22. వస్త్రాలు (లిబాస్) | మిష్కాతుల్ మసాబీహ్

22- كِتَابُ اللِّبَاسِ

22. వస్త్రాల పుస్తకం

ఇస్లామీ తాలీమ్ లో దుస్తుల నియమ నిబంధనలను గురించి చర్చించడం జరిగింది. మానవుడు తన శరీరాన్ని కప్పటం తప్పనిసరి. జంతువులకూ మానవులకు తేడా దుస్తుల ద్వారానే కనబడుతుంది. దుస్తులు మానవుల్ని వేడి, చల్లదనం, నగ్నత్వం నుండి కాపాడుతాయి. అల్లాహ్‌ (త) వీటిని శరీరాన్ని కప్పి ఉంచడానికి, అందం కోసం సృష్టించాడు.

”ఓ ఆదమ్‌ సంతానమా! వాస్తవానికి మేము మీ కొరకు వస్త్రాలను కల్పించాము, అవి మీ మర్మాంగాలను కప్పుతాయి మరియు మీకు అలంకారమిస్తాయి. మరియు దైవభీతియే అన్నిటి కంటే శ్రేష్ఠమైన వస్త్రం..” (అల్‌ఆరాఫ్‌, 7:26)

‘అల్లాహ్‌ (త) ఈ శరీరం కప్పి ఉంచటాన్ని మానవ స్వభావంలో ఉంచాడు. ఇది ఆదమ్‌ సంఘటన ద్వారా తెలుస్తుంది. ఇద్దరికీ స్వర్గంలో మంచి దుస్తులు ధరించడానికి లభించాయి. వారు వీటిని ధరిస్తూ ఉండేవారు. దైవధిక్కారణకు పాల్పడినందువల్ల వారి దుస్తులు తొలగించబడ్డాయి. వెంటనే వృక్షాల ఆకుల ద్వారా తమ మర్మాంగాలను కప్పసాగారు. వారిద్దరూ చెట్టు ఫలాల్ని తినగానే వారి వస్త్రాలు తొలగి పోయాయి. వెంటనే ఆకులతో తమ మర్మాంగాలను కప్పుకోసాగారు. నగ్నత్వం మానవ స్వభావానికి అయినట్టే బుద్ధి మరియు షరీఅత్కు వ్యతిరేకం.’

ప్రవక్త (స) ప్రవచనం, ”నగ్నంగా ఉండకండి. ఎందుకంటే మీతో వేరుకాని వారు మీతో ఉంటారు. అయితే మలమూత్ర విసర్జన, భార్యలతో సంభోగ సమయాల్లో సిగ్గు లజ్జలతో వ్యవహరించండి.”

శరీరాన్నంతా కప్పి ఉంచటం మంచిదే కాని, పురుషులు బొడ్డు నుండి ముడుకుల వరకు, స్త్రీలు తల వెంట్రుకలు దగ్గరి నుండి కాళ్ళ చీలమండల వరకు దాచి ఉంచటం తప్పనిసరి విధి. ఈ భాగాలను తెరచి ఉంచటం ఎట్టి పరిస్థితిలోనూ ధర్మం కాదు. దుస్తులన్నిటిలోకెల్లా తెలుపు దుస్తులు చాలా మంచివి.

ప్రవక్త (స) ప్రవచనం, తెల్లని దుస్తులు ధరించండి. ఎందుకంటే దుస్తుల్లో తెల్లని దుస్తులు చాలా మంచివి. దుస్తుల్లోనే మృతులకు కఫన్ఇవ్వండి.”

ఎర్రని దుస్తులు పురుషులకు ధర్మసమ్మతం కావు. అయితే స్త్రీలు ధరించవచ్చును. నల్లని, పచ్చని దుస్తులు స్త్రీ పురుషులు ధరించవచ్చును. పురుషులు పట్టు, బంగారం ధరించడం నిషిద్ధం. ఈ రెండూ స్త్రీల కోసం ధర్మసమ్మతం. ‘

అలీ (ర) కథనం: ప్రవక్త (స) పట్టును కుడిచేతిలో, బంగా రాన్ని ఎడమ చేతిలో తీసుకొని ఈ రెండూ నా అనుచర సమాజంలోని పురుషులకు నిషిద్ధం అని ప్రవచించారు. (అ’హ్మద్‌, అబూ దావూద్‌)

నిరాడంబరత చాలా మంచిది. అన్నపానీయాల్లో, దుస్తుల్లో ప్రవక్త() నిరాడంబరతను పాటించేవారు. దళసరి కమీ’జు, దళసరి దుప్పటి, దొడ్డుగా ఉన్న లుంగీ ధరించేవారు. ఒక్కో సారి అతుకులు ఉన్న దుస్తులు కూడా ధరించేవారు. ఎటువంటి ఆడంబరతకు గురిఅయ్యేవారు కారు. 

‘ఆయి’షహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ఒకసారి ఉదయం ఇంటి నుండి బయలుదేరారు. అప్పుడు వెంట్రుకల నల్లని దుప్పటి ధరించారు.

ము’గీరహ్ బిన్‌ షూబహ్ (ర) కథనం: ఒకసారి ప్రవక్త (స) రూమీ కమీ’జు ధరించి ఉన్నారు. దాని భుజాలు బిగుతుగా ఉన్నాయి. (షమాయిలె  తిర్మిజి’)

అబూ హురైరహ్‌ (ర) కథనం: ‘ఆయి’షహ్‌ (ర) అతుకు లున్న ఒక దుప్పటి, ఒక లుంగీ తీసి చూపెట్టారు. ప్రవక్త (స) ఇవి ధరించి ఉన్నప్పుడే ఆయన మరణించారు. అంటే ప్రవక్త (స)కు నిరాడంబరమైన దుస్తులంటే ఎంతో ఇష్టంగా ఉండేది. ఇందులో దీనత్వం, సున్నితత్వం ఉట్టిపడుతుంది. ఖరీదైన, ఆకర్షణీయమైన దుస్తులు ధరిస్తే, గర్వానికి, అహంకారానికి గురికావటం జరుగుతుంది.

ఒక ఉల్లేఖనంలో ఇలా ఉంది, ”ప్రవక్త (స) వద్ద అతుకులున్న ఒక దుప్పటి ఉండేది. ప్రవక్త (స) దాన్ని ధరించి నేనూ ఒక బానిసనే, బానిసల్లాంటి దుస్తులు ధరిస్తాను,” అని అన్నారు.

ఉమ్మె సలమహ్ (ర) కథనం: దుస్తుల్లో అన్నింటికంటే కమీ’జు అంటే ప్రవక్త (స)కు చాలా ఇష్టం. (షమాయిలె తిర్మిజి’)

ఎందుకంటే దీనివల్ల శరీరం మొత్తం కప్పబడు తుంది. ఇందులో నిరాడంబరంగా, హుందాతనం ఉట్టిపడుతుంది.

అస్మా (ర) కథనం: ప్రవక్త () కమీజు అరచేతుల వరకు ఉండేది. (షమాయిలె  తిర్మిజి’)

అంటే భుజాల వరకు ధరించటం ప్రవక్త సాంప్రదాయానికి వ్యతిరేకం. పైజామహ్ మర్మాంగాన్ని కప్పిఉంచటానికి చాలా మంచి దుస్తుల్లో ఒకటి. ప్రవక్త()కు పైజామహ్ అంటే చాలా ఇష్టం. దీన్ని కొన్నారు కూడా. ఇబ్నె ఖయ్యిమ్‌ ప్రకారం ప్రవక్త (స) పైజామహ్ ధరించడానికి కొన్నారు. అనుచరులు కూడా ప్రవక్త (స) అనుమతితో ధరించేవారు. (‘జాదుల్‌ మ’ఆద్‌)

అల్లమా షౌకానీ, నైలుల్‌ అవతార్‌లో ఇలా పేర్కొన్నారు.

 అబూ హురైరహ్‌ (ర) కథనం: ‘ఓ ప్రవక్తా! తమరు పైజామహ్ ధరిస్తారా?’ అని విన్నవించుకున్నాను. ప్రవక్త (స), ‘అవును. రాత్రీ, పగలు నేను నా శరీరం కప్పి ఉంచాలని నన్ను ఆదేశించడం జరిగింది. దీనికంటే మంచిది నేను చూడలేదు.

మున్‌తఖహ్లో ఇబ్నె తైమియ అబూ ఉసామా ద్వారా కథనం: ‘ఓ ప్రవక్తా! యూదులు, క్రైస్తవులు పైజామహ్ ధరిస్తున్నారు. వీరు లుంగీ ధరించరు,’ అని విన్నవించుకున్నాను. దానికి ప్రవక్త (స) ‘పైజామహ్ లుంగీ ధరించండి. వారికి వ్యతిరేకంగా ప్రవర్తించండి’ అని ఆదేశించారు.

లుంగీ: ఈ ఉల్లేఖనాలన్నింటి ద్వారా పైజామహ్ ధరించడం ప్రవక్త(స) సాంప్రదాయం అని తెలిసింది. కాని ప్రవక్త (స) అధికంగా లుంగీనే ధరించేవారు. ప్రవక్త (స) లుంగీ నాలుగు గజాల ఒక జానెడు ఉండేది. రెండు గజాలు వెడల్పుగా ఉండేది. చీలమండల వరకు ఉండేది.

‘ఉబైద్‌ బిన్‌ ‘ఖాలిద్‌ (ర) కథనం: మదీనహ్లో నేను నడుస్తున్నాను. అప్పుడు ఒక వ్యక్తి, ‘లుంగీని పైకి ఎత్తుకోండి, ఎందుకంటే దానివల్ల దుస్తులు పరి శుభ్రంగా ఉంటాయి. నేలపై ఈడ్చడంతో పాడవదు. అహంకారానికి దూరంగా ఉంటుంది,’ అని ప్రకటి స్తున్నాడు. వెనక్కి తిరిగి చూస్తే ప్రవక్త (స)ను చూచాను. అతను (స) నాతోనే అంటున్నారు. అప్పుడు నేను, ‘ఓ ప్రవక్తా! ఒక సాధారణమైన దుప్పటి ఉంది. దాన్ని ఎలా రక్షించాలి. అందులో అహంకారం ఎక్కడుంది,’ అని విన్నవించుకున్నాను. దానికి ప్రవక్త (స), ‘నన్ను అనుస రించు,’ అని అన్నారు. చూస్తే ప్రవక్త (స) లుంగీ చీల మండలకు పైన ఉంది. (షమాయిలె తిర్మిజి’)

దుప్పటి: ప్రవక్త (స) దుప్పటిని కప్పుకునేవారు, ఇంకా దానిపై నమా’జు కూడా చదివేవారు.

బరాఅ’ బిన్‌ ‘ఆ’జిబ్‌ (ర) కథనం: ప్రవక్త (స)ను ఒక ఎర్రటి జత లుంగీ, దుప్పటి ధరించి ఉండటం చూసాను.

‘ఆయి’షహ్‌ (ర) కథనం: ఒక రోజు ఉదయం ప్రవక్త(స) బయటకు వచ్చారు. ప్రవక్త (స) శరీరంపై నల్లటి వెంట్రుకల దుప్పటి ఉండేది. (షమాయిలె తిర్మిజి’)

పగ్డీ, టోపీ: అరబ్‌లో పగ్‌డీ, టోపీ ధరించే సాంప్రదాయం ఉండేది. ప్రవక్త () పగ్డీ ధరించేవారు, అనుచ రులకు కూడా ధరించమని ఆదేశించారు. ప్రవక్త (స) ప్రవచనం, ”ఈవిధంగా అమామహ్ ధరించు. ఎందుకంటే అమామహ్ ఇస్లామ్చిహ్నం, గుర్తు. దీన్నిబట్టి ముస్లిమ్‌, ముష్రిక్‌ను గుర్తించడం జరుగుతుంది. (అబూ న’యీమ్‌)

ప్రవక్త (స) ప్రవచనం, ”ముస్లిముల, ముష్రికుల మధ్య తేడా తెలియడానికి టోపీలపై అమామహ్ ధరించండి. అంటే ముందు టోపీ ధరించి దానిపై అమామ ధరించండి. ముష్రికులు టోపీ లేకుండా అమామహ్ ధరిస్తారు. టోపీ ధరించటం కూడా ప్రవక్త () సాంప్రదాయం.

అబూ కబ్‌షహ్ (ర) కథనం: ప్రవక్త () అనుచరుల టోపీలు తలలకు అంటి ఉండేవి. (తిర్మిజి’)

రూమీ జుబ్బహ్‌: ప్రవక్త (స) చేతులు బిగుతుగా ఉన్న రూమీ జుబ్బహ్ ధరించారు.

ము’గీరహ్ బిన్‌ షూబహ్ కథనం: ప్రవక్త (స) తబూక్‌ యుద్ధంలో మలమూత్ర విసర్జన కోసం వెళ్ళారు. తిరిగి వస్తే నేను నీళ్ళు తీసుకొని వెళ్ళాను. ప్రవక్త (స) వు’దూ చేసారు. అప్పుడు ప్రవక్త (స) రూమీ జుబ్బహ్‌ ధరించి ఉన్నారు. (బు’ఖారీ)

షేర్వానీ: మ’ఖ్‌రమహ్ తన కొడుకు మిస్‌వర్‌తో, ‘కుమారా! ప్రవక్త (స) వద్దకు చాలా అబ్‌కన్‌లు వచ్చాయి. ప్రవక్త (స) పంచుతున్నారు. మనం కూడా వెళదాం, మనక్కూడా ఏదైనా దొరికిపోతుంది.’ అని అన్నారు. తండ్రీ కొడుగులం కలసి వెళ్ళారు. ప్రవక్త(స) ఇంట్లో ఉన్నారు. మ’ఖ్‌రమహ్ తన కొడుకుతో, ‘నా పేరుతో ప్రవక్త (స) ను పిలువు,’ అని అన్నారు. దానికి అతడు, ‘నేను అలా చేయను’ అన్నాడు. దానికి మ’ఖ్‌రమహ్, ‘కుమారా! ప్రవక్త (స) గర్వాహంకారాలు గలవారు కారు,’ అని అన్నారు. మిస్‌వర్‌ ప్రవక్త(స) పిలిచారు. ప్రవక్త (స) వచ్చారు. ‘మఖ్‌రమహ్! నేను ఒక కోటును నీ కొరకు దాచి ఉంచాను,’ అని పలికి తెచ్చి ఇచ్చారు. మఖ్‌రమహ్‌ చాలా సంతోషించారు. (బు’ఖారీ)

మంచి దుస్తులు ధరించటం: మంచి దుస్తులు ధరించటం అభిలషణీయం. షరీ’అత్‌ పరిధిలో ఉంటూ మంచి దుస్తులు ధరించటం మంచిదే. అల్లాహ్‌ ఆదేశం: ”..ప్రతి మస్జిద్ (నమాజ్)లో  మీ వస్త్రాలంకరణ పట్ల శ్రద్ధ వహించండి…” (అల్ అ’అరాఫ్, 7:31)  

ప్రవక్త (స) ప్రవచనం: అల్లాహ్‌ (త) తన దాసునికి ప్రసాదించిన అనుగ్రహాల ప్రభావాన్ని చూచి సంతోషిస్తాడు. ఒకవేళ ఎవరికైనా ధన సంపదలు ప్రసాదిస్తే, మంచి దుస్తులు ధరించాలి. స్తోమత ఉన్నా మంచి దుస్తులు ధరించకపోవటం అల్లాహ్‌(త) అనుగ్రహాలను గుర్తించక పోవటంగా పరిగణించటం జరుగుతుంది. అయితే నిరాడంబరత, అణకువలతో సామాన్య దుస్తులు ధరించే వ్యక్తికి అల్లాహ్‌ (త) గౌరవా దరణలు ప్రసాదిస్తాడు. (అబూ దావూద్‌)

ఒక వ్యక్తి, ‘నాకు మంచి దుస్తులు ధరించాలని, తలకు నూనె ఉండాలని, చెప్పులు ఇంకా నాకయ్‌బీ కూడా ఆకర్షణీయంగా ఉండాలని కోరికగా ఉంటుంది,’ అని విన్నవించుకున్నాడు. అది విని ప్రవక్త (స) అల్లాహ్‌ (త) అందమైన వాడు, అందాన్ని ఇష్టపడతాడు.

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘ఉమర్‌ (ర) కథనం: ”ఓ ప్రవక్తా! మంచి బట్టలు ధరించడం గర్వమా?” అని విన్నవించు కున్నాను. దానికి ప్రవక్త (స), ”ఎంత మాత్రం కాదు. పైగా ఇది అందం, అల్లాహ్‌ (త) కూడా అందాన్ని ఇష్టపడతాడు,” అని అన్నారు. (ఇబ్నె మాజహ్)

పలుచని దుస్తులు: దుస్తులు అనేవి మర్మాంగాలను కప్పడానికి శరీరం కనబడేలా పలుచని దుస్తులు ధరించటం ఎంత మాత్రం ధర్మసమ్మతం కాదు. ఇటువంటి దుస్తుల వల్ల ఎటువంటి లాభమూ ఉండదు. ఇటువంటి పలుచని దుస్తులు స్త్రీ పురుషులిరువురికీ నిషిద్ధం.

అస్మా బిన్‌తె అబీ బక్‌ర్‌ ప్రవక్త (స) మరదలు. ఒకసారి పలుచని దుస్తులు ధరించి ముందుకు వచ్చింది. ప్రవక్త (స) ముఖం త్రిప్పుకున్నారు. ఇంకా, ‘ అస్మా! యుక్తవయస్సుకు చేరిన స్త్రీ తన అవయవాలను ప్రదర్శించటం సరికాదు. అయితే అరచేతులు, ముఖం తప్ప,’ అని ఉపదేశించారు.

ప్రవక్త (స) ప్రవచనం: రెండు రకాలకు చెందిన నరక వాసులను నేనింకా చూడలేదు. ఒకరిచేతుల్లో ఆవుతోకల్లా కొరడాలు ఉంటాయి. వాటితో ప్రజలను అన్యాయంగా కొడతారు. అంటే దుర్మార్గుడైన పాలకులుంటారు. రెండవ రకానికి చెందినవారు పలుచని దుస్తులు ధరించే స్త్రీలు, వాస్తవంగా వారు నగ్నంగా ఉంటారు. పురుషులను తమ వైపు రెచ్చ గొడతారు. వారుకూడా పురుషులవైపు మొగ్గు చూపు తారు. వారితలలు ఒంటెల్లా ఒకవైపు వంగిఉంటాయి. ఇటువంటి వారు స్వర్గంలో ప్రవేశించరు. స్వర్గ సువా సననూ ఆస్వాదించలేరు. అయితే స్వర్గ పరిమళం చాలా దూరంవరకు వ్యాపిస్తుంది. (ముస్లిమ్‌)

అంటే వారు పలుచని దుస్తులు ధరించి ఉంటారు. దానివల్ల వారి శరీరం కనబడుతూ ఉంటుంది. వారు దుస్తులు ధరించి ఉంటారు కాని నగ్నంగా ఉంటారు. ఈ కాలంలో ఇటువంటి స్త్రీలు చాలామంది ఉన్నారు. ముఖంతో పాటు ఇతర అవయవాలను కూడా ప్రదర్శిస్తారు. తమ అవయవాలను ప్రదర్శించి తమ వైపు ఆకర్షిస్తారు. వ్యభిచార స్త్రీలు తమ అందచందాల ద్వారా ప్రజలను, యువకులను తమ వైపు ఆకర్షిస్తారు.

ఇంకా అనేక ‘హదీసు’ల్లో పలుచని దుస్తులు ధరించరాదని హెచ్చరించటం జరిగింది. ఒకవేళ లోపల శరీరం కనబడని దుస్తులు ధరించి ఉంటే పైన పలుచని దుస్తులు ధరించడంలో అభ్యంతరం లేదు. అయితే స్త్రీలు బిగుతుగా ఉన్న దుస్తులు ధరించరాదు. ఎందుకంటే వాటివల్ల శరీర ఎత్తుపల్లాలపై దృష్టి పడుతుంది.

ఉమర్‌ (ర) కథనం: మీ స్త్రీలను ఇటువంటివి ధరించవద్దని వారించండి. ఎందుకంటే దీనివల్ల శరీరం అంతా కనబడుతుంది. స్త్రీలను మస్తూరాత్ అంటారు. మస్తూరాత్‌ అంటే దాచి ఉంచబడే వస్తువులు. ముఖం, అరచేతులు తప్ప మిగతా శరీరమంతా దాచి ఉంచాలి. ‘హఫ్‌’సహ్ బిన్‌తె ‘అబ్దుర్ర’హ్మాన్‌ పలుచని ఓణీ ధరించి ‘ఆయి’షహ్‌ (ర) వద్దకు వచ్చారు. ‘ఆయి’షహ్‌ (ర) ఆ పలుచని ఓణ్ణీని చింపి పారవేసారు. శరీరం కనబడని విధంగా ఉన్న మరో ఓణ్ణీని కప్పుకోవటానికి ఇచ్చారు. (తిర్మిజి’, ఇబ్నె మాజహ్)

స్త్రీలు ఆభరణాలు ధరించవచ్చును. అయితే కేవలం తమ భర్తలను చూపెట్టటానికే. ఇతరులకు చూపెట్టటానికి ఆభరణాలు, అలంకరణలు చేసే స్త్రీలు శాపానికి గురౌతారు. ప్రవక్త (స) ప్రవచనం, ”పరాయి పురుషుల ముందు అంద చందాలు, అలంకరణలు చేసి వయ్యారంగా నడిచే స్త్రీలు తీర్పుదినం నాడు అంధకారంలో నడుస్తారు.”

దుస్తులు చిరిగిపోతే, పాతవైపోతే అతుకులు వేసి, సరిచేసి ధరించడం ప్రవక్త (స) సాంప్రదాయం. ఇది వినయ విధేయతలకు, అణకువకు చిహ్నం. ‘ఆయి’షహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఓ ‘ఆయి’షహ్‌!  ఒకవేళ నువ్వు నన్ను కలవాలనుకుంటే ప్రయాణంలో జీవితం గడిపినట్టు గడపాలి. ధనవంతుల వద్ద కూర్చోరాదు, నీ దుస్తులు చిరిగిపోతే అతుకులు వేసి ధరించాలి. ఎవరైనా తన పాత దుస్తులను పేదలకు, అక్కరగల వారికి ఇచ్చివేస్తే అతడు జీవితంలో, మరణించిన తర్వాత దైవరక్షణ, శరణులో ఉంటాడు. (అ’హ్మద్‌, తిర్మిజి’)

ప్రవక్త (స) క్రొత్త దుస్తులు ధరించినపుడు ‘బిస్మిల్లాహ్‌’ పలికి ఈ దు’ఆలను పఠించేవారు, ”స్తోత్రాలన్నీ అల్లాహ్‌ కొరకే, ఆయనే నాకు దీన్ని ధరింపజేసాడు. దీనిద్వారానే నేను నా మర్మాంగాన్ని దాచుకున్నాను. దీనిద్వారానే నేను నా జీవితంలో అందాన్ని పొందుతున్నాను.”

”ఓ అల్లాహ్‌! అన్ని రకాల స్తోత్రాలు నీ కొరకే, నీవు నన్ను దుస్తులు ధరింప జేసావు. నేను నిన్ను ఈ దుస్తుల మేలు కోరుతున్నాను. ఏ మేలు గురించి ఇది తయారుచేయబడిందో, ఆ మేలును కోరుతున్నాను. అదేవిధంగా దీని చెడునుండి నీ శరణు కోరుతున్నాను. అదేవిధంగా దేని గురించి తయారు చేయబడిందో దాని చెడునుండి శరణు కోరుతున్నాను.”

దుస్తులు ధరించేటప్పుడు కుడివైపు నుండి ధరించాలి, తొలగించేటప్పుడు ఎడమవైపు నుండి తొలగించాలి. (ఇబ్నె మాజహ్) అవసరం అనుకుంటే వెండి ఉంగరం కుడి చేతిలో ధరించవచ్చును. ఉంగరంపై పేర్లు లేదా ఏదైనా పదం వ్రాయడం కూడా ప్రవక్త (స) సాంప్రదాయం. ప్రవక్త (స) ఉంగరం వెండితో చేయబడి ఉండేది. ఉంగరంపై ‘ము’హమ్మద్‌ రసూలుల్లాహ్‌’ అని వ్రాయబడి ఉండేది.

ప్రవక్త (స) చెప్పులు ధరించేవారు. దానికి రెండు పట్టాలు ఉండేవి.  (బు’ఖారీ).

ప్రవక్త (స) చెప్పులు ధరిస్తే ముందు కుడివైపు ధరించమని, తీసినపుడు ఎడమవైపు చెప్పు ముందు తొలగించమని  ఆదేశించారు. (బు’ఖారీ)

ఇబ్నె ‘అబ్బాస (ర) కథనం: ఎప్పుడైనా, ఎక్కడైనా కూర్చుంటే చెప్పులు తీసి కూర్చోండి. తమ చెంతనే ఉంచుకోవాలి. (అబూ  దావూద్‌).

చర్మంతో చేయబడిన సాక్సులు, బూట్లు ధరించటం, వాటిపై మసహ్‌ చేయటం కూడా ప్రవక్త సాంప్రదాయమే. (షమాయిలె తిర్మిజి’)

చెప్పులు, బూట్లు, సాక్సులు ధరించటానికి ముందు వీటిని దులుపుకోవాలి. దుమ్ము ధూళి ఉన్నా తొలగి పోతుంది, హానికరమైన కీటకాలు ఏమైనా ఉన్నా బయటకు వచ్చేస్తాయి.

ఇబ్నె ‘అబ్బాస్‌ (ర) కథనం: ప్రవక్త (స) ఒకసారి అడవిలో ఒక బూటు ధరించి, మరో బూటు ధరించే ప్రయత్నం చేస్తు న్నారు. ఇంతలో ఒక కాకి ఆ సాక్సును తీసుకొని ఎగిరి, పైకి తీసుకొని వెళ్ళి, పైనుండి పడవేసింది. ఆ బూటులో పాము ఉంది. బూటు క్రింద పడగానే పాము బయటకు వచ్చి పారి పోయింది. అప్పుడు ప్రవక్త (స) అల్లాహ్‌(త)కు కృతజ్ఞతలు తెలుపుకున్నారు. ‘ప్రజలారా! బూట్లు ధరించే టప్పుడు దులుపుకొని ధరించండి,’ అని ఉపదేశించారు. (తబ్‌రానీ)

అదేవిధంగా పడుకునేటప్పుడు పడక దులుపు కోవాలి. ఒక వేళ దుస్తులు పెట్టెలో నుండి తీసి ధరించే టప్పుడు, ముందు దులుపుకొని ధరించాలి. తలకు నూనె రాయటం, దువ్వు వటం అభిలషణీయం. వెంట్రుకలు చెల్లాచెదురుగా ఉండటం అసహ్యకరం.

ప్రవక్త (స) పరిశుభ్రత, పరిశుద్ధత పట్ల ప్రోత్సహించారు. ప్రవక్త (స) తల దువ్వుకునేవారు. తలకు నూనె కూడా రాసేవారు. అనస్‌ (ర) కథనం: ప్రవక్త () తలకు చాలా అధికంగా నూనె రాసేవారు. గడ్డం దువ్వుకునేవారు. తలపై టోపీ, వస్త్రం ఉంచేవారు. (షమాయిలె తిర్మిజి’)

తల వెంట్రుకలను గీయించుకోవచ్చు, కత్తిరించు కోవచ్చు. వెంట్రుకలను చెవులవరకు ఉంచుకోవచ్చు. అయితే గడ్డం గీయించడం నిషిద్ధం. మీసాలను కత్తిరించాలి. (బు’ఖారీ, ముస్లిమ్‌)

గోళ్ళు కత్తిరించుకోవాలి. చంకలోని, నాభిక్రింద వెంట్రుకలు గీయించటం ప్రవక్త () సాంప్రదాయం. (నసాయి).

తెల్లని వెంట్రుకలకు రంగు పులుముకోవచ్చు, కాని నల్లరంగు పులుముకోరాదు. తెల్లని వెంట్రుకలను పీకరాదు.

=====

اَلْفَصْلُ الْأَوَّلُ   మొదటి విభాగం   

4304 – [ 1 ] ( متفق عليه ) (2/1240)

عَنْ أَنَسٍ قَالَ: كَانَ أَحَبُّ الثِّيَاب إِلى النَّبِيِّ صلى الله عليه وسلم أَنْ يَلْبَسَهَا الْحِبَرَةَ .

4304. (1) [2/1240 –ఏకీభవితం]

అనస్‌ (ర) కథనం: ప్రవక్త (స)కు దుస్తుల్లో అన్నిటికంటే  హిబరహ్ ధరించాలంటే చాలా ఇష్టపడే వారు.[1] (బు’ఖారీ, ముస్లిమ్‌)

4305 – [ 2 ] ( متفق عليه ) (2/1240)

وَعَنِ الْمُغِيْرَةِ بْنِ شُعْبَةَ: أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم لَبِسَ جُبَّةُ رُوْمِيَّةً ضَيِّقَةَ الْكُمَّيْنِ .

4305. (2) [2/1240 ఏకీభవితం]

ము’గీర బిన్‌ ష’అబహ్ (ర) కథనం: ప్రవక్త (స) చేతులు బిగుతుగా ఉన్న రూమీ జుబ్బహ్ధరించేవారు. (బు’ఖారీ, ముస్లిమ్‌)

4306 – [ 3 ] ( متفق عليه ) (2/1240)

وَعَنْ أَبِيْ بُرْدَةَ قَالَ: أَخْرَجَتْ إِلَيْنَا عَائِشَةُ كَسَاءً مُلَبَّدًا وَإِزَارًا غَلِيْظًا فَقَالَتْ:قُبِضَ رُوْحُ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم فِيْ هَذَيْنِ .

4306. (3) [2/1240 ఏకీభవితం]

అబూ బుర్‌దహ్‌ (ర) కథనం: ‘ఆయి’షహ్‌ (ర) అతుకులున్న ఒక దుప్పటి, ఒక లుంగీ తీసి మా ముందు పెట్టి, ‘ఈ రెండు దుస్తుల్లోనే ప్రవక్త (స) పరమ పదించారని,‘ అన్నారు. (బు’ఖారీ, ముస్లిమ్‌)

4307 – [ 4 ] ( متفق عليه ) (2/1240)

وَعَنْ عَائِشَةَ قَالَتْ: كَانَ فِرَاشُ رَسُوْلِ الله صلى الله عليه وسلم اَلَّذِيْ يَنَامُ عَلَيْهِ أَدَمًا حَشْوُهُ لِيْفٌ.

4307. (4) [2/1240 ఏకీభవితం]

‘ఆయి’షహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) పడుకునే పడక చర్మంతో చేయబడి ఉండేది. అందులో దూదికి బదులు ఖర్జూరం పొట్టు నింపబడి ఉండేది. (బు’ఖారీ, ముస్లిమ్‌)

4308 – [ 5 ] ( صحيح ) (2/1240)

وَعَنْهَا قَالَتْ: كَانَ وِسَادُ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم اَلَّذِيْ يَتَّكِئُ عَلَيْهِ مِنْ أَدَمٍ حَشْوُهُ لِيْفٌ. رَوَاهُ مُسْلِمٌ .

4308. (5) [2/1240దృఢం]

‘ఆయి’షహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) చేరబడే తలగడ చర్మంతో చేయబడి ఉండేది. అది ఖర్జూరం పొట్టుతో నింప బడి ఉండేది. (బు’ఖారీ, ముస్లిమ్‌)

4309 – [ 6 ] ( صحيح ) (2/1240)

وَعَنْهَا قَالَتْ: بَيْنَا نَحْنُ جُلُوْسٌ فِيْ بَيْتِنَا فِيْ حَرِّالظَّهِيْرَةِ قَالَ قَائِلٌ لِأَبِيْ بَكْرٍ: هَذَا رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم مُقْبِلًا مُتَقَنِّعًا. رَوَاهُ الْبُخَارِيُّ.

4309. (6) [2/1240దృఢం]

‘ఆయి’షహ్‌ (ర) కథనం: మేము మా ఇంట్లో మధ్యాహ్న సమయంలో కూర్చొని ఉన్నాం. ఒక వ్యక్తి అబూ బకర్‌ (ర)తో ప్రవక్త (స), ‘వేడితీవ్రత కారణంగా దుప్పటి కప్పుకొని వస్తున్నారు. ఇంకా అవిశ్వాసులు గుర్తుపట్టకుండా ఉండాలని దుప్పటి కప్పుకున్నారు’ అని అన్నారు. (బు’ఖారీ)

4310 – [ 7 ] ( صحيح ) (2/1240)

وَعَنْ جَابِرٍأَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم قَالَ لَهُ: “فِرَاشٌ لِلرَّجُلِ وَفِرَاشٌ لِاِمْرَأتِهِ وَالثَّالِثُ لِلضَّيْفِ وَالرَّابِعُ لِلشَّيْطَانِ”. رَوَاهُ مُسْلِمٌ.

4310. (7) [2/1240దృఢం]

జాబిర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఒక పడక పురుషుని కోసం, రెండవది అతని భార్యకోసం, మూడవ పడక అతిథి కోసం, నాల్గవది షై’తాన్‌ కోసం.” (ముస్లిమ్‌)

ఎందుకంటే నాల్గవది అవసరానికి మించి ఉంది. అది గర్వానికి కారణం అవుతుంది. అందువల్ల విమర్శించడం జరిగింది.

4311 – [ 8 ] ( متفق عليه ) (2/1241)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم قَالَ: “لَا يَنْظُرُ اللهُ يَوْمَ الْقِيَامَةِ إِلى مَنْ جَرَّ إِزَارَهُ بَطَرًا”.

4311. (8) [2/1241-ఏకీభవితం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”అల్లాహ్‌ (త) తీర్పుదినం నాడు, చీలమండల క్రింద తన దుస్తుల్ని ఈడ్చుకుంటూ నడిచేవానివైపు కారుణ్య దృష్టితో చూడడు.” (బు’ఖారీ, ముస్లిమ్‌)

4312 – [ 9 ] ( متفق عليه ) (2/1241)

وَعَنِ ابْنِ عُمَرَ أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم قَالَ: “مَنْ جَرَّ ثَوْبَهُ خُيْلَاءَ لَمْ يَنْظُرِ اللهُ إِلَيْهِ يَوْمَ الْقِيَامِةِ”.

4312. (9) [2/1241-ఏకీభవితం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘ఉమర్‌ (ర) కథనం: ప్రవక్త (స)ప్రవచనం, ”గర్వాహంకారాలతో తన దుస్తుల్ని చీల మండల క్రింది వరకు ఈడ్చుకుంటూ నడిచేవానివైపు అల్లాహ్‌ (త) కారుణ్య దృష్టితో చూడడు. (బు’ఖారీ, ముస్లిమ్‌)

4313 – [ 10 ] ( صحيح ) (2/1241)

وَعَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم:”بَيْنَمَا رَجُلٌ يَجُرُّ إِزَارَهُ مِنَ الْخُيَلَاءِ خُسِفَ بِهِ فَهُوَيَتَجَلْجَلُ فِيْ الْأَرْضِ إِلى يَوْمِ الْقِيَامِةِ”. رَوَاهُ الْبُخَارِيُّ .

4313. (10) [2/1241దృఢం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘ఉమర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఒక వ్యక్తి తన లుంగీని చీలమండల క్రింది వరకు ఈడ్చుకుంటూ వెళ్ళేవాడు. అతన్ని భూమిలో కూరుకు పోయినట్లు చేయడం జరిగింది. తీర్పుదినం వరకు అతడు భూమిలో కూరుకుపోతూ ఉంటాడు.” (బు’ఖారీ, ముస్లిమ్‌)

4314 – [ 11 ] ( صحيح ) (2/1241)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَا أَسْفَلَ مِنَ الْكَعْبَيْنِ مِنَ الْإِزَارِ فِي النَّارِ”. رَوَاهُ الْبُخَارِيُّ.

4314. (11) [2/1241దృఢం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త(స) ప్రవచనం, ”చీలమండల క్రిందివరకు లుంగీ లేదా పైజామాను ఈడ్చుకుంటూ నడవటం నరకంలోనికి పోవటానికి కారణం అవుతుంది.” (బు’ఖారీ)

4315 – [ 12 ] ( صحيح ) (2/1241)

وَعَنْ جَابِرٍقَالَ: نَهَى رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم أَنْ يَأْكُلَ الرَّجُلُ بِشِمَالِهِ أَوْ يَمْشِيَ فِيْ نَعْلٍ وَاحِدٍ وَأَنْ يَشْتَمِلَ الصَّمَّاءَ أَوْ يَجْتَنِيَ فِيْ ثَوْبٍ وَاحِدٍ كَاشِفًا عَنْ فَرْجِهِ . رَوَاهُ مُسْلِمٌ  .

4315. (12) [2/1241దృఢం]

జాబిర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ఎడమచేతితో తినటాన్ని, ఒక చెప్పు ధరించి నడవటాన్ని, బిగుతుగా ఉన్న దుస్తుల్ని ధరించటాన్ని, ఒకే వస్త్రం అంటే కూర్చుంటే మర్మాంగం కనబడేలా ధరించటం మొదలైన వాటన్నింటినీ వారించారు. (ముస్లిమ్‌)

4316 -[13] ، 4317 [14] ، 4318 [15] ، 4319 [16]  (متفق عليه ) (2/1241)

وَعَنْ عُمَرَ وَأَنَسٍ وَابْنِ الزُّبَيْرِ وَأَبِي أُمَامَةَ رَضِيَ اللهُ عَنْهُمْ أَجْمَعِيْنَ عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ: “مَنْ لَبِسَ الْحَرِيْرَ فِي الدُّنْيَا لَمْ يَلْبَسْهُ فِي الْآخِرَةِ”.

4316. (13), 4317. (14), 4318. (15), 4319. (16) [2/1241 ఏకీభవితం]

‘ఉమర్‌, అనస్‌, ఇబ్నె జు’బైర్‌, అబూ ఉమామహ్ (ర) కథనం: ప్రవక్త (స) ఇహలోకంలో పట్టు ధరించినవాడు పరలోకంలో పట్టు ధరించలేడని ప్రవచించారు. (బు’ఖారీ, ముస్లిమ్‌)

4320 – [ 17 ] ( متفق عليه ) (2/1241)

وَعَنِ ابْنِ عُمَرَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِنَّمَا يَلْبَسُ الْحَرِيْرَ فِي الدُّنْيَا مَنْ لَا خَلَاقَ لَهُ فِي الْآخِرَةِ”.

4320. (17) [2/1241-ఏకీభవితం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘ఉమర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”పరలోకంలో ఎటువంటి వంతు లేనివాడే ఇహలోకంలో పట్టు ధరిస్తాడు. (బు’ఖారీ, ముస్లిమ్‌)

అంటే పురుషులు పట్టు ధరించరాదని అర్థం.”

4321 – [ 18 ] ( متفق عليه ) (2/1241)

وَعَنْ حُذَيْفَةَ قَالَ: نَهَانَا رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم أَنْ نَشْرَبَ فِيْ آنِيَةِ الْفِضَّةِ وَالذَّهَبِ وَأَنْ نَأْكُلَ فِيْهَا وَعَنْ لُبْسِ الْحَرِيْرِ وَالدِّيْبَاجِ وَأَنْ نَجْلِسَ عَلَيْهِ .

4321. (18) [2/1241-ఏకీభవితం]

‘హుజై’ఫహ్ (ర) కథనం: ప్రవక్త (స) వెండి, బంగారు గిన్నెలలో తినటాన్ని, పట్టు, జరీ వస్త్రాలను ధరించటాన్ని, వాటిపై కూర్చోవటాన్ని నిషేధించారు. (బు’ఖారీ, ముస్లిమ్‌)

4322 – [ 19 ] ( صحيح ) (2/1241)

وَعَنْ عَلِيٍّ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: أُهْدِيَتْ لِرَسُوْلِ اللهِ صلى الله عليه وسلم حُلَّةٌ سِيَرَاءُ فَبَعَثَ بِهَا إِلَيَّ فَلَبِسْتُهَا فَعَرَفْتُ الْغَضَبَ فِيْ وَجْهِهِ فَقَالَ: “إِنِّيْ لَمْ أَبْعَثْ بِهَا إِلَيْكَ لِتَلَبَسَهَا إِنَّمَا بَعَثْتُ بِهَا إِلَيْكَ لِتُشَقِّقَهَا خُمُرًا بَيْنَ النِّسَاءِ”.

4322. (19) [2/1241దృఢం]

‘అలీ (ర) కథనం: ప్రవక్త (స) వద్దకు పట్టు వస్త్రాలు పంపటం జరిగింది. ప్రవక్త(స) దాన్ని నా వద్దకు పంపారు. నేను దాన్ని ధరించాను. నన్ను చూచి ప్రవక్త (స) ఆగ్రహం వ్యక్తం చేసి ”నేను దీన్ని నీ కోసం పంపలేదు, దీన్ని చించి మీ ఇంట్లోని స్త్రీలకు ఇచ్చివేస్తావని పంపాను, ” అని అన్నారు. (బు’ఖారీ, ముస్లిమ్‌)

4323 – [ 20 ] ( متفق عليه ) (2/1242)

وَعَنْ عُمَرَرَضِيَ اللهُ عَنْهُ أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم نَهَى عَنْ لُبْسِ الْحَرِيْرِ إِلَّا هَكَذَا وَرَفَعَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم إِصْبَعَيْهِ: الْوُسْطَى وَالسَّبَابَةَ وَضَمَّهُمَا .

4323. (20) [2/1242 –ఏకీభవితం]

‘ఉమర్‌ (ర) కథనం: ప్రవక్త (స) పట్టు ధరించరాదని వారించారు. అయితే రెండు అంగుళాలు అంత మాత్రం ధరించ చ్చన్నారు. (బు’ఖారీ, ముస్లిమ్‌)

4324 – [ 21 ] ( صحيح ) (2/1242)

وَفِيْ رِوَايَةٍ لِمُسْلِمٍ: أَنَّهُ خَطَبَ بِالْجَابِيَةِ فَقَالَ: نَهَى رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم عَنْ لُبْسِ الْحَرِيْرِإِلَّا مَوْضِعَ أَصْبَعَيْنِ أَوْ ثَلَاثٍ أَوْ أَرْبَعٍ .

4324. (21) [2/1242 దృఢం]

‘ఉమర్‌ (ర) జాబియహ్‌ ప్రాంతంలో ప్రసంగించారు: అందులో ఈ ‘హదీసు’ను ఇలా వినిపించారు, ”ప్రవక్త (స) పట్టును నిషేధించారు. కాని రెండు, లేదా నాలుగు అంగుళాలు మాత్రమే.”  (ముస్లిమ్‌)

4325 – [ 22 ] ( صحيح ) (2/1242)

وَعَنْ أَسْمَاءَ بِنْتِ أَبِيْ بَكْرٍ: أَنَّهَا أَخْرَجَتْ جُبَّةَ طِيَالِسَةٍ كِسْرَوَانِيَّةً لَهَا لِبْنَةُ دِيْبَاجٍ وَفُرْجَيْهَا مَكْفُوْفَيْنِ بِالدِّيْبَاجِ وَقَالَتْ: هَذِهِ جُبَّةُ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم كَانَتْ عِنْدَ عَائِشَةَ فَلَمَّا قُبِضَتْ قَبَضْتُهَا وَكَانَ النَّبِيُّ صلى الله عليه وسلم يَلْبَسُهَا فَنَحْنُ نَغْسِلُهَا لِلْمَرْضَى نَسْتَشْفِيْ بِهَا. رَوَاهُ مُسْلِمٌ.

4325. (22) [2/1242 దృఢం]

అస్మా బిన్‌తె అబీ బకర్‌ (ర) ఒక కిస్రావానీ తయాలిసీ జుబ్బహ్‌ తీసారు. అందులో పట్టు ముక్కలు అతకబడి ఉన్నాయి. భుజాలకు కూడా పట్టు ముక్కలు తగిలి ఉన్నాయి. ఇది ప్రవక్త (స) జుబ్బహ్‌, ఇది ‘ఆయి’షహ్‌ (ర) వద్ద ఉండేది. ‘ఆయి’షహ్‌ (ర) మరణించిన తర్వాత దీన్ని నేను తీసుకున్నాను. ప్రవక్త (స) దీన్ని ధరించేవారు. మేము అనారోగ్యానికి గురైనవారి స్వస్థత కోసం నీటిలో ముంచి ఆ నీటిని రోగులకు త్రాపించి వారిపై చిలకరించేవాళ్ళం. (ముస్లిమ్‌)

4326 – [ 23 ] ( متفق عليه ) (2/1242)

وَعَنْ أَنَسٍ قَالَ: رَخَّصَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم لِلزُّبَيْرِ وَعَبْدِ الرَّحْمنِ بْنِ عَوْفٍ فِيْ لُبْسِ الْحَرِيْرِ لِحِكَّةٍ بِهِمَا وَفِيْ رِوَايَةٍ لِمُسْلِمٍ قَالَ: إِنَّهُمَا شَكَوُا مِنَ الْقُمَّلَ فَرَخَّصَ لَهُمَا فِي قُمُصِ الْحَرِيْرِ.

4326. (23) [2/1242 –ఏకీభవితం]

అనస్‌ (ర) కథనం: ప్రవక్త (స) ‘జుబైర్‌ (ర) మరియు ‘అబ్దుర్ర’హ్మాన్‌ బిన్‌ ‘ఔఫ్‌ (ర)కు పట్టు వస్త్రాలు ధరించే అనుమతి ఇచ్చారు. ఎందుకంటే వారిద్దరికీ ఒళ్ళంతా దురదగా ఉండేది. పట్టుధరించడం వల్ల దురదగా ఉండేది కాదు. వీరిద్దరూ యుద్ధంలో ఉన్నప్పుడు ఈ కారణంగా తాత్కాలికంగా వారికి అనుమతించారు. (బు’ఖారీ, ముస్లిమ్‌)

4327 – [ 24 ] ( صحيح ) (2/1242)

وَعَنْ عَبْدِ اللهِ بْنِ عَمْرِو بْنِ الْعَاصِ قَالَ: رَأَى رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم عَلَيَّ ثَوْبَيْنِ مُعَصْفَرَيْنِ فَقَالَ: “إِنَّ هَذِهِ مِنْ ثِيَابش الْكُفَّارِ فَلَا تَلْبَسْهَا”.

 وَفِيْ رِوَايَةٍ:قُلْتُ: أَغْسِلْهُمَا؟ قَالَ: “بَلْ اَحْرِقْهَا”. رَوَاهُ مُسْلِمٌ.

وَسَنَذْكُرُ حَدِيْثَ عَائِشَةَ: خَرَجَ النَّبِيُّ صلى الله عليه وسلم ذَاتَ غَدَاةٍ فِيْ “بَابِ مَنَاقِبِ أَهْلِ بَيْتِ النَّبِيِّ صلى الله عليه وسلم”.

4327. (24) [2/1242 దృఢం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘అమ్ర్‌ బిన్‌ ‘ఆ’స్‌ (ర) కథనం: ప్రవక్త (స) నన్ను కాషాయరంగు దుస్తుల్లో చూచి, ‘ఇవి అవిశ్వాసుల దుస్తులు, వీటిని ధరించవద్దు,’ అని అన్నారు. దానికి నేను, ‘వీటి రంగు పోగొట్టనా?’ అని అన్నాను. ప్రవక్త (స) కాల్చివేయి అన్నారు.[2]  (ముస్లిమ్‌)

—–

اَلْفَصْلُ الثَّانِيْ రెండవ విభాగం 

4328 – [ 25 ] ( لم تتم دراسته ) (2/1243)

عَنْ أُمِّ سَلَمَةَ قَالَتْ: كَانَ أَحَبُّ الثِّيَابِ إِلى رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم الْقَمِيْصُ. رَوَاهُ التِّرْمِذِيُّ وأَبُوْ دَاوُدَ .

4328. (25) [2/1243అపరిశోధితం]

ఉమ్మె సలమహ్ (ర) కథనం: ప్రవక్త (స) కు దుస్తులన్నిటిలో జుబ్బహ్‌ అంటే చాలా ఇష్టంగా ఉండేది. (తిర్మిజి’, అబూ  దావూద్‌)

4329 – [ 26 ] ( لم تتم دراسته ) (2/1243)

وَعَنْ أَسْمَاءَ بِنْتِ يَزِيْدَ قَالَتْ: كَانَ كُمُّ قَمِيْصٍ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم إِلى الرُّصْغِ. رَوَاهُ التِّرْمِذِيُّ وَقَالَ: هَذَا حَدِيْثٌ حَسَنٌ غَرِيْبٌ .

4329. (26) [2/1243అపరిశోధితం]

అస్మా బిన్‌తె య’జీద్‌ (ర) కథనం: ప్రవక్త (స) జుబ్బహ్‌ చీలమండల వరకు ఉండేవి. (తిర్మిజి / ప్రామాణికం – ఏకోల్లేఖనం)

4330 – [ 27 ] ( لم تتم دراسته ) (2/1243)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: كَانَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم إِذَا لَبِسَ قَمِيْصًا بَدَأَ بِمِيَامِنِهِ. رَوَاهُ التِّرْمِذِيُّ .

4330. (27) [2/1243అపరిశోధితం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) జుబ్బహ్‌ ధరించినపుడు కుడి వైపు నుండి ప్రారంభించేవారు. అంటే ముందు కుడిచేతిని జుబ్బలో వేసేవారు. (తిర్మిజి’)

4331 – [ 28 ] ( صحيح ) (2/1243)

وَعَنْ أَبِيْ سَعِيْدِ الْخُدْرِيِّ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: سَمِعْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ: “إِزْرَةُ الْمُؤْمِنِ إِلى أَنْصَافِ سَاَقْيِه لَاجُنَاحَ عَلَيْهِ فِيْمَا بَيْنَهُ وَبَيْنَ الْكَعْبَيْنِ مَا أَسْفَلَ مِنْ ذَلِكَ فَفِيْ النَّارِ”. قَالَ ذَلِكَ ثَلَاثَ مَرَّاتٍ. “وَلَا يَنْظُرُ اللهُ يَوْمَ الْقِيَامَةِ إِلى مَنْ جَرَّ إِزَارَهُ بَطَرًّا”. رَوَاهُ أَبُوْ دَاوُدَ وَابْنُ مَاجَهُ .

4331. (28) [2/1243దృఢం]

అబూ స’యీద్‌ ‘ఖుద్రీ (ర) కథనం: ప్రవక్త (స) ఇలా అంటూ ఉండగా నేను విన్నాను. విశ్వాసి పైజామా చీల మండలపై ఉన్నా ఫరవాలేదు. చీలమండల క్రింద ఉంటే మాత్రం నరకం ప్రవేశానికి కారణం అవుతుంది. ఇలా మూడుసార్లు అన్నారు. గర్వాహంకారాలతో చీలమండల క్రిందివరకు తన లుంగీని వ్రేలాడగట్టేవాడి వైపు అల్లాహ్‌ (త) తీర్పుదినం నాడు కారుణ్య దృష్టితో చూడడు. (అబూ  దావూద్‌, ఇబ్నె  మాజహ్)

4332 – [ 29 ] ( صحيح ) (2/1243)

وَعَنْ سَالِمٍ عَنْ أَبِيْهِ عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ: “اَلْإِسْبَالُ فِي الْإِزَارِ وَالْقَمِيْصِ وَالْعِمَامَةِ مَنْ جَرَّ مِنْهَا شَيْئًا خُيْلَاءَ لَمْ يَنْظُرِ اللهُ إِلَيْهِ يَوْمَ الْقِيَامَةِ”.رَوَاهُ أَبُوْ دَاوُدَ والنسائي وَابْنُ مَاجَهُ .

4332. (29) [2/1243దృఢం]

సాలిమ్‌ తన తండ్రి ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘ఉమర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”పైజామా లేదా జుబ్బహ్‌లను గర్వంగా చీలమండల కంటే క్రింద వ్రేలాడ గట్టే వాడి వైపు అల్లాహ్‌ (త) కారుణ్యదృష్టితో చూడడు.” (అబూ  దావూద్‌, నసాయి’, ఇబ్నె  మాజహ్)

4333 – [ 30 ] ( لم تتم دراسته ) (2/1243)

وَعَنْ أَبِيْ كَبْشَةَ قَالَ: كَانَ كَمَامُ أَصْحَابِ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم بُطْحًا. رَوَاهُ التِّرْمِذِيُّ وَقَالَ: هَذَا حَدِيْثٌ مُنْكَرٌ.

4333. (30) [2/1243అపరిశోధితం]

అబూ కబ్‌షహ్ (ర) కథనం: ప్రవక్త (స) అనుచరుల టోపీలు తలకు అంటుకొని ఉండేవి. (తిర్మిజి’ -మున్కర్)

అంటే టోపీలు గుండ్రంగా ఉండేవి.

4334 – [ 31 ] ( لم تتم دراسته ) (2/1244)

وَعَنْ أُمِّ سَلَمَةَ قَالَتْ لِرَسُوْلِ اللهِ صلى الله عليه وسلم حِيْنَ ذَكَرَالْإِزَارَ: فَالْمَرْأَةُ يَا رَسُوْلَ اللهِ؟ قَالَ: “تُرْخِيْ شِبْرًا” فَقَالَتْ: إِذَا تَنْكَشِفُ عَنْهَا قَالَ: “فَذِرَاعًا لَا تَزِيْدُ عَلَيْهِ”. رَوَاهُ مَالِكٌ وَأَبُوْ دَاوُدَ وَالنسائي وَابْنُ مَاجَهُ .

4334. (31) [2/1244అపరిశోధితం]

ఉమ్మె సలమహ్ (ర) కథనం: ప్రవక్త (స) పైజామా గురించి ప్రస్తావించారు. అప్పుడు నేను, ‘ఓ ప్రవక్తా! స్త్రీ తన  పైజామాను ఎక్కడి వరకు ఉంచాలి,’ అని విన్నవించుకున్నాను. దానికి ప్రవక్త (స), ‘చీలమండల నుండి ఒక జానెడు క్రిందికి ఉంచాలి,’ అని అన్నారు. అప్పుడు నేను, ‘దీనివల్ల విడిపోయే ప్రమాదం ఉంది,’ అని అన్నాను. దానికి ప్రవక్త (స), ‘ఒక జానెడు ఎక్కువగా ఉంచాలి. అంతకంటే అధికం కాదు,’ అని అన్నారు. (మాలిక్‌, అబూ దావూద్‌, నసాయి, ఇబ్నె మాజహ్)

4335 – [ 32 ] ( لم تتم دراسته ) (2/1244)

وَفِيْ رِوَايَةِ التِّرْمِذِيُّ وَالنَّسَائِيِّ عَنِ ابْنِ عُمَرَفَقَالَتْ: إِذَا تَنْكَشِفُ أَقْدَامُهُنَّ قَالَ: “فَيُرْخِيْنَ ذِرًاعًا لَا يَزِدْنَ عَلَيْهِ”.

4335. (32) [2/1244అపరిశోధితం]

ఇలా ఇబ్నె ‘ఉమర్‌ ద్వారా ఉంది: అప్పుడు ఉమ్మె సలమహ్ (ర), ‘అప్పుడు కూడా పాదాలు కనబడ తాయి,’ అని అన్నారు. దానికి ప్రవక్త (స) ‘ఒక్క జానెడు వ్రేలాడదీయవచ్చు. అంతకంటే అధికం కాదు,’ అని అన్నారు. (తిర్మిజి’, నసాయి’)

4336 – [ 33 ] ( صحيح ) (2/1244)

وَعَنْ مُعَاوِيَةَ بْنِ قَرَّةَ عَنْ أَبِيْهِ قَالَ: أَتَيْتُ النَّبِيَّ صلى الله عليه وسلم فِيْ رَهْطٍ مِنْ مُزَيْنَةَ فَبَايَعُوْهُ وَإِنَّهُ لَمُطْلَقُ الْأزْرَارِ فَأَدْخَلْتُ يَدِيْ فِيْ جَيْبِ قَمِيْصِهِ فَمَسِسْتُ الْخَاتَمَ . رَوَاهُ أَبُوْ دَاوُدَ.

4336. (33) [2/1244దృఢం]

ము’ఆవియహ్‌ బిన్‌ ఖుర్ర తన తండ్రి ద్వారా కథనం:మరీన వర్గానికి చెందిన ఒక బృందం వెంట ప్రవక్త(స) వద్దకు వెళ్ళారు. వాళ్ళు ప్రవక్త (స) చేతిపై బై’అత్‌ చేసారు. అప్పుడు ప్రవక్త (స) జుబ్బహ్‌ గుండీలు విప్పిఉన్నాయి. నేను భుజం లోపల చేయి వేసి దౌత్య ముద్రను చేత్తోనిమిరాను. (అబూ దావూద్‌)

అంటే జుబ్బహ్‌కు గుండీలు పెట్టాలి. అప్పు డప్పుడు విప్పి ఉంచితే ఫరవాలేదు.

4337 – [ 34 ] ( صحيح ) (2/1244)

وَعَنْ سَمُرَةَ أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم قَالَ: “اِلْبَسُوا الثِّيَابَ الْبِيْضَ  فَإِنَّهَا أَطْهَرُ وَأَطْيَبُ وَكَفِّنُوا فِيْهَا مَوْتَاكُمْ”. رَوَاهُ أَحْمَدُ وَ التِّرْمِذِيُّ  وَالنَّسَائِيُّ وَابْنُ مَاجَهُ .

4337. (34) [2/1244దృఢం]

సమురహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మీరు తెల్లని దుస్తులు ధరించండి. ఎందుకంటే అవి చాలా బాగుంటాయి. మీ మృతులకు కూడా తెల్లని వస్త్రాల్లోనే కప్పండి.(అ’హ్మద్‌, తిర్మిజి’, నసాయి’, ఇబ్నె మాజహ్)

4338 – [ 35 ] ( لم تتم دراسته ) (2/1244)

وَعَنِ ابْنِ عُمَرَ قَالَ: كَانَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم إِذَا اعْتَمَّ سَدَلَ عَمَامَتَهُ بَيْنَ كَتِفَيْهِ. رَوَاهُ التِّرْمِذِيُّ وَقَالَ: هَذَا حَدِيْثٌ حَسَنٌ غَرِيْبٌ.

4338. (35) [2/1244అపరిశోధితం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘ఉమర్‌ (ర) కథనం: ప్రవక్త (స) అమామ ధరించినపుడు దాన్ని వెనుక  రెండు భుజాల మధ్య వ్రేలాడేటట్లు ఉంచేవారు. (తిర్మిజి’ / ప్రామాణికం, -ఏకోల్లేఖనం)

4339 – [ 36 ] ( لم تتم دراسته ) (2/1244)

وَعَنْ عَبْدِ الرَّحْمنِ بْنِ عَوْفٍ قَالَ: عَمَّمَنِيْ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم فَسَدَلَهَا بَيْنَ يَدَيَّ وَمِنْ خَلْفِيْ. رَوَاهُ أَبُوْ دَاوُدَ .

4339. (36) [2/1244అపరిశోధితం]

‘అబ్దుర్రహ్మాన్‌ బిన్‌ ‘ఔఫ్‌ (ర) కథనం: ప్రవక్త (స) నా తలపైఅమామహ్ కట్టించారు. దానిచివరలు ముందు వెనుక వ్రేలాడేటట్లు ఉంచారు. అంటే రెండు వైపుల రెండు చివరలు వదలివేసారు. (అబూ  దావూద్‌)

4340 – [ 37 ] ( ضعيف ) (2/1244)

وَعَنْ رُكَانَةَ عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ: “فَرْقُ مَا بَيْنَنَا وَبَيْنَ الْمُشْرِكِيْنَ الْعَمَائِمُ عَلَى الْقَلَانِسِ”. رَوَاهُ التِّرْمِذِيُّ. وَقَالَ: هَذَا حَدِيْثٌ حَسَنٌ غَرِيْبٌ وَإِسْنَادُهُ لَيْسَ بِالْقَائِمِ .

4340. (37) [2/1244బలహీనం]

రుకాన (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మనలో అంటే ముస్లిముల్లో అవిశ్వాసుల్లో తేడా ఏమిటంటే, వాళ్ళు టోపీ లేకుండా పగిడి ధరిస్తారు. మనం ముస్లిములం టోపీ ధరించి దానిపై పగిడి ధరిస్తాం. (తిర్మిజి’ / ప్రామాణికం, -ఏకోల్లేఖనం)

4341 – [ 38 ] ( صحيح ) (2/1244)

وَعَنْ أَبِيْ مُوْسَى الْأَشْعَرِيِّ أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم قَالَ: “أُحِلَّ الذَّهَبُ وَالْحَرِيْرُلِلْإِنَاثِ مِنْ أُمَّتِيْ وَحُرِّمَ عَلَى ذُكُوْرِهَا”. رَوَاهُ التِّرْمِذِيُّ  وَالنَّسَائِيُّ وَقَالَ التِّرْمِذِيُّ: هَذَا صَحِيْحٌ.

4341. (38) [2/1244దృఢం]

అబూ మూసా అష్‌’అరీ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”నా అనుచర సమాజంలోని స్త్రీల కోసం బంగారం, పట్టు ధర్మసమ్మతం చేయబడ్డాయి, పురుషుల కోసం నిషేధించబడ్డాయి.” (తిర్మిజి’ -దృఢం,  నసాయి’)

4342 – [ 39 ] ( صحيح ) (2/1245)

وَعَنْ أَبِيْ سَعِيْدِ الْخُدْرِيِّ قَالَ: كَانَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم إِذَا اسْتَجَدَّ ثَوْبًا سَمَّاهُ بِاسْمِهِ عَمَامَةً أَوْ قَمِيْصًا أَوْ رِدَاءً ثُمَّ يَقُوْلُ: “اَللّهُمَّ لَكَ الْحَمْدُ كَمَا كَسَوْتَنِيْهِ أَسْأَلُكَ خَيْرَهُ وَخَيْرَ مَا صُنِعَ لَهُ وَأَعُوْذُ بِكَ مِنْ شَرِّهِ وَشَرِّ مَا صَنَعَ لَهُ”. رَوَاهُ التِّرْمِذِيُّ وأَبُوْ دَاوُدَ .

4342. (39) [2/1245దృఢం]

అబూ స’యీద్‌ ‘ఖుద్రీ (ర) కథనం: ప్రవక్త (స) క్రొత్త దుస్తులు ధరించినపుడు ముందు దాని పేరు, అంటే, పగిడి ఉంటే పగిడి, జుబ్బా ఉంటే జుబ్బా, దుప్పటి ఉంటే దుప్పటి అని పేరుతీసుకొని ఈ దు’ఆ పఠిస్తారు. ”ఓ అల్లాహ్‌ స్తోత్రాలన్నీ నీ కొరకే, నీవు నాకు దుస్తులు ప్రసాదించావు. నేను దాని మేలు, మరియు దేనికోసం తయారుచేయబడిందో దానిమేలు కోరుతున్నాను. ఇంకా దాని చెడునుండి, మరియు దేనికోసం తయారుచేయబడిందో దానికీడు నుండి నీ శరణు కోరున్నాను.”  (తిర్మిజి’, అబూ  దావూద్‌)

4343 – [ 40 ] ( لم تتم دراسته ) (2/1245)

وَعَنْ مُعَاذِ بْنِ أَنَسٍ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم قَالَ: “مَنْ أَكَلَ طَعَامًا ثُمَّ قَالَ: اَلْحَمْدُ لِلّهِ الَّذِيْ أَطْعَمَنِيْ هَذَا الطَّعَامَ وَرَزَقَنِيْهِ مِنْ غَيْرِ حَوْلٍ مِّنِّيْ وَلَا قُوَّةٍ غُفِرَ لَهُ مَا تَقَدَّمَ مِنْ ذَنْبِهِ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَزَادَ أَبُوْ دَاوُدَ: “وَمَنْ لَبِسَ ثَوْبًا فَقَالَ: اَلْحَمْدُ لِلّهِ الَّذِيْ كَسَانِيْ هَذَا وَرَزَقَنِيْهِ مِنْ غَيْرِ حَوْلٍ مِّنِّيْ وَلَا قُوَّةٍ غُفِرَ لَهُ مَا تَقَدَّمَ مِنْ ذَنْبِهِ وَمَا تَأَخَّرَ”.

4343. (40) [2/1245అపరిశోధితం]

మ’ఆజ్‌ బిన్‌ అనస్‌ (ర) కథనం: ప్రవక్త (స) భోజనం చేసిన తర్వాత ఈ దు’ఆ పఠిస్తే, అతను చేసిన పాపా లన్నీ తొలగిపోతాయి అని ప్రవచించారు. ”అల్‌’హమ్దులిల్లా హిల్లజీఅత్‌’అమనీ హాజహ్  జఖనీహి మిన్‌ ‘గైరి హౌలిమ్మిన్నీ వలా ఖువ్వతిన్.” — ‘స్తోత్రాలన్నీ అల్లాహ్‌ కొరకే, ఆయనే నాకు భోజనం తినిపించాడు, ఈ ఉపాధిని ప్రసా దించాడు, ఎటువంటి శక్తి  శ్రమ  లేకుండానే.”  (తిర్మిజి)

అబూ దావూద్‌లో ఇలా ఉంది, క్రొత్త దుస్తులు ధరించిన వారు ఈ దు’ఆ పఠించాలి. అల్‌’హమ్దు లిల్లాహిల్లజీకసానీ హాజహ్ జఖనీహి మిన్‌’గైరి హౌలిన్ మిన్నీ వలా ఖువ్వతిన్.”  అతని ముందు వెనుక పాపాలన్నీ హరించ బడతాయి.

4344 – [ 41 ] ( لم تتم دراسته ) (2/1245)

وَعَنْ عَائِشَةَ قَالَتْ قَالَ لِيْ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “يَا عَائِشَةَ إِذَا أَرَدْتِ اللُّحُوْقَ بِيْ فَلْيَكْفِكِ مِنَ الدُّنْيَا كَزَادِ الرَّاكِبِ وَإِيَّاكِ وَمُجَالَسَةَ الْأَغْنِيَاءَ وَلَا تَسْتَخْلِقِيْ ثَوْبًا حَتّى تُرَقِّعِيْهِ”.رَوَاهُ التِّرْمِذِيُّ وَقَالَ: هَذَا حَدِيْثٌ غَرِيْبٌ لَا نَعْرِفُهُ إِلّا مِنْ حَدِيْثِ صَالِحِ بْنِ حَسَّانَ قَالَ مُحَمَّدُ بْنُ إِسْمَاعِيْلَ: صَالِحُ بْنُ حَسَّانَ مُنْكَرُ الْحَدِيْث .

4344. (41) [2/1245 అపరిశోధితం]

‘ఆయి’షహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) నాతో ఇలా అన్నారు, ”ఓ ‘ఆయి’షహ్‌! నువ్వు నన్ను కలుసుకోవా లంటే, జీవితంలో ప్రయాణీకుడు తన తోడు ఉంచినంత జీవితసామాగ్రిని కలిగిఉండాలి. ధనవంతుల వద్ద రాకపోకలకు దూరంగా ఉండాలి. నీ బట్ట పాతదైతే, వాటికి అతుకులు వేసి ధరించాలి. పాతవై పోయాయని పారవేయరాదు.” (తిర్మిజి’ / ఏకోల్లేఖనం. ‘సాలెహ్ బిన్ ‘హస్సాన్-, తిరస్కృతుడు)

4345 – [ 42 ] ؟ (2/1245)

عَنْ أبي أمامة إياس بن ثعلبة قَالَ: قَالَ رسول الله صلى الله عليه وسلم: “ألا تسمعون؟ ألا تسمعون أن البذاذة من الإيمان أن البذاذة من الإيمان؟” رَوَاهُ أَبُوْ دَاوُدَ.

4345. (42) [2/1245 ? ]

అబూ ఉమామ అయాస్‌ బిన్‌ స’అలబహ్ కథనం: ప్రవక్త (స) ”మీరు నా మాట వినరా! నా మాట వినరా! అంటే నా మాట వినండి, పాతదుస్తులను ధరించటం, అలంకరణలను వదలి వేయటం, అంటే నిరాడంబరమైన దుస్తులను ధరించటం విశ్వాసం లోని  భాగమే.” అని అన్నారు. ఇలా మూడు సార్లు అన్నారు.[3]   (అబూ  దావూద్‌)

4346 – [ 43 ] ( حسن ) (2/1246)

وَعَنِ ابْنِ عُمَرَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَنْ لَبِسَ ثَوْبَ شُهْرَةٍ مِنَ الدُّنْيَا أَلْبَسَهُ اللهُ ثَوْبَ مَذَلَّةٍ يَوْمَ الْقِيَامَةِ”. رَوَاهُ أَحْمَدُ وَأَبُوْ دَاوُدَ وَابْنُ مَاجَهُ .

4346. (43) [2/1246ప్రామాణికం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘ఉమర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఇహలోకంలో ప్రఖ్యాత ఖరీదైన దుస్తులు ధరించిన వారికి అల్లాహ్‌(త) తీర్పుదినం నాడు అవమాన కరమైన దుస్తులు ధరింపజేస్తాడు.” [4] (తిర్మిజి’, అ’హ్మద్‌, అబూ  దావూద్‌, ఇబ్నె మాజహ్)

4347 – [ 44 ] ( حسن ) (2/1246)

وَعَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَنْ تَشَبَّهَ بِقَوْمٍ فَهُوَ مِنْهُمْ”. رَوَاهُ أَحْمَدُ وَأَبُوْ دَاوُدَ .

4347. (44) [2/1246 ప్రామాణికం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘ఉమర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఒక జాతిని అనుకరించేవారు, జాతి వారుగానే పరిగణించబడతారు.” [5](అ’హ్మద్‌, అబూ దావూద్‌)

4348 – [ 45 ] ( لم تتم دراسته ) (2/1246)

وَعَنْ سُوَيْدِ بْنِ وَهْبٍ عَنْ رَجُلٍ مِنْ أَبْنَاءِ أَصْحَابِ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم عَنْ أَبِيْهِ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَنْ تَرَكَ لُبْسَ ثَوْبِ جَمَالٍ وَهُوَ يَقْدِرُ عَلَيْهِ.

وَفِيْ رِاوَيَةٍ: تَوَاضُعًا كَسَاهُ اللهُ حلَّةَ الْكَرَامَةِ وَمَنْ تَزَوَّجَ لِلّهِ تَوَّجَهُ اللهُ تَاجَ الْمَلِكِ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ .

4348. (45) [2/1246 అపరిశోధితం]

సువైద్ బిన్‌ వహబ్‌ (ర) ప్రవక్త (స) అనుచరుల సంతానం ద్వారా కథనం: శక్తి ఉన్నా అందచందాలకు, ఆడంబరాలకు దూరంగా ఉండే వ్యక్తి – మరో ఉల్లేఖనంలో నిరాడంబరతను, అణకువను అనుసరిస్తూ అలంకరణలకు దూరంగా ఉండే వ్యక్తిని తీర్పుదినం నాడు అల్లాహ్‌(త) గౌరవాదరణలను ప్రసాదిస్తాడు. అదేవిధంగా అల్లాహ్‌(త) కోసం నికా’హ్‌ చేసే వారికి అల్లాహ్‌ (త) తీర్పుదినం నాడు కిరీటం ధరింప జేస్తాడు. (అబూ  దావూద్‌)

4349 – [ 46 ] ( لم تتم دراسته ) (2/1246)

وَرَوَى التِّرْمِذِيُّ مِنْهُ عَنْ مُعَاذِ بْنِ أَنَسٍ حَدِيثَ اللِّبَاسِ .

4349. (46) [2/1246అపరిశోధితం]

మ’ఆజ్‌ బిన్‌ అనస్‌ (ర) కథనం: [6]  (తిర్మిజి’)

4350 – [ 47 ] ( حسن ) (2/1246)

وَعَنْ عَمْرِو بْنِ شُعَيْبٍ عَنْ أَبِيْهِ عَنْ جَدِّهِ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِنَّ اللهَ يُحِبُّ أَنْ يَّرَى أَثْرَ نِعْمَتِهِ عَلَى عَبْدِهِ”. رَوَاهُ التِّرْمِذِيُّ .

4350. (47) [2/1246 ప్రామాణికం]

‘అమ్ర్‌ బిన్‌ షు’ఐబ్‌ తన తండ్రి, తాతల ద్వారా కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”అల్లాహ్‌ (త) తన దాసులపై తన అనుగ్రహాల ప్రభావం చూడాలని కుతూహలం కలిగి ఉంటాడు.”   [7] (తిర్మిజి’)

4351 – [ 48 ] ( لم تتم دراسته ) (2/1246)

وَعَنْ جَابِرٍ قَالَ: أَتَانَا رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم زَائِرًا فَرَأَى رَجُلًا شَعِثًا قَدْ تَفَرَّقَ شَعْرُهُ فَقَالَ: “مَا كَانَ يَجِدُ هَذَا مَا يُسْكِنُ بِهِ رَأْسَهُ ؟” وَرَأَى رَجُلًا عَلَيْهِ ثِيَابٌ وَسِخَةٌ فَقَالَ: “مَا كَانَ يَجِدُ هَذَا مَا يَغْسِلُ بِهِ ثَوْبَهُ؟” رَوَاهُ أَحْمَدُ وَالنَّسَائِيُّ .

4351. (48) [2/1246అపరిశోధితం]

జాబిర్‌ (ర) కథనం: ప్రవక్త (స) మా దగ్గరకు వచ్చారు. ప్రవక్త (స) ఒక వ్యక్తిని తలవెంట్రుకలు చెల్లాచెదురుగా ఉండటం చూచి, ‘తల దువ్వు కోడానికి ఇతని వద్ద దువ్వెన  లేదా,’ అని అన్నారు. అదేవిధంగా మరోవ్యక్తిని అతని దుస్తులు మాసిపోయి ఉండటం చూసి, ‘ఇతని వద్ద బట్టలు శుభ్రపరచడానికి ఏదైనా లేదా’ అని అన్నారు. [8] (అ’హ్మద్‌, నసాయి’)

4352 – [ 49 ] ( صحيح ) (2/1246)

وَعَنْ أَبِي الْأَحْوَص عَنْ أَبِيْهِ قَالَ: أَتَيْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم وَعَلَيَّ ثَوْبٌ دُوْنَ فَقَالَ لِيْ: “أَلَكَ مَالٌ؟” قُلْتُ: نَعَمْ. قَالَ: “مِنْ أَيِّ الْمَالِ؟” قُلْتُ:مِنْ كُلِّ الْمَالِ قَدْ أَعْطَانِيَ اللهُ مِنَ الْإِبْلِ وَالْبَقَرِ وَالْخَيْلِ وَالرَّقِيْقِ. قَالَ: “فَإِذَا آتَاكَ اللهُ مَالًا فَلْيُرَ أَثَرُ نِعْمَةِ اللهِ عَلَيْكَ وَكَرَامَتِهِ”. رواهُ أَحْمَدُ وَالنَّسَائِيُّ وَفِيْ شَرْحِ السُّنَّةِ بِلَفْظِ الْمَصَابِيْحِ .

4352. (49) [2/1246దృఢం]

అబుల్‌ అ’హ్‌వస్‌ తన తండ్రి ద్వారా కథనం: నేను ప్రవక్త (స) వద్దకు వెళ్ళాను. నా శరీరంపై సాధారణమైన దుస్తులు ఉన్నాయి. వాటిని చూచి ప్రవక్త(స) నీ దగ్గర డబ్బులు లేవా? అని అడిగారు. నేను ఉన్నాయని అన్నాను. ఎటువంటి ధనం ఉందని అన్నారు. అన్ని రకాల ధనసంపదలు అల్లాహ్‌(త) నాకు ప్రసాదించాడని అన్నాను. దానికి ప్రవక్త (స), అల్లాహ్‌ (త) నీకు అన్నిరకాల ధన అనుగ్రహాలు ప్రసాదిస్తే, వాటి ప్రభావం నీపై కనబడాలి. ఇంకా ఆయన దయాకారుణ్యాలు కూడా బహిర్గతం కావాలి అని అన్నారు. [9]  (నసాయి’, షర్‌’హుస్సున్నహ్‌)

4353 – [ 50 ] ( ضعيف ) (2/1247)

وَعَنْ عَبْدِ اللهِ بْنِ عَمْرٍو قَالَ: مَرَّ رَجُلٌ وَعَلَيْهِ ثَوْبَانِ أَحْمَرَانِ فَسَلَّمَ عَلَى النَّبِيِّ صلى الله عليه وسلم. فَلَمْ يَرُدَّ عَلَيْهِ . رَوَاهُ التِّرْمِذِيُّ وأَبُوْ دَاوُدَ .

4353. (50) [2/1247బలహీనం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘అమ్ర్‌ (ర) కథనం: ఎర్రని దుస్తులు ధరించిన వ్యక్తి ప్రవక్త (స) ప్రక్క నుండి వెళుతూ ప్రవక్త (స) కు సలామ్‌ చేసాడు. ప్రవక్త (స) సమాధానం ఇవ్వలేదు.[10](తిర్మిజి’, అబూ  దావూద్)

4354 – [ 51 ] ( لم تتم دراسته ) (2/1247)

وَعَنْ عِمْرَانَ بْنِ حُصَيْنٍ أَنَّ نَبِيَّ الله صلى الله عليه وسلم قَالَ: “لَا أَرْكَبُ الْأُرْجُوَانَ وَلَا أَلْبَسُ الْمُعَصْفَرَ وَلَا أَلْبَسَ الْقَمِيْصَ الْمُكَفَّفَ بِالْحَرِيْرِ”  .وَقَالَ: “أَلَا وَطِيْبُ الرِّجَالِ رِيْحٌ لَا لَوْنَ لَهُ وَطِيْبُ النِّسَاءِ لَوْنٌ لَا رِيْحَ لَهُ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ.

4354. (51) [2/1247అపరిశోధితం]

‘ఇమ్రాన్‌ బిన్‌ ‘హు’సైన్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, నేను ఎర్రని జీనుపై కూర్చోను, సువాసనలతో కూడిన వస్త్రాన్ని నేను ధరించను, పట్టు వస్త్రాన్ని కూడా నేను ధరించను. గుర్తుంచుకోండి, రంగులేని పరిమళాలు కేవలం పురుషులకు మాత్రమే ధర్మసమ్మతం. రంగులుగల దుస్తులు కేవలం స్త్రీలకు మాత్రమే. అయితే అందులో సువాసన ఉండరాదు.[11] (అబూ  దావూద్‌)

4355 – [ 52 ] ( ضعيف ) (2/1247)

وَعَنْ أَبِيْ رَيْحَانَةَ قَالَ: نَهَى رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم عَنْ عَشْرٍ: عَنِ الْوَشْرِ وَالْوَشْمِ وَالنَّتْفِ وَعَنْ مُكَامَعَةِ الرَّجْلِ الرَّجُلَ بِغَيْرِ شِعَارٍ وَمُكَامَعَةِ الْمَرْأَةِ الْمَرْأَةَ بِغَيْرِ شِعَارٍ وَأَنْ يَجْعَلَ الرَّجُلُ فِيْ أَسْفَلِ ثِيَابِهِ حَرِيْرًا مِثْلَ الْأَعَاجِمِ أَوْ يَجْعَلُ عَلَى مَنْكِبَيْهِ حَرِيْرًا مِثْلَ الْأَعَاجِمِ وَعَنِ النَّهْبِىِّ وَعَنْ رُكُوْبِ النُّمُوْرِ وَلُبُوْسِ الْخَاتِمِ إِلَّا لِذِيْ سُلْطَانٍ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ وَالنَّسَائِيُّ.

4355. (52) [2/1247బలహీనం]

అబూ రై’హానహ్ (ర) కథనం: ప్రవక్త (స) 10 విష యాల నుండి వారించారు: 1. పళ్ళు సూదిగా చేయటం, 2. కొప్పులు చేయటం, 3. వెంట్రుకలు పీకటం, 4. పురుషులు పురుషులతో కలసి పడుకోవటం, 5. స్త్రీలు స్త్రీలతో కలసి పడుకోవటం, 6. పట్టు వస్త్రాన్ని ఉపయో గించటం, 7. భుజా లపై పట్టు వస్త్రాన్ని కప్పుకోవటం, 8. దోపిడి చేయడం, 9. చిరుతపులి చర్మంపై కూర్చోవటం, 10. ఉంగరం తొడి గించటం. కాని పాలకుడు, రాజు చేయవచ్చును. [12]  (అబూ దావూద్‌)

4356 – [ 53 ] ( لم تتم دراسته ) (2/1247)

وَعَنْ عَلِيٍّ قَالَ: نَهَانِيْ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم عَنْ خَاتَمِ الذَّهَبِ وَعَنْ لُبْسٍ الْقَسِيِّ وَالْمَيَاثِرِ. رَوَاهُ التِّرْمِذِيُّ وَأَبُوْ دَاوُدَ وَالنَّسَائِيُّ وَابْنُ مَاجَهُ

وَفِيْ رِوَايَةٍ لِأَبِيْ دَاوُدَ قَالَ: نَهَى عَنْ مَيَاثِرِ الْأُرْجُوَانِ .

4356. (53) [2/1247అపరిశోధితం]

‘అలీ (ర) కథనం: ప్రవక్త (స) నన్ను బంగారు ఉంగరాన్ని, పట్టువస్త్రాన్ని, ఎర్రటి పట్టు’జీనును ఉపయోగించరాదని వారించారు. (తిర్మిజి’, అబూ దావూద్‌, నసాయి’, ఇబ్నె మాజహ్)

4357 – [ 54 ] ( لم تتم دراسته ) (2/1248)

وَعَنْ مُعَاوِيَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَا تَرْكَبُوا الْخَزَّ ولَا النِّمَارَ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ وَالنَّسَائِيُّ .

4357. (54) [2/1248అపరిశోధితం]

ముఆవియహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ” మీరు పట్టు జీనుపై, చిరుతపులి చర్మంపై కూర్చో కండి.” (అబూ  దావూద్‌, నసాయి’)

4358 – [ 55 ] ( لم تتم دراسته ) (2/1248)

وَعَنِ الْبَرَاءِ بْنِ عَازِبٍ: أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم نَهَى عَنِ الْمَيْثَرَةِ الْحَمْرَاءِ. رَوَاهُ فِيْ شَرْحِ السُّنَّةِ .

4358. (55) [2/1248అపరిశోధితం]

బరాఅ’ బిన్‌ ‘ఆ’జిబ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ఎర్రటి జీనుపై కూర్చోరాదని వారించారు. (షర్‌’హు స్సున్నహ్)

4359 – [ 56 ] ( لم تتم دراسته ) (2/1248)

وَعَنْ أَبِيْ رِمْثَةَ التَّيْمِيِّ قَالَ: أَتَيْتُ النَّبِيَّ صلى الله عليه وسلم وَعَلَيْهِ ثَوْبَانِ أَخْضَرَانَ وَلَهُ شَعْرٌ قَدْ عَلَاهُ الشَّيْبُ وَشَيْبُهُ أَحْمَرُ. رَوَاهُ التِّرْمِذِيُّ

وَفِيْ رِوَايَةٍ لِأَبِيْ دَاوُدَ: وَهُوَ ذُوْ وَفْرَةٍ وَبِهَا رَدْعٌ مِنْ حِنَّاءٍ.

4359. (56) [2/1248అపరిశోధితం]

అబూ రమ్‌స తైమీ(ర) కథనం: నేను ప్రవక్త (స) వద్దకు వచ్చాను. అప్పుడు ప్రవక్త (స) పచ్చని దుస్తుల్లో ఉన్నారు. ప్రవక్త (స) తల మరియు గడ్డంలో కొన్ని తెల్లటి వెంట్రుకలు, కొన్ని ఎర్రటి వెంట్రుకలు కూడా ఉన్నాయి. (తిర్మిజి’, అబూ దావూద్‌)

ఈ ‘హదీసు’ ద్వారా పచ్చని దుస్తులు ధరించవచ్చని  తెలుస్తుంది.

4360 – [ 57 ] ( لم تتم دراسته ) (2/1248)

وَعَنْ أَنَسٍ: أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم كَانَ شَاكِيًا فَخَرَجَ يَتَوَكَّأُ عَلَى أُسَامَةَ وَعَلَيْهِ ثَوْبُ قِطْرٍ قَدْ تَوَشَّحَ بِهِ فَصَلّى بِهِمْ. رَوَاهُ فِيْ شَرْحِ السُّنَّةِ .

4360. (57) [2/1248అపరిశోధితం]

అనస్‌ (ర) కథనం: ప్రవక్త (స) అనారోగ్యంగా ఉన్నారు. ఉసామా (ర) సహాయంతో బయటకు వచ్చారు. ప్రవక్త (స) శరీరంపై ఖతర్ దుప్పటి ఉండేది. దాన్ని కప్పుకొని ప్రవక్త (స) నమా’జు చదివించారు. (షర్‌హుస్సున్నహ్‌)

ఈ ఖతరు దుప్పటిపై ఎర్రటి గీతలు ఉండేవి. గరుకుగా ఉండేది. అంటే ఎర్రటి గీతలు ఉన్న వస్త్రం ధరించవచ్చని తెలిసింది.

4361 – [ 58 ] ( صحيح ) (2/1248)

وَعَنْ عَائِشَةَ قَالَتْ: كَانَ عَلَى النَّبِيِّ صلى الله عليه وسلم ثَوْبَانِ قِطْرِيَّانِ غَلِيْظَانِ وَكَانَ إِذَا قَعَدَ فرق ثَقُلَا عَلَيْهِ فَقَدِمَ بَزٌّمِنَ الشَّامِ لِفُلَانٍ الْيَهُوْدِيِّ. فَقُلْتُ: لَوْ بَعَثْتَ إِلَيْهِ فَاشْتَرَيْتَ مِنْهُ ثَوْبَيْنِ إِلى الْمَيْسَرَةِ فَأَرْسَلَ إِلَيْهِ فَقَالَ: قَدْ عَلِمْتُ مَا تُرِيْدُ إِنَّمَا تُرِيْدُ أَنْ تَذْهَبَ بِمَالِيْ. فَقَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “كَذَبَ قَدْ عَلِمَ أَنِّيْ مِنْ أَتْقَاهُمْ وَآدَاهُمْ لِلْأَمَانَةِ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَالنَّسَائِيُّ.

4361. (58) [2/1248దృఢం]

‘ఆయి’షహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ఖతర్‌కు చెందిన రెండు గరుకైన దుస్తులు ధరించి ఉన్నారు. చాలా సేపు వరకు కూర్చోవటంవల్ల చెమట రావటంవల్ల అవి బరువెక్కిపోయేవి. ఆ రోజుల్లో ఒక యూద వర్తకుని వద్దకు సిరియా నుండి దుస్తులు వచ్చాయి. ‘ఎవరినైనా పంపి గీతలుగల రెండు దుస్తులు కొనుక్కోండి’ అని అన్నాను. ప్రవక్త (స) ఒక వ్యక్తిని పంపారు. అతడు ప్రవక్త (స) సందేశాన్ని వినిపించాడు. దానికి ఆ యూదుడు, ‘మీ మిత్రుడు అప్పుగా తీసుకొని నా ధనాన్ని దోచుకోవాలను కుంటున్నాడు,’ అని అన్నాడు. ఆ వ్యక్తి వచ్చి జరిగినదంతా చెప్పాడు. ప్రవక్త (స) అది విని, ‘వాడు అసత్యం పలుకుతున్నాడు. నేను అందరి కంటే సత్య వంతుడను, అమానతు దారుడనని ఆ యూదునికి తెలుసు,’ అని అన్నారు. (తిర్మిజి’, నసాయి’)

4362 – [ 59 ] ( ضعيف ) (2/1248)

وَعَنْ عَبْدِ اللهِ بْنِ عَمْرٍو بْنِ الْعَاصِ قَالَ: رَآنِيْ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم وَعَلَيَّ ثَوْبٌ مَصْبُوْغٌ بِعُصْفُرٍ مُوَرَّدٍ فَقَالَ: “مَا هَذَا؟” فَعَرْفَتُ مَا كَرِهَ فَانْطَلَقْتُ فأَحْرَقْتُهُ. فَقَالَ النَّبِيُّ صلى الله عليه وسلم: “مَا صَنَعْتَ بِثَوْبِكَ؟” قُلْتُ: أَحْرَقْتُهُ قَالَ: “أَفَلَا كَسَوْتَهُ بَعْضَ أَهْلِكَ؟ فَإِنَّهُ لَا بَأْسَ بِهِ لِلنِّسَاءِ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ.

4362. (59) [2/1248బలహీనం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘అమ్ర్‌ బిన్‌ ‘ఆ’స్‌ (ర) కథనం: నేను కాషాయ రంగుగల దుస్తులు ధరించి ఉండటం ప్రవక్త (స) చూచారు. ‘ఇది ఏమిటి?’ అని అన్నారు. ప్రవక్త (స) ఉద్దేశ్యం గ్రహించిన నేను ఇంటికి వెళ్ళి దాన్ని కాల్చివేసాను. తిరిగి వచ్చాను. ప్రవక్త (స), ‘నీ బట్టలనేం చేసావు,’ అని అన్నారు. ‘వాటిని నేను కాల్చివేసాను,’ అని అన్నాను. ‘దానికి బదులు మీ ఇంట్లో స్త్రీలకు ఇచ్చివేస్తే బాగుండేది. ఎందుకంటే వాళ్ళు ధరించటంలో ఎటువంటి అభ్యంతరం లేదు,’ అని అన్నారు. (అబూ దావూద్‌)

4363 – [ 60 ] ( صحيح ) (2/1249)

وَعَنْ هِلَالِ بْنِ عَامِرٍ عَنْ أَبِيْهِ قَالَ: رَأَيْتُ النَّبِيَّ صلى الله عليه وسلم بِمِنى يَخْطُبُ عَلَى بَغْلَةٍ وَعَلَيْهِ بُرْدٌ أَحْمَرُ وَعَلِيٌّ أَمَامَهُ يُعَبِّرُ عَنْهُ. رَوَاهُ أَبُوْ دَاوُدَ .

4363. (60) [2/1249దృఢం]

హిలాల్‌ బిన్‌ ‘ఆమిర్‌ (ర) తన తండ్రి ద్వారా కథనం: మినాలో ప్రవక్త (స) ప్రసంగిస్తూ ఉండగా నేను చూచాను. అప్పుడు ప్రవక్త (స) కంచర గాడిదపై కూర్చొని ఉన్నారు. ఎర్రనిగీతలుగల దుప్పటి కప్పుకొని ఉన్నారు. అలీ (ర) ప్రవక్త (స) ముందు ఉన్నారు. ప్రవక్త (స) ప్రసంగాన్ని ఇతరులకు అందజేస్తున్నారు. (అబూ దావూద్‌)

అంటే శబ్దం చేరని ప్రదేశానికి వెళ్ళి ప్రసంగం వినిపించేవారు.

4364 – [ 61 ] ( صحيح ) (2/1249)

وَعَنْ عَائِشَةَ قَالَتْ: صُنِعَتْ لِلنَّبِيِّ صلى الله عليه وسلم بُرْدَةٌ سَوْدَاءُ فَلَبِسَهَا فَلَمَّا عَرِقَ فِيْهَا وَجَدَ رِيْحَ الصُّوْفِ فَقَذَفَهَا. رَوَاهُ أَبُوْ دَاوُدَ .

4364. (61) [2/1249దృఢం]

‘ఆయి’షహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) కోసం ఒక నల్లని దుప్పటి తయారుచేయబడింది. ప్రవక్త (స) దాన్ని ధరించేవారు, చెమటమయం అయి, ఉన్ని వాసన గ్రహించి తీసివేసే వారు. (అబూ  దావూద్‌)

 అంటే ఆదుప్పటి నల్లనివెంట్రుకలతో తయారు చేయబడి ఉంది. చెమటవల్ల దుర్వాసనవేస్తే తీసివేసే వారు. ఎందుకంటే దుర్వాసనను అసహ్యించుకునే వారు.

4365 – [ 62 ] ( ضعيف ) (2/1249)

وَعَنْ جَابِرٍ قَالَ: أَتَيْتُ النَّبِيَّ صلى الله عليه وسلم وَهُوَ مُحْتَبٍ بِشَمْلَةٍ قَدْ وَقَعَ هدَبُهَا عَلَى قَدَمَيْهِ. رَوَاهُ أَبُوْ دَاوُدَ .

4365. (62) [2/1249బలహీనం]

జాబిర్‌ (ర) కథనం: నేను ప్రవక్త (స) వద్దకు వెళ్ళాను. అప్పుడు ప్రవక్త (స) దుప్పటి కప్పుకొని కూర్చున్నారు. దాని అంచులు ప్రవక్త (స) పాదాలపై పడి ఉన్నాయి. (అబూ  దావూద్‌)

4366 – [ 63 ] ( ضعيف ) (2/1249)

وَعَنْ دِحْيَةَ بْنِ خَلِيْفَةَ قَالَ: أُتِيَ النَّبِيُّ صلى الله عليه وسلم بِقَبَاطِيَّ فَأَعْطَانِيْ مِنْهَا قُبْطِيَّةً فَقَالَ: “اِصْدَعْهَا صَدْعَيْنِ فَاقْطَعَ أَحَدَهُمَا قَمِيْصًا وَأَعْطِ الْآخَرَ اِمْرَأَتَكَ تَخْتَمِرُ بِهِ”. فَلَمَّا أَدْبَرَ قَالَ: “وأمر اِمْرَأَتَكَ أَنْ تَجْعَلَ تَحْتَهُ ثَوْبًا لَا يَصِفُهَا”. رَوَاهُ أَبُوْ دَاوُدَ.

4366. (63) [2/1249బలహీనం]

ది’హ్‌యహ్‌ బిన్‌ ‘ఖలీఫహ్ (ర) కథనం: ప్రవక్త (స) వద్దకు ఈజిప్టుకు చెందిన తెల్లని, పలుచని వస్త్రం దిండు తీసుకు రాబడింది. అందులో నుండి ఒక తాను నాకిచ్చి, ‘దీన్ని రెండు భాగాలుగాచేసి ఒకదాన్ని నువ్వు జుబ్బహ్‌ కుట్టించుకో, రెండవ దాన్ని నీ భార్యకు ఇచ్చి దుపట్టా చేసుకోమను,’ అని అన్నారు. నేను తిరిగి వెళ్ళిపోతూ ఉండగా ప్రవక్త (స), ‘నీవు నీ భార్యకు దాని క్రింద మరో బట్ట తగిలించుకోమను, తల వెంట్రుకలు, శరీర ఏ భాగమూ కనబడకుండా ఉండటానికి,’ అని అన్నారు.[13] (అబూ దావూద్‌)

4367 – [ 64 ] ( ضعيف ) (2/1249)

وَعَنْ أُمِّ سَلَمَةَ أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم دَخَلَ عَلَيْهَا وَهِيَ تَخْتَمِرُ فَقَالَ: “لَيَّةً لَا لَيَّتَيْنِ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ

4367. (64) [2/1249బలహీనం]

ఉమ్మె సలమహ్ (ర) కథనం: ప్రవక్త (స) ఆమె వద్దకు వచ్చారు. ఆమె దుపట్టా కప్పుకొని ఉన్నారు. అది చూచి ప్రవక్త (స), ‘తలపై ఒక పొర చాలు, రెండు పొరలు అక్కర లేదు,’ అని అన్నారు. (అబూ  దావూద్‌)

అంటే పురుషుల్లా తలపై రెండేసి పొరలు స్త్రీలు వేయ నక్కర లేదు. ఒక దుపట్టాతోనే తలను రొమ్మును కప్పుకోవాలి.

—–

اَلْفَصْلُ الثَّالِثُ మూడవ విభాగం 

4368 – [ 65 ] ( صحيح ) (2/1250)

عَنِ ابْنِ عُمَرَ قَالَ: مَرَرْتُ بِرَسُوْلِ اللهِ صلى الله عليه وسلم وَفِيْ إِزَارِيْ اِسْتِرْخَاءٌ فَقَالَ: “يَا عَبْدَ اللهِ اِرْفَعْ إِزَارَكَ”. فَرَفَعْتُهُ ثُمَّ قَالَ: “زِدْ”. فَزِدْتُ فَمَا زِلْتُ أتَحَرَّاهَا بَعْدَ فَقَالَ: بَعْضُ الْقَوْمِ: إِلى أَيْنَ؟ قَالَ: “إِلَى أَنْصَافِ السَّاقَيْنِ”. رَوَاهُ مُسْلِمٌ .

4368. (65) [2/1250దృఢం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘ఉమర్‌ (ర) కథనం: నేను ప్రవక్త(స) వెంట వెళుతున్నాను. నా లుంగీ క్రింద వ్రేలాడుతుంది. అప్పుడు ప్రవక్త (స), ‘ఓ ‘అబ్దుల్లాహ్‌! నీవు నీ లుంగీని పైకి ఎత్తుకో,’ అని అన్నారు. నేను పైకి ఎత్తుకున్నాను. ప్రవక్త (స) ‘ఇంకా పైకి ఎత్తు,’ అన్నారు. నేను ఇంకా పైకి ఎత్తాను. ప్రవక్త (స) అలా అంటూ ఉన్నారు, నేను ఎత్తుతూ ఉన్నాను. చివరికి ప్రజలు, ‘లుంగీ ఎక్కడి వరకు ఎత్తాలి,’ అని ప్రశ్నించారు. దానికి ప్రవక్త (స), ‘సగం మోకాళ్ళ వరకు,’ అని సమాధానం ఇచ్చారు. (ముస్లిమ్‌)

 అంటే లుంగీ లేదా పైజామా సగం మోకాళ్ళ వరకు ఉండటం ప్రవక్త (స) సాంప్రదాయం.

4369 – [ 66 ] ( صحيح ) (2/1250)

وَعَنْهُ أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم قَالَ: “مَنْ جَرَّ ثَوْبَهُ خُيَلَاءَ لَمْ يَنْظُرِ اللهُ إِلَيْهِ يَوْمَ الْقِيَامَةِ”. فَقَالَ أَبُوْ بَكْرٍ: يَا رَسُوْلَ اللهِ إِزَارِيْ يَسْتَرْخِيْ إِلَّا أَنْ أَتَعاهَدَهُ. فَقَالَ لَهُ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِنَّكَ لَسْتَ مِمَّنْ يَفْعَلُهُ خُيَلَاءَ”. رَوَاهُ الْبُخَارِيُّ .

4369. (66) [2/1250దృఢం]

‘అబ్దుల్లాహ్‌ బిన్ ‘ఉమర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”గర్వంగా తన దుస్తులను చీలమండల క్రింది వరకు వ్రేలాడదీసే వాని వైపు అల్లాహ్‌ (త) తీర్పుదినం నాడు కారుణ్య దృష్టితో చూడడు. అది విని అబూ బకర్‌ (ర), ‘ప్రవక్తా! నా లుంగీ తరచూ జారిపోతూ ఉంటుంది. అయితే నేను పైకే కడుతున్నాను,’ అని విన్నవించు కున్నారు. దానికి ప్రవక్త (స), ‘నువ్వు గర్వంగా అలా చేసేవారిలోని వాడవు కావు, ‘ అని అన్నారు. (బు’ఖారీ)

అంటే ఎప్పుడైనా అనుకోకుండా వ్రేలాడితే ఫర్వాలేదు.

4370 – [ 67 ] ( صحيح ) (2/1250)

وَعَنْ عِكْرَمَةَ قَالَ: رَأَيْتُ ابْنَ عَبَّاسٍ يَأْتَزِرُ فَيَضَعُ حَاشِيَةَ إِزَارِهِ مِنْ مُقَدَّمِهِ عَلَى ظَهْرِ قَدَمِهِ وَيَرْفَعُ مِنْ مُؤَخَّرِةِ قُلْتُ لَمْ تَأْتَزِرُهَذِهِ الْإِزْرَةَ؟ قَالَ: رَأَيْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يَأْتَزِرُهَا. رَوَاهُ أَبُوْدَاوُدَ .

4370. (67) [2/1250దృఢం]

ఇక్రమ (ర) కథనం: ఇబ్నె ‘అబ్బాస్‌ (ర) లుంగీ కట్టటం నేను చూచాను, ముందు భాగం పాదాలపై ఉంది, వెనుక భాగం పైకి లేచి ఉంది. ‘ఇలా లుంగీ ఎందుకు కడతారు,’ అని నేనడిగాను. దానికి అతను, ‘నేను ప్రవక్త (స) ను ఇలా లుంగీ ధరించి ఉండగా చూచాను’ అని అన్నారు. (అబూ  దావూద్‌)

4371 – [ 68 ] ( ضعيف ) (2/1250)

وَعَنْ عُبَادَةَ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “عَلَيْكُمْ بِالْعَمَائِمِ فَإِنَّهَا سِيْمَاءُ الْمَلَائِكَةِ وَأَرْخُوْهَا خَلْفَ ظُهُوْرِكُمْ”. رَوَاهُ الْبَيْهَقِيُّ .

4371. (68) [2/1250బలహీనం]

‘ఉబాదహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మీరు పగిడి ధరించండి, ఎందుకంటే ఇది దైవదూతల చిహ్నం, పగిడి కొంతభాగాన్ని అంటే షమ్లాను వీపు వెనుక వదలి వేయండి.”  [14]  (బైహఖీ)

4372 – [ 69 ] ( حسن ) (2/1250)

وَعَنْ عَائِشَةَ أَنَّ أَسْمَاءَ بِنْتَ أَبِيْ بَكْرٍ دَخَلْتُ عَلَى رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم وَعَلَيْهَا ثِيَابٌ رِقَاقٌ فَأَعْرَضَ عَنْهُ وَقَالَ: “يَا أَسْمَاءُ إِنَّ الْمَرْأَةَ إِذَا بَلَغَتِ الْمَحِيْضَ لَنْ يَّصْلُحَ أَنْ يُرَى مِنْهَا إِلَّا هَذَا وَهَذَا”. وَأَشَارَ إِلى وَجْهِهِ وَكَفَّيْهِ. رَوَاهُ أَبُوْ دَاوُدَ .

4372. (69) [2/1250ప్రామాణికం]

‘ఆయి’షహ్‌ (ర) కథనం: అస్మా బిన్‌తె అబీ బక్‌ర్‌ ప్రవక్త (స) వద్దకు వచ్చారు. ఆమె శరీరంపై పలుచని దుస్తులు ఉండేవి. ప్రవక్త (స) ఆమె వైపు నుండి ముఖం త్రిప్పుకొని, ‘ఓ అస్మా స్త్రీలు యుక్తవయస్సుకు చేరిన తర్వాత ముఖం, అర చేతులు తప్ప శరీరమంతా బహిర్గతం కావటం ధర్మం కాదు,’ అని అన్నారు. (అబూ దావూద్‌)

ఈ ‘హదీసు’ ద్వారా స్త్రీలు శరీరం కనబడేటట్లు పలుచని దుస్తులు ధరించవద్దని తెలిసింది.

4373 – [ 70 ] ( لم تتم دراسته ) (2/1251)

وَعَنْ أَبِيْ مَطَرٍ قَالَ: إِنَّ عَلِيًّا اِشْتَرَى ثَوْبًا بِثَلَاثَةِ دَرَاهِمَ فَلَمَّا لَبِسَهُ قَالَ: “اَلْحَمْدُ لِلّهِ الَّذِيْ رَزَقَنِيْ مِنَ الرِّيَاشِ مَا أَتَجَمَّلَ بِهِ فِي النَّاسِ وَأُوَارِيْ بِهِ عَوْرَتِيْ “ثُمَّ قَالَ: هَكَذَا سَمِعْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ. رَوَاهُ أَحْمَدُ.

4373. (70) [2/1251అపరిశోధితం]

అబూ మ’తరిన్‌ కథనం: ‘అలీ (ర) 3 దిర్‌హమ్‌లు ఇచ్చి ఒక వస్త్రం కొన్నారు. దాన్ని ధరించినపుడు అల్‌’మ్దు లిల్లాహిల్లజీజఖనీ మినర్రియాషి, మా అతజమ్మలు బిహి ఫిన్నాసి, ఫఉవారియ బిహీ ఔరతీ.” — ‘ఈ వస్త్రాన్ని ప్రసాదించిన దైవానికి కతజ్ఞతలు. ప్రజల ముందు నేను అలంకరణ చేస్తాను. నా మర్మాంగాన్ని కప్పి ఉంచుతాను. అనే దు’ఆ పఠించి, ‘ప్రవక్త (స) ను ఇలా దు’ఆ పఠించడం విన్నాను,’ అని అన్నారు. (అ’హ్మద్‌)

4374 – [ 71 ] ( ضعيف ) (2/1251)

وَعَنْ أَبِيْ أُمَامَةَ قَالَ: لَبِسَ عُمَرُبْنُ الْخَطَّابٍ رَضِيَ اللهُ عَنْهُ ثَوْبًا جَدِيْدًا فَقَالَ: اَلْحَمْدُ لِلّهِ الَّذِيْ كَسَانِيْ مَا أُوَارِيْ بِهِ عَوْرَتِيْ وَأَتَجَمَّلُ بِهِ فِيْ حَيَاتِيْ ثُمَّ قَالَ: سَمِعْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ: “مَنْ لَبِسَ ثَوْبًا جَدِيْدًا فَقَالَ: اَلْحَمْدُ لِلّهِ الَّذِيْ كَسَانِيْ مَا أُوَارِيْ بِهِ عَوْرَتِيْ وَأَتَجَمَّلُ بِهِ فِيْ حَيَاتِيْ ثُمَّ عَمَدَ إِلى الثَّوْبِ الَّذِيْ أَخْلَقَ فَتَصَدَّقَ بِهِ كَانَ فِيْ كَنَفِ اللهِ وَفِيْ حِفْظِ اللهِ وَفِيْ سِتْرِ اللهِ حَيًّا وَمَيِّتًا”. رَوَاهُ أَحْمَدُ وَالتِّرْمِذِيُّ وَابْنُ مَاجَهُ. وَقَالَ التِّرْمِذِيُّ: هَذَا حَدِيْثٌ غَرِيْبٌ.

4374. (71) [2/1251బలహీనం]

అబూ ఉమామహ్ (ర) కథనం: ‘ఉమర్‌ (ర) క్రొత్త దుస్తులు ధరించి ఈ దు’ఆ పఠించారు. ”అల్‌’హమ్దులిల్లా హిల్లజీకసానీ మా ఉవారియ బిహీ ఔరతీ అతజమ్మలు బిహీ ఫీహయాతీ.” — ‘స్తోత్రాలన్నీ అల్లాహ్‌ (త) కొరకే. ఆయనే నాకు ఈ దుస్తులు ప్రసాదించాడు. దీని ద్వారా నేను నా మర్మాంగాన్ని కప్పుకున్నాను. ప్రజల ముందు అలంకరణ చేసాను.’ ఆ తరువాత ప్రవక్త (స)ను ఇలా అంటూ ఉండగా విన్నాను: ”ఎవరు ఈ దు’ఆ పఠించి దాన్ని ధరించి, ఆ తరు పాత దాన్ని ధర్మంచేస్తే ఆ వ్యక్తి బ్రతికి ఉన్నా, చనిపోయినా దేవుని సంరక్షణలో ఉంటాడు. (ఇబ్నె మాజహ్, తిర్మిజి’)

4375 – [ 72 ] ( لم تتم دراسته ) (2/1251)

وَعَنْ عَلْقَمَةَ بْنِ أَبِيْ عَلْقَمَةَ عَنْ أُمِّهِ قَالَتْ: دَخَلَتْ حَفْصَةُ بِنْتُ عَبْدِ الرَّحْمَنِ عَلَى عَائِشَةَ وَعَلَيْهَا خِمَارٌ رَقِيْقٌ فَشَقَّتْهُ عَائِشَةَ وَكَسَتْهَا خِمَارًا كَثِيْفًا. رَوَاهُ مَالِكٌ .

4375. (72) [2/1251అపరిశోధితం]

‘అల్‌ఖమహ్‌ బిన్‌ అబీ ‘అల్‌ఖమహ్‌ తన తల్లి ద్వారా కథనం: ‘హఫ్‌’సహ్ బిన్‌తె ‘అబ్దుర్ర’హ్మాన్‌, ‘ఆయి’షహ్‌ (ర) వద్దకు వచ్చారు. అప్పుడు ఆమె పలుచని దుప్పట్టా ధరించి ఉన్నారు. ‘ఆయి’షహ్‌ (ర) ఆ పలుచని దుపట్టాను చించి పారవేసారు. ఒక దళసరి దుప్పటితో ఆమెను కప్పారు. (మాలిక్‌)

పలుచని దుపట్టా ధరించడం స్త్రీలకు నిషిద్ధం గనుక దాన్ని చించిపారవేసారు.

4376 – [ 73 ] ( صحيح ) (2/1251)

وَعَنْ عَبْدِ الْوَاحِدِ بْنِ أَيْمَنَ عَنْ أَبِيْهِ قَالَ: دَخَلْتُ عَلَى عَائِشَةَ وَعَلَيْهَا دِرْعٌ قِطْرِيٌّ ثَمَنُ خَمْسَةِ دَرَاهِمَ فَقَالَتْ: اِرْفَعْ بَصَرَكَ إِلى جَارِيَتِيْ اُنْظُرْ إِلَيْهَا فَإِنَّهَا تُزْهِىْ أَنْ تَلْبَسَهُ فِيْ الْبَيْتِ وَقَدْ كَانَ لِيْ مِنْهَا دِرْعٌ عَلَى عَهْدِ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم فَمَا كَانَتْ اِمْرَأَةٌ تُقَيَّنُ بِالْمَدِيْنَةِ إِلَّا أَرْسَلَتْ إِلَيَّ تَسْتَعِيْرُهُ. رَوَاهُ الْبُخَارِيُّ .

4376. (73) [2/1251దృఢం]

‘అబ్దుల్‌ వా’హిద్‌ బిన్‌ ఐమన్‌ తన తండ్రి ద్వారా కథనం: నేను ‘ఆయి’షహ్‌ (ర) వద్దకు వచ్చాను. అప్పుడు ఆమె శరీరంపై మిస్రీ కుర్తా ఉంది. దాని వెల 5 దిర్‌హమ్‌లు. (అంటే సాధారణమైన కుర్తా) అది చూచి నాకు ఆశ్చర్యం కలిగింది. ‘ఆయి’షహ్‌ (ర) అది గ్రహించి, ‘నువ్వు తలఎత్తి నా బానిసరాలిని చూడు, ఆమె ఇంట్లో ఆ కుర్తాను తొడగమంటే అసహ్యించు కుంటుంది. అంటే ఇంటిలోపల ధరించ మంటేనే అసహ్యించుకుంటుంది. బయట తరువాత సంగతి. ఈ కుర్తాల్లోని  ఒక కుర్తా ప్రవక్త (స) కాలంలో నా దగ్గర ఉండేది. ఏ స్త్రీకైనా అలంకరించి ఆమె భర్త ఇంటికి పంపేటప్పుడు దీన్ని నా దగ్గర నుండి తాత్కా లికంగా తీసుకొని ఆమెను ధరించి, అలంకరించి ఆమె భర్త ఇంటికి పంపేవారు. (బు’ఖారీ)

అంటే ప్రవక్త (స) కాలంలో బట్టలు కూడా చాలా తక్కువగా ఉండేవి. నిరాడంబరత కూడా ఉండేది. ఇప్పుడు చాలా బట్టలు ఉన్నాయి. ఇప్పుడు అటు వంటి కుర్తా పనిమనిషి ఇంట్లో ధరించమంటే అసహ్యించుకుంటుంది.

4377 – [ 74 ] ( صحيح ) (2/1252)

وَعَنْ جَابِرٍ قَالَ: لَبِسَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم يَوْمًا قُبَاءَ دِيْبَاجٍ أُهْدَي لَهُ ثُمَّ أَوْشَكَ أَنْ نَزَعَهُ فَأَرْسَلَ بِهِ إِلَى عُمَرَفَقِيْلَ: قَدْ أَوْشَكَ مَا اِنْتَزَعْتَهُ يَا رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم فَقَالَ: “نَهَانِيْ عَنْهُ جِبْرِيْلُ ” فَجَاءَ عُمَرُ يَبْكِيْ فَقَالَ: يَا رَسُوْلَ اللهِ كَرِهْتَ أَمْرًا وَأَعْطَيْتَنِيْهِ فَمَا لِيْ؟ فَقَالَ: “إِنِّيْ لَمْ أُعْطِكَهُ تَلْبَسُهُ إِنَّمَا أَعْطَيْتُكَهُ تَبِيْعُهُ”. فَبَاعَهُ بِأَلْفَيْ دِرْهَمٍ. رَوَاهُ مُسْلِمٌ.

4377. (74) [2/1252దృఢం]

జాబిర్‌ (ర) కథనం: ఒకరోజు ప్రవక్త (స) పట్టు పైజామా ధరించారు. అది కానుకగా వచ్చింది. ఆ తరువాత వెంటనే దాన్ని తొలగించారు, ‘ఉమర్‌ (ర) వద్దకు పంపివేసారు. ప్రవక్త (స)ను దాన్ని వెంటనే ఎందుకు తొలగించారని ప్రశ్నించడం జరిగింది. దానికి ప్రవక్త (స), ‘ఇప్పుడిప్పుడే జిబ్రీల్‌(అ) దాన్ని ధరించవద్దని’ వారించారు. ఆ తరువాత ‘ఉమర్‌ (ర) ఏడుస్తూ వచ్చారు. ‘ఓ ప్రవక్తా! తమరు ఒక వస్తువును చెడుగా భావించి, దాన్ని నా దగ్గరకు పంపించారు, నేను ధరించాలని, మరి నా పరిస్థితి ఏం కాను?’ దానికి ప్రవక్త (స), ‘దాన్ని నేను నీవు ధరించాలని పంపలేదు, దాన్ని అమ్మకానికి ఇచ్చాను. దాన్ని అమ్మి లాభం పొందాలని,’ అని అన్నారు. ‘ఉమర్‌ (ర) దాన్ని రెండు వేల దిర్హంలకు అమ్మివేసారు. (ముస్లిమ్‌)

4378 – [ 75 ] ( ضعيف ) (2/1252)

وَعَنِ ابْنِ عَبَّاسٍ رَضِيَ اللهُ عَنْهُمَا قَالَ: إِنَّمَا نَهَى رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم عَنْ ثَوْبِ الْمُصْمَتِ مِنَ الْحَرِيْرِ. فَأَمَّا الْعَلَمُ وَسَدَى الثَّوْبِ فَلَا بَأْسَ بِهِ. رَوَاهُ أَبُوْ دَاوُدَ .

4378. (75) [2/1252బలహీనం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘అబ్బాస్‌ (ర) కథనం: ప్రవక్త (స) పూర్తిగా పట్టువస్త్రాన్ని ధరించడాన్ని నిషేధించారు. అయితే కేవలం గీతలు లేదా నాలుగు అంగుళాల పట్టు ఉన్న వస్త్రాన్ని ధరించడంలో ఎటువంటి అభ్యంతరం లేదు. (అబూ  దావూద్‌)

4379 – [ 76 ] ( صحيح ) (2/1252)

وَعَنْ أَبِيْ رَجَاءٍ قَالَ: خَرَجَ عَلَيْنَا عِمْرَانُ بْنُ حُصَيْنٍ وَعَلَيْهِ مِطْرَفٌ مِنْ خَزٍّوَقَالَ: إِنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم قَالَ: “مَنْ أَنْعَمَ اللهُ عَلَيْهِ نِعْمَةً فَإِنَّ اللهَ يُحِبُّ أَنْ يَرَى أَثَرَ نَعْمَتِهِ عَلَى عَبْدِهِ”. رَوَاهُ أَحْمَدُ .

4379. (76) [2/1252దృఢం]

అబూ రజాఅ’ కథనం: ‘ఇమ్రాన్‌ బిన్‌ ‘హు’సైన్‌ (ర) నా వద్దకు వచ్చారు. అప్పుడతను ఊలు జుబ్బహ్‌ ధరించి ఉన్నారు. అతను ఇలా అన్నారు, ”ప్రవక్త (స) ప్రవచనం, ‘అల్లాహ్‌ (త) తన దాసునికి ప్రసాదించిన అనుగ్రహాల ప్రభావాన్ని తన దాసులపై చూడాలని కుతూహలం కలిగి ఉంటాడు.” (అ’హ్మద్‌)

4380 – [ 77 ] ( صحيح ) (2/1252)

وَعَنِ ابْنِ عَبَّاسٍ رَضِيَ اللهُ عَنْهُمَا قَالَ: كُلْ مَا شِئْتَ وَالْبَسْ مَا شِئْتَ مَا أْخَطَأَتْكَ اثْنَتَانِ: سَرَفٌ وَمَخِيْلَةٌ. رَوَاهُ الْبُخَارِيُّ فِيْ تَرْجَمَةِ بَابٍ .

4380. (77) [2/1252దృఢం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘అబ్బాస్‌ (ర) కథనం: ధర్మ సమ్మతమైన వస్తువులను తినండి, ధరించండి. అయితే అందులో దుబారా ఖర్చు, గర్వం, అహంకారం ఉండకూడదు. (బు’ఖారీ)

4381 – [ 78 ] ( حسن ) (2/1252)

وَعَنْ عَمْرِو بْنِ شُعَيْبٍ عَنْ أَبِيْهِ عَنْ جَدِّهِ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “كُلُوْا وَاشْرَبُوْا وَتَصَدَّقُوْا وَالْبَسُوْا مَا لَمْ يُخَالِطْ إِسْرَافٌ وَلَا مَخِيْلَةٌ”. رواهُ أَحْمَدُ وَالنَّسَائِيُّ وَابْنُ مَاجَهُ.

4381. (78) [2/1252ప్రామాణికం]

అమ్ర్‌ బిన్‌ షుఐబ్‌ తన తండ్రి ద్వారా, అతడు తన తాత ద్వారా కథనం: ప్రవక్త (స) ”తినండి, త్రాగండి, దాన ధర్మాలు చేయండి, ధరించండి. అయితే దుబారా ఖర్చులకు, గర్వాహంకారాలకు గురికాకండి.” [15]   (అ’హ్మద్‌, నసాయి’, ఇబ్నె  మాజహ్)

4382 – [ 79 ] ( لم تتم دراسته ) (2/1252)

وَعَنْ أَبِي الدَّرْدَاءِ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِنَّ أَحْسَنَ مَا زُرْتُمُ اللهَ فِيْ قُبُوْرِكُمْ وَمَسَاجِدِكُمُ الْبِيَاضُ”. رَوَاهُ ابْنُ مَاجَهُ.

4382. (79) [2/1252అపరిశోధితం]

అబూ దర్‌దా (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మీరు ధరించి సమాధులలోనికి వెళ్ళే, నమా’జుల కోసం ధరించి మస్జిదులలోనికి వెళ్ళే తెల్లటి వస్త్రాలు అన్నిటికంటే ఉత్తమమైనవి.” [16]  (ఇబ్నె మాజహ్)

=====

1– بَابُ الْخَاتَمِ

1. ఉంగరం

 అవసరం అనుకుంటే వెండి ఉంగరం కుడిచేతిలో ధరించడం ప్రవక్త సాంప్రదాయం. ఉంగరంపై తన పేరు చెక్కడం ప్రవక్త (స) సాంప్రదాయం. అంటే ఇది గుర్తుగా ఉండటానికి.

اَلْفَصْلُ الْأَوَّلُ   మొదటి విభాగం

4383 – [ 1 ] ( متفق عليه ) (2/1253)

عَنِ ابْنِ عُمَرَ رَضِيَ اللهُ عَنْهُمَا قَالَ: اِتَّخَذَ النَّبِيُّ صلى الله عليه وسلم خَاتِمًا مِنْ ذَهَبٍ وَفِيْ رِوَايَةٍ: وَجَعَلَهُ فِيْ يَدِهِ الْيُمْنَى ثُمَّ أَلْقَاهُ ثُمَّ اتَّخَذَ خَاتَمًا مِنَ الْوَرِقِ نُقِشَ فِيْهِ: مُحَمَّدٌ رَسُوْلُ اللهِ وَقَالَ: “لَا يُنَقِّشَنَّ أَحَدٌ عَلَى نَقْشِ خَاتَمِيْ هَذَا”. وَكَانَ إِذَا لَبِسَهُ جَعَلَ فَصَّهُ مِمَّا يَلِيْ بَطْنَ كَفِّهِ .

4383. (1) [2/1253ఏకీభవితం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘ఉమర్‌ (ర) కథనం: ప్రవక్త (స) బంగారం ఉంగరం చేయించారు. మరో ఉలేలేఖనలో ఆ ఉంగరాన్ని కుడిచేతి వేలిలో ధరించారు. మళ్ళీ దాన్ని పారవేసారు. ఆ తరువాత వెండి ఉంగరాన్ని తయారు చేయించారు. దానిపై ము’హమ్మద్‌, రసూలుల్లాహ్‌ అని చెక్కించారు. ఆ తరువాత ప్రవక్త (స) ఇతరు లెవ్వరూ ఈ విధంగా ము’హమ్మద్‌ రసూలుల్లాహ్‌ చెక్కించరాదని అన్నారు. ఉంగరం ధరిస్తే దాని వజ్రం అరచేతివైపు ఉండేది. [17]  (బు’ఖారీ,  ముస్లిమ్‌)

4384 – [ 2 ] ( صحيح ) (2/1253)

وَعَنْ عَلِيٍّ قَالَ: نَهَى رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم عَنْ لُبْسِ الْقَسِيِّ وَالْمُعَصْفَرِ وَعَنْ تَخْتُمِ الذَّهَبِ وَعَنْ قِرَاءَةِ الْقُرْآنِ فِي الرُّكُوْعِ. رَوَاهُ مُسْلِمٌ .

4384. (2) [2/1253దృఢం]

‘అలీ (ర) కథనం: ప్రవక్త (స) నన్ను పట్టు వస్త్రాలు, రంగు పట్టించిన వస్త్రాలు, బంగారు ఉంగరాన్ని ధరించవద్దని, రుకూ స్థితిలో ఖుర్ఆన్పఠించవద్దని వారించారు. (ముస్లిమ్‌)

4385 – [ 3 ] ( صحيح ) (2/1253)

وَعَنْ عَبْدِ اللهِ بْنِ عَبَّاسٍ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم رَأَى خَاتِمًا مِنْ ذَهَبٍ فِيْ يَدِ رَجُل فَنَزَعَهُ فَطَرَحَهُ فَقَالَ: “يَعْمِدُ أَحَدُكُمْ إِلى جَمْرَةٍ مِنْ نَارٍ فَيَجْعَلَهَا فِيْ يَدِهِ؟ “فَقِيْلَ لِلرّجُلِ بَعْدَمَا ذَهَبَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: خُذْ خَاتَمَكَ اِنْتَفِعْ بِهِ. قَالَ: لَا وَاللهِ لَا آخُذُهُ أَبَدًا وَقَدْ طَرَحَهُ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم. رَوَاهُ مُسْلِمٌ .

4385. (3) [2/1253దృఢం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘అబ్బాస్‌ (ర) కథనం: ప్రవక్త (స) ఒక వ్యక్తి చేతిలో బంగారు ఉంగరాన్ని చూచారు. ప్రవక్త (స) అతని చేతి నుండి దాన్ని తీసి పారవేసారు. ఇంకా, ‘మీరు అగ్నికణాన్ని చేతుల్లో తీసుకోవాలను కుంటున్నారు,’ అని అన్నారు. ప్రవక్త (స) వెళ్ళి పోయిన తర్వాత ప్రజలు ఆ వ్యక్తితో, ‘దాన్ని ఎత్తుకో, అమ్మి లాభం పొందు’ అని అన్నారు. దానికి ఆ వ్యక్తి, ‘అల్లాహ్ సాక్షి! ప్రవక్త (స) విసరివేసిన దాన్ని నేను ఎంతమాత్రం తీసుకోను,’ అని అన్నాడు. [18]  (ముస్లిమ్‌)

4386 – [ 4 ] ( صحيح ) (2/1253)

وَعَنْ أَنَسٍ أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم أَرَادَ أَنْ يَكْتُبَ إِلى كِسْرَى وَقَيْصَرَ وَالنَّجَاشِيِّ فَقِيْلَ: إِنَّهُمْ لَا يَقْبَلُوْنَ كِتَابًا إِلَّا بِخَاتَمٍ فَصَاغَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم خَاتِمًا حَلْقَةَ فِضَّةٍ نُقِشَ فِيْهِ: مُحَمَّدٌ رَسُوْلُ اللهِ. رَوَاهُ مُسْلِمٌ .

وَفِيْ رِوَايَةِ لِلْبُخَارِيِّ: كَانَ نَقْشُ الْخَاتَمِ ثَلَاثَةُ أَسْطُرٍ :مُحَمَّدٌ سَطْرٌ وَرَسُوْلٌ سَطْرٌ وَاللهِ سَطْرٌ  .

4386. (4) [2/1253దృఢం]

అనస్‌ (ర) కథనం: ప్రవక్త (స) కిస్రా మరియు రూమ్, నజ్జాషీ మొదలైన రాజుల వద్దకు ఉత్తరాలు వ్రాద్దామని నిశ్చయించుకున్నారు. వాళ్ళు ముద్రలేని ఉత్తరాలను నమ్మరని తెలియపర్చబడింది. అప్పుడు ప్రవక్త (స) వెండిముద్ర చేయించారు. దానిపై ము’హమ్మద్‌ అని వ్రాసి ఉంది. (ముస్లిమ్‌)

బు’ఖారీ ఉల్లేఖనంలో ఇలా ఉంది, ”ముద్రపై మూడు లైన్లు ఉండేవి. మొదటి లైనులో ము’హమ్మద్‌, రెండవ లైనులో రసూలు మూడవ లైల్లో అల్లాహ్‌ అని వ్రాయబడి ఉంది.”  (ము’హమ్మద్‌  రసూల్  అల్లాహ్‌)

4387 – [ 5 ] ( صحيح ) (2/1254)

وَعَنْهُ أَنَّ نَبِيَّ اللهِ صلى الله عليه وسلم كَانَ خَاتَمُهُ مِنْ فِضَّةٍ وَكَانَ فَصُّهُ مِنْهُ. رَوَاهُ الْبُخَارِيُّ .

4387. (5) [2/1254దృఢం]

అనస్‌ (ర) కథనం: ప్రవక్త (స) వద్ద వెండి ఉంగరం ఉండేది. దాని పొందిక కూడా వెండితో చేయబడింది.[19]  (ముస్లిమ్‌)

4388 – [ 6 ] ( متفق عليه ) (2/1254)

وَعَنْهُ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم لَبِسَ خَاتَمَ فِضَّةٍ فِيْ يَمِيْنِهِ فِيْهِ فَصَّ حَبَشِيٌّ كَانَ يَجْعَلُ فَصَّهُ مِمَّا يَلِيْ كَفَّهُ.

4388. (6) [2/1254ఏకీభవితం]

అనస్‌ (ర) కథనం: ప్రవక్త (స) తన కుడిచేతిలో వెండి ఉంగరం ధరించారు. దీన్ని నల్లరాతితో పొదగడం జరిగింది. ఉంగరాన్ని అరచేతుల వైపు త్రిప్పి ధరించారు.  (బు’ఖారీ,  ముస్లిమ్‌)

4389 – [ 7 ] ( صحيح ) (2/1254)

وَعَنْهُ قَالَ: كَانَ خَاتِمُ النَّبِيِّ صلى الله عليه وسلم فِيْ هَذِهِ وَأَشَارَ إِلى الْخِنْصَرِ مِنْ يَدِهِ الْيُسْرَى . رَوَاهُ مُسْلِمٌ .

4389. (7) [2/1254దృఢం]

అనస్‌(ర) కథనం: ప్రవక్త (స) ఉంగరం ఎడమ చేతి ప్రక్క వ్రేలులో ఉండేది. [20]  (ముస్లిమ్‌)

4390 – [ 8 ] ( صحيح ) (2/1254)

وَعَنْ عَلِيٍّ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: نَهَانِيْ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم أَنْ أَتَخْتَّمَ فِيْ إِصْبَعِيْ هَذِهِ أَوْ هَذِهِ قَالَ: فَأَوْمَأَ إِلى الْوُسْطَى وَالَّتِيْ تَلِيْهَا. رَوَاهُ مُسْلِمٌ .

4390. (8) [2/1254దృఢం]

‘అలీ (ర) కథనం: ప్రవక్త (స) నన్ను ఈ వ్రేలులో ఉంగరం ధరించరాదని వారించారు. అంటే మధ్యవ్రేలు, చూపుడు వ్రేలు. అందువల్ల ఉంగరం ప్రక్క వేలులో ధరించాలి.[21]  (ముస్లిమ్‌)

—–

اَلْفَصْلُ الثَّانِيْ రెండవ విభాగం 

4391 – [ 9 ] ( لم تتم دراسته ) (2/1254)

عَنْ عَبْدِ اللهِ بْنِ جَعْفَرٍ قَالَ :كَانَ النَّبِيُّ صلى الله عليه وسلم يَتَخَتَّمُ فِيْ يَمِيْنِهِ. رَوَاهُ ابْنُ مَاجَهُ .

4391. (9) [2/1254అపరిశోధితం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ జ’అఫర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ఉంగరాన్ని కుడిచేతిలో ధరించేవారు. (ఇబ్నె  మాజహ్)

4392 – [ 10 ] ( لم تتم دراسته ) (2/1254)

وَرَوَاهُ أَبُوْ دَاوُدَ وَالنَّسَائِيُّ عَنْ عَلِيٍّ .

4392. (10) [2/1254అపరిశోధితం]

‘అలీ (ర) కథనం: (అబూ దావూద్‌, నసాయి’)

4393 – [ 11 ] ( لم تتم دراسته ) (2/1254)

وَعَنِ ابْنِ عُمَرَ قَالَ: كَانَ النَّبِيُّ صلى الله عليه وسلم يَتَخَتَّمُ فِيْ يَسَارِهِ رَوَاهُ أَبُوْ دَاوُدَ .

4393. (11) [2/1254అపరిశోధితం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘ఉమర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ఎడమ చేతిలో ఉంగరాన్ని ధరించేవారు. [22]  (అబూ దావూద్‌)

4394 – [ 12 ] ( صحيح ) (2/1254)

وَعَنْ عَلِيٍّ رَضِيَ اللهُ عَنْهُ أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم أَخَذَ حَرِيْرًا فَجَعَلَهُ فِيْ يَمِيْنِهِ وَأَخَذَ ذَهَبًا فَجَعَلَهُ فِيْ شِمَالِهِ ثُمَّ قَالَ: “إِنَّ هَذَيْنِ حَرَامٌ عَلَى ذُكُوْرِ أُمَّتِيْ”. رَوَاهُ أَحْمَدُ وَأَبُوْ دَاوُدَ وَالنَّسَائِيُّ .

4394. (12) [2/1254దృఢం]

‘అలీ (ర) కథనం: ప్రవక్త (స) కుడిచేతిలో పట్టును, ఎడమ చేతిలో బంగారాన్ని పట్టుకొని, ఈ రెండూ అంటే పట్టు, బంగారం నా అనుచర సమాజంలోని పురుషులకు నిషిద్ధం అని ప్రవచించారు. (అ’హ్మద్‌, అబూ దావూద్‌, నసాయి’)

4395 – [ 13 ] ( صحيح ) (2/1255)

وَعَنْ مُعَاوِيَةَ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم نَهَى عَنْ رُكُوْبِ النُّمُوْرِوَعَنْ لُبْسِ الذَّهَبِ إِلّا مُقَطَّعًا. رَوَاهُ أَبُوْدَاوُدَ وَالنَّسَائِيُّ .

4395. (13) [2/1255దృఢం]

ము’ఆవియహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) చిరుత చర్మంపై కూర్చోవటాన్ని, పడుకోవటాన్ని నిషేధించారు. (అబూ దావూద్‌, నసాయి’)

అంటే చాలా కొంచం బంగారం ధర్మసమ్మతంగా ఉండేది. ఆ తరువాత రద్దుచేయబడింది. అవసర మైతే బంగారం ముక్కు పుడక లేదా బంగారం పన్ను చేయించుకో వచ్చును.

4396 – [ 14 ] ( ضعيف ) (2/1255)

وَعَنْ بُرَيْدَةَ أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم قَالَ لِرَجُلٍ عَلَيْهِ خَاتَمٌ مِنْ شَبَهٍ: “مَا لِيْ أَجِدُ مِنْكَ رِيْحَ الْأَصْنَامِ؟” فَطَرَحَهُ ثُمَّ جَاءَ وَعَلَيْهِ خَاتِمٌ مِنْ حَدِيْدٍ فَقَالَ: “مَا لِيْ أَرَى عَلَيْكَ حِلْيَةَ أَهْلِ النَّارِ؟” فَطَرَحَهُ فَقَالَ: يَا رَسُوْلَ اللهِ مِنْ أَيِّ شَيْءٍ أَتَّخِذُهُ؟ قَالَ: “مِنْ وَرِقٍ وَلَا تُتِمَّهُ مِثْقَالًا”. رَوَاهُ التِّرْمِذِيُّ وَأَبُوْ دَاوُدَ وَالنَّسَائِيُّ

4396. (14) [2/1255బలహీనం]

బురైదహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ముందు ఒక వ్యక్తి ఇత్తడి ఉంగరాన్ని ధరించి హాజరయ్యాడు. అది చూచి ప్రవక్త (స), ‘ఏంటీ సంగతి, నీలో విగ్రహాల దుర్వాసన వస్తుంది,’ అని అన్నారు. ఆ వ్యక్తి ఆ ఉంగరాన్ని పారవేసాడు. మరో వ్యక్తి ఇనుప ఉంగరం ధరించి వచ్చాడు. ప్రవక్త (స) అతనితో, ‘నిన్ను నరకవాసుల ఆభరణాలు ధరించి ఉండటం చూస్తున్నాను,’ అని అన్నారు. ఆ వ్యక్తి దాన్ని పారవేసాడు. ఆ వ్యక్తి, ‘ఓ ప్రవక్తా! మరి దేనితో చేయించిన ఉంగరం ధరించాలి,’ అని విన్నవించు కున్నాడు. దానికి ప్రవక్త (స), ‘వెండి ఉంగరం చేయించుకో, అయితే అది ఒక తులం కన్నా ఎక్కువ ఉండరాదు,’ అని అన్నారు. [23] (తిర్మిజి’, అబూ  దావూద్‌, నసాయి’)

ము’హ్‌యుస్సున్నహ్‌లో ఇలా ఉంది, ”ప్రవక్త (స) ఒక వ్యక్తిని నువ్వు వెళ్ళి ఏదైనా వస్తువు తీసుకురా, అది ఇనుప  ఉంగరం అయినా సరే”  అని  అన్నారు.

4397- [ 15 ] ( ضعيف ) (2/1255)

وَعَنِ ابْنِ مَسْعُوْدٍ قَالَ: كَانَ النَّبِيُّ صلى الله عليه وسلم يَكْرَهُ عَشْرَ خِلَالٍ: الصُّفْرَةُ يَعْنِي الْخَلُوْقَ وَتَغْيِيْرَ الشَّيْبِ وَجَرُّ الْأَزَارِ وَالتَّخَتُّمَ بِالذَّهَبِ وَالتَّبَرُّجَ بِالزِّيْنَةِ لِغَيْرِ مَحَلِّهَا وَالضَّرَبَ بِالْكِعَابِ وَالرُّقى إِلَّا بِالْمُعَوَّذَاتِ وَعَقْدَ التَّمَائِمِ وَعَزْلَ الْمَاءِ لِغَيْرِ مَحَلِّهِ وَفَسَادَ الصَّبِيِّ مُحَرِّمِهِ. رَوَاهُ أَبُوْ دَاوُدَ وَالنَّسَائِيُّ .

4397. (15) [2/1255బలహీనం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ మస్‌’ఊద్‌ (ర) కథనం: ప్రవక్త (స) ఈ 10 విషయాలను అసహ్యించుకునే వారు: 1. కుంకుమతో తయారయ్యే పసుపురంగు, 2. తెల్ల వెంట్రుకలను పీకడం లేదా నల్లటిరంగు పట్టించటం, 3. లుంగీ లేదా పైజామా చీల మండల క్రింద వ్రేలాడదీయడం, 4. బంగారు ఉంగరాన్ని ధరించటం, 5. స్త్రీలు పరాయి పురుషులకు చూపటానికి ఆభరణాలు ధరించటం, 6. చదరంగం ఆడటం, 7.చేతబడి చేయటం, 8. తావీజులు తాయెత్తులు ధరించటం, 9. వీర్యాన్ని లోపలికి పోకుండా చేయటం, 10. బిడ్డకు హాని చేకూర్చటం అంటే భార్యతో సంభోగం చేస్తే బిడ్డ పాలు ఆగిపోతాయి. ఇవన్నీ నిషిద్ధం కావు, కాని అసహ్యించు కోదగ్గవి. (అబూ దావూద్‌, నసాయి’)

4398 – [ 16 ] ( ضعيف ) (2/1256)

وَعَنِ ابْنِ الزُّبَيْرِ: أَنَّ مَوْلَاةً لَهُمْ ذَهَبَتْ بِابْنَةِ الزُّبَيْرِإِلى عُمَرَبْنِ الْخَطَّابِ وَفِيْ رِجْلِهَا أَجْرَاسٌ فَقَطَعَهَا عُمَرُوَقَالَ: سَمِعْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ: “مَعَ كُلِّ جَرَسٍ شَيْطَانٌ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ .

4398. (16) [2/1256బలహీనం]

ఇబ్నె జుబైర్‌(ర) కథనం:అతను విడుదల చేసిన బానిస రాలు ‘జుబైర్‌ కుమార్తెను ‘ఉమర్‌ (ర) వద్దకు తీసుకు వెళ్ళింది. ఆ అమ్మాయి కాళ్ళకు పట్టీలు ఉన్నాయి. ‘ఉమర్‌ (ర) వాటిని త్రెంచివేసి, నేను ప్రవక్త (స) ”ప్రతి పట్టీ, మరియు గంటల వెంట షై’తాన్‌ ఉంటాడని అనటం  విన్నాను,’ అని అన్నారు. (అబూ  దావూద్‌)

ఈ ‘హదీసు’ ద్వారా శబ్దం చేసే పట్టీలు, గంటలు ధరించ రాదని తెలిసింది.

4399 – [ 17 ] ( لم تتم دراسته ) (2/1256)

وَعَنْ بُنَانَةَ مَوْلَاةٍ عَبْدِ الرَّحْمَنِ بْنِ حَيَّانَ الْأَنْصَارِيِّ كَانَتْ عِنْدَ عَائِشَةَ إِذْ دُخِلَتْ عَلَيْهَا بِجَارِيَةٍ وَعَلَيْهَا جَلَاجِلُ يُصَوِّتُنَ فَقَالَتْ: لَا تُدْخِلَنَّهَا عَلَيَّ إِلَّا أَنْ تُقَطِّعَنَّ جَلَاجِلَهَا سَمِعْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ: “لَا تَدْخُلُ الْمَلَائِكَةُ بَيْتًا فِيْهِ أَجْرَاسٌ”.  رَوَاهُ أَبُوْ دَاوُدَ.

4399. (17) [2/1256అపరిశోధితం]

‘అబ్దుర్ర’హ్మాన్‌ బిన్‌ ‘హయ్యాన్‌ అ’న్సారీ విడుదల చేసిన బానిసరాలు బనానహ్‌ కథనం: ఆమె ‘ఆయి’ షహ్‌ (ర) వద్ద ఉంది. ఆమె వద్దకు ఒక అమ్మాయి వచ్చింది, ఆమె పట్టీలు ధరించి ఉంది. వాటి నుండి శబ్దం వస్తుంది. ‘ఆయి’షహ్‌ (ర) ఆ అమ్మాయిని తెచ్చిన స్త్రీతో ఈ అమ్మాయిని మళ్ళీ నా ఇంటికి ఈ పట్టీలు ఉన్నంత వరకు తీసుకురాకు. నువ్వు ఈ పట్టీలను త్రెంచి పారేయి. ఎందుకంటే ప్రవక్త(స), ‘ఏ ఇంటిలో శబ్దంచేసే ఆభరణాలు అంటే పట్టీలు గంటలు ఉంటాయో, ఆ ఇంట్లో కారుణ్య దైవదూతలు ప్రవేశించరు,’ అని అన్నారు.  [24]  (అబూ  దావూద్‌)

4400 – [ 18 ] ( لم تتم دراسته ) (2/1256)

وَعَنْ عَبْدِ الرَّحْمنِ بْنِ طَرَفَةَ أَنَّ جَدَّهُ عَرْفَجَةَ بْنَ أَسْعَدَ قُطِعَ أَنْفُهُ يَوْمَ الْكُلَابِ فَاتَّخَذَ أَنْفًا مِنْ وَرِقٍ فَأَنْتَنَ عَلَيْهِ فَأَمَرَهُ النَّبِيُّ صلى الله عليه وسلم أَنْ يّتَّخِذَ أَنْفًا مِنْ ذَهَبٍ. رَوَاهُ التِّرْمِذِيُّ وأَبُوْ دَاوُدَ وَالنَّسَائِيُّ

4400. (18) [2/1256అపరిశోధితం]

‘అబ్దుర్ర’హ్మాన్‌ బిన్‌ ‘తరఫహ్‌ కథనం: అతని తాత గారైన ‘తరఫ బిన్‌ స’అద్‌ యొక్క ముక్కు కిలాబ్‌ యుద్ధంలో తెగిపోయింది. అతడు వెండి ముక్కు చేయించుకున్నారు. కాని అందులో దుర్వాసన ఏర్పడింది. ప్రవక్త (స) బంగారు ముక్కును చేయించు కోమని ఆదేశించారు. (తిర్మిజి’, అబూ దావూద్‌, నసాయి’)

4401 – [ 19 ] ( جيد ) (2/1256)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم قَالَ: “مَنْ أَحَبَّ أَنْ يُّحَلِّقَ حَبِيْبَهُ حَلْقَةً مِنْ نَارٍ فَلْيُحَلِّقْهُ حَلْقَةً مِنْ ذَهَبٍ وَمَنْ أَحَبَّ أَنْ يُطَوِّقَ حَبِيْبَهُ طَوْقًا مِنْ نَارٍ فَلْيُطَوِقْهُ طَوْقًا مِنْ ذَهَبٍ وَمَنْ أَحَبَّ أَنْ يُسَوِّرَ حَبِيْبَهُ سِوَارًا مِنْ نَارٍ فَلْيُسَوِّرْهُ مِنْ ذَهَبٍ وَلَكِنْ عَلَيْكُمْ بِالْفِضَّةِ فَالْعَبُوْا بِهَا”. رَوَاهُ أَبُوْ دَاوُدَ .

4401. (19) [2/1256 ఆమోదయోగ్యం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”తన మిత్రులకు నరకాగ్ని అంటే అగ్ని ఉంగరం, జుమ్‌కా ధరింపజేయగోరే వ్యక్తి, బంగారం ఆభరణాలు ధరింప జేయాలి. అదేవిధంగా తన భార్యాబిడ్డలకు, బంధువులకు నరకాగ్ని ఆభరణాలు ధరింపజేయగోరే వారు బంగారు ఆభర ణాన్ని ధరింపజేయాలి. అయితే మీరు వెండి ఆభరణాలు ధరించవచ్చును. [25] (అబూ దావూద్‌)

4402 – [ 20 ] ( ضعيف ) (2/1257)

وَعَنْ أَسْمَاءَ بِنْتِ يَزِيْدَ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم قَالَ: “أَيُّمَا امْرَأَةٍ تَقَلَّدَتْ قِلَادَةً مِنْ ذَهَبٍ قُلِّدَتْ فِيْ عُنُقِهَا مِثْلَهَا مِنَ النَّارِيَوْمَ الْقِيَامَةِ وَأَيُّمَا امْرَأَةٍ جَعَلَتْ فِيْ أُذُنِهَا خُرْصًا مِنْ ذَهَبٍ جَعَلَ اللهُ فِيْ أُذُنِهَا مِثْلَهُ مِنَ النَّارِيَوْمَ الْقَيَامِةِ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ وَالنَّسَائِيُّ.

4402. (20) [2/1257బలహీనం]

అస్మా బిన్‌తె య’జీద్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”బంగారు హారాన్ని ధరించిన వ్యక్తికి తీర్పుదినంనాడు నరకాగ్నిహారాన్ని తొడిగించడం జరుగుతుంది. అదేవిధంగా బంగారు జుమ్‌కా ధరించే వ్యక్తి చెవికి నరకాగ్ని జుమ్‌కా తొడిగించడం జరుగుతుంది.” (అబూ దావూద్‌, నసాయి’)

అయితే ఇదంతా ‘జకాత్‌ చెల్లించనపుడు జరుగుతుంది.

4403 – [ 21 ] ( ضعيف ) (2/1257)

وَعَنْ أُخْتٍ لِحُذَيْفَةَ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم قَالَ: “يَا مَعْشَرَ النِّسَاءِ أَمَا لَكن فِي الْفِضَّةِ مَا تُحَلِّيْنَ بِهِ؟ أَمَّا إِنَّهُ لَيْسَ مِنْكُنَّ اِمْرَأَةٌ تُحَلَّى ذَهَبًا تُظْهِرْهُ إِلَّا عُذِّبَتْ بِهِ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ وَالنَّسَائِيُّ .

4403. (21) [2/1257బలహీనం]

హుజైఫ (ర) చెల్లెలు కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఓ స్త్రీలారా! మీకు వెండి ఆభరణాలు చాలవా? అంటే వెండి ఆభరణాలు ధరించండి. శ్రద్ధగా వినండి, మీలో బంగారు ఆభరణాలు ధరించి అసందర్భంగా ప్రదర్శించే వారు దానికి బదులుగా నరక శిక్ష అనుభవిస్తారు.”  [26]  (అబూ దావూద్‌, నసాయి’)

—–

الْفَصْلُ الثَّالِثُ మూడవ విభాగం 

4404 – [ 22 ] ( لم تتم دراسته ) (2/1257)

عَنْ عُقْبَةَ بْنِ عَامِرٍ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم كَانَ يَمْنَعُ أَهْلَ الْحِلْيَةِ وَالْحَرِيْرِ وَيَقُوْلُ: “إِنْ كُنْتُمْ تُحِبُّوْنَ حِلْيَةَ الْجَنَّةِ وَحَرِيْرَهَا فَلَا تَلْبَسُوْهَا فِي الدُّنْيَا”. رَوَاهُ النَّسَائِيُّ  .

4404. (22) [2/1257అపరిశోధితం]

‘ఉఖ్‌బహ్ బిన్‌ ‘ఆమిర్‌ (ర) కథనం: ప్రవక్త (స) పట్టు వస్త్రాలు ధరించేవారిని, ఆభరణాలు ధరించేవారిని వారించేవారు. ‘ఒకవేళ మీరు స్వర్గంలో ఆభరణాలు, పట్టు ధరించాలని కోరితే, ప్రపంచంలో వీటిని ధరించకండి,’  అని హితబోధ  చేసేవారు. (నసాయి’)

4405 – [ 23 ] ( لم تتم دراسته ) (2/1257)

وَعَنِ ابْنِ عَبَّاسٍ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم اِتَّخَذَ خَاتَمًا فَلَبِسَهُ قَالَ: “شَغْلَنِيْ هَذَا عَنْكُمْ مُنْذُ الْيَوْمِ إِلَيْهِ نَظْرَةٌ وَإِلَيْكُمْ نَظْرَةٌ” ثُمَّ أَلْقَاهُ. رَوَاهُ النَّسَائِيُّ  .

4405. (23) [2/1257అపరిశోధితం]

ఇబ్నె ‘అబ్బాస్‌ (ర) కథనం: ప్రవక్త (స) ఉంగరం చేయించారు. దాన్ని ధరించారు. ఈ రోజు అది నాకు మీ నుండి మరల్చివేసింది. ఒకసారి మిమ్మల్ని చూస్తున్నాను, మరోసారి దాన్ని చూస్తున్నాను అని పలికి దాన్ని తొలగించి వేసారు. (నసాయి)

ఇది బంగారు ఉంగరం అయి ఉంటుంది. దైవభీతి, అణుకువ వల్ల ఇలా చేసారు.

4406 – [ 24 ] ( لم تتم دراسته ) (2/1258)

وَعَنْ مَالِكٍ قَالَ: أَنَا أَكْرَهُ اَنْ يُلْبَسَ الْغِلْمَانُ شَيْئًا مِنَ الذَّهَبِ لِأَنَّهُ بَلَغَنِيْ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم نَهَى عَنِ التَّخَتُمِ بِالذَّهَبِ فَأَنَا أَكْرَهُ لِلرِّجَالِ الْكَبِيْرِ مِنْهُمْ وَالصَّغِيْرِ. رَوَاهُ فِي الْمُوَطّأ  .

4406. (24) [2/1258అపరిశోధితం]

మాలిక్‌ (ర) కథనం: అబ్బాయిలకు బంగారం ధరించటం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే ప్రవక్త (స) బంగారు ఉంగ రాన్ని వారించారు. పెద్దలకు నిషిద్ధమైన వస్తువు చిన్నలకు కూడా నిషిద్ధమే. (మువ’త్తా)

అంటే చిన్నపిల్లలకు కూడా పట్టు, బంగారం తొడిగించరాదు.

=====

2- بَابُ النِّعَالِ

2. పాదరక్షలు

పాదరక్షణ కోసం దుస్తుల్లా చెప్పులు, సాక్సులు చాలా అవసరం. వీటిని ప్రవక్త సాంప్రదాయం ప్రకారం ఉపయోగిస్తే మనకు పుణ్యం లభిస్తుంది. ప్రతిదేశం, జాతుల యొక్క సాంప్రదాయాల ప్రకారం అనేక రకాల చెప్పులు, సాక్సులు ధరించడం జరుగుతుంది. నేటి చెప్పుల వంటి చెప్పులను ప్రవక్త (స) ధరించేవారు. వాటికి  రెండు పట్టీలు ఉండేవి. (బు’ఖారీ).

చెప్పులు ధరిస్తే ముందు కుడికాలి చెప్పు ధరించమని, తీసినపుడు ముందు ఎడమ కాలి చెప్పు తీయమని ఉపదే శించారు. (బుఖారీ).

అదేవిధంగా కూర్చుంటే చెప్పులు తీసి కూర్చోవాలని, వాటిని తన దగ్గర ఉంచుకోమని ఇబ్నె ‘అబ్బాస్‌ (ర) పేర్కొన్నారు. (అబూ  దావూద్‌)

చర్మం సాక్సులను ధరించటం, వాటిపై మసహ్‌ చేయటం నిరూపించటం జరిగింది. ప్రవక్త (స) సాక్సులు ధరించేవారు, వాటిపై మసహ్‌ చేసేవారు. చెప్పులను సాక్సులను ధరించేముందు వాటిని దులుపుకోవాలి. దానివల్ల దుమ్ము ధూళి హానికరమైన కీటకాల నుండి రక్షణ లభిస్తుంది.

ఇబ్నె ‘అబ్బాస్‌ (ర) కథనం: ప్రవక్త (స) అడవిలో ఒకసారి సాక్సులు ధరించారు. రెండవసాక్సు ధరించ ప్రయత్నించారు. ఒక కాకి వచ్చి దాన్ని తీసుకొని ఎగిరిపోయింది.  పైకి తీసుకువెళ్ళి క్రిందపడవేసింది. అందులో పాము లేదా తేలు ఉండేది. సాక్సు క్రింద పడగానే అది బయటకు వచ్చి పారిపోయింది. ప్రవక్త (స) దైవానికి కృతజ్ఞతలు తెలుపుకున్నారు. ఆ తరువాత సాక్సులు ధరించినపుడు దులుపుకొని ధరించమన్నారు. అదేవిధంగా పడుకున్నప్పుడు కూడా పడకను దులుపుకోవాలి, అదేవిధంగా పెట్టె లోపలి నుండి బట్టలు తీసి ధరించటానికి ముందు వాటిని దులుపుకోవాలి.

اَلْفَصْلُ الْأَوَّلُ మొదటి విభాగం 

4407 – [ 1 ] ( صحيح ) (2/1259)

عَنِ ابْنِ عُمَرَ قَالَ: رَأَيْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يَلْبَسُ النِّعَالَ الَّتِيْ لَيْسَ فِيْهَا شَعْرٌ. رَوَاهُ الْبُخَارِيُّ  

4407. (1) [2/1259దృఢం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘ఉమర్‌ (ర) కథనం: ప్రవక్త(స) ధరించిన చెప్పుపై వెంట్రుకలు లేకపోవటం నేను చూసాను. అంటే ఆ చర్మం నుండి వెంట్రుకలను శుభ్ర పరచటం జరిగింది. (బు’ఖారీ)

4408 – [ 2 ] ( صحيح ) (2/1259)

وَعَنْ أَنَسٍ قَالَ: إِنَّ نَعْلَ النَّبِيِّ صلى الله عليه وسلم كَانَ لَهَا قِبَالَانِ .

4408. (2) [2/1259దృఢం]

అనస్‌ (ర) కథనం: ప్రవక్త (స) చెప్పులకు రెండు పట్టీలు ఉండేవి. (బు’ఖారీ)

ఒకపట్టీ బొటనవ్రేలిలో, రెండవది మధ్యవ్రేలులో వేసుకునే వారు.

4409 – [ 3 ] ( صحيح ) (2/1259)

وَعَنْ جَابِرٍ قَالَ: سَمِعْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم فِيْ غَزْوَةٍ غَزَاهَا يَقُوْلُ: “اِسْتَكْثِرُوْا مِنَ النِّعَالِ فَإِنَّ الرَّجُلَ لَا يَزَالُ رَاكِبًا مَا انْتَعَلَ”. رَوَاهُ مُسْلِمٌ.

4409. (3) [2/1259దృఢం]

జాబిర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ఒక యుద్ధంలో ఇలా ప్రవచిస్తూ ఉండగా విన్నాను, ”మీరు చెప్పులు ధరించండి, ఎందుకంటే చెప్పులు ధరించేవాడు ఎల్లప్పుడూ చెప్పులపైనే ఉంటాడు. అతని పాదాలకు పాములు, తేళ్ళు, ఇంకా ఇతర హానికరమైన ప్రాణుల నుండి రక్షణ లభిస్తుంది. (ముస్లిమ్‌)

4410 – [ 4 ] ( متفق عليه ) (2/1259)

وَعَنْ أَبِيْ هُرْيَرَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِذَا انْتَعَلَ أَحَدُكُمْ فَلْيَبْدَأ بِالْيُمْنَى وَإِذَا نَزَعَ فَلْيَبْدَأُ بِالشِّمَالِ لِتَكُنِ الْيُمَنَى أَوَّلَهُمَا تُنْعَلُ وَآخِرَهُمَا تُنْزَعُ”.

4410. (4) [2/1259 ఏకీభవితం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మీరు చెప్పులు ధరిస్తే ముందు కుడికాలికి ధరించండి, తీసినపుడు ఎడమకాలి నుండి తీయండి. కుడికాలి చెప్పు ధరించినపుడు ముందు,  తీసినపుడు తరువాత ఉండాలి.”  (బు’ఖారీ, ముస్లిమ్‌)

4411 – [ 5 ] ( متفق عليه ) (2/1259)

وَعَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَا يَمْشِيْ أَحَدُكُمْ فِيْ نَعْلٍ وَاحِدَةٍ لِيُحْفِهِمَا جَمِيْعًا أَوْ ليُنْعِلْهُمَا جَمِيْعًا”.  

4411. (5) [2/1259ఏకీభవితం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఒక చెప్పు ధరించి నడవకండి. రెండు చెప్పులు ధరించి లేదా రెండు చెప్పులు ధరించకుండా నడవండి.”  [27]  (బు’ఖారీ, ముస్లిమ్‌)

4412 – [ 6 ] ( صحيح ) (2/1259)

وَعَنْ جَابِرٍقَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِذَا اِنْقَطَعَ شِسْعُ نَعْلِهِ فَلَا يَمْشِ فِيْ نَعْلٍ وَاحِدَةٍ حَتّى يُصْلِحَ شِسْعَهُ وَلَا يَمْشِ فِيْ خُفٍّ وَاحِدٍ وَلَا يَأْكُلُ بِشِمَالِهِ وَلَا يَجْتَبِيْ بِالثَّوْبِ الْوَاحِدِ وَلَا يَلْتَحِفُ الصَّمَّاءَ”. رَوَاهُ مُسْلِمٌ  .

4412. (6) [2/1259దృఢం]

జాబిర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఒక చెప్పు పట్టీ తెగిపోతే, రెండవ చెప్పు సరిచేసుకునే వరకు ఒక చెప్పుతో నడవకండి. అదేవిధంగా ఒక సాక్సు ధరించి నడవకండి. ఎడమ చేతితో తినకండి. ఒకే వస్త్రం ధరిస్తే విడిపోయి నట్లు ఉండకూడదు. చేయి బయటకు తీస్తే, విడిపోయినట్లు వస్త్రం చుట్టకండి.”  (ముస్లిమ్‌)

—–

اَلْفَصْلُ الثَّانِيْ  రెండవ విభాగం 

4413 – [ 7 ] ( لم تتم دراسته ) (2/1260)

عَنِ ابْنِ عَبَّاسٍ قَالَ: كَانَ لِنَعْلِ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم قِبَالَانِ مُثَنًّى شِرَاكُهُمَا. رَوَاهُ التِّرْمِذِيُّ .

4413. (7) [2/1260అపరిశోధితం]

ఇబ్నె ‘అబ్బాస్‌ (ర) కథనం: ప్రవక్త (స) చెప్పుల్లో రెండు పట్టీలు ఉండేవి. ఇంకా ప్రతీది డబల్ పట్టీ ఉండేది. (తిర్మిజి’)

4414 – [ 8 ] ( صحيح ) (2/1260)

وَعَنْ جَابِرٍ قَالَ: نَهَى رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم أَنْ يَنْتَعِلَ الرَّجُلُ قَائِمًا. رَوَاهُ أَبُوْ دَاوُدَ .

4414. (8) [2/1260దృఢం]

జాబిర్‌ (ర) కథనం: ప్రవక్త (స) నిలబడి బూట్లు ధరించ వద్దని వారించారు. (అబూ  దావూద్‌)

ఎందుకంటే త్రాళ్ళు కట్టటం కష్టంగా ఉంటుంది. త్రాళ్ళు లేకపోతే నిలబడి ధరించవచ్చును.

4415 – [ 9 ] ( صحيح ) (2/1260)

وَرَوَاهُ التِّرْمِذِيُّ وَابْنُ مَاجَهُ عَنْ أَبِيْ هُرَيْرَةَ .

4415. (9) [2/1260దృఢం]

అబూ హురైరహ్‌ (ర) కథనం. (తిర్మిజి’, ఇబ్నె మాజహ్)

4416 – [ 10 ] ( لم تتم دراسته ) (2/1260)

وَعَنِ الْقَاسِمِ بْنِ مُحَمَّدٍ عَنْ عَائِشَةَ قَالَتْ: رُبَّمَا مَشَى النَّبِيُّ صلى الله عليه وسلم فِيْ نَعْلٍ وَاحِدَةٍ.

وَفِيْ رِوَايَةٍ: أَنَّهَا مَشَتْ بِنَعْلٍ وَاحِدَةٍ. رَوَاهُ التِّرْمِذِيُّ وَقَالَ: هَذَا أَصَحُّ  .

4416. (10) [2/1260అపరిశోధితం]

ఖాసిమ్‌ బిన్‌ ము’హమ్మద్‌, ‘ఆయి’షహ్‌ (ర) ద్వారా కథనం: ప్రవక్త (స) ఒక్కోసారి ఒకే చెప్పుతో నడిచేవారు. ‘ఆయి’షహ్‌ (ర) కూడా ఒక్కోసారి ఒకే చెప్పుతో నడిచే వారు. [28]  (తిర్మిజి’ – దృఢం)

4417 – [ 11 ] ( لم تتم دراسته ) (2/1260)

وَعَنِ ابْنِ عَبَّاسٍ قَالَ: مِنَ السُّنَّةِ إِذَا جَلَسَ الرَّجُلُ أَنْ يَخْلَعَ نَعْلَيْهِ فَيَضَعُهُمَا بِجَنْبِهِ. رَوَاهُ أَبُوْ دَاوُدَ .

4417. (11) [2/1260అపరిశోధితం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘అబ్బాస్‌ (ర) కథనం: కూర్చుంటే, రెండు చెప్పులను తీసుకొని చంకలో ఉంచుకోవాలి. (అబూ  దావూద్)

అంటే చెప్పులతో కూర్చోకూడదు. చెప్పులను ఎడమచంకలో పెట్టుకోవాలి. దీని వల్ల చెప్పులు సురక్షితంగా ఉంటాయి. దీనినే నఅలైన్ బగలైన్ అంటారు.

4418 – [ 12 ] ( لم تتم دراسته ) (2/1260)

وَعَنِ ابْنِ بُرَيْدَةَ عَنْ أَبِيْهِ أَنَّ النَّجَاشِيَّ أَهْدَى إِلَى النَّبِيِّ صلى الله عليه وسلم خُفَّيْنِ أَسْوَدَيْنِ سَاذِجَيْنِ فَلَبِسَهُمَا. روَاهُ ابْنُ مَاجَهُ. وَزَادَ التِّرْمِذِيُّ عَنِ ابْنِ بُرَيْدَةَ عَنْ أَبْيِهِ: ثُمَّ تَوَضَّأَ وَمَسَحَ عَلَيْهِمَا

4418. (12) [2/1260అపరిశోధితం]

ఇబ్నె బురైదహ్‌ తన తండ్రి ద్వారా కథనం: నజ్జాషీ రాజు ప్రవక్త (స)కు రెండు నల్లని సాక్సులు కానుకగా ఇచ్చాడు. ప్రవక్త (స) వాటిని ధరించారు. [29]  (తిర్మిజి’)

—–

وهذا الباب خال من اَلْفَصْلُ الثَّالِثُ.

ఇందులో మూడవ విభాగం లేదు

=====

3- بَابُ التَّرَجُّلِ

3. తలదువ్వుకోవటం

తల వెంట్రుకలను చెల్లాచెదురుగా ఉంచరాదు. ప్రవక్త (స) పరిశుభ్రత, పరిశుద్ధతల పట్ల ప్రోత్సహించారు. ప్రవక్త (స) తల దువ్వుకునేవారు, తలకు నూనెకూడా రాసుకునే వారు. తల వెంట్రుకలను గీయించటం, కత్తి రించటం మంచిదే. చెవులవరకు తల వెంట్రుకలను పెంచటం ధర్మమే. వెంట్రుకలు చిన్నవిగా కూడా ఉంచ వచ్చును. గడ్డం గీయించటం నిషిద్ధం. మీసాలను తప్పని సరిగా కత్తిరించి చిన్నవిగా ఉంచాలి. (బు’ఖారీ, ముస్లిమ్‌)

గోళ్ళు కత్తిరించుకోవాలి, చంకలోని, నాభిక్రింద వెంట్రుకలు శుభ్రపరచుకోవాలి. (నసాయి’).

తెల్లటి వెంట్రుకలకు రంగు పట్టించవచ్చు, కాని నల్లరంగు పట్టించకూడదు. తెల్లటి వెంట్రుకలను పీకడం నిషిద్ధం.

اَلْفَصْلُ الْأَوَّلُ మొదటి విభాగం  

4419 – [ 1 ] ( متفق عليه ) (2/1261)

عَنْ عَائِشَةَ رَضِيَ اللهُ عَنْهَا قَالَتْ: كُنْتُ أُرَجِّلُ رَأْسَ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم وَأَنَا حَائِضٌ .

4419. (1) [2/1261ఏకీభవితం]

‘ఆయి’షహ్‌ (ర) కథనం: నేను బహిష్టుస్థితిలో ఉన్నప్పటికీ ప్రవక్త (స) తల దువ్వేదాన్ని. (బు’ఖారీ, ముస్లిమ్‌)

అంటే స్త్రీలు బహిష్టు స్థితిలో ఉన్నప్పటికీ తమ భర్తల సేవ చేయవచ్చు. ఆమె శరీరమంతా అపరిశుద్ధం కాదు. అయితే  ఆమెతో సంభోగం మాత్రం చేయరాదు.

4420 – [ 2 ] ( متفق عليه ) (2/1261)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “اَلْفِطْرَةُ خَمْسٌ: اَلْخِتَانُ وَالْاِسْتِحْدَادُ وَقَصُّ الشَّارِبِ وَتَقْلِيْمُ الْأَظْفَارِوَنَتْفُ الْإِبِطِ”.

4420. (2) [2/1261ఏకీభవితం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ఈ ఐదు విషయాలు ప్రకృతి సహజసిద్ధమైనవి. అంటే ప్రవక్త లందరి  సాంప్రదాయాలు: 1. ఖతనహ్ చేయడం, 2. నాభి క్రింది, వెంట్రుకలు శుభ్రపరచటం, 3. మీసాలను కత్తిరించడం, 4. గోళ్ళు కత్తిరించటం, 5. చంకలోని వెంట్రుకలు శుభ్ర పరచటం, గీయించటం. (బు’ఖారీ, ముస్లిమ్‌)

4421 – [ 3 ] ( متفق عليه ) (2/1261)

وَعَنِ ابْنِ عُمَرَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “خَالِفُوْا الْمُشْرِكِيْنَ: أَوْفِرُوْا اللِّحى وَأَحْفُوا الشَّوَارِبَ”.

وَفِيْ رِوَايَةٍ: “أَنْهَكُوا الشَّوَارِبَ وَأَعْفُوا اللِّحى”.

4421. (3) [2/1261ఏకీభవితం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘ఉమర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మీరు అవిశ్వాసులను వ్యతిరేకించండి. వాళ్ళు గడ్డం గీయిస్తారు, మీసాలు పెంచుతారు. మీ రందరూ గడ్డాలను పెంచండి, మీసాలను గీయించండి, లేదా చిన్నవి చేయించండి.”  (బు’ఖారీ, ముస్లిమ్‌)

4422 – [ 4 ] ( صحيح ) (2/1261)

وَعَنْ أَنَسٍ قَالَ: وُقِّتَ لَنَا فِيْ قَصِّ الشَّارِبِ وَتَقْلِيْمِ الْأَظْفَارِوَنَتْفِ الْإِبِطِ وَحَلْقِ الْعَانَةِ أَنْ لَا تَتْرَكَ أَكْثَرَمِنْ أَرْبَعِيْنَ لَيْلَةً. رَوَاهُ مُسْلِمٌ

4422. (4) [2/1261దృఢం]

అనస్‌ (ర) కథనం: ప్రవక్త (స) మీసాలను, గోళ్ళను, చంకలోని వెంట్రుకలను నిర్ణీతవ్యవధి 40 రోజులుగా నిర్ణయించారు. అంటే వీటిని 40 రోజులకంటే అధికంగా వదలరాదు. (ముస్లిమ్)

అంటే 40 రోజుల లోపు మీసాలు, గోళ్ళు, చంకలోని వెంట్రుకలు, నాభిక్రింద వెంట్రుకలు కత్తిరించుకోవాలి. ఈ ఆదేశం స్త్రీ పురుషులిరువురికీ  వర్తిస్తుంది.

4423 – [ 5 ] ( متفق عليه ) (2/1261)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم قَالَ: “إِنَّ الْيَهُوْدَ وَالنَّصَارَى لَا يَصْبِغُوْنَ فَخَالِفُوْهُمْ”.

4423. (5) [2/1261ఏకీభవితం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”యూదులు మరియు క్రైస్తవులు గోరింటాకు పట్టించుకోరు. మీరు వారికి వ్యతిరేకించండి. అంటే గోరింటాకు పట్టించు కోండి.” [30]  (బు’ఖారీ, ముస్లిమ్‌)

4424 – [ 6 ] ( صحيح ) (2/1261)

وَعَنْ جَابِرٍقَالَ: أُتِيَ بِأَبِيْ قُحَافَةَ يَوْمَ فَتْحِ مَكَّةَ وَرَأْسُهُ وَلِحْيَتُهُ كَالثَّغَامَةِ بِيَاضًا فَقَالَ النَّبِيُّ صلى الله عليه وسلم: “غَيِّرُوْا هَذَا بِشَيْءٍ وَاجْتَنِبُوا السَّوَادَ”. رَوَاهُ مُسْلِمٌ .

4424. (6) [2/1261దృఢం]

జాబిర్‌ (ర) కథనం: మక్కహ్ విజయంనాడు అబూ ఖహాఫా (ర) ప్రవక్త (స) ముందు హాజరుపర్చబడ్డారు. అప్పుడు వారి వెంట్రుకలు తెల్లబడి ఉన్నాయి. ప్రవక్త (స) చూచి, ‘ఈ తెల్లని వెంట్రుకలకు ఏదైనారంగు పులమండి, అయితే నల్లరంగు మాత్రం తగిలించకండి’ అని  అన్నారు. (ముస్లిమ్‌)

4425 – [ 7 ] ( متفق عليه ) (2/1262)

وَعَنِ ابْنِ عَبَّاسٍ قَالَ: كَانَ النَّبِيُّ صلى الله عليه وسلم يُحِبُّ مُوَافَقَةَ أَهْلَ الْكِتَابِ فِيْمَا لَمْ يُؤْمَرْ فِيْهِ. وَكَانَ أَهْلُ الْكِتَابِ يُسَالُوْنَ أَشْعَارَهُمْ وَكَانَ الْمُشْرِكُوْنَ يَفْرِقُوْنَ رُؤُوْسَهُمْ. فَسَدَلَ النَّبِيُّ صلى الله عليه وسلم نَاصِيَتَهُ ثُمَّ فَرَقَ بَعْدُ.

4425. (7) [2/1262ఏకీభవితం]

ఇబ్నె ‘అబ్బాస్‌(ర) కథనం: ప్రవక్త (స) అల్లాహ్(త) ఆదేశం అవతరించని విషయంలో గ్రంథప్రజలను అనుసరించే వారు. గ్రంథప్రజలు తల దువ్వుకునే వారు కారు. అవిశ్వాసులు తల దువ్వుకునేవారు. ప్రవక్త (స) ముందు అవిశ్వాసులను వ్యతిరేకించారు. ఆ తరువాత దువ్వుకో సాగారు. [31]  (బు’ఖారీ, ముస్లిమ్‌)

4426 – [ 8 ] ( متفق عليه ) (2/1262)

وَعَنْ نَافِعٍ عَنِ ابْنِ عُمَرَ قَالَ: سَمِعْتُ النَّبِيَّ صلى الله عليه وسلم يَنْهَى عَنِ الْقَزَعُ. قِيْلَ لِنَافِعٍ: مَا الْقَزَعُ؟ قَالَ: يُحْلَقُ بَعْضُ رَأْسِ الصَّبِيِّ وَيُتْرَكُ الْبَعْضُ وَأَلْحَقَ بَعْضُهُمُ التَّفْسِيْرَ بِالْحَدِيْثِ.

4426. (8) [2/1262ఏకీభవితం]

ఇబ్ను ‘ఉమర్‌ (ర) ద్వారా నాఫె’అ కథనం: ఇబ్నె ‘ఉమర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ఖ’జ’అను వారిస్తుండగా నేను విన్నాను. అంటే ఏమిటని నాఫె’ను ప్రశ్నించడం జరిగింది. దానికి అతను బాలుని తల వెంట్రుకల్లో కొన్నింటిని గీయించి మరికొన్నింటిని వదలివేయడం అని అన్నారు. [32](బుఖారీ, ముస్లిమ్‌)

4427 – [ 9 ] ( صحيح ) (2/1262)

وَعَنِ ابْنِ عُمَرَ : أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم رَأَى صَبِيًا قَدْ حُلِقَ بَعْضُ رَأْسِهِ وَتُرِكَ بَعْضُهُ فَنَهَاهُمْ عَنْ ذَلِكَ وَقَالَ: “احْلِقُوْا كُلَّهُ أَوْ اتْرُكُوْا كُلَّهُ “. رَوَاهُ مُسْلِمٌ  .

4427. (9) [2/1262దృఢం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘ఉమర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ఒక బాలుడ్ని చూచారు. తల వెంట్రుకల్లో కొన్నింటిని గీసి మరికొన్నింటిని వదలివేయడం జరిగింది. ప్రవక్త (స) దాన్ని వారించారు. ఇంకా గీయిస్తే అన్నింటినీ గీయించమని, లేదా అన్నిటినీ వదలివేయమని ఆదేశించారు. (ముస్లిమ్‌)

4428 – [ 10 ] ( صحيح ) (2/1262)

وَعَنِ ابْنِ عَبَّاسٍ قَالَ:لَعَنَ اللهُ الْمُخَنَّثِيْنَ مِنَ الرِّجَالِ وَالْمُتَرَجِّلَاتِ مِنَ النِّسَاءِ وَقَالَ: “أَخْرِجُوْهُمْ مِنْ بُيُوْتِكُمْ”. رَوَاهُ الْبُخَارِيُّ.

4428. (10) [2/1262దృఢం]

ఇబ్నె ‘అబ్బాస్‌ (ర) కథనం: ప్రవక్త (స) కొజ్జావాళ్ళను అనుకరించేవారిని  శపించారు. అదేవిధంగా పురుషులను అనుకరించే స్త్రీలను కూడా శపించారు. అదే విధంగా కొజ్జావాళ్ళను తమ ఇళ్ళల్లోకి రానీయ కూడదని వారించారు.  (బు’ఖారీ)

4429 – [ 11 ] ( صحيح ) (2/1262)

وَعَنْهُ قَالَ: قَالَ النِّبِيُّ صلى الله عليه وسلم: “لَعَنَ اللهُ الْمُتَشَبِّهِيْنَ مِنَ الرِّجَالِ بِالنِّسَاءِ وَالْمُتَشَبِّهَاتِ مِنَ النِّسَاءِ بِالرِّجَالِ”. رَوَاهُ الْبُخَارِيُّ.

4429. (11) [2/1262దృఢం]

ఇబ్నె ‘అబ్బాస్‌(ర) కథనం: ప్రవక్త (స) స్త్రీలను అనుకరించే పురుషులను, పురుషులను అనుక రించే స్త్రీలను  శపించారు.  (బు’ఖారీ)

4430 – [ 12 ] ( صحيح ) (2/1262)

وَعَنِ ابْنِ عُمَرَ أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم قَالَ: “لَعَنَ اللهُ الْوَاصِلَةَ وَالْمُسْتَوْصِلَةَ وَالْوَاشِمَةَ وَالْمُسْتَوْشِمَةَ”.

4430. (12) [2/1262దృఢం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘ఉమర్‌ (ర) కథనం: ప్రవక్త (స) వాసిలహ్ మరియు ముస్తాసిలహ్‌, వాషిమహ్ మరియు ముస్తవ్షిమహ్ స్త్రీలను శపించారు. [33] (బు’ఖారీ, ముస్లిమ్‌)

4431 – [ 13 ] ( صحيح ) (2/1262)

وَعَنْ عَبْدِ اللهِ بْنِ مَسْعُوْدِ قَالَ: لَعَنَ اللهُ الْوَاشِمَاتِ وَالْمُسْتَوْشِمَاتِ وَالْمُتَنَمِّصَاتِ وَالْمُتَفَلِّجَاتِ لِلْحُسْنِ الْمُغَيِّرَاتِ خَلْقَ اللهِ. فَجَاءَتْهُ اِمْرَأَةٌ فَقَالَتْ: إِنَّهُ بَلَغَنِيْ أَنَّكَ لَعَنْتَ كَيْتَ وَكَيْتَ فَقَالَ: مَا لِيْ لَا أَلعَنُ مِنْ لَعَنَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم وَمَنْ هُوَ فِيْ كِتَابِ اللهِ فَقَالَتْ: لَقَدْ قَرَأْتُ مَا بَيْنَ اللَّوْحَيْنِ فَمَا وَجَدْتُ فِيْهِ مَا نَقُوْلُ قَالَ: لَئِنْ كُنْتِ قَرَأتِيْهِ لَقَدْ وَجَدْتِيْهِ أَمَا قَرَأْتِ: (مَا آتَاكُمُ الرَّسُوْلُ فَخُذُوْهُ وَمَا نَهَاكُمْ عَنْهُ فَانْتَهُوْا؛ 59:7)؟ قَالَتْ: بَلَى. قَالَ: فَإِنَّهُ قَدْ نَهَى عَنْهُ.

4431. (13) [2/1262దృఢం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ మస్‌’ఊద్‌ (ర) కథనం: ప్రవక్త (స) పచ్చబొట్లు పెట్టించుకునే, పచ్చబొట్లు పెట్టే స్త్రీలను శపించారు. అదేవిధంగా మీసాల వెంట్రుకలను పీకే స్త్రీలను శపించారు. అదేవిధంగా పళ్ళను పదును పట్టించే స్త్రీలను శపించారు. దైవం సృష్టించిన దాన్ని మార్పులు చేర్పులు చేస్తారు. అది విని ఒక స్త్రీ వచ్చి ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ మస్‌’ఊద్‌ను, ‘ఇటువంటి స్త్రీలను శపించారని విన్నాను,’ అని విన్నవించు కుంది. దానికి ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ మస్‌’ఊద్‌ (ర), ప్రవక్త (స) శపించిన వారిని నేనెందుకు శపించకూడదు, వారు అల్లాహ్‌(త) గ్రంథంలో కూడా శపించబడ్డారు. దానికి ఆ స్త్రీ, ‘నేను మొదటి నుండి చివరిదాకా ఖుర్‌ఆన్‌ పఠించాను, ఇలా నేనెక్కడా చదవలేదు,’ అని విన్నవించుకుంది. దానికి ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ మస్‌’ఊద్‌ ఒకవేళ నీవు శ్రద్ధగా చదివితే దీన్ని గుర్తించే దానివి, ” …వమా అతాకుమ్ అర్రసూలు ఖుజూహు, వమా నహాకుమ్ అన్హు ఫన్తహూ…” — ‘..మరియు ప్రవక్త మీకు ఇచ్చిన దాన్ని తీసుకోండి, మరియు అతను నిషేధించిన దానికి దూరంగా ఉండండి..,’ (అల్ హష్ర్, 59:7) అని నీవు చదవలేదా?” అని ప్రశ్నించారు. దానికి ఆ స్త్రీ అవును నేను ఈ ఆయతును చదివాను. అప్పుడు ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ మస్‌’ఊద్‌, ‘ప్రవక్త (స) దీన్ని వారించారు,’ అని అన్నారు. [34]  (బు’ఖారీ, ముస్లిమ్‌)

4432 – [ 14 ] ( صحيح ) (2/1263)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “اَلْعَيْنُ حَقٌّ”. وَنَهَى عَنِ الْوَشْمِ. رَوَاهُ الْبُخَارِيُّ.

4432. (14) [2/1263దృఢం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”దిష్ఠి తగలటం వాస్తవమే. ఇంకా పచ్చబొట్లు పొడిపించు కోవటాన్ని నిషేధించారు.” (బు’ఖారీ)

అంటే చేతబడి ప్రభావం చూపినట్లే దిష్ఠికూడా ప్రభావం చూపుతుంది.

4433 – [ 15 ] ( صحيح ) (2/1263)

وَعَنِ ابْنِ عُمَرَ قَالَ: لَقَدْ رَأَيْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم مُلَبَّدًا. رَوَاهُ الْبُخَارِيُّ  .

4433. (15) [2/1263దృఢం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘ఉమర్‌ (ర) కథనం: నేను ప్రవక్త (స) ను చూచాను, తల మరియు గడ్డం వెంట్రుకలను గమ్‌తో అంటించి ఉన్నారు. పేళ్ళు పడకుండా ఉండటానికి, ఇ’హ్‌రామ్‌ స్థితిలో వెంట్రుకలు రాలకుండా ఉండటానికి. (బు’ఖారీ)

4434 – [ 16 ] ( متفق عليه ) (2/1263)

وَعَنْ أَنَسٍ قَالَ: نَهَى رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم أَنْ يَتَزَعْفَرَ الرَّجُلُ.

4434. (16) [2/1263ఏకీభవితం]

అనస్‌ (ర) కథనం: ప్రవక్త (స) కాషాయ రంగు దుస్తులను పురుషులు ధరించటాన్ని నిషేధించారు. (బు’ఖారీ, ముస్లిమ్‌)

ఎందుకంటే ఇది స్త్రీలకు ప్రత్యేకం.

4435 – [ 17 ] ( متفق عليه ) (2/1263)

وَعَنْ عَائِشَةَ قَالَتْ: كُنْتُ أَطَيِّبُ النَّبِيَّ صلى الله عليه وسلم بِأَطْيَبَ مَا نَجِدُ حَتّى أَجِدُ وَبِيْصَ الطِّيْبِ فِيْ رَأْسِهِ وَلِحْيَتِهِ  .

4435. (17) [2/1263ఏకీభవితం]

‘ఆయి’షహ్‌(ర) కథనం: నేను ప్రవక్త (స) తలకు, గడ్డానికి మంచి సుగంధ పరిమళాన్ని పూసేదాన్ని. చివరికి దాని మెరుపు తలలో, గడ్డంలో కనబడేది. (బు’ఖారీ, ముస్లిమ్‌)

4436 – [ 18 ] ( صحيح ) (2/1263)

وَعَنْ نَافِعٍ قَالَ: كَانَ ابْنُ عُمَرَإِذَا اسْتَجْمَرَ اِسْتَجْمَرَ بِأُلُوَّةٍ غَيْرِ مُطَرَّاةٍ وَبِكَافُوْرٍ يَطْرَحُهُ مَعَ الْأُلُوَّةِ ثُمَّ قَالَ: هَكَذَا كَانَ يَسْتَجْمِرُ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم. رَوَاهُ مُسْلِمٌ  

4436. (18) [2/1263దృఢం]

నాఫె’అ (ర) కథనం: ‘అబ్దుల్లామ్‌ బిన్‌ ‘ఉమర్‌ (ర) సువాసన కోసం పొగవేస్తే అందులో కస్తూరి ఉండేది కాదు.  కర్పూరం సువాసన, అగర్‌లను కలిపి కాల్చి వాటి సువాసన వెదజల్లేవారు. ఇంకా ప్రవక్త (స) ఇలాగే సువాసన వెదజల్లే వారని పలికేవారు. (ముస్లిమ్‌)

ప్రస్తుత కాలంలో సువాసన కోసం అగర్ బత్తీలు, సాంబ్రాని కాల్చినట్టు, ఆ కాలంలో పొగద్వారా సువాసన పొందేవారు.

—–

اَلْفَصْلُ الثَّانِيْ రెండవ విభాగం 

4437 – [ 19 ] ( لم تتم دراسته ) (2/1263)

عَنِ ابْنِ عَبَّاسٍ قَالَ: كَانَ النَّبِيُّ صلى الله عليه وسلم يَقُصُّ أَوْ يَأْخُذُ مِنْ شَارِبِهِ وَكَانَ إِبْرَاهِيْمُ خَلِيْلُ الرَّحْمنِ صَلَوَاتُ الرَّحْمنِ عَلَيْهِ يَفْعَلُهُ. رَوَاهُ التِّرْمِذِيُّ .

4437. (19) [2/1263అపరిశోధితం]

ఇబ్నె ‘అబ్బాస్‌ (ర) కథనం: ప్రవక్త (స) తన మీసాలను కత్తిరించు కునేవారు. అదేవిధంగా ఇబ్రాహీమ్‌ (అ) కూడా ఇలాగే చేసేవారు. (తిర్మిజి’)

4438 – [ 20 ] ( جيد ) (2/1263)

وَعَنْ زَيْدِ بْنِ أَرْقَمَ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم قَالَ:” مَنْ لَمْ يَأْخُذْ شَارِبِهِ فَلَيْسَ مِنَّا”. رَوَاهُ أَحْمَدُ وَالتِّرْمِذِيُّ وَالنَّسَائِيُّ.

4438. (20) [2/1263ఆమోదయోగ్యం]

‘జైద్‌ బిన్‌ అర్‌ఖమ్‌(ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మీసాలను కత్తిరించని వారు మనలోనివారు కారు.” (తిర్మిజి’)

4439 – [ 21 ] ( ضعيف ) (2/1263)

وَعَنْ عَمْرِو بْنِ شُعَيْبٍ عَنْ أَبِيْهِ عَنْ جَدِّهِ: أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم كَانَ يَأْخُذُ مِنْ لِحْيَتِهِ مِنْ عَرْضِهَا وَطُوْلِهَا. رَوَاهُ التِّرْمِذِيُّ وَقَالَ: هَذَا حَدِيْثٌ غَرِيْبٌ .

4439. (21) [2/1263బలహీనం]

‘అమ్ర్‌ బిన్‌ షు’ఐబ్‌ తన తండ్రి తాతల ద్వారా కథనం: ప్రవక్త (స) తన గడ్డాన్ని పొడవు, వెడల్పులలో కొంత సరిచేసుకునేవారు.[35](తిర్మిజి’  /  ఏకోల్లేఖనం)

4440 – [ 22 ] ؟ (2/1264)

وَعَنْ يَعْلَى بْنَ مُرَّةَ أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم رَأَى عَلَيْهِ خَلُوْقًا فَقَالَ: “أَلَكَ اِمْرَأَةٌ؟” قَالَ: لَا. قَالَ: “فَاغْسِلْهُ ثُمَّ اغْسِلْهُ ثُمَّ اغْسِلْهُ ثُمَّ لَا تَعُدْ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَالنَّسَائِيُّ

4440. (22) ? [2/1264]

య’అలా బిన్‌ ముర్రహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) య’అలా శరీరంపై సువాసన గమనించి, ‘నీకు భార్య ఉందా,’ అని అడిగారు. దానికి అతడు, ‘లేదు’ అని విన్నవించుకున్నాడు. అప్పుడు ప్రవక్త (స), ‘దాన్ని కడిగేయి, ఇక ముందు దీన్ని ఉపయోగించకు,’ అని ఆదేశించారు. [36]  (తిర్మిజి’, నసాయి’)

4441 – [ 23 ] ( ضعيف ) (2/1264)

وَعَنْ أَبِيْ مُوْسَى قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَا يَقْبَلُ اللهُ صَلَاةَ رَجُلٍ فِيْ جَسَدِهِ شَيْءٌ مِنْ خُلُوْقٍ”.رَوَاهُ أَبُوْدَاوُدَ.

4441. (23) [2/1264బలహీనం]

అబూ మూసా (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”అల్లాహ్(త) శరీరంపై ‘ఖులూఖ్‌ సువాసన గల వ్యక్తి నమా’జ్‌  స్వీకరించడు.”  (అబూ  దావూద్‌)

4442 – [ 24 ] ( لم تتم دراسته ) (2/1264)

وَعَنْ عَمَّارِ بْنِ يَاسِرٍ قَالَ: قَدِمْتُ عَلَى أَهْلِيْ مِنْ سَفَرٍ وَقَدْ تَشَقَّقَتْ يَدَايَ فَخَلَّقُوْنِيْ بِزَعْفَرَانٍ فَغَدَوْتُ عَلَى النَّبِيِّ صلى الله عليه وسلم فَسَلَّمْتُ عَلَيْهِ فَلَمْ يَرُدَّ عَلَيَّ وَقَالَ: “اِذْهَبْ فَاغْسِلْ هَذَا عَنْكَ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ.

4442. (24) [2/1264అపరిశోధితం]

‘అమ్మార్‌ బిన్‌ యాసిర్‌ (ర) కథనం: నేను ప్రయాణం నుండి ఇంటికి వచ్చాను. నా రెండుచేతులూ పగిలి ఉన్నాయి. మా ఇంటివారు నా చేతులకు కస్తూరి పరిమళం పూసారు. మరుసటి రోజు ఉదయం ప్రవక్త (స) వద్దకు వెళ్ళాను. సలామ్‌ చేసాను. ప్రవక్త (స) నా సలామ్‌కు సమాధానం ఇవ్వలేదు, ఇంకా, ‘ఇక్కడి నుండి వెళ్ళు, శుభ్రంగా కడిగి దీన్ని వదిలించుకో,’ అని అన్నారు. (అబూ  దావూద్‌)

4443 – [ 25 ] ( صحيح ) (2/1264)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “طِيْبُ الرِّجَالِ مَا ظَهَرَرِيْحُهُ وَخَفِيَ لَوْنُهُ وَطِيْبُ النِّسَاءِ مَا ظَهَرَ لَوْنُهُ وَخَفِيَ رِيْحُهُ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَالنَّسَائِيُّ .

4443. (25) [2/1264దృఢం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”పురుషులు రంగులేని సువాసన ఉపయోగించాలి. స్త్రీలు సువాసనలేని రంగు ఉపయోగించాలి.” (తిర్మిజి’, నసాయి’)

4444 – [ 26 ] ( لم تتم دراسته ) (2/1264)

وَعَنْ أَنَسٍ قَالَ: كَانَتْ لِرَسُوْلِ اللهِ صلى الله عليه وسلم سُكَّةٌ يَتَطَيَّبُ مِنْهَا. رَوَاهُ أَبُوْ دَاوُدَ  .

4444. (26) [2/1264అపరిశోధితం]

అనస్‌ (ర) కథనం: ప్రవక్త (స) వద్ద సుక్క అనే పేరుగల సువాసన ద్రవ్యం ఉండేది. ప్రవక్త (స) దాన్ని ఉపయోగించే వారు. (అబూ  దావూద్‌)

4445 – [ 27 ] ( لم تتم دراسته ) (2/1264)

وَعَنْهُ قَالَ: كَانَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم يُكْثِرُدُهْنَ رَأْسِهِ وَ تَسْرِيْحَ لِحْيَتِهِ وَيُكْثِرُ الْقِنَاعَ كَأَنَّ ثَوْبَهُ ثَوْبُ زَيَّاتٍ. رَوَاهُ فِيْ شَرْحِ السُّنَّةِ

4445. (27) [2/1264అపరిశోధితం]

అనస్‌ (ర) కథనం: ప్రవక్త (స) తలకు, గడ్డానికి చాలా అధికంగా నూనె రాసేవారు, దువ్వుకునేవారు. నూనె రాసి తలపై ఏదైనా వస్త్రం కప్పుకునేవారు. దాని వల్ల ఆ వస్త్రం అంతా నూనెమయం అయిపోయేది. (షర్‌’హు స్సున్నహ్‌)

4446 – [ 28 ] ( لم تتم دراسته ) (2/1264)

وَعَنْ أُمِّ هَانِئٍ قَالَت: قَدِمَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم عَلَيْنَا بِمَكَّةَ قَدْمَةً وَلَهُ أَرْبَعُ غَدَائِرَ. رَوَاهُ أَحْمَدُ وَأَبُوْ دَاوُدَ وَالتِّرْمِذِيُّ وَابْنُ مَاجَهُ.

4446. (28) [2/1264అపరిశోధితం]

ఉమ్మె హానీ (ర) కథనం: ప్రవక్త (స) మక్కహ్ విజయం నాడు మక్కహ్కు వచ్చారు. అప్పుడు, ప్రవక్త (స) తలకు నాలుగు జడలు ఉండేవి. అంటే తల వెంట్రుకలు నాలుగు భాగాలుగా ఉండేవి. అవి భుజంపై పడి ఉన్నాయి. (అ’హ్మద్‌, అబూ దావూద్‌, తిర్మిజి’, ఇబ్నె మాజహ్)

4447 – [ 29 ] ( لم تتم دراسته ) (2/1264)

وَعَنْ عَائِشَةَ قَالَتْ: إِذَا فَرَقْتُ لِرَسُوْلِ اللهِ صلى الله عليه وسلم رَأْسَهُ صَدَعْتُ فَرْقَهُ عَنْ يَافُوْخِهِ. وَأَرْسَلْتُ نَاصِيَتَهُ بَيْنَ عَيْنَيْهِ. رَوَاهُ أَبُوْ دَاوُدَ.

4447. (29) [2/1264అపరిశోధితం]

‘ఆయి’షహ్‌ (ర) కథనం: నేను ప్రవక్త (స) తలపై భాగం నుండి నుదురు వరకు వెంట్రుకలను చీల్చివేసే దాన్ని. అంటే వెంట్రుకలను రెండుగా చీల్చివేసేదాన్ని. (అబూ దావూద్‌)

4448 – [ 30 ] ( لم تتم دراسته ) (2/1265)

وَعَنْ عَبْدِ اللهِ بْنِ مُغَفَّلٍ قَالَ: نَهَى رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم عَنِ التَّرَجُّلُّ إِلَّا غِبًّا. رَوَاهُ التِّرْمِذِيُّ وأَبُوْ دَاوُدَ وَالنَّسَائِيُّ.

4448. (30) [2/1265అపరిశోధితం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ము’గప్ఫల్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రతి రోజు దువ్వుకోకూడదని వారించారు. అయితే ఒక రోజు తప్పి ఒక రోజు. (తిర్మిజి’, అబూ దావూద్‌, నసాయి’)

అంటే ప్రతిరోజు తలదువ్వుకోకూడదు. ఒకరోజు తప్పి ఒకరోజు తల దువ్వుకోవాలి.

4449 – [ 31 ] ( لم تتم دراسته ) (2/1265)

وَعَنْ عَبْدِ اللهِ بْنِ بُرَيْدَةَ قَالَ: قَالَ رَجُلٌ لِفُضَالَةَ بْنِ عُبَيْدٍ: مَا لِيْ أَرَاكَ شَعِثًا؟ قَالَ: إِنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم كَانَ يَنْهَانَا عَنْ كَثِيْرٍ مِنَ الْإِرْفَاهِ. قَالَ: مَالِيْ لَا أَرَى عَلَيْكَ حِذَاءً؟ قَالَ: كَانَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم يَأْمُرُنَا أَنْ نَحْتَفِيَ أَحْيَانًا. رَوَاهُ أَبُوْ دَاوُدَ.

4449. (31) [2/1265అపరిశోధితం]

అబ్దుల్లాహ్బిన్బురైదహ్‌ () కథనం: ఒక వ్యక్తి ఫు’దాలహ్ బిన్‌ ఉబైద్‌ (ర)తో ”అసలు సంగతేంటి, నీవు చెల్లాచెదురు వెంట్రుకలు కలిగి ఉంటావు, నువ్వు తల దువ్వుకోవు,” అని అన్నాడు. దానికి అతడు, ‘మమ్మల్ని ప్రవక్త (స) ప్రతిరోజు అలంకరణలు, విలాసాలు చేయకూడదని వారించారు,’ అని అన్నాడు. దానికి ఆ వ్యక్తి, ‘నీవు చెప్పులు ధరించవా? నీ కాళ్ళకు చెప్పులు లేవు,’ అని అన్నాడు. దానికి అతడు, ‘ప్రవక్త (స) మాకు ఒక్కోసారి చెప్పులు లేకుండా నడవమని ఆదేశించారు,’ అని సమాధానం ఇచ్చాడు. (అబూ దావూద్‌)

4450 – [ 32 ] ( لم تتم دراسته ) (2/1265)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ أَنَّ رَسُولَ اللهِ صلى الله عليه وسلم قَالَ: “مَنْ كَانَ لَهُ شَعْرٌ فَلْيُكْرِمْهُ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ.

4450. (32) [2/1265అపరిశోధితం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”తలపై వెంట్రుకలు ఉన్నవారు వాటిని గౌరవించాలి. అంటే వాటిని నీటితో శుభ్రపరచాలి, నూనె రాయాలి, తల దువ్వాలి, సువాసన రాయాలి.” (అబూ  దావూద్‌)

4451 – [ 33 ] ( لم تتم دراسته ) (2/1265)

وَعَنْ أَبِيْ ذَرٍّ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِنَّ أَحْسَنَ مَا غُيِّرَبِهِ الشَّيْبُ الْحِنَّاءُ وَالْكَتَمُ “. رَوَاهُ التِّرْمِذِيُّ وأَبُوْ دَاوُدَ وَالنَّسَائِيُّ.

4451. (33) [2/1265అపరిశోధితం]

అబూ జ’ర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ముసలి తనాన్ని మార్చే అన్నిటికంటే మంచి వస్తువు, గోరింటాకు మరియు వస్హ్. (తిర్మిజి’, అబూ దావూద్‌,  నసాయి’)

అంటే గోరింటాకు, వస్‌మహ్ కలిపి రాయటం మంచిది.

4452 – [ 34 ] ( صحيح ) (2/1265)

وَعَنِ ابْنِ عَبَّاسٍ عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ: “يَكُوْنُ قَوْمٌ فِيْ آخِرِ الزَّمَانِ يَخْضِبُوْنَ بِهَذَا السَّوَادَ كَحَوَاصِلِ الْحَمَّامِ لَا يَجِدُوْنَ رَائِحَةَ الْجَنَّةِ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ وَالنَّسَائِيُّ .

4452. (34) [2/1265దృఢం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘అబ్బాస్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”చివరి కాలంలో నల్లటి రంగు పూస్తారు. అది పావురాల మెడల క్రింద నల్లగా ఉన్నట్టు ఉంటుంది. ఇటువంటి వారు స్వర్గ పరిమళాన్ని ఆస్వాదించలేరు.” (అబూ  దావూద్‌, నసాయి’)

4453 – [ 35 ] ( لم تتم دراسته ) (2/1265)

وَعَنِ ابْنِ عُمَرَأَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم كَانَ يَلْبَسُ النِّعَالَ السِّبْتِيَّةَ وَيُصْفِرُ لِحْيَتَهُ بِالْوَرْسِ وَالزَّعْفَرَانِ وَكَانَ ابْنُ عُمَرَيَفْعَلُ ذَلِكَ. رَوَاهُ النَّسَائِيُّ .

4453. (35) [2/1265అపరిశోధితం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘ఉమర్‌ (ర) కథనం: ప్రవక్త (స) సిబ్తీ చెప్పులు ధరించేవారు. అంటే దాని చర్మంలో వెంట్రుకలు ఉండేవి కావు, తన గడ్డానికి వరస్‌, కస్తూరి రంగు పులిమేవారు. ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘ఉమర్‌ కూడా ఇలాగే  చేసేవారు. (నసాయి’)

ఈ ‘హదీసు’ ద్వారా ప్రవక్త (స) తన గడ్డానికి రంగు పులిమే వారని తెలుస్తుంది.

4454 – [ 36 ] ( جيد ) (2/1265)

وَعَنِ ابْنِ عَبَّاسٍ قَالَ: مَرَّ عَلَى النَّبِيِّ صلى الله عليه وسلم رَجُلٌ قَدْ خَضَبَ بِالْحِنَّاءِ فَقَالَ: “مَا أَحْسَنَ هَذَا”. قَالَ: فَمَرَّ آخَرُ قَدْ خَضَبَ بِالْحِنَّاءِ وَالْكَتَمِ فَقَالَ: “هَذَا أَحْسَنُ مِنْ هَذَا”. ثُمَّ مَرَّ آخَرُ قَدْ خَضَبَ بِالصُّفْرَةِ فَقَالَ: “هَذَا أَحْسَنُ مِنْ هَذَا كُلِّهِ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ .

4454. (36) [2/1265ఆమోదయోగ్యం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘అబ్బాస్‌ (ర) కథనం: ప్రవక్త(స) ముందు నుండి ఒక వ్యక్తి వెళ్ళాడు. అతడు గోరింటాకు రాసుకున్నాడు. అంటే గోరింటాకు రాసుకొని ఉన్నాడు, ఆ తరువాత మరోవ్యక్తి వెళ్ళాడు. అతడు గోరింటాకు, మసమ రెండూ కలిపి రాసి ఉన్నాడు. ప్రవక్త (స), ‘ఇతడు మొదటి వానికంటే మంచివాడు,’ అని అన్నారు. ఆ తరువాత మూడవవ్యక్తి వెళ్ళాడు. అతడు ఎర్రని రంగు రాసిఉన్నాడు. ప్రవక్త (స), ‘ఇతడు అందరికన్నా మంచివాడు,’ అని అన్నారు. (అబూ దావూద్‌)

4455 – [ 37 ] ( صحيح ) (2/1266)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “غَيِّرُوْا الشَّيْبَ وَلَا تَشَبَّهُوْا بِالْيَهُوْدِ”. رَوَاهُ التِّرْمِذِيُّ  .

4455. (37) [2/1266దృఢం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”రంగు రాసి ముసలితనాన్ని మార్చివేయండి. ఇంకా యూదులను అనుకరించకండి, వాళ్ళు ఎంత మాత్రం రంగులు రాయరు.” (తిర్మిజి’)

ఈ ఆదేశం ముసలి వారికి. ఎందుకంటే, దీనివల్ల ముస్లిముల బలాన్ని ప్రదర్శించటం, అవిశ్వాసులను భయ పెట్టటం ముఖ్య ఉద్దేశ్యం.

4456 – [38] و 4457 [39] ( صحيح ) (2/1266)

وَرَوَاهُ النَّسَائِيُّ عَنِ ابْنِ عُمَرَ وَالزُّبَيْرِ .

4456. (38), 4457. (39) [2/1266దృఢం]

ఇదేవిధంగా నసాయిలో ఇబ్నె ‘ఉమర్‌, ‘జుబైర్‌ల ద్వారా ఉల్లేఖించడం జరిగింది.

4458 – [ 40 ] ( حسن ) (2/1266)

وَعَنْ عَمْرِو بْنِ شُعَيْبِ عَنْ أَبِيْهِ عَنْ جَدِّهِ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَا تَنْتِفُوا الشَّيْبَ فَإِنَّهُ نُوْرُ الْمُسْلِمِ مَنْ شَابَ شَيْبَةً فِي الْإِسْلَامِ كَتَبَ اللهُ لَهُ بِهَا حَسَنَةً وَكَفَّرَ عَنْهُ بِهَا خَطِيْئَةً وَرَفَعَهُ بِهَا دَرَجَةً”. رَوَاهُ أَبُوْ دَاوُدَ.

4458. (40) [2/1266ప్రామాణికం]

‘అమ్ర్‌ బిన్‌ షు’ఐబ్‌ తన తండ్రి తాతల ద్వారా కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మీరు తెల్లటి వెంట్రుకలను పీకివేయకండి. ఎందుకంటే అవి ముస్లిముల వెలుగు, ఇస్లామ్‌లో వృధ్ధాప్యానికి చేరుకున్న వ్యక్తికి అల్లాహ్‌ (త) అతని ప్రతి వెంట్రుకకు బదులు పుణ్యం రాస్తాడు. అతని పాపాలను క్షమిస్తాడు. అతని స్థానాలు ఉన్నతం చేస్తాడు.” (అబూ  దావూద్‌)

4459 – [ 41 ] ( لم تتم دراسته ) (2/1266)

وَعَنْ كَعْبِ بْنِ مُرَّةَ عَنْ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم قَالَ: “مَنْ شَابَ شَيْبَةً فِي الْإِسْلَامِ كَانَتْ لَهُ نَوْرًا يَوْمَ الْقِيَامَةِ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَالنَّسَائِيُّ.

4459. (41) [2/1266అపరిశోధితం]

క’అబ్‌ బిన్‌ ముర్రహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఇస్లామ్‌లో వృధ్ధాప్యానికి చేరుకున్న వ్యక్తి యొక్క వృధ్ధాప్యం తీర్పుదినం నాడు వెలుగుకు కారకం అవుతుంది.” (తిర్మిజి’, నసాయి’)

4460 – [ 42 ] ( حسن ) (2/1266)

وَعَنْ عَائِشَةَ قَالَتْ: كُنْتُ أَغْتَسِلُ أَنَا وَرَسُوْلُ اللهِ صلى الله عليه وسلم مِنْ إِنَاءٍ وَاحِدٍ وَكَانَ لَهُ شَعْرٌفَوْقَ الْجُمَّةِ وَدُوْنَ الْوَفْرَةِ. رَوَاهُ التِّرْمِذِيُّ وَالنَّسَائِيُّ .

4460. (42) [2/1266ప్రామాణికం]

‘ఆయి’షహ్‌ (ర) కథనం: నేను మరియు ప్రవక్త (స) ఒకే తొట్టె నుండి స్నానం చేసేవాళ్ళం. ప్రవక్త(స) వెంట్రుకలు జుమ్మహ్‌ కంటే అధికంగా వఫ్‌రహ్‌కు తక్కువగా ఉండేవి.[37] (తిర్మిజి’, నసాయి’)

4461 – [ 43 ] ( لم تتم دراسته ) (2/1266)

وَعَنِ ابْنِ الْحَنْظَلِيَّةِ رَجُلٍ مِنْ أَصْحَابِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ: قَالَ النِّبِيُّ صلى الله عليه وسلم: “نِعْمَ الرَّجُلُ خُرَيْمٌ الْأَسَدِيُّ لَوْلَا طُوْلُ جُمَّتِهِ وَإِسْبَالُ إِزَرِاهِ” .فَبَلَغَ ذَلِكَ خُرَيْمًا فَأَخَذَ شَفْرَةً فَقَطَعَ بِهَا جُمَّتَهُ إِلى أُذُنَيْهِ وَرَفَعَ إِزَرَاهُ إِلى أَنْصَافِ سَاقَيْهِ. رَوَاهُ أَبُوْ دَاوُدَ .

4461. (43) [2/1266అపరిశోధితం]

ఇబ్నె ‘హన్‌”జలహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ‘ఖురైమ్‌ అసదీ గురించి ప్రస్తావిస్తూ, ‘ఖురైమ్‌ ‘అసదీ చాలా మంచివాడు, కాని అతడు పొడవైన జుట్టు కలిగి ఉన్నాడు, చీలమండల క్రింది వరకు దుస్తులు వ్రేలాడుతూ ఉంటాయి,’ అని అన్నారు. ఈ వార్త ‘ఖురైమ్‌ కు తెలిసింది. అతడు వెంటనే కత్తితో తన వెంట్రుకలను కోసి చెవులవరకు ఉండేటట్లు, తన లుంగీని చీలమండలపై ఉండేటట్లు చేసుకున్నాడు. (అబూ  దావూద్‌)

అంటే ఈ ‘హదీసు’ ద్వారా పురుషులు చెల్లా చెదురుగా పొడవైన వెంట్రుకలు ఉంచుకోరాదు. చీల మండల క్రింద లుంగీని పైజామాను వ్రేలాడదీయడం నిషిధ్ధం.

4462 – [ 44 ] ( ضعيف ) (2/1267)

وَعَنْ أَنَسٍ قَالَ: كَانَتْ لِيْ ذُؤَابَةٌ فَقَالَتْ لِيْ أُمِّيْ: لَا أَجُزُّهَا كَانَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم يَمُدُّهَا وَيَأْخُذُهَا. رَوَاهُ أَبُوْ دَاوُدَ.

4462. (44) [2/1267బలహీనం]

అనస్‌ (ర) కథనం: నాకు పొడవైన వెంట్రుకలు ఉండేవి. మా అమ్మగారు వాటిని కత్తిరించమని అన్నారు. ఎందుకంటే ప్రవక్త (స) వాటిని లాగేవారు. ముట్టుకునే వారు. పట్టుకునే వారు. అంటే ప్రేమతో అలా చేసేవారు. (అబూ  దావూద్‌)

4463 – [ 45 ] ( صحيح ) (2/1267)

وَعَنْ عَبْدِ اللهِ بْنِ جَعْفَرٍ: أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم أَمْهَلَ آلَ جَعْفَرَ ثَلَاثًا ثُمَّ أَتَاهُمْ فَقَالَ: “لَا تَبْكُوا عَلَى أَخِيْ بَعْدَ الْيَوْمِ”. ثُمَّ قَالَ: “اُدْعُوْا لِيْ بَنِيْ أَخِيْ”. فَجِيْءَ بِنَا كَأَنَّا أَفْرُخٌ فَقَالَ: “اُدْعُوْا لِيَ الْحَلَّاقَ”. فَأَمَرَهُ فَحَلَّقَ رُؤُوْسَنَا. رَوَاهُ أَبُوْ دَاوُدَ وَالنَّسَائِيُّ  .

4463. (45) [2/1267- దృఢం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ జ’అఫర్‌ (ర) కథనం: ప్రవక్త (స), ‘జ’అఫర్‌ ఇంటివారిని మూడు రోజులవరకు వదలి వేయండి,’ అని అన్నారు. మూడు రోజుల తర్వాత ప్రవక్త (స) వచ్చి, ‘ఇప్పుడు మూడురోజుల తర్వాత నా సోదరునిపై ఏడ్వకండి,’ అని అన్నతర్వాత, ‘నా అన్న కొడుకులను అంటే ‘అబ్దుల్లాహ్‌ (ర), ‘ఔన్‌ (ర), ము’హమ్మద్‌లను నా దగ్గరకు తీసుకురండి,’ అని అన్నారు, వారిని తీసుకురావటం జరిగింది. అప్పుడు వాళ్ళందరూ పసిపిల్లలు. ప్రవక్త (స) మంగలి వాడిని పిలవమని ఆదేశించారు. మంగలివాడు వచ్చి ప్రవక్త (స) ఆదేశంపై మా తలలు గీసాడు. (అబూ దావూద్‌, నసాయి’)

 అంటే జ’అఫర్‌ (ర) వీరమరణం వార్తవిని అతని కుటుంబం వారు ఏడ్పులు, పెడబొబ్బలు పెట్టసాగారు. ప్రవక్త (స) వారి దుఃఖాన్ని దూరం చేయడానికి, మూడు రోజులవరకు వారిని వదలివేయండని పలికి, మూడవ రోజు వచ్చి ఏడ్పులు, పెడబొబ్బలు పెట్టరాదని వారించారు.

4464 – [ 46 ] ( لم تتم دراسته ) (2/1267)

وَعَنْ أُمِّ عَطِيَّةَ الْأَنْصَارِيَّةَ: أَنَّ امْرَأَةً كَانَتْ تَخْتِنُ بِالْمَدِيْنَةِ. فَقَالَ لَهُ النَّبِيُّ صلى الله عليه وسلم: “لَا تُنْهِكِيْ فَإِنَّ ذَلِكَ أَحْظَى لِلْمَرْأَةِ وَأَحَبُّ إِلى الْبَعْلِ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ وَقَالَ: هَذَا الْحَدِيْثُ ضَعِيْفٌ وَرَاوِيْهِ مَجْهُوْلٌ .

4464. (46) [2/1267అపరిశోధితం]

ఉమ్మె ‘అతియ్య అ’న్సారీ (ర) కథనం: మదీనహ్లో ఒక స్త్రీ ఉండేది. స్త్రీలకు ఖత్‌నహ్ చేసేది. ప్రవక్త (స), ‘ఆ భాగంలో చర్మాన్ని అధికంగా కోయరాదని, ఎందుకంటే దానివల్ల స్త్రీకి సుఖంగా, భర్తకు సంతోషంగా ఉంటుంది,’ అని అన్నారు. (అబూ దావూద్‌ / బలహీనం. దీని కథకుడు  మజ్హూల్).

4465 – [ 47 ] ( لم تت دراسته ) (2/1267)

وَعَنْ كَرِيْمَةَ بِنْتِ هُمَامٍ: أَنَّ امْرَأَةً سَأَلَتْ عَائِشَةَ عَنْ خِضَابِ الْحِنَّاءِ فَقَالَتْ: لَا بَأْسَ وَلَكِنِّيْ أَكْرَهُهُ كَانَ حَبِيْبِيْ يَكْرَهُ رِيْحَهُ. رَوَاهُ أَبُوْ دَاوُدَ وَالنَّسَائِيُّ .

4465. (47) [2/1267అపరిశోధితం]

కరీమహ్ బిన్‌తె హుమామ్‌ (ర) కథనం: ‘ఆయి’షహ్‌ (ర) ను ఒక స్త్రీ గోరింటాకు గురించి ప్రశ్నించింది. దానికి ‘ఆయి’షహ్‌ (ర) దాన్ని ఉపయోగించటంలో ఏమీ అభ్యంతరం లేదు, కాని నాకు నచ్చదు, ఎందుకంటే ప్రవక్త (స) దాని వాసనను అసహ్యించుకునేవారు అని సమాధానం ఇచ్చారు. (అబూ  దావూద్‌, నసాయి’)

4466 – [ 48 ] ( لم تتم دراسته ) (2/1267)

وَعَنْ عَائِشَةَ أَنَّ هِنْدًا بِنْتَ عُتْبَةَ قَالَتْ: يَا نَبِيَّ اللهِ بَايِعْنِيْ فقَالَ: “لَا أُبَايِعُكَ حَتّى تُغَيِّرِيْ كَفَّيْكِ فَكَأَنَّهُمَا كَفًّا سَبُعٍ”.رَوَاهُ أَبُوْ دَاوُدَ.

4466. (48) [2/1267అపరిశోధితం]

‘ఆయి’షహ్‌ (ర) కథనం: హింద్బిన్తెఉత్హ్, ‘ఓ ప్రవక్తా! తమరు నా నుండి బై’అత్‌ తీసుకోండి,’ అని విన్నవించుకున్నది. దానికి ప్రవక్త (స) నీవు నీ చేతుల రంగు మార్చుకోనంత వరకు నేను నీతో బై’అత్‌ తీసుకోను. ఎందుకంటే నీ చేతులు క్రూరమృగాల పంజాల్లా ఉన్నాయి,’ అని అన్నారు. (అబూ  దావూద్‌)

అంటే స్త్రీలు గోరింటాకు పెట్టుకోవచ్చును.

4467 – [ 49 ] ( لم تتم دراسته ) (2/1267)

وَعَنْهَا قَالَتْ: أَوْمَتْ اِمْرَأَةٌ مِنْ وَرَاءِ سِتْرٍ بِيَدِهَا كِتَابٌ إِلَى رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم. فَقَبَضَ النَّبِيُّ صلى الله عليه وسلم يَدَهُ فَقَالَ: “مَا أَدْرِيْ أَيَدُّ رَجُلٍ أَمْ يَد اِمْرَأَةٍ؟” قَالَتْ: بَلْ يَدُ اِمْرَأَةٍ قَالَ: “لَوْ كُنْتِ اِمْرَأَةً لَغَيَّرْتِ أَظْفَارَكِ”. يَعْنِيْ بِالْحِنَّاءِ . رَوَاهُ أَبُوْ دَاوُدَ وَالنَّسَائِيُّ  .

4467. (49) [2/1267అపరిశోధితం]

‘ఆయి’షహ్‌ (ర) కథనం: ఒక స్త్రీ తెరచాటు నుండి తన చేయిచాచి ప్రవక్త(స) కు ఒక ఉత్తరం ఇవ్వటానికి ప్రయత్నించింది. ప్రవక్త (స) తన చేతిని లాక్కొని, ‘ఈ చేయి స్త్రీదో, పురుషునిదో నాకు అర్థం కావటం లేదు,’ అని అన్నారు. ఆమె స్త్రీ చేయి అని పలికింది. అప్పుడు ప్రవక్త (స), ‘నువ్వు స్త్రీవైతే చేతులకు, గోళ్ళకు గోరింటాకు పెట్టుకునే దానివి,’ అని అన్నారు. (అబూ దావూద్‌, నసాయి’)

4468 – [ 50 ] ( لم تتم دراسته ) (2/1268)

وَعَنِ ابْنِ عَبَّاسٍ قَالَ: لُعِنَتِ الْوَاصِلَةُ وَالْمُسْتَوْصِلَةُ وَالنَّامِصَةُ وَ الْمُتَنَمِّصَةُ وَالْوَاشِمَةُ وَالْمُشْتَوْشِمَةُ مِنْ غَيْرِدَاءٍ. رَوَاهُ أَبُوْ دَاوُدَ.

4468. (50) [2/1268అపరిశోధితం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘అబ్బాస్‌ (ర) కథనం: వెంట్రుకలు వేసే, వేయించుకునే స్త్రీలు, ఇతరుల వెంట్రుకలు కలిపే, కలపబడ్డ స్త్రీలు, వెంట్రుకలు పీకేవారు, పీకించుకునే వారు, పచ్చ బొట్లు వేసే, వేయించుకునే వారిని అందరినీ శపించటం జరిగింది. (అబూ-దావూద్)

4469 – [ 51 ] ( صحيح ) (2/1268)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: لَعَنَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم الرَّجُلَ يَلْبَسُ لِبْسَةً الْمَرْأَةِ وَالْمَرْأَةِ تَلْبَسُ لِبْسَةَ الرَّجُلِ. رَوَاهُ أَبُوْ دَاوُدَ .

4469. (51) [2/1268దృఢం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) స్త్రీల దుస్తుల్ని ధరించే పురుషులను, పురుషుల దుస్తులను ధరించే స్త్రీలను శపించారు. (అబూ  దావూద్‌)

4470 – [ 52 ] ( لم تتم دراسته ) (2/1268)

وَعَنِ ابْنِ أَبِيْ مُلَيْكَةَ قَالَ : قِيْلَ لِعَائِشَةَ : إِنَّ امْرَأَةً تَلْبَسُ النَّعْلَ قَالَتْ : لَعَنَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم الرَّجُلَةَ مِنَ النِّسَاءِ . رَوَاهُ أَبُوْ دَاوُدَ.

4470. (52) [2/1268అపరిశోధితం]

ఇబ్నె అబీ ములైక (ర) కథనం: ఫలానా స్త్రీ పురుషుల్లాంటి చెప్పులు ధరిస్తుందని ‘ఆయి’షహ్‌ (ర) కు తెలియపరచటం జరిగింది. అప్పుడు ‘ఆయి’షహ్‌ (ర) పురుషుల్లాంటి దుస్తులు, చెప్పులు ధరించే స్త్రీలను ప్రవక్త(స) శపించారు,’ అని అన్నారు. (అబూ దావూద్‌)

4471 – [ 53 ] ( ضعيف ) (2/1268)

وَعَنْ ثَوْبَانَ قَالَ: كَانَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم إِذَا سَافَرَ كَانَ آخِرُ عَهْدِهِ بِإِنْسَانٍ مِنْ أَهْلِهِ فَاطِمَةَ وَأَوَّلُ مَنْ يَدْخُلُ عَلَيْهَا فَاطِمَةَ فَقَدِمَ مِنْ غَزَاةٍ وَقَدْ عَلَّقَتْ مِسْحًا أَوْ سِتْرًا عَلَى بَابِهَا وَحَلَّتِ الْحَسَنَ وَالْحُسَيْنَ قُلْبَيْنِ مِنْ فِضَّةٍ فَقَدِمَ فَلَمْ يَدْخُلْ فَظَنَّتْ أَنَّ مَا مَنَعَهُ أَنْ يَدْخُلَ مَا رَأَى فَهَتَكَتِ السِّتْرَ وَفَكَّتِ الْقُلْبَيْنِ عَنِ الصَّبِيَّيْنِ وَقَطَعَتْهُ مِنْهُمَا فَانْطَلَقَا إِلَى رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم يَبْكِيَانِ فَأَخَذَهُ مِنْهُمَا فَقَالَ: “يَا ثَوْبَانَ اِذْهَبْ بِهَذَا إِلى فُلَانٍ إِنَّ هَؤُلَاءِ أَهْلِيْ أَكْرَهُ أَنْ يَأْكُلُوْا طَيِّبَاتِهِمْ فِيْ حَيَاتِهِمْ الدُّنْيَا. يَا ثَوْبَانُ اِشْتَرِ لِفَاطِمَةَ قِلَادَةً مِنْ عَصَبٍ وَسِوَارَيْنِ مِنْ عَاجٍ”. رَوَاهُ أَحْمَدُ وأَبُوْ دَاوُدَ .

4471. (53) [2/1268బలహీనం]

సౌ’బాన్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రయాణానికి వెళ్ళాలనుకున్నప్పుడు తమ ఇంటి వారందరిలో చివరన ఫాతిమహ్ (ర)తో కలసివెళతారు. అదేవిధంగా తిరిగి వచ్చినప్పుడు అందరికంటే ముందు ఫాతిమహ్ (ర)ను కలుస్తారు. ఒకసారి ప్రవక్త(స) ప్రయాణం నుండి తిరిగి వచ్చారు. ఫాతిమహ్ (ర) వద్దకు వెళ్ళారు. అక్కడ ఫాతిమహ్ తన ఇంటి ద్వారానికి గోనెసంచి లేదా తెర తగిలించి ఉంచారు. ఇంకా ‘హసన్‌, ‘హుసైన్‌లకు రెండు వెండి కడియాలు ధరించారు. అది చూచి ప్రవక్త (స) ఇంట్లో ప్రవేశించకుండా తిరిగి వెళ్ళిపోయారు. అది గమనించిన ఫాతిమహ్ (ర) ఆ తెరను చించివేసారు, ఆ రెండు కడియాలను విరిచేసారు. వారిద్దరూ ఏడుస్తూ ప్రవక్త (స) వద్దకు వెళ్ళారు. ప్రవక్త (స) వారిద్దరినీ ఓడిలోకి తీసుకొని సౌ’బాన్‌ (ర) తో దీన్ని ఫలానా వ్యక్తి వద్దకు తీసుకొనివెళ్ళు. వీరు నా కుంటుంబంవారు, వీళ్ళు తమ పరలోకానికి చెందిన వాటిని ఇహలోకంలోనే ఆరగించటం నాకు ఇష్టం లేదు. ‘ఓ సౌ’బాన్‌ నువ్వు ఫాతిమహ్ కోసం ముళ్ళ హారం మరియు ఏనుగు దంతాల రెండు కడియాలుకొని తెచ్చి ఇవ్వు,’అని అన్నారు. (అ’హ్మద్, అబూ  దావూద్‌)

4472 – [ 54 ] ( لم تتم دراسته ) (2/1268)

وَعَنِ ابْنِ عَبَّاسٍ أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم قَالَ: “اِكْتَحِلُوْا بِالْإِثْمِدِ فَإِنَّهُ يَجْلُو الْبَصَرَوَيُنْبِتُ الشَّعْرَ”. وَزَعَمَ أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم كَانَتْ لَهُ مُكْحَلَةٌ يَكْتَحِلُ بِهَا كُلَّ لَيْلَةً ثَلَاثَةً فِيْ هَذِهِ وَثَلَاثَةً فِيْ هَذِهِ. رَوَاهُ التِّرْمِذِيُّ .

4472. (54) [2/1268అపరిశోధితం]

ఇబ్నె ‘అబ్బాస్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మీరు అస్హానీ సుర్మ ఉపయోగించండి. అది కంటి చూపును మరింత తేజోవంతంచేస్తుంది, కనురెప్పలను పెంచుతుంది. ప్రవక్త (స) వద్ద ఒక సుర్మ ఉండేది. దాని నుండి రాత్రిపూట ఒక్కో కంటికి మూడుసార్లు సుర్మా పట్టించేవారు. (తిర్మిజి’)

4473 – [ 55 ] ( لم تتم دراسته ) (2/1269)

وَعَنْهُ قَالَ: كَانَ النَّبِيُّ صلى الله عليه وسلم يَكْتَحِلُ قَبْلَ أَنْ يَنَامَ بِالْإِثْمِدِ ثَلَاثًا فِيْ كُلِّ عَيْنٍ قَالَ: وَقَالَ: “إِنَّ خَيْرَمَا تَدَاوَيْتُمْ بِهِ اللَّدُوْد وَالسَّعُوْطُ وَالْحِجَامَةُ وَالْمَشِيُّ وَخَيْرَ مَا اكْتَحَلْتُمْ بِهِ الْإِثْمِدُ فَإِنَّهُ يَجْلُو الْبَصَرَ وَ يُنْبِتُ الشَّعْرَ وَإِنَّ خَيْرَ مَا تَحْتَجِمُوْنَ فِيْهِ يَوْمَ سَبْعَ عَشْرَةَ وَيَوْمَ تِسْعَ عَشَرَةَ وَيَوْمَ إِحْدَى وَّعِشْرِيْنَ”. وَإِنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم حَيْثُ عُرِجَ بِهِ مَا مَرَّعَلَى مَلَأٍ مِنَ الْمَلَائِكَةِ إِلَّا قَالُوْا: عَلَيْكَ بِالْحِجَامِةِ. رَوَاهُ التِّرْمِذِيُّ وَقَالَ: هَذَا حَدِيْثٌ حَسَنٌ غَرِيْبٌ .

4473. (55) [2/1269అపరిశోధితం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘అబ్బాస్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రతి రోజూ రాత్రి పడుకునే ముందు ఒక్కో కంటికి మూడుసార్లు సుర్మా పట్టించేవారు. ఇంకా అన్నిటి కంటే మంచి వైద్యం, లదూద్‌, సఊత్‌, హుజుమత్‌, మష్యి అన్నిటి కంటే మంచిది అస్‌ఫహానీ సుర్మా, ఎందు కంటే అది దృష్టిని అధికం చేస్తుంది, కను రెప్పలను పెంచుతుంది, అదేవిధంగా మీరు హిజా మహ్ చేయస్తే 17, 19, 21 తేదీలలో చేయించు కోవటం మంచిది. నేను మే’అరాజ్‌లో వెళ్ళినపుడు ఒక దైవదూతల బృందం గుండా నేను వెళ్ళినప్పుడు ప్రతిదూత, ‘ఓ ము’హమ్మద్‌! మీ అనుచర సంఘానికి హిజామహ్ కొరకు ఆదేశించండి,’ అని చెబుతూ ఉన్నారు. [38] (తిర్మిజి’  /  ప్రామాణికం, -ఏకోల్లేఖనం)

4474 – [ 56 ] ( لم تتم دراسته ) (2/1269)

وَعَنْ عَائِشَةَ: أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم نَهَى الرِّجَالَ وَالنِّسَاءَ عَنْ دُخُوْلِ الْحَمَّامَاتِ ثُمَّ رَخَّصَ لِلرِّجَالِ أَنْ يَدْخُلُوْا بِالْمِيَازِرِ. رَوَاهُ التِّرْمِذِيُّ وأَبُوْ دَاوُدَ   

4474. (56) [2/1269అపరిశోధితం]

‘ఆయి’షహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) స్త్రీ పురుషులను స్నానాల గదిలో ప్రవేశించటాన్ని వారించారు. ఆ తరువాత పురుషులకు లుంగీ ధరించి ‘హమ్మామ్ లో వెళ్ళే అనుమతి ఇచ్చారు.[39]  (తిర్మిజి’, అబూ దావూద్‌)

4475 – [ 57 ] ( صحيح ) (2/1269)

وَعَنْ أَبِي الْمَلِيْحِ قَالَ: قَدِمَ عَلَى عَائِشَةَ نِسْوَةٌ مِنْ أَهْلِ حِمْصَ فَقَالَتْ: مِنْ أَيْنَ أَنْتُنَّ؟ قُلْنَ: مِنَ الشَّامِ فَلَعَلَّكُنَّ مِنَ الْكُوْرَةِ الَّتِيْ تَدْخُلُ نِسَاؤُهَا الْحَمَّامَاتِ؟ قُلْنَ: بَلَى قَالَتْ: فَإِنِّيْ سَمِعْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ: “لَا تَخْلَعُ اِمْرَأَةٌ ثِيَابَهَا فِيْ غَيْرِ بَيْتِ زَوْجِهَا إِلَّا هَتَكَتِ السِّتْرَ بَيْنَهَا وَبَيْنَ رَبِّهَا”.

وَفِيْ رِوَايَةٍ: “فِيْ غَيْرِ بَيْتِهَا إِلَّا هَتَكَتْ سِتْرَهَا بَيْنَهَا وَبَيْنَ اللهِ عَزَّ وَجَلَّ”. رَوَاهُ التِّرْمِذِيُّ وأَبُوْ دَاوُدَ .

4475. (57) [2/1269దృఢం]

‘అబూ మలీహ్‌ కథనం: ‘ఆయి’షహ్‌ (ర) వద్దకు కొందరు షామీ స్త్రీలు వచ్చారు. ‘ఆయి’షహ్‌ (ర) మీరెక్కడ నుండి వచ్చారని వారిని అడిగారు. వారు మేము షామ్‌ నుండి వచ్చామని అన్నారు. అప్పుడు ‘ఆయి’షహ్‌ (ర) వారితో బహుశా మీరు, ‘స్త్రీలు బాత్రూమ్‌లలో ప్రవేశించే పట్టణానికి చెందిన వారులా ఉన్నారు,’ అని అన్నారు. దానికి వారు అవును,’ అని అన్నారు. అప్పుడు ‘ఆయి’షహ్‌ (ర) ప్రవక్త (స)ను, ‘తన భర్త ఇంటిలో తప్ప మరో ఇంటిలో తన దుస్తులను తొలగించే స్త్రీ తనకూ, తన ప్రభువుకూ మధ్య ఉన్న తెర చించివేసినట్టే,’ అని ప్రవచిస్తూ ఉండగా విన్నాను” అని అన్నారు. (తిర్మిజి’, అబూ దావూద్‌)

అంటే తగని ప్రదేశంలో తన దుస్తులను తొలగిస్తే, తన్ను తానే  అగౌరవానికి  గురిచేసుకున్నట్టు.

4476 – [ 58 ] ( ضعيف ) (2/1269)

وَعَنْ عَبْدِ اللهِ بْنِ عَمْرٍو أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم قَالَ: “سَتُفْتَحُ لَكُمْ أَرْضُ الْعَجَمِ وَسَتَجِدُوْنَ فِيْهَا بُيُوْتًا يُقَالُ لَهَا: اَلْحَمَّامَاتُ فَلَا يَدْخُلَنَّهَا الرِّجَالُ إِلَّا بِالْأُزُرِ وَامْنَعُوْهَا النِّسَاءَ إِلَّا مَرِيْضَةً أَوْ نَفَسَاءَ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ.

4476. (57) [2/1269బలహీనం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘అమ్ర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”భవిష్యత్తులో మీరు అరబ్బేతరుల రాజ్యాలు  జయిస్తారు. మీరు అక్కడ స్నానాల గదులను చూస్తారు. మీరు లుంగీ ధరించి వాటిలో స్నానం చేయగలరు. మీరు మీ స్త్రీలను అక్కడికి వెళ్ళకుండా వారించండి. అయితే స్త్రీలకు అత్యవసర పరిస్థితిలో ఉంటే వారు ఒంటరిగా వస్త్రం కట్టుకొని స్నానం చేయగలరు. (అబూ  దావూద్‌)

4477 – [ 59 ] ( صحيح ) (2/1270)

وَعَنْ جَابِرٍ أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم قَالَ: “مَنْ كَانَ يُؤْمِنُ بِاللهِ وَ الْيَوْمِ الْآخِرِفَلَا يَدخُلِ الْحَمَّامَ بِغَيْرِإِزَارٍوَمَنْ كَانَ يُؤْمِنُ بِاللهِ وَالْيَوْمِ الْآخِرِفَلَا يُدْخِلْ حَلِيْلَتَهُ الْحَمَّامَ وَمَنْ كَانَ يُؤْمِنُ بِاللهِ وَالْيَوْمِ الْآخِرِفَلَا يَجْلِسْ عَلَى مَائِدَةٍ تُدَارُ عَلَيْهَا الْخَمْرُ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَالنَّسَائِيُّ .

4477. (59) [2/1270దృఢం]

జాబిర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”అల్లాహ్‌(త)నూ, తీర్పుదినాన్ని విశ్వసించే వ్యక్తి లుంగీ ధరించ కుండా బాత్రూమ్‌ లోనికి ప్రవేశించరాదు. అదేవిధంగా అల్లాహ్‌ (త) నూ, తీర్పుదినాన్ని విశ్వసించే వ్యక్తి, తన భార్యను ఇటువంటి బాత్రూమ్‌లలో ప్రవేశింపనీయరాదు. అదేవిధంగా అల్లాహ్‌(త) నూ, తీర్పు దినాన్ని విశ్వసించే వ్యక్తి, మత్తుపానీయాలు గల విందులో పాల్గొనరాదు. (తిర్మిజి’, నసాయి’)

—–

اَلْفَصْلُ الثَّالِثُ  మూడవ విభాగం 

4478 – [ 60 ] ( متفق عليه ) (2/1270)

عَنْ ثَابِتٍ قَالَ: سُئِلَ أَنَسٌ عَنْ خِضَابِ النَّبِيِّ صلى الله عليه وسلم فقَالَ: لَوْ شِئْتُ أَنْ أَعُدَّ شَمَطَاتٍ كُنَّ فِيْ رَأْسِهِ فَعَلْتُ قَالَ: ولَمْ يَخْتَضِبْ

زَادَ فِيْ رِوَايَةٍ: وَقَدْ اخْتَضَبَ أَبُوْ بَكْرٍ بِالْحِنَاءِ وَالْكَتَمِ وَاخْتَضَبَ عُمَرُ بِالْحِنَّاءِ بَحْتًا.

4478. (60) [2/1270ఏకీభవితం]

సా’బిత్‌ (ర) కథనం: అనస్‌ (ర) ను ప్రవక్త (స) రంగు పట్టించటాన్ని గురించి ప్రశ్నించడం జరిగింది. దానికి అనస్‌ (ర) ఒకవేళ నేను కోరితే ప్రవక్త (స) తెల్లని వెంట్రుకలను లెక్క పెట్టుకునే వాడిని. అంటే తెల్లని వెంట్రుకలు కొన్ని మాత్రమే ఉండేవి. అంటే వాటిని రంగు పట్టించే అవసరం రాలేదు. అయితే అబూ బకర్‌ (ర) గోరింటాకు, వస్‌మహ్‌ కలిపి రాసుకునేవారు. ‘ఉమర్‌ (ర) కేవలం గోరింటాకు రాసుకున్నారు, అని సమాధానం ఇచ్చారు.[40] (బు’ఖారీ, ముస్లిమ్‌)

4479 – [ 61 ] ( لم تتم دراسته ) (2/1270)

وَعَنِ ابْنِ عُمَرَ أَنَّهُ كَانَ يُصَفِّرُ لِحْيَتَهِ بِالصُّفْرَةِ حَتّى تَمْتَلِئَ ثِيَابُهُ مِنَ الصُّفْرَةِ فَقِيْلَ لَهُ: لَمْ تَصْبِغْ بِالصُّفْرَةِ؟ قَالَ: إِنِّيْ رَأَيْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يَصْبِغُ بِهَا وَلَمْ يَكُنْ شَيْءٌ أَحَبَّ إِلَيْهِ مِنْهَا وَقَدْ كَانَ يَصْبِغُ ثِيَابَهُ كُلّهَا حَتّى عِمَامَتَهُ. رَوَاهُ أَبُوْدَاوُدَ وَالنَّسَائِيُّ.

4479. (61) [2/1270అపరిశోధితం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘ఉమర్‌ (ర) తన గడ్డానికి పసుపు పచ్చని రంగు పూసుకునేవారు. చివరికి ఆ రంగు వల్ల బట్టలన్నీ పసుపుపచ్చ రంగుగా తయారయ్యేవి. పసుపుపచ్చ రంగు ఎందుకు ఉపయోగిస్తారని ప్రశ్నించడం జరిగింది. దానికి అతను, ‘ప్రవక్త (స)ను పసుపుపచ్చ రంగు పూసు టూ ఉండగా నేను చూచాను, ఇంకా పసుపుపచ్చ రంగంటే ప్రవక్త (స) చాలా ఇష్టపడే వారు, బట్టల్ని కూడా పసుపు రంగుగా చేసుకునేవారు, చివరికి పగిడి కూడా పసుపు పచ్చగా తయారయ్యేది,’ అని  అన్నారు. (అబూ  దావూద్‌, నసాయి’)

4480 – [ 62 ] ( صحيح ) (2/1270)

وَعَنْ عُثْمَانِ بْنِ عَبْدِ اللهِ بْنِ مَوْهِبٍ قَالَ: دَخَلْتُ عَلَى أُمِّ سَلَمَةَ فَأَخْرَجَتْ إِلَيْنَا شَعْرًا مِنْ شَعْرِ النَّبِيِّ صلى الله عليه وسلم مَخْضُوْبًا. رَوَاهُ الْبُخَارِيُّ.

4480. (62) [2/1270దృఢం]

‘ఉస్మాన్‌ బిన్‌ ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ మూహిబ్‌ కథనం: నేను ఉమ్మె సలమహ్ ఇంటికి వెళ్ళాను. ఆమె ప్రవక్త (స) వెంట్రుకల నుండి కొన్నింటిని తీసి నా ముందు ఉంచారు. అవి రంగు పట్టించినట్లు నేను చూచాను.[41] (బు’ఖారీ)

4481 – [ 63 ] ( لم تتم دراسته ) (2/1270)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: أُتِيَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم بِمُخَنَّثِ قَدْ خَضَبَ يَدَيْهِ وَرِجْلَيْهِ بِالْحِنَّاءِ. فَقَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَا بَالُ هَذَا؟” قَالُوْا: يَتَشَبَّهُ بِالنِّسَاءِ فَأَمَرَ بِهِ فَنُفِيَ إِلى النَّقِيْعِ . فَقِيْلَ: يَا رَسُوْلَ اللهِ أَلَا تَقْتُلُهُ؟ فَقَالَ: “إِنِّيْ نُهِيْتُ عَنْ قَتْلِ الْمُصَلِّيْنَ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ.

4481. (63) [2/1270అపరిశోధితం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) వద్దకు ఒక కొజ్జావాడిని తీసుకురావటం జరిగింది. అతడు తన కాళ్ళకూ, చేతులకూ గోరింటాకు పెట్టుకొని ఉన్నాడు. ప్రవక్త (స) అది గమనించి కారణం అడిగారు. అక్కడి ప్రజలు, ‘వీడు స్త్రీలను అనుకరిస్తున్నాడు,’ అని అన్నారు. ప్రవక్త (స), ‘వీడిని బఖీ ప్రాంతం వైపు బహిష్కరించండి,’ కొందరు, ‘ఇతడ్ని చంపివేద్దామా,’ అని అన్నారు. దానికి ప్రవక్త (స), ‘నన్ను నమాజీలను చంపరాదని వారించడం జరిగింది,’ అని అన్నారు.  (అబూ  దావూద్‌)  

4482 – [ 64 ] ( لم تتم دراسته ) (2/1270)

وَعَنِ الْوَلِيْدِ بْنِ عُقْبَةَ قَالَ: لَمَّا فَتَحَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم مَكَّةَ جَعَلَ أَهْلُ مَكَّةَ يَأْتُوْنَهُ بِصِبْيَانِهِمْ فَيَدْعُو لَهُمْ بِالْبَرْكَةِ وَيَمْسَحُ رُؤُوْسَهُمْ فَجِيْءَ بِيْ إِلَيْهِ وَأَنَا مُخَلَّقٌ فَلَمْ يَمْسَنِيْ مِنْ أَجْلِ الْخَلُوْقِ. رَوَاهُ أَبُوْ دَاوُدَ.

4482. (64) [2/1270అపరిశోధితం]

వలీద్‌ బిన్‌ ‘ఉఖ్‌బహ్ (ర) కథనం: మక్కహ్ విజయం తరువాత  మక్కహ్ వారు తమ పిల్లల్ని దు’ఆ కోసం, శుభం పొందటానికి ప్రవక్త (స) వద్దకు తీసుకువచ్చేవారు. ప్రవక్త (స) వారిని దీవించేవారు, ప్రేమతో వారి తలను నిమిరేవారు. నన్ను కూడా తీసుకురావటం జరిగింది. నాకు ‘ఖలూఖ్‌ సువాసన పూయడం జరిగింది. దానివల్ల ప్రవక్త (స) నా తలను తన చేత్తో నిమిరలేదు. (అబూ దావూద్‌)

4483 – [ 65 ] ( لم تتم دراسته ) (2/1271)

وَعَنْ أَبِيْ قَتَادَةَ أَنَّهُ قَالَ لِرَسُوْلِ اللهِ صلى الله عليه وسلم: إِنَّ لِيْ جُمَّةً أَفَأرَجِلُهَا؟ قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “نَعَمْ وَأَكْرِمْهَا”. قَالَ: فَكَانَ أَبُوْ قَتَادَةَ رُبَّمَا دَهَّنَهَا فِي الْيَوْمِ مَرَّتَيْنِ مِنْ أَجَلِ قَوْلِ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم: “نَعَمْ وَأَكْرِمْهَا”. رَوَاهُ مَالِكٌ .

4483. (65) [2/1271అపరిశోధితం]

అబూ ఖతాదహ్‌ (ర) ప్రవక్త (స) ను, ‘నా వెంట్రుకలు భుజాల వరకు ఉన్నాయి. నేను దువ్వుకో వచ్చునా?’ అని విన్నవించుకున్నారు. దానికి ప్రవక్త (స), ‘తల దువ్వుకో ఇంకా వాటిని గౌరవించు, అంటే నూనె రాసుకో,’ అని అన్నారు. ప్రవక్త (స) ఆదేశం తరువాత అతను రోజుకు రెండుసార్లు నూనె రాసుకునేవారు, తల దువ్వుకునేవారు. (మాలిక్‌)

4484 – [ 66 ] ( ضعيف ) (2/1271)

وَعَنِ الْحَجَّاحِ بْنِ حَسَّانَ قَالَ: دَخَلْنَا عَلَى أَنَسِ بْنِ مَالِكٍ فَحَدَّثَتْنِيْ أُخْتِي الْمُغِيْرَةُ قَالَتْ: وَأَنْتَ يَومَئِذٍ غُلَامٌ وَلَكَ قَرْنَانِ أَوْ قُصَّتَانِ فَمَسَحَ رَأْسَكَ وَبرَّكَ عَلَيْكَ وَقَالَ: “اِحْلِقُوْا هَذَيْنِ أَوْ قُصُّوْهُمَا فَإِنَّ هَذَا زِيُّ الْيَهُوْدِ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ.

4484. (66) [2/1271బలహీనం]

‘హజ్జాజ్‌ బిన్‌ ‘హస్సాన్‌ కథనం: నేను అనస్‌ బిన్‌ మాలిక్‌ వద్దకు వెళ్ళాను. మా అక్క నాతో, ‘నీ బాల్యంలో నీకు రెండు జడలు ఉండేవి. ప్రవక్త (స) నీ తలను చేత్తో నిమిరి, దీవించి, ‘నీ రెండు జడలు కత్తిరించమన్నారు. ఎందుకంటే ఇది యూదుల చిహ్నం,’ అని అన్నారు. (అబూ  దావూద్‌)  

అంటే పొడవైన వెంట్రుకలు ఉంచరాదని, ఇది యూదుల క్రైస్తవుల చిహ్నమని ఈ ‘హదీసు’ ద్వారా తెలిసింది.

4485 – [ 67 ] ( لم تتم دراسته ) (2/1271)

وَعَنْ عَلِيٍّ قَالَ: نَهَى رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم أَنْ تَحْلِقَ الْمَرْأَةُ رَأْسَهَا. رَوَاهُ النَّسَائِيُّ  .

4485. (67) [2/1271అపరిశోధితం]

‘అలీ (ర) కథనం: ప్రవక్త (స) స్త్రీలను తల గీయించ వద్దని వారించారు. (నసాయి)

ఎందుకంటే స్త్రీల తల వెంట్రుకలు, పురుషుల గడ్డం లాంటివి. అందువల్ల పురుషులు గడ్డం గీయించటం, స్త్రీలు తల వెంట్రుకలు గీయించటం అధర్మం.

4486 – [ 68 ] ( لم تتم دراسته ) (2/1271)

وَعَنْ عَطَاءِ بْنِ يَسَارٍ قَالَ: كَانَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم فِي الْمَسْجِدِ فَدَخَلَ رَجُلٌ ثَائِرُ الرَّأْسِ وَاللِّحْيَةِ فَأَشَارَ إِلَيْهِ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم بِيَدِهِ كَأَنَّهُ يَأْمُرُهُ بِإِصْلَاحِ شَعْرِهِ وَلِحْيَتِهِ فَفَعَلَ ثُمَّ رَجَعَ. فَقَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “أَلَيْسَ هَذَا خَيْرًا مِنْ أَنْ يَأْتِيَ أَحَدُكُمْ وَهُوَ ثَائِرُ الرَّأْسِ كَأَنَّهُ شَيْطَانٌ”. رَوَاهُ مَالِكٌ .

4486. (68) [2/1271అపరిశోధితం]

‘అ’తా బిన్‌ యసార్‌ (ర) కథనం: ప్రవక్త (స) మస్జిద్‌లో ఉన్నారు. వెంట్రుకలు చెల్లాచెదురుగా ఉన్న ఒక వ్యక్తి వచ్చాడు. ప్రవక్త (స) తన చేత్తో వెంట్రుకలు సరి చేసుకోమని ఆదేశించారు. ఆ తరువాత ఆ వ్యక్తి తన తల వెంట్రుకలు, గడ్డంసరిచేసుకొని వచ్చాడు. అప్పుడు ప్రవక్త (స), ‘ఈ పరిస్ధితి ఇంతకు ముందుకంటే బాగుంది కదా  షై’తాన్‌లా వెంట్రుకలు చెల్లాచెదురుగా ఉండటం మంచిది కాదు,’ అని అన్నారు. (మాలిక్‌)

4487 – [ 69 ] ( حسن ) (2/1271)

وَعَنِ ابْنِ الْمُسَيَّبِ سَمِعَ يَقُوْلُ: “إِنَّ اللهَ طَيِّبٌ يُحِبُّ الطِّيْبَ نَظِيْفٌ يُحِبُّ النَّظَافَةَ كَرِيْمٌ يُحِبُّ الْكَرَمَ جَوَّادٌ يُحِبُّ الْجُوْدَ فَنَظِّفُوْا أَرَاهُ قَالَ: أَفْنِيَتَكُمْ وَلَا تَشَبَّهُوْا بِالْيَهُوْدِ”. قَالَ: فَذَكَرْتُ ذَلِكَ لِمُهَاجِرِيْنَ مِسْمَارٍ فَقَالَ: حَدَّثَنِيْهِ عَامِرُ بْنُ سَعْدٍ عَنْ أَبِيْهِ عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم مِثْلَهُ إِلَّا أَنَّهُ قَالَ: “نَظِّفُوْا أَفْنِيَتَكُمْ”. رَوَاهُ التِّرْمِذِيُّ .

4487. (69) [2/1271ప్రామాణికం]

స’యీద్‌ బిన్‌ ముసయ్యిబ్‌ కథనం : ప్రవక్త (స) ఇలా అన్నారు: ”అల్లాహ్‌ (త) పరిశుద్ధుడు, పరిశుద్ధత, పరిశుభ్రతలను ప్రేమిస్తాడు. అల్లాహ్‌ (త) గొప్పవాడు, గొప్పతనాన్ని ఇష్ట పడతాడు. దాతృత్వం గలవాడు, దాతృత్వాన్ని ప్రేమిస్తాడు. మీరు మీ ఇళ్ళను, ప్రాంగణాలను పరిశుభ్రంగా ఉంచండి. యూదులను అనుసరించకండి. ఎందుకంటే యూదులు తమ ఇళ్ళను, ప్రాంగణాలను పరిశుభ్రంగా ఉంచరు. ఈ విధంగా నేను ముహాజిర్‌ బిన్‌ మిస్‌మార్‌తో అన్నాను. దానికి ఆయన ‘ఆమిర్‌ బిన్‌ స’అద్‌ తన తండ్రి ద్వారా ఉల్లేఖిస్తూ ప్రవక్త (స) ఇలా ప్రవచించారని అన్నారు.” (తిర్మిజి’)

4488 – [ 70 ] ( لم تتم دراسته ) (2/1272)

وَعَنْ يَحْيَى بْنِ سَعِيْدٍ أَنَّهُ سَمِعَ سَعِيْدَ بْنَ الْمُسَيَّبِ يَقُوْلُ: كَانَ إِبْرَاهِيْمُ خَلِيْلَ الرَّحْمنِ أَوَّلَ النَّاسِ ضَيَّفَ وَأَوَّلَ النَّاسِ اخْتَتَنَ وَأَوَّلَ النَّاسِ قَصّ شَارِبَهُ وَأَوَّلَ النَّاسِ رَأَى الشَّيْبَ فَقَالَ: يَا رَبِّ: مَا هَذَا؟ قَالَ الرَّبُّ تَبَارَكَ وَتَعَالى: وَقَارٌيَا إِبْرَاهِيْمُ قَالَ: رَبِّ زِدْنِيْ وَقَارًا. رَوَاهُ مَالِكٌ .

4488. (70) [2/1272అపరిశోధితం]

య’హ్‌యా బిన్‌ స’యీద్‌, స’యీద్‌ బిన్‌ ముసయ్యిబ్‌ ద్వారా విని ఇలా అన్నారు. ఇబ్రాహీమ్‌ (అ) అందరికంటే ముందు అరబ్‌లో ఆతిథ్యం ఇచ్చారు. ఇంకా అందరికంటే ముందు ఖత్‌నా చేసారు, ఇంకా అందరికంటే ముందు తన మీసాలను కత్తిరించారు. అందరికంటే ముందు తన తలలో తెల్లని వెంట్రుకలు చూచారు. ఇంకా ప్రభూ! ‘ఇవి ఏమిటీ,’ అని అన్నారు. దానికి అల్లాహ్‌ (త), ‘గొప్పతనం మరియు గౌరవం,’ అంటే తెల్లని వెంట్రుకలు రావటం గొప్పతనం, గౌరవసూచకం అని సమాధానం ఇచ్చాడు. అప్పుడు ఇబ్రాహీమ్‌ (అ), ‘ఓ ప్రభూ! అప్పుడైతే ఈ గొప్పతనాన్ని, గౌరవాన్ని ఇంకా అధికంగా ప్రసాదించు,’ అని అన్నారు.” (మాలిక్‌)

=====

4– بَابُ التَّصَاوِيْرِ

4. చిత్రాలు

  ఇక్కడ చిత్రాలు అంటే ప్రాణుల చిత్రాలు. ఇస్లామ్ లో ప్రాణుల చిత్రాలు తీయటం నిషిధ్ధ. ఎందుకంటే ఇదే చివరికి విగ్రహారాధనకు గురిచేస్తుంది. విగ్రహారాధన దీనినుండే ప్రారంభం అయ్యింది. దైవప్రవక్తల్లో గొప్ప ప్రవక్త నూహ్(అ). ఆదమ్ (అ) 8 తరంలో జన్మించారు. నూహ్() తండ్రి పేరు మాలిక్. ఇతడు ఏకదైవా రాధకుడు, సజ్జనుడూను. ప్రజలకు ఏకత్వాన్ని బోధించేవారు. మాలిక్ తండ్రిపేరు మనూషల్ఖ్. మనూషల్ఖ్ తండ్రి పేరు ఇద్రీస్ (అ). మనూషల్ఖ్ చాలా బుధ్ధీవివేకాలు గలవారు. 10 సంవత్సరాల వయసులోనే ఇద్రీస్ (అ), షీస్ (అ), ఆదమ్ (అ)లపై అవతరించబడిన అల్లాహ్ గ్రంథాలను కంఠస్తం చేసుకున్నారు. ఇద్రీస్ (అ) తరువాత అతని వారసులయ్యారు. అతని ప్రయత్నాలన్నీ మానవ కళ్యాణానికి ఉపయోగ పడ్డాయి. ఇద్రీస్() అసలుపేరు అఖ్ నూఖ్. ఖుర్ఆన్ లో అనేక చోట్ల ఇతన్ని గురించి ప్రస్తావించటం జరిగింది. ఇది అతని ప్రత్యేకతకు సూచకం. యూనాన్ వైద్యులు గణితంలో భౌతిక శాస్త్రంలో ఇతన్నే గుర్తుచేసుకుంటారు. వ్రాయడం, కుట్టటం ఇతనే కనుగొన్నారు. ఇద్రీస్()  తండ్రిపేరు బీరో. ఇతను ఎల్లప్పుడూ ఖాబీల్ సంతతితో యుధ్ధం చేసేవారు. ఆదమ్ (అ) ఖిలాఫత్ పదవి నలంకరించారు. బీరో తండ్రిపేరు ముహ్ లాయిల్. ప్రజలను పట్టణాల్లో పల్లెల్లో విభజించి జనవాసాలు ఏర్పాటు చేసింది ఈయనే. ఈయనే బాబుల్ నగరం నిర్మించారు. ఇక్కడే తన కుటుంబంవారితో సహా నివాసం ఏర్పరచుకున్నారు. ముహ్ లాయిల్ తండ్రి పేరు ఖీతాన్. ఇతను కూడా తన తాతముత్తాతల్లా సజ్జనుడు. ఖీతాన్ తండ్రిపేరు అనూష్. షీస్ సంతానంలో వీరికి ఉన్నత స్ధానం ఉంది. అనూష్ తన తాతగారైన ఆదమ్(అ) ప్రక్కన ఖననం చేయబడ్డారు. అనూష్ తండ్రిపేరు షీస్(అ). అతడు ఆదమ్ (అ) తరువాత బాధ్యతలు అందుకున్నారు. వీరు గొప్ప ప్రవక్తల్లో ఒకరుగా పరిగణింపబడతారు. 50 గ్రంథాలు ఇతనిపై అవతరించబడ్డాయి. యూనాన్ పండితులు దైవనిర్ణయాల గురించి ఇతన్నుండే తెలుసుకున్నారు. ఇతడు అధిక సమయం దైవారాధనలోనే గడిపేవారు. 8తరాల వివరాలు ఉన్నాయి. అందరూ పరిపూర్ణ ముస్లిములే. ఇద్రీస్ (అ) మరణానంతరం మానవుల్లో విగ్రహారాధన ప్రారంభ మయింది. దీనికి కారణం ఏమిటంటే, ఇద్రీస్ (అ) సంతానంలోని అందరూ పుణ్యాత్ములే ప్రతిఒక్కరూ ఆరాధనకోసం వేర్వేరుగా మస్జిదులు నిర్మించు కున్నారు. వాటిలో వారు స్వయంగా ఆరాధన చేసుకునేవారు. ఇతరులను కూడా ఆరాధనపట్ల ప్రోత్సహించేవారు. చాలామంది వారితో కలసి శ్రధ్ధాభక్తులతో ఆరాధించేవారు. వారి సహవాసంలో ఒకప్రత్యేక తృప్తిని పొందేవారు.

   ఇద్రీస్ (అ) సంతానం క్రమంగా అంతరించిపోయింది. ప్రజలు చాలా విచారించి, తరచూ తమ సభల్లో ఆ మహా వ్యక్తుల సహవాసంలో ఆరాధనలో ఒక ప్రత్యేక సంతృప్తి, సంతోషం కలిగేది, అది మనకిప్పుడు లభించటంలేదని చెప్పుకునే వారు. షై’తాన్ మానవునికి బధ్ధశతృవు. ఈ అవకాశాన్ని మహా భాగ్యంగా భావించి, ముసలివాని రూపంలో తలపై అమామ కట్టుకొని, చేతికర్ర పట్టుకొని, ప్రజలు చర్చించుకునే సభల్లోకి వచ్చి, ప్రజలారా, నేను మీకు ఒకపద్దతి చెబుతాను. దానివల్ల మీ సమస్యలన్నీ తీరి పోతాయి. ఇంతకు ముందులా సంతృప్తి లభిస్తుంది. ఆ పద్దతి ఏమిటంటే, ”ఆ మహావ్యక్తుల రాతి విగ్రహాలు చెక్కించండి, వారి దుస్తులు వాటికి తొడిగించండి, దాన్ని మస్జిద్ లో మీ ముందు ఉన్నట్టు మెహ్రాబ్ లో ఉంచండి. ఇంకా అవి మిమ్మల్ని చూస్తున్నట్టు భావించండి. ‘ఇన్న అవ్ లియా అల్లాహి లా యమూతూన,’ అనే ఈ ఆలోచన ద్వారా ఇంతకు ముందు లాంటి సంతృప్తి లభిస్తుంది,” అని అన్నాడు. ప్రజలకు ఈ ఆలోచన బాగా నచ్చింది. విగ్రహాలు చెక్కి మస్జిదుల్లో ఉంచసాగారు. ఇంకా ప్రార్ధనల తర్వాత బయటకు వెళ్ళినపుడు విగ్రహాల కాళ్ళూ చేతులకు ముద్దుపెట్టుకునే వారు. తాము వచ్చినట్టు వాటి ఆత్మలు తెలుసుకొని, దైవం ముందు సాక్ష్యం ఇవ్వాలని. కొంతకాలం గడచిన తరువాత, ఆరాధన కంటే విగ్రహాలను ముద్దుపెట్టుకోవటమే మిగిలి పోయింది. మస్జిద్ లోనికి వచ్చేవారు విగ్రహాల కాళ్ళూ చేతులకు ముద్దుపెట్టుకొని బయటకువచ్చే ఆచారమే మిగిలి పోయింది. మరి కొంతకాలం తరువాత సజ్దా (సాష్టాంగ ప్రణామం) ఆచారం ప్రారంభమైపోయింది. నూ’హ్ (అ) తండ్రి గారు ప్రజలను దీన్నుండి వారించేవారు. కాని ప్రజలు వినేవారుకారు. చివరికి అల్లాహ్ (త) నూ’హ్ (అ) ను ప్రజల మార్గదర్శకత్వం కోసం ప్రవక్తగా పంపాడు. ఆదమ్ (అ) సంతతిలోని 8 తరం తరువాత నుండి విగ్రహారాధన ప్రారంభ మయిందని పైవాక్యాలు నిరూపిస్తున్నాయి. ఇదంతా షై’తాన్ వల్లే జరిగింది. షై’తాన్ అల్లాహ్(త) సన్నిధిలో, ‘నేను నీదాసులను సన్మార్గానికి దూరం చేయడానికి శాయశక్తులా ప్రయత్నిస్తాను. ఇంకా వారిని నీ ఆరాధనకు దూరంగా ఉంచుతాను,’ అని వాగ్దానం చేసాడు. అనంతరం వాడు వల పన్నాడు. వాడివల ఫలించింది. దైవమార్గం నుండి ప్రజలను దూరంగా ఉంచడానికి తన మార్గానికి గురిచేయడానికి ఈ మార్గమే వాడికి లభించింది. ఈ విధంగా దైవారాధనకు బదులు విగ్రహారాధన ప్రారంభం అయ్యింది. అనంతరం షై’తాన్ తన పాపవాగ్దానం కొంతవరకు చేసి చూపాడని అల్లాహ్(త) పేర్కొన్నాడు. ఏది ఏమైనా విగ్రహారాధన ఈ చిత్రాలనుండే ప్రారంభమయింది. అల్లాహ్(త) చిత్రాల, ఫొటోల ఆరాధనను నిషేధించాడు. అందువల్ల ఫొటోలకు చిత్రాలకు విగ్రహాలకు బొమ్మలకు దూరంగా ఉండాలి. ఇవేకాక ఇతర షై’తాన్ మార్గాలన్నిటికీ దూరంగా ఉండాలి.

బు’ఖారీలో ఇలా ఉంది, నూహ్ జాతి విగ్రహాలను అరబ్ అవిశ్వాసులు అనుసరించారు. దౌమతుల్ జందల్ లో కల్బ్ వర్గం వారు వద్ద్ ను పూజించేవారు. హుజైల్ వర్గం వారు సువాను పూజించే వారు. ఇంకా మురాద్, సర్ఫ్ వారైన బనూగతీఫ్ తెగలవారు యగూస్ ను పూజించేవారు. హమ్దాన్ తెగవారు యఊఖ్ ను పూజించేవారు. హమీర్ తెగవారు నస్ర్ ను పూజించేవారు. ఈ విగ్రహాల పేర్లన్నీ నూహ్ జాతికి చెందిన మహా పురుషులవి. వీరి మరణానంతరం షైతాన్ ఈ మహావ్యక్తుల ఆరాధనాలయాల్లో వారి జ్ఞాపికలను స్ధాపించవలసిందిగా, ఆ కాలపు ప్రజల హృదయాల్లో ఆలోచనలను రేకెత్తించాడు. అనంతరం అక్కడ స్మారక చిహ్నాలు స్ధాపించడం జరిగింది. విగ్రహాల పేర్లతో వాటిని గురించి ప్రచారం చేయడం జరిగింది. స్మారక చిహ్నాలు స్ధాపించిన ఈ ప్రజలు బ్రతికి ఉన్నంతకాలం అక్కడ ఏపూజా జరగలేదు. వీరు మరణించిన తరువాత క్రొత్త తరంవారు ఆయా స్ధానాల్లో ఆరాధనలు, ప్రార్ధనలు, పూజలు, భజనలు ప్రారంభించారు. ఇక్రమ, దిహాక్, ఖతాదహ్ మొదలైన వారందరూ ఈ విధంగానే ఉల్లేఖించారు.

  ముహమ్మద్ బిన్ ఖైస్ కథనం: ఈ మహావ్యక్తులు, భక్తులు ఆదమ్(అ), నూ’హ్(అ)లను అనుసరించే వారు. ఇతరులు వీరిని అనుసరించేవారు. వీరి మరణానంతరం వీరి శిష్యులు ఒకవేళ మనం వీరి చిత్రాలు చేసి ఉంచుకుంటే, ఆరాధనలో శ్రధ్ధాభక్తులు అధికంగా ఉంటాయి. ఇంకా అధికం అవుతూ ఉంటాయి అని భావించారు. అలాగే చేయడం జరిగింది. వీరి మరణానంతరం వీరి సంతతిని, మీ పెద్దలు వారిని పూజించేవారని, వర్షం మొదలైనవాటి గురించి వారిని మొరపెట్టు కునేవారని ప్రేరేపించాడు. అది విన్నవారు ఆ మహాపురుషుల చిత్రాలను పూజించడం ప్రారంభించారు. హాఫిజ్ ఇబ్ను అసాకిర్ షీస్ వృత్తాంతంలో కథనం, ‘అబ్దుల్లాహ్ బిన్ ‘అబ్బాస్ (ర) కధనం, ఆదమ్ (అ)కు 40మంది సంతానం. 20మంది అబ్బాయిలు, 20 మంది అమ్మాయిలు. వీరిలో పెద్దవారు హాబీల్, ఖాబీల్, సాలిహ్ మరియు అబ్దుర్రహ్మాన్, ఇతని మొదటి పేరు అబ్దుల్ హారిస్ మరియు వద్ద్. ఇతన్ని షీస్ మరియు అబ్తుల్లాహ్ అని కూడా పిలిచే వారు. సోదరులందరూ ఇతన్ని నాయకునిగా గౌరవించే వారు. ఇతని సంతానం సువా, యగూస్, ఊఖ్ మరియు నస్ర్.

   ‘ఉర్వహ్ బిన్ ‘జుబైర్ (ర) కథనం, ఆదమ్(అ) మరణించి నపుడు అతని సంతానంలో వద్ద్, యగూస్, యఊఖ్, సవాఅ, నస్ర్ మాత్రమే మిగిలి ఉన్నారు. వీరందరిలో వద్ద్ పెద్ద వారూ మరియు సజ్జనులూను. ఇబ్ను అబీ’హాతిమ్ లో ఇలా ఉంది, అబూ జ’అఫర్ నమా’జు చదువుతున్నారు. ప్రజలు య’జీద్ బిన్ మహ్తాబ్ గురించి ప్రస్తావించారు. నమా’జు పూర్తయిన తరువాత వినండి, అన్నిటికంటే ముందు దైవేతరులను ఆరాధించినచోట అతడు వధించ బడ్డాడు. అదేమిటంటే, ఒక ముస్లిమ్ అల్లాహ్(త) భక్తుడు ఉండేవాడు. అతన్ని ప్రజలు చాలా అధికంగా ప్రేమించేవారు, గౌరవించేవారు. అతడు మరణించాడు. వారు అతని సమాధి వద్ద కూర్చోని ఏడ్వటం, పెడబొబ్బలు పెట్టటం ప్రారంభించారు. తీవ్ర దుఖ్ఖానికి గురయ్యారు. అది చూసిన షై’తాన్ వారి వద్దకు మానవరూపంలో వచ్చి, వారితో, ‘ఈ మహాపురుషుని స్మారక చిహ్నం నిర్మించు కుంటే బాగుంటుంది. ఎల్లప్డుడూ మీ ముందు ఉంటుంది, ఇంకా మీరు మరవరు,’ అని ప్రేరేపించాడు. అందరూ అతని సలహాను సమర్ధించారు. షై’తాన్ ఆ మహాపురుషుని చిత్రం తయారుచేసి వారి ముందు నిలబెట్టాడు. ప్రజలు దాన్ని చూసి గుర్తుచేసుకునే వారు. అతని గురించి గొప్పగా చెప్పుకునేవారు. అందరూ ఇందులో నిమగ్నమయిపోయారు. ‘మీ అందరికీ ఇక్కడకు రావలసివస్తుంది. కనుక నేను అనేక చిత్రాలను తయారుచేసి మీకు ఇస్తాను, మీరు తీసుకొని వెళ్ళి మీ ఇళ్ళల్లో ఉంచుకోండి,’ అని అన్నాడు. దానికి కూడా వారు, ‘సరే,’ అన్నారు. అప్పటివరకు ఈ చిత్రాలూ, విగ్రహాలూ స్మారక చిహ్నాలుగానే ఉండేవి. కాని వారి తరువాతి తరం వారు వీటిని ఆరాధించసాగారు. అసలు విషయాన్ని అందరూ మరచిపోయారు. తమ తాత ముత్తాతలు కూడా వాటిని అరాధించేవారుగా భావించి, వారు కూడా విగ్రహా రాధనలో నిమగ్నులయి పోయారు. అతని పేరు వుద్ద్. దైవానికి వ్యతిరేకంగా ఆరాధించిన మొట్టమొదటి విగ్రహం ఇదే. వారు చాలా మందిని వక్రమార్గానికి గురిచేసారు. అప్పటినుండి ఇప్పటి వరకు ప్రపంచంలో అల్లాహ్ (త) ను వదలి విగ్రహారాధన జరుగుతూ ఉంది. దైవ సృష్టితాలు మార్గం తప్పాయి. అందు వల్లే, ఇబ్రాహీమ్ (అ) అల్లాహ్ ను, ”ఓఅల్లాహ్(త) నన్నూ నా సంతా నాన్ని విగ్రహారాధన నుండి కాపాడు, వారు చాలా మందిని మార్గం తప్పించారు.” అని ప్రార్ధించేవారు.

   ఖుర్ఆన్ లో అల్లాహ్(త) నూహ్(అ) సంఘటనను ఇలా పేర్కొన్నాడు, నూహ్(అ) ఇలా ప్రార్ధించారు, ఓ నా ప్రభూ, వీరు నన్ను తిరస్కరించారు. వీరు విధేయత చూపినవారికి, వారి సంతానం ధనసంపదలు నష్టాన్నే అధికంచేసాయి. వీరు నీచ కుట్రపన్నారు. ఇంకా, ‘ఎంతమాత్రం మీ విగ్రహాలను వదలకండి, ఇంకా వుద్ద్ నూ, సువాఅను, యగూస్ ను, యఊఖ్ ను, నస్ర్ నూ వదలకండి’ అని అన్నారు. ఇంకా వారు చాలా మందిని మార్గం నుండి తప్పించారు. ‘ఓ నా ప్రభూ ఈ దుర్మార్గులను అంధకారంలో  ఇంకా లోపలికి నెట్టు.’

  కొందరు వస్తువులను ప్రారంభంలో స్మారక చిహ్నాలుగా తయారుచేస్తారు. వారి ఉద్దేశ్యం ఆరాధించాలని ఉండదు. కాని తరువాత పూజలు, ప్రార్ధనలు ప్రారంభమయిపోతాయి.  ఉదాహరణకు రి’ద్వాన్ చెట్టునే తీసుకోండి. దీని క్రింద ప్రవక్త(స) చేతిపై అనుచరులందరూ ప్రమాణం (బై’అత్) చేసారు. దీన్ని గురించి ఖుర్ఆన్, ‘హదీసు’ల్లో ఉంది. దీన్ని కూడా ‘ఉమర్ (ర)వ్రేళ్ళతో సహా నరికించివేసారు. ఇబ్ను ‘అబీ షైబ’అలో ఇలా ఉంది, ప్రజలు దర్శనం కోసం బైతు ర్రి’ద్వాన్ వద్దకు వస్తూ పోతూఉన్నారని, ‘ఉమర్ (ర)కు తెలిసింది. ఆయన వెంటనే దాన్ని నరికివేయమని ఆదేశించారు. దాన్ని వ్రేళ్ళతోసహా నరికి వేయడం జరిగింది.  (ఫత్హుల్  బయాన్).

‘అబ్దుల్లాహ్ బిన్ ‘ఉమర్ (ర), ‘ఆ చెట్టును దాచి వేయడం జరిగింది. దాన్ని దాచివేయడమే దైవ కారుణ్యం, లేకపోతే ప్రజలు దాన్నికూడా వదిలేవారు కారు’ , అని అన్నారు.

   మజాలిసుల్ అబ్రార్ 128,129 పేజీల్లో ఇలా ఉంది, ప్రజలు దర్శనంకోసం బైతుర్రి’ద్వాన్ వద్దకు వస్తూపోతూ ఉన్నారని, ‘ఉమర్(ర)కు తెలిసింది. అతడు వెంటనే సైనికులను పంపించి దాన్ని నరికి వేయమని ఆదేశించారు. దాన్ని వ్రేళ్ళతోసహా నరికివేయడం జరిగింది. ఈ సంఘటన ప్రస్తావించి తరువాత మజాలిసుల్ అబ్రార్ రచయిత ఇలా పేర్కొ న్నారు. ప్రవక్త(స) ఖలీఫహ్ ఆ బైతుర్రిద్వాన్ ను నరికి వేయించారు. దీన్నిగురించి అల్లాహ్(త) తన గ్రంథంలో పేర్కొన్నాడు. ఎందుకంటే ప్రజలు దాన్ని దర్శించ డానికి రావడం ప్రారంభించారు. క్రమంగా పూజలు, ప్రార్ధనలు ప్రారంభిస్తారని భయంవేసి, ప్రజల్లో కల్పిత ఆచారాలు, జనిస్తాయని దాన్ని నరికి వేయించారు.

   అదేవిధంగా ‘ఉమర్ (ర) పరిపాలనాకాలంలో ‘అబ్దుల్లాహ్ బిన్ తా’మిర్ సమాధి బహిర్గతం అయ్యింది. దీన్మిగురించి సూరహ్ బురూజ్ (85) లో ఉంది. అప్పుడు అతని సమాధిని అలాగే ఉంచి, సమాధి చిహ్నాలు లేకుండా చేసివేయమని ఆదేశించారు.

  స్మారక చిహ్నాలుగా ఎత్తైన కట్టడాలు కలిగి ఉన్న సమాధులను నేలకు సమానంగా చేయమని ఆదే శించడం జరిగింది. తరువాత వచ్చేవారు దాన్ని ప్రార్ధనాలయంగా చేసుకో కూడదని. ఎక్కడైనా చిత్రాలు, విగ్రహాలు కనబడితే, వాటిని తొలగించి వేసారు. విగ్రహాలకు కట్టడాలుగల సమాధులకు ఒకే ఆదేశం వర్తిస్తుంది.

ముస్లిమ్ లో ఇలా ఉంది, ‘అలీ(ర) అబుల్ ‘హయ్యా’జ్ అసదీతో, ప్రవక్త(స) ఏ పనిమీద నన్ను పంపారో, ఆపనిమీద నిన్ను పంపనా, అదేమిటంటే ప్రాణుల చిత్రాలను, బొమ్మలను, విగ్రహాలను నాశనం చేయటం, ఎత్తైన సమాధులను ఎక్కడ చూచినా నేలకు సమానంగా చేయటం.

  అబుల్ ‘హయ్యా’జ్ అసదీ (ర)  జాబిర్ (ర) ద్వారా కథనం, ప్రవక్త(స) సమాధిని ఎత్తుగా నిర్మించటాన్ని, సమాధిపై కట్టడాలు కట్టటాన్ని, సమాధిపై కూర్చోవటాన్ని నిషేధించారు.

  షేఖ్ అబ్దుల్ హఖ్ ముహద్దిస్ దెహల్వీ మిష్కాత్ అనువాదంలో సమాధిపై కూర్చోవటాన్ని ఎందుకు వారించారంటే, ఇది ముస్లిమ్ గౌరవ మర్యాదలకు వ్యతిరేకం. మరి కొందరు కాలకృత్యా లకు కూర్చోవటం నిషిధ్ధం’ అని పేర్కొన్నారు.

   హాఫిజ్ ఇబ్ను ఖయ్యిమ్, ఇఘాసాలో, ఇబ్ను తైమియ ద్వారా ఇలా పేర్కొన్నారు. షరీ’అత్ సమాధులను ప్రార్ధనాలయాలుగా చేయవద్దని వారించడానికి గల కారణాలు చాలా ప్రమాద కరమైనవి, నీచమైనవి. అవి ఎంతోమందిని మార్గ భ్రష్టత్వానికి, సాటి కల్పించటానికి, కల్పితాలకు గురిచేసాయి. ఎందుకంటే మహావ్యక్తుల సమాధులను గౌరవించటం అనేది విగ్రహాలను, రాళ్ళను, చెట్లను దైవానికి సాటి కల్పించటం కంటే చాలా ప్రభావ పూరితమైనది, ప్రమాదకర మైనది. అందువల్లే మనం చూస్తూ ఉంటాం, ఒకవ్యక్తి సమాధి వద్ద ఏడ్చినంత, పెడబొబ్బలు పెట్టినంత, వినయ విధేయతలు ప్రదర్శించి నంత అధికంగా నమాజుల్లో, తహజ్జుద్ లో ప్రార్ధనల్లో ప్రదర్శించడు. సమాధుల వద్ద నమా’జులు, ఉపవాసాల్లో ఉన్నంత నమ్మకం, మస్జిదుల్లో నమా’జులు, ఉపవాసాల్లో ఉండదు. ఇటువంటి మహా ఉపద్రవాలను అంటే సమాధి పూజలను, సృష్టితాల పూజలను అంతం చేయటానికి ప్రవక్త(స) సమాధుల వద్ద నమా’జు చేయరాదని ప్రజలను కఠినంగా వారించి ఉన్నారు. సమాధి గౌరవం ఆలోచన ఉన్నా, లేక పోయినా అక్కడ మాత్రం నమాజు చదవరాదు. ప్రవక్త (స) సూర్యుడు ఉదయించినపుడు, నడినెత్తిన ఉన్నప్పుడు, సూర్యాస్తమయం అవుతున్నప్పుడు నమా’జు చదవటాన్ని వారించారు. ఎందుకంటే ఈ సమయాల్లో విగ్రహారాధకులు సూర్యున్ని పూజిస్తారు. ఎవరైనా శభంకోసం లేదా శుభంలో ఆధిక్యత కోసం సమాధి వద్ద నమా’జు చదివితే, అది సమాధి ఆరాధనగా పరిగణించబడుతుంది. ఇది ఇస్లామ్ ధర్మానికి సరాసరి వ్యతిరేకం. అల్లాహ్(త), ఆయన ప్రవక్త  ఇలాంటి ఆదేశం ఎప్పుడూ ఇచ్చి ఉండ లేదు. పైగా ఇటువంటి పనులనుండి వారించి ఉన్నారు.

   మజాలిసుల్ అబ్రార్ లో ఇలా ఉంది, ప్రవక్త(స) ఇటువంటి కల్లోలం (సమాధి పూజ) నుండి వారించి నపుడు, విగ్రహారాధనకు కారణమైన ఈ కల్లోలం ఎంత ప్రమాదకరమైనదో తెలుస్తుంది. చాలామంది కేవలం కూర్చున్నా, పడుకున్నా, నడుస్తున్నా, సమాధుల్లో ఉన్నవారిని ఓ ప్రభూ, ఓ దేవా అని ప్రార్ధించటం, మొరపెట్టుకోవటం, సహాయం కోరటం వల్లనే నాశనం అయ్యారు. ఇటువంటివారు మస్జిదుల్లో నమా’జు చదవడం కంటే సమాధుల వద్ద నమా’జు చదవటం ఉత్తమంగా భావిస్తారు.

   ‘హాఫి”జ్ ఇబ్నుల్ ఖయ్యిమ్, గాసాలో ఇలా పేర్కొన్నారు, ‘ఎవరైనా ఈ కాలం ముస్లిముల వాక్కర్మలు, ఆచరణలు, ప్రవక్త(స), అనుచరుల వాక్కర్మలు, ఆచరణలు పరికించి చూస్తే, రెంటికీ భూమ్యాకాశమంత తేడా కనబడుతుంది. ఉదాహ రణకు కొన్నివిషయాలను గమనించండి.’

1. ప్రవక్త(స), ప్రవక్తల సమాధుల వద్ద నమా’జు చదవటాన్ని వారించారు. కాని ఈ నాడు ముస్లిములు శ్రధ్ధాభక్తులతో అక్కడ నమా’జు చదువుతున్నారు.

2. ప్రవక్త(స), సమాధులపై మస్జిదులు నిర్మించటాన్ని వారించారు. కాని ఈనాడు ముస్లిములు సమాధులపై మస్జిదులు నిర్మిస్తున్నారు. దానికి దర్గా అని పేరు పెడుతున్నారు.

3. ప్రవక్త(స), సమాధులపై దీపాలు వెలిగించటాన్ని వారించారు. కాని ముస్లిమ్ సమాధి పూజారులు సమాధులపై దీపాలు వెలిగిస్తున్నారు. పైగా దానికోసం తమ ఆస్తులను దానం చేస్తున్నారు.

4. ప్రవక్త(స) సమాధులను సిమెంటు, ఇటుకలతో ఎత్తుగా చేయడాన్ని వారించారు. కాని ఈ నాటి ముస్లిములు సమాధులపై ఎత్తైన కట్టడాలు, గోపురాలు నిర్మిస్తున్నారు.

5. ప్రవక్త(స), సమాధులపై ఎత్తైన కట్టడాలు, గోపురాలు నిర్మించటాన్ని, వాటిపై వ్రాయటాన్ని వారించారు. కాని ఈ నాటి ముస్లిములు సమాధులపై ఎత్తైన కట్టడాలు, గోపురాలు నిర్మిస్తున్నారు, వాటిపై ఖుర్ఆన్ వాక్యాలు వ్రాయిస్తున్నారు.

6. ప్రవక్త(స), సమాధులపై అవసరానికి మించి, మట్టిని వేయటాన్ని వారించారు. కాని ఈనాటి ముస్లిములు సమాధులపై మట్టికి బదులు సిమెంటు, ఇటుకలు, రాళ్ళతో దృఢమైన, ఎత్తైన కట్టడాన్ని నిర్మిస్తున్నారు.

7. ప్రవక్త(స), సమాధులను జాతరలు, ఉత్సవాల కేంద్రాలుగా చేయవద్దని వారించారు. కాని ఈనాటి ముస్లిములు సమాధుల వద్ద కొన్ని దినాలను నిర్ణయించుకొని, కల్పిత ఉత్సవాలు, జాతరలు జరుపు కుంటున్నారు.

  సారాంశం ఏమిటంటే వీరు ప్రవక్త(స) ఆదేశాలకు వ్యతిరేకులు, ఇస్లామ్ శత్రువులు. దీన్ని గురించి మిస్బాహుల్ మూమినీన్ ఉర్దూ అనువాదం బలాగుల్ ముబీన్ లో వివరంగా పేర్కొన్నాము. ప్రాణుల చిత్రాలు, విగ్రహాలు, స్మారక చిహ్నాలు నిర్మించడం శాపానికి గురిచేస్తుంది, ఇంకా సాటి కల్పించటం అవుతుంది. ఇక ‘హదీసు’ల అనువాదాన్ని పరిశీలిద్దాం.

اَلْفَصْلُ الْأَوَّلُ మొదటి విభాగం    

4489 – [ 1 ] ( متفق عليه ) (2/1273)

عَنْ أَبِيْ طَلْحَةَ قَالَ: قَالَ النَّبِيُّ صلى الله عليه وسلم: “لَا تَدْخُلُ الْمَلَائِكَةُ بَيْتًا فِيْهِ كَلْبٌ وَلَا تَصَاوِيْرُ”.

4489. (1) [2/1273ఏకీభవితం]  

అబూ ‘తల్‌’హా (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”కుక్కలు, ప్రాణుల చిత్రాలు ఉన్న ఇళ్ళల్లో దైవదూతలు ప్రవేశించరు.” (బు’ఖారీ, ముస్లిమ్‌)

4490 – [ 2 ] ( صحيح ) (2/1273)

وَعَنِ ابْنِ عَبَّاسٍ عَنْ مَيْمُوْنَةَ: أَنَّ رَسُولَ اللهِ صلى الله عليه وسلم أَصْبَحَ يَوْمًا وَاجِمًا وَقَالَ: “إِنَّ جِبْرِيْلَ كَانَ وَعَدَنِيْ أَنْ يَلْقَانِيَ اللَّيْلَةَ فَلَمْ يَلْقَنِيْ أَمْ وَاللهِ مَا أَخْلَفَنِيْ”. ثُمَّ وَقَعَ فِيْ نَفْسِهِ جَرْوُ كَلْبٍ تَحْتَ فُسْطَاطٍ لَهُ فَأَمَرَ بِهِ فَأُخْرِجَ ثُمَّ أَخَذَ بِيَدِهِ مَاءً فَنَضَحَ مَكَانَهُ فَلَمَّا أَمْسَى لَقِيَهُ جِبْرَيِلُ فَقَالَ: “لَقَدْ كُنْتَ وَعَدْتَنِيْ أَنْ تَلْقَانِيَ الْبَارِحَةَ”. قَالَ: أَجَلْ وَلَكِنَّا لَا نَدْخُلُ بَيْتًا فِيْهِ كَلْبٌ وَلَا صُوْرَةٌ فَأَصْبَحَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم يَوْمَئِذٍ فَأَمَرَ بِقَتْلِ الْكِلَابِ حَتّى إِنَّهُ يَأْمُرُ بِقَتْلِ الْكَلْبِ الْحَائِطِ الصَّغِيْرِ وَيَتْرُكُ كَلْبَ الْحَائِطِ الْكَبِيْرِ. رَوَاهُ مُسْلِمٌ.

4490. (2) [2/1273 దృఢం]

ఇబ్నె ‘అబ్బాస్‌ (ర) మైమూనహ్‌ (ర) ద్వారా కథనం: ఒక రోజు ఉదయం ప్రవక్త (స) చాలా విచారంగా, మౌనంగా లేచారు. ఇంకా, ‘జిబ్రీల్‌ (అ) ఈ రోజు రాత్రి నన్ను కలుస్తానని వాగ్దానం చేసారు. కాని నన్ను కలవలేదు. అల్లాహ్ సాక్షి! జిబ్రీల్‌ (అ) ఏనాడూ నాతో వాగ్దాన భంగం చేయలేదు,’ అని అన్నారు. ఆ తరువాత కుక్కపిల్ల గురించి ఆలోచన వచ్చింది. ఆ కుక్క పిల్ల ఖైమలో ఒక ప్రక్క కూర్చొని ఉంది. దాన్ని బయటకు తీసివేయమని ఆదేశించారు. దాన్ని బయటకు తీసివేయటం జరిగింది. ఆ తరువాత ప్రవక్త (స) ఆ ప్రదేశంలో తన చేత్తో నీళ్ళు తీసుకొని చిలకరించారు. సాయంత్రం జిబ్రీల్‌ (అ) వచ్చారు. అప్పుడు ప్రవక్త(స), ‘నిన్నటి రాత్రి కలుస్తానని వాగ్దానంచేసి కలువలేదు,’ అని విన్నవించుకున్నారు. దానికి జిబ్రీల్‌ (అ) సమాధానమిస్తూ, ‘అప్పుడు మీ ఇంట్లో కుక్కఉండేది, కుక్క మరియు ప్రాణుల చిత్రాలు ఉన్న ఇంట్లో మేము ప్రవేశించం,’ అని అన్నారు. మరుసటి రోజు ప్రవక్త(స) కుక్కలను చంపివేయండని ఆదేశించారు. చివరికి తోటల కాపలా కుక్కలను కూడా చంపమని ఆదేశించారు. పెద్దపెద్ద తోటల కాపలా కుక్కలను వదలివేయమన్నారు. (ముస్లిమ్‌)

4491 – [ 3 ] ( صحيح ) (2/1273)

وَعَنْ عَائِشَةَ رَضِيَ اللهُ عَنْهَا أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم لَمْ يَكُنْ يَتْرُكُ فِيْ بَيْتِهِ شَيْئًا فِيْهِ تَصَالِيْبُ إِلَّا نَقَضَهُ. رَوَاهُ الْبُخَارِيُّ.

4491. (3) [2/1273దృఢం]

‘ఆయి’షహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) తన ఇంట్లోని ప్రాణుల చిత్రాలు ఉన్న ఎటువంటి చిత్రపటాన్ని వదిలేవారు కారు. దాన్ని చింపివేసేవారు. [42] (బు’ఖారీ)

4492 – [ 4 ] ( متفق عليه ) (2/1273)

وَعَنْهَا أَنَّهَا اِشْتَرَتْ نُمْرُقُةً فِيْهَا تَصَاوِيْرُ فَلَمَّا رَآهَا رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم قَامَ عَلَى الْبَابِ فَلَمْ يَدْخُلْ فَعَرَفْتُ فِيْ وَجْهِهِ الْكَرَاهِيَةَ قَالَتْ: فَقُلْتُ: يَا رَسُوْلَ اللهِ أَتُوْبُ إِلَى اللهِ وَإِلى رَسُوْلِهِ مَا أَذْنَبْتُ؟ فَقَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَا بَالُ هَذِهِ النُّمْرُقَةِ؟” قُلْتُ اِشْتَرَيْتُهَا لَكَ لِتَقْعُدَ عَلَيْهَا وَتَوَسَّدَهَا فَقَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِنَّ أَصْحَابَ هَذِهِ الصُّوَرِ يُعَذَّبُوْنَ يَوْمَ الْقِيَامَةِ. وَيُقَالُ لَهُمْ: أَحْيُوْا مَا خَلَقْتُمْ”. وَقَالَ: “إِنَّ الْبَيْتَ الَّذِيْ فِيْهِ الصُّوْرَةُ لَا تَدْخُلُهُ الْمَلَائِكَةُ”.

4492. (4) [2/1273 ఏకీభవితం]

‘ఆయి’షహ్‌ (ర) ప్రవక్త (స) కోసం ఒక తలగడ కొన్నారు. కాని దానిపై ప్రాణుల చిత్రాలు ఉండేవి. ప్రవక్త (స) దాన్ని చూచి తలుపువద్దనే నిలబడిపోయారు. ఇంటిలోపలికి రాలేదు. ‘ఆయి’షహ్‌ (ర) ప్రవక్త (స) ఆగ్రహాన్ని, అసహ్యాన్ని గ్రహించి, ‘ప్రవక్తా! అల్లాహ్‌ మరియు ఆయన ప్రవక్త (స) వ్యతిరేకత నుండి నేను శరణుకోరుతున్నాను, నేనేం పాపం చేసానని తమరు ఇంట్లోకి రావటం లేదు,’ అని విన్నవించుకున్నారు. అప్పుడు ప్రవక్త (స), ‘ఈ తలగడ నీవు ఎక్కడి నుండి తెచ్చావు, ఎందుకు తెచ్చావు, దానిపై ఈ బొమ్మలు ఉన్నాయి,’ అడిగారు. దానికి ‘ఆయి’షహ్‌ (ర), ‘తమరు కూర్చుంటారని, అప్పుడప్పుడూ దాన్ని తలగడగా ఉపయోగిస్తారని, దాన్ని నేను కొన్నాను’ అని విన్నవించుకున్నారు. అప్పుడు ప్రవక్త (స) ఈ చిత్రాలు వేసేవారికి తీర్పు దినాన శిక్షించడం జరుగు తుంది. ఇంకా వారితో మీరు తయారుచేసిన చిత్రా లలో ప్రాణం పోయండి, ఆత్మలు ప్రవేశింప జేయండి,’ అని అనబడు తుంది. అది వారివల్ల ఎంత మాత్రం సాధ్యంకాదు. ఇలా ఆదేశించడం జరుగు తుంది. ఇంకా ప్రాణుల చిత్రాలు ఉన్న ఇంట్లో కారుణ్య దూతలు ప్రవేశించరు,’ అని ప్రవచించారు. (బు’ఖారీ, ముస్లిమ్‌)

4493 – [ 5 ] ( متفق عليه ) (2/1274)

وَعَنْهَا أَنَّهَا كَانَتْ عَلَى سَهْوَةٍ لَهَا سِتْرًا فِيْهِ تَمَاثِيْلُ فَهَتَكَهُ النَّبِيُّ صلى الله عليه وسلم فَاتَّخَذَتْ مِنْهُ نُمْرُقَتَيْنِ فَكَانَتَا فِي الْبَيْتِ يَجْلِسُ عَلَيْهِمْ .

4493. (5) [2/1274ఏకీభవితం]

‘ఆయి’షహ్‌ (ర) తన ఇంటిలో ఒక తెర తగిలించారు. దానిపై ప్రాణుల చిత్రాలు ఉండేవి. ప్రవక్త (స) ఆ తెరను  చించివేసారు. చిత్రం కూడా చిరిగిపోయింది. ‘ఆయి’షహ్‌ (ర) ఆ వస్త్రంతో రెండు తలగడలు చేసారు. ప్రవక్త (స) వాటిద్వారా విశ్రాంతి తీసుకునేవారు. (బు’ఖారీ, ముస్లిమ్‌)

4494 – [ 6 ] ( متفق عليه ) (2/1274)

وَعَنْهَا أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم خَرَجَ فِيْ غَزَاةٍ فَأَخَذْتُ نَمَطًا فَسَتَرْتُّهُ عَلَى الْبَابِ فَلَمَّا قَدِمَ فَرَأَى النَّمَطَ فَجَذَبَهُ حَتّى هَتَكَهُ ثُمَّ قَالَ: “إِنَّ اللهَ لَمْ يَأْمُرْنَا أَنْ نَكْسُوَ الْحِجَارَةَ وَالطِّيْنَ”.

4494. (6) [2/1274  ఏకీభవితం]

‘ఆయి’షహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ఒక యుద్ధంలో వెళ్ళారు. ప్రవక్త (స) వెళ్ళిన తర్వాత నేను ఒక వస్త్రం కొన్నాను. దానిపై  ప్రాణుల చిత్రాలు ఉండేవి, దాన్ని ద్వారానికి అమర్చాను. ప్రవక్త (స) యుద్ధం నుండి తిరిగి వచ్చి తెరను చూసి, లాగి చించివేసారు. ఇంకా, ‘అల్లాహ్‌ (త) నన్ను రాళ్ళను, మట్టిని వస్త్రం తొడిగించే అనుమతి ఇవ్వలేదు,’ అని అన్నారు. [43] (బు’ఖారీ, ముస్లిమ్‌)

4495 – [ 7 ] ( متفق عليه ) (2/1274)

وَعَنْهَا عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ: “أَشَدُّ النَّاسِ عَذَابًا يَوْمَ الْقِيَامَةِ الَّذِيْنَ يُضَاهُوْنَ بِخَلْقِ اللهِ”.

4495. (7) [2/1274 ఏకీభవితం]

‘ఆయి’షహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”తీర్పు దినం నాడు అల్లాహ్‌(త) సృష్టించిన ప్రాణుల నకిలీ చిత్రాలు చేసేవారిని, అంటే ప్రాణుల చిత్రాలు తయారు చేసే వారిని అందరికంటే కఠినంగా శిక్షించటం జరుగుతుంది.” (బు’ఖారీ, ముస్లిమ్‌)

4496 – [ 8 ] ( متفق عليه ) (2/1274)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: سَمِعْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ: “قَالَ اللهُ تَعَالى: )وَمَنْ أَظْلَمُ مِمَّن ذَهَبَ يَخْلُقُ كَخَلْقِيْ فَلْيَخْلُقُوْا ذَرَّةً أَوْ لِيَخْلُقُوْا حَبَّةً أَوْ شَعِيْرَةً”(. متفق عليه.

4496. (8) [2/1274ఏకీభవితం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ఇలా ప్రవచిస్తూ ఉండగా నేను విన్నాను. అల్లాహ్‌ ఆదేశం, ”నేను సృష్టించే వాటిలా సృష్టించే అంటే చిత్రాలు వేసేవాడి కంటే దుర్మార్గుడు మరెవడు కాగలడు? అతడిని ఒక చీమ లేదా ఒక గోధుమ గింజ సృష్టించి చూపమనండి.”[44] (బు’ఖారీ, ముస్లిమ్‌)

4497 – [ 9 ] ( متفق عليه ) (2/1274)

وَعَنْ عَبْدِ اللهِ بْنِ مَسْعُوْدٍ قَالَ: سَمِعْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ: “أَشَدُّ النَّاسِ عَذَابًا عِنْدَ اللهِ الْمُصَوِّرُوْنَ”.

4497. (9) [2/1274ఏకీభవితం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ మస్‌’ఊద్‌ (ర) కథనం: ప్రవక్త (స) ఇలా ప్రవిచిస్తూ ఉండగా నేను విన్నాను, ”ప్రాణుల చిత్రాలు తయారుచేసే వారిని తీర్పుదినం నాడు అందరి కంటే కఠినంగా శిక్షించడం జరుగుతుంది.” (బు’ఖారీ, ముస్లిమ్‌)

4498 – [ 10 ] ( متفق عليه ) (2/1274)

وَعَنِ ابْنِ عَبَّاسٍ قَالَ: سَمِعْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ: “كُلُّ مُصَوِّرٍفِي النَّارِيَجْعَلُ لَهُ بِكُلِّ صُوْرَةٍ صَوَّرَهَا نَفْسًا فَيُعَذِّبُهُ فِيْ جَهَنَّمَ”. قَالَ ابْنُ عَبَّاسٍ: فَإِنْ كُنْتُ لَابُدَّ فَاعِلًا فَاصْنَعِ الشَّجَرَوَمَا لَا رُوْحَ فِيْهِ.

4498. (10) [2/1274 ఏకీభవితం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘అబ్బాస్‌ (ర) కథనం: ప్రవక్త (స) ఇలా ప్రవచిస్తూ ఉండగా నేను విన్నాను, ”ప్రాణుల చిత్రాలు తయారుచేసే ప్రతిఒక్కరినీ నరకంలో వేయబడును. ఇంకా వారితో, చేసిన చిత్రాలన్నింటిలో  ప్రాణం పోయమని ఆదేశించటం జరుగును. వారు ఎలాగూ ప్రాణం పోయలేరు, అందువల్ల నరకంలోనే ఉండవలసి వస్తుంది. ఇబ్నె ‘అబ్బాస్‌ (ర) అభిప్రాయం, ”ఒకవేళ చిత్రం వేసే అవసరంవస్తే చెట్లు, నిర్జీవ వస్తువుల చిత్రాలు వేసుకోండి.” (బు’ఖారీ, ముస్లిమ్‌) అంటే బట్టలపై, దుస్తులపై నిర్జీవ ఫలాల, ఆకుల, వస్తువుల చిత్రాలు వేసుకోవచ్చును.

4499 – [ 11 ] ( صحيح ) (2/1275)

وَعَنْهُ قَالَ: سَمِعْتُ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ: “مَنْ تَحَلَّمَ بِحُلْمٍ لَمْ يَرَهُ كُلِّفَ أَنْ يَعْقِدَ بَيْنَ شَعِيْرَتَيْنِ وَلَنْ يَفْعَلَ وَمَنِ اسْتَمَعَ إِلى حَدِيْثِ قَوْمٍ وَهُمْ لَهُ كَارِهُوْنَ أَوْ يَفِرُّوْنَ مِنْهُ صُبَّ فِيْ أُذُنَيْهِ الْآنَكُ يَوْمَ الْقِيَامَةِ. وَمَنْ صَوَّرَ صُوْرَةً عُذِّبَ وَكُلِّفَ أَنْ يَنْفُخَ فِيْهَا وَلَيْسَ بِنَافِخٍ”. رَوَاهُ الْبُخَارِيُّ.

4499. (11) [2/1275దృఢం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘అబ్బాస్‌ (ర) కథనం: ప్రవక్త (స) ఇలా ప్రవచిస్తూ ఉండగా నేను విన్నాను. చూడని కలను చూసానని ప్రస్తావించే వారిని తీర్పుదినం నాడు రెండు జొన్నల మధ్య ముడివేయమని ఆదేశించడం జరుగు తుంది. అతడు ఎన్నడూ అలా చేయలేడు. అదే విధంగా ఒక జాతి రహస్యాలను చెవియొగ్గి విన్నవాడిని తీర్పుదినం నాడు అతని చెవిలో సీసం కరిగించి పోయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రాణుల చిత్రాలు తయారుచేసిన వారిని శిక్షించడం జరుగుతుంది. ఇంకా వాటిలో ప్రాణం పోయమని నిర్బంధించడం జరుగు తుంది. ఆ వ్యక్తి ఎంత గింజుకున్నా వాటిలో ప్రాణం పోయలేడు.”  (బు’ఖారీ)

4500 – [ 12 ] ( صحيح ) (2/1275)

وَعَنْ بُرَيْدَةَ أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم قَالَ: “مَنْ لَعِبَ بِالنَّرْدِشيْر فَكَأَنَّمَا صَبَغَ يَدَهُ فِيْ لَحْمِ خِنْزِيْرٍ وَدَمِهِ”. رَوَاهُ مُسْلِمٌ.

4500. (12) [2/1275దృఢం]

బురైదహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”చదరంగం ఆడిన వ్యక్తి పందిరక్తంలో చేతులు ముంచినట్టే. తన చేతితో పందిమాంసం పట్టినట్టే.”  [45]  (ముస్లిమ్‌)

—–

اَلْفَصْلُ الثَّانِيْ  రెండవ విభాగం 

4501 – [ 13 ] ( صحيح ) (2/1275)

عَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “أَتَانِيْ جِبْرِيْلُ عَلَيْهِ السَّلَامَ قَالَ: أَتَيْتُكَ الْبَارِحَةَ فَلَمْ يَمْنَعْنِيْ أَنْ أَكُوْنَ دَخَلْتُ إِلّا أَنَّهُ كَانَ عَلَى الْبَابِ تَمَاثِيْلُ وَكَانَ فِي الْبَيْتِ قِرَامٌ سِتْرٌفِيْهِ تَمَاثِيْلُ وَكَانَ فِي الْبَيْتِ كَلْبٌ فَمُرْبِرَأسِ التِّمْثَالِ الَّذِيْ عَلَى بَابِ الْبَيْتِ فَيُقْطَعَ فَيَصِيْرُكَهَيْئَةِ الشَّجَرَةِ وَمُرْ بِالسِّتْرِ فَلْيُقْطَعْ فَلْيُجْعَلْ وَسَادَتَيْنِ مَنْبُوْذَتَيْنِ تُوْطَآنِ وَمُرْبِالْكَلْبِ فَلْيَخْرُجْ”. فَفَعَلَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم. رَوَاهُ التِّرْمِذِيُّ وأَبُوْ دَاوُدَ

4501. (13) [2/1275దృఢం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”నా వద్దకు జిబ్రీల్‌ (అ) వచ్చారు. ‘రేపు రాత్రి మిమ్మల్ని కలవ టానికి వస్తాను’ అని వాగ్దానం చేసారు. కాని రాలేదు. ఆ తరువాత వచ్చి, ‘నాకు మీ ఇంట్లో రానీయకుండా ఏదీ ఆపలేదు, కాని మీ ఇంట్లో ప్రాణుల చిత్రాలుఉండేవి. ప్రాణులచిత్రాలు, కుక్కలు ఉన్నచోట మేము ప్రవేశించలేము. తమరు దాన్ని చింపివేయమని, దానితో రెండు తలగడలు చేయించు కోమని, కుక్కను ఇంటి నుండి బయటకు తీసు కెళ్ళమని ఆదేశించమని,’ అన్నారు. ప్రవక్త (స) అలాగే చేసారు.” (తిర్మిజి’, అబూ దావూద్‌)

4502 – [ 14 ] ( لم تتم دراسته ) (2/1275)

وَعَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “يَخْرُجُ عُنُقٌ مِنَ النَّارِ يَوْمَ الْقِيَامَةِ لَهَا عَيْنَانِ تَبْصُرَانِ وَأُذُنَانِ تَسْمَعَانِ وَلِسَانٌ يَنْطِقُ يَقُوْلُ: إِنِّيْ وُكِّلْتُ بِثَلَاثَةٍ: بِكُلِّ جَبَّارٍ عِنِيْدٍ وَكُلِّ مَنْ دَعَا مَعَ اللهِ آلِهَا آخَرَ وَبِالْمُصَوِّرِيْنَ”. رَوَاهُ التِّرْمِذِي .

4502. (14) [2/1275అపరిశోధితం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”తీర్పుదినం నాడు నరకంలో నుండి ఒక మెడ బయటకు వస్తుంది. దానికి రెండు కళ్ళు ఉంటాయి, రెండు చెవులు ఉంటాయి, నోరు ఉంటుంది. ఇవన్నీ చూస్తాయి, వింటాయి, మాట్లాడుతాయి. ఇంకా నేను ముగ్గురిపై నియమించబడ్డాను అంటే మూడు రకాల వ్యక్తులపై నియమించబడ్డాను. వారిని నరకంలోనికి తీసుకొని వెళతాను: 1. అహంకారులు, 2. సాటి కల్పించే వారు, 3. ప్రాణుల చిత్రాలు వేసేవారు అని అంటుంది. (తిర్మిజి’)

4503 – [ 15 ] ( صحيح ) (2/1276)

وَعَنِ ابْنِ عَبَّاسٍ عَنْ رَسُوْلِ الله صلى الله عليه وسلم قَالَ: “إِنَّ اللهَ تَعَالى حَرَّمَ الْخَمْرَ وَالْمَيْسِرَ وَالْكُوْبَةَ وَقَالَ: كُلُّ مُسْكِرٍ حَرَامٌ”. قِيْلَ: اَلْكُوْبَةُ الطَّبْلُ. رَوَاهُ الْبَيْهَقِيُّ فِيْ شُعَبِ الْإِيْمَانِ  .

4503. (15) [2/1276దృఢం]

ఇబ్నె అబ్బాస్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”అల్లాహ్‌ (త) మద్యపానం, జూదాన్ని, ఇంకా ప్రతి మత్తు పదార్థాన్ని నిషేధించాడు.” (బైహఖీ / షు’అబిల్ ఈమాన్)

4504 – [ 16 ] ( لم تتم دراسته ) (2/1276)

وَعَنِ ابْنِ عُمَرَ: أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم نَهَى عَنِ الْخَمْرِ وَ الْمَيْسِرِ وَالْكُوْبَةِ وَالْغَبِيْرَاءِ. الْغَبِيْرَاءُ: شَرَابٌ يَعْمَلُهُ الْحَبَشَةُ مِنَ الذُّرَةِ يُقَالُ لَهُ: السُّكُرْكَةُ. رَوَاهُ أَبُوْ دَاوُدَ  .

4504. (16) [2/1276అపరిశోధితం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘ఉమర్‌ (ర) కథనం: ప్రవక్త (స) సారాయి సేవించటాన్ని, జూదాన్నీ నిషేధించారు. ఇంకా గబీరాను ఉపయోగించటాన్ని వారించారు. దీనితో  హబ్షా ప్రజలు జొన్న మత్తుపానీయం తయారుచేసి త్రాగుతారు. దీన్ని సక్రుక్ అనికూడా అంటారు.(అబూ దావూద్‌)

4505 – [ 17 ] ( لم تتم دراسته ) (2/1276)

وَعَنْ أَبِيْ مُوْسَى الْأَشْعَرِيِّ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم قَالَ: “مَنْ لَعِبَ بِالنَّرْدِ فَقَدْ عَصَى اللهَ وَرَسُوْلَهُ”. رَوَاهُ أَحْمَدُ وَأَبُوْ دَاوُدَ .

4505. (17) [2/1276అపరిశోధితం]

అబూ మూసా అష్‌’అరీ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”చదరంగం ఆడేవారు అల్లాహ్‌(త), ఆయన ప్రవక్తల అవిధేయులు.” (అ’హ్మద్‌, అబూ  దావూద్‌)

ఎందుకంటే  ఇటువంటి వారు  జూదగాళ్ళు.

4506 – [ 18 ] ( حسن ) (2/1276)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ: أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم رَأَى رَجُلًا يَتْبَعُ حَمَّامَةً فَقَالَ: “شَيْطَانٌ يَتْبَعُ شَيْطَانَةُ”. رَوَاهُ أْحَمَدُ وَأَبُوْ دَاوُدَ وَابْنُ مَاجَهُ وَالْبَيْهَقِيُّ فِيْ شُعَبِ الْإِيْمَانِ .

4506. (18) [2/1276ప్రామాణికం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ”ప్రవక్త (స) ఒక వ్యక్తిని చూసారు. పావురాల వెంట పడి ఉన్నాడు. అంటే పావురాలను వేటాడుతున్నాడు. ప్రవక్త (స), ‘వీడు షైతాన్‌, షైతాన్‌ వీడి వెంటపడి ఉన్నాడు,’ అని అన్నారు.” [46]   (అహ్మద్‌, అబూ దావూద్‌, ఇబ్నె మాజహ్, బైహఖీ – షు’అబిల్ ఈమాన్)

—–

اَلْفَصْلُ الثَّالِثُ  మూడవ విభాగం 

4507 – [ 19 ] ( صحيح ) (2/1276)

عَنْ سَعِيْدِ بْنِ أَبِي الْحَسَنِ قَالَ: كُنْتُ عِنْدَ ابْنِ عَبَّاسٍ إِذْ جَاءَهُ رَجُلٌ فَقَالَ: يَا ابْنَ عَبَّاسٍ إِنِّيْ رَجُلٌ إِنَّمَا مَعِيْشَتِيْ مِنْ صُنْعَةِ يَدِيْ وَإِنِّيْ أَصْنَعُ هَذِهِ التَّصَاوِيْرَ. فَقَالَ ابْنُ عَبَّاسٍ: لَا أُحدِّثُكَ إِلَّا مَا سَمِعْتُ مِنْ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم سَمِعْتُهُ يَقُوْلُ: “مَنْ صَوَّرصُوْرَةً فَإِنَّ اللهَ مُعَذِّبُهُ حَتّى يَنْفُخَ فِيْهِ الرُّوْحَ وَلَيْسَ بِنَافِخِ فِيْهَا أَبَدًا”. فَرَبَا الرَّجُلُ رَبْوَةً شَدِيْدَةً وَاصْفَرَّ وَجْهَهُ فَقَالَ: وَيْحَكَ إِنْ أَبَيْتَ إِلَّا أَنْ تَصْنَعَ فَعَلَيْكَ بِهَذَا الشَّجَرِ وَكُلِّ شَيْءٍ لَيْسَ فِيْهِ رُوْحٌ. رَوَاهُ الْبُخَارِيُّ .

4507. (19) [2/1276దృఢం]

స’యీద్‌ బిన్‌ అబిల్‌ ‘హసన్‌ కథనం: నేను ఇబ్నె ‘అబ్బాస్‌ వద్ద కూర్చొని ఉన్నాను. ఇంతలో ఒక వ్యక్తి వచ్చి, ”నేను చేతి వృత్తి పనివాడను, చేతి పనుల ద్వారా సంపాదిస్తాను. ఇంకా నేను చిత్రాలు కూడా వేస్తాను. అయితే ఈ నా సంపాదన ధర్మమా? అధర్మమా” అని ప్రశ్నించాడు? ఇబ్నె ‘అబ్బాస్‌ (ర) ఈ విషయంలో నేను ప్రవక్త (స) ద్వారా ఇలా విన్నాను. దాన్నే నీకు వినిపిస్తాను. ”ప్రాణుల చిత్రాలు వేసేవాడికి అల్లాహ్‌ (త) ఆ చిత్రంలో ప్రాణం పోసేవరకు శిక్షిస్తాడు. ఎప్పటికీ, అతడు ప్రాణం పోయలేడు.” అది విని ఆ వ్యక్తి నిట్టూర్పు విడిచాడు, అతని ముఖవర్చస్సు మారి పోయింది. అంటే అతడు భయంతో వణకసాగాడు. ఇబ్నె ‘అబ్బాస్‌ అతని పరిస్థితి చూచి, ‘చాలా విచారించ వలసిన విషయం, ఒకవేళ నువ్వు ఈ వృత్తినే అవలంబించాలనుకుంటే నిర్జీవచిత్రాలు వేసి ఉపాధి సంపాదించుకో. ఎందుకంటే నిర్జీవచిత్రాలు వేయటంలో ఏమాత్రం అభ్యంతరం లేదు,’ అని అన్నారు. (బు’ఖారీ)

4508 – [ 20 ] ( متفق عليه ) (2/1277)

وَعَنْ عَائِشَةَ قَالَتْ: لَمَّا اشْتَكَى النَّبِيُّ صلى الله عليه وسلم ذَكَرَ بَعْضُ نِسَائِهِ كَنِيْسَةً يُقَالُ لَهَا: مَارِيَةُ وَكَانَتْ أُمُّ سَلَمَةَ وَأُمُّ حَبِيْبَةَ أَتَتَا أَرْضَ الْحَبْشَةِ فَذَكَرَنَا مِنْ حُسْنِهَا وَتَصَاوِيْرَفِيْهَا فَرَفَعَ رَأْسَهُ فَقَالَ: “أُولئِكَ إِذَا مَاتَ فِيْهِمُ الرَّجُلُ الصَّالِحُ بَنَوْا عَلَى قَبْرِهِ مَسْجِدًا ثُمَّ صَوَّرُوْا فِيْهِ تِلْكَ الصُّوَرَ أُولَئِكَ شَرَارُ خَلْقِ اللهِ”.

4508. (20) [2/1277ఏకీభవితం]

‘ఆయి’షహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) అనారోగ్యానికి గురైనపుడు ‘హబ్‌షాలోని ‘మారియ’ అనే పేరుగల సజీవ సమాధిని చూచిన ప్రవక్త(స) భార్యల్లో ఉమ్మె సలమహ్ మరియు ఉమ్మె ‘హబీబహ్ కూడా ఉన్నారు. వీరు మక్కహ్ నుండి వలసపోయి ‘హబ్‌షా వచ్చారు. ఆ తరువాత మదీనహ్ వచ్చారు. ప్రవక్త (స) ముందు దాన్ని గురించి ప్రస్తావించారు. అందులో ఉన్న చిత్ర పటాల గురించి ప్రస్తావించారు. దాని అలంకరణలను కూడా  ప్రస్తావించారు. ప్రవక్త (స) తల ఎత్తి, ‘వినండి, ఈ క్రైస్తవుల్లో పుణ్యాత్ములు ఎవరైనా చనిపోతే, వాళ్ళు అతని సమాధిపై మస్జిద్‌ నిర్మించే వారు. వారి చిత్ర పటాలు కూడా తయారుచేసేవారు. జ్ఞాపకార్థం కోసం ఇవన్నీ చేసేవారు. ప్రజలు వారిని పూజించేవారు. వీరు  దైవ సృష్టితాల్లో అందరికంటే పరమ నీచులు. (బు’ఖారీ, ముస్లిమ్‌)

4509 – [ 21 ] ( لم تتم دراسته ) (2/1277)

وَعَنِ ابْنِ عَبَّاسٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِنَّ أَشَدَّ النَّاسِ عَذَابًا يَوْمَ الْقِيَامَةِ مَنْ قَتَلَ نَبِيًّا أَوْ قَتَلَهُ نَبِيٌّ أَوْ قَتَلَ أَحَدَ وَالِدَيْهِ وَالْمُصَوِّرُوْنَ وَعَالِمٌ لَمْ يَنْتَفِعْ بِعِلْمِهِ”.

4509. (21) [2/1277అపరిశోధితం]

ఇబ్నె ‘అబ్బాస్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”తీర్పుదినం నాడు అందరికంటే అధికంగా దైవ ప్రవక్తలను చంపిన వ్యక్తులను శిక్షించడం జరుగుతుంది. లేదా అవిశ్వాసం, ధిక్కారం వల్ల ప్రవక్తలను చంపిన వ్యక్తులను శిక్షించడం జరుగుతుంది, లేదా తన తల్లిదండ్రులలో ఎవరినైనా చంపినవారిని, శిక్షించడం జరుగుతుంది. లేదా ప్రాణుల చిత్రాలు వేసిన వారిని శిక్షించడం జరుగుతుంది. ఇంకా తన జ్ఞానం ద్వారా తనకు లేద ఇతరులకు ఏ విధమైన లాభం చేకూరని పండితున్ని శిక్షించటం జరుగుతుంది. (బైహఖీ)

4510 – [ 22 ] ( لم تتم دراسته ) (2/1277)

وَعَنْ عَلِيٍّ رَضِيَ اللهُ عَنْهُ أَنَّهُ كَانَ يَقُوْلُ: الشَّطْرَنْجُ هُوَمَيْسِرُ الْأَعَاجِمِ .

4510. (22) [2/1277అపరిశోధితం]

‘అలీ (ర) కథనం: చదరంగం ఆడటం అరబ్బేతరుల జూదం.

4511 – [ 23 ] ( لم تتم دراسته ) (2/1277)

وَعَنِ ابْنِ شَهابٍ أَنَّ أَبَا مُوْسَى الْأَشْعَرِيَّ قَالَ: لَا يَلْعَبُ بِالشَّطْرَنْجِ إِلَّا خَاطِئٌ .

4511. (23) [2/1277అపరిశోధితం]

ఇబ్నె షిహాబ్‌ కథనం: అబూ మూసా అష్‌’అరీ కథనం: ”చదరంగం ఆడేవాడు పాపాత్ముడు మరియు దైవ అవిధేయుడు.” (బైహఖీ)

4512 – [ 24 ] ( لم تتم دراسته ) (2/1277)

وَعَنْهُ أَنّ سُئِلَ عَنْ لَعْبِ الشَّطْرَنْجٍ فَقَالَ: هِيَ مِنَ الْبَاطِلِ وَلَا يُحِبُّ اللهُ الْبَاطِلَ. رَوَى الْبَيْهِقِيُّ الْأَحَادِيْثَ الْأَرْبَعَةَ فِيْ شُعَبِ الْإِيْمَانِ .

4512. (24) [2/1277అపరిశోధితం]

ఇబ్నె షిహాబ్‌ (ర) కథనం: చదరంగం ఆట గురించి అతన్ని ప్రశ్నించటం జరిగింది. దానికి అతను, ‘చదరంగం ఆడటం అనవసరమైన, వ్యర్థమైన పని. అల్లాహ్‌ (త) అసహ్యించు కునే పని,’ అని సమాధానం ఇచ్చారు. (బైహఖీ)

4513 – [ 25 ] ( ضعيف ) (2/1277)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: كَانَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم يَأْتِيْ دَارَ قَوْمِ مِنَ الْأَنْصَارِ وَدُوْنَهُمْ دَارٌ فَشَقَّ ذَلِكَ عَلَيْهِمْ فَقَالُوْا: يَا رَسُوْلَ اللهِ تَأْتِيْ دَارَ فُلَانٍ وَلَا تَأْتِيْ دَارَنَا. فَقَالَ النَّبِيُّ صلى الله عليه وسلم: “لِأَنَّ فِيْ دَارِكُمْ كَلْبًا”. قَالُوْا: إِنَّ فِيْ دَارِهِمْ سِنَّوْرًا. فَقَالَ النَّبِيُّ صلى الله عليه وسلم: “اَلسِّنَّوْرِ سَبَّعٌ”. رَوَاهُ الدَّارَقُطْنِيُّ .

4513. (25) [2/1277బలహీనం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ఒక అ’న్సారీ ఇంటికి వెళ్ళేవారు. అయితే ప్రవక్త (స)కు దగ్గరలో చాలా మంది పొరుగువారు ఉన్నారు. ప్రవక్త (స) వీళ్ళందరినీ వదలి దూరంగా ఉన్న ఆ అ’న్సారీ ఇంటికి వెళ్ళడం వాళ్ళకు కొంత బాధ కలిగించింది. దాన్ని గురించి వారు ప్రవక్త (స)కు విన్నవించుకున్నారు. దానికి ప్రవక్త (స) సమాధానం ఇస్తూ, ‘నేను మీ ఇంటికి ఎందుకు రానంటే, మీ ఇళ్ళల్లో కుక్కలు ఉంటాయి,’ అని అన్నారు. దానికి వారు, ‘మరి తమరు వెళ్తున్న వాడి ఇంట్లో పిల్లి ఉంటుంది,’ అని విన్నవించుకున్నారు. దానికి ప్రవక్త (స), ‘పిల్లి జంతువే, కాని అపరిశుద్ధమైనది కాదు,’ అని సమాధానం ఇచ్చారు. [47]  (దారు ఖు’త్నీ)

*****


[1]) వివరణ-4304: హిబ్రహ్ అంటే గీతలున్న దుప్పటి. ఆ గీతలు ఎర్రగా లేదా పచ్చగా ఉండవచ్చు.

[2]) వివరణ-4327: ప్రవక్త (స) వీటిని కాల్చివేయమని అన్నారు. ఎందుకంటే ఇవి పురుషులకు నిషిద్ధం, కాని స్త్రీలు ధరించవచ్చు.

[3]) వివరణ-4345: అంటే ముస్లిమ్‌ పురుషులు స్త్రీలలా అధిక అలంకరణలకు గురికారాదు. అణకువ, నిరాడంబరతలు గల దుస్తులు ధరించాలి. ఒకవేళ దుస్తులు చినికిపోతే అతుకులు వేసి ధరించాలి. దాన్ని అవమానంగా భావించరాదు.

[4]) వివరణ-4346: అంటే గర్వాహంకారాలతో ప్రజల్లో ఖ్యాతి గడించటానికి గొప్పతనం కోసం ఖరీదైన దుస్తులు ధరిస్తే, అల్లాహ్‌ (త) తీర్పుదినం నాడు అవమాన కరమైన దుస్తులు దరింపజేసి అవమానానికి గురిచేస్తాడు. అందువల్ల దుస్తులు ధరించటంలో అణకువ, నిరాడంబరత తప్పనిసరిగా పాటించాలి. అదేవిధంగా పండితుడు కానివ్యక్తి తన్నుతాను పండితునిగా చెలామణి చేస్తే, తీర్పుదినం నాడు అల్లాహ్‌ (త) అతని గుట్టు రట్టుచేసి అతన్నినీచఅవమానానికి గురిచేస్తాడు.

[5]) వివరణ-4347: బస్తవీగారు, ఇస్లామీ సీరత్ లో ఈ ‘హదీసు’ వివరణలో ఇలా పేర్కొన్నారు, బహిర్గత విషయాల్లో ఎవరిని అనుసరించినా అంటే మంచివారిని అనుసరించినా చెడ్డవారిని అనుసరించినా, మంచిలో లేదా చెడులో లేదా సంస్కృతిలో అనుసరించినా వారిలో ఒకడుగా పరిగణింపబడతాడు. అందు వల్ల ధార్మిక పండితులందరూ చర్చించి, ఒకవేళ జిన్నులు పాము రూపంలో కనబడితే, దాన్ని చంపటంలో ఏమాత్రం భయపడకూడదు, అని అభిప్రాయపడ్డారు. ‘మన్ ఖుతిల దూన హైఅతిహీ, ఫదియతుహూ హదరున్.’ — అంటే ఒకవ్యక్తి తన రూపంలో కాక మరోరూపంలో చంపబడితే, దానికి నష్టపరిహారం ఇవ్వబడదు. ఎందుకంటే ఇస్లామీయ ధర్మచట్టం పాములకు, తేళ్ళకు ‘హరమ్ లోకూడా శరణు ఇవ్వలేదు. ఒకవేళ జిన్ను ఆ రూపాన్ని ధరిస్తే, వారిలో ఒకడుగా పరిగణించబడతాడు. ప్రవక్త(స) అనుచరులు, తాబయూన్లు, పండితులు ఈ ‘హదీసు’ను దృష్టిలో పెట్టుకొని సమాజంలోని మార్పులను, అనుకరణలను అసహ్యించుకునే వారు. ఇంకా ఈ ‘హదీసు’ ద్వారానే సమస్యలను పరిష్కరించే వారు.

 ఒకసారి హుజైఫహ్ బిన్ యమాన్ కు వలీమ ఆహ్వానం వచ్చింది. అతడు అక్కడికి వెళ్ళి చూసేసరికి ఆ శుభకార్యంలో కొన్ని అజమీ సాంప్రదాయాలు, ఆచారాలు నెరవేర్చబడుతున్నాయి. అది చూసి తిరిగి వచ్చేసారు. ఇంకా, ‘ఒక జాతిని అనుకరించేవారు, వారిలోని ఒకరుగా పరిగణింపబడతారు,’ అని అన్నారు. (అల్ ఇఖ్తిజా అస్సిరాతల్ ముస్తఖీమ్)

హ్మద్ బిన్ హంబల్ ను తల వెనుకభాగం వెంట్రుకలను గీయించటం గురించి ప్రశ్నించడం జరిగింది. దానికి అతను ‘ఇది నాస్తికుల సాంప్రదాయం’ అని అన్నారు. ఇంకా ఒక జాతిని అనుకరించేవారు, వారిలోని ఒకరుగా పరిగణింపబడతారు,’ అని అన్నారు. ఈ ‘హదీసు’ గురించి ‘హసన్ (ర), ‘ఒకజాతిని అనుసరించి కూడా వారిలో ఒకరు కానివారు చాలా అరుదు,’ అని అన్నారు. అదేవిధంగా గడ్డం గీయించేవారు కూడా ఈ ‘హదీసు’ పరిధిలోనికి వస్తారు. ప్రవక్త (స) ప్రవచనం, ‘అవిశ్వాసులను వ్యతిరేకించండి, ఎందుకంటే వారు గడ్డాన్ని గీయిస్తారు మీసాలను పెంచుతారు. మీరు గడ్డాన్ని పెంచండి, మీసాలను కత్తిరించండి.

  ఈ ‘హదీసు’ను దృష్టిలో పెట్టుకొని ‘హత్తాబ్ బిన్ మూల్ మఖ్జూమీ తన కొడుకుతో, ‘వివేకవంతులను అనుకరించు, వారిలో ఒకడుగా అవుతావు, ప్రదర్శనా బుధ్ధితో మంచివైపు వంగినా మంచిని పొందగలవు,’ అని ఉపదేశించారు. దీన్ని ఇబ్నె ‘హిబ్బాన్ తన పుస్తకం రౌతుల్ ఉఖలాలో పేర్కొన్నారు. ప్రజలారా! మహానుభావులను, వివేకవంతులను అనుకరించండి. మీరు వారిలా కాకపోయినా, వారి సహవాసమే మీ సాఫల్యానికి చాలు.

దీనికి అనేక ఉదాహరణలు ఉన్నాయి. మిష్కాత్ వివరణ కర్త ముల్లా అలీ ఖారీ కథనం: మూసా(అ) కాలంలో మాంత్రికులు విశ్వసించడం అల్లాహ్ (త) అధీనంలో ఉంది. ఎందుకంటే రుజుమార్గం ప్రసాదించడం, మార్గభ్రష్టత్వానికి గురిచేయడం అల్లాహ్ (త) చేతుల్లో ఉంది. అయితే మూసా(అ) దుస్తులను అనుకరించటమే ముందు వారిని విశ్వాసంవైపు ప్రేరేపించింది. వారు మూసా(అ) లాంటి దుస్తులు ధరించి పోటీకి మైదానం లోనికి వచ్చారు. అంటే వారు తమ బాహ్యరూపాన్ని మూసా (అ)కు అనుగుణంగా చేసుకున్నారు. బాహ్య పరంగా మాంత్రికుల్లో, మూసా(అ)లో ఏమీ తేడా లేకుండా పోయింది. చివరికి వారి ఆంతర్యాలు కూడా మూసా(అ)కు విధేయులై పోయాయి. హృదయాల్లో ద్వేషం అదృశ్యమై విశ్వాసం జనించింది. అదేవిధంగా ఫిర్ఔన్ సభలో ఒక హాస్యగాడు ఉండేవాడు. మూసా(అ)లా నటించి ప్రజలను నవ్వించేవాడు. మూసా (అ)లా దుస్తులు ధరించి, చేతిలో కర్ర పట్టకొని సభలోనికి వచ్చి అందరినీ నవ్వించేవాడు. అందరినీ నాశనంచేసి వాడిని రక్షించుకోవడం జరిగింది. అప్పుడు మూసా(అ) వాడిని ఎందుకు రక్షించారు, ‘అందరికంటే వాడే నాకు బాధకు గురిచేసాడు. ‘ అని విన్నవించుకున్నారు. దానికి అల్లాహ్(త) సమాధానమిస్తూ నిస్సందేహంగా నీలా నటించి నీకు బాధకు గురిచేసాడు ఇంకా వాడి హృదయంలో అవిశ్వాసమే ఉండేది. కాని వాడు నీలాంటి దుస్తులు ధరించేవాడు, నీలా నటించేవాడు, బాహ్య ప్రవర్తన అంతా నీలా ఉండేది. ప్రియ ప్రవక్త రూపంలో ఉన్న ఒక శతృవును శిక్షించడం నావల్ల కాలేదు. ఇహలోకంలో నీలా నటించినందుకు తాత్కాలికంగా వాడిని శిక్షనుండి రక్షించుకోవడం జరిగింది. అయితే వాడి హృదయం అవిశ్వాసంతోనే నిండి ఉంది.

అంతదూరం ఎందుకు ము’హమ్మద్ (స) అనుచర సమాజంలోనే చూసుకోండి. అబూ మ’హజూరహ్ (ర) సంఘటన (అబూ దావూద్).

మిష్కాత్ లో ఉంది. హునైన్ యుధ్ధం నుండి తిరిగివస్తున్న ఇస్లామీయ సైన్యం దారిలో విశ్రాంతి కోసం ఆగింది. పల్లెటూరి యువకులు ఇస్లామీయ సైన్యాన్ని చూడటానికి తండోప తండాలుగా వచ్చారు. సైన్యంలో అజా’న్ ఇవ్వబడింది. అది విని యువకులందరూ అజా’న్ లాంటి శబ్దాలు చేయసాగారు. ప్రవక్త(స) ఆ యువకులను పట్టుకురమ్మని ఆదేశించారు. అనంతరం కొందరిని పట్టుకొని తీసుకురావటం జరిగింది. ఎవరు అలా నటిస్తున్నారు అని అడగటం జరిగింది. అందరూ అబూ మహ్ జూరహ్ ను సూచించారు. మిగిలిన వారందరినీ వదలివేయటం జరిగింది. అబూ మహ్ జూరహ్ ను అతని అదృష్టం ఆపివేసింది. ప్రవక్త(స) అతన్ని, ‘నిలబడు, అజా’న్ పలుకు అంటే అజా’న్ ఇచ్చేలా నటించు’ అని ఆదేశించారు. అతను నిలబడి ప్రవక్త(స)లా అజా’న్ ఇవ్వడం ప్రారంభించారు. ఎటువంటి జంకులేకుండా పలుకుతూ పోతున్నారు. చివరికి ఆ నోటితోనే ఏకత్వం గురించి, దైవదౌత్యం గురించి సాక్ష్యం ఇచ్చివేసారు. ఈ సంఘటన అరబ్ ప్రాంతమంతా చర్చనీయాంశంగా మారిపోయింది. సు’బ్హానల్లాహ్ బాహ్యనటన అతన్ని విశ్వాసిగా, ప్రవక్త (స) ప్రఖ్యాత అనుచరుడిగా మార్చివేసింది.      

 [6]) వివరణ-4349: అంటే కేవలం దైవప్రీతి పొందటానికి నికా’హ్ చేసుకునే వ్యక్తికి అల్లాహ్(త) రాజకిరీటాన్ని ధరింప జేస్తాడు.  

[7]) వివరణ-4350: దైవానుగ్రహాలను బహిర్గతం చేయడం కృతజ్ఞతకు సూచకం. ఇది నోటిద్వారా, చేతిద్వారా, శరీర అవయవాలద్వారా, దుస్తులద్వారా, ఇతర సామాజిక విధులద్వారా బహిర్గతం చేయాలి. వాటిని పొందుతూ వాటిని మంచికోసం ఉపయోగించాలి. ఎల్లప్పుడూ దైవంపట్ల కృతజ్ఞులుగా జీవితం గడపాలి. ఖుర్ఆన్ లో అల్లాహ్ ప్రవక్త (స) కు తన అనుగ్రహాలను గురించి తెలిపిన తర్వాత, ‘ఓ ప్రవక్తా, నీవు నీ ప్రభువు అనుగ్రహాలను బహిర్గతంచేయి,’ అని ఆదేశించాడు. తఫ్సీర్ ఇబ్నెకసీ’ర్ లో ఈ ఆయతును గురించి ఇలా పేర్కొనడం జరిగింది – ‘పేదవారైన మిమ్మల్ని ధన వంతులుగా మార్చివేసాము. మీరు మా అనుగ్రహాలను కొనియాడుతూ ఉండాలి. అందువల్ల ప్రవక్త(స), ‘ఓ మా ప్రభూ, నీ అనుగ్రహాల పట్ల కృతజ్ఞతలు తెలిపే వారుగా, వాటిద్వారా నిన్ను కీర్తించేవానిగా, వాటి గురించి కొనియాడేవానిగా చేయి, ఇంకా ఆ అనుగ్రహాలను మాపై పూర్తిచేయి.’ అని దు’ఆ చేసేవారు.  

అబూ నజ్ర (ర) కథనం, ‘ముస్లిములు అనుగ్రహాల పట్ల కృతజ్ఞత చూపడం అంటే వాటిని ప్రస్తావించటం, ప్రదర్శించటంగా భావించేవారు. ముస్నద్ అ’హ్మద్ లోని ఒక ‘హదీసు’ లో, అల్పమైన అనుగ్రహంపై కృతజ్ఞతలు తెలపనివాడు, అధికమైన అనుగ్రహాలపై కూడా కృతజ్ఞతలు తెలపనట్టే. అదేవిధంగా ప్రజలకు కృతజ్ఞతలు తెలపనివాడు, అల్లాహ్(త) కూ కృతజ్ఞతలు తెలపనట్టే. అనుగ్రహాలను ప్రస్తావించటం కూడా కృతజ్ఞతలు తెలిపినట్టే, వాటిని ప్రస్తావించక పోవటం కృతజ్ఞతలు తెలపనట్టే. అని ఉంది.

అనస్(ర) కథనం, మహాజిరీన్లు, ‘ఓ ప్రవక్తా, అ’న్సార్లు పుణ్యాన్నంతా తీసుకొనిపోయారు అని విన్నవించు కున్నారు.’ దానికి ప్రవక్త (స), ‘మీరు వారి కోసం దు’ఆ చేస్తున్నంత వరకు, వారిని పొగుడుతున్నంత వరకు అలా జరుగదు,’ అని అన్నారు. అబూ దావూద్ లో, ‘ప్రజలకు కృతజ్ఞతలు తెలపనివాడు, అల్లాహ్ కూ కృతజ్ఞతలు తెలపనట్టే,’ అని ఉంది.

అబూ దావూద్ లోని మరో ‘హదీసు’లో, ‘అనుగ్రహం పొంది, దాన్ని కొనియాడేవాడు కృతజ్ఞుడు. దాచిపెట్టిన వాడు కృతఘ్నుడు,’ అని ఉంది. మరో ఉల్లేఖనలో, ‘కానుక ఇవ్వబడినవాడు. వీలయితే దానికి బదులు తీర్చివేయాలి. వీలుకాకపోతే అతన్ని పొగడాలి. పొగిడినవాడు కృతజ్ఞతలు తెలిపినట్టే. ఇంకా అనుగ్రహాలను బహిర్గతం చేయనివాడు కృతఘ్నతకు పాల్పడి నట్టే. ‘ (అబూ దావూద్)

[8]) వివరణ-4351: ఈ ‘హదీసు’ ద్వారా తల వెంట్రుకలు, గడ్డం వెంట్రుకలు సరిచేసుకోవటం, శుభ్రపరచుకోవటం, మంచి దుస్తులు ధరించటం ఒక మంచి అలవాటు అని తెలిసింది. అందువల్ల తలకు నూనె రాయటం, దువ్వు కోవటం అభిలషణీయం. వెంట్రుకలు చెల్లాచెదురుగా ఉంచటం అసహ్యకరం. ప్రవక్త (స) పరిశుభ్రత, పరిశుద్ధ తల గురించి చాలా అధికంగా ప్రోత్సహించారు. ప్రవక్త (స) తల దువ్వుకునేవారు, నూనె రాసుకునేవారు.  

[9]) వివరణ-4352: షరీఅత్‌ పరిధిలో ఉంటూ మంచి దుస్తులు ధరించటం, అలంకరణలు చేయటంలో అభ్యంతరం లేదు. అల్లాహ్‌ ఆదేశం: ”..ప్రతి మస్జిద్ (నమాజ్)లో  మీ వస్త్రాలంకరణ పట్ల శ్రద్ధ వహించండి…” (అల్ అ’అరాఫ్7:31)’. ప్రవక్త (స) ప్రవచనం: అల్లాహ్‌ (త) దాసునికి ఇచ్చిన తన అనుగ్రహాల ప్రభావం చూడాలని కుతూహలంతో ఉంటాడు. అంటే ఒకవేళ అల్లాహ్‌(త) ధనసంపదలు ప్రసాదిస్తే మంచి దుస్తులు ధరించాలి. స్తోమత ఉన్నా పిసినారితనంతో మంచి దుస్తులు ధరించకపోవటం దైవ అనుగ్రహాలను గుర్తించక పోవటం అవుతుంది. అయితే ఒక వ్యక్తి అణకువ, నిరాడంబరత అనుసరిస్తూ సాధారణ దుస్తులు ధరిస్తే అల్లాహ్‌ (త) అతనికి గౌరవాన్ని ప్రసాదిస్తాడు. (అబూ దావూద్‌)  

ఒక వ్యక్తి నేను మంచి బట్టలు ధరించాలని, తలకు నూనె రాయాలని, చెప్పులు కూడా సరిగా ఉండాలని, ఇంకా అనేక విషయాలు ప్రసాదించి నా కొరడా కూడా మంచిదిగా ఉండాలని కోరికగా ఉంటుంది అన్నాడు. దానికి ప్రవక్త (స) అల్లాహ్‌(త) అందగాడు, అందాన్ని కోరుకుంటాడు.

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘ఉమర్‌ (ర) కథనం: ‘ఓ ప్రవక్తా! నేను మంచి దుస్తులు ధరించటం గర్వమా?’ అని విన్నవించుకున్నాను. దానికి ప్రవక్త (స), ‘ఎంతమాత్రం కాదు. అది అందం, అల్లాహ్‌(త)కు అందమంటే ఇష్టం.’ (ఇబ్నె మాజహ్)

[10])వివరణ-4353: సమాధానం ఎందుకు ఇవ్వలేదంటే, అతడు ఎర్రని దుస్తులు ధరించి ఉన్నాడు. అవి పురుషులకు నిషిధ్ధం. దీనివల్ల ఎవరైనా  ఎర్రని దుస్తులు ధరించి సలామ్ చేస్తే, సమాధానం ఇవ్వకూడదని తెలిసింది.

[11]) వివరణ-4354: అంటే పట్టు వస్త్రం ఎక్కడ ఉన్నా కూర్చోరాదు. అదేవిధంగా కాషాయరంగు దుస్తులు కూడా పురుషులు ధరించరాదు. స్త్రీలు రంగురంగుల దుస్తులు ధరించవచ్చును. సువాసనలు ఉండరాదు.

[12]) వివరణ-4355: 1. అంటే పళ్ళను సన్నంగా చేయటం. అరబ్బుల్లోని ముసలి స్త్రీలు తమ పళ్ళను చిన్నవిగా, సన్నగా చేసుకునేవారు. దీనివల్ల వారు యువతుల్లా కనబడేవారు. ఇటువంటి అనుకరణను ప్రవక్త (స) నిషేధించారు. 2. అంటే శరీరానికి పచ్చ, నల్లబొట్లు పొడవటం. దీనివల్ల శాశ్వతంగా ఆ భాగం నల్లగా తయారవుతుంది. ఇవన్నీ షైతాన్ చేష్టలు. పురుషులకు స్త్రీలకు ఇవి నిషిద్ధం. 3. వెంట్రుకలు పీకడం అంటే గడ్డంలో తెల్లటి వెంట్రుకలు రావటం చూచి ఏరి పీకడం జరుగు తుంది. ఎందుకంటే వారి ముసలితనం కనబడకూడదని, ఇవన్నీ షై’తాన్‌ పనులు. 4. నగ్నంగా పురుషులు కలసి పడుకోవటం నిషిద్ధం. అదేవిధంగా స్త్రీలు కూడా నగ్నంగా కలసి పడుకోరాదు. 5. దుస్తులకు పట్టువస్త్రం ముక్క తగిలించి ధరించడం కూడా నిషిద్ధం. అయితే భుజాలపై 4 అంగుళాల పట్టు వస్త్రాన్ని అతుకులు వేసి ధరించడం ధర్మమే, అంతకుమించి అధర్మం. 6. దారిదోపిడీలు, దోపిడీ దొంగతనాలు చేయడం నిషిద్ధం. 7. చిరుత పులి చర్మంపై పరుండడం కూడా నిషిద్ధం. ఎందుకంటే ఇందులో గర్వం ఉంటుంది. 8. అనవసరంగా ఉంగరం ధరించడం కూడా అధర్మం. అయితే పాలకుడు, గుమస్తా ఉపయోగించవచ్చు. వీటిని గురించి క్రింద ‘హదీసు’లు ఇవ్వటం జరిగింది.

[13]) వివరణ-4366: స్త్రీలు పలుచని వస్త్రాలు ధరించ గలరు. అయితే దానిక్రింద మరో బట్ట శరీరం కనబడకుండా ఉండటానికి ధరించాలి. శరీర భాగాలేవీ బహిర్గతం కాకూడదు.

బస్తవీగారు ఇస్లామీ ఖుతబాత్ 2వ భాగంలో ఇస్లామీయ దుస్తులు  అనే అంశంలో పలుచని దుస్తుల గురించి ఇలా పేర్కొన్నారు, దుస్తులు మర్మాంగాలను కప్పి ఉంచుతాయి. శరీర లోపలి అవయవాలు కనపడేలా పలుచని దుస్తులు ధరించడం నిషిధ్ధం. ఎందుకంటే దానివల్ల ఉద్దేశం నెరవేరదు. ఇటువంటి పలుచని దుస్తులు స్త్రీ పురుషులిరువురికీ నిషిధ్ధం.  అస్మా బిన్తె అబీ బక్ర్(ర) ప్రవక్త(స)కు మరదలు అవుతారు. ఒకసారి ప్రవక్త(స) ముందు పలుచని దుస్తులు ధరించి వచ్చారు. పైనుండి శరీరం కనబడుతుంది. ప్రవక్త(స) వెంటనే చూపు మరల్చుకొని, ఓ అస్మా, స్త్రీ యుక్తవయస్సుకు చేరిన తర్వాత శరీర భాగాలు కనబడటం మంచిదికాదు. అయితే ఇవితప్ప అని, ముఖం మరియు అరచేతుల వైపు సైగచేసారు. (అబూ దావూద్)  

  ప్రవక్త(స) ప్రవచనం, రెండు రకాల నరకవాసులు ఉన్నారు. ఇంత వరకు నేను వారిని చూడలేదు: 1. వారిచేతుల్లో ఆవు తోకల్లాంటి కొరడాలు ఉంటాయి. వారు ప్రజలను అన్యాయంగా కొడుతూఉంటారు. అంటే దుర్మార్గపాలకులుంటారు. మన కాలంలో చూస్తునే ఉన్నాం, 2. పేరుకు మాత్రమే దుస్తులు ధరించే స్త్రీలు, కాని వాస్తవంగా వారు నగ్నంగా ఉంటారు. ఇంకా వారు పురుషులను తమవైపు ఆకర్షిస్తారు, ప్రేరేపిస్తారు. వారు స్వయంగా పురుషులవైపు ఆకర్షితులౌతారు, వారిని వాంఛిస్తారు. ఇంకా వారి తలలు ఒంటెల్లా ఒక వైపు వంగి ఉంటాయి. అటువంటివారు స్వర్గంలో ప్రవేశించరు, దాని సువాసననూ పొందలేరు. అయితే స్వర్గ సువాసన చాలా దూరం వరకు వ్యాపించి ఉంటుంది.

అంటే పలుచని దుస్తులు ధరించికూడా పైనుండి శరీరం కనిపిస్తున్నందువల్ల వారు నగ్నంగానే ఉంటారు. ఈ కాలంలో ఇటువంటి స్త్రీలు అనేకం. శరీరంలో కొంత భాగాన్ని కప్పి మరికొంత భాగాన్ని వదలివేస్తారు. వాటి ద్వారా పురుషులను తమవైపు ఆకర్షిస్తారు, ప్రేరేపిస్తారు.

నవవీ ‘స’హీ’హ్ ముస్లిమ్ వివరణలో ఈ ‘హదీసు’ గురించి ఇలా పేర్కొన్నారు, ‘శరీరంలోని కొంత భాగాన్నికప్పి ఉంచుతుంది, మరికొంత భాగాన్ని బహిరంగ పరుస్తుంది. వయ్యారంగా నడుస్తుంది. దీని ద్వారా పురుషులను ఆకర్షిస్తుంది, ప్రేరేపిస్తుంది.’ అనేక ‘హదీసు’ల్లో పలుచని దుస్తులు ధరించడాన్ని నిషేధించడం జరిగింది. ఇవి తర్గీబ్, మున్తఖా మొదలైన వాటిలో ఉన్నాయి. దుడ్డుగా ఉన్న దుస్తులపై పలుచని వస్త్రాలు కప్పుకుంటే మరేం ఫరవాలేదు. స్త్రీలు బిగుతుగా ఉన్న దుస్తులు ధరించడం  నిషిధ్ధం. దీనివల్ల శరీర మర్మాంగాలు కనబడతాయి. ‘ఉమర్ (ర), మీ స్త్రీలను పైనుండి శరీర భాగాలు కనబడేలా బిగుతుగా ఉన్న దుస్తులు తొడిగించకండి. (అల్ మబ్సూత్ / కితాబుల్ ఇస్తిహ్సాన్)  

స్త్రీలను మస్తూరాత్ అంటారు. మస్తూరాత్ అంటే దాచి ఉంచబడే వస్తువులు. అంటే స్త్రీలు ముఖం మరియు అరచేతులు తప్ప శరీరాన్నంతా దాచి ఉంచడం తప్పని సరి. చివరికి తల, చేతులను కాళ్ళవరకు శరీరాన్నంతా దాచి ఉంచాలి. భుజాలను విప్పి ఉంచడం కూడా నిషిధ్ధమే. ప్రవక్త(స) అనుచర స్త్రీలు మణికట్లవరకు దుస్తులు ధరించేవారు. చేతి వ్రేళ్ళ మధ్య బటన్లు పెట్టేవారు. బుఖారీలో హిందహ్ తన కమీజు చేతుల బటన్లు తన చేతివ్రేళ్ళమధ్య పెట్టేవారు.

‘హ’ఫ్సహ్ బిన్తె ‘అబ్దుర్ర’హామాన్ (ర) పలుచని వస్త్రం కప్పుకొని ‘ఆయి’షహ్ (ర) వద్దకు వచ్చారు. ‘ఆయి’షహ్ (ర) ఆ పలుచని వస్త్రాన్ని చించి పారవేశారు. మరో దుడ్డుగా ఉన్న వస్త్రాన్ని తెచ్చి, కప్పుకోవటానికి ఇచ్చారు. (తిర్మిజి’, ఇబ్ను మాజహ్)

స్త్రీలు నగలు, ఆభరణాలు ధరించుకోవచ్చును. కేవలం తమ భర్తలకు చూపించటానికి మాత్రమే, పర పురుషులకు చూపించటానికి కాదు. తమ అంద చందాలను పరపురుషుల ముందు ప్రదర్శించే స్త్రీలను శపించటం జరిగింది. ప్రవక్త(స) ప్రవచనం, పరపురుషుల ముందు తమ అందచందాలను ప్రదర్శిస్తూ వయ్యారంగా నడిచే స్త్రీలు, తీర్పుదినంనాడు వారి ఆకర్షణను, వెలుగును హరింపజేయడం జరుగుతుంది. (తిర్మిజి’) 

[14]) వివరణ-4371: బద్ర్‌ యుద్ధంలో 5000 మంది దైవదూతలు సహాయం కొరకు వచ్చారు. వాళ్ళు గుర్రాలపై ఉన్నారు, తలపై పగిడి ధరించి ఉన్నారు. పగిడి ధరించటం దైవదూతల, ఇంకా ప్రవక్తల సాంప్రదాయం. బస్తవీగారు ఇస్లామీ ఖుత్బాత్ రెండవ భాగంలో ఇస్లామీయ వస్త్రధారణలోని పగిడీ మరియు టోపీ గురించి ఇలా పేర్కొన్నారు.

అరబ్బులు సాధారణంగా తలను కప్పటానికి టోపీ మరియు పగిడి ఉపయోగించే వారు. ప్రవక్త (స) కూడా పగిడి ధరించేవారు. అనుచరులకు కూడా ఆదేశించే వారు.

హాఫిజ్ ఇబ్నె  ‘హజర్ (ర) ఫ’త్హుల్ బారీలో తబ్రానీ ద్వారా ఈ ‘హదీసును పేర్కొన్నారు, ప్రవక్త(స) అమామహ్ ధరించండి, మేధస్సును అంతకంటే అధికంగా పొందగలరు. హాఫిజ్ ఐనీ ఉమ్దతుల్ ఖారీలో అబూ నయీమ్ ద్వారా ఈ ‘హదీసు’ను పేర్కొన్నారు. ప్రవక్త (స) ‘అలీ (ర)కు ‘గదీర్ ఖమ్ రోజు అమామహ్ కట్టి, ‘ఈవిధంగా అమామ కట్టండి, ఎందుకంటే ఈ అమామహ్ ఇస్లామ్ యొక్క చిహ్నం మరియు గొప్పతనం. ఇంకా ఇది ముస్లిమ్ మరియు అవిశ్వాసికి తేడా చూపుతుంది.’ అని అన్నారు.

ప్రవక్త (స) అమామహ్ గురించి స్పష్టమైన ‘హదీసు’ లభించలేదు. కొందరు 7 చేతుల పొడవు ఉండేదని, మరి కొందరు 12చేతుల పొడవు ఉండేదని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రవక్త(స) షమ్లా 4 జానెళ్ళ పొడవు ఉండేది. దాన్ని వెనుక వ్రేలాడినట్లు వదలివేసేవారు. ఫత’హ్ మక్కహ్ రోజు మక్కహ్ లో ప్రవేశించినపుడు ప్రవక్త(స) తలపై నల్లని అమామహ్ ఉండేది. అంటే ప్రవక్త (స) నల్లని అమామహ్ ధరించేవారు. ‘అబ్దుల్లాహ్ బిన్ ‘ఉమర్ (ర) కథనం, ప్రవక్త(స) అమామహ్ ధరించి నపుడు, వెనుక రెండుభుజాల మధ్య షమ్లా వ్రేలాడేటట్లు ఉంచేవారు. ప్రవక్త (స) ప్రవచనం, ‘ముస్లిములకు మరియు విగ్రహారాధకులకు మధ్య టోపీలపై అమామహ్ ధరించటం తేడా ఉంది.’ అంటే ముందు టోపీ ధరించి దానిపై అమామహ్ ధరించాలి. విగ్రహారాధకులు టోపీ లేకుండా అమామహ్ ధరించేవారు.

ఈ ‘హదీసు’ల ద్వారా అమామహ్ ధరించడం ఇస్లామ్ చిహ్నం అని తెలుస్తుంది. కాని ప్రస్తుతకాలంలో ముస్లిములు అమామహ్ ధరించడం వదలివేసారు. సిక్కులు దాన్ని అవలం భిస్తున్నారు. టోపీ ధరించటం కూడా ప్రవక్త(స) సాంప్రదాయమే. అబూ కబ్ షహ్ (ర) కథనం, ‘ప్రవక్త(స) అనుచరుల టోపీలు గుండ్రంగా, తలలకు అంటుకొని ఉండేవి.

[15]) వివరణ-4381: అంటే ప్రతి ధర్మసమ్మతమైన వస్తువులను తినవచ్చును, త్రాగవచ్చును, ధరించ వచ్చును. అయితే అందులో దుబారా ఖర్చులకు, గర్వాహంకారాలకు గురికారాదు.

[16]) వివరణ-4382: అంటే మృతులను తెల్లవస్త్రాల్లో కఫన్‌ చేయడం అన్నిటికంటే ఉత్తమం. మస్జిదులలో తెల్ల వస్త్రాలు ధరించి నమా’జుకు వెళ్ళడం అన్నిటికంటే ఉత్తమం.

[17]) వివరణ-4383: ప్రవక్త (స) ప్రారంభంలో బంగారు ఉంగ రాన్ని చేయించారు. ఆ తరువాత బంగారం పురుషులకు నిషేధించబడింది. అందువల్ల ప్రవక్త (స) దాన్ని తీసివేసారు. ఆ తరువాత ప్రవక్త (స) వెండి ఉంగరాన్ని తయారు చేయించారు. అవసరమైనప్పు డల్లా దాన్ని ఉపయోగించే వారు.

[18]) వివరణ-4385: ఈ ‘హదీసు’ ద్వారా తెలిసిన విషయం ఏమిటంటే, ఒకవేళ ఎవరైనా బంగారు ఉంగరాన్ని ధరించి ఉంటే, దాన్ని వారించాలి. అంటే షరీఅత్‌కు వ్యతిరేకంగా జరుగుతూ ఉంటే దాన్ని వారించాలి.

[19]) వివరణ-4387: ప్రవక్త (స) వద్ద అనేక ఉంగరాలు ఉండేవి. కొన్నింటి పొందికలు వెండిని, మరికొన్ని నల్లగా ఉండేవి. ప్రవక్త (స) మరణానంతరం అబూ బకర్‌, ‘ఉమర్‌, ‘ఉస్మాన్‌లు ధరించారు. ‘ఖిలాఫత్‌ చివరికాలంలో ‘అరీస్‌ బావిలో పడిపోయింది, ఎంత వెతికినా దొరకలేదు.

[20]) వివరణ-4389: ఉంగరం కుడిచేతిలో ధరించడం ప్రవక్త సాంప్రదాయం. ఒకవేళ కుడిచేతిలో బాధగా ఉంటే ఎడమ చేతిలో ధరించవచ్చును.

[21]) వివరణ-4390: ముస్లిం పురుషులు ప్రక్క (నాల్గవ) వేలులో ధరించాలి. అయితే స్త్రీలు తమ ఇష్టం వచ్చిన వ్రేలిలో ధరించ వచ్చును.

[22]) వివరణ-4393: అయితే కుడిచేతిలో ధరించటమే ఉత్తమం. ఒకవేళ కుడిచేతిలో నొప్పిగా ఉంటే ఎడమ చేతిలో ధరించవచ్చును.

[23]) వివరణ-4396: చాలామంది అవిశ్వాసులు, విగ్రహా రాధకులు ఇత్తడి విగ్రహాలు తయారుచేస్తారు. అందువల్ల ప్రవక్త (స) నువ్వు ఇత్తడి ఉంగరం ధరించివచ్చావు. అందులో విగ్రహాల దుర్వాసన వస్తుంది. అందువల్ల ప్రవక్త (స) దీన్ని అసహ్యించుకున్నారు. అదేవిధంగా ప్రవక్త (స) ఇనుప ఉంగరాన్ని అసహ్యించుకున్నారు. ఎందుకంటే ఇది నరకవాసుల ఆభరణం. నరకవాసుల మెడల్లో ఇనుపహారాలు, గొలుసులు ఉంటాయి. ఇనుప ఉంగరం గురించి అడిగిన ‘హదీసు’లో దీన్ని రద్దు చేయడం జరిగింది.

[24]) వివరణ-4399: అంటే పట్టీలు, గంటల శబ్దం వచ్చే ఆభర ణాలను అమ్మాయిలు, స్త్రీలు ధరించరాదు.

[25]) వివరణ-4401: ఆభరణాల ‘జకాత్ చెల్లించకుంటే ఇలా జరుగుతుంది. బంగారం,ఆభరణాల జకాత్ క్రమం తప్ప కుండా చెల్లిస్తూ ఉండాలి. స్త్రీలు బంగారం, వెండి ఆభరణాలు ధరించవచ్చును. కొందరు విద్వాంసులు ఈ ‘హదీసు’ రద్దుచేయబడినదని పేర్కొన్నారు. లేదా ఈ ‘హదీసు’ ఇతర ‘హదీసు’ల కంటే బలహీనమైనది కావచ్చు. వల్లాహు ఆలము.  

[26]) వివరణ-4403:ఈ ‘హదీసు’లద్వారా ఆభరణాల్లో ‘జకాత్ ఉందని నిరూపించబడింది.అయితే అవి నిర్ణీత పరిమాణానికి చేరాలి. ఇంకా సంవత్సరం పూర్తికావాలి. ఈ పుస్తకంలోనే ‘జకాత్ అధ్యాయంలో దీన్నిగురించి చర్చించడం జరిగింది.

[27]) వివరణ-4411: అంటే ఒకవేళ చెప్పులు ధరిస్తే రెండు కాళ్ళకూ ధరించండి. విప్పితే రెండుకాళ్ళ చెప్పులూ తీసి వేయండి. కాని ఒకవేళ ఒక కాలిలో నొప్పి ఉంటే, ఒక కాలికి చెప్పు లేదా సాక్సు ధరించి నడవవచ్చును.

[28]) వివరణ-4416: మొదటి ‘హదీసు’ల్లో ఒక చెప్పు ధరించి నడవరాదని వారించడం జరిగింది. ఈ ‘హదీసు’ ద్వారా అనుమతించడం జరిగింది. ఈ రెండూ వ్యతిరేకంగా ఉన్నాయి. అనుమతించబడిన ‘హదీసు’ బలహీనమైనది. లేదా ఇంటి ప్రాంగణంలో అవసరం ఉండి ఒకచెప్పు ధరించి కొన్ని అడుగులు వేయడంలో తప్పులేదు. బయట మాత్రం రెండు కాళ్ళకూ చెప్పులు ధరించి నడవాలి.

[29]) వివరణ-4418: మరో ఉల్లేఖనంలో ”ప్రవక్త (స) వాటిపై మసహ్‌ కూడా చేసారని” ఉంది. ‘హబష్‌ రాజుకు నజ్జాషీ అనే బిరుదు ఉండేది. అతను పంపిన సాక్సులను ప్రవక్త (స) ఏ జంతువు చర్మం అని పరిశీలించకుండా, ఎటువంటి సంకోచం లేకుండా ధరించారు.

[30]) వివరణ-4423: గోరింటాకు గురించి ధార్మిక పండితుల్లో అభిప్రాయ భేదాలున్నాయి. గోరింటాకు పట్టించడం ఉత్తమమా? లేక పట్టించకపోవటం ఉత్తమమా? కాని అనేక ఉల్లేఖనాల ద్వారా అల్లాహ్‌ (త)కు తెల్లటి వెంట్రుకలంటే ఇష్టమని తెలుస్తుంది. ప్రవక్త (స) ప్రవచనం, ”తెల్లని వెంట్రుకలను పీకకండి, అవి ముస్లిముల వెలుగు. ఇస్లామ్‌లో వృధ్ధాప్యానికి చేరుకున్నవ్యక్తికి అల్లాహ్‌ (త) వృధ్ధాప్యానికి బదులు పుణ్యం ప్రసాదిస్తాడు, అతని ఉన్నత స్థానాలు అధికం చేస్తాడు, అతని తప్పులను క్షమిస్తాడు. (అబూ దావూద్‌)

ప్రవక్త (స) అనుచరులు తల, గడ్డం తెల్లని వెంట్రుకలను పీకటాన్ని అసహ్యంగా భావించేవారు. (ముస్లిమ్‌).

తెల్లటి వెంట్రుకలు గల ముస్లిమ్‌కు తీర్పుదినం నాడు అల్లాహ్‌(త) వెలుగు ప్రసాదిస్తాడు. (తిర్మిజి).

ఇబ్రాహీమ్‌ (అ) తన శరీరంపై తెల్లటి వెంట్రుకలు చూచి, ‘ఓ అల్లాహ్‌! ఇవి ఏమిటి?’ అని ప్రశ్నించారు. ‘ఇవి గౌరవ చిహ్నాలు,’ అని సమాధానం లభించింది. (మువ’త్తా ఇమామ్‌ మాలిక్‌)

తెల్లని వెంట్రుకలు తలవైనా మీసాలవైనా పీకడం నిషిధ్ధం. ఇది స్త్రీపురుషు లిరువురికీ వర్తిస్తుంది. ప్రవక్త(స) సుమారు 17 వెంట్రుకలు తెల్లగా అయిపోయాయి. ఖి’జాబ్ తగిలించేనంతగా కాలేదు. అందువల్ల ప్రవక్త(స) ఖిజాబ్ పట్టలేదు. ధర్మసమ్మతం గనుక అప్పు డప్పుడూ పట్టేవారు. ముసలివారు గోరింటాకు పట్టించు వచ్చును అని ఈ ‘హదీసు’ ద్వారా తెలిసింది.

అబూ బకర్‌ () తండ్రి అబూ ఖహాఫహ్ (ర) మక్కహ్ విజయం నాడు ఇస్లామ్‌ స్వీకరించారు. అప్పుడు ప్రవక్త (స), ‘అతని తల, గడ్డం తెల్లని వెంట్రుకలకు గోరింటాకు పట్టించండి’ అని ఆదేశించారు. (ముస్లిమ్‌, అ’హ్మద్‌)

స్వయంగా ప్రవక్త (స) పసుపుపచ్చని రంగు పట్టించే వారు. (అబూ దావూద్‌).

ఒక్కోసారి ఎర్రటి రంగు పట్టించేవారు. పసుపుపచ్చని రంగు అంటే ప్రవక్త (స)కు ఎంతో ఇష్టం. అయితే నల్లని రంగు పట్టించరాదని ప్రవక్త (స) వారించారు. ఒక ‘హదీసు’లో నల్లని ఖి’జాబ్ కు దూరంగా ఉండమని వారించడం జరిగింది. (ముస్లిమ్)

మరో ‘హదీసు’లో ప్రళయానికి ముందు చాలా మంది నల్లని రంగు పట్టిస్తారు. పావురాల వెంట్రుకలు నల్లగా ఉన్నట్టు. ఇటువంటి వారు స్వర్గ సువాసనకూడా ఆస్వాదించలేరు. (అబూ దావూద్‌).

ప్రవక్త (స) వెంట్రుకలకు రంగు పట్టించడం, తెల్ల వెంట్రుకలను అలాగే వదలి వేయటం రెండూ నిరూపించ బడి ఉన్నాయి. (బు’ఖారీ, ముస్లిమ్‌)

[31]) వివరణ-4425: ప్రవక్త (స) తలపై పెద్ద పెద్ద వెంట్రుకలు ఉండేవి. ఒక్కోసారి సగం చెవుల వరకు ఉండేవి. ఒక్కోసారి చెవుల క్రిందిభాగం వరకు ఉండేవి. ఒక్కోసారి భుజాల వరకు ఉండేవి. (తిర్మిజి, అబూ దావూద్‌)

ఇంతకంటే పొడవైన వెంట్రుకలు ఉంచటం ప్రవక్త సాంప్రదాయానికి విరుధ్ధం. (అబూ దావూద్‌). తల మధ్య నుండి రెండువైపుల దువ్వుకునే వారు. (బు’ఖారీ, ముస్లిమ్)

అటు ఇటు దువ్వుకోవడం ప్రవక్త సాంప్రదాయానికి విరుధ్ధం. ప్రవక్త (స) తలవెంట్రుకలకు, గడ్డానికి సువాసనగల నూనె రాసేవారు. దువ్వుకునేవారు. (బు’ఖారీ, ముస్లిమ్)

ప్రవక్త(స), ‘తల వెంట్రుకలన్నిటినీ పెంచండి లేదా గీయించండి,’ అని అన్నారు.(ముస్లిమ్)

గీయించడంకన్నా ఉంచడం ఉత్తమం. ప్రవక్త(స) ‘హజ్ మరియు ‘ఉమ్రహ్ తప్ప మరెప్పుడూ తలవెంట్రుకలను గీయించలేదు. (నైలుల్ అవ్తార్) తలవెంట్రుకలను సరిసమానంగా కత్తిరించడం కూడా ధర్మసమ్మతమే. తల వెంట్రుకలను కొన్నింటిని చిన్నవి చేయటం, కొన్నింటిని వదలటం నిషిద్ధం. బు’ఖారీ, ముస్లిమ్ లో ఒక ‘హదీసు’ ఉంది, తల వెంట్రుకలను కొన్నింటిని గీయించటం, కొన్నింటిని వదలటం నిషిద్ధం. గీయించటం, కత్తిరించటం సమానమే. స్త్రీలు తలవెంట్రుకలన్నిటినీ గీయించటం నిషిధ్ధం. (నసాయి’)

అదే విధంగా కష్టాల్లో తల గీయించటం నిషిధ్ధం. (బుఖారీ, ముస్లిమ్)

అబూ బకర్ (ర) తన సైనకాధికారులను తల మధ్య భాగంలో గీయించేవారిని కలిస్తే, గీయించినచోట అక్కడికక్కడే కరవాలంతో నరకమని ఆదేశించారు. (మువ’త్తా మాలిక్)

కొందరు పీర్ల మరియు అవలియాల పేర మొక్కుబడిగా జడలు పెంచుతారు. ఇది పరమ అవిశ్వాసం. యూదులను, క్రైస్తవులను అనుకరిస్తూ తలవెంట్రుకలను కత్తిరించటం ప్రవక్త (స) సాంప్రదాయానికి వ్యతిరేకం.

[32]) వివరణ-4426: అంటే బాలుని తలపై కొన్నిచోట్ల గీయడం, కొన్నిచోట్ల వదలివేయడం. అంటే వీటిని మేఘాల ముక్కల్లా పోల్చటం జరిగింది. బాలుడ్ని కాదు ఏ వయస్సుకు చెందినవారైనా స్త్రీలయినా, పురుషు లైనా ఇది వర్తిస్తుంది. అయితే వ్యాధివల్ల అలాచేస్తే ఎటు వంటి అభ్యంతరం లేదు.

[33]) వివరణ-4430: వాసిలహ్ అంటే ఇతరుల వెంట్రు కలను తన వెంట్రుకలతో జతపరచి ఉపయోగించటం. పొడవైన వెంట్రుకలు ప్రదర్శించటానికి కొందరు పొడవైన వెంట్రుకలంటే ఇష్టపడతారు. మోసగించటానికి ఇలా చేస్తారు. అదేవిధంగా ముస్తవ్‌’సిలహ్ అంటే ఇతర స్త్రీల వెంట్రుకలను తన వెంట్రుకలతో జతపరచటం. దీనివల్ల ఆమె వెంట్రుకలు పొడవుగా కనబడతాయి. ఇది మోసం. ఇటువంటి స్త్రీలను ప్రవక్త(స) శపించారు. అదేవిధంగా వాషిమహ్ అంటే పచ్చబొట్లు పెట్టే స్త్రీ, ముస్తవ్షిమహ్ అంటే పచ్చబొట్లు పెట్టించుకునే స్త్రీ, వీరిద్దరినీ శపించటం జరిగింది. ఎందుకంటే పచ్చబొట్లుపెట్టటం నిషిద్ధం.ఇవన్నీ అవిశ్వాసుల సాంప్రదాయాలు, షై’తానీ పనులు.

[34]) వివరణ-4431: బస్తవీగారు ఇస్లామీ సీరత్ లో ఈ ‘హదీసు’ను గురించిన చర్చలో గడ్డం గీయించటం కూడా నిషిధ్ధమని, ఎందుకంటే దీనివల్లకూడా ముఖవర్చస్సు చెడుతుందని, ఇంకా ప్రవక్త(స) ఆదేశాలకు, సాంప్రదా యానికి వ్యతిరేకం అని పేర్కొన్నారు. (ఇంకా చూడండి, 4:59, 4:80, 5:92, 9:63, 24:55, 56, 47:33)

[35]) వివరణ-4439: ఈ ‘హదీసు’ ద్వారా గడ్డాన్ని పొడవు, వెడల్పులలో కత్తిరించి సరిచేసుకోవచ్చని తెలుస్తుంది. మరొక ‘హదీసు’ ద్వారా గడ్డం వెంట్రుకలను కత్తిరించటం నిషిధ్ధమని తెలుస్తుంది. దీనికి ‘హదీసు’వేత్తలు ఈ ‘హదీసు’బలహీనమైనదని, ఇందులోని ఇద్దరు ఉల్లేఖన కర్తలు విమర్శలకు గురైనవారని, ఈ ‘హదీసు’ ద్వారా నిరూపించడం ధర్మసమ్మతం కాదని పేర్కొన్నారు.

 [36]) వివరణ-4440: ఖులూఖ్ అంటే ఒక మిశ్రమ సువాసన. అందులో కస్తూరి మొదలైనవి కలసి ఉంటాయి. ఇది స్త్రీల కోసం, పురుషులకోసం కాదు. ఒకవేళ భార్య ఈ సువాసన పులుముకొని ఉండి, భర్త బట్టలకు తగులు కుంటే మరేం ఫరవాలేదు. కాని దాన్ని కడిగి శుభ్రపరచుకోవాలి. అందువల్లే ప్రవక్త(స) నీకు భార్య ఉందా అని అడిగారు.

[37]) వివరణ-4460: ప్రవక్త (స) వెంట్రుకల గురించి అనేక ఉల్లేఖనాలు ఉన్నాయి. కొన్ని ఉల్లేఖనాల ద్వారా చెవుల వరకు ఉన్నాయని, మరికొన్ని ఉల్లేఖనాల ద్వారా చెవులపైకి ఉండేవని, కొన్ని ఉల్లేఖనాల ద్వారా భుజాలవరకు ఉండేవని తెలుస్తుంది. వీటిలో ఎలాంటి వ్యతిరేకత లేదు. ఎందుకంటే వెంట్రుకలు పెరిగే వస్తువులు. ఒక సమయంలో చెవులవరకు ఉంటాయి. మరో సమయంలో భుజాలవరకు ఉంటాయి.

[38]) వివరణ-4473: లదూద్‌ అంటే రోగి నోట్లో వేసేమందు, సఊత్‌ అనేది ముక్కులో వేసే మందు, హజామత్‌ అంటే శస్త్రచికిత్స, మష్‌యి అంటే విరోచనాల మందు.

[39]) వివరణ-4474: బజారుల్లో బాత్రూమ్‌లు ఉండేవి. వాటిలో అద్దె ఇచ్చి పురుషులు, స్త్రీలు స్నానం చేసేవారు. ప్రవక్త (స) దీన్ని వారించారు. వీటివల్ల కల్లోలాలు తలెత్తే భయం ఉంది. అయితే పురుషులు లుంగీ ధరించి వాటిలో ప్రవేశించి స్నానం చేస్తే అభ్యంతరం లేదు. అయితే స్త్రీలు తమ ఇళ్ళల్లోని బాత్రూమ్‌లలో ప్రవేశించవచ్చును.

[40]) వివరణ-4478: ఈ ‘హదీసు’ ద్వారా ప్రవక్త (స) గోరింటాకు పెట్టుకోలేదని తెలుస్తుంది. ఇతర ఉల్లేఖనాల ద్వారా పెట్టుకున్నారని తెలుస్తుంది. అంటే ప్రవక్త (స) గోరింటాకు ఉపయోగించే వయస్సుకు చేరలేదు. కేవలం 16, 17 వెంట్రుకలు తెలుపుగా అయ్యాయి. అప్పుడప్పుడూ గోరింటాకు పూసుకోవటం ధర్మమని తెలుపటానికి ఇలా పూసుకునేవారు.

[41]) వివరణ-4480: ప్రవక్త (స) తల నుండి కొన్ని వెంట్రుకలు రాలిపోయాయి. లేదా ‘హజ్‌ సందర్భంగా గీయించుకొని ఉంటారు. ప్రవక్త (స) ప్రసాదంగా పంచిపెట్టి ఉన్నారు. అదే విధంగా ఉమ్మె సులైమ్‌ వద్దకూడా ఉండేవి. ఆమె ప్రవక్త (స) చూడని వారికి ప్రవక్త (స) వెంట్రుకలను చూపెట్టేవారు.

[42]) వివరణ-4491:అంటేచిత్రాలు, ఉరికంభాన్ని అంటారు. దీన్ని క్రైస్తవులు ఆరాధిస్తారు. దీనిపైనే ‘ఈసా (అ)ను ఉరితీయటం జరిగిందని వారు భావిస్తారు. అయితే ఖుర్‌ఆన్‌ ప్రకారం ‘ఈసా (అ) ఉరితీయ బడలేదు. చంపబడ లేదు. అల్లాహ్‌ (త) సజీవంగా తన వద్దకు ఎత్తు కున్నాడు. ఒకవేళ ఇంట్లో కూడా ఉరికంబంలాంటి వస్తువు ఏదైనా ఉంటే దాన్ని చించి వేయాలి. దాన్ని కూడా విగ్రహంగానే పరిగణించబడటం జరుగుతుంది.

[43]) వివరణ-4494: అంటే ఆ వస్త్రం చిత్రాలు గలది అయినా ఉండవచ్చు లేదా దుబారా ఖర్చు చేయ కూడదని హెచ్చరించేందుకు ఇలా చేసి ఉండవచ్చు ఎందుకంటే ద్వారం వద్ద తెరవేస్తే గోనెసంచి తెరగా వేయవచ్చు. ‘హదీసు’లో నమ్త్ అనే పదం వచ్చింది. అంటే ఖరీదైన పడక లేదా తెర అని అర్ధం. సాధారణంగా దీన్ని ధనవంతులు ఉపయోగిస్తారు. దైవప్రవక్త (స) కుటుంబానికి ఇది తగదు.

[44]) వివరణ-4496: ఇలా ఎందుకు ఆగ్రహించడం జరిగిం దంటే, చీమను లేదా గోధుమ గింజను సృష్టించలేడు. అందు వల్ల ప్రాణుల చిత్రాలుగానీ ఫోటోలను గానీ తీయరాదు అని హెచ్చరించడం జరిగింది.

[45]) వివరణ-4500: నర్ద్ అంటే పాచికల ఆట, ఈ ఆట జూదం వంటిది. దీన్ని దర్ద్ షేర్ రాజు ప్రారంభించాడు. చదరంగం, పేకాట ఈ జాతికి చెందినవే. వీటిని జూదంగా ఆడుతారు. వీటిలో సమయం వృథా అవుతుంది. ఇవన్నీ నిషిధ్ధమే. వీటిపై కూడా ప్రాణుల ఫొటోలుకూడా ఉంటాయి. రెండూ నిషిద్ధమైనవే. అందువల్ల దీన్ని పందిరక్తంలో చేతులు ముంచినట్టు పరిగణించటం జరిగింది. అంటే వీటిని కఠినంగా నిషేధించటం జరిగింది.

[46]) వివరణ-4506: అంటే, ‘ఎటువంటి లాభం లేని పావురాల వేటలో పడి ఉన్న వ్యక్తి, షై’తాన్‌. దైవ అవిధేయుడు,’ అని అన్నారు. అంటే పావురాలను వేటాడటం నిషిద్ధం.

[47]) వివరణ-4513: పిల్లి ఉన్నా కారుణ్యదూతలు వస్తారు. కాని కుక్కలు ఉంటే మాత్రం కారుణ్యదూతలు ఇళ్ళలోకి ప్రవేశించరు.

***

%d bloggers like this: