26. మనసును కరిగించే మాటలు (రిఖాఖ్) | మిష్కాతుల్ మసాబీహ్

26 – كِتَابُ الرِّقَاقِ
26. మనుసును కరిగించే మాటలు

اَلْفَصْلُ الْأَوَّلُమొదటి విభాగం   

5155 – [ 1 ] ( صحيح ) (3/1427)

عَنِ ابْنِ عَبَّاسٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “نِعْمَتَانِ مَغْبُوْنَ فِيْهِمَاكَثِيْرٌمِنَ النَّاسِ:الصِّحَّةُ وَالْفَرَاغُ”. رَوَاهُ الْبُخَارِيُّ.

5155. (1) [3/1427దృఢం]

ఇబ్నె ‘అబ్బాస్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”రెండు అనుగ్రహాలు ఎలాంటివంటే, అనేక మంది ప్రజలు వీటిపట్ల మోసంలో ఉన్నారు. వీటి విషయంలో నష్టపోతున్నారు. వాటి విలువను గుర్తించటం లేదు. వాటివల్ల లాభం పొందటం లేదు. వాటిలో ఒకటి ఆరోగ్యం, రెండవది తీరిక. [1]   (బు’ఖారీ)

5156 – [ 2 ] ( صحيح ) (3/1427)

وَعَنِ الْمُسْتَوْرِدِ بْنِ شَدَّادٍ قَالَ: سَمِعْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه و سلم يَقُوْلُ: “وَاللهِ مَا الدُّنْيَا فِي الْآخِرَةِ إِلَّا مِثْلَ مَا يَجْعَلُ أَحَدُكُمْ أَصْبَعَهُ فِي الْيَمِّ فَلْيَنْظُرْ بِمَ يَرْجِعُ”. رَوَاهُ مُسْلِمٌ.

5156. (2) [3/1427దృఢం]

ముస్తౌరిద్‌ బిన్‌ షద్దాద్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”అల్లాహ్‌ సాక్షి! పరలోకం ముందు, ఇహలోకం ఎలా ఉందంటే, ఎవరైనా సముద్రంలో తన చేతివ్రేలు ముంచి ఎంత నీరు తనవ్రేలుకు అంటుకొని ఉందో చూచి నట్టుంది.”  [2] (ముస్లిమ్‌)

5157 – [ 3 ] ( صحيح ) (3/1427)

وَعَنْ جَابِرٍ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم مَرَّ بِجَدْيٍ أَسَكٍ مَيِّتٍ. قَالَ: “أَيُّكُمْ يُحِبُّ أَنَّ هَذَا لَهُ بِدِرْهِمٍ؟” فَقَالُوْا: مَا نُحِبُّ أَنَّهُ لَنَا بِشَيْءٍ قَالَ: “فَوَاللهِ لِلدُّنْيَا أَهْوَنُ عَلَى اللهِ مِنْ هَذَا عَلَيْكُمْ”. رَوَاهُ مُسْلِمٌ .

5157. (3) [3/1427దృఢం]

జాబిర్‌ (ర) కథనం: ప్రవక్త (స) చనిపోయిన ఒక మేక పిల్ల ప్రక్క నుండి వెళుతూ, ‘ఈ చనిపోయిన మేకపిల్లను ఒక దిర్‌హమ్‌లో ఎవరు తీసుకుంటారు?’ అని తన శిష్యులను అడిగారు. దానికి అనుచరులు, ‘మాలో ఎవరూ దీన్ని తీసుకోవటానికి సిద్ధంకారు. ఎందుకంటే తీసుకొని ఏం చేసుకుంటారు? అది చనిపోయిఉంది. ఉచితంగా ఇచ్చినా తీసుకోరు,’ అని విన్నవించు కున్నారు. అప్పుడు ప్రవక్త (స) అల్లాహ్ సాక్షి! ఈ ప్రాపంచిక జీవితం అల్లాహ్‌ (త) వద్ద చనిపోయిన మేకపిల్ల కంటే నీచమైనది అని ప్రవచించారు.  [3]  (ముస్లిమ్‌)

5158 – [ 4 ] ( صحيح ) (3/1427)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “اَلدُّنْيَا سِجْنُ الْمُؤْمِنِ وَجَنَّةُ الْكَافِرِ”. رَوَاهُ مُسْلِمٌ.

5158. (4) [3/1427దృఢం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం: ”ఇహలోకం విశ్వాసికి జేలు వంటిది, అవిశ్వాసికి స్వర్గం వంటిది.” [4](ముస్లిమ్‌)

5159 – [ 5 ] ( صحيح ) (3/1427)

وَعَنْ أَنَسٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِنَّ اللهَ لَا يَظْلِمُ مُؤْمِنًا حَسَنَةً يُعْطِيْ بِهَا فِي الدُّنْيَا وَيُجْزِيْ بِهَا فِي الْآخِرِةِ وَأَمَّا الْكَافِرُ فَيُطْعَمُ بِحَسَنَاتِ مَا عَمِلَ بِهَا لِلّهِ فِي الدُّنْيَا حَتّى إِذَا أَفْضَى إِلى الْآخِرَةِ لَمْ يَكُنْ لَهُ حَسَنَةٌ يُجْزَى بِهَا”. رَوَاهُ مُسْلِمٌ.  

5159. (5) [3/1427దృఢం]

అనస్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”అల్లాహ్‌ (త) విశ్వాసుల్లోని ఏ ఒక్కరి ప్రతిఫలాన్ని వృథాచేయడు. ప్రపంచంలో కూడా అతనికి ప్రతి ఫలానికి బదులు ఇవ్వటం జరుగుతుంది. పరలోకంలో కూడా ఇవ్వటం జరుగుతుంది. అదే విధంగా అవిశ్వాసికి కూడా పుణ్యాలకు బదులు ప్రతిఫలం ఇవ్వటం జరుగుతుంది. అతనికి ధనసంపదల్లో వృద్ధిని ప్రసాదిస్తాడు. కాని పరలోకంలో అతని కోసం ఏదీ ఉండదు.”   [5] (ముస్లిమ్‌)

5160 – [ 6 ] ( متفق عليه ) (3/1428)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “حُجِبَتِ النَّارُ بِالشَّهَوَاتِ وَحُجِبَتِ الْجَنَّةُ بِالْمَكَارِهِ”. مُتَّفَقٌ عَلَيْهِ. إِلَّا أَنَّ عِنْدَ مُسْلِمٍ: “حُفَّتْ”. بَدْلَ “حُجِبَتْ”. متفق عليه.

5160. (6) [3/1428  ఏకీభవితం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”నరకం – మనోకాంక్షలు, విలాసాలతో ఆవరించబడి ఉంది, స్వర్గం-కష్టాలు, బాధలతో ఆవరించ బడిఉంది.” [6](బు’ఖారీ, ముస్లిం)

5161 – [ 7 ] ( صحيح ) (3/1428)

وَعَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “تَعِسَ عَبْدُ الدِّيْنَارِ وَعَبْدُ الدِّرْهَمِ وَعَبْدُ الْخَمِيْصَةِ. إِنْ أُعْطِيَ رَضِيَ وَإِنْ لَمْ يُعْطَ سَخِطَ تَعِسَ وَانْتَكَسَ. وَإِذَا شَيْكَ فَلَا انْتُقِشَ. طُوْبَى لِعَبْدٍ آخِذٍ بِعِنَانِ فَرَسِهِ فِيْ سَبِيْلِ اللهِ أَشْعَثَ رَأْسُهُ مُغْبَرَّةً قَدَمَاهُ إِنْ كَانَ فِي الْحِرَاسَةِ كَانَ فِي الْحِرَاسَةِ وَإِنْ كَانَ فِي السَّاقَةِ كَانَ فِي السَّاقَةِ وَإِنِ اسْتَأْذَنَ لَمْ يُؤْذَنْ لَهُ وَإِنْ شَفَّعَ لَمْ يُشَفَّعْ”. رَوَاهُ الْبُخَارِيُّ.

5161. (7) [3/1428   దృఢం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ధన సంపదలు, ఖరీదైన దుస్తులను కోరుకునే వ్యక్తి నాశనం అవుగాక! ఎందుకంటే ఇవి ప్రసాదించబడితే సంతోషిస్తాడు, ఇవ్వకపోతే అసహ్యించుకుంటాడు. అంటే ధనసంపదల దాసుడు దైవదాసుడు కాడు. ఇటువంటివాడు నాశనం అవుగాక! ఆపదలు వస్తే తొలగకూడదు. ముళ్ళు గుచ్చుకుంటే బయటకు రాకూడదు.” అయితే శుభ సంతోషాలు ఎటువంటి వ్యక్తి కంటే అతడు తన గుర్రం కళ్ళెం పట్టుకొని దైవమార్గంలో పోరాడుతాడు, యుద్ధంలో ఉండటం వల్ల అతని జుట్టు చెల్లాచెదురుగా ఉంటుంది. అతని కాళ్ళు కూడా దుమ్ము, ధూళితో నిండిఉంటాయి. ఏపని చెప్పినా సంతోషంగా చేస్తాడు, పని చాలా చక్కగా చేస్తాడు. ఒకవేళ అతనికి సైన్యం కాపలా దారునిగా నియమిస్తే ఎంతో నిజాయితీగా తన బాధ్యతను నిర్వర్తిస్తాడు. అదేవిధంగా సైన్యం వెనుక ఉండమంటే వెనుక ఉంటాడు. ఉత్తమంగా తన బాధ్యతను నిర్వర్తిస్తాడు. అతని పేదరికంవల్ల అధికారుల వద్దకు వెళ్ళగోరినా అతనికి అనుమతిలభించదు. ఒకవేళ అతను ఎవరి గురించైనా సిఫారసు చేసినా అతని సిఫారసు చెల్లదు. (బు’ఖారీ)

5162 – [ 8 ] ( متفق عليه ) (3/1428)

وَعَنْ أَبِيْ سَعِيْدِ الْخُدْرِيِّ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم قَالَ: “إِنَّ مِمَّا أَخَافَ عَلَيْكُمْ مِنْ بَعْدِيْ مَا يُفْتَحُ عَلَيْكُمْ مِنْ زَهْرَةِ الدُّنْيَا وَ زِيْنَتِهَا”. فَقَالَ رَجُلٌ: يَا رَسُوْلَ اللهِ أَوْ يَأْتِي الْخَيْرُ بِالشَّرِّ؟ فَسَكَتَ حَتَّى ظَننا أَنَّهُ يُنْزَلُ عَلَيْهِ. قَالَ: فَمَسَحَ عَنْهُ الرُحَضَاءُ. وَقَالَ: “أَيْنَ السَّائِلُ؟” وَكَأَنَّهُ حَمِدَهُ فَقَالَ: “إِنَّهُ لَا يَأْتِي الْخَيْرُ بِالشِّرِّ وَإِنَّ مِمَّا يُنْبِتُ الرَّبِيْعُ مَا يَقْتُلُ حَبَطا أَوْ يُلِمُّ إِلَّا آكِلَةَ الْخَضِرِ أَكَلَتْ حَتّى اِمْتَدَّتْ خَاصِرَتَاهَا اِسْتَقْبَلَتْ الشَّمْسِ فَثَلْطَتْ وَبَالَتْ ثُمَّ عَادَتْ فَأَكَلَتْ. وَإِنَّ هَذَا الْمَالَ خَضِرَةٌ حُلْوَةٌ فَمَنْ أَخَذَهُ بِحَقِّهِ وَوَضَعَهُ فِي حَقِّهِ فَنِعْمَ الْمَعُوْنَةُ هُوَ وَمَنْ أَخَذَهُ بِغَيْرِ حَقِّهِ كَانَ كَالَّذِيْ يَأْكُلُ وَلَا يَشْبَعُ وَيَكُوْنُ شَهِيْدًا عَلَيْهِ يَوْمَ الْقِيَامَةِ”. مُتَّفَقٌ عَلَيْهِ.

5162. (8) [3/1428  ఏకీభవితం]

అబూ స’యీద్‌ ‘ఖుద్రీ (ర) కథనం: ప్రవక్త (స) ‘నేను నా మరణానంతరం ఈ ఐహిక సుఖసంతోషాలు, అలంకరణలను గురించి భయపడుతున్నాను. ఇస్లామ్‌ పోరాటాల వల్ల ఇవి లభిస్తాయి,’ అని అన్నారు. అది విని ఒక వ్యక్తి, ‘ఇది చాలా శుభకరమైన మాట. అనేక దేశాలను జయిస్తాం, యుద్ధధనం చేతికి వస్తుంది, మా పరిస్థితి మెరుగు పడుతుంది. మేము సుఖంగా, సంతోషంగా దైవాన్ని ఆరాధించగలం. ఇవి హాని చేకూరుస్తాయా? వీటివల్ల కీడు కలుగుతుందా?’ అని ప్రశ్నించాడు. అది విని ప్రవక్త (స) మౌనం వహించారు. దైవవాణి అవత రిస్తుందని మేము భావించాము. దైవవాణి అవత రించిన తరువాత ప్రవక్త (స) ముఖంపై ఉన్న చెమటను తుడుచుకొని, ‘ఆ ప్రశ్నించిన వ్యక్తి ఎక్కడున్నాడు?’ అని అన్నారు. అంటే, ప్రవక్త (స) ప్రశ్నించే వాని ప్రశ్నను మంచి ప్రశ్నగా భావించారు. అతని ప్రశ్నకు సమా ధానంగా ఇలా అన్నారు, ‘మంచి, మంచిని తెస్తుంది. మంచి, చెడును తీసుకురాలేదు, ఇంకా చెడుకు సహాయకారిగా కూడా పనికిరాదు. అయితే చెడుగా ఉపయోగించటం వల్ల చెడు కలుగు తుంది. దీని ఉదాహరణ ఎలా ఉందంటే, వర్షాకాలంలో పచ్చిక మొలుస్తుంది. ఎక్కడ చూసినా పచ్చని పచ్చిక బయళ్ళే కనబడతాయి. అయితే వీటిలో ఎటువంటి చెడులేదు. కాని ఆకలిగా ఉన్న జంతువు పచ్చగడ్డిని హద్దుమీరి తింటే అజీర్ణం అయిపోతుంది. దానివల్ల మరణం సంభవించవచ్చు, లేదా తీవ్ర అనారోగ్యానికీ గురి కావచ్చు. అయితే కొంతమాత్రమే తిన్న జంతువు, కడుపునిండి చురుగ్గా తయారై మేయడం ఆపి, అలవాటు ప్రకారం ఎండలో కూర్చుంటుంది. జంతువులు కడుపునిండా తిన్న తరువాత ఎండలో దొర్లుతాయి. ఎండవేడివల్ల కడుపు మెత్తబడుతుంది. తిన్నదంతా జీర్ణమయిపోతుంది. మళ్ళీ నిలబడి మలమూత్రాలు విసర్జిస్తాయి. ఆ తరువాత మళ్ళీవెళ్ళి మేయడం ప్రారంభిస్తాయి. ఇంతకు ముందు చేసినట్లు చేస్తాయి. మధ్యేమార్గాన్ని అనుసరిస్తూ తింటూ త్రాగుతూ ఉంటాయి. ఆరోగ్యంగా ఉంటాయి. ఒకవేళ హద్దులుమీరి తిని ఉంటే అనారోగ్యానికి గురయ్యేవి. అతని ధనానిధి కూడా ఇటువంటి పరిస్థితే. చాలా కనువిందుగా ఉంటుంది, ధర్మంగా సంపాదించి సరైన విధంగా ఖర్చుచేస్తే ఈ ధనం అతనికి సహాయ పడుతుంది. అధర్మంగా సంపాదించి అధర్మ కార్యాల్లో ఖర్చుపెడితే, దాని ఆశ ఎప్పటికీ తరగదు. తిని కూడా తిననట్టు ఉంటాడు, పొందికూడా పొందనట్టు ఉంటాడు. ఇంకా ఈ ధనం తీర్పుదినం నాడు అతనికి వ్యతిరేకంగా సాక్ష్యం ఇస్తుంది. (బు’ఖారీ, ముస్లిమ్‌)

5163 – [ 9 ] ( متفق عليه ) (3/1429)

وَعَنْ عَمْرِو بْنِ عَوْفٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: ” فَوَاللهِ لَا الْفَقْرَأَخْشَى عَلَيْكُمْ وَلَكِنْ أَخْشَى عَلَيْكُمْ أَنْ تُبْسَطَ عَلَيْكُمُ الدُّنْيَا كَمَا بُسِطَتْ عَلَى مَنْ كَانَ قَبْلَكُمْ فَتَنَافَسُوْهَا كَمَا تَنَافَسُوْهَا وَتُهْلِكَكُمْ كَمَا أَهْلَكَتْهُمْ”. مُتَّفَقٌ عَلَيْهِ.

5163. (9) [3/1429ఏకీభవితం]

‘అమ్ర్‌ బిన్‌ ‘ఔఫ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”అల్లాహ్ సాక్షి! నేను మీ పేదరికం గురించి భయపడటం లేదు. కాని నేను మీకు ప్రసాదించబడే ధన సంపదల పట్ల భయపడుతున్నాను. మీ పూర్వీకులకు కూడా ధనసంపదలు ప్రసాదించ బడినట్లు. అంటే మీరు ధనవంతులుగా పాలకులుగా అయిపోతారు. ఉపాధి పుష్కలంగా లభిస్తుంది. మీరు దాన్నే కోరుతూ ఉంటారు. ఎందుకంటే మీ పూర్వీకులు కూడా వాటినే కోరుకోసాగారు. అయితే ఇవన్నీ వారిని నాశనం చేసినట్లు మిమ్మల్ని కూడా నాశనం చేసివేస్తాయి. (బు’ఖారీ, ముస్లిమ్‌)

5164 – [ 10 ] ( متفق عليه ) (3/1429)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم قَالَ: “اَللّهُمَّ اجْعَلْ رِزْقَ آلِ مُحَمَّدٍ قُوْتًا”. وَفِيْ رِوَايَةٍ: “كَفَافًا”.

5164. (10) [3/1429  ఏకీభవితం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) తన గురించి, తన సంతానం గురించి ఇలా దు’ఆ చేసేవారు.

అల్లాహు మ్మజ్‌అల్‌రి’జ్‌ఆలి ము’హమ్మదిన్‌ ఖూతన్‌” — ‘ఓ అల్లాహ్‌! ము’హమ్మద్‌ కుటుంబానికి తగినంత ఉపాధి మాత్రమే ప్రసాదించు.’ [7]

5165 – [ 11 ] ( صحيح ) (3/1429)

وعَنْ عَبْدِ اللهِ بْنِ عَمْرٍوقَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “قَدْ أَفْلَحَ مَنْ أَسْلَمَ وَرُزِقَ كَفَافًا وَقَنَّعَهُ اللهُ بِمَا آتَاهُ”. رَوَاهُ مُسْلِمٌ .

5165. (11) [3/1429  దృఢం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘అమ్ర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఇస్లామ్‌ స్వీకరించి, ముస్లిమ్‌ అయి, తగినంత ఉపాధి ఇవ్వబడిన వాడు అంటే అల్లాహ్‌ (త) ఇచ్చిన దానితో తృప్తి చెందినవాడు సాఫల్యం పొందాడు.”  (ముస్లిమ్)

5166 – [ 12 ] ( صحيح ) (3/1429)

وعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “يَقُوْلُ الْعَبْدُ: مَالِيْ مَالِيْ. وَإِنَّ مَالَهُ مِنْ مَالِهِ ثَلَاثٌ: مَا أَكَلَ فَأَفْنَى أَوْ لَبِسَ فَأَبْلَى أَوْ أَعْطَى فَأَقْتَنَى. وَمَا سِوَى ذَلِكَ فَهُوَ ذَاهِبٌ وَتَارِكُهُ لِلنَّاسِ”. رَوَاهُ مُسْلِمٌ.

5166. (12) [3/1429దృఢం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”దాసుడు ఇది నా ధనం, ఇది నా ధనం” అని అంటాడు. అంటే అతని ధనం మూడు రకాలు. 1. అతడు తినివేసింది, నాశనం చేసింది. లేదా 2. ధరించి ఉపయోగించి చించివేసింది. లేదా 3. దైవమార్గంలో ఖర్చుచేసింది మరియు పరలోకం కోసం కూడబెట్టింది. ఈ మూడు తప్ప అతని దగ్గర ఉన్నది పోవలసిందే, ప్రజల కోసం వదలిపెట్టవలసి ఉన్నదే.” (ముస్లిమ్‌)

5167 – [ 13 ] ( متفق عليه ) (3/1429)

وَعَنْ أَنَسٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “يَتْبَعُ الْمَيِّتَ ثَلَاثَةٌ: فَيَرْجِعُ اِثْنَانِ وَيَبْقَى مَعَهُ وَاحِدٌ يَتْبَعَهُ أَهْلُهُ وَمَالُهُ وَعَمَلُهُ فَيَرْجِعُ أَهْلُهُ وَمَالُهُ وَيَبْقَى عَمَلُهُ”. مَتَّفَقٌ عَلَيْهِ.  

5167. (13) [3/1429  ఏకీభవితం]

అనస్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, మరణా నంతరం మనిషివెంట మూడు విషయాలు వెళతాయి. వాటిలో రెండు తిరిగి వచ్చేస్తాయి. ఒకటి మాత్రం అతని వెంట ఉంటుంది. అతని వెంట అతని కుటుం బీకులు, అతని ధనసంపదలు, అతని ఆచరణ  వెళతాయి. కుటుంబీకులు, ధనం తిరిగి వస్తాయి. కాని అతని ఆచరణ అతని వెంట ఉంటుంది. (బు’ఖారీ, ముస్లిమ్‌)

అంటే ఆచరణ మంచిదైతే సరే, లేకుంటే కష్టాలే కష్టాలు.

5168 – [ 14 ] ( صحيح ) (3/1429)

وَعَنْ عَبْدِ اللهِ بْنِ مَسْعُوْدٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: ” أَيُّكُمْ مَالُ وَارِثِهِ أَحَبُّ إِلَيْهِ مِنْ مَالِهِ؟” قَالُوْا: يَا رَسُوْلَ اللهِ مَا مِنَّا أَحَدٌ إِلَّا مَالُهُ أَحَبُّ إِلَيْهِ مِنْ مَالِ وَارِثِهِ. قَالَ: “فَإِنَّ مَالَهُ مَا قَدَّمَ وَمَالَ وَارِثِهِ مَا أَخَّرَ”. رَوَاهُ الْبُخَارِيُّ.

5168. (14) [3/1429దృఢం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ మస్‌’ఊద్‌ (ర) కథనం: ప్రవక్త (స), ‘మీలో ఎవరు తన ధనంకంటే తన వారసుని ధనాన్ని అధికంగా ప్రేమిస్తారు,’ అని ప్రశ్నించారు. దానికి అనుచరులు, ‘ఓ ప్రవక్తా! ప్రతి వ్యక్తి తన వారసుని ధనం కంటే తనధనాన్నే ప్రియంగా భావిస్తాడు,’ అని విన్న వించుకున్నారు. దానికి ప్రవక్త (స), ‘ముందు పంపిందే అతని ధనం, అంటే అల్లాహ్ (త) మార్గంలో ఖర్చుపెట్టిన ధనం. ఇంకా వెనుక వదలి వెళ్ళ వలసింది అతని వారసుని ధనం’ అని ప్రవచించారు. (బు’ఖారీ, ముస్లిమ్‌)

5169 – [ 15 ] ( صحيح ) (3/1429)

وَعَنْ مُطَرِّفٍ عَنْ أَبِيْهِ قَالَ: أَتَيْتُ النَّبِيَّ صلى الله عليه وسلم وَهُوَ يَقْرَأُ: (أَلْهَاكُمُ التَّكَاثُر،102)قَالَ: “يَقُوْلُ ابْنُ آدَمَ: مَالِيْ مَالِيْ”. قَالَ: “وَهَلْ لَكَ يَا ابْنَ آدَمَ إِلَّا مَا أَكَلْتَ فَأَفْنَيْتَ أَوْ لَبِسْتَ فَأَبْلَيْتَ أَوْ تَصَدَّقْتَ فَأَمْضَيْتَ ؟” رَوَاهُ مُسْلِمٌ.

5169. (15) [3/1429  దృఢం]

ము’తర్రిఫ్‌ తన తండ్రి ద్వారా కథనం: ”ప్రవక్త (స) సూరహ్‌ అత్తకాసుర్‌ (102) పఠిస్తూ ఉన్నప్పుడు నేను ఆయన వద్దకు వెళ్ళాను. అప్పుడు ప్రవక్త (స) ”మానవుడు, ‘నా ధనం’ అంటాడు. కాని అతను తిన్నది, నాశనం చేసింది, ధరించి పేలికలుగా చేసింది లేదా దానధర్మాలు చేసిందే అతని ధనం అవుతుంది,” అని అన్నారు. (ముస్లిమ్‌)

5170 – [ 16 ] ( متفق عليه ) (3/1430)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَيْسَ الْغِنى عَنْ كَثْرَةِ الْعَرَضِ وَلَكِنَّ الْغِنَى غِنَى النَّفْسِ”.

5170. (16) [3/1430  ఏకీభవితం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”అధిక ధనసంపదలను కలిగి ఉండటం ఐశ్వర్యం కాదు. అయితే హృదయ నిరపేక్షతయే అసలైన ఐశ్వర్యం.” [8]  (బు’ఖారీ, ముస్లిమ్‌)

—–

اَلْفَصْلُ الثَّانِيْ రెండవ విభాగం  

5171 – [ 17 ] ( لم تتم دراسته ) (3/1430)

عَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَنْ يَأْخُذُ عَنِّيْ هَؤُلَاءِ الْكَلِمَاتِ فَيَعْمَلُ بِهِنَّ أَوْ يُعَلِّمُ مَنْ يَعْمَلُ بِهِنَّ؟” قُلْتُ: أَنَا يَا رَسُوْلَ اللهِ. فَأَخَذَ بِيَدِيْ فَعَدَّ خَمْسًا فَقَالَ: “اتَّقِ الْمَحَارِمَ تَكُنْ أَعْبَدَ النَّاسَ وَارْضَ بِمَا قَسَّمَ اللهُ لَكَ تَكُنْ أَغْنَى النَّاسِ وَأَحْسِنْ إِلى جَارِكَ تَكُنْ مُؤْمِنًا وَأَحِبَّ لِلنَّاسِ مَا تُحِبُّ لِنَفْسِكَ تَكُنْ مُسْلِمًا وَلَا تُكْثِرِ الضِّحْكَ فَإِنَّ كَثْرَةَ الضِّحْكِ تُمِيْتُ الْقَلْبَ”. رَوَاهُ أَحْمَدُ وَالتِّرْمِذِيُّ. وَقَالَ: هَذَا حَدِيْثٌ غَرِيْبٌ  

5171. (17) [3/1430 అపరిశోధితం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స), ‘ఈ నా మాటలు విని, ఆచరించి, ఇతరులకు చెప్పే వారెవరు?’ అని అన్నారు. అప్పుడు నేను, ‘ఓ ప్రవక్తా! నాకు బోధించండి ఇన్‌షా అల్లాహ్‌ నేను ఆచరిస్తాను, ఇంకా ఇతరులకు తెలియ పరుస్తాను,’ అని అన్నాను. ప్రవక్త (స) నాచేయి పట్టుకొని ఈ ఐదు విషయాలను బోధించసాగారు: ”1. నిషిద్ధాలకు దూరంగా ఉండు-అందరికంటే అధికంగా ఆరాధించే భక్తునిగా మారిపో. 2. విధివ్రాత, దైవనిర్ణయం పట్ల సంతృప్తి పొందితే – అందరి కంటే ధనికుడవవుతావు. 3. తోటివారికి మేలుచేస్తే – పరిపూర్ణ విశ్వాసివి అయిపోతావు. 4. నీ గురించి ఇష్టపడేదే ఇతరుల గురించి కూడా ఇష్టపడితే – పరిపూర్ణ విశ్వాసివి అవుతావు. 5. అధికంగా నవ్వకు- ఎందుకంటే అధికంగా నవ్వటం హృదయాన్ని నాశనం చేస్తుంది.” (అ’హ్మద్‌, తిర్మిజి’ /  ఏకోల్లేఖనం)

5172 – [ 18 ] ( لم تتم دراسته ) (3/1430)

وعَنْه قَالَ: قَالَ رسول الله صلى الله عليه وسلم: “إن الله يقول: ابن آدم تفرغ لعبادتي أملأ صدرك غنى وأسد فقرك. وإن لا تفعل ملأت يدك شغلا ولم أسد فقرك”. رواه أحمد وَابْنُ مَاجَهُ

5172. (18) [3/1430 అపరిశోధితం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”అల్లాహ్‌ ఆదేశం: ఓ ఆదమ్‌ కుమారా! నా ఆరాధన కోసం సిద్ధం కా. నేను నీ హృదయాన్ని నిరపేక్షా భావంతో నింపివేస్తాను. నీ పేదరికాన్ని దూరంచేస్తాను. ఇలా చేయకపోతే ప్రాపంచిక వ్యవహారాలతో నీ చేతులను నింపివేస్తాను, నీ పేదరికాన్ని దూరంచేయను.” (అ’హ్మద్‌, ఇబ్నె మాజహ్)

5173 – [ 19 ] ( لم تتم دراسته ) (3/1430)

وَعَنْ جَابِرٍقَالَ: ذُكِرَرَجُلٌ عِنْدَ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم بِعِبَادَةٍ وَاِجْتِهَادٍ وَذُكِرَ آخَرُبِرِعَةٍ. فَقَالَ النَّبِيُّ صلى الله عليه وسلم: “لَا تَعْدِلُ بِالرِّعَةِ”. يَعْنِي الْوَرْعَ. رَوَاهُ التِّرْمِذِيُّ.

5173. (19) [3/1430 అపరిశోధితం]

జాబిర్‌(ర) కథనం: ప్రవక్త(స)ముందు ఇద్దరు వ్యక్తుల గురించి ప్రస్తావించటం జరిగింది. ఒకడు శ్రమించే భక్తుడు, మరొకడు దైవభీతిపరుడైన భక్తుడు – అంటే ఇద్దరిలో ఉత్తములు ఎవరు? అయితే ప్రవక్త (స) దైవభీతికి సరిసమాన మైనదేదీ లేదని ప్రవచించారు.[9](తిర్మిజి’)

5174 – [ 20 ] ( لم تتم دراسته ) (3/1430)

وَعَنْ عَمْرِو بْنِ مَيْمُوْنِ الْأَوْدِيِّ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم لِرَجُلٍ وَهُوَ يَعِظُهُ: “اِغْتَنِمْ خَمْسًا قَبْلَ خَمْسٍ: شَبَابَكَ قَبْلَ هَرَمِكَ وَصِحَّتَكَ قَبْلَ سَقَمِكَ وَغِنَاكَ قَبْلَ فَقْرِكَ وَفَرَاغَكَ قَبْلَ شُغْلِكَ وَحَيَاتَكَ قَبْلَ مَوْتِكَ”. رَوَاهُ التِّرْمِذِيُّ مُرْسَلًا.

5174. (20) [3/1430అపరిశోధితం]

‘అమ్ర్‌ బిన్‌ మైమూన్‌ అల్-అవ్ ది(ర) కథనం: ప్రవక్త (స) ఒక వ్యక్తిని ఉపదేశిస్తూ ఈ ఐదు విషయాలను ఐదు ఆపదలకంటే ముందు మంచి అవకాశాలుగా భావించు అని అన్నారు: ”1. ముసలితనం కంటే ముందు యవ్వనాన్ని. 2. అనారోగ్యం కంటే ముందు ఆరోగ్యాన్ని. 3. పేదరికం కంటే ముందు ధనసంపదల్ని. 4. నిమగ్నత కంటే ముందు తీరికను. 5. మరణం కంటే ముందు జీవితాన్ని. [10](తిర్మిజి’ /  తాబయీ’  ప్రోక్తం)

5175 – [ 21 ] ( لم تتم دراسته ) (3/1431)

وَعَنْ أَبِيْ هُرْيَرَةَ عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ:”مَا يَنْتَظِرُ أَحَدُكُمْ إِلَّا غِنًى مُطْغِيًا أَوْ فَقْرًا مُنْسِيًا أَوْ مَرَضًا مُفْسٍدًا أَوْ هَرَمًا مُفَنَّدًا أَوْ مضوْتًا مُجْهِزًا أَوِ الدَّجَّالَ فَالدَّجَّالُ شَرُّ غَائِبٍ يُنْتَظَرُ أَوِ السَّاعَةَ وَالسَّاعَةُ أَدْهَى وَأَمَرُّ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَالنَّسَائِيُّ.

5175. (21) [3/1431అపరిశోధితం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మీరు ధనసంపదల గురించి, పెట్టుబడుదారీ తనాన్ని గురించి వేచి ఉంటారు. కాని అవి మిమ్మల్ని నాశనం చేస్తాయి. లేదా పరలోకాన్ని మరిపించే దారిద్య్రాన్ని గురించి, లేదా మిమ్మల్ని నాశనం చేసే వ్యాధి గురించి, లేదా మిమ్మల్ని సమాప్తంచేసే మరణం గురించి, లేదా దజ్జాల్‌ ఉపద్రవం గురించి. దజ్జాల్‌ ఉపద్రవం ఇంకా రాలేదు, దాన్ని గురించి వేచి ఉండాలి లేదా ప్రళయం. ప్రళయం కూడా చాలా దగ్గరగా ఉన్నది. ఇది అన్నిటి కంటే  కఠినమైనది.  [11](తిర్మిజి’, నసాయి’)

5176 – [ 22 ] ( حسن ) (3/1431)

وَعَنْهُ أَنَّ رَسُولَ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ: «أَلَا إِنَّ الدُّنْيَا مَلْعُونَةٌ مَلْعُونٌ مَا فِيهَا إِلا ذكرُ الله وَمَا وَالَاهُ وَعَالِمٌ أَوْ مُتَعَلِّمٌ» . رَوَاهُ التِّرْمِذِيُّ وَابْنُ مَاجَهْ.

5176. (22) [3/1431ప్రామాణికం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”జాగ్రత్తగా వినండి! ఈ ఐహిక జీవితం శాప భూయిష్ట మైనది. అంటే దైవకారుణ్యానికి దూరం చేస్తుంది. ఈ ఐహిక జీవితంలో నిమగ్నమై, పరలోకాన్ని మరచి పోయినవాడు అల్లాహ్ (త) కారుణ్యానికి దూరమై పోతాడు. ఇంకా ఈ ప్రపంచంలో ప్రతి వస్తువూ శపించ దగినదే. ఎందుకంటే దైవకారుణ్యానికి దూరం చేస్తుంది. అయితే దైవధ్యానం, మరియు దైవసాన్నిహిత్యం పొందినవారు తప్ప. ఈ రెంటిలో అన్నిరకాల మేళ్ళూ ఉన్నాయి. ఇంకా ధార్మికపండితుడైనా, ధార్మిక విద్యను అభ్యసించేవాడయినా వీరంతా దైవకారుణ్యం హక్కు గలవారు. (తిర్మిజి’,  ఇబ్నె  మాజహ్).

5177 – [ 23 ] ( لم تتم دراسته ) (3/1431)

وَعَنْ سَهْلِ بْنِ سَعْدٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَوْ كَانَتِ الدُّنْيَا تَعْدِلُ عِنْدَ اللهِ جَنَاحَ بَعُوْضَةٍ مَا سَقَى كَافِرًا مِنْهَا شُرْبَةً”. رَوَاهُ أَحْمَدُ وَالتِّرْمِذِيُّ وَابْنُ مَاجَهُ

5177. (23) [3/1431అపరిశోధితం]

సహల్‌ బిన్‌ స’అద్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఒకవేళ అల్లాహ్‌ దృష్టిలో ఇహలోకం  పట్ల ఒక్క దోమ రెక్కంత గౌరవం ఉన్నా,  ఏ అవిశ్వాసికి ఒక గుక్కెడు నీళ్ళయినా ఇచ్చి ఉండేవాడు కాడు.” [12] (అ’హ్మద్‌, తిర్మిజి’, ఇబ్నె  మాజహ్)

5178 – [ 24 ] ( إسناده جيد ) (3/1431)

وَعَنِ ابْنِ مَسْعُوْدٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَا تَتَّخِذُوْا الضَّيْعَةَ فَتَرْغَبُوْا فِي الدُّنْيَا”. رَوَاهُ التِّرْمِذِيُّ وَالْبَيْهَقِيُّ فِي” شُعَبِ الْإِيْمَانِ ”

5178. (24) [3/1431ఆధారాలు ఆమోదయోగ్యం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ మస్‌’ఊద్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మీరు ఏమరుపాటుకు గురిచేసే వాటిని అనుసరించకండి. లేకపోతే మీరు వాటిలో చిక్కు కుంటారు.” [13](తిర్మిజి’, బైహఖీ / షు’అబిల్ ఈమాన్)

5179 – [25 ] ( لم تتم دراسته ) (3/1431)

وَعَنْ أَبِيْ مُوْسَى قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَنْ أَحَبَّ دُنْيَاهُ أَضَرَّ بِآخِرَتَهِ. وَمَنْ أَحَبَّ آخِرَتَهُ أَضَرَّ بِدُنْيَاهُ فَآثِرُوْا مَا يَبْقَى عَلَى مَا يَفْنَى”. رَوَاهُ أَحْمَدُ وَالْبَيْهَقِيُّ فِيْ” شُعَبِ الْإِيْمَانِ”

5179. (25) [3/1431అపరిశోధితం]

అబూ మూసా (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”తమ ఐహిక జీవితాన్ని ప్రేమించేవారు, తమ పర లోకాన్ని నాశనం చేసుకున్నట్టే. అదేవిధంగా తమ పరలోకాన్ని ప్రేమించేవారు, తమ ఐహికజీవితాన్ని నాశనం చేసు కున్నట్టే. కనుక మీరు నాశనం అయ్యే దానిపై శాశ్వతంగా ఉండేదానికి ప్రాధాన్యత నివ్వండి.”[14](అ’హ్మద్‌, బైహఖీ-షు’అబిల్ఈమాన్)

5180 – [ 26] ( لم تتم دراسته ) (3/1431)

وَعَنْ أَبِيْ هُرْيَرْةَ عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم: “لُعِنَ عَبْدُ الدِّيْنَارِ وَلُعِنَ عَبْدُ الدِّرْهَمِ”. رَوَاهُ التِّرْمِذِيُّ.

5180. (26) [3/1431అపరిశోధితం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ధనసంపదల దాసుడు నాశనం అవుగాక!”[15] (తిర్మిజి’)

5181 – [ 27 ] ( صحيح ) (3/1431)

وَعَنْ كَعْبِ بْنِ مَالِكٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَا ذِئْبَانِ جَائِعَانِ أُرْسِلَا فِيْ غَنَمٍ بِأَفْسَدَ لَهَا مِنْ حِرْصِ الْمَرْءِ عَلَى الْمَالِ وَالشَّرَفِ لِدِيْنِهِ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَالدَّارَمِيُّ

5181. (27) [3/1431దృఢం]

క’అబ్‌ బిన్‌ మాలిక్‌ తన తండ్రి ద్వారా కథనం: ప్రవక్త (స) ప్రవచనం: ”ఆకలిగా ఉన్న రెండు తోడేళ్ళను మేకల మందలో వదలివేస్తే, అవి అనేకమేకలను చంపి, తిని చాలా నష్టం కలిగిస్తాయి. కాని అది మానవునికి అతని మనోకాంక్షలు, అత్యాశ, ఐహికవాంఛలు ధర్మం విషయంలో నష్టం చేకూర్చే దాని కంటే తక్కువే.” [16] (తిర్మిజి’,  దార్మీ)

5182 – [ 28 ] ( لم تتم دراسته ) (3/1431)

وَعَنْ خَبَّابٍ عَنْ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم قَالَ: “مَا أَنْفَقَ مُؤْمِنٌ مِنْ نَفَقَةٍ إِلَّا أُجِرَ فِيْهَا إِلَّا نَفْقَتَهُ فِي هَذَا التُّرَابِ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَابْنُ مَاجَهُ.

5182. (28) [3/1431అపరిశోధితం]

‘ఖబ్బాబ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”విశ్వాసి తన జీవితంలో ఖర్చుచేసిన దానికి, అతనికి ప్రతిఫలం తప్పకుండా లభిస్తుంది. కాని అతడు అనవసరంగా భూమి, భవనాల్లో ఖర్చుపెట్టినందుకు అతనికి ప్రతిఫలం లభించదు.” [17] (తిర్మిజి’,  ఇబ్నె  మాజహ్)

5183 – [ 29] ( لم تتم دراسته ) (3/1432)

وَعَنْ أَنَسٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “اَلنَّفَقَةُ كُلُّهَا فِيْ سَبِيْلِ اللهِ إِلَّا الْبِنَاءَ فَلَا خَيْرَ فِيْهِ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَقَالَ: هَذَا حَدِيْثٌ غَرِيْبٌ

5183. (29) [3/1432 అపరిశోధితం]

అనస్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”అల్లాహ్‌ (త) మార్గంలో ఏది ఖర్చుపెట్టినా ప్రతిఫలం లభిస్తుంది.” కాని అవసరానికి మించి ఖర్చుపెట్టిన దానికి ప్రతిఫలం లభించదు. ఎందుకంటే అది దుబారా ఖర్చవుతుంది. (తిర్మిజి’ – ఏకోల్లేఖనం)

5184 – [ 30 ] ( ضعيف ) (3/1432)

وعَنْهُ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم خَرَجَ يَوْمًا وَنَحْنُ مَعَهُ فَرَأَى قُبَّةً مُشْرِفَةً فَقَالَ: “مَا هَذِهِ؟” قَالَ أَصْحَابُهُ: هَذِهِ لِفُلَانٍ رَجُلٍ مِنَ الْأَنْصَارِ فَسَكَتَ وَحَمَلَهَا فِيْ نَفْسِهِ حَتَّى إِذَا جَاءَ صَاحِبُهَا فَسَلَّمَ عَلَيْهِ فِي النَّاسِ فَأَعْرَضَ عَنْهُ صَنَعَ ذَلِكَ مَرَارًا حَتَّى عَرَفَ الرَّجُلُ الْغَضَبَ فِيْهِ وَالْإِعْرَاضَ فَشَكَا ذَلِكَ إِلى أَصْحَابِهِ وَقَالَ: وَاللهِ إِنِّيْ لَأُنْكِرُرَسُوْلَ اللهِ صلى الله عليه وسلم. قَالُوْا: خَرَجَ فَرَأَى قُبَّتَكَ. فَرَجَعَ الرَّجُلُ إِلى قُبَّتِهِ فَهَدَمَهَا حَتَّى سَوَّاهَا بِالْأَرْضِ. فَخَرَجَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم ذَاتَ يَوْمٍ فَلَمْ يَرَهَا قَالَ: “مَا فُعِلَتِ الْقُبَّةُ؟” قَالُوْا: شَكَا إِلَيْنَا صَاحِبُهَا إِعْرَاضَكَ فَأَخْبَرْنَاهُ فَهَدَمَهَا. فَقَالَ: “أَمَّا إِنَّ كُلّ بِنَاءٍ وَبَالٌ عَلَى صَاحِبِهِ إِلَّا مَا لَا إِلَّا مَا لَا” .يَعْنِيْ مَا لَا بُدَّ مِنْهُ. رَوَاهُ أَبُوْ دَاوُدَ.

5184. (30) [3/1432  బలహీనం]

అనస్‌ (ర) కథనం: ప్రవక్త (స) ఒకసారి బయటకు వెళ్ళారు. మేము కూడా ఆయనవెంట నడిచాము. ఒక వీధిలో చాలా ఎత్తైన భవనం అంటే గోపురం గల భవనం ఒకటి చూచాము. అది అనేక అంతస్తులు కలిగిఉంది. పైన గోపురం కూడా ఉంది. ప్రవక్త (స) అది చూసి, ‘ఈ భవనం ఎవరిది?’ అని అడిగారు. అనుచరుల్లో ఒకరు, ‘ప్రవక్తా! ఇది ఒక అన్సారీకి చెందినది,’ అని అన్నాడు. అది విని, ప్రవక్త (స), మౌనం వహించారు. అంటే అసహ్యాన్ని వ్యక్తపరిచలేదు. ఆ తరువాత ఆ భవనం యజమాని వచ్చి సలామ్‌ చేస్తే, ప్రవక్త (స) ముఖం త్రిప్పు కున్నారు. అనేకసార్లు అలా జరిగింది. చివరికి ఆ వ్యక్తి తన పట్ల ప్రవక్త (స) హృదయంలో అసహ్యం ఉందని తెలుసుకొని తన సహచరులతో కారణం అడిగాడు. దానికి సహచరులు, ‘ఏమీలేదు కాని, మీ భవనం ప్రక్కనుండి పోతూ ‘ఈ భవనం ఎవరిది’ అని అడగటం జరిగింది. ఫలానా వ్యక్తిదని తెలియపరచటం జరిగింది. ఇంత ఎత్తైన మరియు గోపురంగల భవనం వల్లనేమో ప్రవక్త (స) అయిష్టానికి గురయినట్టుంది,” అని తెలియ పరచటం జరిగింది. ఆ అన్సారీ తిరిగి వెళ్ళి దాన్ని కూల్చి నేలమట్టం చేసాడు. ఆ తరువాత ఒకరోజు అటుగా వెళ్ళి ప్రవక్త (స), ‘ఆ భవనం ఏమయింది?’ అని అడిగారు. దానికి ప్రజలు సమా ధానం ఇస్తూ, ‘ఆ వ్యక్తి నా పట్ల ప్రవక్త (స) ఎందుకు అసహ్యంగా ఉన్నారు’ అని అడిగాడు, దానికి మేము ‘ఈ విధంగా తెలియ పరిచాము, అది విని ఆ వ్యక్తి దాన్ని కూల్చి నేలమట్టం చేసాడు,’ అని సమాధానం ఇచ్చారు. అది విని ప్రవక్త (స), ‘అవసరానికి మించి నిర్మించే భవనాలు ప్రాణాంత కాలుగా పరిణమిస్తాయి, శిక్షకు గురిచేస్తాయి. కాని నివసించడానికి, అవసరానికి తగ్గట్టు నిర్మించు కోవటంలో అభ్యంతరం లేదు,’ అని అన్నారు. (అబూ దావూద్‌)

మస్జిద్‌లు, విద్యాలయాలు, సరాయిలు ఈ పరిధిలోకే వస్తాయి.

5185 – [ 31 ] ( لم تتم دراسته ) (3/1432)

وَعَنْ أَبِيْ هَاشِمِ بْنِ عُتْبَةَ قَالَ:عَهِدَ إِلَيَّ رَسُوْلُ اللهِ صلى الله عليه و سلم قَالَ: “إِنَّمَا يَكْفِيْكَ مِنْ جَمْعِ الْمَالِ خَادِمٌ وَمَرْكَبٌ فِيْ سَبِيْلِ اللهِ”. رَوَاهُ أَحْمَدُ وَالتِّرْمِذِيُّ وَالنَّسَائِيُّ وَابْنُ مَاجَهُ.

وَفِيْ بَعْضِ نُسَخِ” الْمَصَابِيْحِ”عَنْ أَبِيْ هَاشِمِ بْنِ عُتْبدٍ بِالدَّالِ بَدْلَ التَّاءِ وَهُوَ تَصْحِيْفٌ.

5185. (31) [3/1432  అపరిశోధితం]

అబూ హాషిమ్‌ బిన్‌ ‘ఉత్‌బహ్ (ర) కథనం: ప్రవక్త (స) నాకు ఇలా ఉపదేశం చేసారు, ”నీవు ప్రాపంచిక ధన సంపదల్లో కేవలం సేవకోసం – సేవకుడు, దైవ మార్గంలో వెళ్ళడానికి – వాహనం మాత్రమే ఉంచు కుంటే చాలు.” (అ’హ్మద్‌, తిర్మిజి’, నసాయి’, ఇబ్నె మాజహ్)

అంటే ఒక సేవకుడు, ఒక వాహనం ఉంచుకోవచ్చు.

5186 – [ 32 ] ( ضعيف ) (3/1432)

وَعَنْ عُثْمَانَ بْنِ عَفَّانَ رَضِيَ اللهُ عَنْهُ أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم قَالَ: “لَيْسَ لِاِبْنِ آدَمَ حَقٌّ فِيْ سِوَى هَذِهِ الْخِصَالِ: بَيْتٍ يَسْكُنُهُ وَثَوْبٍ يُوَارِيْ بِهِ عَوْرَتِهِ وَجَلْفِ الْخُبْزِ وَالْمَاءِ”. رَوَاهُ التِّرْمِذِيُّ.

5186. (32) [3/1432  బలహీనం]

‘ఉస్మాన్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మనిషి కేవలం ఈ మూడు వస్తువులను ఉంచుకోవచ్చు, వీటి కంటే ఎక్కువ ధర్మం కాదు. 1. ఉండటానికి ఇల్లు. 2. ధరించటానికి దుస్తులు. 3. తినటానికి ఆహారం, నీళ్ళు.”  (తిర్మిజి’)

5187 – [ 33 ] ( لم تتم دراسته ) (3/1433)

وَعَنْ سَهْلِبْنِ سَعْدٍ قَالَ: جَاءَ رَجُلٌ فَقَالَ: يَا رَسُوْلَ اللهِ دُلَّنِيْ عَلَى عَمَلٍ إِذَا أَنَا عَمِلْتُهُ أَحَبَّنِيَ اللهُ وَأَحَبَّنِيَ النَّاسُ. قَالَ: “ازْهَدْ فِي الدُّنْيَا يُحِبُّكَ اللهُ وَازْهَدْ فِيْمَا عِنْدَ النَّاسِ يُحِبُّكَ النَّاسُ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَابْنُ مَاجَهُ

5187. (33) [3/1433  అపరిశోధితం]

సహల్‌ బిన్‌ స’అద్‌ (ర) కథనం: ప్రవక్త (స) వద్దకు ఒక వ్యక్తి వచ్చి, ‘ఓ ప్రవక్తా! అల్లాహ్‌ మరియు ప్రజలు నన్ను ప్రేమించే విధంగా ఏదైనా సత్కార్యం ఉంటే చెప్పండి’ అని విన్నవించుకున్నాడు. దానికి ప్రవక్త (స), ‘నువ్వు ప్రాపంచిక జీవితాన్ని విస్మరించు, ఎవరి నుండీ ఏదీ ఆశించకు. ఇలా చేస్తే అందరూ నిన్ను ప్రేమిస్తారు’ అని అన్నారు.[18](తిర్మిజి’, ఇబ్నె  మాజహ్)

5188 – [ 34 ] ( لم تتم دراسته ) (3/1433)

وعَنِ ابْنِ مَسْعُوْدٍ أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم نَامَ عَلَى حَصِيْرٍفَقَامَ وَقَدْ أَثَّرَفِيْ جَسَدِهِ. فَقَالَ ابْنُ مَسْعُوْدٍ: يَا رَسُوْلَ اللهِ لَوْ أَمَرْتَنَا أَنْ نَبْسُطَ لَكَ وَنَعْمَلَ. فَقَالَ: “مَا لِيْ وَلِلدُّنْيَا؟ وَمَا أَنَا وَالدُّنْيَا إِلَّا كَرَاكِبٍ اسْتَظَلَّ تضتْ شَجَرَةٍ ثُمَّ رَاحَ وَتَرَكَهَا”. رَوَاهُ أَحْمَدُ وَالتِّرْمِذِيُّ وَابْنُ مَاجَهُ

5188. (34) [3/1433  అపరిశోధితం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ మస్‌’ఊద్‌ (ర) కథనం: ప్రవక్త (స) చాపపై పండుకున్నారు. చాప చిహ్నాలు ప్రవక్త (స)పై పడ్డాయి. ఇబ్నె మస్‌’ఊద్‌ (ర), ‘ఓ ప్రవక్తా! తమరు కోరితే మెత్తని పడక ఏర్పాటు చేసేవాళ్ళం’ అని విన్నవించుకున్నారు. అది విని ప్రవక్త (స), నాకు ఈ ప్రపంచంతో పనేంటి, నేను ఈ ప్రపంచం బాటసారి, చెట్టు వంటివాళ్ళం. బాటసారి చెట్టుక్రింద విశ్రాంతి కోసం దిగి, కొంతసేపు తర్వాత అక్కడి నుండి వెళ్ళిపోతాడు, చెట్టును అక్కడే వదలివేస్తాడు. (అ’హ్మద్‌, తిర్మిజి’, ఇబ్నె మాజహ్)

అంటే, ఈ ప్రపంచం విశ్రాంతి గృహం. ప్రయాణానికి అధిక వస్తుసామగ్రి తీసుకు వెళ్ళ వలసిన అవసరం లేదు.

5189 – [ 35 ] ( حسن ) (3/1433)

وَعَنْ أَبِيْ أُمَامَةَ عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ: “أَغْبَطُ أَوْلِيَائِيْ عِنْدِيْ لَمُؤْمِنٌ خَفِيْفُ الْحَاذِ ذُوْ حَظٍّ مِنَ الصَّلَاةِ أَحْسَنَ عِبَادَةَ رَبِّهِ وَأَطَاعَهُ فِي السِّرِّوَكَانَ غَامِضًا فِي النَّاسِ لَا يُشَارُ إِلَيْهِ بِالْأَصَابِعِ وَكَانَ رِزْقُهُ كَفَافًا فَصَبَرَ عَلَى ذَلِكَ.” ثُمَّ نَقَدَ بِيَدِهِ فَقَالَ: “عُجِّلَتْ مَنِيَّتُهُ. قلتْ بَوَاكِيْهِ قَلَّ تُرَاثُهُ”. روَاهُ أَحْمَدُ وَالتِّرْمِذِيُّ وَابْنُ مَاجَهُ

5189. (35) [3/1433   ప్రామాణికం]

అబూ ఉమామహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”నా అనుచరుల్లో అందరికంటే నాకు ప్రియమైన వారెవరంటే, అందరికంటే ధనసంపదలు స్వల్పంగా ఉన్నవాడు, నమా’జ్‌ స్థాపించేవాడు, తన ప్రభువును అధికంగా ఆరాధించేవాడు, అంతర్బాహ్యాల్లో అల్లాహ్ కు విధేయత చూపేవాడు, ప్రజల్లో అపరిచితుడు, పేరు ప్రఖ్యాతులు లేనివాడు, పరిమితంగా ఆహారం లభించే వాడు, ప్రజలను అర్థించేవాడూ కాడు, ధనవంతుడూ కాడు. ఆ తరువాత ప్రవక్త (స) తన చేత్తో ఈల కొట్టి, అతనికి మరణం వచ్చినా అతడిపై ఏడ్చే వాడె వడూ లేని వాడు, ఇంకా వారసులూ లేనివాడు. ఎందుకంటే అతని వద్ద ధనమేలేదు.” (అ’హ్మద్‌, తిర్మిజి’, ఇబ్నె మాజహ్)

5190 – [ 36 ] ( لم تتم دراسته ) (3/1433)

وعَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “عَرَضَ عَلَيَّ رَبِّيْ لِيَجْعَلُ لِيْ يَطْحَاءَ مَكَّةَ ذَهَبًا. فَقُلْتُ: لَا يَارَبِّ وَلَكِنْ أَشْبَعُ يَوْمًا وَأَجُوْعُ يَوْمًا فَإِذَا جُعْتُ تَضَرَّعْتُ إِلَيْكَ وَذَكَرْتُكَ وَإِذَا شَبِعْتُ حَمِدْتُكَ وَشَكَرْتُكَ “. رَوَاهُ أَحْمَدُ وَالتِّرْمِذِيُّ.

5190. (36) [3/1433అపరిశోధితం]

అబూ ఉమామహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”అల్లాహ్‌  నాతో మక్కహ్ ముకర్రమహ్ లోని రాళ్ళు రెప్పలను బంగారంగా మార్చివేస్తానని ఆదేశించాడు. కాని నేను, ‘ఓ ప్రభూ! ఒకరోజు కడుపునిండా తిని, ఒక రోజు ఆకలితో ఉండాలని కోరుకుంటున్నాను. నేను ఆకలిగా ఉంటే నిన్ను వేడుకుంటూ, నా అసహా యతను చాటుకుంటూ ప్రార్థిస్తాను, నీ స్తోత్రాన్ని కొనియాడుతాను, నీకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉంటాను’ అని  ప్రార్థించాను.” (అ’హ్మద్‌, తిర్మిజి’)

5191- [ 37 ] ( لم تتم دراسته ) (3/1434)

وَعَنْ عُبَيْدِ اللهِ بْنِ مِحْصَنٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَنْ أَصْبَحَ مِنْكُمْ آمِنًا فِيْ سِرْبِهِ مُعَافى فِيْ جَسَدِهِ عِنْدَهُ قُوْتُ يَوْمِهِ فَكَأَنَّمَا حِيْزَتْ لَهُ الدُّنْيَا”. رَوَاهُ التِّرْمِذِيُّ وَقَالَ: هَذَا حَدِيْثٌ غَرِيْبٌ .

5191. (37) [3/1434 అపరిశోధితం]

‘ఉబైదుల్లాహ్‌ బిన్‌ ము’హ్‌’సిన్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”క్షేమంగా, ఆరోగ్యంగా ఉదయం లేచి, అతని వద్ద ఒక్క రోజుకు సరిపడే ఆహారం ఉంటే, అతని కోసం ప్రాపంచిక అనుగ్రహాలన్నీ చేర్చటం జరిగింది, ధన సంపదలన్ని అతని కోసం కూడబెట్టడం జరిగింది.” (తిర్మిజి’ / ఏకోల్లేఖనం)

అంటే విశ్వాసి క్షేమంగా, ఆరోగ్యంగా ఉండి, అతని వద్ద ఉన్న ఒక్కరోజు ఆహారం ప్రాపంచిక ధన సంపదలన్నిటి కంటే  ఉత్తమమైనది.

5192 – [ 38 ] ( لم تتم دراسته ) (3/1434)

وَعَنْ مِقْدَامِ بْنِ مَعْدِيْ كَرِبَ قَالَ: سَمِعْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه و سلم يَقُوْلُ: “مَا مَلَأَ آدَمِيٌّ وِعَاءً شَرًّا مِنْ بَطْنٍ بِحَسْبِ ابْنِ آدَمَ أُكُلَاتٌ يُقِمْنَ صُلْبَهُ فَإِنْ كَانَ لَا مَحَالَةَ فَثُلُثٌ طَعَامٌ وَثُلُثٌ شَرَابٌ وَثُلُثٌ لِنَفْسِهِ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَابْنُ مَاجَهُ

5192. (38) [3/1434అపరిశోధితం]

మిఖ్‌దామ్‌ బిన్‌ మ’అదీ కరబ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ఇలా అంటూ ఉండగా నేను విన్నాను, ”మనిషికి కడుపంత చెడ్డ కంచం మరొకటి లేదు. అంటే కడుపు కూడా ఒక కంచం వంటిదే. దాన్ని ఆహారం, నీళ్ళతో పూర్తిగా నింపుకోవటం జరిగితే అంతకంటే చెడ్డవాడు మరొకడు లేడు. మనిషికి కొద్దిపాటి ముద్దలు చాలు. తన శరీరం ఆరోగ్యంగా ఉంచటానికి. అంత అవసరమే అనుకుంటే కడుపును 3 భాగాలుగా చేసి, ఒక భాగం ఆహారం, ఒక భాగం నీరు, మూడో భాగం శ్వాసకోసం చాలు.” (తిర్మిజి’, ఇబ్నె మాజహ్)

5193 – [ 39] ( لم تتم دراسته ) (3/1434)

وعَنِ ابْنِ عُمَرَ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم سَمِعَ رَجُلًايَتَجَشَّأ فقَالَ: “أَقْصِرْمِنْ جُشَائِكَ فَإِنَّ أَطْوَلَ النَّاسِ جُوْعًا يَوْمَ الْقِيَامَةِ أَطْوَلُهُمْ شِبْعًا فِي الدُّنْيَا”. رَوَاهُ فِي “شَرْحِ السُّنَّةِ”. وَرَوَى التِّرْمِذِيُّ نَحْوَهُ.

5193. (39) [3/1434 అపరిశోధితం]

ఇబ్నె ‘ఉమర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ఒక వ్యక్తికి తేన్పులు తీసుకుంటుండగా విని, ”నువ్వు నీ తేన్పులను తగ్గించు, అంటే తేన్పులు అధికంగా ఆహారాన్ని తిన్నట్టు సూచిస్తాయి. ఎవరైనా ప్రాపంచిక జీవితంలో అతిగా తింటే, తీర్పుదినం నాడు అతడు అందరి కంటే ఆకలిగలవాడై ఉంటాడు.”  అని అన్నారు. (షర్‌’హుస్సున్నహ్‌,  తిర్మిజి’)

5194 – [ 40 ] ( لم تتم دراسته ) (3/1434)

وَعَنْ كَعْبِ بْنِ عِيَاضٍ قَالَ: سَمِعْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ:”إِنَّ لِكُلِّ أُمَّةٍ فِتْنَةً وَفِتْنَةً أُمَّتِيْ الْمَالُ”. رَوَاهُ التِّرْمِذِيُّ

5194. (40) [3/1434అపరిశోధితం]

క’అబ్‌ బిన్‌ ‘ఇయా’ద్ (ర) కథనం: ప్రవక్త (స) ఇలా ప్రవచిస్తూ ఉండగా నేను విన్నాను, ”ప్రతి అనుచర  సమాజానికి ఒక పరీక్ష ఉండేది, నా అనుచర సమాజ పరీక్ష ధనం.” [19] (తిర్మిజి’)

5195 – [ 41 ] ( ضعيف ) (3/1434)

وعَنْ أَنَسٍ عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ: “يُجَاءُ بِابْنِ آدَمَ يَوْمَ الْقِيَامَةِ كَأَنَّهُ بَذَجٌ فَيُوْقَفُ بَيْنَ يَدَيِ اللهِ فَيَقُوْلُ لَهُ: أَعْطَيْتُكَ وَخَوَّلْتُكَ وَ أَنْعَمْتُ عَلَيْكَ فَمَا صَنَعْتَ؟ فَيَقُوْلُ: يَا رَبِّ جَمَّعْتُهُ وَثَمَّرْتُهُ وَتَرَكْتُهُ أَكْثَرَ مَا كَانَ فَاَرْجِعنِيْ آتِكَ بِهِ كُلِّهِ. فَيَقُوْلُ لَهُ: أَرِنِيْ مَا قَدَّمْتَ. فَيَقُوْلُ: رَبِّ جَمَّعْتُهُ وَثَمَّرْتُهُ وَتَرَكْتُهُ أَكْثَرَ مَاكَانَ فَارْجِعْنِيْ آتِكَ بِهِ كُلِّهِ. فَإِذَا عَبْدٌ لَمْ يُقَدِّمْ خَيْرًا فَيُمْضَي بِهِ إِلى النَّارِ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَضَعَّفَهُ

5195. (41) [3/1434బలహీనం]

అనస్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”తీర్పుదినం నాడు మానవుడ్ని మేక పిల్లలా తీసుకు రావటం జరుగు తుంది. అంటే చాలా దీనంగా, బలహీనంగా ఉంటాడు, దైవంముందు నిలబెట్ట బడతాడు. అల్లాహ్‌ (త) అతనితో ”నేను నీకు జీవి తాన్ని ఇచ్చాను, ధన సంపదలు కూడా ప్రసాదించాను, నీకు గొప్ప ఉపకారం చేసాను, నిన్ను గొప్పగా అనుగ్రహించాను. నీ మార్గదర్శకత్వానికి ప్రవక్తలను, గ్రంథాలను పంపాను, వీటివల్ల నీవు ఏంచేసావు?” అని ప్రశ్నిస్తాడు. దానికి దాసుడు, ‘ఓ నా ప్రభూ! నేను చాలా ధనసంపదలు కూడబెట్టాను, దాన్ని వ్యాపారంలో పెట్టి చాలా లాభాలు సంపాదించాను, అయితే అంతా అక్కడే వదలి వచ్చాను. తమరు మళ్ళీ నన్ను పంపితే, నేను ఆ ధనాన్నంతా తీసుకువస్తాను,’ అని విన్నవించు కుంటాడు. దానికి అల్లాహ్‌, ‘సరే, నువ్వు మరణా నంతర జీవితానికి పంపింది చూపించు,’ అని ఆదేశిస్తాడు. కాని ఆ వ్యక్తి పరలోకానికి ఏదీ పంపి ఉండడు. అప్పుడు అల్లాహ్‌ (త), వీడిని పట్టుకోండి, నరకంలో పడవేయండి అని ఆదేశిస్తాడు.”  (తిర్మిజి  /  బలహీనం)

5196 – [ 42 ] ( صحيح ) (3/1434)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِنَّ أَوَّلَ مَا يُسْأَلُ الْعَبْدُ يَوْمَ الْقِيَامَةِ مِنَ النَّعِيْمِ. أَنْ يُقَالَ لَهُ: أَلَمْ نُصِحَّ جِسْمَكَ؟ وَنُرَوِّكَ مِنَ الْمَاءِ الْبَارِدِ؟” . رَوَاهُ التِّرْمِذِيُّ.

5196. (42) [3/1434దృఢం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”తీర్పుదినం నాడు అన్నిటికంటే ముందు అనుగ్రహాల గురించి ప్రశ్నించటం జరుగుతుంది, ‘మేము నీకు ఆరోగ్యం ప్రసాదించలేదా, త్రాగటానికి చల్లనినీరు ప్రసాదించ లేదా’ ” అని ప్రశ్నించటం జరుగుతుంది.[20] (తిర్మిజి’)

5197 – [ 43 ] ( صحيح لشواهده ) (3/1435)

وَعَنِ ابْنِ مَسْعُوْدٍ عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ: “لَا تَزُوْلُ قَدَمَا ابْنِ آدَمَ يَوْمَ الْقِيَامَةِ حَتّى يُسْأَلَ عَنْ خَمْسٍ: عَنْ عُمُرِهِ فِيْمَا أَفْنَاهُ وَعَنْ شَبَابِهِ فِيْمَا أَبْلَاهُ وَعَنْ مَالِهِ مِنْ أيْنَ اكْتَسَبَهُ وَفِيْمَا أَنْفَقَهُ وَمَاذَا عَمِلَ فِيْمَا عَلِمَ؟”.رَوَاهُ التِّرْمِذِيُّ وَقَالَ : هَذَا حَدِيْثٌ غَرِيْبٌ .

5197. (43) [3/1435సాక్షులచే  దృఢం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ మస్‌’ఊద్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”తీర్పుదినం నాడు ఐదు విషయాల గురించి విచారించనంత వరకు మానవుని పాదాలు కదలలేవు. అవి, 1. అతని వయస్సు ఎక్కడ ఖర్చు చేసాడనేది. 2. అతని యవ్వనం ఎక్కడ ఖర్చు చేసాడనే దాని గురించి. 3. ధనం ఎక్కడి నుండి సంపాదించాడు. 4. ఎక్కడ ఖర్చు చేసాడనే దాని గురించి. 5. విద్య నేర్చుకొని ఆచరించాడా లేదా? (తిర్మిజి’  –  ఏకోల్లేఖనం)

—–

اَلْفَصْلُ الثَّالِثُ     మూడవ విభాగం 

5198 – [ 44 ] ( لم تتم دراسته ) (3/1435)

عَنْ أَبِيْ ذَرٍّ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم قَالَ لَهُ: “إِنَّكَ لَسْتَ بِخَيْرٍمِنْ أَحْمَرَوَلَا أَسْوَدَ إِلَّا أَنْ تَفْضُلَهُ بِتَقْوَى”.رَوَاهُ أَحْمَدُ

5198. (44) [3/1435అపరిశోధితం]

అబూ జ’ర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఓ అబూ జ’ర్‌! నువ్వు ఎర్రగా, బుర్రగా ఉండే వాడికంటే ఉత్తముడవు కావు, లేదా నల్లగా కర్రెగా ఉండేవాడి కంటే ఉత్తముడవేమీ కావు. కాని దైవభీతి, దైవభక్తిలో నువ్వు వారిద్దరికంటే  ఉత్తముడవు.” [21] (అహ్మద్‌)

5199- [ 45 ] ( لم تتم دراسته ) (3/1435)

وَعَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَا زَهِدَ عَبْدٌ فِي الدُّنْيَا إِلَّا أَنْبَتَ اللهُ الْحِكْمَةَ فِي قَلْبِهِ وَأَنْطَقَ لِسَانَهُ وَبَصَّرَهُ عَيْبَ الدُّنْيَا وَدَاءَهَا وَدَوَاءَهَا وَأَخْرَجَهُ مِنْهَا سَالِمًا إِلى دَارِ السَّلَامِ” .رَوَاهُ الْبَيْهَقِيُّ فِي “شُعَبِ الْإِيْمَانِ”.

5199. (45) [3/1435అపరిశోధితం]

అబూ జ’ర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ప్రాపంచిక జీవితంపట్ల శ్రద్ధచూపని దాసునికి అల్లాహ్‌ (త) వివేకం, మేధస్సుప్రసాదిస్తాడు, అతని నోటి ద్వారా వివేక వచనాలు వల్లిస్తాడు. ఇంకా అతని ప్రాపంచిక లోపాలను, వ్యాధులను దూరంచేస్తాడు. ఇంకా భూలోకంనుండి సురక్షితంగా దారుస్సలామ్‌ వైపు తీసుకువెళతాడు.” (బైహఖీ – షు’అబిల్ ఈమాన్)

5200 – [ 46 ] ( لم تتم دراسته ) (3/1435)

وَعَنْهُ أَنَّ رَسُوْلَ الله صلى الله عليه وسلم قَالَ: “قَدْ أَفْلَحَ مَنْ أَخْلَصَ اللهُ قَلْبَهُ لِلْإِيْمَانِ وَجَعَلَ قَلْبَهُ سَلِيْمًا وَلِسَانَهُ صَادِقًا وَنَفْسَهُ مُطْمَئِنَّةً وَخَلِيْقَتَهُ مُسْتَقِيْمَةً وَجَعَلَ أُذُنَهُ مُسْتَمِعَةً وَعَيْنَهُ نَاظِرَةً فَأَمَّا الْأُذُنُ فَقَمْعٌ وَأَمَّا الْعَيْنُ فَمُقِرَّةٌ لِمَا يُوْعِى الْقَلْبُ وَقَدْ أَفْلَحَ مَنْ جُعِلَ قَلْبُهُ وَاعِيًا”. رَوَاهُ أَحْمَدُ وَالْبَيْهَقِيُّ فِيْ “شُعَبِ الْإِيْمَانِ”.

5200. (46) [3/1435అపరిశోధితం]

అబూ జ’ర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”అల్లాహ్‌ విశ్వాసానికి ప్రత్యేకించినవారే, సాఫల్యం పొందుతారు. అంటే పరిశుద్ధ విశ్వాసం ప్రసాదించ బడినవారు, మరియు వారి హృదయాల్ని ఈర్ష్యా ద్వేషాల నుండి రక్షించబడినవారు, ఇంకా సత్యత ప్రసాదించబడిన వారు. అంటే సత్యంపలికే భాగ్యం ప్రసాదించబడిన వారు, ఇంకా మనశ్శాంతి ప్రసాదించ బడినవారు, అంటే దైవస్మరణ భాగ్యం ప్రసాదించ బడినవారు. దీనివల్ల మీ మనస్సుకు సంతృప్తి, శాంతి లభిస్తాయి. ఇంకా ఉత్తమ మనస్తత్వాన్ని ప్రసాదించ బడినవారు, సత్యాన్ని వినే భాగ్యం ప్రసాదించ బడినవారు. ఇంకా అతని కళ్ళకు సత్యాన్ని మాత్రమే చూచే భాగ్యం ప్రసాదించబడిన వారు. అంటే చూసిన సత్యాన్ని స్వీకరిస్తాడు, దాన్ని గుర్తుంచుకుంటాడు. ఇటువంటి వారందరూ సాఫల్యం పొందుతారు.[22] (అ’హ్మద్‌, బైహఖీ -షు’అబిల్ ఈమాన్)

5201 – [ 47 ] ( إسناده جيد ) (3/1435)

وَعَنْ عُقْبَةَ بْنِ عَامِرٍ عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ:”إِذَا رَأَيْتَ اللهَ عَزَّ وَجَلَّ يُعْطِي الْعَبْدَ مِنَ الدُّنْيَا عَلَى مَعَاصِيْهِ مَا يُحِبُّ فَإِنَّمَا هُوَ اسْتِدْرَاجٌ”ثُمَّ تَلَا رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم:(فَلَمَّا نَسُوْا مَاذُكِّرُوْا بِهِ فَتَحْنَا عَلَيْهِمْ أَبْوَابَ كُلِّ شَيْءٍ حَتَّى إِذَا فَرِحُوْا بِمَا أُوْتُوْا أَخَذْنَاهُمْ بَغْتَةً فَإِذَا هُمْ مُبْلِسُوْنَ) رَوَاهُ أَحْمَدُ

5201. (47) [3/1435 ఆధారాలు ఆమోదయోగ్యం]

‘ఉఖ్‌బహ్ బిన్‌ ‘ఆమిర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”అల్లాహ్‌, దాసుడు పాపాలు చేస్తున్నా అనుగ్రహిస్తూ ఉంటే, అతనికి వ్యవధి ఇస్తున్నాడని భావించాలి. ఆ తరువాత దీన్ని సమర్థిస్తూ ఈ ఆయతును పఠించారు. ”ఆ పిదప వారికి చేయబడిన బోధనను వారు మరచిపోగా, మేము వారికొరకు సకల (భోగభాగ్యాల) ద్వారాలను తెరిచాము, చివరకు వారు తమకు ప్రసాదించబడిన ఆనందాలలో నిమగ్నులై ఉండగా, మేము వారిని అకస్మాత్తుగా (శిక్షించటానికి) పట్టుకున్నాము, అప్పుడు వారు నిరాశులయ్యారు.” (అల్ అన్‌ఆమ్‌, 6:44) [23]  (అ’హ్మద్‌)

5202 – [ 48 ] ( لم تتم دراسته ) (3/1436)

وَعَنْ أَبِيْ أُمَامَةَ أَنَّ رَجُلًا مِنْ أَهْلِ الصُّفَّةِ تُوُفِّيَ وَتَرَكَ دِيْنَارًا. فَقَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “كَيَّةٌ” قَالَ: ثُمَّ تُوُفِّيَ آخَرُفَتَرَكَ دِيْنَارَيْنِ. فَقَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم : “كَيَّتَانِ”. رَوَاهُ أَحْمَدُ وَالْبَيْهَقِيُّ فِيْ “شُعَبِ الْإِيْمَانِ”.

5202. (48) [3/1436 అపరిశోధితం]

అబూ ఉమామహ్ (ర) కథనం: అస్‌’హాబు స్సుప్ఫహ్” లోని ఒక అనుచరుడు మరణించాడు. అతడు కేవలం ఒక్క దీనార్‌ వదలివెళ్ళాడు. ప్రవక్త (స) ఈ ఒక్క దీనార్‌  ఒక మచ్చ.

‘హదీసు’ ఉల్లేఖకులు అబూ ఉమామహ్ (ర) కథనం, ”మరి కొన్నిదినాల తర్వాత మరో అనుచరుడు మరణించాడు. అతడు రెండు దీనార్లు వదలివెళ్ళాడు. అప్పుడు ప్రవక్త (స) ఈ రెండు, రెండు మచ్చలవంటివి” అన్నారు. [24](అ’హ్మద్‌, బైహఖీ-షు’అబిల్ఈమాన్)

5203 – [ 49 ] ( لم تتم دراسته ) (3/1436)

وَعَنْ مُعَاوِيَةَ أَنَّهُ دَخَلَ عَلَى خَالِهِ أَبِيْ هَاشِمِ بْنِ عُتْبَةَ يَعُوْدُهُ فَبَكَى أَبُوْ هَاشِمٍ فَقَالَ: مَا يُبْكِيْكَ يَا خَالُ؟ أَوَجَعٌ يُشْئِزُكَ أَمْ حِرْصٌ عَلَى الدُّنْيَا؟ قَالَ: كُلَّا وَلَكِنَّ رَسُوْلَ اللهِ عَهِدَ إِلَيْنَا عَهْدًا لَمْ آخُذْ بِهِ.قَالَ: وَمَا ذَلِكَ؟ قَالَ: سَمِعْتُهُ يَقُوْلُ: “إِنَّمَا يَكْفِيْكَ مِنْ جَمْعِ الْمَالِ خَادِمٌ وَمَرْكَبٌ فِيْ سَبِيْلِ اللهِ”. وَإِنِّيْ أَرَانِيْ قَدْ جَمَعْتُ. روَاهُ أَحْمَدُ وَالتِّرْمِذِيُّ وَالنَّسَائِيُّ وَابْنُ مَاجَهُ

5203. (49) [3/1436అపరిశోధితం]

ము’ఆవియహ్‌ (ర) కథనం: అతను తన మామ అబూ హాషిమ్‌ బిన్‌ ‘ఉత్‌హ్ ను పరామర్శించ టానికి వెళ్ళారు. అబూ హాషిమ్‌ అతన్ని చూచి ఏడ్వసాగారు. దానికి ము’ఆవియా (ర) ”మామగారు తమరు ఎందుకు ఏడుస్తున్నారు, ఏ విషయం వల్ల తమరు ఏడుస్తున్నారు? తమరు వ్యాధివల్ల ఏడుస్తున్నారా? లేదా ప్రాపంచిక వ్యామోహం వల్ల ఏడుస్తున్నారా?” అని అడిగారు. అప్పుడు అబూ హాషిమ్‌ ”ఎంత మాత్రం కాదు, వీటిలో ఏదీ కాదు. కాని అన్నిటికంటే విచారకరమైన విషయం ఏమిటంటే, ప్రవక్త (స) మాకు వాఙ్మూలం చేసి వెళ్ళారు, కాని మేము వాటిని నెరవేర్చ లేక పోయాము, దాన్ని ఆచరించలేక పోయాం,” అని అన్నారు. అప్పుడు ము’ఆవియ (ర) ‘ఆ చెప్పిన విషయం ఏమిటి?’ అని అన్నారు. దానికి అబూ హాషిమ్‌ (ర) ప్రవక్త (స)  ఇలా అంటూ ఉండగా నేను విన్నాను, ” ‘నీవు ధన సంపదలు కూడబెట్టాలంటే ఒక బానిస, దైవమార్గంలో పోరాడటానికి ఒక వాహనం చాలు.’ కాని నేను ప్రవక్త (స) అన్నదానికంటే అధిక ధనాన్ని కూడ బెట్టానని, అనిపిస్తుంది. ఈ విషయం గురించే విచారిస్తూ ఏడుస్తున్నాను,” అని అన్నారు. (అ’హ్మద్‌, తిర్మిజి, నసాయి’, ఇబ్నె మాజహ్)

5204 – [ 50 ] ( لم تتم دراسته ) (3/1436)

وَعَنْ أُمِّ الدَّرْدَاءِ قَالَتْ: قُلْتُ: لِأَبِيْ الدَّرْدَاءِ: مَالَكَ لَا تَطْلُبُ كَمَا يَطْلُبُ فُلَانٌ؟ فَقَالَ: إِنِّيْ سَمِعْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ: “إِنَّ أَمَامَكُمْ عَقَبَةً كُؤُوْدًا لَايَجُوْزُهَا الْمُثْقَلُوْنَ”. فَأُحِبُّ أَنْ أَتَخَفَّفُ لِتِلْكَ الْعَقَبَةِ

5204. (50) [3/1436 అపరిశోధితం]

ఉమ్మె దర్‌దా’ (ర) కథనం: నేను నా భర్త అబూ దర్‌దా’తో ‘మీకేమయింది? ఫలానా వ్యక్తి అడిగినట్లు మీరు కూడా ప్రవక్త (స)ను ఆర్థిక సహాయం, లేదా ఏదైనా పదవి అడగరెందుకు?’ అని అన్నాను. సమాధానంగా అబూదర్‌దా’ ప్రవక్త (స) ఇలా ప్రవచిస్తూ ఉండగా నేను విన్నాను, ”మీ ముందు ఒక ప్రమాదకరమైన కొంత ప్రాంతం ఉంది. బరువు కలిగి ఉన్నవారు దాన్ని దాటలేరు. అందువల్ల నేను తేలికగా ఉండాలని కోరుతున్నాను. ఫలితంగా సులువుగా దాన్ని  దాట వచ్చును. (ఆ ప్రమాద కరమైన కొండప్రాంతం ప్రాపంచిక ధనసంపదలు, పదవులు, ఇతరుల బాధ్యతలు.)” [25] (బైహఖీ)

5205 – [ 51 ] ( لم تتم دراسته ) (3/1436)

وعَنْ أنس قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “هَلْ مِنْ أَحَدٍ يَمْشِيْ عَلَى الْمَاءِ إِلَّا ابْتَلَّتْ قَدَمَاهُ؟” قَالُوْا: لَا يَا رَسُوْلَ اللهِ قَالَ: “كَذَلِكَ صَاحِبُ الدُّنْيَا لَا يَسْلَمُ مِنَ الذُّنُوْبِ”. رَوَاهُمَا الْبَيْهَقِيُّ فِيْ ” شُعَبِ الْإِيْمَانِ “

5205. (51) [3/1436 అపరిశోధితం]

అనస్‌ (ర) కథనం: ‘ఎవరైనా నీటిపై నడిస్తే రెండు పాదాలు తడవకుండా ఉంటాయా?’ అని ప్రశ్నించారు. దానికి ప్రజలు ‘అలా ఎంతమాత్రం జరగదు’ అని అన్నారు. దానికి ప్రవక్త(స) సమాధాన మిస్తూ అదేవిధంగా ప్రపంచంలో ఎవరూ పాపాల నుండి తప్పించుకోలేడు. (బైహఖీ-షు’అబిల్ ఈమాన్) 

అంటే ప్రాపంచిక వాంఛలు గలవాడు పాపాలు చేయకుండా తప్పించుకోలేడు.

5206 – [ 52 ] ( لم تتم دراسته ) (3/1436)

وعَنْ جُبَيْرِبْنِ نُفَيْرٍ رَضِيَ اللهُ عَنْهُ مُرْسَلًا قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَا أُوْحِيَ إِلَيَّ أَنْ أَجْمَعَ الْمَالَ وَأَكُوْنَ مِنَ التَّاجِرِيْنَ وَلَكِنْ أُوْحِيَ إِلَيَّ أَنْ (سَبِّحْ بِحَمْدِ رَبِّكَ وَكُنْ مِنْ السَّاجِدِينَ وَاعْبُدْ رَبَّكَ حَتَّى يَأْتِيَكَ الْيَقِينُ،15: 98-99 ) رَوَاهُ فِيْ شَرْحِ السُّنَّةِ”. وَأَبُوْ نُعَيْمٍ فِيْ”الْحِلْيَةِ” عَنْ أَبِيْ مُسْلِمٍ.

5206. (52) [3/1436అపరిశోధితం]

జుబైర్‌ బిన్‌ నఫీర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ‘నాకు ధనం కూడబెట్టమని దైవవాణి రాలేదు. ఇంకా నన్ను ధనసంపదలు కూడబెట్టమని ఆదేశమివ్వ బడలేదు. నన్ను కేవలం దైవస్తోత్రం చేయమని, దైవ పరిశుద్ధతను కొనియాడమని ఆదేశించడం జరిగింది.’ ”కావున నీవు నీ ప్రభువు పవిత్రతను కొనియాడుతూ, స్తోత్రంచేస్తూ ఉండు. మరియు సాష్టాంగం (సజ్దా) చేసే వారిలో చేరు. మరియు తప్పక రాబోయే ఆ అంతిమ ఘడియ (మరణం) వచ్చేవరకు నీ ప్రభువును ఆరాధిస్తూ ఉండు.” (అల్ హిజ్ర్, 15:98-99). (షర్‌’హుస్సున్నహ్‌, అబూ న’ఈమ్ హిల్యలో- అబూ ముస్లిం  ద్వారా)

5207 – [ 53 ] ( لم تتم دراسته ) (3/1437)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَنْ طَلَبَ الدُّنْيَا حَلَالًا اِسْتِعْفَافًا عَنِ الْمَسْأَلَةِ وَسَعْيًا عَلَى أَهْلِهِ وَتَعَطُّفًا عَلَى جَارِهِ لَقِيَ اللهُ تَعَالى يَوْمَ الْقِيَامَةِ وَوَجْهُهُ مِثْلُ الْقَمَرِ لَيْلَةَ الْبَدْرِ. وَمَنْ طَلَبَ الدُّنْيَا حَلَالًا مُكَاثِرًامُفَاخِرًا مُرَائِيًا لَقِيَ اللهُ وَهُوَعَلَيْهِ غَضْبَانُ”. رَوَاهُ الْبَيْهَقِيُّ فِيْ”شُعَبِ الْإِيْمَانِ”وَأَبُوْ نَعِيْمٍ فِيْ “الْحِلْيَةِ”

5207. (53) [3/1437అపరిశోధితం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త ప్రవచనం, ”బిచ్చ మెత్తుకునే అవమానానికి దూరంగా ఉంటూ, తన భార్యా పిల్లలను పోషించే, తన పొరుగువారికి మేలు చేసే ఉద్దేశ్యంతో ధర్మంగా సంపాదిస్తే, తీర్పు దినం నాడు అల్లాహ్‌ (త) అతన్ని కలిసినపుడు అతని ముఖం వెన్నెల రాత్రిలా మెరుస్తూ ఉంటుంది. అదేవిధంగా ఇతరులపై తన గొప్పతనాన్ని చాటడానికి ధర్మంగా సంపాదిస్తే, అల్లాహ్‌ (త) తీర్పుదినం నాడు అసహ్యించుకుంటూ కలుస్తాడు. [26] (బైహఖీ – షు’అబిల్ ఈమాన్, అబూ  న’ఈమ్ –  హిల్య)

5208 – [ 54 ] ( ضعيف جدا ) (3/1437)

وَعَنْ سَهْلِ بْنِ سَعْدٍ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم قَالَ: “إِنَّ هَذَا الْخَيْرَخَزَائِنُ لِتِلْكَ الْخَزَائِنِ مَفَاتِيْحُ فَطُوْبَى لِعَبْدٍ جَعَلَهُ اللهُ مِفْتَاحًا لِلْخَيْرِ مِغْلَاقًا لِلشَّرِّ. وَوَيْلٌ لِعَبْدٍ جَعَلَهُ اللهُ مِفْتَاحًا لِلشَّرِّ مِغْلَاقًا لِلْخَيْرِ”. رَوَاهُ ابْنُ مَاجَهُ

5208. (54) [3/1437అతి బలహీనం]

సహల్‌ బిన్‌ స’అద్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”నిస్సందేహంగా ఈ మేళ్ళు నిధులవంటివి. ఈ నిధులకు తాళాలు ఉన్నాయి. ఎవరికి వాటి తాళపు చెవులు మంచిని తెరవటానికి, చెడును మూయటానికి లభిస్తాయో వారు చాలా అదృష్ట వంతులు. అదేవిధంగా ఎవరికి ఈ తాళపు చెవులు చెడును తెరవటానికి, మంచిని మూయటానికి లభిస్తాయో వారు దురదృష్ట వంతులు.” [27]  (ఇబ్నె మాజహ్)

5209 – [ 55 ] ( لم تتم دراسته ) (3/1437)

وَعَنْ عَلِيٍّ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِذَا لَمْ يُبَارَكْ لِلْعَبْدِ فِيْ مَالِهِ جَعَلَهُ فِي الْمَاءِ وَالطِّيْنِ”.

5209. (55) [3/1437అపరిశోధితం]

‘అలీ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”అల్లాహ్‌ (త) శుభం ప్రసాదించని ధనాన్ని దాసుడు మట్టి, నీళ్ళలో ఉపయోగిస్తాడు. అంటే భవన నిర్మాణంలో ఖర్చు పెడతాడు.” (బైహఖీ)

అంటే అనవసరంగా భవన నిర్మాణంలో ఖర్చుచేసే ధనంలో శుభం ఉండదు. అదేవిధంగా దైవప్రీతి కోసం దైవమార్గంలో ఖర్చు చేసే ధనంలో శుభం ఉంటుంది.

5210 – [ 56 ] ( لم تتم دراسته ) (3/1437)

وعَنِ ابْنِ عُمَرَ أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم قَالَ: “اتَّقُواالْحَرام فِي الْبُنْيَانِ فَإِنَّهُ أَسَاسُ الْخَرَابِ”. رَوَاهُمَا الْبَيْهَقِيُّ فِيْ” شُعَبِ الْإِيْمَانِ “

5210. (56) [3/1437అపరిశోధితం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘ఉమర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”భవనాలు, నివాసాలు కట్టడంలో నిషిద్ధ కార్యాలకు దూరంగా ఉండండి, ఎందుకంటే ఇది నిర్మించడం కాదు, ధ్వంసం చేయడం అవుతుంది.” [28] (బైహఖీ – షు’అబిల్ ఈమాన్)

5211 – [ 57 ] ( لم تتم دراسته ) (3/1437)

وعَنْ عَائِشَةَ رَضِيَ اللهُ عَنْهَا عَنِ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم قَالَ: “اَلدُّنْيَا دَارُ مَنْ لَا دَارَ لَهُ. وَمَالُ مَنْ لَا مَالَ لَهُ وَلَهَا يَجْمَعُ مَنْ لَا عَقْلَ لَهُ”. روَاهُ أَحْمَدُ وَالْبَيْهَقِيُّ فِيْ “شُعَبِ الْإِيْمَانِ”.

5211. (57) [3/1437 అపరిశోధితం]

‘ఆయి’షహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”పరలోక నివాసం లేని వాడికే ప్రాపంచిక నివాసం. అదేవిధంగా పరలోకంలో ధనసంపదలు లేనివాడికే ఇహలోకం ధనం ఉంటుంది. బుద్ధిలేనివాడే ధనం కూడబెడతాడు.” [29] (అ’హ్మద్‌, బైహఖీ/షు’అబిల్ ఈమాన్)

5212 – [ 58 ] (لا أصل له، مرفوعا ) (3/1437)

وَعَنْ حُذَيْفَةَ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: سَمِعْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ فِيْ خُطْبَتِهِ: “الْخَمْرُجَمَاعُ الْإِثْمِ وَالنِّسَاءُ حَبَائِلُ الشَّيْطَانِ وَحُبُّ الدُّنْيَا رَأْسُ كُلِّ خَطِيْئَةٍ”  .قَالَ: وَسَمِعْتُهُ يَقُوْلُ: “أَخِّرُوْا النِّسَاءَ حَيْثُ أَخَّرَهُنَّ اللهُ”. رَوَاهُ رَزِيْنٌ.

5212. (58) [3/1437నిరాధార సహచరుని ప్రోక్తం]

హుజై’ఫహ్ (ర) కథనం: ప్రవక్త (స)ఇలా ప్రవచిస్తూ ఉండగా నేను విన్నాను, ”మద్యపానం పాపాలన్నిటికీ మూలం. స్త్రీలు షై’తాన్‌ వలలు. ప్రాపంచిక వ్యామోహం, పాపాలన్నిటికీ మూలం.” హుజై’ఫహ్ (ర) కథనం: ప్రవక్త (స) ఇలా ప్రవచిస్తూ ఉండగా నేను విన్నాను, ‘స్త్రీలను వెనుక ఉంచండి, ఎందుకంటే అల్లాహ్‌ (త) వారిని వెనుక ఉంచాడు.” [30]  (ర’జీన్‌)

5213 – [ 59 ] ( لم تتم دراسته ) (3/1438)

وَرَوَى الْبَيْهَقِيُّ مِنْهُ فِيْ”شُعَبِ الْإِيْمَانِ”عَنِ الْحَسَنِ مُرْسَلًا:”حُبُّ الدُّنْيَا رَأْسُ كُلّ خَطِيْئَةٍ ”  

5213. (59) [3/1438అపరిశోధితం]

బైహఖీ కూడా షు’అబిల్ ఈమాన్ లో, ‘హసన్ (ర) ద్వారా ఉల్లేఖించారు. ప్రాపంచిక వ్యామోహం, పాపాలన్నిటికీ మూలం.

5214 – [ 60 ] ( لم تتم دراسته ) (3/1438)

وعَنْ جَابِرٍ رَضِيَ اللهُ عَنْهُ قَالَ:قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم:”إِنَّ أَخْوَفَ مَا أَتَخَوَّفُ عَلَى أُمَّتِيْ الْهَوى وَطُوْلُ الْأَمَلِ فَأَمَّا الْهَوَى فَيَصُدُّ عَنِ الْحَقِّ وَأَمَّا طُوْلُ الْأَمَلِ فَيُنْسِي الْآخِرَةَ وَهَذِهِ الدُّنْيَا مُرْتَحِلَةٌ ذَاهِبَةٌ وَهَذِهِ الْآخِرَةُ مُرْتَحِلَةٌ قَادِمَةٌ وَلِكُلِّ وَاحِدَةٍ مِنْهُمَا بَنُوْنُ. فَإِنِ اسْتطَعْتُمْ أَنْ لَا تَكُوْنُوْا بَنِي الدُّنْيَا فَافْعضوُاْ فَإِنَّكُمُ الْيَوْمَ فِيْ دَارِالْعَمَلِ وَلَا حِسَابَ وَأَنْتُمْ غَدًا فِيْ دَارِ الْآخِرَةِ وَلَا عَمَلَ”. رَوَاهُ الْبَيْهَقِيُّ فِيْ” شُعَبِ الْإِيْمَانِ”.

5214. (60) [3/1438 అపరిశోధితం]

జాబిర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”నేను నా అనుచర సమాజం గురించి ఈ రెండు విషయాల పట్ల చాలా అధికంగా భయపడుతున్నాను. ఒకటి మనో కాంక్షలు, రెండవది, అధిక ఆయుష్షు కోరటం. మనో కాంక్షలు పరలోకాన్ని మరపింపజేస్తాయి. ఈ ప్రపంచ జీవితం ముగుస్తుంది. పరలోకం రానున్నది. ఈ రెండు విషయాలను కోరే వారున్నారు. మీకు సాధ్యం అయితే మీరు దాన్ని కోరేవారు కాకూడదు. ఎందుకంటే  ఈనాడు ఆచరించే అవకాశం ఉంది. అంటే ఈ ఐహిక జీవితంలో పుణ్యం చేసుకోండి. ఈనాడు విచారణ లేదు. కాని రేపు మీరు పర లోకంలో వెళ్ళనున్నారు. అక్కడ ఆచరణ లేదు, విచారణే విచారణ. [31]  (బైహఖీ – షు’అబిల్ ఈమాన్)  

5215 – [ 61 ] ( لم تتم دراسته ) (3/1438)

وَعَنْ عَلِيٍّ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: اِرْتَحَلَتشالدُّنْيَا مُدْبِرَةً وَارْتَحَلَتِ الْآخِرَةُ مُقْبِلَةً. وَلِكُلِّ وَاحِدَةٍ مِنْهُمَا بَنُوْنَ فَكُوْنُوْا مِنْ أَبْنَاءِ الْآخِرَةِ وَلَا تَكُوْنُوْا مِنْ أَبْنَاءِ الدُّنْيَا فَإِنَّ الْيَوْمَ عَمَلٌ وَلَا حِسَابَ وَغَدًا حِسَابٌ وَلَا عَمَلَ. رَوَاهُ الْبُخَارِيُّ.

5215. (61) [3/1438 అపరిశోధితం]

‘అలీ (ర) కథనం: ఈ ప్రాపంచిక జీవితం వెళ్ళి పోతుంది, ముఖం త్రిప్పి ఉంది. పరలోకం వస్తుంది. అది ముందు నిలబడి ఉంది. ఈ రెంటినీ కోరేవారున్నారు. మీరు పరలోకం కోరేవారు కండి. ఇహలోకం కోరేవారు కాకండి. ఎందుకంటే ఈ నాడు ప్రపంచంలో ఆచరించే అవకాశం ఉంది, విచారణ లేదు. కాని రేపు తీర్పుదినం నాడు విచారణే ఉంటుంది. ఆచరించే అవకాశం ఉండదు. (బు’ఖారీ)  

ఇది ‘అలీ (ర) అభిప్రాయం. కాని ఇది ప్రామాణిక ‘హదీసు’కు అనుగుణంగా ఉంది.

5216 – [ 62 ] ( لم تتم دراسته ) (3/1438)

وَعَنْ عَمْرٍو رَضِيَ اللَّهُ عَنْهُ أَنَّ النَّبِيَّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ خَطَبَ يَوْمًا فَقَالَ فِي خُطْبَتِهِ: « أَلَا إِنَّ الدُّنْيَا عَرَضٌ حَاضِرٌ يَأْكُلُ مِنْهُ الْبَرُّ وَالْفَاجِرُ أَلا وَإِن الآحرة أَجَلٌ صَادِقٌ وَيَقْضِي فِيهَا مَلِكٌ قَادِرٌ أَلَا وَإِنَّ الْخَيْرَ كُلَّهُ بِحَذَافِيرِهِ فِي الْجَنَّةِ أَلَا وَإِنَّ الشَّرَّ كُلَّهُ بِحَذَافِيرِهِ فِي النَّارِ أَلَا فَاعْمَلُوا وَأَنْتُمْ مِنَ اللَّهِ عَلَى حَذَرٍ وَاعْلَمُوا أَنَّكُمْ مَعْرُوضُونَ عَلَى أَعْمَالِكُمْ (فَمَنْ يَعْمَلْ مِثْقَالَ ذَرَّةٍ خَيْرًا يَرَهُ وَمَنْ يَعْمَلْ مِثْقَالَ ذَرَّةٍ شرا يره) » . للشَّافِعِيّ

5216. (62) [3/1438 అపరిశోధితం]

అమ్ర్ (ర) కథనం: ఒకరోజు ప్రవక్త(స)  ఇలా ప్రసంగించారు, ‘గుర్తుంచుకోండి! ఈ ప్రపంచం ముందు ఉంది, దీనివల్ల మంచివారు,చెడ్డవారు అందరూ లాభం పొందుతారు. గుర్తుంచుకోండి! పరలోకం ఆలస్యంగా వస్తుంది. తప్పకుండా వస్తుంది. శక్తి వంతుడైన అల్లాహ్ (త) అందులో తీర్పుచేస్తాడు. గుర్తుంచుకోండి! అన్నీ రకాల పుణ్యకార్యాలు స్వర్గంలోనికి తీసుకువెళతాయి. గుర్తుంచుకోండి! అన్నీరకాల పాపకార్యాలు నరకంవైపు నెట్టివేస్తాయి. గుర్తుంచుకోండి! ఆచరిస్తూ ఉండండి, అల్లాహ్ (త) కు భయపడుతూ ఉండండి .మిమ్మల్ని మీ కార్యాల వద్దకు చేర్చుతాడు . రవ్వంత పుణ్యం చేసిన వాడు, తప్పకుండా దాని ప్రతిఫలాన్ని పొందుతాడు. అదేవిధంగా రవ్వంత పాపం చేసినవాడు కూడా దాని శిక్షకు గురవుతాడు . (షాఫ’యీ)

5217 – [ 63 ] ( ضعيف ) (3/1439)

وعَنْ شَدَّادٍ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: سَمِعْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ: “يَا أَيُّهَا النَّاسُ إِنَّ الدُّنْيَا عَرْضٌ حَاضِرٌ يَأْكُلُ مِنْهَا الْبَرُّ وَالْفَاجِرُ وَإِنَّ الْاخِرَةَ وَعْدٌ صَادِقٌ يَحْكُمُ فِيْهَا مَلِكٌ عَادِلٌ قَادِرٌيُحِقُّ فِيْهَا الْحَقَّ وَيُبْطِلُ الْبَاطِلَ كُوْنُوْا مِنْ أَبْنَاءِ الْآخِرَةِ وَلَا تَكُوْنُوْا مِنْ أَبْنَاءِ الدُّنْيَا فَإِنَّ كُلَّ أُمٍّ يَتْبَعُهَا وَلَدُهَا”.

5217. (63) [3/1439 బలహీనం]

షద్దాద్‌ (ర) కథనం: ప్రవక్త (స)ఇలా ప్రవచిస్తూ ఉండగా నేను విన్నాను, ”ఈ ప్రాపంచిక జీవితం తాత్కాలిక మైనది. ఇది శాశ్వతం కాదు. ఇందులో లాభదాయకమైన వస్తువులు ఉన్నాయి. వాటిని మంచివారు, చెడ్డవారు అందరూ తింటారు, త్రాగుతారు. పరలోకం అనేది ఒక వాగ్దానం. అందులో వాస్తవ చక్రవర్తి తీర్పుచేస్తాడు. సత్యాన్ని సత్యంగా అసత్యాన్ని అసత్యంగా చూపెడతాడు. మీరు పరలోకం కోరేవారు కండి. ఐహిక జీవితం కోరేవారు కాకండి. ఎందుకంటే ప్రతి బిడ్డ తల్లిని అనుసరిస్తుంది.  (అబూ న’యీమ్‌)

5218 – [ 64 ] ( صحيح ) (3/1439)

وَعَنْ أَبِي الدَّرْدَاءِ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَا طَلَعَتِ الشَّمْسُ إِلَّا وَبِجَنْبَتيهَا مَلَكَانِ يُنَادِيَانِ يَسْمَعَانِ الْخَلَائِقَ غَيْرَالثَّقَلَيْنِ: يَا أَيُّهَا النَّاسُ هَلُمُّوْا إِلى رَبِّكُمْ مَا قَلَّ وَكَفَى خَيْرٌ مِمَّا كَثُرَ وَأَلْهَى”. رَوَاهُمَا أَبُوْ نُعَيْمٍ فِي “الْحِلْيَةِ”.

5218. (64) [3/1439దృఢం]

అబూ దర్దా’ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ప్రతి రోజూ సూర్యుడుఉదయించినపుడు దాని రెండు వైపుల ఇద్దరు దైవదూతలు ఉంటారు. వాళ్ళు బిగ్గరగా సృష్టిరాసులన్నీ విన్నట్లు ఇలా అంటారు, కాని మానవులు, జిన్నులు మాత్రం వినలేరు. ఆ దైవదూతలు ఇలా ప్రకటిస్తూ తిరుగుతుంటారు: ”ప్రజలారా! మీరు మీప్రభువు వైపునకు రండి! అయితే అధికంగా ఉండి, భోగవిలాసాల్లో, ఆట పాటల్లో ఖర్చుచేసే దైవానికి దూరంచేసే ధనంకంటే తక్కువగా ఉండి, సరిపోయేధనం మేలని గుర్తుంచుకోండి.” (అబూ ను’ఐమ్‌-‘హిల్యహ్)

5219 – [ 65 ] ( لم تتم دراسته ) (3/1439)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ رَضِيَ اللهُ عَنْهُ يَبْلُغُ بِهِ قَالَ: “إِذَا مَاتَ الْمَيِّتُ قَالَتِ الْمَلَائِكَةُ: مَا قَدَّمَ؟ وَقَالَ بَنُوْآدَمَ: مَا خَلَّفَ؟” رَوَاهُ الْبَيْهَقِيُّ فِيْ “شُعَبِ الْإِيْمَانِ”.

5219. (65) [3/1439అపరిశోధితం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఎవరైనా మరణిస్తే, దైవదూతలు అతన్ని పరలోకానికి ఏమి సిద్ధంచేసావు?” అని ప్రశ్నిస్తారు. కాని ప్రజలు అతడు మరణిస్తూ ఏమి వదలివెళ్లాడు? అని అంటారు. (బైహఖీ)

5220 – [ 66 ] ( لم تتم دراسته ) (3/1439)

وَعَنْ مَالِكٍ رَضِيَ اللهُ عَنْهُ: أَنَّ لُقْمَانَ قَالَ لِاِبْنِهِ: “يَا بُنَيَّ إِنَّ النَّاسَ قَدْ تَطَاوَلَ عَلَيْهِمْ مَا يُوْعَدُوْنَ وَهُمْ إِلَى الْآخِرَةِ سِرَاعًا يَذْهَبُوْنَ وَإِنَّكَ قَدِاسْتَدْبَرْتَ الدُّنْيَا مُنْذُ كُنْتَ وَاسْتَقْبَلْتَ الْآخِرَةَ وَإِنَّ دَارًا تَسِيْرُإِلَيْهَا أَقْرَبُ إِلَيْكَ مِنْ دَارٍ تَخْرُجُ مِنْهَا”. رَوَاهُ رَزِيْنٌ.

5220. (66) [3/1439 అపరిశోధితం]

ఇమామ్‌ మాలిక్‌ (ర) కథనం: లుఖ్మాన్‌ (అ) తన కుమారునికి బోధిస్తూ ఇలా హితవుచేసారు, ”ఓ నా కుమారా! ప్రజలతో వాగ్దానం చేయబడి, అంటే, మరణానంతర జీవితం, సమాధి శిక్ష చాలా కాలం అయింది. అంటే అప్పటి నుండి ఆ వాగ్దానం గురించి హెచ్చరించ బడుతూ ఉంది. అయితే ప్రజలు చాలా వేగంగా పరలోకం వైపు ముందుకు సాగిపోతున్నారు. ”ఓ నా కుమారా! నువ్వు పుట్టినప్పటి నుండి, ప్రపం చానికి దూరం అవుతూ ఉన్నావు. నువ్వు చాలా వేగంగా పరలోకం వైపు పయనమవుతున్నావు. నీవు శాశ్వత నివాసం వైపునకు దగ్గరవుతున్నావు.” (ర’జీన్)

ప్రజలకు తీర్పుదినం దూరంగా ఉందని చెప్పటం జరుగుతుంది, కాని ప్రతి నిమిషం దానివైపే పరిగెడుతూ ఉన్నది.

5221 – [ 67 ] ( لم تتم دراسته ) (3/1439)

وَعَنْ عَبْدِ اللهِ بْنِ عَمْرٍو رَضِيَ اللهُ عَنْهُمَا قَالَ: قِيْلَ لِرَسُوْلِ اللهِ صلى الله عليه وسلم: أَيُّ النَّاسِ أَفْضَلُ؟ قَالَ: “كُلُّ مَخْمُوْمِ الْقَلْبِ صَدُوْقِ اللِّسَانِ”. قَالُوْا: صَدُزْقُ اللِّسَانِ نَعْرِفُهُ فَمَا مَخْمُوْمُ الْقَلْبِ؟ قَالَ: “هُوَ النَّقِيُّ التَّقِيُّ لَا إِثْمَ عَلَيْهِ وَلَا بَغي وَلَا غِلَّ وَلَا حَسَدَ”. رَوَاهُ ابْنُ مَاجَهُ وَالْبَيْهَقِيُّ فِيْ”شُعَبِ الْإِيْمَانِ”.  

5221. (67) [3/1439అపరిశోధితం]

అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘అమ్ర్‌ (ర) కథనం: ప్రవక్త (స)ను ‘అందరికంటే మంచివారెవరు’ అని ప్రశ్నించడం జరిగింది. ప్రవక్త (స), ”నిర్మల హృదయుడు, సత్య వంతుడు” అని సమాధానం ఇచ్చారు. దానికి ప్రజలు, ‘ప్రవక్తా! సత్యవంతుడంటే మాకు తెలుసు. కాని నిర్మల హృదయుడు అంటే ఏమిటి?’ అని విన్న వించుకున్నారు. అప్పుడు ప్రవక్త (స), ”హృదయ పరిశుద్ధత కలిగి ఉన్న దైవభీతిగల భక్తుడు. పాపాలకు, ఈర్ష్యా ద్వేషాలకు, శతృత్వానికి దూరంగా ఉన్న వాడు.’ అంటే పవిత్ర హృదయుడు, ఇతర ముస్లిముల పట్ట ఎటువంటి శతృత్వం, ద్వేషం, కుట్రలు, కుతంత్రాలు లేని దైవభీతిపరుడు. అతనిలో పాపాలుగాని, దుర్మార్గంగాని లేనివాడు. అదేవిధంగా సత్యం పలికే వాడు, అసత్యం పలకనివాడు.” (ఇబ్నె మాజహ్, బైహఖీ/-షు’అబిల్ ఈమాన్)

5222 – [ 68 ] ( لم تتم دراسته ) (3/1440)

وَعَنْهُ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم قَالَ: “أَرْبَعٌ إِذَا كُنَّ فِيْكَ فَلَا عَلَيْكَ مَا فَاتَكَ مِنَ الدُّنْيَا: حِفْظُ أَمَانَةٍ وَصِدْقُ حَدِيِثٍ وَحُسْنُ خَلِيْقَةٍ وَ عِفَّةٌ فِي طُعْمَةٍ”. رَوَاهُ أَحْمَدُ وَالْبَيْهَقِيُّ فِيْ “شُعَبِ الْإِيْمَانِ”

5222. (68) [3/1440అపరిశోధితం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘అమ్ర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఒకవేళ నీలో నాలుగు విషయాలు ఉంటే, ప్రపంచంతో నీవు విచారించే పనే లేదు. 1. నీ వద్ద ఉంచిన అమానతును భద్ర పరచటం. 2. సత్యం పలకటం. 3. ఉత్తమ గుణాలు కలిగి ఉండటం. 4. అన్నపానీయాల్లో అప్రమత్తంగా ఉండటం. ఇవి నాలుగు విషయాలు, వీటికి ప్రపంచంలో విలువలేదు. కాని పరలోకంలో వీటికి ప్రతిఫలం  లభిస్తుంది. (బైహఖీ-/షు’అబిల్ ఈమాన్)

5223 – [ 69 ] ( لم تتم دراسته ) (3/1440)

وَعَنْ مَالِكٍ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: بَلَغَنِيْ أَنَّهُ قِيْلَ لِلُقْمَانَ الْحَكِيْمِ: مَا بَلَغَ بِكَ مَا تَرَى؟ يَعْنِي الْفَضْلَ قَالَ: صِدْقَ الْحَدِيْثِ وَأَدَاءُ الْأَمَانَةِ وَتَرْكُ مَا لَا يَعْنِيْنِيْ. رَوَاهُ فِيْ “الْمُوَطَّأ”و أَحْمَدُ .

5223. (69) [3/1440 అపరిశోధితం]

ఇమామ్‌ మాలిక్‌ (ర) కథనం: నాకు ఈ వార్త అందింది. ”లుఖ్మాన్‌ (అ)ను ‘మీకీ ఉన్నత స్థానం ఎలా లభించింది,’ అని ప్రశ్నించడం జరిగింది. దానికి లుఖ్మాన్‌ (అ), ‘సత్య సంధత, సత్యం,’ అని సమాధానం ఇచ్చారు. అంటే సత్యం పలకటం, అమానతు అప్పగించటం వల్ల ఇంకా వ్యర్థ బాతాఖానీలకు దూరంగా ఉండటం వల్ల.” (మువ’త్తా -ఇమామ్ మాలిక్, అ’హ్మద్)

5224 – [ 70 ] ( ضعيف ) (3/1440)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “تَجِيْءُ الْأَعْمَالُ فَتَجِيْءُ الصَّلَاةُ قَتَقُوْلُ: يَارَبِّ أنَا الصَّلَاةُ. فَيَقُوْلُ: إِنَّكَ عَلَى خَيْرٍ . فَتَجِيْءُ الصَّدَقَةُ فَتَقُوْلُ: يَارَبِّ أَنَا الصَّدَقَةُ. فَيَقُوْلُ: إِنَّكَ عَلَى خَيْرٍ ثُمَّ يَجِيْءُ الصِّيَامُ فَيَقُوْلُ: يَارَبِّ أَنَا الصِّيَامُ. فَيَقُوْلُ: إِنَّكَ عَلَى خَيْرٍ. ثُمَّ تَجِيْءُ الْأَعْمَالُ عَلَى ذَلِكَ. يَقُوْلُ اللهُ تَعَالى: إِنَّكَ عَلَى خَيْرٍ. ثُمَّ يَجِيْءُ الْإِسْلَامِ فَيَقُوْلُ: يَا رَبِّ أَنْتَ السَّلَامُ وَأَنَا الْإِسْلَامُ. فَيَقُوْلُ اللهُ تَعَالى: إِنَّكَ عَلَى خَيْرٍ بِكَ الْيَوْمَ آخُذُ وَبِكَ أُعْطِيْ. قَالَ اللهُ تَعَالى فِيْ كِتَابِهِ: (وَمَنْ يَبْتَغِ غَيْرِ الْإِسْلَامِ دِيْنًا فَلَنْ يُقْبَلَ مِنْهُ وَهُوَ فِيْ الْآخِرَةِ مِنَ الْخَاسِرِيْنَ،3: 85) “. رَوَاهُ أَحْمَدُ.

5224. (70) [3/1440బలహీనం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మానవుని ఆచరణలు ప్రత్యక్షమైవస్తాయి. నమా’జు వచ్చి, ‘ఓ అల్లాహ్ (త)! నేను నమా’జును’ అని అంటుంది. దానికి అల్లాహ్‌ (త) ‘నీవు చాలా మంచిదానివి,’ అని అంటాడు. ఆ తరువాత, ‘సదఖహ్ వచ్చి, ‘ఓ అల్లాహ్‌ (త)! ‘నేను సదఖహ్ను,’ అని అంటుంది. దానికి అల్లాహ్‌ (త) ‘నీవు మంచిదానివే. ‘ అని అంటాడు. ఆ తరువాత రో’జహ్ వచ్చి, ‘ఓ అల్లాహ్ (త)! నేను రో’జహ్ను,’ అని అంటుంది. అల్లాహ్‌ (త), ‘నువ్వు కూడా చాలా మంచిదానివే,’ అని అంటాడు. అదే విధంగా ఇతర సత్కార్యాలు వస్తాయి. అన్నిటితో అల్లాహ్‌ (త) నీవు మంచిదానివే అంటాడు. ఆ తరువాత ఇస్లామ్‌ వస్తుంది. వచ్చి, ‘ఓ అల్లాహ్ (త)! నీవు సలామ్ అంటే శాంతిమయుడవు, నేను ఇస్లామ్‌ను,’ అని అంటుంది. అప్పుడు అల్లాహ్ (త), ‘నీవు మంచి దానివే, ఈనాడు నేను నీ ద్వారానే శిక్షిస్తాను, నీ ద్వారానే ప్రసాదిస్తాను. ”మరియు ఎవడైనా అల్లాహ్ కు విధేయత (ఇస్లామ్) తప్ప ఇతర ధర్మాన్ని అవలం బించగోరితే, , అది ఏ మాత్రం స్వీకరించబడదు. మరియు  అతడు పరలోకంలో నష్టపడేవారిలో చేరుతాడు. ”(ఆల ఇమ్రాన్, 3:85)  [32] (అ’హ్మద్)  

5225 – [ 71 ] ( لم تتم دراسته ) (3/1440)

وعَنْ عَائِشَةَ رَضِيَ اللهُ عَنْهَا قَالَتْ: كَانَ لَنَا سِتْرٌفِيْهِ تَمَاثِيْلُ طَيْرٍ فَقَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: يَا عَائِشَةَ حَوِّلِيْهِ فَإِنِّيْ إِذَا رَأَيْتُهُ ذَكَرْتُ الدُّنْيَا”. رَوَاهُ أَحْمَدُ

5225. (71) [3/1440అపరిశోధితం]

‘ఆయి’షహ్‌ (ర) కథనం: మా వద్ద ఒక తెర ఉండేది. దానిపై పక్షుల బొమ్మలు ఉండేవి. ప్రవక్త (స) దాన్ని చూసి, ” ‘ఆయి’షహ్‌! దీన్ని మార్చివేయి లేదా తొల గించు, ఎందుకంటే నేను దాన్నిచూస్తే ఐహిక భోగ భాగ్యాలు గుర్తుకువస్తాయి,” అని అన్నారు.  (అ’హ్మద్)

5226 – [ 72 ] ( لم تتم دراسته ) (3/1441)

وعَنْ أبي أَيُّوْبَ الْأَنْصَارِيِّ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: جَاءَ رَجُلٌ إِلى النَّبِيِّ صلى الله عليه وسلم فَقَالَ: عِظْنِيْ وَأَوْجِزْ. فَقَالَ: “إِذَا قُمْتَ فِيْ صَلَاتِكَ فَصَلِّ صَلَاةَ مُوَدِّعٍ وَلَا تُكَلِّمْ بِكَلَامِ تَعْذِرُمِنْهُ غَدًا وَأجْمَعِ الْإِيَاسَ مِمَّا فِيْ أَيْدِي النَّاسِ”. رَوَاهُ أَحْمَدُ

5226. (72) [3/1441అపరిశోధితం]

అబూ అయ్యూబ్‌ అ’న్సారీ (ర) కథనం: ప్రవక్త (స) వద్దకు ఒక వ్యక్తి వచ్చి, ‘ఓ ప్రవక్తా! నాకేదైనా బోధించండి,’ అని విన్నవించుకున్నాడు. దానికి ప్రవక్త (స), ”నువ్వు నమా’జులో నిలబడితే అందరినీ మరచి అల్లాహ్‌ (త)ను గుర్తుంచుకో, నోటితో పనికిరాని మాటలు ఏవీ పలకకు, అదేవిధంగా ప్రజల చేతుల్లో ఉన్నవాటి నుండి ఏదీ ఆశించకు.” [33] (అ’హ్మద్)

5227 – [ 73 ] ( لم تتم دراسته ) (3/1441)

وَعَنْ مُعَاذِ بْنِ جَبَلٍ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: لَمَّا بَعَثَهُ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم إِلى الْيَمَنِ خَرَجَ مَعَهُ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم يُوْصِيْهِ وَمُعَاذٌ رَاكِبٌ وَرَسُوْلُ اللهِ صلى الله عليه وسلم يَمْشِيْ تَحْتَ رَاحِلَتِهِ فَلَمَّا فَرَغَ قَالَ: يَا مُعَاذُ إِنَّكَ عَسَى أَنْ لَا تَلْقَانِيْ بَعْدَ عَامِيْ هَذَا وَلَعَلَّكَ أَنْ تَمُرّبِمَسْجِدِيْ هَذَا وَقَبَرِيْ” فَبَكَى مُعَاذٌ جَشَعًا لِفِرَاقِ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم. ثُمَّ الْتَفَتَ فَأَقْبَلَ بِوَجْهِهِ نَحْوَ الْمَدِيْنَةِ فَقَالَ: ” إِنَّ أَوْلَى النَّاسِ بِيْ اَلْمُتَّقُوْنَ مَنْ كَانُوْا وَحَيْثُ كَانُوْا” .(رَوَى الْأَحَادِيْثَ الْأَرْبَعَةَ أَحْمَدُ)

5227. (73) [3/1441 అపరిశోధితం]

ముఆజ్‌బిన్‌ జబల్‌ (ర) కథనం: ప్రవక్త (స) అతన్ని యమన్‌ వైపు పంపినపుడు, అతడు వాహనంపై ఎక్కి బయలు దేరుతున్నప్పుడు, ప్రవక్త (స) అతని గుర్రంతో పాటు నడుస్తూ హితబోధలు చేసారు. వాటి అనంతరం, ‘ఓ ము’ఆజ్‌’! ఈ సంవత్సరం తరువాత నీవు నన్ను కలవలేవు, నువ్వు నా యీ మస్జిద్‌ మరియు నా సమాధి ప్రక్క నుండి వెళ్ళవచ్చు,’ అని అన్నారు. అది విని ము’ఆజ్‌’ (ర) ఏడ్వ సాగారు. ఆ తరువాత ప్రవక్త (స) వెనుతిరిగి, ‘అంటే మదీనహ్ వైపు తిరిగి, దైవభీతి పరులేనాకు సన్నిహితులుగా ఉంటారు, ఏ జాతికి చెందిన వారైనా, ఎక్కడి వారైనా.’ [34] (అ’హ్మద్)

5228 – [ 74 ] ( ضعيف ) (3/1441)

وعَنْ ابْنِ مَسْعُوْدٍ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: تَلَا رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: (فَمَنْ يُرِدِ اللهُ أَنْ يَهْدِيَهُ يَشْرَحْ صدْرَهُ لِلْإِسْلَامِ) فَقَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم:”إِنَّ النُّوْرَإِذَا دَخَلَ الصَّدْرَانْفَسَحَ”. فَقِيْلَ: يَا رَسُوْلَ اللهِ هَلْ لِتِلْكَ مِنْ عَلَمٍ يُعْرِفُ بِهِ؟ قَالَ: “نَعَمْ التَّجَا فِيْ مِنْ دَارِ الْغُرُوْرِ وَالْإِنَابَةُ إِلى دَارِالْخُلُوْدِ وَالْاِسْتِعْدَادُ لِلْمُوْتِ قَبْلَ نُزُوْلِهِ”. وَالْبَيْهَقِيُّ فِيْ “شُعَبِ الْإِيْمَانِ”.

5228. (74) [3/1441 బలహీనం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ మస్‌’ఊద్‌ (ర) కథనం: ప్రవక్త (స) ఈ ఆయతును పఠించారు, ”అల్లాహ్‌ సన్మార్గం ప్రసాదించ గోరే వారి హృదయాన్ని ఇస్లామ్‌ కొరకు వికసింప జేస్తాడు.” (అల్ అన్ ఆమ్, 6:125) – అంటే ‘ఇస్లామ్‌ వెలుగు హృదయంలో చేరగానే, హృదయం విశాల వంతంగా తయారవుతుంది. ప్రవక్త (స)ను, ‘ఓ ప్రవక్తా! దాని చిహ్నం ఏమిటి’ అని ప్రశ్నించడం జరిగింది. దానికి ప్రవక్త (స), ‘ప్రపంచానికి దూరంగా ఉండటం, పరలోకం కోసం పాటుపడటం,’ అని అన్నారు. (బైహఖీ -షు’అబిల్  ఈమాన్)

5229 –] 75[ ؛5230 ]76[ ( ضعيف ) (3/1441)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ وَأَبِيْ خَلَّادٍ رَضِيَ اللهُ عَنْهُمَا: أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم قَالَ: “إِذَا رَأَيْتُمُ الْعَبْدَ يُعْطَى زُهْدًا فِي الدُّنْيَا وَقِلَّةَ مَنْطِقٍ فَاقْتَرِبُوْا مِنْهُ فَإِنَّهُ يُلَقَّى الْحِكْمَةَ”. رَوَاهُمَا الْبَيْهَقِيُّ فِيْ”شُعَبِ الْإِيْمَانِ”.  

5229. (75) & 5230. (76) [3/1441 బలహీనం]

అబూ హురైరహ్‌ మరియు అబూ ‘ఖల్లాద్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఒకవేళ దైవభక్తుల్లో ఎవరైనా ధనంపట్ల అనాశక్తత, అసహ్యం, చాలా తక్కు వగా మాట్లాడటం, అంటే హీనంగా ఉంటే, మీరు అతనికి సమీపంగా ఉండండి. అతనితో పాటు కూర్చోవటం, లేవటం చేయండి. ఎందుకంటే అతనికి వివేకం, మేధోపదేశం  జరిగింది. (బైహఖీ-షు’అబిల్  ఈమాన్)

=====

1- بَابُ فَضْلِ الْفُقَرَاءِ وَمَا كَانَ مِنْ عَيْشِ النَّبِيِّ صلى الله عليه وسلم

1. నిరుపేదల విశిష్టతలు, ప్రవక్త () జీవితం

అంటే దైవారాధకులైన, దైవభీతిపరులైన, నిరు పేదల, అగత్యపరుల ప్రత్యేకతలు. వీళ్ళు పేదరికంలో మగ్గేవారు. కాని ఎవరి ముందూ చేయి చాచే వారు  కారు. ప్రవక్త (స) ఆదర్శం కూడా  ఇదే.

اَلْفَصْلُ الْأَوَّلُ   మొదటి విభాగం 

5231 –] 1 [ ( صحيح ) (3/1442)

عَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم:”رُبَّ أَشْعَثَ مَدْفُوْعٍ بِالْأَبْوَابِ لَوْ أَقْسَمَ عَلَى اللهِ لَأَبَرَّهُ”.رَوَاهُ مُسْلِمٌ .

5231. (1) [3/1442 దృఢం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”చాలామంది ప్రజలు అనేక బాధలకు, కష్టాలకు గురవుతూ ఉంటారు. వారి శరీరంపై ధూళితో నిండిన, మాసిపోయిన దుస్తులు ఉంటాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఒకరి కడపముందుకు వెళితే, వారి పరిస్థితిని చూచి వారిని గెంటి వేయడం జరుగు తుంది. కాని అల్లాహ్‌ (త) వద్ద వారు ఎంతో ప్రీతి పాత్రులు, ఒకవేళ వారు ఏదైనా విషయంలో అల్లాహ్‌ (త) పై ప్రమాణంచేస్తే, అల్లాహ్‌ (త) వారి గౌరవార్థం వారి ప్రమాణాలను నిజం చేసి చూపిస్తాడు.[35]  (ముస్లిమ్‌)

5232 – [ 2 ] ( صحيح ) (3/1442)

وَعَنْ مُصْعَبِ بْنِ سَعْدٍ قَالَ: رَأَى سَعْدٌ أَنَّ لَهُ فَضْلًا عَلَى مَنْ دُوْنَهُ فَقَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “هَلْ تُنْصَرُوْنَ وَتُرْزَقُوْنَ إِلَّا بِضُعَفَائِكُمْ؟” رَوَاهُ الْبُخَارِيُّ.

5232. (2) [3/1442 దృఢం]

ము’స్‌’అబ్‌ బిన్‌ స’అద్‌ (ర) కథనం: స’అద్‌ తన్ను తాను ఇతరుల కంటే ఉన్నతులుగా భావించేవారు. అది గమనించిన ప్రవక్త (స) పేదలపై, బలహీనులపై నిన్నునువ్వు గొప్పగా భావించకు. వారిని హీనంగా భావించకు. ఎందుకంటే ఆ అల్లాహ్ దాసులవల్లే, ఆ బలహీనుల వల్లే, నీకు శత్రువులపై విజయం ప్రాప్తిస్తుంది, వారివల్లే  మీకు ఉపాధి, ఆహారం సమర్పించ బడతాయి. [36]  (బు’ఖారీ)

5233 – [ 3 ] ( متفق عليه ) (3/1442)

وَعَنْ أُسَامَةَ بْنِ زَيْدٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “قُمْتُ عَلَى بَابِ الْجَنَّةِ فَكَانَ عَامَّةُ مَنْ دَخَلَهَا الْمَسَاكِيْنَ وَأَصْحَابُ الْجَدِّ مَحْبُوْسُوْنَ غَيْرَأَنَّ أَصْحَابَ النَّارِقَدْ أُمِرَبِهِمْ إِلى النَّارِوَقُمْتُ عَلَى بَابِ النَّارِ فَإِذَا عَامَّةُ مَنْ دَخَلَهَا النِّسَاءُ”.

5233. (3) [3/1442–  ఏకీభవితం]

ఉసామహ్ బిన్‌ ‘జైద్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”నేను స్వర్గ ద్వారం వద్ద నిలబడి చూస్తే స్వర్గంలో ప్రవేశించేవారు పేదలు, దరిద్రులు, అగత్య పరులే అధికంగా ఉన్నారు. ఇటు ధనవంతులు, వ్యాపార వేత్తలు తీర్పు మైదానంలో ఆపి వేయ బడ్డారు. వారి విచారణ జరుగుతుంది. నరక వాసులను నరకంవైపు తీసుకువెళ్ళమని ఆదేశించటం జరిగింది. అదే విధంగా నరకద్వారం వద్ద నిలబడి చూస్తే  స్త్రీలే చాలా అధి కంగా ఉన్నారు. ఎందుకంటే సాధారణంగా భర్తపట్ల అవిధేయత, కృతఘ్నతలకు పాల్పడుతారు.”  (బు’ఖారీ,  ముస్లిమ్‌)

5234 – [ 4 ] ( متفق عليه ) (3/1442)

وَعَنِ ابْنِ عَبَّاسٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “اِطَّلَعْتُ فِي الْجَنَّةِ فَرَأَيْتُ أَكْثَرَأَهْلِهَا الْفُقَرَاءَ. وَاطَّلَعْتُ فِي النَّارِفَرَأَيْتُ أَكْثَرَ أَهْلِهَا النِّسَاءَ”. مُتَّفَقٌ عَلَيْهِ

5234. (4) [3/1442ఏకీభవితం]

ఇబ్నె ‘అబ్బాస్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”నేను స్వర్గంలోకి తొంగిచూడగా వారిలో అధికశాతం పేదలు, దరిద్రులే ఉన్నారు. అదేవిధంగా నరకంలోకి తొంగిచూడగా వారిలో అధికశాతం స్త్రీలే ఉన్నారు.” (బు’ఖారీ, ముస్లిమ్‌)

5235 – [ 5 ] ( صحيح ) (3/1442)

وَعَنْ عَبْدِ اللهِ بْنِ عَمْرِورَضِيَ اللهُ عَنْهُمَا قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِنَّ فُقَرَاءَ الْمُهَاجِرِيْنَ يَسْبِقُوْنَ الْأَغْنِيَاءَ يَوْمَ الْقِيَامَةِ إِلى الْجَنَّةِ بِأَرْبَعِيْنَ خَرِيْفًا”. رَوَاهُ مُسْلِمٌ.  

5235. (5) [3/1442 దృఢం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘అమ్ర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”తీర్పుదినం నాడు పేద ముహాజిరీన్లు, ధనిక ముహాజిరీన్ల కంటే నలభై సంవత్సరాల ముందే స్వర్గంలో ప్రవేశిస్తారు.” [37]  (ముస్లిమ్‌)

5236 – [ 6 ] ( متفق عليه ) (3/1442)

وَعَنْ سَهْلِ بْنِ سَعْدٍ قَالَ: مَرَّ رَجُلٌ عَلَى رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم. فَقَالَ لِرَجُلِ عِنْدَهُ جَالِسٍ: “مَا رَأْيُكَ فِيْ هَذَا؟” فَقَالَ رَجُلٌ مِنْ أَشْرَافِ النَّاسِ: هَذَا وَاللهِ حَرِيٌّ إِنْ خَطَبَ أَنْ يُنْكَحَ وَإِنْ شَفَعَ أَنْ يُشَفَّعَ. قَالَ: فَسَكَتَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم ثُمَّ مَرَّ عَلَى رَجُلٌ. فَقَالَ لَهُ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَا رَأْيُكَ فِيْ هَذَا؟” فَقَالَ: يَا رَسُوْلَ اللهِ هَذَا رَجُلٌ مِنْ فُقَرَاءِ الْمُسْلِمِيْنَ هَذَا حَرِيٌّ إِنْ خَطَبَ أَنْ لَا يَنْكَحَ. وَإِنْ شَفَعَ أَنْ لَا يُشَفَّعَ. وَإِنَّ قَالَ أَنْ لَا يُسْمَعَ لِقَوْلِهِ. فَقَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “هَذَا خَيْرٌ مِنْ مِلْءِ الْأَرْضِ مِثْلَ هَذَا”. مُتَّفَقٌ عَلَيْهِ.

5236. (6) [3/1442 ఏకీభవితం]

సహల్‌ బిన్‌ స’అద్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రక్క నుండి ఒక వ్యక్తి వెళ్ళటం జరిగింది. అప్పుడు ప్రవక్త (స) తన ప్రక్కన కూర్చున్న వ్యక్తితో, ‘ఈ వ్యక్తి గురించి నీ అభిప్రాయం ఏమిటి?’ అని అడిగారు. అంటే మంచి వాడా లేక చెడ్డవాడా అని. దానికి ఆ వ్యక్తి ‘ఈ వ్యక్తి అందరికంటే గొప్పవాడు. అల్లాహ్ (త) సాక్షి! ఇతడు ఎవరి ఇంట్లోనైనా పెళ్ళి సంబంధం పంపిస్తే, అతని గొప్పతనం, ధనసంపదల మూలంగా వెంటనే పెళ్ళికి ఒప్పుకుంటారు. ఒకవేళ అతడు ఎవరి గురించైనా సిఫారసు చేస్తే అతని సిఫారసు స్వీకరించబడుతుంది.’ అది వినిప్రవక్త (స) మౌనం వహించారని ఉల్లేఖనకర్త అన్నారు. మరికొంత సేపటికి మరో వ్యక్తి వెళ్ళడం జరిగింది. అప్పుడు ప్రవక్త (స) ఆ వ్యక్తితో, ‘ఈ వ్యక్తి గురించి నీ అభిప్రాయం ఏమిటి?’ అని అడిగారు. దానికి ఆ వ్యక్తి, ‘ప్రవక్తా! ముస్లిముల్లో అందరికంటే పేదవాడు ఇతనే, ఒకవేళ ఇతడు పెళ్ళి సంబంధం పంపితే, ఇతడి పేదరికం, దారిద్య్రం కారణంగా స్వీకరించటం జరుగదు, సిఫారసు చేసినా వినడం జరుగదు. ఇతని మాటకూ విలువ ఉండదు,’ అని అన్నాడు. అది విని ప్రవక్త (స), ‘ఈ వ్యక్తి అతనిలాంటి భూమి నిండినంత జనంకంటే గొప్పవాడు,’ అని  అన్నారు. (బు’ఖారీ, ముస్లిమ్‌)

5237 – [ 7 ] ( متفق عليه ) (3/1443)

وَعَنْ عَائِشَةَ قَالَتْ: مَا شَبعَ آلُ مُحَمَّدٍ مِنْ خُبْرِالشَّعِيْرِيَوْمَيْنِ مُتَتَابِعَيْنِ حَتّى قُبِضَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم”. مُتَّفَقٌ عَلَيْهِ.

5237. (7) [3/1443ఏకీభవితం]

‘ఆయి’షహ్‌ (ర) కథనం: ము’హమ్మద్‌ (స) కుటుంబం వారు క్రమంగా రెండు రోజులు కూడా యవ్వ రొట్టెలు తినలేక పోయేవారు. ఆ స్థితిలోనే ప్రవక్త (స) పరమ పదించారు.[38] (బు’ఖారీ, ముస్లిమ్‌)

5238 – [ 8 ] ( صحيح ) (3/1443)

وَعَنْ سَعِيْدٍ الْمَقْبُرِيِّ عَنْ أَبِيْ هُرَيْرَةَ: أَنَّهُ مَرَّ بِقَوْمٍ بَيْنَ أَيْدِيْهِمْ شَاةٌ مَصْلِيَّةٌ فَدَعَوْهُ فَأَبى أَنْ يَأْكُلَ وَقَالَ: خَرَجَ النَّبِيُّ صلى الله عليه وسلم وَلَمْ يَشْبَعْ مِنْ خُبْزِ الشَّعِيْرِ. رَوَاهُ الْبُخَارِيُّ.  

5238. (8) [3/1443 దృఢం]

స’యీద్‌ మఖ్‌బురీ, అబూ హురైరహ్‌ (ర) ద్వారా కథనం: అబూ హురైరహ్‌ (ర) దారిలో వెళుతుండగా కొందరు మార్గం ప్రక్కన కూర్చొని ఉన్నారు. వారి ముందు కాల్చినమేక ఉంది. వారు అబూహురైరహ్‌ (ర)ను తినటానికి ఆహ్వానించారు. దానికి అబూ హురైరహ్‌ (ర) తిరస్కరిస్తూ, ‘ప్రవక్త (స) మర ణించారు. ఏనాడూ యవ్వరొట్టె కూడా కడుపు నిండా తినలేదు’ అని అన్నారు. [39]  (బు’ఖారీ)

5239 – [ 9 ] ( صحيح ) (3/1443)

وَعَنْ أَنَسٍ أَنَّهُ مَشَى إِلى النَّبِيِّ صلى الله عليه وسلم بِخُبْزِشَعِيْرٍ وَ إِهَالَةٍ سَنِخَةٍ وَلَقَدْ رَهَنَ النَّبِيُّ صلى الله عليه وسلم دِرْعًا لَهُ بِالْمَدِيْنَةِ عِنْدَ يَهُوْدِيٍّ وَأَخَذَمِنْهُ شَعِيْرًا لِأَهْلِهِ وَلَقَدْ سَمِعْتُهُ يَقُوْلُ: “مَا أَمْسَى عِنْدَ آلِ مُحَمَّدٍ صَاعُ بُرٍّوَلَاصَاعَ حَبٍّ وَإِنَّ عِنْدَهُ لَتِسْعَ نِسْوَةٍ”. رَوَاهُ الْبُخَارِيُّ.

5239. (9) [3/1443 దృఢం]

అనస్‌ (ర) కథనం: అతను యవ్వరొట్టె, క్రొవ్వు తీసుకొని ప్రవక్త (స) వద్దకు వెళ్ళారు. అప్పుడు ప్రవక్త (స) పరిస్థితి ఎలా ఉండేదంటే ఒక యూదుని వద్ద తన కవచాన్ని తాకట్టు పెట్టి తన కుటుంబం కోసం యవ్వలు తీసుకొంటున్నారు. ప్రవక్త (స), ‘ఇంట్లో రాత్రికి ఒక్కగింజ లేదు, ఒక్క మెతుకుకూడా లేదు,’ అని అన్నారు. అయితే అప్పుడు ప్రవక్త (స) ఇంట్లో 9 మంది స్త్రీలు ఉన్నారు.  (బు’ఖారీ)

5240 – [ 10 ] ( متفق عليه ) (3/1443)

وَعَنْ عُمَرَ قَالَ: دَخَلْتُ عَلَى رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم فَإِذَا هُوَ مُضْطَجِعٌ عَلَى رِمَالِ حَصِيْرٍ لَيْسَ بَيْنَهُ وَبَيْنَهُ فِرَاشٌ قَدْ أَثَّرَ الرِّمَالُ بِجَنْبِهِ مُتَّكِئًا عَلَى وِسَادَةٍ مِنْ أَدْمٍ حَشْوُهَا لِيْفٌ. قُلْتُ: يَا رَسُوْلَ اللهِ: اُدْعُ اللهَ فَلْيُوَسِّعْ عَلَى أُمَّتِكَ فَإِنَّ فَارِسَ وَالرُّوْمَ قَدْ وُسِعَ عَلَيْهِمْ وَهُمْ لَا يَعْبُدُوْنَ اللهَ. فَقَالَ: “أَوْ فِيْ هَذَا أَنْتَ يَا ابْنَ الْخَطَّابِ؟ أُوْلَئِكَ قَوْمٌ عُجِّلَتْ لَهُمْ طَيِّبَتَاتُهُمْ فِي الْحَيَاةِ الدُّنْيَا”. وَفِي رِوَايَةٍ: “أَمَا تَرْضَى أَنْ تَكُوْنَ لَهُمُ الدُّنْيَا وَلَنَا الْآخِرَةُ؟”

5240. (10) [3/1443 ఏకీభవితం]

‘ఉమర్‌ (ర) కథనం: నేను ప్రవక్త (స) వద్దకు వెళ్ళాను. అప్పుడు ప్రవక్త (స) ఖర్జూరపు చాపపై పండుకొని ఉన్నారు. దానిపై ఎటువంటి పడకలేదు. చాప చిహ్నాలు ప్రవక్త (స) శరీరంపై పడి ఉన్నాయి. ఇంకా తల క్రింద చర్మం తలగడ ఉండేది. అందులో ఖర్జూరం తొక్కలు నిండి ఉండేవి. ఈ పరిస్థితి చూసి నేను ప్రవక్త (స)తో, ‘ఓ ప్రవక్తా! తమరు దైవాన్ని తమ అనుచర సమాజాన్ని అనుగ్రహించమని ప్రార్థించండి, ఫారిస్‌, రూమ్‌ దేశస్తులను ప్రసాదించినట్టు, అయినా వారు అల్లాహ్‌ను ప్రార్థించడం లేదు,’ అని అన్నాను. దానికి ప్రవక్త (స) ‘ఉమర్‌! నువ్వు ఇలా ఆలోచిస్తు న్నావా? వారికోసం కేవలం ఈప్రపంచమే స్వర్గం. మన కోసం పరలోకం,’ అనిఅన్నారు.  (బు’ఖారీ, ముస్లిమ్‌)

5241 – [ 11 ] ( صحيح ) (3/1443)

وعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: لَقَدْ رَأَيْتُ سَبْعِيْنَ مِنْ أَصْحَابِ الصُّفَّةِ مَا مِنْهُمْ رَجُلٌ عَلَيْهِ رِدَاءٌ إِمَّا إِزَارٌوَإِمَّا كِسَاءٌ قَدْ رَبَطُوا فِيْ أَعْنَاقِهِمْ فَمِنْهَا مَا يَبْلُغُ نِصْفَ السَّاقَيْنِ وَمِنْهَا مَا يَبْلُغُ الْكَعْبَيْنِ فَيَجْمَعُهُ بِيَدِهِ كَرَاهِيَةَ أَنْ تُرَى عَوْرَتُهُ”. رَوَاهُ الْبُخَارِيُّ.

5241. (11) [3/1443దృఢం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: నేను 70 మంది ‘సుప్ఫహ్ వారిని చూసాను. వారిలో ఎవరివద్ద కూడా దుప్పటి ఉండేది కాదు. కేవలం ఒక లుంగీ ఉండేది. అంటే కప్పు కునేది లేదా కట్టుకునేది. దాన్ని వారు భుజాలకు కట్టుకునే వారు. వారిలోనూ కొందరివద్ద చీలమండల వరకు, సగంకాళ్ళ వరకు ఉండేవి. వారు నమా’జులో చేత్తో పట్టుకొని మర్మాంగాలు కనబడ కుండా జాగ్రత్త పడేవారు. (బు’ఖారీ)

5242 – [ 12 ] ( متفق عليه ) (3/1444)

وَعَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِذَا نَظَرَ أَحَدُكُمْ إِلى مَنْ فُضِّلَ عَلَيْهِ فِي الْمَالِ وَالْخُلْقِ فَلْيَنْظُرُ إِلى مَن هُوَ أَسْفَلَ مِنْهُ”. مُتَّفَقٌ عَلَيْهِ.

وَفِيْ رِوَايَةٍ لِمُسْلِمٍ قَالَ: “اُنْظُرُوْا إِلى مَنْ هُوَ أَسْفَلَ مِنْكُمْ وَلَا تَنْظُرُوْا إِلى مَنْ هُوَ فَوْقَكُمْ فَهُوَ أَجْدَرُأَنْ لَا تَزْدَرُوْا نِعْمَةَ اللهِ عَلَيْكُمْ”.  

5242. (12) [3/1444ఏకీభవితం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మీలో ఎవరైనా తనకంటే ధనవంతుడ్నిగానీ, అంద మైన వాడ్నిగానీ చూస్తే, అతడు తనకంటే తక్కువ గల వారి వైపు చూడాలి.” (బు’ఖారీ, ముస్లిమ్‌)

మరో ముస్లిమ్‌ ఉల్లేఖనంలో ఇలా ఉంది, ”తనకంటే క్రిందివారిని చూసేవ్యక్తి అల్లాహ్ (త) అనుగ్రహాలను గుర్తిస్తాడు,  కృతజ్ఞుడై ఉంటాడు.”

—–

اَلْفَصْلُ الثَّانِيْ   రెండవ విభాగం

5243 – [ 13 ] ( لم تتم دراسته ) (3/1444)

عَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “يَدْخُلُ الْفُقَرَاءُ الْجَنَّةَ قَبْلَ الْأَغْنِيَاءِ بِخَمْسِمِائَةِ عَامٍ نِصْفِ يَوْمٍ”. رَوَاهُ التِّرْمِذِيُّ  

5243. (13) [3/1444అపరిశోధితం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”పేదవారు, అగత్యపరులు, దరిద్రులు, ధనవంతుల కంటే 500 సంవత్సరాలు ముందు స్వర్గంలో ప్రవేశిస్తారు. అది తీర్పుదినంలో సగం దినం ఉంటుంది.”[40]  (తిర్మిజి’)

5244 – [ 14 ] ( لم تتم دراسته ) (3/1444)

وَعَنْ أَنَسٍ أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم قَالَ: “اَللّهُمَّ أَحْيِنِيْ مِسْكِيْنًا وَأَمِتْنِيْ مِسْكِيْنًا وَاحْشُرْنِيْ فِيْ زُمْرَةِ الْمَسَاكِيْنِ” فَقَالَتْ عَائِشَةُ: لِمَ يَا رَسُوْلَ اللهِ؟ قَالَ: “إِنَّهُمْ يَدْخُلُوْنَ الْجَنَّةَ قَبْلَ أَغْنِيَائِهِمْ بِأَرْبَعِيْنَ خَرِيْفًا يَا عَائِشَةَ لَا تَرُدِّيْ الْمِسْكِيْنَ وَلَوْ بِشِقِّ تَمْرَةٍ. يَا عَائِشَةَ أَحِبِّي الْمَسَاكِيْنَ وَقَرِّبِيْهِمْ. فَإِنَّ اللهَ يُقَرِّبُكِ يَوْمَ الْقِيَامَةِ” رَوَاهُ التِّرْمِذِيُّ وَالْبَيْهَقِيُّ فِيْ”شُعَبِ الْإِيْمَانِ”.  

5244. (14) [3/1444అపరిశోధితం]

అనస్‌ (ర) కథనం: ప్రవక్త (స) ఈ దు’ఆ పఠించేవారు: అల్లాహుమ్మ అ’హ్‌యినీ మిస్కీనన్‌ అమిత్‌నీ మిస్కీనన్‌ వ’హ్‌షుర్‌నీ ఫీ ‘జుమ్‌రతిల్‌ మసాకీని.” – ‘ఓ అల్లాహ్‌! నన్ను పేదవానిగానే సజీవంగాఉంచు, పేదవానిగానే మరణం ప్రసాదించు, ఇంకా నన్ను పేదవారితో పాటే మళ్ళీలేపు.” అది విని ‘ఆయి’షహ్‌ (ర), ‘ఓ ప్రవక్తా! ఇలా ఎందుకు?’ అని విన్నవించు కున్నారు. దానికి ప్రవక్త (స), ”ఎందుకంటే పేదలు ధనవంతుల కంటే 40 సంవత్సరాలు ముందు స్వర్గంలోనికి ప్రవేశిస్తారు. ఓ ‘ఆయి’షహ్‌! నీవు పేదవారిని నీ ద్వారం నుండి ఎన్నడూ ఉత్తి చేతులతో పంపకు. ఏమీ లేకపోయినా కనీసం ఖర్జూరం ముక్కయినా ఇచ్చి పంపించు. ఇంకా ఓ ‘ఆయి’షహ్‌! నువ్వు వారిని ప్రేమిస్తూ ఉండు. వారిని నీ దగ్గర కూర్చొని వెళ్ళే అవకాశం కల్పిస్తూ ఉండు. అల్లాహ్‌ (త) నిన్ను తీర్పుదినం నాడు తన సాన్నిహిత్యం ప్రసాదిస్తాడు. ” (తిర్మిజి’, బైహఖీ/-షు’అబిల్ ఈమాన్)

5245 – [ 15 ] ( لم تتم دراسته ) (3/1444)

وَرَوَى ابْنُ مَاجَهُ عَنْ أَبِيْ سَعِيْدٍ إِلى قَوْلِهِ”زُمْرَةِ الْمَسَاكِيْنِ”

5245. (15) [3/1444అపరిశోధితం]

అబూ స’యీద్‌ (ర) కథనం: ‘జుమ్‌రతిల్‌ మసాకీన్‌ వరకు ప్రస్తావించారు. (ఇబ్నె మాజహ్)

5246 – [ 16 ] ( صحيح ) (3/1444)

وَعَنْ أَبِي الدَّرْدَاءِ عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ: “اِبْغُوْنِيْ فِيْ ضُعَفَائِكُمْ فَإِنَّمَا تُرْزَقُوْنَ-أَوْ تُنْصَرُوْنَ- بِضُعَفاَئِكُمْ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ.

5246. (16) [3/1444దృఢం]

అబూ దర్‌దా’ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం: ”నువ్వు నా ప్రీతి పొందటానికి బలహీనులను, పేదలను, దరిద్రులను వెతికి నా దగ్గరకు తీసుకు రా. ఎందుకంటే ఆ పేదలు, దరిద్రులవల్లే మీకు ఉపాధి ప్రసాదించడం జరుగుతుంది. ఇంకా ఆ పేదలు, అక్కర గలవారి ప్రార్థనలవల్లే శత్రువులపై నీకు విజయం లభిస్తుంది. (అబూ  దావూద్‌)

5247 – [ 17 ] ( ضعيف ) (3/1444)

وعَنْ أُمَيَّةَ بْنِ خَالِدِ بْنِ عَبْدِ اللهِ بْنِ أَسِيْدٍ عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم: أَنَّهُ كَانَ يَسْتَفْتِحُ بِصَعَالِيْكَ الْمُهَاجِرِيْنَ. رَوَاهُ فِيْ “شَرْحِ السُّنَّةِ”.

5247. (17) [3/1444 బలహీనం]

ఉమయ్య బిన్‌ ‘ఖాలిద్‌ బిన్‌ ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ అసీద్‌ (ర) కథనం: ప్రవక్త (స) ‘పేదల, దరిద్రుల ప్రార్థనల ద్వారా శత్రువులపై విజయం సాధించేవారు.’ (షర్‌హు స్సున్నహ్‌)

5248 – [ 18 ] ( ضعيف ) (3/1445)

وعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَا تَغْبِطَنَّ فَاجِرًا بِنِعْمَةٍ فَإِنَّكَ لَا تَدْرِيْ مَا هُوَ لَاقٍ بَعْدَ مَوْتِهِ إِنَّ لَهُ عِنْدَ اللهِ قَاتِلًا لَا يَمُوْتُ”. يَعْنِي النَّارَ. رَوَاهُ فِيْ”شَرْحِ السُّنَّةِ”.  

5248. (18) [3/1445  –బలహీనం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”నువ్వు పాపాత్ముల, దుర్మార్గుల ధనసంపదలను చూసి ఈర్ష్యచెందకు, దాన్ని ఆశించకు. ఎందుకంటే అతడు మరణించిన తర్వాత, అతని పట్ల ఎలాంటి వ్యవహారం జరుగుతుందో నీకు తెలియదు. ఓ ‘అబ్దుల్లాహ్‌! అల్లాహ్‌ (త) వద్ద అతని కొరకు ఎటువంటి ప్రమాదం ఉందంటే అది అతన్ని చావనివ్వదు, బ్రతక నివ్వదు. అంటే అది నరకాగ్ని.” (షర్‌హు స్సున్నహ్‌)

అంటే ఈ ధనవంతుడు మరణించి నరకంలో పడితే, అది అతన్ని చంపదు,  బ్రతకనివ్వదు.

5249 – [ 19 ] ( ضعيف ) (3/1445)

وعَنْ عَبْدِ اللهِ بْنِ عَمْرٍو قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “اَلدُّنْيَا سِجْنُ الْمُؤْمِنِ وَسَنَتُهُ وَإِذَا فَارَقَ الدُّنْيَا فَارَقَ السِّجْنَ وَالسَّنَةَ”. رَوَاهُ فِيْ “شَرْحِ السُّنَّةِ”.

5249. (19) [3/1445 బలహీనం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘అమ్ర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం: ”విశ్వాసికి ఐహిక జీవితం జేలు వంటిది, మరియు కరవువంటిది. ఐహిక జీవితాన్ని వదలి వెళ్ళేవారు జేలును, కరువును వదలి వెళతారు. అంటే దాన్నుండి విముక్తి పొందుతారు.” (షర్‌హుస్సున్నహ్‌)

5250 – [ 20 ] ( لم تتم دراسته ) (3/1445)

وَعَنْ قَتَادَةَ بْنِ النُّعْمَانِ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم قَالَ: “إِذَا أَحَبَّ اللهُ عَبْدًا حَمَاهُ الدُّنْيَا كَمَا يَظَلُّ أَحَدُكُمْ يَحْمِيْ سَقِيْمَهُ الْمَاءَ”. رَوَاهُ أَحْمَدُ وَالتِّرْمِذِيُّ.  

5250. (20) [3/1445 అపరిశోధితం]

ఖతాదహ్‌ బిన్‌ ను’అమాన్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”అల్లాహ్‌ దాసుల్లో ఎవరినైనా ప్రేమిస్తే, మీలో  ఎవరైనా రోగిని, హానిచేకూర్చే నీటి నుండి రక్షించి నట్లు అల్లాహ్‌  అతన్ని రక్షిస్తాడు.” [41]  (అ’హ్మద్‌, తిర్మిజి’)

5251 – [ 21 ] ( لم تتم دراسته ) (3/1445)

وَعَنْ مَحْمُوْدِ بْنِ لَبِيْدٍ أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم قَالَ: “اِثْنَتَانِ يَكْرَهُهُمَا ابْنُ آدَمَ:يَكْرَهُ الْمَوْتَ وَالْمَوْتُ خَيْرٌ لِلْمُؤْمِنِ مِنَ الْفِتْنَةِ وَيَكْرَهُ قِلَّةَ الْمَالِ وَقِلَّةُ الْمَالِ أَقَلُّ لِلْحِسَابِ”. رَوَاهُ أَحْمَدُ.  

5251. (21) [3/1445 అపరిశోధితం]

మ’హ్‌మూద్‌ బిన్‌ లుబైద్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మానవుడు రెండు విషయాలను మంచి విగా భావించడు. అయితే ఆ రెండు విషయాలు అతనికి మేలు చేకూర్చేవే. ఒకటి మరణాన్ని ఇష్టపడడు. వాస్తవంగా ఉపద్రవాల నుండి, కల్లోలాల నుండి మరణమే మంచిది. రెండవది, పేదరికం. ధనసంపదల కొరతను మంచిదిగా భావించడు. వాస్తవంగా పేదరికం, ధనసంపదల కొరత అతనికి మేలు చేకూర్చేవే. ఎందుకంటే ధనం ఎంత తక్కువగా ఉంటే తీర్పుదినం నాడు విచారణ కూడా అంత త్వరగా ముగుస్తుంది. ధనసంపదలు ఎంత ఎక్కువగా ఉంటే, విచారణ అంత కఠినంగా  జరుగు తుంది.  (అ’హ్మద్‌)

5252 – [ 22 ] ( ضعيف ) (3/1445)

وعَنْ عَبْدِ اللهِ بْنِ مُغَفَّلِ قَالَ: جَاءَ رَجُلٌ إِلَى النَّبِيِّ صلى الله عليه و سلم فَقَالَ: “إِنِّيْ أُحِبُّكَ.قَالَ: ” اُنْظُرْمَا تَقُوْلُ”. فَقَالَ: وَاللهِ إِنِّيْ لَأُ حِبُّكَ ثَلَاثَ مَرَّاتٍ.قَالَ: “إِنْ كُنْتَ صَادِقًا فَأَعِدَّ لِلْفَقْرِ تِجْفَافًا  لِلْفَقْرُ أَسْرَعُ إِلى مضنْ يُحِبُّنِيْ مِنَ السَّيْلِ إِلى مُنْتَهَاهُ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَقَالَ: هَذَا حَدِيْثٌ حَسَنٌ غَرِيْبٌ  

5252. (22) [3/1445బలహీనం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ము’గప్ఫల్‌ (ర) కథనం: ప్రవక్త (స) వద్దకు ఒక వ్యక్తి వచ్చి, ‘ఓ ప్రవక్తా! నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను,’ అని అన్నాడు. దానికి ప్రవక్త (స) ‘నువ్వు ఏమంటున్నావో కొంచెం ఆలోచించుకో,’ అని అన్నారు. ఆవ్యక్తి మళ్ళీ, ‘ఓ ప్రవక్తా! నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను,’ అని అన్నాడు. మళ్ళీ ప్రవక్త (స), ‘నువ్వు ఏమంటున్నావో ఆలోచించి మరీ చెప్పు,’ అని అన్నారు. ఈ విధంగా మూడు సార్లు జరిగింది. చివరికి ప్రవక్త (స) ఇలా అన్నారు, ”ఒకవేళ నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తే, అంటే నీవు నన్ను ప్రేమించే విషయం వాస్తవం అయితే, నువ్వు నాలా భయ భక్తులు, దైవారాధన, పేదరికం, దారిద్య్రం కలిగి ఉండు, ఇది చాలా కష్టం. అనేక కష్టనష్టాలకు గురికా వలసి వస్తుంది. నన్ను ప్రేమించటం నీ దారిద్య్రానికి, పేదరికానికి కారణభూతం అవుతుంది, ఆకలి దప్పికలతో అలమటించవలసి వస్తుంది. పేదరికం, దారిద్య్రం నన్ను ప్రేమించే వారి వద్దకు చాలా వేగంగా వస్తాయి. వరద నీరు పల్లపు ప్రాంతాల వైపు పరిగెత్తి నట్లు.” (తిర్మిజి’ – ప్రామాణికం, – ఏకోల్లేఖనం)

5253 – [ 23 ] ( صحيح ) (3/1445)

وعَنْ أنس قَالَ: قَالَ رسول الله صلى الله عليه وسلم: “لقد أخفت في الله وما يخاف أحد ولقد أوذيت في الله وما يؤذى أحد ولقد أتت علي ثلاثون من بين ليلة ويوم وما لي ولبلال طعام يأكله ذو كبد إلا شيء يواريه إبط بلال”. رَوَاهُ التِّرْمِذِيُّ قَالَ: ومعَنْى هذا الحديث: حين خرج النبي صلى الله عليه وسلم هاربا من مكة ومعه بلال إنما كان مع بلال من الطعام ما يحمل تحت إبطه.

5253. (23) [3/1445దృఢం]

అనస్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”అల్లాహ్‌ (త) విషయంలో నేనెంత హెచ్చరించబడ్డానో, ఇతరు లెవరూ హెచ్చరించబడలేదు. అదేవిధంగా, అల్లాహ్‌ (త) విషయంలో నాకు వచ్చినన్ని కష్టాలు మరెవరికీ రాలేదు. ఒక నెల ఎలా గడిచిందంటే, అందులో నాకు గానీ, బిలాల్‌కు గానీ తినటానికి ఏమీ ఉండేది కాదు. అయితే ఏదో కొంత తినేవస్తువు బిలాల్‌ వద్ద ఉండేది.” [42] (తిర్మిజి’)

తిర్మిజీ ఈ ‘హదీసు’ను వివరిస్తూ అవిశ్వాసుల హింసల వల్ల ప్రవక్త (స) మక్కహ్ నుండి బయటకు సందేశ ప్రచారం, హిత బోధకు వెళ్ళారు. ప్రవక్త (స) వెంట బిలాల్‌ కూడా ఉన్నారు. బిలాల్‌ వద్ద కేవలం కొంతమాత్రమే ఆహార్థం ఉండేది. దానిని అతను తన చంకలోపెట్టుకొని ఇటూఅటూ  తిరిగేవారు.

5254 – [ 24 ] ( لم تتم دراسته ) (3/1446)

وَعَنْ أَبِيْ طَلْحَةَ قَالَ: شَكَوْنَا إِلى رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم اَلْجُوْعَ فَرَفَعْنَا عَنْ بُطُوْنِنَا عَنْ حَجَرٍحَجَرٍفَرَفَعَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم عَنْ بَطْنِهِ عَنْ حَجَرَيْنِ. رَوَاهُ التِّرْمِذِيُّ وقَالَ: حَدَيْثٌ غَرِيْبٌ.  

5254. (24) [3/1446అపరిశోధితం]

అబూ ‘తల్‌’హా (ర) కథనం: మేము ఆకలి గురించి ప్రవక్త (స)తో ఫిర్యాదు చేసాము. అంటే అనేక రోజులుగా ఆహారం లేక పస్తులు ఉండటం వల్ల ప్రవక్త (స) వద్ద ప్రస్తావించటం జరిగింది. ఆకలి వల్ల మేము కడుపులపై రాళ్ళు కట్టిఉంచాము. మేము ఒక్కరాయినే కట్టి ఉన్నాము. ప్రవక్త (స) తన పొట్టను చూపెట్టగా రెండురాళ్ళు ఉన్నట్టు తెలిసింది. అప్పుడు తెలిసింది, మా కంటే ప్ర వక్త (స)కు అధికంగా ఆకలి ఉందని. (తిర్మిజి  /  ఏకోల్లేఖనం)

ఈ ‘హదీసు’ ద్వారా ప్రవక్త (స) ఎల్లప్పుడూ దు’ఆలు చేసేవారని, ఇంకా ఓ అల్లాహ్‌ (త)! ఒక రోజు ఆహారం ప్రసాదించు, నీకు కృతజ్ఞతలు తెలుపు కుంటాను. మరో రోజు ఆకలితో నిన్ను ఆహారం ప్రసాదించమని అర్థిస్తాను. అందువల్లే ప్రవక్త (స) తన అనుచర సమాజం గుణపాఠం నేర్చు కోవటానికి రెండు బండరాళ్ళు పొట్టపైన కట్టేవారు.

5255 – [ 25 ] ( لم تتم دراسته ) (3/1446)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ أَنَّهُ أَصَابَهُمْ جُوْعٌ فَأَعْطَاهُمْ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم تَمْرَةً تَمْرَةً. رَوَاهُ التِّرْمِذِيُّ.  

5255. (25) [3/1446 అపరిశోధితం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) అనుచరు ల్లోని ‘సుఫ్ఫహ్వారు తీవ్రమైన ఆకలికి గురయ్యారు. ప్రవక్త (స) ఒక్కొక్క  ఖర్జూరం  ఇచ్చారు.  (తిర్మిజి’)

5256 – [ 26 ] ( لم تتم دراسته ) (3/1446)

وَعَنْ عَمْرِو بْنِ شُعَيْبٍ عَنْ أَبِيْهِ عَنْ جَدِّهِ عَنْ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم قَالَ: “خَصْلَتَانِ مَنْ كَانَتَا فِيْهِ كَتَبَهُ اللهُ شَاكِرًا: مَنْ نَظَرَ فِيْ دِيْنِهِ إِلى مَنْ هُوَ فَوقَهُ فَاقْتَدَى بِهِ وَنَظَرَ فِيْ دُنْيَاهُ إِلى مَنْ هُوَ دُوْنَهُ فَحَمِدَ اللهُ عَلَى مَا فَضَّلَهُ اللهُ عَلَيْهِ كَتَبَهُ اللهُ شَاكِرًا صَابِرًا. وَمَنْ نَظَرَ فِيْ دِيْنِهِ إِلى مَنْ هُوَ دُوْنَهُ وَنَظَرَ فِيْ دُنْيَاهُ إِلى مَنْ هُوَ فَوْقَهُ فَأَسِفَ عَلَى مَا فَاتَهُ مِنْهُ لَمْ يَكْتُبُهُ اللهُ شَاكِرًا وَلَا صَابِرًا”. رَوَاهُ التِّرْمِذِيُّ وَذُكِرَ حَدِيْثُ أَبِيْ سَعِيْدٍ: “أَبْشِرُوْا يَا مَعْشَرَصَعَالِيْكِ الْمُهَاجِرِيْنَ”فِيْ بَابِ بَعْدَ فَضَائِلِ الْقُرْآنِ.  

5256. (26) [3/1446 అపరిశోధితం]

‘అమ్ర్‌ బిన్‌ షు’ఐబ్‌ తన తండ్రి, అతడు తన తండ్రి ద్వారా కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”రెండు విష యాలు ఎవరిలో ఉంటే, అల్లాహ్‌ (త) వారిని కృతజ్ఞుడుగా, సహనమూర్తిగా పరిగణిస్తాడు. ఒకటి ఏమిటంటే, ధార్మిక విషయాల్లో తనకంటే ఉత్తమ వ్యక్తిని అనుసరిస్తాడు. రెండవది ప్రాపంచిక పరంగా తనకంటే తక్కువగల వ్యక్తిని చూసి, దైవానికి కృతజ్ఞతలు తెలుపు కుంటాడు. అల్లాహ్‌ (త) అతన్ని కృతజ్ఞుడుగా, సహనశీలుడుగా వ్రాస్తాడు. అదేవిధంగా ధర్మం విషయంలో తనకంటే క్రిందివ్యక్తిని చూసి, అతనిలా ఆచరిస్తాడు. ప్రాపంచికపరంగా తనకంటే గొప్పవ్యక్తిని చూసి, అతన్ని అనుసరిస్తూ మంచిమార్గం అనుసరించ నందువల్ల విచారిస్తాడు. ఇటువంటి వ్యక్తిని అల్లాహ్‌ (త) కృతజ్ఞుడుగా, సహనశీలుడుగా భావించడు. (తిర్మిజి’)

—–

اَلْفَصْلُ الثَّالِثُ   మూడవ విభాగం 

5257 – [ 27] ( صحيح ) (3/1446)

عَنْ أَبِيْ عَبْدِ الرَّحْمنِ الْحُبُلِيِّ قَالَ: سَمِعْتُ عَبْدَ اللهِ بْنِ عَمْرٍو وَسَأَلَهُ رَجُلٌ قَالَ: أَلَسْنَا مِنْ فُقَرَاءِ الْمُهَاجِرِيْنَ؟ فَقَالَ لَهُ عَبْدُ اللهِ: أَلَكَ اِمْرَأَةٌ تَأْوِيْ إِلَيْهَا؟ قَالَ: نَعَمْ. قَالَ: أَلَكَ مَسْكَنٌ تَسْكُنُهُ؟ قَالَ: نَعَمْ. قَالَ: فَأَنْتَ مِنِ الْأَغْنِيَاءِ. قَالَ: فَإِنَّ لِيْ خَادِمًا. قَالَ: فَأَنْتَ مِنَ الْمُلُوْكِ. قَالَ: عَبْدُ الرَّحْمنِ: وَجَاءَ ثَلَاثَةُ نَفَرٍإِلى عَبْدِ اللهِ بْنِ عَمْرٍو وَأَنَا عِنْدَهُ. فَقَالُوْا: يَا أَبَا مُحَمَّدٍ إِنَّاوَاللهِ مَا نَقْدِرُ عَلَى شَيْءٍ لَا نَفَقَةٍ وَلَا دَابَّةٍ وَلَا مَتَاعٍ. فَقَالَ لَهُمْ: مَا شِئْتُمْ إِنْ شِئْتُمْ رَجَعْتُمْ إِلَيْنَا فَأَعْطَيْنَاكُمْ مَا يَسَّرَ اللهُ لَكُمْ وَإِنْ شِئْتُمْ ذَكَرْنَا أَمْرَكُمْ لِلسُّلْطَانِ وَإِنْ شِئْتُمْ صَبَرْتُمْ فَإِنِّيْ سَمِعْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ: “إِنَّ فُقَرَاءَ الْمُهَاجِرِيْنَ يَسْبِقُوْنَ الْأَغْنِيَاءَ يَوْمَ الْقِيَامَةِ إِلى الْجَنَّةِ بِأَرْبَعِيْنَ خَرِيْفًا”. قَالُوْا: فَإِنَّا نَصْبِرُ لَا نَسْأَلُ شَيْئًا”. رَوَاهُ مُسْلِمٌ.  

5257. (27) [3/1446దృఢం]

అబూ ‘అబ్దుర్రహ్మాన్‌ ‘హుబ్‌లీ కథనం: నేను ‘అబ్దు ల్లాహ్‌ బిన్‌ ‘అమ్ర్‌ ద్వారా ఇలా విన్నాను, ”అతన్ని మేము పేద ముహాజిరీన్లు కామా?” అంటే మమ్మల్ని పేద ముహాజిరీన్లుగా పరిగణించరా? అని ప్రశ్నించడం జరిగింది. దానికి ‘అబ్దుల్లాహ్‌ వారితో, ”నీ భార్య ఉందా?” అని అడిగారు. ఆ వ్యక్తి, ‘అవును,’ అన్నాడు. ‘నీ దగ్గర నివసించడానికి ఇల్లు  ఉందా?’ అని అడి గారు, దానికి ఆ వ్యక్తి, ‘అవును,’ అని అన్నాడు. అప్పుడు ‘అబ్దుల్లాహ్‌, ‘అయితే నీవు ధన వంతుడవు, పేదవాడవు కావు,’ అని అన్నారు. ఆ వ్యక్తి, ‘నా దగ్గర సేవకుడు కూడా ఉన్నాడు,’ అని అన్నాడు. దానికి ‘అబ్దుల్లాహ్‌ మరయితే నీవు రాజుల్లో ఒకడివి.’ ‘అబ్దుర్రహ్మాన్‌ ఇలా అన్నారు, ”ముగ్గురు వ్యక్తులు ‘అబ్దు ల్లాహ్‌ బిన్‌ ‘అమ్ర్‌ వద్దకు వచ్చారు. అప్పుడు నేను అక్కడే కూర్చుని ఉన్నాను. ఆ ముగ్గురు వ్యక్తులు ‘అబ్దుల్లాహ్‌తో అతని కునియత్‌ అబూ ము’హమ్మద్‌. అందువల్ల, ‘ఓ అబూ ము’హమ్మద్‌! మా దగ్గర డబ్బూ లేదు, వాహనమూ లేదు, జీవిత సామగ్రిలేదు.’ ‘అబ్దుల్లాహ్‌ వారితో, ‘మీరేమంటారు,’ అని అన్నారు. అంటే ఏం కావాలి అని అన్నారు. మీరు కోరితే ఇప్పుడు వెళ్ళిపోండి, మా దగ్గర ఇప్పుడు ఏమీ లేదు. అల్లాహ్‌ మీకోసం ఏదైనా అనుగ్రహిస్తే రండి, ఉన్నవరకు ఇవ్వగలను. ఒకవేళ మీరు కోరితే మీ విషయాన్ని రాజుగారి ముందు పెడతాను. అతను కోరింది మీకు ఇస్తాడు. ఒకవేళ మీరు కోరితే సహనం పాటించండి. ఎందుకంటే, ప్రవక్త (స)ను ఇలా ప్రవచిస్తూ ఉండగా నేను విన్నాను. ”పేద ముహాజిరీన్లు ధనవంతులకంటే 40 సంవత్సరాలు ముందు స్వర్గంలో ప్రవేశిస్తారు,” అని అన్నారు. అప్పుడు వారు మేము సహనం పాటిస్తాం, ఎవరినీ ఏమీ అడగం అని అన్నారు. (ముస్లిమ్‌)

5258 – [ 28 ] ( لم تتم دراسته ) (3/1447)

وعَنْ عَبْدِ اللهِ بْنِ عَمْرٍوقَالَ: بَيْنَمَا أَنَا قَاعِدٌ فِي الْمَسْجِدِ وَحَلْقَةٌ مِنْ فُقَرَاءِ الْمُهَاجِرِيْنَ قُعُوْدٌ إِذْ دَخَلَ النَّبِيُّ صلى الله عليه وسلم فَقَعَدَ إِلَيْهِمْ فَقُمْتُ إِلَيْهِمْ فَقَالَ النَّبِيُّ صلى الله عليه وسلم: “لَيُبَشَّرُ فُقَرَاءُ الْمُهَاجِرِيْنَ بِمَا يَسُرُّوُجُوْهَهُمْ فَإِنَّهُمْ يَدْخُلُوْنَ الْجَنَّةَ قَبْلَ الْأَغْنِيَاءِ بِأَرْبِعِيْنَ عَامًا”. قَالَ: فَلَقَدْ رَأَيْتُ أَلْوَانَهُمْ أَسْفَرَتْ. قَالَ عَبْدُ اللهِ بْنِ عَمْرٍو: حَتَّى تَمَنَّيْتُ أَنْ أَكُوْنَ مَعَهُمْ أَوْ مِنْهُمْ. رَوَاهُ الدَّارَمِيُّ.  

5258. (28) [3/1447 అపరిశోధితం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ అమ్ర్‌ (ర) కథనం: మేము మస్జిద్‌లో కూర్చున్నాము. పేద ముహాజిరీన్లు కూడా ఒక ప్రక్క వృత్తాకారంలో కూర్చొని ఉన్నారు. ఇంతలో ప్రవక్త (స) మస్జిద్‌లోనికి వచ్చి, వారివద్ద కూర్చు న్నారు. నేను కూడా వారి వద్దకు వెళ్ళి కూర్చు న్నాను. అప్పుడు ప్రవక్త (స), ‘పేద ముహాజిరీన్లకు శుభవార్త! తీర్పుదినం నాడు వారిముఖాలు సంతో షంతో మెరుస్తూ ఉంటాయి. ఎందుకంటే వీరు ధన వంతులకంటే 40 సంవత్సరాలు ముందు స్వర్గంలో ప్రవేశిస్తారు,’ అని అన్నారు.

ఉల్లేఖనకర్త కథనం: ప్రవక్త (స) శుభవార్త తెలియ జేయగానే పేద ముహాజిరీన్ల ముఖాలు సంతోషంతో మెరవసాగాయి. ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘అమ్ర్‌ (ర) కథనం: అప్పుడు నేను వారిలో ఒకరినై ఉంటే ఎంత బాగుండేది అని అనిపించింది. (దార్మి)  

5259 – [ 29 ] ( لم تتم دراسته ) (3/1447)

وعَنْ أَبِيْ ذَرٍّ قَالَ: أَمَرَنِيْ خَلِيْلِيْ بِسَبْعٍ: أَمَرَنِيْ بِحُبِّ الْمَسَاكِيْنِ وَالدُّنُّوِ مِنْهُمْ وَأَمَرَنِيْ أَنْ أَنْظُرَ إِلى مَنْ هُوَ دُوْنِيْ وَلَا أَنْظُرَ إِلى مَنْ هُوَ فَوْقِيْ وَأَمَرَنِيْ أَنْ أَصِلَّ الرَّحِمَ وَإِنْ أَدْبَرَتْ. وَأَمَرَنِيْ أَنْ لَا أَسْأَلَ أَحَدًا شَيْئًا.  وَأَمَرَنِيْ أَنْ أَقُوْلَ بِالْحَقِّ وَإِنْ كَانَ مُرًّا. وَأَمَرَنِيْ أَنْ لَا أَخَافَ فِي اللهِ لَوْمَةَ لَا ئِمٍ وَأَمَرَنِيْ أَنْ أُكْثِرَ مِنْ قَوْلِ: لَا حَوْلَ وَلَا قُوَّةَ إِلَّا بِاللهِ فَإِنَّهُنَّ مَنْ كَنْزِ تَحْتَ الْعَرْشِ. رَوَاهُ أَحْمَدُ .

5259. (29) [3/1447అపరిశోధితం]

అబూ జ’ర్‌ (ర) కథనం: నా ప్రియ మిత్రులు ప్రవక్త (స) నాకు ఈ 7విషయాలు చేయమని ఆదేశించారు. 1. పేదలను ప్రేమించటం, వారికి చేరువగా ఉండటం.  2. తనకంటే క్రిందఉన్నవారిని చూడాలి, తనకంటే పైన ఉన్నవారిని చూడకూడదు. 3. బంధువుల పట్ల సహాయ సహకారాలు అందించాలి. వారు నాకు దూరంగా ఉన్నా సరే. 4. ఎవరినీ ఏ వస్తువూ అడగ రాదు. 5. ప్రజలకు చేదు అనిపించినా సత్యమే పల కాలి. 6. అల్లాహ్‌ విషయంలో, మంచిని ఆదేశించడంలో చెడును నిర్మూలించడంలో విమర్శలకు భయపడ రాదు. 7. ఎల్లప్పుడూ లా ‘హౌల వలా ఖువ్వత ఇల్లాబిల్లాహ్‌”  పఠిస్తూ ఉండటం, ఇవన్నీ దైవ సింహాసనం క్రిందఉన్న నిధికి చెందినవి.  (అ’హ్మద్‌)

5260 – [ 30 ] ( لم تتم دراسته ) (3/1447)

وَعَنْ عَائِشَةَ قَالَتْ: كَانَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم يُعْجِبُهُ مِنَ الدُّنْيَا ثَلَاثَةُ الطَّعَامُ وَالنِّسَاءُ وَالطِّيْبُ فَأَصَابَ اثْنَيْنِ وَلَمْ يُصِبْ وَاحِدًا أَصَابَ النِّسَاءَ وَالطِّيْبَ وَلَمْ يُصِبِ الطَّعَامَ. رَوَاهُ أَحْمَدُ.  

5260. (30) [3/1447 అపరిశోధితం]

‘ఆయి’షహ్‌ (ర) కథనం: ప్రవక్త (స)కు ఈ మూడు విషయాలంటే ఎంతో ఇష్టంగా ఉండేది. 1. ఆహారం 2. స్త్రీలు 3. సువాసన. అయితే రెండు విషయాలు లభించాయి కాని ఒకటి పూర్తిగా లభించలేదు. అల్లాహ్‌ స్త్రీలు, సువాసన ప్రసాదించాడు, కాని కడుపు నిండా అన్నం  లభించ లేదు.  (అ’హ్మద్‌)

5261 – [ 31 ] ( حسن ) (3/1448)

وَعَنْ أَنَسٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “حُبِّبَ إِلَيَّ الطِّيْبُ وَالنِّسَاءُ وَجُعِلَتْ قُرَّةُ عَيْنِيْ فِي الصَّلَاةِ”. رَوَاهُ أَحْمَدُ وَ النَّسَائِيُّ.

 وَزَادَ ابْنُ الْجَوْزِيِّ بَعْدَ قَوْلِهِ: “حُبِّبَ إِلَيَّ” “مِنَ الدُّنْيَا”.

5261. (31) [3/1448 ప్రామాణికం]

అనస్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”నాకు స్త్రీలు, సువాసన అంటే ఎంతో ఇష్టం, నా కంటి చలువ నమా’జులో  ఉంది.” (అ’హ్మద్‌, నసాయి’)

5262 – [ 32 ] ( صحيح ) (3/1448)

وعَنْ مُعَاذِ بْنِ جَبَلٍ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم لَمَّا بَعَثَ بِهِ إِلى الْيَمَنِ قَالَ:”إِيَّاكَ وَالتَّنَعُّمَ فَإِنَّ عِبَادَ اللهِ لَيْسُوْا بِالْمُتَنعَمِيْنَ”. رَوَاهُ أَحْمَدُ.

5262. (32) [3/1448 దృఢం]

ము’ఆజ్‌’ బిన్‌ జబల్‌ (ర) కథనం: ప్రవక్త (స) అతన్ని యమన్‌కు గవర్నర్‌గా పంపినపుడు, ము’ఆజ్‌’! నువ్వు ఐహిక వాంఛలకు, భోగవిలా సాలకు, అలంకరణలకు దూరంగా ఉండు. ఎందుకంటే దేవుని ప్రియ భక్తులు భోగ విలాసాలకు దూరంగా ఉంటారు అని హితోపదేశం చేసారు. (అ’హ్మద్‌)

5263 – [ 33 ] ( لم تتم دراسته ) (3/1448)

وَعَنْ عَلِيٍّ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَنْ رَضِيَ مِنَ اللهِ بِالْيَسِيْرِمِنَ الرِّزْقِ رَضِيَ اللهُ مِنْهُ بِالْقَلِيْلِ مِنَ الْعَمَلِ”.

5263. (33) [3/1448 అపరిశోధితం]

‘అలీ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”అల్లాహ్‌ (త) ప్రసా దించిన కొంతతోనే సంతృప్తి చెందితే, అల్లాహ్‌ (త) అతని కొన్ని సత్కార్యాలతోనే సంతృప్తి చెందుతాడు.” (బైహఖీ)

5264 – [ 34 ] ( ضعيف ) (3/1448)

وَعَنْ ابْنِ عَبَّاسٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَنْ جَاعَ أَوِ احْتَاجَ فَكَتَمَهُ النَّاسَ كَانَ حَقًّا عَلَى اللهِ عَزَّ وَجَلَّ أَنْ يَرْزُقُهُ رِزْقَ سَنَةٍ مِنْ حَلَالٍ”. رَوَاهُمَا الْبَيْهَقِيُّ فِيْ “شُعَبِ الْإِيْمَانِ”.

5264. (34) [3/1448బలహీనం]

ఇబ్నె ‘అబ్బాస్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఆకలికి లేదా, అవసరాలకు గురయి కూడా తన ఆకలి, అవసరాల గురించి ప్రజలకు చెప్పకుండా, ప్రజలముందు బహిర్గతం చేయకుండా ఉంటే, ఎవరినీ అర్థించకుండా ఉంటే, అతనికి ధర్మంగా ఒక సంవ త్సరం ఉపాధి ప్రసాదించడం అల్లాహ్‌ (త) పై తప్పని సరి అయిపోతుంది.”  (బైహఖీ – షు’అబిల్ ఈమాన్)

5265 – [ 35 ] ( ضعيف ) (3/1448)

وعَنْ عِمْرَانَ بْنِ حُصَيْنٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: ” إِنَّ اللهَ يُحِبُّ عَبْدَهُ الْمُؤْمِنَ الْفَقِيْرَالْمُتَعَفِّفَ أَبَا الْعَيَالِ”. رَوَاهُ ابْنُ مَاجَهُ.  

5265. (35) [3/1448బలహీనం]

‘ఇమ్రాన్‌ బిన్‌ ‘హు’సైన్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”అల్లాహ్‌ (త) తనదాసుల్లోని దరిద్రుడు, శీలవంతుడు, సంతానం గల విశ్వాసిని  ప్రేమిస్తాడు.” (ఇబ్నె మాజహ్)

5266 – [ 36 ] ( لم تتم دراسته ) (3/1448)

وَعَنْ زَيْدِ بْنِ أَسْلَمَ قَالَ: اِسْتَسْقَى يَوْمًا عُمَرُفَجِيْءَ بِمَاءٍ قَدْ شِيْبَ بِعَسَلٍ فَقَالَ: إِنَّهُ لَطَيِّبٌ لَكِنِّيْ أَسْمَعُ اللهَ عَزَّوَجَلَّ نَعَى عَلَى قَوْمٍ شَهَوَاتِهِمْ .فَقَالَ(أَذْهَبْتُمْ طَيِّبَاتِكُمْ فِيْ حَيَاتِكُمُ الدُّنْيَا وَاسْتَمْتَعْتُمْ بِهَا، 46: 20) فَأَخَافُ أَنْ تَكُوْنَ حَسَنَاتُنَا عُجِّلَتْ لَنَا فَلَمْ يَشْرَبْهُ. رَوَاهُ رَزِيْنٌ.  

5266. (36) [3/1448అపరిశోధితం]

‘జైద్‌ బిన్‌ అస్లమ్‌ (ర) కథనం: ఒకసారి ‘ఉమర్‌ (ర) త్రాగటానికి మంచినీళ్ళు అడిగారు. నీళ్ళు తీసుకు రావటం జరిగింది. అందులో తేనె కలిపి ఉంది. ‘ఉమర్‌ (ర) ఈతేనె కలిపిననీళ్ళు చాలా రుచికరంగా ఉన్నాయి. కాని నేను అల్లాహ్‌ (త) నుండి ఇలా విన్నాను, ”మనో కాంక్షలకు బానిసలైన జాతిని విమర్శించడం జరిగింది. ఖుర్‌ఆన్‌ ఆదేశం: ”…మీరు మీ ఇహలోక జీవితంలో మీ భోగభాగ్యాలను తరిగించు కున్నారు మరియు వాటిని బాగా అనుభ వించారు…” (అల్ అహ్ ఖాఫ్, 46:20) తన సత్కార్యాల ప్రతి ఫలం ఇక్కడే ఇవ్వబడుతుం దేమోనన్న భయంతో ఆ పానీయాన్ని  త్రిప్పి పంపివేసారు.

ఈ’హదీసు’ ద్వారా తెలిసిన విషయం ఏమిటంటే పుణ్యాత్ముల దృష్టి ఎల్లప్పుడూ పరలోక విషయాల పైనే ఉంటుంది. వాళ్ళకు ప్రాపంచిక విషయాలపై దృష్టి  ఉండదు.

5267 – [ 37 ] ( صحيح ) (3/1449)

وعَنْ ابْنِ عُمَرَقَالَ: مَا شَبِعْنَا مِنْ تَمَرٍحَتَّى فَتَحْنَا خَيْبَرَ. رَوَاهُ الْبُخَارِيُّ.

5267. (37) [3/1449దృఢం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘ఉమర్‌ (ర) కథనం: ఖైబర్‌ను జయించి నంతవరకు, మేము ఏనాడూ కడుపునిండా ఖర్జూరాలు కూడా తినలేదు. (బు’ఖారీ)

అంటే ఖైబర్‌ జయించిన తర్వాతనే కడుపునిండా తినగలిగాము.  

=====

2 بَابُ الْأَمَلِ وَالْحِرْصِ

2. ఆశ, అత్యాశలు

అధర్మ మనోకాంక్షలు, ఆశలు చాలా చెడ్డవి. దానివల్ల కుటుంబ జీవితం ప్రమాదాలకు గురవుతుంది. అరబీ లో దీన్ని షుహ్హ్‌ అంటారు. దీనివల్ల ఈర్ష్యాద్వేషాలు జనిస్తాయి. ధనప్రేమలో ఇది చాలా అధికంగా పెరుగు తుంది. భర్తకు ధన ప్రేమ ఉంటుంది. అతడు తన కుటుంబంపై తన శక్తిమేరకు ఖర్చుచేయడు. భార్య తన భర్త  ఇష్టప్రకారం రెండో పెళ్ళి చేసుకోనివ్వదు. సమాజంలో అభిప్రాయభేదాలు తలెత్తుతాయి. హృదయాల్లో అత్యాశ  చోటు  చేసుకుంటుంది.

అల్లాహ్‌ ఆదేశం: ”… మరియు మానవుల మనస్సులలో పేరాస ఇమిడివున్నది. మీరు సజ్జనులై, దైవభీతి కలిగి ఉండండి! ఎందుకంటే! నిశ్చయంగా, అల్లాహ్‌ మీ కర్మలన్నింటినీ బాగా ఎరుగును.” (అన్-నిసా’, 4:128) – భార్యాభర్తలిద్దరూ అత్యాశను వదలి ఉపకారం, భయభీతులను అవలంబిస్తే, వారి వ్యవహారాలన్ని పరిష్కరించబడతాయి. అన్నీ సక్రమంగా  జరిగితే  విజయమే  విజయం.

అల్లాహ్‌ ఆదేశం: ”…మరియు ఎవరైతే ఆత్మలోభం నుండి రక్షింపబడతారో! అలాంటివారు, వారే! సాఫల్యం పొందేవారు.” (అల్ హష్ర్, 59:9, అత్ తగాబున్, 64:16) – ఇవి భార్యాభర్తల్లోనే కాదు. ప్రతి మానవుని లోనూ ఉంటాయి. ఒక్కోసారి మానవుడు తన శక్తికంటే అధికంగా గౌరవమర్యాదలు పొందాలని ఆశిస్తాడు. అధిక వయస్సు, అధిక  ధనం  మొదలైనవి.

అల్లాహ్‌ ఆదేశం, ”మరియు అల్లాహ్‌ మీలో కొందరికి మరికొందరిపై ఇచ్చిన ఘనతను మీరు ఆశించకండి. పురుషులకు తాము సంపాదించిన దానికి తగినట్లుగా ఫలితం ఉంటుంది. మరియు స్త్రీలకు తాము సంపాదించిన దానికి తగినట్లుగా ఫలితం ఉంటుంది. మరియు అల్లాహ్‌ అనుగ్రహం కొరకు ప్రార్థిస్తూ ఉండండి. నిశ్చయంగా, అల్లాహ్‌ కు ప్రతిదాని పరి జ్ఞానం ఉంది.” (అన్-నిసా’, 4:32) – అంటే అల్లాహ్‌ (త) ఒకరికంటే మరొకరికి అధికంగా ప్రసాదిస్తాడు. ఎవరూ మరొకరికి ఎందుకు, ఎలా, ఎక్కడ దొరికిందని అసూయకు గురికారాదు. ఇతరులకు ఎంత లభించినా, వారివైపు చూడకుండా, ఏదైనా అల్లాహ్‌ (త)నే అర్థించాలి. ఒకవేళ అదీ మీకు లాభం చేకూర్చే దైతే అల్లాహ్‌ (త) ప్రసాదిస్తాడు. ఇలా చేయటం వల్ల మనస్తత్వత్వంలో ప్రాపంచిక వ్యామోహాలపట్ల అనాశక్తత జనిస్తుంది. దీనికి ఇతరుల పట్ల ఈర్ష్యాద్వేషాలకు గురికావటం కూడా జరుగదు.

అల్లాహ్‌ (త) ఆదేశం:”మరియు మేము నిశ్చయంగా నీకు తరచుగా పఠింపబడే ఏడు (సూక్తులను)  మరియు సర్వోత్తమ ఖుర్‌ఆన్‌ను ప్రసాదించాము.” (అల్-హిజ్ర్, 15:87) –  మేము ఇతరులకు ప్రసాదించిన ప్రాపంచిక వస్తువులపై దృష్టిసారించకు. అంటే కోరికల్లో కొన్ని మంచివి, మరికొన్ని చెడ్డవి  ఉంటాయి.

మరో చోట అల్లాహ్‌ ఇలా ఆదేశించాడు: ”వారిని తింటూ (త్రాగుతూ) సుఖసంతోషాలను అనుభవిస్తూ, (వృథా)  ఆశలలో ఉండటానికి విడిచిపెట్టు.” (అల్-‘హిజ్ర్, 15:3) – ‘అంటే ఇక్కడ మనోకాంక్షలను, అత్యాశలను ఖండించడం జరిగింది. వీటిని మీరు క్రింది ‘హదీసు’ల్లో తెలుసు కోగలరు.

اَلْفَصْلُ الْأَوَّلُ  మొదటి విభాగం   

5268- [ 1 ] ( صحيح ) (3/1450)

عَنْ عَبْدِ اللهِ قَالَ: خَطَّ النَّبِيُّ صلى الله عليه وسلم خَطًّا مُرَبَّعًا وَخَطَّ خَطًّا فِي الْوَسْطِ خَارِجًا مِنْهُ وَخَطَّ خُطَطًا صِغَارًا إِلى هَذَا الَّذِيْ فِي الْوَسْطِ مِنْ جَانِبِهِ الَّذِيْ فِي الْوَسْطِ وَفَقَالَ: “هَذَا الْإِنْسَانِ وَهَذَا أَجَلُهُ مُحِيْطٌ بِهِ وَهَذَا الَّذِيْ هُوَ خَارِجٌ أَمَلُهُ وَهَذِهِ الْخُطُوْطُ الصِّغَارُ الْأَعْرَاضُ فَإِنْ أَخْطَأهُ هَذَا نَهَسَهُ هَذَا وَإِنْ أَخْطَأهُ هَذَا نَهَسَهُ هَذَا”. رَوَاهُ الْبُخَارِيُّ.

5268. (1) [3/1450 దృఢం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ మస్‌’ఊద్‌ (ర) కథనం: ప్రవక్త (స) చతుర్భుజంగా గీసి అందులో ఒక గీత తిన్నగా గీసి దానికి  ఇరువైపుల గీతలు గీసారు. లోపల ఉన్న పెద్ద గీత మానవుడు, అతనికి నాలుగువైపుల ఉన్న గీతలు అతని మరణం బయటకు అధిగమించిన గీత అతని మనోకాంక్షలు, అత్యాశలు. లోపల ఉన్న చిన్న చిన్న గీతలు అతని కష్టాలు, సమస్యలు. ఒకటి పోతే మరొకటి వస్తుంది.[43](బు’ఖారీ)

5269 – [ 2 ] ( صحيح ) (3/1450)

وَعَنْ أَنَسٍ قَالَ: خَطَّ النَّبِيُّ صلى الله عليه وسلم خُطُوْطًا فَقَالَ: “هَذَا الْأَمَلُ وَهَذَا أَجَلُهُ فَبَيْنَمَا هُوَ كَذَلِكَ إِذْ جَاءَهُ اْلْخَطُّ الْأَقْرَبُ”. رَوَاهُ الْبُخَارِيُّ.

5269. (2) [3/1450దృఢం]

అనస్‌ (ర) కథనం: ప్రవక్త (స) అనేక గీతలు గీసి ఇది అతని మనోకాంక్షలు, ఇది అతని మరణం. అతను తన మనోకాంక్షల్లో తేలుతూ ఉంటాడు. చివరికి మరణం సంభవిస్తుంది. (బు’ఖారీ)

5270 – [ 3 ] ( متفق عليه ) (3/1450)

وَعَنْهُ قَالَ: قَالَ النَّبِيُّ صلى الله عليه وسلم: “يَهْرَمُ ابْنُ آدَمَ وَيَشِبُّ مِنْهُ اِثْنَانِ: الْحِرْصُ عَلَى الْمَالِ وَالْحِرْصُ عَلَى الْعُمُر”.

5270. (3) [3/1450 ఏకీభవితం]

అనస్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మాన వుడు ముసలివాడై పోతాడు కాని రెండు విషయాలు అతని ముసలి తనంలో కూడా యవ్వనంలా ఉంటాయి. ఒకటి ధనాశ, దీన్ని కూడబెట్ట టంలో రాత్రీపగలు కష్టపడతాడు. రెండవది చాలా కాలం జీవించే ఆశ,  అంటే నేను చాలారోజులు బ్రతికి ఉంటాను, ఇప్పుడే నేను చావను  అనేవి.” (బు’ఖారీ, ముస్లిమ్‌)

5271 – [ 4 ] ( متفق عليه ) (3/1450)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ: “لَا يَزَالُ قَلْبُ الْكَبِيْرِشَابًا فِي اثْنَيْنِ: فِيْ حُبِّ الدُّنْيَا وَطُوْلِ الْأَمَلِ”.

5271. (4) [3/1450ఏకీభవితం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ముసలివాని మనస్సు రెండు విషయాల్లో యవ్వనం లోనే ఉంటుంది. ఒకటి ఐహికవాంఛల్లో, అధిక ఆయుష్షు వాంఛించడంలో.” (బు’ఖారీ, ముస్లిమ్‌)

అంటే ముసలితనంలో కూడా ఈ రెండు విషయాలు యవ్వ నంలానే  ఉంటాయి.

5272 – [ 5 ] ( صحيح ) (3/1450)

وَعَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “أَعْذَرَاللهُ إِلَى امْرِئٍ أَخَّرَ أَجَلَهُ حَتّى بَلَّغَهُ سِتِّيْنَ سَنَةً”. رَوَاهُ الْبُخَارِيُّ.

5272. (5) [3/1450 దృఢం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”అల్లాహ్‌ 60 సంవత్సరాల వయస్సు ప్రసాదించిన వారి సాకులు, ఫిర్యాదులు స్వీకరించడు.”  [44]  (బు’ఖారీ)

5273 – [6 ] ( متفق عليه ) (3/1450)

وَعَنِ ابْنِ عَبَّاسٍ عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ: “لَوْ كَانَ لِاِبْنِ آدَمَ وَادِيَانِ مِنْ مَالٍ لَابْتَغَى ثَالِثًا وَلَا يَمْلَأُ جَوْفَ ابْنِ آدَمَ إِلَّا التُّرَابُ وَيَتُوْبُ اللهُ عَلَى مَنْ تَابَ”. مُتَّفَقٌ عَلَيْهِ.

5273. (6) [3/1450ఏకీభవితం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘అబ్బాస్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఒకవేళ మానవుని వద్ద రెండు అడవుల నిండా ధనసంపదలు, వెండి, బంగారాలు ఉన్నా, మూడవ దాన్ని ఆశిస్తాడు. ఒకవేళ మూడవది లభించినా, నాల్గవది ఆశిస్తాడు. అతని కోరికలు తీరవు. కేవలం మన్ను తప్ప మరేదీ అతని కడుపు నింపలేదు. అంటే మరణానంతరం అతని కోరికలు అంతం అవుతాయి. అల్లాహ్‌ (త) వైపు మరలేవాని వైపే అల్లాహ్‌ (త) మరలుతాడు. ఆయనవైపు మరలేవానికే అల్లాహ్‌ (త) పశ్చాత్తాపంచెందే భాగ్యాన్ని ప్రసాదిస్తాడు. (బు’ఖారీ,  ముస్లిమ్‌)

5274 – [ 7 ] ( صحيح ) (3/1451)

وَعَنِ ابْنِ عُمَرَ قَالَ: أَخَذَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم بِبَعْضِ جَسَدِيْ فَقَالَ: “كُنْ فِي الدُّنْيَا كَأَنَّكَ غَرِيْبٌ أَوْعَابِرُ سَبِيْلٍ وَعُدَّ نَفْسَكَ فِي أهْلِ الْقُبُوْرِ”. رَوَاهُ الْبُخَارِيُّ.  

5274. (7) [3/1451దృఢం]

ఇబ్నె ‘ఉమర్‌ (ర) కథనం: ప్రవక్త (స) నా భుజాన్ని పట్టుకొని, నువ్వు ప్రపంచంలో ప్రయాణీకుడిలా లేదా అపరిచితుడిలా జీవించు, నిన్నునీవు మృతునిగా భావించు.” (బు’ఖారీ)

—–

اَلْفَصْلُ الثَّانِيْ  రెండవ విభాగం 

5275 – [ 8 ] ( لم تتم دراسته ) (3/1451)

عَنْ عَبْدِ اللهِ بْنِ عَمْرٍو قَالَ: مَرَّ بِنَا رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم وَأَنَا وَأُمِّيْ نُطَيِّنُ شَيْئًا فَقَالَ: “مَا هَذَا يَا عَبْدَ اللهِ؟” قُلْتُ شَيْءٌ نُصْلِحُهُ. قَالَ: “الْأَمْرُ أَسْرَعُ مِنْ ذَلِك”. رَوَاهُ أَحْمَدُ وَالتِّرْمِذِيُّ وَقَالَ: هَذَا حَدِيْثٌ غَرِيْبٌ.

5275. (8) [3/1451అపరిశోధితం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘అమ్ర్‌ (ర) కథనం: ప్రవక్త (స) మా ప్రక్క నుండి వెళ్ళారు. నేనూ, నా తల్లిగారూ ఇద్దరూ మా  ఇంటి పైకప్పు రిపేరు చేస్తున్నాం. ప్రవక్త (స) చూసి ‘అబ్దుల్లాహ్‌ ఏం చేస్తున్నావు,’ అని అన్నారు. దానికి నేను, ‘రిపేరు చేస్తున్నాను,’ అని అన్నాను. ప్రవక్త (స) అది విని, ‘మరణం దానికంటే ముందు రాబోతున్నది. అంటే  ఇల్లు శిథిలం కాకముందే మరణం వచ్చేస్తుంది’ అని అన్నారు.[45] (అ’హ్మద్‌, తిర్మిజి’  – ఏకోల్లేఖనం)

5276 – [9] ( لم تتم دراسته ) (3/1451)

وَعَنِ ابْنَ عَبَّاسٍ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم كَانَ يُهْرِيْقُ الْمَاءَ فَيَتَيَمَّمُ بِالتُّرَابِ. فَأَقُوْلُ: يَا رَسُوْلَ اللهِ إِنَّ الْمَاءَ مِنْكَ قَرِيْبٌ. يَقُوْلُ: “مَا يُدْرِيْنِيْ لَعَلِّيْ لَا أَبْلُغُهُ”. رَوَاهُ فِيْ ” شَرْحِ السُّنَّةِ” وَابْنُ الْجَوْزِيِّ فِيْ كِتَابِ “اَلْوَفَاءِ” .

5276. (9) [3/1451అపరిశోధితం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘అబ్బాస్‌ (ర) కథనం: ప్రవక్త (స) మూత్ర విసర్జన చేసి, పెడ్డతో పరిశుభ్రపరచుకున్న తర్వాత తయమ్ముమ్‌ చేసుకునేవారు. అప్పుడు నేను’ ప్రవక్తా! నీళ్ళు దగ్గరలోనే ఉన్నాయి. అక్కడకు వెళ్ళి వు’దూ చేసుకోండి,’ అని అనేవాడిని. దానికి ప్రవక్త (స), ‘నీకేం తెలుసు? ఆ నీటి వరకు చేరక ముందే మరణం సంభవించవచ్చు. అందువల్ల పరిశుద్ధ స్థితిలోనే చావటం  మంచిది.’  (షర్‌’హు స్సున్నహ్‌)

5277 – [ 10 ] ( لم تتم دراسته ) (3/1451)

عَنْ أَنَسٍ أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم قَالَ: “هَذَا ابْنُ آدَمَ وَهَذَا أَجَلُهُ”. وَوَضَعَ يَدَهُ عِنْدَ قَفَاهُ ثُمَّ بَسَطَ فَقَالَ: “وَثَمَّ أَمَلُهُ”. رَوَاهُ التِّرْمِذِيُّ.

5277. (10) [3/1451అపరిశోధితం]

అనస్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఇది మానవుడు, ఇది అతని మరణం అని అంటూ ప్రవక్త (స) తన చేతిని తల వెనుక భాగంపై ఉంచి పైకి ఎత్తి, ఇదే మానవుని కోరికలు, అంటే మరణం సమీపంగా ఉంది. మానవుని కోరికలు చాలా పైన ఉన్నాయి అని అన్నారు. [46]  (తిర్మిజి’)

5278 – [ 11 ] ( لم تتم دراسته ) (3/1451)

وعَنْ أَبِيْ سَعِيْدِ الْخُدْرِيِّ أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم غَرَزَ عُوْدًا بَيْنَ يَدَيْهِ وَ آخَرَإِلى جَنْبِهِ وَآخَرَ أَبْعَدَ مِنْهُ. فَقَالَ: “أَتَدْرُوْنَ مَا هَذَا؟” قَالُوْا: اللهُ وَ رَسُوْلُهُ أَعْلَمُ. قَالَ: “هَذَا الْإِنْسَانُ وَهَذَا الْأَجَلُ” .أَرَاهُ قَال: “وَهَذَا الْأَمَلُ فَيَتَعَاطَى الْأَمَلَ فَلَحِقَهُ الْأَجَلُ دُوْنَ الْأَمَلِ”. رَوَاهُ فِيْ” شَرْحِ السُّنَّةِ”.

5278. (11) [3/1451అపరిశోధితం]

అబూ స’యీద్‌ ‘ఖుద్రీ (ర) కథనం: ప్రవక్త (స) ఒక కర్ర తీసుకొని తన ముందు పాతిపెట్టి, మరోకర్ర  దానికి సమీపంగా పాతారు. మూడవకర్ర మరికొంత దూరంలో పాతారు. ఆ తరువాత, ‘ఇదేమిటో మీకు తెలుసా?’ అని అన్నారు. దానికి ప్రజలు, ‘అల్లాహ్‌ (త) మరియు ఆయన ప్రవక్తకే తెలుసు,’ అని విన్నవించు కున్నారు. అప్పుడు ప్రవక్త (స) ‘ఈ మొదటి కర్రను మనిషి అను కోండి, రెండవ కర్రను మరణం అనుకోండి, మూడవ కర్రను మనిషి కోరికలు అనుకోండి. మానవుడు ఈ కోరికల్లో బంధించబడి ఉంటాడు. మరణం వాటన్నిటినీ నాశనం చేస్తుంది.’  (షర్’హుస్సున్నహ్‌)

5279 – [ 12 ] ( لم تتم دراسته ) (3/1452)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ: “عُمْرُ أُمَّتِيْ مِنْ سِتِّيْنَ سَنَةً إِلى سَبْعِيْنَ”. رَوَاهُ التِّرْمِذِيُّ وقَالَ: هَذَا حَدِيْثٌ غَرِيْبٌ.

5279. (12) [3/1452అపరిశోధితం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”నా అనుచరసమాజ  వయస్సు 60-70 సం. రాల మధ్య  ఉంటుంది.”  [47]  (తిర్మిజి’ – ఏకోల్లేఖనం)

5280 – [ 13 ] ( حسن ) (3/1452)

وعَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “أَعْمَارُأُمَّتِيْ مَا بَيْنَ السِّتِّيْنَ إِلى السَّبْعِيْنَ وَأَقَلُّهُمْ مَنْ يَجُوْزُذَلِكَ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَابْنُ مَاجَهُ. وذكر حديث عبد الله بن الشخير في”باب عيادة المريض”.

5280. (13) [3/1452 ప్రామాణికం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, నా అనుచర సమాజం వయస్సు 60 నుండి 70 సంవత్సరాల మధ్య ఉంటుంది. అయితే చాలా తక్కువమంది  దాన్ని మించి ఉంటారు. (తిర్మిజి’, ఇబ్నె  మాజహ్)

—–

اَلْفَصْلُ الثَّالِثُ   మూడవ విభాగం 

5281 – [ 14] ( لم تتم دراسته ) (3/1452)

عَنْ عَمْرِو بْنِ شُعَيْبِ عَنْ أَبِيْهِ عَنْ جَدِّهِ أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم قَالَ: “أَوَّلُ صَلَاحِ هَذِهِ الْأُمَّةِ الْيَقِيْنُ وَالزُّهْدُ وَأَوَّلُ فَسَادِهَا الْبُخْلُ وَالْأَمَلُ”. رَوَاهُ الْبَيْهَقِيُّ فِيْ “شُعَبِ الْإِيْمَانِ”.

5281. (14) [3/1452అపరిశోధితం]

‘అమ్ర్‌ బిన్‌ షు’ఐబ్‌ తన తండ్రి తాతల ద్వారా కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఈ అనుచర సమాజంలోని మొదటి సత్కార్యం నమ్మకం, భక్తి మరియు మొదటి ఉపద్రవం  పిసినారితనం మరియు అత్యాశలు.” (బైహఖీ-షు’అబిల్ ఈమాన్)

5282 – [ 15 ] ( لم تتم دراسته ) (3/1452)

وعَنْ سُفْيَاَنَ الثَّوْرِيِّ قَالَ: لَيْسَ الزُّهْدُ فِي الدُّنْيَا بِلُبْسِ الْغَلِيْظِ وَالْخَشِنِ وَأَكْلِ الْجَشِبِ إِنَّمَا الزُّهْدُ فِي الدُّنْيَا قِصَرُ الْأَمَلِ. رَوَاهُ فِيْ “شَرْحِ السُّنَّةِ”.

5282. (15) [3/1452 అపరిశోధితం]

సుఫ్యాన్‌ సౌ’రీ కథనం: ”ప్రపంచంలో ఖద్దరు వస్త్రాలు ధరించటం, రుచికరమైన ఆహారానికి దూరంగా ఉండటం భక్తితత్వం కాదు, కోరికలు లేకుండా జీవించడమే దైవభక్తి.”  (షర్‌’హుస్సున్నహ్‌)

5283 – [ 16 ] ( لم تتم دراسته ) (3/1452)

وعَنْ زَيْدِ بْنِ الْحُسَيْنِ قَالَ: سَمِعْتُ مَالِكًا وَسُئِلَ أَيُّ شَيْءٍ الزُّهْدُ فِي الدُّنْيَا؟ قَالَ: طَيِّبُ الْكَسْبِ وَقِصَرُالْأَمَلِ.  رَوَاهُ الْبَيْهَقِيُّ فِيْ “شُعَبِالْإِيْمَانِ” .

5283. (16) [3/1452 అపరిశోధితం]

‘జైద్‌ బిన్‌ ‘హుసైన్‌ కథనం: ఇమామ్‌ మాలిక్‌ ఇలా పలుకుతుండగా నేను విన్నాను, ”అతన్ని పరి త్యాగం గురించి ప్రశ్నించడం జరిగింది. దానికి అతను ధర్మ సంపాదన, కోరికలను తగ్గించడమే భక్తీ, త్యాగం” అని  అన్నారు.  (బైహఖీ – షు’అబిల్  ఈమాన్)

=====

3 بَابُ اِسْتِحْبَابِ الْمَالِ وَالْعُمْرِ لِلطَّاعَةِ

3. దైవ విధేయత దృష్ట్యా ధనం, ఆయుష్షులను ప్రేమించడం

సాధారణంగా ప్రతి వస్తువూ అల్లాహ్‌ (త) ప్రసాదించినదే. అన్నీ ఆయనవే. ధనం ఆయన ప్రసాదించినదే. జీవితం, ప్రాణం, అంతా అల్లాహ్‌ (త) ప్రసాదించినవే. కనుక ఆ ధనాన్ని ఆయన మార్గంలోనే ఖర్చుపెట్టాలి. జీవితం ఆయన ఆరాధనలోనే గడపాలి. దీని దృష్ట్యా ఈ రెండు విషయాలను ప్రేమించడం అంటే అల్లాహ్‌ (త) విధేయతలో ధనం ఖర్చు చేయడం, దైవ విధేయతలో జీవితాన్ని ఖర్చుచేయడం కూడా ఆరాధనగా పరిగణించ బడతాయి. ఎందుకంటే అల్లాహ్‌ (త) ధనప్రాణాలకు బదులుగా స్వర్గం ప్రసాదిస్తానని వాగ్దానంచేసాడు.  

అల్లాహ్‌ ఆదేశం: ”నిశ్చయంగా అల్లాహ్‌ విశ్వాసుల నుండి వారి ప్రాణాలను వారి సంపదలనుకొన్నాడు. కాబట్టి నిశ్చయంగా వారి కొరకు స్వర్గముంది. వారు అల్లాహ్‌ మార్గంలో పోరాడి (తమ శత్రువులను) చంపు తారు మరియు చంపబడతారు. మరియు ఇది తౌరాత్‌, ఇంజీల్‌ మరియు ఖుర్‌ఆన్‌లలో, ఆయన (అల్లాహ్) చేసిన వాగ్దానం, సత్యమైనది. మరియు తన వాగ్దా నాన్ని నెరవేర్చటంలో అల్లాహ్‌ను మించిన వాడు ఎవడు? కావున మీరు ఆయనతో చేసిన వ్యాపారానికి సంతోషపడండి. మరియు ఇదే ఆ గొప్ప విజయం. (వీరే అల్లాహ్‌ ముందు) పశ్చాత్తాపపడే వారు, ఆయనను ఆరాధించేవారు, స్తుతించే వారు (అల్లాహ్‌ మార్గంలో) సంచరించేవారు (ఉపవాసాలు చేసేవారు). ఆయన సన్నిధిలోవంగే (రుకూ’ఉచేసే) వారు, సాష్టాంగం(సజ్దా) చేసేవారు, ధర్మమును ఆదేశించేవారు మరియు అధర్మమును నిషేధించే వారు మరియు అల్లాహ్‌ విధిం చిన హద్దులను పాటించేవారు కూడాను. మరియు విశ్వాసులకు శుభవార్తతెలుపు. అల్లాహ్కు సాటి కల్పించే వారు (ముష్రికులు), దగ్గరి బంధువులైనా, వారు నరకవాసులని వ్యక్తమైన తరువాత కూడా, ప్రవక్తకు మరియు విశ్వాసులకు వారి క్షమాపణకై ప్రార్థించటం  తగదు.”  (అత్తౌబహ్‌, 9 : 111-113)

ఈ ఆయాతులలో దీన్ని గురించే ప్రస్తావించడం, శుభవార్త అందజేయడం జరిగింది. అందువల్ల దైవప్రీతి కోసం  ఈ  రెంటిని ప్రేమించడం  ధర్మసమ్మతమే.

اَلْفَصْلُ الْأَوَّلُ  మొదటి విభాగం 

5284 – [ 1 ] ( صحيح ) (3/1453)

عَنْ سَعْدٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِنَّ اللهَ يُحِبُّ الْعَبْدَ التَّقِيَّ الْغَنِيَّ الْخَفِيَّ”. رَوَاهُ مُسْلِمٌ. وَذُكِرَحَدِيْثُ ابْنِ عُمَرَ: “لَا حَسَدَ إِلَّا فِيْ اثْنَيْنِ” فِيْ “بَابِ فَضَائِلِ الْقُرْآنِ”.

5284. (1) [3/1453దృఢం]

స’అద్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”అల్లాహ్‌ (త) తన భయభీతులు, ప్రాపంచిక అనావశ్యకత మరియు ఏకాంతంలో గడిపే  దాసుణ్ణి  ప్రేమిస్తాడు.” [48]  (ముస్లిమ్‌)

—–

اَلْفَصْلُ الثَّانِيْ  రెండవ విభాగం  

5285 – [ 2 ] ( لم تتم دراسته ) (3/1453)

عَنْ أَبِيْ بَكْرَةَ أَنَّ رَجُلًا قَالَ: يَا رَسُوْلَ اللهِ أَيُّ النَّاسِ خَيْرٌ؟ قَالَ مَنْ طَالَ عُمُرُهُ وَحَسُنَ عَمَلُهُ”. قَالَ: فَأَيُّ النَّاسِ شَرٌّ؟ قَالَ: “مَنْ طَالَ عُمُرُهُ وَسَاءَ عَمَلُهُ”. رَوَاهُ أَحْمَدُ وَالتِّرْمِذِيُّ وَالدَّارَمِيُّ

5285. (2) [3/1453 అపరిశోధితం]

అబీ బక్‌రహ్(ర) కథనం: ప్రవక్త (స)ను ఒక వ్యక్తి, ‘ఓ ప్రవక్తా! అందరికంటే మంచివారెవరు?’ అని ప్రశ్నించాడు. దానికి ప్రవక్త (స), ‘అధిక ఆయుష్షు ఉండి, సత్కార్యాలు చేసేవాడు,’ అని సమాధానం ఇచ్చారు. ఆ వ్యక్తి మళ్ళీ, ‘అందరికంటే చెడ్డవా డెవడు?’ అని ప్రశ్నించాడు. ప్రవక్త (స), ‘అధిక ఆయుష్షు ఉండి, పాపకార్యాలు చేసేవాడు,’ అని అన్నారు. [49] (అ’హ్మద్‌, తిర్మిజీ’, దార్మీ)

5286 – [ 3] ( لم تتم دراسته ) (3/1453)

وعَنْ عُبَيْدِ بْنِ خَالِدٍ أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم آخى بَيْنَ رَجُلَيْنِ فَقُتِلَ أَحَدُهُمَا ثُمَّ مَاتَ الْآخَرُ بَعْدَهُ بِجُمُعَةٍ أَوْ نَحْوِهَا فَصَلُّوْا عَلَيْهِ. فَقَالَ النَّبِيُّ صلى الله عليه وسلم: “مَا قُلْتُمْ؟” قَالُوْا: دَعَوْنَا اللهَ أَنْ يَغْفِرَلَهُ وَ يَرْحَمَهُ وَيُلْحِقَهُ بِصَاحِبِهِ. فَقَالَ النَّبِيُّ صلى الله عليه وسلم: “فَأَيْنَ صَلَاتُهُ بَعْدَ صَلَاتِهِ وَعَمَلُهُ بَعْدَ عَمَلِهِ؟” أَوْقَالَ: “صِيَامُهُ بَعْدَ صِيَامُهُ لَمَا بَيْنَهُمَا أَبْعَدُ مِمَّا بَيْنَ السَّمَاءِ وَالْأَرْضِ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ وَالنَّسَائِيُّ

5286. (3) [3/1453 అపరిశోధితం]

‘ఉబైద్‌ బిన్‌ ‘ఖాలిద్‌ (ర) కథనం: ప్రవక్త (స) ఇద్దరు వ్యక్తుల మధ్య సోదరభావాన్ని కల్పించారు. అంటే ఇద్దరు అపరిచిత వ్యక్తులను సోదరులుగా చేసి వేసారు. దీన్ని ములాఖాత్‌ సంబంధం అంటారు. వీరిలో ఒకడు దైవమార్గంలో వీరమరణం పొందాడు, ఆ తరువాత మరొకడు తన పడకపై మరణించాడు. ప్రజలు అతని జనా’జహ్ నమా’జు చదివారు. ప్రవక్త (స), ‘రెండవ వ్యక్తిని గురించి మీరేమంటారు,’ అని అడిగారు. దానికి ప్రజలు, ‘అతని గురించి అల్లాహ్‌ (త) ను ప్రార్థించామని, అతన్నిక్షమించమని, అతనిపై దయచూపమని ఇంకా వీరమరణం పొందిన అతని సోదరునితో కలపమని ప్రార్థించాము,’ అని అన్నారు. అది విని ప్రవక్త (స), ‘అతని సోదరుడు ఒకవారం ముందు మరణించాడు. ఇతడు వారం తరు వాత మరణించాడు. మరి ఇతని నమా’జు, రో’జహ్ ఇతర సత్కార్యాల పుణ్యం ఏమయ్యింది? వాస్తవం ఏమి టంటే వీరిద్దరిమధ్య భూమ్యాకాశాలంత దూరం ఉంది,’ అని అన్నారు. [50]  (అబూ  దావూద్‌,  నసాయి’)

5287 – [ 4 ] ( صحيح ) (3/1453)

وَعَنْ أَبِي كَبْشَةَ الْأَنصارِيِّ أَنَّهُ سَمِعَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ: “ثَلَاثٌ أَقْسِمُ عَلَيْهِنَّ وَأُحَدِّثُكُمْ حَدِيْثًا فَاحْفَظُوْهُ فَأَمَّا الَّذِيْ أُقْسِمُ عَلَيْهِنَّ فَإِنَّهُ مَا نَقَصَ مَالُ عَبْدٍ مِنْ صَدَقَةٍ وَلَا ظُلِمَ عَبْدٌ مَظْلِمَةً صَبَرَ عَلَيْهَا إِلَّا زَادَهُ اللهُ بِهَا عِزًّا وَلَا فَتَحَ عَبْدٌ بَابَ مَسْأَلَةٍ إِلَّا فَتَحَ اللهُ عَلَيْهِ بَابَ فَقْرٍ. وَأَمَّا الَّذِيْ أُحَدِّثُكُمْ فَاحْفَظُوْهُ”. فَقَالَ: “إِنَّمَا الدُّنْيَا لِأَرْبَعَةٍ نَفَرٍ: عَبْدٌ رَزَقَهُ اللهُ مَالًا وَعِلْمًا فَهُوَ يَتَّقِيْ فِيْهِ رَبَّهُ وَيَصِلُ رَحِمَهُ وَيَعْمَلُ لِلّهِ فِيْهِ بِحَقِّهِ فَهَذَا بِأَفْضَلِ الْمَنَازِلِ. وَعَبْدٌ رَزَقَهُ اللهُ عِلْمًا وَلَمْ يَرْزُقُهُ مَالًا فَهُوَ صَادِقُ النِّيَّةِ وَيَقُوْلُ: لَوْ أَنَّ لِيْ مَالًا لَعَمِلْتُ بِعَمَلٍ فُلَانٍ فَأَجْرُهُمَا سَوَاءٌ. وَعَبْدٌ رَزَقَهُ اللهُ مَالًا وَلَمْ يَرْزُقْهُ عِلْمًا فَهُوَ يَتَخَبَّطُ فِيْ مَالِهِ بِغَيْرٍ عِلْمٍ لَا يَتَّقِيْ فِيْهِ رَبَّهُ وَلَا يَصِلُ فِيْهِ رَحِمَهُ وَلَا يَعْمَلُ فِيْهِ بِحَقٍّ. فَهَذَا بِأَخْبَثِ الْمَنَازِلِ وَعَبْدٌ لَمْ يَرْزُقُهُ اللهُ مَالًا وَلَا عِلْمًا فَهُوَ يَقُوْلُ: لَوْ أَنَّ لِيْ مَالًا لَعَمِلْتُ فِيْهِ بِعَمَلٍ فُلَانٍ فَهُوَ نِيَّتُهُ وَوِزْرَهُمَا سَوَاءٌ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَقَالَ:هَذَا حَدِيْثٌ صَحِيْحٌ.

5287. (4) [3/1453 దృఢం]

అబూ కబ్‌షహ్ అ’న్సారీ (ర) కథనం: అతడు ప్రవక్త (స) ఇలా ప్రవచిస్తూ ఉండగా విన్నాడు, ”మూడు విషయాలపై ప్రమాణం చేస్తున్నాను. ఇవన్నీ సత్యమైనవే, ఇంకా నేనొక ‘హదీసు’ కూడా వివరిస్తాను, మీరు దాన్ని గుర్తుంచుకోండి. నేను ప్రమాణం చేసే ఆ మూడు విషయాలు ఇవి: 1. దాసుడు తన ధనాన్ని అల్లాహ్‌ (త) మార్గంలో ఖర్చుచేస్తాడు, దానధర్మాలు చేస్తాడు, దానివల్ల అతని ధనం తరగదు, పైగా పెరుగుతూ పోతుంది. 2. ఎవరైనా బాధించబడి, దానిపై అతడు సహనం పాటిస్తే, అల్లాహ్‌ (త) దీనిద్వారా అతని గౌరవాన్ని అధికం చేస్తాడు. 3. ఎవరైనా అర్థించటాన్ని అలవాటుగా చేసుకుంటే అల్లాహ్‌ (త) అతన్ని పేదరికానికి, దారిద్య్రానికి గురిచేస్తాడు, అంటే ఎంత అర్థిస్తే అంత దారిద్య్రానికి గురవుతాడు. అదేవిధంగా మమ్మల్ని గుర్తుంచు కోమన్న ఆ ‘హదీసు’ కూడా వినిపిస్తాను. అదేమి టంటే, ప్రపంచం నలుగురు వ్యక్తుల కొరకు ఉంది. 1. అల్లాహ్‌ (త) జ్ఞానం, ధనం ప్రసాదించిన వ్యక్తి. అతడు తన ధనాన్ని దైవమార్గంలో ఖర్చు పెడతాడు, అధర్మకార్యాల్లో ఖర్చు కాకూడదని భయపడుతూ ఉంటాడు. ఇంకా అతడు నేర్చుకున్న జ్ఞానానికి అనుగుణంగా ఆచరిస్తాడు, ఇంకా తన బంధువులకు మేలు చేస్తాడు, బంధువులతో కలసి ఉంటాడు, దైవప్రీతి కోసం వారి హక్కులను నెరవేరుస్తూ ఉంటాడు. కనుక అతని స్థానంగొప్పది. 2. అల్లాహ్‌ కేవలం జ్ఞానం ప్రసాదించిన వ్యక్తి. ఇతడు చిత్తశుద్ధితో ఉంటాడు, ఇంకా నా దగ్గర కూడా ధనం ఉంటే నేను కూడా ఫలానా సత్కార్యాలు చేసేవాడిని అని ఆశిస్తాడు. ఈ జ్ఞానం, చిత్తశుద్ధి వల్ల ఇతడు మొదటి వ్యక్తికి సమానం కాగలడు. అంటే ఇద్దరి పుణ్యం సమానం, ఇద్దరి స్థానం ఒక్కటే. 3. అల్లాహ్‌ (త) కేవలం ధనం ప్రసాదించిన వ్యక్తి, అతడు తన అజ్ఞానం వల్ల ధనాన్ని అటూఇటూ విచ్చలవిడిగా ఖర్చుపెడ తాడు. దైవానికి కూడా భయపడడు. బంధుత్వాలను కలపడు, తన ధనంలో గల అల్లాహ్‌ (త) హక్కును చెల్లించడు. దాసుల హక్కులను చెల్లించడు. కనుక ఈ వ్యక్తి చాలా నీచ స్థానం కలవాడు. 4. అల్లాహ్‌ (త) జ్ఞానం, ధనం రెండూ ఇవ్వని వ్యక్తి. అతడు ఒకవేళ తన దగ్గర కూడా ధనం ఉంటే తను కూడా ఫలానా వ్యక్తిలా చెడు కార్యాల్లో ధనం ఖర్చుపెట్టే వాడినని ఆశిస్తాడు. అతని సంకల్పానికి తగ్గట్టు అతనికి పాపం చుట్టుకుంటుంది. అంటే పాపపరంగా ఇతడు మూడో  వ్యక్తికి సమానం. అంటే మూడవ వ్యక్తి నాల్గవ వ్యక్తి  పాపంలో సమానులు. (తిర్మిజి’ – దృఢం)

5288- [ 5 ] ( صحيح ) (3/1454)

وَ عَنْ أَنَسٍ أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم قَالَ: “إِنَّ اللهَ تَعَالى إِذَاأَرَادَ بِعَبْدٍ خَيْرًا اِسْتَعْمَلَهُ”. فَقِيْلَ: وَكَيْفَ يَسْتَعْمِلُهُ يَا رَسُوْلَ اللهِ؟ قَالَ: “يُوَفِّقُهُ لِعَمَلٍ صَالِحٍ قَبْلَ الْمَوْتِ”. رَوَاهُ التِّرْمِذِيُّ.

5288. (5) [3/1454దృఢం]

అనస్‌ (ర) కథనం: ప్రవక్త (స): ”అల్లాహ్‌ మేలు చేయ గోరే వ్యక్తికి సత్కార్యాల్లో ప్రవేశపెడతాడు,” అని ప్రవచించారు. దానికి ప్రజలు, ‘ప్రవక్తా! ఎలా ప్రవేశ పెడతాడు’ అని విన్నవించుకోగా, మరణం కంటే ముందు సత్కార్యాలు చేసే భాగ్యాన్ని  ప్రసాదిస్తాడు.  (తిర్మిజి’)

5289 – [ 6 ] ( ضعيف ) (3/1454)

وَعَنْ شَدَّادِ بْنِ أَوْسٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم : “اَلْكَيِّسُ مَنْ دَانَ نَفْسَهُ وَعَمِلَ لِمَا بَعْدَ الْمَوْتِ. وَالْعَاجِزُ مَنْ أَتْبَعَ نَفْسَهُ هَوَاهَا وَتَمَنّى عَلَى اللهِ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَابْنُ مَاجَهُ.

5289. (6) [3/1454బలహీనం]

షద్దాద్‌ బిన్‌ ఔస్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”దైవప్రీతి కోసం సత్కార్యాల్లో తన్నుతాను నిమగ్నం చేసుకున్నవాడే వివేకవంతుడు, బుద్ధిమంతుడు. అంటే ఎల్లప్పుడూ దైవారాధనలో ఉంటాడు. అదే విధంగా అనవసరమైనకోరికల్లో, మనోకాంక్షల్లో మునిగి తేలేవాడే నీచుడు, బుద్ధిహీనుడు. అంటే మనో కాంక్ష లకు, వ్యసనాలకు, కోరికలకు దాసుడై పోతాడు. దైవ దాస్యానికి దూరమైపోతాడు. అయినప్పటికీ దైవం అనుగ్రహిస్తాడని ఆశిస్తాడు.[51] (తిర్మిజి’, ఇబ్నె మాజహ్)

—–

اَلْفَصْلُ الثَّالِثُ   మూడవ విభాగం

5290 – [ 7 ] ( صحيح ) (3/1455)

عَنْ رَجُلٍ مِنْ أَصْحَابِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ : كُنَّا فِيْ مَجْلِسٍ فَطَلَعَ عَلَيْنَا رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم وَعَلَى رَأْسِهِ أَثرُ مَاءٍ فَقُلْنَا : يَا رَسُوْلَ اللهِ نَرَاكَ طَيِّبَ النَّفْسِ . قَالَ : أَجَلْ . قَالَ: ثُمَّ خَاضَ الْقَوْمُ فِي ذِكْرِ الْغِنَى فَقَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم : ” لَا بَاْسَ بِالْغِنَى لِمَنِ اتَّقَى اللهَ عَزَّ وَجَلَّ وَالصِّحَّةِ لِمَنِ اتَّقَى خَيْرٌ مِنَ الْغِنَى وَطِيْبُ النَّفْسِ مِنَ النَّعِيْمِ.” رَوَاهُ أَحْمَدُ.

5290. (7) [3/1455దృఢం]

ఒక ప్రవక్త (స) అనుచరుని కథనం: మేము ఒక సభలో కూర్చున్నాము. ఇంతలో ప్రవక్త (స) వచ్చారు. ప్రవక్త (స) తలపై నీటి చిహ్నాలు ఉన్నాయి. అంటే ప్రవక్త (స) స్నానం చేసి వచ్చారు. తల తడిగా ఉంది. అప్పుడు మేము, ‘ఓ ప్రవక్తా! ఈ రోజు మేము మిమ్మల్ని సంతోషంగా ఉన్నట్లు చూస్తున్నాము’ అని అన్నాము. దానికి ప్రవక్త (స) ‘అవును’ అని అన్నారు. ఆ తరువాత సభ్యులందరూ ప్రాపంచిక ధనసంపదల గురించి మాట్లాడుకోసాగారు. ‘ఫలానా వ్యక్తి ఇలా ఉన్నాడు, ఫలానా వ్యక్తి ఇలా ఉన్నాడు,’ అని. అది విని ప్రవక్త (స) ”దైవభీతిపరులు ధనవంతులు కావడంలో ఎటువంటి భయంలేదు. భయభక్తులు గలవారికి ధనసంపదల కంటే ఆరోగ్యం, క్షేమం ఎంతో విలువైనవి. ఎందుకంటే ఆరోగ్యం, క్షేమం, ధనసంపదలు అన్ని దైవానుగ్రహాలే. కనుక కృతజ్ఞులై ఉండటం ఎంతైనా అవసరం,” అని అన్నారు.

5291 – [ 8 ] ( لم تتم دراسته ) (3/1455)

وَعَنْ سُفْيَانَ الثَّوْرِيِّ قَالَ: كَانَ الْمَالُ فِيْمَا مَضَى يُكْرَهُ فَأَمَّا الْيَوْمَ فَهُوَ تُرْسُ الْمُؤْمِنِ وَقَالَ لَوْلَا هَذِهِ الدَّنَانِيْرُ لَتَمَنْدَلَ بِنَا هَؤُلَاءِ الْمُلُوْكُ. وَقَالَ مَنْ كَانَ فِيْ يَدِهِ مِنْ هَذِهِ شَيْءٌ فَلْيُصْلِحْهُ فَإِنَّهُ زَمَانٌ إِنِ احْتَاجَ كَانَ أَوَّلَ مَنْ يَبْذُلُ دِيْنَهُ وَقَالَ: اَلْحَلَالُ لَايَحْتَمِلُ السَّرَفَ. رَوَاهُ فِي شَرْحِ السُّنَّةِ .

5291. (8) [3/1455 అపరిశోధితం]

సుఫియాన్‌ సౌ’రీ కథనం: ప్రాచీన కాలంలో ధనాన్ని చెడుగా భావించేవారు. కాని ఈ కాలంలో విశ్వాసికి ధనం ఢాలు వంటిది. విశ్వాసి వద్ద ఒకవేళ ధనం లేకుంటే ధన వంతులు, చక్రవర్తులు అవమానానికి గురిచేస్తారు. ధనం లేక పోవటం వల్ల వారి ముందుకు వెళ్ళవలసి వస్తుంది. మా పరిస్థితి రుమాలులా ఉంటుంది. ఎందుకంటే రుమాలుకు ఎటువంటి గౌరవం ఉండదు. దానితో చేతులు, ముక్కు శుభ్రం చేసుకుంటారు. అదేవిధంగా ధనం లేకపోవడం వల్ల ధనవంతులు మమ్మల్ని హీనంగా చూస్తారు. కాస్తంత ధనం ఉన్న వారు దాన్ని అభివృద్ధి చేయాలి. ఎందుకంటే అత్యవసర పరిస్థితుల్లో వృద్ధాప్యంలో పనికి వస్తుంది. మనిషి డబ్బులేని పక్షంలో తన విశ్వాసాన్ని, ధర్మాన్ని అమ్ముకుంటాడు. సౌ’రీ అభి ప్రాయం, ”ధర్మ సంపాదనను వృథా చేయరాదు. దుబారా ఖర్చులతో ధనం వృథా అవుతుంది. వ్యర్థం అయిన తర్వాత ప్రజల హీనదృష్టికి గురి కావడం జరుగుతుంది.”  (షర్‌’హుస్సున్నహ్‌)

5292 – [ 9] ( لم تتم دراسته ) (3/1455)

وَعَنِ ابْنِ عَبَّاسٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: يُنَادِيْ مُنَادٍ يَوْمَ الْقِيَامَةِ: أَيْنَ أَبْنَاءُ السِّتِّيْنَ؟ وَهُوَ الْعُمُرُ الَّذِيْ قَالَ اللهُ تَعَالى [أَوَلَمْ نُعَمِّرْكُمْ مَا يَتَذَكَّرُ فِيْهِ مَنْ تَذَكَّرَ وَجَاءَكُمُ النَّذِيْرُ، 35: 37] رَوَاهُ الْبَيْهَقِيُّ فِيْ شُعَبِ الْإِيْمَانِ.

5292. (9) [3/1455 అపరిశోధితం]

ఇబ్నె ‘అబ్బాస్‌ (ర) కథనం: ప్రవక్త (స)  ప్రవచనం: ”తీర్పుదినం నాడు ఒక ప్రకటించేవాడు, ’60 సంవత్సరాలు వయస్సుగల వారు ఎక్కడ ఉన్నారు,’ అని ప్రకటిస్తాడు. ఇది ఎలాంటి వయస్సంటే, దీన్ని గురించి అల్లాహ్‌ ఇలా ఆదేశించాడు, “..ఏమీ? గుణపాఠం నేర్చుకోదలచిన వాడు గుణపాఠం నేర్చు కోవటానికి, మేము మీకు తగినంత వయస్సును ఇవ్వలేదా? మరియు మీ వద్దకు హెచ్చరిక చేసేవాడు కూడా వచ్చాడు కదా?..” (ఫాతిర్, 35:37) – అంటే ఖుర్‌ఆన్‌ వచ్చింది, ప్రవక్త (స) వచ్చారు. ముసలి తనం కూడా వచ్చింది. ఇవన్నీ మీకు హెచ్చరించేవి, అప్రమత్తంచేసేవి. అయినా మీరు తెలివి లేకుండా ప్రవర్తిస్తున్నారు.” (బైహఖీ – షు’అబిల్ ఈమాన్)

5293 – [ 10 ] ( لم تتم دراسته ) (3/1455)

وعَنْ عَبْدِ اللهِ بْنِ شَدَّادٍ قَالَ: إِنَّ نَفَرًا مِنْ بَنِيْ عُذْرَةَ ثَلَاثَةً أَتَوُا النَّبِيَّ صلى الله عليه وسلم فَأَسْلَمُوْا قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَنْ يَكْفِيْهِمْ؟ “قَالَ طَلْحَةُ: أَنَا. فَكَانُوْا عِنْدَهُ فَبَعَثَ النَّبِيُّ صلى الله عليه وسلم بَعْثًا فَخَرَجَ فِيْهِ أَحَدُهُمْ فَاسْتُشْهِدَ ثُمَّ بَعَثَ بَعْثًا فَخَرَجَ فِيْهِ الْآخَرُ فَاسْتُشْهِدَ ثُمَّ مَاتَ الثَّالِثُ عَلَى فِرَاشِهِ. قَالَ: قَالَ طَلْحَةُ: فَرَأَيْتُ هَؤُلَاءِ الثَّلَاثَةَ فِي الْجَنَّةِ. وَرَأَيْتُ الْمَيِّتَ عَلَى فِرَاشِهِ أَمَامَهُمْ وَالَّذِيْ اسْتُشْهِدَ آخِرًا يَلِيْهِ وَأَوَّلَهُمْ يَلِيْهِ فَدَخَلَنِيْ مِنْ ذَلِكَ فَذَكَرْتُ لِلنَّبِيِّ صلى الله عليه وسلم فَقَالَ: “وَمَا أَنْكَرْتَ مِنْ ذَلِكَ؟ لَيْسَ أَحَدٌ أَفْضَلَ عِنْدَ اللهِ مِنْ مُؤْمِنٍ يُعَمَّرُ فِي الْإِسْلَامِ لِتَسْبِيْحِهِ وَتَكْبِيْرِهِ وَتَهْلِيْلِهِ”.

5293. (10) [3/1455అపరిశోధితం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ షద్దాద్‌ (ర) కథనం: బనీ ‘ఉజ్ర’ తెగకు చెందిన ముగ్గురు వ్యక్తులు ప్రవక్త (స) వద్దకు వచ్చి ఇస్లామ్‌ స్వీకరించారు. ప్రవక్త (స) తన అనుచరులను ఉద్దేశించి, ”ఈ నవ ముస్లిములను ఆదుకొని నాకు సహాయం చేయగలవారెవరైనా మీలో ఉన్నారా?” అని అన్నారు. వెంటనే అబూ ‘తల్’హా లేచి, ‘వీరికి నేను సహాయపడతాను,’ అని అన్నారు. ఆ ముగ్గురు వ్యక్తులు అబూ ‘తల్‌’హా వద్ద నివసించసాగారు. ప్రవక్త (స) ఒక సైన్యాన్ని పంపారు. వీరిలో ఒకడు ఆ సైన్యంలో వెళ్ళాడు. అక్కడ వెళ్ళి వీరమరణం పొందాడు. మరికొన్ని రోజుల తర్వాత మరోసైన్యం పంపారు. రెండవ వ్యక్తి  వారితోపాటు వెళ్ళి వీరమరణం పొందాడు. మరికొన్ని దినాల తర్వాత మూడవ వ్యక్తి అనారోగ్యానికి గురై తనపడకపైనే మరణించాడు. ఆ తరువాత అబూ ‘తల్‌’హా ”నేను ఈ ముగ్గురిని స్వర్గంలో చూచాను, అయితే తన పడకపై మరణించిన వ్యక్తి అందరికంటే ముందు ఉన్నాడు, రెండవ సారి వీర మరణం పొందిన వ్యక్తి అతని వెనుక ఉన్నాడు. అందరి కంటే ముందు వీరమరణం పొందిన వ్యక్తి స్వర్గంలో అందరికంటే వెనుక ఉన్నాడు. మొదట వీరమరణం పొందిన వ్యక్తి అందరికంటే వెనుక ఎలా ఉన్నాడు? రెండవసారి వీర మరణం పొందినవాడు అతనికంటే ముందు ఎలా ఉన్నాడు, తన పడకపై మరణించిన వ్యక్తి అందరికంటే ముందు ఎలా ఉన్నాడు: అని నేను ఆందోళనకు గురయ్యాను. దీన్ని గురించి నేను ప్రవక్త (స)ను విన్నవించుకున్నాను. దానికి ప్రవక్త (స), ‘నీకు అనుమానం ఎందుకు కలిగింది, ఈ ముగ్గురిలో అధిక వయస్సుగలవాడే ఉత్తముడు. ఆధిక్యత ఎందుకంటే దైవారాధన దైవస్మరణ, దైవకీర్తన మొదలైనవి చేసి ఉన్నాడు. వీటి కారణంగా అతనిదే గొప్ప స్థానం అయి ఉండాలి. (అ’హ్మద్‌)

5294 – [ 11 ] ( لم تتم دراسته ) (3/1456)

وَعَنْ مُحَمَّدِ بْنِ أَبِيْ عَمِيْرَةَ وَكَانَ مِنْ أَصْحَابِ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم قَالَ: إِنَّ عَبْدًا لَوْ خَرَّ عَلَى وَجْهِهِ مِنْ يَوْمٍ وُلِدَ إِلى أَنْ يَمُوْتَ هَرَمًا فِي طَاعَةِ اللهِ لَحَقَّرَهُ فِي ذَلِكَ الْيَوْمِ وَلَوَدَّ أَنَّهُ رُدَّ إِلى الدُّنْيَا كَيْمَا يَزْدَادَ مِنَ الْأَجْرِ وَالثَّوَابِ رَوَاهُمَا أَحْمَدُ.

5294. (11) [3/1456 అపరిశోధితం]

ము’హమ్మద్‌ బిన్‌ అబీ ‘ఉమైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”పుట్టుకనుండి వృద్ధాప్యానికి చేరి మరణం వరకు దైవవిధేయతలోనే గడిపి ఉంటే, తీర్పుదినం నాడు తన ఆరాధనను, విధేయతను చాలా కొంచెంగా భావించి మళ్ళీ నన్ను ఇహలోకానికి త్రిప్పి పంపితే ఇంకా అధికంగా సత్కార్యాలు చేసి ఇంకా అధికంగా పుణ్యం సంపాదిస్తానని కోరుకుంటాడు.” (అ’హ్మద్‌)  

=====

4- بَابُ التَّوَكُّلِ وَالصَّبْرِ

4. నమ్మకం, సహనం

అబ్దుస్సలాం బస్తవి గారు, ఇస్లామీయ నియమ నిబంధనల్లో అల్లాహ్‌పై నమ్మకం గురించి వివరంగా పేర్కొన్నారు. ఇక్కడ కొన్ని విషయాలను పేర్కొంటున్నాము. మనిషి ప్రయత్నించి, శ్రమించి ఫలితాన్ని దైవంపై వదలివేయాలి. లాభనష్టాలన్నీ అల్లాహ్‌ (త) అధీనంలోనే ఉన్నాయని భావించాలి. లాభనష్టాల్లో దైవప్రీతికోసం సహనం పాటించాలి. అల్లాహ్‌ (త) పై నమ్మకం, సహనాల వల్ల ఎన్ని కష్టాలు వచ్చినా, ఆపదలు వచ్చినా ఎటువంటి ఆందోళనకు గురికావటం జరుగదు. వీటికి గురిచేసే వాడూ అల్లాహ్‌ (త)యేనని వీటినుండి రక్షించేవాడూ అల్లాహ్‌ (త) యేననే దృఢనమ్మకం మనిషిని బలహీనతకు గురికాకుండా కాపాడుతుంది.

అల్లాహ్‌ (త)పై నమ్మకం అనేది ముస్లిముల విజయ రహస్యం. ఎటువంటి కష్ట పరిస్థితులు వచ్చినా చివరికి యుద్ధసమయం వచ్చినా అన్నిటికంటే ముందు సలహాలు, సంప్రదింపులు చేసుకోవాలి. ఆ తర్వాత అన్నివిధాలా సన్నద్ధంకావాలి. అయితే అల్లాహ్‌(త)పై నమ్మకాన్ని, సహనాన్ని విడువరాదు. ఆయన మీకు అనుకూలంగా మలచుతాడు. ఒకవేళ ఫలితం కనబడక పోతే అందులో దైవ పరమార్థం ఉందని భావించి, నిరాశ చెందకూడదు. ఒకవేళ అందులో విజయం ప్రాప్తిస్తే, గర్వానికి, అహంకారానికి గురికాకుండా దైవానికి కృతజ్ఞతలు తెలుపుకోవాలి. ఎందుకంటే అది దైవాను గ్రహం. ఆయనే మీకు విజయం ప్రసాదించాడు.

అల్లాహ్‌ ఆదేశం: ”…ఆ పిదప నీవు కార్యానికి సిధ్ధమై నపుడు అల్లాహ్‌పై ఆధారపడు. నిశ్చయంగా, అల్లాహ్‌ తనపై ఆధారపడే వారిని ప్రేమిస్తాడు. ఒకవేళ మీకు అల్లాహ్‌ సహాయమే ఉంటే, మరెవ్వరూ మీపై ఆధిక్యాన్ని పొందజాలరు. మరియు ఆయనే మిమ్మల్ని త్యజిస్తే, ఆయన తప్ప మీకు సహాయం చేయగల వాడెవడు? మరియు విశ్వాసులు కేవలం అల్లాహ్‌ పైననే నమ్మకం ఉంచుకుంటారు!” (ఆలి ఇమ్రాన్‌, 3:159-160)

ఈ ఆయతులలో అల్లాహ్‌(త)పై నమ్మకం యొక్క ప్రాముఖ్యతను, ప్రాధాన్యతను బహిర్గతం చేయడం జరిగింది. అల్లాహ్‌(త)పై నమ్మకంఅంటే ఏమీ ప్రయత్నించకుండా చేతులు ముడుచుకొని కూర్చోవటం కాదు. పూర్తి కృషిప్రయత్నాలు చేసి, ఫలితాన్ని అల్లాహ్‌(త)పై వదలివేయటాన్ని అల్లాహ్‌ (త)పై  నమ్మకం అంటారు. అల్లాహ్‌ (త) తమను అవమానపరచడు అని నమ్మ కంతో ఉండాలి. ఒకవేళ ఆయన నిర్ణయం విజయం ప్రసాదించ కూడదని ఉంటే ఎవరూ ఎంత ప్రయత్నించినా, సహాయ సహకారాలు అందించినా ఏమీ లాభం లేదు. అందువల్ల తన కృషిప్రయత్నాలతో పాటు అల్లాహ్‌ (త)పై నమ్మకం కూడా  తప్పనిసరి.

అవిశ్వాసులతో నిరంతరం యుద్ధాలు చేసిన తర్వాత కూడా ఒకవేళ వారు ఒక ఒప్పందానికి వస్తే, మీరూ దానికి సమ్మతించండి. వాళ్ళు మోసం చేస్తారేమో, వాగ్దానం భంగం చేస్తారేమోనని భయపడ కండి. అల్లాహ్‌ (త) పై నమ్మకం కలిగి ఉండండి. వారి కుట్రలు ఏమాత్రం పనిచేయవు.

అల్లాహ్‌ ఆదేశం: ”కాని ఒకవేళ వారు శాంతివైపుకు మొగ్గితే నీవు కూడా దానికి దిగు మరియు అల్లాహ్‌పై ఆధారపడు. నిశ్చయంగా, ఆయన సర్వం వినేవాడు, సర్వజ్ఞుడు. కాని ఒకవేళ వారు నిన్ను మోసగించాలని సంకల్పిస్తే! నిశ్చయంగా, నీకు అల్లాహ్‌యే చాలు. ఆయనే తన సహాయంద్వారా మరియు విశ్వాసుల ద్వారా నిన్ను బలపరుస్తాడు. (అన్ఫాల్, 8:61-62)

ఇస్లామ్‌ సందేశప్రచారంలో కూడా అల్లాహ్‌(త)నే నమ్ముకోవాలని ఆదేశించడం జరగింది. అల్లాహ్‌ (త) ఎటువంటి శక్తి అంటే దానికి పతనం లేదు, వినాశనం లేదు.

అల్లాహ్‌ఆదేశం: ”మరియు (ఓ ము’హమ్మద్‌!) మేము నిన్ను ఒక శుభవార్తాహరునిగా మరియు హెచ్చరిక చేసేవానిగా మాత్రమే పంపాము. కావున నీవు వారితో అను: “నేను దీనికై (ఈ ప్రచారానికై) మీతో ఎలాంటి ప్రతిఫలం అడగటంలేదు. కేవలం, తాను కోరిన వ్యక్తియే తన ప్రభువు మార్గాన్ని  అవలంబించవచ్చు!” కావున ఎన్నడూ మరణించని, ఆ సజీవుని (నిత్యుని) పైననే ఆధారపడి ఉండు…” (అల్-ఫుర్ఖాన్, 25:56-58)

ప్రవక్త (స)ను, ముస్లిములను ఎటువంటి ఆపద లొచ్చినా అల్లాహ్ నే నమ్ముకోవాలని నిర్దేశించ బడింది. ప్రవక్త (స)కు ముందు పంపబడిన ప్రవక్తలను కూడా దీన్ని గురించే శిక్షణ ఇవ్వబడింది. ప్రవక్త లందరూ దీన్నే పాటించారు.

నూ’హ్‌ (అ) సంవత్సరాల తరబడి సందేశప్రచారం చేస్తూ అవిశ్వాసులవలలో చిక్కుకుపోయి ఉన్నారు. అప్పుడు అల్లాహ్ (త) ఇలా ప్రకటించాడు: ”మరియు వారికి నూ’హ్‌ గాథను వినిపించు. అతను తన జాతి వారితో ఇలా అన్నప్పుడు: ‘నా జాతిసోదరులారా! నేను మీతో ఉండటం మరియు అల్లాహ్‌ సూచన (ఆయాత్‌) లను బోధించటం, మీకు బాధాకర మైనదిగా ఉంటే! నేను మాత్రం అల్లాహ్‌నే నమ్ముకున్నాను. మీరూ మరియు మీరు అల్లాహ్‌కు సాటికల్పించిన వారూ, అందరూ కలిసి ఒక (పన్నాగపు) నిర్ణయం తీసుకోండి, తరువాత మీ నిర్ణయంలో మీకెలాంటి సందేహంలేకుండా చూసు కోండి. ఆ పిదప ఆపన్నాగాన్ని నాకు వ్యతిరేకంగా ప్రయోగించండి; నాకు ఏమాత్రం వ్యవధి నివ్వకండి.’ ” (యూనుస్, 10:71)

సోదరులారా! నూ’హ్‌ (అ) శత్రువుల అన్ని విధాల కుట్రలకు ఒకే మార్గాన్ని అనుసరించారు. అది కేవలం అల్లాహ్‌ (త)పై నమ్మకం మాత్రమే. ఇదే ప్రవక్తల గొప్పతనం.

హూద్‌ (అ)ను అతని జాతివారు తమ దేవతల ఆగ్రహం పట్ల భయపెట్టినపుడు అతను సమాధాన మిస్తూ, ”మీరు ఆయనకు సాటికల్పించే వాటితో నిశ్చయంగా, నాకు ఎలాంటి సంబంధంలేదని, నేను అల్లాహ్‌ను సాక్షిగా పెడుతున్నాను మరియు మీరు కూడా సాక్షులుగా ఉండండి; ‘ఇక మీరంతా కలసి నాకు వ్యతిరేకంగా కుట్రలు పన్నండి. నాకెలాంటి వ్యవధి ఇవ్వకండి. నిశ్చయంగా, నాకూ మరియు మీకూ ప్రభువైన అల్లాహ్‌నే నేను నమ్ముకున్నాను,’ ” అని అన్నారు.(హూద్, 11:54-56)

ఈ ఆయతులో అల్లాహ్‌(త) సహనం, వహించేవారి ప్రత్యేకతలను గురించి పేర్కొన్నాడు. సహనం అంటే ఆపడం, ఆధారం అని అర్థం. అంటే తన్నుతాను ఆందోళన, వణుకులనుంచి ఆపడం. స్థిరంగా నిలకడగా ఉండటం. ఖుర్‌ఆన్‌లో సహనం గురించి అనేక ఆయతులు ఉన్నాయి. వాటిలో కొన్నింటిని ఇక్కడ పేర్కొంటున్నాము. 1. ‘కావున నీవు నీ ప్రభువు యొక్క ఆజ్ఞపై స్థిరంగా ఉండు, మరియు వీరిలోని ఏపాపి యొక్క లేదా సత్యతిరస్కారుని యొక్క మాటగాని వినకు.’ (అద్ దహ్ర్, 76:24). 2. ‘సహనం వహించు, నిశ్చయంగా, మంచి ఫలితం దైవభీతి గలవారికే లభిస్తుంది.’ (హూద్, 11:49). 3. స్థిరంగా ఉంటూ అల్లాహ్‌(త) తీర్పు వచ్చేవరకు వేచి ఉండు, ఎందుకంటే ఆయనే తీర్పు ఇచ్చేవారిలో అందరికంటే ఉత్తముడు. 4. ‘మరియు అల్లాహ్ తీర్పు చేసేవరకు నీవు ఓర్పు వహించు. మరియు న్యాయాధిపతులలో ఆయనే అత్యుత్తముడు.’ (యూనుస్, 10:109). 5. కావున నీవు నీ ప్రభువు ఆజ్ఞకొరకు వేచిఉండు. మరియు నీవు, చేపవానివలే వ్యవహరించకు. (అల్ ఖలమ్… 68:48). 6. ‘కావున నీవు (ఓ ప్రవక్తా) సహనంవహించు. దృఢ సంకల్పంగల ప్రవక్తలు సహనం  వహించినట్లు. మరియు వారి విషయంలో తొందరపడకు.’ (అల్-అ’హ్ఖాఫ్, 46:35)

దీనిద్వారా ప్రవక్తలందరికీ సహనం గురించి బోధించినట్లు తెలిసింది. వారు ఆ సహనంతోనే సందేశ ప్రచారంలో విజయం సాధించారు. ఎందుకంటే హృదయాన్ని పదిలంగా ఉంచేది, ప్రోత్సహించేది, మంచి ఫలితం ఇచ్చేది, వ్యక్తిత్వాన్ని స్థిరంగా ఉంచేది సహనం. సహనం లేని వ్యక్తి మనిషే కాడు. పరలోకంలో ఉన్నత స్థానాలు తెచ్చిపెట్టేది. ఈ సహనమే. సహనం వహించే వారి కోసం అక్కడ ఉన్నత స్థానాలు ఉన్నాయి.

బనీ ఇస్రాయీ’ల్‌ జాతి ప్రజలు బానిస జీవితాన్ని గడిపేవారు. అయితే సహనం, స్థిరత్వాలవల్లే వారు పాలకులుగా మారారు. ఖుర్‌ఆన్‌లో సహనం గురించి ఇలా ఆదేశించడం జరిగింది: ”మరియు వారి స్థానంలో బలహీనులుగా ఎంచబడేవారిని మేము శుభాలతో నింపిన, ఆదేశపు తూర్పుభాగాలకు మరియు పశ్చిమ భాగాలకు వారసులుగా చేశాము. ఈ విధంగా నీ ప్రభువు ఇస్రాయీ’ల్‌ సంతతి వారికిచేసిన ఉత్తమమైన వాగ్దానం, వారు ఓర్పు వహించినందుకు పూర్తయింది. మరియు ఫిర్’ఔన్‌ మరియు అతని జాతివారు ఉత్పత్తిచేసిన వాటిని మరియు ఎత్తిన (నిర్మించిన) కట్టడాలను నాశనం  చేశాము.” (అల్‌ అ’అరాఫ్‌, 7:137)

దీనివల్ల తెలిసిన విషయం ఏమిటంటే బనీ ఇస్రాయీ’ల్‌ వంటి బలహీనమైన జాతి బలమైన ఫిర్‌’ఔన్‌ జాతిముందు నిలబడగలిగిందంటే దానికి కారణం సహన స్థైర్యాలే. దాని ఫలితంగానే, అల్లాహ్‌ (త) వారికి సిరియా వంటి  శుభప్రద మైన  సామ్రాజ్యం  ప్రసాదించాడు.

అల్లాహ్‌ ఆదేశం: ‘మరియు మేము (ఇస్రాయీ’ల్‌ సంతతి) వారి నుండి కొందరిని నాయకులుగా చేశాము. వారు, వారికి మా ఆజ్ఞానుసారంగా మార్గదర్శకత్వం చేస్తూ ఉన్నారు – ఎంతవరకైతే వారు సహనం వహించి ఉన్నారో మరియు వారు మా సూచన (ఆయాత్‌) లను నమ్ముతూ  ఉన్నారో!’  (అస్ సజ్దహ్, 32:24)

పై ఆయతులో బనీ ఇస్రాయీ’ల్‌లోని రెండు గుణాలను పేర్కొనడం జరిగింది. 1. దైవాదేశాలపై దృఢవిశ్వాసం కలిగి ఉండటం. 2. వాటి ఆచరణలో వచ్చే కష్టాలు, ఆపదల పట్ల సహనం పాటిస్తూ స్థిరంగా ఉండటం. ఈ రెండే ప్రతి జాతిలోని అభివృద్ధి రహస్యాలు. దైవాదేశాల ట్ల దృఢవిశ్వాసం, వాటి ఆచరణ. అయితే ఇది ప్రతి ఒక్కరి వల్ల సాధ్యం కాదు.

ప్రపంచంలో సుఖదుఃఖాలు జతలుగా ఉన్నాయి. ఈ రెండు సందర్భాల్లోనూ మనిషి సహనం, ఓర్పులను ప్రదర్శించవలసి ఉంటుంది. సంతోషం, లాభం మొదలైన సమయాల్లో గర్వాహంకారాలకు గురికారాదు. అదేవిధంగా దుఃఖవిచారాల్లో నిరాశకు గురికారాదు. హృదయంలోని ఈ రెండు లోపాలను సహనం, స్థిరత్వం ద్వారా తొలగించవచ్చు.

మానవుని సహజ గుణం గురించి ఖుర్ఆన్ లో ఇలా ఆదేశించబడింది: ”మరియు ఒకవేళ మేము మానవు నికి మా కారుణ్యాన్ని రుచి చూపించి, తరువాత అతని నుండి దానిని లాక్కుంటే! నిశ్చయంగా, అతడు నిరాశ చెంది, కృతఘ్నుడవుతాడు. కాని ఒకవేళ మేము అతనికి ఆపద తరువాత అనుగ్రహాన్ని రుచిచూపిస్తే: ‘నా ఆపదలన్నీ నానుండి తొలగిపోయాయి!’ అని అంటాడు. నిశ్చయంగా, అతడు ఆనందంతో విర్రవీగు తాడు. కాని ఎవరైతే సహనం వహించి సత్కార్యాలు చేస్తూ ఉంటారో, అలాంటి వారికి క్షమాపణ మరియు గొప్ప ప్రతిఫలం ఉంటాయి.” (హూద్, 11:9-11)

వీరి గురించే అల్లాహ్‌ (త) మరోచోట ఇలా ఆదేశించటం జరిగింది. ”నిశ్చయంగా, సహనం వహించిన వారికి లెక్కలేనంత ప్రతిఫలం ఇవ్వబడు తుంది.” (అ’జ్జ్-‘జుమర్, 39:10), వారికి స్వర్గంలోని బాల్కనీలు సహనానికి బదులు లభిస్తాయి, అల్లాహ్‌ (త) ఆనాటి చెడు నుండి వారిని రక్షించాడు, వారికి సుఖసంతోషాలు  ప్రసాదించాడు. వారు సహనం పాటిస్తూ దైవాదేశాలను పాటించటం వల్ల తోటలు, పట్టు వస్త్రాలు  వారికి  ప్రసాదించాడు.

అదేవిధంగా: ”సహనం మరియు నమాజ్ ద్వారా (అల్లాహ్) సహాయాన్ని అర్థించండి, అని (అల్-బఖరహ్, 2:45)లో ఆదేశించడం జరిగింది. ప్రపంచంలో గాలి తగలని చెట్టు ఏదీలేదు. అదేవిధంగా ఆపదలురాని మనుషులు ఎవరూ లేరు. కష్టాలు, బాధలు, విచారాలు, దుఃఖాలు మనిషికి వస్తూ ఉంటాయి. అంటే మానవుని ఈ రోజు ఒకవిధంగా ఉంటే, రేపు మరోవిధంగా ఉంటుంది. అందువల్ల కష్టాల్లో, సుఖసంతోషాల్లో అదుపు తప్పటం మానవునికి తగని పని.

దైవంపై నమ్మకం, సహనం గురించి ఖుర్‌ఆన్‌లోని కొన్ని ఆయతుల ద్వారా మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ‘హదీసు’ల్లో వీటి ప్రత్యేకత గురించి తెలుసు కుందాం.

اَلْفَصْلُ الْأَوَّلُ మొదటి విభాగం   

5295 – [ 1 ] ( متفق عليه ) (3/1457)

عَنِ ابْنِ عَبَّاسٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “يَدْخُلُ الْجَنَّةَ مِنْ أُمَّتِيْ سَبْعُوْنَ أَلْفًا بِغَيْرِ حِسَابٍ هُمُ الَّذِيْنَ لَا يَسْتَرْقُوْنَ وَلَا يَتَطَيَّرُوْنَ وَعَلَى رَبِّهِمْ يَتَوَكَّلُوْنَ”. مُتَّفَقٌ عَلَيْهِ  

5295. (1) [3/1457 ఏకీభవితం]

ఇబ్నె ‘అబ్బాస్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”నా అనుచర సమాజంలో నుండి 70 వేల మంది ఎటువంటి విచారణ లేకుండా స్వర్గంలో ప్రవేశిస్తారు. వీరు మంత్ర తంత్రాలకు, చేతబడికి పాల్పడని వారు. అపశకునాలను నమ్మనివారు. కేవలం తమ ప్రభువునే నమ్మేవారు.” [52]  (బు’ఖారీ, ముస్లిమ్)

5296 – [2 ] ( متفق عليه ) (3/1457)

وَعَنْهُ قَالَ خَرَجَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم يَوْمًا فَقَالَ:” عُرِضَتْ عَلَيَّ الْأُمَمُ فَجَعَلَ يَمُرُّ النَّبِيُّ وَمَعَهُ الرَّجُلُ وَالنَّبِيُّ وَمَعَهُ الرَّجُلَانِ وَالنَّبِيُّ وَمَعَهُ الرَّهْطُ وَالنَّبِيُّ وَلَيْسَ مَعَهُ أَحَدٌ فَرَأَيْتُ سَوَادًا كَثِيْرًا سَدَّ الْأُفُقَ فَرَجَوْتُ أَنْ يَكُوْنَ أُمَّتِيْ فَقِيْلَ هَذَا مُوْسَى فِيْ قَوْمِهِ ثُمَّ قِيْلَ لِيْ اُنْظُرْ فَرَأَيْتُ سَوَادًا كَثِيْرًا سَدَّ الْأُفُقَ فَقِيْلَ لِيْ اُنْظُرْ هَكَذَا وَهَكَذَا فَرَأَيْتُ سَوَادًا كَثِيْرًا سَدَّ الْأُفُقَ فَقِيْلَ: هَؤُلَاءِ أُمَّتُكَ وَمَعَ هَؤُلَاءِ سَبْعُوْنَ أَلْفًا قُدَّامَهُمْ يَدْخُلُوْنَ الْجَنَّةَ بِغَيْرِ حِسَابٍ هُمُ الَّذِيْنَ لَا يَتَطَيَّرُوْنَ وَلَايَسْتَرْقُوْنَ وَلَا يَكَتَوُوْنَ وَعَلَى رَبِّهِمْ يَتَوَكَّلُوْنَ فَقَامَ عُكَّاشَةُ بْنُ مِحْصَنِ فَقَالَ: اُدْعُ اللهَ أَنْ يَجْعَلَنِيْ مَنْهُمْ. قَالَ: “اَللّهُمَّ اجْعَلْهُ مِنْهُمْ”. ثُمَّ قَامَ رَجُلٌ فَقَالَ: اُدْعُ اللهَ أَنْ يَجْعَلَنِيْ مِنْهُمْ. فَقَالَ سَبَقَكَ بِهَا عُكَاشَةُ.

5296. (2) [3/1457 ఏకీభవితం]

ఇబ్నె ‘అబ్బాస్‌ (ర) కథనం: ఒకరోజు ప్రవక్త (స) ఇంటి నుండి బయటకు వచ్చి ఇలా ప్రవచించారు : ”ప్రాచీన సమాజాలు నాకు చూపించబడ్డాయి. వారి ప్రవక్తలు ముందు ఉన్నారు. ఒక ప్రవక్త వెంట ఒక్కడే ఉన్నాడు. మరో ప్రవక్త వెంట ఇద్దరున్నారు. కొందరి వెంట ఎవరూ లేరు. కొందరివెంట ఒక సమూహం ఉంది. ఒక పెద్ద సమూహాన్ని వెళ్ళడం చూసి, నా అనుచర సమాజం అని భావించాను. కాని కలలోనే నాకు ఇది మూసా (అ) సమాజం అని తెలియ పర చటం జరిగింది. నన్ను ముందు చూడమని ఆదే శించడం జరిగింది. నేను ముందుకు చూసాను, చాలా పెద్ద బృందం వెళుతుంది. మళ్ళీ నాకు కుడి ప్రక్క ఎడమ ప్రక్క చూడమని ఆదేశించడం జరిగింది. నేను రెండు వైపుల చూసాను. చాలా పెద్ద బృందం వెళు తుంది. ఇది మీ అనుచర సమాజం అని, వీరిలో 70,000 మంది ఎటువంటి విచారణ లేకుండా స్వర్గం లో ప్రవేశిస్తారు అని చెప్పటం జరిగింది. ఇంకా వీళ్ళు అపశకునాలనను నమ్మనివారు, మంత్ర తంత్రాలకు పాల్పడనివారు, తమ శరీరాలపై పచ్చ బొట్లు పెట్టించుకోని వారు. వారు ఎల్లప్పుడూ తమ ప్రభు వునే నమ్ముకునే వారై ఉంటారు. అది విని ‘ఉక్కాషహ్ బిన్‌ ము’హ్‌సిన్‌ (ర) నిలబడి, ‘ఓ ప్రవక్తా! నన్ను కూడా వారిలో చేర్చమని అల్లాహ్ (త) ను ప్రార్థిం చండి,’ అని విన్నవించుకున్నాడు. ప్రవక్త (స) అతని గురించి, ‘ఓ అల్లాహ్‌(త)! ఇతన్ని వారిలో చేర్చు’ అనిప్రార్థించారు. మరోవ్యక్తి నిలబడి, ‘నా గురించి కూడా ప్రార్థించండి,’ అని విన్నవించు కున్నాడు. దానికి ప్రవక్త (స) ‘ఉక్కాషహ్ నిన్ను అధిగమించాడు,’ అని అన్నారు.  (బు’ఖారీ, ముస్లిమ్‌)

ఎందుకంటే ‘ఉక్కాషహ్లో ఇటువంటి గుణాలు ఉండేవి. అందువల్ల అతన్ని ప్రోత్సహిస్తూ ఇలా అన్నారు. మరోవ్యక్తిలో ఈ గుణాలు ఉండేవికావు. అందువల్ల  అతన్ని గురించి  ప్రార్థించలేదు.

5297 – [ 3 ] ( صحيح ) (3/1457)

وَعَنْ صُهَيْبٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “عَجَبًا لِأَمْرِ الْمُؤْمِنِ كُلَّهُ خَيْرٌ وَلَيْسَ ذَلِكَ لِأَحَدٍ إِلَّا لِلْمُؤْمِنِ إِنْ أَصَابَتْهُ سَرَّاءُ شَكَرَ فَكَانَ خَيْرًا لَهُ وَإِنْ أَصَابَتْهُ ضَرَّاءُ صَبَرَ فَكَانَ خَيْرًا لَهُ”. رَوَاهُ مُسْلِمٌ.

5297. (3) [3/1457దృఢం]

‘సుహైబ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”విశ్వాసి గొప్పతనం ఆశ్చర్యకరమైనది. అతని ప్రతిపనిలో మేలు ఉంటుంది. ఇది కేవలం విశ్వాసికే ప్రత్యేకం. అత నికి సంతోషం కలిగితే, దైవానికి కృతజ్ఞతలు తెలుపు కుంటాడు. దానివల్ల అతనికి మేలు చేకూరు తుంది. ఒక వేళ ఏదైనా ఆపద, కష్టంవస్తే సహన స్థైర్యాలను పాటిస్తాడు. ఈ సహనం కూడా అతనికి మేలు చేకూరుస్తుంది. అంటే సంతోషంలో కృతజ్ఞత, కష్టాల్లో సహనం, రెంటివల్లా మేలే మేలు ఉంది.  (ముస్లిమ్)

5298 – [ 4 ] ( صحيح ) (3/1458)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “اَلْمُؤْمِنُ الْقَوِيُّ خَيْرٌوَأَحَبَّ إِلى اللهِ مِنَ الْمُؤْمِنِ الضَّعِيْفِ وَفِيْ كُلِّ خَيْرٌ اِحْرِصْ عَلَى مَا يَنْفَعُكَ وَاسْتَعِنْ بِاللهِ وَلَاتَعْجَزُ. وَإِنْ أَصَابَكَ شَيْءٌ فَلَا تَقُلْ لَوْ أَنِّيْ فَعَلْتُ كَانَ كَذَا وَكَذَا وَلَكِنْ قُلْ قَدَّرَ اللهُ وَمَا شَاءَ فَعَلَ فَإِنَّ لَوْ تَفْتَحُ عَمَلَ الشَّيْطَانِ”. رَوَاهُ مُسْلِمٌ.

5298. (4) [3/1457 దృఢం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”దృఢమైన, పరిపూర్ణ విశ్వాసి బలహీనుడైన విశ్వాసి కంటే గొప్పవాడు. వాడి ప్రతిపనిలో మేలు ఉంటుంది. కావున లాభం చేకూర్చే దాన్ని కోరుకో, అల్లాహ్‌(త) సహాయంకోరు. బలహీనత ప్రదర్శించకు. ఒకవేళ ఏదైనా ఆపదవస్తే, ”ఒకవేళ నేను ఇలాచేస్తే ఇలా అయ్యేదని అనకు.” అల్లాహ్‌(త) కోరింది అయ్యిందని, నా విధిలో ఉన్నది జరిగిందని భావించు. ఎందుకంటే  ఒకవేళ అనేది షై’తాన్‌ ద్వారాన్ని తెరచివేస్తుంది. (ముస్లిమ్‌)

—–

اَلْفَصْلُ الثَّانِيْ  రెండవ విభాగం

5299 – [ 5 ] ( لم تتم دراسته ) (3/1458)

عَنْ عُمَرَبْنِ الْخَطَّابِ قَالَ: سَمِعْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ: لَوْأَنَّكُمْ تَتَوَكَّلُوْنَ عَلَى اللهِ حَقَّ تَوَكُّلِهِ لِرَزَقَكُمْ كَمَا يَرْزُقُ الطَّيْرَ تَغْدُوْ خِمَاصًا وَتَرُوْحُ بِطَانًا”. رَوَاهُ التِّرْمِذِيُّ وَابْنُ مَاجَهُ.  

5299. (5) [3/1458 అపరిశోధితం]

‘ఉమర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ఇలా ప్రవచిస్తూ ఉండగా విన్నాను, ”ఒకవేళ మీరు దైవాన్ని ఎలా నమ్మాలో అలా నమ్మితే అల్లాహ్‌ (త) పక్షులకు ఆహారం ప్రసాదించినట్లు మీకూ ఆహారం ప్రసాదిస్తాడు. అవి ఉదయం ఖాళీ కడుపులతో బయలుదేరు తాయి, సాయంత్రం కడుపులు నింపుకొని తిరిగి వస్తాయి.” [53] (తిర్మిజి’, ఇబ్నె మాజహ్)

5300 – [ 6 ] ( لم تتم دراسته ) (3/1458)

وَعَنِ ابْنِ مَسْعُوْدٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “أَيُّهَا النَّاسُ لَيْسَ مِنْ شَيْءٍ يُقَرِّبُكُمْ إِلى الْجَنَّةِ وَيُبَاعِدُكُمْ مِنَ النَّارِ إِلَّا قَدْ أَمَرْتُكُمْ بِهِ. وَلَيْسَ شَيْءٌ يُقَرِّبُكُمْ مِنَ النَّارِ وَيُبَاعِدُكُمْ مِنَ الْجَنَّةِ إِلَّا قَدْ نَهَيْتُكُمْ عَنْهُ. وَإِنَّ الرُّوْحَ الْأَمِيْنَ – وَفِيْ رِوَايَةٍ: وَإِنَّ رُوْحَ الْقُدُسِ – نَفَثَ فِي رَوْعِيْ أَنَّ نَفْسًا لَنْ تَمُوْتَ حَتَّى تَسْتَكْمِلَ رِزْقَهَا أَلَا فَاتَّقُوْا اللهَ وَأَجْمِلُوْا فِيْ الطَّلَبِ وَلَا يَحْمِلَنَّكُمْ اِسْتِبْطَاءُ الرِّزْقِ أَنْ تَطْلُبُوْهُ بِمَعَاصِي اللهِ فَإِنَّهُ لَا يُدْرَكُ مَا عِنْدَ اللهِ إِلَّا بِطَاعَتِهِ ” . رَوَاهُ فِيْ “شَرْحِ السُّنَّةِ”. وَالْبَيْهَقِيُّ فِيْ “شُعَبِ الْإِيْمَانِ”. إِلَّا أَنَّهُ لَمْ يَذْكُرْ: “وَإِنَّ رُوْحَ الْقُدُسِ”.

5300. (6) [3/1458అపరిశోధితం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ మస్‌’ఊద్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ప్రజలారా! మిమ్మల్ని స్వర్గంలో చేర్చే దాని గురించి, నరకం నుండి రక్షించేదాన్ని గురించి నేను మీకు ఆదేశించి ఉన్నాను. ఇంకా మిమ్మల్ని నరకానికి చేరువచేసేదాన్ని గురించి, స్వర్గానికి దూరం చేసే దాన్ని గురించి నేను మీకు తెలియపరచి ఉన్నాను. జిబ్రీల్‌ (అ) వచ్చి నా హృదయంలో, ‘ఏ వ్యక్తీ తన ఉపాధి పూర్తిచేసుకోనంత వరకు మరణించడు,’ అని దైవవాణి అందించి వెళ్ళారు. గుర్తుంచుకోండి! ఎల్లప్పుడూ దైవభీతి కలిగి ఉండండి. సంపాదనలో మధ్యేమార్గాన్ని అవలంబించండి. ఉపాధికొరత మిమ్మల్ని దైవ అవిధేయతకు గురిచేయరాదు. ఎందుకంటే అల్లాహ్ (త) వద్ద ఉన్నది దైవవిధేయత వల్లే లభిస్తుంది.[54]  (షర్‌’హు స్సున్నహ్‌,  బైహఖీ/-షు’అబిల్ ఈమాన్)

5301 – [ 7 ] ( لم تتم دراسته ) (3/1459)

وَعَنْ أَبِيْ ذَرٍّ عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ: “اَلزّهَادَةُ فِي الدُّنْيَا لَيْسَتْ بِتَحْرِيْمِ. وَلَا إِضَاعَةِ الْمَالِ وَلَكِنَّ الزّهَادَةَ فِي الدُّنْيَا أَنْ لَا تَكُوْنَ بِمَا فِيْ يَدَيْكَ أَوْثَقَ بِمَا فِي يَدِ اللهِ. وَأَنْ تَكُوْنَ فِيْ ثَوْابِ الْمُصِيْبَةِ إِذَا أَنْتَ أُصِبْتَ بِهَا أَرْغَبَ فِيْهَا لَوْ أَنَّهَا أُبْقِيَتْ لَكَ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَابْنُ مَاجَهُ. وَقَالَ التِّرْمِذِيُّ: هَذَا حَدِيْثٌ غَرِيْبٌ وَعَمْرُو بْنُ وَاقِدٍ الرَّاوِيْ مُنْكَرُ الْحَدِيْثِ.

5301. (7) [3/1459అపరిశోధితం]

అబూ జ’ర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ప్రాపంచిక అనాశక్తత అంటే ధర్మసమ్మతమైన వాటిని నిషిద్ధం చేయటం, ధనాన్ని వ్యర్థం చేయటం కాదు. ధర్మ సమ్మతమైన అనాశక్తత అంటే మీ చేతుల్లో ఉన్న ధన సంపదలను నమ్మకండి. దైవంచేతుల్లో ఉన్న దాన్ని నమ్మండి. అదేవిధంగా ప్రాపంచిక అనాశక్తత అంటే మీకేదైనా ఆపద వస్తే, మీరు పుణ్యం కావాలని కోరు కుంటే ఆ ఆపద తొలగకూడదని ప్రార్థించండి. మీకు ఎల్లప్పుడూ పుణ్యం లభిస్తూ ఉంటుంది.” (తిర్మిజి’ – ఏకోల్లేఖనం. ఉల్లేఖకుడు ‘అమ్ర్ ఇబ్నె వాఖిద్, తిరస్కరింపబడ్జాడు, ఇబ్నె  మాజహ్)

5302 – [ 8 ] ( صحيح ) (3/1459)

وَعَنِ ابْنِ عَبَّاسٍ قَالَ: كُنتُ خَلْفَ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم  يَوْمًا فَقَالَ:”يَا غُلَامُ اِحْفَظِ اللهَ يَحْفَظْكَ. اِحْفَظِ اللهَ تَجِدْهُ تُجَاهَكَ. وَإِذَا سَأَلْتَ فَاسْأَلِ اللهَ وَإِذَا اسْتَعَنْتَ فَاسْتَعِنْ بِاللهِ. وَاعْلَمْ أَنَّ الْأَمَةَ لَوِ اجْتَمَعَتْ عَلَى أَنْ يَنْفَعُوْكَ بِشيْءٍ لَمْ يَنْفَعُوْكَ إِلَّا بِشَيْءٍ قَدْ كَتَبَهُ اللهُ لَكَ. ولَوْ اجْتَمَعُوْا عَلَى أَنْ يَضُرُّوْكَ بِشَيْءٍ لَمْ يَضُرُّوْكَ إِلَّا بِشَيْءٍ قَدْ كَتَبَهُ اللهُ عَلَيْكَ. رُفِعَتِ الْأَقْلَامُ وَجَفَّتِ الصُّحُفُ”. رَوَاهُ أَحْمَدُ وَالتِّرْمِذِيُّ  

5302. (8) [3/1459 దృఢం]

ఇబ్నె ‘అబ్బాస్‌ (ర) కథనం: నేను ప్రవక్త (స) వెనుక కూర్చొని ఉన్నాను. అప్పుడు ప్రవక్త (స) నాతో, ఓ అబ్బాయి! నువ్వు అల్లాహ్‌ (త) హక్కులను నిర్వర్తిస్తూ ఉండు. అల్లాహ్‌ (త) నిన్ను సంరక్షిస్తూ ఉంటాడు. నువ్వు అల్లాహ్‌ (త) ఆదే శాలను అనుసరించు, అల్లాహ్‌ (త)ను నీ ముందు పొంద గలవు, ఇంకా అర్థిస్తే అల్లాహ్‌ (త) నే అర్థించు, సహాయం కోరితే అల్లాహ్‌ (త)నే సహాయం కోరు. ఈ విషయాన్ని బాగా గుర్తుంచుకో, అందరూ కలసి నిన్ను లాభం చేకూర్చాలన్నా చేకూర్చలేరు. అల్లాహ్‌(త) నీ కోసం వ్రాసింది తప్ప. అదే విధంగా అందరూ కలసి నీకు నష్టం చేకూర్చాలన్నా చేకూర్చలేరు. అల్లాహ్‌(త) నీ కోసం వ్రాసింది తప్ప. కలం లేచి ఉంది. వ్రాయవలసింది వ్రాయబడింది.” (అ’హ్మద్‌, తిర్మిజి’)

5303 – [ 9 ] ( لم تتم دراسته ) (3/1459)

وَعَنْ سَعْدٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مِنْ سَعَادَةِ ابْنِ آدَمَ رِضَاهُ بِمَا قَضَى اللهُ لَهُ وَمَنْ شَقَاوَةِ ابْنِ آدَمَ تَرْكُهُ اِسْتِخَارَةَ اللهِ. وَمِنْ شَقَاوَةِ ابْنِ آدَمَ سَخَطُهُ بِمَا قَضَى اللهُ لَهُ”. رَوَاهُ أَحْمَدُ وَالتِّرْمِذِيُّ وَقَالَ: هَذَا حَدِيْثٌ غَرِيْبٌ  

5303. (9) [3/1459 అపరిశోధితం]

స’అద్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”అల్లాహ్‌ (త) తీర్పుపట్ల సంతృప్తి వ్యక్తం చేసేవాడు అదృష్ట వంతుడు. ఇంకా అల్లాహ్ (త) మేలు కోరకుండా, అల్లాహ్‌ (త) తీర్పుపట్ల అసంతృప్తి చెందేవాడు దురదృష్ట వంతుడు.” [55]  (అ’హ్మద్‌, తిర్మిజి’  –  ఏకోల్లేఖనం)

—–

اَلْفَصْلُ الثَّالِثُ   మూడవ విభాగం

5304 – [ 10 ] ( متفق عليه ) (3/1459)

عَنْ جَابِرٍ أَنَّهُ غَزَا مَعَ النَّبِيِّ صلى الله عليه وسلم قِبَلَ نَجْدٍ فَلَمَّا قَفَلَ مَعَهُ فَأَدْرَكَتْهُمُ الْقَائِلَةُ فِيْ وَادٍ كَثِيْرِالْعِضَاهِ فَنَزَلَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم وَتَفَرَّقَ النَّاسُ يَسْتَظِلُّوْنَ بِالشَّجَرِ فَنَزَلَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم تَحْتَ سَمُرَةٍ فَعَلَّقَ بِهَا سَيْفَهُ وَنِمْنَا نَوْمَةً فَإِذَا رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم يَدْعُوْنَا وَإِذَا عِنْدَهُ أَعْرَابِيٌّ فَقَالَ: “إِنَّ هَذَااخْتَرَطَ عَلَيَّ سَيْفِيْ وَأَنَا نَائِمٌ فَاسْتَيْقَظْتُ وَهُوَ فِيْ يَدِهِ صَلْتَا. قَالَ: مَا يَمْنَعُكَ مِنِّيْ؟ فَقُلْتُ: اللهُ ثَلَاثًا” وَلَمْ يُعَاقِبْهُ وَجَلَسَ. مُتَّفَقٌ عَلَيْهِ.

5304. (10) [3/1459ఏకీభవితం]

జాబిర్‌ (ర) కథనం: అతడు ప్రవక్త (స) వెంట నజ్ద్ పోరాటంలో పాల్గొన్నాడు. ప్రవక్త (స) తిరిగి వచ్చినప్పుడు జాబిర్‌ (ర) కూడా ప్రవక్త (స) వెంట తిరుగు ప్రయాణమయ్యారు. మధ్యాహ్న సమయానికి ఒక అడవికి చేరుకున్నారు. అక్కడ అనేక జిల్లేడు చెట్లు ఉన్నాయి. ప్రవక్త (స) అనుచరులు కూడా విశ్రాంతి కోసం అక్కడ దిగారు. ప్రవక్త (స) కూడా అందుకోసమే దిగారు. ప్రవక్త (స) అనుచరులు నీడ వెతుకుతూ అటూఇటూ చెదిరిపోయారు. ప్రవక్త (స) కూడా ఒక జిల్లేడు చెట్టు క్రింద విశ్రాంతి తీసుకుంటున్నారు. కరవాలాన్ని అక్కడ చెట్టుకు వ్రేలాడగట్టారు. మేము నిద్రపోయాం. అనుకోకుండా ప్రవక్త (స) మమ్మల్ని పిలవటం మేము విన్నాం. వెంటనే మేము అక్కడికి చేరుకున్నాం. ఒక వ్యక్తి ప్రవక్త (స) ముందు కూర్చొని ఉండటం మేము చూసాము. ”ఈ వ్యక్తి నా కరవాలం తీసుకొని నాపై దాడి చేయబోతుంటే వెంటనే నేను మేల్కొన్నాను. అతని చేతిలో నా కరవాలం ఉంది. అతడు నాతో, ‘ఇప్పుడు నిన్ను నానుండి ఎవరు రక్షిస్తారు,’ అని అన్నాడు. దానికి నేను ‘అల్లాహ్‌(త)’ అని అన్నాను. ఇలా మూడుసార్లు జరిగింది. నేను కూడా అదే సమాధానం ఇచ్చాను.” ప్రవక్త (స) ఆ బదూను  ఏ మాత్రం శిక్షించ లేదు. ఆ వ్యక్తి అక్కడే కూర్చొని ఉన్నాడు. (బు’ఖారీ, ముస్లిమ్‌)

5305 – [ 11 ] ( لم تتم دراسته ) (3/1460)

وَفِيْ رِوَايَةٍ أَبِيْ بَكْرِ الْإِسْمَاعِيْلِيٍّ فِيْ “صَحِيْحِهِ” فَقَالَ: مَنْ يَمْنَعُكَ مِنِّيْ؟ قَالَ: “اللهُ”. فَسَقَطَ السَّيْفُ مِنْ يَدِهِ فَأَخَذَ السَّيْفَ فَقَالَ: “مَنْ يَمْنُعَكَ مِنِّيْ؟ “فَقَالَ: كُنْ خَيْرَ آخِذٍ. فَقَالَ: ” تَشْهَدُ أَنْ لَا إِلَهَ إِلَّا اللهُ وَأَنِّيْ رَسُوْلُ اللهِ”. قَالَ: لَا وَلَكِنِّيْ أُعَاهِدُكَ عَلَى أَنْ لَا أُقَاتِلُكَ وَلَا أَكُوْنَ مَعَ قَوْمِ يُقَاتِلُوْنَكَ فَخَلَى سَبِيْلَهُ. فأَتَى أَصْحَابَهُ فَقَالَ: جِئْتُكُمْ مِنْ عِنْدِخَيْرِ النَّاسِ. هَكَذَا فِيْ ” كِتَابِ الْحُمَيْدِيِّ” .وَ فِيْ “الرِّيَاضِ”.

5305. (11) [3/1460అపరిశోధితం]

మరో ఉల్లేఖనంలో ఇలా ఉంది: ”ఆ బదూ ప్రవక్త (స) తో ‘నానుండి నిన్ను ఎవరు రక్షిస్తారు?’ అని అన్నాడు. దానికి నేను, ‘అల్లాహ్‌ (త) రక్షిస్తాడు,’ అని అన్నాను. అది వినగానే కరవాలం జారి క్రిందపడింది. వెంటనే ప్రవక్త (స) దాన్ని తన చేతిలో తీసుకున్నారు. ఆ తరువాత, ‘ఇప్పుడు నా నుండి నిన్నెవరు రక్షిస్తారు,’ అని అన్నారు. దానికి ఆ వ్యక్తి, ‘తమరు చాలా కఠినంగా పట్టుకునే వారు. క్షమించండి,’ అని అన్నాడు. అప్పుడు ప్రవక్త (స) ‘నువ్వు లా ఇలాహ ఇల్లల్లాహ్, ము’హమ్మ దుర్రసూలుల్లాహ్‌ సాక్ష్య వచనాలు పలుకుతావా, అంటే ఇస్లామ్‌ స్వీకరిస్తావా,’ అని అడిగారు. దానికి ఆ వ్యక్తి, ‘లేదు, కాని నేను వాగ్దానం చేస్తున్నాను, మిమ్మల్ని చంపను, మీతో యుద్ధం చేయను, మీ వ్యతిరేకులకూ సహాయం చేయను,’ అని అన్నాడు. ప్రవక్త (స) అతన్ని విడిచిపెట్టేసారు. ఆ బదూ తిరిగి తన స్నేహితుల వద్దకు వచ్చి, ‘ప్రపంచంలో అందరికంటే గొప్ప వ్యక్తి వద్ద నుండి వస్తున్నాను,’ అని చెప్పాడు. కితాబుల్‌ ‘హమీదీ, రియా’దుస్సాలిహీన్‌లో  ఇలాగే  వ్రాసి ఉంది.[56]

5306 – [ 12 ] ( ضعيف ) (3/1460)

وعَنْ أَبِيْ ذَرٍّ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم قَالَ: “إِنِّيْ لَأَعْلَمُ آيَةً لَوْ أَخَذَ النَّاسُ بِهَا لَكَفَتْهُمْ: (مَنْ يَتَّقِ اللهَ يَجْعَلْ لَهُ مَخْرَجًا؛ وَيَرْزُقْهُ مِنْ حَيْثُ لَا يَحْتَسِبُ،65: 2-3) رَوَاهُ أَحْمَدُ وَابْنُ مَاجَهُ وَالدَّارَمِيُّ.

5306. (12) [3/1460బలహీనం]

అబూ జ’ర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”నాకొక ఆయతు తెలుసు. ఒకవేళ ప్రజలు ఆ ఆయతును అనుసరిస్తే, అది వారికి చాలు. ఆ ఆయతు: ”…అల్లాహ్‌ యందు భయభక్తులు గల వానికి, ఆయన ముక్తిమార్గం చూపుతాడు. మరియు ఆయన అతనికి, అతడు ఊహించని దిక్కు నుండి జీవనోపాధి ప్రసాదిస్తాడు…” [57] (అ’త్-‘తలాఖ్, 65:2-3) (అ’హ్మద్‌, ఇబ్నె  మాజహ్, దార్మీ)

5307 – [ 13 ] ( لم تتم دراسته ) (3/1460)

وعَنِ ابْنِ مَسْعُوْدٍ قَالَ:أَقْرَأَنِيْ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: (إِنَّ الله هُو الرَّزَّاقُ ذُو الْقُوَّةِ الْمَتِيْنُ؛51: 58) رَوَاهُ أَبُوْ دَاوُدَ وَالتِّرْمِذِيُّ وَقَالَ:هَذَا حَدِيْثٌ حَسَنٌ صَحِيْحٌ

5307. (13) [3/1460అపరిశోధితం]

ఇబ్నె మస్‌’ఊద్‌(ర) కథనం: ప్రవక్త (స) నాకు ఈ ఆయతు నేర్పించారు. ”నిశ్చయంగా, అల్లాహ్, ఆయన మాత్రమే, ఉపాధి ప్రదాత, మహా బల వంతుడు స్థైర్యం గలవాడు.” (అ’జ్-‘జారియాత్, 51:58) [58] (అబూ  దావూద్‌,  తిర్మిజి’)

5308 – [ 14 ] ( إسناده جيد ) (3/1460)

وَعَنْ أَنَسٍ قَالَ: كَانَ أَخوَانِ عَلَى عَهْدِ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم فَكَانَ أَحَدُهُمَا يَأْتِي النَّبِيّ صلى الله عليه وسلم وَالْآخَرُ يَحْتَرِفُ فَشَكَا الْمُحْتَرِفُ أَخَاهُ إِلى النَّبِيِّ صلى الله عليه وسلم فَقَالَ: “لَعَلَّكَ تُرْزَقُ بِهِ” .رَوَاهُ التِّرْمِذِيُّ وَقَالَ:هَذَا حَدِيْثٌ صَحِيْحٌ غَرِيْبٌ

5308. (14) [3/1460ఆధారాలు ఆమోదయోగ్యం]

అనస్‌ (ర) కథనం: ప్రవక్త (స) కాలంలో ఇద్దరు సోద రులు ఉండేవారు. ఒక సోదరుడు ప్రవక్త (స) వద్దకు వచ్చేవాడు. మరొక సోదరుడు కష్టపడి ఎంతో కొంత సంపాదించే వాడు. సంపాదించే సోదరుడు ప్రవక్త(స)తో తన సోదరుడు ఏ పనీ చేయడని, తమ వద్దకు వచ్చి కూర్చుండి  పోతున్నాడని ఫిర్యాదుచేసాడు. దానికి ప్రవక్త (స) ”బహుశా అతనివల్లే నీకు ఉపాధి లభిస్తుందేమో,” అని సమాధానం ఇచ్చారు.[59]  (తిర్మిజి’ – దృఢం,  ఏకోల్లేఖనం)

5309 – [ 15 ] ؟ (3/1460)

وَعَنْ عَمْرِو بْنِ الْعَاصِ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِنَّ قَلْبَ ابْنِ آدَمَ بِكُلِّ وَادٍ شُعْبَةٌ فَمَنْ أَتْبَعَ قَلْبَهُ الشُّعَبَ كُلَّهَا لَمْ يُبَالِ اللهُ بِأَيِّ وَادٍ أَهْلَكَهُ وَمَنْ تَوَكَّلَ عَلَى اللهِ كَفَّاهُ الشُّعَبَ”. رَوَاهُ ابْنُ مَاجَهُ.

5309. (15) [3/1460? ]

‘అమ్ర్‌ బిన్‌ ‘ఆ’స్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మానవుని మనసులో ఎన్నో ఆలోచనలు మెదులుతూ ఉంటాయి. తన్నుతాను ఆలోచనలకు గురిచేసే వాడు ఏమైనా పట్టించుకోడు, అల్లాహ్‌(త)నే నమ్ముకున్న వారి పనులన్నిటినీ అల్లాహ్‌ (త) చక్క బెడతాడు.” [60] (ఇబ్నె  మాజహ్)

5310 – [ 16 ] ( ضعيف ) (3/1461)

وعَنْ أَبِيْ هُرَيْرَةَ أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم قَالَ: “قَالَ رَبُّكُمْ عَزَّ وَجَلَّ: لَوْ أَنَّ عَبِيْدِيْ أَطَاعُوْنِيْ لَأَسْقَيْتُهُمُ الْمَطَرَبِاللَّيْلِ وَأَطْلَعْتُ عَلَيْهِمُ الشَّمْسَ بِالنَّهَارِوَلَمْ أُسْمِعُهُمْ صَوْتَ الرَّعْدِ”. رَوَاهُ أَحْمَدُ.  

5310. (16) [3/1461బలహీనం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మీ ప్రభువు ఇలా ఆదేశిస్తున్నాడు, ”ఒకవేళ నా దాసులు, నా ఆదేశాలను పాలిస్తే, వారిపై రాత్రి వర్షంకురిపిస్తాను, పగలు సూర్యుణ్ణి ఉదయింపజేస్తాను. వారికి మెరుపు శబ్దం కూడా వినకుండా ఉంచుతాను.”[61]  (అ’హ్మద్)

5311 – [ 17 ] ( لم تتم دراسته ) (3/1461)

وَعَنْهُ قَالَ: دَخَلَ رَجُلٌ عَلَى أَهْلِهِ فَلَمَّا رَأَى مَا بِهِمْ مِنَ الْحَاجَةِ خَرَجَ إِلى الْبَرِّيَّةِ فَلَمَّا رَأَتِ امْرَأَتُهُ قَامَتْ إِلى الرَّحى فَوَضَعَتْهَا وَإِلى التَّنُّوْرِ فَسَجَرَتْهُ ثُمَّ قَالَتْ: اَللّهُمَّ ارْزُقْنَا فَنَظَرَتْ فَإِذَا الْجَفْنَةُ قَدْ امْتَلَأَتْ. قَالَ: وَذَهَبَتْ إِلى التَّنُّوْرِ فَوَجَدَتْهُ مُمْتَلِئًا. قَالَ: فَرَجَعَ الزَّوْجُ قَالَ: أَصَبْتُمْ بَعْدِيْ شَيْئًا؟ قَالَتِ امْرَأْتُهُ: نَعَمْ مِنْ رَبِّنَا وَقَامَ إِلى الرَّحَى فَذُكِرَ ذَلِكَ إِلى النَّبِيِّ صلى الله عليه وسلم فَقَالَ: “أَمَّا إِنَّهُ لَوْ لَمْ يَرْفَعْهَا لَمْ تَزَلْ تَدُوْرُ إِلى يَوْمِ الْقِيَامَةِ”. رَوَاهُ أَحْمَدُ.

5311. (17) [3/1461అపరిశోధితం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: అధిక సంతానం గల ఒక దరిద్రుడు ఉండేవాడు. ఇంటికి వచ్చి తన సంతానాన్ని చూసి, భరించలేకపోయేవాడు. మళ్లీ అడవి వైపునకు వెళ్ళిపోయేవాడు. అదేవిధంగా చేసేవాడు. ఎక్కడి నుండీ ఆహారం ఏర్పాటు చేయలేక పోయేవాడు. అడవికి వెళ్ళి అల్లాహ్ ను ఆరాధించేవాడు, ప్రార్థించేవాడు. ఒకసారి అతడు ఇంటికి వచ్చాడు. ఇంట్లో భార్యాబిడ్డల ఆకలిబాధ చూడలేక, మళ్ళీ అడవికి వెళ్ళిపోయాడు. తన భర్త సిగ్గుతో వెళ్ళిపోవడం భార్య చూసింది. అతని భార్య లేచి పిండిమరను శుభ్రపరచి పొయ్యివద్దకు వెళ్ళింది. పొయ్యివెలిగించి, ‘ఓ ప్రభూ! నేను పిండిమరను శుభ్రంచేసాను, పొయ్యి వెలిగించాను. ఇప్పుడు ఉపాధి పంపించు’ అని ప్రార్థించింది. పిండిమర దానంతట అది తిరగసాగింది. ఇటు పిండిమర వద్ద పిండి పడుతుంది. అటు పొయ్యిపై రొట్టెలు తయారవుతున్నాయి. అదే సమయంలో ఆమె భర్తకూడా వచ్చాడు. అతడు పిండిమర తిరుగాడుతూ ఉండటం చూసాడు. అటు పొయ్యిపై రొట్టెలు కూడా వండబడుతున్నాయి. ‘నేను వెళ్ళిన తర్వాత నీకేమైనా దొరికిందా?’ అని అడిగాడు. దానికి ఆమె, ‘అవును, అల్లాహ్ (త) వద్ద నుండి లభించింది’ అని సమాధానం ఇచ్చింది. అతడు సంతోషం పట్టలేక ప్రవక్త (స) వద్దకు వచ్చి, ప్రవక్తా! ఈ రోజు ఇలా జరిగిందని విన్నవించుకున్నాడు. దానికి ప్రవక్త (స) ‘దాన్ని శుభ్రపరచలేదు కదా’ అని అన్నారు. దానికి ఆ వ్యక్తి ‘శుభ్రపరిచాను,’ అని అన్నాడు. ప్రవక్త (స) అది విని, ‘ఒకవేళ నీవు దాన్ని ఎత్తి ఉండకపోతే తీర్పుదినం వరకూ అది నిరంతరం తిరిగేది,’ అని అన్నారు.  (అ’హ్మద్‌)

5312 – [ 18 ] ( لم تتم دراسته ) (3/1461)

وَعَنْ أَبِيْ الدَّرْدَاءِ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِنَّ الرِّزْقَ لَيَطْلُبُ الْعَبْدَ كَمَا يَطْلُبُهُ أَجَلُهُ”. رَوَاهُ أَبُوْ نَعِيْمٍ فِيْ “الْحِلْيَةِ”

5312. (18) [3/1461అపరిశోధితం]

అబూ దర్‌దా (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఉపాధి దాసుడ్ని వెదుకుతూ ఉంటుంది. మరణం అతన్నివె తుకుతున్నట్టు”   [62]  (అబూ న’యీమ్‌ – ‘హిల్‌య)

5313 – [ 19 ] ( متفق عليه ) (3/1461)

وَعَنِ ابْنِ مَسْعُوْدٍ قَالَ:كَأَنِّيْ أَنْظُرُ إِلَى رَسُوْلِ اللهِ صلى الله عليه و سلم يَحْكِيْ نَبِيًّا مِنَ الْأَنْبِيَاءِ ضَرَبَهُ قَوْمُهُ فَأَدْمُوْهُ وَهُوَ يَمْسَحُ الدَّمَ عَنْ وَجْهِهِ وَيَقُوْلُ: “اَللّهُمَّ اغْفِرْلِقَوْمِيْ فَإِنَّهُمْ لَا يَعْلَمُوْنَ”.

5313. (19) [3/1461ఏకీభవితం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ మస్‌’ఊద్‌ (ర) కథనం: ప్రవక్త (స)ను వెనుకటి ప్రవక్తల గురించి ఇలా ప్రవచిస్తూ ఉండగా విన్నాను. ”ఒక ప్రవక్త జాతివారు అతన్ని కొట్టి రక్తసిక్తం చేసివేసారు. ఆ ప్రవక్త తన శరీరం నుండి రక్తం తుడుస్తూ ”ఓ అల్లాహ్(త)! నా జాతిని క్షమించు! ఎందుకంటే వారికేమీ తెలియదు” అని ప్రార్థిస్తూ ఉన్నారు. (బు’ఖారీ, ముస్లిమ్‌)

=====

5 بَابُ الرِّيَاءِ وَالسُّمْعَةِ

5. ప్రదర్శనా బుద్ధి, పేరు ప్రఖ్యాతుల వ్యామోహం

అంటే ప్రజలు చూచేవిధంగా, వినేవిధంగా దైవా రాధన చేయటం. దీన్ని చూపుగోలు లేదా ప్రదర్శనా బుద్ధి అంటారు. దైవారాధనల్లో, సత్కా ర్యాల్లో ఇది ఎంత మాత్రం తగదు. ఇది చాలా చెడ్డ విషయం, పాపం, ఇంకా అన్నిటికంటే ఘోర పాపమైన సాటికల్పించటంగా పరిగణించబడుతుంది. ప్రతి సత్కా ర్యం కేవలం దైవప్రీతి కోసమే చేయాలి. ప్రజలకు వినిపించడానికి, చూపించటానికి ఎంత మాత్రం చేయరాదు. ప్రతి సత్కార్యం  చిత్తశుద్ధిపై  ఆధారపడి  ఉంది.

అల్లాహ్‌ ఆదేశం: ”మరియు వారికిచ్చిన ఆదేశం: వారు అల్లాహ్‌నే ఆరాధించాలని, పూర్తి ఏకాగ్రచిత్తంతో  తమ ధర్మాన్ని (భక్తిని) కేవలం ఆయన కొరకే ప్రత్యేకించు కోవాలని, నమా’జ్‌ను స్థాపించాలని మరియు ‘జకాత్‌ ఇవ్వాలని. ఇదే సరైన ధర్మము. (అల్‌- బయ్యినహ్‌, 98:5)

మరోచోట ఇలా ఆదేశించడం జరిగింది: ”…కావున నీవు అల్లాహ్ నే ఆరాధిస్తూ నీ భక్తిని కేవలం ఆయన కొరకే ప్రత్యేకించుకో.” ( అజ్ జుమర్, 39:2)

ఖుర్‌ఆన్‌, ‘హదీసు’ల్లో ప్రదర్శనాబుద్ధి, చూపుగోలు మొదలైనవాటి గురించి ఖండించటం జరిగింది. చిత్తశుద్ధి  గురించి తాకీదు  చేయబడింది.

اَلْفَصْلُ الْأَوَّلُ  మొదటి విభాగం 

5314 – [ 1 ] ( صحيح ) (3/1462)

عَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِنَّ اللهَ لَا يَنْظُرُ إِلَى صُوَرِكُمْ وَلَا أَمْوَالِكُمْ وَلَكِنْ يَنْظُرُ إِلَى قُلُوْبِكُمْ وَأَعْمَالِكُمْ”. رَوَاهُ مُسْلِمٌ.

5314. (1) [3/1462 దృఢం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”అల్లాహ్‌ మీ రూపురేఖల్ని, మీ సిరిసంపదల్ని చూడడు. మీ ఆంతర్యాలను, మీ ఆచరణలను చూస్తాడు.”  [63]   (ముస్లిమ్‌)

5315 – [ 2 ] ( صحيح ) (3/1462)

وَعَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: (“قَالَ الله تَعَالى: أَنَا أَغْنَى الشُّرَكَاءِ عَنْ الشِّرْكِ مَنْ عَمَلَ عَمَلًا أَشْرَكَ فِيْهِ مَعِيَ غَيْرِيْ تَرَكْتُهُ وَشِرْكَهُ”)

وَفِيْ رِوَايَةٍ: فَأَنَا مِنْهُ بَرِيْءٌ هُوَ لِلَّذِيْ عَمِلَهُ”. رَوَاهُ مُسْلِمٌ.

5315. (2) [3/1462  దృఢం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”అల్లాహ్‌ ఆదేశం: ‘నేను భాగస్వాముల అక్కరలేని వాడను. ఎవరైనాఏదైనా సత్కార్యంలో నాతోపాటు ఇతరులనుకూడా చేర్చితే, నేను అతనిని, ఆ భాగస్వామిని వదలివేస్తాను.’ మరో ఉల్లేఖనంలో ‘నేను ఆ వ్యక్తితో, అతని పనితో విసుగు చెందుతాను’ అని ఉంది.” (ముస్లిమ్‌)

5316 – [ 3 ] ( متفق عليه ) (3/1462)

وَعَنْ جُنْدُبٍ قَالَ: قَالَ النَّبِيُّ صلى الله عليه وسلم: “مَنْ سَمِعَ سَمَّعَ اللهُ بِهِ وَمَنْ يُرَائِي اللهُ بِهِ”. مُتَّفَقٌ عَلَيْهِ.

5316. (3) [3/1462 ఏకీభవితం]

జున్‌దుబ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఎవరైనా ఖ్యాతికోసం, ఇతరులకు వినిపించటానికి, ఏదైనా సత్కార్యం చేస్తే, అల్లాహ్‌ (త) తీర్పుదినం నాడు అతని లోపాలను ఇతరులకు తెలియజేస్తాడు, అదేవిధంగా ప్రదర్శనాబుద్ధితో ఎవరైనా ఏదైనా చేస్తే, తీర్పుదినం నాడు అల్లాహ్‌ (త) అతనికి తెలియ పరుస్తాడు. దానికి తగిన ప్రతిఫలం ప్రసాదించడు. అంటే తీర్పుదినం నాడు అవమానించ బడతాడు. అందరి దు అతని మోసం, దగా బట్ట బయలు చేయబడు తుంది. (బు’ఖారీ, ముస్లిమ్‌)

5317 – [ 4 ] ( صحيح ) (3/1462)

وَعَنْ أَبِيْ ذَرٍ قَالَ: قِيْلَ لِرَسُوْلِ اللهِ صلى الله عليه وسلم: أَرَأَيْتَ الرَّجُلَ يَعْمَلُ الْخَيْرُ وَيَحْمَدُهُ النَّاسُ عَلَيْهِ.

وَفِيْ رِوَايَةٍ: يُحِبُّهُ النَّاسُ عَلَيْهِ. قَالَ: “تِلْكَ عَاجِلُ بُشْرَى الْمُؤْمِنِ”. رَوَاهُ مُسْلِمٌ .

5317. (4) [3/1462దృఢం]

అబూ జ’ర్‌ (ర) కథనం: ప్రవక్త (స)ను  ‘ఎవరైనా సత్కార్యం చేస్తే, ప్రజలు అతన్ని మెచ్చుకుంటే, అతన్ని ప్రశంసిస్తే అతన్ని గురించి ఏమని భావించాలి?’ అని ప్రశ్నించారు. దానికి ప్రవక్త (స), ‘అతడు చిత్తశుద్ధితో సత్కార్యం చేయడం, ప్రజలు అతన్ని మెచ్చుకోవడం అది అతని కోసం శుభవార్త వంటిది. ఇంకా శుభసూచకం కూడా.” [64]  (ముస్లిమ్‌)

—–

اَلْفَصْلُ الثَّانِيْ  రెండవ విభాగం  

5318 – [5 ] ( حسن ) (3/1462)

عَنْ أَبِيْ سَعْدِ بْنِ أَبِيْ فَضَالَةَ عَنْ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم قَالَ: “إِذَا جَمَعَ اللهُ النَّاسَ يَوْمَ الْقِيَامَةِ لِيَوْمٍ لَا رَيْبَ فِيْهِ نَادَى مُنَادٍ: مَنْ كَانَ أَشْرَكَ فِيْ عَمَلٍ عَمِلَهُ لِلّهِ أَحَدًا فَلْيَطْلُبْ ثَوَابَهُ مِنْ عِنْدَ غَيْرِ اللهِ. فَإِنَّ اللهَ أَغْنَى الشُّرَكَاءَ عَنِ الشِّرْكِ”. رَوَاهُ أَحْمَدُ .

5318. (5) [3/1462 ప్రామాణికం]

అబూ స’అద్‌ బిన్‌ అబూ ఫు’దాలహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ” ఎలాంటి సందేహం లేని, తీర్పుదినం నాడు అల్లాహ్‌ (త) అందరినీ ఒకచోట చేర్చుతాడు. ఆ రోజు అల్లాహ్‌ (త) తరఫున ప్రకటించేవాడు ఇలా ప్రకటిస్తాడు, ‘అల్లాహ్‌ (త) ఆరాధనలో ఇతరులను సాటికల్పించేవారు అల్లాహ్‌ యేతరుల నుండి తమ ప్రతిఫలం తీసుకోవాలి. ఎందు కంటే అల్లాహ్‌ (త) తన భాగస్వాముల  అక్కర  లేనివాడు.”  (అ’హ్మద్‌)

5319 – [ 6 ] ( صحيح ) (3/1463)

وَعَنْ عَبْدِ اللهِ بْنِ عَمْرٍو أَنَّهُ سَمِعَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ: “مَنْ سَمِعَ النَّاسُ بِعَمَلِهِ سَمِعَ اللهُ بِهِ أَسَامِعَ خَلْقِهِ وَحَقَّرَهُ وَصَغَّرَهُ”. رَوَاهُ الْبَيْهَقِيُّ فِيْ “شُعَبِ الْإِيْمَانِ”.

5319. (6) [3/1463 దృఢం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘అమ్ర్‌ (ర) కథనం: అతడు ప్రవక్త (స)ను ఇలా ప్రవచిస్తూ ఉండగా విన్నాడు, ”ఎవరైనా పేరు ప్రఖ్యాతుల కోసం, ఇతరులకు వినిపించడానికి సత్కార్యాలు చేసి ఉంటే, తీర్పుదినంనాడు సృష్టితా లందరి ముందు అతన్ని అవమానపరచటం జరుగు తుంది.” (బైహఖీ – షు’అబిల్  ఈమాన్)

5320 – [ 7 ] ( لم تتم دراسته ) (3/1463)

وَعَنْ أَنَسٍ أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم قَالَ: “مَنْ كَانَتْ نِيَّتُهُ طَلَبَ الْآخِرَةِ جَعَلَ اللهُ غِنَاهُ فِيْ قَلْبِهِ وَجَمَعَ لَهُ شَمْلَهُ وَأَتَتْهُ الدُّنْيَا وَهِيَ رَاغِمَةٌ وَمَنْ كَانَتْ نِيَّتُهُ طَلَبَ الدُّنْيَا جَعَلَ اللهُ الْفَقْرَ بَيْنَ عَيْنَيْهِ وَشَتَّتَ عَلَيْهِ أَمْرَهُ وَلَا يَأْتِيْهِ مِنْهَا إِلَّا مَا كُتِبَ لَهُ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَأَحْمَدُ.

5320. (7) [3/1463 అపరిశోధితం]

అనస్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”అల్లాహ్‌ పరలోకాన్ని కోరుకునేవారి హృదయాల్లో అణా శక్తతను జనింపజేస్తాడు. అతని పరిస్థితిని చక్కదిద్దు తాడు. ప్రపంచం అతని వెంట పడుతుంది. అదే విధంగా ఇహలోకాన్ని కోరుకునే వారిని అల్లాహ్‌ (త) దారిద్య్రానికి గురిచేస్తాడు, అతని పను లన్నింటినీ చెల్లాచెదురు చేస్తాడు. ప్రపంచంలో అతని విధి వ్రాతలో ఉన్నదే అతనికి లభిస్తుంది.” (తిర్మిజి’, అ’హ్మద్‌)

5321 – [ 8 ] ( لم تتم دراسته ) (3/1463)

وَالدَّارَمِيُّ عَنْ أَبَانٍ عَنْ زَيْدِ بْنِ ثَابِتٍ  

5321. (8) [3/1463 అపరిశోధితం]

అబాని, ‘జైద్‌ బిన్‌ సా’బిత్‌ (ర)ల కథనం.  (దార్మీ)

5322 – [ 9 ] ( لم تتم دراسته ) (3/1463)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: قُلْتُ: يَا رَسُوْلَ اللهِ بَيْنَا أَنَا فِيْ بَيْتِيْ فِيْ مُصَلَّايَ إِذْ دَخَلَ عَلَيَّ رَجُلٌ فَأَعْجَبَنِيَ الْحَالُ الَّتِيْ رَآنِيْ عَلَيْهَا. فَقَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “رَحِمَكَ اللهُ يَا أَبَا هُرَيْرَةَ لَكَ أَجْرَانِ: أَجرُالسِّرِّ وَأَجْرُالْعَلَانِيَةِ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَقَالَ: هَذَا حَدِيْثٌ غَرِيْبٌ.  

5322. (9) [3/1463 అపరిశోధితం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: నేను ప్రవక్త (స)తో, ‘ఓ ప్రవక్తా! నేను నా ఇంట్లో నమా’జు చదివే స్థలంలో కూర్చొని ఉండగా, అకస్మాత్తుగా ఒక వ్యక్తి నా ఇంట్లో ప్రవేశించాడు. అతడు నా పరిస్థితిని చూసాడు, అంటే నేను నమా’జు,  అల్లాహ్ ధ్యానంలో ఉండటం చూసాడు. నాకు ఎవరికీ చూపించే సంకల్పం లేదు. కాని అతడు నన్ను ఇంట్లో అలా చూసాడు. ఇది ప్రదర్శనా బుద్ధి అవదు కదా?’ అని విన్నవించు కున్నాను. దానికి ప్రవక్త (స), ‘అబూ హురైరహ్‌! అల్లాహ్‌(త) నీపై దయచూపు గాక! నీకు రెండు పుణ్యాలు లభిస్తాయి. ఒకటి నీ చిత్తశుద్ధికి, ఒకటి నీ ఆచరణకు. (తిర్మిజి’  – ఏకోల్లేఖనం)

ఎందు కంటే ప్రజలు నిన్ను చూచి వారు కూడా చిత్త శుద్ధితో ఆచరిస్తారు.

5323 – [ 10 ] ( لم تتم دراسته ) (3/1463)

وعَنْه قَالَ:قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم:”يَخْرُجُ فِيْ آخِرِ الزَّمَانِ رِجَال يَخْتِلُوْنَ الدُّنْيَا بِالدِّيْنِ يَلْبَسُوْنَ لِلنَّاسِ جُلُوْدَ الضَّأْنِ مِنَ اللِّيْنِ أَلْسِنَتُهُمْ أَحْلَى مِنَ السُّكَّرِ وَقُلُوْبُهُمْ قُلُوْبُ الذِّيَابِ. يَقُوْلُ اللهُ: (“أَبِيْ يَغْتَرُّوْنَ أَمْ عَلَيَّ يَجْتَئِرُون فَبِيْ حَلَفْتُ لَأَبْعَثَنَّ عَلَى أُوْلَئِكَ مِنْهُمْ فِتْنَةً تَدَعُ الْحَلِيْمَ فِيْهِمْ حَيْرَانَ”). رَوَاهُ التِّرْمِذِيُّ.

5323. (10) [3/1463అపరిశోధితం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”చివరికాలంలో ప్రజలు ధర్మంద్వారా ప్రపంచాన్ని సంపాదిస్తారు. అంటే ధార్మిక ఆచరణచేసి సంపా దిస్తారు. ప్రజలకు చూపించడానికి మేకల, తోడేళ్ళ వస్త్రాలు ధరిస్తారు. సున్నితత్వం వల్ల వారి మాటలు చక్కెరకన్నా తియ్యగా ఉంటాయి. అంటే వారు తోడేళ్ళ ముసుగులో తియ్యటి మాటలు పలుకు తారు. అల్లాహ్‌ ఆదేశం: ”మీరు నా వల్ల మోసానికి గురవుతారా? నాకు వ్యతిరేకంగా సాహసిస్తారా? నేను నాపై ప్రమాణం చేసి చెబు తున్నాను. వీరిపై ఎటు వంటి ఉపద్రవాన్ని పంపిస్తానంటే, వీరిలో గొప్పతెలివి గలవారు కూడా ఆందోళనకు గురవుతారు.”  (తిర్మిజి’)

5324 – [ 11 ] ( لم تتم دراسته ) (3/1464)

وَعَنِ ابْنِ عُمَرَعَنِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ: “إِنَّ اللهَ تَبَارَكَ وَ تَعَالى قَالَ: لَقَدْ خَلَقْتُ خَلْقًا أَلْسِنَتُهُمْ أَحْلَى مِنَ السُّكَّرِ وَقُلُوْبُهُمْ أَمَرُّمِنَ الصَّبِرِفَبِيْ حَلَفْتُ لَأُتِيْحَنَّهُمْ فِتْنَةً تَدَعُ الْحَلِيْمِ فِيْهِمْ حَيْرَانَ فَبِيْ يَغْتَرُّوْنَ أَمْ عَلَيَّ يَجْتَرِؤُوْنَ؟” رَوَاهُ التِّرْمِذِيُّ وَقَالَ: هَذَا حَدِيْثٌ غَرِيْبٌ

5324. (11) [3/1464 అపరిశోధితం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘ఉమర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, అల్లాహ్‌ ఆదేశం: ”అయితే నేను కొందరిని సృష్టించాను. వారి మాటలు చక్కెరకంటే తియ్యగా ఉంటాయి. వారి హృదయాలు మాత్రం చాలా చేదుగా ఉంటాయి. నేను నాపై ప్రమాణంచేసి చెబు తున్నాను. నేను తప్పకుండా వారిపై కల్లోలాన్ని అవతరింపజేస్తాను. ఫలితంగా వారిలో మేధావులు కూడా ఆందోళనకు గురవుతారు. వారు నా ముందు సాహసించగోరి, నా ద్వారా మోసగింపబడతారు.” (తిర్మిజి’  – ఏకోల్లేఖనం)

5325 – [ 12 ] ( لم تتم دراسته ) (3/1464)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم : “إِنَّ لِكُلِّ شَيْءٍ شِرَّةً وَلِكُلِّ شِرَّةٍ فَتْرَةً فَإِنْ صَاحِبُهَا سَدَّدَ وَقَارَبَ فَارْجُوْهُ وَإِنْ أُشِيْرَ إِلَيْهِ بِالْأَصَابِعَ فَلَا تَعُدُوْهُ”. رَوَاهُ التِّرْمِذِيُّ.

5325. (12) [3/1464 అపరిశోధితం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ప్రతివానిలో ఆత్రత ఉంటుంది. ప్రతివ్యక్తి పొందాలనే తపన, చురుకుదనం, కోరికలు కలిగి ఉంటాడు. ప్రతిదానిలో అలసత్వం కూడా ఉంటుంది. అంటే ప్రతివాడు నిర్లక్ష్యానికి కూడా గురవుతాడు, పతనానికి చేరుకుంటాడు. కనుక ఆచరించేవాడు మధ్యే మార్గాన్ని అనుసరిస్తే, అనేక ఆపదల నుండి, కష్టాల నుండి దూరంగా ఉండవచ్చు. తన గమ్యాన్ని చేరుకో వచ్చు. సాఫల్యం పొందవచ్చు. ఒకవేళ పేరు ప్రతిష్ఠలు లభిస్తే, ఖ్యాతిపొందితే, ఇతడు చాలా దైవభక్తుడు అని ప్రజలు చర్చించుకుంటే, అతని ఆచరణకూడా పేరు ప్రఖ్యాతులకోసమే అవుతుంది. అప్పుడు ఇటువంటి వారిని దైవభక్తులుగా, దైవభీతి పరులుగా పరిగణించ వద్దు.”  (తిర్మిజి’)

5326 – [ 13 ] ( لم تتم دراسته ) (3/1464)

وَعَنْ أَنَسٍ عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ: “بِحَسْبِ امْرِيْءٍ مِنَ الشَّرِّ أَنْ يُشَارَ إِلَيْهِ بِالْأَصَابِعِ فِيْ دِيْنٍ أَوْ دُنْيَا إِلَّا مَنْ عَصَمَهُ اللهُ”. رَوَاهُ الْبَيْهَقِيُّ فِيْ “شُعَبِ الْإِيْمَانِ”.

5326. (13) [3/1464అపరిశోధితం]

అనస్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ధార్మికంగా పేరు ప్రఖ్యాతులు మనిషిని చెడుకు గురిచేస్తాయి. అంటే పేరుప్రఖ్యాతుల కోసమే అతడు ఆచరించాడు. ఖ్యాతి గడించాడు. అయితే అల్లాహ్‌ (త) రక్షించే వాడు, రక్షించ బడతాడు.”  [65] (బైహఖీ-షు’అబిల్ ఈమాన్)

—–

اَلْفَصْلُ الثَّالِثُ   మూడవ విభాగం

5327 – [ 14 ] ( صحيح ) (3/1464)

عَنْ أَبِيْ تَمِيْمَةَ قَالَ: شَهِدْتُ صَفْوَانَ وَأَصْحَابِهِ وَجُنْدُبٌ يُوْصِيْهِمْ فَقَالُوْا: هَلْ سَمِعْتَ مِنْ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم شَيْئًا؟ قَالَ: سَمِعْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ: “مَنْ سَمِعَ إِنَّ أَوَّلَ مَا يُنْتِنُ مِنَ الْاِنْسَانِ بَطْنُهُ فَمَنِ اسْتَطَاعَ أَنْ لَا يَأْكُلَ إِلَّا طَيِّبًا فَلْيَفْعَلْ وَمَنِ اسْتَطَاعَ أَنْ لَا يَحُوْلَ بَيْنَهُ وَبَيْنَ الْجَنَّةِ مِلْءُ كَفٍّ مِنْ دَمٍ اَهْرَاقَهُ فَلْيَفْعَلْ. رَوَاهُ الْبُخَارِيُّ.

5327. (14) [3/1464దృఢం]

అబూ తమీమహ్ (ర) కథనం: నేను సఫ్వాన్‌ మరియు అతని మిత్రులవద్ద కూర్చొని ఉన్నాను. అప్పుడు జున్‌దుబ్‌ (ర) ప్రజలకు హితబోధ చేస్తున్నారు. అప్పుడు ప్రజలు ‘మీరు ప్రవక్త (స) ద్వారా విన్నారా?’ అని అడిగారు. దానికతను ”అవును, ప్రవక్త (స)ను ఇలా ప్రవచిస్తూ ఉండగా నేను విన్నాను. ‘ఇతరులకు వినిపించటానికి, పేరు ప్రతిష్ఠల కోసం ఎవరైనా సత్కార్యం చేస్తే, అల్లాహ్‌ (త) తీర్పుదినంనాడు అతన్ని అందరి ముందు అవమా నిస్తాడు. ఇంకా అతని గురించి అందరికీ తెలియ జేస్తాడు. అదేవిధంగా అనవసరంగా ఇతరులకు హానికలిగించినా, కష్టాలకు గురిచేసినా తీర్పు దినంనాడు అల్లాహ్‌ (త) కూడా అతన్ని కష్టాలకు గురిచేస్తాడు” అని అన్నారు. ప్రజలు ‘మరికాస్త హితబోధ చేయండి,’ అని అన్నారు. అప్పుడతను ‘అన్నిటికంటే ముందు మానవుణ్ణి పాడు చేసేది అతని పొట్టయే. అంటే ఆహారం పొట్టల్లోకి వెళుతుంది. అది ధర్మసంపాదన అయినా, అధర్మ సంపాదన అయినా సరే. అన్నిటికంటే ముందు మరణానంతరం క్రుళ్ళేది పొట్టయే. కనుక ఎవరైనా సాధ్యమైనంత వరకు ధర్మ సంపాదనే తినాలి. అదేవిధంగా సాధ్యమైనంత వరకు గుక్కెడు రక్తం కూడా చిందించనివాడై ఉండాలి. అంటే ఇతరులను కొట్టటం, తిట్టడం, హాని చేకూర్చటం మొదలైనవాటికి దూరంగా ఉండాలి.’  (బు’ఖారీ)

5328 – [ 15 ] ( ضعيف ) (3/1465)

وعَنْ عُمَرَ بْنِ الْخَطَّابِ أَنَّهُ خَرَجَ يَوْمًا إِلى مَسْجِدِ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم فَوَجَدَ مُعَاذَ بْنَ جَبَلٍ قَاعِدًا عِنْدَ قَبَرِ النَّبِيِّ صلى الله عليه وسلم يَبْكِيْ فَقَالَ: مَا يُبْكِيْكَ؟ قَالَ: يُبْكِيْنِيْ شَيْءٌ سَمِعْتُهُ مِنْ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم. سَمِعْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ: “إِنَّ يَسِيْرَ الرِّيَاءِ شِرْكٌ. وَمَنْ عَادَى لِلّهِ وَلِيًّا فَقَدْ بَارَزَ اللهَ بِالْمُحَارَبَةِ إِنَّ اللهَ يُحِبُّ الْأَبْرَارَ الْأَتْقِيَاءُ الْأَخْفِيَاءَ الَّذِيْنَ إِذَا غَابُوْا لَمْ يُتَفَقَّدُوْا وَإِنْ حَضَرُوْا لَمْ يُدْعَوْا وَلَمْ يُقَرَّبُوْا قُلُوْبُهُمْ مَصَابِيْحُ الْهُدَى يَخْرُجُوْنَ مِنْ كُلِّ غَبْرَاءَ مُظْلِمَةٍ. رَوَاهُ ابْنُ مَاجَهُ وَالْبَيْهَقِيُّ فِيْ “شُعَبِ الْإِيْمَانِ”.

5328. (15) [3/1465  బలహీనం]

‘ఉమర్‌(ర) ఒకసారి ప్రవక్త(స)మస్జిద్‌లోనికి వెళ్ళారు. అక్కడ ప్రవక్త (స) సమాధి తలదగ్గర మ’ఆజ్‌ బిన్‌ జబల్‌ (ర) కూర్చొని ఏడుస్తున్నారు. అతన్ని, ‘ఏ విషయంవల్ల నీవు ఏడుస్తున్నావు,’ అని అడిగారు. దానికి అతడు, ‘ప్రవక్త (స) ద్వారా విన్న విషయంవల్ల ఏడుస్తున్నాను,’ అని అన్నారు. అంటే ప్రవక్త (స) ప్రదర్శనాబుద్ధి కొంతైనా అది అల్లాహ్(త)కు సాటి కల్పించటానికి సమానమే, ఇంకా దైవభక్తుల పట్ల శత్రుత్వం వహించటం, వారికి హాని చేకూర్చటం, వీటికి పాల్పడినవాడు అల్లాహ్‌(త)తో యుద్ధం చేసి నట్టే. అల్లాహ్‌(త) భీతిపరులను, భక్తిపరులను ప్రేమిస్తాడు. వారిపట్ల సంతృప్తి చెందుతాడు. వీరు ప్రజల్లో గుర్తించ బడరు, పేరు ప్రఖ్యాతులు లేనివారై ఉంటారు. వారు ఉన్నా, లేకపోయినా ఎవరూ పట్టించుకోరు. వారిని ఎవరూ అతిథులుగా స్వీక రించరు, చివరికి తన ప్రక్కన కూడా కూర్చోనివ్వరు. అయితే వారి హృదయాలు మార్గదర్శక దీపాలు. ప్రతిఅంధకార యుగంలో జన్మిస్తారు. (ఇబ్నె మాజహ్, బైహఖీ -షు’అబిల్  ఈమాన్)

5329 – [ 16 ] ( ضعيف ) (3/1465)

وعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِنَّ الْعَبْدَ إِذَا صَلّى فِي الْعَلَانِيَةِ فَأَحْسَنَ وَصَلَّى فِي السِّرِّ فَأَحْسَنَ. قَالَ اللهُ تَعَالى: “هَذَا عَبْدِيْ حَقًّا”. رَوَاهُ ابْنُ مَاجَهُ  

5329. (16) [3/1465బలహీనం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ప్రజల ముందు బహిరంగంగా చక్కగా నమా’జు చేసే వ్యక్తి రహస్యంగా, ఒంటరిగా కూడా చక్కగా నమా’జు చదివితే అల్లాహ్‌ (త) ఇతడు నా సత్యమైన దాసుడు” అని అంటాడు.  (ఇబ్నె మాజహ్)

5330 – [ 17 ] ( لم تتم دراسته ) (3/1465)

وَعَنْ مُعَاذِ بْنِ جَبَلٍ أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم قَالَ: “يَكُوْنُ فِيْ آخِرِ الزَّمَانِ أَقْوَامٌ إِخْوَانُ الْعَلَانِيَةِ أَعْدَاءُ السَّرِيْرَةِ”. فَقِيْلَ: يَا رَسُوْلَ اللهِ وَكَيْفَ يَكُوْنُ ذَلِكَ. قَالَ: “ذَلِكَ بِرَغْبَةِ بَعْضِهِمْ إِلى بَعْضِ وَرَهْبَةِ بَعْضِهِمْ مِنْ بَعْضٍ”.

5330. (17) [3/1465 అపరిశోధితం]

ము’ఆజ్‌ బిన్‌ జబల్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ‘చివరికాలంలో పైకి మిత్రులుగా వ్యవహ రించే ప్రజలు ఉంటారు. లోపల శత్రువులుగా ఉంటారు.’ ‘అదెలా,’ అని ప్రవక్త (స)ను ప్రశ్నించటం జరిగింది. అప్పుడు ప్రవక్త (స) వారిలోకొందరు కొందరి పట్ల కోరికగా ఉంటారు. మరి కొందరు కొందరిపట్ల భయం కలిగిఉంటారు. వారి ప్రేమ, శత్రుత్వాలు దైవప్రీతికోసం అయిఉండవు. ప్రాపంచిక పరంగా ఐహిక వాంఛలపరంగా ఉంటాయి. వారి కోరిక తీరితే స్నేహాన్ని బహిర్గతం చేస్తారు. ఒకవేళ వారికోరిక తీరక పోతే  శత్రుత్వం  బహిర్గతం  చేస్తారు.”  (అ’హ్మద్‌)

5331 – [ 18 ] ( لم تتم دراسته ) (3/1465)

وَعَنْ شَدَّادِ بْنِ أَوْسٍ قَالَ: سَمِعْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ: “مَنْ صَلّى يثرَائِيْ فَقَدْ أَشْرَكَ وَمَنْ صَامَ يُرَائِيْ فَقَدْ أَشْرَكَ وَ مَنْ تَصَدَّقَ يُرَائِيْ فَقَدْ أَشْرَكَ”. رَوَاهُمَا أَحْمَدُ.  

5331. (18) [3/1465 అపరిశోధితం]

షద్దాద్‌ బిన్‌ ఔన్‌ (ర) కథనం: ప్రవక్త (స) ఇలా ప్రవచిస్తూ ఉండగా నేను విన్నాను, ”ప్రజలకు చూపించేడానికి నమా’జు చేసినవాడు సాటికల్పించి నట్టే. ప్రజలకు చూపించడానికి ఉపవాసం పాటించిన వాడు సాటి కల్పించినట్టే. అదేవిధంగా ప్రజలకు చూపించటానికి దానధర్మాలు చేసినవాడు సాటి కల్పించి నట్టే.” (అ’హ్మద్‌)

5332 – [ 19 ] ( لم تتم دراسته ) (3/1465)

وعَنْهُ أَنَّهُ بَكَى فَقِيْلَ لَهُ: مَا يُبْكِيْكَ؟ قَالَ: شَيْءٌ سَمِعْتُ مِنْ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ فَذَكَرْتُهُ فَأَبْكَانِيْ سَمِعْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ: “أَتَخَوَّفُ عَلَى أُمَّتِي الشِّرْكَ وَالشَّهْوَةَ الْخَفِيَّةَ”. قَالَ: قُلْتُ يَا رَسُوْلَ اللهِ أَتُشْرِكُ أُمَّتُكَ مِنْ بَعْدِكَ؟ قَالَ: “نَعَمْ. أَمَا إِنَّهُمْ لَا يَعْبُدُوْنَ شَمْسًا وَلَا قَمَرًاوَلَا حَجَرًا وَلَا وَثْنًا وَلَكِنْ يراؤُوْنَ بِأَعْمَالِهِمْ. وَالشَّهْوَةُ الْخَفِيَّةُ أَنْ يُصْبِحَ أَحَدُهُمْ صَائِمًا فَتَعْرِضُ لَهُ شَهْوَةٌ مِنْ شَهْوَاتِهِ فَيَتْرُكُ صَوْمَهُ”. رَوَاهُ الْبَيْهَقِيُّ فِيْ”شُعَبِ الْإِيْمَانِ”.

5332. (19) [3/1465 అపరిశోధితం]

షద్దాద్‌ బిన్‌ ఔస్‌ (ర) కథనం: షద్దాద్‌ బిన్‌ ఔన్‌ ఏడుస్తూ ఉన్నారు. ‘ఎందుకు ఏడుస్తున్నారు,’ అని అడగ్గా, ఆయన సమాధానం ఇస్తూ ప్రవక్త (స) ”నేను నా అనుచర సమాజం విషయంలో అంతర్గత వ్యసనం గురించి చాలా భయపడు తున్నాను” అని ప్రవచిస్తూ ఉండగా నేను విన్నాను. దానికి నేను, ‘ఓ ప్రవక్తా! తమరి తర్వాత తమరి అనుచర సమాజం సాటి కల్పించటానికి గురవుతుందా?’ అని అడిగాను. దానికి ప్రవక్త (స), ‘అవును, వాళ్ళు సూర్యుణ్ని, చంద్రుణ్ణి, చెట్లను, రాళ్ళను పూజించరు, కాని, ప్రదర్శనా బుద్ధితో సత్కార్యాలు చేస్తారు, ఇదే షిర్క్‌ (సాటికల్పించటం). ఇంకా అంతర్గత కోరిక ఏమిటంటే, ఉదయం ఉపవాస స్థితిలో లేస్తారు. కాని ఏదో ఒక కోరిక గుర్తుకు వచ్చి దాన్ని పూర్తిచేయటానికి ఉప వాసాన్ని భంగ పరుస్తారు.” (అ’హ్మద్‌, బైహఖీ-షు’అబిల్ ఈమాన్)

ఈ ‘హదీసు’ ద్వారా తెలిసిన విషయం ఏమిటంటే, ఒక ముస్లిమ్‌ ప్రదర్శనాబుద్ధితో ఇస్లామ్‌ విధులను నిర్వర్తించినా, అది కూడా సాటికల్పించటం వంటిదే. ఎందుకంటే చేసిన సత్కార్యం అల్లాహ్‌ (త) కోసం కాదు, ఇతరుల కోసం.

5333 – [ 20 ] ( حسن ) (3/1466)

وَعَنْ أَبِيْ سَعِيْدِ الْخُدْرِيِّ قَالَ: خَرَجَ عَلَيْنَا رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم وَنَحْنُ نَتَذَاكَرُ الْمَسِيْحَ الدَّجَّالَ فَقَالَ: “أَلَا أُخْبِرُكُمْ بِمَا هُوَ أَخْوَفُ عَلَيْكُمْ عِنْدِيْ مِنَ الْمَسِيْحِ الدَّجَّالِ؟” فَقُلْنَا: بَلَى يَا رَسُوْلَ اللهِ. قَالَ: “اَلشِّرْكُ الْخَفِيُّ أَنْ يَقُوْمَ الرَّجُلُ فَيُصَلِّيْ فَيَزِيْدَ صَلَاتَهُ لِمَا يَرَى مِنْ نَظْرِ رَجُلٍ”. رَوَاهُ ابْنُ مَاجَهُ”.

5333. (20) [3/1466ప్రామాణికం]

అబూ స’యీద్‌ ‘ఖుద్రీ (ర) కథనం: ప్రవక్త (స) బయటకు వచ్చారు. అప్పుడు మేము మసీ’హు ద్దజ్జాల్‌ గురించి మాట్లాడుకుంటున్నాము, అది విని ప్రవక్త (స) ఇలా అన్నారు, ‘వినండి! నేను మీకు మసీ’హుద్దజ్జాల్‌ కంటే భయంకరమైన విషయాన్ని తెలుపనా?’ అని అన్నారు. దానికి మేము, ‘తప్పకుండా ఓ ప్రవక్తా!’ అని అన్నాము. అప్పుడు ప్రవక్త (స) అది అంతర్గత షిర్క్‌, మనిషి నిలబడి నమా’జు చదవటం ప్రారంభిస్తాడు. ఎవరైనా అటు వస్తున్నారని తెలిసి దాన్ని సాగదీసి చదువుతాడు. అంటే ఇతరులకు చూపించ డానికి సాగదీసి చదువుతాడు.” (ఇబ్నె మాజహ్)

5334 – [ 21 ] ( لم تتم دراسته ) (3/1466)

وَعَنْ مَحْمُوْدِ بْنِ لَبِيْدٍ أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم قَالَ: “إِنَّ أَخْوَفَ مَا أَخَافُ عَلَيْكُمُ الشِّرْكَ الْأَصْغَرُ” .قَالُوْا: يَا رَسُوْلَ اللهِ وَمَا الشِّرْكُ الْأَصْغَرُ؟ قَالَ: “اَلرِّيَاءُ”. رَوَاهُ أَحْمَدُ.

وَزَادَ الْبَيْهَقِيُّ فِيْ”شُعَبِ الْإِيْمَانِ”: “يَقُوْلُ اللهُ لَهُمْ يَوْمَ يُجَازِي الْعِبَادَ بِأَعْمَالِهِمْ: اِذْهَبُوْا إِلى الَّذِيْنَ كُنْتُمْ تُرَاؤُوْنَ فِي الدُّنْيَا فَانْظُرُوْ اهَلْ تَجِدُوْنَ عِنْدَهُمْ جَزَاءً وَخَيْرًا؟”

5334. (21) [3/1466 అపరిశోధితం]

మ’హ్‌మూద్‌ బిన్‌ లబీద్‌ (ర) కథనం: ప్రవక్త (స), ”షిర్క్‌ అస్‌’గర్‌ విషయంలో మీపట్ల నేనుచాలా భయపడుతున్నాను” అని అన్నారు. దానికి ప్రజలు, ‘ఓ ప్రవక్తా! షిర్క్‌ అస్‌’గర్‌ అంటే ఏమిటి,’ అని విన్నవించుకున్నారు. అప్పుడు ప్రవక్త (స) రియా’ అంటే ప్రదర్శనా బుద్ధితో మాట్లాడటం, లేదా సత్కార్యం చేయటం,’ అని అన్నారు. (అ’హ్మద్‌, బైహఖీ)

 ఇంకా బైహఖీలో ఇలా ఉంది, ”దాసుల ప్రతిఫలం ఇస్తూ ఉన్నప్పుడు అల్లాహ్‌(త), ‘ఓ దూతలారా! మీరు ఈ ప్రదర్శనా బుద్ధితో ఆరాధించేవాడ్ని తీసుకొని పోండి, పాపపుణ్యాల్లో ఏది పొందుతాడో చూడండి” అని ఆదేశిస్తాడు. (బైహఖీ – షు’అబిల్ ఈమాన్)

5335 – [ 22] ( لم تتم دراسته ) (3/1466)

وَعَنْ أَبِيْ سَعِيدِ الْخُدْرِيِّ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: ” لَوْ أَنَّ رَجُلًا عَمِلَ عَمَلًا فِيْ صَخْرَةٍ لَا بَابَ لَهَا وَلَا كُوَّةَ خَرَجَ عَمَلُهُ إِلى النَّاسِ كَائِنًا مَا كَانَ”.

5335. (22) [3/1466అపరిశోధితం]

అబూ స’యీద్‌ ‘ఖుద్రీ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఎవరైనా బండరాయిలో ఏదైనా పనిచేస్తే, ఎటూ మార్గం లేకపోయినా, అతని కర్మ గురించి ప్రజలకు తెలిసిపోతుంది. ఆ పని ఎటువంటిదైనా ప్రజలకు తెలిసిపోతుంది. [66]  (బైహఖీ)

5336 – [ 23 ] ( لم تتم دراسته ) (3/1466)

وَعَنْ عُثْمَانَ بْنِ عَفَّانَ قَال: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَنْ كَانَتْ لَهُ سَرِيْرَةٌ صَالِحَةٌ أَوْ سَيِّئَةٌ أَظْهَرَ اللهُ مِنْهَا رِدَاءُ يُعْرَفُ بِهِ”.

5336. (23) [3/1466–  అపరిశోధితం]

‘ఉస్మాన్‌ బిన్‌ ‘అఫ్ఫాన్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఒకవ్యక్తి యొక్క దాగిఉన్న మంచి లేక చెడును, అల్లాహ్‌ (త) ఆ చెడు అలవాటును ప్రజలముందు ఒక చిహ్నంగా బహిరంగపరుస్తాడు. దాన్ని ప్రజలు తెలుసుకుంటారు. మనిషి ఏది చేసినా అల్లాహ్‌ (త)కు తెలియకుండా ఉండదు.” (బైహఖీ)

5337 – [ 24 ] ( لم تتم دراسته ) (3/1466)

وَعَنْ عُمَرَ بْنِ الْخَطَّابِ عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ: “إِنَّمَا أَخَافُ عَلَى هَذِهِ الْأُمَّةِ كُلَّ مُنَافِقٍ يَتَكَلَّمُ بِالْحِكْمَةِ وَيَعْمَلُ بِالْجَوْرِ”. رَوَى الْبَيْهَقِيُّ الْأَحَادِيْثَ الثَّلَاثَةَ فِيْ “شُعَبِ الْإِيْمَانِ”.

5337. (24) [3/1466 అపరిశోధితం]

‘ఉమర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”నా అనుచర సంఘంలోని కపటాచారుల చెడుపట్ల చాలా భయపడు తున్నాను. మేధావుల్లా మాట్లాడుతారు. కాని, దుర్మార్గం, దౌర్జన్యాలను అనుసరిస్తారు. అంటే మాటలు మంచివి. చేతలు చెడ్డవి.” (బైహఖీ-షు’అబిల్ ఈమాన్)

5338 – [ 25 ] ( ضعيف ) (3/1466)

وَعَنْ الْمُهَاجِرِ بْنِ حَبِيْبٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “قَالَ اللهُ تَعَالى: إِنِّيْ لَسْتُ كُلَّ كَلَامِ الْحَكِيْمِ أَتَقَبَّلُ وَلَكِنْ أَتَقَبَّلُ هَمَّهُ وَ هَوَاهُ فَإِنْ كَانَ هَمُّهُ وَهَوَاهُ فِيْ طَاعَتِيْ جَعَلْتُ صَمْتَهُ حَمْدًا لِيْ وَ وَقَارًا وَإِنْ لَمْ يَتَكَلَّمْ”. رَوَاهُ الدَّارَمِيُّ.

5338. (25) [3/1466బలహీనం]

ముహాజిర్‌ బిన్‌ ‘హబీబ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”నేను వైద్యుని ప్రతి మాటను స్వీకరించను. కాని అతని ధైర్యం, సంకల్పాన్ని స్వీకరిస్తాను. ఒకవేళ అతని ధైర్యం, సంకల్పం నా విధేయతలో ఉంటే, అతని మౌనాన్ని నాగొప్పతనం, ప్రశంసగా భావిస్తాను. ఒకవేళ అతను మాట్లాడక పోయినా సరే.” (దార్మీ)

=====

6 – بَابُ الْبُكَاءِ وَالْخَوْفِ

6. ఏడ్పులు, భయభీతులు

అల్లాహ్ (త) శిక్షకు భయపడి ఏడ్వటం ఆరాధన అవుతుంది. దీన్ని గురించి ఖుర్‌ఆన్‌లో కొన్ని ఆయతులు ఉన్నాయి.” మరియు ఎవడైతే తన ప్రభువు సన్నిధిలో హాజరు కావలసి ఉంటుందనే భయం కలిగి  ఉంటాడో, అతనికి రెండు స్వర్గ వనాలుంటాయి.” (సూరహ్‌ రహ్మాన్‌, 55:46) – ‘అంటే తీర్పుదినం నాడు తన ప్రభువుముందు నిలబడాలని, తన్ను తాను పాపాలకు దూరంగా ఉంచుతూ అహంకారానికి గురికాడు, ప్రాపంచిక వ్యవహారాల్లో పడి పరలోకాన్ని మరవడు. పైగా పరలోకాన్ని గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ధార్మిక విధులను నిర్వర్తిస్తూ ఉంటాడు. నిషిద్ధాలకు దూరంగా ఉంటాడు. ఇటువంటి వ్యక్తికి ఒకటి కాదు రెండు స్వర్గాలు లభిస్తాయి.’

మరోచోట అల్లాహ్‌ ఆదేశం: ” మరియు తన ప్రభువు ముందు నిలబడవలసి ఉంటుందన్న భయంతో తన మనస్సును దుష్టవాంఛలకు దూరంగా ఉంచిన వ్యక్తికి; నిశ్చయంగా, స్వర్గమే, అతని నివాస స్థాన మవు తుంది.”  (అన్-నా’జి’ఆత్, 79:40-41)

اَلْفَصْلُ الْأَوَّلُ  మొదటి విభాగం 

5339 – [ 1 ] ( صحيح ) (3/1467)

عَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: قَالَ أَبُو الْقَاسِمِ صلى الله عليه وسلم: “وَالَّذِيْ نَفْسِيْ بِيَدِهِ لَوْ تَعْلَمُوْنَ مَا أَعْلَمُ لَبَكَيْتُمْ كَثِيْرًا وَلَضَحِكْتُمْ قَلِيْلًا”. رَوَاهُ الْبُخَارِيُّ.

5339. (1) [3/1467దృఢం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఎవరి చేతిలో నా ప్రాణం ఉందో ఆయన (త) సాక్షి! నాకు తెలిసిన విషయాలు ఒకవేళ మీకు తెలిస్తే, మీరు ఎక్కువగా ఏడుస్తారు, తక్కువగా నవ్వుతారు.” [67] (బు’ఖారీ)

5340 – [ 2] ( صحيح ) (3/1467)

وَعَنْ أُمِّ الْعَلَاءِ الْأَنْصَارِيَّةِ قَالَتْ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “وَاللهِ لَا أَدْرِيْ وَاللهِ لَا أدْرِيْ وَأَنَا رَسُوْلُ اللهِ مَا يَفْعَلُ بِيْ وَبِكُمْ”. رَوَاهُ الْبُخَارِيُّ.

5340. (2) [3/1467 దృఢం]

ఉమ్మె ‘అలా’ అ’న్సారియ్యహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం: ”అల్లాహ్ సాక్షి! నాకు తెలియదు, అల్లాహ్ సాక్షి! నాకు తెలియదు, నేను దైవప్రవక్తను అయినప్పటికీ అల్లాహ్‌ (త) నాపట్ల, మీపట్ల ఎలా విచారించటం జరుగుతుందో.”  [68] (బు’ఖారీ)

5341 – [ 3 ] ( صحيح ) (3/1467)

وَعَنْ جَابِرٍ قَالَ:قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “عُرِضَتْ عَلَيَّ النَّارُ فَرَأَيْتُ فِيْهَا امْرَأَةً مِنْ بَنِيْ إِسْرَائِيْلَ تُعَذَّبُ فِيْ هِرَّةٍ لَهَا رَبَطَتْهَا فَلَمْ تُطْعِمْهَا وَلَمْ تَدَعْهَا تَأْكُلُ مِنْ خَشَاشِ الْأَرْضِ حَتّى مَاتَتْ جُوْعًا وَرَأَيْتُ عَمْرَو بْنِ عَامِرِ الْخُزَاعِيَّ يَجُرُّ قُصْبَهُ فِي النَّارِ وَكَانَ أَوَّلَ مَنْ سَيَّبَ السَّوَائِبَ”. رَوَاهُ مُسْلِمٌ.  

5341. (3) [3/1467  దృఢం]

జాబిర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”నరకం నా ముందుకు రప్పించబడుతుంది. నేను ఆ నరకంలో బనీ ఇస్రాయీల్‌కు చెందిన ఒక స్త్రీని చూచాను. కేవలం ఒక పిల్లి వల్ల ఆమెను శిక్షించడం జరుగుతుంది. ఆమె దాన్ని కట్టి పడేసి, దానికి అన్నం పెట్టేదీ కాదు, వదిలేదీ కాదు, అది ఎక్కడికైనా వెళ్ళి తినటానికి. చివరికి ఆపిల్లి ఆకలి దప్పికలతో చనిపోయింది. ఇంకా అదే నరకంలో నేను ‘అమ్ర్‌ బిన్‌ ‘ఆమిర్‌ ‘ఖు’జా’యీను చూచాను. అతడు తన ప్రేగులను ఈడ్చుతున్నాడు. ఎందుకంటే అందరికంటే ముందు విగ్రహాల పేర ఎద్దులను వదిలే ఆచారాన్ని  ప్రారంభించింది  ఇతడే.” (ముస్లిమ్‌)

5342 – [ 4 ] ( متفق عليه ) (3/1467)

وَعَنْ زَيْنَبَ بِنْتِ جَحْشٍ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم دَخَلَ يَوْمًا فَزِعًا يَقُوْلُ: “لَا إِلَهَ إِلَّا اللهُ. وَيْلٌ لِلْعَرَبِ مِنْ شَرٍّ قَدِ اقْتَرَبَ فُتِحَ الْيَوْمَ مِنْ رَدْمِ يَأْجُوْجَ وَمَأْجُوْجَ مِثْلُ هَذِهِ” .وَحَلَّقَ بِأَصْبَعَيْهِ: الْإِبْهَامِ وَالَّتِيْ تَلِيْهَا. قَالَتْ زَيْنَبُ: فَقُلْتُ: يَا رَسُوْلَ اللهِ أَفَنْهْلِكُ وَفِيْنَا الصَّالِحُوْنَ؟ قَالَ: “نَعَمْ إِذَا كَثُرَ الْخَبَثُ”.

5342. (4) [3/1467  ఏకీభవితం]

జైనబ్‌ బిన్‌తె జ’హష్‌ (ర) కథనం: ప్రవక్త (స) ఒక సారి ఆందోళనకరమైన స్థితిలో ఆమె వద్దకు వచ్చారు. ‘లా ఇలాహ ఇల్లల్లాహ్‌’ పఠిస్తూ అరబ్బులపై వినాశం విరుచుకుపడుతుంది. ఈ ఉపద్రవాలు, యుద్ధాల వల్ల అది చాలా సమీపం లోనే ఉంది. యా’జూజ్‌, మా’జూజ్‌ల గోడలో వేలంత వెడల్పు కన్నం అయి పోయింది. అతి త్వరలో ఆ గోడ కూలి పోతుంది. యా’జూజ్‌, మా’జూజ్‌లు మానవులపై విరుచుకు పడతారు. వినాశనం సృష్టిస్తారు,” అని అన్నారు. దానికి ‘జైనబ్‌, ”ప్రవక్తా! మాలో మంచి వారున్నా మేము నాశనం అయిపోతామా?” అని అడిగారు. దానికి ప్రవక్త (స), ”అవును, పాపాలు, దుర్మార్గాలు, వ్యభిచారం హద్దు మీరితే పుణ్యాత్ములు ఉండటం, వారి ప్రార్ధనలు వినాశనం  నుండి  రక్షించ లేవు.”  (బు’ఖారీ, ముస్లిమ్‌)

5343 – [ 5 ] ( صحيح ) (3/1467)

وَعَنْ أَبِيْ عَامِرٍ أَوْ أَبِيْ مَالِكِ الْأَشْعَرِيِّ قَالَ: سَمِعْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ: “لَيَكُوْنَنَّ مِنْ أُمَّتِيْ أَقْوَامٌ يَسْتَحِلُّوْنَ الْخِزَّ وَالْحَرِيْرَ وَالْخَمْرَ وَالْمَعَازِفَ وَلَيَنْزِلَنَّ أَقْوَامٌ إِلى جَنَبِ عَلَمٍ يَرُوْحُ عَلَيْهِمْ بِسَارِحَةٍ لَهُمْ يَأْتِيْهِمْ رَجُلٌ لِحَاجَةٍ فَيَقُوْلُوْنَ: اِرْجِعْ إِلَيْنَا غَدًا فَيُبَيِّتُهُمْ اللهُ وَيَضَعُ الْعَلَمَ وَيَمْسَخُ آخَرِيْنَ قِرَدَةً وَخَنَازِيْرَ إِلى يَوْمِ الْقِيَامَةِ”. رَوَاهُ الْبُخَارِيُّ.

وَفِيْ بَعْضِ نُسَخِ  الْمَصَابِيْحِ: “اَلْحِرَ” بِالْحَاءِ وَالرَّاءِ اَلْمُهْمَلَتَيْنِ وَهُوَ تَصْحِيْفٌ وَإِنَّمَا هُوَ بِالْخَاءِ وَالزَّايِ الْمُعْجَمَتَيْنِ نَصَّ عَلَيْهِ الْحُمَيْدِيُّ وَابْنُ الْأَثِيْرِ فِيْ هَذَا الْحَدِيْثِ. وَفِيْ كِتَابِ “الْحُمَيْدِيِّ” عَنْ اَلْبُخَارِيِّ وَكَذَا فِيْ “شَرْحِهِ لِلْخَطَّابِيِّ”: “تَرُوْحُ سَارِحَةٌ لَهُمْ يَأْتِيْهِمْ لِحَاجَةٍ”.

5343. (5) [3/1467 దృఢం]

అబూ ‘ఆమిర్‌, అబూ మాలిక్‌ అష్‌’అరీ (ర)ల కథనం: ప్రవక్త (స) ఇలా ప్రవచిస్తూ ఉండగా మేము విన్నాము. ”నా అనుచర సమాజంలోని కొందరు పట్టు వస్త్రాలను,  సారాయిని, ఆటపాటలను ధర్మ సమ్మతంగా భావిస్తారు. వీరిలో కొందరు పెద్దపెద్ద కొండల నీడల్లో నివసిస్తారు. ప్రజలందరూ వారివద్దకు వస్తూపోతూ ఉంటారు. వీరు చాలాధనవంతులై ఉంటారు. వారి పశువులు మేతకు పచ్చిక బయళ్ళ లోనికి వెళతాయి. మేసిన తర్వాత సాయంత్రం తిరిగి వచ్చినపుడు ఒక అగత్యపరుడు అతని వద్దకు వస్తాడు. వారు హేళనగా అతనితో, ‘ఇప్పుడు, వెళ్ళి రేపు రా’ అని అంటారు. అతడు వెళ్ళిపోతాడు. ఎందుకంటే వారి హృదయాల్లో దురుద్దేశం ఉంటుంది. రాత్రికి రాత్రే అల్లాహ్‌ (త) శిక్షను వారిపై అవతరింపజేస్తాడు. కొండను వారిపై పడవేసి వారిని నాశనం చేస్తాడు. ఇతరులను కోతులుగా, పందులుగా మార్చివేస్తాడు. తీర్పుదినం వరకు వారు ఆ రూపంలోనే  ఉంటారు.”  (బు’ఖారీ)

5344 – [ 6 ] ( متفق عليه ) (3/1468)

وَعَنِ ابْنِ عُمَرَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِذَا أَنْزَلَ اللهُ بِقَوْمٍ عَذَابًا أَصَابَ الْعَذَابُ مَنْ كَانَ فِيْهِمْ ثُمَّ بُعِثُوْاعَلَى أَعْمَالِهِمْ”.

5344. (6) [3/1468 ఏకీభవితం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘ఉమర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”అల్లాహ్‌ ఏదైనా జాతిపై దైవశిక్ష అవతరింపజేస్తే అందరినీ నాశనం చేయడం జరుగు తుంది. అయితే తమ కర్మల ప్రకారం మళ్ళీ సజీవ పరచటం  జరుగుతుంది.”  [69]  (బు’ఖారీ, ముస్లిమ్‌)

5345 – [ 7 ] ( صحيح ) (3/1468)

وَعَنْ جَابِرٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “يُبْعَثُ كُلُّ عَبْدٍ عَلَى مَا مَاتَ عَلَيْهِ”. رَوَاهُ مُسْلِمٌ.

5345. (7) [3/1468దృఢం]

జాబిర్‌ బిన్‌ ‘అబ్దుల్లాహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”తీర్పుదినం నాడు ప్రతి వ్యక్తి ఎటువంటి ఆచరణాపరంగా మరణిస్తే ఆస్థి తిలోనే  లేపబడతాడు.”[70] (ముస్లిమ్‌)

—–

اَلْفَصْلُ الثَّانِيْ   రెండవ విభాగం 

5346 – [ 8 ] ( لم تتم دراسته ) (3/1469)

عَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَا رَأَيْتُ مِثْلَ النَّارِنَامَ هَارِبُهَا وَلَا مِثْلَ الْجَنَّةِ نَامَ طَالِبُهَا”. رَوَاهُ التِّرْمِذِيُّ

5346. (8) [3/1469  అపరిశోధితం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”నరకంలాంటి ప్రమాదకరమైనది నేను చూడలేదు, కాని దాన్నుండి పారిపోయేవాడు పడుకున్నాడు, అదేవిధంగా స్వర్గంలాంటి సుఖవంతమైనదాన్ని నేను చూడలేదు. కాని దాన్ని కోరుకునే వ్యక్తి కూడా పడుకున్నాడు.”   [71] (తిర్మిజి’)

5347 – [ 9 ] ( لم تتم دراسته ) (3/1469)

وَعَنْ أَبِيْ ذَرٍّ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِنِّيْ أَرَى مَا لَا تَرَوْنَ وَأَسْمَعُ مَا لَا تَسْمَعُوْنَ أَطَّتِ السَّمَاءُ وَحُقَّ لَهَا أَنْ تَئِطَّ وَالَّذِيْ نَفْسِيْ بِيَدِهِ مَا فِيْهَا مَوْضِعُ أَرْبَعَةِ أَصَابِعَ إِلَّا وَمَلَكٌ وَاضِعٌ جَبْهَتَهُ سَاجِدُ لِلّهِ وَاللهِ لَوْ تَعْلَمُوْنَ مَا أَعْلَمُ لَضَحِكْتُمْ قَلِيْلًا وَلَبَكَيْتُمْ كَثِيْرًا وَمَا تَلَذَّذْتُمْ بِالنِّسَاءِ عَلَى الْفُرُشَاتِ وَلَخَرَجْتُمْ إِلى الصُّعُدَاتِ تَجْأَرُوْنَ إِلى اللهِ”. قَالَ أَبُوْذَرٍّ: يَا لَيْتَنِيْ كُنْتُ شَجَرَةً تُعْضَدُ. رَوَاهُ أَحْمَدُ وَالتِّرْمِذِيُّ وَابْنُ مَاجَهُ.

5347. (9) [3/1469  అపరిశోధితం]

అబూ జ’ర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”నేను చూస్తున్నది మీరు చూడలేరు. అదేవిధంగా నేను వింటున్నది మీరు వినలేరు. ఆకాశం కేకలు, హాహా కారాలు చేస్తుంది. దైవభీతి వల్ల అది అలా చేయడం సబబే. ఎవరి చేతిలో నా ప్రాణం ఉందో ఆయన సాక్షి! దైవదూతలు సజ్దాలు (సాష్టాంగాలు) చేయని స్ధలం  ఆకాశంలో ఎక్కడా లేదు. అంటే దైవదూతలందరూ సజ్దాలో ఉన్నారు. ఎక్కడా 4 అంగుళాల స్థలం అయినా ఖాళీగా లేదు. అల్లాహ్ సాక్షి! దాన్ని మీరు తెలుసుకుంటే చాలా తక్కువగా నవ్వుతారు. చాలా ఎక్కువగా ఏడుస్తారు. ఇంకా మీ స్త్రీలతో సంభోగం కూడా చేయలేరు. మీరు అడవుల వైపు బయలుదేరి దైవాన్ని ప్రార్థిస్తూ, ఏడుస్తూ భయభక్తులతో మొరపెట్టు కుంటారు.

అబూ జ’ర్‌ (ర) ”ఈ ‘హదీసు’ను పేర్కొన్న తరువాత నేను అడవిలో చెట్టునై ఉంటే ఎంత బాగుణ్ణు, నరికివేయ బడతాను, నాకు విచారణే  ఉండదు. నరక భయం కూడా ఉండదు,” అని అన్నారు. (అ’హ్మద్‌, తిర్మిజి’, ఇబ్నె  మాజహ్)

5348 – [ 10 ] ( لم تتم دراسته ) (3/1469)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَنْ خَافَ أَدْلَجَ وَمَنْ أَدْلَجَ بَلَغَ الْمَنْزِلَ. أَلَا أَنْ سِلْعَةَ اللهِ غَالِيَةٌ أَلَا إِنَّ سِلْعَةَ اللهِ الْجَنَّةُ”. رَوَاهُ التِّرْمِذِيُّ.

5348. (10) [3/1469అపరిశోధితం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”శత్రువుల భయం ఉన్నవాడు, దోపిడీ భయం ఉన్న వాడు రాత్రి మొదటి భాగంలోనే పారిపోవటానికి ప్రయత్నిస్తాడు. ఇటువంటి సందర్భాల్లో ముందు జాగ్రత్తగా పారిపోయేవాడు తన గమ్యాన్ని చేరు కుంటాడు. మీరు జాగ్రత్తగా ఉండండి! అల్లాహ్‌ (త) అనుగ్రహాలు చాలా విలువైనవి. అల్లాహ్‌ (త) అను గ్రహాలు స్వర్గంలో ఉన్నాయి.”  [72]   (తిర్మిజి’)

5349 – [ 11 ] ( لم تتم دراسته ) (3/1469)

وَعَنْ أَنَسٍ عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ: “يَقُوْلُ اللهُ جَلَّ ذِكْرُهُ: “أَخْرِجُوْا مِنَ النَّارِمِنَ ذَكَرَنِيْ يَوْمًا أَوْ خَافَنِيْ فِيْ مَقَامٍ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَالْبَيْهَقِيُّ فِيْ “كِتَابِ الْبَعْثِ وَالنُّشُوْرِ”

5349. (11) [3/1469  అపరిశోధితం]

అనస్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”తీర్పు దినం నాడు అల్లాహ్‌(త) ప్రపంచంలో నన్ను స్మరించే వారిని, నాకు భయపడేవారిని నరకం నుండి తీసివేయండి” అని ఆదేశిస్తాడు. (తిర్మిజి’, బైహఖీ- / బ’అసి’ వన్నషూర్)

5350 – [ 12 ] ( لم تتم دراسته ) (3/1469)

وَعَنْ عَائِشَةَ قَالَتْ: سَأَلْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم عَنْ هَذِهِ الْآيَةِ: (وَالَّذِيْنَ يُؤْتُوْنَ مَا أتُوْا وَقُلُوْبُهُمْ وَجِلَةٌأنَّهُم إِلى ربِّهِمرَجِعُون؛ 23:60) أَهُمُ الَّذِيْنَ يَشْرَبُوْنَ الْخَمْرَوَيَسْرِقُوْنَ؟ قَالَ: “لَا يَا بِنتَ الصِّدِّيْقِ وَلَكِنَّهُمُ الَّذِيْنَ يَصُوْمُوْنَ وَيُصَلُّوْنَ وَيَتَصَدَّقُوْنَ وَهُمْ يَخَافُوْنَ أَنْ لَا يُقْبَلَ مِنْهُمْ أُولئِكَ الَّذِيْنَ يُسَارِعُوْنَ فِي الْخَيْرَاتِ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَابْنُ مَاجَهُ.

5350. (12) [3/1469  అపరిశోధితం]

‘ఆయి’షహ్‌ (ర) కథనం: నేను ప్రవక్త (స)ను ఈ ఆయతు, మరియు ఎవరైతే, తాము ఇవ్వవలసినది (జకాత్) ఇచ్చేటప్పుడు, నిశ్చయంగా, వారు తమ ప్రభువువైపుకు మరలి పోవలసి ఉన్నదనే భయాన్ని తమ హృదయాలలో ఉంచుకొని ఇస్తారో;” (అల్-ముఅ’మిన్, 23:60) – అంటే మత్తుపానీయాలు సేవిస్తూ, దొంగతనాలు చేస్తూఉంటారా?’ అని అడిగాను. దానికి ప్రవక్త (స), ” ‘సిద్దీఖ్ కూతురా! ఇది కాదు. ఉపవాసాలు ఉండేవారు, నమా’జు ఆచరించే వారు, అమితంగా దానధర్మాలు చేసేవారు, అయి నప్పటికీ వారు దైవానికి భయపడుతూ ఉంటారు. ఇటు వంటి వారు సత్కార్యాల్లో చాలా త్వరగా పాల్గొంటారు.” (తిర్మిజి’, ఇబ్నె మాజహ్)

5351 – [ 13 ] ( لم تتم دراسته ) (3/1470)

وَعَنْ أُبَيِّ بْنَ كَعْبٍ قَالَ: كَانَ النَّبِيُّ صلى الله عليه وسلم إِذَا ذَهَبَ ثُلُثَا اللَّيْلِ قَامَ فَقَالَ: “يَا أَيُّهَا النَّاسُ اذْكُرُوْا اللهَ اُذْكُرُوْا اللهَ جَاءَتِ الرَّاجِفَةُ تَتْبَعُهَا الرَّادِفَةُ جَاءَ الْمَوْتُ بِمَا فِيْهِ جَاءَ الْمَوْتُ بِمَا فِيْهِ”. رَوَاهُ التِّرْمِذِيُّ.  

5351. (13) [3/1470అపరిశోధితం]

ఉబయ్‌ బిన్‌క’అబ్‌(ర) కథనం: రాత్రి రెండు జాములు గడచిన తర్వాత మేల్కొని లేచి ప్రవక్త (స), ‘ప్రజలారా!  అల్లాహ్(త)ను స్మరించండి. అల్లాహ్(త) ధ్యానం చేయండి. ప్రజలారా! అల్లాహ్(త)ను స్మరించండి. భూకంపం వచ్చేసింది, దాని వెనుక రాబోయేది కూడా వచ్చేస్తుంది,’  అని  అన్నారు. అంటే మరణం.  (తిర్మిజి’)

5352 – [ 14 ] ( لم تتم دراسته ) (3/1470)

وَعَنْ أَبِيْ سَعِيْدٍ قَالَ: خَرَجَ النَّبِيُّ صلى الله عليه وسلم لِصَلَاةٍ فَرَأَى النَّاسَ كَأَنَّهُمْ يَكْتَشِرُوْنَ قَالَ: “أَمَا إِنَّكُمْ لَوْ أَكْثَرْتُمْ ذِكْرَ هَادِمِ اللَّذَّاتِ لَشَغَلَكُمْ عَمَّا أَرَى الْمَوْتُ فَأَكْثِرُوْا ذِكْرَ هَادِمِ اللَّذَّاتِ الْمَوْتِ فَإِنَّهُ لَا يَأْتِ عَلَى الْقَبْرِ يَوْمٌ إِلَّا تَكَلَّمَ فَيَقُوْلُ: أَنَا بَيْتُ الْغُرْبَةِ وَأَنَا بَيْتُ الْوَحْدَةِ وَأَنَا بَيْتُ التُّرَابِ وَأَنَا بَيْتُ الدُّوْدِ. وَإِذَا دُفِنَ الْعَبْدُ الْمُؤْمِنُ. قَالَ لَهُ الْقَبْرُ: مَرْحَبًا وَأَهْلًا أَمَا إِنْ كُنْتَ لَأَحَبَّ مَنْ يَمْشِيْ عَلَى ظَهْرِيْ إِلَيَّ فَإِذْ وُلَيْتُكَ الْيَوْمَ وَصِرْتَ إِلَيَّ فَسَتَرَى صَنِيْعِيْ بِكَ”. قَالَ: “فَيَتَّسِعُ لَهُ مَدَّ بَصَرِهِ وَيُفْتَحُ لَهُ بَابٌ إِلى الْجَنَّةِ وَإِذَا دُفِنُ الْعَبْدُ الْفَاجِرُ أَوِ الْكَافِرُ قَالَ لَهُ الْقَبْرُ: لَا مَرْحَبًا وَلَا أَهْلًا أَمَا إِنْ كُنْتَ لَأَبْغَضَ مَنْ يَمْشِيْ عَلَى ظَهْرِيْ إِلَيَّ فَإِذْ وُلِّيتُكَ الْيَوْمَ وَصِرْتَ إِلَيَّ فَسَتَرَى صَنِيْعِيْ بِكَ”. قَالَ: “فَيَلْتَئِمُ عَلَيْهِ حَتَّى يَخْتَلِفَ أَضْلَاعُهُ”. قَالَ: وَقَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم بِأَصَابِعِهِ. فَأَدْخَلَ بَعْضَهَا فِيْ جَوْفِ بَعْضٍ. قَالَ: “وَيُقَيَّضُ لَهُ سَبْعُوْنَ تِنِّيْنًا لَوْ أَنَّ وَاحِدًا مِنْهَا نَفَخَ فِي الْأَرْضِ مَا أَنْبَتَتْ شَيْئًا مَا بَقِيَتِ الدُّنْيَا فَيَنْهَسْنَهُ وَيَخْدِشْنَهُ حَتَّى يُفْضَى بِهِ إِلَى الْحِسَابِ”. قَالَ: وَقَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِنَّمَا الْقَبْرُ رَوْضَةٌ مِنْ رِيَاضِ الْجَنَّةِ أَوْ حُفْرَةٌ مِنْ حُفَرِ النَّارِ”. رَوَاهُ التِّرْمِذِيُّ.

5352. (14) [3/1470  అపరిశోధితం]

అబూ స’యీద్‌ (ర) కథనం: ప్రవక్త (స) నమా’జు కోసం బయటకు వచ్చారు. ప్రజలు నవ్వుతూ ఉండటం చూసారు. అప్పుడు ప్రవక్త(స), ”ఒకవేళ మీరు రుచులను మరపింపజేసే దాన్ని గుర్తుచేసు కుంటూ ఉంటే ఈ నవ్వటాన్ని మరచిపోతారు – అంటే మరణం, రుచులను మరపింపజేస్తుంది. ప్రతిరోజు సమాధి నేను చాలా దరిద్రపు గృహాన్ని, నేను ఏకాంత నివాసాన్ని, మట్టి ఇల్లును, నేను పురుగుల, కీటకాల నివాసాన్ని. నాలోనికి వచ్చే ప్రతివాడు ఒంటరిగా వస్తాడు. మట్టి లోనికి వచ్చి క్రుళ్ళి క్రుశించి పోతాడు. చీమలు, పురుగులు అతన్ని తినివేస్తాయి. విశ్వాసిని సమాధిలో దించిన తరువాత, సమాధి విశ్వాసితో, ‘నీ రావటం శుభమగుగాక, నీవు ఇక్కడ నివసించడం శుభమగు గాక. నువ్వు విశాలమైన, సుఖాల మయమైనచోటుకు వచ్చావు, నీవు నీ ఇంటికి వచ్చావు. నాపై నడిచే ప్రజలందరిలో కెల్లా నీవు నాకు అత్యంత ప్రియుడవు. ఈనాడు నీపై నేను సంరక్షకురాలిగా, అధికారిగా నియమించబడ్డాను. నీవు నిస్సహాయుడవై నావద్దకు వచ్చావు. ఈనాడు నేను నీపట్ల మంచిగా ప్రవర్తిస్తాను. సుఖవిలాసాలను అందిస్తాను. నీవు నీ కళ్ళతో చూస్తే సమాధి అక్కడ వరకు విశాలంగా తయారవుతుంది’ అని అంటుంది. అతనికోసం స్వర్గద్వారాలు తెరువ బడతాయి. అదేవిధంగా పాపాత్ముడు, దుర్మార్గుడు ఖననం చేయబడితే, సమాధి అతనితో, ‘నీ రావటం నాశనంగాను, నీ నివాసం పాడుగాను. ప్రపంచంలో అందరికంటే నీచుడవు నీవే. నేను ఈనాడు నీపై అధికారిగా సంరక్షకుడిగా నియమించబడ్డాను. నేను నీపట్ల ఎలా ప్రవర్తిస్తానో నీవే చూస్తావు. ఆ సమాధి అతని పట్ల ఇరుకుగా అయిపోతుంది, కలిసిపోతుంది. చివరికి అతని ప్రక్కటెముకలు అటువి ఇటు, ఇటువి అటు అయిపోతాయి. ఒకదాంట్లో ఒకటి దూరి పోతాయి.” ప్రవక్త (స) తన చేతి వ్రేళ్ళతో సైగచేసి అంటే తన రెండు అరచేతులను ఒకదానిలో ఒకటి కలిపి చూపించారు. ”అతనిపై 70 విషసర్పాలు నియమించబడతాయి. వాటిలో ఒకటి కూడా భూమిపై కాటువేస్తే ప్రళయం వరకు ఎటువంటి పంటలు పండవు. ఆ విషసర్పాలు అతన్ని కాటు వేస్తూ అతన్ని హింసిస్తూ ఉంటాయి. చివరికి అతన్ని తీర్పుదినం నాడు అల్లాహ్‌ ముందు సమర్పించడం జరుగుతుంది. అదేవిధంగా సమాధి స్వర్గం తోటల్లోని ఒకతోట, నరకం గొయ్యిల్లోని ఒక గొయ్యి.”  (తిర్మిజి’)

ఈ ‘హదీసు’ ద్వారా తెలిసిన విషయం ఏమిటంటే సత్కార్యాలు చేసేవారికి అల్లాహ్‌(త) ప్రతిఫలం ప్రసాదిస్తాడు. పాపాలు చేసేవారిని కఠినంగా శిక్షిస్తాడు.

5353 – [ 15 ] ( لم تتم دراسته ) (3/1471)

وَعَنْ أَبِيْ جُحَيْفَةَ قَالَ: قَالُوْا: يَا رَسُوْلَ اللهِ قَدْ شِبْتَ. قَالَ: “شَيَّبَتْنِيْ سُوْرَةُ هُوْدٍ وَأَخَوَاتُهَا”. رَوَاهُ التِّرْمِذِيُّ.  

5353. (15) [3/1471  అపరిశోధితం]

అబూ జు’హైఫహ్ (ర) కథనం: ప్రవక్త (స)ను ప్రజలు, ‘ఓ ప్రవక్తా! తమరు ముసలితనానికి చేరుకున్నారు. తమరి తల వెంట్రుకలు గడ్డం వెంట్రుకలు తెల్లబడి పోయాయి,’ అని అన్నారు. దానికి ప్రవక్త (స), ‘సూరహ్‌ హూద్‌ (11) మరియు అటువంటి సూరాహ్లు  నన్ను ముసలివాణ్ణి చేసివేసాయి. వీటిలో ప్రళయ సంఘటనలు, దృశ్యాలు పేర్కొనడం జరిగింది,’ అని అన్నారు. (తిర్మిజి’)

5354 – [ 16 ] ( لم تتم دراسته ) (3/1471)

وَعَنِ ابْنِ عَبَّاسٍ قَالَ: قَالَ أَبُوْبَكْرٍ: يَا رَسُوْلَ اللهِ قَدْ شِبْتَ. قَالَ: شَيَّبَتْنِيْ (هُوْدٌ) وَ(الواقِعَةُ)و(الْمُرْسَلَاتُ) وَ (عَمَّ يَتَسَاءَلُوْنَ) وَ (إِذَا الشَّمْسُ كُوِّرَتْ).  رَوَاهُ التِّرْمِذِيُّ وَذُكِرَ حَدِيْثُ أَبِيْ هُرَيْرَةَ: لَا يَلِجُ النَّارَ “فِيْ”كِتَابِ الْجِهَادِ”.

5354. (16) [3/1471అపరిశోధితం]

ఇబ్నె ‘అబ్బాస్‌ (ర) కథనం: అబూ బకర్‌ (ర), ‘ఓ ప్రవక్తా! తమరు ముసలివారై పోయారు,’ అని అన్నారు. దానికి ప్రవక్త (స), ‘సూరహ్‌ హూద్‌ (11), సూరహ్‌ అల్ వాఖి’అహ్‌ (56), సూరహ్‌ ముర్‌సలాత్‌ (77), సూరహ్‌ ‘అమ్మ యతసా అ’లూన్‌ (78), సూరహ్‌ వ ఇజష్షమ్‌సు కువ్విరత్‌ (81)లు నన్ను ముసలివాణ్ని చేసివేసాయి. ఎందుకంటే ఈ సూరహ్లలో ప్రళయ సంఘటనలు పేర్కొనబడ్డాయి.  (తిర్మిజి’)

—–

اَلْفَصْلُ الثَّالِثُ   మూడవ విభాగం 

5355 – [ 17 ] ( صحيح ) (3/1471)

عَنْ أَنَسٍ قَالَ: إِنَّكُمْ لَتَعْمَلُوْنَ أَعْمَالًا هِيَ أَدَقُّ فِيْ أَعْيُنِكُمْ مِنَ الشَّعْرِ كُنَّا نَعُدُّهَا عَلَى عَهْدِ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم مِنَ الْمُوْبِقَاتِ. يَعْنِي الْمُهْلِكَاتِ. رَوَاهُ الْبُخَارِيُّ.

5355. (17) [3/1471 దృఢం]

అనస్‌ (ర) కథనం: మీరు పాపాలు చేసి వాటిని చాలా చిన్నవిగా భావిస్తున్నారు. మేము ప్రవక్త (స) కాలంలో వినాశ కారులుగా భావించేవాళ్ళం. (బు’ఖారీ)

అంటే చిన్న చిన్న పాపాలను తేలిగ్గా తీసుకోరాదు. అవి పెరుగుతూ మహా పాపాలుగా తయారవుతాయి.

5356 – [ 18 ] ( لم تتم دراسته ) (3/1471)

وَعَنْ عَائِشَةَ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم قَالَ: “يَا عَائِشَةَ إِيَّاكِ وَمُحَقِّرَاتِ الذُّنُوْبِ فَإِنَّ لَهَا مِنَ اللهِ طَالِبًا”. رَوَاهُ ابْنُ مَاجَهُ وَالدَّارَمِيُّ وَالْبَيْهَقِيُّ فِيْ “شُعَبِ الْإِيْمَانِ”

5356. (18) [3/1471  అపరిశోధితం]

‘ఆయి’షహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఓ ‘ఆయి’షహ్‌! చిన్న పాపాలకు దూరంగా ఉండు. ఎందు కంటే అల్లాహ్‌ (త) దూతలు ఎల్లప్పుడూ వ్రాయటానికి సిద్ధంగా ఉంటారు. వాటిని వ్రాస్తూ ఉంటారు.” (ఇబ్నె మాజహ్, దార్మీ, బైహఖీ -షు’అబిల్ ఈమాన్)

5357 – [ 19 ] ( صحيح ) (3/1471)

وَعَنْ أَبِيْ بُرْدَةَ بْنِ أَبِيْ مُوْسَى قَالَ: قَالَ لِيْ عَبْدُ اللهِ بْنِ عُمَرَ: هَلْ تَدْرِيْ مَا قَالَ أَبِيْ لِأَبِيْكَ؟ قَالَ: قُلْتُ: لَا. قَالَ: فَإِنَّ أَبِيْ قَالَ لِأَبِيْكَ: يَا أَبَا مُوْسَى هَلْ يَسُرُّكَ أَنْ إِسْلَامَنَا مَعَ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم وَهِجْرَتَنَا مَعَهُ وَجِهَادَنَا مَعَهُ وَعَمَلَنَا كُلَّهُ مَعَهُ بَرَدَ لَنَا؟ وَأَنَّ كُلَّ عَمَلٍ عَمِلْنَاهُ بَعْدَهُ نَجُوْنَا مِنْهُ كَفَافًا رَأْسًا بِرَأْسِ؟ فَقَالَ أَبُوْكَ: لِأَبِيْ: لَا وَاللهِ قَدْ جَاهَدْنَا بَعْدَ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم وَصَلَّيْنَا وَصُمْنَا وَعَمِلْنَا خَيْرًا كَثِيْرًا. وَأَسَلْمَ عَلَى أَيْدِيْنَا بَشْرٌ كَثِيْرٌ وَإِنَّا لَنَرْجُوْ ذَلِكَ. قَالَ أَبِيْ: وَلَكِنِّيْ أَنَا وَالَّذِيْ نَفْسُ عُمَرَ بِيَدِهِ لَوَدِدْتُ أَنَّ ذَلِكَ بَرَدَ لَنَا وَأَنَّ كُلَّ شَيْءٍ عَمِلْنَاهُ بَعْدَهُ نَجَوْنَا مِنْهُ كَفَافًا رَأْسًا بِرَأْسٍ. فَقُلْتُ: إِنَّ أَبَاكَ وَاللهِ كَانَ خَيْرًا مِنْ أَبِيْ. رَوَاهُ الْبُخَارِيُّ.

5357. (19) [3/1471దృఢం]

అబూ బుర్‌దహ్ బిన్‌ అబీ మూసా (ర) కథనం: ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘ఉమర్‌ (ర) నాతో, ‘నా తండ్రిగారు, నీ తండ్రి గారితో ఏమన్నారో నీకు తెలుసా?’ అని అడిగారు. దానికి నేను ‘లేదు’ అని అన్నాను. అప్పుడతను, ”నా తండ్రి ‘ఉమర్‌ (ర) నీ తండ్రి అబూ మూసాతో, ‘ఓ అబూ మూసా! ప్రవక్త (స) వద్ద మనం ఇస్లామ్‌ స్వీకరించటం, ప్రవక్త (స) వెంట వలస పోవటం, ప్రవక్త (స) వెంట పోరాడటం ఇంకా ఇతర విషయాలు మనకు లాభం చేకూర్చేవే. అయితే ఆ తరువాత మనం చేసే పనులకు ఒకవేళ సరిసమానంగా సాఫల్యం పొందితే, అంటే పుణ్యాలు, పాపాలు సమానమై శిక్ష నుండి తప్పించుకుంటే ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం అవుతుంది,’ ” అని అన్నారు. – అంటే ‘ఉమర్‌ (ర) మాటకు అర్థం ఏమిటంటే ప్రవక్త (స) కాలంలో మనం చేసిన సత్కార్యాలకు తప్పకుండా మనకు ప్రతిఫలం లభిస్తుంది. ప్రవక్త  మరణానంతరం చేసిన సత్కార్యాలకు సరిసమానంగా అంటే ప్రతిఫలం వద్దు, శిక్షపడకుండా ఉంటే చాలు.’ –  అప్పుడు మీ తండ్రి అబూ మూసా నా తండ్రి, ‘ఉమర్‌తో, ”అలాకాదు అల్లాహ్ సాక్షి మనం ప్రవక్త (స) తర్వాత కూడా పోరాటాలు చేసాము. అనేక నమా’జులు చదివాము. అనేక రోజులు ఉపవాసాలు ఉన్నాం. అనేక సత్కార్యాలు చేసాం, ఇంకా మన చేతులపై అనేకమంది ఇస్లామ్‌ స్వీకరించారు. ఈ సత్కార్యా లన్నిటికీ మనకు పుణ్యం లభిస్తుందని ఆశిద్దాం,” అని అన్నారు. అప్పుడు నా తండ్రి ఉమర్‌ (ర), ”ప్రవక్త (స) కాలంలో చేసిన సత్కార్యాలకు తగిన పుణ్యం మనకు లభిస్తుంది. ఆ తరువాత చేసినవి కలిపి సరిసమానం అయిపోతే అదే మాకు పదివేలు.” ఈ ఇద్దరిలో ఎవరి అభిప్రాయం మంచిది, దానికి నేను మీ తండ్రి ‘ఉమర్‌ (ర) నా తండ్రి అబూ మూసా (ర) కంటే ఉత్తములు. అంటే ‘ఉమర్‌ (ర) అభిప్రాయమే ఉత్తమమైనది.  (బు’ఖారీ)

అంటే ‘ఉమర్‌ (ర)లో దైవభీతి అధికంగా ఉండేది. అందువల్లే  అలా  అన్నారు.

5358 – [ 20 ] و ( لم تتم دراسته ) (3/1472)

عَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “أَمَرَنِيْ رَبِّيْ بِتِسْعٍ: خَشْيَةِ اللهِ فِي السِّرِّوَالْعَلَانِيَةِ وَكَلِمَةِ الْعَدْلِ فِي الْغَضَبِ وَ الرّضَى وَالْقَصْدِ فِي الْفَقْرِوَالْغِنَى وَأَنْ أَصِلَ مَنْ قَطَعَنِيْ وَأُعْطِيْ مَنْ حَرَمَنِيْ وَأَعْفُوَ عَمَّنْ ظَلَمَنِيْ وَأَنْ يَكُوْنَ صَمْتِيْ فِكْرًا وَنُطْقِيْ ذِكْرًا وَ نَظْرِيْ عِبْرَةً وَآمُرَبِالْعُرْفِ”. وَقِيْلَ: “بَالْمَعْرُوْفِ” . رَوَاهُ رَزِيْنٌ

5358. (20) [3/1472  –అపరిశోధితం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) నన్ను 9 విషయాలను గురించి ఆదేశించారు: 1. ప్రజలతో కలసి ఉన్నా, ఏకాంతంలో ఉన్నా దైవానికే భయ పడాలి. 2. కోపంలోనూ, సంతోషంలోనూ న్యాయమైన పలుకులనే పలకాలి. 3. దారిద్య్రంలోనూ, ధనసంప దల్లోనూ మధ్యే మార్గాన్ని అనుసరించాలి. 4. బంధు త్వాన్ని త్రెంచే బంధువులతో ఉత్తమంగా వ్యవహ రించాలి. 5. ఇవ్వని వారికి ఇవ్వాలి. 6. దుర్మార్గుని దుర్మార్గాన్ని క్షమించాలి. 7. మౌనంలో చింతన చేయాలి. 8. మాట్లాడేటప్పుడు అల్లాహ్ ధ్యానం చేయాలి. 9. నీ చూపుకూడా లాభకరమైనదిగా ఉండాలి, సత్కార్యాల గురించి  ఆదేశిస్తూ  ఉండాలి. (ర’జీన్‌)

5359 – [ 21 ] ( لم تتم دراسته ) (3/1472)

وَعَنْ عَبْدِ اللهِ بْنِ مَسْعُوْدٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَا مِنْ عَبْدٍ مُؤْمِنٍ يَخْرُجُ مِنْ عَيْنَيْهِ دُمُوْعٌ وَإِنْ كَانَ مِثْلَ رَأْسِ الذُّبَابِ مِنْ خَشْيَةِ اللهِ ثُمَّ يُصِيْبُ شَيْئًا مِنْ حُرِّ وَجْهِهِ إِلَّا حَرَّمَهُ اللهُ عَلَى النَّارِ”. رَوَاهُ ابْنُ مَاجَهُ  

5359. (21) [3/1472 అపరిశోధితం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ మస్‌’ఊద్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”దైవభీతి వల్ల ఒక్కచుక్క కన్నీరు రాలినా అల్లాహ్‌ (త) అతనిపై నరకాన్ని నిషిద్ధం చేస్తాడు.” (ఇబ్నె మాజహ్)

అంటే చిత్తశుద్ధితో, దైవభీతివల్ల కన్నీటి ఒక్కచుక్క రాలిన వ్యక్తి స్వర్గంలోనికి ప్రవేశిస్తాడు. అంటే నరకంలోనికి ప్రవేశించడు.  

=====

7 بَابُ تَغَيُّرِ النَّاسِ

7. ప్రజల్లో మార్పులు

ప్రపంచంలో ప్రతిరోజు మార్పులు, చేర్పులు జరుగుతూ ఉంటాయి. ఒక్కోసారి చల్లగా ఉంటుంది. ఒక్కోసారి వేడిగా ఉంటుంది, ఒక్కోసారి సుఖంగా ఉంటుంది. ఒక్కోసారి కష్టంగా ఉంటుంది. ఒక్కోసారి వర్షం, ఒక్కోసారి పచ్చగా, ఒక్కోసారి ఎండుగా, ఒక్కోసారి ధనసంపదలు, దారిద్య్రం వస్తూ-పోతూ ఉంటాయి. అయితే ఇవన్నీ కొన్ని కారణాల వల్ల జరుగుతూ ఉంటాయి.

అల్లాహ్‌ ఆదేశం: ”…నిశ్చయంగా, ఒక జాతివారు తమస్థితిని తాము మార్చుకోనంత వరకు, అల్లాహ్‌ వారి స్థితిని మార్చడు…” (హూద్, 13:11)

ప్రవక్త (స) కాలంలో ముస్లిముల పరిస్థితి చాలా బాగుండేది. కాని ప్రవక్త (స) మరణానంతరం ముస్లిముల పరిస్థితి మారిపోయింది. తీర్పుదినం వరకు అన్నీ మారుతూ ఉంటాయి. చివరికి 100 ముస్లిముల్లో ఒక్కరైనా సరైన ముస్లిమ్‌ ఉండరు. క్రింది ‘హదీసు’లను అధ్యయనం చేయండి.

اَلْفَصْلُ الْأَوَّلُ   మొదటి విభాగం 

5360 – [ 1 ] ( متفق عليه ) (3/1473)

عَنِ ابْنِ عُمَرَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِنَّمَا النَّاسُ كَالْإِبِلِ الْمِائَةِ لَا تَكَادُ تَجِدُ فِيْهَا رَاحِلَةً”. مُتَّفَقٌ عَلَيْهِ.

5360. (1) [3/1473 ఏకీభవితం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌’ఉమర్‌ (ర)కథనం: ప్రవక్త(స) ప్రవచనం, ”ప్రజలు 100 ఒంటెల్లో ఒక్కటికూడా ప్రయాణానికి పనికిరానిదిగా ఉన్నారు.[73] (బు’ఖారీ, ముస్లిమ్‌)

5361 – [ 2 ] ( متفق عليه ) (3/1473)

وَعَنْ أَبِيْ سَعِيْدٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَتَتَّبِعُنَّ سُنَنَ مَنْ قَبْلَكُمْ شِبْرًا بِشِبْرٍوَذِرَاعًا بِذِرَاعٍ حَتّى لَوْ دَخَلُوْا جُحْرَضَبٍّ تَبِعْتُمُوْهُمْ”. قِيْلَ: يَا رَسُوْلَ اللهِ اَلْيَهُوْدَ وَالنَّصَارَى؟ قَالَ: “فَمَنْ”. مُتَّفَقٌ عَلَيْهِ.

5361. (2) [3/1473ఏకీభవితం]

అబూ స’యీద్‌ ‘ఖుద్రీ (ర) కథనం: ప్రవక్త (స), ”మీరు మీ పూర్వీకుల అడుగు జాడలపై నడుస్తారు.  ఒకవేళ వారు ఉడుము కన్నంలోప్రవేశిస్తే, మీరు కూడా దానిలోకి ప్రవేశిస్తారు,” అని అన్నారు. దానికి ప్రజలు పూర్వీకు లంటే ఎవరు? అని ప్రశ్నించారు. దానికి ప్రవక్త (స), ‘యూదులు, క్రైస్తవులు,’ అని అన్నారు. ఇంకా ఒకవేళ వారు కాకుంటే మరెవరు? అంటే యూదులు మరియు క్రైస్తవులే. [74](బు’ఖారీ, ముస్లిమ్‌)

5362 – [ 3 ] ( صحيح ) (3/1473)

وَعَنْ مَرْدَاسٍ الْأَسْلَمِيِّ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “يَذْهَبُ الصَّالِحُوْنَ الْأَوَّلُ فَالْأَوَّلُ وَتَبْقَى حُفَالَةٌ كَحُفَالَةٌ الشَّعِيْرِأَوِ التَّمْرِ لَا يُبَالِيْهِمُ اللهُ بَالَةً”. رَوَاهُ الْبُخَارِيُّ.

5362. (3) [3/1473దృఢం]

మర్‌దాస్ అస్లమీ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ముందు మంచివాళ్ళు మరణిస్తారు. చెడ్డవాళ్ళు మిగిలి ఉంటారు. పొట్టు లేదా చెడు ఖర్జూరాలు. అల్లాహ్‌ (త) వారి పట్ల ఏమాత్రం శ్రద్ధ వహించడు. అంటే వారిని ఎవరూ గౌరవించరు.” (బు’ఖారీ)

అంటే పుణ్యాత్ములు మరణిస్తారు. పొట్టు, చెత్త వంటి వారు మిగిలిపోతారు.

—–

اَلْفَصْلُ الثَّانِيْ  రెండవ విభాగం  

5363 – [ 4 ] ( لم تتم دراسته ) (3/1473)

عَنِ ابْنِ عُمَرَقَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِذَا مَشَتْ أُمَّتِيْ الْمُطَيْطِيَاءَ وَخَدَمَتْهُمْ أَبْنَاءُ الْمُلُوْكِ أَبْنَاءُ فَارِسٍ وَالرُّوْمِ سَلَّطَ اللهُ شِرَارَهَاعَلَى خِيَارِهَا”. رَوَاهُ التِّرْمِذِيُّ. وَقَالَ: هَذَاحَدِيْثٌ غَرِيْبٌ.

5363. (4) [3/1473 అపరిశోధితం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘ఉమర్‌ (ర) కథనం: ప్రవక్త (స), నా అనుచర సమాజం గర్వాహంకారాలకు గురయి నప్పుడు, రూమ్‌, ఫారిస్‌కు చెందిన రాజకుమారులు వారి సేవలు చేయటం ప్రారంభించినపుడు అల్లాహ్‌ (త) చెడ్డవారిని మంచివారిపై పాలకులుగా, నాయకులుగా విధించి వదలి వేస్తాడు. [75](తిర్మిజి’  /  ఏకోల్లేఖనం)

5364 – [ 5 ] ( لم تتم دراسته ) (3/1474)

وَعَنْ حُذَيْفَةَ أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم قَالَ: “لَا تَقُوْمُ السَّاعَةُ حَتّى تَقْتُلُوْا إِمَامَكُمْ وَتَجْتَلِدُوْا بِأَسْيَافِكُمْ وَيَرِثَ دُنْيَاكُمْ شِرَارُكُمْ”. رَوَاهُ التِّرْمِذِيُّ.

5364. (5) [3/1474 అపరిశోధితం]

హు’దైఫహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మీరు మీ నాయకుడ్ని చంపేస్థితికి వచ్చేవరకు, మీ కరవాలాలు పరస్పరం హతమార్చటంలో ముందడుగు వేయనంత వరకు ప్రళయం సంభ వించదు. ఇంకా మీరు మీ కరవాలాలతో మిమ్మల్ని మీరు చంపుకుంటారు. అంటే తీర్పు దినానికి ముందు మీరు మీ నాయకులను, చక్రవర్తులను హతమార్చు తారు. అంతర్గత కలహాలు, యుద్ధాలకు పాల్పడి పరస్పరం చంపుకుంటారు. దుర్మార్గులు, అవిధేయులు, పాపాత్ములు పాలకులుగా, అధికారులుగా చెలామణి అవుతారు.[76] (తిర్మిజి’)

5365 – [ 6 ] ( لم تتم دراسته ) (3/1474)

وَعَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَا تَقُوْمُ السَّاعَةُ حَتَّى يَكُوْنُ أَسْعَدَ النَّاسِ بِالدُّنْيَا لُكْعُ بْنُ لُكْعٍ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَالْبَيْهَقِيُّ فِيْ “دَلَائِلِ النُّبُوَّةِ”

5365. (6) [3/1474 అపరిశోధితం]

హు’దైఫహ్ (ర) కథనం: ప్రవక్త(స) ప్రవచనం ”ప్రాపంచిక ధనసంపదల పరంగా బుధ్ధిహీనుడి సంతానం బుధ్ధిహీనుడు అందరికంటే గొప్పవాడు కానంత వరకు ప్రళయం సంభ వించదు.” (తిర్మిజీ’, బైహఖీ-దలాయి’లు న్నుబువ్వహ్)

5366 – [ 7 ] ( لم تتم دراسته ) (3/1474)

وَعَنْ مُحَمَّدِ بْنِ كَعْبِ الْقُرَظِيِّ قَالَ: حَدَّثَنِيْ مَنْ سَمِعَ عَلِيَّ بْنَ أَبِيْ طَالِبٍ قَالَ: إِنَّا لَجُلُوْسٌ مَعَ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم فِي الْمَسْجِدِ فَاطَّلَعَ عَلَيْنَا مُصْعَبُ بْنُ عُمَيْرٍمَا عَلَيْهِ إِلَّا بُرْدَةٌ لَهُ مَرْقُوْعَةٌ بِفَرْوٍ فَلَمَّا رَآهُ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم بَكَى لِلَّذِيْ كَانَ فِيْهِ مِنَ النِّعْمَةِ وَالَّذِيْ هُوَ فِيْهِ الْيَوْمَ. ثُمَّ قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “كَيْفَ بِكُمْ إِذَا غَدَا أَحَدُكُمْ فِيْ حُلَّةٍ وَرَاحَ فِيْ حُلَّةٍ؟ وَوُضِعَتْ بَيْنَ يَدَيْهِ صَحْفَةٌ وَرُفِعَتْ أُخْرَى وَسَتَرْتُمْ بُيُوْتَكُمْ كَمَا تُسْتَرُالْكَعْبَةُ؟” فَقَالُوْا: يَا رَسُوْلَ اللهِ نَحْنُ يَوْمَئِذٍ خَيْرٌمِنَّا الْيَوْمَ نَتَفَرَّغُ لِلْعِبَادَةِ وَنُكْفَى الْمَؤُنَةَ. قَالَ: “لَا أَنْتُمُ الْيَوْمَ خَيْرٌ مِنْكُمْ يَوْمَئِذٍ”. رَوَاهُ التِّرْمِذِيُّ.

5366. (7) [3/1474అపరిశోధితం]

ము’హమ్మద్‌ బిన్‌ క’అబ్‌ అల్-ఖుర”జీ (ర) ‘అలీ (ర) నుండి ఒక వ్యక్తి ద్వారా కథనం: ‘అలీ (ర) కథనం: ప్రవక్త (స)తో పాటు మేము కూడా మస్జిద్‌లో కూర్చున్నాము. ఇంతలో ము’స్‌’అబ్‌ బిన్‌ ‘ఉమైర్‌ (ర) వచ్చారు. అప్పుడు అతని శరీరంపై ఎటువంటి దుప్పటి ఉందంటే, అందులో చర్మం అతుకులు ఉన్నాయి. అది చూసి ప్రవక్త (స) ఏడ్వసాగారు. ఎందుకంటే ఇస్లామ్‌ స్వీకరించటానికి ముందు అతడు చాలా ధనవంతుడు. మక్కహ్ నాయకుల్లో ఒకరు. ప్రతిరోజూ మంచి మంచి దుస్తులు ధరించి బయలుదేరేవారు. కాని ఇప్పుడు చిరిగిన మరియు అతుకులు గల దుప్పటి. అతని శరీరంపై ఉంది. మళ్ళీ ప్రవక్త (స) మీరు ఉదయం ఒక జత ధరించి బయలుదేరుతారు, సాయంత్రం ఒక జత ధరించి బయలు దేరుతారు, మీ ముందు ఆహారపదార్థాల ప్లేట్లు ఉంటాయి. ఇంకా మీరు మీ ఇళ్ళపై తెరలు వ్రేలాడగడతాడు, బైతుల్లాహ్‌పై తెర ఉన్నట్టు,’ అని అన్నారు. దానికి ప్రజలు, ‘ప్రవక్తా! అప్పుడు మేము ఇప్పటి కన్నా బాగుంటాం. ఆరాధించటానికి మాకు చాలా సమయం దొరుకుతుంది. ఇంకా మాకు పని చింత తగ్గుతుంది. ఎందుకంటే పనంతా మా సేవకులు చూసుకుంటారు,’ అని విన్నవించుకున్నారు. దానికి ప్రవక్త (స), ‘అప్పుడు ఏం బాగుండదు. ఇప్పుడు మీరు ఏ స్థితిలో ఉన్నారని అదే దానికంటే మంచి స్థితి,’ అని అన్నారు.  [77]  (తిర్మిజి’)

5367 – [ 8 ] ( لم تتم دراسته ) (3/1474)

وَعَنْ أَنَسٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “يَأْتِيْ عَلَى النَّاسِ زَمَانٌ الصَّابِرُ فِيْهِمْ عَلَى دِيْنِهِ كَالْقَابِضِ عَلَى الْجَمْرِ” .رَوَاهُ التِّرْمِذِيُّ. وَقَالَ: هَذَا حَدِيْثٌ غَرِيْبٌ إِسْنَادًا

5367. (8) [3/1474అపరిశోధితం]

అనస్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ప్రజలపై ఒక కాలం రాబోతుంది. అప్పుడు తనధర్మం విషయం లో సహనం వహించటం చేతిలో నిప్పుకణం పట్టు కున్నట్టుగా ఉంటుంది.” [78]  (తిర్మిజి’ –  ఏకోల్లేఖనం)

5368 – [ 9 ] ( لم تتم دراسته ) (3/1474)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِذَا كَانَ أُمَرَاؤُكُمْ خِيَارَكُمْ وَأَغْنِيَاؤُكُمْ سُمَحَاءَكُمْ وَأُمُوْرُكُمْ شُوْرَى بَيْنَكُمْ فَظَهْرُ الْأَرْضِ خَيْرٌ لَكُمْ مِنْ بَطْنِهَا. وَإِذَا كَانَ أُمَرَاؤُكُمْ شِرَارَكُمْ وَأَغْنِيَاؤُكُمْ بُخَلَاؤَكُمْ وَأُمُوْرُكُمْ إِلى نِسَائِكُمْ فَبَطْنُ الْأَرْضِ خَيْرٌ لَكُمْ مِنْ ظَهْرِهَا”. رَوَاهُ التِّرْمِذِيُّ وَقَالَ: هَذَا حَدِيْثٌ غَرِيْبٌ.

5368. (9) [3/1474అపరిశోధితం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మీ పాలకులు మంచివారైతే, మీ ధనవంతులు దాన గుణం గలవారైతే, మీ పనులు పరస్పరం సంప్రదింపుల ద్వారా జరిగితే, అప్పుడు ప్రపంచం మీ కోసం మంచిదై ఉంటుంది. మీరు మరణించేకన్నా జీవించి ఉండటమే మంచిది. కాని పాలకులు చెడ్డ వారైతే, మీ ధనవంతులు పిసినారులైతే, మీ వ్యవహారాలు మీ స్త్రీల చేతుల్లోకి పోతే అంటే మీరు స్త్రీల సలహాలపై నడిస్తే, అప్పుడు మీకోసం భూమి కడుపే మంచిది. అప్పుడు మీరు బ్రతికి ఉండటం కంటే చావడమే మేలు.” (తిర్మిజి’  –  ఏకోల్లేఖనం)

5369 – [ 10 ] ( صحيح ) (3/1474)

وَعَنْ ثَوْبَانَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “يُوْشِكُ الْأُمَمُ أَنْ تَدَاعَى عَلَيْكُمْ كَمَا تَدَاعِىَ الْأَكِلَةُ إِلَى قَصْعَتِهَا”. فَقَالَ قَائِلٌ: وَمَنْ قِلَّةٍ نَحْنُ يَوْمَئِذٍ؟ قَالَ: “بَلْ أَنْتُمْ يَوْمَئِذٍ كَثِيْرٌ وَلَكِنْ غُثَاءٌ كَغُثَاءِ السَّيْلِ وَلَيَنْزَعَنَّ اللهُ مِنْ صُدُوْرِعَدُوِّكُمُ الْمَهَابَةَ مِنْكُمْ وَلَيَقْذِفَنَّ فِيْ قُلُوْبِكُمُ الْوَهْنَ”. قَالَ قَائِلٌ: يَا رَسُولَ اللهِ وَمَا الْوَهْنُ؟ قَالَ: “حُبُّ الدُّنْيَا وَكَرَاهِيَةُ الْمَوْتِ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ وَ الْبَيْهَقِيُّ فِيْ”شُعَبِ الْإِيْمَانِ”.

5369. (10) [3/1474దృఢం]

సౌ’బాన్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ఒక కాలం రానున్నది, మార్గభ్రష్టులు పరస్పరం భోజనానికి ఆహ్వానించి నట్లు మార్గభ్రష్టత్వం వైపు పిలుస్తుంటారు. ఒక వ్యక్తి, ‘ఓ ప్రవక్తా! అప్పుడు మేము తక్కువ సంఖ్యలో ఉంటామా?’ అని విన్నవించు కున్నాడు. దానికి ప్రవక్త (స), ‘లేదు, మీరు అధికంగా ఉంటారు. కాని మీరు వరదచెత్తలా ఉంటారు. అల్లాహ్‌ (త) మీ శత్రువుల హృదయాల నుండి మీ పట్ల ఉన్న భయాందోళనలు చెరిపివేస్తాడు. ఇంకా మీ హృద యాలను అనుమానాలకు  గురిచేస్తాడు.’ ఒకవ్యక్తి, ‘సంకోచం అంటే ఏమిటి?’ అని అడిగాడు. ప్రవక్త (స) సమాధాన మిస్తూ, ‘ఐహిక వాంఛలు, కోరికలు, మరణం పట్ల అసహ్యం,’ అని అన్నారు.[79](అబూ దావూద్‌, బైహఖీ -షు’అబిల్ ఈమాన్).

—–

اَلْفَصْلُ الثَّالِثُ  మూడవ విభాగం    

5370 – [ 11 ] ( لم تتم دراسته ) (3/1475)

عَنِ ابْنِ عَبَّاسٍ قَالَ: “مَا ظَهَرَالْغُلُوْلُ فِيْ قَوْمٍ إِلَّا أَلْقَى اللهُ فِيْ قُلُوْبِهِمُ الرُّعْبَ ولَا فَشَا الزِّنَا فِيْ قَوْمٍ إِلَّا كَثُرَفِيْهِمُ الْمَوْتُ وَلَانَقَصَ قَوْمٌ الْمِكْيَالَ و الْمِيْزَانَ إِلَّا قُطِعَ عَنْهُمُ الرِّزْقَ وَلَا حَكَمَ قَوْمٌ بِغَيْرِحَقّ إِلَّا فَشَا فِيْهِمُ الدَّمُ وَلَاخَتَرَ قَوْمٌ بِالْعَهْدِ إِلَّا سُلِطَ عَلَيْهِمُ الْعَدُوُّ”. رَوَاهُ مَالِكٌ.

5370. (11) [3/1475అపరిశోధితం]

ఇబ్నె ‘అబ్బాస్‌ (ర) కథనం: యుద్ధధనంలో ద్రోహం జరిగే జాతి హృదయాలు భయాందోళనలకు గురవుతాయి. అదేవిధంగా వ్యభిచారం, నిషిద్ధ కార్యాలు, పాపాలు జరిగే జాతిలో మరణాలు అధికం అవుతాయి. అంటే కలరా, ప్లేగు వ్యాధుల వల్ల అధికంగా మరణాలు సంభవిస్తాయి. కొలతల్లో తూనికల్లో మోసం చేయటం వల్ల ఉపాధితగ్గించటం జరుగుతుంది. కరువు కాటకాలు సంభవించి ఆ జాతి మరణిస్తుంది. అధికారులు అన్యాయమైన తీర్పులు ఇస్తే రక్తపాతాలు అధికమయిపోతాయి. ఇంకా వాగ్దానాలు నెరవేర్చని జాతి  శత్రువులకు  గురిచేయ బడుతుంది. (మాలిక్‌)

=====

8 بَابُ الْإِنْذَارِ وَالتَّحْذِيْرِ

8. హెచ్చరించటం, అప్రమత్తం చేయటం

اَلْفَصْلُ الْأَوَّلُ  మొదటి విభాగం   

5371 – [ 1 ] ( صحيح ) (3/1476)

عَنْ عِيَاضِ بْنِ حِمَار الْمُجَاشِعِيِّ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم قَالَ ذَاتَ يَوْمٍ فِيْ خُطْبَتِهِ: “أَلَا إِنَّ رَبِّيْ أَمَرَنِيْ أَنْ أُعَلِّمَكُمْ مَا جَهِلْتُمْ مِمَّا عَلَّمَنِيْ يَوْمِيْ هَذَا: كُلُّ مَالٍ نَحَلْتُهُ عَبْدًا حَلَالٌ وَإِنِّيْ خَلَقْتُ عِبَادِيْ حُنَفَاءَ كُلَّهُمْ وَإِنَّهُ أَتَتْهُمُ الشَّيَاطِيْنُ فَاجْتَالَتْهُمْ عَنْ دِيْنِهِمْ وَحَرَّمَتْ عَلَيْهِمْ مَا أَحْلَلْتُ لَهُمْ وَأَمَرَتْهُمْ أَنْ يُشْرِكُوْا بِيْ مَا لَمْ أُنْزِلْ بِهِ سُلْطَانًا وَإِنَّ اللهَ نَظَرَ إِلى أَهْلِ الْأَرْضِ فَمَقَتَهُمْ عَرَبَهُمْ وَعَجَمَهُمْ إِلَّا بَقَايَا مِنْ أَهْلِ الْكِتَابِ. وَقَالَ: إِنَّمَا بَعَثْتُكَ لِأَبْتَلِيَكَ وَأَبْتَلِيَ بِكَ وَأَنْزَلْتُ عَلَيْكَ كِتَابًا لَا يَغْسِلُهُ الْمَاءُ تَقْرَؤُهُ نَائِمًا وَيَقْظَانَ وَإِنَّ اللهَ أَمَرَنِيْ أَنْ أُحَرِّقَ قُرَيْشًا فَقُلْتُ:  يَا رَبِّ إِذَا يَثْلُغُوْا رَأْسِيْ فَيَدَعُوْهُ خُبْزَةَ قَالَ: اسْتَخْرِجْهُمْ كَمَا أَخْرَجُوْكَ وَأَغْزُهُمْ نُغْزِكَ وَأَنْفِقْ فَسَنُنْفِقُ عَلَيْكَ وَابْعَثْ جَيْشًا نَبْعَثْ خَمْسَةً مِثْلَهُ وَقَاتِلْ بِمَنْ أَطَاعَكَ مَنْ عَصَاكَ”.رَوَاهُ مُسْلِمٌ.

5371. (1) [3/1476 దృఢం]

ఇయా’ద్ బిన్‌ ‘హిమార్‌ ముజాషి’యి (ర) కథనం: ప్రవక్త (స) ఒక ప్రసంగంలో ఇలా ప్రవచించారు, ”మీరు బాగా గుర్తుంచుకోండి! అల్లాహ్‌ (త) నన్ను మీకు తెలియని విషయాలు తెలియపర్చమని ఆదే శించాడు. అల్లాహ్‌ (త) ఈ నాడు నాకు ఇలా తెలియ పరిచాడు, ”నేను నా దాసులకు ఇచ్చిన ధనం ధర్మ సమ్మత మైనది. ఇంకా నేను నా దాసులందరినీ సత్యం పైనే సృష్టించాను. అంటే ఇస్లామ్ ప్రకృతిపై. ఆ తరువాత వారి వద్దకు షై’తానులు వచ్చి వారిని వారి ధర్మంనుండి దూరం చేస్తారు. నేను వారి కొరకు ధర్మ సమ్మ తం చేసినవాటిని నిషిద్ధం చేసివేస్తారు. ఇంకా ఆ షై’తానులు నాకు సాటి కల్పించమని ప్రజలను ఆదే శిస్తారు. వారిపై నేను ఎటువంటి సాక్ష్యాధారాల్ని అవతరింపజేయ లేదు.” ఇంకా అల్లాహ్‌ (త) భూవాసులను చూసాడు. వారిలో చాలామందిని అవిశ్వాసులుగా కను గొన్నాడు. అందరి పట్ల అయిష్టాన్ని వ్యక్తంచేసాడు. కాని గ్రంథప్రజలలో ఒక బృందం సత్యమార్గంపై, ఏకత్వంపై ఉంది. వారిపట్ల అయిష్టాన్ని వ్యక్తపరచలేదు. ఇంకా, ”ఓప్రవక్తా! మేము నిన్ను ప్రవక్తగా ప్రజలవద్దకు పంపాము. నీవు నీజాతి వారు పెట్టే హింసలకు ఓర్పు, సహనం వహిస్తావా లేదా?’ అని, వారిని పరీక్షించటం జరిగింది. నీపై నేను ఎటువంటి గ్రంథాన్ని అవతరింపజేస్తాం అంటే దాన్ని నీరు కూడా చెరపలేదు. అది హృదయాల్లో భద్రంగా ఉంటుంది. ఇంకా అందులో ఎటువంటి మార్పులు చేర్పులు జరగవు. నీవు ఎప్పుడైనా దాన్ని పఠించవచ్చు.

”ఇంకా నేను ఖురైషులను నాశనంచేయాలని, కాల్చి వేయాలని నన్ను ఆదేశించడం జరిగింది.” అప్పుడు  నేను ఇలా అన్నాను, ”ఓ నా ప్రభూ! అప్పుడు ఖురై షులు అందరూ కలసి నన్ను చంపివేస్తారు. అంటే నేను ఒంటరిగా వారితో పోరాడితే అందరూ కలసి నన్ను చంపివేస్తారు” అని అన్నాను. అప్పుడు అల్లాహ్‌ (త), ‘నిన్ను వారు దేశబహిష్కరణకు గురిచేసినట్టు వారిని నేను బహిష్కరిస్తాను. ఇంకా, వారు నీతో యుద్ధం చేసినట్టు నేను వారితో యుద్ధంచేస్తాను. నీకు వ్యతిరేకంగా వారు ఖర్చుపెట్టి నట్లు, నేను వారికి వ్యతిరేకంగా ఖర్చుచేస్తాను. వారి కంటే ఐదురెట్లు అధిక సైన్యాన్ని వారిపైకి పంపుతాను. వారు నీ ఆధిపత్యంలో నీ శత్రువులకు వ్యతిరేకంగా యుద్ధం చేస్తారు.” (ముస్లిమ్‌)

5372 – [ 2 ] ( متفق عليه ) (3/1476)

وَعَنِ ابْنِ عَبَّاسٍ قَالَ: لَمَّا نَزَلَتْ (وَأَنْذِرْعَشِيْرَتَكَ الْأَقْرَبِيْنَ؛ 26:214) صَعِدَالنَّبِيُّ صلى الله عليه وسلم اَلصَّفَا فَجَعَلَ يُنَادِيْ: “يَا بَنِيْ فَهُرَ يَا بَنِيْ عَدِيِّ ” لِبُطُوْنِ قُرَيْشٍ حَتَّى اجْتَمَعُوْا فَقَالَ: “أَرَأَيْتُكُمْ لَوْ أَخْبَرْتُكُمْ أَنَّ خَيْلًا بِالْوَادِيْ تُرِيْدُ أَنْ تُغِيْرَعَلَيْكُمْ أَكُنْتُمْ مُصَدِّقِيَّ؟” قَالُوْا: نَعَمْ مَا جَرَّبْنَا عَلَيْكَ إِلَّا صِدْقًا. قَالَ: “فَإِنِّيْ نَذِيْرٌلَكُمْ بَيْنَ يَدَيْ عَذَابٍ شَدِيْدٍ”. فَقَالَ أَبُوْ لَهَبٍ: تَبًّا لَكَ سَائِرِالْيَوْمِ أَلِهَذَا جَمَعْتَنَا؟ فَنَزَلَتْ: (تَبَّتْ يَدَا أَبِيْ لَهَبٍ وَتَبَّ) مُتَّفَقٌ عَلَيْهِ.

وَفِيْ رِوَايَةٍ نَادَى: “يَا بَنِيْ عَبْدِ مَنَافٍ إِنَّمَا مَثَلِيْ وَ مَثَلُكُمْ كَمَثَلِ رَجُلٍ رَأَى الْعَدُوَّ فَانْطَلَقَ يَرْبَأُ أَهْلَهُ فَخَشِيَ أَنْ يَسْبِقُوْهُ فَجَعَلَ يَهْتِفُ يَا صَبَاحَاهُ “.

5372. (2) [3/1476ఏకీభవితం]

ఇబ్నె ‘అబ్బాస్‌ (ర) కథనం: ఈ ఆయతు, ”అన్‌జి’ర్‌ అషీరతకల్‌ అఖ్‌రబీన్‌” అంటే  –    ‘మరియు నీ దగ్గరి బంధువులను హెచ్చరించు,’ అవతరించబడి నప్పుడు, ప్రవక్త (స) ‘సఫా కొండపై ఎక్కి తన బంధువులు ఒక్కొక్కరిని పిలవసాగారు. ”ఓబనీ ఫహుర్‌, ఓ బనీ ‘అదీ!” అంటే ఖురైషులారా! అని. అందరూ వచ్చారు. అప్పుడు ప్రవక్త (స) వారితో, ”ఒక వేళ నేను మీతో ‘ ‘సఫా’ వెనుక మైదానంలో మీ శత్రువులు మీపై దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నారు’ అని అంటే నమ్ముతారా? లేదా?” అని అన్నారు. అందరూ, ”నీ మాట నమ్ముతాము, ఎందుకంటే నువ్వు ఏనాడూ అసత్యం పలకలేదు. ఎల్లప్పుడూ సత్యమే పలికావు,” అని అన్నారు. అప్పుడు ప్రవక్త (స), ”మీపై రాబోయే కఠిన శిక్ష గురించి మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. అంటే ఒకవేళ దైవాన్ని విశ్వసించకపోతే, మీపై కఠిన శిక్ష విరుచుకు పడుతుంది. మీరు నాశనం అయిపోతారు.” అప్పుడు అబూ లహబ్‌ ఇలా అన్నాడు, ”నీ పాడుగాను! దీని కోసమేనా మమ్మల్నందరినీ ఇక్కడ చేర్చావు.” వాడికి వ్యతిరే కంగా సూరహ్‌ లహబ్‌ (111) అవతరించబడింది.[80] (బు’ఖారీ, ముస్లిమ్‌)

మరో ఉల్లేఖనంలో ఇలా ఉంది, ”ప్రవక్త (స) ‘సఫా కొండపై ఎక్కి కుటుంబా లన్నింటినీ పిలిచారు. ఓ బనీ అబ్దు మునాఫ్‌! మన ఇరువురి ఉదాహరణ శత్రు సైన్యాలను చూస్తున్న వ్యక్తి తన జాతివారిని రక్షించడానికి కొండపైకి ఎక్కిన ఒక వ్యక్తిలా ఉంది. అతడు అక్కడి నుండే కేకలు వేయటం ప్రారంభించాడు. ఆ ఊరిపై శత్రువు దాడి చేయడానికి వచ్చి నట్లుంది. మీరు మిమ్మల్ని రక్షించుకోండి. శత్రువు వచ్చి దాడి చేస్తాడేమోనని కొండపై నుండే నిరంతరం కేకలు పెడు తున్నాడు.’

5373 – [ 3 ] ( صحيح ) (3/1477)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: لَمَّا نَزَلَتْ(وَأَنْذِرْعَشِيْرَتَكَ الْأَقْرَبِيْنَ) دَعَا النَّبِيُّ صلى الله عليه وسلم قُرَيْشًا فَاجْتَمَعُوْا فَعَمَّ وَخَصَّ فَقَالَ: “يَا بَنِيْ كَعْبِ بْنِ لُؤيٍّ أَنْقِذُوْا أَنْفُسَكُمْ مِنَ النَّارِ يَا بَنِيْ مُرَّةَ بْنِ كَعْبٍ أَنْقِذُوْا أَنْفُسَكُمْ مِنَ النَّارِ. يَا بَنِيْ عَبْدِ شَمْسٍ أَنْقِذُوْا أَنْفُسَكُمْ مِنَ النَّارِ يَا بَنِيْ عَبْدِ مُنَافٍ أَنْقِذُوْا أَنْفُسَكُمْ مِنَ النَّارِ. بَا بَنِيْ هَاشِمٍ أَنْقِذُوْا أَنْفُسَكُمْ مِنَ النَّارِ. يَا بَنِيْ عَبْدِ الْمُطَّلِبِ أَنْقِذُوْا أَنْفُسَكُمْ مِنَ النَّارِ. يَا فَاطِمَةُ أَنْقِذِيْ نَفْسَكِ مِنَ النَّارِ فَإِنِّيْ لَا أَمْلِكُ لَكُمْ مِنَ اللهِ شَيْئًا غَيْرَ أَنَّ لَكُمْ رِحْمًا سَأَبُلُّهَا بِبَلَالِهَا”. رَوَاهُ مُسْلِمٌ.

وَفِي الْمُتَّفَقِ عَلَيْهِ قَالَ: “يَا مَعْشَرَ قُرَيْشٍ اِشْتَرُوْا أَنْفُسَكُمْ لَا أُغْنِيْ عنْكُمْ مِنَ اللهِ شَيْئًا وَيَا صَفِيَّةُ عَمَّةَ رَسُوْلِ اللهِ لَا أُغْنِيْ عَنْكَ مِنَ اللهِ شَيْئًا. وَياَ فَاطِمَةُ بِنْتَ مُحَمَّدٍ سَلِيْنِيْ مَا شِئْتِ مِنْ مَالِيْ لَا أُغْنِي عَنْكَ مِنَ اللهِ شَيْئًا”.

5373. (3) [3/1477దృఢం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ”వ అన్జి’ర్‌ అషీరతకల్‌ అఖ్‌రబీన” అనే ఆయతు అవతరింప జేయబడినపుడు ప్రవక్త (స) తన బంధువులందరినీ పిలిచారు. అందరూ అంటే బంధువులు, స్నేహితులు, అందరూ వచ్చారు. అప్పుడు ప్రవక్త (స), క’అబ్‌ బిన్‌ లూయీ’ సంతానమా! మిమ్మల్ని మీరు నరకం నుండి రక్షించుకోండి! ఇంకా ముర్రహ్ బిన్‌ క’అబ్‌ సంతానమా! మిమ్మల్ని మీరు నరకబాధ నుండి రక్షించుకోండి! ఇంకా బనీ అబ్దుష్షమ్స్, మిమ్మల్ని మీరు నరకం నుండి రక్షించుకోండి. ఇంకా అబ్దు మునాఫ్‌! మిమ్మల్ని మీరు నరకం నుండి రక్షించు కోండి. ఇంకా బనీ హాషిమ్‌! మిమ్మల్ని మీరు నరకం నుండి రక్షించుకోండి. ఇంకా అబ్దుల్‌ ము’త్తలిబ్‌! మీరు కూడా నరకం నుండి రక్షించుకోండి. ఫాతిమహ్! నువ్వు కూడా నరకం నుండి  రక్షించుకో! ఎందుకంటే తీర్పుదినం నాడు అల్లాహ్ శిక్షల నుండి నేను నిన్ను రక్షించలేను. అయితే ప్రాపంచిక పరంగా బంధు త్వాన్ని నెరవేరుస్తాను. బంధుత్వ హక్కులను నెరవేరుస్తూ ఉంటాను” అని అన్నారు. (ముస్లిమ్‌)

బు’ఖారీలో ఇలా ఉంది, ”ప్రవక్త (స) ఖురైషులందరినీ పిలిచి ఒకచోట చేర్చారు. ఆ తరువాత, మీరు నన్ను విశ్వసించి మిమ్మల్ని మీరు నరకం నుండి విముక్తి పొందండి. ఎందుకంటే, మీరు విశ్వసించనంత వరకు మీకు ఎటువంటి లాభమూ చేకూరదు. ఇంకా ఓ అబ్దు మునాఫ్‌! మిమ్మల్ని మీరు నరకం నుండి రక్షించు కోండి! విశ్వసించకుండా మీరు అల్లాహ్ శిక్షల నుండి విముక్తి పొందలేరు. ఇంకా ఓ ‘అబ్బాస్‌ బిన్‌ ‘అబ్దుల్‌ ము’త్తలిబ్‌, మీరు కూడా విశ్వసించండి. ఎందుకంటే విశ్వసించ కుండా ఎవరూ దైవశిక్షల నుండి తప్పించు కోలేరు. ఇంకా ఓ అత్తయ్య ‘సఫియ్యా! అల్లాహ్ ను విశ్వసించు, విశ్వసించ కుండా అల్లాహ్ శిక్ష నుండి తప్పించు కోలేవు. ఇంకా ఓ నా ప్రియ పుత్రికా! ఫాతిమహ్ నువ్వు కూడా విశ్వసించు, విశ్వసించనంత వరకు నిన్ను నేను నరకం నుండి రక్షించలేను. కాని ప్రపంచంలో నీకు కావలసినంత నా దగ్గరి నుండి తీసుకో, ఇవ్వగలను. కాని పరలోకంలో విశ్వసించకుండా ఏమీ లాభం చేకూరదు,’ అని అన్నారు.

—–

اَلْفَصْلُ الثَّانِيْ  రెండవ విభాగం   

5374 – [ 4 ] ( لم تتم دراسته ) (3/1477)

عَنْ أَبِيْ مُوْسَى قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “أُمَّتِيْ هَذِهِ أُمَّةٌ مَرْحُوْمَةٌ لَيْسَ عَلَيْهَا عَذَابٌ فِيْ الْآخِرَةِ عَذَابُهَا فِي الدُّنْيَا: اَلْفِتَنُ وَالزَّلَازِلُ وَالْقَتْلُ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ.

5374. (4) [3/1477అపరిశోధితం]

అబూ మూసా అష్‌’అరీ(ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”నా ఈ అనుచర సమాజం, ఉమ్మతున్‌ మర్‌’హూ తున్‌’ అంటే — ‘నా అనుచర సమాజంపై అల్లాహ్ ప్రత్యేక కారుణ్యం ఉంది.’ దీన్ని విశ్వసించటం వల్ల పరలోకంలో శిక్ష పడదు. అయితే ప్రాపంచిక ఉపద్రవాలు, భూకంపాలు, యుద్ధాలకు గురిచేయటం జరుగుతూ ఉంటుంది.”  [81] (అబూ  దావూద్‌).

5375 – [5] ، 5376 [6] (لم تتم دراسته) (3/1478)

وَعَنْ أَبِيْ عُبَيْدَةَ وَمُعَاذِ بْنِ جَبَلٍ عَنْ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم قَالَ: “إِنَّ هَذَا الْأَمْرَبَدَأَ نُبُوَّةً وَرَحْمَةً. ثُمَّ يَكُوْنُ خِلَافَةً وَرَحْمَةً ثُمَّ مَلِكًا عَضُوْضًا ثُمَّ كَانَ جَبْرِيَّةً وَعُتُوًّا وَفَسَادًا فِي الْأَرْضِ يَسْتَحِلُّوْنَ الْحَرِيْرَ وَالْفُرُوْجَ وَالْخُمُوْرَ. يَرْزَقُوْنَ عَلَى ذَلِكَ وَيُنْصَرُوْنَ حَتّى يَلْقَوُا اللهَ”. رَوَاهُ الْبَيْهَقِيُّ فِيْ “شُعَبِ الْإِيْمَانِ”.

5375. (5) & 5376. (6) [3/1478అపరిశోధితం]

అబూ ‘ఉబైదహ్‌ (ర), ము’ఆజ్‌’ బిన్‌ జబల్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఈ ధర్మం దైవదౌత్యం, కారుణ్యాల ద్వారా బహిర్గతం అయ్యింది. ఇస్లామ్‌ ధర్మం ప్రారంభకాలం దైవవాణి, కారుణ్యాలతో కూడు కున్నది. నా మరణానంతరం ఖలీఫాల పరిపాలన, కారుణ్యం కాలం ఉంటుంది. ఆ తరు వాత రాజులు పరిపాలిస్తారు. ఆ తరువాత జరగవలసినది జరుగు తుంది. అంటే అత్యాచారాలు, అహంకారం, రక్త పాతాలు, ఉపద్రవాలు సంభవిస్తాయి. ప్రజలు పట్టును ధర్మసమ్మతం చేసు కుంటారు, వ్యభిచారం, అశ్లీలం, మద్యపానం కూడా ధర్మసమ్మతంగా భావిస్తారు. అయినప్పటికీ వారికి ఉపాధి ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. శత్రువులపై వారికి సహాయం చేయడం జరుగు తుంది. చివరికి వారు అల్లాహ్‌(త) ను కలుసు కుంటారు. అంటే మరణించి అల్లాహ్‌ (త) ముందు హాజరౌతారు. [82] (బైహఖీ-షు’అబిల్ఈమాన్)

5377 – [7 ] ( حسن ) (3/1478)

وَعَنْ عَائِشَةَ قَالَتْ: سَمِعْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ: “إِنَّ أَوَّلَ مَا يُكْفَأُ- قَالَ زَيْدُ بْنُ يَحْيَى الرَّاوِيْ: يَعْنِي الْإِسْلَامَ – كَمَا يُكْفَأُ الْإِنَاءُ “يَعْنِي الْخَمْرَ. قِيلَ: فَكَيْفَ يَا رَسُوْلَ اللهِ وَقَدْ بَيَّنَ اللهُ فِيْهَا مَابَيَّنَ؟ قَالَ: “يُسَمُّوْنَهَا بِغَيْرِاسْمِهَا فَيَسْتَحِلُّوْنَهَا”. روَاهُ الدَّارَمِيُّ.

5377. (7) [3/1478ప్రామాణికం]

‘ఆయి’షహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ఇలా ప్రవచిస్తూ ఉండగా నేను విన్నాను: ”అన్నిటికంటే తిరగవేయ బడేది ఇస్లామ్‌ ఒక్కటే. అంటే అన్నిటికంటే ముందు అల్లాహ్ అవిధేయతకు పాల్పడి ఇస్లామ్‌ను అంటే ఇస్లామీయ ఆదేశాలను తిరగవేయడం జరుగును. అది మద్యపానం అంటే మద్యం నిషిద్ధం అయి నప్పటికీ ప్రజలు మద్యాన్ని సేవిస్తారు. ప్రవక్త (స)ను, ఓ ప్రవక్తా! ఇది ఎలా జరుగుతుంది? అల్లాహ్‌ మద్యాన్ని నిషేధించాడు. అందరికీ తెలిసిపోయింది అని విన్నవించుకోవటం జరిగింది. దానికి ప్రవక్త (స) సమాధానమిస్తూ, ‘మద్యాన్ని పేర్లుమార్చి, క్రొత్త పేర్లు పెట్టి ధర్మసమ్మతం చేసుకుంటారు,’ అని అన్నారు.[83]  (దార్మీ)

—–

اَلْفَصْلُ الثَّالِثُ   మూడవ విభాగం 

5378 – [ 8 ] ( حسن ) (3/1478)

عَنِ النُّعْمَانِ بْنِ بَشِيْرٍعَنْ حُذَيْفَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “تَكُوْنُ النُّبُوَّةُ فِيْكُمْ مَا شَاءَ اللهُ أَنْ تَكُوْنَ ثُمَّ يَرْفَعُهَا اللهُ تَعَالى. ثُمَّ تَكُوْنُ خِلَافَةُ عَلَى مِنْهَاجِ النُّبُوَّةِ مَا شَاءَ اللهُ أَنْ تَكُوْنَ. ثُمَّ يَرْفَعُهَا اللهُ تَعَالى. ثُمَّ تَكُوْنُ مُلْكًا عَاضًا فَتَكُونُ مَا شَاءَ اللهُ أَنْ تَكُوْنَ. ثُمَّ يَرْفَعُهَا اللهُ تَعَالى ثُمَّ تَكُوْنُ مُلْكًا جَبَرِيَّةً فَيَكُوْنُ مَا شَاءَ اللهُ أَنْ يَكُوْنَ. ثُمَّ يَرْفَعُهَا اللهُ تَعَالى ثُمَّ تَكُوْنُ خِلَافَةً عَلَى مِنْهَاجِ نُبُوَّةٍ” .ثُمَّ سَكَتَ. قَالَ حَبِيْبٌ: فَلَمَّا قَامَ عُمَرُبْنُ عَبْدِ الْعَزِيْزِ كَتَبْتُ إِلَيْهِ بِهَذَا الْحَدِيْثِ أُذَكِّرُهُ إِيَّاُه وَقُلْتُ: أَرْجُوْ أَنْ تَكُوْنَ أَمِيْرَ الْمُؤْمِنِيْنَ بَعْدَ الْمَلِكِ الْعَاضِّ وَالْجَبَرِيّةِ فَسُرَّ بِهِ وَأَعْجَبَهُ يَعْنِيْ عُمَرَبْنَ عَبْدِ الْعَزِيْزِ. رَوَاهُ أَحْمَدُ وَالْبَيْهَقِيُّ فِيْ” دَلَائِلِ النُّبُوَّةِ”.

5378. (8) [3/1478 ప్రామాణికం]

నో’మాన్‌ బిన్‌ బషీర్‌, హు’దైఫహ్ (ర) ద్వారా కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”అల్లాహ్‌ కోరినంత వరకు మీలో దైవదౌత్యం స్థిరంగా ఉంటుంది. అంటే దైవదౌత్యకాలం మిగిలి ఉంటుంది. ఆ తరువాత అల్లాహ్‌(త) దైవప్రవక్తను ఎత్తుకుంటాడు. ఆ తరువాత అల్లాహ్ కోరినంత వరకు దైవప్రవక్త పద్ధతిప్రకారం పరిపాలన సాగుతుంది. అంటే ఖలీఫాల పరిపాలన ఉంటుంది . ఆ తరువాత పళ్ళు కొరికే పరిపాలన వస్తుంది. అంటే దుర్మార్గుల, అత్యాచారుల పరిపాలన వస్తుంది. అల్లాహ్‌(త) కోరినంత వరకు అది సాగుతుంది. ఆ తరువాత అల్లాహ్‌(త) దాన్ని కూడా ఎత్తివేస్తాడు. ఆ తరువాత గర్వాహంకారుల, దుర్మార్గుల అధికారం వస్తుంది. అంటే దుర్మార్గులు, నిర్దయులైన పాపాత్ముల పరిపాలన వస్తుంది. దాన్ని కూడా అల్లాహ్‌ (త) ఎత్తుకుంటాడు. ఆ తరువాత దైవప్రవక్తల ఆదేశాల కనుగుణంగా పరిపాలన జరుగుతుంది అని పలికి ప్రవక్త (స) మౌనం వహించారు.

ఈ ‘హదీసు’ ఉల్లేఖనకర్త ‘హబీబ్‌ బిన్‌ సాలిమ్‌ కథనం, ఉమర్‌ బిన్‌ ‘అబ్దుల్‌ ‘అ’జీ’జ్‌ పాలకులైనపుడు నేను ఈ ‘హదీసు’ను వ్రాసి అతని వద్దకు పంపాను. అతనికి గుర్తు చేయడం కోసం. ‘దుర్మార్గులు, నిర్దయుల తర్వాత విశ్వాసుల ‘ఖలీఫహ్ అయినవారు తమరే’ అని సూచించాను. దానికి ‘ఉమర్‌ బిన్‌ ‘అబ్దుల్‌ ‘అ’జీ’జ్‌ అది చదివి చాలా సంతోషించారు.  (అ’హ్మద్‌, బైహఖీ-దలాయిలిల్  నబువ్వహ్)

ఈ’హదీసు’లో కూడా సత్య భవిష్యవాణి  ఉంది. ఎందు కంటే ప్రవక్త (స) ప్రవచించిన దాని ప్రకారం జరిగింది. దైవదౌత్య సాక్ష్యాధారాల్లో ఇది కూడా ఒక సాక్ష్యం.

*****


[1]) వివరణ-5155: అంటే అల్లాహ్‌(త) ప్రసాదించిన రెండు అనుగ్రహాలు ఆరోగ్యం, తీరికల వల్ల లాభం పొందాలి. వీటిని వృథాగా పోనివ్వరాదు. ఏదైనా మంచి పనిచేస్తూ ఉండాలి. ఆరోగ్యం ధనంకన్నా గొప్పది. అదేవిధంగా తీరికకూడా గొప్ప దైవానుగ్రహం. పెద్దపెద్ద పాలకులకు, ధనవంతులకు కూడా దీని భాగ్యం కలుగదు. పేదలకన్నా అధికంగా ధనవంతులే విచారంలో మునిగి ఉంటారు. ధనవంతులు పాలకులు ప్రశాంతంగా ఉండలేరు. మనశ్శాంతిలేని ఆ ధనమెందుకు? తీరికలేని ఆ అధికారం ఎందుకు? అందువల్ల ఆరోగ్యాన్ని, తీరికను వృథాచేయరాదు.

[2]) వివరణ-5156: అంటే సముద్రంలో ముంచి వేలును తీస్తే, ఒకటి రెండు చుక్కల నీరు మాత్రమే వస్తుంది. అంటే ఐహిక జీవితం పరలోకంముందు ఆ నీటిచుక్కల కంటే చాలా చిన్నది. పరలోకం సముద్రం వంటిది. ఈ జీవితం నశించేది, కాని పరలోకం శాశ్వతమైనది. ఈ లోకంలోని ప్రతి వస్తువు నశించేది. కాని పరలోక సుఖాలు శాశ్వతమైనవి. అందువల్ల నశించేదాన్ని, శాశ్వతంగా ఉండేదానిపై ప్రాధాన్యత ఇవ్వరాదు. ఇప్పుడు తెలిసిన విషయం ఏమిటంటే ప్రాపంచిక అనుగ్రహాలు పొంది గర్వాహంకారాలకు గురికావటం సరికాదు.

దైవానుగ్రహాలను పొంది దైవాదేశాల ప్రకారం, దైవమార్గంలో ఖర్చుపెట్టే వ్యక్తి మాత్రమే అదృష్టవంతుడు. ఇటువంటి వ్యక్తి ఉభయ లోకాల్లోనూ మేలుపొంది, స్వర్గంలో ఉన్నత స్థానాలు అధిరోహిస్తాడు.

[3]) వివరణ-5157: వివేకవంతులైన విశ్వాసులు దీన్ని హీనంగా భావిస్తారు. దీనివైపు చూడనైనా చూడరు. ఓ సోదరా! పరలోకంలో ఈప్రాపంచిక మనోకాంక్షలు నిన్ను సర్వనాశనం చేస్తాయి. అక్కడ ఐహిక ప్రేమికులకు కఠినాతి కఠినమైన విధంగా శిక్షించటం జరుగుతుంది. ప్రవక్త (స) ఒక క్రుళ్ళిన సమాధిపై నిలబడి, ప్రజలారా! రండి ప్రపంచాన్ని చూడండి. ప్రవక్త (స) క్రుళ్ళిన వస్త్రం, క్రుళ్ళిన కళేబరాన్ని చూపెడుతూ ఇది ప్రపంచం. ప్రపంచ అలంకరణ ఈ వస్త్రం వంటిది. ఈ దుమ్ములు క్రుళ్ళిన దుమ్ముల్లా ఉన్నాయి. అంటే మరణానంతరం శరీరం క్రుళ్ళిపోతుంది, దుమ్ములు కూడా క్రుళ్ళిపోతాయి. వస్త్రం కూడా చిరిగిపోతుంది. అన్నీ నశిస్తాయి. (బైహఖీ, ‘గజాలీ, అ’హ్‌యా ఉల్‌ ‘ఉలూమ్‌)

ప్రపంచంలోని ఏ వస్తువూ శాశ్వతమైనది కాదు. పై ‘హదీసు’ను క్రింది ‘హదీసు’ వివరిస్తుంది. అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) నాతో, ‘ప్రపంచం చూపెడుతాను, నాతో రా,’ అని అన్నారు. దానికి నేను, ‘సిద్ధంగా ఉన్నాను,’ అని అన్నాను. ప్రవక్త (స) నా చేయి పట్టుకొని మదీనహ్ వెలుపల అడవిలోకి తీసుకొని వెళ్ళారు. అక్కడ ఒకచోట పుర్రెలు, మలం, దుమ్ములు, చినిగి ఉన్న బట్టపేలికలు ఉన్నాయి. ప్రవక్త (స), ‘ఓ అబూ హురైరహ్‌! ఈ పుర్రెలు కూడా నీవు కోరుతున్నట్లే కోరుకునేవారు, నీవు ఆచరిస్తున్నట్లే ఆచరించేవారు. కాని ఈనాడు వీరిపై చర్మంగాని, వస్త్రాలుగాని లేకుండా పోయాయి. ఇంకా కొన్నిదినాల్లో ఇవి బుగ్గి అయిపోతాయి. ఈ మలాన్ని వీరు సంపాదించి తెచ్చేవారు. ఈనాడు నీవు దీన్నిచూసి అసహ్యించుకుంటున్నావు. ఈ బట్ట పేలికలే వీరివస్త్రాలుగా ఉండేవి. ఇంకా ఈ దుమ్ములు వీరి వాహనాలు. వీటిపై ఎక్కి నగరాల్లో తిరిగేవారు. కాని వీటన్నిటికీ వినాశనం తప్పిందికాదు. అక్కడ చాలాసేపు ఏడ్చిన తర్వాతనే అక్కడి నుండి వెనుతిరిగాము,’ అని అబూ హురైరహ్‌ (ర) పేర్కొన్నారు.

[4]) వివరణ-5158: అంటే స్వర్గంలో విశ్వాసికి లభించే సుఖాలు, విలాసాలు ప్రపంచంలో లభించవు. కనుక ఇహలోకం విశ్వాసికి జేలువంటిది. నరకంలో అవిశ్వాసి పడే బాధలకంటే ఇక్కడ తన ఇష్టానుసారం ఎటువంటి ఆదేశాలు, నిషిద్ధాలు లేకుండా జీవితం గడుపుతాడు. అందువల్ల అవిశ్వాసికి ఇది స్వర్గం అవుతుంది. విశ్వాసి ఇహలోకంలో  దైవాదేశాలను పాలిస్తూ, తన్నుతాను మనోకాంక్షలకు దూరంగా ఉంచుతూ జీవిస్తాడు. కనుక అతనికి ఇది జేలువంటిది. అదేవిధంగా అవిశ్వాసి ఇక్కడ ఎటువంటి అవరోధాలు లేకుండా, మనోకాంక్షలకు దాసుడై ధర్మం, అధర్మం అని ఆలోచించకుండా విందుల్లో విలాసాల్లో మునిగి తేలుతూ ఉంటాడు. అందువల్ల అతడికి ఇది స్వర్గంలా ఉంటుంది.

అల్లాహ్‌ఆదేశం:అలాకాదు! నిశ్చయంగా, దుష్టుల కర్మ పత్రం సిజ్జీనులో ఉంది. సిజ్జీన్ అంటే నీవు ఏమను కుంటున్నావు? వ్రాసిపెట్టబడిన (చెరగని) గ్రంథం. సత్యాన్ని తిరస్కరించేవారికి ఆ రోజు వినాశముంది. వారికే! ఎవరైతే తీర్పుదినాన్ని తిరస్కరిస్తారో! మరియు మితిమీరి ప్రవర్తించే పాపిష్ఠుడు తప్ప, మరెవ్వడూ దానిని (తీర్పుదినాన్ని) తిరస్కరించడు. మా సూచనలు (ఆయాత్‌) అతడికి వినిపించబడి నప్పుడు అతడు: “ఇవి పూర్వకాలపు కట్టుకథలే!” అని అంటాడు. అలాకాదు! వాస్తవానికి వారి హృదయాలకు వారి (దుష్ట) కార్యాల త్రుప్పు పట్టింది. అంతే కాదు, ఆ రోజు నిశ్చయంగా, వారు తమ ప్రభువు కారుణ్యం నుండి నిరోధింపబడతారు. తరువాత వారు నిశ్చయంగా, భగభగ మండే నరకాగ్నిలోకి పోతారు. అప్పుడు వారితో: “దేనినైతే మీరు అసత్యమని తిరస్కరిస్తూ వచ్చారో, అది ఇదే!” అని చెప్పబడుతుంది. అలా కాదు! నిశ్చయంగా, ధర్మనిష్ఠాపరుల (పుణ్యాత్ముల) కర్మపత్రం మహోన్నత గ్రంథం (ఇల్లియ్యీన్)లో ఉంది. మరిఇల్లియ్యూన్ అంటే నీవు ఏమనుకుం టున్నావు? అది వ్రాసిపెట్టబడిన ఒక గ్రంథం. దానికి, (అల్లాహ్‌కు) సన్నిహితులైన వారు (దేవదూతలు) సాక్ష్యంగా ఉంటారు.” (అల్‌-ముతప్ఫిఫీన్, 83:7-21)

వాస్తవం ఏమిటంటే హృదయాల్లో పరలోక కోరిక ఉన్న వారికి సత్కార్యాలు చేసే భాగ్యం ప్రసాదించటం జరుగు తుంది. అయితే ఐహిక జీవితాన్ని పొందే ప్రయత్నంలో పరలోకాన్ని మరచినవారు ఉభయ లోకాల్లోనూ సాఫల్యం పొందలేరు. ఉభయలోకాలూ అల్లాహ్‌ (త) చేతుల్లోనే ఉన్నాయి. అందువల్ల ప్రతిఒక్కరూ ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి.

అల్లాహ్‌ ఆదేశం: ”ఎవడు (ఇహలోక) తాత్కాలిక సుఖాలు కోరుకుంటాడో – మేము కోరిన వానికి – దానిలో మాకు ఇష్టంవచ్చినంత, ఒసంగుతాము. తరువాత అతని కొరకు నరకాన్ని నియమిస్తాము, దానిలో అతడు అవ మానంతో బహిష్కరించబడినవాడై దహింపబడతాడు. మరియు ఎవడు విశ్వాసి అయి, పరలోక (సుఖాన్ని) కోరి దానికై కృషి చేయవలసిన విధంగా కృషిచేస్తాడో, అలాంటివారి కృషి స్వీకరించబడుతుంది. నీ ప్రభువు యొక్క బహుమానాలు వీరికీ మరియు వారికీ అందరికీ స్వేచ్ఛగా ప్రసాదించబడతాయి. మరియు నీ ప్రభువు యొక్క బహుమానాలు (ఎవ్వరికీ) నిషేధించబడలేదు. చూడండి! మేము కొందరికి మరికొందరిపై ఏవిధంగా ఘనత నొసంగామో! కాని పరలోక (జీవితసుఖ)మే గొప్ప స్థానాలు గలది మరియు గొప్ప ఘనత గలది.” (బనీ-ఇస్రాయీల్‌, 17:18-21)

”..మన్ య’అమల్‌ సూఅన్‌’ యుజ్‌’జబిహీ..” (అన్నిసా’, 4:123). ఈ ఆయత్ అవతరించబడినపుడు అబూబక్ర్‌ (ర),’ఓ ప్రవక్తా! ఎవరు సాఫల్యం పొందుతారు,’ అని విన్నవించుకున్నారు. దానికి ప్రవక్త (స), ”అల్లాహ్‌ నిన్ను దుఃఖవిచారాల ద్వారా, వ్యాధులద్వారా, ఆపదలద్వారా క్షమించివేస్తాడు” అని అన్నారు.

[5]) వివరణ-5159: ఎందుకంటే అవిశ్వాసికి అతడు చేసిన పుణ్యఫలితంగా ప్రతిఫలం ఇహలోకంలోనే అల్లాహ్‌ (త) ఇచ్చివేస్తాడు. అంటే అల్లాహ్‌ (త) తన దాసులపై అపార కారుణ్యం గలవాడు, అల్లాహ్‌ (త) విశ్వాసికి, అవిశ్వాసికి ఎవరినీ మరువడు. అంటే భూమిపై సంచరించే ప్రాణులన్నిటి ఆహార బాధ్యత అల్లాహ్‌(త)పై ఉంది.

[6]) వివరణ-5160: అంటే మనోకాంక్షలను, సుఖవిలా సాలను అనుసరిస్తే చేరే గమ్యస్థానం నరకం. దైవభీతి, కష్టాలు, ఆపదలను అనుసరిస్తే చేరే గమ్యస్థానం స్వర్గం.

[7]) వివరణ-5164: అంటే జీవితం సాగినంత మాత్రమే ఇవ్వాలి. ప్రవక్త (స) తన కుటుంబానికి అధిక ధన సంపదలను కోరుకోలేదు. ఎందుకంటే ఇటువంటి పరిస్థితుల్లో అల్లాహ్ (త) నుండి ఏమరుపాటుకు గురి కావటం జరుగు తుంది.  ఈ ‘హదీసు’ ద్వారా ముస్లిమ్‌ సమాజానికి ఉపాధి అన్వేషణలో ప్రమాదకరమైనంతగా కష్టపడరాదని తగిన దానికంటే అధిక సంపాదనకోసం ప్రాకులాడరాదని హితబోధ చేయబడింది.

[8]) వివరణ-5170: అంటే అధిక ధనసంపదలు కలిగి ఉండటం వల్ల మనిషి ధనికుడుకాడు. పేదవాడైనప్పటికీ ఇతరుల సంపదలపట్ల నిరపేక్షాభావం కలిగి ఉండేవాడే అసలైన ధనవంతుడౌతాడు. ఉన్నదానితోనే సంతృప్తి చెందేవాడే ధనవంతుడు. ఉన్నదానితో సంతృప్తి చెందే వాడే మేధావుల దృష్టిలో అసలైన ధనవంతుడు. ‘అలీ (ర) ఇలా కవిత్వం చెప్పారు: ”అల్లాహ్‌ మా పట్ల చేసిన తీర్పుపై మేము సంతృప్తిని వ్యక్తం చేస్తున్నాము. ఎందుకంటే మా వంతులో విద్యాజ్ఞానాలు వచ్చాయి. అజ్ఞానుల వంతులో ధనం వచ్చింది. బుద్ధీజ్ఞానాలు ఎల్లప్పుడూ ఉంటాయి. ధనసంపదలు త్వరగా నాశనం అయ్యేవి. మనము నశించేవాటిపై, ఎల్లప్పుడూ ఉండే వాటికి ప్రాధాన్యత ఇస్తున్నాము.”

[9]) వివరణ-5173: అంటే, దైవభీతిలేని దాసుని కంటే దైవభీతిగల దాసుడే ఉత్తముడు.

[10]) వివరణ-5174: అంటే వీటిని మహాభాగ్యంగా భావించి వాటి ద్వారా పుణ్యం సంపాదించాలి. అవి వెళ్ళిపోయిన తర్వాత విచారించటమే తప్ప మరేమీ మిగలదు.

[11]) వివరణ-5175: అంటే పనికంటే ముందు తీరికను మహా భాగ్యంగా భావించాలి. ఒక్కోసారి వీటికి గురి కావలసి ఉంటుంది. విచారించవలసి ఉంటుంది. అవి వచ్చిన తర్వాత విచారించటం వల్ల లాభం ఏమీ లేదు.

[12]) వివరణ-5177: అంటే అల్లాహ్‌ (త) దృష్టిలో ఇహ లోకానికి దోమ రెక్కంత విలువ అయినా లేదు.

[13]) వివరణ-5178: అంటే ప్రాపంచికవృత్తులు, ధన సంపదలు అంటే ఆస్తులు తోటలు, వ్యవసాయం మొదలైనవాటిలో నిమగ్నం కాకండి. దైవధ్యానానికి దూరమైపోతారు. ఎల్లప్పుడూ వాటిగురించే ఆలోచన వస్తూ ఉంటుంది. అంటే ధర్మబద్ధంగా సంపాదించడంలో ఎటువంటి అభ్యంతరం లేదు. ఈ ‘హదీసు’ అర్థం ఏమి టంటే, ఈ ఐహిక జీవితాన్ని పరలోక సంపాదన కోసం ఉపయోగించాలి. విశ్వాసి ఎల్లప్పుడూ పరలోకాన్ని పొందే ఉద్దేశ్యంతోనే ఆచరిస్తాడు. పరలోకానికి హానిచేకూర్చే ఏ కార్యాన్నయినా తిరస్కరిస్తాడు.

[14]) వివరణ-5179: అంటే ఐహిక జీవితాన్ని ప్రేమించే వారు, మరణానంతర జీవితాన్ని నాశనం చేసుకుంటారు, పరలోకాన్ని ప్రేమించేవారు ఐహిక జీవితాన్ని పాడుచేసు కుంటారు. కాని సాధారణంగా నాశనం అయ్యేదానికే ప్రాధాన్యత ఇస్తారు.

అల్లాహ్‌ ఆదేశం:అలాకాదు! మీరు ఐహిక జీవితానికి ప్రాధాన్యత నిస్తున్నారు; కాని పరలోక జీవితమే మేలైనది మరియు చిరకాలముండేది. నిశ్చయంగా, ఈ విషయం పూర్వగ్రంథాలలో (వ్రాయబడి) ఉంది; ఇబ్రాహీమ్ మరియు మూసాలపై (అవతరింపజేయబడిన) గ్రంథాలలో. ” (అల్‌-అ’అలా, 87:16-19)

అల్లాహ్‌ (త) దాసుల్లోని ప్రియభక్తులు ప్రాపంచిక జీవితాన్ని వదలివేసి ఉపద్రవాలకు, కల్లోలాలకు దూరంగా ఉంటారు. ఈ ప్రాపంచిక జీవితం శాశ్వతం కాదని, అది ఒక సముద్రం అని, సత్కార్యాలను ఒక పడవ అని భావిస్తారు.

[15]) వివరణ-5180: అంటే ధనసంపదలు సంపాదించడంలో నిమగ్నమయి ఉంటాడు. ధన వ్యామోహం అతన్ని కట్టి పడేస్తుంది. అతని హృదయంలో అల్లాహ్‌ (త), ఆయన ప్రవక్తపట్ల ప్రేమగానీ, దైవభీతిగానీ, పరలోక విచారణా భయం గాని ఉండదు. అతడు ధనదాసుడు, దైవదాసుడు కాడు. ఇటువంటి వ్యక్తి దైవకారుణ్యానికి దూరమవుతాడు.

[16]) వివరణ-5181: అంటే ప్రాపంచిక వాంఛలు, మనో కాంక్షలు అతని విశ్వాసాన్ని, ధర్మాన్ని తోడేళ్ళకంటే అధికంగా నష్టంకలిగిస్తాయి. తోడేళ్ళు ఆస్తిని నష్టపరుస్తాయి. కాని అత్యాశ, మనోకాంక్షలు అతని విశ్వాసానికి హాని చేకూరుస్తాయి.

[17]) వివరణ-5182: తనకు, తన కుటుంబానికి, ఉపాధికి, తన భార్యాపిల్లల కోసం ఖర్చుపెట్టిన దానికి అతనికి ప్రతిఫలం లభిస్తుంది. అవసరానికిమించి ఉన్నదానికి ప్రతిఫలం లభించదు.

[18]) వివరణ-5187: భయభక్తులు కలిగి ఉంటే అల్లాహ్‌ (త) తప్పకుండా ప్రేమిస్తాడు. ఇంకా ప్రజలు కూడా ప్రేమిస్తారు. జుహ్ద్ అంటే ప్రాపంచిక జీవితాన్ని విస్మరించటం, అసహ్యించుకోవటం. ధనసంపత్తులు అందరికంటే తక్కువగా ఉన్నవాడే అందరికంటే ఉత్తముడు. అతడు ఐహిక సుఖాలను కాంక్షించడు. అంటే భయభక్తులు గలవారిని, అందరికంటే పేదవాడ్ని విచారించటం జరుగదు. ఇమామ్‌ జుహ్‌రీని జుహ్ద్ గురించి ప్రశ్నించటం జరిగింది. దానికి అతను సమాధానం ఇస్తూ, ‘ధర్మంగా సంపాదిస్తూ ఎల్లప్పుడూ దైవానికి కృతజ్ఞతలు తెలుపుతూ ఉండటం, విధులను, అదనపు బాధ్యతలను నిర్వర్తిస్తూ ఉండటం, ‘జకాత్‌, దానధర్మాలు చేస్తూ ఉండటం, అధర్మ సంపాదనకు దూరంగా ఉండటంపై ఓర్పు వహించటం, ఇతరులను అధర్మంగా సంపాదిస్తూ చూసి కూడా తాను అధర్మ సంపాదనకు దూరంగా ఉంటూ తన పేదరికానికే ప్రాముఖ్యత ఇవ్వటం,’ అని పేర్కొనటం జరిగింది.

[19]) వివరణ-5194: అల్లాహ్‌ ఆదేశం: ”నిస్సందేహంగా మీ ధనం, మీ సంతానం పరీక్షలే.” (అల్ అన్ఫాల్, 8:23) ఈ రెంటిలో సాఫల్యం పొందటం చాలా కష్టం. అందువల్ల ధనవంతులు, సంతానవంతులు చాలా అప్రమత్తంగా ఉండాలి.

[20]) వివరణ-5196: అంటే అన్నిటికంటే ముందు ఆరోగ్యం గురించి, చల్లటి నీటి గురించి ప్రశ్నించటం జరుగుతుంది. అల్లాహ్‌ ఆదేశం: ” అప్పుడు, ఆ రోజ మీరు, (ఈ జీవితంలో అనుభవించిన) సౌఖ్యాలను గురించి తప్పక ప్రశ్నించబడతారు.” (అత్ తకాసుర్, 102:8) – అంటే అన్నిటికంటే ముందు ఆరోగ్యం, శాంతి భద్రతలు, ఆహారం మొదలైన అనుగ్రహాల గురించి ప్రశ్నించటం జరుగు తుంది. అంటే వాటిపట్ల ఎంతవరకు కృతజ్ఞుడవై ఉన్నావు?’  అని.

ఇబ్నె అబీ ‘హాతిమ్‌లోని ఒక ‘ఏకోల్లేఖన ‘హదీస్‌’లో ఇలా ఉంది, ”మిట్ట మధ్యాహ్నవేళ ప్రవక్త (స) తన ఇంటి నుండి బయలుదేరి, అబూ బకర్‌ కూడా మస్జిద్‌లోనికి రావడం చూసి, ‘ఈ సమయంలో ఎలా వచ్చావు,’ అని ప్రశ్నించారు. దానికి అబూ బకర్‌ (ర), ‘ఓ ప్రవక్తా! ఏ విషయంవల్ల మీరు బయటకు వచ్చారో, ఆ విషయం వల్లే నేను కూడా బయటకు వచ్చాను,’ అని సమాధానం ఇచ్చారు. ఇంతలో ‘ఉమర్‌ కూడా వచ్చారు. ప్రవక్త (స) అతన్ని కూడా ఇలా ప్రశ్నించారు, దానికి అతను కూడా అదే సమాధానం ఇచ్చారు. ఆ తరువాత ప్రవక్త (స) వారిద్దరితో సంభాషించసాగారు. మాట్లాడుతూ, ‘శక్తి ఉంటే ఆ తోటవరకు పదండి, తినడానికి ఏదైనా మరియు నీడ కూడా తప్పకుండా దొరుకుతుంది,’ అని అన్నారు. దానికి మేము, ‘తప్పకుండా పదండి,’ అని అన్నాం. ప్రవక్త (స) మమ్మల్ని తీసుకొని అబుల్హాషిమ్న్సారీ తోట గేటు వద్దకు వచ్చారు. ప్రవక్త (స) సలామ్‌ చేసి, అనుమతి కోరారు. ఉమ్మె హాషిమ్‌ అ’న్సారియ తలుపు వెనుకనే నిలబడి వింటుంది. కాని బిగ్గరగా సమాధానం ఇవ్వలేదు. ఎందుకంటే ప్రవక్త (స) మరిన్ని సార్లు దీవించాలని. ప్రవక్త (స) అనేకసార్లు సలామ్‌ చేసినా సమాధానం రాకపోయే సరికి, తిరిగి వెనక్కి రాసాగారు. వెంటనే అబుల్‌ హాషిమ్‌ తల్లి పరుగెత్తుకుంటూ వచ్చి, ‘ప్రవక్తా! నేను మీ శబ్దాన్ని విన్నాను కాని, తమరు అనేక సార్లు నన్ను దీవించాలని మౌనం వహించాను. రండి, దయచేయండి,’ అని విన్నవించుకుంది. ఆ తరువాత ప్రవక్త (స), ‘అబుల్‌ హాషిమ్‌ ఏరి?’ అని అన్నారు. దానికి ఆమె, ‘అతను కూడా ఉన్నారు, దగ్గరలోనే నీళ్ళు తీసుకురావటానికి వెళ్ళారు, తమరు రండి, అతను వస్తారు’ అని విన్నవించుకుంది. ప్రవక్త (స) తోటలో ప్రవేశించారు. ఆమె ఒక చెట్టు నీడలో పరిచారు. దానిపై ప్రవక్త (స) కూర్చున్నారు. ఇంతలో అబుల్‌ హాషిమ్‌ కూడా వచ్చి చాలా సంతోషించారు. ఆ వెంటనే ఒక ఖర్జూరం చెట్టుపై ఎక్కి మంచి మంచి ఖర్జూరపు గుత్తులు ఇవ్వసాగారు. చివరికి స్వయంగా ప్రవక్త (స) ఆపివేసారు. అతడు, ‘ఓ ప్రవక్తా! వీటిలో పండువి, ఎండువి రెండూ ఉన్నాయి. తమకు ఇష్టమైనవి తినండి,’ అని అన్నారు. ఖర్జూరాలు తిన్న తర్వాత, మంచి నీరు తెచ్చారు. ప్రవక్త (స) నీళ్ళు త్రాగిన తరువాత, ‘వేటిని గురించి విచారించటం జరుగుతుందో ఆ అనుగ్రహాలు ఇవే’ అని అన్నారు.

ఇబ్నె జరీర్‌లోని ఒక ‘హదీసు’లో ఇలా ఉంది, ”అబూ బకర్‌ (ర), ‘ఉమర్‌ (ర) కూర్చొని ఉన్నారు. ప్రవక్త (స) కూడా వారి వద్దకు వచ్చి, ‘ఎంటీ సంగతి, ఎందుకు కూర్చున్నారు?’ అని ప్రశ్నించారు. ఆ ఇద్దరూ, ‘ప్రవక్తా! చాలా ఆకలిగా ఉంది. అందువల్ల ఇంటి నుండి బయలు దేరి వచ్చాం,’ అని అన్నారు. అప్పుడు ప్రవక్త (స), ‘ఎవరి చేతిలో నా ప్రాణం ఉందో ఆయన సాక్షి! నేను కూడా దానివల్లే బయటకువచ్చాను.’ ప్రవక్త (స) వాళ్ళిద్దరినీ తీసుకొని ఒక అ’న్సారీ ఇంటికి వెళ్ళారు. అతని భార్య ఉన్నారు. ప్రవక్త (స) ‘మీ భర్త ఎక్కడ’ అని అడిగారు. దానికి ఆమె, ‘మంచి నీళ్ళు తీసుకురావటానికి వెళ్ళారు’ అని అన్నారు. ఇంతలో ఆ అ’న్సారీ వచ్చారు. చాలా సంతోషించి, ‘ఈ రోజు నా అంతటి అదృష్టవంతుడు మరొకడు లేడు. ఎందుకంటే ఈ రోజు నా ఇంటికి దైవప్రవక్త (స) వచ్తారు,’ అని అన్నాడు.  ఆ అ’న్సారీ వ్యక్తి నీటి కుండ అటుపెట్టి, తాజా ఖర్జూరపు పండ్ల గుత్తులను తీసుకువచ్చాడు. ప్రవక్త (స) వేర్వేరుగా ఎందుకు తెచ్చావు, అని అడగ్గా, ‘ప్రవక్తా! తమరు తమ ఇష్టమైన విధంగా తినాలని,’ అని సమాధానం ఇచ్చాడు. ఆ తరువాత జంతువును జిబహ్‌ చేసి మాంసం వండుదామని సిద్ధమయ్యాడు. అప్పుడు ప్రవక్త (స), ‘పాలుఇచ్చే జంతువును జిబహ్‌ చేయకు,’ అని అన్నారు. అనంతరం అతడు జిబహ్‌ చేసాడు. ప్రవక్త (స) అక్కడే భోజనంచేసి, ”చూడండి, ఆకలితో వచ్చారు, కడుపులునిండి, తిరిగి వెళుతున్నారు, తీర్పుదినం నాడు ప్రశ్నించబడే ఆ అనుగ్రహాలు ఇవే” అని అన్నారు.

ప్రవక్త (స) విడుదల చేసిన బానిస ఉసైబ్‌ (ర) కథనం: ‘ప్రవక్త (స) రాత్రివేళ నన్ను పిలిచారు. నేను బయలు దేరాను, ఆ తరువాత అబూ బకర్‌ (ర) ను పిలిచారు, ఆ తరువాత ‘ఉమర్‌ (ర)ను పిలిచారు. ఆ తర్వాత అందరూ కలసి ఒక అ’న్సారీ తోటలోనికి వెళ్ళాము. ”రండి, ఏదైనా ఉంటే తిందాం,” అని అన్నారు. అతడు ద్రాక్షగుత్తులు తీసుకువచ్చాడు. ఆ తర్వాత, ‘చల్లని నీరు త్రాపించండి,’ అన్నారు. ఆ తరువాత చల్లని నీరు తెచ్చాడు. ప్రవక్త (స) ఆరగించి, ‘దీన్ని గురించి ప్రశ్నించటం జరుగుతుంది,’ అని అన్నారు. అది విని ‘ఉమర్‌ (ర) ఆ ద్రాక్ష గుత్తులను నేలకేసికొట్టి, ‘దీన్ని గురించి కూడా అల్లాహ్‌ (త) విచారిస్తాడా?’ అని అన్నారు. ప్రవక్త (స), ‘అవును, కేవలం మూడు విషయాలను గురించి అంటే 1. శరీరాన్ని కప్పుకో గలిగేంత వస్త్రం, 2. ఆకలికి తగిన ఆహారం, 3. తల దాచుకునేంత ఇల్లు గురించి విచారించటం జరుగదు’ అని అన్నారు. (ముస్సద్‌ అ’హ్మద్‌)

ముస్నద్‌లోని ఒక ఉల్లేఖనంలో ఇలా ఉంది, ”ఈ సూరహ్‌ అవతరించబడినప్పుడు, ప్రవక్త (స) చదివివినిపించారు. అప్పుడు అనుచరులు, ‘మమ్మల్ని ఏ అనుగ్రహాల గురించి ప్రశ్నించటం జరుగుతుంది, ఖర్జూరాలు తింటున్నాము, నీళ్ళు త్రాగుతున్నాము, కరవాలాలు మెడలో వ్రేలాడుతున్నాయి, శత్రువు తలపై నిల్చున్నాడు,’ అని అన్నారు. దానికి ప్రవక్త (స) ‘ఆందోళన చెందకండి, త్వరలో అనుగ్రహాలు వచ్చేస్తాయి’ అని అన్నారు. ‘ఉమర్‌ (ర) కథనం, ”ఒకసారి మేము కూర్చున్నాము. ప్రవక్త (స) వచ్చారు. స్నానం చేసి వచ్చినట్టు ఉన్నారు. ”ప్రవక్తా! తమరు ఈ సమయంలో సంతోషంలో ఉన్నట్టుంది” అని అన్నాము. దానికి ప్రవక్త (స) ”అవును” అని అన్నారు. ఆ తరువాత ప్రజలు ధనసంపదల గురించి మాట్లాడసాగారు. అప్పుడు ప్రవక్త (స) ”దైవభక్తి, దైవభీతి గలవారికి ధనసంపదలు ఏమీ హాని చేకూర్చలేవు. అయితే, గుర్తుంచుకోండి! దైవభీతి పరునికి మరణం ధన సంపదల కంటే ఉత్తమమైనది. ఇంకా సంతోషం కూడా దేవుని అనుగ్రహమే,” అని అన్నారు. ఇబ్నె మాజహ్ లో కూడా ఈ ‘హదీసు’ ఉంది,

తిర్మిజిలో ఇలా ఉంది: ”తీర్పుదినం నాడు అనుగ్రహాలను ప్రశ్నించే విషయంలో అన్నిటికంటే ముందు, ”మేము నీకు ఆరోగ్యం ప్రసాదించలేదా? చల్లటి మంచినీరు ప్రసాదించ లేదా?” అని ప్రశ్నించటం జరుగుతుంది.

ఇబ్నె అబీహాతిమ్‌లో ఇలా ఉంది, ”సుమ్మలతుస్‌ అలున్న” అనే వాక్యం విని, ‘ప్రవక్తా! మేము కేవలం యవ్వరొట్టెలు, సగంకడుపే తింటున్నాము,’ అని అన్నారు. అప్పుడు ”మీరు కాళ్ళను రక్షించు కోవటానికి చెప్పులు ధరించటం లేదా? మీరు చల్లటి మంచినీరు త్రాగటం లేదా? ఇవే చాలా గొప్ప అనుగ్రహాలు” అని అన్నారు. మరో ఉల్లేఖనంలో ఇలా ఉంది, ”ఆరోగ్యం శాంతి భద్రతల గురించి ప్రశ్నించటం జరుగుతుంది. అదేవిధంగా కడుపునిండా అన్నం గురించి, చల్లటి నీటి గురించి, నీడగురించి, మంచి నిద్రగురించి ప్రశ్నించటం జరుగుతుంది. అదేవిధంగా తేనెగురించి, సుఖాలు గురించి, మూడుపూటల ఆహారం గురించి, ఆహార పదార్థాల గురించి అంటే దైవానుగ్రహాలన్నిటి గురించి ప్రశ్నించడం జరుగుతుంది.”  ఇబ్నె ‘అబ్బాస్‌ (ర) దీన్ని గురించి వ్యాఖ్యానిస్తూ శరీర అవయవాల ఆరోగ్యం గురించి వాటిని ఎలా ఉపయోగించారని కూడా ప్రశ్నించటం జరుగుతుంది.

అల్లాహ్‌ ఆదేశం: ”నిశ్చయంగా చూపులూ, వినికిడీ మరియు హృదయం వీటన్నింటినీ గురించీ, (తీర్పు దినమున) ప్రశ్నించడం జరుగుతుంది.” (అల్ ఇస్రా’, 17:36)

స’హీ’హ్ బు’ఖారీలో ఇలా ఉంది, ”ప్రజలు రెండు అనుగ్రహాల విషయంలో చాలా ఏమరు పాటుకు గురై ఉన్నారు. అంటే ఆరోగ్యం, తీరిక. వాటిపట్ల కృతజ్ఞత చూపడంలేదు, వాటి గొప్ప తనాన్ని గుర్తించడమూ లేదు. ఇంకా వాటిని దైవాదేశాను సారం ఉపయో గించటమూ లేదు.”

బ’జ్జార్‌లో ఇలా ఉంది, ”కట్టుకునే వస్త్రం, నీడగల గోడలు, రొట్టె ముక్కలు తప్ప ప్రతి విషయం గురించి తీర్పుదినం నాడు విచారించటం జరుగుతుంది.”

ముస్నద్‌ అ’హ్మద్‌లో ఇలా ఉంది, ”తీర్పుదినం నాడు అల్లాహ్‌ (త) ఇలా ఆదేశిస్తాడు, ”ఓ ఆదమ్‌ కుమారా! నేను నిన్ను గుర్రాలపై, ఒంటెలపై ఎక్కించాను. స్త్రీలను నీ అధీనంలోనికి ఇచ్చాను, నీకు సుఖంగా, విలాస వంతంగా, ఆరోగ్యంగా ప్రశాంతంగా జీవించే అవకాశం ప్రసాదించాను. ఎటువంటి భయంలేకుండా జీవించే భాగ్యం ప్రసాదించాను. ఇప్పుడు చెప్పు, దీనంతటికీ కృతజ్ఞత ఏది?” (తఫ్‌సీర్‌ ఇబ్నె కసీ’ర్‌)

[21]) వివరణ-5198: అంటే రూపురేఖల్లో, అందచందాల్లో, కాదు. మంచిలో, దైవభీతిలో ఉత్తములై ఉండాలి. ఇటువంటి ఉత్తముడే అందరికంటే గొప్పవాడు, ఖుర్‌ఆన్‌లో అల్లాహ్‌ ఆదేశం: ”నిశ్చయంగా మీలో ఎక్కువ దైవభీతిగల వాడే, అల్లాహ్‌ దగ్గర ఎక్కువ గౌరవం గలవాడు.” (హుజురాత్, 49:13)

[22]) వివరణ-5200: ఖమిఉన్‌” అంటే వడపోసే జల్లెడ. అంటే చెవితో వినే విషయాలు హృదయం వరకు చేరుతాయి. సత్యం విని, హృదయంతో స్వీకరించి, దాన్ని ఆచరిస్తే, అటువంటి వ్యక్తికి సాఫల్యం సిద్ధిస్తుంది. ఒకవేళ దాన్ని గుర్తుంచుకోకుండా, దాన్ని ఆచరించక పోతే, అటువంటి వ్యక్తికి కఠినశిక్ష పడుతుంది. అదేవిధంగా ధిక్కరించేవారిని కూడా కఠినంగా శిక్షించటం జరుగు తుంది. అంటే చిన్నచిన్న పాపాలను లెక్కచేయకుండా, వాటిని చేస్తూ పోతూ, ఏ మాత్రం పశ్చాత్తాపపడకుండా ఉన్నా కఠిన శిక్షకు గురికావటం జరుగుతుంది. అంటే సత్యాన్ని విని కూడా విననట్లు ఉండి, దాన్ని ఆచరించని వారినికూడా కఠినంగా శిక్షించటం జరుగుతుంది. అంటే కళ్ళు, ముక్కు, చెవి ఇవన్నీ విషయాలను హృదయానికి చేరవేస్తాయి. అందువల్ల వీటన్నిటినీ విచారించటం జరుగుతుంది.

[23]) వివరణ-5201: ఈ వాక్యపు అర్థం ఏమిటంటే, మా హెచ్చరికలను మరచి, విశ్వసించని వారికి మేము ఉపాధి ద్వారాలన్నీ తెరచివేస్తాము. దానివల్ల వారు పూర్తిగా సన్మార్గానికి దూరమవుతారు. వారు పూర్తిగా ప్రాపంచిక సుఖసంతోషాల్లో మునిగితేలుతూ ఉండగా, అకస్మాత్తుగా వారిని పట్టుకోవటం జరుగుతుంది. ఆ స్థితిలో వారు ప్రతి విషయం నుండి నిరాశ చెందుతారు.

[24]) వివరణ-5202: అస్‌’హాబె సుఫ్ఫహ్: ప్రవక్త (స) అనుచరుల్లో చాలామంది ధార్మిక వ్యవహరాలతో పాటు వ్యాపారం, వ్యవసాయం, ఉద్యోగం మొదలైనవి చేసేవారు. కాని వీళ్ళు తమ జీవితాన్ని ఆరాధన, శిక్షణ, దైవమార్గాలకు అంకితంచేసారు. వీరికి భార్యాబిడ్డలు ఉండేవారు కారు. పెళ్ళి చేసుకున్న తర్వాత ఆ బృందం నుండి విడిపోయేవారు. వీళ్ళు పగటిపూట ప్రవక్త (స) సన్నిధిలో గడిపేవారు. ‘హదీసు’లను వినేవారు. రాత్రి పూట అరుగుపై నిద్రపోయేవారు. అరబీలో అరుగును ‘సుఫ్ఫహ్ అంటారు. అందువల్లే వీరిని ‘సుఫ్ఫహ్ వాళ్ళు అంటారు. వీరిలో ఎవరివద్దా దుప్పటి, లుంగీ రెండూ ఒకేసారి ఉండేవి కావు. ఉన్న వస్త్రంతోనే శరీరాన్ని కప్పుకునే వారు. అబూ హురైరహ్‌ (ర) (వీరిలో ఒకరు). అతని కథనం, ”మాలో ముగ్గురువ్యక్తులు ఎలాంటి వారంటే, వారి దుస్తులు, వారి తొడల వరకు కూడా చేరేవికావు. అందువల్ల వారు, నమా’జులో రుకూ చేసినపుడు దుస్తులను తమచేత్తో ముడుచుకునేవారు. మర్మాంగాలు కనబడకుండా ఉండాలని. ఒకసారి మస్జిద్‌లో వాళ్ళ పఠనక్లాసు జరుగుతుంది. ప్రతి వ్యక్తి మరొకరితో కలిసి కూర్చున్నారు – తమ మర్మాంగాలు కప్పి ఉండాలని. వీరి ఉపాధి మార్గం ఎలా ఉండేదంటే, వారిలో ఒక బృందం అడవికి వెళ్ళి కట్టెలు ఏరి తెచ్చి, వాటిని అమ్మి అందరి కోసం ఆహారం ఏర్పాటు చేసేది. చాలా మంది అన్సారులు ఖర్జూరం ఎండిన కొమ్మలు కోసి వాటిని తెచ్చి, మస్జిద్‌పై వేసేవారు. అవి ఎండి రాలితే, వాటిని తీసుకునే వారు. ఒక్కోసారి, 1, 2 రోజుల వరకు ఆహారం లభించేది కాదు. ప్రవక్త (స) మస్జిద్‌లోనికి వచ్చి, నమా’జు చదివించేవారు. వీళ్ళూ వచ్చి నమా’జ్‌లో పాల్గొనేవారు. కాని ఆకలి, బలహీనత వల్ల నమా’జు స్థితిలో క్రిందపడేవారు. బయటివారు వచ్చి, వాళ్ళను చూసి పిచ్చివారుగా భావించేవారు. ఏవైనా వస్తువులు ప్రవక్త (స) వద్దకువస్తే వారివద్దకు పంపేవారు. అదేవిధంగా విందుభోజనం వస్తే, వాళ్ళను కూడా పిలిపించుకునేవారు. వారితోపాటు కూర్చొని తినేవారు. తరచూ ప్రవక్త (స) వారిని అ’న్సార్‌, ముహాజిరీన్లలో పంచివేసేవారు. అంటే ప్రతిఒక్కరూ తన శక్తిమేరకు ఒకరూ లేక ఇద్దరినీ తమఇంటికి తీసుకొని వెళ్ళి తినిపించేవారు. అద్బిన్‌ ‘ఉబాదహ్ (ర) చాలా ధనవంతులు, ధర్మాత్ములు. అతను ఒక్కోసారి 80 మందివరకు తన ఇంటికి తీసుకొనివెళ్ళి అన్నం తినిపించే వారు. అందువల్ల ప్రవక్త (స) అతన్ని చాలా అభిమానించేవారు. వారికి తోడుగా కూర్చునేవారు. వారితోపాటు భోజనం చేసేవారు. ఇంకా ప్రజలను వారిపట్ల గౌరవమర్యాదలను కలిగి ఉండమని ప్రోత్సహించేవారు. ఒకసారి ‘సుఫ్ఫహ్ వారు ఖర్జూరాలు మా పొట్టలు కాల్చివేసాయి అని ప్రవక్త (స)తో ఫిర్యాదు చేసారు. ప్రవక్త (స) వారి ఫిర్యాదు విని, వారిని ఓదార్చటానికి ఒక ప్రసంగంచేసారు. అందులో ఇలా ప్రవచించారు, ”ఖర్జూరాలు మా పొట్టలను కాల్చి వేసాయని,”మీరంటున్నారు. కాని ఖర్జూరాలే మదీనహ్ వాసుల ఆహారం అనే విషయం మీకు తెలియదు. వాటి ద్వారానే మీకు సహాయం చేస్తున్నారు. అల్లాహ్ సాక్షి! ఒకటి లేదా రెండు నెలల నుండి ప్రవక్త () ఇంటిలో పొయ్యి వెలగలేదు. కేవలం ఖర్జూరం, నీటిపైనే గడుపుతున్నారు. ప్రవక్త (స) ఎల్లప్పుడూ వాళ్ళను గురించి గుర్తుంచుకునేవారు. ఒకసారి ఫాతిమహ్ (ర) పిండిమర తిప్పుతూ ‘చేతులు నొప్పెట్టు తున్నాయి. ఒక సేవకురాలిని ఇప్పిస్తే బాగుండు’ అని విన్నవించు కున్నారు. దానికి ప్రవక్త (స) నీకు ఇచ్చి ‘సుఫ్ఫహ్ వాళ్ళను చావటానికి వదలివేయలేను. ఖుర్‌ఆన్‌లో అల్లాహ్‌ (త) వారిగురించి చాలా ప్రత్యేకంగా పేర్కొని ఉన్నాడు, అని అన్నారు. ఒక సారి వారిలో ఉత్తములైన అబ్దుల్లాహ్ బిన్ఉమ్మె మక్తూమ్ (ర) పట్ల ప్రవక్త (స) అశ్రద్ధవహించడం జరిగింది. దాన్ని గురించి దైవాదేశం అవతరించింది. ఆ తరువాత నుండి ప్రవక్త (స) అతన్ని చూసి ఆయన్ను గౌరవించేవారు. వీళ్ళు సాధారణంగా రాత్రి ఆరాధనలో గడిపేవారు, ఖుర్‌ఆన్‌ పఠించేవారు. వీరికి ఒక నాయకుడు కూడా ఉండేవాడు. రాత్రిపూట అతని వద్దకువెళ్ళి చదివేవారు. వీరిని ఖారీ అనేవారు. ఇస్లామ్‌ కోసం ఎక్కడికైనా పంపిస్తే వీరినే పంపించేవారు. కయ్యతున్‌ అంటే వాతలు పెట్టటం,

అల్లాహ్‌ ఆదేశం: ” ఓ విశ్వాసులారా! నిశ్చయంగా, చాలా మంది యూద మతాచారులు (హ్బార్) మరియు క్రైస్తవ సన్యాసులు (రుహ్బాన్) ప్రజల సొత్తును అక్రమ పద్దతుల ద్వారా తినివేస్తున్నారు మరియు వారిని అల్లాహ్‌ మార్గం నుండి ఆటంకపరుస్తున్నారు. మరియు ఎవరైతే వెండి, బంగారాన్ని కూడబెట్టి, దానిని అల్లాహ్‌ మార్గంలో ఖర్చుపెట్టరో వారికి బాధాకరమైనశిక్ష గలదనే వార్తను వినిపించు. ఆ దినమున దానిని (జకాత్‌ ఇవ్వని ధనాన్ని / ఆ వెండి బంగారాన్ని) నరకాగ్నిలో కాల్చి దానితో వారి నుదురుల మీద, ప్రక్కల మీద మరియు వీపుల మీద వాతలు వేయబడతాయి. (అప్పుడు వారితో ఇలా అనబడుతుంది): ‘ఇదంతా మీరు మీకొరకు కూడబెట్టుకున్నదే, కావున మీరు కూడబెట్టుకున్న దానిని చవిచూడండి.’ ” (అత్తౌబహ్‌, 9:3435

ప్రవక్త (స) ఈ ఆయతును గురించి వ్యాఖ్యానిస్తూ, వెండి, బంగారాల్లో ‘జకాత్‌ చెల్లించనివారిని తీర్పుదినం నాడు అతని వెండీ, బంగారాలను పలకలుగా చేసి దాన్ని నరకాగ్నిలో కాల్చి దాని ద్వారా అతని శరీరంపై వాతలు పెట్టటం జరుగుతుంది. ఆ దినమంతా అదే శిక్షకు గురిచేయడం జరుగుతుంది. ఆ తర్వాత స్వర్గం లేదా నరకంలోనికి వెళ్ళవలసిందే. (బు’ఖారీ)

అంటే ఆ ధనం సర్పంగా మారి వెంటాడుతుంది. చివరికి ఆ పాము అతన్ని వెంటాడి పట్టుకొని, అతని చేతిని నములుతుంది. ఇంకా అతని మెడలో హారంగా చుట్టు కుంటుంది. ఇంకా నేను నీ ధనాన్ని, నన్నే నీవు కూడ బెడుతూ ఉండేవాడివి అని అంటుంది. (బు’ఖారీ, నసాయి)

‘జకాత్‌ ఇవ్వకుంటే ఇటువంటి శిక్షలనే ఎదుర్కోవలసి ఉంటుంది. అయితే ‘జకాత్‌ చెల్లించే ధనం పరిశుద్ధంగా ఉంటుంది. ఇటువంటి ధనం ఎంత ఉన్నా ఎటువంటి భయంలేదు. ‘జకాత్‌ చెల్లించని ధనాన్నే కన్జ్ అంటారు.

ఉమ్మె సలమహ్ కథనం: నేను బంగారు ఝుమ్హ్ ధరించి ప్రవక్త (స)ను ఇది కన్‌జ్‌ అవుతుందా? అని అడిగాను. దానికి ప్రవక్త (స), ‘ఒకవేళ ఇది ‘జకాత్‌ పరిమాణానికి చేరి, దాని ‘జకాత్‌ చెల్లిస్తే కన్‌’జ్‌ అవదు, చెల్లించకపోతే కన్‌’జ్ అవుతుంది,’ అని అన్నారు. (మాలిక్‌, అబూ దావూద్‌)

‘జకాత్‌లో పరిమాణం షరతు ఉంది. వెండి పరిమాణం 200 దిర్హమ్లు, ఒక దిర్‌హమ్‌ సుమారు 4 అణాలు అవుతుంది. 200 ఇంచుమించు 52 రూపాయలు ఉంటుంది. బంగారంలో 20 దీనార్లు ఉండాలి. ఒక దీనార్‌ 4½  మాషాలు ఉంటుంది. 20 దీనార్లు 7½ తులాలు ఉంటుంది. 7½ తులాలు బంగారంలో ‘జకాత్‌ తప్పనిసరి అవుతుంది. ‘సుప్ఫహ్ వారిలో క్రమంగా ఒకరి తరువాత ఒకరు మరణించారు. వారిలో ఒకరు ఒక దీనారు వదలి మరణించారు. మరొకరు 2 దీనార్లు వదలి మరణించారు. వాటిని గురించి ప్రవక్త (స) ఒకమచ్చ, రెండు మచ్చలు అని పేర్కొన్నారు. అంటే వారిపై ‘జకాత్‌ తప్పనిసరి అవలేదు. కాని వారు పేదలతో, భక్తులతో ఉండేవారు. ఇటువంటి పరిస్థితుల్లో 1 లేక 2 దీనార్లు వదలి వెళ్ళడం చాలా విచారకరమైన విషయం. అంటే ప్రవక్త (స), హితవుకోరి ఇలా చెప్పారు.

[25]) వివరణ-5204: అల్‌ ‘అఖ్బహ్ అంటే ఎత్తైన కొండ  ప్రాంతం. ఇది మినా మరియు మక్కహ్కు మధ్య ఉంది. ఇక్కడే హాజీలు కంకరరాళ్ళు రువ్వే జమరహ్‌ ఉంది. లైలతుల్‌ ‘అఖబహ్‌ అంటే అ’న్సారులు మక్కహ్లో ప్రవక్త (స) చేతిపై బై’అత్‌ చేసిన రాత్రి. మొదటి సంవత్సరం 12 మంది వచ్చారు. వాళ్ళు కొండ ప్రాంతంపై బై’అత్‌ చేసారు. దాన్ని ”బై’అతుల్‌ ‘అఖబహ్‌ అల్‌ ఊలా” అంటారు. రెండవ సంవత్సరం 70 మంది వచ్చారు. దీన్ని ”బై’అతె అ’ఖబహ్ సానీ,” అంటారు. నేను లైలతుల్‌ ‘అఖబహ్‌లో పాల్గొన్నాను. ఎందుకంటే ఈ రాత్రిలోనే ఇస్లామ్‌ స్థాపన జరిగింది. ఖుర్‌ఆన్‌లో కూడా ‘అఖబహ్‌ అనే పదం వచ్చింది.

అల్లాహ్‌ ఆదేశం: ”కాని అతడు కష్టతరమైన ఊర్ధ్వ గమనానికి సాహసించలేదు! మరియు ఆ ఊర్ధ్వగమనం అంటే ఏమిటో నీకు తెలుసా? అది ఒకని మెడను (బానిసత్వం నుండి) విడిపించడం. లేదా! (స్వయంగా) ఆకలిగొని ఉన్న రోజు కూడా (ఇతరులకు) అన్నం పెట్టడం. సమీప అనాథునికి గానీ; లేక, దిక్కులేని నిరుపేదకు గానీ! మరియు విశ్వసించి, సహనాన్ని బోధించేవారిలో! మరియు కరుణను ఒకరికొకరు బోధించు కునేవారిలో చేరిపోవడం.” (అల్‌ బలద్, 90:11-17

తఫ్‌సీర్‌ ఇబ్నె కసీ’ర్‌లో ఇలా ఉంది, ”ఇబ్నె  ‘ఉమర్‌ (ర) ఇది నరకంలోని ఎత్తుగా ఉండే కొండపేరు అని అభిప్రాయ పడ్డారు. క’అబ్‌ బిన్‌ అ’హ్‌బార్‌ నరకంలో 70 తరగతులు ఉన్నాయని అభిప్రాయపడ్డారు. ఖతాదహ్ ఇది ఎత్తైన పర్వత శ్రేణి అని అభిప్రాయపడ్డారు.

[26]) వివరణ -5207: ఖుర్‌ఆన్‌లో అల్లాహ్‌ ఇలా ఆదేశిస్తున్నాడు: ”(ఇహలోక) పేరాస మిమ్మల్ని ఏమరు పాటులో పడవేసింది; మీరు గోరీలలోకి చేరేవరకు. అలా కాదు! త్వరలోనే మీరు తెలుసుకుంటారు. మరొక సారి (వినండి)! వాస్తవంగా, మీరు అతి త్వరలోనే తెలుసు కుంటారు.” (అత్తకాసుర్‌, 102:1-4 ) – ‘అంటే ప్రాపంచిక వ్యామోహం, అత్యాశ మిమ్మల్ని ఏమరు పాటుకు గురిచేసింది. కాని ఏం చేస్తాం, అకస్మాత్తుగా మీకు మరణం సంభవిస్తుంది. మీరు సమాధుల్లోకి చేరుకుంటారు.’

ప్రవక్త (స) ప్రవచనం, ”దైవవిధేయతను మరచి, ఏమరు పాటుకు గురై, మరణంవరకు దానికి దూరంగానే ఉన్నారు.” (ఇబ్నె అబీ ‘హాతిమ్‌) ‘హసన్‌ బ’స్రీ అభిప్రాయం, ”సంతానం, ధనసంపదల వ్యామోహంలో పడి మరణాన్ని విస్మరించారు.”

‘స’హీ’హ్ బు’ఖారీలో ఇలా ఉంది: ఉబయ్‌ బిన్‌ క’అబ్‌ (ర) కథనం: ”అంటే మనిషి వద్ద ఒక అడివంత బంగారం ఉన్నా, దీన్ని మేము ఖుర్‌ఆన్‌ ఆయతు అనుకున్నాం ఇంతలో ఈ సూరహ్‌ అవతరించింది.  

ముస్నద్‌ అ’హ్మద్‌లో ఇలా ఉంది, ”అబ్దుల్లాహ్‌ బిన్‌ షఖీర్‌ (ర) కథనం, ”నేను ప్రవక్త (స) వద్దకు వెళ్ళినప్పుడు, ప్రవక్త (స) ఈ ఆయతు పఠిస్తున్నారు. ప్రవక్త (స) ప్రవచనం, ”మనిషి నా ధనం, నా ధనం,  అంటాడు, అయితే తిని నాశనం చేసిందే నీ ధనం అవుతుంది. లేదా ధరించి చించివేసిందే నీ ధనం అవుతుంది. లేదా దానధర్మాలు చేసిందే నీ ధనం అవుతుంది.” ముస్లిమ్‌లో ఇది అధికంగా ఉంది, ”దానికిమించి ఉన్నది నువ్వు ప్రజలకోసం వదలి వెళ్ళవలసిందే.” బు’ఖారీలో ఇలా ఉంది, ”మృతుని వెంట మూడు విషయాలు వెళతాయి. వాటిలో రెండు తిరిగి వచ్చేస్తాయి. కేవలం ఒకటి మాత్రం మృతుని వెంట ఉంటుంది. కుటుంబ సభ్యులు, ధనం తిరిగి వచ్చేస్తాయి, కేవలం ఆచరణ మృతుని వెంట ఉంటుంది. అందరూ వదలి వచ్చారు, తోడు వెళ్ళింది కేవలం ఆచరణే.”

ముస్నద్‌ అహ్మద్‌లో ఇలా ఉంది, ”మనిషి వృద్ధాప్యానికి చేరుకుంటాడు. కాని రెండు విషయాలు అతని వెంట ఉంటాయి. అత్యాశ, మనోకాంక్షలు.” 

ఖతాదహ్‌ (ర) కథనం, ”ప్రజలు తమ ఆధిక్యత, అధిక సంఖ్యపై గర్వాన్ని ప్రదర్శిస్తారు. చివరికి ఒక్కొక్కరు క్రమంగా సమాధిలోనికి చేరుకున్నారు. అంటే మనోకాంక్షలు అలాగే ఉండిపోయాయి. కాని వారు మాత్రం మరణించారు.”

[27]) వివరణ-5208: మేలు అంటే అధిక ధనసంపదలు, చట్టబద్ధంగా వాటి రక్షణకు నిధులు ఉన్నాయి. వాటి తాళాలు కూడా ఉన్నాయి. అంటే మంచీ చెడు గుప్త నిధులు వంటివి. వీటిని తెరవటానికి చట్టబద్ధ జ్ఞానం ఉన్నవారు, పేదలకు, అగత్యపరులకు సేవ, సహాయ సహకారాలు అందించాలి. ఇతరులకు విద్యనేర్పాలి. దీని ద్వారా ఇతరులకు లాభం చేకూరుతుంది. అంటే వీరు ఈ నిధుల బాధ్యులు. అల్లాహ్‌(త) ఆదేశించిన చోట వీరు ఖర్చుచేస్తారు. దైవభీతిపరులు, ధనవంతులు, పండితులు మంచికి తాళంచెవి వంటివారు. పిసినారి ధన వంతులు, మూర్ఖులు చెడుకు తాళం చెవి వంటివారు.

[28]) వివరణ-5210: అంటే ఈనాడు భవనం నిర్మిస్తే, ఒకనాడు ధ్వంసం అవుతుంది. అదేవిధంగా అవసరానికి మించి భవనాలు నిర్మించడం, వాటిపై గర్వాహం కారాలను ప్రదర్శించటం ధర్మానికి దూరం చేస్తుంది. అబూ నయీమ్‌ హిల్‌యహ్లో ముజాహిద్‌ ద్వారా ఉల్లేఖించారు. ఆదమ్‌ (అ) భూమిపై దిగిన తర్వాత అన్నిటికంటే ముందు అల్లాహ్‌ (త) ఇలా దైవవాణి పంపాడు, ”మరణించటానికి సంతానం కనండి, శిథిలమవడానికి భవనాలు నిర్మించండి.” (తయ్యిబిల్‌ ఫరాసిఖ్‌ ఇలా మనాజిలిల్‌ బఖరి వల్‌ బరాజిఖ్‌)

[29]) వివరణ-5211: ఈ ప్రాపంచిక జీవితం అశాశ్వత మైనది. ఇది కొన్నిదినాలు మాత్రమే. ప్రాపంచిక నివాసం కోల్పోతుంది. మరొకరు అక్కడ నివాసమై పోతారు. అటువంటి నివాసం నిర్మించినందువల్ల లాభం ఏంటి? ధనం విషయం కూడా ఇంతే, బుద్ధిలేనివారే, అవివేకులే ధనం కూడబెట్టడంలో నిమగ్నమై ఉంటారు.

అల్లాహ్‌ఆదేశం: ”అపనిందలు మోపే, చాడీలు చెప్పే ప్రతి ఒక్కడికీ వినాశం తప్పదు. ఎవడైతే ధనాన్ని కూడబెట్టి, మాటిమాటికి దాన్ని లెక్కబెడుతూ ఉంటాడో! తన ధనం, తనను శాశ్వతంగా ఉంచుతుందని అతడు భావిస్తున్నాడు! ఎంత మాత్రం కాదు! అతడు (రాబోయే జీవితంలో) తప్పకుండా అణగద్రొక్కబడే నరకాగ్నిలో వేయబడతాడు. (అణగద్రొక్కబడే) నరకాగ్ని అంటే ఏమిటో నీకు తెలుసా? అల్లాహ్, తీవ్రంగా ప్రజ్వలింప జేసిన అగ్ని; అది గుండెల దాకా చేరుకుంటుంది. నిశ్చయంగా, అది వారిమీద క్రమ్ము కొంటుంది; పొడుగాటి (అగ్ని) స్తంభాలవలె!. (అల్‌ హుమ’జహ్, 104:1-9

అంటే పరోక్షంగా ఇతరుల లోపాలను పేర్కొనేవాడు, ఇతరుల గురించి హీనంగా మాట్లాడేవాడు. ఇంకా ధనాన్ని లెక్కిస్తూ ప్రోగుచేస్తాడు.

కఅబ్‌ కథనం: పగలంతా ధన సంపాదనలో మునిగి ఉంటాడు. రాత్రి శవంలా పడి ఉంటాడు. అయితే ఇది వాస్తవం కాదు. ఇటువంటి పిసినారి నరకంలో అతి నీచతరగతిలో పడతాడు. అది అందులో పడే ప్రతి వస్తువును నుజ్జు నుజ్జు చేసివేస్తుంది.

సూరహ్‌ యూనుస్లో కూడా ప్రాపంచిక విషయాల్లో నిమగ్నమై జీవించే వారిని హెచ్చరించబడింది. అల్లాహ్‌ఆదేశం: ”నిశ్చయంగా, ఎవరైతే మమ్మల్ని కలుసు కోవటాన్ని ఆశించక, ఇహలోక జీవితంతోనే సంతసించి, దానితోనే తృప్తి చెందుతారో మరియు మా సూచనలను (ఆయాత్‌ లను) గురించి నిర్లక్ష్యభావం కలిగి ఉంటారో!  అలాంటి వారి ఆశ్రయం –  తమ కర్మలకు ఫలితంగా – నరకాగ్నియే!” (యూనుస్, 10:7-8) – ‘అంటే ప్రాపంచిక జీవితం పట్ల ఎంత శ్రద్ధ చూపారంటే, పరలోకాన్ని పూర్తిగా మరచిపోయారు. ప్రాపంచిక జీవితాన్నే దైవంగా చేసుకున్నారు. దైవసూచనల పట్ల ఏమాత్రం ఆలోచించ లేదు. ఈ వ్యవస్థ అంతా ఒక ఉద్దేశ్యపూర్వకంగా నిర్మించడం జరిగింది. మొదటిసారి సృష్టించడం కష్టం కానపుడు రెండవసారి సృష్టించడం ఎలా కష్టం అవుతుంది.

ఇబ్నె ‘అసాకిర్‌ సద్‌ఖహ్ బిన్‌ య’జీద్‌ ద్వారా కథనం: తరాబలస్‌లో మూడు ఎత్తైన ప్రాంతాల్లో సమాధులు చూచాను. ఒక సమాధిపై ఇలా వ్రాసి ఉంది. ”ఎవరికి, మరణం అకస్మాత్తుగా ఈ ప్రపంచం నుండి తీసుకు పోతుందని, గర్వాహంకారాలన్నీ హరించుకు పోతాయని, ఒక చీకటిగదిలో తీసుకుపోయి పడేస్తుందని, నమ్మకం ఉంటుందో, అటువంటి వ్యక్తి ప్రాపంచిక భోగవిలాసాలు ఎలా అనుభవించగలడు?”

అదేవిధంగా రెండవ సమాధిపై కూడా ఇలా వ్రాయబడి ఉంది, ”అందరి సృష్టికర్త అయిన అల్లాహ్‌ (త) తప్ప కుండా తనను విచారిస్తాడని, దాసులపై తాను చేసిన అత్యాచారాలకు ప్రతీకారం తీర్చుకుంటాడని, ఇంకా తాను చేసిన సత్కార్యాలకు ప్రతిఫలం ప్రసాదిస్తాడని తెలిసిన వ్యక్తి ఎలా సుఖంగా జీవించగలడు?”

అదేవిధంగా మూడవ సమాధిపై ఇలా వ్రాయబడి ఉంది:  ”సమాధిలోకి వెళ్ళవలసి ఉందని, దాని దశలు యవ్వనాన్ని మరిపింపజేస్తాయని, ముఖారవిందాన్ని మార్చివేస్తాయని,  దుమ్ములను ధ్వంసం చేసి వేస్తుందని తెలిసిన వ్యక్తి ఎలా సుఖంగా జీవించగలడు. ఆ శ్మశాన వాటికకు దగ్గరిలో ఒక గ్రామం ఉండేది. నేనక్కడకు వెళ్ళాను. అక్కడ ఒక వృద్ధున్ని కలిసాను. నేనతనితో, ‘ఈ శ్మశానవాటికలో ఒక వింత చూసానని,’ అన్నాను. దానికి ఆ వ్యక్తి, ‘ఏమిటి,’ అన్నాడు. నేను ఆ సమాధులను గురించి చెప్పాను. దానికావ్యక్తి, ‘అంతకంటే ఆశ్చర్యకరమైన విషయం కూడా ఉంది,’ అని అన్నాడు. దానికి నేను ‘తమరు నాకు తెలియపర్చండి,’ అని అన్నాను. దానికి ఆ వ్యక్తి, ”ఈ మూడు సమాధుల్లో ఉన్నవారు ముగ్గురు సోదరులు. ఒకరు రాజువద్ద మంత్రి, మరొకరు గొప్ప వ్యాపారి, మరొకరు చాలా గొప్ప దైవభక్తుడు. ఏకాంతంలో దైవారాధనలో ఉండేవాడు. ఈ వ్యక్తి మరణం ఆసన్నమయింది. అతని ఇద్దరు సోదరులు మంత్రి, వ్యాపారి కలవడానికి వచ్చారు. తమ సోదరునితో ‘తమరేదైనా వాఙ్మూలం ఇవ్వాలను కుంటే తప్పకుండా ఇవ్వండి,’ అని అన్నారు. దానికి ఆ వ్యక్తి, ‘నా దగ్గర ధనంలేదు, సామగ్రి కూడాలేదు, నాపై ఎవరి రుణం లేదు, మరి నేనేమి వాఙ్మూలం ఇవ్వగలను. అయితే నా మరణానంతరం నాకు ఒక ఎత్తైన ప్రదేశంలో ఖననం చేయాలి. నా సమాధిపై ఇలా వ్రాయించాలి’ అని అన్నాడు. ‘మీరిద్దరూ మూడు రోజుల వరకు నా సమాధి వద్దకు వస్తూపోతూ ఉండాలి, మీకు ఏదైనా గుణపాఠం లేదా హితబోధ కలగవచ్చు,’ అని అన్నాడు. ఆ ఇద్దరు సోదరులు అలాగే చేసారు. మూడవ రోజు మంత్రి అయిన సోదరుడు వచ్చి, తిరిగి వెళుతుండగా, సమాధిలోపలి నుండి విస్ఫోటమైన ఒక శబ్దం విన్నాడు. దాని కావ్యక్తి భయపడి, ఆ స్థితిలోనే ఇంటికి తిరిగి వెళ్ళాడు. ఆ రాత్రి తన సోదరున్ని కలలోచూసాడు. ఉదయంలేచి తన మిత్రులు, సన్నిహితుల ముందు, ఇక ముందు నేను మీ వెంట ఉండదలచుకోలేదు అని చెప్పి ఏకాంతం పుచ్చు కున్నాడు. ఇంకా దైవభక్తిలో, దైవారాధనలో గడపసాగాడు. ఈ మంత్రికూడా కొన్ని రోజుల తర్వాత తన చివరి ఘడియకు చేరుకున్నాడు. అతని వద్దకు వ్యాపారి అయిన సోదరుడు వచ్చాడు. ‘ఏదైనా వాఙ్మూలం ఉంటే చెప్పండి’ అని అన్నాడు. ‘నా వద్ద ధనమూ లేదు, నాపై ఎవరి రుణమూ లేదు. మరి నేనెలాంటి వాఙ్మూలం ఇవ్వాలి. అయితే నా మరణానంతరం నా సోదరుని ప్రక్కనే నన్ను ఖననం చేయాలి, నా సమాధిపై ఇలా వ్రాయాలి’ అని అన్నాడు. అదేవిధంగా మూడవ వ్యక్తి కూడా మరణానికి చేరుకున్నాడు. అతని కుమారుడు అతనితో ‘నాన్నగారూ! ఏదైనా వాఙ్మూలం ఉంటే చెప్పండి’ అని అన్నాడు. దానికి ఆ వ్యక్తి ‘నా దగ్గర ధనమైతే లేదు, మరి నేనేమి వాఙ్మూలం చేయాలి. అయితే నా మరణానంతరం నన్ను నా సోదరుల ప్రక్కనే సమాధి చేయాలి. నా సమాధిపై ఇలా వ్రాయాలి’ అని అన్నాడు. మూడు రోజుల వరకు నా సమాధి వద్దకు వస్తూ పోతూ ఉండాలి,’ అని అన్నాడు. అతని కుమారుడు అలాగే చేసాడు. మూడవ రోజు సమాధి వద్ద నుండి తిరిగి వస్తూ ఉండగా ఒకశబ్దం విని భయపడి ఇంటికి తిరిగి వచ్చాడు. రాత్రి కలలో తనతండ్రిని చూచాడు. తండ్రి ఇలా అన్నాడు, ‘నువ్వు కూడా చాలా త్వరగా మా వద్దకు వస్తావు. చాలా సిద్ధపడి రావాలి. చాలా దూర ప్రయాణం, బరువులతో రాకూడదు. ప్రాపంచిక వ్యవహారాల్లో ఉండ కూడదు. ఇవన్నీ మోసంలో పడవేస్తాయి, పనికివచ్చే దాన్ని చేయరు. తమ జీవితాల్ని వృథా చేసుకుంటారు. మరణానంతరం విచారిస్తారు. కాని ఇప్పుడు విచారిస్తే ఏంటి లాభం, పక్షులు పొలాన్ని తిన్న తర్వాత. కుమారా! త్వరపడు’ అని అన్నాడు. ఆ వృద్ధుడి కథనం: ‘అతని తండ్రి చనిపోయిన తర్వాత కొడుకు వద్దకు వచ్చాను. కొడుకు తాను చూసిన కల గురించి పేర్కొన్నాడు. ఇంకా, ‘మా తండ్రిగారు నిజం చెప్పారు, నా మరణం చాలా దగ్గరగా ఉంది, కేవలం మూడు సార్లు త్వరపడు,’ అని అన్నారు. ఆ తరువాత ఆ వ్యక్తి తన భార్యాబిడ్డలను పిలిచి, వారికి హితబోధ చేసి, ఖిబ్లావైపు ముఖం చేసి షహాదహ్‌ పఠించాడు. ఆ రాత్రే మరణించాడు. అల్లాహ్‌ (త) అతన్ని కరుణించుగాక! (ఫత్‌’హుల్‌ ‘ఖల్లాఖహ్ – సుననె కుబ్‌రా)

[30]) వివరణ-5212, 5213: మద్యపానం అంటే మత్తు ఎక్కించేది. షరీఅత్‌పరంగా, నైతికపరంగా దీన్ని త్రాగటం నిషిద్ధం. దీనికి కూడా శిక్ష నిర్ణయించబడింది. మొదట వారికి హితబోధచేయాలి. దాన్ని మానుకోకపోతే 80 కొరడా దెబ్బలు కొట్టాలి.

ఖుర్‌ఆన్‌లో అల్లాహ్‌ ఆదేశం: విశ్వాసులారా! నిశ్చయంగా మద్యపానం, జూదం, బలిపీఠం మీద బలి ఇవ్వటం (న్సాబ్) మరియు శకునానికై బాణాల ప్రయోగం (జ్లామ్), ఇవన్నీ కేవలం అసహ్యకరమైన షై’తాన్‌ చేష్టలు, కావున మీరు సాఫల్యం పొందాలంటే వీటిని త్యజించండి. నిశ్చయంగా, షై’తాన్‌ మద్యపానం మరియు జూదం ద్వారా మీ మధ్య విరోధాలు మరియు విద్వేషాలు రేకెత్తించాలని మరియు మిమ్మల్ని అల్లాహ్‌ ధ్యానం నుండి మరియు నమా’జ్‌ నుండి తొలగించాలని కోరుతున్నాడు. అయితే మీరిప్పుడైనా మానుకోరా?” (అల్‌ మాయిదహ్‌, 5:9091)

ఈ ఆయతులో సారాయిని నిషిద్ధం చేయటానికి గల కారణాలు పేర్కొనబడ్డాయి. మొదటిది, ఇది షై’తాన్‌ పని, రెండవది దీన్ని త్రాగి మనిషి, అనేక ముఖ్యమైన బాధ్యతలను మరచిపోతాడు. ఇందులో ప్రాపంచిక నష్టాలతో పాటు పరలోకనష్టం కూడా ఉంది. సారాయి త్రాగేవాడు స్వర్గంలోనికి ప్రవేశించడు. విశ్వాసి సారాయి త్రాగినపుడు అతని విశ్వాసం అతని హృదయంలో ఉండదు అని ప్రవక్త (స) పేర్కొన్నారు. (బు’ఖారీ)

స్త్రీలు షై’తాన్‌ వలలు, వారి ద్వారా షై’తాన్‌ వేటాడుతాడు. ఎందుకంటే వారిలో సహజ ఆకర్షణా శక్తి ఉంది. దాని ద్వారా షై’తాన్‌ చాలా సులువుగా ఉపద్రవాలకు గురిచేస్తాడు. అందువల్ల వారిపట్ల అప్రమత్తంగా ఉండాలి. స్త్రీ అన్ని ఐహికవాంఛలకు పాపాలకు మూలం. ఖుర్‌ఆన్‌ ‘హదీసు’ల్లో వీటిని గురించి హెచ్చరించడం జరిగింది. ఈ మూడు విషయాలకు అంటే సారాయి, స్త్రీ, ఐహికవాంఛలకు దూరంగా ఉండాలి.

[31]) వివరణ-5214: అంటే తమ కర్మలను గూర్చి విచారించుకోండి. ఎందుకంటే ఒక ఉల్లేఖనంలో ఇలా ఉంది, ”మిమ్మల్ని విచారించే ముందే మిమ్మల్ని మీరు విచారించుకోండి.” జాబిర్‌ (ర) ‘హదీసు’ ద్వారా తెలిసిన విషయం ఏమిటంటే, ప్రాపంచిక జీవితం, మానవులు ఇద్దరూ నాశనం అయ్యేవారే. తీర్పుదినం ముందుకు వచ్చేస్తుంది. నావలో కూర్చున్న వ్యక్తి తన గమ్యాన్ని చేరుకునే ఉద్దేశ్యంతో ఉన్నట్టు. అదేవిధంగా ప్రపంచ ప్రజలు పరలోకంవైపు పరుగెడుతున్నారు. నావలో కూర్చున్న వ్యక్తికి ప్రపంచం నాశనం అవుతుందని తెలియదు. ఈ పరమార్థాన్నే ‘అలీ (ర) పేర్కొన్నారు. అంటే దైవవిధేయతతో జీవించాలి. అటువంటి వాడే ఉత్తముడు. ఉల్లేఖన కర్త ఈ ఆయతు పఠించాడు, ‘ఇస్లామ్‌ను వదలి మరో ధర్మాన్ని అనుసరిస్తే, అది స్వీకరించబడదు. ఇంకా అతడు పరలోకంలో నష్టపోయే వారిలో చేరిపోతాడు.” 

తీర్పుదినం నాడు దాసుల కర్మలు అల్లాహ్‌ ముందు సమర్పించబడతాయి. వారి ఆచరణా సాక్ష్యం కొరకు, వారి సిఫారసు కోసం చివరికి స్వయంగా ఇస్లామ్‌ కూడా హాజరవుతుంది. అల్లాహ్‌ ఇస్లామ్‌తో ఈనాడు శిక్షలో, ప్రతిఫలాలు నీపైనే ఆధారపడి ఉన్నాయి. ఎవరి ఇస్లామ్‌ సరైనదైతే, వారి ఆచరణలు స్వీకరించబడతాయి. లేనివారి ఆచరణలు తిరస్క రించబడవు.

అల్లాహ్‌ ఆదేశం, ”నిస్సందేహంగా అల్లాహ్‌ వద్ద ఆమోద యోగ్యమైన ధర్మం కేవలం ఇస్లామ్‌ మాత్రమే.” (ఆల ఇమ్రాన్, 3:19) ఇస్లామ్‌ అంటే శాంతి, కారుణ్యం. అంటే ఇస్లామ్‌ స్వీకరించిన వ్యక్తి ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉంటాడు. ఇతరులకు కూడా ఇస్లామ్‌ వైపు ఆహ్వానిస్తాడు. అన్నివిధాల ఇస్లామ్‌లో అంతా శాంతి ఉంది. అన్ని సుగుణాలు గల ధర్మం ఇస్లామ్‌ మాత్రమే. అందువల్లే అల్లాహ్‌కు అన్నిటికంటే చాలా ప్రియమైనది.

[32]) వివరణ-5224: అందువల్లే ఖుర్‌ఆన్‌లో, ”దైవవిధే యతలో పూర్తిగా ప్రవేశించండి,” అని ఉంది. కేవలం ఈ ధర్మమే ఔన్నత్యం వైపు ఆహ్వానిస్తుంది. ఇంకా ప్రవక్తలందరి ధర్మం ఇస్లామ్‌గానే ఉండేది. ఆదమ్‌ (అ) నుండి ము’హమ్మద్‌ (స) వరకు ప్రవక్తలందరూ దైవ విధేయత శాంతి భద్రతలవైపునకే ఆహ్వానించేవారు.

[33]) వివరణ-5226: అంటే భక్తిశ్రద్ధలతో నమా’జు చేయాలి. అంటే ఇది నా చివరి నామ’జు అని ఆలోచిస్తే, భక్తిశ్రద్ధలతో నమా’జు ఆచరిస్తావు. తీర్పుదినంనాడు అవమానం పాలయ్యే ఏ పనీ చేయకు. అదేవిధంగా ఇతరుల వస్తువులను ఆశించకు.

[34]) వివరణ-5227: అంటే నీవు నీ పని మీద వెళ్ళు. నీవు భయభక్తులు కలిగిఉంటే తీర్పుదినంనాడు నువ్వుమళ్ళీ నన్ను కలుసుకుంటావు. నాకు సమీపంగా ఉంటావు.

[35]) వివరణ-5231: అంటే వీరు నిజమైన విశ్వాసులు, దైవారాధకులు, దైవభీతిగలవారు. అయితే పేదరికం వల్ల, దారిద్య్రం వల్ల వారి దుస్తులు పరిశుభ్రంగా ఉండవు. దువ్వెన కూడా చేసి ఉండరు. వారి తల వెంట్రుకలు చిందర వందరగా ధూలి నిండి ఉంటాయి. ప్రజలు వారిని చిన్నవారిగా భావించి తమ వద్ద కూర్చోనివ్వరు, వారికి ఇతరులతో పరిచయమూ ఉండదు. ఒకవేళ అనుకోకుండా ద్వారం ముందు నిలబడితే, వారిని తోస్తూ గెంటివేయడం జరుగుతుంది. కాని అల్లాహ్‌ (త) దృష్టిలో వారు చాలా గొప్పవారు, సాన్నిహిత్యులు, అల్లాహ్‌ (త) ప్రియభక్తులు. అల్లాహ్‌ (త) ఇటువంటి భక్తులను ఎంతో ఆదరిస్తాడు. ఒకవేళ వారు అల్లాహ్‌(త) పై ప్రమాణం చేస్తే అల్లాహ్‌ (త) దాన్ని తప్పకుండా నెరవేరుస్తాడు. అల్లాహ్‌ (త) వారిని గౌరవిస్తాడు. వారి ప్రమాణాన్ని పూర్తిచేస్తాడు. ఖుర్‌ఆన్‌లో కూడా వారిని గురించి ప్రత్యేకంగా పేర్కొనటం జరిగింది.

అల్లాహ్‌ ఆదేశం: ”మరియు ఎవరైతే తమ ప్రభువును ఉదయం మరియు సాయంత్రం ప్రార్థిస్తూ, ఆయన ముఖాన్ని (చూడ) గోరుతున్నారో, వారిని నీవు దూరం చేయకు. వారి లెక్కకొరకు నీవు ఎంత మాత్రమూ జవాబుదారుడవు కావు. మరియు నీ లెక్కకొరకు వారూ జవాబుదారులు కారు. కావున నీవు వారిని దూరంచేస్తే నీవు దుర్మార్గులలో చేరిన వాడవవుతావు. మరియు ఈ విధంగా, మేము వారిలోని కొందరిని మరికొందరి ద్వారా పరీక్షకు గురిచేశాము. వారు (విశ్వాసులను చూసి): ”ఏమీ? మా అందరిలో, వీరినేనా అల్లాహ్‌ అనుగ్ర హించింది?” అని అంటారు. ఏమీ? ఎవరు కృతజ్ఞులో అల్లాహ్‌కు తెలియదా? (అల్‌అన్‌ఆమ్‌, 6:52-53) – అంటే ఉదయం, సాయంత్రం అల్లాహ్‌ను ఆరాధించే వారిని, దైవప్రీతిని కోరేవారిని, మీ దగ్గరి నుండి గెంటివేయకండి. పైగా తన ప్రత్యేక అనుచరులుగా చేసుకోండి. వారిని గురించి మిమ్మల్ని ప్రశ్నించడం జరుగదు. ఇంకా మీ గురించి వారిని ప్రశ్నించడం జరుగదు. ఒకవేళ మీరు ఇటువంటి వారిని తమ వద్ద నుండి గెంటివేస్తే, మీరు దుర్మార్గుల్లో చేరిపోతారు. ఈ ఆయతులు ‘ఖబ్బాబ్‌, ‘సుహైబ్‌, బిలాల్‌, ‘అమ్మార్‌లను గురించి సమర్థిస్తూ అవతరించాయి. వీళ్ళు ప్రవక్త (స) వద్ద కూర్చునేవారు. కాని వీరు ప్రాపంచికపరంగా చాలా పేదవారు, బలహీనులు. మాసిన దుస్తులు ధరించి ఉండేవారు. తల వెంట్రుకలు దుమ్ము ధూళితో నిండి ఉండేవి. అవిశ్వాసులు వీరిని చూసి అసహ్యించుకునే వారు. ఒకసారి అవిశ్వాసులు ప్రవక్త(స)తో మేము మీ దగ్గరకు వచ్చినపుడు వీరిని తరిమివేయండి. ఎందుకంటే మేము ఉన్నతులం. వీళ్లు హీనులు. మాకు వీరు సరిసమానం కాజాలరు. అప్పుడు ఈ ఆయతులు అవతరింపజేయబడ్డాయి. సాధారణంగా ప్రవక్తలను అనుసరించింది ముందు పేదవారూ, అగత్యపరులే. ఈ ఆదేశం అందరికీ వర్తిస్తుంది. ఎవరైనా వస్తే కోపంగా, అసహ్యంగా తరిమివేయరాదు. వారికీ ఈ పరిస్థితి రావచ్చు, ఎందుకంటే మంచికి ప్రతిఫలం మంచి, చెడుకు ప్రతిఫలం చెడు.

[36]) వివరణ-5232: స’అద్‌ (ర) చాలా గొప్ప ధర్మాత్ములు, వీరులు, ఇస్లామీయ వ్యవహారాల్లో అనేక విధాలుగా సహాయసహకారాలు అందించేవారు. అందు వల్లే పేద ముస్లిములకంటే తన్నుతాను గొప్పవానిగా భావించేవారు. అతని ఆ గర్వాహంకారాలను తొలగించటానికి ప్రవక్త (స) ఇలా ప్రవచిస్తూ, ‘ఈ పేద ప్రజలవల్లే శత్రువులపై మీకు విజయం ప్రాప్తిస్తుంది.  ఇంకా వారి ప్రార్థనలవల్లే మీకు ఆహారం, ఉపాధి ప్రసాదించ బడతాయి’ అని అన్నారు.

[37]) వివరణ-5235: అంటే పేద, దరిద్ర ముహాజిరీన్లు ధనిక ముహాజిరీన్ల కంటే 40 సంవత్సరాలు ముందు స్వర్గంలో ప్రవేశిస్తారు. వ్యాపారవేత్తలు, ధనవంతులు విచారణ నిమిత్తం వెనుక ఉండిపోతారు. ఈ ‘హదీసు’లో 40 సంవత్సరాలు అని ఉంది. మరో హదీసులో 500 సంవత్సరాలు అని ఉంది. ఈ రెండు ‘హదీసు’ల్లో ఎటు వంటి వ్యతిరేకత లేదు. ఎందుకంటే 40 సంవత్సరాలు ఉన్న ‘హదీసు’ ముహాజిరీన్లకు సంబంధించినది. అంటే నిరుపేదలు, అగత్యపరులు, దరిద్రులు ముందు స్వర్గం లోనికి ప్రవేశిస్తారు. ధనవంతులు తర్వాత ప్రవేశిస్తారు. ఏది ఏమైనా ముందు ప్రవేశించేది పేదలే.

[38]) వివరణ-5237: అంటే క్రమంగా రెండు రోజులు కూడా యవ్వరొట్టెలు తినే స్థితిలో ఉండేవారు కారు. అంటే జీవితమంతా దారిద్య్రంలోనే మగ్గేవారు. ప్రవక్త (స) ప్రవక్త లందరి నాయకులైనప్పటికీ పేదవానిగానే మిగిలారు. ఒకవేళ ప్రవక్త (స) ప్రార్థిస్తే అల్లాహ్‌ ఎన్నో ధనసంపదలను ప్రసాదించేవాడు. అందువల్లే ప్రవక్త (స) జీవితంలో మనకెంతో ఆదర్శం ఉంది.

[39]) వివరణ-5238: ఇప్పుడు ప్రజల పరిస్థితి ఎలా ఉందంటే రుచికరమైన ఆహార పదార్థాలు దిగమ్రింగు తున్నారు. ఇటు దైవప్రవక్త, ప్రవక్తల నాయకులు అయి కూడా చివరి నిమిషం వరకు పేదరికం, దారిద్య్రంలోనే మగ్గుతూ ఉన్నారు. ఆ స్థితిలోనే మరణించారు. చారిత్రక పుస్తకాల్లో, ‘హదీసు’ పుస్తకాల్లో ప్రవక్త (స)కు సంబం ధించిన అనేక సంఘటనలు ఉన్నాయి. సీరతు న్నబీ (2) నుండి కొన్ని ‘హదీసు’లను ఇక్కడ పేర్కొనడం జరుగు తుంది.  ‘స’హీ’హ్‌ బు’ఖారీ బాబుల్‌ జిహాద్‌లో ఇలా ఉంది, ”ప్రవక్త (స) మరణించినపుడు అతని (స) యుధ్ధ కవచం ఒక యూదుని వద్ద 3 సాఅల యవ్వలకు బదులు తాకట్టులో ఉంది. ప్రవక్త (స) మరణించినపుడు ధరించి ఉన్న దుస్తుల్లో క్రింద మీద అతుకులు ఉండేవి. అప్పటికి అరబ్‌ అంతా జయించడం జరిగింది. అప్పు డప్పుడూ మంచి భోజనం కూడా భుజించేవారు. అయితే ఐహిక వాంఛలకు దూరంగా ఉండేవారు. ఇంకా ప్రవక్త (స) మానవునికి ఈ కొన్ని వస్తువులు తప్ప మరేదీ ఉంచే అధికారం లేదని ప్రవచించే వారు: ”ఉండటానికి ఇల్లు, కట్టుకోవటానికి బట్ట, తినటానికి రొట్టె మరియు నీళ్ళు.” ‘ఆయి’షహ్‌ (ర) ప్రవచనం, ”ఏనాడూ ప్రవక్త (స) దుస్తులు మడిచి ఉంచబడ లేదు. అంటే కేవలం ఒకే జత బట్టలు ఉండేవి.  ఒకసారి ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘ఉమర్‌ (ర) ఇంటి గోడకు మరమ్మత్తు చేస్తున్నారు. అనుకోకుండా ప్రవక్త (స) అటువైపు వచ్చారు. ‘ఏం చేస్తున్నావు?’ అని అడిగారు. దానికి ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘ఉమర్‌, ‘గోడ రిపేరు చేస్తున్నాను,’ అని అన్నారు. అప్పుడు ప్రవక్త (స), ‘ఇంతటి తీరిక ఎక్కడిది?’ అని అన్నారు. అంటే సాధార ణంగా ప్రవక్త (స) ఇంటివారు రాత్రి పస్తులుండే వారు.  ప్రవక్త (స) ఇంట్లో ఒక్కోసారి రెండునెలల వరకు పొయ్యి వెలిగేదికాదు. ఒక సందర్భంలో ‘ఆయి’షహ్‌ (ర) ‘ఉర్‌వ బిన్‌ ‘జుబైర్‌ ముందు విన్నవించుకోగా, ‘మరి ఎలా గడి చేది?’ అని అడిగారు. దానికి ఆమె, ‘ఖర్జూరం మరియు నీళ్ళు, అయితే ఒక్కోసారి సహచరులు మేకపాలు పంపితే, ప్రవక్త (స) త్రాగేవారు.’ (బు’ఖారీ) అంతేకాదు, ప్రవక్త (స) జీవితాంతం చపాతి చూడనేలేదు. (బు’ఖారీ).

అరబ్‌లో దొరికే మైదా కూడా ప్రవక్త (స) ఎరుగరు. ఈ సంఘటన ఉల్లేఖనకర్త అయిన సహల్‌ బిన్‌ స’అద్‌ను ప్రజలు, ‘ప్రవక్త (స) కాలంలో జల్లెడలు ఉండేవా?’ అని అడిగారు. దానికి, ‘లేదు’ అని సమాధానం ఇచ్చారు. ‘మరి దేనితో పిండిని జల్లించేవారు,’ అని అడగ్గా, ‘నోటితో ఊదేవారు, మిగిలి ఉండే దాన్ని కలిపి రొట్టెలు వండేవారు.’ (షమాయిలె తిర్మిజి’) 

‘ఆయి’షహ్‌ (ర) ఉల్లేఖనం: మదీనహ్ జీవితంనుండి మరణంవరకు ప్రవక్త (స) ఏనాడూ రెండు పూటలూ కడుపునిండా తినలేదు. (షమాయిల్‌) ఫదక్‌ మరియు ఖైబర్‌లను గురించి ‘హదీసు’వేత్తలు, చరిత్రకారులు ఇలా వ్రాస్తున్నారు, ”ప్రవక్త (స) రాబడిలో నుండి వార్షిక ఖర్చుల నిమిత్తం తీసుకునేవారు. మిగిలింది పేదలకు, అగత్యపరులకు ఇచ్చేవారు. అయితే ఒక్కోసారి తన వంతు కూడా వారికోసం ఖర్చుపెట్టేవారు. ‘హదీసు’ల్లో ప్రవక్త (స) పేదరికం గురించి, దారిద్య్రం గురించి అనేక సంఘటనలు ఉన్నాయి. కొన్నింటిని ఇక్కడ పేర్కొంటున్నాము. ఒకసారి ప్రవక్త (స) వద్దకు ఒక వ్యక్తి వచ్చి, చాలా ఆకలిగా ఉందన్నాడు. ప్రవక్త (స) తన సతీమణుల వద్దకు, ‘ఏదైనా ఉంటే పంపండి,’ అని కబురు పంపారు. ‘ఇంట్లో నీరు తప్ప మరేమీ లేదు,’ అని కబురు వచ్చింది. అందరి వద్దనుండి ఇదే సమాధానం వచ్చింది. అంటే అందరి ఇళ్ళల్లో నీళ్ళు తప్ప మరేమీ ఉండేది కాదు. (బు’ఖారీ, ముస్లిమ్‌) 

అనస్‌ (ర) కథనం: ఒకసారి ప్రవక్త (స) వద్దకు వెళ్ళాను. ప్రవక్త (స) తన కడుపును కట్టి ఉండటం చూచాను. నేను కారణం అడిగాను. అనుచరుల్లో ఒకరు, ‘ఆకలివల్ల,’ అని సమాధానం ఇచ్చారు. (ముస్లిమ్‌)

అబూ ‘తల్‌’హా (ర) కథనం: ఒకసారి ప్రవక్త (స) మస్జిద్‌లో పరుండటం చూసాను. ఆకలివల్ల ప్రక్కలు మారు తున్నారు. (ముస్లిమ్‌) 

ఒకసారి అనుచరులు ప్రవక్త (స)తో ఆకలి, దారిద్య్రాలను గురించి విన్నవించుకున్నారు. వస్త్రాలు ఎత్తి కడుపులు చూపించారు. రాళ్ళు కట్టబడి ఉన్నాయి. ప్రవక్త (స) కూడా ఎత్తి చూపితే రెండురాళ్ళు ఉన్నాయి. (ముస్లిమ్‌) సాధారణంగా ఆకలివల్ల గొంతు బలహీనపడేది. అనుచరులు ప్రవక్త (స) పరిస్థితి గమనించేవారు. ఒకరోజు అబూతల్‌’హా వచ్చి తన భార్యతో, ‘తినడానికి ఏమైనా ఉందా? నేనిప్పుడే ప్రవక్త (స) గొంతు బలహీనంగా ఉండటం చూసాను,’ అని అన్నారు.  ఒకసారి మిట్ట మధ్యాహ్నం కడుపులో ఏమీ లేని స్థితిలో ఇంటి నుండి బయలుదేరారు. దారిలో అబూ బకర్‌ (ర), ‘ఉమర్‌ (ర) కలిసారు. వీరు కూడా ఆకలితో ఉన్నారు. ప్రవక్త (స) వీరిని తీసుకొని అబూ అయ్యూబ్‌ అ’న్సారీ ఇంటికి వచ్చారు. అతను ప్రవక్త (స) కోసం పాలు ఉంచే వారు. ఆ రోజు ప్రవక్త (స) రావడంలో ఆలస్యం అయితే, పిల్లలకు త్రాపించారు. ప్రవక్త (స) వారింటికి వెళ్ళారు. అప్పటికి అబూ అయ్యూబ్‌ అ’న్సారీ తోటకు వెళ్ళి ఉన్నారు. అతని భార్యకు తెలిసి ఆమె బయటకు వచ్చి, ‘ప్రవక్తా! తమరు రావటం శుభం కలుగుగాక!’ అని అన్నారు. అప్పుడు ప్రవక్త (స), ‘అబూ అయ్యూబ్‌ అ’న్సారీ ఏరి,’ అని అడిగారు. తోట ప్రక్కనే ఉండటం వల్ల మాటలు విని పరుగెత్తుతూ వచ్చారు. సలామ్‌ చేసి, ‘ప్రవక్తా! ఈ సమయంలో తమరు?’ అని విన్నవించు కున్నారు. ప్రవక్త (స) పరిస్థితి తెలిపారు. వెంటనే అతను తోటలోనికి వెళ్ళి ఒక ఖర్జూరాల గుత్తి తీసుకొని వచ్చి ఇచ్చి, ‘నేను మాంసం ఏర్పాటు చేస్తాను,’ అని, ఒక మేక జిబహ్‌ చేసి, సగం కూర వండారు. సగం మంటపై వేసారు. భోజనం తీసుకొని వచ్చి ముందుపెట్టారు. అప్పుడు ప్రవక్త (స) ఒక రొట్టెపై కొంతమాంసం పెట్టి, ‘దీన్ని ఫాతిమహ్కు పంపండి, కొన్ని రోజులుగా ఆమె ఏమీ తినలేదు,’ అని పలికిన తరువాత అందరితో కలసి తిన్నారు. అనేక రకాల  రుచికరమైన వంటకాలు చూసి, కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. ఇంకా, ‘అల్లాహ్‌ (త) తీర్పుదినం నాడు అనుగ్రహాల గురించి విచారిస్తాడనేది వీటి గురించే’ అని అన్నారు. (తర్‌’గీబ్‌ వ తర్‌’హీబ్‌, ముస్లిమ్‌) సాధారణంగా ప్రవక్త (స) ఉదయంపూట భార్యల వద్దకు వచ్చి, ‘తినటానికి ఏమైనా ఉందా’ అని అడిగేవారు. సతీమణులు, ‘లేదు’ అని చెప్పేవారు. అప్పుడు ప్రవక్త (స), ‘సరే, అయితే నేను ఉపవాసం ఉంటాను,’ అని అనేవారు. (ముస్నద్‌ అ’హ్మద్‌ బిన్‌ హంబల్‌)

[40]) వివరణ-5243: తీర్పుదినం 1000 ప్రాపంచిక సంవత్స రాలకు సమానంగా ఉంటుంది. అల్లాహ్‌ ఆదేశం: అంటే ఆ దినం నీ ప్రభువు వద్ద 1000 సంవత్సరాలకు సమానంగా ఉంటుంది.

 మరోచోట అల్లాహ్‌ ఆదేశం: ఆ తీర్పుదినం 50000 సంవత్ రాలకు సమానంగా ఉంటుంది. అంటే ప్రజలు ఆ రోజు తీవ్ర ఆందోళనకు గురవుతారు. కొందరికి 1000 సంవత్సరాలుగా ఉంటుంది. మరికొందరికి 50,000 సంవత్సరాలుగా ఉంటుంది. అయితే నిజమైన విశ్వాసు లకు, ఏకదైవారాధకులకు నమా’జు చదివినంత సమయంలా ఉంటుంది. కాని అవిశ్వాసులకు, అవిధేయులకు ఆ దినం చాలా కఠినదినంగా ఉంటుంది. ఈ ‘హదీసు’లో దరిద్రులు, పేదవారు ధనవంతుల కంటే 500 సంవత్సరాల ముందు స్వర్గంలో ప్రవేశిస్తారని ఉంది. మొదటి అధ్యాయంలో 40 సంవత్సరాలు అని ఉంది. అంటే అక్కడ ముహాజిరీన్లు, ఇక్కడ ఎవరైనా అని ఉంది. ఖుర్‌ఆన్‌ ప్రకారం తీర్పు దినం 1000 సంవత్సరాలకు సమానంగా ఉంటుంది. హదీసులో 500 సంవత్సరాలు ముందు పేదవారు ధనవంతుల కంటే స్వర్గంలో ప్రవేశిస్తారని ఉంది. అంటే 1000 లో సగం 500 నిజమే.

[41]) వివరణ-5250: అంటే అల్లాహ్‌ (త) తన ప్రియ దాసులకు దైవాన్ని మరపించే ధనసంపదలను ప్రసాదించడు. ఎందుకంటే ప్రాపంచిక ధనసంపదలు ప్రాణాంతకమైనవి. వ్యాధిగ్రస్తున్ని హానికరమైన వస్తువుల నుండి దూరంగా ఉంచినట్టు. అల్లాహ్‌ తన ప్రియ దాసులను ఇటువంటి ప్రాణాంతకమైన, హానికరమైన విషయాల నుండి దూరంగా ఉంచుతాడు.

[42]) వివరణ-5253: ఇది హిజ్రత్‌ సంఘటన కాదు. ధర్మసందేశ ప్రచారంవల్ల మక్కహ్ అవిశ్వాసులు ప్రవక్త (స)ను హింసలకు గురిచేశారు. అప్పుడు ప్రవక్త (స) మక్కహ్ నుండి బయటకు వెళ్ళి సందేశప్రచారం చేసేవారు. ప్రవక్త (స) వెంట బిలాల్‌ కూడా ఉండేవారు. తినేపదార్థాలు అంటే సత్తు, ఖర్జూరాలు, నీళ్ళు మొదలైనవాటిని చంకలో తీసుకొని తిరిగేవారు. అందులో నుండి వీరిద్దరూ తీసుకొని తినేవారు. నెలరోజుల వరకు పరిస్థితి ఇలాగే ఉండేది. కొందరు దీన్ని ‘తాయిఫ్‌ సంఘటనగా పేర్కొన్నారు. మరికొందరు అబూ ‘తాలిబ్‌, ఖదీజహ్ల  మరణానంతరం మక్కహ్లోనే సందేశ ప్రచారం చేసేవారు. ఎల్లప్పుడూ సందేశప్రచార సభలు జరిగేవి. అయితే మక్కహ్ నుండి బయటకు వెళ్ళే అవకాశం లభించేది కాదు. వీరిద్దరి మరణానంతరం కొన్ని రోజుల తర్వాత మక్కహ్ నుండి బయటకు వెళ్ళారు. ఇతర ప్రాంతాల్లో సందేశప్రచారం చేయటానికి బయలు దేరారు. ప్రవక్త (స) వెంట ఈ ప్రయాణంలో జైద్బిన్‌ ‘హారిసహ్ ఉన్నారు. మక్కహ్ మరియు ‘తాయి’ఫ్‌ల మధ్య ఉన్న తెగలవారికి ధర్మసందేశం చేసేవారు. ఏకత్వాన్ని బోధిస్తూ ప్రవక్త (స) ‘తాయి’ఫ్‌ చేరుకున్నారు. ‘తాయిఫ్‌లో బనూ ఖీఫ్ తెగవారు ఉండేవారు. సస్యశ్యామలమైన చల్లని కొండప్రాంతంలో ఉండటం వల్ల వారి గర్వాహంకారాలకు హద్దు లేకుండా పోయింది. అక్కడి నాయకులు అబ్ద్‌ యా లైల్‌, మస్‌’ఊద్‌, ‘హబీబ్‌ ఉండిరి. ప్రవక్త (స) ముందు వారినే కలిసారు. వారిని ఇస్లామ్‌ వైపు ఆహ్వానించారు. వారిలో ఒకడు, ”అల్లాహ్‌ నిన్ను ప్రవక్తగా పంపించి ఉంటే క’అబహ్ ముందు నీ గడ్డం గీయించివేస్తాను” అని అన్నాడు.  మరొకడు, ”దేవునికి ప్రవక్తగా పంపడానికి నీవు తప్ప మరొకరు దొరక లేదా? నీకు వాహనం అయినా లేదు. దేవుడు ప్రవక్తగా పంపిస్తే పాలకుడ్ని లేదా నాయకుడ్ని ప్రవక్తగా పంపేవాడు,” అని అన్నాడు. మూడవవాడు, ”నేను నీతో ఎన్నడూ మాట్లాడను. ఎందుకంటే ఒకవేళ నువ్వు దైవప్రవక్తవైతే, ఇది చాలా ప్రమాదకరమైన విషయం. తప్పకుండా నేను నిన్ను తిరస్కరించాలి. నువ్వు దైవంపై అసత్యాలు పలికితే, నేనెంత మాత్రం నీతో మాట్లాడను” అన్నాడు.

అప్పుడు ప్రవక్త (స) ఇలా అన్నారు, ”మీరు మాట్లాడు తున్నది మీ వద్ద ఉండనివ్వండి, మీ మాటల ద్వారా ఇతరులను చెడగొట్టకండి. ప్రవక్త (స) హితబోధ చేయడం ప్రారంభించారు. ఆ నాయకులు తమ కుమారులను, సేవకులను రెచ్చగొట్టారు. వారు వచ్చి సందేశం అందజేస్తున్న ప్రవక్త (స)పై రాళ్ళు విసరడం ప్రారం భించారు. ప్రవక్త (స) పాదాలు రక్తసిక్త మయ్యాయి. రక్తం చెప్పుల్లో గడ్డకట్టుకుంది. వు’దూ కోసం చెప్పులు తీయటం కష్టం అయ్యింది. ఒకసారి ఆ అల్లరి మూకలు ప్రవక్త (స)ను తిట్టసాగారు. చప్పట్లు, కేకలు, అరుపులు పెట్టారు. ప్రవక్త (స) ఒక ఇంటి ప్రాంగణంలోనికి వెళ్ళ వలసి వచ్చింది. అది ఉత్హ్, షీబహ్ కుమారులకు చెందినది. వారు దూరం నుండి ఆ దృశ్యాన్ని చూసి ప్రవక్త (స)పై దయతలచి తన సేవకుడు ‘దాన్తో ఒక ప్లేటులో ద్రాక్షపళ్ళు పెట్టి, ‘ఆ వ్యక్తికి ఇచ్చిరా’ అని అన్నారు. ఆ సేవకుడు ద్రాక్షపళ్ళను ప్రవక్త (స) ముందు తెచ్చిపెట్టాడు. ప్రవక్త (స) ద్రాక్షపళ్ళను బిస్మిల్లాహ్‌ అని పలికి తినటం ప్రారంభించారు. ‘అదాన్‌ ఆశ్చర్యంగా ప్రవక్త (స) వైపు చూచి, ‘ఇలా ఇక్కడ ఎవరూ అనరు’ అని అన్నాడు. ప్రవక్త (స) అతనితో, ‘నీదేవూరు, నీ మతం ఏమిటి?’ అని అడిగారు. దానికి అతను, ‘నేను క్రైస్తవుడను. నైనవా ప్రాంతానికి చెందిన వాడను. అప్పుడు ప్రవక్త (స) ”నువ్వు ఉత్తమ పురుషుడు యూనుస్బిన్త్తా పట్టణం వాడవా,” అని అడిగారు. దానికి ఆ వ్యక్తి  ‘యూనుస్‌ బిన్‌ మ’త్తా ఎవరో మీకెలా తెలుసు?’ అని అడిగాడు. దానికి ప్రవక్త (స), ‘అతడు నా సోదరుడు, అతడూ ప్రవక్తే, నేను కూడా ప్రవక్తనే,’ అని అన్నారు.  ‘అదాన్‌ అది వినగానే వంగి, ప్రవక్త (స) తల, చేతులు, పాదాలకు ముద్దులు పెట్ట సాగాడు. ‘ఉత్‌బహ్, షీబహ్ దూరం నుండి ఇలా చేయడం చూసారు. పరస్పరం: ”చూడండి, సేవకుడు కూడా చే జారి పోయాడు,” అని చెప్పుకున్నారు. ‘అదాన్‌ తన యజమాని దగ్గరకు వచ్చిన అనంతరం వారు అతనితో, ‘ఒరే నీచుడా, నీకేమయింది, అతని తల, చేతులు, కాళ్ళకు ముద్దులు పెడుతున్నావు,’ అని చీవాట్లు పెట్టారు. దానికి ‘అదాన్‌, ‘దొరా! ఈనాడు ఇతని కంటే ఉత్తముడు ఈ భూమిపై ఎవ్వరూ లేరు. అతను నాకు ఎలాంటి విషయం చెప్పాడంటే, అది కేవలం దైవప్రవక్తే చెప్పగలడు,’ అని అన్నాడు. వారు ‘ఉదాన్‌ను చీవాట్లు పెట్టి, ‘జాగ్రత్త! మతం మార్చుకోగలవు, నీధర్మం అతని ధర్మంకంటే ఉత్తమమైనది’ అని అన్నారు. (‘తబ్‌రీ)

ఆ ప్రాంతంలోనే  ప్రవక్త (స)కు ఒకసారి చాలా గాయాలు తగిలాయి. ప్రవక్త (స) స్పృహ తప్పి క్రిందపడ్డారు. ‘జైద్‌ బిన్‌ హారిస’హ్ ప్రవక్త (స)ను తన వీపుపై కూర్చోబెట్టు కొని, పట్టణం పొలిమేరలకు తీసుకొనిపోయి, నీళ్ళు చిలకరించిన తర్వాత ప్రవక్త (స)కు తెలివి వచ్చింది. ఆ ప్రయాణంలో కష్టాలు, గాయాలు తగిలినప్పటికీ ఒక్క వ్యక్తి కూడా ఇస్లామ్‌ స్వీకరించలేదనే దుఃఖసమయంలో కూడా ప్రవక్త (స) హృదయం దైవఔన్నత్యాన్ని గొప్ప తనాన్ని కొనియాడుతూనే ఉంది. ఆ స్థితిలో ప్రవక్త (స) ఇలా ప్రార్థించారు: ”ఓ అల్లాహ్ (త)! నా బలహీనత, పేద రికం, ప్రజలు అవమానపరచటాన్ని గురించి నీ ముందు ఫిర్యాదు చేస్తున్నాను, నీవే అందరికంటే దయా మయుడవు. పేదల యజమానివి నీవే. నా యజమానివి కూడా నీవే. నన్ను ఎవరికి అప్పగించ గోరుతున్నావు. అపరిచితులనా లేక శత్రువులనా. అయితే నీవు ఆగ్రహించకుంటే చాలు, ఎందుకంటే నీ క్షేమంఉంటే చాలు. నేను అంధకారాలు తొలగించే నీ వెలుగు ద్వారా శరణుకోరుతున్నాను. దానిద్వారా ప్రాపంచిక, ధార్మిక సమస్యలన్నీ తొలగిపోతాయి. నాకు నీ ప్రియమైన సాన్నిహిత్యం ఎంతైనా అవసరం. సత్కార్యాలు చేసే, చెడుకు దూరంగా ఉండే శక్తి నీ నుండే లభిస్తుంది.” ప్రవక్త (స) తాయిఫ్‌ నుండి తిరిగి వస్తూ, ”నేను వీరిని శపించడం దేనికి, వీరు విశ్వసించకపోతే వీరి ముందు తరాలు విశ్వసించ వచ్చు” అన్నారు. (ముస్లిమ్‌)

[43]) వివరణ-5268: అంటే చతుర్భుజంగా ఉన్నది అతని మరణం. మధ్యలో ఉన్న పెద్ద గీత మానవుడు. దానికి ఇరువైపులు ఉన్న గీతలు వ్యాధులు, ఆపదలు, నష్టాలు. పెద్ద గీత పైన బయటకు వెళ్ళిన గీత అతని మనోకాంక్షలు. మానవుడు జీవితాంతం ఏదో ఒక ఆపదకు గురిఅవుతూ ఉంటాడు. చివరకు మరణం సంభవిస్తుంది. అతని మనోకాంక్షలు, కోరికలుతీరవు. ఎందుకంటే అతని కోరికలు చావుకంటే చాలా అధికంగా ఉన్నాయి. అందువల్ల మానవుడు తనకు చాలినంత దానితోనే తృప్తిచెందాలి. అత్యాశలకు, మనో కాంక్షలకు దూరంగా ఉంటూ జీవించాలి.

[44]) వివరణ-5272: అంటే ఈ వయసులో కూడా అతడు పాపాలకు దూరంగా ఉండకుంటే, పశ్చాత్తాపం చెందకుంటే ఎటువంటి సాకులు స్వీకరించబడవు.

[45]) వివరణ-5275: అంటే మరణం తప్పకుండా వస్తుంది. మరి ఈ వివాదాల్లో తల ఎందుకు దూరుస్తావు.

[46]) వివరణ-5277: ఇది మానవుడు అంటే, శరీరం. అదే విధంగా తల అంటే మరణం, చేయి పైకెత్తి చూపించటం అంటే కోరికలు. అంటే మానవుడు మరియు మరణం చాలా దగ్గరగా ఉన్నాయి. కాని అతని కోరికలు మరణానికి మించి ఉన్నాయి. కనుక ప్రపంచంలో అతని కోరికలు తీరవు.

[47]) వివరణ-5279: ఈ అతి చిన్న జీవితంలో పరలోకం కంటే ఇహలోకానికి ప్రాధాన్యత ఇవ్వటం వల్ల లాభం ఏంటి? మరణం రావలసిఉంటే 100 సంవత్సరాలు ఏంటి, ఒకదినం ఏంటి?

[48]) వివరణ-5284: ముత్తఖీ అంటే విధేయుడని అర్థం, అతడు అధర్మకార్యాలకు, దుబారాఖర్చులకు, విందూ వినోదాలకు, అనవసరమైనవాటికి, అనుమానాలకు, సంకోచాలకూ దూరంగా ఉంటాడు. ఏది చేసినా దైవప్రీతి కోసం చేస్తాడు. అక్కరలేని హృదయం కలిగి ఉంటాడు. దైవ విధేయతా కార్యాల్లో తనధనాన్ని ఖర్చుపెడతాడు. ఏ సత్కార్యం చేసినా పేరు ప్రఖ్యాతుల కోసం చేయడు. ఇటువంటి దాసుడ్ని అల్లాహ్‌ (త) ప్రేమిస్తాడు.

[49]) వివరణ-5285: అంటే అధిక ఆయుష్షు పొంది, సత్కార్యాలు చేస్తే, అతని కర్మపత్రంలో ఎంతో పుణ్యం ప్రోగయి ఉంటుంది. ఈ కారణంగా అతడు అందరికంటే మంచివాడు. అదేవిధంగా అధిక ఆయుష్షు పొంది పాపాలే చేస్తూ ఉంటే, అతని కర్మపత్రంలో పాపం ప్రోగయి ఉంటుంది. అందువల్ల అతడు అందరికంటే చెడ్డవాడు.

[50]) వివరణ-5286: అంటే ఒక వారం అధికంగా జీవిస్తే అతని స్థానం గొప్పది. అదే విధంగా ఒక వారం తక్కువ జీవిస్తే అతని స్థానం చిన్నది.

[51]) వివరణ-5289: అంటే ధిక్కారానికి, అవిధేయతకు పాల్పడుతూ అల్లాహ్‌(త) ప్రసాదిస్తాడని ఆశిస్తాడు. అతని ఈకోరిక సరైనది కాదు. అల్లాహ్‌ ప్రసాదించేవాడు, దానికి తగిన నమ్మకం కూడా ఉండాలి. అయితే ఆచరణ సరిగ్గా ఉండాలి.

అల్లాహ్‌ ఆదేశం: ” ఓ ప్రవక్తా! నేను క్షమించేవాడిని, కరుణించేవాడిని. అదేవిధంగా నా శిక్ష కఠినమైనదీ, తీవ్రమైనదని నా దాసులకు తెలుపు. – అల్లాహ్‌ తన ప్రియదాసులకు దయామయుడు, కరుణా మయుడూను. అదేవిధంగా అవిధేయులకు కఠినుడూను. అయితే అవిధేయులకు శుభవార్త ఏమిటంటే, వారు పశ్చాత్తాపపడి, క్షమాపణకోరి అల్లాహ్‌ వైపు మరలాలి.

ఓ ప్రవక్తా! ”ఇలా అను: ‘స్వయంగా మీకు (మీ ఆత్మలకు) మీరే అన్యాయం చేసుకున్న నా దాసులారా! అల్లాహ్‌ కారుణ్యం పట్ల నిరాశ చెందకండి. నిశ్చయంగా, అల్లాహ్‌ అన్ని పాపాలను క్షమిస్తాడు. నిశ్చయంగా, ఆయన! కేవలం ఆయనే క్షమాశీలుడు, అపార కరుణాప్రదాత. “మరియు మీరు పశ్చాత్తాపంతో మీ ప్రభువు వైపునకు మరలండి మరియు మీపైకి శిక్ష రాకముందే, మీరు ఆయనకు విధేయులు (ముస్లింలు) అయి ఉండండి తరువాత మీకు ఎలాంటి సహాయం లభించదు. “మరియు మీకు తెలియకుండానే అకస్మాత్తుగా, మీపైకి శిక్ష రాకముందే మీ ప్రభువు తరఫునుండి మీ కొరకు అవతరింపజేయబడిన శ్రేష్ఠమైనదానిని (ఈ ఖుర్‌ఆన్‌ను) అనుసరించండి.”  (అజ్జుమర్‌, 39:53-55)

దైవ కారుణ్యం చాలా విశాలమైనది, ఆయన కారుణ్యం పట్ల ఆశకూడా ఉంది. దీనికి తోడు అల్లాహ్‌ (త) శిక్ష పట్లకూడా అప్రమత్తంగా ఉండాలి. అందుకే అంటారు, ”విశ్వాసం భయం – ఆశల మధ్య ఉంటుంది. అల్లాహ్‌ (త) కారుణ్యం పట్ల నిరాశచెందరాదు, ఆయన శిక్షల పట్ల నిర్భయంగా ఉండరాదు. విశ్వాసం, సత్కార్యాలు లేకుండా అల్లాహ్‌ (త) కారుణ్యాన్ని ఆశించడం తన్ను తాను మోసానికి గురిచేసు కోవడమే. అదేవిధంగా ఆయన కారుణ్యం పట్ల నిరాశచెందనూ కూడదు. 

మ’అరూఫ్‌ కర్‌ఖీ అభిప్రాయం: సత్కార్యాలు చేయకుండా స్వర్గంపై ఆశలు పెట్టుకోవటం పాపం అవుతుంది. ప్రవక్త (స)తో సంబంధం లేకుండా ప్రవక్త (స) సిఫారసుపై ఆశలు పెట్టుకోవటం మోసం అవుతుంది. విధేయత లేకుండా దైవ కారుణ్యంపై ఆశలు పెట్టుకోవటం అవివేకం అవుతుంది.

అల్లాహ్‌ ఆదేశం: ”నిశ్చయంగా, అల్లాహ్ కారుణ్యం సజ్జనులకు సమీపంలోనే ఉంది.” (7:56) – పాపాత్ములకు దైవకారుణ్యం దూరంగా ఉంటుంది. పుణ్యాత్ములే దైవ కారుణ్యానికి హక్కుదారులు.

అల్లాహ్‌ ఆదేశం: ”నిశ్చయంగా, విశ్వసించినవారు మరియు (అల్లాహ్మార్గంలో తమ జన్మ భూమిని విడిచి) వలసపోయేవారు మరియు అల్లాహ్ మార్గంలో ధర్మ పోరాటం చేసేవారు, ఇలాంటివారే అల్లాహ్ కారుణ్యం ఆశించటానికి అర్హులు.” (అల్ బఖరహ్, 2: 218)

ఒక ‘హదీసు’లో ఇలా ఉంది, ”దైవ విధేయతలో జీవితం గడిపినవారే తెలివిగలవారు. సత్కార్యాలు అంటే దైవస్మరణ, పాపాలంటే పశ్చాత్తాపం, క్షమాపణల ద్వారా తమ్ముతాము రక్షించుకుంటారు. వీళ్ళు ప్రతిరోజూ రాత్రి పడుకునేముందు తమ్ముతాము విచారించుకుంటారు. వ్యాపారవేత్తలు ప్రతిరోజు తమ వ్యాపార జమా  లెక్కలు చూసుకున్నట్లు.

అల్లాహ్‌ ఆదేశం: ”మరియు ప్రతివ్యక్తి, తాను రేపటికొరకు ఏమి సమకూర్చుకున్నాడో చూసుకోవాలి.” (అల్ ‘హష్ర్, 59:18) – ప్రపంచంలోనే ఆత్మవిమర్శ చేసుకోవాలి. తీర్పుదినంనాడు అవమానంపాలు కాకుండా చూసుకోవాలి. అంటే అవమానించబడక ముందే మిమ్మల్ని మీరు విమర్శించుకోండి.

[52]) వివరణ-5295: అంటే విచారణ లేకుండా స్వర్గంలోనికి వెళ్ళే అల్లాహ్‌ (త) ప్రియభక్తులు. వీరిలో మూడు ప్రత్యేక గుణాలు ఉంటాయి. మంత్రతంత్రాలను, ధర్మవ్యతిరేక విధానాలను అనుసరించరు. కేవలం తమ ప్రభువునే నమ్ముతారు

బు’ఖారీలో ఇలా ఉంది, ”ప్రవక్త (స) అనుచరుల్లో ఒకరు ఒకరికి మంత్రించి ఫీసు కూడా తీసుకున్నారు. ప్రవక్త (స)కు తెలిసి ప్రజలు అసత్యపు మంత్రాలు చదివి సంపాదిస్తున్నారు. నువ్వు సత్యమైన మంత్రం చదివి డబ్బు సంపాదించావు” అని అన్నారు.

జాబిర్‌ (ర) కథనం: ప్రవక్త (స), ”అయితే నాకు ఆ మంత్రం వినిపించు” అని అన్నారు. దానికి అతడు వినిపించాడు. అది విని ప్రవక్త (స) ‘ఇందులో ఎటువంటి లోపంలేదు’ అని అన్నారు. మంత్రాల్లో ఎటువంటి నిషిద్ధపదాలు ఉండకూడదు. దిష్టి తగిలినా, పాము కాటేసినా మంత్రాలు చదివేవారు. అంటే ఈ రెండు విషయాల్లోనే మంత్రం చదవాలని కాదు. ప్రవక్త (స) తన అనేకమంది అనుచరు లకు మంత్రించమని ఆదేశించారు. ఇంకా అనేకమందిని గురించి వాళ్ళు మంత్రిస్తారని విని ఉన్నారు. ఇందులో మంత్రించనివారు అంటే ధర్మ వ్యతిరేక విధానాల ద్వారా మంత్రించనివారు అని అర్థం. అంటే దైవప్రియభక్తులు దైవాన్నే నమ్ముకుంటారు. వాళ్ళు చికిత్స, వైద్యం, మందులు, మంత్రాలు ఏమీ చేయక ఎన్ని కష్టాలు వచ్చినా దైవప్రీతిగా భావించి సంతోషం వ్యక్తం చేస్తారు. ఇది చాలా ఉత్తమ స్థానం, ఇది అందరికీ లభించదు. ఉదా: అబూ బకర్‌ (ర) తన ధనాన్నంతా తెచ్చి ప్రవక్త (స) ముందుపెట్టి, దైవ మార్గంలో ఖర్చుచేయమని అన్నారు. దానికి ప్రవక్త (స), ‘భార్యాబిడ్డలకు ఏమి వదిలావు?’ అని అడిగారు. దానికి అబూ బకర్‌ (ర), ‘అల్లాహ్‌పై వదిలాను’ అని అన్నారు. ప్రవక్త (స) దాన్ని స్వీకరించారు. మరో వ్యక్తి పావురం గ్రుడ్డంత బంగారం తెచ్చాడు, ‘ఇది తప్ప నా వద్ద మరేమీ లేదు’ అని అన్నాడు. ప్రవక్త (స) ఆ గ్రుడ్డును తీసుకొని త్రిప్పి కొట్టారు. ఒకవేళ అది అతనికి తగిలితే గాయం అయ్యేది. అంటే ప్రవక్త (స) ధనాన్నంతా దైవమార్గంలో ధారపోసే స్థానంలో నీవు లేవని సూచించారు. అంటే కొంత ధనం భార్యాబిడ్డల కోసం కూడా ఉంచి, మిగిలింది దైవమార్గంలో దానం చేయాలి. అంటే షరీ’అత్‌ ఆదేశాలు పరిస్థితులను బట్టి మారుతూ ఉంటాయి. వాళ్ళు కేవలం దైవాన్నే నమ్ముతారు. ఒకవేళ వారు వైద్యం చేయించు కోకుంటే ఇదే ఉత్తమం. ‘హదీసు’ల్లో వీరి ప్రత్యేకత పేర్కొనడం జరిగింది. వీరు తమ ప్రార్థనల్లో, ”ఓ అల్లాహ్! మేలు చేకూరితే  కేవలం నీ వల్లే చేకూరుతుంది. అపశకునం అనేది ఏదీ లేదు, ఒకవేళ మంచి ఉంటే నీ తరఫు నుండే ఉంటుంది. నీవు తప్ప ఆరాధ్యులెవరూ లేరు.” ఇలా కూడా అంటారు, ”ఓ అల్లాహ్‌! నీవు తప్ప, ఎవరూ మేలు చేకూర్చలేరు, చెడును దూరం చేయనూ లేరు. అదేవిధంగా సత్కార్యాలు చేయడం, చెడుకు దూరంగాఉండటం నీ భాగ్యంవల్లే సాధ్యం.” (ఇబ్నెసున్నీ) – దీని సారాంశం ఏమిటంటే అల్లాహ్‌నే నమ్ముకోవటం దైవభక్తుల సాంప్రదాయం. మంత్రతంత్రా లకు పాల్పడటం, అపశకునంగా భావించటం మొదలైనవి అజ్ఞానకాలపు ఆచారాలు. వీటికి మనం దూరంగా ఉండాలి.

[53]) వివరణ 5299: అంటే ఆహారం ప్రసాదించేవాడు అల్లాహ్‌ (త) యే. ఆయన(త)యే మన ఆహారానికి బాధ్యుడు.

అల్లాహ్‌ (త) ఆదేశం: ”మరియు భూమిపై సంచరించే ప్రతి ప్రాణి జీవనోపాధి (బాధ్యత) అల్లాహ్‌పైననే ఉంది…” (హూద్, 11:6).

ఈ ‘హదీసు’లో ప్రయత్నించవద్దని, కృషిచేయవద్దని, శ్రమించవద్దని అనటంలేదు. ప్రతి పనికి అల్లాహ్ (త)పై నమ్మకం ఉంచిచేయాలి. ఉపాధి తగ్గినా, ఆ మార్గం మూయబడినా నిరాశ చెందకూడదు. ఒక ఉల్లేఖనంలో ఇలా ఉంది, ”ఒక పల్లెవాసి ఒంటెపై ఎక్కి ప్రవక్త (స) వద్దకు వచ్చాడు. ‘ఓ ప్రవక్తా! నేను ఒంటెను వదలివేసి అల్లాహ్ (త)పై భారం వేయాలా లేక ఒంటెను కట్టి అల్లాహ్ (త) ను నమ్ముకోవాలా? ‘ అని ప్రశ్నించాడు.” దానికి ప్రవక్త (స) ‘ముందు దాన్ని కట్టివేసి, ఆ తరువాత అల్లాహ్ (త)పై భారం వేయి’ అని ప్రవచించారు. (తిర్మిజి’)

ముస్లిములు ఆందోళన చెందకూడదని, నిరాశ చెంద కూడదని వారికి అల్లాహ్‌(త)పై నమ్మకం గురించి శిక్షణ ఇవ్వటం జరిగింది. ఎందుకంటే మానవుని జీవితంలో ఎటువంటి సందర్భాలు వస్తాయంటే, వాటిలో మనిషి నిస్సహాయతకు గురవుతాడు. నిస్సహాయ స్థితిలో ఆందోళనకు గురికాకుండా వ్యవహారాన్ని దైవానికి అప్పగించాలి. భరించరాని స్థితిలో తన్నుతాను ప్రమాదాలకు గురిచేసుకోరాదు. వెంటనే వాటిపై అల్లాహ్ (త)ను సంరక్షకుడిగా భావించాలి. కష్టాల్లో ఆదుకునే వాడిని, దుఃఖవిచారాలను దూరంచేసేవాడిని, మొరలను ఆలకించేవాడినే మనం నమ్మాలి.

[54]) వివరణ-5300: ఉపాధిబాధ్యత అల్లాహ్‌(త)పైనేఉంది. ఉపాధి సంపాదన కోసం పాపాలు చేయటం వ్యర్థం.

అల్లాహ్‌ ఆదేశం: ”మరియు నేను జిన్నాతులను మరియు మానవులను సృష్టించింది కేవలం వారు నన్ను ఆరాధించటానికే! నేను వారినుండి ఎలాంటి జీవనోపాధిని కోరటం లేదు మరియు వారు నాకు ఆహారం పెట్టాలని కూడా కోరటంలేదు. నిశ్చయంగా అల్లాహ్‌! ఆయన మాత్రమే ఉపాధి ప్రదాత, మహా బలవంతుడు, స్థైర్యం గలవాడు.” (అ’జ్జారిఆత్, 51:56-58)

మరోచోట అల్లాహ్‌ఆదేశం: ”మరియు నీ కుటుంబం వారిని నమా’జ్‌ చేయమని ఆజ్ఞాపించు; మరియు స్వయంగా నీవుకూడా దానిని సహనంతో పాటించు. మేము నీ నుండి జీవనోపాధిని ఆశించము. మేమే నీకు జీవనోపాధిని ఇచ్చేవారము. చివరకు దైవభీతి గలవారిదే ఉత్తమ ముగింపు.” (తా-హా, 20:132)

[55]) వివరణ-5303: ఈ ‘హదీసు’ ద్వారా తెలిసిన విషయం ఏమిటంటే, మనిషి ఎల్లప్పుడూ అల్లాహ్ మేలు కోరుతూ ఉంటే. అల్లాహ్‌(త) ఎల్లప్పుడూ అతన్ని సన్మా ర్గంలో నడుపుతాడు. అతడు పాపాలకు అధర్మ కార్యా లకు దూరంగా ఉండాలి. ఇస్తిఖారహ్ అంటే అల్లాహ్‌ (త)మేలునే కోరుతూ ఉండాలి. ఒక ‘హదీసు’లో ఇలా ఉంది, ”మేలు నీ చేతుల్లోనే ఉంది, చెడుద్వారా నిన్ను నిందించటం జరుగదు.” మరో ‘హదీసు’లో ఇలా ఉంది, ”ఇస్తిఖారహ్ చేసిన వ్యక్తి  నిరాశచెందడు, విచారించడు, సంప్రదించినవాడు అక్కరకు గురికాడు. మధ్యేమార్గాన్ని అనుసరించిన వాడు అవమానానికి గురికాడు.”

[56]) వివరణ-5305: జ్ద్ అంటే ఎత్తైన ప్రదేశం. ఇది ఇరాఖ్లోని ఒక ఊరిపేరు.

[57]) వివరణ-5306: ఇది సూరహ్‌ ‘తలాఖ్‌లోని ఆయతు. ”…మరియు అల్లాహ్‌ యందు భయభక్తులు గలవానికి, ఆయన ముక్తిమార్గం చూపుతాడు. మరియు ఆయన, అతనికి, అతడు ఊహించని దిక్కునుండి జీవనోపాధిని ప్రసాదిస్తాడు. మరియు అల్లాహ్‌ మీద నమ్మకం ఉంచుకున్న వానికి ఆయనే చాలు. నిశ్చయంగా, అల్లాహ్‌ తనపని పూర్తిచేసి తీరుతాడు. వాస్తవానికి, అల్లాహ్‌ ప్రతిదానికి దాని విధి (ఖద్ర్) నిర్ణయించి ఉన్నాడు.” (అ’త్తలాఖ్‌, 65:23)

[58]) వివరణ-5307: ”నిస్సందేహంగా అల్లాహ్‌(త)యే ఆహారం ప్రసాదించేవాడు, సర్వశక్తిమంతుడూను.”

[59]) వివరణ-5308: అంటే ఉపాధి సంపాదనపైనే ఆధారపడి ఉండదు. అసలు ఆహారప్రదాత అల్లాహ్‌ (త). నీవు కష్టపడి సంపాదిస్తావు. నీ సోదరుడు సజ్జనుల సహవాసంలో ఉంటూ అల్లాహ్(త) ను ప్రార్థిస్తూఉంటాడు. అతని ప్రార్థనల శుభంవల్లే నీకు పనిలభిస్తుంది. ఇందులో నీ గొప్పతనం ఏమీ లేదు.

[60]) వివరణ-5309: అంటే అల్లాహ్ నే నమ్ముకోండి. సమస్యలన్నిటినీ గురించి ఆలోచించడంవల్ల ఏమీ లాభం లేదు. కనుక అల్లాహ్ (త)నే నమ్ముకోవాలి.

[61]) వివరణ-5310: అంటే పాటించవలసిన విధంగా విధే యత పాటిస్తే, అల్లాహ్‌ సంతోషించి వారి జీవితాన్ని తీర్చిదిద్దుతాడు. వర్షాలు పడతాయి. పంటలు బాగా పండుతాయి. రాత్రి సుఖంగా నిద్రపోతారు. వర్షం పడిందా, పడలేదా? అనే చింత ఉండదు. మెరుపుల శబ్దాలు విన బడవు. అనేక అనుగ్రహాల ద్వారాలు తెరచుకుంటాయి.

[62]) వివరణ-5312: అంటే ఉపాధి, మరణం రెండూ తప్పనిసరి విషయాలు. అల్లాహ్‌ ఆదేశం: ”అల్లాహ్‌యే మిమ్మల్నిపుట్టించాడు.  తరువాత జీవనోపాధినిచ్చాడు,  తరువాత ఆయనే మిమ్మల్ని మరణింపజేస్తాడు. ఆ తరువాత మళ్ళీ బ్రతికిస్తాడు…” (అర్-రూమ్, 30:40)

[63]) వివరణ-5314: అంటే అల్లాహ్‌ (త) రూపురేఖల్ని చూసి సంతోషించడు. అల్లాహ్‌ (త) చిత్తశుద్ధిని, ఆచరణలను చూస్తాడు. చిత్తశుద్ధితో చేసిన ఆచరణ లంటే అల్లాహ్‌(త)కు ఎంతో ఇష్టం. అందం, ధనం కలిగిన వ్యక్తి చిత్తశుద్ధిలేని ఆచరణలు చేసినా అల్లాహ్‌ (త) స్వీకరించడు, సంతోషించడు.

[64]) వివరణ-5317: అతని సంకల్పం మంచిదై, ప్రజలు అతన్ని కొనియాడితే ఇందులో ప్రదర్శనాబుద్ధి, చూపు గోలు లేవు.

[65]) వివరణ-5326: ఈ ‘హదీసు’ ద్వారా తెలిసిన విషయం ఏమిటంటే, పేరు ప్రఖ్యాతులుగల వారిని ప్రతి ఒక్కరూ  చూపించగలరు. కాని దైవసాన్నిహిత్యం గలవారు అంటే సత్యవంతులు, అమరవీరులు, పుణ్యాత్ములు మొదలైనవారి గురించి అల్లాహ్‌ ”మేము దైవభీతిపరులను నాయకులుగా చేసాము” అని పేర్కొన్నాడు. అదేవిధంగా ప్రపంచంలో ధనవంతుడై కూడా పాపకార్యాలకు పాల్పడకుండా అల్లాహ్‌(త), ఆయన ప్రవక్త (స) ఆదేశాల ప్రకారం జీవించే వ్యక్తి, దేవుని ప్రియభక్తుడని ప్రవక్త (స) పేర్కొన్నారు.

[66]) వివరణ-5335: అల్లాహ్‌ ఆదేశం: ”మీరు దాస్తున్న దానిని అల్లాహ్‌ బయటపెడ్తాడు.” (అల్-బఖరహ్, 2:72). అంటే వాటిని బహిర్గతం చేస్తాడు.”

[67]) వివరణ-5339: అంటే అవిధేయులకు, నేరస్తులకు చాలా కఠిన శిక్షలు ఉంటాయి. ఒకవేళ మీకు తెలిస్తే, మీకు నవ్వురాదు. ఎప్పుడూ దైవభీతితో వణుకుతూ ఉంటారు.

[68]) వివరణ-5340: అంటే నేను దైవప్రవక్తను అయి నప్పటికీ, ఎవరిని క్షమించటం జరుగుతుందో, ఎవరిని స్వర్గంలోనికి పంపడం జరుగుతుందో నాకు తెలియదు. ఇదంతా అల్లాహ్‌(త) దయపై ఆధారపడి ఉంది. ఇదంతా దైవభీతి గురించి ఆదేశించటం జరిగింది. ఎందుకంటే దైవానికి సన్నిహితంగా ఉండే వ్యక్తి చాలా ఎక్కువగా దైవానికి భయపడుతూ ఉంటాడు. దైవభీతి గలవారు దైవశిక్షలకు భయపడుతూ ఉంటారు. దైవానుగ్రహం పట్ల ఆశతో కూడా ఉంటారు.

[69]) వివరణ-5344: అంటే అందరినీ హతమార్చడం జరుగు తుంది. అయితే తమతమ కర్మల ప్రకారం మళ్ళీ మంచీ, చెడు స్థితుల్లో లేపడం జరుగుతుంది.

[70]) వివరణ-5345: అంటే అతడు విశ్వాసిగా మరణిస్తే విశ్వాసిగా లేస్తాడు. ఒకవేళ అవిశ్వాసిగామరణిస్తే, అవిశ్వాసిగా లేపబడతాడు.

[71]) వివరణ-5346: అంటే ఎల్లప్పుడూ నరకంపట్ల భయపడుతూ ఉండాలి. కాని ప్రజలు ఏమరుపాటుకు గురై ఉన్నారు. స్వర్గం విషయంలోనూ ఇందులో ప్రవేశించటానికి సత్కార్యాలు చేయాలి. కాని దాన్ని కోరుకునే వారు కూడా పడుకున్నారు.

[72]) వివరణ-5348: అంటే స్వర్గం చాలా విలువైనది. చాలా కష్టమైనది. తమ అమూల్యమైన వాటిని ఖర్చుచేయకుండా లభించదు. దాని ఖరీదు ధనం, ప్రాణం. అవసరమైనచోట ధనం ఖర్చు పెట్టండి, ప్రాణాన్ని త్యాగం చేయండి.

అల్లాహ్‌ ఆదేశం: ”అల్లాహ్‌ విశ్వాసుల ధనప్రాణాలను స్వర్గానికి బదులుగా కొనుక్కున్నాడు.”

[73]) వివరణ-5360: అంటే ప్రయాణంచేసే ఒంటె. ప్రవక్త (స) మరణానంతరం మూడు తరాల తరువాతి ప్రజలలో 100లో ఒక్కరుకూడా సరైనముస్లిమ్‌ లభించరు. మరికొందరు ఇది అన్ని కాలాలకు వర్తిస్తుందని భావిస్తున్నారు. ఇస్లామీయ ఆదేశాల్లో ముస్లిములంతా సమానమే. పేద, గొప్ప, మంచి, చెడు అందరూ సమానులే. ఒంటెలన్నీ సమానంగా ఉన్నట్టు.

[74]) వివరణ-5361: అంటే ఉడుము. ఇంకా ఈర్ష్యా, ద్వేషాలను కూడా అంటారు. అంటే ఒకవేళ మీ పూర్వీకులు ఉడుము కన్నంలో ప్రవేశిస్తే కూడా వారిని అనుసరిస్తూ అందులోకి ప్రవేశిస్తారు. అందులో ఎంత కష్టమైనా సరే. అంటే వారి మూఢాచారాలను, మూఢ నమ్మకాలను అనుసరిస్తారు. అందులో ఎన్నికష్టాలు, ఆపదలు, ఖర్చులు ఉన్నా మీరు వాటిని అనుసరిస్తారు. అన్నపానీయాల్లో, భోగవిలాసాల్లో, నడవడికలో మీరు వారినే అనుకరిస్తారు.

[75]) వివరణ-5363: అంటే భవిష్యత్తులో నా అనుచర సమాజం రారాజు అవుతుంది. రూమ్‌, ఫారిస్‌ మొదలైన దేశాలను జయిస్తుంది. యుద్ధధనంగా అక్కడి యువ రాజులను బంధించి బానిసలుగా చేసుకుంటుంది. వారి ద్వారా సేవలు పొందుతుంది. దానివల్ల గర్వాహంకా రాలకు గురవుతుంది. విర్రవీగుతూ భూమిపై సంచరిస్తుంది. వినయవిధేయతలకు దూరం అవుతూ ఉంటుంది. అటువంటి పరిస్థితిలో అల్లాహ్‌(త) దుర్మార్గులను వారిపై అధికారులుగా నియమిస్తాడు. వాళ్ళు వీరిని అనేక రకాల వ్యధలకు బాధలకు గురిచేస్తూ ఉంటారు. వాళ్ళు మళ్ళీ ఇస్లామీయ ఆదేశాలను అనుసరించనంత వరకు వారిపై దైవశిక్ష నిరంతరం తాండవిస్తుంది.

[76]) వివరణ-5364: అంటే ప్రళయం సంభవించక ముందు దుర్మార్గులు, పాపాత్ములు, పాలకులుగా వ్యవహరిస్తారు. ఇంకా ముస్లిములు నీచంగా అవమానించబడతారు. పరస్పరం యుద్ధాలకు, పోరాటాలకు గురయి సర్వనాశనం అవుతారు.

[77]) వివరణ-5366: ముస్‌’అబ్బిన్‌ ‘ఉమైర్ (ర) మక్కహ్కు చెందిన ఒక అందమైన యువకుడు. తల్లిదండ్రులు ఇతన్ని గాఢంగా ప్రేమించేవారు. ప్రత్యేకంగా అతని తల్లి ఖన్నాన్‌ బిన్తె మాలిక్‌ ధనవంతురాలు అయినందువల్ల తన కుమారుణ్ణి ఎంతో గారాబంగా, అల్లారు ముద్దుగా పెంచారు. ఫలితంగా ఖరీదైన దుస్తులు, ఖరీదైన సువాసనలు ఉపయోగించేవారు. ఎప్పుడైనా ప్రవక్త (స) అతని గురించి ప్రస్తావిస్తే ఇలా ప్రవచించేవారు: ”మక్కాలో ము’స్‌’అబ్‌ బిన్‌ ‘ఉమైర్‌ కంటే అందమైనవాడు, ఖరీదైన దుస్తులు ధరించేవాడు, గొప్పవాడు మరొకడు లేడు. అల్లాహ్‌ (త) శారీరకంగా ఎంత అందంగా తీర్చిదిద్దాడో, అంతే పరిశుద్ధంగా హృదయాన్ని మలిచాడు. కేవలం ఒక్క ఛాయ హృదయంపై పడగానే తౌ’హీద్‌కి ప్రభావితులయ్యారు. ప్రవక్త (స) వద్దకు వచ్చి ఇస్లామ్‌ స్వీకరించారు. ఇటువంటి సమయంలో ప్రవక్త (స) అర్‌ఖమ్‌ బిన్‌ అబీ అర్‌ఖమ్‌ (ర) ఇంట్లో శరణులో ఉన్నారు. ముస్లిములపై హింసా దౌర్జన్యాలు అధికం కాసాగాయి. అందువల్ల ము’స్‌’అబ్‌ బిన్‌ ‘ఉమైర్‌ (ర) కొంతకాలం వరకు తన ఇస్లామ్‌ స్వీకరణను రహస్యంగా ఉంచారు. రహస్యంగా ప్రవక్త (స)ను  కలిసేవారు. కాని ఒక రోజు అనుకోకుండా నమా’జు చదువుతూ ఉండగా ‘ఉస్మాన్‌ బిన్‌ ‘తల్‌’హా చూచి అతని తల్లి, కుటుంబానికి తెలియపరిచాడు. అది వినగానే ప్రేమ, అసహ్యంగా మారిపోయింది. ఇంకా అతన్ని బంధించడం జరిగింది. ముస్‌’అబ్‌ (ర) చాలా కాలం వరకు కష్టాలను భరిస్తూ ఉన్నారు. చివరికి తన స్వదేశాన్ని విడిచిపెట్టాలని నిశ్చయించుకొని సుఖ శాంతులు వెదుకుతూ హబ్‌షాకు బయలుదేరారు. సుఖ విలాసాల్లో మునిగి తేలిన ఈ యువకునికి ఇప్పుడు ఖరీదైన బట్టల అవసరం లేకుండా పోయింది. కేవలం ఒక్క తౌ’హీద్‌ కిరణం అతని ప్రాపంచిక అందచందాలు, వస్తుసామగ్రి పట్ల అతనిలో అనాశక్తతను జనింపజేసింది. కొంతకాలం తర్వాత మళ్ళీ హబ్‌షా నుండి మక్కహ్ తిరిగి వచ్చారు. పరదేశంలో బాధలు కష్టాలవల్ల రంగు, రూపం అన్నీ మారిపోయాయి. తల్లి అతని వ్యధలతో కూడిన జీవితాన్ని చూచి మళ్ళీ అతన్ని పీడించాలన్న నిర్ణయాన్ని మార్చుకున్నది. అప్పటికి ఇస్లామ్‌ కిరణాలు మదీనహ్లో ప్రవేశించి ఉన్నాయి. మదీనహ్లోని ఒక ఉన్నత వర్గం ఇస్లామ్‌ స్వీకరించి ఉంది. వాళ్ళు ప్రవక్త (స)ను తమకు ఇతర విషయాలు బోధించటానికి ఎవరినైనా పంపమని విన్నవించుకున్నారు. ప్రవక్త (స) ఈ కార్యం నిమిత్తం ము’స్‌’అబ్‌ బిన్‌ ‘ఉమైర్‌ను నియమించారు. కొన్ని హితోపదేశాలు చేసి మదీనహ్ వైపు పంపారు. ము’స్‌’అబ్‌ (ర) మదీనహ్ చేరి అద్బిన్ జరాహ్ (ర) ఇంటిలో ఉంటూ ఇంటింటికి తిరిగి ఇస్లామీయ ఆదేశాలను నేర్పే పని ప్రారంభించారు. ఈ విధంగా క్రమంగా ఒక బృందం తయారయింది. అప్పుడు నమా’జు కోసం, ఖుర్‌ఆన్‌ పఠనం కోసం స’అద్‌ బిన్‌ ‘జరారహ్ ఇళ్ళ వద్ద అందరినీ సమీకరించటం జరిగేది. 

ఒకసారి ము’స్‌’అబ్‌ బిన్‌ ‘ఉమైర్‌ (ర) అలవాటు ప్రకారం బనీ స’అద్‌ బిన్‌ ‘జరారహ్  ఇంట్లో కొందరు ముస్లిములను సంబోధిస్తున్నారు. ఇంతలో ‘అబ్దుల్‌ అష్‌హర్‌ తెగ నాయకుడు అద్బిన్ఆజ్ తన స్నేహితుడు ఉసైద్బిన్‌ ‘హుదైర్తో, ”ఈ ఇస్లామ్‌ ప్రచారకుడ్ని మన వీధినుండి తీసివేయండి, ఇక్కడికి వచ్చి బలహీనులను చెడగొడుతున్నాడు, ఒకవేళ ‘ఉసైద్‌తో నాకు బంధుత్వం లేకుంటే నేనే చేసేవాడిని” అని అన్నాడు. అది విని ‘ఉసైద్‌ బిన్‌ ‘హు’దైర్‌ బల్లెం ఎత్తి ము’స్‌’అబ్‌, స’అద్ల వద్దకు వచ్చి అసహ్యించుకుంటూ, ”ఇక్కడకు మీకు ఎవరు పిలిచారు? విశ్వాస బలహీనులను మీరు మార్గభ్రష్టత్వానికి గురి చేస్తున్నారు. మీరు మీ ప్రాణాల మీద తీపి ఉంటే వెంటనే ఇక్కడి నుండి వెళ్ళిపోండి” అన్నాడు. ము’స’అబ్‌ బిన్‌ ‘ఉమైర్‌ వినయంగా మాట్లాడుతూ ‘కొంచెం కూర్చొని మా మాటలు వినండి. నచ్చితే స్వీకరించండి. లేకపోతే మేమే వెళ్ళిపోతాము’ అని అన్నారు. ‘ఉసైద్‌ బిన్‌ ‘హు’దైర్‌ బల్లెం పాతిపెట్టి కూర్చొని శ్రద్ధగా వినసాగారు. ము’స్‌’అబ్‌ (ర) కొన్ని ఖుర్‌ఆన్‌ ఆయాతులను పఠించి, వాటి గురించి వివరించారు. కొద్దిసేపటికే ‘ఉసైద్‌ హృదయం విశ్వాసం వెలుగుతో వెలగసాగింది. సంతోషం పట్టలేక, ‘ఇది ఎంత మంచి ధర్మం? ఎంత మంచి మార్గ దర్శకత్వం? ఈ ధర్మంలో  ప్రవేశించడం ఎలా?’ అని ప్రశ్నించారు. అప్పుడు ము’స్‌’అబ్‌ ”ముందు స్నానం చేసి, పరిశుభ్రమైన దుస్తులు ధరించి, ఆ తరువాత చిత్తశుద్ధితో, లా ఇలాహ ఇల్లల్లాహ్ముహమ్మదు ర్రసూలుల్లాహ్‌’ అని పలకండి, అని అన్నారు. అతడు వెంటనే ఆ నియమాన్ని ఆచరించి ఆ శుభవచనాన్ని పఠించి ఇస్లామ్‌ స్వీకరించారు.  ‘ఉసైద్‌ బిన్‌ ‘హు’దైర్‌ (ర) ఇస్లామ్‌ స్వీకరించిన తర్వాత, ”నా తర్వాత మరో వ్యక్తి ఉన్నారు. అతడు కూడా తప్పకుండా ఇస్లామ్‌ స్వీకరించాలి. ఒకవేళ అతడు ఇస్లామ్‌ స్వీకరిస్తే ‘అబ్దుల్‌ అష్‌హల్‌ తెగ అంతా అతన్ని అనుసరిస్తుంది. నేనతన్ని మీ దగ్గరకు పంపుతాను. ‘ఉసైద్‌ బిన్‌ ‘హు’దైర్‌ శత్రుత్వం, ఆగ్రహంతో వచ్చి ప్రేమను, మిత్రత్వాన్ని తీసుకొని తన తెగ వద్దకు తిరిగి వెళ్ళారు. స’అద్‌ బిన్‌ మ’ఆజ్‌ దూరం నుండి చూచి, ‘అల్లాహ్ సాక్షి! ఈ వ్యక్తిలో ఏదో ఉద్యమం తలెత్తింది.’ దగ్గరకు రాగానే, ‘ఏమయింది?’ అని అడిగారు. దానికతను అల్లాహ్ సాక్షి! వారిద్దరూ ఏమాత్రం భయపడలేదు. స’అద్‌ బిన్‌ మ’ఆజ్‌ ఆగ్రహంతో నిలబడి, అస్‌’అద్‌ సహాయం కోసం బయలుదేరారు. అక్కడకు వెళ్ళి చూసేసరికి అంతా ప్రశాంతంగా ఉంది. వీరిద్దరితో నేను మాట్లాడాలని నన్ను రెచ్చగొట్టి ‘ఉసైద్‌ పంపారని అర్థం అయింది. వెంటనే ధార్మిక పక్షపాతం గుర్తుకు వచ్చి ఆగ్రహిస్తూ అబూ ఉమామహ్! ‘అల్లాహ్ సాక్షి! మన మధ్య బంధుత్వం ఉండకపోతే మీపట్ల నేను కఠినంగా వ్యవహరించే వాడిని. మాకు ఏమాత్రం ఇష్టంలేని ఇటువంటి నమ్మకాలు మా వీధిలో ప్రచారం చేయడానికి మీకు ధైర్యం ఎక్కడి నుండి వచ్చింది?’ అని అన్నారు. అప్పుడు ముస్‌’అబ్బిన్‌ ‘ఉమైర్ (ర) నిదానంగా మాట్లాడుతూ, ‘తమరు ముందు మా మాటలు వినండి, మీకు నచ్చితే స్వీకరించండి. లేదంటే మేమే ఇక్కడి నుండి వెళ్ళిపోతాము,’ అని అన్నారు. స’అద్‌ దానికి ఒప్పు కున్నారు. అతని ముందు కూడా ఇస్లామ్‌ గురించి చాలా చక్కగా వివరించారు. స’అద్‌ ముఖం విశ్వాసవెలుగుతో మెరవసాగింది. అప్పటికప్పుడే పవిత్ర వచనం, ‘లా ఇలాహ ఇల్లల్లాహ్‌ ము’హమ్మ దుర్రసూ లుల్లాహ్‌’ అని పలికి ఇస్లాం స్వీకరించారు. విశ్వాసంతో నిండిన హృదయంతో వెళ్ళి తన తెగవారి వద్దకు వచ్చి బహిరంగంగా, ”ఓ బనీ అష్‌’హల్‌! నేనెవరినో చెప్పండి” అని అన్నారు. దానికి వారు, ”మీరు మా నాయకులు, బుద్ధి, జ్ఞానం, ఉన్నత వంశం గల మేధావులు” అని అన్నారు. దానికి అతడు, ”అల్లాహ్ సాక్షి! మీరందరూ అల్లాహ్‌(త), ఆయన ప్రవక్తను విశ్వసించనంత వరకు మీ అందరితో మాట్లాడటం నిషిద్ధం” అని అన్నారు. ఈ విధంగా అబ్దుల్అష్‌’హల్తెగ వారందరూ అద్బిన్ఆజ్ప్రభావం వల్ల ఇస్లామ్స్వీకరించారు. ము’స్‌’అబ్‌ బిన్‌ ‘ఉమైర్‌ కొంతకాలం వరకు అస్‌’అద్‌ బిన్‌ ‘జరారహ్‌ ఇంట్లో అతిథిగా ఉన్నారు. కాని బనీ నజ్జార్‌ అతనిపై కఠినంగా వ్యవహరించటం వల్ల స’అద్‌ బిన్‌ మ’ఆజ్‌ ఇంటికి వెళ్ళి పోయారు. ఇక్కడి నుండే ఇస్లామ్‌ వెలుగును చివరికి కొన్ని కుటుంబాలు తప్ప మిగిలిన వారందరూ ఇస్లామ్‌ స్వీకరించారు.  మదీనహ్ మునవ్వరహ్లో విశ్వాసుల ఒక బృందం ఏర్పడితే, ముస్‌’అబ్‌ () ప్రవక్త () అనుమతితో అద్బిన్ఖైసమహ్ ఇంట్లో సామూహికంగా జుమఅహ్ నమాజ్ప్రారంభించారు. ముందు నిలబడి ప్రభావ పూరితమైన ప్రసంగం చేసారు. ఆ తరువాత భక్తిశ్రద్ధలతో నమా’జు చదివించారు. ఆ తరువాత అందరికోసం విందు ఏర్పాటు చేసారు. ఈవిధంగా వారానికి ఒకసారి ముస్లిము లందరూ కలుసుకునే ఆ ఇస్లామీయ జుమ’అహ్ సాంప్రదాయం ముస్‌’అబ్బిన్‌ ‘ఉమైర్ఉద్యమం ద్వారా ప్రారంభ మయింది.

ఉఖ్‌బహ్ తొలి బై’అత్‌లో కేవలం 12 మంది అ’న్సార్లు పాల్గొన్నారు. కాని ము’స్‌’అబ్‌ (ర) ఒక్క సంవత్సరంలోనే మదీనహ్ ప్రజలందరినీ ఇస్లాంను అనంతంగా ప్రేమించే వారుగా మలచి వేసాడు. రెండవ సంవత్సరం 73 మంది ముస్లిములు గల ఒక బృందం ప్రవక్త (స)ను మదీనహ్ ఆహ్వానించటానికి బయలుదేరింది. వారి నాయకులు ము’స్‌’అబ్‌ (ర) కూడా వారి వెంట ఉన్నారు. మక్కహ్ చేరగానే అన్నిటికంటే ముందు ప్రవక్త (స) వద్దకు వచ్చి విజయ గాథ వినిపించారు. ప్రవక్త (స) అమిత శ్రధ్ధతో అంతా విని, అతని ప్రయత్నం, శ్రమలను కొనియాడారు. ఇంకా చాలా సంతోశించారు. ము’స్‌’అబ్‌ తల్లికి కొడుకు వచ్చాడన్నవార్త తెలిసి, ”ఓ అవిధేయుడా! నీవు వచ్చిన ఊరిలో నేను ఉన్నానని తెలిసి కూడా ముందు నన్ను కలవడానికి కూడా రాలేదు,” అని కబురు పంపారు. దానికి అతను ”నేను ప్రవక్త (స) కంటే ముందు ఎవరినీ కలవను,” అని తెలియపరిచారు. ము’స్‌’అబ్‌ (ర) ప్రవక్త (స)ను కలిసినతర్వాత తన తల్లి దగ్గరకు వచ్చారు. అప్పుడు ఆమె, ‘నీవు ఇప్పటి వరకు పరాయి మతంపై ఉన్నావని అనుకుంటున్నాను,’ అని అన్నారు. దానికి అతను, ‘నేను ప్రవక్త (స) ధర్మమైన ఇస్లామ్‌ను ఆచరించే వాడ్ని. అల్లాహ్‌ (త) దాన్ని తనకోసం, తన ప్రవక్త కోసం ఎన్నుకున్నాడు’ అని అన్నారు. అతని తల్లి, ‘హబష్‌లోని, యస్‌’రిబ్‌లోని కష్టాలు, ఆపదలు  మరచి పోయావా?’ అని అన్నారు. ము’స్‌’అబ్‌ (ర) తననను, మళ్ళీ బంధిస్తారని భావించి, ‘బిగ్గరగా నువ్వు బలవంతంగా మతం మార్పిడి చేయగలవా? నీ ఉద్దేశం ఇదే అయితే నన్ను బంధించిచూడు. ఎవడు ముందు నా ముందుకువస్తే నేను వాడిని చంపివేస్తాను.’ అతని ఈ ప్రవర్తన చూసి ఆమె (తల్లి), ‘నువ్వు నా దగ్గరినుండి వెళ్ళిపో,’ అని చెప్పి ఏడ్వసాగింది. ము’స్‌’అబ్‌ చాలా ప్రభావితులయ్యారు. అనంతరం, ‘ఓ నా తల్లీ! నేను నీ శ్రేయోభిలాషిని, నీకు ఒక మంచి సలహా ఇస్తున్నాను. దేవుడు ఒక్కడే ఉన్నాడు, ము’హమ్మద్‌ (స) అల్లాహ్‌ (త) దాసులు, మరియు ప్రవక్త అని సాక్ష్యం ఇవ్వు’ అని అన్నారు. దానికి ఆమె, ‘నక్షత్రాల సాక్షి! నేను ఈ మతాన్ని స్వీకరించి,  తెలివి తక్కువ దాన్నని నిరూపించుకోను. వెళ్ళు నువ్వూ, నీ మాటలూ నాకు అక్కర్లేదు. నేను నా మతాన్ని అంటిపెట్టుకొని ఉంటాను’ అని అన్నది. ము’స్‌’అబ్‌ బిన్‌ ‘ఉమైర్‌ (ర) మక్కహ్ వచ్చిన తర్వాత జి’ల్‌’హిజ్జహ్‌, ము’హర్రమ్‌, ‘సఫర్‌ నెలలు ప్రవక్త (స) వెంటఉన్నారు. రబీఉల్‌ అవ్వల్‌లో ప్రవక్త (స) అనుమతి పొంది శాశ్వతంగా మదీనహ్ వైపు వలసపోయారు.

పోరాటాలు: 2వ హిజ్రీ సంవత్సరం నుండి సత్యాసత్యాల పోరాటాల పరంపర ప్రారంభమయింది. ము’స్‌’అబ్‌ (ర) యుద్ధ మైదానంలో కూడా ప్రధానపాత్ర వహించేవారు. బద్ర్యుద్ధంలో ముహాజిరీన్ల జెండా ఆయన చేతుల్లోనే ఉండేది. అదేవిధంగా హుద్ యుద్ధంలో కూడా జండ బాధ్యత ఆయనకే దక్కింది. ఈ యుద్ధంలో ఒక్క పొరపాటు వల్ల విజయం ఓటమిగా మారి నప్పటికీ అవిశ్వాసులతో యుద్ధం చేయటానికి స్థిరంగా ఉంటూ ముందడుగు వేసారు. ఎందుకంటే ప్రవక్త (స)కు ఎటువంటి హాని కలుగకూడదనే తపన వారిని ప్రేరేపించింది. ఈ స్థితిలోనే ఒక అవిశ్వాసి దాడి చేసి కుడిచేతిని నరికివేసాడు. వెంటనే ఎడమ చేతితో జెండాను అందుకున్నారు. ఆ సమయంలో ”వ మా  ము’హమ్మదున్‌ ఇల్లా రసూలున్‌ ఖద్‌ఖలత్‌ మిన్‌ ఖబ్‌లిహి ర్రుసుల్‌” (ఆల ఇమ్రాన్, 3:144) అంటే –’మరియు ము’హమ్మద్ కేవలం ఒక సందేశహరుడు మాత్రమే. వాస్తవానికి అతనికి పూర్వం అనేక సందేశహరులు గడచిపోయారు,’ అని పఠిస్తూ ఉన్నారు. ఆ అవిశ్వాసి ఎడమచేతిని కూడా నరికివేసాడు. అయినప్పటికీ జెండాను తన రెండు భుజాలతో గుండెకు హత్తుకున్నారు. మళ్ళీ అవిశ్వాసి కరవాలంతో దాడిచేసి కరవాలాన్ని గుండెలో దింపివేసాడు. ఈవిధంగా ఇస్లాం వీరుడు చివరి క్షణం వరకు ఇస్లామ్‌ సేవచేస్తూ, వీరోచితంగా పోరాడుతూ వీరమరణం పొందాడు. ఇస్లామ్‌ ఓడిపోవటానికి రాలేదు. అతని సోదరుడు అబుర్రూమ్‌ (ర) ముందడుగు వేసి ఎదుర్కొన్నారు, చివరి వరకు వీరోచితంగా పోరాడారు. యుద్దం ముగిసిన తర్వాత ప్రవక్త (స) ము’స్‌’అబ్‌ (ర) శవం వద్ద నిలబడి ”మినల్‌ మఅ’మినీన రిజాలున్‌ ‘సదఖూ మా ‘ఆహదుల్లాహ ‘అలైహి” (అల్-అ:హ్జాబ్, 33:23) అంటే –’విశ్వాసులలో అల్లాహ్ కు తాము చేసిన ఒప్పందం నిజం చేసి చూపిన వారు కూడా ఉన్నారు.’ అని పఠించారు.  ఆ తర్వాత ”మీరందరూ తీర్పుదినం నాడు అల్లాహ్‌ (త) దర్బారులో హాజరౌతారని అల్లాహ్‌ ప్రవక్త సాక్ష్యం ఇస్తున్నాడు” అని ప్రవచించారు. ఆ తరువాత ఖనన సంస్కారాలు జరిగాయి. ఆ కాలంలో పేదరికం, దారిద్య్రం వల్ల వీరమరణం పొందిన వారికి శవవస్త్రాలు కూడా లభించేవి కావు. ము’స్‌’అబ్‌ (ర) శవంపై కేవలం ఒక్క దుప్పటి మాత్రమే ఉంది. తలకప్పితే కాళ్ళు కనబడేవి, కాళ్ళు కప్పితే తల కనబడేది. చివరికి దుప్పటితో తల కప్పబడింది. కాళ్ళపై గడ్డి వేయడం జరిగింది. ఆ తరువాత అతని సోదరులు అబుర్రూమ్‌, ‘ఆమిర్‌ బిన్‌ రబీ’అ, సువైబిత్‌ బిన్‌ స’అద్‌ల సహాయంతో సమాధి కప్పబడింది. ము’స్‌’అబ్‌ (ర) చాలా తెలివితేటలు గల వారు. నగుమోము గలవారు. వీరి సద్గుణ సంపన్నత వల్ల మదీనహ్లో ఇస్లామ్‌ చాలా వేగంగా వ్యాపించింది. అంతవరకు అవతరించ బడినంత ఖుర్‌ఆన్‌ను కంఠస్తం చేసుకున్నారు. మదీనహ్లో జుమ’అహ్ నమా’జు వీరి ఉద్యమం ద్వారానే ప్రారంభించబడింది. ఇతనే అందరి కంటే ముందు ఇమామ్‌గా నియమించబడ్డారు. ఇస్లామ్‌కు ముందు ఆయన విలాసవంతమైన జీవితం గడిపేవారు. చాలా అందంగా ఉండేవారు. కాని ఇస్లామ్‌ స్వీకరించిన తర్వాత అతనిశరీరంపై అతుకులుగల దుప్పటి ఉండేది. ఆ స్థితిలో అతన్ని చూసి అనుచరులందరూ తలలు వంచుకున్నారు. కాని సత్యం అతన్ని ఎలా మార్చిం దంటే ఇస్లామ్‌ కోసం అతడు సుఖాలన్నిటినీ త్యాగం చేసారు. ఇది ఇస్లామ్‌ సేవకుని ఈ సంక్షిప్త జీవిత గాథ.

[78]) వివరణ-5367: అంటే అది చాలా ఆందోళనకరమైన, వ్యధాభరితమైన కాలం వస్తుంది. అప్పుడు ధర్మాన్ని ఆచరించడం చాలా కష్టమౌతుంది. అంటే చేతిలో అగ్నికణం పట్టుకున్నట్టు ఉంటుంది. ఇటువంటి కాలంలో ఇస్లామ్‌పై నిలకడగా ఉండే వ్యక్తి ప్రపంచంలో అందరికంటే పోరాటవీరుని కంటే తక్కువేమీ కాదు.

  [79]) వివరణ-5369: అంటే మీ శత్రువులందరూ మీతో యుద్ధం చేయటానికి ఏకమవుతారు. విందులో ఏకమైనట్టు. మీతో యుద్ధం చేస్తారు. మిమ్మల్ని ఓడిస్తారు. అప్పుడు ఒక వ్యక్తి ‘అప్పుడు మేము తక్కువ సంఖ్యలో ఉంటామా?’ అని ప్రశ్నించాడు. దానికి ప్రవక్త (స), ‘లేదు, మీ సంఖ్య అధికంగా ఉంటుంది. మీరు చాలా బలహీనులైపోతారు. శత్రువుల హృదయాలనుండి మీ భయం తొలగి పోతుంది. ఇంకా మీరు సంకోచాలకు గురవుతారు,’ అని అన్నారు. ‘సంకోచం అంటే ఏమిటి,’ అని ప్రశ్నించడం జరిగింది. ప్రవక్త (స) సమాధాన మిస్తూ, ‘ఐహికవాంఛలు, కోరికలు, ప్రపంచంపట్ల ఆసక్తి, మరణం పట్ల అనాశక్తత, వీటివల్ల శత్రువులను ఎదుర్కోలేరు. చేతులు ఎత్తివేస్తారు. నీచంగా అవమానించబడతారు’ అన్నారు.

[80]) వివరణ-5372: సూరతుల్లహబ్‌ (111): ” అబూ లహబ్ రెండుచేతులూ నశించుగాక మరియు అతడు కూడా నశించిపోవు గాక! అతడి ధనం మరియు అతడి సంపాదన (సంతానం) అతడికి ఏ మాత్రం పనికిరావు! అతడు ప్రజ్వలించే నరకాగ్నిలో కాల్చబడతాడు! మరియు అతడి భార్య కూడా! కట్టెలు మోసే (చాడీలు చెప్పి కలహాలు రేకెత్తించే) స్త్రీ! ఆమె మెడలో బాగా పేనిన ఖర్జూరపునార త్రాడు (మసద్) ఉంటుంది. (అల్లహబ్‌, 111:1-5) ఈ సూరహ్‌ వివరణలో ఇబ్నె కసీ’ర్‌ ఇలా పేర్కొన్నారు, ”సహీ బు’ఖారీలో ఇలా ఉంది, ‘ప్రవక్త (స) బత్‌హాలోని ఒక కొండపై ఎక్కి బిగ్గరగా, ‘యా సబాహా, యా సబాహా” అని అరవసాగారు. ఖురైషులందరూ వచ్చి చేరారు. అప్పుడు ప్రవక్త (స), ‘ఒకవేళ నేను మీతో ఉదయం లేదా సాయంత్రం శత్రువు దాడి చేయనున్నాడనంటే మీరు నమ్ముతారా?’ అని అన్నారు. అందరూ ముక్తకంఠంతో, ‘అవును,’ అని అన్నారు. అప్పుడు ప్రవక్త (స), ‘వినండి, నేను మిమ్మల్ని దైవశిక్షలు రాబోతున్నాయని హెచ్చ రిస్తున్నాను,’ అని అన్నారు. అప్పుడు అబూ లహబ్‌, ‘నీ పాడుగాను, ఇందుకేనా మమ్మల్ని ఇక్కడ చేర్చింది,’ అని తిట్టాడు. అప్పుడు ఈ సూరహ్‌ అవతరింప జేయబడింది. (బు’ఖారీ)

మరో ఉల్లేఖనంలో ఇలా ఉంది, ”చేతులు దులుపుతూ, శపిస్తూ లేచి నిలబడ్డాడు, అబూ లహబ్‌ ప్రవక్త (స) చిన్నాన్న. అతని పేరు అబ్దుల్జ్జా బిన్‌ ‘అబ్దుల్ముత్తలిబ్. ఇతన్ని అబూ ‘ఉత్‌బహ్ అని పిలచేవారు. అతడి అందచందాల వల్ల అందరూ అతన్ని అబూ లహబ్‌ అని అనేవారు. ఇతడు ప్రవక్త (స)కు బద్ధశత్రువు. ఎల్లప్పుడూ హింసిస్తూ ఉండేవాడు. హాని చేకూర్చేవాడు. రబీ’అహ్ బిన్‌ ‘ఇబాద్‌ ఇస్లామ్‌ స్వీకరించిన తరువాత ఒకసారి ఇస్లామ్‌కు ముందు సంఘటన గురించి పేర్కొన్నాడు, ”ప్రవక్త (స) జు’ల్‌ మ’జాజ్‌ బజారులో ప్రజలతో, ‘లా ఇలాహ ఇల్లల్లాహ్‌’ పలకండి. సాఫల్యం పొందుతారు అని అంటూ తిరగటం చూసాను. ప్రవక్త (స) చుట్టూ ప్రజలు గుమిగూడి ఉండటం చూసాను. అయితే ప్రవక్త (స) వెనుకనే ఒక వ్యక్తి, ”ఈ వ్యక్తి మార్గభ్రష్టుడు, అసత్యవంతుడు” అని అంటూ ఉండటం కూడా నేను చూసాను. ఏది ఏమైనా ప్రవక్త (స) ప్రజల వద్దకు వెళ్ళి దేవుని ఏకత్వ సందేశం అందజేసేవారు. ఈ వ్యక్తి కూడా అలా అంటూ వెనుక వెళ్ళేవాడు. నేను ప్రజలతో ‘ఇతను ఎవరు?’ అని అడిగాను. దానికి ప్రజలు ‘ఇతడు ప్రవక్త (స) చిన్నాన్న’ అని చెప్పారు.

ఉల్లేఖనకర్త అయిన బూజ్జియాద్, రబీఅతో, ‘అప్పుడు మీరు బాలురిగా ఉండి ఉంటారు,’ అని అన్నాడు. దానికి అతడు, ‘లేదు, అప్పుడు నేను యుక్త వయస్సుకు చేరువగా ఉండేవాడిని. కుండలో నీళ్ళునింపి తెచ్చే వాడిని,’ అని అన్నారు.

మరో ఉల్లేఖనంలో ఇలాఉంది, ”నేను మా నాన్నగారివెంట ఉన్నాను. అప్పుడు నేను యుక్త వయస్సుకు చేరి ఉన్నాను. ప్రవక్త (స) ఒక తెగవారి వద్దకు వెళ్ళి, ‘ప్రజలారా! నేను మీ వద్దకు దైవప్రవక్తగా పంపబడ్డాను. నేను చెప్పేదేమిటంటే, ఒక్క ఆరాధ్యుడ్నే ఆరాధించండి, ఆయనకు ఎవరినీసాటికల్పించకండి. నన్ను నమ్మండి. నన్ను నా శత్రువుల నుండి రక్షించండి, నాకు ఆదేశించబడిన దాన్ని నిర్వర్తించటానికి.’ ప్రవక్త (స) ఈ సందేశం ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిన వెంటనే ఆయన చిన్నాన్న అక్కడికి వచ్చి, ‘ఓ ప్రజలారా! ఈవ్యక్తి మిమ్మల్ని లాత్‌, జ్జాల ఆరాధనకు  దూరం చేయాలని ప్రయత్నిస్తున్నాడు.   క్రొత్త ధర్మం వైపు మిమ్మల్ని ఈడ్చాలని ప్రయత్నిస్తున్నాడు. జాగ్రత్త! వీడి మాటలు వినకండి,’ అని అనటం నేను చూసేవాడిని. (అ’హ్మద్‌, తబ్‌రానీ)

అబ్దుల్లాహ్బిన్మస్‌’ఊద్‌ () కథనం: ప్రవక్త (స) తన జాతి వారిని ఏక దైవారాధన వైపు ఆహ్వానించినపుడు అబూ లహబ్‌, ‘ఒకవేళ నా తమ్ముని కొడుకు మాటలు నిజమైతే తీర్పుదినం నాడు నా ధనాన్ని, సంతానాన్ని పరిహారంగా చెల్లించి దైవ శిక్ష నుండి తప్పించుకుంటాను’ అని అన్నాడు. అతడి భార్య ఖురైష్‌ స్త్రీల నాయకురాలు. ఆమె పేరు అర్వా, ఆమెను ఉమ్మె జమీల్‌ అని అందరూ పిలిచేవారు. ఈమె ‘హర్‌బ్‌ బిన్‌ ‘ఉమయ్య కూతురు. ఈమె అబూ సుఫియాన్చెల్లెలు. ఈమె తన భర్త పాపకార్యాల్లో సహాయసహకారాలు అందించేది. అందువల్ల తీర్పుదినం నాడు నరకంలో ఈమె కూడా అతడి వెంట ఉంటుంది. కట్టెలు తెచ్చి తన భర్త కాలుతున్న మంటల్లో వేస్తూ ఉంటుంది. ఆమె మెడలో నిప్పుత్రాడు ఉంటుంది.

ఇబ్నె అబ్బాస్‌ () కథనం: ఆమె అడవి నుండి ముళ్ళ కట్టెలు ఏరి తెచ్చి ప్రవక్త (స) వెళ్ళే మార్గంలో పరిచేది. ఈ స్త్రీ ప్రవక్త (స) పేదరికంపై ఎత్తిపొడిచేది. ఆమెను కట్టెలు ఏరడం గుర్తు చేయబడింది. అయితే మొదటి అభిప్రాయమే సరైనది.

యీద్బిన్ముసయ్యిబ్‌ () కథనం: ఆమె వద్ద ఒక అందమైన హారం ఉండేది. నేను దీన్ని అమ్మి ము’హమ్మద్‌ (స)కు వ్యతిరేకతలో ఖర్చు చేస్తానని అనేది. దానికి బదులుగా ఆమె  మెడలో నిప్పుకణాల హారం వేయబడునని పేర్కొనడం జరిగింది. మసద్‌ అంటే ఖర్జూరం చెట్టు త్రాడు.

ఉర్వహ్‌ () కథనం: ఇది నరకంలోని గొలుసులు. దాని ఒక్కో జాయింటు 70 గజాలు ఉంటుంది.

సౌ’రీకథనం: ఇదినరకంలోని హారం. దీని పొడవు 70 గజాలు.

జౌహరీ అభిప్రాయం: ఇది ఒంటె చర్మం, వెంట్రుకలతో తయారు చేస్తారు.

ముజాహిద్‌ కథనం: అది ఇనుప హారం.

ఆయిషహ్‌ () కథనం: ఈ సూరహ్‌ అవతరించబడి నపుడు ఈ మెల్లకన్ను స్త్రీ ఉమ్మె జమీల్‌ బిన్‌తె ‘హర్‌బ్‌ తనచేతిలో సూదిగా ఉన్న రాయిని తీసుకొని, ”మేము ఆ నీచ వ్యక్తి తిరస్కారులం, అతని ధర్మ శత్రువులం, అతని అవిధేయులం” అని అంటూ వచ్చింది. అప్పుడు ప్రవక్త (స) క’అబతుల్లాహ్‌లో కూర్చొని ఉన్నారు. అతనితో పాటు మా తండ్రిగారు అబూ బకర్‌ ‘సిద్దీఖ్‌ కూడా ఉన్నారు. ఆమెను చూసిన అబూ బకర్‌ ప్రవక్త (స)తో, ‘ప్రవక్తా! ఆమె వస్తుంది. మిమ్మల్ని చూస్తుందేమో,’ అని అన్నారు. వెంటనే ప్రవక్త (స), ‘నీ వేమాత్రం విచారించకు. ఆమె నన్ను చూడలేదు,’ అని అన్నారు. వెంటనే ప్రవక్త (స) ఖుర్‌ఆన్‌ ఆయతులు పఠించడం ప్రారంభించారు. ఆమె నుండి తప్పించుకోవడానికి. ఖుర్‌ఆన్‌ స్వయంగా ఆదేశిస్తుంది, ”నీవు ఖుర్‌ఆన్‌ పఠిస్తూఉంటే, మేము నీకూ, అవిశ్వాసులకూ మధ్య తెర కల్పిస్తాం.” ఆమె వచ్చి అబూ బకర్‌ (ర) వద్దకు వచ్చి నిలబడింది. ప్రవక్త (స) కూడా అక్కడే కూర్చున్నారు. కాని దైవ మహత్యం వల్ల ఆమెను తెర కప్పింది. ప్రవక్త (స)ను చూడలేకపోయింది. ఆమె అబూ బకర్‌తో ‘నీ మిత్రుడు కవిత్వాల్లో నన్ను తిట్టాడు,’ అని అన్నది. దానికి అబూ బకర్‌, ‘లేదు, లేదు అల్లాహ్ సాక్షి! అతను (స)ఏమీ తిట్టలేదు.’ అప్పుడు ఆమె, ‘నేను వారి నాయకుని కూతురునని ఖురైషు లందరికీ తెలుసు’ అని అంటూ వెళ్ళి పోయింది. (ఇబ్నె అబీ హాతిమ్‌)

ఒకసారి తన పొడవైన దుప్పటి కప్పుకొని ‘తవాఫ్‌ చేస్తూ ఉంది. కాలు దుప్పటిలో చిక్కుకుంది. కాలుజారి క్రింది పడింది.

[81]) వివరణ-5374: అంటే నా దైవదౌత్యం అందరికీ వర్తిస్తుంది. అల్లాహ్‌ (త) నన్ను హ్మతుల్లిల్ఆలమీన్‌” గా పంపాడు. అందువల్ల నా అనుచర సంఘం కారుణ్యానికి తగినది. వారి పాపాలకు ప్రాయశ్చిత్తం ఇక్కడే జరుగుతుంది.

[82]) వివరణ-5375 & 5376: ఇది ప్రవక్త (స) భవిష్యవాణి. 10వ హిజ్రీ, వరకు దైవదౌత్యం, కారుణ్యం, మరియు వెలుగుతో నిండిన కాలం ఉంటుంది. ప్రవక్త (స) మరణానంతరం ఖలీఫాల కాలం, అబూ బకర్‌, ‘ఉమర్‌, ‘ఉస్మాన్‌, ‘అలీల కాలం ప్రారంభం అయింది. ఇస్లామ్‌ చట్రం 35, 36, 37 సంవత్సరాల వరకు తిరుగుతూ ఉంటుంది. అంటే ఈ కాలంలో చాలా అభివృద్ధి జరుగుతుంది. ముస్లిములందరూ కలసి ఉంటారు. ఆ తరువాత ఒకవేళ వారి ధర్మం మిగిలి ఉంటే 70 సంవత్సరాల వరకు ఉంటుంది. లేకపోతే ఇతర జాతుల్లా నాశనం అయి పోతారు. 35 సంవత్సరాల వరకు ముస్లిము లందరూ ఐకమత్యంగా ఉంటారు. ఆ తరువాత చెల్లాచెదురై పోతారు. ఈజిప్టువారు ద్రోహులుగా మారి ‘ఉస్మాన్‌ (ర)పై దండెత్తారు. 36 సంవత్సరాలు అనంతరం జమల్ యుద్ధం సంభవించింది. దీని ఒక సంవత్సరం తరువాత అలీ () కాలంలో సిఫ్ఫీన్యుద్ధం సంభవించింది. ఇందులో అనేక మంది ముస్లిములు హతమార్చబడ్డారు. దీనివల్ల ఇస్లామీయ సమాజానికి చాలానష్టం జరిగింది. ఈ యుద్ధాలు, పోరాటాల అనంతరం ఒక రాజ్యం ఏర్పడి, 70 సంవత్సరాల వరకు ఉంటుంది. అంటే బనీ ఉమయ్య సామ్రాజ్యం, వీరి కాలంలో ధార్మికంగా నష్టం జరిగింది.  ఒకవేళ 37 సంవత్సరాల తరువాత ముస్లిమ్‌ సమాజంలో ఐక్యత జనించకపోతే, మరో 70 సంవత్సరాలు ధర్మం స్థిరంగా ఉంటుందని, ఒకవేళ అలా కాకపోతే వెనుకటి జాతుల్లా సర్వనాశనం అవుతారని ప్రవక్త (స) ప్రవచించారు. కాని 35 సంవత్సరాల్లోనే అనైక్యతకు గురై ముస్లిములు కూడా వెనుకటి జాతుల్లా వినాశనానికి గురయ్యారు. బనీ ఉమయ్య నామరూపాలు లేకుండా పోయింది. ఆ తరువాత అబ్బాసియా సామ్రాజ్యం స్థాపించబడింది. అది కూడా హలాకూఖాన్‌ చేతిలో పతనమయింది. (అన్‌వార్‌)

[83]) వివరణ-5377: అంటే ఇస్లామ్‌లో భావాలు  మార్చి మద్యానికి వేరేపేర్లు పెట్టి త్రాగటం జరుగుతుంది. అంటే ఇస్లామ్‌ను తిరగవేయడం జరుగుతుంది. ఇంకా అనేక విషయాలు ఇందులో చేరి ఉన్నాయి. సంగీతం, నృత్యం మొదలైనవి.

***

%d bloggers like this: