యక్తి విచారణను తలచుకొని వణుకుతూ ఉంటాడు. అప్పుడు ప్రవక్త (స) సిఫారసు చేస్తారు.
اَلْفَصْلُ الْأَوَّلُ మొదటి విభాగం
5566 – [1 ] ( صحيح ) (3/1545)
عَنْ أَنَسٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “بَيْنَا أَنَا أَسِيْرُ فِي الْجَنَّةِ إِذَا أَنَا بِنَهَرٍحَافَتَاهُ الدُّرِّالْمُجَوَّفِ قُلْتُ: مَاهَذَا يَا جِبْرِيْلُ؟ قَالَ: الْكَوْثَرُالَّذِيْ أَعْطَاكَ رَبُّكَ فَإِذَا طِيْنُهُ مِسْكٌ أَذْفَرُ”. رَوَاهُ الْبُخَارِيُّ.
5566. (1) [3/1545 –దృఢం]
అనస్ (ర) కథనం : ప్రవక్త (స) ప్రవచనం, ”నేను మేరాజ్ రాత్రి స్వర్గంలో తిరుగుతున్నాను. నేను ఒక కోనేరు ప్రక్కనుండి వెళ్ళాను. దాని రెండువైపుల ముత్యాల స్తంభాలు ఉన్నాయి. జిబ్రీల్‌ను, ‘ఏమిటిది,’ అని అడిగాను. అతను, ”ఇది కౌస’ర్ కోనేరు,’ అని అన్నారు. మీ ప్రభువు దీన్ని మీకు ప్రసాదించాడు. నేను దాని మట్టిని చూస్తే కస్తూరి సువాసన కలిగి ఉంది.” (బు’ఖారీ)
5567 – [ 2 ] ( متفق عليه ) (3/1545)
وَعَنْ عَبْدِ اللهِ بْنِ عَمْرٍوقَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “حَوْضِيْ مَسِيْرَةُ شَهْرٍ وَزَوَايَاهُ سَوَاءٌ مَاؤُهُ أَبْيَضُ مِنَ اللَّبَنِ وَرِيْحُهُ أَطْيَبُ مِنَ الْمِسْكِ وَكِيْزَانُهُ كَنُجُوْمِ السَّمَاءِ مَنْ يَّشْرَبُ مِنْهَا فَلَا يَظْمَأُ أبَدًا”. مُتَّفَقٌ عَلَيْهِ.
5567. (2) [3/1545 –ఏకీభవితం]
‘అబ్దుల్లాహ్ బిన్ ‘ఉమర్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఆ కౌస’ర్ కోనేరు ఒక నెల ప్రయాణమంత పొడవుగా ఉంటుంది. అది చతుర్భుజంగా ఉంది. దాని నీరు పాలకన్నా తెల్లగా కస్తూరికన్నా అత్యధిక సువాసన కలిగి ఉంటుంది. దాని గ్లాసులు నక్షత్రాల్లా ఉంటాయి. ఆ నీటిని త్రాగిన వ్యక్తికి ఎన్నడూ దాహం వేయదు.” [17] (బు’ఖారీ, ముస్లిమ్)
5568 – [ 3 ] ( صحيح ) (3/1545)
وَعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِنَّ حَوْضِيْ أَبْعَدُ مِنْ أَيْلَةَ مِنء عَدَنٍ لَهُوَ أَشَدُّ بَيَاضًا مِنَ الثَّلْجِ وَأَحْلَى مِنَ الْعَسَلِ بِاللَّبَنِ وَلَآنِيَتُهُ أَكْثَرُ مِنْ عَدَدِ النُّجُوْمِ وَإِنِّيْ لَأَصُدُّ النَّاسَ عَنْهُ كَمَا يَصُدُّ الرَّجُلُ إِبِلَ النَّاسِ عَنْ حَوْضِهِ”. قَالُوْا: يَا رَسُوْلَ اللهِ أَتَعْرِفْنَا يَوْمَئِذٍ؟ قَالَ: “نَعَمْ لَكُمْ سِيْمَاءُ لَيْسَتْ لِأَحَدٍ مِّنَ الْأُمَمِ تَرِدُوْنَ عَلَيَّ غُرًّا مِنْ أَثَرِ الْوُضُوْءِ”. رَوَاهُ مُسْلِمٌ.
5568. (3) [3/1545 –దృఢం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”నా కోనేరు అంటే కౌసర్ కోనేరు. రెండు మూలల మధ్య అయ్‌ల మరియు అద్‌న్‌ల దూరం అంత ఉంటుంది. ఇంకా అంత కంటే అధికంగా ఉంటుంది. దాని నీరు మంచు కంటే తెల్లగా, తేనెకంటే తియ్యగా ఉంటుంది. దాన్ని త్రాగే గ్లాసులు ఆకాశంలోని నక్షత్రాలకంటే అధికంగా ఉంటాయి. నేను ఇతర సమాజాల వారిని ఒక ఒంటెల కాపరి ఇతరుల ఒంటెలను రాకుండా వారించినట్టు వారిస్తాను. అప్పుడు అనుచరులు, ‘ప్రవక్తా! ఆ రోజు తమరు మమ్మల్ని గుర్తుపట్టగలరా?’ అని ప్రశ్నించారు. అప్పుడు ప్రవక్త (స), ‘అవును మీ కోసం ఒక చిహ్నం ఉంది. అది ఏ ఇతర సమాజానికీ ఉండదు. మీరు నా వద్దకు వచ్చినపుడు మీ ముఖాలు, చేతులు, కాళ్ళూ వుజూ వల్ల మెరుస్తూ ఉంటాయి’ ” అని అన్నారు. (ముస్లిమ్)
5569 – [ 4 ] ( صحيح ) (3/1546)
وَفِيْ رِوَايَةٍ لَهُ عَنْ أَنَسٍ قَالَ: “تَرَى فِيْهِ أَبَارِيْقُ الذَّهَبِ وَالْفِضَّةِ كَعَدَدِ نُجُوْمِ السَّمَاءِ”.
5569. (4) [3/1546 –దృఢం]
ముస్లిమ్ ఉల్లేఖనంలో ఇలా ఉంది, ”అనస్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఆ కోనేరులో బంగారు, వెండి గ్లాసులు, కప్పులు ఉంటాయి, ఆకాశంలో నక్షత్రాలు ఉన్నట్టు.”
5570 – [ 5 ] ( صحيح ) (3/1546)
وَفِيْ أُخْرَى لَهُ عَنْ ثَوْبَانَ قَالَ: سُئِلَ عَنْ شَرَابِهِ.فَقَالَ: “أَشَدُّ بَيَاضًا مِنَ اللَّبَنِ وَأَحْلَى مِنَ الْعَسَلِ يَغُتُّ فِيْهِ مِيْزَابَانِ يَمُدَّانِهِ مِنَ الْجَنَّةِ: أَحَدُهُمَا مِنْ ذَهَبٍ وَالْآخَرُ مِنْ وَرِقٍ”.
5570. (5) [3/1546– దృఢం]
మరో ముస్లిమ్ ఉల్లేఖనంలో ఇలా ఉంది, ”సౌ’బాన్ (ర) కథనం: ప్రవక్త (స)ను కౌస’ర్ కోనేరు గురించి ప్రశ్నించడం జరిగింది. అప్పుడు ప్రవక్త (స) దాని నీరు పాలకంటే తెల్లగా, తేనెకంటే తియ్యగా ఉంటాయి. అందులో రెండు నీటి కాలువలు పడుతూ ఉంటాయి. కోనేరును నింపుతూ ఉంటాయి. ఈ నీరు స్వర్గం నుండి వస్తుంది. వీటిలో ఒకటి బంగారం, రెండవది వెండితో చేయబడి ఉంటాయి.[18]
5571 – [ 6 ] ( متفق عليه ) (3/1546)
وَعَنْ سَهْلِ بْنِ سَعْدٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِنِّيْ فَرَطُكُمْ عَلَى الْحَوْضِ مَنْ مَرَّ عَلَيَّ شَرِبَ وَمَنْ شَرِبَ لَمْ يَظْمَأْ أَبَدًا لَيَرِدَنَّ عَلَيَّ أَقْوَامٌ أَعْرِفُهُمْ وَيَعْرِفُوْنَنِيْ ثُمَّ يُحَالُ بَيْنِيْ وَبَيْنَهُمْ فَأَقُوْلُ: إِنَّهُمْ مِنِّيْ. فَيُقَالُ: إِنَّكَ لَا تَدْرِيْ مَا أَحْدَثُوْا بَعْدَكَ؟ فَأَقُوْلُ: سُحْقًا سُحْقًا لِمَنء غَيَّرَ بَعْدِيْ”. مُتَّفَقٌ عَلَيْهِ.
5571. (6) [3/1546– ఏకీభవితం]
సహల్ బిన్ స’అద్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవ చనం, ”మీరు నన్ను కౌస’ర్ కోనేరువద్ద కలుసు కుంటారు. నా వద్దకు వచ్చిన ప్రతిఒక్కరూ అందులో నుండి నీటిని త్రాగుతారు. దాని నీటిని త్రాగేవారు ఆ తరువాత ఎప్పుడూ దాహానికి గురికారు. అప్పుడు నాఅనుచర సమాజంలోని కొంతమంది అక్క డకు వస్తారు. వారిని నేను గుర్తిస్తాను. వారూ నన్ను గుర్తి స్తారు. కాని, వారికి నాకు మధ్య ఒకఅడ్డుతెర ఏర్పడుతుంది. అది చూచి నేను, ‘వాళ్ళు నా అనుచర సమా జానికి చెందినవారు,’ అని అంటాను. దానికి సమాధానంగా, ‘మీకు తెలియదు మీ తరువాత వీళ్ళు అనేక విషయాలను కల్పించారు,’ అని అంటారు. అది విని నేను వీళ్ళను దూరంగా తీసుకువెళ్ళండి, దైవకారు ణ్యానికి దూరం చేయండి, నా తరువాత అనేక విషయాలు కల్పించారు,” అని అంటాను. (బు’ఖారీ, ముస్లిమ్)
5572 – [ 7 ] ( متفق عليه ) (3/1546)
وَعَنْ أَنَسٍ أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم قَالَ: “يُحْبَسُ الْمُؤْمِنُوْنَ يَوْمَ الْقِيَامَةِ حَتَّى يُهَمُّوا بِذَلِكَ فَيَقُوْلُوْنَ: لَوِ اسْتَشْفَعْنَا إِلى رَبِّنَا فَيُرِيْحُنَا مِنْ مَكَانِنَا فَيَأْتُوْنَ آدَمَ فَيَقُوْلُوْنَ: أَنْتَ آدَمَ أبُوْ النَّاسِ خَلَقَكَ اللهُ بِيَدِهِ وَأَسْكَنَكَ جَنَّتَهُ وَأَسْجَدَ لَكَ مَلَائِكَتَهُ وَعَلَّمَكَ أَسْمَاءَ كُلِّ شَيْءٍ اِشْفَعْ لَنَا عِنْدَ رَبِّكَ حَتَّى يُرِيْحَنَا مِنْ مَكَانِنَا هَذَا. فَيَقُوْلُ: لَسَتُ هُنَاكُمْ. وَيَذْكُرُ خَطِيْئَتَهُ الَّتِيْ أَصَابَ: أَكْلَهُ مِنَ الشَّجَرَةِ وَقَدْ نُهِيَ عَنْهَا- ولَكن ائْتُوْا نُوْحًا أَوَّلَ نَبِيٍّ بَعَثَهُ اللهُ إِلى أَهْلِ الْأَرْضِ فَيَأْتُوْنَ نُوْحًا فَيَقُوْلُ: لَسْتُ هُنَاكُمْ – وَيَذْكُرُ خَطِيْئَتَهُ الَّتِيْ أَصَابَ: سُؤَالَهُ رَبَّهُ بِغَيْرِ عِلْمٍ – وَلَكِنِ ائْتُوْا إِبْرَاهِيْمَ خَلِيْلَ الرَّحْمنِ. قَالَ: فَيَأْتُوْنَ إِبْرَاهِيْمَ فَيَقُوْلُ: إِنِّيْ لَسْتُ هُنَاكُمْ- وَيَذْكُرُ ثَلَاثَ كَذِبَاتٍ كَذَبَهُنَّ – وَلَكِنِ ائْتُوْا مُوْسَى عَبْدًا آتَاهُ اللهُ التَّوْرَاةَ وَكَلَّمَهُ وَقَرَّبَهُ نَجِيًّا. قَالَ: فَيَأْتُوْنَ مُوْسَى فَيَقُوْلُ: إِنِّيْ لَسْتُ هُنَاكُمْ – وَيَذْكُرُ خَطِيْئَتَهُ الَّتِيْ أَصَابَ قَتْلَهُ النَّفْسَ – وَلَكِنِ ائْتُوْا عِيْسَى عَبْدُ اللهِ وَرَسُوْلِهِ وَرُوْحَ اللهِ وَكَلِمَتَهُ”. قَالَ: “فَيَأْتُوْنَ عِيْسَى فَيَقُوْلُ: لَسْتُ هُنَاكُمْ وَلَكِنِ ائْتُوْا مُحَمَّدًا عَبْدًا غَفَرَ اللهُ لَهُ مَاتَقَدَّمَ مِنْ ذَنْبِهِ وَمَا تَأَخَّرَ”. قَالَ: “فَيَأْتُوْنِيْ فَأَسْتَأْذِنْ عَلَى رَبِّيْ فِيْ دَارِهِ فَيُؤْذَنُ لِيْ عَلَيْهِ فَإِذَا رَأَيْتُهُ وَقَعْتُ سَاجِدًا فَيَدَعُنِيْ مَا شَاءَ اللهُ أَنْ يَّدْعَنِيْ فَيَقُوْلُ: اِرْفَعْ مُحَمَّدُ وَقُلْ تُسْمَعْ وَاشْفَعْ تُشَفَّعْ وَسَلْ تُعْطَهُ”. قَالَ: “فَأَرْفَعُ رَأْسِيْ فَأُثْنِيْ عَلَى رَبِّيْ بِثَنَاءٍ تَحْمِيْدٍ يُعَلِّمُنِيْهِ ثُمَّ أَشْفَعُ فَيَحُدُّ لِيْ حَدًّا فَأَخْرُجُ فَأُخْرِجُهُمْ مِنَ النَّارِ وَأَدْخِلُهُمُ الْجَنَّةَ ثُمَّ أَعُوْدُ الثَّانِيَةَ فَأَسْتَأْذِنُ عَلَى رَبِّيْ فِيْ دَارِهِ. فَيُؤْذَنُ لِيْ عَلَيْهِ فَإِذَا رَأَيْتُهُ وَقَعْتُ سَاجِدًا. فَيَدَعُنِيْ مَا شَاءَ اللهُ أَنْ يَّدَعَنِيْ ثُمَّ يَقُوْلُ: اِرْفَعْ مُحَمّدُ وَقُلْ تُسْمَعْ وَاشْفَعْ تُشَفَّعْ وَسَلْ تُعْطَهُ. قَالَ: “فَأَرْفَعُ رَأْسِيْ فَأُثْنِيْ عَلَى رَبِّيْ بِثَنَاءٍ وَتَحْمِيْدٍ يُعَلِّمُنِيْهِ ثُمَّ أَشْفَعُ فَيَحُدُّ لِيْ حَدًّا فَأَخْرُجُ فَأُخْرِجُهُمْ مِنَ النَّارِ وَأُدْخِلُهُمُ الْجَنَّةَ ثُمَّ أَعُوْدُ الثَّالِثَةَ فَأَسْتَأْذِنُ عَلَى رَبِّيْ فِيْ دَارِهِ فَيُؤْذَنُ لِيْ عَلَيْهِ فَإِذَا رَأَيْتُهُ وَقَعْتُ سَاجِدًا فَيدعُنِيْ مَا شَاءَ اللهُ أَنْ يَّدَعَنِيْ ثُمَّ يَقُوْلُ: اِرْفَعْ مُحَمَّدُ وَقُلْ تُسْمَعْ وَاشْفَعْ تُشَفَّعْ وَسَلْ تُعْطَهُ”. قَالَ: “فَأَرْفَعُ رَأْسِيْ فَأُثْنِيْ عَلَى رَبِّيْ بِثَنَاءٍوَتَحْمِيْدٍ يُعَلِّمُنِيْهِ ثُمَّ أَشْفَعْ فَيَحُدُّ لِيْ حَدًّا فَأَخْرُجُ فَأُخْرِجُهُمْ مِنَ النَّارِ وَأُدْخِلُهُمُ الْجَنَّةَ حَتَّى مَا يَبْقَى فِي النَّارِ إِلَّا مَنْ قَدْ حَبَسَهُ الْقُرْآنُ”. أَيْ وَجَبَ عَلَيْهِ الْخُلُوْدُ ثُمَّ تَلَا هَذِهِ الْآيَةَ (عَسَى أَنْ يَّبْعَثَكَ رَبُّكَ مَقَامًا مَّحْمُوْدًا؛17: 79) قَالَ: “وَهَذَا الْمَقَامُ الْمَحْمُوْدُ الَّذِيْ وَعَدَهُ نَبِيُّكُمْ”. مُتَّفَقٌ عَلَيْهِ.
5572. (7) [3/1546 –ఏకీభవితం]
అనస్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ముస్లిము లను తీర్పుదినం నాడు ఆపివేయటం జరుగుతుంది. వాళ్ళు విచారిస్తూ, ఒకవేళ మనం అల్లాహ్ (త)కు ఎవరితోనైనా సిఫారసు చేయిస్తే బాగుండేది. అప్పుడు ప్రజలు ఆదమ్ (అ) వద్దకు వెళ్ళి, ‘మీరు మానవులందరి తండ్రి. అల్లాహ్(త) మిమ్మల్ని తన చేతితో సృష్టించాడు, స్వర్గంలో ఉంచాడు, తన దూతల ద్వారా సజ్దా చేయించాడు. అనేక విషయా లను గురించి తెలిపాడు. తమరు మా గురించి అల్లాహ్(త) వద్ద సిఫారసు చేస్తే బాగుం టుంది’ అని అంటారు. దానికి ఆదమ్ (అ), ‘నేను దీనికి తగను. దైవాజ్ఞను ధిక్కరించి ఆ చెట్టు ఫలాన్ని తిన్నాను. అయితే మీరు నూ’హ్(అ) వద్దకు వెళ్ళండి. అతడు మొదటి ప్రవక్త అతన్ని మొట్ట మొదట ప్రజల వద్దకు పంపడం జరిగింది,’ అని అంటారు.
అందరూ కలసి నూ’హ్ (అ) వద్దకు వచ్చి విన్నవించు కుంటారు. దానికి నూ’హ్ (అ), ‘నేను దానికి తగనని, నేను అజ్ఞానిగా వ్యవహరించి ప్రశ్నించాను. కనుక మీరు ఇబ్రాహీమ్ (అ) వద్దకు వెళ్ళండి,’ అని అంటారు. వారు ఇబ్రాహీమ్ (అ) వద్దకు పోతారు. అతన్ని సిఫారసు చేయమని కోరుతారు. ఇబ్రాహీమ్ (అ), ‘నేను దీనికి తగను, నేను మూడుసార్లు అసత్యం పలికాను, మీరు మూసా(అ) వద్దకు వెళ్ళండి, అతడు ప్రియభక్తుడు, అతనికి అల్లాహ్(త) తౌరాతు ప్రసాదించాడు, అల్లాహ్(త) అతనితో మాట్లాడాడు,’ అని’ అంటారు. అప్పుడు ప్రజలు మూసా (అ) వద్దకు పోతారు. మూసా (అ) నేను దీనికి తగనని, నేను ఒక వ్యక్తిని చంపాను, అందువల్ల మీరు ‘ఈసా (అ) వద్దకు వెళ్ళండి, అతను దైవ దాసులు మరియు దైవాత్మ,’ అని అంటారు. ప్రజలు ‘ఈసా (అ) వద్దకు వెళతారు. సిఫారసు చేయమని కోరుతారు. అప్పుడు ‘ఈసా (అ) ‘నేను దీనికి తగను, మీరు ము’హమ్మద్ (స) వద్దకు వెళ్ళండి, ఎందుకంటే అతని ముందు వెనుక పాపాలన్నీ క్షమించడం జరిగింది,’ అని అంటారు. ప్రవక్త (స) కథనం: ‘ఆ తరువాత ప్రజలు నా దగ్గరకు వస్తారు. నేను అల్లాహ్ (త)సన్నిధిలో వెళ్ళటానికి అనుమతి కోరుతాను. అల్లాహ్(త) నాకు అనుమతి ఇస్తాడు.
నేను అల్లాహ్(త) సన్నిధిలోకి వెళ్ళి, సజ్దాలో పడిపోతాను. అల్లాహ్(త) కోరినంత వరకు సజ్దాలో ఉంటాను. ఆ తరువాత అల్లాహ్(త), ‘ము’హమ్మద్! తలఎత్తు, చెప్పదలచు కున్నది చెప్పు, వింటాను, నీ కోరిక తీర్చుతాను. అడగదలచుకున్నది అడుగు, ప్రసాదిస్తాను.’ అని అంటాడు. ప్రవక్త (స) కథనం, ”అది విని నేను తల ఎత్తుతాను, అల్లాహ్(త) నేర్పిన విధంగా స్తోత్రం పఠిస్తాను. ఆ తరువాత నేను సిఫారసు చేస్తాను. నా కోసం ఒక నిర్ణీత ప్రమాణం నిర్ణయించటం జరుగుతుంది. అంటే ఫలానా వాళ్ళ గురించి నీవు సిఫారసు చేయగలవని నిర్ణయించటం జరుగుతుంది. ఆ తరువాత నేను అల్లాహ్ (త) సన్నిధినుండి బయ టకు వస్తాను. సిఫారసు స్వీకరించిన వారి నందరినీ నరకం నుండి తీసి స్వర్గంలోనికి పంపివేస్తాను. మళ్ళీ నేను దైవసన్నిధిలో రావటానికి అనుమతి కోరుతాను. నాకు అనుమతి లభిస్తుంది. నేను దైవసన్నిధిలోనికి వెళ్ళి సజ్దాలో పడిపోతాను. అల్లాహ్(త) కోరినంత వరకు నేను సజ్దాలో ఉంటాను. అనంతరం, ‘ము’హమ్మద్ తలఎత్తు చెప్పవలసింది చెప్పు, నీ మాట వింటాను. సిఫారసు చేయి, అనుమ తిస్తాను. అడుగు ఇస్తాను,’ అని అల్లాహ్ (త) అంటాడు. ప్రవక్త (స) కథనం: నేను నా తల ఎత్తు తాను. ఇంకా దైవస్తోత్రం చేస్తాను. దాన్ని అల్లాహ్(త) నాకు నేర్పించి ఉంటాడు. ఆ తరువాత నేను సిఫారసు చేస్తాను. నాకొక హద్దు నిర్ణయించబడు తుంది. ఆ తరువాత నేను దైవసన్నిధి నుండి బయ టకు వస్తాను. వారిని నరకం నుండి తీయించి స్వర్గం లోనికి ప్రవేశింపజేస్తాను. మళ్ళీ నేను మూడవసారి అల్లాహ్(త) సన్నిధిలోనికి వస్తాను. అల్లాహ్(త) సన్నిధిలో ప్రవేశించే అనుమతి కోరుతాను. నాకు అనుమతి లభిస్తుంది. నేను అల్లాహ్(త) సన్నిధిలో ప్రవేవించి చూసి సజ్దాలో పడిపోతాను. ఇంకా అల్లాహ్(త) కోరినంతవరకు నేను సజ్దాలో ఉంటాను. ఆ తరువాత ఓ ము’హమ్మద్! తలఎత్తు, అడగ వలసిందేదో అడుగు, నీ మాట వినటం జరుగుతుంది. స్వీకరించటం జరుగుతుంది. అడుగు ఇస్తాను,’ అని అనటం జరుగుతుంది. ప్రవక్త (స) కథనం: ‘అది విని నేను తల ఎత్తుతాను. నాకు నేర్పిన విధంగా స్తోత్రం చేస్తాను. ఆ తరువాత నేను సిఫారసు చేస్తాను. నా కోసం సిఫారసు హద్దు ఒకటి నిర్ణయించటం జరుగు తుంది. ఆ తరువాత బయటకు వస్తాను. మరికొంత మందిని నరకం నుండి రక్షించి స్వర్గంలోకి పంపిస్తాను. చివరికి నరకంలో ఖుర్‌ఆన్ ఆపినవారు మాత్రమే మిగిలి ఉంటారు. అంటే ఖుర్‌ఆన్ ప్రకారం శాశ్వతంగా నరకంలో ఉండేవాళ్ళు అంటే వాళ్ళు అవిశ్వాసులు. ఆ తరువాత ప్రవక్త (స) ఈ వాక్యాన్ని పఠించారు. ”నీ ప్రభువు నిన్ను మఖామె మ’హ్‌మూద్‌కు చేర్చు తాడని భావించవచ్చు, దీన్ని నీకు అల్లాహ్(త) ప్రసాదిస్తాడు,” అని అన్నారు. (బు’ఖారీ, ముస్లిమ్)
5573 – [ 8 ] ( متفق عليه ) (3/1548)
وَعَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِذَا كَانَ يَوْمَ الْقِيَامَةِ مَاجَ النَّاسُ بَعْضُهُمْ فِيْ بَعْضٍ فَيَأْتُوْنَ آدَمَ فَيَقُوْلُوْنَ: اِشْفَعْ لَنَا إِلى رَبِّكَ فَيَقُوْلُ: لَسْتُ لَهَا وَلَكِنْ عَلَيْكُمْ بِاِبْرَاهِيْمِ فَإِنَّهُ خَلِيْلُ الرَّحْمَنِ فَيَأْتُوْنَ إِبْرَاهِيْمَ فَيَقُوْلُ لَسْتُ لَهَا وَلَكِنْ عَلَيْكُمْ بِمُوْسَى فَإِنَّهُ كَلِيْمُ اللهُ فَيَأْتُوْنَ مُوْسَى فَيَقُوْلُ لَسْتُ لَهَا وَلَكِنْ عَلَيْكُمْ بِعِيْسَى فَإِنَّهُ رُوْحُ اللهِ وَكَلِمَتُهُ فَيَأْتُوْنَ عِيْسَى فَيَقُوْلُ لَسْتُ لَهَا وَلَكِنْ عَلَيْكُمْ بِمُحَمَّدٍ. فَيَأْتُوْنِّيْ فَأَقُوْلُ أَنَا لَهَا فَأَسْتَأْذِنُ عَلَى رَبِّيْ فَيُؤْذَنُ لِيْ وَيُلْهِمُنِيْ مَحَامَدَ أَحْمَدُهُ بِهَا لَا تَحْضُرُنِيَ الْآنَ فَأَحْمَدُهُ بِتِلْكَ الْمَحَامِدِ وَأَخِرُّ لَهُ سَاجِدًا. فَيُقَالُ يَا مُحَمَّدُ اِرْفَعْ رَأْسَكَ وَقُلْ تُسْمَعْ وَسَلْ تُعْطَهُ وَاشْفَعْ تُشَفَّعْ. فَأَقُوْلُ يَارَبِّ أُمَّتِيْ أُمَّتِيْ فَيُقَالُ اِنْطَلَقَ فَأَخْرَجَ مَنْ كَانَ فِيْ قَلْبِهِ مِثْقَالُ شَعِيْرَةٍ مِّنْ إِيْمَانٍ فَأَنْطَلَقَ فَأَفْعَلُ. ثُمَّ أَعُوْدُ فَأَحْمَدُهُ بِتِلْكَ الْمَحَامِدِ أخِرُّ لَهُ سَاجِدًا. فَيُقَالُ يَا مُحَمَّدُ اِرْفَعْ رَأْسَكَ وَقُلْ تُسْمَعْ وَسَلْ تُعْطَهُ وَاشْفَعْ تُشَفَّعْ. فَأَقُوْلُ يَارَبِّ أُمَّتِيْ أُمَّتِيْ. فَيُقَالُ انْطَلِقْ فَأَخْرِجْ مَنْ كَانَ فِيْ قَلْبِهِ مِثْقَالُ ذَرَّةٍ أَوْ خَرْدَلَةٍ مِنْ إِيْمَانٍ فَأَنْطَلَقَ فَأَفْعَلُ. ثُمَّ أَعُوْدُ فَأَحْمَدُهُ بِتِلْكَ الْمَحَامِدِوَأَخِرُّ لَهُ سَاجِدًا. فَيُقَالُ يَا مُحَمَّدُ اِرْفَعْ رَأْسَكَ وَقُلْ تُسْمَعْ وَسَلْ تُعْطَهُ وَاشْفَعْ تُشَفَّعْ. فَأَقُوْلُ يَارَبِّ أُمَّتِيْ أُمَّتِيْ. فَيُقَالُ اِنْطَلِقْ فَأَخْرِجْ مَنْ كَانَ فِيْ قَلْبِهِ أَدْنَى أَدْنَى أَدْنَى مِثْقَالَ حَبَّةٍ مِنْ خَرْدَلَةٍ مِنْ إِيْمَانٍ فَأَخْرِجْهُ مِنَ النَّارِ فَأَنْطَلَقَ فَأَفْعَلُ. ثُمَّ أَعُوْدُ الرَّابِعَةَ فَأَحْمَدُهُ بِتِلْكَ الْمَحَامِدِوَأَخِرُّ لَهُ سَاجِدًا. فَيقُالُ يَا مُحَمَّدُ اِرْفَعْ رَأْسَكَ وَقُلْ تُسْمَعْ وَسَلْ تُعْطَهُ وَاْشَفْع تُشَفَّعْ. فَأَقُوْلُ يَارَبِّ اِئْذِنْ لِيْ فِيْمَنْ قَالَ لَا إِلَهَ إِلّا اللهُ قَالَ لَيْسَ ذَلِكَ لَكَ وَلَكِنْ وَعِزَّتِيْ وَجَلَالِيْ وَكِبْرِيَائِيْ وَعَظْمَتِيْ لَأُخْرِجَنَّ مِنْهَا مَنْ قَالَ لَا إِلَهَ إِلَّا اللهُ”. مُتَّفَقٌ عَلَيْهِ.
5573. (8) [3/1548 –ఏకీభవితం]
అనస్ (ర) కథనం, ప్రవక్త (స) ప్రవచనం: ”తీర్పు దినం నాడు ప్రజలు ప్రళయ మైదానంలో పరస్పరం ఆందోళనగా అటూఇటూ తిరుగుతూ ఉంటారు. ఆదమ్ (అ) వద్దకు వెళ్ళి, ‘మా కోసం సిఫారసు చేయండి,’ అని కోరుతారు. దానికి ఆదమ్ (అ), ‘నేను సిఫారసు చేయటానికి తగను, మీరు ఇబ్రాహీమ్ (అ) వద్దకు వెళ్ళండి. అతను అల్లాహ్(త) మిత్రులు అని అంటారు. వాళ్ళు ఇబ్రాహీమ్ (అ) వద్దకు వెళతారు. కాని ఇబ్రాహీమ్ కూడా నాకు సిఫారసు చేసే శక్తి లేదు, మీరు మూసా (అ) వద్దకు వెళ్లండని అంటారు. వాళ్ళు మూసా (అ) దగ్గరకు వెళతారు. కాని అతను కూడా సిఫారసు చేసే అర్హత నాకు లేదు కనుక మీరు ‘ఈసా (అ) దగ్గరకు వెళ్ళండని అంటారు. వాళ్ళు ‘ఈసా (అ) దగ్గరకు వెళతారు. అతను కూడా నాకు సిఫారసు చేసే శక్తి లేదు కనుక మీరు ము’హమ్మద్ (స) దగ్గరకు వెళ్ళండని అంటారు. అనంతరం వాళ్ళు నా దగ్గరకు వస్తారు. వారితో నేను సిఫారసు చేయగలను అని పలికి, అనంతరం నేను అల్లాహ్(త) సన్నిధిలో ప్రవేశించే అనుమతి కోరుతాను. అల్లాహ్(త) నాకు అనుమతి ఇస్తాడు. ఇంకా నా హృదయంలో దైవస్తోత్ర వచనాలు ప్రవేశింపజేస్తాడు. నేను ఆ వచనాల ద్వారా దైవ స్తోత్రం చేస్తాను, ఇంకా సజ్దాలో పడి పోతాను. అప్పుడు ఓ ము’హమ్మద్! తల ఎత్తు, చెప్ప వలసిందేదో చెప్పు, వింటాను. అడుగు ఇవ్వటం జరుగుతుంది. సిఫారసు చేయి స్వీకరించటం జరుగుతుంది,’ అని అల్లాహ్(త) అంటాడు.
అప్పుడు నేను ”ఓ నా ప్రభూ! నా అనుచర సంఘాన్ని క్షమించు, నా అనుచర సంఘాన్ని కరుణించు,” అని ప్రార్థిస్తాను. అప్పుడు, ”వెళ్ళు, ఎవరి హృదయంలో రవ్వంత విశ్వాసం ఉన్నా, వారిని తీసుకురా,” అని ఆదేశించటం జరుగుతుంది. నేను వెళ్ళి వాళ్ళను తీయించిన తర్వాత మళ్ళీ వస్తాను. మళ్ళీ దైవస్తోత్రం చేస్తాను, సజ్దాలో పడిపోతాను. అప్పుడు, ‘ఓ ము’హమ్మద్! తలఎత్తు, చెప్పు, నీ మాట వినటం జరుగుతుంది. కోరు, కోరిక తీర్చటం జరుగుతుంది. సిఫారసు చేయి, సిఫారసు స్వీక రించటం జరుగుతుంది,’ అని అనటం జరుగుతుంది. అప్పుడు నేను, ‘ఓ నా ప్రభూ! నా అనుచర సమాజాన్ని క్షమించు, నా అనుచర సమాజాన్ని మన్నించు,’ అని ప్రార్థిస్తాను. అప్పుడు రవ్వంత విశ్వాసం ఎవరి హృదయంలో ఉన్నా వారందరినీ నరకం నుండి బయటకు తీసి మళ్ళీ అల్లాహ్(త) సన్నిధిలోకి వచ్చి స్తోత్రం చేసి, సజ్దాలో పడిపోతాను. మళ్ళీ, ‘ఓ ము’హమ్మద్! తలఎత్తు, చెప్పు నీ మాట వినటం జరుగుతుంది. అడుగు ఇవ్వటం జరుగు తుంది, సిఫారసు చేయి, సిఫారసు వినటం జరుగు తుంది,’ అని చెప్పటం జరుగుతుంది. అప్పుడు నేను ”నా అనుచర సమాజం, నా అనుచర సమాజం, నా అనుచర సమాజం అని అంటే వారిని క్షమించు,” అని ప్రార్థించటం జరుగుతుంది. అప్పుడు, ‘వెళ్ళు ఎవరి హృదయంలో రవ్వంత విశ్వాసం ఉన్నా, వారిని నరకం నుండి తీయించి తీసుకొని రా,’ అని ఆదేశించబడుతుంది. నేను వెళ్ళి అల్లాహ్(త) ఆదేశాను సారం ఆచరిస్తాను. ఆ తరువాత మళ్ళీ నాల్గవసారి దైవసన్నిధికి వెళ్ళి, సోత్రం చేసి, సజ్దాలో పడిపోతాను. మళ్ళీ, ‘ఓ ము’హమ్మద్! తలఎత్తు, కోరుకో, నీ కోరిక తీర్చటం జరుగుతుంది. అడుగు, ఇవ్వటం జరుగు తుంది. సిఫారసు చేయి స్వీక రించటం జరుగుతుంది అని ఆదేశించటం జరుగు తుంది. అప్పుడు నేను, ‘ఓ నా ప్రభూ! కేవలం ‘లా ఇలాహ ఇల్లల్లాహ్,’ అని, ‘పలికిన వారిని నరకం నుండి విముక్తి ప్రసాదించు,’ అని ప్రార్థిస్తాను. దానికి అల్లాహ్(త), ‘వారి గురించి సిఫారసు చేయటం నీకు తగదు, నా గొప్పతనం సాక్షి! నేనే వారిని నరకం నుండి విముక్తి ప్రసాదిస్తాను,’ అని అనటం జరుగుతుంది. (బు’ఖారీ, ముస్లిమ్)
5574 – [ 9 ] ( صحيح ) (3/1548)
عَنْ أَبِيْ هُرَيْرَةَ عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ: “أَسْعَدُ النَّاسِ بِشَفَاعَتِيْ يَوْمَ الْقِيَامَةِ مَنْ قَالَ: لَا إِلَهَ إِلَّا اللهُ خَالِصًا مِنْ قَلْبِهِ أَوْنَفْسِهِ”. رَوَاهُ الْبُخَارِيُّ.
5574. (9) [3/1548 –దృఢం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త(స) ప్రవచనం, ప్రపంచంలో నిర్మలమైన మనస్సుతో ”లాఇలాహ ఇల్ల ల్లాహ్” పలికిన అదృష్టవంతుడు మాత్రమే తీర్పుదినం నాడు నా సిఫారసుకు అర్హుడౌతాడు. (బు’ఖారీ)
5575 – [ 10 ] ( متفق عليه ) (3/1549)
وَعَنْهُ قَالَ أَتَى النَّبِيُّ صلى الله عليه وسلم بِلَحْمٍ فَرُفِعَ إِلَيْهِ الذِّرَاعُ وَكَانَتْ تُعْجِبُهُ فَنَهَسَ مِنْهَا نَهْسَةً ثُمَّ قَالَ: “أَنَا سَيِّدُ النَّاسِ يَوْمَ الْقِيَامَةِ يَوْمَ يَقُوْمُ النَّاسِ لِرَبِّ الْعَالَمِيْنَ وَتَدْنُو الشَّمْسُ فَيَبْلُغُ مِنَ الْغَمِّ وَالْكَرْبِ مَا لَا يَطِيْقُوْنَ فَيَقُوْلُ النَّاسُ أَلَا تَنْظُرُوْنَ مَنْ يَشْفَعُ لَكُمْ إِلى رَبِّكُمْ؟ فَيَأْتُوْنَ آدَمَ”. وَذَكَرَحَدِيْثَ الشَّفَاعَةِ وَقَالَ: “فَأَنْطَلِقُ فَآتِيْ تَحْتَ الْعَرْشِ فَأَقعُ سَاجِدًا لِرَبِّيْ ثُمَّ يَفْتَحُ اللهُ عَلَيَّ مِنْ مَحَامِدِهِ وَحُسْنِ الثَّنَاءِ عَلَيْهِ شَيْئًا لَمْ يَفْتَحُهُ عَلَى أَحَدٍ قَبْلِيْ ثُمَّ قَالَ يَا مُحَمَّدُ اِرْفَعْ رَأْسَكَ وَسَلْ تُعْطَهُ وَاشْفَعُ تُشَفَّعْ فَأَرْفَعُ رَأْسِيْ فَأَقُوْلُ أُمَّتِيْ يَارَبِّ أُمَّتِيْ يَارَبِّ. فَيُقَالُ يَا مُحَمَّدُ أَدْخِلْ مِنْ أُمَّتِكَ مَنْ لَا حِسَابَ عَلَيْهِمْ مِنَ الْبَابِ الْأَيْمَنِ مِنْ أَبْوَابِ الْجَنَّةِ وَهُمْ شُرَكَاءُ النَّاسِ فِيْمَا سِوَى ذَلِكَ مِنَ الْأَبْوَابِ”. ثُمَّ قَالَ: “وَالَّذِيْ نَفْسِيْ بِيَدِهِ إِنَّ مَا بَيْنَ الْمِصْرَاعَيْنِ مِنْ مَصَارِيْعِ الْجَنَّةِ كَمَا بَيْنَ مَكَّةَ وَهَجَرَ”. مُتَّفَقٌ عَلَيْهِ.
5575. (10) [3/1549 –ఏకీభవితం]
అబూ హురైరహ్ (ర) కథనం : ప్రవక్త (స) వద్దకు మాంసం తీసుకురావటం జరిగింది. అందులో నుండి తొడ భాగం ప్రవక్త (స) ముందు పెట్టబడింది. ప్రవక్త (స)కు అదంటే చాలా ఇష్టం. ప్రవక్త (స) దాన్నుండి పొడుచుకు తిన్నారు. ఇంకా ఇలా అన్నారు, ”తీర్పుదినం నాడు ప్రజలు అల్లాహ్ (త) ముందు నిలబడినపుడు, నేను అందరికీ నాయకుడిగా ఉంటాను. ఆ రోజు సూర్యుడు చాలా దగ్గరగా ఉంటాడు. ప్రజలు ఎంత ఆందోళన కరంగా ఉంటారంటే, దాన్ని భరించలేకుండా ఉంటారు. ప్రజలు పరస్పరం మన గురించి అల్లాహ్ (త) ముందు సిఫారసు చేసే వ్యక్తిని వెతుకుతుంటారు. అనంతరం ప్రజలు ఆదమ్ (అ) వద్దకు వెళతారు. ఆ తరువాత ప్రవక్త (స) లేదా అబూ హురైరహ్ (ర) సిఫారసు ‘హదీసు’ తెలిపారు. దాన్ని ప్రస్తావించిన తర్వాత ప్రవక్త (స) కథనం: ప్రజల వద్ద నుండి నేను బయలుదేరి అల్లాహ్ సింహాసనం క్రిందికి వస్తాను. అక్కడ నా ప్రభువు ముందు సజ్దాలో పడిపోతాను. అప్పుడు అల్లాహ్ (త) నాకు స్మరించేపదాలు నా హృదయంలో వేస్తాడు. అవి ఎలాంటివంటే అంతకు ముందు ఎవరి హృదయంలోనూ అవి వేసి ఉండవు. ఆ తరువాత అల్లాహ్ (త), ‘ఓ ము’హమ్మద్! నీ తల ఎత్తు, నీవు కోరింది అడుగు, ఇస్తాను. సిఫారసు చేయి, నేను స్వీకరిస్తాను,’ అని అంటాడు. అప్పుడు నేను తల ఎత్తుతాను. ‘ఓ నా ప్రభూ! నా అనుచర సమాజం, ఓ నా ప్రభూ! నా అనుచర సమాజాన్ని క్షమించు,’ అని వేడు కుంటాను. అప్పుడు, ఓ ము’హమ్మద్! విచారణ జరగని వారిని స్వర్గంలోని కుడిప్రక్క ద్వారం ద్వారా స్వర్గంలోనికి తీసుకు వెళ్ళు. వారు ఇతర ద్వారాలకు కూడా అర్హులే.’ ఆ తర్వాత ప్రవక్త (స) ఇలా అన్నారు, ‘ఎవరి చేతిలో నా ప్రాణం ఉందో ఆయన సాక్షి! స్వర్గద్వారాల్లో ప్రతి ద్వారంలోని రెండు రెక్కల మధ్య దూరం మక్కహ్ నుండి హిజ్‌ర్‌ల దూరం అంత ఉంటుంది.’ (ఇది బహ్‌రైన్‌లోని ఒక ప్రాంతం పేరు). (బు’ఖారీ, ముస్లిమ్)
5576 – [ 11 ] ( صحيح ) (3/1549)
وعَنْ حُذَيْفَةَ فِيْ حَدِيْثِ الشَّفَاعَةِ عَنْ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم قَالَ: “وَتُرْسَلُ الْأَمَانَةُ وَالرَّحِمُ فَتَقُوْمَانِ جَنْبَتَيِ الصِّرَاطِ يَمِيْنًا وَشِمَالًا”. رَوَاهُ مُسْلِمٌ.
5576. (11) [3/1549 –దృఢం]
హుజై’ఫహ్ (ర) ప్రవక్త (స) నుండి సిఫారసు ‘హదీసు’ను ఉల్లేఖిస్తూ ఇలా అన్నారు: ”ప్రవక్త (స) ఇలా అన్నారు, ‘నిజాయితీ, బంధత్వాలను పంపడం జరుగుతుంది. ఆ రెండూ ‘సిరా’త్ వంతెన వద్ద రెండు వైపులా నిలబడతాయి.” [19] (ముస్లిమ్)
5577 – [ 12 ] ( صحيح ) (3/1549)
وعَنْ عَبْدِ اللهِ بْنِ عَمْرٍو بْنِ الْعَاصِ أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم تَلَا قَوْلَ اللهِ تَعَالى فِيْ إِبْرَاهِيْمِ: [رَبِّ إِنَّهُنَّ أَضْلَلْنَ كَثِيْرًا مِنَ النَّاسِ فَمَنْ تَبِعَنِيْ فَإِنَّهُ مِنِّيْ؛14: 36] وَقَالَ عِيْسَى: [إِنْ تُعَذِّبْهُمْ فَإِنَّهُمْ عِبَادُكَ؛ 5: 118] فَرَفَعَ يَدَيْهِ فَقَالَ: “اللّهُمَّ أُمَّتِيْ أُمَّتِيْ”. وَبَكَى فَقَالَ اللهُ تَعَالى: “يَا جِبْرِيْلُ اذْهَبْ إِلى مُحَمَّدٍ وَرَبُّكَ أَعْلَمُ فَسَلْهُ مَا يُبْكِيْهِ؟” فَأَتَاهُ جِبْرِيْلُ فَسَأَلَهُ فَأَخْبَرَهُ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم بِمَا قَالَ. فَقَالَ اللهُ لِجِبْرَيْلَ اِذْهَبْ إِلى مُحَمَّدٍ فَقُلْ: إِنَّا سَنُرْضِيْكَ فِيْ أُمَّتِكَ وَلَا نَسُوْؤُكَ”. رَوَاهُ مُسْلِمٌ.
5577. (12) [3/1549 –దృఢం]
‘అబ్దుల్లాహ్ బిన్ ‘అమ్ర్ బిన్ అల్ ‘ఆ’స్ (ర) కథనం: ప్రవక్త (స) తీర్పుదినం నాడు ఇబ్రాహీమ్ (అ) చేసే దరఖాస్తు గురించి ప్రస్తావిస్తూ, ఈ ఆయతును పఠించారు: ”ఓ నా ప్రభూ! నిశ్చయంగా, అవి (ఈ విగ్రహాలు) అనేక మానవులను మార్గభ్రష్టులుగా చేసాయి. ఇక నా విధానాన్ని అనుసరించేవాడు, నిశ్చయంగా, నావాడు. మరియు ఎవడైనా నా విధా నాన్ని ఉల్లంఘిస్తే! నిశ్చయంగా, నీవు క్షమాశీలుడవు, అపార కరుణా ప్రదాతవు.” (ఇబ్రాహీం, 14:36)
ఇంకా ప్రవక్త (స) ‘ఈసా (అ) దరఖాస్తును కూడా ప్రస్తా విస్తూ ఈ ఆయతు పఠించారు, ”ఓ అల్లాహ్! ‘ఒకవేళ నీవు వారిని శిక్షించదలచితే, వారు నీ దాసులే…” (అల్ మాయి’దహ్, 5:118)
ఆ తరువాత ప్రవక్త (స) తన రెండు చేతులూ ఎత్తి, ”ఓ అల్లాహ్! నా అనుచర సమాజాన్ని క్షమించు, నా అనుచర సమాజాన్ని క్షమించు,” అని ప్రార్థించి ఏడ్వ సాగారు. అల్లాహ్(త) జిబ్రీల్ (అ) ను, ‘ఓ జిబ్రీల్! ము’హమ్మద్ వద్దకు వెళ్ళి, ఎందుకు ఏడుస్తున్నావని అడుగు,’ అని ఆదేశించాడు. జిబ్రీల్ (అ) ము’హ మ్మద్ (స) వద్దకు వచ్చి అడిగారు. అప్పుడు ప్రవక్త (స) చెప్పగలిగింది చెప్పారు. అల్లాహ్ (త) ప్రవక్త (స) మాటలు విని జిబ్రీల్! ము’హమ్మద్ (స) వద్దకు వెళ్ళి, ‘మేము నీ అనుచర సమాజం విషయంలో నిన్ను సంతృప్తి పరుస్తాము, నిరాశకు గురిచేయము,’ అని చెప్పమని ఆదేశించారు. (ముస్లిమ్)
5578 – [ 13 ] ( متفق عليه ) (3/1550)
وَعَنْ أَبِيْ سَعِيْدِ الْخُدْرِيِّ أَنَّ نَاسًا قَالُوْا يَا رَسُوْلَ اللهِ هَلْ نَرَى رَبَّنَا يَوْمَ الْقِيَامَةِ؟ قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “نَعَمْ هَلْ تُضَارُّوْنَ فِيْ رُؤْيَةِ الْقَمَرِ لَيْلَةَ الْبَدْرِ صَحْوًا لَيْسَ فِيْهَا سَحَابٌ؟ “قَالُوْا: لَا يَا رَسُوْلَ اللهِ. قَالَ: “مَا تُضَارُّوْنَ فِيْ رُؤْيَةِ اللهِ يَوْمَ الْقِيَامَةِ إِلَّا كَمَا تُضَارُّوْنَ فِيْ رُؤْيَةٍ أَحَدٌهُمَا إِذَا كَانَ يَوْمَ الْقِيَامَةِ أَذَّنَ مُؤَذِّنٌ لِيَتَّبِعَ كُلُّ أُمَّةٍ مَا كَانَتْ تَعْبُدُ فَلَا يَبْقَى أَحَدٌ كَانَ يَعْبُدُ غَيْرَاللهِ مِنَ الْأَصْنَامِ وَالْأَنْصَابِ إِلَّا يَتَسَاقَطُوْنَ فِي النَّارِ حَتّى إِذَا لَمْ يَبْقَ إِلَّا مَنْ كَانَ يَعْبُدُ اللهُ مِنْ بَرٍّوَفَاجِرٍ أَتَاهُمْ رَبُّ الْعَالَمِيْنَ. قَالَ: فَمَاذَا تَنْظُرُوْنَ؟ يَتَّبِعُ كُلُّ أُمَّةٍ مَا كَانَتْ تَعْبُدُ. قَالُوْا: يَارَبَّنَا فَارَقْنَا النَّاسَ فِي الدُّنْيَا أَفْقَرَ مَا كُنَّا إِلَيْهِمْ وَلَمْ نُصَاحِبْهُمْ”.
5578. (13) [3/1550– ఏకీభవితం]
అబూ స’యీద్ ‘ఖుద్రీ (ర) కథనం: ఒక రోజు కొంత మంది, ‘ఓ ప్రవక్తా! తీర్పుదినం నాడు మేము మా ప్రభువును చూడగలమా?’ అని ప్రశ్నించారు. దానికి ప్రవక్త (స), ‘అవును చూస్తారు, మధ్యాహ్న సమయంలో మేఘాలు లేనప్పుడు సూర్యుడ్ని చూడటం మీకు కష్టంగా ఉందా? అదేవిధంగా వెన్నెల రాత్రుల్లో మేఘాలు లేనప్పుడు చంద్రుణ్ణి చూడటంలో మీకు కష్టంగా ఉంటుందా?’ అని అడిగారు. దానికి వారు, ‘ఎంతమాత్రం కాదు ఓ ప్రవక్తా!’ అని అన్నారు. అప్పుడు ప్రవక్త (స), ‘మరి తీర్పుదినం నాడు అల్లాహ్(త)ను చూడటంలో ఎటువంటి కష్టం కలుగదు. ఈ రెంటిని చూడటంలో కష్టం కలగనట్లు,’ అని అన్నారు. ఆ తరువాత ప్రవక్త (స), ”తీర్పుదినం నాడు ఒక ప్రకటించే వాడు, ప్రతి అనుచర సమాజం, సంఘం తాను ఆరాధించేవాని వైపు వెళ్ళాలి,” అని ప్రకటిస్తాడు. అనంతరం అల్లాహ్(త)కు బదులు ఇతరులను ఆరాధించేవారు నరకాగ్నిలో పడి పోతారు. కొంతమంది మిగిలి ఉంటారు. అంటే అల్లాహ్(త) ను ఆరాధించేవారు. అల్లాహ్(త) వారి వద్దకు వచ్చి, ‘మీరు ఎవరి గురించి వేచి ఉన్నారు, ప్రతి అనుచర సమాజం తాను పూజించే వాని వెంట వెళ్ళిపోయింది,’ అని అంటాడు. దానికి వారు, ‘ఓ మా ప్రభూ! ప్రపంచంలోనే మాకు వారి అవసరం ఉన్నా, వారికి దూరంగా ఉండేవాళ్ళం,’ అని అంటారు.
5579 – [ 14 ] ( متفق عليه ) (3/1550)
وَفِيْ رِوَايَةٍ أَبِيْ هُرَيْرَةَ “فَيَقُوْلُوْنَ: هَذَا مَكَانُنَا حَتَّى يَأْتِيْنَا رَبُّنَا فَإِذَا جَاءَ رَبُّنَا عَرَفْنَاهُ”
وَفِيْ رِوَايَةٍ أَبِيْ سَعِيْدٍ: “فَيَقُوْلُ هَلْ بَيْنَكُمْ وَبَيْنَهُ آَيَةٌ تَعْرِفُوْنَهُ؟ فَيَقُوْلُوْنَ: نَعَمْ. فَيَكْشِفُ عَنْ سَاقٍ فَلَا يَبْقَى مَنْ كَانَ يَسْجُدُ لِلّهِ مَنْ تِلْقَاءِ نَفْسِهِ إِلَّا أَذِنَ اللهُ لَهُ بِالسُّجُوْدِ وَلَا يَبْقَى مَنْ كَانَ يَسْجُدُ اِتِّقَاءً وَّرِيَاءً إِلَّا جَعَلَ اللهُ ظَهْرَهُ طَبْقَةً وَّاحِدَةً كُلَّمَا أَرَادَ أَنْ يَّسْجُدَ خَرَّ عَلَى قَفَاهُ ثُمَّ يَضْرِبُ الْجَسْرُ عَلَى جَهَنَّمَ وَتَحِلُّ الشَّفَاعَةُ. وَيَقُوْلُوْنَ اَللّهُمَّ سَلِّمْ سَلِّمْ فَيَمُرُّ الْمُؤْمِنُوْنَ كَطَرْفِ الْعَيْنِ وَكَالْبَرْقِ وَكَالرِّيْحِ وَكَالطَّيْرِ وَكَأَجَاوِيْدِ الْخَيْلِ وَالرِّكَابِ فَنَاجٍ مُسَلَّمٌ وَمَخْدُوْشٌ مُرْسَلٌ وَمَكْدُوْسٌ فِيْ نَارٍ جَهَنَّمَ حَتَّى إِذَا خَلَصَ الْمُؤْمِنُوْنَ مِنَ النَّارِ فَوَالَّذِيْ نَفْسِيْ بِيَدِهِ مَا مِنْ أَحَدٍ مِنْكُمْ بِأَشَدّ مُنَاشَدَةً فِي الْحَقِّ – قَدْ تَبَيَّنَ لَكُمْ – مِنَ الْمُؤْمِنِيْنَ لِلّهِ يَوْمَ الْقِيَامَةِ لِإِخْوَانِهِمُ الَّذِيْنَ فِي النَّارِ يَقُوْلُوْنَ رَبَّنَا كَانُوْا يَصُوْمُوْنَ مَعَنَا وَيُصَلُّوْنَ وَيَحُجُّوْنَ. فَيُقَالُ لَهُمْ: أَخْرِجُوْا مَنْ عَرَفْتُمْ فَتُحَرَّمُ صُوَرُهُمْ عَلَى النَّارِ فَيَخْرِجُوْنَ خَلْقًا كَثِيْرًا ثُمَّ يَقُوْلُوْنَ: رَبَّنَا مَا بَقِىَ فِيْهَا أَحَدٌ مِّمَّنْ أَمَرْتَنَا بِهِ. فَيَقُوْلُ: اِرْجِعُوْا فَمَنْ وَجَدْتُمْ فِيْ قَلْبِهِ مِثْقَالَ دِنْيَارٍ مِنْ خَيْرٍ فَأَخْرِجُوْهُ فَيَخْرُجُوْنَ خَلْقًا كَثِيْرًا ثُمَّ يَقُوْلُ: اِرْجِعُوْا فَمَنْ وَجَدْتُمْ فِيْ قَلْبِهِ مِثْقَالَ نِصْفِ دِيْنَارٍ مِنْ خَيْرٍ فَأَخْرِجُوْهُ فَيَخْرِجُوْنَ خَلْقًا كَثِيْرًا ثُمَّ يَقُوْلُ: اِرْجِعُوْا فَمَنْ وَجَدْتُمْ فِيْ قَلْبِهِ مِثْقَالَ ذَرَّةٍ مِنْ خَيْرٍ فَأَخْرِجُوْهُ فَيَخْرِجُوْنَ خَلْقًا كَثِيْرًا ثُمَّ يَقُوْلُوْنَ: رَبَّنَا لَمْ نَذَرْ فِيْهَا خَيْرًا. فَيَقُوْلُ اللهُ شَفَعَتِ الْمَلَائِكَةُ وَشَفَعَ النَّبِيُّوْنَ وَشَفَعَ الْمُؤْمِنُوْنَ وَلَمْ يَبْقَ إِلَّا أَرْحَمُ الرَّاحِمِيْنَ فَيَقْبِضُ قَبْضَةً مِنَ النَّارِ فَيَخْرِجُ مِنْهَا قَوْمًا لَمْ يَعْمَلُوْا خَيْرًا قَطُّ قَدْ عَادُوْا حُمْمًا فَيُلْقِيْهِمْ فِيْ نَهْرٍ فِيْ أَفْوَاهِ الْجَنَّةِ يُقَالُ لَهُ: نَهْرُ الْحَيَاةٍ فَيَخْرُجُوْنَ كَمَا تَخْرُجُ الْحَبَّةُ فِيْ حَمِيْلِ السَّيْلِ فَيَخْرُجُوْنَ كَاللُّؤْلُؤِ فِيْ رِقَابِهِمُ الْخَوَاتِمُ فَيَقُوْلُ أَهْلُ الْجَنَّةِ: هَؤُلَاءِ عُتَقَاءُ الرّحْمَنِ أَدْخَلَهُمُ الْجَنَّةَ بِغَيْرِ عَمَلٍ وَلَا خَيْرٍ قَدَّمُوْهُ. فَيُقَالُ لَهُمْ لَكُمْ مَا رَأَيْتُمْ وَمِثْلُهُ مَعَهُ”. مُتَّفَقٌ عَلَيْهِ.
5579. (14) [3/1550– ఏకీభవితం]
అబూ హురైరహ్‌కు చెందిన మరో ఉల్లేఖనంలో ఇలా ఉంది, ”వారిలా అంటారు, ‘మేము అక్కడ నిలబడి ఉంటాము, అప్పుడు మాప్రభువు మాదగ్గరకు వస్తాడు, మేమతన్ని గుర్తిస్తాము.’ ఇంకా అబూ స’యీద్‌కి చెందిన ఒక ఉల్లేఖ నంలో ఇలా ఉంది, ‘మీకూ మీ దైవానికి మధ్య ఏవైనా గుర్తులు ఉన్నాయా?’ అని అల్లాహ్(త) ప్రశ్నిస్తాడు. దానికి వారు, ‘అవును,’ అని అంటారు. అప్పుడు చీలమండ (ankle) విప్పటం జరుగుతుంది. నిర్మలమైన మనస్సుతో అల్లాహ్(త)కు సజ్దా చేసే వారందరికి సజ్దా చేసే అనుమతి, భాగ్యం కలుగుతుంది. ఇంకా ప్రదర్శనాబుద్ధితో సజ్దాచేసే వారికి నడుము పట్టుకొని, సజ్దా చేయగోరినప్పుడు పడిపోతారు. ఆ తరువాత నరకంపై ‘సిరా’త్ వంతెనను ఉంచడం జరుగుతుంది. అనంతరం సిఫారసు చేసే అనుమతి లభిస్తుంది. అనంతరం ప్రవక్తలందరూ ఇలా ప్రార్థిస్తారు: ‘ఓ అల్లాహ్(త)! వారిని ‘సిరా’త్‌పై నుండి క్షేమంగా సాగనంపు. ముస్లిముల్లో కొందరు ‘సిరా’త్ వంతెనను రెప్ప పాటులో దాటుతారు. మరికొందరు పిడుగులా, మరికొందరు గాలిలా, పక్షుల్లా, గుర్రాల్లా మరికొందరు ఒంటెల్లా దాటుతారు. వారిలో కొందరు ఎటువంటి హాని కలగకుండా సాఫల్యం పొందుతారు. మరికొందరు గాయపడతారు. కాని గమ్యాన్ని చేరుకుంటారు. మరికొందరు నరకంలో పడిపోతారు. విశ్వాసులు నరకం నుండి విముక్తి పొందిన తర్వాత, ఎవరి చేతిలో నా ప్రాణం ఉందో ఆయన సాక్షి! నరకంలో మిగిలి వున్న ఆ సోదరుల గురించి, మీరు తప్ప ఇతరులెవ్వరూ తీవ్రంగా ప్రయత్నించరు. అనంతరం విశ్వాసులు అల్లాహ్(త) ను, ‘ఓ అల్లాహ్! వీళ్ళు మాతోపాటు ఉపవాసాలు పాటించేవారు, నమా’జులు చదివేవారు, ‘హజ్జ్ చేసేవారు. కనుక వారిని కూడా నరకం నుండి విముక్తి ప్రసాదించు,’ అని వేడుకుంటారు. అప్పుడు వారిని, ‘మీకు పరిచయం ఉన్నవారిని నరకంలో నుండి తీసుకోండి.’ మానవుల ముఖాలు కాల్చరాదని నరకానికి నిషేధాజ్ఞ అయి ఉంటుంది. అనంతరం విశ్వా సులు అనేక మంది విశ్వాసులను నరకం నుండి తీయ టం జరుగుతుంది. ఆ తరువాత మళ్ళీ, ‘ఓ మా ప్రభూ! నీవు చెప్పిన వారిని నరకం నుండి తీసి వేసాము. అటువంటి వారెవరూ నరకంలో లేరు,’ అని అంటారు విశ్వాసులు. అప్పుడు అల్లాహ్ (త), ‘మంచిది, నరకంలో మళ్ళీ వెళ్ళి ఎవరి హృదయంలో దీనారంత విశ్వాసం ఉన్నా వారిని నరకం నుండి తీసి వేయండి,’ అని ఆదేశిస్తాడు. వాళ్ళు అనేకమందిని నరకం నుండి తీస్తారు. ఆ తరువాత మళ్ళీ అల్లాహ్ (త), ‘సగం దీనారంత విశ్వాసం ఉన్నా వారినీ నరకం నుండి తీసివేయండి,’ అని ఆదేశిస్తాడు. వాళ్ళు అనేక మందిని నరకం నుండి తీసివేస్తారు. మళ్ళీ అల్లాహ్(త) వారిని, ‘తిరిగి వెళ్ళి ఏమాత్రం మంచి ఉన్నా వారందరినీ తీసెయ్యండి,’ అని ఆదేశిస్తాడు. వాళ్ళు వెళ్ళి అనేక మందిని నరకం నుండి తీసివేస్తారు.
అనంతరం అల్లాహ్(త)తో, ‘మా ప్రభూ! మేము నరకంలో ఎటువంటి మంచిని ఉంచలేదు,’ అని అంటారు. అప్పుడు అల్లాహ్ (త): ‘దైవదూతలు, ప్రవక్తలు, విశ్వాసులు సిఫారసుచేసారు. కాని ఇంకా అనంత కరుణామయుడు మిగిలి ఉన్నాడు,’ అని పలికి, అల్లాహ్(త) నరకంలో నుండి తన పిడికెడు ఏనాడూ మంచి పని చేయని వారిని తీస్తాడు. వీళ్ళు నరకంలో బొగ్గుగా మారి ఉంటారు. స్వర్గం ముందున్న కోనేరులో వారిని వేయడం జరుగుతుంది. పూర్తిగా పరిశుద్ధమై, మెరుస్తూ వారు బయటపడతారు. దాన్ని అమృతకోనేరు అని పిలవటం జరుగుతుంది. వారి మెడల్లో లేబిళ్ళు ఉంటాయి. స్వర్గవాసులు, ‘వీళ్లను ర’హ్మాన్ విడుదలచేసారు,’ అని అంటారు. వీళ్ళు ఎటువంటి పుణ్యకార్యాలు చేయక పోయినప్పటికీ వారిని అల్లాహ్ స్వర్గంలోకి పంపాడు. ఇంకా వారితో, ‘స్వర్గంలో ఉన్న దైవానుగ్రహాలన్నీ మీకోసమే,’ అని చెప్పటం జరుగుతుంది. (బు’ఖారీ, ముస్లిమ్)
5580 – [ 15 ] ( متفق عليه ) (3/1551)
وَعَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِذَا دَخَلَ أَهْلُ الْجَنَّةِ الْجَنَّةَ وَأَهْلُ النَّارِ النَّارَ. يَقُوْلُ اللهُ تَعَالى: مَنْ كَانَ فِيْ قَلْبِهِ مِثْقَالُ حَبَّةٍ مَنْ خَرْدَلٍ مِنْ إِيْمَانٍ فَأَخْرِجُوْهُ فَيَخْرجوْنَ قَدْ امْتُحِشُوْا وَعَادُوْا حُمَمًا فَيُلْقَوْنَ فِيْ نَهْرِ الْحَيَاةِ فَيَنْبُتُوْنَ كَمَا تَنْبُتُ الْحِبَّةُ فِيْ حَمِيْلِ السَّيْلِ أَلَمْ تَرَوْا أَنَّهَا تَخْرُجُ صَفْرَاءَ مُلْتَوِيَةً”. مُتَّفَقٌ عَلَيْهِ .
5580. (15) [3/1551– ఏకీభవితం]
అబూ స’యీద్ ‘ఖుద్రీ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”స్వర్గవాసులను స్వర్గంలో, నరకవాసులను నరకంలో పంపివేసిన తర్వాత, అల్లాహ్(త), ‘హృద యంలో రవ్వంత విశ్వాసం ఉన్నవారిని కూడా నరకంలో నుండి తీసివేయండి,’ అని ఆదేశిస్తాడు. అనంతరం వారిని నరకం నుండి బయటకు తీయటం జరుగుతుంది. అప్పుడు వారు కాలి బొగ్గులా తయారై ఉంటారు. వారిని ”నహ్‌రె హయాత్” లో వేయడం జరుగుతుంది. వారు అందులో నుండి పరిశుద్ధులై తుఫాను చెత్తలో పచ్చగడ్డి మొలచినట్టు బయటకు వస్తారు. (బు’ఖారీ, ముస్లిమ్)
5581 – [ 16 ] ( متفق عليه ) (3/1551)
وَعَنْ أَبِيْ هُرَيْرَةَ أَنَّ النَّاسَ قَالُوْا: يَا رَسُوْلَ اللهِ هَلْ نَرَى رَبَّنَا يَوْمَ الْقِيَامَةِ؟ فَذَكَرَ مَعْنَى حَدِيْثِ أَبِيْ سَعِيْدٍ غَيْرَ كَشْفِ السَّاقِ وَقَالَ: “يُضْرَبُ الصِّرَاطُ بَيْنَ ظَهْرَانِيْ جَهَنَّمَ فَأَكُوْنُ أَوَّلَ مَنْ يَّجُوْزُ مِنَ الرُّسُلِ بِأُمَّتِهِ وَلَا يَتَكَلَّمُ يَوْمَئِذٍ الرُّسُلُ وَكَلَامُ الرُّسُلِ يَوْمَئِذٍ: اَللّهُمَّ سَلِّمْ سَلِّمْ. وَفِيْ جَهَنَّمَ كَلَالِيْبُ مِثْلُ شَوْكِ السَّعْدَانِ وَلَا يَعْلَمُ قَدْرَ عَظمِهَا إِلّا اللهُ تَخْطِفُ النَّاسَ بِأَعْمَالِهِمْ فَمِنْهُمْ مَنْ يُوْبَقُ بِعَمَلِهِ وَمِنْهُمْ مَنْ يُخَرْدَلُ ثُمَّ يَنْجُوْ حَتّى إِذَا فَرَغَ اللهُ مَنِ الْقَضَاءَ بَيْنَ عِبَادِهِ وَأَرَادَ أَنْ يُّخْرِجَ مِنَ النَّارِ مَنْ أَرَادَ أَنْ يُخْرِجَهُ مِمَّنْ كَانَ يَشْهَدُ أَنْ لَا إِلَهَ إِلّا اللهُ أَمَرَ الْمَلَائِكَةَ أَنْ يُخْرِجُوْا مَنْ يَعْبُدُ اللهُ فَيُخْرِجُوْنَهُمْ وَيَعْرِفُوْنَهُمْ بِآثَارِ السُّجُوْدِ وَحَرَّمَ اللهُ تَعَالى عَلَى النَّارِ أَنْ تَأْكُلَ أَثَرَ السُّجُوْدِ فَكُلُّ ابْنِ آدَمَ تَأْكُلُهُ النَّارُ إِلَّا أَثَرَ السُّجُوْدِ فَيَخْرِجُوْنَ مِنَ النَّارِ قَدِ امْتُحِشُوْا فَيُصَبُّ عَلَيْهِمْ مَاءُ الْحَيَاةِ فَيَنْبُتُوْنَ كَمَا تَنْبُتُ الْحِبَّةُ فِيْ حَمِيْلِ السَّيْلِ وَيَبْقَى رَجُلٌ بَيْنَ الْجَنَّةِ وَالنَّارِ وَهُوَ آخِرُ أَهْلِ النَّارِ دُخُوْلًا الْجَنَّةَ مُقْبِلٌ بِوَجْهِهِ قِبَلَ النَّارِ فَيَقُوْلُ: يَا رَبِّ اِصْرِفْ وَجْهِيْ عَنِ النَّارِ فَإِنَّهُ قَدْ قَشْبَنِيْ رِيْحُهَا وَأَحْرَقَنِيْ ذَكَاؤُهَا. فَيَقُوْلُ: هَلْ عَسَيْتَ إِنْ أَفْعَلْ ذَلِكَ أَنْ تَسْأَلَ غَيْرَ ذَلِكَ؟ فَيَقُوْلُ: وَلَا وَعِزَّتِكَ فَيُعْطِي اللهَ مَا شَاءَ اللهَ مِنْ عَهْدٍ وَمِيْثَاقٍ فَيَصْرِفُ اللهُ وَجْهَهُ عَنِ النَّارِ. فَإِذَا أَقْبَلَ بِهِ عَلَى الْجَنَّةِ وَرَأَى بَهْجَتَهَا سَكَتَ مَا شَاءَ اللهُ أَنْ يَّسْكُتَ ثُمَّ قَالَ: يَا رَبِّ قَدِّمْنِيْ عِنْدَ بَابِ الْجَنَّةِ. فَيَقُوْلُ اللهُ تَبَارَكَ وَتَعَالى: اَلَيْسَ أضعْطَيْتَ الْعُهُوْدَ وَالْمِيْثَاقَ أَنْ لَا تَسْأَلَ غَيْرَ الَّذِيْ كُنْتَ سَأَلْتَ. فَيَقُوْلُ: يَا رَبِّ لَا أَكُوْنُ أَشْقَى خَلْقِكَ. فَيَقُوْلُ: فَمَا عَسَيْتَ إِنْ أُعْطِيْتَ ذَلِكَ أَنْ تَسْأَلَ غَيْرَهُ. فَيَقُوْلُ: لَا وَعِزَّتِكَ لَا أَسْأَلُكَ غَيْرَ ذَلِكَ فَيُعْطِيْ رَبَّهُ مَا شَاءَ مَنْ عَهْدٍ وَمِيْثَاقٍ فَيُقَدِّمُهُ إِلى بَابِ الْجَنَّةِ فَإِذَا بَلَغَ بَابَهَا فَرَأى زَهْرَتَهَا وَمَا فِيْهَا مِنَ النَّضْرَةِ وَالسُّرُوْرِ فَسَكَتَ مَا شَاءَ اللهُ أَنْ يَّسْكُتَ فَيَقُوْلُ: يَا رَبِّ أَدْخِلْنِيْ الْجَنَّةَ. فَيَقُوْلُ اللهُ تَبَارَكَ وَتَعَالى: وَيْلَكَ يَا ابْنَ آدَمَ مَا أَغْدَرَكَ أَلَيْسَ قَدْ أَعْطَيْتَ الْعُهُوْدَ وَالْمِيْثَاقَ أَنْ لَا تَسْأَلَ غَيْرَ الَّذِيْ أُعْطِيتَ. فَيَقُوْلُ: يَا رَبِّ لَا تَجْعَلْنِيْ أَشْقَى خَلْقِكَ فَلَا يَزَالُ يَدْعُوْ حَتّى يَضْحَكَ اللهُ مِنْهُ فَإِذَا ضَحِكَ أَذِنَ لَهُ فِيْ دُخُوْلِ الْجَنَّةِ. فَيَقُوْلُ: تَمَنَّ فَيَتَمَنّى حَتّى إِذَا انْقَطَعَتْ أُمْنِيَّتُهُ. قَالَ اللهُ تَعَالى: تَمَنَّ مِنْ كَذَا وَكَذَا أَقْبَلَ يُذَكِّرُهُ رَبُّهُ حَتَّى إِذَا انْتَهَتْ بِهِ الْأَمَانِيُّ قَالَ اللهُ: لَكَ ذَلِكَ وَمِثْلُهُ مَعَهُ”
وَفِيْ رِوَايَةٍ أَبِيْ سَعِيْدٍ: “قَالَ اللهُ: لَكَ ذَلِكَ وَعَشْرَةُ أَمْثَالِهِ”. مُتَّفَقٌ عَلَيْهِ.
5581. (16) [3/1551 –ఏకీభవితం]
అబూ హురైరహ్ (ర) కథనం: ఒకరోజు ప్రజలు, ‘ఓ ప్రవక్తా! తీర్పుదినం నాడు మేము మా ప్రభువును చూస్తామా?’ అని విన్నవించుకున్నారు. ఆ తరువాత అబూ హురైరహ్ (ర) అబూ స’యీద్‌కు సమాన భావం గల ‘హదీసు’ను ఉల్లేఖించారు. అందులో చీలమండ తెరచుకోవటం గురించి ప్రస్తావించలేదు. ఇలా అన్నారు, ప్రవక్త (స) ఇలా అన్నారు, ”నరకంపై ‘సిరా’త్ వంతెన ఉంచబడిన తర్వాత, తమ అనుచర సమాజాలను తీసుకొని ఆ వంతెనను దాటే ప్రవక్త లందరిలో ముందు నేను నా అనుచర సమాజాన్ని తీసుకొని దాటుతాను. ఆ రోజు ప్రవక్తలకు తన గురించి తప్ప మరెవ్వరి గురించి మాట్లాడే అవకాశం ఇవ్వబడదు. ప్రవక్తలు కూడా కేవలం, ‘ఓ అల్లాహ్ (త)! మమ్మల్ని క్షేమంగా ఉంచు, క్షేమంగా ఉంచు,’ అని మాత్రమే ప్రార్థిస్తారు. నరకంలో స’అదాన్ ముళ్ళ లాంటి కంచెలు ఉంటాయి. అవి ఏ పరిమాణంలో ఉంటాయన్నది అల్లాహ్(త)కు తప్ప మరెవరికీ తెలియదు. అవి ప్రజలను వారి పాపాల ప్రకారం పట్టుకుంటాయి. అంటే వాళ్ళను నాశనం చేస్తాయి. కాని మళ్ళీ విముక్తి పొందుతారు. అనంతరం అల్లాహ్ (త) దాసుల విచారణ జరిపిన తర్వాత, ”లా ఇలాహ ఇల్లల్లాహు ము’హమ్మదుర్రసూలుల్లాహ్” పలికిన వారిని నరకం నుండి విముక్తి ప్రసాదించగోరి దైవ దూతలను ఆదేశిస్తాడు. దైవదూతలు వారిని నరకం నుండి బయటకు తీసివేస్తారు. దైవదూతలు వారిని నుదురుపై సజ్దా చిహ్నాల వల్ల గుర్తుపడతారు.
ఎందుకంటే అల్లాహ్(త) వారిపై నరకాగ్నిని నిషేధించి ఉంటాడు. అందువల్ల నరకాగ్ని మానవుని శరీరాన్నంతా తినివేస్తుంది కాని, సజ్దాల చిహ్నాలను హరించదు. అయితే వారు నరకం నుండి కాలి నల్లని స్థితిలో బయటకు వస్తారు. వారిపై అమృతం వేయబడు తుంది. దానివల్ల వారు పూర్వ స్థితిని పొందుతారు. చెత్తలో పచ్చని గడ్డి మొలచినట్టు. ఒక వ్యక్తి స్వర్గనరకాల మధ్య మిగిలి ఉంటాడు. అతడు నరకం నుండి స్వర్గంలో ప్రవేశించే వారిలో చివరివాడై ఉంటాడు. అతని ముఖం నరకం వైపు తిరిగి ఉంటుంది. అతడు, ‘ఓ అల్లాహ్(త)! నాముఖం నరకం వైపు నుండి త్రిప్పివేయి. నరకరుచి నాకు చాలా తీవ్రంగా శిక్షించింది. నరకజ్వాలలు నన్ను కాల్చివేసాయి,’ అని అంటాడు. దానికి అల్లాహ్ (త), ‘నేనలా చేస్తే, అంటే నీ ముఖం త్రిప్పితే, నువ్వు మరేమైనా అడుగుతావు,’ అని అంటాడు. దానికతడు, ‘నీ గౌరవం సాక్షి! నేనేమీ అడగను.’ ఆ తరువాత అల్లాహ్ (త) అతనితో వాగ్దానం తీసుకొని, అతని ముఖాన్ని స్వర్గం వైపు త్రిప్పివేస్తాడు. అతడు స్వర్గంవైపు చూచి, దాని సుఖసంతోషాలపై అతని దృష్టి పడుతుంది. అతడు ఊరుకుంటాడని అల్లాహ్ (త) కోరుతాడు. అనంతరం ఆ వ్యక్తి, ‘ఓ అల్లాహ్ (త)! నన్ను స్వర్గద్వారాల వద్దకు చేర్చు,’ అని ప్రార్థిస్తాడు. అప్పుడు అల్లాహ్ (త), ‘మరేమీ అడగనని వాగ్దానం చేసావు కదా,’ అని అంటాడు. అప్పుడు ఆ వ్యక్తిస ‘ఓ అల్లాహ్ (త)! సృష్టితాలన్నిటి కంటే నీచదురదృష్టానికి గురిచేయకు,’ అని ప్రార్థిస్తాడు.
అప్పుడు అల్లాహ్ (త), ‘నీ ఈ కోరిక తీర్చితే మరో కోరిక కోరవు కదా?’ అని అంటాడు. దానికి ఆ వ్యక్తి, ‘నీ గౌరవం సాక్షి! మరే కోరిక కోరను,’ అని అంటాడు. ఆ తరువాత అతని నుండి వాగ్దానం తీసుకోవటం జరుగుతుంది. అతన్ని స్వర్గ ద్వారం దగ్గరకు చేర్చటం జరుగుతుంది. ద్వారం దగ్గరకు చేరి, స్వర్గ సుఖాలను, స్వర్గ అనుగ్రహాలను చూచి, ఇటు అల్లాహ్(త) ఆ వ్యక్తి మరేమీ అడగను అంటాడు. కాని ఆ వ్యక్తి మళ్ళీ, ‘ఓ ప్రభూ! నన్ను స్వర్గంలో చేర్చవా?’ అని విన్నవించు కుంటాడు. దానికి అల్లాహ్, ‘ఓ ఆదమ్ పుత్రుడా! నీపై చాలా విచారం వేస్తుంది. నీవు వాగ్దన భంగం చేసావు. నేను నీ కోరిక ప్రకారం ఇచ్చాను. దానిపై సంతృప్తి చెందుతావని’ అని అంటాడు. దానికి ఆ వ్యక్తి, ‘నువ్వు నీ సృష్టితాల్లో అందరికంటే అభాగ్యునిగా చేయకు,’ అని అంటాడు. ఆ వ్యక్తి అలాగే అడుగుతూ ఉంటాడు. చివరికి అల్లాహ్(త) అతని కోరికను స్వీకరించి అతన్ని స్వర్గంలోనికి పంపుతాడు. ఆ తరువాత అల్లాహ్(త), ‘ఇంకా నీ మనసులో ఏమైనా కోరికలు ఉంటే చెప్పు,’ అని అంటాడు. అతడు తన కోరికలను చెప్పు కుంటాడు. అతని కోరికలు తీరిన తర్వాత, అల్లాహ్ అతనితో ‘ఫలానా కోరికలు కోరు’ అని అంటాడు. ఆ కోరికలు కూడా తీరిన తర్వాత అల్లాహ్(త) అతనితో, ‘ఇవే కాదు, ఇంకా ఇటువంటి అనుగ్రహాలన్నీ నీకు ఇవ్వబడతాయి,’ అని అంటాడు. (బు’ఖారీ, ముస్లిమ్)
అబూ స’యీద్ ఉల్లేఖనంలో ఇలా ఉంది, ”అల్లాహ్ ఇలా ఆదేశిస్తాడు, ‘ఇవే కాదు, వీటితో పాటు 10 అంతల అనుగ్రహాలు నీకు ఇవ్వబడుతున్నాయి.’ అని అంటాడు.”
5582 – [ 17 ] ( صحيح ) (3/1553)
وَعَنْ ابْنِ مَسْعُوْدٍ أَنَّ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم قَالَ:”آخِرُ مَنْ يَّدْخُلُ الْجَنَّةَ رَجُلٌ يَمْشِيْ مَرَّةً وَيَكْبُوْ مَرَّةً وَتَسْفَعُهُ النَّارُ مَرَّةً فَإِذَا جَاؤُوْهَا اِلْتَفَتَ إِلَيْهَا فَقَالَ: تَبَارَكَ الَّذِيْ نَجَّانِيْ مِنْكِ لَقَدْ أَعْطَانِيَ اللهُ شْيًئا مَا أَعْطَاهُ أَحَدًا مِّنَ الْأَوَّلِيْنَ وَالْآخِرِيْنَ فَتُرْفَعُ لَهُ شَجَرَةٌ فَيَقُوْلُ: أَيْ رَبِّ أَدْنِنِيْ مِنْ هَذِهِ الشَّجَرَةِ فَلَأَسْتَظِلَّ بِظِلِّهَا وَأَشْرَبَ مِنْ مَائِهَا. فَيَقُوْلُ اللهُ: يَا ابْنَ آدَمَ لَعَلِّيْ إِنْ أَعْطَيْتُكَهَا سَأَلْتَنِيْ غَيْرَهَا؟ فَيَقُوْلُ: لَا يَا رَبِّ وَيُعَاهِدُهُ أَنْ لَا يَسْأَلَهُ غَيْرَهَا. وَرَبُّهُ يُعْذِرُهُ لِأَنَّهُ يَرَى مَا لَا صَبْرَ لَهُ عَلَيْهِ فَيُدْنِيْهِ مِنْهَا فَيَسْتَظِلُّ بِظِلِّهَا وَيَشْرَبُ مِنْ مَائِهَا ثُمَّ تُرْفَعُ لَهُ شَجَرَةٌ هِيَ أَحْسَنَ مِنْ الْأَوْلَى. فَيَقُوْلُ: أَيْ رَبِّ أَدْنِنِيْ مِنْ هَذِهِ الشَّجَرَةِ لِأَشْرَبَ مِنْ مَائِهَا وَأَسْتَظِلَّ بِظِلِّهَا لَا أَسْأَلُكَ غَيْرَهَا. فَيَقُوْلُ: يَا ابْنَ آدَمَ أَلَمْ تُعَاهِدْنِيْ أَنْ لَا تَسْأَلَنِيْ غَيْرَهَا؟ فَيَقُوْلُ: لَعَلِّيْ إِنْ أَدْنَيْتُكَ مِنْهَا تَسْأَلُنِيْ غَيْرَهَا؟ فَيُعَاهِدُهُ أَنْ لَا يَسْأَلَهُ غَيْرَهَا وَرَبُّهُ يُعْذِرْهُ لِأَنَّهُ يَرَى مَا لَا صَبْرَ لَهُ عَلَيْهِ فَيُدْنِيْهِ مِنْهَا فَيَسْتَظِلُّ بِظِلِّهَا وَيَشْرَبُ مِنْ مَائِهَا ثُمَّ تُرْفَعُ لَهُ شَجَرَةٌ عَنْدَ بَابِ الْجَنَّةِ هِيَ أَحْسَنُ مِنَ الْأَوَّلَيَيْنِ فَيَقُوْلُ: أَيْ رَبِّ اَدْنِنِيْ مِنْ هَذِهِ فَلِأَسْتَظِلّ بِظِلِّهَا وَأَشْرَبَ مِنْ مَائِهَا لَا أَسْأَلُكَ غَيْرَهَا. فَيَقُوْلُ: يَا ابْنَ آدَمَ أَلَمْ تُعَاهِدْنِيْ أَنْ لَا تَسْأَلَنِيْ غَيْرَهَا؟ قَالَ: بَلَى يَا رَبِّ هَذِهِ لَا أَسْأَلُكَ غَيْرَهَا وَرَبُّهُ يُعْذِرُهُ لِأَنَّهُ يَرَى مَا لَا صَبْرَ لَهُ عَلَيْهِ فَيُدْنِيْهِ مِنْهَا فَإِذَا أَدْنَاهُ مِنْها سَمِعَ أَصْوَاتَ أَهْلِ الْجَنَّةِ فَيَقُوْلُ: أَيْ رَبِّ أَدْخِلْنِيْهَا فَيَقُوْلُ: يَا ابْنَ آدَمَ مَا يَصْرِيْنِيْ مِنْكَ؟ أَيُرْضِيْكَ أَنْ أُعْطِيَكَ الدُّنْيَا وَمِثْلَهَا مَعَهَا. قَالَ: أَيْ رَبِّ أَتَسْتَهْزِئُ مِنِّيْ وَأَنْتَ رَبُّ الْعَالَمِيْنَ؟ فَضَحِكَ ابْنُ مَسْعُوْدٍ فَقَالَ: أَلَا تَسْأَلُوْنِيْ مِمَّ أَضْحَكَ؟ فَقَالَوْا: مِمَّ تَضْحَكُ؟ فَقَالَ: هَكَذَا ضَحِكَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم. فَقَالَوْا: مِمَّ تَضْحَكُ يَا رَسُوْلُ اللهِ؟ قَالَ: “مِنْ ضِحْكِ رَبِّ الْعَالَمِيْنَ؟ فَيَقُوْلُ: إِنِّيْ لَا أَسْتَهْزِئُ مِنْكَ وَلَكِنِّيْ عَلَى مَا أَشَاءُ قَدِيْرٌ”. رَوَاهُ مُسْلِمٌ.
5582. (17) [3/1553 –దృఢం]
ఇబ్నె మస్’ఊద్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”స్వర్గంలో అందరికంటే చివరికి ఒకవ్యక్తివెళతాడు. అతడు ఒక అడుగు వేస్తాడు, రెండవ అడుగు వేయ టానికి ప్రయ త్నించగా, బోర్లాపడతాడు. మూడవ అడుగు వేయగా అగ్ని జ్వాలలు అతని శరీరాన్ని కాల్చివేస్తాయి. ఎలాగైతేనేం నరకం నుండి బయటకు పడి, తిరిగి నరకంవైపు చూస్తాడు. అప్పుడు, ‘అల్లాహ్ (త) నీ నుండి నాకు విముక్తి ప్రసాదించాడు. ఇంకా ఇతరులెవ్వరికీ ప్రసాదించనిది నాకు ప్రసాదించాడు,’ అని అంటాడు. ఆ తర్వాత అతనికి కొంతదూరంలో ఒక చెట్టును నిలబెట్టటం జరుగుతుంది. ఆ వ్యక్తి, ”ఓ అల్లాహ్ (త)! నన్ను ఈ చెట్టు దగ్గరకు చేర్చవా? నేను దాని నీడలోనైనా ఉంటాను, దాని నీటినైనా త్రాగు తాను,” అని అంటాడు. అప్పుడు అల్లాహ్ (త), ‘ఓ ఆదమ్ కుమారా! ఒకవేళ నేను నీ ఈ కోరిక తీర్చితే, నువ్వు మరో కోరిక కోరుతావు,’ అని అంటాడు. దానికి ఆ వ్యక్తి, ‘ఓ నా ప్రభూ! అలా జరుగదు,’ అని అంటాడు. ఆ తరువాత అతడు అల్లాహ్(త) తో ఇంకేమీ అడగనని వాగ్దానం చేస్తాడు. అతని ప్రభువు అతడు సహించరాని వస్తువును చూస్తున్నాడని గ్రహిస్తాడు. అతన్ని చెట్టువద్దకు చేర్చుతాడు. ఆ వ్యక్తి చెట్టునీడలో కూర్చొని, దాని కాలువనుండి వచ్చిన నీటిని త్రాగుతాడు. అతనికి కొంతదూరంలో మరో చెట్టును ఉంచడం జరుగు తుంది. అది మొదటి చెట్టుకంటే చాలా ఉత్తమంగా ఉంటుంది. ఆ వ్యక్తి ఆ చెట్టును చూచి, ‘ఓ నా ప్రభూ! నన్ను ఆ చెట్టు దగ్గరకు చేర్చు, దాని ద్వారా కొంత విశ్రాంతి పొందుతాను. ఇంకా మరేమీ అడగను,’ అని అంటాడు. అప్పుడు అల్లాహ్ (త), ‘ఓ ఆదమ్ కుమారా! మరేమీ కోరవని వాగ్దానం చేసావు కదా,’ అని పలికి, ఒకవేళ నేను నిన్ను ఆ చెట్టు దగ్గరకు చేర్చితే నువ్వు మళ్ళీ మరో వస్తువు అడుగుతావు,’ అని అంటాడు. ఆ వ్యక్తి, ‘నేనేమీ అడగను,’ అని వాగ్దానం చేస్తాడు. అతడు ఒక విషయంపట్ల సహనం వహించకలేక పోతున్నాడని గ్రహిస్తాడు. అనంతరం అల్లాహ్ (త) అతన్ని ఆ చెట్టు దగ్గరకు చేర్చుతాడు. ఆ వ్యక్తి ఆ చెట్టునీడలో, దాని కాలువ నుండి వచ్చే నీటిని త్రాగుతాడు. మరో చెట్టును అతనికి కొంత దూరంలో ఉంచబడుతుంది. అది స్వర్గద్వారానికి సమీపంగా ఉంటుంది. ఆ వ్యక్తి చెట్టును చూసి, ‘ఓ నా ప్రభూ! నన్ను ఈ చెట్టు దగ్గరకు చేర్చు, నేను దాని ద్వారా లాభం పొందు తాను,’ అని అంటాడు. అప్పుడు అల్లాహ్ (త), ‘ఆదమ్ కుమారా! మరేమీ అడగనని వాగ్దానం చేసావు కదా?’ అని అంటాడు. దానికి ఆ వ్యక్తి, ‘అవును ఇది తప్ప మరేమీ అడగను,’ అని అంటాడు. అల్లాహ్(త) ఒక విషయంలో అతన్ని అసహనానికి గురి అయ్యాడని భావించి, అతన్ని చెట్టువద్దకు చేర్చు తాడు. ఆ చెట్టు వద్దకు చేరిన తర్వాత స్వర్గవాసుల శబ్దాలు విని, ‘ఓ నా ప్రభూ! నన్ను స్వర్గంలో ప్రవేశింపజేయకూడదా?’ అని అంటాడు. అప్పుడు అల్లాహ్, ‘ఓ ఆదమ్ కుమారా! నీవు మరేమీ అడక్కుండా ఉండే వస్తువు ఏదైనా ఉందా, రెండు ప్రపంచాలంత ఇస్తే నీవు సంతోషిస్తావా?’ అని అంటాడు. దానికి ఆ వ్యక్తి, ‘అల్లాహ్ (త)! మీరు నాతో హాస్యమాడటం లేదు కదా? మీరు సర్వలోకా లకు పాలకులు,’ అని అంటాడు.” ఇలా చెప్పిన తర్వాత ఇబ్నె మస్’ఊద్ (ర) నవ్వారు. ఇంకా అక్కడున్న వారితో, ‘నేనెందుకు నవ్వానో నన్ను అడగండి” అని అన్నారు. ప్రజలు, ‘మీరెందుకు నవ్వారు,’ అని అన్నారు. దానికి అతడు, ‘ప్రవక్త (స) కూడా ఇలాగే నవ్వారు,’ అని అన్నారు. అక్కడున్నవారు, ‘మీరెందుకు నవ్వు తున్నారు,’ అని అడిగారు. దానికి ఇబ్నె మస్’ఊద్ (ర), ‘నేను అల్లాహ్(త) నవ్వటంపై నవ్వుతున్నాను. ఆ వ్యక్తి అల్లాహ్(త)తో, ‘నువ్వు నాతో హాస్యమాడు తున్నావా? నువ్వు సర్వలోకాల సృష్టికర్తవు,’ అని అంటాడు. అది విన్న అల్లాహ్ (త), ఫక్కున నవ్వుతాడు. ఇంకా, ‘లేదు నేను నీతో హాస్యం ఆడటంలేదు, నీవు కోరింది నేను చెయ్యగలను,’ అని అంటాడు. (ముస్లిమ్)
5583 – [ 18 ] ( صحيح ) (3/1554)
وَفِيْ رِوَايَةٍ لَهُ عَنْ أَبِيْ سَعِيْدٍ نَحْوَهُ إِلَّا أَنَّهُ لَمْ يَذْكُر”فَيَقُوْلُ: يَا ابْنَ آدَمَ مَا يَصْرِيْنِيْ مِنْكَ؟” إِلى آخِرِالْحَدِيْثِ وَزَادَ فِيْهِ: “وَيَذَكِّرُهُ اللهُ: سَلْ كَذَا وَكَذَا حَتّى إِذَا انْقَطَعَتْ بِهِ الْأَمَانِيُّ قَالَ اللهُ: هُوَ لَكَ وَعَشْرَةُ أَمْثَالِهِ. قَالَ :ثُمَّ يَدْخُلُ بَيْتَهُ فَتَدْخُلُ عَلَيْهِ زَوْجَتَاهُ مِنَ الْحُوْرِ الْعَيْنِ فَيَقُوْلَانِ: الْحَمْدُ لِلّهِ الَّذِيْ أَحْيَاكَ لَنَا وَأَحْيَانَا لَكَ. قَالَ: فَيَقُوْلُ: مَا أَعْطِيَ أَحَدٌ مِثْلَ مَا أَعْطِيْتُ”.
5583. (18) [3/1554– దృఢం]
ముస్లిమ్ ఉల్లేఖనంలో ఈ వాక్యాలు అధికంగా ఉన్నాయి. అల్లాహ్ (త) అతన్ని, ‘ఫలానా వస్తువులు కోరు,’ అని గుర్తుచేస్తాడు. అప్పుడు అతని కోరికలు అన్నీ తీరుతాయి. అప్పుడు అల్లాహ్ (త), ‘ఇవన్నీ ఇంకా వీటికి పదింతలు వస్తువులు నీకు ఇవ్వబడతాయి,’ అని ఆదేశించటం జరుగుతుంది. ఆ తర్వాత ప్రవక్త (స) ఇలా అన్నారు, ‘ఆ తర్వాత ఆ వ్యక్తి స్వర్గంలో తన నివాసంలో ప్రవేశిస్తాడు. అతని వద్దకు ఇద్దరు దేవకన్యలు వచ్చి, ‘స్తోత్రాలన్నీ నిన్ను మా కోసం, మమ్మల్ని నీ కోసం సృష్టించిన ఆ అల్లాహ్ (త)కే,’ అని స్తుతిస్తారు. అప్పుడా వ్యక్తి, ‘నాకిచ్చినంత మరెవరికీ ఇవ్వలేదు,’ అని అంటాడు.
5584 – [ 19 ] ( صحيح ) (3/1554)
وَعَنْ أَنَسٍ أَنَّ النَّبِيَّ الله صلى الله عليه وسلم قَالَ: “لَيُصِيْبَنَّ أَقْوَامًا سَفْعٌ مِّنَ النَّارِ بِذُنُوْبِ أَصَابُوْهَا عُقُوْبَةً ثُمَّ يُدْخِلُهُمُ اللهُ الْجَنَّةَ بِفَضْلِهِ وَرَحْمَتِهِ فَيُقَالَ لَهُمْ: اَلْجَهَنَّمِيُّوْنَ”. روَاهُ الْبُخَارِيُّ.
5584. (19) [3/1554 –దృఢం]
అనస్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ముస్లిముల ఎన్నోవర్గాలు పాపాలవల్ల నరకాగ్నికి గురవుతాయి. నరకాగ్ని వారిని కాల్చివేస్తుంది. ఆ తర్వాత అల్లాహ్(త) తన ప్రత్యేక కారుణ్యంతో వారిని స్వర్గంలో ప్రవేశింపజేస్తాడు. వారిని జహన్నమియ్యూన్ అని పిలువటం జరుగుతుంది. (బు’ఖారీ)
5585 – [ 20 ] ( صحيح ) (3/1555)
وَعَنْ عِمْرَانَ بْنِ حُصَيْنٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: ” يَخْرُجُ أَقْوَامٌ مِّنَ النَّارِ بِشَفَاعَةِ مُحَمَّدٍ فَيَدْخُلُوْنَ الْجَنَّةَ وَيُسَمُّوْنَ الْجَهَنَّمِيِّيْنَ”. روَاهُ الْبُخَارِيُّ.
وَفِيْ رِوَايَةٍ: “يَخْرُجُ قَوْمٌ مِنْ أُمَّتِيْ مِنَ النَّارِ بِشَفَاعَتِيْ يُسَمُّوْنَ الْجَهَنَّمِيِّيْنَ”.
5585. (20) [3/1555 –దృఢం]
‘ఇమ్రాన్ బిన్ ‘హు’సైన్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ప్రవక్త (స) సిఫారసు ద్వారా అనేక మందిని నరకంనుండి తీయటం జరుగుతుంది. స్వర్గంలో ప్రవే శింపజేయటం జరుగుతుంది. వారికి జహన్న మియ్యూన్ అనే పేరు ఇవ్వడం జరుగుతుంది.” (బు’ఖారీ)
మరో ఉల్లేఖనంలో ఇలా ఉంది, ప్రవక్త (స) ప్రవచనం, ”నా అనుచర సమాజంలోని ఒక వర్గం నా సిఫారసు ద్వారా నరకం నుండి తీయబడి స్వర్గంలో వేయబడు తుంది, వారి పేరు జహన్నమియ్యూన్ అని పెట్టటం జరుగుతుంది.”
5586 – [ 21 ] ( مُتَّفَقٌ عَلَيْهِ ) (3/1555)
وَعَنْ عَبْدِ اللهِ بْنِ مَسْعُوْدٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِنِّيْ لَأَعْلَمُ آخِرَ أَهْلِ النَّارِخُرُوْجًا مِنْهَا وَآخَرَأَهْلِ الْجَنَّةِ دُخُوْلًا رَجُلٌ يَخْرُجُ مِنَ النَّارِحَبوًا. فَيَقُوْلُ اللهُ: اِذْهَبْ فَاَدْخُلِ الْجَنَّةَ فَإِنَّ لَكَ مِثْلَ الدُّنْيَا وَعَشْرَةَ أَمْثَالِهَا. فَيَقُوْلُ: أَتَسْخَرُمِنِّيْ-أَوْتَضْحَكُ مِنِّيْ- وَأَنْتَ الْمَلِكُ؟” وَلَقَدْ رَأَيْتُ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم ضَحِكَ حَتّى بَدَتْ نَوَاجِذُهُ وَكَانَ يُقَالَ: ذَلِكَ أَدْنَى أَهْلِ الْجَنَّةِ مَنْزِلَةً. مُتَّفَقٌ عَلَيْهِ .
5586. (21) [3/1555 –ఏకీభవితం]
‘అబ్దుల్లాహ్ బిన్ మస్’ఊద్ (ర) కథనం, ప్రవక్త (స) ప్రవచనం, ”అందరికంటే చివరిగా నరకం నుండి తీయబడే వ్యక్తి ఎవరో నాకు తెలుసు. అతడు అందరికంటే చివరిగా స్వర్గంలో ప్రవేశిస్తాడు. అతడు మోకాళ్ళపై నడిచి నరకం నుండి బయటకు వస్తాడు. అల్లాహ్ (త) అతనితో, ‘వెళ్ళు, స్వర్గంలో ప్రవేశించు,’ అని అంటాడు. అతడు స్వర్గంలోనికి వచ్చి చూసి స్వర్గం అంతా నిండుగా ఉన్నట్టు భావించి, ‘ఓ అల్లాహ్ (త)! నేను స్వర్గాన్ని నిండుగా ఉన్నట్టు చూసాను,’ అని అంటాడు. అప్పుడు అల్లాహ్ (త), ‘వెళ్ళు స్వర్గంలో ప్రవేశించు. నీ కోసం ప్రపంచం ఇంకా దానికి 10 రెట్టు ఇవ్వటం జరిగింది,’ అని అంటాడు. దానికి ఆ వ్యక్తి, ‘అల్లాహ్(త)! నాతో పరిహాసం ఆడుతున్నావా? మీరు చక్రవర్తులు,’ అని అంటాడు.
ఇబ్నె మస్’ఊద్ (ర) కథనం: ‘ప్రవక్త(స) ఇలా పలికి నవ్వారు. ఆయన నోటిలోని పళ్ళు కనబడటం నేను చూసాను. ఇంకా ఈ వ్యక్తి అందరికంటే చిన్న తరగతికి చెందిన వాడని భావించడం జరిగేది.’ (బు’ఖారీ, ముస్లిమ్)
5587 – [ 22 ] ( صحيح ) (3/1555)
وَعَنْ أَبِيْ ذَرٍّ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِنِّيْ لَأَعْلَمُ آخِرَأَهْلِ الْجَنَّةِ دُخُوْلًا الْجَنَّةَ وَآخِرَ أَهْلِ النَّارِخُرُوْجًا مِنْهَا رَجُلٌ يُؤْتَى بِهِ يَوْمَ الْقِيَامَةِ. فَيُقَالَ: اَعْرِضُوْا عَلَيْهِ صِغَارَ ذُنُوْبِهِ وَارْفَعُوْا عَنْهُ كِبَارَهَا فَتُعْرَضُ عَلَيْهِ صِغَارُ ذُنُوْبِهِ. وَفَيُقَالَ: عَمِلْتَ يَوْمَ كَذَا وَكَذَا وَكَذَا وَكَذَا وَعَمِلْتَ يَوْمَ كَذَا وَكَذَا كَذَا وَكَذَا؟ فَيَقُوْلُ: نَعَمْ.لَا يَسْتَطِيْعُ أَنْ يُّنْكِرَوَهُوَ مُشْفِقٌ مِنْ كِبَارِذُنُوْبِهِ أَنْ تُعْرَضَ عَلَيْهِ. فَيُقَالَ لَهُ فَإِنَّ لَكَ مَكَانَ كُلِّ سَيِّئَةٍ حَسَنَةً. فَيَقُوْلُ: “رَبِّ قَدْ عَمِلْتُ أَشْيَاءَ لَا أَرَاهَا هَهُنَا”. وَقَدْ رَأَيْتُ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم ضَحِكَ حَتّى بَدَتْ نَوَاجِذُهُ. رَوَاهُ مُسْلِمٌ.
5587. (22) [3/1555– దృఢం]
అబూ జ’ర్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”అందరి కంటే చివరిగా స్వర్గంలో ప్రవేశించేవ్యక్తి ఎవరో నాకు తెలుసు. అతడు అందరికంటే చివర నరకం నుండి తీయబడతాడు. తీర్పుదినం నాడు ఆ వ్యక్తిని అల్లాహ్(త) ముందుకు తీసుకురావటం జరుగు తుంది. దైవదూతలతో అతని చిన్నచిన్న పాపాలను అతనిముందు పెట్టమని ఆదేశించటం జరుగుతుంది. అతని పాపాలు అతని ముందు ప్రవేశపెట్టబడతాయి. అప్పుడు అతనితో, ‘నువ్వు ఫలానా పాపం, ఫలానా సమయంలో చేసావా?’ అని విచారించటం జరుగు తుంది. ఆ వ్యక్తి చేసేది లేక అన్నిటినీ ఒప్పు కుంటాడు. ఇంకా తన పెద్దపాపాల గురించి ఎక్కడ పట్టుబడతానో అని భయపడుతూ ఉంటాడు. అప్పుడు అతనితో, ‘ఒక్కొక్క పాపానికి బదులు నీకు ఒక్కొక్క పుణ్యం ఇవ్వటం జరుగుతుంది’ అని చెప్పటం జరుగుతుంది. అది విని ఆ వ్యక్తి, ‘ఓ అల్లాహ్(త)! నేను ఇంకా చాలా పాపాలు చేసాను. అవి వీటిలో లేవు,’ అని అంటాడు. అబూ జ’ర్ (ర) కథనం: ప్రవక్త (స) ఇది చెప్పిన తర్వాత నవ్వగా ఆయన పళ్ళు కనబడ్డం నేను చూసాను.” (ముస్లిమ్)
5588 – [ 23 ] ( صحيح ) (3/1555)
وَعَنْ أَنَسٍ أَنَّ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم قَالَ: “يَخْرُجُ مِنَ النَّارِ أَرْبَعَةٌ فَيُعْرِضُوْنَ عَلَى اللهِ ثُمَّ يُؤْمَرُ بِهِمْ إِلى النَّارِفَيَلْتَفِتُ أَحَدُهُمْ فَيَقُوْلُ: أَيْ رَبِّ؟ لَقَدْ كُنْتُ أَرْجُوْ إِذَا أَخْرَجْتَنِيْ مِنْهَا أَنْ لَا تُعِيْدَنِيْ فِيْهَا”. قَالَ: “فَيُنْجِيْهِ اللهُ مِنْهَا”. رَوَاهُ مُسْلِمٌ.
5588 . (23) [3/1555– దృఢం]
అనస్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, నరకం నుండి నలుగురు వ్యక్తులను తీయటం జరుగుతుంది. వారిని అల్లాహ్(త) ముందు నిలబెట్టటం జరుగు తుంది. ఇంకా వారిని నరకంలో పంపమని ఆదేశించటం జరుగుతుంది. వారిలో ఒకడు తిరిగి చూస్తాడు, ఇంకా, ‘ఓ మా ప్రభూ! నరకం నుండి తీసిన తర్వాత మళ్ళీ నన్ను నరకంలోనికి పంపవని అను కున్నాను,’ అని అంటాడు. ప్రవక్త (స) కథనం, ”ఇది విని అల్లాహ్(త) అతనికి నరకం నుండి విముక్తి ప్రసాదిస్తాడు.” (ముస్లిమ్)
5589 – [ 24 ] ( صحيح ) (3/1556)
وَعَنْ أَبِيْ سَعِيْدٍ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “يَخْلُصُ الْمُؤْمِنُوْنَ مِنَ النَّارِ فَيُحْبَسُوْنَ عَلَى قَنْطَرَةٍ بَيْنَ الْجَنَّةِ وَالنَّارِ فَيَقْتَصُّ لِبَعْضِهِمْ مِنْ بَعْضٍ مَظَالِمَ كَانَتْ بَيْنَهُمْ فِيْ الدُّنْيَا حَتّى إِذَا هُذّبُوْا وَنَقُوْا أُذِنَ لَهُمْ فِيْ دُخُوْلِ الْجَنَّةِ فَوَالَّذِيْ نَفْسُ مُحَمَّدٍ بِيَدِهِ لِأَحَدُهُمْ أَهْدَى بِمَنْزِلِهِ فِي الْجَنَّةِ مِنْهُ بِمَنْزِلِهِ كَانَ لَهُ فِي الدُّنْيَا”. روَاهُ الْبُخَارِيُّ.
5589. (24) [3/1556 –దృఢం]
అబూ స’యీద్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”విశ్వాసులకు నరకాగ్ని నుండి విముక్తి లభిస్తుంది. వారిని స్వర్గనరకాల మధ్య ఒక వంతెనపై ఆపి వేయటం జరుగుతుంది. వారు పరస్పరం ప్రాపంచిక అత్యాచారాలకు ప్రతీకారం తీర్చుకుంటారు. పరస్పర ప్రతీకారాలు తీర్చుకున్న తర్వాత, పరిశుద్ధులైన తర్వాత వారికి స్వర్గంలోనికి వెళ్ళమని అనుమతి లభిస్తుంది. ఎవరి చేతిలో ము’హమ్మద్ ప్రాణం ఉందో ఆయన సాక్షి! వారిలోని ప్రతి ఒక్కరూ స్వర్గంలో ఉన్న తన నివాసాన్ని ప్రాపంచిక నివాసం కన్నా బాగా గుర్తిస్తాడు.” (బు’ఖారీ)
5590 – [ 25 ] ( صحيح ) (3/1556)
وَعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَا يَدْخُلُ أَحَدُ الْجَنَّةَ إِلَّا أُرِيَ مَقْعَدَهُ مِنَ النَّارِ لَوْ أَسَاءَ لَيَزْدَادَ شُكْرًا وَلَا يَدْخُلُ النَّارَ أَحَدٌ إِلَّا أُرِيَ مَقْعَدَهُ مِنَ الْجَنَّةِ لَوْ أَحْسَنَ لِيَكُوْنَ عَلَيْهِ حَسْرَةً”. روَاهُ الْبُخَارِيُّ.
5590. (25) [3/1556– దృఢం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ప్రతి ఒక్కరూ నరకంలో ఉన్న తన నివాసం చూసుకోనంత వరకు స్వర్గంలో ప్రవేశించలేడు. అతడు అల్లాహ్ (త) కు అధికంగా కృతజ్ఞతలు తెలుపు కోవాలని. అదేవిధంగా ప్రతి ఒక్కరూ స్వర్గంలో ఉన్న తన నివాసం చూడనంత వరకు నరకంలో ప్రవేశించరు. పుణ్యకార్యాలు చేస్తే అది అతనికి దక్కేది. ఇలా అయినందుకు చాలా విచారించాలని. (బు’ఖారీ)
5591 – [ 26 ] ( مُتَّفَقٌ عَلَيْهِ ) (3/1556)
وَعَنِ ابْنِ عُمَرَقَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِذَا صَارَ أَهْلُ الْجَنَّةِ إِلى الْجَنَّةِ وَأَهْلُ النَّارِ إِلى النَّارِ جِيْءَ بِالْمَوْتِ حَتّى يُجْعَلَ بَيْنَ الْجَنَّةِ وَالنَّارِ ثُمَّ يُذْبَحُ ثُمَّ يُنَادِيْ مُنَادٍ: يَا أَهْلَ الْجَنَّةِ لَا مَوْتَ وَيَا أَهْلَ النَّارِ لَا مَوْتَ. فَيَزْدَادُ أَهْلُ الْجَنَّةِ فَرْحًا إِلى فَرْحِهِمْ وَيَزْدَادُ أَهْلُ النَّارِ حُزْنًا إِلى حُزْنِهِمْ”. مُتَّفَقٌ عَلَيْهِ.
5591. (26) [3/1556 –ఏకీభవితం]
ఇబ్నె’ఉమర్ (ర) కథనం:ప్రవక్త (స) ప్రవచనం, ”స్వర్గ వాసులు స్వర్గంలో, నరక వాసులు నరకంలో ప్రవేశించిన తరువాత మరణాన్ని తెచ్చి స్వర్గనరకాల మధ్య జి’బ’హ్ చేయటం జరుగుతుంది. అనంతరం ఒక ప్రకటించే వాడు ఇలా ప్రకటిస్తాడు. ”స్వర్గవాసు లారా! ఇప్పుడు మీకు చావులేదు, ఇంకా ఓ నరక వాసులారా! ఇప్పుడు మీకు మరణంలేదు.” ఇది విని స్వర్గవాసులు సంతోషం వ్యక్తంచేస్తారు. నరకవాసులు విచారిస్తారు. (బు’ఖారీ, ముస్లిమ్)
—–
الفصل الثاني రెండవ విభాగం
5592 – [ 27 ] ( لم تتم دراسته ) (3/1556)
عَنْ ثَوْبَانَ عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ: “حَوْضِيْ مِنْ عَدْنَ إِلى عَمَّانَ الْبَلْقَاءِ مَاؤُهُ أَشَدُّ بَيَاضًا مِنَ اللَّبَنِ وَأَحْلَى مِنَ الْعَسْلِ وَأَكْوَابُهُ عَدَدُ نُجُوْمِ السَّمَاءِ مَنْ شَرِبَ مِنْهُ شُرْبَةً لَمْ يَظْمَأْ بَعْدَهَا أَبَدًا أَوَّلُ النَّاسِ وُرُوْدًا فُقَرَاءُ الْمُهَاجِرِيْنَ الشُّعْثُ رُؤُوْسًا الدّنسُ ثِيَابًا الَّذِيْنَ لَا يَنْكِحُوْنَ الْمُتَنَعِّمَاتِ ولَا يُفْتَحُ لَهُمُ السُّدَدُ”. رَوَاهُ أَحْمَدُ وَ التِّرْمِذِيُّ وَابْنُ مَاجَهُ. وَقَالَ التِّرْمِذِيُّ: هَذَا حَدِيْثٌ غَرِيْبٌ.
5592. (27) [3/1556– అపరిశోధితం]
సౌ’బాన్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”నా హౌజ్ కౌసర్ వెడల్పు అద్‌న్ నుండి ‘అమాన్ బల్‌ఖా వరకు గల దూరం అంత ఉంటుంది. దాని నీరు పాలకన్నా తెల్లగా, తేనెకన్నా తియ్యగా ఉంటుంది. దాని పాత్రలు ఆకాశంలోని నక్షత్రాల సంఖ్యకు సమానంగా ఉంటాయి. ఒక్కసారి త్రాగిన వారికి ఇంకెప్పుడూ దాహం వేయదు. ఆ కోనేరుపై నీళ్ళు త్రాగటానికి అందరికంటే ముందు దరిద్రులు, ముహాజిరీన్లు వస్తారు. వీళ్ళు దుమ్ము ధూళితో నిండినతల, మాసిపోయిన బట్టలు ధరించి ఉంటారు. వీరి పెళ్ళి ధనవంతుల కూతుర్లతో జరగదు. వారి కోసం ఇళ్ళ ద్వారాలు తెరచుకోవు.” (అ’హ్మద్, తిర్మిజి’ – ఏకోల్లేఖనం, ఇబ్నె మాజహ్)
5593 – [28 ] ( صحيح ) (3/1557)
وعَنْ زَيْدِ بْنِ أَرْقَمَ قَالَ: كُنَّا مَعَ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم فَنَزَلْنَا مَنْزِلًا فَقَالَ: “مَا أَنْتُمْ جُزْءٌ مِّنْ مِائَةِ أَلْفِ جُزْءٍ مِمَّنْ يَرِدُ عَلَيَّ الْحَوْضَ “. قِيْلَ: كُمْ كُنْتُمْ يَوْمَئِذٍ؟ قَالَ: سَبْعُمِائَةٍ أَوْ ثَمَانُمِائَةٍ. رَوَاهُ أَبُوْ دَاوُد.
5593. (28) [3/1557– దృఢం]
‘జైద్ బిన్ అర్‌ఖమ్ కథనం: ఒక ప్రయాణంలో మేము ప్రవక్త (స) వెంట ఉన్నాం. ఒక ప్రాంతంలో మేము దిగాము. అప్పుడు ప్రవక్త (స) అనుచరులతో ఇలా అన్నారు. హౌ’దె కౌస’ర్‌పై నా వద్దకు వచ్చేవారిలో మీరు లక్ష భాగాల్లో ఒక్క భాగం కూడా లేరు. ప్రజలు ‘జైద్ బిన్ అర్‌ఖమ్‌ను ఆ రోజు మీరెందరు అని అడగటం జరిగింది. దానికి అతను 700 లేదా 800 అని అన్నారు.” (అబూ దావూద్)
5594 – [ 29 ] ( لم تتم دراسته ) (3/1557)
وَعَنْ سَمُرَةَ قَالَ: قَالَ رَسُوْلُ الله صلى الله عليه وسلم: “إِنَّ لِكُلِّ نَبِيٍّ حَوْضًا وَإِنَّهُمْ لِيَتَبَاهُوْنَ أَيّهُمْ أَكْثَرُوَارِدَةُ وَإِنِّيْ لَأَرْجُوْأَنْ أَكُوْنَ أَكْثَرَهُمْ وَارِدَةُ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَقَالَ: هَذَا حَدِيْثٌ غَرِيْبٌ.
5594. (29) [3/1557– అపరిశోధితం]
సమురహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ప్రతి ప్రవక్తకు ఒక కోనేరు ఉంది. దైవప్రవక్తలు వాటిపట్ల ఎవరి కోనేరుపై అధిక జనం వస్తారని గర్వపడతారు. అందరికంటే నా కోనేరుపై అధిక జనం వస్తారని నేను ఆశిస్తున్నాను.” (తిర్మిజి’ – ఏకోల్లేఖనం)
5595 – [ 30 ] ( إسناده جيد ) (3/1557)
وَعَنْ أَنَسٍ قَالَ سَأَلْتُ النَّبِيَّ صلى الله عليه وسلم أَنْ يَّشْفَعَ لِيْ يَوْمَ الْقِيَامَةِ فَقَالَ: “أَنَا فَاعِلٌ”. قُلْتُ يَا رَسُوْلَ اللهِ فَأَيْنَ أَطْلُبُكَ؟ قَالَ اُطْلُبُنِيْ أَوَّلَ مَا تَطْلُبُنِيْ عَلَى الصِّرَاطِ”. قُلْتُ فَإِنْ لَمْ أَلْقَكَ عَلَى الصِّرَاطِ؟ قَالَ: “فَاطْلُبُنِيْ عِنْدَ الْمِيْزَانِ”. قُلْتُ فَإِنْ لَمْ أَلْقَكَ عِنْدَ الْمِيْزَانِ؟ قَالَ: “فَاطْلُبُنِيْ عِنْدَ الْحَوْضِ فَإِنِّيْ لَا أُخْطِىءُ هَذِهِ الثَّلَاثَ الْمَوَاطِنُ” .رَوَاهُ التِّرْمِذِيُّ وَقَالَ لَهَذَا حَدِيْثٌ غَرِيْبٌ.
5595. (30) [3/1557– ఆధారాలు ఆమోదయోగ్యం]
అనస్ (ర) కథనం: ఒకరోజు నేను ప్రవక్త (స) ను, ‘తమరు తీర్పుదినంనాడు నా గురించి సిఫారసు చేస్తారా,’ అని అడిగాను. దానికి ప్రవక్త (స), ‘మంచిది, నేను సిఫారసు చేస్తాను,’ అని అన్నారు. మళ్ళీ నేను, ‘ఓ ప్రవక్తా (స)! మిమ్మల్ని ఎక్కడ వెదకను,’ అని అడిగాను. దానికి ప్రవక్త (స), ‘అన్నిటి కంటే ముందు నన్ను సిరాత్ వంతెనపై వెదుకు,’ అని అన్నారు. అందుకు నేను, ‘ఒకవేళ అక్కడ కనబడక పోతే,’ అని అన్నాను. దానికి ప్రవక్త (స), ‘కర్మల తూనిక వద్ద వెదుకు,’అన్నారు. దానికి నేను, ‘ఒకవేళ అక్కడ కూడా కనబడకపోతే,’ అని అన్నాను. దానికి, ‘కోనేరు వద్ద నన్ను వెదుకు, నేను ఆ మూడు ప్రదేశాలు తప్ప మరెక్కడా ఉండను,’ అని అన్నారు. (తిర్మిజి’ – ఏకోల్లేఖనం)
5596 – [ 31 ] ( ضعيف ) (3/1557)
وعَنْ ابْنِ مَسْعُوْدٍ عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ: قِيْلَ لَهُ مَا الْمُقَامُ الْمَحْمُوْدُ؟ قَالَ: “ذَلِكَ يَوْمَ يَنْزِلُ اللهُ تَعَالى عَلَى كُرْسِيِّهِ فَيَئِطُ كَمَا يَئِطُ الرَّحُلُ الْجَدِيْدُ مِنْ تُضَايُقِهِ بِهِ وَهُوَ كَسَعَةِ مَا بَيْنَ السَّمَاءِ وَالْأَرْضِ وَيُجَاءُ بِكُمْ حُفَاةً عُرَاةً غُرلًا فَيَكُوْنُ أَوَّلَ مَنْ يُكَسى إِبْرَاهِيْمُ. يَقُوْلُ اللهُ تَعَالى: اُكْسُوْا خَلِيْلِيْ بِرَيْطَتَيْنِ بَيْضَاوَيْنِ مِنْ رَيَاطِ الْجَنَّةِ ثُمَّ أَكْسَى عَلَى أَثْرِهِ ثُمَّ أَقُوْمُ عَنْ يَمِيْنِ اللهِ مَقَامًا يَغْبَطُنِيَ الْأَوَّلُوْنَ وَالْآخِرُوْنَ”. رَوَاهُ الدَّارَمِيُّ.
5596. (31) [3/1557– బలహీనం]
ఇబ్నె మస్’ఊద్ (ర) కథనం: ప్రవక్త (స)ను మీకు వాగ్దానం చేయబడిన, మఖామె మ’హ్‌మూద్ అంటే ఏమిటి?’ అని ప్రశ్నించడం జరిగింది. దానికి ప్రవక్త (స) అల్లాహ్(త) తన సింహాసనాన్ని అలంకరించినపుడు మఖామె మ’హ్‌మూద్ లభిస్తుందని, ఈ సింహాసనం అల్లాహ్(త) కూర్చోవటం వల్ల చర్మపు జీను శబ్దం చేసినట్టు శబ్దం చేస్తుంది. అది భూమ్యాకాశాలను వ్యాపించి ఉంది. మిమ్మల్ని చెప్పులు లేకుండా, నగ్నంగా, సున్నతి చేయబడని స్థితిలో తీసుకు రావటం జరుగుతుంది. ఇంకా ఆ రోజు దుస్తులు తొడిగించే వారిలో అందరికంటే ముందు ఇబ్రాహీమ్ (అ) ఉంటారు. అనంతరం అల్లాహ్(త) దైవ దూతలను, ‘నా స్నేహితునికి దుస్తులు తొడిగించండి,’ అని ఆదేశిస్తాడు. స్వర్గదుస్తుల్లోని రెండు తెల్లని దుప్పట్లు తీసుకురావటం జరుగు తుంది. ఇంకా ఇబ్రాహీమ్ (అ)ను కప్పటం, అంటే తొడిగించటం జరుగుతుంది. ఆ తరువాత నాకు దుస్తులు ఇవ్వటం జరుగుతుంది. ఆ తరువాత నేను మహోన్నతుడైన అల్లాహ్(త)కు కుడి ప్రక్క నిలబడతాను. మానవులందరూ నన్ను చూసి ఈర్ష్యకు గురవుతారు. (దార్మీ)
5597 – [ 32 ] ( لم تتم دراسته ) (3/1558)
وَعَنِ الْمُغَيْرَةَ بْنِ شُعْبَةَ قَالَ: قَالَ رَسُوْلُ الله صلى الله عليه وسلم شِعَارُ الْمُؤْمِنِيْنَ يَوْمَ الْقِيَامَةِ عَلَى الصِّرَاطِ: رَبِّ سَلِّمْ سَلِّمْ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَقَالَ: هَذَا حَدِيْثٌ غَرِيْبٌ .
5597. (32) [3/1558 –అపరిశోధితం]
ము’గీరహ్ బిన్ షు’అబహ్ కథనం: ప్రవక్త (స) ప్రవ చనం, ”తీర్పుదినం నాడు ‘సిరా’త్ వంతెనపై విశ్వా సుల చిహ్నం, ”రబ్బి సల్లిమ్ రబ్బి సల్లిమ్” – ‘ఓ మా ప్రభూ! మమ్మల్ని క్షేమంగాఉంచు మమ్మల్ని క్షేమంగా ఉంచు.’ అని పలకటం. (తిర్మిజి’ – ఏకోల్లేఖనం)
5598 – [ 33 ] ( صحيح ) (3/1558)
وعَنْ أَنَسٍ أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم قَالَ: “شَفَاعَتِيْ لِأَهْلِ الْكَبَائِرِ مِنْ أُمَّتِيْ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَأَبُوْ دَاوُدَ
5598. (33) [3/1558– దృఢం]
అనస్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”నా సిఫారసును ప్రత్యేకంగా నా అనుచర సమాజంలోని మహాపాపాలు చేసేవారి కోసం ఉంటుంది.” (తిర్మిజి’, అబూ దావూద్)
5599 – [ 34 ] ( صحيح ) (3/1558)
وَرَوَاهُ ابْنُ مَاجَهُ عَنْ جَابِرٍ
5599. (34) [3/1558–దృఢం]
దీన్నే జాబిర్ ( ర) కూడా ఉల్లేఖించారు. (ఇబ్నె మాజహ్)
5600 – [ 35 ] ( صحيح ) (3/1558)
وَعَنْ عَوْفِ بْنِ مَالِكٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “آتَانِيْ آتِ مِنْ عِنْدَ رَبِّيْ فَخَيَّرَنِيْ بَيْنَ أَنْ يَدْخُلَ نِصْفُ أُمَّتِي الْجَنَّةَ وَبَيْنَ الشَّفَاعَةِ فَاخْتَرْتُ الشَّفَاعَةَ وَهِيَ لِمَنْ مَاتَ لَا يُشْركُ بِاللهِ شَيْئًا”. رَوَاهُ التِّرْمِذِيُّ وَابْنُ مَاجَهُ.
5600. (35) [3/1558 –దృఢం]
‘ఔఫ్ బిన్ మాలిక్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”నా ప్రభువు తరఫునుండి ఒక దూత నావద్దకు వచ్చాడు. నన్ను నా సగం అనుచర సమాజం స్వర్గవాసులు కావాలనో లేదా సిఫారసు చేసే అవకాశం కావాలనో ఎన్నుకోమన్నాడు. నేను సిఫారసును ఎన్ను కున్నాను. అయితే నా సిఫారసు మరణం వరకు అల్లాహ్ (త) కు సాటి కల్పించని ప్రతి వ్యక్తికి వర్తిస్తుంది.” [20] (తిర్మిజి’, ఇబ్నె మాజహ్)
5601 – [ 36 ] ( صحيح ) (3/1558)
وَعَنْ عَبْدِ اللهِ بْنِ أَبِي الْجَدْعَاءِ قَالَ: سَمِعْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ: “يَدْخُلُ الْجَنَّةَ بِشَفَاعَةِ رَجُلٍ مِّنْ أُمَّتِيْ أَكْثَرُ مِنْ بَنِيْ تَمِيْمٍ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَالدَّارَمِيُّ وَابْنُ مَاجَهُ .
5601. (36) [3/1558– దృఢం]
‘అబ్దుల్లాహ్ బిన్ అబిల్ జద్’ఆ’అ (ర) కథనం: ప్రవక్త (స) ఇలా ప్రవచిస్తూ ఉండగా నేను విన్నాను, ”నా అనుచర సమాజంలోని ఒక్క వ్యక్తి సిఫారసు వల్ల బనూ తమీమ్ తెగ ప్రజల సంఖ్యకన్నా అధికంగా ప్రజలు స్వర్గంలో ప్రవేశిస్తారు.” (తిర్మిజి’, దార్మీ, ఇబ్నె మాజహ్)
5602 – [ 37 ] ( ضعيف ) (3/1558)
وَعَنْ أَبِيْ سَعِيْدٍ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم قَالَ: “إِنَّ مِنْ أُمَّتِيْ مَنْ يَّشْفَعُ لِلْقَبِيْلَةِ وَمِنْهُمْ مَنْ يَّشْفَعُ لِلْعُصْبَةِ وَمِنْهُمْ مَنْ يَّشْفَعُ لِلرَّجُلِ حَتّى يَدْخُلُوْا الْجَنَّةَ “. رَوَاهُ التِّرْمِذِيُّ.
5602. (37) [3/1558– బలహీనం]
అబూ స’యీద్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”నా అనుచర సమాజంలోని అనేకమంది అనేక వర్గాల కోసం సిఫారసు చేస్తారు. కొందరు ఒక తెగ కోసం సిఫారసు చేస్తారు. మరికొందరు ఒక కుటుంబం కోసం సిఫారసు చేస్తారు. చివరికి నా అనుచర సమాజం అంతా స్వర్గంలో ప్రవేశిస్తుంది.” (తిర్మిజి’)
5603 – [ 38 ] ( لم تتم دراسته ) (3/1559)
وَعَنْ أَنَسٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِنَّ اللهَ عَزَّ وَجَلَّ وَعَدَنِيْ أَنْ يُّدْخِلَ الْجَنَّةَ مِنْ أُمَّتِيْ أَرْبَعَمِائَةِ أَلْفٍ بِلَا حِسَابٍ”. فَقَالَ أَبُوْ بَكْرٍ زِدْنَا يَا رَسُوْلَ اللهِ. قَالَ وَهَكَذَا فَحَثَا بِكَفَّيْهِ وَجَمَعَهُمَا. فَقَالَ أَبُوْ بَكْرٍ: زِدْنَا يَا رَسُوْلَ اللهِ. قَالَ: وَهَكَذَا فَقَالَ عُمَرُدعْنَا يَا أَبُوْبَكْرٍ. فَقَالَ أَبُوْ بَكْرٍ: وَمَا عَلَيْكَ أَنْ يُّدْخَلَنا اللهُ كُلَّنَا الْجَنَّةَ؟ فَقَالَ عُمَرُ: إِنَّ اللهَ عَزَّوَجَلَّ إِنْ شَاءَ أَنْ يُّدْخِلَ خَلْقَهُ الْجَنَّةَ بِكَفٍّ وَاحِدٍ فَعَلَ. فَقَالَ النَّبِيُّ صلى الله عليه وسلم: “صَدَقَ عُمَرُ” .رَوَاهُ فِيْ شَرْحِ السُّنَّةِ.
5603. (38) [3/1559– అపరిశోధితం]
అనస్ (ర) కథనం: ప్రవక్త (స) ”నా అనుచర సమాజం లోని 4 లక్షల మందిని విచారణ లేకుండా స్వర్గంలోనికి పంపుతానని అల్లాహ్ (త) నాతో వాగ్దానం చేసి ఉన్నాడు” అని అన్నారు. అప్పుడు అబూ బకర్ (ర), ‘ఓ ప్రవక్తా! మా సంఖ్యను పెంచండి,’ అని అన్నారు. దానికి ప్రవక్త (స), ‘ఇంక అధికమా?’ అని పలికి, తన రెండు అరచేతులను కలిపి దోసెడుగా చేసారు. మళ్ళీ అబూ బకర్ (ర), ‘ప్రవక్తా! మా సంఖ్యను మరికాస్త పెంచండి,’ అని అన్నారు. ప్రవక్త (స) ‘మళ్ళీ దోసెడుగా అరచేతులు కలిపి ఇంత ఎక్కువ?’ అని అన్నారు. అప్పుడు ‘ఉమర్ (ర), ‘వదలివేయండి బాబూ!’ అని అన్నారు. దానికి అబూ బకర్, ‘అల్లాహ్(త) మమ్మల్ని అందరినీ స్వర్గంలోనికి పంపిస్తే నీకు జరిగే నష్టం ఏముంది?’ అని అన్నారు. దానికి ‘ఉమర్ (ర), ‘ఒకవేళ అల్లాహ్(త) తన సృష్టితాలందరినీ, ఒకే చేత్తో, ఒకేసారి స్వర్గంలోనికి పంపగోరితే పంపగలడు,’ అని అన్నారు. అప్పుడు ప్రవక్త (స) ‘ఉమర్ చెప్పింది పచ్చి నిజం,’ అని అన్నారు. (షర్’హుస్సున్నహ్)
5604 – [ 39 ] ( ضعيف ) (3/1559)
وعَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ الله صلى الله عليه وسلم: ” يُصَفُّ أَهْلُ النَّارِ فَيَمُرُّ بِهِمُ الرَّجُلُ مِنْ أَهْلِ الْجَنَّةِ. فَيَقُوْلُ الرَّجُلُ مِنْهُمْ: يَا فُلَانُ أَمَا تَعْرِفُنِيْ؟ أَنَا الَّذِيْ سَقَيْتُكَ شُرْبَةً.وَقَالَ بَعْضُهُمْ: أَنَا الَّذِيْ وَهَبْتُ لَكَ وَضُوْءًا فَيَشْفَعُ لَهُ فَيُدْخِلُهُ الْجَنَّةَ”. رَوَاهُ ابْنُ مَاجَهُ.
5604. (39) [3/1559– బలహీనం]
అనస్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”నరకవాసులు పంక్తులుగా నిలబడతారు. అప్పుడు ఒక స్వర్గవాసి వాళ్ళ ముందునుండి వెళతాడు. నరకవాసుల్లోని ఒక వ్యక్తి అతనితో, నీవు నన్ను గుర్తుపట్టలేదా, నేను నీకు ఒకసారి నీళ్ళు త్రాపించాను. వారిలో నుండే మరో వ్యక్తి నేనొకసారి నీకు వు’దూ కోసం నీళ్ళు ఇచ్చాను. అది విని ఆ స్వర్గవాసి వారి కోసం సిఫారసు చేస్తాడు. వారిని స్వర్గంలో ప్రవేశింపజేస్తాడు.[21] (ఇబ్నె మాజహ్)
5605 – [ 40 ] ( ضعيف ) (3/1559)
وَعَنْ أَبِيْ هُرَيْرَةَ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم قَالَ: “إِنَّ رَجُلَيْنِ مِمَّنْ دَخَلَ النَّارَ اِشْتَدَّ صِيَاحُهُمَا. فَقَالَ الرَّبُّ تَعَالى: أَخْرِجُوْهُمَا. فَقَالَ لَهُمَا: لِأَيِّ شَيْءٍ اشْتَدَّ صِيَاحُكُمَا؟ قَالَا: فَعَلْنَا ذَلِكَ لِتَرْحَمَنَا. قَالَ: فَإِنَّ رَحْمَتِيْ لَكُمَا أَنْ تَنْطَلِقَا فَتُلْقِيَا أَنْفُسَكُمَا حَيْثُ كُنْتُمَا مِنَ النَّارِ فَيُلْقِيْ أَحَدُهُمَا نَفْسَهُ فَيَجْعَلُهَا اللهُ بَرْدًا وَّسَلَامًا وَيَقُوْمُ الْآخَرُ فَلَا يُلْقِيْ نَفْسَهُ فَيَقُوْلُ لَهُ الرَّبُ تَعَالى: مَا مَنَعَكَ أَنْ تُلْقِيَ نَفْسَكَ كَمَا أَلْقَى صَاحِبُكَ؟ فَيَقُوْلُ: رَبِّ إِنِّيْ لَأَرْجُوْ أَنْ لَا تُعِيْدَنِيْ فِيْهَا بَعْدَ مَا أَخْرَجْتَنِيْ مِنْهَا. فَيَقُوْلُ لَهُ الرَّبُّ تَعَالى: لَكَ رَجَاؤُكَ. فَيُدْخَلَانِ جَمِيْعًا الْجَنَّةَ بِرَحْمَةِ اللهِ”. رَوَاهُ التِّرْمِذِيُّ .
5605. (40) [3/1559 –బలహీనం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”నరకంలోనికి ప్రవేశించిన వారిలో ఇద్దరు వ్యక్తులు అల్లర్లు, కేకలు వేస్తారు. అంటే ఏడ్పులు, పెడ బొబ్బలు పెడతారు. అల్లాహ్(త) వారిద్దరినీ తీయ మని ఆదేశించి, ‘మీ రెందుకిలా కేకలు, ఏడ్పులు, పెడబొబ్బలు పెడుతున్నారు?’ అని ప్రశ్నిస్తాడు. దానికి వారు, ‘తమరు మమ్మల్ని కరుణించాలని అలా చేస్తున్నాం,’ అని అంటారు. అప్పుడు అల్లాహ్(త), ‘మీ పట్ల నా దయ, జాలి ఏమిటంటే, మీరిద్దరూ వెళ్ళి మిమ్మల్ని మీరు నరకంలో పడేయండి,’ అని అంటాడు. ఒకడు వెంటనే వెళ్ళి ఆదేశం పాలిస్తాడు. అంటే అగ్నిలో దూకుతాడు. అల్లాహ్ (త) ఆ అగ్నిని చల్లబడమని ఆదేశిస్తాడు. అతడు ప్రశాంతంగా ఉంటాడు. రెండవ వ్యక్తి నిలబడి ఉంటాడు. అల్లాహ్ (త) అతనితో, ‘నువ్వు ఎందుకు అగ్నిలో దూకలేదు,’ అని అడుగుతాడు, ‘మీరు తీసుకు వచ్చిన స్థలం నుండి మళ్ళీ మీరు అక్కడకు పంపరని భావిస్తున్నాను,’ అని అంటాడు. అప్పుడు అల్లాహ్ (త), ‘నీవు ఆశించినది నీకు లభిస్తుంది.’ అని అంటాడు. అనంతరం అల్లాహ్ (త) కారుణ్యం వల్ల వారిద్దరూ స్వర్గంలో చేర్చబడతారు. (తిర్మిజి’)
5606 – [ 41 ] ( لم تتم دراسته ) (3/1560)
وعَنْ ابْنِ مَسْعُوْدٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم:”يَرِدُ النَّاسُ النَّارَ ثُمَّ يَصْدُوْنَ مِنْهَا بِأَعْمَالِهِمْ فَأَوَّلُهُمْ كَلَمْحِ الْبَرْقِ ثُمَّ كَالرِّيْحِ ثُمَّ كَحُضْرِ الْفَرَسِ ثُمَّ كَالرَّاكِبِ فِيْ رَحْلِهِ ثُمَّ كَشَدِّ الرِّجْلِ ثُمَّ كَمَشْيِهِ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَالدَّارَمِيُّ.
5606. (41) [3/1560 –అపరిశోధితం]
ఇబ్నె మస్’ఊద్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ప్రజలు నరకాగ్ని వద్దకు వస్తారు. ఆ తరువాత వారి కర్మల ప్రకారం వారికి విముక్తి లభిస్తుంది. వారిలో అందరి కంటే ఉన్నతులు, పిడుగులా ఆ వంతెనను దాటివెళ్ళి పోతారు, మరికొందరు గాలిలా దాటు తారు. మరి కొందరు గుర్రం పరుగులా, మరికొందరు ఒంటెలా, మరి కొందరు మనషి పరిగెత్తే వేగంలా, మరికొందరు మనిషి నడిచే వేగంతో దాటుతారు.” (తిర్మిజి’, దార్మి)
—–
اَلْفَصْلُ الثَّالِثُ మూడవ విభాగం
5607 – [ 42 ] ( مُتَّفَقٌ عَلَيْهِ ) (3/1560)
عَنِ ابْنِ عُمَرَ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم قَالَ: “إِنَّ أَمَامَكُمْ حَوْضِيْ مَا بَيْنَ جَنْبَيْهِ كَمَا بَيْنَ جَرْبَاءَ وَأَذْرُحَ”. قَالَ بَعْضُ الرُّوَاةِ: هُمَا قَرْيَتَانِ بِالشَّامِ بَيْنَهُمَا مَسِيْرَةُ ثَلَاثِ لِيَالٍ.
وَفِيْ رِوَايَةٍ: “فِيْهِ أَبَارِيْقُ كَنُجُوْمِ السَّمَاءِ مَنْ وَرَدَهُ فَشَرِبَ مِنْهُ لَمْ يَظْمَأْ بَعْدَهَا أَبَدًا”. مُتَّفَقٌ عَلَيْهِ.
5607. (42) [3/1560 –ఏకీభవితం]
ఇబ్నె ‘ఉమర్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”తీర్పుదినం నాడు మీ ముందు నా హౌ’ద్ ఉంటుంది. దాని రెండుమూలల మధ్య జర్‌బాఅ’—అజ్’రు’హ్ ల మధ్య ఉండే దూరం ఉంటుంది. కొందరు ఉల్లేఖనకర్తలు ఇవి సిరియాలోని రెండు ప్రాంతాలని, వీటి మధ్య మూడు రోజుల ప్రయాణ దూరం ఉంది. మరో ఉల్లేఖనంలో ఆ కోనేరుకు ఇరువైపులా నీళ్ళు త్రాగే పాత్రలు ఆకాశంలోని నక్షత్రాలకు సమానంగా ఉంటాయి. ఆ కోనేరు వద్దకు వచ్చి నీళ్ళు త్రాగే వ్యక్తికి మరెప్పుడూ దాహం వేయదు. (బు’ఖారీ, ముస్లిమ్)
5608 – [43] ؛ 5609 [44] ( صحيح ) (3/1560)
وَعَنْ حُذَيْفَةَ وَأَبِيْ هُرَيْرَةَ قَالَا: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “يَجْمَعُ اللهُ تَبَارَكَ وَتَعَالى النَّاسَ فَيَقُوْمُ الْمُؤْمِنُوْنَ حَتّى تَزْلَفَ لَهُمُ الْجَنَّةُ. فَيَأْتُوْنَ آدَمَ فَيَقُوْلُوْنَ: يَا أَبَانَا اسْتَفْتِحُ لَنَا الْجَنَّةَ. فَيَقُوْلُ: وَهَلْ أَخْرَجَكُمْ مِنَ الْجَنَّةِ إِلّا خَطِيْئَةُ أَبِيْكُمْ لَسْتُ بِصَاحِبٍ ذَلِكَ اِذْهَبُوْا إِلى ابْنِيْ إِبْرَاهِيْمَ خَلِيْلِ اللهِ”. قَالَ: “فَيَقُوْلُ إِبْرَاهِيْمُ: لَسْتُ بِصَاحِبِ ذَلِكَ إِنّمَا كُنْتُ خَلِيْلًا مِنْ وَّرَاءٍ وَرَاءٍ اعْمِدُوْا إِلى مُوْسَى الَّذِيْ كَلمَهُ اللهُ تَكْلِيْمًا فَيَأْتُوْنَ مُوْسَى عَلَيْهِ السَّلَامُ فَيَقُوْلُ: لَسْتُ بِصَاحِبِ ذَلِكَ اذْهَبُوْا إِلى عِيْسى كَلِمَةِ اللهِ وَرُوْحِهِ فَيَقُوْلُ عِيْسَى: لَسْتُ بِصَاحِبِ ذَلِكَ فَيَأْتُوْنَ مُحَمَّدًا صلى الله عليه وسلم فَيَقُوْمُ فَيُؤْذَنُ لَهُ وَتُرْسَلُ الْأَمَانَةُ وَالرَّحِمُ فَيَقُوْمَانِ جَنْبَتَيِ الصِّرَاطِ يَمِيْنًا وَشِمَالًا فَيَمُرُّ أَوَّلُكُمْ كَالْبَرْقِ”. قَالَ: قُلْتُ: بِأَبِيْ أَنْتَ وَأُمِّيْ أَيُّ شَيْءٍ كَمَرِّالْبَرْقِ؟ قَالَ: “أَلَمْ تَرَوْا إِلى الْبَرْقِ كَيْفَ يَمُرُّ وَيَرْجِعُ فِيْ طَرْفِ عَيْنٍ. ثُمَّ كَمَرِّ الرِّيْحِ ثُمَّ كَمَرِّ الطَّيْرِ وَشَدِّ الرِّجَالِ تَجْرِيْ بِهِمْ أَعْمَالُهُمْ وَنَبِيُّكُمْ قَائِمٌ عَلَى الصِّرَاطِ يَقُوْلُ: يَا رَبِّ سَلِّمْ سَلِّمْ. حَتّى تَعْجَزَ أَعْمَالُ الْعِبَادِ حَتَّى يَجِيْءَ الرَّجُلُ فَلَا يَسْتَطِيُع السَّيْرَ إِلَّا زَحْفًا”. وقَالَ: “وَفِيْ حَافَتَيِ الصِّرَاطِ كَلَالِيْبُ مُعَلَّقَةُ مَأْمُوْرَةٌ تَأْخُذُ مَنْ أُمِرَتْ بِهِ فَمَخْدُوْشٌ نَاج وَمُكَرْدَسٌ فِي النَّارِ”. وَ الَّذِيْ نَفْسُ أَبِيْ هُرَيْرَةَ بِيَدِهِ إِنَّ قَعْرَ جَهَنَّمَ لَسَبْعِيْنَ خَرِيْفًا. رَوَاهُ مُسْلِمٌ.
5608 (43) & 5609. (44) [3/1560 –దృఢం]
‘హుజై’ఫహ్, అబూ-హురైరల కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”తీర్పుదినం నాడు అల్లాహ్ ప్రళయ మైదానంలో ప్రజలను సమీకరిస్తాడు. విశ్వాసులందరూ నిలబడతారు. స్వర్గాన్ని వారికి చేరువ చేయబడు తుంది. ఆ తరువాత ప్రజలు ఆదమ్ (అ) వద్దకు వస్తారు. ‘ఓ మా తండ్రి మా కోసం స్వర్గం తెరవండి,’ అని అంటారు. దానికి ఆదమ్ (అ), ‘మిమ్మల్ని స్వర్గం నుండి మీ తండ్రి పాపమే బయటకు తీసి వేసింది, ఈ పని నాకు సాధ్యం కాదు, నేను దీనికి తగను, మీరు నా కుమారుడు ఇబ్రాహీమ్ (అ) వద్దకు వెళ్ళండి,’ అని అంటారు. ప్రవక్త (స) కథనం: ”ఇబ్రాహీమ్ (అ) కూడా వారికి ఇటువంటి సమాధానమే ఇస్తూ, ‘నేను దీనికి తగను, ఈ నాటికి ముందు నేను అల్లాహ్(త) మిత్రుడ్ని, మీరు మూసా (అ) వద్దకు వెళ్ళండి, అల్లాహ్(త) స్వయంగా అతనితో మాట్లాడాడు,’ అని అంటారు. ప్రజలు మూసా (అ) వద్దకు వెళతారు. అతను కూడా, ‘నేను దీనికి తగనని, మీరు ‘ఈసా ప్రవక్త వద్దకు వెళ్ళండి, అతను అల్లాహ్ వచనం, ఆయన(త) ఆత్మ,’ అని అంటారు. ప్రజలు ‘ఈసా (అ) వద్దకు వెళతారు. ‘ఈసా (అ) కూడా, ‘నేను దీనికి తగను,’ అని అంటారు. ప్రజలు చివరికి ము’హమ్మద్ (స) వద్దకు వస్తారు. అప్పుడు ము’హమ్మద్ (స) నిలబడి అనుమతి కోరుతారు. ప్రవక్త (స)కు అనుమతి లభిస్తుంది. ఆ తరువాత అమానతు, బంధుత్వాన్ని పంపటం జరుగుతుంది. అవి ‘సిరా’త్ వంతెనపై రెండు వైపుల నిలబడిపోతాయి. ‘సిరా’త్ వంతెన మీదుగా ప్రజలు వెళ్ళటం ప్రారంభిస్తారు. అందరి కంటే మొదటి బృందం పిడుగులా వెళ్ళిపోతుంది.
అబూ హురైరహ్ (ర) కథనం: ‘ఓ ప్రవక్తా! నా తల్లి దండ్రులు మీ కొరకు త్యాగంకాను, పిడుగులా ఎలా వెళ్తారు,’ అని నేను ప్రశ్నించాను. దానికి ప్రవక్త (స), ‘పిడుగు మెరిసి ఎలా అదృశ్యం అవుతుందో మీరు చూడ లేదా? కనురెప్ప పాటులో వచ్చిపోతుంది.’ ఆ తరువాత వారు గాలిలా వెళ్ళిపోతారు. ఆ తరువాత వారు పక్షుల్లా వెళ్ళిపోతారు. ఆ తరువాత వారు పురుషులు పరిగెత్తే వేగంతో వెళతారు. ఆ తరువాత వారు నడక వేగంతో వెళతారు. అంటే కర్మలు ఎలా ఉంటే వారి వేగం కూడా అలాగే ఉంటుంది. వాళ్ళు ‘సిరాత్’ వంతెన పై నిల్చొని ”రబ్బి సల్లిమ్, రబ్బి సల్లిమ్” – ‘ఓ అల్లాహ్ (త)! నన్ను క్షేమంగా ఉంచు,’ అని ప్రార్థిస్తూ ఉంటారు. చివరికి మంచి కర్మలు గల వారందరూ వెళ్ళిపోతారు. కర్మలు తక్కువగా ఉన్న వారికి దాటడం కష్టం అవుతుంది. ఎందు కంటే వారి కర్మల వేగం బలహీనంగా ఉంటుంది. వారు వంతెనపై దాటలేరు. ఒక వ్యక్తి ఈడ్చు కుంటూ వస్తాడు.’ ఆ తర్వాత ప్రవక్త (స) ఇలా అన్నారు: ఆ వంతెన రెండు వైపుల కంచెలు ఉంటాయి. వాటికి ఆ వ్యక్తిని పట్టు కోమని ఆదేశించడం జరుగుతుంది. అనంతరం వాటికి గురై గాయాలపాలై కొందరు విముక్తిపొందుతారు. మరి కొందరిని కాళ్ళు చేతులూ కట్టి నరకంలో పడవేయటం జరుగుతుంది. ఎవరి చేతిలో అబూ హురైరహ్ ప్రాణం ఉందో ఆయన(త) సాక్షి! నరకం 70 సంవత్సరాల ప్రయాణమంత లోతుగా ఉంటుంది.” (ముస్లిమ్)
5610 – [ 45 ] ( مُتَّفَقٌ عَلَيْهِ ) (3/1561)
وَعَنْ جَابِرٍقَالَ: قَالَ رَسُوْلُ الله صلى الله عليه وسلم: “يَخْرُجُ مِنَ النَّارِ بِالشَّفَاعَةِ كَأَنَّهُمُ الثَّعَارِيْرُ؟قَالَ: “إِنَّهُ الضَّغَابِيْسُ”.
5610. (45) [3/1561–ఏకీభవితం]
జాబిర్ (ర) కథనం: ప్రవక్త (స) ”సిఫారసు ద్వారా నరకం నుండి తీయబడిన వారిని, స”ఆరీర్‌గా ఉదహ రించటం జరుగుతుంది,” అని అన్నారు. అప్పుడు మేము, ‘ఓ ప్రవక్తా! స”ఆరీర్ అంటే ఏమిటి,’ అని విన్నవించుకున్నాం. దానికి ప్రవక్త (స) అంటే, ఖీరా, కకడీల వలే,’ అని అన్నారు. [22] (బు’ఖారీ, ముస్లిమ్)
5611 – [ 46 ] )موضوع( (3/1561)
وَعَنْ عَثْمَانَ بْنِ عَفَّانَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “يَشْفَعُ يَوْمَ الْقِيَامَةِ ثَلَاثَةٌ: الْأَنْبِيَاءُ ثُمَّ الْعُلَمَاءُ ثُمَّ الشُّهَدَاءُ”. رَوَاهُ ابْنُ مَاجَهُ .
5611. (46) [3/1561కల్పితం]
‘ఉస్మాన్ బిన్ ‘అప్ఫాన్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవ చనం: ”తీర్పుదినం నాడు మూడు రకాలకు చెందిన వ్యక్తులు సిఫా రసు చేస్తారు. దైవప్రవక్తలు, ధార్మిక పండితులు, అమర వీరులు.” [23] (ఇబ్నె మాజహ్)
=====
5– بَابُ صِفَةِالْجَنَّةِ وَأَهْلِهَا
5. స్వర్గం, స్వర్గవాసుల విశేషాలు
اَلْفَصْلُ الْأَوَّلُ మొదటి విభాగం
5612 – [ 1 ] ( مُتَّفَقٌ عَلَيْهِ ) (3/1562)
عَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: قَالَ رَسُوْلُ الله صلى الله عليه وسلم: “قَالَ اللهُ تَعَالى: أَعْدَدْتُ لِعِبَادِيْ الصَّالِحِيْنَ مَا لَا عَيْنٌ رَأَتْ وَلَا أُذنٌ سَمِعَتْ وَلَا خَطَرَ عَلَى قَلْبِ بَشَرٍ. وَاقْرَؤُوْا إِنْ شِئْتُمْ: (فَلَا تَعْلَمُ نَفْسٌ مَا أُخْفِيَ لَهُمْ مِّنْ قُرَّةِ اَعْيُنٍ؛32 : 17) مُتَّفَقٌ عَلَيْهِ
5612. (1) [3/1562 –ఏకీభవితం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”అల్లాహ్(త) ఇలా ఆదేశిస్తున్నాడు: ‘నేను నా ప్రియ దాసుల కోసం ఎటువంటి వస్తువులు తయారుచేసి ఉంచానంటే, ఏ కన్ను వాటిని చూడలేదు. ఏ చెవి వినలేదు, ఏ వ్యక్తి హృదయంలో వాటి ఆలోచన కూడా రాజాలదు. దీన్ని ధృవీకరిస్తూ ఈ ఆయతు: ”కాని వారికి, వారి కర్మల ఫలితంగా వారి కొరకు (పరలోకంలో) కళ్ళకు చలువనిచ్చే ఎటువంటి సామాగ్రి దాచిపెట్టబడి ఉందో ఏ ప్రాణికీ తెలియదు,” (సజ్దా, 32:17) చదవండి అని అన్నారు. (బు’ఖారీ, ముస్లిమ్)
5613 – [ 2 ] ( مُتَّفَقٌ عَلَيْهِ ) (3/1562)
وَعَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ الله صلى الله عليه وسلم: مَوْضِعُ سَوْطٍ فِي الْجَنَّةِ خَيْرٌ مِنَ الدُّنْيَا وَمَا فِيْهَا”. مُتَّفَقٌ عَلَيْهِ.
5613. (2) [3/1562 –ఏకీభవితం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”స్వర్గంలోని చెత్త కుండీ స్థలం, ప్రపంచం, దానిలో ఉన్న సమస్తం కంటే ఎంతో ఉన్నతమైనది.” (ముస్లిమ్, బు’ఖారీ)
5614 – [ 3 ] ( صحيح ) (3/1562)
وَعَنْ أَنَسٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “غَدْوَةٌ فِيْ سَبِيْلِ اللهِ أَوْرَوْحَةٌ خَيْرٌمِّنَ الدُّنْيَا وَمَا فِيْهَا وَلَوْأَنَّ امْرَأَةَ مِّنْ نِسَاءِ أَهْلِ الْجَنَّةِ اطَّلَعَتْ إِلى الْأَرْضِ لَأَضَاءَتْ مَابَيْنَهُمَا وَلَمَلَأَتْ مَا بَيْنَهُمَا رِيْحًا وَ لَنَصِيْفُهَا عَلَى رَأْسِهَا خَيْرٌمِّنَ الدُّنْيَاوَمَا فِيْهَا”. روَاهُ الْبُخَارِيُّ.
5614. (3) [3/1562 – దృఢం]
అనస్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఉదయం, సాయంత్రం ఒకసారి దైవమార్గంలో బయలుదేరటం, ప్రపంచం మరియు ప్రపంచంలోని వస్తువులన్నిటి కంటే ఉన్నతమైనది. ఒకవేళ స్వర్గవాసుల్లో ఒక స్త్రీ భూమి వైపు తొంగి చూస్తే, తూర్పు పశ్చిమాల వరకు వెలు గుతో నింపివేస్తుంది. ఇంకా తూర్పు నుండి పశ్చిమం వరకు సువాసనతో నింపివేస్తుంది. ఇంకా ఆమె తలపై ఉండే దుప్పటి ఈ ప్రపంచం, ఇంకా అందులోని వస్తువు లన్నిటి కంటే ఎంతో ఉత్తమమైనది. (బు’ఖారీ)
5615 – [ 4 ] ( مُتَّفَقٌ عَلَيْهِ ) (3/1562)
وَعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: قَالَ رَسُوْلُ الله صلى الله عليه وسلم: “إِنَّ فِي الْجَنَّةِ شَجرة يسير الراكب في ظلها مائة عام لا يقطعها ولقاب قوس أحدكم في الجنة خير مما طلعت عليه الشمس أو تغرب”. مُتَّفَقٌ عَلَيْهِ.
5615. (4) [3/1562 –ఏకీభవితం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”స్వర్గంలో ఒక చెట్టు ఉంది. ఎవరైనా ఒకవేళ 100 సంవత్సరాలు వాహనంపై ఆ చెట్టు నీడలో ప్రయాణం చేసినా దాన్ని అధిగమించలేడు. స్వర్గంలో విల్లు అంత స్థలం ప్రపంచంలో వస్తువులన్నిటి కంటే ఎంతో శ్రేష్ఠమైనది.” (బు’ఖారీ, ముస్లిమ్)
5616 – [ 5 ] ( مُتَّفَقٌ عَلَيْهِ ) (3/1563)
وَعَنْ أَبِيْ مُوْسَى قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِنَّ لِلْمُؤْمِنِ فِي الْجَنَّةِ لَخَيْمَةً مِنْ لُؤْلُؤَةٍ وَاحِدَةٍ مُجَوَّفَةٍ عَرْضُهَا وَفِيْ رِوَايَةٍ: طُوْلُهَا سِتُّوْنَ مِيْلًا فِيْ كُلِّ زَاوِيَةٍ مِنْهَا أَهْلٌ مَا يَرَوْنَ الْآخَرِيْنَ يَطُوْفُ عَلَيْهِمُ الْمُؤْمِنُ وَجَنَّتَانِ مِنْ فِضَّةٍ آنِيَتُهُمَا مَا فِيْهِمَا وَجَنَّتَانِ مِنْ ذَهَبٍ آنِيَتُهُمَا وَمَا فِيْهِمَا وَمَا بَيْنَ أَنْ يَّنْظُرُوْا إِلى رَبِّهِمْ إِلَّا رِدَاءُ الْكِبْرِيَاءِ عَلَى وَجْهِهِ فِيْ جَنَّةِ عَدْنٍ”.
5616. (5) [3/1563 –ఏకీభవితం]
అబూ మూసా (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”స్వర్గంలో విశ్వాసి కోసం ముత్యాలతో చేయబడిన టెంట్ ఉంటుంది. దాని వెడల్పు ఒక ఉల్లేఖనం ప్రకారం 60 మైళ్ళ దూరం ఉంటుంది. ఆ టెంట్‌లోప్రతి వైపు అతని భార్యలు ఉంటారు. వాళ్ళు ప్రక్క టెంట్ వారిని చూడలేరు. విశ్వాసి వీళ్ళవద్దకు వస్తూ పోతూ ఉంటాడు. విశ్వాసికొరకు రెండు స్వర్గాలు ఉంటాయి. అందులో వంటింటి సామాన్లన్నీ వెండితో చేయబడి ఉంటాయి. మరో స్వర్గంలో వంటింటి సామాన్లన్నీ బంగారంతో చేయబడి ఉంటాయి. జన్నతుల్ అద్‌న్‌లో ప్రజలు అల్లాహ్ (త)ను చూడటానికి ఒక్క తెర తప్ప మరేమీ ఉండదు. [24] (బు’ఖారీ, ముస్లిమ్)
5617 – [ 6 ] ( صحيح ) (3/1563)
وَعَنْ عُبَادَةَ بْنِ الصَّامِتِ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: ” فِي الْجَنَّةِ مِائَةُ دَرَجَةٍ مَا بَيْنَ كُلِّ دَرَجَتَيْنِ كَمَا بَيْنَ السَّمَاءِ وَالْأَرْضِ وَالْفِرْدَوْسُ أَعْلَاهَا دَرَجَةً مِنْهَا تَفَجَّرُ أَنْهَارُ الْجَنَّةِ الْأَرْبَعَةُ وَمِنْ فَوْقِهَا يَكُوْنُ الْعَرْشُ فَإِذَا سَأَلْتُمُ اللهَ فَاسْأَلُوْهُ الْفِرْدَوْسَ”. رَوَاهُ التِّرْمِذِيُّ.
وَلَمْ أَجِدْهُ فِي الصَّحِيْحَيْنِ وَلَا فِي كِتَابِ الْحُمَيْدِيِّ.
5617. (6) [3/1563– దృఢం]
‘ఉబాదహ్‌బిన్ ‘సామిత్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”స్వర్గంలో 100 తరగతులు ఉన్నాయి. ప్రతి రెండు తరగతుల మధ్య దూరం భూమ్యా కాశాలంత దూరం ఉంది. అయితే స్వర్గంలో అన్ని తరగతుల కంటే ఉన్నతమైనది. ఫిర్‌దౌస్. ఈ ఫిర్‌దౌస్ నుండే కాలువలన్నీ ప్రవహిస్తాయి. ఫిర్‌దౌస్‌పై అల్లాహ్ (త) సింహాసనం ఉంది. మీరు అల్లాహ్(త)ను స్వర్గం అర్థిస్తే జన్నతుల్ ఫిర్‌దౌస్ అర్థించండి.” [25] (తిర్మిజి’)
5618 – [ 7 ] ( صحيح ) (3/1563)
وَعَنْ أَنَسٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِنَّ فِي الْجَنَّةِ لَسُوْقًا يَأْتُوْنَهَا كُلَّ جُمْعَةٍ فَتَهُبُّ رِيْحُ الشِّمَالِ فَتَحْثُوْ فِي وُجُوْهِهِمْ وَثِيَابِهِمْ فَيَزْدَادُوْنَ حُسْنًا وَّجَمَالًا فَيَرْجِعُوْنَ إِلى أَهْلِيْهِمْ وَقَدِ ازْدَادُوْا حُسْنًا وَجَمَالًا فَيَقُوْلُ لَهُمْ أَهْلُوْهُمْ وَاللهِ لَقَدِ ازْدَدْتُمْ بَعْدَنَا حُسْنًا وَّجَمَالًا فَيَقُوْلُوْنَ وَأَنْتُمْ وَاللهِ لَقَدِ ازْدَدْتُمْ حُسْنًا وَّجَمَالًا”.
5618. (7) [3/1562– దృఢం]
అనస్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”స్వర్గంలో ఒక బజారు ఉంది. స్వర్గవాసులు ప్రతి శుక్రవారం అక్కడికి వస్తూ ఉంటారు. అక్కడ షిమాలీ గాలి వీస్తుంది. స్వర్గవాసుల ముఖాలపై, దుస్తులపై సువాసన చల్లుతుంది. దానివల్ల వారి అందం మరింత పెరుగు తుంది. ఆ తరువాత వారు చాలా అందంగా తయారై తమ భార్యల వద్దకు తిరిగి వస్తే, వారి భార్యలు వారితో, ‘అల్లాహ్ సాక్షి! మా దగ్గరినుండి వెళ్ళి మీరు చాలా అందంగా తయారయ్యారు,’ అని అంటారు. దానికి సమాధానంగా వారు, ‘అల్లాహ్ సాక్షి! మీరు కూడా చాలా అందంగా తయారయ్యారు,’ అని అంటారు. (ముస్లిమ్)
5619 – [ 8 ] ( صحيح ) (3/1563)
وعَنْ أَبِيْ هُرَيْرَةَ قا ل: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِنَّ أَوَّلَ زُمْرَةٍ يَدْخُلُوْنَ الْجَنَّةَ عَلَى صُوْرَةِ الْقَمَرِ لَيْلَةَ الْبَدْرِ ثُمَّ الَّذِيْنَ يَلُوْنَهُمْ كَأَشَدِّ كَوْكَبٍ دُرِّيٍّ فِي السَّمَاءِ إِضَاءَةً قُلُوْبُهُمْ عَلَى قَلْبِ رَجُلٍ وَاحِدٍ لَا اخْتِلَافَ بَيْنَهُمْ وَلَا تَبَاغُضَ لِكُلِّ امْرِئٍ مِّنْهُمْ زَوْجَتَانِ مِنَ الْحُوْرِ الْعَيْنِ يُرَى مُخُّ سُوْقِهِنَّ مِنْ وَّرَاءِ الْعَظْمِ وَاللَّحْمِ مِنَ الْحُسْنِ يُسَبِّحُوْنَ اللهَ بُكْرَةً وَّعَشِيًّا لَا يَسْقُمُوْنَ وَلَا يَبُوْلُوْنَ وَلَا يَتَغَوَّطُوْنَ وَلَا يَتْفُلُوْنَ وَلَا يَتْمَخِطُوْنَ آنِيَتُهُمُ الذَّهَبُ وَالْفِضَّةُ وَأَمْشَاطُهُمُ الذَّهَبُ وَوَقُوْدُ مَجَامِرِهُمُ الْأَلُوَّةُ وَرَشْحُهُمُ الْمِسْكُ عَلَى خَلْقِ رَجُلٍ وَاحِدٍعَلَى صُوْرَةٍ أَبِيهِمْ آدَمَ سِتُّوْنَ ذِرَاعًا فِي السَّمَاءِ. رَوَاهُ مُسِلِمٌ .
5619. (8) [3/1563 –దృఢం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”స్వర్గంలోకి వెళ్ళే మొట్టమొదటి బృందం వారి ముఖాలు వెన్నెలరాత్రి చంద్రుడిలా తేజోవంతంగా ఉంటాయి. వారి తరువాత వెళ్ళే బృందం వారి ముఖాలు ఆకాశంలో తేజోవంతంగా మెరుస్తున్న నక్షత్రాల్లా ఉంటాయి. వారి హృదయాలు ఒకేలా ఉంటాయి. వారిలో విభేదాలు, ఈర్ష్యా ద్వేషాలు, అసూయ ఏ మాత్రం ఉండవు. స్వర్గంలో ప్రతి వ్యక్తికి దైవకన్యల్లో నుండి ఇద్దరు భార్యలు ఉంటారు. వారి చీలమండలలో నుండి దుమ్ముల్లో ఉన్న మూలుగ మాంసంపై నుండి కనబడుతూ ఉంటుంది. స్వర్గవాసులు ఉదయం, సాయంత్రం అల్లాహ్(త)ను స్మరిస్తూ ఉంటారు. వారు వ్యాధికి గురికారు, వారికి మలమూత్ర విసర్జనకు వెళ్ళే అవసరం ఉండదు, ఉమ్మిరాదు, ఇంకా వారికి దగ్గురాదు. స్వర్గవాసుల పాత్రలు, కంచాలు బంగారం, వెండితో చేయబడి ఉంటాయి. వారి దువ్వెనలు బంగారంతో చేయబడి ఉంటాయి. వారి నిప్పు కుంపట్లు సువాసనతో కూడుకొని ఉంటాయి. వారి చెమట కస్తూరిలా ఉంటుంది. స్వర్గవాసులందరి అలవాట్లు, గుణాలు ఒకేలా ఉంటాయి. స్వర్గవాసులు రూపురేఖల్లో తమ తండ్రి ఆదమ్‌ను పోలి ఉంటారు. వారి పొడవు 60 గజాలు ఉంటుంది.” (బు’ఖారీ, ముస్లిమ్)
5620 – [ 9 ] ( صحيح ) (3/1564)
وَعَنْ جَابِرٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِنَّ أَهْلِ الْجَنَّةِ يَأْكُلُوْنَ فِيْهَا وَيَشْرِبُوْنَ وَلَايَتْفُلُوْنَ وَلَايَبُوْلُوْنَ وَلَا يَتَغَوَّطُوْنَ وَلَا يَمْتَخطُوْنَ”. قَالُوْا: فَمَا بَالُ الطَّعَامِ؟ قَالَ: “جُشَاءٌ وَّرَشْحٌ كَرَشْحِ الْمِسْكِ يُلهَمُوْنَ التَّسْبِيْحَ وَالتَّحْمِيْدَكَمَا تُلْهَمُوْنَ النَّفْسَ”. رَوَاهُ مُسْلِمٌ .
5620. (9) [3/1564 –దృఢం]
జాబిర్ (ర) కథనం: ప్రవక్త(స) ”స్వర్గ వాసులు స్వర్గంలో తింటారు, త్రాగుతారు. కాని వారికి ఉమ్మిరాదు, మల మూత్రాలు రావు, ముక్కులో నుండి మలినాలురావు,” అని ప్రవచించారు. దానికి అనుచరులు ”మరి ఆహార మలం ఏమవుతుంది?” అని విన్నవించుకున్నారు. అప్పుడు ప్రవక్త (స), ‘మలం తేన్పులా, చెమట కస్తూరి సువాసనలా మారి పోతాయి. స్వర్గవాసుల శ్వాస, ”సుబ్’హానల్లాహ్, అల్’హమ్‌దులిల్లాహ్” గా మారి పోతాయి. అంటే వారు ఎల్లప్పుడూ సుబ్’హానల్లాహ్, అల్’హమ్‌దు లిల్లాహ్, అని స్మరిస్తూ ఉంటారు. (ముస్లిమ్)
5621 – [ 10 ] ( صحيح ) (3/1564)
وعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: قَالَ رَسُوْلُ الله صلى الله عليه وسلم: “مَنْ يَدْخُلُ الْجَنَّةَ يَنْعَمُ وَلَا يَبْأَسُ وَلَا تَبْلَى ثِيَابُهُ وَلَا يَفْنَى شَبَابُهُ”. رَوَاهُ مُسْلِمٌ .
5621. (10) [3/1564 –దృఢం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”స్వర్గంలోకి ప్రవేశించిన ప్రతి వ్యక్తి అత్యంత సంతోషంగా ఉంటాడు. దుఃఖవిచారాలు అతని దరిచేరవు. అతని దుస్తులూ మాసిపోవు, ఇంకా అతని యవ్వనం నశించదు.” (ముస్లిమ్)
5622 – [11] ( صحيح ) 5623 – [12] (3/1564)
وعَنْ أبي سعيد وَأَبِيْ هُرَيْرَةَ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم قَالَ: “يُنَادِيْ مُنَادٍ: إِنَّ لَكُمْ أَنْ تَصِحُوْا فَلَا تَسْقَمُوْا أَبَدًا وَإِنَّ لَكُمْ أَنْ تَحْيَوْا فَلَا تَمُوْتُوْا أَبَدًا وَإِنَّ لَكُمْ أَنْ تَشْبُّوْا فَلَا تَهْرَمُوْا أَبَدًا وَإِنَّ لَكُمْ أَنْ تَنْعَمُوْا فَلَا تَبْأَسُوْا أَبَدًا”. رَوَاهُ مُسْلِمٌ.
5622 (11) & 5623. (12) [3/1564– దృఢం]
అబూ స’యీద్, అబూ హురైరహ్ (ర)ల కథనం: ప్రవక్త (స) ప్రవచనం, స్వర్గంలో ఒక ప్రకటించేవాడు ఇలా ప్రకటిస్తాడు, ”ఓ స్వర్గవాసులారా! మీరు శాశ్వతంగా క్షేమంగా, ఆరోగ్యంగా ఉంటారు. వ్యాధికి గురికారు. శాశ్వతంగా ఉంటారు. అంటే మరణంరాదు, మీరు ఎల్లప్పుడూ యవ్వనదశలోనే ఉంటారు. వృధ్ధాప్యం రాదు. మీరు సుఖసంతోషాల్లోనే ఉంటారు. దుఃఖ విచారాలు మీ దగ్గరకు రావు.” (ముస్లిమ్)
5624 – [13] (مُتَّفَقٌ عَلَيْهِ) (3/1564)
وَعَنْ أَبِيْ سَعِيْدِ الْخُدْرِيِّ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم قَالَ:” إِنَّ أَهْلَ الْجَنَّةِ يَتَرَآءَوْنَ أَهْلَ الْغُرَفِ مِنْ فَوْقِهِمْ كَمَا تَتَرَآءَوْنَ الْكَوْكَبَ الدّرِّيَّ الْغَابِرَفِي الْأُفُقِ مِنَ الْمَشْرِقِ أَوِالْمَغْرِبِ لِتَفَاضُلِ مَا بَيْنَهُمْ” .قَالُوْا يَا رَسُوْلَ اللهِ تِلْكَ مَنَازِلُ الْأَنْبِيَاءِلَا يَبْلُغُهَاغَيْرُهُمْ قَالَ:”بَلَى وَ الَّذِيْ نَفْسِيْ بِيَدِهِ رِجَالٌ آمَنُوْا بِاللهِ وَصَدَّقُوا الْمُرْسَلِيْنَ”. مُتَّفَقٌ عَلَيْهِ.
5624. (13) [3/1564 –ఏకీభవితం]
అబూ స’యీద్ ‘ఖుద్రీ(ర) కథనం: ప్రవక్త (స) ”స్వర్గ వాసులు తమపై ఉన్న బాల్కనీలలో ఉన్న వారిని మీరు నక్షత్రాలను చూచినట్లు చూస్తారు. ఆ బాల్క నీల ఎత్తు వారి స్థానాలను బట్టి ఉంటుంది,” అని అన్నారు. దానికి అనుచరులు, ‘ఓ ప్రవక్తా! ఈ బాల్క నీలు కేవలం ప్రవక్తల నివాసాలై ఉంటాయా, వాటిలో వారు తప్ప మరెవరూ ప్రవేశించరా?’ అని విన్నవించు కున్నారు. దానికి ప్రవక్త (స), ‘ఎవరి చేతిలో నా ప్రాణం ఉందో ఆయన (త) సాక్షి! అల్లాహ్ (త)ను విశ్వసించి ప్రవక్తలను ధృవీకరించిన వారే వాటిలో ప్రవేశిస్తారు,’ అని అన్నారు. (బు’ఖారీ, ముస్లిమ్)
5625 – [ 14 ] ( صحيح ) (3/1565)
وعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “يَدْخُلُ الْجَنَّةَ أَقْوَامٌ أَفْئِدَتُهُمْ مِثْلُ أَفْئِدةِ الطَّيْرِ”. رَوَاهُ مُسْلِمٌ.
5625. (14) [3/1565 –దృఢం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”స్వర్గంలో ఎటువంటి వారు ప్రవేశిస్తారంటే, వారి హృదయాలు పక్షుల హృదయాల్లా ఉంటాయి. అంటే సున్నితమైన, ఈర్ష్యాద్వేషాలకు దూరంగా ఉండే హృదయాలు ఉంటాయి. ఇంకా అల్లాహ్ (త)పై పూర్తి భారం కలిగి ఉంటాయి.” (ముస్లిమ్)
5626 – [ 15 ] ( مُتَّفَقٌ عَلَيْهِ ) (3/1565)
وَعَنْ أَبِيْ سَعِيْدٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِنَّ اللهَ تَعَالى يَقُوْلُ لِأَهْلِ الْجَنَّةِ يَا أَهْلَ الْجَنَّةِ فَيَقُوْلُوْنَ لَبَّيْكَ رَبَّنَا وَسَعْدَيْكَ وَ الْخَيْرُ كُلُّهُ فِيْ يَدَيْكَ. فَيَقُوْلُ: هَلْ رَضِيْتُمْ؟ فَيَقُوْلُوْنَ: وَمَا لَنَا لَا نَرْضَى يَا رَبِّ وَقَدْأَعْطَيْتَنَا مَا لَمْ تُعْطِ أَحَدًامِنْ خَلْقِكَ؟ فَيَقُوْلُ أَلَا أُعْطِيْكُمْ أَفْضَلَ مِنْ ذَلِكَ؟ فَيَقُوْلُوْنَ: يَا رَبُّ وَأَيُّ شَيْءٍ أَفْضَلُ مِنْ ذَلِكَ؟ فَيَقُوْلُ: أُحِلُّ عَلَيْكُمْ رِضْوَانِيْ فَلَا أَسْخَطُ عَلَيْكُمْ بَعْدَهُ أَبَدًا”. مُتَّفَقٌ عَلَيْهِ .
5626. (15) [3/1565– ఏకీభవితం]
అబూ స’యీద్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”అల్లాహ్(త) స్వర్గవాసులతో ఇలా ఆదేశిస్తాడు, ‘ఓ స్వర్గవాసులారా!’ అని అంటాడు. అది విని స్వర్గవాసు లందరూ, ‘మా ప్రభూ! మేము సిద్ధంగా ఉన్నాం. ఇంకా మేలంతా నీ చేతుల్లోనే ఉంది,’ అని అంటారు. అప్పుడు అల్లాహ్(త), ‘మీరు ఆనందంగా, సంతోషాలలో ఉన్నారా?’ అని అడుగుతాడు. దానికి స్వర్గవాసులు, ‘ఓ మా ప్రభూ! మే మెలా ఆనందంగా, సంతోషంగా ఉండము. నీవు మాకు సృష్టితాల్లో ఎవ్వరికీ ఇవ్వనంతగా ఇచ్చివేసావు,’ అని అంటారు. అప్పుడు అల్లాహ్ (త), ‘దీనికంటే ఉన్నతమైన అనుగ్రహం మీకు ప్రసాదించనా?’ అని అంటాడు. దానికి వారు, ‘దీనికంటే ఉత్తమమైన అనుగ్రహం మరొకటి ఏముంటుంది?’ అని అంటారు. దానికి అల్లాహ్(త), ‘నేను మీకు నా ప్రీతిని ప్రసాదిస్తాను,’ అని అంటాడు.” (బు’ఖారీ, ముస్లిమ్)
5627 – [ 16 ] ( صحيح ) (3/1565)
وعَنْ أَبِيْ هُرَيْرَةَ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم قَالَ: “إِنَّ أَدْنَى مَقْعَدِ أَحَدِكُمْ مِنَ الْجَنَّةِ أَنْ يَقُوْلُ لَهُ: تَمَنَّ فَيَتَمَنّى وَيَتَمَنّى فَيَقُوْلُ لَهُ: هَلْ تَمَنَّيْتَ؟ فَيَقُوْلُ نَعَمْ. فَيَقُوْلُ لَهُ: فَإِنَّ لَكَ مَا تَمَنَّيْتَ وَمِثْلَهُ مَعَهُ”. رَوَاهُ مُسْلِمٌ.
5627. (16) [3/1565 –దృఢం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”స్వర్గంలో మీలో అందరికంటే అల్ప తరగతికి చెందిన వ్యక్తితో అల్లాహ్(త),’కోరుకో,’ అని అంటాడు. అతడు కోరుకుంటాడు, ఇంకా కోరుకుంటాడు. అప్పుడు అల్లాహ్ (త), ‘కోరుకున్నావా?’ అని అంటాడు. దాని కతడు కోరుకున్నాను,’ అంటాడు. అప్పుడు అల్లాహ్ (త) నీవు కోరుకున్న దానికంటే ఒక్కింత అధికంగా ఇవ్వటం జరిగింది,’ అని అంటాడు.” (ముస్లిమ్)
5628 – [ 17 ] ( صحيح ) (3/1565)
وعَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “سِيْحَانُ وّجِيْحَانُ وَ الْفُرَاتُ وَالنِّيْلُ كُلٌّ مِّنَ أَنْهَارِ الْجَنَّةِ”. رَوَاهُ مُسْلِمٌ .
5628. (17) [3/1565 –దృఢం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”సీ’హాన్, జీ’హాన్, ఫురాత్, నీల్ మొదలైన నదులన్నింటికీ స్వర్గంలోని నదులతో సంబంధం ఉంది.” [26] (ముస్లిమ్)
5629 – [ 18 ] ( صحيح ) (3/1566)
وعَنْ عُتْبَةَ بْنِ غَزْوَانَ قَالَ: ذُكِرَ لَنَا أَنَّ الْحَجَرَ يُلْقَى مِنْ شَفَةِ جَهَنَّمَ فَيَهْوِيْ فِيْهَا سَبْعِيْنَ خَرِيْفًا لَا يُدْرِكُ لَهَا قَعْرًا وَاللهِ لَتُمْلانَّ وَلَقَدْ ذُكِرَ لَنَا أَنَّ مَا بَيْنَ مِصْرَاعَيْنَ مِنْ مَصَارِيْعِ الْجَنَّةِ مَسِيْرَةُ أَرْبَعِيْنَ سَنَةً وَلَيَأْتِيَنَّ عَلَيْهَا يَوْمٌ وَهُوَ كَظِيْظٌ مِّنَ الزِّحَامِ”. رَوَاهُ مُسْلِمٌ .
5629. (18) [3/1566 –దృఢం]
‘ఉత్‌బహ్ బిన్ ‘గజవాన్ కథనం: ఒకవేళ నరకంలో రాయి విసిరితే 70 సంవత్సరాల వరకు అది నరకం అడుగుకు చేరదు. అల్లాహ్ సాక్షి! అంత లోతుగా ఉన్నప్పటికీ అది అవిశ్వాసులతో నిండిపోతుందని మా ముందు ప్రస్తావించటం జరిగింది. ‘ఉత్‌బహ్ కథనం: ”స్వర్గంలోని ద్వారాల తలుపుల మధ్య దూరం 40 సంవత్సరాల ప్రయాణ దూరం ఉంటుంది. ఇంత విశాలంగా ఉన్నప్పటికీ స్వర్గవాసులతో నిండి ఉంటుందని, ప్రస్తావించటం జరిగింది.” (ముస్లిమ్)
—–
اَلْفَصْلُ الثَّانِيْ రెండవ విభాగం
5630 – [ 19 ] ( صحيح لشواهده ) (3/1566)
عَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: قُلْتُ: يَا رَسُوْلَ اللهِ مِمَّ خُلِقَ الْخَلْقُ؟ قَالَ:”مِنَ الْمَاءِ”. قُلْنَا: اَلْجَنَّةُ مَا بِنَاؤُهَا؟ قَالَ: “لَبِنَةٌ مِّنْ ذَهَبٍ وَلَبِنَةٌ مِّنْ فِضَّةٍ وَمِلَاطُهَا الْمِسْكُ الْأَذْفَرُ وَحَصْبَاؤُهَا اللُّؤْلُؤُ وَالْيَاقُوْتُ وَتُربَتُهَا الزَّعْفَرَانُ مَنْ يَّدْخُلُهَا يَنْعَمُ وَلَا يَبْأَسُ وَيَخْلُدُ وَلَا يَمُوْتُ وَلَا يَبْلَى ثِيَابُهُمْ وَلَا يَفْنَى شَبَابُهُمْ”. رَوَاهُ أَحْمَدُ وَالتِّرْمِذِيُّ وَالدَّارَمِيُّ
5630. (19) [3/1566 –సాక్షులచే దృఢం]
అబూ హురైరహ్ (ర) కథనం: ”ఓ ప్రవక్తా! సృష్టితాలను ఎలా సృష్టించటం జరిగింది,’ అని విన్నవించు కున్నాను. దానికి ప్రవక్త (స), ‘నీటితో,’ అని అన్నారు. మళ్ళీ మేము, ‘స్వర్గాన్ని ఎలా సృష్టించటం జరిగింది,’ అని ప్రశ్నించాము. దానికి ప్రవక్త (స), ”ఒక ఇటుక బంగారంతో, మరొక ఇటుక వెండితో. పరిమళ భరితమైన కస్తూరిని ఇసుక సిమెంట్ల స్థానంలో ఉపయోగించటం జరిగింది. దాని కంకర రాళ్ళు ముత్యాలు, వజ్రాలు, దాని మట్టిగా కస్తూరిని ఉపయోగించటం జరిగింది. అందులో ప్రవేశించిన వ్యక్తి, సుఖశాంతులతో ఉంటాడు. ఏనాడూ దుఃఖ విచారాలకు గురికాడు. శాశ్వతంగా సజీవంగా ఉంటాడు. అతడి దుస్తులు మాసిపోవు. అతడి యవ్వనం నశించదు అని ప్రవచించారు.” (అ’హ్మద్, తిర్మిజి’, దార్మీ)
5631 – [ 20 ] ( ضعيف ) (3/1566)
وَعَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَا فِي الْجَنَّةِ شَجَرَةٌ إِلَّا وَسَاقُهَا مِنْ ذَهَبٍ”. رَوَاهُ التِّرْمِذِيُّ .
5631. (20) [3/1566 –బలహీనం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”స్వర్గంలో ఉన్న చెట్లకు బంగారు కొమ్మలు ఉంటాయి.” (తిర్మిజి’)
5632 – [ 21 ] ( صحيح ) (3/1566)
وعَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِنَّ فِي الْجَنَّةِ مِائَةَ دَرَجَةٍ مَا بَيْنَ كُلِّ دَرَجَتَيْنِ مِائَةٍ عَامٍ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَقَالَ:هَذَا حَدِيْثٌ حَسَنٌ غَرِيْبٌ
5632. (21) [3/1566– దృఢం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”స్వర్గంలో 100 తరగతులున్నాయి. ప్రతి రెండు తరగతుల మధ్య 100 సంవత్సరాల ప్రయాణ దూరం ఉంది.” (తిర్మిజి’ – ప్రామాణికం – ఏకోల్లేఖనం)
5633 – [ 22 ] ( ضعيف ) (3/1566)
وَعَنْ أَبِيْ سَعِيْدٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِنَّ فِي الْجَنَّةِ مِائَةٍ دَرَجَةٍ لَوْ أَنَّ الْعَالَمِيْنَ اجْتَمَعُوْا فِي أحْدَاهُنَّ لَوَسِعَتْهُمْ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَقَالَ: هَذَا حَدِيْثٌ غَرِيْبٌ
5633. (22) [3/1566 –బలహీనం]
అబూ స’యీద్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”స్వర్గంలో 100 తరగతులు ఉన్నాయి. ఒకవేళ ప్రపంచ ప్రజలందరూ ఏదైనా ఒకే తరగతిలో ఏకమైనా, అది అందరికీ సరిపోతుంది.” (తిర్మిజి’ – ఏకోల్లేఖనం)
5634 – [ 23 ] ( ضعيف ) (3/1567)
وَعَنْهُ عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم فِيْ قَوْلِهِ تَعَالى (وَفُرُشٍ مَّرْفُوْعَةٍ؛56: 34) قَالَ:”اِرْتِفَاعُهَا لَكُمَا بَيْنَ السَّمَاءِ وَالْأَرْضِ مَسِيْرَةُ خَمْسِ مِائَةِ سَنَةٍ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَقَالَ: هَذَا حَدِيْثٌ غَرِيْبٌ.
5634. (23) [3/1567– బలహీనం]
అబూ స’యీద్ ‘ఖుద్రీ (ర) కథనం: ప్రవక్త (స) అల్లాహ్ (త) ఆదేశం: ”ఫురుషిమ్ మర్‌ఫూ’అహ్” (అల్ వాఖిఅహ్, 56:34) గురించి వ్యాఖ్యా నిస్తూ ఆ పడకల ఎత్తు భూమ్యాకాశాల మధ్య దూరం అంత ఉంటుంది. అంటే 500 సంవత్సరాల దూరం ఉంటుంది,” అని అన్నారు. (తిర్మిజి’ / ఏకోల్లేఖనం)
5635 – [ 24 ] ( ضعيف ) (3/1567)
وعَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِنَّ أَوَّلَ زُمْرَةٍ يَدْخُلُوْنَ الْجَنَّةَ يَوْمَ الْقِيَامَةِ ضَوْءُ وُجُوْهِهِمْ عَلَى مِثْلِ ضَوْءِ الْقَمَرِ لَيْلَةَ الْبَدْرِ وَالزُّمُرَةُ الثَّانِيَةُ عَلَى مِثْلِ أَحْسَنِ كَوْكَبٍ دُرِّيٍّ فِيْ السَّمَاءِ لِكُلِّ رَجُلٍ مِنْهُمْ زَوْجَتَانِ عَلَى كُلِّ زَوْجَةٍ سَبْعُوْنَ حُلَّةً يُرَى مُخّ سَاقِهَا مِنْ وَّرَائِهَا”. رَوَاهُ التِّرْمِذِيُّ.
5635. (24) [3/1567 –బలహీనం]
అబూ స’యీద్ ‘ఖుద్రీ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”తీర్పుదినం నాడు అందరికంటే ముందు స్వర్గంలో ప్రవేశించేవారి ముఖాలు వెన్నెల చంద్రుడిలా మెరుస్తూ ఉంటాయి. ఆ తరువాత స్వర్గంలో ప్రవేశించేవారి ముఖాలు నక్షత్రాల్లా మెరుస్తూ ఉంటాయి. వారిలో ప్రతి ఒక్కరికి ఇద్దరు భార్యలు ఉంటారు. ప్రతి ఒక్క భార్య శరీరంపై 70 దుస్తులు ఉంటాయి. వారి చీలమండల ఎముకల్లోని మూలుగ (మజ్జ) కనబడుతూ ఉంటుంది.” (తిర్మిజి’)
5636 – [ 25 ] ( صحيح لشواهده ) (3/1567)
وَعَنْ أَنَسٍ عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ: “يُعْطَى الْمُؤْمِنُ فِي الْجَنَّةِ قُوَّةَ كَذَا وَكَذَا مِنَ الْجِمَاعِ”. قِيْلَ: يَا رَسُوْلَ اللهِ أَوْيُطِيْقُ ذَلِكَ؟ قَالَ: ” يُعْطَى قُوَّة مِائَةٍ”. رَوَاهُ التِّرْمِذِيُّ.
5636. (25) [3/1567– సాక్షులచే దృఢం]
అనస్ (ర) కథనం: ప్రవక్త (స), ”స్వర్గంలో విశ్వాసికి అత్యధిక సంభోగశక్తి ప్రసాదించబడుతుంది,” అని ప్రవచించారు. అప్పుడు, ”ప్రవక్తా! అంతశక్తి మనిషికి ఉంటుందా?” అని విన్నవించుకోగా, ప్రవక్త (స), ”స్వర్గంలో ఒక వ్యక్తికి 100 మంది శక్తి ప్రసాదించటం జరుగుతుంది,” అని అన్నారు. (తిర్మిజి’)
5637 – [ 26 ] ( ضعيف ) (3/1567)
وعَنْ سَعْدِ بْنِ أَبِيْ وَقَّاصٍ عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ: “لَوْ أَنَّ مَا يَقِلُّ ظُفْرٌمِمَّا فِي الْجَنَّةِ بَدَا لَتَزَخْرَفَتْ لَهُ مَا بَيْنَ خَوَافِقِ السَّمَاوَاتِ وَالْأَرْضِ وَلَوْ أَنَّ رَجُلًا مِنْ أَهْلِ الْجَنَّةِ اطَّلَعَ فَبَدَا أَسَاوِرَهُ لَطَمَسَ ضَوْؤُهُ ضَوْءَ الشَّمْسِ كَمَا تَطْمِسُ الشَّمْسُ ضَوْءَ النُّجُوْمِ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَقَالَ: هَذَا حَدِيْثٌ غَرِيْبٌ.
5637. (26) [3/1567 –బలహీనం]
స’అద్ బిన్ అబీ వఖ్ఖా’స్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఒకవేళ స్వర్గంలోని గోరుకు సమానమైన వస్తువు కూడా ప్రపంచంలో పడితే దానివల్ల భూమ్యా కాశాల మూలలన్నీ అందంగా అయిపోతాయి. స్వర్గ వాసుల్లోని ఎవరైనా ప్రపంచంవైపు తొంగిచూస్తే, ఆమె చేతికడియాలు పడితే, ఆ వెలుగు, కాంతి సూర్యుని మరలింపజేస్తుంది. సూర్యుడు రాగానే నక్షత్రాల వెలుగు అదృశ్యం అయినట్టు.” (తిర్మిజి’ -ఏకోల్లేఖనం)
5638 – [ 27 ] ( ضعيف ) (3/1567)
وعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “أَهْلُ الْجَنَّةِ جُرْدٌ مُرْدٌ كَحْلَى لَا يَفْنَى شَبَابُهُمْ وَلَا تَبْلَى ثِيَابُهُمْ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَالدَّارَمِيُّ .
5638. (27) [3/1567 –బలహీనం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”స్వర్గవాసులు శరీరంపై వెంట్రుకలు లేనివారిగా ఉంటారు. వారి కళ్ళు నల్లగా ఉంటాయి. వారి యవ్వ నం నశించదు. బట్టలుమాసిపోవు.” (తిర్మిజి’, దార్మీ)
5639 – [ 28 ] ( حسن بما قبله ) (3/1568)
وَعَنْ مُعَاذِ بْنِ جَبَلٍ أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم قَالَ: “يَدْخُلُ أَهْلُ الْجَنَّةِ الْجَنَّةَ جُرْدًا مُرْدًا مَكَحَّلِيْنَ أَبْنَاءَ ثَلَاثِيْنَ- أَوْ ثَلَاثٍ وَّثَلَاثِيْنَ – سَنَةً”. رَوَاهُ التِّرْمِذِيُّ.
5639. (28) [3/1568– పూర్వ ప్రామాణికం]
మ’ఆజ్ బిన్ జబల్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”స్వర్గవాసులు స్వర్గంలో ప్రవేశించినపుడు, వారి శరీరంపై వెంట్రుకలు ఉండవు. అంటే గడ్డం లేకుండా యవ్వనంలో ఉంటారు. వారికి నల్లని కళ్ళు ఉంటాయి. ఇంకా 30 లేదా 33 సంవత్సరాల వయస్సులో ఉంటారు.” (తిర్మిజి’)
5640 – [ 29 ] ( لم تتم دراسته ) (3/1568)
وَعَنْ أَسْمَاءَ بِنْتِ أَبِيْ بَكْرٍقَالَتْ: سَمِعْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه و سلم وَذُكِرَلَهُ سِدْرَةُ الْمُنْتَهَى قَالَ: “يَسِيْرُالرَّاكِبُ فِي ظِلِّ الْفَنَنِ مِنْهَا مِائَةَ سَنَةٍ أَوْ يَسْتَظِلُّ بِظِلِّهَا مِائَةُ رَاكِبٍ- شَكَّ الرَّاوِيْ – فِيْهَا فَرَاشُ الذَّهَبِ كَأَنَّ ثَمَرَهَا الْقِلَالُ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَقَالَ: هَذَا حَدِيْثٌ غَرِيْبٌ
5640. (29) [3/1568– అపరిశోధితం]
అస్మా’ బిన్‌తె అబీ బక్‌ర్ (ర) కథనం: ప్రవక్త (స) ముందు సిద్‌రతుల్ మున్‌తహా గురించి ప్రస్తావించటం జరిగింది. అప్పుడు ప్రవక్త (స)ను నేను ఇలా ప్రవచిస్తూ ఉండగా విన్నాను: ”సిద్‌రతుల్ మున్‌తహా నీడలో ఒక వ్యక్తి వాహనంపై 100 సంవత్సరాలు వేగంగా ప్రయాణం చేస్తూ ఉంటాడు. లేదా దాని నీడలో 100 మంది కూర్చో గలరు. సిద్‌రతుల్ మున్‌తహాపై, బంగారు పిచ్చుకలు ఉంటాయి. దాని పళ్ళు కుండల్లా ఉంటాయి.” (తిర్మిజి’ – ఏకోల్లేఖనం)
5641 – [ 30 ] ( حسن ) (3/1568)
وعَنْ أَنَسٍ قَالَ: سُئِلَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم مَاالْكَوْثَرُ؟ قَالَ: “ذَاكَ نَهْرُ أَعْطَانِيْهِ اللهُ يَعْنِي فِي الْجَنَّةِ أَشَدُّ بِيَاضًا مِنَ اللَّبَنِ وَأَحْلَى مِنَ الْعَسَلِ فِيْهِ طَيْرٌ أَعْنَاقُهَا كَأَعْنَاقِ الْجُزُرِ”. قَالَ عُمَرُ: إِنَّ هَذِهِ لَنَاعِمَةٌ. قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “أَكَلَتُهَا أَنْعَمُ مِنْهَا”. رَوَاهُ التِّرْمِذِيُّ.
5641. (30) [3/1568– ప్రామాణికం]
అనస్ (ర) కథనం: ప్రవక్త (స)ను, ”కౌస’ర్, అంటే ఏమిటి,” అని ప్రశ్నించడం జరిగింది. దానికి ప్రవక్త (స), ”అది ఒక కాలువ, అల్లాహ్ దాన్ని నాకు ప్రసాదించాడు. స్వర్గంలో దాని నీరు పాలకంటే తెల్లగా, తేనెకంటే తియ్యగా ఉంటాయి, అందులో ఉన్న పక్షుల మెడలు ఒంటె మెడల్లా పొడవుగా ఉంటాయి,” అని అన్నారు. అప్పుడు ‘ఉమర్ (ర), ”అయితే అవి బాగా బలిసి ఉంటాయి మరి,” అని అన్నారు. దానికి ప్రవక్త (స), ”ఆ పక్షులను తినే స్వర్గవాసులు కూడా ఆ పక్షుల కంటే బాగా బలిసి పుష్టిగా ఉంటారు,” అని అన్నారు. (తిర్మిజి’)
5642 – [ 31 ] ( ضعيف ) (3/1568)
وعَنْ بُرَيْدَةَ أَنَّ رَجُلًا قَالَ: يَا رَسُوْلَ اللهِ هَلْ فِي الْجَنَّةِ مِنْ خَيْلٍ؟ قَالَ:”إِنَّ اللهَ أَدْخَلَكَ الْجَنَّةَ فَلَا تَشَاءُ أَنْ تُحْمَلَ فِيْهَا عَلَى فَرَسٍ مِنْ يَاْقُوْتَةٍ حَمْرَاءَ يَطِيْرُ بِكَ فِي الْجَنَّةِ حَيْثُ شِئْتَ إِلّا فَعَلْتَ”. وَسَأَلَهُ رَجُلٌ فَقَالَ: يَارَسُوْلَ اللهِ هَلْ فِي الْجَنَّةِ مِنْ إِبِلٌ؟ قَالَ: فَلَمْ يَقُلْ لَهُ مَا قَالَ لِصَاحِبِهِ. فَقَالَ: “إِنْ يُدْخِلُكَ اللهُ الْجَنَّةَ يَكُنْ لَكَ فِيْهَا مَا اشْتَهَتْ نَفْسُكَ وَلَذَّتْ عَيْنُكَ”. رَوَاهُ التِّرْمِذِيُّ.
5642. (31) [3/1568 –బలహీనం]
బురైదహ్ (ర) కథనం: ఒక వ్యక్తి, ”ఓ ప్రవక్తా! స్వర్గం లో గుర్రాలు కూడా ఉంటాయా? ” అని విన్నవించు కున్నాడు. దానికి ప్రవక్త (స), ”నిన్ను స్వర్గంలో ప్రవేశింపజేస్తే, నీవు కోరితే ఎర్రని గుర్రం నిన్ను తీసు కొని స్వర్గంలో ఎగురుతూ ఉంటుంది,” అని అన్నారు. మరో వ్యక్తి, ”ఓ ప్రవక్తా! స్వర్గంలో ఒంటెలు కూడా ఉంటాయా?” అని ప్రశ్నించాడు. ప్రవక్త (స) సమాధానంగా, ”అల్లాహ్ నిన్ను స్వర్గంలో పంపిన తర్వాత నీవు కోరిన, నీ కళ్ళకు నచ్చిన ప్రతి వస్తువు అక్కడ లభిస్తుంది,” అని అన్నారు. (తిర్మిజి’)
5643 – [ 32 ] ( لم تتم دراسته ) (3/1568)
وَعَنْ أَبِيْ أَيُّوْبَ قَالَ: أَتَى النَّبِيّ صلى الله عليه وسلم أَعْرَابِيٌّ فَقَالَ: يَا رَسُوْلَ اللهِ إِنِّيْ أُحِبُّ الْخَيْلَ أَفِي الْجَنَّةِ خَيْلٌ؟ قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِنْ أُدْخِلْتَ الْجَنَّةَ أَتِيْتَ بِفَرَسٍ مِنْ يَاْقُوْتَةٍ لَهُ جَنَاحَانِ فَحُمِلْتَ عَلَيْهِ ثُمَّ طَارَبِكَ حَيْثُ شِئْتَ”. رَوَاهُ التِّرْمِذِيُّ. وَقَالَ هَذَا حَدِيْثٌ لَيْسَ بِالْقَوِيِّ وَأَبُوْسَوْرَةَ الرَّاوِيْ يُضَعَّفُ فِي الْحَدِيْثِ وَسَمِعْتُ مُحَمَّدَ بْنَ إِسْمَاعِيْلَ يَقُوْلُ: أَبُوْسَوْرَةَ هَذَامُنْكَرُالْحَدِيْثِ يَرْوِيْ مَنَاكِيْرَ.
5643. (32) [3/1568 –అపరిశోధితం]
అబూ అయ్యూబ్ అ’న్సారీ (ర) కథనం: ప్రవక్త (స) వద్దకు ఒక పల్లెవాసి వచ్చి, ‘ఓ అల్లాహ్ ప్రవక్తా! గుర్రాలంటే నాకెంతో ఇష్టం, స్వర్గంలో గుర్రాలు ఉంటాయా?’ అని ప్రశ్నించాడు. దానికి ప్రవక్త (స), ”ఒకవేళ స్వర్గంలో నీకు ప్రవేశంలభిస్తే, నీకు ముత్యాల గుర్రం ఇవ్వబడుతుంది. దానికి రెండురెక్కలు ఉంటాయి. ఆ తరువాత నిన్ను దానిపై కూర్చో బెట్టటం జరుగుతుంది. నీవు కోరిన చోటికి ఆ గుర్రం నిన్ను తీసుకొని ఎగురుతుంది,” అని అన్నారు. (తిర్మిజి’ – బలహీనం, తిరస్కృతం)
5644 – [ 33 ] ( صحيح ) (3/1569)
وعَنْ بُرَيْدَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “أَهْلُ الْجَنَّةِ عِشْرُوْنَ وَمِائَةُ صَفٍّ ثَمَانُوْنَ مِنْهَا مِنْ هَذِهِ الْأُمَّةِ وَأَرْبَعُوْنَ مِنْ سَائِرِ الْأُمَمِ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَالدَّارَمِيُّ وَالْبَيْهَقِيُّ فِيْ كِتَابِ الْبَعْثِ وَالنُّشُوْرِ.
5644. (33) [3/1569 –దృఢం]
బురైదహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”స్వర్గ వాసుల్లో 120 పంక్తులు ఉంటాయి. వాటిలో 80 నా అనుచర సమాజానికి చెందినవి. మిగిలిన 40 ఇతర అనుచర సమాజాలకు చెందినవి.” (తిర్మిజి’, దార్మీ, బైహఖీ-కితాబిల్ బ’అస్’ వన్నుషూర్)
5645 – [ 34 ] ( لم تتم دراسته ) (3/1569)
وَعَنْ سَالِمٍ عَنْ أَبِيْهِ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “بَابُ أُمَّتِي الَّذِيْنَ يَدْخُلُوْنَ مِنْهُ الْجَنَّةَ عَرْضُهُ مَسِيْرَةُ الرَّاكِبِ الْمُجَوِّدِ ثَلَاثًا ثُمَّ إِنَّهُمْ لَيُضْغَطُوْنَ عَلَيْهِ حَتّى تَكَادَ مَنَاكِبُهُمْ تَزُوْلُ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَقَالَ هَذَا حَدِيْثٌ ضَعِيْفٌ وَسَأَلْتُ مُحَمَّدَ بْنَ إِسْمَاعِيْلَ عَنْ هَذَا الْحَدِيْثِ فَلَمْ يَعْرِفْهُ وَقَالَ: خَالِدُ بْنُ أَبِيْ بَكْرٍ يَرْوِي الْمَنَاكِيْرَ.
5645. (34) [3/1569– అపరిశోధితం]
సాలిమ్ తన తండ్రి ద్వారా కథనం: ప్రవక్త (స) ప్రవచనం: ”నా అనుచర సమాజం స్వర్గంలోనికి ప్రవేశించే ద్వారం వెడల్పు మూడు రోజులు గుర్రం వేగంగా పరిగెత్తేటంత వెడల్పుగా ఉంటుంది. అది అంత వెడల్పు ఉన్నప్పటికీ, నా అనుచర సమాజం స్వర్గంలో ప్రవేశించేటపుడు జనంవల్ల చాలా ఇరుకుగా అయిపోతుంది. చివరికి ఒకరి భుజాలు మరొకరి భుజాల మధ్య రాపిడి జరుగుతుంది.” (తిర్మిజి’ – బలహీనం – తిరస్కృతం)
5646 – [ 35 ] ( ضعيف ) (3/1569)
وعَنْ عَلِيٍّ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِنَّ فِي الْجَنَّةِ لَسُوْقًا مَا فِيْهَا شِرى وَلَا بَيْعٌ إِلّا الصُّوَرُ مِنَ الرِّجَالِ وَالنِّسَاءِ فَإِذَا اشْتَهَى الرَّجُلُ صُوْرَةً دَخَلَ فِيْهَا”. رَوَاهُ التِّرْمِذِيُّ وقَالَ: هَذَا حَدِيْثٌ غَرِيْبٌ
5646. (35) [3/1569– బలహీనం]
‘అలీ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”స్వర్గంలో ఒక బజారు ఉంది. కాని అందులో క్రయ విక్రయాలు జరగవు. స్త్రీ పురుషుల ఫోటోలు అక్కడ ఉంటాయి. ఎవరు ఏ చిత్రాన్ని ఇష్టపడితే, ఆ రూపంలా మారిపోతారు.” (తిర్మిజి’ – ఏకోల్లేఖనం)
5647 – [ 36 ] ( ضعيف ) (3/1569)
وعَنْ سَعِيْدِ بْنِ الْمُسَيَّبِ أَنَّهُ لَقِيَ أَبَا هُرَيْرَةَ فَقَالَ أَبُوْ هُرَيْرَةَ: أَسْأَلُ اللهَ أَنْ يَجْمَعَ بَيْنِيْ وَبَيْنَكَ فِي سُوْقِ الْجَنَّةِ. فَقَالَ سَعِيْدٌ: أَفِيْهَا سُوْقٌ؟ قَالَ: نَعَمْ أَخبَرَنِيْ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِنَّ أَهْلَ الْجَنَّةِ إِذَا دَخَلُوْهَا نَزَلُوْا فِيْهَا بِفَضْلِ أَعْمَالِهِمْ ثُمَّ يُؤْذَنُ لَهُمْ فِي مِقْدَارِ يَوْمَ الْجُمُعَةِ مِنْ أَيَّامِ الدُّنْيَا فَيَزُوْرُوْنَ رَبَّهُمْ وَيَبْرَزُ لَهُمْ عَرْشُهُ وَيَتَبَدّى لَهُمْ فِيْ رَوْضَةٍ مِنْ رِيَاضِ الْجَنَّةِ فَيُوْضَعُ لَهُمْ مَنَابِرُ مِنْ نُوْرٍ وَمَنَابِرُمِنْ لُؤْلُؤٍ وَمَنَابِرُ مِنْ يَاْقُوْتٍ وَمَنَابِرُ مِنْ زَبَرٍجَدٍ وَمَنَابِرُ مِنْ ذَهَبٍ وَمَنَابِرُ مِنْ فِضَّةٍ وَيَجْلِسُ أَدَنَاهُمْ – وَمَا فِيْهِمْ دَنِيٌّ – عَلَى كُثْبَانِ الْمِسْكِ وَالْكَافُوْرِ مَا يَرَوْنُ أَنَّ أَصْحَابَ الْكُرَاسِيِّ بِأَفْضَلَ مِنْهُمْ مَجْلِسًا”. قَالَ أَبُوْ هُرَيْرَةَ: قُلْتُ: يَا رَسُوْلَ اللهِ وَهَلْ نَرَى رَبَّنَا؟ قَالَ: “نَعَمْ هَلْ تَتَمَارَوْنَ فِي رُؤْيَةِ الشَّمْسِ وَالْقَمَرِ لَيْلَةَ الْبَدْرِ؟ “قُلْنَا: لَا. قَالَ: “كَذَلِكَ لَا تَتَمَارَوْنَ فِيْ رُؤْيَةِ رَبِّكُمْ وَلَا يَبْقَى فِي ذَلِكَ الْمَجْلِسِ رَجُلٌ إِلّا حَاضَرَهُ اللهُ مُحَاضَرَةً حَتّى يَقُوْلُ لِلرَّجُلِ مِنْهُمْ: يَا فُلَان ابْنَ فُلَانٍ أَتَذْكُرُ يَوْمَ قُلْتَ كَذَا وَكَذَا؟ فَيُذَكِّرُهُ بِبَعْضِ غَدَارَتِهِ فِي الدُّنْيَا. فَيَقُوْلُ: يَا رَبِّ أَفَلَمْ تَغْفِرْ لِيْ؟ فَيَقُوْلُ: بَلَى فَبِسَعَةِ مَغْفِرَتِيْ بَلَغْتَ مَنْزِلَتَكَ هَذِهِ. فَبَيْنَا هُمْ عَلَى ذَلِكَ غَشِيَتْهُمْ سَحَابَةٌ مِنْ فَوْقِهِمْ فَأَمْطَرَتْ عَلَيْهِمْ طِيْبًا لَمْ يَجِدُوْا مِثْلَ رِيْحهِ شَيْئًا قَطُّ وَيَقُوْلُ رَبُّنَا: قُوْمُوْا إِلى مَا أَعْدَدْتُ لَكُمْ مِنَ الْكَرَامَةِ فَخُذُوْا مَا اشْتَهَيْتُمْ فَنَأْتِيْ سُوْقًا قَدْ حَفَّتْ بِهِ الْمَلَائِكَةُ فِيْهَا مَا لَمْ تَنْظُرِ الْعُيُوْنِ إِلى مِثْلِهِ وَلَمْ تَسْمَعِ الْآذَانُ وَلَمْ يَخْطُرْ عَلَى الْقُلُوْبِ فَيُحْمَلُ لَنَا مَا اشْتَهَيْنَا لَيْسَ يُبَاعُ فِيْهَا وَلَا يُشْتَرى وَفِي ذَلِكَ السُّوْقِ يَلْقَى أَهْلُ الْجَنَّةِ بَعْضُهُمْ بَعْضًا”. قَالَ: “فَيُقْبِلُ الرَّجُلُ ذُو الْمَنْزِلَةِ الْمُرْتَفِعَةِ فَيَلْقَى مَنْ هُوَ دُوْنَهُ- وَمَا فِيْهِمْ دَنِيٌّ – فَيَرُوْعُهُ مَا يَرَى عَلَيْهِ مِنَ اللِّبَاسِ فِيْمَا يَنْقَضِيْ آخِرُ حَدِيْثِهِ حَتّى يُتَخَيَّلَ عَلَيْهِ مَا هُوَ أَحْسَنُ مِنْهُ وَذَلِكَ أَنَّهُ لَا يَنْبَغِيْ لِأَحْدٍ أَنْ يَّحْزَنَ فِيْهَا ثُمَّ نَنْصَرِفُ إِلى مَنَازِلَنَا فَيَتَلَقَّانَا أَزْوَاجُنَا فَيَقُلْنَ: مَرْحَبًا وَأَهْلًا لَقَدْ جِئْتَ وَإِنَّ بِكَ مِنَ الْجَمَالِ أَفْضَلَ مِمَّا فَارَقْتَنَا عَلَيْهِ فَيَقُوْلُ: إِنَّا جَالَسْنَا الْيَوْمَ رَبَّنَا الْجَبَّارَ وَيَحِقُّنَا أَنْ نَنْقَلِبَ بِمِثْلِ مَا انْقَلَبْنَا”. رَوَاهُ التِّرْمِذِيُّ وَابْنُ مَاجَهُ وَقَالَ التِّرْمِذِيُّ: هَذَا حَدِيْثٌ غَرِيْبٌ.
5647. (36) [3/1569 –బలహీనం]
స’యీద్ బిన్ ముసయ్యిబ్ (ర) కథనం: అతను అబూ హురైరహ్‌ను కలిసారు. అబూ హురైరహ్ (ర), ‘అల్లాహ్(త) మనిద్దరినీ స్వర్గంలోని బజారులో కలిసే భాగ్యం ప్రసాదించు గాక!’ అని ప్రార్థించారు. దానికి స’యీద్, ‘స్వర్గంలో బజారు ఉంటుందా,’ అని అడిగారు. దానికి అబూ హురైరహ్ (ర), ‘అవును, నాకు ప్రవక్త (స) దీన్ని గురించి తెలిపారు, స్వర్గవాసులు తమ తమ కర్మల ప్రకారం స్వర్గంలో ప్రవేశిస్తే, వారికి ప్రాపంచిక జీవితంలోని ఒక శుక్రవారం అంత గడువు లభిస్తుంది. వారు తమ ప్రభువును దర్శిస్తారు. వారి కోసం అల్లాహ్(త) సింహాసనం ప్రత్యక్షం అవుతుంది. స్వర్గవాసుల దర్శనార్థం అల్లాహ్(త) స్వర్గంలోని ఒక పెద్ద తోటలో ప్రత్యక్షం అవుతాడు. స్వర్గవాసులకు దర్శనం ఇస్తాడు. ఆ తోటలో స్వర్గవాసుల కొరకు వెలుగు మెంబర్లు, ముత్యాల మెంబర్లు, వజ్రాల మెంబర్లు, బంగారు మెంబర్లు, వెండి మెంబర్లు ఏర్పాటు చేయబడతాయి. వీరిలో అత్యంత అల్ప తరగతికి చెందిన వారు కస్తూరి మరియు కర్పూరం దిబ్బలపై కూర్చుంటారు. వీరిలో ఎవ్వరికీ అవమానం జరుగదు. ఇంకా ఇతరులు మాకంటే ఉన్నతులు అనే ఆలోచనే వారికి రాదు,” అని అన్నారు. అప్పుడు నేను, ”ఓ ప్రవక్తా! ఆ రోజు మేము మా ప్రభువును చూడగలమా?” అని విన్నవించుకున్నాను. దానికి ప్రవక్త (స), ”అవును నిస్సందేహంగా మీరు పగలు సూర్యుణ్ణి, వెన్నెల రాత్రిలో చంద్రుణ్ణి చూడటంలో కష్టం కలుగుతుందా?” అని ప్రశ్నించారు. దానికి మేము, ‘ఎంతమాత్రం కాదు,’ అని అన్నాం. అప్పుడు ప్రవక్త (స), ‘అదేవిధంగా ఆ రోజు మీరు మీ ప్రభువును చూడటంలో కష్టంగా ఉన్న వారెవరూ ఉండరు.’ చివరికి అల్లాహ్(త) అక్కడున్న వారిలో ఒక వ్యక్తిని ఉద్దేశించి, ‘ఓ ఫలానా వ్యక్తీ! నువ్వు ఫలానా రోజు ఇలా చేసావు గుర్తుందా?’ ఇంకా కొన్ని వాగ్దాన భంగాలు గుర్తుచేస్తాడు. అప్పుడా వ్యక్తి, ‘ఓ నా ప్రభూ! మీరు ఆ పాపాలను మన్నించలేదా?’ దానికి అల్లాహ్ (త), ‘నా కారుణ్యం విశాలత వల్లే నువ్వు ఇక్కడికి చేరుకో గలిగావు,’ అని అంటాడు.
ఆ తరువాత వారందరూ ఆ స్థితిలోనే ఉంటారు, ఒక మేఘం వచ్చి వారిపై ఆవరిస్తుంది. ఇంకా వారిపై సువాసనను వెదజల్లుతుంది. అటువంటి సువాసన వారు ఎన్నడూ పొంది ఉండరు. ఆ తరువాత ప్రభువు ఇలా ఆదేశిస్తాడు, ”ప్రజలారా! మీ కోసం తయారు చేయబడిన వస్తువుల వైపుకు పదండి. మీరు మీ ఇష్టప్రకారం తీసుకోండి. మేము బజారుకు వస్తాం. దాని చుట్టూ దైవదూతలు చుట్టుముట్టి ఉంటారు. ఆ బజారులో ఉన్న వస్తువులను ఏ కన్నూ చూచి ఉండదు, ఏ చెవీ విని ఉండదు. ఏ హృదయం ఊహించి ఉండదు. మేము కోరింది మాకు ప్రసాదించడం జరుగు తుంది. ఆ బజారులో క్రయ విక్రయాలు జరుగవు. ఆ బజారులో స్వర్గవాసులు పరస్పరం కలుసుకుంటారు.”
స’యీద్ కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”స్వర్గంలోని ఆ బజారులో పై తరగతికి చెందిన వ్యక్తి క్రింది తరగతికి చెందిన వ్యక్తిని కలుస్తాడు. కాని ఈ క్రింది తరగతికి చెందిన వ్యక్తి అవమాన దృష్టితో చూడబడడు. క్రింది తరగతికి చెందిన వ్యక్తి పై తరగతికి చెందిన వ్యక్తి శరీరంపై ఉన్న దుస్తులు చూచి అసహ్యంగా భావిస్తాడు. ఎందుకంటే అతని దుస్తులు తనదుస్తుల కంటే సాధారణమైనవిగా ఉంటాయి. వారిద్దరి సంభాషణ ముగుస్తుంది. పై తరగతికి చెందిన వ్యక్తి తన ఎదుటి వ్యక్తి దుస్తులు తన కంటే మంచివిగా ఉండటం గమనిస్తాడు. అంటే స్వర్గంలో ఎవరూ ఇతరు లకంటే తనను తక్కువగా భావించరు. ఆ తరువాత మేము మా నివాసాల వైపునకు బయలు దేరుతాము. మేము మాభార్యలను కలుస్తాము. వారు మాకు స్వాగతం పలుకుతారు. ఇంకా ‘ఇంతకు ముందు కంటే మీరు చాలా ఆనందంగా ఉన్నారు,’ అని అంటారు. దానికి సమాధానంగా, ‘మేము ఈ రోజు మా ప్రభువు తో కూర్చున్నాం, ఆ గౌరవంతోనే వచ్చాం,’ అని అంటారు. (తిర్మిజి’-ఏకోల్లేఖనం, ఇబ్నె మాజహ్)
5648 – [ 37 ] ( ضعيف ) (3/1571)
وعَنْ أَبِيْ سَعِيْدٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “أَدْنَى أَهْلِ الْجَنَّةِ الَّذِيْ لَهُ ثَمَانُوْنَ أَلْفَ خَادِمٍ وَاثْنَتَانِ وَسَبْعُوْنَ زَوْجَةً وَتُنْصَبُ لَهُ قُبَّةٌ مِنْ لُؤْلُؤٍ وَزَبَرْجَدٍ وَيَاْقُوْتٍ كَمَا بَيْنَ الْجَابِيَةِ إِلى صَنْعَاءَ” وَبِهَذا الْإِسْنَادِ قَالَ (ضعيف):” وَمَنْ مَاتَ مِنْ أَهْلِ الْجَنَّةِ مِنْ صَغِيْرٍ أَوْ كَبِيْرٍ يُرَدُّوْنَ بَنِيْ ثَلَاثِيْنَ فِي الْجَنَّةِ لَا يَزِيْدُوْنَ عَلَيْهَا أَبَدًا وَكَذِلَكَ أَهْلُ النَّارِ”. وَبِهَذاَ الْإِسْنَادِ قَالَ (ضَعِيفٌ): ” إِنَّ عَلَيْهِمُ التِّيْجَانَ أَدْنَى لُؤْلُؤَةٍ مِنْهَا لَتُضِيْءُ مَا بَيْنَ الْمَشْرِقِ وَالْمَغْرِبِ”. وَبِهَذَا الْإِسْنَادِ قَالَ: (صَحِيْحٌ لِغَيْرِهِ): “اَلْمُؤْمِنِ إِذَا اشْتَهَى الْوَلَدَ فِي الْجَنَّةِ كَانَ حَمْلُهُ وَوَضْعُهُ وَسِنُّهُ فِيْ سَاعَةٍ كَمَا يَشْتَهِيْ” .وَقَالَ إِسْحَاقُ بْنُ إِبرَاهِيْمَ فِي هَذَا الْحَدِيْثِ: إِذَا اشْتَهَى الْمُؤْمِنُ فِي الْجَنَّةِ الْوَلَدَ كَانَ فِيْ سَاعَةٍ وَلَكِنْ لَا يَشْتَهِيْ (قَوْلُ اسْحَاقِ لَيْسَ مِنَ الْحَدِيْثِ) رَوَاهُ التِّرْمِذِيُّ وَقَالَ: هَذَا حَدِيْثٌ غَرِيْبٌ. رَوَى ابْنُ مَاجَهُ الرّابعةُ وَالدَّارَمِيُّ الْأَخِيْرَةُ.
5648. (37) [3/1571– బలహీనం]
అబూ స’యీద్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం: ”స్వర్గవాసుల్లో క్రింది తరగతికి చెందిన వ్యక్తికి 80 వేల మంది సేవకులు, 72 మంది భార్యలు ఉంటారు. అతనికోసం వేయబడే టెంట్ ముత్యాలతో, వజ్రాలతో రత్నాలతో చేయబడి ఉంటుంది. అది జాబియహ్, ‘సన్’ఆ’ల మధ్య దూరం అంత ఉంటుంది.
అబూ స’యీద్‌కు చెందిన మరో ఉల్లేఖనంలో ఇలా ఉంది, ప్రవక్త (స) ప్రవచనం, ”మరణించిన వారిలో స్వర్గంలో వారి వయస్సు 30 సంవత్సరాలు ఉంటుంది. అంతకంటే ఎక్కువ వయస్సు ఉండదు. అదేవిధంగా నరకవాసులు కూడా.”
ఈ పరంపరలోనే ఒక ఉల్లేఖనం ఉంది, ”ప్రవక్త (స) ప్రవచనం, స్వర్గవాసుల తలపై ఉండే కిరీటంలోని సాధారణ ముత్యం కూడా తూర్పు పడమరలను వెలుగుతో నింపివేస్తుంది.
ఈ పరంపరలోనే మరో ఉల్లేఖనంలో ఇలా ఉంది, ”ప్రవక్త (స) ప్రవచనం, ఒకవేళ స్వర్గంలో సంతానవాంఛ కలిగితే గర్భం దాల్చటం, జన్మించటం, యుక్త వయస్సుకు చేరటం ఇదంతా ఒక క్షణంలో కోరిక ప్రకారం జరిగిపోతుంది.” (తిర్మిజీ – ఏకోల్లేఖనం, ఇబ్నె మాజహ్-నాల్గవ భాగం, దార్మి-చివరి భాగం)
5649- [ 38 ] ( ضعيف ) (3/1571)
وعَنْ عَلِيٍّ قَالَ: قَالَ رَسُوْلُ الله صلى الله عليه وسلم: إنَّ فِيْ الْجَنَّةِ لَمُجْتَمَعًا لِلْحُوْرِ الْعَيْنِ يَرْفَعْنَ بِأَصْوَاتٍ لَمْ تَسْمَعِ الْخَلَائِقُ مِثْلَهَا يَقُلْنَ: نَحْنَ الْخَالِدَاتُ فَلَا نَبِيْدُ وَنَحْنُ النَّاعِمَاتُ فَلَا نَبَأسُ وَنَحْنُ الرَّاضِيَاتُ فَلَا نَسْخَطُ طُوْبَى لِمَنْ كَانَ لَنَا وَكُنَّا لَهُ”. رَوَاهُ التِّرْمِذِيُّ.
5649. (38) [3/1571–బలహీనం]
‘అలీ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”స్వర్గంలో ‘హూరుల్’ఐన్’ అంటే దైవకన్యలు కలిసే ఒక ప్రదేశం ఉంటుంది. అక్కడ బిగ్గరగా కవిత్వాలు పాడుతూ ఉంటారు. వారి శబ్దం చాలా మధురంగా ఉంటుంది. ఇంతకు ముందు ఎప్పుడూ విననట్టు ఉంటుంది. ఇంకా ఇలా పాడటం జరుగుతుంది, ”మేము ఎల్లప్పుడూ సజీవంగా ఉంటాం, ఎన్నడూ నశించము, మేము సుఖ సంతోషాలతో ఉంటాం, మే మెప్పుడూ కష్టాలకు, నిరాశకు గురికాము, మేము ఇష్టంగా, సంతోషంగా ఉండే వాళ్ళం. మేమెప్పుడూ దుఃఖానికి గురికాము. స్వర్గం లో మాకోసం ఉన్న ప్రతి ఒక్కరికి శుభా కాంక్షలు, మేము కూడా వారికోసమే ఉన్నాం.” (తిర్మిజి’)
5650 – [ 39 ] ( لم تتم دراسته ) (3/1572)
وعَنْ حَكِيْمِ بْنِ مُعَاوِيَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِنَّ فِي الْجَنَّةِ بَحْرَ الْمَاءِ وَبَحْرَ الْعَسْلِ وَبَحْرَ اللَّبَنِ وَبَحْرَ الْخَمْرِ ثُمَّ تُشَقَّقُ الْأَنْهَارُ بَعْدُ”. رَوَاهُ التِّرْمِذِيُّ.
5650. (39) [3/1572 –అపరిశోధితం]
‘హకీమ్ బిన్ ము’ఆవియహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”స్వర్గంలో నీటి సరస్సు ఉంది. తేనె సరస్సు ఉంది, పాల సరస్సు ఉంది, పానీయం సరస్సు ఉంది, ఇంకా ఆ సరస్సుల నుండి కాలువలు ప్రవహిస్తాయి.” (తిర్మిజి’)
5651 – [ 40 ] ( لم تتم دراسته ) (3/1572)
رَوَاهُ الدَّارَمِيُّ عَنْ مُعَاوِيَةَ
5651. (40) [3/1572– అపరిశోధితం]
ము’ఆవియహ్ (ర) కథనం. (దార్మీ)
—–
اَلْفَصْلُ الثَّالِثُ మూడవ విభాగం
5652 – [ 41 ] ( ضعيف ) (3/1572)
عَنْ أَبِيْ سَعِيْدٍ عَنْ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم قَالَ: “إِنَّ الرَّجُلَ فِي الْجَنَّةِ لَيَتَّكِئُ فِي الْجَنَّةِ سَبْعِيْنَ مُسْنَدًا قَبْلَ أَنْ يَّتَحَوَّلَ ثُمَّ تَأْتِيْهِ امْرَأَةٌ فَتَضْرِبُ عَلَى مَنْكِبِهِ فَيَنْظُرُ وَجْهَهُ فِيْ خَدِّهَا أَصْفَى مِنَ الْمِرْآَةِ وَإِنَّ أَدْنَى لُؤْلُؤَةٍ عَلَيْهَا تُضِيْءُ مَا بَيْنَ الْمَشْرِقِ وَالْمَغْرِبِ فَتُسَلِّمُ عَلَيْهِ فَيَرُدُّ السَّلَامَ وَيَسْأَلُهَا: مَنْ أَنْتِ؟ فَتَقُوْلُ: أَنَا مِنَ الْمَزِيْدِ وَإِنَّهُ لَيَكُوْنُ عَلَيْهَا سَبْعُوْنَ ثَوْبًا فَيَنْفُذُهَا بَصَرُهُ حَتّى يَرَى مُخُّ سَاقِهَا مِنْ وَرَاءِ ذَلِكَ وَإِنَّ عَلَيْهَا مِنَ التِّيْجَانِ أَنْ أَدْنَى لُؤْلُؤَةٍ مِنْهَا لَتُضِيْءُ مَا بَيْنَ الْمَشْرِقِ وَالْمَغْرِبِ”. رَوَاهُ أَحْمَدُ.
5652. (41) [3/1572– బలహీనం]
అబూ స’యీద్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”స్వర్గంలో పురుషులు ఒక ప్రక్క తిరగటానికి ముందు 70 తలగడలు పెట్టుకొని కూర్చొని ఉంటారు. ఆ తరు వాత దైవకన్య వస్తుంది. ఆమె అతని భుజాన్ని తడు తుంది. అతడు ఆమెబుగ్గపై తనముఖాన్ని చూస్తాడు. అది అద్దంకంటే ఎంతో స్పష్టంగా ఉంటుంది. ఆమె యొక్క ఒక సాధారణ ముత్యం వల్ల తూర్పు పడ మరలు వెలుగుతో నిండిపోతాయి. ఆమె అతనికి సలామ్ చేస్తుంది. అతడు ఆమె సలామ్‌కు సమా ధానం ఇస్తాడు. ఇంకా, ‘నీవెవరవు,’ అని అడుగుతాడు. దానికి ఆమె, ”నేను ‘మ’జీద్,’ ” అంటే ”నేను అల్లాహ్ (త) అదనపు కానుకను,” అని అంటుంది. ఆమె శరీ రంపై 70 దుస్తులు ఉంటాయి. అతని చూపు ఆ దుస్తు లను దాటి పోతుంది. చివరికి ఆ వ్యక్తి ఆమె చీల మండల ఎముకల్లో గల మూలుగను సైతం చూస్తాడు. ఇంకా ఆమెపై కిరీటం ఉంటుంది. ఆ కిరీటంలోని మామూలు ముత్యం కూడా తూర్పూ పడమరలను వెలుగుతో నింపివేస్తుంది.” [27] (అ’హ్మద్)
5653 – [ 42 ] ( صحيح ) (3/1572)
وعَنْ أَبِيْ هُرَيْرَةَ أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم كَانَ يَتَحَدَّثُ -وَعِنْدَهُ رَجُلٌ مِنْ أَهْلِ الْبَادِيَةِ: “إِنَّ رَجُلًا مِنْ أَهْلِ الْجَنَّةِ اسْتَأْذَنَ رَبَّه فِي الزَّرْعِ. فَقَالَ لَهُ: أَلَسْتَ فِيْمَا شِئْتَ؟ قَالَ: بَلَى وَلَكِنْ أُحِبُّ أَنْ أَزْرَعَ فَبَذَرَ فَبَادَرَالطَّرْفَ نَبَاتُهُ وَاسْتِوَاؤُهُ وَاسْتِحْصَادُهُ فَكَانَ أَمْثَالَ الْجِبَالِ. فَيَقُوْلُ اللهُ تَعَالى: دُوْنَكَ يَا ابْنَ آدَمَ فَإِنَّهُ يُشْبِعُكَ شَيْءٌ”. فَقَالَ الْأَعْرَابِيٌّ: وَاللهِ لَا تَجِدُهُ إِلّا قُرَشِيًّا أَوْ أَنْصَارِيًّا فَإِنَّهُمْ أَصْحَابُ زَرْعٍ وَأَمَّا نَحْنُ فَلَسْنَا بِأَصْحَابِ زَرْعٍ فَضَحِكَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم. روَاهُ الْبُخَارِيُّ.
5653. (42) [3/1572 –దృఢం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచిస్తు న్నప్పుడు, ఆయన ప్రక్క ఒక పల్లెవాసి కూర్చొని ఉన్నాడు. ఒక స్వర్గవాసి వ్యవసాయం చేసే అనుమతి ఇవ్వమని కోరుతాడు. అల్లాహ్ (త) అతనితో, ‘నీవు కోరే వస్తువులు ఇక్కడ లేవా?’ అని అడుగుతాడు. దానికి ఆ వ్యక్తి, ‘ఎందుకు లేవు, అన్నీ ఉన్నాయి. కాని వ్యవసాయంచేయాలనినాకుంది,’ అని అంటాడు. అతడు భూమిలో విత్తనాలు నాటుతాడు. రెప్ప పాటులో పచ్చని పంట మొలుస్తుంది. పంటపండి కోత అయిపోతుంది. ఆహారధాన్యాలు కొండల్లా పేరుకు పోయి ఉంటాయి. అప్పుడు అల్లాహ్(త) ఆ వ్యక్తితో, ‘ఓ ఆదమ్ పుత్రుడా దీన్ని తీసుకో. నీకు ఏ వస్తువూ తృప్తి పరచలేదు,’ అని అంటాడు. అది విని ఆ పల్లెవాసి, ”అల్లాహ్ (త) సాక్షి! ఆ వ్యక్తి ఖురైషీ అయి ఉంటాడు లేదా అ’న్సారీ అయి ఉంటాడు. ఎందు కంటే, వీళ్ళే వ్యవసాయం చేస్తారు. మాకూ వ్యవసా యానికి ఎటువంటి సంబంధం లేదు,” అని అన్నాడు. అతని మాటలు విని ప్రవక్త(స), ఫక్కున నవ్వారు.” (బు’ఖారీ)
5654 – [ 43 ] ( ضعيف ) (3/1573)
وَعَنْ جَابِرٍ قَالَ: سَأَلَ رَجُلٌ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم: أَيَنَامُ أَهْلُ الْجَنَّةِ؟ قَالَ: “النَّوْمُ أَخُو الْمَوْتِ وَلَا يَمُوْتُ أَهْلُ الْجَنَّةِ”. رَوَاهُ الْبَيْهَقِيُّ فِيْ “شُعُبِ الْإِيْمَانِ”.
5654. (43) [3/1573– బలహీనం]
జాబిర్ (ర) కథనం: ప్రవక్త (స) ను ఒక వ్యక్తి, ‘స్వర్గ వాసులు పడుకుంటారా?’ అని అడిగాడు. దానికి ప్రవక్త (స), ”నిద్ర చావుకు తోబుట్టు వంటిది. స్వర్గవాసులకు మరణంరాదు. మరణించనపుడు, నిద్రకూడారాదు.” (బైహఖీ – షుఅబుల్ ఈమాన్)
=====
6- بَابُ رُؤْيَةِ اللهِ تَعَالى
6. అల్లాహు త‘ఆలా దర్శనం
اَلْفَصْلُ الْأَوَّلُ మొదటి విభాగం
5655 – [ 1 ] ( مُتَّفَقٌ عَلَيْهِ ) (3/1574)
عَنْ جَرِيْرِبْنِ عَبْدِ اللهِ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِنَّكُمْ سَتَرَوْنَ رَبَّكُمْ عَيَانًا”.
وَفِيْ رِوَايَةٍ: قَالَ: كُنَّا جُلُوْسًا عِنْدَ رَسُوْلِ الله صلى الله عليه وسلم فَنَظَرَإِلى الْقَمَرَلَيْلَةَ الْبَدْرِفَقَالَ: “إِنَّكُمْ سَتَرَوْنَ رَبَّكُمْ كَمَا تَرَوْنَ هَذَا الْقَمَرَ لَا تُضَامُّوْنَ فِيْ رُؤْيَتِهِ فَإِنِ اسْتَطَعْتُمْ أَنْ لَا تُغْلَبُوْا عَلَى صَلَاةِ قَبْلَ طُلُوْعِ الشَّمْسِ وَقَبْلَ غُرُوْبِهَا فَافْعَلُوْا”. ثُمَّ قَرَأَ (وَسَبِّحْ بِحَمْدِ رَبِّكَ قَبْلَ طُلُوْعِ الشَّمْسِ وَقَبْلَ غُرُوْبِهَا؛ 20: 130). مُتَّفَقٌ عَلَيْهِ.
5655. (1) [3/1574 –ఏకీభవితం]
జరీర్ బిన్ ‘అబ్దుల్లాహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవ చనం, ”మీరు మీ ప్రభువును మీ కళ్ళతో చూస్తారు. మరో ఉల్లేఖ నంలో ఇలా ఉంది, జరీర్ (ర) కథనం: ఒకరోజు ప్రవక్త (స) వద్ద కొందరు సహచరులు కూర్చొని ఉన్నారు. ప్రవక్త (స) వెన్నెల చంద్రుని వైపు చూచి, మీరు కూడా మీ ప్రభువును ఈ చంద్రుణ్ణి చూస్తున్నట్లు చూస్తారు. ఇంకా మీ ప్రభువును చూడ టంలో ఎటువంటి కష్టం, ఆటంకం కలుగదు. మీకు శక్తి ఉంటే సూర్యోదయానికి ముందు, సూర్యాస్తయానికి ముందు ఉన్న నమా’జులను వదలకండి, వాటిని వాటి సమయాల్లో ఆచరించండి,” అని అన్నారు. ఆ తరువాత ఈ ఆయతు పఠించారు, ”ఇంకా మీ ప్రభువు స్తోత్రం చేయండి, సూర్యోదయానికి ముందు, సూర్యాస్తమ యానికి ముందు కూడా.” (‘తా హా, 20:130) [28] (బు’ఖారీ, ముస్లిమ్)
5656 – [ 2 ] ( صحيح ) (3/1574)
وَعَنْ صُهَيْبِ عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ: “إِذَا دَخَلَ أَهْلُ الْجَنَّةِ الْجَنَّةَ يَقُوْلُ اللهُ تَعَالى: تُرِيْدُوْنَ شَيْئًا أَزِيْدُكُمْ؟ فَيَقُوْلُوْنَ: أَلَمْ تُبَيِّضْ وُجُوْهَنَا؟ أَلَمْ تُدْخِلْنَا الْجَنَّةَ وَتُنْجِنَا مِنَ النَّارِ؟” قَالَ: “فَيُرْفَعَ الْحِجَابُ فَيَنْظُرُوْنَ إِلى وَجْهِ اللهِ فَمَا أُعْطُوْا شَيْئًا أحَبَّ إِلَيْهِمْ مِنَ النَّظَرِ إِلى رَبِّهِمْ”. ثُمَّ تَلَا(لِلَّذِيْنَ أَحْسَنُوْا الْحُسْنَى وَزِيَادَةٌ؛ 10: 26) .رَوَاهُ مُسْلِمٌ .
5656. (2) [3/1574 –దృఢం]
‘సుహైబ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”స్వర్గ వాసులు స్వర్గంలో ప్రవేశించిన తర్వాత, అల్లాహ్(త) వారితో, ‘మీకు ఇవ్వబడిన దానికంటే ఇంకా అధికంగా ఏమైనా కావాలా?’ అని అడుగుతాడు. దానికి వారు, ‘ఓ ప్రభూ! తమరు మా ముఖాలను వెలుగుతో నింపారు, మమ్మల్ని స్వర్గంలో ప్రవేశింపజేసారు, మమ్మల్ని నరకం నుండి విముక్తి ప్రసాదించారు,’ అని అంటారు. ప్రవక్త (స) ప్రవచనం, ”అప్పుడు తెర ఎత్తివేయ బడుతుంది. వారు అల్లాహ్ (త) శుభకరమైన ముఖం వైపు చూస్తారు. అల్లాహ్ (త) ను దర్శించి ధన్యులవుతారు. ‘స్వర్గవాసులకు అంత కంటే ఉత్తమ మైనదేదీ ఇవ్వబడి ఉండదు. ఇంకా దాని కంటే వారికి ఇష్ట మైనది, ప్రియమైనది ఏదీ ఉండదు,’ అని అంటారు. ఆ తరువాత ప్రవక్త (స) ఈ ఆయతు పఠించారు, ”పుణ్యం చేసినవారికి ప్రతి ఫలమూ ఉంది, ఇంకా అధికం కూడా ఉంది.”(యూనుస్, 10:26)
—–
اَلْفَصْلُ الثَّانِيُّ రెండవ విభాగం
5657 – [ 3 ] ( ضعيف ) (3/1575)
عَنِ ابْنِ عُمَرَقَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِنَّ أَدْنَى أَهْلِ الْجَنَّةِ مَنْزِلَةً لَمَنْ يَنْظُرُ إِلى جِنَانِهِ وَأَزْوَاجِهِ وَنَعِيْمِهِ وَخَدَمِهِ وَسُرُرِهِ مَسِيْرَةَ أَلْفِ سَنَةٍ وَأَكْرَمُهُمْ عَلَى اللهِ مَنْ يَنْظُرُ إِلى وَجْهِهِ غُدْوَةً وَ عَشِيَّةً”. ثُمَّ قَرَأَ (وُجُوْهٌ يَّوْمَئِذٍ نَاضِرَةٌ إِلى رَبِّهَا نَاظِرَةٌ؛ 75: 22). رواه أحمد والترمذي.
5657. (3) [3/1575 –బలహీనం]
ఇబ్నె ‘ఉమర్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”స్వర్గవాసుల్లో అందరికంటే క్రింది తరగతికి చెందిన వ్యక్తి తన తోటలు, భార్యలు, అనుగ్రహాలు, సేవకులు, సంపదలను 1000 సంవత్సరాల ప్రయాణ పరిధిలో చూస్తాడు. ఇంకా అందరికంటే పై తరగతికి చెందిన వ్యక్తి ఉదయం, సాయంత్రం అల్లాహ్ (త) దర్శనభాగ్యం పొందు తాడు. ఆ తరువాత ప్రవక్త (స) ఈ ఆయతును పఠించారు, ”అనేక ముఖాలు ఆ రో’జు తమ ప్రభువును దర్శించి వికశిస్తాయి.” (అల్ ఖియామహ్, 75:22).(అ’హ్మద్, తిర్మిజి’)
5658 – [ 4 ] (ضعيف وبعضهم يحسنه) (3/1575)
وَعَنْ أَبِيْ رَزِيْنِ الْعُقَيْلِيِّ قَالَ: قُلْتُ:يَا رَسُوْلَ اللهِ أَكُلُّنَا يَرَى رَبَّهُ مُخْلِيًا بِهِ يَوْمَ الْقِيَامَةِ؟قَالَ: “بَلَى”.قَالَ:وَمَا آيَةُ ذَلِكَ فِيْ خَلْقِهِ؟ قَالَ: “ يَا أَبَا رَزِيْنٍ أَلَيْسَ كُلُّكُمْ يَرَى الْقَمَرَلَيْلَةَ الْبَدْرِمُخْلِيًا بِهِ؟ “قَالَ: بَلَى.قَالَ: “فَإِنَّمَا هُوَ خَلْقٌ مِنْ خَلْقِ اللهِ وَاللهِ أَجَلُّ وَأَعْظَمُ.“ رَوَاهُ أَبُوْ دَاوُدَ.
5658. (4)[3/1575 –బలహీనం, కొంత ప్రామాణికం]
అబూ ర’జీన్ ‘అఖీలీ కథనం: ”ఓ ప్రవక్తా! ప్రళయ దినం నాడు మాలో ప్రతి ఒక్కరూ అల్లాహ్(త)ను చూస్తారా?” అని నేను ప్రశ్నించాను. దానికి ప్రవక్త (స), ”అవును,” అని అన్నారు. అబూ ర’జీన్ కథనం: ‘ఆ తరువాత నేను సృష్టితాల్లో ఆయన్ను పోలినవస్తువు ఉందా?’ అని ప్రశ్నించాను. ‘దానికి ప్రవక్త (స) మీలో ఎవరూ వెన్నెల చంద్రుణ్ణి స్పష్టంగా చూడరా?’ అని ప్రశ్నించారు. దానికి నేను, ‘నిస్సందేహంగా,’ అని అన్నాను. దానికి ప్రవక్త (స), ‘చంద్రుడు దైవసృష్టి తాల్లో ఒక సృష్టితం, అల్లాహ్(త) ఎంతో గొప్పవాడు. అల్లాహ్(త) సృష్టితాల్లోని చంద్రుణ్ణి చూడగలిగి నపుడు, వాటిని సృష్టించిన దైవాన్ని ఎందుకు చూడలేరు,’ అని అన్నారు. (అబూ దావూద్)
—–
اَلْفَصْلُ الثَّالِثُ మూడవ విభాగం
5659 – [ 5 ] ( صحيح ) (3/1575)
عَنْ أَبِيْ ذَرٍّ قَالَ سَأَلْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم: هَلْ رَأَيْتَ رَبَّكَ؟ قَالَ: ” نُوْرٌ أَنّى أَرَاهُ”. رَوَاهُ مُسْلِمٌ.
5659. (5) [3/1575– దృఢం]
అబూ జ’ర్ (ర) కథనం: ప్రవక్త (స)ను, ‘మీరు మేరాజ్‌లో మీ ప్రభువును చూసారా?’ అని ప్రశ్నించడం జరిగింది. దానికి ప్రవక్త (స), ‘అల్లాహ్(త) ఒక తేజస్సువంటి వాడు, ఆయన్ను నేనెలా చూడగలను?’ అని అన్నారు. (ముస్లిమ్)
5660 – [ 6 ] ( صحيح ) (3/1575)
وَعَنِ ابْنِ عَبَّاسٍ: (مَاَكَذَبَ الْفؤَادُ مَا رَأَى؛ 53: 11). وَلَقَدْ رَآهُ نَزْلَةً أُخْرَى؛ 53: 13) قَالَ: رَآهُ بِفُؤَادِهِ مَرَّتيَنْ . روَاهُ مُسْلِمٌ.
وَفِيْ رِوَايَةٍ لِلتِّرْمِذِيِّ قَالَ: رَأَى مُحَمّدٌ رَبّهُ. قَالَ عِكْرَمَةُ قُلْتُ: أَلَيْسَ اللهُ يَقُوْلُ:(لَا تُدْرِكُهُ الْأَبْصَارُ وَهُوَ يُدْرِكُ الْأَبْصَارَ؛ 6: 103)؟ قَالَ: وَيْحَكَ إِذَا تَجَلّى بِنُوْرِهِ الَّذِيْ هُوَ نُوْرُهُ وَقَدْ رَأَى رَبَّهُ مَرَّتَيْنِ.
5660. (6) [3/1575 –దృఢం]
ఇబ్నె ‘అబ్బాస్ (ర) కథనం: అతను ఈ ఆయత్ వ్యాఖ్యానంలో, ”(ము’హమ్మద్) హృదయం, (ము’హమ్మద్) తన కళ్ళతో చూచిన దాన్ని గురించి తప్పుగా చెప్పలేదు. వాస్తవం ఏమిటంటే అతను, ఆయనను మరోసారి చూసాడు.” ఈ ఆయత్ ను, గురించి, ‘ప్రవక్త (స) అల్లాహ్ (త)ను తమ హృదయ కళ్ళతో రెండు సార్లు చూసారు. ‘ అని వ్యాఖ్యానించారు. (ముస్లిమ్)
తిర్మిజి ఉల్లేఖనంలో ఇలా ఉంది, ”ఇబ్నె ‘అబ్బాస్ (ర) ఈ ఆయత్ వ్యాఖ్యానంలో ఇలా అన్నారు, ”ము’హమ్మద్ (స) తన ప్రభువును చూసారు.” ఇక్రమహ్ కథనం: నేను అది విని, ఇబ్నె ‘అబ్బాస్ తో అన్నాను, ”మరి అల్లాహ్ (త): ‘ఏ చూపులు ఆయన్ను చూడలేవు, ఆయన చూపులను చూడగలడు’ అని ఆదేశించలేదా? అయితే చూడటం ఎలా సాధ్యం?” అని ప్రశ్నించాను. దానికి ఇబ్నె ‘అబ్బాస్ (ర) ”ఇక్రమహ్ నీపై చాలా జాలివేస్తుంది. ఇది అల్లాహ్(త) తన కాంతిని బహిర్గతం చేసినపుడే. అయితే ప్రవక్త (స) తన ప్రభువును రెండుసార్లు చూసారు,’ అని అన్నారు.
5661 – [ 7 ] ( صحيح ) (3/1576)
وَعَنِ الشَّعْبِيِّ قَالَ: لَقِيَ ابْنُ عَبَّاسٍ كَعْبًا بِعَرَفَةٍ فَسَأَلَهُ عَنْ شَيْءٍ فَكَبَّرَ حَتّى جَاوَبْتُهُ الْجِبَالُ. فَقَالَ ابْنُ عَبَّاسٍ: إِنَّا بَنُوْ هَاشِمٍ. فَقَالَ كَعْبُ: إِنَّ اللهَ قَسَّمَ رُؤْيَتَهُ وَكَلَامَهُ بَيْنَ مُحَمَّدٍ وَمُوْسَى فَكَلَّمَ مُوْسَى مَرَّتَيْنِ وَرَآهُ مُحَمَّدٌ مَرَّتَيْنِ. قَالَ مَسْرُوْقُ: فَدَخْلُتُ عَلَى عَائِشَةَ فَقُلْتُ: هَلْ رَأَى مُحَمَّدَ رَبَّهُ؟ فَقَالَتْ: لَقَدْ تَكَلَّمْتَ بِشْيْءٍ قَفَّ لَهُ شَعْرِيْ قُلْتُ: رُوَيْدًا ثُمَّ قَرَأْتُ (لَقَدْ رَأَى مِنْ آيَاتِ رَبِّهِ الْكُبْرَى؛ 53: 18)
فَقَالَتْ: أَيْنَ تَذْهَبُ بِكَ؟ إِنَّمَا هُوَ جِبْرِيْلُ. مَنْ أَخْبَرَكَ أَنَّ مُحَمَّدًا رَأَى رَبَّهُ أَوْ كَتَمَ شَيْئًا مِمَّا أُمِرَ بِهِ أَوْ يَعْلَمُ الْخَمْسَ الَّتِيْ. قَالَ اللهُ تَعَالى: (إِنَّ اللهَ عِنْدَهُ عِلْمُ السَّاعَةِ وَيَنْزِلُ الْغَيْثِ؛ 31: 34) فَقَدْ أَعْظَمَ الْفِرْيَةَ وَلَكِنَّهُ رَأَى جِبْرَيْلَ لَمْ يَرَهُ فِيْ صُوْرَتِهِ إِلَّا مَرَّتَيْنِ: مَرَّةً عِنْدَ سِدْرَةِ الْمُنْتَهَى وَمَرَّةً فِيْ أَجْيَادٍ لَهُ سِتُّمِائَةِ جَنَاحٍ قَدْ سَدَّ الْأُفُقَ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَرَوَى الشَّيْخَانِ مَعَ زِيَادَةٍ وَاخْتَلَافٍ.
وَفِيْ رِوَايَتِهِمَا: قَالَ: قُلْتُ لِعَائِشَةَ: فَأَيْنَ قَوْلُهُ (ثُمَّ دَنَا فَتَدَلّى فَكَاَنَ قَابَ قَوْسَيْنِ أَوْ أَدْنَى؛ 53: 9)؟ قَالَتْ: ذَاكَ جِبْرِيْلُ عَلَيْهِ السَّلَامُ كَانَ يَأْتِيْهِ فِيْ صُوْرَةِ الرَّجُلِ وَإِنَّهُ أَتَاهُ هَذِهِ الْمَرَّةَ فِيْ صُوْرَتِهِ الَّتِيْ هِيَ صُوْرَتُهُ فَسَدَّ الْأُفُقَ.
5661. (7) [3/1576 –దృఢం]
షు’అబీ (ర) కథనం: ‘అరఫహ్ నాడు ‘అరఫహ్ మైదానంలో ఇబ్నె ‘అబ్బాస్ (ర) క’అబ్ అ’హ్‌బార్ ను కలిసారు. అతన్ని, ‘ప్రపంచంలో దైవాన్ని చూడటం సాధ్యమా?’ అని అడిగారు. క’అబ్(ర), ‘అల్లాహు అక్బర్,’ అని బిగ్గరగా అరిచారు. దానివల్ల కొండలు కంపించాయి. దానికి ఇబ్నె ‘అబ్బాస్ (ర), ‘మేము బనూ హాషిమ్ సంతానం,’ అని అన్నారు. ఆ తరువాత క’అబ్ (ర) ”అల్లాహ్ (త) తన దర్శనాన్ని ము’హమ్మద్, మూసాల మధ్య పంచాడు, అందువల్ల రెండు సార్లు అల్లాహ్(త) మూసాతో మాట్లాడాడు. ఇంకా రెండు సార్లు ము’హమ్మద్ (స) అల్లాహ్(త)ను చూసారు.
మస్‌రూఖ్ కథనం: నేను ‘ఆయి’షహ్ (ర) ను ప్రశ్నించాను, ”ముహమ్మద్(స), తమ ప్రభువును చూసారా?” ‘ఆయి’షహ్(ర)! అన్నారు, ‘ మస్‌రూఖ్ నీవు ఎటువంటి మాట అడిగావంటే, దానితో నా శరీరపు వెంట్రుకలు నిక్కిపోయాయి. [అంటే అల్లాహ్(త) ప్రతాపం, భీతివల్ల ఆయనను చూడటం అసాధ్యం].’ అప్పుడు నేను ఆమెతో అన్నాను, ” ‘ఆయి ‘షహ్ (ర)! సహనం వహించండి, తొందర పడకండి. ఆ తరువాత నేను ఈ ఆయతును పఠించాను. ”లఖద్ రఆ’ మిన్ ఆయాతి రబ్బిహిల్ కుబ్రా’ ” – (అన్ నజ్జ్, 53:18)’ అంటే ము’హమ్మద్ తన ప్రభువుకు చెందిన గొప్ప సూచనలు చూసారు.’ అప్పుడు ‘ఆయి’షహ్ (ర) ”నీకు ఈ వాక్యాలు ఎటు తీసుకు వెళుతున్నాయి [అంటే నువ్వు అను కుంటున్నట్టు దాని అర్థం అది కాదు]. దాని అర్థం, జిబ్రీల్ (అ). గొప్ప సూచనలు అంటే జిబ్రీల్(అ). మస్‌రూఖ్! నీతో ఎవరైనా ము’హమ్మద్ తన ప్రభువును చూసారని గాని, అల్లాహ్ (త) బహిర్గతం చేయమన్న విషయాలు దాచారని గాని, లేక అల్లాహ్ (త) పేర్కొన్న ఆ ఐదు విషయాలు, ఏ వైతే అల్లాహ్ (త) ఈ ఆయత్ లో పేర్కొన్నాడో, ” ‘ఇందహు ‘ఇల్ముస్సా’అతి, వ యున’జ్జిలుల్ ‘గైస’…. ” (లుఖ్మాన్, 31:34) గురించి ము’హమ్మద్‌కు తెలుసునని గాని అంటే, అతడు ము’హమ్మద్ (స)పై అభాండాలు వేసాడు. [అంటే, ము’హమ్మద్(స) అల్లాహ్(త)ను చూడలేదు, దైవాజ్ఞలను దాచలేదు, ఈ ఐదు విషయాల గురించి ముహమ్మద్(స)కు తెలియదు ఏవైతే కేవలం అల్లాహ్ (త) కు మాత్రమే తెలుసో]. అయితే ము’హమ్మద్ (స) జిబ్రీల్(అ)ను చూసారు. జిబ్రీల్(అ)ను అతని అసలు రూపంలో కేవలం రెండుసార్లు చూసారు. ఒకసారి సిద్‌రతుల్ మున్‌తహా వద్ద, మరోసారి అజ్‌యాద్ (మక్కహ్ లోని ఒక వీధి)లో. ప్రవక్త (స) జిబ్రీల్(అ)ను అతని అసలు రూపంలో చూసి నప్పుడు అతనికి 600 రెక్కలు ఉన్నాయి. అతను ఆకాశాన్ని పూర్తిగా ఆవరించి ఉన్నారు.” (తిర్మిజి’)
బు’ఖారీ, ముస్లిమ్‌లు మరికొన్ని అధిక పదాలతో ఈ రివాయతును ఉల్లేఖించారు. బు’ఖారీ, ముస్లిమ్‌ల లోని ఒక ఉల్లేఖనంలో ఇలా ఉంది, మస్‌రూఖ్ కథనం: ”తరువాత నేను ‘ఆయి’షహ్ (ర)తో, ‘అయితే అల్లాహ్ (త) యొక్క ఈ ఆదేశపు అర్థం ఏమిటని అడిగాను. ”సు’మ్మ దనా, ఫతదల్లా, ఫకాన ఖాబ ఖౌసైని అవ్ అద్ నా!”’ –( అన్ నజ్జ్, 53:9) దానికి ‘ఆయి’షహ్ (ర) అన్నారు, ‘అంటే జిబ్రీల్(అ). అతను ప్రతిసారి మనిషి రూపంలో వచ్చేవారు, కాని అప్పుడు మాత్రం తన అసలు రూపంలో బహిర్గతం అయ్యి, పూర్తి గనన తలాన్ని కప్పివేసారు, ” అని అన్నారు.
5662 – [ 8 ] ( مُتَّفَقٌ عَلَيْهِ ) (3/1576)
وَعَنِ ابْنِ مَسْعُوْدٍ فِيْ قَوْلِهِ: (فَكَانَ قَابَ قَوْسَيْنِ أَوْ أَدْنَى؛ 53: 9) وَفِيْ قَوْلِهِ:(مَا كَذَبَ الْفُؤَادُ مَا رَأَى) وَفِيْ قَوْلِهِ:( لَقَدْ رَأَى مِنْ آيَاتِ رَبِّهِ الْكُبْرَى؛ 53: 18) قَالَ فِيْهَا كُلِّهَا: رَأَى جِبْرَيْلَ عَلَيْهِ السَّلَامُ لَهُ سِتُّمِائَةِ جَنَاحٍ.مُتَّفَقٌ عَلَيْهِ.
وَفِيْ رِوَايَةٍ التِّرْمِذِيِّ قَالَ: (مَا كَذَبَ الْفُؤَادُ مَا رَأَى؛ 53: 11) قَالَ : رَأَى رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم جِبْرِيْلَ فِيْ حُلَّةٍ مِنْ رَفْرَفٍ قَدْ مَلَأَ مَا بَيْنَ السَّمَاءِ وَالْأَرْضِ وَلَهُ وَلِلْبُخَارِيِّ فِيْ قَوْلِهِ : (لَقَدْ رَأَى مِنْ آيَاتِ رَبِّهِ الْكُبْرَى؛ 53: 18) قَالَ: رَأَى رَفْرَفًا أَخْضَرَ سَدَّ أُفُقَ السَّمَاءِ.
5662. (8) [3/1576 –ఏకీభవితం]
ఇబ్నె మస్’ఊద్ (ర) కథనం: ” ఫకాన ఖాబ ఖౌసైని అవ్ అద్ నా! మా కజ’బల్ ఫుఆ’దు మా రఆ’, వలఖద్ రఆ’ మిన్ ఆయాతి రబ్బిహిల్ కుబ్రా.” (అన్ నజ్జ్, 53:9) ఈ మూడు ఆయాతుల వ్యాఖ్యా నంలో ప్రవక్త (స) జిబ్రీల్‌ను 600 రెక్కలు కలిగి ఉన్న అసలు స్థితిలో చూసారు. (బు’ఖారీ, ముస్లిమ్)
తిర్మిజి’లోని ఒక ఉల్లేఖనంలో ఇలా ఉంది, ”ఇబ్నె మస్’ఊద్(ర), ”మా కజ’బల్ ఫుఆ’దు మా రఆ’, ” (అన్ నజ్జ్, 53:11) వ్యాఖ్యానంలో ప్రవక్త (స) జిబ్రీల్‌ను పచ్చని దుస్తులు ధరించి భూమ్యాకాశాల మధ్య ఉండటం చూసారు.”
ఇంకా తిర్మిజీ’, బు’ఖారీలలోని ఒక ఉల్లేఖనం ఈ విధంగా ఉంది, ”ఇబ్నె మస్‌ఊద్ (ర) మూడవ ఆయత్, ”లఖద్ రఆ’ మిన్ ఆయాతి రబ్బిహిల్ కుబ్రా.” – (అన్ నజ్జ్, 53:18) వ్యాఖ్యానంలో ప్రవక్త (స) జిబ్రీల్‌ను పచ్చని దుస్తుల్లో ఆకాశాన్ని ఆవరించి ఉండటం చూసారు.”
5663 – [ 9 ] ( لم تتم دراسته ) (3/1577)
وَسُئِلَ مَالِكُ بْنُ أَنَسٍ عَنْ قَوْلِهِ تَعَالى (إِلى رَبِّهَا نَاظِرَةٌ؛ 75: 23) فَقِيْلَ: قَوْمٌ يَقُوْلُوْنَ: إِلى ثَوَابِهِ. فَقَالَ مَالِكٌ: كَذَّبُوْا فَأَيْنَ هُمْ عَنْ قَوْلِهِ تَعَالى: (كَلَا إِنَّهُمْ عَنْ رَبِّهِمْ يَوْمَئِذٍ لَمَحْجُوْبُوْنَ؛ 83: 15)؟ قَالَ مَالِكُ النَاسُ يَنْظُرُوْنَ إِلى اللهِ يَوْمَ الْقِيَامَةِ بِأَعْيُنِهِمْ وَقَالَ: لَوْ لَمْ يَرَ الْمُؤْمِنُوْنَ رَبَّهُمْ يَوْمَ الْقِيَامَةِ لَمْ يُعَيِّرِ اللهُ الْكُفَّارَ بِالْحِجَابِ فَقَالَ (كَلَّا إِنَّهُمْ عَنْ رَبِّهِمْ يَوْمَئِذٍ لَمَحْجُوْبُوْنَ83: 15) رَوَاهُ فِيْ ” شَرْحِ السُّنَّةِ”
5663. (9) [3/1577– అపరిశోధితం]
మాలిక్ బిన్ అనస్‌ను, అల్లాహ్ (త) ఆదేశం: ”ఇలా రబ్బిహా నా’దిరహ్” (అల్ ఖియామహ్, 75:23) గురించి ప్రశ్నించడం జరిగింది. ఇంకా అతనితో కొందరు ఈ ఆయత్లో అల్లాహ్(త)ను చూడటం అంటే ఆయన ప్రతిఫలాన్ని చూడటంగా భావి స్తున్నారు అని చెప్పటం జరిగింది. దానికి మాలిక్ బిన్ అనస్ ”వారు అసత్య వంతులు, వాళ్ళ బుద్ధికి ఏమయింది, వారు అల్లాహ్(త) ఆదేశం, ”కల్లా’ ఇన్నహుమ్ అన్ రబ్బిహిమ్ యౌమయి’జి‘న్ లమ’హ్‌జూబూన్”ను (అల్ ముతఫ్ఫిఫీన్, 83:15) ఎందుకు చూడరు,” అని అన్నారు. ఆ తరువాత మాలిక్ బిన్ అనస్, ”ముసిములు తీర్పుదినం నాడు అల్లాహ్ (త)ను తమ కళ్ళతో చూస్తారు. ఒకవేళ విశ్వాసులు తీర్పుదినం నాడు తమ ప్రభువును చూడని వారైతే, అల్లాహ్(త) అవిశ్వాసులను ఈ విధంగా, ”కల్లా ఇన్నహుమ్ అన్ రబ్బిహిమ్ యౌమ యి’జి’న్ లమ’హ్‌జూబూన్” (అల్ ముతఫ్ఫిఫీన్, 83:15) అని అవమానపరచడు.” (బ’గ్‌వీ – షర్’హుస్సున్నహ్)
5664 – [ 10 ] ( ضعيف ) (3/1577)
وَعَنْ جَابِرٍعَنِ النَّبِيِّ صلى الله عليه وسلم: “بَيْنَا أَهْلُ الْجَنَّةِ فِيْ نَعِيْمِهِمْ إِذْ سَطَعَ نُوْرٌ فَرَفَعُوْا رُؤُوْسَهُمْ فَإِذَا الرَّبُ قَدْ أَشْرَفَ عَلَيْهِمْ مِنْ فَوْقِهِمْ فَقَالَ: السَّلَامُ عَلَيْكُمْ يَا أَهْلَ الْجَنَّةِ قَالَ: وَذَلِكَ قَوْلُهُ تَعَالى (سَلَامٌ قَوْلًا مِّنْ رَبِّ رَّحِيْمٍ؛ 36: 58) قَالَ: فَيَنْظُرَ إِلَيْهِمْ وَيَنْظُرُوْنَ إِلَيْهِ فَلَايَلْتَفِتُوْنَ إِلى شَيْءٍ مِنَ النَّعِيْمِ مَا دَامُوْا يَنْظُرُوْنَ إِلَيْهِ حَتّى يَحْتَجِبَ عَنْهُمْ وَيَبْقَى نُوْرُهُ وَبَرَكَتُهُ عَلَيْهِمْ فِيْ دِيَارِهِمْ”. رَوَاهُ ابْنُ مَاجِهُ.
5664. (10) [3/1577– బలహీనం]
జాబిర్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”స్వర్గ వాసులు స్వర్గంలో భోగవిలాసాల్లో ఉండగా, అకస్మా త్తుగా వారి ముందు ఒక పెద్ద వెలుగు ప్రత్యక్షం అవు తుంది. వారు తల ఎత్తి చూస్తారు. వెంటనే తమ ప్రభువును గుర్తిస్తారు. అప్పుడు వారిప్రభువు, ‘ఓ స్వర్గ వాసులారా! అస్సలాము అలైకుమ్’ అని అంటాడు. ”సలామున్ ఖౌలమ్ మిర్రబ్బిర్ర’హీమ్”కు (యా-సీన్, 36:58) అర్థం ఇదే. ఆ తరువాత ప్రవక్త (స) ”మళ్ళీ అల్లాహ్(త) స్వర్గవాసుల వైపు చూస్తాడు, స్వర్గవాసులు అల్లాహ్(త)ను చూస్తారు. దైవ దర్శ నంలో ఎంత నిమగ్నం అయి ఉంటారంటే, స్వర్గంలోని ఏ అనుగ్రహంవైపు చూడరు. వారి దృష్టి అల్లాహ్(త) వైపే ఉంటుంది. చివరికి అల్లాహ్(త) వారి ముందు నుండి అదృశ్యం అయిపోతాడు. కేవలం అతని వెలుగు మిగిలి ఉంటుంది.” అని అన్నారు. (ఇబ్నె మాజహ్)
=====
7- بَابُ صِفَةِ النَّارِ وَأَهْلِهَا
7. నరకం, నరకవాసులు
اَلْفَصْلُ الْأَوَّلُ మొదటి విభాగం
5665 – [ 1 ] ( مُتَّفَقٌ عَلَيْهِ ) (3/1578)
عَنْ أَبِيْ هُرَيْرَةَ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم قَالَ: “نَارُكُمْ جُزْءٌ مِّنْ سَبْعِيْنَ جُزْءًا مِّنْ نَارِ جَهَنَّمَ”. قِيْلَ: يَا رَسُوْلَ اللهِ إِنْ كَانَتْ لَكَافِيَةٌ قَالَ: “فُضِّلَتْ عَلَيْهِنَّ بِتِسْعَةٍ وَسِتِّيْنَ جُزْءًا كُلُّهُنَّ مِثْلُ حَرِّهَا”. مُتَّفَقٌ عَلَيْهِ. وَاللَّفْظُ لِلْبُخَارِيِّ.
وَفِيْ رِوَايَةٍ مُسْلِمٍ: “نَارُكُمُ الَّتِيْ يُوْقِدُ ابْنُ آدَمَ”. وَفِيْهَا: “عَلَيْهَا” وَ”كُلُّهَا” بَدْلَ” عَلَيْهِنَّ” وَ”كُلُّهُنَّ”
5665. (1) [3/1578 –ఏకీభవితం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) ”మీ ఈ ప్రాపంచిక అగ్ని, నరకాగ్ని యొక్క 70 వంతుల్లో ఒక వంతు మాత్రమే,” అని అన్నారు. అప్పుడు అనుచరులు, ‘ఓ ప్రవక్తా! ఈ ప్రాపంచిక అగ్నియే సరిపోయేది!’ అని అన్నారు. దానికి ప్రవక్త (స), ‘నరకాగ్నిని 69 రెట్లు పెంచటం జరిగింది. దానిలోని ప్రతి వంతు ప్రాపంచిక అగ్నికి సమానంగా ఉంది. (బు’ఖారీ, ముస్లిమ్)
అయితే అవి బు’ఖారీలోని పదాలు, ముస్లిమ్‌లో ఇలా ఉంది, ”ప్రవక్త (స) మీ ప్రాపంచిక అగ్ని నరకాగ్ని యొక్క 70 వంతుల్లో ఒక వంతు మాత్రమే.”
5666 – [ 2 ] ( صحيح ) (3/1578)
وَعَنِ ابْنِ مَسْعُوْدٍ قَالَ: قَالَ رَسُوْلُ الله صلى الله عليه وسلم: “يُؤْتَى بِجَهَنَّمَ يَوْمَئِذٍ لَهَا سَبْعُوْنَ أَلْفَ زِمَامٍ مَعَ كُلِّ زِمَامٍ سَبْعُوْنَ أَلْفَ مَلَكٍ يَجُرُّوْنَهَا”. روَاهُ مُسْلِمٌ.
5666. (2) [3/1578– దృఢం]
ఇబ్నె మస్’ఊద్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”తీర్పుదినం నాడు నరకాన్ని తీసుకురావటం జరుగు తుంది. దానికి 70 వేల కళ్ళాలుంటాయి. ప్రతి కళ్ళాన్ని 70 వేల మంది దైవదూతలు పట్టుకొని ఉంటారు. ఇంకా దైవదూతలు దాన్ని ఈడ్చుకుని వస్తారు.” [29] (ముస్లిమ్)
5667 – [ 3 ] ( مُتَّفَقٌ عَلَيْهِ ) (3/1578)
وَعَنِ النُّعْمَانِ بْنِ بَشِيْرٍقَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِنَّ أَهْوَنَ أَهْلِ النَّارِ عَذَابًا مَنْ لَهُ نَعْلَانِ وَشِرَاكَانَ مِنْ نَارٍ يَغْلِيْ مِنْهُمَا دِمَاغُهُ كَمَا يَغْلَي الْمِرْجَلُ مَا يُرَى أَنَّ أَحَدًا أَشَدُّ مِنْهُ عَذَابًا وَإِنَّهُ لَأَهْوَنُهُمْ عَذَابًا”. مُتَّفَقٌ عَلَيْهِ.
5667. (3) [3/1578–ఏకీభవితం]
ను’అమాన్ బిన్ బషీర్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”నరకంలోని అందరికంటే తేలికైన శిక్ష ఏమిటంటే, నిప్పు చెప్పులు తొడిగించబడతాయి. దానివల్ల అతని మెదడు ఉడుకుతుంది. ఆ వ్యక్తి అందరికంటే తనకే కఠినమైన శిక్ష పడుతుందని భావిస్తాడు. అయితే అది అందరికంటే తేలికయిన శిక్ష అయి ఉంటుంది.” (బు’ఖారీ, ముస్లిమ్)
5668 – [ 4 ] ( صحيح ) (3/1578)
وَعَنِ ابْنِ عَبَّاسٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “أَهْوَنُ أَهْلِ النَّارِ عَذَابًا أَبُوْ طَالِبٍ وَهُوَ مُنْتَعِلٌ بِنَعْلَيْنِ يَغْلِيْ مِنْهُمَا دِمَاغُهُ”. روَاهُ الْبُخَارِيُّ.
5668. (4) [3/1578 –దృఢం]
ఇబ్నె ‘అబ్బాస్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”నరక వాసుల్లో అందరికంటే తేలికైన శిక్ష అబూ ‘తాలిబ్‌కు పడుతుంది. అతను నిప్పు చెప్పులు ధరించి ఉంటారు. దానివల్ల అతని మెదడు ఉడుకుతూ ఉంటుంది.” [30] (బు’ఖారీ)
5669 – [ 5 ] ( صحيح ) (3/1579)
وَعَنْ أَنَسٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “يُؤْتَى بِأَنْعَمِ أَهْلِ الدُّنْيَا مِنْ أَهْلِ النَّاِر يَوْمَ الْقِيَامَةِ فَيُصْبَغُ فِي النَّارِ صَبْغَةً ثُمَّ يُقَالُ: يَا ابْنَ آدَمَ هَلْ رَأَيْتَ خَيْرًا قَطُّ؟ هَلْ مَرَّ بِكَ نَعِيْمٌ قَطُّ؟ فَيَقُوْلُ: لَا وَاللهِ يَا رَبِّ وَيُؤْتَى بِأَشَدِّ النَّاسِ بُؤْسًا فِي الدُّنْيَا مِنْ أَهْلِ الْجَنَّةِ فَيُصْبَغُ صبْغَةً فِي الْجَنَّةِ. فَيُقَالُ لَهُ: يَا ابْنَ آدَمَ هَلْ رَأَيْتَ بُؤْسًا قَطُّ؟ وَهَلْ مَرَّ بِكَ شِدَّةٌ قَطُّ. فَيَقُوْلُ: لَا وَاللهِ يَا رَبِّ مَا مَرَّ بِيْ بُؤْسٌ قَطُّ وَلَا رَأَيْتُ شِدَّةً قَطُّ”. رَوَاهُ مُسْلِمٌ.
5669. (5) [3/1579–దృఢం]
అనస్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”తీర్పుదినం నాడు నరకవాసుల్లోని ఒక వ్యక్తిని తీసుకురావటం జరుగుతుంది. అతడు ప్రపంచంలో భోగవిలాసాల్లో జీవితం గడిపి ఉంటాడు. అతన్ని నరకంలో విసిరి శిక్షించి, ‘ఓ ఆదమ్ కుమారా! ప్రపంచంలో నువ్వు ఎప్పుడైనా సుఖం పొందావా?’ అని ప్రశ్నించటం జరుగుతుంది. దానికి ఆ వ్యక్తి, ‘లేదు మహా ప్రభూ! లేదు,’ అని అంటాడు. ఆ తరువాత స్వర్గ వాసుల్లోని ఒక వ్యక్తిని తీసుకువచ్చి, ఆ వ్యక్తి ప్రపంచంలో కష్టాలకు, నష్టాలకు, ఆపదలకు గురయి ఉంటాడు. అతన్ని స్వర్గం రుచి చూపించి, ‘ప్రపంచంలో ఎప్పుడైనా కష్టాలను అనుభ వించావా?’ అని అడిగితే, ‘లేదు ప్రభూ! లేదు, నేను ఎంత మాత్రం ప్రపంచంలో కష్టాలను అనుభవించలేదు,’ అని అంటాడు. (ముస్లిమ్)
5670 – [ 6 ] ( مُتَّفَقٌ عَلَيْهِ ) (3/1579)
وَعَنْهُ عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ: “يَقُوْلُ اللهُ لَأَهْوَنِ أَهْلِ النَّارِ عَذَابًا يَوْمَ الْقِيَامَةِ: لَوْأَنَّ لَكَ مَا فِي الْأَرْضِ مِنْ شَيْءٍ أَكُنْتَ تَفْتَدِيْ بِهِ؟ فَيَقُوْلُ: نَعَمْ. فَيَقُوْلُ: أَرَدْتُ مِنْكَ أَهْوَنَ مِنْ هَذَا وَأَنْتَ فِيْ صُلْبِ آدَمَ أَنْ لَا تُشْرِكَ بِيْ شَيْئًا فَأَبَيْتَ إِلَّا أَنْ تُشْرِكَ بِيْ”. مُتَّفَقٌ عَلَيْهِ.
5670. (6) [3/1579 –ఏకీభవితం]
అనస్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”తీర్పుదినం నాడు అల్లాహ్(త) సున్నితంగా శిక్షించ బడే వారిని ఉద్దేశించి, ‘ఒకవేళ మీ దగ్గర ప్రాపంచిక వస్తువుల్లోని ఏదైనా ఉండి, దాన్ని ఇచ్చి శిక్ష నుండి తప్పించుకునే అవకాశం ఉంటే, మీరు అలా చేస్తారా?’ అని అంటాడు. దానికి వారు, ‘అవును,’ అని అంటారు. అప్పుడు అల్లాహ్ (త), ‘నువ్వు ఆదమ్ వెన్నెముకలో ఉన్నప్పుడు దీనికన్నా చిన్న విషయాన్ని నేను కోరాను. అదేమిటంటే, నీవు నాకు ఎవరినీ సాటి కల్పించ రాదని మాత్రమే కోరాను. నీవు చేసిన వాగ్దానం భంగపరిచావు. నాకు సాటి కల్పించావు,’ అని అంటాడు. (బు’ఖారీ, ముస్లిమ్)
5671 – [ 7 ] ( صحيح ) (3/1579)
وَعَنْ سَمُرَةَ بْنِ جُنْدُبٍ أَنَّ النَّبِيَّ صَلى الله عليه وسلم قَالَ: “مِنْهُمْ مَنْ تَأْخُذُهُ النَّارُ إِلى كَعْبَيْهِ وَمِنْهُمْ مَنْ تَأْخُذُهُ النَّارُ إِلى رُكْبَتَيْهِ وَمِنْهُمْ مَنْ تَأْخُذُهُ النَّارُ إِلى حُجْزَتِهِ وَمِنْهُمْ مَنْ تَأْخُذُهُ النَّارُ إِلى تَرْقُوَتِهِ”. رَوَاهُ مُسْلِمٌ.
5671. (7) [3/1579– దృఢం]
సమురహ్ బిన్ జున్‌దుబ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”నరకవాసుల్లో కొంతమందికి చీలమండల వరకు అగ్ని జ్వాలలు ఉంటాయి, మరికొందరికి మోకాళ్ళ వరకు అగ్ని జ్వాలలు ఉంటాయి. మరి కొందరికి నడుమువరకు అగ్ని జ్వాలలు ఉంటాయి. మరికొందరికి మెడల వరకు అగ్ని జ్వాలలు ఉంటాయి.” (ముస్లిమ్)
5672 – [ 8 ] ( صحيح ) (3/1579)
وَعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَا بَيْنَ مَنْكَبَي الْكَافِرِفِي النَّارِمَسِيْرَةُ ثَلَاثَةِ أَيَّامٍ لِلرَّاكِبِ الْمُسْرِعِ”.
وَفِيْ رِوَايَةٍ: “ضِرْسُ الْكَافِرِ مِثْلُ أُحْدٍ وَغِلَظَ جِلْدِهِ مَسِيْرَةُ ثَلَاثٍ”. رَوَاهُ مُسِلِمٌ وَ ذُكِرَحَدِيْثُ أَبِيْ هُرَيْرَةَ: “إِذَا اشْتَكَتِ النَّارُ إِلى رَبِّهَا”. فِيْ بَابِ” تَعْجِيْلِ الصَّلَوَاتِ”.
5672. (8) [3/1579 –దృఢం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”నరకంలో అవిశ్వాసుల రెండు భుజాల మధ్య మూడు రోజులు ఏక ధాటిగా గుర్రంపై ప్రయాణం చేసినంత దూరం ఉంటుంది. మరో ఉల్లేఖనంలో ఇలా ఉంది. నర కంలో అవిశ్వాసి పన్ను ఉ’హుద్ కొండంత ఉంటుంది. ఇంకా అతని చర్మం మూడు రోజుల ప్రయాణ దూరం అంత దళసరిగా ఉంటుంది.” (ముస్లిమ్)
5673 – [ 9 ] ( ضعيف ) (3/1580)
عَنْ أَبِيْ هُرَيْرَةَ عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ: “أُوْقِدَ عَلَى النَّارِ أَلْفَ سَنَةٍ حَتّى اِحْمَرَّتْ ثُمَّ أَوْقِدَ عَلَيْهَا أَلْفَ سَنَةٍ حَتّى اِبْيَضَّتْ ثُمَّ أُوْقِدَ عَلَيْهَا أَلْفَ سَنَةٍ حَتّى اِسْوَدَّتْ فَهِيَ سَوْدَاءُ مُظْلِمَةٌ”. رَوَاهُ التِّرْمِذِيُّ.
5673. (9) [3/1580– బలహీనం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”నరకాగ్నిని 1000 సంవత్సరాల వరకు రాజేయటం జరిగింది. అప్పుడది ఎర్రగా అయిపోయింది. మరో 1000 సంవత్సరాల వరకు మండించటం జరిగింది. అప్పుడది తెల్లగా అయింది. ఆ తరువాత దాన్ని మరో 1000 సంవత్స రాలు రగిలించటం జరిగింది. అప్పుడది నల్లగా మారిపోయింది. ఆ నరకాగ్ని ఇప్పుడు చాలా నల్లగా అయి ఉంది.” (తిర్మిజి’)
5674 – [ 10 ] ( ضعيف ) (3/1580)
وعَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “ضِرْسُ الْكَافِرِيَوْمَ الْقِيَامَةِ مِثْلُ أُحْدٍ وَفَخِذُهُ مِثْلُ الْبَيْضَاءِ وَمَقْعَدُهُ مِنَ النَّارِ مَسِيْرَةُ ثَلَاثٍ مِثْلُ الرَّبْذَةِ”. رَوَاهُ التِّرْمِذِيُّ.
5674. (10) [3/1580 –బలహీనం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”తీర్పు దినం నాడు అవిశ్వాసి పన్ను ఉహుద్ కొండంత ఉంటుంది. వాడి తొడ బై’దా’ కొండంత ఉంటుంది. ఇంకా వాడు కూర్చునే స్థలం గుర్రం మూడు రోజుల ప్రయాణ దూరం అంత ఉంటుంది. అంటే మదీనహ్ నుండి రబ్‌జ’హ్ వరకు.” (తిర్మిజి’)
5675 – [ 11 ] ( صحيح ) (3/1580)
وَعَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِنَّ غِلْظَ جِلْدَ الْكَافِرِ اثْنَانِ وَأَرْبَعُوْنَ ذِرَاعًا وَإِنَّ ضِرْسَهُ مِثْلُ أُحْدٍ وَإِنَّ مَجْلِسَهُ مِنْ جَهَنَّمَ مَا بَيْنَ مَكَّةَ وَالْمَدِيْنَةِ”. رَوَاهُ التِّرْمِذِيُّ.
5675. (11) [3/1581 –దృఢం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”నరకంలో అవిశ్వాసి 42 గజాల వలంగా ఉంటాడు. వాడి పన్ను ఉ’హుద్ కొండంత ఉంటుంది. నరకంలో అతను కూర్చునే చోటు మక్కహ్ మదీనహ్ ల మధ్య దూరం అంత ఉంటుంది.” (తిర్మిజి’)
5676 – [ 12 ] ( ضعيف ) (3/1580)
وَعَنْ ابْنِ عُمَرَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِنَّ الْكَافِرَ لَيُسْحَبُ لِسَانُهُ الْفَرْسَخَ وَالْفَرْسَخَيْنِ يَتَوَطَّؤُهُ النَّاسُ”. رَوَاهُ أَحْمَدُ وَ التِّرْمِذِيُّ وَقَالَ: هَذَا حَدِيْثٌ غَرِيْبٌ
5676. (12) [3/1580– బలహీనం]
ఇబ్నె ‘ఉమర్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”నరకంలో అవిశ్వాసి తన నాలుకను 3 నుండి 6 కోసుల వరకు సాగదీస్తాడు. ప్రజలు దాన్ని కాళ్ళతో తన్నుతుంటారు.” (అ’హ్మద్, తిర్మిజి’-ఏకోల్లేఖనం)
5677 – [ 13 ] ( ضعيف ) (3/1580)
وَعَنْ أَبِيْ سَعِيْدِ الْخُدْرِيِّ عَنْ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم قَالَ: “الصَّعُوْدُ جَبَلٌ مِنْ نَارٍ يُتَصَعَّدُ فِيْهِ سَبْعِيْنَ خَرِيْفًا وَيُهَوَي بِهِ كَذَلِكَ فِيْهِ أَبَدًا”. رَوَاهُ التِّرْمِذِيُّ.
5677. (13) [3/1580– బలహీనం]
అబూ స’యీద్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ” ‘స’ఊద్ అనేది ఒక అగ్ని పర్వతం, దానిపై అవిశ్వాసి 70 సంవత్సరాల వరకు ఎక్కుతూ ఉంటాడు. అదే విధంగా 70 సంవత్సరాలు క్రిందపడుతూ ఉంటాడు. ఎల్లప్పుడూ అలాగే జరుగుతూ ఉంటుంది.’ [31] (తిర్మిజి’)
5678 – [ 14 ] ( ضعيف ) (3/1580)
وَعَنْهُ عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ فِيْ قَوْلِهِ: (كَالْمُهْلِ) أَيْ كَعَكْرِ الزَّيْتِ فَإِذَا قُرِّبَ إِلى وَجْهِهِ سَقَطَتْ فَرْوَةُ وَجْهِهِ فِيْهِ رَوَاهُ التِّرْمِذِيُّ.
5678. (14) [3/1580 –బలహీనం]
అబూ స’యీద్ (ర) కథనం: ప్రవక్త (స) ఉల్లేఖనం: ”అల్లాహ్(త) ఆదేశం, అంటే ముళ్ళచెట్టు వారికి ఆహారం అవుతుంది. అది కడుపులో ఉడుకుతూ ఉంటుంది. అది చాలా జిడ్డుగా ఉంటుంది. దాన్ని నోటి దగ్గరకు తీసుకురాగానే అతని నోటి చర్మం వచ్చేస్తుంది.” (తిర్మిజి’)
5679 – [ 15 ] ( ضعيف ) (3/1581)
وَعَنْ أَبِيْ هُرَيْرَةَ عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ: “إِنَّ الْحَمِيْمَ لَيُصَبُّ عَلَى رُؤُوْسِهِمْ فَيَنْفُذُ الْحَمِيْمُ حَتّى يَخْلُصَ إِلى جَوْفِهِ فَيَسْلُتُ مَا فِيْ جَوْفِهِ حَتّى يَمْرُقَ مِنْ قَدَمَيْهِ وَهُوَ الصِّهْرُ ثُمَّ يُعَادُ كَمَا كَانَ”. رَوَاهُ التِّرْمِذِيُّ.
5679. (15) [3/1581– బలహీనం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”నరకవాసుల తలపై వేడినీరు వేయగానే అది కడుపు లోపలికి దిగిపోతుంది. ఇంకా కడుపును చించివేస్తుంది. చివరికి మలద్వారం ద్వారా బయటకు వస్తుంది. ‘సిహ్‌ర్ అంటే ఇదే. మళ్ళీ ఆ నరకవాసి యథాస్థితికి చేరు కుంటాడు.” [32] (తిర్మిజి’)
5680 – [ 16 ] ( ضعيف ) (3/1581)
وَعَنْ أَبِيْ أُمَامَةَ عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم فِيْ قَوْلِهِ: (يُسْقَى مِنْ مَاءٍ صَدِيْدٍ يَتَجَرَّعُهُ؛ 14: 16) قَالَ: “يُقَرَّبُ إِلى فِيْهِ فَيَكْرَهُهُ فَإِذَا أَدْنَي مِنْهُ شَوْى وَجْهَهُ وَوَقَعَتْ فَرْوَةُ رَأْسِهِ فَإِذَا شَرِبَهُ قَطَّعَ أَمْعَاءَهُ حَتّى يَخْرُجَ مِنْ دُبْرِهِ. يَقُوْلُ اللهُ تَعَالى: (وَسُقُوْا مَاءُ حَمِيْمًا فَقَطَّعَ أَمْعَاءَهُمْ؛ 47: 15 ) وَيَقُوْلُ: (وَإِنْ يَسْتَغِيْثُوْا يُغَاثُوْا بِمَاءٍ كَالْمُهْلِ يَشْوِي الْوُجُوْه بِئْسَ الشَّرَابُ؛ 18: 29). رَوَاهُ التِّرْمِذِيُّ.
5680. (16) [3/1581 –బలహీనం]
అబూ ఉమామహ్ ప్రవక్త (స) ద్వారా కథనం: అల్లాహ్ (త) ఆదేశం, ”నరకవాసులకు చీము నీరు త్రాపించటం జరుగుతుంది. (ఇబ్రాహీం, 14:16) దాన్ని వారు గుటకలు గుటకలుగా త్రాగుతారు. దీని వ్యాఖ్యానంలో ప్రవక్త (స), ‘నీటిని నరకవాసుల నోటి దగ్గరకు తీసుకురావటం జరుగుతుంది, దాన్ని వారు అసహ్యించుకుంటారు, ఆ నీటిని వారి నోటిలో వేయబడుతుంది, అది వారినోటిని కాల్చి వేస్తుంది, అతని తల చర్మం వీడి క్రిందపడుతుంది, అతను దాన్ని త్రాగితే, అది వారి ప్రేగులను ముక్కలుగా చేసివేస్తుంది, ఆ తరువాత అది మలద్వారం ద్వారా బయటకు వస్తుంది,’ అని అన్నారు. అల్లాహ్(త) ఆదేశం, ”వారికి వేడి నీరు త్రాపించటం జరుగుతుంది. అది వారి ప్రేగులను కోసి వేస్తుంది.” (ముహమ్మద్, 47:15) ఇంకా అల్లాహ్(త) ఆదేశం, ”నరకవాసులు నీళ్ళు కోరుతారు, వాళ్ళకు నీళ్ళు ఇవ్వటం జరుగుతుంది. అది నూనెలా జిడ్డుగా ఉంటుంది. అది వారి ముఖాలను మాడ్చి వేస్తుంది. అంతేకాదు, ఇది చాలా అసహ్యంగా ఉంటుంది. ” (అల్ కహఫ్, 18:29) (తిర్మిజి’)
5681 – [ 17 ] ( ضعيف ) (3/1581)
وعَنْ أَبِيْ سَعِيْدٍ الْخُدْرِيِّ عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ: لِسُرَادِقُ النَّارِ أَرْبَعَةُ جُدُرٍ كِثْفُ كُلِّ جِدَارٍ مَسِيْرَةُ أَرْبَعِيْنَ سَنَةً”. رَوَاهُ التِّرْمِذِيُّ.
5681. (17) [3/1581– బలహీనం]
అబూ స’యీద్ ‘ఖుద్రీ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”నరకాన్ని నాలుగుగోడలు ఆవరించి ఉన్నాయి. ప్రతి గోడ 40 సంవత్సరాల ప్రయాణ దూరం అంత పొడవు ఉంటుంది.” (తిర్మిజి’)
5682 – [ 18 ] ( ضعيف ) (3/1582)
وعَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَوْأَنَّ دَلْوًامِنْ غَسّاقٍ يُهْرَاقُ فِي الدُّنْيَا لَأَنْتَنَ أَهْلَ الدُّنْيَا “. رَوَاهُ التِّرْمِذِيُّ.
5682. (18) [3/1582– బలహీనం]
అబూ స’యీద్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”నరకవాసుల గాయాల కడుగు అంటే చీము నెత్తురులను ఒక్క బకెటు ప్రపంచంలో పడవేస్తే, మనుషు లందరూ క్రుళ్ళిపోతారు.” (తిర్మిజి’)
5683 – [ 19 ] ( صحيح ) (3/1582)
وَعَنِ ابْنِ عَبَّاسٍ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم قَرَأَ هَذِهِ الْآيَةَ: (اِتَّقُوا اللهَ حَقَّ تُقَاتِهِ وَلَا تَمُوْتُنَّ إِلَّا وَأَنْتُمْ مُسْلِمُوْنَ؛ 3: 102) قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَوْ أَنَّ قَطْرَةً مِنَ الزَّقُوْمِ قَطَرَتْ فِيْ دَارِ الدُّنْيَا لَأَفْسَدَتْ عَلَى أَهْلِ الْأَرْضِ مَعَايِشَهُمْ فَكَيْفَ بِمَنْ يَكُوْنُ طَعَامُهُ؟” رَوَاهُ التِّرْمِذِيُّ وَقَالَ: هَذَا حَدِيْثٌ حَسَنٌ صَحِيْحٌ .
5683. (19) [3/1582– దృఢం]
ఇబ్నె ‘అబ్బాస్ (ర) కథనం: ప్రవక్త (స) ”దైవానికి భయపడండి, భయపడే విధంగా, ఇంకా ముస్లిమ్‌గా తప్ప మరణించకండి” (ఆల ఇమ్రాన్, 3:102) పఠించి, ”ఒకవేళ జెముడుచెట్టు ఒక చుక్క కూడా ఈ ప్రపంచంలో పడవేస్తే, ఇక్కడ ఉన్న పంటలన్నీ నశిస్తాయి. మరి తినేవాడి పరిస్థితి ఏమవుతుందో ఊహించండి” అని అన్నారు. (తిర్మిజి’ -ప్రామాణికం -దృఢం)
5684 – [ 20 ] ( ضعيف ) (3/1582)
وَعَنْ أَبِيْ سَعِيْدٍ عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ :(وَهُمْ فِيْهَا كَالِحُوْنَ؛ 23: 104) قَالَ: “تَشْوِيْهِ النَّارُفَتَقَلَّصُ شَفَتُهُ الْعُلْيَا حَتّى تَبْلُغَ وَسْطَ رَأْسِهِ وَتَسْتَرْخِيْ شَفَتُهُ السُّفْلَى حَتّى تَضْرِبَ سُرَّتَهُ”. رَوَاهُ التِّرْمِذِيُّ .
5684. (20) [3/1582 –బలహీనం]
అబూ స’యీద్ ‘ఖుద్రీ (ర) కథనం: ప్రవక్త (స) ”వహుమ్ ఫీహా కాలి’హూన్” (అల్ ము’అమినూన్, 23:104) యొక్క వ్యాఖ్యానంలో ”నరకాగ్ని అవిశ్వాసి ముఖాన్ని మాడ్చివేస్తుంది. దానివల్ల అతని పెదాలు ఒకటి మీదకు మరొకటి క్రిందకు వ్రేలాడుతూ ఉంటాయి.” (తిర్మిజి’)
5685 – [ 21 ] ( لم تتم دراسته ) (3/1582)
وَعَنْ أَنَسٍ عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ: “يَا أَيُّهَا النَّاسُ ابْكُوْا فَإِنْ لَمْ تَسْتَطِيْعُوْا فَتَبَاكَوْا فَإِنَّ أَهْلَ النَّارِ يَبْكُوْنَ فِي النَّارِ حَتّى تَسِيْلَ دُمُوْعُهُمْ فِيْ وُجُوْهِهِمْ كَأَنَّهَا جَدَاوِلُ حَتّى تَنْقَطِعَ الدُّمُوْعُ فَتَسِيلُ الدِّمَاءُ فَتَقَرَّحَ الْعُيُوْنُ فَلَوْ أَنَّ سُفُنَا أُزْجِيَتْ فِيْهَا لَجَرَتْ”. رَوَاهُ فِيْ” شَرْحِ السُّنَّةِ”.
5685. (21) [3/1582 –అపరిశోధితం]
అనస్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ప్రజలారా! దైవభీతితో ఏడవండి. ఒకవేళ ఏడుపు రాకపోయినా ఏడ్వండి. ఎందుకంటే నరకవాసులు నరకంలో ఏడుస్తారు. వారికన్నీళ్ళు వారి బుగ్గలపై కాలువల్లా ప్రవహిస్తాయి. చివరికి వారి కన్నీళ్ళు నశిస్తాయి. అప్పుడు రక్తం ప్రవహించటం ప్రారంభం అవుతుంది. కళ్ళల్లో అంతా రక్తం వ్యాపిస్తుంది. వారి కళ్ళనుండి ప్రవహించే రక్తం ఎంత అధికంగా ఉంటుందంటే, దానిలో పడవలు కూడా నడపవచ్చు.” (షర్‌హుస్సున్నహ్)
5686 – [ 22 ] ( ضعيف ) (3/1582)
وعَنْ أَبِي الدَّرْدَاءِ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “يُلْقَى عَلَى أَهْلِ النَّارِ الْجُوْعُ فَيَعْدِلُ مَا هُمْ فِيْهِ مِنَ الْعَذَابِ فَيَسْتَغِيْثُوْنَ فَيُغَاثُوْنَ بِطَعَامٍ مِنْ ضَرِيْعٍ لَا يُسْمِنَّ وَلَا يُغْنِيْ مِنء جُوْعٍ فَيَسْتَغِيْثُوْنَ بِالطَّعَامٍ فَيُغَاثُوْنَ بِطَعَامٍ ذِيْ غُصَّةٍ فَيَذْكُرُوْنَ أَنَّهُمْ كَانُوْا يُجِيْزُوْنَ الْغُصَصَ فِي الدُّنْيَا بِالشَّرَابِ فَيَسْتَغِيْثُوْنَ بِالشَّرَابِ فَيُرْفَعُ إِلَيْهِمُ الْحَمِيْمُ بِكَلَالِيْبِ الْحَدِيْدِ فَإِذَا دَنَتْ مِنْ وُجُوْهِهِمْ شَوَتْ وُجُوْهَهُمْ فَإِذَا دَخَلَتْ بُطُوْنَهُمْ قَطَعَتْ مَا فِيْ بُطُوْنِهِمْ فَيَقُوْلُوْنَ: اُدْعُوْا خَزَنَةَ جَهَنَّمَ فَيَقُوْلُوْنَ: أَلَمْ تَكُ تَأْتِيْكُمْ رُسُلُكُمْ بِالْبَيِّنَاتِ؟ قَالُوْا: بَلَى. قَالُوْا: فَادْعُوْا وَمَا دُعَاءُ الْكَافِرِيْنَ إِلّا فِيْ ضَلَالٍ”. قَالَ: “فَيَقُوْلُوْنَ: اُدْعُوْا مَالِكًا فَيَقُوْلُوْنَ: يَا مَالِكُ لِيَقْضِ عَلَيْنَا رَبُّكَ”. قَالَ: “فَيُجِيْبُهُمْ إِنَّكُمْ مَاكِثُوْنَ”. قَالَ الْأَعْمَشُ: نُبِّئْتُ أَنَّ بَيْنَ دُعَائِهِمْ وَإِجَابَةِ مَالِكٍ إِيَّاُهْم أَلْفَ عَامٍ. قَالَ: “فَيَقُوْلُوْنَ: اُدْعُوْا رَبَّكُمْ فَلَا أَحَدٌ خَيْرٌ مِّنْ رَبِّكُمْ فَيَقُوْلُوْنَ: رَبَّنَا غَلَبَتْ عَلَيْنَا شِقْوَتُنَا وَكُنَّا قَوْمًا ضَالِّيْنَ رَبَّنَا أَخْرِجْنَا مِنْهَا فَإِنْ عُدْنَا فَإِنَّا ظَالِمُوْنَ”. قَالَ: “فَيُجِيْبُهُمْ: اِخْسَؤُوْا فِيْهَا وَلَا تُكَلِّمُوْنَ”. قَالَ: “فَعِنْدَ ذَلِكَ يَئِسُوْا مِنْ كُلِّ خَيْرٍ وَعِنْدَ ذَلِكَ يَأْخُذُوْنَ فِي الزَّفِيْرِ وَالْحَسْرَةِ وَالْوَيْلِ”. قَالَ عَبْدُ اللهِ بْنُ عَبْدِ الرَّحْمَنِ: وَالنَّاسُ لَا يَرْفَعُوْنَ هَذَا الْحَدِيْثَ. رَوَاهُ التِّرْمِذِيُّ.
5686. (22) [3/1582 –బలహీనం]
అబూ దర్‌దా (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”నరక వాసులను తీవ్రమైన ఆకలికి గురిచేయటం జరుగుతుంది. ఆహారం కావాలని హాహాకారాలు చేస్తారు. తినటానికి వారికి చేదుగా ఉన్న ముళ్ళ చెట్టు ఇవ్వబడుతుంది. ఈ ఆహారం వారికి శక్తినివ్వదు, వారి ఆకలిని తగ్గించదు. మళ్ళీ వారు ఆహారం కావాలని వేడుకుంటారు. మళ్ళీ వారికి ఆహారం ఇవ్వబడుతుంది. అది వారి గొంతులో చిక్కు కుంటుంది. అంటే కడుపులోనికి వెళ్ళదు, నోటినుండి బయటకురాదు. అప్పుడు వారికి ప్రపంచంలో ఏదైనావస్తువు గొంతులో చిక్కుకుంటే దాన్ని నోటితో దింపేవారం అని గుర్తుకు వస్తుంది. వారు నీళ్ళు కోరుతారు. అప్పుడు వాళ్ళకు వేడిగా కాగుతున్న నీరు ఇవ్వబడుతుంది. వారు దాన్ని త్రాగటానికి ప్రయత్నించినపుడు వారి ముఖాలు మాడిపోతాయి.
ఆ కాగుతున్న నీరు వారి కడుపులోనికి వెళ్ళి కడుపులో ఉన్న వాటినంతటినీ కాల్చివేస్తుంది. ఇంకా వాళ్ళు నరకపాలకుల్ని పిలుస్తారు, అతనితో శిక్ష తగ్గించమని కోరుతారు. వారి మొరలు విని నరక పాలకులు, ‘స్పష్టమైన సూచనలు తీసుకొని దైవప్రవక్తలు రాలేదా?’ అని అడుగుతారు. దానికి వారు, ‘వచ్చారు,’ అని అంటారు. దానికి నరక పాలకులు మీరు స్వయంగా ప్రార్థించండి, అవిశ్వాసుల మొరలు ఎటువంటి లాభాన్ని చేకూర్చలేవు. ఆ తరువాత నరకవాసులు పరస్పరం మాలిక్‌ను పిలవండి అని చెప్పి, మాలిక్‌తో, ‘నీవు మా ప్రభువుతో చెప్పి మాకు మరణం ప్రసాదించమని చెప్పు,’ అని అంటారు. దానికి ఆ మాలిక్, ‘మీరు ఎల్లప్పుడూ, ఈ స్థితిలోనే ఉంటారు,’ అని అంటాడు.
ఈ ‘హదీసు’ ఉల్లేఖనకర్త కథనం: నరకవాసులు మాలిక్‌ను ప్రాధేయపడటం, మాలిక్ సమాధానం ఇవ్వ టంల మధ్య 1000 సంవత్సరాలు ఉంటుందని నాకు తెలియపరచబడింది. ప్రవక్త (స) కథనం: ఆ తరువాత నరకవాసులు, ‘ఇప్పుడు మన ప్రభువునే ప్రార్థించాలి. ఎందుకంటే ఇంతకంటే గత్యంతరం మరొకటి లేదు,’ అని పరస్పరం చెప్పుకుంటారు. అప్పుడు వారు, ‘ఓ మా ప్రభూ! మా దురదృష్టం మమ్మల్ని అధిగ మించింది. మేము మార్గభ్రష్టత్వానికి గురయ్యాము, ఓ మా ప్రభూ! మమ్మల్ని నరక శిక్షనుండి కాపాడు. ఆ తరువాత కూడా మేము అవిశ్వాసానికి ఒడిగడితే, మాపై మేము దుర్మార్గం చేసుకున్న వారమౌతాము.’ అని అంటారు. అప్పుడు అల్లాహ్ (త), ”దూరంగా పోండి, నాతో మాట్లాడకండి,” అని అంటాడు. అల్లాహ్(త) సమాధానం విని నిరాశకు గురై మొరపెట్టుకుంటూ ఉంటారు. (తిర్మిజి’)
5687 – [ 23 ] ( صحيح ) (3/1583)
وعَنِ النُّعْمَانِ بْنِ بَشِيْرٍ قَالَ: سَمِعْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ: “أَنْذَرْتُكُمُ النَّارَ أَنْذَرْتُكُمُ النَّارَ”. فَمَا زَالَ يَقُوْلُهَا حَتّى لَوْ كَانَ فِيْ مَقَامِيْ هَذَا سَمِعَهُ أَهْلُ السُّوْقِ وَحَتّى سَقَطَتْ خَمِيْصَةٌ كَانَتْ عَلَيْهِ عِنْدَ رِجْلَيْهِ. رَوَاهُ الدَّارَمِيُّ.
5687. (23) [3/1583– దృఢం]
ను’అమాన్ బిన్ బషీర్ (ర) కథనం: ప్రవక్త (స) ఇలా ప్రవచిస్తూ ఉండగా నేను విన్నాను, ”ప్రజలారా! నేను మిమ్మల్ని నరక శిక్ష నుండి హెచ్చరించాను. నేను మిమ్మల్ని నరక శిక్ష నుండి భయపెట్టాను.” ప్రవక్త (స) ఇలా చాలా సార్లు అన్నారు. ఒకవేళ ప్రవక్త (స) ఇప్పుడు నేనున్న చోట్లో ఉంటే ఆయన మాటలు బజారులో ఉన్నవారు వింటారు, అప్పుడు ప్రవక్త (స) భుజంపై ఉన్న దుప్పటి క్రిందపడింది.” (దార్మీ)
5688 – [ 24 ] ( ضعيف ) (3/1583)
وعَنْ عَبْدِ اللهِ بْنِ عَمْرِو بْنِ الْعَاصٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَوْ أَنَّ رَصَاصَةً مِثْلَ هَذِهِ – وَأَشَارَ إِلى مِثْلِ الْجُمْجُمَةِ – أُرْسِلَتْ مِنَ السَّمَاءِ إِلى الْأَرْضِ وَهِيَ مَسِيْرَةٌ خَمْسِمِائَةِ سَنَةٍ لَبَلَغَتِ الْأَرْضِ قَبْلَ اللَّيْلِ وَلَوْ أَنَّهَا أُرْسِلَتْ مِنْ رَأْسِ السِّلْسَلَةِ لَسَارَتْ أَرْبَعِيْنَ خَرِيْفًا اللَّيْلَ وَالنَّهَارَ قَبْلَ أَنْ تَبْلُعَ أَصْلَهَا أَوْ قَعْرَهَا”. رَوَاهُ التِّرْمِذِيُّ.
5688. (24) [3/1583– బలహీనం]
‘అబ్దుల్లాహ్ బిన్ ‘అమ్ర్ బిన్ ‘ఆ’స్ కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”పుర్రెవంటి ఒక గాజు ముక్కను ఆకాశం నుండి విసిరితే దానికి భూమికి మధ్య దూరం 500 సంవత్సరాల ప్రయాణదూరం ఉంది. అది ఒక్క రాత్రిలోనే భూమికి చేరుకుంటుంది. కాని ఆ గాజు ముక్కను నరక వాసులను బంధించే గొలుసుకు కట్టి వదలితే 40 సంవత్సరాల వరకు క్రిందివైపు దొర్లినా దాని రెండవ చివరకు చేరదు.”[33] (తిర్మిజి’)
5689 – [ 25 ] ( ضعيف ) (3/1584)
وعَنْ أَبِيْ بُرْدَةَ عَنْ أَبِيْهِ أَنَّ النَّبِيَّ صلى ا لله عليه وسلم قَالَ: “إِنَّ فِيْ جَهَنَّمَ لَوَادِيًا يُقَالُ لَهُ: هَبْهَبٌ يَسْكُنُهُ كُلُّ جَبَّارٍ”. روَاهُ الدَّارَمِيُّ.
5689. (25) [3/1584 –బలహీనం]
అబూ బుర్‌దహ్ తన తండ్రి ద్వారా కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”నరకంలో ఒక కాలువ ఉంది. దాని పేరు ‘హబ్‌హబ్’. అందులో గర్వంగా, అహంకారంగా ప్రవర్తించేవారిని శిక్షించడం జరుగుతుంది.” [34]
—–
اَلْفَصْلُ الثَّالِثُ మూడవ విభాగం
5690 – [ 26 ] ( لم تتم دراسته ) (3/1584)
عَنِ ابْنِ عُمَرَعَنِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ: “يَعْظُمُ أَهْلُ النَّارِ فِي النَّارِ حَتّى إِنَّ بَيْنَ شَحْمَةِ أُذُنِ أَحَدِهِمْ إِلى عَاتِقِهِ مَسِيْرَةَ سَبْعِمِائَةِ عَامٍ وَإِنَّ غِلَظَ جِلْدِهِ سَبْعُوْنَ ذِرَاعًا وَإِنَّ ضِرْسَهُ مِثْلُ أُحُدٍ”.
5690. (26) [3/1584– అపరిశోధితం]
ఇబ్నె ‘ఉమర్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”నరకంలో నరకవాసుల శరీరాలు చాలా పెద్దవిగా ఉంటాయి. చివరికి ఒక నరకవాసి చెవుల నుండి భుజం వరకు గల దూరం 700 సంవత్సరాల ప్రయాణ దూరం ఉంటుంది. అతని చర్మం 70 గజాల తలంగా ఉంటుంది. ఇంకా అతని పళ్ళు ఉహుద్ కొండంత ఉంటాయి.” (అ’హ్మద్)
5691 – [ 27 ] ( لم تتم دراسته ) (3/1584)
وَعَنْ عَبْدِ اللهِ بْنِ الْحَارِثِ بْنِ جَزْءٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِنَّ فِي النَّارِ حَيَّاتٍ كَأَمْثَالِ الْبُخْتِ تَلْسَعُ إِحْدَاهُنَّ اللَّسْعَةَ فَيَجِدُ حُمُوَّتَهَا أَرْبَعِيْنَ خَرِيْفًا وَإِنَّ فِي النَّارِعَقَارِبُ كَأَمْثَالِ الْبِغَالِ الْمُؤْكَفَةِ تَلْسَعُ إِحْدَاهُنَّ اللَّسْعَةَ فَيَجِدُ حُمُوَّتَهَا أَرْبَعِيْنَ خَرِيْفًا”. رَوَاهُمَا أَحْمَدُ.
5691. (27) [3/1584 –అపరిశోధితం]
‘అబ్దుల్లాహ్ బిన్ ‘హారిస్’ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”నరకంలో మేలురకం ఒంటెల్లాంటి పాములు ఉంటాయి. పాము ఒకసారి కాటువేస్తే, దాని బాధ 40 సంవత్సరాల వరకు కలుగుతుంది. ఇంకా నరకంలో గాడిదల్లాంటి తేళ్ళు ఉన్నాయి. తేలు ఒకసారి కాటువేస్తే 40 సంవత్సరాల వరకు బాధ కలుగుతుంది.” (అ’హ్మద్)
5692 – [ 28 ] ( صحيح ) (3/1584)
وَعَنِ الْحَسَنِ قَالَ: حَدَّثَنَا أَبُوْ هُرَيْرَةَ عَنْ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم قَالَ: “الشَّمْسُ وَالْقَمَرُثَوْرَانِ مَكَوَّرَانِ فِي النَّارِيَوْمَ الْقِيَامَةِ”. فَقَالَ الْحَسَنُ: وَمَا ذَنْبُهُمَا؟ فَقَالَ: أُحَدِّثُكَ عَنْ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم فسَكَتَ الْحَسَنُ. رَوَاهُ الْبَيْهَقِيُّ فِيْ”كِتَابِ الْبَعْثِ وَالنُّشُوْرِ”.
5692. (28) [3/1584 –దృఢం]
‘హసన్ బ’స్రీ కథనం: అబూ హురైరహ్ మాకు ప్రవక్త (స) యొక్క ఈ ‘హదీసు’ను వినిపించారు. ప్రవక్త (స) ప్రవచనం, ”తీర్పుదినంనాడు సూర్యుడు, చంద్రుడు రెండు ముక్కలుగా చేసి నరకాగ్నిలో వేయబడ తాయి.” హసన్ బ’స్రీ కథనం: నేను అబూ హురైరహ్‌ను, ‘సూర్యచంద్రుల తప్పేంటి?’ అని అడిగాను. దానికి అబూ హురైరహ్, ‘నేను చెప్పింది ప్రవక్త (స) ‘హదీసు’ అని అన్నారు. అది విని నేను మౌనంగా ఉండి పోయాను.[35] (బైహఖీ – బ’అసి’ వన్నుషూర్)
5693 – [ 29 ] ( ضعيف ) (3/1585)
وعَنِ أَبِيْ هُرَيْرَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَا يَدْخُلُ النَّارَ إِلَّا شَقِيٌّ”. قِيْلَ: يَا رَسُوْلَ اللهِ وَمَنِ الشَّقِيُّ؟ قَالَ: “مَنْ لَمْ يَعْمَلُ لِلّهِ بِطَاعَةٍ وَلَمْ يَتْرُكْ لَهُ مَعْصِيَةً”. رَوَاهُ ابْنُ مَاجَهُ
5693. (29) [3/1585 –బలహీనం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) ”నరకంలో అభాగ్యులు, దురదృష్టవంతులు ప్రవేశిస్తారు,” అని ప్రవచించారు. దానికి, ‘ఓ ప్రవక్తా! దురదృష్టవంతులు ఎవరు?’ అని ప్రశ్నించడం జరిగింది. దానికి ప్రవక్త (స), ‘దైవప్రీతి కోసం విధేయత చూపనివారు, పాపకార్యాలకు దూరంగా ఉండనివారు,’ అని అన్నారు. (ఇబ్నె మాజహ్)
=====
8- بَابُ خَلْقِ الْجَنَّةِ وَالنَّارِ
8. స్వర్గనరకాల సృష్టి
స్వర్గనరకాలు సృష్టించబడి ఉన్నాయి. ముస్లిము లందరూ దీన్ని విశ్వసిస్తారు.
اَلْفَصْلُ الْأَوَّلُ మొదటి విభాగం
5694 – [ 1 ] ( مُتَّفَقٌ عَلَيْهِ ) (3/1586)
عَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: قَالَ رَسُوْلُ الله صلى الله عليه وسلم: “تَحَاجَّتِ الْجَنَّةُ وَالنَّارُ فَقَالَتِ النَّارُ: أُوْثِرْتُ بِالْمُتَكَبِّرِيْنَ وَالْمُتَجَبِّرِيْنَ وَقَالَتِ الْجَنَّةُ: فَمَا لِيْ لَا يَدْخُلُنِيْ إِلّا ضُعَفَاءُ النَّاسِ وَسَقَطُهُمْ وَغِرَّتُهُمْ. قَالَ اللهُ تَعَالى لِلْجَنَّةِ: إِنَّمَا أَنْتِ رَحْمَتِيْ أَرْحَمُ بِكِ مَنْ أَشَاءُ مِنْ عِبَادِيْ. وَ قَالَ لِلنَّارِ: إِنَّمَا أَنْتِ عَذَابِيْ أُعَذِّبُ بِكِ مَنْ أَشَاءَ مِنْ عِبَادِيْ وَلِكُلِّ وَاحِدَةٍ مِنْكُمَا مِلْؤُهَا فَأَمَّا النَّارُ فَلَا تُمْتَلِئُ حَتّى يضعَ اللهُ رِجْلَهُ. تَقُوْلُ: قَطٍ قَطٍ قَطٍ فَهُنَالِكَ تَمْتَلِئُ وَيُزْوَى بَعْضُهَا إِلى بَعْضٍ فَلَا يَظْلِمُ اللهُ مِنْ خَلْقِهِ أَحَدًا وَأَمَّا الْجَنَّةُ. فَإِنَّ اللهَ يُنْشِئُ لَهَا خَلْقًا”. مُتَّفَقٌ عَلَيْهِ.
5694. (1) [3/1856 –ఏకీభవితం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”స్వర్గనరకాలు పరస్పరం కలహించుకున్నాయి. నరకం, ‘అహంకారులు, దుర్మార్గుల కోసం నేను ఎన్నుకోబడ్డాను,’ అని వాదించింది. స్వర్గం, ‘నేను బలహీనులు, అభాగ్యుల నిలయాన్ని,’ అని వాదించింది. అది విని అల్లాహ్ (త) స్వర్గంతో, ‘నువ్వు నా కారుణ్యానివి. నేను నా దాసుల్లో నేను కోరిన వారిని నీ ద్వారా కనికరిస్తాను.’ ఇంకా నరకంతో, ‘నీవు నాశిక్షవు. నేను నా దాసుల్లోని నేను కోరిన వారిని నీ ద్వారా శిక్షిస్తాను. మీరిద్దరిలో ప్రతిఒక్కరిని నింపుతాను.’ అల్లాహ్(త) తన కాలుపెట్టే వరకు నరకం నిండదు. అల్లాహ్(త) తన కాలు పెట్టగానే, ‘చాలు, చాలు,’ అని నిండిపోతుంది. ఇంకా దాని భాగాలను దగ్గర చేయడం జరుగుతుంది. వెంటనే అది ముడుచుకుంటుంది. ఇంకా అల్లాహ్(త) తన సృష్టితాల్లోని ఎవరిపట్ల అన్యాయంగా ప్రవర్తించడు. ఇంకా స్వర్గాన్ని నింపడానికి అల్లాహ్(త) క్రొత్త సృష్టితాలను సృష్టిస్తాడు.” (బు’ఖారీ, ముస్లిమ్)
5695 – [ 2 ] ( مُتَّفَقٌ عَلَيْهِ ) (3/1586)
وَعَنْ أَنَسٍ عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ:”لَا تَزَالُ جَهَنَّمَ يُلْقَى فِيْهَا وَتَقُوْلُ: هَلْ مِنْ مَزِيْدٍ؟ حَتّى يَضَعَ رَبُّ الْعِزَّةِ فِيْهَا قَدَمَهُ فَيُزَوَي بَعْضُهَا إِلى بَعْضٍ فَتَقُوْلُ: قَطٍ قَطٍ بِعِزَّتِكَ وَكَرَمِكَ وَلَا يَزَالُ فِي الْجَنَّةِ فَضْلٌ حَتّى يُنْشِئَ اللهُ لَهَا خَلْقًا فَيُسْكِنَهُمْ فَضْلَ الْجَنَّةِ”. مُتَّفَقٌ عَلَيْهِ وَ ذُكِرَحَدِيْثُ أَنَسٍ: “حُفَّتِ الْجَنَّةُ بِالْمَكَارِهِ” فِيْ”كِتَابِ الرِّقَاقِ”.
5695. (2) [3/1586 –ఏకీభవితం]
అనస్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”నరకంలో ప్రజలను వేయటం కొనసాగుతూ ఉంటుంది. అయినా నరకం ఇంకా కావాలి, ఇంకా కావాలి అని అంటూ ఉంటుంది. చివరికి అల్లాహ్(త) తన కాలు నరకంలో పెడతాడు. నరక భాగాలన్ని దగ్గరయి పోతాయి. అప్పుడు నరకం, ‘చాలు చాలు నీ గొప్పతనం, నీ గౌరవం సాక్షి నేను నిండిపోయాను,’ అని అంటుంది. అదేవిధంగా స్వర్గంలో ఇంకా చాలా చోటు ఉంటుంది. చివరికి అల్లాహ్(త) స్వర్గం కోసం క్రొత్తవారిని సృష్టిస్తాడు. వారిని స్వర్గంలో ఉన్న ఖాళీ స్థానాల్లో ఉంచటం జరుగుతుంది. (బు’ఖారీ, ముస్లిమ్)
—–
اَلْفَصْلُ الثَّانِيْ రెండవ విభాగం
5696 – [ 3 ] ( حسن ) (3/1587)
عَنْ أَبِيْ هُرَيْرَةَ عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ: “لَمَّا خَلَقَ اللهُ الْجَنَّةَ قَالَ لِجِبْرَيْلِ: اِذْهَبْ فَانْظُرْ إِلَيْهَا فَذَهَبَ فَنَظَرَ إِلَيْهَا وَإِلى مَا أَعَدَّ اللهُ لِأَهْلِهَا فِيْهَا ثُمَّ جَاءَ فَقَالَ: أَيْ رَبِّ وَعِزَّتِكَ لَا يَسْمَعُ بِهَا أَحَدٌ إِلَّا دَخَلَهَا ثُمَّ حَفَّهَا بِالْمَكَارِهِ. ثُمَّ قَالَ: يَا جِبْرَيْلُ اِذْهَبْ فَانْظُرْ إِلَيْهَا. فَذَهَبَ فَنَظَرَ إِلَيْهَا ثُمَّ جَاءَ فَقَالَ: أَيْ رَبِّ وَعِزَّتِكَ لَقَدْ خَشِيْتُ أَنْ لَا يَدْخُلَهَا أَحَدٌ”. قَالَ: “فَلَمَّا خَلَقَ اللهُ النَّارَ قَالَ: يَا جِبْرِيْلُ اِذْهَبْ فَانْظُرْ إِلَيْهَا فَذَهَبَ فَنَظَر إِلَيْهَا فَقَالَ: أَيْ رَبِّ وَعِزَّتِكَ لَا يَسْمَعُ بِهَا أَحَدٌ فَيَدْخُلُهَا فَحَفَّهَا بِالشَّهْوَاتِ ثُمَّ قَالَ: يَا جِبْرِيْلُ اِذْهَبْ فَانْظُرْ إِلَيْهَا فَذَهَبَ فَنَظَرَ إِلَيْهَا فَقَالَ: أَيْ رَبِّ وَعِزَّتِكَ لَقَدْ خَشِيْتُ أَنْ لَا يَبْقَى أَحَدٌ إِلَّا دَخَلَهَا”. رَوَاهُ التِّرْمِذِيُّ وأَبُوْ دَاوُدَ وَالنَّسَائِيُّ.
5696. (3) [3/1587 –ప్రామాణికం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”అల్లాహ్ స్వర్గాన్ని సృష్టించినపుడు, జిబ్రీల్ (అ) ను, ‘వెళ్ళు, వెళ్ళి స్వర్గం చూచి రా,’ అని అన్నాడు. అతను వెళ్ళి స్వర్గాన్ని అందులో అల్లాహ్(త) స్వర్గవాసుల కొరకు తయారు చేసిన అనుగ్రహాలను చూచి తిరిగి వచ్చి, ‘ఓ అల్లాహ్! నీ గౌరవం సాక్షి! దీన్ని గురించి విన్న ప్రతివాడు అందులో ప్రవేశించాలని కోరుకుంటాడు,’ అని అన్నారు. అప్పుడు అల్లాహ్(త) స్వర్గం చుట్టూ నిషిద్ధాల కంచెకడతాడు. ఆ తరువాత జిబ్రీల్ ను, ‘స్వర్గాన్ని చూచి రా,’ అని అంటాడు. జిబ్రీల్ వెళ్ళి స్వర్గాన్ని చూచి వచ్చి, ప్రభూ! నీ గౌరవం సాక్షి! ఇప్పుడు ఎవ్వరూ స్వర్గంలోనికి వెళ్ళలేరని అనిపిస్తుంది. ఆ తరువాత ప్రవక్త (స) కథనం: అదేవిధంగా అల్లాహ్(త) నరకాన్ని సృష్టించి, జిబ్రీల్‌ను చూసి రమ్మని ఆదేశిస్తాడు. జిబ్రీల్ వెళ్ళి చూచి వచ్చి ప్రభూ! ‘నీ గౌరవం సాక్షి! దీన్ని గురించి విన్న వ్యక్తి ఇందులో ప్రవేశించాలని కోరుకోడు,’ అని అన్నారు. ఆ తరువాత అల్లాహ్(త) నరకాన్ని మనోకాంక్షల కంచెవేసి, జిబ్రీల్‌ను నరకం చూచి రమ్మని ఆదేశించాడు. జిబ్రీల్ వెళ్ళి నరకం చూచి వచ్చి, ‘ఓ అల్లాహ్! నీ గౌరవం సాక్షి! ఎవరూ నరకంలోనికి వెళ్ళకుండా ఉండలేరనిపిస్తుంది,’ అని అంటారు.” (అబూ దావూద్, తిర్మిజి’, నసాయి’)
—–
الفصل الثالث మూడవ విభాగం
5697 – [ 4 ] ( صحيح ) (3/1587)
عَنْ أَنَسٍ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم صَلّى بِنَا يَوْمًا الصَّلَاةَ ثُمَّ رَقِيَ الْمِنْبَرَفَأَشَارَبِيَدِهِ قَبْلَ قِبْلَةِ الْمَسْجِدِ فَقَالَ: “قَدْ أُرِيْتُ الْآنَ مُذْ صَلَّيْتُ لَكُمُ الصَّلَاةَ الْجَنَّةَ وَالنَّارَ مُمَثَّلَتَيْنِ فِيْ قَبْلِ هَذَا الْجِدَارِ فَلَمْ أَرَ كَالْيَوْمِ فِي الْخَيْرِ وَالشِّرِّ”. روَاهُ الْبُخَارِيُّ.
5697. (4) [3/11587 –దృఢం]
ఒకరోజు ప్రవక్త (స) మాకు నమా’జు చదివించారు. ఆ తరువాత మెంబరుపై ఎక్కారు. మస్జిద్ ఖిబ్లా వైపు తనచేత్తో సైగచేస్తూ ఇప్పుడిప్పుడే నేను మీకు నమా’జు చదివిస్తున్నప్పుడు ఆ గోడ ముందు నాకు స్వర్గ నరకాలు చూపెట్టబడ్డాయి. వాస్తవం ఏమిటంటే, నేను ఈ రోజు చూసినంతటి మంచి వస్తువు చెడ్డవస్తువు ఇంతకు ముందు ఎన్నడూ చూడలేదు,” అని అన్నారు. (బు’ఖారీ)
=====
9- بَابُ بَدْءِالْخَلْقِ وَذِكْرِ الْأَنْبِيَاءِ عَلَيْهِمُ الصَّلَاةُ وَالسَّلَامُ
9. సృష్టి ఆరంభం, దైవ ప్రవక్తలు (అ స)
اَلْفَصْلُ الْأَوَّلُ మొదటి విభాగం
5698 – [ 1 ] ( صحيح ) (3/1588)
عَنْ عِمْرَانَ بْنِ حُصَيْنٍ قَالَ: إِنِّيْ كُنْتُ عِنْدَ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم إِذْ جَاءَ قَوْمٌ مِنْ بَنِيْ تَمِيْمٍ فَقَالَ: “اِقْبَلُوْا الْبُشْرَى يَا بَنِيْ تَمِيْمٍ”. قَالُوْا: بَشَّرْتَنَا فَأَعْطِنَا فَدَخَلَ نَاسٌ مِنْ أَهْلِ الْيَمَنِ. فَقَالَ: “اِقْبَلُوا الْبُشْرَى يَا أَهْلَ الْيَمَنِ إِذْ لَمْ يَقْبَلْهَا بَنُوْ تَمِيْمٍ”. قَالُوْا: قَبِلْنَا جِئْنَاكَ لِنَتْفَقَّهُ فِي الدِّيْنِ وَلِنِسَأَلَكَ عَنْ أَوَّلِ هَذَا الْأَمْرِمَا كَانَ؟ قَالَ: “كَانَ اللهُ وَلَمْ يَكُنْ شَيْءٌ قَبْلَهُ وَكَانَ عَرْشُهُ عَلى الْمَاءِ ثُمَّ خَلَقَ السَّمَاوَاتِ وَالْأَرْضِ وَكَتَبَ فِي الذِّكْرِ كُلِّ شَيْءٍ”. ثُمَّ أَتَانِيْ رَجُلٌ فَقَالَ: يَا عِمْرَانُ أَدْرِكْ نَاقَتَكَ فَقَدْ ذَهَبْتُ فَانْطَلَقْتُ أَطْلُبُهَا وَأَيْمُ اللهِ لَوَدِدْتُ أَنَّهَا قَدْ ذَهَبَتْ وَلَمْ أَقُمْ. روَاهُ الْبُخَارِيُّ.
5698. (1) [3/1588 –దృఢం]
‘ఇమ్రాన్ బిన్ ‘హు’సైన్ (ర) కథనం: నేను ప్రవక్త (స) వద్ద కూర్చొని ఉన్నాను. బనూ తమీమ్‌కు చెందిన కొంత మంది వచ్చారు. ప్రవక్త (స) వారితో, ‘ఓ బనీ తమీమ్ ప్రజలారా! శుభవార్తను స్వీకరించండి,’ అని అన్నారు. దానికి వారు, ‘తమరు శుభవార్తనైతే ఇచ్చారు మరి మాకేమైనా ఇవ్వండి,’ అని అన్నారు. ఆ తరువాత యమన్ నుండి కొంతమంది వచ్చారు. అప్పుడు వారితో ప్రవక్త (స), ‘యమన్ ప్రజలారా! శుభవార్తను స్వీకరించండి. బనూ తమీమ్ శుభవార్తను స్వీకరించలేదు,’ అని అన్నారు. దానికి యమన్ వారు, ‘మేము శుభవార్తను స్వీకరించాము. అందువల్లే మేము తమరి వద్దకు వచ్చాము. మీనుండి ధార్మిక జ్ఞానం పొందాలని, తమరిని అడిగి తెలుసుకోవాలని, అన్నిటి కంటే ముందు విశ్వంలో ఏ వస్తువు ఉండేది?’ అని అన్నారు. అప్పుడు ప్రవక్త (స), ‘కేవలం అల్లాహ్(త) మాత్రమే ఉండేవాడు. దానికి ముందు ఏ వస్తువూ ఉండేది కాదు. అల్లాహ్(త) సింహాసనం నీటిపై ఉండేది. ఆ తరువాత అల్లాహ్(త) భూమ్యాకాశాలను సృష్టించాడు. ఇంకా మూల గ్రంథంలో ప్రతి వస్తువును గురించి వ్రాసాడు,’ అని అన్నారు. ‘ఇమ్రాన్ బిన్ ‘హు’సైన్ కథనం: ఒక వ్యక్తి నా వద్దకు వచ్చి, ” ‘ఇమ్రాన్! వెళ్ళు. వెళ్ళి నీ ఒంటెను వెదుకు, అది పారిపోయింది,’ అని అన్నాడు. నేను నా ఒంటెను వెదకడానికి బయలు దేరడానికి సిద్ధపడ్డాను. అల్లాహ్ (త) సాక్షిగా! చెబుతున్నాను. నేను లేవకపోతే ఆ ఒంటె పారిపోయేది.[36] (బు’ఖారీ)
5699 – [ 2 ] ( صحيح ) (3/1588)
وَعَنْ عُمَرَقَالَ: قَامَ فِيْنَا رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم مَقَامًا فَأَخْبَرَنَا عَنْ بَدْءِ الْخَلْقِ حَتّى دَخَلَ أَهْلُ الْجَنَّةِ مَنَازِلَهُمْ وَأَهْلُ النَّارِ مَنَازِلَهُمْ حَفِظَ ذَلِكَ مَنْ حَفِظَهُ وَنَسِيَهُ مِنْ نَسِيَهُ”. روَاهُ الْبُخَارِيُّ.
5699. (2) [3/1588– దృఢం]
‘ఉమర్ (ర) కథనం: ఒకరోజు ప్రవక్త (స) మా ముందు నిలబడి సృష్టి ప్రారంభం నుండి స్వర్గనరకాల ప్రవేశం వరకు ప్రస్తావించారు. దాన్ని గుర్తుంచుకున్నవారు గుర్తుంచుకున్నారు, మరచిపోయిన వారు మరచి పోయారు. (బు’ఖారీ)
5700 – [ 3 ] ( مُتَّفَقٌ عَلَيْهِ ) (3/1588)
وَعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: سَمِعْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ: “إِنَّ اللهَ تَعَالى كَتَبَ كِتَابًا قَبْلَ أَنْ يَّخْلُقَ الْخَلْقَ:إِنَّ رَحْمَتِيْ سَبَقَتْ غَضَبِيْ فَهُوَ مَكْتُوْبٌ عِنْدَهُ فَوْقَ الْعَرْشِ”. مُتَّفَقٌ عَلَيْهِ.
5700. (3) [3/1588 –ఏకీభవితం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) ఇలా ప్రవ చిస్తూ ఉండగా నేను విన్నాను. అల్లాహ్(త) సృష్టితా లను సృష్టించే ముందు ఒక గ్రంథం వ్రాసాడు. అందులో ”నా కారుణ్యం నా ఆగ్రహాన్ని అధిగ మించింది,” అని ఉంది. ఈ పదాలు అల్లాహ్(త) సింహా సనంపై వ్రాయబడి ఉన్నాయి.[37] (బు’ఖారీ, ముస్లిమ్)
5701 – [4 ] ( صحيح ) (3/1589)
وَعَنْ عَائِشَةَ عَنْ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم قَالَ: “خُلِقَتِ الْمَلَائِكَةُ مِنْ نُوْرِوَخُلِقَ الْجَانُّ مِنْ مَارِجٍ مِنْ نَارٍ وَخُلِقَ آدَمُ مِمَّا وُصِفَ لَكُمْ”. رَوَاهُ مُسْلِمٌ .
5701. (4) [3/1589 –దృఢం]
‘ఆయి’షహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”దైవ దూతలను వెలుగు(నూర్)తో సృష్టించటం జరిగింది. జిన్నాతులను అగ్ని జ్వాలల (నార్) ద్వారా సృష్టించటం జరిగింది. అందులో పొగ కలసి ఉంటుంది. ఆదమ్‌ను ఏ వస్తువుతో సృష్టించటం జరిగిందో దాన్ని గురించి ఖుర్‌ఆన్‌లో పేర్కొనడం జరిగింది.” (ముస్లిమ్)
5702 – [ 5 ] ( صحيح ) (3/1589)
وَعَنْ أَنَسٍ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم قَالَ: “لَمَّا صَوَّرَ اللهُ آدَمَ فِي الْجَنَّةِ تَرَكَهُ مَا شَاءَ أَنْ يَتْرُكَهُ فَجعَلَ إِبْلِيْسُ يُطِيْفُ بِهِ يَنْظُرَ مَا هُوَ فَلَمَّا رَآهُ أَجْوَفَ عَرِفَ أَنَّهُ خَلَقَ خَلْقًا لَا يَتَمَالَكَ”. رَوَاهُ مُسْلِمٌ.
5702. (5) [3/1589 –దృఢం]
అనస్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”అల్లాహ్(త) స్వర్గంలో ఆదమ్ బొమ్మను తయారు చేసాడు. దాన్ని స్వర్గంలో ఉంచాడు. ఈ మధ్య షై’తాన్ ఆదమ్ బొమ్మ చుట్టూ తిరుగుతూ అసలు ఇది ఏంటి అని ఆలోచించ సాగాడు. లోపల గుల్లగా ఉండటం చూచి ఇది చాలా బలహీనమైన వస్తువు అని అనుకున్నాడు.” (ముస్లిమ్)
5703 – [ 6 ] ( مُتَّفَقٌ عَلَيْهِ ) (3/1589)
وَعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: قَالَ رَسُوْلُ الله صلى الله عليه وسلم: ” اِخْتَتَنَ إِبْرَاهِيْمُ النَّبِيُّ وَهُوَ ابْنُ ثَمَانِيْنَ سَنَةً بِالْقَدُوْمِ”. مُتَّفَقٌ عَلَيْهِ.
5703. (6) [3/1589 –ఏకీభవితం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఇబ్రాహీమ్ (అ) 80 సంవత్సరాల వయస్సులో తన ఖత్నా చేయించారు. అప్పుడతను ఖదూమ్ ప్రాంతంలో ఉన్నారు.” (బు’ఖారీ, ముస్లిమ్)
5704 – [ 7 ] ( مُتَّفَقٌ عَلَيْهِ ) (3/1589)
وَعَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَمْ يَكْذِبْ إِبْرَاهِيْمُ إِلّا فِيْ ثَلَاثَ كَذَبَاتٍ: ثِنْتيْنِ مِنْهُنَّ فِيْ ذَاتِ اللهِ قَوْلِهِ (إِنِّيْ سَقِيْمٌ؛ 37: 89) وَقَوْلُهُ (بَلْ فَعَلَهُ كَبِيْرُهُمْ هَذَا؛ 21: 63) وَقَالَ: بَيْنَا هُوَ ذَاتَ يَوْمٍ وَسَارَةُ إِذْ أَتَى عَلَى جَبَّارٍ مِنَ الْجَبَابِرَةِ فَقِيْلَ لَهُ: إِنَّ هَهُنَا رَجُلًا مَعَهُ امْرَأَةٌ مِنْ أَحْسَنِ النَّاسِ فَأَرْسَلَ إِلَيْهِ فَسَأَلَهُ عَنْهَا: مَنْ هَذِهِ؟ قَالَ:أُخْتِيْ فَأَتَى سَارَةَ فَقَالَ لَهَا: إِنَّ هَذَا الْجَبَّارَ إِنْ يَعْلَم أَنَّكِ امْرَأَتِيْ يَغْلِبُنِيْ عَلَيْكِ فَإِنْ سَأَلَكِ فَأَخْبِرِيْهِ أَنَّكَ أُخْتِيْ فَإِنَّكَ أُخْتِيْ فِي الْإِسْلَامِ لَيْسَ عَلَى وَجْهِ الْأَرْضِ مُؤْمِنٌ غَيْرِيْ وَغَيْرُكَ فَأَرْسَلَ إِلَيْهَا فَأُتِيَ بِهَا قَامَ إِبْرَاهِيْمُ يُصَلِّيْ فَلَمَّا دَخَلَتْ عَلَيْهِ ذَهَبَ يَتَنَاوَلُهَا بِيَدِهِ. فَأُخِذَ -وَيُرْوِى فَغُطَّ -حَتّى رَكَضَ بِرِجْلِهِ. فَقَالَ: اُدْعِي اللهَ لِيْ وَلَا أَضُرُّكِ فَدَعَتِ اللهَ فَأُطْلِقَ ثُمَّ تَنَاوَلَهَا الثَّانِيَةَ فَأَخَذَ مِثْلَهَا أَوْ أَشَدَّ فَقَالَ: اُدْعِيْ اللهَ لِيْ وَلَا أَضُرُّكِ فَدَعَتِ اللهَ فَأَطْلِقَ فَدَعَا بَعْضَ حَجَبَتِهِ فَقَالَ: إِنَّكَ لَمْ تَأْتَنِيْ بِإِنْسَانٍ إِنَّمَا أَتَيْتَنِيْ بِشَيْطَانٍ فَأَخَدَمَهَا هَاجَرَ فَأَتَتْهُ وَهُوَ قَائِمٌ يُصَلِّيْ فَأَوْمَأَ بِيَدِهِ مَهْيَمْ؟ قَالَتْ: رَدَّ اللهُ كَيْدَ الْكَافِرِ فِيْ نَحْرِهِ وَأَخْدَمَ هَاجَرَ”. قَالَ أَبُوْ هُرَيْرَةَ: تِلْكَ أُمُّكُمْ يَا بَنِيْ مَاءِ السَّمَاءِ. مُتَّفَقٌ عَلَيْهِ.
5704. (7) [3/1589 –ఏకీభవితం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఇబ్రాహీమ్ (అ) కేవలం 3 సార్లు అబద్ధం పలికారు. వాటిలో రెండు దైవంకోసం పలికారు. ఒకసారి, ”నేను అనారోగ్యంగా ఉన్నాను,” (అస్ సాఫ్ఫాత్, 37:89) అని అసత్యం పలికారు. మరోసారి, ”పెద్ద విగ్రహం చేసింది” (అల్ అంబియాఅ, 21:63) అని అసత్యం పలికారు. మూడవసారి ఇబ్రాహీమ్ మరియు ఆయన భార్య సారా ఒక దుర్మార్గుడైన రాజు నగరం గుండా వెళ్ళటం జరిగింది. ఇక్కడ ఒక వ్యక్తి వచ్చాడని, అతని వెంట ఒక అందమైన స్త్రీ ఉందని తెలియ పరచటం జరిగింది. ఆ రాజు ఒక వ్యక్తిని పంపి ఇబ్రా హీమ్ ను పిలిపించాడు. ‘నీ వెంట స్త్రీ ఉందా,’ అని అడిగాడు. ఇబ్రాహీమ్, ‘నా చెల్లెలు ఉంది,’ అని అన్నారు. ఆ తరువాత ఇబ్రాహీమ్ తిరిగి వచ్చి సారాతో, ‘ఇక్కడి దుర్మార్గ పాలకుడికి నువ్వు నా భార్యవని తెలిస్తే నిన్ను నా నుండి లాక్కుంటాడు. ఒకవేళ నిన్ను అడిగితే, నువ్వు నా చెల్లిలివి,’ అని చెప్పు,’ అని అన్నారు. ‘వాస్తవంగా నీవు నాకు సోదరివే అవుతావు.’ ఆ తరువాత ఆ పాలకుడు సారాను పిలిపించాడు. ఇటు ఇబ్రాహీమ్ నమా’జులో నిమగ్నమయి పోయారు. సారా పాలకుని ముందుకు వచ్చింది. వాడు అత్యాచారానికి ప్రయత్నించాడు. దైవశక్తి అతన్ని వెంటనే బంధించింది. అంటే పీక పిసికినంత పనయింది. అతడు నేలపై పడి కాళ్ళూ చేతులు కొట్టుకోసాగాడు. ఇంకా అతడు సారాతో, ‘నువ్వు దైవాన్ని నా గురించి ప్రార్థించు, నేను నీకు ఎటువంటి హాని తలపెట్టను,’ అని ప్రాధేయపడ్డాడు. అనంతరం సారా (అ) దైవాన్ని ప్రార్థించింది. వాడిని విడిచి పెట్టటం జరిగింది. మళ్ళీ వాడు సారాను పట్టుకోవటానికి ప్రయత్నించగా, మళ్ళీ అతన్ని బంధించటం జరిగింది. చాలా కఠినంగా పట్టుకోవటం జరిగింది. అతడు మళ్ళీ సారాను అల్లాహ్(త)ను ప్రార్థించమని కోరాడు. సారా (అ) మళ్ళీ దు’ఆ చేసారు. వాడిని వదలి వేయటం జరిగింది. ఆ తరువాత ఆ దుర్మార్గుడు తన సేవకుల్లో ఒకరిని పిలిచి, నువ్వు నాదగ్గరకు మనిషినికాదు, దయ్యాన్ని తీసుకొని వచ్చావు. అతడు సారాకు హాజిరహ్ పేరుగల ఒక సేవకురాలిని ఇచ్చి ఆమెను తిరిగి పంపి వేసాడు. సారాతిరిగివచ్చి ఇబ్రాహీమ్ నమా’జు చదువు తుండగా చూసింది. ఇబ్రాహీమ్ (అ) నమా’జులోనే చేతి సైగతో ఏమయిందని అడిగారు. దానికి సారా (అ), ‘అల్లాహ్(త) ఆ దుర్మార్గుని ప్రయత్నం విఫలం చేసాడని, ఇంకా వాడు సేవకోసం హాజిరహ్ అనే ఈమెను నా వెంట పంపాడు,’ అని చెప్పారు. అబూ హురైరహ్ (ర) కథనం: ఓ ఆకాశ నీటి సంతానమా! ఈ హాజిరహ్‌యే మీ తల్లి.[38] (బు’ఖారీ, ముస్లిమ్)
5705 – [ 8 ] ( مُتَّفَقٌ عَلَيْهِ ) (3/1590)
وَعَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ الله صلى الله عليه وسلم: “نَحْنُ أَحَقَّ بِالشَّكِ مِنْ إِبْرَاهِيْمَ إِذْ قَالَ: (رَبِّ أَرِنِيْ كَيْفَ تُحْيي الْمَوْتَى؛ 2: 260)
وَيَرْحَمُ اللهُ لُوْطًا لَقَدْ كَانَ يَأْوِي إِلى رُكْنٍ شَدِيْدٍ وَلَوْ لَبِثْتُ فِي السِّجْنِ طُوْلَ مَا لَبِثَ يُوْسُفُ لَأَجَبْتُ الدَّاعِيَ”. مُتَّفَقٌ عَلَيْهِ.
5705. (8) [3/1590 –ఏకీభవితం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) అనుమా నించే హక్కు ఇబ్రాహీమ్ కంటే మనకే ఎక్కువగా ఉంది. అతను అల్లాహ్(త)తో, ”ఓ నా ప్రభూ! మృతులను ఎలా సజీవ పరుస్తావో చూపెట్టు,” (అల్ బఖరహ్, 2:260) అని ప్రార్థించారు. ఇంకా, ‘అల్లాహ్(త) లూత్‌పై దయచూపు గాక, అతడు దృఢమైన ఆధారాన్ని పట్టుకోవాలని ప్రయత్నించే వారు. ఒకవేళ నేను యూసుఫ్‌లా దీర్ఘకాలం జైలులో ఉంటే, నిస్సందేహంగా నేను విడుదల చేస్తామని చెప్పగానే సిద్ధపడేవాణ్ణి,’ అని అన్నారు.[39] (బు’ఖారీ, ముస్లిమ్)
5706 – [ 9 ] ( مُتَّفَقٌ عَلَيْهِ ) (3/1590)
وَعَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِنَّ مُوْسَى كَانَ رَجُلًا حَيِيا سَتِيْرًا لَا يُرَى مِنْ جِلْدِهِ شَيْءٌ اِسْتِحْيَاءً فَآذَاهُ مِنْ آذَاهُ مِنْ بَنِيْ إِسْرَائِيْلَ فَقَالُوْا: مَا تَسَتَّرُ هَذَا التَّسَتُّرُ إِلّا مِنْ عَيْبٍ بِجِلْدِهِ: إِمَّا بَرْصٌ أَوْ أُدْرَةٌ وَإِنَّ اللهَ أَرَادَ أَنْ يُّبْرِئَهُ فَخَلَا يَوْمًا وَحْدَهُ لِيَغْتَسِلَ فَوَضَعَ ثَوْبهِ عَلَى حَجَرٍ فَفَرَّ الْحَجَرُ بِثَوْبِهِ فَجَمَعَ مُوْسَى فِيْ إثَرِهِ يَقُوْلُ: ثَوْبِيْ يَا حَجْرُ ثَوْبِيْ يَا حَجَرُ حَتّى اِنْتَهَى إِلى مَلَأٍ مِنْ بَنِيْ إِسْرَائِيْلَ فَرَأوْهُ عُرْيَانًا أَحْسَنَ مَا خَلَقَ اللهُ وَقَالُوْا: وَاللهِ مَا بِمُوْسَى مِنْ بَأْسٍ وَأَخَذَ ثَوْبَهُ وَطَفِقَ بِالْحَجَرِ ضَرْبًا فَوَاللهِ إِنَّ بِالْحَجَرِ لَنَدْبًا مِنْ أَثَرِ ضَرَبِهِ ثَلَاثًا أَوْ أَرْبَعًا أَوْ خَمْسًا”. مُتَّفَقٌ عَلَيْهِ.
5706. (9) [3/1590– ఏకీభవితం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మూసా (అ) చాలా సిగ్గు, బిడియం కలవారు. తన శరీరాన్ని ఎంతమాత్రం కనబడకుండా ఉంచేవారు. బనూ ఇస్రాయీల్ కు చెందిన కొందరు అతన్ని పీడించాలని కోరి మూసా (అ) కు ఏదో రోగం ఉంది అందువల్లే తన శరీరం ఎప్పుడూ కప్పి ఉంచుతారని ప్రజల్లో అపోహ వ్యాపింపజేసారు. అల్లాహ్(త) ఈ పన్నాగం అంతంచేయటానికి నిశ్చయించుకున్నాడు. ఒకరోజు మూసా(అ) ఒంటరిగా ఒకచోట స్నానం చేద్దా మని బట్టలు తీసి ఒక రాతిపై పెట్టారు. రాతి బండ అతని బట్టలు తీసుకొని పరుగెత్తసాగింది. మూసా (అ) పరిగెతుకుంటూ వచ్చి, ‘ఓ రాయి, నా దుస్తులు ఇచ్చేయి,’ అంటూ ఉన్నారు. మూసా (అ) పరి గెత్తుతూ బనీ ఇస్రాయీ’ల్‌కు చెందిన ఒక బృందం వద్దకు వచ్చారు. ఆ బృందం వారు మూసా(అ)ను నగ్నంగా చూసారు. అతనికి ఎటువంటి రోగం లేదని నిర్థారించారు. చివరికి మూసా (అ) తనబట్టలు తీసు కున్నారు. ఆ రాయిని కొట్టసాగారు. అల్లాహ్ (త) సాక్షి! మూసా (అ) ఆ రాతిని కొట్టటం వల్ల దానిపై 3 లేక 4 లేక 5 గుర్తులు పడ్డాయి. (బు’ఖారీ, ముస్లిమ్)
5707 – [ 10 ] ( صحيح ) (3/1591)
وَعَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ الله صلى الله عليه وسلم: “بَيْنَا أَيُّوْبُ يَغْتَسِلُ عُرْيَانًا فَخَرَّ عَلَيْهِ جَرَادُ مِنْ ذَهَبٍ فَجَعَلَ أَيُّوْبُ يَحثِيْ فِيْ ثَوْبِهِ فَنَادَاهُ رَبُّهُ: يَا أَيُّوْبُ أَلَمْ أَكُنْ أَغْنَيْتُكَ عَمّا تَرَى؟ قَالَ: بَلَى وَعِزَّتِكَ وَلَكِنْ لَا غَنى بِيْ عَنْ بَرَكَتِكَ”. روَاهُ الْبُخَارِيُّ.
5707. (10) [3/1591–దృఢం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, అయ్యూబ్ (అ) నగ్నంగా స్నానం చేస్తున్నారు. బంగారు పిచ్చుకలు అతనిపై పడసాగాయి. అయ్యూబ్ (అ) వాటిని ఏరి తన దుస్తుల్లో ఉంచసాగారు. అల్లాహ్ (త) అతన్ని ఉద్దేశించి, ‘అయ్యూబ్! మేము నిన్ను ఇవి అక్కరలేని వాడుగా చేయలేదా?’ అని అడిగాడు. దానికి అయ్యూబ్ (అ), ‘నీ గౌరవం సాక్షి! కాని నీ కారుణ్యం, శుభం పట్ల అక్కర లేని వాడిగా ఉండలేను,’ అని అన్నారు. (బు’ఖారీ)
5708 – [ 11 ] ( لم تتم دراسته ) (3/1591)
وَعَنْهُ قَالَ: اِسْتَبَّ رَجُلٌ مِنَ الْمُسْلِمِيْنَ وَرَجُلٌ مِنَ الْيَهُوْدِ. فَقَالَ الْمُسْلِمُ: وَالَّذِيْ اصْطَفَى مُحَمَّدًا عَلَى الْعَالَمِيْنَ. فَقَالَ الْيَهُوْدِيُّ: وَالَّذِيْ اصْطَفَى مُوْسَى عَلَى الْعَالَمِيْنَ. فَرَفَعَ الْمُسْلِمُ يَدَهُ عِنْدَ ذَلِكَ فَلَطَمَ وَجْهَ الْيَهُوْدِيِّ فَذَهَبَ الْيَهُوْدِيُّ إِلى النَّبِيِّ صلى الله عليه وسلم فَأَخْبَرَهُ بِمَا كَانَ مِنْ أَمْرِهِ وَأَمْرِ الْمُسْلِمِ فَدَعَا النَّبِيُّ صلى الله عليه وسلم الْمُسْلِمَ فَسَأَلَهُ عَنْ ذَلِكَ فَأَخْبَرَهُ. فَقَالَ النَّبِيُّ صلى الله عليه وسلم: “لَا تُخَيِّرُوْنِيْ عَلَى مُوْسَى فَإِنَّ النَّاسَ يَصْعَقُوْنَ يَوْمَ الْقِيَامَةِ فَأَصْعَقُ مَعَهُمْ فَأَكُوْنُ أَوَّلَ مَن يُفِيْقُ فَإِذَا مُوْسَى بَاطِشٌ بِجَانِبِ الْعَرْشِ فَلَا أَدْرِيْ كَانَ فَيْمَنْ صَعِقَ فَأَفَاقَ قَبْلِيْ أَوْ كَانَ فِيْمَنْ اسْتَثْنَى اللهُ”.
وَفِيْ رِوَايَةٍ: “فَلَا أَدْرِيْ أَحُوْسِبَ بِصَعْقَةٍ يَوْمَ الطُّوْرِ أَوْ بُعِثَ قَبْلِيْ؟ وَلَا أَقُوْلُ: إِنَّ أَحَدًا أَفْضَلُ مِنْ يُوْنَسَ بْنِ مَتّى”.
5708. (11) [3/1591– అపరిశోధితం]
అబూ హురైరహ్ (ర) కథనం: ఒక ముస్లిమ్, ఒక యూదుడు తిట్టుకోవటం జరిగింది. అప్పుడు ముస్లిమ్ ము’హమ్మద్ (స) ను మానవులందరిపై ఔన్నత్యం ప్రసాదించిన అల్లాహ్(త) సాక్షి! అని అన్నాడు. దానికి సమాధానంగా యూదుడు మూసా (అ)ను ప్రజలందరిపై ఔన్నత్యం ప్రసాదించిన అల్లాహ్ (త) సాక్షి! అని అన్నాడు. దానికి ముస్లిమ్ యూదుణ్ణి ఒక్క లెంపకాయ కొట్టాడు. ఆ యూదుడు ప్రవక్త (స) వద్దకు వచ్చి జరిగినదంతా చెప్పాడు. ప్రవక్త (స) ముస్లిమ్ ను పిలిపించారు. వివరణ అడిగారు. అతడు కూడా జరిగినదంతా చెప్పాడు. అప్పుడు ప్రవక్త (స), ‘నాకు మూసా(అ)పై ప్రాధాన్యత ఇవ్వకండి, ప్రజలు తీర్పుదినం నాడు స్పృహలోకి వస్తారు. కళ్ళు తెరచి చూసేసరికి మూసా (అ) దైవ సింహాసనాన్ని ఒకవైపు పట్టుకొని ఉంటారు. అతను కూడా స్పృహ కోల్పో యారా? లేక నాకంటే ముందు స్పృహలోకి వచ్చారా? లేక అల్లాహ్(త) అతన్ని మినహా యించాడా అనేది మాత్రం నాకు తెలియదు.’ అని అన్నారు.
మరో ఉల్లేఖనంలో, ”తూర్ కొండ దగ్గర స్పృహను ఇక్కడ పరిగణించటం జరిగి ఉండవచ్చని లేదా నా కంటే ముందు స్పృహలో వచ్చారని మాత్రం నాకు తెలియదు. ఇంకా యూనుస్ బిన్ మత్తా కంటే ఉన్న తులు ఉంటారని కూడా నేను అనను,” అని ఉంది.
5709 – [ 12 ] ( مُتَّفَقٌ عَلَيْهِ ) (3/1591)
وَفِيْ رِوَايَةٍ أَبِيْ سَعِيْدٍ قَالَ:”لَا تُخَيِّرُوْا بَيْنَ الْأَنْبِيَاءِ”.مُتَّفَقٌ عَلَيْهِ.
وَفِيْ رِوَايَةٍ أَبِيْ هُرَيْرَةَ: “لَا تُفَضِّلُوْا بَيْنَ أَنْبِيَاءِ اللهِ”.
5709. (12) [3/1591– ఏకీభవితం]
ఇబ్నె స’యీద్ ఉల్లేఖనంలో ఇలా ఉంది, ప్రవక్త (స) ప్రవచనం, ”ప్రవక్తల్లో ఒకరిపై ఒకరికి ప్రాధాన్యత ఇవ్వకండి.”
మరొక అబూ హురైరహ్ (ర) ఉల్లేఖనంలో, ”మీరు దైవ ప్రవక్తల్లో ఒకరికి మరొకరిపై ప్రాధాన్యత ఇవ్వకండి,” అని ఉంది.
5710 – [ 13 ] ( مُتَّفَقٌ عَلَيْهِ ) (3/1591)
وَعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: قَالَ رَسُوْلُ الله صلى الله عليه وسلم: “مَا يَنْبَغِيْ لِعَبْ دٍ أَنْ يَقُوْلَ:إِنِّيْ خَيْرٌ مِنْ يُوْنَسَ بْنِ مَتّى”.مُتَّفَقٌ عَلَيْهِ
وَفِيْ رِوَايَةٍ لِلْبُخَارِيِّ قَالَ: “مَنْ قَالَ: أَنَا خَيْرٌمِنْ يُوْنُسَ بْنِ مَتّى فَقَدْ كَذَبَ”.
5710. (13) [3/1591 –ఏకీభవితం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”నేను యూనుస్ బిన్ మత్తా (అ) కంటే ఉన్నతుడ్ని,” అని అనటం ఎంతమాత్రం ధర్మంకాదు. (బు’ఖారీ, ముస్లిమ్)
బు’ఖారీ ఉల్లేఖనంలో ఇలా ఉంది, ”ప్రవక్త (స) ప్రవచనం, యూనుస్ మత్తా (అ) కన్నా నేను ఉన్నతుణ్ణి అని చెప్పిన వాడు అబద్ధం పలికినట్టే.”
5711 – [ 14 ] ( مُتَّفَقٌ عَلَيْهِ ) (3/1592)
وَعَنْ أُبَيِّ بْنِ كَعْبٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِنَّ الْغُلَامَ الَّذِيْ قَتَلَهُ الْخَضِرُ طُبِعَ كَافِرًا وَلَوْ عَاشَ لَأَرْهَقَ أَبَوَيْهِ طُغْيَانًا وَكُفْرًا”. مُتَّفَقٌ عَلَيْهِ.
5711. (14) [3/1592– ఏకీభవితం]
ఉబయ్ బిన్ క’అబ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఖి’దర్ (అ) చంపిన ఆ యువకుడు అవిశ్వాస మనస్తత్వంతో జన్మించాడు. ఒకవేళ ఆ యువకుడు బ్రతికిఉంటే తన తల్లిదండ్రులను అవిశ్వాసానికి, కష్టాలకు గురిచేసేవాడు.” (బు’ఖారీ, ముస్లిమ్)
5712 – [ 15 ] ( صحيح ) (3/1592)
وعَنْ أَبِيْ هُرَيْرَةَ عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ: “إِنَّمَا سُمِّيَ الْخَضِرَ لِأَنَّهُ جَلَسَ عَلَى فَرُوَةٍ بَيْضَاءَ فَإِذَا هِيَ تَهْتَزُّ مِنْ خَلْفِهِ خَضْرَاءَ”. روَاهُ الْبُخَارِيُّ.
5712. (15) [3/1592–దృఢం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఖి’దర్ (అ)కు ఖి’దర్ అనేపేరు ఎందుకు పడిం దంటే అతనొకతెల్లని బంజరుభూమిపై కూర్చున్నారు. అకస్మాత్తుగా ఆ భూమి వెనుక నుండి పచ్చని పైరుతో సస్యశ్యామలంగా కళకళ లాడసాగింది. (బు’ఖారీ)
5713 – [ 16 ] ( مُتَّفَقٌ عَلَيْهِ ) (3/1592)
وَعَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “جَاءَ مَلَكُ الْمَوْتِ إِلى مُوْسَى ابْنِ عِمْرَانَ فَقَالَ لَهُ: أَجِبْ رَبَّكَ”. قَالَ: “فَلَطَمَ مُوْسَى عَيْنَ مَلَكِ الْمَوْتِ فَفَقأَهَا” قَالَ: “فَرَجَعَ الْمَلَكُ إِلى اللهِ فَقَالَ: إِنَّكَ أَرْسَلْتَنِيْ إِلى عَبْدٍ لَكَ لَا يُرِيْدُ الْمَوْتَ وَقَدْ فَقَأَ عَيْنِيْ”. قَالَ: “فَرَدَّ اللهُ إِلَيْهِ عَيْنَهُ وَقَالَ: اِرْجِعْ إِلى عَبْدِيْ فَقُلْ: اَلْحَيَاةَ تُرِيْدُ؟ فَإِنْ كُنْتَ تُرِيْدُ الْحَيَاةَ فَضَعْ يَدَكَ عَلى مَتَنِ ثَوْرٍ فَمَا تَوَارَتْ يَدُكَ مِنْ شَعْرَةٍ فَإِنَّكَ تَعِيْشُ بِهَا سَنَةً قَالَ: ثُمَّ مَهُ؟ قَالَ: ثُمَّ تَمُوْتُ. قَالَ: فَالْآنَ مِنْ قَرِيْبٍ رَبِّ أَدْنِنِيْ مِنَ الْأَرْضِ الْمُقَدَّسَةِ رَمْيَةً بِحَجَرٍ”. قَالَ رَسُوْلُ الله صلى الله عليه وسلم: “وَاللهِ لَوْ أَنِّيْ عِنْدَهُ لَأَرَيْتُكُمْ قَبَرَهُ إِلى جَنْبِ الطَّرِيْقِ عِنْدَ الْكَثِيْبِ الْأَحْمَرِ”. مُتَّفَقٌ عَلَيْهِ.
5713. (16) [3/1592– ఏకీభవితం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మూసా బిన్ ‘ఇమ్‌రాన్ దగ్గరకు ప్రాణాలు తీసే దూత వచ్చాడు. ‘నీ ప్రభువు సందేశాన్ని స్వీకరించు,’ అంటే ‘దైవాజ్ఞ వల్ల నీ ప్రాణం తీయటానికి వచ్చాను,’ అని అన్నాడు. అది విన్న మూసా (అ) అతనికి ఒక లంపకాయ కొట్టారు. దాని వల్ల అతని కన్ను పోయింది. ఆ దూత అల్లాహ్(త) వద్దకు తిరిగి వెళ్ళి, ‘ఓ ప్రభూ! నువ్వు నన్ను ఎలాంటి వ్యక్తి దగ్గరకు పంపావంటే, అతనికి మరణించే కోరిక లేదు, నా కన్ను పగల గొట్టాడు,’ అని విన్నవించుకున్నాడు. అల్లాహ్(త) అతనికి కన్ను ప్రసాదించి, నువ్వు మళ్ళీ ఆ దాసుని వద్దకు వెళ్ళి, ‘నీవు జీవితం కోరుకుంటే నీ చేతిని ఒక ఎద్దు వీపుపై పెట్టు, నీ చేతిక్రింద ఎన్ని వెంట్రుకలు వస్తే అంత నీ ఆయుష్షు పెరిగిపోతుందని, చెప్పు,’ అని చెప్పిపంపాడు. అది విన్న మూసా (అ), ‘ఆ తరువాత ఏం జరుగుతుంది,’ అని అడిగారు. ‘ఆ తరువాత మరణం ఉంది,’ అని అన్నారు. దానికి మూసా (అ), ‘నేనిప్పుడే మరణాన్ని స్వీకరిస్తున్నాను. ఓ అల్లాహ్(త)! నన్ను బైతుల్ ముఖద్దస్‌కు దగ్గర చేయి. రాయి విసరినంత దూరం అయినా సరే,’ అని అన్నారు. ‘ఒకవేళ నేను బైతుల్ ముఖద్దస్‌కు దగ్గరగా ఉంటే మీకు మూసా (అ) సమాధిని చూపించే వాణ్ణి. అది ఒకమార్గం ప్రక్క ఎర్రని కొండకు సమీపంలో ఉంది,’ అని అన్నారు. (బు’ఖారీ, ముస్లిమ్)
5714 – [ 17 ] ( صحيح ) (3/1592)
وَعَنْ جَابِرٍ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم قَالَ: “عُرِضَ عَلَيَّ الْأَنْبِيَاءُ فَإِذَا مُوْسَى ضَرْبٌ مِنَ الرِّجَالِ كَأَنَّهُ مِنْ رِجَالٍ شَنُوْءَةَ وَرَأَيْتُ عِيْسَى بْن مَرْيَمَ فَإِذَا أَقْرَبُ مَنْ رَأَيْتُ بِهِ شَبَهًا عُرْوَةُ بْنُ مَسْعُوْدٍ وَرَأَيْتُ إِبْرَاهِيْمَ فَإِذَا أَقْرَبُ مَنْ رَأَيْتُ بِهِ شَبَهًا صَاحِبُكُمْ – يَعْنِي نَفْسَهُ – وَرَأَيْتُ جِبْرَيْلَ فَإِذَا أَقْرَبَ مَنْ رَأَيْتُ بِهِ شَبَهًا دِحْيَةُ بْنُ خَلِيْفَةَ”. رَوَاهُ مُسْلِمٌ.
5714. (17) [3/1592 –దృఢం]
జాబిర్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మేరాజ్ లో దైవప్రవక్తలందరూ నా ముందుకు రావటం జరిగింది. మూసా (అ) నగ్నంగా ఉన్నారు. షనూ అ’హ్ వర్గం వ్యక్తిలా ఉన్నారు. ఇంకా నేను ‘ఈసా బిన్ మర్యమ్‌ను చూసాను. అంటే ఉర్‌వహ్ బిన్ మస్’ఊద్ లా ఉన్నారు. నేను ఇబ్రాహీమ్ (అ)ను చూసాను. ఆయన మీ స్నేహితునిలా అంటే ము’హమ్మద్ (స) లా ఉన్నారు. ఇంకా నేను జిబ్రీల్‌ను చూసాను. అతను దహియ్య బిన్ ‘ఖలీఫాలా ఉన్నారు.” (ముస్లిమ్)
5715 – [ 18 ] ( مُتَّفَقٌ عَلَيْهِ ) (3/1593)
وَعَنِ ابْنِ عَبَّاسٍ عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ: “رَأَيْتُ لَيْلَةَ أُسْرِيَ بِيْ مُوْسَى رَجُلًا آدَمَ طِوَالًا جَعْدًا كَأَنَّهُ شَنُوْءَةَ وَرَأَيْتُ رَجًلًا مَرْبُوْعَ الْخَلْقِ إِلى الْحُمْرَةِ وَالْبِيَاضِ سَبِطَ الرَّأْسِ وَرَأَيْتُ مَالِكًا خَازِنَ النَّارِ وَالدَّجَّالَ فِي آيَاتِ أَرَاهُنَّ اللهِ إِيَّاهُ فَلَا تَكُنْ فِيْ مِرْيَةٍ مِنْ لِقَائِهِ”. مُتَّفَقٌ عَلَيْهِ.
5715. (18) [3/1593–ఏకీభవితం]
ఇబ్నె ‘అబ్బాస్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మేరాజ్‌లో నేను మూసా (అ)ను చూసాను. అతను చాలా పొడవుగా ఉన్నారు. అతను ఉంగరాల జుట్టు కలిగి ఉన్నారు. అంటే అతను షనూఅ’హ్ తెగకు చెందిన వ్యక్తిలా ఉన్నారు. ఇంకా నేను ‘ఈసా (అ)ను చూసాను. అతను ఒక మోస్తరు ఎత్తు కలిగి, తేలిక ఎరుపు రంగు కలిగి ఉన్నారు. అతని వెంట్రుకలు తిన్నగా ఉన్నాయి. ఇంకా నేను నరక అధికారి మాలిక్‌ను చూసాను. ఇంకా దజ్జాల్‌ను కూడా చూసాను. అల్లాహ్(త) నాకు వారిద్దరినీ వారి చిహ్నాలతో పాటు చూపించాడు. అందువల్ల వారిని చూడటంలో, వారిని కలవటంలో ఎంతమాత్రం అనుమానించరాదు. (బు’ఖారీ, ముస్లిమ్)
5716 – [ 19 ] ( مُتَّفَقٌ عَلَيْهِ ) (3/1593)
وَعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَيْلَةَ أُسْرِي بِيْ لَقِيْتُ مُوْسَى – فَنَعَتَهُ – فَإِذَا رَجُلٌ مُضْطَرِبٌ رَجُلُ الشَّعْرِ كَأَنَّهُ مِنْ رِجَالِ شَنُوْءَةَ وَلَقِيْتُ عِيْسَى رَبْعَةُ أَحْمَرَ كَأَنَّمَا خَرَجَ مِنْ دِيْمَاسَ – يَعْنِي الْحَمَّامَ – وَرَأَيْتُ إِبْرَاهِيْمَ وَأَنَا أَشْبَهُ وُلِدَهُ بِهِ”. قَالَ: “فَأُتِيْتُ بِإِنَاءَيْنِ: أَحَدُهُمَا لَبَنٌ وَالْآخَرُ فِيْهِ خَمَرٌ. فَقِيْلَ لِيْ: خُذْ أَيَّهُمَا شِئْتَ. فَأَخَذْتُ اللَّبَنَ فَشَرِبْتُهُ فَقِيْلَ لِيْ: هُدِيْتَ الْفِطْرَةَ أَمَّا أَنَّكَ لَوْ أَخَذْتَ الْخَمْرَغَوْتَ أُمَّتُكَ”. مُتَّفَقٌ عَلَيْهِ
5716. (19) [3/1593 – ఏకీభవితం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మేరాజ్ రాత్రి నేను మూసా (అ)ను చూసాను అని పలికి అతని గుణాలను ఇలాపేర్కొన్నారు, ”అతను చాలా దైవభీతి, దైవభక్తి కలిగి వణికే వ్యక్తి, అతని తల వెంట్రుకలు ఉంగరాల జుట్టు కాదు, తిన్నని జుట్టుకాదు. అతను షనూఅ’హ్ తెగకు చెందినవాడిలా ఉన్నారు. ఇంకా నేను ‘ఈసా (అ)ను కలిసాను. అతను మధ్యస్థ ఎత్తు కలిగి ఎర్రగా ఉన్నారు. ఇప్పుడిప్పుడే స్నానం చేసి బాత్‌రూం నుండి వచ్చినట్టు ఉన్నారు. ఇంకా నేను ఇబ్రాహీమ్ (అ)ను చూసాను. అతని సంతానంలో నేను అతనిలా ఉన్నాను. ఆ తరువాత నాకు రెండు గిన్నెలు ఇవ్వబడ్డాయి. ఒకదానిలో పాలు మరొక దానిలో మద్యం ఉంది. ‘ఈ రెంటిలో నీకు ఇష్టమైన దాన్ని తీసుకో,’ అని చెప్పటం జరిగింది. నేను పాలు తీసుకొని త్రాగాను. ‘నీకు ప్రకృతి మార్గం చూపడం జరిగింది,’ అని చెప్పటం జరిగింది. అంటే నీకు అల్లాహ్(త) ఇస్లామ్ మార్గాన్ని చూపెట్టాడు. ‘ఒకవేళ నేను మద్యాన్ని తీసుకుని ఉంటే నా అనుచర సమాజం మార్గభ్రష్టత్వానికి గురయ్యేది,’ అని చెప్పటం జరిగింది. (బు’ఖారీ, ముస్లిమ్)
5717 – [ 20] ( صحيح ) (3/1593)
وعَنْ ابْنِ عَبَّاسٍ قَالَ: سِرْنَا مَعَ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم بَيْنَ مَكَّةَ وَالْمَدِيْنَةِ فَمَرَرْنَا بِوَادٍ فَقَالَ: “أَيُّ وَادٍ هَذَا؟” فَقَالُوْا: وَادِي الْأَزْرَقِ. قَالَ: “كَأَنِّيْ أنْظُرُ إِلى مُوْسَى”. فَذَكَرَ مِنْ لَوْنِهِ وَشَعْرِهِ شَيْئًا وَاضِعًا أَصْبَعَيْهِ فِيْ أُذُنَيْهِ لَهُ جُؤَارٌ إِلى اللهِ بِالتَّلْبِيَةِ مَارًّا بِهَذَا الْوَادِيْ”. قَالَ: ثُمَّ سِرْنَا حَتّى أَتَيْنَا عَلَى ثِنْيَةٍ. فَقَالَ: “أَيُّ ثَنِيَّةٍ هَذِهِ؟” قَالُوْا: هَرْشَى – أَوْ لِفَتٌ – فَقَالَ: “كَأَنِّيْ أَنْظُرُ إِلى يُوْنَسَ عَلَى نَاقَةٍ حَمْرَاءَ عَلَيْهِ جُبَّةُ صُوْفٍ خِطَامُ نَاقَتِهِ خَلْبَةٌ مَارًا بِهَذَا الْوَادِيْ مُلَبِّيًا”. رَوَاهُ مُسْلِمٌ.
5717. (20) [3/1593– దృఢం]
ఇబ్నె ‘అబ్బాస్ (ర) కథనం: మేము మక్కహ్ మదీనహ్ల మధ్య ప్రవక్త (స) వెంట ప్రయాణం చేసాము. ఒక లోయ ప్రక్క నుండి మేము నడుస్తున్నప్పుడు ప్రవక్త (స), ‘ఇది ఏ లోయ,’ అని అన్నారు. అనుచరులు, ‘ఇది అ’జ్రరఖ్ లోయ,’ అని అన్నారు. అప్పుడు ప్రవక్త (స), ‘నేను మూసా (అ)ను చూస్తున్నట్టు ఉంది,’ అని అన్నారు. ఆ తరువాత మూసా రంగు గురించి పేర్కొన్నారు. అతని వెంట్రుకల గురించి పేర్కొన్నారు. ఆ తరువాత, ‘మూసా (అ) ఈ లోయలో చెవుల్లో వేళ్లు పెట్టి లబ్బయెక్, లబ్బయెక్ అని బిగ్గరగా పలుకుతూ వెళ్తున్నట్లు అనిపిస్తుంది,’ అని అన్నారు. మళ్ళీ మేము ముందుకు సాగాము. మేము సనియ్య లోయ వద్దకు వచ్చాం. సనియ్య అనేది రెండు కొండల మధ్య ఉంది. అప్పుడు ప్రవక్త (స), ‘ఇది ఏ లోయ అని లేదా సనియ్య లోయ,’ అని అన్నారు. దానికి అనుచరులు, ‘హర్‌షీ లేదా లిఫత్,‘ అని అన్నారు. ప్రవక్త (స) విని, ‘నేను యూనుస్ (అ)ను చూస్తున్నట్టు ఉంది. అతను ఎర్రని ఒంటెపై కూర్చున్నారు. దళసరి ఉన్ని జుబ్బా ధరించి ఉన్నారు. అతని ఒంటె కళ్ళెం ఖర్జూరపుత్రాడుతో చేయబడింది. అతను, ‘లబ్బయెక్ లబ్బయెక్,‘ అని బిగ్గరగా పలుకుతూ వెళుతున్నారు. ” అని అన్నారు. (ముస్లిమ్)
5718 – [ 21 ] ( صحيح ) (3/1593)
وعَنْ أَبِيْ هُرَيْرَةَ عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ: “خُفِّفَ عَلَى دَاوُدَ الْقُرْآنُ فَكَانَ يَأْمُرُ بِدَوَابَهِ فَتُسرَحَ فَيَقْرُأُ الْقُرْآنَ قَبْلَ أَنْ تُسْرَحَ دَوَابُّهُ وَلَا يَأْكُلُ إِلّا مِنْ عَمَلٍ يَدَيْهِ”. روَاهُ الْبُخَارِيُّ.
5718. (21) [3/1593– దృఢం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”దావూద్ (అ) కోసం ‘జబూర్ పఠనాన్ని సులభతరం చేయబడింది. అతను తన వాహనాలపై జీను కట్టమని ఆదేశించే వారు. ఆ పని పూర్తి కాక ముందే ‘జబూర్ పఠనం పూర్తిచేసే వారు. దావూద్ (అ) తన చేతి సంపాదనతో తినేవారు.” (బు’ఖారీ)
5719 – [ 22 ] ( مُتَّفَقٌ عَلَيْهِ ) (3/1594)
وَعَنْهُ عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ: “كَانَتِ امْرَأَتَانِ مَعَهُمَا اِبْنَاهُمَا جَاءَ الذِّئْبُ فَذَهَبَ بِابْنِ إِحْدَاهُمَا فَقَالَتْ صَاحِبَتُهَا: إِنَّمَا ذَهَبَ بِابْنِكِ. وَقَالَتِ الْأُخْرَى: إِنَّمَا ذَهَبَ بِابْنِكَ فَتَحَاكَمَا إِلى دَاوُدَ فَقَضَى بِهِ لِلْكُبْرَى فَخَرَجْتَا عَلَى سُلَيْمَانَ بْنِ دَاوُدَ فَأَخْبَرتَاهُ فَقَالَ: ائْتُوُنِيْ بِالسِّكِّيْنِ أَشُقَّهُ بَيْنَكُمَا. فَقَالَتِ الصُّغْرَى: لَا تَفْعَلْ يَرْحَمُكَ اللهُ هُوَ ابْنُهَا فَقَضَى بِهِ لِلصُّغْرَى”. مُتَّفَقٌ عَلَيْهِ.
5719. (22) [3/1594– ఏకీభవితం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఇద్దరు స్త్రీలు ఉండేవారు. వారిద్దరికీ ఒక్కొక్క బాలుడు ఉండేవాడు. ఒక తోడేలు వచ్చి, వారిలోని ఒక స్త్రీ అబ్బాయిని తీసుకొనిపోయింది. వారిలో ఒకామె, ‘తోడేలు తీసుకు వెళ్లింది నీ కొడుకునే,’ అని అన్నది. రెండవ స్త్రీ ,’కాదు నీ కొడుకునే తోడేలు తీసుకు పోయింది,’ అని చెప్పింది. చివరికి ఇద్దరూ తమ కేసును తీసుకొని దావూద్(అ) వద్దకు వెళ్ళారు. దావూద్ (అ) ఆ అబ్బాయిని అధిక వయస్సుగల స్త్రీకి ఇచ్చి వేసారు. వారిద్దరూ సులైమాన్ బిన్ దావూద్(అ) ముందు నుండి వెళ్ళటం జరిగింది. ఆ స్త్రీలు ఆయనకు కూడా దీన్ని గురించి విన్నవించుకున్నారు. అప్పుడు సులైమాన్ (అ), ‘ఒక కత్తి తీసుకురండి, ఈ అబ్బాయిని రెండు ముక్కలు చేసి మీరిద్దరికి సగం-సగం ఇస్తాను,’ అని అన్నారు. చిన్నవయస్సుగల స్త్రీ, ”అల్లాహ్ (త)మిమ్మల్ని కరుణించు గాక! అలా చేయకండి, వీడు ఆమె కొడుకే,” అని చెప్పింది. సులైమాన్ (అ) ఆబిడ్డను చిన్నావిడకు ఇచ్చివేసారు. అంటే ఆమెకు, ఆమె బిడ్డను ఇప్పించారు.” (బు’ఖారీ, ముస్లిమ్)
5720 – [ 23 ] ( مُتَّفَقٌ عَلَيْهِ ) (3/1594)
وَعَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “قَالَ سُلَيْمَانُ: لَأَطُوْفَنَّ اللَّيْلَةَ عَلَى تِسْعِيْنَ امْرَأةً.
وَفِيْ رِوَايَةٍ: بِمِائَةِ امْرَأَةٍ – كُلُّهُنَّ تَأْتِيْ بِفَارِسٍ يُجَاهِدُ فِيْ سَبِيْلِ اللهِ. فَقَالَ لَهُ الْمَلَكُ: قُلْ إِنْ شَاءَ اللهُ. فَلَمْ يَقُلَ وَنَسِيَ فَطَافَ عَلَيْهِنَّ فَلَمْ تَحْمِلُ مِنْهُنَّ إِلَّا امْرَأَةٌ وَاحِدَةٌ جَاءَتْ بِشِقِّ رَجُلٍ وَأَيْمِ الَّذِيْ نَفْسُ مُحَمَّدٍ بِيَدِهِ لَوْ قَالَ: إِنْ شَاءَ اللهُ لَجَاهَدُوْا فِيْ سَبِيْلِ اللهِ فُرَسَانًا أَجْمَعُوْنَ”. مُتَّفَقٌ عَلَيْهِ .
5720. (23) [3/1594 –ఏకీభవితం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఒకరోజు సులైమాన్ (అ), ‘ఈ రోజు రాత్రి నేను నా 90 భార్యలు, మరో ఉల్లేఖనం ప్రకారం 100 మంది భార్యలతో సంభోగం చేస్తాను. వారిలో ప్రతి ఒక్కరూ ఒక వీర బిడ్డను కంటారు. వారు దైవమార్గంలో పోరాడుతారు,’ అని అన్నారు. దైవదూత అతనితో, ” ‘ఇన్‌షా అల్లాహ్,’ అని అనండి” అని అన్నాడు. కాని సులైమాన్ (అ), ‘ఇన్‌షాఅల్లాహ్’ అని పలకలేదు, మరచిపోయారు. ఆ తరువాత సులైమాన్ (అ) తన భార్యలందరి తోనూ సంభోగం చేసారు. వారిలో కేవలం ఒక భార్య గర్భం దాల్చింది. ఆమె కూడా అసంపూర్ణ బిడ్డ కన్నది. ఎవరి చేతిలో ము’హమ్మద్ ప్రాణం ఉందో ఆయన (త) సాక్షి! ఒకవేళ సులైమాన్ (అ), ” ‘ఇన్‌షా అల్లాహ్,’ అని పలికి ఉంటే, ప్రతి భార్యకు మగబిడ్డ జన్మించి ఉండేవాడు. వారందరూ దైవమార్గంలో పోరాడే వారు.” [40] (బు’ఖారీ, ముస్లిమ్)
5721 – [ 24 ] ( صحيح ) (3/1594)
وَعَنْهُ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم قَالَ: “كَانَ زَكَرِيَّا نَجَّارًا”. رواه مسلم
5721. (24) [3/1594 –దృఢం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ” ‘జకరియ్యా (అ) వడ్రంగి (కార్పెంటర్) పని చేసేవారు.” (ముస్లిమ్)
5722 – [ 25 ] ( مُتَّفَقٌ عَلَيْهِ ) (3/1594)
وَعَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “أَنَا أَوْلَى النَّاسِ بِعِيْسَى بْنِ مَرْيَمَ فِي الْأُوْلَى وَالْآخِرَةِ الْأَنْبِيَاءُ إِخْوَةٌ مِنْ عَلَّاتٍ وَأُمَّهَاتُهُمْ شَتّى وَدِيْنُهُمْ وَاحِدٌ ولَيْسَ بَيْنَنَا نَبِيٌّ”.مُتَّفَقٌ عَلَيْهِ
5722. (25) [3/1594 –ఏకీభవితం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఉభయలోకాల్లోనూ నేను ‘ఈసా బిన్ మర్యమ్‌కు అందరి కంటే దగ్గరి సంబంధం గలవాడిని. దైవప్రవక్త లందరూ సోదరుల వంటివారు. తండ్రి ఒక్కడే, తల్లులు వేరు. వీరందరి ధర్మం ఒక్కటే. మా ఇద్దరి మధ్య మరే ప్రవక్త లేడు.” (బు’ఖారీ, ముస్లిమ్)
5723 – [26] ( مُتَّفَقٌ عَلَيْهِ ) (3/1595)
وَعَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ الله صلى الله عليه وسلم: “كُلُّ بَنِي آدَمُ يَطْعَنُ الشَّيْطَانُ فِيْ جَنَبَيْهِ بِأَصْبَعَيْهِ حِيْنَ يُوْلَدُ غَيْرَ عِيْسَى بْنِ مَرْيَمَ ذَهَبَ يَطْعَنُ فَطَعَنَ فِي الْحِجَابِ”. مُتَّفَقٌ عَلَيْهِ.
5723. (26) [3/1595 –ఏకీభవితం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”బిడ్డ జన్మిస్తే, షై’తాన్ ఆ బిడ్డ ప్రక్కల్లో తన వ్రేలితో కితకితలు పెడతాడు. ‘ఈసా బిన్ మర్యమ్‌ను కితకితలు పెట్టాడు. కాని అతన్ని తెర ద్వారా రక్షించడం జరిగింది.”[41] (బు’ఖారీ, ముస్లిమ్)
5724 – [ 27 ] ( مُتَّفَقٌ عَلَيْهِ ) (3/1595)
وَعَنْ أَبِيْ مُوْسَى عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ: “كَمُلَ مِنَ الرِّجَالِ كَثِيْرٌ وَلَمْ يَكْمُلْ مِنَ النِّسَاءِ إِلَّا مَرْيَمُ بِنْتُ عِمْرَانَ وَآسِيَةُ امْرَأَةُ فِرْعَوْنَ وَفَضْلُ عَائِشَةَ عَلَى النِّسَاءِ كَفَضْلِ الثَّرِيْدِ عَلَى سَائِرِ الطَّعَامِ”. مُتَّفَقٌ عَلَيْهِ.
وَذُكِرَ حَدِيْثُ أَنَسٍ: “يَا خَيْرَ الْبَرِيَّةِ”. وَحَدِيْثُ أَبِيْ هُرَيْرَةَ: “أَيُّ النَّاسِ أَكْرَمُ”
وَحَدِيْثُ ابْنِ عُمَرَ: “اَلْكَرِيْمُ بْنُ الْكَرِيْمِ: “فِيْ”بَابِ الْمُفَاخَرَةِ وَالْعَصْبِيَّةِ.”
5724. (27) [3/1595 –ఏకీభవితం]
అబూ మూసా (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”పురుషుల్లో పరిపూర్ణ వ్యక్తులు చాలామంది ఉన్నారు. కాని స్త్రీలలో మర్యమ్ బిన్‌తె ‘ఇమ్రాన్, ఫిర్‌ఔన్ భార్య ఆ’సియ పరిపూర్ణ స్త్రీలు. ఇంకా ‘ఆయి’షహ్ (ర)కు స్త్రీలందరిపై, వంటకాలన్నిటిపై స’రీద్‌కు ఉన్నంత ప్రత్యేక స్థానం ఉంది.” (బు’ఖారీ, ముస్లిమ్)
—–
اَلْفَصْلث الثَّانِيْ రెండవ విభాగం
5725 – [ 28 ] (ضعيف والبعض يحسنه) (3/1595)
عَنْ أَبِيْ رَزِيْنٍ قَالَ: قُلْتُ: يَا رَسُوْلَ اللهِ أَيْنَ رَبُّنَا قَبْلَ أَنْ يَخْلُقَ خَلْقَهُ؟ قَالَ: “كَانَ فِيْ عَمَاءٍ مَا تَحْتَهُ هَوَاءٌ وَمَا فَوْقَهُ هَوَاءٌ وَخَلَقَ عَرْشَهُ عَلَى الْمَاءِ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَقَالَ: قَالَ يَزِيْدُ بْنُ هَارُوْنَ: الْعُمَاءُ: أَيْ لَيْسَ مَعَهُ شَيْءٌ.
5725. (28) [3/1595 –బలహీనం]
అబూ ర’జీన్ కథనం: ‘ఓ ప్రవక్తా! మన ప్రభువు విశ్వాన్ని సృష్టించక ముందు ఎక్కడున్నాడు,’ అని విన్నవించుకున్నాను. దానికి ప్రవక్త (స) అమా అ’లో, దానికి క్రింద, పైన గాలి ఉండేది కాదు. ఇంకా తన సింహాసనాన్ని నీటిపై సృష్టించాడు.” (తిర్మిజి’)
5726 – [ 29 ] ( ضعيف ) (3/1595)
وعَنِ الْعِبَّاسِ بْنِ عَبْدِ الْمُطّلَبِ زَعَمَ أَنَّهُ كَانَ جَالِسًا فِي الْبَطْحَاءِ فِيْ عِصَابَةٍ وَرَسُوْلُ اللهِ صلى الله عليه وسلم جَالِسٌ فِيْهِمْ فَمَرَّتْ سَحَابَةٌ فَنَظَرُوْا إِلَيْهَا. فَقَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَا تُسَمُّوْنَ هَذِهِ؟” قَالُوْا: السَّحَابَ. قَالَ: “وَالْمُزْنَ؟” قَالُوْا: وَالْمُزْنَ. قَالَ: “وَالْعِنَانَ؟” قَالُوْا: وَالْعِنَانَ. قَالَ: “هَلْ تَدْرُوْنَ مَا بُعْدُ مَابَيْنَ السَّمَاءِ وَالْأَرْضِ؟ “قَالُوْا: لَا نَدْرِيْ. قَالَ: “إِنَّ بُعْدَ مَا بَيْنَهُمَا إِمَّا وَاحِدَةٌ وَإِمَّا اِثْنَتَانِ أَوْ ثَلَاثٌ وَسَبْعُوْنَ سَنَةً وَالسَّمَاءُ الَّتِيْ فَوْقَهَا كَذِلَكَ”. حَتّى عَدَّ سَبْعَ سَمَاوَاتٍ. ثُمَّ “فَوْقَ السَّمَاءِ السَّابِعَةِ بَحْرٌبَيْنَ أَعْلَاهُ وَأَسْفَلِهِ مَا بَيْنَ سَمَاءٍ إِلى سَمَاءٍ ثُمَّ فَوْقَ ذَلِكَ ثَمَانِيَةُ أَوْ عَالٍ بَيْنَ أُظْلَافِهِنَّ وَوَرِكِهِنَّ مِثْلُ مَا بَيْنَ سَمَاءٍ إِلى سَمَاءٍ ثُمَّ عَلَى ظُهُوْرِهِنَّ الْعَرْشُ بَيْنَ أَسْفَلِهِ وَأَعْلَاهُ مَا بَيْنَ سَمَاءٍ إِلى سَمَاءٍ ثُمَّ اللهُ فَوْقَ ذَلِكَ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَأَبُوْ دَاوُدَ.
5726. (29) [3/1595 –బలహీనం]
‘అబ్బాస్ బిన్ ‘అబ్దుల్ ము’త్తలిబ్ (ర) కథనం: నేను మక్కహ్లోని బ’త్’హా’లో కొంతమంది గల బృందంతో పాటు కూర్చొని ఉన్నాను. ప్రవక్త (స) కూడా మాతోపాటే కూర్చొని ఉన్నారు. ఒక మేఘం వచ్చింది. ప్రజలు దానివైపు చూసారు. అప్పుడు ప్రవక్త (స), ‘మీరు దీన్ని ఏమని పిలుస్తారు?’ అని అన్నారు. దానికి వారు మేఘం (స’హాబ్) అంటారు,’ అని అన్నారు. అప్పుడు ప్రవక్త(స), ‘దీన్ని ‘ము’జ్న‘ అని కూడా అంటారు,’ అని అన్నారు. దానికి వారు, ‘అవును దీన్ని ము’జ్న,’ అని కూడా అంటారు,’ అని అన్నారు. మళ్ళీ ప్రవక్త (స), ‘దీన్ని ‘ఇనాన్, అని కూడా అంటారు,’ అని అన్నారు. దానికి ఆ ప్రజలు, ‘అవును దీన్ని ‘ఇనాన్ అని కూడా అంటారు,’ అని అన్నారు. ఆ తరువాత ప్రవక్త (స), ‘భూమ్యాకాశాల మధ్య ఎంతదూరం ఉందో మీకు తెలుసా?’ అని అడిగారు. దానికి వారు, ‘తెలియదు,’ అని అన్నారు. అప్పుడు ప్రవక్త (స), ‘భూమ్యాకాశాల మధ్య దూరం 71 లేదా 72 లేదా 73 సంవత్సరాల ప్రయాణ దూరమంత ఉంది. ఆకాశంపైన ఉన్న ఆకాశం దూరం కూడా అంతే దూరం ఉంది. అదేవిధంగా 7 ఆకాశాల గురించి ప్రస్తావించారు. 7వ ఆకాశంపై చాలా పెద్ద నీటి సముద్రం ఉంది. ఆ సముద్రం లోతు కూడా ఒక ఆకాశం నుండి మరో ఆకాశం అంత దూరం ఉంది. ఆ సముద్రంపై 8 దైవదూతలు ఉన్నారు. వాళ్ళు అడవి గొర్రెల్లా ఉన్నారు. వాటి కాలి డెక్కలకు కాళ్ళకు మధ్య దూరం కూడా అంతే ఉంది. ఆ దైవదూతల వీపుపై దైవసింహాసనం ఉంది. దాని క్రింది భాగానికి మీద భాగానికి ఒక ఆకాశం నుండి మరో ఆకాశం అంత దూరం ఉంది. ఆ సింహాసనంపై అల్లాహ్(త) ఉన్నాడు. (తిర్మిజి’, అబూ దావూద్)
5727 – [ 30 ] ( ضعيف ) (3/1596)
وعَنْ جُبَيْرِ بْنِ مُطْعِمٍ قَالَ: أَتَى رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم أَعْرَابِيٌّ فَقَالَ: جُهِدَتِ الْأَنْفُسُ وَجَاعَ الْعِيَالُ وَنُهِكَتِ الْأَمْوَالُ وَهَلَكَتِ الْأَنْعَامُ فَاسْتَسْقِ الله لَنَا فَإِنَّا نَسْتَشْفِعُ بِكَ عَلَى اللهِ نَسْتَشْفِعُ بِاللهِ عَلَيْكَ. فَقَالَ النَّبِيُّ صلى الله عليه وسلم: “سُبْحَانَ اللهِ سُبْحَانَ اللهِ”. فَمَا زَالَ يُسَبِّحُ حَتّى عُرِفَ ذَلِكَ فِيْ وُجُوْهِ أَصْحَابِهِ ثُمَّ قَالَ: “وَيْحَكَ إِنَّهُ لَا يُسْتَشْفَعُ بِاللهِ عَلَى أَحَدٍ شَأْنُ اللهِ أَعْظَمُ مِنْ ذَلِكَ وَيْحَكَ أَتَدْرِيْ مَا اللهُ؟ إِنَّ عَرْشَهُ عَلَى سَمَاوَاتِهِ لَهَكَذَا” وَقَالَ بِأَصَابِعِهِ مِثْلَ الْقُبَّةِ عَلَيْهِ”. وَإِنَّهُ لَيَئِطُ أَطِيْطَ الرَّحْلِ بِالرَّاكِبِ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ.
5727. (30) [3/1596– బలహీనం]
‘జుబైర్ బిన్ ము’త్’యిమ్ (ర) కథనం: ప్రవక్త (స) వద్దకు ఒక బదూ వచ్చి, ‘మానవ ప్రాణులను కష్టాలకు గురిచేయటం జరిగింది. భార్యాపిల్లలు ఆకలితో అలమటిస్తున్నారు. ఆస్తులన్నీ నాశనం అవుతు న్నాయి. పశువులు చనిపోతున్నాయి. కనుక తమరు అల్లాహ్ (త)ను మా గురించి వర్షం కురిపించ మని ప్రార్థించండి. మేము మిమ్మల్ని సిఫారసు చేయమని అర్థిస్తున్నాం,’ అని విన్నవించుకున్నాడు. అది విన్న ప్రవక్త (స) తస్‌బీ’హ్ పలుకుతూ ఉన్నారు. అది చూచి అనుచరుల ఆగ్రహం కట్టలు త్రెంచు కుంటుంది. ఆ తరువాత ప్రవక్త (స), ‘నీ పాడుగాను, అల్లాహ్ (త)కు ఎవరి ద్వారా సిఫారసు చేయించ కూడదు. అల్లాహ్(త) దీనికి అతీతుడు. అల్లాహ్(త) ఎంత గొప్పవాడో నీకు తెలియదా? ఆయన సింహాసనం భూమ్యాకాశాలను ఆవరించి ఉంది,’ అని చెప్పి తన చేతిని గోపురంలా చేసి చూపెట్టారు. ‘అల్లాహ్(త) సింహాసనం అంత పెద్దది అయినప్ప టికీ అల్లాహ్ (త) కూర్చోగానే శబ్దం చేస్తుంది. ఒంటెపై గల మావటి శబ్దం చేసినట్టు,’ అని అన్నారు. (అబూ దావూద్)
5728 – [ 31 ] ( صحيح ) (3/1596)
وعَنْ جَابِرِ بْنِ عَبْدِ اللهِ عَنْ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم قَالَ: “أُذِنَ لِيْ أَنْ أُحَدِّثَ عَنْ مَلَكٍ مِنْ مَلَائِكَةِ اللهِ مَنْ حَمَلَةِ الْعَرْشِ أَنَّ مَا بَيْنَ شَحْمَةِ أُذُنَيْهِ إِلى عَاتِقَيْهِ مَسِيْرَةً سَبْعِمِائَةِ عَامٍ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ.
5728. (31) [3/1596– దృఢం]
జాబిర్ బిన్ ‘అబ్దుల్లాహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”సింహాసనాన్ని పైకి ఎత్తే దైవదూతలలోని ఒకరిని గురించి నేను మీకు తెలియపరచవచ్చని అనుమతించబడింది. అతని చెవుల క్రింది భాగం నుండి అతని భుజాల వరకు 700 సంవత్సరాల ప్రయాణ దూరం ఉంది.” (అబూ దావూద్)
5729 – [ 32 ] ( لم تتم دراسته ) (3/1596)
وَعَنْ زُرَارَةَ بْنِ أَوْفَى أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم قَالَ لِجِبْرَيْلَ: “هَلْ رَأَيْتَ رَبَّكَ؟ فَانْتَفَضَ جِبْرَيْلُ وَقَالَ: يَا مُحَمَّدَ إِنَّ بَيْنِيْ وَبَيْنَهُ سَبْعِيْنَ حِجَابًا مِنْ نُوْرٍ لَوْ دَنَوْت مِنْ بَعْضِهَا لَاَحْتَرِقَتْ”. هَكَذَا فِيْ “الْمَصَابِيْحِ”.
5729. (32) [3/1596 –అపరిశోధితం]
‘జురారహ్ బిన్ అబీ అవ్‌ఫా (ర) కథనం: ప్రవక్త (స) జిబ్రీల్(అ)ను, ‘మీరు మీ ప్రభువును చూసారా?’ అని అడిగారు. జిబ్రీల్(అ) అది విని భయంతో వణకసాగారు. ఇంకా ఇలాఅన్నారు, ‘ఓ ము’హమ్మద్! నాకూ అల్లాహ్ కు మధ్య 70 వెలుగు తెరలు ఉన్నాయి. వాటికి ఏమాత్రం దగ్గర అయినా కాలిపోతాను,’ అని అన్నారు.
5730 – [ 33 ] ( لم تتم دراسته ) (3/1597)
وَرَوَاهُ أَبُوْ نَعِيْمٍ فِي “الْحِلْيَةِ” عَنْ أَنَسٍ إِلَّا أَنَّهُ لَمْ يَذْكُرْ: “فَانْتَفَضَ جِبْرِيْلُ”.
5730. (33) [3/1597 –అపరిశోధితం]
అయితే అబూ న’యీమ్ తన పుస్తకం ”హిల్యహ్” లో ఈ ఉల్లేఖనాన్ని అనస్ ద్వారా పేర్కొన్నారు. కాని అబూ న’యీమ్ ఉల్లేఖనంలో ”ఫన్‌తఫ’ద” అనే పదం లేదు.
5731 – [ 34 ] ( لم تتم دراسته ) (3/1597)
وَعَنِ ابْنِ عَبَّاسٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِنَّ اللهَ خَلَقَ إِسْرَافِيْلَ مُنْذُ يَوْمٍ خَلَقَهُ صَافًا قَدَمَيْهِ لَا يَرْفَعُ بَصَرَهُ بَينَهُ وَبَيْنَ الرَّبِّ تَبَارَكَ وَتَعَالى سَبْعُوْنَ نُوْرًا مَا مِنْهَا مِنْ نُوْرٍ يَدْنُوْ مِنْهُ إِلَّا احْتَرَقَ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَصَحَّحَهُ
5731. (34) [3/1597– అపరిశోధితం]
ఇబ్నె ‘అబ్బాస్ కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”అల్లాహ్ ఇస్రాఫీల్ (అ)ను సృష్టించినప్పటి నుండి నిటారుగా నిలబడి ఉన్నారు. దృష్టినైనా మరల్చరు. అల్లాహ్‌కు, అతనికి మధ్య 70 వెలుగు తెరలు ఉన్నాయి. ఒకవేళ ఇస్రాఫీల్ ఆ తెరలలో దేని దగ్గరకు వెళ్ళినా కాలిపోతారు.” (తిర్మిజి’ – దృఢం)
5732 – [ 35 ] ( لم تتم دراسته ) (3/1597)
وَعَنْ جَابِرٍ أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم قَالَ: “لَمَّا خَلَقَ اللهُ آدَمَ وَذُرِّيَتَهُ قَالَتْ: الْمَلَائِكَةُ: يَا رَبِّ خَلَقْتَهُمْ يَأْكُلُوْنَ وَيَشْرَبُوْنَ وَيَنْكِحُوْنَ وَيَرْكَبُوْنَ فَاجْعَلْ لَهُمُ الدُّنْيَا وَلَنَا الْآخِرَةَ. قَالَ اللهُ تَعَالى: لَا أَجْعَلُ مَنْ خَلَقْتُهُ بِيَديّ وَنَفَخْتُ فِيْهِ مِنْ رُوْحِيْ كَمَنْ قُلْتُ لَهُ: كُنْ فَكَانَ”. رَوَاهُ الْبَيْهَقِيُّ فِيْ “شُعَبِ الْإِيْمَانِ”.
5732. (35) [3/1597– అపరిశోధితం]
జాబిర్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”అల్లాహ్(త) ఆదమ్‌ను, అతని సంతతిని సృష్టించి నపుడు, దైవదూతలు, ‘ఓ ప్రభూ! తమరు ఎలాంటి సృష్టితాల్ని సృష్టించారంటే, వాళ్ళు తింటారు, త్రాగుతారు, పెళ్ళి చేసుకుంటారు, వాహనాలు ఎక్కుతారు. తమరు వాళ్ళకు భూలోకాన్ని ఇచ్చివేయండి, మాకు పరలోకం ఇచ్చి వేయండి,’ అని విన్నవించుకున్నారు. దానికి అల్లాహ్(త), ”నేను నా చేతులతో తయారుచేసి, అందులో నా ఆత్మను ఊదాను. అట్టి వారితో, ‘అయిపో’ అనగానే అయి పోయిన వారిని సమానంగా చేయను,’ అని అన్నాడు.” (బైహఖీ-షు’అబిల్ ఈమాన్)
—–
اَلْفَصْلُ الثَّالِثُ మూడవ విభాగం
5733 – [ 36 ] ( ضعيف ) (3/1597)
عَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “اَلْمُؤْمِنُ أَكْرَمُ عَلَى اللهِ مِنْ بَعْضِ مَلَائِكَتِهِ”. روَاهُ ابْنُ مَاجَهُ.
5733. (36) [3/1597 –బలహీనం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”అల్లాహ్ వద్ద విశ్వాసి కొందరు దైవదూతలకన్నా ఉన్నతుడు.” (ఇబ్నె మాజహ్)
5734 – [ 37 ] ( صحيح ) (3/1597)
وَعَنْهُ قَالَ: أَخَذَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم بِيَدِيْ فَقَالَ: “خَلَقَ اللهُ البرْيَةَ يَوْمَ السَّبْتِ وَخَلَقَ فِيْهَا الْجِبَالَ يَوْمَ الْأَحَدٍ وَخَلَقَ الشَّجَرَ يَوْمَ الْاِثْنَيْنِ وَخَلَقَ الْمَكْرُوْهَ يَوْمَ الثُّلَاثَاءِ وَخَلَقَ النُّوْرَيَوْمَ الْأَرْبِعَاءِ وَبَثَّ فِيْهَا الدَّوَابَّ يَوْمَ الْخَمِيْسِ وَخَلَقَ آدَمَ بَعْدَ الْعَصْرِ مِنْ يَوْمِ الْجُمْعَةِ فِي آخِرِ الْخَلْقِ وَآخِرِسَاعَةٍ مِنَ النَّهَارِ فِيْمَا بَيْنَ الْعَصْرِ إِلى اللَّيْلِ”. رَوَاهُ مُسْلِمٌ.
5734. (37) [3/1597– దృఢం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) నా చేయి పట్టుకొని ఇలా అనసాగారు. అల్లాహ్(త) మట్టిని– శనివారం సృష్టించాడు. ఈ భూమిపై పర్వతాలను– ఆదివారం సృష్టించాడు, వృక్షాలను–సోమవారం సృష్టించాడు, చెడ్డ వస్తువులను–మంగళవారం సృష్టించాడు, వెలుగును–బుధవారం సృష్టించాడు. జంతువులను–గురువారం సృష్టించాడు. ఆదమ్ (అ)ను–జుమ’అహ్ రోజు ‘అ’స్‌ర్ తర్వాత సృష్టించాడు. ఈ వ్యవహారం చివరి రోజు అస్ర్ నుండి రాత్రి వరకు జరిగింది. (ముస్లిమ్)
5735 – [ 38 ] ( ضعيف ) (3/1598)
وَعَنْهُ قَالَ: بَيْنَمَا نَبِيُّ اللهِ صلى الله عليه وسلم جَالِسٌ وَأَصْحَابُهُ إِذْ أَتَى عَلَيْهِمْ سَحَابٌ. فَقَالَ نَبِيُّ اللهِ صلى الله عليه وسلم: “هَلْ تَدْرُوْنَ مَا هَذَا؟” قَالُوْا: اللهُ وَرَسُوْلُهُ أَعْلَمُ. قَالَ: “هَذِهِ الْعَنَانُ هَذِهِ رَوَايَا الْأَرْضِ يَسُوْقُهَا اللهُ إِلى قَوْمٍ لَا يَشْكُرُوْنَهُ وَلَا يَدْعُوْنَهُ”. ثُمَّ قَالَ: “هَلْ تَدْرُوْنَ مَا فَوْقَكُمْ ؟ “قَالُوْا: اللهُ وَرَسُوْلُهُ أَعْلَمُ . قَالَ: “فَإِنَّهَا الرَّقِيْعُ سَقْفٌ مَحْفُوْظٌ وَمَوْجٌ مَكْفُوْفٌ”. ثُمَّ قَالَ: “هَلْ تَدْرُوْنَ مَا بَيْنَكُمْ وَبَيْنَهَا؟ “قَالُوْا: اللهُ وَرَسُوْلُهُ أَعْلَمُ. قَالَ: “بَيْنَكُمْ وَبَيْنَهَا خَمْسُمِاَئِة عَامٍ”. ثُمَّ قَالَ: “هَلْ تَدْرُوْنَ مَا فَوْقَ ذَلِكَ؟ قَالُوْا: اللهُ وَرَسُوْلُهُ أَعْلَمُ. قَالَ: “سَمَاءَانِ بُعْدُ مَا بَيْنَهُمَا خَمْسُمِائَةِ سَنَةٍ”. ثُمَّ قَالَ كَذَلِكَ حَتّى عَدَّ سَبْعَ سَمَاوَاتٍ” مَا بَيْنَ كُلِّ سَمَاءَيْنِ مَا بَيْنَ السَّمَاءِ وَالْأَرْضِ”. ثُمَّ قَالَ: “هَلْ تَدْرُوْنَ مَا فَوْقَ ذَلِكَ؟” قَالُوْا: اللهُ وَرَسُوْلُهُ أَعْلَمُ. قَالَ: “إِنَّ فَوْقَ ذَلِكَ الْعَرْشَ وَبَيْنَهُ وَبَيْنَ السَّمَاءِ بُعْدُ مَا بَيْنَ السَّمَاءَيْنِ”. ثُمَّ قَالَ: “هَلْ تَدْرُوْنَ مَا تَحْتَ ذَلِكَ؟” قَالُوْا: اللهُ وَرَسُوْلُهُ أَعْلَمُ. قَالَ: “إِنَّ تَحْتَهَا أَرْضًا أُخْرَى بَيْنَهُمَا مَسِيْرَةُ خَمْسِمِائَةِ سَنَةٍ” .حَتّى عَدَّ سَبْعَ أَرْضِيْنَ بَيْنَ كُلِّ أَرْضِيْنَ مَسِيْرَةُ خَمْسِمِائَةِ سَنَةٍ”. قَالَ: “وَالَّذِيْ نَفْسُ مُحَمَّدٍ بِيَدِهِ لَوْ أَنَّكُمْ دَلَّيْتُمْ بِحَبْلٍ إِلى الْأَرْضِ السُّفْلَى لَهَبِطَ عَلَى اللهِ”ثُمَّ قَرَأَ(هُوَ الْأَوَّلُ وَالْآخِرُ وَالظَّاهِرُ وَالْبَاطِنُ وَهُوَ بِكُلِّ شَيْءٍ عَلِيْمٌ؛ 57: 3). رَوَاهُ أَحْمَدُ وَالتِّرْمِذِيُّ. وَقَالَ التِّرْمِذِيُّ: قِرَاءَةُ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم الْآيَةَ تَدُلُّ عَلَى أَنَّهُ أَرَادَ الْهَبطَ عَلَى عِلْمِ اللهِ وَقُدْرَتِهِ وَسُلْطَانِهِ وَعِلْمُ اللهِ وَقُدْرَتُهُ وَسُلْطَانُهُ فِيْ كُلِّ مَكَانٍ وَهُوَ عَلَى الْعَرْشِ كَمَا وَصَفْ نَفْسَهُ فِيْ كِتَابِهِ.
5735. (38) [3/1598 –బలహీనం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) మరియు అనుచరులు కూర్చొని ఉన్నారు. అకస్మాత్తుగా మేఘాలు ఆవరించాయి. అప్పుడు ప్రవక్త (స), ‘ఇదేమిటో మీకు తెలుసా?’ అని అడిగారు. అనుచరులు, ‘అల్లాహ్(త)కు ఆయన ప్రవక్తకే బాగా తెలుసు,’ అని అన్నారు. అప్పుడు ప్రవక్త (స) ఇవి ” ‘అనాన్,” ఇవి భూమి దాహం తీరుస్తాయి, అల్లాహ్(త) దైవానికి కృతజ్ఞులుగా ఉండని, దైవాన్ని ప్రార్థించని వారి వైపే తోలుతాడు,’ అని అన్నారు. ఆ తరువాత, ‘మీపై ఏముందో మీకు తెలుసా?’ అని అన్నారు. దానికి అనుచరులు, ‘అల్లాహ్(త), ఆయన ప్రవక్తకే బాగా తెలుసు,’ అని అన్నారు. అప్పుడు ప్రవక్త (స) మీపై ఉన్నది ”రఖీ’ఉ” అది ఒక భద్రమైన కవచం కాదు, పడిపోయే అల కూడా కాదు. ఆ తర్వాత, ‘మీకూ ఆకాశానికి మధ్య ఎంత దూరం ఉందో మీకు తెలుసా?’ అని అన్నారు. అనుచరులు, ‘అల్లాహ్(త)కు ఆయన ప్రవక్తకే బాగా తెలుసు,’ అని అన్నారు. అప్పుడు ప్రవక్త (స), ‘మీకు ఆకాశానికి 500 సంవత్సరాల దూరం ఉంది,’ అని అన్నారు. ఇంకా, ‘ఆకాశంపై ఏముందో మీకు తెలుసా?’ అని అన్నారు. దానికి అనుచరులు, ‘అల్లాహ్(త) మరియు ఆయన ప్రవక్తకే బాగా తెలుసు,’ అని అన్నారు. అప్పుడు ప్రవక్త (స), ‘ఈ ఆకాశం తరువాత క్రింద, మీద రెండు ఆకాశాలు ఉన్నాయి. ఆ రెండు ఆకాశాల మధ్య 500 సంవత్సరాల దూరం ఉంది.’ అదేవిధంగా 7 ఆకాశాల గురించి పేర్కొన్నారు. ప్రతి రెండు ఆకాశాల మధ్య 500 సంవత్సరాల దూరం ఉందని, అన్నారు.
ఆ తరువాత, ‘ఆకాశాలపై ఏముందో మీకు తెలుసా?’ అని అన్నారు. దానికి అనుచరులు, ‘అల్లాహ్(త) మరియు ఆయన ప్రవక్తకే బాగా తెలుసు,’ అని అన్నారు. దానికి ప్రవక్త (స), ‘ఆకాశాల పై దైవ సింహాసనం ఉంది. ఆకాశాలకూ, ఆ సింహా సనానికి మధ్య కూడా రెండు ఆకాశాల మధ్య దూరం అంత దూరం ఉంది’, అని అన్నారు. మళ్ళీ, ‘మీ క్రింద ఏముందో తెలుసా?’ అని అన్నారు. అనుచరులు, ‘అల్లాహ్(త)కు ఆయన ప్రవక్తకే బాగా తెలుసు,’ అని అన్నారు. అప్పుడు ప్రవక్త (స), ‘భూమి ఉంది, దాని క్రింద ఏముందో మీకు తెలుసా?’ అని అన్నారు. ‘దాని క్రింద భూమి ఉంది. రెండు భూములకు మధ్య 500 సంవత్సరాల దూరం ఉంది, అదేవిధంగా 7 భూముల గురించి పేర్కొని ప్రతి భూమికి భూమికి మధ్య 500 సంవత్సరాల దూరం ఉంది,’ అని అన్నారు. ఇంకా, ‘ఎవరి చేతిలో నా ప్రాణం ఉందో ఆయన సాక్షి! ఒకవేళ మీరు అన్నిటికంటే క్రింద ఉన్న భూమిపై త్రాడువేస్తే అది అల్లాహ్(త)పై పడుతుంది. ఆ తరువాత ఈ అయతు, ”ఆయనే ప్రారంభం, ఆయనే అంతం, ఇంకా సమస్త విషయాలూ ఆయనకు తెలుసు,” (అల్ హదీద్, 57:3) పఠించారు. (అ’హ్మద్, తిర్మిజి’)
తిర్మిజి’లో ఇలా ఉంది, ”ప్రవక్త (స) తన ప్రవచనం తరువాత ఈ ఆయతును పఠించడం అంటే అల్లాహ్ (త) జ్ఞానం, ఆయన శక్తి, ఆయన అధికారాలను సూచిస్తుంది. ఆయన సింహాసనంపై ఉన్నా ఆయన అధికారం విశ్వమంతా వ్యాపించి ఉంది. ఆయన తన గుణాలను తన గ్రంథంలో పేర్కొని ఉన్నాడు.
5736 – [ 39 ] ( صحيح ) (3/1599)
وعَنْهُ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم قَالَ: “كَانَ طُوْلُ آدَمَ سِتِّيْنَ ذِرَاعًا فِيْ سَبْعِ أَذْرُعِ عَرْضًا”. رَوَاه أَحْمَدُ.
5736. (39) [3/1599– దృఢం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఆదమ్ (అ) 60 గజాల పొడవు, 7 గజాల వెడల్పు ఉండే వారు.” (అ’హ్మద్)
5737 – [ 40 ] ( صحيح ) (3/1599)
وعَنْ أَبِيْ ذَرٍّ قَالَ: قُلْتُ: يَا رَسُوْلَ اللهِ أَيُّ الْأَنْبِيَاءِ كَانَ أَوَّلَ؟ قَالَ: “آدَمُ”. قُلْتُ: يَا رَسُوْلَ اللهِ وَنَبِيٌّ كَانَ؟ قَالَ: “نَعَمْ نَبِيٌّ مُكَلَمٌ”. قُلْتُ: يَا رَسُوْلَ اللهِ كَمِ الْمُرْسِلُوْنَ؟ قَالَ: “ثَلَاثُمِائَةٍ وَبِضْعَ عَشَرَ جَمًّا غَفِيْرًا”. رَوَاه أَحْمَدُ.
وَفِيْ رِوَايَةٍ عَنْ أَبِيْ أُمَامَةَ قَالَ أَبُوْ ذَرٍّ: قُلْتُ يَا رَسُوْلَ اللهِ كَمْ وَفَاءً عِدَّةِ الْأَنْبِيَاءِ؟ قَالَ: ” مِائَةُ أَلْفٍ وَأَرْبَعَةٌ وَعِشْرُوْنَ أَلْفًا اَلرُّسُلُ مِنْ ذَلِكَ ثَلَاثُمِائَةٍ وَخَمْسَةَ عَشَرَ جَمًّا غَفِيْرًا”.
5737. (40) [3/1599 –దృఢం]
అబూ జ’ర్ (ర) కథనం: ‘ఓ ప్రవక్తా(స)! అందరికంటే మొదటి ప్రవక్త ఎవరు?’ అని ప్రశ్నించాను. ప్రవక్త (స), ‘ఆదమ్,’ అని అన్నారు. నేను మళ్ళీ, ‘ఆదమ్ (అ) ప్రవక్తనా?’ అని ప్రశ్నించాను. ప్రవక్త (స), ‘అవును, ఆయన ప్రవక్త,’ అని అన్నారు. ‘అల్లాహ్(త) అతనితో సంభాషించాడు,’ అని అన్నారు. ఆ తరువాత నేను, ‘ఓ ప్రవక్తా! ఎంతమంది సందేశహరులు?’ అని అడిగాను. దానికి ప్రవక్త (స), ‘ఒక పెద్ద సమూహమే అంటే, 310 కన్నా కొంత అధికమే‘ అని అన్నారు.
మరో ఉల్లేఖనంలో అబూ ఉమామహ్ ద్వారా ఇలా ఉంది, అబూ జ’ర్ (ర) కథనం: నేను, ‘ఓ ప్రవక్తా! ప్రవక్తలెంత మంది?’ అని అడిగాను. దానికి ప్రవక్త (స), ‘లక్షా 24 వేలు, ఇంకా వారిలో సందేశహరులు 315 అంటే ఒక పెద్ద సమూహం” అనిఅన్నారు.[42] (అ’హ్మద్)
5738 – [ 41 ] ( صحيح ) (3/1599)
وعَنِ ابْنِ عَبَّاسٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَيْسَ الْخَبْرُ كَالْمُعَايَنَةِ إِنَّ اللهَ تَعَالى أَخْبَرَ مُوْسَى بِمَا صَنَعَ قَوْمُهُ فِي الْعِجْلِ فَلَمْ يُلْقِ الْأَلْوَاحَ فَلَمَّا عَايَنَ مَا صَنَعُوْا أَلْقَى الْأَلْوَاحَ فَانْكَسَرَتْ. رَوَى الْأَحَادِيْثَ الثَّلَاثَةَ أَحْمَدُ.
5738. (41) [3/1599 –దృఢం]
ఇబ్నె ‘అబ్బాస్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఒక వస్తువును గురించి వినటం, వార్త అందటం కళ్ళతో చూడటానికి సమానం కాజాలవు. అల్లాహ్ (త) మూసా (అ) కు, అతని జాతివారు ఆవుదూడ గురించి చేసిన నిర్వాకాన్ని గురించి తెలియపరచగా, ప్రభావితులై, ఆగ్రహంచెంది తౌరాతు పలకలను విసర లేదు. కాని మూసా (అ) తన జాతి వారి వద్దకు వచ్చి తన కళ్ళతో జరిగింది చూసి ఆగ్రహం చెంది పల కలను పారవేసారు. అవి విరిగిపోయాయి. (అ’హ్మద్)
*****
[1]) వివరణ-5535: ‘ఈసా(అ) పలికిన వాక్యాన్నే నేనూ పలుకు తాను. అంటే ఏవిధంగా ‘ఈసా (అ) తీర్పుదినం నాడు తన జాతి మార్గభ్రష్టత్వం గురించి, తిరస్కారం గురించి తనకేమీ సంబంధంలేదని విన్నవించుకుంటారో, అదేవిధంగా నేను కూడా, ‘ఓ అల్లాహ్(త)! వీళ్ళు నేనున్నప్పుడు మాత్రం ధర్మంపై స్థిరంగా ఉన్నారు. అప్పుడు నేను బాధ్యుడ్ని. కాని నా మరణానంతరం వారు షై’తాన్ కుట్రలకు గురయి, అపమార్గాన్ని అనుసరించారు. వారి వ్యవహారం నీపై ఉంది. నీవు శిక్షించ దలిస్తే, వారు నీ దాసులు, ఒకవేళ క్షమించదలిస్తే నీవు చాలా బలవంతుడవు, వివేకవంతుడవూను,’ అని అంటారు.
[2]) వివరణ-5536: ప్రళయం నాడు ప్రజలందరూ నగ్నంగా వస్తారు. ప్రతి ఒక్కరూ తన్ను గురించి ఆలోచిస్తూ ఉంటారు. అక్కడ ఇతరుల్ని చూసే తీరికే ఉండదు.
[3]) వివరణ-5539: చెమట అంత అధికంగా ఎందుకు వస్తుందంటే, ఆ పరిస్థితే అంత వ్యధాభరితంగా ఉంటుంది. చెమట ఎంత అధికంగా వస్తుందంటే, వారి ముఖాల వరకు వచ్చి వారిని ముంచివేస్తుంది. కళ్ళెంలా వారి నోటిపై ఆవరిస్తుంది. వారు మాట్లాడలేరు కూడా.
[4]) వివరణ-5540: అంటే ఆ రోజు వచ్చే చెమట వారి కర్మల ప్రకారం ఉంటుంది. చాలా మంచి కర్మలు ఉన్నవారికి అతి తక్కువగా చెమట పడుతుంది. వారికి చెమట కేవలం వారి చీలమండల వరకే ఉంటుంది. పుణ్యాలు తగ్గి పాపాలు పెరుగు తున్న కొలది చెమట కూడా పెరుగుతూ ఉంటుంది.
[5]) వివరణ-5541: ముహమ్మద్ (స) యొక్క అనుచర సమాజం ప్రత్యేకత ఏమిటంటే, స్వర్గవాసుల్లో అందరి కంటే అధిక సంఖ్య ఈ అనుచర సమాజానిదే ఉంటుంది. సగం స్వర్గంలో వీరే ఉంటారు. మిగిలిన సగంలో ఇతర అనుచర సమాజాలు ఉంటాయి.
[6]) వివరణ-5542: అంటే ఏదైనా వ్యవహారం పట్ల కఠినంగా వ్యవహరించడం, అల్లాహ్(త) తన దాసుల పట్ల కఠినంగా వ్యవహరించినపుడు వారందరూ భయంతో సజ్దాలో పడిపోతారు. దీని అసలు అర్థం అల్లాహ్(త)కే తెలుసు. అనవసరమైన వ్యర్థ అభిప్రాయాలకు, ఆలోచనలకు తావీయరాదు.
[7]) వివరణ-5543: అంటే ప్రపంచంలో ఎంతటి వారైనా విశ్వాసం లేకుండా ఎన్ని సత్కార్యాలు చేసినా వాటికి ఎటువంటి విలువ ఉండదు.
[8]) వివరణ-5546: మొదటి వర్గం విశ్వాసులై ఉంటారు. వీరివద్ద పుణ్యాలు, పాపాలు రెండూ ఉంటాయి. రెండవవర్గం పరిపూర్ణ విశ్వాసులై ఉంటారు. వీరివద్ద సత్కార్యాలు అధికంగా ఉంటాయి. మూడవ వర్గం అవిశ్వాసులు, బహుదైవారాధ కులు ఉంటారు. ఈ మూడవ వర్గం వారు తీర్పుదినం నాడు తలక్రిందులుగా నడచివస్తారు. వారి ముఖాలు కూడా వారి కాళ్ళూ, చేతుల్లా పనిచేస్తాయి. ఇంకా హానిచేకూర్చే వస్తువుల నుండి తప్పిస్తాయి.
[9]) వివరణ-5547: ఈ సూరాహ్ల్లో ప్రళయం గురించి చర్చించటం జరిగింది. ఈ సూరాహ్లను శ్రద్ధగా చదివితే, ప్రళయదినాన సంభవించే విషయాలు స్పష్టంగా తెలుస్తాయి. కళ్ళముందు జరిగినట్టు అనిపిస్తాయి.
[10]) వివరణ-5549: తేలికైన విచారణఅంటే, అతను చేసిన మంచీ చెడులను చూపెట్టి, పాపాల ప్రస్తావన చేయక పోవటం. కాని విచారణలో పాపాల పట్ల గుచ్చిగుచ్చి ప్రశ్నిస్తే మాత్రం శిక్ష నుండి తప్పించుకోవటం కష్టం.
[11]) వివరణ-5550: అంటే ప్రతి వ్యక్తి అల్లాహ్(త)తో ప్రత్యక్షంగా మాట్లాడుతాడు. కుడివైపు సత్కార్యాలు, ఎడమవైపు పాపాలు ఉంటాయి. ముందు చూస్తే నరకాగ్ని ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో తన్నుతాను నరకాగ్ని నుండి రక్షించగోరేవారు పేదలపై, అగత్యపరులపై తన ధనాన్ని ఖర్చుపెట్టాలి. ఒక ఖర్జూరపు పండు ముక్క ఇచ్చే స్థోమత ఉన్నా ఇచ్చివేయాలి. ఎందుకంటే దైవమార్గంలో చేసే దానధర్మాలు మీకూ నరకాగ్నికి మధ్య తెరగా మారుతాయి.
[12]) వివరణ-5552: అల్లాహ్(త) ప్రతి మానవునికి అంటే విశ్వాసి అయినా అవిశ్వాసి అయినా స్వర్గనరకాల్లో ఒక్కో చోట నియమించి ఉంచాడు. విశ్వాసిగా మరణిస్తే నరకంలో ఉన్న స్థలం స్వర్గస్థలంగా మారిపోతుంది. అదే విధంగా అవిశ్వాసిగా మరణిస్తే దీనికి వ్యతిరేకంగా జరుగు తుంది. ఈ విధంగా విశ్వాసి సాఫల్యం, పరిహారంగా అవుతారు.
[13]) వివరణ-5555: తీర్పుదినం నాడు దాసులు తమ కళ్ళతో తమ ప్రభువును చూస్తారు. సూర్య చంద్రా దులను చూసినట్లు. ఎటువంటి కష్టం, శ్రమ పడనక్కర లేదు. అందరూ తమ దైవాన్ని స్పష్టంగా చూస్తారు.
[14]) వివరణ-5556: విచారణ, శిక్ష లేకుండా 70 వేలమందిని స్వర్గంలో ప్రవేశింపజేస్తారు. అంటే వారికి ఎటువంటి శిక్ష పడదు. విచారణ కూడా శిక్ష లాంటిదే. అందువల్ల విచారణ ఉండదు, విచారణ లేకుంటే శిక్ష కూడా ఉండదు. ప్రతి వెయ్యిమంది వెంట 70 వేల మంది, ఇంకా అల్లాహ్(త) 3 దోసెళ్ళ నిండా ప్రజలను అదనంగా స్వర్గంలోనికి పంపుతాడు. అంటే అల్లాహ్ (త) ఈ అనుచర సమాజానికి చెందిన లెక్క లేనంత మందిని విచారణ, శిక్ష లేకుండా స్వర్గంలోనికి పంపిస్తాడు. అల్లాహ్ (త) మనల్ని కూడా విచారణ, శిక్షలు లేకుండా స్వర్గంలో ప్రవేశించే భాగ్యం ప్రసాదించుగాక. ఆమీన్!
[15]) వివరణ-5558: రెండుసార్లు వాదన జరుగుతుంది. అంటే కొందరు మా వద్దకు ప్రవక్తలు రాలేదని, మాకు వాటి వాస్తవం తెలియదని, కొందరు చేసిన తప్పులను ఒప్పుకుంటారు. ఈ వ్యవహారమంతా జరిగిన తర్వాత ప్రజల చేతుల్లో వారి కర్మ పత్రాలు ఇవ్వబడతాయి. కుడిచేతిలో ఇవ్వబడిన వారు, అదృష్ట వంతులు, ఎడమ చేతిలో ఇవ్వబడినవారు దురదృష్టవంతులు.
[16]) వివరణ-5561: తమ సేవకులను, పనివాళ్ళను, చిన్నచిన్న విషయాలపై కఠినంగా శిక్షించేవాళ్ళు, శారీరకంగా మానసికంగా వేధించేవాళ్ళు. తీర్పుదినం నాడు ఒక్కోచర్యకు సమాధానం చెప్పుకోవలసి ఉంటుందని, కఠినమైన విచారణకు గురికావలసి ఉంటుందని గుర్తుంచుకోవాలి.
[17]) వివరణ-5567: ఒకసారి త్రాగగానే దాహం తీరిపోతుంది. కాని స్వర్గవాసులు రుచిని ఆస్వాదిస్తూ ఎల్లప్పుడూ త్రాగ తుంటారు.
[18]) వివరణ-5570: అంటే ప్రవక్త (స) తన కోనేరు యొక్క రెండుమూలల మధ్య దూరం అద్‌న్ మరియు అయ్‌ల మధ్య దూరం అంత ఉంటుంది. అంటే ఆ కోనేరు చాలా పొడవుగా, వెడల్పుగా ఉంటుంది. అంటే ఇక్కడ అత్యధిక పొడవు వెడల్పులు కలిగి ఉంటుందని చెప్పడం జరిగింది.
[19]) వివరణ-5576: నిజాయితీ, బంధుత్వాలకు చాలా ప్రాధాన్యత ఉంది. ఈ రెంటి హక్కులను నిర్వర్తించటం దాసుల తప్పనిసరి విధి.
[20]) వివరణ-5600: ప్రవక్త (స) తన అనుచర సమాజం కోసం సిఫారసు చేయటాన్ని ఎన్నుకున్నారు. ఈ విషయం తన అనుచర సమాజంపై తనకున్న ప్రేమను సూచిస్తుంది. ప్రవక్త (స) సిఫారసును ఐదు విధాలుగా ఉంటుంది. మొదటి రకానికి చెందిన సిఫారసు కేవలం ప్రవక్త మహమ్మద్(స)కు మాత్రమే ప్రత్యేకించి ఉంటుంది. ఇది ప్రళయమైదానంలో ఇవ్వటం జరుగుతుంది. అంటే ప్రజలు సమాధులనుండి లేచి విచారణకు ముందు ప్రళయమైదానంలో నిలబడి ఎండవేడికి తీవ్రతకు గురై ఆందోళనకు గురై ఉంటారు. ప్రవక్తలందరూ సమాధానం ఇస్తారు. అప్పుడు ప్రవక్త (స) ప్రజల ఆందోళనను దూరం చేసి విచారణ త్వరగా పూర్తిచేయించి ప్రజలకు విముక్తి కలిగిస్తారు. దీన్ని ”షిఫా‘అతె కుబ్‌రా” అంటారు. ఇది కేవలం ప్రవక్త (స)కే ప్రత్యేకించి ఉంటుంది. రెండవ సిఫారసు ఏమిటంటే, కొంతమందిని విచారణ లేకుండా స్వర్గంలో పంపడం గురించి ఉంటుంది. ఇది కేవలం ప్రవక్త (స)కే ప్రత్యేకించబడి ఉంటుందని సాక్ష్యాధారాలు ఉన్నాయి. మూడవది ఏమిటంటే నరకవాసులుగా నిర్థారించబడిన వారిలో అల్లాహ్(త) కోరిన వారి గురించి ప్రవక్త (స) సిఫారసు చేస్తారు. నాల్గవ సిఫారసు ఏమిటంటే నరకం వరకు చేరుకున్న వారిని ప్రవక్త (స) సిఫారసు ద్వారా విముక్తి ప్రసాదించటం జరుగుతుంది. ఐదవ సిఫారసు ఏమిటంటే, నరకంలో వేయబడిన వారిని ప్రవక్త (స) సిఫారసు ద్వారా నరకం నుండి తీయటం జరుగుతుంది. వారి నుదురు తప్ప శరీరం అంతా కాలి ఉంటుంది. వారిని ముస్లిమ్ సోదరుల సిఫారసు ద్వారా నరకం నుండి బయటకు తీయటం జరుగుతుంది. ఇంకా చివరిగా అల్లాహ్ (త) తన ప్రత్యేక కారుణ్యం ద్వారా ”లా ఇలాహ ఇల్లల్లాహ్” పలికిన వారికి నరకం నుండి విముక్తి ప్రసాదిస్తాడు. ఐదవ సిఫారసు స్వర్గంలో స్వర్గవాసుల తరగతులను పెంచటాన్ని గురించి ఉంటుంది.
[21]) వివరణ-5604: దీనివల్ల పాపాత్ములు పుణ్యాత్ము లకు ఈ ప్రపంచంలో ఏదైనా సహాయం చేసి ఉంటే, దానికి పరలోకంలో ప్రతిఫలం పొందుతారు. అంటే వారి సహాయం, సిఫారసు వల్ల స్వర్గంలో ప్రవేశిస్తారు.
[22]) వివరణ-5610: అంటే నరకంనుండి వాళ్ళను తీసి నపుడు, వాళ్ళు కాలి బొగ్గుగా మారిపోయి ఉంటారు. కాని వారిని న‘హర్ ‘హయాత్లో వేసిన తరువాత వాళ్ళుపూర్వ స్థితిని తిరిగి పొందుతారు. అంటే ఖీరా, కకడీలు సస్యశ్యామలంగా, పచ్చగా ఉన్నట్టు ఉంటారు.
[23]) వివరణ-5611: ఈ ‘హదీసు’లో మూడు రకాల వ్యక్తు లకు సిఫారసు ప్రత్యేకించటంజరిగింది. వారి ప్రాధాన్యతను బట్టి ఉంటుంది. అదేవిధంగా ముస్లిముల్లోని పుణ్యాత్ము లను కూడా సిఫారసు చేసే అవకాశం లభిస్తుంది. ఈ విషయంలో అనేక ‘హదీసు’లు ఉన్నాయి.
[24]) వివరణ-5616: ఇల్లాలు అంటే భార్యలు అని అర్థం. అక్కడ అల్లాహ్ (త) ప్రసాదిస్తాడు. స్వర్గవాసి వారి ద్వారా సుఖం పొందుతాడు. అయితే తన ఇంటికి వస్తూపోతూ ఉంటాడు. అంటే విశ్వాసి తన భార్యలతో సంభోగం చేస్తూ ఉంటాడు.
[25]) వివరణ-5617: ఈ ‘హదీసు’ ‘స’హీ’హ్ బు’ఖారీలో రెండు చోట్ల ఉంది. ఒకటి కితాబుల్ జిహాద్‌లో, మరొకటి కానల్’అర్‌షుహు ‘అలా అల్-మాఅ’లో. ఇంకా ‘స’హీ’ ముస్లిములో ఫజ్‌లుల్ జిహాద్ ఫి సబీలిల్లాహ్ లో ఉంది.
[26]) వివరణ-5628: ఫురాత్, నీల్ ఇవి ప్రఖ్యాత నదులు. ఫురాత్ ఇరాఖ్లో, నీల్ ఈజిప్టులో జీ’హాన్, సీ’హాన్ సిరియాలోని నదులు. ఇవి ప్రాచీన పట్టణాలు ‘తర్’తూస్, మ’సీ’సహ్ లకు దగ్గరనుండి ప్రవహిస్తున్నాయి. ఇంకా రూమ్ సముద్రంలో కలుస్తున్నాయి. ఈ నాలుగు నదులకు స్వర్గంలోని నదులతో సంబంధం ఉంది. వీటికి చాలా ప్రత్యేకత ఉంది. అంటే ఇక్కడి అనుగ్రహాలు స్వర్గంలోని అనుగ్రహాలకు పోలి ఉన్నాయి.
[27]) వివరణ-5652: అంటే స్వర్గంలో స్వర్గవాసులకు లభించే అనుగ్రహాలు కాక అదనంగా కూడా అనుగ్రహాలు లభిస్తాయి. వాటినే ‘మజీద్’ అంటారు.
[28]) వివరణ-5655: ఫజ్‌ర్ మరియు ‘అస్ర్ సమయాలు చాలా శుభకరమైనవి. ఈ సమయాల నమా’జులకు చాలా ప్రత్యేకత ఉంది. అందువల్ల వీటిపట్ల శ్రద్ధ, సమయపాలన కలిగి ఉండాలి. ఈ నమా’జులు తప్ప కుండా చూసుకోవాలి. నమా’జుల పట్ల శ్రధ్ధ వహించేవారు. అల్లాహ్(త) దర్శనానికి ఎక్కువ అర్హులు.
[29]) వివరణ-5666: తీర్పుదినం నాడు నరకాన్ని లక్షల మంది దైవదూతలు ఈడ్చుకుంటూ తీర్పుమైదానంలోనికి తీసుకువస్తారు. అంటే మానవులకు స్వర్గానికి మధ్య ఉంచుతారు. స్వర్గంలోనికి వెళ్ళడానికి నరకంపై గల వంతెన (‘సిరా’త్)ను దాటవలసి ఉంటుంది.
[30]) వివరణ-5668: అబూ ‘తాలిబ్ ప్రవక్త (స) చిన్నాన్న. అతను ఇస్లామ్ స్వీకరించలేదు. కాని ప్రవక్త (స)ను అవిశ్వాసుల నుండి రక్షించేవారు. దీనికి బదులుగా నరకంలో అతనికి అందరికంటే తేలికైన శిక్ష పడుతుంది.
[31]) వివరణ-5677: ‘స’ఊద్ – నరకంలోని ఒక అగ్ని కొండ పేరు. ఈ ఆయతులో అది పేర్కొనబడింది, ”స ఉర్హిఖుహు ‘స‘ఊదన్.”
[32]) వివరణ-5679: ” ‘సిహ్రున్” అనే పదం గురించి ఈ ‘హదీసు’లో ప్రవక్త (స) విశదపరిచారు. ఖుర్‌ఆన్‌లోని ఈ ఆయతులో ఇది ఉంది, ”వారి తలపై వేడి నీరు పోయటం జరుగుతుంది. దానివల్ల కడుపులో ఉన్న భాగాలన్నీ ఉడుకుతాయి.” ఇంకా అతనిపై శిక్ష కొనసాగుతూ ఉంటుంది. అంటే మళ్ళీ తను యథాస్థితికి చేరు కుంటాడు. మళ్ళీ ఆ శిక్షకు గురికావటం జరుగుతుంది. కడుపు భాగాలు ఉడికి క్రింది నుండి బయటకు వస్తాయి. ఇలాగే కొనసాగుతూ ఉంటుంది.
[33]) వివరణ-5688: గొలుసు అంటే నరకవాసులను బంధించే గొలుసు, ”ఆ తరువాత నరకవాసులను 70 గజాల పొడవుగల గొలుసులో బంధించమని దైవదూతలను ఆదేశించటం జరుగుతుంది.” హసన్ బ’స్రీ ఈ వాక్యంపై వ్యాఖ్యానిస్తూ, ‘ఈ గజం పొడవు ఎంత ఉంటుందో అల్లాహ్ (త)కే తెలుసు’ అని అన్నారు.
[34]) వివరణ-5689: హబ్ హబ్ అంటే తొందర, వేగిరం అని అర్థం. ఈ కాలువలో చాలా తీవ్రమైన జ్వాలలు ఉంటాయి. ఇందులో వేయబడిన వారికి చాలా త్వరగా శిక్షించడం జరుగుతుంది.
[35]) వివరణ-5692: సూర్యచంద్రులను నరకంలో వేయ బడటం జరుగుతుంది. ఆ రెంటిని నరకాగ్నిలో ఎందుకు వేయడం జరుగుతుందంటే, అవిశ్వాసులు సూర్య చంద్రాలను పూజిస్తారు. అందువల్ల తీర్పుదినం నాడు ఈ రెంటిని నరకంలో వేసి వారిని అవమానపరచడం జరుగుతుంది. మీరు దైవాలుగా భావించేవాటి గతి ఏమయిందో చూడండని చెప్పటం జరుగుతుంది.
[36]) వివరణ-5698: అంటే ‘ఇమ్రాన్ బిన్ ‘హు’సైన్ తన ఒంటె విషయంలో పడి అక్కడి నుండి వెళ్ళిపోయినందుకు చాలా విచారించారు. ప్రవక్త (స) ప్రజలకు విశ్వ ప్రారం భాన్ని గురించి ప్రస్తావిస్తున్న సమయంలో ఒక వ్యక్తి వచ్చి అతనితో, ‘నీ ఒంటె త్రాడు విప్పుకొని పారి పోతుంది. తొందరగా వెళ్ళు, దాన్ని పట్టుకో,’ అని అనగానే లేచి ఒంటెను పట్టుకోవటానికి వెళ్ళి పోయారు. తిరిగి వచ్చి ప్రవక్త (స) సృష్టి రహస్యాలను తెలుపు తున్నప్పుడు ఎందుకు లేచానా అని చాలా విచారించారు.
[37]) వివరణ-5700: అల్లాహ్(త) కారుణ్యం అల్లాహ్ (త) ఆగ్రహాన్ని అధిగమించిందంటే అర్థం, దైవకారుణ్య సూచనలు అనేకం ఉన్నాయి. సృష్టితాలన్నీ దైవకారుణ్య నీడలో ఉన్నాయి. అయితే ఆయన ఆగ్రహం మాత్రం చాలా తక్కువగా అప్పుడప్పుడూ బహిర్గతం అవుతుంది. ఖుర్‌ఆన్‌లో ఈవిధంగా ఉంది, ”నేను కోరిన వారిని నేను శిక్షిస్తాను. కాని నా కారుణ్యం అందరినీ ఆవరించి ఉంది.”
[38]) వివరణ-5704: ఇబ్రాహీమ్ (అ) తన జీవితంలో కేవలం మూడుసార్లు అసత్యం పలికారు. వాటిలో రెండుసార్లు అల్లాహ్ కోసం పలికారు. అంటే దైవప్రీతిని పొందటానికి పలికారు. ఒకసారి విగ్రహాల పండుగలో పాల్గొనకూడదనే ఉద్దేశ్యంతో నేను అనారోగ్యంగా ఉన్నానని అన్నారు. మరోసారి విగ్రహాలను విరగ్గొట్టి పెద్ద విగ్రహం చేసిందని అసత్యం పలికారు.
[39]) వివరణ-5705: మేము అనుమానించటానికి ఇబ్రాహీమ్ (అ) కంటే ఎక్కువ హక్కుదారులం. ఆయన ఇలా విన్నవించుకున్నారు, ”ఓ అల్లాహ్! మృతులను ఎలా సజీవపరుస్తావో, నాకు చూపించు.” మన మనసులో కూడా ఇటువంటి అనుమానాలు మెదలవచ్చు. అదేవిధంగా లూత్ (అ) తనను సహాయపడటానికి ఒక శక్తివంతమైన బృందం ఉంటే ఎంత బాగుణ్ణు అని కోరేవారు. అదేవిధంగా యూసుఫ్ నేనూ చాలా కాలం చెరసాలలో ఉండి ఉంటే పిలవగానే నేను వెళ్ళి ఉండే వాణ్ణి. కాని యూసుఫ్ (అ) తాను నిరపరాధినని స్త్రీల ద్వారా సాక్ష్యం తీసుకోనంత వరకు బయటకు రానని చెప్పారు.
[40]) వివరణ-5720: సులైమాన్ (అ), ‘ఇన్‌షా అల్లాహ్,’ అని అనకపోవడం అతనికి ఓ పరీక్షవంటిది. ఆ తరువాత సులైమాన్ (అ) అల్లాహ్ (త) క్షమాపణ వేడుకున్నారు. పశ్చాత్తాపం చెందారు. అందువల్ల ఏ పని చేయదలచుకున్నా, ‘ఇన్షాఅల్లాహ్’ అని పలకాలి. దీనివల్ల ఆ పనిలో అల్లాహ్(త) సహాయం చోటు చేసుకుంటుంది. ఖుర్ఆన్లో ఇలా ఉంది, ”నీవు ఏ పని గురించి, దాన్ని నేను రేపుచేస్తాను అని పలికేటప్పుడు దానితో పాటు, ‘ఇన్‌షాఅల్లాహ్,’ అని కూడా పలుకు,” అని ఉంది.
[41]) వివరణ-5723: అంటే బిడ్డ చుట్టూ ఉండే పొర. బిడ్డ జన్మించినపుడు ఆ పొరలో ఉంటాడు. షై’తాన్ తన అలవాటు ప్రకారం ‘ఈసా (అ)ను కూడా కితకితలు పెట్ట ప్రయత్నించాడు. కాని అల్లాహ్(త) అతన్ని రక్షించాడు. వాడి వ్రేళ్ళు ఆ పొరలో చిక్కుకున్నాయి. ఈవిధంగా ‘ఈసా (అ) రక్షించబడ్డారు.
[42]) వివరణ-5737: రసూల్‌కు నబీకి తేడా ఉంది. రసూల్ అంటే గ్రంథం, జీవన వ్యవస్థ ఇవ్వబడినవారు. ప్రతి రసూల్ నబీ కాగలడు. నబీ అంటే అంతకుముందు గల గ్రంథాన్ని, జీవన వ్యవస్థకు కట్టుబడి ఉండేవాడు.
***