23. వైద్యం, మంత్రించటం | మిష్కాతుల్ మసాబీహ్

23- كِتَابُ الطِّبِّ وَالرُّقَى                    
23. వైద్యం, మంత్రించటం

తిబ్బ్ అంటే వైద్యం చేయటం, మంత్రించటం అంటే ఇస్లామీయ పరిభాషలో మానవుని స్థితిగతులు, రోగాలు గ్రహించి వాటికి వైద్యం చేయటం. ఒకవేళ ఆరోగ్యంగా ఉంటే వాటిని సంరక్షించటం. అంటే రోగాలు రాకుండా అప్రమత్తంగా ఉండటం.

వైద్యం రెండు రకాలు: 1. శారీరకమైనది, 2. మానసికమైనది. ప్రపంచంలో రెండురకాల వైద్యులు వచ్చారు. శారీరకమైన వైద్యులు, మానసిక వైద్యులు. దైవప్రవక్తలు శారీరక, మానసిక వైద్యులుగా వచ్చారు. వీరు అనేక రోగాలకు అనేక మందులు చూపెట్టారు. ఇవన్నీ అల్లాహ్‌ (త) తరఫు నుండే ప్రసాదించబడ్డాయి. శారీరక వైద్యులు చూపెట్టిన వైద్యం ప్రయోగాలు, అనుభవాలు, భావనలపై ఆధారపడి ఉన్నాయి. మానసిక వైద్యం ఖుర్‌ఆన్‌ వాక్యాల ద్వారా, ‘హదీసు’ దు’ఆల ద్వారా చేయబడుతుంది. లేదా ఖుర్‌ఆన్‌, ‘హదీసు’లు సూచించిన విధంగా చేయడం జరుగుతుంది.  దీన్నే మనం రుఖయ్, మంత్రతంత్రాలు అంటాం. వీటిని గురించి వివరంగా క్రింద పేర్కొనడం జరిగింది.

—–

اَلْفَصْلُ الْأَوَّلُ మొదటి విభాగం   

4514 – [ 1 ] ( صحيح ) (2/1278)

عَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَا أَنْزَلَ اللهُ دَاءً إِلَّا أَنْزَلَ لَهُ شِفَاءً. رَوَاهُ الْبُخَارِيُّ.

4514. (1) [2/1278 దృఢం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”అల్లాహ్‌ వైద్యం లేని ఎటువంటి రోగాన్ని అవతరింపజేయ లేదు.”  [1]  (బు’ఖారీ)

4515 – [ 2 ] ( صحيح ) (2/1278)

وَعَنْ جَابِرٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لِكُلِّ دَاءٍ دَوَاءٌ فَإِذَا أُصِيْبَ دَوَاءُ الدَّاءِ بَرَأَ بِإِذْنِ اللهِ”. رَوَاهُ مُسْلِمٌ .

4515. (2) [2/1278 దృఢం]

జాబిర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ప్రతి రోగానికి మందు ఉంది. మందు రోగానికి తగ్గట్టుగా ఉంటే  రోగం నయమయిపోతుంది. అల్లాహ్‌ (త) ఆదేశానుసారం వ్యాధి  నయమవుతుంది.” (ముస్లిమ్‌)

4516 – [ 3 ] ( صحيح ) (2/1278)

وَعَنِ ابْنِ عَبَّاسٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “اَلشِّفَاءُفِيْ ثَلَاثٍ: فِيْ شَرَطَةِ مِحْجَمٍ أَوْ شَرْبَةِ عَسْلٍ أَوْ كَيَّةٍ بِنَارٍوَأَنَا أَنْهَى أُمَّتِيْ عَنِ الْكَيِّ”. رَوَاهُ الْبُخَارِيُّ .

4516. (3) [2/127 8- దృఢం]

ఇబ్నె ‘అబ్బాస్‌ (ర) కథనం: ప్రవక్త (స) సాధారణంగా మూడు వస్తువుల్లో స్వస్థత ఉంది, కొమ్ము పేట్టటంలో, తేనెలో, వేడి ఇనుపకడ్డీతో వాతలు పెట్టటంలో. కాని నేను నా అనుచరసమాజాన్ని వాతలు పెట్టటాన్నుండి వారిస్తున్నాను,”  అని  ప్రవచించారు.[2](బు’ఖారీ)

4517 – [ 4 ] ( صحيح ) (2/1278)

وَعَنْ جَابِرٍ قَالَ: رُمِيَ أُبَيٌّ يَوْمَ الْأَحْزَابِ عَلَى أَكْحَلِهِ فَكَوَاهُ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم. رَوَاهُ مُسْلِمٌ.

4517. (4) [2/1278 దృఢం]

జాబిర్‌ (ర) కథనం: అ’హ్‌’జాబ్‌ యుద్ధంలో ఉబయ్‌ బిన్‌ కఅబ్‌ (ర) భుజంపై బాణం దెబ్ద తగిలింది. ప్రవక్త (స) వాతలు పెట్టారు. రక్తం ప్రవహించరాదని. (ముస్లిమ్‌)

4518 – [ 5 ] ( صحيح ) (2/1278)

وَعَنْهُ قَالَ: رُمِيَ سَعْدُ بْنُ مُعَاذٍ فِيْ أَكْحَلِهِ فَحَمَسَهُ النَّبِيُّ صلى الله عليه وسلم بِيَدِهِ بِمِشْقَصٍ ثُمَّ وَرِمَتْ فَحَمَسَهُ الثَّانِيَةَ . رَوَاهُ مُسْلِمٌ .

4518. (5) [2/1278 దృఢం]

జాబిర్‌ (ర) కథనం: స’అద్‌ బిన్‌ మ’ఆజ్‌కు మెడపై బాణం తగిలింది. ప్రవక్త (స) వాతలు పెట్టారు. అది కొంత వాచిపోయింది, ప్రవక్త (స) మళ్ళీ వాతలు పెట్టారు. (ముస్లిమ్‌)

4519 – [ 6 ] ( صحيح ) (2/1278)

وَعَنْهُ قَالَ: بَعَثَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم إِلى أُبَيِّ بْنِ كَعْبٍ طَبِيْبًا فَقَطَعَ مِنْهُ عِرْقًا ثُمَّ كَوَاهُ عَلَيْهِ. رَوَاهُ مُسْلِمٌ .

4519. (6) [2/1278 దృఢం]

జాబిర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ఉబయ్‌ బిన్‌ క’అబ్‌ వద్దకు ఒక వైద్యుణ్ని పంపారు. అతడు ఒక నరం కోసివేసాడు. ప్రవక్త (స) దానికి వాతలు పెట్టారు. (ముస్లిమ్‌)

4520 – [ 7 ] ( متفق عليه ) (2/1278)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ أَنَّهُ سَمِعَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ: “فِي الْحَبَّةِ السَّوْدَاءِ شِفَاءٌ مِنْ كُلِّ دَاءٍ إِلَّا السَّامَ”. قَالَ ابْنُ شِهَابٍ: اَلسَّامُ: اَلْمَوْتُ وَالْحَبَّةُ السَّوْدَاءُ: الشُّوْنِيْزُ .

4520. (7) [2/1278ఏకీభవితం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) నల్ల గింజల గురించి ఇలా ప్రవచిస్తూ ఉండగా విన్నాను, ”మరణం తప్ప మిగతా వ్యాధులన్నిటికీ వైద్యం,” అని తెలిపారు. (బు’ఖారీ, ముస్లిమ్‌)

4521 – [ 8 ] ( متفق عليه ) (2/1279)

وَعَنْ أَبِيْ سَعِيْدِ الْخُدْرِيِّ قَالَ: جَاءَ رَجُلٌ إِلَى النَّبِيِّ صلى الله عليه وسلم فَقَالَ: أَخِيْ اِسْتَطْلَقَ بَطْنُهُ. فَقَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “اِسْقِيِه عَسَلًا”. فَسَقَاهُ ثُمَّ جَاءَ فَقَالَ: سَقَيْتُهُ فَلَمْ يَزِدْهُ إِلَّا اسْتِطْلَاقًا. فَقَالَ لَهُ ثَلَاثَ مَرَّاتٍ. ثُمَّ جَاءَ الرَّابِعَةَ فَقَالَ: “اِسْقِهِ عَسَلًا”. فَقَالَ: لَقَدْ سَقَيْتُهُ فَلَمْ يَزِدْهُ إِلَّا اسْتِطْلَاقًا. فَقَالَ رَسُولُ الله صلى الله عليه وسلم: “صَدَقَ اللهُ وَكَذَبَ بَطْنُ أَخِيْكَ”. فَسَقَاهُ فَبَرَأَ.

4521. (8) [2/1279ఏకీభవితం]

అబూ స’యీద్‌ ‘ఖుద్రీ (ర) కథనం: ప్రవక్త (స) వద్దకు ఒకవ్యక్తి వచ్చి, ‘నా సోదరునికి విరోచనాలు అవుతున్నాయి,’ అని విన్నవించుకున్నాడు. ప్రవక్త (స) తేనె త్రాపించమని ఉపదేశించారు. అతడు తేనె త్రాపించాడు. మళ్ళీ వచ్చి ‘తేనె త్రాపించటం వల్ల మరీ అధికంగా అవుతున్నాయి,’ అని అన్నాడు. ప్రవక్త (స), ‘వెళ్ళి మళ్ళీ తేనె త్రాపించు,’ అని అన్నారు. ఆ వ్యక్తి మళ్ళీ వెళ్ళి తేనె త్రాపించాడు. ముందు కంటే అధికంగా విరోచనాలు అవసాగాయి. మళ్ళీ ఆ వ్యక్తి వచ్చి, ‘ఇంకా అధికంగా అవుతున్నాయి’ అని ఫిర్యాదు చేసాడు. దానికి ప్రవక్త (స) ‘మళ్ళీ వెళ్ళి తేనె త్రాపించు, దైవ గ్రంథం సత్యమైనది, నీ సోదరుని కడుపు పాడైపోయింది,’ అని అన్నారు. అతడు మళ్ళీ వెళ్ళి తేనె త్రాపించాడు. అల్లాహ్‌ (త) అతనికి స్వస్థత ప్రసాదించాడు. అతని ఆరోగ్యం తిరిగి వచ్చింది. [3]  (బు’ఖారీ, ముస్లిమ్‌)

4522 – [ 9 ] ( متفق عليه ) (2/1279)

وَعَنْ أَنَسٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِنَّ أَمْثَلَ مَا تَدَاوَيْتُمْ بِهِ الْحِجَامَةُ وَالْقُسْطُ الْبَحْرِيُّ”.

4522. (9) [2/1279ఏకీభవితం]

అనస్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”అన్నిటికంటే మంచి వైద్యం చెడు రక్తాన్ని తీయటం, రెండవది  ఖుస్త్బహ్రీ అనేమందును ఉపయోగించటం.” [4] (బు’ఖారీ, ముస్లిమ్‌)

4523 – [ 10 ] ( متفق عليه ) (2/1279)

وَعَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَا تُعَذِّبُوْا صِبْيَانَكُمْ بِالْغَمَزِ مِنَ الْعُذْرَةِ عَلَيْكُمْ بِالْقُسْطِ”.

4523. (10) [2/1279ఏకీభవితం]

అనస్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మీరు మీ పిల్లలకు గొంతులో బాధగా ఉంటే, గొంతు ఎందుకు నొక్కుతారు, మీరు ఖుస్‌’త్‌ ఉపయోగించండి.” [5] (బు’ఖారీ, ముస్లిమ్‌)

4524 – [ 11 ] ( متفق عليه ) (2/1279)

وَعَنْ أُمِّ قَيْسٍ قَالَتْ:قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم:”علَى مَا تَدْغَرْنَ أَوْلَادَكُنَّ بِهَذَا الْعَلَاقِ؟عَلَيْكُنَّ بِهَذَا الْعُوْدِ الْهِنْدِيِّ فَإِنَّ فِيْهِ سَبْعَةً أَشْفِيَةٍ مِنْهَا ذَاتُ الْجَنْبِ يُسْعَطُ مِنَ الْعُذْرَةِ وَيُلَدُّ مِنْ ذَاتِ الْجَنْبِ”.

4524. (11) [2/1279ఏకీభవితం]

ఉమ్మె ఖైస్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మీరు మీ పిల్లల వైద్యం గొంతు నొక్కి ఎందుకు చేస్తారు. మీరు ఈ ఊద్‌ హిందీ ఉపయోగిస్తే చాలు, ఇది ఏడు రోగాలకు స్వస్థత ప్రసాదిస్తుంది. వీటిలో ఒకటి నిమోనియ. రెండవది జాతుల్ జంబ్. నిమోనియకు ముక్కుపై మందు వేయాలి. జాతుల్ జంబ్ కోసం ఒక ప్రక్క నుండి మందు త్రాపించాలి.”  [6] (బు’ఖారీ, ముస్లిమ్‌)

4525 – [ 12 ] ( متفق عليه ) (2/1279)

وَعَنْ عَائِشَةَ وَرَافِعِ بْنِ خَدِيْجٍ عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ: “اَلْحُمّى مِنْ فَيْجِ جَهَنَّمَ فَأَبْرِدُوْهَا بِالْمَاءِ”.

4525. (12) [2/1279ఏకీభవితం]

‘ఆయి’షహ్‌ (ర) మరియు రాఫె’అ బిన్‌ ‘ఖదీజ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”జ్వరం నరకాగ్ని ఆవిరి, దాన్ని నీటిద్వారా చల్లార్చండి.” [7](బు’ఖారీ, ముస్లిమ్‌)

4526 – [ 13 ] ( صحيح ) (2/1280)

وَعَنْ أَنَسٍ قَالَ: رَخَّصَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم فِي الرُّقْيَةِ مِنَ الْعَيْنِ وَالْحُمَةِ وَالنَّمْلَةِ. رَوَاهُ مُسْلِمٌ  .

4526. (13) [2/1279దృఢం]

అనస్‌ (ర) కథనం: ప్రవక్త (స) దిష్టి నుండి రక్షణకు, హాని కరమైన కీటకాలు, పాములు, తేళ్ళు కాటు వేస్తే వాటి నుండి రక్షణకు మంత్రించే అనుమతి ఇచ్చారు.[8](ముస్లిమ్‌)

4527 – [ 14 ] ( متفق عليه ) (2/1280)

وَعَنْ عَائِشَةَ قَالَتْ: أَمَرَ النَّبِيُّ صلى الله عليه وسلم أَنْ نَسْتَرْقِيَ مِنَ الْعَيْنِ .

4527. (14) [2/1280ఏకీభవితం]

‘ఆయి’షహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) దిష్టి తగిలితే మంత్రించటానికి, దు’ఆ చేయించడానికి అనుమ తించారు.[9]  (బు’ఖారీ, ముస్లిమ్‌)

4528 – [ 15 ] ( متفق عليه ) (2/1280)

وَعَنْ أُمِّ سَلَمَةَ أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم رَأَى فِيْ بَيْتِهَا جَارِيَةً فِيْ وَجْهِهَا سُفْعَةً يَعْنِيْ صُفْرَةً فَقَالَ:”اِسْتَرْقُوا لَهَا فَإِنَّ بِهَا النَّظْرَةَ”.

4528. (15) [2/1280ఏకీభవితం]

ఉమ్మె సలమహ్(ర) కథనం: ప్రవక్త (స) మా ఇంట్లో ఉన్నారు. ఒక అమ్మాయి ముఖం ఎర్రగా లేదా నల్లగా ఉండటం చూచి, ‘ఈ అమ్మాయికి దిష్టి తగిలింది. ఎవరిద్వారానైనా మంత్రించుకోండి’ అని అన్నారు. (బు’ఖారీ, ముస్లిమ్‌)

4529 – [ 16 ] ( صحيح ) (2/1280)

وَعَنْ جَابِرٍقَالَ: نَهَى رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم عَنِ الرُّقَى فَجَاءَ آلُ عَمْرِوبْنِ حَزَمٍ فَقَالُوْا: يَا رَسُوْلَ اللهِ إِنَّهُ كَانَتْ عِنْدَنَا رُقْيَةٌ نَرْقِيْ بِهَا مِنَ الْعَقْرَبِ وَأَنْتَ نَهَيْتَ عَنِ الرُّقَى فَعَرَضُوْهَا عَلَيْهِ فَقَالَ: “مَا أَرَى بِهَا بَأْسًا مَنِ اسْتَطَاعَ مِنْكُمْ أَنْ يَنْفَعَ أَخَاهُ فَلْيَنْفَعَهُ”. رَوَاهُ مُسْلِمٌ .

4529. (16) [2/1280దృఢం]

జాబిర్‌ (ర) కథనం: ప్రవక్త (స) మంత్రించటాన్ని వారించారు. అది విని, ‘అమ్ర్‌ బిన్‌ ‘హ’జ్‌మ్‌ ఇంటివారు వచ్చి, ‘ఓ ప్రవక్తా! తమరు మంత్రించటాన్ని నిషేధించారట, మాకు పాము, తేలు కాటు మంత్రం గుర్తుంది. మేము దాన్ని చదివి మంత్రిస్తాము, దాని విషం దిగిపోతుంది,’ అని విన్న వించుకున్నారు. అప్పుడు ప్రవక్త (స), ‘ఏది ఆ మంత్రం నాకు చదివి వినిపించండి’ అని అన్నారు. వారు చదివి వినిపించారు. అందులో ఇస్లామ్‌కు విరుద్ధమైనదేదీ కనబడలేదు. ప్రవక్త (స) ”ఇందులో ఎటువంటి అభ్యంతరంలేదు. తన ముస్లిమ్‌ సోదరునికి మేలు చేసే శక్తి ఉంటే మేలు చేయాలి. అయితే అందులో అవిశ్వాస పదాలు ఉండకూడదు” అని అన్నారు. (ముస్లిమ్‌)

4530 – [ 17 ] ( صحيح ) (2/1280)

وَعَنْ عَوْفِ بْنِ مَالِكٍ الْأَشْجَعِيِّ قَالَ: كُنَّا نَرْقِيْ فِي الْجَاهِلِيَّةِ فَقُلْنَا: يَا رَسُولَ اللهِ كَيْفَ تَرَى فِيْ ذَلِكَ؟ فَقَالَ: “اَعْرِضُوْا عَلَيَّ رُقَاكُمْ لَا بَأْسَ بِالرُّقى مَا لَمْ يَكُنْ فِيْهِ شِرْكٌ”. رَوَاهُ مُسْلِمٌ  .

4530. (17) [2/1280దృఢం]

‘ఔఫ్‌ బిన్‌ మాలిక్‌ అష్‌జ’యీ (ర) కథనం: అజ్ఞాన కాలంలో మేము మంత్రాలు చదివేవారం. మేము ఓ ప్రవక్తా! ఇప్పుడు ఇస్లామ్‌ స్వీకరించిన తర్వాత ఏం చేయమంటారు అంటే మంత్రాలు చదవవచ్చా?’ లేదా అని విన్నవించుకున్నారు. అప్పుడు ప్రవక్త (స), ‘మీరు మీ మంత్రాలను వినిపించండి,’ అని అన్నారు. ‘మీ మంత్రాల్లో అవిశ్వాస వచనాలు లేకుంటే చదవ వచ్చును,’  అని  ఆదేశించారు.[10] (ముస్లిమ్‌)

4531 – [ 18 ] ( صحيح ) (2/1280)

وَعَنِ ابْنِ عَبَّاسٍ عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ : ” اَلْعَيْنُ حَقٌّ فَلَوْ كَانَ شَيْءٌ سَابَقَ الْقَدْرَ سَبَقَتْهُ الْعَيْنُ وَإِذَا اسْتُغْسِلْتُمْ فَاغْسِلُوْا ” . رَوَاهُ مُسْلِمٌ  .

4531. (18) [2/1280 –దృఢం]

ఇబ్నె ‘అబ్బాస్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”దిష్టి వాస్తవమే, ఒకవేళ ఏదైనా జాతకాన్ని అధిగమిస్తే, అది దిష్టి అధిగమిస్తుంది. కాని దిష్టికూడా జాతకానికి అనుగుణంగా ఉంటుంది. ఒకవేళ మిమ్మల్ని స్నానం చేయమంటే  స్నానం  చేయండి.[11](ముస్లిమ్‌)

—–

اَلْفَصْلُ الثَّانِيْ రెండవ విభాగం  

4532 – [ 19 ] ( صحيح ) (2/1281)

عَنْ أُسَامَةَ بْنِ شَرِيْكٍ قَالَ: قَالُوْا: يَا رَسُوْلَ اللهِ أَفَنَتَدَاوَى؟ قَالَ: “نَعَمْ يَا عَبْدَ اللهِ تَدَاوَوْا فَإِنَّ اللهَ لَمْ يَضَعْ دَاءً إِلَّا وَضَعَ لَهُ شِفَاءً غَيْرَ دَاءٍ وَاحِدٍ الْهَرَمِ”. رَوَاهُ أَحْمَدُ وَالتِّرْمِذِيُّ وَأَبُوْ دَاوُدَ.  

4532. (19) [2/1281దృఢం]

ఉసామహ్ బిన్‌ షరీక్‌ కథనం: ప్రవక్త (స) ను ప్రవక్త (స) అనుచరులు, ‘ఓ ప్రవక్తా! మేము వైద్యం చేయించుకో వచ్చునా?’ అని విన్నవించుకున్నారు. దానికి ప్రవక్త (స), ‘అల్లాహ్ దాసులారా! వైద్యం చేయించుకోండి. ఎందుకంటే ప్రతి రోగానికి వైద్యం ఉంది. అయితే కేవలం ఒక్క రోగానికి అంటే ముసలితనానికి ఏ మందూ లేదు,’ అని అన్నారు. (అ’హ్మద్‌, తిర్మిజి’, అబూ  దావూద్‌)

4533 – [ 20 ] ( لم تتم دراسته ) (2/1281)

وَعَنْ عُقْبَةَ بْنِ عَامِرٍقَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَا تُكَرِهُوْا مَرْضَاكُمْ عَلَى الطَّعَامِ. فَإِنَّ اللهَ يُطْعِمُهُمْ وَيَسْقِيْهِمْ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَابْنُ مَاجَهُ وَقَالَ التِّرْمِذِيُّ: هَذَا حَدِيْثٌ غَرِيْبٌ.

4533. (20) [2/1281అపరిశోధితం]

‘ఉఖ్‌బహ్ బిన్‌ ‘ఆమిర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మీరు మీ రోగులను మందు తినమని బలవంతం చేయకండి, ఎందుకంటే అల్లాహ్‌ (త) వారికి తినిపిస్తాడు.” [12]   (తిర్మిజి’ / ఏకోల్లేఖనం, ఇబ్నె మాజహ్)

4534 – [ 21 ] ( لم تتم دراسته ) (2/1281)

وَعَنْ أَنَسٍ أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم كَوَى أَسْعَدَ بْنَ زُرَارَةَ مِنَ الشَّوْكَةِ. رَوَاهُ التِّرْمِذِيُّ وقَالَ: هَذَا حَدِيْثٌ غَرِيْبٌ.

4534. (21) [2/1281అపరిశోధితం]

అనస్‌ (ర) కథనం: ప్రవక్త (స) షౌక అనే రోగం వల్ల అస్‌ ‘అద్‌ బిన్‌ జరారహ్ను ఇనుపకడ్డీ వేడిచేసి వాతలు పెట్టారు.[13] (తిర్మిజి’ /  ఏకోల్లేఖనం) 

4535 – [ 22 ] ( لم تتم دراسته ) (2/1281)

وَعَنْ زَيْدِ بْنِ أَرْقَمَ قَالَ: أَمَرَنَا رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم أَنْ نَتَدَاوَى مِنْ ذَاتِ الْجَنْبِ بِالْقُسْطِ الْبَحْرِيِّ وَالزَّيْتِ. رَوَاهُ التِّرْمِذِيُّ .

4535. (22) [2/1281అపరిశోధితం]

జైద్‌ బిన్‌ అర్‌ఖమ్‌ (ర) కథనం: ప్రవక్త (స) జాతుల్‌ జన్‌బ్‌ రోగానికి వైద్యం చేయమని ఆదేశించారు. ఇంకా ఈ వైద్యానికి ఖు’స్త్ బ’హ్‌రీ, ‘జైతూన్‌ నూనె వాడమని ఆదేశించారు.  (తిర్మిజి’)

4536 – [ 23 ] ( لم تتم دراسته ) (2/1281)

وَعَنْهُ قَالَ: كَانَ النَّبِيُّ صلى الله عليه وسلم يَنْعَتُ الزَّيْتَ وَالْوَرْسَ مِنْ ذَاتِ الْجَنْبِ. رَوَاهُ التِّرْمِذِيُّ  .

4536. (23) [2/1281అపరిశోధితం]

‘జైద్‌ బిన్‌ అరఖమ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ‘జాతుల్‌ జంబ్‌ వ్యాధికి వర్స్‌, ‘జైతూన్‌ నూనె మంచి వైద్యం,’ అని ప్రవచించారు. (తిర్మిజి)

అంటే జైతూన్ నూనె, వర్స్ను (ఒక రకమైన గడ్డిని) ఈ వ్యాధికి మందు అని ప్రవచించేవారు.

4537 – [ 24 ] ( لم تتم دراسته ) (2/1281)

وَعَنْ أَسْمَاءَ بِنْتِ عُمَيْسٍ أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم سَأَلَهَا: “بِمَ تَسْتَمْشِيْنَ؟” قَالَتْ: بِالشُّبْرُمِ قَالَ: “حَارٌّ حَارٌّ”. قَالَتْ: ثُمَّ اسْتَمْشَيْتُ بِالسَّنَا. فَقَالَ النَّبِيُّ صلى الله عليه وسلم: “لَوْ أَنَّ شَيْئًا كَانَ فِيْهِ الشِّفَاءُ مِنَ الْمَوْتِ لَكَانَ فِي السَّنَا”. رَوَاهُ التِّرْمِذِيُّ وَابْنُ مَاجَهُ وقَالَ التِّرْمِذِيُّ: هَذَا حَدِيْثٌ حَسَنٌ غَرِيْبٌ  .

4537. (24) [2/1281అపరిశోధితం]

అస్మా బిన్‌తె ‘ఉమైస్‌ (ర) కథనం: ప్రవక్త (స) ఈమెను, ‘మీరు విరోచనాలకు ఏ మందు వాడుతారు,’ అని అడిగారు. దానికి ఆమె, షుబ్రమ్, అని సమాధానం ఇచ్చారు. దానికి ప్రవక్త (స), ‘అది చాలా వేడిచేస్తుంది. మీరు విరోచనాలకు సనా ఆకు ఉపయోగించండి. ఈ ఆకులో మరణం తప్ప వ్యాధులన్నిటికీ స్వస్థత ఉంది,’ అని ప్రవచించారు. [14]  (ఇబ్నె మాజహ్, తిర్మిజి’ / ప్రామాణికం, -ఏకోల్లేఖనం)

4538- [25]( ضعيف وشطره الأول صحيح) (2/1282)

وَعَنْ أَبِي الدَّرْدَاءِ قَالَ: قَالَ رَسُولُ اللهِ صلى الله عليه وسلم: “إِنَّ اللهَ أَنْزَلَ الدَّاءَ وَالدَّواءَ. وَجَعَلَ لِكُلِّ دَاءٍ دَوَاءً فَتَدَاووْا وَلَا تَدَاوَوْا بِحَرَامٍ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ  .

4538. (25) [2/1282బలహీనం. మొదటి భాగం దృఢం]

అబూ ద్దర్దా (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”అల్లాహ్‌ (త) వ్యాధినీ అవతరింపజేసాడు, దాని మందునూ అవతరింపజేసాడు. కనుక మీరు వైద్యం చేయించుకోండి, అయితే నిషిద్ధ వస్తువుల ద్వారా వైద్యం చేయించకండి.” (అబూ దావూద్)

ఉదా: సారాయి, పందిమాంసం, వంటి నిషిద్ధ వస్తువులు. ఎందుకంటే మరో ‘హదీసు’లో అల్లాహ్‌ (త) నిషిద్ధ వస్తువుల్లో స్వస్థత ఉంచలేదని ప్రవక్త (స) పేర్కొన్నారు.

4539 – [ 26 ] ( صحيح ) (2/1282)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: نَهَى رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم عَنِ الدَّوَاءِ الْخَبِيْثِ. روَاهُ أَحْمَدُ وَأَبُوْدَاوُدَ وَالتِّرْمِذِيُّ وَابْنُ مَاجَهُ .

4539. (26) [2/1282దృఢం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) అపరిశుభ్రమైన మందు ఉపయోగించరాదని వారించారు. అంటే నిషిద్ధ వస్తువుల ద్వారా వైద్యం చేయించటాన్ని వారించారు. ఎందు కంటే  నిషిద్ధ వస్తువు అపరిశుభ్రం అవుతుంది. (అ’హ్మద్‌, అబూ దావూద్‌,  తిర్మిజి’,  ఇబ్నె  మాజహ్)

4540 – [ 27 ] ( صحيح ) (2/1282)

وَعَنْ سَلْمَى خَادِمَةِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَتْ: مَا كَانَ أَحَدٌ يَشْتَكِيْ إِلى رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم وَجْعًا فِيْ رَأْسِهِ إِلَّا قَالَ: “اِحْتَجِمْ”وَلَا وَجْعًا فِيْ رِجْلَيْهِ إِلَّا قَالَ: “اِخْتَضِبْهُمَا”. رَوَاهُ أَبُوْ دَاوُدَ.

4540. (27) [2/1282 దృఢం]

ప్రవక్త (స) సేవకురాలు సల్మా (ర) కథనం: ప్రవక్త (స) తలనొప్పిగా ఉందని చెప్పేవారికి కొమ్ము చేయించమని సలహా ఇచ్చేవారు. ఇంకా కాళ్ళల్లో బాధ ఉందని చెప్పే వారికి కాళ్ళకు గోరింటాకు పెట్టమని సలహా  ఇచ్చేవారు. (అబూ  దావూద్‌)

4541 – [ 28 ] ( لم تتم دراسته ) (2/1282)

وَعَنْهَا قَالَتْ: مَا كَانَ يَكُوْنُ رَسُوْلُ الله صلى الله عليه وسلم قَرْحَةٌ وَلَا نَكَبَةٌ إِلَّا أَمَرَنِيْ أَنْ أَضَعَ عَلَيْهَا الْحنَّاء. رَوَاهُ التِّرْمِذِيُّ

4541. (28) [2/1282అపరిశోధితం]

సల్మా (ర) కథనం: ప్రవక్త (స) కు గాయం తగిలినా, ఎక్కడైనా బాధగా ఉన్నా నన్ను గోరింటాకు పెట్టమని ఆదేశించేవారు. నేను గోరింటాకు పెట్టేదాన్ని (తిర్మిజి’)

4542 – [ 29 ] ( لم تتم دراسته ) (2/1282)

وَعَنْ أَبِيْ كَبَشَةَ الْأَنْمَارِيِّ: أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم كَانَ يَحْتَجِمُ عَلَى هَامَتِهِ وَبَيْنَ كَتِفَيْهِ وَهُوَ يَقُوْلُ: “مَنْ أَهْرَاقَ مِنْ هَذِهِ الدِّمَاءِ فَلَا يَضُرُّهُ أَنْ لَا يَتَدَاوَى بِشَيْءٍ لِشَيْءٍ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ وَابْنُ مَاجَهُ .

4542. (29) [2/1282అపరిశోధితం]

అబూ కబ్‌షహ్ అన్‌మారీ (ర) కథనం:  ప్రవక్త (స) తన తల, రెండు తొడల మధ్య కొమ్ము చేయించే వారు. ఇంకా, ‘కొమ్ము తగిలించడం వల్ల రక్తం తొలగి, దానివల్ల బాధ తగ్గుతుంది. దాని తర్వాత ఏ వైద్యం చేయించక పోయినా ఫరవాలేదు,’ అని అనేవారు. (అబూ దావూద్‌, ఇబ్నె మాజహ్)

4543 – [ 30 ] ( لم تتم دراسته ) (2/1282)

وَعَنْ جَابِرٍ:أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم اِحْتَجَمَ عَلَى وَرِكِهِ مِنْ وَثْءٍ كَانَ بِهِ. رَوَاهُ أَبُوْ دَاوُدَ.

454. (30) [2/1282అపరిశోధితం]

జాబిర్‌ (ర) కథనం: ప్రవక్త (స) కాలు బెణికింది. ప్రవక్త (స) దానికి కొమ్ముచేయించుకున్నారు. (అబూ  దావూద్‌)

4544 – [ 31 ] ( صحيح ) (2/1282)

وَعَنِ ابْنِ مَسْعُوْدٍ قَالَ: حَدَّثَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم عَنْ لَيْلَةَ أُسْرِيَ بِهِ: أَنَّهُ لَمْ يَمُرَّعَلَى مَلَأٍ مِنَ الْمَلَائِكَةِ إِلَّا أَمَرُوْهُ: “مُرْأُمَّتَكَ بِالْحِجَامَةِ “. رَوَاهُ التِّرْمِذِيُّ وَابْنُ مَاجَهُ. وقَالَ التِّرْمِذِيُّ:هَذَا حَدِيْثٌ حَسَنٌ غَرِيْبٌ .

4544. (31) [2/1282దృఢం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ మస్‌’ఊద్‌ (ర) కథనం: ప్రవక్త (స) మే’అరాజ్‌ రాత్రి గురించి ప్రస్తావిస్తూ దైవదూతల బృందాలను కలిసినప్పుడల్లా వారు, ‘మీరు మీ అనుచర సమాజానికి కొమ్ము తగిలించమనే సలహా ఇవ్వండి,’ అని అన్నారు. (తిర్మిజి’ / ప్రామాణికం – ఏకోల్లేఖనం, ఇబ్నె  మాజహ్)

4545 – [ 32 ] ( صحيح ) (2/1283)

وَعَنْ عَبْدِ الرَّحْمنِ بْنِ عُثْمَانَ: أَنْ طَبِيْبًا سَأَلَ النَّبِيّ صلى الله عليه وسلم عَنْ ضِفْدَعٍ يَجْعَلُهَا فِيْ دَوَاءٍ فَنَهَاهُ النَّبِيُّ صلى الله عليه وسلم عَنْ قَتلِهَا. رَوَاهُ أَبُوْ دَاوُدَ.

4545. (32) [2/1283దృఢం]

‘అబ్దుర్రహ్మాన్‌ బిన్‌ ‘ఉస్మాన్‌ (ర) కథనం: ప్రవక్త (స) ను ఒక వైద్యుడు కప్పను చంపి మందులో కలుపు కుంటానని కోరగా ప్రవక్త (స) కప్పను చంపరాదని వారించారు. (అబూ  దావూద్‌)

4546 – [ 33 ] ( صحيح ) (2/1283)

وَعَنْ أَنَسٍ قَالَ: كَانَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم يَحْتَجِمُ فِي الْأَخْدَعَيْنِ وَالْكَاهِلِ. رَوَاهُ أَبُوْ دَاوُدَ وَزَادَ التِّرْمِذِيُّ وَابْنُ مَاجَهُ : وَكَانَ يَحْتَجِمُ سَبْعَ عَشَرَةَ وَتِسْعَ عَشَرَةَ وَإِحْدَى وَعِشْرِيْنَ

4546. (33) [2/1283దృఢం]

అనస్‌ (ర) కథనం: ప్రవక్త (స) మెడపై ఉన్న రెండు నరాల మధ్య, రెండు భుజాల మధ్య కొమ్ము తగిలించే వారు. (అబూ  దావూద్‌,  తిర్మిజి’,  ఇబ్నె  మాజహ్)

అయితే 17, 19, 21 తేదీల్లో కొమ్ము చికిత్స చేసేవారు.

4547 – [ 34 ] ( لم تتم دراسته ) (2/1283)

وَعَنِ ابْنِ عَبَّاسٍ رَضِيَ اللهُ عَنْهُ أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم كَانَ يَسْتَحِبُّ الْحَجَامةَ لِسَبْعَ عَشَرَةَ وَتِسْعَ عَشَرَةَ وَإِحْدَى وَّعِشْرِيْنَ. رَوَاهُ فِيْ شَرْحِ السُّنَّةِ.

4547. (34) [2/1283అపరిశోధితం]

ఇబ్నె ‘అబ్బాస్‌ (ర) కథనం: ప్రవక్త (స) 17, 19, 21 తేదీలలో కొమ్ము చికిత్స చేయడం మంచిదిగా భావించేవారు. (షర్‌హు స్సున్నహ్‌)

4548 – [ 35 ] ( حسن ) (2/1283)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ عَنْ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم قَالَ: “مَنِ احْتَجَمَ لِسَبْعَ عَشَرَةَ وَتِسْعَ عَشَرَةَ وَإِحْدَى وَّعِشْرِيْنَ كَانَ شِفَاءً لَهُ مِنْ كُلِّ دَاءٍ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ.

4548. (35) [2/1283ప్రామాణికం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”17, 19, 21 తేదీల్లో కొమ్ము చికిత్స చేయించుకునే వారికి అల్లాహ్‌ (త) పరిపూర్ణ ఆరోగ్యం ప్రసాదిస్తాడు.” (అబూ  దావూద్‌)

4549 – [ 36 ] ( ضعيف ) (2/1283)

وَعَنْ كَبْشَةَ بِنْتِ أَبِيْ بَكْرَةَ: أَنَّ أَبَاهَا كَانَ يَنْهَى أَهْلَهُ عَنِ الْحَجَامَةِ يَوْمَ الثُّلَاثَاءِ وَيَزْعَمُ عَنْ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم: “أَنَّ يَوْمَ الثُّلَاثَاءِ يَوْمَ الدَّمِ وَفِيْهِ سَاعَةٌ لَا يَرقَأُ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ .

4549. (36) [2/1283బలహీనం]

కబ్‌షహ్ బిన్‌తె అబూ బక్‌రహ్‌(ర) కథనం: ఆమె తండ్రి మంగళవారం కొమ్ము చికిత్స చేయించరాదని వారించేవారు, ఇంకా ప్రవక్త (స) ప్రతి మంగళవారం ఒక ప్రత్యేక సమయంలో రక్తం నిలువదని చెప్పారని అన్నారు. (అబూ  దావూద్‌)

4550 – [ 37 ] ( لم تتم دراسته ) (2/1283)

وَعَنِ الزُّهْرِيِّ مُرْسَلًا عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم: “مَنِ احْتَجَمَ يَوْمَ الْأَرْبِعَاءِ أَوْ يَوْمَ السَّبْتِ فَأَصَابَهُ وَضَحٌ فَلَا يَلُوْمَنَّ إِلَّا نَفْسَهُ”. رَوَاهُ أَحْمَدُ وَأَبُوْ دَاوُدَ وَقَالَ: وقَدْ أُسْنِدَ وَلَا يَصِحُّ  .

4550. (37) [2/1283అపరిశోధితం]

ఇమామ్‌ ‘జుహ్‌రీ కథనం: ప్రవక్త (స) బుధవారం, శనివారం, కొమ్ము చికిత్స చేయించేవారికి కుష్ఠువ్యాధి సోకితే, అతడు తన్నుతానే విమర్శించుకోవాలి. (అ’హ్మద్‌, అబూ దావూద్‌) [15] 

4551 – [ 38 ] ( لم تتم دراسته ) (2/1284)

وَعَنْهُ مُرْسَلًا قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَنِ احْتَجَمَ أَوْ اطَّلى يَوْمَ السَّبْتِ أَوْ الْأَرْبِعَاءِ فَلَا يَلُوْمَنَّ إِلَّا نَفْسَهُ فِي الْوَضَحِ”. رَوَاهُ فِيْ شَرْحِ السُّنَّةِ  .

4551. (38) [2/1284అపరిశోధితం]

జుహ్‌రీ కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”శనివారం లేదా బుధవారం కొమ్ము చికిత్స చేయించినా, మరే విధంగా చికిత్స చేయించినా అతనికి కుష్ఠురోగం వస్తే, అతడు తన్నుతాను విమర్శించుకోవాలి.” (షర్‌హు స్సున్నహ్‌)

4552 – [ 39 ] ( حسن ) (2/1284)

وَعَنْ زَيْنَبَ اِمْرَأَةِ عَبْدِ اللهِ بْنِ مَسْعُوْدٍ أَنَّ عَبْدَ اللهِ رَأَى فِيْ عُنُقِيْ خَيْطًا فَقَالَ: مَا هَذَا؟ فَقُلْتُ: خَيْطٌ رُقِيَ لِيَ فِيْهِ. قَالَتْ: فَأَخَذَهُ فَقَطَعَهُ ثُمَّ قَالَ :أَنْتُمْ آلَ عَبْدِ اللهِ لَأَغْنِيَاءُ. عَنِ الشِّرْكِ سَمِعْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ: “إِنَّ الرُّقَى وَالتَّمَائِمَ وَالتَّوَلَةَ شِرْكٌ” .فَقُلْتُ: لَمْ تَقُوْلُ هَكَذَا؟ لَقَدْ كَانَتْ عَيْنِيْ تُقْذَفُ وَكُنْتُ أَخْتَلِفُ إِلى فُلَانٍ الْيَهُوْدِيِّ فَإِذَا رَقَاهَا سَكَنَتْ. فَقَالَ عَبْدُ اللهِ: إِنَّمَا ذَلِكَ عَمَلُ الشَّيْطَانِ كَانَ يَنْخَسُهَا بِيَدِهِ فَإِذَا رُقِيَ كَفَّ عَنْهَا إِنَّمَا كَانَ يَكْفِيْكِ أَنْ تَقُوْلِيْ كَمَا كَانَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم يقول: “أَذْهِبِ الْبَأْسَ رَبَّ النَّاسِ وَاشْفِ أَنْتَ الشَّافِيْ. لَا شِفَاءَ إِلَّا شِفَاؤُكَ شِفَاء لَا يُغَادِرُسَقَمًا”. رَوَاهُ أَبُوْدَاوُدَ.

4552. (39) [2/1284ప్రామాణికం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ మస్‌’ఊద్‌ (ర) భార్య ‘జైనబ్‌ (ర) కథనం: నా భర్త ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ మస్‌’ఊద్‌ (ర) నా మెడలో దారం చూచి, ‘ఇదేమిటి,’ అని అడిగారు, నేను, ‘మంత్రించిన దారం,’ అని అన్నాను. ‘దిష్టి తగలకుండా ఉండటానికి మెడలో దారం వేసు కున్నావా?’ అని ఆ దారాన్ని ముక్కలు, ముక్కలు చేసి ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ మస్‌’ఊద్‌ ఇంటివారితో, ‘ఇటువంటివి ఎంతమాత్రం అక్కరలేవు. నేను ప్రవక్త (స) ను, ‘మంత్రతంత్రాలు, తావీజులు, తాయెత్తులు అన్నీ అవిశ్వా సానికి చెందినవి అని అంటూ ఉండగా విన్నాను,’ అని అన్నారు. దానికి నేను, ‘నా కంటిలో నొప్పిగా ఉండేది, ఒక యూదుని వద్దకు వెళ్ళాను. అతడు మంత్రించాడు. నాకు స్వస్థత లభించింది,’ అని తెలిపాను. దానికి ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ మస్‌’ఊద్‌ (ర), ‘ఇవన్నీ షై’తానీ పనులు. షై’తాన్‌ తన చేతులతో కంటిలో పొడుస్తాడు, అది నొప్పిగా ఉంటుంది. వాడి పేరుచెప్పి మంత్రిస్తే, నొప్పి తగ్గుతుంది. కళ్ళు నొప్పి పెట్టినపుడు ఇటువంటి సమయాల్లో పఠించటానికి ప్రవక్త (స) నేర్పిన దు’ఆ పఠించాలి, అదే సరిపోతుంది. అది, అజ్హిబిల్బాస రబ్బన్నాసి  వష్ఫి అన్తష్షాఫీ  లాషిఫాఅ  ఇల్లా  షిఫాఉక  షిఫాఅన్లా యుగాదిరు సఖమన్  — ‘ఓ మానవులందరి ప్రభువా! బాధను తగ్గించి, స్వస్థత ప్రసాదించు. నీవే స్వస్థత ప్రసాదించేవాడవు. నీదే స్వస్థత, వ్యాధిని పూర్తిగా తొలగించే స్వస్థత ప్రసాదించు.’ [16]  (అబూ దావూద్‌)

4553 – [ 40 ] ( صحيح ) (2/1284)

وَعَنْ جَابِرٍ قَالَ: سُئِلَ النَّبِيُّ صلى الله عليه وسلم عَنِ النُّشْرَةِ فقَالَ: “هُوَ مِنْ عَمَلِ الشَّيْطَانِ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ .

4553. (40) [2/1284దృఢం]

జాబిర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ను నుష్రహ్ ను గురించి అడగటం జరిగింది. ప్రవక్త (స) ‘అది షై’తానీ పని,’ అని సమా ధానం ఇచ్చారు. [17] (అబూ  దావూద్‌)

4554 – [ 41 ] ( ضعيف ) (2/1284)

وَعَنْ عَبْدِ اللهِ بْنِ عُمَرَ قَالَ: سَمِعْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ: “مَا أُبَالِيْ مَا أَتَيْتُ إِنْ أَنَا شَرِبْتُ تَرْيَاقًا أَوْ تَعَلَّقْتُ تَمِيْمَةً أَوْ قُلْتُ الشِّعْرَ مِنْ قِبَلِ نَفْسِيْ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ .

4554. (41) [2/1284బలహీనం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘ఉమర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ఇలా ప్రవచిస్తూ ఉండగా నేను విన్నాను.’నిషిద్ధ మందును, తావీజును,  ఇష్టం వచ్చిన విధంగా కవిత్వాలు వ్రాసి మెడలో వేసుకోవటాన్ని నేనెంత మాత్రం సమ్మతించను.’ [18]  (అబూ దావూద్)

4555 – [ 42 ] ( صحيح ) (2/1285)

وَعَنِ الْمُغِيْرَةِ بْنِ شُعَبَةَ قَالَ: قَالَ النَّبِيُّ صلى الله عليه وسلم: “مَنِ اكْتَوَى أَوِ اسْتَرْقَى فَقَدْ بَرِئَ مِنَ التَّوَكُّلِ”. روَاهُ أَحْمَدُ وَالتِّرْمِذِيُّ  وَابْنُ مَاجَهُ  .

4555. (42) [2/1285దృఢం]

ము’గీరహ్ బిన్‌ షూబహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, వాతలు పెట్టి వైద్యం చేసినవాడు, మంత్రాలు తంత్రాలు చేసినవాడు దైవంపై నమ్మకానికి దూర మయ్యాడు. [19] (అ’హ్మద్‌, తిర్మిజి’, ఇబ్నె  మాజహ్)

4556 – [ 43 ] ( لم تتم دراسته ) (2/1285)

وَعَنْ عِيْسَى بْنِ حَمْزَةَ قَالَ: دَخَلْتُ عَلَى عَبْدِ اللهِ بْنِ عُكَيْمٍ وبِهِ حُمْرَةٌ فَقُلْتُ: أَلَا تُعَلِّقُ تَمِيْمَةً؟ فَقَالَ: نَعُوْذُ بِاللهِ مِنْ ذَلِكَ قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم:”مَنْ تَعَلَّقَ شَيْئًا وُكِلَ إِلَيْهِ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ.

4556. (43) [2/1285అపరిశోధితం]

‘ఈసా బిన్‌ ‘హమ్‌’జహ్ (ర) కథనం: నేను అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘హకీమ్‌ వద్దకు వెళ్ళాను. అతనికి సుర్‌ఖీ వ్యాధి సోకి ఉండటం చూచి, ‘మీరు తాయెత్తులు కట్టుకో రు?’ అని సలహా  ఇచ్చాను. దానికి అతడు, ”అ’ఊజు బిల్లాహి మిన్‌ జా’లిక”- ‘నేను ఇటువంటి వస్తువుల నుండి అల్లాహ్‌(త) శరణు కోరుతున్నాను.’ ప్రవక్త (స), ‘ఎవరైనా ఏదైనా వస్తువు కట్టుకుంటే అతన్ని దానికే అప్పజెప్పటం జరుగుతుంది,’ అని ప్రవచించారు. (అబూ  దావూద్‌)  

ఈ ‘హదీసు’ ద్వారా తావీజులు, తాయెత్తులు ధరించరాదని తెలుస్తుంది.

4557 – [ 44 ] ( صحيح ) (2/1285)

وَعَنْ عِمْرَانَ بْنِ حُصَيْنٍ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم قَالَ:”لَا رُقْيَةَ إِلَّا مِنْ عَيْنٍ أَوْحُمَةٍ “.رَوَاهُ أَحْمَدُوَالتِّرْمِذِيُّ وَأَبُوْدَاوُدَ .

4557. (44) [2/1285దృఢం]

‘ఇమ్రాన్‌ బిన్‌ ‘హు’సైన్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మంత్రతంత్రాలు దిష్టికి, విషజంతువుల కాటుకు పనిచేస్తాయి.” (అ’హ్మద్‌, తిర్మిజి’, అబూ  దావూద్‌)

4558 – [ 45 ] ( ضعيف ) (2/1285)

وَرَوَاهُ ابْنُ مَاجَهُ عَنْ بُرَيْدَةَ  .

4558. (45) [2/1285బలహీనం]

బురైదహ్‌ (ర) కథనం. (ఇబ్నె మాజహ్)

అంటే దిష్టి, విషప్రభావం తొలగించటానికి ఖుర్‌ఆన్‌ ‘హదీసు’ల వెలుగులో దు’ఆలు చదవవచ్చును.

4559 – [ 46 ] ( ضعيف ) (2/1285)

وَعَنْ أَنَسٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَا رُقْيَةَ إِلَّا مِنْ عَيْنٍ أَوْ حُمَةٍ أَوْ دَمٍ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ.

4559. (46) [2/1285బలహీనం]

అనస్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”దిష్టి, విష ప్రభావం, రక్త స్రావాలకు మాత్రమే మంత్ర తంత్రాలు, దు’ఆలు చేయాలి.”  [20] (అబూ దావూద్‌)

4560 – [ 47 ] ( صحيح ) (2/1285)

وَعَنْ أَسْمَاءَ بِنْتِ عُمَيْسٍ قَالَتْ : يَا رَسُوْلَ اللهِ إِنَّ وُلِدَ جَعْفَرَ تَسْرَعُ إِلَيْهِمُ الْعَيْنُ أَفَأَسْتَرْقِيْ لَهُمْ ؟ قَالَ:”نَعَمْ فَإِنَّهُ لَوْ كَانَ شَيْءٌ سَابَقَ الْقَدَرَ لَسَبقَتْهُ الْعَيْنُ”. رَوَاهُ أَحْمَدُ وَالتِّرْمِذِيُّ وَابْنُ مَاجَهُ .

4560. (47) [2/1285దృఢం]

అస్మా బిన్‌తె ‘ఉమైస్‌ (ర) కథనం: ”ఓ ప్రవక్తా! జ’అఫర్‌ పిల్లలకు చాలా త్వరగా దిష్టి తగులుతుంది, వారి దిష్టి తొలగించటానికి ఈ దు’ఆ మంత్రించనా,” అని విన్నవించు కున్నాను. దానికి ప్రవక్త (స), ”మంత్రించు, విధివ్రాతను అధిగమించేది ఏదైనా ఉంటే అది దిష్టి, అంటే దిష్టి విధివ్రాతను అధిగమిస్తుంది,” అని అన్నారు. (అ’హ్మద్‌, తిర్మిజి’, ఇబ్నె  మాజహ్)

4561 – [ 48 ] ( صحيح ) (2/1286)

وَعَنِ الشِّفَاءِ بِنْتِ عَبْدِ اللهِ قَالَتْ: دَخَلَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم وَأَنَا عِنْدَ حَفْصَةَ فَقَالَ: “أَلَا تُعَلِّمِيْنَ هَذِهِ رُقْيَةَ النَّمْلَةِ كَمَا عَلَّمْتِيْهَا الْكِتَابَةَ. رَوَاهُ أَبُوْ دَاوُدَ.  

4561. (48) [2/1286దృఢం]

షిఫా’ బిన్‌తె ‘అబ్దుల్లాహ్‌ (ర) కథనం: నేను ‘హఫ్‌’సహ్ (ర) వద్ద కూర్చొని ఉన్నాను. ఇంతలో ప్రవక్త (స) వచ్చి, ‘హఫ్‌’సహ్ తో, ‘నువ్వు వ్రాయడం నేర్పించినట్టే మంత్రించటం, నమ్‌ల వ్యాధి దు’ఆ కూడా నేర్పించు,’ అని  ఆదేశించారు. [21]  (అబూ  దావూద్‌)

4562 – [ 49 ] ( صحيح ) (2/1286)

وَعَنْ أَبِيْ أُمَامَةَ بْنِ سَهْلِ بْنِ حُنَيْفٍ قَالَ: رَأَى عَامِرُ بْنُ رَبِيْعَةَ سَهْلَ بْن حُنَيْفٍ يَغْتَسِلُ فَقَالَ: وَاللهِ مَا رَأَيْتُ كَالْيَوْمِ وَلَا جِلْدَ مُخَبَّأةٍ قَالَ: فَلُبِطَ سَهْلٌ فَأَتَي رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم فَقِيْلَ لَهُ: يَا رَسُوْلَ اللهِ هَلْ لَكَ فِيْ سَهْلِ بْنِ حُنَيْفٍ؟ وَاللهِ مَا يَرْفَعُ رَأْسَهُ فَقَالَ: “هَلْ تَتَّهِمُوْنَ لَهُ أَحَدًا؟ “فَقَالُوْا: نَتَّهمُ عَامِرَ بْنَ رَبِيْعَةَ قَالَ: فَدَعَا رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم عَامِرًا فَتَغَلَّظَ عَلَيْهِ. وَقَالَ: “عَلَامَ يَقْتُلُ أَحَدُكُمْ أَخَاهُ؟ أَلَا بَرَّكْتَ؟ اِغْتَسِلْ لَهُ”. فَغَسَلَ لَهُ عَامِرٌ وَجْهَهُ وَيَدَيْهِ وَمِرْفَقَيْهِ وَرُكْبَتَيْهِ وَأَطْرَافَ رِجْلَيْهِ وَدَاخِلَة إِزَارِهِ فِيْ قَدْحٍ ثُمَّ صَبَّ عَلَيْهِ فَرَاحَ مَعَ النَّاسِ لَيْسَ لَهُ بَأْسٌ. رَوَاهُ فِيْ شَرْحِ السُّنَّةِ وَرَوَاهُ مَالِكٌ وَفِيْ رِوَايَتِهِ: قَالَ: “إِنَّ الْعَيْنَ حَقٌّ تَوَضَّأَ لَهُ”.

4562. (49) [2/1286దృఢం]

ఉమామహ్ బిన్‌ సహల్‌ బిన్‌ ‘హునైఫ్‌ (ర) కథనం: ‘ఆమిర్‌ బిన్‌ రబీ’అ, సహల్‌ బిన్‌ ‘హునైఫ్‌ను స్నానం చేస్తూ ఉండగా చూచి, ‘అల్లాహ్‌ సాక్షి! ఇలా నేను ఎవరినీ, చివరికి అమ్మాయిల చర్మాన్ని కూడా చూడలేదు,’ అని అన్నారు. అంటే అతడు ఎర్రగా బుర్రగా చాలా అందంగా ఉండేవాడు. అతని ఈ మాటలు వినగానే సహల్‌ బిన్‌ హునైఫ్‌ స్నానం చేస్తూ క్రిందపడ్డాడు. క్రిందపడి చేపలా కొట్టుకోసాగాడు. అతన్ని ఎత్తి ప్రవక్త (స) వద్దకు తీసుకురావటం జరిగింది. ‘ప్రవక్తా! కొంచెం చూస్తారా! అతడు తన తల కూడా ఎత్తలేక పోతున్నాడు, దిష్టి ప్రభావం విషంలా వ్యాపించింది,’ అని విన్నవించుకోవటం జరిగింది. అప్పుడు ప్రవక్త (స), ‘దిష్టి ఎవరి వల్ల తగిలిందో మీకేమైనా తెలుసా?’ అని అడిగారు. దానికి అతడు, ‘నా అనుమానం ‘ఆమిర్‌ బిన్‌ రబీ’అ మాత్రమే. ఎందుకంటే ఇతడు స్నానం చేస్తూ ఉండగా అతడు చూసి ఇలా అన్నాడు. ప్రవక్త (స) అది విని అతన్ని పిలుచుకురమ్మని ఆదేశించారు. అతన్ని పిలవటం జరిగింది. అప్పుడు ప్రవక్త (స) నీవు నీ సోదరున్ని చంపాలనా, ఇటువంటి మాటలు పలికి దిష్టి తగిలిస్తావు?’ అని అతని పట్ల ఆగ్రహం వ్యక్తంచేసారు. దీనికి వ్యతిరేకంగా అతన్ని దీవించాలి, అతని శుభం కోసం ప్రార్థించాలి, మాషా అల్లాహ్‌ మొదలైన వచనాలు పలకాలి అని హితోపదేశం చేసారు. ఇంకా, ‘స్నానం చేయి, ఆ నీటిని అతనిపై వేయి,’ అని అన్నారు. ‘ఆమిర్‌ బిన్‌ రబీ’అ ముఖం, చేతులు, కాళ్ళు, నడుం మొదలైన వాటిని కడిగి, ఆ నీటిని అతనిపై వేసారు. అతడు వెంటనే ఆరోగ్యం పొందాడు. దిష్టి ప్రభావం తొలగిపోయింది. అతడు తిరిగి నడుస్తూ వెళ్ళి పోయాడు. (షర్‌హుస్సున్నహ్‌, మువత్తా ఇమామ్‌ మాలిక్‌)

మరో ఉల్లేఖనలో ఇలా ఉంది, ప్రవక్త(స), ‘దిష్టి తగలటం వాస్తవం. వు’దూ చేయి,’ అని అన్నారు. అతడు వు’దూ చేసాడు. పైన పేర్కొన్నట్టు.

4563 – [ 50 ] ( صحيح ) (2/1286)

وَعَنْ أَبِيْ سَعِيْدِ الْخُدْرِيِّ قَالَ: كَانَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم يَتَعَوَّذُ مِنَ الْجَانِّ وَعَيْنِ الْإِنْسَانِ حَتَّى نَزَلَتِ الْمُعَوِّذَتَانِ فَلَمَّا نَزَلَتْ أَخَذَ بِهِمَا وَتَرَكَ سِوَاهُمَا. رَوَاهُ التِّرْمِذِيُّ وَابْنُ مَاجَهُ. وَقَالَ التِّرْمِذِيُّ: هَذَا حَدِيْثٌ حَسَنٌ غَرِيْبٌ .

4563. (50) [2/1286దృఢం]

అబూ స’యీద్‌ ‘ఖుద్రీ (ర) కథనం: ప్రవక్త (స) మానవుల, జిన్నుల దిష్టి నుండి శరణు కోరేవారు. అప్పుడు ఈ రెండు సూరాలు సూరహ్‌ ఫలఖ్‌(113), సూరహ్‌ నాస్‌ (114) అవతరింపజేయబడ్డాయి. అప్పటి నుండి ప్రవక్త (స) వీటిని చదవటం ప్రారం భించారు. ఇతర దు’ఆలను చదవటం మానివేసారు.[22](ఇబ్నె మాజహ్, తిర్మిజి’-ప్రామాణికం, -ఏకోల్లేఖనం)

4564 – [ 51 ] ( ضعيف ) (2/1286)

وَعَنْ عَائِشَةَ قَالَتْ: قَالَ لِيْ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “هَلْ رُئِيَ فِيْكُمُ الْمُغَرِّبُوْنَ؟” قُلْتُ: وَمَا الْمُغَرِّبُوْنَ؟ قَالَ: “الَّذِيْنَ يَشْتَرِكُ فِيْهِمُ الْجِنُّ”.  رَوَاهُ أَبُوْ دَاوُدَ .

4564. (51) [2/1286బలహీనం]

‘ఆయి’షహ్‌ (ర) కథనం: ప్రవక్త (స)  నాతో ”మీలో ము’గర్రిబూన్‌ కనబడుతున్నారు,” అని అన్నారు. దానికి నేను, ”ఓ ప్రవక్తా! ముగర్రిబూన్ ఎవరు?’ అని అన్నాను. అప్పుడు ప్రవక్త (స), ‘జిన్నులు ప్రవేశించిన వారు,’ అని  అన్నారు”  (అబూ  దావూద్‌)

4565 – [ 52 ] ( لم تتم دراسته ) (2/1286)

وَذُكِرَحَدِيْثُ ابْنِ عَبَّاسٍ:”خَيْرَمَا تَدَاوَيْتُمْ”فِيْ”بَابِ التَّرَجُّلِ”.

4565. (52) [2/1286అపరిశోధితం]

చూ. బాబ్ తరజ్జుల్ లో ఇబ్నె అబ్బాస్‌ (ర) కథనం.[23]

—–

اَلْفَصْلُ الثَّالِثُ  మూడవ విభాగం   

4566 – [ 53 ] ( ضعيف ) (2/1287)

عَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “اَلْمَعِدَةُ حَوْضُ الْبَدَنِ وَالْعُرُوْقُ إِلَيْهَا وَارِدَةٌ فَإِذَا صَحَّتِ الْمَعِدَةُ صَدَرَتِ الْعُرُوْقُ بِالصِّحَّةِ وَإِذَا فَسَدَتِ الْمَعِدَةُ صَدَرَتِ الْعُرُوْقُ بِالسُّقْمِ”.

4566. (53) [2/1287బలహీనం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”జీర్ణాశయం శరీరంలోని హౌ’ద్ వంటిది. నరాలు దాని వైపు కలసి ఉంటాయి. జీర్ణావయం సరిగా ఉంటే నరాలు సరిగా ఉంటాయి. జీర్ణాశయం పాడయితే నరాలు కూడా పాడవుతాయి.”  [24]  (బైహఖీ)

4567 – [ 54 ] ( صحيح ) (2/1287)

وَعَنْ عَلِيٍّ قَالَ: بَيْنَا رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم ذَاتَ لَيْلَةٍ يُصَلِّيْ فَوَضَعَ يَدَهُ عَلَى الْأَرْضِ فَلَدَغَتْهُ عَقْرَبُ فَنَاوَلَهَا رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم بِنَعْلِهِ فَقَتَلَهَا فَلَمَّا انْصَرَفَ قَالَ: “لَعَنَ اللهُ الْعَقْرَبَ مَا تَدَعُ مُصَلِّيًا وَلَا غَيْرَهُ أَوْ نَبِيًّا وَغَيْرَهُ”. ثُمَّ دَعَا بِمِلْحٍ وَمَاءٍ فَجَعَلَهُ فِيْ إِنَاءٍ ثُمَّ جَعَلَ يَصُبُّهُ عَلَى إِصْبَعِهِ حَيْثُ لَدَغَتْهُ وَيَمْسَحُهَا وَيُعَوِّذُهَا بِالْمُعَوِّذَتَيْنِ. رَوَاهُمَا الْبَيْهَقِيُّ فِيْ شُعَبِ الْإِيْمَانِ.

4567. (54) [2/1287దృఢం]

‘అలీ (ర) కథనం: ప్రవక్త (స) రాత్రిపూట నమా’జు చదువుతున్నారు. ప్రవక్త (స) తన చేతిని నేలపై పెట్టారు. తేలు కుట్టింది. ప్రవక్త (స) తన చెప్పులతో నలిపివేసారు. నమా’జు తర్వాత, అల్లాహ్(త) తేలును శపించు గాక, నమా’జులో ఉన్న వారినీ, నమా’జులో లేని వారినీ, (అంటే నేను కుడుతున్నది ఎవరినీ అని కూడా చూడదు) అని పలికి ఉప్పు నీరు తెప్పించి తేలు కుట్టిన చోట వేస్తూ ముఅవ్వజతైన్ పఠిస్తూ ఉన్నారు. (బైహఖీ)

 అంటే ఎవరికైనా తేలు లేదా పాము కుడితే, దానిపై ఉప్పు నీరు వేస్తూ ము’అవ్వజతైన్‌ పఠిస్తూ ఊదుతూ ఉండాలి. ఇన్‌షా’ అల్లాహ్‌ దాని ప్రభావం పోతుంది.

అది తహజ్జుద్  నమా’జు  అయి ఉండవచ్చు.

4568 – [ 55 ] ( صحيح ) (2/1287)

وَعَنْ عُثْمَانَ بْنِ عَبْدِ اللهِ بْنِ مَوْهَبٍ قَالَ: أَرْسَلَنِيْ أَهْلِيْ إِلى أُمِّ سَلَمَةَ بِقَدَحٍ مِنْ مَاءٍ وَكَانَ إِذَا أَصَابَ الْإِنْسَانَ عَيْنٌ أَوْ شَيْءٌ بَعَثَ إِلَيْهَا مِخْضَبَهُ فَأَخْرَجَتْ مِنْ شَعْرِرَسُوْلِ اللهِ صلى الله عليه وسلم وَكَانَتْ تُمْسِكُهُ فِيْ جُلْجُلٍ مِنْ فِضَّةٍ فَخَضْخَضَتْهُ لَهُ فَشَرِبَ مِنْهُ قَالَ: فَاطَّلَعْتُ فِيْ الْجُلْجُلِ فَرَأَيْتُ شَعَرَاتٍ حَمْرَاءَ . رَوَاهُ الْبُخَارِيُّ  .

4568. (55) [2/1287-దృఢం]

‘ఉస్మాన్‌ బిన్‌ ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ మవ్‌హబ్‌ కథనం: మా ఇంటివారు నాకు నీటికప్పు ఒకటి ఇచ్చి ఉమ్మె సలమహ్ వద్దకు పంపారు. అంటే ఆ  కాలంలో చాలా మంది ఎవరికైనా దిష్టి తగిలినా లేదా మరే బాధ, నొప్పి కలిగినా ఉమ్మె సలమహ్ (ర) దగ్గరకు వెళ్ళేవారు. ఆమె ప్రవక్త (స) వెంట్రుకలను కడిగిన నీటిని వారికి ఇచ్చేవారు. ఆ నీటిని రోగులు త్రాగేవారు, ఇంకా తమపై చిలకరించే వారు. దానివల్ల వ్యాధి, దిష్టి నయం అయిపోయేది. అందువల్లే మా ఇంటి వారు ఒక గిన్నెలో నీళ్ళు ఇచ్చి నన్ను పంపారు. నేనామె ఇంటికి వెళితే ఆమె నన్ను చూచి నేను ఆ అవసరం ఉండే వచ్చానని గ్రహించారు. ఆమె ఒక వెండి గొట్టం తీసారు. అందులో ప్రవక్త (స) వెంట్రుకలు చాలా భద్రంగా ఉన్నాయి. ఆమె ఆ గొట్టంలో నీళ్ళు వేసి ఊపసాగారు. నేను తొంగిచూసాను. ఎర్రటి వెంట్రుకలు కనబడ్డాయి. ఆ నీటిని రోగి త్రాగితే స్వస్థత పొందేవాడు. [25]  (బు’ఖారీ)

4569 – [ 56 ] ( لم تتم دراسته ) (2/1287)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ أَنَّ نَاسًا مِنْ أَصْحَابِ رَسُوْلِ اللهِ صلى الله عليه و سلم قَالُوْا لِرَسُوْلِ اللهِ: اَلْكَمْأَةُ جُدَرِيُّ الْأَرْضِ؟ فَقَالَ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم: “اَلْكَمْأَةُ مِنَ الْمَنِّ وَمَاؤُهَا شَفَاءٌ لِلْعَيْنِ وَالْعَجْوَةُ مِنَ الْجَنَّةِ وَهِيَ شِفَاءٌ مِنَ السُّمِّ”. قَالَ أَبُوْ هُرَيْرَةَ: فَأَخَذْتُ ثَلَاثَةَ أَكْمُؤٍ أَوْ خَمْسًا أَوْ سَبْعًا فَعَصَرْتُهُنَّ وَجَعَلْتُ مَاءَهُنَّ فِيْ قَارُوْرَةٍ وَكَحَلْتُ بِهِ جَارِيَةً لِيْ عَمْشَاءَ فَبَرَأَتْ. رَوَاهُ التِّرْمِذِيُّ وَقَالَ: هَذَا حَدِيْثٌ حَسَنٌ.

4569. (56) [2/1287 అపరిశోధితం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) అనుచరులు, ”ఓ ప్రవక్తా! ఖంబి’జమీన్‌ చేచక్‌ అవుతుందా?” అని విన్నవించుకున్నారు. దానికి ప్రవక్త (స), ‘ఖంబీ మన్‌ జాతికి చెందినది. దాని నీరు కళ్ళకు మందువంటిది. అజ్వహ్ ఖర్జూరం స్వర్గం నుండి వచ్చింది. ఇది విష ప్రభావాన్ని తొలగిస్తుంది,’ అని అన్నారు. అబూ హురైరహ్‌ (ర) కథనం: ఈ ‘హదీసు’ను విని, నేను, 5 లేక 7 ఖంబీలను నూరి దాని నీటిని ఒక సీసాలో వేసాను. మా పని మనిషికి కంటిజబ్బు ఉండేది. ఆమె దీన్ని ఉపయోగించింది. ఆమె స్వస్థత పొందింది.” [26]  (తిర్మిజి’ – ప్రామాణికం)

4570 – [ 57 ] ( لم تتم دراسته ) (2/1288)

وَعَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَنْ لَعِقَ الْعَسَلَ ثَلَاثَ غَدَوَاتِ فِيْ كُلِّ شَهْرٍ لَمْ يُصِبْهُ عَظِيْمٌ مِنَ الْبَلَاءِ”.

4570. (57) [2/1288అపరిశోధితం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మీరు మీ పిల్లల్ని గొంతువ్యాధికి గొంతులో వేలుపెట్టి నొక్కకండి. మీరు ఖుస్త్ ఉపయోగించండి.” [27](బు’ఖారీ, ముస్లిమ్‌)

4571 – [ 58 ] ( لم تتم دراسته ) (2/1288)

وَعَنْ عَبْدِ اللهِ بْنِ مَسْعُوْدٍ قَالَ: قَالَ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم: “عَلَيْكُمْ بِالشِّفَاءَيْنِ: الْعَسَلِ وَالْقُرْآنِ”. رَوَاهُمَا ابْنُ مَاجَهُ وَالْبَيْهَقِيُّ فِيْ شُعَبِ الْإِيْمَانِ

وَقَالَ: وَالصَّحِيْحُ أَنَّ الْأَخِيْرَ مَوْقُوْفٌ عَلَى ابْنِ مَسْعُوْدٍ .

4571. (58) [2/1288అపరిశోధితం]

‘అబ్దుల్లాహ్ బిన్ మస్’ఊద్ (ర) కథనం: ప్రవక్త (స) మీ కొరకు రెండు మందులున్నాయి. ”తేనే మరియు ఖుర్ఆన్.” (ఇబ్నె మాజహ్, బైహఖీ – షుఅబిల్ ఈమాన్,  దృఢం).

చివరి భాగం ఇబ్నె మస్’ఊద్ వద్ద ఆగింది. [28] (బు’ఖారీ, ముస్లిమ్‌)

4572 – [ 59 ] ( لم تتم دراسته ) (2/1288)

وَعَنْ أَبِيْ كَبْشَةَ الْأَنْمَارِيِّ: أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم اِحْتَجَمَ عَلَى هَامَتِهِ مِنَ الشَّاةِ الْمَسْمُوْمَةِ. قَالَ مَعْمَرٌ: فَاحْتَجَمْتُ أَنَا مِنْ غَيْرِ سُمِّ. كَذَلِكَ فِيْ يَافُوْخِيْ. فَذَهَبَ حُسْنُ الْحِفْظِ عَنِّيْ حَتّى كُنْتث أُلقنُ فَاتِحَةَ الْكِتَابِ فِي الصَّلَاةِ. رَوَاهُ رَزِيْنٌ .

4572. (59) [2/1288అపరిశోధితం]

అబూ కబ్‌షహ్ అన్మారీ (ర) కథనం: ప్రవక్త (స) విషపూరితమైన మేకమాంసం తిన్నందుకు తన తల మధ్య కొమ్ము చికిత్స చేయించారు. మ’అమ్మర్‌ ఉల్లేఖన కర్త రోగం లేనిదే తన తలపై కొమ్ముచికిత్స చేయించుకున్నారు. ఫలితంగా అతని జ్ఞాపక శక్తి తడబడసాగింది. అతను అనేవాడు, ”నేను సూరహ్‌ ఫాతి’హా చదివినప్పుడు కూడా మరచిపోయేవాడిని, ప్రజలు గుర్తు చేస్తే ముందుకు సాగే వాడిని.” (ర’జీన్‌)

అంటే అనవసరంగా శస్త్రచికిత్స చేయించరాదు, అలా చేస్తే  లాభం కన్నా నష్టమే అధికంగా ఉంటుంది.

4573 – [ 60 ] ( ضعيف ) (2/1288)

وَعَنْ نَافِعٍ قَالَ: قَالَ ابْنُ عُمَرَ: يَا نَافِعُ يَنْبِغُ بِي الدَّمُ فَأَتَنِيْ بِحَجَّامٍ وَ اجْعَلْهُ شَابًّا وَلَا تَجْعَلْهُ شَيْخًا وَلَا صَبِيًّا. وَقَالَ ابْنُ عُمَرَ: سَمِعْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ: “اَلْحِجَامَةُ عَلَى الرِّيْقِ أَمْثَلُ وَهِيَ تَزِيْدُ فِيْ الْعَقْلِ وَتَزِيْدُ فِي الْحِفْظِ وَتَزِيْدُ الْحَافِظَ حِفْظًا. فَمَنْ كَانَ مُحْتَجِمًا فَيَوْمَ الْخَمِيْسِ عَلَى اسْمِ الله تَعَالى وَاجْتَنِبُوا الْحَجَامَةَ يَوْمَ الْجُمُعَةِ وَيَوْمَ السَّبْتِ وَيَوْمَ الْأَحَدِ فَاحْتَجِمُوْا يَوْمَ الْاِثْنَيْنِ وَيَوْمَ الثُّلَاثَاءِ وَ اجْتَنِبُوْا الْحِجَامَةَ يَوْمَ الْأَرْبَعَاءِ فَإِنَّهُ الْيَوْمُ الَّذِيْ أُصِيْبَ بِهِ أَيُّوْبُ فِي الْبَلَاءِ. وَمَا يَبْدُوْ جُذَامٌ وَلَا بَرَصٌ إِلَّا فِيْ يَوْمِ الْأَرْبَعَاءِ أَوْ لَيْلَةِ الْأَرْبِعَاءِ”. رَوَاهُ ابْنُ مَاجَهُ  .

4573.(60) [2/1288బలహీనం]

 నాఫే’అ (ర) కథనం: నాతో ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘ఉమర్‌ (ర) ఇలా అన్నారు, ”నా రక్తం చెడినట్టుంది, కొమ్ము చికిత్స చేసే వారినెవరినైనా తీసుకురండి, అయితే అతడు బలహీనంగా, కొమ్ముచికిత్స చేసేటప్పుడు వణికేలా ఉండకూడదు. దానికి నాఫె’అ, ‘నేను ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘ఉమర్‌ను ఇలా అంటూ ఉండగా విన్నాను. అతడు ప్రవక్త (స)ను ఇలా అంటూ ఉండగా విన్నాడు. ”ఏమీ తినకుండా కొమ్ము చికిత్స చేయించడం చాలా మంచిది, లాభకరమైనది. ఎందు కంటే  ఇలా చేస్తే బుద్ధిబలం అధికమవుతుంది.”  జ్ఞాపకశక్తి కూడా అధికమవుతుంది. గురువారం నాడు కొమ్ము చికిత్స చేయించండి, శనివారం, ఆది వారం కొమ్ము చికిత్స చేయించకండి, సోమవారం, మంగళ వారం కొమ్ము చికిత్స చేయించండి, మీరు బుధవారం కొమ్ము చికిత్స చేయించకండి. ఎందుకంటే ఈ రోజే అయ్యూబ్‌ (అ) ఈ వ్యాధికి గురయ్యారు. కుష్ఠు వ్యాధి, చర్మవ్యాధి బుధవారం లేదా బుధవారం రాత్రి ప్రారంభమయింది. (ఇబ్నె  మాజహ్)

4574 – [ 61 ] ( لم تتم دراسته ) (2/1288)

وَعَنْ مَعْقِلِ بْنِ يَسَارٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: ” اَلْحِجَامَةُ يَوْمَ الثُّلَاثَاءِ لِسَبْعَ عَشَرَةَ مِنَ الشَّهْرِدَوَاءٌ لِدَاءِ السُّنَّةِ”. رَوَاهُ حَرْبُ بْنُ إِسْمَاعِيْلَ الْكِرْمَانِيُّ صَاحِبُ أَحْمَدُ وَلَيْسَ إِسْنَادُهُ بِذَاكَ هَكَذَا فِي الْمُنْتَقَى .

4574. (61) [2/1288 –అపరిశోధితం]

మ’అఖల్‌ బిన్‌ యసార్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ప్రతి నెల 17వ తేదీన మంగళవారం శస్త్ర చికిత్స చేయించడం చాలా మంచిది. సంవత్సరం పొడుగునా వచ్చే వ్యాధులకు మంచి చికిత్స. ఈ ‘హదీసు’ను ఇమామ్‌ అ’హ్మద్‌ శిష్యుడు హర్‌బ్‌ బిన్‌ ఇస్మా’యీల్‌ కిర్‌మానీ ఉల్లేఖించారు. కాని ఇది నిజం కాదు. అదేవిధంగా మున్‌తఖాలో ఉంది.”

4575 – [ 62 ] ( لم تتم دراسته ) (2/1288)

وَرَوَى رَزِيْنُ نَحْوَهُ عَنْ أَبِيْ هُرَيْرَةَ .

4575. (62) [2/1288అపరిశోధితం]

దీన్ని అబూ హురైరహ్‌ (ర) ద్వారా, ర’జీన్‌ కూడా ఉల్లేఖించారు.

=====

1- بَابُ الْفَأْلِ وَالطِّيَرَةِ

1. శకునాలు చూడటం

అంటే కొన్ని పదాల ద్వారా శుభం అని, మరికొన్ని పదాల ద్వారా అశుభం అని భావించటం. సాధారణంగా మంచి పదాన్ని విని శుభంగా భావించటం. ప్రవక్త (స) సంతోషం కలిగినపుడు శుభసూచకంగా భావించేవారు. మంచిగా భావిస్తే మనసుకు శాంతి, సంతోషం కలుగుతాయి. అంతే కాక దైవకారుణ్యం పట్ల ఆశ ఉంటుంది. దైవంపట్ల ఆశగా ఉండటం దాసునికి లాభం చేకూర్చుతుంది. అదేవిధంగా అపశకున భావన మంచిది కాదు. దీనివల్ల అనవసరంగా దుఃఖం, విచారం, సంకోచానికి గురికావటం జరుగుతుంది. దైవంపై అపనమ్మకం, నిరాశ కలుగుతుంది. ప్రవక్త (స) శుభ సూచకాన్ని పాటించే వారు. మంచిపేర్లను ఇష్టపడే వారు, చెడుపేర్లను మార్చేవారు. ప్రజలు శుభసూచకం అంటే ఏమిటి అని ప్రశ్నించారు. దానికి ప్రవక్త (స) తన కోరికతీరే ఆశతో ఉండటం. అంటే ఎల్లప్పుడూ శుభంగా భావిస్తూ ముందుకు సాగాలి. తాయరహ్ అంటే సాధారణంగా అపశకునంగా భావించేవారు. అరబ్బుల్లో మంచీ చెడు తెలుసుకోవటానికి పక్షులను ఎగురవేసే వారు. ఒకవేళ కుడివైపు ఎగిరితే శుభంగా భావించే వారు, ఒకవేళ ఎడమ వైపు ఎగిరితే అశుభంగా భావించే వారు. అవిశ్వాసులు కూడా అపశకునం కోసం దీన్ని ఉపయోగించారు. సూరహ్‌ యా  సీన్లో ఇలా ఉంది:

”(ఆ నగరవాసులు) అన్నారు: “నిశ్చయంగా మేము మిమ్మల్ని ఒక దుశ్శకునంగా పరిగ ణిస్తున్నాము. మీరు దీనిని మానుకోకపోతే, మేము మిమ్మల్ని రాళ్ళతో కొట్టి చంపే స్తాము. మరియు మా నుండి మీకు బాధాకరమైన శిక్ష పడుతుంది.” (ఆ ప్రవక్తలు) అన్నారు: “మీ అపశకునం మీ వెంటనే ఉంది. మీకు చేసే హితబోధను (మీరు అపశకునంగా పరిగణిస్తున్నారా)? అది కాదు, అసలు మీరు మితిమీరి పోయిన ప్రజలు..” (యా సీన్‌, 36:18-19)

అదేవిధంగా సూరహ్‌ అల్అన్ఆమ్లో ఇలా ఉంది: ”మరియు అగోచరవిషయాల తాళపు చెవులు ఆయన (అల్లాహ్‌) వద్దనే ఉన్నాయి.వాటిని, ఆయన తప్ప మరెవ్వరూ ఎరుగరు. మరియు భూమిలోనూ, సముద్రంలోనూ ఉన్నదంతా ఆయనకు తెలుసు. మరియు ఆయనకు తెలియకుండా ఏ చెట్టు ఆకు కూడా రాలదు. మరియు భూమిలోని చీకటి పొరలలో ఉన్న ప్రతిగింజ, అది పచ్చిది కానీ, ఎండినది కానీ, అంతా స్పష్టంగా ఒక గ్రంథంలో (వ్రాయబడి) ఉంది. ” (అల్‌ అన్‌ ఆమ్‌, 6: 59)

అదేవిధంగా సూరహ్‌ న్ నమ్ల్ లో అల్లాహ్‌ (త) ఇలా ఆదేశిస్తున్నాడు:వారితో అను: “ఆకాశాలలోను మరియు భూమిలోను ఉన్న అగోచర విషయజ్ఞానం గలవాడు అల్లాహ్‌ తప్ప మరొకడు లేడు. మరియు వారు తిరిగి ఎప్పుడు లేపబడతారో కూడా వారికి తెలియదు.” (అన్ నమ్ల్, 27:65)

ఎందుకంటే అగోచర జ్ఞానం ఏ మానవునికీ ఉండదు. వారు మాంత్రికులైనా, జ్యోతిష్యులైనా సరే. ఇలా నమ్మడం కూడా పాపమే.

—–

اَلْفَصْلُ الْأَوَّلُ  మొదటి విభాగం   

4576 – [ 1 ] ( متفق عليه ) (2/1289)

عَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: سَمِعْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ: “لَا طِيَرَةَ وَخَيْرُهَا الْفَأْلُ”  .قَالُوْا: وَمَا اَلْفَألُ؟ قَالَ: “اَلْكَلِمَةُ الصَّالِحَةُ يَسْمَعُهَا أَحَدُكُمْ”.

4576. (1) [2/1289ఏకీభవితం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స)  ఇలా ప్రవచిస్తూ ఉండగా నేను విన్నాను, ”అపశకునం అనేది ఏమీ లేదు. శుభసూచకం చాలా మంచిది; దానికి అనుచరులు, ‘ఈ ఫాలు ఏమిటి,’ అని అన్నారు. దానికి ప్రవక్త (స), ‘శుభసూచనం అంటే మీలో ఎవరైనా శుభం కలగాలని పలికే మంచివచనాలు,’ అని అన్నారు. [29](బు’ఖారీ, ముస్లిమ్‌)

4577 – [ 2 ] ( صحيح ) (2/1289)

وَعَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَا عَدْوَى وَلَا طِيَرَةَ وَلَا هَامَةَ وَلَا صَفَرَ. وَفِرَّ مِنَ الْمَجْذُوْمِ كَمَا تَفِرُّ مِنَ الْأَسَدِ”. رَوَاهُ الْبُخَارِيُّ .

4577. (2) [2/1289దృఢం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఒకరి వ్యాధి మరొకరికి  అంటదు, అపశకునం అనేది ఏదీ లేదు. ఇంకా గుడ్లగూబ, ‘సఫర్‌ నెల అనేవి అపశకునం కానే కావు. ఇంకా కుష్ఠురోగిని చూచి సింహం నుండి పారి పోయి నట్టు పారిపోవటం కూడా.”  (బు’ఖారీ)

4578 – [ 3 ] ( صحيح ) (2/1289)

وَعَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَا عَدْوَى وَلَا هَامَةَ ولَاَ صَفَرَ”. فَقَالَ أَعْرَابِيّ: يَا رَسُوْلَ فَمَا بَالَ الْإِبِلِ تَكُوْنُ فِي الرَّمْلِ لَكَأَنَّهَا الظِّبَّاءُ فَيُخَالِطُهَا الْبَعِيْرُالْأَجْرَبُ فَيُجْرِبُهَا؟ فَقَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “فَمَنْ أَعْدَى الْأَوَّلَ”. رَوَاهُ الْبُخَارِيُّ .

4578. (3) [2/1289దృఢం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఒకరి వ్యాధి మరొకరికి అంటదు, గుడ్లగూబ అపశకునం కాదు. ‘సఫర్‌ నెల అపశకునం కాదు.” అది విని ఒక బదూ, ‘ఓ ప్రవక్తా! మా ఒంటెలు మైదానంలో, పచ్చిక బయళ్ళలో ఆరోగ్యంగా, చురుకుగా ఉంటాయి. కాని గజ్జి ఉన్న ఒంటె వాటిలో కలిస్తే, అవి కూడా గజ్జికి గురవుతాయి,’ అని విన్నవించు కున్నాడు. దానికి ప్రవక్త (స), ‘మొదటి ఒంటెకు వ్యాధి ఎవరి దగ్గరి నుండి వచ్చింది. అంటే మొదటి ఒంటెకు కూడా విధివ్రాత వల్ల గజ్జి తగిలింది. రెండవ ఒంటె కూడా దైవం వల్లే వ్యాధికి గురవుతుంది.” (బు’ఖారీ)

4579 – [ 4 ] ( صحيح ) (2/1290)

وَعَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَا عَدْوَى وَلَا هَامَةَ وَلَا نَوْءَ وَلَا صَفَرَ”. رَوَاهُ مُسْلِمٌ .

4579. (4) [2/1290దృఢం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఒకరివ్యాధి మరొకరికి అంటదు, గుడ్లగూబ అప శకునం కాదు, నక్షత్రాల్లో ఎటువంటి ప్రభావం లేదు, ఇంకా ‘సఫర్‌ నెల దురదృష్టకరమైనది  కాదు.”  [30] (ముస్లిమ్‌)

4580 – [ 5 ] ( صحيح ) (2/1290)

وَعَنْ جَابِرٍ قَالَ: سَمِعْتُ النَّبِيَّ صلى الله عليه وسلم يَقُوْلُ: “لَا عَدْوَى وَلَا صَفَرَ وَلَا غُوْلَ”. رَوَاهُ مُسْلِمٌ .

4580. (5) [2/1290దృఢం]

జాబిర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ను ఇలా ప్రవచిస్తూ ఉండగా నేను విన్నాను, ”ఒకరి వ్యాధి మరొకరికి సోకదు, ‘సఫర్‌ నెల దరిద్రమైనది కాదు. ‘గౌల్‌లో ఎటువంటి వాస్తవం లేదు.”  [31]  (ముస్లిమ్)

4581 – [ 6 ] ( صحيح ) (2/1290)

وَعَنْ عَمْرِوبْنِ الشَّرِيْدِ عَنْ أَبِيْهِ قَالَ: كَانَ فِيْ وَفْدِ ثَقِيْفٍ رَجُلٌ مَجْذُوْمٌ فَأَرْسَلَ إِلَيْهِ النَّبِيُّ صلى الله عليه وسلم: “إِنَّا قَدْ بَايَعْنَاكَ فَارْجِعْ”. رَوَاهُ مُسْلِمٌ .

4581. (6) [2/1290దృఢం]

‘అమ్ర్‌ బిన్‌ షరీద్‌ తన తండ్రి ద్వారా కథనం: సఖీఫ్‌ తెగకు చెందిన బృందాలలో  ఒక కుష్ఠురోగి ఉండే వాడు. అతడు ప్రవక్త (స) చేతిపై బై’అత్‌ చేయాలని కోరాడు. ప్రవక్త (స) ‘మేము నీ బై’అత్‌ను స్వీకరించాము, నీవు చేతిలో చేయిపెట్ట నవసరం లేదు,’ అని అన్నారు. [32] (ముస్లిమ్‌)

—–

اَلْفَصْلُ الثَّانِيْ  రెండవ విభాగం 

4582 – [ 7 ] ( لم تتم دراسته ) (2/1290)

عَنِ ابْنِ عَبَّاسٍ قَالَ: كَانَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم يَتَفَاءَلُ وَلَا يَتَطَيَّرُوَكَانَ يُحِبُّ الْاِسْمُ الْحَسَنَ. رَوَاهُ فِيْ شَرْحِ السُّنَّةِ .

4582. (7) [2/1290అపరిశోధితం]

ఇబ్నె ‘అబ్బాస్‌ (ర) కథనం: ప్రవక్త (స) శుభ సూచకంగా భావించే వారు. అపశకునంగా భావించేవారు కారు. శుభ సూచకంలో మంచి పేర్లను పేర్కొనే వారు. (షర్‌’హుస్సున్నహ్‌)

4583 – [ 8 ] ( لم تتم دراسته ) (2/1290)

وَعَنْ قَطْنِ بْنِ قَبِيْصَةَ عَنْ أَبِيْهِ أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم قَالَ: “اَلْعِيَافَةُ وَالطَّرْقُ وَالطِّيَرَةُ مِنَ الْجِبْتِ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ .

4583. (8) [2/1290అపరిశోధితం]

ఖు’త్న్‌ బిన్‌ ఖబీ’సహ్ తన తండ్రి ద్వారా కథనం: ప్రవక్త (స) ‘ఇయాఫహ్, ‘తుర్ఖ్‌, పక్షుల అపశకునంలో వాస్తవం ఏమీ లేదు అని అన్నారు. [33] (అబూ దావూద్‌)

4584 – [ 9 ] ( لم تتم دراسته ) (2/1290)

وَعَنْ عَبْدِ اللهِ بْنِ مَسْعُوْدٍ عَنْ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم قَالَ: “اَلطِّيَرَةُ شِرْكٌ”. قَالَهُ ثَلَاثًا وَمَا مِنَّا إِلَّا ولَكِنَّ اللهَ يُذْهِبَهُ بِالتَّوَكُّل. رَوَاهُ أَبُوْ دَاوُدَ وَالتِّرْمِذِيُّ

وَقَالَ: سَمِعْتُ مُحَمَّد بْنُ إِسْمَاعِيْلَ يَقُوْلُ: كَانَ سُلَيْمَانَ بْنُ حَرَبٍ يَقُوْلُ فِي هَذَا الْحَدِيْثِ: “وَمَا مِنَّا إِلَّا وَلَكِنَّ اللهَ يُذْهِبُهُ بَالتَّوَكُلِّ”. هَذَا عِنْدِيْ قَوْلُ ابْن مَسْعُوْدٍ  .

4584. (9) [2/1290అపరిశోధితం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ మస్‌’ఊద్‌ (ర) కథనం: ప్రవక్త (స) అపశకునం భావించడం అల్లాహ్(త)కు సాటి కల్పించి నట్టు అని మూడుసార్లు పలికారు. అల్లాహ్‌ (త) తవక్కల్‌ ద్వారా ఆ అపోహను దూరం చేస్తాడు. (అబూదావూద్‌, తిర్మిజి’)

 ఇమామ్‌ బుఖారీ కథనం: అయితే ”అల్లాహ్‌ (త) తవక్కుల్‌ ద్వారా ఆ అపోహను దూరం చేస్తాడు” అనే వాక్యం ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ మస్‌’ఊద్‌కు చెందినది.

4585 – [ 10 ] ( ضعيف ) (2/1291)

وَعَنْ جَابِرٍأَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم أَخَذَ بِيَدٍ مَجْذُوْمٍ فَوَضَعَهَا مَعَهُ فِي الْقَصْعَةِ وَقَالَ: “كُلْ ثِقَةً بِاللهِ وَتَوُكُّلًا عَلَيْهِ”. رَوَاهُ ابْنُ مَاجَهُ.

4585. (10) [2/1291బలహీనం]

జాబిర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ఒక కుష్ఠురోగి చేయి పట్టు కొని అన్నం కంచెంలో పెట్టారు. అతనితో పాటు తినటం ప్రారంభించారు. ‘నువ్వూ తిను. నేను అల్లాహ్‌(త)పై భారం వేసి, ఆయన పేరుతో తింటున్నాను,’ అని అన్నారు. [34] (ఇబ్నె  మాజహ్)

4586 – [ 11 ] ( لم تتم دراسته ) (2/1291)

وَعَنْ سَعْدِ بْنِ مَالِكٍ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم قَالَ: “لَا هَامَةَ وَلَا عَدْوَى وَلَا طِيَرَةَ وَإِنْ تَكُنِ الطِّيَرَةُ فِيْ شَيْءٍ فَفِي الدَّارِ وَ الْفَرَسِ وَالْمَرْأَةِ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ .

4586. (11) [2/1291అపరిశోధితం]

స’అద్‌ బిన్‌ మాలిక్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”గుడ్లగూబ దారిద్య్ర సూచకం కాదు, ఒకరి వ్యాధి అల్లాహ్ (త) ఆజ్ఞ లేనిదే మరొకరికి సోకదు, ఇంకా అపశకునం అనేది ఏదీ లేదు. ఒకవేళ అపశకునం ఉంటే ఇంటిలో, గుర్రంలో, స్త్రీలో ఉండేది. కాని ఈ మూడింటిలోనూ  లేదు.[35]  (అబూ  దావూద్‌)

4587 – [ 12 ] ( لم تتم دراسته ) (2/1291)

وَعَنْ أَنَسٍ أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم كَانَ يُعْجِبُهُ إِذَا خَرَجَ لِحَاجَةٍ أَنْ يَسْمَعَ: يَا رَاشِدُ يَا نَجِيْحُ . رَوَاهُ التِّرْمِذِيُّ .

4587. (12) [2/1291అపరిశోధితం]

అనస్‌ (ర) కథనం: ప్రవక్త (స) బయటకు వెళితే ఎవరి నోట అయినా, ‘రాషిద్‌ అంటే  రుజుమార్గంపై నడిచేవాడా, నజీహ్‌ అంటే కార్యసాధకుడు,’ అని అంటారు. [36]  (తిర్మిజి’)

4588 – [ 13 ] ( لم تتم دراسته ) (2/1291)

وَعَنْ بُرَيْدَةَ: أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم كَانَ لَا يَتَطَيَّرُ مِنْ شَيْءٍ فَإِذَا بَعَثَ عَامِلًا سَأَلَ عَنْ اسْمِهِ فَإِذَا أَعْجَبَهُ اسْمُهُ فَرِحَ بِهِ وَرُئِيَ بِشْرُ ذَلِكَ عَلَى وَجْهِهِ وَإِنْ كَرِهَ اسْمَهُ رُئِيَ كَرَاهِيَةُ ذَلِكَ عَلَى وَجْهِهِ وَإِذَا دَخَلَ قَرْيَةً سَأَلَ عَنِ اسْمِهَا. فَإِنْ أَعْجَبَهُ اسْمُهَا فَرِحَ بِهِ. وَرُئِيَ بِشْرُ ذَلِكَ فِيْ وَجْهِهِ وَإِنْ كَرِهَ اسْمُهَا رُئِيَ كَرَاهِيَةُ ذَلِكَ فِيْ وَجْهِهِ. رَوَاهُ أَبُوْ دَاوُدَ.

4588. (13) [2/1291అపరిశోధితం]

బురైదహ్‌(ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, అపశకు నంగా భావించేవారు కారు. ఎవరినైనా, ఎక్కడికైనా తాసిల్దారుగా పంపితే, అతని పేరు అడుగుతారు, అతని పేరు మంచిగా ఉందని సంతోషిస్తే, సంతోష సూచనలు ప్రవక్త (స) ముఖంపై కనబడతాయి. ఒకవేళ అతని పేరు బాగు లేదని అనుకుంటే అసహ్యించు కుంటారు. అసహ్య సూచనలు ప్రవక్త (స) ముఖంపై కనబడతాయి. అదేవిధంగా ప్రవక్త (స)  ఏపట్టణంలో నైనా ప్రవేశిస్తే, దాని పేరు కనుక్కుంటారు. ఒకవేళ దాని పేరు మంచిదైతే, సంతోషిస్తారు, సంతోష చిహ్నాలు ప్రవక్త (స) ముఖంపై కనబడతాయి. ఒకవేళ దాని పేరు బాగు లేక పోతే అసహ్యించుకుంటారు. దాని చిహ్నాలు స్పష్టంగా ముఖంపై కనబడతాయి. (అబూ  దావూద్‌)

ఇది అపశకునం కాదు. సహజంగా సంతోష, అసహ్య చిహ్నాలు కారణ  భూతమవుతాయి.

4589 – [ 14 ] ( حسن ) (2/1291)

وَعَنْ أَنَسٍ قَالَ: قَالَ رَجُلٌ: يَا رَسُوْلَ اللهِ إِنَّا كُنَّا فِي دَارٍكَثُرَ فِيْهَا عَدَدُنَا وَأَمْوَالُنَا فَتَحَوَّلَنَا إِلى دَارٍ. قَلَّ فِيْهَا عَدُدَنَا وَأَمْوَالُنَا. فَقَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “ذَرُوْهَا ذَمِيْمَةً”. رَوَاهُ أَبُوْ دَاوُدَ .

4589. (14) [2/1291ప్రామాణికం]

అనస్‌ (ర) కథనం: ఒక వ్యక్తి ‘ఓ ప్రవక్తా! మేము ఒక ఇంట్లో ఉండేవారం, మేము చాలా అధిక సంఖ్యలో ఉండే వారం, ధన సంపదలు కూడా చాలా అధికంగా ఉండేవి. మేము ఆ ఇంటి నుండి మరో ఇంటిలోనికి మారాము. ఆ ఇంట్లో మా సంఖ్య తగ్గిపోయింది. ధన సంపదలు కూడా తగ్గాయి,’ అని అన్నాడు. అది విని ప్రవక్త (స) ”ఆ చెడు నివాసాన్ని వదలివేయండి,” అని అన్నారు. [37] (అబూ దావూద్‌)

4590 – [ 15 ] ( ضعيف ) (2/1291)

وَعَنْ يَحْيَى بْنِ عَبْدِ اللهِ بْنِ بَحِيْرٍ قَالَ: أَخْبَرَنِيْ مَنْ سَمِعَ فَرْوَةَ بْنَ مُسَيْكٍ يَقُوْلُ: قُلْتُ: يَا رَسُوْلَ اللهِ عِنْدَنَا أَرْضٍ يُقَالُ لَهَا أَبْيَنُ وَهِيَ أَرْضُ رِيْفِنَا وَمِيْرَتِنَا وَإِنَّ وَبَاءَهَا شَدِيْدٌ. فَقَالَ: “دَعْهَا عَنْكَ فَإِنَّ مِنَ الْقَرَفِ التَّلَفَ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ .

4590. (15) [2/1291బలహీనం]

యహ్‌యా బిన్‌ ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ బుహైర్‌ కథనం: ఫర్వా బిన్‌ ముసైక్‌ ద్వారా విన్న వ్యక్తి ఇలా తెలియ పరిచాడు, నేను ప్రవక్త (స)ను ‘మా వద్ద ఒక భూమి ఉండేది, దాన్ని అబీన్ అనే వారు. అది మా వ్యవసాయ భూమి, ఇతర ప్రాంతాల నుండి ఆహార ధాన్యాలు వచ్చి అక్కడ చేరేవి. ప్రజలు కొనుక్కొని అక్కడి నుండి తీసుకు వెళ్ళేవారు. కాని అక్కడి వాతావరణం సరిగా ఉండేది కాదు,’ అని విన్నవించు కున్నాడు. దానికి ప్రవక్త (స), ‘ఆ ప్రాంతం వదలివేయండి, ఎందుకంటే అక్కడికి రాకపోకలు హాని కలుగజేస్తాయి,’ అని అన్నారు. (అబూ  దావూద్‌)

—–

اَلْفَصْلُ الثَّالِثُ   మూడవ విభాగం

4591 – [ 16 ] ( لم تتم دراسته ) (2/1292)

عَنْ عُرْوَةَ بْنِ عَامِرٍقَالَ: ذُكِرَتِ الطِّيَرَةُ عِنْدَ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم فَقَالَ: “أَحْسَنُهَا الْفَألُ وَلَا تَرُدَّ مُسْلِمًا فَإِذَا رَأَى أَحَدُكُمْ مَا يَكْرَهُ فَلْيَقُلْ: اَللّهُمَّ لَا يَأْتِيْ بِالْحَسَنَاتِ إِلَّا أَنْتَ وَلَا يَدْفَعُ السَّيِّئَاتِ إِلَّا أَنْتَ وَلَا حَوْلَ وَلَا قُوَّةَ إِلّا بِاللهِ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ .

4591. (16) [2/1292అపరిశోధితం]

‘ఉర్‌వహ్‌ బిన్‌ ‘ఆమిర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ముందు శకునం గురించి పేర్కొనడం జరిగింది. దానిని, ‘మంచిది శుభసూచకం,’ అని అన్నారు. ముస్లిములు దేన్ని అపశకునంగా భావించరాదు. ఏదైనా కష్టం ఎదురైతే, అల్లాహుమ్మ లా యాతీ బిల్ హస నాతి ఇల్లా అంత. వలా యదఫ అస్సయ్యిఆతి ఇల్లా అంత. వలాహవ్ వలాఖువ్వత ఇల్లాహ్ బిల్లాహ్. — ‘ఓ అల్లాహ్‌ మంచిని ఇచ్చేదీ నీవే, చెడుకు గురి చేసేదీ నీవే. పాపాలకు దూరంగా ఉండే శక్తి సత్కార్యాలు చేసే శక్తి నీ నుండే  లభిస్తుంది,’  అని అనాలి. (అబూ  దావూద్‌)

=====

2بَابُ الْكَهَانَةِ

2. జ్యోతిష్యం

అంటే అగోచరాల జ్ఞానం, భవిష్యత్తుల్లో జరిగే విషయం. దీన్నే జ్యోతిషం అంటారు. అంటే జరుగబోయే విషయాలను చెప్పడం, కంకరరాళ్ళు విసిరి ప్రజల పరిస్ధితులు తెలియపరచటం, జరిగి పోయిన విషయాలను గురించి చెప్పటం, అగోచరాలు, రహస్యాలు తెలుసునని వాదించటం. ఇటువంటి వారిని జ్యోతీష్యులు (కాహిన్) అంటారు, జరగబోయే విషయాలను తెలిపేవారిని అర్రాఫ్ అంటారు అని కుల్లియాత్ లో ఉంది. కొందరు ప్రవక్త (స) దైవదౌత్యానికి ముందు జ్యోతీష్యం ఉండేది, షైతానులు ఆకాశం పైకి పోయి దైవదూతల కొన్ని విషయాలు తెలుసుకొని అందులో వంద అబద్ధాలు కలిపి తెలియపరిచేవారు, అని, ఒక ‘హదీసులో ఉంది.

اَلْفَصْلُ الْأَوَّلُ   మొదటి విభాగం   

4592 – [ 1 ] ( صحيح ) (2/1293)

عَنْ مُعَاوِيَةَ بْنِ الْحَكَمِ قَالَ: قُلْتُ: يَا رَسُوْلَ اللهِ أَمُوْرًا كُنَّا نَصْنَعُهَا فِي الْجَاهِلَيَّةِ كُنَّا نَأْتِي الْكُهَّانِ قَالَ: “فَلَا تَأْتُوا الْكُهَّانَ “قَالَ: قُلْتُ: كُنَّا نَتَطَيَّرُ قَالَ: “ذَلِكَ شَيْءٌ يَجِدُهُ أَحَدُكُمْ فِي نَفْسِهِ فَلَا يَصُدَّنَّكُمْ”. قَالَ: قُلْتُ: وَمِنَّا رِجَالٌ يَخُطُّوْنَ قَالَ: “كَانَ نَبِيٌّ مِّنَ الْأَنْبِيَاءِ يَخُطُّ فَمَنْ وَافَقَ خَطُّهُ فَذَاكَ” .رَوَاهُ مُسْلِمٌ .

4592. (1) [2/1293దృఢం]

ము’ఆవియహ్‌ బిన్‌ ‘హకమ్‌ (ర) కథనం: నేను ప్రవక్త (స) తో, ‘ఇస్లామ్‌కు పూర్వం మేము అజ్ఞాన కాలంలో చాలా అలాంటి, ఇలాంటి పనులు చేసేవారం. జ్యోతిషుల వద్దకు వెళ్ళేవారం. వారిని అగోచరాల గురించి, భవిష్యత్తులో జరిగే విషయాల గురించి అడిగే వారం,’ అని అన్నారు. దానికి ప్రవక్త (స), ‘ఇప్పుడు ఇస్లామ్‌ స్వీకరించిన తర్వాత జ్యోతిష్యుల వద్దకు వెళ్ళకండి,’ అని అన్నారు. ఆ తరువాత నేను, ‘ఓ ప్రవక్తా! మేము అపశకునాలను కూడా నమ్మేవారం,’ అని అన్నాను. దానికి ప్రవక్త (స), అపశకునాలను ఇప్పుడు అపశకునాలను నమ్మకండి. దేన్నీ అపశకునంగా భావించి పనులను వదలకండి, అల్లాహ్‌(త)పై నమ్మకంతో పనులను కొనసాగించండి,’ అని అన్నారు. మళ్ళీ నేను, ‘ఓ ప్రవక్తా! మాలో కొందరు గీతలు గీసి అగోచర విషయాలను తెలియ పరుస్తున్నారు,’ అని అన్నాను. ప్రవక్త (స), ‘ప్రవక్తల్లో ఒకరు గీతలు గీసేవారు, గీత  గీతకు అనుగుణంగా ఉంటే ధర్మమే,’  అని అన్నారు.[38](ముస్లిమ్‌)

4593 – [ 2 ] ( متفق عليه ) (2/1293)

وَعَنْ عَائِشَةَ قَالَتْ: سَأَلَ أُنَاسٌ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم عَنِ الْكُهَّانِ فَقَالَ لَهُمْ رَسُوْلُ اللهِ صلى اللهِ عليه وسلم: “إِنَّهُمْ لَيْسُوْا بِشَيْءٍ” .قَالُوْا: يَا رَسُوْلَ اللهِ فَإِنَّهُمْ يُحَدِّثُوْنَ أَحْيَانًا بِالشَّيْءِ يَكُوْنُ حَقًّا. فَقَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “تِلْكَ الْكَلِمَةُ مِنَ الْحَقِّ يَخْطَفُهَاالْجِنِّيُّ فَيَقُرَّهَا فِيْ أُذُنِ وَلِيَّهِ قَرَّ الدَّجَاجَةِ فَيَخْلِطُوْنَ فِيْهَا أَكْثَرَ مِنْ مِائَةِ كَذِبَةٍ”.

4593. (2) [2/1293ఏకీభవితం]

‘ఆయి’షహ్‌ (ర) కథనం: ప్రజలు ప్రవక్త (స) ను జ్యోతిష్యుల గురించి అడిగారు. దానికి ప్రవక్త (స), ‘వీరు ఏమీ కారు, అంటే వీరి మాట నమ్మదగినది కాదు,’ అని అన్నారు. దానికి ప్రజలు, ‘ఓ ప్రవక్తా! ఒక్కోసారి వారి మాటలు నిజమౌతాయి,’ అని అన్నారు. ప్రవక్త (స) దాన్ని జిన్నులు దొంగి లించి తెచ్చి తన మిత్రుని చెవిలో వేస్తారు. కోడి పుంజు గింజలు చూచి మరో కోడి పుంజును పిలిచినట్టు. ఈ జ్యోతిషులు ఒక నిజానికి 100 అబద్ధాలు కలిపి చెబుతారు,’ అని అన్నారు. [39]  (బు’ఖారీ,  ముస్లిమ్‌)

4594 – [ 3 ] ( صحيح ) (2/1293)

وَعَنْهَا قَالَتْ: سَمِعْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ: “إِنَّ الْمَلَائِكَةَ تَنْزِلُ فِي الْعَنَانِ وَهُوَ السِّحَابُ فَتَذْكُرُ الْأَمْرَ قُضِيَ فِي السَّمَاءِ فَتَسْتَرِقُ الشَّيَاطِيْنُ السَّمْعَ فَتُوْحِيْهِ إِلى الْكُهَّانِ فَيَكْذِبُوْنَ مَعَهَا مِائَةَ كَذِبَةٍ مِنْ عَنْدِ أَنْفُسِهِمْ. رَوَاهُ الْبُخَارِيُّ .

4594. (3) [2/1293దృఢం]

‘ఆయి’షహ్‌ (ర) కథనం: ప్రవక్త(స) ఇలా అంటూ ఉండగా నేను విన్నాను, ”దైవదూతలు మేఘాల క్రిందికి దిగి అల్లాహ్(త) నిర్ణయాల గురించి మాట్లాడుతూ ఉంటారు. షైతానులు చెవియొగ్గి రహస్యంగా వింటారు. ఏదో ఒక విషయం విని తమ స్నేహితులైన జ్యోతిషుల చెవిలో పడవేస్తారు. ఆ జ్యోతిషుడు అందులో 100 అబద్ధాలు కలిపి ప్రజలకు వినిపిస్తాడు. (బు’ఖారీ)

4595 – [ 4 ]?  (2/1293)

وَعَنْ حَفْصَةَ قَالَتْ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَنْ أَتَى عَرَّافًا فَسَأَلَهُ عَنْ شَيْءٍ لَمْ تُقْبَلْ صَلَاةُ أَرْبَعِيْنَ لَيْلَةً”. رَوَاهُ مُسْلِمٌ .

4595. (4) [2/1293? ]

‘హఫ్‌’సహ్ (ర) కథనం: ఎవరైనా జ్యోతిషుల వద్దకు వెళ్ళి  ఏ విషయం గురించి అయినా అడిగితే 40 రోజుల వరకు అతని నమా’జు స్వీకరించబడదు. (ముస్లిమ్‌)

అంటే ఎవడైనా జ్యోతిషుల వద్దకు వెళ్ళి జ్యోతిష్యం అడిగి, దాన్ని నమ్మితే, 40 రోజుల వరకు అతడి నమా’జు స్వీకరించబడదు. పైగా ఒక్కోసారి ఇస్లామ్‌ పరిధి నుండి తొలగి పోవచ్చును. అందువల్ల వీటికి దూరంగా ఉండాలి.

4596 – [ 5 ] ( متفق عليه ) (2/1294)

وَعَنْ زَيْدِ بْنِ خَالِدِ الْجُهَنِيِّ قَالَ: صَلَّى لَنَا رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم صَلَاةُ الصُّبْحِ بِالْحُدَيْبِيَةِ عَلَى أَثْرِسَمَاءٍ كَانَتْ مِنَ اللَّيْلِ فَلَمَّا انْصَرَفَ أَقْبَلَ عَلَى النَّاسِ فَقَالَ: “هَلْ تَدْرُوْنَ مَاذَا قَالَ رَبُّكُمْ؟” قَالُوْا:  اللهُ وَرَسُوْلُهُ أَعْلَمُ. قَالَ: أَصْبَحَ مِنْ عِبَادِيْ مُؤْمِنٌ بِيْ وَكَافِرٌ .فَأَمَّا مَنْ قَالَ: مُطِرْنَا بِفَضْلِ اللهِ وَرَحْمَتِهِ فَذَلِكَ مُؤْمِنٌ بِيْ كَافِرٌبِالْكَوْكَبِ. وَأَمَّا مَنْ قَالَ: مُطِرْنَا بِنَوْءِ كَذَا وَكَذَا فَذَلِكَ كَافِرٌبِيْ وَمُؤْمِنٌ بِالْكَوْكِبِ”.

4596. (5) [2/1294ఏకీభవితం]

‘జైద్‌ బిన్‌ ‘ఖాలిద్‌ జుహ్‌నీ (ర) కథనం: ప్రవక్త (స) హుదైబియా ప్రాంతంలో మాకు నమా’జు చదివించారు. ఆరాత్రి వర్షం పడింది. నమా’జు అయిన తర్వాత ప్రజల వైపు తిరిగి, ‘మీ ప్రభువు ఏమన్నాడో మీకు తెలుసా?’ అని అన్నారు. దానికి ప్రజలు, ‘అల్లాహ్‌, ఆయన ప్రవక్త(స)కే బాగా తెలుసు,’ అని అన్నారు. అప్పుడు ప్రవక్త (స) ఈ ఉదయం నా దాసుల్లోని కొందరు విశ్వాసులుగా, మరికొందరు అవిశ్వాసులుగా లేచారు. ‘అల్లాహ్ (త) దయవల్ల వర్షం కురిసింది అని అన్నవారు విశ్వాసులు. ఫలానా నక్షత్రాల వల్ల వర్షం పడిందని భావించిన వారు అవిశ్వాసులు,’ అని అన్నారు. [40]  (బు’ఖారీ, ముస్లిమ్‌)

4597 – [ 6 ] ( صحيح ) (2/1294)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ عَنْ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم قَالَ: “مَا أَنْزَلَ اللهُ مِنَ السَّمَاءِ مِنْ بَرَكَةٍ إِلَّا أَصْبَحَ فَرِيْقٌ مِنَ النَّاسِ بِهَا كَافِرِيْنَ يَنْزِلُ اللهُ الْغَيْثَ فَيَقُوْلُوْنَ: بِكَوْكَبِ كَذَا وَكَذَا”.رَوَاهُ مُسْلِمٌ

4597. (6) [2/1294దృఢం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ఇలా ప్రవచించారు, ”అల్లాహ్‌ (త) ఏ శుభం అవతరింప జేసినా ఉదయమే అవతరింపజేస్తాడు, ఒక బృందం వ్యతిరేకిస్తుంది, కృతఘ్నతకు పాల్పడుతుంది. అల్లాహ్‌ (త) ఆకాశం నుండి వర్షాన్ని కురిపిస్తాడు. కాని వీరు ఫలానా నక్షత్రం వల్ల వర్షం కురిసిందని భావిస్తారు.”[41]  (ముస్లిమ్‌)

—–

اَلْفَصْلُ الثَّانِيْ  రెండవ విభాగం 

4598 – [ 7 ] ( لم تتم دراسته ) (2/1294)

عَنِ ابْنِ عَبَّاسٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَنِ اقْتَبَسَ عِلْمًا مِّنَ النُّجُوْمِ اقْتَبَسَ شُعْبَةٌ مِّنَ السِّحْرِ زَادَ مَا زَادَ”. رَوَاهُ أَحْمَدُ وأَبُوْ دَاوُدَ وَابْنُ مَاجَهُ.

4598. (7) [2/1294అపరిశోధితం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘అబ్బాస్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ‘నక్షత్రాల జ్ఞానం నేర్చుకున్నవారు చేతబడి జ్ఞానం నేర్చినట్టే. నక్షత్రాలజ్ఞానం ఎంత అధికంగా నేర్చు కుంటే అంత అధికంగా చేతబడి, మంత్ర జ్ఞానం నేర్చుకుంటున్నట్టే.” [42]  (అ’హ్మద్‌, అబూ దావూద్‌, ఇబ్నె  మాజహ్)

4599 – [ 8 ] ( صحيح ) (2/1294)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَنْ أَتَى كَاهِنًا فَصَدَّقَهُ بِمَا يَقُوْلُ أَوْ أَتَى اِمْرَأَتَهُ حَائِضًا أَوْ أَتَى اِمْرَأَتَهُ مِنْ دُبُرهَا فَقَدْ بَرِئَ مِمَّا أُنْزِلَ عَلَى مُحَمَّدٍ”. رَوَاهُ أَحْمَدُ وَأَبُوْدَاوُدَ .

4599. (8) [2/1294దృఢం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”జ్యోతిషుల వద్దకు వెళ్ళి వారి మాటలు నమ్మేవారు, బహిష్టుస్థితిలో భార్యతో సంభోగం చేసేవారు లేదా భార్యతో ఆమె వెనుక భాగం (మల మార్గం)లో సంభోగం చేసేవారు ప్రవక్త (స) తెచ్చిన షరీఅత్‌ పట్ల విసిగిపోయినట్టే.” [43] (అ’హ్మద్‌, అబూ  దావూద్‌)

—–

اَلْفَصْلُ الثَّالِثُ  మూడవ విభాగం   

4600 – [ 9 ] ( صحيح ) (2/1295)

عَنْ أَبِيْ هُرَيْرَةَ أَنَّ نَبِيَّ الله صلى الله عليه وسلم قَالَ: إِذَا قَضَى اللهُ الْأَمْرَ فِي السَّمَاءِ ضَرَبَتِ الْمَلَائِكَةُ بِأَجْنِحَتِهَا خُضْعَانًا لِقَوْلِهِ كَأَنَّهُ سِلْسِلَةٌ عَلَى صَفْوَانٍ فَإِذَا فُزِّعَ عَنْ قُلُوْبِهِمْ قَالُوْا: مَاذَا. قَالَ رَبُّكُمْ؟ قَالُوْا: لِلِّذِيْ قَالَ اَلْحَقَّ وَهُوَ الْعَلِيُّ الْكَبِيْرُ فَسَمِعَهَا مُسْتَرِقُوْا السَّمْعِ وَمَسُتْرِقُوا السَّمْعِ. هَكَذَا بَعْضُهُ فَوْقَ بَعْضٍ. “وَوَصَفَ سُفْيَانُ بِكَفِّهِ فَحَرَّفَهَا وَبَدَّدَ بَيْنَ أَصَابِعِهِ” فَيَسْمَعُ الْكَلِمَةَ فَيُلْقِيْهَا إِلى مَنْ تَحْتَهُ ثُمَّ يُلْقِيْهَا الْآخَرُ إِلى مَنْ تَحْتَهُ حَتّى يُلْقِيَهَا علَى لِسَانِ السَّاحِرِ أَوِ الْكَاهِنِ. فَرُبَّمَا أَدْرَكَ الشِّهَابُ قَبْلَ أَنْ يُلْقِيَهَا وَرُبَّمَا أَلْقَاهَا قَبْلَ أَنْ يُدْرِكَهُ فَيَكْذِبُ مَعَهَا مِائَةَ كَذِبَةٍ فَيُقَالُ: أَلَيْسَ قَدْ. قَالَ لَنَا يَوْمَ كَذَا وَكَذَا: كَذَا وَكَذَا؟ فَيُصَدَّقُ بِتِلْكَ الْكَلِمَةِ الَّتِيْ سَمِعْتْ مِنَ السَّمَاءِ”. رَوَاهُ الْبُخَارِيُّ  .

4600. (9) [2/1295దృఢం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”అల్లాహ్‌ (త) ఆకాశంలో దేన్ని గురించైనా ఆదేశిస్తే దైవ దూతలు భయంతో వణికిపోతారు, ఇంకా తమ రెక్కలను విదిలించుకుంటూ ఉంటారు. ఈ ఆదేశం గొలుసు శబ్దంలా ఉంటుంది. అంటే అదొక రకమైన శబ్దం కలిగి ఉంటుంది. దైవదూతల హృదయాల నుండి భయం తొలగిన తర్వాత వారు, ‘మీ ప్రభువు ఏం ఆదేశించాడు,’ అని పరస్పరం ప్రశ్నించు కుంటారు. ఇంకా, ‘మా ప్రభువు ఆదేశించిన దంతా సత్యమే, ఆయన ఔన్నత్యం, గొప్పతనం గలవాడు,’ అని సమాధానం ఇచ్చుకుంటారు. ఈ మాటలను షై’తానులు రహస్యంగా విని ఒక షై’తాన్‌ మరో షై’తాన్‌కు అంద జేస్తాడు. ఈ విధంగా ఈ విషయాలు భూమి వరకు చేరుతాయి. ఒక్కోసారి వీరిపై అగ్నికణాలు పడుతూ ఉంటాయి. ఈ విధంగా చివరి షై’తాన్‌ మాంత్రికులకు, జ్యోతిషులకు తెలియ పరుస్తాడు. వీళ్ళు అంటే మాంత్రికులు, జ్యోతిషులు అందులో వంద అబద్ధాలు కలిపి ప్రచారం చేస్తారు. ఆ ఒక్కమాట వల్ల ప్రజలు వారిని నమ్ముతూ ఉంటారు.”  (బు’ఖారీ)

4601 – [ 10 ] ( صحيح ) (2/1295)

وَعَنِ ابْنِ عَبَّاسٍ قَالَ: أَخْبَرَنِيْ رَجُلٌ مِّنْ أَصْحَابِ النَّبِيّ صلى الله عليه وسلم مِنَ الْأَنْصَارِ: أَنَّهُمْ بَيْنَا جُلُوْسٌ لَيْلَةً مَعَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم رُمِيَ بِنَجْمٍ وَاسْتَنَارَ فَقَالَ لَهُمْ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَا كُنْتُمْ تَقُوْلُوْنَ فِي الْجَاهِلِيَّةِ إِذَا رُمِيَ بِمِثْلِ هَذَا؟” قَالُوْا: اللهُ وَرَسُوْلُهُ أَعْلَمُ. كُنَّا نَقُوْلُ: وُلِدَ اللَّيْلَةَ رَجُلٌ عَظِيْمٌ وَمَاتَ رَجُلٌ عَظِيْمٌ. فَقَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “فَإِنَّهَا لَا يُرْمَى بِهَا لِمَوْتِ أَحَدٍ وَلَا لِحَياَتِهِ وَلَكِنْ رَبُّنَا تَبَارَكَ اسْمُهُ إِذَا قَضَى أَمْرًا سَبَّحَ حَمَلَةُ الْعَرْشِ ثُمَّ سَبَّحَ أَهْلِ السَّمَاءِ الَّذِيْنِ يَلُوْنَهُمْ حَتّى يَبْلُغَ التَسْبِيْحُ أَهْلَ هَذِهِ السَّمَاءِ الدُّنْيَا ثُمَّ قَالَ الَّذِيْ يَوْنَ حَمَلَةَ الْعَرْشِ لِحَمَلَةِ الْعَرْشِ: مَاذَا قَالَ رَبُّكُمْ؟ فَيُخْبِرُوْنَهُمْ مَا قَالَ: فَيَسْتَخْبِرُ بَعْضُ أَهْلِ السَّمَاوَاتِ بَعْضًا حَتّى يَبْلُغَ هَذِهِ السَّمَاءَ الدُّنْيَا فَيَخُطَفُ الْجِنُّ السَّمْعَ فَيَقْذِفُوْنَ إِلى أَوْلِيَائِهِمْ وَيُرْمَوْنَ فَمَا جَاؤُوْا بِهِ عَلَى وَجْهِهِ فَهُوَ حَقٌّ وَلَكِنَّهُمْ يَقْرِفُوْنَ فِيْهِ وَيَزِيْدُوْنَ”. رَوَاهُ مُسْلِمٌ .

4601. (10) [2/1295దృఢం]

ఇబ్నె ‘అబ్బాస్‌ (ర) కథనం: వీరితో ఒక అ’న్సారీ అనుచరుడు ఇలా తెలిపాడు, ”ఒకరోజు రాత్రి ప్రవక్త (స) వద్ద అనుచరులు కూర్చొని ఉన్నారు. ఇంతలో ఒక చుక్క రాలింది, దాని వెలుగు వ్యాపించింది. అది చూచి ప్రవక్త (స), ‘అజ్ఞానకాలంలో దీన్ని ఏమనేవారు’ అని ప్రశ్నించారు. దానికి అనుచరులు, ‘దీని వాస్తవం అల్లాహ్‌ (త) మరియు ఆయన ప్రవక్తకే తెలుసు, మేము ఇలా జరిగితే ఈ రోజు రాత్రి గొప్పవాడు జన్మించాడని, లేదా గొప్ప వ్యక్తి మరణించాడని భావించేవారం,’ అని అన్నారు. అప్పుడు ప్రవక్త (స) ఒకరి జీవన్మరణాల వల్ల చుక్కలు రాలవు. వాస్తవం ఏమిటంటే, అల్లాహ్‌ (త) ఆకాశంలో ఏదైనా ఆదేశం జారిచేస్తే, దాన్ని విని దైవ సింహాసనాన్ని ఎత్తే దైవదూతలు, ‘సుబ్‌హానల్లాహ్‌’ అంటారు. వారి తరువాత ఉన్న దైవదూతలు అది విని తస్బీహ్‌ పఠిస్తారు. అదేవిధంగా భూమ్యాకాశాల దైవ దూతలు అది విని తస్బీహ్‌ చదువుతారు. వీరు దైవ సింహాసనాన్ని ఎత్తిన దైవదూతలను మీ ప్రభువు ఏమి ఆదేశించాడని అడుగుతారు. వారు సమాధానం ఇస్తారు. ఈ విధంగా భూమిపై ఆకాశ దైవదూతల వరకు ఈ విషయం చేరుతుంది. వీటిని షైతానులు, జిన్నులు దొంగతనంగా కొన్ని మాటలు విని తమ అభిమానులకు తెలియపరుస్తారు. వీళ్ళు అందులో అనేక అసత్యాలు కలిపి చెబుతారు” అని అన్నారు. (ముస్లిమ్‌)

4602 – [ 11 ] ( لم تتم دراسته ) (2/1296)

وَعَنْ قَتَادَةَ قَالَ: خَلَقَ اللهُ تَعَالى هَذِهِ النُّجُوْمَ لِثَلَاثٍ جَعَلَهَا زِيْنَةً لِلسَّمَاءِ وَرُجُوْمًا لِلشَّيَاطِيْنِ وَعَلَامَاتٍ يُهْتَدى بِهَا فَمَنْ تَأَوَّلَ فِيْهَا بِغَيْرِذَلِكَ أَخْطَأَ وَأَضَاعَ نَصِيْبَهُ وَتَكَلَّفَ مَالَا يَعْلَمُ. رَوَاهُ الْبُخَارِيُّ تَعْلِيْقًا.

وَفِيْ رِوَايَةٍ رَزِيْنٍ: “تَكَلَّفَ مَالَا يَعْنِيْهِ وَمَالَا عَلِمَ لَهُ بِهِ وَمَا عَجِزَ عَنْ عِلْمِهِ الْأَنْبِيَاءُ وَالْمَلَائِكَةُ”.

4602. (11) [2/1296 –అపరిశోధితం]

ఖతాదహ్ (ర) కథనం: అల్లాహ్‌ (త) నక్షత్రాలను మూడు ఉపయోగాల కొరకు సృష్టించాడు. కొన్నింటిని ఆకాశ అలంకరణగా, మరికొన్నింటిని షై’తానులను తరిమి వేయ డానికి, కొన్నింటిని మార్గం చూపడటానికి. ఈ మూడు లాభాలు తప్ప మరే విషయాన్ని తెలిపే వ్యక్తి ప్రయత్నం వృధా అయినట్టే, తెలియని దాన్ని గురించి పాకులాడినట్టే. ఇంకా ఆ విషయాలను ప్రవక్తలు, దైవదూతలు మొదలైనవారు కూడా  తెలుసుకోలేరు.[44]  (బు’ఖారీ)

4603 – [ 12 ] ( لم تتم دراسته ) (2/1296)

وَعَنِ الرَّبِيْعِ مِثْلُهُ وَزَاد: وَاللهِ مَا جَعَلَ اللهُ فِيْ نَجْمٍ حَيَاةَ أَحَدٍ وَلَا رِزْقَهُ وَلَا مَوْتَهُ وَإِنَّمَا يَفْتَرُوْنَ عَلَى اللهِ الْكَذِبَ وَيَتَعَلَّلُوْنَ بِالنُّجُوْمِ .

4603. (12) [2/1296అపరిశోధితం]

రబీ’అ కథనం: అల్లాహ్‌(త) సాక్షి! అల్లాహ్‌ (త) నక్షత్రాలతో ఎవరి జీవితాన్నీ ముడిపెట్టలేదు. ఎవరి ఉపాధిని ముడిపెట్ట లేదు. ఎవరిమరణాన్ని ముడి పెట్ట లేదు. జ్యోతిషులు  కేవలం అల్లాహ్‌(త)పై అభాండాలు వేస్తున్నారు. నక్షత్రాలతో సంఘటన లను, జీవితాలను ముడిపెడుతున్నారు.

4604 – [ 13 ] ( لم تتم دراسته ) (2/1296)

وَعَنِ ابْنِ عَبَّاسٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَنِ اقْتَبَسَ بَابًا مِنْ عِلْمِ النُّجُوْمِ لِغَيْرِمَا ذَكَرَ اللهُ فَقَدِ اقْتَبَسَ شُعْبَةً مِّنَ السِّحْرِالْمُنَجِّمُ كَاهِنٌ وَالْكَاهِنُ سَاحِرٌوَالسَّاحِرُ كَافِرٌ”. رَوَاهُ رَزِيْنٌ  

4604. (13) [2/1296అపరిశోధితం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘అబ్బాస్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”అల్లాహ్‌ (త) పేర్కొనని నక్షత్రాల జ్ఞానం ఎవరైనా నేర్చుకున్నవాడు చేతబడికి సంబంధించిన విద్య నేర్చుకున్నాడు. జ్యోతిషుడు మాంత్రికుడు, అవిశ్వాసి.”  (ర’జీన్‌)

4605 – [ 14 ] ( ضعيف ) (2/1296)

وَعَنْ أَبِيْ سَعِيْدِ الْخُدْرِيِّ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: لَوْأَمْسَكَ اللهُ الْقَطْرَعَنْ عِبَادِهِ خَمْسَ سِنِيْنَ ثُمَّ أَرْسَلَهُ لَأَصْبَحَتْ طَائِفَةٌ مِّنَ النَّاسِ كَافِرِيْنَ يَقُوْلُوْنَ:سُقِيْنَا بِنَوْءِ الْمِجْدَحِ” رَوَاهُ النَّسَائِيُّ.

4605. (14) [2/1296బలహీనం]

అబూ స’యీద్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఒక వేళ అల్లాహ్‌ (త) 5 సంవత్సరాల వరకు వర్షం కురిపించక ఆ తరువాత వర్షం కురిపిస్తే చాలామంది అవిశ్వాస ప్రజలు ఫలానా నక్షత్రం ఉదయించటం వల్ల వర్షం కురిసిందని  భావిస్తారు.” (నసాయి’)

*****


[1]) వివరణ-4514: ప్రతి రోగానికి అల్లాహ్‌(త) మందు, వైద్యం అవతరింపజేసాడు. కాని మరణానికి ఎటువంటి మందు లేదు.

[2]) వివరణ-4516: కొమ్ముచికిత్సవల్ల చెడు రక్తం బయటకు వచ్చేస్తుంది. అదేవిధంగా తేనెలో స్వస్థత ఉందని అల్లాహ్‌ (త) ఖుర్‌ఆన్‌లో పేర్కొన్నాడు. కేవలం తేనె సేవించినా, లేదా ఇతర మందులతో కలిపి సేవించినా స్వస్థత లభిస్తుంది. వేడి ఇనుపకడ్డీతో వాతలు పెట్టటంకూడా మంచి వైద్యమే. అయితే అది తప్ప వేరే మార్గం లేనప్పుడు. అయితే ప్రవక్త(స)కు తన అనుచర సమాజంపైగల ప్రేమవల్ల వాతలు పెట్టటాన్ని వారించారు. అత్యవసర పరిస్ధితుల్లో పెట్టవచ్చును.

  1. [3]) వివరణ-4521: ఎందుకంటే జీర్ణాశయంలో ఉన్న మలం అంతా బయటకు వచ్చేసింది. అందువల్ల అప్పుడప్పుడూ వైద్యులు సానుకూలంగా, వ్యతిరేకంగా వైద్యం చేస్తారు. అల్లాహ్ (త) మందుల్లో అమోఘమైన ప్రభావం ఉంచాడు. ఆముదము నూనెకూడా తేనెలా పనిచేస్తుంది. ఎవరికైనా విరోచనాలుగా ఉంటే, ఈ మందులు త్రాపిస్తే, చివరికి వ్యాధి నయమవుతుంది. యూనానీ మరియు ఏలోఫేతిక్ వైద్యంలో వ్యతిరేక వైద్యం చేయబడుతుంది. అంటే విరోచనాలు అయితే, వాటిని అరికట్టటానికి వద్యం చేస్తారు. అదేవిధంగా జలుబు ఉంటే, వేడిమందు ఇస్తారు. వేడిఉంటే చల్లనిమందు ఇస్తారు. తేనె గురించి అల్లాహ్‌ (త) ఖుర్‌ఆన్‌లో ఇలా ఆదేశించాడు: ”మరియు నీ ప్రభువు తేనెటీగకు ఈ విధంగా ఆదేశమిచ్చాడు: ”నీవు కొండలలో, చెట్లలో మరియు మానవుల కట్టడాలలో నీ తెట్టెలను కట్టుకో! ”తరువాత అన్నిరకాల ఫలాలను తిను. ఇలా నీ ప్రభువు మార్గాలపై నమ్రతతో నడువు.” దాని కడుపునుండి. రంగురంగుల పానకం (తేనే) ప్రసవిస్తుంది; అందులో మానవులకు వ్యాధినివారణ ఉంది. నిశ్చయంగా, ఇందులో ఆలోచించే వారికి సూచన ఉంది.” (అన్నహ్ల్‌, 16: 68-69)

[4]) వివరణ-4522: ఇది ఒక రకమైన మందు. దీనివల్ల అనేక లాభాలు ఉన్నాయి. వైద్య శాస్త్రంలో దీన్ని గురించి ప్రత్యేకంగా ప్రశంసించడం జరిగింది. ప్రవక్త (స) కూడా దీన్ని ప్రస శించడం హర్షదాయకం.

[5]) వివరణ-4523: ఉజ్రహ్ ఒక రకమైన వాపు. సాధారణంగా మధ్యవేసవిలో వస్తుంది. మరికొందరు ఉజ్రహ్ ఒక గాయమని, ఇది పిల్లలకు ముక్కు మరియు గొంతు మధ్య అవుతుందని అభిప్రాయపడ్డారు. స్త్రీలు ఈ వ్యాధిని గొంతులో వేలుపెట్టి నొక్కి, లేదా వస్త్రాన్ని చుట్టి, ముక్కులోని గాయం వరకు పంపి, అక్కడి చెడురక్తాన్ని తీసి నయంచేసేవారు. దీన్ని దాయున్ అనేవారు.

[6]) వివరణ-4524: దగర్‌ అంటే అజ్‌రహ్‌ వ్యాధి వల్ల గొంతులో వేలుపెట్టి నొక్కటం. ఇవన్నీ చేయటానికి బదులు ఊద్‌ హిందీని ఉపయోగించమని ప్రవక్త (స) ఆదేశించారు. ఇంకా ఇది 7వ్యాధులకు మందని, రెంటి గురించి పేర్కొని, మిగిలిన 5ను అందరికి తెలిసినందువల్ల వదలివేసారు.

[7]) వివరణ-4525: అంటే జ్వరం నరక ఆవిరివంటిది. దాన్ని ‘జమ్‌ ‘జమ్‌ నీటితో చల్లార్చాలి. జ్వరంలో అనేక రకాలున్నాయి. కొన్ని జ్వరాలకు నీళ్ళు వేయడం, స్నానం చేయటమే మంచి వైద్యం.

[8]) వివరణ-4526: ఒక్కోసారి దిష్టి తగులుతుంది. ఫలితంగా వ్యక్తి వ్యాధికి గురవుతాడు. ఒక్కోసారి చనిపోతాడు. దానికి మంత్రించ వచ్చును. ఖుర్‌ఆన్‌లో చివరి మూడు సూరాలు (112, 113, 114) చాలా శక్తి మంతమైనవి. అదేవిధంగా పాము, తేలు కాటు ఇంకా ఇతర విషప్రాణుల కాట్లకు కొన్ని ప్రత్యేక దుఆలు, వైద్యాలు ఉన్నాయి. ప్రత్యేకంగా సూరహ్‌ ఫాతి’హా (1) ఉంది. అదేవిధంగా అన్మిలహ్ అని కూడా ఒక రోగం ఉంది. చంకల్లో చిన్నచిన్న ఎర్రటి మొటిమలు లేస్తాయి. వాటికి కూడా మంత్రాల చికిత్స చేయవచ్చును. అయితే అవిశ్వాస పధ్ధతులు, మంత్రాలు ఉపయోగించరాదు.

మరో హదీసులో అల్లమ హఫ్సత రుఖయ్యతమ్లహ్ అంటే హఫ్సాకు నమ్లహ్ మంత్రం నేర్పు. అరబ్ మహిళల్లో ఈ మంత్రం వాడుకలో ఉండేది. వారు ఇలా అనేవారు, పెళ్ళికూతురు తాను కోరిన విధంగా తలదువ్వుకోవడం అలంకరణలు చేసుకోవచ్చు, చేతులకు కాళ్ళకూ రంగులు పులుముకోవచ్చు, కళ్ళకు కాటుక పెట్టుకో వచ్చు, కాని భర్తకు అవిధేయత చూపరాదు. కొందరి అభిప్రాయం ప్రకారం ప్రవక్త (స) హఫ్సాకు హితబోధ కావాలని కోరారు. ప్రవక్త (స) ఆమెతో ఒక రహస్య విషయం చెప్పారు. ఆమె దాన్ని బహిర్గతం చేసివేసారు. అంటే భర్తకు అవిధేయత చూపారు. అప్పుడు ప్రవక్త (స) నీవు హఫ్సాకు వ్రాయడం నేర్పినట్టు, నమ్లహ్ మంత్రం కూడా నేర్పవా అని అన్నారు.

[9]) వివరణ-4527: అంటే ఒకవేళ ఎవరికైనా దిష్టి తగిలితే ఖుర్‌ఆన్‌, ‘హదీసు’ల ప్రకారం మంత్రించవచ్చును. అయితే అందులో అవిశ్వాస వచనాలు ఉండకూడదు.

[10]) వివరణ-4530: ఒక్కోసారి దైవ నిర్ణయం ప్రకారం వ్యాధిగ్రస్తుడు జిన్నుల, షై’తానుల ప్రభావానికి గురవుతాడు. ఎవరైనా ఆ జిన్నుల షై’తానుల పేరు ద్వారా మంత్రిస్తే వాళ్ళు సంతోషించి వదలివేస్తారు. జ్యోతిష్యులు చేసే మంత్రాలవల్ల రోగి ఆ మంత్రాలతో తాను స్వస్థత పొందినట్టు భావిస్తాడు. ఎందుకంటే ఇటువంటి మంత్రాల్లో దైవాన్ని వదలి ఇతరుల్ని సహాయం కోరడం జరుగుతుంది. అందువల్ల ఇటువంటి మంత్రాలు చదవరాదు. అయితే అల్లాహ్‌ (త) పేర్ల ద్వారా, గుణాల ద్వారా సహాయం అర్థిస్తే అందులో ఎటువంటి అభ్యంతరంలేదు. పదాలు అరబీలో ఉన్నా లేదా మరే భాషలో ఉన్నా ఫరవాలేదు. ప్రవక్త(స) అవిశ్వాస తిరస్కార మంత్రాలు చదవరాదని స్పష్టంగా ప్రవచించారు. ఖుర్‌ఆన్‌లో, ‘హదీసు’లలో అనేక దు’ఆలు ఉన్నాయి. వాటిని మేము ఇస్లామీ దాయిఫ్ మరియు ఇస్లామీ అవ్రాద్ లలో పేర్కొన్నాము. ఈ పుస్తకంలో కూడా కితాబుద్ద’అవాత్ లో అనేక దు’ఆలు పేర్కొనడం జరిగింది. ముందు పేజీల్లో కూడా అనేక దు’ఆలు ఉన్నాయి. ఖౌలుల్ జమీల్ మరియు ఇతర పుస్తకాల్లో షిఫా వాక్యాల గురించి చాలా ప్రశంసించడం జరిగింది. అంటే ఖుర్ఆన్ లో 6 పేజీలు గల వాక్యాలు చాలా ప్రఖ్యాతి చెందినవి. వీటిని పఠించినా లేదా రాసి కలిపి త్రాపించినా రోగికి చాలా లాభం కలుగుతుంది. అబుల్ ఖాసిమ్ ఖషీరీ అనారోగ్యంగా ఉన్న తన కుమారుని గురించి చాలా ఆందోళనకు గురయ్యారు. స్వప్నంలో ప్రవక్త (స)ను చూచి, ‘ఓప్రవక్తా, నా కుమారుడు అనారోగ్యంగా ఉన్నాడు, ఏ దు’ఆ చదవమంటారు,’ అని విన్నవించుకున్నారు. దానికి ప్రవక్త(స) ఆయాతుష్షిఫా’ చదవమని ఉపదేశించారు. మవాహిబుద్దీనహ్ మరియు అద్దాఅ వద్దుఆఅ మరియు అల్ ఖౌలుల్ జమీల్ మొదలైన వాటిలో షిఫా (స్వస్ధత) ఆయాతులను పేర్కొనడం జరిగింది. క్రింద వాటిని పేర్కొంటున్నాను, పూర్తి ఆయాతులను ఖుర్ఆన్ లో చూసుకోండి. స్వస్థత పొందే ఆయాతులు ఈ క్రింద ఇవ్వటం జరిగింది. [Urdu Bastawi: Vol.3, Pgs: 598 – 604]; (i) అత్ తౌబహ్ (Ruku.2), 9:14; (ii) యూనుస్‌ (R.6), 10:57; (iii) అన్ న’హ్‌ల్‌ (R.9), 16:69; (iv) బనీ ఇస్రాయీల్‌ (R.9), 17:82; (v) అష్ ష్షు’అరా (R.4), 26:80; (vi) పుస్సిలత్‌ (R.5), 41:44.

మేము ఇస్లామీ వ’దాయిఫ్ లలో జిన్నులను, షై’తానులను తరమటానికి, ఖుర్ఆన్ లోని అనేక ఆయాతులను పేర్కొన్నాము. ఆ ఆయాతులను చదివి రోగిపై ఊదాలి. కుడిచెవిలో అ’జాన్ మరియు ఎడమచెవిలో ఇఖామత్ పలకాలి. అల్లహ్(త) ఆదేశానుసారం వ్యాధి తొలగి పోతుంది. (i) అల్ ఫాతిహా, 1:1–7; (ii) అల్ బఖరహ్‌; 2: 1–5; (iii) అల్ అ’అరాఫ్‌ 7; (వ ఇలాహుకుమ్ ఇలాహున్ వా’హిద్… అర్ర’హ్మాను ర్ర’హీమ్);  (iv) అల్ బఖరహ్‌, 2: 255; (v) అల్ బఖరహ్‌. 2: 284 – 286; (vi) ఆల ఇమ్రాన్‌, 3:18; (vii) అల్ అ’అరాఫ్‌, 7:54; (viii) అల్ ముఅ’మినూన్, 23:116-118; (ix) అస్సాప్ఫాత్, 37:1-11; (x) అల్ ‘హష్‌ర్‌, 59:22 –24; (xi) అల్ జిన్‌, 72:3-4; (xii) అల్ ఇ’ఖ్‌లాస్‌, 112:1-4; (xiii) అల్ ఫలఖ్‌, 113:1-5; (xiv) అన్నాస్‌, 114:1-6.

[11]) వివరణ-4531: ప్రాచీన కాలంలో అరబ్బుల్లో ఎవరికైనా దిష్టితగిలితే, ఎవరి నుండి తగిలిందో వారిని స్నానం చేయమని, వారు స్నానంచేసిన నీటిని దిష్టితగిలిన వ్యక్తిపై వేసేవారు. దానివల్ల అతని దిష్టి ప్రభావం తొలగిపోయేది. అయితే ఇప్పుడు దీనికి ఖుర్‌ఆన్‌ చివరి మూడు సూరాలు ఉన్నాయి. దిష్టి కూడా విధి వ్రాతను అనుసరించే పనిచేస్తుంది.

నవవీ ముస్లిమ్ వివరణలో ఈ ‘హదీసు’ గురించి ఇలా పేర్కొన్నారు. దిష్టికి గురైన వ్యక్తిముందు ఒక కంచంలో నీళ్ళు తీసుకొనిరావాలి. ఆ కంచాన్ని ఎవరో ఒకరు పట్టుకొని ఉండాలి. నేలపై పెట్టకూడదు. దిష్టి తగిలించిన వ్యక్తిని నీటిని పుక్కలించి, ముఖం కడిగి, రెండు చేతులను కడిగి, రెండు కాళ్ళు చీలమండలవరకు కడిగి, మర్మాంగాన్ని కడిగి ఆ నీటిని అలాగే ఉంచి, దిష్టికి గురైన వ్యక్తి తల వెనుకభాగం నుండి వేయాలి. ఇన్షాఆల్లాహ్ దిష్టి తొలగిపోతుంది. ఇదొక రకమైన చికిత్స. దీన్ని అనేకసార్లు ప్రయోగించడం జరిగింది.

[12]) వివరణ-4533: అంటే రోగి వ్యాధివల్ల ఏమీ తినటానికి ఒప్పుకోడు. అతన్ని తినమని బలవంతం చేయరాదు. ఎందు కంటే తినే శక్తిని అల్లాహ్‌(త) ప్రసాదిస్తాడు.

[13]) వివరణ-4534: షౌకను హిందీలో పత్తీ ఉఛల్నా అంటారు. దీనివల్ల దైవదౌత్య సీలుతో వాతలు పెట్టమని ఆదేశించారు. స్వయంగా తన చేత్తో వాతలు పెట్టారు.

[14]) వివరణ-4537: మజ్మఉల్ బిహార్ లో ఇలా ఉంది. షుబ్రమ్ ఒక రకమైన గింజ, వేడిగా ఉంటుంది. దాని నీరు మందుగా త్రాగుతారు. మున్తహల్ అరబ్ లో అదీ, దాని వ్రేళ్ళూ విరోచనాలకు మందని ఉంది.  

[15]) వివరణ-4550: అంటే బుధవారం, శనివారం కొమ్ము చికిత్స చేయించు కుంటే కుష్ఠురోగం సోకే ప్రమాదముంది. అందువల్ల ఈ రెండు దినాల్లో కొమ్ము చికిత్స చేయించుకోరాదు.

[16]) వివరణ-4552: రుఖా అంటే చిల్లర దైవాల పేర్లు పలికి సహాయం కోసం పిలువడం, ఇది అధర్మం, నిషిద్ధం. తమీమహ్, అంటే తావీజులు, ఇందులో అవిశ్వాస వచనాలు ఉంటాయి. ఇది కూడా నిషిద్ధమే.

   లుగాతుల్ ‘హదీస్’ లో ఇలా ఉంది, తావీజులు, మంత్రాలు దైవానికి సాటికల్పించే విషయాలు. అల్లాహ్ అనుమతి లేకుండా వీటిలో ప్రభావం ఉందని భావించిన వాడు ఇటువంటి వాటిని ధరించేవాడు ఇస్లామ్‌ పరిధి నుండి తొలగిపోతాడు. ఇటువంటి వాటికి పాల్పడిన వాడు అవిశ్వాసానికి పాల్పడి నట్లే. ఈ పాపానికి వొడిగట్టిన వాడు మరేపాపం చేయ నవసరం లేదు. ఇటువంటి వాటికి పాల్పడిన వాడి కోరికలను అల్లాహ్‌ పూర్తిచేయడు. ఇబ్నె కసీర్‌ (ర) అవిశ్వాసులు దీన్ని దృఢంగా నమ్మేవారని పేర్కొన్నారు. ప్రవక్త (స) దీన్ని అవిశ్వాసంగా పరిగణించారు. ఎందుకంటే దీని ద్వారా విధిని మార్చివేయాలని ప్రయత్నిస్తారు, అల్లాహ్‌ను వదలి ఇతరులను ప్రార్థిస్తారు. వాస్తవంగా కష్టాలను ఆపదలనూ తొలగించేవాడు అల్లాహ్‌ ఒక్కడే. ఎవరైనా పీర్లను, వలీలను, ప్రవక్తలను కష్టాలను, నష్టాలను దూరం చేస్తారని, వ్యాధులను, బాధలను తొలగిస్తారని భావిస్తే వారు ఇస్లామ్‌ పరిధినుండి తొలగిపోతారు. అల్లాహ్‌ ఆదేశం: ”అనుజ్ఞ లేకుండా ఎవరూ ఏమీ చేయలేరు.”

   తివలహ్ అంటే ప్రేమ పన్నాగం, స్త్రీలు భర్తలు భార్యలను ప్రేమించాలని చేతబడి చేసేవారు. ఇందులో ప్రేమదారాలు, తావీజులు అన్నీ చేరి ఉన్నాయి. ఇవన్నీ చేతబడి క్రిందికే వస్తాయి. ప్రవక్త(స) కాలంలో ఇటువంటి ఆచరణల్లో అవిశ్వాస వచనాలు ఉండేవి. అందువల్ల ప్రవక్త(స) వీటినుండి కఠినంగా వారించారు. అల్లాహ్‌ (త) మనందరినీ వీటినుండి దూరంగా ఉంచుగాక!

[17]) వివరణ-4553: ఖామూస్ లో ఇలా ఉంది, నుష్రహ్‌, రుఖహ్ రెండూ ఒక్కటే. వీటిలో అవిశ్వాస వచనాలు వల్లించడం జరుగుతుంది. ఇవన్నీ షై’తానీ పనులు. ముస్లిములు వీటికి చాలాదూరంగా ఉండాలి.

[18]) వివరణ-4554: అంటే ఈ మూడు వస్తువులు నాకు తగవు. ఏ విధంగా తావీజులు, దారాలు, కవిత్వం గురించి నాకు అనుమతి లేదో, అదేవిధంగా నిషిధ్ధ వస్తువులు కలిగి ఉన్న మందులు కూడా నాకు తగవు. ఇవన్నీ నిషిద్ధం.

[19]) వివరణ-4555: అంటే ఈ రెండు విషయాలూ ధర్మ సమ్మతమైనవే. అనుమతించబడినవే. అయితే వీటిని చేసేవాడు దైవాన్ని నమ్మవలసిందిగా నమ్మడు. ఎందు కంటే మానవుడు ప్రయత్నాలు చేసి ఫలితాన్ని దైవంపై వదలి వేయాలి. ప్రతి విషయం అల్లాహ్‌(త) పరిధిలో ఉందని భావించాలి. పరిస్థితి ఎటువంటిదైనా నమ్మకం అల్లాహ్‌(త)పై ఉంచి ఓర్పు సహనంతో వ్యవహరించాలి. ఇటువంటి వ్యక్తికి బలహీనత ఎంతమాత్రం నష్టం కలిగించలేదు. కష్టాలు నష్టాలు అతన్ని నిరాశకు గురిచేయలేవు. అల్లాహ్‌(త)పైన నమ్మకం ముస్లిముల సాఫల్య రహస్యం. ముందు సంప్రదించుకోవాలి. ఆ తరువాత అల్లాహ్‌(త)పై దృఢమైన నమ్మకం కలిగి ఉండాలి. ఒకవేళ విజయం లభించకపోతే, అందులో ఏదో పరమార్థం ఉందని భావించాలి, నిరాశకు గురికారాదు. ఒకవేళ విజయం ప్రాప్తిస్తే గర్వానికి, అహంకారానికి గురికారాదు. ఇదంతా అల్లాహ్‌(త) సహాయం, అనుగ్రహం అని దైవానికి కృతజ్ఞతలు తెలుపుకోవాలి. 

సూరహ్‌ ఆలి ‘ఇమ్రాన్‌లో అల్లాహ్‌ (త) ఇలా ఆదేశించాడు. ”…మరియు వ్యవహారాలలో వారిని సంప్రదించు. ఆ పిదప నీవు కార్యానికి సిధ్ధమైనపుడు అల్లాహ్‌పై ఆధారపడు. నిశ్చయంగా, అల్లాహ్‌ తనపై ఆధారపడేవారిని ప్రేమిస్తాడు. ఒకవేళ మీకు అల్లాహ్‌ సహాయమే ఉంటే, మరెవ్వరూ మీపై ఆధిక్యాన్ని పొంద జాలరు. మరియు ఆయనే మిమ్మల్ని త్యజిస్తే, ఆయన తప్ప మీకు సహాయం చేయగల వాడెవడు? మరియు విశ్వాసులు కేవలం అల్లాహ్‌ పైననే నమ్మకం ఉంచుకుంటారు!.” (ఆల ఇమ్రాన్‌, 3:159-160)

ఈ ఆయాతులలో తవక్కుల్‌ ప్రాముఖ్యతను, వాస్తవాన్ని పూర్తిగా పేర్కొనడం జరిగింది. తవక్కుల్‌ అంటే ఆచరణ మానివేసి కూర్చోవడం కాదు. తవక్కల్‌ అంటే దృఢ నిశ్చయంతో శ్రమించి, ఫలితాన్ని అల్లాహ్‌పై వదలి వేయడం. అల్లాహ్‌ (త) తప్ప మనకు సాఫల్యం, విజయం ప్రసాదించే వారెవరూ లేరు. ఆయన విఫలం చేస్తే ఎవరూ సహాయం చేయలేరు. ఎదురు లేనివాడు. క్రమంగా యుధ్ధాలు జరిగిన తరువాత అల్లాహ్ (త) ఇలా ఆదేశిస్తున్నాడు:

కాని ఒకవేళ వారు శాంతివైపుకు మొగ్గితే నీవు కూడా దానికి దిగు మరియు అల్లాహ్‌పై ఆధారపడు. నిశ్చయంగా, ఆయన సర్వం వినేవాడు, సర్వజ్ఞుడు. కాని ఒకవేళ వారు నిన్ను మోసగించాలని సంకల్పిస్తే! నిశ్చయంగా, నీకు అల్లాహ్‌యే చాలు. ఆయనే తన సహాయం ద్వారా మరియు విశ్వాసుల ద్వారా నిన్ను బలపరుస్తాడు. (అల్ అన్ ఫాల్, 8:6162)

అదేవిధంగా ఇస్లామీయ సందేశ ప్రచారంలో ఎదురయ్యే కష్టాలు, ఆటంకాల్లో కూడా అల్లాహ్‌పైనే నమ్మకం కలిగి ఉండాలి. ఎందుకంటే అల్లాహ్‌(త)యే అన్నిటికీ మూలం, ఆయన నిత్యుడు, అనంతుడు,

[20]) వివరణ-4559: రక్తం అంటే ముక్కు నుండి రక్తం కారటం అని కొందరు పండితుల అభిప్రాయం. దీన్ని నక్సీర్ అంటారు. మరికొందరు సాధారణంగా రక్తం కారటం అని అభిప్రాయ పడుతున్నారు. ఇటువంటి సందర్భాలలో ప్రవక్త (స) ఈ దు’ఆ పఠించేవారు.

1.బిస్మిల్లాహి అర్ఖీ మిన్కుల్లిషైయిన్‌, యూజీ మిన్షర్రి కుల్లిషయ్న్, అవ్‌ ‘ఐనిన్ హాసిదిన్‌, అల్లా హు యుష్ఫీక, బిస్మిల్లాహి అర్ఖీక.” — ‘అల్లాహ్‌(త) పేరుతో నిన్నుమంత్రిస్తున్నాను. నీకు హాని చేకూర్చే ప్రతిచెడు నుండి, ఇంకా ప్రతి ఈర్ష్యచెందే కన్ను నుండి, అల్లాహ్‌ (త) నిన్ను స్వస్థత ప్రసాదించుగాక! అల్లాహ్ (త) పేరుతో నేను మంత్రిస్తున్నాను.'(ముస్లిమ్‌, తిర్మిజి’)

  • . బిస్మిల్లాహి అర్ఖీక, వల్లాహు యుష్ఫీక మిన్కుల్లి దాయిన్ఫీక, మిన్ షర్రిన్నఫాసాతి ఫిల్ఉఖది మిన్షర్రిహాసిదిన్ఇజా‘ ‘హసద్‌. ” — ‘అల్లాహ్‌ పేరుతో నిన్ను మంత్రి స్తున్నాను.  ఇంకా ప్రతి వ్యాధి మరియు మాంత్రిక స్త్రీల చెడు నుండి, వాళ్ళు ముడులపై మంత్రించే, ఇంకా ఈర్ష్య చెందేవారి కీడు నుండి నీకు స్వస్థత ప్రసాదించు గాక! ‘ (నసాయి’)

3. బిస్మిల్లాహి అర్ఖీక మిన్కుల్లి దాయిన్‌, యుష్ఫీక మిన్షర్రి కుల్లిహాసిదిన్ఇజా హసద్‌, వమిన్షర్రి కుల్లి జీ‘ ‘ఐనిన్‌, అల్లాహుమ్మష్ఫిఅబ్దక యన్కఉలకఅదువ్వన్వయమ్షీలక ఇలా జనాజతిన్‌.” — ‘అల్లాహ్‌ పేరుతో నీపై మంత్రిస్తున్నాను. అల్లాహ్‌ (త) నిన్ను ప్రతి వ్యాధినుండి స్వస్థత ప్రసాదించుగాక! ఇంకా ప్రతి ఈర్ష్యచెందే వాని కీడు నుండి, దిష్టిగల కళ్ళ నుండి. ఓ అల్లాహ్‌ నీ దాసునికి స్వస్థత ప్రసాదించు. అది నీ శత్రువును గాయపరుస్తుంది. ఇంకా నీ ప్రీతికోసం జనాజ’హ్ వైపు నడుస్తుంది. (అబూ దావూద్‌)

[21]) వివరణ-4561: ఈ ‘హదీసు’ ద్వారా స్త్రీలకు చదవంటం, వ్రాయడం నేర్పించటం ధర్మమే. కొందరు స్త్రీలకు చదవడం, వ్రాయడం నేర్పించకూడదని అభిప్రాయపడుతున్నారు. కాని వారి ఈ అభిప్రాయం సరైనది కాదు. స్త్రీలు కూడా ఎన్నో ఘనకార్యాలు సాధించారు. మేము కొన్ని ఘనకార్యాలను క్రింద పేర్కొంటున్నాము. స్త్రీలు కూడా చదవంటం, వ్రాయటం నేర్చుకోవాలి.

విద్యా ఘనకార్యాలు: ఇస్లామీయ విద్యలు అంటే ఖుర్ఆన్, తఫ్సీ’ర్, ‘హదీస్’, ఫిఖహ్, ఫరాయి’ద్ లలో అనేకమంది అనుచర స్త్రీలు పరిపూర్ణత సాధించారు. ‘ఆయి’షహ్ (ర), హ’ఫ్సా (ర), ఉమ్ము సలమహ్(ర), ఉమ్ము వరఖహ్(ర), ఖుర్ఆన్ ను పూర్తిగా కంఠస్తం చేసుకున్నారు. హింద్ బిన్తె ఉసైద్ (ర), ఉమ్మె హిషామ్ బిన్తె హారిసా (ర), రాయితహ్ బిన్తె హయ్యాన్ (ర), ఉమ్ము స’అద్ బిన్తె స’అద్ బిన్ రబీ’అ మొదలైన వారు కొన్ని భాగాలు కంఠస్తం చేసుకున్నారు. ఉమ్ము స’అద్ దర్సె ఖుర్ఆన్ కూడా ఇచ్చేవారు. ‘ఆయి’షహ్(ర) తఫ్సీర్ లో ప్రత్యేక పాండిత్యం కలిగి ఉండేవారు. ‘స’హీ’హ్ ముస్లిమ్ చివరిలో ఆమె తఫ్సీర్ కు చెందిన కొంతభాగం పేర్కొనబడి ఉంది. ‘హదీసు’లో ప్రవక్త (స) భార్యలు ‘ఆయి’షహ్ (ర), ఉమ్మె సలమహ్ (ర) లకు ఇతర స్త్రీలపై ప్రత్యేకస్ధానం ఉండేది. వీరేకాక ఉమ్ము అతియ్య (ర), అస్మా బిన్తె అబూ బకర్ (ర), ఉమ్మె హానీ (ర), ఫాతిమహ్ బిన్తె ఖైస్ కూడా నిపుణులే. ఫిఖహ్ లో ‘ఆయి’షహ్ (ర) ఫత్వాలు చాలా అధికంగా ఉన్నాయి. వీటిని అనేక సంపుటాలుగా తయారు చేయవచ్చు. ఉమ్ము సలమహ్ (ర) ఫత్వాలను ఒక చిన్న పుస్తకంగా తయారు చేయవచ్చును. ‘సఫియ్యహ్ (ర), ‘హ’ఫ్సహ్ (ర), ఉమ్మె ‘హబీబహ్ (ర), జువైరియహ్ (ర), మైమూనహ్ (ర), ఫాతిమహ్ ‘జుహ్రా (ర), ఉమ్మెషరీక్ (ర), ఉమ్మె అతియ్యహ్ (ర), అస్మా బిన్తె అబూ బకర్ (ర), లైలా బిన్తె ‘తాయి’ఫ్ (ర) ‘ఖౌల బిన్తె తువైత్ (ర), ఉమ్ము దర్దహ్ (ర), ‘ఆతికహ్ బిన్తె ‘జైద్ (ర), సహ్ లహ్ బిన్తె సుహైల్ (ర), ఫాతిమహ్ బిన్తె ఖైస్ (ర), ‘జైనబ్ బిన్తె అబూ సలమహ్ (ర), ఉమ్మె అయ్ మన్ (ర), ఉమ్మె యూసుఫ్ (ర), ఉమ్మె సలమహ్ ల ఫతావాలు ఒక చిన్న పుస్తకంగా తయారవగలవు.

ఫరాయిద్ లో ‘ఆయి’షహ్ (ర)కు ప్రత్యేక స్ధానం ఉండేది. గొప్పగొప్ప అనుచరులు ‘ఆయి’షహ్ (ర)ను సమస్యలను అడిగి తెలుసుకునేవారు. ఇస్లామీయ విద్యల్లోనేకాదు, ఇతర విద్యల్లోనూ ప్రవక్త (స) అనుచర స్త్రీలు ప్రావీణ్యత సంపాదించారు. అస్రార్ విద్యలో ఉమ్ము సలమహ్ (ర) ప్రవీణులు, ప్రసంగంలో అస్మా బిన్తె సకన్ ప్రవీణులు, స్వప్నాల పరమార్ధంలో అస్మా బిన్తె ‘ఉమైస్ ప్రముఖులు.  వైద్యం, శస్త్ర చికిత్సల్లో రఫీదహ్ అస్లమీయ (ర), ఉమ్ము ముతా’అహ్ (ర), ఉమ్ము కబ్ షహ్ (ర), ‘హమ్ నహ్ బిన్తె జహష్ (ర), ము’ఆ’జహ్ (ర), లైలహ్(ర), అమీమహ్(ర), ఉమ్ము ‘జియాద్ (ర), రబీ బిన్తె ము’అవ్విజ్ (ర), ఉమ్ము ‘అతియ్య(ర), ఉమ్ము సులైమ్ (ర)లకు చాలా అధికంగా ప్రావీణ్యత ఉండేది. మస్జిదె నబవీకి దగ్గరలో రఫీదహ్ అస్లమీయ (ర) టెంట్లో శస్త్ర చికిత్స చేసే గదికూడా ఉండేది.

కవిత్వంలో ఖన్సా(ర), స’అదీ(ర), ‘సఫియ్యహ్(ర), ‘ఆతికహ్ (ర), ఇమామ మురీదియ్యహ్ (ర), హింద్ బిన్తె ‘హారిస్’ (ర), ‘జీనత్ బిన్తె అవ్వామ్ అరవీ (ర), ‘ఆతికహ్ బిన్తె ‘జైద్(ర), హింద్ బిన్తె అసాసహ్ (ర), ఉమ్మె అయ్ మన్ (ర), ఖనీలహ్ అబ్దరియ్యహ్ (ర), కబ్ షహ్ బిన్తె రాఫె’అ (ర), మైమూనహ్ బలవియ్యహ్ (ర) మొదలైన వారు ప్రముఖులు. స్త్రీలలో ఖన్సా (ర)కు ఈ నాటి వరకు సాటిలేదు. ఆమె వ్యాసాలు ప్రచురించ బడి ఉన్నాయి.

ఘనకార్యాలు: అంటే వృత్తులు, పరిశ్రమలు. వ్యవసాయం, వృత్తులు, విద్య, వ్యాపారం, కుట్టటం, మొదలైనవి. అసదుల్ ‘గాబహ్ మరియు ముస్నద్ అ’హ్మద్ బిన్ హంబల్ వివిధ ఉల్లేఖనల ద్వారా ప్రవక్త (స) అనుచర స్త్రీలు తమకోసం తమ పిల్లల కోసం బట్టలు కుట్టేవారని తెలుస్తుంది. వ్యవసాయం అందరూ చేసేవారుకారు. మదీనహ్ లేదా ఇతర సారవంతమైన భూములకు చెందిన వారు వ్యవసాయం చేసేవారు. మదీనహ్ లో సాధారణంగా అ’న్సారీ స్త్రీలు వ్యవసాయం చేసేవారు. ముహాజిరీన్లలో అస్మా (ర) ఈ వృత్తినే అవలంభించారు.

చాలామంది అనుచర స్త్రీలకు చదవడం, వ్రాయడం తెలిసి ఉండేది. షిఫా బిన్తె అబ్దుల్లాహ్ కు ఇందులో ప్రత్యేక స్ధానం ఉండేది. ఈమె అజ్ఞాన కాలంలోనే చదవడం, వ్రాయడం నేర్చుకున్నారు. షిఫాతో పాటు ‘హ’ఫ్సహ్(ర), ఉమ్మె కుల్సూమ్ బిన్తె ‘ఉఖ్ బహ్(ర), కరీమహ్ బిన్తె అల్ మిఖ్ దాద్ (ర) కు కూడా చదవడం, వ్రాయడం తెలిసి ఉండేది. ‘ఆయి’షహ్(ర) మరియు ఉమ్ము సలమహ్ (ర) లకు చదవడం వచ్చేది, కాని వ్రాయడం వచ్చేది కాదు.

కొంతమంది ప్రవక్త(స) అనుచర స్త్రీలు వ్యాపారం చేసేవారు. సిరియాలో ఖదీజహ్ (ర)  కు చాలాపెద్ద వ్యాపారం ఉండేది. ఖౌలహ్ (ర), ములైకహ్ (ర), ‘సఖఫియ్యహ్(ర) మరియు బిన్తె మఖ్రమహ్ (ర) సుగంధ ద్రవ్యాల వ్యాపారం చేసేవారు. కుట్టుపని సర్వసాధారణంగా ఉండేది. ఫాతిమహ్ బిన్తె షబీహ్ (ర) పరిస్ధితుల ద్వారా ఈ విషయం తెలుస్తుంది. వివాహం, ఇతర శుభకార్యాల్లో అన్సార్ల అమ్మాయిలు పాటలు పాడేవారు. అప్పు డప్పుడూ శుభకార్యాల సమయాల్లో ప్రవక్త(స) ముందు కూడా కవిత్వాలు పాడి ఉన్నారు. ఫరీ’అహ్ బిన్తె ము’అవ్విజ్ (ర) ఉల్లేఖించిన ‘హదీసు’ ద్వారా ప్రవక్త(స) వారికి అనుమతి ఇచ్చినట్టు తెలుస్తుంది. మదీనహ్ లో ఒకావిడ ఉండేది. ఆమె పేరు ‘అర్ నబ్. ప్రవక్త(స) అనుమతితో ‘ఆయి’షహ్(ర) ఆమెను అ’న్సార్ల పెళ్ళిళ్ళలో పాటలు పాడటానికి పంపేవారు. ఈమె గురించి అసదుల్ ‘గాబహ్ లో ఉంది. ప్రవక్త (స) భార్యల్లో ఉమ్ము సలమహ్ (ర) మధురమైన స్వరంతో ఖుర్ఆన్ పఠించేవారు. ప్రత్యేకమైన విషయం ఏమిటంటే, ప్రవక్త(స) ఉఛ్ఛారణ, స్వరంలో చదివేవారు.

[22]) వివరణ-4563: శరణు పొందటానికి ఈ రెండు సూరాలు చాలా ఉపయోగకరమైనవి. ‘హదీసు’ల్లో వీటి ప్రత్యేకత గురించి పేర్కొనడం జరిగింది. బస్తవీగారు ఇస్లామీ వ’జాయిఫ్ లో ఈ రెండుసూరాలు చాలా ప్రాధాన్యత గలవని, చేతబడి, మంత్రతంత్రాలకు గురైన వ్యక్తిపై వీటిని పఠించి ఊదితే, స్వస్థత పొందుతాడని పేర్కొనడం జరిగింది. ప్రవక్త (స)పై కూడా ఒక యూదుడు చేతబడి చేసాడు. ప్రవక్త (స) వీటిని పఠిస్తూ తనపై ఊదేవారు. చేతబడి ప్రభావం అంతా తొలగిపోయింది. ప్రవక్త (స) పడుకునేటప్పుడు ఈ రెండు సూరాలను పఠించి తమ శరీరంపై మూడుసార్లు ఊదుకొని పడుకునేవారు. వీటి ద్వారా ఇంకా అనేక లాభాలు ఉన్నాయి.

[23]) వివరణ-4565: అంటే ప్రజలు తన భార్యతో సంభోగం చేసినపుడు, బిస్మిల్లాహి, అల్లాహుమ్మ జన్నిబ్ ష్షైతాన, న్నిబిష్షైతాన మారజఖ్తనా, పఠించక పోతే షై’తాన్‌ ఆ స్త్రీతో సంభోగం చేస్తాడు. ఇటువంటి వారిని ముగర్రిబూన్అంటారు. అందువల్ల భార్యలతో సంభోగం చేసినపుడు తప్పకుండా ఈ దు’ఆను పఠించాలి. మేము ఇస్లామీ వ’దాయిఫ్ లో ఇస్తిఆజ’హ్ మరియు బస్మలహ్ యొక్క ప్రత్యేకతల్లో ఇలా పేర్కొన్నాము. జ’అఫర్ బిన్ ము’హమ్మద్ కథనం, ”ఒకవేళ సంభోగ సమయంలో ‘బిస్మిల్లాహ్’ పఠించక పోతే,వ్యక్తి మర్మాంగంపై షై’తాన్ తాండవిస్తాడు. అతనితోపాటు షైతాన్ కూడా సంభోగంలో పాల్గొంటాడు. పురుషుడిలా షై’తాన్ కూడా స్త్రీ మర్మాంగంలో వీర్యాన్ని వదులుతాడు.” ఇబ్నె ‘అబ్బాస్ తో ఒకవ్యక్తి, ‘నా భార్యతో పడుకొని లేచినపుడు, ఆమె మర్మాంగంలో అగ్నికణం ఉంది’ అని విన్నవించుకున్నాడు. దానికి ఇబ్నె ‘అబ్బాస్ అది షై’తాన్ వీర్యం, నువ్వు సంభోగం చేసినపుడు, బిస్మిల్లాహి అల్లాహుమ్మ జన్నిబ్నష్షైతాన్ న్నిబిష్షైతాన మారజఖ్తనా, పఠించు అని అన్నారు.

[24]) వివరణ-4566: అంటే మానవ శరీరంలోని జీర్ణాశయం హౌ’ద్ లా ప్రధానపాత్ర  పోషిస్తుంది. నరాలన్ని ఇక్కడ కలుస్తాయి. దీని ప్రభావం నరాలపై పడుతుంది. జీర్ణాశయం సరిగా ఉంటే నరాలన్నీ సరిగా ఉంటాయి. ఇది పాడయితే నరాలు కూడా పాడవుతాయి. అందువల్ల జీర్ణాశయం సరిగా ఉండేటట్లు చూసుకోవాలి. ఈ ‘హదీసు’ ద్వారా తెలిసిన మరో విషయం ఏమిటంటే, ధర్మ సంపాదన తింటే మంచి కార్యాలు ప్రాప్తం అవుతాయి. అధర్మ సంపాదన తింటే నికృష్ట పాప కార్యాలు ప్రాప్తం అవుతాయి. అంటే ఫలితం శారీరక మానసిక ఫలితాలు వెలువడతాయి. మంచి శిక్షణ వల్ల మానవుడు ఉత్తముడవుతాడు. చెడు శిక్షణ వల్ల వక్రమార్గాలకు గురవుతాడు.

[25]) వివరణ-4568: ప్రవక్త (స) చెమట, ఆయన వెంట్రుకలు ప్రసాదంగా స్వస్థత ఇచ్చేవిగా ఉండేవి. ఈ ప్రత్యేకత కేవలం ప్రవక్త (స) వెంట్రుకలకే ఉండేది. దీని ద్వారా ఇతరుల వెంట్రుకలు ఇటువంటి మహిమలు కలిగి ఉంటాయని భావించరాదు. ఒకవేళ ఎవరివద్దనైనా వాస్తవంగా ప్రవక్త (స) వెంట్రుకలు ఉంటే ఉమ్మె సలమహ్ (ర) పద్ధతిని అవలంబించ వచ్చును. కొందరు ఇతరుల వెంట్రుకలను చూపి మోసం చేస్తారు. వాటి కోసం దర్శనం, ఊరేగింపులు, జాతరలు, ఉత్సవాలు కల్పిస్తారు. వీటికి ఎటువంటి సాక్ష్యాధారాలూ ఉండవు. అవి ప్రవక్త(స) వెంట్రుకలని అనటం మహాపాపం. ఇలా ప్రజలను మోసం చేయటం తమ్ము తాము మోసం చేసుకోవటమే అవుతుంది. అల్లాహ్(త) మనందరినీ వాటికి దూరంగా ఉంచుగాక. ఆమీన్.

[26]) వివరణ-4569: మన్‌ వ సల్వా అల్లాహ్‌ (త) అనుగ్రహాల్లో చాలా గొప్ప అనుగ్రహాలు. అల్లాహ్‌ (త) వీటిని మూసా (అ) జాతికి ప్రసాదించాడు. కాని వాళ్ళు వాటిని గుర్తించలేదు. వాటికంటే హీనమైన వస్తువులను కోరారు. ప్రవక్త (స) కు కూడా ఇలాంటి పదార్థాలు ఇవ్వబడ్డాయి.

[27]) వివరణ-4570: ఇది బలహీనమైన హదీసు. దీని పరంపరలో అబ్దుల్ హుమైద్ బిన్ సాలిమ్ ఉల్లేఖనకర్త ఆధారాలు లేవు. (మీజానుల్ ఏతెదాల్ 2/540, ‘దయీఫ్/ఇబ్నుమాజహ్ పేజీ280, అహాదీసు’ద్దయీఫహ్ పేజీ 763, ‘దయీఫ్ – అల్జామి ఉస్సగీర్ పేజీ 583)

[28]) వివరణ-4571: ఉజ్రహ్ వ్యాధికి నోటిలో వేలుపెట్టి నొక్కటాన్ని దగర్ అంటారు. దీనికి నోటిలో ఒక వైపు నుండి మందు వేయాలి.

[29]) వివరణ-4576: అపశకునంగా భావిస్తే, దానివల్ల ఎటు వంటి ప్రభావం ఉండదు. దానివల్ల నమ్మకం వమ్మవు తుంది. శుభసూచకంగా భావించడం, మంచి పలుకులు విని శుభం జరుగతుందని ఆశించడం.

[30]) వివరణ-4579: చాలామంది వర్షం ఫలానా నక్షత్రం వల్ల పడిందని విశ్వసిస్తూ ఉంటారు. అంటే ఫలానా నక్షత్రం ఉదయిస్తే వర్షం పడుతుందని వారి భావన. హుదైబియా ఒప్పందం సమయంలో కూడా వర్షం పడినందుకు ఫలానా నక్షత్రం ఉదయించిన కారణంగా వర్షం పడిందని భావించారు. అది విని ప్రవక్త (స) ఇలా అనేవారు, అల్లాహ్‌ (త)పట్ల అవిశ్వాసానికి గురయ్యారని పేర్కొన్నారు. ఈ ఆధునిక కాలంలో కూడా చాలామంది ప్రజలు ఇటువంటి కల్పిత భావాలు కలిగి ఉంటున్నారు.

[31]) వివరణ-4580: గౌల్అంటే నాశనం చేయడం, తొందరగా నడవటం, బుద్ధి చెడటం. ‘హదీసు’లో గౌల్ అంటే, అరబ్బులు గౌల్ అంటే అడవిలోని షై’తాన్‌గా, వాడు అనేక రూపాల్లో ప్రజలను హింసిస్తాడని, మార్గం మరపింపజేస్తాడని భావించే వారు. ప్రవక్త (స) ఇవన్నీ కల్పిత నమ్మకాలని ఖండించారు. అయితే కొందరు జిన్నుల్లోని మాంత్రికులు అనేక రూపాల్లో బహిర్గతం అవుతారని, ప్రజలను హింసిస్తారని భావిస్తున్నారు. అదేవిధంగా అరబ్బులు ‘సఫర్‌ నెలను దారిద్య్ర మైనదిగా భావించేవారు. మన ప్రాంతాల్లోని అజ్ఞానులు కూడా ఈనాటికీ ‘సఫర్‌ నెలను దారిద్య్రమైనదిగా ఇప్పటికీ భావిస్తుంటారు. ఇది చాలా పెద్ద పొరపాటు.

[32]) వివరణ-4581: అంటే ప్రవక్త (స) ఆ కుష్ఠురోగితో చేయి కలపలేదు. మరో ‘హదీసు’లో కుష్టురోగి చేతి ద్వారా ప్రవక్త (స) భోజనం చేసారని తెలుస్తుంది. ఏది ఏమైనా వ్యాధులు, రోగాలు అన్నీ దైవం నుండే సంభవిస్తాయి.

[33]) వివరణ-4583: అంటే పక్షుల ద్వారా శుభ, అశుభ సూచ కంగా భావించేవారు. ఇవన్నీ కల్పిత మూఢ నమ్మకాలు. వీటిలో ఎలాంటి వాస్తవం లేదు.

[34]) వివరణ-4585: ఒకవేళ ఎవరికైనా అల్లాహ్‌(త)పై దృఢనమ్మకం ఉంటే అటువంటివారు కుష్ఠురోగులతో కలసి తినగలరు. బలహీనమైన విశ్వాసం ఉంటే  దూరంగా ఉండటమే మంచిది. అల్లాహు ఆలమ్!

[35]) వివరణ-4586: దారిద్య్ర సూచకం, అపశకునం, అశుభ సూచకం అనేవి ఏవీ లేవు. ఇవన్నీ మూఢ నమ్మకాలు. స్త్రీ అశుభ సూచకం అంటే దుర్భాషలాడేది, చెడునడత గలది, దుబారా ఖర్చుచేసేది. గొడ్రాలు.

[36]) వివరణ-4587: ఇది శుభాకాంక్ష. అపశకునం కాదు.

[37]) వివరణ-4589: ఆ రెండో ఇంటిని వదలమన్నది అపశకునం వల్లకాదు. అక్కడి వాతావరణం అబ్బనందున చాలా మంది అనారోగ్యానికి గురయ్యారు. చని పోయారు. మందూ మాకులకు చాలా ధనం ఖర్చయి తగ్గు ముఖం పట్టింది.

[38]) వివరణ-4592: నవవీ మరియు ఖా’దీ అయాజ్‌ ఇలా పేర్కొన్నారు : జ్యోతిషం మూడు రకాలుగా ఉంటుంది. 1. జిన్‌ లేదా షై’తాన్‌తో ప్రేమ ఉంటుంది. వాడు అతనికి అగోచరాలను తెలియజేస్తాడు. ఇది ప్రవక్త (స) దైవదౌత్యంతో అంతమైపోయింది. 2. భూమిపై సుదూర ప్రాంతాల విషయాలను వార్తలను తెలియపరచ్చటం జరుగుతుంది. 3. భవిష్యవాణులు పలకటం, హిందువుల్లో పండితులు, శాస్త్రులు చెప్పుతుంటారు. ఇవన్నీ అసత్యాలే, కల్పితాలే. అందువల్లే వీటిని నిషేధించటం జరిగింది. (నవవీ – ముస్లిమ్‌)

[39]) వివరణ-4593: అంటే షై’తాన్‌ ఆకాశంపై వెళతాడు. అక్కడ దైవదూతల నుండి మాటలు విని, జ్యోతిషుల వద్దకు వెళ్ళి కోడి శబ్దం చేసి పిలిచినట్లు పిలుస్తాడు. ఖస్తలానీ అభిప్రాయం: షై’తానులు ఆకాశంపైకి వెళ్ళి విషయాలను దొంగిలించి తెచ్చేవారు. ప్రవక్త (స) దైవదౌత్యానికి ముందు ఇది జరిగేది. ప్రవక్త (స) కు దైవదౌత్యం లభించిన తరువాత ఆకాశంపై గట్టి కాపలా పెట్టటం జరిగింది. ఇప్పుడు అక్కడకు షైతానులు వెళ్ళేలేరు. ఇప్పుడు జ్యోతిషులు డంబాలు మాత్రమే పలుకుతారు. వాటిలో ఎటువంటి వాస్తవం ఉండదు.

[40]) వివరణ-4596: అంటే ‘వర్షం నక్షత్రాల ప్రభావం వల్ల పడింది,’ అని విశ్వసించిన వాడు ఇస్లామ్‌ పరిధి నుండి తొలగిపోతాడు. ఎందుకంటే వర్షం అల్లాహ్ (త) నిర్ణయం వల్ల పడుతుంది. అల్లాహ్(త) తప్ప మరే వస్తువూ వర్షం కురిపించ లేదు. కనుక ఇలా భావించడం కూడా అవిశ్వాసానికి గురిచేస్తుంది. 

[41]) వివరణ-4597: అంటే ఈ నక్షత్రాల ప్రభావం వల్ల వర్షం కురుస్తుందని భావిస్తారు. ఈ ఆధునిక కాలంలో కూడా ఇటువంటి విశ్వాస బలహీనులు చాలామంది ఉన్నారు. మానవునికి కలిగే లాభనష్టాలకు నక్షత్రాలు కారణమని భావిస్తారు. ఇలా భావించటం మహా పాపం.

[42]) వివరణ-4598: అంటే జ్యోతిషులు మాంత్రికుల వంటి వారు. మాంత్రికులు అగోచరాల గురించి తెలిపినట్టు జ్యోతిషులు కూడా అగోచరాల గురించి తెలియజేస్తారు. వాస్తవం ఏమిటంటే అగోచరాల జ్ఞానం కేవలం అల్లాహ్‌కు మాత్రమే ఉంది. ఆయనకు తప్ప అగోచరాల జ్ఞానం మరెవ్వరికీ లేదు.

[43]) వివరణ-4599: ఒకవేళ ధర్మసమ్మతంగా భావించి చేస్తే అవిశ్వాసానికి గురవుతాడు. లేకపోతే మహా పాపానికి గురయినట్టే.

[44]) వివరణ-4602: ఈ ‘హదీసు’ ద్వారా అల్లాహ్‌ (త) నక్షత్రాలను మూడు ఉపయోగాల కోసం సృష్టించాడు. ఇప్పుడు ఎవరైనా ఈ నక్షత్రాల ద్వారా అగోచరాలు తెలుస్తాయని, వీటివల్ల వర్షాలు కురుస్తాయని భావిస్తే అది మహా పాపం అవుతుంది. ఇంకా ఎవరైనా వీటి గురించి తన జీవితం వృథా చేస్తే, అతడు తన ఇహపరాలను వ్యర్థం చేసుకున్నాడు.

***

%d bloggers like this: