27. కల్లోలాలు, ఉపద్రవాలు | మిష్కాతుల్ మసాబీహ్

27- كِتَابُ الْفِتَنِ

27. కల్లోలాలు, ఉపద్రవాలు (అల్ఫితన్)

పిత్‌నహ్‌ ఏకవచనం, ఫితనున్‌ బహువచనం. అంటే పరీక్షించటం, మార్గభ్రష్టత్వం, రక్తపాతం, యుద్ధాలు పోరాటాలు, బలా అంటే కఠిన పరీక్ష. నిఘంటువులో ఫిత్‌నహ్‌ అంటే బంగారాన్ని అగ్నిలో కాల్చటం. దానివల్ల అది అసలైనదో కాదో తెలిసిపోతుంది. ఫిత్‌నహ్‌ అంటే అల్లాహ్ శిక్ష అని కూడా అర్థం వస్తుంది. అల్లాహ్ శిక్ష అందరినీ పట్టుకుంటుంది. అంటే చెడు చూచి మౌనం వహించటం, మంచిని ఆదేశించడంలో, చెడును వారించడంలో అలసత్వం వహించడం, కల్లోలం, అనైక్యత, దైవానికి సాటికల్పించటం, మూఢ నమ్మకాలు, దురాచారాలు మొదలైనవి.

——–

اَلْفَصْلُ الْأَوَّلُ    మొదటి విభాగం 

5379 – [ 1 ] ( متفق عليه ) (3/1480)

عَنْ حُذَيْفَةَ قَالَ: قَامَ فِيْنَا رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم مَقَامًا مَاتَرَكَ شَيْئًا يَّكُوْنُ فِيْ مَقَامِهِ إِلى قِيَامِ السَّاعَةِ إِلَّا حَدَّثَ بِهِ حَفِظَهُ مَنْ حَفِظَهُ وَنَسِيَهُ مَنْ نَسِيَهُ قَدْ عَلِمَهُ أَصْحَابِيْ هَؤُلَاءِ وَإِنَّهُ لَيَكُوْنُ مِنْهُ الشَّيْءُ قَدْ نَسِيْتُهُ فَأَرَاهُ فَأَذْكُرُهُ كَمَا يَذْكُرُ الرَّجُلُ وَجْهَ الرَّجُلِ إِذَا غَابَ عَنْهُ ثُمَّ إِذَا رَآهُ عَرَفَهُ. مُتَّفَقٌ عَلَيْهِ.  

5379. (1) [3/1480 ఏకీభవితం]

హుజై’ఫహ్ (ర) కథనం: ప్రవక్త (స) మా మధ్య నిలబడి ప్రసంగించారు. అందులో ప్రళయంవరకు జరగబోయే విషయాలన్నింటినీ పేర్కొన్నారు. ఏ ముఖ్య విషయాన్నీ వదలలేదు. వాటిని గుర్తుంచిన వారు గుర్తుంచారు. మరచిపోయినవారు మరచి పోయారు. ఈ నా మిత్రులు కొందరు కొన్ని విషయాలను గుర్తుంచారు; కొన్ని విషయాలను మరచి పోయారు. నేనూ మరచి పోయాను, కాని ఆ విషయాలను చూసినపుడు అవన్నీ గుర్తుకు వస్తున్నాయి. ఎవరైనా పరిచయ వ్యక్తి ప్రయాణం లోనికి వెళ్ళి చాలారోజుల వరకు రాకపోతే గుర్తుండడు. అతను తిరిగి రాగానే వెంటనే గుర్తుకు వస్తాడు. అతడు ఫలానా వ్యక్తి  అని. (బు’ఖారీ, ముస్లిమ్‌)

5380 – [2 ] ( صحيح ) (3/1480)

وَعَنْهُ قَالَ: سَمِعْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ: “تُعْرَضُ الْفِتَنُ عَلَى الْقُلُوْبِ كَالْحَصِيْرِ عُوْدًا عُوْدًا فَأَيُّ قَلْبٍ أُشْرِبَهَا نكِتَتْ فِيْهِ نُكْتَةٌ سَوْدَاءُ وَأَيُّ قَلْبٍ أَنْكَرَهَا نُكِتَتْ فِيْهِ نُكْتَةٌ بَيْضَاءُ حَتَّى يَصِيْرَ عَلَى قَلْبَيْنِ: أَبْيَضَ بِمِثْلِ الصَّفَا فَلَا تَضُرُّهُ فِتْنَةٌ مَا دَامَتِ السَّمَاواتُ وَالْأَرْضُ وَالْآخَرَ أَسْوَدَ مُرْبَادًا كَالْكُوْزِ مُجَخِّيًا لَا يَعْرِفُ مَعْرُوْفًا وَلَا يُنْكِرُ مُنْكَرًا إِلَّا مَا أُشْرِبَ مِنْ هَوَاهُ”. رَوَاهُ مُسْلِمٌ.  

5380. (2) [3/1480దృఢం]

హుజై’ఫహ్ (ర) కథనం: ప్రవక్త (స) ఇలా ప్రవచిస్తూ ఉండగా నేను విన్నాను, ”కల్లోలాలు ప్రజల హృదయాల్లో చాపరేణువుల్లా ప్రవేశపెట్టబడతాయి. అంటే కల్లోలాల ప్రభావం హృదయాలపై పడుతుంది. దాని ప్రభావాన్ని స్వీకరించిన హృదయంపై ఒక నల్లని మచ్చ ఏర్పడుతుంది. దాన్ని తిరస్కరించిన హృదయం అంటే ప్రభావితంకాని హృదయంపై తెల్లని మచ్చపడుతుంది. అంటే రెండురకాల హృదయాలు ఉంటాయి. ఒకటి నల్లనిహృదయం, మరొకటి తెల్లని హృదయం. తెల్లనిహృదయం తీర్పుదినం వరకు కల్లోలాలకు ప్రభావితంకాదు. దానికి ఎటువంటి నష్టం వాటిల్లదు. నల్లనిహృదయం కొన్ని కల్లోలాలకు ప్రభావితం అవుతుంది. ఈ హృదయంలో విశ్వాసం మిగిలి ఉండదు. అది తిరగవేయబడిన కూజా వంటిది. అదేవిధంగా అందులో మేలు ఉండదు, పుణ్యం ఉండదు.

5381 – [ 3 ] ( متفق عليه ) (3/1480)

وَعَنْهُ قَالَ: حَدَّثَنَا رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم حَدِيْثَيْنِ رَأَيْتُ أَحَدَهُمَا وَأَنَا أَنْتَظِرُ الْآخَرَ. حَدَّثَنَا: “إِنَّ الْأَمَانَةَ نَزَلَتْ فِيْ جَذْرِ قُلُوْبِ الرِّجَالِ ثُمَّ عَلِمُوا مِنَ الْقُرْآنِ ثُمَّ عَلِمُوْا مِنَ السُّنَّةِ”. وَحَدَّثَنَا عَنْ رَفْعِهَا قَالَ: “يَنَامُ الرَّجُلُ النَّوْمَةَ فَتُقْبَضُ الْأَمَانَةُ مِنْ قَلْبِهِ أَثَرُهَا مِثْلَ أَثَرِ الْوَكْتِ ثُمَّ يَنَامُ النَّوْمَةَ قَتُقْبَضُ فَيَبْقَى أَثَرُهَا مَثَلَ أَثَرِ الْمَجلِ كَجَمْرٍ دَحْرَجْتَهُ عَلَى رِجْلِكَ فَنَفِطَ فَتَرَاهُ مُنْتَبِرًا وَلَيْسَ فِيْهِ شَيْءٌ وَيُصْبِحُ النَّاسُ يَتَبَايَعُوْنَ وَلَا يَكَادُ أَحَدٌ يُؤَدِّي الْأَمَانَةَ فَيُقَالُ: إِنَّ فِيْ بَنِيْ فُلَانٍ رَجُلًا أَمِيْنًا وَيُقَالُ لِلرَّجُلِ: مَا أَعْقَلَهُ وَمَا أَظْرَفَهُ وَمَا أَجْلَدَهُ وَمَا فِيْ قَلْبِهِ مِثْقَالُ حَبَّةٍ مِّنْ خَرْدَلٍ مِنْ إِيْمَانٍ”. مُتَّفَقٌ عَلَيْهِ.

5381. (3) [3/1480 ఏకీభవితం]

హుజై’ఫహ్ (ర) కథనం: ‘ప్రవక్త (స) మాకు రెండు విషయాలు గురించి తెలిపారు. వాటిలో ఒకదాన్ని నేను నా కళ్ళతో చూసుకున్నాను, రెండవదాన్ని గురించి వేచి ఉన్నాను.’ ప్రవక్త (స) అమానతు నిజాయితీ ప్రజల హృదయాల వ్రేళ్ళలో దించటం జరి గింది. అంటే సహజంగా అందరూ నిజాయితీ పరులే. ప్రవక్త (స) ఆ అమానతు, నిజాయితీ నశిస్తాయని పేర్కొన్నారు. అంటే ఈ రెండూ ప్రజల హృదయాల నుండి నశిస్తాయి. వారి హృదయాల నుండి అమా నతు ఎలా పోతుందంటే, మనిషి పడు కుంటాడు, ఆ తరువాత మరచిపోతాడు. అతని హృదయంనుండి ఈ రెండూ వెనక్కి తీసుకో బడతాయి. కాని దాని చిహ్నం నల్లని మచ్చలా మిగిలి ఉంటుంది. మళ్ళీ అతడు పడుకుంటాడు. అంటే ఏమరుపాటుకు గురవుతాడు. ఉన్న అమానతు చిహ్నం కూడా చెరిగిపోతుంది. దాని చిహ్నం చిన్న మొటిమలా మిగిలి ఉంటుంది. మీరు అగ్నికణాన్ని కాలిపై వేస్తే బొబ్బలు పుడతాయి, అందులో నీరు, చీము నెత్తురు ఉంటాయి. ప్రజలు పరస్పరం క్రయ విక్రయాలు చేస్తారు. కాని వారిలో ఏమాత్రం నిజాయితీపరులు ఎవరూ ఉండరు. ఇంకా దాన్ని ఎరుగనైనా ఎరుగరు. మంచినీ ఎరుగరు, చెడునుండీ దూరంకారు. అయితే అతడు సంకల్పించుకున్నది తప్ప, అంటే మనో కాంక్షలు.[1] (ముస్లిమ్‌)

5382 – [ 4 ] ( متفق عليه ) (3/1481)

وَعَنْهُ قَالَ: كَانَ النَّاسُ يَسْأَلُوْنَ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم عَنِ الْخَيْرِ وَكُنْتُ أَسْأَلُهُ عَنِ الشَّرِّ مَخَافَةَ أَنْ يُّدْرِكَنِيْ قَالَ: قُلْتُ: يَا رَسُوْلَ اللهِ إِنَّا كُنَّا فِيْ جَاهِلِيَّةٍ وَشَرِّفَجَاءَنَا اللهُ بِهَذَا الْخَيْرِ. فَهَلْ بَعْدَ هَذَا الْخَيْرِ مِنْ شَرٍّ؟ قَالَ: “نَعَمْ” .قُلْتُ: وَهَلْ بَعْدَ ذَلِكَ الشَّرِّمِنْ خَيْرٍ؟ قَالَ: “نَعَمْ. وَفِيْهِ دَخَنٌ”. قُلْتُ: وَمَا دَخَنُهُ؟ قَالَ: “قَوْمٌ يَسْتَنُوْنَ بِغَيْرِ سُنَّتِيْ وَيَهْدُوْنَ بِغَيْرِ هَدَيِيْ تَعْرِفُ مِنْهُمْ وَتُنْكِرُ”. قُلْتُ: فَهَلْ بَعْدَ ذَلِكَ الْخَيْرِمِنْ شَرٍّ؟ قَالَ: “نَعَمْ دُعَاةٌ عَلَى أَبْوَابِ جَهَنَّمَ مَنْ أَجَابَهُمْ إِلَيْهَا قَذَفُوْهُ فِيْهَا”. قُلْتُ: يَا رَسُوْلَ اللهِ صِفْهُمْ لَنَا. قَالَ: “هُمْ مِنْ جِلْدَتِنَا وَيَتَكَلَّمُوْنَ بِأَلْسِنَتِنَا”. قُلْتُ: فَمَا تَأْمُرُنِيْ إِنْ أَدْرَكَنِيْ ذَلِكَ؟ قَالَ: “تَلْزِمُ جَمَاعَةَ الْمُسْلِمِيْنَ وَإِمَامَهُمْ”. قُلْتُ: فَإِنْ لَّمْ يَكُنْ لَّهُمْ جَمَاعَةٌ وَّلَا إِمَامٌ؟ قَالَ: “فَاعْتَزِلْ تِلْكَ الْفَرَقَ كُلَّهَا وَلَوْ أَنْ تَعَضَّ بِأَصْلِ شَجَرَةٍ حَتَّى يُدْرِكَكَ الْمَوْتُ وَأَنْتَ عَلَى ذَلِكَ”. مُتَّفَقٌ عَلَيْهِ.

وَفِيْ رِوَايَةِ لِمُسْلِمِ: قَالَ: “يَكُوْنُ بَعْدِيْ أَئِمَّةٌ لَا يَهْتَدُوْنَ بِهُدَايَ وَلَا يَسْتَنُوْنَ بِسُنَّتِيْ وَسَيَقُوْمُ فِيْهِمْ رِجَالٌ قُلُوْبُهُمْ قُلُوْبُ الشَّيَاطِيْنِ فِيْ جُثْمَانِ إِنْسٍ”. قَالَ حُذَيْفَةَ: قُلْتُ: كَيْفَ أَصْنَعُ يَا رَسُوْلَ اللهِ إِنْ أَدْرَكْتُ ذَلِكَ؟ قَالَ: تَسْمَعُ وَتُطِيْعُ الْأَمِيْرَ وَإِنْ ضُرِبَ ظَهْرُكَ وَأُخِذَ مَالُكَ فَاسْمَعْ وَأَطِعْ”.

5382. (4) [3/1481ఏకీభవితం]

హుజై’ఫహ్ (ర) కథనం: ప్రవక్త (స)ను అనుచరులు మంచిమేలు గురించి ప్రశ్నించేవారు. ఎందులో అధిక పుణ్యంఉందని, అయితే నేను పాపాల గురించి, కల్లో లాల గురించి, ఎక్కడైనా నేను కల్లోలాలకు గురవు తానేమో నని నాకు భయంవేసేది. దాన్నుండి బయట పడే మార్గం ఏది? అనే విషయాల గురించి ప్రవక్త (స) ను అడిగే వాడిని. నేను ప్రవక్త(స)తో, ‘ఓ ప్రవక్తా! మేము ఇస్లామ్‌కు ముందు అజ్ఞానంలో, అవిశ్వాసంలో ఉండేవారం. ఇప్పుడు అల్లాహ్‌ (త) ఇస్లామ్‌ ద్వారా మాకు మంచిచేసే భాగ్యం ప్రసాదించాడు. చాలా మంచి స్థితిలో ఉన్నాం. ఈ మంచిస్థితి తర్వాత ఏదైనా చెడ్డస్థితి రానున్నదా? అంటే ‘ఈ మంచికాలం తరువాత చెడ్డకాలం రానున్నదా,’ అని ప్రశ్నించాను. దానికి ప్రవక్త (స), అవునని అన్నారు ఆ తరువాత మళ్ళీ నేను, ‘ఓ ప్రవక్తా! ఆ చెడ్డస్థితి తర్వాత కూడా మంచి స్థితి వస్తుందా? అంటే ఆ చెడ్డకాలం తర్వాత కూడా మంచికాలం వస్తుందా.’ అని అడిగాను. దానికి ప్రవక్త (స), ‘అవును, కాని అందులో అసంతృప్తి, అశ్రద్ధ ఉంటుంది.’ దానికి నేను, ‘అంటే ఏమిటి?’ అని అడిగాను. దానికి ప్రవక్త (స), ‘నా సాంప్రదాయానికి వ్యతిరేకంగా ఆచరిస్తుంది. నా పద్ధతికి వ్యతిరేకంగా నడుస్తుంది, ఇతరులను కూడా నా సాంప్రదాయానికి వ్యతిరేకంగా నడవమని ప్రోత్సహిస్తుంది, పురికొల్పు తుంది. అంటే అధర్మ కార్యాలను చేస్తుంది, చేయిస్తుంది. దాని చెడును మీరు తెలుసుకుంటారు.’ దానికి నేను, ‘ఓ ప్రవక్తా! ఈ మంచి తరువాత కూడా చెడువస్తుందా?’ దానికి ప్రవక్త (స), ‘అవును,’ అని అన్నారు. ‘నరకంవైపు పిలిచేప్రజలు కూడా ఉంటారు. అంటే బహిరంగంగా చెడువైపు పిలుస్తారు. వారిని అనుసరించేవారు నరకంలో వారి వెంట వెళతారు. వాళ్ళు వారిని నరకంలో పారవేస్తారు,’ అని అన్నారు. దానికి నేను, ‘ఓ ప్రవక్తా! వారెలా ఉంటారు? వారి గుణాలేమిటి తెలుసుకొని వారినుండి దూరంగా ఉంటాం,’ అని అన్నాను. అప్పుడు ప్రవక్త (స), ‘వాళ్ళు మనలాగే ఉంటారు. వాళ్ళు మనజాతి నుండే ఉంటారు. మనభాషే మాట్లాడుతారు,’ అని అన్నారు. దానికి నేను, ‘ఓ ప్రవక్తా! ఒకవేళ ఈకాలం నేను పొందితే మీ ఆదేశం ఏమిటి?’ అని అన్నాను. దానికి ప్రవక్త (స) నీవు ముస్లిములను  అంటిపెట్టుకొని ఉండు, వారి నాయకునికి విధేయుడవై ఉండు,’ అని ఆదేశించారు. దానికి నేను, ‘ఓ ప్రవక్తా! ఒకవేళ ముస్లిముల సంఘం, నాయకుడు లేకపోతే ఏమి చేయాలి?’ అని విన్నవించు కున్నాను. దానికి ప్రవక్త (స), ‘అప్పుడు అసత్య సంఘాలకు దూరంగా ఉంటూ ఏకత్వాన్ని, ప్రవక్త (స) సాంప్రదాయాన్ని అంటి పెట్టుకొని ఉండు. అందులో ఎంత శ్రమ పడవలసిన పరిస్థితి ఉన్నా, ఉపాధిలో ఎంత కష్టం ఉన్నా సరే. చివరికి చెట్ల, చర్మాలు తినవలసి వచ్చినా సరే. ఇంకా పట్టణాలను, ప్రజలను వదలి అడవులకు, కొండలకు వెళ్ళవలసి వచ్చినాసరే. అప్పుడు కూడా నువ్వు ఏకత్వం, ప్రవక్త సాంప్రదాయాన్ని ఎంత మాత్రం వదలకూడదు,’ అని ఉపదేశించారు.[2] (బు’ఖారీ, ముస్లిమ్‌)

ముస్లిమ్‌ ఉల్లేఖనంలో ఇలా ఉంది, ”నా అనంతరం చాలామంది పండితులు నా ఉపదేశాలకు, సాంప్ర దాయాలకు వ్యతిరేకంగా ఆచరిస్తారు. వారిలో కొందరు మానవాకారాల్లో ఉంటారు. కాని వారి హృదయాలు షై’తానుల్లా నల్లగా ఉంటాయి,” అని అన్నారు. దానికి నేను, ‘ఓ ప్రవక్తా! నేనీ కాలం పొందితే ఏం చేయాలి? ‘ అని విన్నవించుకున్నాను. దానికి ప్రవక్త (స), ”ధర్మబద్ధమైన నాయకుడెవడైనా ఉంటే, అతని మాటవినాలి, అతన్ని అనుసరించాలి. మీకు ఎటువంటి ఆపదవచ్చినాసరే, అంటే మీపై అత్యాచారాలు జరిగినాసరే. మీపై కొరడాలు పడినా సరే. అప్పుడు కూడా నీవు ముస్లిమ్‌ నాయకులను  అనుసరించాలి.” అని అన్నారు.

5383 – [ 5 ] ( صحيح ) (3/1482)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “بَادِرُوْا بِالْأَعْمَالِ فِتَنًا كَقِطَعِ اللَّيْلِ الْمُظْلِمِ يُصْبِحُ الرَّجُلُ مُؤْمِنًا وَيُمْسِيْ كَافِرًا وَيُمْسِيْ مُؤْمِنًا وَيُصْبِحُ كَافِرًا يَبِيْعُ دِيْنَهُ بِعَرَضٍ مِّنَ الدُّنْيَا”. رَوَاهُ مُسْلِمٌ .

5383. (5) [3/1482దృఢం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”అంధకారమైన, కఠినమైన ఉపద్రవాలు, కల్లోలాలు రాకముందే సత్కార్యాల్లో ముందడుగు వేయండి, ఎందుకంటే భవిష్యత్తులో కారుచీకటి రాత్రుల్లో నల్లని ఉపద్రవాలు జనిస్తాయి. అప్పుడు ఏ మంచి విషయమూ అర్థంకాదు. మనిషి ఉదయం విశ్వాసస్థితిలో లేస్తాడు. కల్లోలాలు, ఉపద్రవాల వల్ల సాయంత్రం అవిశ్వాసిగా మారిపోతాడు. సాయంత్రం విశ్వాసిగా ఉంటాడు. ఉదయం అవిశ్వాసి అయిపోతాడు. తన నీతీ నిజాయితీలను ప్రాపంచిక స్వల్పలాభాల కోసం అమ్మివేస్తాడు.”  [3]  (ముస్లిమ్‌)

5384 – [ 6 ] ( متفق عليه ) (3/1482)

وَعَنْهُ قَالَ: قَالَ رَسُولُ اللهِ صلى الله عليه وسلم: “سَتَكُوْنَ فِتَنٌ الْقَاعِدُ فِيْهَا خَيْرٌمِّنَ الْقَائِمِ وَالْقَائِمُ فِيْهَا خَيْرٌمِّنَ الْمَاشِيْ وَالْمَاشِيْ فِيْهِ خَيْرٌمِّنَ السَّاعِيْ مَنْ تَشَرَّفَ لَهَا تَسْتَشْرِفْهُ فَمَنْ وَجَدَ مَلْجَأً أَوْ مَعَاذًا فَلْيَعِذْ بِهِ”. مُتَّفَقٌ عَلَيْهِ.

وَفِيْ رِوَايَةٍ لِّمُسْلِمٍ قَالَ: “تَكُوْنُ فِتْنَةٌ النَّائِمُ فِيْهَا خَيْرٌمِّنَ الْيَقْظَانِ وَالْيَقْظَانُ خَيْرٌ مِّنَ الْقَائِمِ وَالْقَائِمُ فِيْهَا خَيْرٌ مِّنَ السَّاعِيْ فَمَنْ وَجَدَ مَلْجَأً أَوْمَعَاذًا فَلْيَسْتَعِذْ بِهِ”.

5384. (6) [3/1482ఏకీభవితం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”భవిష్యత్తులో చాలా పెద్ద ఉపద్రవాలు బహిర్గతం అవుతాయి. ఈ ఉపద్రవాల కాలంలో కూర్చున్నా వాడు, నిలబడిన వాడికంటే నయం, నిలబడినవాడు నడిచేవాడికంటే నయం, మెల్లగా నడిచేవాడు ఉపద్రవాలవైపు పరిగెత్తే వానికంటే నయం, ఉపద్రవాల వైపు తొంగిచూస్తే ఉపద్రవాలు కూడా తొంగిచూస్తాయి. ఎక్కడైనా శరణుపొందే స్థలం కనిపిస్తే, అక్కడ శరణు తీసుకోవాలి. [4]  (బు’ఖారీ, ముస్లిమ్‌)

ముస్లిమ్‌ ఉల్లేఖనంలో ఇలా ఉంది, ”ప్రవక్త (స) ప్రవచనం, ”భవిష్యత్తులో ఉపద్రవం తలెత్తుతుంది. అందులో నిద్రపోయేవాడు, మేల్కొన్నవాడి కంటే ఉత్తముడు, మేల్కొని ఉన్నవాడు నిలబడినవాడికంటే ఉత్తముడు, నిలబడినవాడు పరిగెత్తేవానికంటే ఉత్తముడు. అప్పుడు ఎవరైనా రక్షణపొందే స్థలం పొందితే వెంటనే అందులో ప్రవేశించి రక్షణ పొందాలి.  

5385 – [ 7 ] ( صحيح ) (3/1482)

وَعَنْ أَبِيْ بَكْرَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِنَّهَا سَتَكُوْنُ فِتَنٌ أَلَا ثُمَّ تَكُوْنُ فِتَنٌ أَلَا ثُمَّ تَكُوْنُ فِتْنَةُ الْقَاعِدُ خَيْرٌمِّنَ الْمَاشِيْ فِيْهَا وَالْمَاشِيْ فِيْهَا خَيْرٌ مِّنَ السَّاعِيْ إِلَيْهَا أَلَا فَإِذَا وَقَعَتْ فَمَنْ كَانَ لَهُ إِبِلٌ فَلْيَلْحَقْ بِإِبْلِهِ وَمَنْ كَانَ لَهُ غَنَمٌ فَلْيَلْحَقْ بِغَنَمِهِ وَمَنْ كَانَتْ لَهُ أَرْضٌ فَلْيَلْحَقْ بِأَرْضِهِ” .فَقَالَ رَجُلٌ: يَا رَسُوْلَ اللهِ أَرَأَيْتَ مَنْ لَمْ يَكُنْ لَهُ إِبِلٌ وَلَا غَنَمٌ وَلَا أَرْضٌ؟ قَالَ: “يَعْمِدُ إِلى سَيْفِهِ فَيَدْقُ عَلَى حَدِّهِ بِحَجَرٍ ثُمَّ لْيَنْجُ إِنِ اسْتَطَاعَ النَّجَاءَ اللّهُمَّ هَلْ بَلَّغْتُ؟ ” ثَلَاثًا. فَقَالَ رَجُلٌ: يَا رَسُوْلَ اللهِ أَرَأَيْتُ إِنْ أُكْرِهْتُ حَتّى يُنْطَلَقَ بِيْ إِلى أَحَدِالصَّفَّيْنِ فَضَرَبَنِيْ رَجُلٌ بِسَيْفِهِ أَوْ يَجِيْءُ سَهْمٌ فَيَقْتُلُنِيْ؟ قَالَ: “يَبُوْءُ بِإِثْمِهِ وَإِثْمِكَ وَيَكُوْنُ مِنْ أَصْحَابِ النَّارِ” .رَوَاهُ مُسْلِمٌ.

5385. (7) [3/1482 దృఢం]

అబూ బకర్(ర) కథనం: ప్రవక్త(స) ప్రవచనం: ”నిస్సందే హంగా భవిష్యత్తులో ఉపద్రవాలు తలెత్తు తాయి. మళ్ళీ గుర్తుంచుకోండి, ఉపద్రవాలు తలెత్తు తాయి. గుర్తుంచుకోండి, ఆ తరువాత ఒక మహా ఉపద్రవం తలెత్తుతుంది. అందులో కూర్చున్నవాడు నడిచేవాడి కంటే, నడిచేవాడు పరిగెత్తేవాడి కంటే ఉత్తముడు. గుర్తుంచు కోండి, ఉపద్రవాలు తలెత్తి నపుడు, అడవిలో ఒంటెలు ఉన్నవారు వాటి దగ్గరకు వెళ్ళిపోవాలి. మేకలున్నవారు వాటిదగ్గరకు వెళ్ళి పోవాలి. భూమి ఉన్నవారు, తన భూమివద్దకు వెళ్ళి పోవాలి,” అని అన్నారు. అప్పుడు ఒక వ్యక్తి, ”ఒంటెలు మేకలు భూమి లేనివారు ఏమి చేయాలి?” అని విన్నవించుకున్నాడు. దానికి ప్రవక్త(స) అతడు తనకరవాలం రాతిపై కొట్టి త్రెంచి, ఉపద్రవాల ప్రాంతం నుండి పారిపోగలిగితే పారిపోవాలి,”  అని పలికి, ‘ఓ అల్లాహ్ (త) నేను నీ ఆదేశాలను నీ దాసులకు అందజేశానా?’ అని అన్నారు. ఇలా మూడుసార్లు పలికారు. అప్పుడు ఒకవ్యక్తి, ‘ఓ అల్లాహ్ ప్రవక్తా ఒకవేళ ఇద్దరు విరోధుల్లో ఒకరు నన్ను బలవంతంగా తనవర్గం వద్దకు తీసుకుపోతే లేదా ఎవరైనా నన్ను తనకరవాలంతో చంపివేస్తే లేదా ఏదైనా బాణంవచ్చి నాకు తగిలి, నేను మరణిస్తే, హంతకుని గురించి మీ ఆదేశం ఏమిటి?’ అని విన్నవించు కున్నాడు. దానికి ప్రవక్త (స) అతడు అతడి పాపం, నీ పాపం తీసుకొని తిరిగి వెళతాడు. ఇంకా అతడు నరకవాసునిగా పరిగణించబడతాడు.’  (ముస్లిమ్)

5386 – [ 8 ] ( صحيح ) (3/1482)

وَعَنْ أَبِيْ سَعِيْدٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “يُوْشِكَ أَنْ يَّكُوْنَ خَيْرَ مَالِ الْمُسْلِمِ غَنَمٌ يَتَّبِعُ بِهَا شَغَفُ الْجِبَالِ وَمَوَاقِعَ الْقَطَرِ يَفِرُّ بِدِيْنِهِ مِنَ الْفِتَنِ”. رَوَاهُ الْبُخَارِيُّ.

5386. (8) [3/1482 దృఢం]

అబూ స’యీద్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”భవిష్యత్తులో ముస్లిముల అమూల్యసంపద మేకలు అవుతాయి. మేకలను తీసుకొని కొండలపై వర్షం పడే ప్రదేశాల్లోకి వెళ్ళడం జరుగుతుంది. ఈవిధంగా తన ధర్మాన్ని, విశ్వాసాన్ని రక్షించుకోవటానికి ఉపద్రవ ప్రదేశాలనుండి పారిపోవడం జరుగుతుంది. (బు’ఖారీ)

5387 – [ 9 ] ( متفق عليه ) (3/1483)

وَعَنْ أُسَامَةَ بْنِ زَيْدٍ قَالَ: أَشْرَفَ النَّبِيُّ صلى الله عليه وسلم عَلَى أُطُمٍ مِنْ آطَامِ الْمَدِيْنَةِ فَقَالَ: “هَلْ تَرَوْنَ مَا أَرَى؟ قَالُوْا: لَا. قَالَ: “فَإِنِّيْ لَأَرَى الْفِتَنَ خِلَالَ بُيُوْتِكُمْ كَوَقْعِ الْمَطَرِ”.

5387. (9) [3/1483 ఏకీభవితం]

ఉసామా బిన్‌ ‘జైద్‌ (ర) కథనం: ప్రవక్త (స) మదీనహ్ మునవ్వరహ్లోని ఒక ఎత్తైన గుట్టపై ఎక్కి అనుచరులను ఉద్దేశించి, ‘నేను చూస్తున్న విషయాన్ని మీరు కూడా చూస్తున్నారా?’ అని అన్నారు. దానికి అనుచరులు, ‘లేదు,’ అని అన్నారు. అప్పుడు ప్రవక్త (స), ”నేను ఉపద్రవాలను చూస్తున్నాను. అవి మీ ఇళ్ళపై, నివాసాలపై కురుస్తున్నాయి. వర్షం కురుస్తున్నట్టు” అని అన్నారు. [5] (బు’ఖారీ, ముస్లిమ్‌)

5388 – [ 10 ] ( صحيح ) (3/1483)

وعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “هَلَكَةُ أُمَّتِيْ عَلَى يَدَيُ غِلْمَةٍ مِنْ قُرَيْشٍ”. رَوَاهُ الْبُخَارِيُّ.

5388. (10) [3/1483 దృఢం]

అబూ హురైరహ్‌(ర) కథనం: ప్రవక్త(స) ప్రవచనం ”నా అనుచర సంఘం వినాశనం ఖురైష్‌కు చెందిన కొందరు యువకుల ద్వారా జరుగుతుంది.”  [6]  (బు’ఖారీ)

5389 – [ 11 ] ( متفق عليه ) (3/1483)

وَعَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “يَتَقَارَبُ الزَّمَانُ وَيُقْبَضُ الْعِلْمُ وَتَظْهَرُ الْفِتَنُ وَيُلْقَى الشُّحُّ وَيَكْثُرُ الْهَرْجُ”. قَالُوْا: ومَا الْهَرْجُ؟ قَالَ: “اَلْقَتْلُ”. مُتَّفَقٌ عَلَيْهِ.

5389. (11) [3/1483 ఏకీభవితం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”కాలం త్వరగా గడుస్తుంది, ధార్మికవిద్య క్రమంగా నశిస్తుంది. ఉపద్రవాలు బహిర్గతం అవుతాయి. ప్రాపంచిక వాంఛలు, కోరికలు సర్వ సాధారణం అయి పోతాయి, ‘హర్జ్ అధికం అవుతుంది,” అని అన్నారు. ప్రజలు, ‘ఓ ప్రవక్తా! హర్‌జ్‌ అంటే ఏమిటి?’ అని అన్నారు. దానికి ప్రవక్త (స) యుద్ధాలు, దాడులు, రక్తపాతాలు,’ అని  అన్నారు. [7]  (బు’ఖారీ)

5390 – [ 12 ] ( صحيح ) (3/1483)

وَعَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “وَالَّذِيْ نَفْسِيْ بِيَدِهِ لَا تَذْهَبُ الدُّنْيَا حَتَّى يَأْتِيَ يَوْمٌ لَا يَدْرِي الْقَاتِلُ فِيْمَ قَتَلَ؟ وَلَا الْمَقْتُوْلُ فِيْمَ قُتِلَ؟ فَقِيْلَ: كَيْفَ يَكُوْنُ ذَلِكَ؟ قَالَ: “اَلْهَرجُ الْقَاتِلُ وَالْمَقْتُوْلُ فِي النَّارِ”. رَوَاهُ مُسْلِمٌ.  

5390. (12) [3/1483 దృఢం]

అబూ హురైరహ్‌ (ర) కథనం : ప్రవక్త (స), ”ప్రజలు పరస్పరం ఎలా తోచితే అలా చంపుకుంటారు, చంపే వారు ఎందుకు చంపుకుంటున్నారో తెలుసుకోరు, మరణించేవారు ఎందుకు చంపబడుతున్నారో తెలుసుకోరు. ఈకాలం రానంతవరకు ప్రళయం సంభవించదు, ” అని ప్రవచించారు. దానికి ప్రజలు, ‘అదెలా జరుగుతుంది?’ అని అన్నారు. అప్పుడు ప్రవక్త(స), ‘యుద్ధాలు, ఉపద్రవాల కాలం వస్తుంది, ఇటువంటి అధర్మయుద్ధాల్లో చంపేవాడు, చంపబడిన వాడు ఇద్దరూ నరకంలోనికి వెళతారు,’  అని అన్నారు. (ముస్లిమ్‌)

5391 – [ 13 ] ( صحيح ) (3/1483)

وعَنْ مَعْقَلِ بْنِ يَسَارٍقَالَ قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “اَلْعِبَادَةُ  فِي الْهَرْجِ كَهِجْرَةٍ إِلَيَّ”. رَوَاهُ مُسْلِمٌ.

5391. (13) [3/1483 దృఢం]

మ’అఖల్‌ బిన్‌ యసార్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఉపద్రవాలు, కల్లోలాలు, యుద్ధాల కాలం లో దైవారాధనచేస్తే దానికి నావైపు వలసరావటానికి సమానంగా పుణ్యం లభిస్తుంది.”  [8] (ముస్లిమ్‌)

5392 – [ 14] ( صحيح ) (3/1483)

وعَنْ الزُّبَيْرِ بْنِ عَدِيٍّ قَالَ: أَتَيْنَا أَنَسَ بْنَ مَالِكٍ فَشَكَوْنَا إِلَيْهِ مَا نَلْقَى مِنَ الْحَجَّاجِ. فَقَالَ: “اصْبِرُوْا فَإِنَّهُ لَا يَأْتِيْ عَلَيْكُمْ زَمَانٌ إِلَّا الَّذِيْ بَعْدَهُ أَشَرُّمِنْهُ حَتَّى تَلْقَوْا رَبَّكُمْ”. سَمِعْتُهُ مِنْ نَبِيِّكُمْ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ. رَوَاهُ الْبُخَارِيُّ.

5392. (14) [3/1483దృఢం]

‘జుబైర్‌ బిన్‌ ‘అదీ (ర) కథనం: మేము అనస్‌ బిన్‌ మాలిక్‌ వద్దకు వెళ్ళాము. హజ్జాజ్‌ దుర్మార్గాలు, హింసల గురించి ఫిర్యాదు చేసాము. దానికి అతను ”మీరు సహనం, ఓర్పు వహించండి. రాబోయే కాలం గడిచిన కాలం కన్నా హీనంగా ఉంటుంది. దాని తరువాత దానికంటె హీనమైన కాలం వస్తుంది. చివరికి మీరు అల్లాహ్ ను కలుసుకుంటారు, అంటే మరణం. ఈ మాటలు నేను ప్రవక్త (స) ద్వారా విన్నాను,” అని అన్నారు. (బు’ఖారీ)

—–

اَلْفَصْلُ الثَّانِيْ  రెండవ విభాగం   

5393 – [ 15 ] ( ضعيف ) (3/1483)

عَنْ حُذَيْفَةَ قَالَ: وَاللهِ مَا أَدْرِيْ أَنَسِيَ أَصْحَابِيْ أَمْ تَنَاسَوْا؟ وَاللهِ مَا تَرَكَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم مِنْ قَائِدِ فِتْنَةِ إِلى أَنْ تَنْقَضِيَ الدُّنْيَا يَبْلُغُ مَنْ مَعَهُ ثَلَاثَ مِائَةٍ. فَصَاعِدًا إِلَّا قَدْ سَمَّاهُ لَنَا بِاِسْمِهِ وَاسْمِ أَبِيْهِ وَاسْمِ قَبِيْلَتِهِ. رَوَاهُ أَبُوْ دَاوُدَ.

5393. (15) [3/1483 బలహీనం]

హుజై’ఫహ్ (ర) కథనం: ‘అల్లాహ్‌(త) సాక్షి! నా మిత్రులు మరచిపోయారని, లేదా మరచి పోయామని చెపుతున్నారని భావించను. వాస్తవం ఏమిటంటే వాళ్ళు మరచిపోలేదు. అల్లాహ్ సాక్షి! ప్రవక్త (స) ఈ నాటి నుండి తీర్పుదినం వరకు ఉపద్రవాలు సృష్టించే ఎటువంటి వ్యక్తిని వదలిపెట్టలేదు.’ అంటే ఉపద్రవాలు సృష్టించే వ్యక్తి గురించి అతని అనుచరుల సంఖ్య 300 లేదా 300 కంటే అధికంగా ఉంటారు. చివరికి మాకు వాడి తండ్రి గురించి, అతని తెగ గురించి పేర్లతో సహా తెలిపారు.” (అబూ  దావూద్‌)

5394 – [ 16 ] ( صحيح ) (3/1484)

وَعَنْ ثَوْبَانَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِنَّمَا أَخَافُ عَلَى أُمَّتِيَ الْأَئِمَّةَ الْمُضِلِّيْنَ. وَإِذَا وُضِعَ السَّيْفُ فِيْ أُمَّتِيْ لَمْ يُرْفَعْ عَنْهُمْ إِلى يَوْمِ الْقِيَامَةِ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ وَالتِّرْمِذِيُّ .

5394. (16) [3/1484దృఢం]

సౌ’బాన్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”నేను నా అనుచర సమాజం విషయంలో ధర్మవ్యతిరేక నాయకులు, పండితుల పట్ల భయపడుతున్నాను. ఈ కరవాలం నా అనుచర సమాజంలో కొనసాగితే తీర్పు దినం వరకు ఆగదు. అంటే నా అనుచర సమాజంలో హత్యలు, యుద్ధాలు, ఉపద్రవాలు ప్రారంభం అవుతాయి. అవి ప్రళయంతోనే ఆగుతాయి.” [9]  (అబూ  దావూద్‌, తిర్మిజీ’)

5395 – [ 17 ] ( حسن ) (3/1484)

وعَنْ سَفِيْنَةَ قَالَ: سَمِعْتُ النَّبِيَّ صلى الله عليه وسلم يَقُوْلُ: “اَلْخِلَافَةُ ثَلَاثُوْنَ سَنَةً ثُمَّ تَكُوْنُ مُلْكًا”. ثُمَّ يَقُوْلُ سَفِيْنَةُ: أَمْسِكْ خِلَافَةَ أَبِيْ بَكْرٍ سَنَتَيْنِ وَخَلَافَةَ عُمَرَ عَشْرَةَ وَعُثْمَانَ اثْنَتَيْ عَشَرَةَ وَعَلِيٍّ سِتَّةً. رَوَاهُ أَحْمَدُ وَالتِّرْمِذِيُّ وَأَبُوْ دَاوُدَ.  

5395. (17) [3/1484ప్రామాణికం]

సఫీనహ్ (ర) కథనం: ప్రవక్త (స)ను ఇలా ప్రవచిస్తూ ఉండగా విన్నాను, 30 సంవత్సరాల వరకు ప్రవక్త (స) సాంప్రదాయం ప్రకారం పరిపాలన సాగుతుంది. ఆ తరువాత రాజరికంవస్తుంది. సఫీనహ్ ఇలా అన్నారు, ”అబూ బకర్‌ పరిపాలన 2 సంవత్సరాలు, ‘ఉమర్‌ పరిపాలన 10 సంవత్సరాలు, ‘ఉస్మాన్‌ పరిపాలన 12 సంవత్సరాలు, ‘అలీ పరిపాలన 4 సంవత్సరాలు.” [10] (అ’హ్మద్‌, తిర్మిజి’, అబూ దావూద్‌)

5396 – [ 18 ] ( لم تتم دراسته ) (3/1484)

وَعَنْ حُذَيْفَةَ قَالَ: قُلْتُيَا رَسُوْلَ اللهِ أَيَكُوْنُ بَعْدَ هَذَا الْخَيْرِ شَرٌّ كَمَا كَانَ قَبْلَهُ شَرٌّ؟ قَالَ: “نَعَمْ”. قُلْتُ: فَمَا الْعِصْمَةُ؟ قَالَ: “السَّيْفُ”. قُلْتُ: وَهَلْ بَعْدَ السَّيْفِ بَقِيَّةٌ؟ قَالَ: “نَعَمْ تَكُوْنُ إِمَارَةٌ عَلَى أَقْذَاءٍ وَهُدْنَةٌ عَلَى دَخَنٍ”. قُلْتُ: ثُمَّ مَاذَا؟ قَالَ: “ثُمَّ يَنْشَأُ دُعَاةُ الضَّلَالِ فَإِنْ كَانَ لِلّهِ فِي الْأَرْضِ خَلِيْفَةٌ جَلَدَ ظَهْرَكَ وَأَخَذَ مَالَكَ فَأَطِعْهُ وَإِلَّا فَمُتْ وَأَنْتَ عَاضٌ عَلَى جِذْلِ شَجَرَةٍ”. قُلْتُ: ثُمَّ مَاذَا؟ قَالَ: “ثُمَّ يَخْرُجُ الدَّجَّالُ بَعْدَ ذَلِكَ مَعَهُ نَهْرٌ وَنَارٌ فَمَنْ وَّقَعَ فِيْ نَارِهِ وَجَبَ أَجْرُهُ وَحُطَّ وزره وَمَنْ وَقَعَ فِيْ نَهْرِهِ وَجَبَ وِزْرُهُ وَحُظَّ أَجْرُهُ”. قَالَ قُلْتُ: ثُمَّ مَاذَا؟ قَالَ: “ثُمَّ يُنْتَجُ الْمُهْرُ فَلَا يُرْكَبُ حَتَّى تَقُوْمَ السَّاعَةُ”.

وَفِيْ رِوَايَةٍ: “هُدْنَةٌ عَلَى دَخَنِ وَجَمَاعَةٌ عَلَى أَقْذَاءٍ”. قُلْتُ: يَا رَسُوْلَ اللهِ الْهُدْنَةُ عَلَى الدَّخَنِ مَا هِيَ؟ قَالَ: “لَا تَرْجِعُ قُلُوْبُ أَقْوَامٍ كَمَا كَانَتْ عَلَيْهِ”. قُلْتُ: بَعْدَ هَذَا الْخَيْرِ شَرٌّ؟ قَالَ: “فِتْنَةٌ عَمْيَاءُ صَمَّاءٌ عَلَيْهَا دُعَاةٌ عَلَى أَبْوَابِ النَّارِ فَإِنْ مُتَّ يَا حُذَيْفَةَ وَأَنْتَ عَاضٌّ عَلَى جِذْلٍ خَيْرٌ لَكَ مِنْ أَنْ تَتَّبِعَ أَحَدًا مِنْهُمْ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ.

5396. (18) [3/1484అపరిశోధితం]

హుజై’ఫహ్ (ర) కథనం: నేను ప్రవక్త (స)ను, ‘ఓ ప్రవక్తా! ఈ మంచి కాలం తర్వాత చెడ్డకాలం కూడా వస్తుందా? ఇస్లామ్‌కు ముందు అవిశ్వాసులు, పాపాత్ములు ఉన్నట్లు, ఇస్లామ్‌ తర్వాతకూడా ఉంటారా?’ అని విన్నవించుకున్నాను. ప్రవక్త (స), ‘అవును,’ అని అన్నారు. దానికి నేను, ‘ఓప్రవక్తా!దాన్నుండి తప్పించు కోవటం ఎలా సాధ్యం?’ అని ప్రశ్నించాను. దానికి ప్రవక్త (స) ‘కరవాలం ద్వారా అంటే వారిని ఎదుర్కొని,’ అని అన్నారు. ప్రవక్త (స) తర్వాత కొంత మంది ఇస్లామ్‌ను త్యజించారు. అబూ బకర్‌ (ర) వారితో యుద్ధం చేసి ఆ ఉపద్రవాన్ని పరిష్కరించారు. మళ్ళీ నేను ”ఈ కర వాలాన్ని ఉపయోగించిన తర్వాత ముస్లిములు మిగిలి ఉంటారా?”అని ప్రశ్నించాను. దానికి ప్రవక్త(స)’అవును కాని అప్పటి పరిపాలన ఇస్లామీయ పరిపాలన ఉండదు. కల్లోలాలు,  ఉపద్రవాల ద్వారా స్థిరపరచటం జరుగుతుంది. పైకి మాత్రం ఇస్లామీయ ప్రభుత్వంలా కనబడుతుంది. కాని లోపల వారిహృదయాలు అపరిశుద్ధంగా ఉంటాయి. ధూళితో నిండి ఉంటాయి. కాని చూడటానికి చాలా అందంగా ఉంటాయి. దగా, మోసాలపై ఒప్పందాలు జరుగుతాయి,’ అని అన్నారు. దానికి నేను, ‘ఓ ప్రవక్తా! మరేం జరుగుతుంది,’ అని అడి గాను. ప్రవక్త (స) ఆ తరువాత ఒక సంఘం పుడుతుంది. అది మార్గ భ్రష్టత్వం, మోసం, ద్రోహం వైపు పిలుస్తుంది. ఒకవేళ ఎక్కడైనా ముస్లిం పాలకులు ఉంటే వారు దుర్మార్గులు, అధర్ములు, అసత్యవంతులు మిమ్మల్ని హింసించేవారు అయిఉంటారు. మీ ధన సంపదలను లాక్కుంటారు. అప్పుడు కూడా ధర్మ సమ్మతమైన విషయాల్లో వారికి విధేయతచూపాలి. వారికి ద్రోహం చేయరాదు. ఒకవేళ ముస్లిం పాలకులు లేకపోతే, అధర్మవర్గాలకు దూరంగా ఉండండి. చెట్టు క్రింద ఏకాంతం అనుసరించండి. అడవుల్లో జీవితం కొనసాగించండి. మీకు కష్టాలు భరించవలసి వచ్చినా సరే. తినరాని వస్తువులు తిని జీవితం గడపవలసి వచ్చినా సరే,’ అని అన్నారు. ఆ తర్వాత నేను, ‘ఓ ప్రవక్తా! ఆ తరువాత ఏం జరుగుతుంది,’ అని విన్న వించుకున్నాను. అప్పుడు ప్రవక్త (స), ‘ఆ తరువాత దజ్జాల్‌ బహిర్గతం అవుతాడు, వాడివెంట నీటికాలువ మరియు అగ్ని అంటే చల్లదనం, వేడి ఉంటాయి. వాడు ప్రజలను నేను దైవాన్నని, నన్ను ఆరాధించమని బలవంతం చేస్తాడు. వాడిని దైవంగా విశ్వసించని వారిని అగ్నిలో పడవేస్తాడు. విశ్వసించినవారిని నీటిలో. అగ్నిలో పడినవాడు వీరమరణం పొందుతాడు. అతని ప్రతిఫలం అతనికి దక్కి తీరుతుంది. అతని పాపాలను క్షమించటం జరుగుతుంది. నీటిలో పడినవాడికి అతని పాపం చుట్టుకుంటుంది. అతని పుణ్యం నాశనం అవుతుంది,’ అని అన్నారు. నేనిలా అన్నాను, ‘ఓ ప్రవక్తా! ఆ తరువాత ఏం జరుగుతుంది అని ప్రశ్నించాను. దానికి ప్రవక్త (స), ”ఆ తరువాత సుఖ విలాసాల కాలం వస్తుంది. ప్రజలు గుర్రాలు పెంచుతారు. దానివల్ల సంతానం కలుగుతుంది. కాని దానిపై స్వారీ మాత్రం జరగదు. అంటే అవి స్వారీ చేయటానికి పనికిరావు. అంటే తీర్పుదినం ఆసన్నం అవుతుంది. ఇంకా ఇది ‘ఈసా (అ) కాలం అయి ఉంటుంది. అతని కాలంలో ఎవరూ అవిశ్వాసులుగా ఉండరు. అప్పుడు యుద్ధం చేసే అవసరం ఉండదు.”

మరో ఉల్లేఖనంలో ఇలా ఉంది: ”మోసం, ద్రోహాలపై ఒప్పందాలు జరుగుతాయి. ఒక వర్గం కాపట్యంతో కూడుకొని ఉంటుంది,” అని అన్నారు. దానికి నేను, ‘ద్రోహం, మోసాలపై ఒప్పందం అంటే ఏమిటి,’ అని అడిగాను. దానికి ప్రవక్త (స) సమాధానంఇస్తూ, ‘ప్రజల హృదయాలు కేవలం విశ్వాసంతో నిండి ఉండవు, ముందు ఉన్నట్టు’ అని అన్నారు. దానికి నేను, ‘ఓ ప్రవక్తా! ఆ కాలం తరువాత చెడ్డ కాలం వస్తుందా?’ అని ప్రశ్నించాను. దానికి ప్రవక్త (స), ‘అవును, అంధ కార యుగం వస్తుంది. ఆ కల్లోల ద్వారం వద్ద కూర్చొని ప్రజలు నరకంవైపు పిలుస్తారు. హుజై’హ్! ఒకవేళ నీవు ఇటువంటి కాలంలో బ్రతికుంటే, ఇటువంటి కల్లోల పూరిత ప్రజలకు దూరంగా ఉండు. నీకు అనేక కష్టాలు భరించవలసి వస్తుంది. కర్రలు నమిలే పరిస్థితి వస్తుంది. అయితే నీవు ఆ స్థితిలోనే ఉండాలి. అందులోనే నీకు శుభం ఉంది. నీవు వారిని ఎంత మాత్రం అనుసరించ కూడదు.” (అబూ  దావూద్‌)

5397 – [ 19 ] ( لم تتم دراسته ) (3/1485)

وَعَنْ أَبِيْ ذَرٍّ قَالَ: كُنْتُ رَدِيْفًا خَلْفَ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم يَوْمًا عَلَى حِمَارٍ فَلَمَّا جَاوَزْنَا بُيُوْتَ الْمَدِيْنَةِ قَالَ: “كَيْفَ بِكَ يَا أَبَا ذَرٍّ إِذَا كَانَ بِالْمَدِيْنَةِ جُوْعٌ تَقُوْمُ عَنْ فِرَاشِكَ وَلَا تَبْلُغُ مَسْجِدَكَ حَتَّى يُجْهِدَكَ الْجُوْعُ؟” قَالَ قُلْتُ: اللهُ وَرَسُوْلُهُ أَعْلَمُ. قَالَ: “تَعَفَّفْ يَا أَبَا ذَرٍّ”. قَالَ: “كَيْفَ بِكَ يَا أَبَا ذَرٍّ إِذَا كَانَ بِالْمَدِيْنَةِ مَوْتٌ يَبْلُغُ الْبَيْتُ الْعَبْدِ حَتَّى إِنَّهُ يُبَاعُ الْقَبْرُ بِالْعَبْدِ؟ “قَالَ: قُلْتُ اللهُ وَرَسُوْلُهُ أَعْلَمُ. قَالَ: ” تَصَبَّرُ يَا أَبَا ذَرٍّ”. قَالَ: “كَيْفَ بِكَ يَا أَبَا ذَرٍّ إِذَا كَانَ بِالْمَدِيْنَةِ قَتْلٌ تَغْمُرُ الدِّمَاءُ أَحْجَارَ الزَّيْتِ؟” قَالَ: قُلْتُ: اللهُ وَرَسُوْلُهُ أَعْلَمُ. قَالَ: “تَأْتِيْ مَنْ أَنْتَ مِنْهُ”. قَالَ: قُلْتُ: وَأَلْبَسُ السِّلَاحَ؟ قَالَ: “شَارَكْتَ الْقَوْمَ إِذَا”. قُلْتُ: فَكَيْفَ أَصْنَعُ يَا رَسُوْلَ اللهِ؟ قَالَ: “إِنْ خَشِيْتَ أَنْ يَبْهَرَكَ شُعَاعُ السَّيْفِ فَأَلْقِ نَاحِيَةَ ثَوْبِكَ عَلَى وَجْهِكَ لِيَبُوْءَ بِاِثْمِكَ وَإِثْمِهِ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ.  

5397. (19) [3/1485అపరిశోధితం]

అబూ జ’ర్‌ (ర) కథనం: ఒక రోజు నేను ప్రవక్త (స) వెనుక కంచరగాడిదపై కూర్చొని ఉన్నాను.  అప్పుడు మేము మదీనహ్ వెలుపలకు చేరుకున్నాం. అప్పుడు ప్రవక్త (స) నాతో ఓ అబూ జ’ర్‌! ఎండ సమయంలో నీవు మేల్కొంటే, ఇంకా మస్జిదె నబవీ వరకు ఆకలితో చేరలేక పోయినపుడు, చాలా కష్టంతో అక్కడికి చేరి నపుడు అంటే కరువుకాటకాలు సంభవించినపుడు, దానివల్ల ప్రజలు దారిద్య్రంవల్ల బలహీనులైనప్పుడు, వారి నడవటం కష్టంఅయినప్పుడు, నువ్వు కూడా బలహీనపడి మస్జిద్‌ వరకురావటం కష్టం అయి నపుడు నీవు ఏంచేస్తావు?’ అనిఅడిగారు. దానికి నేను ‘అల్లాహ్‌ (త), ఆయన ప్రవక్తకే దాన్ని గురించి బాగా తెలుసు’ అని అన్నాను. అప్పుడు ప్రవక్త (స), ‘నీవు ఆ సమయంలో క్షేమాన్ని, దైవభీతిని అనుసరిస్తూ, ఓర్పు సహనాలను కలిగి ఉంటూ అనుమా నాస్పద విషయాలకు దూరంగా ఉండాలి,’ అని అన్నారు. ఆ తరువాత మళ్ళీ ప్రవక్త (స), ‘ఓ అబూ జ’ర్‌! మదీ నహ్లో అనేకమంది మరణించి నపుడు, శవాలను ఖననం చేయడానికి బదులు అమ్మడం జరిగినపుడు, అంటే కరువు కాటకాల వల్ల కలరా మొదలైన వ్యాధుల వల్ల చాలామంది చనిపోయినపుడు, సమాధి స్థలం వెల ఇచ్చి కొనడం జరుగుతుంది. అప్పుడు నీ పరి స్థితి ఎలా ఉంటుంది?’ అని అడిగారు. దానికి నేను, ‘అల్లాహ్‌ ఆయనప్రవక్తకే బాగాతెలుసు,’ అని అన్నాను. దానికి ప్రవక్త (స) నువ్వు సహనం పాటించాలి. అటూ ఇటూ పారిపోకూడదు.’ ఆ తరువాత మళ్ళీ ప్రవక్త (స), ‘ఓ అబూ జ’ర్‌! మదీన హ్లో హత్యలు సర్వసాధా రణం అయినపుడు, రక్త పాతం జరిగినపుడు, జైత్‌ రాళ్ళు రక్తసిక్తం అయి నపుడు, అప్పుడు నీవు ఏం చేస్తావు,’ అని అడిగారు. దానికి నేను అల్లాహ్‌ ఆయన ప్రవక్త (స)కే బాగా తెలుసు,’ అని అన్నాను. దానికి ప్రవక్త (స), ‘నీవు ఎక్కడున్నా, నీ భార్యాబిడ్డల వద్దకు వచ్చేయి. ఇంట్లోకివచ్చి ఏకాంతం అనుసరించు. ప్రచ్ఛన్న యుద్ధాలలో పాల్గొనకు,’ అని అన్నారు. దానికి నేను, ‘ఓ ప్రవక్తా! అదెలా అవుతుంది? నేను ఆయుధాలు ధరించి కల్లోలకారులతో యుద్ధం చేస్తాను,’ అని అన్నాను. దానికి ప్రవక్త (స), ‘అప్పుడు నీవు నీజాతి వైపు పాల్గొంటావు,’ అని అన్నారు. ఆ తరువాత నేను, ‘ఓ ప్రవక్తా! అప్పుడు నేను ఏం చేయాలి? అని అన్నాను. దానికి ప్రవక్త (స), ‘ఒకవేళ నీపై ఎవరైనా దాడి చేయదలిస్తే నీవు నీ ముఖం కప్పుకోవాలి. ఎవరూ చూడకుండా ఉండటానికి ఇంకా నీవు ఏ ముస్లిమ్‌పైననూ కరవాలం ఎత్తకూడదు. ఎందుకంటే హంతకుడు మీరిద్దరి పాపాలను తనపై వేసు కుంటాడు,’ అని అన్నారు. [11]   (అబూ  దావూద్‌)

5398 – [ 20] ( لم تتم دراسته ) (3/1486)

وَعَنْ عَبْدِ اللهِ بْنِ عَمْرِو بْنِ الْعَاصِ أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم قَالَ: “كَيْفَ بِكَ إِذَا أُبْقِيْتَ فِي حُثَالَةٍ مِّنَ النَّاسِ مرجت عهودهم وأماناتهم؟ واختلفوا فكانوا هكذا؟ “وشبك بين أصابعه. قَالَ: فبم تأمرني؟ قَالَ: “عليك بما تعرف ودع ما تنكر وعليك بخاصة نفسك وإياك وعوامهم”.

وفي رواية: “إلزم بيتك واملك عليك لسانك وخذ ما تعرف ودع ما تنكر وعليك بأمر خاصة نفسك ودع أمر العامة”. رَوَاهُ التِّرْمِذِيُّ وصححه  .

5398. (20) [3/1486అపరిశోధితం]

అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘అమ్ర్‌ బిన్‌ ‘ఆస్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఓ ‘అబ్దుల్లాహ్‌! చరిత్ర హీనులలో మిగిలిపోతావు, అంటే దుర్మార్గులమధ్య నివసించే అవకాశం లభిస్తుంది. అప్పుడు నీవు ఏం చేస్తావు, వారి మాటకు ఎలాంటి విలువ ఉండదు, అమానతులు కూడా ద్రోహంగా మారిపోతాయి. పరస్పరం ఒక చేతి వ్రేళ్ళు, మరో చేతి వేళ్ళలో కలిసిపోయి నట్లు ఇలా పలికి ప్రవక్త (స) తన చేతివ్రేళ్ళు పరస్పరం కలిపి అంటే మంచివారెవరో తెలుసుకోవటం కష్టం అవుతుంది.’ అప్పుడు ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘అమ్ర్‌ బిన్‌ ‘ఆస్‌ (ర), ‘మీ ఆదేశం ఏమిటి?’ అని విన్నవించుకున్నారు. దానికి ప్రవక్త (స), ‘నీకు మంచిదనిపించిన విషయాన్ని అనుస రించాలి. చెడు విషయాన్ని వదలిపెట్టాలి. నిన్ను నీవు సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఇతరుల ధర్మవ్యతిరేక విషయాలకు దూరంగా ఉండాలి.” [12]  (తిర్మిజి’  –  దృఢం)

5399 – [ 21 ] ( صحيح ) (3/1486)

وَعَنْ أَبِيْ مُوْسَى عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم أَنَّهُ قَالَ: “إِنَّ بَيْنَ يَدَيِ السَّاعَةِ فِتَناً كَقِطْعِ اللَّيْلِ الْمُظْلِمِ يُصبِحُ الرَّجُلُ مُؤْمِنًا وَيُمْسِيْ كَافِرًا وَيُمْسِيْ مُؤْمِنًا وَيُصْبِحُ كَافِرًا اَلْقَاعِدُ خَيْرٌ مِنَ الْقَائِمِ وَالْمَاشِي خَيْرٌمِنَ السَّاعِيْ. فَكَسِرُوْا فِيْهَا قِسِيَّكُمْ وَقَطِّعُوْا فِيْهَا أَوْتَارَكُمْ وَاضْرِبُوْا سُيُوْفَكُمْ بِالْحِجَارَةِ فَإِنْ دُخِلَ عَلَى أَحَدٍ مِنْكُمْ فَلْيَكُنْ كَخَيْرٍ ابْنَيْ آدَمَ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ.

 وَفِيْ رِوَايَةٍ لَهُ (ضَعِيْفٌ): “ذَكَرَ إِلى قَوْلِهِ ” خَيْرٌ مِنَ السَّاعِيْ”ثُمَّ قَالُوْا: فَمَا تَأْمُرُنَا ؟ قَالَ: كُوْنُوْا أَحْلَاسَ بُيُوْتِكُمْ”.

وَفِيْ رِوَايَةِ التِّرْمِذِيُّ: أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم قَالَ فِي الْفِتْنَةِ: “كَسِّرُوْ افِيْهَا قِسِيَّكُمْ وَقَطِّعُوْا فِيْهَا أَوْتَارَكُمْ وَالْزَمُوْا فِيْهَاأَجْوَافَ بُيُوْتِكُمْ وَكُوْنُوْاكَابْنِ آدَمَ”. وَقَالَ: هَذَا حَدِيْثٌ صَحِيْحٌ غَرِيْبٌ.  

5399. (21) [3/1486 దృఢం]

అబూ మూసా (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ప్రళయానికి ముందు కారుచీకటి మేఘాల్లా అనేక ఉపద్రవాలు, కల్లోలాలు తలెత్తుతాయి. ఈ ఉపద్రవాలకు గురయి ప్రజలు, విశ్వాసులుగా లేస్తారు, సాయంత్రం అవిశ్వాసులుగా మారిపోతారు. సాయంత్రం విశ్వాసులుగా ఉంటారు. ఉదయం అవిశ్వాసులుగా మారిపోతారు. అంటే ఉపద్రవాల వల్ల విశ్వాస పరిస్థితి మారుతూ ఉంటుంది. ఈ ఉపద్రవాల్లో నిలబడిన వాడికంటే కూర్చున్నవాడే ఉత్తముడు, పరిగెత్తేవాడి కంటే నడిచేవాడే ఉత్తముడు. ఇటువంటి కల్లోల పరిస్థితుల్లో ప్రజలు తమబాణాలను, విల్లులను విరిచివేయాలి. తమ కరవాలాలను రాళ్ళతో కొట్టి విరిచివేయాలి. అంటే నీవు ఈ ఉపద్రవాల్లో కరవా లాలు, బల్లాలు ఉపయోగించరాదు. ఇటువంటి పరిస్థితుల్లో ఏకాంతాన్ని అనుసరించాలి. ఎవరైనా మిమ్మల్ని హత్యచేయడానికి వస్తే, మీరు ఆదమ్‌ మంచి సంతానంలా మారిపోవాలి. అంటే మీరు పోరాడకుండా హతమార్చబడాలి. ఆదమ్‌ (అ) ఇద్దరి కుమారుల్లో విభేదాలు ఏర్పడి, ఒకరు మరొకరిని చంపివేసారు. మీరు కూడా బాధితునిగా, హతునిగా మారాలి. (అబూ దావూద్‌ /  బలహీనం)

అబూ దావూద్‌లోని మరో ఉల్లేఖనంలో ఇలా ఉంది: ‘నడిచేవాడు, పరిగెత్తేవానికంటే ఉత్తముడు,’ అని అన్నారు. దానికి ప్రజలు, ‘మరి మాకు మీ ఆదేశం ఏమిటి?’ అని అన్నారు. దానికి ప్రవక్త (స) మీరు ఇళ్ళను అంటిపెట్టుకొని ఉండాలి. ఉపద్రవాల్లో కల్లోలాల్లో పాల్గొనరాదు. ఆదమ్‌ (ర) కుమారునిలా మారిపోవాలి. బాధితులై చంపబడటానికి ఇష్టపడాలి. కాని ఏ ముస్లిమ్‌ పైననూ చేయి ఎత్తరాదు. (తిర్మిజీ’ – దృఢం – ఏకోల్లేఖనం)

5400 – [ 22 ] ( لم تتم دراسته ) (3/1486)

وَعَنْ أُمِّ مَالِكٍ الْبَهْزِيَّةِ قَالَتْ: ذَكَرَرَسُوْلُ اللهِ صلى الله عليه وسلم فِتْنَةً فَقَرَّبِهَا.قُلْتُ: يَا رَسُوْلَ اللهِ مَنْ خَيْرُالنَّاسِ فِيْهَا؟ قَالَ: “رَجُلٌ فِيْ مَاشِيَتِهِ يُؤَدِّيْ حَقَّهَا وَيَعْبُدُ رَبَّهُ وَرَجُلٌ آخِذٌ بِرَأْسِ فَرَأسِهِ يُخِيْفُ الْعدُوّ وَ يُخَوِّفُوْنَهُ”. رَوَاهُ التِّرْمِذِيُّ.

5400. (22) [3/1486- అపరిశోధితం]

మాలిక్‌ తల్లి బహ్‌’జియ్యహ్ కథనం: ప్రవక్త(స) ఉపద్రవాల గురించి ప్రస్తావించారు. ఉపద్రవాలు దగ్గర పడే భయంకరమైన సంఘటనను వినిపించారు. అంటే అతి త్వరలో ఉపద్రవం తలెత్తుతుందని సూచించారు. అప్పుడు నేను, ”ఓ ప్రవక్తా! ఈ ఉపద్రవంలో అందరి కంటే ఉత్తముడెవరు?” అని విన్నవించుకున్నాను. దానికి ప్రవక్త (స), తన పశువుల్లో నిమగ్నుడయి ఉండేవాడు. అంటే ఆవులు, మేకలు, ఒంటెలు మొదలైనవి తీసుకొని కొండల్లో, అడవుల్లోకి వెళ్ళిపోయే వాడు ఉపద్రవాలకు దూరంగా ఉండేవాడు, ఆ పశువుల హక్కులను చెల్లించేవాడు. అంటే ‘జకాత్‌ దానధర్మాలు చేసేవాడు. ఇంకా తన ప్రభువు ఆరాధన లో నిమగ్నుడయి ఉండేవాడు. అదేవిధంగా తన గుర్రంకళ్ళెం పట్టుకొని స్వారీచేసి శత్రువుతో పోరాడటానికి సిద్ధంగా ఉన్నవాడు, అవిశ్వాసులను భయపెట్టేవాడు అంటే దైవమార్గంలో పోరాడేవాడు కూడా అందరికంటే ఉత్తముడే. అంటే ఇటువంటి పరిస్థితుల్లో పశువులను తీసుకొని బయటకు వెళ్ళిన వాడు, లేదా శత్రువుతో పోరాడటానికి వెళ్ళేవాడు వీరిద్దరూ  ఉత్తములే.  (తిర్మిజి’)

5401 – [ 23 ] ( لم تتم دراسته ) (3/1487)

وَعَنْ عَبْدِاللهِ بْنِ عَمْرٍو قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “سَتَكُوْنُ فِتْنَةٌ تَسْتَنْظِفُ الْعَرَبَ قَتْلَاهَا فِي النَّارِ اللِّسَانِ فِيْهَا أَشَدُّ مِنْ وَقْعِ السَّيْفِ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَابْنُ مَاجَهُ.  

5401. (23) [1/1487అపరిశోధితం]

‘అబ్దుల్లాహ్ బిన్ ‘అమ్ర్(ర) కధనం: ప్రవక్త(స) ప్రవచనం: ‘అతిత్వరలో ఒక పెద్ద కల్లోలం ఉద్భవిస్తుంది. అది అరబ్ అంతా వ్యాపిస్తుంది. అందులో చంపబడిన వారు నరకవాసులు, ఆ కల్లోలంలో నోరు విప్పడం కరవాలం  త్రిప్పటం  కంటే కఠినంగా ఉంటుంది. (తిర్మిజి’,  ఇబ్నె  మాజహ్)

5402 – [ 24 ] ( ضعيف ) (3/1487)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم قَالَ: “سَتَكُوْنُ فِتْنَةٌ صَمَّاءٌ بَكُمَاءُ عَمْيَاءُ مَنْ أَشْرَفَ لَهَا اِسْتَشْرَفَتْ لَهُ وَإِشْرَافُ اللِّسَانِ فِيْهَا كَوُقُوْعِ السَّيْفِ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ.  

5402. (24) [1/1487- బలహీనం]

అబూ హురైరహ్(ర) కథనం: ప్రవక్త(స) ప్రవచనం, ”త్వరలో ఒక ఉపద్రవం తలెత్తుతుంది. అది చెవిటిది, గృడ్డిది, మూగది అయి ఉంటుంది. అది తనకు దగ్గరగా ఉన్నవారిని తనవైపు లాక్కుంటుంది. అందులో మాట్లాడటం, కరవాలం త్రిప్పటంలా ఉంటుంది. (అబూ దావూద్)

5403 – [ 25 ] ( صحيح ) (3/1487)

وعَنْ عَبْدِ اللهِ بْنِ عُمَرَ قَالَ: كُنَّا قُعُوْدًا عِنْدَ النَّبِيِّ صلى الله عليه وسلم فَذَكَرَ الْفِتَنَ فَأَكْثَرَ فِيْ ذِكْرِهَا حَتّى ذَكَرَ فِتْنَةَ الْاحْلَاسِ فَقَالَ قَائِلٌ: وَمَا فِتْنَةُ الْأَحْلَاسِ. قَالَ: “هِيَ هَرَبٌ وَحَرْبٌ ثُمَّ فِتْنَةُ السَّرَّاءِ دَخَنُهَا مِنْ تَحْتِ قَدَمِيْ رَجُلٍ مِنْ أَهْلِ بَيْتِيْ يَزْعَمُ أَنَّهُ مِنِّيْ وَلَيْسَ مِنِّيْ إِنَّمَا أَوْلِيَائِيَ الْمُتَّقُوْنَ ثُمَّ يَصْطَلِحُ النَّاسُ عَلَى رَجُلٍ كَوِرْكٍ عَلَى ضِلَعٍ ثُمَّ فِتْنَةُ الدُّهَيْمَاءِ لَا تَدَعُ أَحَدًا مِنْ هَذِهِ الْأُمَّةِ إِلَّا لَطَمَتْهُ لَطْمَةً فَإِذَا قِيْلَ: انْقَضَتْ تَمَادَّتْ يُصْبِحُ الرَّجُلُ فِيْهَا مُؤْمِنًا وَيُمْسِيْ كَافِرًا حَتّى يَصِيْرَ النَّاسُ إِلى فُسْطَاطَيْنِ: فُسْطَاطُ إِيْمَانٍ لَا نِفَاقَ فِيْهِ وَفُسْطَاطُ نِفَاقٍ لَا إِيْمَانَ فِيْهِ. فَإِذَا كَانَ ذَلِكَ فَانْتَظِرُوْا الدَّجَّالَ مِنْ يَوْمِهِ أَوْ مِنْ غَدِهِ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ.

5403. (25) [3/1487 దృఢం]

‘అబ్దుల్లాహ్ బిన్ ‘ఉమర్ (ర) కథనం: మేము ప్రవక్త (స) వద్ద కూర్చొని ఉన్నాము. అతను(స) ఉపద్రవాలు, కల్లోలాల గురించి ప్రస్తావిస్తూ ఉన్నారు. చివరికి అల్ అ’హ్లాస్ కల్లోలం గురించి కూడా ప్రస్తావించారు. అప్పుడు  ఒక వ్యక్తి  ‘అల్ అ’హ్లాస్ కల్లోలం అంటే ఏమిటి?’ అని విన్నవించుకున్నాడు. దానికి ప్రవక్త(స) ‘అందులో ప్రజలు ఒకరినుండి మరొకరు పారిపోతారు. ధనసంపదలు దోచుకుంటారు. ఆ తరువాత కలిమి కల్లొలం ఉద్భవిస్తుంది. నా కుటుంబంవానిగా చెప్పుకునే వ్యక్తి  దాన్ని వ్యాపింప జేస్తాడు. అతడు మా వాడుగా చెప్పుకుంటాడు, కాని అతడు మావాడుకాడు. ఎందుకంటే మా వాళ్ళందరూ దైవభీతిపరులు. ఆ తరువాత ప్రజలు ఒక వ్యక్తిపై ఏకమవుతారు. అతడు ప్రక్కటెముకపై ఉన్న మాంసం ముక్కలా ఉంటాడు. ఆ తరువాత ఒక చాలా పెద్ద కల్లోలం తలెత్తుతుంది. అది ముస్లిమ్ సమాజంలోని ఏవ్యక్తినీ కష్టాలకు గురిచేయకుండా వదలదు. కల్లోలం సమాప్తం అయిపో యిందనే వార్తలు వచ్చిన తరు వాత అది మరీ ఉధృతం అయి పోతుంది. ఈ కల్లోలం లో  ప్రజలు ఉదయం విశ్వాసి,  సాయంత్రం అవిశ్వాసిగా మారిపోతారు. చివరికి ప్రజలు రెండు వర్గాలుగా విడిపోతారు. ఒక వర్గం చిత్తశుధ్ధిగల విశ్వాసులది, మరోవర్గం విశ్వాసంలేని కపటా చారులది. ఇది జరిగిన రోజు లేదా మరుసటి రోజు దజ్జాల్ గురించి వేచి ఉండండి. (అబూ  దావూద్)

5404 – [ 26 ] ( صحيح ) (3/1488)

وعَنْ أَبِيْ هُرَيْرَةَ أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم قَالَ: “وَيْلُ لِلْعَرَبِ مِنْ شَرٍّ قَدِ اقْتَرَبَ أَفْلَحَ مَنْ كَفَّ يَدَهُ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ.

5404. (26) [3/1488దృఢం]

అబూ హురైరహ్(ర) కథనం: ప్రవక్త(స) ప్రవచనం, ‘దగ్గరకు వచ్చేసిన ఆ చెడునుండి అరబ్బులకు వినాశనం ఉంది. తన చేతిని ఆపుకున్నవాడు సాఫల్యం పొందినట్టే.’ (అబూ  దావూద్)

5405 – [ 27 ] ( صحيح ) (3/1488)

وعَنْ الْمِقْدَادِ بْنِ الْأَسْوَدِ قَالَ: سَمِعْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ: إِنَّ السَّعِيْدَلَمَنْ جُنِّبَ الْفِتَنَ أَنَّ السَّعِيْدَلَمَنْ جُنِّبَ الْفِتَنَ إِنَّ السَّعِيْدَ لَمَنْ جُنِّبَ الْفِتَنَ وَلَمَنِ ابْتُلِىَ فَصَبَرَفَوَاهَا “. رَوَاهُ أَبُوْ دَاوُدَ.  

5405. (27) [3/1488దృఢం]

మిఖ్దాద్ బిన్ అస్వద్(ర) కథనం: ప్రవక్త(స) ప్రవచనం, ”నిస్సందేహంగా కల్లోలాల నుండి రక్షించ బడినవాడు అదృష్టవంతుడు, నిస్సందేహంగా కల్లోలాల నుండి రక్షించబడినవాడు అదృష్టవంతుడు, నిస్సందేహంగా కల్లోలాలనుండి రక్షించబడినవాడు అదృష్టవంతుడు, ఇంకా కల్లోలాలకు గురిచేయబడిన వారు సహనం పాటిస్తే ఎంతో మంచి  విషయం.”  (అబూ  దావూద్)

5406 – [ 28 ] ( صحيح ) (3/1488)

وعَنْ ثَوْبَانَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِذَا وُضِعَ السَّيْفُ فِيْ أُمَّتِيْ لَمْ يُرْفَعْ عَنْهَا إِلى يَوْمِ الْقِيَامَةِ وَلَا تَقُوْمُ السَّاعَةُ حَتّى تَلْحَقَ قَبَائِلُ مِنْ أُمَّتِيْ بِالْمُشْرِكِيْنَ وَحَتَّى تَعْبُدَ قَبَائِلُ مِنْ أُمَّتِي الْأَوْثَانَ وَإِنَّهُ سَيَكُوْنُ فِيْ أُمَّتِيْ كَذَّابُوْنَ ثَلَاثُوْنَ كُلُّهُمْ يَزْعَمُ أَنَّهُ نَبِيُّ اللهِ وَأَنَا خَاتِمُ النَّبِيِّيْنَ لَا نَبِيَّ بَعْدِيْ وَلَاتَزَالُ طَائِفَةٌ مِنْ أُمَّتِيْ عَلَى الْحَقِّ ظَاهِرِيْنَ لَا يَضُرُّهُمْ مَنْ خَالَفَهُمْ حَتَّى يَأْتِيَ أَمْرُ اللهِ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ.

5406. (28) [3/1488 దృఢం]

సౌ’బాన్(ర) కథనం: ప్రవక్త(స) ప్రవచనం, ”నా అనుచర సమాజంలోని కొందరి ఒరలనుండి కరవాలాలు బయటకువస్తే, తీర్పుదినంవరకు అవి ఒరల్లోకి వెళ్ళవు. ఇంకా నా అనుచర సమాజంలోని కొందరు అవిశ్వాసులతో కలవనంతవరకు, నా అనుచర సమాజంలోని కొన్ని తెగలు విగ్రహారాధన ప్రారంభించ నంత వరకు ప్రళయం సంభవించదు. ఇంకా నా అనుచర సమాజంలో 30 అసత్య ప్రవక్తలు ఉధ్భ విస్తారు. వీరిలో ప్రతిఒక్కడు తన్నుతాను దైవప్రవక్తగా భావిస్తాడు. వాస్తవం ఏమిటంటే నేనే అంతిమ ప్రవక్తను, నా తరువాత ప్రవక్తలెవరూ లేరు. ఇంకా నా అనుచర సమాజంలోని ఒక వర్గం ఎల్లప్పుడూ సత్యంపై ఉంటుంది, అదే ఆధిక్యత పొందుతుంది. దాని వ్యతిరేకులు దానికి ఏమాత్రం హాని చేకూర్చలేరు. చివరికి ప్రళయం సంభవిస్తుంది. (అబూ  దావూద్)

5407 – [ 29 ] ( صحيح ) (3/1488)

وَعَنْ عَبْدِ اللهِ بْنِ مَسْعُوْدٍ عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ: “تَدُوْرُ رَحىَ الْإِسْلَامِ لِخَمْسٍ وَثَلَاثِيْنَ أَوْ سِتٍّ وَثَلَاثِيْنَ أَوْ سَبْعٍ وَثَلَاثِيْنَ فَإِنْ يَهْلِكُوْا فَسَبِيْلُ مَنْ هَلَكَ وَإِنْ يَقُمْ لَهُمْ دِيْنُهُمْ يَقُمْ لَهُمْ سَبْعِيْنَ عَامًا”. قُلْتُ :أَمِمَّا بَقِيَ أَوْ مِمَّا مَضَى؟ قَالَ: “مِمَّا مَضَى”. رَوَاهُ أَبُوْدَاوُدَ  .

5407. (29) [3/1488 దృఢం]

‘అబ్దుల్లాహ్ బిన్ మస్’ఊద్ (ర) కథనం: ప్రవక్త (స), ‘ఇస్లామ్ చక్రం 35, 36, 37 సంవత్సరాలవరకు సరిగ్గా తిరుగుతూ ఉంటుంది. ఒకవేళ ప్రజలు నాశనం అయితే, అంతకుముందు ప్రజలు అనుసరించి నాశనం అయిన మార్గాన్ని అనుసరించి ఉంటారు. ఒకవేళ వారి ధర్మం సరిగ్గా ఉంటే, 70 సంవత్సరాల వరకు సరిగ్గా ఉంటుంది.’ అని ప్రవచించారు. దానికి నేను, ’70 సంవత్సరాలు వేరుగా ఉంటాయా లేక 35సంవత్సరాలతో కలిపి ఉంటాయా,’ అని నేను ప్రశ్నించాను. దానికి ప్రవక్త (స) వాటితో కలిపి ఉంటాయి అని అన్నారు.[13] (అబూ దావూద్)

—–

اَلْفَصْلُ الثَّالِثُ  మూడవ విభాగం   

5408 – [ 30 ] ( صحيح ) (3/1488)

عَنْ أَبِيْ وَاقِدٍ اللَّيْثِيِّ: أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم لَمَّا خَرَجَ إِلى غَزْوَةِ حُنَيْنٍ مَرَّ بِشَجَرَةٍ لِلْمُشْرِكِيْنَ كَانُوْا يُعَلِّقُوْنَ عَلَيْهَا أَسْلِحَتَهُمْ. يُقَالُ لَهَا: ذَاتُ أَنْوَاطٍ. فَقَالُوْا: يَا رَسُوْلَ اللهِ اِجْعَلْ لضنَا ذَاتَ أَنْوَاطٍ كَمَا لَهُمْ ذَاتُ أَنْوَاطٍ. فَقَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “سُبْحَانَ اللهِ هَذَا كَمَا قَالَ قَوْمُ مُوْسَى (اِجْعَلْ لَنَا إلها كَمَا لَهُمْ آلِهَةٌ) وَالَّذِيْ نَفْسِيْ بِيَدِهِ لَتَرْكَبُنَّ سُنَنَ مَنْ كَانَ قَبْلَكُمْ “. رَوَاهُ التِّرْمِذِيُّ.  

5408. (30) [3/1488 దృఢం]

అబూ వాఖిద్ లైసీ’ (ర) కథనం: ప్రవక్త(స) హునైన్ యుధ్ధసందర్భంగా బయలుదేరి, విగ్రహారాధకుల ఒకచెట్టు ప్రక్కనుండి వెళ్ళటం జరిగింది. అవిశ్వా సులు దానిపై తమ కరవాలాలు వ్రేలాడగట్టేవారు. ఆ చెట్టును జా’తు అన్వా’త్ అని పిలిచేవారు. ముస్లిముల్లోని బలహీనవిశ్వాసులు, ‘మాకోసం కూడా జా’తు అన్వా’త్ చెట్టును నియమించండి,’ అని కోరారు. ప్రవక్త(స) ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ, ”సు’బ్హా నల్లాహ్ ఇది మూసా(అ) జాతి మూసాను అవిశ్వా సులకు ఒక ఆరాధ్యదైవం ఉన్నట్టు, మీరు మాకూ ఒక ఆరాధ్యదైవం నియమించండి’ అని అన్నట్టు ఉంది” అని న్నారు. ఆ తరువాత ప్రవక్త(స) ఎవరి చేతిలో నాప్రాణం ఉందో ఆయన సాక్షి మీరు ముందు తరాలవారి మార్గాన్ని అనుసరిస్తారు. (తిర్మిజీ’)

5409 – [ 31 ] ( صحيح ) (3/1489)

وَعَنْ ابْنِ الْمُسَيَّبِ قَالَ: وَقَعَتِ الْفِتْنَةُ الْأُوْلَى – يَعْنِيْ مَقْتَلَ عُثْمَانَ – فَلَمْ يَبْقَ مِنْ أَصْحَابِ بَدْرٍ أَحَدٌ ثُمَّ وَقَعَتِ الْفِتْنَةُ الثَّانِيَةُ – يَعْنِي الْحَرَّةَ – فَلَمْ يَبْقَ مِنْ أَصْحَابِ الْحُدَيْبِيَةِ أَحَدٌ ثُمَّ وَقَعَتِ الْفِتْنَةُ الثَّالِثَةُ فَلَمْ تَرْتَفِعْ وَبِالنَّاسِ طَبَّاخٌ. رَوَاهُ الْبُخَارِيُّ.

5409. (31) [3/1489దృఢం]

స’యీద్ బిన్ ముసయ్యిబ్ కథనం: మొదటి కల్లోలం అంటేఉస్మాన్() వీరమరణం సంభవించి నపుడు, బద్ర్ యుధ్ధంలో పాల్గొన్నవారెవరూ అక్కడ లేరు. ఆ తరువాత రెండవ కల్లోలం అంటే, ‘హర్రహ్ యుధ్ధం సంభవించినపుడు, హుదైబియహ్ అంటే బై’అతె రి’ద్వాన్లో పాల్గొన్న వారెవరూ అక్కడ లేరు. మూడవ కల్లోలం సంభవించి, తొలగితే ప్రజల్లో ఏమాత్రం శక్తి లేకుండా పోయింది.[14](బు’ఖారీ)

1 – بَابُ الْمَلَاحِمِ

  1. భీకర పోరాటాలు

మల్హమహ్ ఏకవచనం, మలాహిమ్ బహువచనం. దీని అర్ధం మాంసంతో మాంసం కలవటం. అంటే యుధ్ధంలో మరణించినవారి శవాలు ఒకదానిపై ఒకటి పడటం. అంటే భీకర పోరాటాలు. (నిహాయహ్, ఇబ్నె కసీర్, లుగాతుల్ హదీస్) ఇన్నల్లాహ యబ్గజు అహ్లల్ బైతిల్లాహిమీన్ అంటే అల్లాహ్ ఎల్లప్పుడూ మాంసంతినే కుటుంబంపట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. మాంసం ముక్క లేకుండా వారి నోట్లోని ముద్దదిగదు. మరికొందరు ముస్లిముల మాంసం తినేవారని, అంటే ముస్లిముల గురించి పరోక్షంగా మాట్లాడేవారని అభి ప్రాయపడ్డారు. మలాహిమ్ అంటే గ్రామాల్లో, నగరాల్లో కల్లోలాల, ఉపద్రవాల వల్ల సంభవించే యుధ్ధాలు, పోరాటాలు. అయితే క్రింది హదీసుల్లో పేర్కొనబడిన కల్లోలాలు, ఉపద్రవాలు అసాధారణమైనవి.  

اَلْفَصْلُ الْأَوَّلُ   మొదటి విభాగం   

5410 – [1] ( متفق عليه ) (3/1490)

عَنْ أَبِيْ هُرَيْرَةَ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم قَالَ: “لَا تَقُوْمُ السَّاعَةُ حَتّى تَقْتَتِلَ فِئَتَانِ عَظِيْمَتَانِ تَكُوْنُ بِئَيْنَهُمَا مَقْتَلَةٌ عَظِيْمَةٌ دَعْوَاهُمَا وَاحِدَةٌ وَحَتّى يُبْعَثَ دَجَّالُوْنَ كَذَّابُوْنَ قَرِيْبٌ مِنْ ثَلَاثِيْنَ كُلُّهُمْ يَزْعَمُ أَنَّهُ رَسُوْلُ اللهِ وَحَتّى يُقْبَضَ الْعِلْمُ وَتَكْثُرُ الزَّلَازِلُ وَيَتَقَارَبَ الزَّمَانُ وَيَظْهَرَ الْفِتَنُ وَيَكْثُرَ الْهَرْجُ وَهُوَ الْقَتْلُ وَحَتّى يَكْثُر فِيْكُمُ الْمَالُ فَيَفِيْضُ حَتَّى يَهُمَّ رَبُّ الْمَالِ مَنْ يَقْبَلُ صَدَقَتَهُ وَحَتَّى يُعْرِضَهُ فَيَقُوْلُ الَّذِيْ يُعْرِضُهُ عَلَيْهِ: لَا أَرَبَ لِيْ بِهِ وَحَتّى يَتَطَاوَلَ النَّاسُ فِي الْبُنْيَانِ وَحَتّى يَمُرَّ الرَّجُلِ بِقَبَرِ الرَّجُلِ فَيَقُوْلُ: يَا لَيْتَنِيْ مَكَانَهُ وَحَتّى تَطْلُعَ الشَّمْسُ مِنْ مَغْرِبِهَا فَإِذَا طَلَعَتْ وَرَآهَا النَّاسُ آمَنُوْا أَجْمَعُوْنَ فَذَلِكَ حِيْنَ(لَا يَنْفَعُ نَفْسًا إِيْمَانُهَا لَمْ تَكُنْ آمنت مِنْ قَبْلث أَوْ كَسَبَتْ فِيْ إِيْمَانِهَا خَيْرًا) وَلَتَقُوْمَنَّ السَّاعَةُ وَقَدْ نَشَرَ الرَّجُلَانِ ثَوْبَهُمَا بَيْنَهُمَا فَلَا يَتَبَايَعَانِ وَلَا يَطْوِيَانِ وَلَتَقُوْمَنَّ السَّاعَةُ وَقَدِ انْصَرَفَ الرَّجُلُ بِلَبَنِ لِقْحَتِهِ فَلَا يَطْعَمُهُ وَلَتَقُوْمَنَّ السَّاعَةُ وَهُوَ يَلِيْطُ حَوْضَهُ فَلَا يَسْقِيْ فِيْهِ وَلَتَقُوْمَنَّ السَّاعَةُ وَقَدْ رَفَعَ أُكلَتَهُ إِلى فِيْهِ فَلَا يَطْعَمُهَا”.

5410. (1) [3/1490 ఏకీభవితం]

అబూహురైరహ్ (ర) కధనం: ప్రవక్త(స) ప్రవచనం, ”తీర్పు దినానికి ముందు రెండు పెద్దవర్గాల మధ్య భీకర పోరాటం జరుగుతుంది. ఇద్దరిదీ ఒకే వాదం ఉంటుంది. ఇంచుమించు 30 అసత్య దజ్జాల్ లు ఉద్భవిస్తారు. వీరిలో ప్రతిఒక్కరూ నేను దైవప్రవక్తనని వాదిస్తాడు. చివరికి జ్ఞానం అంతరిస్తుంది. భూకంపాలు అధికంగా సంభవిస్తాయి. ఇమామ్ మహ్దీ కాలం దగ్గర పడుతుంది. కల్లోలాలు సంభవిస్తాయి. హత్యలు, దోపిడీలు అధిక మవుతాయి. ధనసంపదలు నీరులా ప్రవహిస్తాయి. ధనవంతులకు దానం ఎవరికి ఇవ్వాలి అనే విచారణ పట్టుకుంటుంది. దానంచేస్తే దానం తీసుకున్నవ్యక్తి ‘నాకు దీని అవసరం లేదు,’ అని అంటాడు. ప్రజలు భవనాల నిర్మాణంలో గర్వా హంకారాలు ప్రదర్శిస్తారు. ఒకవ్యక్తి సమాధి ప్రక్కనుండి వెళుతూ, ‘నేనిక్కడ ఉండి ఉంటే ఎంత బాగుండేది, కల్లోలాలకు గురి కాకుండా ఉండేవాడిని,’ అని విచారిస్తాడు. సూర్యుడు పడమటి దిక్కునుండి ఉదయిస్తాడు. ప్రజలందరూ సూర్యుడు పడమటి దిక్కునుండి ఉదయించటంచూచి ఇస్లామ్ స్వీకరిస్తారు. కాని అప్పుడు విశ్వసించటం ఏమాత్రం లాభం చేకూర్చదు. ప్రళయం సంభవించినపుడు ఇద్దరు వ్యక్తులు తమమధ్య వస్త్రాన్ని పరచి కనుగోలు చేస్తూ ఉంటారు. ఇంకా వారు వస్త్రాన్ని చుట్టనైనా చుట్టరు, ఇంతలో ప్రళయం సంభవిస్తుంది. అదేవిధంగా ఒకవ్యక్తి తన ఒంటెపాలు తీసుకు వెళుతూ ఉంటాడు. ఇంకా అతడు త్రాగనైనా త్రాగడు. ఇంతలో ప్రళయం సంభవిస్తుంది. అదేవిధంగా మరోవ్యక్తి తన జంతువులకు నీరు త్రాపించటానికి కుండీకి ప్లాస్టరు చేస్తూ ఉంటాడు. తన జంతువులకు నీళ్ళు త్రాపించనైనా త్రాపించడు, ఇంతలో ప్రళయం సంభవిస్తుంది. ఒకవ్యక్తి నోటిలోనికి ముద్ద ఎత్తి ఉంటాడు, ఇంకా తిన్నైనా తినడు. ప్రళయం సంభవిస్తుంది. (బు’ఖారీ, ముస్లిమ్)  

5411 – [ 2 ] ( متفق عليه ) (3/1490)

وَعَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَا تَقُوْمُ السَّاعَةُ حَتّى تُقَاتِلُوْا قَوْمًا نِعَالُهُمْ الشَّعْرُ وَحَتّى تُقَاتِلُوا التُّرْكَ صِغَارَ الْأَعْيُنِ حُمَرَ الْوُجُوْهِ ذُلَفَ الْأُنُوْفِ كَأَنَّ وُجُوْهَهُمْ الْمَجَانُّ الْمُطْرَقَةُ “.

5411. (2) [3/1490ఏకీభవితం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: మేము వెంట్రుకలు గల చెప్పులు ధరించేవారితో యుద్ధం చేయనంత వరకు ప్రళయం సంభవించదు. అంటే వాళ్ళు ధరించిన చెప్పుల చర్మం నుండి వెంట్రుకలు తీసి ఉండరు. ఇంకా మీరు తుర్కులతో యుద్ధం చేయనంతవరకు ప్రళయం సంభవించదు. వారు చిన్నచిన్న కళ్ళు కలిగి ఉంటారు, ఇంకా వారి ముఖాలు ఎర్రగా ఉంటాయి. వారి ముక్కు వెడల్పుగా ఉంటుంది. ఇంకా వారి బుగ్గలు ఉబ్బి ఉంటాయి. ఇంకా వారి ముఖాలు డాలులా ఉంటాయి. (అంటే చైనీయుల్లా ఉంటారు). (బు’ఖారీ)

5412 – [ 3 ] ( صحيح ) (3/1491)

وَعَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَا تَقُوْمُ السَّاعَةُ حَتّى تُقَاتِلُواخَوْزًا وَكِرْمَانَ مِنَ الْأَعَاجِمِ حُمَرَالْوُجُوْهِ فُطْسَ الْأُنُوْفِ صِغَارَ الْأَعْيُنِ وُجُوْهُهُمُ الْمَجَانُ الْمُطْرَقَةُ نِعَالُهُمُ الشَّعْرُ”. رَوَاهُ الْبُخَارِيُّ.  

5412. (3) [3/1491 దృఢం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మీరు అరబ్బేతరులైన, ఎర్రని ముఖాలు కలిగి ఉన్న, వెడల్పయిన ముక్కు, చిన్నకళ్ళుగల, ఢాలువంటి ముఖాలు కలిగి ఉన్న, వెంట్రుకలుగల చెప్పులు ధరించే ‘ఖౌ’జ్‌, కిర్మాన్‌ వారితో యుద్ధం చేయనంతవరకు ప్రళయం  సంభవించదు.” (బు’ఖారీ)

5413 – [ 4 ] ( لم تتم دراسته ) (3/1491)

وَفِيْ رِاوَيَةٍ لَهُ وَعَنْ عَمْرِو بْنِ تَغْلِبَ: “عِرَاضَ الْوُجُوْهِ”

5413. (4) [3/1491అపరిశోధితం]

మరో ‘అమ్ర్ బిన్ తగ్లిబ్, ఉల్లేఖనంలో వెడల్పు ముఖాలు గల వారని ఉంది.

5414 – [ 5 ] ( صحيح ) (3/1491)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَا تَقُوْمُ السَّاعَةُ حَتّى يُقَاتِلَ الْمُسْلِمُوْنَ الْيَهُوْدَ فَيَقْتُلُهُمُ الْمُسْلِمُوْنَ حَتّى يَخْتَبِئَ الْيَهُوْدِيُّ مِنْ وَرَاءِ الْحَجَرِ وَالشَّجَرِ فَيَقُوْلُ الْحَجَرُ وَالشَّجَرُ: يَا مُسْلِمُ يَا عَبْدَ اللهِ هَذَا يَهُوْدِيٌّ خَلْفِيْ فَتَعَالَ فَاقْتُلْهُ إِلَّا الْغَرْقَدَ فَإِنَّهُ مِنْ شَجَرِ الْيَهُوْدِ”. رَوَاهُ مُسْلِمٌ.

5414. (5) [3/1491దృఢం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”యూదులతో ముస్లిములు యుద్ధం చేయనంత వరకు ప్రళయం సంభవించదు. ఆ తరువాత వారిని చంపుతారు. చివరికి యూదులు బండరాళ్ళ వెనుక లేదా చెట్ల వెనుక దాక్కున్నా రాళ్ళు , చెట్లు ఇలా తెలియజేస్తాయి, ‘ఓముస్లిమ్‌! ఓ అల్లాహ్ దాసుడా, నా వెనుక ఒక యూదుడు ఉన్నాడు, ఇటు రా! వాడిని చంపివేయి,’ కాని ఒక చెట్టు మాత్రం చెప్పదు. (అదొక ముళ్ళచెట్టు, బైతుల్‌ ముఖద్దస్‌ ప్రాంతంలో పెరుగుతుంది. అది యూదుల చెట్టు).” (ముస్లిమ్‌)

5415 – [ 6 ] ( متفق عليه ) (3/1491)

وَعَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَا تَقُوْمُ السَّاعَةُ حَتّى يَخْرُجَ رَجُلٌ مِنْ قَحْطَانَ يَسُوْقُ النَّاسَ بِعَصَاهُ”. مُتَّفَقٌ عَلَيْهِ.

5415. (6) [3/1491ఏకీభవితం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఖ’హ్‌తాన్‌ తెగకు చెందిన ఒక వ్యక్తి జన్మించి, బెత్తంతో ప్రజలను తోలనంత వరకు ప్రళయం  సంభవించదు.” [15]  (బు’ఖారీ, ముస్లిమ్‌)

5416 – [ 7 ] ( صحيح ) (3/1491)

وَعَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَا تَذْهَبُ الْأَيَّامُ وَاللَّيَالِيْ حَتّى يَمْلِكَ رَجُلٌ يُقَالُ لَهُ: اَلْجَهْجَاهُ”. وَفِيْ رِوَايَةٍ: “حَتّى يَمْلِكَ رَجُلٌ مِنَ الْمَوَالِيْ يُقَالُ لَهُ: اَلْجَهْجَاهُ”. رَوَاهُ مُسْلِمٌ.

5416. (7) [3/1491దృఢం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”జహ్‌జాహ్‌ అనే వ్యక్తి చక్రవర్తి కానంతవరకు రాత్రీ పగలు సమాప్తం కావని, అంటే ప్రళయం సంభవించదు. మరో ఉల్లేఖనంలో బానిసల్లో ఒక వ్యక్తి భూమికి చక్రవర్తి అవుతాడు, అతన్ని జహ్‌జాహ్‌ అని అంటారు.” (ముస్లిమ్‌)

5417 – [ 8 ] ( صحيح ) (3/1491)

وَعَنْ جَابِرِبْنِ سَمُرَةَ قَالَ: سَمِعْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ: “لَتَفْتَحَنَّ عِصَابَة مِنَ الْمُسْلِمِيْنَ كَنْزَآلِ كِسْرَى الَّذِيْ فِي الْأَبْيَضِ”. رَوَاهُ مُسْلِمٌ.  

5417. (8) [3/1491దృఢం]

జాబిర్‌ బిన్‌ సమురహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ఇలా ప్రవచిస్తూ ఉండగా నేను విన్నాను, ”నిస్సందేహంగా ఒక ముస్లిముల బృందం తెల్లటి భవనంలో ఉన్న కిస్రా గుప్తనిధిని  తెరుస్తుంది.” [16] (ముస్లిమ్‌)

5418 – [ 9 ] ( متفق عليه ) (3/1492)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “هَلَكَ كِسْرَى فَلَا يَكُوْنُ كِسْرَى بَعْدَهُ وَقَيْصَرُلَيَهْلِكَنَّ ثُمَّ لَا يَكُوْنُ قَيْصَرُ بَعْدَهُ وَلَتُقْسَمَنَّ كُنُوْزُهُمَا فِيْ سَبِيْلِ اللهِ”. وَسَمَّى”الْحَرْبُ خُدْعَةٌ”. متفق عليه.

5418. (9) [3/1492ఏకీభవితం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం: ”కిస్రా నశించాడు. భవిష్యత్తులో ఎవరూ కిస్రా అవరు. ఖైసర్‌ నశించాడు, అతని తరువాత ఎవరూ ఖైసర్‌ కారు. వారిద్దరి నిధులు దైవమార్గంలో పంచబడతాయి. ఇంకా ప్రవక్త (స) యుద్ధం అంటే మోసం అన్నారు.” [17] (బు’ఖారీ, ముస్లిమ్‌)

5419 – [ 10 ] ( صحيح ) (3/1492)

وعَنْ نَافِعِ بْنِ عُتْبَةَ قَالَ:قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم:” تَغْزُوْنَ جَزِيْرَةَ الْعَرَبش فَيَفْتَحُهَا اللهُ ثُمَّ فَارِسَ فَيَفْتَحُهَا اللهُ ثُمَّ تَغْزُوْنَ الرُّوْمَ فَيَفْتَحُهَا اللهُ ثُمَّ تَغْزُوْنَ الدَّجَّالَ فَيَفْتَحُهُ اللهُ “.رَوَاهُ مُسْلِمٌ.

5419. (10) [3/1492దృఢం]

నాఫె’ బిన్‌ ‘ఉత్‌బహ్ కథనం: ప్రవక్త (స) ప్రవచనం: ” (1) నా తరువాత మీరు అరబ్‌ ద్వీపాలవారితో యుద్ధం చేస్తారు. అల్లాహ్‌(త) వారిపై మీకు విజయం ప్రసాదిస్తాడు, ఆ తరువాత, (2) ఫారిస్‌ వారితో అంటే కిస్రా వారితో యుద్ధం చేస్తారు. అల్లాహ్‌(త) మీకు విజయం ప్రసాదిస్తాడు,  (3) ఆ తరువాత రూమీలతో యుద్ధం చేస్తారు. అంటే ఖైసర్‌తో అల్లాహ్‌ మీకు విజయం ప్రసాదిస్తాడు, (4) ఆ తరువాత మీరు దజ్జాల్‌తో యుద్ధం చేస్తారు. అప్పుడు కూడా అల్లాహ్‌(త) మీకు విజయం ప్రసాదిస్తాడు.[18] (ముస్లిమ్‌)

5420 – [ 11 ] ( صحيح ) (3/1492)

وعَنْ عَوْفِ بْنِ مَالِكٍ قَالَ: أَتَيْتُ النَّبِيَّ صلى الله عليه وسلم فِيْ غَزْوَةِ تَبُوْكَ وَهُوَ فِيْ قُبَّةٍ مِنْ أُدْمٍ فَقَالَ: “اَعْدِدْ سِتًّا بَيْنَ يَدَيِ السَّاعَةِ: مَوْتِيْ ثُمَّ فَتْحُ بَيْتِ الْمَقْدِسِ ثُمَّ مُوْتَانٌ يَأْخُذُ فِيْكُمْ كَقُعَاصِ الْغَنَمِ ثُمَّ اسْتِفَاضَةُ الْمَالِ حَتّى يُعْطَى الرَّجُلُ مِائَةَ دِيْنَارٍ فَيَظَلُّ سَاخِطًا ثُمَّ فِتْنَةٌ لَا يَبْقَى بَيْتٌ مِنَ الْعَرَبِ إِلّا دَخَلَتْهُ ثُمَّ هُدْنَةٌ تَكُوْنُ بَيْنَكُمْ وَبَيْنَ بَنِي الْأَصْفَرِ فَيَغْدِرُوْنَ فَيَأْتُوْنَكُمْ تَحْتَ ثَمَانِيْنَ غَايَةً تَحْتَ كُلِّ غَايَةٍ اثْنَا عَشَرَ أَلْفًا”. رَوَاهُ الْبُخَارِيُّ.

5420. (11) [3/1492దృఢం]

ఔఫ్‌ బిన్‌ మాలిక్‌ (ర) కథనం: తబూక్‌ యుద్ధ సందర్భంగా నేను ప్రవక్త (స) వద్దకు వెళ్ళాను. ప్రవక్త (స) అప్పుడు చర్మం ఖైమలో విశ్రాంతి తీసుకుంటున్నారు. అప్పుడు ప్రవక్త (స) నువ్వు ప్రళయం సంభవించటానికి ఈ 6 విషయాలను లెక్కపెట్టుకో. 1. నా మరణం, 2. బైతుల్‌ ముఖద్దస్‌ విజయం, 3. పశువుల్లో వ్యాపించినట్టు మీలో అంటువ్యాధి వ్యాపిస్తుంది, 4. ధనసంపదలు ఎంత అధికంగా వ్యాపిస్తాయంటే ఎవరికైనా 100 అష్రఫీలు ఉచితంగా ఇచ్చినా ఇంకా అయిష్టంగానే ఉంటాడు, 5. అనేక ఉపద్రవాలు ఒక దాని తరువాత మరొకటి తలెత్తుతాయి. అరబ్‌లోని ఏ ఇల్లూ దాన్నుండి తప్పించుకోలేదు, 6. మీకూ రూమీల మధ్య ఒప్పందం జరుగుతుంది. అయితే వారు దాన్ని భంగం చేస్తారు. మీతో యుద్ధం చేయటానికి సిద్ధపడతారు. 80 జండాలు తీసుకొని మీపై దాడి చేస్తారు. ప్రతి జండా క్రింద 12 వేల మంది సైన్యికులు ఉంటారు. [19]

5421 – [ 12 ] ( صحيح ) (3/1492)

وعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَا تَقُوْمُ السَّاعَةُ حَتّى يَنْزِلَ الرُّوْمُ بِالْأَعْمَاقِ أَوْ بِدَابِقَ فَيَخْرُجُ إِلَيْهِمْ جَيْشٌ مِنَ الْمَدِيْنَةِ مِنْ خِيَارِأَهْلِ الْأَرْضِ يَوْمَئِذٍ فَإِذَا تَصَافُّوْا قَالَتِ الرُّوْمُ: خَلُّوْا بَيْنَنَا وَبَيْنَ الَّذِيْنَ سَبَوْا مِنَّا نُقَاتِلْهُمْ فَيَقُوْلُ الْمُسْلِمُوْنَ: لَا وَاللهِ لَا نُخَلِّي بَيْنَكُمْ وَبَيْنَ إِخْوَانِنَا فَيُقَاتِلُوْنَهُمْ فَيَنْهَزِمُ ثُلُثٌ لَا يَتُوْبُ اللهُ عَلَيْهِمْ أَبَدًا وَ يُقْتَلُ ثُلُثهُمْ أَفْضَلَ الشُّهَدَاءِ عِنْدَ اللهِ وَيَفْتَتِحُ الثُّلُثُ لَا يُفْتَنُوْنَ أَبَدًا فَيَفْتَتِحُوْنَ قُسْطُنْطِيْنِيَةَ فَبَيْنَاَ هُمْ يَقْتَسِمُوْنَ الْغَنَائِمَ قَدْ عَلَّقُوْا سُيُوْفَهُمْ بِالزَّيْتُوْنِ إِذْ صَاحَ فِيْهِمُ الشَّيْطَانَ: إِنَّ الْمَسِيْحَ قَدْ خَلَفَكُمْ فِيْ أَهْلِيْكُمْ فَيَخْرُجُوْنَ وَذَلِكَ بَاطِلٌ فَإِذَا جَاؤُوا الشَّامَ خَرَجَ فَبَيْنَا هُمْ يُعِدُّوْنَ لِلْقِتَالِ يُسَوُّوْنَ الصُّفُوْفَ إِذْ أُقِيْمَتِ الصَّلَاةُ فَيَنْزِلُ عِيْسَى بْنُ مَرْيَمَ فَأَمَّهُمْ فَإِذَا رَآهُ عَدُوُّ اللهِ ذَابَ كَمَا يَذُوْبُ الْمِلْحُ فِي الْمَاءِ فَلَوْتَرَكَهُ لَاَنْذَابَ حَتّى يَهْلِكَ وَلَكِنْ يَقْتُلُهُ اللهُ بِيَدِهِ فَيُرِيْهِمْ دَمَهُ فِيْ حَرْبَتِهِ”. رَوَاهُ مُسْلِمٌ.

5421. (12) [3/1492దృఢం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”రూమ్‌ క్రైస్తవుల సైన్యం ఎ’మాఖ్‌, వాబిఖ్‌లపై దాడిచేయనంత వరకు  ప్రళయం సంభవించదు. (ఈ రెండు ప్రాంతాలూ సిరియాలో హల్బ్‌కు సమీపంగా ఉన్నాయి. ఆ తరువాత మదీనహ్ నుండి ముస్లిముల సహాయం కోసం ముస్లిముల సైన్యం బయలుదేరు తుంది. ఆ కాలంలో వాళ్ళు అందరికంటే ఉన్నతులై ఉంటారు. ఇరువైపుల నుండి యుద్ధానికి సన్నధ్ధులై నప్పుడు క్రైస్తవులు మదీనహ్ నుండి వచ్చిన ముస్లిమ్‌ సైన్యంతో, ‘మీరు వీరితో వేరుగా ఉండండి. వీళ్ళు మా భార్యాబిడ్డలను బంధించి ఉంచారు. మేము వారితో యుద్ధం చేస్తాం,’ అని అంటారు. మదీనహ్ నుండి సహాయం చేయటానికి వచ్చిన ముస్లిములు క్రైస్తవులతో, ‘మేము మా సోదరుల నుండి వేరుగా ఉండటం  జరుగదు. ఇంకా వారికి సహాయం చేయకుండా మేము ఉండలేము,’ అని అంటారు. ఈ సమాధానం విని క్రైస్తవులు యుద్ధానికి సిద్ధపడతారు. భీకరపోరాటం ప్రారంభమవుతుంది. అప్పుడు ముస్లిముల 1/3 వ వంతు సైన్యం పారిపోతారు. వారి పశ్చాత్తాపాన్ని అల్లాహ్‌ (త) ఎంత మాత్రం స్వీకరించడు. 1/3వ వంతు సైన్యం వీరమరణం పొందు తుంది. ఆ కాలానికి చెందిన ఉత్తమ అమర వీరులుగా పరిగణింపబడతారు. ఇంకా 1/3వ వంతు సైన్యం క్రైస్తవులపై విజయం సాధిస్తుంది. ఈ అదృష్టవంతులు దీని తరువాత ఎటువంటి కల్లోలాలకు గురికారు. ఆ తరువాత వారు ఖుస్తుంతునియను జయిస్తారు. అది ఈ సమయంలో క్రైస్తవుల అధీనంలో ఉంటుంది. యుద్ధ ధనాన్ని వారు అందరూ పంచుకుంటారు. ఇంకా తీరిక చూసుకొని తమ కరవాలాలను ‘జైతూన్‌ చెట్టుకు వ్రేలాడగడతారు. ఇంతలోనే షై’తాన్‌ మోసగించటానికి మీరు లేనిది చూచి, ‘దజ్జాల్‌ మీ  ఇళ్ళల్లోకి ప్రవేశించాడు,’ అని బిగ్గరగా కేకలు వేస్తాడు. అది విని ముస్లిమ్‌ వీరులు అక్కడి నుండి భార్యాపిల్లల రక్షణకు వెనుదిరుగుతారు. వాస్తవంగా ఈ వార్త అసత్యంతో కూడుకొని ఉంటుంది. అయితే వీళ్ళు సిరియాలో చేరినపుడు దజ్జాల్‌ బయటకు వస్తాడు. ముస్లిములు దజ్జాల్‌తో యుద్ధం చేయటానికి సిధ్ధం అవుతారు. ఇంతలో ఈసా బిన్‌ మర్యమ్‌ ఆకాశం నుండి దిగి, ఆ ఇస్లామ్‌ వీరుల ముందు ప్రత్యక్షం అవుతారు. నమా’జ్‌ సమయం ఆసన్నమవగా ‘ఈసా (అ) ఇమాముగా నమా’జు చదివిస్తారు. దజ్జాల్‌ ‘ఈసా (అ)ను చూచి భయంతో వణకటం ప్రారంభిస్తాడు, ఉప్పు నీటిలో కరిగినట్లు. ఒకవేళ ‘ఈసా (అ) చంపకుండా వదలివేస్తే అలాగే కరిగినశిస్తాడు. కాని ‘ఈసా (అ) చేతుల మీదుగా దజ్జాల్‌ సంహారం మూలగ్రంథంలో వ్రాయబడి ఉంది. అందువల్ల ‘ఈసా (అ) దజ్జాల్‌ను తన బల్లెంతో చంపివేస్తారు. బల్లానికి వాడి రక్తం తగిలి ఉంటుంది. ‘ఈసా (అ) దాన్ని ప్రజలకు చూపిస్తారు. [20] (ముస్లిమ్‌)

5422 – [ 13 ] ( صحيح ) (3/1493)

وعَنْ عَبْدِ اللهِ بْنِ مَسْعُوْدٍ قَالَ: إِنَّ السَّاعَةَ لَاتَقُوْمُ حَتّى لَا يُقْسَمَ مِيْرَاثٌ وَلَا يُفْرَحَ بِغَنِيْمَةٍ.ثُمَّ قَالَ: عَدُوٌّ يَجْمَعُوْنَ لِأَهْلِ الشَّامِ وَيَجْمَعُ لَهُمْ أَهْلُ الْإِسْلَامِ ( يَعْنِي الرُّوْمَ ) فَيَتْشَرَّطُ الْمُسْلِمُوْنَ شُرْطَةً لِلْمَوْتِ لَا تَرْجِعُ إِلَّا غَالِبَةً فَيَقْتَتِلُوْنَ حَتَّى يَحْجِزَ بَيْنَهُمُ اللَّيْلُ فَيَفِيْء هَؤُلَاءِ وَهَؤُلَاءِ كُلٌّ غَيْرُ غَالِبٍ وَتَفْنَى الشُّرْطَةُ ثُمَّ يَتَشَرطُ الْمُسْلِمُوْنَ شُرْطَةً لِلْمَوْتِ لَا تَرْجِعُ إِلّا غَالِبَةً فَيَقْتَتِلُوْنَ حَتّى يَحْجِزَ بَيْنَهُمُ اللَّيْلُ فَيَفِيْءُ هَؤُلَاءِ وَهَؤُلَاءِ كُلٌّ غَيْرُ غَالِبٍ وَتَفِنَى الشُّرْطَةُ ثُمَّ يَشَتَرَّطُ الْمُسْلِمُوْنَ شُرْطَةً لِلْمَوْتِ لَا تَرْجِعُ إِلّا غَالِبَةً فَيَقْتَتِلُوْنَ حَتّى يُمْسُوْا فَيَفِيْءُ هَؤُلَاءِ وَهَؤُلَاءِ كُلُّ غَيْرُ غَالِبٍ وَتَفْنَى الشُّرُطَةُ فَإِذَا كَانَ يَوْمُ الرَّابِعِ نَهَدَ إِلَيْهِمْ بَقِيَّةُ أَهْلِ الْإِسْلَامِ فَيَجْعَلُ اللهُ الدَبَرَةَ عَلَيْهِمْ فَيَقْتُلُوْنَ مَقْتَلَةً لَمْ يُرَ مِثْلُهَا حَتّى إِنَّ الطَّائِرَ لَيَمُرُّ بِجَنْاَتِهِمْ فَلَا يُخَلِّفُهُمْ حَتَّى يَخِرَّ مَيِّتًا فَيُتَعَادُّ بَنُو الْأَبِ كَانُوْا مِائَةً فَلَا يَجِدُوْنَهُ بَقِيَ مِنْهُمْ إِلّا الرَّجُلُ الْوَاحِدُ فَبِأَيِّ غَنِيْمَةٍ يَفْرَحُ أَوْ أَيِّ مِيْرَاثٍ يَقْسِمُ؟ فَبَيْنَا هُمْ كَذَلِكَ إِذْ سَمِعُوْا بِبَأْسٍ هُوَ أَكْبَرُ مِنْ ذَلِكَ فَجَاءَهُمُ الصَّرِيْخُ: أَنَّ الدَّجَّالَ قَدْ خَلَفَهُمْ فِيْ ذَرَارِيِّهِمْ فَيَرْفُضُوْنَ مَا فِيْ أَيْدِيْهِمْ وَيُقْبِلُوْنَ فَيَبْعَثُوْنَ عَشْرَ فَوَارِسَ طَلِيْعَةً”. قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِنِّيْ لَأَعْرِفُ أَسْمَاءَهُمْ وَأَسْمَاءَ آبَائِهِمْ وَأَلْوَانَ خُيُوْلِهِمْ هُمْ خَيْرُ فَوَارِسَ أَوْ مِنْ خَيْرٍ فَوَارِسَ عَلَى ظَهْرِ الْأَرْضِ يَوْمَئِذٍ”. رَوَاهُ مُسْلِمٌ.  

5422. (13) [3/1493దృఢం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ మస్‌’ఊద్‌ (ర) కథనం: ప్రళయం ఎప్పుడు వస్తుందంటే, ఆస్తి పంచబడదు, అంటే ప్రళయానికి ముందు శత్రువులతో అనేక యుద్ధాలు జరుగుతాయి. వాటిలో అనేకమంది ముస్లిములు వీరమరణం పొందుతారు. 100 మందిలో ఒక వ్యక్తి మిగులుతాడు, అందువల్ల ఆస్తి పంచబడదు. ధార్మిక జ్ఞానం లేనందువల్ల ఆస్తి పంపకం నియమ నిబంధనలను ఆచరించటం జరుగదు. షరీ’అత్‌ ప్రకారం ఆస్తి పంపకం జరగటం లేదు. కుమారులే ఆక్రమించు కుంటున్నారు. కుమార్తెలకు అందకుండా చేస్తున్నారు. యుద్ధధనం లభించినా సంతోషం కలగటం లేదు. ఆ తరువాత ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ మస్‌’ఊద్‌ ఇలా అన్నారు, ”ఇస్లామ్‌ శత్రువులు ముస్లిములతో యుద్ధం చేయటానికి సైన్యాలు సిద్ధం చేస్తారు. భీకర యుద్ధానికి సన్నాహాలు చేస్తారు. ఇటు అవిశ్వాసులతో, క్రైస్తవులతో యుద్ధం చేయటానికి ముస్లిములు కూడా యుద్ధ సన్నాహాలు చేస్తారు. ఇంకా ముస్లిములు పరస్పరం ఎన్నుకొని ఒక వీరులసైన్యాన్ని పంపిస్తూ, మీరు పోరాడుతూ వీరమరణం అయినా పొందాలి లేదా విజయంతోనైనా తిరిగి రావాలని షరతుపెడతారు. ఆ రెండు సైన్యాల మధ్య భీకర యుద్ధం ప్రారంభం అవుతుంది. పగలంతా యుద్ధం చేస్తూ కొందరు వీరమరణం పొందుతారు. మిగిలినవారు అలసిపోతారు. ఇంతలో రాత్రి ఆవరిస్తుంది. ఆ తరువాత ఇరువర్గాల ప్రజలు యుద్ధం ఆపి తమ సైన్యాలలో చేరుకుంటారు. ఇరువర్గాల్లో ఎవరికీ విజయం వరించదు. ఇంకా యుద్ధానికి వెళ్ళిన మొదటి సైన్యం అంతా వీరమరణం పొందుతుంది. మరుసటి రోజు ముస్లిములు మరో సైన్యాన్ని యుద్ధానికి పంపుతారు. వారితో కూడా ఈ షరతు పెడతారు. అంటే యుద్ధం చేస్తూ వీరమరణం పొందాలి. లేదా విజయులై రావాలి. రెండవరోజు కూడా భీకర యుద్ధం జరుగు తుంది. పగలంతా యుద్ధం కొనసాగుతుంది. ఇంతలో రాత్రి ఆవరిస్తుంది. పగలంతా ఎవరికీ విజయం లభించదు. కాని ఆ రోజు కూడా మహా వీరులందరూ వీరమరణం పొందుతారు. ఆ తరువాత మూడవ రోజు ఆ షరతుతోనే మూడవ సారి సైన్యం పంపిస్తారు. ఈ సైన్యం క్రైస్తవులతో పగలంతా పోరాడుతూ ఉంటుంది. చివరికి సాయంత్రం అయిపోతుంది. ఇరుసైన్యాలూ తిరిగి వెళ్ళిపోతాయి. ఎవరికీ విజయం వరించదు. పంపబడిన ముస్లిముల సైన్యం నాశనమవుతుంది. నాల్గవ రోజు మిగిలిన ముస్లిములు క్రైస్తవులతో వీరోచితంగా పోరాడుతారు. క్రైస్తవుల సైన్యం సన్నగిల్లుతుంది. క్రైస్తవులు ఆ నాల్గవదాడిలో చాలా అధిక సంఖ్యలో చంపబడతారు. పక్షులు వారిపై నుండి ఎగురుతూ వెళ్ళి పోవాలన్నా వెళ్ళ లేక వారిమీదనే పడి చచ్చిపోతాయి. తరువాత మిగిలిన బ్రతికున్న ముస్లిములను లెక్క పెట్టటం జరుగుతుంది. 100 సోదరుల్లో ఒక్క సోదరుడు మిగిలి ఉంటాడు. 99 సోదరులు వీరమరణం పొంది ఉంటారు. ఇటువంటి పరిస్థితుల్లో యుద్ధధనం లభిస్తే, ఎవరికి సంతోషం కలుగుతుంది. ఆస్తి ఎవరికి పంచడం జరుగుతుంది. ఒక్కరు తప్ప మరెవరూ ఉండరు. ముస్లిములు ఇంకా ఆ స్థితిలోనే ఉంటారు. వారికి మరో భీకర యుద్ధం చేయాలనే వార్త అందుతుంది. ఇంకా ముస్లిములకు దజ్జాల్‌ మీ ఇళ్ళల్లోకి ప్రవేశించాడనే కబురు కూడా అందు తుంది. ఆ వార్త విన్న సైనికులు ఆయుధాలన్నీ పారవేసి తమ భార్యాబిడ్డల రక్షణ కోసం బయలుదేరుతారు. దజ్జాల్‌తో యుద్ధం చేయటానికి తమలో నుండి 10 మందిని ముందు పంపుతారు. వారు వెళ్ళి శత్రువు గురించి తెలుసు కుంటారని, ఈ సందర్భంగా ప్రవక్త (స) ఇలా ప్రవచించారు. ”ముందు పంపబడిన పదిమంది గురించి నాకు తెలుసు. ఇంకా ఆ గుర్రాల రంగు అంతా నాకు తెలుసు. వారి గుర్రాల రంగు ఇలా ఉంటుంది, వాళ్ళు చాలా గొప్ప వీరులై ఉంటారు.  దీనివల్ల తెలిసిందేమిటంటే యుద్ధం ఒక అనూహ్యమైన పద్ధతిలో జరుగుతుంది. ఇందులో బల్లాలు, బాణాలు, కరవాలాలు ఉండవు. ఇందులో తుపాకులు, బాంబులు, క్షిపణులు ఉంటాయి.” వీటిని గురించి మనం వింటున్నాం, చూస్తున్నాం.

5423 – [ 14 ] ( صحيح ) (3/1494)

وعَنْ أَبِيْ هُرَيْرَةَ أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم قَالَ: “هَلْ سَمِعْتُمْ بِمَدِيْنَةِ جَانِبٌ مِنْهَا فِي الْبِّرِ وَجَانِبٌ مِنْهَا فِي الْبَحْرِ؟” قَالُوْا: نَعَمْ يَا رَسُوْلَ اللهِ قَالَ: “لَا تَقُوْمُ السَّاعَةُ حَتّى يَغْزُوْهَا سَبْعُوْنَ أَلْفًا مِنْ بَنِي إِسْحَاقَ فَإِذَا جَاؤُوْهَا نَزَلُوْا فَلَمْ يُقَاتِلُوْا بِسَلَاحِ وَلَمْ يَرْمُوْا بِسَهْمٍ قَالَ: لَا إِلَهَ إِلَّا اللهُ وَاللهُ أَكْبَرُ. فَيَسْقُطُ أَحَدُ جَانِبَيْهَا قَالَ ثَوْرُ بْنُ زَيْدٍ الرَّاوِيْ: لَا أَعْلَمُهُ إِلَّا قَالَ : “الَّذِيْ فِي الْبَحْرِيَقُوْلُوْنَ الثَّانِيَةَ: لَا إِلَهَ إِلَّا اللهُ وَاللهُ أَكْبَرُ فَيَسْقُطُ جَانِبُهَا الْآخَرُ ثُمَّ يَقُوْلُوْنَ الثَّالِثَةَ: لَا إِلَهَ إِلَّا اللهُ وَاللهُ أَكْبَرُ فَيُفَرَّجُ لَهُمْ فَيَدْخُلُوْنَهَا فَيَغْنَمُوْنَ فَبَيْنَا هُمْ يَقْتَسِمُوْنَ الْمَغَانِمَ إِذْ جَاءَهُمُ الصَّرِيْخُ فَقَالَ: إِنَّ الدَّجَّالَ قَدْ خَرَجَ فَيَتْرُكُوْنَ كُلَّ شَيْءٍ وَيَرْجَعُوْنَ”. رَوَاهُ مُسْلِمٌ .

5423. (14) [3/1494దృఢం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) తన అను చరులతో ఒక భాగం సముద్రంవైపు మరోభాగం నేల వైపు ఉండే నగరం గురించి విన్నారా? అని అడిగారు. దానికి అనుచరులు అవును ఓ ప్రవక్తా! విని ఉన్నాము. అది ఖుస్తున్‌తునియా అని అన్నారు. అప్పుడు ప్రవక్త (స) ఇస్‌’హాఖ్‌ (ర) సంతానం నుండి 70 వేలమంది ఆ నగర వాసులతో యుద్ధంచేస్తారు. వీరు ఆ నగరానికి చేరి అక్కడ విడిదిచేసి ఆ నగర వాసులపై బాణాలు సంధించరు, ఆయుధాలతో దాడిచేయరు. కేవలం తక్‌బీర్‌ నినాదాలతో వారికి విజయం వరిస్తుంది. అంటే ”లా ఇలాహ ఇల్లల్లాహు వల్లాహు అక్బర్‌” అని పలుకుతారు. దీని శుభంతో నగరానికి ఒక వైపు ఉన్న గోడ దానంతట అదే కూలిపోతుంది. వాళ్ళు మళ్ళీ తక్‌బీర్‌ నినాదాలు చేస్తూ ఉంటారు. అంటే ”లా ఇలాహ ఇల్లల్లాహు వల్లాహుఅక్బర్‌” అనే నినాదాలతో రెండో భాగం కూలి పోతుంది. ఆ తరువాత మూడవసారి ”లా ఇలాహ ఇల్ల ల్లాహు, వల్లాహు అక్బర్‌” అని నినాదాలు చేయటం వల్ల నగరంలో ప్రవేశించే ద్వారం తెరచుకుంటుంది. వాళ్ళు చాలా సులువుగా నగరంలో ప్రవేశిస్తారు. దాన్ని జయిస్తారు. యుద్ధధనంగా చాలా ధనం చేజిక్కుతుంది. వాళ్ళు ఆ ధనాన్ని పరస్పరం పంచుకుంటూ ఉంటారు. ఇంతలో ”దజ్జాల్‌ వచ్చేసాడు” అనే కేక వింటారు. అది విని అందరూ ఆ ధనాన్ని అక్కడే వదలి దజ్జాల్‌ వైపు బయలు దేరుతారు. [21] (ముస్లిమ్‌)

—–

اَلْفَصْلُ الثَّانِيْ  రెండవ విభాగం   

5424 – [ 15 ] ( حسن ) (3/1494)

عَنْ مُعَاذِ بْنِ جَبَلٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “عُمْرَانُ بَيْتِ الْمَقْدِسِ خَرَابُ يَثْرِبَ وَخَرَابُ يَثْرِبَ خُرُوْجُ الْمَلْحَمَةِ وَخُرُوْجُ الْمَلْحَمَةِ فَتْحُ قُسْطُنْطِيْنِيَّةَ وَفَتْحُ قُسْطُنْطِيْنيِةَّ خُرُوْجُ الدَّجَّالِ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ.

5424. (15) [3/1494 ప్రామాణికం]

ముఆజ్‌ బిన్‌ జబల్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”బైతుల్‌ ముఖద్దస్‌ జనాభా విపరీతంగా పెరిగితే, అక్కడ ప్రాపంచికభోగవిలాసాల సాధనాలు చేరుతాయి. అప్పుడది మదీనహ్ వినాశనానికి కారణం అవుతుంది. ఎందుకంటే బైతుల్‌ ముఖద్దస్‌ అవిశ్వా సుల, యూదుల వల్ల అభివృద్ధి చెందు తుంది. వీళ్ళు మదీనహ్ను నాశనం చేద్దామని ప్రయత్నిస్తారు. యుద్ధాలు, పోరాటాలు కేవలం కల్లో లాలు అలజడుల ద్వారా ప్రారంభమవుతాయి. ఈ కల్లోలాల ప్రభావం భీకర యుద్ధంగా మారి ఖుస్తుం తునియా విజయానికి కారణభూత మవు తుంది. ఖుస్తుంతునియా విజయం దజ్జాల్‌ రావటానికి కారణం అవుతుంది. (అబూ దావూద్‌)

5425 – [ 16 ] ( ضعيف ) (3/1494)

وعَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “اَلْمَلْحَمَةُ الْعُظْمَى وَفَتْحُ الْقُسْطُنْطِيْنِيَّةَ وَخُرُوْجُ الدَّجَّالِ فِيْ سَبْعَةِ أَشْهُر”. رَوَاهُ التِّرْمِذِيُّ وأَبُوْ دَاوُدَ.

5425. (16) [3/1494 బలహీనం]

మ’ఆజ్‌ బిన్‌ జబల్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవ చనం, ”భీకర యుద్ధం, ఖుస్తుంతునియాను జయిం చడం, దజ్జాల్‌ రావటం ఇవన్నీ 7 నెలల వ్యవధిలో జరుగుతాయి.” [22]  (తిర్మిజి’,  అబూ  దావూద్‌)

5426 – [ 17 ] ( ضعيف ) (3/1494)

وعَنْ عَبْدِ اللهِ بْنِ بُسْرٍأَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم قَالَ: “بَيْنَ الْمَلْحَمَةِ وَفَتْحِ الْمَدِيْنَةِ سِتُّ سِنِيْنَ وَيَخْرُجُ الدَّجَّالُ فِي السَّابِعَةِ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ وَقَالَ: هَذَا أَصَحُّ .

5426. (17) [3/1494 బలహీనం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ బుస్ర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవ చనం, ”మహా యుద్ధానికి, ఖుస్తుంతునియా విజయా నికి మధ్య 6 సంవత్సరాల వ్యవధి ఉంటుంది. 7వ సంవ త్సరం దజ్జాల్‌ బహిర్గతం అవుతాడు.”(అబూ దావూద్‌)

5427 – [ 18 ] ( صحيح ) (3/1494)

وعَنْ ابْنِ عُمَرَقَالَ: يُوْشِكُ الْمُسْلِمُوْنَ أَنْ يُحَاصَرُوْا إِلى الْمَدِيْنَةِ حَتَّى يَكُوْنَ أَبْعَدَ مَسَالِحِهِمْ سَلَاحٌ وَسَلَاحٌ: قَرِيْبٌ مِنْ خَيْبَرَ. رَوَاهُ أَبُوْ دَاوُدَ.

5427. (18) [3/1494 దృఢం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘ఉమర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”భవిష్యత్తులో మదీనహ్ వారిని శత్రువులు  చుట్టుముడతారు.  చివరికి వారి చివరి సరిహద్దు సలాహ్‌  ఉంటుంది. సలాహ్‌ అంటే ‘ఖైబర్‌ వద్దనున్న ఒక ప్రాంతం  పేరు.” (అబూ  దావూద్‌)

5428 – [ 19 ] ( صحيح ) (3/1495)

وعَنْ ذِيْ مِخْبَرٍ قَالَ: سَمِعْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ: “سَتُصَالِحُوْنَ الرُّوْمَ صُلْحًا آمِنًا فَتَغْزُوْنَ أَنْتُمْ وَهُمْ عَدُوْا مِنْ وَرَائِكُمْ فَتُنْصَرُوْنَ وَتَغْنَمُوْنَ وَتَسْلَمُوْنَ ثُمَّ تَرْجِعُوْنَ حَتَّى تَنْزِلُوْا بِمَرْجِ ذِيْ تُلُوْلٍ فَيَرْفَعُ رَجُلٌ مِنْ أَهْلِ النَّصْرَانِيَةِ الصَّلِيْبَ فَيَقُوْلُ: غَلَبَ الصَّلِيْبُ فَيَغْضَبُ رَجُلٌ مِنَ الْمُسْلِمِيْنَ فَيَدُقُّهُ فَعِنْدَ ذَلِكَ تَغْدِرُ الرُّوْمُ وَتَجْمَعُ لِلْمَلْحَمَةِ”.  وَزَادَ بَعْضُهُمْ: “فَيَثُوْرُ الْمُسْلِمُوْنَ إِلى أَسْلِحَتِهِمْ فَيَقْتَتِلُوْنَ فَيُكْرِمُ اللهُ تِلْكَ الْعِصَابَةَ بِالشَّهَادَةِ”. رَوَاهُ أَبُوْدَاوُدَ.

5428. (19) [3/1495 దృఢం]

జీ’ మి’ఖ్‌బర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ఇలా ప్రవచిస్తూ ఉండగా నేను విన్నాను, ”ఓ ముస్లిములారా! భవిష్యత్తులో మీరు రూమీలతో క్రైస్తవులతో శాంతి ఒప్పందం కుదుర్చుకుంటారు. ఆ తరువాత మీరూ క్రైస్తవులు ఇద్దరూకలసి మరోశత్రువుతో యుద్ధం చేస్తారు. ఆ యుద్ధంలో మీకు దైవసహాయం, విజయం లభిస్తుంది. ఆ తరువాత మీరిద్దరూ ఒక సస్యశ్యా మలమైన ప్రదేశంలో నివసిస్తారు. అక్కడ ఒక క్రైస్తవుడు శిలను ఎత్తి మాకు ఈ శిల శుభం వల్ల శత్రువుపై విజయం లభించిందని  అంటాడు. ముస్లిములకు ఆగ్రహం వస్తుంది. అతని చేతి నుండి శిలను లాక్కొని విరచివేస్తారు. అప్పుడు క్రైస్తవులు సంధిని, ఒప్పందాన్ని భంగంచేస్తారు. మహా యుద్ధానికి సైన్యం సిద్ధంచేస్తారు. ఇటు ముస్లిములు కూడా ఆయుధాలు ధరించటానికి సిద్ధపడతారు. ఆ మహా యుద్ధంలో చాలామంది ముస్లిములు వీరమరణం పొందుతారు.[23]  (అబూ  దావూద్‌)

5429 – [ 20 ] ( ضعيف ) (3/1495)

وعَنْ عَبْدِ اللهِ بْنِ عَمْرٍوعَنِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ: “اُتْرُكُوْا الْحَبَشَةَ مَا تَرَكُوْكُمْ فَإِنَّهُ لَا يَسْتَخْرِجُ كَنْزَ الْكَعْبَةِ إِلَّا ذُو السَّوِيْقَتَيْنِ مِنَ الْحَبَشَةِ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ .

5429. (20) [3/1495బలహీనం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘అమ్ర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మీరు హబషహ్ వారిని వదిలివేయండి. అంటే మీతో వారు తలపడనంత వరకు వారితో యుద్ధం చేయకండి. ఎందుకంటే భవిష్యత్తులో బైతుల్లాహ్‌ గుప్తనిధి ఒక హబషీ వ్యక్తికి వర్తిస్తుంది. అతనికి చిన్న చిన్న చీల మండలు  ఉంటాయి. (అబూ  దావూద్‌)

5430 – [ 21 ] ( لم تتم دراسته ) (3/1495)

وَعَنْ رَجُلٍ مِنْ أَصْحَابِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ: “دَعُوا الْحَبَشَةَ مَا وَدَعُوْكُمْ وَاتْرُكُوْا التُّرْكَ مَا تَرَكُوْكُمْ “. رَوَاهُ أَبُوْ دَاوُدَ و النسائي .

5430. (21) [3/1495  అపరిశోధితం]

ప్రవక్త (స) ఒక అనుచరుడు కథనం: మీరు హబషీలకు వారు ఊరుకున్నంతవరకు దూరంగా ఉండండి. అంటే ముందుగా మీరు కయ్యానికి కాలు దువ్వకండి. తుర్కీలను కూడా వారు ఏమీ చేయనంత వరకు మీరూ వారిని ఏమీ అనకండి. అంటే తుర్కీలు మీతో యుద్ధం చేయనంతవరకు మీరూ వారితో యుద్ధం చేయకండి. ఒకవేళ వారు మీతో యుద్ధం చేస్తే మీరూ వారితో పోరాడండి. (అబూ  దావూద్‌, నసాయీ’)

5431 – [ 22] ( ضعيف ) (3/1495)

وعَنْ بُرَيْدَةَ عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم فِيْ حَدِيْثٍ: “يُقَاتِلُكُمْ قَوْمٌ صِغَارُ الْأَعْيُنِ”يَعْنِي التُّركَ. قَالَ: ” تَسُوْقُوْنَهُمْ ثَلَاثَ مَرَّاتٍ حَتّى تَلْحَقُوْهُمْ بِجَزِيْرِةِ الْعَرَبِ فَأَمَّا السِّيَاقَةِ الْأَوْلَى فَيَنْجُوْ مَنْ هَرَبَ مِنْهُمْ وَأَمَّا الثَّانِيَةِ فَيَنْجُوْ بَعْضٌ وَيَهْلِكُ بَعْضٌ وَأَمَّا الثَّالِثَةِ فَيُصْطَلَمُوْنَ”. أَوْ كَمَا قَالَ. رَوَاهُ أَبُوْ دَاوُدَ.

5431. (22) [3/1495బలహీనం]

బురైదహ్‌ (ర) కథనం: ఒక సుదీర్ఘ ‘హదీసు’లో ఇలా పలికారు. దాని ప్రారంభంలో ఇలా ఉంది, ”భవిష్యత్తులో మీరు ఒకజాతి వారితో యుద్ధం చేస్తారు. వారికి చిన్నచిన్న కళ్ళు ఉంటాయి. (అంటే తుర్కులు) మీకూ వారికీ మధ్య చాలా భీకర యుద్ధం జరుగుతుంది. మీరు వారిని మూడు సార్లు ఓడించి వెంబడిస్తారు. చివరికి వారు అరబ్‌ భూభా గానికి చేరుకుంటారు. మొదటి ఓటమిలో వారిలోని కొందరు చంపబడతారు. మరికొందరు పారిపోయి తప్పించు కుంటారు, రెండవ దాడిలో చాలామంది చంపబడతారు. కొందరు తప్పించు కుంటారు. మూడవసారి మాత్రం అందరూ సర్వనాశనం అవుతారు.” (అబూ దావూద్‌)

5432 – [23 ] ( إسناده جيد ) (3/1495)

وَعَنْ أَبِيْ بَكْرَةَ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم قَالَ: “يَنْزِلُ أَنَاسٌ مِنْ أُمَّتِيْ بِغَائِطٍ يُسَمُّوْنَهُ الْبَصْرَةَ عِنْدَ نَهْرٍيُقَالُ لَهُ: دَجْلَةُ يَكُوْنُ عَلَيْهِ جَسْرٌيَكْثُرُأَهْلُهَا وَيَكُوْنُ مِنْ أَمْصَارِالْمُسْلِمِيْنَ وَإِذَا كَانَ فِي آخِرِ الزَّمَانِ جَاءَ بَنُوْ قُنْطُوْرَاءَ عِرَاضُ الْوُجُوْهِ صِغَارُ الْأَعْيُنِ حَتَّى يَنْزِلُوْا عَلَى شَطِّ النَّهْرِ فَيَتَفَرَّقُ أَهْلُهَا ثضلَاثَ فِرَقٍ فِرْقَةٌ يَأْخُذُوْنَ فِيْ أَذْنَابِ الْبَقَرِ وَالْبَرِّيةِ وَهَلَكُوْا وَفِرْقَةٌ يَأْخُذُوْنَ لِأَنْفُسُهِمْ وَهَلَكُوْا وَفِرْقَةٌ يَجْعَلُوْنَ ذَرَارِيَّهُمْ خَلْفَ ظُهُوْرِهِمْ وَيُقَاتِلُوْنَهُمْ وَهُمُ الشُّهَدَاءُ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ.

5432. (23) [3/1495 ఆధారాలు ఆమోదయోగ్యం]

అబూ బక్‌రహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”నా అనుచర సమాజం బ’స్రా అనే ప్రాంతానికి వెళుతుంది. ఇది దజ్‌లహ్‌కు సమీపంగా ఉంటుంది. ఈ నదిపై వంతెనలు ఉంటాయి. ఇక్కడ స్థానికులు చాలా అధికంగా ఉంటారు. ఇంకా ఇది ముస్లిముల నగరాల్లో ఒక నగరంగా ఉంటుంది. దీన్ని ముస్లిములు జయిస్తారు. చివరికాలంలో బనీ ఖున్‌’తూరా’ అంటే తుర్కులు ముస్లిములతో ఇక్కడ యుద్ధం చేయటానికి దాడి చేస్తారు. అప్పుడు ఇక్కడి  ప్రజలు మూడు వర్గాలుగా విడిపోతారు. ఒక వర్గం తమ్ము తాము రక్షించు కోవటానికి అడవుల్లోకి, లోయల్లోకి పారిపోతారు. ఇంకా వారు వ్యవసాయం చేస్తూ జీవిస్తారు. ఇంకా అవిశ్వాసులతో యుద్ధం చేయటానికి ఇష్టపడరు. అయితే ఈ వర్గం తుర్కులద్వారా చంపబడతారు. వీరిలో ఎవరూ తప్పించుకోలేరు. మరోవర్గం తమ ప్రాణాలు రక్షించుకోవటానికి తుర్కులను శరణు కోరుతారు. కాని తుర్కులు శరణుఇవ్వరు. వారిని కూడా చంపివేస్తారు. మూడవ వర్గంవారు తమ భార్యాబిడ్డలను వదలి తుర్కులతో పోరాడుతారు. చివరికి వీరు కూడా వీరమరణం పొందుతారు. [24] (అబూ  దావూద్‌)

5433 – [ 24 ] ( صحيح ) (3/1496)

وعَنْ أَنَسٍ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم قَالَ: “يَا أَنَسُ إِنَّ النَّاسَ يُمَصِّرُوْنَ أَمْصَارًا فَإِنَّ مِصْرًا مِنْهَا يُقَالُ لَهُ: اَلْبَصْرَةُ فَإِنْ أَنْتَ مَرَرْتَ بِهَا أَوْ دَخَلْتَهَا فَإِيَّاكَ وَسِبَاخَهَا وَكِلأهَا وَنَخِيْلَهَا وَسُوْقَهَا وَبَابَ أُمَرَائِهَا وَعَلَيْكَ بِضَوَاحَيْهَا فَإِنَّهُ يَكُوْنُ بِهَا خَسْفٌ وَقَذْفٌ وَرَجْفٌ وَقَوْمٌ يَبِيْتُوْنَ وَيُصْبِحُوْنَ قِرْدَةً وَخَنَازِيْرَ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ.

5433. (24) [3/1496 దృఢం]

అనస్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఓ అనస్‌! ప్రజలు అనేక నగరాలను నిర్మిస్తారు. వాటిలో బ’స్రా అనే పట్టణం కూడా నిర్మించబడుతుంది. (ఇది ప్రాపంచిక పరంగా అందంగా, నీవు అక్కడికి వెళ్ళే అవకాశం వస్తే, అక్కడ శాశ్వతంగా ఉండటానికి వెళ్ళరాదు. అక్కడి ఎత్తైన ప్రాంతాల వద్దకు, పచ్చిక బయళ్ళకు, ఖర్జూరాలకు దూరంగా ఉండాలి. ఇంకా అక్కడి బజారు లకు వెళ్ళరాదు. ఇంకా అక్కడి రాజుల, ధనవంతుల ద్వారాల వద్దకు వెళ్ళరాదు. అయితే ఆ నగర పొలి మేరల్లో వెళ్ళ గలవు. ఎందుకంటే ఈ ప్రాంతాలన్నీ దైవశిక్ష అవతరించవలసి ఉన్న ప్రాంతాలు. వీటిలో కొన్ని ప్రాంతాలు పాపాల కారణంగా భూమిలో దిగవేయ బడతాయి. అక్కడ రాళ్ళ వర్షం కురుస్తుంది. దానివల్ల అక్కడున్నవారు రాళ్ళుతగిలి చనిపోతారు. ఇంకా అక్కడ అనేక భూకంపాలు వస్తాయి. దానివల్ల భూమి పగిలిపోతుంది. అక్కడ ఒకజాతి వారు రాత్రి మానవా కారాల్లో నిద్రపోతారు. ఉదయం వారి యువకులను కోతులుగా, ముసలివాళ్ళను పందులుగా మార్చి వేయడం  జరుగుతుంది. [25] (అబూ  దావూద్‌)

5434 – [ 25 ] ( ضعيف ) (3/1496)

وعَنْ صَالِحِ بْنِ دِرْهَمٍ يَقُوْلُ: انْطَلَقْنَا حَاجِّيْنَ فَإِذَا رَجُلٌ فَقَالَ لَنَا: إِلَى جَنْبِكُمْ قَرْيَةٌ يُقَالُ لَهَا: الْأُبلَّةُ؟ قُلْنَا: نَعَمْ. قَالَ: مَنْ يَضْمَنُ لِيْ مِنْكُمْ أَنْ يُصَلِّيَ لِيْ فِيْ مَسْجِدِ العَشَّارِ رَكْعَتَيْنِ أَوْ أَرْبَعًا وَيَقُوْلُ هَذِهِ لِأَبِيْ هُرَيْرَةَ؟ سَمِعْتُ خَلِيْلِيْ أَبَا الْقَاسِمِ صَلى الله عليه وسلم يَقُوْلُ: “إِنَّ اللهَ عَزَّ وَجَلَّ يَبْعَثُ مِنْ مَسْجِدِ الْعَشَّارِ يَوْمَ الْقِيَامَةِ شُهَدَاءَ لَا يَقُوْمُ مَعَ شُهَدَاءِ بَدْرٍ غَيْرُهُمْ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ. وَقَالَ: هَذَا الْمَسْجِدُ مِمَّا يَلِي النَّهْرَ وَسَنَذْكُرُ حَدِيْثَ أَبِي الدَّرْدَاءِ: “إِنَّ فُسْطَاطَ الْمُسْلِمِيْنَ”. فِيْ بَابِ: “ذِكْرِ الْيَمَنِ وَالشَّامِ” إِنْ شَاءَ اللهُ تَعَالى.

5434. (25) [3/1496 బలహీనం]

‘సాలె’హ్‌ బిన్‌ దిర్‌హమ్‌ కథనం: మేము బ’స్రా నుండి మక్కహ్ ముకర్రమహ్ ‘హజ్‌ కోసం వెళ్ళాము. అక్కడ ప్రవక్త అనుచరుల్లో ఒకరైన అబూ హురైరహ్‌ (ర)ను కలవటం జరిగింది. వారు మాతో, ‘మీరు ఎక్కడి నుండి వచ్చారు,’ అని అడిగారు. మేము బ’స్రా అన్నాము. అప్పుడు మాతో మీ నగరంలోని ఒక వైపు ఉబల్ల అనే ప్రాంతం ఉందా? అని అడిగారు. దానికి మేము అవునని అన్నాము. అప్పుడు అబూ హురైరహ్‌ (ర) మమ్మల్ని ఉద్దేశించి, మీలో ఎవరైనా అబూ హురైరహ్‌ (ర) తరఫున ఉబల్లలోని మస్జిదె ఉసార్‌లో రెండు లేదా 4 రకాతులు నమా’జ్‌ చదవగలరా? అంటే నా తరఫున నమా’జు చదవాలి. ఇంకా దీని పుణ్యం అబూ హురైరహ్‌కు చెందాలి అని ప్రార్థించాలి. నేను ప్రవక్త (స) ద్వారా ”అల్లాహ్‌ మస్జిదె ‘ఉసార్‌ నుండి అమరవీరులను లేపుతాడు. వాళ్ళు బద్ర్‌ అమరవీరుల్లా ఉంటారు. అంటే వారు బద్ర్‌ అమరవీరుల సమాన స్థాయి కలిగి ఉంటారు  అని  విన్నాను.” (అబూ  దావూద్‌)

ఉల్లేఖనకర్త కథనం: ఉబల్లలో ఈ మస్జిద్‌ బ’స్రాలో దజ్‌లహ్‌ కు సమీపంగా ఉంది.

—–

اَلْفَصْلُ الثَّالِثُ  మూడవ విభాగం  

5435 – [ 26 ] ( متفق عليه ) (3/1497)

عَنْ شَقِيْقٍ عَنْ حُذَيْفَةَ قَالَ: كُنَّا عِنْدَ عُمَرَ فَقَالَ: أَيُّكُمْ يَحْفَظُ حَدِيْثَ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم فِي الْفِتْنَةِ؟ فَقُلْتُ: أَنَا أَحْفَظُ كَمَا قَالَ: قَالَ: هَاتَ إِنَّكَ لَجَرِيْءٌ وَكَيْفَ؟ قَالَ قُلْتُ: سَمِعْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ “فِتْنَةُ الرَّجُلِ فِي أَهْلِهِ وَمَالِهِ وَنَفْسِهِ وَوَلَدِهِ وَجَارِهِ يُكَفِّرِهَا الصِّيَامُ وَالصَّلَاةُ وَالصَّدَقَةُ وَالْأَمْرُ بِالْمَعْرُوْفِ وَالنَّهْيُ عَنِ الْمُنْكَرِ”. فَقَالَ عُمَرُ: لَيْسَ هَذَا أُرِيْدُ إِنَّمَا أُرِيْدُ الَّتِيْ تَمُوْجُ كَمَوْجِ الْبَحْرِ. قَالَ: مَا لَكَ وَلَهَا يَا أَمِيْرُ الْمُؤْمِنِيْنَ؟ إِنَّ بَيْنَكَ وَبَيْنَهَا بَابًا مُغْلَقًا. قَالَ: فَيُكْسَرُ الْبَابُ أَوْيُفْتَحُ؟ قَالَ قُلْتُ: لَا بَلْ يُكْسَرُ. قَالَ: ذَاكَ أَحْرَى أَنْ لَا يُغْلَقَ أَبَدًا. قَالَ: فَقُلْنَا لِحُذَيْفَةَ: هَلْ كَانَ عُمَرُ يَعْلَمُ مَنِ الْبَابُ؟ قَالَ: نَعَمْ كَمَا يَعْلَمُ أَنْ دُوْنَ غَدٍ لَيْلَةً إِنِّيْ حَدَّثْتُهُ حَدِيْثًا لَيْسَ بِالْأَغَالِيْطِ قَالَ: فَهِبْنَا أَنْ نَسْأَلَ حُذَيْفَةَ مَنِ الْبَابِ؟ فَقُلْنَا لِمَسْرُوْقٍ: سَلْهُ. فَسَأَلَهُ. فَقَالَ: عُمَرُ. متفق عليه.

5435. (26) [3/1496 ఏకీభవితం]

హుజై’ఫహ్ (ర) కథనం: మేమందరం ‘ఉమర్‌ (ర) వద్ద కూర్చుని ఉన్నాం. ‘ఉమర్‌ (ర) మమ్మల్ని, ‘ప్రవక్త (స) పలికిన ఉపద్రవాలకు చెందిన ‘హదీసు’లు ఎవరికి ఎక్కువగా గుర్తున్నాయి,’ అని అడిగారు. అప్పుడు, నాకు అధికంగా గుర్తున్నాయని నేనన్నాను. అది విన్న ‘ఉమర్‌ (ర), ‘అవును, ఇటువంటి ‘హదీసు’లను గురించి అడగటంలో నువ్వు ముందుండేవాడివి,’ అని అన్నారు. ఆ తరువాత ‘ఉమర్‌ (ర), ‘ఉపద్రవాలకు చెందిన ‘హదీసు’లను గురించి చెప్పు,’ అని అన్నారు. అప్పుడు నేను ఈ ‘హదీసు’ను గురించి ఇలా చెప్పాను. ప్రవక్త (స) ఇలా ప్రవచిస్తూ ఉండగా నేను విన్నాను, ”మానవుణ్ణి అతని భార్యాబిడ్డల ద్వారా, ఇరుగు, పొరుగువారి ద్వారా పరీక్షించడం జరుగుతూ ఉంటుంది. కాని ఈ ఉపద్రవాలకు నమా’జ్‌, ఉపవాసం, దానధర్మాలు మరియు మంచిని ఆదేశించడం, చెడును వారించటం పరిహారం అవుతాయి.” అది విని ‘ఉమర్‌ (ర), ‘నేను నిన్ను సామాన్య ఉపద్రవాల గురించి అడగటం లేదు, సముద్రపు అలల వంటి భయంకరమైన ఉపద్రవం గురించి అడుగుతున్నాను,’ అని అన్నారు. దానికి నేను, ‘మీకు ఇటువంటి ఉపద్రవాల గురించి తెలుసుకోవలసిన అవసరం లేదు. ఎందుకంటే మీకూ ఉపద్రవాలకూ మధ్య ఒకద్వారం మూసిఉంది. ఆ ద్వారం మూసి ఉన్నంత కాలం ఎటువంటి ఉపద్రవం సంభవించదు.’ అది విని ‘ఉమర్‌ (ర), ‘ఆ ద్వారాన్ని పడగొట్టటం జరుగుతుందా? లేక తెరవటం జరుగు తుందా?’ అని అడిగారు. దానికి నేను, ‘ఆ ద్వారాన్ని పడగొట్టటం జరుగుతుంది.’ ఆ తరువాత ‘ఉమర్‌ (ర), ‘పడగొట్టబడే ఆ ద్వారం మళ్ళీ మూసుకోదా?’ అని అడిగారు. దానికి హుజైఫహ్ (ర), ‘అవును, అది మూసుకోదు.’ వారిలో షఖీఖ్‌ (ర) ఇలా అన్నారు. ”షఖీఖ్‌ (ర), నన్ను, ‘ ‘ఉమర్‌ (ర)కు ఆ ద్వారం గురించి తెలుసా?’ అని అడిగారు. దానికి నేను,  ‘స్పష్టంగా నేటి రాత్రి రేపటి పగలు గురించి తెలిసినట్టు అతనికి తెలుసు,’ అని అన్నాను. నేను ‘ఉమర్‌ (ర)కు ఒక నిజమైన స్పష్టమైన ‘హదీసు’ను గురించి చెప్పాను. షఖీఖ్‌ (ర) ఇలా అన్నారు, ”మా గురువుగారు హుజై’ ఫహ్ (ర) ఈ ‘హదీసు’ను గురించి చెప్పిన తరువాత మా మిత్రులు, ‘ఆ ద్వారం ఏమిటి?’ అని హుజై’ఫహ్ (ర)ను అడగవలసింది,” అని అన్నారు. అడగటానికి మాకెవరికీ ధైర్యం చాలలేదు. మేము మా మిత్రుడు మస్‌రూ’ఖ్‌తో నీకూ హుజై’ఫహ్ (ర) మధ్య పరిచయం ఉంది. నీవడిగితే బాగుంటుంది,’ అని అన్నారు. మస్‌రూ’ఖ్‌, హుజై’ఫహ్ (ర)ను అడిగారు, దానికి హుజై’ఫహ్ (ర), ‘ఆ ద్వారం స్వయంగా ‘ఉమర్‌ (ర),’  అని అన్నారు.[26]  (బు’ఖారీ, ముస్లిమ్‌)

5436 – [ 27 ] ( لم تتم دراسته ) (3/1497)

وَعَنْ أَنَسٍ قَالَ: فَتْحُ الْقُسْطُنْطِيْنَةِ مَعَ قِيَامِ السَّاعَةِ. رَوَاهُ التِّرْمِذِيُّ. وَقَالَ: هَذَا حَدِيْثٌ غَرِيْبٌ .

5436. (27) [3/1497 అపరిశోధితం]

అనస్(ర) కధనం: ప్రళయానికి అతి చేరువలో ఖుస్తున్తునియహ్ జయించబడుతుంది. (తిర్మిజీ’ – ఏకోల్లేఖనం)

=====

2- بَابُ أَشْرَاطِ السَّاعَةِ

2. ప్రళయ సూచనలు

اَلْفَصْلُ الْأَوَّلُ మొదటి విభాగం   

5437 – [ 1 ] ( متفق عليه ) (3/1498)

عَنْ أَنَسٍ قَالَ: سَمِعْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ: “إِنَّ مِنْ أَشْرَاطِ السَّاعَةِ أَنْ يُرْفَعَ الْعِلْمُ وَيَكْثُرَالْجَهْلُ وَيُكْثُرَ الزِّنَا وَيَكْثُرَ شُرْبُ الْخَمْرِوَيَقِلَّ الرّجَالُ وَتَكْثُرَالنِّسَاءُ حَتّى يَكُوْنَ لِخَمْسِيْنَ امْرَأَةً الْقَيِّمُ الْوَاحِدُ”. وَفِيْ رِوَايَةٍ: “يَقِلَّ الْعِلْمُ وَيَظْهَرَالْجَهْلُ”. متفق عليه.

5437. (1) [3/1498 ఏకీభవితం]

అనస్‌ (ర) కథనం: ప్రవక్త (స) ఇలా ప్రవచిస్తూ ఉండగా నేను విన్నాను, ”ప్రళయ సూచనల్లో కొన్ని ఇవి కూడా ఉన్నాయి. 1. ధార్మిక జ్ఞానం అంతరిస్తుంది. 2. అజ్ఞానం అన్ని వైపుల వ్యాపిస్తుంది. 3. వ్యభిచారం అధిక మవుతుంది. 4. మద్యపానం చాలా అధికమవుతుంది. 5. పురుషుల సంఖ్య తగ్గిపోతుంది. 6. స్త్రీల సంఖ్య అధిక మవుతుంది. చివరికి 50 మంది స్త్రీలకు ఒక్క పురుషుడే బాధ్యత వహించ వలసి ఉంటుంది.

కొన్ని ఉల్లేఖనాల్లో జ్ఞానం తగ్గుముఖం పడు తుందని, అజ్ఞానం  వ్యాపిస్తుందని,  ఉంది. (బు’ఖారీ, ముస్లిమ్‌)

5438 – [ 2 ] ( صحيح ) (3/1498)

وَعَنْ جَابِرِبْنِ سَمُرَةَ قَالَ: سَمِعْتُ رَسُوْلَ النَّبِيَّ صلى الله عليه وسلم يَقُوْلُ: “إِنَّ بَيْنَ يَدَيِ السَّاعَةِ كَذَّابِيْنَ فَاحْذَرُوْهُمْ”. رَوَاهُ مُسْلِمٌ.

5438. (2) [3/1498దృఢం]

జాబిర్‌ బిన్‌ సమురహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ఇలా ప్రవచిస్తూ ఉండగా నేను విన్నాను, ”ప్రళయానికి ముందు చాలా మంది అసత్యవాదులు జన్మిస్తారు. నీవు వారి పట్ల అప్రమత్తంగా ఉండాలి.” (ముస్లిమ్‌)

5439 – [ 3 ] ( صحيح ) (3/1498)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: بَيْنَمَا كَانَ النَّبِيُّ صلى الله عليه وسلم يُحَدِّثُ إِذْ جَاءَأَعْرَابِيٌّ فَقَالَ: مَتَى السَّاعَةُ؟ قَالَ: “إِذَا ضُيِّعَتِ الْأَمَانَةُ فَانْتَظِرِ السَّاعَةَ “. قَالَ: كَيْفَ إِضَاعَتُهَا؟ قَالَ: ” إِذَا وُسِّدَ الْأَمْرُ إِلى غَيْرِأَهْلِهِ فَانْتَظِرِ السَّاعَةَ”. رَوَاهُ الْبُخَارِيُّ.  

5439. (3) [3/1498దృఢం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) తన అనుచరు లకు కొన్ని ‘హదీసు’లు బోధిస్తున్నారు. ఇంతలో ఎక్కడినుండో ఒక పల్లెవాసి వచ్చాడు. ఆ వ్యక్తి ప్రవక్త (స)ను ‘ప్రళయం ఎప్పుడువస్తుంది?’ అని అడిగాడు. దానికి ప్రవక్త (స), ‘నిజాయితీ లోపించి నపుడు ప్రళయం గురించి వేచిఉండు,’ అని అన్నారు. దానికి ఆ వ్యక్తి, ‘ఎలా లోపిస్తుంది?’ అని అడిగాడు. దానికి ప్రవక్త (స), ‘అర్హతలేని వారికి ప్రభుత్వం అప్పజెప్పబడితే, ప్రళయం గురించి వేచి ఉండు,’ అని అన్నారు. (బు’ఖారీ)

ప్రస్తుతం ప్రపంచంలో దేశాల ప్రభుత్వాలు అసమ ర్థుల చేతుల్లో ఉన్నాయి. ప్రతిచోట ఉపద్రవాలు, కల్లో లాలు, లంచాలు, సారాయి, వ్యభిచారం, ఘర్షణలు, ఉద్యమాలు  అనైతికతలు  కొనసాగుతున్నాయి.

5440 – [ 4 ] ( صحيح ) (3/1498)

وَعَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَا تَقُوْمُ السَّاعَةُ حَتّى يَكْثُرِ الْمَالُ وَيَفِيْضَ حَتّى يُخْرِجَ الرَّجُلُ زَكَاةَ مَالِهِ فَلَا يَجِدُ أَحَدًا يَقْبَلُهَا مِنْهُ وَحَتّى تَعُوْدَ أَرْضُ الْعَرَبِ مُرُوْجًا وَأَنْهَارًا”. رَوَاهُ مُسْلِمٌ.

وَفِيْ رِوَايَةٍ قَالَ: “تَبْلُغَ الْمَسَاكِنُ إِهَابَ أَوْ يِهَابَ “.

5440. (4) [3/1498దృఢం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ధన సంపదలు నీరులా పారేవరకు ప్రళయం సంభవించదు. ప్రజలు తమ ‘జకాతు తీసి దానం చేయాలనుకుంటారు. కాని తీసుకునేవారెవరూ ఉండరు. అందరూ ధన వంతులు ‘జకాత్‌ ఇచ్చేవారై ఉంటారు. అదేవిధంగా అరబ్‌ ప్రాంతం సస్యశ్యా మలంగా, పొలాలు, తోటలు, నదులు ప్రవహించేది కానంతవరకు ప్రళయం సంభవించదు. [27]   (ముస్లిమ్‌)

5441 – [ 5 ] ( صحيح ) (3/1499)

وَعَنْ جَابِرٍقَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “يَكُوْنُ فِيْ آخِرِ الزَّمَانِ خَلِيْفَةٌ يَقْسِمُ الْمَالَ وَلَا يَعُدُّهُ”.

وَفِيْ رِوَايَةٍ: قَالَ:”يَكُوْنُ فِيْ آخِرِ أُمَّتِيْ خَلِيْفَةٌ يَحْثِي الْمَالَ حَثْيًا وَلَا يَعُدُّهُ عَدًا”. رَوَاهُ مُسْلِمٌ .

5441. (5) [3/1499 దృఢం]

జాబిర్‌ (ర) కథనం: ప్రవక్త(స) ప్రవచనం, ”చివరి కాలంలో ఒక ‘ఖలీఫహ్ జన్మిస్తాడు. అతడు ధనాన్ని లెక్కలేనంతగా ప్రజల్లో పంచిపెడతాడు, ప్రజలు ఆ ధనాన్ని లెక్కపెట్టలేరు.

మరో ఉల్లేఖనంలో ఇలా ఉంది, ”చివరి కాలంలో ఒక ‘ఖలీఫహ్ (పాలకుడు) వస్తాడు. అతడు ప్రజలకు ధనాన్ని రెండు చేతులతో పంచిపెడతాడు.  ప్రజలు ఆ ధనాన్ని లెక్కపెట్టలేరు.”  [28]  (ముస్లిమ్‌)

5442 – [ 6 ] ( متفق عليه ) (3/1499)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “يُوْشِكُ الْفُرَاتُ أَنْ يَحْسُرَ عَنْ كَنْزٍ مِنْ ذَهَبٍ فَمَنْ حَضَرَ فَلَا يَأْخُذْ مِنْهُ شَيْئًا”. مُتَّفَقٌ عَلَيْهِ.  

5442. (6) [3/1499ఏకీభవితం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”భవిష్యత్తులో ఫురాత్‌ నది ఎండిపోతుంది. ఆ నది నుండి బంగారం, వెండిల, గుప్త నిధి బయటపడు తుంది. అయితే ఆ సమయంలో అక్కడ ఉన్నవారు ఆ నిధిని ముట్టుకో  కూడదు.”  (బు’ఖారీ,  ముస్లిమ్‌)

ఎందుకంటే వాటిని తీసుకోవటం వల్ల కల్లోలాలకు, ఉపద్రవాలకు గురికావలసివస్తుంది.

5443 – [ 7 ] ( صحيح ) (3/1499)

وَعَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَا تَقُوْمُ السَّاعَةُ حَتَّى يُحْسَرَالْفُرَاتُ عَنْ جَبَلٍ مِنْ ذَهَبٍ يَقْتَتِلُ النَّاسُ عَلَيْهِ فَيُقْتَلُ مِنْ كُلِّ مِائَةٍ تِسْعَةٌ وَتِسْعُوْنَ. وَيَقُوْلُ كُلُّ رَجُلٍ مِنْهُمْ: لَعَلِّيْ أَكُوْنُ أَنَا الَّذِيْ أَنْجُوْ”. رَوَاهُ مُسْلِمٌ .

5443. (7) [3/1499దృఢం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”భవిష్యత్తులో తీర్పుదినానికి ముందు ఫురాత్‌ నది ఎండిపోతుంది. అందులో నుండి బంగారు కొండ బయట పడుతుంది. ప్రజలు ఆ కొండను పొందటానికి యుద్ధం చేస్తారు. యుద్ధం చేసినవారిలో 99% చంప బడతారు. 100లో ఒక్కరే మిగులుతారు. వారిలో ప్రతి ఒక్కరూ నేనే సజీవంగా ఉంటాను, నేనే ఈనిధిని చేజిక్కించు కుంటాను అని భావిస్తూ ఉంటారు.” (ముస్లిమ్‌)

ఈ’హదీసు’మొదటి ‘హదీసు’ను సమర్థిస్తుంది. మొదటి ‘హదీసు’లో యుద్ధప్రస్తావన లేదు, ఇందులో ఉంది.

5444 – [ 8 ] ( صحيح ) (3/1499)

وَعَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “تَقِيْءُ الْأَرْضُ أَفْلَاذَ كَبِدِهَا أَمْثَالَ الْأُسْطُوَانَةِ مِنَ الذَّهَبِ وَالْفِضَّةِ فَيَجِيْءُ الْقَاتِلُ فَيَقُوْلُ: فِيْ هَذَا قَتَلْتُ وَيَجِيْءُ الْقَاطِعُ فَيَقُوْلُ: فِيْ هَذَا قَطَعْتُ رَحِمِيْ. وَيَجِيْءُ السَّارِقُ فَيَقُوْلُ: فِيْ هَذَا قُطِعَتْ يَدِيْ ثُمَّ يَدْعُوْنَهُ فَلَا يَأْخُذُوْنَ مِنْ شَيْئًا”. رَوَاهُ مُسْلِمٌ.

5444. (8) [3/1499దృఢం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”భూమి తనలో దాగి ఉన్న ధనరాసులను తీసి బయట పారేస్తుంది. అవి బంగారు, వెండి స్తంభాల్లా ఉంటాయి. ధనం కోసం ప్రజలను చంపిన వ్యక్తి అక్కడకు వచ్చి, ‘ఈ ధనం కోసమే నేను అనేకమందిని చంపాను. ఇప్పు డు ఈ ధనాన్ని తీసుకోవటానికి ఎవరైనా ఉన్నారా?’ అని అంటాడు. ఆ తరువాత సంబంధాలు త్రెంచేవాడు, బంధువుల హక్కులను చెల్లించనివాడు అక్కడకు వచ్చి, ‘ఈధనాన్ని కూడబెట్టడానికి నేను బంధుత్వాన్ని త్రెంచాను, ఇంకా వారి హక్కులను చెల్లించ లేదు. ఈ రోజు ఈ ధనాన్ని గురించి ఎవరూ అడగరు,’ అని అంటాడు. ఆ తరువాత అక్కడకు ఒక దొంగవస్తాడు. దొంగతనం వల్ల అతని చేయి నరికి వేయబడి ఉంటుంది. అతడు, ‘ఈ ధనాన్ని దొంగలించడంలోనే నా ఈ చేయి నరక బడింది.’ అని అంటాడు. ఇలా ఇటు వంటి చాలా మంది అక్కడకు వస్తారు. వారిలో ఎవ్వరూ ఆ ధనాన్ని ముట్టుకోరు. (ముస్లిమ్‌)

5445 – [ 9 ] ( صحيح ) (3/1499)

وَعَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “وَالَّذِيْ نَفْسِيْ بِيَدِهِ لَا تَذْهَبُ الدُّنْيَا حَتَّى يَمُرَّالرَّجُلُ عَلَى الْقَبْرِفَيَتَمَرَّغُ عَلَيْهِ وَيَقُوْلُ: يَا لَيْتَنِيْ مَكَانَ صَاحِبِ هَذَا الْقَبْرِوَلَيْسَ بِهِ الدَّيْنُ إِلَّا الْبَلَاءُ”. رَوَاهُ مُسْلِمٌ .

5445. (9) [3/1499దృఢం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”అల్లాహ్‌ సాక్షి! ప్రళయానికిముందు భవిష్యత్తులో ఒకకాలం వస్తుంది. మనిషి సమాధి ప్రక్కనుండి వెళుతూ సమాధిపై జంతువులా దొర్లుతూ చాలా నిరాశతో, ‘నేను ఈ సమాధిలో ఉంటే ఎంతబాగుండు, నేను చనిపోయి ఉంటే ఎంతబాగుండు,’ అని అంటాడు. ఎందుకంటే ఆ వ్యక్తి కష్టాలకు, కల్లోలాలకు గురయిఉంటాడు. అతడిలా కోరటం అతనికి ధర్మజ్ఞానం లేదని కాదు, కేవలం కష్టాలు, ఆపదల వల్ల అలా అంటాడు. (ముస్లిమ్‌)

5446 – [ 10 ] ( متفق عليه ) (3/1499)

وَعَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَا تَقُوْمُ السَّاعَةُ حَتّى تَخْرُجَ نَارٌمِنْ أَرْضِ الْحِجَازِ تُضِيْءُ أَعْنَاقَ الْإِبِلِ بِبُصْرَى”. متفق عليه .

5446. (10) [3/1499ఏకీభవితం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ప్రళయానికి ముందు హిజా’జ్‌నుండి ఒక అగ్ని జ్వాల బహిర్గతం అవుతుంది. దానివల్ల బ’స్రాలోని ఒంటెల మెడలకు వెలుగు ప్రసాదిస్తుంది. అంటే ఈ అగ్ని జ్వాల వెలుగు బ’స్రావరకు చేరుతుంది. [బ’స్రా, ఇరాఖ్ దేశంలోని ఒక పట్టణం పేరు]. (బు’ఖారీ, ముస్లిమ్‌)

అది సహజంగా అగ్నిజ్వాలకావచ్చు, లేదా యుద్ధాలు, పోరాటాలు కావచ్చు. ఇవన్నీ ప్రళయానికి ముందు జరుగుతాయి.

5447 – [ 11 ] ( صحيح ) (3/1499)

وعَنْ أَنَسٍ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم: “أَوَّلُ أَشْرَاطِ السَّاعَةِ نَارٌ تَحْشُرُالنَّاسَ مِنَ الْمَشْرِقِ إِلى الْمَغْرِبِ”. رَوَاهُ الْبُخَارِيُّ.

5447. (11) [3/1499 దృఢం]

అనస్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ప్రళయానికి ముందు ఒక అగ్నిజ్వాల బహిర్గతం అవుతుంది. అది ప్రజలను తూర్పు నుండి పడమర వైపునకు వెంబడిస్తుంది.” (బు’ఖారీ)

అంటే ప్రజలు తూర్పు నుండి పడమర వైపునకు పారి పోతారు. అంటే కల్లోలాలు, యుద్ధాలు జరుగుతాయి.

—–

اَلْفَصْلُ الثَّانِيరెండవ విభాగం    

5448 – [ 12 ] ( لم تتم دراسته ) (3/1500)

عَنْ أَنَسٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَا تَقُوْمُ السَّاعَةُ حَتّى يَتَقَارَبَ الزَّمَانُ فَتَكُوْنُ السَّنَةُ كَالشَّهْرِ وَالشَّهْرُ كَالْجُمْعَةُ وَتَكُوْنُ الْجُمُعَةُ كَالْيَوْمِ وَيَكُوْنُ الْيَوْمُ كَالسَّاعَةِ وَتَكُوْنُ السَّاعَةُ كَالضَّرْمَةِ بِالنَّارِ”. رَوَاهُ التِّرْمِذِيُّ.

5448. (12) [3/1500అపరిశోధితం]

అనస్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”చివరి కాలంలో కాలం ముడుచుకుంటుంది. ఒక సంవత్సరం ఒకనెలగా ఉంటుంది. ఒకనెల ఒకవారంగా ఉంటుంది. ఒకవారం ఒకరోజుగా ఉంటుంది. ఒకరోజు ఒకగంటగా ఉంటుంది. ఒకగంట ఒకనిమిషంగా ఉంటుంది.” [29] (తిర్మిజి’)

5449 – [ 13 ] ( ضعيف ) (3/1500)

وعَنْ عَبْدِ اللهِ بْنِ حَوَالَةَ قَالَ: بَعَثَنَا رَسُوْلُ اللهِ صلى الله صلى الله عليه وسلم لِنَغْنَمَ عَلَى أَقْدَامِنَا فَرَجَعْنَا فَلَمْ نَغْنَمْ شَيْئًا وَعَرَفَ الْجُهْدَ فِيْ وُجُوْهِنَا فَقَامَ فِيْنَا فَقَالَ: “اَللّهُمَّ لَا تَكِلْهُمْ إِلَيَّ فَأَضْعُفَ عَنْهُمْ وَلَا تَكِلْهُمْ إِلى أَنْفُسُهِمْ فَيَعْجِزُوْا عَنْهَا وَلَا تَكِلْهُمْ إِلى النَّاسِ فَيَسْتَأْثِرُوْا عَلَيْهِمْ” .ثُمَّ وَضَعَ يَدَهُ عَلَى رَأْسِيْ ثُمَّ قَالَ: “يَا ابْنَ حَوَالَةَ إِذَا رَأَيْتَ الْخِلَافَةَ قَدْ نَزَلَتِ الْأَرْضَ الْمُقَدَّسَةَ فَقَدْ دَنَتِ الزَّلَازِلُ وَالْبَلَابِلُ وَالْأُمُوْرُ الْعِظَامُ وَالسَّاعَةُ يَوْمَئَذٍ أَقْرَبُ مِنَ النَّاسِ مِنْ يَدِيْ هَذَهِ إِلى رَأْسِكَ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ.

5449. (13) [3/1500 బలహీనం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘హవాలహ్ (ర) కథనం: ప్రవక్త (స) మమ్మల్ని కాలినడకన పోరాటానికి పంపి, యుద్ధధనం ఒకచోట చేర్చమని పంపారు. అప్పుడు ముస్లిముల వద్ద యుద్ధ పరికరాలు లేవు. అంటే వాహనాలు మొదలైనవి లేవు. మేము జిహాద్‌ నుండి వచ్చాం. యుద్ధధనంగా మాకేమీ దక్కలేదు.

ప్రవక్త (స) మా ముఖాలు చూసి మేము పడిన శ్రమ గురించి తెలుసుకున్నారు. ఆ తరువాత ప్రవక్త (స) మా మధ్య నిలబడి ఇలా ప్రసంగించారు. ‘ఓ అల్లాహ్‌ (త)! వీరి వ్యవహారాలను నాకు అప్పగించకు, నేను బలహీనుణ్ణి అయిపోతాను. (అంటే వారి సంరక్షణ బాధ్యతలు నేను భరించలేను).’ ఇంకా ‘ఓ అల్లాహ్‌ (త)! వీరు కూడా తమ పరిస్థితుల్ని చక్కబెట్టకో లేరు. ఓ అల్లాహ్‌(త)! వీరిని అక్కరగలవారుగా, దీనులుగా చేయకు. ఎందుకంటే వీరు తమ సమస్యల్లో తల మునకలై పోతారు.’ ఆ తరువాత ప్రవక్త (స) నా తలపై చేయిపెట్టి ఇలా అన్నారు, ‘ఓ ఇబ్నె హవాల! ఖిలాఫత్‌ సిరియా చేరుకుంటే, భూకంపాలు, కల్లోలాలు మరియు పెద్దపెద్ద సూచనలు, సమీపిస్తాయి. అప్పుడు ప్రళయం ఎంత దగ్గరగా ఉంటుందంటే నా చేయి నీ తలకు దగ్గరగా ఉన్నంతగా ఉంటుంది.

5450 – [ 14 ] ( ضعيف ) (3/1500)

وعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِذَا اتّخِذَ الْفَيْءُ دِوَلًا وَالْأَمَانَةُ مَغْنَمًا وَالزَّكَاةُ مَغْرَمًا وَتُعلِّمَ لِغَيْرِ الدِّيْنِ وَأَطَاعَ الرَّجُلُ امْرَأَتَهُ وَعَقَّ أُمَّهُ وَأَدْنَى صَدِيْقَهُ وَأَقْصَى أَبَاهُ وَظَهَرَتِ الْأَصْوَاتُ فِي الْمَسَاجِدِ وَسَادَ الْقَبِيْلَةَ فَاسْقُهُمْ وَكَانَ زَعِيْمُ الْقَوْمِ أَرْذَلَهُمْ وَأُكْرِمَ الرَّجُلُ مَخَافَةَ شَرِّهِ وَظَهَرَتِ الْقَيْنَاتُ وَالْمَعَازِفُ وَشُرِبَتِ الْخُمُوْرُ وَلَعَنَ آخِرُ هَذِهِ الْأُمَّةِ أَوَّلَهَا فَارْتَقِبُوْا عِنْدَ ذَلِكَ رِيْحًا حَمْرَاءَ وَزَلْزَلَةً وَخَسْفًا وَمَسْخًا وَقَذْفًا وَآيَاتٍ تَتَابَعُ كَنِظَامِ قُطِعَ سِلْكُهُ فَتَتَابَعَ”. رَوَاهُ التِّرْمِذِيُّ.

5450. (14) [3/1500 బలహీనం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”నా అనుచర సమాజం ఈ 15 విషయాలకు పాల్పడితే, వారిపై కష్టాలు అవతరిస్తూ ఉంటాయి. 1. యుద్ధ ధనాన్ని ధార్మిక సొత్తుగా కాక తమ సొంత డబ్బుగా చేసుకుంటారు. 2. నిజాయితీని యుద్ధ ధనంలా ధర్మ సమ్మతంగా భావిస్తారు. 3. ప్రజలు ‘జకాత్‌ను జరిమానాగా భావిస్తారు. 4. ఆస్తి పంపక శాస్త్రాన్ని ప్రాపంచిక స్వలాభం కోసం నేర్చుకుంటారు. 5. భర్త తన భార్యకు విధేయుడై ఉంటాడు. 6. సంతానం తల్లి దండ్రుల పట్ల అవిధేయత చూపుతారు. 7. తమ మిత్రులకు దగ్గర అవుతారు. 8. తమ తల్లిదండ్రులకు దూరం అవుతారు. 9. మస్జిదుల్లో అల్లర్లు, ఆటలు పాటల కోలాహలం చేస్తారు. 10. జాతి నాయకులు నీచులై, హీనులై, దుర్జనులై ఉంటారు. 11. భయం వల్ల వారిని గౌరవించడం, ఆదరించడం జరుగుతుంది. 12. ఆటలు పాటలు బహిర్గతం అవుతాయి. అంటే పాటలు పాడే స్త్రీలు బహిరంగంగా ఆటలు, పాటలు ప్రదర్శిస్తారు. 13. ఇంకా డప్పులు, వాయిద్యాలు, వీణా పరికరాలు వ్యాపిస్తాయి. ప్రతిచోట సంగీతం, పాటలు, నృత్యాలు కనబడతాయి, వినబడతాయి. 14. మద్యం సర్వసాధారణమై పోతుంది. 15. ఇంకా ఈ అనుచర సమాజంలోని చివరి బృందం, మొదటి బృందాన్ని విమర్శిస్తుంది. ఇంకా వారిని శపిస్తుంది, ఇంకా వారిని ఎత్తిపొడుస్తుంది.

ఈ విషయాలన్నీ బహిర్గతం అవగానే, ఎర్రటి తుఫాను గురించి వేచి ఉండండి. ఇది ప్రళయ సూచనలలోని ఒక సూచన. ఇంకా అనేక భూకంపాలు వస్తాయి. భూమిలోకి దింపివేయడం జరుగుతుంది. ఇంకా ముఖాలు కోతులుగా మార్చివేయడం జరుగుతుంది. ఆకాశం నుండి రాళ్ళ వర్షం కురుస్తుంది. ఇటు వంటి సూచన లన్నీ క్రమంగా బహిర్గతం అవుతాయి. తెగిన ముత్యాల హారం నుండి ముత్యాలు రాలి నట్లు. అంటే ప్రళయ సూచనలు క్రమంగా బహిర్గతమవుతూ ఉంటాయి. చివరికి ప్రళయం రానే వస్తుంది. (తిర్మిజి’)

5451 – [ 15 ] ( ضعيف ) (3/1501)

وعَنْ عَلِيٍّ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِذَا فَعَلَتْ أُمَّتِيْ خَمْسَ عَشَرَةَ خِصْلَةً حَلَّ بِهَا الْبَلَاءُ”. وَعَدَّ هَذِهِ الْخِصَالَ وَلَمْ يَذْكُرْ”تُعَلِّمَ لِغَيْرِ الدِّيْنِ” قَالَ: “وَبَرَّ صَدِيْقَهُ وَجَفَا أَبَاهُ”. وَقَالَ: “وَشُرِبَ الْخَمْرُ وَلُبِسَ الْحَرِيْرُ”. رَوَاهُ التِّرْمِذِيُّ .

5451. (15) [3/1501 -బలహీనం]

‘అలీ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”నా అనుచర సమాజం 15 విషయాలకు పాల్పడితే, వారిపై కష్టాలు, ఆపదలు అవతరిస్తాయి. పై ‘హదీసు’లో పేర్కొన్న 15 విషయాలను ప్రవక్త (స) పేర్కొన్నారు. (తిర్మిజి’)

5452 – [ 16 ] ( حسن ) (3/1501)

وعَنْ عَبْدِ اللهِ بْنِ مَسْعُوْدٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَا تَذْهَبُ الدُّنْيَا حَتَّى يَمْلِكَ الْعَرَبَ رَجُلٌ مِنْ أَهْلِ بَيْتِيْ يُوَاطِيْءُ اِسْمُهُ اِسْمِيْ”. رَوَاهُ التِّرْمِذِيُّ وأَبُوْ دَاوُدَ.

وَفِيْ رِوَايَةٍ لَهُ: “لَوْ لَمْ يَبْقَ مِنَ الدُّنْيَا إِلَّا يَوْمٌ لَطَوَّلَ اللهُ ذَلِكَ الْيَوْمَ حَتَّى يَبْعَثَ اللهُ فِيْهِ رَجُلًا مِنِّيْ – أَوْ مِنْ أَهْلِ بَيْتِيْ – يُوَاطِئُ اِسْمُهُ اِسْمِيْ وَاسْمُ أَبِيْهِ اِسْمَ أَبِيْ يَمْلَأُ الْأَرْضَ قِسْطًا وَعَدْلًا كَمَا مُلِئَتْ ظُلْمًا وَجَوْرًا”.

5452. (16) [3/1501 ప్రామాణికం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ మస్‌’ఊద్‌ (ర) కథనం: ప్రవక్త(స) ప్రవచనం, ”అరబ్బునంతా నాకుటుంబానికి చెందిన ఒక వ్యక్తి పాలించనంతవరకు ప్రళయం సంభవించదు. అతనిదీ నా పేరులాగే ఉంటుంది. అతడు నా కుటుం బానికి చెందిన వాడై ఉంటాడు. అతని తండ్రిపేరు నా తండ్రి పేరులాగే ఉంటుంది. అతడు ధర్మంగా న్యాయంగా పరిపాలిస్తాడు. అంతకుముందు ప్రపంచ మంతా అధర్మంతో, అన్యాయంతో నిండి ఉంటుంది.

కొన్ని ఉల్లేఖనాల్లో ఇలా ఉంది, ”కేవలం ఒక్క రోజు మాత్రమే మిగిలి ఉంటుంది. అల్లాహ్‌ (త) ఆ దినాన్ని చాలా విశాలంగా చేస్తాడు. చివరికి నా కుటుంబం నుండి ఒక వ్యక్తిని పంపుతాడు. అతనిదీ నా పేరై ఉంటుంది. అతని తండ్రిదీ నా తండ్రి పేరై ఉంటుంది.”[30] (అబూ దావూద్‌, తిర్మిజి’)

5453 – [ 17 ] ( صحيح ) (3/1501)

وعَنْ أُمِّ سَلَمَةَ قَالَتْ: سَمِعْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ: “اَلْمَهْدِيُّ مِنْ عِتْرَتِيْ مِنْ أَوْلَادِ فَاطِمَةَ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ.

5453. (17) [3/1501దృఢం]

ఉమ్మె సలమహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మహ్‌దీ (అ) నా కుటుంబం వారై ఉంటాడు. అంటే నా కూతురు ఫాతిమహ్ సంతతి నుండి ఉంటాడు.” (అబూ  దావూద్‌)

ఈ ‘హదీసు’ ద్వారా మహ్‌దీ (అ) ఫాతిమహ్ సంతతివారై ఉంటారని తెలుస్తోంది.

5454 – [ 18 ] ( حسن ) (3/1501)

وعَنْ أَبِيْ سَعِيْدِ الْخُدْرِيِّ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “اَلْمَهْدِيُّ مِنِّيْ أَجْلَى الْجَبْهَةِ وَأَقْنَى الْأَنْفِ يَمْلَأُ الْأَرْضَ قِسْطًا وَعَدْلًا كَمَا مُلِئَتْ ظُلْمًا وَجَوْرًا يَمْلِكُ سَبْعَ سِنِيْنَ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ.

5454. (18) [3/1501ప్రామాణికం]

అబూ స’యీద్‌ ‘ఖుద్రీ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవ చనం, ”మహ్‌దీ నాసంతతి నుండి జన్మిస్తాడు. అతడు విశాలమైన నుదురు, వెలుగుతో కూడిన ముఖం, పొడవైన ముక్కు కలిగి ఉంటారు. అతడు ప్రపంచాన్ని న్యాయంగా, ధర్మంగా పరిపాలిస్తాడు. అతడు 7 సంవత్సరాలు పరిపాలిస్తాడు.” (అబూ  దావూద్‌)

5455 – [ 19 ] ( لم تتم دراسته ) (3/1501)

وعَنْهُ عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم فِي قِصَّةِ الْمَهْدِيِّ قَالَ: “فَيَجِيْءُ إِلَيْهِ الرَّجُلُ فَيَقُوْلُ: يَا مَهْدِيُّ أَعْطِنِيْ أَعْطِنِيْ. قَالَ: فَيَحْثِيْ لَهُ فِيْ ثَوْبِهِ مَا اسْتَطَاعَ أَنْ يَحْمِلَهُ”. رَوَاهُ التِّرْمِذِيُّ.

5455. (19) [3/1501అపరిశోధితం]

అబూ స’యీద్‌ ‘ఖుద్రీ (ర) కథనం: ప్రవక్త (స) మహ్‌దీ (అ) గురించి మాట్లాడుతూ అతడు చాలా దాతృత్వ గుణం కలిగి ఉంటాడని, ప్రజలు అతని దగ్గరకు వస్తారు. అతడు రెండు చేతుల నిండుగా ధనాన్ని ప్రజలకు ఇస్తాడు. అంటే వారు తీసుకు పోయినంత ధనం ఇస్తాడు.” (తిర్మిజి’)

5456 – [ 20 ] ( ضعيف ) (3/1502)

وعَنْ أُمِّ سَلَمَةَ عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ:”يَكُوْنُ اخْتِلَافٌ عِنْدَ مَوْتِ خَلِيْفَةٍ فَيَخْرُجُ رَجُلٌ مِنْ أَهْلِ الْمَدِيْنَةِ هَارِبًا إِلى مَكَّةَ فَيَأْتِيْهِ النَّاسُ مِنْ أَهْلِ مَكَّةَ فَيُخْرِجُوْهُ وَهُوَ كَارِهٌ فَيُبَايِعُوْنَهُ بَيْنَ الرُّكُنِ وَالْمَقَامِ يُبْعَثُ إِلَيْهِ بَعْثٌ مِنَ الشَّامِ فَيُخْسَفُ بِهِمْ بِالْبَيْدَاءِ بَيْنَ مَكَّةَ وَالْمَدِيْنَةِ فَإِذَا رَأَى النَّاسُ ذَلِكَ أَتَاهُ أَبْدَالُ الشَّامِ وَعَصَائِبُ أَهْلِ الْعِرَاقِ فَيُبَايِعُوْنَهُ ثُمَّ يَنْشَأُ رَجَلٌ مِنْ قُرَيْشٍ أَخْوَالُهُ كَلْبٌ فَيَبْعَثُ إِلَيْهِمْ بَعْثًا فَيَظْهَرُوْنَ عَلَيْهِمْ وَذَلِكَ بَعْثُ كَلْب وَيَعْمَلُ النَّاسُ بِسُنَّةِ نَبِيِّهِمْ وَيُلْقِي الْإِسْلَامِ بِجِرَانِهِ فِي الْأَرْضِ فَيَلْبَثُ سَبْعَ سِنِيْنَ ثُمَّ يُتَوَفّى وَيُصَلِّيْ عَلَيْهِ الْمُسْلِمُوْنَ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ.

5456. (20) [3/1502–  బలహీనం]

ఉమ్మె సలమహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఒక ‘ఖలీఫహ్ మరణించినపుడు ప్రజల్లో అభిప్రాయభేదాలు ఏర్పడతాయి. ఈ విభేదాల నుండి తప్పించు కోవటానికి, ఒకవ్యక్తి బయలుదేరి మక్కహ్ పారిపోతాడు. మక్కహ్ ప్రజలు అతని వద్దకు వస్తారు. అతన్ని అతని ఇంటి నుండి బయటకు రప్పించి ‘హజరె అస్వద్‌, మఖామె ఇబ్రాహీమ్‌ల మధ్య అతని చేతిపై బైఅత్‌ చేసి అతన్ని తమ ‘ఖలీఫహ్గా ఎన్నుకుంటారు. అయితే, ఆ వ్యక్తి పాలకుడు కావటానికి ఒప్పుకోడు, దానిపట్ల సంతోషం వ్యక్తం చేయడు, ఆ తరువాత సిరియా నుండి అతనిపైకి ఒకసైన్యం పంపబడుతుంది, సిరియా సైన్యం అతనితో యుద్ధం చేయటానికి మక్కహ్ వచ్చినపుడు వారిని బైదాహ్‌ అనే ప్రాంతంలో భూమిలో కూర్చివేయటం జరుగుతుంది. ఇది మక్కహ్ మదీనహ్ల మధ్య ఉంది. ఈ వార్త ముస్లిములకు చేరిన వెంటనే సిరియా నుండి, ఇరాఖ్‌ నుండి అనేక మంది  అల్లాహ్ ప్రియభక్తులు వారికి సహాయం చేయ టానికి వస్తారు, ఇంకా వారి చేతులపై బై’అత్‌ చేస్తారు. ఆ తరువాత మరో వ్యక్తి ఖురైష్‌లో జన్మిస్తాడు. అతని తల్లి కల్బ్‌ వర్గానికి చెందినదై ఉంటుంది. ఈ వ్యక్తి కూడా అతనిపై సైన్యం పంపిస్తాడు. కాని ఈ సైన్యాన్ని అతని సైన్యం ఓడిస్తుంది. దీన్ని కల్బ్‌ వర్గం కల్లోలం అంటారు. ఆ ‘ఖలీఫహ్ తన ప్రవక్త (స) ఆదేశాల ప్రకా రం పరిపాలిస్తాడు. ఇస్లామ్‌ తన మెడ భూమిపై పెడు తుంది. అంటే పనులన్నీ ఇస్లామ్‌ ప్రకారమే జరుగు తాయి. ఆ ‘ఖలీఫహ్ 7 సంవత్సరాల వరకు నిజా యితీగా పరిపాలిస్తాడు. ఆ తరువాత ఆ కాలంలోనే అతడు మరణిస్తాడు. ముస్లిములు అతని జనా’జహ్ నమా’జు చదువుతారు. [31] (అబూ  దావూద్‌)

5457 – [ 21 ] ( ضعيف ) (3/1502)

وعَنْ أَبِيْ سَعِيْدٍ قَالَ: ذَكَرَرَسُوْل اللهِ صلى الله عليه وسلم: “بَلَاءً يُصِيْبُ هَذِهِ الْأُمَّةَ حَتَّى لَا يَجِدَ الرَّجُلُ مَلْجَأً يَلْجَأُ إِلَيْهِ مِنَ الظُّلْمِ فَيَبْعَثُ اللهُ رَجُلًا مِنْ عِتْرَتِيْ وَأَهْلِ بَيْتِيْ فَيَمْلَأُ بِهِ الْأَرْضَ قِسْطًا وَ عَدْلًا كَمَا مُلِئَتْ ظُلْمًا وَجَوْرًا يَرْضَى عَنْهُ سَاكِنُ السَّمَاءِ وَسَاكِنُ الْأَرْضِ لَا تَدَعُ السَّمَاءُ مِنْ قَطَرِهَا شَيْئًا إِلَّا صَبَّتْهُ مِدْرَارًا وَلَا تَدَعُ الْأَرْضُ مِنْ نَبَاتِهَا شَيْئًا إِلَّا أَخْرَجَتْهُ حَتّى يَتَمَنّى الْأَحْيَاءُ الْأَمْوَاتَ يَعِيْشُ فِيْ ذَلِكَ سَبْعَ سِنِيْنَ أَوْثَمَانَ سِنِيْنَ أَوْتِسْعَ سِنِيْنَ”. رواه.

5457. (21) [3/1502 బలహీనం]

అబూ స’యీద్‌ (ర) కథనం: ప్రవక్త (స) ముస్లిమ్‌ సమాజంపై రాబోయే ఆపదల గురించి పేర్కొన్నారు. ప్రతి వ్యక్తి ఆ ఆపదల్లో ఏదో ఒక దానికి గురవుతాడు. ఎవ్వరూ వారి కష్టాల నుండి తప్పించుకోలేరు. అప్పుడు అల్లాహ్‌ (త) నా కుటుంబంలో నుండి ఒక వ్యక్తిని పంపిస్తాడు. అతడు భూమిపై ధర్మాన్ని న్యాయాన్ని స్థాపిస్తాడు. అప్పుడు ప్రజలు కూడా సంతోషిస్తారు. అల్లాహ్ కూడా సంతోషిస్తాడు. అతని కాలంలో వర్షాలు విస్తారంగా పడతాయి. పంటల్లో శుభం అవతరిస్తుంది. అందరూ సంతోషంగా, సంతృప్తిగా ఉంటారు. చివరికి ప్రజలు మనపెద్దలు కూడా బ్రతికి ఉంటే బాగుణ్ణు, ఈ సంతోషాల్లో పాలు పంచుకునేవారు, అని కోరుకుంటారు. ఇతడు మహ్‌దీ అయి ఉంటాడు. ఈ విధమైన కాలంలో 7, 8 లేక 9 సంవత్సరాలు ఉంటారు.(హాకిమ్‌)

5458 – [ 22 ] ( ضعيف ) (3/1503)

وَعَنْ عَلِيِّ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “يَخْرُجُ رَجُلٌ مِنْ وَرَاءِ النَّهْرِيُقَالُ لَهُ: الْحَارِثُ حَرَّاثٌ عَلَى مُقَدَّمَتِهِ رَجُلٌ يُقَالُ لَهُ: مَنْصُوْرٌ يُوَطِّنُ أَوْ يُمَكِّنُ لِآلِ مُحَمَّدٍ كَمَا مَكَّنَتْ قُرَيْشٌ لِرَسُوْلِ اللهِ وَجَبَ عَلَى كُلِّ مُؤْمِنٍ نَصْرُهُ – أَوْ قَالَ: إِجَابَتُهُ – ” رَوَاهُ أَبُوْ دَاوُدَ.

5458. (22) [3/1503బలహీనం]

‘అలీ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”నదికి అవతలి వైపు ఉన్న నగరాల నుండి ఒక వ్యక్తి వస్తాడు. అతడి పేరు ‘హారిస్‌’ లేదా ‘హర్రాస్’ ఉంటుంది. అతని సైన్యంలో ముందు భాగంలో ఒక అధికారి ఉంటాడు. అతని పేరు మన్‌’సూర్‌ ఉంటుంది. అతడు దైవదౌత్య కుటుంబానికి శరణు, అభయం ఇస్తాడు. వారికి ఏ విధమైన కష్టాలు కలగకుండా చూస్తాడు. ముస్లిమ్‌ ఖురైషీలు ప్రవక్త (స)కు అభయం ఇచ్చినట్టు. అప్పుడు అతనికి సహాయం చేయటం ప్రతి ఒక్కరి బాధ్యత.” [32]  (అబూ  దావూద్‌)

5459 – [ 23 ] ( صحيح ) (3/1503)

وعَنْ أَبِيْ سَعِيْدِ الْخُدْرِيِّ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “وَالَّذِيْ نَفْسِيْ بِيَدِهِ لَا تَقُوْمُ السَّاعَةُ حَتّى تُكَلِّمَ السِّبَاعُ الْإِنْسَ وَحَتّى تُكَلِّمَ الرَّجُلَ عَذَبَةُ سَوْطِهِ وَشِرَاكُ نَعْلِهِ وَيُخْبِرُهُ فَخِذُهُ بِمَا أَحْدَثَ أهْلُهُ بَعْدَهُ”. رَوَاهُ التِّرْمِذِيُّ  .

5459. (23) [3/1503  దృఢం]

అబూ స’యీద్‌ ‘ఖుద్రీ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఎవరి చేతిలో నా ప్రాణం ఉందో ఆయన సాక్షి! క్రూరమృగాలు మానవులతో మాట్లాడనంత వరకు ప్రళయం సంభవించదు. అంటే ప్రళయానికి ముందు అడవి జంతువులు క్రూరమృగాలు మానవులతో మాట్లాడుతాయి. చివరికి కొరడా చివరి భాగం, చెప్పుల పట్టీలు, తొడ అంటే మర్మాంగం, నిర్జీవ పదార్థాలు కూడా మాట్లాడుతాయి. ఇవన్నీ ప్రళయ చిహ్నాలు. (తిర్మిజి’)

—–

اَلْفَصْلُ الثَّالِثُ  మూడవ విభాగం  

5460 – [ 24 ] ( ضعيف ) (3/1503)

عَنْ أَبِي قَتَادَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: اَلْآيَاتُ بَعْدَ الْمِائَتَيْنِ”. رَوَاهُ ابْنُ مَاجَهُ.

5460. (24) [3/1503బలహీనం]

అబూ ఖతాదహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, నా మరణానంతరం 200 సంవత్సరాల తర్వాత పెద్ద పెద్ద ప్రళయ సూచనలు బహిర్గతం అవుతాయి.” [33] (ఇబ్నె మాజహ్)

5461 – [ 25] ( ضعيف ) (3/1503)

وعَنْ ثَوْبَانَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِذَا رَأَيْتُمُ الرَّايَاتِ السُوْدَ قَدْ جَاءَتْ مِنْ قِبَلِ خُرَاسَانَ فَأْتُوْهَا فَإِنَّ فِيْهَا خَلِيْفَةَ اللهِ الْمَهْدِيَّ”. روَاهُ أَحْمَدُ وَالْبَيْهَقِيُّ فِيْ” دَلَائِلِ النُّبُوَّةِ. “.

5461. (25) [3/1503బలహీనం]

సౌ’బాన్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ” ‘ఖురాసాన్‌ దేశం వైపునుండి నల్లని జెండాలు రావడం మీరు చూస్తే, మీరు కూడా వారిలో కలసిపోండి. ఎందుకంటే ఈ జండాల క్రింద అల్లాహ్‌ (త) ‘ఖలీఫహ్ మహ్‌దీ (అ) ఉంటాడు.” (అ’హ్మద్‌, బైహఖీ/-దలాయి లిన్నబువ్వహ్)

5462 – [ 26 ] ( ضعيف ) (3/1503)

وعَنْ أَبِيْ إِسْحَاقَ قَالَ: قَالَ عَلِيٌّ وَنَظَرَ إِلَى ابْنِهِ الْحَسَنِ قَالَ: إِنَّ ابْنِيْ هَذَا سَيِّدٌ كَمَا سَمَّاهُ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم وَسَيَخْرُجُ مِنْ صُلْبِهِ رَجُلٌ يُسَمّى بِاِسْمِ نَبِيِّكُمْ يُشْبِهُهُ فِي الْخُلُقِ – ثُمَّ ذَكَرَ قِصَّةً – يَمْلَأُ الْأَرْضَ عَدْلًا . رَوَاهُ أَبُوْ دَاوُدَ وَلَمْ يَذْكُرِ الْقِصَّةَ.

5462. (26) [3/1503బలహీనం]

అబూ ఇస్‌’హాఖ్‌ కథనం: ‘అలీ (ర) తన కుమారుడు ‘హసన్‌ (ర)ను చూచి, ఈ నా కుమారుడు నాయకుడు, ప్రవక్త (స) కూడా ఇలాగే ప్రవచించారు. భవిష్యత్తులో ఇతడి కుటుంబం నుండి ఒక వ్యక్తి జన్మిస్తాడు. అతని పేరు మీ ప్రవక్త పేరులా ఉంటుంది. అంటే అ’హ్‌మద్‌ లేదా ము’హమ్మద్‌. సద్దుణాల్లో, అలవాట్లలో ప్రవక్త (స)ను పోలి ఉంటాడు. కాని ముఖవర్చస్సు మాత్రం అలా ఉండదు. ఆ తరువాత ‘అలీ (ర) అతని ధర్మం, న్యాయాలను గురించి ప్రస్తావించారు. (అబూ దావూద్‌)

ఈ ‘హదీసు’ ద్వారా మహ్‌దీ (అ) ‘హసన్‌ (ర) సంతతికి చెందినవారై ఉంటారు. కనుక షి’అహ్ వారి వాదన ఖండించ బడుతుంది.

5463 – [ 27 ] ( لم تتم دراسته ) (3/1504)

وَعَنْ جَابِرِ بْنِ عَبْدِ اللهِ قَالَ: فُقِدَ الْجَرَادُ فِيْ سَنَةٍ مِنْ سِنِيْ عُمَرَ الَّتِيْ تُوُفِّيَ فِيْهَا فَاهْتَمَّ بِذَلِكَ هَمًّا شَدِيْدًا فَبَعَثَ إِلى الْيَمَنِ رَاكِبًا وَرَاكِبًا إِلى الْعِرَاقِ وَرَاكِبًا إِلى الشَّامِ يَسْأَلُ عَنِ الْجَرَادِ هَلْ أَرَى مِنْهُ شَيْئًا فَأَتَاهُ الرَّاكِبُ الَّذِيْ مِنْ قِبَلِ الْيَمَنِ بِقَبْضَةٍ فَنَثَرَهَابَيْنَ يَدَيْهِ فَلَمَّا رَآهَا عُمَرُ كَبَّرَ وَقَالَ سَمِعْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ: إِنَّ اللهَ عَزَّ وَجَلَّ خَلَقَ أَلْفَ أُمَّةٍ سِتَّمِائَةٍ مِنْهَا فِي الْبَحْرِ وَأَرْبَعُ مِائَةٍ فِي الْبَرِّ فَإِنَّ أَوَّلَ هَلَاكِ هَذِهِ الْأُمَّةِ الْجَرَادُ فَإِذَا هَلَكَ الْجَرَادُ تَتَابَعَتِ الْأُمَمُ كَنَظَامِ السِّلْكِ”. رَوَاهُ الْبَيْهَقِيُّ فِيْ “شُعُبِ الْإِيْمَانِ”.

5463. (27) [3/1504 అపరిశోధితం]

జాబిర్‌ బిన్‌ ‘అబ్దుల్లాహ్‌ (ర) కథనం: ‘ఉమర్‌ (ర) మరణించిన సంవత్సరం సముద్రపు పక్షులు కనబడ లేదు. ‘ఉమర్‌ (ర) దాన్ని గమనించి అవి రానందువల్ల చాలా విచారించారు. ఆ తరువాత యమన్‌ వైపు ఒక వ్యక్తిని పంపారు, ‘ఇరాఖ్ వైపు ఒక వ్యక్తిని పంపారు, సిరియా వైపు ఒక వ్యక్తిని పంపారు. అక్కడకు వెళ్ళి, ‘సముద్రపు పక్షుల్ని ఎవరైనా చూసారా?’ అని అడగమన్నారు. యమన్‌ వైపు వెళ్ళి న వ్యక్తి కొన్ని సముద్రపు పక్షులు తీసుకొని వచ్చి ‘ఉమర్‌ (ర) ముందు పెట్టాడు. ‘ఉమర్‌ (ర) వాటిని చూచి అల్లాహు అక్బర్‌ అని పలికి, నేను ప్రవక్త (స) ఇలా అంటుండగా విన్నాను, ”అల్లాహ్‌ జంతువులను 1000 రకాలుగా పుట్టించాడు. వాటిలో 600 సము ద్రంలో ఉన్నాయి. 400 నేలపై జీవించేవి. వీటిలో అన్నిటికంటే ముందు సముద్రపు పక్షులు నాశనం అవుతాయి. అంటే అవినశిస్తాయి. ఆ తరువాత జంతువులు, పక్షులు ఒక దాని తరువాత ఒకటి నశిస్తాయి, హారం తెగితే ముత్యాలు ఒకదాని తరువాత ఒకటి పడిపోయినట్లు.” (బైహఖీ-షు’అబిల్ ఈమాన్)

=====

3- بَابُ الْعَلَامَاتِ بَيْنَ يَدَيِ السَّاعَةِ وَذِكْرِ الدَّجَّالِ

3. పునరుత్థానానుకి  ముందు బహిర్గతయ్యే  సూచనలు ,  దజ్జాల్

అబ్దుస్సలామ్‌ బస్తవీ గారు తన పుస్తకం ”ఇస్లామీయ ఖుత్‌బాత్‌”లో ప్రళయచిహ్నాల గురించి క్లుప్తంగా పేర్కొన్నారు. దాన్నే ఇక్కడ కూడా పేర్కొనడం జరిగింది.

ప్రళయచిహ్నాలు రెండు రకాలు. చిన్నవి, పెద్దవి. 1. ప్రళయానికి సంబంధించిన చిన్నచిన్న సూచనలు. 2. పెద్ద పెద్ద సూచనలు. చిన్న చిన్న సూచనలు అంటే ప్రవక్త (స) మరణం నుండి మహ్‌దీ లేదా ‘ఈసా (అ) అవతరించే వరకు ఉనికిలోకి వచ్చేవి. ఇంకా పెద్ద పెద్ద సూచనలంటే, మహ్‌దీ నుండి తుత్తార ఊదబడే వరకు బహిర్గతం అయ్యేవి. ప్రళయ తుత్తార ఊదబడి నప్పటి నుండి ప్రారంభం అవుతాయి.

చిన్న చిన్న ప్రళయ సూచనలు: ప్రళయ సూచనల గురించి ప్రవక్త (స) ఇలా ప్రవచించారు, ”మొదటి చిహ్నం నా మరణం, బైతుల్‌ ముఖద్దస్‌ విజయం, ఆ తరువాత ఒక అంటువ్యాధి. బైతుల్‌ ముఖద్దస్‌ విజయం, అంటువ్యాధి ఈ రెండూ ‘ఉమర్‌ (ర) కాలంలో బహిర్గతం అయ్యాయి. ఆ తరువాత అరబ్బుల ప్రతి ఇంట్లో ప్రవేశించే ఒక కల్లోలం ఏమిటంటే అది ‘ఉస్మాన్‌ (ర) హత్య. దీనివల్ల య’జీద్‌ మరియు ‘అబ్దుల్‌ మలిక్‌ బిన్‌ మర్వాన్‌ల కాలంలో ప్రతి ఇంటివారు శోకసముద్రంలో మునిగి పోయారు. ధన సంపదలు అధికం అవుతాయి, ముస్లిములు క్రైస్తవులలో ఒప్పందం జరుగుతుంది. ఆ తరువాత క్రైస్తవులు ఒప్పందాన్ని భంగం చేస్తారు. 80 జండాలు, ప్రతి జండా క్రింద 12,000 మంది సైనికులతో ముస్లిములపై దాడిచేస్తారు.” (బు’ఖారీ)

ప్రవక్త (స) ప్రళయ చిహ్నాల గురించి ప్రస్తావిస్తూ ఇలా అన్నారు, ”ముస్లిమ్‌ పాలకులు ప్రజాధనాన్ని తమ సొంత ధనంగా భావిస్తారు. అంటే దాన్ని ధార్మిక విషయాల్లో ఖర్చు చేయరు. ప్రజలు ‘జకాత్‌ను జరిమానాగా భావిస్తూ చెల్లిస్తారు. నిజాయితీని యుద్ధధనం వలె ధర్మసమ్మతంగా భావిస్తారు. భర్త తన భార్యకు విధేయుడై ఉంటాడు. సంతానం తమ తల్లి దండ్రులకు అవిధేయత చూపుతుంది. దుర్జనులతో స్నేహం చేస్తారు. గణితశాస్త్రం ప్రాపంచిక లాభాల కోసం నేర్చుకోవటం జరుగుతుంది. జాతినాయకులు దుర్మార్గులు, అవినీతిపరులు, దుర్గుణాలు గలవారై ఉంటారు. అర్హతలేని వారికి ప్రభుత్వ పదవులు లభిస్తాయి. భయంవల్ల వారిని గౌరవించటం జరుగు తుంది. మద్యపానం సర్వసామాన్యం అవుతుంది. పాటలు, నృత్యాలు విపరీతంగా సర్వసామాన్యం అవుతాయి. వ్యభిచారం అధికమయిపోతుంది. ముస్లిమ్‌ సమాజపు చివరి వారు మొదటి వారిని దూషించటం జరుగుతుంది. యువకుల్లో నడవడి సరిగా ఉండదు. మస్జిదుల్లో ఆటలు, పాటలు జరుగుతాయి. కలుసుకునే సమయాల్లో సలామ్‌కు బదులు తిట్లు పలుకుతారు. ధార్మిక జ్ఞానం తగ్గు ముఖం పడుతుంది. హృదయాల నుండి నిజాయితీ అంతం అవుతుంది. అసత్యాన్ని ఒక వృత్తిగా భావించటం జరుగుతుంది. సిగ్గు, లజ్జలు క్షీణిస్తూ ఉంటాయి. స్త్రీలు అధికమవుతారు. విచ్చలవిడిగా పలుచని వస్త్రాలు ధరించి బజారుల్లో తిరుగుతూ ప్రజలను తమ వైపు ఆకర్షిస్తారు.” (తిర్మిజి’)

ప్రవక్త (స) ప్రవచనం, ”ఒక కాలం వస్తుంది. అప్పుడు అవిశ్వాసులు పరస్పరం ఇస్లామీయ దేశాలపై దాడి చేయటానికి భోజనానికి పిలిచినట్టు పిలుస్తారు. దానికి ఒక వ్యక్తి, ‘ఓ ప్రవక్తా! అప్పుడు మా సంఖ్య తక్కువగా ఉంటుందా?’ అని ప్రశ్నించాడు. దానికి ప్రవక్త (స), ‘లేదు కాని, అప్పుడు మీరు చాలా అధికసంఖ్యలో ఉంటారు. మీ స్థానం నీటిపై ఉండే కఫంలా(నురుగులా) ఉంటుంది. వారి హృదయాల నుండి మీ భయం తొలగిపోతుంది. మీరు బలహీనులై పోతారు.’ దానికి ఒక వ్యక్తి, ‘ఓ ప్రవక్తా! ఈ బలహీనత ఏమిటి?’ అని అడిగాడు. దానికి ప్రవక్త (స), ‘మీరు ప్రపంచాన్ని ప్రేమించడం, మరణానికి భయపడటం.’ (అ’హ్మద్‌, అబూ దావూద్‌)

ప్రళయ సూచనల్లో ఒకటేమిటంటే, అన్ని వైపుల నుండి ముస్లిములపై అవిశ్వాసులు చుట్టుముట్టు తారు. వారిపై దుర్మార్గాలు, హింసలు చేస్తారు. ముస్లిములు తప్పించు కోవటం కష్టం అవుతుంది. వక్రమతాల వారు అసత్యపు ప్రవచనాలు తయారు చేస్తారు. బిద్‌’అతీలను గౌరవించటం జరుగుతుంది. ఈ సూచనలన్నీ బహిర్గతం అయిన తర్వాత, ముస్లిములకు, క్రైస్తవులకు భీకర యుద్ధం జరుగు తుంది. ముస్లిముల దేశాలను క్రైస్తవులు దాడిచేసి ఆక్రమించుకోవటం జరుగుతుంది. చివరికి వారి ప్రభుత్వం అరబ్‌లో ఖైబర్‌ వరకు చేరుకుంటుంది. అప్పుడు ముస్లిములు ఆందోళనకు గురై మహ్‌దీ (అ)ను వెదుకుతారు. అప్పుడు అల్లాహ్‌(త) మహ్‌దీ (అ)ను బహిర్గతం చేస్తాడు. ముస్లిమ్‌ సమాజాన్నంతా ఒక జెండా క్రిందికి తీసుకువస్తారు.

పెద్ద ప్రళయచిహ్నాలు, మహ్‌దీ (అ) బహిర్గతం:

మహ్‌దీ అంటే మార్గదర్శకత్వం పొందిన వ్యక్తి. ఇక్కడ మహ్‌దీ (అ) అంటే ‘హదీసు’ల్లో వివరంగా పేర్కొనబడిన మహ్‌దీ (అ). అతడు ఒక మోస్తరు పొడవుగా ఉంటారు. చురుకైన శరీరం, ఎర్రగా ఉంటారు. అయితే అతని ముఖ వర్చస్సు ప్రవక్త (స)ను పోలి ఉండదు. అతను ప్రవక్త (స) వంటి సద్గుణాలు కలిగి ఉంటారు. అతని పేరు ము’హమ్మద్‌, తండ్రి పేరు ‘అబ్దుల్లాహ్‌, తల్లి పేరు ఆమినహ్ ఉంటాయి. అతడు ఫాతిమహ్ (ర) సంతతి నుండి ఉంటాడు. నోటిలో కొంత నత్తి ఉంటుంది. దానివల్ల అతడు ఒక్కోసారి తన తొడపై చేత్తో కొట్టడం జరుగుతుంది. అతడు దైవజ్ఞానం కలిగి ఉంటాడు.

బై’అత్‌ సమయంలో అతని వయస్సు 40 సంవత్స రాలు ఉంటుంది. ‘ఖిలాఫత్‌ విషయం తెలియగానే మదీనహ్ సైన్యాలు అతని వద్దకు మక్కహ్ వస్తాయి. సిరియా, ‘ఇరాఖ్‌, యమన్‌ల దైవభక్తులు ఇంకా అరబ్‌కు చెందిన చాలామంది అతని సైన్యంలో చేరుతారు. క్రైస్తవులు అతని పేరు విని నలువైపుల నుండి సైన్యాలు సమీకరించి సిరియాలోని ముస్లిములపై దాడిచేస్తారు. అప్పుడు వారి సైన్యంలో 80 జెండాలు ఉంటాయి. ప్రతి జండా క్రింద 12,000 మంది ఉంటారు. మహ్‌దీ (అ) ఆ క్రైస్తవులతో యుద్ధం చేయటానికి మదీనహ్ నుండి సిరియా వైపు బయలుదేరుతారు. దిమిష్క్‌ ప్రాంతంలో ఆ క్రైస్తవులతో యుద్ధం జరుగుతుంది. అప్పుడు మహ్‌దీ (అ) సైన్యం మూడు భాగాలుగా ఉంటుంది. ఒక భాగం క్రైస్తవుల భయం వల్ల పారిపోతుంది. వారు ఎంత నీచులు అంటే అల్లాహ్‌ (త) వారి పశ్చాత్తాపం ఏమాత్రం అంగీకరించడు. మిగిలిన సైన్యంలో నుండి కొందరు వీరమరణం పొంది బద్ర్‌, ఉ’హుద్‌ అమరవీరుల స్థానానికి చేరుకుంటారు. మరికొందరు అల్లాహ్‌ (త) సహాయంవల్ల విజయులై శాశ్వతంగా సాఫల్యం పొందుతారు.

మహ్‌దీ (అ) రెండవ రోజు కూడా క్రైస్తవులతో యుద్ధా నికి బయలుదేరుతారు. ఆ రోజు ముస్లిముల ఒక పెద్ద సైన్యం విజయం లేదా వీరస్వర్గం పొందేవరకు వెను తిరగ మని ప్రమాణం చేస్తారు. వీరు కూడా సాయంత్రం వరకు వీర మరణం పొందుతారు. మహ్‌దీ (అ) మిగిలిన వారిని తీసు కొని యుద్ధానికి వెళతారు. రెండవ రోజు మరో పెద్ద సైన్యం విజయం లేదా వీరస్వర్గం అని ప్రమాణం చేసి వెళ్ళి వీర మరణం పొందుతారు.

మూడు, నాలుగు రోజులు భీకర యుద్ధం జరుగుతుంది. మహ్‌దీ (అ) ఒక చిన్న సైన్యాన్ని తీసుకొని ధైర్యంగా యుద్ధం చేస్తారు. అల్లాహ్‌ (త) అతనికి విజయం ప్రసాదిస్తాడు. క్రైస్తవులు చాలామంది మరణిస్తారు. వారిని చూచి ఇతరులు కూడా పారిపోజూస్తారు. వారిని కూడా పట్టుకొని చంపటం జరుగుతుంది. ఆ తరువాత మహ్‌దీ (అ) వీరులకు అనేక కానుకలు ఇచ్చి గౌరవిస్తారు. కాని ఆ ధనం వల్ల ఎవరికీ సంతోషం కలుగదు. ఎందుకంటే ఆ యుద్ధం వల్ల 100 మందిలో ఒక్కరే మిగిలి ఉంటారు. ఆ తరువాత మహ్‌దీ (అ) ఇస్లామీయ దేశాలను క్రమబద్ధీకరణ చేస్తారు. ఇంతలో దజ్జాల్‌ ముస్లిములను హింసిస్తున్నాడని పుకార్లు వస్తాయి. పరిశీలించగా ఈ వార్త అసత్యం అని తేలుతుంది. ఆ తరువాత మహ్‌దీ (అ) తన పనిలో నిమగ్నమయి పోతారు. కొంతకాలం తర్వాత దజ్జాల్‌ బహిర్గతం అవుతాడు.

దజ్జాల్‌:  దజ్జాల్‌ యూదుడై ఉంటాడు. వాడి బిరుదు మసీ’హ్‌ అని ఉంటుంది. వాడి కుడికన్ను ఉబ్బి ఉంటుంది. ఉంగరాల జుట్టు ఉంటుంది. ఒక పెద్ద గాడిద అతడి వాహనంగా ఉంటుంది. ముందు ‘ఇరాఖ్‌, సిరియాల మధ్య బహిర్గతం అవుతాడు. అక్కడ 70 వేల మంది యూదులు అతన్ని అనుసరించటం జరుగుతుంది. అక్కడి నుండే అతడు, తాను దైవమని వాదించి అన్నివైపుల కల్లోలం సృష్టిస్తాడు. అనేక ప్రాంతాల్లో పర్యటించి తాను దైవాన్నని నమ్మిస్తాడు. వాడి నుదురుపై క-ఫ-ర అంటే కుఫ్ర్‌ అని ఉంటుంది. వాడిని సత్యముస్లిములే గుర్తించగలరు. ప్రజలను పరీక్షించటానికి అల్లాహ్‌ (త) వాడికి అనేక మహిమలు ప్రసాదించి ఉంటాడు. అతనివెంట ఒక అగ్నిజ్వాల ఉంటుంది. దాన్ని వాడు నరకంగా నమ్మిస్తాడు. ఒక తోట ఉంటుంది. దాన్ని వాడు స్వర్గంగా చూపిస్తాడు. తన శత్రువులను అగ్నిలోకి, మిత్రులను తోటలోనికి ప్రవేశింప జేస్తాడు. కాని ఆ అగ్ని స్వర్గం అయి ఉంటుంది. ఆ తోట నరకమై ఉంటుంది. వాడివద్ద ఆహార పదార్థాలు కూడా నిండుగాఉంటాయి. తానుకోరినవారికి ఇస్తాడు. దజ్జాల్‌ ఆదేశం వల్ల వర్షంకురుస్తుంది. పంటలు పండుతాయి. పశువులు పాలతో నిండిపోతాయి. ఇదంతా గారడీలా జరుగుతుంది. అతడిని వ్యతిరేకించిన వారికి అనేక రకాలుగా హింసిస్తాడు, అన్నపానీయాలు ఆపుతాడు. కాని సుబ్హానల్లాహ్, వ లాఇలాహ ఇల్లా అల్లాహ్ వారికి అన్నపానీయాలు ఆపుతాయి.

ఇంకా నాస్తికుల్లా నేను దైవాన్నని నమ్మిస్తాడు. చని పోయిన వారిని బ్రతికిస్తాడు. అంటే షై’తాన్‌ అతని రూపంలో ప్రత్యక్షం అవుతాడు. తన వ్యతిరేకులను రెండు ముక్కలు చేసి మళ్ళీ అతికిస్తాడు. సత్య విశ్వాసి వాడిని ఎంతమాత్రం నమ్మడు. (తిర్మిజి’)

ఏది ఏమైనా దజ్జాల్‌ కల్లోలం చాలావిపరీతంగా ఉంటుంది. వాడు కల్లోలం సృష్టిస్తూ దమిష్క్‌ చేరుకుంటాడు. మహ్‌దీ (అ) ముందు నుండే దమిష్క్‌లో ఉంటారు. యుద్ధానికి సన్నాహాలు చేస్తూ ఉంటారు. ఈసా (అ) ఆకాశం నుండి దిగుతారు. అప్పుడు అ’స్ర్‌ అజాన్‌ అవుతూ ఉంటుంది. ప్రజలు నమా’జుకు సిద్ధం అవుతూ ఉంటారు. ‘ఈసా (అ) ఇద్దరు దైవదూతల సహాయంతో దమిష్క్‌ జామె మస్జిద్‌ తూర్పు వైపున ఉన్న మినార్‌పై ప్రత్యక్షం అవుతారు. మహ్‌దీ (అ)ను కలుస్తారు. మహ్‌దీ (అ) చాలా వినయవిధేయతలతో ప్రవర్తిస్తారు. ఇంకా, ‘ఓ దైవప్రవక్తా! ఇమామత్‌ చేయండి,’ అని అంటారు. దానికి ‘ఈసా (అ), ‘లేదు, మీరే నమా’జు చదివించండి, ఎందుకంటే ఇమామత్‌ మీకే చెల్లుతుంది,’ అని అంటారు. అనంతరం మహ్‌దీ (అ)  నమా’జు చదివిస్తారు. నమా’జు ముగిసిన తరువాత మహ్‌దీ (అ) ‘ఈసా (అ)తో, ‘ఓ ప్రవక్తా! ఇప్పుడు సైన్య బాధ్యతలు మీకు అప్పగిస్తున్నాను,’ అని అంటారు. దానికి ‘ఈసా (అ), ‘ఈ బాధ్యత కూడా మీ పైనే ఉంటుంది. నేను కేవలం దజ్జాల్‌ను సంహరించ టానికి వచ్చాను, ఎందుకంటే వాడు నా చేతి ద్వారానే చంపబడాలని వ్రాసిఉంది,’ అని అంటారు. (ముస్లిమ్‌)

ఇద్దరూ సైన్యాలను తీసుకొని దజ్జాల్‌ సైన్యాలపై దాడి చేస్తారు. చాలా భీకరమైన యుద్ధం జరుగు తుంది. అప్పుడు ‘ఈసా (అ) ప్రత్యేకత ఏమిటంటే, అతని దృష్టి ఎక్కడ వరకు వెళుతుందో అక్కడి వరకు అతని శ్వాసకూడా చేరుకుంటుంది. ఏ అవిశ్వాసి వద్దకు అతని శ్వాస వెళుతుందో ఆ అవిశ్వాసి అక్కడే క్షీణిస్తాడు. దజ్జాల్‌ వెనుతిరిగి పారి పోతాడు. ‘ఈసా (అ) అతన్ని వెంబడిస్తూ లుద్‌ ప్రాంతానికి చేరుకొని బల్లెంతో వాడిని చంపివేస్తారు. వాడు చనిపోయాడని ప్రజలకు తెలియజేస్తారు. ఒకవేళ ‘ఈసా (అ) దజ్జాల్‌ను చంపటంలో ఆలస్యం చేస్తే, వాడు తనంతట తానే ‘ఈసా (అ) శ్వాసవల్ల కరిగిపోతాడు. నీటిలో ఉప్పు కరిగినట్టు.

అనంతరం ఇస్లామీ సైన్యం దజ్జాల్‌ సైన్యాన్ని చంపటంలో నిమగ్నమయి పోతుంది. ఆ సైన్యంలో ఉన్న యూదులకు ఎవరూ శరణు ఇవ్వరు. చివరికి ఒకవేళ వారిలో ఒక బండ రాతి వెనుక దాక్కున్నా అది కూడా ”ఓ అల్లాహ్‌దాసుడా! ఇక్కడ ఒక యూదుడు ఉన్నాడు. పట్టి చంపు” అని అంటుంది. అయితే ఒక చెట్టు మాత్రం యూదులను రక్షిస్తుంది. (అబూ దావూద్‌, హాకిమ్‌)

భూమిపై దజ్జాల్‌ కల్లోలం 40 రోజుల వరకు ఉంటుంది. వాటిలో ఒకరోజు ఒక సంవత్సరంలా, ఒక రోజు ఒక నెలగా, ఒక రోజు ఒక వారంలా మిగిలిన దినాలు మామూలుగానే ఉంటాయి. ప్రవక్త (స)అనుచరులు ఒక సంవత్సరంగా ఉండే రోజులో నమాజు ఒక దినంగా లేదా ఒక సంవత్సర నమా’జులు చేయాలా అని అడిగారు. దానికి ప్రవక్త (స) నిర్థారించుకొని, ‘ఒక సంవత్సరం నమా’జులు చదవాలి,’ అని అన్నారు.

దజ్జాల్‌ కల్లోలం పూర్తవగానే మహ్‌దీ (అ) మరియు ‘ఈసా (అ) వాడివల్ల ధ్వంసం అయిన నగరాల్లో పర్యటిస్తారు. దజ్జాల్‌ వల్ల నష్టపోయిన వారిని అల్లాహ్‌(త) అనంత ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాడని శుభవార్త ఇస్తూ ఓదార్చటం జరుగుతుంది. వారికి కానుకలు ప్రోత్సాహకాలు ఇచ్చి వారికి కొంత ఉపశమనం కలిగిస్తారు. ‘ఈసా (అ), పందిని చంపమని, శిలను పడగొట్టమని, అవిశ్వాసుల నుండి పన్ను (జి’జ్ యహ్) వసూలు చేయరాదని ఆదేశించి, అవిశ్వాసులను ఇస్లామ్‌ వైపు ఆహ్వానిస్తారు. దైవకృప వల్ల ఇస్లామీయ నగరాల్లో అవిశ్వాసులెవరూ ఉండరు. భూమంతా మహ్‌దీ న్యాయం, ధర్మం వ్యాపిస్తుంది. హింసలు హత్యాచారాలు అన్నీ సమసిపోతాయి. ప్రజలందరూ దైవారాధనలో, దైవవిధేయతలో నిమగ్న మయి  పోతారు.

అప్పుడు మహ్‌దీ (అ) 8 లేక 9 సంవత్సరాలు పరిపా లించి మరణిస్తారు. ‘ఈసా (అ) అతని జనా’జహ్ నమా’జు చదివి ఖనన సంస్కారాలు పూర్తిచేస్తారు. ఆ తరువాత చిన్న పెద్ద వ్యవహారాలన్నీ ‘ఈసా (అ) చేతుల్లోనికి వస్తాయి. అందరూ ప్రశాంతంగా జీవిస్తారు. అల్లాహ్‌(త) ‘ఈసా (అ)పై దైవవాణి అవతరింపజేస్తూ,

”నేను నా దాసుల్లో చాలా బలవంతులైన వారిని బహిర్గతం చేస్తున్నాను. ఇతరులెవ్వరూ వారిని ఎదుర్కోలేరు. నా ప్రత్యేక దాసులను తీసుకొని ‘తూర్‌ కొండపై వెళ్ళి అక్కడే ఉండు,” అని ఆదేశిస్తాడు. ‘ఈసా (అ) ముస్లిములందరికీ ‘తూర్‌ కొండపై తీసుకొని వెళ్ళి పోతారు. ఇంతలో యా’జూజ్‌, మా’జూజ్‌ సికందర్‌ గోడను కూల్చి సైన్యాలుగా అన్ని వైపులా వ్యాపిస్తారు. ఇప్పుడు కూడా వారు దాన్ని కూల్చడం లో నిమగ్నులయి ఉంటారు. కాని అల్లాహ్‌ (త) దాన్ని మళ్ళీ సరిచేస్తూ ఉంటాడు. అందులో మూడు అంగుళాల కన్నం అవుతుంది. కాని మళ్ళీ ఆ కన్నం మూసుకుంటుంది. వారు బహిర్గతం అయ్యే సమయం వచ్చేసరికి ఇన్‌షా అల్లాహ్‌ అని బయటకు వస్తారు.

వారి సంఖ్య ఎంత అధికంగా ఉంటుందంటే, వారి మొదటి బృందం తబ్‌రియ సముద్రం చేరి దాని నీరంతా త్రాగి దాన్ని ఎండుగా చేసివేస్తుంది. హింసలు దౌర్జన్యాలు చేస్తూ సిరియా చేరి పరస్పరం, ‘భూవాసులను మనం నాశనం చేసాము. రండి ఆకాశవాసులను కూడా నాశనం చేద్దాం,’ అని ఆకాశం వైపు బాణాలు విసురుతారు. అల్లాహ్‌(త) తన శక్తివల్ల వారి బాణాలకు రక్తపు మరకలు అంటించి త్రిప్పి వేస్తాడు. అది చూచి వారు చాలా సంతోసిస్తారు. అప్పుడు ‘ఈసా (అ) మరియు ముస్లిములపై కరువు ఏర్పడుతుంది. పశువుల ఆహారం 100 అష్రఫీలకు అమ్ముడవుతుంది. చివరికి ‘ఈసా (అ) దు’ఆ చేయటానికి నిలబడతారు. అతని అనుచరు లందరూ అతని వెనుక నిలబడి ఆమీన్‌ అంటారు. అల్లాహ్‌(త) వారి ప్రార్థనను స్వీకరిస్తాడు. యా’జూజ్‌ మా’జూజ్‌లను చంపటానికి వారిని మెడకు సంబంధించిన వ్యాధికి గురిచేస్తాడు. దానివల్ల వారందరూ ఒక్క రాత్రిలోనే మరణిస్తారు. వారు తిరిగి వచ్చి భూమంతా తమ శవాలతో నిండి ఉందని, దుర్వాసన వేస్తుందని పరస్పరం చెప్పుకుంటారు. ఆ ఆపదల నుండి బయటపడటానికి మళ్ళీ ‘ఈసా (అ) తన అనుచరులతో సహా దు’ఆ చేస్తారు. అప్పుడు అల్లాహ్‌ (త) పొడవైన మెడలు గల పక్షులను పంపుతాడు. ఆ పక్షులు వారిలో కొంతమందిని తిని మరికొంతమందిని వివిధ ద్వీపాల్లో పారవేస్తాయి. ఇంకా వారి చీము రక్తాల నుండి భూమిని పరిశుభ్రం చేయటానికి అల్లాహ్‌(త) విపరీతమైన వర్షం కురిపిస్తాడు. దానివల్ల భూమంతా పరిశుభ్రంగా అయిపోతుంది. ఆ వర్షం వల్ల పంటలు కూడా బాగా పండుతాయి. అప్పుడు ‘ఈసా (అ) తన అనుచరులను తీసుకొని నేలపైకి వస్తారు. పంటల్లో, ఫలాల్లో విపరీతమైన శుభం కలుగుతుంది. అందరూ సంతోషంగా జీవిస్తూ ఉంటారు. అప్పుడు అందరూ ముస్లిములై పోతారు. అవిశ్వాసి ఎవరూ ఉండరు. ఎవరూ ఎవరినీ హింసించరు. అందరూ ఒకరి పట్ల మరొకరు ప్రేమాభిమానాలతో ప్రవర్తిస్తారు. యా’జూజ్‌, మా’జూజ్‌ల కరవాలాలు ఒరల్లో అలాగే ఉంటాయి. వాటిని ఇంధనంగా కాల్చటం జరుగుతుంది. ఈ విధంగా 7 సంవత్సరాల వరకు గొప్ప అభివృద్ధి ఉంటుంది. (ముస్లిమ్‌, తిర్మిజి’)

‘ఈసా (అ) ప్రపంచంలో 40 సంవత్సరాలు ఉంటారు. ఆయనకు వివాహం అవుతుంది, సంతానం కలుగుతుంది. ఆ తరువాత ఆయన మరణించి ప్రవక్త (స) ప్రక్కన ఖననం చేయబడతారు. ఆ తరువాత ఖ’హ్‌’తాన్‌ తెగకు చెందిన జహ్‌జాహ్‌ అనే పేరుగల వ్యక్తి ‘ఖలీఫహ్ అవుతాడు. అతడు చాలా న్యాయంగా పరిపాలిస్తాడు.

జహ్‌జాహ్‌ పరిపాలన: ఆయన తర్వాత కొన్నిరోజుల కోసం పాలకుడుగా ఉంటారు. ఇతని కాలంలో అవిశ్వాసం, అజ్ఞానం, మూఢ విశ్వాసాలు, ఆచారాలు సర్వసామాన్యం అయిపోతాయి. జ్ఞానం తగ్గుముఖం పడుతుంది.

‘ఖసఫ్‌: ఇంతలోనే ఒకప్రాంతం తూర్పులో ఒక ప్రాంతం పడమరలో భూమిలో కూరుకుపోవటం జరుగుతుంది. దీనివల్ల విధివ్రాత తిరస్కారులు చనిపోతారు. ఈ రోజుల్లోనే ఒక పొగ బహిర్గతమై భూమంతా వ్యాపిస్తుంది. దీనివల్ల ప్రజలంతా ఆందోళనకు గురవుతారు. ముందు ముస్లిములు బుద్ధిహీనులుగా, మతి స్థిమితం లేనివారుగా, జలుబుకు గురవుతారు. కాని కపటాచారులు, అవిశ్వాసులు మూర్ఛకు గురవుతారు. కొందరు ఒకరోజు, మరికొందరు రెండు రోజులు, మరికొందరు మూడు రోజులకు మేల్కొంటారు. ఆ పొగ నిరంతరం 40 రోజుల వరకు ఉంటుంది. ఆ తరువాత అంతా మాయమై పోతుంది. ఆ తరువాత జిల్‌హిజ్జహ్‌ ‘ఈదుల్‌ అ’ద్’హా తరువాత రాత్రి చాలా దీర్ఘంగా తయారవుతుంది. ప్రయాణీకులు, పిల్లలు, పశువులు ఆందోళనకు గురవుతారు.

పడమర దిక్కు నుండి సూర్యుడు ఉదయిస్తాడు: అందరూ ఆందోళనకు గురయి హాహాకారాలు చేస్తూ పశ్చాత్తాపం చెందుతారు. చివరికి మూడు లేక నాలుగు రాత్రులకు సమానమైన రాత్రి గడిచిన తర్వాత ఆందోళన కరమైన స్థితిలో సూర్యుడు చిన్న వెలుగుతో పడమటి నుండి ఉదయిస్తాడు. అప్పుడు అందరూ దైవాన్ని విశ్వసిస్తారు. కాని అప్పుడు విశ్వసించి ఏమీ లాభం ఉండదు. పశ్చాత్తాప ద్వారం మూసుకుంటుంది. ఆ తరువాత సామాన్య వెలుగుతో సూర్యుడు తూర్పునుండి ఉదయిస్తూ ఉంటాడు.

విచిత్ర జంతువు: రెండవ రోజు విచిత్ర జంతువు బహిర్గతం అవుతుంది. ప్రజలు దాన్ని గురించే చర్చించు కుంటూ ఉంటారు. ఇంతలో క’అబహ్కు తూర్పు దిశలో ఉన్న సఫా కొండ భూకంపం ద్వారా పగిలిపోతుంది. దానిలో నుండి ఒక వింత జంతువు బహిర్గతం అవుతుంది. అది రూపంలో 7 జంతు వులను పోలి ఉంటుంది.

1. మనిషి ముఖం కలిగి ఉంటుంది. 2. ఒంటె కాళ్ళు కలిగి ఉంటుంది. 3. గుర్రం మెడ కలిగి ఉంటుంది. 4. ఎద్దు తోక కలిగి ఉంటుంది. 5. లేడి లాంటి తల కలిగి ఉంటుంది. 6. కోతిలాంటి చేతులు కలిగి ఉంటుంది. చాలా చక్కగా మాట్లాడుతుంది. దాని చేతిలో మూసా (అ) బెత్తం  ఉంటుంది. రెండవ చేతిలో సులైమాన్‌ (అ) ఉంగరం ఉంటుంది. చాలా వేగంగా సంచరిస్తూ ఉంటుంది. పారిపోయేవాడు దాన్నుండి తప్పించు కోలేడు. ప్రతి వ్యక్తిపై గుర్తువేస్తూ ఉంటుంది. మూసా (అ) కర్రతో విశ్వాసుల నుదురుపై ఒక గీత గీస్తుంది. దాని వల్ల అతని  ముఖం వెలుగుతో నిండిపోతుంది. సులైమాన్‌ (అ) ఉంగరంతో అవిశ్వాసి యొక్క ముక్కు లేదా మెడపై నల్లని ముద్ర వేస్తుంది. దానివల్ల అతని ముఖం అందవికారంగా తయారవు తుంది. కొందరు భోజనానికి కూర్చుంటే, వారిలో విశ్వాసి ఎవరో, అవిశ్వాసి ఎవరో గుర్తించడం చాలా సులువై పోతుంది. ఆ జంతువు పేరు దాబ్బతుల్‌ అర్జ్‌ అయి ఉంటుంది. అది ఆ పని ముగిసిన తర్వాత అదృశ్యమై పోతుంది. సూర్యుడు పడమర నుండి ఉదయించే టానికి, దాబ్బ తుల్‌ అర్జ్‌ బహిర్గతం కావటానికి తుత్తార ఊదటానికి మధ్య 120 సంవత్సరాల కాలం ఉంటుంది. దాబ్బతుల్‌ అర్జ్‌ అదృశ్యమయిన తరువాత దక్షిణాది నుండి ఒక గాలి వీస్తుంది. ఈ గాలి చాలా ఆహ్లాదకర మైనదిగా ఉంటుంది. దీనివల్ల ప్రతి విశ్వాసి చంకలో నొప్పి పుడుతుంది. ప్రజలు మరణిం చటం ప్రారంభం అవుతుంది. ప్రళయానికి సమీపంలో జంతువులు, నిర్జీవులు, కత్తులు, చెప్పు పట్టీలు మొదలైనవి మాట్లాడుతాయి. ఇళ్ళల్లోని విషయాలు తెలియపరుస్తాయి.

హబ్‌హ్ వారి ఆధిక్యత: విశ్వాసులందరూ మర ణించిన తర్వాత ‘హబ్‌షహ్ వారు ఆధిక్యత కలిగి ఉంటారు. అనేక దేశాల్లో వారి అధికారం ఉంటుంది. ‘హజ్‌ సమాప్తం అయిపోయి ఉంటుంది. వాళ్ళు క’ హ్ను కూల్చివేస్తారు. ఖుర్‌ఆన్‌ హృదయాల నుండి, నోటి నుండి, కాగితాలపై నుండి చెరిగిపోతుంది. సిగ్గు లజ్జ ఏమాత్రం ఉండదు. దైవభీతి, దైవభక్తి, విచారణ భయం ప్రజల హృదయాల నుండి తొలగి పోతుంది. మార్గాల్లో గాడిదలు, కుక్కల్లా వ్యభి చారం జరుగుతుంది. కరువుకాటకాలు, వ్యాధులు ఒకటి తరువాత ఒకటి అవతరిస్తూ ఉంటాయి. స్త్రీలు అధికం, పురుషులు అల్పంగా ఉంటారు. అజ్ఞానం, అధర్మం ఎంత అధికంగా వ్యాపిస్తుందంటే, దైవాన్ని తలచుకునేవారు ఎవరూ ఉండరు. ఈ కాలంలోనే ఇతర దేశాలకన్నా సిరియా దేశం చాలా అభివృద్ధి చెంది సస్యశ్యామలంగా ఉంటుంది. ఇతర దేశాల నుండి వచ్చి ప్రజలు సిరియా దేశంలో నివాస మేర్పరచుకుంటారు.

దక్షిణ దిశ నుండి అగ్ని జ్వాల: కొంతకాలం తరువాత ఒక పెద్ద అగ్ని జ్వాల సంభవిస్తుంది. అది ప్రజలను వెంబడిస్తుంది. ప్రజలు భయంతో పారిపోతారు. ప్రజలను వెంబడిస్తూ మధ్యాహ్నం నిలిచిపోతుంది. ప్రజలు కొంత విశ్రాంతి తీసుకుంటారు. ఉదయంకాగానే మళ్ళీ ఆ అగ్ని జ్వాల వారిని వెంబ డిస్తుంది. ఈ విధంగా ఆ అగ్ని జ్వాల అందరినీ సిరియా దేశంలోకి చేర్చుతుంది. ఆ తరువాత ఆ అగ్ని తిరిగి అదృశ్యం అయిపోతుంది. ఆ తరువాత ప్రజలు తమ మాతృ దేశ ప్రేమలో తమ దేశాలకు తిరిగి వెళ్ళి పోతారు. అయినా చాలా మంది సిరియా దేశంలోనే ఉండిపోతారు. ఇది ప్రళయ చివరి సూచన. అల్లాహ్‌(త) మనందరినీ కల్లోలాలనుండి దూరంగా ఉంటూ విశ్వాసం, ఇస్లామ్‌లపై స్థిరంగా ఉంటూ జీవితం గడిపే భాగ్యం ప్రసాదించుగాక. ఆమీన్‌!

اَلْفَصْلُ الْأَوَّلُ  మొదటి విభాగం    

5464  ]1[ (صحيح )  (3/1505)

عَنْ حُذَيْفَةَ بْنِ أَسِيْدِ الْغِفاَرِيِّ قَالَ: اِطَّلَعَ النَّبِيُّ صلى الله عليه وسلم عَلَيْنَا وَنَحْنُ نَتَذَاكَرُ. فَقَالَ: “مَا تَذْكُرُوْنَ؟” قَالُوْا: نَذْكُرُ السَّاعَةَ. قَالَ: “إِنَّهَا لَنْ تَقُوْمَ حَتّى تَرَوْا قَبْلَهَا عَشْرَ آيَاتٍ فَذَكَرَ الدُّخَانَ وَالدَّجَّالَ وَالدَّابَّةَ وَطُلُوْعِ الشَّمْسِ مِنْ مَغْرِبِهَا وَنُزُوْلَ عِيْسَى بْنِ مَرْيَمَ وَيَأْجُوْجَ وَمَأْجُوْجَ وَثَلَاثَةَ خُسُوْفٍ: خَسْفٍ بِالْمَشْرِقِ وَخَسْفٍ بِالْمَغْرِبِ وَخَسْفٍ بِجَزِيْرَةِ الْعَرَبِ وَآخِرُ ذَلِكَ نَارٌ تَخْرُجُ مِنَ الْيَمَنِ تُطْرُدُ النَّاسَ إِلى مَحْشَرِهِمْ”. وَفِيْ رِوَايَةٍ: “نَارٌ تَخْرُجُ مِنْ قَعْرِ عَدْنٍ تَسُوْقُ النَّاسَ إِلى الْمَحْشَرِ”. وَفِيْ رِوَايَةٍ فِي الْعَاشِرَةِ ” وَرِيْحٌ تُلْقِي النَّاسَ فِي الْبَحْرِ”. رَوَاهُ مُسْلِمٌ

5464. (1) [3/1505 దృఢం]

హుజై’ఫహ్ బిన్‌ అసీద్‌ ‘గిఫారీ (ర) కథనం: ప్రవక్త (స) మా వద్దకు వచ్చారు. మేము పరస్పరం మాట్లాడు కుంటున్నాము. ప్రవక్త (స) మమ్మల్ని, ‘మీరేం మాట్లాడుకుంటున్నారు,’ అని, అడిగారు. దానికి మేము ”ప్రళయం గురించి మాట్లాడు కుంటున్నాము,” అని అన్నాము. దానికి ప్రవక్త (స), ’10 సూచనలు బహిర్గతం కానంతవరకు  ప్రళయం సంభవించదని చెప్పి వాటిని పేర్కొన్నారు. 1. పొగ,  2. దజ్జాల్‌, 3. దాబ్బతుల్‌ అర్జ్‌, 4. సూర్యుడు పడమటి దిక్కు నుండి ఉదయించటం, 5. ‘ఈసా (అ) విచ్చేయటం, 6. యా’జూజ్‌ మా’జూజ్‌ల బహిర్గతం, 7. తూర్పు ప్రాంతాలలో ఒకప్రాంతం భూమిలో కూరుకు పోవటం, 8. పడమర ప్రాంతాలలో ఒక ప్రాంతం భూమిలో కూరుకు పోవటం. 9. అరబ్‌లోని ఒక ప్రాంతం భూమిలో కూరుకు పోవటం. 10. అద్‌న్‌ మూల నుండి అగ్ని జ్వాల బహిర్గతం అవుతుంది. ప్రజలను తీర్పు మైదానం వైపు తోలుకుపోతుంది. మరో ఉల్లేఖనంలో 10వ ప్రళయ సూచన గాలిగా పేర్కొనడం జరిగింది. అది ప్రజలను సముద్రంలో విసురుతుంది.’ [34] (ముస్లిమ్‌)

5465 – [ 2 ] ( صحيح ) (3/1505)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “بَادِرُوْا بِالْأَعْمَالِ سِتًّا. الدُّخَانَ وَالدَّجَّالَ وَدَابَّةَ الْأَرْضِ وَطُلُوْعِ الشَّمْسِ مِنْ مَغْرِبِهَا وَأَمْرَ الْعَامَّةِ وَخُوَيِّصَةَ أَحَدِكُمْ”. رَوَاهُ مُسْلِمٌ

5465. (2) [3/1505 దృఢం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”6 ప్రళయ సూచనలు సంభవించక ముందే సత్కార్యాల కోసం తొందరపడండి. 1. పొగ, 2. దజ్జాల్‌, 3. దాబ్బతుల్‌ అర్జ్‌, 4. సూర్యుడు పడమర దిక్కు నుండి ఉదయించటం, 5. కల్లోలం, 6. ప్రత్యేక కల్లోలం.[35](ముస్లిమ్)

5466 – [ 3 ] ( صحيح ) (3/1505)

وَعَنْ عَبْدِ اللهِ بْنِ عَمْرٍو قَالَ: سَمِعْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ: “إِنَّ أَوَّلَ الْآيَاتِ خُرُوْجًا طُلُوْعِ الشَّمْسِ مِنْ مَغْرِبِهَا وَخُرُوْجُ الدَّابَّةِ عَلَى النَّاسِ ضُحى وَأَيُّهُمَا مَا كَانَتْ قَبْلَ صَاحِبَتِهَا فَالْأُخْرَى علَى أَثَرِهَا قَرِيْبًا”. رَوَاهُ مُسْلِمٌ.

5466. (3) [3/1505 దృఢం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘అమ్ర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ఇలా ప్రవచిస్తూ ఉండగా నేను విన్నాను, ”ప్రళయ సూచనల్లో పెద్ద సూచనలు. 1. సూర్యుడు పడమటి దిక్కు నుండి ఉదయించటం. 2. పగటి పూట దాబ్బతుల్‌ అ’ర్ద్ బహిర్గతం కావటం. ఈ రెంటిలో ఏది ముందు సంభవించినా మరొకటి దాని వెనుకనే సంభవిస్తుంది.” (ముస్లిమ్‌)

5467 – [ 4 ] ( صحيح ) (3/1506)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “ثَلَاثٌ إِذَا خَرَجْنَ(لَايَنْفَعُ نَفْسًا إِيْمَانُهَا لَمْ تَكُنْ آمَنَتْ مِنْ قَبْلُ أَوْكَسَبَتْ فِيْ إِيْمَانِهَا خَيْرًا) طُلُوْعُ الشَّمْسِ مِنْ مَغْرِبِهَا وَالدَّجَّالُ وَدَابَّةُ الْأًرْضِ”. رَوَاهُ مُسْلِمٌ.

5467. (4) [3/1506 దృఢం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మూడు విషయాలు సంభవించిన తరువాత విశ్వసించటం, సత్కార్యాలు చేయటం పనికిరావు. వాటికి ముందు విశ్వసించినా, సత్కార్యాలు చేసినా పనికి వస్తాయి. 1. సూర్యుడు పడమటి దిక్కు నుండి ఉదయించటం. 2. దజ్జాల్‌ ప్రపంచమంతా కల్లోలం సృష్టించటం. 3. దాబ్బతుల్‌ అ’ర్జ్‌ బహిర్గతం కావటం. (‘స’హీ’హ్ ముస్లిమ్‌)

5468 – [ 5 ] ( متفق عليه ) (3/1506)

وَعَنْ أَبِيْ ذَرٍّ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم حِيْنَ غَرَبَتِ الشَّمْسُ: “أَيْنَ تَذْهَبُ؟”  قُلْتُ: اللهُ وَرَسُوْلُهُ أَعْلَمُ. قَالَ: “فَإِنَّهَا تَذْهَبُ حَتّى تَسْجُدَ تَحْتَ الْعَرْشِ فَتَسْتَأْذِنُ فَيُؤْذَنُ لَهَا وَيُوْشِكُ أَنْ تَسْجُدَ وَلَا يُقْبَلُ مِنْهَا وَتَسْتَأْذِنُ فَلَا يُؤْذَنُ لَهَا. وَيُقَالُ لَهَا: ارْجِعِيْ مِنْ حَيْثُ جِئْتِ فَتَطْلُعَ مِنْ مَغْرِبِهَا فَذَلِكَ قَوْلُهُ تَعَالى  (وَالشَّمْسُ تَجْرِيْ لِمُسْتَقرٍ لَهَا..؛ 36:38). قَالَ : “مُسْتَقَرُّهَا تَحْتَ الْعَرْشِ”. مُتَّفَقٌ عَلَيْهِ.

5468. (5) [3/1506 ఏకీభవితం]

అబూ జ’ర్‌ (ర) కథనం: ప్రవక్త (స) సూర్యాస్తమయానికి ముందు వచ్చారు. ‘ప్రతిరోజూ ఈ సూర్యుడు అస్తమించిన తర్వాత ఎక్కడికి వెళతాడో మీకు తెలుసా?’ అని అడిగారు. దానికి నేను, ‘అల్లాహ్‌(త) మరియు  ఆయన ప్రవక్తకే బాగా తెలుసు,’ అని అన్నాను. అప్పుడు ప్రవక్త (స), ‘ఈ సూర్యుడు సూర్యాస్తమయం అయిన తర్వాత దైవసింహాసనం క్రిందికి వెళ్ళి సజ్దా చేస్తాడు. అల్లాహ్‌ (త)ను రోజులా ఉదయించటానికి అనుమతి కోరుతాడు. అల్లాహ్‌(త) సమాధానంగా సరే తూర్పు నుండే ఉదయించు కాని ఒక సమయం వస్తుంది. అస్తమించిన తర్వాత దైవ సింహాసనం క్రింద సజ్దా చేసి, అనుమతి కోరినపుడు, ‘ఇప్పుడు నువ్వు పడమటి దిక్కు నుండి ఉదయించు,’ అని ఆదేశించడం జరుగుతుంది. అనంతరం సూర్యుడు పడమటి దిక్కునుండి ఉదయిస్తాడు. వష్షమ్‌సు … నుండి …యస్బ’హూన్ వరకు గల ఆయతుల (యా-సీన్, 36:38-40) అర్థం ఇదే. [36]  (బు’ఖారీ, ముస్లిమ్‌)

5469 – [6 ] ( صحيح ) (3/1506)

وَعَنْ عِمْرَانَ بْنِ حُصَيْنِ قَالَ: سَمِعْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه و سلم يقول: “مَا بَيْنَ خَلْقِ آدَمَ إِلى قِيَامِ السَّاعَةِ أُمَرٌ أَكْبَرُ مِنَ الدَّجَّالِ”. رَوَاهُ مُسْلِمٌ.

5469. (6) [3/1506దృఢం]

ఇమ్‌రాన్‌ బిన్‌ ‘హు’సైన్‌ (ర) కథనం: ప్రవక్త (స) ఇలా ప్రవచిస్తూ ఉండగా నేను విన్నాను, ”ఆదమ్‌ (అ) ను సృష్టించటం దగ్గరి నుండి ప్రళయం వరకు దజ్జాల్‌ కల్లోల మంత పెద్ద కల్లోలం మరేదీ లేదు. అంటే దజ్జాల్‌ కల్లోలం అన్నిటి కంటే పెద్ద కల్లోలం.”  (ముస్లిమ్‌)

5470 – [7 ] ( متفق عليه ) (3/1506)

وَعَنْ عَبْدِ اللهِ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِنَّ اللهَ لَا يَخْفَى عَلَيْكُمْ إِنَّ اللهَ تَعَالى لَيْسَ بِأَعْوَرَ وَإِنَّ الْمَسِيْحَ الدَّجَّالَ أَعْوَرُ عَيْنِ الْيُمْنَى كَأَنَّ عَيْنَهُ عِنْبَةٌ طَافِيَةٌ”. مُتَّفَقٌ عَلَيْهِ.

5470. (7) [3/1506 ఏకీభవితం]

‘అబ్దుల్లాహ్‌(ర) కథనం: ప్రవక్త(స) ప్రవచనం ”అల్లాహ్‌ (త) మీకు రహస్యంగా లేడు, ఆయన సూచనల, నిదర్శనాల ద్వారా బహిర్గతంగానే ఉన్నాడు. ఇంకా ఆయన లోపాలకు అతీతుడు, కుంటివాడు కాడు, చెవిటివాడు కాడు. దజ్జాల్‌ ఒంటికన్ను గలవాడు. ఇంకా వాడి కుడి కన్ను ద్రాక్ష గింజలా ఉంటుంది. ఇది అన్నిటికంటే  పెద్ద  లోపం.  (బు’ఖారీ, ముస్లిమ్‌)

5471 – [ 8 ] ( متفق عليه ) (3/1506)

وَعَنْ أَنَسٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَا مِنْ نَبِيٍّ إِلَّا أَنْذَرَ أُمَّتَهُ الْأَعْوَرَ الْكَذَّابَ أَلَا إِنَّهُ أَعْوَرُ وَإِنَّ رَبَّكُمْ لَيْسَ بِأَعْوَرَ مَكْتُوْبٌ بَيْنَ عَيْنَيْهِ: ك ف ر”. مُتَّفَقٌ عَلَيْهِ.

5471. (8) [3/1506ఏకీభవితం]

అనస్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”దైవప్రవక్త లందరూ తమతమ కాలాల్లో తమ అనుచర సమాజాలను అసత్యవాది అయిన దజ్జాల్‌ నుండి హెచ్చరించి ఉన్నారు. గుర్తుంచుకోండి! వినండి! అల్లాహ్‌(త) అవిటివాడు కాడు. దజ్జాల్‌ అవిటివాడు. వాడి కండ్లమధ్య ‘ ‘ అక్షరాలు వ్రాయబడి ఉంటాయి.”  (బు’ఖారీ, ముస్లిమ్‌)

5472 – [ 9 ] ( متفق عليه ) (3/1506)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “أَلَا أُحَدِّثُكُمْ حَدِيِثًا عَنِ الدَّجَّالِ مَاحَدَّثَ بِهِ نَبِيٌّ قَوْمَهُ؟ إِنَّهُ أَعْوَرُ وَإِنَّهُ يَجِيْءُ مَعَهُ بِمَثَلِ الْجَنَّةِ وَالنَّارِ فَالَّتِيْ يَقُوْلُ: إِنَّهَا الْجَنَّةُ هِيَ النَّارُ وَإِنِّيْ أُنْذِرُكُمْ كَمَا أَنْذَرَ بِهِ نُوْحٌ قَوْمَهُ”. مُتَّفَقٌ عَلَيْهِ.

5472. (9) [3/1506  ఏకీభవితం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”నేను దజ్జాల్‌ గురించి ఏ ప్రవక్త తన అనుచర సమాజానికి తెలియపరచని విషయాన్ని నేను మీకు తెలియపరుస్తాను. అదేమిటంటే, దజ్జాల్‌ అవిటివాడు. స్వర్గ నరకాల్లాంటివి రెంటిని తన దగ్గర ఉంచుతాడు. ఒకదాని పేరు స్వర్గం, మరొక దాని పేరు నరకం. కాని వాడి స్వర్గం, స్వర్గంకాదు, -నరకం. వాడినరకం, నరకంకాదు-స్వర్గం. దజ్జాల్‌ మంత్రజాలం ద్వారా ప్రజలను మోసం చేస్తాడు. నూహ్‌ (అ) తన అనుచర సమాజాన్ని దజ్జాల్‌ గురించి హెచ్చరించినట్టు నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను.  (బు’ఖారీ, ముస్లిమ్‌)

5473 – [ 10 ] ( متفق عليه ) (3/1507)

وَعَنْ حُذَيْفَةَ عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ: “إِنَّ الدَّجَّالَ يَخْرُجُ وَإِنَّ مَعَهُ مَاءً وَنَارًا فَأَمَّا الَّذِيْ يَرَاهُ النَّاسُ مَاءٌ فَنَارٌ تُحْرِقُ وَأَمَّا الَّذِيْ يَرَاهُ النَّاسُ نَارًا فَمَاءٌ بَارِدٌ عَذْبٌ فَمَنْ أَدْرَكَ ذَلِكَ مِنْكُمْ فَلْيَقَعْ فِيْ الَّذِيْ يَرَاهُ نَارًا فَإِنَّهُ مَاءٌ عَذْبٌ طَيِّبٌ”. مُتَّفَقٌ عَلَيْهِ.

وَزَادَ مُسْلِمٌ: “إِنَّ الدَّجَّالَ مَمْسُوْحُ الْعَيْنِ عَلَيْهَا ظَفْرَةٌ غَلِيْظَةٌ مَكْتُوْبٌ بَيْنَ عَيْنَيْهِ كَافِرٌ يَقْرَؤُهُ كُلُّ مُؤْمِنٍ كَاتِبٌ وَغَيْرُ كَاتِبِ”.

5473. (10) [3/1507ఏకీభవితం]

హుజై’ఫహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”దజ్జాల్‌ తనవెంట అగ్నిని, నీటిని తీసుకొని నడుస్తాడు. ప్రజలు నీరు అనుకున్నది అగ్ని అయి ఉంటుంది. అగ్ని అనుకున్నది నీరయి ఉంటుంది. మీలో ఎవరైనా వాడి కాలంలో ఉంటే, అగ్నిలో పడటానికి సిద్ధంకావాలి.” (బు’ఖారీ, ముస్లిమ్‌)

ముస్లిమ్‌లో ఈ పదాలు అధికంగా ఉన్నాయి. ”దజ్జాల్‌ ఒకకన్ను మూసిఉంటుంది. మరో కన్నుపై గోరు ఉంటుంది. వాడి నుదుటి మధ్య భాగంలో ‘ ‘  (కాఫిర్) అని వ్రాయబడి ఉంటుంది. దాన్ని ప్రతి ముస్లిమ్‌ సులువుగా విద్యావంతుడైనా, నిరక్షరాస్యు డైనా చదువుకోగలడు.

5474 – [ 11] ( صحيح ) (3/1507)

وَعَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “اَلدَّجَّالُ أَعْوَرُ الْعَيْنِ الْيُسْرَى جُفَالُ الشَّعْرِ مَعَهُ جَنَّتُهُ وَنَارُهُ فَنَارُهُ جَنَّةٌ وَجَنَّتُهُ نَارٌ”. رَوَاهُ مُسْلِمٌ.

5474. (11) [3/1507దృఢం]

హుజై’ఫహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”దజ్జాల్‌ ఎడమ కన్ను గ్రుడ్డిగా ఉంటుంది. వాడికి వెంట్రుకలు చాలా అధికంగా ఉంటాయి. వాడి వెంట స్వర్గనరకాలు ఉంటాయి. వాడి నరకం-అసలు స్వర్గం అయి ఉంటుంది. వాడి స్వర్గం-నరకం అయి ఉంటుంది.”[37]  (ముస్లిమ్‌)

5475 – [ 12 ] ( صحيح ) (3/1507)

وعَنِ النَّوَّاسِ بْنِ سَمْعَانَ قَالَ: ذَكَرَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم الدَّجَّالَ فَقَالَ: “إِنّْ يَخْرُجْ وَأَنَا فِيْكُمْ فَأَنَا حَجِيْجُهُ دُوْنَكُمْ وَإِنْ يَخْرُجْ وَلَسْتُ فَيِكُمْ فَامْرُؤٌ حَجِيْجُ نَفْسِهِ وَاللهِ خَلِيْفَتِيْ عَلَى كُلِّ مُسْلِمٍ إِنَّهُ شَابٌّ قَطِطٌ عَيْنُهُ طَافِيَهٌ كَأَنِّيْ أَشْبِّهُهُ بِعَبْدِ الْعُزَّى بْنِ قَطَنٍ فَمَنْ أَدْرَكَهُ مِنْكُمْ فَلْيَقْرَأُ عَلَيْهِ. فَوَاتِحَ سُوْرَةِ الْكَهْفِ”.

 وَفِيْ رِوَايَةٍ “فَلْيَقْرَأْ عَلَيْهِ بِفَوَاتِحِ سُوْرَةِ الْكَهْفِ فَإِنَّهَا جَوَارُكُمْ مِنْ فِتْنَتِهِ إِنَّهُ خَارِجٌ خَلَّةً بِيْنَ الشَّامِ وَالْعِرَاقِ فَعَاثَ يَمِيْنًا وَعَاثَ شِمَالًا يَا عِبَادَ اللهِ فَاثْبُتُوْا”. قُلْنَا: يَا رَسُوْلَ اللهِ وَمَا لَبْثُهُ فِي الْأَرْضِ؟ قَالَ: “أَرْبَعُوْنَ يَوْمًا يَوْمَ كَسَنَةٍ وَيَوْمَ كَشَهْرٍ وَيَوْمَ كَجُمُعَةٍ وَسَائِرُ أَيَّامِهِ كَأَيَّامِكُمْ”. قُلْنَا: يَا رَسُولَ اللهِ فَذَلِكَ الْيَوْمُ الَّذِيْ كَسَنَةٍ أَتَكْفِيْنَا فِيْهِ صَلَاةُ يَوْمٍ. قَالَ: “لَا اُقْدُرُوْا لَهُ قَدَرَهُ”. قُلْنَا: يَا رَسُولَ اللهِ وَمَا إِسْرَاعُهُ فِي الْأَرْضِ؟ قَالَ: “كَالْغَيْثِ اِسْتَدْبَرَتْهُ الرِّيْحِ فَيَأْتِيْ عَلَى الْقَوْمِ فَيَدْعُوْهُمْ فَيُؤْمِنُوْنَ بِهِ فَيَأْمُرُ السَّمَاءَ فَتُمْطِرُ وَالْأَرْضَ فَتُنْبِتُ فَتَرُوْحُ عَلَيْهِمْ سَارِحَتُهُمْ أَطُوَلَ مَا كَانَتْ ذُرى وَأَسْبَغَهُ ضُرُوْعًا وَأَمَدَّهُ خَوَاصِرَ ثُمَّ يَأْتِي الْقَوْمَ فَيَدْعُوْهُمْ فَيَرُدُّوْنَ عَلَيْهِ قَوْلِهِ فَيَنْصَرِفُ عَنْهُمْ فَيُصْبِحُوْنَ مُمْلَحِيْنَ لَيْسَ بِأَيْدِيْهِمْ شَيْءٌ مِنْ أَمْوَالِهِمْ وَيَمُرُّ بِالْخَرِبَةِ فَيَقُوْلُ لَهَا: أَخْرِجِيْ كَنُوْزَكِ فَتَتْبَعُهُ كُنُوْزُهَا كَيَعَاسِيْبِ النَّحْلِ ثُمَّ يَدْعُوْ رَجُلًا مُمْتَلِئًا شَبَابًا فَيَضْرِبُهُ بِالسَّيْفِ فَيَقْطَعُهُ جَزْلَتَيْنِ رَمْيَةَ الْغَرَضِ ثُمَّ يَدْعُوْهُ فَيُقْبِلُ وَيَتَهَلَّلُ وَجْهُهُ يَضْحَكُ فَبْيَنَمَا هُوَ كَذَلِكَ إِذْ بَعَثَ اللهُ الْمَسِيْحَ بْنَ مَرْيَمَ فَيَنْزِلُ عِنْدَ الْمَنَارَةِ الْبَيْضَاءِ شَرْقِيِّ دِمَشْقَ بَيْنَ مَهْرُوْذَتَيْنِ وَاضِعًا كَفَّيْهِ عَلَى أَجْنِحَةِ مَلَكَيْنِ إِذَا طَأْطَأُ رَأْسَهُ قَطَرَ وَإِذَا رَفَعَهُ تَحَدَّرَمِنْهُ مِثْلُ جُمَانٍ كَاللُّؤْلُؤِ فَلَا يَحِلُّ لِكَافِرٍ يَجِدُ مِنْ رِيْحٍ نَفَسِهِ إِلَّا مَاتَ وَنَفَسُهُ يَنْتَهِيْ حَيْثُ يَنْتَهِيْ طَرَفُهُ فَيَطْلُبُهُ حَتَّى يُدْرِكَهُ بِبَابِ لُدٍّ فَيَقْتُلُهُ ثُمَّ يَأْتِي عِيْسَى إِلى قَوْمٍ قَدْ عَصَمَهُمُ اللهُ مِنْهُ فَيَمْسَحُ عَنْ وُجُوْهِهِمْ وَيُحَدِّثُهُمْ بِدَرَ جَاتِهِمْ فِي الْجَنَّةِ فَبَيْنَمَا هُوَ كَذَلِكَ إِذْ أَوْحَى اللهُ إِلى عِيْسَى: إِنِّيْ قَدْ أَخْرَجْتُ عِبًادًا لِيْ لَا يَدَانِ لِأَحَدٍ بِقِتَالِهِمْ فَحَرِّزْ عِبَادِيْ إِلى الطُّوْرِ وَيَبْعَثُ اللهُ يَأْجُوْجَ وَمَأْجُوْجَ (وَهُمْ مِنْ كُلِّ حَدَبٍ يَنْسِلُوْنَ؛ 21: 96)

فَيَمُرُّ أَوْائِلُهُمْ عَلَى بُحَيْرَةٍ طَبْرِيَّةٍ فَيَشْرَبُوْنَ مَا فِيْهَا وَيَمُرُّ آخِرُهُمْ وَيَقُوْلُ: لَقَدْ كَانَ بِهِذِهِ مَرَّةً مَاءٌ ثُمَّ يَسِيْرُوْنَ حَتّى يَنْتَهُوْا إِلى جَبَلِ الْخَمَرِ وَهُوَ جَبَلُ بَيْتِ الْمَقْدِسِ فَيَقُوْلُوْنَ لَقَدْ قَتَلْنَا مَنْ فِيْ الْأَرْضِ هَلُمَّ فَلْنَقْتُلْ مَنْ فِي السَّمَاءِ فَيَرْمُوْنَ بِنُشَّابِهِمْ إِلى السَّمَاءِ فَيَرُدُّ اللهُ عَلَيْهِمْ نُشَّابَهُمْ مَخْضُوْبَةً دَمًا وَيُحْصَرُ نَبِيُّ اللهِ وَأَصْحَابُهُ حَتّى يَكُوْنَ رَأْسُ الثَّوْرِ لِأَحَدِهِمْ خَيْرًا مِنْ مِائَةِ دِيْنَارٍ لِأَحَدِكُمُ الْيَوْمَ فَيَرْغَبُ نَبِيُّ اللهِ عِيْسَى وَأَصْحَابُهُ فَيَرْسِلُ اللهُ عَلَيْهِم النَّغَفَ فِيْ رِقَابِهِمْ فَيُصْبِحُوْنَ فَرْسَى كَمَوْتِ نَفْسٍ وَاحِدَةٍ ثُمَّ يَهْبِطُ نَبِيُّ اللهِ عِيْسَى وَأَصْحَابِهِ إِلى الْأَرْضِ فَلَا يَجِدُوْنَ فِي الْأَرْضِ مَوْضِعَ شِبْرٍ إِلَّا مَلَأَهُ زَهَمُهُمْ وَنَتَنُهُمْ فَيَرْغَبُ نَبِيُّ اللهِ عِيْسَى وَأَصْحَابُهُ إِلى اللهِ فَيُرْسِلُ اللهُ طَيْرًا كَأَعْنَاقِ الْبُخْتِ فَتَحْمِلُهُمْ فَتَطْرَحُهُمْ حَيْثُ شَاءَ اللهُ”.

وَفِيْ رِوَايَةٍ ” تَطْرَحُهُمْ بِالنَّهْبَلِ وَيَسْتَوْقِدُ الْمُسْلِمُوْنَ مِنْ قِسِيِّهِمْ وَنُشَّابِهِمْ وَجَعَابِهِمْ سَبْعَ سِنِيْنَ ثُمَّ يُرْسِلُ اللهُ مَطَرًا لَا يَكُنُّ مِنْهُ بَيْتُ مَدَرٍ وَلَا وَبَرٍ فَيَغْسِلُ الْأَرْضَ حَتّى يَتْرُكَهَا كَالزَّلَفَةَ ثُمَّ يُقَالُ لِلْأَرْضِ: أَنْبِتِيْ ثَمَرَتُكَ وَرُدِّيْ بَرَكَتَكِ فَيَوْمَئَذٍ تَأْكُلُ الْعِصَابَةُ مِنَ الرُّمَّانَةِ وَيَسْتَظِلُّوْنَ بِقِحْفِهَا وَيُبَارَكُ فِي الرِّسْلِ حَتّى إِنَّ اللِّقْحَةَ مِنَ الْإِبِلِ لَتَكْفِي الْفِئَامَ مِنَ النَّاسِ وَاللِّقْحَةَ مِنَ الْبَقَرِ لَتَكْفِي الْقَبِيْلَةَ مِنَ النَّاسِ وَاللِّقْحَةَ مِنَ الْغَنَمِ لَتَكْفِي الْفَخِذَ مِنَ النَّاسِ فَبَيْنَا هُمْ كَذَلِكَ إِذْ بَعَثَ اللهُ رِيْحًا طَيِّبَةً فَتَأْخُذُهُمْ تَحْتَ آبَاطِهِمْ فَتَقْبِضُ رُوْحَ كُلِّ مُؤْمِنٍ وَكُلِّ مُسْلِمٍ وَيَبْقَى شِرَارُ النَّاسِ يَتَهَارَجُوْنَ فِيْهَا تَهَارُجَ الْحُمُرِ فَعَلَيْهِمْ تَقُوْمُ السَّاعَةُ”. رَوَاهُ مُسْلِمٌ إِلَّا الرِّوَايَةَ الثَّانِيَةَ وَهِيَ قَوْلُهُ: “تَطرَحُهُمْ بِالنَّهْبَلِ إِلى قَوْلِه: سَبْعَ سِنِيْنَ”. رَوَاهُمَا التِّرْمِذِيُّ.

5475. (12) [3/1507దృఢం]

నవాస్‌ బిన్‌ సమ్‌’ఆన్‌ (ర) కథనం: ప్రవక్త (స) ఒకసారి దజ్జాల్‌ గురించి ప్రస్తావించారు. ఒకవేళ ఆ దజ్జాల్‌ నా జీవితంలో వస్తే, నేను మీ తరఫున వాడికి పోటీగా ఉంటాను. ఇంకా నేను వాడి కల్లోలం నుండి మిమ్మల్ని కాపాడుతాను. ఒకవేళ నా తరువాత వస్తే, ముస్లిముల్లోని ప్రతి ఒక్కరూ పోరాడాలి. అల్లాహ్‌(త) ప్రతి ముస్లిమ్‌కు  సంరక్షకుడై ఉంటాడు. వాడికి ఉంగరాల జుట్టు ఉంటుంది. వాడి ఒక కన్ను ఉబ్బి ఉంటుంది. వాడు ‘అబ్దుల్‌ ‘ఉజ్జా బిన్‌ ఖుతున్‌ను పోలి ఉంటాడని చెప్పగలను. ‘అబ్దుల్‌ ‘ఉజ్జా ఒక అవిశ్వాసి వాడిని ప్రవక్త (స) అనుచరులు చూసి ఉన్నారు. మీలో ఎవరైనా దజ్జాల్‌ను చూస్తే, వాడి కల్లోలాల నుండి తప్పించు కోవటానికి సూరహ్‌ కహఫ్‌లోని ప్రారంభ ఆయతులు పఠించాలి. ఎందుకంటే ఈ ఆయతులు దజ్జాల్‌ ఉపద్రవం నుండి రక్షిస్తాయి. దజ్జాల్‌ సిరియా మరియు ఇరాఖ్ మార్గంలో బహిర్గతం అవుతాడు. అటూ ఇటూ కల్లోలాలు రేపుతూ పోతాడు. ఇంకా ఓ అల్లాహ్‌ దాసులారా! మీరు మీ ధర్మం, విశ్వాసాలపై స్థిరంగా ఉండాలి. అస్థిరతకు లోను కాకూడదు. ఎందుకంటే దజ్జాల్‌ కల్లోలం చాలా భయంకరంగా ఉంటుంది. తన విశ్వాసాన్ని కాపాడుకోవటం కష్టం అయిపోతుంది.” అప్పుడు ప్రవక్త (స) అనుచరులు, ‘ఓ ప్రవక్తా! వాడు ఎన్నిరోజుల వరకు భూమిపై ఉంటాడు,’ అని ప్రశ్నించారు. దానికి ప్రవక్త (స), ‘40 రోజులు, అయితే మొదటి రోజు ఒక సంవత్సరానికి సమానంగా ఉంటుంది. మరో రోజు ఒక నెలకు సమానంగా ఉంటుంది. మూడవ రోజు ఒక వారానికి సమానంగా ఉంటుంది. మిగతా దినాలు మామూలుగానే ఉంటాయి,’ అని అన్నారు. అప్పుడు మేము, ‘ఓ ప్రవక్తా! ఒక సంవత్సరానికి సమానమైన మొదటి రోజు, ఒకరోజు నమా’జు సరిపోతుందా?’ అని విన్నవించు కున్నాము. దానికి ప్రవక్త (స), ”కాదు, ఆ రోజున ప్రతి రోజును అంచనా వేసి నమా’జులు చదువుకోండి. అంటే ప్రతి ఒక్క రోజు యొక్క అంచనా వేసి సమయం ప్రకారం నమా’జులు చదువుకోవాలి.” అప్పుడు మేము, ”ఓ ప్రవక్తా! వాడు వేగంగా వస్తాడా?” అని ప్రశ్నించాము. దానికి ప్రవక్త (స), ”మేఘాల కన్నా వేగంగా నడుస్తాడు. వాడు ఒక జాతి వద్దకు వెళ్ళి, తాను దైవాన్నని నమ్మిస్తాడు. ప్రజలు వాడిని దైవంగా భావిస్తారు. ఆ తరువాత దజ్జాల్‌ ఆకాశాన్ని వర్షం కురిపించమని ఆదేశిస్తాడు. ఆకాశం నుండి విస్తృతంగా వర్షాలు పడతాయి. ఆ తరువాత దజ్జాల్‌ భూమితో ఓ భూమి పంటలు పండించు అని ఆదేశిస్తాడు. భూమి పంటలు, పచ్చగడ్డి పండిస్తుంది. ప్రజల పశువులు వాటిని తిని బలంగా తయారవుతాయి. వాటి పాలిండ్లు (పొదుగులు) కూడా నిండి ఉంటాయి. ఒంటెల కుహరాలు పెద్దవయి పోతాయి. వాటి పొదుగుల్లో పాలు చాలా అధికంగా ఉంటుంది. ఆ తరువాత దజ్జాల్‌ ప్రజల వద్దకు వెళ్ళి తనను దైవంగా భావించమని ఆహ్వానిస్తాడు. ప్రజలు వాడి దైవత్వాన్ని తిరస్కరిస్తారు. అంటే వాడిని దైవంగా భావించరు. అప్పుడు దజ్జాల్‌ ఆ ఏక దైవారాధకులను అసహ్యించుకొని వెళ్ళిపోతాడు. వారి ధన సంపద లన్నిటినీ దజ్జాల్‌ లాక్కుంటాడు. వీరు కరువు కాటకాలకు గురవుతారు. ఇది కూడా ఒక పెద్ద పరీక్షే. ఇందులో సత్యవిశ్వాసులే స్థిరంగా ఉంటారు. ఆ తరువాత దజ్జాల్‌ పురాతన శిధిలావస్థలో ఉన్న ప్రాంతం గుండా వెళుతూ, ‘ఓ భూమీ, నీలో దాగివున్న నిధులను బయటికి తీయి,’ అని అంటాడు. ఆ గుప్తనిధులు బయల్పడి దజ్జాల్‌ వెనుక నడుస్తూ ఉంటాయి. తేనెటీగల నాయకుడు ముందు ఉండి మిగిలిన ఈగలన్నీ వెనుక నడుస్తాయి.

”ఆ తరువాత దజ్జాల్‌ ఒక యువకుణ్ణి పిలిచి, ఆ యువకుడ్ని తన కరవాలంతో రెండు ముక్కలు చేసి విసరివేస్తాడు, బాణాలు విసిరినట్టు. ఇంకా దజ్జాల్‌ ఆ రెండు ముక్కల మధ్య గర్వంగా, అహంకారంగా నడుస్తాడు. ఆ తరువాత ఆ రెండు ముక్కలను ఒక చోట చేర్చి సజీవపరుస్తాడు. దజ్జాల్‌ ఆ యువకునితో, ‘ఇప్పుడు నేనే నీ దైవాన్ని. నాలో చనిపోయిన వారిని బ్రతికించే శక్తి ఉందని నీకు తెలిసి పోయిందా?’ అని అడుగుతాడు. ఆ సత్య విశ్వాసి చిరునవ్వు నవ్వుతూ, అతని ముఖం మెరుస్తూ ఉంటుంది. దజ్జాల్‌తో, ‘ఇప్పుడు నాకు ముందుకంటే అధికంగా నీవే దజ్జాల్‌వని నమ్మకం కలిగింది. నీవు మంత్రాల ద్వారా ఇవన్నీ చేసావు, ఇవన్నీ మాంత్రికులు కూడా చేస్తారు.’ అని అంటాడు. ఏదైతేనేం దజ్జాల్‌ ఈ పనుల్లో ఉంటాడు. ఇంతలో అల్లాహ్‌(త) ఈసా (అ)ను అవతరింప జేస్తాడు. అతను(అ) దమిష్క్‌లోని తూర్పున ఉన్న మినాపై దిగుతారు. ఇరువైపులా ఇద్దరు దైవదూతలు ఉంటారు. గేరూ రంగు వస్త్రాలు ధరించి ఉంటారు. ‘ఈసా (అ) తల వంచితే చెమట కారుతుంది. తల ఎత్తితే ముత్యాల్లాంటి చుక్కలు పడతాయి. అతని శ్వాస తగిలిన అవిశ్వాసి వెంటనే మరణిస్తాడు. ఆయన శ్వాస దృష్టి చేరే వరకు పోతుంది. ‘ఈసా (అ) దజ్జాల్‌ను వెంబడిస్తారు. దజ్జాల్‌ పారిపోతూ ఉంటాడు. చివరికి లుద్‌ ద్వారం వద్ద పట్టుకుంటారు, వాడిని చంపివేస్తారు. ఆ తరువాత ‘ఈసా (అ) ఏక దైవారాధకుల వద్దకు వస్తారు. వారిని అల్లాహ్‌ (త) దజ్జాల్‌ కల్లోలాల నుండి రక్షించి ఉంటాడు. వీళ్ళు చాలా దూరం నుండి వచ్చి ఉంటారు.

దానివల్ల వారి ముఖాలు ధూళితో నిండి ఉంటాయి. ‘ఈసా (అ) ప్రేమతో వారి ముఖాల నుండి ధూళి తుడిచి వారికి, ‘స్వర్గంలో మీ కోసం పెద్దపెద్ద తరగతులు, ఆసనాలు ఉన్నాయి,’ అని శుభవార్త తెలియజేస్తారు. ఇంతలో అల్లాహ్‌(త) అతని వద్దకు ఇలా దైవవాణి పంపుతాడు, ‘ఓ ‘ఈసా! ఇప్పుడు నేను ఎటువంటి వారిని పంపుతున్నానంటే, వారితో నీవు యుద్ధం చేయలేవు. ఇంకా అంత శక్తి నీలోలేదు కూడా, అందువల్ల నీవు నా సత్యవిశ్వాసులను తీసుకొని తూర్‌ కొండపైకి వెళ్ళిపో, ఇంకా అక్కడ వారిని కనిపెట్టుకొని ఉండు.’ అనంతరం ‘ఈసా (అ) వారిని తీసుకొని ‘తూర్‌ కొండపైకి ఎక్కుతారు. అప్పుడు అల్లాహ్‌(త) యా’జూజ్‌, మా’జూజ్‌లను పంపుతాడు. ఎత్తైన ప్రదేశాల నుండి, కొండల నుండి వచ్చి భూమంతా వ్యాపిస్తారు. ప్రపంచమంతా హింసలు, దౌర్జన్యాలు, కల్లోలాలు రేకెత్తిస్తారు. ప్రజలను తమ ఇష్టం వచ్చినట్టుగా చంపుతారు. వీళ్ళు చాలా ఆకలిగా దాహంగా ఉంటారు. మొదటి బృందం తబ్‌రియ సముద్రం చేరి దాని నీరంతా త్రాగుతారు. వారి మరో బృందం వచ్చి ఆ మార్గాన్నే వెళుతూ, ‘ఇక్కడ ఎప్పుడో నీరు ఉండేది,’ అని అంటారు. అలా వెళుతూ వాళ్ళు ఒక కొండ వద్దకు చేరు కుంటారు. అక్కడ పొలాలు, తోటలు, చెట్లు, పంటలు అన్నీ సస్యశ్యామలంగా ఉంటాయి. ఇది బైతుల్‌ ముఖద్దస్‌ కొండ ల్లోని ఒక కొండ. ఆ తరువాత యా’జూజ్‌ మా’జూజ్‌ గర్వంగా, అహంకారంతో, ‘మేము భూలోక వాసు లందరినీ చంపివేశాము. ఇప్పుడు రండి, ఆకాశవాసుల్ని చంపుదాం,’ అని అంటారు. అనంతరం వారు ఆకాశంపై బాణాలు విసురుతారు. అల్లాహ్‌(త) వారి బాణాలకు రక్తం పులిమి తిరిగి పడవేస్తాడు. అది చూసి వారు, ‘మేము ఆకాశ వాసులను కూడా చంపివేసాము,’ అని, భూమ్యా కాశాలలో మేము తప్ప మరెవరూ లేరని భ్రమపడతారు.

‘ఈసా(అ) అతని అనుచరులు ‘తూర్‌ కొండపై చాలా ఆందోళనకరమైన స్థితిలో ఉంటారు. ఆహార పదార్థాల్లో తీవ్రమైన కొరత ఏర్పడుతుంది. చివరికి ఒక ఆవు తల విలువ 100 అష్రఫీల కంటే అధికంగా ఉంటుంది. అప్పుడు ‘ఈసా (అ) అతని(అ) అనుచరులు ఆపదల నుండి గట్టెక్కడానికి దు’ఆ చేస్తారు. ‘ఈసా (అ) దు’ఆ చేస్తారు. అనుచరులంతా ఆమీన్‌ అనిఅంటూ ఉంటారు. అల్లాహ్‌(త) వారి దు’ఆ స్వీకరిస్తాడు, అప్పుడు అల్లాహ్‌(త) కల్లోలాలను వ్యాపింపజేసే యా’జూజ్‌ మా’జూజ్‌లపై ఒకవ్యాధి వ్యాపింపజేస్తాడు. దానివల్ల వాళ్ళందరూ మరణిస్తారు. ‘ఈసా(అ) అనుచరులను తీసుకొని క్రిందికి దిగుతారు. భూమిపై యా’జూజ్‌ మా’జూజ్‌ శవాలు కుప్పలు తిప్పలుగా పడి ఉండటం చూస్తారు. అవి క్రుళ్ళి పోవటం వల్ల దుర్వాసన వ్యాపించి ఉంటుంది. అంటే భూమంతా వారి శవాలతో నిండి ఉంటుంది. అప్పుడు ‘ఈసా (అ), ‘ఓ ప్రభూ! భూమిని యా’జూజ్‌ మా’జూజ్‌ల శవాల నుండి పరిశుభ్రపరచు,’ అని ప్రార్థిస్తారు. అతని (అ) అనుచ రులు అతని వెనుక ఆమీన్‌ అని పలుకుతూ ఉంటారు. అల్లాహ్‌(త) వారి దు’ఆను స్వీకరిస్తాడు. ఆ శవాలను తొలగించటానికి అల్లాహ్‌(త) ఎలాంటి పక్షలను పంపి స్తాడంటే వారిని తమ నోటితోపట్టుకొని భూమిపై వేర్వేరుప్రదేశాల్లో విసరి వేస్తారు. ఆ తరువాత అల్లాహ్‌(త) వర్షం కురిపిస్తాడు. దానివల్ల వారి చీము రక్తం అంతా ప్రవహించి భూమి పరిశుభ్రం అయిపోతుంది. ఆ తరువాత భూమితో, ‘నీ శుభాలను వెలికి తీసి, పంటలను పండించు,’ అని ఆదేశించటం జరుగుతుంది. అనంతరం వర్షం వల్ల పంటలు చాలా బాగా పండుతాయి. చివరికి ఒక దానిమ్మ  పండు 40 మందికి  సరిపోతుంది.

”ఇంకా ఆ దానిమ్మ పండు తొక్క ద్వారా ప్రజలు నీడను కూడా పొందటం జరుగుతుంది. అంటే ఆ దానిమ్మ పండు అంత పెద్దదిగా ఉంటుంది. అదేవిధంగా పశువుల పాలు కూడా అత్యధికంగా పెరుగుతాయి. ఒక పశువు పాలు ఎంతో మంది త్రాగుతారు. దాన్ని త్రాగేవారు ఎంతోబలంగా చురుగ్గా ఆరోగ్యంగా ఉంటారు. కొంతకాలం వరకు సుఖ, విలాసాలలో ఉంటారు. ఆ తరువాత అల్లాహ్‌(త) ఒక గాలిని పంపుతాడు. విశ్వాసుల, ముస్లిముల ఆత్మలను హరిస్తుంది. కేవలం పాపాత్ములే ప్రపంచంలో మిగిలి ఉంటారు. వారు గాడిదల్లా, కుక్కల్లా సంభోగం చేస్తారు. ప్రళయం వీరిపైనే సంభవిస్తుంది.[38] (ముస్లిమ్‌, తిర్మిజి’)

5476 – [ 13 ] ( صحيح ) (3/1509)

وعَنْ أَبِي سَعِيْدِ الْخُدْرِيِّ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “يَخْرُجُ الدَّجَّالُ فَيَتَوَجَّهُ قِبَلَهُ رَجُلٌ مِنَ الْمُؤْمِنِيْنَ فَيَلْقَاهُ الْمَسَالِحُ مَسَالِحُ الدَّجَّالِ.فَيَقُوْلُوْنَ لَهُ: أَيْنَ تَعْمِدُ؟ فَيَقُوْلُ: أَعْمِدُ إِلى هَذَا الَّذِيْ خَرَجَ.قَالَ: فَيَقُوْلُوْنَ لَهُ: أَوْ مَا تَبَارَكَ وَتَعَالى ؤمن بربنا؟ فيقول: ما بربنا خفاء. فَيَقُوْلُوْنَ: اُقْتُلُوْهُ. فَيَقُوْلُ بَعْضُهُمْ لِبَعْضٍ: أَلَيْسَ قَدْ نَهَاكُمْ رَبُّكُمْ أَنْ تَقْتُلُوْا أَحَدا دُوْنَهُ”. قَالَ:  “فَيَنْطَلِقُوْنَ بِهِ إِلى الدَّجَّالِ فَإِذَا رَآهُ الْمُؤْمِنُ قَالَ: يَا أَيُّهَا النَّاسُ هَذَا الدَّجَّالُ الَّذِيْ ذَكَرَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم”. قَالَ: “فَيَأْمُرُ الدَّجَّالُ بِهِ فَيُشَبحُّ. فَيَقُوْلُ: خُذُوْهُ وَشُجُّوْهُ فَيُوْسَعُ ظَهْرُهُ وَبَطْنُهُ ضَرْبًا”. قَالَ: “فَيَقُوْلُ: أَوْ مَا تُؤْمِنُ بِيْ؟” قَالَ: “فَيَقُوْلُ: أَنْتَ الْمَسِيْحُ الْكَذَّابُ”. قَالَ: “فَيُؤْمَرُ بِهِ فَيُؤْشَرُ بِالْمِنْشَارِ مِنْ مَفْرِقِهِ حَتّى يُفَرَّقُ بَيْنَ رِجْلَيْهِ”. قَالَ: “ثُمَّ يَمْشِي الدَّجَّالُ بَيْنَ الْقِطْعَتَيْنِ ثُمَّ يَقُوْلُ لَهُ: أَتُؤْمِنُ بِيْ؟ فَيَقُوْلُ: مَا ازْدَدْتُ إِلَّا بَصِيْرَةً”. قَالَ: “ثُمَّ يَقُوْلُ: يَا أَيُّهَا النَّاسُ إِنَّهُ لَا يَفْعَلُ بَعْدِيْ بِأَحَدٍ مِنَ النَّاسِ”. قَالَ: “فَيَأْخُذُهُ الدَّجَّالُ لِيَذْبَحَهُ فَيَجْعَلُ مَا بَيْنَ رَقْبَتِهِ إِلى تَرْقُوْتِهُ نُحَاسًا فَلَا يَسْتَطِيْعُ إِلَيْهِ سَبِيْلًا”. قَالَ: “فَيَأْخُذُهُ بِيَدَيْهِ وَرِجْلَيْهِ فَيَقْذِفُ بِهِ فَيَحْسَبُ النَّاسُ أَنَّمَا قَذَفَهُإِلى النَّارِ وَإِنَّمَا أُلْقِيَ فِي الْجَنَّةِ”. فَقَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “هَذَا أَعْظَمُ النَّاسِ شَهَادَةً عِنْدَ رَبِّ الْعَالَمِيْنَ”. رَوَاهُ مُسْلِمٌ.  

5476. (13) [3/1509 దృఢం]

అబూ స’యీద్‌ ‘ఖుద్రీ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”దజ్జాల్‌ బహిర్గతం అయిన తర్వాత ఒక ముస్లిమ్‌ వ్యక్తి వాడివద్దకు వెళతాడు. దారిలో వాడి సైనికులు కలుస్తారు. వారు అతన్ని, ‘నీవు ఎక్కడికి వెళుతున్నావు,’ అని అడుగుతారు. ఆ వ్యక్తి నీచుడు. ‘దజ్జాల్‌ వద్దకు వెళుతున్నాను,’ అని అంటాడు. దానికి వారు, ‘నువ్వు మా దైవాన్ని విశ్వసించడం లేదా?’ అని అంటారు. దానికి ఆ వ్యక్తి ‘దైవం దాక్కొని ఉండడు,’ అని అంటాడు. దానికి వారు, ‘ఇతన్ని చంపేయండి,’ అని అంటారు. మళ్ళీ పరస్పరం, ‘మా దైవం ఎవరినీ అతని ముందు సమర్పించకుండా చంపవద్దన్నాడు’ అని అంటారు. ఆ తరువాత అతన్ని పట్టుకొని దజ్జాల్‌ ముందు పెడతారు. ఆ వ్యక్తి చూడగానే, ‘ఈ దజ్జాల్‌ గురించి ప్రవక్త (స) ముందే భవిష్యవాణి పలికారు. ఆ సూచనలన్నీ వీడిలో ఉన్నాయి,’ అని అంటాడు. అది విన్న దజ్జాల్‌ తన సైనికులను, ‘అతన్ని పట్టుకొని అతని తల పగలగొట్టండి,’ అని ఆదేశిస్తాడు. వారు అతన్ని కొట్టి అతని శరీరాన్ని సుతిమెత్తగా చేసివేస్తారు. ఆ తరువాత దజ్జాల్‌ ఆ వ్యక్తితో, ‘నీవు నన్ను విశ్వసిస్తావా లేదా?’ అని హెచ్చరిస్తాడు. ఆ సత్య విశ్వాసి, ‘నువ్వు దజ్జాల్‌వి, నీవు చాలా మోసగాడివి. అసత్యవాదివి. నీవు దైవం కావు,’ అని అంటాడు. ఆ తరువాత దజ్జాల్‌ తన సైనికులతో అతన్ని రంపంతో కోసి రెండు ముక్కలు చేయవలసిందిగా ఆదేశిస్తాడు. అనంతరం అతని తలపై రంపంపెట్టి కర్రను కోసినట్టు కోస్తారు. అతన్ని రెండు ముక్కలు చేయడం జరుగుతుంది. ఆ రెండు ముక్కలను దూరంగా విసిరి వేయడం జరుగుతుంది. దజ్జాల్‌ ఆ రెండు భాగాల మధ్యన నడుస్తూ ఆ తరువాత ఆ రెండు ముక్కలను అతికి, ‘నిలబడు,’ అని అంటాడు. అతడు నిలబడతాడు. అప్పుడు దజ్జాల్‌ అతనితో, ‘నన్ను దైవంగా భావిస్తావా? లేదా?’ అని అంటాడు. ఆ సత్య విశ్వాసి దజ్జాల్‌తో, ‘ఇంతకు ముందుకంటే ఇప్పుడు నాకు మరీ నమ్మకం కలిగింది. నువ్వే దజ్జాల్‌వి, నీవు వస్తావని ప్రవక్త (స) ముందే హెచ్చరించి ఉన్నారు. ప్రజలారా! నా తరువాత ఎవరినీ దజ్జాల్‌ ఏమీ చేయలేడు. చంపలేడు, కొట్టలేడు,’ అని అంటాడు. ఈ సంభాషణ తర్వాత దజ్జాల్‌ ఆ వ్యక్తిని చంపటానికి పట్టుకుంటాడు. అల్లాహ్‌(త) ఆ వ్యక్తి మెడను ఇతడిలా గట్టిగా చేసి వేస్తాడు. దానివల్ల వాడు జిబహ్‌ చేయలేకపోతాడు. ఇక చేసేది లేక దజ్జాల్‌ అతడి కాళ్ళూ చేతులూ కట్టి అగ్నిలో పడవేస్తాడు. కాని ఆ అగ్ని అసలు స్వర్గం అయి ఉంటుంది. ప్రజలు అతన్ని అగ్నిలో పడవేశాడని అనుకుంటారు. కాని అది స్వర్గమై ఉంటుంది. ప్రవక్త (స) ఇలా ప్రవచించిన తర్వాత, ‘ఆ వ్యక్తి అల్లాహ్‌ వద్ద గొప్ప ఉన్నత స్థాయి కలిగి ఉంటాడు’ అని అంటారు. ” (ముస్లిమ్‌)

కొందరు ఆ సత్య విశ్వాసి మహ్‌దీ(అ) అని అభిప్రాయ పడ్డారు.

5477 – [ 14 ] ( صحيح ) (3/1510)

وعَنْ أُمِّ شَرِيْكٍ قَالَتْ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَيَفِرَّنَّ النَّاسُ مِنَ الدَّجَّالِ حَتّى يَلْحَقُوْابِالْجِبَالِ” .قَالَتْ أُمّ شَرِيْكٍ: قُلْتُ: يَا رَسُوْلَ اللهِ فَأَيْنَ الْعَرَبُ يَوْمَئِذٍ؟ قَالَ: “هُمْ قَلِيْلٌ”. رَوَاهُ مُسْلِمٌ  

5477. (14) [3/1510  దృఢం]

ఉమ్మె షరీక్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ప్రజలు దజ్జాల్‌ మోసాలు, కల్లోలాల నుండి పారిపోయి కొండల్లోకి పోయి దాక్కుంటారు. అది విని ఉమ్మె షరీక్‌ (ర), ‘ఓ ప్రవక్తా! ఇటువంటి పరిస్థితుల్లో అరబ్బులు ఎక్కడుంటారు? వారు చాలా ధైర్యవంతులుగా, వీరులుగా ఉంటారా?’ అని విన్న వించుకుంటుంది. దానికి ప్రవక్త (స) ‘అప్పుడు అరబ్బులు తక్కువ సంఖ్యలో ఉంటారు. అందు వల్ల జిహాద్‌ చేయడానికి ఎవ్వరికీ ధైర్యంచాలదు,’ అని అంటారు. (ముస్లిమ్‌)

5478 – [ 15 ] ( صحيح ) (3/1511)

وعَنْ أَنَسٍ عَنْ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم قَالَ: “يَتْبَعُ الدَّجَّالَ مِنْ يَهُوْدِأَصْفَهَانَ سَبْعُوْنَ أَلْفًا عَلَيْهِمُ الطِّيَالِسةُ”. رَوَاهُ مُسْلِمٌ

5478. (15) [3/1511దృఢం]

అనస్‌ (ర) కథనం : ప్రవక్త (స) ఇలా ప్రవచించారు, ”అ’స్‌ఫహాన్‌కు చెందిన 70 వేల మంది యూదులు దజ్జాల్‌ను అనుసరిస్తారు. వారి తలలపై నల్లని లేదా పసుపు పచ్చరంగు గల దుప్పట్లు ఉంటాయి. అది యూదుల చిహ్నం.”  (ముస్లిమ్‌)

5479 – [ 16 ] ( متفق عليه ) (3/1511)

وَعَنْ أبِي سَعِيْدِ الْخُدْرِيِّ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “يَأْتِي الدَّجَّالُ وَهُوَ مُحَرَّمٌ عَلَيْهِ أَنْ يَدْخُلَ نِقَابَ الْمَدِيْنَةِ فَيَنْزِلُ بَعْضَ السِّبَاخِ الَّتِيْ تَلِي الْمَدِيْنَةَ فَيَخْرُجُ إِلَيْهِ رَجُلٌ وَهُوَ خَيْرُ النَّاسِ أَوْ مِنْ خِيَارِ النَّاسِ فَيَقُوْلُ: أَشْهَدُ أَنَّكَ الدَّجَّالُ الَّذِيْ حَدَّثَنَا رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم حَدِيْثَهُ. فَيَقُوْلُ الدَّجَّالُ: أَرَأَيْتُمْ إِنْ قَتَلْتُ هَذَا ثُمَّ أَحْيَيْتُهُ هَلْ تَشُكُّوْنَ فِي الْأَمْرِ؟ فَيَقُوْلُوْنَ: لَا فَيَقْتُلُهُ ثُمَّ يُحْيِيْهِ فَيَقُوْلُ: وَاللهِ مَا كُنْتُ فِيْكَ أَشَدَّ بَصِيْرَةً مِنِّي الْيَوْمَ فَيُرِيْدُ الدَّجَّالُ أَنْ يَقْتُلَهُ فَلَا يُسَلَّطُ عَلَيْهِ”. متفق عليه.

5479. (16) [3/1510 ఏకీభవితం]

అబూ స’యీద్‌ ‘ఖుద్రీ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”దజ్జాల్‌ మదీనహ్ వైపు వస్తాడు. కాని మదీనహ్లో ప్రవేశించడం వాడికి నిషేధించబడుతుంది. అందువల్ల మదీనహ్కు సమీపంగా పల్లపు ప్రాంతంలో ఆగిపోతాడు. మదీనహ్ నుండి ఒక వ్యక్తి వాడి దగ్గరకు వెళతాడు. అతడు ఆ కాలంలో అందరికంటే మంచివాడై ఉంటాడు. అతడు వచ్చి, ‘ప్రవక్త (స) మాకు తెలిపిన ఆ దజ్జాల్‌ నువ్వే అని నేను సాక్ష్యం ఇస్తున్నాను,’ అని అంటాడు. అప్పుడు దజ్జాల్‌ తన సైనికులతో, ‘ఒకవేళ నేను ఈ వ్యక్తిని చంపి మళ్ళీ బ్రతికిస్తే మీరు నేను దైవాన్నని నమ్ముతారా?’ అని అడుగుతాడు. దానికి వారు, ‘నిన్ను దైవం అనటంలో ఎటువంటి సందేహం లేదు.’ అనంతరం దజ్జాల్‌ ఆ వ్యక్తిని చంపివేస్తాడు. తరువాత అతనికి ప్రాణం పోస్తాడు. ఆ వ్యక్తి, ‘ఇప్పుడు నాకు ముందుకంటే ఎక్కువగా నువ్వే దజ్జాల్‌వని నమ్మకం కలిగింది,’ అని అంటాడు. దజ్జాల్‌ మళ్ళీ ఆ వ్యక్తిని చంపటానికి ప్రయత్నిస్తాడు. కాని రెండవసారి చంపలేడు. (బు’ఖారీ, ముస్లిమ్‌)

5480 – [ 17] ( متفق عليه ) (3/1511)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ عَنْ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم قَالَ: “يَأْتِي الْمَسِيْحُ مِنْ قِبَلِ الْمَشْرِقِ هِمَّتُهُ الْمَدِيْنَةُ حَتّى يَنْزِلَ دُبُرَأُحُدٍ ثُمَّ تَصْرِفُ الْمَلَائِكَةُ وَجْهَهُ قِبْلَ الشَّامِ وَهُنَالِكَ يَهْلِكُ”.

5480. (17) [3/1511ఏకీభవితం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”దజ్జాల్‌ మదీనహ్కు తూర్పువైపున వచ్చి, మదీనహ్ వైపు నడుస్తాడు. ఇంకా ఉ’హుద్‌ కొండ వెనుక వచ్చి ఉంటాడు. కాని దైవదూతలు వాడిని సిరియా వైపు త్రిప్పివేస్తారు. దజ్జాల్‌ సిరియా దేశంలోనే మరణిస్తాడు.” (బు’ఖారీ, ముస్లిమ్‌)

5481 – [ 18] ( صحيح ) (3/1511)

وعَنْ أَبِيْ بَكْرَةَ عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ: “لَا يَدْخُلُ الْمَدِيْنَةَ رُعْبُ الْمَسِيْحِ الدَّجَّالِ لَهَا يَوْمَئِذٍ سَبْعَةُ أَبْوَابٍ عَلَى كُلِّ بَابٍ مَلَكاَنِ”. رَوَاهُ الْبُخَارِيُّ.

5481. (18) [3/1511దృఢం]

అబూ బక్‌రహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మదీనహ్లో దజ్జాల్‌ భయం, పెత్తనం ప్రవేశించలేవు. మదీనహ్ వాసులు వాడికి ఏమాత్రం భయపడరు. ఎందుకంటే మదీనహ్కు 7 ద్వారాలు ఉంటాయి. ప్రతి ద్వారం వద్ద ఇద్దరు కాపలాదారులు ఉంటారు. అందువల్ల మదీనహ్ నలువైపుల నుండి సురక్షితంగా ఉంటుంది.” (బు’ఖారీ)

5482 – [ 19 ] ( صحيح ) (3/1511)

وعَنْ فَاطِمَةَ بِنْتِ قَيْسٍ قَالَتْ: سَمِعْتُ مُنَادِيَ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم فَلَمَّا قَضَى صَلَاتِهِ جَلَسَ عَلَى الْمِنْبَرِ وَهُوَ يَضْحَكُ فَقَالَ: “لِيَلْزَمْ كُلُّ إِنْسَانٍ مُصَلَّاهُ”. ثُمَّ قَالَ: “هَلْ تَدْرُوْنَ لَمَ جَمَعْتُكُمْ؟” قَالُوْا: اللهُ وَرَسُوْلُهُ أَعْلَمُ. قَالَ: “إِنِّيْ وَاللهِ مَا جَمَعْتُكُمْ لِرَغْبَةٍ وَلَا لِرَهْبَةٍ وَلَكِنْ جَمَعْتُكُمْ لِأَنَّ تَمِيْمًا الدَّارِيَ كَانَ رَجُلًا نَصْرَانِيًا فَجَاءَ فَبَايَعَ وَأَسْلَمَ وَحَدَّثَنِيْ حَدِيْثًا وَافَقَ الَّذِيْ كُنْتُ أُحَدِّثُكُمْ بِهِ عَنِ الْمَسِيْحِ الدَّجَّالِ حَدَّثَنِيْ أَنَّهُ رَكِبَ فِيْ سَفِيْنَةٍ بَحْرِيَّةٍ مَعَ ثَلَاثِيْنَ رَجُلًا مِنْ لَخْمٍ وَجُذَامٍ فَلَعِبَ بِهِمُ الْمَوْجُ شَهْرًا فِي الْبَحْرِ فَأَرْفَؤُوْا إِلى جَزِيْرَةِ حِيْنَ تَغْرُبُ الشَّمْسُ فَجَلَسُوْا فِيْ أَقْرُبِ سَفِيْنَةِ فَدَخَلُوْا الْجَزِيْرَةَ فَلَقِيَتْهُمْ دَابَّةُ أَهْلَبُ كَثِيْرُ الشَّعْرِ لَا يَدْرُوْنَ مَا قُبلهُ مِنْ دُبُرِهِ مِنْ كَثْرَةِ الشَّعْرِ قَالُوْا: وَيْلَكَ مَا أَنْتَ؟ قَالَتْ: أَنَا الْجَسَّاسَةُ قَالُوْا: وَمَا الْجَسَّاسَةُ؟ قَالَتْ: أَيُّهَا الْقَوْمُ اِنْطَلِقُوْا إِلى هَذَا الرَّجُلِ فِي الدِّيْرِ فَإِنَّهُ إِلى خَبَرِكُمْ بِالْأَشْوَاقِ. قَالَ: لَمَّا سَمَّتْ لَنَا رَجُلًا فَرِقْنَا مِنْهَا أَنْ تَكُوْنَ شَيْطَانَةً قَالَ: فَانْطَلَقْنَا سِرَاعًا حَتّى دَخَلْنَا الدِّيْرَ فَإِذَا فِيْهِ أَعْظمُ إِنْسَانٍ مَا رَأَيْنَاهُ قَطُّ خَلْقًا وَأَشَدُّهُ وَثَاقًا مَجْمُوْعَةٌ يَدَهُ إِلى عُنُقِهِ مَا بَيْنَ رُكْبَتَيْهِ إِلى كَعْبَيْهِ بِالْحَدِيْدِ. قُلْنَا: وَيْلَكَ مَا أَنْتَ؟ قَالَ: قَدْ قَدَرْتُمْ عَلَى خَبَرِيْ فَأَخْبِرُوْنِيْ مَا أَنْتُمْ؟ قَالُوْا: نَحْنُ أُنَاسٌ مِنَ الْعَرَبِ رَكِبْنَا فِي سَفِيْنَةٍ بَحْرِيَّةٍ فَلَعِبَ بِنَا الْبَحْرُ شَهْرًا فَدَخَلْنَا الْجَزِيرَةَ فَلَقِيَتْنَا دَابَّةٌ أَهْلَبُ فَقَالَتْ: أَنَا الْجَسَّاسَةُ اعْمَدُوْا إِلى هَذَا فِيْ الدُّيْرِ فَأَقْبَلْنَا إِلَيْكَ سِرَاعًا وَفَزِعِنَا مِنْهَا وَلَمْ نَأْمَنْ أَنْ تَكُوْنَ شَيْطَانَةً فَقَالَ: أَخْبِرُوْنِيْ عَنْ نَخْلِ بَيْسَانَ قُلْنَا: عَنْ أَيِّ شَأْنِهَا تَسْتَخْبِرُ؟ قَالَ: أَسْأَلُكُمْ عَنْ نَخْلِهَا هَلْ تُثْمِرُ؟ قُلْنَا: نَعَمْ. قَالَ: أَمَّا إِنَّهَا تُوْشِكُ أَنْ لَا تُثْمِرَ. قَالَ: أَخْبِرُوْنِيْ عَنْ بُحَيْرَةِ الطَّبْرِيَّةِ قُلْنَا: عَنْ أَيِّ شَأْنَهَا تَسْتَخْبِرُ؟ قَالَ: هَلْ فِيْهَا مَاءٌ؟ قُلْنَا هِيَ كَثِيْرَةُ الْمَاءِ. قَالَ: أَمَا إِنَّ مَاءَهَا يُوْشِكُ أَنْ يَذْهَبَ . قَالَ: أَخْبِرُوْنِيْ عَنْ عَيْنٍ زُغَرَ. قَالُوْا: وَعَنْ أَيِّ شَأْنِهَا تَسْتَخْبِرُ؟ قَالَ: هَلْ فِي الْعَيْنِ مَاءٌ؟ وَهَلْ يَزْرَعُ أَهْلُهَا بِمَاءِ الْعَيْنِ؟ قُلْنَا لَهُ: نَعَمْ هِيَ كَثِيْرَةُ الْمَاءِ وَأَهْله يَزْرَعُوْنَ مِنْ مَائِهَا. قَالَ: أَخْبِرُوْنِي عَنْ نَبِيِّ الْأُمِّيِّيْنَ مَا فَعَلَ؟ قُلْنَا: قَدْ خَرَجَ مِنْ مَكَّةَ وَنَزَلَ يَثْرِبَ. قَالَ: أَقَاتَلَهُ الْعَرَبُ؟ قُلْنَا: نَعَمْ. قَالَ: كَيْفَ صَنَعَ بِهِمْ؟ فَأَخْبَرْنَاهُ أَنَّهُ قَدْ ظَهَرَ عَلَى مَنْ يَلِيْهِ مِنَ الْعَرَبِ وَأَطَاعُوْهُ. قَالَ لَهُمْ: قَدْ كَانَ ذَلِكَ؟ قُلْنَا: نَعَمْ. قَالَ: أَمَا إِنَّ ذَلِكَ خَيْرٌ لَهُمْ أَنْ يُطِيْعُوْهُ وَإِنِّيْ مُخْبِرُكُمْ عنِّيْ: إِنِّيْ أَنَا الْمَسِيْحُ الدَّجَّالُ وَإِنِّيْ يُوْشِكُ أَنْ يُؤْذَنَ لِيْ فِي الْخُرُوْجِ فَأَخْرُجَ فَأَسِيْرَ فِي الْأَرْضِ فَلَا أَدَعَ قَرْيَةً إِلَّا هَبَطْتُهَا فِي أَرْبَعِيْنَ لَيْلَةً غَيْرَ مَكَّةَ وَطَيبَةَ هُمَا مُحَرَّمَتَانِ عَلَيَّ كِلْتَاهُمَا كُلَّمَا أَرَدْتُ أَنْ أَدْخُلَ وَاحِدَةً أَوْ وَاحِدًا مِنْهُمَا اسْتَقَبَلَنِي مَلَكٌ بِيَدِهِ السَّيْفُ صَلَتًا يَصُدُّنِيْ عَنْهَا وَإِنَّ عَلَى كُلِّ نَقْبٍ مِنْهَا مَلَائِكَةَ يَحْرِسُوْنَهَا. “قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم – وَطَعَنَ بِمِخْصَرَتِهِ فِي الْمِنْبَرِ- ” هَذِهِ طَيْبَةُ هَذِهِ طَيْبَةُ هَذِهِ طَيْبَةُ”. يَعْنِي الْمَدِيْنَةَ” أَلَا هَلْ كُنْتُ حَدَّثْتُكُمْ؟ “فَقَالَ النَّاسُ: نَعَمْ فَإِنَّهُ أَعْجَبَنِيْ حَدِيْثُ تَمِيْمٍ أَنَّهُ وَافَقَ الَّذِيْ كُنْتُ أُحَدِّثُكُمْ عَنْهُ وَعَنِ الْمَدِيْنَةِ وَمَكَّةَ. أَلَا إِنَّهُ فِي بَحْرِ الشَّأمِ أَوْ بَحْرِ الْيَمَنِ لَا بَلْ مِنْ قِبَلِ الْمَشْرِقِ مَاهُوَ مِنْ قِبَلِ الْمَشْرِقِ مَاهُوَ مِنْ قِبَلِ الْمَشْرِقِ مَاهُوَ” وَأَوْمَأَ بِيَدِهِ إِلى الْمَشْرِقِ. رَوَاهُ مُسْلِمٌ.

5482. (19) [3/1511దృఢం]

ఫాతిమహ్ బిన్‌తె ఖైస్‌ (ర) కథనం: ఒక వ్యక్తి, ”నమా’జుకు రండి,” అని ప్రకటించడం నేను విన్నాను. అందరూ వచ్చారు. నేను కూడా మస్జిద్‌లోనికి ప్రవేశించాను, స్త్రీల పంక్తిలో చేరాను, నమా’జు చదివాను. నమా’జు ముగిసిన తర్వాత ప్రవక్త (స) నవ్వుతూ మెంబరుపై ఎక్కారు. ప్రజల నుద్దేశించి, ‘ప్రతి వ్యక్తి తన చోట్లో కూర్చోండి. ఎవ్వరూ లేచి వెళ్ళకండి,’ అని అన్నారు. ఆ తరువాత మళ్ళీ, ‘నేను మిమ్మల్ని ఎందుకు కూర్చోమన్నానో తెలుసా?’ అని అడిగారు. దానికి ప్రజలు, ‘అల్లాహ్‌కూ ఆయన ప్రవక్తకే బాగా తెలుసు,’ అని అన్నారు. అప్పుడు ప్రవక్త (స), ‘మీకేదైనా ఇవ్వటానికి లేదా ఏదైనా శుభవార్త తెలియపరచటానికి ఉండమనలేదు.

”తమీమ్‌ దారీ అనే వ్యక్తి ఉండేవాడు. నా వద్దకు వచ్చి ఇస్లామ్‌ స్వీకరించాడు. ఇంకా నాకు ఎలాంటి విషయం తెలిపాడంటే అది నేను మీకు దజ్జాల్‌ గురించి తెలియపరిచినట్లుంది. తమీమ్‌ దారీ ఇలా అన్నాడు, ”బనీ ల’ఖ్‌మ్‌ మరియు బనీ జు’జామ్‌ తెగలకు చెందిన 30 మందివెంట నేను నావలో కూర్చున్నాను. ఆ నౌక నెలరోజుల వరకు సముద్రంలో తిరుగుతూ ఉంది. నెల రోజుల తర్వాత ఒక ద్వీపాన్ని చేరుకున్నాము. మేము చిన్నపడవల్లో కూర్చొని ఆ ద్వీపంలోనికి చేరుకున్నాము. ఆ ద్వీపంలో ఒక వింత జంతువు కలిసింది. దాని శరీరమంతా వెంట్రుకలతో కప్పబడి ఉంది. ముందూ వెనుకా ఏమీ కనబడటం లేదు. దాని తోక కూడా చాలా పొడవుగా ఉంది. ప్రజలు దాన్ని, ‘నీ వెవరవు,’ అని అడిగారు. అది, ‘నేను గూఢచారిని,’ అని సమాధానం ఇచ్చింది. దానికి ప్రజలు, ‘అంటే ఏమిటి,’ అని అన్నారు. అప్పుడది, ‘మీరు ముందుకు వెళ్ళండి, అక్కడ ఒక భవనం కనబడుతుంది. అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. అతడు అంతా చెబుతాడు. అతడికి మీవార్తలు వినాలనే కుతూహలం ఉంది,’ అని చెప్పింది. మేమందరం అక్కడికి వెళ్ళాము. చాలా పొడవైన మనిషిని చూసాము. గొలుసులతో బంధించబడి ఉన్నాడు. చేతులకు కాళ్ళకూ గొలుసులు పడి ఉన్నాయి. కదలలేని స్థితిలో ఉన్నాడు. ప్రజలు అతన్ని ‘నీవెవరవు,’ అని అడిగారు. దానికి ఆ వ్యక్తి, ‘మీరు నన్ను చేరుకోగలిగారా? నా గురించి పరిశీలించడంలో మీరు విజయులయ్యారా? ఇప్పుడు మీరెవరో? ఎక్కడినుండి వచ్చారో చెప్పండి,’ అని అన్నాడు. అప్పుడు ప్రజలు, ‘మేము అరబ్బులం, నౌకలో నెలరోజుల వరకు ప్రయాణం చేసి ఒక ద్వీపానికి చేరుకున్నాము. అక్కడి నుండి చిన్నపడవల ద్వారా ద్వీపం లోనికి  వచ్చాం.

అక్కడ ఒక వింత జంతువు కనబడింది. మేము, ‘నీవెవరవు,’ అని అడిగాము. దానికి అది, ‘నేను గూఢాచారిని,’ అని చెప్పింది. ‘దాని అర్థం ఏమిటని’ అడిగాము. దానికది ‘అటు వెళ్ళండి మీకంతా తెలుస్తుందని అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడని మీ గురించి వేచి ఉన్నాడని, మిమ్మల్ని కలవాలని కోరికతో ఉన్నాడని చెప్పింది. మేము నీ దగ్గరకు వచ్చాము,’ అని అన్నారు. అప్పుడు ఆ పొడవైన వ్యక్తి, బియాన్‌ ప్రాంతంలో ఖర్జూరాలు పండుతున్నాయా?’ అని అడిగాడు. దానికి మేము, ‘అవును ఖర్జూరాల చెట్టుకు చాలా పళ్ళు కాస్తున్నాయి,’ అని అన్నాం. అప్పుడా వ్యక్తి, ‘భవిష్యత్తులో ఆ చెట్లకు పళ్ళు కాయవు, కరువు కాటకాలు ఏర్పడుతాయి,’అని అన్నాడు. ఆ తరువాత ఆ వ్యక్తి, తబ్‌రియహ్ సముద్రంలో నీళ్ళు ఉన్నాయా’ అని అడిగాడు. మేము, ‘అది నీళ్ళతో నిండి ఉంది,’ అని అన్నాము. అప్పుడా వ్యక్తి, ‘భవిష్యత్తులో నీరంతా ఎండి పోతుంది,’ అని అన్నాడు. ఇంకా నాకు జ’అజ్‌ కాలువ గురించి చెప్పండి,’ అని అన్నాడు. ప్రజలు, ‘ఏమిటి?’ అని అన్నారు. అప్పుడావ్యక్తి, ‘దాని నుండి రైతులు తమ పొలాలకు నీరు తోడుతున్నారా లేదా?’ అని అన్నాడు. మేము అందులో చాలా నీరుంది. ప్రజలు దానిద్వారా లాభం పొందుతున్నారు,’ అని అన్నాం. అప్పుడా వ్యక్తి, ‘బెత్తంతో కొట్టి, ‘ఇదే తయ్యిబహ్, ఇదే తయ్యిబహ్, ఇదే తయ్యిబహ్,’ అని అన్నాడు. అప్పుడు ప్రవక్త (స) దజ్జాల్‌ గురించి, ‘ముందే నేను మీకు తెలియజేసానా లేదా?’ అని అడిగారు. అనుచరులు, ‘మిగతాదంతా తమరు మాకు తెలియ పరిచి ఉన్నారు.’ అప్పుడు ప్రవక్త (స), ‘నాకు తమీమ్‌ దారీ మాటలు ఎందుకు నచ్చాయంటే నేను మీకు ముందు వివరించినట్లుగానే అవి ఉన్నాయి.’ ఆ తరువాత ప్రవక్త (స) తన చేతితో సైగ చేస్తూ దజ్జాల్‌ తూర్పు దిక్కునుండి బహిర్గతమవుతాడు,’ అని అన్నారు. [39] (ముస్లిమ్‌)

5483 – [ 20] ( متفق عليه ) (3/1513)

وَعَنْ عَبْدِ اللهِ بْنِ عُمَرَ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم قَالَ: “رَأَيْتُنِي اللَّيْلَةَ عِنْدَ الْكَعْبَةِ فرَأَيْتُ رَجُلًا آدَمَ كَأَحْسَنِ مَا أَنْتَ رَاءٍ مِنْ أَدَمِ الرِّجَالِ لَهُ لِمَّةٌ كَأَحْسَنِ مَا أَنْتَ رَاءٍ مِنَ اللِّمَمِ قَدْ رَجلَهَا فَهِيْ تُقْطِرُ مَاءً مُتَّكِأً عَلَى عَوَاتِقَ رَجُلَيْنِ يَطُوْفُ بِالْبَيْتِ فَسَأَلْتُ: مَنْ هَذَا؟ فَقَالُوْا: هَذَا الْمَسِيْحُ بْنُ مَرْيَمَ”.  قَالَ: “ثُمَّ إِذَا أَنَا بِرَجُلٍ جَعْدٍ قَطِطٍ أَعْوَرِ الْعَيْنِ الْيُمْنَى كَأَنَّ عَيْنَةُ عِنَبَةٌ طَافِيَةٌ كَأَشْبَهِ مَنْ رَأَيْتُ مِنَ النَّاسِ بِابْنِ قَطَنٍ وَاضِعًا يَدَيْهِ عَلَى مَنْكِبَيْ رَجُلَيْنِ يَطُوْفُ بِالْبَيْتِ فَسَأَلْتُ مَنْ هَذَا؟ فَقَالُوْا: هَذَا الْمَسِيْحُ الدَّجَّالِ”. مُتَّفَقٌ عَلَيْهِ.

وَفِيْ رِوَايَةٍ: قَالَ فِي الدَّجَّالِ: “رَجُلٌ أَحْمَرُ جَسِيْمٌ جَعْدُ الرَّأْسِ أَعْوَرُ عَيْنِ الْيُمْنَى أَقْرَبُ النَّاسِ بِهِ شَبَهَا اِبْنُ قَطَنٍ”. وَذُكِر حَدِيْثُ أَبِيْ هُرَيْرَةَ: “لَا تَقُوْمُ السَّاعَةُ حَتّى تَطْلُعَ الشَّمْسَ مِنْ مَغْرِبِهَا” فِيْ “بَابِ الْمَلَاحِمِ” وَسَنَذْكُرُ حَدِيْثَ ابْنِ عُمَرَ: قَامَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم فِي النَّاسِ فِيْ “بَابِ قِصَّةِ ابْنِ الصَيَّادٍ” إِنْ شَاءَ اللهُ تَعَالى .

5483. (20) [3/1513 ఏకీభవితం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘ఉమర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ఆ వ్యక్తి ‘భవిష్యత్తులో ఆ కోనేరు నీరు ఎండి పోతుందని’ అన్నాడు. ఆ తరువాత ‘మీరు అరబ్బులా, అరబ్‌లో ఒక నిరక్షరాసి ప్రవక్తవస్తాడు. అతడు వచ్చాడా?’ అని అడిగాడు. మేము, ‘ఆ ప్రవక్త వచ్చాడు, మక్కహ్లో జన్మించాడు, అతను తాను ప్రవక్తనని చెప్పాడు. అక్కడి ప్రజలు శత్రువులై పోయారు. అతను మదీనహ్ వలస పోయాడు,’ అని అన్నాం. ‘అతను అరబ్బులతో యుద్ధం చేస్తూ ఉంటాడా,’ అని అడిగాడు. మేము, ‘అవును అరబ్బులతో యుద్ధం చేస్తూ ఉంటాడు,’ అని అన్నాం. మళ్ళీ ‘అతడు మీ పట్ల అతను ఎలా ప్రవర్తిస్తున్నాడు,’ అని అడి గాడు. మేము అంతా వినిపించాం, ‘ఇంకా తన శత్రువులైన బంధువులపై విజయం సాధించాడు, ఇంకా వారిపై ఆధిక్యత కూడా పొందాడు, అనేక యుద్ధాలలో విజయం సాధించాడు, రోజు రోజుకు అతన్ని అనుసరించే వారు అధికం అవుతున్నారు, చాలామంది అతన్ని అనుస రిస్తున్నారు’ అని అన్నాం. ఆ వ్యక్తి, ‘ఇదే వారికి మంచిది, ఇప్పుడు నేను నా గురించి మీకు తెలియ పరుస్తాను’ అని పలికి, ‘నేను మసీహ్‌ దజ్జాల్‌ ను. ఇక్కడ బంధించబడి ఉన్నాను. భవిష్యత్తులో నన్ను విడుదల చేయడం జరుగుతుంది. ప్రపంచమంతా తిరుగుతాను. కాని మక్కహ్ ముకర్రమహ్, మదీనహ్లలో నేను ప్రవేశించలేను. ఈ రెంటిలో నేను ప్రవేశించడం నా కోసం నిషేధించబడింది. నేను ఈ రెంటిలో ప్రవేశించటానికి ప్రయత్నిస్తే, అక్కడి కాపలా దైవదూతలు కరవాలాలతో నన్ను వెంబడిస్తారు.’ ఇలా పలికి ప్రవక్త (స) తన మెంబరుపై, ‘రాత్రి బైతు ల్లాహ్‌ వద్ద కలలో ఒక వ్యక్తిని చూసానని, అతడు ఎర్రగా ఉన్నాడని, చాలా అందంగా ఉన్నాడని, అతని తల వెంట్రుకలు పొడుగ్గా చాలా అందంగా ఉన్నాయి. తల దువ్వుకొని ఉన్నాడు. తల నుండి నీటి చుక్కలు కారుతున్నాయి. ఆ వ్యక్తి ఇద్దరు వ్యక్తుల భుజాలపై చేతులుపెట్టి బైతుల్లాహ్‌ తవాఫ్‌ చేస్తున్నాడు. ‘ఇతనెవరని’ నేను ప్రజలను అడిగాను. దానికి ప్రజలు ‘అతడు ఈసా ఇబ్నె మర్యమ్‌,’ అని అన్నారు. ఆ తరువాత నేను మరోవ్యక్తిని చూసాను. అతడు ఉంగరాల జుట్టు కలిగి ఉన్నాడు. ఇంకా అతడి కుడికన్ను మూసుకొని ఉంది. అతని కన్ను ఉబ్బి ఉంది. అతడు ఇబ్నె ఖుత్‌న్‌ లా ఉన్నాడు. ‘ఈ వ్యక్తి ఇద్దరు వ్యక్తుల సహాయంతో బైతుల్లాహ్‌ ప్రదక్షిణ చేస్తు న్నాడు. ఇతనెవరని’ నేనడిగాను. ప్రజలు ‘ఇతను మసీహ్‌ దజ్జాల్‌,’ అని చెప్పారు. (బు’ఖారీ, ముస్లిమ్‌)

మరో ఉల్లేఖనంలో దజ్జాల్‌ ఎర్రటి కన్ను కలిగి ఉంటాడు, అతడు ఉంగరాల జుట్టు కలిగి ఉంటాడు, కుడికన్ను గ్రుడ్డిగా ఉంటుంది, ఇంకా ఇబ్నె ఖుతున్‌ లా ఉంటాడు,’ అని ఉంది.

—–

اَلْفَصْلُ الثَّانِيْ  రెండవ విభాగం 

5484 – [ 21 ] ( صحيح ) (3/1514)

عَنْ فَاطِمَةَ بِنْتِ قَيْسٍ فِيْ حَدِيْثِ تَمِيْمٍ الدَّارِيِّ: قَالَتْ: قَالَ: فَإِذَا أَنَابِامْرَأَةٍ تَجُرُّ شَعْرَهَا. قَالَ: مَا أَنْتَ؟ قَالَتْ: أَنَا الْجَسَّاسَةُ اذْهَبْ إِلى ذَلِكَ الْقَصْرِ فَأَتَيْتُهُ فَإِذَارَجُلٌ يَجُرُّشَعْرَهُ مُسَلْسَلٌ فِي الْأَغْلَالِ يَنْزُوْفِيْمَا بَيْنَ السَّمَاءِ وَالْأَرْضِ. فَقُلْتُ: مَنْ أَنْتَ؟ قَالَ: أنَا الدَّجَّالُ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ.

5484. (21) [3/1514దృఢం]

ఫాతిమహ్ బిన్‌తె ఖైస్‌ (ర) తమీమ్‌ దారీ ‘హదీసు’ గురించి ప్రస్తావిస్తూ ఇలా అన్నారు: ”తమీమ్‌ దారీ (ర) కథనం: ఆ ద్వీపంలో ప్రవేశించి, నేను ఒక స్త్రీని చూసాను. ఆమె తన తలవెంట్రుకలను ఈడ్చుకుంటూ పోతుంది. తమీమ్‌ దారీ, ‘నీవెవరవు?’ అని అడిగారు. దానికి ఆ స్త్రీ, ‘నేను గూఢచారిని, నువ్వు ఆ భవనంలోనికి వెళ్ళు,’ అని చెప్పింది. నేను ఆ భవనంలోనికి వెళ్ళాను. అక్కడ ఒక వ్యక్తిని చూసాను. అతడు తన జుట్టును ఈడ్చుకుంటూ వెళుతున్నాడు. గొలుసులతో బంధించబడి ఉన్నాడు. బేడీలు పడి ఉన్నాయి. అతడు భూమ్యా కాశాల మధ్య గెంతుతూ ఉన్నాడు. ‘నీవెవరవు,’ అని అడిగాను. దానికి ఆ వ్యక్తి, ‘నేను దజ్జాల్‌ను,’ అని అన్నాడు. (అబూ దావూద్‌)

5485 – [ 22 ] ( صحيح ) (3/1514)

وعَنْ عُبَادَةَ بْنِ الصَّامِتِ عَنْ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم قَالَ: “إِنِّيْ حَدَّثْتُكُمْ عَنِ الدَّجَّالِ حَتّى خَشِيْتُ أَنْ لَا تَعْقِلُوْا. إِنَّ الْمَسِيْحَ الدَّجَّالَ قَصِيْرٌ أَفْحَجُ جَعْدٌ أَعْوَرُ مَطْمُوْسُ الْعَيْنِ لَيْسَتْ بِنَاتِئَةٍ وَلَا حَجْرَاءَ فَإِنْ أُلْبِسَ عَلَيْكُمْ فَاعْلَمُوْا أَنَّ رَبَّكُمْ لَيْسَ بِأَعْوَرَ.” رَوَاهُ أَبُوْ دَاوُدَ.

5485. (22) [3/1514–  దృఢం]

‘ఉబాదహ్‌ బిన్‌ ‘సామిత్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”నేను దజ్జాల్‌ గురించి అనేకసార్లు ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే, దాన్ని మీరు మరచిపోకూడదని, దాని వాస్తవం గురించి ఏమరుపాటుకు గురికా కూడదని. మీరు గుర్తుంచుకోవలసిన విషయాలు ఏమిటంటే, మసీహ్‌ దజ్జాల్‌ పొట్టిగా ఉంటాడు. అతడి కాళ్ళు నడుస్తున్నప్పుడు దగ్గరగా ఉంటాయి. చీలమండలు దూరంగా ఉంటాయి. ఉంగరాల జుట్టు, ఒక కన్ను ఉండదు. మరో కన్ను సరిగ్గా ఉంటుంది. అయితే మీ ప్రభూ గ్రుడ్డివాడు కాదనే విషయాన్ని బాగా గుర్తుంచుకోండి.” (అబూ  దావూద్‌)

5486 – [ 23 ] ( لم تتم دراسته ) (3/1515)

وَعَنْ أَبِيْ عُبَيْدَةَ بْنِ الْجَرَّاحِ قَالَ: سَمِعْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ: “إِنَّهُ لَمْ يَكُنْ نَبِيٌّ بَعْدَ نُوْحٍ إِلَّا قَدْ أَنْذَرَالدَّجَّالَ قَوْمَهُ وَإِنِّي أُنْذِرُكُمُوْهُ”. فَرَصَفَهُ لَنَا قَالَ: “لَعَلَّهُ سَيُدْرِكُهُ بَعْضُ مَنْ رَآنِيْ أَوْ سَمِعَ كَلَامِيْ”. قَالُوْا: يَا رَسُوْلَ اللهِ فَكَيْفَ قُلُوْبُنَا يَوْمَئِذٍ؟ قَالَ: “مِثْلُهَا “يَعْنِي الْيَوْمَ” أَوْخَيْرٌ”.  رَوَاهُ التِّرْمِذِيُّ وأَبُوْ دَاوُدَ .

5486. (23) [3/151అపరిశోధితం]

అబూ ‘ఉబైదహ్‌ బిన్‌ జర్రా’హ్‌ (ర) కథనం: నేను ప్రవక్త (స)ను ఇలా ప్రవచిస్తూ ఉండగా విన్నాను, ”నూహ్‌ (అ) తరువాత వచ్చిన ప్రతి ప్రవక్త తన అనుచర సమాజాన్ని దజ్జాల్‌ గురించి హెచ్చ రించారు. నేను కూడా వాడి గురించి హెచ్చరిస్తున్నాను. ఇంకా వాడి వాస్తవాన్ని గురించి తెలుపుతున్నాను. ఆ తరువాత ప్రవక్త (స) దజ్జాల్‌ గురించి వివరించారు. ఇంకా ఇలా అన్నారు, ‘నా మాటలు విన్నా లేదా నన్ను చూసినవారిలో ఎవరైనా వాడిని చూస్తే,’ అని అంటే — అనుచరులు, ‘ఓ ప్రవక్తా! ఆ రోజుల్లో మా హృదయాలు ఎలా ఉంటాయి,’ అని అడిగారు. దానికి ప్రవక్త (స), ‘ఈ కాలంలో ఉన్నట్టు లేదా ఇంతకంటే మంచిగా’ అని అన్నారు. (తిర్మిజి’, అబూ దావూద్‌)

5487 – [ 24 ] ( لم تتم دراسته ) (3/1515)

وعَنْ عَمْرِو بْنِ حُرَيْثٍ عَنْ أَبِيْ بَكْرِ الصِّدِّيْقِ قَالَ: حَدَّثَنَا رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم قَالَ: “اَلدَّجَّالُ يَخْرُجُ مِنْ أَرْضِ بِالْمَشْرِقِ يُقَالُ لَهَا: خُرَاسَانُ يَتْبَعُهُ أَقْوَامٌ كَأَنَّ وُجُوْهَهُمُ الْمَجَانُ الْمُطْرَقَةُ”. رَوَاهُ التِّرْمِذِيُّ.

5487. (24) [3/1515–  అపరిశోధితం]

‘అమ్ర్‌ బిన్‌ ‘హురైస్‌’ (ర) అబూ బక్‌ర్‌ (ర) ద్వారా కథనం: ప్రవక్త (స) మాతో ఇలా అన్నారు, ”దజ్జాల్‌ తూర్పు దిక్కు నుండి బహిర్గతం అవుతాడు. వాడి పేరు ఖురాసాన్‌ ఉంటుంది. అనేక జాతులు దజ్జాల్‌కు విధేయత చూపుతాయి. వారి ముఖాలు వెడల్పుగా ఢాలులా  ఉంటాయి.” (తిర్మిజి’)

5488 – [ 25 ] ( صحيح ) (3/1515)

وعَنْ عِمْرَانَ بْنِ حُصَيْنٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَنْ سَمِعَ بِالدَّجَّالِ فَلْيَنَأْ مِنْهُ فَوَ اللهِ إِنَّ الرَّجُلَ لَيَأْتِيْهِ وَهُوَ يَحْسَبُ أَنَّهُ مُؤْمِنٌ فَيَتْبَعُهُ مِمَّا يُبْعَثُ بِهِ مِنَ الشُّبُهَاتِ” . رَوَاهُ أَبُوْ دَاوُدَ.

5488. (25) [3/1515దృఢం]

‘ఇమ్రాన్‌ బిన్‌ ‘హు’సైన్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం: ”దజ్జాల్‌ బహిర్గతం అయ్యాడని విన్న వ్యక్తి వాడికి దూరంగా ఉండాలి. అల్లాహ్ సాక్షి! ఒక విశ్వాసి దజ్జాల్‌ వద్దకు వచ్చి, వాడికి విధేయత చూపుతాడు. ఎందుకంటే పరీక్షించే నిమిత్తం. దజ్జాల్‌కు ఎటువంటి వస్తువులు ఇవ్వబడ్డాయంటే దానివల్ల మనిషి, అను మానానికి గురవుతాడు. మోసానికి గురవుతాడు.”  (అబూ దావూద్‌)

5489 – [ 26 ] ( لم تتم دراسته ) (3/1515)

وَعَنْ أَسْمَاءَ بِنْتِ يَزِيْدَ بْنِ السّكَنِ قَالَتْ: قَالَ النَّبِيُّ صلى الله عليه وسلم: “يَمْكُثُ الدَّجَّالُ فِي الْأَرْضِ أَرْبَعِيْنَ سَنَةً السَّنَةُ كَالشَّهْرِ وَالشَّهْرُ كَالْجُمُعَةِ وَالْجُمُعَةِ كَالْيَوْمِ وَالْيَوْمُ كَاضْطِرَامِ السّعَفَةِ فِي النِّارِ”. رَوَاهُ فِي “شَرْحِ السُّنَّةِ”.

5489. (26) [3/1515–  అపరిశోధితం]

అస్మా బిన్‌తె య’జీద్‌ బిన్‌ సకన్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”దజ్జాల్‌ 40 సంవత్సరాల వరకు భూమి పై ఆధిక్యతలో ఉంటాడు. వాడి ఒక సంవత్సరం ఒక నెలకు సమానంగా ఉంటుంది, ఒక నెల ఒక వారంలా ఉంటుంది, ఒక వారం ఒక రోజులా ఉంటుంది, ఒక రోజు ఎండి పోయిన ఖర్జూరం కొమ్మ కాలినంత సేపుకు సమానంగా ఉంటుంది.” [40]  (షర్‌’హుస్సున్నహ్‌)

5490 – [ 27 ] ( ضعيف ) (3/1515)

وعَنْ أَبِيْ سَعِيْدِ الْخُدْرِيِّ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “يَتَّبِعُ الدَّجَّالَ مِنْ أُمَتِّيْ سَبْعُوْنَ أَلْفًا عَلَيْهِم السِّيْجَانُ”. رَوَاهُ فِيْ “شَرْحِ السُّنَّةِ”.

5490. (27) [3/1515 బలహీనం]

అబూ స’యీద్‌ ‘ఖుద్రీ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”నా అనుచర సమాజానికి చెందిన 70 వేల మంది తలలపై ఆకుపచ్చనిదుప్పట్లు ఉంటాయి. వారు దజ్జాల్‌ను అనుసరిస్తారు.” [41] (షర్‌’హుస్సున్నహ్‌)

5491 – [ 28 ] ( ضعيف ) (3/1516)

وَعَنْ أَسْمَاءَ بِنْتِ يَزِيْدَ قَالَتْ: كَانَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم فِيْ بَيْتِيْ فَذَكَرَ الدَّجَّالَ فَقَالَ: “إِنَّ بَيْنَ يَدَيْهِ ثَلَاثَ سِنِيْنَ سَنَةٌ تُمْسِكُ السَّمَاءُ فِيْهَا ثُلُثَ قَطْرِهَا وَالْأَرْضُ ثُلُثَ نَبَاتِهَا. وَالثَّانِيَةُ تُمْسِكُ السَّمَاءُ ثُلُثَيْ قَطْرِهَا وَالْأَرْضُ ثُلُثَيْ نَبَاتِهَا. وَالثَّالِثَةُ تُمْسِكُ السَّمَاءُ قَطْرَهَا كُلَّهُ وَالْأَرْضُ نَبَاتَهَا كُلَّهُ. فَلَا يَبْقَى ذَاتُ ظِلْفٍ وَلَاذَاتُ ضِرْسٍ مِنَ الْبَهَائِمِ إِلَّا هَلَكَ وَإِنَّ مِنْ شَدِّ فِتْنَتِهِ أَنَّهُ يَأْتِي الْأَعْرَابِيَّ فَيَقُوْلُ: أَرَأَيْتَ إِنْ أَحْيَيْتُ لَكَ إِبْلَكَ أَلَسْتَ تَعْلَمُ أَنَّيْ رَبُّكَ؟ فَيَقُوْلُ بَلَى فَيُمَثِّلُ لَهُ الشَّيَاطِيْنَ نَحْوَ إِبْلِهِ كَأَحْسَنِ مَا يَكُوْنُ ضرُوْعًا وَأَعْظَمِهِ أَسْنِمَةً”. قَالَ: “وَيَأْتِي الرَّجُلَ قَدْ مَاتَ أَخُوْهُ وَمَاتَ أَبُوْهُ فَيَقُوْلُ: أَرَأَيْتَ إِنْ أَحْيَيْتُ لَكَ أَبَاكَ وَأَخَاكَ أَلَسْتَ تَعْلَمُ أَنِّيْ رَبُّكَ؟ فَيَقُوْلُ: بَلَى فَيُمَثِّلُ لَهُ الشَّيَاطِيْنَ نَحْوَ أَبِيْهِ وَنَحْوَأَخِيْهِ”. قَالَتْ: ثُمَّ خَرَجَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم لِحَاجَتِهِ ثُمَّ رَجَعَ وَالْقَوْمُ فِي اهْتِمَامِ وَغَمٍّ مِمَّا حَدَّثَهُمْ. قَالَتْ: فَأَخَذَ بِلَحْمَتَيِ الْبَابِ فَقَالَ: “مَهْيَمَ أَسْمَاءُ؟” قُلْتُ: يَا رَسُوْلَ اللهِ لَقَدْ خَلَعْتَ أَفْئِدَتَنَا بِذِكْرِ الدَّجَّالِ. قَالَ: “إِنْ يَخْرُجْ وَأَنَا حَيٌّ فَأَنَا حَجِيْجُهُ وَإِلَّا فَإِنَّ رَبِّيْ خَلِيْفَتِيْ عَلى كُلِّ مُؤْمِنٍ”. فَقُلْتُ: يَا رَسُوْلَ اللهِ وَاللهِ إِنَّا لَنَعْجِنُ عَجِيْنَنَا فَمَا نَخْبِزُهُ حَتّى نَجُوْعَ فَكَيْفَ بِالْمُؤْمِنِيْنَ يَوْمَئِذٍ؟قَالَ: “يُجْزِئُهُمْ مَا يُجْزِئُ أَهْلَ السَّمَاءِ مِنَ التَّسْبِيْحِ وَالتَّقْدِيْسِ”. رَوَاهُ أَحْمَدُ.

5491. (28) [3/1516 బలహీనం]

అస్మా బిన్‌తె య’జీద్‌ (ర) కథనం: ప్రవక్త (స) మా ఇంటికి విచ్చేసారు. ఆయన దజ్జాల్‌ గురించి ప్రస్తావించారు. దజ్జాల్‌ బహిర్గతం కావటానికి ముందు మూడు సంవత్సరాలు ఎలా ఉంటాయంటే వాటిలోని ఒక సంవత్సరం ఆకాశం 1/3వ వంతు వర్షాన్ని, భూమి 1/3వ వంతు పంటలను ఆపివేస్తాయి. రెండవ సంవత్సరం కూడా ఆకాశం 1/3వ వంతు వర్షాన్ని, 1/3వ వంతు పంటలను భూమి ఆపివేస్తాయి. మూడవ సంవత్సరం కూడా ఆకాశం వర్షాన్ని, పంటలను భూమి ఆపివేస్తాయి. తీవ్రమైన కరువు కాటకాలు ఏర్పడతాయి. అప్పుడు పశువులన్నీ, మనుషులు కూడా మరణిస్తారు. దజ్జాల్‌ తీవ్రమైన ఉపద్రవం ఎలా ఉంటుందంటే వాడు బుద్ధిహీనుల వద్దకు వెళ్ళి, ‘ఒక వేళ నేను చనిపోయిన నీ ఒంటెలన్నింటినీ మళ్ళీ బ్రతికిస్తే మీరు నన్ను దైవంగా భావిస్తారా?’ అని అంటాడు. ఆ బుద్ధిహీనులు నిలబెడతారు. ఇంకా ఒంటెల సిరాలు పాలతో నిండి ఉంటాయి. ఇంకా ఒంటెల మూపురాలు చాలా దృఢంగా కనబడతాయి. వారి ఒంటెల వీపులకన్నా అవి పెద్దవిగా కనబడ తాయి. అనంతరం దజ్జాల్‌ మరో వ్యక్తి వద్దకు వెళతాడు. అతని తండ్రి, సోదరుడు, మొదలైన వారు మరణించి ఉంటారు. దజ్జాల్‌ ఆ వ్యక్తితో, ‘నీ తండ్రిని, సోదరుణ్ని బ్రతికించి చూపిస్తాను. నన్ను దైవంగా భావిస్తావా?’ అని అంటాడు. దానికి ఆ వ్యక్తి ‘అవును’ అంటాడు. దజ్జాల్‌ షైతానులను అతని తండ్రి సోదరుల రూపాల్లోనికి తెచ్చి ‘ఇతడు మీ దైవం’ అని ఇతన్ని దైవంగా భావించమని’ అంటారు. అతడు విశ్వసిస్తాడు.

అస్మా బిన్‌తె య’జీద్‌ కథనం: ఇది చెప్పిన తర్వాత ప్రవక్త (స) బయటకు వెళ్ళారు. మళ్ళీ తొందరగా తిరిగి లోపలికి వచ్చారు. అనుచరులు మసీ’హ్‌ దజ్జాల్‌ గురించి విని ఆందోళనకరమైన స్థితిలో కూర్చొని ఉన్నారు. ప్రవక్త (స) ద్వారం రెండు రెక్కలను పట్టుకొని ‘అస్మా ఏంటి సంగతి? ఎందుకు ఆందోళనకరంగా ఉన్నావు?’ అని అన్నారు. దానికి నేను, ‘ఓ ప్రవక్తా! తమరు దజ్జాల్‌ గురించి చెప్పి మమ్మల్ని చాలా భయానికి గురిచేసారు. అందువల్ల మేమందరం ఆందోళనకు గురయ్యాము,’ అని అంటారు. అప్పుడు ప్రవక్త (స), ‘ఒకవేళ ఆ దజ్జాల్‌ నా జీవితంలో వస్తే వాడిని దూరంచేస్తాను. అంటే వాడిని ఓడిస్తాను. ఒకవేళ నా జీవితంలో రాకుండా తరువాత వస్తే అల్లాహ్‌ ప్రతి ముస్లిమ్‌కు సంరక్షకుడిగా ఉంటాడు’ అని అన్నారు. అప్పుడు నేను ఇలా విన్నవించుకున్నాను. ‘ఓ ప్రవక్తా! మేము పిండి కలుపుతాము. ఇంకా వండుతుండగా మాకు ఆకలి వేస్తుంది. మరి ఆ కరువు కాటకాల్లో విశ్వాసుల పరిస్థితి ఎలా ఉంటుందో అంటే ఎక్కడ నుండి తింటారు’ అని విన్నవించుకున్నారు. అప్పుడు ప్రవక్త (స) వారి ఆకలిని తీర్చటానికి ఆకాశవాసులకు సరిపోయేది. వాళ్ళకూ సరిపోతుంది. అంటే దైవస్తోత్రం, దైవస్మరణ ఇదే దైవదూతల ఆహారం’ అని అన్నారు. (అ’హ్మద్‌, అబూ దావూద్‌)

—–

اَلْفَصْلُ الثَّالِثُ  మూడవ విభాగం   

5492 – [ 29 ] ( متفق عليه ) (3/1517)

عَنِ الْمُغَيْرَةَ بْنِ شُعْبَةَ قَالَ: مَا سَأَلَ أَحَدٌ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم عَنِ الدَّجَّالِ أَكْثَرَ مِمَّا سَأَلْتُهُ وَإِنَّهُ قَالَ لِيْ: “مَا يَضُرُّكَ؟” قُلْتُ: إِنَّهُمْ يَقُوْلُوْنَ: إِنَّ مَعَهُ جَبَلُ خُبْزٍ وَنَهْرُ مَاءٍ. قَالَ: هُوَ أَهْوَنُ عَلَى اللهِ مِنْ ذَلِكَ”.

5492. (29) [3/1517 ఏకీభవితం]

ము’గీరహ్ బిన్‌ షూబహ్ (ర) కథనం: దజ్జాల్‌ గురించి నేను అడిగినంత మరెవరూ అడగలేదు. ప్రవక్త (స) ఒకసారి నాతో, ”నువ్వు దజ్జాల్‌కు భయపడకు. వాడు దైవాజ్ఞలేనిదే నీకు ఏమీ నష్టం కలిగించలేడు,” అని అన్నారు. దానికి నేను,’ఓ ప్రవక్తా! వాడివద్ద రొట్టెల కొండ ఉంటుందని ప్రజలు చెబుతున్నారు. అంటే చాలా రొట్టెలు ఉంటాయి, నీటి కోనేరు కూడా ఉంటుంది,’ అని అన్నాను. ప్రవక్త (స), ‘వాడు అల్లాహ్‌ దృష్టిలో అంత కంటే నీచుడు అంటే, వాడు చూపించింది కనికట్టు, మంత్రజాలం ఉంటుంది. అందులో ఏ మాత్రం వాస్తవం ఉండదు. వాడివద్ద రొట్టెల కొండా ఉండదు, నీటి కోనేరు ఉండదు. అంత ఎందుకు వాడు దైవాజ్ఞ లేనిదే వాడు ఎవ్వరినీ మార్గ భ్రష్టత్వానికి  గురిచేయలేడు కూడా’ అని  అన్నారు.  (బు’ఖారీ, ముస్లిమ్‌)

5493 – [ 30 ] ( لم تتم دراسته ) (3/1517)

وعَنْ أَبِيْ هُرَيْرَةَ عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ: “يَخْرُجُ الدَّجَّالُ عَلَى حِمَارٍ أَقْمَرَ مَا بَيْنَ أُذُنَيْهِ سَبْعُوْنَ بَاعًا”. رَوَاهُ الْبَيْهَقِيُّ فِيْ “كِتَابِ الْبَعْثِ وَالنُّشُوْرِ”.

5493. (30) [3/1517అపరిశోధితం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”దజ్జాల్‌ ఒక తెల్లటి గాడిదపై కూర్చొని బహిర్గతం అవుతాడు. వాడిరెండుచెవుల మధ్యదూరం 70 బా అల వెడల్పు ఉంటుంది. అంటే ఒక బాఅ గజాలు ఉంటుంది.” (బైహఖీ-అల్ బ’అస్ వన్నుషూర్)

=====

4 – بَابُ قِصِّةِ ابْنِ الصَيَّادٍ

4. ఇబ్నె సయ్యాద్‌  గా

అతని పేరు సాఫ్‌. అతని తండ్రి పేరు య్యాద్‌. అతడు యూదుడు. మదీనహ్లో జన్మించాడు. చిన్నప్పటి నుండే దగా మోసగాడు. దజ్జాల్‌కు చెందిన అనేక గుణాలు అతనిలో ఉండేవి. అందువల్ల కొందరు అతన్ని దజ్జాల్‌గా భావించేవారు. కాని అతడు మాత్రం దజ్జాల్‌ కాడు. ఎందుకంటే అసలైన దజ్జాల్‌ మదీనహ్లో ప్రవేశించలేడు. మన ప్రవక్త (స) జీవిత కాలంలో కొందరు అనుచరులు ద్వీపంలోనికి వెళ్ళారు. అక్కడ మసీ’హ్‌ దజ్జాల్‌ బంధించబడి ఉండటం చూసారు. ముందు పేజీల్లో అబూ స’యీద్‌ ‘ఖుద్రీ ఉల్లేఖనం వస్తుంది. అందులో అతను తన ఇబ్నె సయ్యద్‌ మక్కహ్ ప్రయాణం చేస్తున్నాము. ఇబ్నె సయ్యద్‌ ప్రజల వల్ల తనకు కలిగిన బాధను గురించి చెప్పారు. ప్రజలు నన్ను దజ్జాల్‌గా భావిస్తున్నారు. మీరు ప్రవక్త (స) ద్వారా దజ్జాల్‌ సంతానం లేనివాడని  వినలేదా? నాకు సంతానం ఉంది, ఇంకా దజ్జాల్‌ మక్కహ్ మదీనహ్లో ప్రవేశించలేడని ప్రవక్త (స) ద్వారా వినలేదా? నేను మదీనహ్ నుండి వస్తున్నాను, మక్కహ్ వెళుతున్నాను,’ అని అన్నాడు.

అబూ స’యీద్‌ ‘ఖుద్రీ (ర) కథనం, ”ఇబ్నె సయ్యద్‌ చివరిగా నాతో, ‘గుర్తుంచుకోండి! అల్లాహ్ సాక్షి! నాకు దజ్జాల్‌ జన్మించే సమయం గురించి తెలుసు, వాడి నివాసం తెలుసు, జన్మించే స్థలమూ తెలుసు, ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు వాడి తల్లిదండ్రుల పేర్లు కూడా నాకు తెలుసు’ అని అన్నాడు. అబూ స’యీద్‌ ‘ఖుద్రీ (ర) కథనం: ‘ఇబ్నె సయ్యద్‌ చివరి మాటలు నాకు సందిగ్ధంలో పడవేసాయి. నేను నీ పాడుగాను’ అన్నాను. ఇంకా తోడు వెళుతున్న వారిలో ‘దజ్జాల్‌ నేను’ అని చెప్పుకోవటం నీకు మంచిదనిపిస్తుందా?’ అని అన్నారు. దానికి ఇబ్నె సయ్యద్‌, ‘ఒకవేళ దజ్జాల్‌ గుణాలు నాకు ప్రసాదించబడితే నేనే చెడ్డవాడిని,’ అని అన్నాడు.

اَلْفَصْلُ الْأَوَّلُ  మొదటి  విభాగం   

5494 – [ 1 ] ( متفق عليه ) (3/1518)

عَنْ عَبْدِ اللهِ بْنِ عُمَرَ أَنَّ عُمَرَ بْنِ الْخَطَّابِ اِنْطَلَقَ مَعَ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم فِيْ رَهْطٍ مِنْ أَصْحَابِهِ قِبَلَ ابْنِ الصَّيَّادِ حَتّى وَجَدُوْهُ يَلْعَبُ مَعَ الصِّبْيَانِ فِيْ أُطُمِ بَنِيْ مَغَالَةَ. وَقَدْ قَارَبَ ابْنُ صَيَّادٍ يَوْمَئِذٍ الْحُلْمَ فَلَمْ يَشْعُرْ حَتَّى ضَرَبَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم ظَهْرَهُ بِيَدِهِ ثُمَّ قَالَ: “أَتَشْهَدُ أَنِّيْ رَسُوْلُ اللهِ؟” فَقَالَ: أَشْهَدُ أَنَّكَ رَسُوْلُ الْأُمِّيِّيْنَ. ثُمَّ قَالَ ابْنُ صَيَّادٍ: أَتَشْهَدُ أَنِّيْ رَسُوْلُ اللهِ؟ فَرَصَّهُ النَّبِيُّ صلى الله عليه وسلم ثُمَّ قَالَ: “آمَنْتُ بِاللهِ وَبِرُسُلِهِ”. ثُمَّ قَالَ لِاِبْنِ صَيَّادٍ: “مَاذَا تَرَى؟” قَالَ: يَأْتِيْنِيْ صَادِقٌ وَكَاذِبٌ. قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “خُلِّطَ عَلَيْكَ الْأَمْرُ”. قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِنِّيْ خَبَّأتُ لَكَ خَبِيْئًا” وَخَبَّأَ لَهُ: (يَوْمَ تَأْتِي السَّمَاءُ بِدُخَانٍ مُبِيْن؛ 44: 10) فَقَالَ: هُوَ الدُّخُّ. فَقَالَ: “اخْسَأْ فَلَنْ تَعْدُو قَدْرَكَ”. قَالَ عُمَرُ: يَا رَسُوْلَ اللهِ أَتَأْذَنُ لِيْ فِيْ أَنْ أَضْرِبَ عُنُقَهُ؟ قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِنْ يَكُنْ هُوَ لَا تُسَلَّطُ عَلَيْهِ وَإِنْ لَمْ يَكُنْ هُوَ فَلَا خَيْرَ لَكَ فِيْ قَتْلِهِ”. قَالَ ابْنُ عُمَرَ: اِنْطَلَقَ بَعْدَ ذَلِكَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم وَأُبَيُّ بْنُ كَعْبِ الْأَنْصَارِيُّ يَؤُمَّانِ النَّخْلَ الَّتِيْ فِيْهَا ابْنُ صَيَّادٍ فَطَفِقَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم يَتَّقِيْ بِجُذُوْعِ النَّخْلِ وَهُوَ يَخْتِلُ أَنْ يَسْمَعَ مِنَ ابْنِ صَيَّادٍ شَيْئًا قَبْلَ أَنْ يَرَاهُ وَابْنُ صَيَّادٍ مُضْطَجِعٌ عَلَى فِرَاشِهِ فِيْ قَطِيْفَةٍ لَهُ فِيْهَا زَمْزَمَةٌ فَرَأَتْ أُمّ ابْنِ صَيَّادٍ النَّبِيَّ صلى الله عليه وسلم وَهُوَ يَتَّقِيْ بِجُذُوْعِ النَّخْلِ. فَقَالَتْ: أَيْ صَافُ – وَهُوَ اسْمُهُ – هَذَا مُحَمَّدٌ. فَتَنَاهَى ابْنُ صَيَّادٍ. قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَوْ تَرَكَتْهُ بَيَّنَ”. قَالَ عَبْدُ اللهِ بْنُ عُمَرَ: قَامَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم فِي النَّاسِ فَأَثْنَى عَلَى اللهِ بِمَا هُوَ أَهْلُهُ ثُمَّ ذَكَرَ الدَّجَّالَ فَقَالَ: “إِنِّيْ أُنْذِرُكُمُوْهُ وَمَا مِنْ نَبِيٍّ إِلَّا وَقَدْ أَنْذَرَ قَوْمُهُ لَقَدْ أَنْذَرَ نُوْحٌ قَوْمَهُ وَلَكِنِّيْ سَأَقُوْلُ لَكُمْ فِيْهِ قَوْلًا لَمْ يَقُلْهُ نَبِيٌّ لِقَوْمِهِ تَعْلَمُوْنَ أَنَّهُ أَعْوَرُ وَأَنَّ اللهَ لَيْسَ بِأَعْوَرٍ”.

5494. (1) [3/1518 ఏకీభవితం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘ఉమర్‌ (ర) కథనం: మా నాన్న గారు ‘ఉమర్‌ (ర), ప్రవక్త (స) అనుచరుల బృందంలో ప్రవక్త (స) వెంట ఇబ్నె సయ్యాద్‌ వద్దకు బయలు దేరారు.  ప్రవక్త (స) అతన్ని యూదతెగ బనీ ము’గాల వీధిలో పిల్లలతో ఆడుతూ ఉండటం చూసారు. అప్పుడు అతడు యవ్వనదశకు చేరు కున్నాడు. ఇబ్నె సయ్యాద్‌కు మేము వచ్చినట్టు తెలియదు. ప్రవక్త (స) అతని వద్దకు వెళ్ళి అతని వీపు చేత్తో తట్టారు. ఇంకా, ‘నీవు నేను దైవప్రవక్తనని సాక్ష్యం ఇస్తావా,’ అంటే, ”నేను, ‘మీరు నిరక్షరాస్యుల ప్రవక్త,’ అని నేను సాక్ష్యం ఇస్తాను,” అని అన్నాడు. ఆ తరువాత, ”మీరు ‘నేను దైవప్రవక్తను,’ అని సాక్ష్యం ఇస్తారా,” అని అన్నాడు. అప్పుడు ప్రవక్త (స) వాడిని పట్టుకొని గట్టిగా నొక్కారు. ఇంకా, ‘నేను అల్లాహ్‌ను, ఆయన ప్రవక్తను విశ్వసించాను’ అని అన్నారు. ఆ తరువాత ప్రవక్త (స), ‘నువ్వు ఏంటి చూస్తున్నావు,’ అని అన్నారు. వాడు, ‘నిజం మరియు అబద్ధం కూడా, అంటే నా వద్దకు సత్యమైన మరియు అసత్యమైన వార్తలు వస్తాయి,’ అని అన్నాడు. దానికి ప్రవక్త (స), ‘నిజం, సత్యం కలగా పులగం చేసి నిన్ను కల్పించడం జరిగింది. సత్యం, అసత్యంలో ఏమాత్రం తేడా లేకుండా పోయింది. అందువల్ల నీవు ప్రవక్త కాలేవు, ఎందుకంటే ప్రవక్త వద్దకు కేవలం సత్యమైన వార్తలే వస్తాయి,’ అని అన్నారు. ఆ తరువాత ప్రవక్త (స) వాడితో, ‘నేను నా హృదయంలో ఒక విషయాన్ని దాచి ఉంచాను. దాన్ని నీవు చెప్పు,’ అని అన్నారు. వాడు వెంటనే, ‘దుఖ్‌,’ అని అన్నాడు. అప్పుడు ప్రవక్త (స), ‘ఇంతకంటే నీవు ముందుకు పోలేవు పైగా నువ్వు ఎల్లప్పుడూ అవమానం పాలవుతావు,’ అని అన్నారు.

అప్పుడు ‘ఉమర్‌ (ర), ‘తమరు నన్ను వీడి మెడ నరక డానికి అనుమతి ఇవ్వండి. నేను వీడిని చంపు తాను” అని అన్నారు. అప్పుడు ప్రవక్త (స), ‘ఒకవేళ ఇతడు అసలైన దజ్జాల్‌ అయితే వాడిపై నీకు ఆధి పత్యం లభించదు. ఎందుకంటే అసలైన దజ్జాల్‌ను చంపేవారు. ‘ఈసా (అ) ఒకవేళ వీడు అసలైన దజ్జాల్‌ కాకపోతే వీడిని చంపటం వల్ల ఎటువంటి లాభమూ లేదు.’

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘ఉమర్‌ (ర) కథనం: ఆ తరువాత ప్రవక్త (స) మరియు ఉబయ్‌ బిన్‌ క’అబ్‌ ఇద్దరూ కలసి ఇబ్నెసయ్యాద్ మరియు అతని తల్లిదండ్రులు ఉంటున్న తోటలోనికి వెళ్ళారు. వారిద్దరూ రహస్యంగా అకస్మాత్తుగా ఇబ్నెసయ్యాద్‌ వద్దకు వెళ్ళాలని అనుకున్నారు. ఇబ్నె సయ్యాద్‌ అప్పుడు దుప్పటి కప్పుకొని పండుకుని ఉన్నాడు. అతని నోటి నుండి ఒక రకమైన శబ్దం వస్తుంది. ఇబ్నె సయ్యాద్‌ తల్లి  ప్రవక్త (స) ఈ విధంగా రావటం చూచి ”అరే ‘సాఫ్‌, ము’హ మ్మద్‌ (స) వచ్చారు,” అని పలికింది. అతడు వెంటనే లేచి కూర్చున్నాడు. అప్పుడు ప్రవక్త (స), ”ఒకవేళ అతని తల్లి అతన్ని ఆ స్థితిలోనే వదలిపెడితే, స్వయంగా వాడు తన గురించి చెప్పేవాడు,” అని అన్నారు.

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘ఉమర్‌ (ర) కథనం: ఆ తరువాత ప్రవక్త (స) ఆ తోట నుండి బయటకు వచ్చారు. ప్రజల ముందు దీన్ని గురించి ఒక ప్రసంగం చేసారు. దైవస్తోత్రం తరువాత ”నేను మీకు దజ్జాల్‌ కల్లోలాల గురించి హెచ్చరించాను. ఇంకా ప్రతివ్యక్తికి తన జాతిని దజ్జాల్‌ ఉపద్రవాల గురించి హెచ్చరించి ఉన్నారు. కాని ఏ ప్రవక్త చెప్పని విషయం ఒకటి నేను మీకు చెబుతాను. అదేమిటంటే, దజ్జాల్‌ ఒక కన్ను గ్రుడ్డివాడు, అల్లాహ్‌(త) మాత్రం ఇటువంటి లోపాలకు అతీతుడు. (బు’ఖారీ, ముస్లిమ్‌)

5495 – [ 2 ] ( صحيح ) (3/1519)

وَعَنْ أَبِي سَعِيْدِ الْخُدْرِيِّ قَالَ: لَقِيَهُ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم وَأَبُوْ بَكْرٍ وَعُمَرُ – يَعْنِيْ ابْنَ صَيَّادٍ – فِيْ بَعْضِ طُرُقِ الْمَدِيْنَةِ. فَقَالَ لَهُ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “أَتَشْهَدُ أَنِّيْ رَسُوْل اللهِ؟” فَقَالَ هُوَ: أَتَشْهَدُ أَنِّيْ رَسُوْلُ اللهِ؟ فَقَالَ رَسُوْلُ الله صلى الله عليه وسلم: “آمَنْتُ بِاللهِ وَمَلَائِكَتِهِ وَكُتُبِهِ وَرُسُلِهِ مَاذَا تَرَى؟” قَالَ: أَرَى عَرْشًا عَلَى الْمَاءِ. فَقَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “تَرَى عَرْشَ إِبْلِيْسَ عَلَى الْبَحْرِ وَمَا تَرَى؟” قَالَ: أَرَى صَادِقَيْنِ وَكَاذِبًا أَوْ كَاذِبَيْنِ وَصَادِقًا. فَقَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لُبِسَ عَلَيْهِ فَدَعُوْهُ”. رَوَاهُ مُسْلِمٌ .

5495. (2) [3/1519 దృఢం]

అబూ స’యీద్‌ ‘ఖుద్రీ (ర) కథనం: ప్రవక్త (స), అబూ బకర్‌ (ర), ‘ఉమర్‌ (ర) మదీనహ్కు చెందిన ఒక మార్గంలో ఇబ్నె సయ్యాద్‌ను కలిసారు. ప్రవక్త (స) ఇబ్నె సయ్యాద్‌తో ”నేను దైవప్రవక్తనని నువ్వు సాక్ష్యం ఇస్తావా?” అని అన్నారు. దానికి సమాధానంగా వాడు, ”నేను దైవప్రవక్తనని మీరు సాక్ష్యం ఇస్తారా?” అని అడిగాడు. అప్పుడు ప్రవక్త (స), ”నేను అల్లాహ్‌ను, ఆయన ప్రవక్తలను, ఆయన గ్రంథాలను, ఆయన దూతలను విశ్వసిస్తున్నాను,” అని అన్నారు. ఆ తరువాత, ‘నువ్వు ఏం చూస్తున్నావు,’ అని వాడిని అడిగారు. దానికి వాడు, ”ఒక సింహాసనాన్ని నీటిపై ఉన్నట్టు చూస్తున్నాను,” అని అన్నాడు. అప్పుడు ప్రవక్త (స), ”అది షై’తాన్‌ సింహాసనం” అని అన్నారు.

ఆ తరువాత ప్రవక్త (స) వాడిని ఇంకా ఏమిటి చూస్తావు అని అడిగారు. వాడు, ఇద్దరు సత్య వంతు లను, ఒక అసత్యవాదిని లేదా ఇద్దరు అసత్యవంతు లను, ఒక సత్యవంతుడ్ని చూస్తున్నాను. అంటే, ‘సత్యాసత్యాల వార్తలు నా దగ్గరకు వస్తాయి’ అని అన్నాడు. అప్పుడు ప్రవక్త (స) నీ వ్యవహారం అనుమానాస్పదమైనదిగా ఉంది. అంటే, ‘నీవు జ్యోతిష్యుడవు,’ అని అన్నారు. అనేకరకాల సత్యమైన, అసత్యమైన విషయాలు షై’తానులు నీచెవిలో వేస్తాయి. ఇప్పుడునిన్ను నమ్మడం జరుగదు. ఇప్పుడు దీన్ని వదిలెయ్యి, దాన్ని గురించి చర్చించకు అని అన్నారు. (ముస్లిమ్‌)

5496 – [ 3 ] ( صحيح ) (3/1519)

وَعَنْهُ أَنَّ ابْنَ صَيَّادٍ سَأَلَ النَّبِيّ صلى الله عليه وسلم عَنْ تُرْبَةِ الْجَنَّةِ. فَقَالَ: “دَرُ مَكَةٌ يَبْضَاءُ وَمِسْكٌ خَالِصٌ”. رَوَاهُ مُسْلِمٌ.

5496. (3) [3/1519దృఢం]

అబూ స’యీద్‌ ‘ఖుద్రీ (ర) కథనం: ఇబ్నె సయ్యాద్ ప్రవక్త (స)ను, ‘స్వర్గంలోని మట్టి ఎటువంటిది’ అని అడిగాడు. దానికి ప్రవక్త (స) ”స్వర్గంలోని మట్టిరంగు తెల్లని మైదా పిండిలా ఉంటుంది, సువాసనలో కస్తూరిలా ఉంటుంది” అని సమాధానం ఇచ్చారు.” (ముస్లిమ్‌)

5497 – [ 4 ] ( صحيح ) (3/1519)

وَعَنْ نَافِعٍ قَالَ: لَقِيَ ابْنُ عُمَرَ ابْنَ صَيَّادٍ فِي بَعْضِ طُرُقِ الْمَدِيْنَةِ. فَقَالَ لَهُ قَوْلًا أَغْضَبَهُ فَانْتَفَخَ حَتّى مَلَأ السِّكَّةَ. فَدَخَلَ ابْنُ عُمَرَ عَلَى حَفْصَةَ وَقَدْ بَلَغَهَا فَقَالَتْ لَهُ: رَحِمَكَ اللهُ مَا أَرَدْتَ مِنَ ابْنِ صَيَّادٍ؟ أَمَا عَلِمْتَ أَنَّ رَسُوْلَ اللهِ عليه وسلم قَالَ: “إِنَّمَا يَخْرُجُ مِنْ غَضَبَةٍ يَغْضَبُهَا”. رَوَاهُ مُسْلِمٌ.

5497. (4) [3/1519 దృఢం]

నాఫె’ (ర) కథనం: ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘ఉమర్‌ (ర) ఇబ్నె సయ్యాద్‌ను మదీనహ్ దారిలో కలిసారు. ఇబ్నె ‘ఉమర్‌ (ర) అతనితో ఒక విషయం అన్నారు. దానివల్ల అతడు చాలా ఆగ్రహానికి గురి అయ్యాడు. కోపంతో అతని నరాలు ఉబ్బి పోయాయి. చివరికి వీధి అంతా జనంతో నిండిపోయింది. ఇబ్నె ‘ఉమర్‌ (ర) తన సోదరి ‘హఫ్‌’సహ్ (ర) వద్దకు వెళ్ళారు. ఆమెకు కూడా ఈ వార్త అందింది. ‘హఫ్సహ్ (ర) ఇబ్నె ఉమర్‌తో, ”అల్లాహ్‌ నిన్ను క్షమించుగాక! నువ్వు ఇబ్నె సయ్యాద్‌ను ఎందుకు రెచ్చగొట్టావు. వాడి గురించి నీకు తెలియదు. ప్రవక్త (స) ఇలా ప్రవచించారు, ‘దజ్జాల్‌ను ఆగ్రహం తెప్పిస్తేనే బహిర్గతం అవుతాడు,’ అని అన్నారు. (ముస్లిమ్‌)

5498 – [ 5 ] ( صحيح ) (3/1520)

وَعَنْ أَبِيْ سَعِيْدِ الْخُدْرِيِّ قَالَ: صَحِبْتُ ابْنَ صَيَّادٍ إِلى مَكَّةَ فَقَالَ: مَا لَقِيْتُ مِنَ النَّاسِ؟ يَزْعَمُوْنَ أَنِّي الدَّجَّالُ أَلَسْتَ سَمِعْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ: “إِنَّهُ لَا يُوْلَدُ لَهُ”. وَقَدْ وُلِدَ لِيْ أَلَيْسَ قَدْ قَالَ: “هُوَكَافِرٌ”. وَأَنَا مُسْلِمٌ أَوْ لَيْسَ قَدْ قَالَ: “لَا يَدْخُلُ الْمَدِيْنَةَ وَلَا مَكَّةَ”؟ وَقَدْ أَقْبَلْتُ مِنَ الْمَدِيْنَةِ وَأَنَا أُرِيْدُ مَكَّةَ. ثُمَّ قَالَ لِيْ فِيْ آخِرِ قَوْلِ: أَمَا وَاللهِ إِنِّي لَأَعْلَمُ مَوْلِدَهُ وَمَكَانَهُ وَأَيْنَ هُوَ وَأَعْرِفُ أَبَاهُ وَأُمَّهُ قَالَ: فَلَبَّسَنِيْ قَالَ: قُلْتُ لَهُ: تَبًّا لَكَ سَائِرَالْيَوْمِ. قَالَ: وَقِيْلَ لَهُ: أَيَسُرُّكَ أَنَّكَ ذَاكَ الرَّجُلُ؟ قَالَ: فَقَالَ: لَوْ عُرِضَ عَلَيَّ مَا كَرِهْتُ.رَوَاهُ مُسْلِمٌ.

5498. (5) [3/1520దృఢం]

అబూ స’యీద్‌ ‘ఖుద్రీ (ర) ఇబ్నె సయ్యాద్‌ను కలవడం గురించి ఇలా అన్నారు: ”నేను ‘హజ్జ్కు వెళుతున్నాను. దారిలోఇబ్నెసయ్యాద్‌ను కలిసాను. అతను నాతో, ‘ప్రజల మాటలవల్ల నాకు చాలా బాధ కలుగుతుంది, వాళ్ళు నన్నే దజ్జాల్‌గా భావిస్తున్నారు, కాని నేను దజ్జాల్‌ను కాను, దజ్జాల్‌ను గురించి ప్రవక్త (స) అతడు మక్కహ్ మదీనహ్లలో ప్రవేశించలేడని, అతనికి సంతానం కూడా ఉండదని అన్నారు. నేను మదీనహ్లో జన్మించాననే విషయం మీకు తెలుసు, నా తల్లి దండ్రులు, బంధువులు మదీనహ్లోనే ఉంటున్నారు. ఇంకా ఇప్పుడు నేను ‘హజ్జ్ చేయడానికి వెళుతున్నాను, ఇంకా నాకు భార్యాబిడ్డలు కూడా ఉన్నారు, ఆ దజ్జాల్‌ అవిశ్వాసి అయి ఉంటాడు. కాని నేను ముస్లిమ్‌ను, ఇన్ని విషయాలు ఉన్నా ప్రజలు నన్ను గురించి ఇటువంటి మాటలు అంటున్నారు. దీనివల్ల నాకు చాలా బాధ కలుగుతుంది,’ అని అన్నాడు. ఇంకా ఇబ్నె సయ్యాద్‌ దైవం సాక్షి! దజ్జాల్‌ జన్మించే స్థానం, ఉండేస్థానం ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు, అతని తల్లిదండ్రులెవరు అనేవన్నీ నాకు తెలుసునని అన్నాడు.

అబూ సయ్యాద్‌ (ర), ”అతడు తన మాటల వల్ల మమ్మల్ని అనుమానానికి గురిచేసాడు, అందుకు నేను ‘నువ్వు నాశనం అవుగాక’ అని అన్నాను. ఇబ్నె సయ్యాద్‌ను, ‘ఒకవేళ నిన్ను నువ్వు కూడా దజ్జాల్‌వే అని అంటే చెడుగా భావిస్తావా?’ అని అడగటం జరిగింది. దానికతడు ఒకవేళ నన్ను దజ్జాల్‌ చేసివేస్తే, ఇందులో నాకు అభ్యంతరం ఉండదు,’ అని అన్నాడు. (ముస్లిమ్‌)

5499 – [6 ] ( صحيح ) (3/1520)

وَعَنِ ابْنِ عُمَرَ رَضِيَ اللهُ عَنْهُمَا قَالَ: لَقِيْتُهُ وَقَدْ نَفَرَتْ عَيْنُهُ فَقُلْتُ: مَتَى فَعَلَتْ عَيْنُكَ مَا أَرَى؟ قَالَ: لَا أَدْرِيْ. قُلْتُ: لَا تَدْرِيْ وَهِيَ فِيْ رَأْسِكَ؟ قَالَ: إِنْ شَاءَ اللهُ خَلَقَهَا فِيْ عَصَاكَ. قَالَ: فَنَخَرَ كَأَشَدِّ نَخِيْرِ حِمَارٍ سَمِعْت. رَوَاهُ مُسْلِمٌ.

5499. (6) [3/1520 దృఢం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘ఉమర్‌ (ర) కథనం: ఇబ్నె సయ్యాద్‌ను కలిసాను. అప్పుడు అతని కన్ను వాచిపోయి  ఉంది. ‘నీ కన్ను ఎప్పుడు వాచి పోయింది,’ అని అడిగాను. దానికతడు, ‘నాకు తెలియదు’ అని అన్నాడు. దానికి నేను, ”నీకు తెలియదా? కన్ను నీ తలలో ఉంది” అని అన్నాను. దాని కతను, ఒకవేళ అల్లాహ్‌ కోరితే, నాకన్ను చేతి కర్రలో సృష్టిస్తాడు,’ అని అన్నాడు. ఇంకా ఇబ్నె సయ్యాద్‌ ముక్కుతో గాడిదలాంటి శబ్దం చేసాడు, చాలా బిగ్గరగా గాడిదలా.” (ముస్లిమ్‌)

5500 – [ 7 ] ( متفق عليه ) (3/1520)

وَعَنْ مُحَمَّدِ بْنِ الْمُنْكَدِرِ قَالَ: رَأَيْتُ جَابِرَ بْنَ عَبْدِ اللهِ يَحْلِفُ بِاللهِ أَنَّ ابْنَ الصَّيَّادِ الدَّجَّالُ. قُلْتُ: تَحْلِفُ بِاللهِ؟ قَالَ: إِنِّيْ سَمِعْتُ عُمَرَ يَحْلِفُ عَلى ذَلِكَ عِنْدَ النَّبِيِّ صلى الله عليه وسلم. فَلَمْ يُنْكِرْهُ النَّبِيُّ صلى الله عليه وسلم . مُتَّفَقٌ عَلَيْهِ.

5500. (7) [3/1520–  ఏకీభవితం]

ము’హమ్మద్‌ బిన్‌ మున్‌కదిర్‌ (ర) కథనం: నేను జాబిర్‌ బిన్‌ ‘అబ్దుల్లాహ్‌ను చూసాను. అతడు ప్రమాణం చేసి, ‘ఇబ్నె సయ్యాద్‌ దజ్జాల్‌’ అని అన్నారు. నేనతనితో, ‘మీరు  ప్రమాణం చేసి చెబుతున్నారా?’ అని అన్నాను. దానికతను నేను ‘ఉమర్‌ (ర) ద్వారా, ప్రవక్త (స) ముందు దీనిపై ప్రమాణం చేస్తే, ప్రవక్త (స) దాన్నుండి వారించలేదని విన్నాను’ అని అన్నారు. (బు’ఖారీ, ముస్లిమ్‌)

అంటే దజ్జాల్‌కు చెందిన కొన్ని గుణాలు ఇబ్నె సయ్యాద్‌లో ఉండేవి.

—–

الْفَصْلُ الْثَّانِيْ రెండవ విభాగం   

5501 – [ 8 ] ( صحيح ) (3/1521)

عَنْ نَافِعٍ قَالَ: كَانَ ابْنُ عُمَرَيَقُوْلُ: وَاللهِ مَا أَشُكُّ أَنَّ الْمَسِيْحَ الدَّجَّالَ ابْنُ صَيَّادٍ. رَوَاهُ أَبُوْ دَاوُدَ وَالْبَيْهَقِيُّ فِيْ”كِتَابِ الْبَعْثِ وَالنُّشُوْرِ”.

5501. (8) [3/1521-దృఢం]

నాఫె’ (ర) కథనం: ఇబ్నె సయ్యాద్‌ కూడా దజ్జాల్‌ అనే విషయంలో నాకు ఎలాంటి సందేహం లేదని ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘ఉమర్‌ అనేవారు. (బైహఖీ-/బ’అస్’ వన్నుషూర్)

5502 – [ 9 ] ( صحيح ) (3/1521)

وَعَنْ جَابِرٍ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَدْ فَقَدْنَا ابْنَ صَيَّادٍ يَوْمَ الْحَرَّةِ. رَوَاهُ أَبُوْ دَاوُدَ.

5502. (9) [3/1521దృఢం]

జాబిర్‌ (ర) కథనం: హుర్రహ్‌ యుద్ధ సంఘటనలో ఇబ్నె సయ్యాద్‌ను మేము చూడలేదు. ఆ యుద్ధంలో మరణించి ఉండవచ్చు. (అబూ  దావూద్‌)

5503 – [ 10 ] ( لم تتم دراسته ) (3/1521)

وَعَنْ أَبِيْ بَكْرَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “يَمْكُثُ أَبُو الدَّجَّالِ ثَلَاثِيْنَ عَامًا لَا يُوْلَدُ لَهُمَا وَلَدٌ ثُمَّ يُوْلَدُ لَهُمَا غُلَامُ أَعْوَرُ أَضْرَسُ وَأَقَلُّهُ مَنْفَعَةً تَنَامُ عَيْنَاهُ وَلَا يَنَامُ قَلْبُهُ”. ثُمَّ نَعَتَ لَنَا رَسُوْلُ الله صلى الله عليه وسلم أَبَوَيْهِ فَقَالَ: “أَبُوْهُ طِوَالُ ضَرْبُ اللَّحْمِ كَأَنَّ أَنْفَهُ مِنْقَارٌ وَأُمُّهُ امْرَأةٌ فَرْضَاخِيَّةٌ طَوِيْلَةُ الْيَدَيْنِ”. فَقَالَ أَبُوْ بَكْرَةَ: فَسَمِعْنَا بِمَوْلُوْدِ فِي الْيَهُوْدِ. فَذَهَبْتُ أَنَا وَالزُّبَيْرُ بْنُ الْعَوَّامِ حَتَّى دَخَلْنَا عَلَى أَبَوَيْهِ فَإِذَا نَعْتُ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم فِيْهِمَا فَقُلْنَا هَلْ لَكُمَا وَلَدٌ؟ فَقَالَا: مَكَثْنَا ثَلَاثِيْنَ عَامًا لَا يُوْلَدُ لَنَا وَلَدٌ ثُمَّ وُلِدَ لَنَا غُلَامٌ أَعْوَرُ أَضْرَسُ وَأَقَلَّهُ مَنْفَعَةٌ تَنَامُ عَيْنَاهُ وَلَا يَنَامُ قَلْبُهُ. قَالَ فَخَرَجْنَا مِنْ عِنْدِهِمَا فَإِذَا هُوَ مُنْجَدِلٌ فِي الشَّمْسِ فِيْ قَطِيْفَةٍ وَلَهُ هَمْهَمَةٌ فَكَشَفَ عَنْ رأْسِهِ فَقَالَ: مَا قُلْتُمَا: وَهَلْ سَمِعْتَ مَا قُلْنَا؟ قَالَ: نَعَمْ تَنَامُ عَيْنَايَ ولَا يَنَامُ قَلْبِيْ. رَوَاهُ التِّرْمِذِيُّ.

5503. (10) [3/1521అపరిశోధితం]

అబూ బక్‌రహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”దజ్జాల్‌ తల్లిదండ్రులు 30 సంవత్సరాల వరకు సంతానం లేకుండా ఉంటారు. ఆ తరువాత వారికి ఒక గ్రుడ్డి బిడ్డ పుడతాడు. అతని పళ్ళు పెద్దవిగా ఉంటాయి. వాడివల్ల ఇంటి వారికి చాలా తక్కువ లాభమే చేకూరుతుంది. అతడి కళ్ళు నిద్రపోతాయి, కాని అతని హృదయం మాత్రం నిద్రపోదు.” ఆ తరువాత ప్రవక్త (స) అతడి తల్లిదండ్రుల గురించి పేర్కొంటూ, అతడి తండ్రి పొడవుగా, సన్నగా ఉంటాడు, ముక్కు సూదిలా ఉంటుంది, ఇంకా అతని తల్లి బలంగా, పొడవైన చేతులు కలిగి ఉంటుంది,’ అని అన్నారు.

అబూ బక్‌రహ్‌ కథనం: మేము మదీనహ్ యూదుల్లో ఇటువంటి బిడ్డ జన్మించాడని విన్నాం, ప్రవక్త (స) చెప్పినట్టే. నేను మరియు జుబైర్‌ బిన్‌ ‘అవ్వామ్‌ అతని తల్లిదండ్రుల వద్దకు వెళ్ళాం. చూస్తే వారిద్దరూ ప్రవక్త (స) చెప్పినట్టే ఉన్నారు. మేము వారితో, ‘మీకు అబ్బాయి ఉన్నాడా,’ అని అడిగాము. దానికి వారు, ’30 సంవత్సరాల వరకు మాకు సంతానం కలగలేదు. ఆ తరువాత మాకు ఒక గ్రుడ్డి బిడ్డ జన్మించాడు. అతడి వల్ల మాకు ఎటువంటి లాభమూ చేకూరటం లేదు. వాడికళ్ళు నిద్రపోతాయి కాని హృదయం మేల్కొని ఉంటుంది,’ అని అన్నారు. మేము వారి దగ్గరి నుండి ఆ బాలుని వద్దకు వెళ్ళాము. ఎండలో దుప్పటి కప్పుకొని పండు కున్నాడు. ఏదో గుసగుసలాడుతున్నాడు. ఆ బాలుడు దుప్పటి తొలగించి, ‘మీరేమంటున్నారు,’ అని అడిగాడు. దానికి మేము, ‘మేమన్నది నువ్వు విన్నావా?’ అని అడిగాము. దానికి ఆ బాలుడు, ‘నా కళ్ళు పడుకుంటాయి. కాని, నా హృదయం మాత్రం మేల్కొని  ఉంటుంది,’ అని  అన్నాడు. (తిర్మిజి’)

5504 – [ 11 ] ( لم تتم دراسته ) (3/1522)

وَعَنْ جَابِرٍ أَنَّ امْرَأَةً مِنَ الْيَهُوْدِ بِالْمَدِيْنَةِ وَلَدَتْ غُلَامًا مَمْسُوْحَةً عَيْنُهُ طَالِعَةً نَابُهُ فَأَشْفَقَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم أَنْ يَكُوْنَ الدَّجَّالُ فَوَجَدَهُ تَحْتَ قَطِيْفَةٍ يُهَمْهِمُ. فَآذَنَتْهُ أُمُّهُ فَقَالَتْ: يَا عَبْدَ اللهِ هَذَا أَبُو الْقَاسِمِ فَخَرَجَ مِنَ الْقَطِيْفَةِ. فَقَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: مَا لَهَا قَاتَلَهَا اللهُ؟ لَوْ تَرَكَتَهُ لَبَيَّنَ”. فَذَكَرَ مِثْلَ مَعْنَى حَدِيْثِ ابْنِ عُمَرَ. فَقَالَ عُمَرَ بْنِ الْخَطَّابِ اِئْذَنْ لِيْ يَا رَسُوْلَ اللهِ فَأَقْتُلَهُ. فَقَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِنْ يَكُنْ هُوَ فَلَيْسَتْ صَاحِبَهُ إِنَّمَا صَاحِبُهُ عِيْسَى بْنُ مَرْيَمَ وَإِلَّا يَكُنْ هُوَ فَلَيْسَ لَكَ أَتَقْتُلَ رَجُلًا مِنْ أَهْلِ الْعَهْدِ”. فَلَمْ يَزَلْ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم مُشْفِقًا أَنَّهُ هُوَ الدَّجَّالُ. روَاهُ فِيْ شَرْحِ السُّنَّةِ.

5504. (11) [3/1522 అపరిశోధితం]

జాబిర్‌ (ర) కథనం: మదీనహ్లోని ఒక యూదుని ఇంట్లో ఒక బాలుడు జన్మించాడు. అతనికి ఒక కన్ను మాత్రమే ఉంది. ఇంకా పెద్దపెద్ద పళ్ళు బయటకు చొచ్చుకొని వచ్చాయి. ప్రవక్త (స)కు, ‘ఆ బాలుడే దజ్జాల్‌ అయి ఉండవచ్చనే ఆందోళన కలిగింది. ఒకరోజు ప్రవక్త (స) ఆ బాలుణ్ణి చూడటానికి వెళ్ళారు. అతడు ఒక దుప్పటి కప్పుకొని పరుండి ఉన్నాడు. మెల్లగా ఏదో గుసగుసలాడుతున్నాడు. అతని తల్లి ప్రవక్త (స)ను చూసి ఆ బాలునితో, ‘ఓ అబ్బాయి! ప్రవక్త (స) గారు వచ్చారు,’ అని చెప్పింది. అతడు దుప్పటి నుండి తలతీసాడు. అప్పుడు ప్రవక్త (స) ‘వెధవ ఆడది, నా గురించి వాడికి తెలియపరచింది. ఒకవేళ వాడికి చెప్పకుండా ఉంటే వాడు తన వాస్తవం అంతా బయటపెట్టే వాడు.’ అని అన్నారు. ఆ తరువాత జాబిర్‌ (ర) ప్రవక్త (స) ‘హదీసు’ను చెప్పారు. దాన్ని విని ‘ఉమర్‌ (ర), ‘ఓ ప్రవక్తా! నన్ను వీడిని నరికేందుకు అనుమతి ఇవ్వండి,’ అని అన్నారు. దానికి ప్రవక్త (స), ‘ఒకవేళ ఇతడే దజ్జాల్‌ అయిఉంటే నీవు వీడిని చంపలేవు. ఎందుకంటే దజ్జాల్‌ను ‘ఈసా(అ) మాత్రమే చంపుతారు. ఒకవేళ ఇతడు దజ్జాల్‌ కాకుండా ఉంటే, నేను నా అనుచర సమాజంలోని ఎవ్వరినీ చంపే అనుమతి ఇవ్వను.’ అని అన్నారు. అయితే ప్రవక్త (స)కు ఇతడు దజ్జాల్‌ కాదు కదా అనే అనుమానం ఉండేది. ఎందుకంటే ఇతనిలో అనేక దజ్జాల్‌ గుణాలు ఉండేవి.  (షర్‌’హుస్సున్నహ్‌)

—–

وَهَذَا الْبَابُ خَالٍ عَنِ اَلْفَصْلِ الثَّالِثِ

ఇందులో మూడవ విభాగం లేదు

=====

5 بَابُ نُزُوْلِ عِيْسَى عَلَيْهِ السَّلَامُ

5. ‘ఈసా ()  పునరాగమనం

اَلْفَصْلُ الْأَوَّلُ   మొదటి  విభాగం  

5505 – [ 1 ] ( متفق عليه ) (3/1523)

عَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “وَالَّذِيْ نَفْسِيْ بِيَدِهِ لَيُوْشِكَنَّ أَنْ يَنْزِلَ فِيْكُمُ ابْنُ مَرْيَمَ حَكَمًا عَدَلًا فَيَكْسِرُ الصَّلِيْبَ وَيَقْتُلُ الْخِنْزِيْرُ وَيَضَعُ الْجِزْيَةَ وَيَفِيْضُ الْمَالُ حَتّى لَا يَقْبَلَهُ أَحَدٌ حَتّى تَكُوْنُ السَّجْدَةُ الْوَاحِدَةُ خَيْرًامِنَ الدُّنْيَا وَمَا فِيْهَا”. ثُمَّ يَقُوْلُ أَبُوْ هُرَيْرَةَ: فَاقْرَؤُاْ إِنْ شِئْتُمْ (وَإِنْ مِّنْ أَهْلِ الْكِتَابِ إِلَّا لَيُؤْمِنَنَّ بِهِ قَبْلَ مَوْتِهِ؛4: 159) الآية. مُتَّفَقٌ عَلَيْهِ.

5505. (1) [3/1523–  ఏకీభవితం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఎవరిచేతిలో నా ప్రాణం ఉందో ఆయన సాక్షి! నిస్సందేహంగా ‘ఈసా ఇబ్నె మర్యమ్‌ ఆకాశం నుండి మీ మధ్య దిగుతాడు. అతడు ఒక న్యాయ పాల కుడిగా ఉంటారు. అతడు శిలువను విరచివేస్తారు. ఇంకా పందిని చంపివేస్తారు. పన్ను (జి’జ్యా) ను తొలగిస్తారు. అతని కాలంలో ధనసంపదలు అధిక మవుతాయి. చివరికి వాటిని తీసుకునే వాడుండడు. ఒక్క సజ్దా అన్నిటికంటే విలువైనదిగా ఉంటుంది.

ఆ తరువాత అబూ హురైరహ్‌ (ర) ఇలా అనేవారు, ”ఒకవేళ మీరు కోరితే ఈ ఆయతును పఠించండి, మరియు గ్రంథప్రజల్లో ఎవడు కూడా అతనిని (‘ఈసాను), అతని మరణానికి పూర్వం (అతను, అల్లాహ్‌ యొక్క సందేశహరుడు మరియు ఒక మానవుడని), విశ్వసించకుండా ఉండడు…” [42] )అన్-నిసా’, 4:159( (బు’ఖారీ, ముస్లిమ్‌)

5506 – [ 2 ] ( صحيح ) (3/1523)

وَعَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “وَاللهِ لَيَنْزِلَنَّ ابْنُ مَرْيَمَ حَكَمًا عَادِلًا فَلَيَكْسِرَنَّ الصَّلِيْبَ وَلَيَقْتُلَنَّ الْخِنْزِيْرَ وَلَيَضْعَأنَّ الْجِزْيَةَ وَلَيَتْرُكَنَّ الْقِلَاصَ فَلَا يَسْعَى عَلَيْهَا وَلَتَذْهَبَنَّ الشَّحْنَاءُ وَ التَّحَاسُدُ وَلَيَدْعُوْنَ إِلى الْمَالِ فَلَا يَقْبَلُهُ أَحَدٌ”. رَوَاهُ مُسْلِمٌ.

وَفِيْ رِوَايَةٍ لَهُمَا قَالَ: “كَيْفَ أَنْتُمْ إِذَا نَزَلَ ابْنُ مَرْيَمَ فِيْكُمْ وَإِمَامُكُمْ مِنْكُمْ” .

5506. (2) [3/1523 దృఢం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”దైవసాక్షి! ‘ఈసా బిన్‌ మర్యమ్‌ ఆకాశం నుండి దిగుతారు. న్యాయపాలకులై ఉంటారు. శిలువను ధ్వంసం చేస్తారు. పందిని చంపివేస్తారు. ముస్లిమేతరుల పన్నును రద్దుచేస్తారు. ఇంకా యవ్వనంలో ఉన్న ఒంటెలను వదలి వేయటం జరుగుతుంది. వాటిని వాహనాలుగా ఉపయోగించటం జరుగదు. ప్రజల హృదయాల నుండి ఈర్ష్యాద్వేషాలు, అసూయ, శత్రుత్వం మొదలైనవి నశిస్తాయి. ‘ఈసా (అ) ప్రజలను ధన సంపదలు ఇవ్వటానికి  పిలుస్తారు. కాని ఎవరూ అవసరం లేనందున తీసుకోవటానికి ముందుకు రారు. (ముస్లిమ్)

మరో ఉల్లేఖనంలో ఇలా ఉంది, ” ‘ఈసా ఇబ్నె మర్యమ్‌ మీ మధ్య దిగినపుడు, మీ ఇమాము మీలో ఒకరుంటారు.” [43]

5507 – [ 3 ] ( صحيح ) (3/1523)

وَعَنْ جَابِرٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَا تَزَالُ طَائِفَةٌ مِنْ أُمَّتِيْ يُقَاتِلُوْنَ عَلَى الْحَقِّ ظَاهِرِيْنَ إِلى يَوْمِ الْقِيَامَةِ”. قَالَ: “فَيَنْزِلُ عِيْسَى بْنُ مَرْيَمَ. فَيَقُوْلُ أَمِيْرُهُمْ: تَعَالَ صَلَّ لَنَا فَيَقُوْلُ: لَا إِنَّ بَعَضَكُمْ عَلَى بَعْضٍ أُمَرَاءُ تَكْرِمَةَ اللهِ هَذِهِ الْأُمَّةَ”. رَوَاهُ مُسْلِمٌ  

5507. (3) [3/1523దృఢం]

జాబిర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”నా అను చర సమాజంలో ఒక బృందం ఎల్లప్పుడూ సత్యం కోసం పోరాడుతూ ఉంటుంది. తీర్పుదినం వరకూ శత్రువులపై ఆధిక్యం కలిగి ఉంటుంది. ఇంకా ‘ఈసా (అ) ఆకాశం నుండి దిగుతారు. అప్పుడు ముస్లిముల నాయకుడు అతనితో, ‘రండి మమ్మల్ని నమా’జు చదివించండి’ అని అంటాడు. అప్పుడు ‘ఈసా (అ), ‘నేను ఇమామత్‌ చేయను. ఎందుకంటే మీలోని కొందరు కొందరిపై నాయకులు, ఇమాములుగా ఉంటారు. అల్లాహ్‌(త) ఈ అనుచర సమాజానికి ప్రత్యేకత, గౌరవం ప్రసాదించాడు.[44](ముస్లిమ్‌)

—–

وهذا الباب خال عَنْ اَلْفَصْلُ الثَّانِيْ

ఇందులో రెండవ విభాగం లేదు

—–

اَلْفَصْلُ الثَّالِثُ  మూడవ విభాగం   

5508 – [ 4 ] ؟ (3/1524)

عَنْ عَبْدِ اللهِ بْنِ عَمْرٍو قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “يَنْزِلُ عِيْسَى بْنُ مَرْيَمَ إِلى الْأَرْضِ فَيَتَزَوَّجُ وَيُوْلَدُ لَهُ وَيَمْكُثُ خَمْسًا وَأَرْبَعِيْنَ سَنَةً ثُمَّ يَمُوْتُ. فَيُدْفَنُ مَعِيَ فِيْ قَبَرِيْ فَأَقُوْمُ أَنَا وَعِيْسَى بْنث مَرْيَمَ فِيْ قَبْرٍ وَاحِدٍ بَيْنَ أَبِيْ بَكْرٍ وَعُمَرَ”. رَوَاهُ ابْنُ الْجَوْزِيُّ فِيْ كِتَابِ الْوَفَاءِ

5508. (4) [3/1524 ? ]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘ఉమర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ” ‘ఈసా బిన్‌ మర్యమ్‌ భూమిపై దిగుతారు. వివాహం చేసుకుంటారు. ఆయనకు సంతానం కలుగు తుంది. 45 సంవత్సరాల వరకు ప్రపంచంలో ఉంటారు. ఆ తరువాత మరణిస్తారు. ఇంకా నా సమాధిలో నాతో పాటు ఖననం చేయబడతారు. అనంతరం తీర్పుదినం నాడు నేనూ ‘ఈసా – అబూ బకర్‌, ఉమర్‌ల మధ్య ఒకే సమాధి నుండి లేపబడతాము.” ఇబ్నె జౌ’జీ ఈ ఉల్లేఖనాన్ని  కితాబుల్‌ వఫా’లో  పేర్కొన్నారు. [45]

=====

6 بَابُ قُرْبِ السَّاعَةِ وَإِنَّ مَنْ مَاتَ فَقَدْ قَامَتْ قِيَامَتُهُ

6. ప్రళయం చేరువలో ఉంది, మరణించిన వారికి  ప్రళయం  సంభవించినట్టే

اَلْفَصْلُ الْأَوَّلُ మొదటి  విభాగం   

5509 – [ 1 ] ( متفق عليه ) (3/1525)

عَنْ شُعْبَةَ عَنْ قَتَادَةَ عَنْ أَنَسٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “بُعِثْتُ أَنَا وَالسَّاعَةُ كَهَاتيْنِ”. قَالَ شُعْبَةُ: وَسَمِعْتُ قَتَادَةَ يَقُوْلُ فِيْ قِصَصِهِ كَفَصْلِ إِحْدَاهُمَا عَلَى الْأُخْرَى. فَلَا أَدْرِيْ أَذَكَرَهُ عَنْ أَنَسٍ أَوْ قَالَهُ قَتَادَةُ؟ مُتَّفَقٌ عَلَيْهِ.

5509. (1) [3/1525–  ఏకీభవితం]

షు’అబహ్ (ర), ఖతాదహ్‌ ద్వారా, ఖతాదహ్‌ అనస్‌ ద్వారా కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”నేను, ప్రళయం ఈ రెండు వ్రేళ్ళలా పంపబడ్డాము. షు’అబహ్ (ర) కథనం, ”నేను ఖతాదహ్‌ (ర) ద్వారా విన్నాను. అతను తన బోధనల్లో చూపుడు వేలు, మధ్యవేలును చూపి అనేవారు. అయితే ఈ వివరణ ఖతాదహ్‌ చెప్పారో లేక అనస్‌ నుండి తెలుసుకొని చెప్పారో తెలియదు.” [46] (బు’ఖారీ, ముస్లిమ్‌)

5510 – [ 2 ] ( صحيح ) (3/1525)

وَعَنْ جَابِرٍ قال: سَمِعْتُ النَّبِيَّ صلى الله عليه وسلم يَقُوْلُ قَبْلَ أَنْ يَّمُوْتَ بِشَهْرٍ: “تَسْأَلُوْنِيْ عَنِ السَّاعَةِ؟ وَإِنَّمَا عِلْمُهَا عِنْدَ اللهِ وَأُقْسِمُ بِاللهِ مَا عَلَى الْأَرْضِ مِنْ نَفْسٍ مَنْفُوْسَةٍ يَأْتِيْ عَلَيْهَا مِاَئةُ سَنَةٍ وَهِيَ حَيَّةٌ يَوْمَئِذٍ”. رَوَاهُ مُسْلِمٌ.

5510. (2) [3/1525  దృఢం]

జాబిర్‌ బిన్‌ ‘అబ్దుల్లాహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ఇలా ప్రవచిస్తూ ఉండగా నేను విన్నాను, ”ప్రవక్త (స) తాను మరణించటానికి ఒక నెల ముందు ఇలా ప్రవచించే వారు, ”మీరు నన్ను ప్రళయం గురించి అడుగుతున్నారు. అయితే వినండి, ప్రళయజ్ఞానం కేవలం అల్లాహ్‌(త) వద్దనే ఉంది. ఇంకా అల్లాహ్పై ప్రమాణం చేసి చెబుతున్నాను. 100 సంవత్సరాల తర్వాత బ్రతి కుండే ఏ ప్రాణీ ఈ రోజు సజీవంగా లేదు.”  [47] (ముస్లిమ్‌)

5511 – [ 3 ] ( صحيح ) (3/1525)

وعَنْ أبي سعيد عَنْ النبي صلى الله عليه وسلم قَالَ: “لا يأتي مائة سنة وعلى الأرض نفس منفوسة اليوم”. رَوَاهُ مُسْلِمٌ.  

5511. (3) [3/1525  దృఢం]

అబూ స’యీద్‌ (ర) కథనం: ప్రవక్త(స) ప్రవచనం, ”ఇప్పుడు సజీవంగా ఉన్నవారెవరూ 100 సంవత్స రాల తర్వాత సజీవంగా ఉండరు.”  [48] (ముస్లిమ్‌)

5512 – [ 4 ] ( متفق عليه ) (3/1525)

وَعَنْ عَائِشَةَ قَالَتْ: كَانَ رِجَالٌ مِنَ الْأَعْرَابِ يَأْتُوْنَ النَّبِيَّ صلى الله عليه وسلم فَيَسْأَلُوْنَهُ عَنِ السَّاعَةِ فَكَانَ يَنْظُرُ إِلى أَصْغَرِهِمْ فَيَقُوْلُ: “إِنْ يَعِشَ هَذَا لَا يُدْرِكُهُ الْهَرَمُ حَتَّى تَقُوْمَ عَلَيْكُمْ سَاعَتُكُمْ”. مُتَّفَقٌ عَلَيْهِ.

5512. (4) [3/1525–  ఏకీభవితం]

‘ఆయి’షహ్‌ (ర) కథనం: చాలామంది అరబ్బులు వచ్చేవారు, ఇంకా ప్రళయం గురించి ప్రవక్త (స)ను అడిగేవారు. అప్పుడు వారిలో చిన్న వయస్కులను చూచి, ‘ఒకవేళ ఇతడు బ్రతికిఉంటే ముసలివాడవడు, చివరికి మీ మరణం సంభవిస్తుంది’ అని అనేవారు.[49](బు’ఖారీ, ముస్లిమ్‌)

—–

الْفَصْلُ الثَّانِيْ రెండవ విభాగం   

5513 – [ 5 ] ( لم تتم دراسته ) (3/1526)

عَنِ الْمُسْتَوْرِدِ بْنِ شَدَّادِ عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ: “بُعِثْتُ فِيْ نَفْسِ السَّاعَةِ فَسَبَقْتُهَا كَمَا سَبَقَتْ هَذِهِ هَذِهِ” وَأَشَارَ بِأصْبَعَيْهِ السَّبَّابَةِ وَالْوُسْطَى . رَوَاهُ التِّرْمِذِيُّ.

5513. (5) [3/1526 అపరిశోధితం]

ముస్తవ్‌రిద్‌ బిన్‌ షద్దాద్‌ కథనం: ”ప్రవక్త (స) ప్రవచనం, ”నేను ప్రళయ ప్రారంభంలో పంపబడ్డాను. ఇంకా నేను ప్రళయం కంటే మధ్యవేలు చూపుడువేలు కంటే ఎంత పొడుగ్గా ఉందో అంతముందు ఉన్నాను,’ అని పలికి తన రెండు వేళ్ళూ చూపించారు.” (తిర్మిజి’)

5514 – [ 6 ] ( صحيح ) (3/1526)

وَعَنْ سَعْدِ بْنِ أَبِيْ وَقَّاصٍ عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ: “إِنِّيْ لَأَرْجُوْ أَنْ لَا تَعْجَزَ أُمَّتِيْ عِنْدَ رَبِّهَا أَنْ يُؤَخِّرَهُمْ نِصْفَ يَوْمٍ”. قِيْلَ لِسَعْدٍ: وَكَمْ نِصْفُ يَوْمٍ؟ قَالَ: خَمْسُمِائَةٍ سَنَةٍ . رَوَاهُ أَبُوْ دَاوُدَ.

5514. (6) [3/1526 దృఢం]

స’అద్‌ బిన్‌ అబీ వఖ్ఖా’స్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”నా అనుచర సమాజానికి అల్లాహ్‌ (త) వద్ద సగం దినం కూడా ఇవ్వబడనంత హీనంగా ఉండదు. స’అద్‌ బిన్‌ వఖ్ఖా’స్‌ను, ‘సగం దినం అంటే ఎంత,’ అని ప్రశ్నించడం జరిగింది. దానికి అతను, ‘500 సంవత్సరాలు’ అని సమాధానం ఇచ్చారు.” [50](అబూ దావూద్‌)

—–

اَلْفَصْلُ الثَّالِثُ మూడవ  విభాగం   

5515 – [ 7 ] ( لم تتم دراسته ) (3/1526)

عَنْ أَنَسٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَثَلُ هَذِهِ الدُّنْيَا مَثَلُ ثَوْبٍ شُقَّ مِنْ أَوَّلِهِ إِلَى آخِرِهِ فَبَقِيَ مُتَعَلِّقَا بِخَيْطٍ فِيْ آخِرِهِ فَيُوْشِكُ ذَلِكَ الْخَيْطُ أَنْ يَنْقَطِعَ”. روَاهُ الْبَيْهَقِيُّ فِيْ “شُعَبِ الْإِيْمَانِ”.

5515. (7) [3/1526  అపరిశోధితం]

అనస్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఈ ప్రపంచం రెండు ముక్కలు చేయబడిన వస్త్రం. కేవలం ఒక దారం ద్వారా కలసి ఉన్నట్టు ఉంది. ఆ దారం కూడా త్వరలోనే తెగి పోవటానికి సిద్ధంగా ఉంది.” (బైహఖీ – షు’అబిల్ ఈమాన్)

=====

7 بَابٌ لَا تَقُوْمُ السَّاعَةُ إِلَّا عَلَى شِرَارِ النَّاسِ

7. ప్రళయం పాపాత్ములపైనే సంభవిస్తుంది

اَلْفَصْلُ الْأَوَّلُ  మొదటి  విభాగం   

5516 – [ 1 ] ( صحيح ) (3/1527)

عَنْ أَنَسٍ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم قَالَ: “لَا تَقُوْمُ السَّاعَةُ حَتّى لَا يُقَالُ فِي الْأَرْضِ: اللهُ اللهُ”.

وَفِيْ رِوَايَةٍ: “لَا تَقُوْمُ السَّاعَةُ عَلَى أَحَدٍ يَقُوْلُ: اللهُ اللهُ”. رَوَاهُ مُسْلِمٌ.

5516. (1) [3/1527 దృఢం]

అనస్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”అల్లాహ్‌, అల్లాహ్‌ అనేవారు ఉన్నంత వరకు ప్రళయం సంభవించదు.”

మరో ఉల్లేఖనంలో అల్లాహ్‌, అల్లాహ్‌ అనేవారు ఉన్నంతవరకు ప్రళయం సంభవించదు.” [51] (ముస్లిమ్‌)

5517 – [ 2 ] ( صحيح ) (3/1527)

وَعَنْ عَبْدِ اللهِ بْنِ مَسْعُوْدٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَا تَقُوْمُ السَّاعَةُ إِلَّا عَلَى شِرَارِ الْخَلْقِ”. رَوَاهُ مُسْلِمٌ.  

5517. (2) [3/1527 దృఢం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ మస్‌’ఊద్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”పాపాత్ములపై ప్రళయం సంభవిస్తుంది.” [52] (ముస్లిమ్‌)

5518 – [ 3 ] ( متفق عليه ) (3/1527)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَا تَقُوْمُ السَّاعَةُ حَتّى تَضْطَرِبَ أَلْيَاتُ نِسَاءِ دُوْسٍ حَوْلَ ذِي الْخَلَصَةِ”. وَذُو الْخَلَصَةِ: طَاغِيَةُ دَوْسٍ الَّتِيْ كَانُوْا يَعْبُدُوْنَ فِيْ الْجَاهِلِيَّةِ. مُتَّفَقٌ عَلَيْهِ.

5518. (3) [3/1527 ఏకీభవితం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”దౌస్‌ తెగకు చెందిన స్త్రీలు జి’ల్‌’ఖల’సహ్ విగ్రహం ముందు తమ మర్మాంగాన్ని ప్రదర్శించనంత వరకు ప్రళయం సంభవించదు. జి’ల్‌’ఖల’సహ్, దౌస్‌ తెగ ఆరాధించే ఒక విగ్రహం. అజ్ఞానకాలంలో దీన్ని పూజించడం  జరిగేది.”  [53]  (బు’ఖారీ, ముస్లిమ్‌)

5519 – [ 4 ] ( صحيح ) (3/1527)

وَعَنْ عَائِشَةَ قَالَتْ: سَمِعْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ: “لَا يَذْهَبُ اللَّيْلُ وَالنَّهَارُ حَتّى يُعْبَدَ اللَّاتُ وَالْعُزَّى”. فَقُلْتُ: يَا رَسُوْلَ اللهِ إِنْ كُنْتُ لَأَظُنُّ حِيْنَ أَنْزَلَ اللهُ: (هُوَ الَّذِيْ أَرْسَلَ رَسُوْلَهُ بِالْهُدَى وَدِيْنِ الْحَقِّ لِيُظْهِرَهُ عَلَى الدِّيْنِ كُلِّهِ وَلَوْ كَرِهَ الْمُشْرِكُوْنَ؛ 9: 33). أَنَّ ذَلِكَ تَامًّا. قَالَ: “إِنَّهُ سَيَكُوْنُ مِنْ ذَلِكَ مَا شَاءَ اللهُ ثُمَّ يَبْعَثُ اللهُ رِيْحًا طَيِّبَةً فَتُوُفِّيَ كُلُّ مَنْ كَانَ فِيْ قَلْبِهِ مِثْقَالُ حَبَّةٍ مِنْ خَرْدَلٍ مِنْ إِيْمَانٍ فَيَبْقَى مَنْ لَا خَيْرَ فِيْهِ فَيَرْجَعُوْنَ إِلى دِيْنِ آبَائِهِمْ”. رَوَاهُ مُسْلِمٌ.

5519. (4) [3/1527 దృఢం]

‘ఆయి’షహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ఇలా ప్రవచిస్తూ ఉండగా నేను విన్నాను, ”మళ్ళీ లాత్‌ వ ‘ఉ’జ్జా ఆరాధించబడనంత వరకు ప్రళయం సంభవించదు.” అప్పుడు నేను, ఓ ప్రవక్తా! అల్లాహ్‌ ”హువల్లజీ అర్‌సల… వలౌకరిహల్‌ ముష్రి కూన్‌”.(అత్-తౌబహ్, 9:33) ‘ఈ ఆయతు అవతరించినపుడు,  అల్లాహ్‌ (త) వాగ్దానం పూర్తవుతుందని, ఇస్లామ్‌ తప్ప మరే ధర్మం భూమి పై ఉండదని అనుకున్నాను,’ అని అన్నాను. దానికి ప్రవక్త (స) ”అలాగే జరుగుతుంది, అల్లాహ్‌ కోరినంత వరకు అలాగే జరుగుతుంది. ఆ తరువాత అల్లాహ్‌ ఒక సువాసన గల గాలిని పంపుతాడు. దానివల్ల ఏమాత్రం విశ్వాసం ఉన్న ప్రతి ఒక్కరూ మరణిస్తారు. చెడ్డవాళ్ళు మిగిలి ఉంటారు. వాళ్ళు మళ్ళీ తమ పూర్వుల మూఢాచారాలకు పాల్పడతారు.” అని అన్నారు. [54] (ముస్లిమ్‌)

5520 – [ 5 ] ( صحيح ) (3/1528)

وَعَنْ عَبْدِ اللهِ بْنِ عَمْرٍو قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “يَخْرُجُ الدَّجَّالُ فَيَمْكُثُ أَرْبَعِيْنَ”. لَا أَدْرِيْ أَرْبَعِيْنَ يَوْمًا أَوْ شَهْرًا أَوْ عَامًا. فَيَبْعَثُ اللهُ عِيْسَى ابْنَ مَرْيَمَ كَأَنَّهُ عُرْوَةُ بْنُ مَسْعُوْدٍ فيَطْلُبُهُ فَيُهْلِكُهُ ثُمَّ يَمْكُثُ فِي النَّاسِ سَبْعَ سِنِيْنَ لَيْسَ بَيْنَ اثْنَيْنِ عَدَاوَةٌ ثُمَّ يُرْسِلُ اللهُ رِيْحًا بَارِدَةً مِنْ قِبَلِ الشَّامِ فَلَا يَبْقَى عَلَى وَجْهِ الْأَرْضِ أَحَدٌ فِيْ قَلْبِهِ مِثْقَالُ ذَرَّةٍ مِنْ خَيْرٍ أَوْ إِيْمَانٍ إِلَّا قَبَضَتْهُ حَتَّى لَوْ أَنَّ أَحَدَكُمْ دَخَلَ فِيْ كَبِدِ جَبَلٍ لَدَخَلَتْهُ عَلَيْهِ حَتَّى تَقْبِضَهُ. قَالَ: “فَيَبْقَى شِرَارُ النَّاسِ فِيْ خِفَّةِ الطِّيْرِ وَأَحْلَامِ السِّبَاعِ لَا يَعْرفُوْنَ مَعْرُوْفًا وَلَا يُنْكِرُوْنَ مُنْكَرًا فَيَتَمَثَّلُ لَهُمُ الشَّيْطَانُ فَيَقُوْلُ أَلَا تَسْتَجِيْبُوْنَ؟ فَيَقُوْلُوْنَ: فَمَا تَأْمُرُنَا؟ فَيَأْمُرُهُمْ بِعِبَادَةِ الْأَوْثَانِ وَهُمْ فِيْ ذَلِكَ دَارٌ رِزْقُهُمْ حَسَنٌ عَيْشُهُمْ ثُمَّ يُنْفَخُ فِيْ الصُّوْرِ فَلَا يَسْمَعُهُ أَحَدٌ إِلَّا أَصْغَى لِيْتًا وَرَفَعَ لَيْتًا” .قَالَ: “وَ أَوَّلُ مَنْ يَسْمَعُهُ رَجُلٌ يَلُوْطُ حَوْضَ إِبِلِهِ فَيَصْعَقُ وَ يَصْعَقُ النَّاسُ ثُمَّ يُرْسِلُ اللهُ مَطْرًا كَأَنَّهُ الطَّلُّ فَيَنْبُتُ مِنْهُ أَجْسَادُالنَّاسِ ثُمَّ يُنْفَخُ فِيْهِ أُخْرَى فَإِذَا هُمْ قِيَامٌ يَنْظُرُوْنَ. ثُمَّ يُقَالُ: يَا أَيُّهَا النَّاسُ هَلُمَّ إِلى رَبِّكُمْ وَقِفُوْهُمْ إِنَّهُمْ مَسْؤُوْلُوْنَ. فَيُقَالُ: أَخْرِجُوْا بَعْثَ النَّارِ. فَيُقَالُ: مِنْ كَمْ؟ كَمْ؟ فَيُقَالُ: مِنْ كُلِّ أَلْفٍ تِسْعُمِائَةٍ وَتِسْعَةٌ وَتِسْعِيْنَ” .قَالَ: “فَذَلِكَ يَوْمٌ يَجْعَلُ الْوِلْدَانَ شَيْبًا وَذَلِكَ يَوْمَ يُكْشَفُ عَنْ سَاقٍ”. رَوَاهُ مُسْلِمٌ وَذُكِرَحَدِيْثُ مُعَاوِيَةَ: “لَا تَنْقَطِعُ الْهِجْرَةُ” فِيْ”بَابِ التَّوْبَةِ”.

5520. (5) [3/1528 -దృఢం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘ఉమర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”దజ్జాల్‌ బయలుదేరుతాడు, 40 వరకు ఉంటాడు, అయితే 40 రోజులో, 40 నెలలో, 40 సంవత్స రాలో నాకు తెలియదు. ప్రవక్త (స) దేన్ని గురించి అన్నారో నాకు తెలియదు. ఆ తరువాత అల్లాహ్‌ (త) ‘ఈసా ఇబ్నె మర్యమ్‌ను పంపుతాడు. అతను ‘ఉర్వ బిన్‌ మస్‌’ఊద్‌ రూపంలో ఉంటాడు. అతను దజ్జాల్‌ను వెతికి పట్టుకొని చంపుతారు. ఆ తరువాత 7 సంవత్స రాలవరకు ప్రజలు ఎటువంటి ఈర్ష్యాద్వేషాలు లేకుండా జీవిస్తారు. ఆ తరువాత అల్లాహ్‌ (త) సిరియా వైపు నుండి ఒకచల్లటిగాలిని పంపుతాడు. అనంతరం భూమి పై రవ్వంత విశ్వాసం, మేలు ఉన్న వారందరూ మరణిస్తారు. చివరికి మీలో ఎవరైనా కొండల్లో దాక్కున్నా సరే ఆ గాలి మీ వరకు వచ్చి ప్రాణం తీస్తుంది.

‘అబ్దుల్లాహ్‌ కథనం: ప్రవక్త (స) ఇలా ప్రవచిస్తూ ఉండగా విన్నాను: ఆతరువాత చెడ్డవారు ప్రపంచంలో మిగిలి పోతారు, పిచ్చుకల్లాంటి ముక్కులు, క్రూర మృగాల్లా దృఢంగా ఉంటారు. వాళ్ళు మంచిని మంచిగా భావించరు. చెడును  చెడుగా భావించరు. షై’తాన్‌ మానవరూపంలో వాళ్ళ వద్దకు వచ్చి, ‘మీకు సిగ్గులేదా?’ అనిఅంటాడు. దానికి వారు, ‘నీవు మాకు చెప్పేది ఏమిటి?’ అని అంటారు. అప్పుడు షై’తాన్‌ వాళ్ళతో, ‘విగ్రహాలను ఆరాధించండి,’ అని అంటాడు. వాళ్ళు విగ్రహాలను ఆరాధిస్తారు. అయినప్పటికీ ఉపాధి అత్యధికంగా ఉంటుంది. అందరూ భోగవిలాసాల్లో జీవితం గడుపుతూ ఉంటారు.

ఆ తరువాత ప్రళయం సంభవించటానికి తుత్తార ఊదబడుతుంది. దాన్ని ఎవరూ వినరు, కాని ఒక వైపు నుండి మెడ వంచుతారు. మరో వైపునుండి మెడ ఎత్తుతారు. (అంటే స్పృహ కోల్పోయి క్రింద పడతారు). ఆ తుత్తార శబ్దాన్ని అందరికంటే ముందు తన ఒంటెలను నీళ్ళు త్రాపించటానికి తొట్టెను సరిచేస్తున్న వ్యక్తి వింటాడు. అతడు ఆ స్థితిలోనే స్పృహ తప్పి అక్కడే క్రిందపడి మరణిస్తాడు. ఇతరులు కూడా మరణిస్తారు. ఆ తరువాత అల్లాహ్‌ (త) వర్షం కురిపిస్తాడు. అది మంచులా ఉంటుంది. దానివల్ల ప్రజల శరీరాలు తయారవుతాయి. ఆ తరువాత 40 సంవత్సరాలు తర్వాత రెండవ తుత్తార ఊదుబడు తుంది. దాన్ని విని అందరూ లేచి నిలబడతారు. ప్రళయ భయంకర దృశ్యాలను చూస్తూ ఉంటారు. ఆ తరువాత ”ప్రజలారా! మీ ప్రభువు వద్దకురండి” అని పిలవటం జరుగుతుంది. మానవులను నిల్చోబెట్టి ఉంచమని, వారిని వారి కర్మల గురించి ప్రశ్నించడం జరుగుతుంది. దైవదూతలను ఆదేశించడం జరుగు తుంది. ఆ తరువాత దైవదూతలను వారిలో నరక వాసులను వేరు చేయమని ఆదేశించడం జరుగుతుంది. ఆ తరువాత దైవదూతలు, ‘ఇంతమందిలో ఎంత మందిని తీయాలి’ అని అడుగుతారు, ప్రతి 1000 మందిలో 999 మందిని నరకంకోసం వేరు పరచమని ఆదేశించడం జరుగుతుంది. ఇలాచెప్పి ప్రవక్త (స) పిల్లల్ని వృద్ధులుగా మార్చే ఆ దినం ఇదే, ఇంకా చీలమండలు తెరచుకునే ఆ దినం ఇదే, అంటే కఠినంగా వ్యవహరించే  దినం  అని  అన్నారు.”  [55] (ముస్లిమ్‌)

ము’ఆవియ (ర) ఉల్లేఖన (లా తన్ ఖతిఉల్ హిజ్రతు) తౌబహ్ అధ్యాయంలో పేర్కొనడం జరిగింది.

—–

و هَذَا الْبَابُ خَالٍ عَنِ الْفَصْلِ الثَّانِيْ و الثَّالِث

ఇందులో రెండవ, మూడవ విభాగాలు లేవు

*****


[1]) వివరణ-5381: అంటే కల్లోలాలు, మార్గభ్రష్టత్వాల విషయాలు హృదయాలను చాపలా చుట్టుకుంటాయి. అందువల్ల కల్లోలాల నుండి, శరణుకోరుతూ ఉండాలి. అల్లాహ్‌(త) ఎవరిని రక్షిస్తే వారే తప్పించుకుంటారు. ఇటువంటి కల్లోలాల కాలంలో ప్రజలు రెండు విధాలుగా ఉంటారు. కొందరు ఈ కల్లోలాల ప్రభావానికి గురికారు. వారు కల్లోలాల విషయాలను తిరస్కరిస్తూ ఉంటారు. మంచిని ఆదేశిస్తూ, చెడును వారిస్తూ ఉంటారు. వారి హృదయం తెల్లని రాయిలా ఉంటుంది. ఇంకా ప్రళయం వరకు ఎటువంటి కల్లోలం కూడా వారికి నష్టం కలిగించ లేదు. ఈ కల్లోలాలకు ప్రభావితులైన వారి హృదయం నల్లగా మారిపోతుంది. వారు మంచి విషయాలను అర్థం చేసుకోలేరు, చెడు విషయాలను తిరస్కరించనూలేరు. వారి నరనరాల్లో కోరికలు, ఐహిక వాంఛలు నిండి ఉంటాయి. వీరు ఎల్లప్పుడూ కల్లోలాలకు, ఉపద్రవాలకు గురవుతూ ఉంటారు.  ఒక ‘హదీసు’లో ప్రవక్త (స) ప్రవచనం, ”నేను దైవాన్ని నా అనుచర సమాజాన్ని బూడిదపాలు చేసే కరువు కాటకాలకు గురిచేయవద్దని ప్రార్థించాను. దైవం నా విన్నపాన్ని స్వీక రించాడు.” ‘ఉమర్‌ (ర) కరువు కాటకాలు ఏర్పడినపుడు ప్రజల నుండి జకాత్‌ తీసుకోలేదు. అంటే కల్లోలాల వల్ల ప్రభావితులయ్యే హృదయం బూడిద, లేదా బొగ్గులా నల్లగా అయిపోతుంది. అందులో ఎటువంటి మేలు ఉండదు. అది తిరగవేసిన కూజాలా అయిపోతుంది. అయినప్పటికీ ప్రజలు ఫలానావ్యక్తి కుటుంబం చాలా గొప్ప అమానతుదారు అని, గొప్ప నిజాయితీపరులని, చాలా బుద్ధిమంతులని, చాలా ఉత్తములని చెప్పు కుంటారు. వాస్తవం ఏమిటంటే అతని హృదయంలో ఒక్క రవ్వకూడా విశ్వాసం ఉండదు. నిజాయితీ ఉండదు. ‘హదీసు’ ఉల్లేఖనకర్త హుజై’ఫహ్ (ర) కథనం: ”నా పై ఒక కాలం వచ్చింది. కాని నేను దానిపట్ల ఏమాత్రం పట్టించుకో లేదు. వ్యాపారంలో అరువు ఇస్తే, తిరిగి ఇచ్చేవారు కాదు. అందువల్ల నేను ఇటువంటి వ్యవహారం కొంతమందితోనే చేస్తాను. ఎందుకంటే వారు తిరిగి చెల్లిస్తారని నాకు నమ్మకం అయింది గనుక. (బు’ఖారీ, ముస్లిమ్‌)

[2]) వివరణ-5382: ఈ ‘హదీసు’ ద్వారా తెలిసిన విషయం ఏమిటంటే, అల్లాహ్‌(త) మరియు ఆయన ప్రవక్త (స) ఆదేశాలను, ఉపదేశాలనూ అనుసరిస్తూ ఉంటే అల్లాహ్‌(త) సంతోషించి ప్రపంచంలో విశాలమైన ఉపాధి ప్రసాదిస్తాడు. పరలోకంలో సాఫల్యం ప్రసాదిస్తాడు. దానికి వ్యతిరేకంగా చేస్తే, అల్లాహ్‌(త) కల్లోలాలకు, ఉపద్రవాలకు గురిచేస్తాడు.

[3]) వివరణ-5383: అంటే కారు మేఘాల్లా ఉపద్రవాలు, కల్లోలాలు వ్యాపిస్తాయి. అందులో సత్యాసత్యాలను పరికించటం కష్టం అవుతుంది. మనిషి ఇటువంటి క్లిష్ట పరిస్థితులకు గురయి అవిశ్వాసానికి, మార్గభ్రష్టత్వానికి గురవుతాడు. అల్లాహ్‌(త) మనందర్నీ వీటి నుండి కాపాడుగాక! ఆమీన్‌!

[4]) వివరణ-5384: ఈ ‘హదీసు’లో ప్రవక్త (స) తర్వాత బహిర్గతమయ్యే ఉపద్రవాల గురించి సూచించడం జరిగింది. ఉదా: ఉస్మాన్‌ () వీరమరణం, పరిష్కారం కాని ఈ ఉపద్రవంలో తక్కువగా ప్రయత్నించేవాడు. అధికంగా ప్రయత్నించేవానికంటే ఉత్తముడు. అందువల్లే అనేకమంది ప్రవక్త (స) అనుచరులు ఉపద్రవకాలంలో ఏకాంతాన్ని అనుసరించారు. (తుహ్‌ఫతుల్‌ అఖ్‌యార్‌) 

ఇమామ్‌ నవవీ అభిప్రాయం: ముస్లిములు పరస్పరం చంపు కోరాదు. ఉపద్రవాల్లో పాల్గొనకుండా వేరుగా ఉండాలి. ఇతరులను చంపుతున్నప్పుడు రక్షించాలి. కొందరు తన్నుతాను రక్షించడం ధర్మసమ్మతమని, రక్షించడం తప్పనిసరి అని పేర్కొన్నారు. ఉపద్రవాల్లో సత్యాన్ని అనుసరించాలి. సత్యవంతులకు సహాయం చేయాలి. ద్రోహులతో పోరాడాలి. విషయం అర్థం కానపుడు ఏకాంతం అనుసరించాలి.

అబూ బక్‌రహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”భవిష్యత్తులో అనేక ఉపద్రవాలు తలెత్తుతాయి. గుర్తుంచుకోండి! ఆ ఉపద్రవాల తర్వాత వాటన్నిటికంటే ఘోరమైన ఉపద్రవం తలెత్తుతుంది. దాని తరువాత వాటి కంటే కఠినమైన ఉపద్రవం తలెత్తుతుంది. ఆ సమయంలో కూర్చున్నవ్యక్తి నడిచేవాడికంటే ఉత్తముడు. నడిచేవాడు పరిగెత్తేవానికంటే ఉత్తముడు. గుర్తుంచుకోండి!  ఇటువంటి ఉపద్రవాలు తలెత్తితే, ఒంటెలు ఉన్నవారు, అవి అడవిలో మేస్తుంటే అతడు తన ఒంటెల వద్దకు వెళ్ళిపోవాలి. అంటే పల్లె, పట్టణం వదలి కొండలపై, అడవుల్లోకి వెళ్ళి నివసించాలి. మేకలున్నవారు, తమ మేకల్ని తీసుకొని అడవుల్లోనికి వెళ్ళి నివాసం ఏర్పరచు కోవాలి. పట్టణాలు, నగరాలు వదలివేయాలి. ఉపద్రవాలు కొనసాగుతున్నప్పుడు ఒంటెలు, మేకలు లేకపోతే భూమి మాత్రమే ఉంటే, అతడు తన భూమిలోనికి వెళ్ళిపోవాలి,’ అని అన్నారు. ఒక వ్యక్తి, ‘ఓ ప్రవక్తా! ఒకవేళ ఎవరి వద్దనైనా ఒంటె, మేక, భూమి లేకపోతే ఏంచేయాలి,’ అని విన్నవించుకున్నాడు, దానికి ప్రవక్త (స), ‘అతడు తన కరవాలాన్ని రాతిమీద కొట్టి దాన్ని పనికిరాకుండా చేయాలి. ఆ తరువాత ఏవిధంగానైనా రక్షించుకోవటానికి ప్రయత్నించాలి.’ ఆ తరువాత ప్రవక్త (స) ఇలా ప్రార్థించారు: ”ఓ అల్లాహ్‌! నేను నీ ఆదేశాలను అందజేసాను,” అని అన్నారు. ఒక వ్యక్తి, ”ఓ ప్రవక్తా! ఆ ఉపద్రవంలో పాల్గొనమని నన్ను బలవంతంచేసి, నన్ను ఎవరో ఒకరు చేర్చుకుంటే, అక్కడ ఎవరైనా నాపై దాడిచేసినా, లేదా బాణం వదలినా, అది నాకు తగిలితే నేను చంపివేయబడితే నా గురించి మీ అభిప్రాయం ఏమిటి?” అని విన్నవించు కున్నాడు. దానికి ప్రవక్త (స), ”నిన్ను చంపినవాడు నీకు, అతనికి చెందిన పాపాలను మోస్తూ నరకంలో ప్రవేశిస్తాడు. నీవు వీరమరణం పొందుతావు, ఇది మహత్తరమైన సాఫల్యం.” (ముస్లిమ్‌)

[5]) వివరణ-5387: అంటే భవిష్యత్తులో మీ ఇళ్ళపై ఉపద్రవాల, కల్లోలాల వర్షం కురుస్తుందని ప్రవక్త (స) భవిష్యవాణి పలికారు. ప్రవక్త (స) భవిష్యవాణి నిజమయింది. ‘ఉస్మాన్‌ (ర)ను మదీనహ్ మునవ్వరహ్లో చుట్టుముట్టి చంపటం జరిగింది. ‘ఉస్మాన్‌ () వీరమరణం పొందారు. ఆ సమయంలో మదీనహ్ మునవ్వరహ్ వీధుల్లో ఉపద్రవమే కానవచ్చేది. ఇంకా పరస్పరం రక్తపాతం, జమల్ యుద్ధం, సిఫ్ఫీన్యుద్ధం,  కర్బలా యుద్ధం మొదలైనవి సంభవించాయి. అంటే ప్రవక్త (స) వీటిని గురించే సూచించినట్లు అనిపిస్తుంది.

[6]) వివరణ-5388: ఈ భవిష్యవాణి జరిగితీరింది. ‘ఉస్మాన్‌ (ర), ‘హుసైన్‌ (ర)ల వీరమరణాల ద్వారా బహిర్గతం అయ్యింది.

[7]) వివరణ-5389: అంటే ప్రజలు ఐహికవాంఛల్లో, సుఖాల్లో నిమగ్నులయిపోతారు. వారికి ఒకసంవత్సరం ఒకనెలలా, ఒకవారం ఒకదినంలా గడుస్తుంది. లేదా రాత్రీపగలు సమానం అయిపోతాయి. లేదా రాత్రీపగలు చిన్నవై పోతాయి. అంటే ఇవన్నీ ప్రళయసూచనలు. లేదా దుర్మార్గాలు, కల్లోలాలు చాలా దగ్గరకు వచ్చేస్తాయి. అల్లాహ్‌(త)ను ప్రార్థించేవారెవరూ ఉండరు. లేదా ప్రభుత్వాలు త్వరగా మారుతుంటాయి. లేదా వయస్సులు తగ్గుతూ ఉంటాయి. లేదా కాలం నుండి శుభం దూరమవుతూ ఉంటుంది మొదలైనవి.

[8]) వివరణ-5391: ఎందుకంటే ఇటువంటి కాలంలో వినయ విధేయతలతో, భక్తి శ్రధ్ధలతో ఆరాధన జరుగుతుంది. అందువల్ల దానికి పుణ్యం కూడా అధికంగానే లభిస్తుంది.

[9]) వివరణ-5394: ఈ ‘హదీసు’ద్వారా ప్రజల్లో హత్యలు, హింసలు వారి అజ్ఞానం వల్ల జరుగుతాయని తెలిసింది. పరస్పర భేదాభిప్రాయాలు ఒక భయంకరమైన ఉపద్ర వానికి కారకం అవుతాయి. ఈ కారణం వల్ల ఉపద్రవాలు, కల్లోలాలద్వారా నేలపై సంభవించిన మొదటి అధర్మ హత్య ‘ఉస్మాన్‌ (ర) ది. ఇప్పుడు ఈ దుర్మార్గాలు, హత్యలు ప్రళయం వరకు ఆగవు.

[10]) వివరణ-5395: ఈ నలుగురి పరిపాలన ప్రవక్త (స) పద్ధతి ప్రకారం ఉండేది. వీరి పరిపాలనాకాలంలో ఎటు వంటి హింసా, దౌర్జన్యాలు జరగలేదు. వీరి పరిపాలన కాలం మొత్తం: 29 . 7 నెలలు. వీరందరూ ఖలీఫాలే. అబూ బకర్‌: 2 సం. 4 నెలలు; ఉమర్: 10 సం. 6 నెలలు; ఉస్మాన్‌:12 ; అలీ: 4 . 9 నెలలు, హసన్: 5 నెలలు.

[11]) వివరణ-5397: ఇదంతా హుర్ర యుద్ధంలో జరిగింది. ఈ యుద్ధం 32 హిజ్రీలో జరిగింది. అబూ జ’ర్‌ (ర), ‘ఉస్మాన్‌ (ర) పరిపాలన చివరికాలంలో మరణించారు. ఏది ఏమైనా ఈ యుద్ధంలో అబూ జ’ర్‌ (ర) పాల్గొనలేదు. అబూ జ’ర్‌ ‘గిఫారీ (ర) రబ్‌’జహ్లో ఉండేవారు. అక్కడే ఆయన మరణించారు.

[12]) వివరణ-5398: ప్రవక్త (స) అబ్దుల్లాహ్ బిన్అమ్ర్తో ఇలా అన్నారు, ”నీవు ప్రజలతో ప్రేమాభిమానాలతో వ్యవహరించాలి, ఇంకా నిన్ను నీవు సరిదిద్దుకోవటానికి ప్రయత్నిస్తూ ఉండాలి. ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘అమ్ర్‌ తన యవ్వనంలో ఎల్లప్పుడూ దైవభీతి, దైవభక్తి, దైవారాధనలో గడిపేవారు. అధికంగా ఉపవాసాలు పాటించేవారు. రాత్రిపూట పడుకునేవారు కాదు. దైవారాధనలో నిమగ్నులయి ఉండేవారు. స్త్రీల వైపు చూచేవారుకాదు. అతని తండ్రిగారు అతన్ని ప్రవక్త (స) వద్దకు తీసుకొని వచ్చి ఇతని ఆచరణ ఈవిధంగా ఉందని అన్నారు. ప్రవక్త (స) అతనికి ఉపవాసాలు, దైవారాధన తగ్గించమని సలహా ఇచ్చారు.

[13]) వివరణ-5407: 36 హిజ్రీలో జమల్ యుధ్ధం సంభ వించింది. 36 హిజ్రీలో సిఫ్ఫీన్ యుధ్ధం సంభవించింది. 70 హిజ్రీలో బనూ ఉమయ్యహ్ అధికారం పతనమై పోయింది, బనూ అబ్బాస్ అధికారంలోకి వచ్చారు.

[14]) వివరణ-5409: ఉస్మాన్ (ర) వీరమరణం సంఘటన చాలా భయంకరమైనది. దీన్ని వినడానికి, అర్థం చేసుకోవటానికి, వ్రాయటానికి చాలా ఓర్పు, సహనం, స్థిరత్వం, ధైర్యం ఉండాలి. ఖులఫాయె రాషిదీన్ నుండి ‘ఉస్మాన్‌ (ర) వీరమరణం గురించి సంక్షిప్తంగా ఇక్కడ పేర్కొంటున్నాము. ‘ఉస్మాన్‌ (ర) 12 సంవత్సరాల పరిపాలనలో మొదటి 6సంవత్సరాలు ప్రశాంతంగా, శాంతి భద్రతలతో, విజయాలతో, యుద్ధధనం రాబడితో, ఉద్యోగాలతో, వ్యవసాయ, వ్యాపార అభివృద్ధితో, అనేక రంగాల్లో అభివృద్ధితో గడిచాయి. ప్రజలు సుఖ-విలాసాలకు అలవాటుపడ్డారు. అన్నివైపుల సుఖసంతోషాలు విలసిల్లసాగాయి. ప్రవక్త (స) షైఖుల్ఇస్లామ్అనే బిరుదు ఇచ్చిన అబూ ర్ ‘గిఫారీ (ర) వీటికి వ్యతిరేకంగా హితబోధలు, హెచ్చరికలు చేసేవారు. ఇంకా అవసరానికి మించి ధనం కూడబెట్టటం ఒక ముస్లిమ్‌కు తగదని సూచించేవారు. ముఆవియా () సిరియాదేశాన్ని పాలించేవారు. ఈ దేశం అనేక సంవత్సరాలు రూమీల చేతుల్లో కష్టాలు భరిస్తూ ఉండేది. అక్కడి ముస్లిముల్లో చాలా చెడుగులు జనింపసాగాయి. అబూ జ’ర్‌ (ర) బహిరంగంగా పాలకులకు, ధన వంతులకు వ్యతిరేకంగా విమర్శించేవారు. దీనివల్ల ప్రభుత్వానికి ఆటంకాలు ఏర్పడేవి. అందువల్ల ము’ఆవియ కోరికపై ‘ఉస్మాన్‌ (ర) అబూ జ’ర్‌ (ర)ను మదీనహ్ పిలిపించుకున్నారు. కాని ఇప్పుడు ఆ మదీనహ్ లేదు. విదేశీయుల పెద్దపెద్ద భవనాలు నిర్మించ బడ్డాయి. అందువల్ల అబూ జ’ర్‌ (ర) ఇక్కడ కూడా సహించలేక రబ్జహ్ అనే ప్రాంతంలో నివాసం ఏర్పరచుకున్నారు.

ఉస్మాన్‌ (ర) చివరి కాలంలో ఉపద్రవం తలెత్తటానికి అసలు కారణం అధిక ధనాకాంక్షలు, ఐహిక వాంఛలు. ఇవే చివరికి పతనావస్థకు చేర్చుతాయి. అందువల్లే ప్రవక్త (స) ముస్లిముల నుద్దేశించి, ”నేను మీ దారిద్య్రాన్ని గురించి భయపడటం లేదు, అసలు నేను భయపడేది మీ ధనసంపదల ప్రమాదాల గురించే,” అని అన్నారు. ధనసంపదలు అధికం కావటంవల్ల ప్రతివ్యక్తి, ప్రతివర్గం, వ్యక్తిగత లాభాలకు ప్రాధాన్యత ఇవ్వటం జరుగుతుంది. ఈర్ష్యాద్వేషాలు,  శత్రుత్వాలు పెరుగుతాయి. ఐక్యత దెబ్బతింటుంది. పతనం ప్రారంభమవుతుంది. అయితే ఇంకాఅనేక కారణాలు కూడా ఉన్నాయి.

1. అన్నిటికంటే మొదటి కారణం ఏమిటంటే, ప్రవక్త (స) అనుచరుల సంతానం ప్రత్యక్షంగా ప్రవక్త (స) ద్వారా లాభంపొందేది.  అది ఇప్పుడు నశించింది. మిగిలి ఉన్న వారు కూడా తమ వృధ్ధాప్యం వల్ల ఏకాంతం అనుసరించారు. వారి సంతానం వారి స్థానాన్ని స్వీకరించ సాగింది. ఈ యువకులు దైవభీతి, భక్తి, న్యాయం, ధర్మం, సత్యం మొదలైన విషయాల్లో తమ పెద్దలకంటే తక్కువ స్థానంలో ఉండేవారు. ఈ కారణంగా ప్రజలదృష్టిలో తమ పెద్దలకు సరిసమానులు కాలేక పోయారు.

2. అబూ బకర్‌ (ర) సలహా వల్ల, ముస్లిముల ఇష్టప్రకారం పరిపాలనా బాధ్యతలు ఖురైష్వంశానికి అప్ప జెప్పటం జరిగింది. పెద్దపెద్ద పదవులు వీరికే లభించేవి. ఫలితంగా ఖురైష్‌ యువకులు దీన్ని తమ ఆస్తిగా భావించి, ఇతర అరబ్‌ తెగలను హీనదృష్టితో తమ పాలితులుగా చూడటం ప్రారంభించారు. అరబ్‌ తెగలు విజయాల్లో తమ శ్రమకూడా ఉందని భావించే వారు. అందువల్ల ఉద్యోగాల్లో పదవుల్లో సరిసమాన ప్రాధాన్యత ఉండాలన్నది వారి వాదన.

3. ఆ కాలంలో కాబూల్నుండి మరాఖిష్ వరకు ఇస్లామీయ పరిపాలన ఉండేది. ఇందులో అనేక జాతులు ఉండేవి. ఈ పాలితుల హృదయాల్లో ముస్లిములపట్ల ప్రతీకారజ్వాల ఉండేది. కాని బలంలేక మౌనంగా ఉండేవారు. అందువల్ల వారు కుట్రలు, కుతంత్రాలు పన్నసాగారు. ఇందులో అందరికంటే ముందు యూదులు, అగ్ని ఆరాధకులు ఉండేవారు.

4. ‘ఉస్మాన్‌ (ర) సాధారణంగా పుణ్యాత్ములు, గౌరవ మర్యాదలు గలవారు. సున్నిత స్వభావులు. సాధారణంగా ప్రజలపట్ల కఠినంగా వ్యవహరించేవారు కారు. నేరాలపట్ల కూడా ఉదారంగా వ్యవహరించేవారు. అందువల్ల అల్లరిమూకల ధైర్యం పెరిగిపోయింది.

5. ఉస్మాన్‌ () ఉమవీ వంశానికి చెందినవారు. అందువల్ల అతను తన కుటుంబీకులపట్ల శ్రేయోభి లాషిగా వ్యవహరించేవారు. వారికి లాభం చేకూర్చాలని ఆశించేవారు. తన ధనంలోనుండి వారికి సహాయం చేసే వారు. కాని అల్లరిమూకలు ‘ఉస్మాన్‌ (ర) ప్రభుత్వ ధనాన్ని వారికి ఇస్తున్నారనే అపోహ వ్యాపింపజేసారు.

6. ప్రతి నాయకుని విజయానికి అతని సహచరుల, కార్యకర్తల, ప్రజల విధేయత తప్పనిసరి అవుతుంది. రెండవతరం, మొదటితరం స్థానం తీసుకుంటున్న సమయం అది. నాయకుని విధేయతపట్ల మొదటి తరంలో ఉన్నంత ఉత్సాహం రెండవతరంలో లేకపోయింది. ఇటువంటి పరిస్థితుల్లో ఉస్మాన్‌ (ర) ప్రభుత్వ వ్యవస్థను పటిష్ఠత చేకూర్చడానికి బనీ ఉమయ్యలో నుండి అధికులను ప్రభుత్వంలోకి తీసుకున్నారు.

7. అనేక తెగలవారిలోని అల్లరిమూకలు పరిస్థితులను మార్చటానికి ఉద్యమాన్ని ఎన్నుకున్నారు.

8. ముస్లిములుగా మారిన విదేశీయులు లేదా ముస్లిములు పెళ్ళాడిన విదేశీస్త్రీలు, లేదా బానిసరాళ్ళు, వారి సంతానం ఈ ఉపద్రవానికి కారకులయ్యారు.

ఈ సంఘటనపై సూక్ష్మ దృష్టితో ఆలోచిస్తే ఈ ఉపద్రవానికి పైన పేర్కొన్న విషయాలే కారణమని స్పష్టమవుతుంది. ఉదా: 1. బనూహాషిమ్, బనూఉమయ్య అభివృద్ధి, విజయాలను ఇష్టపడేవారు కారు. ప్రభుత్వ పదవులకు తామే యోగ్యులమని భావించేవారు. 2. ఇతర తెగల ప్రజలు కూడా ఆస్తిపాస్తుల్లో, పదవుల్లో తమ్ముతాము ఖురైషులకంటే తక్కువేమీకాము అని భావించేవారు. అందువల్ల వారు ఖురైషు అధికారుల గర్వాహంకారా లను అణచి, తమ ధర్మబద్ధమైన స్థానం పొందాలని ప్రయత్నించేవారు. 3. అగ్ని ఆరాధకులు ఒక విప్లవం లేవదీయాలని కోరుకునేవారు. తమ సహాయంతో ఎవరైనా అధికారంలోకి వస్తే, వారికి ఇంకా అధికహక్కులు లభిస్తాయని ఆశించేవారు. ఇతరులకన్నా తమకు ప్రాధాన్యత లభిస్తుందని ఆశించేవారు. 4. ముస్లిములు చెల్లాచెదురై పోవాలని, యూదులు కోరుకునేవారు. వారి శక్తి నశించాలని, వారు బలహీనులు కావాలని, వర్గాలుగా విడిపోవాలని కోరుకునేవారు. వివిధవర్గాల ఉద్దేశ్యాలు ఈవిధంగా ఉండేవి. ప్రతివర్గం తన అవసరంకోసం ప్రయత్తిస్తూ ఉండేది. దీనికోసం కుట్రలు కుతంత్రాలు ప్రారంభమయ్యాయి.

ఉస్మాన్‌ ()ను అగౌరవపరచటానికి ప్రయత్నించటం జరిగింది. ‘ఉస్మాన్‌ (ర) ఈ కల్లోలాలను అరికట్టాలని ప్రయత్నించారు. కాని మంటలు ఎలా ఉండేవంటే, వాటిని ఆర్పడం సాధ్యం కాకపోయింది. రోజు-రోజుకూ అల్లరిమూకల ఆగడాలు అధికం కాసాగాయి. దేశంలో ఒక రహస్య బృందం తయారై కల్లోలాలకు పాల్పడుతూ పోయింది.

కూఫా విప్లవకారుల్లో అష్తర్ నఖయీ, ఇబ్ను జిల్హబ్, జున్దుబ్సఅసఅ, ఇబ్నుల్కవార్కమీల్, ‘ఉమైర్బిన్జాబీ ప్రముఖులు. వీరు ప్రభుత్వం ఖురైషుల చేతిలో ఉండరాదని భావించేవారు. ముస్లిము లందరూ విజయాలు సాధించారు. అందువల్ల అది అందరికీ వర్తిస్తుందని భావించేవారు. సయీద్బిన్ఆస్ (ర)కు ఈ బృందంతో వ్యతిరేకత ఉండేది. ఇతన్ని అప్రతిష్టపాలు చేద్దామని ప్రతిరోజు ఒక్కో క్రొత్త కుట్ర పన్నడం ప్రారంభమయింది. ఖురైషులకు వ్యతిరేకంగా దేశాన్నంతటినీ మలచేందుకు అనేకరకాల కుతంత్రాలు పన్నటం జరిగేది. కూఫాప్రజలు ఈ అల్లరి మూకల ఆగడాలకు విసిగి ‘ఉస్మాన్‌ (ర)కు విన్నవించు కున్నారు. ఈ కల్లోలాలను వెంటనే పరిష్కరించమని కోరారు. ‘ఉస్మాన్‌ (ర) విప్లవకారుల బృందానికి సంబంధించిన 10 మందిని దేశబహిష్కరణ చేసారు.

అదేవిధంగా స్రాలో కూడా కల్లోలాలకు పాల్పడే మరో బృందం కూడా ఉనికిలోకి వచ్చింది. ‘ఉస్మాన్‌ (ర) వీరిలోని కొందరిని కూడా దేశబహిష్కరణచేసారు. కాని అప్పటికీ కల్లోలమంటలు దేశమంతావ్యాపించాయి. ఈ మామూలు నీటిచారలు ఈ మంటల్ని ఆర్పలేక పోయాయి. ఈ కల్లోలమంటలు దేశమంతా వ్యాపించాయి.

ఈజిప్టు కుట్రలకు కుతంత్రాలకు కేంద్రంగా మారింది. ముస్లిముల బద్ధశత్రువులు యూదులు. ఒక యూదుడు అబ్దుల్లాహ్బిన్సబా తన చాతుర్యంతో విప్లవకారు లందరినీ ఒకచోట చేర్చాడు. వారిని బలోపేతం చేయటానికి అనేకరకాల నూతన నమ్మకాలు, ఆచారాలు ఉనికిలోకి తెచ్చాడు. దేశవిదేశాల్లో దీన్ని గురించి ప్రచారం చేశాడు. ప్రస్తుత షియవర్గం ఈ నమ్మకాలపైనే స్థాపించబడింది. విప్లవకారులు దేశమంతా వ్యాపించారు. అయితే వీరిలో ప్రతి ఒక్కరి ఆలోచన వేరుగా ఉండేది.

ఈజిప్టు ప్రజలు అలీ ()కు ప్రాధాన్యత ఇచ్చేవారు. స్రా ప్రజలు తల్హా ()ను సమర్థించేవారు. కూఫా వారు జుబైర్‌ ()ను ఇష్టపడేవారు. ఖురైషుల్లోని ఒక బృందం ఖురైషుల పట్ల ద్వేషభావం, శత్రుత్వం కలిగి ఉండేది. మరోబృందం అరబ్బులకు వ్యతిరేకంగా ఉండేది. అయితే ‘ఉస్మాన్‌ (ర) తొలగింపుపై అందరూ ఏకాభి ప్రాయం కలిగి ఉండేవారు. అబ్దుల్లాహ్బిన్సబా తన చాతుర్యత ద్వారా వీరిలో విభేదాలు ఉన్నా అందరినీ ఒక అభిప్రాయంపై ఏకంచేసాడు. అంటే ‘ఉస్మాన్‌ (ర)ను తొలగించాలన్నదే ప్రధాన అంశంగా మారింది. దేశమంతా తన అనుచరులను వ్యాపింపజేసాడు. దేశాన్ని అశాంతికి, కల్లోలాలకు గురిచేయడమే అతని అసలు ఉద్దేశం.

ఇంకా తన అనుచరులను ఈవిధంగా ఆదేశించేవాడు.

1. ప్రజలకు హితబోధలు చేస్తూ వారిని తమ అభిమానులుగా మలచటం.

2. అధికారులను, ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రతిష్టపాలు చేయటం.

3. ప్రతిచోట నాయకుని గురించి చెడు, అధర్మ కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ప్రచారం చేయడం.

ఈ పద్ధతుల్లో చాలా కృషి ప్రయత్నాలు చేయడం జరిగింది. వలీద్బిన్ఉత్బహ్ (ర)పై మద్యపానం సేవించారని నిందించడం జరిగింది. అతనికి శిక్ష కూడా నిర్ణయించడం జరిగింది. అసలు ఇది ఒక పెద్దకుట్ర. అదేవిధంగా మూసా అష్అరీని పదవినుండి తొలగించడం కూడా వీరి కుట్రల ఫలితమే.

34 హిజ్రీలో రూమ్చక్రవర్తి 500 యుద్ధనౌకలతో, చాలా పెద్దసైన్యంతో ఇస్లామీయ తీరాలపై దాడిచేసాడు. ముస్లిములు చాలా భయభ్రాంతులయ్యారు. అప్పుడు కూడా ఈ విచ్ఛిన్నకర శక్తులు తమ కుట్రలకు కుతంత్రాలకు దూరంగా ఉండలేదు. ముహమ్మద్బిన్అబీ హుజైఫహ్, ముహమ్మద్బిన్అబీ బక్ర్ (ర) విచ్ఛిన్నకారులవలలో చిక్కుకున్నందువల్ల, సముద్ర నౌకాదళ అధికారి, అబ్దుల్లాహ్బిన్అబీ షరహ్ను అనేక విధాలుగా పీడించారు. నమాజులో అనవసరంగా తక్‌ బీర్లు పలికి ఆగ్రహానికి గురిచేసేవారు. బహిరంగంగా అబ్దుల్లాహ్బిన్అద్ను విమర్శించేవారు. సైనికు లతో, ‘మీరు రూమీలతో యుద్ధంచేయటానికి వెళ తారా? ఇక్కడ మదీనహ్ లో మీ అవసరం చాలా ఉంది,’ అని అనేవారు. ప్రజలు ఆశ్చర్యంగా, ‘మదీనహ్ లో అవసరం ఏంటి,’ అని అడిగితే, ‘ఉస్మాన్‌ (ర) పేరు ప్రస్తా వించి, ‘ఈ దుర్మార్గుణ్ణి తొలగించటం ఇస్లామ్‌ సేవ,’ అని, అబూ బకర్‌, ‘ఉమర్‌ల సాంప్రదాయాలను మరచి ప్రవక్త (స) అనుచరులైన మహావ్యక్తులను తొలగించి తన బంధుమిత్రులకు గొప్ప పదవులు అందజేసాడు,’ అని విమర్శించారు. ఏది ఏమైనా అనేక కుట్రలు, కుతంత్రాల ద్వారా ప్రజలను ప్రభావితం చేసే ప్రయత్నం జరిగింది. ము’హమ్మద్‌ బిన్‌ అబీ హుజై’ఫహ్ మరియు ము’హ మ్మద్‌ బిన్‌ అబీ బక్‌ర్‌, ఒక నావలో ప్రయాణమై వారిని వెంబడించారు. వారు ఎక్కడ ఆగితే అక్కడ వీరిద్దరూ తమ అభిప్రాయాలను వాళ్ళకు వినిపించేవారు. సైని కులు రూమీలను ఓడించి, లాభాలతో తిరిగి వచ్చారు. వారిలో కొందరు ము’హమ్మద్‌ బిన్‌ అబీ బక్‌ర్‌, ము’హ మ్మద్‌ బిన్‌ హుజై’ఫహ్ ను యుద్ధంలో పాల్గొన లేదని విమర్శించారు. దానికి వారు, ‘మేము ఈ యుద్ధంలో ఎలా పాల్గొనాలి. ఇది ‘ఉస్మాన్‌ (ర) ఆదేశించింది, దీని నాయకత్వం అబ్దుల్లాహ్బిన్అద్ చేతిలో ఉంది.’ ఆ తరువాత ‘ఉస్మాన్‌ (ర) లోపాలను ఎత్తి చూపటం జరిగింది. వీళ్ళ ప్రవర్తన చూచి ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ స’అద్‌ వాళ్ళను వారించారు. ‘అల్లాహ్ సాక్షి! ఆయన వల్ల మిమ్మల్ని విడిచి పెడుతున్నాను’ అని హెచ్చరించారు.

మదీనహ్ మునవ్వరహ్ లో కూడా విచ్ఛిన్నకర శక్తులు చోటుచేసుకొని ఉన్నాయి. అయితే ప్రవక్త (స) అనుచరులు ఉండటంవల్ల అంతగా వారిప్రభావం వ్యాపించలేదు. 35 హిజ్రీలో ‘ఉస్మాన్‌ (ర) వీరమరణం పొందారు. మదీనహ్ లోని విచ్ఛిన్నకర శక్తులు ఇతర ప్రాంతాలవారితో కలసి ‘ఉస్మాన్‌ (ర)పై దౌర్జన్యం హింస లకు పాల్పడే ధైర్యం వచ్చింది. ఒకసారి శుక్రవారం నాడు ‘ఉస్మాన్‌ (ర) మెంబరుపై ప్రసంగం ప్రారంభిస్తున్నప్పుడు ఒక వ్యక్తి నిలబడి, ” ‘ఉస్మాన్‌! దైవగ్రంథం ప్రకారం ఆచరించు,” అని అన్నాడు. దానికి ‘ఉస్మాన్‌ (ర) ”కూర్చొ” అని అన్నారు. మళ్ళీ రెండవ సారి నిలబడి ఆ వాక్యాన్నే మళ్ళీ వల్లించాడు. ‘ఉస్మాన్‌ (ర) మళ్ళీ, ‘కూర్చో,’ అని అన్నారు. ఆ వ్యక్తి మూడుసార్లు ఈ విధంగా ప్రవర్తించి ‘ఉస్మాన్‌ను ఆగ్రహానికి గురిచేసే ప్రయత్నం చేసాడు. ‘ఉస్మాన్‌ (ర) ప్రతిసారి సున్నితంగా కూర్చోమని ఆదేశించారు. కాని ఆ వ్యక్తి ముందే కుట్ర పన్ని ఉన్నాడు. అన్నివైపుల నుండి అల్లరి మూకలు రాళ్ళు, ఈటెలు విసిరి ‘ఉస్మాన్‌ (ర)ను గాయపరిచారు. ‘ఉస్మాన్‌ (ర) మెంబరుపై నుండి క్రిందపడ్డారు. కాని వినయ, వినమ్రతలతో మూర్తీభవించిన అతని వ్యక్తిత్వం ఎటువంటి ఆగ్రహానికి గురికాలేదు.

అనేక విచ్ఛిన్నకర శక్తులు తమ కుట్రలు, కుతంత్రాల ద్వారా ‘ఉస్మాన్‌ (ర)ను అప్రతిష్టపాలు చేయడానికి ప్రయత్నించాయి. ఆ కాలంలోని విద్యావంతులు కూడా ఈ సంఘటన వాస్తవికతను అర్థం చేసుకోలేనంతగా దీన్ని కల్పించటం జరిగింది. అందువల్ల ఆయనపై వచ్చిన విమర్శన లన్నింటినీ మీ ముందుంచి అసలు సంఘటనను తేటతెల్లం చేయాలని నిశ్చయించు కున్నాం. అతని(ర)పై వచ్చిన విమర్శనలు ఇవి:

1. ప్రవక్త (స) సహచరులు అయిన అబూ మూసా అష్అరీ (ర), ముగీరహ్ బిన్షూబహ్ (ర), అమ్ర్బిన్ఆస్ (ర), అమ్మార్బిన్యాసిర్ (ర), అబ్దుల్లాహ్బిన్మస్ఊద్ (ర), అబ్దుర్రహ్మాన్బిన్అర్ఖమ్ (ర)లను తొలగించి అనుభవంలేని తన కుటుంబంవారిని, వారి స్థానంలో నియమించారు.

2. ప్రభుత్వ నిధిలో అనవసరంగా అధికారం చెలాయించారు. అనవసరంగా తన కుటుంబంలోని వారికి, సహాయ సహకారాలు అందించటం చేసారు. హకమ్బిన్అల్ఆస్ను ప్రవక్త (స) బహిష్కరించారు. ఉస్మాన్‌ (ర) అతన్ని మదీనహ్ రమ్మని అనుమతి ఇచ్చారు. ఇంకా ప్రభుత్వ నిధి నుండి 1,00,000 (ఒక లక్ష) దిర్‌హమ్‌లు ఇచ్చారు. ఇంకా అతని కొడుకు’ హారిస్ను బజారులో అమ్మే వస్తువులపై 1/10 వంతు వసూలు చేసే అనుమతి ఇచ్చారు.

3. మర్వాన్కు ఆఫ్రికా యుద్ధ ధనంలోని 5వ వంతు ఇవ్వటం జరిగింది. అదేవిధంగా అబ్దుల్లాహ్బిన్ఖాలిద్కు 3 లక్షల దిర్‌హమ్‌లు బహుమతిగా ఇవ్వటం జరిగింది. ఇంకా తన కుమార్తెలకు, ప్రభుత్వనిధికి చెందిన విలువైన వజ్రాలను ఇవ్వటం జరిగింది. అయితే ‘ఉమర్‌ (ర) ఇటువంటి ఆధిపత్యాన్ని తీవ్రంగా వ్యతిరేకించేవారు. అంతేకాక ఒక విలాస వంతమైన భవనం నిర్మించి, దాని ఖర్చంతా ప్రభుత్వ నిధిపై వేసారు. 

4. ప్రభుత్వనిధికి సంబంధించిన అధికారులు, అబ్దుల్లాహ్బిన్అర్ఖమ్ (ర) మరియు ముఐఖీబ్లు దీనిపై అభ్యంతరం వ్యక్తంచేస్తే, వారిని తొలగించి, జైద్బిన్సాబిత్ కు ఆ పదవి అప్పజెప్పారు. ఒకసారి ప్రభుత్వ నిధినుండి జీతాలు పంచిన తర్వాత లక్ష దిర్‌హమ్‌లు మిగిలాయి. ‘ఉస్మాన్‌ (ర) అనవసరంగా ఈ ధనాన్ని ‘జైద్‌ బిన్‌ సా’బిత్‌కు ఇచ్చివేసారు. అబ్దుల్లాహ్బిన్మస్ఊద్ మరియు ఉబయ్బిన్అబ్ పెన్షన్లు ఆపివేసారు. మదీనహ్ చుట్టుప్రక్కల ప్రాంతమైన బఖీని ప్రభుత్వ మైదానంగా తీర్మానించారు. ప్రజలు అందులోకి వెళ్ళ రాదని ఆదేశించారు.

5. మదీనహ్ బజారులోని కొన్నివస్తువుల క్రయవిక్రయాలు తనకోసం ప్రత్యేకించుకున్నారు. ఖర్జూరం గింజలు ఖలీఫాకు చెందిన వ్యక్తికే అమ్మాలని ఆదేశించారు.

6. తన క్రింది అధికారులకు, బంధువులకు దేశంలోని వివిధ భాగాల్లో, పెద్దపెద్ద భూములు ఇవ్వడం జరిగింది. అంతకు ముందు ఎవరూ అలా చేయలేదు.

7. ప్రవక్త (స) అనుచరుల్లోని కొందరిని అవమానించి, దేశబహిష్కరణకు గురిచేసారు. అబూ జ’ర్‌ ‘గిఫారీ, ‘అమ్మార్‌ బిన్‌ యాసిర్‌, జున్‌దుబ్‌ జనాదహ్‌, ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ మస్‌’ఊద్‌, అబ్బాద్‌ బిన్‌ సా’మిత్‌ల పట్ల అన్యాయంగా ప్రవర్తించారు.

8. జైద్బిన్సాబిత్ తయారు చేసిన ఖుర్‌ఆన్‌ ప్రతిని కాల్చి వేసారు.

9. హద్దుల విషయంలో అశ్రద్ధగా వ్యవహరించారు.

10. ఫరాయి’ద్ విషయంలో బలహీన ఉల్లేఖనాలను అనుసరించారు. అయితే అబూ బకర్‌, ‘ఉమర్‌లు క్షుణ్ణంగా పరిశీలించనంత వరకు వాటిని స్వీకరించేవారు కారు.

11. ధర్మంలో కొన్నిచోట్ల క్రొత్త ఆచారాలు కల్పించారు. చాలామంది ప్రవక్త(స) అనుచరులు దీన్ని వ్యతిరేకించారు. ఉదా: హజ్‌ సందర్భంగా రెండు రకాతులకు బదులు 4 రకాతులు నిర్ణయించడం. అయితే ప్రవక్త (స) ఆ తరువాత ఇద్దరూ ఏనాడూ రెండు రకాతులకంటే ఎక్కువ చదవలేదు.

12. ఈజిప్టు బృందంతో వాగ్దానభంగం చేయబడింది. ఫలితంగా ‘ఉస్మాన్‌ (ర) వీరమరణం రూపంలో బహిర్గతం అయ్యింది. ఈ సంఘటనల ద్వారా ‘ఉస్మాన్‌ (ర) ను  అప్రతిష్ఠపాలు చేయడం జరిగింది. కాని ఇందులో ఒక్కటి కూడా నమ్మదగినది కాదు. ఇందులో ఎంత సత్యం ఎంత అసత్యం ఉందో పరికించాలి. అన్నిటికంటే మొదటి ఆరోపణ ఈ విధంగా ఉంది.

1. ప్రవక్త (స) అనుచరులను పదవుల నుండి తొలగించారు.

2. క్రొత్తవారిని, అనుభవం లేనివారిని పదవులు అప్పగించారు.

3. ఇంకా తన కుటుంబం వారికి ప్రాధాన్యత ఇచ్చారు.

సూక్ష్మదృష్టితోచూస్తే, ఒకవేళ ఈవిమర్శ సరైనదే అయితే, ‘ఉమర్‌ (ర) కాలంలో ఎందుకు విమర్శించలేదు. ఒకే పని ఇద్దరు చేస్తే ఒకరిని ప్రశంసించటం, మరొకరిని విమర్శించటం తగదు. అదేవిధంగా ‘అలీ (ర) కూడా ఈ విధంగా ప్రవర్తించారు. విచారించే, పరిశోధించే, పరికించే ఆలోచన ఎవరికీ రాకపోవడం ఆశ్చర్యకరం.

‘ఉస్మాన్‌ (ర) తొలగించిన ప్రవక్త (స) అనుచరుల్లో అమ్ర్బిన్అల్స్, అద్బిన్వఖ్ఖాస్, అబూ మూసా అష్అరీ గురించి ఇంతకు ముందు ప్రస్తావించటం జరిగింది. ఎందుకంటే ఈజిప్టు గవర్నర్అయిన అమ్ర్ బిన్అల్స్ (ర), ఇస్కందరియ్య విద్రోహాన్ని తుదముట్టించడానికి, వాళ్ళ పట్ల అన్యాయంగా ప్రవర్తించారు. వారి స్త్రీలను బానిసరాళ్ళుగా చేసు కున్నారు. ఇంకా కాలువలు ప్రారంభించినప్పటికీ ఈజిప్టు ప్రజానిధిని అభివృద్ధి పరచలేకపోయారు. అయితే ఆయన్ను తొలగించి అబ్దుల్లాహ్బిన్అబీ సర్రహ్ను నియమించిన తర్వాత ఎన్నో రెట్లు మెరుగయింది. అదేవిధంగా కూఫా పాలకులయిన అద్బిన్అబీ వఖ్ఖాస్, ప్రభుత్వ నిధినుండి ఒక పెద్ద మొత్తం అప్పుగా తీసుకున్నారు. దాన్ని తిరిగి ఇవ్వటంలో ఆలస్యం చేస్తూపోయారు. చివరికి ప్రభుత్వ నిధి అధికారులైన అబ్దుల్లాహ్బిన్మస్ఊద్తో వాగ్వివాదం జరిగింది. అబూ మూసా అష్అరీ, బ’స్‌రహ్‌ ప్రజల్ని సంతోషపరచలేక పోయారు. బ’స్రహ్ ప్రజలు వారికి వ్యతిరేకులైపోయారు. వారి బృందం రాజధానికి వెళ్ళి వాళ్ళను తొలగించమని కోరారు.

     ఈ కారణాలన్నీ వాళ్ళను తొలగించడానికి చాలవా? ముగీర బిన్షూబహ్ పై లంచం తీసుకున్నారని ఆరో పించడం జరిగింది. ఇది అవాస్తవం అయినప్పటికీ ‘ఉస్మాన్‌ (ర) అతన్ని తొలగించారు. ఎందుకంటే అబ్దుల్లాహ్ బిన్ ‘ఉమర్‌ (ర) అతని స్థానంలో, అద్బిన్అబీ వఖ్ఖాస్ను నియమించమని రికమండేషన్‌ చేసారు. ‘అమ్మార్‌ బిన్‌ యా’సిర్‌ను, ‘ఉస్మాన్‌ (ర)  తొలగించ లేదు, అతడు ‘ఉమర్‌ (ర) పరిపాలనా కాలంలోనే తొలగించబడ్డారు. అదే విధంగా అబ్దుల్లాహ్బిన్మస్ఊద్ (ర)ను అకారణంగా తొలగించడం జరిగింది. ప్రజలు ‘ఉస్మాన్‌ (ర)ను అతని పట్ల అసంతృప్తికి గురిచేయడం జరిగింది. అందువల్ల అతన్ని తొల గించడం తప్పనిసరి అయిపోయింది. ఇక ప్రభుత్వ నిధి అధికారులైన ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ అర్‌ఖమ్‌, మయీఖిబ్‌ (ర)లను వారి వృద్ధాప్యం వల్ల తొలగించడం జరిగింది.

  దీన్నిగురించి ఒక బహిరంగ సభ ఏర్పాటుచేసి, ”ప్రజలారా! ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ అర్‌ఖమ్‌ (ర), అబూ బకర్‌, ‘ఉమర్‌ల, కాలంనుండి ఇప్పటి వరకు సేవలందించారు. ఇప్పుడు వృద్ధాప్యానికి చేరుకున్నారు. అందువల్ల అతని బాధ్యతలను ‘జైద్‌ బిన్‌ సా’బిత్‌కు అప్పగించడం జరిగింది అని ప్రకటించారు. ఎందుకంటే ధనాగార బాధ్యత చాలా గొప్పది, కష్టమైనదీను. వృద్ధాప్యంవల్ల వీరు తమ బాధ్యతలను సరిగా నిర్వర్తించలేనందువల్ల వీరిని తొలగించటం జరిగింది. ‘జైద్‌ బిన్‌ సా’బిత్‌ విద్యావంతులు, గణిత జ్ఞానం గలవారు. కనుక వారికి ఈ పదవి ఇవ్వడం జరిగింది.

అదేవిధంగా అనుభవంలేని వారికి పదవులిచ్చారనే విమర్శ కూడా అవాస్తవమే. వారి విజయాలు, ఘన కార్యాలు, ప్రభుత్వ వ్యవస్థలో వారి సేవలు వారిని అనర్హులుగా నిరూపించలేవు.

వలీద్బిన్ఉఖ్బహ్ (ర), ‘ఉమర్‌ (ర) కాలంలో జజీరహ్ తహ్‌సిల్‌దారుగా సేవలందించారు. యీద్బిన్అల్ఆస్తబరస్తాన్, ఆర్మేనియాలను జయించారు. అబ్దుల్లాహ్బిన్అబీ సర్రహ్, తరాబలస్‌, ఖబరస్‌లను జయించారు. వీరి విజయాలు వీరి చేతకానితనానికి నిదర్శనమా? అయితే బ’స్రా పాలకుడైన అబ్దుల్లాహ్బిన్ఆమిర్ చిన్న వయస్కులు, యువకులు. అర్హత, కార్యసాధనకు వయస్సుతో ఎటువంటి సంబంధం లేదు. ఈ యువకుడు కాబుల్‌, ‘హర్రాత్‌, సజిస్తాన్‌ ఇంకా నేషాపూర్‌లను జయించాడు. అంటే అనుభవం లేని వారికి పదవులిచ్చారనటం అవాస్తవం.

అయితే తన కుటుంబానికి సంబంధించిన వారికి ఉన్నత పదవులందించారనే అభియోగం కొంతవరకు ఆలోచించ దగినది. ఈ విషయంలో అబూ బకర్‌ (ర) ‘ఉమర్‌ (ర) చాలా అప్రమత్తంగా ఉండేవారు. అనుమానాస్పద విషయాలకు దూరంగా ఉండేవారు. ఈ కారణం వల్లే తమ పరిపాలనలో బంధుమిత్రులకు దూరంగా ఉండేవారు. కాని ‘ఉస్మాన్‌ (ర) ఈ రహస్యాలు తెలియని సామాన్యులు. మనస్తత్వంలో అంత దూరదృష్టి ఉండేది కాదు. తన అధికారంతో తన బంధుమిత్రులకు లాభంచేకూర్చటం సిలారహ్మీగా భావించేవారు. ఒకసారి ప్రజలు ఆయన ఆచరణపై ఫిర్యాదుచేస్తే, ‘ఉస్మాన్‌ (ర) సహచరులందరిని సమావేశపరిచారు. ‘అల్లాహ్ సాక్షి! ప్రవక్త (స) ఖురైషులను అరబ్బులపై ప్రాధాన్యత ఇచ్చేవారు కారా?’ అని ప్రశ్నించారు. ‘అందులోనూ బనూహాషిమ్కు అందరి కంటే అధిక ప్రాధాన్యత ఇచ్చేవారు కారా?’ అని ప్రశ్నించారు. అప్పుడు ప్రజలందరూ మౌనం వహించారు. అప్పుడు ‘ఉస్మాన్‌ (ర) ‘ఒకవేళ తన చేతిలో స్వర్గపు తాళంచెవులు ఉంటే స్వర్గాన్ని బనీ ఉమయ్యావారితో నింపివేస్తాను’ అని అన్నారు. ఏది ఏమైనా అది అతని వ్యక్తిగత అభిప్రాయం, ప్రజలు దీనితో ఏకీభవించక పోవచ్చు.   అయితే దీనివల్ల ‘ఉస్మాన్‌ (ర)ను విమర్శిం చడం తగదు. ఇతని(ర)పై ప్రభుత్వ నిధినుండి దుబారా ఖర్చుచేసేవారని ఆరోపణ ఉండేది. కాని సాక్ష్యా ధారాలుగా పేర్కొన్న సంఘ టనల్లో వాస్తవం లేదు, లేదా కల్పించి వాటిని పేర్కొనటం జరిగింది. ఇక్కడ మేము ఒక సంఘటనను పేర్కొంటున్నాం. దీనివల్ల ‘ఉస్మాన్‌ (ర)ను ఎలా అప్రతిష్టపాలు చేయడం జరిగిందో తెలుస్తుంది.

ఈ విషయంలో మనం ‘ఉస్మాన్‌ (ర) వ్యక్తిగతంగా ఆర్థిక పరిస్థితి ఎలా ఉండేదని చూడాలి. దీనివల్ల ఈవిధంగా దానధర్మాలు చేసే శక్తి ఆయనకు ఉండేదా? లేదా అని తెలుస్తుంది. ‘ఉస్మాన్‌(ర) ప్రవక్త(స) అనుచరుల్లో అందరి కంటే ధనవంతులని చరిత్ర చెబుతుంది. చాలా మొత్తం చెల్లించి బీరెరోమా కొనుగోలు చేసారు. చాలా పెద్ద మొత్తంతో మస్జిదె నబవీని మరమ్మత్తు చేయించారు. దైవమార్గంలో ఈ విధంగా ఖర్చుపెట్టేవాడు తన కుటుంబీకులకు సహాయసహకారాలు అందించలేడా? దీన్ని గురించి ‘ఉస్మాన్‌ (ర) ఒకసారి ఇలా ప్రసంగించారు. దీనివల్ల వాస్తవం అంతా అర్థం అవుతుంది.  ప్రజలు నేను మదీనహ్ లో తన కుటుంబం పట్ల ప్రేమగా, దాతృత్వంతో వ్యవహరిస్తున్నానని అంటున్నారు. కాని నాప్రేమ నన్ను దుర్మార్గానికి గురిచేయలేదు. నేను కేవలం వారి కనీస హక్కులనే నెరవేరుస్తున్నాను. ఇదంతా నా ధనం వరకే పరిమితం. ప్రజలధనాన్ని నేను మా గురించి ధర్మసమ్మతంగా భావించటం లేదు. నేను ప్రవక్త (స), అబూబకర్‌, ‘ఉమర్‌(ర)ల కాలంలోనూ నాధనాన్ని నా బంధువులకు కానుకలుగా, సహాయంగా ఇచ్చేవాడిని. అయితే అప్పుడు నేను పిసినారిగా వ్యవహరించేవాడ్ని. ఇప్పుడు నేను వృద్ధాప్యానికి చేరుకున్నాను. నా ఆస్తిని నా భార్యాబిడ్డలకు అప్ప గించాను. కాని ఇస్లామ్‌ వ్యతిరేక శక్తులు అసత్యాలు కల్పించి ప్రజల్ని అపోహలకు గురిచేస్తున్నారు. ఇంకా నేను ఏ ఊరిపైననూ ఎటువంటి పన్నుభారం వేయలేదు. వచ్చే పన్ను  రుసుమును వాళ్ళపైనే ఖర్చుపెడు తున్నాను. నా వద్దకు కేవలం 5వ వంతు వస్తుంది. ఇందులో కూడా ఏదైనా తీసుకోవటం నాకు ధర్మ సమ్మతం కాదు. ముస్లిములు నన్నుసంప్రదించకుండానే హక్కుగల వారికి ఇచ్చారు. దైవధనంలో ఒక్క దిర్‌ హమ్‌ కూడా ఖర్చుచేసే అధకారం లేదు. దీన్నుండి నేను ఏమాత్రం తీసుకోను. చివరికి తింటే నాధనం నుండే తింటున్నాను.

మరికొన్ని సంఘటనల వాస్తవాలను గురించి పరిశీలిద్దాం:

హకమ్బిన్అల్ఆస్ను ప్రవక్త (స) బహిష్కరించారన డంలో ఎటువంటి సందేహంలేదు. కాని చివరి కాలంలో ‘ఉస్మాన్‌ (ర) సిఫారసుతో, అతనిని, మదీనహ్ లోనికి రావటానికి అనుమతిచ్చారు. అయితే ఈ విషయం వారిద్దరికీ (అబూ బక్ర్, ‘ఉమర్ లకు) తెలియదు. అందువల్ల వారు, అతనిని మదీనహ్ లోకి రావటానికి అనుమతించలేదు. ‘ఉస్మాన్‌ (ర) అధికారంలోకి రాగానే అతన్ని మదీనహ్ పిలిపించుకున్నారు. ఇంకా అతని కుమారునికిచ్చి తనకూతురి పెళ్ళిచేసారు. ఇంకా బంధుత్వ పరంగా తనధనంలో నుండి ఒకలక్ష దిర్‌హమ్‌ లు సహాయంగా ఇచ్చారు. మర్వాన్ కు కూడా పెళ్ళిలో ఒక లక్ష దిర్‌హమ్‌లు ఇచ్చారు. ఇదీ అసలు సంఘటన.

  తరాబలస్ధనంలో నుండి మర్వాన్‌కు 1/5వ వంతు ఇప్పించారన్నది అబద్ధం. వాస్తవం ఏమిటంటే, మర్వాన్‌ దాన్ని కొనుక్కున్నాడు.

ఇబ్నె ఖుల్‌దూన్‌ అభిప్రాయం: ఇబ్నె ‘జుబైర్‌ యుద్ధధనం, 1/5వ వంతు రాజధాని పంపారు. దాన్ని మర్వాన్‌ 5 లక్షల దీనార్లకు కొనుక్కున్నారు. మరికొందరు అతనికి ఇవ్వటం జరిగిందని అభిప్రాయపడుతున్నారు. ఇది వాస్తవం కాదు. మొదటి యుద్ధధనాన్ని అంతా ఇబ్నె అబీ సర్రహ్కు ఇవ్వటం జరిగింది.

  యుద్ధధనాన్ని ఇబ్నె అబీ సర్రహ్‌కు ఎందుకు ఇవ్వటం జరిగిందంటే, తరాబలస్‌ యుద్ధానికి ముందు ఉస్మాన్‌ (ర) ఇబ్నె అబీ సర్రహ్‌తో ఒకవేళ ఈ యుద్ధంలో విజయంసాధిస్తే యుద్ధధనాన్నంతా ఇవ్వటం జరుగుతుందని వాగ్దానం చేసారు. విజయం తర్వాత వాగ్దానం ప్రకారం ఇవ్వడం జరిగింది. ప్రజలకు ఇది నచ్చలేదు. ప్రజలు తమ మనసులోని మాటను వెలిబుచ్చారు. ‘ఉస్మాన్‌ (ర) దాన్ని తిరిగి తీసుకున్నారు. ‘ఉస్మాన్‌ (ర) ఇది మీకు ఇష్టమైతే అది అతనిది అయిపోతుంది. మీకు ఇష్టం లేకపోతే తిరిగి తీసుకోబడుతుంది. ప్రజలు ‘మాకు ఇష్టం లేదు’ అని అన్నారు. అయితే తీసుకోవటం జరుగుతుందని, వెనక్కి తీసుకోమని ఆదేశించారు.

 అబ్దుల్లాహ్బిన్ఖాలిఖ్కు 3 లక్షల బహుమానం ఇవ్వటం జరిగింది. ఈజిప్టుకు చెందిన అభ్యంతరాలతో నేను ప్రజానిధి నుండి రుణం తీసుకున్నానని చెప్పారు. హారిస్ను బజారు నుండి 1/10వ వంతు వసూలు చేయమని చెప్పటం కూడా అవాస్తవమే.

1. ప్రజానిధి నుండి తనకోసం భవనం నిర్మించారనటం శుద్ధ అబద్ధం. తనధనాన్ని దానధర్మాలు చేసేవాడు, ప్రజాధనం నుండి జీతం కూడా తీసుకోవటం ఇష్టం లేని వాడు ముస్లిముల ఉపకారం ఎలా స్వీకరించగలడు?

2. జైద్బిన్సాబిత్కు లక్ష దిర్‌హమ్‌లు ఇచ్చారనటానికి ఎటువంటి ఆధారం లేదు. ఒకసారి ప్రజానిధిలో ఖర్చులు పోగా కొంత మొత్తం మిగిలింది. ‘ఉస్మాన్‌ (ర) ‘జైద్‌ బిన్‌ సా’బిత్‌ను దీన్ని ప్రజా సంక్షేమకార్యాల్లో ఖర్చుచేయమని ఆదేశించారు. అతను దాన్ని మస్జిద్‌ విస్తరణలో ఖర్చుచేసారు.

3. అబ్దుల్లాహ్బిన్మస్ఊద్, ఉబయ్బిన్అబ్ పించన్లు రద్దుచేయటం ఏమంత అభ్యంతరకరమైన విషయం కాదు. పాలకునికి ఇటువంటి అధికారాలు ఉంటాయి. ‘ఉస్మాన్‌ (ర) వారిద్దరి పట్ల అపార్థానికి గురయ్యారు. అందువల్ల కొంతకాలం వారిద్దరి పింఛన్లు ఆపివేసారు. ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ మస్‌’ఊద్‌ మరణానంతరం న్యాయంగా అతనికి రావలసిన మొత్తాన్ని 20,000 దీనార్లను అతని వారసులకు ఇచ్చివేస్తారు.  

4. నాల్గవ విమర్శ కల్పితమైనది. యుద్ధ గుర్రాలకు, ‘జకాత్‌ ఒంటెల కోసం పచ్చిక బయళ్ళ ఏర్పాటు చేయడం పాలకుని ప్రధాన అధికారాల్లో ఒకటి. స్వయంగా ప్రవక్త (స) బఖీ స్థలాన్ని పచ్చిక బయళ్ళుగా నిర్దేశించారు. ‘ఉమర్‌ (ర) దేశమంతటా విశాలమైన పచ్చికమైదానాలు ఏర్పాటు చేయించారు. ‘ఉస్మాన్‌ (ర) కాలంలో గుర్రాలు, ఒంటెల సంఖ్య బాగా పెరిగింది. చివరికి ఒక మైదానంలో 40 వేల ఒంటెలు మేసేవి. వీటి ఏర్పాటు ఎంతైనా అవసరం ఉండేది. ఈ మైదానాలన్నీ ప్రభుత్వ ఖర్చుతో ఏర్పాటు చేయబడేవి. అందువల్ల ప్రజలకు వీటిని ఉపయోగించే అధికారం ఎంతమాత్రం లేదు. ఒక వేళ ‘ఉస్మాన్‌ (ర) తన గుర్రాలు, ఒంటెల కోసం బఖీ ప్రదేశాన్ని ప్రత్యేకించామన్నారని అంటే, దాన్ని ఖండించటానికి ఆయన చేసిన ప్రసంగం చాలు. ‘ప్రజలు నువ్వు ప్రత్యేక పచ్చిక బయళ్ళు ఏర్పాటు చేసుకున్నావని’ అంటున్నారు. ‘నాకంటే ముందు ప్రత్యేకం చేయబడిన వాటినే నేను ప్రత్యేకం చేసాను. నేను పరిపాలనా బాధ్యతలు స్వీకరించినపుడు నా వద్ద అందరికంటే అధికంగా ఒంటెలు, గుర్రాలు ఉండేవి. కాని ఇప్పుడు నా వద్ద కేవలం రెండు ఒంటెలు మాత్రమే ఉన్నాయి. అవి కూడా ‘హజ్‌కు వెళ్ళడానికి.

5. బజారులో కొన్ని వస్తువుల క్రయవిక్రయాలను తనకోసం ప్రత్యేకించుకున్నారనే విమర్శ ఎంతమాత్రం సరైనది కాదు. ఒకవేళ దాన్ని సరైనదని నమ్మితే ప్రవక్త (స) ప్రతినిధికి, దుర్మార్గరాజుకు తేడా ఉండదు. అయితే ఖర్జూరం గింజలను ‘జకాత్‌ ఒంటెల కోసం ఆహారం విషయంలో తమకే అమ్మాలని ఆదేశించి ఉండవచ్చు. దీన్ని గురించి విమర్శించడం తగదు.

6. అదేవిధంగా తన క్రిందివారికి, బంధువులకు దేశంలో అనేకచోట్ల భూములు ఇచ్చారనే ఆరోపణ గురించి ఈ విధంగా ఉంది, ‘ఉస్మాన్‌ (ర) కాలంలో యమన్‌కు చెందిన వారు చాలామంది భూములు, ఆస్తులు వదలి మదీనహ్ వచ్చారు. ‘ఉస్మాన్‌ (ర) తన చెల్లెలి భూములను వారికోసం వినియోగించారు. ఉదా: తల్మాకు కొంత భూమిని కేటాయించారు. దానికి బదులుగా కన్దలో అతని ఆస్తిని తన అధీనంలోకి తీసుకున్నారు. వ్యవస్థను బట్టి ఇటువంటి మార్పిడి తప్పనిసరి అయ్యింది.

  ఇరాఖ్ లో చాలా విశాలమైన భూమి వ్యర్థంగా పడి ఉండేది. దాన్ని సాగుచేసి పంటకోసం సిద్ధం చేసిన వారికి ఆ భూమి ఇచ్చివేసారు. దేశాన్ని నివాసయోగ్యంగా, ప్రజలను అభివృద్ధి పరచటానికి ఇటువంటి చర్యలు తప్పనిసరి అవుతాయి.

7. ఒకవేళ ‘ఉస్మాన్‌ (ర) వ్యక్తిగతంగా లేదా రాజకీయ పరంగా చీవాట్లు పెట్టటం జరిగితే, దాన్ని అవమా నించటంగా భావించరాదు. ‘ఉమర్‌ (ర) బగాబిన్‌ క’అబ్‌ (ర)పై కొరడా ఎత్తారు, ఇయాజ్‌ బిన్‌ గనమ్‌ చొక్కా విప్పించి మేకలు తోలమని ఆదేశించారు. అద్బిన్వఖ్ఖాస్ను కొరడాతో కొట్టారు. వీరిలో ఎవరూ దాన్ని అవమానంగా భావించలేదు. ఉస్మాన్‌ (ర) అబూ జ’ర్‌ (ర) ను దేశబహిష్కరణ చేయలేదు. స్వయంగా అతను ఏకాంతాన్ని అనుసరించారు. ‘ఉస్మాన్‌ (ర) విచారణ నిమిత్తం అతన్ని పిలవగా అతను ‘ఉస్మాన్‌ (ర) ముందుకు వచ్చారు. ముందు ‘ఉస్మాన్‌ (ర) అతనితో, ‘నావద్ద ఉండిపోండి, మీ ఖర్చులకు నేను బాధ్యుణ్ణి,’ అని అన్నారు. కాని అతను, ‘నీ ఐహిక జీవితం నాకు అక్కర్లేదు,’ అని తిరస్కరించారు.

  అదేవిధంగా ఉబాదా బిన్సామిత్ పట్ల కూడా ఎటు వంటి సంఘటన జరగలేదు. అతని దేశబహిష్కరణకు వ్యతిరేకంగా ఒక ఉల్లేఖనం ఉంది. ‘ఉస్మాన్‌ (ర) చివరికాలం వరకు షామ్‌లో యుద్ధధనం సరఫరా అధికారిగా ఉండేవారు. అయితే, అమ్మార్బిన్యాసిర్ (ర), జున్దుబ్బిన్జనాదహ్ (ర), అబ్దుల్లాహ్బిన్మస్ఊద్ (ర)ల పట్ల కాస్తంత కఠినంగా వ్యవహరించటం జరిగింది. అయితే దీనివల్ల వారిని అవమానించడం జరగలేదు. ‘ఉస్మాన్‌ (ర) స్వయంగా ముస్‌హఫ్‌ను సంకలనం చేసి ప్రవేశపెట్టలేదు. కల్లోలాలు తలెత్తక ముందే ప్రవక్త (స) మరణించినవెంటనే అబూ బకర్‌ () తయారు చేసిన ముస్హఫ్యొక్క కాపీలను ఉస్మాన్‌ () వివిధ ప్రాంతాలకు పంపించారు. వాటిపైనే ఐక్యం కావాలని ఆదేశించారు. ‘ఉస్మాన్‌ (ర) ముస్లిమ్‌ సమాజానికి చాలా గొప్ప ఉపకారం చేసివెళ్ళారు.

9. ఉస్మాన్‌ (ర) సాధుప్రియులు, సున్నిత మనస్కులు అనటంలో ఎటువంటి అనుమానం లేదు. ఇస్లామీయ చట్టాలను పాలించడంలో ఎటువంటి అలసత్వం, అశ్రద్ధ చూపలేదు. ఈ క్రింది విషయాలద్వారా అతన్ని బాధ్యతారహితంగా ప్రవర్తించారని విమర్శించడం జరిగింది. (1) ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘ఉమర్‌ (ర) నుండి హుర్ముజాన్ ప్రతీకారం తీర్చుకోలేదు. (2) వలీద్బిన్ఉఖ్బహ్ పై మద్యపాన శిక్ష అమలు చేయటంలో చాలా ఆలస్యం జరిగింది.

‘ఉమర్‌ (ర)ను అబూ లూలు హతమార్చాడు. ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘ఉమర్‌ (ర) ఆగ్రహానికిగురై హంతకుని కూతురు, నవ ముస్లిమైన ఈరానీ వ్యక్తిని చంపారు. అతని దృష్టిలో వీరందరూ కుట్రలో భాగస్వాములే. ‘ఉస్మాన్‌ (ర) పరిపాలన ప్రారంభం కాగానే అతని వద్దకు వచ్చిన మొట్టమొదటి కేసు ఇదే. ‘ఉస్మాన్‌ (ర) దీన్ని గురించి ప్రవక్త (స) అనుచరులను సంప్రదించారు. ‘అలీ (ర), ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘ఉమర్‌ను, హుర్ముజాన్కి బదులు చంపివేయమని సలహా ఇచ్చారు. కొందరు ముహాజిర్లు, ”ఇప్పుడిప్పుడే ‘ఉమర్‌ (ర) నమా’జులో చంపబడ్డారు, అతని కుమారుణ్ణి ఈ నాడు చంపబడడమా? అని అభిప్రాయపడ్డారు. అప్పుడు అమ్ర్బిన్అల్స్, ‘ఓ నాయకా! ఒకవేళ  మీరు ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘ఉమర్‌ను క్షమించివేస్తే, అల్లాహ్‌ మిమ్మల్ని విచారించడం జరగదు’ అని అన్నారు. అంటే చాలామంది అనుచరులు ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘ఉమర్‌ మరణశిక్షకు వ్యతిరేకంగా నిలబడ్డారు.

హుర్ముజాన్ వారసులు ఎవరూ లేనందువల్ల, పాలకు నిగా నేను అతని తరఫున సంరక్షకుడ్ని. మరణ శిక్షకు బదులు రక్తపరిహారం అమలు చేస్తాను అని తన ధనంలో నుండి రక్తపరిహారం చెల్లించారు. ‘ఉస్మాన్‌ (ర) ఈ కేసు విషయంలో చాలా ఉత్తమంగా వ్యవహరించారు. ఎందుకంటే హుర్‌ముజాన్‌కు బదులు ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘ఉమర్‌ను మరణ శిక్ష విధించడం అదదీ తెగవారికి ఏమాత్రం ఇష్టంలేదు. వెంటనే కల్లోలం తలెత్తుతుందని భావించటం జరిగింది.

వలీద్బిన్ఉఖ్బహ్, కూఫా పాలకులు మద్యపానం సేవించారు. ‘ఉస్మాన్‌ (ర) వెంటనే అతన్ని పదవి నుండి తొలగించారు. సాక్ష్యులపై నమ్మకం లేనందువల్ల శిక్షను ఆలస్యం చేయటం జరిగింది. ఇంకా అనేక సాక్ష్యాధారాలు చేతికి అందినందువల్ల శిక్షను అమలు జరిపారు.

10. ఉస్మాన్‌ (ర) ప్రామాణిక సంస్కృతిని వదలి బలహీన మైన ఆచారాన్ని అనుసరించారని అనిపించటం జరి గింది. అయితే వ్యక్తిగత అభిప్రాయభేదాలు ఉండవచ్చు. ఇది ‘ఉస్మాన్‌ (ర)కి ప్రత్యేకం కాదు, అనుచరులందరిలో ఇటువంటి అభిప్రాయభేదాలు ఉండేవి.

11. ఉస్మాన్‌ (ర) ధర్మంలో మూఢాచారాలను, మూఢ నమ్మకాలను కల్పించారని విమర్శించటం జరిగింది. వాస్తవం ఏమిటంటే, ‘ఉస్మాన్‌ (ర) ఎల్లప్పుడూ ప్రవక్త సంప్రదాయాన్ని అనుసరించేవారు. మినా మైదానంలో 2 రకాతులకు బదులు 4 రకాతులు చదవటం షరీ’అత్‌ ఆదేశ అనుమతిగా భావించటం జరిగింది. అనుచరులు దాన్ని వ్యతిరేకించగా బహిరంగసభలో దానికి కారణం ఇలా తెలియపరచటం జరిగింది: సోదరులారా! నేను మక్కహ్ చేరిన వెంటనే నివాస సంకల్పం చేసుకున్నాను. ఇంకా నేను ప్రవక్త (స)ను ఎవరైనా ఏదైనా పట్టణంలో నివసించే సంకల్పం చేసుకుంటే స్థానికులు నమా’జు చదవవచ్చని ప్రవచిస్తూ ఉండగా విన్నాను.

12. ఈజిప్టు బృందంతో వాగ్దానభంగం చేయడం. దీన్ని గురించి ‘ఉస్మాన్‌ (ర) వీరమరణం సందర్భంగా వస్తుంది.   ఉపద్రవాన్ని అరికట్టే చివరి ప్రయత్నం: ఏది ఏమైనా వాస్తవం ఇదే. ఇవన్నీ కుట్రలు కుతంత్రాలు పన్నడం ద్వారా జరిగింది. ఇవన్నీ ప్రమాదకర స్థితికి చేరుకున్నాయి. అందువల్ల వీటిని పరిష్కరించటం సాధ్యం కాలేదు. చివరి ప్రయత్నంగా ‘ఉస్మాన్‌ (ర) దేశంలోని అధికారులందరినీ పిలిచి ఒక ప్రత్యేక సలహా సంఘాన్ని ఏర్పాటు చేసారు. ఇందులో ముఆవియహ్, అబ్దుల్లాహ్బిన్సర్రహ్, యీద్బిన్అల్ఆస్ మొదలైన వారు ప్రముఖులు.

ఉస్మాన్‌ (ర) సంక్షిప్తంగా ప్రసంగించి ప్రస్తుత కల్లోలాన్ని తొలగించడానికి ప్రతిఒక్కరి నుండి సలహాకోరారు. అప్పుడు అబ్దుల్లాహ్బిన్ఆమిర్ (ర), ‘అమీర్ అల్ ము’అమినీన్! నా అభిప్రాయం ఏమిటంటే ఏదైనా ఒక దేశంపై యుద్ధం ప్రకటించాలి. ప్రజలు యుద్ధసన్నాహాల్లో నిమగ్నులైపోతారు. కల్లోలం దానంతట అదే సమసి పోతుంది’ అని అన్నారు. యీద్బిన్అల్ఆస్, ‘ప్రస్తుత కల్లోలం ఒక వర్గానికి చెందినదని, దాని ప్రధాన వ్యక్తులు చంపబడితే కల్లోలం దానంతట అదే చెల్లాచెదురై పోతుంది, దేశంలో శాంతిభద్రతలు జనిస్తాయి’ అని అన్నారు. ముఆవియహ్, ‘ప్రతి ఒక్కరు తమ తమ శాంతిభద్రతల బాధ్యత తీసుకోవాలి. సిరియా బాధ్యత నేను తీసుకుంటాను’ అని అన్నారు. అబ్దుల్లాహ్బిన్యీద్, ‘విచ్ఛిన్నకారులు ధనసంపదల ఆశలో ఉన్నారు. అందువల్ల వాటితో వారి నోరు మూయించాలి,’ అని అన్నారు. అమ్ర్బిన్అల్స్, ‘అమీర్ అల్ ము’అమినీన్! తమరి అసమాన కార్యకలాపాల వల్లే ప్రజలు తమ హక్కుల కోసం ఉద్యమించారు. వీటి పరిష్కారానికి రెండే రెండు మార్గాలు ఉన్నాయి. న్యాయంగా, ధర్మంగా వ్యవహ రించండి, లేదా అధికారం నుండి తొలగిపోండి. ఈ రెండూ ఇష్టం లేకుంటే మీరు కోరింది చేయండి’ అని అన్నారు.

ఉస్మాన్‌ (ర) ఆశ్చర్యపడుతూ అమ్ర్బిన్అల్స్ వైపు చూచి, ‘నా గురించి నీ అభిప్రాయం ఇదేనా?’ అని అన్నారు. అమ్ర్‌ బిన్‌ ‘ఆ’స్‌ మౌనంగా ఉన్నారు. కాని సభ ముగిసిన తర్వాత ‘ఉస్మాన్‌ (ర) ఒంటరిగా ఉన్నప్పుడు ‘అమీర్ అల్ ము’అమినీన్! నేను మిమ్మల్ని చాలా గౌరవిస్తాను. అందరి ముందు ఇచ్చిన సలహా కేవలం నటన మాత్రమే. వ్యతిరేకులు నాకు, తమ విషయాలు తెలపాలని అలా నటించాను. దానివల్ల వారి కుతంత్రాలు తెలుసుకోవచ్చు’ అని అన్నారు. ‘ఉస్మాన్‌ (ర) మౌనం వహించారు.

సలహా సంఘసభ్యులు తమతమ అభిప్రాయాలు తెలిపారు. కాని వీటిలో ఏదీ సరైన పరిష్కారంగా కనబడ లేదు. ‘ఉస్మాన్‌ (ర) అధికారులందరినీ తిరిగి పంపివేసారు. తాను స్వయంగా ఒక పథకాన్ని గురించి ఆలోచించడంలో నిమగ్నమయి పోయారు.

కూఫా విచ్ఛిన్నకారులు, యీద్బిన్అల్ఆస్ (ర) పట్ల శత్రుభావం కలిగి ఉండేవారు. అతడు సలహా మండలి సమావేశానికి వెళ్ళినపుడు, అందరూ కలిసి అతన్ని తిరిగి రానివ్వం అని ప్రతిజ్ఞచేసారు. స’యీద్‌ బిన్‌ అల్‌ ఆస్‌ తిరిగి కూఫా సమీపానికి చేరుకున్న తరువాత విచ్ఛిన్నకారులు నగరం నుండి బయటకు వచ్చి జర్ ప్రాంతంలో అడ్డుకున్నారు. స’యీద్‌ (ర) ను మదీనహ్ తిరిగి వెళ్ళిపొమ్మని పట్టుబట్టారు. ‘ఉస్మాన్‌ (ర) వారి కోరిక ప్రకారం స’యీద్‌ను తొలగించి, అబూ మూసా అష్అరీ ()ని నియమించారు. ఇంకా ఉద్యమ కారులకు ఉత్తరం వ్రాస్తూ, ‘నేను మీ కోరిక ప్రకారం నియమించాను. చివరినిముషం వరకు మీ సంస్కరణ కోసం పాటుపడుతూ ఉంటాను. ఎల్లప్పుడూ సహన స్థైర్యాలు కలిగి ఉంటాను,’ అని తెలిపారు.

‘ఉస్మాన్‌ (ర) నిరంతరం దేశసంస్కరణలో నిమగ్నులయి ఉన్నారు. సరైన పథకం ఏదీ దొరకలేదు. దేశంలోని వివిధ ప్రాంతాలకు పరిశీలక బృందాలను పంపవలసిందని సలహా ఇచ్చారు. ‘ఉస్మాన్‌ (ర)కు ఈ సలహా నచ్చింది. అనంతరం 35వ హిజ్రీలో ము’హమ్మద్‌ను కూఫా, ఉసామా బిన్‌ ‘జైద్‌ను స్రహ్, ‘అమ్మార్‌ బిన్‌ యా’సిర్‌ను ఈజిప్టు, ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘ఉమర్‌ను సిరియా ఇంకా ఇతరులను వివిధ ప్రాంతాలకు పంపారు. ఏ అధికారికి వ్యతిరేకంగా ఏదైనా ఫిర్యాదు ఉంటే, వెంటనే పరిశీలించి పరిష్కరిస్తాను. కాని చాలామంది అధికారులు అనవసరంగా ప్రజలను హింసిస్తున్నారని, ప్రజలను తిడుతున్నారని, ఇంకా అనేక రకాలుగా ప్రజలను హింసిస్తున్నారని తెలిసింది. ‘హజ్‌ సందర్భంగా నాకు తెలియపరిస్తే సమస్యలను పరిష్కరిస్తానని ప్రకటించారు.

విప్లవ ప్రయత్నం: ఇటు ఖలీఫహ్ సభలో సంస్కరించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరోవైపు దేశంలో ఒక గొప్ప విప్లవం కోసం కుట్రలు, కుతంత్రాలు జరుగు తున్నాయి. అనంతరం స్రహ్, కూఫా, ఈజిప్టు విచ్ఛిన్నకారులు తమతమ ప్రాంతాలనుండి హాజీల ముసుగులో మదీనహ్ వైపు బయలుదేరారు. బలవం తంగా తమకోర్కెలు స్వీకరించేలా చేద్దామని వారి ఉద్దేశ్యం.

మదీనహ్ మునవ్వరహ్ కు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక ప్రదేశానికి చేరి, వారి ప్రముఖులు, నాయకులు ఒక్కొక్కరు; తల్హా, జుబైర్, అద్బిన్వఖ్ఖాస్ మరియు అలీ (ర)లను కలుసుకున్నారు. సమస్యను పరిష్కరించవలసిందిగా కోరారు. కాని అందరూ అందులో పాల్గొనడానికి నిరాకరించారు.

‘ఉస్మాన్‌ (ర) కల్లోలాలను, ఉపద్రవాలను ప్రజల ఫిర్యాదులను పరిష్కరించటానికి ప్రయత్నించేవారు. అందువల్ల విచ్ఛిన్నకారులు రహస్యంగా సమావేశమవు తున్నారని తెలిసి, ‘అలీ (ర) ను పిలిపించి, ‘వారిని సంతృప్తిపరచి పంపివేయండి,’ అని అన్నారు.

ఆ తరువాత ‘ఉస్మాన్‌(ర) జుమ’అహ్ రోజు మస్జిద్‌లో ప్రసంగించారు. సంస్కరణా పథకాన్ని గురించి, ఇంకా భవిష్యత్తులో తన కార్యాచరణ గురించి వివరంగా పేర్కొన్నారు. ప్రజలు సంతోషించారు. వివాదాలు సద్దుమణిగాయి.

ఒకసారి అకస్మాత్తుగా మదీనహ్ వీధుల్లో తక్‌బీర్‌ నినాదాలు గుర్రాల చప్పుళ్ళు ప్రళయాన్ని తలపించాయి. ప్రవక్త (స) అనుచరులు ఆందోళనకు గురి అయి ఇళ్ళనుండి బయటకువచ్చి చూడసాగారు. విచ్ఛిన్నకారులు మళ్ళీ తిరిగివచ్చి ఉన్నారు. ‘ప్రతీకారం, ప్రతీకారం,’ అని నినాదాలు చేస్తున్నారు. ‘అలీ (ర), ‘వెళ్ళి మళ్ళీ తిరిగి రావటానికి గల కారణం ఏమిటి,’ అని అడిగారు. దానికి ఈజిప్టు ప్రజలు, ‘మార్గంలో ప్రభుత్వానికి సంబంధించిన ఒక వ్యక్తి కనబడ్డాడు. చాలా వేగంగా ఈజిప్టు వెళుతున్నాడు. మేము అనుమానించి అతన్ని పట్టుకొని సోదా చేస్తే ప్రభుత్వ ఆదేశం లభించింది. అందులో మమ్మల్ని మరణ శిక్ష వేయమని ఉంది. అందువల్ల ఇప్పుడు మేము వాగ్దాన భంగానికి ప్రతీకారం తీర్చు కోవటానికివచ్చాము,’ అని అన్నారు.

ఉస్మాన్‌ (ర) కు ఈ సంఘటన గురించి తెలియపర్చటం జరిగింది. ఆయన తనకేమీ తెలియదని ఆశ్చర్యం వ్యక్తం చేసారు. ప్రమాణంచేసి నిజంగా తనకేమీ తెలియదని అన్నారు. ‘ఉస్మాన్‌ (ర) ప్రమాణం చేసేసరికి ప్రజలు, ఇది ‘మర్వాన్కుట్ర‘ అని భావించారు. అప్పుడు ఈజిప్టు వారు ఏదిఏమైనా పాలకుడు ఈవిధంగా ఏమరుపాటుకు గురయిఉంటే, ఇటువంటి సంఘటనలు ఉనికిలోకి వస్తాయి, కనుక అతనికి పాలకునిగా కొనసాగే అర్హత లేదు, అని, ఉస్మాన్‌ (ర)ను పరిపాలననుండి తొలగిపొమ్మని కోరారు. దానికి ‘ఉస్మాన్‌(ర) ‘నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు దైవం ప్రసాదించిన ఈ స్థానాన్ని నేను స్వయంగా వదిలే ప్రసక్తిలేదు, ప్రవక్త (స) ఉపదేశం ప్రకారం తన చివరిక్షణం వరకు సహనం పాటిస్తాను’ అని అన్నారు.

‘ఉస్మాన్‌ (ర) తిరస్కరించగా విచ్ఛిన్నకారులు అతని ఇంటిని చుట్టుముట్టారు. 40 రోజుల వరకు కొన సాగించారు. ఈ మధ్యకాలంలో ఇంటిలోపలికి నీళ్ళు వెళ్ళటం కూడా నేరంగా పరిగణించబడేది. ఒకసారి ఉమ్మె హబీబహ్ (ర) ఆహార పదార్థాలు తీసుకొని ‘ఉస్మాన్‌ (ర) వద్దకు వెళదామని ప్రయత్నించగా, ఆమెను కూడా లోపలికి వెళ్ళనివ్వలేదు. పొరుగిళ్ళ నుండి అప్పుడప్పుడూ సహాయం అందేది. అబ్దుల్లాహ్బిన్సలామ్ (ర) అబూ హురైరహ్ (ర), అద్బిన్వఖ్ఖాస్ (ర), జైద్బిన్సాబిత్ (ర) వంటి గొప్పగొప్ప అనుచరుల పట్ల కూడా వాళ్ళు నిర్లక్ష్యంగా వ్యవహ రించారు, వారిని అవమానించారు. ‘ఉస్మాన్‌ (ర) పిలవగా, ‘అలీ (ర), అతని వద్దకు వెళ్ళగోరితే, అతన్ని కూడా వెళ్ళనివ్వలేదు. ‘అలీ (ర) చేసేదిలేక తన నల్లని అమామ తీసి ఒకవ్యక్తికి ఇచ్చి పరిస్థితిని చూసి వెళ్ళి, ‘చాలా మంది ప్రవక్త (స) అనుచరులు మదీనహ్ వదలి వెళ్ళిపోయారని తెలియపర్చమని’ అన్నారు. ఆయిషహ్‌ (ర) ‘హజ్‌ సంకల్పం చేసుకున్నారు. ప్రవక్త (స) అనుచరుల్లోని చాలామంది ఇటువంటి కల్లోల పరిస్థితుల్లో ఏకాంతమే మంచిదని భావించారు. బాధ్యతగల వారిలో ముగ్గురు, అలీ (ర), తల్హా (ర), జుబైర్ (ర) మాత్రమే ఉన్నారు. వీళ్ళ పరిస్థితి ఎలా ఉండేదంటే సంబంధంలేకుండా ఉండనూ లేరు. పరిస్థితిని పరిష్కరించే శక్తీ వారికిలేదు. ముగ్గురూ కలసి అనేక ప్రయత్నాలు చేసారు. కాని, ఆ కల్లోలంలో ఎవరి మాటనూ ఎవరూ పట్టించుకునే స్థితిలో లేరు. అందువల్ల ఈ ముగ్గురూ వేరుగా ఉండసాగారు. అయితే తన కుమారులను, ‘ఉస్మాన్‌ రక్షణకోసం పంపించారు. హుసైన్ (ర) ద్వారంవద్ద కాపలా కాస్తున్నారు. అబ్దు ల్లాహ్బిన్జుబైర్ (ర) ఉస్మాన్ (ర) ఇంట్లో ఉన్న అభిమానులకు నాయకత్వం వహిస్తున్నారు. చుట్టు ముట్టిన విచ్ఛిన్నకారులకు ‘ఉస్మాన్‌(ర) అనేకసార్లు నచ్చజెప్పటానికి ప్రయత్నించారు. వారి ముందు అనేక సార్లు ప్రసంగించారు. ఉబయ్బిన్అబ్ (ర) కూడా ప్రసంగించారు. కాని వారిపై ఎటువంటి ప్రభావం చూపలేదు. ‘ఉస్మాన్‌ (ర) ఇంటి పైకప్పు నుండి ప్రజల నుద్దేశించి ప్రసంగిస్తూ, ‘ప్రవక్త (స) మస్జిద్‌ కోసం భూమి అంటే, నేను కొనిఇచ్చాను, ఆ మస్జిద్‌లో నన్ను నమా’జు చదవకుండా చేస్తారా? అదేవిధంగా ప్రవక్త (స) మదీనహ్ వచ్చినపుడు, మదీనాహ్ లో రూమా బావి తప్ప మరేదీ ఉండేది కాదు. ప్రవక్త (స), ”ఎవరు దీన్నికొని ధర్మం చేస్తారు,’ అంటే నేను కొని ఇచ్చాను. ఇప్పుడు దాని నీళ్ళు నాకు తాగనీయకుండా చేస్తారా? ఇంకా మీకు తెలియదా? ఉస్రత్ పోరాటంలో యుద్ధసామగ్రినంతా నేనే ఏర్పాటు చేసాను. మీలో ఎవరికైనా గుర్తుందా? ఒకసారి ప్రవక్త (స) కొండపైఎక్కారు. కొండ కదలసాగింది. అప్పుడు ప్రవక్త (స) తన్ని, ‘ఓ కొండ! నీపై ఒక ప్రవక్త, ఒక సత్య వంతుడు, ఒక అమరవీరుడు ఉన్నారు’ అని అన్నారు. అప్పుడు నేను ఆయన వెంటఉన్నాను. ‘అదేవిధంగా హుదైబియాలో ప్రవక్త (స) నన్ను మక్కహ్ పంపారు. ఇటు హుదైబియాలో బైఅత్‌ చేసినపుడు ఒక చేతిని నా చేయిగా ఉపయోగించటం జరగలేదా?” అని అడిగారు. అందరూ కలసి నిజం అన్నారు. విచ్ఛిన్న కారులు ‘హజ్‌ కాలం కొన్ని రోజుల్లో సమాప్తం అవుతుందని, తరువాత ప్రజలు ఇటు వస్తారని, అవకాశం చేజారిపోతుందని చంపటానికి పథకం వేయసాగారు. ‘ఉస్మాన్‌ (ర) స్వయంగా దాన్ని విన్నారు. ప్రజల నుద్దేశించి ప్రజలారా! చివరికి దేనికోసం నా రక్తం కోసం ఆరాటపడుతున్నారా?. ఇస్లాంలో కేవలం వ్యభిచారం, హత్య, ఇస్లామ్‌ను త్యజించటం వల్ల హత్య చేయవచ్చు. నేను ఈ మూడింటిలో దేనికీ పాల్పడలేదు. ఇప్పుడు కూడా నేను ‘అల్లాహ్‌ తప్ప ఎవరూ ఆరాధ్యులు కారని, ము’హమ్మద్‌ (స) అల్లాహ్‌ ప్రవక్త అని సాక్ష్యం ఇస్తున్నాను’ అని అన్నారు. కాని ద్రోహులు ఏమాత్రం చలించలేదు.

అభిమానులు అనేక సలహాలు ఇచ్చారు. ముగీరహ్ బిన్షూబహ్ (ర), ‘నాయకా! మూడు విషయాలు ఉన్నాయి. వాటిలో ఏదో ఒకటి అనుసరించండి. మిమ్మల్ని అభిమానించే, సమర్థించేవారి శక్తివంతమైన ఒకబృందం ఇక్కడఉంది. దాన్ని తీసుకొని, బయలు దేరండి, ద్రోహులతో పోరాడి వారిని వెంబడించండి. మీరు సత్యంపై ఉన్నారు, వాళ్ళు అసత్యంపై. ప్రజలు సత్యాన్ని సమర్థిస్తారు, సహాయం చేస్తారు. ఒకవేళ ఇది ఇష్టం లేకపోతే ప్రధాన ద్వారాన్ని వదలి వెనుకవైపు నుండి గోడకూల్చి బయటపడండి, వాహనాలపై కూర్చొని మక్కహ్ వెళ్ళిపోండి. అది హరమ్‌. అక్కడ వాళ్ళు యుద్ధం చేయలేరు, లేదా సిరియా వెళ్ళిపోండి. అక్కడి ప్రజలు నిజాయితీపరులు, అక్కడ ము’ఆవియా (ర) ఉన్నారు’ అని అన్నారు. దానికి ‘ఉస్మాన్‌ (ర) నేను బయటకు వెళ్ళి వాళ్ళతో యుద్ధం చేసి రక్తపాతం చేసిన ఇస్లామీయ మొదటి వ్యక్తిని కాలేను. ఒకవేళ నేను మక్కహ్ వెళ్ళినా వీళ్ళు ‘హరమ్‌ను అవమానపరచరని నాకు నమ్మకం లేదు. నా వల్ల హరమ్‌ను అగౌరవ పరచటం నాకు ఇష్టం లేదు. సిరియాకు కూడా వెళ్ళలేను. ఎందుకంటే నేను వలస వచ్చిన, ప్రవక్త (స) నివాసాన్ని వదలి వెళ్ళదలచు కోలేదు,’ అని అన్నారు.

‘ఉస్మాన్‌ (ర) ఇల్లు చాలా విశాలంగా ఉండేది. ద్వారంవద్ద, లోపల ముస్లిముల సంఖ్య బాగానే ఉండేది. సుమారు 700 ఉంటుంది. దీనికి అబ్దుల్లాహ్బిన్జుబైర్ (ర) నాయకత్వం వహిస్తున్నారు. ‘అనుమతిస్తే ద్రోహులతో యుద్ధం చేస్తాను’ అని అనుమతి కోరారు. దానికి ‘ఉస్మాన్‌ (ర) ‘నా కోసం ఒక్కడ్ని కూడా చంపటం ధర్మంగా నేను భావించను.’ ఆ సమయంలో అతని ఇంట్లో 20 మంది సేవకులు ఉన్నారు, వారిని పిలిచి విడుదల చేసివేసారు.

  జైద్బిన్సాబిత్ (ర) వచ్చి, ‘నాయకా! అన్సార్లు వచ్చి ద్వారంవద్ద నిలబడి మళ్ళీ తమ ఘనకార్యాలు చూపడానికి వేచిఉన్నారు’ అనిఅన్నారు. దానికి ‘ఉస్మాన్‌ (ర) ‘ఒకవేళ యుద్ధమే, వారి ఉద్దేశ్యం అయితే, నేనెంత మాత్రం అనుమతి ఇవ్వను, ఈ సమయంలో నా కోసం కరవాలం ఎత్తనివాడే నా సహాయకుడు’ అని అన్నారు. అబూ హురైరహ్‌ (ర) అనుమతి కోరగా, ‘అబూ హురై రహ్‌! నీవు నన్నూ, ప్రజల్ని చంపిద్దామని అనుకుంటు న్నావా?’ అని అన్నారు. దానికి అతడు ‘లేదు’ అని అన్నారు. ‘ఒకవేళనీవు ఒక్కడిని చంపినా అందరినీ చంపినట్లే.’ అబూ హురైరహ్‌ (ర) అది విని వెనుతిరిగారు.  

‘ఉస్మాన్‌ (ర)కు ప్రవక్త (స) భవిష్యవాణి ప్రకారం, అతని వీరమరణం పొందే సమయం ఆసన్నమయిందని తెలిసి పోయింది. ప్రవక్త (స) అతన్ని అనేకసార్లు ఈ సంఘటన గురించి హెచ్చరిస్తూ, సహనస్థైర్యాలు కలిగి ఉండాలని అప్రమత్తం చేయడం జరిగింది. వీరమరణం పొందిన రోజు అతను ఉపవాసంతో ఉన్నారు. అది శుక్రవారం. కలలో ప్రవక్త (స), అబూ బకర్‌ (ర), ‘ఉమర్‌ (ర) ఉన్నారు. అతన్ని ‘తొందరగా కానీ’ అని అంటున్నారు. మేల్కొని అక్కడున్న వారితో స్వప్నం గురించి ప్రస్తావించారు. భార్యతో వీరమరణం పొందే సమయం ఆసన్న మయ్యిందని, ద్రోహులు నన్ను చంపివేస్తారని భార్యకు తెలియపరిచారు. భార్య అది విని ‘అలా ఎంత మాత్రం జరగదు,’ అని పలికింది. దానికి అతను ‘నేను కలలో చూచాను’ అని అన్నారు. మరో ఉల్లేఖనంలో ప్రవక్త (స), ” ‘ఉస్మాన్‌, ఈ రోజు జుమ’అహ్ నమా’జ్‌ నాతో పాటు చదవాలి,” అని అన్నారు. ఆ తర్వాత ఏనాడూ ధరించని పైజామాను తెప్పించి ధరించారు. ఇంకా తన 20 మంది బానిసలను విడుదలచేసి వేసారు. ఖుర్‌ఆన్‌ తెరచి పఠనంలో నిమగ్నులయ్యారు. ద్రోహులు ఇంటిపై దాడిచేసారు. ద్వారం వద్ద ఉన్న ‘హసన్‌(ర) ఎదురు దాడిలో గాయపడ్డారు. నలుగురు గోడగెంతి బాల్కనీలోకి ప్రవేశించారు. వారిలో ముందు అబూ బకర్‌ (ర) కుమారులు ముహమ్మద్బిన్అబీ బకర్ ఉన్నారు. వీరు ‘అలీ (ర) సంరక్షణలో పెరిగారు. ఇతనికి పదవులపై ఆశ ఉండేది. లభించక పోయేసరికి శత్రువుగా మారిపోయారు. అతడు ముందడుగు వేసి ‘ఉస్మాన్‌ (ర) జుత్తు పట్టుకొని బలంగా లాగారు. దానికి ‘ఉస్మాన్‌(ర) ‘కుమారా! నీ తండ్రిగారు బ్రతికుంటే, అతడు దీనికి ఎంతమాత్రం ఇష్టపడరు,’ అని అన్నారు. అది విని ము’హమ్మద్‌ బిన్‌ అబీ బకర్‌ సిగ్గుపడి వెనక్కుతగ్గారు. మరో వ్యక్తి, కనాన్బిన్బషీర్, ముందుకు దూకి నుదురుపై ఇనుపగజంతో పూర్తిబలంతో కొట్డాడు. ‘ఉస్మాన్ (ర) వెంటనే ఒక ప్రక్కకు పడిపోయారు. అప్పుడు కూడా ‘బిస్మిల్లాహి తవక్కల్‌తు ‘అలల్లాహి’ అనే పలికారు. సౌదాన్బిన్హమ్రాన్మురారీ, మరో సారి దాడిచేసిన వెంటనే రక్తం చిందించడం ప్రారంభ మయింది. మరో కర్కశుడు, అమ్ర్బిన్అల్హుమ్ఖ్ రొమ్ముపై కూర్చొని శరీరంలో అనేకచోట్ల బల్లెంతో గాయపరిచాడు. మరో పాపాత్ముడు ముందుకు వచ్చి కరవాలంతో దాడిచేసాడు. అక్కడే కూర్చున్న భార్య నాయిలహ్ చేత్తో ఆపటం జరిగింది. మూడు వేళ్ళు తెగిపడ్డాయి. ఆ దాడికి ‘ఉస్మాన్‌ (ర) ప్రాణం శరీరాన్ని విడిచిపోయింది. ‘ఉస్మాన్‌ (ర) వీరమరణం పొందినపుడు ఖుర్‌ఆన్‌ పఠిస్తున్నారు. ఖుర్‌ఆన్‌ ముందు తెరచి ఉంది. రక్తం మరక, ఫసయక్ఫీకహుముల్లాహు వహువస్సమీఉల్అలీమ్, అనే ఆయతుపై పడింది.

జుమ’అహ్ రోజు అస్ర్‌ సమయాన ఈ సంఘటన జరిగింది. రెండు రోజులవరకు శవం అలాగే పడిఉంది. ప్రవక్త (స) పవిత్రస్థలంలో ప్రళయం తాండవించింది. ద్రోహుల రాజ్యంగా మారిఉంది. వారి భయంవల్ల ఎవరికీ బహిరంగంగా ఖననసంస్కారాలు చేసే ధైర్యం చాలలేదు. శనివారం రాత్రి కొందరు చేతిలో ప్రాణాలు పెట్టుకొని ఖనన సంస్కారాలు చేసారు. స్నానం చేయించకుండా రక్తంలో ఉన్నట్టే ఖననం చేసారు. 17 మంది కాబుల్ నుండి మరాకిష్ వరకు రాజ్యం ఏలే చక్రవర్తి జనా’జహ్ నమా’జు చదివారు. ‘జుబైర్‌ (ర) లేదా ‘జుబైర్‌ బిన్‌ ముత్‌యిమ్‌ (ర) జనా’జహ్ నమా’జు చదివారు. జన్నతుల్‌ బఖీ వెనుక హిష్‌కౌకబ్‌లో ఖననం చేసారు. ఆ తరువాత దాన్ని జన్నతుల్‌ బఖీలో చేర్చటం జరిగింది. ఈనాడు కూడా జన్నతుల్‌ బఖీ చివర ‘ఉస్మాన్‌ (ర) సమాధి ఉంది.

ప్రవక్త(స) అనుచరులు, ముస్లిముల్లోని ఎవరూ ఈ సంఘటన గురించి నమ్మేస్థితిలో లేరు. ఇలా జరుగు తుందని ఎవరూ ఊహించలేదు. ప్రవక్త (స) పవిత్ర స్థలం, ఈ విధంగా అవమానించబడుతుందని ఎవరూ ఊహించ లేదు. ‘ఉస్మాన్‌ (ర) ప్రభుత్వంపట్ల అసంతృప్తిగా ఉన్న వారు కూడా కన్నీరు కార్చారు. చివరికి అతని హత్యకు పాల్పడినవారు కూడా విచారించసాగారు. కాని ఇస్లామ్‌ శత్రువులు పన్నిన కుట్రలు ఫలించాయి. సంయుక్త ఇస్లామ్‌ సున్ని, షి, ఖారిజీ, ‘ఉస్మానీ, అనే భాగాలుగా విడిపోయింది. ప్రళయంవరకు ఈ వర్గ విభేదాలు కొనసాగుతాయి. ‘అలీ (ర) మస్జిద్‌ నుండి ‘ఉస్మాన్‌ (ర) ఇంటివైపు వస్తున్నారు. దారిలో వీరమరణ వార్త అందింది. ఈ వార్త వినగానే రెండుచేతులు ఎత్తి, ‘ఓ అల్లాహ్! ‘ఉస్మాన్‌ (ర)హత్యకు నాకు ఎటువంటి సంబంధం లేదు,’ అని అన్నారు.

ఉమర్‌ (ర) బావగారు యీద్బిన్జైద్బిన్ఉమర్బిన్నుఫైల్, ప్రజలారా! ఒకవేళ మీరు చేసిన ఈ పాపం కారణంగా మీపై ఈ ఉ’హుద్‌ కొండ పడి విరిగినా పడవచ్చు. హుజై’ఫహ్ (ర), ఇతడు భవిష్యవాణులను గుర్తుంచేవారు. ‘ ‘ఉస్మాన్‌ (ర) హత్యవల్ల ఇస్లామ్‌లో ఒక పగులు ఏర్పడింది. అది తీర్పుదినం వరకు అతక బడదు,’ అని అన్నారు.

అబ్దుల్లాహ్బిన్అబ్బాస్ (ర), ‘ఒకవేళ సృష్టిరాసులన్నీ ‘ఉస్మాన్‌ (ర) హత్యలో పాల్గొంటే, లూత్‌ జాతిలా ఆకాశం నుండి రాళ్ళు వర్షించటం జరిగేది,’ అని అన్నారు. యమన్‌ పాలకులైన సమామహ్ (ర)కు, ఈ వార్త అందగానే అతను ఏడ్వసాగారు. ప్రవక్త (స) ప్రాతినిధ్యం పోతూ ఉంది. చాలా విచారకరం. అబూ ‘హుమైద్‌ సా’యిదీ (ర), ‘జీవితాంతం నవ్వను’ అని ప్రమాణం చేసారు. ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ సలామ్‌ (ర), ‘ఓహ్‌! ఈ నాడు ‘అరబ్‌ శక్తి నశించింది,’ అని అన్నారు.

‘ఆయి’షహ్‌ (ర) ‘ ‘ఉస్మాన్‌ (ర) అన్యాయంగా చంప బడ్డారు. అల్లాహ్ సాక్షి! అతని కర్మపత్రం పరిశుభ్రపరచ బడింది,’ అని అన్నారు. ‘జైద్‌ బిన్‌ సా’బిత్‌ (ర) కళ్ళ నుండి కన్నీళ్ళు కారుతూనే ఉన్నాయి. అబూ హురైరహ్‌ (ర) పరిస్థితి ఎలా ఉండేదంటే ఈ సంఘటన గుర్తుకువస్తే వెక్కివెక్కి ఏడ్చేవారు. ‘ఉస్మాన్‌ (ర) రక్తసిక్తమయిన కమీజు, నాయిలహ్‌ తెగిన వ్రేళ్ళు సిరియా ము’ఆవియహ్‌ (ర) వద్దకు పంపడం జరిగింది. వాటిని బహిరంగంగా ప్రజల ముందు ఉంచబడగా ప్రజలు దుఃఖ విచారాలలో మునిగిపోయారు. ‘ప్రతీకారం, ప్రతీకారం’ అని నినాదాలు చేయసాగారు.

‘ఉస్మాన్‌ (ర) వీరమరణం సంఘటనను మీరు చదివారు. ఉస్మాన్‌ () వీరమరణం నుండి రెండవ కల్లోలం అంటే హుర్రహ్వరకు, బద్రీ అనుచరులు మిగలలేదు. ఎందుకంటే ఈ బద్‌ర్‌ అనుచరులందరిలో చివరి వారు, యీద్బిన్అబీ వఖ్ఖాస్ (ర) మరణించారు. ఇతను కూడా హుర్రహ్‌ సంఘటనకు ముందే మరణించారు.

ఆ తరువాత హుర్రహ్కల్లోలం తలెత్తింది. ఇందులో జీద్మదీనహ్ వాళ్ళను హతమార్చాడు. ఈ కల్లోలంలో హుదైబియాలో పాల్గొన్న అనుచరులలో ఎవరూ మిగలలేదు. ము’ఆవియా తన జీవితకాలంలోనే తన కుమారుణ్ణి యువరాజుగా ప్రకటించారు. అతడు తన అధికారులకు తన అధికారం పట్ల ప్రజలతో వాగ్దానం తీసుకోమని ఆదేశించాడు. కాని ప్రజలకు అతని చేష్టలు, అలవాట్లు నచ్చలేదు. ఎందుకంటే అతడు చాలా దుర్మార్గుడు, వ్యసనపరుడు. కొన్నిచోట్ల సైన్యం, లాఠీల బలంతో వాగ్దానం తీసుకోవటం జరిగింది. ప్రజలు తమ్ము తాము రక్షించుకునే నిమిత్తం వాగ్దానం చేసారు. హుర్రహ్అంటే నల్లని రాతినేల. మదీనహ్ లో ఒక ప్రాంతంలో నల్లని రాతినేల ఉండేది. ఇక్కడ యుద్ధం జరిగింది. చరిత్రలో హుర్రహ్‌ యుద్ధంగా పేర్కొనడం జరిగింది. ఇది 63 హిజ్రీలో జరిగింది.

జీద్, ముస్లిమ్‌ బిన్‌ ఉఖ్‌బహ్ నేతృత్వంలో మదీనహ్ పై దాడిచేసాడు. ఇందులో అనేకమంది ప్రవక్త (స) అనుచరులు, తాబయీన్లు వీరమరణం పొందారు. పవిత్ర స్థలాన్ని అగౌరవపరచటం జరిగింది. ఆ దినాన్నే హుర్రహ్దినంగా పేర్కొనటం జరిగింది. ఇందులో అనేక మంది ప్రవక్త (స) అనుచరులు చంపబడ్డారు. ధనం దోచుకోవటం జరిగింది. అనేకమంది అమ్మాయిలను చెరచటం జరిగింది. ప్రవక్త (స) ప్రవచనం, ”మదీనహ్ ను భయపెట్టేవాణ్ణి అల్లాహ్‌ భయపెడతాడు, ఇంకా వాడిని అల్లాహ్‌, దైవదూతలు, ఇంకా మనుషులందరి అభిశాపం పడుతుంది.” (ముస్లిమ్‌)

మదీనహ్ ప్రజలతో ప్రమాణం చేయించడానికి కారణం ఏమిటంటే య’జీద్‌ పాపాలలో పూర్తిగా చిక్కుకున్నాడు. ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ హన్‌’జలహ్‌ ద్వారా వాఖిదీ కథనం: య’జీద్‌ పాపాల్లో పూర్తిగా చిక్కుకున్నాడని తెలిసినంత వరకు మేమతనితో యుద్ధం చేయలేదు. య’జీద్‌ మదీనహ్ వారి పట్ల ఈవిధంగా వ్యవహరించాడు. మద్యం, ఇతర పాపాలు ముందునుంచే అనుస రిస్తున్నాడు. అందరూ అతన్ని అసహ్యించుకోసాగారు. అన్ని వైపుల నుండి అతనికి వ్యతిరేకత కనబడింది. అల్లాహ్‌ అతనికి ఆయుష్షులో శుభం ప్రసాదించలేదు. చివరికి మక్కహ్ పై కూడా దండెత్తాడు. అక్కడ అబ్దుల్లాహ్బిన్జుబైర్ (ర)తో తలపడాలని, మార్గంలో సైన్యాధికారి మరణించాడు. మరో సైన్యాధికారి నియమించబడ్డాడు. సైన్యం మక్కహ్ లో ప్రవేశించి ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘జుబైర్‌ను చుట్టుముట్టింది. ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘జుబైర్‌ (ర) కూడా వారితో యుద్ధం చేసారు. అతనిపై రాళ్ళ వర్షం కురిపించబడింది. దీనివల్ల కాబతుల్లాహ్‌ తెర, పైకప్పు, ఇస్మా’యీల్‌కు బదులుగా స్వర్గం నుండి వచ్చిన గొర్రెకొమ్ములు అన్ని కాలిపోయాయి. ఈ సంఘటన 64 హిజ్రీలో సఫర్‌నెలలో జరిగింది. 64 హిజ్రీ రబీఉల్‌ అవ్వల్‌లో అతడు మరణించాడు. యుద్ధం జరుగుతూ ఉండగా ఈ వార్త అందింది. ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘జుబైర్‌ (ర) బిగ్గరగా ”ఓ సిరియా ప్రజలారా! మిమ్మల్ని మార్గభ్రష్టత్వానికి గురిచేసినవాడు మరణించాడు” అని అరిచారు. అది వినగానే సైన్యం పారిపోయింది. చాలా అవమానానికి గురయ్యారు. ప్రజలు వారిని వెంబడించారు. ఆ తరువాత ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘జుబైర్‌ (ర) నుండి బై’అత్‌ తీసుకున్నారు.

సారాంశం: నేను పేర్కొన్న ‘హదీసు’లో బై’అతె రి’ద్వాన్‌లో పాల్గొన్న అనుచరుల గురించి పేర్కొనడం జరిగింది. వీరి గురించే అల్లాహ్‌ ఇలా ఆదేశించాడు: వాస్తవానికి విశ్వాసులు చెట్టుక్రింద నీతో చేసిన శపథం చూసి అల్లాహ్‌ సంతోషించాడు; మరియు వారి హృదయాల స్థితి ఆయనకు తెలిసిందే. కావున ఆయన వారి మీద శాంతిని అవతరింపజేశాడు. మరియు బహుమానంగా వారికి సమీపవిజయాన్ని ప్రసాదించాడు.” (అల్‌ ఫత్‌హ్‌, 48:18)

 అదృష్టవంతులైన ఈ అనుచరులందరూ నిస్సందేహంగా స్వర్గవాసులే. ఇహలోకంలోనే వారికి స్వర్గ శుభవార్త అందింది. కాని ఈ కల్లోలాలకు గురై శాశ్వతంగా దూర మయ్యారు. కొందరు, యీద్బిన్ముసయ్యిబ్, ఉల్లేఖనంలో ఉన్న భవిష్యవాణిలో జమల్ యుద్ధం, సిప్ఫీన్ యుద్ధంలా అభిప్రాయపడ్డారు. వారి రక్తంతో అక్కడి నేల ఎర్రబడింది. అయితే వీటిని గురించి మేము రాబోయే పేజీల్లో పేర్కొంటాము. దీనివల్ల మరికొన్ని విషయాలు తెలుస్తాయి. కొందరు య’జీద్‌ చేతిపై బై’అత్‌ చేసారు. మరికొందరు నిరాకరించారు. మరికొందరు మదీనహ్ వదలి వెళ్ళిపోయారు. వాస్తవం ఏమిటంటే ము’ఆవియహ్‌ (ర) తన జీవిత కాలంలోనే తన కుమారుణ్ణి కాబోయే పాలకుడని ప్రకటించకుండా ఉండ వలసింది. ఎందుకంటే అతనికంటే ముందు అబూ బకర్‌ (ర) తన కుమారుని గురించి ఏ విషయమూ ప్రకటించలేదు. ‘ఉమర్‌ కూడా ప్రకటించలేదు. ‘ఉస్మాన్‌ (ర) కూడా ప్రక టించ లేదు. ‘అలీ (ర) కూడా ప్రకటించ లేదు. ము’ఆవియహ్‌ (ర) ఈపని చేసి చాలా పెద్ద పొరపాటు చేసారు.

జలాలుద్దీన్‌ సుయూతీ ”తారీఖుల్ఖులఫా”లో ము’ఆవియా గురించి పేర్కొంటూ 50 హిజ్రీలో ము’ఆవి యహ్‌ (ర) తన కుమారుని కోసం సిరియా ప్రజలనుండి బై’అత్‌ తీసుకున్నారు. దీనివల్ల అర్థం అయ్యే విషయం ఏమిటంటే తన కొడుకు కోసం తన జీవితకాలంలోనే బై’అత్‌ తీసుకున్న మొట్టమొదటి వ్యక్తి ము’ఆవియహ్‌ యే. ఆ తరువాత మదీనహ్ ప్రజల నుండి కూడా బై’అత్‌ తీసుకోమని మర్వాన్కు ఉత్తరం వ్రాసారు. అనంతరం ప్రసంగంలో మర్వాన్‌ ఖలీఫహ్ తరఫు నుండి అతనికొడుకుకోసం బైఅత్‌ తీసుకోమని ఆదేశం వచ్చిందని ‘ఇది అబూ బకర్‌ (ర) ‘ఉమర్‌ల సాంప్రదాయం’ అని అన్నాడు. అప్పుడు ‘అబ్దుర్ర’హ్మాన్‌ బిన్‌ అబూ బకర్‌ (ర) నిలబడి, ‘కాదు కాదు ఇది ఖైసర్‌, ఖస్రాల సాంప్ర దాయం. ఎందుకంటే అబూ బకర్‌ (ర), ‘ఉమర్‌ (ర) ఏ నాడూ తమ సంతానం తరఫున, లేదా ప్రవక్త (స) కుటుం బం తరఫున బై’అత్‌ తీసుకోలేదు,’ అని అన్నారు.

51 హిజ్రీలో ము’ఆవియహ్‌ (ర) ‘హజ్‌ చేసారు, ఇంకా తన కొడుకు కోసం బై’అత్‌ తీసుకున్నారు. ఇబ్నె ‘ఉమర్‌ ను పిలిపించి, ‘ఓ ఇబ్నె ‘ఉమర్‌ (ర)! నాయకత్వం లేనిదే నాకు మనశ్శాంతి ఉండదు అని అంటావు, మరి ప్రజల వ్యవహారాల్లో అవరోధాలు కల్పిస్తున్నావు,’ అని అన్నారు. దానికి అబ్దుల్లాహ్బిన్ఉమర్ దైవస్తోత్రం తర్వాత మీకన్నా ముందు కూడా ‘ఖలీఫాలు గతించారు. వాళ్ళకూ సంతానం ఉండేది. వారి కుమారు లకంటే మీ కుమారుడు ఉత్తముడేమీ కాడు. అయి నప్పటికీ వాళ్ళు ఏనాడూ తమ కుమారులను కాబోయే పాలకులుగా ప్రకటించలేదు. ఈ విషయాన్ని ముస్లిముల పై వదలివేసారు. అదేవిధంగా ఇప్పుడు కూడా వాళ్ళు ఏదైనా విషయంపై ఏకాభిప్రాయం వ్యక్తంచేస్తే నేనుకూడా వారిలోని ఒక సభ్యుడ్నే. నువ్వు ముస్లిములను చెడగొడుతున్నావు,’ అని అంటున్నారు. అలా నేను ఎంతమాత్రం చేయటం లేదు,” అని చెప్పి లేచి వెళ్ళిపోయారు.

ఆ తరువాత ము’ఆవియహ్‌ అబూ బకర్‌ () కుమారుణ్ని పిలిపించారు. అతనితో కూడా ఇలాగే అన్నారు. అతను కూడా ‘మేము మీకు ఈ విషయాన్ని అప్పగించామని భావిస్తున్నారా? మేము అలా అప్పగించ లేదు. అల్లాహ్ సాక్షి! ఈ విషయంలో ప్రజలందరూ కలసి సంప్రదించాలి’ అని పలికి లేచి వెళ్ళి పోయారు. ము’ఆవియహ్‌ (ర) ఈ విషయంలో నాకు సహాయం చేయమని అల్లాహ్ ను ప్రార్థించారు.

ఆ తరువాత ము’ఆవియహ్‌ (ర) ఇబ్నె జుబైర్ను పిలిచి, ఓ ఇబ్నె ‘జుబైర్‌! నీవు నక్కలాంటివాడవు. ఒక రంధ్రం నుండి బయటకు వస్తావు, మరోరంధ్రంలో దూరిపోతావు. నువ్వే వాళ్ళిద్దరినీ పురికొల్పి ఉంటావు. దానికి ఇబ్నె ‘జుబైర్‌, ఒకవేళ మీరు పరిపాలనపట్ల విసిగిపోతే, అధికారాన్ని వదలివేయండి. మేము మీకొడుకు కోసం బై’అత్‌ చేసుకుంటాము. మీరే చెప్పండి, మీ ఇద్దరి మాట తప్ప మేము మరేం చేయగలము. మేము ఎవరి మాట వినాలి. ఎందుకంటే ఏక కాలంలో ఇద్దరు పాలకుల అధికారం ఎలా చెల్లుతుంది అని చెప్పి వెళ్ళి పోయారు.

ఆ తరువాత ము’ఆవియహ్‌ మెంబరుపై ఎక్కి దైవస్తోత్రం తరువాత, ”ఇబ్నె ‘ఉమర్‌ (ర), ఇబ్నె అబూ బకర్‌ (ర), ఇబ్నె ‘జుబైర్‌ (ర), య’జీద్‌ బై’అత్‌కు వ్యతిరేకులని నాకు వేగుల వాళ్ళ ద్వారా తెలిసింది. కాని వాళ్ళు య’జీద్‌పై బై’అత్‌ చేసుకున్నారు” అని అన్నారు. దానికి సిరియా ప్రజలు, ‘మా ముందు వాళ్ళు బై’అత్‌ చేయనంతవరకు మేము నమ్మం, ఒకవేళ మా ముందు అలా చేయకపోతే ముగ్గురి తలలు నరికివేస్తాం’ అని అన్నారు. అప్పుడు ము’ఆవియహ్‌ ‘సుబ్‌హానల్లాహ్‌, ఖురైష్‌ల విషయంలో ఇంత అవమానమా, ఇక ముందు నేను ఇటువంటి మాటలు వినదలచుకోలేదు’ అని పలికి మెంబరుపై నుండి క్రిందికి దిగారు.

ఆ తరువాత ప్రజల్లో ఇబ్నె ‘ఉమర్‌ (ర), ఇబ్నె అబూ బకర్‌ (ర), ఇబ్నె’జుబైర్‌(ర) య’జీద్‌ చేతిపైబై’అత్‌ చేసుకున్నారని పుకార్లు లేచాయి. వీళ్ళు వ్యతిరేకిస్తూనే ఉన్నారు.

ముఆవియహ్‌ (ర) ‘హజ్‌ తర్వాత సిరియా వెళ్ళి పోయారు. య’జీద్‌పై బై’అత్‌ చేసినపుడు ఇబ్నె ‘ఉమర్‌ (ర), ”ఈ వ్యక్తి మంచివాడైతే మేము సుముఖతను వ్యక్తం చేస్తాము, లేదా పరీక్షపై సహనం పాటిస్తాం,” అని అన్నట్టు ఇబ్నె సికిందర్‌ పేర్కొన్నారు. ము’ఆవియహ్‌ తన జీవితంలోనే తన కొడుకును యువరాజుగా ప్రకటించాడు. అందువల్ల ప్రజలు అసహ్యించుకున్నారని జలాలుద్దీన్సుయూతీ తారీఖుల్ఖులఫాలో పేర్కొన్నారు.

హసన్స్రీ అభిప్రాయం: ఇద్దరు వ్యక్తులు ప్రజలను కల్లోలాలకు గురిచేసారు. మొదటి వాడు అమ్ర్బిన్స్, ఇతడు సిప్ఫీన్యుద్ధంలో ము’ఆవియహ్‌ను సైగచేసి ఖుర్‌ఆన్‌ ఎత్తించారు. రెండవ వ్యక్తి ముగీరహ్ బిన్షూబహ్, ఇతడు ము’ఆవియహ్‌ తరఫున కూఫాలో తాసిల్దార్‌గా ఉండేవాడు. ము’ఆవియహ్‌ (ర) అతనికి ఉత్తరం వ్రాస్తూ, ”నీవు ఈ ఉత్తరం చదివిన తర్వాత నిన్ను తొలగించినట్టు భావించాలి. కాని ము’గీరహ్ బిన్‌ షూబహ్ స్వయంగా ము’ఆవియహ్‌ వద్దకు వెళ్ళారు. ము’ఆవియహ్‌, వచ్చిన కారణం అడిగారు. దానికి ముగీరహ్ బిన్‌ షూబహ్, ‘నేనొక ముఖ్యమైన పని చేస్తున్నందున తమరి ఆదేశాన్ని పాలించడంలో ఆలస్యం అయ్యింది,’ అని అన్నారు. ము’ఆవియహ్‌, ‘ఏమిటా పని,’ అని అడిగారు, దానికి అతడు, ‘య’జీద్‌ గురించి బై’అత్‌ తీసుకుంటున్నాను,’ అని అన్నారు. ‘దాన్ని పూర్తిచేసావా?’ అని అడిగారు. దానికి అతను, అవునని అన్నాడు. ము’ఆవియహ్‌ అది విని అతన్ని మళ్ళీ కొనసాగమని ఆదేశించారు. ము’గీరహ్ బిన్‌ షూబహ్, అక్కడి నుండి తిరిగి వెళ్ళిన తర్వాత అతని బంధుమిత్రులందరూ, ‘ఏమయింది’ అని అన్నారు. దానికి ము’గీరహ్ బిన్‌ షూబహ్ నేను ము’ఆవి యహ్‌ను ఎలాంటి సుడిగుండానికి గురిచేసానంటే, ప్రళయం వరకు అతడు దాన్నుండి తప్పించుకోలేడు. అందువల్లే తండ్రి ఉండగా కొడుకు యువరాజు అయ్యాడని, లేకపోతే తీర్పుదినం వరకూ ముస్లిములు పరస్పరం సంప్రదింపులు, సలహాలతోనే ఇటువంటి సమస్యలను పరిష్కరించుకునేవారు అని ‘హసన్‌ బస్రీ పేర్కొన్నారు.

ఇబ్నె సీరీన్అభిప్రాయం: అమ్ర్బిన్హుజ్మ్ ము’ఆవి యహ్‌కు ఉత్తరంవ్రాస్తూ, ‘అల్లాహ్ కు భయపడండి, ముస్లిముల్లో తమరు ఎవరిని ఖలీఫాగా నిర్ణయిస్తున్నారో చూడండి,’ అని అన్నారు. దానికి ము’ఆవియహ్‌ (ర), ‘నీవు నన్ను ఉపదేశించావు, నీ అభిప్రాయం తెలియపరిచావు, కృతజ్ఞుడ్ని. అయితే, ఇప్పుడు యువకులే యువకులు ఉన్నారు. వీరందరిలో నా కుమారుడే అధికారానికి అర్హుడు, కనుక అతడినే నేను కాబోయే ఖలీఫాగా నిర్ణయిస్తాను’ అని అన్నారు.

ఉఖ్బహ్ బిన్ఖైస్ (ర) కథనం: ఒకరోజు ము’ఆవియహ్‌ (ర) ప్రసంగిస్తూ, ‘ఓ అల్లాహ్! నేను య’జీద్‌ను వాడి అర్హతనుబట్టి వాడిని నా పదవికి వారసునిగా ప్రకటి స్తున్నాను. ఈ వ్యవహారంలో నాకు సహాయం చేయి, ఒకవేళ నేను తండ్రి ప్రేమవల్ల ఇలాచేస్తే, అతడు దానికి అర్హుడు కానిపక్షంలో అతడు సింహాసనాన్ని అధిష్టించక ముందే అతని ఆత్మను వశపరచుకో’ అని ప్రార్థించారు.

ముఆవియహ్మరణానంతరం సిరియా ప్రజలు య’జీద్‌ చేతిపై బై’అత్‌ చేసుకున్నారు. య’జీద్‌ మదీనహ్ ప్రజలను కూడా బై’అత్‌ చేయమని కబురుపంపాడు. హుసైన్(ర),ఇబ్నె జుబైర్(ర)తిరస్కరించారు. ఆ రాత్రి ఇద్దరూ మక్కహ్ వచ్చారు. అబ్దుల్లాహ్బిన్జుబైర్ (ర) య’జీద్‌ చేతిపై బై’అత్‌ చేయలేదు. తన చేతిపై ప్రజలు బై’అత్‌ చేయాలని కోరలేదు. కాని ‘హుసైన్‌ (ర)ను కూఫా ప్రజలు ము’ఆవియహ్‌ కాలం నుండే పిలుస్తున్నారు. ‘బై’అత్‌ చేస్తాం’ అని కోరుతున్నారు. కాని హుసైన్ (ర) తిరస్కరిస్తూ వస్తున్నారు. య’జీద్‌, బై’అత్‌ తీసుకోగానే తన స్థానాన్ని గుర్తించి, కూఫా వెళదామని నిశ్చయించుకున్నారు. ఇబ్నె ‘జుబైర్‌ కూడా వెళ్ళమని సలహా ఇచ్చారు. కాని ఇబ్నె అబ్బాస్, ఇబ్నె ఉమర్లు వెళ్ళవద్దని కోరారు. ‘అల్లాహ్ ప్రవక్త (స)ను ఐహిక జీవితం, పరలోకాల్లో ఒకదాన్ని ఎంచుకోమని ఆదేశించాడు. కాని ప్రవక్త (స) పరలోకాన్ని ఎన్ను కున్నారు. తమరు కూడా పరలోకాన్నే అనుసరించండి. ప్రాపంచిక విషయాలవైపు శ్రద్ధచూపకండి’ అని హితబోధ చేసారు. కాని ‘హుసైన్‌ (ర) వినలేదు. చివరికి ఇబ్నె ‘ఉమర్‌ ఏడుస్తూ వీడ్కోలు పలికారు. ఇంకా ‘ ‘హుసైన్‌ మా ఒక్కమాట వినలేదు. అతని తండ్రి, సోదరుల విషయంలో కూఫావారిని గుర్తించిన తర్వాతకూడా వెళ్ళారు,’ అని అంటుండేవారు.

అదేవిధంగా అతనికి జాబిర్బిన్అబ్దుల్లాహ్, అబూ యీద్, అబూ వాఖిద్ అల్లైసీ ఎంత నచ్చజెప్పినా వినలేదు. ఇరాఖ్ వెళదామని దృఢంగా నిశ్చయించు కున్నారు. అప్పుడు ఇబ్నె ‘అబ్బాస్‌ (ర), ‘ఉస్మాన్‌ (ర)లా, ఇతను కూడా వీరమరణం పొందుతారనిపిస్తుంది’ అని అన్నారు. అబ్దుస్సలామ్‌ బస్తవీ ఇస్లామీ అఖా యిద్‌లో ఇలా పేర్కొన్నారు. 60వ హిజ్రీ (681 క్రీ.శ.) లో ము’ఆవియహ్‌(ర) మరణించారు. జీద్రాజయ్యాడు. అతడు ప్రజలందరి నుండి బై’అత్‌ తీసుకోవటం ప్రారంభించాడు. కూఫాలోని సులైమాన్బిన్మర్వ, ఖుజాయీ ఇంట్లో చేరి, ము’ఆవియహ్‌ (ర) సంతాపం, య’జీద్‌ బై’అత్‌ గురించి మాట్లాడారు. సులై మాన్ అన్నారు, ”ఇప్పుడు ము’ఆవియహ్‌ మరణించారు. ‘హుసైన్‌ (ర), య’జీద్‌ బై’అత్‌ను తిరస్క రించారు. ఇప్పుడు మీరు వారినే అనుసరించాలి. ఒకవేళ మీరు కోరితే వారినిపిలిచి, వారికి సహాయం చేయండి. ఉత్తరం వ్రాసి వారిని పిలిపించుకోండి. మీకిష్టం లేకపోతే వారిని ఇరకాటంలో పడవేయకండి,” అని అన్నారు. అప్పుడు ప్రజలు, ‘అతనువస్తే తప్పకుండా మేము ఆదరిస్తాము,’ అని అన్నారు. ఆ తరువాత సులైమాన్బిన్ సర్ద్ఖుజాయీ, ముసయ్యిబ్బిన్నఖ్బహ్, రిఫా బిన్షద్దాద్, హబీబ్బిన్మజాహిర్ మొదలైన వారి తరఫునుండి ఉత్తరం పంపబడింది. అందులో ఇలా ఉంది: ” ‘హుసైన్‌ బిన్‌ ‘అలీ (ర) అభిమానుల తరఫున ఆయన వైపునకు పంపుతున్న ఉత్తరం: ‘తమరు త్వరగా తమరి అభిమానుల వద్దకు చేరిపోండి. కూఫాలోని ప్రజలందరూ మీ కోసం ఎదురు చూస్తున్నారు. మిమ్మల్నితప్ప మరెవ్వర్నీ వారు ఆమోదించటం లేదు. దురదృష్ట కరమైన విషయం ఏమిటంటే ప్రస్తుతం మాకు నాయకు లెవరూ లేరు. తమరు వెంటనే రావాలి. మేమంతా తమకు విధేయులమై ఉన్నాం. తమరు వస్తే మనమంతా కూఫాపై దాడిచేద్దాం. ప్రస్తుతం ఉన్న అధికారిని తొలగించి ఎల్లప్పుడూ మీ విధేయతలో ఉంటాం.” (జలా ఉల్ఉయూన్)

ఈ విధంగా ప్రయత్నంలో ఏమాత్రం లోపం ఉంచలేదు. అధికారం గురించి ఆశచూపడం జరిగింది. విధేయతా వాగ్దానం కూడా చేయబడింది. అనేక ఉత్తరాలు పంపటం జరిగింది. సుమారు రెండువందల ఉత్తరాలు పంపటం జరిగింది. ‘హుసైన్‌ వద్దకు సుమారు 12,000 ఉత్తరాలు పంపటం జరిగింది. అప్పుడు ‘హుసైన్‌ (ర) ముందు జాగ్రత్తగా, తన చిన్నాన్న కొడుకైన, ముస్లిమ్బిన్అఖీల్ను తన ప్రతినిధిగా చేసి పంపుతూ కూఫా ప్రజల పట్ల అప్రమత్తంగా ఉండాలని, రహస్యాన్ని బయట పెట్టరాదని, ఒకవేళ నిజంగానే కూఫా ప్రజలు నా పాలనపై బై’అత్‌ చేస్తే, వాస్తవాల గురించి నాకు తెలియపర్చాలని ఆదేశించారు. (జలా ఉల్ఉయూన్)

‘హుసైన్‌ (ర) ముస్లిమ్‌ ద్వారా సులైమాన్బిన్సర్ద్ఖుజాయీ, ముసయ్యిబ్బిన్నఖ్బహ్, రిఫా బిన్షద్దాద్ మరియు అబ్దుల్లాహ్బిన్లావహ్ లకు ఉత్తరం పంపారు. అందులో, ”హాని మరియు స’యీద్‌ల ద్వారా మీ నుండి అనేక ఉత్తరాలు అందాయని, ప్రస్తుతం ముస్లిమ్‌ను పంపుతున్నాను, పరిస్థితులను అంచనా వేసి వాస్తవాలను గురించి నాకు తెలిపితే, నేను  అతి త్వరగా మీ వద్దకు వస్తాను” అని రాసారు. (జలా ఉల్ఉయూన్)

ముస్లిమ్‌ కూఫా చేరగానే 8,000 మంది ప్రజలు బై’అత్‌ చేసారు. ముస్లిమ్‌ చేరిన తర్వాత కూడా కూఫా వారు ‘హుసైన్‌కు ఒక ఉత్తరం వ్రాసారు. అందులో త్వరగా రమ్మని లక్ష కరవాలాలు తమర్ని సహాయం కొరకు వేచి ఉన్నాయని వ్రాసారు.

ముస్లిమ్‌ చేతిపై 80 వేల మంది కూఫా ప్రజలు బై’అత్‌ చేయగానే వారి ఆప్యాయతను, ప్రేమను చూచి, ‘విజయం తథ్యం, అని నమ్మి ‘హుసైన్‌కు ఎటువంటి భయంలేదు, తమరు విచ్చేయండి’ అని ఉత్తరం వ్రాసారు. ఈ ఉత్తరాన్ని ముస్లిమ్‌ తాను వీరమరణం పొందటానికి 27 రోజుల ముందు పంపారు.

‘చాలా విచారకరమైన విషయం ఏమిటంటే, నిన్న బై’అత్‌ చేసినవారు, ఈనాడు కానరావటం లేదు. నమా’జు ముగిసిన తర్వాత ముస్లిమ్‌ తన సేవకునితో, సేవకా! ఈ ప్రజలు ఎలాంటి పనికి ఒడిగట్టారు’ అని అన్నారు. దానికి ఆ సేవకుడు యజమాని! ఇక్కడి ప్రజలు ‘హుసైన్‌పై చేసిన ప్రమాణాన్ని భంగంచేసారు. య’జీద్‌కు విధేయులైపోయారు. చివరికి ముస్లిమ్ను రాళ్ళతో చంపివేసారు.

12 వేల ఉత్తరాలు అందిన తర్వాత ముస్లిమ్‌ సంతృప్తికరమైన ఉత్తరం అందినవెంటనే ‘హుసైన్‌ కూఫా వెళ్ళాలని నిశ్చయించుకున్నారు. మక్కహ్ నుండి బయలుదేరినపుడు, బంధువులు మిత్రులు వెళ్ళవద్దని నచ్చజెప్పారు. కాని వినలేదు. 80 వేల మంది కూఫా ప్రజలు ప్రమాణం చేసారనే వార్తను బట్టి విజయం తథ్యమని భావించి ఎవరి మాట వినలేదు. ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘ఉమర్‌, ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘అబ్బాస్‌ అతన్ని వీడ్కోలు పలుకుతూ మేము మిమ్మల్ని అల్లాహ్‌కు అప్పగిస్తున్నాం, తమరు ఈ ప్రయాణంలో వీరమరణం పొందుతారని తెలిపారు. (జలా ఉల్ఉయూన్)

మార్గం మధ్యలో ముస్లిమ్‌, అబ్దుల్లాహ్‌ బిన్‌ యఖ్‌తర్‌, మర్‌వహ్‌ బిన్‌ హానీ చంపబడ్డారని తెలిసి ఆశ్చర్యచకితు లయ్యారు. ”ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజివూన్‌” పఠించి తిరుగు ప్రయాణం కోసం సంప్రదించారు. ముస్లిమ్‌ సోదరుడు ముందుకు వచ్చి యుద్ధ ఉత్సాహంతో ప్రాణం ఉన్నంత వరకు మేము ముస్లిమ్‌ ప్రతీకారం తప్పకుండా తీసుకుందాము. లేదా మేము కూడా అతనిలా వీరమరణం పొందుదాం. ఏది ఏమైనా సరే అని అన్నారు.

‘హుసైన్‌ (ర) కూడా ముందుకు సాగారు. తమ పట్ల విధేయత చూపిన ప్రజలు ఈవిధంగా ప్రవర్తిస్తారని అతనికేం తెలుసు? కూఫా ప్రజలు ‘హుసైన్‌ను అన్ని వైపుల నుండి చుట్టు ముట్టారు. అప్పుడు ‘హుసైన్‌ (ర) ఇలా ప్రసంగించారు: ప్రజలారా! మీరు నాశనం అవుగాక! మీరే మమ్మల్ని నిరంతరం రమ్మని పిలిచారు. మేము మీ పిలుపు వినగానే వెంటనే వచ్చాము. కాని మీరు మా చేతిలో ఉన్న కత్తినే మాపై ఎత్తారు, మేము మన శత్రువులపై విసిరిన అగ్నిజ్వాలలనే మీరు మాపై విసిరారు. మీ చేతులపై బై’అత్‌ చేస్తామని మీరు గుమ్మడి కాయపై పురుగులు పరిగెత్తినట్టు పరిగెత్తారు. దానిపై దీపంపై చీమలు పడినట్టుపడ్డారు. ఆ తరువాత మీరే ఆ బై’అత్‌ను భంగం చేసారు.

అమ్ర్బిన్అద్, ‘మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు,’ అని ‘హుసైన్‌ను అడిగారు. దానికి ‘హుసైన్‌ (ర), ‘కూఫా వాళ్ళు ఉత్తరాలు పంపారు,’ అని అన్నారు. ‘అమ్ర్‌ బిన్‌ స’అద్‌, ‘ఇప్పుడు మీకు కూఫా ప్రజలు ప్రమాణభంగం చేసారు, మీకు శత్రువులైపోయారని తెలిసిపోయింది. ఇప్పుడు మీ ఉద్దేశ్యం ఏమిటి,’ అని అన్నారు. దానికి ‘హుసైన్‌ (ర) ఇలా అన్నారు: ‘నన్ను మక్కహ్ లేదా మదీనహ్ వెళ్ళనివ్వండి. లేదా మరెక్కడికైనా వెళ్ళ నివ్వండి,’ అని కోరారు. కాని కూఫా ప్రజలు దీనికి నిరాకరించారు. చంపటాన్నే ఎన్నుకున్నారు. అప్పుడు ‘హుసైన్‌ (ర), ‘మా విధేయులే మమ్మల్ని ఒంటరిగా వదలివేసారు.’ ‘హుసైన్‌ (ర) కర్బలాలో ఖైమలో కుర్చీపై కూర్చొని కూఫా వారి ఉత్తరాలు తడుముతుండగా, ఒక ఇరాకీ ప్రయాణీకుడు ఆ ఆందోళనకు కారణం అడిగాడు. దానికి ‘హుసైన్‌ (ర), ‘నన్ను కూఫా ప్రజలు పిలిచారు. ఇవన్నీ వారి ఉత్తరాలే, కాని ఇప్పుడు నన్నే చంపటానికి సిద్ధం అయి ఉన్నారు. ఇన్‌షా అల్లాహ్‌ వారికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. వారిని అవమానించటం జరుగు తుంది. ఎల్లప్పుడూ కష్టాలకు గురవుతూ ఉంటారు,’ అని అన్నారు. (నాసిఖుత్తవారిఖ్)

ఏది ఏమైనా కూఫా వారు ‘హుసైన్‌ను 3, 4 రోజులు ఆకలి దప్పికలతో ఉంచి, అసహాయస్థితిలో కర్‌బలా మైదానంలో మిత్రులందరితో పాటు చంపివేసారు. (ఖులాసతుల్మసాయిబ్)

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘ఉమర్‌ (ర) ను ఒక ఇరాకీ వ్యక్తి ”ఇ’హ్‌రామ్‌ స్థితిలో ఈగను చంపితే, దానికి పరిహారం ఏమిటి?” అని అడిగాడు. దానికి ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘ఉమర్‌ (ర) చాలా బాగుంది, ‘ఇరాఖీయులు ఈగను చంపటాన్ని గురించి అడుగుతున్నారు. అటు ప్రవక్త (స) మనవడు ‘హుసైన్‌ (ర)ను నిష్కారణంగా చంపారు. ఏమాత్రం దైవానికి భయపడలేదు. వాస్తవం ఏమిటంటే ప్రవక్త (స) వారి గురించి వీళ్ళిద్దరూ ఈ లోకంలో రెండు పువ్వుల వంటివారు అని ప్రవచించారు” అని అన్నారు.

  కూఫా ప్రజలు ‘హుసైన్‌ను చంపిన తర్వాత స్వయంగా వారే ఆయన పట్ల దుఃఖవిచారాలను వ్యక్తపరుస్తూ పెడబొబ్బలు పెట్టసాగారు. అప్పుడు జైనుల్ఆబిదీన్ను వీళ్ళేచంపి, వీళ్ళే పెడబొబ్బలు పెడితే, మమ్మల్ని హింసించినదెవరో మీరే చెప్పాలి. అంటే స్వయంగా వారే చంపి వాళ్ళే దుఃఖవిచారాలను పాటిస్తున్నారు. (ఇహ్తిజాజ్తబ్రీ / 156)

‘హుసైన్‌ చంపబడినపుడు ‘జైనుల్‌ ‘ఆబిదీన్‌ అనారోగ్యంగా ఉన్నారు. బట్టలు చించుకొని కూఫా స్త్రీలు, పురుషుల ఏడ్పులు పెడబొబ్బలు పెట్టటం చూసారు. అప్పుడు ‘జైనుల్‌ ‘ఆబిదీన్‌ బలహీనమైన స్వరంతో ”వీళ్ళు మాపై ఏడుస్తున్నారు. అయితే, అతన్ని చంపింది వీళ్ళు తప్ప మరెవరు?” అని అన్నారు. అంటే వీళ్ళే చంపారు, వీళ్ళే బట్టలు చించుకొని ఏడ్పులు, పెడబొబ్బలు పెడుతున్నారు. అంటే వీళ్ళు ఏడ్పులు పెడబొబ్బలు పెట్టి సత్యాన్ని కప్పిపుచ్చాలని ప్రయత్నిస్తున్నారు. అల్లాహ్‌ సాక్షి! ఎంతమాత్రం కాదు, తీర్పుదినం నాడు వారి మెడ నా చేతిలో ఉంటుంది.

ఈ చారిత్రక సాక్ష్యాధారాలన్నిటి ద్వారా ‘హుసైన్‌ను కూఫా వాళ్ళే చంపారని స్పష్టమయింది. కాని ఏడ్పులు, పెడబొబ్బలు పెట్టి ఈ హత్యానేరాన్ని కప్పిపుచ్చాలని ప్రయత్నిస్తున్నారు. అంతే కాదు, ‘హుసైన్‌, ఆయన కుటుంబం పట్ల ప్రేమను వలకబోస్తున్నారు. ఇంకా ప్రవక్త (స) సిఫారసు చేస్తారని ఆశిస్తున్నారు.

ఇస్లామీ అఖామత్లోని 83వ పేజీలో ‘హుసైన్‌ను హత్యచేసి దుఃఖాన్ని విచారాన్ని ప్రకటిస్తూ దాన్ని పుణ్యకార్యంగా భావించింది, కూఫా వ్యక్తి య’జీద్‌ మాత్రమే, ఇతడు ‘హుసైన్‌ శత్రువు, హంతకుడు.

ఏది ఏమైనా ము’హర్రమ్‌లో శోకం, దుఃఖం ప్రకటనా ఆచారం య’జీద్‌ ఇంటిలో ప్రారంభమైంది. కొన్నిరోజుల తర్వాత య’జీద్‌, ‘హుసైన్‌ కుటుంబానికి, సిరియాలో లేదా మదీనహ్ లో ఉండే అనుమతి ఇచ్చాడు. అప్పుడు వాళ్ళు దుఃఖాన్ని ప్రకటించే అనుమతికోరారు. వారికి అనుమతి ఇవ్వబడింది. సిరియాలో ఉన్న ఖురైష్‌, బనీ హాషిమ్‌లు అందరూ ఆ దుఃఖ ప్రకటనలో పాల్గొన్నారు. వారం రోజులవరకు అది కొనసాగింది. ఆ తరువాత య’జీద్‌ వారిని గౌరవంగా మదీనహ్ సాగనంపాడు. య’జీద్‌ ఎటువంటి వ్యక్తి అనేది ఇంతకు ముందు మేము పేర్కొన్నాము. కాని పై వాక్యాల ద్వారా అతడు అహ్లె బైత్‌ను ప్రేమించేవాడునూ, శ్రేయోభిలాషి అని తెలుస్తుంది.

  ము’ఆవియహ్‌ (ర) తన జీవిత కాలంలోనే య’జీద్‌ను యువరాజుగా ప్రకటించడం సరైన పనికాదు. ఇది అతని పొరపాటు. ము’ఆవియహ్‌ (ర) ఇస్లామ్‌ను చాలా దూర ప్రాంతాల వరకు వ్యాపింపజేసారు. ఇస్లామ్‌ శత్రువులతో యుద్ధంచేసారు. య’జీద్‌ కూడ ఈ పోరాటాల్లో పాల్గొన్నాడు.

బు’ఖారీలో ఇలా ఉంది: ము’ఆవియహ్‌ (ర) కొన్ని ఇస్లామీయ పోరాటాల్లో య’జీద్‌ను సైన్యాధికారిగా పంపారు. ఉమ్మె హరామ్ కథనం, ”నేను ప్రవక్త (స)ను జిహాద్‌లో పాల్గొంటానని కోరాను. దానికి ప్రవక్త (స), ‘నువ్వు జిహాద్‌లో పాల్గొంటావు, జిహాద్‌లోనే నీవు వీరమరణం పొందుతావు’ అని అన్నారు. ప్రవక్త (స) ఉమ్మె హరామ్‌ ఇంటికి వెళ్ళేవారు. ఆమె ప్రవక్త (స)కు తగురీతిలో సేవ చేసేవారు.

బు’ఖారీలో ఇలా ఉంది, ‘హజ్జతుల్‌ విదా’ తరువాత ఒక రోజు ప్రవక్త (స) భోజనం చేసి విశ్రాంతి తీసుకుంటున్నారు. ఉమ్మె హరామ్‌ ప్రవక్త (స)కు పేళ్ళు చూడటం ప్రారంభించారు. ప్రవక్త (స)కు నిద్రపట్టింది. కాని కొంతసేపటికి ప్రవక్త (స) చిరునవ్వు నవ్వుతూ లేచి, ‘నేను కలగన్నాను. అదేమిటంటే నా అనుచర సమాజానికి చెందిన కొందరు యుద్ధ సంకల్పంతో సముద్ర ప్రయాణం చేస్తున్నారు,’ అని అన్నారు. అప్పుడు ఉమ్మె హరామ్‌, ‘ఓ ప్రవక్తా! నేనూ వారిలో ఉండేటట్టు ప్రార్థించండి,’ అని విన్నవించుకున్నారు. ప్రవక్త (స) ప్రార్థించారు. మళ్ళీ ప్రవక్త (స) పడుకున్నారు. కొంతసేపటికి చిరునవ్వు నవ్వుతూ లేచి మళ్ళీ దాన్ని గురించి ప్రస్తావించారు. ఉమ్మె హరామ్‌ మళ్ళీ తన గురించి ప్రార్థించమని విన్నవించుకున్నారు. అప్పుడు, ప్రవక్త (స), ‘నువ్వు మొదటి బృందంలో ఉన్నావు,’ అని అన్నారు. ఈ కల 28 హిజ్రీలో నిజమయింది.

  ‘ఉమర్‌ (ర) తరఫున ముఆవియహ్‌() సిరియా పాలకుడిగా ఉండేవారు. అతడు జ’జాయిర్‌పై దాడి చేస్తానని అనేకసార్లు అనుమతికోరారు. కాని ‘ఉమర్‌ (ర) అనుమతి ఇవ్వలేదు. ‘ఉస్మాన్‌ (ర) కాలంలో అతడు తన కోరికను బహిర్గతం చేసారు. అతనికి అనుమతి లభించింది. అనంతరం అతడు సైప్రస్పై దాడి కోసం సన్నాహాలు చేసారు. ఈ దాడిలో చాలామంది ప్రవక్త (స) అనుచరులు పాల్గొన్నారు. వీరిలో ఉమ్మె హరామ్ కూడా ఉన్నారు. విజయం సాధించిన తర్వాత తిరుగు ప్రయాణంలో వాహనంపై ఎక్కుతూ క్రిందపడి మరణించారు. అక్కడే ఆమెను ఖననం చేయడం జరిగింది. (‘స’హీ’హ్‌ బు’ఖారీ)

బు’ఖారీలో బాబుర్రూమ్‌లో ఉమ్మె హరామ్‌ (ర) ఉల్లేఖనం: ప్రవక్త (స) ”నా అనుచర సమాజంలోని సముద్ర ప్రయాణం చేసే మొదటి సైన్యం స్వర్గంలోనికి ప్రవేశిస్తుంది” అని అన్నారు. అప్పుడు ఉమ్మె హరామ్‌, ”ఓ ప్రవక్తా! నేను కూడా వారిలో ఉండేటట్టు దీవించండి,” అని అన్నారు. దానికి ప్రవక్త (స), ‘నీవు కూడా వారిలో ఉన్నావు,’ అని అన్నారు. ఆ తరువాత ఖైసరె రూమ్పై దాడిచేసే మొదటి ముస్లిమ్‌ సైన్యం అల్లాహ్‌ క్షమాపణను పొందుతుంది,’ అని అన్నారు. అప్పుడు నేను కూడా వారిలో ఉంటానా? అని విన్నవించుకున్నాను. దానికి ప్రవక్త (స), ‘లేదు’ అని అన్నారు.

ఈ యుద్ధంలో యజీ’ద్‌ బిన్‌ ము’ఆవియహ్‌ సైన్యాధి కారిగా ఉన్నాడు. అనేకమంది ప్రవక్త (స) అనుచరులు పాల్గొన్నారు. ఈ సంఘటన 58వహిజ్రీలో జరిగింది. ప్రవక్త (స) ఈ యుద్ధంలో పాల్గొన్న వారందరినీ క్షమించడం జరుగుతుందని భవిష్యవాణి పలికారు.

కొందరు ఈ ‘హదీసు’ ద్వారా య’జీద్‌ బిన్‌ ము’ఆవియహ్‌ క్షమించబడతాడని భావిస్తున్నారు. అయితే అతడు చాలా దుర్మార్గుడు, అతడు తన పరిపాలనా కాలంలో అనేక దుర్మార్గాలకు పాల్పడ్డాడు. మదీనహ్ గవర్నర్లకు తన గురించి బై’అత్‌ తీసుకోమని ఆదేశించాడు. పౌరుషం గల అనుచరులు మదీనహ్ నుండి మక్కహ్ కు వలస పోయారు. కొందరు ఇతర ప్రాంతాలకు వలసపోయారు. జీద్కుట్రవల్లే హుసైన్‌ () వీరమరణం పొందారు. అదేవిధంగా అబ్దుల్లాహ్బిన్జుబైర్ను కూడా మక్కహ్ లో చంపించాడు. ఇతడే మదీనహ్ పై దాడి చేయించాడు. హరమ్లో గుర్రాలను కట్టించింది ఇతడే. మస్జిదె నబవీని, ప్రవక్త () సమాధిని అవమానపరిచింది ఇతడే. ఇంకా తన సేవకుని చేతులతో ప్రవక్త (స) అనుచరులు, తాబియీన్లు, అయిన మహావ్యక్తులను అన్యాయంగా చంపించాడు. ఇన్ని దుర్మార్గాలు, హత్యలు, హింసలు చేసి ఎలా క్షమించ బడతాడు? అయితే క్షమించబడటానికి ఒక మార్గం ఉంది. ” స్వయంగా మీకు (మీ ఆత్మలకు) మీరే అన్యాయం చేసుకున్న నా దాసులారా! అల్లాహ్‌ కారుణ్యం పట్ల నిరాశచెందకండి. నిశ్చయంగా, అల్లాహ్‌ అన్ని పాపాలను క్షమిస్తాడు. నిశ్చయంగా ఆయన! కేవలం ఆయనే క్షమాశీలుడు, అపార కరుణాప్రదాత.” (అ’జ్ ‘జుమర్, 39:53)

య’జీద్‌ దుర్మార్గుడే, కాని ముష్రిక్‌ మాత్రం కాడు. అల్లాహ్‌ ముష్రిక్‌ను ఎంతమాత్రం క్షమించడు, అయితే దుర్మార్గుణ్ణి క్షమిస్తాడు. అల్లాహ్‌ ఆదేశం: ”ఇన్నల్లాహ లా యగ్‌ఫిరు అయ్యుష్‌రక బిహి వ యగ్‌ఫిరు మాదూన జాలిక లిమ య్యషాఉ” (అన్ నిసా’, 4:48) అంటే – ‘అల్లాహ్‌ య’జీద్‌ను క్షమించవచ్చు!

ఏది ఏమైనా ము’ఆవియహ్‌ (ర) తన కుమారుణ్ని యువరాజుగా పేర్కొని ఇస్లామీయ ప్రపంచాన్ని అనేక ఉపద్రవాలకు గురిచేసారు. ఈ ఉపద్రవాల్లో ఒక ఉపద్రవం హుర్రహ్ ఉపద్రవంగా ప్రఖ్యాతి గాంచింది. అది ఒక పెద్ద ఉపద్రవం. అది కూడా య’జీద్‌ బిన్‌ ము’ఆవియహ్‌ ద్వారానే తలెత్తింది. హుర్రహ్అనేది, మదీనహ్ లోని నల్లని రాతినేల. అక్కడ ఒక యుద్ధం జరిగింది. య’జీద్‌ను యువరాజుగా పేర్కొనడం జరిగింది. అతడు మదీనహ్ పై దండెత్తాడు. ఇందులో అనేకమంది ప్రవక్త (స) అనుచరులు వీరమరణం పొందారు. ఇందులో పవిత్ర స్థలాన్ని అవమానపరచటం జరిగింది. ఈ దినాన్నే హుర్రహ్దినం అంటారు. ఇది 63హిజ్రీ జిల్‌’హిజ్జహ్‌ నెలలో సంభవించింది.

దీనికంతటికీ కారణం, య’జీద్‌ను యువరాజుగా పేర్కొనడం జరిగింది. మదీనహ్ గవర్నరుకు య’జీద్‌ కొరకు ప్రజల నుండి ప్రమాణం తీసుకోమని ఆదేశించడం జరిగింది. కాని చాలా మంది అనుచరులు య’జీద్‌ అసభ్యకరమైన చేష్టలవల్ల తిరస్కరించి ఇతర ప్రాంతాలకు వలస పోయారు. మదీనహ్ కు సిరియా సైన్యం పంపటం జరిగింది. పవిత్ర మదీనహ్ ను అవమానపరచటం జరిగింది. దీన్ని గురించి జలాలుద్దీన్సుయూతీ తారీఖుల్ఖులఫాలో పేర్కొన్నారు.

63 హిజ్రీలో య’జీద్‌కు మదీనహ్ ప్రజలు దీన్ని వ్యతిరేకి స్తున్నారనే వార్త అందింది. అది విని అతడు ఒక పెద్ద సైన్యాన్ని పంపాడు. మదీనహ్ వారితో యుద్ధం ప్రకటించారు. ఈ సైన్యం అక్కడకు చేరి మదీనహ్ ద్వారం వద్ద యుద్ధం జరిగింది. దీన్ని గురించి ‘హసన్‌ బస్రీ ఇలా పేర్కొన్నారు, ”అనేక మంది అనుచరులు చంపబడ్డారు. మదీనహ్ దోచుకోబడింది. అనేకమంది అమ్మాయిలను చెరచివేయడం జరిగింది.”

ప్రవక్త (స) ప్రవచనం, ”మదీనహ్ ప్రజలను భయపెట్టేవాడిని అల్లాహ్‌ భయపెడతాడు. వాడిపై అల్లాహ్‌, దైవదూతలు, మానవుల అభిశాపం పడుతుంది.” (ముస్లిమ్‌)

మదీనహ్ ప్రజలు అతన్ని ఎందుకు తిరస్కరించారంటే, అతడు పాపకార్యాల్లో చాలా మునిగిపోయాడు. విచ్చల విడిగా మద్యపానం, వ్యభిచారం, చేసాడు. నమా’జుకు దూరం అయ్యాడు. య’జీద్‌ మదీనహ్ ప్రజలపట్ల ఇలా వ్యవహరించాడు, ఇంకా జూదం, మద్యపానం ముందు నుండే ఉండేవి. అందువల్ల ప్రజలందరూ అతనికి వ్యతిరేకంగా నిలబడ్డారు. అన్ని వైపులనుండి అతనికి వ్యతిరేకంగా ప్రవర్తించారు. ఇటు అల్లాహ్‌ కూడా అతని ఆయుష్షులో శుభం ప్రసాదించలేదు. అనంతరం అతడు మక్కహ్ ప్రజలపై కూడా సైన్యాన్ని పంపాడు. అక్కడ ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘జుబైర్‌ను ఎదుర్కోవాలని. దారిలో సైన్యాధికారి మరణించాడు. మరో సైన్యాధికారిని నియమించటం జరిగింది. ఈ సైన్యం మక్కహ్ వచ్చి ‘అబ్దు ల్లాహ్‌ బిన్‌ ‘జుబైర్‌ను చుట్టుముట్టింది. ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘జుబైర్‌ కూడా వారిని ఎదుర్కొన్నారు. అతనిపై పరికరాల ద్వారా రాళ్ళు విసరబడ్డాయి. దానివల్ల క’అబహ్ గృహతెర, పైకప్పు, ఇస్మాయీల్‌ (అ)కు బదులు పంపిన గొర్రెతల అన్నీ కాలిపోయాయి. ఈ సంఘటన 64 హిజ్రీలో జరిగింది.

64 హిజ్రీ రబీఉల్అవ్వల్లో జీద్మరణించాడు. యుద్ధ సమయంలోనే ఈ వార్త అందింది. అప్పుడు ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘జుబైర్‌ బిగ్గరగా, ‘ఓ సిరియా వాసులారా! మిమ్మల్ని దారి తప్పించినవాడు చని పోయాడు,’ అని అన్నారు. అది వినగానే సైన్యం పారి పోబోయింది. నీచంగా అవమానించబడింది. ఆ తరువాత ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘జుబైర్‌ ప్రజల నుండి బై’అత్‌ తీసుకున్నారు. ఖలీఫాగా పేర్కొనబడ్డారు. సిరియాలో ముఆవియహ్బిన్జీద్కోసం బై’అత్‌ తీసుకోవటం జరిగింది. కాని అతని పరిపాలనా కాలం చాలా తక్కువే.

అబ్దుల్లాహ్బిన్జుబైర్‌ () వీరమరణం: ము’ఆవియహ్‌ బిన్‌య’జీద్‌ మక్కహ్ పై, మదీనహ్ పై దాడిచేసాడు. ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘జుబైర్‌ను మక్కహ్ ఖలీఫాగా ఉన్నారు. కాని య’జీద్‌కు చెందినవారు కొన్ని రోజుల తర్వాత అతన్ని కూడా చంపివేసారు.  

ముస్అబ్మరణం తరువాత ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘జుబైర్‌ బలహీనులైపోయారు. అతన్ని సమర్థించేవారు, సహాయం చేసేవారు లేకుండా పోయారు. మరోవైపు ఇరాఖ్ ప్రాంతం వేరైనందువల్ల రాబడి తగ్గిపోయింది. అందువల్ల అబ్దుల్మలిక్కు అతన్ని ఓడించడం సులువైపోయింది. 72 హిజ్రీలో అతతడు ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘జుబైర్‌ను చంపటానికి నిర్ణయించుకున్నాడు. ఒకరోజు మెంబరుపై ఎక్కి ప్రజలతో ‘మీలో ఎవరు ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘జుబైర్‌ను చంపుతారు,’ అని అడిగాడు. అప్పుడు హజ్జాజ్ తాను చంపుతానని అన్నాడు. ‘అబ్దుల్‌ మలిక్‌ మూడుసార్లు ప్రశ్నించాడు. మూడుసార్లు కూడా ‘హజ్జాజ్‌ సమాధానం ఇచ్చాడు. ఇంకా నేను కలలో ఒక ఢాలు లాక్కొని ఉంచుకున్నాను అని అన్నాడు. (ముస్తదరక్హాకిమ్)

  హరమ్ను చుట్టుముట్టటం: ‘అబ్దుల్‌ మలిక్‌ జి’ల్-ఖఅదహ్‌ 72 హిజ్రీలో ‘హజ్జాజ్‌ను, ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘జుబైర్‌తో పోరాడటానికి పంపాడు. అప్పుడు అతను ‘హరమ్‌లో  ఉన్నారు. అందువల్ల హజ్జాజ్‌ మక్కాచేరి హరమ్‌ను చుట్టుముట్టాడు. నెలల తరబడి ముట్టడి కొనసాగింది. రాళ్ళ వర్షం కురిపించబడింది. దాని మెరుపు, శబ్దాలవల్ల భూమ్యాకాశాలు ఒక్కటై పోయాయి. ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘జుబైర్‌ ధైర్యంగా పోరాడుతున్నారు. అయితే ఏమాత్రం అశాంతికి గురికాలేదు. (తబ్‌రీ / 8)

రాళ్ళు పడుతున్నప్పుడు ఆయన కాబాలో నమా’జు చదువుతున్నారు. రాళ్ళు వచ్చి అతనివద్ద పడేవి. కాని ఆయన తన స్థానం నుండి కదిలేవారు కాదు. (ఇబ్నెకసీర్‌)

ఆహార ధాన్యాల కొరత, అనుచరుల ద్రోహం: ప్రారంభంలో ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘జుబైర్‌ వద్ద ఆహార పదార్థాలు అధికంగా ఉండేవి. కాని చాలా కాలం చుట్టుముట్టి ఉండటం వల్ల ఆహార పదార్థాల కొరత ఏర్పడింది. ప్రతి వస్తువు అత్యంత అధిక ధరలకు అమ్మబడసాగింది. ఒక కోడి 10 దిర్‌హమ్‌లకు లభించేది. ఆయన అనుచరులు, ఆప్తులు కష్టాలు భరించలేక విడిచిపోయారు. ఆయన కుమారుల్లో ఇద్దరుకూడా తండ్రినివదలి పక్షం మార్చుకున్నారు. ఒక కుమారుడు చివరి క్షణం వరకు పోరాడుతూ మరణించాడు.

అస్మా(ర)ను సంప్రదించటం, వీరోచితమైన ఆమె సమాధానం: ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘జుబైర్‌ పరిస్థితుల పట్ల నిరాశచెంది ఒక రోజు తన తల్లి అస్మా వద్దకు వెళ్ళి, ‘నా అనుచరులందరూ నన్ను వదలి వెళ్ళిపోయారు, చివరికి నా సంతానం కూడా వెళ్ళి పోయింది. ఇప్పుడు కేవలం కొంతమంది మాత్రమే మిగిలి ఉన్నారు. కాని వారిలో శక్తి నశించింది. ఇటువంటి పరిస్థితిలో మీ ఆదేశం ఏమిటి,’ అని అన్నారు. అప్పుడు అస్మా వయస్సు 100ను అధిగమించింది. ఆమెకు కొడుకులు, మనవళ్ళు ఉన్నారు. అబూ బకర్‌ (ర) కూతురైన ఆమె వృద్ధాప్యంలో కూడా తన కుమారునితో, ‘కుమారా! నీ పరిస్థితి గురించి నీకు తెలిసే ఉంటుంది. ఒకవేళ నీవు సత్యంపై ఉంటే సత్యం వైపునకే ప్రజలు ఆహ్వానిస్తే, దానికోసమే పోరాడు, ఎందుకంటే సత్యం కోసమే అనేక మంది ప్రాణాలు అర్పించారు. ఒకవేళ ప్రపంచంకోసం అయితే నీకంటే నీచుడు మరొకడుండడు. వెళ్ళు, అన్యాయం సహిస్తూ జీవించడం కంటే సత్యం కోసం ప్రాణత్యాగం చేయటమే మేలు,’ అని సలహా ఇచ్చారు. తల్లి నోట ఈ వీరోచితమైన పలుకు విని, ”తల్లీ! బనీ ఉమయ్య నన్ను చంపి నా శవం పట్ల అవమాన కరమైన విధంగా ప్రవర్తిస్తుందని భయంగా ఉంది,” అని అన్నారు. దానికి తల్లి, నరికివేయబడిన తరువాత చర్మం వలిస్తే గొర్రెకి బాధకలుగదు, ‘వెళ్ళు దైవాన్ని సహాయం కోరి నీ పని పూర్తిచేయి’ అని హితబోధ చేసారు. ఈ పలుకులు విని నడుం బిగించి తల్లి నుదురును ముద్దుపెట్టి, ‘నా అభిప్రాయం కూడా ఇదే, మిమ్మల్ని సంతృప్తి పరచాలన్నదే నా ఉద్దేశ్యం’ అని అన్నారు. దానికి అతని (ర) తల్లి, ‘నేను ఎల్లప్పుడూ సహనం వహిస్తూ ఉంటాను. ఒకవేళ నీవు నా కంటే ముందు గతించితే ఓర్పు వహిస్తాను. ఇంకా ఒకవేళ విజయం సాధిస్తే నీ విజయం పట్ల సంతోషిస్తాను, వెళ్ళు దైవం ఏం వ్రాసాడో చూడు,’ అని అన్నారు. ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘జుబైర్‌ (ర) తల్లిని దు’ఆ చేయమని కోరారు. తల్లి ఆయన గురించి దు’ఆ చేసారు. ‘అబ్దుల్లాహ్‌తో, ‘కొడుకా! ఇలా రా, చివరిసారిగా  కలవటానికి హాజరయ్యాను, ఇవి నా జీవితంలోని చివరిదినాలు. అస్మా (ర) ఆలింగనం చేసుకొని ముద్దుపెట్టారు, వెళ్ళి నీ పని పూర్తిచేయి,’ అని అన్నారు. అనుకోకుండా కవచంపై అతని చేయిపడింది. అప్పుడు ఆమె, ‘కొడుకా! ఇదేంటి? ప్రాణాలర్పించే వారి లక్షణం కాదిది’ అని అన్నారు.

వీరమరణం: తల్లి ఆదేశంపై కవచాన్ని తొలగించి బట్టలు ధరించి యుద్ధ మైదానంలోకి దూకి చాలా మందిని చంపారు. కాని సిరియా వారు చాలా అధిక సంఖ్యలో ఉన్నారు. ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘జుబైర్‌ అనుచరులు ప్రతిఘటనను తట్టుకోలేక పోయారు. చెల్లాచెదురై పోయారు. ఒక శ్రేయోభిలాషి సురక్షితమైన ప్రదేశానికి వెళ్ళిపొమ్మని సలహా ఇచ్చాడు. దానికి ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘జుబైర్‌, ‘అలా చేస్తే నాకంటే చెడ్డవాడు మరొకడుండడు’ అని అన్నారు. ఇటు ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘జుబైర్‌ శక్తి బలహీనపడింది. సిరియా సైన్యం క్రమంగా ముందుకు దూసుకొని వచ్చింది. క’అబహ్ గృహ ద్వారాలన్నింటినీ చుట్టు ముట్టారు. ఇటువంటి పరిస్థితుల్లోనూ ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘జుబైర్‌ వీరోచితంగా పోరాడారు. శత్రువులు అతని పతాకాన్ని దించివేసారు. ఆ తరువాత నమా’జు చదవడానికి మఖామె ఇబ్రాహీమ్‌ వద్దకు వెళ్ళి నమాజ్‌ చదివి తిరిగి వచ్చి మళ్ళీ పోరాడారు. ఇంతలో ఒక సైనికుడు ఒక పెద్ద రాయిని అబ్దుల్లాహ్బిన్జుబైర్పై విసిరాడు. అది తగలగానే అతని తల పగిలి రక్తం కారసాగింది. 73వ హిజ్రీ జమాదుస్సా’నీలో ప్రవక్త (స) ప్రియ శిష్యుల్లోని ఒకరైన ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘జుబైర్‌ వీరమరణం పొందారు.

దురదృష్టవంతుడైన ‘హజ్జాజ్‌, శవాన్ని అవమాన పరచటం, అస్మా (ర) సాహసం: హృదయ కఠినుడైన,హజ్జాజ్‌ ప్రతీకారజ్వాల ఇంకా ఆరనేలేదు. చంపిన తర్వాత అతని(ర) తలను ‘అబ్దుల్‌ మలిక్‌కు పంపాడు. శవాన్ని ఒక ఎత్తైన గుట్టపై వ్రేలాడగట్టాడు. (ఇబ్నె కసీర్‌)

ఈ విషయం అస్మా (ర)కు తెలిసి, ”అల్లాహ్‌ నిన్ను నాశనం చేయుగాక! నువ్వు శవాన్ని ఎందుకు వ్రేలాడగట్టావు,” అని కబురుపంపింది. దానికి వాడు, ‘ఆ దృశ్యం ఇంకా ప్రజల కళ్ళముందు ఉండాలని’ అని అన్నాడు. ఆ తరువాత ఆమె ఖనన సంస్కారాల కోసం అనుమతి కోరింది. ‘హజ్జాజ్‌ దానికీ అనుమతి ఇవ్వలేదు. ఎందుకంటే 7 సంవత్సరాల వరకు బనీ ‘ఉమయ్యను గొంతులో వెలక్కాయలు చేసి ఉంచడం జరిగింది. అతని శవం కూడలిపై వ్రేలాడుతూ ఉంది. ఖురైష్‌ వస్తూ పోతూ చూడసాగారు. అనుకోకుండా ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘ఉమర్‌ అటువైపు వచ్చి శవం దగ్గర నిలబడి మూడుసార్లు శవాన్ని ఉద్దేశిస్తూ, ‘ఓ అబూ ఖుబైబ్! అస్సలాము అలైకుమ్‌. ఇందులో పడవద్దని నేను నిన్ను వారించ లేదా? నీవు ఉపవాసాలు ఉండేవాడివి. నమా’జులు చదివేవాడివి. బంధుత్వాన్ని నెరవేర్చేవాడివి’ అని అన్నారు. ‘హజ్జాజ్‌కు ఈ వార్త తెలియగానే శవాన్ని దించి యూదుల స్మశానంలో పారవేయించాడు. అస్మా (ర)ను పిలిపించాడు. ఆమె నిరాకరించింది. అది తెలిసిన ‘హజ్జాజ్‌ తిన్నగావస్తే సరి, లేదా జుట్టు పట్టుకొని ఈడ్చుకు రావటం జరుగుతుంది అని కబురు పంపాడు. సిద్దీఖ్‌ కూతురైన అస్మా (ర), ఇప్పుడు నేను నా జుట్టు పట్టుకొని ఈడ్చే వరకు నేను రాను అని కబురు పంపారు. ‘హజ్జాజ్ వాహనం ఎక్కి అస్మా (ర) వద్దకు వచ్చి నిజం చెబితే ఏం గతి అయ్యిందో చూసావా? అని అన్నాడు. సమాధానంగా అస్మా (ర), ”నీవు వాళ్ళ  ప్రపంచాన్ని పాడుచేశావు, కాని వాళ్ళు నీ పరలోకాన్ని పాడు చేసారు. నన్ను రెండు ఓనీలు అని అవమాన పరుస్తున్నావా? ఇది ప్రవక్త (స) ఇచ్చిన బిరుదు. నేను ప్రవక్త (స) ద్వారా బనీ సఖీఫ్‌లో అత్యంత అబద్ధాలకోరు, చరిత్రహీనుడు ఉంటాడని విన్నాను. అత్యంత అబద్ధాలకోరును మేము చూసాము. మిగిలింది చరిత్రహీనుడు, అది నీవే” అని అన్నారు. అస్మా (ర) ముళ్ళులాంటి మాటలు విని ‘హజ్జాజ్‌ తిరిగి వెళ్ళిపోయాడు. (ముస్తదరక్హాకిమ్)

ఖనన సంస్కారాలు: ‘అబ్దుల్‌ మలిక్‌కు ”అస్మా (ర) శవం అడిగితే ‘హజ్జాజ్ శవాన్ని ఇవ్వలేదనే వార్త అందింది. ‘అబ్దుల్‌ మలిక్‌ వెంటనే ‘హజ్జాజ్‌కు ఒక ఉత్తరం వ్రాస్తూ నీవు ఇప్పటి వరకు శవాన్ని అస్మా (ర)కు ఎందుకు ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేసాడు. ‘హజ్జాజ్‌ వెంటనే శవాన్ని అతని తల్లికి ఇచ్చివేసాడు. శోక సముద్రంలో ఉన్న ఆయన తల్లి తన కొడుకును స్నానం చేయించి హుజూన్ ప్రాంతంలో ఖననం చేయించారు. ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘జుబైర్‌ మరణించినపుడు అతని వయస్సు 72 సంవత్సరాలు. అతను 7 సంవత్సరాలు పరిపాలించారు.

షిబ్‌లీ, ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘జుబైర్‌ వీరమరణం గురించి, ఆయన తల్లి అస్మా (ర) సహన స్థయిర్యాలను గురించి ప్రభావ పూరితమైన పదాలో చిత్రీకరించారు.

ఈ వ్యధాభరితమైన సంఘటన మీరు చదివారు. అదేవిధంగా య’జీద్‌ గతి ఏమయిందో మీ అందరికీ తెలిసిన విషయమే. దీనికంతటికీ కారకులు ము’ఆవియహ్‌ (ర). అతడు 60వ హిజ్రీలో మరణించారు. మరణానికి ముందు అతడు తన కుమారుని కొరకు, తన కుటుంబం వారి కొరకు వాంఙ్మూలం చేసి వెళ్ళాడు. దీన్ని ”సియరుస్సహాబా” 6వ భాగం నుండి మీ ముందు ఉంచుతున్నాము.

ముఆవియహ్‌ () చివరి ప్రసంగం, అనారోగ్యం: 59 హిజ్రీలో ము’ఆవియహ్‌ (ర) అంతిమ ఘడియకు చేరుకున్నాడు. అతని శక్తి అంతా నశించింది. అందువల్ల మరణానికి ముందు నుండి వేచి ఉండేవాడు. అనారో గ్యానికి కొన్ని దినాల ముందు ఇలా ప్రసంగించాడు: ”ప్రజలారా! నా పరిస్థితి కోతకు వచ్చిన పంటలా ఉంది. నేను చాలా కాలం వరకు మిమ్మల్ని పరిపాలించాను. ఇప్పుడు నేను అలసిపోయాను. మీరు కూడా అలసిపోయి ఉంటారు. ఇప్పుడు నేను మీ నుండి వేరుకావాలను కుంటున్నాను. నా తరువాత వచ్చేవారు నాకంటే మంచివారై ఉండకపోవచ్చు. అల్లాహ్ ను కలవ గోరితే, అల్లాహ్ కూడా అతన్ని కలవాలనే కోరికతో ఉంటాడు. అందువల్ల ఓ అల్లాహ్! ఇప్పుడు నాకు నిన్ను కలవాలని ఉంది. నా కోసం నీ సాన్నిధ్యాన్ని విశాలపరచు. నిన్ను కలసినపుడు శుభం ప్రసాదించు.” ఈ ప్రసంగం చేసిన కొన్ని దినాలకే అనారోగ్యానికి గురయ్యారు. (ఇబ్నె కసీర్‌)

అప్పుడు అతని (ర) వయస్సు 78 సంవత్సరాలు. మరణం దగ్గర పడింది. కనుక చికిత్స వల్ల ఎటువంటి లాభం చేకూరలేదు. రోజు రోజుకు పరిస్థితి క్షీనించసాగింది. కాని రాజఠీవి మాత్రం తగ్గలేదు. ఆరోగ్యం మరీ క్షీణించింది. ప్రజలు పరస్పరం చెప్పుకోసాగారు. ఒకరోజు తలకు నూనె, కళ్ళకు సుర్‌మా పూసుకొని ఠీవిగా కూర్చొని ప్రజలను కోరారు. అందరూ హాజరయ్యారు. ఆయన్ను కలసి అందరూ తిరిగి వెళ్ళి పోయారు. ప్రజలు చూసి ము’ఆవియహ్‌ ఆరోగ్యంగానే ఉన్నారు అని చెప్పుకున్నారు.

 యజీద్‌ కోసం వాంఙ్మూలం: పరిస్థితి మరీక్షీణించగా, య’జీద్‌ను పిలిచి, కుమారా! నేను నీ మార్గంలోని ఆటంకాలన్నీ వేరుచేసి నీ మార్గాన్ని సుగమంచేసాను. శత్రువులను ఓడించి ‘అరబ్‌ మెడను వంచాను. ఇంకా నీ కోసం ఎంతధనం కూడబెట్టానంటే, ఇంతకు ముందు ఎవరూ అంతధనం కూడబెట్టి ఉండరు. ఇప్పుడు నీకూ నా ఉపదేశం ఏమిటంటే ఎల్లప్పుడూ హిజాజ్ ప్రజలను గౌరవిస్తూ ఉండాలి. వారు నీ ముఖ్యులు. అక్కడి నుండి ఎవరువచ్చినా వారిని గౌరవించి సత్కరించాలి, వారికి ఉపకారం చేయాలి. రానివాడి గురించి ఒక కంట కనిపెడుతూ ఉండాలి. ఇరాఖ్ వారి కోరికలన్నీ తీర్చాలి. ఒకవేళ వారు పాలకులను మార్చమంటే మారుస్తూ ఉండాలి. సిరియా వారిని సలహాదారులుగా ఉంచు కోవాలి. విజయం తరువాత అందరినీ కలుపుకోవాలి. అన్నిటికంటే ప్రధాన విషయం పాలనది. ఇందులో ‘హుసైన్‌ బిన్అలీ, ‘అబ్దుల్లాహ్‌ బిన్ఉమర్, ‘అబ్దుర్ర’హ్మాన్‌ బిన్అబీ బకర్, ‘అబ్దుల్లాహ్‌ బిన్జుబైర్ తప్ప మరెవరూ వ్యతిరేకులు కారు. కాని ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘ఉమర్‌ నుండి ఎటువంటి ప్రమాదం లేదు. అతనికి ఆరాధన, భక్తి శ్రద్ధల్లో తప్ప మరే విషయంతో పనుండదు. ప్రజలందరూ బై’అత్‌ చేస్తే అతనికి ఎటువంటి అభ్యంతరం ఉండదు. ‘అబ్దుర్ర’హ్మాన్‌ బిన్‌ అబీ బకర్‌లో ధైర్యంలేదు. సహచరులు ఏదిచేస్తే దాన్నే అతను అనుసరిస్తాడు. అయితే ‘హుసైన్‌ బిన్‌ ‘అలీ వైపు నుండి ప్రమాదం ఉంది. ఇరాఖీలు అతన్ని నీకు వ్యతిరేకంగా నిలబెడతారు. ఒకవేళ అతను నిన్ను ఎదుర్కొంటే, అతన్ని అధిగమిస్తే, అతని పట్ల మంచిగా వ్యవహరించాలి. ఎందుకంటే అతడు ప్రవక్త (స) బంధువు. కాని నక్కలా మోసంచేసి సింహంలా దాడిచేసే వాడు ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘జుబైర్‌ మాత్రమే. ఒకవేళ అతడు ఒప్పందానికివస్తే, ఒప్పందం కుదుర్చుకో, లేకుంటే అతనిపై పట్టు ఏర్పడితే ఎంతమాత్రం వదలకు, ముక్కలుగా చేసివేయి.” (తబ్రీ, ఫఖ్రీ)

ఉపదేశాలు: ‘మన బంధువులకు, కుటుంబానికి అల్లాహ్ కు భయపడుతూ ఉండాలి, ఎందుకంటే అల్లాహ్‌కు భయపడేవారిని అల్లాహ్‌ కష్టాల నుండి కాపాడుతాడు. అల్లాహ్‌కు భయపడనివాడికి సహాయం చేసేవారెవరూ ఉండరు,’ అని ఉపదేశించారు. ఆ తరువాత తన ఢాలు ప్రజానిధిలో చేర్చమని ఆదేశించాడు. (తబ్రీ)

ఖనన సంస్కారాల గురించి ఆదేశిస్తూ, ‘నాకు ప్రవక్త (స) ఒక చొక్కా ఇచ్చారు. నేను ఈ రోజు కోసమే దాన్ని దాచి ఉంచాను. ఆయన గోళ్ళు, వెంట్రుకలు, సీసాలో ఉన్నాయి. నన్ను ఈ చొక్కాలో ఖనన సంస్కారాలు చేయాలి. ఇంకా గోళ్ళు, వెంట్రుకలు నా కళ్ళలో, నోటిలో ఉంచాలి. వీటివల్ల నైనా నన్ను క్షమించబడవచ్చు’ అని అన్నాడు. (ఇస్తీఆబ్)

మరణం: ఈ ఉపదేశాల తర్వాత అరబ్‌ మేధావి 60 హిజ్రీలో రజబ్‌ నెలలో మరణించాడు. మరణానంతరం జిహాక్‌ బిన్‌ ఖైస్‌ చేతిలో ఖనన వస్త్రాలు తీసుకొని బయ టకు వచ్చి ప్రజలకు ఆయన మరణవార్తను గురించి ఇలా తెలిపాడు: ‘ప్రజలారా! ము’ఆవియహ్‌ ‘అరబ్‌ మేధావి. అతని ద్వారా అల్లాహ్‌ ఎన్నో ఉపద్రవాలను పరిష్కరించాడు, ఎన్నో రాజ్యాలపై విజయం ప్రసా దించాడు. ఆయన్ను ప్రజలపై పాలకుడుగా నియ మించాడు. ఈ నాడు అతను మరణించారు. ఇది అతని శవవస్త్రం, వీటిలోనే అతన్ని చుట్టిఖననం చేస్తాం. ఆయన తీర్పును ఆయన ఆచరణలపై వదలివేద్దాం. అతని ఖనన సంస్కారాల్లో పాల్గొనగోరేవారు రావచ్చు. (తబ్రీ)

ఈ ప్రకటన తర్వాత ఖనన సంస్కారాలు జరిగాయి. జిహాక్జనా’జహ్ నమా’జు చదివించారు. ముఆవియహ్దమిష్క్ ప్రాంతంలో సమాధి చేయబడ్డారు. ఆయన 19 సంవత్సరాల 3నెలలు పరిపాలించారు. ఇదంతా హుర్రహ్ యుద్ధం సందర్భంగా వ్రాయడం జరిగింది. దీనివల్లే య’జీద్‌ను యువరాజుగా ప్రకటించటం జరిగింది. మరి కొందరు రెండవ ఉపద్రవం జమల్, సిఫ్ఫీన్ యుద్ధాలని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా మేము ఈ రెండు యుద్ధాల గురించి సంక్షిప్తంగా పేర్కొంటాము. వీటివల్ల ఇస్లామ్‌కు ఎంతనష్టం కలిగిందో మీరే ఊహించండి.

జమల్యుద్ధం: జమల్‌ అంటే ఒంటె. ఈ యుద్ధం ఒక ఒంటెపై జరిగింది. ఇది ‘ఆయి’షహ్‌ (ర), ‘అలీ (ర)ల మధ్య అనుకోకుండా జరిగింది. దీని అసలు ఉద్దేశ్యం ఉస్మాన్‌ () హంతకుల ప్రతీకారం తీర్చుకోవటమే.

సియరుస్సహాబాలో ‘ఆయి’షహ్‌ (ర) గురించి ఇలా పేర్కొనడం జరిగింది: ‘ఉస్మాన్‌ (ర) వీరమరణం పొంది నపుడు ‘ఆయి’షహ్‌ (ర) మక్కహ్ లో ఉన్నారు. తల్హా (ర), జుబైర్(ర)లు మదీనహ్ నుండి వెళ్ళి ఆమెకు జరిగినదంతా తెలియపరిచారు. ఆమె సంస్కరణా ఉద్దేశ్యంతో స్రా వెళ్ళారు. అక్కడ ‘అలీ (ర)తో యుద్దం చేయవలసి వచ్చింది. దీన్ని జమల్‌ యుద్ధం అని అంటారు. ‘ఆయి’షహ్‌ (ర) ఒక ఒంటెపై కూర్చున్నారు. ఈ యుద్ధంలో ఆమెకు చాలా ప్రాధాన్యత లభించింది. ఈ యుద్ధం చాలా ఖ్యాతి గడించింది. ఈ యుద్ధం అనుకోకుండా జరిగినా ‘ఆయి’షహ్‌ (ర) ఎల్లప్పుడూ దీన్ని తలచుకొని విచారించే వారు.

బు’ఖారీలో ఇలా ఉంది: ”చివరి సమయంలో ‘ఆయి’షహ్‌ (ర) తనను ప్రవక్త(స) ప్రక్కన మస్జిదె నబవీలో ఖననం చేయవద్దని, బఖీలో ప్రవక్త (స) భార్యల ప్రక్కన నన్ను ఖననంచేయండి. ఎందుకంటే అతని (స) మరణానంతరం నేను ఒక అపరాధం చేసానని అన్నారు. ఇబ్నె స’అద్‌లో ఇలాఉంది: ఆమె ఈ ఆయతు, ”ఓ ప్రవక్త భార్యలారా! మీ ఇళ్ళల్లో ప్రశాంతంగా ఉండండి” పఠించినపుడు చాలా ఏడ్చేవారు. (తబఖాత్ఇబ్ను సఅద్)

‘అలీ (ర) మరణించిన తరువాత ‘ఆయి’షహ్‌ (ర) 18 సంవత్సరాలు బ్రతికున్నారు. ఈ కాలమంతా చాలా ప్రశాంతంగా గడిచింది. దీని తరువాత ఆమె మరే యుద్ధం లోనూ, పోరాటాల్లోనూ పాల్గొనలేదు. ఎందుకంటే జమల్‌ యుద్ధం వల్ల ఏం జరిగిందో అంతా కళ్ళముందు ఉంది.

సియరుస్సహాబా6 భాగంలో ఈ యుద్ధం గురించి ఇలా పేర్కొనడం జరిగింది, ‘ ‘అలీ బై’అత్‌ తర్వాత ఆయిషహ్ (ర), తల్హా (ర), జుబైర్ (ర); ‘ఉస్మాన్‌ (ర) హత్యకు ప్రతీకారం తీర్చుకోవడానికి బయలు దేరారు, అప్పుడు ‘హసన్‌ (ర), ‘అలీ (ర)తో మదీనహ్ తిరిగి వెళ్ళిపోమని, కొంతకాలం ఇంట్లోనే ఉండమన్నారు. కాని ‘అలీ (ర) ఇటువంటి పరిస్థితుల్లో మదీనహ్ తిరిగి వెళ్ళటం, ఇంటి పట్టున ఉండటం సరికాదని భావించి దీనికి అంగీకరించలేదు.

జమల్యుద్ధం: ‘తల్‌’హా (ర), ‘జుబైర్‌ (ర) మొదలైన వారు ‘ఉస్మాన్‌ (ర) ప్రతీకారంకోసం బయలుదేరారు. అందువల్ల ‘అలీ (ర) కూడా పోరాటానికి సన్నాహాలు ప్రారంభించారు. ‘హసన్‌ను కూడా తన వెంట తీసుకొని పోయారు. అతని వెంట అమ్మార్బిన్యాసిర్ కూడా కూఫా వెళ్ళారు. వచ్చి కూఫా జామియ మస్జిద్‌లో ఇలా ప్రసంగించారు: ‘కూఫా ప్రజలారా! మీరు కూఫా ప్రజల సహాయకులుగా మారండి. బాధితులు, భయంతో ఉన్నవారు మీ శరణు పొందటానికి. ప్రజలారా! ఉపద్రవం తలెత్తినపుడు, దాన్ని గురించి ఏమీ తెలియదు. అది వచ్చిన తర్వాత దాని వాస్తవం తెలుస్తుంది. అంటే ఎక్కడనుండి వచ్చింది. ఎవరు దీనికి కారకులు అనేది అంతా తెలిసిపోతుంది. అందువల్ల మీరు మీ కరవాలా లను ఒరలో పెట్టుకోండి. బల్లాల పళ్ళు తొలగించండి. విల్లు ముడులను విప్పివేయండి, ఇంటి లోపలి భాగంలో కూర్చొండి. ప్రజలారా! ఉపద్రవకాలంలో పండుకునేవాడు నిలబడినవాడి కంటే ఉత్తముడు, నిలబడినవాడు, నడిచేవాడి కంటే ఉత్తముడు. ‘హసన్‌ మస్జిద్‌ చేరి ఈ ప్రసంగం విని అబూ మూసాను ఆపి వేసారు. ఇంకా ‘నువ్వు ఇక్కడి నుండి నీవు కోరిన చోటికి వెళ్ళిపో’ అని అన్నారు.  తాను స్వయంగా మెంబరుపై ఎక్కి కూఫా ప్రజలను ‘అలీ (ర)కి సహాయం చేయమని ప్రోత్సహించారు. ‘హసన్‌ పిలుపుపై హజర్బిన్అదీ, ‘అలీ (ర) తో కలసి పోయారు. యుద్ధ నిర్ణయం వరకు ఉన్నారు.

965 కూఫీలు ‘అలీ (ర) సహాయం కోసం సిద్ధమయ్యారు. ఇటు ‘ఆయి’షహ్‌ (ర) ‘ఉస్మాన్‌ ప్రతీకారం కోసం బయలు దేరారు. ‘అలీ (ర) దీన్ని గురించి వాగ్దానంచేసినా సాక్ష్యాధారాలు దొరికినా రక్తపరిహారం ఇవ్వలేదు. ఫలితంగా ఈ ఇద్దరి మధ్య యుద్ధం ఏర్పడింది. ‘అలీ (ర), ‘ఆయి’షహ్‌ (ర) న్యాయం తనవైపు ఉందని భావించేవారు. ఇరువైపుల నుండి చాలామంది పట్టుబడ్డారు. యుద్ధం జరిగింది. ఇందులో అనేక మంది అనుచరులు, తాబయీన్లు చంపబడ్డారు. అనేకమంది స్త్రీలు విధవలయ్యారు. పిల్లలు అనాథులయ్యారు. ఇది కూడా చాలా పెద్ద ఉపద్రవం. జరిగిందేదో జరిగింది. వీరిలో ఎవరూ యుద్ధం కావాలని కోరలేదు. అయితే అపార్థం కారణంగా ఇదంతా జరిగింది.

ఇరుపక్షాలూ సంధికోసమే ప్రయత్నించారు. యుద్ధ నిర్ణయాన్ని మార్చుకున్నారు. ఇరుపక్షాల వారూ ప్రశాంతంగా నిద్రపోతున్నారు. కాని ఇరుపక్షాలలో కొందరు ఈ సంధిని తమ అంతంగా భావించారు. ‘అలీ (ర) సైన్యంలో సబాయీ, ‘ఉస్మాన్‌ హంతకులు ఉండేవారు. అదేవిధంగా ‘ఆయి’షహ్‌ (ర) సైన్యంలో కొందరు ఉమవీలు ఉండేవారు. ‘ఉస్మాన్‌ హంతకులు మరియు సబాయీలు ఒకవేళ ఈ సంధి విజయం అయితే, తమకు మంచిదికాదని ఊహించి రాత్రి సమయంలో ‘ఆయి’షహ్‌ సైన్యంపై దాడిచేసారు. వారు కూడా తమపట్ల ద్రోహం జరిగిందని, దాడి జరిగిందని యుద్ధం ప్రారంభించారు. ‘ఆయి’షహ్‌ (ర) ఒంటెపై మావటిని దించి దానిపై కూర్చున్నారు. ‘ఆయి’షహ్‌ (ర) తన సైన్యాన్ని ఆపే ప్రయత్నం చేసారు. ‘అలీ (ర) కూడా తనసైన్యాన్ని ఆపే ప్రయత్నం చేసారు. కాని వ్యాపించిన ఈ ఉపద్రవం ఆగే ప్రసక్తే లేదు. ‘ఆయి’షహ్‌ (ర) వల్ల ఆమె సైన్యం అమిత ఉత్సాహం కలిగిఉంది. ఆమె సైన్యం మధ్య ఉంది. ముహమ్మద్బిన్తల్హా గుర్రపుస్వారీల అధికారిగా ఉన్నారు. అబ్దుల్లాహ్బిన్జుబైర్ నడిచేసైన్యం అధికారిగా ఉన్నారు. సైన్యం అంతా ‘తల్‌’హా (ర) మరియు ‘జుబైర్‌ (ర) చేతుల్లో ఉండేది. యుద్ధం జరుగు తుండగా ‘అలీ (ర) ముందుకు దూకి మధ్యకు వచ్చారు. ‘జుబైర్‌ను పిలిచి, ”అబూ ‘అబ్దుల్లాహ్‌! నీకు ఆ రోజు గుర్తుందా? ప్రవక్త (స) నిన్ను పిలిచి, ‘ ‘అలీని నువ్వు స్నేహి తుడిగా భావిస్తున్నావా? ‘ అని అడిగితే, దానికి నీవు ‘అవును’ అని అన్నావు. ఆ తరువాత ప్రవక్త (స) నిన్నుపిలిచి, ‘ఒకరోజు నీవు అతనితో అన్యాయంగా పోరాడుతావని అన్నారు’ అని అన్నారు. దానికతను ‘అవును ఇప్పుడు నాకు గుర్తుకువచ్చింది’ అని అన్నారు. (ముస్తదరక్హాకిమ్)

  ఈ భవిష్యవాణిని గుర్తుచేసుకొని జుబైర్ (ర) యుద్ధాన్ని విరమించారు. తన కుమారుడైన ‘అబ్దుల్లాహ్‌తో ” ‘అలీ (ర) నాకు ఈనాడు ఒక విషయం గుర్తుచేసారు. దాని వల్ల నా యుద్ధఉత్సాహం అంతా చల్లబడింది. నిస్సందేహంగా మనం న్యాయంపై లేము. ఇప్పుడు నేను యుద్ధంలో పాల్గొనను. నువ్వుకూడా నాతోవచ్చేయి,” అని అన్నారు. కాని ‘అబ్దుల్లాహ్‌ నిరాకరించారు. అనంతరం అతను ఒంటరిగా బ’స్రవైపు ప్రయాణ మయ్యారు. అక్కడినుండి సామాన్లు తీసుకొని ఎటువైపైనా బయలు దేరుదామని అనుకున్నారు. తల్హా, ‘జుబైర్‌ వెళ్ళడం చూచి తన నిర్ణయం మార్చుకున్నారు. ఈ విషయం మర్వాన్‌కు తెలిసి, మాటువేసి అతడు ముడుకులపై విషబాణం ప్రయోగించాడు. దానివల్ల జుబైర్(ర)మరణించారు. ఇప్పుడు మైదానంలో కేవలం ‘ఆయి’షహ్‌ (ర) ఆమె అభిమానులు మాత్రమే మిగిలారు. యుద్దం ప్రారంభమయిపోయింది. భీకర యుద్ధం జరుగుతోంది. ‘ఆయి’షహ్‌ (ర) కవచం గల మావటిపై కూర్చున్నారు. సబాయీ వారు ఆమెపట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ ఆమెను బంధించ ప్రయత్నం చేసారు. కాని ఆమె అభిమానులు ఆమెను తమ ప్రాణాలు త్యాగం చేస్తూ రక్షిస్తూ పోయారు.

స్రాకు చెందిన అమ్ర్బిన్హ్రహ్ ఎంతో వీరోచి తంగా పోరాడుతున్నారు. ‘అలీ (ర) సైన్యానికి చెందిన ఏ వ్యక్తి అతని ముందుకు వచ్చినా చంపబడే వాడు. చివరికి ‘అలీ (ర) సైన్యానికి చెందిన ‘హారిస్‌’ బిన్‌ జబ్‌రాజ్‌దీ ముందడుగు వేసి అతన్ని ఎదుర్కొన్నాడు. ఇద్దరి మధ్య భీకర  పోరాటం జరిగింది. ఇద్దరూ పరస్పరం దాడి చేసి నేలకొరిగారు. ఒంటె ముందు ఉండి బనూజుబ్బ అనే వ్యక్తి వీరోచితంగా శత్రువులను ఎదుర్కొం టున్నాడు. అందరినీ చంపేవరకు అతడు వెన్ను చూపలేదు.

‘అలీ (ర) ఒంటెను కూర్చోబెట్టనంత వరకు ఈ రక్తపాతం ఆగదని గ్రహించారు. ఆయన సూచన మేరకు ఒక వ్యక్తి ఒంటె కాళ్ళపై దాడి చేసాడు. ఒంటె విలవిల లాడుతూ కూర్చుండి పోయింది. ఒంటె కూర్చోగానే ఆమె సైన్యం ధైర్యం సన్నగిల్లింది. ‘అలీ (ర) విజయులుగా తీర్మానించ బడ్డారు. ‘అలీ (ర) ‘ఆయి’షహ్‌ (ర) సోదరుడు ము’హమ్మద్‌ బిన్‌ అబీ బక్‌ర్‌ను, ‘ఆయి’షహ్‌ (ర)ను కనిపెట్టి ఉండమని కోరారు. ఇంకా పారిపోయిన వారిని వెంటాడకూడదని, గాయపడిన వారివైపు గుర్రాలను పరిగెత్తించరాదని ప్రకటించారు. తాను స్వయంగా ‘ఆయి’షహ్‌(ర) వద్దకు వచ్చి క్షేమ సమాచారం తీసుకున్నారు. స్రాలో కొన్ని రోజులు ఉంచి ము’హమ్మద్‌ బిన్‌ అబీ బక్‌ర్‌ వెంట గౌరవంగా మదీనహ్ కు సాగనంపారు. బ’స్రాకు చెందిన 40 మంది ఉత్తమ స్త్రీలను ఆమెను వదలి రమ్మని ఆమెవెంట పంపారు. వీడ్కోలు పలుకుతూ కొన్నిమైళ్ళు ఆమె వెంట వెళ్ళారు. కొన్నిమైళ్ళ వరకు ఆమెకు తోడుగా వెళ్ళమని తమ కుమారులను ఆదేశించారు.

‘ఆయి’షహ్‌ (ర) వెళ్ళే ముందు ప్రజలతో మాట్లాడుతూ, బిడ్డలారా! అపార్థాల వల్లే ఈ పరిస్థితి ఏర్పడింది. దీనికి ముందు మా ఇద్దరిలో ఏమాత్రం శత్రుత్వం లేదు. ‘అలీ (ర) కూడా దీన్ని ధృవీకరించారు. ప్రవక్త (స) భార్యామణి మనందరికీ తల్లివంటిది. ఆమెను గౌరవించటం మన ధర్మం. అనంతరం 36వ హిజ్రీలో రజబ్, శనివారం నాడు ‘ఆయి’షహ్‌ (ర) మదీనహ్ వైపు ప్రయాణమయ్యారు.

  బస్రాలో కొన్ని రోజులు ఉండిన తర్వాత, ‘అలీ (ర) కూఫాకు ప్రయాణమయ్యారు. 36వ హిజ్రీ రజబ్‌ 12వ తేదీన సోమవారం నాడు నగరానికి చేరుకున్నారు. కూఫా ప్రజలు రాజ భవనంలో స్వాగతం పలికారు. కాని భయభక్తులు గలవారైన ‘అలీ (ర) వాటిని స్వీకరించలేదు. ఇంకా ‘ఉమర్‌ (ర) ఎల్లప్పుడూ ఇటువంటి విలాసవంతమైన భవనాలను హీనదృష్టితో చూసేవారని, తనకు కూడా ఇవి అక్కరలేదని, మైదానంలోనే ఉన్నారు. ఇంకా మస్జిద్‌ ఆజమలో రెండు రకాతుల నమా’జు చదివి, శుక్రవారం నాడు ప్రసంగిస్తూ దైవభీతి, దైవభక్తుల గురించి బోధించారు.

జమల్‌ యుద్ధం తరువాత ‘అలీ (ర) కూఫాలో నివసించ సాగారు. రాజధాని ‘హిజాజ్‌ నుండి ఇరాఖ్ కు మారి పోయింది. ప్రజలు దీన్ని గురించి అనేక రకాలుగా అనుకున్నారు. కాని నా అభిప్రాయం ఏమిటంటే, ‘ఉస్మాన్‌ (ర) వీరమరణం వల్ల పవిత్ర స్థల అవమానం జరిగింది. అందువల్ల ఈ పవిత్ర స్థలాన్ని రాజకీయాలకు దూరంగా ఉంచుదామనే ఆలోచనవల్ల ఈ నిర్ణయం తీసుకోవలసి వచ్చింది. కూఫాలో ఆ సమయంలో ‘అలీ (ర) అభిమానులు, సమర్థించేవారూ చాలా అధిక సంఖ్యలో ఉండేవారు. అందువల్ల ‘అలీ (ర) మదీనహ్ ను రాజకీయ ఉపద్రవాల నుండి దూరంగా ఉంచడానికి ఇరాఖ్ ను రాజధానిగా చేయడం జరిగింది. కాని దాని వల్ల ఎటువంటి లాభం జరగలేదు. దీనివల్ల మదీనహ్ రాజకీయ ప్రాధాన్యత తగ్గసాగింది. స్వయంగా ‘అలీ (ర) ఇస్లామ్‌ కేంద్రానికి దూరమయ్యారు. ఇంకా దీనివల్ల అతనికి రాజకీయ సంక్షోభం ఎదురైంది. ‘అలీ (ర) ఎటువంటి పరిస్థితుల్లోనూ మదీనహ్ ను వదలకుండా ఉండవల సింది. ‘ఉస్మాన్‌ (ర)లా స్థిరంగా ఉండవలసింది. విధివ్రాతలో ఏం వ్రాయబడిందో అదే జరిగింది. కూఫీలు చాలా క్రూరంగా చంపివేసారు.

  అనంతరం ‘అలీ (ర) కూఫాలో నివసిస్తూ దేశ వ్యవస్థను పునరుద్ధరించారు. ‘అబ్దుల్లాహ్‌ బిన్అబ్బాస్ను స్రా అధికారిగా నియమించారు. మద్‌యన్‌పై య’జీద్‌ బిన్‌ ఖైస్‌ను, అస్‌ఫ’హాన్‌పై ము’హమ్మద్‌ బిన్‌ సలీమ్‌ను, కన్‌కర్‌పై ఖుదామ బిన్‌ అజ్‌లాన్‌ అజుదీను, సజిస్థాన్‌పై రబీ బిన్‌ కాస్‌ను ఇంకా ఖురాసాన్‌పై ఖుల్య బిన్‌ కాస్‌ను అధికారులుగా నియమించారు.

ఖుల్య బిన్కాస్, ఖురాసాన్ చేరిన వెంటనే కిస్రా వంశానికి చెందిన ఒక అమ్మాయి నేషాపూర్ వెళ్ళి ద్రోహానికి పాల్పడిందనే వార్త అందింది. అనంతరం వెంటనే ఆయన నేషాపూర్‌పై దాడి చేయించి ఆ ద్రోహాన్ని అడ్డుకున్నారు. ఆ అమ్మాయిని ‘అలీ (ర) వద్దకు పంపివేసారు. ఖలీఫహ్ ‘అలీ (ర) ఆమెపట్ల చాలా సున్నితంగా వ్యవహరించారు. ‘నీవుకోరితే నా కొడుకుతో నీపెళ్ళి చేయిస్తానని’ అన్నారు. దానికి ఆమె, స్వతంత్ర అధికారం లేని వారితో నేను పెళ్ళి చేయనని, ఒకవేళ ఖలీఫహ్ స్వయంగా నన్ను పెళ్ళి చేసుకుంటారంటే నేను దానికి సిద్ధంగా ఉన్నానని చెప్పింది. ‘అలీ (ర) దానికి తిరస్కరించి, ఆమెను ఎక్కడికైనా వెళ్ళవచ్చని, ఎవరినైనా పెళ్ళి చేసుకోవచ్చని అనుమతి ఇచ్చారు.

జ’జీరహ్, సిరియా పొలిమేరల ప్రాంతాలపై అష్టర్‌ నఖయీని నియమించారు. అష్తర్నఖయీ పొందుకు పోయి కొన్ని ప్రాంతాలను స్వాధీనపరచుకున్నాడు. ము’ఆవియాకు చెందిన తహ్‌సిల్దార్‌ జిహాక్‌ బిన్‌ ఖైస్‌ పోరాడి అష్టర్‌ను మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళేలా చేసాడు. అష్తర్‌ మూసల్‌లో ఉంటూ సిరియా సైన్యంతో పోరాడుతూ దాన్ని అధిగమించకుండా చూసాడు.

సంధికి ఆహ్వానం: వాస్తవంగా ‘అలీ (ర)కి ము’ఆవియహ్‌ (ర)కు తన అధికారం స్వీకరించరని తెలిసి ఉండేది. అయినా తన బాధ్యతగా మరోసారి సంధికి ఆహ్వానిస్తూ, జరీర్బిన్అబ్దుల్లాహ్ను పంపారు. జరీర్‌, ము’ఆవియహ్‌ సభలోనికి వెళ్ళినపుడు అక్కడ నాయకు లందరూ ఉన్నారు. ము’ఆవియహ్‌ ఉత్తరం తీసుకొని స్వయంగా చదివి, అందరికీ వినిపించారు.

”మీపై మీ అనుచరులపై నా విధేయత తప్పనిసరి అవుతుంది. ఎందుకంటే ముహాజిరీన్లు, అ’న్సార్లు కలసి నన్ను ‘ఖలీఫహ్ గా ఎన్నుకున్నారు. అబూ బకర్‌ (ర), ‘ఉమర్‌ (ర), ‘ఉస్మాన్‌ (ర)లను కూడా వారే ఎన్ను కున్నారు. అందువల్ల బై’అత్‌ తరువాత తిరస్కరిస్తే అతడు బలవంతంగా విధేయతకు గురవుతాడు. మీరు కూడా ముహాజిరీన్లను, అ’న్సార్లను అనుసరించండి. ఇదే ఉత్తమమైన మార్గం. లేదా యుద్ధానికి సన్నద్ధం కండి.” నీవు ‘ఉస్మాన్‌ (ర) మరణాన్ని తన స్వార్థం కోసం ఉపయో గించుకున్నావు. ఒకవేళ నీవు ‘ఉస్మాన్‌ హంతకుల ప్రతీకారం తీర్చుకోవాలనే ఉంటే ముందు నాకు విధేయు లవ్వండి. ఆ తరువాత ఆ కేసును ప్రవేశపెట్టండి. లేదంటే నీవు అనుసరించిన మార్గం దగామోసం వంటిది. ము’ఆవియహ్‌ 20 సంవత్సరాల నుండి సిరియాను ఏలుతున్నారు. ఈ సుదీర్ఘపాలన వల్ల అతనిలో స్వతంత్ర అధికారిననే కోరిక జనించింది. దానికోసం అటువంటి అవకాశం ఇంకెప్పుడూ రాని పరిస్థితి కూడా ఏర్పడింది. ఇంకా ‘ఉస్మాన్‌ (ర) వీరమరణం, ‘అలీ (ర) ఖిలాఫత్‌, ‘ఉమవీ అధికారులను తొలగించినందువల్ల బనూ ఉమయ్యహ్, బనూ హాషిమ్ శత్రుత్వం మళ్ళీ జనించింది. ‘అలీ (ర) తొలగించిన ‘ఉమవీ అధికారు లందరూ ము’ఆవియహ్‌ చుట్టూ చేరారు. అనేక ‘అరబ్‌ తెగలు ము’ఆవియహ్‌ పక్షాన చేరాయి. ఆయన్నే సమర్థించారు. కొందరు ప్రవక్త సహచరులు కూడా స్వలాభం కోసం ఆయనకు చేరువయ్యారు.

అమ్ర్బిన్అల్స్, ఈజిప్టు అధికార పగ్గాలు స్వీకరించి, సహాయసహకారాలు అందిస్తానని వాగ్దానం చేసివేసారు. ‘అరబ్‌ మేధావుల్లో ఒకరైన ముగీరహ్ బిన్షూబహ్, ముందు ‘అలీ (ర) పక్షాన ఉన్నారు. ఆ తరువాత ఇద్దరి మధ్య అభిప్రాయభేదాలు ఏర్పడి ము’ఆవియహ్‌కు చేరువయ్యారు. తన తండ్రి హత్యా ప్రతీకార జ్వాలతో ఒకపారసీ ముస్లిమ్‌ను అనవసరంగా చంపివేసారు. ‘ఉస్మాన్‌ అతని నుండి రక్తపరిహారం తీసుకో నందున, ము’ఆవియహ్‌ గూటికి చేరుకున్నారు. ‘అలీ (ర) పక్షంలో ఉన్న గొప్ప మేధావి అయిన, జియాద్బిన్ఉమయ్యను, ము’ఆవియహ్‌ తన సన్నిహితుల్లో చేర్చుకున్నారు. సిరియా నాయకులు ముందునుండే ఆయన్ను సమర్థించేవారు. వారి సహాయంతో ము’ఆవియహ్‌, ‘ఉస్మాన్‌ (ర) వీరమరణ సంఘటనను సిరియాలో వ్యాపింపజేసారు. ప్రతి పల్లెలో, గ్రామంలో, పట్టణంలో దాన్ని ప్రచారంచేయటానికి ఉపన్యాసకుల్ని పంపారు. దిమిష్క్ లోని జామా మస్జి ద్‌లో ‘ఉస్మాన్‌(ర) తలను ఆయన భార్య నాయిలహ్ తెగిన వ్రేళ్ళను ప్రదర్శించారు. (తబ్రీ55)

ఈ కుట్రలవల్ల ప్రజల్లో ‘ఉస్మాన్‌ (ర) హత్యా ప్రతీకారజ్వాల జనింపజేసిన తర్వాత తన సభికుల సంప్రదింపుల తర్వాత ‘అలీ (ర)కు ఉత్తరం వ్రాసారు. ‘ఉస్మాన్‌ (ర) హంతకులను మాకు అప్పగించవలసిందిగా కోరారు. అబూ ముస్లిమ్ ఉత్తరం తీసుకొని వెళ్ళారు. సభలో ఈ ఉత్తరం అందజేసిన తర్వాత అమిత విచారంతో, ‘ఒకవేళ ‘ఉస్మాన్‌ హంతకులను మాకు అప్పజెపితే, మేమందరం, సిరియా ప్రజలు మీ చేతిపై బై’అత్‌ చేయటానికి సిద్ధంగా ఉన్నాం’ అని అన్నారు. ‘అలీ (ర) ‘సమాధానం రేపు ఇస్తానని’ అన్నారు. అబూ ముస్లిమ్‌ రెండవ రోజు వచ్చి చూస్తే అక్కడ 10 వేల మంది సాయుధులు ఉన్నారు. అబూ ముస్లిమ్‌ను చూసి అందరూ ఒక్కసారిగా ”మేమందరం ‘ఉస్మాన్‌ (ర) హంతకులం” అని అరిచారు. అబూ ముస్లిమ్‌ ఆశ్చర్యపడి వీరందరూ పరస్పరం మాట్లాడుకున్నట్టు ఉంది, అని అన్నారు. అప్పుడు ‘అలీ (ర), ‘దీనివల్ల ‘ఉస్మాన్‌ హంతకులపై నా పట్టు ఎంతవరకు ఉందో అర్థం చేసుకోగలవు,’ అని అన్నారు.

‘అలీ (ర) ము’ఆవియహ్‌కు ఉత్తరంవ్రాస్తూ నెరవేరని మంకు పట్టును వదలివేయమని అతని హత్యలో నాకు ఎటువంటి పాత్రలేదని వ్రాసారు. అదేవిధంగా అమ్ర్బిన్ఆస్కు ఉత్తరం వ్రాస్తూ ప్రాపంచిక వ్యామోహం వదలి సత్యాన్ని సమర్థించమని కోరారు. కాని భూమి ముస్లిముల రక్తం కోసం దాహంతో ఎదురుచూస్తోంది. యుద్ధంలో 10 వేలకు పైగా ముస్లిములు చంపబడ్డారు. ఇంకా దాని దాహం తీరలేదు. సంధి, ఒప్పందాల ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. ‘అలీ (ర) నిస్సహా యులై కరవాలం ఎత్తవలసివచ్చింది. దేశంలోని అధికారు లందరినీ యుద్ధంకోసం పిలవటం జరిగింది. సుమారు 80 వేలమంది సైనికులు సిరియాకు బయలుదేరారు.

సిఫ్ఫీన్పోరాటం: ఈ సైన్యం ఫురాత్ను దాటి సిరియా భూభాగంలో ప్రవేశించగానే ము’ఆవియహ్‌ తరఫున అబుల్ఆవర్నుల్లమీ సైన్యాన్ని ముందుకు రాకుండా అడ్డుకున్నారు. ‘అలవీ సైన్యం అధికారి, జియాద్బిన్అన్నజ్ర్ మరియు షురైహ్బిన్హానీ, రోజంతా ఏక ధాటిగా పోరాడారు. ఇంతలోనే, అష్తర్నఖయీ సైన్యం తీసుకొని వచ్చేసాడు. అబుల్ఆవర్ అది చూసి ఇప్పుడు ఎదుర్కోవటం కష్టంగాభావించి రాత్రిచీకటిలో తన సైన్యాన్ని అక్కడినుండి తొలగించాడు. ఇంకా శత్రు సైన్యం వచ్చిందని కబురు పంపాడు. వారు సిఫ్ఫీన్మైదా నాన్ని యుద్ధంకోసం ఎంచుకున్నారు. ముందస్తు జాగ్ర త్తగా సైన్యాన్ని వివిధప్రాంతాల్లో పరచివేసారు. నీటి తీరాన్ని తమఅధీనంలోఉంచుకొని అబుల్‌ ఆవర్‌ నుల్లమీని ఒకపెద్ద సైన్యమిచ్చి నియమించారు. ఈ విధంగా ‘అలీ సైన్యాన్ని నది నుండి నీళ్ళు తీసుకోకుండా చేసారు.

నీటి కోసం ఆందోళన: అబుల్‌ ఆవర్‌ ఆదేశాన్ని పాలిస్తూ ఉన్నాడు. ‘అలీ (ర) సైన్యం సిఫ్ఫీన్‌ చేరింది. సైన్యం నీటి కొరతకు గురై చాలా ఆందోళన చెందింది. అప్పుడు ‘అలీ (ర) సిరియా సైన్యాన్ని ఎదుర్కొని నదీ తీరాన్ని తమ అధీనంలోకి తీసుకోమని ఆదేశించారు. కొందరు నదీ తీరం చేరిన వెంటనే అన్ని వైపుల నుండి బాణాల వర్షం మొదలయింది. ‘అలీ సైన్యం అంతా కలసి ఒక్కసారి దాడిచేసారు. అయితే ఆవర్‌ స్థిరంగా ఉంటూ చాలా సేపు వరకు పోరాడారు. ‘అమ్ర్‌ బిన్‌ ‘ఆ’స్‌ కూడా తన సైన్యం ద్వారా సహాయంచేసాడు. కాని దాహంతో ఉన్నవారిని నదీ తీరాన్నుండి దూరం చేయడం సాధ్యం కాలేదు. సిరియా సైన్యం బలహీనపడింది. నదీ తీరాన్ని, ‘అలీ (ర) సైన్యం తన అధీనంలోకి తీసుకుంది.

‘అలీ(ర) సైన్యానికి పట్టినగతే, ఇప్పుడు ము’ఆవియహ్‌ (ర) సైన్యానికి పట్టింది. అయితే ‘అలీ (ర) మాన వత్వాన్ని మరవకుండా నీళ్ళు తీసుకునే అనుమతి ఇచ్చారు. అనంతరం ఇరుపక్షాల వాళ్ళు నదినుండి నీళ్ళు తీసుకొని తమ అవసరాలు తీర్చుకుంటున్నారు. ఇరువర్గాల సైనికుల మధ్య స్నేహ భావం జనించింది. కొందరికి సంధి ఏర్పడిందనే అనుమానం కలిగింది. (ఇబ్నె కసీర్)

యుద్ధ మైదానంలో సంధి ప్రయత్నం: ‘అలీ (ర) యుద్ధం ప్రారంభం కావటానికి ముందు, మరొకసారి బషీర్బిన్‌’అమ్ర్‌ బిన్‌ ముహ్‌సిన్‌ అ’న్సారీ, యీద్ బిన్‌ ఖైస్‌ హమ్‌దానీ మరియు  షీస్ బిన్‌ రబ్‌యీ లను, ము’ఆవియహ్‌ (ర) వద్దకు పంపారు. అయితే యుద్ధం కోరని సంధి – ఒప్పందం కోరే ఒక వర్గం ఉండేది. అందువల్లే నిరంతరం మూడు మాసాల వరకు యుద్ధం జరక్కుండా సంధి ప్రయత్నాలు కొనసాగాయి. ఈ కాలంలో ఇరువైపుల నుండి దాడికోసం ప్రయత్నించడం జరిగింది. కాని వీలుకల్పించుకొని యుద్ధాన్నివారించారు. అనంతరం రబీ ఉల్‌ అవ్వల్‌, రబీ ఉస్సానీ, జమాదిల్‌ ఊలా ఈ మూడు నెలలు సంధి ప్రయత్నా లలో గడచిపోయాయి. కాని ఏ మార్గం కానరాలేదు. జమాదుల్‌ ఉఖ్‌రా ప్రారంభంలో యుద్ధం ప్రారంభమయింది.

యుద్ధం ప్రారంభం: ఈ యుద్ధం ఎలా జరిగిందంటే రెండు వైపులనుండి దినంలో రెండుసార్లు అంటే ఉదయం సాయంత్రం కొంత సైన్యం యుద్ధ మైదానంలోకి వచ్చి యుద్ధంచేసి తన గూటికి చేరిపోయేది. సైన్యాన్ని ‘అలీ (ర) కూడా సమీక్షించేవారు. అప్పుడప్పుడూ తమ వంతుగా అస్తర్‌ నఖయీ, హజ్‌ర్‌ బిన్‌ అదీ, షబ్‌స్‌ బిన్‌ రబయీ, ఖాలిద్‌ బిన్‌ అల్‌ ఉమ్‌రహ్‌, ‘జియాద్‌ బిన్‌ హన్‌ఫ అత్తైమీ, స’యీద్‌ బిన్‌ ఖైస్‌, ము’హమ్మద్‌ బిన్‌ హనఫియ, మాఖల్‌ బిన్‌ ఖైస్‌ మరియు ఖైస్‌ బిన్‌ సఅద్‌ విధులను నిర్వర్తించేవారు. ఈ విధంగా జమాదిల్‌ ఆఖిర్‌ నెలంతా గడిచింది. రజబ్‌ నెల ప్రారంభం కాగానే పవిత్ర మాసాల కారణంగా యుద్దం ఆగిపోయింది. మరోసారి సంధి ప్రయత్నాలు జరిగాయి. అనంతరం అబూ దర్‌దా, అబూ ఉమామహ్, ము’ఆవియహ్‌ వద్దకు వెళ్ళి, అబూ దర్‌దా (ర): ”నీవు ‘అలీ (ర)తో ఎందుకు తలపడు తున్నావు? నీకంటే అధికంగా ఆయనకు హక్కు లేదా?” అని అన్నారు.  ముఆవియహ్‌ (ర): ”నేను ‘ఉస్మాన్‌ (ర) హత్యకోసం పోరాడుతున్నాను.” అబూ దర్‌దా (ర): ”ఉస్మాన్‌ను, ‘అలీ (ర) చంపారా?” ము’ఆవియహ్‌ (ర): ”చంపలేదు కాని, హంతకులకు శరణుఇచ్చారు. వారిని అప్పగిస్తే అందరికంటే ముందు నేను అతని చేతిపై బై’అత్‌ చేస్తాను.”

ఈ సంభాషణ తర్వాత అబూ దర్‌దా, అబూ ఉమామహ్, ‘అలీ (ర) వద్దకు వచ్చి ము’ఆవియహ్‌ (ర) షరతును పెట్టారు. అది విని సుమారు 20 వేల మంది సైనికులు సైన్యం నుండి బయటకు వచ్చి, ”మేమంతా ‘ఉస్మాన్‌ హంతకులమే” అని అన్నారు. అది విన్న అబూ దర్‌దా, అబూ ఉమామహ్ సైన్యాన్ని వదలి తీర ప్రాంతాలకు వెళ్ళిపోయారు. యుద్ధంలో ఎవరూ పాల్గొనలేదు.

ఏది ఏమైనా రజబ్‌ మొదటి తేదీ నుండి చివరి ముహర్రమ్‌ 37 హిజ్రీ వరకు ఇరుపక్షాలు మౌనంగా ఉన్నాయి. ప్రస్తావించదగ్గ సంఘటనలేవీ జరగలేదు. సఫర్‌ నెల నుండి మళ్ళీ యుద్ధం ప్రారంభమయింది. ఎంత భీకర పోరాటం జరిగిందంటే వేలమంది స్త్రీలు విధవలయ్యారు. వేలమంది పిల్లలు అనాథులయ్యారు. అయినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదు. ‘అలీ (ర) ఈ సుదీర్ఘ యుద్ధం వల్ల విసుగుచెంది, తన సైన్యాన్ని ఉత్తేజపరచటానికి ప్రభావపూరితమైన ప్రసంగం చేసారు. అందరూ యుద్ధానికి సిద్ధమయ్యారు. ఎంత భీకరంగా దాడి చేసారంటే శత్రుసైన్యం ఛిన్నాభిన్నమై పోయింది. మహా నాయకులు కూడా తలదించుకోవలసి వచ్చింది. శత్రు సైన్యాన్ని చీల్చుతూ ము’ఆవియహ్‌ (ర) రక్షణా వలయం వరకు చేరుకున్నారు. యుద్ధానికి రమ్మని ము’ఆవియహ్‌ను ఛాలెంజ్‌ చేసారు.

ముఆవియహ్‌ (ర) యుద్ధానికి నిరాకరించిన పిదప, అమ్ర్బిన్అల్స్, అలీని ఎదుర్కొనడానికి బయటకు వచ్చారు. ఇద్దరి మధ్య భీకర పోరాటం జరిగింది. ‘అలీ (ర) చేసిన దాడికి తట్టుకోలేక స్పృహకోల్పోయి క్రిందపడ్డారు. నగ్నంగా తయారయ్యారు. ‘అలీ (ర) తన శత్రువును నగ్నంగా చూసి ముఖం త్రిప్పుకొని సజీవంగా వదలి వెళ్ళిపోయారు.

ఈ యుద్ధం తరువాత కొంత సైన్యం యుద్ధం చేసే బదులు సైన్యంమొత్తం యుద్ధం చేయసాగింది. కొన్ని రోజుల వరకు ఇలా కొనసాగింది. చివరకు శుక్రవారం భీకర పోరాటం జరిగింది. ఉదయం నుండి సాయంత్రం వరకు, సాయంత్రం నుండి ఉదయం వరకు యుద్ధం కొనసా గింది. నినాదాలు, గుర్రాల చప్పుళ్ళు, కరవాలాల శబ్దాలతో భూమంతా వణకసాగింది. అందువల్లే దీన్ని లైలతుల్హరీర్ అంటారు. మరుసటి రోజు క్షతగాత్రులను, మరణించిన వారిని తొలగించడానికి యుద్ధం వాయిదా వేయబడింది. ‘అలీ (ర) తన అభిమానులను ఉద్దేశించి, వీరులారా! మన ప్రయత్నం పూర్తయ్యింది. ఇన్‌షా అల్లాహ్‌ రేపు చివరి నిర్ణయం జరుగుతుంది. ఈ రోజు విశ్రాంతి తీసుకొని రేపు శత్రువును ఓడించటానికి సంసిద్ధులుకండి, తీర్పు జరిగేవరకు వెనుతిరిగి చూడకండి.

ము’ఆవియహ్‌ (ర) మరియు ‘అమ్ర్‌ బిన్‌ అల్‌ ‘ఆ’స్‌లు అప్పటి వరకు తమ సైన్యాన్ని వీరోచితంగా పోరాడమని ఉత్తేజపరిచారు. కాని లైలతుల్‌ ‘హరీర్‌ యుద్దం వల్ల ‘అలీని ఎదుర్కోవడం అసాధ్యం అని తెలిసిపోయింది. తెగల నాయకులు కూడా ధైర్యం కోల్పోయారు. అష్అస్బిన్ఖైస్సభలో నిలబడి బహిరంగంగా ”ఒకవేళ ముస్లిములు ఇలాగే యుద్ధం చేస్తూపోతే ‘అరబ్‌ దేశమంతా స్మశానంలా తయారవుతుంది. రూమీలు, షామీలు మన భార్యాబిడ్డలను ఆక్రమించుకుంటారు. అదేవిధంగా ఈరానియన్లు కూఫాలో ఉన్న భార్యా బిడ్డలను ఉంచుకుంటారు. అందరి దృష్టి ము’ఆవియహ్‌ పై కేంద్రీకృతమై ఉంది. అందరూ దీన్ని సమర్థించారు.

అది గ్రహించిన ము’ఆవియహ్‌ (ర) ‘అలీకి ఉత్తరం వ్రాస్తూ ”ఈ యుద్ధం ఇంత దీర్ఘంగా ఉండేదంటే మనం దీనికి సమ్మతించేవాళ్ళం కాము. ఇప్పుడు మనం ఈ యుద్ధాన్ని విరమించాలి. మనమంతా అబ్దె మునాఫ్ వాళ్ళం. మనకు ఒకరిపై ఒకరికి ఎటువంటి ప్రత్యేకత లేదు. అందువల్ల ఒకరి గౌరవాభిమానాలకు ఏమాత్రం అవమానం జరక్కుండా సంధిజరగాలి,” అని వ్రాసారు. అయితే ‘అలీ (ర) దీనికి సమ్మతించలేదు. మరుసటి రోజు ఆయుధాలుధరించి యుద్ధమైదానంలోనికి వచ్చారు. కాని ప్రతిపక్షం యుద్ధం ముగించాలని నిర్ణ యించుకొనిఉంది. అప్పుడు ‘అమ్ర్‌ బిన్‌ ‘ఆ’స్‌, ”నే నిప్పుడు ఎలాంటి పథకం వేస్తానంటే యుద్ధమైనా ముగు స్తుంది లేదా ‘అలీ (ర) సైన్యంలో చీలికనైనా తెస్తుంది,” అని అన్నారు. అనంతరం మరుసటి రోజు సిరియా సైన్యం ఒకఅనూహ్యమైన పథకం ద్వారా యుద్ధ భూమిలో ప్రత్యక్షమయింది. ఐదు బల్లాలపై దిమిష్క్ కు చెందిన ఖుర్‌ఆన్‌ను పెట్టబడి ఉంది. ‘అలీ తరఫు నుండి అష్తర్‌ నఖయీ దాడిచేసారు. మధ్యనుండి ఫజ్‌ల్‌ బిన్‌ అద్‌హమ్‌ ఇంకా ఇతరులు బిగ్గరగా ‘అరబ్‌ వాసులారా! అల్లాహ్‌ రూమీల నుండి, ఈరానియన్ల నుండి మీ భార్యా పిల్లలను రక్షించుగాక! చూడండి, ఈ దైవగ్రంథం, మీకూ మాకు మధ్య ఉంది. అదేవిధంగా ఆవర్‌ తన తలపై ఖుర్‌ఆన్‌ గ్రంథం ఉంచుకొని ‘అలీ (ర) వద్దకు వచ్చారు. బహిరం గంగా, ”ఓ ఇరాఖ్‌ ప్రజలారా! ఈ దైవగ్రంథం మీకూ మాకూ మధ్య తీర్పుఇస్తుంది. కాని అష్తర్‌ నఖయీ తన సైన్యాన్ని ఇది సిరియా సైనికుల కుట్ర,” అని తెలిపారు. వారిని ఉత్తేజపరచి సూటిగా దాడి చేయమని ఆదేశించాడు. కాని సిరియా ప్రజల పన్నాగం ఫలించింది.

‘అలీ (ర) ప్రజలను అనేక విధాలుగా నచ్చజెప్పారు. ఖుర్‌ ఆన్‌ ఎత్తి చూపటం కేవలం ప్రదర్శనా బుద్ధి మాత్రమేనని స్పష్టం చేసారు. ‘సుఫియాన్‌ బిన్‌ సోర్‌, ‘ఖాలిద్‌ మఅమర్‌ లు కూడా ‘అలీని సమర్థించారు. ఇంతకుముందు మనం ఖుర్‌ఆన్‌ వైపు పిలిస్తే స్పందించ లేదు. ఇప్పుడు ఓడి పోతామనే భయంతో ఈ కుట్రకు దిగారు అని అనేక విధాలుగా నచ్చజెప్పారు. కాని సిరియా ప్రజల కుట్ర ఫలించింది. వారిలోని ఒక వర్గం ఖుర్‌ఆన్‌ సందేశాన్ని తిరస్కరించరాదని పట్టుపట్టింది. అంతే కాక ఖుర్‌ఆన్‌ మధ్య వచ్చిన తరువాత కూడా యుద్ధం ఆపకపోతే మేము తప్పుకుంటామని, అంతే కాదు, నాయకునితో నైనా ఎదుర్కొంటామని హెచ్చరించింది.

మస్‌’ఊద్‌ బిన్‌ ఫద్‌కే, ‘జైద్‌ బిన్‌ ‘హుసైన్‌ ఇంకా ఇబ్ను కవార్‌ ఈ బృందానికి నాయకులు. చివరికి అష్‌అస్‌ బిన్‌ ఖైస్‌ కూడా మేముమిమ్మల్నే సమర్థిస్తున్నాము, అయితే దీన్నిఒప్పుకుంటే బాగుంటుంది,’ అని అన్నారు. చివరికి ‘అలీ (ర) కూడా దీనికి తల ఒగ్గవలసి వచ్చింది.

అయితే అష్తర్‌ నఖయీ పూర్తి ఉత్సాహంగా యుద్ధం చేస్తున్నారు. ఈ వార్త వినగానే ఆయన కూడా చాలా విచారించారు. యుద్ధం ముగించుకొని తిరిగి వచ్చిన తర్వాత యుద్ధ నివారణకు పూనుకున్న బృందం వారితో వాడివేడి సంభాషణ జరిగింది. అయితే ‘అలీ (ర) కల్పించుకొని వారిని ఓదార్చారు.

యుద్ధం ముగిసిన తర్వాత ఇరుపక్షాలమధ్య ఉత్తర ప్రత్య్తురాలు ప్రారంభమయ్యాయి. ఇరుపక్షాల పండితులు విద్వాంసులు, మేధావులు చర్చించి, ఖిలాఫత్‌ వ్యవహా రాన్ని ఇద్దరు న్యాయమూర్తులకు వదలిపెట్టాలని, వారు ఇచ్చిన తీర్పునే స్వీకరించాలని నిర్ణయించారు. సిరియా ప్రజలు తమ తరఫునుండి అమ్ర్బిన్అల్స్ పేరును ప్రతిపాదించారు. ఇరాఖ్‌ ప్రజల తరఫున అబూ మూసా అష్‌’అరీ పేరును ప్రతిపా దించారు. ‘అలీ (ర) దీన్ని వ్యతిరేకించి ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘అబ్బాస్‌ పేరును ప్రతిపాదించారు. దానికి ప్రజలు, ”మీరూ ఆయన ఒకటే, ఇక్కడ నిష్పక్షపాతిఅయినవ్యక్తి కావాలి,” అని అన్నారు. అందువల్ల ‘అలీ (ర) అష్తర్‌ నఖయీని పేర్కొన్నారు. అష్‌అస్‌ బిన్‌ ఖైస్‌ అభ్యంతరం పలికి అసలు యుద్ధ జ్వాలను రగిలించింది అష్తర్‌ నఖయీనే అని అన్నారు. తీర్పు జరిగే వరకు ఒక వర్గం మరోవర్గంతో యుద్ధం చేస్తూ ఉండాలనేది అతని అభిప్రాయం.

ప్రజలు అబూ మూసా అష్అరీ (ర) తప్ప మరెవరినీ స్వీకరించక పోవటం చూసి ‘అలీ (ర) ‘ఎవరినైనా నియమించండి మీ ఇష్టం’ అని అన్నారు. అబూ మూసా అష్‌’అరీ యుద్ధ నిర్ణయం మార్చుకొని సిరియాలోని ఒక పల్లెలో ఏకాంతం అనుసరించారు. ప్రజలు ఒక వ్యక్తిని పంపి అతన్ని పిలిపించారు. ఇరుపక్షాల తరఫున ఒప్పందం పత్రం వ్రాయడానికి సిద్ధమయ్యారు.

ఒప్పందం వ్రాసే వ్యక్తి, ‘బిస్మిల్లాహ్‌ హిర్రహ్మా నిర్రహీమ్‌’ తర్వాత ఒప్పందం వ్రాయబడింది. ఇరుపక్షాల తరఫున సంతకాలు చేసి ముగించారు. దాని సారాంశం ఇది: ‘అలీ (ర), ము’ఆవియహ్‌ (ర)లను సమర్థించేవారు అందరూ కలసి ఇలా ప్రమాణం చేసారు. అబూ మూసా అష్‌’అరీ, ‘అమ్ర్‌ బిన్‌ అల్‌ ‘ఆ’స్‌ ఖుర్‌ఆన్‌, ప్రవక్త (స) సాంప్రదాయానికి అనుగుణంగా తీర్పుచేస్తారు. దీన్ని వారు తప్పకుండా స్వీకరిస్తారు. అందువల్ల న్యాయమూర్తులిద్దరూ ఖుర్‌ఆన్‌, ప్రవక్త (స) సాంప్రదాయాల కనుగుణంగా తీర్పుచేయాలి. ఎంత మాత్రం దానికి వ్యతిరేకంగా తీర్పు ఇవ్వరాదు. న్యాయ మూర్తుల ధనప్రాణాలు భద్రంగా ఉంటాయి. వారి సరైన తీర్పును అందరూ స్వీకరించాలి. ఒకవేళ తీర్పు ఖుర్‌ఆన్‌, ప్రవక్త సాంప్రదాయాలకు వ్యతిరేకంగా జరిగితే స్వీకరించడం జరుగదు. ఇరుపక్షాలూ యుద్ధం ద్వారానే సమస్యను పరిష్కరించుకోగలవు.

ఖారిజీ వర్గ స్థాపన: ఒప్పందం సఫర్‌ 13, బుధవారం 37 హిజ్రీలో జరిగింది. అష్‌అస్‌ బిన్‌ఖైస్‌పై తెగలన్నిటికీ ఒప్పందం గురించి తెలియపరిచే బాధ్యత పడింది. అందరికీ తెలియపరుస్తూ గజ్‌నహ్‌ చేరేసరికి ఇద్దరు వ్యక్తులు నిలబడి అల్లాహ్‌కు తప్ప ఇతరు లెవ్వరికీ తీర్పు చేసే అధికారం లేదని, ఆగ్రహించి సిరియా సైన్యంపై దాడిచేసారు. ఇంకా వెనుతిరిగి చంపబడ్డారు. అదేవిధంగా మురాద్‌, తబూరాస్త్‌, బనూ తమీమ్‌ తెగలు కూడా అసహ్యించుకున్నాయి. బనూ తమీమ్‌కు చెందిన ఒక వ్యక్తి అష్‌అస్‌ను, మీరు అల్లాహ్‌ ధర్మంలో మనుషుల తీర్పును స్వీకరిస్తారా? ఒకవేళ ఇలా అయితే మా హతుల సంగతి ఏమి కానూ? అని పలికి ఆగ్రహించి కరవాలంతో ఎటువంటి దాడి చేసాడంటే, అది తప్పకుండా ఉంటే అష్‌అస్‌ పని సమాప్తం అయిపోయేది. ఇంకా చాలా మంది ‘అలీ (ర) వద్దకు వెళ్ళి ఒప్పందం పట్ల తమ విముఖత ప్రకటించారు. మహ్‌రజ్‌ బిన్‌ ఖునైస్‌, ”అమీర్ అల్ ము’అమినీన్! ఈ ఒప్పందాన్ని వెంటనే రద్దుచేయండి, దీనివల్ల మీకు హాని జరుగుతుందని నేను భావిస్తున్నాను,” అని అన్నాడు. ఏది ఏమైనా అనేక వర్గాలు ఈ ఒప్పందాన్ని తిరస్కరిస్తూ, దాని పర్యవసానం సరిగా ఉండదని భయం వ్యక్తం చేసారు. దీనివల్ల ఒక ప్రత్యేక వర్గం స్థాపన జరిగింది.

న్యాయపీఠం ఫలితం: ‘అలీ (ర) మరియు ము’ఆవియహ్‌ (ర) దౌమతుల్జందల్ (ఇరాక్‌, సిరియాల మధ్య భాగం)ను న్యాయమూర్తుల తీర్పు స్థలంగా నిర్ణయిం చారు. ఇరుపక్షాలు తమతమ న్యాయమూర్తుల వెంట 400 మంది సైనికులను తోడు ఉంచారు. అబూ మూసా అష్‌’అరీ వెంట వెళ్ళిన సైన్యానికి షురైహ్‌ బిన్‌ హానీ, ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘అబ్బాస్‌ నాయకులుగా ఉండేవారు. అబ్దుల్లాహ్బిన్ఉమర్, అద్బిన్అబీ వఖ్ఖాస్, ముగీర బిన్షూబహ్ మొదలైనవారు తమ భయభక్తుల వల్ల యుద్ధానికి దూరంగానే ఉన్నారు. తీర్పు గురించి విని తెలుసుకుందామని దౌమతుల్‌ జందల్‌ వచ్చారు. ము’గీరహ్ బిన్‌ షూబహ్ (ర) చాలా తెలివిగలవారు. అక్కడ చేరగానే అబూ మూసా అష్‌’అరీ మరియు అమ్ర్‌ బిన్‌ అల్‌ ఆస్‌లను వేర్వేరుగా కలసి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఫలితంగా వీరిలో ఏకాభిప్రాయం సాధ్యంకాదని అతనికి తెలిసి పోయింది. అతడు వెంటనే ఈ తీర్పువల్ల న్యాయం జరగదని భవిష్యవాణి పలికారు. ఏది ఏమైనా ఇద్దరు న్యాయమూర్తులు ఏకాంతంగా సమావేశమయ్యారు. అమ్ర్బిన్అల్స్, అబూ మూసా అష్అరీని తన అభిప్రాయాన్ని సమర్థించేందుకు ఆయన్ను చాలా గౌరవాభిమానాలలో ముంచెత్తారు. వారిద్దరి మధ్య జరిగిన సంభాషణ సారాంశం ఇది:

అబూ మూసా: ‘అమ్ర్‌! దైవప్రీతి, జాతి అభివృద్ధి కలిగి ఉన్న అభిప్రా యంలో నీ ఉద్దేశ్యం ఏమిటి?

‘అమ్ర్‌ బిన్‌ అల్‌’ఆ’స్‌: అదేమిటి?

అబూ మూసా: ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘ఉమర్‌ (ర) ఇటువంటి ఏ యుద్ధంలోనూ పాల్గొనలేదు. అతన్నే ఎందుకు పాలకుడిగా ఎంచుకోకూడదు. ముఆవియహ్‌ ఈ పదవికి తగినవారు కారు, అతనికి అర్హత కూడా లేదు. ఒకవేళ నువ్వు నాతో ఏకీభవిస్తే మళ్ళీ ‘ఉమర్‌ (ర) పరిపాలన తిరిగి వస్తుంది. ‘అబ్దుల్లాహ్‌ తన తండ్రి గుర్తింపు సర్వసామాన్యం చేస్తాడు.

‘అమ్ర్‌ బిన్‌ అల్‌’ఆ’స్‌: నా కొడుకు అబ్దుల్లాహ్పై మీ దృష్టి ఎందుకు పడలేదు. ప్రత్యేకతల్లో, ప్రాధాన్యతల్లో వాడూ తక్కువేమీ కాదు.

అబూ మూసా: నిస్సందేహంగా నీ కొడుకు కూడా చాలా గొప్పవాడే, కాని ఈ విచ్ఛిన్న యుద్ధాల్లో వాడిని కూడా చేర్చి, నువ్వు అతనిపై మచ్చలు తెచ్చిపెట్టావు. కాని ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘ఉమర్‌ దైవభీతి, దైవభక్తి వల్ల ఇటువంటి ఆరోపణల నుండి దూరంగా ఉన్నాడు. రా! అతన్నే పాలకునిగా ఎంచుకుందాం.

‘అమ్ర్‌ బిన్‌ అల్‌’ఆ’స్‌: అబూ మూసా! ఈ పదవి అర్హత కేవలం ఒకనోటితో తిని మరోనోటితో తినిపించే వారికే ఉంటుంది.

అబూ మూసా: ‘అమ్ర్‌! నీ పాడుగాను. ఇంత రక్తపాతం జరిగిన తర్వాత మనల్ని ఆశ్రయించడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ మనం వారిని ఉపద్రవాల వైపునకు నెట్టలేం.

‘అమ్ర్‌ బిన్‌ అల్‌’ఆ’స్‌: మరి మీ అభిప్రాయం ఏమిటి?

అబూ మూసా: మన అభిప్రాయం ఏమిటంటే, ‘అలీని, ము’ఆవియహ్‌ను తొలగిద్దాం. ముస్లిముల సలహా బృందాన్ని ఏర్పాటు చేసి ఎవర్నయినా ఎన్నుకుంటారు.

‘అమ్ర్‌ బిన్‌ అల్‌’ఆ’స్‌: నేనూ ఏకీభవిస్తున్నాను.

ఇద్దరూ నిర్ణయించుకున్న తర్వాత ఇద్దరూ విడిపోయారు.

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘అబ్బాస్‌, అబూ మూసా వద్దకు వెళ్ళి, ”అల్లాహ్ సాక్షి! ‘అమ్ర్‌ మిమ్మల్ని మోసగించి ఉంటాడు. ఒకవేళ ఏదైనా విషయంపై ఏకాభిప్రాయం జరిగినా మీరు ప్రకటించడంలో ముందడుగు వేయకండి, వాడు చాలా మోసగాడు. మిమ్మల్ని వ్యతిరేకించి తీరుతాడు,” అని అన్నారు. దానికి అబూ మూసా మేమిద్దరం ఎటువంటి నిర్ణయంపై ఏకాభిప్రాయం కలిగి ఉన్నామంటే అందులో అభిప్రాయభేదాలు ఉండనే ఉండవు. అనంతరం మరుసటి రోజు మస్జిద్‌లో ముస్లిమ్‌లందరూ చేరారు. అబూ మూసా అష్‌’అరీ, ‘అమ్ర్‌ బిన్‌ అల్‌ ‘ఆ’స్‌తో, ”మెంబరుపై ఎక్కి తీర్పు వినిపించండి,” అని అన్నారు. దానికి ‘అమ్ర్‌ బిన్‌ అల్‌’ఆ’స్‌ ”తమరు పూజ్యులు, పెద్దలు, మిమ్మల్ని నేను అధిగమించలేను” అని అన్నారు.

అప్పటికి అబూ మూసా అష్‌’అరీ (ర)ని, ‘అమ్ర్‌ బిన్‌ అల్‌’ఆ’స్‌ ప్రభావితులను చేయడం జరిగింది. ఆయన నిరభ్యంతరంగా నిలబడి దైవస్తోత్రం పఠించిన తర్వాత, ”ప్రజలారా! మేము ‘అలీని ము’ఆవియహ్‌ను తొలగించాము, కనుక మళ్ళీ ఒక సలహా బృందం, అది కోరిన వారిని ఎన్నుకుంటుంది” అని చెప్పి మెంబరుపై నుండి దిగారు.

‘అమ్ర్‌ బిన్‌ అల్‌’ఆ’స్‌ తరువాత మెంబరు పైకి ఎక్కి, ”ప్రజలారా! ‘అలీని, అబూ మూసా అష్‌’అరీ తొలగించారు. నేను కూడా తొలగిస్తున్నాను. కాని ము’ఆవియహ్‌ను అతని పదవిపై కొనసాగిస్తున్నాను. ఎందుకంటే అతడు ‘ఉస్మాన్‌ మిత్రులు, పాలనకు అందరికంటే అధికంగా అర్హత గలవారు.”

అబూ మూసా చాలా సాధు మనస్కులు. ఈ ప్రకటన వల్ల ఆశ్చర్యానికి గురై, బిగ్గరగా, ”ఇదేమి మోసం, నిజంగా నీ పరిస్థితి నాలుక వెళ్ళబెట్టే కుక్కలా ఉంది” అని చీవాట్లు పెట్టారు.

‘అమ్ర్‌ బిన్‌ అల్‌’ఆ’స్‌ ప్రకటన వల్ల జనం తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. షురైహ్‌ బిన్‌ హానీ, ‘అమ్ర్‌ బిన్‌ అల్‌’ఆ’స్‌ను కొరడాతో కొట్టటం ప్రారంభించారు. ఇటు అతని కొడుకు షురైపై దాడి చేయసాగాడు. కాని పరిస్థితి తీవ్రతరం కాలేదు, అబూ మూసా చాలా విచారించి అప్పటికప్పుడే మక్కహ్ ప్రమాణమయ్యారు. మిగిలిన జీవితమంతా ఏకాంతంలోనే గడిపారు.

ఖవారిజ్తలబిరుసుతనం: ‘అలీ (ర) అభిమానుల్లో కొందరు, అని మనం ఇంతకుముందు చదివాము. అలీ (ర) సిఫ్ఫీన్ నుండి కూఫా వచ్చిన తర్వాత తమ అయిష్టాన్ని ఎలా నిరూపించారంటే సుమారు 12 వేల మంది సైన్యం నుండి వేరై హరూరాలో నివసించసాగారు. ‘అలీ (ర), ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘అబ్బాస్‌ను, వారిని బ్రతిమాలడానికి పంపారు. అతని మాట వినలేదు, చివరికి ‘అలీ (ర) స్వయంగా వచ్చారు. వారిని నచ్చజెప్పి కూఫా తీసుకువచ్చారు. ఇటు పాలకుడు వారిని నచ్చజెప్పడానికి న్యాయమూర్తుల బెంచ్‌ను తిరస్కరించారని, దాన్నుండి పశ్చాత్తాపం చెందారని ‘అలీ చెవిలో పడింది. ఆ వెంటనే ఆయన ప్రసంగిస్తూ దాన్ని ఖండించారు. ఇంకా ముందు వీరే యుద్ధ నివారణకు ప్రయత్నించారు. మళ్ళీ తీర్పుపై వ్యతిరేకత చూపారు. ఇప్పుడు ఒప్పందాన్ని భంగంచేసి యుద్ధం చేద్దామని ప్రయత్నిస్తున్నారు. ‘అల్లాహ్ సాక్షి! ఇలా ఎంతమాత్రం జరుగదు,’ అని అన్నారు. అక్కడున్న వారిలో ఆ బృందానికి సంబంధించిన వారు కూడా ఉన్నారు. వారందరూ తీర్పుచేసే హక్కు కేవలం అల్లాహ్‌కే ఉందని నినాదాలు చేసారు.

‘అలీ (ర) వెంటనే, ‘సహనం వహించండి. దైవవాగ్దానం సత్యమైనది,’ అని సమాధానం ఇచ్చారు. అయితే క్రమంగా ఆ బృందం ఒక ప్రత్యేక తెగగా మారిపోయింది. దౌమతుల్‌ జందల్‌ న్యాయపీఠం వల్ల దేశంలో ప్రమాదకరమైన పరిస్థితి ఏర్పడింది. ఈ తెగవారు ‘అలీ (ర)ను వదలి, అబ్దుల్లాహ్బిన్నహబ్అర్రాసీ చేతిపై బై’అత్‌ చేసారు. ఇంకా కూఫా, బ’స్‌రహ్‌, అన్‌బార్‌ మరియు మదాయిన్‌ మొదలైన ప్రాంతాలకు చెందిన వారందరూ నహర్వాన్ లో ఏకమై హత్యలు, దోపిడీలకు పాల్పడసాగారు.

ఖారీజీలు ధర్మపరమైన విషయాల్లో న్యాయాధికారులను నియమించడం అవిశ్వాసమని, దీనివల్ల న్యాయ మూర్తులు, వారిని ఎన్నుకున్నవారు వీరి దృష్టిలో అవిశ్వాసులు. ఇంకా వీరితో ఏకీభవించినవారి ప్రాణాలు తీయడం ధర్మసమ్మతం అని భావించేవారు. అనంతరం వీరు అబ్దుల్లాహ్బిన్ఖబ్బాబ్ ఆయన భార్యను చాలా క్రూరంగా చంపివేసారు. అదేవిధంగా ఉమ్మె సినాన్‌ మరియు సైదావియహ్‌ను క్రూరంగా హింసించారు. దొరికిన వారిని తమలో కలుపుకున్నారు. లేదా క్రూరంగా చంపివేసారు. ‘అలీకీ ఈ క్రూరమైన సంఘటనల గురించి తెలిసింది. ‘హారిస్‌’ బిన్‌ మర్వాన్ ను పరిశీలనలకు పంపారు. అతన్ని కూడా ‘ఖారిజీయులు చంపివేసారు.

‘అలీ (ర) ఆ సమయంలో కొత్త తరహాలో సిరియాపై దండెత్తే కార్యక్రమాలు చేపడుతున్నారు. అయితే ‘ఖారిజీల తలబిరుసుతనం, హత్యలు, దోపిడీలు మోసాలు ఎంత పెరిగిపోయాయంటే, మొదటి నిర్ణయాన్ని మార్చుకొని ‘ఖారిజీలను అణచడానికి నహర్వాన్వైపు వెళ్ళవలసి వచ్చింది.

నహర్వాన్పోరాటం: నహర్‌వాన్‌ చేరిన తర్వాత, అబూ అయ్యూబ్న్సారీ మరియు ఖైస్బిన్అద్బిన్ఉబాదహ్లను, ‘ఖారిజీల వద్దకు వారిని హెచ్చరించమని పంపారు. అయినా సమస్య పరిష్కారం కానందు వల్ల, ‘ఖారిజీల ఒక నాయకుడైన ఇబ్నుల్లివా ను పిలిపించి, ‘అలీ (ర) స్వయంగా అనేక విధాలుగా నచ్చజెప్పారు. కాని వారి హృదయాలు కాఠిన్యంతో నిండి ఉండటం వల్ల ఎన్ని విధాలుగా బోధనలు, హితోపదేశాలు పనికిరాలేదు. ‘అలీ (ర) చేసేది లేక సైన్యాన్ని సిద్ధంకండని ఆదేశించారు. కుడిప్రక్క ‘హజర్‌ బిన్‌ ‘అదీ, ఎడమ ప్రక్క షీస్‌బిన్‌ రబియా, సైనికులపై అబూ ఖతాదా అన్సారీ, వాహనాల దళంపై అబూ అయ్యూబ్‌ అ’న్సారీని నియమించి సైన్య పంక్తులను యుద్ధానికి సిద్ధం చేసారు.

‘ఖారిజీల్లో ఒక వర్గం ‘అలీ (ర)తో యుద్ధం చేయటానికి సంశయంలో పడిపోయింది. అందువల్లే యుద్ధం ప్రారంభం కాగానే సుమారు 500 మంది యుద్ధం వదలి పారిపోయారు. పెద్ద సంఖ్యలో మరో బృందం కూఫా వెళ్ళి పోయింది. మరో 1000 మంది పశ్చాత్తాపంచెంది, ‘అలీ (ర)ను శరణుకోరారు. ఇక అబ్దుల్లాహ్అర్రాసీ నాయకత్వంలో కేవలం 4 వేలమంది ఖారిజీలు మాత్రమే మిగిలారు. అయితే వీరిలో చాలామంది వీరులు, శూరులు ఉన్నారు. అందువల్ల వారు చాలా తీవ్రమైన దాడికి పాల్పడ్డారు. ‘అలీ (ర) స్థిరత్వంతో లేకుంటే వారిని ఎదుర్కోవటం చాలా కష్టం అయ్యేది. ‘ఖారిజీల పరిస్థితి ఎలా ఉందంటే, వారి శరీర భాగాలు తెగిపడుతున్నాయి. అయినా వారి దాడిలో బలహీనత జనించలేదు. సరీహ్బిన్అల్ఫా ఒక కాలు తెగిపోయినా ఒంటరిగా ఒక కాలిపైనే నిలబడి క్రమంగా ‘ఖారిజీలు ఒకరి తరువాత ఒకరిని చంపుతూ ఉన్నారు. యుద్ధం ముగిసిన తర్వాత ‘అలీ (ర) ‘ఖారిజీ హతుల్లోని ఒక వ్యక్తిని వెదకటం ప్రారంభించారు. వాడి గురించి ప్రవక్త (స) భవిష్యవాణి పలికి ఉన్నారు. అనంతరం అతన్ని చిహ్నాలతో ఆ శవం దొరికింది. అప్పుడు ‘అలీ(ర), ‘అల్లాహు అక్బర్‌, అల్లాహ్ సాక్షి! ప్రవక్త (స) పలికినట్టే ఉన్నాడు,’ అని పలికారు.

నహర్వాన్ యుద్ధం ముగిసిన తర్వాత ‘అలీ (ర) సిరియా వైపు ప్రయాణమవమని ఆదేశించారు. కాని అష్‌అస్‌ బిన్‌ ఖైస్‌, నాయకుడా! మా అమ్ముల పొదులు ఖాళీ అయిపోయాయి. కరవాలాలు కూడా సానపట్టి లేవు. బాణాల పళ్ళు కూడా పాడై పోయాయి. అందువల్ల మనం శత్రువుపై దాడిచేయడానికి ముందు అన్నిటినీ సిద్ధం చేసుకుంటే మంచిది. ‘అలీ (ర) అష్‌’అస్‌ అభిప్రాయం ప్రకారం నఖ్‌లియలో విడిది చేసి, సిద్ధం కమ్మని ఆదేశించారు. కాని సిద్ధం కావడానికి బదులు మెల్ల మెల్లగా 10, 20 గా కూఫా వైపు జారుకోసాగారు. చివరికి 1000 మంది మిగిలారు. ‘అలీ (ర) ఇదంతా చూసి సిరియాపై దాడి నిర్ణయం మార్చుకున్నారు. తిరిగి కూఫా వెళ్ళిపోయారు.

ఈజిప్టు విషయంలో సంశయం: ‘అలీ (ర) అధికారంలోకి రాగానే ‘ఉస్మాన్‌ (ర) కాలం నాటి సిబ్బందిని తొలగించి కొత్త సిబ్బందిని నియమించారు. ఈజిప్టులో ఖైస్బిన్అద్న్సారీ అధికారిగా ఉండేవారు. అతడు వివేకంతో ఇంచుమించు ఈజిప్టునంతా ‘అలీ (ర) అధికారంపై ఒప్పించారు. వారి నుండి బై’అత్‌ తీసుకున్నారు. కేవలం ఖుర్తుబా ప్రజలే ఇంకా సంశయంలో ఉన్నారు. పరిస్థితులు సద్దుమణిగే వరకు తమను బై’అత్‌ కొరకు బలవంతం చేయరాదని, అయితే పాలకుని విధేయతలో ఎటువంటి లోటూ రానీయమని, అదేవిధంగా దేశశాంతి భద్రతల్లో ఎటువంటి విఘాతం కలిగించమని అన్నారు. జైన్బిన్అద్ కూడా చాలా తెలివిగల మేధావి. అతడు ఆ తేనెటీగల గూటిని కదిలించడం అవివేకంగా భావించి, వారిని సుఖంగా జీవించమని అనుమతి ఇచ్చారు. ఫలితంగా వారందరూ విధేయులైపోయారు. పన్ను చెల్లించడంలో ఎటువంటి అపీలు చేయలేదు.

సిప్ఫీన్ సన్నాహాలు ప్రారంభం అయ్యాయి. ఒకవేళ మరోవైపు నుండి, ఖైస్బిన్అద్ ఈజిప్టు వారిని తీసుకొని సిరియాపై దాడిచేసే ప్రమాదం అని ము’ఆవియహ్‌ భయపడి ఖైస్‌ బిన్‌ స’అద్‌కు ఉత్తరం వ్రాస్తూ తనను సమర్థించమని కోరారు. ఖైస్‌ బిన్‌ సఅద్‌ సమాధానం ఇవ్వకుండా దాటవేసారు. అది గ్రహించిన ము’ఆవియహ్‌ నన్ను మోసగించాలని ప్రయత్ని స్తున్నావా? నాలాంటి వ్యక్తి నీ పన్నాగంలోనికి రాడు, నువ్వు నన్ను మోసంచేయాలని అనుకుంటున్నావు, నా ఒక్క సైగ ఈజిప్టును నాశనం చేయగలదు అని ఉత్తరం వ్రాసారు. ఖైస్‌ బిన్‌ స’అద్‌ ఆ ఉత్తరానికి కఠినంగా సమాధానం ఇస్తూ, ‘నేను నీ హెచ్చరికల వల్ల భయపడను. అల్లాహ్ కోరితే నీ పరిస్థితే పలుచబడి పోతుంది’ అని వ్రాసారు.

  ఖైస్‌ బిన్‌ స’అద్‌ చాలా గొప్ప వివేకవంతులు, గౌరవనీయులు. ప్రవక్త (స) వెంట అనేక యుద్ధాలలో అన్సార్ల నాయకులుగా ఉన్నారు. అతని ముందు పన్నాగాలేవీ పనికిరావటం లేదని గ్రహించిన ము’ఆవియహ్‌ అతన్ని ఈజిప్టు నుండి తొలగించటానికి ఖైస్‌ బిన్‌ సఅద్‌ నన్ను సమర్థిస్తున్నారని పుకార్లు పుట్టించారు. ఈ గాలివార్తలు ‘అలీ (ర) వరకు చేరాయి. ముహమ్మద్బిన్అబీ బక్ర్దాన్ని మరీ దిట్టించి వివరించారు. ఇంకా ఖుర్‌’తుబా ప్రజల నుండి బై’అత్‌ తీసుకోకపోవటాన్ని సాక్ష్యంగా పెట్టారు.

  ‘అలీ (ర) ఈ వార్తలకు ప్రభావితులై ఖైస్‌ బిన్‌ స’అద్‌ను ఖుర్‌’తుబా వారితో బై’అత్‌ తీసుకోమని ఆదేశించారు. దానికతను ఖుర్‌’తుబా 10 వేల జనాభా గల పట్టణం. అందులో బ’స్ర్‌ బిన్‌ అర్‌తాత్‌, సలమహ్ బిన్‌ ముఖ్‌లిద్‌, ము’ఆవియహ్‌ బిన్‌ ఖరీజ్‌ వంటి వీరులు ఉన్నారు. వారితో తలపడటం మంచిది కాదని అభిప్రాయపడ్డారు. అనేకసార్లు ఆదేశాలు వచ్చి వత్తిడిపడి రాజీనామా చేసారు. ఖైస్స్థానంలో ముహమ్మద్బిన్అబీ బక్ర్ఈజిప్టు గవర్నర్గా నియమితులయ్యారు. ఈ అనుభవం లేని నవ యువకుడి ప్రవర్తన వల్ల ఈజిప్టులో ఆందోళనలు, కల్లోలాలు చెలరేగాయి. ఇంకా అతడు ఖుర్‌’తుబావారిని రెచ్చగొట్టి వారిని ఆగ్రహానికి గురిచేసాడు. ‘అలీ (ర) కు అక్కడి పరిస్థితులు తెలిసాయి. ‘అలీ (ర) సిప్ఫీన్‌ యుద్ధం తరువాత, అష్తర్నఖయీని ఈజిప్టు పంపి ము’హమ్మద్‌ బిన్‌ అబీ బక్‌ర్‌ను తొలగించి సిరియా పరిస్థితులను చక్కదిద్దమని పంపారు. కాని మార్గంలో అష్తర్‌ నఖయీనిను ము’ఆవియహ్‌ విషం ఇచ్చి చంపించారు. ఇంకా, అమ్ర్బిన్స్నాయకత్వంలో ఒక పెద్ద సైన్యాన్ని ఈజిప్టుకు పంపించాడు. ము’హమ్మద్‌ బిన్‌ అబీ బక్‌ర్‌కు ఈ సైన్యాన్ని ఎదుర్కోవటం చాలా కష్టం అయ్యింది. రెండువేల మంది సైన్యాన్ని తీసుకొని వీరోచితంగా పోరాడారు. ఫలితంగా ‘అమ్ర్‌ బిన్‌ అల్‌’ఆ’స్‌ ఖర్‌’తుబా నాయకుడైన ము’ఆవియహ్‌ బిన్‌ ‘ఖదీజ్‌ సహాయం కోరవలసి వచ్చింది. కాని ఈ మధ్యలో ము’ఆవియహ్‌ ఒక పెద్ద సైన్యంతో వచ్చి చుట్టుముట్టారు. ము’హమ్మద్‌ బిన్‌ అబీ బక్‌ర్‌ అనుచరులు పారిపోయారు. లేదా చంపబడ్డారు. ము’హమ్మద్‌ బిన్‌ అబీ బక్‌ర్‌ కూడా ఒక శిధిలంగా పడి ఉన్న భవనంలో దాక్కున్నారు. కాని ‘అమ్ర్‌ బిన్‌ అల్‌’ఆ’స్‌ గూఢచారులు పసిగట్టి పట్టుకొని తెచ్చారు. ము’ఆవియహ్‌ బిన్‌ ‘ఖదీజ్‌ చాలా క్రూరంగా చంపి శవాన్ని ఒక గాడిద శవంలో పెట్టి కాల్చివేసారు.

ఇటువంటి భయంకరమైన పద్ధతి ప్రకారం 38 హిజ్రీలో ఈజిప్టు తీర్పు జరిగిపోయింది. ‘అలీ తన నిస్సహాయత వల్ల ము’హమ్మద్‌ అబీ బక్‌ర్‌కు ఎటువంటి సహాయం చేయలేక పోయారు.

ఆ సంవత్సరమే అంటే 38 హిజ్రీలో ము’ఆవియహ్‌ బ’స్రా వారిని ‘అలీ (ర) విధేయతనుండి తీసి తన ప్రభుత్వానికి సమర్థించే విధంగా చేయడానికి ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘హ’దరమీని బ’స్రా పంపారు. ‘అబ్దుల్లాహ్‌కు ఈ విషయంలో విజయం లభించింది. బనూ తమీమ్‌ తెగవారు, ఇంకా బ’స్రా ప్రజలు అతని ఆహ్వానాన్ని స్వీకరించారు. ‘అలీ సిబ్బంది అయిన ‘జియాద్‌ బ’స్రా వదలి హిరాన్‌లో తలదాచుకోవలసి వచ్చింది. ‘అలీ (ర)కు ఈ విషయం తెలిసింది. ‘అలీ (ర) ఐన్‌ బిన్‌ సబీఅను ఇబ్నె ‘హ’దరమీని ఎదుర్కొనటానికి పంపారు. కాని ము’ఆవియహ్‌ అభిమానులు అతన్ని చంపివేసారు.

ఐన్‌ బిన్‌ సబీఅ తరువాత ‘అలీ (ర) జారియ బిన్‌ ఖుదామాను ఇబ్నె ‘హ’దరమీపై నియమించారు. అతడు చాలా వివేకంగా బ’స్రా చేరి ఇబ్నె ‘హ’దరమీ అతని అనుచరులను చుట్టు ముట్టారు. వారందరినీ దాక్కున్నచోటే కాల్చివేసారు. బ’స్రా ప్రజలు మళ్ళీ విధేయత స్వీకరించారు. ‘అలీ (ర) అందరినీ క్షమించివేసారు.

ద్రోహాన్ని ఛేదించడం: నహర్వాన్యుద్ధం వల్ల ‘ఖారిజీల బలం సన్నగిల్లింది. అయితే వారి చిన్న చిన్న బృందాలు దేశంలో అక్కడక్కడా ఉండేవి. ప్రతిరోజూ ఏదో ఒక కల్లోలం సృష్టించేవి. ఒక ‘ఖారిజీ ఖిర్రీత్‌ బిన్‌ రాషిద్‌ అనేక మతాల వారిని తన వలలో చిక్కించి దేశంలో అన్ని వైపుల దొంగతనాలు, దోపిడీలు చేసేవాడు. ఇంకా జిమ్మీలను రెచ్చగొట్టి ద్రోహానికి పాల్పడినట్లు చేసేవాడు. ‘అలీ (ర) ‘జియాద్‌ బిన్‌ ‘హఫ్‌’సహ్, మరో ఉల్లేఖనంలో ముఖ్‌తర్‌ బిన్‌ ఖైస్‌ను అతన్ని వారించడానికి పంపారు. అతను వాడిని వెంటాడి రాయ్‌ హుర్‌ముజ్‌ కొండ ప్రాంతంలో ఎదుర్కొని చంపివేసారు. జిమ్మీలు మళ్ళీ విధేయులయ్యారు. అతడు వారిపట్ల సున్నితంగా వ్యవహరించాడు. ఇస్లామ్‌ను త్యజించినవారు కూడా మళ్ళీ ఇస్లామ్‌ను స్వీకరిస్తే, వారిని కూడా గౌరవ దృష్టితో చూసేవారు. వారు చాలా ప్రభావితులయ్యారు. మూఖల్‌ బిన్‌ ఖైస్‌ రాయ్‌ హుర్‌ముజ్‌ నుండి తిరిగి వచ్చినపుడు చాలా గొప్పగా వీడ్కోలు పలుకుతూ ఈరానీ స్త్రీ పురుషులు కళ్ళంట నీళ్ళు పెట్టుకున్నారు.

ముఆవియహ్ఎత్తుగడలు: సిఫ్ఫీన్యుద్ధం వాయిదా పడటం, తీర్పు సమస్య ఒకవైపు, మరోవైపు ‘అలీ (ర) అభిమానుల్లో అభిప్రాయభేదాలు కల్పించి ఖారిజీలను జనింపజేసాడు. దీని వల్ల ‘అలీ (ర) అభిమానుల ధైర్యం సన్నగిల్లి చల్లబడి పోయారు. ఫలితంగా యుద్ధనివారణ దిశగా పయనించారు. తన ప్రసంగాల ద్వారా వారిని ప్రేరేపించడం, జరిగింది. కాని ఎటువంటి లాభం లేకుండా పోయింది. ‘అలీ (ర) చేసిన ప్రసంగాలు నహజుల్‌ బలాగా లో పొందుపరచబడి ఉన్నాయి. తన అభిమానులు ఇలా ధైర్యం కోల్పోవడం చూసి ‘అలీ (ర) చాలా విచారించారు. ము’ఆవియహ్‌కు ఇదంతా తెలిసింది. పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని యుద్ధానికి బదులు ఒక పెద్ద కుతం త్రానికి పాల్పడ్డారు. 39 హిజ్రీలో చిన్న చిన్న సైనిక పటాలాలు ‘హిజా’జ్‌, ఇరాఖ్, జ’జీరలలో వ్యాపింప జేసారు. అక్కడ అశాంతి ప్రబలి ‘అలీని ఆందోళనలకు గురిచేసారు. అనంతరం నోమాన్బిన్బషీర్ 2000 మందిని తీసుకొని ఐనుత్తమర్‌కు, నుఫియాన్బిన్ఔఫ్ 6000 మందిని తీసుకొని అంబార్‌కు, అబ్దుల్లాహ్బిన్ఫజారీ 1700 మందిని తీసుకొని తైమాకు ము’ఆవియహ్‌ దజ్‌ల తీరప్రాంతాలపై దాడిచేసి ప్రజానిధులను దోచు కున్నారు. ‘అలీని వదలి ప్రజలు తమ ప్రభుత్వాన్ని అనుసరించేలా చేసారు.

కిర్మాన్, ఫారిస్ద్రోహాలను ఎదుర్కొనటం: ‘అలీ (ర) ఆక్రమణలకు పాల్పడిన ము’ఆవియహ్‌కు చెందిన బృందాలను ఆయా ప్రాంతాల నుండి తరిమివేసారు. అయితే ఆ ప్రాంతాలలో అశాంతి నెలకుంది. కిర్మాన్‌, ఫారిస్‌ ప్రాంతాల ప్రజలు పన్ను చెల్లించడం మానివేసారు. ఇంకా చాలా ప్రాంతాలలో ఆయన నియమించిన సిబ్బందిని తొలగించారు. ‘అలీ (ర) ఈ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు, జి’యాద్‌ను నియమించారు. అతడు చాలా తొందరగా కిర్మాన్, ఫారిస్, ఈనాన్ ప్రాంతాలలో  సంక్షోభాన్ని తొలగించి శాంతిభద్రతలు స్థాపించారు. సంక్షోభాన్ని పరిష్కరించిన తర్వాత ‘అలీ (ర) ఈరానీ ద్రోహుల పట్ల ఎంతో మంచిగా వ్యవహరించారు. ఈరానీయన్లలో ప్రతి ఒక్కరూ చిన్న, పెద్ద పొగడకుండా ఉండలేక పోయారు.

విజయాలు: లోగడ పరిస్థితుల వల్ల మీకు తెలిసిపోయి ఉంటుంది. ‘అలీ (ర) అంతర్గత కలహాలు, సంక్షోభాలను పరిష్కరించడంలోనే నిమగ్నమయిపోయారు. విజయాలపై దృష్టి సారించేందుకు ఆయనకు సమయం, తీరిక లభించ లేదు. అయినా విదేశీ వ్యవహారాలను మరువకుండా సీస్తాన్‌, కాబూల్‌ ప్రాంతాలను తన అధీనంలోకి తీసుకొని ముందడుగు వేసారు. (ఫుతూహుల్బుల్దాన్)

38 హిజ్రీలో కొంతమంది ముస్లిములను భారతదేశంపై దాడిచేయటానికి అనుమతి ఇవ్వబడింది. అప్పుడు కోకన్, ముంబాయి ప్రాంతాలు సింధ్‌లో ఉండేవి. ముస్లిములు అన్నిటికంటే ముందు ఆ కాలంలో కోకన్‌పై దాడిచేసారు. (ఫుతూహుస్సింధ్)

హిజాజ్మరియు అరబ్ఆక్రమణకు ప్రయత్నాలు: ము’ఆవియహ్‌ 40 హిజ్రీలో మళ్ళీ క్రొత్తగా ప్రయత్నాలు కొనసాగించారు.  స్ర్బిన్అర్తాత్కు 3 వేల మంది సైన్యాన్ని ఇచ్చి ‘హిజా’జ్‌ కు పంపాడు. అతడు ఎటువంటి యుద్ధం, పోరాటం లేకుండా మక్కహ్ మదీనహ్ లను ఆక్రమించుకొని ఇక్కడి వారిని బలవంతంగా ము’ఆవియహ్‌ కోసం బై’అత్‌ తీసుకున్నారు. అక్కడి నుండి యమన్‌ వైపు ముందుకు పోయారు. అబూ మూసా అష్అరీ ముందు నుండే రహస్యంగా యమన్‌ పాలకుడైన ఉబైదుల్లాహ్బిన్అబ్బాస్కు బుస్‌ర్‌ బిన్‌ అబీ అర్‌తాత్‌ దాడి గురించి హెచ్చరిస్తూ, ము’ఆవియహ్‌ అధికారాన్ని స్వీకరించని వారిని చాలా నీచంగా చంపుతున్నాడని తెలియ పరిచారు. ‘ఉబైదుల్లాహ్‌ బిన్‌ ‘అబ్బాస్‌ తనను బలహీనుడిగా భావించి ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘అబ్దుల్‌ మదాన్‌ను తన స్థానంలో పెట్టి సహాయంకోసం ‘అలీ (ర) వద్దకు వచ్చారు. బుస్ర్బిన్అబీ అర్తాత్ యమన్‌ చేరి ఉబైదుల్లాహ్‌ బిన్‌ ‘అబ్బాస్‌ యొక్క ఇద్దరు చిన్నారులను ఇంకా ‘అలీ (ర) అభిమానులను చాలా క్రూరంగా చంపివేసాడు.

మరోవైపు సిరియా సైనికులు సరిహద్దుల్లో దాడులు చేసి అక్కడి జిల్లా అధికారిని ఓడించి అంబార్‌ను ఆక్రమించుకున్నారు. ‘అలీకి బు’స్ర్‌ బిన్‌ అర్‌తాత్‌ దుర్మార్గాలను గురించి తెలిసింది. ‘అలీ (ర) జారియ బిన్‌ ఖుదాను మరియు వహబ్‌ బిన్‌ మస్‌ఊద్‌కు 4000 మంది సైనికులనిచ్చి వారిని ఎదుర్కోవడానికి ‘హిజా’జ్‌ పంపి, కూఫా జామె మస్జిద్‌లో ప్రభావపూరితమైన ప్రసంగాలు చేసి సైనికులను ఇరాఖ్ సరిహద్దుల నుండి సిరియా సైనికులను తొలగించాలని కోరారు. అతని(ర) ప్రసంగాలకు ప్రజల్లో ఉత్సాహం, ఉత్తేజం, చురుకుతనం వికసించాయి. అందరూ నినాదాలు చేసారు. కాని సైన్యం వెళ్ళే సమయం వచ్చేసరికి కేవలం 300 మంది మాత్రమే మిగిలారు. అది గమనించిన ‘అలీ (ర) చాలా విచారించారు. ‘హిజ్ర్‌ బిన్‌ ‘అదీ, స’అద్‌ బిన్‌ ఖైస్‌, నాయకా! కఠినంగా వ్యవహరించనిదే ప్రజలు దారిలోకి రారు. తప్పనిసరిగా యుద్ధానికి సన్నద్ధం కావాలని, లేకుంటే కఠినంగా వ్యవహరించటం జరుగుతుందని ప్రకటన చేయించమని కోరారు. ఇప్పుడు ప్రజలకు ఈ మార్గంతప్ప మరోమార్గం కానరాలేదు. అయితే ఈ ఏర్పాట్లు ఇంకా పూర్తికాక ముందే ఇబ్నె ముల్జిమ్విషపూరితమైన కరవాలంతో అలీ() చంపివేసాడు.

ఈ వ్యధాభరితమైన సంఘటన ఈవిధంగా ఉంది, ”నహర్వాన్ సంఘటన తర్వాత కొందరు ఖారిజీలు ‘హజ్‌ సందర్భంగా ఒకచోట చేరి సమస్యలను గురించి చర్చించి, చివరికి ఈ ముగ్గురు వ్యక్తులు అలీ, ముఆవియహ్, అమ్ర్బిన్అల్స్, ఉన్నంత వరకు ముస్లిములు యుద్ధాలకు దూరం కాలేరు. కనుక ముగ్గురు వ్యక్తులు ఈ ముగ్గురిని చంపటానికి సిద్ధ మయ్యారు. ‘అబ్దుర్ర’హ్మాన్‌ బిన్‌ ముల్జిమ్ అలీని చంపే బాధ్యత తీసుకున్నాడు. అదేవిధంగా నజాల్ముఆవియహ్ను చంపే బాధ్యత తీసుకున్నాడు. అబ్దుల్లాహ్అమ్ర్బిన్అల్స్ను చంపే బాధ్యత తీసుకున్నాడు. ఈ ముగ్గురూ తమ తమ బాధ్యతల కోసం ప్రయాణ మయ్యారు. కూఫా చేరిన తర్వాత ఇబ్నె ముల్జిమ్ నిర్ణయం మరింత దృఢంగా తయారయింది. ఖితామ్‌ అనే అందమైన యువతి ‘అలీని చంపితే తాను పెళ్ళి చేసుకుంటానని, ‘అలీ(ర) హత్యను మహర్‌గా నిర్ణయిస్తానని చెప్పింది.

40 హిజ్రీలో రమ’దాన్‌ మాసంలో ముగ్గురూ ఒకే రోజు ఉదయం ముగ్గురిపై దాడిచేసారు. ము’ఆవియహ్‌, ‘అమ్ర్‌ బిన్‌ అల్‌’ఆ’స్‌ తప్పించుకున్నారు. ము’ఆ వియహ్‌పై దాడి తప్పింది. ‘అమ్ర్‌ బిన్‌ అల్‌’ఆ’స్‌ ఆ రోజు ఇమా మత్‌కు రాలేదు. అతని స్థానంలో మరో వ్యక్తి వచ్చాడు.

‘అలీ (ర) మస్జిద్‌లోనికి వచ్చి పడుకొని ఉన్న ఇబ్నె ముల్‌జిమ్‌ను మేల్కొలిపారు. ‘అలీ (ర) నమా’జు ప్రారంభించిన తర్వాత తల సజ్దాలో ఉండగా ఆ పాపాత్ముడు ఇబ్నె ముల్‌జిమ్‌ చాలా భయంకరమైన దాడి చేసాడు. తలకు గాయం తగిలింది. ప్రజలు అతన్ని పట్టుకున్నారు. (తబ్‌రీ). ‘అలీ (ర)కు చాలా తీవ్రమైన గాయం తగిలింది. బ్రతికే ఆశలేకుండా పోయింది. అందువల్ల ‘హసన్‌ మరియు ‘హుసైన్‌లను పిలిచి హితబోధ చేసారు. ఇంకా ముహమ్మద్బిన్హనఫియహ్ పట్ల సున్నితంగా వ్యవహరించమని తాకీదు చేసారు. జున్దుబ్బిన్అబ్దుల్లాహ్, ”తమరి తరువాత మేము ‘హసన్‌ చేతిపై బై’అత్‌ చేస్తాం,” అని అన్నారు. కాని అతను దాన్ని గురించి నేనేమీ చెప్పదలచుకో లేదు, మీరందరూ కలసి దాన్ని నిర్ణయించగలరు అని చెప్పి, అనేక విషయాల గురించి బోధించారు. హంతకుని గురించి మాట్లాడుతూ సాధారణమైన రక్తపరిహారం తీసుకోవాలి అని సలహా ఇచ్చారు. (తబ్‌రీ)

కరవాలం విషం పట్టి ఉన్నందువల్ల విషం చాలా వేగంగా వ్యాపించింది. అదే రోజు 20వ తేదీ రమ’దాన్‌ శుక్రవారం నాడు 40 హిజ్రీలో మరణించారు. ‘హసన్‌ (ర) స్వయంగా తన చేతులతో ఖనన సంస్కారాలు పూర్తిచేసారు. జనా’జహ్ నమా’జ్‌లో నాలుగు తక్‌బీర్లకు బదులు ఐదు తక్‌బీర్లు పలికారు. ఉజ్జా అనే పేరుగల స్మశానంలో ఖననం చేసారు.

‘అలీ (ర) వీరమరణం తరువాత ప్రజలు ‘హసన్‌ బిన్‌ ‘అలీని పాలకుడుగా ఎన్నుకున్నారు. ఆ సమయంలో అతనికంటే అర్హత గలవారెవరూ లేరు కూడా. ‘హసన్‌ (ర) అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత ము’ఆవియహ్‌ మళ్ళీ పీడించడం ప్రారంభమయ్యింది. దీనివల్ల ఇద్దరిలో ఎక్కడ యుద్ధం సంభవిస్తుందోనని భయంవేసేది. ఇటు ఖారిజీలు కూడా బలమైన స్థానంలో ఉన్నారు. అందువల్ల పరిస్థితులన్నిటినీ దృష్టిలో పెట్టుకొని హసన్బిన్అలీ ముఆవియహ్తో ఒప్పందం కుదుర్చు కున్నారు. అధికారం ఆయనకు అప్పజెప్పి రాజకీయాల నుండి తప్పుకున్నారు.

ఒప్పందం ఈ క్రింది షరతులతో జరిగింది: 1. ఏ ఇరాఖీ వ్యక్తిని అన్యాయంగా బంధించటం జరుగదు. 2. అందరికీ అభయం ఇవ్వడం జరగాలి. 3. ఇరాఖీయీల తప్పులను మన్నించాలి. 4. హవా’జ్‌ నుండి లభించే పన్ను ‘హసన్‌కు ప్రత్యేకించాలి. 5. ‘హుసైన్‌కు సంవత్సరానికి 2 లక్షలు ఇవ్వాలి. 6. బనీ హాషిమ్కు కానుకల్లో ఇతర విషయాల్లో బనీ ఉమయ్యపై ప్రాధాన్యత ఇవ్వాలి.

అబ్దుల్లాహ్బిన్ఆమిర్ ఈ షరతులు వ్రాసి ము’ఆ వియహ్‌కు పంపారు. ఆయన ఎటువంటి అభ్యంతరం లేకుండా ఈ షరతులన్నిటినీ స్వీకరించారు. తనకాలంలో వాటిని అనుమతిస్తున్నట్టు వ్రాసి రాజ ముద్రికవేసి సభికుల సాక్ష్యాలు వేయించి ‘హసన్‌కు పంపారు.

ప్రభుత్వం నుండి తప్పుకున్న తర్వాత ‘హసన్‌ (ర) సిరియాతో పోరాడుతున్న ఖైస్బిన్అద్న్సారీని వ్యవహారాలన్నిటినీ ము’ఆవియహ్‌కు అప్పగించి మదాయన్ వచ్చేయమని ఆదేశించారు. ఖైస్‌కు ఈ ఉత్తరం అందగానే చదివి వినిపించారు. దీని తరువాత మనకు రెండు మార్గాలు ఉన్నాయని ఒకటి నాయకత్వం లేకుండా యుద్ధం చేయటం లేదా ము’ఆవియహ్‌ విధేయతను పాటించటం. అయితే ఖైస్‌ ‘హసన్‌ ఆదేశం ప్రకారం మదాయన్‌ వచ్చారు. అతడు మదాయన్‌ వచ్చిన తర్వాత ‘హసన్‌ కూఫా వెళ్ళారు. ము’ఆవియహ్‌ వచ్చి ఆయన్ను కలిసారు. ఇద్దరి మధ్య ఒప్పందం షరతులను వినిపించడం, ధృవీకరించడం జరిగింది. (అఖ్బబారుత్తిలాల్‌)

పైన పేర్కొన్న షరతులతో పాటు మరో షరతు అంటే ము’ఆవియహ్‌ తరువాత ‘హసన్‌ పాలకుడౌతారు అనేది కూడా ప్రాచుర్యంలో ఉంది. కాని ఈ షరతు చారిత్రక పుస్తకాల్లో ఎక్కడా లేదు. అందువల్ల దీనికి ఎటువంటి ప్రాముఖ్యత లేదు. మరో సాక్ష్యం ఏమిటంటే హసన్‌ () మరణానంతరం ము’ఆవియహ్‌ య’జీద్‌ కోసం బై’అత్‌ తీసుకోవడానికి మదీనహ్ వెళ్ళారు. ఇబ్నె జుబైర్, హుసైన్(ర), అబ్దుర్రహ్మాన్బిన్అబీ బక్ర్ మొదలైన వారి ముందు ఈ వ్యవహారాన్ని పెట్టటం జరిగింది. వాళ్ళు దానికి వ్యతిరేకంగా స్పందించారు. ” ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘జుబైర్‌, ‘ఇది ఖలీఫాల ఎన్నికకు వ్యతిరేకం,  అందువల్ల దీన్ని మేము ఆమోదించమని,’ అన్నారు. ‘అబ్దుర్ర’హ్మాన్‌ బిన్‌ అబీ బక్‌ర్‌, ‘ఇది ఖైసర్‌, కిస్రాల సాంప్రదాయం,’ అన్నారు గాని, ”హసన్‌ కేవలం మీ కోసం తప్పుకున్నారని, కనుక య’జీద్‌ కోసం బై’అత్‌ చేయలేము” అని మాత్రం అనలేదు.

ఒకవేళ వీరికి ఈ షరతు తెలిసి ఉంటే ఇతర విషయాలతో పాటు దీన్నికూడా తెలియపరిచేవారు. ఆ తరువాత ము’ఆవియహ్‌ మరణానంతరం హుసైన్జీద్కు పోటీగా నిలబడ్డారు. అప్పుడు కూడా ప్రసంగించారు. అందులో కారణాలు తెలిపారు. కాని ఏ ప్రసంగంలోనూ ”నా సోదరుడు ‘హసన్‌ కేవలం ము’ఆవియహ్‌ కాలం వరకే తప్పుకున్నారు” అనిమాత్రం అనలేదు. అంటే ఇటు వంటి షరతు ఏమాత్రం లేనట్లే లెక్క. అయితే కొంత మంది చరిత్రకారులు ఎందుకుపేర్కొన్నారనే ప్రశ్న తలెత్తు తుంది. దీనికి సమాధానం ఒక్కటే బనీ ఉమయ్య, బనీ హాషిమ్లు పరస్పరం ఉల్లేఖనాలను కల్పించుకునే వారు. అంటే పరస్పరం బురదచల్లుకునే వారు.

ము’ఆవియహ్‌ ‘అలీ (ర)కు వ్యతిరేకంగా యుద్ధాన్ని పురికొల్పారు, ఆ తరువాత తన తర్వాత య’జీద్‌ను యువరాజు చేసి ఇస్లామీయ ఖిలాఫత్‌ను ఆపి ఇస్లామీయ చరిత్రలో ఒక గొప్ప మార్పు తెచ్చారు. అయితే దీన్ని దాని స్థానంలోఉంచాలి. కాని ఆయన వ్యతిరేకులు ఊరు కోలేక అతనికి వ్యతిరేకంగా అనేక ఆరోపణలకు గురి చేసారు. పై షరతు కూడా ఆ పరంపరలోని ఒక భాగమే. ఈ షరతువల్ల ము’ఆవియహ్‌ కుట్రతో ‘హసన్‌కు విషం ఇచ్చి చంపించారన్న ఉల్లేఖనం కూడా పరిశీలించదగ్గదే. దీన్ని గురించి రాబోయే పేజీల్లో తెలియపరచటం జరుగుతుంది. ఎందుకంటే దీన్ని నిజమని నమ్మేపక్షంలో, ఆయనే విషం ఇచ్చి చంపారనే అనుమానం వచ్చి ము’ఆవియహ్‌ చిత్రం మార్పులతో కూడి అందవికారంగా తయారై ఎల్లప్పుడూ దూషణలకు గురవుతుంది.

హసన్‌ () సద్గుణాలు: ‘హసన్‌ (ర) ప్రవక్త (స)ను పోలి ఉండేవారు. శారీరకంగా, నైతికంగా, మానసికంగా ప్రవక్త (స)ను పోలి ఉండేవారు. ఇందులో ఎవరూ అతనికి సమానులు ఉండేవారు కారు.

ప్రాపంచిక అనాశక్తత: హసన్‌లో ప్రాపంచిక అనాశక్తత పూర్తి పాళ్ళలో ఉండేది. ఇది మానవుల కొరకు ఒక మహిమగా తటస్థించింది. సాధారణంగా రాజకీయ అంతఃపురాలు మానవుల రక్తంతో నిర్మించబడతాయి. కాని ‘హసన్‌ తన చేతికి చిక్కవలసిన రాజ్యాధికారాన్ని కేవలం కొందరి ప్రాణాల కోసం వదులుకున్నారు. చరిత్రలో ఇటువంటి ఉదాహరణలు చాలా తక్కువగా ఉంటాయి. ఒకవేళ అబూ బకర్‌, ‘ఉమర్‌ల తర్వాత ఇస్లామీయ చరిత్రపై దృష్టిసారిస్తే ప్రతి పుట రక్తంతో కూడినదిగా కనబడు తుంది. ఇప్పటివరకు అరబ్‌ భూమి ముస్లిములనే కోరుకుంటుంది. కాని ఈ ప్రత్యేకత కేవలం ‘హసన్‌కే దక్కుతుంది. ‘హసన్‌ రాజ్యాన్ని, అధికారాన్ని కాలదన్ని ముస్లిమ్‌ సమాజాన్ని వినాశనం నుండి తప్పించాలని కోరుకునేవారు. ఇంకా ప్రవక్త (స) యొక్క భవిష్యవాణిని నిజం చేసి చూపించారు. అదేవిధంగా ప్రవక్త (స) ప్రవచనం, ”నా తరువాత ఖిలాఫత్30 సంవత్సరాల వరకు ఉంటుంది.” ఆ ప్రకారం ఈ కాలం సరిగ్గా హసన్‌ (ర) అధికారం నుండి తప్పుకునే వరకు ఉంది.

సైన్య బలహీనత, ప్రజలను రక్తపాతం నుండి రక్షించటానికి అధికారం నుండి తప్పుకున్నారు: ‘హసన్‌ (ర) తన సైన్య బలహీనతవల్ల ము’ఆవియహ్‌తో ఒప్పందం కుదుర్చు కున్నారని కొందరు అభిప్రాయపడ్డారు. కొన్ని సంఘటనలు కూడా దీన్ని సమర్థించేవిగా ఉన్నాయి. అయితే వాస్తవంగా ముస్లిములను రక్తపాతం నుండి కాపాడటానికి సంధి కుదుర్చుకున్నారు. తాను తీసుకొని బయలుదేరిన సైన్యంలో కొందరు కపటాచారులు కూడా ఉండేవారు. వారు సిద్ధం కావలసిన సమయంలోనే బలహీనత బహిర్గతం చేసారు. అయితే అందులో ఖారి జీలు కూడా ఉన్నారు. ము’ఆవియహ్‌తో తల పడుట తప్పనిసరిగా భావించేవారు. ‘హసన్‌ సంధికి ప్రయత్నిం చడం చూసి దూషించసాగారు. (అఖ్బారు త్తివాల్)

ఇరాఖ్ లో స్వయంగా 40 వేల మంది అతని చేతిపై బైఅత్‌ చేసారు. ఒక్క సైగతో తలలు నరుక్కోవడానికి సిద్ధపడ్డారు. (ఇబ్నె అసాకిర్‌)

ఇరాఖ్ మాత్రమే కాదు, అరబ్‌ అంతా ‘హసన్(ర) అధీనంలో ఉండేది. సంధి తర్వాత ఒకసారి ప్రజలు మీకు రాజ్యకాంక్ష ఉండేదని నిందలేస్తారు. అప్పుడతను ”అరబ్‌ మొండెము నా చేతిలో ఉండేది. అంటే నేను సంధి చేస్తే వారితో వాళ్ళు సంధిచేసేవారు. నేను ఎవరితో యుద్ధం చేస్తే వారితో వాళ్ళూ యుద్ధం చేసేవారు. అయినప్పటికీ, ‘నేను కేవలం అల్లాహ్‌ ప్రీతికోసం, ముస్లిములను రక్తపాతం నుండి రక్షించటం కోసం రాజ్యకాంక్ష నుండి తప్పు కున్నాను,’ అని అన్నారు. (ముస్తదరక్హాకిమ్)

‘హసన్(ర) సైన్యంలోని కొంతమంది కపటాచారులు అవసరం ఏర్పడినపుడు మోసంచేసారు. మిగిలిన వారంతా దేనికైనా సిద్ధంగా ఉండేవారు. అబూ అరీజ్‌ ఉల్లేఖనం, ”మేము 12 వేలమంది హసన్సైన్యంలోని ముందు భాగంలో దేనికైనా సిద్ధంగా ఉండేవాళ్ళం. సిరియా సైనికుల రక్తం కోసం మా కరవాలాలు వేచి ఉండేవి. సంధివార్త వినగానే మా నడుం విరిగిపోయి నట్టయి పోయింది. సంధి తర్వాత ‘హసన్‌ కూఫా వచ్చినపుడు మాలోని ఒక వ్యక్తి అబూ ‘ఆమిర్‌ ‘సుఫియాన్‌ ఆగ్రహంతో ముస్లిములను అవమాన పరిచేవాడా, అస్సలాము అలైక అని అసహ్యించు కున్నాడు. దానికి సమాధానంగా ‘హసన్‌ (ర) అబూ ‘ఆమిర్‌! అలా అనకు, నేను ముస్లిములను అవమాన పరచలేదు. రాజ్యకాంక్ష కోసం ప్రజలను బలిచేయ దలచుకోలేదు. అందుకే సంధికి ఒప్పుకున్నాను” అని అన్నారు. (ఇస్తీఆబ్‌/1)

నవవీ అభిప్రాయం: ”40 వేలకు పైగా జనం హసన్చేతి పై బై’అత్‌ చేసారు. 7 నెలల వరకు హిజాజ్, యమన్, ఇరాఖ్, ఖురాసాన్లపై పాలించారు. ఆ తర్వాత ము’ఆవియహ్‌ సిరియా నుండి అతన్ని ఎదుర్కోవడానికి బయలుదేరారు. ఇద్దరూ ఎదురైన తర్వాత ‘హసన్‌ (ర) ముస్లిముల ప్రాణాలను దృష్టిలో పెట్టుకొని కొన్ని షరతులపై ము’ఆవియహ్‌ కోసం తప్పుకున్నారు. ఈ విధంగా ప్రవక్త (స) భవిష్యవాణి నిజమయింది. అదేమిటంటే ప్రవక్త (స) ప్రవచనం, ”నా ఈ బిడ్డ సయ్యిద్‌, దైవం అతని ద్వారా ముస్లిముల రెండు బృందాల మధ్య సంధి కుదుర్చుతాడు.” (తహ్జీబుల్అస్మా)

‘అలీ అభిమానులు సంధిని ఎంత నీచదృష్టితో చూచేవారో, దాని పట్ల ఎంత ఆవేశంతో వారి మనో భావాలు ఉండేవో అతనికిచ్చే బిరుదులను వింటే తెలుస్తుంది. ఆయన్ను,  ముస్లిములను అవమాన పరిచే వాడా! ముస్లిములకు మసి పులిమినవాడా! ముస్లిములను నగ్నం చేసినవాడా! దీనివల్ల ప్రజలు సంధిని ఎంత అసహ్యించుకునేవారో తెలుస్తుంది.

వాస్తవం ఏమిటంటే, ‘హసన్‌ ఎంత శాంతి ప్రియులు, సున్నిత మనస్తత్వం గలవారంటే అతను మొట్టమొదటే రక్తపాతం లేకుండా పాలనా బాధ్యతలు లభిస్తే సరే, లేకపోతే ముస్లిముల రక్తం ప్రవహించనీయరాదు అని దృఢంగా నిశ్చయించుకున్నారు.

తబ్‌రీ వివరణ ప్రకారం 40 వేల మంది ఇరాఖీలు ‘హసన్‌ చేతిపై బై’అత్‌ చేసారు. ‘హసన్‌ (ర) ఇరాఖీలతో బై’అత్‌ చేసినపుడు తన నిర్ణయాన్ని సూచించారు. ‘హసన్‌ ఇరాఖ్‌ ప్రజలతో బై’అత్‌ తీసుకున్నప్పుడు మీరు పూర్తిగా నాకు విధేయత చూపాలని అంటే నేను యుద్ధం చేసేవారితో మీరూ యుద్ధం చేయాలని, నేను సంధి కుదుర్చుకున్న వారితో మీరూ సంధికి అంగీకరించాలని బై’అత్‌ తీసుకున్నారు. అప్పుడే హసన్ యుద్ధాల నుండి, పోరాటాల నుండి తప్పుకుంటారని ఊహించడం జరిగింది. ఈ కొన్ని రోజుల తర్వాత ఆయన్ను గాయపరచటం జరిగింది. (ఇబ్నె అసాకిర్)

‘హసన్‌ తన ఇంటి వారికి కూడా ఈ విషయం తెలిపారు. ఇబ్నె అఫర్ వివరణ ప్రకారం ఒప్పందానికి ఒక రోజు ముందు నేను ‘హసన్‌ వద్ద కూర్చొని ఉన్నాను. వెళ్ళటానికి లేచినపుడు అతడు నా చొక్కా పట్టుకొని కూర్చోబెట్టాడు. ఇంకా, ‘నేనొక నిర్ణయానికి వచ్చాను. నీవు కూడా దానికి ఏకీభవిస్తావు,’ అని అన్నారు. దానికి నేను, ‘ఏ నిర్ణయం,’ అని అన్నాను. దానికి ‘హసన్ నేను అధికారం నుండి తప్పుకొని మదీనహ్ వెళ్ళాలను కుంటున్నాను. ఎందుకంటే కల్లోలాలు పెరుగుతూనే ఉన్నాయి. సరిహద్దులు నిర్వీర్యం అయిపోయాయి. దానికి జ’అఫర్‌ (ర) ‘అల్లాహ్‌ మీకు దీనికి తగిన ప్రతిఫలం ప్రసాదించుగాక,’ అని అన్నారు. ఆ తరువాత ‘హుసైన్‌ ముందు తన అభిప్రాయాన్ని పెట్టారు. అతను, ‘సమాధిలో ఉన్న ‘అలీ (ర)ను వ్యతిరేకించి ము’ఆవియహ్‌ను స్వీకరించకండి,’ అని అన్నారు. ‘హసన్‌ (ర) అది విని, ‘ ‘హుసైన్‌ ఆగ్రహించి నువ్వు మొదట్నుండి నాకు వ్యతిరేకత చూపుతున్నావు. ఏది ఏమైనా నా నిర్ణయం ఇదే, నిన్ను ఫాతిమహ్ (ర) ఇంట్లో బంధించి నేను నా నిర్ణయాన్ని నెరవేరుస్తాను,’ అని అన్నారు. దానికి ‘హుసైన్‌ సోదరుని ప్రవర్తన చూసి, ‘మీరు నాకన్నా పెద్దవారు, మా ప్రభువులు మీరు ఎలా కోరితే అలా చేయండి,’ అని అన్నారు. ఆ తరువాత అతడు రాజీనామా ప్రకటన చేసారు. (ఇబ్నె అసాకిర్)

ఈ సంఘటన వల్ల సైనిక బలహీనత మొదలైనవి కారణం కారాదని, ఎందుకంటే అనేకమంది ముస్లిముల రక్తపాతం జరగనిదే ఈ రాజ్యకాంక్ష లభించదని జమల్‌ యుద్ధం నుండి క్రమంగా ముస్లిముల రక్తం ప్రవహిస్తూనే ఉంది. అందువల్ల దాన్ని వారించటానికి రాజ్యకాంక్షను వదులు కున్నారు. మదీనహ్ లో ఏకాంతం అనుసరించారు.

హసన్బిన్అలీ వీరమరణం: అధికారం నుండి తప్పు కున్న తర్వాత ‘హసన్‌(ర) తన చివరి ఘడియ వరకు తనతాతగారి ఇంటిలోనే ఏకాంతంగా, ప్రశాంతంగా గడిపారు.

50 హిజ్రీలో హసన్ భార్య అదహ్బిన్తె అష్అస్ ఏదో కారణం వల్ల అతనికి విషం ఇచ్చింది. అది చాలా ప్రమాదకరమైన విషం. గుండె ముక్కలుగా మా