25. సంస్కారాలు (ఆదాబ్) | మిష్కాతుల్ మసాబీహ్

25- كِتَابُ الْآدَابِ

25. సంస్కారాల పుస్తకం

1  بَابُ السَّلَام

  1. సలాం అధ్యాయం

ప్రతి జాతిలో నమ్మకాలు, పద్ధతులు, ఆచరణలు, నివసించే కలిసే, అన్నపానీయాలు, పడుకునే, లేచే, స్నానాదులు, సంభాషణలు, సంతోష దుఃఖవిచారాల కొన్ని ప్రత్యేక పద్ధతులు ఉన్నాయి. వాటివల్ల వాటిని గుర్తించడం జరుగుతుంది. వీటన్నిటినీ కలిపి సమా జంగా పరిగణించడం జరుగుతుంది. వీటిని సంస్కృతి, నాగరికతలుగా భావించడం జరుగుతుంది.

  వివిధ జాతులలో వివిధ రకాల సామాజిక నియమ నిబంధనలు ఉన్నాయి. కొన్ని అక్కడి వాతావరణంపై ఆధారపడి ఉన్నాయి. వాతావరణం వేడిగా ఉన్న ప్రాంతంలోని ప్రజలు లూజుగా ఉన్న దుస్తులు ధరిస్తారు మరియు పగిడి ధరిస్తారు.

చల్లని వాతావరణంలోని ప్రజలు దుడ్డుగా ఉన్న దుస్తులు ధరిస్తారు. వాతావరణం సామాన్యంగా ఉన్న ప్రాంతం ప్రజలు తమకు తగిన విధంగా దుస్తులు ధరిస్తారు.

కొన్ని జాతుల్లో ఆవు మలమూత్రాలను పరిశుభ్రతా సాధనాలుగా పరిగణించటం జరుగుతుంది, భోజనం చేసే టప్పుడు నగ్నంగా  ఉండి చెట్ల ఆకులపై తినటాన్ని శుభంగా భావిస్తారు, మలమూత్రాల విసర్జనా సమయాల్లో చెవికి దారం కట్టుకోవటం ఆరాధనగా, దైవసాన్నిహిత్యంగా భావించడం జరుగు తుంది. ఇటువంటి నమ్మకాలు, భావాలనే సామాజిక ప్రామాణికతగా పరిగణించటం జరుగుతుంది.

   కాని ఇస్లామీయ నియమ నిబంధనలు నమ్మకాలపై, ఆచారాలపై ఆధారపడి లేవు. ఇవి కేవలం అల్లాహ్ (త) ఆదేశాలు, నిబంధనలపై ఆధారపడి ఉన్నాయి అల్లాహ్ (త) నుండి వీటిని ప్రవక్తలు, ప్రజలకు అందజేసారు. అంటే ఆదర్శ జీవితం ప్రసాదించబడింది. అంటే ఇస్లామీయ నియమ నిబంధనలన్నీ అల్లాహ్‌(త) మరియు ఆయన ప్రవక్త తరఫు నుండి నిర్దేశించబడి ఉన్నాయి. ఇస్లామ్‌లోని అనేక  ప్రత్యేక నియమ నిబంధనలు ఇతర జాతుల్లో ఏమాత్రం కానరావు.

1. జీవితంలోని ప్రతి పనికి ప్రత్యేక నియమ నిబంధనలు ఉన్నాయి. చివరకు నిద్రపోవటం, మేల్కొనటం, మలమూత్ర విసర్జనలకు కూడా నియమ నిబంధనలు ఉన్నాయి. ఒక యూదుడు, ‘మీ ప్రవక్త అన్ని విషయాలు బోధిస్తారు. చివరకు మల మూత్ర విసర్జన నియమాలు కూడా బోధిస్తారు,’ అని అన్నాడు. దానికి, ‘అవును, మా ప్రవక్త ప్రతి విషయం గురించి బోధిస్తారు,’  అని చెప్పటం జరిగింది.

 2. ఆరాధనలు, లావాదేవీల్లో, సంభాషణల్లో, ఖర్చులో, వ్యాపారంలో మధ్మేమార్గం ఉంది.

3. ఇందులోని ప్రతి నియమం ప్రకృతిపై ఆధారపడి ఉంది. ఇస్లామీయ నియమ నిబంధనలు మానవునికి సహజత్వాన్ని ప్రసాదిస్తాయి.

 4. ఇస్లామీయ విధానంలో గొప్పలు, చూపుగోలు, ఆర్భాటాలు ఉండవు. ఇందులో నిరాడంబరత ఉట్టి పడుతుంది.

5. ఇస్లామీయ విధానాల వల్ల మానవుల్లో సమానత్వం, సౌభ్రాతృత్వం, సోదరభావం మొదలైన వాటికి చాలా ప్రాముఖ్యత ఉంది.

 6. పేద, గొప్ప; పాలకులు, పాలితులు; సేవకుడు యజమానుల గురించి అనేక నియమ నిబంధనలు ఉన్నాయి. వీటి వల్ల ఎవరి హక్కూ కొల్లగొట్టటం జరుగదు.

 7. ఇస్లామీయ విధానం ద్వారా అజ్ఞాన కాలపు మూఢా చారాలు, మూఢ నమ్మకాలు అన్ని రూపుమాప బడ్డాయి.

8. ఇస్లామీయ విధానంవల్ల పరస్పర సంబంధాలు, ప్రేమానురాగాలు విలసిల్లుతాయి. జనిస్తాయి. శతృత్వం, ఈర్ష్యా ద్వేషాలు తొలగిపోతాయి.

 9. మానవునికి ఇస్లామీయ విధానాల ద్వారా ఒక మంచి శిక్షణ లభిస్తుంది. దీనివల్ల ఒక ఉత్తమ వ్యక్తిగా పరిగణించ బడతాడు.

10. ఇస్లామీయ విధానాల వల్ల ఉత్తమ గుణాలు, ప్రత్యేకతలు లభించి ఒక పరిపూర్ణ మానవునిగా వర్థిల్లడం జరుగుతుంది. వీటివల్ల ఆత్మ పరిశీలన, ఆత్మశుద్ధి జరుగుతుంది. శరీరానికి, ఆత్మకూ అన్ని రకాల చెడుల నుండి దూరంగా ఉంచడం జరుగు తుంది. చివరికి వీటివల్లే  సాఫల్యం సిద్ధిస్తుంది.

ప్రవక్త (స) ప్రవచనం, ”నేను సద్గుణాల పరిపూర్ణతకే పంపబడ్డాను.” (అ’హ్మద్‌, బైహఖీ) అయినప్పటికీ ప్రవక్త (స) ఇలా దు’ఆ చేసేవారు, ”ఓ అల్లాహ్‌(త)! నువ్వు నాకు ఉత్తమ గుణాలు ప్రసాదించు, నీవు తప్ప ఇతరులెవ్వరూ ఉత్తమ గుణాలు ప్రసాదించేవారు లేరు, ఇంకా, చెడునడత నుండి నన్ను వారించు, నీవు తప్ప ఇతరులెవ్వరూ చెడుగుణాల నుండి వారించలేరు.” (ముస్లిమ్‌)

ఉత్తమ గుణాలు గలవ్యక్తిని అందరూ ప్రేమిస్తారు. ప్రవక్త (స) ప్రవచనం, ”ఉత్తమ గుణాలు గలవాడు అందరికంటే మంచివాడు.” (బు’ఖారీ) ఇస్లామ్‌లో నమా’జు, రో’జాలకు చాలా ప్రాధాన్యత ఉంది. అయితే ఉత్తమ గుణాలకు కూడా వాటిస్థానం ఉంది. ప్రవక్త (స) ప్రవచనం, ”మానవుడు సద్గుణాల ద్వారా నమా’జీల, ఉపవాసకుల  స్థానాన్ని పొందగలడు.” (అబూ దావూద్‌)

ఈ ఉత్తమ సద్గుణాలే తీర్పుదినం నాడు దైవతూనికలో ఆరాధనలన్నింటి కంటే బరువుగా ఉంటాయి. ప్రవక్త (స) ప్రవచనం, ”తీర్పుదినం నాడు తూనికలో సద్గుణాలు తప్ప మరే వస్తువూ బరువుగా ఉండదు.” (అబూ దావూద్‌, ఇబ్నె హిబ్బాన్‌).

 సద్దుణాలు దైవప్రీతిని పొందే ఒక మార్గం. సద్గుణ సంపన్నుడు అల్లాహ్‌ వద్ద అందరికన్నా ప్రియమైన వాడు. ప్రవక్త (స) ప్రవచనం, ”దైవదాసుల్లో అల్లాహ్‌ వద్ద సద్గుణ సంపన్నుడే అందరికంటే ప్రియ మైనవాడు.”

ఈ సద్గుణాలే స్వర్గ ప్రవేశానికి కూడా కారణం అవుతాయి. ప్రవక్త (స) కాలంలో ఇద్దరు పుణ్యస్త్రీలు ఉండేవారు.

 వారిలో ఒకామె నమాజులు అధికంగా ఆచరించేది. ఉపవాసాలు కూడా అధికంగా ఆచరించేది. అయితే ఆమెలో మాట దురుసుతనం ఉండేది. తన నోటితో ఇరుగు పొరుగు వారిని హింసించేది. మరొకామె కేవలం విధి ఆరాధనలనే పాటించేది. పేదల్లో దుస్తులు పంచిపెట్టేది. అయితే ఎవరికీ హాని చేకూర్చేది కాదు. ఇంకా నోటి దురుసుతనం ప్రదర్శించేది కాదు. ప్రవక్త (స)ను వారిద్దరి గురించి ప్రశ్నించడం జరిగింది. దానికి ప్రవక్త (స) మొదటి స్త్రీ గురించి, ఆమెలో ఏ మేలూ లేదని, ఆమె తన చెడు నడత, నోటి దురుసుతనం వల్ల శిక్షించబడుతుందని, రెండవ స్త్రీ గురించి ఆమె స్వర్గంలోనికి ప్రవేశిస్తుందని సమాధానం ఇచ్చారు. (అల్‌ అదబుల్‌ మఫ్రద్‌,  బు’ఖారీ)

ఈ హదీసువల్ల సద్గుణాల, ఉత్తమ గుణాల ప్రాముఖ్యత, ప్రాధాన్యత విశదమవుతుంది. ఒక అనుచరుడు వచ్చి ‘ఓ ప్రవక్తా! స్వర్గంలోనికి ప్రవేశింపజేసే కార్యం ఏదైనా ఉంటే బోధించండి,’ అని విన్నవించు కున్నాడు. దానికి ప్రవక్త (స) బానిసలను విడుదల చేయి. రుణగ్రస్తుల రుణాన్ని చెల్లించు, దుర్మార్గుడైన బంధువును దుర్మార్గం నుండి వారించు. ఒక వేళ ఇది చేయలేకపోతే ఆకలిగొన్న వారికి అన్నం పెట్టు. ప్రేమతో నీళ్ళు త్రాపించు, ఏదైనా మంచి వచనం బోధించు, ప్రజలను చెడు నుండి వారించు, ఇది కూడా సాధ్యం కాకపోతే, చెడు పలక కుండా నీ నోటిని వారించు,’ అని హితబోధ చేసారు. ఖుర్ఆన్‌ మరియు ప్రవక్త (స) సాంప్రదాయంలో సత్యం పలకమని, ఇతరులకు హాని చేకూర్చరాదని, హానికరమైనవస్తువులను మార్గంనుండి తొలగించ మని, శాంతిభద్రతలను వ్యాపింపజేయమని, తాను ఇష్టపడే వస్తువునే ఇతరులకొరకు కూడా ఇష్టపడ మని, ఇతరుల పట్ల చెడుగా ప్రవర్తించవద్దని, అమానతులో ద్రోహం చేయరాదని, పరిశుభ్రతలను అనుసరించమని, సిగ్గు బిడియాన్ని కలిగి ఉండమని, కలిసే వారిని ముందు సలామ్‌ చేయమని, పెద్దలను గౌరవించమని, చిన్నలను ప్రేమించమని నొక్కి చెప్పటం జరిగింది.

  ఏది ఏమైనా ఉత్తమనడవడికలో అనేక విషయాలు ఉన్నాయి. వాటన్నిటినీ పేర్కొనటం చాలా కష్టం. అందువల్ల చెడు విషయాలకు దూరంగా ఉంటూ మంచి విషయాలను అలవరచుకోవడమే ఉత్తమ నైతికత. వీటన్నిటి గురించి క్రింద ‘హదీసు’ల్లో చదవండి. 

—–

اَلْفَصْلُ الْأَوَّلُ    మొదటి విభాగం

4628 – [ 1 ] ( متفق عليه ) (3/1315)

عَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “خَلَقَ اللهُ آدم عَلَى صُوْرَتِهِ طُوْلُهِ ذِرَاعًا فَلَمَّا خَلَقَهُ قَالَ اذْهَبْ فَسَلِّمْ عَلَى أُوْلَئِكَ النَّفْرِ وَهُمْ نَفَرٌ مِّنَ الْمَلَائِكَةِ جُلُوْسٌ فَاسْتَمِعْ مَا يُحَيُّوْنَكَ فَإِنَّهَا تَحَيَّتُكَ وَتَحَيَّةُ ذُرِّيَّتِكَ فَذَهَبَ فَقَالَ: السَّلَامُ عَلَيْكُمْ. فَقَالُوْا: السَّلَامُ عَلَيْكَ وَرَحْمَةُ اللهِ”. قَالَ: “فَزَادُوْهُ وَرَحْمَةُ اللهِ”. قَالَ: “فَكُلُّ مَنْ يَّدْخُلُ الْجَنَّةَ عَلَى صُوْرَةِ آدَمَ وَطُوْلُهُ سِتُّوْنَ ذِرَاعًا فَلَمْ يَزَلِ الْخَلْقُ يَنْقُصُ بَعْدَهُ حَتَّى الْآنَ”.

4628. (1) [3/1315ఏకీభవితం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”అల్లాహ్‌ (త) ఆదమ్‌ (అ)ను తన రూపంతో సృష్టించాడు. అతని పొడవు 60 మూరలు ఉండేది. సృష్టించిన తర్వాత, ‘ఓ ఆదమ్‌! దైవదూతల బృందం కూర్చొని ఉంది. నువ్వు వెళ్ళి వారికి సలామ్‌ చెయ్యి, ఇంకా వారి సమాధానాన్ని కూడా విను, ఈ సలామ్‌ నీకూ, నీ సంతానానికి దు’ఆగా నిర్ణయించడం జరిగింది,’ అని ఆదేశించాడు అల్లాహ్‌ (త). ఆదమ్‌ (అ) వెళ్ళి, ”అస్సలాము అలైకుమ్‌,” – ‘మీపై శాంతి కురియుగాక,’ అని అన్నారు, దైవదూతలు అతని సలాముకు సమాధానంగా, ‘మీపై కూడా అల్లాహ్‌ శాంతి మరియు కారుణ్యం కురియు గాక!’ అని అన్నారు. అంటే దైవదూతలు సలాముకు సమాధానంలో, ‘వ రహ్మతుల్లాహ్‌,’ అధికం చేసారు. స్వర్గంలో ప్రవేశించే వ్యక్తి ఆదమ్‌ (అ)ను పోలి ఉంటాడు, ఇంకా 60 మూరలు పొడుగ్గా ఉంటాడు. ఆ తరువాత సంతానం పొడవు రానురాను తగ్గి ఇప్పుడు మీరు చూస్తున్నట్లు ఉంది.[1]  (బు’ఖారీ, ముస్లిమ్‌)

4629 – [ 2 ] ( متفق عليه ) (1/1315)

وَعَنْ عَبْدِ اللهِ بْنِ عَمْرٍو: أَنَّ رَجُلًا سَأَلَ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم: أَيُّ الْإِسْلَامِ خَيْرٌ؟ قَالَ: ” تُطْعِمُ الطَّعَامُ وَتُقْرِأُ السَّلَامَ عَلَى مَنْ عَرَفْتَ وَمَنْ لَمْ تَعْرِفْ”.

4629. (2) [3/1315-ఏకీభవితం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘అమ్ర్‌ (ర) కథనం: ఒక వ్యక్తి ప్రవక్త (స) ను, ‘ఇస్లామ్‌ ప్రత్యేకతలన్నింటిలో గొప్ప ప్రత్యేకత ఏమిటి?’ అని ప్రశ్నించాడు. దానికి ప్రవక్త (స), ‘(పేదలకు) అన్నం పెట్టటం, (ప్రతి ముస్లిమ్‌కు) సలామ్‌ చేయటం మొదలైనవి అన్నిటి కంటే గొప్ప ప్రత్యేకతలు,’ అని అన్నారు. (బు’ఖారీ, ముస్లిమ్‌)

4630 – [ 3 ] و ( لم تتم دراسته ) (3/1315)

عَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لِلْمُؤْ مِنِ عَلَى الْمُؤْمِنِ سِتُّ خِصَالٍ: يَعُوْدُهُ إِذَا مَرِضَ وَيَشْهَدُهُ إِذَا مَاتَ وَيُجِيْبُهُ إِذَا دَعَاهُ وَيُسَلِّمُ عَلَيْهِ إِذَا لَقِيَهُ وَيُشَمِّتُهُ إِذَا عَطَسَ وَيَنْصَحُ لَهُ إِذَا غَابَ أَوْ شَهِدَ.

“لَمْ أَجِدْهُ” فِي الصَّحِيْحَيْنِ. وَلَا فِيْ كِتَابِ الْحَمِيْدِيِّ وَلَكِنْ ذَكَرَهُ صَاحِبُ” الْجَامِعِ”. بِرِوَايَةِ النَّسَائِيِّ.

4630. (3) [3/1315 అపరిశోధితం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఒక ముస్లిమ్‌పై మరో ముస్లిమ్‌ యొక్క 6 హక్కులు ఉన్నాయి. 1. అతడు అనారోగ్యానికి గురైతే, పరామర్శించాలి. 2. అతడు మరణిస్తే, అతని జనా ‘జహ్లో పాల్గొనాలి. 3. ఆతిథ్యం ఇస్తే స్వీకరించాలి. 4. కలిస్తే సలామ్‌ చేయాలి. 5. తుమ్మితే సమాధానం ఇవ్వాలి. 6. అతని పట్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా శ్రేయోభిలాషిగా ఉండాలి.  (నసాయి’)

4631 – [ 4 ] ( صحيح ) (3/1316)

وَعَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم:”لَا تَدْخُلُوْنَ الْجَنَّةَ حَتَّى تُؤْمِنُوْا وَلَا تُؤْمِنُوْا حَتّى تَحَابُّوْا أَوْ لَا أَدُلُّكُمْ عَلَى شَيْءٍ إِذَا فَعَلْتُمُوْهُ تَحَابَبْتُمْ؟ أَفْشُوْا السَّلَامَ بَيْنَكُمْ”. رَوَاهُ مُسْلِمٌ.  

4631. (4) [3/1316 దృఢం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మీరు విశ్వసించనంతవరకు స్వర్గంలో ప్రవేశించలేరు, మీరు పరస్పరం ప్రేమించనంతవరకు విశ్వాసికాలేరు, మీకు ఒక విషయం తెలుపుతాను, దాన్ని ఆచరిస్తే పరస్పరం మీలో ప్రేమ జనిస్తుంది. అదేమిటంటే సలామ్‌ను వ్యాపింపజేయండి.  (ముస్లిమ్‌)

ఈ ‘హదీసు’ ద్వారా సలామ్‌ చేయడం పరస్పరం ప్రేమానురాగాలకు కారణభూతం అవుతుంది. దీనివల్లే ఈర్ష్యాద్వేషాలు, శత్రుత్వాలు దూరం కాగలవని తెలిసింది.

4632 – [ 5 ] ( متفق عليه ) (3/1316)

وَعَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “يُسَلِّمُ الرَّاكِبُ عَلَى الْمَاشِيْ وَالْمَاشِيْ عَلَى الْقَاعِدِ وَالْقَلِيْلُ عَلَى الْكَثِيْرِ”.

4632. (5) [3/1316- ఏకీభవితం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”వాహనంపై వెళుతున్నవారు నడుస్తున్నవారికి సలాం చేయాలి. నడుస్తున్నవారు కూర్చున్నవారికి సలామ్‌ చేయాలి. అల్పసంఖ్యలో ఉన్నవారు అధిక సంఖ్యలో ఉన్నవారికి సలామ్‌ చేయాలి.” (బు’ఖారీ, ముస్లిమ్‌)

4633 – [ 6] ( صحيح ) (3/1316)

وَعَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “يُسَلِّمُ الصَّغِيْرُعَلَى الْكِبِيْرْوَالْمَارُّعَلَى الْقَاعِدِ وَالْقَلِيْلُ عَلَى الْكِثِيْرِ” .

4633. (6) [3/1316 దృఢం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”చిన్నవాళ్ళు పెద్దవారికి సలామ్‌ చేయాలి. వెళు తున్నవారు కూర్చున్నవారికి సలామ్‌ చేయాలి, కొద్దిమంది ఎక్కువ మందికి సలామ్‌ చేయాలి.” (బు’ఖారీ)

4634 – [ 7 ] ( متفق عليه ) (3/1316)

وَعَنْ أَنَسٍ قَالَ: إِنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم مَرَّ عَلَى غِلْمَانٍ فَسَلَّمَ عَلَيْهِمْ.  

4634. (7) [3/1316- ఏకీభవితం]

అనస్‌ (ర) కథనం: ప్రవక్త (స) యువకుల ప్రక్క నుండి వెళుతూ వారికి సలామ్‌ చేసారు. (బు’ఖారీ, ముస్లిమ్)

4635 – [ 8 ] ( صحيح ) (3/1316)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَاتَبْدَؤُوا الْيَهُوْدَ وَلَا النَّصَارَى بِالسَّلَامِ وَإِذَا لَقِيْتُمْ أَحَدَهُمْ فِيْ طَرِيْقٍ فَاضْطَرُّوْهُ إِلَى أَضْيَقِهِ”.

4635. (8) [3/1316దృఢం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”యూదులను, క్రైస్తవులకు ముందు సలామ్‌ చేయకండి. ఒకవేళ వాళ్ళు సలామ్‌ చేస్తే, ‘అలైక,’ అని అనండి. మార్గంలో వాళ్ళు ఒక ప్రక్కగా నడిచేలా నిర్బంధించండి.” (ముస్లిమ్‌)

4636 – [ 9 ] ( متفق عليه ) (3/1316)

وَعَنِ ابْنِ عُمَرَقَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِذَا سَلَّمَ عَلَيْكُمُ الْيَهُوْدُ فَإِنَّمَا يَقُوْلُ أَحَدُهُمْ: اَلسَّامُ عَلَيْكَ. فَقُلْ: وَعَلَيْكَ”

4636. (9) [3/1316- ఏకీభవితం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘ఉమర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”యూదులు మిమ్మల్ని కలసినపుడు, ‘అస్సలాము అలైకుమ్‌’కు బదులు, ”అస్సాము అలైక” అంటే, ‘మీపై మరణం సంభవించుగాక!’ అని అంటారు. మీరు ”అలైక” అని అనండి, అంటే ‘మీపై సంభవించు గాక!’  (బు’ఖారీ, ముస్లిమ్‌)

4637 – [ 10 ] ( متفق عليه ) (3/1316)

وَعَنْ أَنَسٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِذَا سَلَّمَ عَلَيْكُمْ أَهْلَ الْكِتَابِ فَقُوْلُوْا: وَعَلَيْكُمْ”.

4637. (10) [3/1316- ఏకీభవితం]

అనస్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”గ్రంథ ప్రజలు మీకు సలామ్‌ చేస్తే, దానికి సమాధానంగా, ‘అలైకుమ్‌‘ అని అనండి.”  (బు’ఖారీ, ముస్లిమ్‌)

4638 – [ 11 ] ( متفق عليه ) (3/1316)

وَعَنْ عَائِشَةَ قَالَتْ: اِسْتَأْذَنَ رَهْطٌ مِّنَ الْيَهُوْدِ عَلَى النَّبِيِّ صلى الله عليه وسلم فَقَالُوْا السَّامُ عَلَيْكُمْ. فَقُلْتُ: بَلْ عَلَيْكُمُ السَّامُ وَاللَّعْنَةُ. فَقَالَ: “يَا عَائِشَةَ إِنَّ اللهَ رَفِيْقٌ يُحِبُّ الرِّفْقَ فِيْ الْأَمْرِ كُلِّهِ”. قُلْتُ: أَوْلَمْ تَسْمَعْ مَا قَالُوْا؟ قَالَ: قَدْ قُلْتُ وَعَلَيْكُمْ.

 وَفِيْ رِوَايَةٍ: “عَلَيْكُمْ”. وَلَمْ يَذْكُرِ الْوَاوَ.

وَفِيْ رِوَايَةِ لِلْبُخَارِيِّ. قَالَتْ: إِنَّ الْيَهُوْدَ أَتَوُا النَّبِيَّ صلى الله عليه وسلم فَقَالُوْا: السَّامُ عَلَيْكَ. قَالَ: “وَعَلَيْكُمْ”. فَقَالَتْ عَائِشَةَ: اَلسَّامُ عَلَيْكُمْ وَلَعَنَكُمُ اللهُ وَغَضِبَ عَلَيْكُمْ. فَقَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَهْلًا يَا عَائِشَةَ عَلَيْكَ بِالرِّفْقِ وَإِيَّاكِ وَالْعُنْفَ وَالْفُحْشَ”. قَالَتْ: أَوْ لَمْ تَسْمَعْ مَا قَالُوْا؟ قَالَ: “أَوْ لَمْ تَسْمَعِيْ مَا قُلْتُ رَدَدْتُّ عَلَيْهِمْ فَيُسْتَجَابُ لِيْ فِيْهِمْ وَلَا يُسْتَجَابُ لَهُمْ فِيْ”.

وَفِيْ رِوَايَةٍ لِمُسْلِمٍ قَالَ: “لَا تَكُوْنِيْ فَاحِشَةً فَإِنَّ اللهَ لَا يُحِبُّ الْفُحْشَ وَالتَّفَحُّشَ”.

4638. (11) [3/1316ఏకీభవితం]

‘ఆయి’షహ్‌ (ర) కథనం: యూదుల ఒక బృందం ప్రవక్త (స)ను కలవడానికి అనుమతి కోరింది. ప్రవక్త (స) వారిని అనుమతించారు. వారు ప్రవక్త (స) వద్దకు వచ్చి, ‘అస్సాము అలైకుమ్‌,’ అని అన్నారు. నేను వెంటనే, ”అస్సామువల్లానతు అలైకుమ్‌,” అంటే ‘మీపై మరణం, శాపం అవతరించు గాక!’ అని అన్నాను. అప్పుడు ప్రవక్త (స) ఓ ‘ఆయి’షహ్‌! అల్లాహ్‌ (త) సున్నితంగా వ్యవహరిస్తాడు, వ్యవహారాల్లో సున్నితత్వం కోరుతుంటాడు,’ అని అన్నారు. అప్పుడు నేను, ‘వారు చెప్పింది మీరు వినలేదా,’ అని అన్నాను. దానికి ప్రవక్త (స), ”నేను వారికి సమాధానంగా, ‘అలైకుమ్‌,’ అని అన్నాను. అంటే అదే మీపై అవతరించుగాక!” అని అన్నారు. (బు’ఖారీ, ముస్లిమ్‌)

బు’ఖారీలోని ఒక ఉల్లేఖనంలో ఇలా ఉంది, ” ‘ఆయి’షహ్‌ (ర) కథనం, ”యూదులు ప్రవక్త (స) వద్దకు వస్తే, ‘అస్సాము అలైకుమ్‌,’ అని అనేవారు. ప్రవక్త (స) సమాధానంగా, ‘వ అలైకుమ్‌,’ అని అనేవారు. ‘ఆయి’షహ్‌ (ర) ”అస్సాము అలైకుమ్‌ వ లఅనకుముల్లాహు వ ‘గజి’బ అలైకుమ్‌”  — అంటే, ‘మీపై మరణం, శాపం, దైవాగ్రహం అవతరించుగాక,’ అని పలికారు. అది విని ప్రవక్త (స), ”ఓ ‘ఆయి’షహ్‌, నువ్వు సున్నితంగా వ్యవహరించు. కాఠిన్యానికి, నోటి దురుసు తనానికి దూరంగా,”  ఉండు అని అన్నారు. దానికి నేను,  ”ప్రవక్తా! వారన్నది మీరు వినలేదా?” అని అన్నాను. దానికి ప్రవక్త (స), ”నేనన్నది నీవు వినలేదా, నేను ‘వ అలైకుమ్‌’ అని అన్నాను. నా దు’ఆ వారి గురించి స్వీకరించబడింది. వారిశాపం నాగురించి స్వీకరించబడలేదు.” (బు’ఖారీ)

4639 – [ 12 ] ( متفق عليه ) (3/1317)

وَعَنْ أُسَامَةَ بْنِ زَيْدٍ: أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم مَرَّ بِمَجْلِسٍ فِيْهِ أَخْلَاطٌ مِّنَ الْمُسْلِمِيْنَ وَالْمُشْرِكِيْنَ عَبْدَةِ الْأَوْثَانِ وَالْيَهُوْدِ فَسَلَّمَ عَلَيْهِمْ.

4639. (12) [3/1317- ఏకీభవితం]

ఉసామా బిన్‌ ‘జైద్‌ (ర) కథనం: ప్రవక్త (స) కొందరు కూర్చున్నవారి ప్రక్కనుండి వెళ్ళారు. వారిలో ముస్లిములు, విగ్రహారాధకులు ఉన్నారు. ప్రవక్త (స) వారికి సలామ్‌ చేసారు. (బు’ఖారీ, ముస్లిమ్‌)

4640 – [ 13 ] ( متفق عليه ) (3/1317)

وَعَنْ أَبِيْ سَعِيْدِ الْخُدْرِيِّ عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ: “إِيَّاكُمْ وَالْجُلُوْسِ بِالطُّرُقَاتِ”. فَقَالُوْا: يَا رَسُوْلَ اللهِ مَا لَنَا مِنْ مَجَالِسِنَا بُدُّ نَتَحَدَّثُ فِيْهَا. قَالَ: “فَإِذَا أَبَيْتُمْ إِلَّا الْمَجْلِسَ فَأَعْطُوا الطَّرِيْقَ حَقَّهُ”. قَالُوْا: وَمَا حَقُّ الطَّرِيْقِ يَا رَسُوْلَ اللهِ. قَالَ: “غَضُّ الْبَصَرٍ وَكَفُّ الْأَذَى وَرَدُّ السَّلَامِ وَالْأَمْرُ بِالْمَعْرُوْفِ وَالنَّهْيُ عَنِ الْمُنْكَر”.

4640. (13) [3/1317ఏకీభవితం]

అబూ స’యీద్‌ ‘ఖుద్రీ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మీరు మార్గాల ప్రక్కన కూర్చోకండి” అని అన్నారు. దానికి ప్రజలు, ‘ప్రవక్తా! ఇక్కడ కూర్చోవటం తప్పనిసరి, ఎందుకంటే మేము ఇక్కడ కూర్చొనే మాట్లాడుకుంటాం,’ అని అన్నారు. దానికి ప్రవక్త (స), ‘కూర్చోవటం తప్పనిసరి అయితే దాని హక్కును చెల్లించండి,’ అని అన్నారు. దానికి ప్రజలు, ‘ఓ ప్రవక్తా! మార్గాలహక్కు ఏమిటి?’ అని విన్నవించు కున్నారు. ప్రవక్త (స), ‘మీ దృష్టిని క్రిందికి మరల్చి ఉంచండి. హానికరమైన వస్తువులను మార్గం నుండి తప్పించండి. సలామ్‌కు సమాధానం ఇవ్వండి, మంచిని ఆదేశించండి, చెడునుండి వారించండి,’ అని అన్నారు. (బు’ఖారీ, ముస్లిమ్‌)

4641 – [ 14 ] ( لم تتم دراسته ) (3/1317)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم فِيْ هَذِهِ الْقِصَّةِ قَالَ: “وَإِرْشَادُ السَّبِيْلِ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ عَقِيْبَ حَدِيْثِ الْخُدْرِيِّ هَكَذَا.

4641. (14) [3/1317 అపరిశోధితం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) పైన పేర్కొన్నవిషయాలతో పాటు దారితప్పిన వారికి దారి చూపించమని  ఉపదేశించారు.  (అబూ  దావూద్‌)

4642 – [ 15 ] ( لم تتم دراسته ) (3/1317)

وَعَنْ عُمَرَ عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم فِيْ هَذِهِ الْقِصَّةِ قَالَ: “وَتُغِيْثُوا الْمَلْهُوْفَ وَتَهْدُوا الضَّالَّ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ عَقِيْبَ حَدِيْثَ أَبِيْ هُرَيْرَةَ هَكَذَا وَلَمْ أَجِدْهُمَا فِي “الصَّحِيْحَيْنِ”.  

4642. (15) [3/1317అపరిశోధితం]

‘ఉమర్‌ (ర) కథనం: ప్రవక్త (స) పైన పేర్కొన్న విషయాలతో పాటు బాధితుని ఆర్తనాదానికి దూరంగా ఉండమని, దారి తప్పిన వారికి మార్గం చూపమని ఉపదేశించారు.  (అబూ  దావూద్‌)

—–

اَلْفَصْلُ الثَّانِيْ  రెండవ విభాగం 

4643 – [ 16 ] ( لم تتم دراسته ) (3/1318)

وعَنْ علي قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لِلْمُسْلِمِ عَلَى الْمُسْلِمِ سِتٌّ بِالْمَعْرُوْفِ: يُسَلِّمُ عَلَيْهِ إِذَا لَقِيَهُ وَيُجِيْبُهُ إِذَا دَعَاهُ وَيُشَمِّتُهُ إِذَا عَطَسَ وَيَعُوْدُهُ إِذَا مَرِضَ وَيَتَّبِعُ جَنَازَتَهُ إِذَا مَاتَ وَيُحِبُّ لَهُ مَا يُحِبُّ لِنَفْسِهِ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَالدَّارَمِيُّ

4643. (16) [3/1318 అపరిశోధితం]

‘అలీ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఒక ముస్లిమ్‌కు మరొక ముస్లిమ్‌పై 6 హక్కులు ఉన్నాయి. 1. కలిస్తే సలామ్‌ చేయాలి. 2. ఆహ్వానిస్తే విందు స్వీకరించాలి. 3. తుమ్ముకు సమాధానం ఇవ్వాలి. 4. అనారోగ్యానికి గురైతే పరామర్శించాలి. 5. అతని జనా’జహ్లో పాల్గొనాలి. 6. తనకు ఇష్టమైన వస్తువునే ఇతరుల కొరకు కూడా ఇష్టపడాలి.  (తిర్మిజి’, దార్మి)

4644 – [ 17 ] ( حسن ) (3/1318)

وَعَنْ عِمْرَانَ بْنِ حُصَيْنٍ أَنَّ رَجُلًا جَاءَ إِلَى النَّبِيِّ صلى الله عليه وسلم فقَالَ: اَلسَّلَامُ عَلَيْكُمْ. فَرَدَّ عَلَيْهِ ثُمَّ جَلَسَ. فَقَالَ النَّبِيُّ صلى الله عليه وسلم: “عَشْرٌ”. ثُمَّ جَاءَ لْآخَرُ فَقَالَ: السَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ اللهِ. فَرَدَّ عَلَيْهِ ثُمَّ جَلَسَ. فَقَالَ: “عَشْرونَ”. ثُمَّ جَاءَ لْآخَرُ فَقَالَ: السَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ اللهِ وَبَرْكَاتُهُ. فَرَدَّ عَلَيْهِ. فَقَالَ:”ثَلَاثُوْنَ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَأَبُوْ دَاوُدَ.

4644. (17) [3/1318 ప్రామాణికం]

‘ఇమ్రాన్‌ బిన్‌ ‘హు’సైన్‌ (ర) కథనం: ప్రవక్త (స) వద్దకు ఒక వ్యక్తి వచ్చి, ‘అస్సలాముఅలైకుమ్‌,’ అని అన్నాడు. ప్రవక్త (స) అతనికి సమాధానం ఇచ్చారు. ఆ వ్యక్తి కూర్చున్నాడు. ప్రవక్త (స) 10 పుణ్యాలు అన్నారు. ఆ తరువాత మరో వ్యక్తి వచ్చాడు, అతడు, ‘అస్సలాము అలైకుమ్‌ వ రహ్మతుల్లాహ్‌,’ అన్నాడు. ప్రవక్త (స) అతనికి సమాధానం ఇచ్చారు. ఆ వ్యక్తి కూర్చున్నాడు. ప్రవక్త (స) 20 పుణ్యాలు అన్నారు. మరో వ్యక్తి వచ్చి, ‘అస్సలాము అలైకుమ్‌ వ రహ్మతుల్లాహి వ బరకా తుహు,’ అని అన్నాడు. ప్రవక్త (స) అతనికి సమాధానం ఇచ్చారు. అతడు కూర్చున్నాడు. ప్రవక్త (స) 30 పుణ్యాలు  అన్నారు.  (అబూ  దావూద్‌)  

ఈ ‘హదీసు’వల్ల తెలిసిందేమిటంటే ఒక ముస్లిమ్‌ మరో ముస్లిమ్‌ను కలసినపుడు పూర్తి సలామ్‌ చేస్తే 30 పుణ్యాలు సంపాదించుకోగలడు.

1645 – [ 18 ] ( لم تتم دراسته ) (3/1318)

وَعَنْ مُعَاذِ بْنِ أَنَسٍ عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم بِمَعْنَاهُ وَزَادَ ثُمَّ أَتَى آخَرُ فَقَالَ: السَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ اللهِ وَبَرْكَاتُهُ وَمَغْفِرَتُهُ فَقَالَ: “أَرْبَعُوْنَ”. وَقَالَ: “هَكَذَا تَكُوْنُ الْفَضَائِلُ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ

4645. (18) [3/1318 అపరిశోధితం]

ము’ఆజ్‌ బిన్‌ అనస్‌ (ర) కథనం: ప్రవక్త (స) పైన పేర్కొన్న విషయాలతో పాటు ఇలా అధికం చేసారు. నాల్గవ వ్యక్తి వచ్చాడు. ఆ వ్యక్తి ప్రవక్త (స)కు, ‘అస్సలాము అలైకుమ్‌ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు వ మ’గ్‌ఫిరతుహు,’ అని అన్నాడు. ప్రవక్త (స), ‘అతనికి 40 పుణ్యాలు లభించాయి. ఈ విధంగా సమాధానంలో పుణ్యాలు పెరుగుతాయి,’ అని అన్నారు.  (అబూ  దావూద్‌)

4646 – [ 19 ] ( إسناده صحيح ) (3/1318)

وَعَنْ أَبِيْ أُمَامَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِنَّ أَوْلَى النَّاسِ بِاللهِ مَنْ بَدَأَ السَّلَامُ”. رَوَاهُ أَحْمَدُ وَالتِّرْمِذِيُّ وَأَبُوْ دَاوُدَ .

4646. (19) [3/1318 ఆధారాలు దృఢమైనవి]

అబూ ఉమామహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ముందు సలామ్‌ చేసేవాడే గొప్పవాడు.” (అ’హ్మద్‌, తిర్మిజి’,  అబూ  దావూద్‌)

4647 – [ 20 ] ( صحيح ) (3/1318)

وَعَنْ جَرِيْرٍ: أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم مَرَّعَلَى نِسْوَةٍ فَسَلَّمَ عَلَيْهِنَّ. رَوَاهُ أَحْمَدُ  

4647. (20) [3/1318 దృఢం]

జరీర్‌ (ర) కథనం: ప్రవక్త (స) స్త్రీల ప్రక్క నుండి వెళుతూ స్త్రీలకు సలామ్‌ చేసారు.  (అ’హ్మద్‌)

4648 – [ 21 ] ( حسن ) (3/1318)

وَعَنْ عَلِيِّ بْنِ أَبِيْ طَالِبٍ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: يُجْزِئُ عَنِ الْجَمَاعَةِ إِذَا مَرُّوْا أَنْ يُّسَلِمَ أَحَدُهُمْ وَيُجْزِئُ عَنِ الْجُلُوْسِ أَنْ يردَّ أَحَدُهُمْ. رَوَاهُ الْبَيْهَقِيُّ فِيْ”شُعَبِ الْإِيْمَانِ”مَرْفُوْعًا.

وَرَوَى أَبُوْ دَاوُدَ وَقَالَ: وَرَفَعَهُ الْحَسَنُ بْنُ عَلِيِّ وَهُوَ شَيْخُ أَبِيْ دَاوُدَ .

4648. (21) [3/1318ప్రామాణఇకం]

‘అలీ (ర) కథనం: ఒక బృందం నుండి ఒక వ్యక్తి సలామ్‌ చేస్తే అందరి తరఫున సరిపోతుంది. (బైహఖీ / ఏకోల్లేఖనం)

4649 – [ 22 ] ( ضعيف ) (3/1319)

وَعَنْ عَمْرِوبْنِ شُعَيْبٍ عَنْ أَبِيْهِ عَنْ جَدِّهِ رَضِيَ اللهُ عَنْهُمْ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم قَالَ: “لَيْسَ مِنَّا مَنْ تَشَبَّهَ بِغَيْرِنَا لَا تَشَبَّهُوْا بِالْيَهُوْدِ وَلَا بِالنَّصَارَى فَإِنَّ تَسْلِيْمَ الْيَهُوْدَ الْإِشَارَةُ بِالْأَصَابِعِ وَتَسْلِيْمَ النَّصَارَى الْإِشَارَةُ بِالْأَكُفِّ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَقَالَ: إِسْنَادُهُ ضَعِيْفٌ.

4649. (22) [3/1319 బలహీనం]

‘అమ్ర్‌ బిన్‌ షు’ఐబ్‌ తన తండ్రి తాతల ద్వారా, కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ముస్లిమేతరులను అనుకరించే ముస్లిములు, ముస్లిములు కారు. మీరు యూదులను క్రైస్తవులను అనుకరించకండి. యూదులు చేతివ్రేళ్ళ ద్వారా సలామ్‌ చేస్తారు, క్రైస్తవులు అరచేతులతో సలామ్‌ చేస్తారు.” (తిర్మిజి’ / బలహీన  ఆధారాలు)  

అంటే సలామ్‌ నోటి ద్వారా చేయాలి. వ్రేళ్ళతో, అర చేతులతో చేయరాదు. ఇంకా ప్రవక్త (స) బోధించిన వచనాలనే వల్లించాలి. ఇదే సరియైన సాంప్రదాయక మైన  పద్ధతి.

4650 – [ 23 ] ( له إسنادان أحدهما صحيح ) (3/1319

 وَعَنْ أَبِيْ هُرَيْرَةَ رَضِيَ اللهُ عَنْهُ عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ: “إِذَا لَقِيَ أَحَدُكُمْ أَخَاهُ فَلْيُسَلِّمْ عَلَيْهِ. فَإِنْ حَالَتْ بَيْنَهُمَا شَجَرَةٌ أَوْ جِدَارٌ أَوْ حَجَرٌ. ثُمَّ لَقِيَهُ فَلْيُسَلِّمْ عَلَيْهِ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ

4650. (23) [3/1319 దీని రెండు ఆధారాల్లో ఒకటి దృఢమైనది]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మీరు మీ ముస్లిమ్‌ సోదరున్నికలిస్తే సలామ్‌ చేయండి. ఆ తరువాత ఒకవేళ చెట్టుగానీ, గోడగానీ, బండరాయి గానీ మధ్య వచ్చి తొలగిపోతే, మళ్ళీ సలామ్‌ చేయండి.”  (అబూ  దావూద్‌)

4651 – [ 24 ] ( ضعيف ) (3/1319)

وَعَنْ قَتَادَةَ قَالَ: قَالَ النَّبِيُّ صلى الله عليه وسلم: “إِذَا دَخَلْتُمْ بَيْتًا فَسَلِّمُوْا عَلَى أَهْلِهِ وَإِذَا خَرَجْتُمْ فَأَوْدِعُوْا أَهْلَهُ بِسَلَامٍ”. رَوَاهُ الْبَيْهَقِيُّ فِيْ ” شُعَبِ الْإِيْمَانِ ” مُرْسَلًا  

4651. (24) [3/1319 బలహీనం]

ఖతాదహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మీరు మీ ఇంటిలోనికి ప్రవేశిస్తే, మీ ఇంటివారికి సలామ్‌ చేయండి. ఇంటి నుండి బయటకు వెళితే సలామ్‌చేసి బయలు దేరండి.”  (బైహఖీ – తాబయీ  ప్రోక్తం)

4652 – [ 25] ) ؟  ((3/1319)

وعَنْ أَنَسٍ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم قَالَ: “يَا بُنَيَّ إِذَا دَخَلْتَ عَلَى أَهْلِكَ فَسَلِّمْ يَكُوْنُ بَرَكَةً عَلَيْكَ وَعَلَى أَهْلِ بَيْتِكَ”. رَوَاهُ التِّرْمِذِيُّ.

4652. (25)  [3/1319 ? ]

అనస్‌ (ర) కథనం: ప్రవక్త (స) నాతో ఇలా అన్నారు, ”ఓ కుమారా! నువ్వు నీ ఇంటిలోనికి ప్రవేశిస్తే ఇంటివారికి సలామ్‌ చేసి ప్రవేశించు, అది నీకూ నీ ఇంటి వారికీ శుభకరంగా  ఉంటుంది.”  (తిర్మిజి’)

4653 – [ 26 ] )؟ ((3/1319)

وَعَنْ جَابِرٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “اَلسَّلَامُ قَبْلَ الْكَلَامِ”. رَوَاهُ التِّرْمِذِيُّ وقَالَ: هَذَا حَدِيْثٌ مُنْكَرٌ 

4653. (26) [3/1319– ? ]

జాబిర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మాట్లాడే ముందు  సలామ్‌  చేయాలి.”  (తిర్మిజి –  తిరస్కృతం)

4654 – [ 27 ] ( لم تتم دراسته ) (3/1319)

وَعَنْ عِمْرَانَ بْنِ حُصَيْنٍ قَالَ: كُنَّا فِي الْجَاهِلِيَّةِ نَقُوْلُ: أَنْعَمَ اللهُ بِكَ عَيْنًا وَأَنْعِمْ صَبَاحًا. فَلَمَّا كَانَ الْإِسْلَامُ نُهِيْنَا عَنْ ذَلِكَ. رَوَاهُ أَبُوْ دَاوُدَ.

4654. (27) [3/1319అపరిశోధితం]

‘ఇమ్రాన్‌ బిన్‌ ‘హు’సైన్‌ (ర) కథనం: మేము ఇస్లామ్‌కి ముందు అజ్ఞాన కాలంలో పరస్పరం కలసినప్పుడు అన్‌’అమల్లాహు బిక ‘ఐనన్‌ వ ‘అన్‌ఇమ్‌ ‘సబా ‘హన్‌,” – అంటే ‘అల్లాహ్‌ నీ ద్వారా కంటిచలువ ప్రసాదించుగాక! ఇంకా నీవు ప్రారంభకాలంలో అను గ్రహాలు కలవాడిగా ఉండు.’ ఇస్లామ్‌ వచ్చిన తర్వాత దీన్ని వారించడం జరిగింది.  (అబూ  దావూద్‌)

4655 – [ 28 ] ؟ (3/1319)

وَعَنْ غَالِبٍ قَالَ: إِنَّا لَجَلُوْسٌ بِبَابِ الْحَسَنِ الْبَصَرِيِّ إِذَ جَاءَ رَجُلٌ فَقَالَ: حَدَّثَنِيْ أَبِيْ عَنْ جَدِّيْ. قَالَ: بَعَثَنِيْ أَبِيْ إِلَى رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم فَقَالَ: ائْتِيْهِ فَأقْرِئهُ السَّلَامَ. قَالَ: فَأَتَيْتُهُ فَقُلْتُ: أَبِيْ يُقرِئُكَ السَّلَامَ. فَقَالَ: عَلَيْكَ وَعَلَى أَبِيْكَ السَّلَامُ. رَوَاهُ أَبُوْ دَاوُدَ .

4655. (28) [3/1319 ? ]

‘గాలిబ్‌ కథనం: మేము ‘హసన్‌ బ’స్రీ వద్ద కూర్చొని ఉన్నాము. ఒక వ్యక్తి వచ్చి మా తండ్రిగారు ఈ ‘హదీసు’ను వినిపించారు, మా తాతగారు మా తండ్రిగారితో ఈ ‘హదీసు’ అన్నారు. ”మా తండ్రిగారు నన్ను ప్రవక్త (స) వద్దకు పంపి, ‘నీవు ప్రవక్త (స) వద్దకు వెళ్ళి నా సలామ్‌ అందజేయి,’ అని అన్నారు. నేను ప్రవక్త (స) వద్దకు వచ్చాను. ‘మా తండ్రిగారు తమకు సలామ్‌ చెప్పారు,’ అని అన్నాను. దానికి ప్రవక్త (స) ‘అలైక వ అలా అబీక స్సలాము,’ – అంటే, ‘నీపై, నీ తండ్రిపై శాంతి కురియు గాక! ‘ అని సమాధానం ఇచ్చారు.”  [2] (అబూ  దావూద్‌)

4656 – [ 29 ] ( لم تتم دراسته ) (3/1320)

وَعَنْ أَبِيْ الْعَلَاءِ بْنِ الْحَضْرَمِيِّ أَنَّ الْعُلَاءَ الْحَضْرَمِيَّ كَانَ عَامِلَ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم. وَكَانَ إِذَا كَتَبَ إِلَيْهِ بَدَأَ بِنَفْسِهِ. رَوَاهُ أَبُوْ دَاوُدَ .

4656. (29) [3/1320 అపరిశోధితం]

అబుల్‌ ‘అలా’ హ’ద్రమీ (ర) కథనం: ‘అలా’ హ’ద్రమీ (ర) ప్రవక్త (స) ద్వారా తాసిల్దారుగా, గవర్నర్‌గా నియమించబడ్డారు. ‘అలా’ హ’ద్రమీ ప్రవక్త (స)కు ఉత్తరం వ్రాస్తే అన్నిటి కంటే ముందు తన పేరు రాసేవారు.  (అబూ  దావూద్‌)

4657 – [ 30 ] ( لم تتم دراسته ) (3/1320)

وَعَنْ جَابِرٍأَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم قَالَ: “إِذَا كَتَبَ أَحَدُكُمْ كِتَابًا فَلْيُتَرِّبِهِ فَإِنَّهُ أَنْجَحُ لِلْحَاجَةِ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَقَالَ: هَذَا حَدِيْثٌ مُنْكَرٌ .

4657. (30) [3/1320 అపరిశోధితం]

జాబిర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మీరు ఎవరికైనా ఉత్తరం వ్రాస్తే, దానిపై మట్టివేయండి, దాని వల్ల మీ ఉద్దేశ్యం  నెరవేరుతుంది.” (తిర్మిజి’  /  తిరస్కృతం)

4658 – [ 31] ؟ (3/1320)

عَنْ زَيْدِ بْنِ ثَابِتٍ قَالَ: دَخَلْتُ عَلَى النَّبِيِّ صلى الله عليه وسلم وَبَيْنَ يَدَيْهِ كَاتِبٌ فَسَمِعْتُهُ يَقُوْلُ: “ضَعِ الْقَلَمَ عَلَى أُذُنِكَ فَإِنَّهُ أَذْكَرُ لِلْمَآلِ. رَوَاهُ التِّرْمِذِيُّ وَقَالَ: هَذَا حَدِيْثٌ غَرِيْبٌ وَفِيْ إِسْنَادِهِ ضُعْفٌ .

4658. (31) ? [3/1320]

‘జైద్‌ బిన్‌ సా’బిత్‌ (ర) కథనం: నేను ప్రవక్త (స) వద్దకు వచ్చాను. ప్రవక్త (స) వద్ద వ్రాసే ఒక వ్యక్తి ఉన్నాడు. ప్రవక్త (స) అతనితో, ‘నువ్వు నీ కలాన్ని చెవిపై పెట్టుకో, ఇలా ఉంచుకుంటే నీ పని నీకు బాగా గుర్తుంటుంది’ అని అన్నారు.[3]  (తిర్మిజి  /  ‘గరీబ్, ‘దయీఫ్- అస్నాద్)

4659 – [ 32 ] ( صحيح ) (3/1320)

وَعَنْهُ قَالَ: أَمَرَنِيْ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم أَنْ أَتَعَلَّمَ السُّرْيَانِيَّةَ. وَفِيْ رِوَايَةٍ: إِنَّهُ أَمَرَنِيْ أَنْ أَتَعَلَّمَ كِتَابَ يَهُوْدَ وَقَالَ: “إِنِّيْ مَا آمَنُ يَهُوْدَ عَلَى كِتَابِ”. قَالَ: فَمَا مَرَّبِيْ نِصْفُ شَهْرٍ حَتَّى تَعَلَّمْتُ فَكَانَ إِذَا كَتَبَ إِلَى يَهُوْدِ كَتَبْتُ وَإِذَا كَتَبُوْا إِلَيْهِ قَرَأْتُ لَهُ كِتَابَهُمْ. رَوَاهُ التِّرْمِذِيُّ.

4659. (32) [3/1320దృఢం]

‘జైద్‌ బిన్‌ సా’బిత్‌ (ర) కథనం: ప్రవక్త (స) నన్ను సుర్యాని (Syriac) భాష నేర్చుకోమని ఆదేశించారు. మరో ఉల్లేఖనంలో ఇలా ఉంది, నన్ను యూదుల భాష చదవటం, వ్రాయటం నేర్చుకోమని ఆదేశించారు. ఇంకా యూదుల వ్రాతలో నాకు నమ్మకం లేదని అంటే నేను 15 రోజుల్లో నేర్చు కున్నాను. ఆ తరువాత ప్రవక్త (స) యూదులకు ఉత్తరం వ్రాయిస్తే నేను రాసేవాడ్ని. ఇంకా యూదులు, ప్రవక్త (స) కు ఉత్తరాలు పంపితే నేనే చదివేవాడ్ని. [4] (తిర్మిజి’)

4660 – [ 33 ] ( حسن ) (3/1320)

وعَنْ أَبِيْ هُرَيْرَةَ رَضِيَ اللهُ عَنْهُ عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ: “إِذَا انْتَهَى أَحَدُكُمْ إِلَى مَجْلِسٍ فَلْيُسَلِّمْ فَإِنْ بَدَا لَهُ أَنْ يَجْلِسَ فَلْيَجْلِسْ ثُمَّ إِذَا قَامَ فَلْيُسَلِّمْ فَلَيْسَتِ الْأُوْلَى بِأَحَقِّ مِنَ الْآخِرَةِ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَأَبُوْ دَاوُدَ

4660. (33) [3/1320 ప్రామాణికం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఏ సమావేశంలోనైనా మీరు వెళ్ళితే వారికి సలామ్‌ చేయండి. అవకాశం ఉంటే కూర్చోండి. అక్కడి నుండి వెళ్ళితే సలామ్‌ చేసివెళ్లండి.ఎందుకంటే వచ్చి నప్పుడు ఎలాంటి హక్కో వెళ్ళినప్పుడు చేయటం కూడా అలాంటి హక్కే. అంటే వచ్చినప్పుడు వెళ్ళినప్పుడు సలామ్‌  చేయాలి.” (తిర్మిజి’, అబూ  దావూద్‌)

4661 – [ 34 ] ( لم تتم دراسته ) (3/1320)

وَعَنْه أَنَّ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم قَالَ: “لَا خَيْرَ فِيْ جُلُوْسِ فِي الطُّرُقَاتِ إِلَّا لِمَنْ هَدَى السَّبِيْلَ وَرَدَّ التَّحِيَّةَ وَغَضَّ الْبَصَرَ وَأَعَانَ عَلَى الْحَمُوْلَةِ”. رَوَاهُ فِيْ “شَرْحِ السُّنَّةِ” وَذُكِرَ حَدِيْثُ أَبِيْ جُرَيٍّ فِي “بَابِ فَضْلِ الصَّدَقَةِ”.

4661. (34) [3/1320 అపరిశోధితం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మార్గాల్లో కూర్చోవటం మంచిది కాదు. అందులో ఎటువంటి మేలూ లేదు. అయితే దారితప్పిన వారికి దారి చూపెట్టాలి. సలామ్‌కు సమాధానం ఇవ్వాలి. ఇంకా నిషిద్ధ వస్తువుల వైపు చూడరాదు. బరువైన వస్తువులు ఎత్తుకొని వెళుతున్న వారికి సహాయ పడాలి.” (షర్‌’హుస్సున్నహ్‌)

అంటే బరువులను తీసుకువెళుతున్న వారికి సహాయ పడాలి.

—–

اَلْفَصْلُ الثَّالِثُ మూడ విభాగం 

4662 – [ 35 ] ( صحيح ) (3/1321)

عَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَمَّا خَلَقَ اللهُ آدَمَ وَنَفَخَ فِيْهِ الرُّوْحَ عَطَسَ فَقَالَ: اَلْحَمْدُ لِلّهِ فَحَمِدَ اللهَ بِإِذْنِهِ. فَقَالَ لَهُ رَبُّهُ: يَرْحَمُكَ اللهُ يَا آدَمُ اِذْهَبْ إِلى أُوْلَئِكَ الْمَلَائِكَةِ إِلَى مَلَأِ مِّنْهُمْ جُلُوْسٍ فَقُلْ: اَلسَّلَامُ عَلَيْكُمْ. فَقَالَ: السَّلَامُ عَلَيْكُمْ. قَالُوْا: عَلَيْكَ السَّلَامُ وَرَحْمَةُ اللهِ. ثُمَّ رَجَعَ إِلى رَبِّهِ فَقَالَ: إِنَّ هَذِهِ تَحَيَّتُكَ وَتَحَيَّةُ بَنِيْكَ بَيْنَهُمْ. فَقَالَ لَهُ اللهُ وَيَدَاهُ مَقْبُوْضَتَانِ: اِخْتَرْ أَيَّتَّهُمَا شِئْتَ؟ فَقَالَ: اِخْتَرْتُ يَمِيْنَ رَبِّيْ وَكِلْتَا يَدَيْ رَبِّيْ يَمِيْنٌ مُبَارَكَةٌ ثُمَّ بَسَطَهَا فَإِذَا فِيْهَا آدَمُ وَذُرِّيَّتُهُ فَقَالَ: أَيْ رَبِّ مَا هَؤُلَاءِ؟ قَالَ: هَؤُلَاءِ ذُرِّيَّتُكَ فَإِذَا كُلُّ إِنْسَانٍ مَكْتُوْبٌ عُمُرُهُ بَيْنَ عَيْنَيْهِ فَإِذَا فِيْهِمْ رَجُلٌ أَضْوَؤُهُمْ – أَوْ مِنْ أَضْوَئِهِمْ – قَالَ: يَا رَبِّ مَنْ هَذَا؟ قَالَ: هَذَا اِبْنُكَ دَاودُ وَقَدْ كَتَبْتُ لَهُ عُمُرَهُ أَرْبَعِيْنَ سَنَةً. قَالَ: يَا رَبِّ زِدْ فِيْ عُمُرِهِ. قَالَ: ذَلِكَ الَّذِيْ كَتَبْتُ لَهُ. قَالَ: أَيْ رَبِّ فَإِنِّيْ قَدْ جَعَلْتُ لَهُ مِنْ عُمُرِيْ سِتِّيْنَ سَنَةَ. قَالَ: أَنْتَ وَذَاكَ. قَالَ: ثُمَّ سَكَنَ الْجَنَّةَ مَا شَاءَ اللهُ ثُمَّ أُهْبِطَ مِنْهَا وَكَانَ آدَمُ يَعُدُّ لِنَفْسِهِ فَأَتَاهُ مَلَكُ الْمَوْتِ. فَقَالَ لَهُ آدَمُ: قَدْ عَجَّلْتَ قَدْ كُتِبَ لِيْ أَلْفُ سَنَةٍ. قَالَ: بَلَى وَلَكِنَّكَ جَعَلْتَ لِاِبْنِكَ دَاوُدَ سِتِّيْنَ سَنَةً فَجَحَدَ فَجَحَدَتْ ذُرِّيَّتُهُ وَنَسِيَ فَنَسِيَتْ ذُرِّيَتُهُ”. قَالَ: “فَمِنْ يَؤْمَئِذٍ أُمِرَ بِالْكِتَابِ وَالشُّهُوْدِ”. رَوَاهُ التِّرْمِذِيُّ.

4662. (35) [3/1321దృఢం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం: ”అల్లాహ్‌ (త) ఆదమ్‌ (అ)ను సృష్టించి, అతనిలో ఆత్మ ఊదాడు. ఆదమ్‌ (అ)కు తుమ్ము వచ్చింది. అతడు, ‘అల్‌’హమ్‌దులిల్లాహ్‌’ అని అన్నాడు. అల్లాహ్‌ (త) ఆదేశాను సారం అతడు అల్లాహ్‌(త)ను కొనియాడాడు. అతని ప్రభువు, ‘యర్‌’హముకల్లాహ్‌’ అని, ఓ ఆదమ్‌ ఆ దైవదూతల వద్దకు వెళ్ళు, ఇంకా, ‘అస్సలాము అలైకుమ్‌,’ అని పలుకు’,’ అని అన్నాడు. ఆదమ్‌ వెళ్ళి ‘అస్సలాము అలైకుమ్‌,’ అని అన్నారు. వారు ‘అస్సలాము అలైకుమ్‌ వ రహ్‌మతుల్లాహి,’ అని సమాధానం ఇచ్చారు. మరల తన ప్రభువు వద్దకు తిరిగి వచ్చాడు. అప్పుడు అతని ప్రభువు ఇది మీరు, మీ సంతానం కొరకు పరస్పరం పలికే శుభవచనాలు, మీరు పరస్పరం కలిస్తే వీటి ద్వారా పలకరించండి. ఆ సమయంలో అల్లాహ్‌ (త) రెండు చేతుల పిడికిలిలు మూసి ఉన్నాయి. అప్పుడు అల్లాహ్‌ (త) సైగ చేసి, ‘ఈ రెండింటిలో ఏదో ఒక దాని కోరుకో,’ అని అన్నాడు. అప్పుడు ఆదమ్‌ (అ) ‘ప్రభువు కుడిచేతిని ఎన్ను కుంటాను నా ప్రభువు రెండు చేతులు కుడిచేతులే, శుభం గలవే.’ ఆ తరువాత అల్లాహ్‌ (త) తన చేతిని విప్పాడు. అందులో ఆదమ్‌ (అ) సంతానం కనబడింది. అప్పుడు ఆదమ్‌ (అ) ‘ప్రభూ వీళ్ళెవరు?’ అని ప్రశ్నించారు. దానికి అల్లాహ్‌ (త) వీరు నీ సంతానం. వీరిలో ప్రతి ఒక్కరి ఆయుష్షు వారి నుదురుపై వ్రాయబడి ఉంది. వారిలో ఒక వ్యక్తి చాలా అందంగా ఉన్నాడు. ‘ఓ ప్రభూ! ఇతనెవరు?’ అని విన్నవించుకున్నాడు. దానికి అల్లాహ్‌ (త) ‘వీడు నీ కుమారుడు దావూ’ద్‌, అతని ఆయుష్షు 40 సంవత్సరాలు వ్రాస్తాను,’ అని అన్నాడు. అప్పుడు ఆదమ్‌ (అ) ‘నా ఆయుష్షులో నుండి కొంత అతని ఆయుష్షులో కలపమని’ విన్నవించుకున్నాడు. దానికి అల్లాహ్‌ (త) ‘ఎంత పెంచమంటావు’ అని అన్నాడు. అప్పుడు ఆదమ్‌ (అ) ‘నేను నా ఆయుష్షులో నుండి 60 సంవత్సరాలు అతనికి ఇస్తున్నాను’ అని అన్నాడు. దానికి అల్లాహ్‌ (త) ‘అనుమతించాను’ అని అన్నాడు. ప్రవక్త (స) ప్రవచనం: ‘ఆ తరువాత ఆదమ్‌ (అ) అల్లాహ్‌ కోరినంతవరకు స్వర్గంలో ఉన్నారు. తరువాత స్వర్గం నుండి భూమిపైకి దించబడ్డారు. ఆదమ్‌ (అ) తన వయస్సును లెక్కిస్తూ ఉండేవారు. దైవదూత ప్రాణం తీయటానికి వచ్చాడు. ఆదమ్‌ (అ) ‘మీరు త్వరగా వచ్చేసారు. నా వయస్సు 1000 సంవ త్సరాలు లిఖించబడి ఉంది. ఇంకా 60 సంవత్సరాలు మిగిలి ఉన్నాయి’ అని అన్నారు. దానికి ఆ దైవదూత, ‘మీరు 60 సంవత్సరాలు మీ కుమారుడైన దావూద్‌ (అ)కు ఇచ్చివేశారు’ అని సమాధానం ఇచ్చారు. దానికి ఆదమ్‌ (అ) తిరస్కరించారు. ఈ బుద్ధి వారి సంతానంలో కూడా వచ్చింది. వాగ్దానం చేసి తిరస్క రిస్తుంది. ఆడిన మాట తప్పుతుంది. అతడు మరచి పోయాడు, అతని సంతానం కూడా మరచిపోయింది. అప్పటి నుండి వ్రాయమని సాక్షుల సాక్ష్యం కూడా వ్రాయమని ఆదేశించటం జరిగింది అని ప్రవక్త (స) ప్రవచించారు. (తిర్మిజి’)

4663 – [ 36 ] ( لم تتم دراسته ) (3/1322)

وَعَنْ أَسْمَاءَ بِنْتِ يَزِيْدَ قَالَتْ:مَرَّعَلَيْنَا رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم فِيْ نِسْوَةٍ فَسَلَّمَ عَلَيْنَا. رَوَاهُ أَبُوْ دَاوُدَ وَابْنُ مَاجَهُ وَالدَّارَمِيُّ  

4663. (36) [3/1322అపరిశోధితం]

అస్మా’ బిన్‌తె య’జీద్‌ (ర) కథనం: ప్రవక్త (స) మా స్త్రీల సమూహం ప్రక్క నుండి వెళుతూ మాకు సలామ్‌ చేశారు. (అబూ  దావూద్‌, ఇబ్నె  మాజ,  దార్మి)

అంటే పరులు ముస్లిమ్‌ స్త్రీలకు కూడా సలామ్‌ చేయవచ్చు.

4664 – [ 37 ] ( لم تتم دراسته ) (3/1322)

وَعَنِ الطُّفَيْلِ بْنِ أُبَيِّ بْنِ كَعْب: أَنَّهُ كَانَ يَأْتِي ابْنَ عُمَرَفَيَغْدُوْ مَعَهُ إِلى السُّوْقِ. قَالَ فَإِذَا غَدَوْنَا إِلى السُّوْقِ لَمْ يَمُرَّعَبْدُ اللهِ بْنِ عُمَرَ عَلَى سَقَّاطٍ وَلَا عَلَى صَاحِبِ بَيْعَةٍ وَلَا مِسْكِيْنٍ وَلَا أَحَدٍ إِلَّا سَلَّمَ عَلَيْهِ. قَالَ الطُّفَيْلُ: فَجِئْتُ عَبْدَ اللهِ بْنِ عُمَرَ يَوْمًا فَاسْتَتْبَعَنِيْ إِلى السُّوْقِ. فَقُلْتُ لَهُ: وَمَا تَصْنَعُ فِي السُّوْقِ وَأَنْتَ لَا تَقِفُ عَلَى الْبَيْعِ وَلَا تَسْأَلُ عَنِ السِّلَعِ وَ تَسُوْمُ بِهَا وَلَا تَجْلِسُ فِيْ مَجَالِسِ السُّوْقِ. فَاجْلِسْ بِنَا هَهُنَا نَتَحَدَّثْ. قَالَ: فَقَالَ عَبْدُ اللهِ بْنِ عُمَرَ: يَا أَبَا بَطْنِ – قَالَ وَكَانَ الطُّفَيْلُ ذَا بَطْنٍ – إِنَّمَا نَغْدُوْ مِنْ أَجْلِ السَّلَامِ نُسَلِّمُ عَلَى مَنْ لَقِيْنَاهُ. رَوَاهُ مَالِكٌ وَالْبَيْهَقِيُّ فِيْ ” شُعَبِ الْإِيْمَانِ”  

4664. (37) [3/1322అపరిశోధితం]

తుఫైల్‌ బిన్‌ ఉబయ్‌ బిన్‌ క’అబ్‌ కథనం: తుఫైల్‌ బిన్‌ ఉబయ్‌ ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘ఉమర్‌ (ర) వద్దకు వచ్చే పోయే వారు. ‘అబ్దుల్లాహ్‌ అతన్ని తీసుకుని ఉదయం వేళ బజారుకు వెళ్ళేవారు. ఒక రోజు నేను ‘అబ్దుల్లాహ్‌ వెంట బజారుకు వెళ్ళాను. ‘అబ్దుల్లాహ్‌ బజారులో కలిసే ప్రతి ఒక్కరికీ సలామ్‌ చేసేవారు. ఒకరోజు నేను ‘అబ్దుల్లాహ్‌ వద్దకు వచ్చాను. నన్ను బజారుకు తీసుకొని వెళ్ళారు. మీరు బజారులో ఏం చేస్తారు అని నేనడిగాను. ఏ దుకాణం వద్ద ఆగరు, ఏదీ కొనరు, క్రయవిక్రయాలు చేయరు, ఎక్కడా కూర్చోరు. రండి, మనం ఇక్కడ కూర్చొని మాట్లాడు కుందాం అని అన్నాను. దానికి అతను, ‘ఓ బొజ్జవాడా మనం కేవలం సలామ్‌ చేయడానికి వస్తూపోతూ ఉంటాం. పరిచయమున్న వారితో కలసి సలామ్‌ చేయడానికి వస్తాము. దానివల్ల మనకు సలామ్‌ పుణ్యం కూడా లభిస్తుంది,’ అని అన్నారు. (ఇమామ్‌ మాలిక్‌ – ముఅత్తా, బైహఖీ, – షు’అబిల్ ఈమాన్ )

4665 – [ 38 ] ( لم تتم دراسته ) (3/1322)

وَعَنْ جَابِرٍقَالَ: أَتَى رَجُلُ النَّبِيَّ صلى الله عليه وسلم فَقَالَ: لِفُلَانٍ فِيْ حَائِطِيْ عَذْقٌ وَإِنَّهُ آذَانِيْ مَكَانُ عَذْقِهِ فَأَرْسَلَ النَّبِيُّ صلى الله عليه وسلم: “أَنْ بِعْنِيْ عَذْقَكَ” .قَالَ: لَا. قَالَ: ” فَهَبْ لِيْ”. قَالَ: لَا. قَالَ: “فَبِعْنِيْهِ بِعَذْقٍ فِي الْجَنَّةِ؟ فَقَالَ: لَا. فَقَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَا رَأَيْتُ الَّذِيْ هُو أَبْخَلُ مِنْكَ إِلَّا الَّذِيْ يَبْخَلُ بِالسَّلَامِ”. رَوَاهُ أَحْمَدُ وَالْبَيْهَقِيُّ فِيْ” شُعَبِ الْإِيْمَانِ “

4665. (38) [3/1322 అపరిశోధితం]

జాబిర్‌ (ర) కథనం: ఒక వ్యక్తి ప్రవక్త (స) వద్దకు వచ్చి, ‘నా తోటలో ఫలానా వ్యక్తికి చెందిన ఒక ఖర్జూరపు చెట్టు ఉంది. అది నాకు ఆటంకంగా ఉంది, ఎందుకంటే ఆ చెట్టు యజమాని వేళాపాళా లేకుండా నా తోటలోనికి వస్తూ ఉండటం వల్ల దానివల్ల నా భార్యాబిడ్డలకు తెరచాటు విషయంలో చాలా అసౌకర్యంగా ఉంది,’ అని ఫిర్యాదు చేసాడు. ప్రవక్త (స) అతని పిలిపించారు. అతనితో, ‘ఆ చెట్టును నాకు అమ్మివేయి,’ అని అన్నారు. అతడు దానికి నిరాకరించాడు. ప్రవక్త (స), ‘ఒకవేళ దాన్ని నువ్వు అమ్మకపోతే కానుకగా ఇచ్చివేయి,’ అని అన్నారు. అతడు దానికి కూడా ఒప్పుకోలేదు. ప్రవక్త (స) అతనితో, ‘ఆ చెట్టును స్వర్గంలోని చెట్టుకు బదులు అమ్మివేయి.’ ఆ వ్యక్తి దానికి కూడా ఒప్పుకోలేదు. అది విని ప్రవక్త (స), ‘నేను నీకంటే పిసినారిని చూడలేదు. సలామ్‌ చేయటంలో పిసినారితనంగా వ్యవహరించే వ్యక్తి నీకంటే పిసినారి,’ అని అన్నారు. (అ’హ్మద్, బైహఖీ–షు’అబుల్  ఈమాన్)

4666 – [ 39 ] ( لم تتم دراسته ) (3/1322)

وَعَنْ عَبْدِ اللهِ عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ: “اَلْبَادِئُ بِالسَّلَامِ بَرِيْءٌ مِّن الْكِبْرِ”. رَوَاهُ الْبَيْهَقِيُّ فِيْ ” شُعَبِ الْإِيْمَانِ”.

4666. (39) [3/1322అపరిశోధితం]

‘అబ్దుల్లాహ్‌(ర) కథనం: ప్రవక్త(స) ప్రవచనం: ”ముందుగా సలామ్‌ చేసేవారు గర్వాహంకారాలకు గురికారు.”  (బైహఖీ)

అంటే ముందు సలామ్‌ చేసేవారు గర్వం, అహంకారానికి  గురికారు.

=====

2- بَابُ الْاِسْتِئْذَانِ

2. అనుమతి కోరటం (స్తిజాన్)

ఇస్తీజా’న్‌ అంటే అనుమతి కోరటం. ఇతరుల ఇళ్ళకు వెళ్ళవలసి వస్తే, ఇతరుల ఇండ్లలో ప్రవేశించే ముందు అనుమతి కోరటం తప్పనిసరి. అనుమతిస్తే లోపలికి వెళ్ళాలి. ఎందు కంటే ఒక్కోసారి ఇతరులు తన ఇంట్లోకి రావటం ఇంటి యజమానికి ఇష్టం ఉండదు. అతడు నగ్నంగా ఉండవచ్చు లేదా ఏదైనా పనిలో నిమగ్నమయి ఉండవచ్చు. దీన్ని గురించి ఖుర్‌ఆన్‌లో ప్రత్యేకంగా హెచ్చరించటం జరిగింది.

విశ్వాసులారా! మీ ఇండ్లు తప్ప, ఇతరుల ఇండ్లలోనికి వారి అనుమతి లేకుండా మరియు ఆ ఇంటి వారికి సలామ్‌ చేయకుండా ప్రవేశించకండి.ఈ పధ్ధతి మీకు అతి ఉత్తమమైనది. మీరు ఈ హితోపదేశం జ్ఞాపకం ఉంచుకుంటారని ఆశింపబడు తోంది! మరియు ఒకవేళ మీకు దానిలో (ఆ ఇంటిలో) ఎవ్వరూ కనబడక పోయినా, మీకు అనుమతి ఇవ్వబడనంత వరకు అందులోకి ప్రవేశించకండి. మరియు (అనుమతి ఇవ్వక) మీతో తిరిగి పొమ్మని (ఆ ఇంటివారు) అంటే! తిరిగి వెళ్ళి పోండి. ఇదే మీ కొరకు శ్రేష్ఠమైన పద్ధతి. మరియు మీరు చేసేదంతా అల్లాహ్‌కు బాగాతెలుసు. ఎవ్వరికీ నివాసస్థలం కాకుండా మీకు ప్రయోజనకరమైన వస్తువులున్న ఇండ్లలో ప్రవేశిస్తే, మీపై ఎట్టి దోషం లేదు. మరియు మీరు వ్యక్తపరిచేది మరియు మీరు దాచేది అంతా అల్లాహ్‌కు బాగా తెలుసు.” (అన్నూర్‌, 24:27-29)

ఈ ఆయతులలో షరీఅత్‌ నియమనిబంధనలు పేర్కొనడం జరిగింది. ఇతరుల ఇంట్లో ప్రవేశించే ముందు అనుమతి కోరాలి. అనుమతిస్తే లోపలికి వెళ్ళి ముందు సలామ్‌ చేయాలి. ఒకవేళ మొదటిసారి అనుమతి లభించకపోతే, మూడు సార్లు అనుమతి కోరాలి. ఒకవేళ అప్పటికి అనుమతి లభించకపోతే తిరిగి వెళ్ళి పోవాలి. మరో ఆయతులలో కూడా అల్లాహ్‌ (త) దీన్ని గురించే పేర్కొన్నాడు.

 ” విశ్వాసులారా! మీ బానిసలు మరియు యుక్త వయస్సుకు చేరని మీ పిల్లలు, మూడు సమయాలలో అనుమతి తీసుకొనే మీవద్దకు రావాలి. (అవి) ఉదయపు (ఫజ్ర్‌) నమా’జ్‌కు ముందు, మధ్యాహ్నం (“జుహ్ర్‌) తరువాత – మీరు మీ వస్త్రాలు విడిచి ఉన్నప్పుడు, మరియు రాత్రి (‘ఇషా) నమా’జ్‌ తరువాత. ఈ మూడు, మీ కొరకు ఏకాంత (పరదా) సమయాలు. వీటి తరువాత వారు మరియు మీరు ఒకరి వద్దకు మరొకరు వచ్చిపోతూ వుంటే, వారిపై గానీ, మీపై గానీ ఎలాంటి దోషంలేదు. ఈ విధంగా అల్లాహ్‌ మీకు తన ఆజ్ఞలను విశదీకరిస్తున్నాడు. అల్లాహ్‌ సర్వజ్ఞుడు, మహావివేక వంతుడు. మరియు మీ పిల్లలు యుక్తవయస్సుకు చేరుకున్నప్పుడు; వారికంటే పెద్ద వారు (ముందు వారు) అనుమతి తీసుకున్నట్లు వారుకూడా అనుమతి తీసుకోవాలి. ఈ విధంగా అల్లాహ్‌ మీకు తన ఆజ్ఞలను విశదీకరిస్తున్నాడు. మరియు అల్లాహ్‌ సర్వజ్ఞుడు, మహా వివేకవంతుడు. మరియు ఋతు స్రావం ఆగిపోయి, వివాహ ఉత్సాహం లేని స్త్రీలు – తమ సౌందర్యం బయటపడకుండా ఉండేటట్లుగా – తమపై వస్త్రాలను (దుప్పట్లను) తీసివేస్తే, వారిపై దోషంలేదు. కాని వారు అట్లు చేయకుండా ఉండటమే వారికి ఉత్తమమైనది. మరియు అల్లాహ్‌ సర్వం వినేవాడు, సర్వజ్ఞుడు. (అన్నూర్‌, 24:58-60)

ఇంతకు ముందు ఆయతులలో అపరిచితుల అనుమతి గురించి పేర్కొనడం జరిగింది. ఈ ఆయతులలో ఇంటి సభ్యులకూ మూడు వేళల్లో చివరికి ఇంకా యుక్త వయస్సుకు చేరని పిల్లలకు కూడా అనుమతి తీసుకోవాలని ఆదేశించడం జరిగింది. ఫజ్ర్‌ నమాజ్‌కు ముందు, మధ్యాహ్న సమయంలో, ఎందు కంటే అది విశ్రాంతి సమయం గనుక, ‘ఇషానమా’జు తరువాత ఎందుకంటే అది పడుకునే సమయం. ఈ మూడు సమయాల్లో ముందుగా తెలియపర్చకుండా నిశ్శబ్దంగా లోపలికి వెళ్ళరాదు. ఈ సమయాల్లో తప్ప ఇతర సమయాల్లో వెళ్ళవచ్చు. అయితే పిల్లలు పెద్దవారైతే అనుమతి లేకుండా ప్రవేశించరాదు. ఈ ఆయాతుల వల్ల దీని ప్రాముఖ్యత బహిర్గత మవుతుంది. ఈ ‘హదీసు’లను చదవండి, మరింత ప్రాముఖ్యత  తెలుస్తుంది.

اَلْفَصْلُ الْأَوَّلُ  మొదటి విభాగం 

4667 – [ 1 ] ( متفق عليه ) (3/1323)

عَنْ أَبِيْ سَعِيْدِ الْخُدْرِيِّ قَالَ: أَتَانَا أَبُوْ مُوْسَى قَالَ: إِنَّ عُمَرَ أَرْسَلَ إِلَيَّ أَنْ آتِيَهِ فَأَتَيْتُ بَابَهُ فَسَلَّمْتُ ثَلَاثًا فَلَمْ يَرُدَّ عَلَيَّ فَرَجَعْتُ. فَقَالَ: مَا مَنَعَكَ أَنْ تَأْتِيْنَا؟ فَقُلْتُ: إِنِّيْ أَتَيْتُ فَسَلَّمْتُ عَلَى بَابِكَ ثَلَاثًا فَلَمْ تَرُدَّ عَلَيَّ فَرَجَعْتُ. وَقَدْ قَالَ لِيْ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِذَا اسْتَأْذَنَ أَحَدُكُمْ ثَلَاثًا فَلَمْ يُؤْذَنْ لَهُ فَلْيَرْجِعْ”. فَقَالَ عُمَرُ: أَقِمْ عَلَيْهِ الْبَيِّنَةَ. قَالَ أَبُوْ سَعِيْدٍ: فَقُمْتُ مَعَهُ فَذَهَبْتُ إِلَى عُمَرَ فَشَهِدْتُّ.

4667. (1) [3/1323ఏకీభవితం]

అబూ స’యీద్‌ ‘ఖుద్రీ (ర) కథనం: ఒక రోజు మా వద్దకు అబూ మూసా ‘అష్‌’అరీ (ర) వచ్చి ఇలా అన్నారు: ‘ఉమర్‌ (ర) నా వద్దకు ఒక వ్యక్తిని పంపి రమ్మని పిలిచారు. నేను వెళ్ళాను. అంతకుముందు పద్ధతి ప్రకారం తలుపు వద్దకు వెళ్ళి అనుమతి తీసుకునే వాడిని. నేనతని ఇంటికి వెళ్ళి మూడుసార్లు తలుపు ముందు నిలబడి సలామ్‌ చేసాను. మొదటి సలామ్‌ చేరిన తర్వాత, రెండవ సలామ్‌ అనుమతి కోసం, మూడవ సలామ్‌ తిరిగి వచ్చే ముందు. ‘ఉమర్‌ (ర) నా ఏ సలామ్‌కు సమాధానం ఇవ్వలేదు. నేను తిరిగి వెళ్ళి పోయాను. ‘ఉమర్‌ (ర) మనిషిని పంపి పిలిపించారు. నేను వెళ్ళిన తర్వాత అతను, ‘నువ్వు ఎందుకు ఇంటిలోపలికి ప్రవేశించలేదు,’ అని అడి గారు. దానికి నేను, ‘మీఇంటి ముందునిలబడి మూడు సార్లు సలామ్‌ చేసాను. మీరు ఏ సలామ్‌కూ సమా ధానం ఇవ్వలేదు. అందువల్ల నేను తిరిగి వెళ్ళి పోయాను,’ అని అన్నాను.  ప్రవక్త (స) నన్ను, ‘నీవు ఎవరి దగ్గరనైనా వెళ్ళి మూడు సార్లు అనుమతి కోరు, ఒకవేళ అనుమతి లభించలేక పోతే తిరిగి వెళ్ళిపో’ అని హితబోధచేసారు. అప్పుడు ‘ఉమర్‌ (ర), ‘దీన్ని గురించి ఇతరులెవరైనా సాక్ష్యం ఉన్నారా?’ అని అడిగారు. దానికి అబూ మూసా ‘నేనందుకే వచ్చాను’ అని అన్నారు. ‘నేనతని వెంట వెళ్ళి ‘ఉమర్‌ (ర) వద్ద సాక్ష్యం ఇచ్చాను’ అని అబూ ‘సయీద్‌ ‘ఖుద్రీ (ర) అన్నారు. (ముత్త ఫఖున్‌ అలైహ్‌)

‘ఉమర్‌ (ర) ముందస్తుగా సాక్ష్యం కోరారు. అయితే ఆ వార్త నమ్మయోగ్యత గలదే.

4668 – [ 2 ] ( صحيح ) (3/1323)

وَعَنْ عَبْدِ اللهِ بْنِ مَسْعُوْدٍ قَالَ: قَالَ لِيَ النَّبِيُّ صلى الله عليه وسلم: “إِذْنُكَ عَلَيَّ أَنْ تَرْفَعَ الْحِجَابَ وَأَنْ تَسْمَعَ سِوَادِيْ حَتَّى أَنْهَاكَ” .

4668. (2) [3/1323దృఢం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ మస్‌’ఊద్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”నేను వారించనంతవరకు నా ఇంటి తెలుపులు తెరుచుకొని లోపలికి రావచ్చని, నా రహస్య విషయాలు వినవచ్చని నేను అనుమ తిస్తున్నాను. (ముస్లిమ్‌)

4669 – [ 3 ] ( متفق عليه ) (3/1323)

وَعَنْ جَابِرٍقَالَ: أَتَيْتُ النَّبِيَّ صلى الله عليه وسلم فِيْ دَيْنٍ كَانَ عَلَى أَبِيْ فَدَقَقْتُ الْبَابَ فَقَالَ: “مَنْ ذَا؟” فَقُلْتُ: أَنَا. فقَالَ: “أَنَا أَنَا”. كَأَنَّهُ كَرِهَهَا.

4669. (3) [3/1323ఏకీభవితం]

జాబిర్‌ (ర) కథనం: ”మా నాన్న గారిపై కొందరి రుణభారం ఉండేది. దాన్ని గురించి సిఫారసు కోసం ప్రవక్త (స) వద్దకు వచ్చాను. ఇంటి తలుపు తట్టాను. ప్రవక్త (స) లోపలి నుండి ‘ఎవరు’ అని అన్నారు. దానికి నేను, ”నేను” అని అన్నాను. ప్రవక్త (స) ”నేను, నేను ఏమిటి,” అని అన్నారు. అంటే దాన్ని అసభ్యంగా భావించారు. (బు’ఖారి, ముస్లిం)

ఈ ‘హదీసు’ ద్వారా తెలిసిన విషయం ఏమిటంటే, ఎవరు అని అడిగితే, తన పేరు, వివరాలు తెలపాలి. నేను  అంటే  దాని  వల్ల ఏ వివరం తెలియదు.

4670 – [ 4 ] ( متفق عليه) (3/1323)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: دَخَلْتُ مَعَ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم فَوَجَدَ لَبَنًا فِيْ قَدَحٍ. فقَالَ: “أَبَا هِرٍّ اِلْحَقْ بِأَهْلِ الصُّفَّةِ فَادْعُهُمْ إِلَيَّ”. فَأَتَيْتُهُمْ فَدَعَوْتُهُمْ فَأَقْبَلُوْا فَاسْتَأْذَنُوْا فَأَذِنَ لَهُمْ فَدَخَلُوْا.  

4670. (4) [3/1323దృఢం]

అబూ హురైరా (ర) కథనం: నేను ప్రవక్త (స) వెంట ఆయన ఇంట్లోకి వెళ్ళాను. అక్కడ పాల గిన్నె ఉంది. ‘సుఫా వారిని పిలవమని నాతోఅన్నారు. వాళ్ళు వచ్చి ద్వారం వద్ద నిలబడి లోపలికి రావటానికి అనుమతి కోరారు. ప్రవక్త (స) అనుమతించారు. అప్పుడు వారు ఇంటి లోపలికి వచ్చారు. (బు’ఖారి)

—–

اَلْفَصْلُ الثَّانِي రెండవ విభాగం 

 4671 – [ 5 ] ( لم تتم دراسته ) (3/1324)

عَنْ كَلَدَةَ بْنِ حَنْبَلٍ: أَنَّ صَفْوَانَ بْنَ أُمَيَّةَ بَعَثَ بِلبَنٍ أَوْجِدَابَةٍ وَضَغَا بِيْسَ إِلى النَّبِيِّ صلى الله عليه وسلم. وَالنَّبِيُّ صلى الله عليه وسلم بِأَعْلَى الْوَادِيْ قَالَ: فَدَخَلْتُ عَلَيْهِ وَلَمْ أُسَلِّمْ وَلَمْ أَسْتَأْذِنْ. فَقَالَ النَّبِيُّ صلى الله عليه وسلم: “اِرْجِعْ فَقُلْ: السَّلَامُ عَلَيْكُمْ أَأَدْخُلُ؟” رَوَاهُ التِّرْمِذِيُّ وأَبُوْ دَاوُدَ

4671. (5) [3/1324 అపరిశోధితం]

కల్‌దహ్‌ బిన్‌ ‘హంబల్‌ కథనం: ‘సఫ్వాన్‌ బిన్‌ ఉమ య్య ఖీరా, జింకపిల్ల పాలు నా ద్వారా ప్రవక్త (స)కు పంపారు. ప్రవక్త (స) అప్పుడు మక్కహ్ లో ఎత్తు ప్రాంతంలో ఉండే వారు. నేను ప్రవక్త (స) వద్దకు అను మతి కోరకుండా సలామ్‌ చేయకుండా వెళ్ళాను. ప్రవక్త (స) నాతో, ‘నువ్వు ఇంటి నుండి బయటకు వెళ్ళిపో, మళ్ళీ తిరిగి వచ్చి అస్సలాము అలైకుమ్‌ అని పలికి, ఆ తరువాత నేను లోపలికి రావచ్చా? అని అనుమతి కోరు’ అని అన్నారు.(తిర్మిజి’, అబూ దావూద్‌)

4672 – [ 6 ] ( صحيح ) (3/1324)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم قَالَ: “إِذَا دُعِيَ أَحَدُكُمْ فَجَاءَ مَعَ الرَّسُوْلِ فَإِنَّ ذَلِكَ إِذْنٌ”. رَوَاهُ أَبُوْدَاوُدَ.

 وَفِيْ رِوَايَةٍ لَّهُ قَالَ: “رَسُوْلُ الرَّجُلِ إِلى الرَّجُلِ إِذْنُهُ”.

4672. (6) [3/1324దృఢం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మీలో ఎవరినైనా పిలిపిస్తే, అతడు పంపబడిన వ్యక్తి వెంటనే రావాలి. అతనికి అదే అనుమతి.” (అబూ దావూద్‌)

4673 – [ 7 ] ( لم تتم دراسته ) (3/1324)

وَعَنْ عَبْدِ اللهِ بْنِ بُسْرٍ قَالَ: كَانَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم إِذَا أَتَى بَابَ قَوْمٍ لَمْ يَسْتَقْبِلِ الْبَابَ تِلْقَاءِ وَجْهِهِ وَلَكِنْ مِنْ رُّكْنِهِ الْأَيْمَنِ أَوْ الْأَيْسَرِ فَيَقُوْلُ: “السَّلَامُ عَلَيْكُمْ، السَّلَامُ عَلَيْكُمْ” وَذَلِكَ أَنَّ الدُّوْرَلَمْ يَكُنْ يَوْمَئذٍعَلَيْهَا سُتُوْرٌ. رَوَاهُ أَبُوْ دَاوُدَ وَذُكِرَ حَدِيثُ أَنَسٍ. قَالَ عَلَيْهِ الصَّلَاةُ وَالسَّلَامُ: “اَلسَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ اللهِ” فِيْ” بَابِ الضِّيَافَةِ”.

4673. (7) [3/1324 అపరిశోధితం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ బుస్ర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ఇతరుల ఇంటికి వెళితే, తలుపు ముందు నిలబడరు. దానికి కుడి లేదా ఎడమ ప్రక్క నిలబడేవారు. ఇంకా, ‘అస్సలాము అలైకుమ్‌, అస్సలాము అలైకుమ్‌’ అని అనేవారు. అయితే ద్వారాలపై తెరలు ఉండనప్పుడు ఇలా  అనేవారు. (అబూ  దావూద్‌)

ఈ ‘హదీసు’ ద్వారా తెలిసిన విషయం ఏమిటంటే ప్రవక్త (స) ఇలా ఎందుకు పిలిచేవారంటే, లోపల ఉన్నవారు తెలుసు టారని లేదా లోపలికి రావడానికి అనుమతి లభిస్తుందని, అదేవిధంగా ఒకవేళ ద్వారంపై తెర ఉంటే ముందు నిలబడి పిలవవచ్చును.

—–

اَلْفَصْلُ الثَّالِثُ    మూడవ విభాగం

4674 – [ 8 ] ( لم تتم دراسته ) (3/1324)

عَنْ عَطَاءٍ أَنَّ رَجُلًا سَأَلَ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم فَقَالَ: اَسْتَأْذِنُ عَلَى أُمِّيْ؟ فَقَالَ: “نَعَمْ”. فَقَالَ الرَّجُلُ: إِنِّيْ مَعَهَا فِي الْبَيْتِ. فَقَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “اِسْتَأْذِنْ عَلَيْهَا”. فَقَالَ الرَّجُلُ: إِنِّيْ خَادِمُهَا. فَقَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “اِسْتَأْذِنْ عَلَيْهَا أَتُحِبُّ أَنْ تَرَاهَا عُرْيَانَةً؟” قَالَ: لَا. قَالَ: “فَاسْتَأْذِنْ عَلَيْهَا”. رَوَاهُ مَالِكٌ مُرْسَلًا.

4674. (8) [3/1324 అపరిశోధితం]

‘అ’తా బిన్‌ యసార్‌ (ర) కథనం: ప్రవక్త (స) ను ఒక వ్యక్తి, ”నేను నా తల్లి వద్దకు వెళితే, అప్పుడు కూడా అనుమతి తీసుకోవాలా?” అని ప్రశ్నించాడు. దానికి ప్రవక్త (స) అవునని అన్నారు. ఆ వ్యక్తి, ”నేను నా తల్లి వెంటే, నా తల్లి ఇంట్లోనే ఉంటున్నాను.” అని అన్నాడు. దానికి ప్రవక్త (స) ‘అనుమతి తీసుకొని వెళ్ళు,’ అని అన్నారు. ‘ప్రవక్తా! నేను ఆమె సేవకుడను, ఆమె కుమారుడను,’ అని అన్నాడు. దానికి ప్రవక్త (స), ‘అనుమతి తీసుకొని వెళ్ళు, నువ్వు నీ తల్లిని నగ్నంగా చూడాలని కోరుకుంటావా?’ అని అన్నారు. దానికి ఆ వ్యక్తి, ‘లేదు’ అని అన్నాడు. అప్పుడు ప్రవక్త (స) అనుమతి తీసుకొని వెళ్ళు, ఒకవేళ నగ్నంగా ఉంటే నీవూ, ఆమె ఇద్దరూ సిగ్గుపడాల్సి వస్తుంది. (మువ’త్తా ఇమామ్‌ మాలిక్‌/  ‘తాబయీ ప్రోక్తం)

4675 – [ 9 ] ( ضعيف ) (3/1325)

وَعَنْ عَلِيٍّ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: كَانَ لِيْ مِنْ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم مَدْخَلٌ بِاللَّيْلِ وَمَدْخَلٌ بِالنَّهَارِفَكُنْت إِذَا دَخَلْتُ بِاللَّيْلِ تَنَحْنَحَ لِيْ . رَوَاهُ النَّسَائِيُّ.  

4675. (9) [3/1325బలహీనం]

‘అలీ (ర) కథనం: ప్రవక్త (స) వద్దకు నేను తరచూ వెళ్ళే వాడిని. రాత్రిపూట వెళితే అనుమతి తీసుకునే వాడిని. ప్రవక్త (స) నమా’జు చదువుతూ ఉంటే, దగ్గులా శబ్దంచేసేవారు. దాన్ని నేను అనుమతిగా భావించే వాడిని. (నసాయి)

4676 – [ 10 ] ( ضعيف ) (3/1325)

وَعَنْ جَابِرٍ أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم قَالَ: “لَا تَأْذَنُوْا لِمَنْ لَمْ يَبْدَأْ بِالسَّلَامِ”. رَوَاهُ الْبَيْهَقِيُّ فِيْ ” شُعَبِ الْإِيْمَانِ”  

4676. (10) [3/1325 బలహీనం]

జాబిర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం: సలామ్‌ చేయని వారిని ఇంటిలోపలికి రానివ్వకండి. అంటే అను మతి కోరే ముందు సలామ్‌ తప్పనిసరిగా చేయాలి. (బైహఖీ)

=====

3 بَابُ الْمُصَافَحَةِ وَالْمُعَانَقَةِ

3. కరచాలనం, ఆలింగనం

కలసినపుడు ప్రేమపూర్వకమైన మరో పద్ధతి ము’సా ఫ’హా, ము’ఆనఖహ్. దీని ద్వారా సలామ్‌ పరిపూర్ణ మవుతుంది. అందువల్లే ఇస్లామ్‌ దీన్నిసలామ్‌ యొక్క భాగంగా నిర్దేశించింది. మీ సలామ్‌ మీ ము’సాఫ’హా ద్వారా పరిపూర్ణమవుతుంది. ము’సా ఫ’హా అంటే చేయిచేయి కలపడం, ము’ఆనఖహ్ అంటే ఆలింగనం చేయడం. ము’సాఫ’హ్‌ చేసిన తర్వాత ము’ఆనఖహ్ చేయాలి. ఇవి ప్రేమకు చిహ్నాలు.

اَلْفَصْلُ الْأَوَّلُ   మొదటి విభాగం

4677 – [ 1 ] ( صحيح ) (3/1326)

عَنْ قَتَادَةَ قَالَ: قُلْتُ لِأَنَسٍ: أَكَانَتِ الْمُصَافَحَةُ فِيْ أَصْحَابِ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم؟ قَالَ: نَعَمْ. رَوَاهُ الْبُخَارِيُّ  

4677. (1) [3/1326దృఢం]

ఖతాదహ్‌ (ర) కథనం: నేను అనస్‌ (ర)ను ‘స’హాబాల్లో ము’సాఫ’హా ఆచారం ఉండేదా?’ అని అడి గాను. దానికి అతను, ‘అవును’ అన్నారు. (బు’ఖారీ)

అంటే ప్రవక్త (స) అనుచరులు సలామ్‌ చేసిన తర్వాత ము’సాఫ’హ్‌ చేసేవారు.

4678 – [ 2 ] ( متفق عليه ) (3/1326)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: قَبَّلَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم اَلْحَسَنَ بْنَ عَلِيٍّ وَعِنْدَهُ الْأَقْرَعُ بْنُ حَابِسٍ. فَقَالَ الْأَقْرَعُ: إِنَّ لِيْ عَشْرَةً مِّنَ الْوَلَدِ مَا قَبَّلْتُ مِنْهُمْ أَحَدًا فَنَظَرَ إِلَيْهِ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم. ثُمَّ قَالَ: “مَنْ لَا يَرحَمُ لَا يُرْحَمُ”. مُتَّفَقٌ عَلَيْهِ.

وَسَنَذْكُرُحَدِيْث أَبِيْ هُرَيْرَةَ: “أَثَمَّ لُكَعُ” فِيْ “بَابِ مَنَاقِبِ أَهْلِ بَيْتِ النَّبِيِّ صلى الله عليه وَعَلَيْهِمْ أَجْمَعِيْنَ”إِنْ شَاءَ تَعَالى وَذُكِرَ حَدِيْثُ أُمِّ هَانِئٍ فِيْ “بَابِ الْأَمَانِ”.

4678. (2) [3/1326ఏకీభవితం]

అబూ హురైరా (ర) కథనం: ప్రవక్త (స) ‘హసన్‌ను ముద్దుపెట్టుకున్నారు. అప్పుడు ప్రవక్త (స) వద్ద అఖ్‌ర’అ బిన్‌ ‘హాబిస్‌ కూర్చుని ఉన్నారు. ముద్దు పెట్టుకుంటూ ఉండగా ప్రవక్త (స) చూచి, ‘నాకు 10 మంది బిడ్డలు. కాని వారిలో ఎవరినీ నేను ముద్దు పెట్టుకో లేదు’ అని అన్నారు. ప్రవక్త (స) అతని వైపు చూచి, ‘ప్రజలను కనికరించనివాడు, కనికరించ బడడు,’ అని అన్నారు. (బు’ఖారీ, ముస్లిం)

అంటే ముద్దు పెట్టుకోవడం ప్రేమ వాత్సల్యాలకు నిదర్శనం. చిన్న పిల్లలను కనికరించని వాడిని కనిక రించడం జరుగదు. అంటే అల్లాహ్‌ (త) అతన్ని కరుణించడు.

—–

اَلْفَصْلُ الثَّانِيْ    రెండవ విభాగం

4679 – [ 3 ] ( صحيح ) (3/1326)

عَنِ الْبَرَاءِ بْنِ عَازِبِ رَضِيَ اللهُ عَنْهُمَا قَالَ: قَالَ النَّبِيُّ صلى الله عليه وسلم: “مَا مِنْ مُسْلِمَيْنِ يَلْتَقِيَانِ فَيَتَصَافَحَانِ إِلَّا غُفِرَ لَهُمَا قَبْلَ أَنْ يَّتَفَرَّقَا”. رَوَاهُ أَحْمَدُ وَالتِّرْمِذِيُّ وَابْنُ مَاجَهُ

وَفِيْ رِوَايَةٍ أَبِيْ دَاوُدَ قَالَ: “إِذَا الْتَقَى الْمُسْلِمَانِ فَتَصَافَحَا وَحَمِدَا اللهَ وَاسْتَغْفَرَاهُ غُفِرَلَهُمَا”.

4679. (3) [3/1326 దృఢం]

బరాఅ’ బిన్‌ ‘ఆ’జిబ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవ చనం, ”ఇద్దరు ముస్లిములు కలసి ము’సాఫ’హా చేస్తే, వారిద్దరూ విడిపోవటానికిముందే వారిపాపాలు క్షమించ బడతాయి.”  (అ’హ్మద్‌, తిర్మిజి, ఇబ్నె  మాజహ్)

అబూ దావూద్‌లో ఇలా ఉంది, ”ఇద్దరు ముస్లిములు కలసి పరస్పరం ము’సాఫ’హా చేస్తే, అల్లాహ్‌ (త) గొప్పతనాన్ని కొని యాడితే, క్షమాపణకోరితే వారిని క్షమించడం జరుగుతుంది. ఎందుకంటే సలామ్‌ ము’సాఫ’హ్‌ చేయటం వల్ల హృదయాలలో ఉన్న కల్మషం దూరమైపోతుంది. హృదయాలు నిర్మలమై పోతాయి. ఆ తరువాత దైవకారుణ్యం వర్షిస్తుంది.

4680 – [ 4 ] ( حسن أو صحيح ) (3/1327)

وَعَنْ أَنَسٍ قَالَ: قَالَ رَجُلٌ: يَا رَسُوْلَ اللهِ الرَّجُلُ مِنَّا يَلْقَى أَخَاهُ أَوْ صَدِيْقَهُ أَيَنْحَنِيْ لَهُ؟ قَالَ: “لَا”. قَالَ: أَفَيَلْتَزِمُهُ وَيُقَبِّلُهُ؟ قَالَ: “لَا”. قَالَ: أَفَيَأْخُذُ بِيَدِهِ وَيُصَافِحُهُ؟ قَالَ: “نَعَمْ”. رَوَاهُ التِّرْمِذِيُّ.  

4680. (4) [3/1327 ఫ్రామాణికం, దృఢం]

అనస్‌ (ర) కథనం: ఒక వ్యక్తి ‘ఓ ప్రవక్తా! మాలో ఎవరైనా తన సోదరునితో కలసినపుడు గౌరవంగా అతని ముందు వంగగలడా?’ అని విన్నవించు కున్నాడు. దానికి ప్రవక్త (స) ‘లేదు’ అని అన్నారు. ఆ వ్యక్తి మళ్ళీ, ‘కలసినప్పుడల్లా ము’సాఫ’హా (చేయి కలపడం), ము’ఆనఖహ్ (ఆలింగనం), తప్పనిసరి అవుతుందా? ‘ అని విన్నవించుకున్నాడు. ప్రవక్త (స), ‘లేదు’ అని అన్నారు. మరల ఆ వ్యక్తి, ‘అతని చేయి పట్టుకొని ము’సాఫ’హా చేయగలడా? అని అన్నాడు. దానికి ప్రవక్త (స) ‘అవును’ అని అన్నారు. (తిర్మిజి’).

4681 – [ 5 ] ( لم تتم دراسته ) (3/1327)

وَعَنْ أَبِيْ أُمَامَةَ أَنَّ رَسُوْلَ الله صلى الله عليه وسلم قَالَ: “تَمَامُ عِيَادَةِ الْمَرِيْضِ أَنْ يَّضَعَ أَحَدُكُمْ يَدَهُ عَلَى جَبْهَتِهِ أَوْ عَلَى يَدِهِ فَيَسْأَلُهُ: كَيْفَ هُوَ؟ وَتَمَامُ تَحِيَّاتِكُمْ بَيْنَكُمُ الْمُصَافَحَةُ”. رَوَاهُ أَحْمَدُ وَالتِّرْمِذِيُّ وَضَعَّفَهُ.

4681. (5) [3/1327అపరిశోధితం]

అబూ ఉమామహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”వ్యాధిగ్రస్తుని పరిపూర్ణ పరామర్శ ఏమిటంటే, మీరు అతని నుదురుపై చేయిపెట్టి నీ ఆరోగ్యం ఎలాగుందని అడగటం, ఇంకా మీరు పరస్పరం కలసినపుడు, సలామ్‌ తర్వాత ము’సాఫ’హా చేయటం పరిపూర్ణ సలామ్‌.” (అ’హ్మద్‌, తిర్మిజీ’  –  బలహీనం)

4682 – [ 6 ] ( ضعيف ) (3/1327)

وَعَنْ عَائِشَةَ رَضِيَ اللهُ عَنْهَا قَالَتْ: قَدِمَ زَيْدُ بْنُ حَارِثَةَ الْمَدِيْنَةَ. وَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم فِيْ بَيْتِيْ فَأَتَاهُ فَقَرَعَ الْبَابَ. فَقَامَ إِلَيْهِ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم عُرْيَانًا يَجُرُّ ثَوْبَهُ وَاللهِ مَا رَأَيْتُهُ عُرْيَانًا قَبْلَهُ وَلَا بَعْدَهُ فَاعْتَنَقَهُ وَقَبَّلَهُ. رَوَاهُ التِّرْمِذِيُّ.   

4682. (6) [3/1327బలహీనం]

‘ఆయి’షహ్‌ (ర) కథనం: జైద్‌ బిన్‌ ‘హారిస’హ్ (ర) మదీనహ్ వచ్చారు. అప్పుడు ప్రవక్త (స) నా ఇంట్లో ఉన్నారు. తలుపు తట్టారు. ప్రవక్త (స) అప్పుడు లుంగీ ధరించి ఉన్నారు. పైన దుస్తులేవీ లేవు. ‘జైద్‌ బిన్‌ ‘హారిస’హ్ పిలుపు విని వెంటనే నిలబడ్డారు. లుంగీ ఈడ్చుకుంటూ అక్కడకు చేరారు. శరీర పై భాగం ఖాళీగా ఉంది. అంతకు ముందు ఎన్నడూ నేను పైభాగాన్ని నగ్నంగా చూడలేదు. ప్రవక్త (స) ‘జైద్‌తో ము’ఆనఖహ్  చేసారు. ముద్దుపెట్టారు. (తిర్మిజీ’)

దీనిద్వారా తెలిసిన విషయం ఏమిటంటే, ప్రయాణం నుండి వచ్చేవారితో  ము’ఆనఖహ్  చేయాలి.

4683 – [ 7 ] ( ضعيف ) (3/1327)

وَعَنْ أَيُّوْبَ بْنِ بُشَيْرٍعَنْ رَجُلٍ مِنْ عَنَزَةَ أَنَّهُ قَالَ: قُلْتُ لِأَبِيْ ذَرٍّ: هَلْ كَانَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم يُصَافِحُكُمْ إِذَا لَقِيْتُمُوْهُ؟ قَالَ: مَا لَقِيْتُهُ قَطُّ إِلَّا صَافَحَنِيْ وَبَعَثَ إِلَيَّ ذَاتَ يَوْمٍ وَلَمْ أَكُنْ فِيْ أَهْلِيْ فَلَمَّا جِئْتُ أُخْبِرْتُ فَأَتَيْتُهُ وَهُوَ عَلَى سَرِيْرٍ فَالْتَزَمَنِيْ فَكَانَتْ تِلْكَ أَجْوَدَ وَ أَجْوَدَ. رَوَاهُ أَبُوْ دَاوُدَ.  

4683. (7) [3/1327బలహీనం]

అయ్యూబ్‌ బిన్‌ బషీర్‌  బనూ ‘అన్‌’జహ్ తెగలోని ఒక వ్యక్తి ద్వారా కథనం: ఆ వ్యక్తి అబూ జ’ర్‌ (ర)ను, ‘ప్రవక్త (స) మీతో కలిస్తే ము’సాఫ’హ్‌ చేసేవారా?’ అని ప్రశ్నించాడు. దానికి అబూ జ’ర్‌ (ర) ప్రవక్త (స), ‘ఎప్పుడు కలిసినా నాతో ము’సాఫ’హ్‌ చేసేవారు. ఒకసారి ఒక వ్యక్తిని పంపి నన్ను పిలిచారు. అప్పుడు నేను ఇంట్లోలేను. నేను వచ్చిన తర్వాత, నాకు తెలియపర్చటం జరిగింది. నేను వెళ్ళాను. అప్పుడు ప్రవక్త (స) పీటపై కూర్చున్నారు. ప్రవక్త (స) నన్ను కౌగలించుకున్నారు. అన్నిటి కంటే ఆ ము’ఆనఖహ్ చాలా  బాగుంది. (అబూ  దావూద్‌)

4684 – [ 8 ] ( لم تتم دراسته ) (3/1327)

وَعَنْ عِكْرَمَةَ بْنِ أَبِيْ جَهْلٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم يَوْمَ جِئْتُهُ: “مَرْحَبًا بِالرَّاكِبِ الْمُهَاجِرِ”. رَوَاهُ التِّرْمِذِيُّ.

4684. (8) [3/1327 అపరిశోధితం]

ఇక్రమహ్ బిన్‌ అబూ జహల్‌ కథనం: నేను ప్రవక్త (స) వద్దకు వెళ్ళాను. ప్రవక్త(స) నన్నుచూచి వలస వచ్చిన బాట సారికి స్వాగతం!  అని  దీవించారు.[5] (తిర్మిజీ’)

4685 – [ 9 ] ( صحيح ) (3/1328)

وَعَنْ أُسَيْدِ بْنِ حُضَيْرٍ – رَجُلٍ مِّنَ الْأَنْصَارِ – قَالَ: بَيْنَمَا هُوَ يُحَدِّثُ الْقَوْمَ – وَكَانَ فِيْهِ مِزَاحٌ – بَيْنَا يُضْحِكُهُمْ فَطَعَنَهُ النَّبِيُّ صلى الله عليه وسلم فِيْ خَاصِرَتِهِ بِعُوْدٍ. فَقَالَ: أَصْبِرْنِيْ. قَالَ: “اصْطَبِرْ”. قَالَ: إِنَّ عَلَيْكَ قَمِيْصًا وَلَيْسَ عَلَيَّ قَمِيْصٌ فَرَفَعَ النَّبِيُّ صلى الله عليه وسلم عَنْ قَمِيْصِهِ فَاحْتَضَنَهُ وَجَعَلَ يُقَبِّلُ كَشْحَهُ قَالَ: إِنَّمَا أَرَدْتُّ هَذَا يَا رَسُوْلَ اللهِ. رَوَاهُ أَبُوْ دَاوُدَ.

4685. (9) [3/1328 దృఢం]

ఉసైద్‌ బిన్‌ ‘హు’దైర్‌ అన్‌’సారీ (ర) కథనం: ఒకరోజు అతను తన జాతివారితో మాట్లాడుతున్నారు. అతనెప్పుడూ సంతోషంగా ఉండేవారు. ప్రజలు అతనిమాటలకు నవ్వేవారు. అతను నవ్వించేవారు. ప్రవక్త (స) అకస్మాత్తుగా వచ్చారు. అతని నడుమును బెత్తంతో తాకారు. అతడు వెంటనే, ‘ఓ ప్రవక్తా! ఈ బెత్తంతో తాకి నందుకు బదులు ఇవ్వండి,’ అని విన్నవించుకున్నారు. దానికి ప్రవక్త (స), ‘ప్రతీకారం తీర్చుకో,’ అని అన్నారు. దానికి అతడు, ‘మీ శరీరంపై చొక్కా ఉంది. మీరు నన్ను బెత్తంతో తాకినపుడు నా శరీరంపై ఏమీ లేదు,’ అని అన్నారు. ప్రవక్త(స) తన చొక్కా తీసివేసారు. ‘రా, ప్రతీకారం తీర్చుకో,’ అని అన్నారు. అతడు ప్రవక్త (స)ను కౌగలించుకున్నారు. ప్రక్కలను ముద్దుపెట్టుకోసాగారు. ఇంకా, ‘ఓ ప్రవక్తా! అసలు నా ఉద్దేశ్యం ఇదే, అది పూర్తయ్యింది,’ అని అన్నారు.  (అబూ  దావూద్)

4686 – [ 10 ] ( ضعيف ) (3/1328)

وَعَنْ الشَّعْبِيِّ: أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم تَلَقَّى جَعْفَرَبْنَ أَبِيْ طَالِبٍ فَالْتَزَمَهُ وَقَبَّلَ مَابَيْنَ عَيْنَيْهِ. رَوَاهُ أَبُوْدَاوُدَ وَالْبَيْهَقِيُّ فِيْ ” شُعَبِ الْإِيْمَانِ”مُرْسَلًا.

وَفِيْ بَعْضِ نُسَخِ”الْمَصَابِيْحِ” وَفِيْ ” شَرْحِ السُّنَّةِ” عَنِ الْبَيَاضِيِّ مُتَّصِلًا.

4686. (10) [3/1328 బలహీనం]

ష’అబీ (ర) కథనం: ప్రవక్త (స) జఅ’ఫర్‌ బిన్‌ అబీ ‘తాలిబ్‌ ను కలిసారు. అతనితో ము’ఆనఖహ్ చేసారు. ఇంకా అతని నుదురుపై ముద్దుపెట్టు కున్నారు. (అబూ దావూద్‌, బైహఖీ)

ఈ ‘హదీసు’ ద్వారా తెలిసిన విషయం ఏమిటంటే, ‘అలీ (ర) సోదరులు జ’అఫర్‌ (ర) ఖురైషుల హింసలు భరించలేక ‘హబషహ్ వలసపోయారు. ప్రవక్త (స) ‘ఖైబర్‌ను జయించిన తర్వాత, జ’అఫర్‌ (ర) ‘హబ్‌షహ్ ను వదలి ‘ఖైబర్‌ వచ్చారు. ప్రవక్త (స) తన చిన్నాన్న కొడుకు వలస రాగానే సంతోషంతో కలసి ము’ఆనఖహ్ చేసి  స్వాగతం  పలికారు.

4687 – [ 11 ] ( ضعيف ) (3/1328)

وَعَنْ جَعْفَرِ بْنِ أَبِيْ طَالِبٍ فِيْ قِصَّةِ رُجُوْعِهِ مِنْ أَرْضِ الْحَبْشَةِ قَالَ: فَخَرَجْنَا حَتَّى أَتَيْنَا الْمَدِيْنَةَ فَتَلَقَّانِيْ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم فَاعْتَنَقَنِيْ ثُمَّ قَالَ: “مَا أَدْرِيْ: أَنَا بِفَتْحِ خَيْبَرَ أَفْرَحُ أَمْ بِقُدُوْمِ جَعْفَرٍ؟” وَوَافَقَ ذَلِكَ فَتْحَ خَيْبَرَ. رَوَاهُ فِيْ” شَرْحِ السُّنَّةِ”.  

4687. (11) [3/1328 బలహీనం]

జ’అఫర్‌ బిన్‌ అబీ ‘తాలిబ్‌ (ర) ‘హబ్‌షహ్ నుండి తిరుగు ప్రయాణం గురించి వివరిస్తూ ఇలా అన్నారు. ‘మేము హబషహ్ నుండి బయలుదేరి మదీనహ్ మునవ్వరహ్ వచ్చాము. ప్రవక్త (స)ను కలవడం జరిగింది. ప్రవక్త (స) ము’ఆనఖహ్ చేసారు. అప్పుడే ‘ఖైబర్‌లో ప్రవక్త (స)కు విజయం ప్రాప్తించింది. అప్పుడు ప్రవక్త (స) నాకు ‘ఖైబర్‌ విజయం వల్ల సంతోషం కలిగిందో, లేక జ’అఫర్‌ వచ్చినందువల్ల సంతోషం కలిగిందో చెప్పలేను,’ అని అన్నారు. దైవ నిర్ణయం వల్ల రెండు సంతోషాలు తోడయ్యాయి. (షర్‌హు స్సున్నహ్‌)

4688 – [ 12 ] ( لم تتم دراسته ) (3/1328)

وَعَنْ زَارِعٍ. وَكَانَ فِيْ وَفْدِعَبْدِ الْقَيْسِ قَالَ: لَمَّا قَدِمْنَا الْمَدِيْنَةَ فَجَعَلْنَا نَتَبَادَرُمِنْ رَوَاحِلِنَا فَنُقَبِّلُ يَدَ رَسُوْلَ الله صلى الله عليه وسلم وَرِجْلَهُ. رَوَاهُ أَبُوْ دَاوُدَ  

4688. (12) [3/1328 అపరిశోధితం]

‘అబ్దుల్‌ ఖైస్‌ తెగ నాయకుల్లో ఒకరైన ‘జారె’అ కథనం: మేము మదీనహ్ చేరిన వెంటనే, తొందరగా మా వాహనాలపై నుండి దిగి ప్రవక్త (స) వద్దకు వెళ్ళి కాళ్ళూ చేతులకు ముద్దులు పెట్టుకోసాగాము. (అబూ దావూద్‌)

4689 – [ 13 ] ( صحيح ) (3/1329)

وَعَنْ عَائِشَةَ رَضِيَ اللهُ عَنْهَا قَالَتْ: مَا رَأَيْتُ أَحَدًا كَانَ أَشْبَهَ سَمْتًا وَهَدْيًا وَّدَلًّا.

 وَفِيْ رِوَايَةٍ حَدِيْثَا وَكَلَامًا بِرَسُوْلِ اللهِ صلى الله عليه وسلم مِنْ فَاطِمَةَ كَانَتْ إِذَا دَخَلَتْ عَلَيْهِ قَامَ إِلَيْهَا فَأَخَذَ بِيَدِهَا فَقَبَّلَهَا وَأَجْلَسَهَا فِيْ مَجْلِسِهِ وَكَانَ إِذَا دَخَلَ عَلَيْهَا قَامَتْ إِلَيْهِ فَأَخَذَتْ بِيَدِهِ فَقَبَّلَتْهُ وَأَجْلَسَتْهُ فِيْ مَجْلِسِهَا. رَوَاهُ أَبُوْ دَاوُدَ.  

4689. (13) [3/1329 దృఢం]

‘ఆయి’షహ్‌ (ర) కథనం: నడకలో, మాటల్లో, రూపు రేఖల్లో ప్రవక్త (స) పోలికలు ఫాతిమహ్లో తప్ప మరెవరిలో నేను చూడలేదు. ప్రవక్త (స) ఇంటికి, ఫాతిమహ్ వస్తే, ప్రవక్త (స) ప్రేమ, వాత్సల్యంతో నిలబడి ఫాతిమహ్ చేయి తన చేతిలోనికి తీసుకొని, ఆమె నుదురుపై ముద్దుపెట్టి తాను కూర్చునే చోట కూర్చో బెడతారు. అదే విధంగా ప్రవక్త (స) ఫాతిమహ్ ఇంటికి వెళితే, ఫాతిమహ్ నిలబడి ప్రవక్త (స) చేతిని తన చేతిలోకి తీసుకొని, ప్రవక్త (స) చేతులపై ముద్దులు పెట్టి తన స్థానంలో కూర్చోబెడతారు. (అబూ  దావూద్‌)

4690 – [ 14 ] ( لم تتم دراسته ) (3/1329)

وَعَنِ الْبَرَاءِ قَالَ: دَخَلْتُ مَعَ أَبِيْ بَكْرٍ رَضِيَ اللهُ عَنْهُمَا أَوَّلَ مَا قَدِمَ الْمَدِيْنَةَ فَإِذَا عَائِشَةَ مُضْطَجِعَةٌ قَدْ أَصَابَهَا حُمّى فَأَتَاهَا أَبُوْ بَكْرٍ. فَقَالَ : كَيْفَ أَنْتِ يَا بُنيَّةُ؟ وَقَبَّلَ خَدَّهَا. رَوَاهُ أَبُوْ دَاوُدَ.  

4690. (14) [3/1329 అపరిశోధితం]

బరాఅ’ (ర) కథనం: అబూ బకర్‌ (ర) మదీనహ్ వచ్చారు. నేను అతని వెంట అతని ఇంటికి వచ్చాను. అప్పుడు అతని కూతురు ‘ఆయి’షహ్‌ (ర)కు  జ్వరంగా ఉంది. అబూ  బకర్‌ (ర) ఆమె వద్దకువచ్చి ఆరోగ్యం ఎలా ఉంది అని అడిగి, తన కూతురుని ముద్దు పెట్టుకున్నారు. (అబూ  దావూద్‌)

4691 – [ 15 ] ( لم تتم دراسته ) (3/1329)

وَعَنْ عَائِشَةَ رَضِيَ اللهُ عَنْهَا أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم أُتِيَ بِصَبِيٍّ فَقَبَّلَهُ فَقَالَ: “أَمَا إِنَّهُمْ مَبْخَلَةٌ مَّجْبَنَةٌ وَإِنَّهُمْ لَمِنْ رَّيْحَانِ اللهِ”. رَوَاهُ فِيْ ” شَرْحِ السُّنَّةِ”.  

4691. (15) [3/1329  అపరిశోధితం]

‘ఆయి’షహ్‌ (ర) కథనం: ఒక పసిబిడ్డను ప్రవక్త (స) వద్దకు తీసుకురావటం జరిగింది. ప్రవక్త (స) ముద్దు పెట్టారు. ఇంకా, ‘ఈ బిడ్డలు పిసినారితనం, పిరికి తనానికి కారణమౌతారు. కాని ప్రపంచంలో వీరు దైవ పుష్పాలు, ఆయన అనుగ్రహాలు,’ అని అన్నారు. [6] (షర్‌హు స్సున్నహ్‌)

—–

اَلْفَصْلُ الثَّالِثُ   మూడవ విభాగం 

4692 – [ 16 ] ( لم تتم دراسته ) (3/1329)

عَنْ يَعْلَى قَالَ: إِنَّ حَسَنًا وَحُسَيْنًا رَضِيَ اللهُ عَنْهُمْ اِسْتَبَقَا إِلى رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم فَضَمَّهُمَا إِلَيْهِ وَقَالَ: “إِنَّ الْوَلَدَ مَبْخَلَةٌ مَجْبَنَةٌ”. رَوَاهُ أَحْمَدُ.

4692. (16) [3/1329  –అపరిశోధితం]

య’అలా (ర) కథనం: ‘హసన్‌ మరియు ‘హుసైన్‌ బాల్యంలో ప్రవక్త (స) వద్దకు పరిగెత్తుకుంటూ వచ్చారు. ప్రవక్త (స) వారిని గుండెకు హత్తుకొని, ‘ఈ పిల్లలు పిసినారితనం, పిరికితనానికి కారణం అవు తారు. అంటే మనిషి బిడ్డల వల్ల పిసినారితనం, పిరికి తనానికి గురవుతాడు,’ అని అన్నారు.  (అ’హ్మద్‌)

4693 – [ 17 ] ( لم تتم دراسته ) (3/1330)

وَعَنْ عَطَاءِ الْخُرَاسَانِيِّ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم قَالَ: “تَصَافَحُوْا يَذْهَبِ الْغِلُّ وَتَهَادَوْا تَحَابُّوْا وَتَذْهَبِ الشَّحْنَاءُ”. رَوَاهُ مَالِكٌ مُرْسَلًا  

4693. (17) [3/1330అపరిశోధితం]

‘అ’తా ‘ఖురాసానీ కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మీరు ఇతరుల్ని కలిసినపుడు ము’సాఫ’హా చేయండి. దానివల్ల ఈర్ష్యాద్వేషాలు తొలగిపోతాయి. పరస్పరం కానుకలు ఇచ్చి పుచ్చుకోండి. దానివల్ల శత్రుత్వం దూరమవుతుంది. ఇంకా ప్రేమ అధికమవుతుంది. (మాలిక్‌  /  తాబయీ  ప్రోక్తం)

4694 – [ 18 ] ( لم تتم دراسته ) (3/1330)

وَعَنِ الْبَرَاءِ بْنِ عَازِبِ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم:”مَنْ صَلّى أَرْبَعًا قَبْلَ الْهَاجِرَةِ فَكَأَنَّمَا صَلَّاهُنَّ فِيْ لَيْلَةِ الْقَدْرِوَالْمُسْلِمَانِ إِذَا تَصَافَحَا لَمْ يَبْقَ بَيْنَهُمَا ذَنْبٌ إِلَّا سَقَطَ”. رَوَاهُ الْبَيْهَقِيُّ فِيْ ” شُعَبِ الْإِيْمَانِ”  

4694. (18) [3/1330  –అపరిశోధితం]

బరా’ బిన్‌ ‘ఆజిబ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మధ్యాహ్నా న్నికి ముందు 4 రకాతులు చదివిన వారికి షబె ఖదర్‌లో 4 రకాతులు చదివినంత పుణ్యం లభిస్తుంది. అదే విధంగా ఇద్దరు ముస్లిములు కలసినపుడు ము’సాఫ’హా చేస్తే వారి పాపాలు తొలగి పోయి వారు  పరిశుద్ధులై పోతారు.  (బైహఖీ) 

=====

4 بَابُ الْقِيَامِ

4. గౌరవసూచకంగా నిలబడటం (ఖియామ్)

ఎవరైనా గొప్పవారు వచ్చినప్పుడు గౌరవ సూచ కంగా అతని గొప్పతనం చాటేందుకు నిలబడటం సరి కాదు. ఎందుకంటే గొప్పతనం కోసం నిలబడటం కేవ లం అల్లాహ్‌(త) ఆరాధనకోసమే నిలబడాలి. అల్లాహ్‌ ఆదేశం: ”…అల్లాహ్‌ సన్నిధానంలో వినయ విధేయత లతో నిలబడండి.”  (అల్ బఖరహ్, 2:238)

اَلْفَصْلُ الْأَوَّلُ    మొదటి విభాగం 

4695 – [ 1 ] ( متفق عليه ) (3/1331)

عَنْ أَبِيْ سَعِيْدِ الْخُدْرِيِّ قَالَ:لَمَّا نَزَلَتْ بَنُوْ قُرَيْظَةَ عَلَى حُكْمِ سَعْدٍ بَعَثَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم إِلَيْهِ وَكَانَ قَرِيْبًا مِّنْهُ فَجَاءَ عَلَى حِمَارٍ فَلَمَّا دَنَا مِنَ الْمَسْجِدِ. قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم لِلْأَنْصَارِ:”قُوْمُوْا إِلى سَيِّدِكُمْ”. مُتَّفَقٌ عَلَيْهِ. وَمَضَى الْحَدِيْثُ بِطُوْلِهِ فِيْ “بَابِ حُكْمِ الْأُسَرَاءِ”.  

4695. (1) [3/1331 ఏకీభవితం]

అబూ స’యీద్‌ ‘ఖుద్రీ (ర) కథనం: బనూ ఖురై”జహ్ యూదులు స’అ’ద్‌ తీర్పు పట్ల సంతృప్తి ప్రకటిస్తే, ప్రవక్త (స) స’అద్‌ బిన్‌ మ’ఆజ్‌’ను పిలిపించారు. అప్ప డతను గాయాలు తగిలి అనారోగ్యంగా ఉన్నారు. నడవలేక పోతున్నారు. వాహనంపై ఎక్కి ప్రవక్త (స) మస్జిద్‌కు వచ్చారు. అప్పుడు ప్రవక్త (స) అన్సారులతో ‘మీరు మీ నాయకుడు స’అద్‌ బిన్‌ మ’ఆజ్‌’ ను వాహనంపై నుండి దించటానికి నిలబడండి,’ అని అన్నారు.” [7]  (బు’ఖారి, ముస్లిం)

4696 – [ 2 ] ( متفق عليه ) (3/1331)

وَعَنِ ابْنِ عُمَرَعَنِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ: “لَا يُقِيْمُ الرَّجُلُ الرَّجُلَ مِنْ مَّجْلِسِهِ ثُمَّ يَجْلِسُ فِيْهِ وَلَكِنْ تَفَسَّحُوْا وَتَوَسَّعُوْا”. مُتَّفَقٌ عَلَيْهِ.

4696. (2) [3/1331 ఏకీభవితం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘ఉమర్‌ (ర) కథనం : ప్రవక్త (స) ప్రవచనం, ”ఒక వ్యక్తిని అతని చోటి నుండి లేపి అక్కడ కూర్చో రాదు. అయితే ప్రజలు ఒకరి గురించి మరొకరు సర్దుకోవాలి. దానివల్ల ఇతరులకు కూడా కూర్చునే స్థలం లభిస్తుంది.” [8]  (బు’ఖారీ,  ముస్లిం)

4697 – [ 3 ] ( صحيح ) (3/1331)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم قَالَ: “مَنْ قَامَ مِنْ مِّجْلِسِهِ ثُمَّ رَجَعَ إِلَيْهِ فَهُوَ أَحَقُّ بِهِ”. رَوَاهُ مُسْلِمٌ.  

4697. (3) [3/1331దృఢం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, కూర్చుని, లేచిపోయి, మళ్ళీ తిరిగివచ్చిన వ్యక్తి మాత్రమే, తాను కూర్చున్న చోటుకు ఎక్కువ హక్కు గలవాడు. [9]   (ముస్లిమ్‌)

—–

اَلْفَصْلُ الثَّانِيْ రెండవ విభాగం  

4698 – [ 4 ] ( صحيح ) (3/1331)

عَنْ أَنَسِ بْنِ مَالِكٍ قَالَ: لَمْ يَكُنْ شَخْصٌ أَحَبَّ إِلَيْهِمْ مِنْ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم. وَكَانُوْا إِذَا رَأَوْهُ لَمْ يَقُوْمُوْا لِمَا يَعْلَمُوْنَ مِنْ كَرَاهِيَتِهِ لِذَلِكَ.رَوَاهُ التِّرْمِذِيُّ وَقَالَ:هَذَا حَدِيْثٌ حَسَنٌ صَحِيْحٌ

4698. (4) [3/1331దృఢం]

అనస్‌ (ర) కథనం: ప్రవక్త (స) అనుచరులు ప్రవక్త (స)ను చాలా ప్రేమించేవారు. అయినప్పటికీ ప్రవక్త (స)ను చూసి నిలబడేవారు కారు. ఎందుకంటే ప్రవక్త (స) రాకపై నిలబడటం ప్రవక్త (స)కు ఎంతమాత్రం ఇష్టం లేదని వారికి  తెలిసి  ఉండేది. (తిర్మిజీ’ /  ప్రామాణికం, -దృఢం)

ఈ ‘హదీసు’ ఆధారంగానే కొందరు పండితులు ఎవరైనా వస్తే గౌరవం కోసం నిలబడటం మంచిది కాదని అభిప్రాయపడ్డారు.

4699 – [ 5 ] ( صحيح ) (3/1332)

وَعَنْ مُعَاوِيَةَ قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَنْ سَرَّهُ أَنْ يَّتَمَثَّلَ لَهُ الرِّجَالُ قِيَامًا فَلْيَتَبَوَّأَ مَقْعَدَهُ مِنَ النَّارِ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَأَبُوْ دَاوُدَ.

4699. (5) [3/1332 దృఢం]

ము’ఆవియహ్‌(ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”తన గౌరవార్థం ప్రజలు నిలబడాలని కోరుకునేవారు తన నివాసాన్ని నరకంలో ఏర్పరచుకోవాలి.” (తిర్మిజీ’, అబూ  దావూద్‌)

4700 – [ 6 ] ( ضعيف ) (3/1332)

وَعَنْ أَبِيْ أُمَامَةَ قَالَ: خَرَجَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم مُتِّكَئًا عَلى عَصًا فَقُمْنَا فَقَالَ: “لَا تَقُوْمُوْا كَمَا يَقُوْمُ الْأَعَاجِمُ يُعَظِّمُ بَعْضُهَا بَعْضًا”. رَوَاهُ أَبُوْ دَاوُدَ.  

4700. (6) [3/1332–  బలహీనం]

అబూ ఉమామహ్ (ర) కథనం: ప్రవక్త (స) కర్ర సహాయంతో వచ్చారు. మేము ప్రవక్త (స) గౌరవార్థం నిల బడ్డాము. అప్పుడు ప్రవక్త (స), ‘మీరు గౌరవార్థం ఈ విధంగా నిలబడకండి. ఇలా అరబ్బేతరులు ఒకరు మరొకరి గౌరవార్థం నిలబడతారు,’ అని అన్నారు. (అబూ  దావూద్‌)

4701 – [ 7 ] ( لم تتم دراسته ) (3/1332)

وَعَنْ سَعِيْدِ بْنِ أَبِي الْحَسَنِ قَالَ: جَاءَنَا أَبُوْ بَكْرَةَ فِيْ شَهَادَةٍ فَقَامَ لَهُ رَجُلٌ مِّنْ مَجْلِسِهِ فَأَبَى أَنْ يَّجْلِسَ فِيْهِ وَقَالَ: إِنَّ النَّبِيَّ صلى الله عليه وسلم نَهَى عَنْ ذَا وَنَهَى النَّبِيُّ صلى الله عليه وسلم أَنْ يَمْسَحَ الرَّجُلُ يَدَهُ بِثَوْبِ مَنْ لَمْ يَكْسُهُ. رَوَاهُ أَبُوْ دَاوُدَ.  

4701. (7) [3/1332అపరిశోధితం]

స’యీద్‌ బిన్‌ అబిల్‌ ‘హసన్‌ కథనం: అబూ బక్రహ్‌ సాక్ష్యం ఇవ్వటానికి వచ్చారు. ఆయన రాగానే ఒక వ్యక్తి లేచి నిలబడ్డాడు. ఆయన అతని స్థలంలో కూర్చో టానికి నిరాకరించారు. ఇంకా ప్రవక్త (స) దీన్ని వారించారని అన్నారు. ఇంకా తన చేతిని తనది కాని వస్త్రంతో తుడవరాదని వారించారు. (అబూ  దావూద్‌)

అంటే అపరిచిత వ్యక్తి యొక్క వస్త్రంతో చేయి తుడవరాదు. తన కుమారుడు, లేదా తన సేవకుని వస్త్రంతో చేయి తుడవ వచ్చు. ఎందుకంటే అది అతడు ఇచ్చిందే గనుక.

4702 – [ 8 ] ( ضعيف ) (3/1332)

وَعَنْ أَبِيْ الدَّرْدَاءِ قَالَ: كَانَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم إِذَا جَلَسَ – جَلَسْنَا حَوْلَهُ – فَأَرَادَ الرُّجُوْعَ نَزَعَ نَعْلَهُ أَوْ بَعْضَ مَا يَكُوْنَ عَلَيْهِ. فَيَعْرِفُ ذَلِكَ أَصْحَابَهُ فَيَثْبُتُوْنَ. رَوَاهُ أَبُوْ دَاوُدَ.  

4702. (8) [3/1332బలహీనం]

అబూ దర్‌దా’ (ర) కథనం: ప్రవక్త (స) కూర్చొని ఉండి, ఆయన చుట్టూ మేము కూర్చొని ఉండి, ప్రవక్త (స) ఏదైనా పని ఉండి ఇంటికి వెళ్ళటానికి నిలబడి, మళ్ళీ రావాలని ఉంటే తన స్థానంలో చెప్పులు లేదా దుప్పటి ఉంచి వెళతారు. దాని వల్ల అనుచరులు ప్రవక్త (స) మళ్ళీ తిరిగి వస్తారని భావించి అందరూ తమ స్థానాల్లో కూర్చొని వేచి  ఉంటారు. (అబూ  దావూద్‌)

4703 – [ 9 ] ( لم تتم دراسته ) (3/1332)

وَعَنْ عَبْدِ اللهِ بْنِ عَمْرٍو عَنْ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم قَالَ: “لَا يَحِلُّ لِرَجُلٍ أَنْ يُّفَرِّقَ بَيْنَ اثْنَيْنِ إِلَّا بِإِذْنِهِمَا”. رَوَاهُ التِّرْمِذِيُّ وأَبُوْ دَاوُدَ

4703. (9) [3/1332 అపరిశోధితం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘అమ్ర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”కూర్చున్న ఇద్దరు వ్యక్తుల మధ్య వారిని జరిపి కూర్చోవటం ఎంతమాత్రం ధర్మంకాదు. వారు అనుమతి ఇస్తే మరేం ఫరవా లేదు.” (తిర్మిజీ’, అబూ దావూద్‌)

4704 – [ 10 ] ( لم تتم دراسته ) (3/1332)

وَعَنْ عَمْرِوبْنِ شُعَيْبِ عَنْ أَبْيِهِ عَنْ جَدِّهِ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم قَالَ: “لَا تَجْلِسْ بَيْنَ رَجُلَيْنِ إِلَّا بِإِذْنِهِمَا”. رَوَاهُ أَبُوْ دَاوُدَ.  

4704. (10) [3/1332అపరిశోధితం]

‘అమ్ర్‌ బిన్‌ షు’ఐబ్‌ తన తండ్రి ద్వారా, ఆయన తన తండ్రి ద్వారా కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”అనుమతి లేకుండా ఇద్దరు వ్యక్తుల మధ్య కూర్చోరాదు.” (అబూ దావూద్‌)

—–

اَلْفَصْلُ الثَّالِث మూడవ విభాగం  

4705 – [ 11 ] ( ضعيف ) (3/1332)

عَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: كَانَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم يَجْلِسُ مَعَنَا فِي الْمَسْجِدِ يُحَدِّثُنَا فَإِذَا قَامَ قُمْنَا قِيَامًا حَتَّى نَرَاهُ قَدْ دَخَلَ بَعْضَ بُيُوْتِ أَزْوَاجِهِ. البيهقي.  

4705. (11) [3/1332బలహీనం]

అబూ హురైరా (ర) కథనం: ప్రవక్త (స) మస్జిద్‌లో మాతో కూర్చొని మాట్లాడేవారు. ప్రవక్త (స) నిలబడితే, ఆయనతో పాటు మేము కూడా నిలబడే వాళ్ళం. ప్రవక్త (స) తన ఇంటి లోనికి ప్రవేశించనంత వరకు మేము నిలబడేవాళ్ళం.  (బైహఖీ)

అంటే సభ ముగిసిన పిమ్మట నిలబడేవారు, గౌరవ సూచకంగా మాత్రం కాదు.

4706 – [ 12 ] ( ضعيف ) (3/1333)

وَعَنْ وَاثِلَةَ بْنِ الْخَطَّابِ قَالَ: دَخَلَ رَجُلٌ إِلَى رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم وَهُوَ فِي الْمَسْجِدِ قَاعِدٌ فَتَزَحْزَحَ لَهُ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم. فَقَالَ الرَّجلُ: يَا رَسُوْلَ اللهِ إِنَّ فِي الْمَكَانِ سَعَةً. فَقَالَ النَّبِيُّ صلى الله عليه وسلم: “إِنَّ لِلْمُسْلِمِ لَحَقًّا إِذَا رَآهُ أَخُوْهُ أَنْ يَتَزَحْزَحَ لَهُ”. رَوَاهُمَا الْبَيْهقِيُّ فِيْ” شُعَبِ الْإِيْمَانِ”.

4706. (12) [3/1333బలహీనం]

వాసి’ల బిన్‌ ‘ఖ’త్తాబ్‌ (ర) కథనం: ప్రవక్త (స) మస్జిద్‌లో కూర్చొని ఉన్నారు. ఒక వ్యక్తి వచ్చాడు. ప్రవక్త (స) తన చోటునుండి కొంత జరిగారు. అతడు కూర్చోవటానికి కొంత స్థలం ఏర్పడింది. అతడు తన ప్రక్కన కూర్చోవాలని. ఆ వ్యక్తి, ‘ఓ ప్రవక్తా! స్థలం చాలా ఉంది నేను మరోచోట కూర్చుంటాను. మీరు ఆందోళన చెందకండి,’ అని అన్నాడు. దానికిప్రవక్త (స) ”తన ముస్లిమ్‌ సోదరుని రాకచూచి కొంచెం సర్దుకొని కూర్చోవడం ఒక ముస్లిమ్‌ విధి.” అని అన్నారు. (బైహఖీ)

=====

5 بَابُ الْجُلُوْسِ وَالنَّوْمِ وَالْمَشْيِ

5. కూర్చోవటం, నిద్రపోవటం, నడవటం

ఇస్లామ్‌ ధర్మం జీవితానికి సంబంధించిన అనేక నియమ నిబంధనల గురించి శిక్షణ ఇచ్చింది. అదేవిధంగా పడుకునే, కూర్చునే, నడిచే నియమా లను గురించి కూడా శిక్షణ ఇచ్చింది. సభలోకి వెళ్ళిన తర్వాత సలామ్‌ చేసి ఎక్కడ ఎలా కూర్చోవాలో కూడా ఇస్లామ్‌ బోధించింది. ఖుర్‌ఆన్‌లో అల్లాహ్‌ (త) సభ నియమ నిబంధనల గురించి ఇలా ఆదేశించాడు: ” విశ్వాసులారా! మీరు రహస్య సమాలోచనలు చేస్తే – పాపకార్యాలు, హద్దులుమీరి ప్రవర్తించటం మరియు ప్రవక్త ఆజ్ఞలను ఉల్లంఘించటం గురించి కాకుండా – పుణ్యకార్యాలు మరియు దైవభీతికి సంబంధించిన విషయాలను గురించి మాత్రమే (రహస్య సమాలోచనలు) చేయండి. మరియు అల్లాహ్‌ పట్ల భయభక్తులు కలిగి ఉండండి. ఆయన సన్నిధిలోనే మీరు సమావేశపరచబడతారు. నిశ్చయంగా, రహస్య సమాలోచన షై’తాన్‌ చేష్టయే. అది విశ్వాసులకు దుఃఖం కలిగించటానికే! కాని అల్లాహ్‌ అనుమతిలేనిదే అది వారికి ఏ మాత్రం నష్టం కలిగించ జాలదు. మరియు విశ్వాసులు కేవలం అల్లాహ్‌ మీదే నమ్మకం ఉంచుకోవాలి. విశ్వాసులారా సమావేశాలలో (వచ్చే వారికి) చోటు కల్పించమని మీతో అన్నప్పుడు, మీరు జరిగి, చోటుకల్పిస్తే, అల్లాహ్‌ మీకు విశాలమైన చోటును ప్రసాదిస్తాడు.మరియు ఒకవేళ మీతో (నమా’జ్‌ లేక జిహాద్‌కు) లేవండి అని చెప్పబడితే! మీరు లేవండి. మరియు మీలో విశ్వసించిన వారికి మరియు జ్ఞానం ప్రసాదించబడిన వారికి అల్లాహ్‌ ఉన్నత స్థానాలను ప్రసాదిస్తాడు. మరియు మీరు చేసేదంతా అల్లాహ్‌ బాగా ఎరుగును. (అల్‌  ముజాదలహ్‌, 58:9-11)

ఈ ఆయతుల ద్వారా క్రింది విషయాలు తెలిసాయి: (1) కొంతమంది కలసి మాట్లాడుతున్నప్పుడు హింసలు, అత్యాచారాలు, పాపాలకు అవిధేయతలకు సంబంధించిన విషయాలను గురించి మాట్లాడు కోరాదు. దైవభక్తి, దైవభీతి, మంచి విషయాలను గురించి మాట్లాడుకోవాలి. (2) సభల్లో కూర్చున్నప్పుడు పరచుకొని కూర్చోరాదు. ఇతరులకు కూడా చోటు లభించేలా సర్దుకొని కూర్చోవాలి. (3) సభల్లో ఒకవేళ ఎవరినైనా లేచి నిలబడండి అని అంటే, లేచి నిలబడాలి. (4) సభల్లో ఎక్కడ చోటు దొరికితే అక్కడే కూర్చోవాలి. ప్రత్యేక స్థలం కోసం ప్రయత్నించరాదు. (5) భుజాలను దాటుతూ ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయరాదు. ఎందుకంటే ‘హదీసు’లో దీన్ని గురించి వారించబడింది. జాబిర్‌ (ర) కథనం: ప్రవక్త (స) సభల్లో మాలో ఎవరైనా వస్తే ఎక్కడ చోటు దొరికితే అక్కడ కూర్చుండిపోయేవారు. (అబూ దావూద్‌) (6) సభల్లో కూర్చున్నవారిని లేపి వారి స్థానంలో కూర్చోరాదు. (7) అవసరం ఉండి, ఎవరైనా తన చోటి నుండి లేచి వెళితే తిరిగి వచ్చిన తర్వాత అతడే ఆ చోటుకు హక్కు గల వాడు. (8) ఇద్దరు వ్యక్తులు ఏదైనా ప్రత్యేక విషయం గురించి మాట్లాడుతుంటే వారి అనుమతి లేకుండా వారిని విడదీయరాదు. లేదా వారి మధ్య కూర్చొని వారి మాటలు వినరాదు. (9) ఒకవేళ కొంతమంది బృందంగా కలసి కూర్చొని ఉంటే వారి మధ్యకు వెళ్ళికూర్చోరాదు. ఎందుకంటే ఒకరి వైపు ముఖం, మరొకరి వైపు వీపు ఉంటుంది. ఇది అసభ్యతను సూచిస్తుంది. ఇటువంటి వ్యక్తిని ప్రవక్త (స) శపించారు. (తిర్మిజి) (10) దారిలో కూర్చో కూడదు. దానివల్ల వచ్చేపోయేవారికి ఇబ్బంది కలుగు తుంది. ఇంకా ఇది అగౌరవంగా కూడా ఉంటుంది. మార్గం హక్కును చెల్లించాలి. ప్రవక్త (స) మార్గాల్లో కూర్చోకూడదని వారించారు. ప్రవక్త (స) అనుచరులు తప్పనిసరి పరిస్థితుల్లో అయితే అని విన్నవించు కున్నారు. అప్పుడు ప్రవక్త (స) ఒక వేళ తప్పనిసరి అయితే మార్గం హక్కును చెల్లించండి. ప్రవక్త (స) అనుచరులు మళ్ళీ మార్గంహక్కు అంటే ఏమిటి అని విన్నవించు కున్నారు. దానికి ప్రవక్త (స) (i) దృష్టిని క్రిందికి మరల్చి ఉంచాలి. (ii) హానికరమైన వస్తువులను మార్గం నుండి తొలగించాలి. (iii) సలామ్‌కు సమాధానం ఇవ్వాలి. (iv) మంచి మాటలను బోధించాలి. (v) చెడు మాటల నుండి వారించాలి. (బు’ఖారీ) (11) సభలో కూర్చున్న వారు వచ్చేవ్యక్తికి గౌరవసూచకంగా నిలబడరాదు. ప్రవక్త (స) దీన్ని వారించారు. (12) సభలో తన తోటివారితో సున్నితంగా వ్యవహరించాలి. అతని గౌరవాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. అతని ముందు కాళ్ళు చాచి కూర్చోరాదు. (అదబుల్‌ మఫ్రద్‌  / బు’ఖారీ). (13) ఇతరులను ఇబ్బందికి గురిచేసే వస్తువులను తినరాదు. బీడీ, సిగరెట్లు, పొగాకు, గుట్కా, ఖైనీ మొదలైనవి.  (14) రహస్యాలను అమానతుగా భావించి భద్రంగా ఉంచాలి. (అదబుల్‌ మఫ్రద్‌ / బు’ఖారీ). (15) సభలో అందరూ క్రింద కూర్చుంటే, ఎత్తైన ప్రదేశంపై కూర్చోరాదు. బోధనా నిమిత్తం కూర్చోవచ్చు. (16) పండితుల, గురువుల ముందు వినయంగా కూర్చోవాలి. (17) అందరూ కూర్చొని ఉంటే అనవసరంగా పండుకోరాదు. (18) సభలో కొందరు కూర్చొని ఉంటే, వారి అనుమతి లేకుండా ఇద్దరు వ్యక్తులతో రహస్య సంభాషణ చేయ రాదు. (అదబుల్‌ మఫ్రద్‌ / బు’ఖారీ). (19) ప్రజలు మాట్లాడు కుంటున్నప్పుడు రహస్యంగా వారి మాటలు వినరాదు. (అదబుల్‌ మఫ్రద్‌) సభ నుండి వెళ్ళినపుడు ఈ దు’ఆ చదివి వెళ్ళాలి. ”ఓ అల్లాహ్‌! మేము నీ పరిశుద్ధతనే కొనియాడు తున్నాము, నీ గొప్పతనాన్నే చర్చిస్తు న్నాము. ఇంకా ఆరాధనకు అర్హుడవు నీవేనని సాక్ష్యం ఇస్తున్నాము, నిన్నే క్షమాపణ కోరుతున్నాను, నీ వైపే మరలు తున్నాను.”

اَلْفَصْلُ الْأَوَّلُ మొదటి విభాగం 

4707 – [ 1 ] ( صحيح ) (3/1334)

عَنِ ابْنِ عُمَرَ قَالَ: رَأَيْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم بِفِنَاءِ الْكَعْبَةِ مُحْتَبِيًا بِيَدَيْهِ. رَوَاهُ الْبُخَارِيُّ.  

4707. (1) [3/1334 దృఢం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘ఉమర్‌ (ర) కథనం: ప్రవక్త (స) క’అబహ్ ప్రాంగణంలో మోకాళ్ళ చుట్టూ చేతులు కట్టుకొని కూర్చొని ఉండగా నేను చూచాను. (బు’ఖారీ) 

4708 – [ 2 ] ( متفق عليه ) (3/1334)

وَعَنْ عَبَّادِ بْنِ تَمِيْمٍ عَنْ عَمِّهِ قَالَ: رَأَيْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم فِي الْمَسْجِدِ مُسْتَلْقِيًا وَّاضِعًا إِحْدَى قَدَمَيْهِ عَلَى الْأُخْرَى.

4708. (2) [3/1334ఏకీభవితం]

‘అబ్బాద్‌ బిన్‌ తమీమ్‌ (ర) తన చిన్నాన్న ద్వారా కథనం: ప్రవక్త (స) మస్జిద్‌లో వెల్లకిలా పడుకొని, ఒక కాలును మరో కాలిపై పెట్టుకొని ఉండటం నేను చూశాను.[10](బు’ఖారీ, ముస్లిం)

4709 – [ 3 ] ( صحيح ) (3/1334)

وَعَنْ جَابِرٍقَالَ: نَهَى رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم أَنْ يَّرْفَعَ الرَّجُلُ إِحْدَى رِجْلَيْهِ عَلَى الْأُخْرَى وَهُوَ مُسْتَلْقٍ عَلَى ظَهْرِهِ. رَوَاهُ مُسْلِمٌ.

4709. (3) [3/1334దృఢం]

జాబిర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ”ఒక కాలిపై మరో కాలు పెట్టుకొని వెల్లకిలా పండుకోవటాన్ని వారించారు.” (ముస్లిమ్‌)

4710 – [ 4 ] ( صحيح ) (3/1334)

وَعَنْهُ أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم قَالَ: “لَا يَسْتَلْقِيَنَّ أَحَدُكُمْ ثُمَّ يَضَعُ رِجْلَيْهِ عَلَى الْأُخْرَى”. رَوَاهُ مُسْلِمٌ.  

4710. (4) [3/1334దృఢం]

జాబిర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఎవరూ ఒక కాలు మరో కాలిపై పెట్టుకొని వెల్లకిలా పరుండరాదు.” [11]  (ముస్లిమ్‌)

4711 – [ 5 ] ( متفق عليه ) (3/1334)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “بَيْنَمَا رَجُلٌ يَتَبَخْتَرُفِيْ بُرْدَيْنِ وَقَدْ أَعْجَبَتْهُ نَفْسُهُ خُسِفَ بِهِ الْأَرْضَ فَهُوَ بَتَجَلْجَلُ فِيْهَا إِلى يَوْمِ الْقِيَامَةِ”.

4711. (5) [3/1334 ఏకీభవితం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం: ఒక వ్యక్తి రెండు దుప్పట్లు ధరించి గర్వంగా వెళు తున్నాడు. అది అతనికి ఎంతో గొప్పగా అనిపించింది. అతన్ని భూమిలోకి కృంగివేయటం జరిగింది. అతడు తీర్పు దినం వరకు దిగబడుతూ ఉంటాడు.[12]  (బు’ఖారీ, ముస్లిం)

—–

اَلْفَصْلُ الثَّنِي రెండవ విభాగం  

4712 – [ 6 ] ( لم تتم دراسته ) (3/1335)

عَنْ جَابِرِ بْنِ سَمُرَةَ قَالَ: رَأَيْتُ النَّبِيَّ صلى الله عليه وسلم مُتَّكِئًا عَلَى وِسَادَةٍ عَلَى يَسَارِهِ. رَوَاهُ التِّرْمِذِيُّ.  

4712. (6) [3/1335–  అపరిశోధితం]

జాబిర్‌ బిన్‌ సమురహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) తలగడకు ఆనుకొని కూర్చోవటం నేను చూసాను. తలగడ ఆయన (స) కు ఎడమ ప్రక్క ఉంది. (తిర్మిజీ’)

4713 – [ 7 ] ( لم تتم دراسته ) (3/1335)

وَعَنْ أَبِيْ سَعِيْدِ الْخُدْرِيِّ قَالَ : كَانَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم إِذَا جَلَسَ فِي الْمَسْجِدِ اِحْتَبَى بِيَدِيْهِ . رَوَاهُ رَزِيْنٌ  

4713. (7) [3/1335అపరిశోధితం]

అబూ స’యీద్‌ ‘ఖుద్రీ (ర) కథనం: ప్రవక్త (స) మస్జిద్‌లో కాళ్ళను రెండు చేతులతో చుట్టుకొని కూర్చునే వారు. (ర’జీన్‌)

4714 – [ 8 ] ( لم تتم دراسته ) (3/1335)

وَعَنْ قَيْلَةَ بِنْتِ مَخْرَمَةَ أَنَّهَا رَأَتْ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم فِي الْمَسْجِدِ وَهُوَ قَاعِدٌ الْقُرْفُصَاءَ . قَالَتْ: فَلَمَّا رَأَيْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم اَلْمُتَخَشِّعَ أُرْعِدْتُّ مِنَ الْفَرَقِ. رَوَاهُ أَبُوْ دَاوُدَ.

4714. (8) [3/1335అపరిశోధితం]

ఖైలహ్ బిన్‌తె మ’ఖ్‌రమహ్ (ర) కథనం: ప్రవక్త (స) మస్జిద్‌లో కాళ్ళను చేతులతో చుట్టుకొని కూర్చవటం చూశాను. ప్రవక్త (స)ను ఈ విధంగా దీన స్థితిలో చూసి నేను తీవ్ర ఆందోళనకు గురయ్యాను. (అబూ  దావూద్‌)

4715 – [ 9 ] ( صحيح ) (3/1335)

وَعَنْ جَابِرِ بْنِ سَمُرَةَ قَالَ: كَانَ النَّبِيُّ صلى الله عليه وسلم إِذَا صَلَّى الْفَجْرَتَرَبَّعَ فِي مَجْلِسِهِ حَتّى تَطْلُعَ الشَّمْسُ حَسْنَاءَ. رَوَاهُ أَبُوْدَاوُدَ.

4715. (9) [3/1335 దృఢం]

జాబిర్‌ బిన్‌ సమురహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ఫజ్ర్ నమా’జు చదివి పూర్తిగా వెలుతురు వ్యాపించే వరకు మోకాళ్ళపై కూర్చునేవారు. (అబూ  దావూద్‌)

4716 – [ 10 ] ( صحيح ) (3/1335)

وَعَنْ أَبِيْ قَتَادَةَ: أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم كَانَ إِذَا عَرَّسَ بِلَيْلٍ اضْطَجَعَ عَلَى شِقِّهِ الْأَيْمَنِ وَإِذَا عَرَّسَ قُبَيْلَ الصُّبْحِ نَصَبَ ذِرَاعَهُ وَوَضَعَ رَأْسَهُ عَلَى كَفِّهِ. رَوَاهُ فِيْ ” شَرْحِ السُّنَّةِ “.

4716. (10) [3/1335దృఢం]

అబూ ఖతాదహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రయాణంలో రాత్రి చివరి భాగంలో విశ్రాంతి తీసుకోవటానికి దిగితే కుడిప్రక్క పరుండేవారు, ఇంకా ఉదయానికి ముందు విశ్రాంతి తీసుకుంటే తన చేతిని నిలబెట్టి అరచేతిపై తల ఉంచి పరుండేవారు – నిద్రరాకూడదని. [13] (షరహుస్సున్నహ్‌)

4717 – [ 11 ] ( لم تتم دراسته ) (3/1335)

وَعَنْ بَعْضِ آلِ أُمِّ سَلَمَةَ قَالَ: كَانَ فِرَاشُ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم نَحْوًا مِمَّا يُوْضَعُ فِيْ قَبْرِهِ وَكَانَ الْمَسْجِدُ عِنْدَ رَأْسِهِ. رَوَاهُ أَبُوْ دَاوُدَ.  

4717. (11) [3/1335  –అపరిశోధితం]

ఉమ్మె సలమహ్ సంతానం కథనం: ప్రవక్త (స) పడక సమాధిలో ఉంచబడేలా ఉండేది. మస్జిద్‌ ప్రవక్త (స) తలకు దగ్గరగా ఉండేది. అంటే అక్కడ ప్రవక్త (స) తహజ్జుద్‌ నమా’జు చదివేవారు. లేచి సులువుగా నమా’జు చదివేలా ఉండేది.  (అబూ  దావూద్‌)

4718 – [ 12 ] ( صحيح ) (3/1335)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: رَأَى رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم رَجُلًا مُضْطَجِعًا عَلَى بَطْنِهِ فَقَالَ: “إِنَّ هَذِهِ ضِجْعَةٌ لَا يُحِبُّهَا اللهُ” . رَوَاهُ التِّرْمِذِيُّ  

4718. (12) [3/1335 దృఢం]

అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) ఒక వ్యక్తిని బోర్లాపండుకొని ఉండటం చూసి, ‘ఈ విధంగా పండు కోవటం అల్లాహ్‌కు ఇష్టంలేదు,’ అని అన్నారు. (తిర్మిజి’)

4719 – [ 13 ] ( لم تتم دراسته ) (3/1336)

وَعَنْ يَعِيْشَ بْنِ طِخْفَةَ بْنِ قَيْسِ الْغِفَارِيِّ عَنْ أَبِيْهِ- وَكَانَ مِنْ أَصْحَابِ الصُّفَّةِ – قَالَ:بَيْنَمَا أَنَا مُضْطَجِعٌ مِنَ السَّحَرِعَلَى بَطْنِيْ إِذَا رَجُلٌ يُحَرِّكُنِيْ بِرِجْلِهِ فَقَالَ:”هَذِهِ ضِجْعَةٌ يُبْغِضُهَا اللهُ ” فَنَظَرْتُ فَإِذَا هُوَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم. رَوَاهُ أَبُوْدَاوُدَ وَابْنُ مَاجَهُ  

4719. (13) [3/1336 అపరిశోధితం]

‘సుఫ్ఫహ్వారిలో ఒకరైన య’యీష్‌ బిన్‌ ‘తి’ఖ్‌ఫహ్‌ బిన్‌ ఖైస్‌ ‘గిఫారీ తన తండ్రిద్వారా ఉల్లేఖనం: నేను ఉదయం వేళ బోర్లాపడుకొని ఉన్నాను. ఒక వ్యక్తి నన్ను తన కాలితో కదిపి ‘ఈ విధంగా పడుకోవటం అల్లాహ్‌కు నచ్చదు’ అని అన్నాడు. నేను లేచి చూసేసరికి ఆ వ్యక్తి ప్రవక్త (స). (అబూ  దావూద్‌, ఇబ్నె  మాజహ్)

4720 – [ 14 ] ( صحيح ) (3/1336)

وَعَنْ عَلِيِّ بْنِ شَيْبَانَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَنْ بَاتَ عَلَى ظَهْرِبَيْتٍ لَيْسَ عَلَيْهِ حِجَابٌ-

وَفِيْ رِوَايَةٍ: حِجَارٌ- فَقَدْ بَرِئَتْ مِنْهُ الذِّمَّةُ “. رَوَاهُ أَبُوْ دَاوُدَ . وَفِيْ ” مُعَالِمِ السُّنَنِ” لِلْخَطَّابِيْ “حِجى”.

4720. (14) [3/1336 దృఢం]

‘అలీ బిన్‌ షైబాన్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం ”గోడలులేని ఇంటి పైకప్పుపై పడుకునేవ్యక్తి గురించి అల్లాహ్‌పై ఎటువంటి బాధ్యత  లేదు. (అబూ  దావూద్‌)

ఎందుకంటే చుట్టూ గోడలు లేకుంటే పడిపోయే భయం ఉంటుంది.

4721 – [ 15 ] ( لم تتم دراسته ) (3/1336)

وَعَنْ جَابِرٍ قَالَ: نَهَى رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم أَنْ يَّنَامَ الرَّجلُ عَلَى سَطْحٍ لَيْسَ بِمَحْجُوْرٍ عَلَيْهِ. رَوَاهُ التِّرْمِذِيُّ  

4721. (15) [3/1336  –అపరిశోధితం]

జాబిర్‌ (ర) కథనం: ప్రవక్త (స) చుట్టూ గోడలు లేని పైకప్పుపై పడుకోరాదని వారించారు. (తిర్మిజీ’)

4722 – [ 16 ] ( ضعيف ) (3/1336)

وَعَنْ حُذَيْفَةَ قَالَ: مَلْعُوْنٌ عَلَى لِسَانِ مُحَمَّدٍ صلى الله عليه وسلم مَنْ قَعَدَ وَسْطَ الْحَلْقَةِ. رَوَاهُ التِّرْمِذِيُّ وأَبُوْ دَاوُدَ.  

4722. (16) [3/1336బలహీనం]

‘హుజై’ఫహ్ (ర) కథనం: ప్రవక్త (స) సభలోకి వచ్చి మధ్య కూర్చున్న వ్యక్తిని శపించారు. (తిర్మిజీ’, అబూ దావూద్‌)

4723 – [ 17 ] ( صحيح ) (3/1336)

وَعَنْ أَبِيْ سَعِيْدِ الْخُدْرِيِّ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “خَيْرُ الْمَجَالِسِ أَوْسَعُهَا”. رَوَاهُ أَبُوْ دَاوُدَ.  

4723. (17) [3/1336 దృఢం]

అబూ స’యీద్‌ ‘ఖుద్రీ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం: ‘విశాలంగా ఉన్నదే అన్నిటికంటే మంచి సభ.’ (అబూ  దావూద్‌)

4724 – [ 18 ] ( صحيح ) (3/1336)

وَعَنْ جَابِرِبْنِ سَمُرَةَ قَالَ: جَاءَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم وَ أَصْحَابُهُ جُلُوْسٌ فَقَالَ: “مَا لِيْ أَرَاكُمْ عِزِيْنَ؟”.رَوَاهُ أَبُوْدَاوُدَ.

4724. (18) [3/1336 దృఢం]

జాబిర్‌ బిన్‌ సమురహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) అనుచరులు పరస్పరం దూరంగా కూర్చొని ఉన్నారు. ప్రవక్త (స) వచ్చి వారిని చూసి, ‘ఇలా చెల్లాచెదురుగా కూర్చోకూడదు. అందరూ కలసి కూర్చోవాలి. పరస్పరం ప్రేమాభి మానాలతో ఉంటారు’ అని అన్నారు. (అబూ దావూద్‌)

4725 – [ 19 ] ( ضعيف ) (3/1336)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم قَالَ: “إِذَا كَانَ أَحَدُكُمْ فِي الْفَيْءِ فَقَلَصَ الظِّلُّ فَصَارَ بَعْضُهُ فِي الشَّمْسِ وَبَعْضُهُ فِي الظِّلِّ فَلْيَقُمْ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ.  

4725. (19) [3/1336 బలహీనం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం: ”మీలో ఎవరైనా నీడలో కూర్చొని ఉంటే, నీడ అక్కడి నుండి జరిగి, ఎండవస్తే, అతని కొంత శరీరభాగం నీడలో, కొంతభాగం ఎండలో ఉంటే, అక్కడి నుండి లేచి నిలబడాలి. ఎండలో అయినా కూర్చోవాలి లేదా నీడలో అయినా కూర్చోవాలి. ఎందుకంటే కొంత ఎండలో, కొంత నీడలో కూర్చోవటం, పడుకోవటం షై’తాన్‌ పని. (అబూ  దావూద్‌,  షర్‌’హుస్సున్నహ్‌)

రెంటి ప్రభావాలు వేర్వేరుగా ఉంటాయి. ఒకేసారి రెంటి వల్ల హాని కలగవచ్చు.

4726 – [ 20 ] ( لم تتم دراسته ) (3/1337)

وَفِيْ “شَرْحِ السُّنَّةِ “عَنْهُ قَالَ:”وَإِذَا كَانَ أَحَدُكُمْ فِي الْفَيْءِ فَقَلَصَ عَنْهُ فَلْيَقُمْ فَإِنَّهُ مَجْلِسُ الشَّيْطَانِ”. هَكَذَا رَوَاهُ مَعْمَرٌ مَوْقُوْفًا.  

4726. (20) [3/1337అపరిశోధితం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: మీలో ఎవరైనా నీడలో కూర్చొని ఉండి, ఆ నీడ తగ్గుతుంటే అక్కడి నుండి లేచి పోవాలి. ఎందుకంటే కొంత నీడలో మరికొంత ఎండలో ఉండే ప్రదేశం షైతాన్‌ కూర్చునే ప్రదేశం. (షర్‌’హుస్సున్నహ్‌)

ఇదేవిధంగా మ’అమర్‌ – సహచరుని ప్రోక్తంగా ఉల్లేఖించారు.

4727 – [ 21 ] ( لم تتم دراسته ) (3/1337)

وَعَنْ أَبِيْ أُسَيْدِ الْأَنْصَارِيِّ أَنَّهُ سَمِعَ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ وَهُوَ خَارِجٌ مِّنَ الْمَسْجِدِ فَاخْتَلَطَ الرِّجَالُ مَعَ النِّسَاءِ فِي الطَّرِيْقِ. فَقَالَ النِّسَاءِ: “اِسْتَأْخِرْنَ فَإِنَّهُ لَيْسَ لَكنَّ أَنْ تَحْقُقْنَ الطَّرِيْقَ عَلَيْكُنَّ بِحَافَّاتِ الطَّرِيْقِ”. فَكَانَتِ الْمَرْأَةُ تَلْصَقُ بِالْجِدَارِ حَتّى إِنْ ثَوْبَهَا لَيَتَعَلَّقُ بِالْجِدَارَ. رَوَاهُ أَبُوْ دَاوُدَ وَالْبَيْهَقِيُّ فِيْ “شُعَبِ الْإِيْمَانِ”.  

4727. (21) [3/1337అపరిశోధితం]

అబూ ఉసైద్‌ అ’న్సారీ (ర) కథనం: ప్రవక్త (స) మస్జిద్‌ నుండి బయలుదేరిబయటకు వెళుతు న్నారు. దారిలో స్త్రీపురుషులు కలసి నడుస్తున్నారు. అది ప్రవక్త (స) చూశారు. ప్రవక్త (స) స్త్రీలతో, ‘మీరు పురుషుల వెనుక నడవండి, మార్గం మధ్యలో నడవ కండి. మార్గానికి ఒక మూలనడవండి,’ అని అన్నారు. అది విన్న వెంటనే స్త్రీలు ఒకమూల నుండి నడ వసాగారు. ఒక్కోసారి వారి దుస్తులు గోడకు తాకేవి. (అబూ దావూద్‌, బైహఖీ, -షు’అబిల్ ఈనాన్)

4728 – [ 22 ] ( ضعيف ) (3/1337)

وَعَنْ ابْنِ عُمَرَ: أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم نَهَى أَنْ يَّمْشِيَ – يَعْنِي الرَّجُلُ – بَيْنَ الْمَرْأَتَيْنِ. رَوَاهُ أَبُوْ دَاوُدَ.  

4728. (22) [3/1337బలహీనం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘ఉమర్‌ (ర) కథనం : ప్రవక్త (స) పురుషుడు ఇద్దరు స్త్రీల మధ్య నడవరాదని వారించారు. (అబూ  దావూద్‌)

4729 – [ 23 ] ( لم تتم دراسته ) (3/1337)

وَعَنْ جَابِرٍ بْنِ سَمُرَةَ قَالَ: كُنَّا إِذَا أَتَيْنَا النَّبِيَّ صلى الله عليه وسلم جَلَسَ أَحَدُنَا حَيْثُ يَنْتَهِيْ. رَوَاهُ أَبُوْ دَاوُدَ وَذُكِرَ حَدِيْثَا عَبْدِ اللهِ بْنِ عَمْرٍو فِيْ “بَابِ الْقِيَامِ” وَسَنَذْكُرُ حَدِيْثَ عَلِيٍّ وَأَبِيْ هُرَيْرَةَ فِيْ” بَابِ أَسْمَاءِ النَّبِيِ صلى الله عليه وسلم وَصِفَاتِهِ ” إِنْ شَاءَ اللهُ تَعَالى.

4729. (23) [3/1337అపరిశోధితం]

జాబిర్‌ బిన్‌ సమురహ్‌ (ర) కథనం: మేము ప్రవక్త (స) సమావేశంలోనికి వస్తే, సమావేశం చివర ఖాళీస్థలంలో కూర్చునేవారం. (అబూ  దావూద్‌)

‘అబ్దుల్లాహ్ బిన్ ‘అమ్ర్(ర) ఉల్లేఖించిన రెండు ‘హదీసు’లను బాబుల్ ఖియామ్ లో పేర్కొనడం జరిగింది. ఇన్షా అల్లాహ్ ‘అలీ (ర), అబూ హురైరహ్ (ర) ‘హదీసు’లను బాబు అస్మాయిన్నబియ్యి వ సిఫాతిహీలో  పేర్కొంటాము.

—–

الْفَصْلُ الثَّالِثُ   మూడవ విభాగం  

4730 – [ 24 ] ( لم تتم دراسته ) (3/1338)

عَنْ عَمْرِو بْنِ الشَّرِيْدِ عَنْ أَبِيْهِ قَالَ: مَرَّ بِيْ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم وَأَنَا جَالِسٌ هَكَذَا وَقَدْ وَضَعْتُ يَديِ الْيُسْرَى خَلْفَ ظَهْرِيْ وَاتَّكأْتُ عَلَى أَلْيَةِ يَدِيْ. قَالَ: “أَتَقْعُدُ قِعْدَةَ الْمَغْضُوْبِ عَلَيْهِمْ”. رَوَاهُ أَبُوْدَاوُدَ.  

4730. (24) [3/1338అపరిశోధితం]

‘అమ్ర్‌ బిన్‌ షరీద్‌ తన తండ్రి ద్వారా ఉల్లేఖనం: ప్రవక్త (స) నా  ప్రక్క నుండి వెళ్ళారు. అప్పుడు నేను ఎడమ చేయి వీపుపై, కుడి అరచేతిపై సహాయంతో కూర్చొని ఉన్నాను. అది చూసి ప్రవక్త (స), ‘ఈ విధంగా యూదులు కూర్చుంటారు. వాళ్ళు దైవాగ్ర హానికి గురయ్యారు. అంటే గర్వాహంకారులు ఇలాగే కూర్చుంటారు,’  అని అన్నారు. (అబూ  దావూద్‌)

4731 – [ 25 ] ( لم تتم دراسته ) (3/1338)

وَعَنْ أَبِيْ ذَرٍّ قَالَ: مَرَّ بِي النَّبِيُّ وَأَنَا مُضْطَجِعٌ عَلَى بَطْنِيْ فَرَكَضَنِيْ بِرِجْلِهِ وَقَالَ: “يَا جُنْدُبُ إِنَّمَا هِيَ ضِجْعَةُ أَهْلِ النَّار”. رَوَاهُ ابْنُ مَاجَهُ.  

4731. (25) [3/1338 అపరిశోధితం]

అబూ జ’ర్‌ (ర) కథనం: ప్రవక్త (స) నా ప్రక్క నుండి వెళ్ళారు. నేను బోర్లా పడుకొని ఉన్నాను. ప్రవక్త (స) తన కాలితో తన్ని,’ఓజున్‌దుబ్‌! ఈ విధంగా నరకవాసులు పండుకుంటారు,’ అని అన్నారు. (ఇబ్నె మాజహ్)

ఈ’హదీసు’ ద్వారా బోర్లాపడుకోవటం నిషిద్ధమని తెలిసింది.

=====

6 بَابُ الْعُطَاسِ وَالتَّثَاؤُبِ

6. తుమ్ము, ఆవులింతల నియమాలు

اَلْفَصْلُ الْأَوَّلُ   మొదటి విభాగం  

4732 – [ 1 ] ( صحيح ) (3/1339)

عَنْ أَبِيْ هُرَيْرَةَ عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ: “إِنَّ اللهَ يُحبُّ الْعُطَاسَ وَيَكْرَهُ التَّثَاؤُبَ فَإِذَا عَطَسَ أَحَدُكُمْ وَحَمِدَ اللهُ كَانَ حَقًّا عَلَى كُلِّ مُسْلِمٍ سَمِعَهُ أَنْ يَّقُوْلَ: يَرْحَمُكَ اللهُ. فَأَمَّا التَّثاؤُبُ فَإِنَّمَا هُوَ مِنَ الشَّيْطَانِ فَإِذَا تَثَاءَبَ أَحَدُكُمْ فَلْيَرُدَّهُ مَااسْتَطَاعَ فَإِنَّ أَحَدَكُمْ إِذَا تَثَاءَبَ ضَحِكَ مِنْهُ الشَّيْطَانُ”. رَوَاهُ الْبُخَارِيُّ

وَفِيْ رِوَايَةٍ لِمُسْلِمٍ:”فَإِنَّ أَحَدَكُمْ إِذَا قَالَ:هَا ضَحِكَ الشَّيْطَانُ مِنْهُ”

4732. (1) [3/1339 దృఢం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”అల్లాహ్‌కు తుమ్మంటే ఇష్టం, ఆవులింతంటే అసహ్యం. మీలో ఎవరైనా తుమ్మితే, అల్‌’హమ్‌దు లిల్లాహ్‌,’ అనాలి. వినే ముస్లిమ్‌ సమాధానంగా, యర్‌హము కల్లాహ్‌,’ అని అనాలి. అదేవిధంగా ఆవులింతలు షై’తాన్‌ తరఫునుండి వస్తాయి. మీలో ఎవరికైనా ఆవులింతలు వస్తే, సాధ్యమైనంత వరకు దాన్ని తొలగించడానికి ప్రయత్నించాలి. ఎందుకంటే ఎవరైనా ఆవులింతలో నోరు విప్పితే, షై’తాన్‌ నవ్వుతాడు .  (బు’ఖారీ)  

ఎవరైనా ఆవులింతలు తీసుకుంటే షైతాన్‌ నవ్వుతాడు.[14](ముస్లిమ్‌)

4733 – [ 2 ] ( صحيح ) (3/1339)

وَعَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِذَا عَطَسَ أَحَدُكُمْ فَلْيَقُلْ: اَلْحَمْدُ لِلّهِ وَلْيَقُلْ لَهُ أَخُوْهُ-أَوْ صَاحِبُهُ-يَرْحَمُكَ اللهُ.فَإِذَا قَالَ لَهُ يَرْحَمُكَ اللهُ قَلْيَقُلْ: يَهْدِيْكُمْ اللهُ وَيُصْلِحُ بَالَكُمْ. رَوَاهُ الْبُخَارِيُّ.

4733. (2) [3/1339 దృఢం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం: ”ఎవరికైనా తుమ్మువస్తే దానికి కృతజ్ఞతగా, ‘అల్‌ ‘హమ్‌దు లిల్లాహ్‌,’ అని పలకాలి. వినేవారు, ‘యర్‌ హముకల్లాహ్‌,’ అని పలకాలి. దానికి సమాధానంగా తుమ్మిన వారు, ‘యహ్‌దీకుమ్ ల్లాహ్‌ యుస్‌లిహు బాలకుమ్‌,’ అని పలకాలి. (బు’ఖారీ)

4734 – [ 3 ] ( متفق عليه ) (3/1339)

وَعَنْ أَنَسٍ قَالَ: عَطَسَ رَجُلَانِ عِنْدَ النَّبِيِّ صلى الله عليه وسلم فَشَمَّتَ أَحَدَهُمَا وَلَمْ يُشَمِّتِ الْآخَرَ.فَقَالَ الرَّجُلُ: يَا رَسُوْلَ اللهِ شَمَّتَّ هَذَا وَلَمْ تُشَمِّتْنِيْ قَالَ: “إِنَّ هَذَا حَمِدَ اللهُ وَلَمْ تَحْمَدِ اللهَ”.

4734. (3) [3/1339 ఏకీభవితం]

అనస్‌ (ర) కథనం: ప్రవక్త (స) ముందు ఇద్దరు వ్యక్తులు తుమ్మారు. ఒక వ్యక్తి, ‘అల్‌’హమ్‌దు లిల్లాహ్‌,’ అని అన్నాడు. దానికి సమాధానంగా, ‘యర్‌హము కల్లాహ్‌,’ అని అన్నారు. రెండవ వ్యక్తి తుమ్ముకు సమాధానం ఇవ్వలేదు. దానికి ఆ వ్యక్తి, ‘ఓ ప్రవక్తా! తమరు అతని తుమ్ముకు సమాధానం ఇచ్చారు. నా తుమ్ముకు సమాధానం ఇవ్వలేదు,’ అని అన్నాడు. దానికి ప్రవక్త (స) ‘అతడు ‘అల్‌’హమ్‌దులిల్లాహ్‌’ అన్నాడు, నేను సమాధానం ఇచ్చాను. ‘నువ్వు ‘అల్‌’హమ్‌దు లిల్లాహ్‌’ అనలేదు. అందువల్ల నేను సమా ధానం ఇవ్వలేదు,’ అని అన్నారు.  (బు’ఖారీ, ముస్లిమ్‌)

4735 – [ 4 ] ( صحيح ) (3/1339)

وَعَنْ أَبِيْ مُوْسَى قَالَ: سَمِعْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ: “إِذَا عَطَسَ أَحَدُكُمْ فَحَمِدَ اللهُ فَشَمِّتُوْهُ. وَإِنْ لَمْ يَحْمَدِ اللهَ فَلَا تُشَمِّتُوْهُ”. رَوَاهُ مُسْلِمٌ.  

4735. (4) [3/1339 దృఢం]

అబూ మూసా అష్‌’అరీ (ర) కథనం: ప్రవక్త (స) ఇలా ప్రవచిస్తూ ఉండగా నేను విన్నాను, ”మీలో ఎవరైనా తుమ్మి, ‘అల్‌’హమ్‌దులిల్లాహ్‌,’ అని అంటే దానికి సమాధానం ఇవ్వండి. ఒకవేళ తుమ్మిన వ్యక్తి, ‘అల్’హమ్‌దు లిల్లాహ్‌,’ అని అనకపోతే సమాధానం ఇవ్వకండి. (ముస్లిమ్‌)

4736 – [ 5 ] ( صحيح ) (3/1339)

وَعَنْ سَلَمَةَ بْنِ الْأَكْوَعِ أَنَّهُ سَمِعَ النَّبِيَّ صلى الله عليه وسلم وَعَطَسَ رَجُلٌ عِنْدَهُ فَقَالَ لَهُ: “يَرْحَمَكَ اللهُ” ثُمَّ عَطَسَ أُخْرَى فَقَالَ: “اَلرَّجُلُ مَزْكُوْمٌ”. رَوَاهُ مُسْلِمٌ.

وَفِيْ رِوَايَةٍ التِّرْمِذِيِّ أَنَّهُ قَالَ لَهُ فِي الثَّالِثَةِ: “إِنَّهُ مَزْكُوْمٌ”.

4736. (5) [3/1339 దృఢం]

సలమహ్ బిన్‌ అక్వ’అ (ర) కథనం: ప్రవక్త (స) ముందు ఒక వ్యక్తి తుమ్మాడు, ‘అల్‌’హమ్‌దు లిల్లాహ్‌,’ అని పలికాడు. ప్రవక్త (స) అతనికి సమాధా నంగా, ‘యర్‌హముకల్లాహ్‌,’ అని అన్నారు. ఆ వ్యక్తి మళ్ళీ తుమ్మాడు. అప్పుడు ప్రవక్త (స), ‘అతనికి జలుబు చేసింది,’ అని  అన్నారు. (ముస్లిమ్‌)

మరో ఉల్లేఖనంలో, అతనికి మూడోసారి కూడా తుమ్ము వచ్చింది. అప్పుడు ప్రవక్త (స), ‘ఇతనికి జలుబుచేసింది, జలుబులో తుమ్ములు ఎక్కువగా వస్తాయి,’ అని అన్నారు. (తిర్మిజీ’)

4737 – [ 6 ] ( صحيح ) (3/1340)

وَعَنْ أَبِيْ سَعِيْدِ الْخُدْرِيِّ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم قَالَ: “إِذَا تَثَاءَبَ أَحَدُكُمْ فَلْيُمْسِكْ بِيَدِهِ عَلَى فَمِهِ فَإِنَّ الشَّيْطَانَ يَدْخُلُ”. رَوَاهُ مُسْلِمٌ .

4737. (6) [3/1340 దృఢం]

అబూ స’యీద్‌ ‘ఖుద్రీ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఎవరికైనా ఆవులింతలు వస్తే, తన చేతితో నోటిని మూసివేయాలి. ఎందుకంటే తెరచి ఉన్న నోటిలో షై’తాన్‌ ప్రవేశిస్తాడు. అంటే ఈగ, దోమ మొదలైన రూపాల్లో  ప్రవేశిస్తాడు.  (ముస్లిమ్‌)

—–

اَلْفَصْلُ الثَّانِيْ  రెండవ విభాగం  

4738 – [ 7 ] ( إسناده جيد ) (3/1340)

عَنْ أَبِيْ هُرَيْرَةَ أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم كَانَ إِذَا عَطَسَ غَطّى وَجْهَهُ بِيَدِهِ أَوْ ثَوْبِهِ. وَغَضَّ بِهَا صَوْتَهُ. رَوَاهُ التِّرْمِذِيُّ وَأَبُوْ دَاوُدَ. وَقَالَ التِّرْمِذِيُّ: هَذَا حَدِيْثٌ حَسَنٌ صَحِيْحٌ.  

4738. (7) [3/1340ఆధారాలు  ఆమోద యోగ్యం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) తుమ్మి నపుడు తనముఖాన్ని తనచేత్తో లేదా ఏదైనా వస్త్రంతో కప్పుకునే వారు. ఇంకా తన శబ్దాన్ని తగ్గించే వారు. (తిర్మిజీ’, అబూ దావూద్‌)

తన తుమ్ము యొక్క తుంపరలు ఇతరుల మీద పడకుండా ఉండాలని.

4739 – [ 8 ] ( إسناده جيد ) (3/1340)

وَعَنْ أَبِيْ أَيُّوْبَ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم قَالَ: “إِذَا عَطَسَ أَحَدُكُمْ فَلْيَقُلْ: اَلْحَمْدُ لِلّهِ عَلَى كُلِّ حَالٍ وَلْيَقُلِ الَّذِيْ يَرُدُّ عَلَيْهِ: يَرْحَمُكَ اللهُ وَلْيَقُلْ هُوَ: يَهْدِيْكُمْ وَيُصْلِحُ بَالَكُمْ”  .رَوَاهُ التِّرْمِذِيُّ وَالدَّارَمِيُّ .

4739. (8) [3/1340ఆధారాలు  ఆమోద యోగ్యం]

అబూ అయ్యూబ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మీకు తుమ్ము వస్తే ‘అల్‌’హమ్‌దులిల్లాహి అలా కుల్లి ‘హాలిన’ అని పలకాలి. దాని సమాధానం ఇచ్చే వ్యక్తి ‘యర్‌హముకల్లాహ్‌’ అని పలకాలి. దానికి సమాధా నంగా తుమ్మినవారు ‘యహ్‌దీకుముల్లాహు వ యుస్‌ లిహు బాల కుమ్‌’ అని పలకాలి. (తిర్మిజీ, దార్మీ)

4740 – [ 9 ] ( إسناده جيد ) (3/1340)

وَعَنْ أَبِيْ مُوْسَى قَالَ: كَانَ الْيَهُوْدُ يَتَعَاطَسُوْنَ عِنْدَ النَّبِيِّ صلى الله عليه وسلم يَرْجُوْنَ أَنْ يَّقُوْلَ لَهُمْ: يَرْحَمُكُمُ اللهُ فَيَقُوْلُ: “يَهْدِيْكُمُ اللهُ وَيُصْلِحُ بَالَكُمْ”. رَوَاهُ التِّرْمِذِيُّ وأَبُوْ دَاوُدَ.  

4740. (9) [3/1340ఆధారాలు  ఆమోద యోగ్యం]

అబూ మూసా (ర) కథనం: ప్రవక్త(స) వద్దకు యూదులు వచ్చి కూర్చుండే వారు. పరస్పరం ఏమాత్రం సిగ్గు పడకుండా తుమ్మేవారు. ప్రవక్త (స) వారి గురించి ‘యర్‌’హముకల్లాహ్‌’ అని పలకాలని. కాని ప్రవక్త (స) వారి గురించి ‘యహ్‌దీకు ముల్లాహు వ యు’స్‌లిహు బాలకుమ్‌,’ అని పలికేవారు. (తిర్మిజీ’, అబూ దావూద్‌)

ప్రవక్త (స) యూదుల మార్గదర్శకత్వంకోసం ప్రార్థించే వారు.

4741 – [ 10 ] ( صحيح ) (3/1340)

وَعَنْ هِلَالِ بْنِ يَسَافٍ قَالَ: كُنَّا مَعَ سَالِمِ بْنِ عُبَيْدٍ فَعَطَسَ رَجُلٌ مِّنَ الْقَوْمِ فَقَالَ: السَّلَامُ عَلَيْكُمْ. فَقَالَ لَهُ سَالِمٌ: وَعَلَيْكَ وَعَلَى أُمِّكَ. فَكَأَنَّ الرَّجُلُ وَجَدَ فِيْ نَفْسِهِ فَقَالَ: أَمَا إِنِّيْ لَمْ أَقُلْ إِلَّا مَا قَالَ النَّبِيُّ صلى الله عليه وسلم إِذَا عَطَسَ رَجُلٌ عِنْدَ النَّبِيِّ صلى الله عليه وسلم فَقَالَ: اَلسَّلَامُ عَلَيْكُمْ. فَقَالَ النَّبِيُّ صلى الله عليه وسلم: “عَلَيْكَ وَعَلَى أُمِّكَ إِذَا عَطَسَ أَحَدُكُمْ فَلْيَقُلْ: اَلْحَمْدُ لِلّهِ رَبِّ الْعَالَمِيْنَ وَلْيَقُلْ لَهُ مَنْ يَّرُدُّ عَلَيْهِ: يَرْحَمُكَ اللهُ وَلْيَقُلْ: يَغْفِرُ لِيْ وَلَكُمْ”  .رَوَاهُ التِّرْمِذِيُّ وأَبُوْدَاوُدَ.  

4741. (10) [3/1340దృఢం]

హిలాల్‌ బిన్‌ యసాఫ్‌ కథనం: మేము సాలిమ్‌ బిన్‌ ‘ఉబైద్‌ వెంట ఉన్నాం. ఒక వ్యక్తికి తుమ్ము వచ్చింది. అతడు’అస్సలాముఅలైకుమ్‌,’ అని అన్నాడు. సాలిమ్‌ దానికి సమాధానంగా ‘వఅలైక వ అలా ఉమ్మిక,’ అని అన్నారు. ఆ వ్యక్తి అయిష్టం వ్యక్తం చేసాడు. అప్పుడు సాలిమ్‌, ‘ఎందుకు అసహ్యించు కుంటున్నావు,’ అని అడిగారు. ‘ప్రవక్త (స) ఇచ్చినట్లే నేనూ సమాధానం ఇచ్చాను.’ ప్రవక్త (స) ముందు ఒక వ్యక్తి తుమ్మాడు. ఆ వ్యక్తి, ‘అస్సలాము అలైకుమ్‌,’ అని అన్నాడు. ప్రవక్త (స) అతనికి సమాధానంగా, ‘అలైక వ అలా ఉమ్మిక,’ అని అన్నారు. ఇంకా ప్రవక్త (స) తుమ్మిన తరువాత, ‘అస్సలాము అలైకుమ్‌,’ అని అనరాదు. ‘అల్‌’హమ్‌దు లిల్లాహి రబ్బిల్‌ ‘ఆలమీన్‌,’ అని అనాలి. దానికి సమాధానంగా ‘యర్‌ హముకల్లాహ్‌’ అని అనాలి. దానికి సమాధానంగా తుమ్మిన వ్యక్తి ‘య’గ్‌ఫిరుల్లాహులీ వలకుమ్‌,’ అని పలకాలి.[15](తిర్మిజీ’, అబూ  దావూద్‌)

4742 – [ 11 ] ( لم تتم دراسته ) (3/1341)

وَعَنْ عُبَيْدِ بْنِ رَفَاعَةَ عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ: “شَمِّتِ الْعَاطِسَ ثَلَاثًا فَإِنْ زَادَ فَشَمِّتْهُ وَإِنْ شِئْتَ فَلَا”. رَوَاهُ أَبُوْ دَاوُدَ وَ التِّرْمِذِيُّ وَقَالَ: هَذَا حَدِيْثٌ غَرِيْبٌ.

4742. (11) [3/1341అపరిశోధితం]

‘ఉబైద్‌ బిన్‌ రిఫా’అహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”తుమ్మేవారికి మూడుసార్లు సమాధానం ఇవ్వండి. అంతకంటే ఎక్కువసార్లు తుమ్మితే మీరు సమాధానం ఇచ్చినా ఇవ్వక పోయినా మీ ఇష్టం.” (తిర్మిజి’ / ఏకోల్లేఖనం)

4743 – [ 12 ] ( لم تتم دراسته ) (3/1341)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: “شَمِّتْ أَخَاكَ ثَلَاثًا فَإِنْ زَادَ فَهُوَ زُكَامٌ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ وَقَالَ: لَا أَعْلَمُهُ إِلَّا أَنَّهُ رَفَعَ الْحَدِيْثَ إِلى النَّبِيِّ صلى الله عليه وسلم.  

4743. (12) [3/1341అపరిశోధితం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ”ఒకవేళ మీ సోదరుడు మూడుసార్లు తుమ్మితే, దానికి సమాధానం ఇవ్వండి. ఒకవేళ మూడు కంటే ఎక్కువ సార్లు తుమ్మితే అతనికి జలుబు చేసిందని అనుకోండి” అని అన్నారు. (అబూ దావూద్‌)

—–

اَلْفَصْلُ الثَّالِثُ  మూడవ విభాగం 

4744 – [ 13 ] ( إسناده جيد ) (3/1341)

عَنْ نَافِعٍ:أَنَّ رَجُلًا عَطَسَ إِلى جَنْبِ ابْنِ عُمَرَفَقَالَ:اَلْحَمْدُ لِلّهِ وَالسَّلَامُ عَلَى رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم قَالَ ابْنُ عُمَرَ:وَأَنَا أَقُوْلُ: اَلْحَمْدُ لِلّهِ وَالسَّلَامُ عَلَى رَسُوْلِ اللهِ وَلَيْسَ هَكَذَا . عَلَّمَنَا رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم أَنْ نَقُوْلَ : اَلْحَمْدُ لِلّهِ عَلَى كُلِّ حَالٍ . رَوَاهُ التِّرْمِذِيُّ وَقَالَ :هَذَا حَدِيْثٌ غَرِيْبٌ

4744. (13) [3/1341-ఆధారాలు  అమోద యోగ్యం]

నాఫె’అ (ర) కథనం: ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘ఉమర్‌ (ర) ముందు ఒక వ్యక్తి తుమ్మాడు. ఇంకా, ‘అల్‌’హమ్‌దు లిల్లాహ్‌ వస్సలాము అలా రసూలిల్లాహ్‌,’ అని అన్నాడు. అది విని ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘ఉమర్‌ (ర), ”మేము కూడా ‘అల్‌’హమ్‌దు లిల్లాహ్‌ వస్సలాము అలా రసూలిల్లాహ్‌’ అని అనేవారము. కాని ప్రవక్త (స) తుమ్మిన తరువాత ఇలా నేర్పించలేదు. ప్రవక్త (స) తుమ్మిన తర్వాత ‘అల్‌’హమ్‌దులిల్లాహి అలాకుల్లి ‘హాలిన్‌’ అని పలకమని బోధించారు” అని అన్నారు. (తిర్మిజీ’  /  ఏకోల్లేఖనం)

=====

7 بَابُ الضِّحْكِ

7. నవ్వు నియమాలు

اَلْفَصْلُ الْأَوَّلُ     మొదటి విభాగం  

4745 – [ 1 ] ( صحيح ) (3/1342)

عَنْ عَائِشَةَ رَضِيَ اللهُ عَنْهَا قَالَتْ: مَا رَأَيْتُ النَّبِيَّ صلى الله عليه و سلم مُسْتَجْمِعًا ضَاحِكَا حَتّى أَرَى مِنْهُ لَهَوَاتِهِ إِنَّمَا كَانَ يَتَبَسَّمَ. رَوَاهُ الْبُخَارِيُّ.  

4745. (1) [3/1342దృఢం]

‘ఆయి’షహ్‌ (ర) కథనం: ప్రవక్త (స)ను నేనెప్పుడూ విపరీతంగా పగలబడి నవ్వటం చూడలేదు. సాధార ణంగా ప్రవక్త (స) చిరునవ్వు నవ్వేవారు.[16] (బు’ఖారీ)

4746 – [ 2 ] ( متفق عليه ) (3/1342)

وَعَنْ جَرِيْرٍ قَالَ: مَا حَجَبَنِيَ النَّبِيُّ صلى الله عليه وسلم مُنْذُ أَسْلَمْتُ وَلَا رَآنِيْ إِلَّا تَبَسَّمَ.  

4746. (2) [3/1342 ఏకీభవితం]

జరీర్‌ (ర) కథనం: నేను ముస్లిమ్‌ అయినప్పటి నుండి ప్రవక్త (స) ఎన్నడూ తన వద్దకు రాకుండా వారించ లేదు. నన్ను ఎప్పుడు చూచినా చిరునవ్వు నవ్వేవారు. (బు’ఖారీ, ముస్లిమ్‌)

4747 – [ 3 ] ( صحيح ) (3/1342)

وَعَنْ جَابِرِ بْنِ سَمُرَةَ قَالَ: كَانَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم لَا يَقُوْمُ مِنْ مُصَلَّاهُ الَّذِيْ يُصَلِّيْ فِيْهِ الصُّبْحَ حَتَّى تَطْلُعَ الشَّمْسُ فَإِذَا طَلَعَتِ الشَّمْسُ قَامَ وَكَانُوْا يَتَحَدَّثُوْنَ فَيَأْخُذُوْنَ فِيْ أَمْرِ الْجَاهِلِيَّةِ فَيَضْحَكُوْنَ وَيَبَتَسَّمُ صَلى الله عليه وسلم. رَوَاهُ مُسْلِمٌ.

وَفِيْ رِوَايَةٍ لِلتِّرْمِذِيُّ: يَتَنَاشَدُوْنَ الشِّعْرَ.

4747. (3) [3/1342 దృఢం]

జాబిర్‌ బిన్‌ సమురహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ఫజ్‌ర్‌ నమా’జ్‌ చదివిన చోటే సూర్యోదయం అయ్యేవరకు కూర్చునే వారు. సూర్యోదయం అయిన తరువాత వెళ్ళేవారు. ఫజ్‌ర్‌ నమా’జు ముగించిన తర్వాత సూర్యోదయం వరకు ప్రవక్త (స) అనుచరులు ప్రవక్త (స) వద్దనే కూర్చుని అజ్ఞాన కాలపు విషయాల గురించి మాట్లాడుకుంటూ పరస్పరం నవ్వుకునే వారు. ప్రవక్త (స) కూడా వారితో పాటు చిరునవ్వు నవ్వే వారు. (ముస్లిమ్‌)

—–

اَلْفَصْلُ الثَّانِيْ  రెండవ విభాగం  

4748 – [ 4 ] ( لم تتم دراسته ) (3/1342)

عَنْ عَبْدِ اللهِ بْنِ الْحَارِثِ بْنِ جَزْءٍ قَالَ: مَا رَأَيْتُ أَحَدًا أَكْثَرَ تَبَسُّمًا مِنْ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم. رَوَاهُ التِّرْمِذِيُّ.  

4748. (4) [3/1342 అపరిశోధితం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘హారిస్‌’ (ర) కథనం: ప్రవక్త (స) చిరు నవ్వు నవ్వినంత అధికంగా నేనెవరినీ చూడలేదు. (తిర్మిజీ’)

ఈ ‘హదీసు’ ద్వారా ప్రవక్త (స) మాట్లాడినపుడు చిరు నవ్వు నవ్వేవారు. ప్రతి ఒక్కరితో చిరునవ్వు నవ్వుతూ కలిసేవారు. అయితే విపరీతంగా నవ్వటం అనేది ఎన్నడూ  జరగలేదని  తెలిసింది.

—–

اَلْفَصْلُ الثَّالِثُ మూడవ విభాగం   

4749 – [ 5 ] ( لم تتم دراسته ) (3/1343)

عَنْ قَتَادَةَ قَالَ: سُئِلَ ابْنُ عُمَرَ: هَلْ كَانَ أَصْحَابُ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم يَضْحَكُوْنَ؟ قَالَ: نَعَمْ وَالْإِيْمَانُ فِيْ قُلُوْبِهِمْ أَعْظَمُ مِنَ الْجَبَلِ. وَقَالَ بِلالُ بْنُ سَعْدٍ: أَدْرَكْتُهُمْ يَشْتَدُّوْنَ بَيْنَ الْأَغْرَاضِ وَيَضْحَكُ بَعْضُهُمْ إِلى بَعْضٍ فَإِذَا كَانَ اللَّيْلُ كَانُوْا رُهْبَانًا. رَوَاهُ فِيْ “شَرْحِ السُّنَّةِ”.

4749. (5) [3/1342 అపరిశోధితం]

ఖతాదహ్‌ (ర) కథనం: ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘ఉమర్‌ (ర)ను, ‘అనుచరులు ప్రవక్త (స) ముందు నవ్వే వారా?’ అని ప్రశ్నించ డం జరిగింది. దానికి అతను, ‘అవును, వారి హృదయాల్లో కొండలకన్నా పెద్దదైన విశ్వాసం ఉండేది. అంటే పరిపూర్ణ విశ్వాసులై కూడా ప్రవక్త (స) ముందు నవ్వేవారు. ప్రవక్వ (స)ను గౌరవించేవారు,’ అని అన్నారు. బిలాల్‌ బిన్‌ స’అద్‌ ఇలా అన్నారు: నేను అనుచరులను బాణాల పోటీలో పరిగెత్తుతూ ఉండగా చూసాను. అంటే బాణాలు వదిలిన తరువాత, బాణాలు తగిలే చిహ్నం వద్దకు పరస్పరం పరిగెత్తే వారు. ఇంకా ఎవరి బాణం గురిపై తగిలిందని, ఎవరిది తగ ల్లేదని చూసే వారు. ఇంకా పరస్పరం నవ్వుకునే వారు. జిహాద్‌ శిక్షణలో ఇలా చేసేవారు. అయితే  రాత్రివేళ మాత్రం తమ ప్రభువుకు అధికంగా భయపడే వారు. (షర్‌’హుస్సున్నహ్‌)

=====

8 بَابُ الْأُسَامِي

8. నామకరణం

గుర్తుపట్టటానికి, నిర్థారణకు, పేర్లు పెట్టటం జరుగు తుంది. అయితే పేరుపెట్టటానికి కూడా నియమ నిబంధనలు ఉన్నాయి. మంచి పేర్లు పెట్టాలి. చెడ్డ పేర్లు పెట్టరాదు. అల్లాహ్‌ ఖుర్‌ఆన్‌లో కూడా దీన్ని గురించి సూచించారు: ”విశ్వసించిన తర్వాత చెడ్డ పేరు చాలా చెడ్డది. అంటే విశ్వసించిన తర్వాత మంచి పేరే పెట్టాలి. సాధ్యమైనంత వరకు సున్నితత్వం, దీనత్వం ఉట్టిపడే పేర్లు పెట్టాలి. ఇస్లామీయ పరిధిలోని పేర్లే పెట్టాలి. అవిశ్వాసానికి ధిక్కారానికి గురిచేసే పేర్లు పెట్టరాదు. అల్లాహ్ ఆదేశం: ”ఆయనే, మిమ్మల్ని ఒకేవ్యక్తి నుండి సృష్టించాడు మరియు అతని నుండియే జీవిత సౌఖ్యం పొందటానికి అతని భార్యను (జౌజను) పుట్టించాడు. అతను ఆమెను కలుసుకున్నపుడు, ఆమె ఒక తేలికైన భారాన్ని ధరించి దానిని మోస్తూ తిరుగుతూ ఉంటుంది. పిదప ఆమె గర్భభారం అధికమైనప్పుడు, వారు ఉభయులూ కలిసి వారి ప్రభువైన అల్లాహ్‌ను ఇలా వేడు కుంటారు: “నీవు మాకు మంచి బిడ్డను ప్రసాదిస్తే మేము తప్పక నీకు కృతజ్ఞతలు తెలిపేవారమవుతాము!”  ఆయన వారికి ఒక మంచి బిడ్డను ప్రసాదించిన పిదప వారు, ఆయన ప్రసాదించిన దాని విష యంలో ఆయనకు సాటి (భాగస్వాములను) కల్పించసాగుతారు. కాని వారు కల్పించే భాగస్వాముల కంటే అల్లాహ్‌ మహోన్నతుడు.” (అల్‌ అ’అరాఫ్, 7:189-190)

అంటే ప్రపంచంలో మానవులు ఆదమ్‌, ‘హవ్వాల ద్వారా వ్యాపించారు. వారిద్దరిలో ప్రేమానురాగాలు జనింపజేశాడు అల్లాహ్‌. దానివల్ల సంతానం కలుగు తుంది. ఇది అల్లాహ్‌(త) గొప్ప అనుగ్రహం. అందుకు కృతజ్ఞతలు తెలుపుకోవాలి. కాని కొందరు బిడ్డలు సురక్షితంగా జన్మించినా దైవానికి సాటి కల్పిస్తూ ఉంటారు. అంటే వారికి సరైన, ధర్మసమ్మతమైన పేర్లు పెట్టరు. అందువల్ల ఇస్లామ్‌ పేర్లు పెట్టటంలో కూడా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తుంది.

اَلْفَصْلُ الْأَوَّلُ   మొదటి విభాగం

4750 – [ 1 ] ( متفق عليه ) (3/1344)

عَنْ أنس قَالَ: كَانَ النَّبِيُّ صلى الله عليه وسلم فِي السُّوْقِ فَقَالَ رَجُلٌ: يَا أَبَا الْقَاسِمِ فَالْتَفَتَ إِلَيْهِ النَّبِيُّ صلى الله عليه وسلم فَقَالَ: إِنَّمَا دَعَوْتُ هَذَا. فَقَالَ النَّبِيُّ صلى الله عليه وسلم: ” سَمُّوْا بِاِسْمِيْ وَلَا تَكْتَنُوْا بِكُنْيَتِيْ ” .

4750. (1) [3/1344 ఏకీభవితం]

అనస్‌ (ర) కథనం: ప్రవక్త (స) బజారులో వెళు తున్నారు. ఎవరో, ‘అబుల్‌ ఖాసిమ్‌’ అని పిలిచారు. అప్పుడు ప్రవక్త (స) అతనివైపు చూసారు, దానికి ఆ వ్యక్తి, ‘నేను మిమ్మల్ని పిలవలేదు,’ అని అన్నాడు. అప్పటి నుండి ప్రవక్త (స), ‘నా పేరు వంటి పేర్లు మీరు పెట్టుకో వచ్చు. కాని అబుల్‌ ఖాసిమ్‌ అని పెట్టుకోకండి,’ అని ప్రవచించారు. (బు’ఖారీ, ముస్లిం)

4751 – [ 2 ] ( متفق عليه ) (3/1344)

وَعَنْ جَابِرٍأَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم قَالَ: “سَمُّوْا بِاِسْمِيْ وَلَا تَكْتَنُوْا بِكُنْيَتِيْ فَإِنِّيْ إِنَّمَا جُعِلْتُ قَاسِمًا أَقْسِمُ بَيْنَكُمْ”.

4751. (2) [3/1344ఏకీభవితం]

జాబిర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”నా పేరువంటి పేరుపెట్టుకోండి. నా కునియత్‌ వంటి కునియత్‌ పెట్టుకో కండి. నేను ఖాసిమ్‌గా చేయబడ్డాను. నేను అల్లాహ్‌ ఆదేశాలను మీకు పంచుతాను.” (బు’ఖారీ, ముస్లిం)

4752 – [ 3 ] ( صحيح ) (3/1344)

وَعَنِ ابْنِ عُمَرَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِنَّ أَحَبَّ أَسْمَائِكُمْ إِلى اللهِ: عَبْدُ اللهِ وَعَبْدُ الرَّحْمنِ”. رَوَاهُ مُسْلِمٌ .

4752. (3) [3/1344దృఢం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘ఉమర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”అల్లాహ్‌ (త) వద్ద అన్నిటికంటే ఉత్తమ మైన, ప్రియమైన పేర్లు అబ్దుల్లాహ్‌, ‘అబ్దుర్ర’హ్మాన్‌.” (ముస్లిమ్‌)

4753 – [ 4 ] ( صحيح ) (3/1344)

وَعَنْ سَمُرَة بْنِ جُنْدُبٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَا تُسَمِّيَنَّ غُلَامًا يَسَارًا وَلَا رَبَاحًا وَلَانَجِيْحًا وَلَا أَفْلَحَ فَإِنَّكَ تَقُوْلُ: أَثَمَّ هُوَ؟ فَلَا يَكُوْنُ فَيَقُوْلُ لَا”. رَوَاهُ مُسْلِمٌ .

وَفِيْ رِوَايَةٍ لَهُ قَالَ: “لَا تُسمِّ غُلَامًا رَبَاحًا وَلَا يَسَارًا وَلَا أَفْلَحَ وَلَا نَافِعًا”.

4753. (4) [3/1344దృఢం]

సమురహ్‌ బిన్‌ జున్‌దుబ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మీరు మీ బానిసలకు, యసార్‌, రబా’హా, నజీ’హా, అఫ్‌ల’హ్, అనే పేర్లు పెట్టకండి. ఎందు కంటే, మీరు ‘యసార్ అక్కడ ఉన్నాడా,’ అని అంటారు. యసార్ అక్కడలేకపోతే, సమాధానం ఇచ్చే వారు, ‘యసార్ లేడు’ అని అంటారు.” (ముస్లిమ్‌)

మరో ఉల్లేఖనంలో  ”రబాహ్‌, యసార్‌, అఫ్‌లహ్‌, నాఫె’” అనే పేర్లు పెట్టకండని ఉంది.

4754 – [ 5 ] ( صحيح ) (3/1344)

وَعَنْ جَابِرٍقَالَ أَرَادَ النَّبِيُّ صلى الله عليه وسلم أَنْ يَّنْهَي عَنْ أَنْ يُّسَمّى بِيَعْلَى وَبِبَرْكَةَ وَبِأَفْلَحَ وَبِيَسَارٍ وَبِنَافِعٍ وَبِنَحْوِ ذَلِكَ. ثُمَّ سَكَتَ بَعْدُ عَنْهَا ثُمَّ قُبِضَ وَلَمْ يَنْهَ عَنْ ذَلِكَ. رَوَاهُ مُسْلِمٌ.  

4754. (5) [3/1344దృఢం]

జాబిర్‌ (ర) కథనం: ప్రవక్త (స) య’అలా, బరకహ్ అఫ్‌ల’హ, యసార్‌, నాఫె’అ మొదలైన పేర్లు పెట్టకూడ దని వారిం చాలని అనుకున్నారు. కాని ప్రవక్త (స) మౌనం వహించారు. ఆ తరువాత ప్రవక్త (స) మరణిం చారు. అంటే ప్రత్యేకంగా నిషేధించలేదు.[17](ముస్లిమ్‌)

4755 – [ 6 ] ( صحيح ) (3/1345)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “أَخْنَى الْأَسْمَاءِ يَوْمَ الْقِيَامَةِ عِنْدَ اللهِ رَجُلٌ يُسمَّى مَلِكَ. الْأَمْلَاكِ”. رَوَاهُ الْبُخَارِيُّ.

 وَفِيْ رِوَايَةٍ لِمُسْلِمٍ قَالَ: “أَغْيَظُ رَجُلٍ عَلَى اللهِ يَوْمَ الْقِيَامَةِ وَأَخْبَثُهُ رَجُلٌ كَانَ يُسَمّى مَلِكَ الْأَمْلَاكِ لَا مَلِكَ إِلَّا لله”.

4755. (6) [3/1345దృఢం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”అల్లాహ్‌ వద్ద అన్నిటికంటే చెడ్డ పేరు, ‘చక్రవర్తి’ లేదా ‘షాహిన్‌ షాహ్‌’. (బు’ఖారీ)

ముస్లిమ్ లోని ఉల్లేఖనంలో ప్రవక్త (స) ప్రవచనం, ”ప్రపంచంలో షాహీన్‌షాహ్‌ (చక్రవర్తి) అనే పేరు పెట్టుకున్న వాడు తీర్పుదినం నాడు అల్లాహ్‌ (త) వద్ద అన్నిటి కంటే నీచుడు, అందరికంటే అధికంగా దైవాగ్రహానికి గురయ్యే వ్యక్తి. ఎందుకంటే ఉభయ లోకాల్లో అధికారం అల్లాహ్‌ (త)దే.

4756 – [ 7 ] ( صحيح ) (3/1345)

وَعَنْ زَيْنَبَ بِنْتِ أَبِيْ سَلَمَةَ قَالَتْ: سُمِّيْتُ بَرَّةَ فَقَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم. “لَا تُزَكُّوْا أَنْفُسَكُمْ اللهُ أَعْلَمُ بِأَهْلِ الْبِرِّ مِنْكُمْ سَمُّوْهَا زَيْنَبَ”. رَوَاهُ مُسْلِمٌ.  

4756. (7) [3/1345  దృఢం]

‘జైనబ్‌ బిన్తె అబీ సలమహ్ (ర) కథనం: మొదట నాకు బర్రహ్ అనే పేరు పెట్టటం జరిగింది. దాని అర్థం పుణ్మాత్మురాలు. ప్రవక్త (స) ‘నిన్ను నువ్వు పొగుడుకోకు. ఎవరు పాపాత్ములో, ఎవరు పుణ్మాత్ములో అల్లాహ్‌ (త)కు తెలుసు, ఈమె పేరు ‘జైనబ్‌  పెట్టండి,’ అని ఆదేశించారు. అప్పటి నుండి నా పేరు ‘జైనబ్‌గా చలామణి అవుతోంది. అంటే అవసర మైతే పేరు మార్చుకోవచ్చును.

4757 – [ 8 ] ( صحيح ) (3/1345)

وَعَنِ ابْنِ عَبَّاسٍ قَالَ: كَانَتْ جُوَيْرِيَةُ اِسْمُهَا بَرَّةُ فَحَوَّلَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم اِسْمَهَا جُوَيْرِيَةَ وَكَانَ يَكْرَهُ أَنْ يُّقَالَ: خَرَجَ مِنْ عِنْدَ بَرَّةَ. رَوَاهُ مُسْلِمٌ.  

4757. (8) [3/1345-  దృఢం]

ఇబ్నె ‘అబ్బాస్‌ (ర) కథనం: ప్రవక్త (స) భార్యల్లో ఒకరి పేరు జువైరియహ్ ఉండేది. ఆమెకు ముందు ‘బర్రహ్‌’ అనే పేరు ఉండేది. ప్రవక్త (స) దాన్ని మార్చి జువైరియహ్ పెట్టారు. ఎందుకంటే ప్రవక్త (స)కు బర్రహ్‌ – అంటే మేలు పోయింది – అనే పేరు నచ్చలేదు. (ముస్లిమ్)

4758 – [ 9 ] ( صحيح ) (3/1345)

وَعَنِ ابْنِ عُمَرَ أَنَّ بِنْتًا كَانَتْ لِعُمَرَ يُقَالُ لَهَا: عَاصِيَةُ فَسَمَّاهَا رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم جَمِيْلَةَ. رَوَاهُ مُسْلِمٌ.  

4758. (9) [3/1345 దృఢం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘ఉమర్‌ (ర) కథనం: ‘ఉమర్‌ కూతురి పేరు ‘ఆ’సియహ్ ఉండేది. అంటే అవిధేయు రాలు. ప్రవక్త (స) ఆమె పేరు మార్చి, జమీలహ్  పెట్టారు. (ముస్లిమ్‌)

అరబ్బులు అజ్ఞాన కాలంలో ఇటువంటి పేర్లే పెట్టే వారు. వాటిని వారించడం జరిగింది.

4759 – [ 10 ] ( متفق عليه ) (3/1345)

وَعَنْ سَهْلِ بْنِ سَعْدٍ قَالَ: أُتِيَ بِالْمُنْذِرِ بْنِ أَبِيْ أُسَيْدٍ إِلى النَّبِيِّ صلى الله عليه وسلم حِيْنَ وُلِدَ فَوَضَعَهُ عَلَى فَخِذِهِ فَقَالَ: “وَمَا اسْمُهُ؟” قَالَ: فُلَانٌ: “لَا وَلَكِنْ اِسْمُهُ الْمُنْذِرُ”.

4759. (10) [3/1345ఏకీభవితం]

సహల్‌ బిన్‌ స’అద్‌ కథనం: మున్‌జి’ర్‌ బిన్‌ అబీ ఉసైద్‌ (ర) జన్మించినపుడు అతన్ని ప్రవక్త (స) వద్దకు తీసుకు రావటం జరిగింది. ప్రవక్త (స) అతన్ని తన తొడలపై కూర్చో బెట్టుకున్నారు. ఇంకా, ‘ఈ బిడ్డ పేరు ఏమిటి’ అని అడిగారు. ‘ఫలానా పేరు’ అని చెప్పటం జరిగింది. దానికి ప్రవక్త (స) కాదు, ‘ఇతని పేరు మున్‌జి’ర్‌’ అని అన్నారు. (బు’ఖారీ, ముస్లిం)

4760 – [ 11 ] ( صحيح ) (3/1345)

عَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَا يَقُوْلَنَّ أَحَدُكُمْ عَبْدِيْ وَأَمَتِيْ كُلُّكُمْ عِبَادُ اللهِ. وَكُلُّ نِسَائِكُمْ إِمَاءُ اللهِ. وَلَكِنَّ لِيَقُلْ: غُلَامِيْ وَجَارِيَتِيْ وَفَتَايَ وَفَتَاتِيْ. وَلَا يَقُلِ الْعَبْدُ: رَبِّيْ وَلَكِنْ لِيَقُلْ: سَيِّدِيْ”.

وَفِيْ رِوَايَةٍ: “لِيَقُلْ: سَيِّدِيْ وَمَوْلَايَ”.

وَفِيْ رِوَايَةٍ: “لَا يَقُلِ الْعَبْدُ لِسَيِّدِهِ: مَوْلَايَ فَإِنَّ مَوْلَاكُمُ اللهُ”. رَوَاهُ مُسْلِمٌ.

4760. (11) [3/1345దృఢం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఎవరూ తన బానిసను, బానిసరాలిని ‘నా బానిస, నా బానిసరాలు,’ అని పిలవరాదు. మీరందరూ అల్లాహ్‌ బానిసలు. స్త్రీలు అల్లాహ్‌ బానిసరాళ్ళు. అయితే ‘నాసేవకుడు నాసేవకురాలు’ అనిపిలవండి. అదేవిధంగా బానిసలు తమ యజమానులను ‘మా సంరక్షకుడు,’ అని పిలవరాదు. అయితే ‘మా నాయకుడు,’ అని  పిలవండి.

మరో ఉల్లేఖనంలో బానిసలు తమ యజమాను లను ‘మా యజమాని’ అని పిలవరాదు. ఎందుకంటే అందరి యజమాని, సంరక్షకుడు అల్లాహ్‌ ఒక్కడే.’ (ముస్లిమ్‌)

ఇవన్నీ వినయ పూరితమైన  పదాలు.

4761 – [ 12 ] ( صحيح ) (3/1345)

وَعَنْهُ عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ: “لَا تَقُوْلُوْا: اَلْكَرْمَ فَإِنَّ الْكَرْمَ قَلْبث الْمُؤْمِنِ”. رَوَاهُ مُسْلِمٌ.  

4761. (12) [3/1345 దృఢం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, మీరు ద్రాక్షను ‘కర్‌మ’ అనకండి. ఎందుకంటే కర్‌మ అంటే విశ్వాసి  హృదయం. (ముస్లిమ్‌)

4762 – [ 13 ] ( صحيح ) (3/1346)

وَفِيْ رِوَايَةٍ لَّهُ عَنْ وَائِلِ بْنِ حُجْرٍ قَالَ: “لَا تَقُوْلُوْا: اَلْكَرْمُ وَلَكِنْ قُوْلُوْا: اَلْعِنَبُ وَالْحَبَلَةُ ”  

4762. (13) [3/1346దృఢం]

వాయి’ల్ బిన్ ‘హుజ్రి (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం ”మీరు ద్రాక్షను కర్‌మ అనకండి, ‘ఇనబ్‌,  ‘హబలహ్‌ అనండి,” అని మరో ఉల్లేఖనంలో ఉంది. (ముస్లిమ్‌)

‘ఇనబ్‌ మరియు ‘హబలహ్‌ అన్నా ద్రాక్ష పళ్లే. అరబ్బులు కర్మ అనేవారు. కర్మ అంటే గౌరవ నీయుడు, మంచి, కారుణ్యం అనే అర్థాలున్నాయి. ఈ  పదం  ద్రాక్ష  పండ్లకు  తగదు.

4763 – [ 14 ] ( صحيح ) (3/1346)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَا تُسَمُّوْا الْعِنَبَ الْكَرْمَ وَلَا تَقُوْلُوْا: يَا خَيْبَةَ الدَّهْرِ فَإِنَّ اللهَ هُوَ الدَّهْرُ”. رَوَاهُ الْبُخَارِيُّ.

4763. (14) [3/1346  దృఢం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మీరు ద్రాక్షకు కర్మ అనే పేరు పెట్టకండి. ఇంకా మీరు కాలాన్ని నిరాశకు చెందిన పేర్లు పెట్టకండి. ఎందుకంటే అల్లాహ్‌యే కాలం. [18] (బు’ఖారీ)

అంటే అంతా అల్లాహ్‌ (త) చేతుల్లోనే ఉంది.

4764 – [ 15 ] ( صحيح ) (3/1346)

وَعَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَا يَسُبُّ أَحَدُكُمُ الدَّهْرَ فَإِنَّ اللهَ هُوَ الدَّهْرُ”. رَوَاهُ مُسْلِمٌ.  

4764. (15) [3/1346దృఢం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మీరు కాలాన్ని తిట్టకండి. ఎందుకంటే అల్లాహ్‌ (త)యే కాలం. ఆయనే దాన్ని తన ఇష్టం వచ్చినట్టు మలచుతాడు. కాలాన్ని తిట్టటం అల్లాహ్‌(త)ను తిట్టినట్లే.  (ముస్లిమ్‌)

4765 – [ 16 ] ( متفق عليه ) (3/1346)

وَعَنْ عَائِشَةَ قَالَتْ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَا يَقُوْلَنَّ أَحَدُكُمْ: خَبُثَتْ نَفْسِيْ وَلَكِنْ لِيَقُلْ:لَقِسَتْ نَفْسِيْ”.مُتَّفَقٌ عَلَيْهِ. وَ ذُكِرَ حَدِيْثُ أَبِيْ هُرَيْرَةَ: “يُؤْذِيْنِيْ اِبْنُ آدَمَ”فِيْ”بَابُ الْإِيْمَانِ”.

4765. (16) [3/1346 ఏకీభవితం]

‘ఆయి’షహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఎవ్వరూ నా మనస్సు చెడ్డదైపోయింది అని అన కూడదు, నా మనసు భారమైపోయింది” అని అనవచ్చును. (బు’ఖారీ, ముస్లిమ్‌)

—–

اَلْفَصْلُ الثَّانِيْ  రెండవ విభాగం  

4766 – [ 17 ] ( إسناده جيد ) (3/1346)

عَنْ شُرَيْحِ بْنِ هَانِئٍ عَنْ أَبِيْهِ أَنَّهُ لَمَّا وَفَدَ إِلى رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم مَعَ قَوْمِهِ سَمِعَهُمْ يُكَنُّونَهُ بِأَبِيْ الْحَكَمِ فَدَعَاهُ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم فَقَالَ: “إِنَّ اللهَ هُوَ الْحَكَمُ فَلَمْ تُكَنّى أَبَا الْحَكمِ؟” قَالَ:إِنَّ قَوْمِيْ إِذَا اخْتَلَفُوْا فِيْ شَيْءٍ أَتَوْنِيْ فَحَكَمْتُ بَيْنَهُمْ فَرَضِيَ كِلَا الْفَرِيْقَيْنِ بِحُكْمِيْ. فَقَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَا أَحْسَنَ هَذَا فَمَا لَكَ مِنَ الْوَلَدِ؟” قَالَ: لِيْ شُرَيْحٌ وَمُسْلِمٌ. وَعَبْدُ اللهِ قَالَ: “فَمَنْ أَكْبَرُهُمْ؟” قَالَ قُلْتُ: شُرَيْحٌ.قَالَ فَأَنْتَ أَبُوْ شُرَيْحٍ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ وَالنَّسَائِيُّ  

4766. (17) [3/1346 ఆధారాలు ఆమోద యోగ్యం]

షురై’హ్‌ బిన్‌ హానీ తన తండ్రి ద్వారా ఉల్లేఖనం: అతడు తన జాతివారితో కలసి  ప్రవక్త (స) వద్దకు ప్రతినిధిగా వచ్చారు. అతన్ని ప్రజలు అబుల్‌ ‘హకమ్‌ అని పిలవటం ప్రవక్త (స) విన్నారు. ప్రవక్త (స) అతన్ని పిలిచి, ‘అల్లాహ్‌(త) యే అధికారి, అధికారాలు ఆయన వద్దనుండే వెలువడతాయి. నువ్వు నీ కునియత్‌ అబుల్‌ ‘హకమ్‌ ఎందుకు పెట్టుకున్నావు,’ అని అడిగారు. దానికి అతడు, ‘నా జాతిలో తగాదాలూ, వివాదాలు తలెత్తితే ప్రజలు నా దగ్గరకే వస్తారు. నేను తీర్పు ఇస్తే ఇరువర్గాలు సంతోషిస్తారు. అందువల్ల నన్ను అబుల్‌ ‘హకమ్‌ అని పిలుస్తారు,’ అని సమాధానం ఇచ్చాడు. అప్పుడు ప్రవక్త (స), ‘చాలా మంచిది, నీకు ఎంతమంది పిల్లలు,’ అని అడిగారు. దానికి అతడు ముగ్గురు షురై’హ్, ముస్లిమ్‌, ‘అబ్దుల్లాహ్‌ అని అన్నాడు. ప్రవక్త (స), ‘పెద్ద వారెవరు,’ అని అడిగారు. దానికి అతడు, ‘షురై’హ్‌’ అని అన్నాడు. అప్పుడు ప్రవక్త (స), ‘నువ్వు అబూ షురై’హ్‌,’ అని అన్నారు. (అబూ  దావూద్‌,  నసాయీ’)

4767 – [ 18 ] ( ضعيف ) (3/1347)

وَعَنْ مَسْرُوْقٍ قَالَ: لَقِيْتُ عُمَرَ فَقَالَ: مَنْ أَنْتَ؟ قُلْتُ: مَسْرُوْقُ بْنُ الْأَجْدَعِ. قَالَ عُمَرُ: سَمِعْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ: “اَلْأَجْدَعُ شَيْطَانٌ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ وَابْنُ مَاجَهُ.  

4767. (18) [3/1347 బలహీనం]

మస్‌రూఖ్‌ (ర) కథనం: నేను ‘ఉమర్‌ (ర)ను కలిసాను. అతను, ‘నీవెవరవు,’ అని అడిగారు. దానికి నేను మస్‌రూఖ్‌ బిన్‌ అజ్‌ద’అ అని అన్నాను. అది విని ‘ఉమర్‌ (ర)  ‘ప్రవక్త (స) అజ్‌ద’అ షై’తాన్‌ అని అంటూ ఉండగా నేను విన్నాను,’  అని అన్నారు. [19]  (అబూ దావూద్‌, ఇబ్నె  మాజహ్)

4768 – [ 19 ] ( ضعيف ) (3/1347)

وَعَنْ أَبِيْ الدَّرْدَاءِ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “تُدْعَوْنَ يَوْمَ الْقِيَامَةِ بِأَسْمَائِكُمْ وَأَسْمَاءِ آَبَائِكُمْ فَأَحْسِنُوْا أَسْمَائَكُمْ”. رَوَاهُ أَحْمَدُ وَأَبُوْ دَاوُدَ

4768. (19) [3/1347బలహీనం]

అబూ దర్‌దా’ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”తీర్పుదినం నాడు మిమ్మల్ని, మీ పేర్లద్వారా, మీ తండ్రుల పేర్ల ద్వారా పిలవటం జరుగుతుంది. అందువల్ల మీరు మంచి పేర్లు పెట్టుకోండి. (అబూ దావూద్‌, అ’హ్మద్‌)

4769 – [ 20 ] ( لم تتم دراسته ) (3/1347)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم نَهَى أَنْ يَّجْمَعَ أَحَدٌ بَيْنَ اِسْمِهِ وَكُنْيَتِهِ وَيُسَمّى أَبَا الْقَاسِمِ. رَوَاهُ التِّرْمِذِيُّ.  

4769. (20) [3/1347అపరిశోధితం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) తన పేరును, తన కునియత్‌ను ఒకచోట చేర్చటాన్ని (అంటే ము’హమ్మద్‌ అబుల్‌ ఖాసిమ్‌ అని అనటాన్ని) వారించారు. (తిర్మిజీ’)

ఈ  నిషేధం  ఆయన  జీవితకాలం  వరకే.

4770 – [ 21 ] ( منكر ) (3/1347)

وَعَنْ جَابِرٍ: أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم قَالَ: “إِذَا سَمَّيْتُمْ بِاِسْمِيْ فَلَا تَكْتَنُوْا بِكُنْيَتِيْ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَابْنُ مَاجَهُ. وَقَالَ التِّرْمِذِيُّ: هَذَا حَدِيْثٌ غَرِيْبٌ.

وَفِيْ رِوَايَةِ أَبِيْ دَاوُدَ قَالَ: “مَنْ تَسَمّى بِاِسْمِيْ فَلَا يَكْتَنِ بِكُنْيَتِيْ وَمَنْ تَكَنّى بِكُنْيَتِيْ فَلَا يَتَسَمَّ بِاِسْمِيْ”.  

4770. (21) [3/1347 తిరస్కృతం]

జాబిర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”నా పేరును మీ పేర్లుగా పెట్టుకోవచ్చు, కాని నా కునియత్‌ను మీ కునియత్‌గా పెట్టవద్దు. ము’హమ్మద్‌ అని పేరు పెట్టుకో వచ్చును. కాని అబుల్‌ ఖాసిమ్‌ అని కునియత్‌ పెట్టుకోకూడదు. (తిర్మిజి / ఏకోల్లేఖనం, ఇబ్నె మాజహ్)

మరో ఉల్లేఖనంలో నా పేరు పెట్టుకున్నవారు నా కునియత్‌  పెట్టకండి. నా కునియత్‌ పెట్టినవారు నా పేరు  పెట్టకండి. (అబూ  దావూద్‌)

4771 – [ 22 ] ( ضعيف ) (3/1347)

وَعَنْ عَائِشَةَ رَضِيَ اللهُ عَنْهَا أَنَّ اِمْرَأَةً قَالَتْ: يَا رَسُوْلَ اللهِ إِنِّيْ وَلَدْتُّ غُلَامًا فَسَمَّيْتُهُ مُحَمَّدًا وَكَنَّيْتُهُ أَبَا الْقَاسِمِ فَذُكِرَ لِيْ أَنَّكَ تَكْرَهُ ذَلِكَ. فَقَالَ: “مَا الَّذِيْ أَحَلَّ اِسْمِيْ وَحَرَّمَ كُنْيَتِيْ؟ أَوْ مَاالَّذِيْ حَرَّمَ كُنْيَتِيْ وَأَحَلَّ اِسْمِيْ؟” رَوَاهُ أَبُوْ دَاوُدَ. وَقَالَ مُحْيُي السُّنَّةِ: غَرِيْبٌ.

4771. (22) [3/1347 బలహీనం]

‘ఆయి’షహ్‌ (ర) కథనం: ఒక స్త్రీ వచ్చి ప్రవక్త (స)తో, ‘నాకు బిడ్డ జన్మించాడు. నేను ఆ బిడ్డకు ము’హమ్మద్‌ అనే పేరు అబుల్‌ ఖాసిమ్‌ అనే కునియత్‌ పెట్టాను. అయితే తమకు ఈ విషయం ఇష్టం లేదని నాకు తెలిసింది,’ అని విన్నవించుకుంది. అది విని ప్రవక్త (స) ‘ఏ విషయం నా పేరును ధర్మసమ్మతం చేసింది. ఎవరు నా కునియత్‌ నిషిద్ధం చేసింది. అంటే నా పేరును పేరుగా పెట్టవచ్చును. నా కునియత్‌ను కునియత్‌గా పెట్టటం కూడా ధర్మసమ్మతమే. అయితే నా జీవితంలో ఆ రెంటినీ ఒకచోట చేర్చరాదు,’ అని అన్నారు.(అబూ దావూద్‌, ము’హ్యియ్సున్నహ్  /  ఏకోల్లేఖనం)

4772 – [ 23 ] ( لم تتم دراسته ) (3/1348)

وَعَنْ مُحَمَّدِ بْنِ الْحَنَفِيَّةِ عَنْ أَبِيْهِ قَالَ: قُلْتُ: يَا رَسُوْلَ اللهِ أَرَأَيْتَ إِنْ وُلِدَ لِيْ بَعْدَكَ وَلَدٌ أُسَمِّيْهِ بِاِسْمِكَ وَأُكَنِّيْهِ بِكُنْيَتِكَ؟ قَالَ: “نَعَمْ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ.  

4772. (23) [3/1348 అపరిశోధితం]

ము’హమ్మద్‌ బిన్‌ ‘హనఫియ్యహ్, తన తండ్రి ద్వారా కథనం: ”ఓ ప్రవక్తా! ఒకవేళ తమరి మరణా నంతరం నాకు బిడ్డ జన్మిస్తే, వాడికి ము’హమ్మద్‌ అనే పేరు, అబుల్‌ ఖాసిమ్‌ అనే కునియత్‌ పెట్టుకోవచ్చా?” అని అడిగాను. దానికి ప్రవక్త (స) ”అవును” అన్నారు. (అబూ దావూద్‌)

4773 – [ 24 ] ( لم تتم دراسته ) (3/1348)

وَعَنْ أَنَسٍ قَالَ: كَنَّانِيْ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم بِبَقْلَةٍ كُنْتُ أَجْتَنِيْهَا. رَوَاهُ التِّرْمِذِيُّ  وَقَالَ: هَذَا حَدِيْثٌ لَا نَعْرِفُهُ إِلَّا مِنْ هَذَا الْوَجْهِ. وَفِيْ “الْمَصَابِيْحِ” صَحَّحَهُ

4773. (24) [3/1348 అపరిశోధితం]

అనస్‌ (ర) కథనం: నేను ఒక మొక్కను పీకాను. దాన్ని హమ్‌’జహ్ అనేవారు. ప్రవక్త (స) నా కునియత్‌ అబూ హమ్‌జహ్ పెట్టారు. (తిర్మిజీ’ – ఏకోల్లేఖనం, మసాబీహ్  – దృఢం)

4774 – [ 25 ] ( لم تتم دراسته ) (3/1348)

وَعَنْ عَائِشَةَ رَضِيَ اللهُ عَنْهَا قَالَتْ: إِنَّ النَّبِيَّ صلى الله عليه وسلم كَانَ يُغَيِّرُ الْاِسْمَ الْقَبِيْحَ. رَوَاهُ التِّرْمِذِيُّ.  

4774. (25) [3/1348 అపరిశోధితం]

‘ఆయి’షహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) చెడ్డ పేర్లను మార్చి మంచి పేర్లు పెట్టే వారు. (తిర్మిజీ’)

4775 – [ 26 ] ( إسناده جيد ) (3/1348)

وَعَنْ بُشَيْرِبْنِ مَيْمُوْنٍ عَنْ أُسَامَةَ بْنِ أَخْدَرِيٍّ أَنَّ رَجُلًا يُقَالُ لَهُ أَصْرَمُ كَانَ فِي النَّفَرِ الَّذِيْنَ أَتَوْا رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم. فَقَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَا اسْمُكَ؟” قَالَ: “بَلْ أَنْتَ زُرْعَةُ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ .

4775. (26) [3/1348ఆధారాలు ఆమోద యోగ్యం]

బషీర్‌ బిన్‌ మైమూన్‌ తన చిన్నాన్న ఉసామా బిన్‌ అ’ఖ్‌దరీ ద్వారా ఉల్లేఖనం: ప్రవక్త (స) వద్దకు ఒక బృందం వచ్చింది. వారిలో ఒక వ్యక్తి పేరు అ’స్‌రమ్‌ ఉండేది. (దీని అర్థం చెట్టు నరికే వాడు) ప్రవక్త (స) అతన్ని ‘నీ పేరేమిటి’ అని అడిగారు. ఆ వ్యక్తి ‘నా పేరు అ’స్‌రమ్‌’ అని అన్నాడు. అప్పుడు ప్రవక్త (స) కాదు, ‘నీ పేరు జుర్‌’అ  ఉండని,’  అని  అన్నారు. (అబూ  దావూద్‌)

4776 – [ 27 ] ( لم تتم دراسته ) (3/1348)

وَقَالَ: وَغَيَّرَ النَّبِيُّ صلى الله عليه وسلم اِسْمَ الْعَاصِ وَعَزِيْز وَعَتَلَةَ وَشَيْطَانٍ وَالْحَكَمٍ وَغُرَابٍ وَحُبَابٍ وَشِهَابٍ وَقَالَ: تَرَكْتُ أَسَانِيْدَهَا لِلْاِخْتِصَارِ.

4776. (27) [3/1348అపరిశోధితం]

ప్రవక్త (స) అనేక చెడ్డపేర్లను మార్చివేసారు. ఉదా: ఆ’స్‌, ‘అ’జీ’జ్‌, ‘త్‌హ్, షై’తాన్‌, ‘హకమ్‌, ‘గురాబ్‌, ‘హుబ్బాబ్‌, షిహాబ్‌ మొదలైన పేర్లను మార్చివేసారు.

‘ఆ’సీ అంటే అవిధేయుడు, ‘అ’జీ’జ్‌ అల్లాహ్‌ పేరు. కాబట్టి, కేవలం ‘అ’జీ’జ్‌, అని పేరు పెట్టకూడదు. ‘అబ్దుల్ ‘అ’జీ’జ్‌, అని పెట్టవచ్చు. ‘ఉత్‌లహ్‌ అంటే కాఠిన్యం, ఇది విశ్వాసికి తగదు. షై’తాన్‌ అంటే తల బిరుసుగా  ప్రవర్తించేవాడు, ‘హకమ్‌ అంటే పాలకుడు, ఇది కూడా దేవుని గుణం, ‘గురాబ్‌ కాకి అని అర్థం, ఇది ఒక పక్షి పేరు, ‘హుబ్బాబ్‌ అంటే పాము ఇంకా షై’తాన్‌ను కూడా అంటారు. షిహాబ్‌  అంటే  అగ్ని అని  అర్థం.

4777 – [ 28 ] ( لم تتم دراسته ) (3/1348)

وَعَنْ أَبِيْ مَسْعُوْدِ الْأَنْصَارِيِّ قَالَ لِأَبِيْ عَبْدِ اللهِ أَوْ قَالَ أَبُوْ عَبْدِاللهِ لِأَبِيْ مَسْعُوْدٍ: مَا سَمِعْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ فِيْ (زَعَمُوْا) قَالَ: سَمِعْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يقول: “بِئْسَ مَطِيَّةُ الرَّجُلِ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ وَقَالَ: إِنَّ أَبَا عَبْدَ اللهِ حُذَيْفَةُ.  

4777. (28) [3/1348అపరిశోధితం]

అబూ మస్‌’ఊద్‌ అ’న్సారీ (ర) అబూ ‘అబ్దుల్లాహ్‌తో, ”తమరు ‘జ’అమూ అనే పదం గురించి ప్రవక్త (స) ద్వారా విన్నారా?” అని అన్నారు. దానికతను, ‘ ‘జ’అమూ మనిషికి చాలా చెడ్డ వాహనం,” అని ప్రవక్త (స) అంటూ ఉండగా విన్నాను అని అన్నారు.[20]  (అబూ  దావూద్‌)

4778 – [ 29 ] ( صحيح ) (3/1349)

وَعَنْ حُذَيْفَةَ عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ: “لَا تَقُوْلُوْا :مَا شَاءَ اللهُ وَشَاءَ فُلَانٌ وَلَكِنْ قُوْلُوْا: مَا شَاءَ اللهُ ثُمَّ شَاءَ فُلَانٌ”. رَوَاهُ أَحْمَدُ وَأَبُوْ دَاوُدَ.

4778. (29) [3/1349 దృఢం]

‘హుజై’ఫహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, మీరు ”అల్లాహ్‌ కోరితే, ఫలానా వ్యక్తి కోరితే” అని అనకండి. కాని ‘అల్లాహ్‌ కోరింది’ – ఆ తరువాత – ‘ఫలానావ్యక్తి కోరింది.’  అని అనండి.  (అ’హ్మద్‌, అబూ  దావూద్‌)

4779 – [ 30 ] ( لم تتم دراسته ) (3/1349)

وَفِيْ رِوَايَةِ مُنْقَطِعًا قَالَ: “لَا تَقُوْلُوْا: مَا شَاءَ اللهُ وَشَاءَ مُحَمَّدٌ وَقُوْلُوْا مَا شَاءَ اللهُ وَحْدَهُ”. رَوَاهُ فِيْ ” شَرْحِ السُّنَّةِ”.

4779. (30) [[3/1349అపరిశోధితం]

మరో ఉల్లేఖనంలో ఇలా ఉంది: ”అల్లాహ్‌ కోరింది మరియు ము’హమ్మద్‌ కోరింది అని అనకండి. కాని కేవలం అల్లాహ్‌ కోరిందే అని అనండి.” (షర్‌’హు స్సున్నహ్‌)

4780 – [ 31 ] ( صحيح ) (3/1349)

وَعَنْهُ عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ: “لَا تَقُوْلُوا لِلْمُنَافِقِ سَيِّدٌ فَإِنَّهُ إِنْ يَّكُ سَيِّدًا فَقَدْ أَسْخَطْتُمْ رَبَّكُمْ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ.  

4780. (31) [3/1349దృఢం]

‘హుజై’ఫహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, మీరు కపటాచారులను నాయకులుగా పిలవకండి. ఒకవేళ మీరు వారిని అలా పిలిస్తే దైవాన్ని అయిష్టానికి గురిచేసి నట్లే. (అబూ  దావూద్‌)

ఎందుకంటే నాయకుడు గౌరవించబడతాడు. కాని అర్హతలేని వాడిని గౌరవించటం అపరాధం.

—–

الْفَصْلُ الثَّالِثُ   మూడవ విభాగం  

4781 – [ 32 ] ( صحيح ) (3/1349)

عَنْ عَبْدِ الْحَمِيْدِ بْنِ جُبَيْرِ بْنِ شَيْبَةَ قَالَ: جَلَسْتُ إِلى سَعِيْدِ بْنِ الْمُسَيَّبِ فَحَدَّثَنِيْ أَنَّ جَدَّهُ حَزْنًا قَدِمَ عَلَى النَّبِيِّ صلى الله عليه وسلم فَقَالَ: “مَا اسْمُكَ؟” قَالَ: اِسْمِيْ حَزْنٌ قَالَ: “بَلْ أَنْتَ سَهْلٌ” قَالَ: مَا أَنَا بِمُغَيِّرٍ اِسْمًا سَمَّانِيْهِ أَبِيْ. قَالَ ابْنُ الْمُسَيَّبِ: فَمَا زَالَتْ فِيْنَا الْحُزُوْنَةُ بَعْدُ. رَوَاهُ الْبُخَارِيُّ.  

4781. (32) [3/1349దృఢం]

‘అబ్దుల్‌ ‘హమీద్‌ బిన్‌ జుబైర్‌ బిన్‌ షైబహ్ కథనం: నేను స’యీద్‌ బిన్‌ ముసయ్యిబ్‌ వద్ద కూర్చొని ఉన్నాను. అతను నాకు ఇలా తెలిపారు. అతని తాతగారు ‘హ’జ్న్‌ ప్రవక్త (స) వద్దకు వెళ్ళారు. ప్రవక్త (స) అతన్ని ‘నీ పేరేమిటి’ అని అడి గారు. దానికి అతడు నా పేరు ” ‘హ’జ్న్‌” అని అన్నాడు. అప్పుడు ప్రవక్త (స), ”కాదు నువ్వు సహల్‌వి,” అని అన్నారు. దానికి అతడు, ”మా తండ్రిగారు పెట్టిన పేరును మార్చను,” అని అన్నాడు. అప్పటి నుండి మా కుటుంబం లో దుఃఖవిచారాలు చోటుచేసు కున్నాయి.[21]

4782 – [ 33 ] ( ضعيف ) (3/1349)

وَعَنْ أَبِيْ وَهْبِ الْجُشَمِيَّ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “تَسَمَّوْا أَسْمَاءَ الْأَنْبِيَاءِ وَأَحَبُّ الْأَسْمَاءِ إِلى اللهِ عَبْدُ اللهِ وَعَبْدُ الرَّحْمَنِ وَأَصْدَقُهَا حَارِثٌ وَهَمَّامٌ أَقْبَحُهَا حَرْبٌ وَمُرَّةُ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ

4782. (33) [3/1349బలహీనం]

అబూ వహబ్‌ జుషమియ్యి (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ప్రవక్తల పేర్లు పెట్టుకోండి. అల్లాహ్‌ వద్ద పేర్లన్నిటిలో ‘అబ్దుల్లాహ్‌, ‘అబ్దుర్ర’హ్మాన్‌ ఉత్తమ మైనవి. అదే విధంగా అన్నిటికంటే సత్యమైన పేరు హారిస్‌’. దీని అర్థం సంపాదించేవాడు. ఇంకా హమ్మామ్‌ అంటే నిశ్చయించుకునే వాడు. అదే విధంగా అన్నిటికంటే చెడ్డపేరు ‘హర్‌బ్‌ అంటే యుద్ధం, ఇంకా ముర్రహ్‌ అంటే చేదు, అని అర్థం. (అబూ  దావూద్‌)

=====

9 بَابُ الْبَيَانِ وَالشِّعْرِ

9. వాక్చాతుర్యం, కవిత్వం

اَلْفَصْلُ الْأَوَّلُ    మొదటి విభాగం

4783 – [ 1 ] ( صحيح ) (3/1350)

عَنِ ابْنِ عُمَرَ قَالَ: قَدِمَ رَجُلَانِ مِنَ الْمَشْرِقِ فَخَطَبَا فَعَجِبَ النَّاسُ  لِبَيَانِهِمَا. فَقَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِنَّ مِنَ الْبَيَانِ لَسِحْرًا”. رَوَاهُ الْبُخَارِيُّ. 

4783. (1) [3/1350దృఢం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘ఉమర్‌ (ర) కథనం: ప్రవక్త (స) వద్దకు తూర్పు నుండి ఇద్దరు వ్యక్తులు వచ్చారు. తమ మాటల ద్వారా ప్రభావితం చేసారు. ప్రజలందరూ వారి మాటలు విని ఆశ్చర్యం వ్యక్తం చేసారు. అప్పుడు ప్రవక్త (స) ‘కొందరి ప్రసంగాలు, మాటలు చేతబడిలా ప్రభావ పూరితంగా ఉంటాయి’ అని ప్రవచించారు.[22]  (బు’ఖారీ)

4784 – [ 2 ] ( صحيح ) (3/1350)

وَعَنْ أُبَيِّ بْنِ كَعْبٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِنَّ مِنَ الشِّعْرِ حِكْمَةً”. رَوَاهُ الْبُخَارِيُّ

4784. (2) [3/1350దృఢం]

ఉబయ్‌ బిన్‌ క’అబ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం: ”కొన్ని కవిత్వాలు వివేకపూరితంగా ఉంటాయి.” [23]  (బు’ఖారీ)

4785 – [ 3 ] ( صحيح ) (3/1350)

وَعَنِ ابْنِ مَسْعُوْدٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “هَلَكَ الْمُتَنَطِّعُوْنَ”. قَالَهَا ثَلَاثًا. رَوَاهُ مُسْلِمٌ

4785. (3) [3/1350 దృఢం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ మస్‌’ఊద్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మాటల ద్వారా, పదాల ద్వారా ప్రభావానికి గురి చేసేవారు నాశనం అయ్యారు.” ఇలా మూడుసార్లు పలికారు. (ముస్లిమ్‌)

4786 – [ 4 ] ( متفق عليه ) (3/1350)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “أَصْدَقُ كَلِمَةٍ قَالَهَا الشَّاعِرُ كَلِمَةُ لَبِيْدٍ: أَلَا كُلُّ شَيْءٍ مَا خَلَا اللهَ بَاطِلُ”.

4786. (4) [3/1350ఏకీభవితం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”కవుల్లో ఎవరైనా మంచిమాట అని ఉంటే అది లబీద్‌ చెప్పిన మాటే అన్నికంటే సత్యమైనదని చెప్ప వచ్చును. అంటే అల్లాహ్‌ (త) తప్ప ఇతరులందరూ నాశం అయ్యేవారే.” [24]  (బు’ఖారీ, ముస్లిమ్‌)

4787 – [ 5 ] ( صحيح ) (3/1350)

وَعَنْ عَمْرِوبْنِ الشَّرِيْدِ عَنْ أَبِيْهِ قَالَ: رَدِفْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يَوْمًا فَقَالَ: “هَلْ مَعَكَ مِنْ شِعْرِ أُمَيَّةَ بْنِ أَبِي الصَّلَتِ شَيْءٌ؟ “قُلْتُ: نَعَمْ. قَالَ:”هِيْهِ “فَأَنْشَدْتُّهُ بَيْتًا. فَقَالَ: “هِيْهِ” ثُمَّ أَنْشَدْتُّهُ بَيْتًا فَقَالَ: “هِيْهِ” ثُمَّ أَنْشَدْتُّهُ مِائَةَ بَيْتٍ. رَوَاهُ مُسْلِمٌ. 

4787. (5) [3/1350దృఢం]

‘అమ్ర్‌ బిన్‌ షురైద్‌ తన తండ్రి ద్వారా కథనం: ఒక రోజు నేను వాహనంపై ప్రవక్త (స) వెనుక కూర్చున్నాను. ప్రవక్త (స) నాతో, ‘ఉమయ్య బిన్‌ ‘సల్త్‌ కవిత్వాలు ఏవైనా గుర్తున్నాయా?’ అని అన్నారు. దానికి నేను ‘అవును’ అని అన్నాను. ప్రవక్త (స), ‘అయితే వినిపించు,’ అని అన్నారు. నేను ఒక పద్యం వినిపించాను, ‘ఇంకా వినిపించు,’ అన్నారు. నేను వినిపించాను. ప్రవక్త (స), ‘ఇంకా వినిపించు,’ అని అన్నారు. ప్రవక్త (స), అలా అంటూ ఉన్నారు, నేను వినిపిస్తూ పోయాను. చివరికి నేను 100 పద్యాలు వినిపించాను. [25]   (ముస్లిమ్‌)

4788 – [ 6 ] ( متفق عليه ) (3/1351)

وَعَنْ جُنْدُبٍ: أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم كَانَ فِيْ بَعْضِ الْمَشَاهِدِ وَقَدْ دَمِيَتْ أَصْبَعُهُ فَقَالَ: هَلْ أَنْتِ إِلَّا أصْبَعٌ دَمِيْتِ وَفِيْ سَبِيْلِ اللهِ مَا لَقِيْتِ.

4788. (6) [3/1351 ఏకీభవితం]

జున్‌దుబ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ఒక యుద్ధంలో పాల్గొన్నారు. ప్రవక్త (స) చేతివ్రేలు గాయపడింది. రక్తం కార సాగింది. అప్పుడు ప్రవక్త (స) తన్నుతాను ఓదార్చుతూ ఇలా కవిత్వం చెప్పారు. ”ఓ వ్రేలు నీవు నా శరీరంలోని ఒక భాగానివి , నీపై ఆపద వచ్చింది, రక్తసిక్తం అయ్యావు. నీవు దైవమార్గంలో పాల్గొన్నావు, సహనం వహించు, దైవం వద్ద పుణ్యం లభిస్తుంది.” (బు’ఖారీ, ముస్లిమ్‌)

4789 – [ 7 ] ( متفق عليه ) (3/1351)

وَعَنِ الْبَرَاءِ قَالَ: قَالَ النَّبِيُّ صلى الله عليه وسلم يَوْمَ قُرَيْظَةَ لِحَسَّانَ بْنِ ثَابِتِ: “أُهْجُ الْمُشْرِكِيْنَ فَإِنَّ جِبْرِيْلَ مَعَكَ”. وَكَانَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ لِحَسَّانَ : “أَجِبْ عَنِّيْ اللّهُمَّ أَيِّدَهُ بِرُوْحِ الْقُدُسِ”. 

4789. (7) [3/1351ఏకీభవితం]

బరా’ (ర) కథనం: ప్రవక్త (స) ఖురై”జహ్ దినమున, హస్సాన్‌ బిన్‌ సా’బిత్‌ను కవిత్వంలో అవిశ్వా సులను చీవాట్లు పెట్టు, జిబ్రీల్‌ (అ) నీకు సహాయం చేస్తారు,’ అని అన్నారు. ఇంకా ప్రవక్త (స) ‘హస్సాన్‌ తో, నా తరఫున అవిశ్వాసులకు సమాధానం ఇవ్వ మని చెప్పేవారు. ఆ తరువాత ప్రవక్త (స) ‘హస్సాన్‌ కొరకు ”ఓ అల్లాహ్‌! జిబ్రీల్‌ ద్వారా ‘హస్సాన్‌కు సహాయం చేయి” అని ప్రార్థించేవారు. (బు’ఖారీ, ముస్లిమ్‌)

4790 – [ 8 ] ( صحيح ) (3/1351)

وَعَنْ عَائِشَةَ رَضِيَ اللهُ عَنْهَا أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم قَالَ: “أُهْجُوْا قُرَيْشًا فَإِنَّهُ أَشَدُّ عَلَيْهِمْ مِنْ رَشْقِ النَبْلِ”. رَوَاهُ مُسْلِمٌ.

4790. (8) [3/1351దృఢం]

‘ఆయి’షహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) యుద్ధంలో తమ కవులతో మీరు ఖురైషులను విమర్శించండి. అవి ఖురైషులకు గాయాలకంటే వ్యధాభరితంగా ఉంటాయి. (ముస్లిమ్‌)

4791 – [ 9 ] ( صحيح ) (3/1351)

وَعَنْهَا قَالَتْ: سَمِعْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ لِحَسَّانَ: “إِنَّ رُوْحَ الْقُدُسِ لَا يَزَالُ يُؤَيِّدُكَ مَا نَافَحْتَ عَنِ اللهِ وَرَسُوْلِهِ”. سَمِعْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ: “هَجَاهُمْ حَسَّانُ فَشَفَى وَاشْتَفَى”. رَوَاهُ مُسْلِمٌ .

4791. (9) [3/1351దృఢం]

‘ఆయి’షహ్‌ (ర) కథనం: నేను ప్రవక్త (స)ను ‘హస్సాన్‌తో ‘ఓ ‘హస్సాన్‌! నువ్వు అల్లాహ్‌, ఆయన ప్రవక్తల కోసం అవిశ్వాసులను విమర్శిస్తున్నంత వరకు, జిబ్రీల్‌ (అ) నీకు సహాయం చేస్తూ ఉంటారు,’ అని అనటం విన్నాను.  ఇంకా ప్రవక్త (స) ‘హస్సాన్‌(ర) అవిశ్వాసులను విమర్శించినందుకు ముస్లిములకు, ఆయనకు స్వస్థత ప్రసాదించటం జరిగింది. అంటే ‘హస్సాన్‌ (ర) అవిశ్వాసులను విమర్శించటం వల్ల ముస్లిములకు మనశ్శాంతి లభించింది,” అని కూడా అనటం విన్నాను. (ముస్లిమ్‌)

4792 – [ 10 ] ( متفق عليه ) (3/1351)

وَعَنِ الْبَرَاءِ قَالَ: كَانَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم يَنْقُلُ التُّرَابَ يَوْمَ الْخَنْدَقِ حَتَّى اغْبَرَّ بَطْنُهُ يَقُوْلُ: وَاللهِ لَوْلَا اللهُ مَا اهْتَدَيْنَا وَلَا تَصَدَّقْنَا وَلَا صَلَّيْنَا فَأَنْزِلَنْ سَكِيْنَةً عَلَيْنَا وَثَبِّتِ الْأَقْدَامَ إِنْ لَاقَيْنَا إِنَّ الْأَوْلَى قَدْ بَغَوْا عَلَيْنَا إِذَا أَرَادُوْا فِتْنَةً أَبَيْنَا يَرْفَعُ بِهَا صَوْتَهُ: “أَبَيْنَا أَبَيْنَا”

4792. (10) [3/1351 ఏకీభవితం]

బరా’ (ర) కథనం: కందకయుద్ధంలో ప్రవక్త (స) మట్టి విసురుతూ ఉన్నారు. ప్రవక్త (స) శరీరమంతా మట్టి మయం అయిపోయింది. ప్రవక్త(స) ఇలా పలకసాగారు. ”అల్లాహ్ సాక్షి! ఒకవేళ అల్లాహ్‌ (త) మాకు సన్మార్గం చూపకుండా ఉంటే, మేము సన్మార్గం పొందే వాళ్ళము కాము, దానధర్మాలు చేసేవాళ్ళం కాము, నమా’జ్‌ చదివేవాళ్ళం కాము. ‘ఓ అల్లాహ్‌! మాకు శాంతి, స్థిమితాలను ప్రసాదించు. ఇంకా శత్రువులతో పోరాడి నపుడు మాకు స్థిరత్వాన్ని ప్రసాదించు. వాళ్ళు మమ్మల్ని కల్లోలాలకు గురి సినా, అవిశ్వాసం వైపునకు పిలిచినా మేము తిరస్కరిస్తాం.’ ప్రవక్త (స) తిరస్కార పదం అనేకసార్లు, బిగ్గరగా పలికారు.” (బు’ఖారీ, ముస్లిమ్‌)

4793 – [ 11 ] ( متفق عليه ) (3/1352)

وَعَنْ أَنَسٍ قَالَ: جَعَلَ الْمُهَاجِرُوْنَ وَالْأَنْصَارُ يَحْفِرُوْنَ الْخَنْدَقَ وَ يَنْقُلُوْنَ التُّرَابَ وَهُمْ يَقُوْلُوْنَ: نَحْنث الَّذِيْنَ بَايَعُوْا مُحَمَّدًا عَلَى الْجِهَادِمَا بَقِيْنَا أَبَدًا يَقُوْلُ النَّبِيُّ صلى الله عليه وسلم وَهُوَ يُجِيْبُهُمْ: اَللّهُمَّ لَاعَيْشَ إِلَّا عَيْشُ الْآخِرَةِ فَاغْفِرْلِلْأَنْصَارِ وَالْمُهَاجِرَةِ. متفق عليه.

4793. (11) [3/1352 ఏకీభవితం]

అనస్‌ (ర) కథనం: కందక యుద్ధంలో ముహాజిరీన్లు అ’న్సార్లు కందకం త్రవ్వుతున్నారు. మట్టి ఎత్తి విసురుతూ ఇలా అనేవారు, ”మేము ము’హమ్మద్‌ (స) చేతిపై ఇస్లామ్‌ స్వీకరించిన వాళ్ళం. మేము బ్రతికున్నంత వరకు జిహాద్‌ చేస్తూ ఉంటాము.”  ప్రవక్త (స) కూడా వారికి సమాధానంగా ఇలా అనేవారు: ”ఓ అల్లాహ్‌! అసలైన విలాసం పరలోక విలాసమే, అ’న్సార్లను ముహాజిరీన్లను క్షమించు.” ఈ ‘హదీసు’లో ప్రవక్త (స) అనుచరులకు ఆపదలలో సహనం వహించమని ఆదేశించటం జరిగింది. (బు’ఖారీ, ముస్లిమ్‌)

4794 – [ 12 ] ( متفق عليه ) (3/1352)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَأَنْ يَّمْتَلِىءَ جَوْفُ رَجُلٍ قَيْحًا يَرِيْهِ خَيْرٌ مِنْ أَنْ يَّمْتَلِئَ شِعْرًا”.

4794. (12) [3/1352ఏకీభవితం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ఇలా ప్రవచించారు, ”ఒక వ్యక్తి కవిత్వాల ద్వారా తన కడుపు నింపటం కంటే చీముద్వారా తన కడుపునింపడమే మేలు.” [26] (బు’ఖారీ, ముస్లిమ్‌)

—–

اَلْفَصْلُ الثَّانِيْ  రెండవ విభాగం 

4795 – [ 13 ] ( صحيح ) (3/1352)

عَنْ كَعْبِ بْنِ مَالِكٍ أَنَّهُ قَالَ لِلنَّبِيِّ صلى الله عليه وسلم: إِنَّ اللهَ تَعَالى قَدْ أَنْزَلَ فِي الشِّعْرِمَا أَنْزَلَ. فَقَالَ النَّبِيُّ صلى الله عليه وسلم: “إِنَّ الْمُؤْمِنَ يُجَاهِدُ بِسَيْفِهِ وَلِسَانِهِ وَالَّذِيْ نَفْسِيْ بِيَدِهِ لَكَأَنَّمَا تَرْمُوْنَهُمْ بِهِ نَضْحَ النَّبْلِ”. رَوَاهُ فِيْ شَرْحِ السُّنَّةِ.

وَفِيْ “الْاِسْتِيْعَابِ” لِاِبْنِ عَبْدِ الْبَرِّ أَنَّهُ قَالَ: يَا رَسُوْلَ اللهِ مَاذَا تَرَى فِي الشِّعْرِ؟ فَقَالَ: “إِنَّ الْمُؤْمِنَ يُجَاهِدُ بِسَيْفِهِ وَلِسَانِهِ”

4795. (13) [3/1352 దృఢం]

క’అబ్‌ బిన్‌ మాలిక్‌ (ర) ‘ప్రవక్త (స) తో, అల్లాహ్‌ (త) కవిత్వం గురించి ఏమి అవతరింపజేసాడు?’ అని అన్నారు. దానికి ప్రవక్త (స) ”విశ్వాసి తన కరవాలంతో జిహాద్‌ చేస్తాడు, ఇంకా తన నోటితో జిహాద్‌ చేస్తాడు, ఎవరి చేతిలో నా ప్రాణం ఉందో ఆ అల్లాహ్ సాక్షి! నీవు అవిశ్వాసులను బాణాలతో కొట్టినట్టు కవిత్వాలతో కొట్టి చంపుతున్నావు.” అని అన్నారు. [27] (షర్’హుస్సున్నహ్‌)

ఇస్తీ’ఆబ్‌లో ఇలా ఉంది, ”క’అబ్‌ బిన్‌ మాలిక్‌ (ర) ఓ ప్రవక్తా! కవిత్వం గురించి మీ అభిప్రాయం ఏమిటి” అని అన్నారు. అప్పుడు ప్రవక్త (స) ”విశ్వాసి తన కరవా లంతో, తన నోటితో జిహాద్‌ చేస్తాడు,” అని అన్నారు.

4796 – [ 14 ] ( لم تتم دراسته ) (3/1352)

وَعَنْ أَبِيْ أُمَامَةَ عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ: “اَلْحَيَاءُ وَالْعِيُّ شُعْبَتَانِ مِنَ الْإِيْمَانِ وَالْبَذَاءُ وَالْبَيَانُ شُعْبَتَانِ مِنَ النِّفَاقِ”. رَوَاهُ التِّرْمِذِيُّ

4796. (14) [3/1352అపరిశోధితం]

అబూ ఉమామహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”సిగ్గు, అసభ్య, అశ్లీల విషయాల నుండి దూరంగా ఉండం, విశ్వాసగుణాల్లోని రెండుగుణాలు. ఇంకా అసభ్య అశ్లీల విషయాలను పలకడం కాపట్య గుణాల్లోని రెండు గుణాలు.” [28] (తిర్మిజీ’)

4797 – [ 15 ] ( لم تتم دراسته ) (3/1352)

وَعَنْ أَبِيْ ثَعْلَبَةَ الْخُشَنِيِّ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم قَالَ: “إِنَّ أَحَبَّكُمْ إِلَيَّ وَأَقْرَبَكُمْ مِنِّيْ يَوْمَ الْقِيَامَةِ أَحَاسِنُكُمْ أَخْلَاقًا وَإِنَّ أَبْغَضَكُمْ إِلَيَّ وَأَبْعَدَكُمْ مِنِّيْ مَسَاوِيْكُمْ أَخْلَاقًا الثَّرْثَارُوْنَ الْمُتَشَدِّقُوْنَ الْمُتَفَيْقِهُوْنَ”. رَوَاهُ الْبَيْهَقِيُّ فِيْ”شُعَبِ الْإِيْمَانِ” .

4797. (15) [3/1352అపరిశోధితం]

అబూ స’అలబ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”తీర్పుదినం నాడు ఉత్తమగుణాలు గలవారే నాకు అందరికంటే సన్నిహితులు, సాన్నిహిత్యం గలవారుగా ఉంటారు. ఇంకా దుర్గుణాలు గలవారు, అహం కారులూ, వ్యర్థ ప్రేలాపనలు చేసేవారు నాకు అందరి కంటే దూరంగా ఉంటారు. (బైహఖీ/షు’అబిల్ ఈమాన్)

4798 – [ 16 ] ( لم تتم دراسته ) (3/1353)

وَرَوَى التِّرْمِذِيُّ نَحْوَهُ عَنْ جَابِرٍوَفِيْ رِوَايَتِهِ قَالُوْا: يَا رَسُوْلَ اللهِ قَدْ عَلِمْنَا الثَّرْثَارُوْنَ وَالْمُتَشَدِّقُوْنَ فَمَا الْمُتَفَيْقِهُوْنَ؟ قَالَ: “اَلْمُتَكَبِّرُوْنَ”.

4798. (16) [3/1353అపరిశోధితం]

ఒక ఉల్లేఖనంలో ఇలా ఉంది: ”అనుచరులు అది విని, ‘ఓ ప్రవక్తా! దుర్జనులు, అహంకారులు అంటే మాకు అర్థం అయిపోయింది. కాని ముతఫైఖిహూన్‌ అంటే ఎవరు’ అని విన్నవించుకున్నారు. దానికి ప్రవక్త (స) ‘అహంకారులు,’ అని అన్నారు. (తిర్మిజీ’)

4799 – [ 17 ] ( حسن ) (3/1353)

وَعَنْ سَعْدِ بْنِ أَبِيْ وَقَاصٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَا تَقُوْمُ السَّاعَةُ حَتَّى يَخْرُجَ قَوْمٌ يَأْكُلُوْنَ بِأَلْسِنَتِهِمْ كَمَا تَأْكُلُ الْبَقَرَةُ بِأَلْسِنَتِهَا”. رَوَاهُ أَحْمَدُ

4799. (17) [3/1353 ప్రామాణికం]

స’అద్‌ బిన్‌ అబీ వఖ్ఖా’స్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం: ”ఆవు తన నోటితో తిన్నట్టు, తమ నోటితో తినేవారు జన్మించనంత వరకు ప్రళయం సంభవించదు.” [29]  (అ’హ్మద్‌)

4800 – [ 18 ] ( لم تتم دراسته ) (3/1353)

وَعَنْ عَبْدِ اللهِ بْنِ عُمَرَ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم قَالَ: “إِنَّ اللهَ يُبْغِضُ الْبَلِيْغَ مِنَ الرِّجَالِ الَّذِيْ يَتَخَلَّلُ بِلِسَانِهِ كَمَا يَتَخَلَّلُ الْبَاقِرَةُ بِلِسَانِهَا”. رَوَاهُ التِّرْمِذِيُّ وَأَبُوْدَاوُدَ. وَقَالَ التِّرْمِذِيُّ: هَذَا حَدِيْثٌ غَرِيْبٌ. 

4800. (18) [3/1353అపరిశోధితం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘ఉమర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”తన నోటి దురుసుతనం ద్వారా సంపాదించే వ్యక్తిని అల్లాహ్‌ (త) తన శత్రువుగా భావిస్తాడు. అంటే తన నోటి దురుసుతనం ద్వారా ప్రజల మెప్పు పొందుతాడు. ప్రసంగాలు, కవిత్వాల ద్వారా సంపా దిస్తాడు. ఎందుకంటే ఆవు కూడా తన నోరు ఆడిస్తూ తింటుంది.” (తిర్మిజీ’ / ఏకోల్లేఖనం, అబూ  దావూద్‌)

4801 – [ 19 ] ( ضعيف ) (3/1353)

وَعَنْ أَنَسٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَرَرْتُ لَيْلَةَ أُسْرِيَ بِيْ بِقَوْمٍ تُقْرَضُ شِفَاهُهُمْ بِمَقَارِيْضَ النَّارَ فَقُلْتُ: يَا جِبْرِيْلُ مَنْ هَؤُلَاءِ؟ قَالَ: هَؤُلَاءِ خُطَبَاءُ أُمَّتِكَ الَّذِيْنَ يَقُوْلُوْنَ مَا لَا يَفْعَلُوْنَ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَقَالَ: هَذَا حَدِيْثٌ غَرِيْبٌ.

4801. (19) [3/1353 బలహీనం]

అనస్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మేరాజ్‌ రాత్రి నేను కొంతమందిని చూసాను. వారి పెదాలను అగ్ని కత్తెరల ద్వారా కోయటం జరుగుతూ ఉంది. నేను జిబ్రీల్‌ (అ)ను ‘వీరెవరు’ అని అడిగాను. దానికి అతను(అ) ‘మీ అనుచర సమాజానికి చెందిన ఉపన్యాసకులు, బోధకులు. వీరు ప్రజలకు బోధించే వారు, కాని తాము మాత్రం ఆచరించేవారు కారు,’ అని అన్నారు. (తిర్మిజీ’ / ఏకోల్లేఖనం)

4802 – [ 20 ] ( ضعيف ) (3/1353)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَنْ تَعلَّمَ صَرْفَ الْكَلَامِ لِيَسْبِيَ بِهِ قُلُوْبَ الرِّجَالِ أَوِ النَّاسِ لَمْ يَقْبَلِ اللهُ مِنْهُ يَوْمَ الْقِيَامَةِ صَرْفًا وَلَا عَدْلًا”.  رَوَاهُ أَبُوْ دَاوُدَ.  

4802. (20) [3/1353 బలహీనం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ప్రజల హృదయాలను దోచుకోవటానికి, వారి ప్రసంశలు పొందటానికి మాటకారితనం నేర్చుకున్న వ్యక్తి యొక్క విధి ఆరాధనలైనా, అదనపు ఆరాధనలైనా తీర్పుదినం నాడు అల్లాహ్‌ (త) స్వీకరించడు.”  (అబూ  దావూద్‌)

4803 – [ 21 ] ( لم تتم دراسته ) (3/1354)

وَعَنْ عَمْرِو بْنِ الْعَاصِ أَنَّهُ قَالَ يَوْمًا وَقَامَ رَجُلٌ فَأَكْثَرَ الْقَوْلَ. فَقَالَ عَمْرٌو: لَوْ قَصَدَ فِيْ قَوْلِهِ لَكَانَ خَيْرًا لَهُ. سَمِعْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ: “لَقَدْ رَأَيْتُ – أَوْ أُمِرْتُ – أَنْ أَتَجَوَّزَ فِي الْقَوْلِ فَإِنَّ الْجَوَازَ هُوَ خَيْرٌ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ.  

4803. (21) [3/1353 అపరిశోధితం]

‘అమ్ర్‌ బిన్‌ ‘ఆ’స్‌ (ర) కథనం: ఒకవ్యక్తి చాలా ప్రభావ పూరితమైన ప్రసంగం చేసాడు. ‘అమ్ర్‌, అతనితో ప్రసంగం మధ్యస్థంగా ఉంటే బాగుండు,’ అని అన్నారు. ప్రవక్త (స) ”ప్రసంగంలో మధ్యేమార్గాన్ని పాటించమని నేను ఆదేశించబడ్డాను” అని అనటం నేను విన్నాను. ఎందుకంటే ప్రసంగాన్ని సంక్షిప్తంగా చేయడమే మంచిది” అని అన్నారు.  (అబూ  దావూద్‌)

4804 – [ 22 ] ( ضعيف ) (3/1354)

وَعَنْ صَخْرِ بْنِ عَبْدِ اللهِ بْنِ بُرَيْدَةَ عَنْ أَبِيْهِ عَنْ جَدِّهِ قَالَ: سَمِعْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ: “إِنَّ مِنَ الْبَيَانِ سِحْرًا وَإِنَّ مِنَ الْعِلْمَ جَهْلًا وَإِنَّ مِنَ الشِّعْرِ حِكَمًا وَإِنَّ مِنَ الْقَوْلِ عِيَالًا”. رَوَاهُ أَبُوْ دَاوُدَ.

4804. (22) [3/1354బలహీనం]

‘స’ఖ్‌ర్‌ బిన్‌ ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ బురైదహ్ తన తండ్రి తాతల ద్వారా కథనం: ప్రవక్త (స) ఇలా అంటూ ఉండగా నేను విన్నాను, ”కొన్ని ప్రసంగాలు చేతబడిలా ప్రభావ పూరితంగా ఉంటాయి. కొన్ని విద్యలు అజ్ఞానానికి కారణ భూతమౌతాయి. కొన్ని కవిత్వాల్లో వివేకం ఉంటుంది. కొన్ని మాటలు ప్రాణం పైకి తెస్తాయి.” [30]  (అబూ  దావూద్‌)

—–

الْفَصْلُ الثَّالِثُ   మూడవ విభాగం 

4805 – [ 23 ] ( صحيح ) (3/1354)

عَنْ عَائِشَةَ قَالَتْ: كَانَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم يَضَعُ لِحَسَّانَ مِنْبَرًا فِي الْمَسْجِدِ يَقُوْمُ عَلَيْهِ قَائِمًا يُفَاخِرُ عَنْ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم أَوْيُنَافِحُ. وَيَقُوْلُ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِنَّ اللهَ يُؤَيِّدُ حَسَّانَ بِرُوْحِ الْقُدُسِ مَا نَافَحَ أَوْ فَاخَرُ عَنْ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم”. رَوَاهُ الْبُخَارِيُّ.  

4805. (23) [3/1354దృఢం]

‘ఆయి’షహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ‘హస్సాన్‌ (ర) కోసం మస్జిద్‌లో మెంబరు పెట్టించేవారు. దానిపై అతను నిలబడి ప్రవక్త (స) తరఫున అవిశ్వాసుల కవిత్వాలకు సమాధానం ఇచ్చేవారు. ఇంకా తన కవిత్వాల ద్వారా గర్వాన్ని ప్రదర్శించేవారు. ప్రవక్త (స), ‘హస్సాన్‌ (ర) – ప్రవక్త (స) సమర్థనలో – అవిశ్వాసులపై గర్వం ప్రదర్శిస్తున్నంతవరకు జిబ్రీల్‌(అ) అతనికి సహాయం చేస్తూ ఉంటారు,’ అని అన్నారు. (బు’ఖారీ)

4806 – [ 24 ] ( متفق عليه ) (3/1355)

وَعَنْ أَنَسٍ قَالَ: كَانَ لِلنَّبِيِّ حَادٍ يُقَالُ لَهُ: أَنْجِشَةُ وَكَانَ حَسَنَ الصَّوْتِ. فَقَالَ لَهُ النَّبِيُّ صلى الله عليه وسلم: “رُوَيْدَكَ يَا أَنْجِشَةُ لَا تَكْسِرِ الْقَوَارِيْرَ”.  قَالَ قَتَادَةُ: يَعْنِيْ ضَعْفَةَ النِّسَاءِ.

4806. (24) [3/1355 ఏకీభవితం]

అనస్‌ (ర) కథనం: ప్రవక్త (స) వద్ద ఒక ఒంటెలను తోలే వాడు ఉండేవాడు. అతని పేరు అన్జషహ్. అతని గొంతు చాలా మనోహరంగా ఉండేది. ప్రవక్త (స) అతనితో, ‘ఓ అన్జషహ్ ఒంటెలను మెల్లగా తోలు, అద్దాలను విరవకు అంటే స్త్రీలను,’ అని అన్నారు.[31]  (బు’ఖారీ, ముస్లిం)

4807 – [ 25 ] ( حسن ) (3/1355)

وَعَنْ عَائِشَةَ رَضِيَ اللهُ عَنْهَا قَالَتْ: ذُكِرَ عِنْدَ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم الشِّعْرُ. فَقَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “هُوَ كَلَامٌ فَحَسَنُهُ حَسَنٌ وَقَبِيْحُهُ قَبِيْحٌ”. رَوَاهُ الدَّارَقُطْنِيُّ.  

4807. (25) [3/1355ప్రామాణికం]

‘ఆయి’షహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ముందు కవి త్వం గురించి మాట్లాడటం జరిగింది. అప్పుడు ప్రవక్త (స), ‘అది మంచివిద్యే. మంచి కవిత్వం మంచిదే, చెడ్డ కవిత్వం చెడ్డదే. అంటే దాని అంశం మంచిది లేదా చెడ్డదవుతుంది,’ అని అన్నారు. (దారు ఖుతునీ)

4808 – [ 26 ] ( لم تتم دراسته ) (3/1355)

وَرَوَى الشَّافِعِيُّ عَنْ عُرْوَةَ مُرْسَلًا  

4808. (26) [3/1355 అపరిశోధితం]

ఇమామ్‌ షాఫ’యీ దీన్ని ఉర్‌వహ్‌ ద్వారా తాబయీ ప్రోక్తంగా ఉల్లేఖించారు.

4809 – [ 27 ] ( صحيح ) (3/1355)

وعَنْ أَبِيْ سَعِيْدِ الْخُدْرِيِّ قَالَ: بَيْنَا نَحْنُ نَسِيْرُ مَعَ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم بِالْعَرْجِ. إِذْ عَرَضَ شَاعِرٌ يُنْشِدُ. فَقَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “خُذُوْا الشَّيْطَانَ أَوْ أَمْسِكُوْا الشَّيْطَانَ. لَأَنْ يَّمْتَلِئَ جَوْفُ رَجُلٍ قَيْحًا خَيْرٌ لَهُ مِنْ أَنْ يَّمْتَلِئَ شِعْرًا”. رَوَاهُ مُسْلِمٌ.  

4809. (27) [3/1355 దృఢం]

అబూ స’యీద్‌ ‘ఖుద్రీ (ర) కథనం: మేము ప్రవక్త (స) వెంట అరబ్‌ ప్రాంతానికి వెళుతున్నాము. ఒక కవి కవిత్వం చదువుతూ ప్రవక్త (స) ప్రక్కనుండి వెళ్ళాడు. ప్రవక్త (స) అతని అశ్లీల కవిత్వం విని, ‘ఆ షై’తాన్‌ను పట్టుకోండి,’ అని అన్నారు. ‘ఎందుకంటే మనిషి తన కడుపును కవిత్వంతో నింపటం కంటే చీము నెత్తు రుతో నింపటం మంచిది,’ అని అన్నారు. (ముస్లిమ్‌)

4810 – [ 28 ] ( ضعيف ) (3/1355)

وعَنْ جَابِرٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “اَلْغِنَاءُ يُنْبِتُ النِّفَاقَ فِي الْقَلْبِ كَمَا يُنْبِتُ الْمَاءُ الزَّرْعَ”. رَوَاهُ الْبَيْهَقِيُّ فِيْ ” شُعَبِ الْإِيْمَانِ.”

4810. (28) [3/1355 బలహీనం]

జాబిర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం: పాటలు హృదయంలో కాపట్యాన్ని జనింపజేస్తాయి. నీరు పొలాన్ని పండించినట్లు. (బైహఖీ-షు’అబిల్ ఈమాన్)

4811 – [ 29 ] ( حسن ) (3/1355)

وعَنْ نَافِعِ رَحِمَهُ اللهُ قَالَ: كُنْتُ مَعَ اِبْنِ عُمَرَفِيْ طَرِيْقِ فَسَمِعَ مِزْمَارًا فَوَضَعَ أَصْبَعَيْهِ فِيْ أُذُنَيْهِ وَنَاءَ عَنِ الطَّرِيْقِ إِلى الْجَانِبِ الْآخَرِ. ثُمَّ قَالَ لِيْ بَعْدَ أَنْ بَعُدَ: يَا نَافِعُ هَلْ تَسْمَعُ شَيْئًا ؟ قُلْتُ: لَا. فَرَفَعَ أَصْبَعَيْهِ عَنْ أُذْنَيْهِ قَالَ: كُنْتُ مَعَ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم فَسَمِعَ صَوْتَ يَرَاعٍ فَصَنَعَ مِثْلَ مَا صَنَعْتُ. قَالَ نَافِعُ: فَكُنْتُ إِذْ ذَاكَ صَغِيْرًا. رَوَاهُ أَحْمَدُ وَأَبُوْ دَاوُدَ.  

4811. (29) [3/1355 ప్రామాణికం]

నాఫె’అ (ర) కథనం: నేను ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘ఉమర్‌ (ర) వెంట నడుస్తున్నాను. దారిలో ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘ఉమర్‌ (ర) పిల్లనగ్రోవి శబ్దం విన్నారు. వెంటనే తన చెవులను వేళ్ళతో మూసుకున్నారు. అక్కడి నుండి కొంత జరిగి నడవసాగారు. చాలాదూరం వెళ్ళిన తర్వాత, ‘ఏదైనా శబ్దం వస్తుందా?’ అని అడిగారు. నేను, ‘లేదు’ అని అన్నాను. అప్పుడు అతను చెవుల నుండి తన వేళ్ళను తీసి, ‘నేను ప్రవక్త (స) వెంట వెళ్ళాను. దారిలో పిల్లనగ్రోవి శబ్దం విని ప్రవక్త (స) కూడా నేను ఎలా చేసానో అలాగే చేసారు,’ అని అన్నారు. ‘అప్పుడు నేను చిన్న వాడ్ని,’ అని  నాఫె’ అన్నారు. (అ’హ్మద్‌, అబూ  దావూద్‌)

=====

10 بَابُ حِفْظِ اللِّسَانِ وَالْغِيْبَةِ وَالشَّتْمِ

10. నోటిని అదుపులోఉంచుకోవటం, పరోక్షనింద, దూషణలు

నాలుక మన జీవితంలో ప్రధాన పాత్ర వహిస్తుంది. దీని ద్వారా మనం మాట్లాడుతాం. రుచులు చూస్తాం. దీని ద్వారానే మన మనోభావాల్ని వ్యక్తం చేస్తాం. మనలా మాట్లాడలేని వారిని మూగవారు అంటాం. ఇదొక పెద్ద దైవ ప్రసాదం. బుద్ధీ, మనసుల భావాల్ని ఇతరుల వరకు అనువదిస్తుంది. ఖుర్‌ఆన్‌లో అల్లాహ్‌ (త) ఇలా ఆదేశించాడు: ”ఏమీ మేము అతనికి రెండు కళ్ళు ఇవ్వలేదా?  మరియు నాలుకను మరియు రెండు పెదవులను?” (అల్ బలద్, 90:8-9)

దైవానుగ్రహాల్లో నాలుక కూడా ఒక గొప్ప అనుగ్రహం, మన మనసులోని భావాల్ని ఇతరుల ముందు వ్యక్తం చేస్తాం, దైవగ్రంథం పఠిస్తాం, దైవధ్యానం చేస్తాం, ఇతరులకు బోధిస్తాం. జంతువులకు, మానవు లకు ఈ నాలుకవల్లే ఉంది. ఒకవేళ నాలుకను పరి రక్షిస్తే దానివల్ల అనేక లాభాలు ఉన్నాయి. ఒకవేళ దాన్ని పరరక్షించక పోతే దానివల్ల అనేక ఉపద్రవాలు, కల్లోలాలు, కలహాలు తలెత్తుతాయి. ఖుర్‌ఆన్‌, ‘హదీసు’ల్లో నోటి పరిరక్షణ గురించి అనేక విధాలుగా గుర్తుచేయడం, గుచ్చి చెప్పటం  జరిగింది. క్రింది  ‘హదీసు’లను చదవండి.

اَلْفَصْلُ الْأَوَّلُ  మొదటి విభాగం 

4812 – [ 1 ] ( صحيح ) (3/1356)

عَنْ سَهْلِ بْنِ سَعْدٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَنْ يَضْمَنْ لِيْ مَا بَيْنَ لَحْيَيْهِ وَمَا بَيْنَ رِجْلَيْهِ أَضْمَنْ لَهُ الْجَنَّةَ”. رَوَاهُ الْبُخَارِيُّ.  

4812. (1) [3/1356 దృఢం]

సహల్‌ బిన్‌ స’అద్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవ చనం, ”రెండు పెదాల మధ్య ఉన్నదాని మరియు రెండు కాళ్ళ మధ్య ఉన్న దాని పరిరక్షణ గ్యారంటీ ఇచ్చిన వారికి నేను స్వర్గం గ్యారంటీ  ఇస్తాను.” (బు’ఖారీ)

4813 – [ 2 ] ( صحيح ) (3/1356)

وَعَنْ أَبِيْ هُرْيَرَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِنَّ الْعَبْدَ لَيَتَكَلُّمُ بِالْكَلِمَةِ مِنْ رِضْوَانِ اللهِ لَا يُلِقْي لَهَا بَالًا يَرْفَعُ اللهُ بِهَا دَرَجَاتٍ. وَإِنَّ الْعَبْدَ لِيتكلمُ بِالْكَلِمَةِ مِّنْ سَخَطِ اللهِ لَا يُلْقِيْ لَهَا بَالًا يَهْوِيْ بِهَا فِيْ جَهَنَّمَ”. رَوَاهُ الْبُخَارِيُّ.

وَفِيْ رِوَايَةِ لَهُمَا: “يَهْوِيْ بِهَا فِي النَّارِ أَبْعَدَ مَا بَيْنَ الْمَشْرِقِ وَالْمَغْرِبِ”.

4813. (2) [3/1356 దృఢం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”దాసుడు ఒక్కోసారి అన్నమాటలకు అల్లాహ్(త) చాలా సంతోషిస్తాడు. దానివల్ల అల్లాహ్‌ (త) అతని తరగతులు ఉన్నతం చేస్తాడు. కాని ఒక్కోసారి దాసుడు ఆలోచించకుండా అన్న మాటకు దైవం చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. దానివల్ల అతన్ని నరకంలో పడవేస్తాడు.[32]  (బు’ఖారీ)

4814 – [ 3 ] ( متفق عليه ) (3/1356)

وَعَنْ عَبْدِ اللهِ بْنِ مَسْعُوْدٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “سِبَابُ الْمُسْلِمِ فَسُوْقٌ وَقِتَالُهُ كُفْرٌ”.

4814. (3) [3/1356 ఏకీభవితం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ మస్‌’ఊద్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం: ”ముస్లిమ్‌ను తిట్టటం పాపం, చంపటం అవిశ్వాసం.” (బు’ఖారీ, ముస్లిం)

అంటే ముస్లిమ్‌ను తిట్టినవాడు పాపాత్ముడవు తాడు, ముస్లిమ్‌ను చంపినవాడు అవిశ్వాసి అయి పోతాడు.

4815 – [ 4 ] ( متفق عليه ) (3/1356)

وَعَنِ ابْنِ عُمَرَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “أَيُّمَا رَجُلٍ قَالَ لِأَخِيْهِ كَافِرٌ فَقَدْ بَاءَ بِهَا أَحَدُهُمَا”. مُتَّفَقٌ عَلَيْهِ.

4815. (4) [3/1356ఏకీభవితం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘ఉమర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవ చనం, ”ఎవరు తన సోదరుణ్ణి అవిశ్వాసి అని అంటారో, వారిద్దరిలో ఒకరు అవిశ్వాసి.” (బు’ఖారీ, ముస్లిం)

అంటే ఒక వేళ ఎవరినైనా అవిశ్వాసి అంటే, అతడు అవిశ్వాసి కాకుంటే చెప్పేవాడు అవిశ్వాసి అయిపోతాడు.

4816 – [ 5 ] ( صحيح ) (3/1356)

وَعَنْ أَبِيْ ذَرٍّ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَا يَرْمِيْ رَجُلٌ رَجُلًا بِالْفُسُوْقِ. وَلَا يَرْمِيْهِ بِالْكُفْرِ إِلَّا ارْتَدَّتْ عَلَيْهِ إِنْ لَّمْ يَكُنْ صَاحِبُهُ كَذِلَكَ”. رَوَاهُ الْبُخَارِيُّ  

4816. (5) [3/1356దృఢం]

అబూ జ’ర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఒకవేళ ఎవరైనా ఒక ముస్లిమ్‌పై అవిశ్వాస, పాపపు నిందవేస్తే, ఒక వేళ అతడు అలా కాకుండా ఉంటే అది తిరిగి నిందవేసిన వ్యక్తిపై పడుతుంది.” (బు’ఖారీ)

  అంటే నిందించబడిన వ్యక్తి దానికి తగిన వాడయితే సరే, లేకుంటే నిందించిన వ్యక్తి పాపాత్ముడు, అవిశ్వాసిగా పరిగణించ బడతాడు.

4817 – [ 6 ] ( متفق عليه ) (3/1357)

وَعَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَنْ دَعَا رَجُلًا بِالْكُفْرِ أَوْ قَالَ: عَدُوَّ اللهِ وَلَيْسَ كَذَلِكَ إِلَّا حَارَ عَلَيْهِ”.

4817. (6) [3/1357ఏకీభవితం]

అబూ జ’ర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఒకవేళ ఎవరైనా ముస్లిమ్‌ను, ‘అవిశ్వాసి లేదా అల్లాహ్(త) శత్రువు’, అని పిలిస్తే, ఒకవేళ అతడు అలా కాకుండా ఉంటే, అది తిరిగి పిలిచిన వానిపై పడుతుంది.” (బు’ఖారీ, ముస్లిం)

4818 -[7] (صَحِيح) (3/1357)

وَعَن أنس وَأَبِي هُرَيْرَةَ أَنَّ رَسُولَ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ: «الْمُسْتَبَّانِ مَا قَالَا فَعَلَى الْبَادِئِ مالم يعْتد الْمَظْلُوم» . رَوَاهُ مُسلم

4818. (7) [3/1357 దృఢం]

అనస్‌, అబూ హురైరహ్‌ (ర)ల  కథనం: ప్రవక్త (స) ప్రవచనం: ”పరస్పరం ఇద్దరు వ్యక్తులు తిట్టుకుంటే, ఇద్దరి పాపం మొదట ప్రారంభించిన వానిపై పడుతుంది. అయితే బాధితుడు హద్దు దాటకుండా ఉండాలి.” (ముస్లిమ్‌)

4819- [ 8 ] ( صحيح ) (3/1357)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم قَالَ: “لَا يَنْبَغِيْ لِصِدِّيْقٍ أَنْ يَّكُوْنَ لَعَّانًا”. رَوَاهُ مُسْلِمٌ.  

4819. (8) [3/1357 దృఢం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఒక ముస్లిమ్‌కు శపించేవాడు కావటం తగదు.” (ముస్లిమ్‌)

4820 – [ 9 ] ( صحيح ) (3/1357)

وَعَنْ أَبِيْ الدَّرْدَاءِ قَالَ: سَمِعْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ: “إِنَّ اللَّعَّانِيْنَ لَا يَكُوْنُوْنَ شُهَدَاءَ وَلَا شُفَعَاءَ يَوْمَ الْقِيَامَةِ”. رَوَاهُ مُسْلِمٌ.

4820. (9) [3/1357 దృఢం]

అబూ దర్‌దా’ (ర) కథనం: నేను ప్రవక్త (స) ను ఇలా ప్రవచిస్తూ ఉండగా విన్నాను, ‘అనవసరంగా ఇతరులను చీవాట్లు, శాపాలు పెట్టేవారు, తీర్పుదినం నాడు సాక్షులుగా గాని, సిఫారసు చేసేవారుగా గాని కాలేరు.” (ముస్లిమ్‌)

4821 – [10] ( صحيح ) (3/1357)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِذَا قَالَ الرَّجُلُ: هَلَكَ النَّاسُ فَهُوَ أَهْلَكُهُمْ”. رَوَاهُ مُسْلِمٌ.

4821. (10) [3/1357దృఢం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం: ‘ప్రజలు నాశనం అయిపోయారు అని’ అన్నవాడు అందరికంటే అధికంగా నాశనం అవుతాడు.” [33] (ముస్లిమ్‌)

4822 – [ 11 ] ( متفق عليه ) (3/1357)

وَعَنْهُ: قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “تَجِدُوْنَ شَرَّ النَّاسِ يَوْمَ الْقِيَامَةِ ذَا الْوَجْهَيْنِ الَّذِيْ يَأْتِيْ هَؤُلَاءِ بِوَجْهٍ وَهَؤُلَاءِ بِوَجْهٍ”.

4822. (11) [3/1357 ఏకీభవితం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”రెండు నాలుకల ధోరణిగల వాళ్ళు తీర్పుదినం నాడు రెండు ముఖాలతో వస్తారు.” [34]

4823 – [ 12 ] ( متفق عليه ) (3/1357)

وَعَنْ حُذَيْفَةُ قَالَ: سَمِعْتُ رَسُوْلَ الله صلى الله عليه وسلم يَقُوْلُ: “لَا يَدْخُلُ الْجَنَّةَ قَتَّاتٌ”.مُتَّفَقٌ عَلَيْهِ. وَفِيْ رِوَايَةٍ مُسْلِمٍ:” نَمَّامٌ ” 

4823. (12) [3/1357ఏకీభవితం]

‘హుజై’ఫహ్ (ర) కథనం: ప్రవక్త (స) ‘చాడీలు చెప్పేవాడు స్వర్గంలో ప్రవేశించలేడు’ అని అంటూ ఉండగా నేను విన్నాను.  [35]  (బుఖారీ, ముస్లిం)  

4824 – [ 13 ] ( متفق عليه ) (3/1358)

وَعَنْ عَبْدِ اللهِ بْنِ مَسْعُوْدٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “عَلَيْكُمْ بِالصِّدْقِ فَإِنَّ الصِّدْقَ يَهْدِيْ إِلى الْبِرِّ وَإِنَّ الْبِرَّ يَهْدِيْ إِلى الْجَنَّةِ وَمَا يَزَالُ الرَّجُلُ يَصْدُقُ وَيَتَحَرَّى الصِّدْقَ حَتَّى يُكْتَبَ عِنْدَ اللهِ صِدِّيْقًا . وَإِيَّاكُمْ وَالْكَذِبَ فَإِنَّ الْكَذِبَ يَهْدِيْ إِلى الْفُجُوْرِ وَإِنَّ الْفُجُوْرِ يَهْدِيْ إِلى النَّارِ وَمَا يَزَالُ الرَّجُلُ يَكْذِبُ وَيَتَحَرَّى الْكَذِبَ حَتَّى يُكْتَبَ عِنْدَ اللهِ كَذَّابًا”. مُتَّفَقٌ عَلَيْهِ.

وَفِيْ رِوَايَةٍ مُسْلِمٌ قَالَ: “إِنَّ الصِّدْقَ بِرٌّ وَإِنَّ الْبِرَّ يَهْدِيْ إِلى الْجَنَّةِ. وَإِنَّ الْكَذِبَ فُجُوْرٌ وَإِنَّ الْفُجُوْرَ يَهْدِيْ إِلى النَّارِ”.

4824. (13) [3/1358ఏకీభవితం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ మస్‌’ఊద్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఎల్లప్పుడూ సత్యం పలకండి, ఎందుకంటే సత్యం సత్కార్యాల మార్గం చూపుతుంది, సత్కార్యం స్వర్గంలోనికి తీసుకొనిపోతుంది. ఎల్లప్పుడూ సత్యం పలికేవాడు అల్లాహ్‌ (త) వద్ద సత్యవంతుల్లో లిఖించబడతాడు. అసత్యానికి దూరంగా ఉండండి. ఎందుకంటే అసత్యం పాపాల మార్గం చూపుతుంది. పాపాలు నరకంలోనికి తీసుకొనిపోతాయి. ఎల్లప్పుడూ అసత్యం పలికేవాడు అల్లాహ్‌ వద్ద అసత్యవంతుల జాబితాలో లిఖించబడతాడు. (బు’ఖారీ, ముస్లిం)

ముస్లిమ్‌ ఉల్లేఖనంలో ఇలా ఉంది: ”సత్యం పలకటం పుణ్యం. పుణ్యం స్వర్గంలోనికి తీసుకువెళుతుంది. ఇంకా అసత్యం పాపం. పాపం  నరకానికి  తీసుకొని పోతుంది.”

4825 – [ 14 ] ( متفق عليه ) (3/1358)

وَعَنْ أُمِّ كَلْثُوْمٍ رضي اللهُ عَنْهَا قَالَتْ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَيْسَ الْكَذَّابٌ الَّذِيْ يُصْلِحُ بَيْنَ النَّاسِ وَيَقُوْلُ خَيْرًا وَيَنْمِيْ خَيْرًا”. متفق عليه.

4825. (14) [3/1358 ఏకీభవితం]

ఉమ్మె కుల్‌సూ’మ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ప్రజల కలహాలు పరిష్కరించేవాడు, మంచి విషయాలు బోధించేవాడూ, చెడునుండి వారించే వాడు, సదుద్దేశంతో అబద్ధాలు పలికేవాడు అబద్ధాలకోరు కాడు.” (బు’ఖారీ, ముస్లిం)

4826 – [ 15 ] ( صحيح ) (3/1358)

وَعَنْ الْمِقْدَادِ بْنِ الْأَسْوَدِ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِذَا رَأَيْتُمُ الْمَدَّاحِيْنَ فَاحْثُوْا فِيْ وُجُوْهِهِمُ التُّرَابَ”. رَوَاهُ مُسْلِمٌ

4826. (15) [3/1358 దృఢం]

మిఖ్‌దాద్‌ బిన్‌ అస్వద్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం: ”ప్రసంశించేవారిని చూస్తే వాళ్ళ ముఖంపై మట్టి కొట్టండి.”  (ముస్లిమ్‌)

అంటే లేని గొప్పలు చెప్పేవారి ముఖంపై మట్టి కొట్టండి. వాళ్ళకు ఏమీ ఇవ్వకండి, మీ దగ్గరి నుండి గెంటి వేయండి. ప్రవక్త (స) దీన్ని కఠినంగా వారించారు.

4827 – [ 16 ] ( متفق عليه ) (3/1358)

وَعَنْ أَبِيْ بَكْرَةَ قَالَ: أَثْنَى رَجُلٌ عَلى رَجُلٍ عِنْدَ النَّبِيِّ صلى الله عليه وسلم فَقَالَ: “وَيْلَكَ قَطَعْتَ عُنُقَ أَخِيْكَ” ثَلَاثًا”. مَنْ كَانَ مِنْكُمْ مَادِحًا لَا مُحَالَةَ فَلْيَقُلْ: أَحْسَبُ فُلَانًا وَاللهِ حَسِيْبُهُ. إِنْ كَانَ يُرى أَنَّهُ كَذَلِكَ وَلَا يُزَكِّيْ عَلَى اللهِ أَحَدًا”. مُتَّفَقٌ عَلَيْهِ.

4827. (16) [3/1358 ఏకీభవితం]

అబూ బక్‌రహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ముందు ఒక వ్యక్తి మరోవ్యక్తి గురించి ప్రసంశించాడు. అది విని ప్రవక్త (స) ”చాలా విచారకరమైన విషయం, నువ్వు నీ సోదరుని మెడ నరికివేసావు.” ఇలా మూడుసార్లు అన్నారు. ఇంకా ఒకవేళ నీకు పొగడాలనే ఉంటే, ‘ఫలానా వ్యక్తిని మంచి వాడుగా భావిస్తున్నాను,’ అని అనవచ్చును కదా! ఎవరు ప్రసంశలకు అర్హులో ఎవరు కాదో అల్లాహ్‌(త)కు బాగా తెలుసు. ఎవరూ ఎవరినీ తగని విధంగా ప్రసంశించరాదు,”  అని  అన్నారు. [36]  

4828 – [ 17 ] ( صحيح ) (3/1358)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم قَالَ: “أَتَدْرُوْنَ مَا الْغِيْبَةُ؟” قَالُوْا: اللهُ وَرَسُوْلُهُ أَعْلَمُ. قَالَ: ذِكْرُكَ أَخَاكَ بِمَا يَكْرَهُ”. قِيْلَ أَفَرَأَيْتَ إِنْ كَانَ فِيْ أَخِيْ مَا أَقُوْلُ؟ قَالَ: “إِنْ كَانَ فِيْهِ مَا تَقُوْلُ فَقَدِ اغْتَبْتَهُ. وَإِنْ لَمْ يَكُنْ فِيْهِ مَا تَقُوْلُ فَقَدْبَهَتَّهُ”. رَوَاهُ مُسْلِمٌ.

وَفِيْ رِوَايَةٍ: “إِذَا قُلْتَ لِأَخِيْكَ مَا فِيْهِ فَقَدِ اغْتَبْتَهُ. وَإِذَا قُلْتَ مَا لَيْسَ فِيْهِ فَقَدْ بَهَتَّهُ”.

4828. (17) [3/1358దృఢం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) అనుచరులతో, ‘ ‘గీబత్‌ (పరోక్ష నింద) అంటే ఏమిటో మీకు తెలుసా?’ అని అడిగారు. దానికి అనుచరులు, ‘అల్లాహ్‌(త)కు, ఆయన ప్రవక్తకే బాగా తెలుసు,’ అని అన్నారు. అప్పుడు ప్రవక్త (స), ‘ఒక ముస్లిమ్‌ సోదరుని గురించి అతను అసహ్యించుకున్నట్టు మరొకరి ముందు ప్రస్తావించటం,’ అని అన్నారు. దానికి అనుచరులు, ‘ఒకవేళ ఆ చెడు గుణం అతనిలో ఉంటే,’ అని అన్నారు. అప్పుడు ప్రవక్త (స), ‘అతనిలో చెడుగుణం ఉంటేనే ‘గీబత్‌ అవుతుంది. ఒకవేళ ఆ గుణం అతనిలో లేక పోతే అది  ఆరోపణ  అవుతుంది,’ అని  అన్నారు.

4829 – [ 18 ] ( متفق عليه ) (3/1359)

وَعَنْ عَائِشَةَ رَضِيَ اللهُ عَنْهَا أَنَّ رَجُلًا اِسْتَأْذَنَ عَلَى النَّبِيِّ صلى الله عليه وسلم. فَقَالَ: “اِئْذَنُوْا لَهُ فَبِئَسَ أَخُو الْعَشِيْرَةِ”. فَلَمَّا جَلَسَ تَطَلَّقَ النَّبِيُّ صلى الله عليه وسلم فِيْ وَجْهِهِ وَانْبَسَطَ إِلَيْهِ. فَلَمَّا انْطَلَقَ الرَّجُلُ قَالَتْ عَائِشَةَ: يَا رَسُوْلَ اللهِ قُلْتَ لَهُ: كَذَا وَكَذَا ثُمَّ تَطَلَّقْتَ فِيْ وَجْهِهِ وَانْبَسَطْتَّ إِلَيْهِ. فَقَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَتَّى عَهَدْتَّنِيْ فَحَّاشَا؟إِنَّ شَرَّ النَّاسِ مَنْزِلَةً يَوْمَ الْقِيَامَةِ مَنْ تَرَكَهُ النَّاسُ اِتِّقَاءَ شَرِّهِ”. وَفِيْ رِوَايَةٍ: “اِتّقَاءَ فُحْشِهِ”.

4829. (18) [3/1359 ఏకీభవితం] 

‘ఆయి’షహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) వద్దకు రావటానికి ఒక వ్యక్తి అనుమతి కోరాడు. ప్రవక్త (స) అతనికి అనుమతి ఇచ్చివేయమని చెప్పి, ‘ఈ వ్యక్తి తన జాతిలో చాలా నీచ వ్యక్తి,’ అని అన్నారు. ఆ వ్యక్తి వచ్చి ప్రవక్త (స) వద్ద కూర్చున్నాడు. ప్రవక్త (స) అతనితో నగు మోముతో మాట్లాడారు. అతడు వెళ్ళిపోయిన తరువాత ‘ఆయి’షహ్‌ (ర), ‘ఓ ప్రవక్తా! అంతకు ముందు తమరు ఆ వ్యక్తి చాలా నీచుడని అన్నారు. మరి ఆ వ్యక్తితో అంత మంచిగా మాట్లాడారు ఏమిటి సంగతి?’ అని విన్నవించు కున్నారు. దానికి ప్రవక్త (స) ‘ఆయి’షహ్‌! నువ్వు నన్ను ఎప్పుడైనా దుర్గుణాలు గల వాడిగా, అశ్లీల మాటలు మాట్లాడేవాడిగా చూసావా? ”చెడు వల్ల ప్రజలు వారితో కలవడానికి భయపడి దూరం పారిపోయే వ్యక్తులే  అల్లాహ్‌ వద్ద అందరికంటే హీనులు,” అని అన్నారు. [37]  

4830 – [ 19 ] ( متفق عليه ) (3/1359)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “كُلُّ أُمَّتِيْ مُعَافي إِلَّا الْمُجَاهِرُوْنَ. وَإِنَّ مِنَ الْمَجَانَةِ أَنْ يَّعْمَلَ الرَّجُلُ عَمَلًا بِاللَّيْلِ ثُمَّ يُصْبِحُ وَقَدْ سَتَرَهُ اللهُ. فَيَقُوْلُ: يَا فُلَانُ عَمِلْتُ الْبَارِحَةَ كَذَا وَكَذَا. وَ قَدْ بَاتَ يَسْتُرُهُ رَبُّهُ وَيُصْبِحُ يَكْشِفُ سِتْرَاللهِ عَنْهُ”. مُتَّفَقٌ عَلَيْهِ . وَذُكِرَ فِيْ حَدِيْثِ أَبِيْ هُرَيْرَةَ: “مَنْ كَانَ يُؤْمِنُ بِاللهِ”فِيْ”بَابِ الضِّيَافَةِ”.

4830. (19) [3/1359 ఏకీభవితం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”నా అనుచర సమాజంలోని ప్రతి ఒక్కరినీ క్షమించడం జరుగుతుంది. కాని, బహిరంగంగా పాపాలు, అశ్రద్ధగా వ్యవహరించిన వారిని, ఒకరి పాపాలను మరొకరు కప్పిపుచ్చని వారిని క్షమించడం జరుగదు. ఒక వ్యక్తి రాత్రి పాపం చేసి ఉదయం కాగానే ప్రజలకు తెలియ జేస్తాడు. అల్లాహ్‌ (త) దాన్ని దాచి ఉంచాడు. అంటే చెడును చేసిందికాక దాన్ని ఇతరులకు కూడా తెలియజేస్తున్నాడు. [38] (బు’ఖారీ, ముస్లిం)

—–

اَلْفَصْلُ الثَّانِيْ  రెండవ విభాగం

4831 – [ 20 ] ( لم تتم دراسته ) (3/1360)

عَنْ أَنَسٍ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَنْ تَرَكَ الْكَذِبَ وَهُوَ بَاطِلٌ بُنِيَ لَهُ فِيْ رَبَضِ الْجَنَّةِ وَمَنْ تَرَكَ الْمِرَاءَ وَهُوَ مُحِقٌّ بُنِيَ لَهُ فِيْ وَسَطِ الْجَنَّةِ وَمَنْ حَسُنَ خُلُقُهُ بُنِيَ لَهُ فِيْ أَعْلَاهَا”. رَوَاهُ التِّرْمِذِيُّ. وَقَالَ: هَذَا حَدِيْثٌ حَسَنٌ. وَكَذَا فِيْ شَرْحِ السُّنَّةِ. وَفِي الْمَصَابِيْحِ قَالَ غَرِيْبٌ. 

4831. (20) [3/1360అపరిశోధితం]

అనస్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”అన్యాయ మైన అబద్ధాన్ని చెప్పని వ్యక్తి కొరకు అల్లాహ్‌ (త) స్వర్గం మధ్యలో ఒక భవనం నిర్మిస్తాడు. అదేవిధంగా న్యాయం తనవైపు ఉన్నప్పటికీ వివాదం, కలహాలకు దూరంగా ఉన్న వ్యక్తి కొరకు అల్లాహ్‌ (త) స్వర్గంలో ఒక గొప్ప భవనాన్ని నిర్మిస్తాడు. అదే విధంగా తన్నుతాను సరిదిద్దుకొని ఉత్తమ సద్గుణాలు కలిగి ఉన్న వ్యక్తి కొరకు అల్లాహ్‌ (త) స్వర్గంలో అందమైన భవనం నిర్మిస్తాడు. (తిర్మిజి-ప్రామాణికం, షర్‌హు స్సున్నహ్‌-ప్రామాణికం, మసాబీహ్- ఏకోల్లేఖనం)

4832 – [ 21 ] ( لم تتم دراسته ) (3/1360)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “أَتَدْرُوْنَ مَا أَكْثَرُمَا يُدْخِلُ النَّاسَ الْجَنَّةَ؟ تَقْوَى اللهِ وَحسُنُ الْخُلُقِ. أَتَدْرُوْنَ مَا أَكْثَرُ مَا يُدْخِلُ النَّاسَ النَّارَ؟ الْأَجْوَفَانَ: اَلْفَمُ وَالْفَرْجُ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَابْنُ مَاجَهُ 

4832. (21) [3/1360అపరిశోధితం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) అనుచరులతో  ”ఏ విషయం చాలామంది ప్రజలను స్వర్గంలో ప్రవేశింపజేస్తుందో మీకు తెలుసా? దైవభీతి, సద్గుణాలు. అదే విధంగా ఏ విషయం చాలామంది ప్రజలను నరకంలోకి తీసుకు పోతుందో మీకు తెలుసా? అవి, నోరు, మర్మాంగం.” అని అన్నారు. (తిర్మిజీ’, ఇబ్నె మాజహ్)

4833 – [ 22 ] ( لم تتم دراسته ) (3/1360)

وَعَنْ بِلَالِ بْنِ الْحَارِثِ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِنَّ الرَّجُلَ لَيَتَكَلَّمُ بِالْكَلِمَةِ مِّنَ الْخَيْرِ مَا يَعْلَمُ مَبْلَغَهَا يَكْتُبُ اللهُ لَهُ بِهَا رِضْوَانَهُ إِلى يَوْمِ يَلْقَاهُ. وَإِنَّ الرَّجُلَ لَيَتَكَلَّمُ بِالْكَلِمَةِ مِّنَ الشَّرِّ مَا يَعْلَمُ مَبْلَغَهَا يَكْتُبُ اللهُ بِهَا عَلَيْهِ سَخَطَهُ إِلى يَوْمِ يَلْقَاهُ”. رَوَاهُ فِيْ شَرْحِ السُّنَّةِ. وَ رَوَى مَالِكٌ وَالتِّرْمِذِيُّ وَابْنُ مَاجَهُ نَحْوَهُ. 

4833. (22) [3/136 అపరిశోధితం]

బిలాల్‌ బిన్‌ ‘హారిస్‌’ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మనిషి పలికిన ఒక మాట దైవ సంతృప్తికి కారకం అవుతుంది. కాని ఆ విషయం అతనికి తెలియ కుండా ఉంటుంది. దానికి బదులుగా అల్లాహ్‌ (త) తీర్పు దినం నాడు ప్రసాదిస్తాడు. మరికొందరు అజ్ఞానం వల్ల తమ నోటితో ఎటువంటి మాటలు మాట్లాడకు తారంటే దానివల్ల అల్లాహ్‌ (త) ఆగ్రహం చెందుతాడు. తీర్పుదినంనాడు దాని మూలంగా శిక్షిస్తాడు. (షర్’హిసున్నహ్, మాలిక్‌, తిర్మిజీ, ఇబ్నె  మాజహ్)

4834 – [ 23 ] ( لم تتم دراسته ) (3/1360)

وَعَنْ بَهْزِ بْنِ حَكِيْمٍ عَنْ أَبِيْهِ عَنْ جَدِّهِ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “وَيْلٌ لِّمَنْ يُحَدِّثُ فَيَكْذِبُ لِيُضْحِكَ بِهِ الْقَوْمَ وَيْلٌ لَهُ وَيْلٌ لَهُ”. رَوَاهُ أَحْمَدُ وَالتِّرْمِذِيُّ وَأَبُوْ دَاوُدَ وَالدَّارَمِيُّ. 

4834. (23) [3/1360 అపరిశోధితం]

బహ్’జ బిన్‌ ‘హకీమ్‌ తన తండ్రి ద్వారా, మరియు తాత ద్వారా ఉల్లేఖనం: ప్రవక్త (స) ప్రవచనం, ప్రజలను నవ్వించడానికి అబద్ధాలుపలికే వ్యక్తికి తీర్పుదినం నాడు కఠిన శిక్ష పడుతుంది. (అ’హ్మద్‌, తిర్మిజీ’, అబూ దావూద్‌, దార్మి)

అంటే నవ్వించటానికి కూడా అసత్యాలు, అబద్ధాలు పలకరాదు.

4835 – [ 24 ] ( لم تتم دراسته ) (3/1360)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِنَّ الْعَبْدَ لَيَقُوْلُ الْكَلِمَةَ لَا يَقُوْلُهَا إِلَّا ليُضْحِكَ بِهِ النَّاسَ يَهْوِيْ بِهَا أَبْعَدَ مَا بَيْنَ السَّمَاءِ وَالْأَرْضِ وَإِنَّهُ لَيَزِلُّ عَنْ لِسَانِهِ أَشَدَّ مِمَّا يَزِلُّ عَنْ قَدَمِهِ”. رَوَاهُ الْبَيْهَقِيُّ فِيْ شُعَبِ الْإِيْمَانِ.

4835. (24) [3/1360అపరిశోధితం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం: ”కొందరు ప్రజలను నవ్వించడానికి రకరకాల అబద్దాలు పలుకుతారు. అవి కల్లోలాలకు, ఉపద్ర వాలకు కారణం అవుతాయి. దాని పర్యవసానం వారికి తెలిసి ఉండదు. దానివల్ల ఆ చెప్పిన వ్యక్తిని నరకంలో వేయడం జరుగుతుంది. దాని వెడల్పు భూమ్యా కాశాలంత ఉంటుంది. కొందరు నోటికొచ్చింది వాగుతూ ఉంటారు, దానివల్ల వారు నరకంలో జారి పడతారు. (బైహఖీ /-షు’అబిల్ ఈమాన్)

4836 – [ 25 ] ( لم تتم دراسته ) (3/1360)

وَعَنْ عَبْدِ اللهِ بْنِ عَمْرٍو قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَنْ صَمَتَ نَجَا”. رَوَاهُ أَحْمَدُ وَالتِّرْمِذِيُّ وَالدَّارَمِيُّ وَالْبَيْهَقِيُّ فِيْ ” شُعَبِ الْإِيْمَانِ 

4836. (25) [3/1360అపరిశోధితం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘అమ్ర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవ చనం, ”మౌనంగా ఉన్నవాడు సాఫల్యం పొంది నట్టే.” [39] (అ’హ్మద్‌, తిర్మిజీ, దార్మి, బైహఖి/-షు’అబిల్ ఈమాన్)

4837 – [ 26 ] ( لم تتم دراسته ) (3/1360)

وَعَنْ عُقْبَةَ بْنِ عَامِرٍ قَالَ: لَقِيْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم فَقُلْتُ: مَا النَّجَاةُ؟ فَقَالَ: “أَمْلِكْ عَلَيْكَ لِسَانَكَ وَلْيَسَعْكَ بَيْتُكَ وَابْكِ عَلَى خَطِيْئَتِكَ”. رَوَاهُ أَحْمَدُ وَالتِّرْمِذِيُّ.

4837. (26) [3/1360 అపరిశోధితం]

‘ఉఖ్‌బ బిన్‌ ‘ఆమిర్‌ (ర) కథనం: నేను ప్రవక్త (స)ను, ‘కలసి సాఫల్యం పొందటానికి ఏమిచేయాలి?’ అని అడిగాను. దానికి ప్రవక్త (స) నీవు నీ నోటిని పరిరక్షించు, ఇంటిపట్లనే ఉండు. చేసిన పాపాలపట్ల ఏడుస్తూ ఉండు.[40]  (అ’హ్మద్‌,  తిర్మిజీ’)

4838 – [ 27 ] ( لم تتم دراسته ) (3/1361)

وَعَنْ أَبِيْ سَعِيْدٍ رَفَعَهُ قَالَ: “إِذَا أَصْبَحَ اِبْنُ آدَمَ فَإِنَّ الْأَعْضَاءَ كُلَّهَا تُكَفِّرُ اللِّسَانَ فَتَقُوْلُ: اتَّقِ اللهَ فِيْنَا فَإِنَّا نَحْنُ بِكَ فَإِنِ اسْتَقَمْتَ اِسْتَقَمْنَا وَإِنِ اعْوَجَجْتَ اِعْوَجَجْنَا”. رَوَاهُ التِّرْمِذِيُّ. 

4838. (27) [3/1361- అపరిశోధితం]

అబూ స’యీద్‌ ‘ఖుద్రీ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”తెల్లవారగానే శరీర భాగాలన్నీ నోటితో మా విషయంలో దైవానికి భయపడుతూ ఉండాలని, నీ వెనుకనే మేము ఉన్నామని, నీవు క్షేమంగా ఉంటే మేము క్షేమంగా ఉంటామని, నీవు విచారణకు గురయితే మేమూ గురవుతామని ప్రాధేయపడుతూ విన్నవించు కుంటాయి.”  (తిర్మిజీ’)

4839 – [ 28 ] ( صحيح ) (3/1361)

وعَنْ عَلي بْنِ الْحُسَيْنِ رَضِيَ اللهُ عَنْهُ قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مِنْ حُسْنِ إِسْلَامِ الْمَرْءِ تَرْكُهُ مَا لَا يَعِنِيْهِ”. رَوَاهُ مَالِكٌ وَأَحْمَدُ

4839. (28) [3/1361 దృఢం]

‘అలీ బిన్‌ ‘హుసైన్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”అనవసరమైన వ్యర్థ బాతాఖానీలకు దూరంగా ఉండటం కూడా ఇస్లామ్‌ ప్రత్యేకతల్లో ఒకటి.” [41] (మాలిక్‌, అ’హ్మద్‌)

4840 – [ 29 ] ( صحيح ) (3/1361)

وَرَوَاهُ ابْنُ مَاجَهُ عَنْ أَبِيْ هُرَيْرَةَ 

4840. (29) [3/1361దృఢం]

అబూ-హురైరహ్‌ (ర) ద్వారా ఉల్లేఖనం. (ఇబ్నె మాజహ్)

4841 -[30] (صَحِيح) (3/1361)

وَالتِّرْمِذِيّ وَالْبَيْهَقِيّ فِي «شعب الْإِيمَان» عَنْهُمَا.

4841. (30) [3/1361 దృఢం]

‘అలీబిన్‌ ‘హసన్‌ (ర), అబూ హురైరహ్‌ (ర)ల ద్వారా ఉల్లేఖనం.( తిర్మిజీ’, బైహఖీ / – షు’అబిల్‌ ఈమాన్‌)

4842 – [ 31 ] ( لم تتم دراسته ) (3/1361)

وَعَنْ أَنَسٍ قَالَ: تُوَفِّيَ رَجُلٌ مِّنَ الصَّحَابَةِ. فَقَالَ رَجُلٌ: أَبْشِرْ بِالْجَنَّةِ. فَقَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “أَوَ لَا تَدْرِيْ فَلَعَلَّهُ تَكَلَّمَ فِيْمَا لَا يَعْنِيْهِ أَوْ بَخِلَ بِمَا لَا يَنْقُصُهُ”. رَوَاهُ التِّرْمِذِيُّ. 

4842. (31) [3/1361అపరిశోధితం]

అనస్‌ (ర) కథనం: ఒక అనుచరుడు మరణించాడు. మరో ‘స’హాబీ అతనికి స్వర్గ శుభాకాంక్షలు తెలిపాడు. అది విని ప్రవక్త (స) ”నీకు తెలుసా! ఆ వ్యక్తి ఏదైనా చెడ్డమాట అని ఉండవచ్చు, లేదా పిసినారితనం చూపి ఉండవచ్చు, అతన్ని విచారించడం జరగవచ్చు. మరి నువ్వు ఎలా అతనికి స్వర్గ శుభాకాంక్షలు తెలియ జేస్తున్నావు,” అని  అన్నారు.  (తిర్మిజీ’)

4843 – [ 32 ] ( صحيح ) (3/1361)

وَعَنْ سُفْيَانَ بْنِ عَبْدِ اللهِ الثَّقَفِيُّ قَالَ: قُلْتُ: يَا رَسُوْلَ اللهِ مَا أَخْوَفُ مَا تَخَافُ عَلَيَّ؟ قَالَ: فَأَخَذَ بِلِسَانِ نَفْسِهِ وَقَالَ: “هَذَا”. رَوَاهُ التِّرْمِذِيُّ وَصَحَّحَهُ  

4843. (32) [3/1361 దృఢం]

సుఫియాన్‌ బిన్‌ ‘అబ్దుల్లాహ్‌ (ర) కథనం: నేను ప్రవక్త (స)ను, ‘ఓ ప్రవక్తా! ఏ విషయం వల్ల అధికంగా నేను భయపడాలి,’ అని విన్నవించుకున్నాను. దానికి ప్రవక్త (స) తన నాలుకను పట్టుకొని ‘ఇది అంటే నాలుక. దీన్నుండి చాలా భయపడుతూ ఉండాలి,’ అని అన్నారు. (తిర్మిజీ’ /  దృఢం)

4844 – [ 33 ] ( لم تتم دراسته ) (3/1361)

وعَنْ ابن عُمَرَقَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه و سلم: “إِذَاكَذَبَ الْعَبْدُ تَبَاعَدَ عَنْهُ الْمَلَكُ مِيْلًا مِنْ نَتْنِ مَا جَاءَ بِهِ”. رَوَاهُ التِّرْمِذِيُّ

4844. (33) [3/1361అపరిశోధితం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘ఉమర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మనిషి అబద్ధం పలికితే, దాని దుర్వాసన వల్ల అతన్ని కాపలా కాచుకొని ఉన్న దైవదూతలు ఒక మైలు దూరం  వెళ్ళిపోతారు.”  (తిర్మిజీ’)

4845 – [ 34 ] ( لم تتم دراسته ) (3/1361)

وَعَنْ سُفْيَانَ بْنِ أَسَدِ الْحَضْرَمِيُّ قَالَ: سَمِعْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ: “كَبُرَتْ خِيَانَةً أَنْ تُحَدِّثَ أَخَاكَ حَدِيْثًا هُوَ لَكَ بِهِ مُصَدِّقٌ وَأَنْتَ بِهِ كَاذِبٌ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ

4845. (34) [3/1361అపరిశోధితం]

సుఫియాన్‌ బిన్‌ అసద్‌ (ర) కథనం : ప్రవక్త (స) ఇలా ప్రవచిస్తూ ఉండగా నేను విన్నాను, ”అన్నిటికంటే నీచమైన ద్రోహం ఏమిటంటే, నీ సోదరుడు నిన్ను సత్యవంతుడని భావిస్తుండగా, నీవు అతనితో అసత్యం పలకటం.” (అబూ దావూద్‌)

4846 – [ 35 ] ( لم تتم دراسته ) (3/1361)

وَعَنْ عَمَّارٍقَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَنْ كَانَ ذَا وَجْهَيْنِ فِي الدُّنْيَا كَانَ لَهُ يَوْمَ الْقِيَامَةِ لِسَانَانِ مِنْ نَارِ”. رَوَاهُ الدَّارِمِيُّ

4846. (35) [3/1361అపరిశోధితం]

‘అమ్మార్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ప్రపంచంలో రెండు నాలుకల ధోరణిగల వ్యక్తి కొరకు తీర్పుదినం నాడు  రెండు నాలుకల  అగ్ని ఉంటుంది.  (దార్మీ)

4847- [ 36 ] ( لم تتم دراسته ) (3/1362)

وَعَنِ ابْنِ مَسْعُوْدٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَيْسَ الْمُؤْمِنُ بِالطَّعَّانِ وَلَا بِاللَّعَّانِ وَلَا الْفَاحِشِ وَلَا الْبَذِيْءِ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَالْبَيْهَقِيُّ فِيْ”شُعَبِ الْإِيْمَانِ”. وَفِيْ أُخْرَى لَهُ “وَلَا الْفَاحِشِ الْبَذِيْءِ”. وَقَالَ التِّرْمِذِيُّ: هَذَا حَدِيْثٌ غَرِيْبٌ. 

4847. (36) [3/1362 అపరిశోధితం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ మస్‌’ఊద్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”పరిపూర్ణ విశ్వాసి ఎత్తి పొడవడు, శాపనార్థాలు పెట్టడు. అసభ్య పలుకులు పలకడు, హద్దుమీరి మాట్లాడడు.” (తిర్మిజీ / ఏకోల్లేఖనం, భైహఖీ/-షు’అబిల్ ఈమాన్)

4848- [ 37 ] ( لم تتم دراسته ) (3/1362)

وَعَنِ ابْنِ عُمَرَقَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَا يَكُوْنُ الْمُؤْمِنُ لَعَّانًا”. وَفِيْ رِوَايَةٍ: “لَايَنْبَغِيْ لِلْمُؤْمِنِ أَنْ يَّكُوْنَ لَعَّانًا”. رَوَاهُ التِّرْمِذِيُّ. 

4848. (37) [3/1362 అపరిశోధితం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘ఉమర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవ చనం, ”పరిపూర్ణ విశ్వాసి శాపనార్థాలు పెట్టడు. ఎందు కంటే శాపనార్థాలు పెట్టటం అతనికి తగనిపని.” (తిర్మిజీ’)

4849 – [ 38 ] ( لم تتم دراسته ) (3/1362)

وَعَنْ سَمُرَةَ بْنِ جُنْدُبٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَا تَلَاعَنُوْا بِلَعْنَةِ اللهِ وَلَا بِغَضَبِ اللهِ وَلَا بِجَهَنَّمَ”.

 وَفِيْ رِوَايَةٍ”ولَا بِالنَّارِ”. رَوَاهُ التِّرْمِذِيُّ وأَبُوْ دَاوُدَ

4849. (38) [3/1362 అపరిశోధితం]

సమురహ్‌ బిన్‌ జున్‌దుబ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మీరు ఎవరినీ శపించకండి. నష్టం కలగా లని గాని, దైవాగ్రహానికి గురికావాలని గాని, నరకం పాలు కావాలని గాని.”  (తిర్మిజీ,  అబూ దావూద్‌)

అంటే మీరు ఎవరినీ ”నీపై దేవుని శాపం పడాలని గాని, నువ్వు నరకం పాలు కావాలని గాని శపించకూడదు.”

4850 – [ 39 ] ( ضعيف ) (3/1362)

وَعَنْ أَبِي الدَّرْدَاءِ قَالَ: سَمِعْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ: “إِنَّ الْعَبْدَ إِذَا لَعَنَ شَيْئًا صَعِدَتِ اللَّعْنَةُ إِلى السَّمَاءِ فَتُغْلَقُ أَبْوَابُ السَّمَاءِ دُوْنَهَا ثُمَّ تَهْبِطُ إِلى الْأَرْضِ فَتُغْلَقُ أَبْوَابُهَا دُوْنَهَا ثُمَّ تَأْخُذُ يَمِيْنًا وَشِمَالًا. فَإِذَا لَمْ تَجِدْ مَسَاغًا رَجَعَتْ إِلى الَّذِيْ لُعِنَ فَإِنْ كَانَ لِذَلِكَ أَهْلًا وَإِلَّا رَجَعَتْ إِلى قَائِلِهَا”. رَوَاهُ أَبُوْ دَاوُدَ.  

4850. (39) [3/1362 బలహీనం]

అబూ దర్‌దా'(ర)కథనం: ప్రవక్త (స)ను ఇలా అంటూ ఉండగా నేను విన్నాను. మనిషి ఎవరినైనా శపిస్తే, అది ఆకాశంవైపు ఎత్తబడుతుంది. ఆకాశ ద్వారాలు మూసుకుపోతాయి. దాన్ని మళ్ళీ భూమి వైపు దించటం జరుగుతుంది. భూమి కూడా దాన్ని స్వీకరించటానికి నిరాకరిస్తుంది. దానికి ఏమార్గం దొరక్క శపించిన వానిపైనే  పడుతుంది.  (అబూ  దావూద్‌)

4851 – [ 40 ] ( صحيح ) (3/1362)

وَعَنِ ابْنِ عَبَّاسٍ أَنَّ رَجُلًا نَازَعَتْهُ الرِّيْحُ رِدَاءَهُ فَلَعَنَهَا. فَقَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَا تَلْعَنْهَا فَإِنَّهَا مَأْمُوْرَةٌ وَإِنَّهُ مَنْ لَعَنَ شَيْئًا لَيْسَ لَهُ بِأَهْلِ رَجَعَتِ اللَّعْنَةُ عَلَيْهِ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَأَبُوْدَاوُدَ.  

4851. (40) [3/1362దృఢం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘అబ్బాస్‌ (ర) కథనం: గాలి ఒక వ్యక్తి వంటిపై ఉన్న వస్త్రాన్ని ఎగరవేసింది. ఆ వ్యక్తి గాలిని శపించాడు. అది విని ప్రవక్త (స) ”నువ్వు గాలిని తిట్టకు. ఎందుకంటే దైవం తరఫున దానికి వీచే ఆదేశం లభించింది. శాపానికి తగనిదాన్ని శపిస్తే అది తిరిగి శపించినవానిపైనే పడుతుంది” అని ప్రవచించారు. (తిర్మిజీ’,  అబూ  దావూద్‌)

4852 – [ 41 ] ( لم تتم دراسته ) (3/1362)

وَعَنِ ابْنِ مَسْعُوْدٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَايُبَلِّغُنِيْ أَحَدٌ مِنْ أَصْحَابِيْ عَنْ أَحَدٍ شَيْئًا فَإِنِّيْ أُحِبُّ أَنْ أَخْرُجَ إِلَيْكُمْ وَأَنَا سَلِيْمٌ الصَّدْرِ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ.   

4852. (41) [3/1362 అపరిశోధితం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ మస్‌’ఊద్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”నా అనుచరుల్లో ఎవ్వరూ మరొకరి గురించి నాతో చెడుగా చెప్పకండి. ఎందుకంటే మీలో ఎవ్వరి గురించీ ఎటువంటి కల్మషం లేకుండా మిమ్మల్ని కలవటం మంచిదని భావిస్తున్నాను.” (అబూ దావూద్‌)

4853 – [ 42 ] ( لم تتم دراسته ) (3/1363)

وَعَنْ عَائِشَةَ قَالَتْ: قُلْتُ لِلنَّبِيِّ صلى الله عليه وسلم: حَسْبُكَ مِنْ صَفِيَّةَ كَذَا وَكَذَا – تَعْنِي قَصِيْرَةً – فَقَالَ: “لَقَدْ قُلْتِ كَلِمَةً لَوْ مُزِجَ  بِهَا الْبَحْرُ لَمَزَجَتْهُ”. رَوَاهُ أَحْمَدُ وَالتِّرْمِذِيُّ وَأَبُوْ دَاوُدَ  

4853. (42) [3/1363 అపరిశోధితం]

‘ఆయి’షహ్‌ (ర) కథనం: నేను ప్రవక్త (స)ను ‘సఫియ్యహ్ (ర) పొట్టితనం గురించి సైగ చేసాను. అది విని ప్రవక్త (స) ‘ఆయి’షహ్‌! నువ్వు ఎటువంటి మాట అన్నావంటే దీన్ని మంచినీటి నదిలో గనుక వేస్తే, దాన్ని చేదుగా మార్చి వేస్తుంది. అంటే నీ పరోక్షనింద చెడు వల్ల మంచి నీటి నది కూడా చేదుగా మారిపోతుంది. అంటే ఇది చాలా పెద్ద పాపం అని అన్నారు. (అ’హ్మద్‌, తిర్మిజీ’, అబూ  దావూద్‌)

4854 – [ 43 ] ( لم تتم دراسته ) (3/1363)

وَعَنْ أَنَسٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَا كَانَ الْفُحْشُ فِيْ شَيْءٍ إِلَّا شَانَهُ وَمَا كَانَ الْحَيَاءُ فِيْ شَيْءٍ إِلَّازَانَهُ”. رَوَاهُ التِّرْمِذِيُّ.  

4854. (43) [3/1363 అపరిశోధితం]

అనస్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఏ మాటల్లో అశ్లీలం, కాఠిన్యం ఉంటే అవి దాన్ని లోపం గలదిగా చేసి వేస్తుంది. అదేవిధంగా ఏమాటల్లో సిగ్గు బిడియం ఉంటాయో అవి దాన్ని అందమైనవిగా తీర్చి దిద్దుతాయి.”  (తిర్మిజి’)

4855 – [ 44 ] ( لم تتم دراسته ) (3/1363)

وَعَنْ خَالِدِ بْنِ مَعْدَانَ عَنْ مُعَاذٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَنْ عَيَّرَأَخَاهُ بِذَنْبٍ لَمْ يَمُتْ حَتَّى يَعْمَلَهُ” .يَعْنِي مِنْ ذَنْبٍ قَدْ تَابَ مِنْهُ. رَوَاهُ التِّرْمِذِيُّ. وَقَالَ: هَذَا حَدِيْثٌ غَرِيْبٌ وَلَيْسَ اِسْنَادُهُ بِمُتَّصِلٍ لِأَنَّ خَالِدًا لَمْ يُدْرِكْ مُعَاذَ بْنِ جَبَلٍ.

4855. (44) [3/1363అపరిశోధితం]

‘ఖాలిద్‌ బిన్‌ మ’అదాన్‌ కథనం: ము’ఆజ్‌ బిన్‌ జబల్‌ (ర)తో ఇలా అన్నారు, ప్రవక్త (స) ప్రవచనం, ”ఎవరైనా ఒక ముస్లిమ్‌ సోదరునికి అతడు చేసిన తప్పుకు పశ్చాత్తాపం చెందినప్పటికీ, ఆ తప్పుపై అవమానిస్తాడో ఈ అవమానించిన వాడు తాను మరణించడానికి ముందు తప్పకుండా ఆ తప్పుకు గురవుతాడు.” (తిర్మిజి – ఏకోల్లేఖనం. -‘ఖాలిద్, మ’ఆజ్ బిన్ జబల్ ను ఎరుగడు)

4856 – [ 45 ] ( لم تتم دراسته ) (3/1363)

وَعَنْ وَاثِلَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَا تُظْهِرِ الشَّمَاتَةَ لِأَخِيْكَ فَيَرْحَمُهُ اللهُ وَيَبْتَلِيْكَ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَقَالَ: هَذَا حَدِيْثٌ حَسَنٌ غَرِيْبٌ.

4856. (45) [3/1363అపరిశోధితం]

వాసి’లహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”కష్టాలకు గురయిన ఒక ముస్లిమ్‌ సోదరుణ్ణి చూచి సంతోషం వ్యక్తం చేయకండి. ఎందుకంటే అల్లాహ్‌ (త) అతన్ని కరుణించి నిన్ను ఆ ఆపదకు గురిచేయ వచ్చు.” (తిర్మిజి’ – ప్రామాణికం, ఏకోల్లేఖనం)

అంటే కష్టాలకు గురయిన ఒక వ్యక్తిని చూసి సంతోషం వ్యక్తం చేయరాదు. విచారం వ్యక్తం చేయాలి.

4857 – [ 46 ] ( صحيح ) (3/1363)

وعَنْ عَائِشَةَ قَالَتْ: قَالَ النَّبِيُّ صلى الله عليه وسلم: “مَا أُحِبُّ أَنِّيْ حَكَيْتُ أَحَدًا وَأَنَّ لِيْ كَذَا وَكَذَا”. رَوَاهُ التِّرْمِذِيُّ وَصَحَّحَهُ 

4857. (46) [3/1363 దృఢం]

‘ఆయి’షహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఒక రిని అనుకరించటం అంటే నాకు నచ్చదు, దానికి బదులు నాకు ఎంత ధనం లభించినా సరే.”  (తిర్మిజి’ / దృఢం)

అంటే ఒకరిని అవమానించటానికి అతని చేష్టలు చేసి చూప టం నిషిద్ధం. ఎందుకంటే ఇదీ ఒక రకమైన పరోక్ష నిందే  అవుతుంది.

4858 – [ 47 ] ( لم تتم دراسته ) (3/1363)

وَعَنْ جُنْدُبٍ قَالَ: جَاءَ أَعْرَابِيٌّ فَأَنَاخَ رَاحِلَتَهُ ثُمَّ عَقَلَهَا ثُمَّ دَخَلَ الْمَسْجِدَ فَصَلَّى خَلْفَ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم. فَلَمَّا سَلَّمَ أَتَى رَاحِلَتَهُ فَأَطْلَقَهَا ثُمَّ رَكِبَ ثُمَّ نَادَى: اَللّهُمَّ ارْحَمْنِيْ وَمُحَمَّدًا وَلَا تُشْرِكْ فِيْ رَحْمَتِنَا أَحَدًا. فَقَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “أَتَقُوْلُوْنَ هُوَ أَضَلُّ أَمْ بَعِيْرُهُ؟ أَلَمْ تَسْمَعُوْا إِلى مَا قَالَ؟” قَالُوْا: بَلَى؟ رَوَاهُ أَبُوْدَاوُدَ وَ ذُكِرَ حَدِيْثُ أَبِيْ هُرَيْرَةَ: “كَفَى بِالْمَرْءِ كَذِبًا ” فِيْ”بَابِ الْاِعْتِصَامِ” فِي الْفَصْلِ الْأَوَّلِ.  

4858. (47) [3/1363 అపరిశోధితం]

జున్‌దుబ్‌ (ర) కథనం: సహారా నుండి ఒక వ్యక్తి వచ్చాడు. అతడు తన ఒంటెను కూర్చోబెట్టాడు. దాని కాళ్ళకు త్రాడుకట్టి మస్జిద్‌లోనికి ప్రవేశించాడు. ఆ తరువాత ప్రవక్త (స)తో కలసి నమా’జు చదివాడు. అనంతరం లేచి మస్జిద్‌ నుండి బయటకు వచ్చాడు. ఒంటె కాళ్ళను విప్పి దానిపైకి ఎక్కాడు. ఇలా అంటూ ముందుకు పోసాగాడు, ”ఓ అల్లాహ్‌! నన్ను కరుణించు, ఇంకా ము’హమ్మద్‌ను కరుణించు. మా కారుణ్యంలో మరెవరినీ చేర్చకు.” అది విని ప్రవక్త (స) ”ఏమిటి అలా అంటున్నాడు? ఇతడు అజ్ఞాని, అవివేకి, మీరు వినలేదా?” అని అన్నారు. దానికి ప్రజలు ”అవును, విన్నాం అన్నారు.”  [42]  (అబూ  దావూద్‌)

—–

اَلْفَصْلُ الثَّالِثُ  మూడవ విభాగం   

4859 – [ 48 ] ( ضعيف ) (3/1363)

عَنْ أَنَسٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِذَا مُدِحَ الْفَاسِقُ غَضِبَ الرَّبُّ تَعَالى وَاهْتَزَّلَهُ الْعَرْشُ”.  رَوَاهُ الْبَيْهَقِيُّ فِيْ”شُعَبِ الْإِيْمَانِ”.  

4859. (48) [3/1363 బలహీనం]

అనస్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”దుర్మా ర్గుణ్ని ప్రసంశిస్తే, అల్లాహ్(త) ఆగ్రహిస్తాడు. అధర్మమైన ఆ ప్రసంశ వల్ల అల్లాహ్(త) సింహాసనం కూడా కంపి స్తుంది.” (బైహఖీ/-షు’అబిల్ ఈమాన్)

4860 – [ 49 ] ( لم تتم دراسته ) (3/1364)

وَعَنْ أَبِيْ أُمَامَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “يُطْبَعُ الْمُؤْمِنُ عَلَى الْخِلَالِ كُلِّهَا إِلَّا الْخِيَانَةَ وَالْكَذِبَ”. رَوَاهُ أَحْمَدُ.

4860. (49) [3/1364అపరిశోధితం]

అబూ ఉమామహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”విశ్వాసిలో అన్ని గుణాలు ఉంటాయి, ద్రోహం, అబద్ధం ప్ప.” (అ’హ్మద్‌)

4861 – [ 50 ] ( لم تتم دراسته ) (3/1364)

وَالْبَيْهَقِيُّ فِيْ شُعَبِ الْإِيْمَانِ عَنْ سَعْدِ بْنِ أَبِيْ وَقَّاصٍ  

4861. (50) [3/1364అపరిశోధితం]

స’అద్‌ బిన్‌ అబీ వఖ్ఖా’స్‌ ఉల్లేఖనం. (బైహఖీ / -షు’అబిల్‌ ఈమాన్‌)

అంటే విశ్వాసిలో అబద్ధం, ద్రోహం అనే గుణాలు ఉండ కూడదు. సత్యవంతునిగా, అమానతుదారుగా వ్యవహరించాలి.

4862 – [ 51 ] ( لم تتم دراسته ) (3/1364)

وَعَنْ صَفْوَانَ بْنِ سُلَيْمٍ أَنَّهُ قِيْلَ لِرَسُوْلِ اللهِ صلى الله عليه وسلم: أَيَكُوْنُ الْمُؤْمِنُ جَبَانًا؟ قَالَ: “نَعَمْ”. فَقِيْلَ: أَيَكُوْنُ الْمُؤْمِنُ بَخِيْلًا؟ قَالَ: “نَعَمْ”. فَقِيْلَ: أَيَكُوْنُ الْمُؤْمِنُ كَذَّابًا؟ قَالَ: “لَا”. رَوَاهُ مَالِكٌ وَالْبَيْهَقِيُّ فِيْ ” شُعَبِ الْإِيْمَانِ ” مُرْسَلًا.  

4862. (51) [3/1364అపరిశోధితం]

‘సఫ్వాన్‌ బిన్‌ సులైమ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ను, ‘విశ్వాసి పిరికివాడు కాగలడా?’ అని ప్రశ్నించడం జరిగింది. ప్రవక్త(స), ‘కాగలడు,’ అని సమాధానం ఇచ్చారు. అనుచరులు, ‘విశ్వాసి పిసినారి కాగలడా?’ అని ప్రశ్నించారు. ప్రవక్త (స), ‘అవును’ అని అన్నారు. అనుచరులు మళ్ళీ, ‘విశ్వాసి అసత్యవంతుడు కాగలడా?’ అని ప్రశ్నించారు. ప్రవక్త (స), ‘కాలేడు,’ అని అన్నారు. (మాలిక్‌, బైహఖీ-/షు’అబిల్‌ ఈమాన్‌,  తాబయీ  ప్రోక్తం)

4863 – [ 52 ] ( صحيح ) (3/1364)

وَعَنْ ابْنِ مَسْعُوْدٍ قَالَ: “إِنَّ الشَّيْطَانَ لَيَتَمَثَّلُ فِيْ صُوْرَةِ الرَّجُلِ فَيَأْتِي الْقَوْمَ فَيُحَدِّثُهُمْ بِالْحَدِيْثِ مِنَ الْكَذِبِ فَيَتَفَرَّقُوْنَ فَيَقُوْلُ الرَّجُلُ مِنْهُمْ: سَمِعْتُ رَجُلًا أَعْرِفُ وَجْهَهُ وَلَا أَدْرِيْ مَا اسْمُهُ يُحَدِّثُ”. رَوَاهُ مُسْلِمٌ.

4863. (52) [3/1364 దృఢం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ మస్‌’ఊద్‌ (ర) కథనం: షై’తాన్‌ మానవ రూపంలో ప్రజల వద్దకు వచ్చి, వారికి అసత్య ‘హదీసు’లు వినిపిస్తాడు. అబద్ధాలు మాట్లాడుతాడు. ఆ తరువాత ఆ ప్రజలు అన్నివైపుల వ్యాపిస్తారు. వారిలో ఒకరు ప్రజలతో ఈ రోజు నేను పరిచయం ఉన్న ఒక వ్యక్తి ద్వారా ఈ విషయం విన్నాను అని అంటాడు.[43] (ముస్లిమ్‌)

4864 – [ 53 ] ( لم تتم دراسته ) (3/1364)

وَعَنْ عِمْرَانَ بْنِ حِطَّانَ قَالَ: أَتَيْتُ أَبَا ذَرٍّ فَوَجَدْتُّهُ فِي الْمَسْجِدِ مُحْتَبِيًا بِكِسَاءٍ أَسْوَدَ وَحْدَهُ. فَقُلْتُ: يَا أَبَا ذَرٍّمَاهَذِهِ الْوَحْدَةُ؟ فَقَالَ: سَمِعْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ: “اَلْوَحْدَةُ خَيْرٌ مِّنَ جَلِيْسِ السّوْءِ وَ الْجَلِيْسُ الصَّالِحُ خَيْرٌمِّنَ الْوَحْدَةِ وَإِمْلَاءُ الْخَيْرِخَيْرٌمِّنَ السَّكُوْتِ وَ السَّكُوْتُ خَيْرٌ مِّنْ إِمْلَاءِ الشَّرِّ”.

4864. (53) [3/1364 అపరిశోధితం]

‘ఇమ్రాన్‌ బిన్‌ ‘హి’త్తాన్‌ కథనం: నేను అబూ జ’ర్‌ (ర) వద్దకు వచ్చాను. అతను నల్లని కంబలి కప్పుకొని కాళ్ళను చుట్టుకొని కూర్చొని ఉండటం చూసాను. ‘ఓ అబూ జ’ర్‌ మస్జిద్‌లో ఒంటరిగా ఎందుకు కూర్చున్నావు,’ అని అడిగాను. అది విని అతను నేను ప్రవక్త (స)ను ఇలా అంటూ ఉండగా విన్నాను, ”ఒంటరితనం చెడు స్నేహితునికంటే మంచిది, మంచి మిత్రుడు ఒంటరితనం కంటే నయం, మంచిని పొందటం, మంచిని బోధించటం మౌనం కన్నా మంచిది. చెడు నేర్చుకోవటం కంటే మౌనం మంచిది.”

4865 – [ 54 ] ( لم تتم دراسته ) (3/1364)

وَعَنْ عِمْرَانَ بْنِ حُصَيْنٍ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم قَالَ: “مَقَامُ الرَّجُلِ بِالصَّمْتِ أَفْضَلُ مِنْ عِبَادَةِ سِتِّيْنَ سَنَةً”.

4865. (54) [3/1364అపరిశోధితం]

‘ఇమ్రాన్‌ బిన్‌ ‘హు’సైన్‌ (ర) కథనం : ప్రవక్త (స) ప్రవచనం, ”మౌనం వహించటం, మౌనంగా ఉండటం 60 సంవత్సరాల ఆరాధన కంటే ఉత్తమం, అంటే అనవసరమైన, వ్యర్థ పలుకులు పలకకుండా మౌనంగా ఉండటం కూడా ఆరాధనే.”

4866 – [ 55 ] ( لم تتم دراسته ) (3/1364)

وَعَنْ أَبِيْ ذَرٍّ قَالَ: دَخَلْتُ عَلَى رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم فَذَكَرَ الْحَدِيْثَ بِطُوْلِهِ إِلى أَنْ قَالَ: قُلْتُ: يَا رَسُوْلَ اللهِ أَوْصِنِيْ قَالَ: “أُوْصِيْكَ بِتَقْوَى اللهِ فَإِنَّهُ أَزْيَنُ لِأَمْرِكَ كُلِّهِ”. قُلْتُ: زِدْنِيْ قَالَ: “عَلَيْكَ بِتِلَاوَةِ الْقُرْآنِ وَذِكْرِ اللهِ عَزَّ وَجَلَّ فَإِنَّهُ ذِكْرٌ لَكَ فِي السَّمَاءِ وَنُوْرٌ لَكَ فِي الْأَرْضِ”. قُلْتُ: زِدْنِيْ. قَالَ: “عَلَيْكَ بِطُوْلِ الصَّمْتِ فَإِنَّهُ مَطْرَدَةٌ لِلشَّيْطَانِ وَعَوْنٌ لَكَ عَلَى أَمْرِ دِيْنِكَ”. قُلْتُ: زِدْنِيْ. قَالَ: “إِيَّاكَ وَالضِّحْكِ فَإِنَّهُ يُمِيْتُ الْقَلْبَ وَيَذْهَبُ بِنُوْرِ الْوَجْهِ”. قُلْتُ: زِدْنِيْ. قَالَ: قُلِ الْحَقَّ وَإِنْ كَانَ مُرًّا”. قُلْتُ: زِدْنِيْ.قَالَ: “لَا تَخَفْ فِي اللهِ لَوْمَةَ لَائِمٍ”. قُلْتُ: زِدْنِيْ. لِيَحْجُزْكَ عَنِ النَّاسِ مَا تَعْلَمُ مِنْ نَفْسِكَ”.

4866. (55) [3/1364అపరిశోధితం]

అబూ జ’ర్‌ (ర) కథనం: నేను ప్రవక్త (స) వద్దకు వెళ్ళి, ‘నాకు హితోపదేశం చేయండి,’ అని అన్నాను. దానికి ప్రవక్త (స), ”అబూ జ’ర్‌ నేను నీకు ఎల్లప్పుడూ అల్లాహ్‌(త)కు భయపడుతూ ఉండమని ఉపదే శిస్తున్నాను. నువ్వు ఎల్లప్పుడూ దైవానికి భయ పడుతూ ఉండు, ఎందుకంటే దానివల్ల ఉభయ లోకాలలో నీ సమస్యలన్నీ తొలగిపోతాయి. పరిష్క రించబడతాయి,” అని అన్నారు. ”ఇంకే మైనా బోధించండి,” అని విన్నవించుకున్నాను. దానికి ప్రవక్త (స), ”ఎల్లప్పుడూ ఖుర్‌ఆన్‌ పఠిస్తూ ఉండు, దైవధ్యానాన్ని ఎప్పుడూ వదలకు. దానివల్ల ఆకాశాల్లో నిన్ను గురించి ప్రస్తావించబడుతుంది. ఇంకా భూమిపై దానివల్ల నీ కొరకు వెలుగు ఉంటుంది,” అని అన్నారు. ”ఓ ప్రవక్తా! ఇంకేమైనా బోధించండి,” అని అన్నాను. దానికి ప్రవక్త (స), ”అబూ జ’ర్‌! నువ్వు మౌనంగా ఉంటూ ఉండు. ఎందు కంటే మౌనం షై’తాన్‌ను తరిమివేస్తుంది, ధర్మంలో నీకు సహాయం లభిస్తుంది,” అని అన్నారు. మళ్ళీ నేను, ”ఇంకేమైనా బోధించండి,” అని అన్నాను. దానికి ప్రవక్త (స), ”అబూ-జ’ర్‌! అధికంగా నవ్వకు, ఎందు కంటే అధికంగా నవ్వటం వల్ల హృదయం క్షీణిస్తుంది, ఇంకా ముఖవర్చస్సు యొక్క వెలుగు క్షీణిస్తుంది,” అని అన్నారు. మళ్ళీ నేను, ”ఇంకా బోధించండి,” అని అన్నాను. దానికి ప్రవక్త (స), ”అబూ జర్‌! సత్యం, న్యాయం పలకడంలో ఎవ్వరికీ భయపడకు,” అని అన్నారు. మళ్ళీ నేను, ”ఇంకా బోధించండి,” అని అన్నాను. దానికి ప్రవక్త (స), ”ప్రజల లోపాలను బహిర్గతం చేయకు. అంటే ప్రజల తప్పుల్ని కప్పి పుచ్చు. ఇతరుల లోపాలను ఎత్తి చూపకు. నీలో కూడా లోపాలు ఉండవచ్చు,” అని ఉపదేశించారు.

4867 – [ 56 ] ( لم تتم دراسته ) (3/1365)

وَعَنْ أَنَسٍ عَنْ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم قَالَ:”يَا أَبَا ذَرٍّ أَلَا أَدُلُّكَ عَلَى خَصْلَتَيْنِ هُمَا أَخَفُّ عَلَى الظَّهْرِ وَأَثْقَلُ فِي الْمِيْزَانِ؟” قَالَ :قُلْتُ:بَلَى.قَالَ:”طُوْلُ الصَّمْتِ وَحُسْنُ الْخُلُقِ وَالَّذِيْ نَفْسِيْ بِيَدِهِ مَا عَمِلَ الْخَلَائِقُ بِمِثْلِهِمَا.”

4867. (56) [3/1365 అపరిశోధితం]

అనస్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”అబూ -జ’ర్‌! నేను నీకు రెండు విషయాల గురించి బోధిస్తాను అవి చాలా తేలికైనవి. కాని తూనికలో చాలా బరువైనవి,” అని అన్నారు. అప్పుడు అబూ జర్‌, ‘ప్రవక్తా! తమరు తప్పకుండా బోధించండి,’ అని అన్నారు. ప్రవక్త (స), ‘మౌనం, సద్గుణాలు. ఎవరి చేతిలో నా ప్రాణం ఉందో ఆయన సాక్షి! ఈ రెంటి కంటే ఉత్తమ గుణాలు మరేవీ లేవు.’

4868 – [ 57 ] ( لم تتم دراسته ) (3/1365)

وَعَنْ عَائِشَةَ قَالَتْ: مَرَّ النَّبِيُّ صلى الله عليه وسلم بِأَبِيْ بَكْرٍوَهُوَ يَلْعَنُ بَعْضَ رَقِيْقِهِ فَالْتَفَتَ إِلَيْهِ فَقَالَ: “لَعَّانِيْنَ وَصِدِّيْقِيْنَ؟ كُلَّا وَرَبِّ الْكَعْبَةِ ” فَأَعْتَقَ أَبُوْ بَكْرٍ يَوْمَئِذٍ بَعْضَ رَقِيْقِهِ ثُمَّ جَاءَ إِلى النَّبِيِّ صلى الله عليه وسلم وَقَالَ:لَا أَعُوْدُ. رَوَى الْبَيْهَقِيُّ الْأَحَادِيْثُ الْخَمْسَة فِي ” شُعَبِ الْإِيْمَانِ “

4868. (57) [3/1365 అపరిశోధితం]

‘ఆయి’షహ్‌ (ర) కథనం: ప్రవక్త (స), అబూ  బకర్‌ ‘సిద్దీఖ్‌ (ర) ప్రక్క నుండి వెళ్ళారు. అప్పుడు అబూ బకర్‌ (ర) తన సేవకులను చీవాట్లు పెడుతున్నారు. అది చూచి ప్రవక్త (స) అతనితో, ‘నువ్వు చీవాట్లు పెట్టేవారిని, సత్యసంధులను ఒకే చోట చూసావా? అన్నారు. అంటే సత్యసంధత చీవాట్లుపెట్టటం రెండూ వ్యతిరేక ఆచరణలు. రెండూ ఒకేచోట చేరలేవు. నువ్వు సత్యసంధుడివి. మరి ఈ శాపనార్థాలు ఏమిటి,’ అని అన్నారు. అది విని అబూ -బకర్‌ (ర) చాలా విచారించారు. పరిహారంగా తన సేవకుల్లోని కొందరిని విడుదల చేసివేసారు. ఆ తరువాత ప్రవక్త (స) వద్దకు వచ్చి ఇలా ఇంకెప్పుడూ ప్రవర్తించను అని వాగ్దానం చేసారు. ఈ ఐదు ‘హదీసు’లను బైహఖీ / షు’అబుల్‌ ఈమాన్‌లో  పేర్కొన్నారు.

4869 – [ 58 ] ( صحيح ) (3/1365)

وَعَنْ أَسْلَمَ قَالَ: إِنَّ عُمَرَ دَخَلَ يَوْمًا عَلَى أَبِيْ بَكْرِ الصِّدِّيْقِ رَضِيَ اللهُ عَنْهُمْ وَهُوَ يَجْبِذُ لِسَانَهُ.فَقَالَ عُمَرُ: مَهُ غَفَرَ اللهُ لَكَ. فَقَالَ أَبُوْ بَكْرٍ: إِنَّ هَذَا أَوْرَدَنِي الْمَوَارِدُ . رَوَاهُ مَالِكٌ.

4869. (58) [3/1365 దృఢం]

అస్‌లమ్‌ (ర) కథనం: ఒక రోజు ‘ఉమర్‌ (ర) అబూ  బకర్‌ (ర) ఇంటికి వెళ్ళారు. అప్పుడు అబూ బకర్‌ (ర) తన నాలుకను పట్టుకొని లాగుతున్నారు. అది చూసి ‘ఉమర్‌ (ర) ”దైవం క్షమించుగాక! నువ్వు చేస్తున్న పని ఏంటి?” అని అడిగారు. దానికి అబూ బకర్‌ ఈ నాలుకే నాకు ప్రమాదకరమైన స్థలాలకు తీసుకొని పోతుంది. అందువల్లే నేను దీన్ని శిక్షిస్తున్నాను అని సమాధానం ఇచ్చారు. (మువ’త్తా ఇమామ్‌ మాలిక్‌)

4870 – [ 59 ] ( لم تتم دراسته ) (3/1365)

وَعَنْ عُبَادَةَ بْنِ الصَّامِتِ أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم قَالَ: “اضْمَنُوْا  لِيْ سِتًّا مِنْ أَنْفُسِكُمْ أَضْمَنْ لَكُمُ الْجَنَّةَ: اُصْدُقُوْا إِذَا حَدَّثْتُمْ وَأَوْفُوْا إِذَا وَعَدْتُّمْ وَأَدُّوْا إِذَا ائْتُمِتْنُمْ وَاحْفَظُوْا فُرُوْجَكُمْ وَغُضُّوْا أَبْصَارَكُمْ وَكُفُّوْا أَيْدِيَكُمْ”.

4870. (59) [3/1365అపరిశోధితం]

‘ఉబాదహ్‌ బిన్‌ ‘సామిత్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”నువ్వు 6 విషయాల గురించి వాగ్దానం చేయి, నేను నీ కోసం స్వర్గం గురించి వాగ్దానం చేస్తాను. అవి: 1. మాట్లాడితే సత్యమే పలకాలి. 2. వాగ్దానం చేస్తే నెరవేర్చాలి. 3. నీ దగ్గర ఏదైనా అమానతు ఉంచ బడితే, ఉంచబడినదంతా తిరిగి ఇవ్వాలి. 4. మర్మాంగాలను పరిరక్షిస్తూ ఉండాలి. 5. ఎల్లప్పుడూ నీ దృష్టిని క్రిందికి మరల్చి ఉంచాలి. 6. నీ చేతిని నీ అధీనంలో ఉంచు. ఎవరిపైననూ అత్యాచారం చేయటం గానీ, హద్దులుమీరి ప్రవర్తించడంగానీ చేయరాదు. (బైహఖీ –  షు’అబుల్‌ ఈమాన్‌)

4871 – [60] ، 4872 ]61[ (لم تتم دراسته) (3/1366)

وَعَنْ عَبْدِ الرَّحْمَنِ بْنِ غَنْمٍ وَأَسْمَاءَ بِنْتِ يَزِيْدَ رَضِيَ اللهُ عَنْهُمْ أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم قَالَ: “خِيَارُ عِبَادِ اللهِ الَّذِيْنَ إِذَا رُؤُوْا ذُكِرَ اللهُ. وَشِرَارُعِبَادِ اللهِ الْمَشَّاؤُوْنَ بِالنَّمِيْمَةِ وَالْمُفَرِّقُوْنَ بَيْنَ الْأَحِبَّةِ الْبَاغُوْنَ الْبَرَاءَ الْعَنَتَ”. رَوَاهُمَا أَحْمَدُ وَالْبَيْهَقِيُّ فِيْ “شُعَبِ الْإِيْمَانِ”.

4871.(60),4872. (61)[3/1366అపరిశోధితం]

‘అబ్దుర్రహ్మాన్‌ బిన్‌ ‘గన్మి మరియు అస్మా’ బిన్‌తె య’జీద్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”అల్లాహ్‌ యొక్క మహా భక్తులెవరంటే, వారిని చూడగానే దైవం గుర్తుకువస్తాడు. అదేవిధంగా అందరికంటే నీచులు ఎవరంటే చాడీలు చెప్పే వాళ్ళు. పరోక్షనిందలు చేసే వాళ్ళు. స్నేహితుల మధ్య కలహాలు రేపి వారిని విడగొట్టేవాళ్ళు. సత్యవంతులపై లేనిపోని అపనిందలు వేసేవారు.” (అ’హ్మద్‌, బైహఖీ-షు’అబిల్ ఈమాన్)

4873 – [ 62 ] ( لم تتم دراسته ) (3/1366)

وَعَنِ ابْنِ عَبَّاسٍ أَنَّ رَجُلَيْنِ صَلَّيَا صَلَاةَ الظُّهْرِ أَوِ الْعَصْرِوَكَانَا صَائِمَيْنِ فَلَمَّا قَضَى النَّبِيُّ صلى الله عليه وسلم الصَّلَاةَ قَالَ: “أَعِيْدًا وُضُوْءَكُمَا وَصَلَاتَكُمَا وَامضِيَا فِيْ صَوْمِكُمَا وَاقْضِيَا يَوْمًا آخَرَ”. قَالَا  لَمْ يَا رَسُوْلَ اللهِ؟ قَالَ: “اَغْتَبْتُمْ فُلَانًا”.  

4873. (62) [3/1366అపరిశోధితం]

ఇబ్నె ‘అబ్బాస్‌ (ర) కథనం: ఇద్దరు వ్యక్తులు ”జుహ్ర్ లేక ‘అ’స్ర్‌ నమా’జు చదివారు. వారిద్దరూ ఉపవాసంతో ఉన్నారు. ప్రవక్త (స) నమా’జు ముగించి వారిద్దరితో, ”మీరు మళ్ళీ వు’దూచేయండి, నమా’జులు కూడా మళ్ళీ చదవండి, ఉపవాసం పూర్తిచేయండి, కాని ఆ తరువాత దాన్ని తిరిగి పాటించండి,” అని అన్నారు. దానికి ఆఇద్దరూ, ‘ఎందుకు ఓప్రవక్తా!’ అని విన్నవించు కున్నారు. దానికి ప్రవక్త (స), ‘మీరిద్దరు వు’దూ చేసిన తర్వాత ఫలానా వాడిని పరోక్షంగా నిందించారు. పరోక్ష నిందవల్ల వు’దూ భంగమవుతుంది. వు’దూ భంగ మయితే నమా’జు కూడా భంగమయింది, ఉపవాసం కూడా చెడింది. అందువల్ల అన్నిటినీ మళ్ళీ నెరవేర్చండి,’ అని అన్నారు. (బైహఖీ – షు’అబుల్‌ ఈమాన్‌)

4874 – [ 63 ] ( لم تتم دراسته ) (3/1366)

وَعَنْ أَبِيْ سَعِيْدٍ وَجَابِرٍ قَالَا: قَالَ رَسُولُ اللهِ صلى الله عليه وسلم: “اَلْغِيْبَةُ أَشَدُّ مِنَ الزِّنَا”. قَالُوْا: يَا رَسُوْلَ اللهِ وَكَيْفَ الْغِيْبَةُ أَشَدُّ مِنَ الزِّنَا؟ قَالَ: “إِنَّ الرَّجُلَ لَيَزْنِيْ فَيَتُوْبُ فَيَتُوْبُ اللهُ عَلَيْهِ”

4874. (63) [3/1366అపరిశోధితం]

అబూ స’యీద్‌ (ర), జాబిర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”పరోక్షనింద, చాడీలు, వ్యభిచారం కంటే పెద్ద నేరం.” దానికి ప్రజలు ‘అదెలా’ అని విన్నవించు కున్నారు. అప్పుడు ప్రవక్త (స) ”మనిషి వ్యభిచారం చేస్తాడు, తరువాత దైవానికి భయపడి పశ్చాత్తాపం చెందుతాడు, ఫలితంగా అల్లాహ్‌ (త) క్షమించి వేస్తాడు. కాని పరోక్షనింద చేసేవాడు పశ్చాత్తాపం చెందడు, కనీసం అతనికి పశ్చాత్తాపం చెందే భాగ్యం కూడా కలగదు, అతడ్ని క్షమించడానికి. ఎందుకంటే అతడు దాన్ని ఏమాత్రం పాపంగా భావించడు.”

4875 ]  64 [ ( لم تتم دراسته ) (3/1366)

وَفِيْ رِوَايَةٍ: “فَيَتُوْبُ فَيَغْفِرُ اللهُ لَهُ. وَإِنَّ صَاحِبُ الْغِيْبَةِ لَا يُغْفَرُ لَهُ حَتّى يَغْفِرَهَا لَهُ صَاحِبُهُ”. 

4875. (64) [3/1366 అపరిశోధితం]

మరో ఉల్లేఖనంలో ఇలా ఉంది: ”మనిషి వ్యభిచారం చేస్తాడు, తరువాత పశ్చాత్తాపం చెందుతాడు. అల్లాహ్‌(త) అతన్ని క్షమించివేస్తాడు. కాని పరోక్షనింద చేసే వాడిని పరోక్షనింద చేయబడిన వాడు క్షమించ నంత వరకు, అల్లాహ్‌ (త) క్షమించడు.

4876 – [ 65 ] ( لم تتم دراسته ) (3/1366)

وَفِيْ رِوَايَةٍ أَنَسٍ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: “صَاحِبُ الزِنَا يَتُوْبُ وَصَاحِبُ الْغِيْبَةِ لَيْسَ لَهُ تَوْبَةٌ”. رَوَى الْبَيْهَقِيُّ الْأَحَادِيْثُ الثَّلَاثَةَ فِيْ “شُعَبِ الْإِيْمَانِ”.

4876. (65) [3/1366అపరిశోధితం]

అనస్‌ (ర) ఉల్లేఖనం: ప్రవక్త (స) ప్రవచనం, ”వ్యభిచారం చేసినవాడి కొరకు తౌబహ్ పశ్చాత్తాపం ఉంది. కాని పరోక్షనింద చేసేవారి కొరకు తౌబహ్ పశ్చాత్తాపం లేదు.” (బైహఖీ – షు’అబిల్‌ ఈమాన్‌)

4877 – [ 66 ] ( لم تتم دراسته ) (3/1366)

وَعَنْ أَنَسٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِنَّ مِنْ كَفَّارَةِ الْغَيْبَةِ أَنْ تَسْتَغْفِرَلِمَنِ اغْتَبْتَهُ تَقُوْلُ: اَللّهُمَّ اغْفِرْلَنَا وَلَهُ”. رَوَاهُ الْبَيْهَقِيُّ فِيْ ” الدَّعْوَاتِ الْكَبِيْرِ” وقَالَ : فِيْ هَذَا الْإِسْنَادِ ضُعْفٌ.  

4877. (66) [3/1366 అపరిశోధితం]

అనస్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”నీవు పరోక్ష నింద చేసినవాడి క్షమాపణ కొరకు దు’ఆ చేయటమే దాని పరిహారం.”

ఇలా పలకాలి, ”అల్లాహుమ్మగ్‌ఫిర్‌లనా వలహు” అంటే ఓ అల్లాహ్‌! మమ్మల్ని మరియు అతన్ని క్షమించు. (బైహఖీ – దఅవాతుల్ కబీర్, ఆధారాలు బలహీనం)

అంటే ఒకవేళ ఎవరి గురించైనా పరోక్షంగా నిందిస్తే, అతని వద్దకు వెళ్ళి క్షమాపణ కోరాలి. ఒకవేళ మరణించి ఉంటే అతని క్షమాపణ కోసం దు’ఆ చేస్తూ ఉండాలి.

=====

11 بَابُ الْوَعْدِ

11. వాగ్దానం

ఒకవేళ ఎవరైనా మరొకరికి మాట ఇస్తే దాన్ని వాగ్దానం అంటారు. వాగ్దానాన్ని పూర్తిచేయాలి. ఇది తప్పనిసరి. వాగ్దానం నెరవేర్చనివారు మహా నేరస్తులు. అన్నిటి కంటే ముందు అల్లాహ్‌(త) మన నుండి వాగ్దానం తీసుకున్నాడు. దాన్ని పూర్తి చేసినవారు విశ్వాసులు. తమ వాగ్దానాన్ని నెరవేర్చని వారు అవిధేయులు. అల్లాహ్‌ (త) ఖుర్‌ఆన్‌లో ఇలా ఆదేశించాడు: ”వాగ్దానాన్ని నెరవేర్చండి. ఎందుకంటే దాన్ని గురించి విచారించటం జరుగుతుంది.” (అల్  ఇస్రాఅ’, 17:34)

ప్రవక్త (స) ప్రవచనం, ‘ఎవరిలో మూడు గుణాలు ఉంటే వారు కపటాచారులు. 1. మాట్లాడితే అబద్ధం పలకడం, 2. వాగ్దానం చేసి వాగ్దాన భంగం చేయడం, 3. అమానతు ఉంచబడితే అందులో ద్రోహం చేయడం.’

అల్లాహ్‌ (త) వాగ్దానం నెరవేర్చేవారిని ప్రశంసించాడు. ఇస్మా’యీల్‌ (అ) అనే ఒక గొప్ప ప్రవక్త. ఆయన వాగ్దానానికి కట్టుబడి ఉండేవారు. వాగ్దానం చేస్తే దాన్ని పూర్తి చేసేవారు. అదేవిధంగా మన ప్రవక్త (స) కూడా వాగ్దానానికి కట్టుబడి ఉండేవారు. ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ అబీ ‘హస్మా కథనం: దైవదౌత్యానికి ముందు నేను ప్రవక్త (స) నుండి ఒక వస్తువు కొన్నాను. అందులో నేను కొంత అతనికి బాకీపడ్డాను. అప్పుడు నేను ఫలానా చోట ఉండండి నేను తెచ్చి ఇస్తాను అని అన్నాను. నేను వెళ్ళి మరచిపోయాను. మూడు రోజుల తర్వాత నాకు గుర్తుకు వచ్చింది. అక్కడకు వెళ్ళి చూస్తే ప్రవక్త (స) ఉన్నారు. నన్ను చూసి, ‘మూడు రోజుల నుండి ఇక్కడే నీ కోసం ఎదురు చూస్తున్నాను’ అని అన్నారు. (అబూ దావూద్‌)

వాగ్దానం విషయంలో శత్రువులు కూడా పొగిడేవారు. రూమ్‌ చక్రవర్తి ఖైసర్‌ తన సభలో ప్రవక్త (స) గురించి అప్పటికి ఇంకా ముస్లిమ్‌ కాని అబూ ‘సుఫియాన్‌ను అడిగారు. అందులో ప్రవక్త (స) వాగ్దాన భంగం చేసేవారా అని కూడా అడిగారు. దానికి అబూ ‘సుఫియాన్‌ లేదు, ‘అతను(స) ఏనాడూ వాగ్దాన భంగం చేసేవారు కారు,’ అని సమాధానం ఇచ్చారు. దానికి రూమ్‌ చక్రవర్తి ‘దైవప్రవక్తలు వాగ్దానభంగం చేయరు,’ అని అన్నారు. (బు’ఖారీ)

 వాగ్దానాన్ని నెరవేర్చడం విశ్వాసంలోని ఒక గుణం. వాగ్దానం చేసి నెరవేర్చనివారు మహా నేరస్థులు, భ్రష్టులు.

اَلْفَصْلُ الْأَوَّلُ మొదటి విభాగం  

4878 – [ 1 ] ( متفق عليه ) (3/1367)

عَنْ جَابِرٍ قَالَ: لَمَّا مَاتَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم وَجَاءَ أَبُوْ بَكْرٍ مَالٌ مِنْ قِبَلِ الْعَلَاءِ بْنِ الْحَضْرَمِيِّ. فَقَالَ أَبُوْ بَكْرٍ: مَنْ كَانَ لَهُ عِنْدَ النَّبِيِّ صلى الله عليه وسلم دَيْنٌ أَوْ كَانَتْ لَهُ قِبَلَهُ عِدَةً فَلْيَأْتِنَا. قَالَ جَابِرٌ: فَقُلْتُ: وَعَدَنِيْ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم أَنْ يُعْطِيَنِيْ هَكَذَا وَهَكَذَا وَهَكَذَا. فَبَسَطَ يَدَيْهِ ثَلَاثَ مَرَّاتٍ. قَالَ جَابِرٌ: فَحَثَا لِيْ حَثْيَةً فَعَدَدْتُهَا فَإِذَا هِيَ خَمْسُمِائَةٍ وَقَالَ: خُذْ مِثْلَيْهَا. مُتَّفَقٌ عَلَيْهِ. 

4878. (1) [3/1367ఏకీభవితం]

జాబిర్‌ (ర) కథనం: ప్రవక్త (స) మరణించిన అనంతరం గవర్నరు, ‘అలా’ బిన్‌ హ’దరమీ వద్ద నుండి అబూ బకర్‌ (ర) వద్దకు టాక్స్‌ ధనం వచ్చింది. అప్పుడు అబూ బకర్‌ (ర), ‘ప్రవక్త (స) ఎవరికైనా బాకీ ఉన్నా లేదా ప్రవక్త (స) ఇస్తానని వాగ్దానం చేసి ఉన్నా నా దగ్గరకు వస్తే ఆ బాకీని, తీరుస్తానని చేసిన వాగ్దానాన్ని కూడా పూర్తిచేస్తానని’ ప్రకటించారు.జాబిర్‌ (ర) కథనం, ”నేను అబూ బకర్‌ (ర) దగ్గరికి వెళ్ళి, ‘ప్రవక్త (స) ధనం వస్తే నీకు ఇంత ఇస్తానని తన చేతులతో సైగ చేసి వాగ్దానం చేసారు.’ అని అన్నాను. అబూ బకర్‌ (ర) రెండు చేతులు నిండా నాకు ఇచ్చారు. నేను లెక్కపెట్టి చూస్తే 500 ఉన్నాయి. అబూ బకర్‌ నాతో, ‘ఇప్పుడు నా నుండి రెండు వంతులు తీసుకో,’ అని పలికి మొత్తం మూడుసార్లు అంటే 1500 దిర్‌హమ్‌లు ఇచ్చారు. (బు’ఖారీ, ముస్లిమ్‌)

అంటే ఎవరైనా అప్పు తీసుకొని మరణిస్తే, అతని వారసులు ఆ  అప్పును  తీర్చాలి.

—–

اَلْفَصْلُ الثَّانِيْ  రెండవ విభాగం

4879 – [ 2 ] ( لم تتم دراسته ) (3/1367)

عَنْ أَبِيْ جُحَيْفَةَ قَالَ: رَأَيْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم أَبْيَضَ قَدْ شَابَ وَكَانَ الْحَسَنُ بْنُ عَلِيٍّ يُشْبِهُهُ وَأَمَرَ لَنَا بِثَلَاثَةَ عَشَرَ قُلُوْصًا فَذَهَبْنَا نَقْبِضُهَا فَأَتَانَا مَوْتُهُ فَلَمْ يُعْطُوْنَا شَيْئًا. فَلَمَّا قَامَ أَبُوْ بَكْرٍ قَالَ: مَنْ كَانَتْ لَهُ عِنْدَ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم عِدَةٌ فَلْيَجِئَ فَقُمْتُ إِلَيْهِ فَأَخْبَرْتُهُ فَأَمَرَ لَنَا بِهَا. رَوَاهُ التِّرْمِذِيُّ. 

4879. (2) [3/1367 అపరిశోధితం]

అబూ జు’హైఫహ్ (ర) కథనం: నేను ప్రవక్త (స) ను ముసలితనంలో ఎర్రగా బుర్రగా చూసాను. వెంట్రుకల్లో కొన్ని తెల్లగా ఉన్నాయి. ‘హసన్‌ బిన్‌ ‘అలీ ఇంచు మించు ప్రవక్త (స)లా ఉండేవారు. ప్రవక్త (స) మాకు 13 ఒంటెలు ఇవ్వమని ఆదేశించారు. మేము ఆ ఒంటెలను తీసుకోవటానికి వెళ్ళాము. ఇంతలో ప్రవక్త (స) మరణించారనే వార్త వచ్చింది. వాళ్ళు మాకు ఏమీ ఇవ్వలేదు. అబూ బకర్‌ (ర) ఖలీఫా అయిన తరువాత ప్రవక్త (స) ఎవరికైనా ఏదైనా ఇస్తానని వాగ్దానం చేసి ఉంటే నేనిస్తానని ప్రకటించారు. నేను వెళ్ళాను. అబూ బకర్‌ (ర) ప్రవక్త (స) వాగ్దానం ప్రకారం ఒంటెలను ఇవ్వమని ఆదేశించారు. (తిర్మిజి’)

4880 – [ 3] ( ضعيف ) (3/1367)

وَعَنْ عَبْدِ اللهِ بْنِ أَبِي الْحَسْمَاءِ قَالَ: بَايَعْتُ النَّبِيَّ صلى الله عليه وسلم قَبْلَ أَنْ يُّبْعَثَ وَبَقِيَتْ لَهُ بَقِيَّةُ فَوَعَدْتُهُ أَنْ آتِيَهُ بِهَا فِيْ مَكَانِهِ فَنَسِيْتُ فَذَكَرْتُ بَعْدَ ثَلَاثٍ فَإِذَا هُوَ فِيْ مَكَانِهِ فَقَالَ: “لَقَدْ شَقَقْتَ عَلَيَّ أَنَا هَهُنَا مُنْذُ ثَلَاثٍ أَنْتَظِرُكَ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ.  

4880. (3) [3/1367 బలహీనం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ అబిల్‌ ‘హస్మా’ కథనం: దైవ దౌత్యానికి ముందు ప్రవక్త (స) వద్దనుండి ఒక వస్తువు కొన్నాను. అందులో కొంత బాకీ పడ్డాను. నేను ప్రవక్త (స) తో తమరు ఫలానా చోట ఉండండి, ఇప్పుడే వెళ్ళి తెచ్చి ఇస్తాను అని చెప్పి వెళ్ళి నేను మరచిపోయాను. మూడు రోజుల తర్వాత గుర్తుకు వచ్చింది. ఆ ప్రదేశానికి వెళ్ళిచూస్తే ప్రవక్త (స) అక్కడే ఉన్నారు. నన్ను చూసి, ”నేను మూడు రోజుల నుండి నీ గురించి ఎదురు చూస్తున్నాను,” అని మాత్రమే అన్నారు. (అబూ దావూద్‌)

ఈ ‘హదీసు’ ద్వారా ప్రవక్త (స) వద్ద వాగ్దానానికి ఎంత ప్రాముఖ్యత ఉండేదో తెలుస్తుంది. అదేవిధంగా తన అనుచర సమాజానికి కూడా శిక్షణ ఇచ్చారు. అందువల్ల ముస్లిములు వాగ్దానాన్ని నెరవేర్చాలి. వాగ్దానం నెరవేర్చడం అనే ఈ గుణం ప్రవక్తలందరిలో ఉండేది.

4881 – [ 4 ] ( ضعيف ) (3/1368)

وعَنْ زيد بن أرقم عَنْ النبي صلى الله عليه وسلم قَالَ: “إذا وعد الرجل أخاه ومن نيته أن يفي له فلم يف ولم يجئ للميعاد فلا إثم عليه”. رَوَاهُ أَبُوْ دَاوُدَ والترمذي. 

4881. (4) [3/1368 బలహీనం]

‘జైద్‌ బిన్‌ అర్‌ఖమ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఒకవేళ ఎవరైనా వాగ్దానం నెరవేర్చే ఉద్దేశంతో వాగ్దానం చేసి, అనివార్య కారణాల వల్ల వాగ్దానం నెరవేర్చకపోతే అతనిపై ఎటువంటి పాపమూ లేదు.” (అబూ దావూద్‌, తిర్మిజి’)

4882 – [ 5 ] ( لم تتم دراسته ) (3/1368)

وَعَنْ عَبْدِ اللهِ بْنِ عَامِرٍقَالَ: دَعَتْنِيْ أُمِّيْ يَوْمًا وَرَسُوْلُ اللهِ صلى الله عليه وسلم قَاعِدٌ فِيْ بَيْتِنَا فَقَالَتْ هَا تَعَالُ أُعْطِيْكَ. فَقَالَ لَهَا رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَا أَرَدْتِ أَنْ تُعْطِيْهِ؟” قَالَتْ: أَرَدْتُ أَنْ أُعْطِيَهُ تَمْرًا. فَقَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “أَمَّا أَنَّكِ لَوْ لَمْ تُعْطِيْهِ شَيْئًا كُتِبَتْ عَلَيْكَ كَذِبَةٌ”. رَوَاهُ أَبُوْدَاوُدَ وَالْبَيْهَقِيُّ فِيْ”شُعَبِ الْإِيْمَانِ”

4882. (5) [3/1368అపరిశోధితం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ జాబిర్‌ (ర) కథనం: ఒకసారి నా అమ్మగారు నన్ను, ”ఇలా రా నీకు ఒక వస్తువు ఇస్తాను” అని అన్నారు. అది విన్న ప్రవక్త (స) నా అమ్మ గారితో, ‘నువ్వు ఏమి ఇవ్వాలనుకున్నావు?’ అని అడిగారు. దానికి నా అమ్మగారు, ‘ఖర్జూరం ఇవ్వాలను కున్నాను,’ అని అన్నారు. అప్పుడు ప్రవక్త (స), ‘ఒకవేళ నీవు ఉత్తినే అలా అని ఉంటే, నీ కర్మల పత్రంలో (అసత్యం) ఒక పాపం వ్రాయబడేది,’ అని అన్నారు. అప్పుడు నేను బాలుడను, ‘పిల్లల్ని అలాగే చెప్పి పిలవబడుతుందని అన్నారు ‘అబ్దుల్లాహ్‌. (అబూ దావూద్‌, బైహఖీ-/షు’అబిల్ ఈమాన్)

అంటే మోసగించటానికి వాగ్దానం చేయటం అసత్యం అవుతుంది.

—–

اَلْفَصْلُ الثَّالِثُ మూడవ విభాగం  

4883 – [ 6 ] ( لم تتم دراسته ) (3/1368)

عَنْ زَيْدِ بْنِ أَرْقَمَ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم قَالَ: “مَنْ وَعَدَ رَجُلًا فَلَمْ يَأْتِ أَحَدُهُمَا إِلى وَقْتِ الصَّلَاةِ وَذَهَبَ الَّذِيْ جَاءَ لِيُصَلِّيَ فَلَا إِثْمَ عَلَيْهِ”. رَوَاهُ رَزِيْنٌ. 

4883. (6) [3/1368 అపరిశోధితం]

‘జైద్‌ బిన్‌ అర్‌ఖమ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఒక వ్యక్తి మరో వ్యక్తితో ఫలానా సమయంలో వస్తానని వాగ్దానం చేసి, వచ్చాడు. రెండవ వ్యక్తి ఆ సమయంలో నమా’జు చదవడానికి వెళ్ళిపోయాడు. అటువంటప్పుడు వాగ్దానం ప్రకారం సమయానికి చేరలేకపోతే ఏ పాపమూ చుట్టుకోదు. ఎందుకంటే ముందు అల్లాహ్‌(త) హక్కును నెరవేర్చాలి. (ర’జీన్‌)

=====

12 بَابُ الْمَزَاحِ

12. హాస్యం, సంతోష మనస్తత్వం

اَلْفَصْلُ الْأَوَّلُ    మొదటి విభాగం   

4884 – [ 1 ] ( متفق عليه ) (3/1369)

عَنْ أَنَسٍ قَالَ: إِنَّ كَانَ النَّبِيُّ صلى الله عليه وسلم لَيُخَالِطُنَا حَتَّى يَقُوْلُ لِأَخٍ لِي صَغِيْرٍ: “يَا أَبَا عُمَيْرٍمَا فَعَلَ النُّغَيْرُ؟” كَانَ لَهُ نُغَيْرٌ يَلْعَبُ بِهِ فَمَاتَ. مُتَّفَقٌ عَلَيْهِ

4884. (1) [3/1369 ఏకీభవితం]

అనస్‌ (ర) కథనం: ప్రవక్త (స) మాతో కలసినపుడు హాస్యం, సంతోష మనస్తత్వంగా ప్రవర్తించేవారు. చివరికి చిన్నపిల్లలతో కూడా నవ్వులాటలు ఆడేవారు. మా చిన్న తమ్ముడు కోకిల పెంచేవాడు, దానితో ఆడుకునే వాడు. అది చనిపోయింది. దాని వల్ల వాడు చాలా విచారానికి గురయ్యాడు. ప్రవక్త (స) మా ఇంటికి వచ్చారు. మా తమ్ముణ్ణి చూసి హాస్యంగా ”ఓ ఉమైర్‌! నీ కోకిల ఏమయింది,” అని అన్నారు.[44]  (బు’ఖారీ, ముస్లిం)

—–

اَلْفَصْلُ الثَّانِيْ రెండవ విభాగం  

4885 – [ 2 ] ( لم تتم دراسته ) (3/1369)

عَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: قَالُوْا: يَا رَسُوْلَ اللهِ إِنَّكَ تُدَاعِبُنَا.قَالَ: “إِنِّيْ لَا أَقُوْلُ إِلَّا حَقًّا”. رَوَاهُ التِّرْمِذِيُّ.

4885. (2) [3/1369 అపరిశోధితం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రజలు, ‘ప్రవక్తా! తమరు మాతో హాస్యం, ఎగతాళి చేస్తున్నారు,’ అని అన్నారు. దానికి ప్రవక్త (స), ‘నిజమైన హాస్యం చేస్తున్నాను,’ అని అన్నారు. (తిర్మిజి’)

అంటే హాస్యం, ఎగతాళిగానైనా సత్యమే పలుకుతాను అని అర్థం.

4886 – [ 3 ] ( صحيح ) (3/1369)

وَعَنْ أَنَسٍ أَنَّ رَجُلًا اِسْتَحْمَلَ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم فَقَالَ: “إِنِّيْ حَامِلُكَ عَلَى وَلَدِ نَاقَةٍ ؟” فَقَالَ: مَا أَصْنَعُ بِوَلَدِ النَّاقَةِ؟ فَقَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “وَهَلْ تَلِدُ الْإِبْلَ إِلَّا النُّوْقُ”. رَوَاهُ التِّرْمِذِيُّ وأَبُوْ دَاوُدَ.

4886. (3) [3/1369 దృఢం]

అనస్‌ (ర) కథనం: ప్రవక్త (స)ను ఒక వ్యక్తి వాహనంగా ఒక ఒంటెను అడిగాడు. ప్రవక్త (స), ‘హాస్యంగా నేను నీకు ఒంటె బిడ్డను ఇస్తాను,’ అని అన్నారు. దానికి ఆ వ్యక్తి, ‘నేను ఒంటె బిడ్డను తీసుకొని ఏం చేయను,’ అని అన్నాడు. అప్పుడు ప్రవక్త (స), ‘ఒంటె కూడా ఒంటె బిడ్డే అవుతుంది కదా, అది పెద్దదైనాసరే,’ అని అన్నారు. (తిర్మిజి’, అబూ  దావూద్)

4887 – [ 4 ] ( لم تتم دراسته ) (3/1369)

وَعَنْهُ أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم قَالَ لَهُ: “يَا ذَا الْأُذُنَيْنِ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ وَالتِّرْمِذِيُّ

4887. (4) [3/1369 -అపరిశోధితం]

అనస్‌ (ర) కథనం: ఒకసారి ప్రవక్త (స) నాతో ”ఓ రెండు చెవులవాడా” అని అన్నారు. [45]  (అబూ దావూద్‌, తిర్మిజి’)

4888 – [ 5 ] ( لم تتم دراسته ) (3/1369)

وَعَنْهُ عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ لِامْرَأَةٍ عَجُوْزٍ: “إِنَّهُ لَا تَدْخُلُ الْجَنَّةَ عَجُوْزٌ”فَقَالَتْ:وَمَا لَهُنَّ؟وَكَانَتْ تَقْرَأُ الْقُرْآنَ.فَقَالَ لَهَا:” أَمَا تَقْرَئِيْنَ الْقُرْآنَ؟(إِنَّا أَنْشَأْنَاهُنَّ إِنْشَاء فَجَعلْنَاهُنَّ أَبْكَارًا؛ 56: 35) رَوَاهُ رَزِيْنٌ. وَفِيْ شَرْحِ السُّنَّةِ ” بِلَفْظِ ” الْمَصَابِيْحِ ”

4888. (5) [3/1369అపరిశోధితం]

అనస్‌ (ర) కథనం: ప్రవక్త (స) ఒక వృద్ధురాలితో, ‘ముసలి స్త్రీ స్వర్గంలో ప్రవేశించదు,’ అని అన్నారు. దానికి ఆ వృద్ధురాలు, ‘వారి తప్పేంటి? ఎందుకు ప్రవేశించరు?’ అని ప్రశ్నించింది. ఆమె ఖుర్‌ఆన్‌ చదివి ఉన్నందున ప్రవక్త (స) ఆమెతో, ”నువ్వు ఖుర్‌ఆన్‌ లోని ఈ వాక్యం చదవలేదా? ‘మేము తీర్పుదినం నాడు స్త్రీలను కన్నె యువతులను చేసివేస్తాము,’ ” (అల్-వాఖిఅహ్, 56:35) అని అన్నారు. (ర’జీన్‌, షర్‌హు స్సున్నహ్‌, -మసాబీహ్)

అంటే ముసలి పుణ్యస్త్రీలు తీర్పుదినం నాడు కన్నెయువతులుగా మార్చబడతారు. ఆ స్థితిలోనే వారు స్వర్గంలో ప్రవేశిస్తారు. ప్రవక్త (స) సత్యం పలి కారు. అంటే ఏ స్త్రీ కూడా వృద్ధాప్యస్థితిలో స్వర్గంలో ప్రవేశించదు. ప్రవక్త (స) హాస్యంగా ఇలా అన్నారు.

4889 – [ 6 ] ( لم تتم دراسته ) (3/1370)

وَعَنْهُ أَنَّ رَجُلًا مِنْ أَهْلِ الْبَادِيَةِ كَانَ اسْمُهُ زَاهِرَ بْنَ حِرَامٍ وَكَانَ يُهْدِيْ النَّبِيِّ صلى الله عليه وسلم مِنَ الْبَادِيَةِ فَيُجَهِّزُهُ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم إِذَا أَرَادَ أَنْ يَّخْرُجَ فَقَالَ النَّبِيُّ صلى الله عليه وسلم: “إِنَّ زَاهِرًا بَادِيَتُنَا وَنَحْنُ حَاضِرُوْهُ”. وَكَانَ النَّبِيُّ صلى الله عليه وسلم يُحِبُّهُ وَكَانَ دَمِيْمًا فَأَتَى النَّبِيُّ صلى الله عليه وسلم يَوْمًا وَهُوَ يَبِيْعُ مَتَاعَهُ فَاحْتَضَنَهُ مِنْ خَلْفِهِ وَهُوَ لَا يُبْصِرُهُ. فَقَالَ: أَرْسِلْنِيْ مَنْ هَذَا؟ فَالْتَفَتَ فَعَرَفَ النَّبِيّ صلى الله عليه وسلم فَجَعَلَ لَا يَأْلُوْا مَا أَلْزَقَ ظَهْرَهُ بِصَدْرِ النَّبِيِّ صلى الله عليه وسلم حِيْنَ عَرَفَهُ وَجَعَلَ النَّبِيُّ صلى الله عليه وسلم يَقُوْلُ: “مَنْ يَّشْتَرِيِ الْعَبْدَ؟” فَقَالَ: يَا رَسُوْلَ اللهِ إِذَا وَاللهِ تَجِدُنِيْ كَاسِدًا. فَقَالَ النَّبِيُّ صلى الله عليه وسلم: “لَكِنْ عِنْدَ اللهِ لَسْتَ بِكَاسِدٍ”. رَوَاهُ فِيْ” شَرْحِ السُّنَّةِ ”  

4889. (6) [3/1370అపరిశోధితం]

అనస్‌ (ర) కథనం: ‘జాహిర్‌ బిన్‌ ‘హిరామ్‌ అనే ఒక బదూ ఉండేవాడు. అతడు బాదియహ్ నుండి కూరగాయలు తెచ్చి మదీనహ్లో అమ్మేవాడు. ప్రవక్త (స) కు కానుకగా కూరగాయలు, ఆకుకూరలు తెచ్చి ఇచ్చేవాడు. అతడు తిరిగి వెళ్ళినపుడు ప్రవక్త (స) కూడా కానుకలు ఇచ్చే వారు. ప్రవక్త (స) ” ‘జాహిర్‌ బిన్‌ ‘హిరామ్‌ పల్లెనుండి కానుకలు తెచ్చి మాకు ఇస్తుంటాడు, మేము కూడా పట్టణం నుండి అతనికి కానకలు ఇస్తూ ఉంటాం” అని అనేవారు. ప్రవక్త (స) అతన్ని చాలా అభిమానించేవారు. అతనిపట్ల చాలా ప్రేమతో ప్రవర్తించేవారు. అయితే అతడు అంద వికారంగా ఉండేవాడు.  ఒకసారి ‘జాహిర్‌ మదీనహ్ బజారులో తన సరుకు అమ్ముకుంటున్నాడు. ప్రవక్త (స) కూడా అక్కడకు వచ్చారు. ప్రవక్త (స) హాస్యంగా అతన్ని వెనుక నుండి పట్టుకున్నారు. అతని కళ్ళు తన చేతులతో మూసివేసారు. అప్పుడు అతడు ‘ఎవరు, వదలండి’ అని అన్న తరువాత ప్రవక్త (స) అని పసిగట్టి, గుర్తుపట్టి ప్రవక్త (స)ను గుండెకు హత్తుకున్నాడు. ప్రవక్త (స) హాస్యంగా, ‘ఈ బానిసను నా నుండి ఎవరు కొంటారు,’ అని అన్నారు. దానికి ‘జాహిర్‌, ‘ప్రవక్తా! నేను పనికిరాని వాడ్ని అందవికారుడ్ని, నన్నెవరూ కొనరు,’ అని అన్నాడు. అప్పుడు ప్రవక్త (స), ‘నీవు అల్లాహ్(త) వద్ద పనికిరానివాడవు కావు, అల్లాహ్‌(త) వద్ద నీకు చాలా విలువఉంది,’ అని అన్నారు. (షర్‌’హుస్సున్నహ్‌)

4890 – [ 7 ] ( لم تتم دراسته ) (3/1370)

وَعَنْ عَوْفِ بْنِ مَالِكٍ الْأَشْجَعِيِّ قَالَ: أَتَيْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم فِيْ غَزْوَةِ تُبُوْكَ وَهُوَ فِيْ قُبَّةٍ مِنْ أَدَمٍ فَسَلَّمْتُ فَرَدَّ عَلَيَّ وَقَالَ: “اُدْخُلْ”فَقُلْتُ: أَكُلِّيْ يَا رَسُوْلَ اللهِ؟ قَالَ: “كُلُّكَ” فَدَخَلْتُ. قَالَ عُثْمَانَ بْنُ أَبِي الْعَاتِكَةِ: إِنَّمَا قَالَ أَدْخُلُ كُلِّيْ مِنْ صِغَرِالْقُبَّةِ. رَوَاهُ أَبُوْدَاوُدَ.

4890. (7) [3/1370 అపరిశోధితం]

‘ఔఫ్‌ బిన్‌ మాలిక్‌ అష్జ’యీ (ర) కథనం: నేను తబూక్‌ యుద్ధ సందర్భంగా ప్రవక్త (స) వద్దకు వెళ్ళాను. అప్పుడు ప్రవక్త (స) చర్మంతో చేయబడిన ఒక టెంట్‌లో విశ్రాంతి తీసుకుంటున్నారు. నేను సలామ్‌ చేసాను. ప్రవక్త (స) నా సలామ్‌కు జవాబు ఇచ్చారు. ఆ తరువాత నేను టెంట్‌ లోపలికి రావటానికి అనుమతికోరాను. ప్రవక్త (స), ‘వచ్చేయి’ అన్నారు. అప్పుడు నేను, ‘ఓ ప్రవక్తా! నేను శరీరంతో సహా రావచ్చా?’ అని అన్నాను. దానికి ప్రవక్త (స), ‘అవును, అవును పూర్తి శరీరంతో సహా వచ్చేయి,’ అని అన్నారు. (అబూ  దావూద్‌)

 పూర్తి శరీరంతో సహా అంటే హాస్యంగా అనటం జరిగింది. ఎందుకంటే మనిషి ఎక్కడికి వెళ్ళినా శరీరంతో సహా వెళతాడు.

4891 – [ 8 ] ( لم تتم دراسته ) (3/1370)

وَعَنِ النُّعْمَانِ بْنِ بَشِيْرٍقَالَ: اِسْتَأْذَنَ أَبُوْ بَكْرٍعَلَى النَّبِيِّ صلى الله عليه وسلم فَسَمِعَ صَوْتَ عَائِشَةَ عَالِيًا فَلَمَّا دَخَلَ تَنَاوَلَهَا لِيَلْطِمَهَا وَ قَالَ: لَا أَرَاكِ تَرْفَعِيْنَ صَوْتَكِ عَلَى رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم فَجَعَلَ النَّبِيُّ صلى الله عليه وسلم يَحْجُزُهُ وَأَبُوْ بَكْرٍ مُغْضَبًا. فَقَالَ النَّبِيُّ صلى الله عليه وسلم حِيْنَ خَرَجَ أَبُوْ بَكْرٍ: “كَيْفَ رَأَيْتَنِيْ أَنْقَذْتُكِ مِنَ الرَّجُلِ؟”. قَالَتْ: فَمَكَثَ أَبُوْ بَكْرٍأَيَّامًا ثُمَّ اسْتَأْذَنَ فَوَجَدَهُمَا قَدْ اصْطَلَحَا فَقَالَ لَهُمَا: أَدْخِلَانِيْ فِيْ سِلْمِكُمَا كَمَا أَدْخَلْتُمَانِيْ فِيْ حَرْبِكُمَا. فَقَالَ النَّبِيُّ صلى الله عليه وسلم: “قَدْ فَعَلْنَا قَدْ فَعَلْنَا”. رَوَاهُ أَبُوْدَاوُدَ.

4891. (8) [3/1370 అపరిశోధితం]

నోమాన్‌ బిన్‌ బషీర్‌ (ర) కథనం: అబూ బకర్‌ (ర) ప్రవక్త (స)ను ఇంటిలోపలికి రావటానికి అనుమతి కోరారు. అప్పుడు ‘ఆయి’షహ్‌ (ర) ఇంటిలోపల బిగ్గరగా మాట్లాడుతున్నారు. అబూ బకర్‌ (ర) లోపలికి వెళ్ళిన తర్వాత ‘ఆయి’షహ్‌ (ర)ను చెంపపై కొడదామని నిశ్చయించుకున్నారు. ‘ఇలా ప్రవక్త (స) ముందు బిగ్గరగా గొంతెత్తి మాట్లాడుతావా? ఖుర్‌ఆన్‌లో అల్లాహ్‌ (త)ఆదేశం: ” విశ్వాసులారా! మీ కంఠస్వరాలను, ప్రవక్త కంఠస్వరాని కంటే పెంచకండి … ‘అని (సూ. హుజురాత్, 49:2 లో) వారించింది తెలియదా?’ అని అన్నారు . కనుక ఇక ముందు ప్రవక్త (స) ముందు బిగ్గరగా గొంతెత్తి మాట్లాడకు,’ అని అన్నారు. ఎందుకంటే ‘ఆయి’షహ్‌ (ర) అబూ బకర్‌ (ర) కూతురు. ఆమె ఈ అపరాధంపై ఆమెను కొట్టాలనుకున్నారు, కాని ప్రవక్త (స) ఆపివేసారు. అబూ బకర్‌ (ర) ఆగ్రహంతో ఇంటిలోపలి నుండి బయటకు వచ్చేసారు. అబూ బకర్‌ (ర) వెళ్ళిన తరువాత ప్రవక్త (స) ‘ఆయి’షహ్‌ (ర)తో, ‘అబూ బకర్‌ (ర) నిన్ను కొట్టకుండా నేనెలా తప్పించానో తెలియదా!’ అని అన్నారు. ‘ఆయి’షహ్‌ (ర) కథనం: చాలా రోజుల వరకు కోపం వల్ల అబూ బకర్‌ (ర) ప్రవక్త (స) ఇంటికి రాలేదు. ఆ తరువాత ఒకరోజు ప్రవక్త (స) ఇంటికి వచ్చారు. లోపలికి రావటానికి అనుమతి కోరారు. అనుమతి లభించిన తర్వాత లోపలికి వచ్చి ప్రవక్త (స), ‘ఆయి’షహ్‌ల మధ్య కలహం సద్దుమణిగిందని తెలుసుకొని, అబూ బకర్‌ (ర) ఇద్దరితో, ‘మీరిద్దరూ మీ ఒప్పందంలో నన్ను కూడా చేర్చుకోండి, యుద్ధంలో నన్ను చేర్చుకున్నట్టు,’ అని అన్నారు. అప్పుడు ప్రవక్త (స), ‘మా ఒప్పందంలో మిమ్మల్ని చేర్చుకున్నాం,’ అని అన్నారు. (అబూ  దావూద్‌)

4892 – [ 9 ] ( لم تتم دراسته ) (3/1371)

 وَعَنِ ابْنِ عَبَّاسٍ عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ: “لَا تُمَارِأَخَاكَ وَلَا تُمَازِحْهُ وَلَا تَعِدْهُ مَوْعِدًا فَتُخْلِفَهُ “. رَوَاهُ التِّرْمِذِيُّ وَقَالَ: هَذَا حَدِيْثٌ غَرِيْبٌ .

4892. (9) [3/1371 అపరిశోధితం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘అబ్బాస్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ‘మీరు మీ ముస్లిమ్‌ సోదరునితో పొట్లాడకండి, అసహ్యం కలిగేవిధంగా హాస్యమాడకండి, అదేవిధంగా పూర్తి చేయలేని వాగ్దానం కూడా చేయకండి.’ (తిర్మిజి’ / ఏకోల్లేఖనం)

وَهَذَا الْبَابُ خَالٍ عَنِ الْفَصْلِ الثَّالِثِ

ఇందులో మూడవ విభాగం లేదు

=====

13 بَابُ الْمُفَاخَرَةِ وَالْعَصَبِيَّةِ

13. డాంబికాలు, జాతి దురభిమానం

గర్వం, అహంకారం, పక్షపాతం ఇవన్నీ చెడు గుణాలే. తన వారు పొరపాటు చేసినా వారినే సమర్థించడం అనేది చాలా చెడ్డగుణం. అదేవిధంగా తన కుటుంబం పట్ల, తన జాతి పట్ల అధర్మంగా సమర్థించటం సరికాదు.

اَلْفَصْلُ الْأَوَّلُ మొదటి విభాగం  

4893 – [ 1 ] ( متفق عليه ) (3/1372)

عَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: سُئِلَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: أَيُّ النَّاسِ أَكْرمُ؟ فَقَالَ: “أَكْرمُهُمْ عِنْدَ اللهِ أَتْقَاهُمْ”. قَالُوْا: لَيْسَ عَنْ هَذَا نَسْأَلُكَ. قَالَ: “فَأَكْرَمُ النَّاسِ يُوْسُفُ نَبِيُّ اللهِ اِبْنُ نَبِيِّ اللهِ ابْنِ خَلِيْلِ اللهِ”. قَالُوْا: لَيْسَ عَنْ هَذَا نَسْأَلُكَ. قَالَ: “فَعَنْ مَعَادِنِ الْعَرَبِ تَسْأَلُوْنِيْ؟” قَالُوْا: نَعَمْ. قَالَ: فَخِيَارُكُمْ فِي الْجَاهِلِيَّةِ خِيَارُكُمْ فِي الْإِسْلَامِ إِذَا فَقُهُوْا”. مُتَّفَقٌ عَلَيْهِ.

4893. (1) [3/1372ఏకీభవితం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స)ను, ‘అందరి కంటే గొప్పవారు (గౌరవనీయులు) ఎవరు,’ అని ప్రశ్నించడం జరిగింది. దానికి ప్రవక్త (స), ‘అందరికంటే అధిక దైవభీతిగల వారే అల్లాహ్‌(త) వద్ద అందరికంటే గొప్పవారు,’ అని సమాధానం ఇచ్చారు. అప్పుడు ప్రజలు, ‘మానవుల్లో ఎవరు గొప్పవారు అనేది మా ఉద్దేశ్యం,’ అని అన్నారు. దానికి  ప్రవక్త (స), ‘అందరి కంటే గౌరవనీయులు యూసుఫ్‌ (అ), అతను దైవప్రవక్త య’అఖూబ్‌ (అ) కుమారులు, అతను దైవప్రవక్త ఇస్‌హాఖ్‌ (అ) కుమారులు, అతను దైవప్రవక్త ఇబ్రాహీమ్‌ (అ) కుమారులు,’ అని అన్నారు. అప్పుడు అనుచరులు, ‘మేము అడుగు తుంది వీరిని గురించి కాదు,’ అని అన్నారు. అప్పుడు ప్రవక్త (స), ‘మీరు అడుగుతున్నది అరబ్బుల్లోని కుటుంబాలు, వంశాల గురించా?’ అని అన్నారు. దానికి అనుచరులు, ‘అవును,’ అని అన్నారు. అప్పుడు ప్రవక్త (స), ‘అజ్ఞానకాలంలో మీలో అందరికంటే మంచి వారే, ఇస్లామ్‌లోనూ అందరికంటే మంచివారు, ఉత్తములు, అయితే అతడు బుద్ధిమంతుడూ, తెలివి గలవాడై ఉండాలి’ అని సమాధానం ఇచ్చారు. [46]  (బు’ఖారీ, ముస్లిం)

4894 – [ 2 ] ( صحيح ) (3/1372)

وَعَنِ ابْنِ عُمَرَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “اَلْكَرِيْمُ ابْنُ الْكَرِيْمِ ابْنِ الْكَرِيْمِ ابْنِ الْكَرِيْمِ يُوْسُفُ بْنُ يَعْقُوْبَ بْنِ إِسْحَاقَ بْنِ إِبْرَاهِيْمَ”. رَوَاهُ الْبُخَارِيُّ.

4894. (2) [3/1372 దృఢం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘ఉమర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఉత్తమ కొడుకు, ఉత్తమ కొడుకు, ఉత్తమ కొడుకు, ఉత్తమ కొడుకు – అంటే యూసుఫ్‌ బిన్‌ య’అ ఖూబ్‌ బిన్‌ ఇస్‌’హాఖ్‌ బిన్‌ ఇబ్రాహీమ్‌ (అ).”  (బు’ఖారీ)

అంటే సంతానం, తండ్రి, తాతలు అందరూ ఉత్తములే.

4895 – [ 3 ] ( متفق عليه ) (3/1372)

وَعَنِ الْبَرَاءِ بْنِ عَازِبٍ قَالَ: فِيْ يَوْمٍ حُنَيْنٍ كَانَ أَبُوْسُفْيَانَ بْنُ الْحَارِثِ آخِذًا بِعِنَانِ بَغْلَتِهِ يَعْنِيْ بَغْلَةَ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم. فَلَمَّا غَشِيَهُ الْمُشْرِكُوْنَ نَزَلَ فَجَعَلَ يَقُوْلُ “أَنَا النَّبِيُّ لَاكَذِبُ أَنَا ابْنُ عَبْدِ الْمُطَّلَب”. قَالَ: فَمَا رُئِيَ مِنَ النَّاسِ يَوْمَئِذٍ أَشَدُّ مِنْهُ. مُتَّفَقٌ عَلَيْهِ.

4895. (3) [3/1372ఏకీభవితం]

బరా’ బిన్‌ ‘ఆ’జిబ్‌ (ర) కథనం: ‘హునైన్‌ యుద్ధంలో అబూ సుఫియాన్‌ బిన్‌ ‘హారిస్‌’ ప్రవక్త (స) కూర్చున్న గాడిద కళ్ళెం పట్టుకొని ఉన్నారు. అవిశ్వాసులు నలువైపుల నుండి ప్రవక్త (స)ను చుట్టుముట్టినపుడు ప్రవక్త (స) దిగి, ”నేను సత్య ప్రవక్తను, నేను ‘అబ్దుల్‌ ము’త్తలిబ్‌ మనవడ్ని” అని అన్నారు. ఉల్లేఖనకర్త, ‘ఆ రోజు ప్రవక్త (స) తప్ప మరెవరూ వీరత్వాన్ని ప్రదర్శించ లేదు,’ అని అన్నారు. [47] (బు’ఖారీ, ముస్లిం)

4896 – [ 4 ] ( صحيح ) (3/1372)

وَعَنْ أَنَسٍ قَالَ: جَاءَ رَجُلٌ إِلى النَّبِيِّ صلى الله عليه وسلم فَقَالَ: يَا خَيْرَ الْبَرِيَّةِ. فَقَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: ” ذَاكَ إِبْرَاهِيْمُ”. رَوَاهُ مُسْلِمٌ  

4896. (4) [3/1372దృఢం]

అనస్‌ (ర) కథనం: ప్రవక్త (స) వద్దకు ఒక వ్యక్తి వచ్చి ఓ ఖైరుల్‌ బరియ్యహ్‌!’ అంటే అందరి కంటే ఉత్తముడా! అని అన్నాడు. ప్రవక్త (స) సమాధానంగా, ”ఇలా ఇబ్రా హీమ్‌ (అ) ఉండేవారు” అని అన్నారు. [48] (ముస్లిమ్‌)

4897 – [ 5 ] ( متفق عليه ) (3/1372)

وَعَنْ عُمَرَقَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَا تُطْرُوْنِيْ كَمَا أَطْرَتِ النَّصَارَى ابْنَ مَرْيَمَ فَإِنَّمَا أَنَا عَبْدُهُ فَقُوْلُوْا: عَبْدُ اللهِ وَرَسُوْلُهُ”. مُتَّفَقٌ عَلَيْهِ.  

4897. (5) [3/1372 ఏకీభవితం]

‘ఉమర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మీరు నన్ను పొగడటంలో హద్దులు మీరి ప్రవర్తించకండి. క్రైస్తవుల్లా, వాళ్ళు ‘ఈసా (అ) అతని స్థానానికి మించి పొగిడి అతన్ని దైవకుమారుడని భావించసాగారు. నేను దైవదాసుడ్ని. ఆయన సందేశహరుడ్ని, ‘నన్ను అల్లాహ్‌(త) దాసుడని, ఆయన సందేశహరుడని’ (స) పిలవండి.” (బు’ఖారీ, ముస్లిం)

4898 – [ 6 ] ( صحيح ) (3/1373)

وَعَنْ عَيَّاضِ بْنِ حِمَارِالْمُجَاشِعِيِّ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم قَالَ: “إِنَّ اللهَ أَوْحَى إِلَيَّ: “أَنْ تَوَاضَعُوْا حَتَّى لَا يَفْخَرَأَحَدٌ عَلَى أَحَدٍ وَلَا يَبْغِيَ أَحَدٌ عَلَى أَحَدٍ”. رَوَاهُ مُسْلِمٌ.  

4898. (6) [3/1373దృఢం]

‘అయా’ద్ బిన్‌ ‘హిమార్‌ మజాషి’ఇయ్యి కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”అల్లాహ్‌ (త) ఇలా దైవవాణి పంపాడు:  ”మీరు పరస్పరం దీనత్వం వినయ, వినమ్రతలు కలిగి ఉండండి. మీరు పరస్పరం గర్వాహంకారాలకు గురి కాకండి, ఒకరిపై మరొకరు అత్యాచారాలు చేయకండి.”  (ముస్లిమ్‌)

—–

اَلْفَصْلُ الثَّانِيْ  రెండవ విభాగం  

4899 – [ 7 ] ( حسن ) (3/1373)

عَنْ أَبِيْ هُرَيْرَةَ عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ: “لَيَنْهَيَنَّ أَقْوَامٌ يَفْتَخِرُوْنَ بِآبَائِهِمُ الَّذِيْنَ مَاتُوْا إِنَّمَا هُمْ فَحْمٌ مِّنْ جَهَنَّمَ أَوْ لَيَكُوْنَنَّ أَهْوَنَ عَلَى اللهِ مِنَ الْجُعَلِ الَّذِيْ يُدَهْدِهُ الْخِرَاءَ بِأَنْفِهِ إِنَّ اللهَ قَدْ أَذْهَبَ عَنْكُمْ عُبَيَّةَ الْجَاهِلِيَّةِ وَفَخْرَهَا بِالْآبَاءِ إِنَّمَا هُوَمُؤْمِنٌ تَقِيٌّ أَوْفَاجِرٌشَقِيٌّ النَّاسُ كُلُّهُمْ بَنُوْآدَمَ وَآدَمُ مِنْ تُرَابٍ”. رَوَاهُ التِّرْمِذِيُّ وأَبُوْ دَاوُدَ. 

4899. (7) [3/1373ప్రామాణికం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”తమ తాతముత్తాతల పేర్లు చెప్పుకొని గర్వా హంకారాలకు పాల్పడేవారు, ఆ అలవాటు మాను కోవాలి. ఎందుకంటే వారు నరకాగ్నిలోని బొగ్గులు అయి పోయారు. ఇప్పుడు గర్వం దేనికి. గర్వాహం కారాలు ప్రదర్శించేవారు అల్లాహ్‌(త) దృష్టిలో మాలిన్యాన్ని తన ముక్కుతో అటూ ఇటూ చేసే పురుగు కన్నా హీనులు. అల్లాహ్‌ (త) అజ్ఞానకాలపు గర్వా హంకారాలన్నీ రద్దుచేసాడు. మనుషులు రెండేరెండు రకాలు. 1. విశ్వాసులు, దైవభీతిపరులు 2. అవిశ్వాసులు పాపాత్ములు. ఇవి తప్ప మానవు లందరూ సమానులే. అందరూ ఆదమ్‌ సంతానమే. ఆదమ్‌ మట్టితో సృష్టించబడ్డాడు. మట్టిలో గర్వాహం కారాలు లేవు. మనుషుల్లో కూడా గర్వాహంకారాలు ఉండ కూడదు.(తిర్మిజి’, అబూ  దావూద్‌)

4900 – [ 8 ] ( صحيح ) (3/1373)

وَعَنْ مُطَرِّفِ بْنِ عَبْدِ اللهِ الشِّخِّيْرِقَالَ: قَالَ أَبِيْ: اِنْطَلَقْتُ فِيْ وَفْدِ بَنِيْ عَامِرٍ إِلى رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم فَقُلْنَا: أَنْتَ سَيِّدُنَا. فَقَالَ: “السَّيِّدُ اللهُ” . فَقُلْنَا وَأَفْضَلُنَا فَضْلًا وَأَعْظَمُنَا طَوْلًا. فَقَالَ: “قُوْلُوْا قَوْلَكُمْ أَوْ بَعْضَ قَوْلِكُمْ وَلَا يَسْتَجْرِيَنَّكُمُ الشَّيْطَانُ”. رَوَاهُ أَحْمَدُ وَأَبُوْ دَاوُدَ.

4900. (8) [3/1373 దృఢం]

ము’తర్రఫ్‌ బిన్‌ ‘అబ్దుల్లాహ్‌ షి’ఖ్ఖీరీ (ర) కథనం: నేను బనూ ‘ఆమిర్‌ బృందం వెంట ప్రవక్త (స) వద్దకు వచ్చాను. మేము ప్రవక్త (స) ను, ‘సయ్యిదినా’ అని అన్నాం, అంటే తమరు మా నాయకులు అని. అర్థం. దానికి ప్రవక్త (స), ‘నన్ను నాయకుడు అని అనకండి, మనందరి నాయకుడు అల్లాహ్‌,’ అని అన్నారు. ఆ తరువాత మేము, ‘మరి తమరు మా అందరి కంటే పెద్దవారు, మా అందరికంటే ఉత్తములు,’ అని అన్నాం. దానికి ప్రవక్త (స), ‘మీరు ఇటువంటి మాటలు పలకగలరు కాని అనవసరంగా పొగిడి షై’తాన్‌ను రెచ్చగొట్ట కండి. లేకపోతే షైతాన్‌ మీ వకీలు అయిపోతాడు. ఈ విధంగా మిమ్మల్ని మార్గభ్రష్ట త్వానికి  గురిచేస్తాడు.’ [49]  (అబూ  దావూద్‌)

4901 – [ 9 ] ( لم تتم دراسته ) (3/1373)

وَعَنِ الْحَسَنِ عَنْ سَمُرَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “اَلْحَسَبُ الْمَالُ وَالْكَرَمُ التَّقْوَى”. رَوَاهُ التِّرْمِذِيُّ وَابْنُ مَاجَهُ.

4901. (9) [3/1373 అపరిశఓధితం]

‘హసన్‌ (ర) సమురహ్‌ (ర) ద్వారా కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”గొప్పతనం ధనంవల్ల, గౌరవం దైవభీతి వల్ల లభిస్తుంది.”  [50] (తిర్మిజి’, ఇబ్నె మాజహ్)

4902 – [ 10 ] ( لم تتم دراسته ) (3/1373)

وَعَنْ أُبَيِّ بْنِ كَعْبٍ قَالَ: سَمِعْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ: “مَنْ تَعَزَّى بِعَزَاءِ الْجَاهِلِيَّةِ فَأَعِضُّوْهُ بِهَنِ أَبِيْهِ وَلَا تَكْنُوْا”. رَوَاهُ فِيْ ” شَرْحِ السُّنَّةِ ”

4902. (10) [3/1373అపరిశఓధితం]

ఉబయ్‌ బిన్‌ క’అబ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ఇలా ప్రవచిస్తూ ఉండగా నేను విన్నాను. తన కుటుంబం, వంశం పట్ల గర్వాహంకారాలు ప్రదర్శించే వ్యక్తి మర్మాంగాన్ని నరికించండి. [51]  (షర’హుస్సున్నహ్‌)

4903- [ 11 ] ( ضعيف ) (3/1374)

وَعَنْ عَبْدِ الرَّحْمنِ بْنِ أَبِيْ عُقْبَةَ عَنْ أَبِيْ عُقْبَةَ وَكَانَ مَوْلى مِنْ أَهْلِ فَارِسِ قَالَ: شَهِدْتُ مَعَ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم أحُدًا فَضَرَبْتُ رَجُلًا مِنَ الْمُشْرِكِيْنَ فَقُلْتُ خُذْهَا مِنِّيْ وَأَنَا الْغُلَامُ الْفَارِسِيُّ فَالْتَفَتَ إِلَيَّ فَقَالَ: “هَلَّا قُلْتَ: خُذْهَا مِنِّيْ وَأَنَا الْغُلَامُ الْأَنْصَارِيُّ؟”. رَوَاهُ أَبُوْ دَاوُدَ.  

4903. (11) [3/1374 బలహీనం]

‘అబ్దుర్ర’హ్మాన్‌ బిన్‌ అబీ ‘ఉఖ్‌బహ్ (ర) తన తండ్రి అబీ ‘ఉఖ్‌బహ్ ద్వారా కథనం: ఇతడు ఫారిస్‌కు చెందిన విడుదల చేయబడిన ఒక బానిస. అతనిలా అంటున్నారు: ”నేను ప్రవక్త (స) వెంట ఉ’హుద్‌ యుద్ధంలో పాల్గొన్నాను. నేనొక అవిశ్వాసిని. కరవా లంతో లేదా బల్లెంతో కొడుతూ, ‘ఈ దెబ్బను కాచుకో, నేను ఫారిస్‌కి చెందిన వీర బానిసను,’ అని అన్నాను.  అది విన్న ప్రవక్త (స) నన్ను చూసి, ” ‘నా ఈ దెబ్బ నుండి కాచుకో, నేను అన్సారీ బానిసను,’ అని ఎందుకు అనలేదు” అని అన్నారు. (అబూ  దావూద్‌)

అంటే ‘నీవు నిన్ను అన్సారునిగా చెబితే బాగుంటుంది. ఎందుకంటే అన్సారుల సేవకులు అన్సారులుగానే పరిగణించబడతారు. ఫారిస్‌ ప్రజలు అగ్ని ఆరాధకులు. నీవు నీగుర్తింపు అన్సారులుగా చేస్తే బాగుండేది’ అని అన్నారు.

4904 – [ 12 ] ( صحيح ) (3/1374)

وَعَنْ ابْنِ مَسْعُوْدٍ عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ: “مَنْ نَصَرَ قَوْمَهُ عَلَى غَيْرِ الْحَقِّ فَهُوَ كَالْبَعِيْرِ الَّذِيْ رُدِّيَ فَهُوَ يُنْزَعُ بِذَنْبِهِ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ.  

4904. (12) [3/1374దృఢం]

ఇబ్నె మస్‌’ఊద్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, తన జాతి అన్యాయం పక్షాన ఉన్నా, దాన్ని సమర్థించేవాడు. బావిలో పడి, ప్రజలు తోకపట్టి లాగుతున్న ఒంటెవంటి వాడు. (అబూ  దావూద్‌)

అంటే బావిలో పడిన ఒంటె ఏవిధంగా నాశనం అవుతుందో, అదే విధంగా అన్యాయంగా తన జాతిపట్ల పక్షపాతవైఖరి అవలంబిస్తున్న వ్యక్తి పాపాల బావిలో పడి నాశనం అవుతాడు.

4905 – [ 13 ] ( ضعيف ) (3/1374)

وَعَنْ وَاثِلَةَ بْنِ الْأَسْقَعِ قَالَ: قُلْتُ: يَا رَسُوْلَ اللهِ مَا الْعَصَبِيَّةُ؟ قَالَ: “أَنْ تُعِيْنَ قَوْمَكَ عَلَى الظُّلْمِ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ.

4905. (13) [3/1374బలహీనం]

వాసి’లహ్‌ బిన్‌ అస్‌ఖ’అ (ర) కథనం: నేను ప్రవక్త (స) ను ఓ ప్రవక్తా! పక్షపాతం అంటే ఏమిటి? అని ప్రశ్నించాను. దానికి ప్రవక్త (స) అత్యాచారం విషయంలో నువ్వు నీ జాతిని సమర్థించటం అని సమాధానం ఇచ్చారు.  (అబూ  దావూద్‌)

4906 – [ 14 ] ( ضعيف ) (3/1374)

وَعَنْ سُرَاقَةَ بْنِ مَالِكِ بْنِ جُعْشُمٍ قَالَ: خَطَبَنَا رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم فَقَالَ:”خَيْرُكُمْ الْمُدَافِعُ عَنْ عَشِيْرَتِهِ مَا لَمْ يَأْثَمْ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ .

4906. (14) [3/1374బలహీనం]

సురాఖహ్ బిన్‌ మాలిక్‌ బిన్‌ జు’అషుమ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రసంగిస్తూ ”తన జాతి తరఫున హింసను ఎదుర్కొన్నవాడు అందరికంటే ఉత్తముడు. అయితే అందులో ఎటువంటి పాపానికి పాల్పడ రాదు,” అని అన్నారు. (అబూ  దావూద్)

4907 – [ 15 ] ( ضعيف ) (3/1374)

وَعَنْ جُبَيْرِ بْنِ مُطْعِمِ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم قَالَ: “لَيْسَ مِنَّا مَنْ دَعَا إِلى عَصَبِيَّةٍ وَلَيْسَ مِنَّا مَنْ قَاتَلَ عَصَبِيَّةً وَلَيْسَ مِنَّا مَنْ مَاتَ عَلى عَصْبِيَّةٍ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ.

4907. (15) [3/1374 బలహీనం]

జుబైర్‌ బిన్‌ ము’త్‌’ఇమ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ప్రజలను కష్టాలవైపు ఆహ్వానించేవాడు ముస్లిమ్‌ కాడు, పక్షపాత వైఖరితో యుద్ధం చేసే వ్యక్తి ముస్లిమ్‌ కాడు, పక్షపాత వైఖరిపై మరణించిన వాడు ముస్లిమ్‌ కాడు.” (అబూ  దావూద్‌)

4908 – [ 16 ] ( لم تتم دراسته ) (3/1374)

وَعَنْ أَبِي الدَّرْدَاءِ عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ: “حُبُّكَ الشَّيْءَ يُعْمِيْ وَيُصِمُّ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ.

4908. (16) [3/1374అపరిశోధితం]

అబూ దర్దా’ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఒక వస్తువుపట్ల గల అనవసరమైన ప్రేమ మిమ్మల్ని గ్రుడ్డి వాడిగా, చెవిటివాడిగా చేసివేస్తుంది.” (అబూ దావూద్‌)

—–

الْفَصْلُ الثَّالِثُ మూడవ విభాగం 

4909 – [ 17 ] ( لم تتم دراسته ) (3/1375)

عَنْ عُبَادَةَ بْنِ كَثِيْرٍالشَّامِيِّ مِنْ أَهْلِ فَلَسْطِيْنَ عَنِ امْرَأَةٍ مِّنْهُمْ يُقَالُ لَهَا فَسِيْلَةُ أَنَّهَا قَالَتْ: سَمِعْتُ أَبِيْ يَقُوْلُ: سَأَلْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه و سلم فَقُلْتُ: يَا رَسُوْلَ اللهِ أَمِنَ الْعَصَبِيَّةِ أَنْ يُحِبَّ الرَّجُلُ قَوْمَهُ؟ قَالَ: “لَا وَلَكِنْ مِنَ الْعَصَبِيَّةِ أَنْ يَّنْصُرَالرَّجُلُ قَوْمَهُ عَلَى الظُّلْمِ”. رَوَاهُ أَحْمَدُ وَابْنُ مَاجَهُ.

4909. (17) [3/1375 అపరిశోధితం]

ఫలస్తీన్‌కు చెందిన ‘ఉబాదహ్‌ బిన్‌ కసీ’ర్‌ షామీ (ర) తన జాతికి చెందిన ఫసీలహ్‌ అనే మహిళ ద్వారా కథ నం: ఫసీలహ్‌ కథనం: నేను మా తండ్రిగారిని ఇలా అంటూ ఉండగా విన్నాను, ”నేను ప్రవక్త (స)తో, ‘ఓ ప్రవక్తా! మనిషి తన జాతిని ప్రేమించటం పక్షపాతం అవుతుందా?’ అని ప్రశ్నించాను. దానికి ప్రవక్త (స), ‘కాదు కాని, పక్షపాతం అంటే హింసలో కూడా తన జాతికి సహాయంచేయటం,’ అని అన్నారు. (అ’హ్మద్‌, ఇబ్నె మాజహ్)

4910 – [ 18 ] ( صحيح ) (3/1375)

وَعَنْ عُقْبَةَ بْنِ عَامِرٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “أَنْسَابُكُمْ هَذِهِ لَيْسَتْ بِمَسَبَّةٍ عَلَى أَحَدٍ كُلُّكُمْ بَنُوْ آدَمَ طَفُّ الصَّاع بِالصَّاعِ لَمْ تَمْلَؤُوهُ لَيْسَ لِأَحَدٍ عَلَى أَحَدٍ فَضْلٌ إِلَّا بِدِيْنٍ وَتَقْوَى كَفَى بِالرَّجُلِ أَنْ يَّكُوْنَ بِذِيًّا فَاحِشًا بَخِيْلًا”. رَوَاهُ أَحْمَدُ وَالْبَيْهَقِيُّ فِيْ”شُعَبِ الْإِيْمَانِ”.

4910. (18) [3/1375 దృఢం]

‘ఉఖ్‌బహ్ బిన్‌ ‘ఆమిర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మీ వంశాలు, కుటుంబాలు ఇతరులను నీచులుగా భావించటానికి, ఇతరులను తిట్టటానికి కాదు. అంటే వాటివల్ల తమ్ముతాము గొప్పవారిగా, ఇతరులను నీచులుగా భావించరాదు. మీరందరూ ఆదమ్‌ సంతానమే. ఎవరికీ ఎవరిపై ఎలాంటి ఆధిపత్యము లేదు, దైవభక్తి, దైవభీతిలో తప్ప. మనిషి చెడ్డవాడు కావటానికి అసభ్య పదాలు, లేదా అశ్లీల పదాలు లేదా పిసినారి కావటం చాలు.” (అ’హ్మద్‌, బైహఖీ-/ షు’అబిల్ ఈమాన్)

=====

14 – بَابُ الْبِرِّ وَالصِّلَةِ

14. పుణ్యం, బంధుత్వం హక్కు

తల్లిదండ్రుల తర్వాత ఇతర బంధువులకు కూడా హక్కులు ఉన్నాయి. అరబ్బీ భాషలో బంధువుల హక్కు నిర్వర్తించటాన్ని సిలహ్ ర’హ్మీ అంటారు. బంధువుల హక్కు నిర్వర్తించక పోవటాన్ని ఖత్‌’ ర’హ్మి, అంటారు. ఎందుకంటే తల్లిగర్భం వీటికి మూలం. ఈ భాగస్వామ్యం అనేక విధాలుగా ఉంటుంది. సమవయస్సు, దయ, జాలి, భూతదయ, మిత్రత్వం, సమజాతీయత అనేక రూపాల్లో బహిర్గతం అవుతుంది. ఈ బంధుత్వాన్ని పటిష్ఠంగా ఉంచటానికి వీటి హక్కులు నెరవేర్చటం తప్పనిసరి. వీటన్నిటి కంటే ప్రధానమైనది బంధుత్వం. ఇది ప్రకృతి సహజ మైన బంధం. ఇది అనేకమంది కృషివల్ల ఉద్భవిస్తుంది. అందువల్ల వీటి హక్కుల పట్ల కనిపెట్టు కొని ఉండాలి. బంధుత్వ సంబంధాలను త్రెంచే వారిని దోషులుగా, పాపాత్ములుగా పరిగణించటం జరుగుతుంది.

అల్లాహ్‌ ఆదేశం:”అల్లాహ్‌ (త) అవిధేయత చూపిన వారిని, కలిపి ఉంచమని ఆదేశించినదాన్ని త్రెంచేవారిని అల్లాహ్‌ మార్గభ్రష్ఠత్వానికి గురిచేస్తాడు.”

దాసుల హక్కుల్లో బంధుత్వ హక్కులు అనేకం ఉన్నాయి. ఖుర్‌ఆన్‌లోని 12 ఆయాతులలో దీన్ని గురించి పేర్కొనడం జరిగింది. ఇంకా దీన్ని ఉపకారంగా కాక, విధి మరియు హక్కుగా పరిగణించటం జరిగింది.

1. బంధువులహక్కు చెల్లించాలి.(అర్రూమ్, 30)

2. బంధువుల హక్కు చెల్లించాలి. తన సమస్య లను ప్రక్కన పెట్టి బంధువుల సమస్యలను తీర్చాలి. (అల్ ఇస్రా, 17)

3. అవసరం ఉన్నా దైవప్రీతి కోసం బంధువుల సమస్యలను పరిష్కరించాలి. ఇది అల్లాహ్‌తో చేసిన వాగ్దానం. (అల్ బఖరహ్, 2)

4. సూరహ్‌ నమ్‌ల్‌(27)లో బంధువుల సహాయం, ఉపకారం గురించి మూడవసారి పేర్కొనడం జరిగింది. ధనవంతులు తమ తల్లిదండ్రుల తర్వాత ముందు బంధువులకే సహాయం, ఉపకారం చేయాలి. అల్లాహ్‌ ఆదేశం: ”ఓ ప్రవక్తా! లాభం చేకూర్చదలిస్తే తమ తల్లి దండ్రులకు, బంధువులకు, అనాథులకు, పేదలకు ఇవ్వండి. వారిలో ఎవరివల్లనైనా పొరపాటు జరిగితే వారికి ఇవ్వకుండా ఉండరాదు. ”మీలోని ధనవంతులు పేదలకు ఇవ్వనని ప్రమాణం చేయరాదు. దైవారాధన, తల్లిదండ్రుల సేవ తర్వాత మూడవది బంధుత్వ హక్కు.” (అన్నమ్‌ల్‌, 27)

మరోచోట అల్లాహ్‌ ఆదేశం: ”అల్లాహ్‌నే ఆరాధించండి. ఆయనకు సాటి కల్పించకండి. తల్లిదండ్రులు మరియు బంధువుల పట్ల సహాయం, ఉపకారం చేయండి.” (అన్నిసా’, 4:)

బంధుత్వానికి ఇస్లామ్‌లో చాలా గొప్ప ప్రాధాన్యత ఉంది. ప్రవక్త (స) బంధుత్వాన్ని త్రెంచరాదని, బంధువులతో కలసి మెలసి ఉండాలని ఉపదే శించారు. బంధువులతో ప్రేమాభిమానాలతో వ్యవహ రించాలని హితబోధ చేసారు.

اَلْفَصْلُ الْأَوَّلُ  మొదటి విభాగం 

4911 – [ 1 ] ( متفق عليه ) (3/1376)

عَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: قَالَ رَجُلٌ:يَا رَسُوْلَ اللهِ مَنْ أَحَقُّ بِحُسْنِ صَحَابَتِيْ؟ قَالَ: “أُمُّكَ”. قَالَ: ثُمَّ مَنْ؟ قَالَ: “أُمُّكَ”. قَالَ  ثُمَّ مَنْ؟ قَالَ “أُمُّكَ”. قَالَ: ثُمَّ مَنْ؟ قَالَ: “أَبُوْكَ”.

وَفِيْ رِوَايَةٍ قَالَ: “أُمُّكَ ثُمَّ أُمُّكَ ثُمَّ أُمُّكَ ثُمَّ أَبَاكَ ثُمَّ أَدْنَاكَ أَدْنَاكَ”. مُتَّفَقٌ عَلَيْهِ. 

4911. (1) [3/1376 ఏకీభవితం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ఒక వ్యక్తి, ”ఓ ప్రవక్తా! నా ప్రవర్తనకు అందరికంటే ఎక్కువ హక్కుగల వారెవరు?” అని ప్రశ్నించాడు. ప్రవక్త (స), ‘నీ తల్లి,’ అన్నారు. ఆ వ్యక్తి మళ్ళీ ప్రశ్నించాడు. ప్రవక్త (స), ‘నీ తల్లి,’ అన్నారు. ఆ వ్యక్తి మళ్ళీ ప్రశ్నించాడు. ప్రవక్త (స), ‘నీ తల్లి,’ అని సమాధానం ఇచ్చారు. ఆ వ్యక్తి మళ్ళీ  ప్రశ్నించాడు. అప్పుడు ప్రవక్త (స), ‘నీ తండ్రి, ఆ తరువాత క్రమంగా నీ బంధువులు,’ అని అన్నారు. (బు’ఖారీ, ముస్లిం)

4912 – [ 2 ] ( صحيح ) (3/1376)

وَعَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “رَغِمَ أَنْفُهُ رَغِمَ أَنْفُهُ رَغِمَ أَنْفُهُ”. قِيْلَ: مَنْ يَا رَسُوْلَ اللهِ؟ قَالَ: “مَنْ أَدْرَكَ وَالِدَيْهِ عِنْدَ الْكِبَرِ أَحَدَهُمَا أَوْ كِلَاهُمَا ثُمَّ لَمْ يَدْخُلِ الْجَنَّةَ”. رَوَاهُ مُسْلِمٌ.

4912. (2) [3/1376 దృఢం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ”వాడి ముక్కుకు మన్నుతగల, వాడి ముక్కుకు మన్ను తగల,” – అంటే అవమానం పాలు అవుగాక! అని అన్నారు. దానికి ‘ఎవరు, ఓ ప్రవక్తా! అని అక్కడున్న వారు అడిగారు.’ అప్పుడు ప్రవక్త (స), ‘తల్లిదండ్రుల నిద్దరినీ లేదా వారిలో ఒకరిని వారి వృద్ధాప్యంలో పొందికూడా సేవచేసి స్వర్గం పొందనివాడు,” అని అన్నారు. (ముస్లిమ్‌)

4913 – [ 3 ] ( متفق عليه ) (3/1376)

وَعَنْ أَسْمَاءَ بِنْتِ أَبِيْ بَكْرٍرَضِيَ اللهُ عَنهَا قَالَتْ:قَدِمَتْ عَلَيَّ أُمِّيْ وَهِيَ مُشْرِكَةٌ فِيْ عَهْدِ قُرَيْشٍ فَقُلْتُ:يَا رَسُوْلَ اللهِ إِنَّ أُمِّيْ قَدِمَتْ عَلَيَّ وَهِيَ رَاغِبَةٌ أَفَأَصِلُهَا؟ قَالَ: “نَعَمْ صِلِيْهَا”. مُتَّفَقٌ عَلَيْهِ.  

4913. (3) [3/1376ఏకీభవితం]

అస్మా బిన్తె అబీ బకర్‌ (ర): అవిశ్వాస స్థితిలో ఉన్న నా తల్లి నా దగ్గరకు మదీనహ్ మునవ్వరహ్ వచ్చారు. అప్పటికి ముస్లిములు, కాఫిర్ల మధ్య ఒప్పందం జరిగి ఉంది. అప్పుడు నేను ప్రవక్త (స)తో, ‘ఓ ప్రవక్తా! నా తల్లి నా దగ్గరకు వచ్చింది. అయితే ఆమె ఇస్లామ్‌ స్వీకరించ లేదు, నేను నా తల్లి పట్ల మంచిగా ప్రవర్తించవచ్చునా అంటే ఆమెకు బంధుత్వ హక్కును నిర్వర్తించ వచ్చునా,’ అని విన్నవించుకున్నది. దానికి ప్రవక్త (స), ‘నీవు నీ తల్లిపట్ల ఉత్తమంగా ప్రవర్తించు,’ అని అన్నారు. (బు’ఖారీ, ముస్లిం)

ఈ ‘హదీసు’ ద్వారా అవిశ్వాస తల్లిదండ్రుల పట్ల, బంధువుల పట్ల మంచిగా ప్రవర్తించాలి అని తెలిసింది.

4914 – [4 ] ( متفق عليه ) (3/1376)

وَعَنْ عَمْرِوبْنِ الْعَاصِ قَالَ: سَمِعْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ: “إِنَّ آلَ فُلَانٍ لَيْسُوْا لِيْ بِأَوْلِيَاءَ. إِنَّمَا وَلِيِّيَ اللهُ وَصَالِحُ الْمُؤْمِنِيْنَ. وَلَكِنْ لَهُمْ رَحِمٌ أَبُلُّهَا بِبِلَالِهَا. مُتَّفَقٌ عَلَيْهِ.  

4914. (4) [3/1376ఏకీభవితం]

‘అమ్ర్‌ బిన్‌ అల్‌ ‘ఆ’స్‌ (ర) కథనం: ప్రవక్త (స) ఇలా ప్రవచిస్తూ ఉండగా నేను విన్నాను, ”ఫలానా వ్యక్తి సంతానం నా మిత్రులు కారు. నా మిత్రుడు, రక్షకుడు కేవలం అల్లాహ్ (త) మరియు పుణ్య భక్తులు. కాని నేను నా బంధువులపట్ల ప్రాపంచిక విషయాల్లో సహాయ సహకారాలు అందిస్తూ ఉంటాను, బంధువుల హక్కును చెల్లిస్తూ ఉంటాను.” [52]  (బు’ఖారీ, ముస్లిం)

4915 – [ 5] ( متفق عليه ) (3/1377)

وَعَنِ الْمُغَيْرَةِ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِنَّ اللهَ حَرَّمَ عَلَيْكُمْ عُقُوْقَ الْأُمَّهَاتِ وَوَأدَ الْبَنَاتِ وَمَنَعَ وَهَاتِ. وَكَرِهَ لَكُمْ قِيْلَ وَقَالَ وَكَثْرَةُ السُّؤَالِ وَإِضَاعَةَ الْمَالِ”. مُتَّفَقٌ عَلَيْهِ.  

4915. (5) [3/1377ఏకీభవితం]

ము’గీరహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”అల్లాహ్‌(త) మీపై మీ తల్లుల అవిధేయతను నిషేధించాడు. ఆడ బిడ్డల సజీవ ఖననాన్ని కూడా నిషేధించాడు. దారి దోపిడీలను కూడా నిషేధించాడు. అధికంగా ప్రశ్నించటాన్ని కూడా నిషేధించాడు. ఇంకా దుబారా ఖర్చులను కూడా నిషేధించాడు.” [53] (బు’ఖారీ, ముస్లిం)

అంటే అల్లాహ్‌ (త) తల్లుల అవిధేయత, వారిని హింసించటాన్ని నిషేధించాడు. ఇతరుల హక్కులను కొల్లగొట్టటాన్ని నిషేధించాడు.

4916 – [ 6 ] ( متفق عليه ) (3/1377)

وَعَنْ عَبْدِ اللهِ بْنِ عَمْرٍوقَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مِنَ الْكَبَائِرِ شَتْمُ الرَّجُلِ وَالِدَيْهِ”. قَالُوْا: يَا رَسُوْلَ اللهِ وَهَلْ يَشْتِمُ الرَّجُلُ وَالِدَيْهِ؟ قَالَ: “نَعَمْ يَسُبُّ أَبَا الرَّجُلِ فَيَسُبُّ أَبَاهُ وَيَسُبُّ أُمَّهُ فَيَسُبُّ أُمَّهُ”. مُتَّفَقٌ عَلَيْهِ.

4916. (6) [3/1377 ఏకీభవితం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘ఉమర్‌ (ర) కథనం: ప్రవక్త (స), ”తల్లి దండ్రులను తిట్టటం మహాపాపం” అని అన్నారు. అప్పుడు అనుచరులు, ‘ప్రవక్తా! ఎవడైనా తల్లి దండ్రులను కూడా తిడతాడా?’ అని ప్రశ్నించారు. అప్పుడు ప్రవక్త (స), ‘అవును ఒకరు మరొకరి తల్లి దండ్రుల్ని తిడతాడు, వాడు వీడి తల్లి దండ్రుల్ని తిడతాడు. అంటే తన తల్లిదండ్రుల్ని తిట్టినట్లే కదా,’ అని అన్నారు.  (బు’ఖారీ, ముస్లిం)

4917 – [ 7 ] ( صحيح ) (3/1377)

وَعَنِ ابْنِ عُمَرَقَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِنَّ مِنْ أَبَرِّ الْبِرَّ صِلَةَ الرَّجُلِ أَهْلَ وُدِّ أَبِيْهِ بَعْدَ أَنْ يُوَلِّيَ”. رَوَاهُ مُسْلِمٌ.  

4917. (7) [3/1377దృఢం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘ఉమర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”తండ్రి మరణానంతరం తండ్రి స్నేహితు లతో సంబంధాలను కలిగి ఉండటం, వారికి ఉపకారం చేయటం చాలా పెద్ద పుణ్యం. అంటే తన తండ్రి పట్ల ఉత్తమ రీతిలో వ్యవహరించి నట్లు.”  (ముస్లిమ్‌)

అంటే తండ్రి మరణానంతరం తండ్రి స్నేహితులకు సహాయం, ఉపకారం చేయటం గొప్ప పుణ్యం.

4918 – [ 8 ] (مُتَّفَقٌ عَلَيْهِ) (3/1377)

وَعَنْ أَنَسٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَنْ أَحَبَّ أَنْ يُبْسَطَ لَهُ فِيْ رِزْقِهِ وَيُنْسَأَ لَهُ فِيْ أَثَرِهِ فَلْيَصِلْ رَحِمَهُ”.

4918. (8) [3/1377ఏకీభవితం]

అనస్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”తన ఉపాధి అభివృద్ధి చెందాలని కోరుకునేవారు, తమ ఆయుష్షు పెరగాలని కోరుకునేవారు బంధుత్వ హక్కులను నెరవేరుస్తూ  ఉండాలి.” (బు’ఖారీ, ముస్లిం)

అంటే బంధుత్వ హక్కులను నెరవేర్చటం వల్ల అతని ఉపాధి, ఆయుష్షులలో శుభం కలుగుతుంది.

4919 – [ 9 ] ( متفق عليه ) (3/1377)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “خَلَقَ اللهُ الْخَلْقَ فَلَمَّا فَرَغَ مِنْهُ قَامَتِ الرَّحِمُ فَأَخَذَتْ بِحَقْوَيِ الرَّحْمنِ فَقَالَ: مَهُ؟ قَالَتْ: هَذَا مَقَامُ الْعَائِذِ بِكَ مِنَ الْقَطِيْعَةِ. قَالَ: أَلَا تَرْضَيْنَ أَنْ أَصِلَ مَنْ وَصَلَكِ وَأَقْطَعَ مَنْ قَطَعَكِ؟ قَالَتْ: بَلَى يَا رَبِّ قَالَ: فَذَاكَ”. مُتَّفَقٌ عَلَيْهِ.

4919. (9) [3/1377 ఏకీభవితం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”అల్లాహ్‌ (త) సృష్టితాలను సృష్టించాడు. తరువాత వాటి బంధుత్వాన్ని సృష్టించాడు. ఆ తరువాత బంధుత్వం నిలబడి అల్లాహ్‌ (త) నడుము పట్టుకుంది. ‘ఎందుకు నిలబడ్డావు’ అని అల్లాహ్‌ (త) ప్రశ్నించాడు. ‘ఎవరూ నన్ను త్రెంచరాదని కోరుకుం టున్నాను,’ అని అంది. అప్పుడు అల్లాహ్‌(త), ‘నిన్ను కలిపి ఉంచిన వాడ్ని నేను కలిపిఉంచుతాను. అదేవిధంగా నిన్ను త్రెంచినవాడిని నేను తెంచివేస్తాను. ఇది నీకు ఇష్ట మేనా,’ అని అన్నాడు. దానికి బంధు త్వం, ‘ఇది నాకిష్టమే,’ అని అన్నది. ఇలాగే జరుగు తుందని అల్లాహ్‌ (త) అన్నాడు.  (బు’ఖారీ, ముస్లిం)

4920 – [ 10 ] ( صحيح ) (3/1377)

وَعَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “اَلرَّحِمُ شَجْنَةٌ مِنَ الرَّحْمنِ. فَقَالَ اللهُ: مَنْ وَصَلَكِ وَصَلْتُهُ وَمَنْ قَطَعَكِ قَطَعْتُهُ”. رَوَاهُ الْبُخَارِيُّ  

4920. (10) [3/1377దృఢం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”అర్ర’హీము, ర’హ్మాన్‌ నుండి ఉద్భవించింది. అల్లాహ్‌ ఆదేశం, ”ఓ బంధుత్వమా! నిన్ను కలిపి ఉంచిన వాడ్ని నేను కలిపి ఉంచుతాను, నిన్ను త్రెంచినవాడ్ని నేను త్రెంచుతాను.” (బు’ఖారీ)

అంటే బంధుత్వ హక్కులను నెరవేర్చేవారివెంట అల్లాహ్‌ (త) కారుణ్యం ఉంటుంది. అదేవిధంగా బంధుత్వపు హక్కులను నెరవేర్చని వారిపై అల్లాహ్‌ (త) కారుణ్యం అవతరించదు.

4921 – [ 11 ] ( متفق عليه ) (3/1378)

وَعَنْ عَائِشَةَ قَالَتْ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “اَلرَّحِمُ مُعَلَّقَةٌ بِالْعَرْشِ تَقُوْلُ: مَنْ وَصَلَنِيْ وَصَلَهُ اللهُ وَمَنْ قَطَعَنِيْ قَطَعَهُ اللهُ”. مُتَّفَقٌ عَلَيْهِ.  

4921. (11) [3/1378 ఏకీభవితం]

‘ఆయి’షహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”బంధుత్వం దైవసింహాసనానికి వ్రేలాడుతూ ఉంది. ఇంకా ”ఓ ప్రభూ! నన్ను కలిపి ఉంచినవారిని కలిపి ఉంచు, ఇంకా నన్ను త్రెంచినవారిని నువ్వు త్రెంచి వేయి,” అని ప్రార్థిస్తూ  ఉంటుంది. (బు’ఖారీ, ముస్లిం)

4922 – [ 12 ] ( متفق عليه ) (3/1378)

وَعَنْ جُبَيْرِ بْنِ مُطْعِمٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَا يَدْخُلُ الْجَنَّةَ قَاطِعٌ”. مُتَّفَقٌ عَلَيْهِ.  

4922. (12) [3/1378ఏకీభవితం]

జుబైర్‌ బిన్‌ ము’త్‌’ఇమ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”బంధుత్వాలను త్రెంచేవాడు స్వర్గంలోనికి ప్రవేశించడు.” (బు’ఖారీ, ముస్లిం)

4923 – [ 13 ] ( صحيح ) (3/1378)

وَعَنْ ابْنِ عَمْرٍو قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَيْسَ الْوَاصِلُ بِالْمُكَافِيْءِ وَلَكِنَّ الْوَاصِلَ الَّذِيْ إِذَا قُطِعَتْ رَحِمُهُ وَصَلَهَا”. رَوَاهُ الْبُخَارِيُّ.  

4923. (13) [3/1378 దృఢం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘ఉమర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ప్రత్యుపకారం చేసేవాడు బంధుత్వ హక్కును తీర్చినవాడు కాడు. బంధుత్వ హక్కును నెరవేర్చే వాడంటే, అతన్ని కలవకున్నా, అతని హక్కు తీర్చకపోయినా, అతడు వారి హక్కుల్ని నిర్వర్తించే వాడు.”  (బు’ఖారీ)

4924 – [ 14 ] ( صحيح ) (3/1378)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ أَنَّ رَجُلًا قَالَ: يَا رَسُوْلَ اللهِ إِنَّ لِيْ قَرَابَةً أَصِلُهُمْ وَيَقْطَعُوْنِيْ وَأُحْسِنُ إِلَيْهِمْ وَيُسِيْؤُوْنَ إِلَيَّ وَأَحْلُمُ عَلَيْهِمْ وَيَجْهَلُوْنَ عَلَيَّ .فَقَالَ: “لَئِنْ كُنْتَ كَمَا قُلْتَ فَكَأَنَّمَا تُسِفُّهُمُ الْمَلَّ وَلَا يَزَالُ مَعَكَ مِنَ اللهِ ظَهِيْرٌ عَلَيْهِمْ مَا دُمْتَ عَلَى ذَلِكَ”. رَوَاهُ مُسْلِمٌ.

4924. (14) [3/1378 దృఢం]

అబూ హురైరహ్ (ర) కథనం: ఒక వ్యక్తి వచ్చి ప్రవక్త (స) ను ఇలా విన్నవించుకున్నాడు: ”ప్రవక్తా! మా బంధువులు కొందరున్నారు, నేను వారిపట్లగల వారి హక్కుల్ని నెర వేరుస్తూ ఉంటాను, కాని వారు మాత్రం నా హక్కుల్ని ఖాతరు చేయరు. నేను వారిపట్ల ఎంతో మంచిగా వ్యవహరిస్తాను, వారు మాత్రం నాఎడల చెడుగానే వ్యవహ రిస్తున్నారు, నేను వారితో సహనంగా ఓరిమితో మెలుగు తుంటాను. వారేమో నా పట్ల మూర్ఖంగా ప్రవర్తిస్తారు.” అది విని ప్రవక్త (స), ”నీ ప్రవర్తన నీవు చెప్పినట్లే ఉంటే నీవు వారి ముఖాలకు మసి పులుముతున్నావు. అంటే నీవు ఇలాగే స్థిరంగా వ్యవహరించినంత వరకు అల్లాహ్‌ (త) వారికి వ్యతిరేకంగా నీకు సహాయ పడుతూ ఉంటాడు” అని ప్రవచించారు. (ముస్లిమ్‌)

—–

اَلْفَصْلُ الثَّانِيْ  రెండవ విభాగం 

4925 – [ 15 ] ( لم تتم دراسته ) (3/1378)

عَنْ ثَوْبَانَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَا يَرُدُّ الْقَدَرَ إِلَّا الدُّعَاءُ وَلَا يَزِيْدُ فِيْ الْعُمُرِ إِلَّا الْبِرُّ. وَإِنَّ الرَّجُلَ لَيُحْرَمُ الرِّزْقَ بِالذَّنْبِ يُصِيْبُهُ”. رَوَاهُ ابْنُ مَاجَهُ.  

4925. (15) [3/1378అపరిశోధితం]

సౌ’బాన్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”విధి వ్రాతను కేవలం దు’మార్చగలదు, ఆయుష్షును కేవలం పుణ్యం మాత్రమే అధికం చేస్తుంది, ఇంకా మనిషి యొక్క పాపాల వల్ల అతని ఉపాధిని అతన్నుండి దూరం చేయబడు తుంది.” [54] (ఇబ్నె  మాజహ్)

4926 – [ 16 ] ( لم تتم دراسته ) (3/1378)

وَعَنْ عَائِشَةَ قَالَتْ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “دَخَلْتُ الْجَنَّةَ فَسَمِعْتُ فِيْهَا قِرَاءَةٌ فَقُلْتُ: مَنْ هَذَا؟ قَالُوْا: حَارِثَةُ بْنُ النُّعْمَانِ كَذَلِكُمُ الْبِرُّ كَذَلِكُمُ الْبِرُّ”. وَكَانَ أَبَرَّ النَّاسِ بِأُمِّهِ. رَوَاهُ فِيْ”شَرْحِ السُّنَّةِ”. وَالْبَيْهَقِيُّ فِيْ” شُعَبِ الْإِيْمَانِ”

وَفِيْ رِوَايَةٍ:قَالَ:”نِمْتُ فَرَأَيْتُنِيْ فِي الْجَنَّةِ “بَدْلَ” دَخَلْتُ الْجَنَّةَ”.

4926. (16) [3/1378 అపరిశోధితం]

‘ఆయి’షహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”నేను స్వర్గంలో ప్రవేశించాను. అక్కడ ఖుర్‌ఆన్‌ పఠించే శబ్దం విన్నాను. ఆ వ్యక్తి ఎవరు అని కనుక్కున్నాను. అతడు ‘హారిస’హ్ బిన్‌ నో’మాన్‌ అని ప్రజలు చెప్పారు. ఈ ‘హారిస’హ్ తన తల్లికి అపారమైన సేవచేసేవారు. దీని శుభం వల్ల స్వర్గంలోనికి వెళ్ళారు. ఖుర్‌ఆన్‌ పఠించే స్థానం పొందారు. (ష’ర్ ‘హుసున్నహ్, బైహఖీ-/ షు’అబిల్ ఈమాన్)

4927 – [ 17 ] ( لم تتم دراسته ) (3/1379)

وَعَنْ عَبْدِ اللهِ بْنِ عَمْرٍوقَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “رضى الرب في رضى الوالد وسخط الرب في سخط الوالد”. رَوَاهُ التِّرْمِذِيُّ.

4927. (17) [3/1379అపరిశోధితం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘ఉమర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”అల్లాహ్‌ సంతృప్తి తండ్రి సంతృప్తిలో ఉంది. అల్లాహ్‌ అసంతృప్తి తండ్రి అసంతృప్తిలో ఉంది.” (తిర్మిజి’)

అంటే తండ్రి సంతృప్తి చెందితే అల్లాహ్‌(త) సంతోషిస్తాడు. తండ్రి ఆగ్రహిస్తే, అల్లాహ్‌(త) కూడా ఆగ్రహిస్తాడు. అయితే తండ్రి సంతృప్తి కొడుకు విధేయతపై ఆధారపడి ఉంటుంది. అంటే విధేయుడైన కొడుకుపట్ల తండ్రి సంతోషంగా ఉంటాడు. అల్లాహ్‌ (త) కూడా సంతృప్తిగా ఉంటాడు. అవిధేయుడైన కొడుకు పట్ల  తండ్రి, అల్లాహ్‌ ఇద్దరూ  ఆగ్రహంగా  ఉంటారు.

4928 – [ 18 ] ( لم تتم دراسته ) (3/1379)

وَعَنْ أَبِي الدَّرْدَاءِ أَنَّ رَجُلًا أَتَاهُ فَقَالَ: إِنَّ لِي امْرَأةً وَإِنَّ لِيْ أُمِّيْ تَأْمُرُنِيْ بِطَلَاقِهَا؟ فَقَالَ لَهُ أَبُوْ الدَّرْدَاءِ: سَمِعْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم: “اَلْوَالِدُ أَوْسَطُ أَبْوَابِ الْجَنَّةِ. فَإِنْ شِئْتَ فَحَافِظْ عَلَى الْبَابِ أَوْ ضَيِّعْ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَابْنُ مَاجَهُ.  

4928. (18) [3/1379అపరిశోధితం]

అబూ దర్‌దా’ (ర) కథనం: అతని వద్దకు ఒక వ్యక్తి వచ్చి, ‘నా తల్లి నన్ను నా భార్యకు విడాకులు ఇమ్మని చెబుతుంది. తల్లి కోరికపై విడాకులు (‘తలాఖ్‌) ఇవ్వా లా వద్దా?’ అని విన్నవించు కున్నాడు. అప్పుడు అబూ దర్దా’ (ర) ప్రవక్త (స)ను ఇలా అంటూ ఉండగా నేను విన్నానని అన్నారు. ”తండ్రి స్వర్గంలోని ప్రధాన ద్వారం వంటివాడు. అంటే స్వర్గంలో ప్రవేశించటానికి మహా ద్వారంవంటివాడు. నీవుకోరితే దాన్ని భద్రంగా ఉంచుకో లేదంటే దాన్నిపొగొట్టుకో.”  (తిర్మిజి’, ఇబ్నె మాజహ్)

4929 – [ 19 ] ( حسن ) (3/1379)

وَعَنْ بَهْزِبْنِ حَكِيْمٍ عَنْ أَبِيْهِ عَنْ جَدِّهِ قَالَ: قُلْتُ: يَا رَسُوْلَ اللهِ مَنْ أَبَرُّ؟ قَالَ: “أُمَّكَ”قُلْتُ: ثُمَّ مَنْ؟ قَالَ: “أُمَّكَ” قُلْتُ: ثُمَّ مَنْ؟ قَالَ: “أُمَّكَ” قُلْتُ: ثُمَّ مَنْ؟ قَالَ: “أَبَاكَ ثُمَّ الْأَقْرَبَ فَالْأَقْرَبَ”. رَوَاهُ التِّرْمِذِيُّ وأَبُوْدَاوُدَ

4929. (19) [3/1379 ప్రామాణికం]

బహ’జ్‌ బిన్‌ ‘హకీమ్‌ తన తండ్రి ద్వారా, ఆయన తన తండ్రి ద్వారా కథనం: ‘ఓ ప్రవక్తా! ఉపకారం ఎవరికి చేయను,’ అని విన్నవించుకున్నాను. దానికి ప్రవక్త (స), ‘తల్లికి ఉపకారం చేయి,’ అని అన్నారు. మళ్ళీ నేను ఇలాగే ప్రశ్నించాను. ప్రవక్త (స) మళ్ళీ, ‘నీ తల్లికి ఉపకారం చేయి,’ అని అన్నారు. మళ్ళీ మూడవసారి నేను, ‘ఎవరికి ఉపకారం చేయాలి,’ అని విన్నవించుకున్నాను. ప్రవక్త (స) మళ్ళీ అలాగే అన్నారు. మళ్ళీ నేను ప్రశ్నించాను. దానికి ప్రవక్త (స), ‘నీ తండ్రికి, దగ్గరి బంధువులకు ఉపకారంచేయి,’ అని అన్నారు. (తిర్మిజి’, అబూ  దావూద్‌)

4930 – [ 20 ] ( حسن صحيح ) (3/1379)

وَعَنْ عَبْدِ الرَّحْمنِ بْنِ عَوْفٍ قَالَ: سَمِعْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ: “قَالَ اللهُ تَبَارَكَ: أَنَا اللهُ وَأَنَا الرَّحْمنُ. خَلَقْتُ الرَّحِمَ وَشَقَقْتُ لَهَا مِنَ اسْمِيْ فَمَنْ وَصَلَهَا وَصَلْتُهُ. وَمَنْ قَطَعَهَا بَتَّتُهُ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ.

4930. (20) [3/1379- ప్రామాణికం, దృఢం]

‘అబ్దుర్ర’హ్మాన్‌ బిన్‌ ‘ఔఫ్‌ (ర) కథనం: ప్రవక్త (స)ను ఇలా అంటూ ఉండగా నేను విన్నాను, ”అల్లాహ్‌ ఆదేశం: ”నేనే అల్లాహ్‌ను, ర’హ్మాన్‌ను, నేను ర’హమ్‌ బంధుత్వాన్ని సృష్టించాను. నా పేరు ర’హ్మాన్‌ నుండి ర’హీమ్‌ చేసాను. బంధుత్వాన్ని కలిపి ఉంచిన వారిని నేను కలిపి ఉంచుతాను,  బంధుత్వాన్ని త్రెంచిన వారిని నేను త్రెంచి వేస్తాను.”  (అబూ  దావూద్‌)

4931 – [ 21] ( لم تتم دراسته ) (3/1379)

وَعَنْ عَبْدِ اللهِ بْنِ أَبِيْ أَوْفَى قَالَ: سَمِعْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ: “لَا تَنْزِلُ الرَّحْمَةُ عَلَى قَوْمٍ فِيْهِمْ قَاطِعُ الرَّحِمِ”. رَوَاهُ الْبَيْهَقِيُّ فِيْ ” شُعَبِ الْإِيْمَانِ “

4931. (21) [3/1379 అపరిశోధితం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ అబీ ‘ఔఫా (ర) కథనం: ప్రవక్త (స) ఇలా అంటూ ఉండగా నేను విన్నాను, ”బంధుత్వా లను త్రెంచేవారున్న జాతిపై అల్లాహ్‌(త) తన కారు ణ్యాన్ని అవతరింప జేయడు.” (బైహఖీ/-షు’అబిల్ ఈమాన్)

4932 – [ 22 ] ( صحيح ) (3/1379)

وَعَنْ أَبِيْ بَكْرَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَا مِنْ ذَنْبِ أَحْرَى أَنْ يُعَجِّلَ اللهُ لِصَاحِبِهِ الْعُقُوْبَةَ فِي الدُّنْيَا مَعَ مَايَدَّخِرُلَهُ فِي الْآخِرَةِ مِنَ الْبَغْيِ وَقَطِيْعَةِ الرَّحِمِ”. رَوَاهُ التِّرْمِذِيُّ وأَبُوْدَاوُدَ .

4932. (22) [3/137దృఢం]

 బక్రహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఇహ లోకం లోనే త్వరగా శిక్షించేంత పాపం ఏదీ లేదు కాని, దానికి పరలోకంలో శిక్షించడం జరుగుతుంది. కాని అత్యాచారం, బంధుత్వాన్ని త్రెంచటం అనేవి ఎంత ఘోరమైన పాపాలంటే ఇహలోకంలోనే దానికి ప్రతీ కారంగా శిక్షించటం జరుగుతుంది.” (తిర్మిజి’, అబూ  దావూద్‌)

అంటే హింస, బంధుత్వ సంబంధాలను త్రెంచిన దానికి పరలోకంలో శిక్ష ఉండనే ఉంది. కాని ఇహలోకంలో కూడా తప్పకుండా శిక్షించటం జరుగు తుంది. ఇవి తప్ప ఇతర పాపాలను పరలోకంలో తప్పకుండా శిక్షించటం జరుగు తుంది.

4933 – [ 23 ] ( لم تتم دراسته ) (3/1380)

وَعَنْ عَبْدِ اللهِ بْنِ عَمْرٍوقَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَا يَدْخُلُ الْجَنَّةَ مَنَّانٌ وَلَا عَاقٌ وَلَامُدْمِنٌ خَمْرٍ”. رَوَاهُ النَّسَائِيُّ وَالدَّارَمِيُّ

4933. (23) [3/1380  అపరిశోధితం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘ఉమర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఉపకారం చేసి ఎత్తి పొడిచేవాడు, తల్లి దండ్రుల పట్ల అవిధేయతకు పాల్పడినవాడు, మద్యం సేవించేవాడు స్వర్గంలోనికి ప్రవేశించడు.” (నసాయి’, దార్మి)

4934 – [ 24 ] ( لم تتم دراسته ) (3/1380)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “تَعَلَّمُوْا مِنْ أَنْسَابِكُمْ مَا تَصِلُوْنَ بِهِ أَرْحَامَكُمْ فَإِنَّ صِلَةَ الرَّحِمِ مَحَبَّةٌ فِي الْأَهْلِ مَثْرَاَةٌ فِي الْمَالِ مَنْسَأَةٌ فِي الْأَثْرِ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَقَالَ: هَذَا حَدِيْثٌ غَرِيْبٌ  

4934. (24) [3/1380 అపరిశోధితం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మీరు మీ వంశవృక్షాలను గుర్తించండి, బంధువులను గుర్తించండి. దానివల్ల మీరు బంధుత్వ హక్కులను నెరవేర్చటానికి, ఎందుకంటే బంధువుల పట్ల ఉపకారాలు, హక్కులు నెరవేర్చటం వల్ల పరస్పరం ప్రేమాభిమానాలు ఉంటాయి, దీనివల్ల ఉపాధిలో శుభం కలుగుతుంది, ఇంకా ఆయుష్షు పెరుగుతుంది. (తిర్మిజి’ – ఏకోల్లేఖనం)

4935 – [ 25 ] ( لم تتم دراسته ) (3/1380)

وَعَنِ ابْنِ عُمَرَأَنَّ رَجُلًا أَتَى النَّبِيَّ صلى الله عليه وسلم فَقَالَ: يَا رَسُوْلَ اللهِ إِنِّيْ أَصَبْتُ ذَنْبًا عَظِيْمًا. فَهَلْ لِيْ مِنْ تَوْبَةٍ؟ قَالَ: “هَلْ لَكَ مِنْ أُمِّ؟” قَالَ: لَا. قَالَ: “وَهَلْ لَكَ مِنْ خَالَةٍ؟” قَالَ: نَعَمْ. قَالَ: “فَبَرَّهَا”. رَوَاهُ التِّرْمِذِيُّ.   

4935. (25) [3/1380  అపరిశోధితం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘ఉమర్‌ (ర) కథనం: ప్రవక్త (స) వద్దకు ఒక వ్యక్తి వచ్చి, ”నేను చాలా ఘోరమైన పాపం చేసాను, నా పశ్చాత్తాపం స్వీకరించబడుతుందా?” అని విన్నవించుకున్నాడు. దానికి ప్రవక్త (స), ”నీ తల్లి ఉందా?” అని అడిగారు. దానికి ఆ వ్యక్తి లేదు అన్నాడు. ప్రవక్త (స) ”నీ పిన్ని(తల్లి చెల్లెలు) ఉందా?” అని అడిగారు, ఆ వ్యక్తి ఉంది అన్నాడు. అప్పుడు ప్రవక్త (స), ”నువ్వు నీ పిన్నికి ఉపకారం చేస్తూ ఉండు, ఆ ఉపకారం వల్ల నీ పశ్చాత్తాపం స్వీకరించబడుతుంది,” అని అన్నారు. (తిర్మిజి’)

4936 – [ 26 ] ( ضعيف ) (3/1380)

وعَنْ أَبِيْ أُسَيْدٍ السَّاعِدِيِّ قَالَ: بَيْنَا نَحْنُ عِنْدَ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم إِذْ جَاءَ رَجُلٌ مِنْ بَنِيْ سَلِمَةَ فَقَالَ: يَا رَسُوْلَ اللهِ هَلْ بَقِيَ مِنْ بِرِّ أَبَوَيَّ شَيْءٌ أَبِرُّهُمَا بِهِ بَعْدَ مَوْتِهِمَا؟ قَالَ: “نَعَمْ الصَّلَاةُ عَلَيْهِمَا وَالْاسْتِغْفَارُلَهُمَا وَإِنْفَاذُ عَهْدِهِمَا مِنْ بَعْدِهِمَا وَصِلَةُ الرَّحِمِ الَّتِيْ لَا تُوْصَلُ إِلَّا بِهِمَا وَإِكْرَامُ صَدِيْقِهِمَا”. رَوَاهُ أَبُوْدَاوُدَ وَابْنُ مَاجَهُ.

4936. (26) [3/1380 బలహీనం]

అబూ ఉసైద్‌ సా’ఇదీ (ర) కథనం: మేము ప్రవక్త (స) వద్ద కూర్చొని ఉన్నాం. బనూ సలిమహ్ తెగ నుండి ఒక వ్యక్తి వచ్చి, ‘ఓ ప్రవక్తా! నా తల్లిదండ్రుల మరణానంతరం, వాళ్ళకు పుణ్యం చేరడానికి ఏదైనా సత్కార్యం ఉంటే చెప్పండి, నేను చేయటానికి,’ అని విన్నవించు కున్నాడు. దానికి ప్రవక్త (స) ‘వారి గురించి దు’ఆ చేయి, వారి క్షమాపణ గురించి వేడుకోవటం, వారి వాగ్దానాలను నెరవేర్చటం, వారి బోధనల ప్రకారం జీవించటం, తల్లిదండ్రుల స్నేహితులు, కలిసేవారి పట్ల ఉపకారం చేయటం, వారిని గౌరవించటం, ఆదరించటం మొదలైనవన్నీ చేస్తే నీ తల్లిదండ్రుల పట్ల ఉపకారం చేసినట్లే.’  (అబూ  దావూద్‌, ఇబ్నె  మాజహ్)

4937 – [ 27 ] ( ضعيف ) (3/1380)

وَعَنْ أَبِي الطُّفَيْلِ قَالَ: رَأَيْتُ النَّبِيَّ صلى الله عليه وسلم يُقَسِّمُ لَحْمًا بِالْجِعِرَّانَةِ إِذْ أَقْبَلَتِ امْرَأَةٌ حَتّى دَنَتْ إِلى النَّبِيِّ صلى الله عليه وسلم فَبَسَطَ لَهَا رِدَاءَهُ فَجَلَسَتْ عَلَيْهِ. فَقُلْتُ: مَنْ هِيَ؟ فَقَالُوْا: هِيَ أُمُّهُ الَّتِيْ أَرْضَعَتْهُ. رَوَاهُ أَبُوْ دَاوُدَ.  

4937. (27) [3/1380 బలహీనం]

అబూ ‘తుఫైల్‌ (ర) కథనం: జి’ర్రానహ్ ప్రాంతంలో ప్రవక్త (స) మాంసం పంచిపెడుతున్నప్పుడు అకస్మాత్తుగా ఒక స్త్రీ ప్రవక్త (స) వద్దకు వచ్చింది. వెంటనే ప్రవక్త (స) తన దుప్పటిని పరిచారు. ఆమె దానిపై కూర్చుంది. నేను ప్రజలతో ‘ఈమె ఎవరు?’ అని అడిగాను. ‘ఆమె ప్రవక్త (స) పాలు పట్టిన తల్లి,’ అని అంటే బాల్యంలో ప్రవక్త (స)కు పాలుపట్టిన ‘హలీమహ్ (ర) అని అన్నారు. (అబూ  దావూద్‌)

ఈ ‘హదీసు’ ద్వారా పాలుపట్టిన తల్లిని కూడా కన్నతల్లిలా గౌరవించాలని తెలుస్తోంది.

—–

اَلْفَصْلُ الثَّالِثُ  మూడవ విభాగం  

4938 – [ 28 ] ( متفق عليه ) (3/1380)

عَنِ ابْنِ عُمَرَ عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ: “بَيْنَمَا ثَلَاثَةُ نَفَرٍ يَتَمَاشُوْنَ أَخَذَهُمُ الْمَطَرُ فَمَالُوْا إِلى غَارٍ فِي الْجَبَلِ فَانْحَطَّتْ عَلَى فَمِ غَارِهِمْ صَخْرَةٌ مِنَ الْجَبَلِ فَأَطْبَقَتْ عَلَيْهِمْ. فَقَالَ بَعْضُهُمْ لِبَعْضٍ: اُنْظُرُوْا أَعْمَالًا عَمِلْتُمُوْهَا لِلّهِ صَالِحَةً. فَادْعُوا اللهَ بِهَا لَعَلَّهُ يُفَرِّجُهَا. فَقَالَ أَحَدُهُمْ: اَللّهُمَّ إِنَّهُ كَانَ لِيْ وَالِدَانِ شَيْخَانِ كَبِيْرَانِ وَلِيْ صِبْيَةٌ صِغَارٌ كُنْتُ أَرْعَى عَلَيْهِمْ فَإِذَا رُحْتُ عَلَيْهِمْ فَحَلَبْتُ بَدَأْتُ بِوَالِدَيَّ أَسْقِيْهِمَا قَبْلَ وَلَدِيْ وَإِنَّهُ قَدْ نَأى بِيَ الشَّجَرُ فَمَا أَتَيْتُ حَتّى أَمْسَيْت فَوَجَدْتُهُمَا قَدْ نَامَا فَحَلَبْتُ كَمَا كُنْتُ أَحلبُ فَجِئْتُ بِالْحِلَابِ فَقُمْتث عِنْدَ رُؤُوْسِهِمَا أَكْرَهُ أَنْ أُوْقِظَهُمَا وَأَكْرَهُ أَنْ أَبْدَأَ بِالصِّبْيَةِ قَبْلَهُمَا وَالصِّبْيَةُ يَتَضَاغُوْنَ عِنْدَ قَدَمَيَّ فَلَمْ يَزَلْ ذَلِكَ دَأَبِيْ وَدَأْبُهُمْ حَتَّى طَلَعَ الْفَجْرُ فَإِنْ كُنْتَ تَعْلَمُ أَنِّيْ فَعَلْتُ ذَلِكَ ابْتِغَاءَ وَجْهِكَ فَافْرُجْ لَنَا فُرْجَةً نَرَى مِنْهَا السَّمَاءَ فَفَرَجَ اللهُ لَهُمْ حَتّى يَرَوْنَ السَّمَاءَ. قَالَ الثَّانِيْ: اَللّهُمَّ إِنَّهُ كَانَ لِيْ بِنْتث عَمٍّ أُحِبُّهَا كَأَشَدِّ مَا يُحِبُّ الرِّجَالُ النِّسَاءَ فَطَلَبْتُ إِلَيْهَا نَفْسَهَا فَأَبَتْ حَتّى آتِيَهَا بِمِائَةِ دِيْنَارٍ فَلَقِيْتُهَا بِهَا فَلَمَّا قَعَدْتُ بَيْنَ رِجْلَيْهَا. قَالَتْ: يَا عَبْدَ اللهِ اتَّقِ اللهِ وَلَا تَفْتَحِ الْخَاتَمَ فَقُمْتُ عَنْهَا. اَللّهُمَّ فَإِنْ كُنْتَ تَعْلَمُ أَنِّيْ فَعَلْتُ ذَلِكَ ابْتِغَاءَ وَجْهِكَ فَافْرُجْ لَنَا مِنْهَا فَفَرَجَ لَهُمْ فُرْجَةٌ. وَقَالَ الْآخِرُ: اَللّهُمَّ إِنِّيْ كُنْتُ اسْتَأْجَرْتُ أَجِيْرًا بِفَرَقِ أَرُزٍّ فَلَمَّا قَضَى عَمَلَهُ قَالَ: أَعْطِنِيْ حَقِّيْ. فَعَرَضْتُ عَلَيْهِ حَقَّهُ فَتَرَكَهُ وَرَغِبَ عَنْهُ فَلَمْ أَزَلْ أَزْرَعَهُ حَتَّى جَمَعْتُ مِنْهُ بَقَرَا وَرَاعِيَهَا فَجَاءَنِيْ. فَقَالَ: اِتَّقِ اللهَ وَلَا تَظْلِمْنِيْ وَأَعْطِنِيْ حَقِّيْ. فَقُلْتُ: اِذْهَبْ إِلى ذَلِكَ الْبَقَرِ وَرَاعِيْهَا فَقَالَ: اتَّقِ اللهَ وَلَا تَهْزَأْ بِيْ. فَقُلْتُ: إِنِّيْ لَا أَهْزَأُ بِكَ فَخُذْ ذَلِكَ الْبَقَرَ وَرَاعِيَهَا فَأَخَذَ فَانْطَلَقَ بِهَا. فَإِنْ كُنْتَ تَعْلَمُ أَنَّيْ فَعَلْتُ ذَلِكَ ابْتِغَاءَ وَجْهِكَ فَافْرُجْ مَا بَقِيَ فَفَرَّجَ اللهُ عَنْهُمْ”. مُتَّفَقٌ عَلَيْهِ.  

4938. (28) [3/1380 ఏకీభవితం]

ఇబ్నె ‘ఉమర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”పూర్వం, ముగ్గురు వ్యక్తులు ప్రయాణం చేస్తున్నారు. వర్షం ప్రారంభం అయింది. వర్షం నుండి రక్షణ పొందటానికి ఒక కొండ గుహలో దాక్కున్నారు. అకస్మాత్తుగా ఒక పెద్ద బండరాయి పైనుండి పడి గుహ ద్వారాన్ని మూసివేసింది. అప్పుడు వారు పరస్పరం ఈ పెద్ద ఆపద నుండి రక్షించబడటానికి, మనలో ప్రతి ఒక్కరూ మనం చేసిన సత్కార్యాల ద్వారా అల్లాహ్‌(త) ను ప్రార్థించటం ఒక్కటే మార్గం ఉందని, మన సత్కార్యాల శుభం వల్ల అల్లాహ్‌ (త) మనల్ని ఈ పెద్ద ఆపద నుండి రక్షిస్తాడని సంప్రదించుకున్నారు. వారిలో ఒకరు ”ఓ అల్లాహ్! నేను కేవలం మేకల ద్వారా జీవించే వాడిని. మేకలను మేపే వాడ్ని, వాటి ద్వారా నా కుటుంబాన్ని పోషించుకునే వాణ్ని. నాతల్లిదండ్రులు చాలా వృద్ధులు, నాకు చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నారు. నేను మేకలను మేపి సాయంత్రం ఇంటికి తిరిగి వస్తే అందరికంటే ముందుపాలు తీసి నాతల్లి దండ్రులకు త్రాపించే వాడిని. ఆ తరువాత నా కుటుంబానికి, పిల్లలకు త్రాపించేవాడిని. అనుకోకుండా ఒకసారి చెట్ల ఆకులకు చాలా దూరం వెళ్ళవలసి వచ్చింది. సాయంత్రం వచ్చేసరికి తల్లి దండ్రులు నిద్రపోయారు. నేను అలవాటు ప్రకారం వారివంతు పాలు తీసుకొని వారి వద్దకు వెళ్ళాను. వాళ్ళిద్దరూ నిద్రపోయి ఉన్నారు. వారిని లేపటం మంచిది కాదని, వారిని త్రాపించనంత వరకు ఇతరులకూ త్రాపించటం సరికాదని భావించి పాల పాత్ర తీసుకొని వారి ప్రక్కనే నిలబడ్డాను. వారు మేల్కొంటే పాలు త్రాపిద్దామని భావించాను. చివరికి తెల్లవారి పోయింది. నా బిడ్డలు ఆకలితో విలవిల లాడు తున్నారు. కాని నేను వారికి ప్రాధాన్యత ఇవ్వలేదు. ఉదయం వాళ్ళు నిద్రలేచి పాలుత్రాగారు. ఓ అల్లాహ్‌! ఒకవేళ నేనీ పని కేవలం నీ సంతృప్తి కొరకే చేసి ఉంటే, ఈ బండరాయిని మా నుండి తొలగించు అని ప్రార్థించాడు. బండరాయి కొద్దిగా తొలగింది. ఆకాశం కనబడుతోంది. కాని వాళ్ళు బయటకు రావటానికి వీలులేకుండా ఉంది. వారిలో మరొక వ్యక్తి, ”ఓ అల్లాహ్! నేను నాచిన్నాన్న కూతుర్ని చాలా ప్రేమించేవాడిని, నేను ఆమెతో నా మనోకాంక్షను తీర్చుకోవాలనుకున్నాను. కాని ఆమె దానికి తిరస్కరిస్తూ వచ్చింది. నా పట్టులోకి రాలేదు. చివరికి ఒక సంవత్సరం కరువు కాటకాలు సంభ వించాయి. కష్టాలకు గురయి నా దగ్గరకు వచ్చింది. అప్పుగా కొంత డబ్బు ఇమ్మని ప్రాధేయ పడింది. నేను ఆమెకు 100 దీనార్లు ఇవ్వటానికి, తన్నుతాను నాకు అప్పగించాలని, నా కోరిక తీర్చాలని షరతుపెట్టాను. దానికి ఆమె ఒప్పుకుంది. నేను కష్టపడి 100 దీనార్లు ఆమెకు ఇవ్వటానికి కూడబెట్టాను. ఆమె తన్నుతాను నాకు పూర్తిగా సమర్పించింది. ఇక ఎటువంటి ఆటంకం లేదు, నేను ఆమెను పొందటానికి సిద్ధపడ్డాను. అప్పుడు ఆమె, ‘దైవానికిభయపడు, అధర్మంగా కన్నెపొరను తొలగించకు, ఇది నీకు ధర్మసమ్మతం కాదు,’ అని పలికింది. ఆమె అంటే నాకు ఎంతో ఇష్టం ఉన్నప్పటికీ నేను ఆమె వద్ద నుండి లేచిపోయాను. ఆ 100 అష్రఫీలను కూడా ఆమెకు ఇచ్చివేసాను. ఓ అల్లాహ్‌! ఈ పని నేను నీ ప్రీతికోసమే చేసిఉంటే, ఈ బండరాయిని తొలగించు అని ప్రార్తించాడు. వెంటనే ఆ బండరాయి కొద్దిగా తొలగింది. కాని బయటకు వెళ్ళటానికి మాత్రం సాధ్యం కాలేదు. మూడవవ్యక్తి వంతు వచ్చింది. అతడు, ”ఓ అల్లాహ్! ఒక వ్యక్తి ఆరు సేర్ల కూలిపై పనిచేసాడు. పని చేసిన తర్వాత ఆ వ్యక్తి ‘నా కూలి నాకు ఇప్పించండి,’ అని అన్నాడు. నేనతని కూలి అతని ముందు పెట్టాను. కాని అతడు వదలి వెళ్ళిపోయాడు. నేనతని కూలి డబ్బుల్ని వ్యవసాయంలో పెట్టాను. దానివల్ల చాలా లాభాలు వచ్చాయి. కొంతకాలం తర్వాత అతడు వచ్చి నా కూలి నాకు ఇవ్వమని కోరాడు. నేనతనితో, ‘ఈ ఒంటెలు, ఆవులు, మేకలు, బానిసలు అన్నీ నీవే, తీసుకొని వెళ్ళు,’ అని అన్నాను. దానికి ఆ వ్యక్తి, ‘ఓ దైవ దాసుడా, ఎగతాళి చేయకు,’ అని అన్నాడు. దానికి నేను, ‘ఎగతాళి కాదు,’ అని అన్నాను. అతడు వాస్తవం తెలుసుకున్న తర్వాత అన్నిటినీ తీసుకొని వెళ్ళి పోయాడు. ‘ఓ అల్లాహ్‌(త) ఇదంతా నేను కేవలం నీ ప్రీతి కోసమే చేసి ఉంటే, ఈ బండరాయిని తొలగించు,’ అని ప్రార్థించాడు. బండరాయి తొలగి పోయింది. అందరూ గుహ నుండి బయటపడ్డారు. (బు’ఖారీ, ముస్లిం)

4939 – [ 29 ] ( إسناده جيد ) (3/1382)

وَعَنْ مُعَاوَيِةَ بْنِ جَاهِمَةَ أَنَّ جَاهِمَةَ جَاءَ إِلى النَّبِيِّ صلى الله عليه و سلم فَقَالَ: يَا رَسُوْلَ اللهِ أَرَدْتُ أَنْ أَغْزووَقَدْ جِئْتُ أَسْتَشِيْرُكَ. فَقَالَ: “هَلْ لَكَ مِنْ أُمِّ؟ “قَالَ: نَعَمْ. قَالَ: “فَالْزَمْهَا فَإِنَّ الْجَنَّةَ عِنْدَ رِجْلِهَا”. رَوَاهُ أَحْمَدُ وَالنَّسَائِيُّ وَالْبَيْهَقِيُّ فِيْ شُعَبِ الْإِيْمَانِ

4939. (29) [3/1382 – ఆధారాలు ఆమోద యోగ్యం]

ము’ఆవియహ్‌ బిన్‌ జాహిమహ్‌ (ర) కథనం: జాహిమహ్‌ (ర) ప్రవక్త (స) వద్దకు వచ్చి, ‘ఓ ప్రవక్తా! నేను జిహాద్‌లో పాల్గొనాలని అనుకుంటున్నాను. తమరి సలహా తీసుకోవటానికి వచ్చాను,’ అని అన్నారు. అప్పుడు ప్రవక్త (స), ‘నీ తల్లి బ్రతికుందా?’ అని అడిగారు. దానికి అతడు, ‘అవును,’ అని అన్నాడు. అప్పుడు ప్రవక్త (స), ‘నీవు నీ తల్లివద్దే ఉండు, ఎందు కంటే స్వర్గం తల్లి పాదాలవద్దే ఉంది,’ అని అన్నారు. (అ’హ్మద్‌, నసాయి’, బైహఖీ-షుఅబిల్ ఈమాన్)

అంటే నువ్వు జిహాద్‌ లోకి వెళ్ళకుండా తల్లి సేవచేస్తూ ఉండు, ఆమె సేవ వల్ల స్వర్గంలోనికి పోగలవు.

4940 – [ 30 ] ( لم تتم دراسته ) (3/1382)

وَعَنِ ابْنِ عُمَرَقَالَ: كَانَتْ تَحْتِيْ اِمْرَأَةٌ أُحِبُّهَا وَكَانَ عُمَرُيَكْرَهُهَا. فَقَالَ لِيْ: طَلِّقْهَا فَأَبَيْتُ. فَأَتَى عُمَرُرَسُوْلَ اللهِ صلى الله عليه وسلم فَذَكَرَ ذَلِكَ لَهُ. فَقَالَ لِي رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “طَلِّقْهَا”. رَوَاهُ التِّرْمِذِيُّ وأَبُوْ دَاوُدَ  

4940. (30) [3/1382అపరిశోధితం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘ఉమర్‌ (ర) కథనం: నేను నా భార్యను చాలా ప్రేమించేవాడ్ని, నేను ఆమెపట్ల చాలా ప్రేమగా ప్రవర్తించేవాడిని. అది చూచి ‘ఉమర్‌ (ర) అసహ్యించుకునేవారు. నన్ను, ‘నీవు నీ భార్యను వదలివేయి,’ అన్నారు. నేను దానికి నిరాకరించాను. ‘ఉమర్‌ (ర), ప్రవక్త (స) వద్దకు వచ్చి ఆ విషయం గురించి ప్రస్తావించారు. అప్పుడు ప్రవక్త (స) నాతో, ‘నువ్వు ఆమెను వదలివేయి, తండ్రి మాట విను,’ అని హితోపదేశం  చేసారు. (తిర్మిజి’, అబూ  దావూద్‌)

4941 – [ 31 ] ( لم تتم دراسته ) (3/1382)

وَعَنْ أَبِيْ أُمَامَةَ أَنَّ رَجُلًا قَالَ: يَا رَسُوْلَ اللهِ مَا حَقُّ الْوَالِدَيْنِ عَلَى وَلَدِهِمَا؟ قَالَ: “هُمَا جَنَّتُكَ وَنَارُكَ”. رَوَاهُ ابْنُ مَاجَهُ

4941. (31) [3/1382 అపరిశోధితం]

అబూ ఉమామహ్ (ర) కథనం: ఒక వ్యక్తి ప్రవక్త (స) వద్దకు వచ్చి, ‘ఓ ప్రవక్తా! సంతానంపై తల్లిదండ్రులకు ఎటువంటి హక్కు ఉంది?’ అని విన్నవించు కున్నాడు. దానికి ప్రవక్త (స), ‘వారిద్దరూ నీ స్వర్గం, నీ నరకం,’ అని అనారు. (ఇబ్నె  మాజహ్)

అంటే తల్లి దండ్రుల్ని సంతోషపరిచితే స్వర్గంలోనికి వెళతావు. ఒకవేళ తల్లిదండ్రులకు అవిధేయత చూపితే నరకంలోనికి వెళతావు అని అర్థం.

4942 – [ 32 ] ( موضوع ) (3/1382)

وَعَنْ أَنَسٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِنَّ الْعَبْدَ لَيَمُوْتُ وَالِدَاهُ أَوْأَحَدُهُمَا وَإِنَّهُ لَهُمَا لَعَاقٌ فَلَا يَزَالُ يَدْعُوْلَهُمَا وَيَسْتَغْفِرُ لَهُمَا حَتّى يَكْتُبَهُ اللهُ بَارًا”.

4942. (32) [3/1382కల్పితం]

అనస్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఒక వ్యక్తి తల్లి దండ్రులు లేదా వారిలో ఒకరు మరణిస్తే, ఆ వ్యక్తి తల్లి దండ్రులకు అవిధేయుడై ఉండి, ఆ తరువాత ఆ వ్యక్తి తల్లి దండ్రుల మరణానంతరం వారి క్షమాపణ కొరకు ప్రార్థిస్తే, అల్లాహ్‌ (త) వారిని గురించి అతని ప్రార్థనను స్వీకరించి, అతన్ని పుణ్యాత్ముడిగా పరిగణిస్తాడు.

4943 – [ 33 ] ( ضعيف جدا ) (3/1382)

وَعَنِ ابْنِ عَبَّاسٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم:”مَنْ أَصْبَحَ مُطِيْعًا لِلّهِ فِيْ وَالِدَيْهِ أَصْبَحَ لَهُ بَابَانِ مَفْتُوْحَانِ مِنَ الْجَنَّةِ وَإِنْ كَانَ وَاحِدًا فَوَاحِدًا.وَمَنْ أَمْسَى عَاصِيًا لِلّهِ فِيْ وَالِدَيْهِ أَصْبَحَ لَهُ بَابَانِ مَفْتُوْحَانِ مِنَ النَّارِ وَإِنْ كَانَ وَاحِدًا فَوَاحِدًا”. قَالَ رَجُلٌ: وَإِنْ ظَلَمَاهُ؟ قَالَ: “وَإِنْ ظَلَمَاهُ وَإِنْ ظَلَمَاهُ وَإِنْ ظَلَمَاهُ”.

4943. (33) [3/1382 అతి  బలహీనం]

ఇబ్నె ‘అబ్బాస్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”అల్లాహ్(త) కు, తల్లిదండ్రులకు విధేయుడైన వ్యక్తి ఎలాంటి స్థితిలో ఉదయం లేస్తాడంటే, అతని కోసం రెండు స్వర్గద్వారాలు తెరువబడతాయి. ఒక్కరైతే ఒక ద్వారం తెరువబడుతుంది. అదేవిధంగా దైవానికి, తల్లి దండ్రులకు అవిధేయుడైన వ్యక్తి ఎటువంటి స్థితిలో ఉదయం లేస్తాడంటే, అతని కోసం రెండు నరక ద్వారాలు తెరువబడతాయి. ఒక్కరుంటే ఒక ద్వారం తెరువ బడుతుంది. దానికి ఒక వ్యక్తి లేచి, ‘ఒకవేళ తల్లి దండ్రులు హింసించినప్పటికి కూడానా?’ అని విన్నవించుకున్నాడు. దానికి ప్రవక్త (స), ‘వారు హింసించినప్పటికీ, వారు హింసించినప్పటికీ, వారు హింసించినప్పటికీ’ అని అన్నారు. అంటే ప్రాపంచిక వ్యవహారాల్లో, ధార్మిక వ్యవహారాల్లో మాత్రం  కాదు.

4944 – [ 34] ( موضوع ) (3/1383)

وَعَنْهُ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم قَالَ: “مَامِنْ وَلَدٍ بَارٍّ يَنْظُرُ إِلى وَالِدَيْهِ نَظْرَةَ رَحْمَةٍ إِلَّا كَتَبَ اللهُ لَهُ بِكُلِّ نَظْرَةٍ حَجَّةً مَبْرُوْرَةً”. قَالُوْا: وَإِنْ نَظَرَكُلَّ يَوْمٍ مِائَةَ مَرَّةٍ؟ قَالَ: “نَعَمْ اللهُ أَكْبَرُ وَ أَطْيَبُ”.

4944. (34) [3/1383కల్పితం]

ఇబ్నె ‘అబ్బాస్‌ (ర) కథనం: ప్రవక్త(స) ప్రవచనం, ”కొడుకు తన తల్లిదండ్రుల వైపు ప్రేమాభిమానాలు, కారుణ్యంతో చూస్తే, అల్లాహ్‌ (త) అతని కర్మ పత్రంలో ఎన్నిసార్లు చూస్తే అన్ని సార్లు ‘హజ్జ్ పుణ్యం వ్రాస్తాడు.” అప్పుడు ప్రజలు, ‘అంటే రోజుకు వందసార్లు చూసినా సరేనా?’ అని విన్నవించు కున్నారు. దానికి ప్రవక్త (స), ‘అవును, ఎందు కంటే అల్లాహ్‌ (త)చాలా గొప్పవాడు, పరిశుద్ధుడు,’ అని అన్నారు.

4945 – [ 35 ] ( لم تتم دراسته ) (3/1383)

وَعَنْ أَبِيْ بَكْرَةَ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “كُلُّ الذُّنُوْبِ يَغْفِرُ اللهُ مِنْهَا مَا شَاءَ إِلَّا عُقُوْقَ الْوَالِدَيْنِ فَإِنَّهُ يُعَجِّلُ لِصَاحِبِهِ فِي الْحَيَاةِ قَبْلَ الْمَمَاتِ”.

4945. (35) [3/1383 అపరిశోధితం]

అబూ బక్‌రహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఒక వేళ అల్లాహ్‌ కోరితే ఎటువంటి పాపాన్నయినా క్షమించ గలడు. కాని తల్లిదండ్రుల అవిధేయతా పాపాన్ని క్షమించడు. ఇహలోకంలోనే అతడు మరణించక ముందే శిక్షిస్తాడు.”

4946 – [ 36 ] ( ضعيف ) (3/1383)

وَعَنْ سَعِيْدِ بْنِ الْعَاصِ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “حَقُّ كَبِيْرِ الْإِخْوَةِ عَلَى صَغِيْرِهِمْ حَقُّ الْوَالِدِ عَلَى وَلَدِهِ”. روى الْبَيْهَقِيُّ الْأَحَادِيْثَ الْخَمْسَةَ فِي “شُعَبِ الْإِيْمَانِ”.

4946. (36) [3/1383–  బలహీనం]

స’యీద్‌ బిన్‌ ‘ఆ’స్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”తమ్మునిపై అన్నహక్కు, కొడుకుపై తండ్రి హక్కు ఉన్నట్టు ఉంది.” (ఈ ఐదు ‘హదీసు’లను బైహఖీ/ షు’అబిల్‌ ఈమాన్‌ లో పేర్కొన్నారు)

=====

15 بَابُ الشَّفْقَةِ وَالرَّحْمَةِ عَلَى الْخَلْقِ

15. అల్లాహ్సృష్టితాల పట్ల దయ, జాలి

اَلْفَصْلُ الْأَوَّلُ   మొదటి విభాగం 

4947 – [ 1] ( متفق عليه ) (3/1384)

عَنْ جَرِيْرِبْنِ عَبْدِ اللهِ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَا يَرْحَمُ اللهُ مَنْ لَا يَرْحَمُ النَّاسَ”. متفق عليه.  

4947. (1) [3/1384ఏకీభవితం]

జరీర్‌ బిన్‌ ‘అబ్దుల్లాహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఇతరులను కరుణించని వారిని, అల్లాహ్‌ (త) కూడా కరుణించడు.” (బు’ఖారీ, ముస్లిం)

4948 – [ 2 ] ( متفق عليه ) (3/1384)

وَعَنْ عَائِشَةَ قَالَتْ: جَاءَ أَعْرَابِيٌّ إِلَى النَّبِيِّ صلى الله عليه وسلم فَقَالَ: أَتُقَبِّلُوْنَ الصِّبْيَانَ؟ فَمَا نُقَبِّلُهُمْ. فَقَالَ النَّبِيُّ صلى الله عليه وسلم: “أَوَ أَمْلِكُ لَكَ أَنْ نَزَعَ اللهُ مِنْ قَلْبِكَ الرَّحْمَةَ”. مُتَّفَقٌ عَلَيْهِ.

4948. (2) [3/1384 ఏకీభవితం]

‘ఆయి’షహ్‌ (ర) కథనం: ఒక బదూ ప్రవక్త (స) వద్దకు వచ్చాడు, ‘ప్రజలను తమ పిల్లలను ముద్దులు పెట్టు కోవటం చూసి, మీరు మీ పిల్లల ప్రేమలో పడి వారిని ముద్దులు పెట్టుకోవటం, కౌగిలించుకోవటం చేస్తున్నారు. మేము మాత్రం మా పిల్లలను ముద్దులు పెట్టము,’ అని అన్నాడు. అది విని ప్రవక్త (స), ‘అల్లాహ్‌ నీ హృదయం నుండి దయాకారుణ్యాలు, ప్రేమ హరింపజేస్తే నేనేం చేయగలను,’ అని అన్నారు. (బు’ఖారీ, ముస్లిం)

అంటే ఇది హృదయ కాఠిన్యం. ఎందుకంటే చిన్న పిల్లలను అదీ తన సంతానాన్ని ప్రేమతో, అభి మానంతో  ఆదరించాలి.

4949 – [ 3 ] ( متفق عليه ) (3/1384)

وَعَنْهَا قَالَتْ: جَاءَتْنِيْ امْرَأَةٌ وَمَعَهَا ابْنَتَانِ لَهَا تَسْأَلُنِيْ فَلَمْ تَجِدْ عِنْدِيْ غَيْرَ تَمْرَةٍ وَاحِدَةٍ فَأَعْطَيْتُهَا إِيَّاهَا فَقَسَّمَتْهَا بَيْنَ ابْنَتَيْهَا وَلَمْ تَأْكُلْ مِنْهَا ثُمَّ قَامَتْ فَخَرَجَتْ. فَدَخَلَ النَّبِيُّ صلى الله عليه وسلم فَحَدَّثْتُهُ فَقَالَ: “مَنِ ابْتُلِيَ مِنْ هَذِهِ الْبَنَاتِ بِشَيْءٍ فَأَحْسَنَ إِلَيْهِنَّ كُنَّ لَهُ سِتْرًا مِّنَ النَّارِ”.  

4949. (3) [3/1384ఏకీభవితం]

‘ఆయి’షహ్‌ (ర) కథనం: నా వద్దకు ఒక స్త్రీ వచ్చింది. ఆమె వెంట ఆమె ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆమె, ‘నాకు ఏదైనా ఉంటే ఇవ్వండి,’ అడిగింది. అప్పుడు నా దగ్గర ఒక్క ఖర్జూరం పండు తప్ప మరేమీ లేదు. నేను దాన్ని ఆమెకు ఇచ్చాను. ఆమె దాన్ని రెండు ముక్కలు చేసి ఇద్దరికి పంచి పెట్టింది. అందులో నుండి ఆమె ఏమీ తినలేదు. ఆ తరువాత ఆమె వెళ్ళిపోయింది. ప్రవక్త (స) వచ్చిన తర్వాత జరిగింది ప్రస్తావించాను. అది విని ప్రవక్త (స), ”అమ్మాయిలకు గురిచేయబడి, వారిని ఉత్తమంగా తీర్చిదిద్దిన వారి కొరకు వారు నరకాగ్ని నుండి తెరగా ఏర్పడతారు. అంటే వారివల్ల అతడు నరకాగ్నిలోకి వెళ్ళరు.”  (బు’ఖారీ, ముస్లిం)

4950 – [ 4 ] ( صحيح ) (3/1384)

وَعَنْ أَنَسٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَنْ عَالَ جَارِيَتَيْنِ حَتّى تَبْلُغَا جَاءَ يَوْمَ الْقِيَامَةِ أَنَا وَهُوَ هَكَذَا”.وَضَمَّ أَصَابِعَهُ. رَوَاهُ مُسْلِمٌ.

4950. (4) [3/1384దృఢం]

అనస్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఎవడైతే ఇద్దరు అమ్మాయిలను పోషించి, తీర్చిదిద్ది, వారి వివాహం జరిపి భర్తల వద్దకు పంపితే, అతడు మరియు నేను తీర్పుదినం నాడు స్వర్గంలో ఈవిధంగా ఉంటాం,” అని పలుకుతూ తన చేతి రెండు వ్రేళ్ళను కలిపి చూపించారు.  (ముస్లిమ్‌)

4951 – [ 5 ] ( متفق عليه ) (3/1384)

وَعَنْ أَبِيْ هُرْيَرَةَ قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “اَلسَّاعِيْ عَلَى الْأَرْمِلَةِ وَالْمِسْكِيْنِ كَالسَّاعِيْ فِيْ سَبِيْلِ اللهِ”. وَأَحْسِبُهُ قَالَ: “كَالْقَائِمِ لَا يَفْتُرُوَكَالصَّائِمِ لَا يُفْطِرُ”. مُتَّفَقٌ عَلَيْهِ.  

4951. (5) [3/1384 ఏకీభవితం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”వితంతువులకు, పేదలకు సహాయం చేసేవారు, వారి పట్ల ఉత్తమంగా ప్రవర్తించేవారు దైవమార్గంలో జిహాద్‌ చేసేవారితో సమానం. లేదా ఎల్లప్పుడూ మస్జిద్‌లో నమా’జు చేసేవారితో సమానం లేదా ఎల్లప్పుడూ ఉపవాసం ఉండే వారితో సమానం.” (బు’ఖారీ, ముస్లిం)

4952- [ 6 ] ( صحيح ) (3/1384)

وَعَنْ سَهْلِ بْنِ سَعْدٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “أَنَا وَكَافِلُ الْيَتِيْمِ لَهُ وَلِغَيْرِهِ فِي الْجَنَّةِ هَكَذَا” .وَأَشَارَبِالسَّبَّابَةِ وَالْوُسْطَى وَفَرَّجَ بَيْنَهُمَا شَيْئًا. رَوَاهُ الْبُخَارِيُّ.  

4952. (6) [3/1384 దృఢం]

సహల్‌ బిన్‌ స’అద్‌ (ర)కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”అనాథులను సంరక్షించేవాడు అంటే అనాథుడు అతనికి సంబంధించినవాడైనా, ఇతరులకు సంబం ధించిన వాడైనా స్వర్గంలో ఈవిధంగా ఉంటాం” అని చెబుతూ చూపుడు వేలు, మధ్యవేలును చూపించారు. (బు’ఖారీ)

4953 – [ 7 ] ( متفق عليه ) (3/1385)

وَعَنِ النُّعْمَانِ بْنِ بَشِيْرٍقَالَ:قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: تَرَى الْمُؤْمِنِيْنَ فِيْ تَرَاحُمِهِمْ وَتَوَادِّهِمْ وَتَعاطفِهِمْ كَمَثَلِ الْجَسَدِ إِذَا اشْتَكَى عُضْوًا تَدَاعَى لَهُ سَائِرُالْجَسَدِ بِالسَّهَرِ وَالْحُمّى”.

4953. (7) [3/1385 ఏకీభవితం]

నో’మాన్‌ బిన్‌ బషీర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ప్రేమించేవారు, దయ, జాలి కనబరిచే వారు ఒక శరీరంలా ఉంటారు. ఒకవేళ శరీరంలోని ఒక భాగానికి బాధ కలిగితే ఇతర భాగాలన్నీ ఆ బాధలో పాలు పంచుకుంటాయి.”  (బు’ఖారీ, ముస్లిం)

4954 – [ 8 ] ( صحيح ) (3/1385)

وَعَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “اَلْمُؤْمِنُوْنَ كَرَجُلٍ وَاحِدٍ إِنِ اشْتَكَى عَيْنُهُ اِشْتَكَى كُلُّهُ وَإِنِ اشْتَكَى رَأْسُهُ اشْتَكَى كُلُّهُ”. رَوَاهُ مُسْلِمٌ.

4954. (8) [3/1385దృఢం]

నో’మాన్‌ బిన్‌ బషీర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”విశ్వాసులందరూ ఒకవ్యక్తి వంటివారు. కంటిలో నొప్పి ఉంటే, శరీరమంతా నొప్పిగా ఉంటుంది. ఒకవేళ తల నొప్పిగా ఉంటే శరీరమంతా నొప్పిగా ఉంటుంది.” (ముస్లిమ్‌)

అంటే మానవునిలో దయాదాక్షిణ్యాలు ఉండాలి. ఒకరికి బాధ కలిగితే ఇతరులు కూడా ఆ బాధలో పాల్గొనాలి.

4955 – [ 9 ] ( متفق عليه ) (3/1385)

وَعَنْ أَبِيْ مُوْسَى عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ: “اَلْمُؤْمِنُ لِلْمُؤْمِنِ كَالْبُنْيَانِ يَشُدُّ بَعْضُهُ بَعْضًا” .ثُمَّ شَبَّكَ بَيْنَ أَصَابِعِهِ.

4955. (9) [3/1385 ఏకీభవితం]

అబూ మూసా (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”విశ్వాసులంతా ఒక ఇల్లు వంటివారు. దానిలోని ఒక భాగం మరోభాగంతో కలసి ఉంటుంది. పటిష్ఠంగా ఉంటుంది. తన చూపుడువేలు, మధ్యవేలు చూపుతూ ఈ విధంగా ముస్లి ములు కలసి ఉండాలి” అని హితబోధ చేసారు.  (బు’ఖారీ, ముస్లిం)

4956 – [ 10 ] ( متفق عليه ) (3/1385)

وَعَنْهُ عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم أَنَّهُ كَانَ إِذَا أَتَاهُ السَّائِلُ أَوْ صَاحِبُ الْحَاجَةِ قَالَ: “اِشْفَعُوْا فَلْتُؤْجَرُوْا وَيَقْضِي اللهُ عَلَى لِسَانِ رَسُوْلِهِ مَا شَاءَ”. مُتَّفَقٌ عَلَيْهِ.  

4956. (10) [3/1385 ఏకీభవితం]

అబూ మూసా (ర) కథనం: ”బిచ్చగాళ్ళు, అక్కర గలవారు వస్తే, ప్రవక్త (స) ప్రజలతో, మీరు వారి గురించి సిఫారసు చేయండి, పుణ్యం పొందగలరు. అల్లాహ్‌ (త) తాను కోరింది తన ప్రవక్త నోటి ద్వారా తీర్పు చేసి వేస్తాడు,”  అని అనేవారు.  (బు’ఖారీ, ముస్లిం)

అంటే  సిఫారసు చేస్తే  కూడా  పుణ్యం  లభిస్తుంది.

4957 – [ 11 ] ( متفق عليه ) (3/1385)

وَعَنْ أَنَسٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “اُنْصُرْأَ خَاكَ  ظَالِمًا أَوْمَظْلُوْمًا”. فَقَالَ رَجُلٌ: يَا رَسُوْلَ اللهِ أَنْصُرهُ مَظْلُوْمًا فَكَيْفَ أَنْصُرُهُ ظَالِمًا؟ قَالَ: “تَمْنَعُهُ مِنَ الظُّلْمِ فَذَاكَ نَصْرُكَ إِيَّاهُ”.

4957. (11) [3/1385ఏకీభవితం]

అనస్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మీరు మీ ముస్లిమ్‌ సోదరునికి సహాయం చేయండి. అతడు అత్యాచారి అయినా, బాధితుడు అయినాసరే.” అది విని ఒక వ్యక్తి, ‘ఓ ప్రవక్తా! బాధితునికి సహాయం చేయ డం అర్థమవుతుంది. కాని, బాధించేవాడికి సహాయం ఎలా చేయాలి,’ అని విన్నవించు కున్నాడు. దానికి ప్రవక్త (స), ‘అతణ్ని దుర్మార్గం నుండి వారించు, నీ వారించటమే అతనికి సహాయం చేసినట్టు అవుతుంది,’ అని అన్నారు. (బు’ఖారీ, ముస్లిం)

4958 – [ 12 ] ( متفق عليه ) (3/1385)

وَعَنِ ابْنِ عُمَرَأَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم قَالَ: “اَلْمُسْلِمُ أَخُو الْمُسْلِمِ لَايَظْلِمُهُ وَلَا يُسلِمُهُ وَمَنْ كَانَ فِيْ حَاجَةِ أَخِيْهِ كَانَ اللهُ فِيْ حَاجَتِهِ وَمَنْ فَرَّجَ عَنْ مُسْلِمٍ كَرْبَةً فَرَّجَ اللهُ عَنْهُ كُرْبَةً مِنْ كُرُبَاتِ يَوْمَ الْقِيَامَةِ وَمَنْ سَتَرَمُسْلِمًا سَتَرَهُ اللهُ يَوْمَ الْقِيَامَةِ”.

4958. (12) [3/1385 ఏకీభవితం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘ఉమర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఒక ముస్లిమ్‌ మరో ముస్లిమ్‌కు సోదరుడు. అతన్ని హింసించరాదు. దుర్మార్గులకు అప్పగించ రాదు. తన ముస్లిమ్‌ సోదరునికి సహాయం చేసిన వారికి అల్లాహ్‌ (త) సహాయం చేస్తాడు. తన ముస్లిమ్‌ సోదరుని దుఃఖాన్ని దూరం చేసిన వారి దుఃఖాలను అల్లాహ్‌ (త) తీర్పుదినం నాడు దూరం చేస్తాడు. అదేవిధంగా తన ముస్లిమ్‌ సోదరుని లోపాలను కప్పిపుచ్చే వ్యక్తి లోపాలను అల్లాహ్‌ (త) తీర్పు దినంనాడు కప్పిపుచ్చుతాడు. (బు’ఖారీ, ముస్లిం)

4959 – [ 13 ] ( صحيح ) (3/1385)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “اَلْمُسْلِمُ أَخُو الْمُسْلِمِ. لَا يَظْلِمُهُ وَلَا يَخْذُلُهُ وَلَا يَحْقِرُهُ التَّقْوَى هَهُنَا”. وَيُشِيْرُ إِلى صَدْرِهِ ثَلَاثَ مِرَارٍ”بِحَسْبِ امْرِئٍ مِّنَ الشَّرِّأَنْ يَّحْقِرَ أَخَاهُ الْمُسْلِمَ كُلُّ الْمُسْلِمِ عَلَى الْمُسْلِمِ حَرَامٌ: دَمُهُ وَمَالُهُ وَعِرْضُهُ”. رَوَاهُ مُسْلِمٌ.

4959. (13) [3/1385 దృఢం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఒక ముస్లిమ్‌ మరో ముస్లిమ్‌ సోదరుడు. అతన్ని హింసించరాదు, అతన్ని సహాయం చేయకుండా వదలరాదు, అతనికి సహాయం చేయాలి, అతన్ని అవమానించరాదు, నీచంగా భావించరాదు. అంటే దైవభీతి హృదయంలో ఉంటుంది. మానవుడు పాపానికి గురికావటానికి తన ముస్లిమ్‌ సోదరుణ్ని నీచంగా భావించ డమే చాలు. ఒక ముస్లిమ్‌ యొక్క ప్రాణం, ధనం, గౌరవం, శీలం మరో ముస్లిమ్‌పై నిషిద్ధం.” (ముస్లిమ్‌)

4960 – [ 14 ] ( صحيح ) (3/1386)

وَعَنْ عَيَّاضِ بْنِ حِمَارٍقَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “أَهْلُ الْجَنَّةِ ثَلَاثَةٌ: ذُوْسُلْطَانٍ مُقْسِطٌ مُتَصَدِّقٌ مُوَفِّقٌ. وَرَجُلٌ رَحِيْمٌ رَفِيْقُ الْقَلْبِ لِكُلِّ ذِيْ قُرْبَى. وَمُسْلِمٍ وَعَفِيْفٌ مُتَعَفِّفٌ ذُوْعِيَالٍ.

 وَأَهْلُ النَّارِ خَمْسَةٌ:(1) الضَّعِيْفُ الَّذِيْ لَا زَبْرَ لَهُ الَّذِيْنَ هُمْ فِيْكُمْ تَبَعٌ لَا يَبْغُوْنَ أَهْلًا وَلَا مَالًا. (2) وَالْخَائِنُ الَّذِيْ لَا يَخْفَى لَهُ طَمْعٌ وَإِنْ دَقَّ إِلَّا خَانَهُ.(3) وَرَجُلٌ لَا يُصْبِحُ وَلَا يُمْسِيْ إِلَّا وَهُوَ يُخَادِعُكَ عَنْ أَهْلِكَ.(4) وَمَالَكَ وَذَكَرَ الْبُخْلَ أَوْ الْكَذِبَ. (5) وَالشِّنْظِيْرُ الْفَحَّاشُ”. رَوَاهُ مُسْلِمٌ.  

4960. (14) [3/1386 దృఢం]

‘అయ్యా’ద్ బిన్‌ ‘హిమార్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”స్వర్గవాసులు మూడు రకాలు: 1. న్యాయంగా పాలించే ఉపకారం చేసే ప్రజలకు దానధర్మాలు చేసే, మంచి పనులు చేసే పాలకుడు, 2. చిన్నవారి పట్ల, పెద్దల పట్ల దయాగుణంతో వ్యవహరించే, సున్నిత హృదయం కలిగి, తన బంధువుల పట్ల, ముస్లిముల పట్ల శ్రేయోభిలాషిగా వ్యవహరించేవారు, 3. పరిశుద్ధుడై నిషిద్ధ విషయాలకు దూరంగా ఉంటూ, ఇతరుల ముందు చేయి చాచని వాడు, తన భార్యాబిడ్డల పట్ల అల్లాహ్‌పై నమ్మకం కలిగి ఉండేవాడు.  

అదేవిధంగా నరకవాసులు ఐదు రకాలు. 1. తగని పనులు చేసే, ధర్మం అధర్మంతో పనిలేకుండా జంతువుల్లా జీవించే బుద్ధిహీనులు. వీరికి భార్యా బిడ్డలు ఉండరు. వారికి దాని విచారమే లేదు. వారి దగ్గర ధనం కూడా ఉండదు. వాళ్ళు తమ పాపకార్యాల వల్ల భార్యాబిడ్డల ఆలోచనే వారికిలేదు. పాపకార్యాలతో సంతోషంగా ఉన్నారు. వారికి నిషిద్ధాలతో పనేలేదు. కేవలం కడుపు నిండితే చాలు అనేది వారి ఉద్దేశం, 2. ద్రోహులు, ప్రతి విషయంలోనూ ద్రోహం తలపెడతారు. ఇది అందరికీ తెలిసి ఉంటుంది, 3. ఎల్లప్పుడూ ప్రజలను మోసగించే మోసగాడు. 4. ఇంకా పిసినారి, అబద్ధాల కోరు. 5. నైతికత లేని వ్యక్తులను కూడా నరక వాసులుగా  ప్రవక్త (స) పరిగణించారు.  (ముస్లిమ్‌)

4961 – [ 15 ] ( متفق عليه ) (3/1386)

وَعَنْ أَنَسٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “وَالَّذِيْ نَفْسِيْ بِيَدِهِ لَا يُؤْمِنُ أَحَدٌ حَتَّى يُحِبُّ لِأَخِيْهِ مَا يُحِبُّ لِنَفْسِهِ”. مُتَّفَقٌ عَلَيْهِ.  

4961. (15) [3/1386ఏకీభవితం]

అనస్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”దైవం సాక్షి! ఒక వ్యక్తి తనకోసం ఇష్టపడినదే, తన ముస్లిమ్‌ సోదరుని కోసంకూడా ఇష్టపడనంతవరకు పరిపూర్ణ విశ్వాసి కాలేడు.” (బు’ఖారీ, ముస్లిం)

4962 – [ 16 ] ( متفق عليه ) (3/1386)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ:قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم:”وَاللهِ لَا يُؤْمِنُ وَاللهِ لَا يُؤْمِنُ وَاللهِ لَا يُؤْمِنُ”.قِيْلَ:مَنْ يَا رَسُوْلَ اللهِ؟قَالَ:” اَلَّذِيْ لَا يَأْمَنُ جَارُهُ بَوَائِقَهُ “.مُتَّفَقٌ عَلَيْهِ  

4962. (16) [3/1386ఏకీభవితం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స), ”అల్లాహ్ సాక్షి! అతడు విశ్వాసికాలేడు, అల్లాహ్ సాక్షి! అతడు విశ్వాసి కాలేడు, అల్లాహ్ సాక్షి! అతడు విశ్వాసికాలేడు,” అని ప్రవచించారు. ”ఎవరు” అని ప్రవక్త (స)ను విన్నవించు కోవటం జరిగింది. దానికి ప్రవక్త (స), ”పొరుగువాడు, అతడి హింసా దౌర్జన్యాల నుండి రక్షణ లేనివాడు,” అని సమా ధానం ఇచ్చారు. (బు’ఖారీ, ముస్లిం)

4963- [ 17 ] ( صحيح ) (3/1386)

وَعَنْ أَنَسٍ قَالَ:قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم:”لَا يَدْخُلُ الْجَنَّةَ مَنْ لَا يَأْمَنُ جَارُهُ بَوَائِقَهُ ” . رَوَاهُ مُسْلِمٌ

4963. (17) [3/1386దృఢం]

అనస్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”పొరుగువాడు తన హింసా దౌర్జన్యాల వల్ల రక్షణ లేనివాడు స్వర్గంలో ప్రవేశించలేడు.” (ముస్లిమ్‌)

4964 – [ 18 ] ( متفق عليه ) (3/1386)

وَعَنْ عَائِشَةَ وَابْنُ عُمَرَرَضِيَ اللهُ عَنْهُمْ عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ:”مَا زَالَ جِبْرِيْلُ يُوْصِيْنِيْ بِالْجَارِحَتَّى ظَنَنْتُ أَنَّهُ سَيُوَرِّثُهُ “. مُتَّفَقٌ عَلَيْهِ.  

4964. (18) [3/1386ఏకీభవితం]

‘ఆయి’షహ్‌ (ర), ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘ఉమర్‌ (ర)ల కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”జిబ్రీల్‌ (అ) ఎల్లప్పుడూ నన్ను పొరుగువారి హక్కులనుగురించి బోధించేవారు. చివరికి వారిని కూడా వారసులుగా ప్రకటిస్తారేమో అని నాకు అనుమానం కలిగింది.” (బు’ఖారీ, ముస్లిం)

4965 – [ 19 ] ( متفق عليه ) (3/1387)

وَعَنْ عَبْدِ اللهِ بْنِ مَسْعُوْدٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِذَا كُنْتُمْ ثَلَاثَةً فَلَا يَتَنَاجَى اِثْنَان دُوْنَ الْآخَرِ حَتَّى تَخْتَلِطُوْا بِالنَّاسِ مِنْ أَجْلِ أَنْ يَحْزُنَهُ”. مُتَّفَقٌ عَلَيْهِ.  

4965. (19) [3/1387 ఏకీభవితం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ మస్‌’ఊద్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మీరు ముగ్గురు వ్యక్తులు ఉన్నప్పుడు ఇద్దరు వ్యక్తులు రహస్య సంభాషణ చేయరాదు. ముగ్గురూ కలసి చేయవచ్చును. అంటే కలసి మాట్లాడు కోవాలి. అతన్ని వదలి మీరు రహస్య సంభాషణ చేస్తే, అతడు అపార్థంగా భావిస్తాడు.”  (బు’ఖారీ, ముస్లిం)

4966 – [ 20 ] ( صحيح ) (3/1387)

وَعَنْ تَمِيْمِ الدَّارِيِّ أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم قَالَ: “اَلدِّيْنُ النَّصِيْحَةُ ثَلَاثًا”. قُلْنَا: لِمَنْ؟ قَالَ: “لِلّهِ وَلِكِتَابِهِ وَلِرَسُوْلِهِ وَلِأَئِمِّةِ الْمُسْلِمِيْنَ وَعَامَّتِهِمْ”. رَوَاهُ مُسْلِمٌ.  

4966. (20) [3/1387దృఢం]

తమీమ్‌ దారీ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ‘ధర్మం అంటే శ్రేయోభిలాష’ ఇలా మూడుసార్లు అన్నారు. మేము, ‘ఎవరికోసం,’ అని విన్నవించు కున్నాము. దానికి ప్రవక్త (స), ‘అల్లాహ్‌ (త) కోసం అంటే ఆయన్ను విశ్వసించాలి, ఆయన ఆదేశాలను పాలించాలి. అల్లాహ్‌ (త) గ్రంథం కోసం అంటే దాన్ని గౌరవించాలి. అదే దాని శ్రేయోభిలాష. ఇంకా ప్రవక్త పట్ల శ్రేయోభిలాషంటే, ఆయన దైవదౌత్యాన్ని విశ్వసించాలి. ఆయన్ను అనుసరించాలి. ఇంకా ముస్లిమ్‌ పాలకులకు విధేయత చూపాలి. అయితే ఇస్లామ్‌కు వ్యతిరేకంగా వినకూడదు. అదేవిధంగా ముస్లిముల పట్ల శ్రేయోభిలాష అంటే వారికి ధర్మం గురించి బోధించండి. ధర్మ సందేశం వినిపించండి. ఇంకా వారికి హాని తలపెట్టకండి.” (ముస్లిమ్‌)

4967 – [ 21 ] ( متفق عليه ) (3/1387)

عَنْ جَرِيْرِبْنِ عَبْدِ اللهِ قَالَ: بَايَعْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم عَلَى إِقَامِ الصَّلَاةِ وَإِيْتَاءِ الزَّكَاةِ وَالنُّصْحِ لِكُلِّ مُسْلِمٍ.

4967. (21) [3/1387 ఏకీభవితం]

జరీర్‌ (ర) కథనం: నేను ప్రవక్త (స) చేతిపై నమా’జు ఆచరిస్తానని, ‘జకాత్‌ చెల్లిస్తానని, ప్రతి ముస్లిమ్‌ పట్ల శ్రేయోభిలాషిగా వ్యవహరిస్తానని బైఅత్‌ చేసాను. (బు’ఖారీ, ముస్లిం)

—–

اَلْفَصْلُ الثَّانِيْ  రెండవ విభాగం  

4968 – [ 22 ] ( لم تتم دراسته ) (3/1387)

عَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: سَمِعْتُ أَبَا الْقَاسِمِ الصَّادِقَ الْمَصْدُوْقَ صلى الله عليه وسلم يَقُوْلُ: “لَا تُنْزَعُ الرَّحْمَةُ إِلَّا مِنْ شَقِيٍّ”. رَوَاهُ أَحْمَدُ وَ التِّرْمِذِيُّ

4968. (22) [3/1387అపరిశోధితం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ఇలా ప్రవచిస్తూ ఉండగా నేను విన్నాను, ”దుర్మార్గుల హృదయాల నుండే దయా కారుణ్యాలు తొలగించ బడతాయి. అంటే దురదృష్టవంతుల హృదయాల నుండి దయా కారుణ్యాలు తొలగించబడతాయి.” (అ’హ్మద్‌, తిర్మిజి’)

4969 – [ 23 ] ( لم تتم دراسته ) (3/1387)

وَعَنْ عَبْدِ اللهِ بْنِ عَمْرٍو قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: اَلرَّاحِمُوْنَ يَرْحَمُهُمُ الرَّحْمنَ اِرْحَمُوْا مَنْ فِي الْأَرْضِ يَرْحَمُكُمْ مَنْ فِي السَّمَاءِ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ وَالتِّرْمِذِيُّ  

4969. (23) [3/1387 అపరిశోధితం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘ఉమర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”దయా కారుణ్యాలు చూపే దైవదాసులను కారుణ్యమూర్తి అయిన అల్లాహ్‌ (త) కనికరిస్తాడు. కనుక మీరు భూవాసులపై దయచూపండి. ఆకాశాల వాడు మీపై దయచూపుతాడు.”  (అబూ  దావూద్‌, తిర్మిజి’)

4970 – [ 24 ] ( ضعيف ) (3/1387)

وَعَنْ ابْنِ عَبَّاسٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: لَيْسَ مِنَّا مَنْ لَمْ يَرْحَمْ صَغِيْرَنَا وَلَمْ يُوَقِّرْ كَبِيْرَنَا وَيَأْمُرْ بِالْمَعْرُوْفِ وَيَنْهَ عَنِ الْمُنْكَرِ. رَوَاهُ التِّرْمِذِيُّ وَقَالَ: هَذَا حَدِيْثٌ غَرِيْبٌ.  

4970. (24) [3/1387బలహీనం]

ఇబ్నె ‘అబ్బాస్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”చిన్నారులపై దయ చూపనివాడు, పెద్దలను గౌరవించనివాడు, ప్రజలకు మంచిని బోధించనివాడు, చెడునుండి వారించనివాడు ముస్లిమ్‌ కాడు.” (తిర్మిజి’ – ఏకోల్లేఖనం)

4971 – [ 25 ] ( ضعيف ) (3/1387)

وعَنْ أَنَسٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَا أَكْرَمَ شَابٌّ شَيْخًا مِنْ أَجْلِ سِنِّهِ إِلَّا قَيَّضَ اللهُ لَهُ عِنْدَ سِنِّهِ مَنْ يُّكْرِمُهُ”. رَوَاهُ التِّرْمِذِيُّ  

4971. (25) [3/1387బలహీనం]

అనస్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”వృద్ధున్ని, అతని వృద్ధాప్యం వల్ల గౌరవించిన యువ కుణ్ని కూడా అతని వృద్ధాప్యంలో గౌరవించే వ్యక్తిని అల్లాహ్‌(త) నియమిస్తాడు.”  (తిర్మిజి’)

4972 – [ 26 ] ( حسن ) (3/1388)

وَعَنْ أَبِيْ مُوْسَى قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِنَّ مِنْ إِجْلَالِ اللهِ إِكْرَامَ ذِي الشَّيْبَةِ الْمُسْلِمِ وَحَامِلِ الْقُرْآنِ غَيْرَالْغَالِيْ فِيْهِ وَ لَا الْجَافِيْ عَنْهُ وَإِكْرَامَ السُّلْطَانِ الْمُقْسِطِ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ وَالْبَيْهَقِيُّ فِيْ “شُعَبِ الْإِيْمَانِ”.

4972. (26) [3/1388ప్రామాణికం]

అబూ మూసా (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”వృద్ధ ముస్లిమ్‌ను గౌరవించటం, ఖుర్‌ఆన్‌ పండితుడ్ని లేదా ఖుర్‌ఆన్‌ కంఠస్థంచేసిన లేదా పఠించే ముస్లిమ్‌ను గౌరవించటం, ధర్మపాలకుడ్ని గౌరవించటం, అల్లాహ్‌(త)ను గౌరవించినట్టే అవుతుంది. అంటే అల్లాహ్‌(త)ను ఆదరించినట్టు అవుతుంది.” (అబూ దావూద్‌,  బైహఖీ – షు’అబిల్ ఈమాన్)

4973 – [ 27 ] ( لم تتم دراسته ) (3/1388)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “خَيْرُ بَيْتٍ فِي الْمُسْلِمِيْنَ بَيْتٌ فِيْهِ يَتِيْمٌ يُحْسَنُ إِلَيْهِ وَشَرُّ بَيْتٍ فِي الْمُسْلِمِيْنَ بَيْتٌ فِي يَتِيْمٌ يُسَاءُ إِلَيْهِ”. رَوَاهُ ابْنُ مَاجَهُ

4973. (27) [3/1387అపరిశోధితం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”అనాథుల పట్ల మంచిగా వ్యవహరించే ఇల్లు ఉత్తమ ఇల్లు, అనాథుల పట్ల అసభ్యంగా వ్యవహరించే ఇల్లు నీచమైన  ఇల్లు.” (ఇబ్నె  మాజహ్)

4974 – [ 28] أ ( لم تتم دراسته ) (3/1388)

وَعَنْ اَبِيْ أُمَامَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَنْ مَسَحَ رَأْسَ يَتِيْمٍ لَمْ يَمْسَحْهُ إِلَّالِلّهِ كَانَ لَهُ بِكُلِّ شَعْرَةٍ تَمُرُّعَلَيْهَا يَدُهُ حَسَنَاتٌ وَمَنْ أَحْسَنَ إِلى يَتِيْمَةٍ أَوْ يَتِيْمٍ عِنْدَهُ كُنْتُ أَنَا وَهُوَ فِي الْجَنَّةِ كَهَاتَيْنِ”. وَقَرَنَ بِينَ أصْبَعَيْهِ. رَوَاهُ أَحْمَدُ وَالتِّرْمِذِيُّ وَقَالَ: هَذَا حَدِيْثٌ غَرِيْبٌ.

4974. (28) [3/1388అపరిశోధితం]

అబూ ఉమామహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ‘ఎవరైనా దైవప్రీతి కోసం దయా కారుణ్యాలతో అనాథ బాలుని తలపై చేత్తో నిమిరితే, ఎన్ని వెంట్రుకలు అతని చేతి క్రిందికి వస్తే, అన్ని పుణ్యాలు అతని కర్మపత్రంలో లిఖించబడతాయి. అదేవిధంగా అనాథ బాలుడు లేదా బాలిక పట్ల ఉత్తమంగా వ్యవహరిస్తే అతడూ నేను స్వర్గంలో ఈ విధంగా ఉంటాం’ అని తనచేతి రెండు వ్రేళ్ళూ  చూపించారు.  (తిర్మిజి’ / ఏకోల్లేఖనం)

ఈ ‘హదీసు’ ద్వారా అనాథ పిల్లల పట్ల ప్రేమా వాత్సల్యంతో వ్యవహరించిన వారు తీర్పుదినం నాడు ప్రవక్త (స)తో కలసి ఉంటారు అని తెలిసింది. అయితే ప్రవక్త (స) స్థానం గొప్పది. కనుక అతను(స) తన స్థానానికి తగ్గట్టు ఉంటాడు.

4975 – [ 29 ] ( لم تتم دراسته ) (3/1388)

وَعَنِ ابْنِ عَبَّاسٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَنْ آوَى يَتِيْمًا إِلى طَعَامِهِ وَشَرَابِهِ أَوْجَبَ اللهُ لَهُ الْجَنَّةَ الْبَتَّةَ إِلَّا أَنْ يَعْمَلَ ذَنْبًا لَا يُغْفَرُ. وَمَنْ عَالَ ثَلَاثَ بَنَاتٍ أَوْ مِثْلَهُنَّ مِنَ الْأَخْوَاتِ فَأَدَّبَهُنَّ وَ رَحِمَهُنَّ حَتَّى يُغْنِيَهُنَّ اللهُ أَوْجَبَ اللهُ لَهُ الْجَنَّةَ”. فَقَالَ رَجُلٌ: يَا رَسُوْلَ اللهِ وَاثْنَتَيْنِ؟ قَالَ: “وَاثْنَتَيْنِ” حَتَّى قَالُوْا: أَوْ وَاحِدَةً؟ فَقَالَ: وَاحِدَةً ” وَمَنْ أَذْهَبَ اللهُ بِكَرِيْمَتَيْهِ وَجَبَتْ لَهُ الْجَنَّةُ”. قِيْلَ: يَا رَسُوْلَ اللهِ وَمَا كَرِيْمَتَاهُ؟ قَالَ: “عَيْنَاهُ”. رَوَاهُ فِيْ ” شَرْحِ السُّنَّةِ”.

4975. (29) [3/1388అపరిశోధితం]

ఇబ్నె ‘అబ్బాస్‌ (ర) కథనం: ప్రవక్త, ”ఎవరైనా తాను భోజనం చేసినపుడు అనాథులను కూడా చేర్చుకుంటే నిస్సందేహంగా అల్లాహ్‌ (త) అతని కొరకు స్వర్గం తప్పనిసరి చేస్తాడు. అయితే ఘోర పాపాలకు పాల్పడి ఉండరాదు. అదేవిధంగా, ‘ఎవరు ముగ్గురు కూతుర్లను లేదా ముగ్గురు చెల్లెళ్లను పెంచి పోషించి, వారి పట్ల ఉత్తమంగా వ్యవహరించి, తీర్చిదిద్ది, వారిపట్ల ప్రేమా వాత్సల్యం కనబరచి, వారి పెళ్ళిళ్ళు చేస్తాడో, అల్లాహ్‌ అతని కొరకు స్వర్గం తప్పనిసరి చేస్తాడు,’ అని ప్రవచించారు. అది విని ఒక వ్యక్తి, ‘ఓ ప్రవక్తా! ఒకవేళ ఎవరైనా ఇద్దరు అమ్మాయిలను సంరక్షిస్తే, అతనికేమి లభిస్తుంది?’ అని ప్రశ్నించాడు. దానికి ప్రవక్త (స), ‘అతని కోసం కూడా అదే ఉంది, ఇంకా ఎవరి రెండు ప్రీతికర మైన వస్తువులు లాక్కోబడ్డాయో అతనికి కూడా స్వర్గం ఉంది.’ దానికి ప్రజలు, ‘ఓ ప్రవక్తా! ఆ రెండు ప్రీతికరమైన వస్తువులు ఏమిటి?’ అని ప్రశ్నించారు. అప్పుడు ప్రవక్త(స), ‘రెండుకళ్ళు’ అని, అవి పోయిన పిదప, సహనం, ఓర్పు వహిస్తే అతనికి స్వర్గం లభిస్తుంది,’ అని అన్నారు. (షర్‌’హుస్సున్నహ్‌)

4976 – [ 30 ] ( لم تتم دراسته ) (3/1388)

وَعَنْ جَابِرِبْنِ سُمُرَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَأَنْ يُؤَدِّبَ الرَّجُلُ وَلَدَهُ خَيْرٌلَهُ مِنْ أَنْ يَتَصَدَّقَ بِصَاعٍ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَقَالَ: هَذَا حَدِيْثٌ غَرِيْبٌ وَنَاصِحٌ الرَّاوِيْ لَيْسَ عِنْدَ أْصَحَابِ الْحَدِيْثِ بِالْقَوِيِّ.

4976. (30) [3/1388 అపరిశోధితం]

జాబిర్‌ బిన్‌ సమురహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మనిషి తన సంతానానికి ఒక మంచి మాట నేర్పించటం, బోధించటం 2 ¾ సేర్లు ఆహార ధాన్యాలు దానం  చేయటం కంటే  ఉత్తమం.”  (తిర్మిజి’)

4977 – [ 31 ] ( لم تتم دراسته ) (3/1389)

وَعَنْ أَيُّوْبَ بْنِ مُوْسَى عَنْ أَبْيِهِ عَنْ جَدِّهِ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم قَالَ: “مَا نَحَلَ وَالِدٌ وَلَدَهُ مِنْ نُحْلٍ أَفْضَلَ مِنْ أَدَبٍ حَسَنٍ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَالْبَيْهَقِيُّ فِيْ “شُعَبِ الْإِيْمَان” وَقَالَ التِّرْمِذِيُّ: هَذَا عِنْدِيْ حَدِيْثٌ مُرْسَلٌ.

4977. (31) [3/1389 అపరిశోధితం]

అయ్యూబ్‌ బిన్‌ మూసా తన తండ్రి తన తాత ద్వారా కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”తండ్రి తన సంతానానికి సభ్యతా సంస్కారాలు నేర్పించటంకంటే ఉత్తమ కానుక మరొకటి లేదు.” (తిర్మిజి / తాబయీ ప్రోక్తం, బైహఖీ / షు’అబిల్ ఈమాన్)

అంటే తండ్రి తన సంతానానికి ధార్మిక  సభ్యతా సంస్కారాలు  నేర్పటం  ఉత్తమ  కానుక  వంటిది.

4978 – [ 32] ( لم تتم دراسته ) (3/1389)

وَعَنْ عَوْفِ بْنِ مَالِكٍ الْأَشْجَعِيِّ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “أَنَا وَامْرَأَةٌ سَفْعَاءُ الْخَدَّيْنِ كَهَاتَيْنِ يَوْمَ الْقِيَامَةِ”. وَأَوْمَأَ يَزِيْدُ بْنُ ذُرِيْعٍ إِلى الْوُسْطَى وَالسَّبَّابَةِ”. اِمْرَأَةٌ آمَتْ مِنْ زَوْجِهَا ذَاتُ مَنْصَبٍ وَجَمَالٍ حَبَسَتْ نَفْسَهَاعَلَى يَتَامَاهَا حَتَّى بَانُوْا أَوْماَتُوْا”. رَوَاهُ أَبُوْ دَاوُدَ.  

4978. (32) [3/1386 -అపరిశోధితం]

‘ఔఫ్‌ బిన్‌ మాలిక్‌ అష్‌జ’యీ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”నేనూ మరియు బుగ్గలు నల్లపడిన స్త్రీ, ఈ విధంగా స్వర్గంలో ఉంటాం,” అని అన్నారు. ఉల్లేఖనకర్త తన చేతి మధ్య వ్రేలు, చూపుడు వ్రేలు చూపుతూ’ అన్నారు. నల్లని బుగ్గలు గల స్త్రీ అంటే భర్తచనిపోయిన పిదప అనాథ పిల్లల సంరక్షణా బాధ్యతలను దృష్టిలో పెట్టుకొని మళ్ళీపెళ్ళి చేసుకోక తన యవ్వనాన్ని అనాథ పిల్లల కోసం త్యాగం చేసిన స్త్రీ. వారి సంరక్షణ, విద్యాబుద్ధులు నేర్పించటంలో తన అందాన్ని మరచిపోయి. దుఃఖ విచారాల కారణంగా ఆమె ముఖం నల్లబడిపోతుంది.”  (అబూ  దావూద్‌)

4979 – [ 33] ( ضعيف ) (3/1389)

وَعَنْ ابْنِ عَبَّاسٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم:”مَنْ كَانَتْ لَهُ أُنْثَى فَلَمْ يَئِدْهَا وَلَمْ يُهِنْهَا وَلَمْ يُؤْثِرْوَلَدَهُ عَلَيْهَا- يَعْنِيْ الذُّكُوْرَ – أَدْخَلَهُ اللهُ الْجَنَّةَ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ.  

4979. (33) [3/1389 బలహీనం]

ఇబ్నె ‘అబ్బాస్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ఎవరైనా తన కూతుర్ని సజీవంగా పూడ్చిపెట్టకుండా, అవమానపరచకుండా, కొడుకులను కుమార్తెలపై ప్రాధాన్యత ఇవ్వకుండా అంటే మంచిగా పోషించి, పరిరక్షిస్తే అల్లాహ్‌(త) అతన్ని స్వర్గంలోనికి ప్రవేశింప జేస్తాడు.  (అబూ  దావూద్‌)

4980 – [ 34 ] ( لم تتم دراسته ) (3/1389)

وَعَنْ أَنَسٍ عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ: “مَنِ اغْتِيْبَ عِنْدَهُ أَخُوْهُ الْمُسْلِمُ وَهُوَ يَقْدِرُ عَلَى نَصْرِهِ فَنَصَرَهُ نَصَرَهُ اللهُ فِي الدُّيْنَا وَالْآخِرَةِ. فَإِنْ لَمْ يَنْصُرْهُ وَهُوَ يَقْدِرُعَلَى نَصْرِهِ أَدْرَكَهُ اللهُ بِهِ فِي الدُّنْيَا وَالْآخِرَةِ”. رَوَاهُ فِيْ “شَرْحِ السُّنَّةِ”  

4980. (34) [3/1389అపరిశోధితం]

అనస్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఒక ముస్లిమ్‌ వద్ద మరో ముస్లిమ్‌ సోదరుడు పరోక్షంగా నిందించబడు తుంటే  అతడు ఆ వ్యక్తి తరఫునుండి ప్రతిఘటిస్తే, అతనికి సహాయం చేస్తే అల్లాహ్‌ (త) ఉభయలోకాల్లో అతనికి సహాయం చేస్తాడు. ఇంకా ఒకవేళ శక్తి ఉండి కూడా ప్రతిఘటించక పోతే అల్లాహ్‌ (త) అతన్ని ఉభయ లోకాల్లోనూ  విచారిస్తాడు.  (షర్‌’హు స్సున్నహ్‌)

4981 – [ 35 ] ( لم تتم دراسته ) (3/1389)

وَعَنْ أَسْمَاءَ بِنْتِ يَزِيْدَ قَالَتْ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَنْ ذَبَّ عَنْ لَحْمِ أَخِيْهِ بِالْمَغِيْبَةِ كَانَ حَقًّا عَلَى اللهِ أَنْ يُعْتِقَهُ مِنَ النَّارِ”. رَوَاهُ الْبَيْهَقِيُّ فِيْ “شُعَبِ الْإِيْمَانِ”.

4981. (35) [3/1389అపరిశోధితం]

అస్మా’ బిన్తె య’జీద్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఎవరు మరొక ముస్లిమ్‌ పరోక్షనింద జరగకుండా వారిస్తారో, ప్రతిఘటిస్తారో, వారిని నరక విముక్తి కలిగించటం అల్లాహ్‌(త) కు తప్పనిసరి అవుతుంది.” (బైహఖీ – షుఅబిల్ ఈమాన్)

4982 – [ 36 ] ( لم تتم دراسته ) (3/1389)

وَعَنْ أَبِي الدَّرْدَاءِ قَالَ: سَمِعْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ: “مَا مِنْ مُسْلِمٍ يَرُدُّ عَنْ عِرْضِ أَخِيْهِ إِلَّا كَانَ حَقًّا عَلَى اللهِ أَنْ يَرُدَّ عَنْهُ نَارَ جَهَنَّمَ يَوْمَ الْقِيَامَةِ”. ثُمَّ تَلَا هَذِهِ الْآيَةِ: (وَكَانَ حَقًّا عَلَيْنَا نَصْرُ الْمُؤْمِنِيْنَ؛ 30: 47) رَوَاهُ فِيْ “شَرْحِ السُّنَّةِ”.

4982. (36) [3/1389అపరిశోధితం]

అబూ దర్దా’ (ర) కథనం: ప్రవక్త (స) ఇలా ప్రవచిస్తూ ఉండగా నేను విన్నాను, ”ఒక ముస్లిమ్‌ మరో ముస్లిమ్‌ను అవమానపరచకుండా ఆపితే అంటే పరోక్షనింద జరగ కుండా ఆపితే తీర్పుదినం నాడు అతన్ని నరకం నుండి రక్షించటం అల్లాహ్‌(త)కు తప్పనిసరి అవుతుంది. ప్రవక్త (స) దీన్ని సమర్థిస్తూ ఈ ఆయత్ చదివారు. ”ముస్లిములకు సహాయం చేయటం మాపై తప్పనిసరి అవుతుంది.” [రూమ్, 30:47]  (షర్‌’హుస్సున్నహ్‌)

4983 – [ 37] ( لم تتم دراسته ) (3/1390)

وَعَنْ جَابِرٍأَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم قَالَ: “مَا مِنْ امْرِئٍ مُسْلِمٍ يَخْذُلُ امْرَأ مُسْلِمًا فِيْ مَوْضِعٍ يُنْتَهَكُ فِيْهِ حُرْمَتُهُ وَيُنْتَقَصُ فِيْهِ مِنْ عِرْضِهِ إِلَّا خَذَلَهُ اللهُ تَعَالى فِيْ مَوْطِنٍ يُحِبُّ فِيْهِ نُصْرَتَهُ وَمَا مِنِ امْرَئٍ مُسْلِمٍ يَنْصُرُ مُسْلِمًا فِيْ مَوْضِعِ يُنْتَقَصُ فِيْهِ عِرْضِهِ وَيَنْتَهَكُ فِيْهِ حُرْمَتِهِ إِلَّا نَصَرَهُ اللهُ فِيْ مَوْطِنٍ يُحِبُّ فِيْهِ نُصْرَتَهُ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ.

4983. (37) [3/1390 అపరిశోధితం]

జాబిర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”తన ముస్లిమ్‌ సోదరునికి, అవమానం జరుగుతూ ఉన్నా, సహాయం చేయకుండా ఉంటే, అల్లాహ్‌ (త) కూడా అతనికి సహాయం చేయడు. అదేవిధంగా తన ముస్లిమ్‌ సోదరునికి అవమానం జరుగుతుంటే, అతనికి సహాయం చేస్తే, అవమానం జరగకుండా రక్షిస్తే అల్లాహ్‌ (త) అతన్ని ఉభయ లోకాల్లోనూ రక్షిస్తాడు.” (అబూ దావూద్‌)

4984 – [ 38 ] ( ضعيف ) (3/1390)

وَعَنْ عُقْبَةَ بْنِ عَامِرٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَنْ رَأَى عَوْرَة فَسَتَرَهَا كَانَ كَمَنْ أَحْيَا مَؤُوْدَةً”. رَوَاهُ أَحْمَدُ وَالتِّرْمِذِيُّ وَصَحَّحَهُ.  

4984. (38) [3/1390బలహీనం]

ఉఖ్‌బహ్ బిన్‌ ‘ఆమిర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఎవరైనా ఒక ముస్లిమ్‌ లోపాన్ని చూసి, కప్పి పుచ్చితే, సజీవంగా పూడ్చి పెట్ట బడిన అమ్మాయిని రక్షించినంత పుణ్యం అతనికి లభిస్తుంది.” (అ’హ్మద్‌, తిర్మిజి – దృఢం)

ఈ ‘హదీసు’ ద్వారా ఒకరి లోపాలను కప్పిపుచ్చిన వారి, పెద్దపెద్ద లోపాలను అల్లాహ్‌(త) తన కప్పి పుచ్చుతాడని  తెలిసింది.

4985 – [ 39] ( لم تتم دراسته ) (3/1390)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِنَّ أَحَدَكُمْ مِرْآةُ أَخِيْهِ فَإِنْ رَأَى بِهِ أَذى فَلْيُمِطْ عَنْهُ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَضَعَّفَهُ.

 وَفِيْ رِوَايَةٍ لَهُ وَلِأَبِيْ دَاوُدَ:”اَلْمُؤْمِنُ مِرْآةُ الْمُؤْمِنِ وَالْمُؤْمِنِ أَخُو الْمُؤْمِنِ يَكُفُّ عَنْهُ ضَيْعَتَهُ وَيَحُوْطُهُ مِنْ وَّرَائِهِ”.

4985. (39) [3/1390అపరిశోధితం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మీరు మీ ముస్లిమ్‌ సోదరునికి అద్దం వంటి వారు. ఒకవేళ అతనిలో ఏదైనా లోపంచూస్తే దాన్ని తొలగించండి. అతని ముందు అతని లోపాన్ని బహిర్గతం చేయండి, అతడు దాన్నుండి దూరం కావటానికి. అద్దం ఏ విధంగా ముఖంపై లోపాలను చూపిస్తుందో ఆ విధంగా అతడు లోపాలను దూరం చేసుకుంటాడు.” (తిర్మిజి’ / బలహీనం)

తిర్మిజి’, అబూ దావూద్‌లలోని మరో ఉల్లేఖనంలో, ”ఒక విశ్వాసి మరోవిశ్వాసికి అద్దం వంటివాడు. ఒక ముస్లిమ్‌ మరో ముస్లిమ్‌కు సోదరుడు. అతడు అతనికి హాని చేకూర్చే విషయం నుండి దూరం చేస్తాడు. పరోక్షంగా అతన్ని సమర్థిస్తాడు”  అని  ఉంది.

4986 – [ 40 ] ؟ (3/1390)

وَعَنْ مُعَاذِ بْنِ أَنَسٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَنْ حَمَى مُؤْمِنًا مِنْ مُنَافِقٍ بَعَثَ اللهُ مَلَكًا يَحْمِيْ لَحْمَهُ يَوْمَ الْقِيَامَةِ مِنْ نَارِجَهَنَّمَ وَمَنْ رَمَى مُسْلِمًا بِشَيْءٍ يُرِيْدُ بِهِ شَيْنَهُ حَبَسَهُ اللهُ عَلَى جَسْرِجَهَنَّمَ حَتَّى يَخْرُجَ مِمَّا قَالَ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ

4986. (40) [3/1390 ? ]

ము’ఆజ్‌’ బిన్‌ అనస్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవ చనం, ”ఒక ముస్లిమ్‌ను కపటాచారి హాని నుండి రక్షించినవారికి సహాయంచేయటానికి, అల్లాహ్‌(త) ఒక దైవదూతను పంపిస్తాడు. అతడు అతన్ని తీర్పుదినం నాడు నరకం నుండి రక్షిస్తాడు. అదేవిధంగా ఒక ముస్లిమ్‌పై, అతన్ని అగౌరవ పరిచేలా అప నిందలు వేసేవారిని అల్లాహ్‌ (త) వంతెనపై ఆపు కుంటాడు. అతడు వేసిన నిందారోపణను వెనక్కి తీసుకోనంత వరకు ఆపి ఉంచుతాడు.” (అబూ దావూద్‌)

అంటే గురిచేసిన వ్యక్తి క్షమాపణ కోరితే అతన్ని క్షమించటం జరుగుతుంది. లేకపోతే అతన్ని అక్కడే నిల్చో బెట్టటం  జరుగుతుంది.

4987 – [ 41 ] ( صحيح ) (3/1390)

وَعَنْ عَبْدِ اللهِ بْنِ عَمْرٍوقَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: خَيْرُ الْأَصْحَابِ عِنْدَ اللهِ خَيْرُهُمْ لِصَاحِبِهِ وَخَيْرُ الْجِيْرَانِ عِنْدَ اللهِ خَيْرُهُمْ لِجَارِهِ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَالدَّارَمِيُّ. وَقَالَ التِّرْمِذِيُّ: هَذَا حَدِيْثٌ حَسَنٌ غَرِيْبٌ

4987. (41) [3/1390 దృఢం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ మస్‌’ఊద్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మిత్రుల్లో అందరికంటే తన మిత్రుడి పట్ల శ్రేయోభిలాషి అయిన మిత్రుడు అంటే అల్లాహ్‌(త)కు ఇష్టం. అదే విధంగా పొరుగువారిలో అందరికంటే తన ఇరుగు పొరుగు వారిపట్ల శ్రేయోభిలాషిగా వ్యవ హరించే వారు అల్లాహ్‌(త) వద్ద ఉత్తములు.” (తిర్మిజి – ప్రామాణికం-ఏకోల్లేఖనం, దార్మి)

4988 – [ 42 ] ( صحيح ) (3/1390)

وَعَنْ ابْنِ مَسْعُوْدٍ قَالَ: قَالَ رَجُلٌ لِلنَّبِيِّ الله صلى الله عليه وسلم: يَا رَسُوْلَ اللهِ كَيْفَ لِيْ أَنْ أَعْلَمَ إِذَا أَحْسَنْت أَوْ إِذَا أَسَأْتُ؟ فَقَالَ النَّبِيُّ صلى الله عليه وسلم: “إِذَا سَمِعْتَ جِيْرَانَكَ يَقُوْلُوْنَ: قَدْ أَحْسَنْتَ فَقَدْ أَحْسَنْتَ. وَإِذَا سَمِعْتَهُمْ يَقُوْلُوْنَ: قَدْ أَسَأْتَ فَقَدْ أَسَأْتَ”. رَوَاهُ ابْنُ مَاجَهُ

4988. (42) [3/1390దృఢం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ మస్‌’ఊద్‌ (ర) కథనం: ఒక వ్యక్తి ప్రవక్త (స) వద్దకు వచ్చి, ‘ఓ ప్రవక్తా! నేను మంచిపని చేసానో, చెడుపని చేసానో నాకెలా తెలుస్తుంది?’ అని విన్నవించుకున్నాడు. దానికి ప్రవక్త (స), ‘నీ పొరుగు వారు నీ గురించి మంచిపని చేసావంటే నీవు మంచిపని చేసినట్టే. ఇంకా నీ పొరుగువారు నీ గురించి చెడుపని చేసావంటే నిజంగా నీవు చెడుపని చేసినట్టే.’ (ఇబ్నె మాజహ్)

 ఎందుకంటే ఇరుగుపొరుగువారు ఎల్లప్పుడూ కని పెడుతూ ఉంటారు. ఒకవేళ వాళ్ళందరూ మంచి చేసావంటే నీవు మంచివాడవే, వాళ్ళందరూ నీవు చెడ్డ వాడవు అంటే నీవు చెడ్డవాడవే. అయితే వారు సానుభూతి, ధర్మ పరాయణులయిన ముస్లిములై ఉండాలి.

4989 – [ 43 ] ( لم تتم دراسته ) (3/1391)

وَعَنْ عَائِشَةَ أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم قَالَ: “أَنْزِلُوا النَّاسَ مَنَازِلَهُمْ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ

4989. (43) [3/1391 అపరిశోధితం]

‘ఆయి’షహ్‌ (ర) కథనం: ప్రవక్త(స) ప్రవచనం, ”ప్రజలను వారి స్థానాన్ని బట్టి ఉంచండి.” (అబూ దావూద్‌)

—–

اَلْفَصْلُ الثَّالِثُ  మూడవ విభాగం 

4990 – [ 44 ] ( حسن ) (3/1391)

عَنْ عَبْدِ الرَّحْمنِ بْنِ أَبِيْ قُرَادَ أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم تَوَضَّأَ يَوْمًا فَجَعَلَ أَصْحَابُهُ يَتَمَسَّحُوْنَ بِوَضُوْئِهِ. فَقَالَ لَهُمُ النَّبِيُّ صلى الله عليه وسلم: “مَا يَحْمِلُكُمْ عَلَى هَذَا؟”  قَالُوْا: حُبُّ اللهِ وَرَسُوْلُهُ. فَقَالَ النَّبِيُّ صلى الله عليه وسلم: “مَنْ سَرَّهُ أَنْ يُحِبَّ اللهَ وَرَسُوْلَهُ أَوْيُحِبَّهُ اللهُ وَرَسُوْلَهُ فَلْيَصْدُقْ حَدِيْثَهُ إِذَا حَدَّثَ وَلْيُؤَدِّ أَمَانَتَهُ إِذَا اؤْتُمِنَ وَلْيُحْسِنْ جَوَارَ مَنْ جَاوَرَهُ”.

4990. (44) [3/1391 ప్రామాణికం]

‘అబ్దుర్ర’హ్మాన్‌ బిన్‌ అబీ ఖురాద్హ్ (ర) కథనం: ఒకసారి ప్రవక్త (స) వు’దూ చేస్తున్నారు. అనుచరులు ప్రవక్త (స) వు’దూ నీటిని పట్టి తమ శరీరాలకు పులుము కుంటున్నారు. అది చూసి ప్రవక్త (స), ‘ఏ విషయం మిమ్మల్ని ఇలా చేయమని ప్రేరేపించింది,’ అని అడిగారు. దానికి వారు, ‘అల్లాహ్‌(త), ఆయన ప్రవక్త (స) ప్రేమ,’ అని అన్నారు. అప్పుడు ప్రవక్త (స) ‘అల్లాహ్‌(త) మరియు ఆయన ప్రవక్త (స) ప్రేమపట్ల సంతోషించే వారు, అల్లాహ్‌(త) మరియు ప్రవక్త వారిని ప్రేమించాలని కోరేవారు పలికితే సత్యమే పలకాలి, అమానతు ఉంచబడితే ఉన్నది ఉన్నట్టు ఇవ్వాలి, తన పొరుగు వారికి ఉపకారం చేస్తూ ఉండాలి,’ అని అన్నారు. (బైహఖీ)

4991 – [ 45 ] ( حسن ) (3/1391)

وَعَنْ ابْنِ عَبَّاسٍ قَالَ: سَمِعْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ: “لَيْسَ الْمُؤْمِنُ بِالَّذِيْ يَشْبَعُ وَجَارُهُ جَائِعٌ إِلى جَنْبِهِ”. رَوَاهُ الْبَيْهَقِيُّ فِيْ “شُعَبِ الْإِيْمَانِ”.

4991. (45) [3/1391 ప్రామాణికం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘అబ్బాస్‌ (ర) కథనం: ప్రవక్త (స) ఇలా ప్రవచిస్తూ ఉండగా నేను విన్నాను, ”తాను కడుపు నిండా తిని, తన ప్రక్కన ఉండే పొరుగువాడు పస్తులు ఉండటాన్ని సహించే వ్యక్తి విశ్వాసి కాజాలడు.” (బైహఖీ-షు’అబిల్ ఈమాన్)

 అంటే తన పొరుగువాడు ఆకలితో ఉన్నాడని తెలస్తే, సాను భూతితో అతనికి కూడా తినిపించాలి.

4992 – [ 46 ] ( لم تتم دراسته ) (3/1391)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: قَالَ رَجُلٌ: يَا رَسُوْلَ اللهِ إِنَّ فُلَانَةَ تُذْكَرُمِنْ كَثْرَةِ صَلَاتِهَا وَصِيَامِهَا وَصَدَقَتِهَا. غَيْرَ أَنَّهَا تُؤْذِيْ جِيْرَانَهَا بِلِسَانِهَا. قَالَ: “هِيَ فِي النَّارِ”. قَالَ: يَا رَسُوْلَ اللهِ فَإِنَّ فُلَانَةَ تُذْكَرُ قِلَّةُ صِيَامِهَا وَ صَدَقَتِهَا وَصَلَاتِهَا وَإِنَّهَا تَصَدَّقُ بِالْأَثْوَارِمِنَ الْإِقطِ وَلَاتُؤْذِيْ جِيْرَانَهَا . قَالَ: “هِيَ فِي الْجَنَّةِ”. رَوَاهُ أَحْمَدُ وَالْبَيْهَقِيُّ فِيْ”شُعَبِ الْإِيْمَانِ”.

4992. (46) [3/1391 అపరిశోధితం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ఒక వ్యక్తి వచ్చి, ‘ఓ ప్రవక్తా! ఒక స్త్రీ ఉంది, ఆమె చాలా నమా’జులు చదువు తుంది, ఇంకా అదనపు ఉపవాసాలు పాటిస్తుంది, ఇంకా దానధర్మాలు కూడా చేస్తుంది. కాని, ఆమె తన నోటి దురుసుతనం వల్ల ఇరుగు పొరుగు వారిని దుర్భాషలాడుతుంది,’ అని అన్నాడు. దానికి ప్రవక్త (స), ‘ఆమె నరకంలోనికి ప్రవే శిస్తుంది,’ అని అన్నారు.  మళ్ళీ ఆ వ్యక్తి, ‘ఓ ప్రవక్తా! మరో స్త్రీ ఉంది, ఆమె నమా’జులు, ఉపవాసాలు, దాన ధర్మాలు చాలా తక్కువగా ఆచరిస్తుంది. అయితే ఆమె తన నోటితో ఎవ్వరినీ హింసించదు,’ అని అన్నాడు. దానికి ప్రవక్త (స), ‘ఆమె స్వర్గంలోనికి వెళుతుంది,’ అని అన్నారు. (అ’హ్మద్‌, బైహఖీ)

4993 – [ 47 ] ( لم تتم دراسته ) (3/1392)

وَعَنْهُ قَالَ: إِنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم وَقَفَ عَلَى نَاسٍ جَلُوْسٍ فَقَالَ: “أَلَا أُخْبِرُكُمْ بِخَيْرِكُمْ مِنْ شَرِّكُمْ؟” قَالَ: فَسَكَتُوْا. فَقَالَ ذَلِكَ ثَلَاثَ مَرَّاتٍ. فَقَالَ رَجُلٌ: بَلَى يَا رَسُوْلَ اللهِ أَخْبِرْنَا بِخَيْرِنَا مِنْ شَرِّنَا. فَقَالَ: “خَيْرُكُمْ مَنْ يُرْجَى خَيْرُهُ وَيُؤْمِنُ شَرُّهُ وَشَرُّكُمْ مَنْ لَا يُرْجَى خَيْرُهُ وَلَا يُؤْمَنُ شَرُّهُ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَالْبَيْهَقِيُّ فِيْ “شُعَبِ الْإِيْمَانِ”. وَقَالَ التِّرْمِذِيُّ : هذَا حَدِيْثٌ حَسَنٌ صَحِيْحٌ.  

4993. (47) [3/1392అపరిశోధితం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: కూర్చొని ఉన్న అనుచరులతో ప్రవక్త (స) ‘మంచివారెవరో, చెడ్డ వారెవరో మీకు నేను తెలుపనా?’ అని అన్నారు. ఇలా మూడు సార్లు అన్నారు. అందరూ నిశ్శబ్దంగా ఉన్నారు. ఎవ్వరూ మాట్లాడలేదు. ఒక వ్యక్తి లేచి, ‘తెలియ పరచండి,’ అని అన్నాడు. దానికి ప్రవక్త (స), ‘మంచి చేస్తాడనే ఆశతో ప్రజలు ఉండేవారు, ఇంకా అతని చెడు పట్ల ఎటువంటి భయంలేనివాళ్ళు. (తిర్మిజి – ప్రామాణికం – ఏకోల్లేఖనం, బైహఖీ -ష’అబిల్ ఈమాన్)

అంటే అందరికీ ఉపకారం చేసేవారు, ఎవ్వరికీ అపకారం చేయనివారు. ఇంకా అందరికీ హాని తలపెట్టేవారే చాలా చెడ్డవారు.

4994 – [ 48 ] ( لم تتم دراسته ) (3/1392)

وَعَنِ ابْنِ مَسْعُوْدٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِنَّ اللهَ تَعَالى قَسَّمَ بَيْنَكُمْ أَخْلَاقَكُمْ كَمَا قَسَّمَ بَيْنَكُمْ أَرْزَاقَكُمْ إِنَّ اللهَ يُعْطِي الدُّنْيَا مَنْ يُحِبُّ. وَمَنْ لَا يُحِبُّ وَلَا يُعْطِي الدِّيْنَ إِلَّا مَنْ أَحَبَّ فَمَنْ أَعْطَاهُ اللهُ الدِّيْنَ فَقَدْ أَحَبَّهُ وَالَّذِيْ نَفْسِيْ بِيَدِهِ لَا يُسْلِمُ عَبْدٌ حَتَّى يُسْلِمَ قَلْبُهُ وَلِسَانُهُ وَلَا يُؤْمِنُ حَتَّى يَأْمَنَ جَارُهُ بَوَائِقَهُ”.

4994. (48) [3/1392 అపరిశోధితం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ మస్‌’ఊద్‌ (ర) కథనం: ప్రవక్త (స), అల్లాహ్‌ (త) మీలో మీ ఉపాధిని పంచినట్టే, మీ నైతికత అలవాట్లను కూడా మీలో పంచిపెట్టాడు. అంటే ఇహలోకంలో ఒకరిని ధనవంతునిగా, మరొకరిని పేద వానిగా చేసాడు. అదే విధంగా ఒకరిని మంచి వారుగా, మరొకరిని చెడ్డవారుగా చేసాడు. అయితే అల్లాహ్‌ (త) ఇహలోక భోగభాగ్యాలు మంచివారికీ ఇస్తాడు, చెడ్డ వారికీ ఇస్తాడు. కాని సన్మార్గం కేవలం తన భక్తులకే ఇస్తాడు. అల్లాహ్‌ (త) సన్మార్గం, ధార్మికత ప్రసాదించిన వారిని ప్రేమిస్తాడు. అతడు అల్లాహ్‌ (త) భక్తుడు. ఎవరి చేతుల్లో నా ప్రాణం ఉందో, ఆయన సాక్షి! నోరు, హృదయం ముస్లిమ్‌ అవనంతవరకు దాసుడు ముస్లిమ్‌ కాలేడు. అదేవిధంగా పొరుగువారు తన దుర్మార్గాల నుండి రక్షించబడనంత వరకు అతడు విశ్వాసికాలేడు అని ప్రవచించారు.  (బైహఖీ)

4995 – [ 49 ] ( لم تتم دراسته ) (3/1392)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم قَالَ: “اَلْمُؤْمِنُ مَأْلَفٌ وَلَاخَيْرَفِيْمَنْ لَا يَأْلَفُ وَلَا يُؤْلَفُ”. رَوَاهُمَا أَحْمَدُ وَالْبَيْهَقِيُّ فِي “شُعَبِ الْإِيْمَانِ”.

4995. (49) [3/1392అపరిశోధితం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: విశ్వాసి ప్రేమాభి మానాలతో కలగలుపుగా అందరితో సంతోషంగా ఉంటాడు. ఈ మంచి గుణాలు లేనివారిలో ఎటువంటి మంచి ఉండదు. (అ’హ్మద్‌, బైహఖీ – ష’అబిల్ ఈమాన్)

4996 – [ 50 ] ( ضعيف ) (3/1392)

وَعَنْ أَنَسٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَنْ قَضَى لِأَحَدٍ مِنْ أُمَّتِيْ حَاجَةً يُرِيْدُ أَنْ يُسِرَّهُ بِهَا فَقَدْ سَرَّنِيْ وَمَنْ سَرَّنِيْ فَقَدْ سَرَّ اللهَ وَمَنْ سَرَّ اللهَ أَدْخَلَهُ اللهُ الْجَنَّةَ”.

4996. (50) [3/1392 బలహీనం]

అనస్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”నా అనుచర సమాజంలో ఎవరైనా ఒక వ్యక్తి ప్రాపంచిక లేదా ధార్మిక సమస్య పరిష్కరించి అతన్ని సంతోష పెడితే, అతడు నన్ను సంతోషపెట్టినట్టే, నన్ను సంతోష పరచినవాడు అల్లాహ్‌(త)ను సంతోష పరచి నట్టే. అల్లాహ్‌ (త) ను సంతోషపరచిన వారిని అల్లాహ్‌ (త) స్వర్గంలో ప్రవేశింపజేస్తాడు.”  (బైహఖీ)

4997 – [ 51 ] ( ضعيف ) (3/1392)

وَعَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَنْ أَغَاثَ مَلْهُوْفًا كَتَبَ اللهُ لَهُ ثَلَاثًا وَسَبْعِيْنَ مَغْفِرَةً وَاحِدَةٌ فِيْهَا صَلَاحُ أَمْرِهِ كُلِّهِ وَثِنْتَانِ وَسَبْعُوْنَ لَهُ دَرَجَاتٌ يَوْمَ الْقِيَامَةِ”.

4997. (51) [3/1392 బలహీనం]

అనస్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఎవరైనా బాధితునికి సహాయం చేస్తే, దానికి బదులు 73 క్షమింపులు వ్రాయడం జరుగుతుంది. వాటిలోని ఒక క్షమింపు వల్ల అతని సమస్యలన్నీ పరిష్కరించ బడతాయి. మిగిలిన 72 మన్నింపుల వల్ల తీర్పుదినం నాడు అతని స్థానాలు ఉన్నతం చేయబడతాయి.” (బైహఖీ)

4998 – ]52[؛ 4999 – [53]  (ضعيف) (3/1392)

وَعَنْهُ وَعَنْ عَبْدِ اللهِ قَالَا: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “اَلْخَلْقُ عِيَالُ اللهِ فَأَحَبُّ الْخَلْقِ إِلى اللهِ مَنْ أَحْسَنَ إِلَى عِيَالِهِ”. رَوَى الْبَيْهَقِيُّ الْأَحَادِيْثَ الثَّلَاثَةَ فِيْ “شُعَبِ الْإِيْمَانِ”.

4998. (52), 4999. (53) [3/1392 బలహీనం]

అనస్‌, ‘అబ్దుల్లాహ్‌ (ర)ల కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”సృష్టితాలన్నీ అల్లాహ్‌(త)కుటుంబం. తన కుటుంబం పట్ల మంచిగా ప్రవర్తించేవాడే అందరి కంటే ఉత్తముడు.” (బైహఖీ)

5000 – [ 54 ] ( لم تتم دراسته ) (3/1393)

وَعَنْ عُقْبَةَ بْنِ عَامِرٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “أَوَّلُ خَصْمَيْنِ يَوْمَ الْقِيَامِةَ جَارَانِ”. رَوَاهُ أَحْمَدُ.

5000. (54) [3/1393అపరిశోధితం]

‘ఉఖ్‌బహ్ బిన్‌ ‘ఆమిర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, దాసుల వ్యవహారాల్లో తీర్పుదినం నాడు ఇద్దరు పొరుగువారు ఎల్లప్పుడూ వివాదపడే వ్యవహారం విచారించటం  జరుగుతుంది. (అ’హ్మద్‌)

అంటే దాసుల హక్కుల్లో అన్నిటి కంటే ముందు పొరుగువారి వివాదాలు  విచారణకు  వస్తాయి.

5001 – [ 55] ( لم تتم دراسته ) (3/1393)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ أَنَّ رَجُلًا شَكَا إِلى النَّبِيِّ صلى الله عليه وسلم قَسْوَةَ قَلْبِهِ فَقَالَ:”اِمْسَحْ رَأْسَ الْيَتِيْمِ وَأَطْعِمِ الْمِسْكِيْنَ”.رَوَاهُ أْحَمَدُ

5001. (55) [3/1393అపరిశోధితం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స)ను ఒక వ్యక్తి తన కాఠిన్య హృదయం గురించి విన్నవించుకున్నాడు. ప్రవక్త (స) దానికి చికిత్సగా ప్రేమ వాత్సల్యాలతో అనాథల తలపై చేతితో నిమరమని, పేదలకు, ఆకలిగొన్నవారికి అన్నం పెట్టమని, దానివల్ల నీ హృదయం నుండి కఠినత్వం దూరం అవుతుందని అన్నారు.  (‘అహ్మద్‌)

5002 – [ 56 ] ( ضعيف ) (3/1393)

وعَنْ سُرَاقَةَ بْنِ مَالِكٍ أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم قَالَ: “أَلَا أَدُلُّكُمْ عَلَى أَفْضَلِ الصَّدَقَةِ؟ اِبْنَتُكَ مَرْدُوْدَةُ إَلَيْكَ لَيْسَ لَهَا كَاسِب غَيْرُكَ”. رَوَاهُ ابْنُ مَاجَهُ.

5002. (56) [3/1393బలహీనం]

సురాఖహ్ బిన్‌ మాలిక్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”నేను నీకు ఉత్తమదానం గురించి చెప్పనా? అదేమిటంటే, నీ ఇంటికి త్రిప్పి వేయబడిన నీ కూతురు పట్ల ఉత్తమంగా వ్యవహరించు, ఆమె భర్త మరణించి ఉండవచ్చు, లేదా ఆమె భర్త విడాకులు ఇచ్చి ఉండవచ్చు, నీవు తప్ప ఆమెకు దిక్కెవరూ లేకపోవచ్చు. ఇటువంటి అమ్మాయిని పోషించటం చాలా గొప్ప దానం, పుణ్యం.” (ఇబ్నె  మాజహ్)

=====

16 بَابُ الْحُبِّ فِيْ اللهِ وَمِنَ اللهِ

16. అల్లాహ్పట్ల, అల్లాహ్ కోసం ప్రేమ

అంటే అల్లాహ్‌(త)ను ప్రేమించటం. ఆయన విషయంలో చూపుగోలు, ప్రదర్శనాబుద్ధి, కాపట్యం మొదలైన వాటికి దూరంగా ఉండాలి. అదేవిధంగా ఇతరులను ప్రేమించినా అది కూడా అల్లాహ్ ప్రీతి కోసమే ప్రేమించాలి. అంటే అల్లాహ్ (త) ప్రీతికోసమే ప్రేమించాలి. అల్లాహ్(త)కోసమే ద్వేషించాలి. అల్లాహ్‌(త)ను  ప్రేమించే వారి గురించి ఖుర్‌ఆన్‌లో అనేక  ఆయాతులు ఉన్నాయి. క్రింది ‘హదీసు’లు కూడా వాటినే సమర్థిస్తున్నాయి.

اَلْفَصْلُ الْأَوَّلُ   మొదటి విభాగం  

5003 – [ 1 ] ( صحيح ) (3/1394)

عَنْ عَائِشَةَ قَالَتْ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “اَلْأَرْوَاحُ جُنُوْدٌ مُجَنَّدَةٌ فَمَا تَعَارَفَ مِنْهَا اِئْتَلَفَ وَمَا تَنَاكَرَمِنْهَا اِخْتَلَفَ”. رَوَاهُ الْبُخَارِيُّ.

5003. (1) [3/1394దృఢం]

‘ఆయి’షహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ఆదిలో ఆత్మలన్నీ ఒకేచోట ఉండేవి. అక్కడ పరిచయం స్నేహం అయిన వ్యక్తులతో ప్రపంచంలో కూడా పరిచయం స్నేహం  అవుతుంది. అక్కడ పరిచయం కాని వ్యక్తులతో ఇహలోకంలో కూడా పరిచయం జరుగదు.  (బు’ఖారీ)

5004 – [ 2 ] ( صحيح ) (3/1394)

وَرَوَاهُ مُسْلِمٌ عَنْ أَبِيْ هُرَيْرَةَ.

5004. (2) [3/1394 దృఢం]

దీనినే అబూ హురైరహ్‌(ర) కూడా ఉల్లేఖించారు. (ముస్లిమ్)

5005 – [ 3 ] ( صحيح ) (3/1394)

وَعَنْ أَبِيْ هُرْيَرَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِنَّ اللهَ إِذَا أَحَبَّ عَبْدًا دَعَا جِبْرِيْلَ فَقَالَ: إِنِّيْ أُحِبُّ فُلَانًا فَأَحِبَّهُ قَالَ: فَيُحِبُّهُ جِبْرَيْلُ ثُمَّ يُنَادِيْ فِي السَّمَاءِ فَيَقُوْلُ: إِنَّ اللهَ يُحِبُّ فُلَانًا فَأَحِبُّوْهُ فَيُحِبُّهُ أَهْلُ السَّمَاءِ ثُمَّ يُوْضَعُ لَهُ الْقُبُوْلُ فِي الْأَرْضِ. وَإِذَا اَبْغَضَ عَبْدًا دَعَا جِبْرَيْلَ فَيَقُوْلُ: إِنِّيْ أُبْغِضُ فُلَانًا فَأَبْغِضْهُ. فَيُبْغِضُهُ جِبْرَيْلُ ثُمَّ يُنْاَدِيْ فِي أَهْلِ السَّمَاءِ: إِنَّ اللهَ يُبْغِضُ فُلَانًا فَأَبْغِضُوْهُ. قَالَ: فَيُبْغِضُوْنَهُ. ثُمَّ يَوْضَعُ لَهُ الْبَغْضَاءُ فِي الْأَرْضِ”. رَوَاهُ مُسْلِمٌ.

5005. (3) [3/1394 దృఢం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”అల్లాహ్‌(త), తన దాసుల్లోని ఒకరిపట్ల ప్రేమను బహిర్గతం చేయదలచుకున్నప్పుడు, జిబ్రీల్‌(అ)ను పిలిచి, ‘నేను ఫలానా వ్యక్తిని ప్రేమిస్తున్నాను, నీవు కూడా అతన్ని ప్రేమించు,’ అని ఆదేశిస్తాడు. అనంతరం జిబ్రీల్‌(అ) కూడా అతన్ని ప్రేమిస్తూ ఉంటారు. ఇంకా ఆకాశాల్లో, ”అల్లాహ్‌(త) ఫలానా వ్యక్తిని ప్రేమిస్తున్నాడు, కనుక మీరు కూడా అతన్ని ప్రేమించండి” అని ప్రకటిస్తాడు. అనంతరం ఆకాశాల్లో ఉన్న వారందరూ అతన్ని ప్రేమిస్తూ ఉంటారు. ఇంకా అతన్ని గురించి భూమిపై కూడా ప్రకటించటం జరుగు తుంది. భూవాసులు కూడా అతన్ని ప్రేమిస్తారు. అదేవిధంగా అల్లాహ్‌ (త) తన దాసుల్లోని ఒకరిపట్ల ఆగ్రహం వ్యక్తం చేయదలచు కున్నప్పుడు జిబ్రీల్‌ (అ) ను పిలిచి, ‘నేను ఫలానా వ్యక్తి అవిధేయత వల్ల నేనతన్ని ఆగ్రహిస్తున్నాను, నువ్వుకూడా అతన్ని ఆగ్రహించు,’ అని ఆదేశిస్తాడు. జిబ్రీల్‌(అ) కూడా అతన్ని ఆగ్రహిస్తూ ఉంటారు. ఆ తరువాత, ‘అల్లాహ్‌ (త) ఫలానా దాసుని పట్ల ఆగ్రహం కలిగి ఉన్నాడు, కనుక మీరు కూడా అతని పట్ల ఆగ్రహం కలిగి ఉండండి,’ అని ప్రకటిస్తాడు. అనంతరం ఆకాశంలో ఉన్నవారు కూడా అతని పట్ల ఆగ్రహం కలిగి ఉంటారు. ఇంకా అతని పట్ల గల ఆగ్రహాన్ని భూమిపై దింపివేయటం జరుగుతుంది. అనంతరం భూవాసులు కూడా అతనిపై ఆగ్రహం కలిగి ఉంటారు.”  (ముస్లిమ్‌)

5006 – [4 ] ( صحيح ) (3/1394)

وَعَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِنَّ اللهَ يَقُوْلُ يَوْمَ الْقِيَامَةِ: أَيْنَ الْمُتَحَابُّوْنَ بِجَلَالِيْ؟ اَلْيَوْمَ أُظِلُّهُمْ فِي ظِلِّيْ يَوْمَ لَا ظِلُّ إِلَّا ظِلِّيْ”.رَوَاهُ مُسْلِمٌ.

5006. (4) [3/1394 దృఢం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”తీర్పుదినం నాడు అల్లాహ్‌ (త) ‘ఇహలోకంలో నా సంతృప్తికోసం పరస్పరం ప్రేమించేవారు ఎక్క డున్నారు? నేను ఈనాడు వారికి నా నీడలో చోటిస్తాను. ఎందుకంటే ఈ నాడు నా నీడ తప్ప  మరే నీడ  ఉండదు’  అని  ప్రకటిస్తాడు.”  (ముస్లిమ్‌)

5007 – [ 5 ] ( صحيح ) (3/1394)

وَعَنْهُ عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم: “أَنَّ رَجُلًا زَارَأَخَا لَهُ فِي قَرْيَةٍ أُخْرَى فَأَرْصَدَ اللهُ لَهُ عَلَى مَدْرَجَتْهِ مَلَكًا قَالَ: أَيْنَ تُرِيْدُ؟ قَالَ: أُرِيْدُ أَخَا لِيْ فِي هَذِهِ الْقَرْيَةِ. قَالَ: هَلْ لَكَ عَلَيْهِ مِنء نِعْمَةٍ تَرُبُّهَا؟ قَالَ: لَا غَيْرَ أَنِّيْ أَحْبَبْتُهُ فِي اللهِ. قَالَ: فَإِنِّيْ رَسُوْلُ اللهِ إِلَيْكَ بِأَنَّ اللهَ قَدْ أَحَبَّكَ كَمَا أَحْبَبْتَهُ فِيْهِ”. رَوَاهُ مُسْلِمٌ.

5007. (5) [3/1394దృఢం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఒక ముస్లిమ్‌ మరో ఊరిలో ఉన్న తన ముస్లిమ్‌ సోదరున్ని కలవడానికి బయలుదేరాడు. అల్లాహ్‌ (త) అతని దారిలో ఒక దైవదూతను కూర్చోబెట్టాడు. ఆ ముస్లిమ్‌ ప్రయాణం చేస్తూ అక్కడికి చేరగానే మానవ రూపంలో ఉన్న ఆ దైవదూత, ‘నీవు ఎక్కడికి వెళుతున్నావు,’ అని అడిగాడు. దానికి ఆ వ్యక్తి, ‘నేను ఫలానా ఊరిలో ఉన్న నా ముస్లిమ్‌ సోదరున్ని కలవడానికి వెళుతున్నాను,’ అని సమాధానం ఇచ్చాడు. దానికి ఆ దైవదూత, ‘అతను నీకైమైనా బాకీ ఉన్నాడా?’ అని అడిగాడు. దానికి ఆ వ్యక్తి, ‘లేదు, నేను కేవలం దైవ సంతృప్తి కోసం అతన్ని కలవడానికి వెళుతున్నాను,’ అని అన్నాడు. అప్పుడు ఆ దైవదూత ‘అల్లాహ్‌ నన్ను ఈ మార్గంలో నీ గురించే కూర్చో బెట్టాడు. ఆ వ్యక్తి నీ ప్రక్క నుండి వెళ్ళినపుడు నీవు దైవ సంతృప్తి కోసం అతన్ని ప్రేమించి నట్లే అల్లాహ్‌ కూడా నిన్ను ప్రేమిస్తున్నాడు అనే శుభవార్త చెప్పమని ఆదేశించాడు.’ (ముస్లిమ్‌)

5008 – [ 6 ] ( متفق عليه ) (3/1395)

وَعَنِ ابْنِ مَسْعُوْدٍ قَالَ: جَاءَ رَجُلٌ إِلى النَّبِيِّ صلى الله عليه وسلم فَقَالَ: يَا رَسُوْلَ اللهِ كَيْفَ تَقُوْلُ فِي رَجُلٍ أَحَبَّ قَوْمًا وَلَمْ يَلْحَقْ بِهِمْ؟ فَقَالَ: “اَلْمَرْءُ مَعَ مَنْ أَحَبَّ”. مُتَّفَقٌ عَلَيْهِ.

5008. (6) [3/1395 ఏకీభవితం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ మస్‌’ఊద్‌ (ర) కథనం: ఒక వ్యక్తి ప్రవక్త (స) వద్దకు వచ్చి, ‘ఓ ప్రవక్తా! ఫలానా వ్యక్తి గురించి మీ అభిప్రాయం ఏమిటి? అతడు ఫలానా జాతిని ప్రేమిస్తున్నాడు. కాని అతడు ఇంకా వారితో కలవలేదు,’ అని విన్నవించుకున్నాడు. దానికి ప్రవక్త (స), ‘ఆవ్యక్తి అతడు ప్రేమించేవారిలో ఒకడుగా పరిగ ణించబడతాడు,’ అనిఅన్నారు. (బు’ఖారీ, ముస్లిమ్‌)

అంటే పండితులను, పుణ్యాత్ములను, ఉత్తములను దైవసంతృప్తి కోసం ప్రేమిస్తే, వారితో కలవకున్నా తీర్పుదినం నాడు వారిలో ఒకడుగా పరిగణించ బడతారు. అదేవిధంగా అవిశ్వాసులను ప్రేమిస్తే, వారి సంప్రదాయాల్ని మంచివిగా భావిస్తే, వారిలో ఒకరుగా పరిగణించటం జరుగుతుంది. ప్రేమ ప్రభావం తప్పకుండా పడుతుంది. అందువల్ల పండితులను, పుణ్యాత్ములను, మంచివారిని ప్రే మిస్తూ  ఉండాలి.

5009 – [ 7 ] ( متفق عليه ) (3/1395)

وَعَنْ أَنَسٍ أَنَّ رَجُلًا قَالَ: يَا رَسُوْلَ اللهِ مَتَى السَّاعَةُ؟ قَالَ: “وَيْلَكَ وَمَا أَعْدَدْتَ لَهَا؟” قَالَ: مَا أَعْدَدْتُ لَهَا إِلَّا أَنِّيْ أُحِبُّ اللهَ وَرَسُوْلَهُ. قَالَ: “أَنْتَ مَعَ مَنْ أَحْبَبْتَ”. قَالَ أَنَسٌ: فَمَا رَأَيْتُ الْمُسْلِمِيْنَ فَرِحُوْا بِشَيْءٍ بَعْدَ الْإِسْلَامِ فَرْحَهُمْ بِهَا. مُتَّفَقٌ عَلَيْهِ.

5009. (7) [3/1395ఏకీభవితం]

అనస్‌ (ర) కథనం: ప్రవక్త (స)ను ఒక వ్యక్తి, ‘తీర్పుదినం ఎప్పుడు వస్తుంది,’ అని ప్రశ్నించాడు. దానికి ప్రవక్త (స), ‘నువ్వు చాలా విచారించవలసిన విషయం ఏమిటంటే నువ్వు ప్రశ్నించావు, తీర్పుదినం తప్పకుండా వస్తుంది కాని దాన్ని గురించి నువ్వు ఏమి సిద్ధంచేసుకున్నావు,’ అని అన్నారు. దానికి ఆ వ్యక్తి ఏమీ సిద్ధం చేసుకోలేదు కాని నేను అల్లాహ్‌(త) మరియు ఆయన ప్రవక్త (స)ను ప్రేమిస్తున్నాను,’ అని అన్నాడు. అప్పుడు ప్రవక్త (స), ‘మరి నువ్వు ఎవరిని ప్రేమిస్తే వారితోపాటే ఉంటావు,’ అని అన్నారు. ఈ విషయం వల్ల అక్కడున్న చాలామంది సంతో షించారు. ఇస్లామ్‌ స్వీకరించి నపుడు కూడా ఇంత సంతోషం కలగలేదు. (బు’ఖారీ, ముస్లిమ్‌)

5010- [ 8 ] ( متفق عليه ) (3/1395)

وَعَنْ أَبِيْ مُوْسَى قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَثَلُ الْجَلِيْسِ الصَّالِحِ وَالسُّوْءِ كَحَامِلِ الْمِسْكِ وَنَافِخِ الْكِيْرِ فَحَامِلُ الْمِسْكِ إِمَّا أَنْ يُحْذِيَكَ وَإِمَّا أَنْ تَبْتَاعُ مِنْهُ وَإِمَّا أَنْ تَجِدَ مِنْهُ رِيْحًا طَيِّبَةً وَنَافِخُ الْكِيْرِإِمَّا أَنْ يُحْرِقَ ثِيَابَكَ وَإِمَّا أَنْ تَجِدَ مِنْهُ رِيْحًا خَبِيْثَةً “. مُتَّفَقٌ عَلَيْهِ.

5010. (8) [3/1395 ఏకీభవితం]

అబూ మూసా (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, మంచి, చెడు స్నేహితుల ఉదాహరణ కస్తూరి తీసుకు వెళ్ళేవాడు, కుంపటి రాజేసేవానిలా ఉంది. ఒకవేళ మీరు సుగంధ పరిమళాలు అమ్మేవాని వద్ద కూర్చుంటే, అతడు మీకు కానుకగా సుగంధ పరిమళాన్ని ఇస్తాడు. లేదా మీరు దాన్ని కొంటారు. దాని వల్ల మీరు సువాసన కలిగి ఉంటారు. అదే విధంగా ఇనుపబట్టిలో పనిచేసే వానివద్ద కూర్చుంటే నిప్పు రవ్వలు ఎగిరి మీ బట్టలు కాలుతాయి లేదా దాని పొగవల్ల మీరు అసహనానికి గురవుతారు.”  [55]  (బు’ఖారీ, ముస్లిమ్‌)

—–

اَلْفَصْلُ الثَّانِيْ  రెండవ విభాగం

5011 – [ 9 ] ( صحيح ) (3/1395)

وَعَنْ مُعَاذِ بْنِ جَبَلٍ قَالَ: سَمِعْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ: “قَالَ اللهُ تَعَالى: وَجَبَتْ مَحَبَّتِيْ لِلْمُتَحَابِّيْنَ فِي وَالْمُتَجَالِسِيْنَ فِي وَالْمُتَزَاوِرِيْنَ فِي وَالْمُتَبَاذِلِيْنَ فِيْ”. رَوَاهُ مَالِكٌ.

وَفِي رِوَايَةِ التِّرْمِذِيِّ قَالَ: “يَقُوْلُ اللهُ تَعَالى: اَلْمُتَحَابُّوْنَ فِي جَلَالِيْ لَهُمْ مَنَابِرُمِنْ نُوْرٍ يَغْبِطُهُمْ النَّبِيُّوْنَ وَالشُّهَدَاءُ”.

5011.(9) [3/1395 దృఢం]

ము’ఆజ్‌ బిన్‌ జబల్‌ (ర) కథనం: ప్రవక్త (స) ఇలా అంటూ ఉండగా నేను విన్నాను, ”అల్లాహ్‌ ఆదేశం: ‘నా సంతృప్తి కోసం పరస్పరం ప్రేమించేవారి కొరకు నాప్రేమ తప్పనిసరి అయిపోతుంది. ఇంకా కేవలం నా సంతృప్తి కోసమే కలసి కూర్చునేవారి కొరకు కూడా నా ప్రేమ తప్పనిసరి అయిపోతుంది. ఇంకా నా సంతృప్తి కోసం పరస్పరం కలవటం, వెళ్ళటం చేసేవారి కొరకు కూడా నా ప్రేమ తప్పని సరి అయి పోతుంది. ఇంకా నా సంతృప్తి కోసం ధనం ఖర్చు చేసే వారి కొరకు నా ప్రేమ తప్పనిసరి అయిపోతుంది.  (మాలిక్‌)

తిర్మిజీ ఉల్లేఖనంలో ఇలా  ఉంది, ”అల్లాహ్‌ ఆదేశం: నా గొప్పతనం కోసం పరస్పరం ప్రేమించేవారు తీర్పు దినంనాడు వెలిగే మెంబర్లపై ఉంటారు. వారిని చూసి ప్రవక్తలు, అమరవీరులు కూడా ఈర్ష్యకు గురవుతారు.”

5012 – [ 10 ] ( لم تتم دراسته ) (3/1396)

وَعَنْ عُمَرَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِنَّ مِنْ عِبَادِ اللهِ لَأُنَاسًا مَا هُمْ بِأَنْبِيَاءِ وَلَا شُهَدَاءَ يَغْبِطُهُمُ الْأَنْبِيَاءُ وَالشُّهَدَاءُ يَوْمَ الْقِيَامَةِ بِمَكَانِهِمْ مِنَ اللهِ”. قَالُوْا: يَا رَسُوْلَ اللهِ تُخْبِرُنَا مَنْ هُمْ؟ قَالَ: “هُمْ قَوْمٌ تَحَابّوْا بِرَوْحِ اللهِ عَلَى غَيْرِ أَرْحَامٍ بَيْنَهُمْ وَلَا أَمْوَالٍ يَتَعَاطَوْنَهَا فَوَاللهِ إِنَّ وُجُوْهَهُمْ لَنٌوْرٌ وَإِنَّهُمْ لَعَلَى نُوْرٍ لَا يَخَافُوْنَ إِذَا خَافَ النَّاسُ وَلَا يَحْزَنُوْنَ إِذَا حَزِنَ النَّاسُ”. وَقَرَأَ الْآيَةَ:  (أَلَا إِنَّ أَوْلِيَاءَ اللهِ لَا خَوْفٌ عَلَيْهِمْ وَلَا هُمْ يَحْزَنُوْنَ؛10: 62) رَوَاهُ أَبُوْ دَاوُدَ

5012. (10) [3/1396అపరిశోధితం]

‘ఉమర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”దైవదాసుల్లో కొందరు అంటే వారు దైవప్రవక్తలు, అమర వీరులు కారు, కాని తీర్పుదినం నాడు వారికి గొప్పగొప్ప ఉన్నత స్థానాలు లభిస్తాయి. వారిని చూసి ప్రవక్తలు, అమర వీరులు ఈర్ష్యకు గురవుతారు. దానికి ప్రజలు, ‘ఓ ప్రవక్తా! వారెవరు,’ అని ప్రశ్నించారు. దానికి ప్రవక్త (స), ‘వారు కేవలం ఖుర్‌ఆన్‌ కోసం పరస్పరం ప్రేమిస్తారు. వారి మధ్య మరో సంబంధం అంటూ ఉండదు. ఎటువంటి లావాదేవీలు ఉండవు. వారు కేవలం ఖుర్‌ఆన్‌ కారణంగా పరస్పరం ప్రేమిస్తారు. అల్లాహ్ సాక్షి! వారి ముఖాలు వెలుగుతో నిండిఉంటాయి. తీర్పుదినం నాడు అందరూ భయంతో వణుకుతూ ఉంటారు. కాని వారిపై ఎటువంటి భయాందోళనలు ఉండవు. వారిని సమర్థిస్తూ ప్రవక్త (స) ఈ ఆయతు పఠించారు: ”గుర్తుంచుకోండి నిశ్చయంగా, అల్లాహ్‌కు ప్రియులైన వారికి ఎలాంటి భయమూ ఉండదు మరియు వారు దుఃఖపడరు కూడా.’ ” (యూనుస్, 10:62) (అబూ దావూద్‌)

5013 – [ 11 ] ( لم تتم دراسته ) (3/1396)

وَرَوَاهُ فِي شَرْحِ السُّنَّةِ عَنْ أَبِيْ مَالِكٍ بِلَفْظِ “اَلْمَصَابِيْحِ” مَعَ زَوَائِدَ وَكَذَا فِي “شُعَبِ الْإِيْمَانِ”.

5013. (11) [3/1396 అపరిశోధితం]

షర్‌హుస్సున్నహ్‌ మరియు షు’అబిల్ ఈమాన్ లలో దీన్ని అబూ మాలిక్‌ ద్వారా ఉల్లేఖించటం జరిగింది.

5014 – [ 12 ] ( لم تتم دراسته ) (3/1396)

وَعَنِ ابْنِ عَبَّاسٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم لِأَبِيْ ذَرٍّ: “يَا أَبَا ذَرٍّأَيُّ عُرَى الْإِيْمَانِ أَوْثَقُ؟” قَالَ: اللهُ وَرَسُوْلُهُ أَعْلَمُ. قَالَ: “اَلْمَوَالَاةُ فِي اللهِ وَالْحُبُّ فِي اللهِ وَالْبُغْضُ فِي اللهِ”. رَوَاهُ الْبَيْهَقِيُّ فِي “شُعَبِ الْإِيْمَانِ”.

5014. (12) [3/1396అపరిశోధితం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘అబ్బాస్‌ (ర) కథనం: ప్రవక్త (స) అబూ జ’ర్‌ను, ”ఓ అబూ జ’ర్‌! విశ్వాసంలోని ఏ విషయం పటిష్ఠమైనది” అని ప్రశ్నించారు. దానికి అబూ జ’ర్‌, ”దాన్ని గురించి అల్లాహ్‌(త)కూ, ఆయన ప్రవక్త(స)కే బాగా తెలుసు,” అని అన్నారు. అప్పుడు, ప్రవక్త (స) అల్లాహ్‌ (త) కోసమే పరస్పరం స్నేహ సంబంధాలు ఉంచటం, అల్లాహ్‌ (త) కోసమే ఈర్ష్యా ద్వేషాలు కలిగి ఉండటం విశ్వాసంలోని అన్నిటికంటే పటిష్ఠమైన విషయం.”(బైహఖీ -షు’అబిల్ ఈమాన్)

5015 – [ 13 ] ( لم تتم دراسته ) (3/1396)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم قَالَ: “إِذَا عَادَ الْمُسْلِمُ أَخَاهُ أَوْ زَارَهُ قَالَ اللهُ تَعَالى: طِبْتَ وَطَابَ مَمْشَاكَ وَتَبَوَّأْتَ مِنَ الْجَنَّةِ مَنْزِلًا”. رَوَاهُ التِّرْمِذِيُّ وَقَالَ: هَذَا حَدِيْثٌ غَرِيْبٌ.

5015. (13) [3/1396 అపరిశోధితం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఒక ముస్లిమ్‌ మరో ముస్లిమ్‌ను పరామర్శించటానికి వెళ్ళినా, కలవడానికి వెళ్ళినా, అల్లాహ్‌ (త) అత నితో నీ జీవితం చాలా శుభకరమైనది, నీ నడవటం చాలా శుభకరమైనది. ఈ పరామర్శించ డానికి వెళ్ళ టం, కలవటంవల్ల స్వర్గంలో తనచోటు సంపా దించు కున్నావు’  అని అంటాడు.”  (తిర్మిజి’ – ఏకోల్లేఖనం)

5016 – [ 14 ] ( صحيح ) (3/1396)

وَعَنِ الْمِقْدَامِ بْنِ مَعْدِيْ كَرِبَ عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ:”إِذَا أَحَبَّ الرَّجُلُ أَخَاهُ فَلْيُخْبِرْهُ أَنَّهُ يُحِبُّهُ”. رَوَاهُ أَبُوْدَاوُدَ وَالتِّرْمِذِيُّ.

5016. (14) [3/1396దృఢం]

మిఖ్‌దామ్‌ బిన్‌ మ’అదీ కరబ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఎవరైనా మరొకర్ని ప్రేమిస్తే వారికి తెలియ పరచాలి – అది విని వారు సంతోషించ టానికి.” (అబూ దావూద్‌,  తిర్మిజి’)

5017 – [ 15 ] ( حسن ) (3/1396)

وَعَنْ أَنَسٍ قَالَ: مَرَّ رَجُلٌ بِالنَّبِيِّ صلى الله عليه وسلم وَعِنْدَهُ نَاسٌ. فَقَالَ رَجُلٌ مِمَّنْ عِنْدَهُ: إِنِّيْ لَأُحِبُّ هَذَا فِي اللهِ. فَقَالَ النَّبِيُّ صلى الله عليه وسلم: “أَعْلَمْتَهُ؟” قَالَ: لَا. قَالَ: “قُمْ إِلَيْهِ فَأَعْلِمْهُ”. فَقَامَ إِلَيْهِ فَأَعْلَمَهُ فَقَالَ: أَحَبَّكَ الَّذِيْ أَحْبَبْتَنِيْ لَهُ. قَالَ: ثُمَّ رَجَعَ. فَسَأَلَهُ النَّبِيُّ صلى الله عليه وسلم فَأَخْبَرَهُ بِمَا قَالَ. فَقَالَ النَّبِيُّ صلى الله عليه وسلم: “أَنْتَ مَعَ مَنْ أَحْبَبْتَ وَلَكَ مَا احْتَسَبْتَ” .رَوَاهُ الْبَيْهَقِيُّ فِي”شُعَبِ الْإِيْمَانِ”.

وَفِيْ رِوَايَةِ التِّرْمِذِيِّ: “اَلْمَرْءُ مَعَ مَنْ أَحَبَّ وَلَهُ مَا اكْتَسَبَ”.

5017. (15) [3/1396ప్రామాణికం]

అనస్‌ (ర) కథనం: ఒక వ్యక్తి ప్రవక్త (స) ప్రక్క నుండి వెళ్ళాడు. అప్పుడు ప్రవక్త (స) వద్ద చాలా మంది అనుచరులు కూర్చొని ఉన్నారు. వారిలో ఒకరు, ‘నేనతన్ని చాలా అమితంగా ప్రేమిస్తున్నాను’ అని అన్నాడు. అప్పుడు ప్రవక్త (స), ‘నువ్వు అతనికి తెలియపరిచావా,’ అని అడిగారు. దానికి ఆ వ్యక్తి ‘లేదు,’ అని అన్నాడు. అప్పుడు ప్రవక్త (స), ‘నువ్వు నిలబడి అతనికి తెలియజెయ్యి,’ అని అన్నారు. అతను నిలబడి అతని వద్దకు వెళ్ళి అతనికి తెలియ పరిచాడు. దానికి ఆ వ్యక్తి, ‘ఏ అల్లాహ్ కోసం నువ్వు నన్ను ప్రేమిస్తున్నావో ఆ అల్లాహ్ కూడా నిన్ను ప్రేమించు గాక!’  అని అన్నాడు. ఆ వ్యక్తి తిరిగి వచ్చాడు. ప్రవక్త (స) అడిగిన పిమ్మట అతడు తెలియ పరిచాడు. అప్పుడు ప్రవక్త (స), ‘తీర్పు దినంనాడు నువ్వు ప్రేమించిన వ్యక్తి వెంట ఉంటావు. నీకు నీ సంకల్ప పుణ్యం లభిస్తుంది,’ అని అన్నారు. (బైహఖీ-షు’అబిల్ ఈమాన్, తిర్మిజి’)

5018 – [ 16 ] ( حسن ) (3/1397)

وَعَنْ أَبِي سَعِيْدٍ أَنَّهُ سَمِعَ النَّبِيّ صلى الله عليه وسلم يَقُوْلُ: “لَا تُصَاحِبُ إِلَّا مُؤْمِنًا وَلَا يَأْكُلُ طَعَامَكَ إِلَّا تَقِيٌّ”. رَوَاهُ التِّرْمِذِيُّ وأَبُوْ دَاوُدَ وَالدَّارَمِيُّ.

5018. (16) [3/1397ప్రామాణికం]

అబూ స’యీద్‌ (ర) కథనం: ప్రవక్త (స) ఇలా ప్రవచిస్తూ ఉండగా విన్నారు, ”ప్రవక్త (స) ప్రవచనం, మీరు పుణ్యాత్ముల, సత్యసంధుల సహవాసంలో ఉండండి. అవిశ్వాసుల, పాపాత్ములవెంట ఉండకండి. ఇంకా  కేవలం విశ్వాసులు, దైవభీతిపరులే మీ ఆహారం తినాలి.”  [56]  (తిర్మిజి’, అబూ  దావూద్‌, దార్మి)

5019 – [ 17 ] ( حسن غريب ) (3/1397)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “اَلْمَرْءُ عَلَى دِيْنِ خَلِيْلِهِ فَلْيَنْظُرْ أَحَدُكُمْ مَنْ يُخَالِلْ”. رَوَاهُ أَحْمَدُ وَالتِّرْمِذِيُّ وَأَبُوْ دَاوُدَ وَالْبَيْهَقِيُّ فِي”شُعَبِ الْإِيْمَانِ” وَقَالَ التِّرْمِذِيُّ: هَذَا حَدِيْثٌ حَسَنٌ غَرِيْبٌ. وقَالَ النَّوَوِيُّ : إِسْنَادُهُ صَحِيْحٌ.  

5019. (17) [3/1397ప్రామాణికం, ఏకోల్లేఖనం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మనిషి తన స్నేహితుని ధర్మం, అతని పద్ధతులను అనుసరిస్తాడు. అందువల్ల అతడు ఎవరిని ప్రేమిస్తున్నాడో చూసుకోవాలి.” (అ’హ్మద్‌, తిర్మిజి – ప్రామాణికం, ఏకోల్లేఖనం, అబూ దావూద్‌, బైహఖీ -షు’అబిల్ ఈమాన్,  నవవి  – ఆధారాలు  దృఢం)

అంటే అతను సత్యవంతుడైన మంచి వ్యక్తిని ప్రేమించాలి.

5020 – [ 18 ] ( ضعيف ) (3/1397)

وعَنْ يَزِيْدَ بْنِ نَعَامَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِذَا آخَى الرَّجُلُ الرَّجُلَ فَلْيَسْأَلُهُ عَنِ اسْمِهِ وَاسْمِ أَبِيْهِ وَمِمَّنْ هُوَ؟ فَإِنَّهُ أَوْصَلُ لِلْمَوَدَّةِ”. رَوَاهُ التِّرْمِذِيُّ.

5020. (18) [3/1397 బలహీనం]

య’జీద్‌ బిన్‌ న’ఆమహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఒకవేళ ఎవరైనా ఎవరినైనా తన సోదరునిగా భావిస్తే, అతని పేరు, అతని తండ్రి పేరు అతని కుటుంబం గురించి అడిగి తెలుసుకోవాలి. ఎందుకంటే ఇవన్నీ అతని సోదరభావాన్ని, ప్రేమను పటిష్ఠపరిచే  విషయాలు.”  (తిర్మిజి’)

—–

اَلْفَصْلُ الثَّالِثُ మూడవ విభాగం   

5021 – [ 19 ] ( لم تتم دراسته ) (3/1397)

عَنْ أَبِي ذَرٍّ قَالَ: خَرَجَ عَلَيْنَا رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم قَالَ: “أَتَدْرُوْنَ أَيُّ الْأَعْمَالِ أَحَبُّ إِلَى اللهِ تَعَالى؟” قَالَ قَائِلٌ: الصَّلَاةُ وَالزَّكَاةُ. وَقَالَ قَائِلٌ: اَلْجِهَادُ. قَالَ النَّبِيُّ صلى الله عليه وسلم: “إِنَّ أَحَبَّ الْأَعْمَالِ إِلى اللهِ تَعَالى الْحُبُّ فِي اللهِ وَالْبُغْضُ فِي اللهِ”. رَوَاهُ أَحْمَدُ وَرَوَى أَبُوْ دَاوُدَ اَلْفَصْلُ الْأَخِيْرَ

5021. (19) [3/1397 అపరిశోధితం]

అబూ జ’ర్‌ (ర) కథనం: ప్రవక్త (స) మా వద్దకు వచ్చి, ”ఏ పని అల్లాహ్‌(త)కు చాలా ప్రీతికరమో మీకు తెలుసా?” అని ప్రశ్నించారు. ఒక వ్యక్తి, ‘నమా’జ్‌, ‘జకాత్‌,’ అని అన్నాడు. మరో వ్యక్తి, ‘జిహాద్‌,’ అన్నాడు. అప్పుడు ప్రవక్త (స), ‘అల్లాహ్‌ (త) వద్ద అన్నిటికంటే ప్రీతికరమైన పని, అల్లాహ్ (త) కోసమే స్నేహం చేయడం, అల్లాహ్ (త) కోసమే శత్రుత్వం వహించటం,” అని అన్నారు. (అ’హ్మద్‌, అబూ దావూద్‌- చివరి  భాగం)

5022 – [ 20 ] ( لم تتم دراسته ) (3/1397)

وَعَنْ أَبِيْ أُمَامَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَا أَحَبَّ عَبْدٌ عَبْدًا لِلّهِ إِلَّا أَكْرَمَ رَبَّهُ عَزَّ وَجَلَّ”. روَاهُ أَحْمَدُ .

5022. (20) [3/1397అపరిశోధితం]

అబూ ఉమామహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”దైవ ప్రీతికోసం ఎవరైనా మరో వ్యక్తిని ప్రేమిస్తే అల్లాహ్‌ (త) అతన్ని గౌరవిస్తాడు, ఆదరిస్తాడు.”  (అ’హ్మద్‌)

5023 – [ 21 ] ( لم تتم دراسته ) (3/1398)

وَعَنْ أَسْمَاءَ بِنْتِ يَزِيْدَ أَنَّهَا سَمِعْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يَقُولُ: “أَلَا أُنَبِّئُكُمْ بِخِيَارِكُمْ؟” قَالُوْا: بَلَى يَا رَسُوْلَ اللهِ. قَالَ: “خِيَارُكُمُ الَّذِيْنَ إِذَا رُؤُوْا ذُكِرَ اللهُ”. رَوَاهُ ابْنُ مَاجَهُ.

5023. (21) [3/1398 అపరిశోధితం]

అస్మా బిన్తె య’జీద్‌ (ర) కథనం: ప్రవక్త (స) ఇలా అంటూ ఉండగా నేను విన్నాను, ”మీలో అందరి కంటే మంచివారెవరో మీకు తెలుపనా?” అని అన్నారు. దానికి ప్రజలు, ‘తప్పకుండా ఓ ప్రవక్తా!’ అని అన్నారు. అప్పుడు ప్రవక్త (స), ‘మీలో అందరికంటే ఉత్తములు ఎవరంటే వారిని చూస్తే అల్లాహ్ (త) గుర్తుకు వస్తాడు.’ (ఇబ్నె  మాజహ్)

5024 – [ 22 ] ( لم تتم دراسته ) (3/1398)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَوْ أَنَّ عَبْدَيْنِ تَحَابَّا فِي اللهِ عَزَّوَجَلَّ. وَاحِدٌ فِي الْمَشْرِقِ وَآخَرُفِي الْمَغْرِبِ لَجَمَعَ اللهُ بَيْنَهُمَا يَوْمَ الْقِيَامَةِ. يَقُوْلُ: هَذَا الَّذِيْ كُنْتَ تُحِبُّهُ فِي”.

5024. (22) [3/1398 అపరిశోధితం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఒకవేళ అల్లాహ్ కోసం ఇద్దరి మధ్య స్నేహం అయి, వారిలో ఒకరు తూర్పున, మరొకరు పడమరన ఉండి, వారు ప్రత్యక్షంగా కలిసి మాట్లాడక పోయినప్పటికీ, అల్లాహ్‌ (త) తీర్పు దినంనాడు వారిద్దరినీ కలుపుతాడు, ‘నా కోసం మరో వ్యక్తిని ప్రేమించిన వ్యక్తి ఇతడే,’  అని  చాటుతాడు.”  (బైహఖీ)

5025 – [ 23 ] ( لم تتم دراسته ) (3/1398)

وَعَنْ أَبِيْ رَزِيْنٍ أَنَّهُ قَالَ لَهُ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “أَلَا أَدُلُّكَ عَلَى مِلَاكِ هَذَا الْأَمْرِالَّذِيْ تُصِيْبُ بِهِ خَيْرَالدُّنْيَا وَالْآخِرَةِ؟ عَلَيْكَ بِمَجَالِسِ أَهْلِ الذِّكْرِوَإِذَا خَلَوْتَ فَحَرِّكْ لِسَانَكَ مَا اسْتَطَعْتَ بِذِكْرِاللهِ وَأَحِبَّ فِي اللهِ وَأَبْغَضَ فِي اللهِ يَا أَبَا رَزِيْنٍ هَلْ شَعَرْتَ أَنَّ الرَّجُلَ إِذَا خَرَجَ مِنْ بَيْتِهِ زَائِرًا أَخَاهُ شَيَّعَهُ سَبْعُوْنَ أَلْفَ مَلَكٍ كُلُّهُمْ يُصَلُّوْنَ عَلَيْهِ وَيَقُوْلُوْنَ: رَبَّنَا إِنَّهُ وَصَلَ فِيْكَ فَصِلْهُ؟ فَإِنِ اسْتَطَعْتَ أَنْ تُعْمِلَ جَسَدَكَ فِي ذَلِكَ فَافْعَلْ”.

5025. (23) [3/1398అపరిశోధితం]

అబూ ర’జీన్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఉభయలోకాల మేలును పొందే ఒక విషయం మీకు తెలుపనా? అదేమిటంటే మీరు అల్లాహ్ ధ్యాన సభలలో పాల్గొనండి. ఇంకా హితబోధల సభల్లో పాల్గొంటూ ఉండండి. ఒంటరిగా ఉన్నప్పుడు అల్లాహ్ ను స్మరిస్తూ ఉండండి. అల్లాహ్ ప్రీతికోసమే స్నేహం అయినా, శత్రుత్వం  అయినా  చేయండి.

”ఓ అబూ ర’జీన్‌! ఎవరైనా తన సోదరున్ని కలవడానికి తన ఇంటి నుండి బయలుదేరితే అతని వెనుక  70 వేల మంది దైవదూతలు బయలుదేరు తారు. వారు అతని క్షమాపణ కొరకు దు’ఆ చేస్తూ ఉంటారు. ఇంకా ఇలా ప్రార్థిస్తారు, ‘ఓ అల్లాహ్‌! నీ ప్రీతిని పొందటానికి ఫలానా వ్యక్తితో కలవడానికి వెళుతున్నాడు. నీవు అతనిపై కారుణ్యం అవతరింప జేయి. ఇంకా  అతన్ని  ప్రేమించు.’ 

”ఓ అబూ ర’జీన్‌! వీలైతే నీ సోదరుని సేవచేయ డానికి ప్రయత్నించు. అంటే అల్లాహ్ ప్రీతికోసం నీ ముస్లిమ్‌ సోదరునికి సేవచేయి. అదేవిధంగా అల్లా హ్ప్రీతి కోసం అతన్ని కలుస్తూ  ఉండు.” (బైహఖీ)

5026 – [ 24] ( لم تتم دراسته ) (3/1398)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: كُنْتُ مَعَ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم فَقَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِنَّ فِي الْجَنَّةِ لَعُمُدًا مِنْ يَاقُوْتٍ عَلَيْهَا غُرَفٌ مِنْ زَبَرْجَدٍ لَهَا أَبْوَابٌ مُفَتَّحَةٌ تُضِيْءُ كَمَا يُضِيْءُ الْكَوْكَبُ الدُّرِّيُّ”. فَقَالُوْا: يَا رَسُوْلَ اللهِ مَنْ يَسْكُنُهَا؟ قَالَ: “اَلْمُتَحَابُّوْنَ فِي اللهِ وَالْمُتَجَالِسُوْنَ فِي اللهِ وَالْمُتَلَاقُوْنَ فِي اللهِ”. رَوَى الْبَيْهَقِيُّ الْأَحَادِيْثَ الثَّلَاثَةَ فِي “شُعَبِ الْإِيْمَانِ”.

5026. (24) [3/1398అపరిశోధితం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: నేను ప్రవక్త (స) వెంట ఉన్నాను. ప్రవక్త (స) ఇలా ప్రవచించారు: ”ఓ అబూ హురైరహ్‌! స్వర్గంలో ముత్యాల స్తంభాలున్నాయి. వాటిపై పాలరాతి బాల్కనీలు ఉంటాయి. వాటి ద్వారాలు  తెరచి ఉంటాయి. అవి నక్షత్రాల్లా వెలుగుతూ ఉంటాయి.” దానికి ప్రజలు, ‘ఓ ప్రవక్తా! ఆ బాల్కనీలపై ఎవరుంటారు?’ అని విన్నవించు కున్నారు. దానికి ప్రవక్త (స), ‘అల్లాహ్ ప్రీతికోసమే పరస్పరం ప్రేమించేవారు, అల్లాహ్ ప్రీతికోసమే పరస్పరం కలసి కూర్చునేవారు, అల్లాహ్కోసమే పరస్పరం కలిసేవారు,’ అని అన్నారు. (బైహఖీ/-షు’అబిలే ఈమాన్)

=====

17 بَابُ مَا يَنْهَى عَنْهُ مِنَ التَّهَاجُرِ وَالتَّقَاطُعِ وَاتَّبَاعِ الْعَوْرَاتِ

17. ఎడమొహం పెడమొహంగా ఉండటం, సంబంధాలు త్రెంచుకోవటం, ఇతరుల రహస్యాలను వెదకటం నిషిధ్ధం

اَلْفَصْلُ الْأَوَّلُ  మొదటి విభాగం

5027 – [ 1 ] ( متفق عليه ) (3/1399)

عَنْ أَبِيْ أَيُّوْبَ الْأَنْصَارِيِّ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَا يَحِلُّ لِلرَّجُلِ أَنْ يَهْجُرَ أَخَاهُ فَوْقَ ثَلَاثِ لِيَالٍ يَلْتَقِيَانِ فَيُعْرِضُ هَذَا وَيُعْرِضُ هَذَاوَخَيْرُهُمَا الَّذِيْ يَبْدَأُ بِالسَّلَامِ”.

5027. (1) [3/1399 ఏకీభవితం]

అబూ అయ్యూబ్‌ అ’న్సారీ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మనిషి మూడు రాత్రులకు మించి తన తోటి సోదరునితో సంబంధాలు త్రెంచుకొని ఉండటం, ఇద్దరూ దారిలో కలిసినపుడు ఎడమొహం పెడమొహంగా తప్పు కోవటం ధర్మసమ్మతం కాదు. వారిద్దరిలో సలాం చేసేందుకు ముందుకు వచ్చినవారే ఉత్తములు.” (బు’ఖారీ, ముస్లిమ్‌)

5028 – [ 2 ] ( متفق عليه ) (3/1399)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِيَّاكُمْ وَالظَّنَّ فَإِنَّ الظَّنَّ أَكْذَبُ الْحَدِيْثِ وَلَا تَحَسَّسُوْا وَلَا تَجَسَّسُوْا وَلَا تَنَاجَشُوْا وَلَا تَحَاسَدُوْا وَلَا تَبَاغَضُوْا وَلَا تَدَابَرُوْا وَكُوْنُوْا عِبَادَ اللهِ إِخْوَانًا”. وَفِيْ رِوَايَةٍ:”وَلَا تَنَافَسُوْا”.مُتَّفَقٌ عَلَيْهِ

5028. (2) [3/1399ఏకీభవితం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మీరు అనుమానాలకు దూరంగా ఉండండి. ఎందు కంటే అపార్థం చాలా నీచమైన చెడు. అదేవిధంగా ఇత రుల విషయాల వెంటపడకండి. అపరాధాలు వెతక టానికి ఇతరుల వెంటపడకండి. పరస్పరం పగ, ప్రకోపాలకు తావివ్వకండి. అల్లాహ్‌ (త) దాసులుగా, పరస్పరం సోదరులుగా మెలగండి.”  (బు’ఖారీ, ముస్లిమ్‌)

5029 – [ 3 ] ( صحيح ) (3/1399)

وَعَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “تُفْتَحُ أَبْوَابُ الْجَنَّةِ يَوْمَ الْإِثْنَيْنِ وَيَوْمَ الْخَمِيْسِ فَيُغْفَرُ لِكُلِّ عَبْدٍ لَا يُشْرِكُ بِاللهِ شَيْئًا إِلَّا رَجُلًا كَانَتْ بَيْنَهُ وَبَيْنَ أَخِيْهِ شَحْنَاءُ فَيُقَالُ: اُنْظُرُوْا هَذَيْنِ حَتَّى يَصْطَلِحَا”. رَوَاهُ مُسْلِمٌ.

5029. (3) [3/1399దృఢం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”సోమవారం, గురువారం స్వర్గద్వారాలు తెరువ బడతాయి. అవిశ్వాసులు తప్ప మిగిలిన వారందరిని క్షమించటం జరుగుతుంది. కాని తన ముస్లిమ్‌ సోదరుని పట్ల ఈర్ష్యాద్వేషాలు కలిగి ఉన్న ముస్లిమ్‌ను క్షమించటం జరుగదు. వీరి గురించి ”వీరికి పరస్పరం పరిష్కరించుకొని కలిసిపోయే వరకు గడువు ఇచ్చి వేయండని”  ఆదేశించటం జరుగుతుంది. (ముస్లిమ్‌)

5030 – [ 4 ] ( صحيح ) (3/1399)

وَعَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “تُعْرَضُ أَعْمَالُ النَّاسِ فِي كُلِّ جُمْعَةٍ مَرَّتَيْنِ يَوْمَ الْإِثْنَيْنِ وَيَوْمَ الْخَمِيْسِ فَيُغْفَرُ لِكُلِّ مُؤْمِنٍ إِلَّاعَبْدًا بَيْنَهُ بَيْنَ أَخِيْهِ شَحْنَاءُ فَيُقَالُ: اُتْرُكُوْا هَذَيْنِ حَتَّى يَفِيْئَا”. رَوَاهُ مُسْلِمٌ

5030. (4) [3/1399 దృఢం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”అందరి ఆచరణలు వారంలో రెండుసార్లు దైవసన్నిధిలో సమర్పించటం జరుగుతుంది. అంటే సోమవారం, గురువారం. ప్రతి విశ్వాసిని క్షమించటం జరుగుతుంది. కాని తన ముస్లిమ్‌ సోదరుని పట్ల ఈర్ష్యాద్వేషాలు కలిగిఉన్న ముస్లిమ్‌ను క్షమించటం జరుగదు. వీరిని పరస్పరం పరిష్కరించుకొని కలవనంత వరకు క్షమించకండని ఆదేశించటం జరుగు తుంది. (ముస్లిమ్‌)

5031 – [ 5 ] ( متفق عليه ) (3/1400)

وَعَنْ أُمِّ كُلْثُوْمِ بِنْتِ عُقْبَةَ بْنِ أَبِيْ مُعَيْطٍ قَالَت: سَمِعْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ: “لَيْسَ الْكَذَّابُ الَّذِيْ يُصْلِحُ بَيْنَ النَّاسِ وَيَقُوْلُ خَيْرًا وَيَنْمِيْ خَيْرًا”. مُتَّفَقٌ عَلَيْهِ.

وَزَادَ مُسْلِمٌ قَالَتْ: وَلَمْ أَسْمَعْهُ – تَعْنِي النَّبِيَّ صلى الله عليه وسلم – يُرَخِّصُ فِي شَيْءٍ مِمَّا يَقُوْلُ النَّاسُ كَذِبٌ إِلَّا فِي ثَلَاثٍ: اَلْحَرْبِ وَالْإِصْلَاحِ بَيْنَ النَّاسِ وَحَدِيْثِ الرَّجُلِ اِمْرَأَتَهُ وَحَدِيْثِ الْمَرْأَةِ زَوْجَهَا  

5031. (5) [3/1400 ఏకీభవితం]

ఉమ్మె కుల్‌’సూమ్‌ బింతె ‘ఉఖ్బహ్ (ర) కథనం: ప్రవక్త (స) ఇలా ప్రవచిస్తూ ఉండగా నేను విన్నాను, ”చిత్త శుద్ధితో ప్రజల మధ్య ఒప్పందం కుదిర్చే, ఇద్దరిని కలిపే, ఇద్దరినీ మంచి విషయాలు బోధించేవాడు అబద్ధాల కోరుకాడు. అసత్య పాపం అతనిపై పడదు.” (బు’ఖారీ, ముస్లిమ్‌)

ముస్లిమ్‌లో ఇది అధికంగా ఉంది. మూడు విషయాల్లో సంఘటనకు వ్యతిరేకంగా అసత్యం పలకడం అసత్యంగా పరిగణించబడదు. 1. యుద్ధంలో, 2. ప్రజల వివాదాలు పరిష్కరించడంలో,  3. భర్త భార్యతో పలికినపుడు,  భార్య భర్తతో మాట్లాడినపుడు.

5032 – [6 ]  ؟  (3/1400)

وَذُكِرَ حَدِيْثُ جَابِرٍ: “إِنَّ الشَّيْطَانَ قَدْ أَيِسَ”فِي”بَابِ الْوَسْوَسَةِ”.

5032. (6) [3/1400– ? ]

జాబిర్‌ (ర) కథనం: ఇన్నష్షై’తాన ఖద్ అ’యిస  బాబుల్‌  వస్‌వస లో  పేర్కొనడం  జరిగింది.

—–

اَلْفَصْلُ الثَّانِيْ   రెండవ విభాగం 

5033 – [ 7 ] ( لم تتم دراسته ) (3/1400)

عَنْ أَسْمَاءِ بِنْتِ يَزِيْدَ قَالَتْ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَا يَحِلُّ الْكِذْبُ إِلَّا فِي ثَلَاثٍ: كِذْبُ الرَّجُلِ اِمْرَأَتَهُ لِيُرْضِيَهَا وَالْكِذْبُ فِي الْحَرْبِ وَالْكِذْبُ لِيُصْلِحَ بَيْنَ النَّاسِ”. رَوَاهُ أَحْمَدُ وَالتِّرْمِذِيُّ

5033. (7) [3/1400 అపరిశోధితం]

అస్మా’ బిన్‌తె య’జీద్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”అసత్యం పలకడం ధర్మం కాదు. కాని ఈ సందర్భాలలో తప్ప. భార్య అలిగితే ఆమెను సంతోషపరచటానికి అసత్యం పలకవచ్చు. యుద్ధ తంత్రంగా అసత్యం పలకవచ్చు. ప్రజల మధ్య అపోహలను తొలగించి వారిని కలపడానికి అసత్యం పలకవచ్చు.” (అ’హ్మద్‌, తిర్మిజి’)

5034 – [ 8 ] ( إسناده جيد ) (3/1400)

وَعَنْ عَائِشَةَ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم قَالَ:”لَا يَكُوْنُ لِمُسْلِمٍ أَنْ يَهْجُرَأَخَاهُ فَوْقَ ثَلَاثَ فَمَنْ هَجَرَ فَوْقَ ثَلَاثَ مَرَّاتٍ كُلَّ ذَلِكَ لَا يَرُدُّ عَلَيْه فَقَدْ بَاءَ بِإِثْمِهِ “. رَوَاهُ أَبُوْ دَاوُدَ

5034.(8)[3/1400ఆధారాలుఆమోద యోగ్యం]

‘ఆయి’షహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మనిషి మూడు రాత్రులకు మించి తనతోటి సోదరునితో సంబంధాలు త్రెంచుకొని ఉండటం, ఇద్దరూ దారిలో కలిసి నప్పుడు ఎడముఖం, పెడ ముఖంగా తప్పుకోవటం ధర్మసమ్మతం కాదు. కలిస్తే మూడుసార్లు సలామ్‌ చేయాలి. ఒకవేళ సలామ్‌కు సమాధానం ఇవ్వకపోతే, సమాధానం  ఇవ్వని వారిపైనే పాపం పడుతుంది.” (అబూ  దావూద్‌)

5035 – [ 9 ] ( صحيح ) (3/1400)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم قَالَ: “لَا يَحِلُّ لِمُسْلِمٍ أَنْ يَهْجُرَأَخَاهُ فَوْقَ ثَلَاثٍ فَمَنْ هَجَرَ فَوْقَ ثَلَاثٍ فَمَاتَ دَخَلَ النَّارَ”. رَوَاهُ أَحْمَدُ وَأَبُوْ دَاوُدَ .

5035. (9) [3/1400దృఢం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఒక ముస్లిమ్‌ మూడు రాత్రులకు మించి తన తోటి సోదరునితో మాట్లాడకుండా ఉండటం ధర్మం కాదు. మూడు రోజుల కంటే అధికంగా అయి ఆ స్థితిలో మరణిస్తే నరకంలోనికి ప్రవేశిస్తాడు.” [57] (అ’హ్మద్‌, అబూ దావూద్‌)

5036 – [ 10 ] ( إسناده لين ) (3/1401)

وَعَنْ أَبِيْ خِرَاشٍ السُّلَمِيُّ أَنَّهُ سَمِعَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ:”مَنْ هَجَرَأَخَاهُ سَنَةً فَهُوَكَسَفْكِ دَمِهِ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ.

5036.(10)[3/1401ఆధారాలు  అసంతృప్తికరం]

అబీ ‘ఖిరాష్‌ సులమీ (ర) ప్రవక్త (స) ఇలా ప్రవచిస్తూ ఉండగా విన్నారు: ”ఒక ముస్లిమ్‌ మరో ముస్లిమ్‌తో సంవత్సరం వరకు మాట్లాడకుండా ఉంటే, అతన్ని చంపినంత  పాపం  అవుతుంది.

అంటే ఒక ముస్లిమ్‌ను చంపితే ఎంత పాపం చుట్టు కుంటుందో సంవత్సరం వరకు మాట్లాడకుండా ఉన్నా అంతే పాపం చుట్టుకుంటుంది.  (అబూ  దావూద్‌)

5037 – [ 11 ] ( ضعيف ) (3/1401)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَا يَحِلُّ لِمُؤْمِنٍ أَنْ يَهْجُرَمُؤْمِنًا فَوْقَ ثَلَاثٍ فَإِنْ مَرَّتْ بِهِ ثَلَاثٌ فَلْيَلْقَهُ فَلْيُسَلِّمْ عَلَيْهِ فَإِنْ رَدَّ عَلَيْهِ السَّلَامَ فَقَدِ اشْتَرَكَا فِي الْأَجْرِ وَإِنْ لَمْ يَرُدَّ عَلَيْهِ فَقَدْ بَاءَ بِالْإِثْمِ وَخَرَجَ الْمُسَلِّمُ مِنَ الْهِجْرَةِ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ.

5037. (11) [3/1401 బలహీనం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఒక ముస్లిమ్‌ తన తోటి ముస్లిమ్‌తో మూడు రోజుల కంటే అధికంగా మాట్లాడకుండా ఉండటం ధర్మంకాదు. ఒకవేళ మూడు రోజులు అయిపోతే అతనికి సలామ్‌ చేసి కలసి మాట్లాడాలి. ఇద్దరూ కలసి మాట్లాడుకుంటే ఇద్దరూ సమానులే. సమాధానం ఇవ్వనివాడు పాపాత్ముడవుతాడు. సలామ్‌చేసేవాడు పాప పరిధిలోనికి  రాడు. (అబూ  దావూద్‌)

5038 – [ 12 ] ( لم تتم دراسته ) (3/1401)

وَعَنْ أَبِي الدَّرْدَاءِ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “أَلَا أُخْبِرُكُمْ بِأَفْضَلَ مِنْ دَرَجَةِ الصِّيَامِ وَالصَّدَقَةِ وَالصَّلَاةِ؟” قُلْنَا: بَلَى. قَالَ: “إِصْلَاحُ ذَاتِ الْبَيْنِ وَفَسَادُ ذَاتِ الْبَيْنِ هِيَ الْحَالِقَةُ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ وَالتِّرْمِذِيُّ وَقَالَ: هَذَا حَدِيْثٌ صَحِيْحٌ

5038. (12) [3/1401అపరిశోధితం]

అబూ దర్దా (ర) కథనం: ప్రవక్త (స)  ”ఉపవాసం, నమా’జు, ‘జకాత్‌ల కంటే ఉత్తమమైన పనిని నేను మీకు తెలుపనా? ” అని అన్నారు. దానికి ప్రజలు, ‘తప్పకుండా’ అని అన్నారు. అప్పుడు ప్రవక్త (స), ”ఇద్దరి మధ్య ఒప్పందం కుదర్చటం, వారిని కలపడం, పరస్పర కలహాలను తొలగించే వాడు. అంటే అనైక్యత, విడిపోవటంవల్ల ధర్మంలో ఆటంకం కలుగు తుంది. మంగలి కత్తి ద్వారా వెంట్రుకలు కత్తిరించబడి నట్లు.” (తిర్మిజి’ – దృఢం, అబూ  దావూద్‌)

5039 – [ 13 ] ( لم تتم دراسته ) (3/1401)

وَعَنِ الزُّبَيْرِ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “دَبَّ إِلَيْكُمْ دَاءُ الْأُمَمِ قَبْلَكُمْ الْحَسَدُ وَالْبَغْضَاءُ هِيَ الْحَالِقَةُ لَا أَقُوْلُ تَحْلِقُ الشَّعْرُ وَلَكِنْ تَحْلِقُ الدِّيْنَ”. رَوَاهُ أَحْمَدُ وَالتِّرْمِذِيُّ

5039. (13) [3/1401 అపరిశోధితం]

‘జుబైర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”వెనుకటి జాతులవ్యాధి మీలోప్రవేశించింది, అది ఈర్ష్య, ద్వేషాలు. ఇవి మీ ధర్మాన్ని అంతం చేస్తాయి. వీటివల్ల ఉభయ లోకాల్లోనూ వినాశనం తప్పదు.”  (తిర్మిజి’, అ’హ్మద్‌)

5040 – [ 14 ] ( لم تتم دراسته ) (3/1401)

وَعَنْ أَبِيْ هُرْيَرَةَ عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ: “إِيَّاكُمْ وَالْحَسَدَ فَإِنَّ الْحَسَدَ يَأْكُلُ الْحَسَنَاتِ كَمَا تَأْكُلُ النَّارُ الْحَطَبَ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ .

5040. (14) [3/1401అపరిశోధితం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఈర్ష్యకు దూరంగా ఉండండి. ఎందుకంటే ఈర్ష్య సత్కార్యాలను తినివేస్తుంది – అగ్ని కట్టెలను తినివేసి  నట్లు.” (అబూ  దావూద్‌)

దీనివల్ల తెలిసిన విషయం ఏమిటంటే ఈర్ష్య సత్కా ర్యాలను తినివేస్తుంది. అగ్నికర్రలను కాల్చివేసినట్లు.

5041 – [ 15 ] ( لم تتم دراسته ) (3/1401)

وَعَنْهُ عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ: “إِيَّاكُمْ وَسُوْءَ ذَاتِ الْبَيْنِ فَإِنَّهَا الْحَالِقَةُ”. رَوَاهُ التِّرْمِذِيُّ.

5041. (15) [3/1401అపరిశోధితం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”అనైక్యతకు దూరంగా ఉండండి. ఎందుకంటే అనైక్యత, ఐహిక జీవితాన్ని, ధర్మాన్ని నాశనం చేస్తుంది. అంటే అనైక్యత, విభేదాలవల్ల ఉభయ లోకాలూ నాశనం అవుతాయి.”  (తిర్మిజి’)

5042 – [ 16 ] ( لم تتم دراسته ) (3/1401)

وَعَنْ أَبِيْ صِرْمَةَ أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم قَالَ: “مَنْ ضَارَّ ضَارَّ اللهُ بِهِ وَمَنْ شَاقَّ شَاقَّ اللهُ عَلَيْهِ”. رَوَاهُ ابْنُ مَاجَهُ وَالتِّرْمِذِيُّ وَقَالَ: هَذَا حَدِيْثٌ غَرِيْبٌ

5042. (16) [3/1401 అపరిశోధితం]

అబూ ‘సిర్మహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”అనవసరంగా మరో ముస్లిమ్‌కు హాని చేకూరిస్తే, అల్లాహ్‌ (త) అతనికి హాని చేకూరుస్తాడు. అదేవిధంగా ఇతరులను కష్టాలకు గురిచేస్తే అల్లాహ్‌ కూడా అతన్ని కష్టాలకు గురిచేస్తాడు.” (తిర్మిజి – ఏకోల్లేఖనం, ఇబ్నె మాజహ్)

5043 – [ 17 ] ( لم تتم دراسته ) (3/1402)

وَعَنْ أَبِي بَكْرٍالصِّدِّيْقِ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَلْعُوْنٌ مَنْ ضَارَّ مُؤْمِنًا أَوْ مَكْرَبِهِ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَقَالَ: هَذَا حَدِيْثٌ غَرِيْبٌ  

5043. (17) [3/1402–  అపరిశోధితం]

అబూ బకర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మరో ముస్లిమ్‌కు హాని చేకూర్చే, అతనికి వ్యతిరేకంగా కుట్రలు పన్నే వానిపై అల్లాహ్‌(త) శాపం అవతరించు గాక!”   [58] (తిర్మిజి – ఏకోల్లేఖనం)

5044 – [ 18 ] ( لم تتم دراسته ) (3/1402)

وَعَنِ ابْنِ عُمَرَقَالَ: صَعِدَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم اَلْمِنْبَرَ فَنَادَى بِصَوْتٍ رَفِيْعٍ فَقَالَ: “يَا مَعْشَرَ مَنْ أَسْلَمَ بِلِسَانِهِ وَلَمْ يُفْضِ الْإِيْمَانِ إِلى قَلْبِهِ لَا تُؤْذُوا الْمُسْلِمِيْنَ وَلَا تُعيِّرُوْهُمْ وَلَا تَتَّبِعُوْا عَوْرَاتِهِمْ فَإِنَّهُ مَنْ يَتَّبِعْ عَوْرَةَ أَخِيْهِ الْمُسْلِمِ يَتَّبِعِ اللهُ عَوْرَتَهُ وَمَنْ يَتَّبِعِ اللهُ عَوْرَتَهُ يَفْضَحُهُ وَلَوْفِي جَوْفِ رَحْلِهِ”. رَوَاهُ التِّرْمِذِيُّ.  

5044. (18) [3/1402 అపరిశోధితం]  

‘అబ్దుల్లాహ్‌ బిన్‌’ఉమర్‌(ర) కథనం:ప్రవక్త (స) మెంబరుపై ఎక్కి బిగ్గరగా, ”ఓ ముస్లిములారా! కేవలం నోటితో ఇస్లామ్‌ స్వీకరించి ఇంకా హృదయం వరకు విశ్వాసం చేరనివారు వినండి! ‘ఏ ముస్లిమునూ పీడించకండి, అవమానపరచకండి, వారి లోపాలను వెదకకండి. ఎందుకంటే  ఒక ముస్లిమ్‌ మరో ముస్లిమ్‌ వెంటపడితే, అల్లాహ్‌ (త) అతని వెంటపడతాడు. అల్లాహ్‌(త) వెంటపడితే అతన్ని నీచంగా అవమాన పరచి వదులుతాడు. అతడు తనఇంట్లో కూర్చున్నా  సరే.” (తిర్మిజి’)

5045 – [ 19 ] ( لم تتم دراسته ) (3/1402)

وَعَنْ سَعِيْدِ بْنِ زَيْدٍ عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ: “إِنَّ مِنْ أَرْبَى الرَّبَا اَلِاسْتِطَالَةُ فِي عِرْضِ الْمُسْلِمِ بِغَيْرِحَقٍّ”. رَوَاهُ أَبُوْدَاوُدَ وَالْبَيْهَقِيُّ فِي “شُعَبِ الْإِيْمَانِ”.

5045. (19) [3/1402అపరిశోధితం]

స’యీద్‌ బిన్‌ ‘జైద్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ముస్లిమ్‌ను అన్యాయంగా అవమాన పర చటం, నోటితో దుర్భాషలాడటం అన్నిటి కంటే పెద్ద వడ్డీ.” (అబూ-దావూద్‌, బైహఖీ-ష’అబిల్ ఈమాన్)

అంటే పరోక్షంగా తప్పులెన్నటం, నిందించటం, హీనంగా భావించటం ఇవి వడ్డీ తీసుకోవటం కన్నా పెద్ద పాపాలు.

5046 – [ 20 ] ( لم تتم دراسته ) (3/1402)

وَعَنْ أَنَسٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَما عَرَجَ بِي رَبِّيْ مَرَرْتُ بِقَوْمٍ لَهُمْ أَظْفَارٌ مِنْ نُحَاسٍ يَخْمِشُوْنَ وُجُوْهَهُمْ وَ صُدُوْرَهُمْ فَقُلْتُ: مَنْ هَؤُلَاءِ يَا جِبْرِيْلُ؟ قَالَ: هَؤُلَاءِ الَّذِيْنَ يَأْكُلُوْنَ لُحُوْمَ النَّاسِ وَيَقَعُوْنَ فِي أَعْرَاضِهِمْ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ.

5046. (20) [3/1402 అపరిశోధితం]

అనస్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, నా ప్రభువు నన్ను ఆకాశాల మీదికి తీసుకువెళ్ళినపుడు అక్కడ నాకు కొందరు వ్యక్తులు కనపడ్డారు. వారి చేతిగోళ్ళు ఇత్తడివి, వాటితో వారు తమ ముఖాన్ని, రొమ్మును పొడుచుకుంటున్నారు. నేను జిబ్రీల్‌ (అ)ను వారిని గురించి అడగ్గా, ”వీరు ప్రపంచంలో ఇతరుల మాంసం తినేవారు. ఇతరుల మానమర్యాదలను, గౌరవాన్ని భంగపరిచేవారు” అని బదులు పలికారు.” [59] (అబూ దావూద్‌)

5047 – [ 21 ] ( لم تتم دراسته ) (3/1402)

وَعَنِ الْمُسْتَوْرِدِ عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ: “مَنْ أَكَلَ بِرَجُلٍ مُسْلِمٍ أَكْلَةً فَإِنَّ اللهَ يُطْعِمُهُ مِثْلَهَا مِنْ جَهَنَّمَ وَمَنْ كُسِىَ ثَوْبًا بِرَجُلٍ مُسْلِمٍ فَإِنَّ اللهَ يَكْسُوْهُ مِثْلَهُ مِنْ جَهَنَّمَ وَمَنْ قَامَ بِرَجُلٍ مَقَامَ سُمْعَةٍ وَ رِيَاءٍ فَإِنَّ اللهَ يَقُوْمُ لَهُ مَقَامَ سُمْعَةٍ وَرِيَاءٍ يَوْمَ الْقِيَامَةِ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ.

5047. (21) [3/1402అపరిశోధితం]

ముస్తౌరిద్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఎవరైనా తన ముస్లిమ్‌ సోదరుని పరోక్షనిందకు గురయి ఒక మాంసం ముద్ద తింటే, అల్లాహ్‌(త) తీర్పుదినం నాడు దానికి సమానంగా అగ్ని కణాన్ని తినిపిస్తాడు. అదే విధంగా ఒక ముస్లిమ్‌ను పరోక్షంగా నిందించి వస్త్రం పొంది ధరిస్తే, దానికి బదులుగా తీర్పుదినం నాడు అతనికి నరకదుస్తులు ధరించటం జరుగుతుంది. అదేవిధంగా నిలబడి తన గొప్పలు, ఇతరుల లోపాలు ప్రకటిస్తే అల్లాహ్‌(త) తీర్పుదినం నాడు అందరి ముందు అతన్ని చూపించటానికి, వినిపించటానికి నిలబెడతాడు. (అబూ దావూద్‌)

5048 – [ 22 ] ( لم تتم دراسته ) (3/1403)

وَعَنْ أَبِيْ هُرْيَرَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “حُسْنُ الظَّنِّ مِنْ حُسْنِ الْعِبَادَةِ”. رَوَاهُ أَحْمَدُ وَأَبُوْ دَاوُدَ.

5048. (22) [3/1403 అపరిశోధితం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”అల్లాహ్‌ (త) పట్ల మంచి నమ్మకం కలిగి ఉండటం, ఉత్తమఆరాధన వంటిది.”[60](అ’హ్మద్‌, అబూ దావూద్‌)

5049 – [ 23 ] ( لم تتم دراسته ) (3/1403)

وَعَنْ عَائِشَةَ قَالَتْ: اِعْتَلَّ بَعِيْرٌ لِصَفِيَّةَ وَعِنْدَ زَيْنَبَ فَضْلُ ظَهْرٍ فَقَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم لِزَيْنَبَ: “أَعْطِيْهَا بَعِيْرًا”. فَقَالَتْ: أَنَا أُعْطِيْ تِلْكَ الْيَهُوْدِيَّةِ؟ فَغَضِبَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم فَهَجَرَهَا ذَا الْحَجَّةِ وَالْمُحَرَّمَ وَبَعْضَ صَفَرٍ. رَوَاهُ أَبُوْدَاوُدَ وَذُكِرَحَدِيْثُ مُعَاذِ بْنِ أَنَسٍ: “مَنْ حَمَى مُؤْمِنًا” فِيْ “بَابِ الشَّفَقَةِ وَالرَّحْمَةِ”.

5049. (23) [3/1403 అపరిశోధితం]

ఆయి’షహ్‌ (ర) కథనం: సఫియ్యహ్ ఒంటె అనారోగ్యా నికి గురయింది. జైనబ్‌ వద్ద బక్కచిక్కిన ఒక ఒంటె ఉండేది. ప్రవక్త (స) ‘జైనబ్‌తో, ‘నువ్వు దీన్ని సఫియ్యకు ఇవ్వు,’ అని అన్నారు. ‘జైనబ్‌ కోపంతో, ‘నేను దీన్ని యూద స్త్రీకి ఎందుకివ్వాలి,’ అని పలికింది. అదివిని ప్రవక్త (స) అసహ్యించుకున్నారు. మందలింపుగా జి’ల్‌’-హిజ్జహ్‌, ముహర్రమ్‌, సఫర్‌ వరకు మాట్లాడలేదు.[61] (అబూ  దావూద్‌)

—–

اَلْفَصْلُ الثَّالِثُ  మూడవ విభాగం  

5050 – [ 24] ( صحيح ) (3/1403)

عَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “رَأَى عِيْسَى بْنُ مَرْيَمَ رَجُلًا يَسْرِقُ فَقَالَ لَهُ عِيْسَى: سَرَقْتَ؟ قَالَ: كَلَّا وَالَّذِيْ لَا إِلَهَ إِلَّاهُوَ. فَقَالَ عِيْسَى: آمَنْتُ بِاللهِ وَكَذَّبْتُ نَفْسِيْ”. رَوَاهُ مُسْلِمٌ .

5050. (24) [3/1403 దృఢం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ” ‘ఈసా (అ) ఒక వ్యక్తిని దొంగతనం చేస్తూ ఉండగా చూసారు. ‘ఈసా (అ) అతనితో, ‘నువ్వు దొంగతనం చేసావు,’ అని అన్నారు. దానికి ఆవ్యక్తి, ‘ఎంతమాత్రం కాదు,’ అని అన్నాడు. అప్పుడు ‘ఈసా (అ), ‘నేను దైవాన్ని విశ్వసించాను. నన్ను నేను హీనంగా భావించాను,’  అని  అన్నారు.  (ముస్లిమ్‌)

అంటే అతడు ప్రమాణం చేసినందుకు ‘ఈసా (అ) ఇలా అన్నారు.

5051 – [ 25 ] ( ضعيف ) (3/1403)

وَعَنْ أَنَسٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “كَادَ الْفَقْرُ أَنْ يَكُوْنَ كُفْرًا وَكَادَ الْحَسَدُ أَنْ يَغْلِبَ الْقَدَرَ”.

5051. (25) [3/1403బలహీనం]

అనస్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”పేదరికం అవిశ్వాసం వరకు చేర్చివేస్తుంది. ఈర్ష్య విధి వ్రాతను అధిగ మిస్తుంది.

అంటే మనిషి పేదరికం వల్ల ఒక్కోక్కసారి అవిశ్వా సానికి గురవుతాడు. ఇంకా ఈర్ష్య కూడా విధివ్రాత లోనిదే.”

5052 – [ 26 ] ( ضعيف ) (3/1403)

وعَنْ جَابِرٍعَنْ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم قَالَ: “مَنِ اعْتَذَرَ إِلى أَخِيْهِ فَلَمْ يَعْذُرْهُ أَوْلَمْ يَقْبَلْ عُذْرَهُ كَانَ عَلَيْهِ مِثْلُ خَطِيْئَةِ صَاحِبِ الْمَكْسِ”. رَوَاهُمَا الْبَيْهَقِيُّ فِي”شُعَبِ الْإِيْمَانِ” وَقَالَ: اَلْمَكَّاسُ: اَلْعَشَّارُ.

5052. (26) [3/1403 బలహీనం]

జాబిర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఒక వ్యక్తి తన ముస్లిమ్‌ సోదరునితో తన తప్పును ఒప్పుకుంటే, అతడు అతని తప్పును మన్నించక పోతే అతడు దొంగతనం చేసినంత పాపం అవుతుంది.” (బైహఖీ/-ష’అబిల్ ఈమమాన్)

=====

18 بَابُ الْحَذْرِ وَالتَّأَنِّيْ  فِي الْأُمُوْرِ

18. పనుల్లో అప్రమత్తంగా తెలివిగా ఉండటం

اَلْفَصْلُ الْأَوَّلُ   మొదటి విభాగం 

5053 – [ 1 ] ( متفق عليه ) (3/1404)

عَنْ أَبِيْ هُرْيَرَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَا يُلْدَغُ الْمُؤْمِنُ مِنْ جُحْرٍ مَرَّتَيْنِ”. مُتَّفَقٌ عَلَيْهِ.

5053. (1) [3/1404ఏకీభవితం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”విశ్వాసి ఒకే రంధ్రం నుండి రెండుసార్లు కాటు తినడు.”[62]  (బు’ఖారీ, ముస్లిమ్‌)

5054 – [ 2 ] ( صحيح ) (3/1404)

وَعَنِ ابْنِ عَبَّاسٍ أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم قَالَ لِأَشَجِّ عَبْدِ الْقَيْسِ: “إِنَّ فِيْكَ لَخَصْلَتَيْنِ يُحِبُّهُمَا اللهُ: اَلْحِلْمُ وَالْأَنَاةُ”. رَوَاهُ مُسْلِمٌ.

5054. (2) [3/1404 దృఢం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘అబ్బాస్‌ (ర) కథనం: ప్రవక్త (స) ‘అబ్దుల్‌ ఖైస్‌ తెగ నాయకునితో నీలో రెండు ప్రత్యే కతలు ఉన్నాయి. ఇవి అల్లాహ్‌ (త)కు చాలా ఇష్టం. 1. తెలివిగా వ్యవహరించటం, 2. ఆలోచించి చేయటం, మొండిగా వ్యవహరించకుండా ఉండటం. (ముస్లిమ్‌)

—–

اَلْفَصْلُ الثّانِي   రెండవ విభాగం 

5055 – [ 3 ] ( لم تتم دراسته ) (3/1404)

عَنْ سَهْلِ بْنِ سَعْدٍ السَّاعِدِيِّ أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم قَالَ: “اَلْأَنَاةُ مِنَ اللهِ وَالْعَجَلَةُ مِنَ الشَّيْطَانِ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَقَالَ: هَذَا حَدِيْثٌ غَرِيْبٌ. وَقَدْ تَكَلَّمَ بَعْضُ أَهْلِ الْحَدِيْثِ فِي عَبْدِ الْمُهَيْمِنِ بْنِ عَبَّاسٍ الرَّاوِيْ مِنْ قِبَلِ حِفْظِهِ.

5055. (3) [3/1404 అపరిశోధితం]

సహల్‌ బిన్‌ స’అద్‌ అస్సా’అది (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”పని ప్రశాంతంగా చేయాలి. తొందరపాటుకు గురికారాదు. ప్రశాంతత అల్లాహ్ (త) తరఫు నుండి ఉంటుంది. తొందరపాటు షై’తాన్‌ వల్ల వస్తుంది. అంటే ప్రతి పని ఆలోచించి చేయాలి. ఆలోచించకుండా తొందరపాటుకు గురికావటంలో శుభం ఉండదు.” (తిర్మిజి’ – ఏకోల్లేఖనం).

కొందరు ‘హదీసు’వేత్తల అభిప్రాయంలో ‘అబ్దుల్ ముహైమిన్ బిన్ ‘అబ్బాస్ ‘హదీసు’వేత్త దీన్ని కల్పించాడు.

5056 – [ 4 ] ( لم تتم دراسته ) (3/1404)

عَنْ أَبِيْ سَعِيْدٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لا حَلِيْمَ إِلَّا ذُوْ تَجْرِبَةٍ”. رَوَاهُ أَحْمَدُ وَالتِّرْمِذِيُّ وَقَال، هَذَا حَدِيْثٌ حَسَنٌ غَرِيْبٌ.

5056. (4) [3/1404 అపరిశోధితం]

అబూ స’యీద్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మనిషి ఇబ్బందులుకు, ఆటంకాలకు గురయిన తర్వాతనే పరిపూర్ణుడౌతాడు. అంటే ఎన్నో ఆపదలను ఎదుర్కొన్న తర్వాతే మనిషి తెలివిగల వాడౌతాడు.” (అ’హ్మద్‌, తిర్మిజి’ – ప్రామాణికం, -ఏకోల్లేఖనం)

5057 – [ 5 ] ( لم تتم دراسته ) (3/1404)

وَعَنْ أَنَسٍ أَنَّ رَجُلًا قَالَ لِلنَّبِيِّ صلى الله عليه وسلم: أَوْصِنِيْ. فَقَالَ: “خُذِ الْأَمْرَبِالتَّدْبِيْرِ فَإِنْ رَأَيْتَ فِي عَاقِبَتِهِ خَيْرًا فَأَمْضِهِ وَإِنْ خِفْتَ غَيًّا فَأَمْسِكْ”. رَوَاهُ فِي “شَرْحِ السُّنَّةِ”.

5057. (5) [3/1404అపరిశోధితం]

అనస్‌ (ర) కథనం: ప్రవక్త (స)తో ఒకవ్యక్తి, ‘ఓ ప్రవక్తా! తమరు నాకేమైనా హితబోధ చేయండి,’ అని విన్నవించుకున్నాడు. దానికి ప్రవక్త (స), ‘నీవు నీ పనిని ఆలోచించి పరికించి చేయి. దాని ఫలితం మంచిదైతే చేయి, లేకపోతే చేయకు,’ అని అన్నారు. (షర్‌’హు స్సున్నహ్‌)

5058 – [ 6 ] ( لم تتم دراسته ) (3/1405)

وَعَنْ مُصْعَبِ بْنِ سَعْدٍ عَنْ أَبِيْهِ قَالَ الْأَعْمَشُ: لَا أَعْلَمُهُ إِلَّا عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ: “اَلتَّؤُدَةُ فِي كُلِّ شَيْءٍ إِلَّا فِيْ عَمَلِ الْآخِرَةِ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ

5058. (6) [3/1405 అపరిశోధితం]

ము’స్‌’అబ్‌ బిన్‌ స’అద్‌ కథనం: ప్రవక్త (స) ఇలా అన్నారని మా నాన్నగారు అన్నారు, ”ఆలస్యం అనేది ప్రతి విషయంలో మంచిదే. కాని పరలోక విషయాల్లో ఆలస్యం మంచిది కాదు. అంటే ఈ విషయాల్లో తొందరపడాలి.” (అబూ  దావూద్‌)

5059 – [ 7 ] ( لم تتم دراسته ) (3/1405)

وَعَنْ عَبْدِ اللهِ بْنِ سَرْجِسَ أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم قَالَ: “اَلسَّمْتُ الْحَسَنُ وَالتُّؤَدَةُ وَالْاِقْتِصَادُ جُزْءٌ مِنْ أَرْبعٍ وَّعِشْرِيْنَ جُزْءًا مِنَ النُّبُوَّةِ”. رَوَاهُ التِّرْمِذِيُّ.

5059. (7) [3/1405అపరిశోధితం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ సర్‌జిస్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మిధ్యేమార్గం, ప్రశాంతంగా చేయటం దైవ దౌత్యం లోని  24  భాగాల్లో ఒక  భాగం.” (తిర్మిజి’)

5060- [ 8 ] ( لم تتم دراسته ) (3/1405)

وَعَنِ ابْنِ عَبَّاسٍ أَنَّ نَبِيَّ الله صلى الله عليه وسلم قَالَ: “إِنَّ الْهَدْيَ الصَّالِحَ وَالْاِقْتِصَادَ جُزْءٌ مِنْ خَمْسٍ وَّعِشْرِيْنَ جُزْءًا مِنَ النُّبُوَّةِ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ.

5060. (8) [3/1405అపరిశోధితం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘అబ్బాస్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మంచి అలవాట్లు, మిధ్యేమార్గం దైవ దౌత్యంలోని  25 వ  భాగం.”  (అబూ దా వూద్‌)

5061 – [ 9 ] ( حسن ) (3/1405)

وَعَنْ جَابِرِبْنِ عَبْدِ اللهِ عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ: “إِذَا حَدَّثَ الرَّجُلُ الْحَدِيْثَ ثُمَّ الْتَفَتَ فَهِيَ أَمَانَةٌ”. رَوَاهُ التِّرْمِذِيُّ وأَبُوْدَاوُد.

5061. (9) [3/1405ప్రామాణికం]

జాబిర్‌ బిన్‌ ‘అబ్దుల్లాహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఎవరైనా ఏదైనా రహస్య విషయం చెబితే, అది అమానతు, అతని అనుమతి లేకుండా ఇతరులకు తెలియపరచరాదు. తెలిపితే అది ద్రోహం  అవుతుంది.”  (తిర్మిజి’, అబూ  దావూద్‌)

5062 – [ 10] ( لم تتم دراسته ) (3/1405)

وَعَنْ أَبِيْ هُرْيَرَةَ أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم قَالَ لِأَبِي الْهَيْثَمِ بْنِ التَّيِّهَانِ: “هَلْ لَكَ خَادِمٌ؟” فَقَالَ: لَا. قَالَ: فَإِذَا أَتَانَا سَبْيٌ فَأْتِنَا فَأُتِيَ النَّبِيُّ صلى الله عليه وسلم بِرَأْسَيْنِ فَأَتَاهُ أَبُوْ الْهَيْثَمِ. فَقَالَ النَّبِيُّ صلى الله عليه وسلم: “اِخْتَرْ مِنْهُمَا”. فَقَالَ: يَا نَبِيَّ اللهِ اِخْتَرْ لِيْ. فَقَالَ النَّبِيُّ صلى الله عليه وسلم: “إِنَّ الْمُسْتَشَارَ مُؤْتَمَنٌ. خُذْ هَذَا فَإِنِّيْ رَأَيْتُهُ يُصَلِّيْ وَاسْتَوْصِ بِهِ مَعْرُوْفًا”. رَوَاهُ التِّرْمِذِيُّ.

5062. (10) [3/1405 అపరిశోధితం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) అబుల్‌ హైస’మ్‌తో, ‘మీ దగ్గర సేవకుడు ఉన్నాడా?’ అని అడిగారు. దానికి అతడు, ‘లేడు,’ అని అన్నారు. అప్పుడు ప్రవక్త (స) ‘నీ దగ్గర సేవకుడు వస్తే నువ్వు నా దగ్గరికి రా,’ అని అన్నారు. అతని వద్దకు ఇద్దరు సేవకులు వచ్చారు. అప్పుడు అబుల్‌ హైస’మ్‌ ప్రవక్త (స) వద్దకు వచ్చారు.అప్పుడు ప్రవక్త(స), ‘వీరిద్దరిలో ఒకర్ని ఎంచుకో,’ అని అన్నారు. దానికి అతడు, ‘ప్రవక్తా! మీరే ఎంచి ఇవ్వండి,’ అని అన్నారు. అప్పుడు ప్రవక్త (స), ‘ఈ విషయంలో నీవు నన్ను సలహా కోరావు, సలహా కోరబడిన వ్యక్తి కూడా అమానతుదారు. నేను ఈ సేవ కుడ్ని నమా’జు చదువుతుండగా చూసాను. నువ్వు ఇతడ్ని తీసుకో, ఇతడి పట్ల ఉపకారం చేయమని ఉపదేశిస్తున్నాను,’  అని  అన్నారు.  (తిర్మిజి’)

5063 – [ 11 ] ( لم تتم دراسته ) (3/1405)

وَعَنْ جَابِرٍقَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “اَلْمَجَالِسُ بِالْأَمَانَةِ إِلَّا ثَلَاثَةَ مَجَالِسَ: سَفْكُ دَمٍ حَرَامٍ أَوْ فَرْجٍ حَرَامٍ وَاقْتِطَاعِ مَالٍ بِغَيْرِ حَقٍّ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ وَذُكِرَ حَدِيْثُ أَبِيْ سَعِيْدٍ :”إِنَّ أَعْظَمَ الْأَمَانَةِ” فِي”بَابِ الْمُبَاشَرَةِ” فِيْ “اَلْفَصْلِ الْأَوَّلِ”.

5063. (11) [3/1405అపరిశోధితం]

జాబిర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”సమావేశాల విషయాలు అమానతు. అంటే సమావేశాల్లో జరిగే నిర్ణయాలు రహస్యంగా ఉంటాయి. ఇవి వారికి తప్ప ఇతరులకు తెలియవు. ఇవన్నీ అమానతులు. వీటిని ఇతరులకు తెలియ పరచటం ద్రోహం అవుతుంది. అయితే మూడు సమావేశాలు ఎటువంటివంటే అక్కడి మాటలు వెల్లడించడం తప్పనిసరి అవుతుంది. ఒకటి రక్తపాతం చేయటానికి చేసే కుట్రలు, అంటే అన్యాయంగా హత్యల గురించి జరిగే కుట్రలు. రెండు నిషిద్ధ మరియు వ్యభిచారం జరిగే సమావేశాలు లేదా అన్యాయంగా ఇతరుల ధనాన్ని దోచుకునే కుట్రలు. (అబూ దావూద్‌)

—–

اَلْفَصْلُ الثَّالِثُ   మూడవ విభాగం  

5064 – [ 12 ] ( موضوع ) (3/1406)

عَنْ أَبِي هُرَيْرَةَ عَنِ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ: ” لَمَّا خَلَقَ اللَّهُ الْعَقْلَ قَالَ لَهُ: قُمْ فَقَامَ ثُمَّ قَالَ لَهُ: أدبرفَاَدْبَرَ،  ثُمَّ قَالَ لَهُ: أَقْبِلْ فَأَقْبَلَ،  ثُمَّ قَالَ لَهُ: اقْعُدْ فَقَعَدَ ثُمَّ قَالَ لَهُ: مَا خَلَقْتُ خَلْقًا هُوَ خَيْرٌ مِنْكَ وَلَا أَفْضَلُ مِنْكَ وَلَا أَحْسَنُ مِنْكَ بِكَ آخُذُ وَبِكَ أُعْطِي وَبِكَ أُعْرَفُ وَبِكَ أُعَاتِبُ وَبِكَ الثَّوَابُ وَعَلَيْكَ العقابُ”. وَقد تكلم فِيهِ بعض الْعلمَاء.

5064. (12) [3/1406 కల్పితం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”అల్లాహ్‌(త) బుద్ధిని సృష్టించిన తర్వాత దాన్ని పరీక్షిస్తూ ‘నిలబడు,’ అని ఆదేశించాడు. అది నిలబడింది. మళ్ళీ దాన్ని ‘కూర్చో,’ అని అన్నాడు. అది కూర్చున్నది. మళ్ళీ అల్లాహ్‌(త), ‘నా వైపు తిరుగు,’ అంటే, ‘ నా ముందుకు రా’,  అని అన్నాడు. అది ముందుకు వచ్చింది. మళ్ళీ అల్లాహ్‌ (త), ‘కూర్చో,’ అని అన్నాడు. అది కూర్చుంది. మళ్ళీ అల్లాహ్‌ (త) బుద్ధితో, ‘నీ కంటే మంచిది, నీకంటే ఉత్తమమైనది, నీకంటే అందమైనది దేన్నీ నేను సృష్టించ లేదు. ఇక ముందు నీ ద్వారానే నేను ప్రజలను విచారిస్తాను, నీ ద్వారానే ప్రజలకు ప్రసాదిస్తాను, నీ ద్వారానే నేను గుర్తించబడతాను, బుద్ధిమంతులే నన్ను గుర్తు పట్టగలరు, నీ ద్వారానే నేను ఆగ్రహిస్తాను. నీ ద్వారానే నేను పుణ్యం ప్రసాదిస్తాను. నీ ద్వారానే, ప్రజలు అవిధేయత చూపితే వారిని శిక్షిస్తాను.’

ఈ ‘హదీసు’ ద్వారా బుద్ధిని ఒక శరీరాకృతిలో సృష్టించటం జరిగింది. మరణాన్ని గొర్రెగా సృష్టించ బడినట్లు, అని తెలుస్తుంది. (బైహఖీ-/షు’అబిల్ ఈమాన్)

5065 – [ 13 ] ( لم تتم دراسته ) (3/1406)

وَعَنِ ابْنِ عُمَرَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِنَّ الرَّجُلَ لِيَكُوْنُ مِنْ أَهْلِ الصَّلَاةِ وَالصَّوْمِ وَالزَّكَاةِ وَالْحَجِّ وَالْعُمْرَةِ”. حَتَّى ذَكَرَ سِهَامَ الْخَيْرِ كُلَّهَا: “وَمَا يُجْزَى يَوْمَ الْقِيَامَةِ إِلَّا بِقَدَرِعَقْلِهِ”.

5065. (13) [3/1406అపరిశోధితం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘ఉమర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మనిషి నమాజీ అయిపోతాడు, ఉపవాసం పాటించేవాడు, ‘జకాత్‌ చెల్లించేవాడు, ‘హజ్జ్, ‘ఉమ్రహ్ చేసేవాడై పోతాడు, ప్రతి చిన్న పెద్ద పుణ్యం చేసేవాడై పోతాడు. కాని తీర్పుదినం నాడు అతని బుద్ధి ప్రకారం అతనికి పుణ్యం ఇవ్వడం జరుగుతుంది. దాన్ని అర్థం చేసుకొని ఆచరించాడా? లేదా అని. (బైహఖీ-షు’అబిల్ ఈమాన్)

5066 – [ 14 ] ( لم تتم دراسته ) (3/1406)

وَعَنْ أَبِيْ ذَرٍّقَالَ: قَالَ لِيْ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “يَا أَبَا ذَرٍّ لَا عَقْلَ كَالتَّدْبِيْرِوَلَا وَرْعَ كَالْكَفِّ وَلَاحَسَبَ كَحُسْنِ الْخُلُقِ”.

5066. (14) [3/1406 అపరిశోధితం]

అబూ జ’ర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఓ అబూ జ’ర్‌! ఏ బుద్ధి అయినా ఆలోచన, ప్రణాళికలా ఉండదు. అంటే ఆలోచించి పరికించి ఫలితాన్ని గుర్తించడం అన్నిటి కంటే గొప్పవివేకం. నిషిద్ధ వస్తువులకు దూరంగా ఉండటం అన్నిటికంటే గొప్ప దైవభీతి. నైతికత, మంచి తనాలను మించి ఎటువంటి ప్రాధాన్యత లేదు. (బైహఖీ / -షు’అబిల్ ఈమాన్)

5067 – [ 15 ] ( لم تتم دراسته ) (3/1406)

وَعَنِ ابْنِ عُمَرَقَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “اَلْاقْتِصَادُ فِي النَّفَقَةِ نِصْفُ الْمَعِيْشَةِ وَالتَّوَدُّدُ إِلى النَّاسِ نِصْفُ الْعَقْلِ وَحُسْنُ السُّؤَالِ نِصْفُ الْعِلْمِ”. رَوَى الْبَيْهَقِيُّ الْأَحَادِيْثَ الْأَرْبَعَةَ فِي شُعَبِ الْإِيْمَانِ”.

5067. (15) [3/1406అపరిశోధితం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘ఉమర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఖర్చుపెట్టడంలో మధ్యేమార్గాన్ని అనుస రించడం, సగం జీవిత సంపాదన అవుతుంది. ప్రజల పట్ల ప్రేమ, ఆత్మీయతలు కలిగి ఉండటం సగం బుద్ధి, తెలియని విషయాన్ని సరిగ్గా తెలుసుకొని ఆచరించటం సగం జ్ఞానం. (ఈ పై నాలుగు ‘హదీసు’లను బైహఖీ – షు’అబిల్ ఈమాన్ లో  ప్రస్తావించారు)

=====

19بَابُ الرِّفْقِ وَالْحَيَاءِ وَحُسْنِ الْخُلْقِ

19. సౌమ్యం, బిడియం, మంచి నడవడిక

اَلْفَصْلُ الْأَوَّلُ   మొదటి విభాగం 

5068 – [ 1 ] ( صحيح ) (3/1407)

عَنْ عَائِشَةَ رَضِيَ اللهُ عَنْهَا أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم قَالَ: “إِنَّ اللهَ تَعَالى رَفِيْقٌ يُحِبُّ الرِّفْقَ وَيُعْطِيْ عَلَى الرِّفْقِ مَا لَا يُعْطِيْ عَلَى الْعُنْفِ وَمَا لَا يُعْطِيْ عَلَى مَا سِوَاهُ”. رَوَاهُ مُسْلِمٌ.

وَفِيْ رِوَايَةٍ لَهُ: قَالَ لِعَائِشَةَ: “عَلَيْكِ بِالرِّفْقِ وَإِيَّاكِ وَالْعُنْفَ وَالْفُحْشَ إِنَّ الرِّفْقَ لَا يَكُوْنُ فِيْ شَيْءٍ إِلَّا زَانَهُ وَلَا يُنْزَعُ مِنْ شَيْءٍ إِلَّاشَانَهُ”.

5068. (1) [3/1407 దృఢం]

‘ఆయి’షహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”అల్లాహ్‌(త) సున్నితుడు, అంటే సున్నిత హృద యుడు, దయామయుడు. సున్నిత్వాన్ని ఇష్ట పడ తాడు. సౌమ్యత, దయాగుణంపై ఇచ్చేవి, కాఠిన్యతపై  ఇవ్వడు.” (ముస్లిమ్‌)

మరొక ముస్లిమ్‌ ఉల్లేఖనలో ఇలా ఉంది, ”ప్రవక్త (స) ‘ఆయి’షహ్‌(ర) తో సున్నితత్వాన్ని అనుస రించమని, ప్రజలతో సౌమ్యంగా మాట్లాడమని, ఇంకా తన్ను తాను కాఠి న్యానికి, అశ్లీలానికి దూరంగా ఉండమని, ఎందుకంటే సౌమ్యత ఉన్నది అందంగా తయారవుతుంది, కాఠిన్యత ఉన్నది అందవికారంగా తయారవుతుంది, సౌమ్యత లాక్కోబడింది అంద వికారంగా తయారవుతుంది,” అని ఉపదేశించారు.

5069 – [ 2 ] ( صحيح ) (3/1407)

وَعَنْ جَرِيْرٍعَنِ النَّبِيِّ صلى الله عليه وسلم: “مَنْ يُحْرَمِ الرِّفْقَ يُحْرَمِ الْخَيْرَ”. رَوَاهُ مُسْلِمٌ.

5069. (2) [3/1407దృఢం]

జరీర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”సున్నిత స్వభావానికి దూరం చేయబడినవాడు అనేక మేళ్ళకు దూరం  చేయబడతాడు.” (ముస్లిమ్‌)

5070 – [ 3 ] ( متفق عليه ) (3/1407)

وَعَنِ ابْنِ عُمَرَ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم مَرَّ عَلَى رَجُلٍ مِنَ الْأَنْصَارِ وَهُوَ يَعِظُ أَخَاهُ فِيْ الْحَيَاءِ. فَقَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم:”دَعْهُ فَإِنَّ الْحَيَاءَ مِنَ الْإِيْمَانِ”. مُتَّفَقٌ عَلَيْهِ

5070. (3) [3/1407 ఏకీభవితం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘ఉమర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ఒక అన్సారీ వ్యక్తి ప్రక్క నుండి వెళ్ళారు. అతడు తన సోదరుణ్ణి సిగ్గు, లజ్జల గురించి బోధిస్తూ, ‘నువ్వు అధికంగా సిగ్గు పడకు,’ అని అన్నాడు. అది విని ప్రవక్త (స), ‘నువ్వు అలా హితబోధ చేయకు. ఎందుకంటే సిగ్గు విశ్వాస గుణాల్లోని ఒక గుణం,’ అని అన్నారు. (బు’ఖారీ, ముస్లిమ్‌)

అంటే సిగ్గు కూడా విశ్వాసమే. దానికి వ్యతిరేకంగా హితబోధ చేయడం మంచిది కాదు.

5071 – [ 4 ] ( متفق عليه ) (3/1407)

وَعَنْ عِمْرَانَ بْنِ حُصَيْنٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “اَلْحَيَاءُ لَا يَأْتِيْ إِلَّا بِخَيْرٍ”.

وَفِيْ رِوَايَةٍ: “اَلْحَيَاءُ خَيْرٌ كُلُّهُ”. مُتَّفَقٌ عَلَيْهِ.

5071. (4) [3/1407 ఏకీభవితం]

‘ఇమ్రాన్‌ బిన్‌ ‘హు’సైన్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”సిగ్గు సరాసరి మేలే. ఎలాంటి సిగ్గు అయినా మేలే.” (బు’ఖారీ, ముస్లిమ్‌)

ఎందుకంటే సిగ్గు అశ్లీల కార్యాలకు దూరంగా ఉంచుతుంది. అంటే అన్నిరకాల చెడులనుండి కాపాడు తుంది.  ఇదే  పుణ్యం  మరియు  మేలు.

5072 – [ 5 ] ( صحيح ) (3/1407)

وَعَنِ ابْنِ مَسْعُوْدٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِنَّ مِمَّا أَدْرَكَ النَّاسُ مِنْ كَلَامِ النَّبُوَّةِ الْأُوْلَى: إِذَا لَمْ تَسْتَحْيِ فَاصْنَعَ مَا شِئْتَ”. رَوَاهُ الْبُخَارِيُّ.

5072. (5) [3/1407 దృఢం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ మస్‌’ఊద్‌ (ర) కథనం: ప్రాచీన ప్రవక్తల్లో ఒక మంచి గుణం ఉండేది, అది సిగ్గుపడటం, మీ నుండి సిగ్గు నశిస్తే మీరేం కోరితే  అది చేస్తారు. (బు’ఖారీ)

5073 – [ 6 ] ( صحيح ) (3/1407)

وَعَنِ النَّوَّاسِ بْنِ سَمْعَانَ قَالَ: سَأَلْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم عَنِ الْبِرِّوَالْإِثْمِ فَقَالَ: “اَلْبِرُّحُسْنُ الْخُلُقِ وَالْإِثْمِ مَا حَاكَ فِيْ صَدْرِكَ وَكَرِهْتَ أَنْ يَطَّلِعَ عَلَيْهِ النَّاسُ”. رَوَاهُ مُسْلِمٌ.

5073. (6) [3/1408 దృఢం]

నవాస్‌ బిన్‌ సమ్‌’ఆన్‌ (ర) కథనం: ప్రవక్త (స)ను నేను పుణ్యం మరియు పాపం గురించి అడిగాను. దానికి ప్రవక్త (స), ‘పుణ్యం అంటే ఉత్తమ నడవడిక, పాపం అంటే అనుమానాస్పదమైనది. ఒక విషయంపై మీకు అనుమానం కలిగి ప్రజలు చెడుగా భావిస్తారని భయం ఉంటే అదే పాపం.’ (ముస్లిమ్‌)

5074 – [ 7 ] ( صحيح ) (3/1408)

وَعَنْ عَبْدِ اللهِ بْنِ عَمْرٍو قَالَ :قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِنَّ مِنْ أَحَبِّكُمْ إِلَيَّ أَحْسَنَكُمْ أَخْلَاقًا”. رَوَاهُ الْبُخَارِيُّ

5074. (7) [3/1408దృఢం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘అమ్ర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మీలో ఉత్తమ నడవడిక గలవాడే నాకు ప్రీతి పాత్రుడు.” (బు’ఖారీ)

5075 – [ 8 ] ( متفق عليه ) (3/1408)

وَعَنْهُ قَالَ : قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم:”إِنَّ مِنْ خِيَارِكُمْ أَحْسَنَكُمْ أَخْلَاقًا ” . مُتَّفَقٌ عَلَيْهِ

5075. (8) [3/1408ఏకీభవితం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘అమ్ర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మీలో ఉత్తమ నడవడిక, మంచి అలవాట్లు గలవాడే చాలా ఉత్తముడు.” (బు’ఖారీ, ముస్లిమ్‌)

—–

اَلْفَصْلُ الثَّانِيْ  రెండవ విభాగం 

5076 – [ 9 ] ( لم تتم دراسته ) (3/1408)

عَنْ عَائِشَةَ رَضِيَ اللهُ عَنْهَا قَالَتْ: قَالَ النَّبِيُّ صلى الله عليه وسلم: “مَنْ أُعْطِيَ حَظَّهُ مِنَ الرِّفْقِ أُعْطِيَ حَظَّهُ مِنْ خَيْرِالدُّنْيَا وَالْآخِرَةِ وَمَنْ حُرِمَ حَظَّهُ مِنَ الرِّفْقِ حُرِمَ حَظَّهُ مِنْ خَيْرِالدُّنْيَا وَالْآخِرَةِ”. رَوَاهُ فِيْ “شَرْحِ السُّنَّةِ”.

5076. (9) [3/1408 అపరిశోధితం]

‘ఆయి’షహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”సున్నిత స్వభావం ప్రసాదించబడినవాడికి ఉభయ లోకాల మేలు ప్రసాదించబడినట్టే. సున్నిత స్వభా వానికి దూరం చేయబడిన వాడు ఉభయలోకాల మేలుకు దూరం చేయబడి నట్టే.” (షర్‌’హు స్సున్నహ్‌)

ఈ ‘హదీసు’ ద్వారా సందర్భాన్నిబట్టి సున్నితంగా వ్యవహ రించటం చాలా ఉత్తమ గుణం అని తెలిసింది.

5077 – [ 10 ] ( لم تتم دراسته ) (3/1408)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “اَلْحَيَاءُ مِنَ الْإِيْمَانِ. وَالْإِيْمَانُ فِي الْجَنَّةِ. وَالْبَذَاءُ مِنَ الْجُفَاءِ وَالْجَفَاءُ فِي النَّارِ”. رَوَاهُ أَحْمَدُ وَالتِّرْمِذِيُّ

5077. (10) [3/1408 అపరిశోధితం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”సిగ్గు, విశ్వాస భాగాల్లోని ఒక భాగం, విశ్వాసం స్వర్గంలో ఉంటుంది. అంటే సిగ్గు ద్వారా స్వర్గం లభిస్తుంది, విశ్వాసం స్వర్గానికి చేరుస్తుంది. విచ్చల విడితనం, అశ్లీలం దుర్భాషలు చెడుకార్యాలు, నరకానికి చేర్చుతాయి.”  (అ’హ్మద్‌, తిర్మిజి’)

5078 – [ 11 ] ( لم تتم دراسته ) (3/1408)

وَعَنْ رَجُلٍ مِنْ مُزَيْنَةَ قَالَ:قَالُوْا: يَا رَسُوْلُ اللهِ مَا خَيْرُمَا أُعْطِيَ الْإِنْسَانُ؟ قَالَ:”اَلْخُلُقُ الْحَسَنُ”رَوَاهُ الْبَيْهَقِيُّ فِيْ”شُعُبِ الْإِيْمَانِ”.

5078. (11) [3/1408 అపరిశోధితం]

ము’జైనహ్‌ నుండి ఒక వ్యక్తి కథనం: ప్రవక్త (స)ను ప్రజలు, ‘మానవునికి ఇవ్వబడిన వస్తువుల్లో అన్నిటి కంటే గొప్ప వస్తువు ఏది?’ అని ప్రశ్నించారు. దానికి ప్రవక్త (స), ఉత్తమ నడవడిక,’ అని సమాధానం ఇచ్చారు. (బైహఖీ)

5079 – [ 12 ] ( صحيح ) (3/1408)

وَفِيْ شَرْحِ السُّنَّةِ عَنْ أُسَامَةَ بْنِ شَرِيْكٍ

5079. (12) [3/1408 దృఢం]

ఈ ‘హదీసు’నే ఉసామహ్ బిన్‌ షరీక్‌ ఉల్లేఖించారు అని, షర’హుస్సున్నహ్‌లో పేర్కొనబడింది. 

5080 – [ 13 ] ( لم تتم دراسته ) (3/1408)

وَعَنْ حَارِثَةَ بْنِ وَهْبٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَا يَدْخُلُ الْجَنَّةَ الْجَوَّاظُ وَلَا الْجَعْظَرِيُّ”. قَالَ: وَالْجَوَّاظُ: اَلْغَلِيْظُ الْفَظُّ رَوَاهُ أَبُوْ دَاوُدَ فِيْ”سُنَنِهِ”. وَالْبَيْهَقِيُّ فِيْ” شُعَبِ الْإِيْمَانِ. وَصَاحِبُ”جَامِعِ الْأُصُوْلِ” فِيْهِ عَنْ حَارِثَةَ. وَكَذَا فِي “شَرْحِ السُّنَّةِ” عَنْهُ. وَلَفْظُهُ قَالَ: “لَا يَدْخُلُ الْجَنَّةَ الْجَوَّاظُ الْجَعْظَرِيُّ”. يُقَالُ: اَلْجَعْظَرِيُّ: اَلْفَظُّ الْغَلِيْظُ وَفِيْ نُسَخِ “الْمَصَابِيْحِ”عَنْ عِكْرَمَةِ بْنِ وَهْبٍ وَلَفْظُهُ قَالَ: “وَالْجَوَّاظُ : الَّذِيْ جَمَعَ وَمَنَعَ. وَالْجَعْظَرِيُّ: اَلْغَلِيْظُ الْفَظُّ.

5080. (13) [3/1408అపరిశోధితం]

‘హారిస’హ్ బిన్‌ వహబ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”దుర్గుణాలు, చెడు అలవాట్లు, గలవారు, మరియు దుర్భాషలాడే వారు స్వర్గంలో ప్రవేశించ లేరు. అంటే ఇటువంటి వారు స్వర్గవాసులు కాలేరు.” (బైహఖీ, అబూ  దావూద్‌)

5081 – [ 14] ( لم تتم دراسته ) (3/1409)

وَعَنْ أَبِي الدَّرْدَاءِ عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ: “إِنَّ أَثْقَلَ شَيْءٍ يُوْضَعُ فِي مِيْزَانِ الْمُؤْمِنِ يَوْمَ الْقِيَامَةِ خُلُقٌ حَسَنٌ وَإِنَّ اللهَ يُبْغِضُ الْفَاحِشَ الْبَذِيْءَ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَقَالَ:حَدِيْثٌ حَسَنٌ صَحِيْحٌ . ورَوَى أَبُوْ دَاوُدَ.  

5081. (14) [3/1409 అపరిశోధితం]

అబూ దర్‌దా’ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”తీర్పు దినం నాడు కర్మల తూనికల్లో ఉత్తమ గుణాలే అన్నిటికంటే బరువైనవిగా ఉంటాయి. అల్లాహ్‌ (త) అశ్లీలురు, దుర్భాషలాడేవారు అంటే ఇష్టపడడు.” (తిర్మిజి’  –  ప్రామాణికం, దృఢం, అబూ  దావూద్)

5082- [ 15 ] ( صحيح ) (3/1409)

وَعَنْ عَائِشَةَ رَضِيَ اللهُ عَنْهَا قَالَتْ: سَمِعْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ: “إِنَّ الْمُؤْمِنَ ليُدْرِكُ بِحُسْنِ خُلُقِهِ دَرَجَةَ قَائِمِ اللَّيْلِ وَصَائِمِ النَّهَارِ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ.

5082. (15) [3/1409దృఢం]

‘ఆయి’షహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ఇలా ప్రవచిస్తూ ఉండగా నేను విన్నాను, ”విశ్వాసి తన ఉత్తమ నడవడిక, ఉత్తమ గుణాల ద్వారా రాత్రంతా ఆరాధించే, పగలంతా ఉపవాసం పాటించే వారి స్థానాన్ని పొందుతాడు.” (అబూ దావూద్‌)

5083 – [ 16 ] ( حسن ) (3/1409)

وعَنْ أَبِي ذَرٍّقَالَ: قَالَ لِيْ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “اِتَّقِ اللهَ حَيْثَمَا كُنْتَ وَأَتْبِعِ السَّيِّئَةَ الْحَسَنَةَ تَمْحُهَا وَخَالِقِ النَّاسَ بِخُلُقِ حَسَنٍ”. رَوَاهُ أَحْمَدُ وَالتِّرْمِذِيُّ وَالدَّارَمِيُّ.

5083. (16) [3/1409 ప్రామాణికం]

అబూ జ’ర్‌ (ర) కథనం: ప్రవక్త (స) నాతో ఇలా అన్నారు, ”ఓ అబూ జ’ర్‌! నీవు ఎక్కడున్నా అల్లాహ్‌ (త)కు భయపడుతూ ఉండు. ఒకవేళ అనుకోకుండా ఏదైనా పాపానికి గురయితే, ఆ వెంటనే పుణ్యకార్యం చేసుకో. ఈ పుణ్యం ఆ పాపాన్ని చెరిపివేస్తుంది. ఇంకా నువ్వు ప్రజలను నగు ముఖంతో కలుస్తూ ఉండు.” (అ’హ్మద్‌, తిర్మిజి’, దార్మీ)

5084 – [ 17 ] ( لم تتم دراسته ) (3/1409)

وَعَنْ عَبْدِ اللهِ بْنِ مَسْعُوْدٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “أَلَا أُخْبِرُكُمْ بِمَنْ يَحْرُمُ عَلَى النَّارِوَبِمَنْ تَحْرُمُ النَّارُ عَلَيْهِ؟ عَلَى كُلِّ هَيِّنٍ لَيِّنٍ قَرِيْبٍ سَهْلٍ”. رَوَاهُ أَحْمَدُ وَالتِّرْمِذِيُّ وَقَالَ: هَذَا حَدِيْثٌ حَسَنٌ غَرِيْبٌ.

5084. (17) [3/1409అపరిశోధితం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ మస్‌’ఊద్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”నరకం నిషేధించబడిన వ్యక్తిని గురించి చెప్పనా, ‘అతడు సున్నిత స్వభావుడు, ఉత్తమ గుణసంపన్నుడు.’ అంటే సున్నిత మనస్తత్వం, ఉత్తమగుణాలు నరకంలో ప్రవేశించవు.” (అ’హ్మద్‌, తిర్మిజి’ / ప్రామాణికం, -ఏకోల్లేఖనం)

5085 – [ 18 ] ( لم تتم دراسته ) (3/1409)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ: “اَلْمُؤْمِنُ غِرٌّ كَرِيْمٌ وَالْفَاجِرُخَبٌّ لَئِيْمٌ”. رَوَاهُ أَحْمَدُ وَالتِّرْمِذِيُّ وَأَبُوْ دَاوُدَ.

5085. (18) [3/1409అపరిశోధితం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”అమాయకుడైన పుణ్యాత్ముడు మహా పురుషుడు. పాపాత్ముడైన వ్యక్తి పిసినారి, దుర్మార్గుడై ఉంటాడు.” (అ’హ్మద్‌, తిర్మిజి’, అబూ  దావూద్‌)

అంటే మంచివారిచిహ్నం ఇది, చెడ్డవారి గుర్తు అది.

5086 – [ 19 ] ( لم تتم دراسته ) (3/1410)

وَعَنْ مَكْحُوْلٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “اَلْمُؤْمِنُوْنَ هَيِّنُوْنَ لَيِّنُوْنَ كَالْجَمَلِ الْآنِفِ إِنْ قِيْدَ اِنْقَادَ وَإِنْ أُنِيْخَ عَلَى صَخْرَةٍ اِسْتَنَاخَ”. رَوَاهُ التِّرْمِذِيُّ مُرْسَلًا.

5086. (19) [3/1410అపరిశోధితం]

మక్‌’హూల్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”విశ్వాసులు తెలివైనవారు, సున్నిత హృదయులై ఉంటారు. ఎటు త్రిప్పితే అటు తిరుగుతారు. అంటే ముక్కుతాడు పడిఉన్న ఒంటె వంటివారు. లాగితే వచ్చేస్తారు. కూర్చో బెడితే కూర్చుండిపోతారు. వారిలో ఎటువంటి గర్వం గానీ, అహంకారం గానీ ఉండవు.” (తిర్మిజి’ / తాబయీ  ప్రోక్తం)

5087 – [ 20 ] ( صحيح ) (3/1410)

وَعَنْ ابْنِ عُمَرَعَنِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ: “اَلْمُسْلِمُ الَّذِيْ يُخَالِطُ النَّاسَ وَيَصْبِرُعَلَى أَذَاهُمْ أَفْضَلُ مِنَ الَّذِيْ لَا يُخَالِطُهُمْ وَلَا يَصْبِرُ عَلَى أَذَاهُمْ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَابْنُ مَاجَهُ .

5087. (20) [3/1410దృఢం]

ఇబ్నె ‘ఉమర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ప్రజలను కలుస్తూ, వారి ఆపదలపై సహనం వహించే ముస్లిమ్‌, ప్రజలను కలవని, వారి ఆపదలపట్ల సహనం ఓర్పు వహించని వ్యక్తికంటే ఉత్తముడు.” (తిర్మిజి’, ఇబ్నె  మాజహ్)

5088 – [ 21 ] ( لم تتم دراسته ) (3/1410)

وعَنْ سَهْلِ بْنِ مُعَاذٍ عَنْ أَبِيْهِ أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم قَالَ: “مَنْ كَظَمَ غَيْظًا وَهُوَ يَقْدِرُعَلَى أَنْ يُنْفِذَهُ دَعَاهُ اللهُ عَلَى رُؤُوْسِ الْخَلَائِقِ يَوْمَ الْقِيَامَةِ حَتَّى يُخَيِّرَهُ فِي أَيِّ الْحُوْرِ شَاءَ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَأَبُوْ دَاوُدَ وَقَالَ التِّرْمِذِيُّ: هَذَا حَدِيْثٌ غَرِيْبٌ.  

5088. (21) [3/1410అపరిశోధితం]

సహల్‌ బిన్‌ మ’ఆజ్‌’ (ర) తన తాతగారి ద్వారా కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”శక్తి ఉండి కూడా తన కోపాన్ని నిగ్రహించుకునే వ్యక్తిని తీర్పుదినంనాడు అల్లాహ్‌ (త) పిలిచి దైవకన్యల్లో ఒకామెను ఎంచుకోమని అనుమతినిస్తాడు.” (అబూ దావూద్‌, తిర్మిజి’ – ఏకోల్లేఖనం)

5089 – [ 22 ] ( لم تتم دراسته ) (3/1410)

وَفِيْ رِوَايَةٍ لِأَبِيْ دَاوُدَ عَنْ سُوَيْدِ بْنِ وَهْبٍ عَنْ رَجُلٍ مِنْ أَبْنَاءِ أَصْحَابِ النَّبِيِّ صلى الله عليه وسلم عَنْ أَبِيْهِ قَالَ: “مَلَأَ اللهُ قَلْبَهُ أَمْنًا وَإِيْمَانًا” وَذُكِرَ حَدِيْثُ سُوَيْدٍ: “مَنْ تَرَكَ لُبْسَ ثَوْبِ جَمَالٍ” فِي”كِتَابِ اللِّبَاسِ”.

5089. (22) [3/1410 అపరిశోధితం]

మరో అబూ దావూద్‌ ఉల్లేఖనంలో  ఇలా ఉంది: ”సువైద్‌ బిన్‌ వహబ్‌, ప్రవక్త (స) అనుచరుని కుమారుని ద్వారా కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”తన కోపాన్ని దిగమ్రింగేవారి హృదయాన్ని అల్లాహ్‌ (త) శాంతి శుభాలతో నింపివేస్తాడు.”

—–

اَلْفَصْلُ الثَّالِثُ   మూడవ విభాగం

5090 – [ 23 ] ( لم تتم دراسته ) (3/1410)

عَنْ زَيْدِ بْنِ طَلْحَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِنَّ لِكُلِّ دِيْنٍ خُلُقًا وَخُلُقُ الْإِسْلَامِ الْحَيَاءُ”. رَوَاهُ مَالِكٌ مُرْسَلًا .

5090. (23) [3/1410అపరిశోధితం]

‘జైద్‌ బిన్‌ ‘తల్‌’హా (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ప్రతి ధర్మంలో ఒక మంచి గుణం ఉంటుంది. ఇస్లామ్‌ యొక్క అన్నిటి కంటే ఉత్తమమైన గుణం సిగ్గు, లజ్జలను సూచింస్తుంది.”  (మాలిక్- తాబయీ  ప్రోక్తం)

5091 – [24] ؟ (3/1410)

وَرَوَاهُ ابْنُ مَاجَهُ عَنْ أَنَسٍ وَابْنُ عَبَّاسٍ.

5091. (24) [3/1410? ]

అనస్ మరియు ఇబ్నే ‘అబ్బాస్ ద్వారా, ఇలాంటి ఉల్లేఖనం, ఇబ్నె మాజహ్లో ఉంది.

5092- [ 25 ] ( لم تتم دراسته ) (3/1410)

وَالْبَيْهَقِيُّ فِيْ”شُعَبِ الْإْيِمَانِ”عَنْ أَنَسٍ وَابْنُ عَبَّاسٍ

5092. (25) [3/1410 అపరిశోధితం]

అనస్‌, ఇబ్నె ‘అబ్బాస్‌ల కథనం: (బైహఖీ – షు’అబిల్‌ ఈమాన్‌)

5093 – [ 26 ] ( لم تتم دراسته ) (3/1410)

وَعَنِ ابْنِ عُمَرَأَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم قَالَ: “إِنَّ الْحَيَاءَ وَالْإِيْمَانَ قُرَنَاءُ جَمِيْعًا فَإِذَا رُفِعَ أَحَدُهُمَا رُفِعَ الْآخَرُ”.

5093. (26) [3/1410 అపరిశోధితం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘ఉమర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”సిగ్గు, విశ్వాసం కలిసుండే మిత్రులు. ఒక దానితో ఒకటి ప్రత్యేక సంబంధం కలిగి ఉన్నాయి. ఈ రెంటిలో ఒక దాన్ని ఎత్తివేస్తే రెండవది కూడా లేచిపోతుంది.”

5094 – [ 27 ] ( لم تتم دراسته ) (3/1411)

وَفِيْ رِوَايَةِ ابْنِ عَبَّاسٍ: “فَإِذَا سُلِبَ أَحَدُهُمَا تَبِعَهُ الْآخَرُ”. رَوَاهُ الْبَيْهَقِيُّ فِيْ “شُعَبِ الْإِيْمَانِ”.

5094. (27) [3/1411 అపరిశోధితం]

మరో ఇబ్నె ‘అబ్బాస్ కథనంలో ఇలా ఉంది: ”ఈ రెంటిలో ఒకదాన్ని లాక్కుంటే మరొకటి కూడా వచ్చే స్తుంది. అంటే విశ్వాసం బయటకు వెళితే సిగ్గు కూడా బయటకు వెళ్ళి పోతుంది. విశ్వాసం మిగిలి ఉంటే సిగ్గు కూడా మిగిలి ఉంటుంది.” (బైహఖీ –   షు’అబుల్ ఈమాన్)

5095 – [ 28 ] ؟ (3/1411)

وَعَنْ مُعَاذٍ قَالَ: كَانَ آخِرُ مَا وَصَّانِيْ بِهِ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم حِيْنَ وَضَعْتُ رِجْلِيْ فِي الْغَرْزِ أَنْ قَالَ: “يَا مُعَاذُ أَحْسِنْ خُلُقَكَ لِلنَّاسِ”. رَوَاهُ مَالِكٌ.

5095. (28) [3/1411 ? ]

ము’ఆజ్‌ (ర) కథనం: నేను యమన్‌ గవర్నర్‌గా నియమింపబడి, ప్రవక్త (స) వద్దకు వెళ్ళి, వాహనంపై ఎక్కి బయలుదేరడానికి సిద్ధపడినపుడు, ప్రవక్త (స) నాకు చివరి సారిగా ఇలా హితబోధచేసారు. ‘ఓ ము’ఆజ్‌! నీవు ఎక్కడున్నా ప్రజలతో మంచిగా కలవాలి. (మాలిక్‌)

5096 – [ 29 ] ( لم تتم دراسته ) (3/1411)

وَعَنْ مَالِكٍ بَلَغَهُ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم قَالَ: “بُعِثْتُ لِأُتَمِّمَ حُسْنَ الْأَخْلَاقِ”. رَوَاهُ الْمُوَطَّأ.

5096. (29) [3/1411 అపరిశోధితం]

ఇమామ్‌ మాలిక్‌ కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”నైతికతను పరిపూర్ణం గావించటానికే నన్ను పంపటం జరిగింది.” (మువ’త్తా ఇమామ్‌ మాలిక్‌)

5097 – [ 30 ] ( حسن ) (3/1411)

وَرَوَاهُ أَحْمَدُ عَنْ أَبِيْ هُرَيْرَةَ

5097. (30) [3/1411 ప్రామాణికం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: (అ’హ్మద్‌)

5098 – [ 31 ] ( لم تتم دراسته ) (3/1411)

وَعَنْ جَعْفَرِ بْنِ مُحَمَّدٍ عَنْ أَبِيْهِ قَالَ: كَانَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم إِذَا نَظَرَفِي الْمِرْآةِ قَالَ: “الْحَمْدُ لِلّهِ الَّذِيْ حَسَّنَ خَلْقِيْ وَخُلُقِيْ وَزَانَ مِنِّيْ مَا شَانَ مِنْ غَيْرِيْ”. رَوَاهُ الْبَيْهَقِيُّ فِيْ “شُعَبِ الْإِيْمَانِ” مُرْسَلًا.

5098. (31) [3/1411అపరిశోధితం]

జ’అఫర్‌ బిన్‌ ము’హమ్మద్‌ తన తండ్రి ద్వారా కథనం: ప్రవక్త (స) అద్దంలో తన ముఖాన్ని చూచినపుడు కృతజ్ఞతగా ఈ దు’ఆ పఠించేవారు. అల్‌’హమ్‌దు లిల్లాహిల్లజీ ‘హస్సన ‘ఖల్‌ఖీ వ ‘ఖుల్‌ఖీ వ ‘జాన మిన్నీ మా షాన మిన్‌ ‘గైరీ.” -‘స్తోత్రాలన్నీ నన్ను నా నైతికతను అందంగా తీర్చి దిద్దిన ఆయనకే. ఆయనే వీటిద్వారా నన్ను అలంకరించాడు. ఇతరుల కంటే నన్ను పరిపూర్ణంగా సృష్టించాడు.” (బైహఖీ – షు’అబిల్ ఈమాన్,  తాబయీ  ప్రోక్తం)

5099 – [ 32 ] ( صحيح ) (3/1411)

وَعَنْ عَائِشَةَ قَالَتْ: كَانَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ: “اَللّهُمَّ حَسَّنْتَ خَلْقِيْ فَأَحْسِنْ خُلُقِيْ”. رَوَاهُ أَحْمَدُ.

5099. (32) [3/1411దృఢం]

‘ఆయి’షహ్‌ (ర) కథనం: ప్రవక్త(స) అద్దంలో చూచి నపుడు ఈ దు’ఆ పఠించేవారు, అల్లాహుమ్మ హస్సన్‌త ‘ఖల్‌ఖీ అ’సిను’ఖుల్‌ఖీ.”  – ‘ఓ అల్లాహ్‌! నన్ను అందంగా తీర్చి దిద్దావు, మరి నా నైతికతను కూడా అందంగా తీర్చి దిద్దు.’ (అ’హ్మద్‌)

5100 – [ 33 ] ( لم تتم دراسته ) (3/1411)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “أَلَا أُنَبِّئُكُمْ بِخِيَارِكُمْ؟” قَالُوْا: بَلَى. قَالَ: “خِيَارُكُمْ أَطْوَلُكُمْ أَعْمَارًا وَأَحْسَنُكُمْ أَخْلَاقًا”. رَوَاهُ أَحْمَدُ.

5100. (33) [3/1411అపరిశోధితం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ‘మీలో అందరి కంటే మంచివారెవరో చెప్పనా,’ అని అన్నారు. దానికి ప్రజలు, ‘తప్పకుండా ఓప్రవక్తా!’ అని విన్నవించు కున్నారు. అప్పుడు ప్రవక్త (స), ‘మీలో అధిక ఆయుష్షు, ఉత్తమ నడవడిక గలవారే ఉత్తములు,’ అని ప్రవచించారు. (అ’హ్మద్‌)

5101 – [ 34 ] ( حسن ) (3/1411)

وَعَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “أَكْمَلُ الْمُؤْمِنِيْنَ إِيْمَانًا أَحْسَنُهُمْ خُلُقًا”. رَوَاهُ أَبُوْ دَاوُدَ وَالدَّارَمِيُّ.

5101. (34) [3/1411 ప్రామాణికం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”అందరికంటే అధికంగా ఉత్తమ గుణవంతులే పరిపూర్ణ విశ్వాసం గలవారు.” (అబూ దావూద్‌, దార్మీ)

5102 – [ 35 ] ( لم تتم دراسته ) (3/1411)

وَعَنْهُ أَنَّ رَجُلًا شَتَمَ أَبَا بَكْرٍ وَالنَّبِيُّ صلى الله عليه وسلم جَالِسٌ يَتَعَجَّبُ وَيَتَبَسَّمُ فَلَمَّا أَكْثَرَ رَدَّ عَلَيْهِ بَعْضَ قَوْلِهِ فَغَضِبَ النَّبِيُّ صلى الله عليه وسلم. وَقَامَ فَلَحِقَهُ أَبُوْ بَكْرٍ. وَقَالَ: يَا رَسُوْلَ اللهِ كَانَ يَشْتِمُنِيْ وَأَنْتَ جَالِسٌ. فَلَمَّا رَدَدْتُ عَلَيْهِ بَعْضَ قَوْلِهِ غَضِبْتَ وَقُمْتَ. قَالَ: “كَانَ مَعَكَ مَلَكٌ يَرُدُّ عَلَيْهِ. فَلَمَّا رَدَدْتَ عَلَيْهِ وَقَعَ الشَّيْطَانُ”. ثُمَّ قَالَ: “يَا أَبَا بَكْرٍ ثَلَاثٌ كُلُّهُنَّ حَقٌّ: مَا مِنْ عَبْدٍ ظُلِمَ بِمَظْلَمَةٍ فِيْ فَيُغْضِيَ عَنْهَا لِلّهِ عَزَّ وَجَلَّ إِلَّا أَعَزَّ اللهُ بِهَا نَصْرَهُ وَمَا فَتَحَ رَجُلٌ بَابَ عَطِيَّةٍ يُرِيْدُ بِهَا صِلَةً إِلَّا زَادَ اللهُ بِهَا كَثْرَةً وَمَا فَتَحَ رَجُلٌ بَابَ مَسْأَلَةٍ يُرِيْدُ بِهَا كَثْرَةٌ إِلَّا زَادَ اللهُ بِهَا قِلَّةً”. رَوَاهُ أَحْمَدُ .

5102. (35) [3/1411అపరిశోధితం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) కూర్చొని ఉన్నారు, ప్రవక్త (స) ముందు ఒక వ్యక్తి అబూ బకర్‌ (ర)ను తిట్టసాగాడు, దుర్భాషలాడసాగాడు. ప్రవక్త (స) దాన్ని వింటూ ఉన్నారు. ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ చిరునవ్వు  నవ్వుతూ ఉన్నారు. ఆ వ్యక్తి ఈ విషయంలో హద్దుమీరి పోయాడు. అబూ బకర్‌ (ర) అతని కొన్ని మాటలకు సమా ధానం ఇచ్చారు. దానిపై ప్రవక్త (స) అయిష్టానికి గురయి లేచి వెళ్ళ సాగారు. అబూ బకర్‌ (ర) ప్రవక్త (స) వెనుకనే నడుస్తూ ఇంటికిచేరారు. అప్పుడు అబూ బకర్‌, ”ఓ ప్రవక్తా! ఫలానా వ్యక్తి నన్ను మీ ముందు తిడుతూ ఉన్నాడు, తమరు అప్పుడు కూర్చొని ఉన్నారు. అతడు హద్దుమీరి ప్రవర్తించి నందుకు అతని కొన్ని మాట లకు నేను సమాధానం ఇచ్చాను. దానిపై తమరు అయిష్టానికి గురయి లేచి వచ్చేసారు. ఇందులో నా తప్పేముంది? తప్పు అతనిదే,” అని  అన్నారు.

అది విని, ప్రవక్త (స) ”అతడు నిన్ను తిడుతూ, నువ్వు మౌనంగా ఉన్నంత వరకు నీ వెంట ఉన్న ఒక దైవదూత నీ తరఫున సమాధానం ఇస్తూ ఉన్నాడు. నువ్వు స్వయంగా సమాధానం ఇవ్వటం ప్రారంభిస్తే ఆ దైవదూత వెళ్ళిపోయాడు. అక్కడ షై’తాన్‌ వచ్చేసాడు,” అని తెలిపి, ఓ అబూ బకర్‌! ఈ మూడు విషయాలు వాస్తవమైనవి. 1. బాధితుడు అల్లాహ్ (త) ప్రీతి పొందటానికి మౌనంగా ఉంటే, అల్లాహ్‌ (త) స్వయంగా అతనికి సహాయం చేస్తాడు. ఇంకా అతని గౌరవాన్ని అధికం చేస్తాడు. 2. దానధర్మాల ద్వారా బంధువులకు సహాయం చేసేవాడికి అల్లాహ్‌ (త) చాలా అధికంగా ప్రసాదిస్తాడు. 3. అర్థింపు ద్వారా సంపాదించే వ్యక్తి దాని ద్వారా తన ధనాన్ని అధికం చేస్తే, అల్లాహ్‌ (త) అతని ధనాన్ని తరిగిస్తాడు.  (అ’హ్మద్‌)

5103 – [ 36 ] ( لم تتم دراسته ) (3/1412)

وعَنْ عَائِشَةَ قَالَت: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: لَا يُرِيْدُ اللهُ بِأَهْلِ بَيْتٍ رِفْقًا إِلَّا نَفَعَهُمْ وَلَا يَحْرِمَهُمْ إِيَّاهُ إِلَّا ضَرَّهُمْ”. رَوَاهُ الْبَيْهَقِيُّ فِيْ “شُعَبِ الْإِيْمَانِ”.

5103. (36) [3/1412  అపరిశోధితం]

‘ఆయి’షహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”సున్నిత స్వభావం ప్రసాదించిన కుటుంబానికి అల్లాహ్‌ (త) దాని ద్వారా లాభం చేకూరుస్తాడు. అదే విధంగా సున్నిత స్వభావానికి దూరంగా ఉంచబడిన కుటుంబానికి అల్లాహ్‌ (త) దాని ద్వారా హాని చేకూరుస్తాడు.”  (బైహఖీ)

అంటే సున్నితంగా వ్యవహరించే వారికి లాభం చేకూరుతుంది. కఠినంగా వ్యవహరించే వారికి నష్టం చేకూరుతుంది.

=====

20 بَابُ الْغَضَبِ وَالْكِبْرِ

20. కోపం, అహంకారం

اَلْفَصْلُ الْأَوَّلُ  మొదటి విభాగం