24. స్వప్నాలు | మిష్కాతుల్ మసాబీహ్

24- كِتَابُ الرُّؤْيَا
24. స్వప్నాల పుస్తకం

‘అబ్దుర్ర’హ్మాన్‌ బిన్‌ ‘ఖుల్‌దూన్‌ తన పుస్తకమైన ముఖద్దమ ఇబ్నెఖుల్దూన్లో దైవదౌత్య వాస్తవి కతను, జ్యోతిష్య వాస్తవికతను ప్రస్తావిస్తూ స్వప్నాల విషయంలో చాలా పరిశీలన చేసారు. పరిశోధన జరిపారు. మీరు దీన్ని గురించి తెలుసు కోవాలని, మేము దీన్ని సంక్షిప్తంగా ఇక్కడ పేర్కొంటున్నాము. ఆయన  ఇలా  పేర్కొన్నారు:

ప్రవక్త (స) ప్రవచనం, ”స్వప్నం దైవదౌత్యం యొక్క 40వ భాగం. మరో ‘హదీసు’లో 43వ భాగం, మరో ‘హదీసు’లో 70వ భాగం అని ఉంది. ప్రారంభంలో వ’హీ స్వప్నం రూపంలో వచ్చేది. 6 నెలల వరకు ఇలాగే వచ్చేది. మక్కహ్, మదీనహ్ రెండు ప్రాంతాలను కలపి 23 సంవత్సరాల్లో అవతరించింది. ఈ విధంగా స్వప్నం దైవదౌత్యంలో 46వ వంతు అయింది. 6 నెలలు 23 సంవత్సరాలకు 46వ వంతు అయింది. ఇది కేవలం ప్రవక్తలకే పరిమితం.

ప్రవక్త (స) స్వప్నాలను శుభవార్తలుగా పరిగ ణించారు. ఇంకా దైవదౌత్యం పూర్తయింది, ‘ఇప్పుడు కేవలం ముబష్షి రాత్‌ మిగిలి ఉన్నాయి,’ అని అన్నారు. దానికి ప్రజలు, ‘ఈ ముబష్షిరాత్‌ అంటే ఏమిటి?’ అని విన్నవించుకున్నారు. దానికి ప్రవక్త (స), ‘నిజ స్వప్నాలు, వీటిని పుణ్యాత్ములు, పరిశుద్ధులే చూస్తారు,’ అని  అన్నారు.

ఒక ప్రామాణిక ‘హదీసు’లో ఇలా ఉంది: స్వప్నాలు మూడు రకాలు. 1. అల్లాహ్‌ (త) తరఫు నుండి, 2. దైవదూతల తరఫు నుండి,  3. షై’తాన్‌ ప్రేరణలు.

అల్లాహ్‌ (త) ఖుర్‌ఆన్‌లో యూసుఫ్‌, ఇబ్రాహీమ్‌ల స్వప్నాల గురించి పేర్కొన్నాడు.  యూసుఫ్‌ (అ) గురించి ఇలా పేర్కొన్నాడు:

”యూసుఫ్‌ తన తండ్రితో: ”ఓ నాన్నా! నేను వాస్తవంగా (కలలో) పదకొండు నక్షత్రాలను, సూర్యుణ్ణి మరియు చంద్రుణ్ణి చూశాను; వాటిని నా ముందు సాష్టాంగ పడుతున్నట్లు చూశాను.” అని అన్న ప్పుడు! (అతని తండ్రి) అన్నాడు: ”ఓ నా చిన్న ప్రియకుమారుడా! నీ స్వప్నాన్ని నీ సోదరులకు తెలుపకు. ఎందుకంటే వారు నీకు విరుధ్ధంగా కుట్ర పన్నవచ్చు!  నిశ్చయంగా, షై’తాన్‌ మానవునికి బహిరంగ శత్రువు.”  (యూసుఫ్‌, 12:4-5)

జైలులో అతనితో పాటు మరో ఇద్దరు బానిసలు కూడా ప్రవేశించారు. వారిలో ఒకరు ఇలా అన్నారు, ” మరియు అతనితో బాటు ఇద్దరు యువకులు కూడా చెరసాలలో ప్రవేశించారు. వారిలో ఒకడు అన్నాడు: ”నేను సారాయి పిండుతూ ఉన్నట్లు కలచూశాను!” రెండో వాడు అన్నాడు: ”నేను నా తలపై రొట్టెలు మోస్తున్నట్లు, వాటిని పక్షులు తింటున్నట్లు కలలో చూశాను.” (ఇద్దరూ కలిసి అన్నారు): ”మాకు దీని భావాన్ని తెలుపు. నిశ్చయంగా, మేము నిన్ను సజ్జనునిగా చూస్తున్నాము.” (యూసుఫ్‌, 12:36)

అదేవిధంగా ఈజిప్టు రాజు కలగన్నాడు. దాన్ని గురించి తన సభికులను ప్రశ్నించాడు. వారు ఇవన్నీ కాకమ్మ కథలు అని కొట్టిపారేసారు. చివరికి దాన్ని గురించి యూసుఫ్‌ను ప్రశ్నించటం జరిగింది. యూసుఫ్‌ దాని పరమార్థాన్ని తెలియపరిచారు.

”(ఒక రోజు) రాజు అన్నాడు: ”వాస్తవానికి నేను (కలలో) ఏడు బలిసిన ఆవులను, ఏడు బక్కచిక్కిన (ఆవులు) తినివేస్తున్నట్లు మరియు ఏడుపచ్చి వెన్నులను మరొక ఏడు ఎండిపోయిన వాటిని చూశాను. ఓ సభా సదులారా! మీకు స్వప్నాలభావం తెలిస్తే నాస్వప్నపు భావాన్ని తెలుపండి!” వారన్నారు: ”ఇవి పీడకలలు. మరియు మాకు కలల గూఢార్థం తెలుసుకునే  నైపుణ్యం లేదు!” ఇద్దరు బందీలలో నుండి విడుదల పొందిన వ్యక్తికి చాలాకాలం తరువాత ఇప్పుడా విషయం గుర్తుకు వచ్చింది. అతడు అన్నాడు: ”నేను దీని గూఢార్థాన్ని  మీకు తెలుపుతాను, దానికి నన్ను (యూసుఫ్‌ వద్దకు) పంపండి.” (అతడు అన్నాడు): ”యూసుఫ్‌! సత్యవంతుడా! నాకు – ఏడు బలిసిన ఆవులను, ఏడు బక్కచిక్కిన ఆవులు తినివేయటాన్ని; మరియు ఏడు పచ్చివెన్నుల మరి ఏడు ఎండిపోయిన (వెన్నుల) – గూఢార్థ మేమిటో చెప్పు. నేను (రాజ సభలోని) ప్రజల వద్దకు పోయి (చెబుతాను), వారు దానిని తెలుసు కుంటారు.” (యూసుఫ్) అన్నాడు: ”మీరు యథా ప్రకారంగా ఏడు సంవత్సరాలు సేద్యం చేస్తూ ఉంటారు, కాని మీరు కోసిన పంటలో కొంత భాగాన్ని మాత్రమే తినటానికి ఉపయో గించుకొని, మిగిలిందంతా, వెన్నులతోనే కొట్లలో ఉంచి (భద్రపరచండి). తరువాత చాలా కఠినమైన ఏడు సంవత్సరాలు వస్తాయి, వాటిలో మీరు ముందే నిలువచేసి ఉంచిన దానిని తింటారు. మీరు (విత్తనాని కోసం) భద్రంగా ఉంచుకున్న కొంత భాగం తప్ప! తరువాత ఒక సంవత్సరం వస్తుంది. అందులో ప్రజలకు పుష్కలమైన వర్షాలు కురుస్తాయి. అందులో వారు (రసం / నూనె) తీస్తారు (పిండుతారు).” (యూసుఫ్‌, 12:43-49)

స్వప్నాల పరమార్ధం తెలిపే వారు ఈ క్రింది ఉత్తమ గుణాలు కలిగి  ఉండాలి:

1. ఖుర్‌ఆన్‌ పండితుడై ఉండాలి. 2. ప్రవక్త (స) ‘హదీసు’లు కంఠస్తం అయి ఉండాలి. 3. అరబీ భాష వచ్చినవాడై ఉండాలి. 4. ప్రజల పరిస్థితులు తెలిసిన వాడై ఉండాలి. 5. పరమార్థ నియమాలు తెలిసినవాడై ఉండాలి. 6. పరిశుద్ధుడై ఉండాలి. 7. ఉత్తమ గుణాలు కలవాడై ఉండాలి. 8. సద్వచనుడు, నిర్మలమైన హృదయం  కలవాడై  ఉండాలి.

اَلْفَصْلُ الْأَوَّلُ మొదటి విభాగం   

4606 – [ 1 ] ( صحيح ) (2/1297)

عَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَمْ يَبْقَ مِنَ النُّبُوَّةِ إِلَّا الْمُبِشِّرَاتِ”. قَالُوْا: ومَا الْمُبَشِّرَاتُ؟ قَالَ: “اَلرُّؤْيَا الصَّالِحَةُ”. رَوَاهُ الْبُخَارِيُّ .

4606. (1) [2/1297 దృఢం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స), ‘దైవ దౌత్యంలో శుభస్వప్నాలు తప్ప మరేమీ మిగలలేదు.’ అని అన్నారు. దానికి ప్రజలు, ‘ఈ శుభవార్తలు అంటే ఏమిటి?’ అని అడిగారు. ప్రవక్త (స), ‘నిజమైన స్వప్నాలు,’  అని  అన్నారు.  (బు’ఖారీ)

4607 – [ 2 ] ( متفق عليه ) (2/1297)

وَزَادَ مَالِكٌ بِرِوَايَةِ عَطَاءِ بْنِ يَسَارٍ:”يَرَاهَا الرَّجُلُ الْمُسْلِمُ أَوْتُرَى لَهُ”.

4607. (2) [2/1297]

‘అ’తా బిన్‌ యసార్‌ కథనం. [1](మాలిక్‌)

4608 – [ 3 ] ( متفق عليه ) (2/1297)

وَعَنْ أَنَسٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “الرُّؤْيَا الصَّالِحَةُ جُزْء مِّنْ سِتَّةٍ وَأَرْبَعِيْنَ جُزْءًا مِّنَ النُّبُوَّةِ” .

4608. (3) [2/1297ఏకీభవితం]

అనస్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”నిజమైన స్వప్నం దైవదౌత్య 46 భాగాల్లో ఒక భాగం.” (బు’ఖారీ, ముస్లిమ్‌)

దీన్నిగురించి ఇంతకుముందు వివరించబడింది.

4609 – [ 4 ] ( متفق عليه ) (2/1297)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم قَالَ: “مَنْ رَآنِيْ فِي الْمَنَامِ فَقَدْ رَآنِيْ فَإِنَّ الشَّيْطَانَ لَا يَتَمَثَّلُ فِيْ صُوْرَتِيْ”.

4609. (3) [2/1297ఏకీభవితం]

 అబూ హురైరహ్‌ (ర) కథనం : ప్రవక్త (స) ప్రవచనం, ”ఎవరైనా నన్ను స్వప్నంలో చూస్తే, అతడు నన్నే చూసాడు. ఎందుకంటే షై’తాన్‌ నా రూపం ధరించలేడు.” (బు’ఖారీ, ముస్లిమ్‌)

4610 – [ 5 ] ( متفق عليه ) (2/1297)

وَعَنْ أَبِيْ قَتَادَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَنْ رَآنِيْ فَقَدْ رَأَى الْحَقَّ”.

4610. (5) [2/1297ఏకీభవితం]

అబూ ఖతాదహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”స్వప్నంలో నన్ను చూచిన వ్యక్తి, నిజంగా నన్నే చూచాడు.”  (బు’ఖారీ, ముస్లిమ్‌)

4611 – [ 6 ] ( متفق عليه ) (2/1297)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم:”مَنْ رَآنِيْ فِي الْمَنَامِ فَيَسَرَانِيْ فِي الْيَقْظَةِ وَلَا يَتَمَثَّلُ الشَّيْطَانُ بِيْ”.

4611. (6) [2/1297ఏకీభవితం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”స్వప్నంలో నన్ను చూచిన వ్యక్తి, నన్ను ప్రత్యక్షంగా కూడా చూస్తాడు. ఎందుకంటే షై’తాన్‌ నా రూపాన్ని ధరించలేడు.”  (బు’ఖారీ, ముస్లిమ్‌)

ఇది కేవలం ఆయన కాలానికే పరిమితం, లేదా తీర్పుదినం నాడు ప్రవక్త (స)ను ప్రత్యక్షంగా చూస్తాడు.

4612 – [ 7 ] ( متفق عليه ) (2/1297)

وَعَنْ أَبِيْ قَتَادَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “الرُّؤْيَا الصَّالِحَةُ مِنَ اللهِ وَالْحُلْمُ مِنَ الشَّيْطَانِ فَإِذَا رَأَى أَحَدُكُمْ مَا يُحِبُّ فَلَا يُحَدِثُ بِهِ إِلَّا مَنْ يُحِبُّ وَإِذَا رَأَى مَا يَكْرَهُ فَلْيَتَعَوَّذُ بِاللهِ مِنْ شَرِّهَا وَمِنْ شَرِّ الشَّيْطَانِ وَلْيَتْفُلْ ثَلَاثًا وَلَا يُحَدِّثُ بِهَا أَحَدًا فَإِنَّهَا لَنْ تَضُرَّهُ”.

4612. (7) [2/1297ఏకీభవితం]

అబూ ఖతాదహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మంచి స్వప్నం అల్లహ్(త) తరఫు నుండి ఉంటుంది, ఎవరైనా సంతోషకరమైన స్వప్నంచూస్తే, అతడు తన ఆప్తమిత్రునికి తెలియపరచాలి. (దాని సరియైన పర మార్థం తెలుస్తుంది). మరెవరైనా అసహ్యకరమైన స్వప్నం చూస్తే, షై’తాన్‌ చెడునుండి అల్లాహ్‌ (త)ను శరణుకోరాలి. మూడుసార్లు ఉమ్మివేయాలి. ఇతరు లెవరికీ తెలియపర్చరాదు. ఎందుకంటే స్వప్నం అతనికి ఎటువంటి హానీ చేకూర్చలేదు. (బు’ఖారీ, ముస్లిమ్‌)

4613 – [ 8 ] ( صحيح ) (2/1297)

وَعَنْ جَابِرٍقَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِذَا رَأَى أَحَدُكُمْ الرُّؤْيَا يَكْرَهُهَا فَلْيَبْصُقْ عَنْ يَسَارِهِ ثَلَاثًا وَلْيَسْتَعِذْ بِاللهِ مِنَ الشَّيْطَانِ ثَلَاثًا وَلْيَتَحَوَّلْ عَنْ جَنْبِهِ الَّذِيْ كَانَ عَلَيْهِ”. رَوَاهُ مُسْلِمٌ  .

4613. (8) [2/1297దృఢం]

జాబిర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మీలో ఎవరైనా అసహ్యకరమైన స్వప్నం చూస్తే, అతడు తన ఎడమ వైపు మూడుసార్లు ఉమ్మివేయాలి ఇంకా షై’తాన్‌ చెడు నుండి అల్లాహ్‌ శరణు కోరాలి. ఇంకా ప్రక్క మార్చు కోవాలి.  (ముస్లిమ్‌)

4614 – [ 9 ] ( متفق عليه ) (2/1298)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِذَا اقْتَرَبَ الزَّمَانُ لَمْ يَكَدْ يَكْذِبْ رُؤْيَا الْمُؤْمِنِ وَرُؤْيَا الْمُؤْمِنِ جُزْءٌ مِّنْ سِتَّةٍ وَأَرْبَعِيْنَ جُزْءًا مِّنْ النَّبُوَّةِ وَمَا كَانَ مِنَ النُّبُوَّةِ فَإِنَّهُ لَا يُكَذَّبُ”. قَالَ مُحَمَّدُ بْنِ سِيْرِيْنَ: وَأَنَا أَقُوْلُ: الرُّؤْيَا ثَلَاثٌ: حَدِيْثُ النَّفْسِ وَتَخْوِيْفُ الشَّيْطَانِ وَبُشْرَى مِنَ اللهِ. فَمَنْ رَأَى شَيْئًا يَكْرَهُهُ فَلَا يَقُصَّهُ عَلَى أَحَدٍ وَلْيَقُمْ فَلْيُصَلِّ قَالَ: وَكَانَ يَكْرَهُ الْغُلَّ فِي النَّوْمِ وَيُعْجِبُهُمْ الْقَيْدُ وَيقَالَ: اَلْقَيْدُ ثُبَاتٌ فِي الدِّيْنِ .

4614. (9) [2/1298ఏకీభవితం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”కాలం దగ్గరైతే ఏ విశ్వాసి స్వప్నం అసత్యం కాజా లదు. విశ్వాసి స్వప్నం దైవదౌత్య 46 భాగాల్లోని ఒక భాగం. దైవదౌత్యంలోని ఏ భాగమూ అసత్యం కాజా లదు. ”ము’హమ్మద్‌ బిన్‌ సీరీన్‌ కథనం: స్వప్నాలు మూడు విధాలు అని నేను భావి స్తున్నాను: 1. ఆలోచన, ఊహ, 2. షై’తాన్‌ భయం, 3. అల్లాహ్‌ (త) తరఫు నుండి శుభవార్త. అయితే అసహ్య కరమైన స్వప్నం చూస్తే, ఎవరికీ తెలియపరచరాదు. నిలబడి నమా’జ్‌ చదవాలి. ప్రవక్త (స) స్వప్నంలో సంకెళ్ళు చూడ టాన్ని అసహ్యంగా భావించేవారు, జైలును చూడటాన్ని సంతోషకరమైనదిగా భావించేవారు. జైలు ద్వారా సిర్థత్వం వైపు సూచించడం జరుగు తుంది. (బు’ఖారీ, ముస్లిమ్‌)

4615 – [ 10 ] ( صحيح ) (2/1298)

قَالَ الْبُخَارِيُّ: رَوَاهُ قَتَادَةُ وَيُوْنُسُ وَهَشَامٌ وَأَبُوْ هِلَالِ عَنِ ابْنِ سَيْرِيْنَ عَنْ أَبِيْ هُرَيْرَةَ. وَقَالَ يُوْنُسُ: لَا أَحْسِبُهُ إِلَّا عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم فِي الْقَيْدِ. وَقَالَ مُسْلِمٌ: لَا أَدْرِيْ هُوَفِي الْحَدِيْثِ أَمْ قَالَهُ ابْنُ سِيْرِيْنَ؟

وَفِيْ رِوَايَةٍ نَحْوَهُ وَأَدْرَجَ فِي الْحَدِيْثِ قَوْلَهُ:”وَأَكْرَهُ الْغُلَّ”. إِلى تَمَامِ الْكَلَامِ .

4615. (10) [2/1298దృఢం]

బు’ఖారీ కథనం: ”ఈ ‘హదీసు’ను ఖతాదహ్‌ మరియు యూనుస్‌, హుషైమ్‌, అబూ హిలాల్‌ ము’హమ్మద్‌ బిన్‌ సైరీన్‌ ద్వారా ఉల్లేఖించారు. ఇబ్నె సైరీన్‌ అబూ హురైరహ్‌ ద్వారా ఉల్లేఖించారు. యూనుస్‌ అభిప్రాయం: జైలును స్థిరత్వంగా పరమార్థంగా తెలుపుట ప్రవక్త (స) ప్రవచనమే. అయితే ముస్లిమ్‌ దీన్ని ‘హదీసు’ భాగం లేదా ఇబ్నె సీరీన్‌ అభిప్రాయం కావచ్చు. అంటే ఇందులో అనుమానం ఉంది.[2]

4616 – [ 11 ] ( صحيح ) (2/1298)

وَعَنْ جَابِرٍقَالَ: جَاءَ النَّبِيُّ صلى الله عليه وسلم فَقَالَ: رَأَيْتُ فِي الْمَنَامِ كَأَنَّ رَأْسِيْ قُطِعَ. قَالَ: فَضَحِكَ النَّبِيُّ صلى الله عليه وسلم وَقَالَ: “إِذَا لَعِبَ الشَّيْطَانُ بِأَحَدِكُمْ فِيْ مَنَامِهِ فَلَا يُحَدِّثْ بِهِ النَّاسَ. رَوَاهُ مُسْلِمٌ .

4616. (11) [2/1298దృఢం]

జాబిర్‌ (ర) కథనం: ప్రవక్త (స) వద్దకు ఒక వ్యక్తి వచ్చి, ‘నా తల నరికివేయబడినట్టు నేను కల గన్నాను,’ అని విన్నవించుకున్నాడు. అది విని ప్రవక్త (స) నవ్వ సాగారు. ఇంకా, ‘ఇవి షై’తానీ పీడకలలు, వీటిని గురించి ఇతరులకు తెలియపరచ వద్దు,’ అని సూచించారు. (ముస్లిమ్‌)

4617 – [ 12 ] ( صحيح ) (2/1298)

وَعَنْ أَنَسٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “رَأَيْتُ ذَاتَ لَيْلَةٍ فِيْمَا يَرَى النَّائِمُ كَأَنَّا فِيْ دَارِعُقْبَةَ بْنِ رَافِعٍ فَأُوْتِيْنَا بِرُطَبٍ مِن رُطَبِ ابْنِ طَابٍ فَأَوَّلْتُ أَنَّ الرِّفْعَةَ لَنَا فِي الدُّنْيَا وَالْعَاقِبَةَ فِي الْآخِرَةِ وَأَنَّ دِيْنَنَا قَدْ طَابَ”. رَوَاهُ مُسْلِمٌ  .

4617. (12) [2/129 8దృఢం]

అనస్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”రాత్రి నేను కలగన్నాను, నేను ‘ఉఖ్‌బబిన్‌ రాఫె’అ ఇంట్లో కూర్చు న్నాను. నాముందుకు ఇబ్నె తాబ్‌ ఖర్జూరాల పళ్ళెం తీసుకురావటంజరిగింది. ఈ కల యొక్క పరమార్థం ప్రపంచంలో మన కోసం ఔన్నత్యం, గౌరవం లభిస్తుం దని, పరలోకంలో శాంతి, క్షేమాలు లభిస్తా యని, మనధర్మం సరైనదనిభావిస్తున్నాను. [3]  (ముస్లిమ్‌)

4618 – [ 13 ] ( متفق عليه ) (2/1299)

وَعَنْ أَبِيْ مُوْسَى عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ: “رَأَيْتُ فِي الْمَنَامِ أَنِّيْ أُهَاجِرُمِنْ مَكَّةَ إِلى أَرْضٍ بِهَا نَخْلٌ فَذَهَبَ وَهْلِيْ إِلى أَنَّهَا الْيَمَامَةُ أَوْهَجَرٌ فَإِذَا هِيَ الْمَدِيْنَةُ يَثْرَبُ. وَرَأَيْتُ فِي رُؤْيَايَ هَذِهِ: أَنِّيْ هَزَزْتُ سَيْفًا فَانْقَطَعَ صَدْرُهُ فَإِذَا هُوَمَا أُصِيْبَ مِنَ الْمُؤْمِنِيْنَ يَوْمَ أُحُدٍ ثُمَّ هَزَزْتُهُ أُخْرَى فَعَادَ أَحْسَنَ مَا كَانَ فَإِذَا هُوَ جَاءَ اللهُ بِهِ مِنَ الْفَتْحِ وَاجْتِمَاعِ الْمُؤْمِنِيْنَ” .

4618. (13) [2/1299ఏకీభవితం]

అబూ మూసా అష్‌’అరీ (ర) కథనం: ప్రవక్త (స) నేను స్వప్నం ఇలా చూసాను. ”నేను మక్కహ్ నుండి ఒక ప్రాంతానికి వలసపోయాను. అక్కడ ఖర్జూరాలు చాలా అధికంగా ఉన్నాయి. దానికి నేను యమామహ్ పట్ట ణం వైపు వలసపోతానని పరమార్థంగా భావించాను. కాని అది మదీనహ్ అని తేలింది. ఎందుకంటే మదీనహ్లో అనేక ఖర్జూర తోటలు ఉన్నాయి. ఇంకా నేను కలలో కరవాలం ఊపుతూ ఉన్నాను, దాని పైభాగం విరిగిపోయింది అని చూచాను. దానికి నేను ఒక యుద్ధంలో చాలామంది ముస్లిములు వీరమరణం పొందుతారని భావించాను. అనంతరం ఉ’హుద్‌ యుద్ధంలో 70 మంది అనుచరులు వీరమరణం పొందారు. ఇంకా చాలామంది గాయపడ్డారు. రెండవ సారి ఆ కరవాలాన్నే ఊపాను. మొదటి కన్నా మంచి స్థితి తటస్థించింది. దానికి నేను అల్లాహ్‌ (త) విజయం ప్రసాదిస్తాడని భావించాను. అనంతరం మక్కహ్ విజయం, ‘హుదైబియహ్ ఒప్పందం లభించింది.[4](బు’ఖారీ, ముస్లిమ్‌)

4619 – [ 14 ] ( صحيح ) (2/1299)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: قَالَ رَسُولُ اللهِ صلى الله عليه وسلم: “بَيْنَا أَنَا نَائِمٌ بِخَزَائِنِ الْأَرْضِ فَوُضِعَ فِي كَفِّيْ سَوَارَانِ مِنْ ذَهَبٍ فَكَبُرَا عَلَيَّ فَأُوْحِيَ إِلَيَّ أَنْ أنْفُخْهُمَا فَنَفَخْتُهُمَا فَذَهَبَا فَأوَّلْتُهُمَا الْكَذَّابَيْنِ اللَّذَيْنِ أَنَا بَيْنَهُمَا صَاحِبُ صَنْعَاءَ وَصَاحِبُ الْيَمَامَةِ. مُتَّفَقٌ عَلَيْهِ .

وَفِيْ رِوَايَةٍ: “يُقَالُ لِأَحَدِهِمَا مُسْيَلْمَةَ صَاحِبُ الْيَمَامَةِ وَالْعَنَسِيُّ صَاحِبُ صَنْعَاءَ ” لَمْ أَجِدْ هَذِهِ الرِّوَايَةَ فِيْ (الصَّحِيْحَيْنِ) وَذَكَرَهَا صَاحِبُ الْجَامِعِ عَنِ التِّرْمِذِيِّ  

4619. (14) [2/1299దృఢం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”కలలో నాకు గుప్తనిధులు ప్రసాదించబడ్డాయి, ఇంకా నా రెండు చేతుల్లో రెండు బంగారు కడియాలు తొడి గించ బడ్డాయి. అది నాకు మంచిదనిపించలేదు. అయిష్టతకు గురయ్యాను. మరల కలలోనే వాటిపై ఊదమని ఆదేశించడంజరిగింది. నేనువాటిపై ఊదాను. ఆ రెండు కడియాలు ఎగిరిపోయాయి. దానికి నేను నా కాలంలో ఇద్దరు అబద్ధాల కోరులు పుడతారని తాము దైవప్రవక్తలమని వాదిస్తారని, వారి మధ్య నేను ఉన్నానని, వారిలో ఒకడు సన్ఆకు చెందిన వాడని, మరొకడు యమామకు చెందినవాడని అన్నారు. ఒక ఉల్లేఖనంలో ముసైలమహ్ యమామకు చెందిన వాడని, మరొకడు అనసీ సన్‌ఆకు చెందినవాడు అని ఉంది. [5]  (బుఖారీ, ముస్లిమ్‌)

4620 – [ 15 ] ( صحيح ) (2/1299)

وَعَنْ أُمِّ الْعَلَاءِ الْأَنْصَارِيَّةِ قَالَتْ: رَأَيْتُ لِعُثْمَانَ بْنَ مَظْعُوْنِ فِي النَّوْمِ عَيْنًا تَجْرِيْ فَقَصَصْتُهَا عَلَى رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم فَقَالَ: “ذَلِكَ عَمَلُهُ يَجْرِيْ لَهُ”. رَوَاهُ الْبُخَارِيُّ .

4620. (15) [2/1299దృఢం]

ఉమ్ముల్‌ ‘అలా అ’న్సారీ (ర) కథనం: నేను కలలో ‘ఉస్మాన్‌ బిన్‌ మజ్‌’ఊన్‌ యొక్క పారుతున్న కాలువను చూచాను. ఆ కల గురించే నేను ప్రవక్త (స) ముందు ప్రస్తావించాను. ప్రవక్త (స) ఆ కల పరమార్థంగా, అది ‘ఉస్మాన్‌ (ర) ఆచరణ, అతని మరణానంతరం కూడా కొనసాగుతుంది,’  అని అన్నారు. (బు’ఖారీ)

4621 – [ 16 ] ( صحيح ) (2/1299)

وَعَنْ سَمُرَةَ بْنِ جُنْدُبٍ قَالَ: كَانَ النَّبِيُّ صلى الله عليه وسلم إِذَا صَلَّى أَقْبَلَ عَلَيْنَا بِوَجْهِهِ فَقَالَ: “مَنْ رَأَى مِنْكُمُ اللَّيْلَةَ رُؤْيَا؟” قَالَ: فَإِنْ رَأَى أَحَدٌ قَصَّهَا فَيَقُوْلُ: مَا شَاءَ اللهُ فَسَأَلَنَا يَوْمًا فَقَالَ: “هَلْ رَأَى مِنْكُمْ أَحَد رُؤْيَا؟” قُلْنَا: لَا. قَالَ: “لَكِنِّيْ رَأَيْتُ اللَّيْلَةَ رَجُلَيْنِ أَتَيَانِيْ فَأَخَذَا بِيَدِيَّ فَأَخْرَجَانِيْ إِلى أَرْضٍ مُقَدَّسَةٍ فَإِذَا رَجُلٌ جَالِسٌ وَرَجُلٌ قَائِمٌ بِيَدِهِ كَلُّوْبٌ مِنْ حَدِيْدٍ يُدْخِلُهُ فِيْ شِدْقِهِ فَيَشْقُّهُ حَتَّى يَبْلُغَ قَفَاهُ ثُمَّ يَفْعَلُ بِشِدْقِهِ الْآخَرِ مِثْلَ ذَلِكَ وَيَلْتَئِمُ شِدْقُهُ هَذَا فَيَعُوْدُ فَيَصْنَعُ مِثْلَهُ.قُلْتُ:مَا هَذَا؟ قَالَا: انْطَلِقُ فَانْطَلَقْنَا حَتَّى أَتَيْنَا عَلَى رَجُلٍ مُضْطَجِعٍ عَلَى قَفَاهُ وَرَجُلٌ قَائِمٌ عَلَى رَأْسِهِ بِفِهْرٍ أَوْ صَخْرَةٍ يَشْدَخُ بِهَا رَأْسَهُ فَإِذَا ضَرَبَهُ تَدَهْدَهُ الْحَجَرُ فَانْطَلَقَ إِلَيْهِ لِيَأْخُذَهُ فَلَا يَرْجِعُ إِلى هَذَا حَتَّى يَلْتَئِمَ رَأْسُهُ وعَادَ رَأْسُهُ كَمَا كَانَ فَعَادَ إِلَيْهِ فَضَرَبَهُ فَقُلْتُ: مَا هَذَا؟ قَالَا: اِنْطَلِقْ فَانْطَلَقْنَا حَتَّى أَتَيْنَا إِلى ثَقْبٍ مِثْلَ التَّنَّوْرِأَعْلَاهُ ضَيِّقٌ وَأَسْفَلُهُ وَاسِعٌ تَتَوَقَّدُ تَحْتَهُ نَارٌ. فَإِذَا ارْتَفَعَتِ ارْتَفَعُوْا حَتّى كَادَ أَنْ يَخْرُجُوْا مِنْهَا وَإِذَا خَمَدَتْ رَجَعُوْا فِيْهَا وَفِيْهَا رِجَالٌ وَنِسَاءٌ عُرَاةٌ فَقُلْتُ: مَا هَذَا؟ قَالَا: انْطَلِقْ فَانْطَلَقْنَا حَتّى أَتَيْنَا عَلَى نَهْرٍ مِنْ دَمٍ فِيْهِ رَجُلٌ قَائِمٌ عَلَى وَسْطِ النَّهْرِ وَعَلَى شَطِ النَّهْرِرَجُلٌ بَيْنَ يَدَيْهِ حِجَارَةٌ فَأَقْبَلَ الرَّجُلُ الَّذِيْ فِي النَّهْرِ فَإِذَا أَرَادَ أَنْ يَخْرُجَ رَمَى الرَّجُلُ بِحَجَرٍ فِيْ فِيْهِ فَرَدَّهُ حَيْثُ كَانَ فَجَعَلَ كُلَّمَا جَاءَ لِيَخْرُجَ رَمَى فِيْ فِيْهِ بِحَجَرٍ فَيَرْجِعُ كَمَا كَانَ فَقُلْتُ مَا هَذَا؟ قَالَا: انْطَلِقْ فَانْطَلَقْنَا حَتّى اِنْتَهَيْنَا إِلى رَوْضَةٍ خُضَرَاءَ فِيْهَا شَجَرَةٌ عَظِيْمَةٌ وَفِيْ أَصْلِهَا شَيْخٌ وَصِبْيَانٌ وَإِذَا رَجُلٌ قَرِيْبٌ مِّنَ الشَّجَرَةِ بَيْنَ يَدَيْهِ نَارٌ يُوْقِدُهَا فَصَعِدَا بِيَ الشَّجَرَةَ فَأَدْخَلَانِيْ دَارٌ أَوْسَطَ الشَّجَرَةَ لَمْ أَرَ قَطُّ أَحْسَنَ مِنْهَا فِيْهَا رِجَالٌ شُيُوْخٌ وشَبَابٌ وَنِسَاءٌ وَصِبْيَانٌ ثُمَّ أَخْرَجَانِيْ مِنْهَا فَصَعِدَا بِي الشَّجَرَةَ فَأَدْخَلَانِيْ دَارٌ هِيَ أَحْسَنُ وَأَفْضَلُ مِنْهَا فِيْهَا شُيُوْخٌ وَشَبَابٌ. فَقُلْتُ لَهُمَا: إِنَّكُمَا قَدْ طَوَّفْتُمَانِيْ اللَّيْلَةَ فَأَخْبَرَانِيْ عَمَّا رَأَيْتُ قَالَا: نَعَمْ. أَمَّا الرَّجُلُ الَّذِيْ رَأَيْتُهُ يَشُقُّ شِدْقُهُ فَكَذَّابٌ يُحَدِّثُ بِالْكِذْبَةِ فَتُحْمَلُ عَنْهُ حَتَّى تَبْلُغَ الْآفَاقَ فَيُصْنَعُ بِهِ مَا تَرَى إِلى يَوْمِ الْقِيَامَةِ وَالَّذِيْ رَأَيْتَهُ يُشْدَخُ رَأْسُهُ فَرَجُلٌ عَلَّمَهُ اللهُ الْقُرْآنَ فَنَامَ عَنْهُ بِاللَّيْلِ وَلَمْ يَعْمَلْ بِمَا فِيْهِ بِالنَّهَارِ يُفْعَلُ بِهِ مَا رَأَيْتَ إِلى يَوْمِ الْقِيَامَةِ وَالَّذِيْ رَأَيْتَهُ فِي الثَّقَبِ فَهُمُ الزُّنَاةُ وَالَّذِيْ رَأَيْتَهُ فِي النَّهْرِ آكلُ الرِّبَا وَالشَّيْخُ الَّذِيْ رَأَيْتَهُ فِي أَصْلِ الشَّجَرَةِ إِبْرَاهِيْمُ وَالصِّبْيَانُ حَوْلَهُ فَأَوْلَادُ النَّاسِ وَالَّذِيْ يُوْقِدُ النَّارَ. مَالِكٌ خَازِنُ النَّارِ وَالدَّارُ الْأُوْلَى الَّتِيْ دَخَلْتَ دَارُ عَامَّةُ الْمُؤْمِنِيْنَ وَأَمَّا هَذِهِ الدَّارُ فَدَارُ الشُّهَدَاءِ وَأَنَا جِبْرَيْلُ وَهَذَا مِيْكَائِيْلُ فَارْفَعْ رَأْسَكَ فَرَفَعْتُ رَأْسِيْ فَإِذَا فَوْقِيْ مِثْلُ السِّحَابِ وَفِيْ رِوَايَةٍ مِثْلُ الرَّبَابَةِ الْبَيْضَاءِ قَالَا: ذَلِكَ مَنْزِلُكَ قُلْتُ: دَعَانِيْ أَدْخُلْ مَنْزِلِيْ قَالَا: إِنَّهُ بَقِيَ لَكَ عُمُرٌ لَمْ تَسْتَكْمِلْهُ فَلَوِ اسْتَكْمَلْتَهُ أَتَيْتَ مَنْزِلَكَ”. رَوَاهُ الْبُخَارِيُّ. وَذُكِرَحَدِيْثُ عَبْدِ اللهِ بْنِ عُمَرَ فِيْ رُؤْيَا النَّبِيِّ صلى الله عليه وسلم فِي الْمَدِيْنَةِ فِيْ “بَابُ حَرَمِ الْمَدِيْنَةِ”.

4621. (16) [2/1299దృఢం]

సమురహ్‌ బిన్‌ జున్‌దుబ్‌ (ర) కథనం: ప్రవక్త (స)కు ఉదయం నమా’జు చదివి, మా వైపు తిరిగి కూర్చొని, ‘ఈ రోజు రాత్రి మీలో ఎవరైనా కలగంటే వినిపించండి,’ అని అనేవారు. ఎవరైనా చూస్తే, వినిపిస్తే, ప్రవక్త (స) దాని పరమా ర్థాన్ని తెలిపేవారు. ఒకరోజు అలవాటు ప్రకారం మమ్మల్ని, ‘ఈ రోజు రాత్రి ఎవరైనా కల గన్నారా’ అనిఅడిగారు. మేము లేదని అన్నాము. అప్పుడు ప్రవక్త (స), ”ఈ రోజు రాత్రి నేను కల గన్నాను, ఇద్దరు వ్యక్తులు నా దగ్గరకు వచ్చారు. నా రెండు చేతులను పట్టుకొని బైతుల్‌ ముఖద్దస్‌ వెళ్ళారు. నేను కూడా వారివెంట వెళ్ళాను. దారిలో ఒక వ్యక్తి కూర్చున్నాడు, మరో వ్యక్తి నిలుచున్నాడు. అతని చేతిలో ఇనుప కడ్డీ ఉంది. ఆ వ్యక్తి కూర్చున్న వ్యక్తి నోటిలో దాన్ని దూర్చి, అతని నోటిని చీల్చు తున్నాడు. అతని తల వెనుక భాగం వరకు చీల్చు తాడు. ‘అసలు సంగతేంటి?’ అని వారిద్దరినీ అడి గాను. దానికివారు ‘ముందుకుపదండి,’ అనిఅన్నారు. మేము ముందుకు సాగాము. మేము ఒక వ్యక్తిని చూసాము, అతడు వెల్లకిల్లా పడి ఉన్నాడు. అతని తల దగ్గర ఒక వ్యక్తి రాళ్ళు పట్టుకొని నిలబడి ఉన్నాడు. అతడు ఆ రాయితో అతని తల పగల గొడుతున్నాడు. అతడు రాయిని కొడితే ఆ రాయి దూరంగా వెళ్ళి పడుతుంది, ఆ వ్యక్తి తల నుజ్జు నుజ్జు అయిపోతుంది. ఈ వ్యక్తి రాయిని తీసుకోవడానికి వెళితే, ఇటు రెండవ వ్యక్తి తల మొదటి స్థితికి చేరిపో తుంది. ఆ వ్యక్తి తిరిగి వచ్చి మళ్ళీ దాన్ని పగల గొడతాడు. తల నుజ్జు నుజ్జు అయిపోతుంది. మళ్ళీ ఆ రాయి దూరంగా వెళ్ళి పడుతుంది. ఆ వ్యక్తి దాన్ని తీసుకోవటానికి వెళతాడు, మళ్ళీ కొడతాడు. అదేవిధంగా జరుగుతూ ఉంటుంది. నేను వారితో, ‘వీరెవరు,’ అని అడిగాను. దానికి వారిద్దరూ, ‘ముందుకుపదండి,’ అని అన్నారు. మేము ముందుకు సాగాము. మేము ఒక గొయ్యి ప్రక్క నుండి వెళ్ళాము. అది అగ్ని గుండంలా ఉంది. దాని పైభాగం చాలా ఇరుకుగా ఉంది. క్రింది భాగం విశాలంగా ఉంది. దాని క్రింద అగ్ని కాలుతుంది. దాని జ్వాలలు పైవరకు వచ్చేస్తున్నాయి. అందులో నుండి చాలా మంది పారిపోబోతారు. కాని అగ్ని జ్వాలలు ఆరిపోయి లోప లికి వెళ్ళి పోతాయి. వాళ్ళు కూడా లోపలికి వెళ్ళి పోతారు. అందులో చాలామంది పురుషులు, స్త్రీలు నగ్నంగా ఉన్నారు. నేను వారితో, ‘వీరెవరు, వీరికి ఏమయింది?’ అనిఅడిగాను. దానికివారు, ‘ముందుకు పదండి,’ అని అన్నారు. మేము ముందుకు సాగాము. ఒక రక్తం కాలువ వద్దకు చేరాము. దాని ఒడ్డున ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు. ఇంకా కాలువ మధ్య ఒక వ్యక్తి ఈదుతూ కాలువ వద్దకు చేరాలని ప్రయత్ని స్తున్నాడు. కాలువ ఒడ్డున నిలబడిన వ్యక్తి అతని ముందు చాలా రాళ్ళు ఉన్నాయి. ఆ ఈదుతూ ఉన్న వ్యక్తి బయటకు రావాలని కోరుతున్నాడు. కాని ఈ వ్యక్తి రాళ్ళతో కొట్టి అతన్ని మళ్ళీ కాలువ మధ్యకు పంపి వేస్తున్నాడు. ఇలా జరుగుతూనే ఉంటుంది. నేను వారితో, ‘అసలు సంగతిఏంటి?’ అనిఅడిగాను. దానికివారు, ‘ముందుకు పదండి,’ అని అన్నారు. మేము  ముందుకు సాగాము. మేము ఒక పచ్చని తోటలోనికి వెళ్ళాము. అందులో ఒక మహా వృక్షం ఉంది. దాని క్రింద ఒక ముసలి వ్యక్తి కూర్చుని ఉన్నాడు. చాలామంది పిల్లలు అతని చుట్టూ ఉన్నారు. ఆ చెట్టుకు సమీపంలో మరో వ్యక్తి కూడా ఉన్నాడు. అతడు అగ్ని వెలి గిస్తున్నాడు. వాళ్ళి ద్దరూ నన్ను చెట్టుపై ఎక్కించి వెళ్ళి పోయారు. నేను ఒక అందమైన ఇంటిలో ప్రవేశించడం జరిగింది. ఇంత వరకు అటువంటిది చూడలేదు. ఆ ఇంట్లో వృద్ధులు, యువకులు, స్త్రీలు, పిల్లలు ఉన్నారు. నేను వారిద్ద రితో, ‘ఈ రాత్రంతా మీరు నన్ను త్రిప్పుతూ ఉన్నారు. దీని సంగతేంటి?’ అని అడిగాను. దానికి వారు, అయితే వినండి: ‘అన్నిటి కంటే ముందు దవడలు చీల్చబడు తున్న వ్యక్తి వద్దకు వెళ్ళారు. ఆ వ్యక్తి అబద్ధాలకోరు. అబద్ధాలను వ్యాపింపజేసేవాడు. తీర్పుదినం వరకు అతన్ని ఇలా శిక్షించడం జరుగు తుంది. అతడు అబద్ధాలు పలికినందుకు శిక్షించడం జరుగుతుంది. ఇంకా తల నుజ్జు నుజ్జు చేయబడు తున్న వ్యక్తి పండితుడు. అల్లాహ్‌ (త) అతనికి ఖుర్‌ఆన్‌ జ్ఞానం ప్రసాదించాడు. రాత్రి పడుకునేవాడు, పగలు కూడా ఆచరించలేదు. అందువల్ల తీర్పుదినం వరకూ ఇలాగే శిక్షించడం జరుగుతుంది. ఇంకా తమరు చూచిన వారు వ్యభిచార స్త్రీ, పురుషులు, ఇంకా రక్త సముద్రంలో మీరు చూచిన వ్యక్తి వడ్డీ వ్యాపారి. చెట్టు క్రింద మీరు చూచిన వృద్ధుడు ఇబ్రాహీమ్‌ (అ). అతని ముందు ఆడుకుంటున్న పిల్లలు ప్రజల పిల్లలు. ఇంకా అగ్ని వెలిగిస్తున్న వ్యక్తి నరక పాలకుడు. మీరు ప్రవే శించిన ఇల్లు ముస్లిముల ఇల్లు, ఈ రెండవ ఇల్లు అమర వీరులది. ఇంకా నేను జిబ్రీల్‌ను, ఇతడు మీకాయి’ల్‌,’ అని అన్నాడు. ఇంకా, ‘మీ తలపైకి ఎత్తండి,’ అని అన్నాడు. నేను తలెత్తి పైకి చూచాను. పైన మేఘంలా ఉంది. వారు, ‘ఇది మీ ఎత్తైన స్థానం,’ అని అన్నారు. అప్పుడు నేను, ‘నన్ను వదలండి, నేనిందులోకి ప్రవేశిస్తాను,’ అని అన్నాను. దానికి వారు, ‘ఇంకా మీ ఆయుష్షు మిగిలి ఉంది. మీరు మీ జీవితం పూర్తిచేస్తే ఇందులోకి  ప్రవేశిస్తారు,’ అని అన్నారు.” (బు’ఖారీ)

—–

اَلْفَصْلُ الثَّانِيْ  రెండవ విభాగం 

4622 – [ 17 ] ( لم تتم دراسته ) (2/1301)

عَنْ أَبِيْ رَزِيْنِ الْعُقَيْلِيُّ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “رُؤْيَا الْمُؤْمِنِ جُزْءٌ مِنْ سِتَّةٍ وَأَرْبَعِيْنَ جُزْءًا مِّنَ النُّبوةِ وَهِيَ عَلَى رَجُلٍ طَائِرٍ مَا لَمْ يُحَدِّثْ بِهَا فَإِذَا حَدَّثَ بِهَا وَقَعَتْ”. وَأَحْسِبُهُ قَالَ: “لَا تُحَدِّثْ إِلَّا حَبِيْبًا أَوْ لَبِيْبًا”. رَوَاهُ التِّرْمِذِيُّ

وَفِيْ رِوَايَةٍ أَبِيْ دَاوُدَ قَالَ: “الرُّؤْيَا عَلَى رَجُلٍ طَائِرٍ مَا لَمْ تُعَبَّرْ فَإِذَا عُبِّرَتْ وَقَعَتْ”. وَأَحْسِبُهُ قَالَ: “وَلَا تَقُصَّهَا إِلَّا عَلَى وَادٍّ أَوْ ذِيْ رَأيٍ”.

4622. (17) [2/1301అపరిశోధితం]

అబూ ర’జీన్‌ ‘అఖీలీ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”విశ్వాసి స్వప్నం దైవదౌత్యంలోని 46వ భాగం. ఈ స్వప్నం ఇతరులకు వినిపించనంత వరకు ఒక పక్షి కాళ్ళకు వ్రేలాడుతూ ఉంటుంది. ఇతరులకు వినిపిస్తే అది పడిపోతుంది. అందువల్ల స్వప్నాన్ని గురించి కేవలం శ్రేయోభిలాషి అయిన స్నేహితునికి లేదా బుద్ధి మంతునికే  వినిపించాలి.” [6]  (తిర్మిజి’, అబూ దావూద్‌)

4623 – [ 18 ] ( ضعيف ) (2/1302)

وَعَنْ عَائِشَةَ رَضيَ اللهُ عَنْهَا قَالَتْ سُئِلَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم عَنْ وَرَقَةَ. فَقَالَتْ لَهُ خَدِيْجَةُ: إِنَّهُ كَانَ قَدْ صَدَّقَكَ وَلَكِنْ مَاتَ قَبْلَ أَنْ تَظْهَرَ. فَقَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “أُرِيْتُهُ فِي الْمَنَامِ وَعَلَيْهِ ثِيَابٌ بِيْضٌ وَلَوْ كَانَ مِنْ أَهْلِ النَّارِ لَكَانَ عَلَيْهِ لِبَاسٌ غَيْرَ ذَلِكَ”. رواه أحمد والترمذي .

4623. (18) [2/1302బలహీనం]

‘ఆయి’షహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ను వరఖహ్బిన్నౌఫిల్ విశ్వాసా లేక అవిశ్వాసా అని ప్రశ్నించడం జరిగింది. సమాధానంగా ‘ఖదీజహ్ (ర), ‘అతడు మీ దైవదౌత్యాన్ని ధృవీకరించాడు. కాని దైవదౌత్యం లభించకముందే మరణించాడు,’ అని అన్నారు. ప్రవక్త (స) నేను అతన్ని స్వప్నంలో చూచాను. అతడు తెల్లని వస్త్రాలు ధరించి ఉన్నాడు. ఒకవేళ అతడు నరక వాసి అయితే అతడు నల్లటి వస్త్రాలు ధరించి ఉండేవాడు అని ప్రవచించారు. [7]  (అ’హ్మద్‌, తిర్మిజి’)

4624 – [ 19 ] ( لم تتم دراسته ) (2/1302)

وَعَنِ ابْنِ خُزَيْمَةَ بْنِ ثَابِتٍ عَنْ عَمِّهِ أَبِيْ خُزَيْمَةَ رَضِيَ اللهُ عَنْهُمْ. أَنَّهُ رَأَى فِيْمَا يَرَى النَّائِمُ أَنَّهُ سَجَدَ عَلَى جَبْهَةِ النَّبِيِّ صلى الله عليه وسلم. فَأَخْبَرَهُ فَاضْطَجَعَ لَهُ وَقَالَ: “صَدَقَ رُؤْيَاكَ”.  فَسَجَدَ عَلَى جَبْهَتِه . رَوَاهُ فِيْ شَرْحِ السُّنَّةِ.

وَسَنَذْكُرُحَدِيْثَ أَبِيْ بَكْرَةَ: كَأَنَّ مِيْزَانًا نَزَلَ مِنَ السَّمَاءِ فِيْ بَابِ”. مَنَاقِبِ أَبِيْ بَكْرٍ وَعُمَرَ رَضِيَ اللهُ عَنْهُمَا”.

4624. (19) [2/1302అపరిశోధితం]

ఇబ్నె ‘ఖు’జైమ బిన్‌ సా’బిత్‌ తన చిన్నాన్న అబూ ‘ఖు’జైమ ద్వారా కథనం: అతను కలలో ప్రవక్త (స) నుదుటిపై సజ్దా చేసినట్లు చూచి, దాన్ని గురించి ప్రవక్త (స) ముందు ప్రస్తావించారు. అది విని ప్రవక్త (స) పండుకున్నారు. ఇంకా, ‘నువ్వు నీ స్వప్నాన్ని నిజంచేసుకో,’ అని అన్నారు. అతడు ప్రవక్త (స) నుదుటిపై సజ్దా చేసారు. (షర్‌’హుస్సున్నహ్‌)

—–

اَلْفَصْلُ الثَّالِثُ  మూడవ విభాగం   

4625 – [ 20 ] ( صحيح ) (2/1303)

عَنْ سَمُرَةَ بْنِ جُنْدُبٍ قَالَ: كَانَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم مِمَّا يَكْثُرُ أَنْ يَقُوْلَ لِأَصْحَابِهِ: “هَلْ رَأَى أَحَدٌ مِنْكُمْ مِنْ رُؤْيَا؟” فَيَقُصُّ عَلَيْهِ مَنْ شَاءَ اللهُ أَنْ يَقُصَّ وَإِنَّهُ قَالَ: لَنَا ذَاتَ غَدَاةٍ: “إِنَّهُ أَتَانِي اللَّيْلَةَ آتِيَانِ وَإِنَّهُمَا ابْتَعَثَانِيْ وَإِنَّهُمَا قَالَا لِيْ: اِنْطَلِقْ وَإِنِّيْ اِنْطَلَقْتُ مَعَهُمَا”. وَذَكَرَ مِثْلَ الْحَدِيْثِ الْمَذْكُوْرِ فِي الْفَصْلِ الْأَوَّلِ بِطُوْلِهِ وَفِيْهِ زِيَادَةٌ لَيْسَتْ فِي الْحَدِيْثِ الْمَذْكُوْرِ وَهِيَ قَوْلُهُ: “فَأَتَيْنَا عَلَى رَوْضَةٍ مُعَتَمَّةٍ فِيْهَا مِنْ كُلِّ نَوْرِ الرَّبِيْعِ وَإِذَا بَيْنَ ظَهْرِي الرَّوْضَةِ رَجُلٌ طَوِيْلٌ لَا أَكَادُ أَرَى رَأْسَهُ طُوْلًا فِي السَّمَّاءِ وَإِذَا حَوْلَ الرَّجُلِ مِنْ أَكْثَرِ وِلْدَانٍ رَأَيْتُهُمْ قَطُّ قُلْتُ لَهُمَا: مَا هَذَا مَا هَؤُلَاءِ؟” قَالَ: “قَالَا لِيْ: اِنْطَلِقْ فَاْنطَلَقْنَا فَانْتَهَيْنَا إِلى رَوْضَةٍ عَظِيْمَةِ لَمْ أَرَ رَوْضَةً قَطُّ أَعْظَمَ مِنْهَا وَلَا أَحْسَنَ”. قَالَ: “قَالَا لِيْ: ارْقَ فِيْهَا”. قَالَ: “فَارْتَقَيْنَا فِيْهَا فَانْتَهَيْنَا إِلى مَدِيْنَةٍ مَبْنِيَّةٍ بِلَبَنٍ ذَهْبِ وَلَبنِ فِضَّةٍ فَأَتَيْنَا بَابُ الْمَدِيْنَةِ فَاسْتَفْتَحْنَا فَفُتِحَ لَنَا فَدَخَلْنَاهَا فَتَلَقَّانَا فِيْهَا رِجَالٌ شَطْرٌ مِّنْ خَلْقِهِمْ كَأَحْسَنِ مَا أَنْتَ رَاءٍ وَشطْرٌ مِّنْهُمْ كَأَقْبَحِ مَا أَنْتَ رَاءٍ”. قَالَ: “قَالَا لَهُمْ: اذْهَبُوْا فَقَعُوْا فِي ذَلِكَ النَّهْرِ”. قَالَ: “وَإِذَا نَهْرٌ مُعْتَرِضٌ يَجْرِيْ كَأَنَّ مَاءَهُ الْمَحْضُ فِي الْبِيَاضِ فَذَهَبُوْا فَوَقَعُوْا فِيْهِ ثُمَّ رَجَعُوْا إِلَيْنَا قَدْ ذَهَبَ ذَلِكَ السُّوْءُ عَنْهُمْ فَصَارُوْا فِي أَحْسَنِ صُوْرَةٍ”. وَذَكَرَ فِيْ تَفْسِيْرِ هَذِهِ الزِّيَادَةِ: “وَأَمَّا الرَّجُلُ الطَّوِيْلُ الَّذِيْ فِي الرَّوْضَةِ فَإِنَّهُ إِبْرَاهِيْمُ وَأَمَّا الْوِلْدَانُ الَّذِيْنَ حَوْلَهُ فَكُلُّ مَوْلُوْدٍ مَاتَ عَلَى الْفِطْرَةِ”. قَالَ: فَقَالَ بَعْضُ الْمُسْلِمِيْنَ: يَا رَسُوْلَ اللهِ وَأَوْلَادُ الْمُشْرِكِيْنَ؟ فَقَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “وَأَوْلَادُ الْمُشْرِكِيْنَ وَأَمَّا الْقَوْمُ الَّذِيْنَ كَانُوْا شَطْرٌ مِنْهُمْ حَسَنٌ وَشَطْرٌ مِنْهُمْ حَسَنٌ وَشَطْرٌ مِنْهُمْ قَبِيْحٌ فَإِنَّهُمْ قَوْمٌ قَدْ خَلَطُوْا عَمَلًا صَالِحًا وَآخَرَ سَيِّئًا تَجَاوَزَ اللهُ عَنْهُمْ”. رَوَاهُ الْبُخَارِيُّ .

4625. (20) [2/1303దృఢం]

సమురహ్‌ బిన్‌ జున్‌దుబ్‌ (ర) కథనం: తరచూ ప్రవక్త (స) అనుచరులను, ‘మీలో ఎవరైనా కలగన్నారా?’ అని ప్రశ్నించేవారు. ఒకవేళ ఎవరైనా చూస్తే ప్రవక్త (స) ముందు ప్రస్తావించేవారు. ప్రవక్త (స) దానికి సరైన పరమార్థం చెప్పేవారు. ఒకరోజు ప్రవక్త (స), ‘ఈ రోజు రాత్రి నేను కలగన్నాను, ఇద్దరు వ్యక్తులు నా వద్దకు వచ్చారు. నన్ను లేపి, మా వెంట పదండి,’ అని అన్నారు. నేను వారి వెంట బయలు దేరాను. (ఉల్లేఖన కర్త మొదటి అధ్యాయంలో ఉన్న ‘హదీసు’ పేర్కొన్నారు). ఆ ‘హదీసు’లో ఈ పదాలు అధికంగా ఉన్నాయి. మేము వెళ్ళి ఒక పచ్చని తోటలోనికి వెళ్ళాము. అక్కడ రకరకాల మొగ్గలు, పువ్వులు ఉన్నాయి. ఆ తోటలో ఒక చాలా పొడవైన వ్యక్తి కనబడ్డారు. పొడవుగా ఉండటం వల్ల అతని తల కనబడటం లేదు. అతని తల ఆకాశంపై ఉన్నట్లు అనిపించింది. అతని చుట్టూ చాలామంది బాలురు ఉన్నారు. వారిని నేనెప్పుడూ చూడలేదు. నేను వారిద్దరినీ ఇంత పొడవైన వ్యక్తి ఎవరు? ఈ పిల్లలు ఎవరు?’ అని అడిగాను. వారు, ‘ముందుకు పదండి,’ అని అన్నారు. మేము ముందుకు సాగాము. ఒక పెద్ద తోటలోకి వెళ్ళాము. మొదటి తోట కంటేనూ చాలా బాగుంది. ఇటువంటి తోటను నే నెప్పుడూ చూడలేదు. వారు నాతో, ‘దీనిపైకి ఎక్కండి,’ అని అన్నారు. నేను ఎక్కాను. మేము ఒక పట్టణంలోకి ప్రవేశించాం. అక్కడ బంగారు, వెండి ఇటుకలు ఉన్నాయి. ఒక ఇటుక బంగారంతో ఉంటే మరొకటి వెండిది. ఆ పట్టణం చాలా అందంగా ఉంది. మేము ఆ పట్టణం ద్వారం వద్దకు వెళ్ళాము. అక్కడి ద్వార పాలకునితో తలుపు తెరవండని అన్నాము. తలుపు తెరవబడింది. మేము లోపలికి వెళ్ళాము. మేము ఒక వ్యక్తిని కలిసాము. అతని సగం శరీరం చాలా అందంగా ఉంది. సగం శరీరం చాలా అందవికారంగా ఉంది. ఇంతలో అతనితో, ‘వెళ్ళి ఆ నదిలో స్నానంచేసి రండి,’ అని చెప్పటం జరిగింది. ఆ నది నీరు చాలా పరిశుద్ధంగా ఉంది, పాలలా తెల్లగా ఉంది.  అతడు వెళ్ళాడు, నదిలో దూకాడు. ఈదుతూ స్నానంచేసి బయటకు వచ్చాడు. బయటకు రాగానే అంద వికారమంతా మటుమాయమై పోయింది. చాలా అందంగా తయారై బయటకు వచ్చాడు. అక్కడ చాలా పొడవుగా ఉన్న వ్యక్తి ఆదమ్‌ (అ). ఇంకా వారి చుట్టూ ఆడుతున్నవారు యుక్తవయస్సుకు ముందే చనిపోయిన పిల్లలు. కొంతమంది యుక్తవయస్సుకు చేరని అవిశ్వాసుల పిల్లల గురించి ప్రవక్త (స)ను అడగటం జరిగింది. దానికి ప్రవక్త (స), ‘అవిశ్వాసుల యుక్త వయస్సుకు చేరని పిల్లలు పరలోకంలో ఇబ్రాహీమ్‌ (అ) వద్ద ఉంటారు,’ అని అన్నారు. ఆ తరువాత స్వప్నం పరమార్థాన్ని వివరిస్తూ సగం శరీరం అందంగా సగం శరీరం అందవికారంగా ఉన్న వ్యక్తి, సగం ఆచరణలు మంచివి, సగం ఆచరణలు చెడ్డవిగా ఉన్న ప్రజలు. అల్లాహ్‌ (త) వారిని నదిలో స్నానం చేయించి వారి పాపాలు తొలగించాడు. అంటే క్షమించాడు. అందంగా తయారయా రంటే అల్లాహ్‌ (త) వారిని స్వర్గంలో ప్రవేశింపజేస్తాడు. (బు’ఖారీ)

4626 – [ 21 ] ( صحيح ) (2/1304)

وَعَنِ ابْنِ عُمَرَأَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم قَالَ: “مِنْ أَفْرَى الْفِرى أَنْ يُرِيَ الرَّجُلُ عَيْنَيْهِ مَا لَمْ تَرَيَا”. رَوَاهُ الْبُخَارِيُّ.

4626. (21) [2/1304దృఢం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘ఉమర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”అన్నిటికంటే ఘోరమైన నింద ఏమిటంటే తన కన్నులు చూడని దాన్ని చూసాయని చెప్పటం అంటే అసత్య స్వప్నాన్ని వినిపించటం, ఇది  కళ్ళపై చాలా ఘోరమైన అపనింద.”  (బు’ఖారీ)

4627 – [ 22 ] ( ضعيف ) (2/1304)

وَعَنْ أَبِيْ سَعِيْدٍ عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ: “أَصْدَقَ الرُّؤْيَا بِالْأَسْحَارِ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَالدَّارَمِيُّ.

4627. (22) [2/1304బలహీనం]

అబూ సయీద్‌ ‘ఖుద్రీ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఉషోదయ కాలంలో చూచే స్వప్నం చాలా సత్యమైనది.” [8]   (తిర్మిజి’, దారమి)

*****


[1]) వివరణ-4607: అంటే నేను అంతిమ ప్రవక్తను. నా తరువాత ప్రవక్తలెవరూ రారు. కాని సత్య ముస్లిములకు సత్యమైన స్వప్నాలు వస్తాయి. అవి శుభవార్తలు ఇచ్చేవిగా ఉంటాయి. వాటివల్ల లాభం కలుగుతుంది. అయితే ఇది తన గురించైనా కావచ్చు లేదా ఇతర ముస్లిమ్‌ సోదరుల గురించైనా కావచ్చు. ఇది దైవదౌత్యంలోని 46వ భాగం.

[2]) వివరణ-4615: కాలం దగ్గర కావటం అంటే తీర్పుదినం లేదా మరణం దగ్గర కావటం అని అర్థం. లేదా రాత్రి పగలు సమానమైన కాలం. అంటే తీర్పుదినం దగ్గర అయితే విశ్వాసి స్వప్నం తప్ప కాజాలదు. ఎందుకంటే తీర్పుదినానికి ముందు అవిశ్వాసం వ్యాపిస్తుంది. అప్పుడు పరిపూర్ణ విశ్వాసం గలవాడే, స్వప్నాలు సత్యం అయినవాడై విశ్వాసి అవుతాడు. మరో ‘హదీసు’లో ”చివరి కాలంలో సమయం చాలా వేగంగా గడుస్తుంది. ఒక సంవత్సరం ఒక నెలలా కనబడుతుంది. ఎందుకంటే ప్రజలు సుఖసౌఖ్యాల్లో, విలాసాల్లో గడుపుతారు. సమయం ఎలా గడిచిందో కూడా వారికి తెలియదు.” కొందరు కాలంలో శుభం ఉండదని, ఆయుష్షులు తగ్గిపోతాయని ఒక కాలానికి, మరోకాలానికి చెందినవారు దగ్గరౌతారని భావించారు. కిర్మానీ ప్రజలు విచారాలకు గురిఅవుతారని, కాఠిన్యానికి గురవుతారని, కల్లోలాలకు, ఉపద్రవాలకు గురవుతారని, ప్రజలు మతి స్థిమితం కోల్పోతారని, వారికి సంవత్సరం, నెలలు తెలియకుండా పోతాయని, వాస్తవం ఏమిటంటే శుభం అంతరిస్తుందని, ప్రతి విషయంలో శుభం నశిస్తుందని చివరికి కాలంలో కూడా శుభం నశిస్తుందని అభిప్రాయపడ్డారు.

ముహమ్మద్బిన్సీరీన్ చాలా గొప్ప పాండిత్యం గల తాబియీ. 33వ హిజ్రీలో ‘ఉస్మాన్‌ (ర) పరిపాలనా చివరి కాలంలో జన్మించారు. ఇతడు ‘ఆయి’షహ్‌ (ర), అబూ హురైరహ్‌ (ర), అనస్‌ బిన్‌ మాలిక్‌ (ర), ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘జుబైర్‌ (ర), ‘హుజై’ఫ బిన్‌ యమామహ్ (ర), ము’ఆవియహ్‌ (ర), అబూ దర్‌దా (ర), అబూ ఖతాదహ్‌ (ర), ‘హసన్‌ (ర)ల నుండి ‘హదీసు’లు నేర్చుకున్నారు. వారి ద్వారా ‘హదీసు’లను ఉల్లేఖించారు. ఇతడు 77 సంవత్సరాల వయస్సులో 110వ హిజ్రీలో షవ్వాల్‌ నెలలో మరణించారు. ఇతడు చాలా గొప్ప ‘హదీసు’వేత్త, పండితుడు, ధార్మికవేత్త, దైవభక్తుడు, దైవభీతిపరుడు, ఇస్లామ్‌ ప్రతినిధి. స్వప్నాల పరమార్థాలు తెలుపడంలో ఇతనికి చాలా ప్రావీణ్యత ఉండేది. అనేక స్వప్నాల పరమార్ధం అతని గురించే సూచించబడ్డాయి.

[3]) వివరణ-4617: ఈ కాలలో ‘ఉఖ్‌బహ్ మరియు రాఫె’అ మరియు రు’తబ్‌ ద్వారా పరమార్థం గ్రహించటం జరిగింది. అంటే రాఫె’అ అనే పదం ద్వారా ఔన్నత్యం, గౌరవం మరియు ‘ఉఖ్‌బహ్ ద్వారా పరలోక సాఫల్యం, క్షేమం మరియు రుతబ్‌ అనే పదం ద్వారా తాజాదనం, శ్రేష్ఠత అని గ్రహించటం జరిగింది. రుతబ్ఇబ్నె తాబ్ అంటే మదీనహ్లోని మంచి రకానికి చెందిన ఖర్జూరాలు.

[4]) వివరణ-4618: యమామ హిజాజ్‌ పట్టణాల్లోని ఒక పట్టణం. ఇక్కడ చాలా అధిక సంఖ్యలో ఖర్జూరాలు పండుతాయి. కాని అల్లాహ్‌ (త) నాకు మదీనహ్ చేరవేసాడు. ఇక్కడ ఖర్జూరం తోటలు చాలా అధిక సంఖ్యలో ఉన్నాయి. అజ్ఞాన కాలంలో దీన్ని యస్రిబ్ అని అనేవారు. ఇప్పుడు దాని పేరు మదీనహ్ మునవ్వరహ్.

[5]) వివరణ-4619: ప్రవక్త (స)కు నిధులు ఇవ్వబడటం అంటే గుప్తనిధుల తాళాలు ఇవ్వబడటం. దీని పరమార్థం ఏమిటంటే అనేక దేశాలను జయించడం జరుగుతుంది. అక్కడి నిధులు ప్రవక్త (స) లేదా ఆయన అనుచర సమాజం చేతుల్లో ఉంటాయి. రెండు బంగారు కడియాలు అంటే ఇద్దరు అసత్యవంతులు ప్రవక్తలుగా వాదించటం, అబూబకర్‌ పరిపాలనా కాలంలో నహ్‌షియ్యి ముసైలమను చంపటం జరిగింది. మరొకడు అనసీ ప్రవక్త (స) కాలంలో ఫేరోజ్‌ దైలమీ చంపారు. వీరిద్దరూ అంతమయ్యారు.

[6]) వివరణ-4622: పక్షి కాళ్ళుకు వ్రేలాడటం అంటే దానికి స్థిరత్వం ఉండదు. ఎవరు ఎలా పరమార్థం చెబితే అలాగే జరుగుతుంది. అయితే విధివ్రాత కూడా దానికి అనుగుణంగా ఉంటే అలాగే జరుగుతుంది.

[7]) వివరణ-4623: వరఖహ్బిన్నౌఫిల్ అందరికంటే ముందు ప్రవక్త (స)ను ధృవీకరించారు. ప్రవక్త (స) హిరా గుహ నుండి మొట్ట మొదటి సారిగా ఇంటికి తిరిగి వచ్చి జరిగినదంతా ‘ఖదీజహ్ (ర)కు తెలియపర్చారు. ‘ఖదీజహ్ (ర) ప్రవక్త (స)ను ఓదార్చారు. ఇంకా తన చిన్నాన్న కొడుకైన వరఖహ్ బిన్‌ నౌఫిల్‌ వద్దకు తీసుకొని వెళ్ళి జరిగినదంతా చెప్పారు. వరఖహ్ బిన్‌ నౌఫిల్‌ ఇదంతా విని, ‘మూసా (అ) పై అవతరించిన దైవదూత ఈ దైవదూత, మీ జాతివారు మిమ్మల్ని బహిష్కరించినపుడు నేను యుక్తవయస్సులో ఉంటే ఎంత బాగుండు,’ అని అన్నారు. దానికి ప్రవక్త (స), ‘నా జాతివారు నన్ను తీసివేస్తారా?’ అని అడగ్గా, వరఖహ్‌ బిన్‌ నౌఫిల్‌, ‘నిజంగా, మీరనబోతున్నట్టు ఎవరు పలికినా వారిని హింసించారు, వారి శత్రువులై పోయారు. అప్పటి వరకు నేనుంటే నేను మీకు తప్పకుండా సహాయం చేస్తాను.’ కాని కొంత కాలం గడిచిన తర్వాత వరఖహ్‌ బిన్‌ నౌఫిల్‌ మరణించారు. (బు’ఖారీ)

అజ్ఞాన కాలంలో అంతా అంధకారంగా ఉండేది. కాని ఆ అంధకారంలో కూడా వెలుగు దీపికలు ఉండేవి. వీరిలో ఖైస్‌ బిన్‌ సా’యిదహ్‌, వరఖహ్ బిన్‌ నౌఫిల్‌, ‘ఉబైదు ల్లాహ్‌ బిన్‌ జ’హష్‌, ‘ఉస్మాన్‌ బిన్‌ హువైరిస్‌, ‘జైద్‌ బిన్‌ అమ్ర్‌ బిన్‌ నౌఫిల్‌, వీరందరూ ఏకదైవా రాధకులు. దైవదౌత్యానికి ముందు ప్రవక్త (స) వీరిని కలిసారు, భవిష్యవాణి ప్రకారం ప్రవక్త (స)ను విశ్వసించారు కూడా.

సీరతు ఇబ్నె హిషామ్లో ఇలా ఉంది, ”అజ్ఞాన కాలంలో అవిశ్వాసులు వార్షిక జాతరలు, ఊరేగింపులు నిర్వహించే వారు. ఇక్కడ చిల్లర దైవాల పేర పూజలు, ఆరాధనలు, మొక్కుబడులు సమర్పించేవారు. వీటిని దైవాలుగా, ఆపద్బాంధవులుగా భావించేవారు. ఒకసారి ఆ జాతరలో వరఖహ్ బిన్‌ నౌఫిల్‌, ‘ఉబేదుల్లాహ్‌ బిన్‌ జ’హష్‌, ‘ఉస్మాన్‌ బిన్‌ హువైరిస్‌, ‘జైద్‌ బిన్‌ అమ్ర్‌ బిన్‌ నౌఫిల్‌ కూడా పాల్గొన్నారు. అవిశ్వాసుల చేష్టలకు చాలా విచా రిస్తూ, లాభంగాని నష్టంగానీ చేకూర్చని వారి ముందు ఎందుకు తలలు వంచుతారని, వారిని ఉపదేశించారు. ఈ ప్రయత్నంలో నిమగ్నమయి పోయారు.

అస్మా బిన్‌తె అబీ బక్‌ర్‌ (ర) కథనం: నేను ‘జైద్‌ బిన్‌ అమ్ర్‌ బిన్‌ నౌఫిల్‌ను ముసలితనంలో చూచాను. బైతుల్లాహ్‌కు వీపు ఆనించి కూర్చున్నారు. ప్రజలకు హితబోధ చేస్తుండే వారు. ఇంకా, ‘ఓ మక్కహ్ వాసులారా! అల్లాహ్ సాక్షి! నేను తప్ప ఇబ్రాహీమ్‌ మార్గంపై మీరెవరూ లేరు,’ అని అనేవారు. వీరుచాలాదయామయులు. బాలికలను చంపరాదని బోధించేవారు. ఎక్కడైనా బాలిక  జన్మిం చిందని తెలిస్తే, అక్కడకు వెళ్ళి ఆ అమ్మాయిని తీసు కొనివచ్చి, పోషించి, యుక్తవయస్సుకు చేరగానే ఆమెకు వివాహం చేసేవారు. ఇంకా విగ్రహారాధనను అసహ్యించు కునేవారు. (బు’ఖారీ, సీరతు ఇబ్నె ‘హిషామ్‌)

[8]) వివరణ-4627: ఎందుకంటే ఇది ప్రశాంత సమయం, ఇంకా ఇది స్వీకారయోగ్యమైన సమయం, కారుణ్య దైవదూతలు వచ్చేపోయే సమయం ఇది.

***

%d bloggers like this: