21- كِتَابُ الْأَطْعِمَةِ
21. అన్నపానీయాల పుస్తకం
ప్రాణుల జీవితం తినటం, త్రాగటం పైనే ఆధారపడి ఉంది. ఈ రెండూ దైవానుగ్రహాలు, వీటిపట్ల మనం దైవానికి కృతజ్ఞతలు తెలియపరచుకోవాలి. ఖుర్‌ఆన్‌లో అల్లాహ్ (త) ”…ఒకవేళ మీరు కృతజ్ఞత చూపితే మరీ అధికంగా ఇస్తాను…” (ఇబ్రాహీం, 14:7) అని పేర్కొన్నాడు. మరోచోట అల్లాహ్ (త) ”…తినండి, త్రాగండి, దుబారా ఖర్చు చేయకండి…” (అల్ అ’అరాఫ్, 7:31) అని ఆదేశించాడు. షరీఅత్ ప్రకారం తినటం, త్రాగటం కూడా ఒక ఆరాధనే. తినటానికి అనేక నియమాలున్నాయి. ప్రతి ముస్లిమ్ వీటిని దృష్టిలో పెట్టుకోవాలి.
క్రింద మేము కొన్ని నియమనిబంధనలను పేర్కొంటున్నాం:
తినే ముందు అంటే భోజనంచేసే ముందు రెండు చేతులను శుభ్రంగా కడుక్కోవాలి, పుక్కిలించాలి. నిదానంగా భోజనాలకు కూర్చోవాలి. ‘బిస్మిల్లాహ్‘ పలికి కుడిచేత్తో తినటం ప్రారంభించాలి. ఆహారం బాగా నమిలి మ్రింగాలి. వాలి కూర్చొని తినకండి. ఒకవేళ ఇద్దరు లేక ముగ్గురు ఒకే కంచంలో తింటే, మీరు మీ ముందు నుండి తినండి, ఇతరులవైపు చేయిపెట్టకండి. ఒకవేళ కొంత మంది కలసి ఖర్జూ రాలు, ద్రాక్షలు తింటే ఒక్కొక్క గింజ తీసుకొని తినాలి. రెండేసి తీసుకోకూడదు. తినేటప్పుడు బాతాఖానీలు చేయకూడదు. నిదానంగా తినాలి. తినే పదార్థాల్లో లోపాలను ఎంచకూడదు. ఒకవేళ అన్నం నచ్చితే తినాలి లేదా తినకూడదు. అన్నం తినేటప్పుడు మధ్య ‘అల్హమ్దులిల్లాహ్‘ అని పలుకుతూ ఉండాలి. అసహ్యకరమైన వస్తువులను గురించి ప్రస్తావించ కూడదు. ఇతరులవైపు చూడ కూడదు. అన్నం తినేటప్పుడు ఉమ్మడం, ముక్కు శుభ్రం చేయడం చేయరాదు. అటువంటి పరిస్థితి ఏర్పడితే ముఖం త్రిప్పుకోవాలి. ఒకవేళ తినే టప్పుడు తుమ్మువస్తే నోటిపై గుడ్డ పెట్టుకోవాలి. అత్యధికంగా తినరాదు. ఒకవేళ తినేటప్పుడు అన్నం క్రిందపడిపోతే శుభ్రపరచి తినాలి. భోజనం చేసిన తర్వాత వ్రేళ్ళను శుభ్రంగా నాకాలి, చేతులను శుభ్రంగా కడుక్కోవాలి.
నీళ్ళు త్రాగితే ముందు ‘బిస్మిల్లాహ్‘ పఠించాలి. కుడిచేత్తో పట్టుకొని మూడు శ్వాసల్లో త్రాగాలి. నీటిలో ఊదకూడదు. అందులో ఏదైనా పడితే చేత్తో తీసి వేయాలి. వెండి, బంగారు పాత్రల్లో తినకూడదు, త్రాగ కూడదు. నీళ్ళు కూర్చొని త్రాగాలి. అనవసరంగా నీళ్ళు నిలబడి త్రాగకూడదు. ఎవరికైనా నీళ్ళు ఇస్తే కుడివైపు నుండి ఇవ్వాలి. అన్నం తినేటప్పుడు, నీళ్ళు త్రాగేటప్పుడు నవ్వరాదు. ఒకవేళ భోజనానికి ముందు ‘బిస్మిల్లాహ్’ పఠించడం మరచిపోతే మధ్యలో ‘బిస్మిల్లాహి అవ్వలహు వ ఆఖిరహు‘ పఠించాలి. వీటిన్నిటి సాక్ష్యాధారాలు క్రింద పేర్కొనబడ్డాయి.
=====
اَلْفَصْلُ الْأَوَّلُ మొదటి విభాగం
4159 – [ 1 ] ( متفق عليه ) (2/1210)
عَنْ عُمَرَ بْنِ أَبِيْ سَلَمَةَ قَالَ: كُنْتُ غُلَامًا فِيْ حِجْرِ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم وَكَانَتْ يَدِيْ تَطِيْشُ فِي الصَّفْحَةِ. فَقَالَ لِيْ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “سَمِّ اللهَ وَكُل بِيَمِيْنِكَ وَكُلْ مِمَّا يَلِيْكَ”.
4159. (1) [2/1210 –ఏకీభవితం]
‘ఉమర్ బిన్ అబీ సలమహ్ (ర) కథనం: నేను ప్రవక్త (స) సంరక్షణలో యువకుడ్ని, ప్రవక్త (స)తో కలసి కూర్చొని తినేవాడిని. కంచంలో నా చేయి అటూ ఇటూ తిరిగేది. అది చూచి ప్రవక్త (స), ”నువ్వు ‘బిస్మిల్లాహ్’ పఠించి కుడిచేత్తో తిను, ఇంకా నీ ముందు నుండి తీసుకొని తిను,” అని ఉపదేశించారు. (బు’ఖారీ, ముస్లిమ్)
4160 – [ 2 ] ( صحيح ) (2/1210)
وَعَنْ حُذَيْفَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِنَّ الشَّيْطَانَ يَسْتَحِلُّ الطَّعَامَ أَنْ لَا يُذْكَرَ اسْمُ اللهِ عَلَيْهِ”. رَوَاهُ مُسْلِمٌ.
4160. (2) [2/1210– దృఢం]
‘హుజై’ఫహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ‘బిస్మిల్లాహ్’ పఠించకుండా తినబడే ఆహారాన్ని షై’తాన్ ధర్మసమ్మతం చేసుకుంటాడు. అంటే వాడు కూడా తోడుగా తింటాడు. (ముస్లిమ్)
4161 – [ 3 ] ( صحيح ) (2/1210)
وَعَنْ جَابِرٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِذَا دَخَلَ الرَّجُلُ بَيْتَهُ فَذَكَرَ اللهَ عِنْدَ دَخُوْلِهِ وَعِنْدَ طَعَامِهِ قَالَ الشَّيْطَانُ: لَا مَبِيْتَ لَكُمْ وَلَا عَشَاءَ وَإِذَا دَخَلَ فَلَمْ يَذْكُرِ اللهَ عِنْدَ دَخُوْلِهِ قَالَ الشَّيْطَانُ: أَدْرَكْتُمُ الْمَبِيْتَ وَإِذَا لَمْ يَذْكُرِ اللهَ عِنْدَ طَعَامِهِ قَالَ : أَدْرَكْتُمُ الْمَبِيْتَ وَالْعَشَاءَ”. رَوَاهُ مُسْلِمٌ.
4161. (3) [2/1210– దృఢం]
జాబిర్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఎవరైనా అల్లాహ్ (త) పేరు పలికి ఇంట్లో ప్రవేశించి, అల్లాహ్ (త) పేరుతో తింటే, షై’తాన్ తన అనుచరులతో ఈ రోజు రాత్రిగడపటానికి మీకు ఇక్కడ చోటుదొరకదు. ఎందు కంటే అతడు అల్లాహ్(త) పేరుతో ఇంట్లో ప్రవేశించాడు, ఇప్పుడు ఆ ఇంట్లో మీరు ప్రవేశించలేరు, మీకు అన్నమూ దొరకదు. ఎందుకంటే అతడు దేవుని పేరుతో తిన్నాడు. ఎవరైనా ఇంట్లో ప్రవేశించినపుడు అల్లాహ్ (త) పేరును పలకకపోతే షై’తాన్ ‘ఈ రోజు మీకు రాత్రి గడిపేచోటు లభించింది, తినేటప్పుడు అల్లాహ్ (త)ను స్మరించకపోతే మీకు చోటుకూడా లభించింది, అన్నం కూడా లభించింది,’ అని అంటాడు. (ముస్లిమ్)
4162 – [ 4 ] ( صحيح ) (2/1210)
وَعَنِ ابْنِ عُمَرَقَالَ:قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم:”إِذَا أَكَلَ أَحَدُ كُمْ فَلْيَأْكُلْ بِيَمِيْنَهُ وَإِذَا شَرِبَ فَلْيَشْرِبْ بِيَمِيْنِهِ”. رَوَاهُ مُسْلِمٌ.
4162. (4) [2/1210–దృఢం]
‘అబ్దుల్లాహ్ బిన్ ‘ఉమర్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మీలో ఎవరైనా తింటే కుడిచేత్తో తినాలి, త్రాగితే కుడి చేత్తో త్రాగాలి.” (ముస్లిమ్)
4163 – [ 5 ] ( صحيح ) (2/1210)
وَعَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَا يَأْكُلُنَّ أَحَدُكُمْ بِشَمَالِهِ وَلَا يَشْرَبَنَّ بِهَا فَإِنَّ الشَّيْطَانَ يَأْكُلُ بِشَمَالِهِ وَيَشْرَبُ بِهَا”. رَوَاهُ مُسْلِمٌ .
4163. (5) [2/1210 –దృఢం]
‘అబ్దుల్లాహ్ బిన్ ‘ఉమర్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మీలో ఎవరూ ఎడమచేత్తో తినరాదు. ఎడమచేత్తో నీళ్ళూ త్రాగరాదు. ఎందుకంటే షై’తాన్ ఎడమచేత్తో తింటాడు, త్రాగుతాడు.” (ముస్లిమ్)
4164 – [ 6 ] ( صحيح ) (2/1210)
وَعَنْ كَعْبِ بْنِ مَالِكٍ قَالَ: كَانَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم يَأْكُلُ بِثَلَاثَةِ أَصَابِعَ وَيَلْعَقُ يَدَهُ قَبْلَ أَنْ يَمْسَحَهَا. رَوَاهُ مُسْلِمٌ .
4164. (6) [2/1210–దృఢం]
క’అబ్ బిన్ మాలిక్ (ర) కథనం: ప్రవక్త (స) మూడు వేళ్ళతో తినేవారు, ఇంకా కడుక్కునే ముందు చేతిని నాకే వారు. (ముస్లిమ్)
4165 – [ 7 ] ( صحيح ) (2/1211)
وَعَنْ جَابِر: أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم أَمَرَبِلَعْقِ الْأَصَابِعِ وَ الصَّحْفَةِ وَقَالَ: “إِنَّكُمْ لَا تَدْرُوْنَ فِيْ أَيَةِ الْبَرَكَةُ؟” رَوَاهُ مُسْلِمٌ
4165. (7) [2/1211–దృఢం]
జాబిర్ (ర) కథనం: ప్రవక్త (స) వేళ్ళను, ప్లేటును నాక మని ఆదేశించారు. అంటే వాటిని సరిగ్గా శుభ్రపరచుకోండి, ‘ఎందులో శుభం ఉందో మీకు తెలియదు,’ అని అన్నారు.[1] (ముస్లిమ్)
4166 – [ 8 ] ( متفق عليه ) (2/1211)
وَعَنِ ابْنِ عَبَّاسٍ أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم قَالَ: “إِذَا أَكَلَ أَحَدُكُمْ فَلَا يَمْسَحْ يَدَهُ حَتّى يَلْعَقَهَا أَوْ يُلْعِقَهَا”.
4166. (8) [2/1211–ఏకీభవితం]
ఇబ్నె ‘అబ్బాస్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మీలో ఎవరూ భోజనం తరువాత తనచేతిని తాను స్వయంగా నాకినా, లేదా ఎవరైనా అబ్బాయితో నాకించుకున్నంత వరకు తన చేతిని రుమాల్‌తో తుడవటంగానీ, నీటితో కడుక్కోవటం గానీ చేయరాదు.” (బు’ఖారీ, ముస్లిమ్)
4167 – [ 9 ] ( صحيح ) (2/1211)
وَعَنْ جَابِرٍ قَالَ: النَّبِيَّ صلى الله عليه وسلم يَقُوْلُ: “إِنَّ الشَّيْطَانَ يَحْضُرُ أَحَدَكُمْ عِنْدَ كُلّ شَيْءٍ مِنْ شَأْنِهِ حَتَّى يَحْضُرَهُ عِنْدَ طَعَامِهِ فَإِذَا سَقَطَتْ مِنْ أَحَدِكُمُ اللُّقْمَةُ فَلْيُمِطْ مَا كَانَ بِهَا مِنْ أَذًى ثُمَّ لِيَأْكُلْهَا وَلَا يَدَعْهَا لِلشَّيْطَانِ فَإِذَا فَرَعَ فَلْيَلْعَقْ أَصَابَ فَانَّهُ لَا يَدْرِيْ: فِيْ أَيِّ طَعَامِهِ يِكُوْنُ الْبَرَكَةُ؟” رَوَاهُ مُسْلِمٌ
4167. (9) [2/1211–దృఢం
జాబిర్ (ర) కథనం: ప్రవక్త (స) ను ఇలా అంటూ ఉండగా నేను విన్నాను, ”మీరు ఏ పనిచేసినా షై’తాన్ వెంటనే మీ వద్దకు వచ్చేస్తాడు. చివరికి భోజనం తింటున్నప్పుడు కూడా. అన్నం క్రిందపడిపోతే దాన్ని శుభ్రపరచి తినాలి. షై’తాన్‌కోసం అక్కడ దాన్ని వదలకూడదు. అన్నం తిన్న తరువాత చేతి వ్రేళ్ళను నాకాలి. ఎందుకంటే అన్నంలోని ఏ గింజలో శుభం ఉందో మీకు తెలియదు.” (ముస్లిమ్)
4168 – [ 10 ] ( صحيح ) (2/1211)
وَعَنْ أَبِيْ جُحَيْفَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَا آكُلُ مُتَّكِئًا”. رَوَاهُ الْبُخَارِيُّ .
4168. (10) [2/1211–దృఢం]
అబూ ‘హుజై’ఫహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”వాలుగా అంటే చేరబడి కూర్చొని తినరాదు.” [2] (బు’ఖారీ)
4169 – [ 11 ] ( صحيح ) (2/1211)
وَعَنْ قَتَادَةَ عَنْ أَنَسٍ قَالَ: مَا أَكَلَ النَّبِيُّ صلى الله عليه وسلم عَلَى خِوَانٍ وَلَا فِيْ سُكُرْجَةٍ وَلَا خُبِزَ لَهُ مُرَقَّقٌ قِيْلَ لِقَتَادَةَ: عَلَى مَا يَأْكُلُوْنَ؟ قَالَ: عَلى السُّفَرِ. رَوَاهُ الْبُخَارِيُّ
4169. (11) [2/1211–దృఢం]
ఖతాదహ్ (ర) అనస్ (ర) ద్వారా కథనం: అనస్ (ర) కథనం, ”ప్రవక్త (స) ఏనాడూ టేబుల్‌పై, కుర్సీపై భోజనం చేయలేదు. ఏనాడూ ప్రవక్త (స) కోసం పలుచని రొట్టె తయారు చేయబడలేదు. ఖతాదాను ప్రవక్త (స) దేనిపై తినేవారు అని అడిగితే చతురస్రాకారపు వస్త్రంపై తినేవారని సమాధానం ఇచ్చారు. [3] (బు’ఖారీ)
4170 – [ 12 ] ( صحيح ) (2/1211)
وَعَنْ أَنَسٍ قَالَ: مَا أَعْلَمُ النَّبِيّ صلى الله عليه وسلم رَأَى رَغِيْفًا مُرَقَّقًا حَتّى لَحِقَ بِاللهِ وَلَا رَأَى شَاةً سَمِيْطًا بِعَيْنِهِ قَطُّ. رَوَاهُ الْبُخَارِيُّ .
4170. (12) [2/1211–దృఢం]
అనస్ (ర) కథనం: నాకు తెలిసినంత వరకు ప్రవక్త (స) చపాతి రొట్టె చూడనేలేదు. అన్నం చాలా దూరం ఇంకా కాల్చ బడిన మేక చూడలేదు. (బు’ఖారీ)
అంటే అగ్గిపై కాల్చబడిన మేక. ఇటువంటి మాంసం గొప్పవాళ్ళు చాలా ఇష్టపడతారు. ఇది చాలా రుచికరంగా ఉంటుంది. ప్రవక్త (స) ఇటువంటి మాంసం, అన్నం చూడనే లేదు.
4171 – [ 13 ] ( صحيح ) (2/1211)
وَعَنْ سَهْلِ بْنِ سَعْدٍ قَالَ: مَا رَأَى رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم اَلنَّقِيَّ مِنْ حِيْنَ ابْتَعَثَهُ اللهُ حَتَّى قَبَضَهُ اللهُ وَقَالَ: مَا رَأَى رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم مُنْخَلًا مِنْ حِيْنَ ابْتَعَثُهُ اللهُ حَتّى قَبَضَهُ قِيْلَ: كَيْفَ كُنْتُمْ تَأْكُلُوْنَ الشَّعِيْرَ غَيْرَ مَنْخُوْلٍ؟ قَالَ: كُنَّا نَطْحَنُهُ وَنَنْفُخُهُ فَيَطِيْرُ مَا طَارَ وَمَا بَقِيَ ثَرَّيْنَاهُ فَأَكَلْنَاهُ. رَوَاهُ الْبُخَارِيُّ .
4171. (13) [2/1211–దృఢం]
సహల్ బిన్ స’అద్ (ర) కథనం: ప్రవక్త(స) సందేశ బాధ్యత పొందిన తర్వాత నుండి మరణం వరకు పిండి చూడనే లేదు. జల్లెడ చూడలేదు. మరి జల్లించని జొన్న రొట్టెలు ఎలా తినే వారని ప్రశ్నించడం జరిగింది. మేము దాన్ని పిండిచేసే వాళ్ళం, దానిపై ఊదేవాళ్ళం. ఆ తరువాత రొట్టె చేసి తినే వారం. [4] (బు’ఖారీ)
4172 – [ 14 ] ( متفق عليه ) (2/1212)
وَعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: مَا عَابَ النَّبِيُّ صلى الله عليه وسلم طَعَامًا قَطُّ إِنِ اشْتَهَاهُ أَكَلَهُ وَإِنْ كَرِهَهُ تَرَكَهُ .
4172. (14) [2/1212–ఏకీభవితం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) ఏనాడూ భోజనంలో లోపాలను ఎంచలేదు. కోరితే తినేవారు, లేకపోతే వదలివేసేవారు. (బు’ఖారీ, ముస్లిమ్)
4173 – [ 15 ] ( صحيح ) (2/1212)
وَعَنْهُ أَنَّ رَجُلًا كَانَ يَأْكُلُ أَكْلًا كَثِيْرًا فَأَسْلَمَ فَكَانَ يَأْكُلُ قَلِيْلًا فَذُكِرَ ذَلِكَ لِلنَّبِيِّ صلى الله عليه وسلم فَقَالَ: “إِنَّ الْمُؤْمِنَ يَأْكُلُ فِيْ مِعى وَاحِدٍ وَالْكَافِرَ يَأْكُلُ فِيْ سَبْعَةِ أَمْعَاءٍ”. رَوَاهُ الْبُخَارِيُّ.
4173. (15) [2/1212–దృఢం]
అబూ హురైరహ్ (ర) కథనం: ఒక వ్యక్తి చాలా అధికంగా తినేవాడు. అతడు ఇస్లామ్ స్వీకరించాడు. చాలా తక్కువ తినసాగాడు. దీన్ని గురించి ప్రవక్త (స) ముందు ప్రస్తావించగా, ప్రవక్త (స) విశ్వాసి ఒక ప్రేగులో తింటాడు, అవిశ్వాసి 7 ప్రేగుల్లో తింటాడు అని ప్రవచించారు. (బు’ఖారీ)
4174 – [ 16 ]؟ (2/1212)
وَ رَوَاى مُسْلِمٌ عَنْ اَبِىْ مُوْسَى وَابْنِ عُمَرَ الْمُسْنَدَ مِنْهُ فَقَطْ .
4174. (16) [2/1212 ? ]
అబూ మూసా (ర) కథనం. (ముస్లిమ్)
4175 – [ 17 ] ( صحيح ) (2/1212)
وروى مسلم عَنْ أبي موسى وابن عمر المسند منه فقط .
4175. (17) [2/1212– దృఢం]
ఇబ్నె ఉమర్, అబూ మూసా (ర)ల కథనం. (ముస్లిమ్)
4176 – [ 18 ] ؟ (2/1212)
وفي أخرى له عَنْ أَبِيْ هُرَيْرَةَ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم ضَافَهُ ضَيْفٌ وَهُوَ كَافِرٌ فَأَمَرَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم بِشَاةٍ فَحُلِبَتْ فَشَرِبَ حِلَابَهَا ثُمَّ أُخْرَى فَشَربَهُ ثُمَّ أُخْرَى فَشَرِبَهُ حَتَّى شَرِبَ حِلَابَ سَبْعِ شِيَاهٍ ثُمَّ إِنَّهُ أَصْبَحَ فَأَسْلَمَ فَأَمَرَ لَهُ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم بِشَاةٍ فَحُلِبَتْ فَشَرِبَ حِلَابَهَا ثُمَّ أَمَرَ بِأُخْرَى فَلَمْ يَسْتَتِمَّهَا. فَقَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “اَلْمُؤْمِنُ يَشْرَبُ فِي مِعى وَاحِدٍ وَالْكَافِرُ يَشْرَبُ فِيْ سَبْعَةِ أَمْعَاءٍ”.
4176. (18) [2/1212– ? ]
అబూ హురైరహ్ (ర) కథనం: ఒక అవిశ్వాసికి ప్రవక్త (స) ఆతిథ్యం ఇచ్చారు. ప్రవక్త (స) ఒక మేక పాలు పితకమని ఆదేశించారు. మేకపాలు తీసుకురావటం జరిగింది. ఆ పాలను అతిథికి త్రాపించమని ఆదేశించారు. అతడు పాలన్నీ త్రాగాడు. ‘ఇంకా కావాలా?’ అని అతన్ని అడగటం జరిగింది. అతడు సమాధానంగా అవును అన్నాడు. మరో మేక పాలు పితికి ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా త్రాగాడు, ‘ఇంకా కావాలా’ అంటే ‘అవును’ అని అన్నాడు. ఈ విధంగా ఏడు సార్లు జరిగింది. మరుసటి రోజు ఉదయం ఇస్లాం స్వీకరించాడు. ప్రవక్త (స) మేక పాలు తీసి అతనికి ఇవ్వమని ఆదేశించారు. అతడు దాన్ని త్రాగాడు. ప్రవక్త (స) మరో మేకపాలు తీసి అతనికి ఇవ్వమని ఆదేశించారు. మరో మేకపాలు తీసి అతనికి ఇవ్వడం జరిగింది. అతడు ఆ పాలను పూర్తిగా త్రాగలేక పోయాడు. అప్పుడు ప్రవక్త(స) ”విశ్వాసి ఒక ప్రేగులో త్రాగుతాడు, అవిశ్వాసి 7 ప్రేగుల్లో త్రాగుతాడు,’ అని ప్రవచించారు. [5]
4177 – [ 19 ] ( متفق عليه ) (2/1212)
وَعَنْهُ قَالَ قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “طَعَامُ الْاِثْنَيْنِ كَافِي الثَّلَاثَةِ وَطَعَامُ الثَّلَاثَةِ كَافِي الْأَرْبَعَةِ”.
4177. (19) [2/1212 –ఏకీభవితం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఇద్దరి భోజనం ముగ్గురికి సరిపోతుంది. ముగ్గురి భోజనం నలుగురికి సరిపోతుంది.” [6] (బు’ఖారీ, ముస్లిమ్)
4178 – [ 20 ] ( صحيح ) (2/1212)
وَعَنْ جَابِرٍ قَالَ: سَمِعْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ: “طَعَامُ الْوَاحِدِ يَكْفِي الْاِثْنَيْنِ وَطَعاَمُ الْاِثْنَيْنِ يَكْفِي الْأَرْبَعَةَ وَطَعاَمُ الْأَرْبَعَةِ يَكْفِي الثَّمَانِيَةَ”. رَوَاهُ مُسْلِمٌ
4178. (20) [2/1212 దృఢం ]
జాబిర్ (ర) కథనం: ప్రవక్త (స) ఇలా ప్రవచిస్తూ ఉండగా నేను విన్నాను, ”ఒక వ్యక్తి భోజనం ఇద్దరికి సరిపోతుంది. అదేవిధంగా ఇద్దరి భోజనం నలుగురికి సరిపోతుంది, నలుగురి భోజనం 8 మందికి సరిపోతుంది.” (ముస్లిమ్)
4179 – [ 21 ] ( متفق عليه ) (2/1212)
وَعَنْ عَائِشَةَ رَضِيَ اللهُ عَنْهَا قَالَتْ: سَمِعْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ: “اَلتَّلْبِينَةُ مُجِمَّةٌ لِفَؤَادِ الْمَرِيْضِ تَذْهَبُ بِبَعْضِ الْحُزْنِ”.
4179. (21) [2/1212 –ఏకీభవితం]
‘ఆయి’షహ్ (ర) కథనం: ప్రవక్త (స) ఇలా ప్రవచిస్తూ ఉండగా నేను విన్నాను, ”తల్బీనహ్ హృదయానికి ప్రశాంతతను చేకూరుస్తుంది, దుఃఖవిచారాలను దూరంచేస్తుంది.” [7] (బు’ఖారీ, ముస్లిమ్)
4180 – [ 22 ] ( متفق عليه ) (2/1213)
وَعَنْ أَنَسٍ أَنَّ خَيَّاطًا دَعَا النَّبِيّ صلى الله عليه وسلم لِطَعَامٍ صَنَعَهُ فَذَ هَبْتث مَعَ النَّبِيّ صلى الله عليه وسلم فَقَرب خُبْزَ شَعِيْرٍ وَمَرَقًا فِيْهِ دُبَّاءٌ وَقَدِيْدٌ فَرَأَيْتُ النَّبِيَّ صلى الله عليه وسلم يَتَتَبَّعُ الدُّبَّاءَ مِنْ حَوَالِي الْقَصْعَةِ فَلَمْ أَزَلْ أَحِبُّ الدُّبَّاءَ بَعْدَ يَوْمَئِذٍ وَعَنْ عَمْرِوبْنِ أُمَيَّةَ أَنَّهُ رَأَى النَّبِيَّ صلى الله عليه وسلم يَحْتَزُّ مِنْ كَتِفِ الشّاةٍ فِيْ يَدِهِ فَدُعِيَ إِلى الصَّلَاةِ فَأَلْقَاهَا وَالسِّكِّيْنَ الَّتِيْ يَحْتَزُّ بِهَا ثُمَّ قَامَ فَصَلّى وَلَمْ يَتَوَضَّأْ. متفق عليه.
4180. (22) [2/1213 –ఏకీభవితం]
అనస్ (ర) కథనం: ఒక టైలరు భోజనం వండి ప్రవక్త (స)ను ఆహ్వానించాడు. నేను కూడా ప్రవక్త (స) వెంట వెళ్ళాను. అతడు యవ్వ రొట్టెలు మరియు కూర ప్రవక్త (స) ముందు పెట్టాడు. అందులో మాంసం మరియు గుమ్మడి కాయలు ఉన్నాయి. ప్రవక్త (స) పళ్ళెంలో గుమ్మడి కాయలను వెతికి తిన్నారు. అప్పటి నుండి గుమ్మడి కాయలంటే నాకు చాలా ఇష్టం. (బు’ఖారీ, ముస్లిమ్)
4181 – [23] (مُتَّفق عَلَيْهِ) (2/1213)
وَعَن عَمْرو بنِ أُميَّةَ أَنَّهُ رَأَى النَّبِيَّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ يحتز من كتف الشَّاة فِي يَدِهِ فَدُعِيَ إِلَى الصَّلَاةِ فَأَلْقَاهَا وَالسِّكِّينَ الَّتِي يَحْتَزُّ بِهَا ثُمَّ قَامَ فَصَلَّى وَلَمْ يتَوَضَّأ . متفق عليه .
4181. (23) [2/1213 –ఏకీభవితం]
‘అమ్ర్ బిన్ ఉమయ్య (ర) కథనం: నేను ప్రవక్త (స) ను చూచాను, ”అతను (స) మేక తొడ నుండి కత్తితో కోసి మాంసాన్ని తింటున్నారు. ఇంతలో అ’జాన్ అయింది. ప్రవక్త (స) కత్తిని ఉంచి నమా’జు చదవడానికి వెళ్ళి పోయారు, నమా’జ్ చదివారు మళ్ళీ వు’దూ చేయ లేదు. (బు’ఖారీ, ముస్లిమ్)
ఈ ‘హదీసు’ ద్వారా వండిన పదార్థాన్ని తింటే వు’దూ భంగం కాదని తెలిసింది.
4182 – [ 24 ] ( صحيح ) (2/1213)
وَعَنْ عَائِشَةَ رَضِيَ اللهُ عَنْهَا قَالَتْ: كَانَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم يُحِبُّ الْحَلْوَاءَ وَالْعَسَلِ . رَوَاهُ الْبُخَارِيُّ .
4182. (24) [2/1213 –దృఢం]
‘ఆయి’షహ్ (ర) కథనం: ప్రవక్త (స) తీపి వస్తువు, తేనె అంటే ఎంతో ఇష్టపడేవారు. (బు’ఖారీ)
4183 – [ 25 ] ( صحيح ) (2/1213)
وَعَنْ جَابِرٍ أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم سَأَلَ أَهْلَهُ الْأَدَمَ .فَقَالَوْا: مَا عَنْدَنَا إِلَّا خَلٌّ فَدَعَا بِهِ فَجَعَلَ يَأْكُلُ بِهِ وَيَقُوْلُ: “نِعْمَ الْإِدَامُ الْخَلُّ نِعْمَ الْإِدَامُ الْخَلُّ”. رَوَاهُ مُسْلِمٌ .
4183. (25) [2/1213– దృఢం]
జాబిర్ (ర) కథనం: ప్రవక్త (స) తన ఇంటి వారిని కూర అడిగారు. ఇంటిలోని వారు కూరలేదు గాని, సిర్క ఉందని అన్నారు. ప్రవక్త (స) సిర్క తెప్పించారు, తినటం ప్రారంభించారు. ఇంకా, ‘సిర్క చాలా మంచి కూర,’ అని అన్నారు. [8] (ముస్లిమ్)
4184 – [ 26 ] ( متفق عليه ) (2/1213)
وَعَنْ سَعِيْدِ بْنِ زَيْدٍ قَالَ: قَالَ النَّبِيُّ صلى الله عليه وسلم: “اَلْكَمَأةُ مِنَ الْمَنِّ وَمَاؤُهَا شِفَاءٌ لِلْعَيْنِ”. مُتَّفَقٌ عَلَيْهِ.
وَفِيْ رِوَايَةٍ لِمُسْلِمٍ: “مِنَ الْمَنِّ الَّذِيْ أَنْزَلَ اللهُ تَعَالى عَلَى مُوْسَى عَلَيْهِ السَّلَام”.
4184. (26) [2/1213 –ఏకీభవితం]
స’యీద్ బిన్ ‘జైద్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మన్ వంటికి, దాని నీరు కళ్ళకు మందు వంటిది.” [9] (బు’ఖారీ, ముస్లిమ్)
మస్లిమ్ లోని మరో ఉల్లేఖనలో ఇది అల్లాహ్ మూసా (అ)పై అవతరింపజేసిన మన్ లోనిదే అని ఉంది.
4185 – [ 27 ] ( متفق عليه ) (2/1213)
وَعَنْ عَبْدِ اللهِ بْنِ جَعْفَرٍ قَالَ: رَأَيْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يَأْكُلُ الرُّطَبَ بِالْقِثَّاءِ.
4185. (27) [2/1213 –ఏకీభవితం]
‘అబ్దుల్లాహ్ బిన్ జ’అఫర్ (ర) కథనం: ప్రవక్త (స)ను తాజా ఖర్జూరాలను, ఖీరాతో పాటు తినటం నేను చూసాను. (బు’ఖారీ, ముస్లిమ్)
అంటే ఖర్జూరం వేడి, ఖీరా చల్లది. రెంటినీ కలిపి తింటే సమానంగా ఉంటుంది. ఆరోగ్యానికి మంచిది కూడా.
4186 – [ 28 ] ( متفق عليه ) (2/1213)
وَعَنْ جَابِرٍقَالَ: كُنَّا مَعَ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم بِمَرِّ الظّهْرَانِ نَجْنِي الْكَبَاثَ فَقَالَ: “عَلَيْكُمْ بِالْأَسْوَدِ مِنْهُ فَإِنَّهُ أَطْيَبُ” فَقِيْلَ: أَكُنْتَ تَرْعَى الْغَنَمَ ؟ قَالَ: “نَعَمْ وَهَلْ مِنْ نَبِيٍّ إِلَّا رَعَاهَا؟”
4186. (28) [2/1213 –ఏకీభవితం]
జాబిర్ (ర) కథనం: మేము ప్రవక్త (స) వెంట మర్”జహ్‌రాన్ ప్రాంతంలో ఉన్నాం. మేము నేరేడు పళ్ళను తెంపసాగాము. అది చూసి ప్రవక్త (స), ‘నల్లటి పండ్లను తెంపండి. ఎందుకంటే నల్లటి పండ్లు చాలా రుచికరంగా ఉంటాయి,’ అని అన్నారు. ప్రవక్త (స) ను ‘తమరు మేకలను కాచారా?’ అని ప్రశ్నించడం జరిగింది. దానికి ప్రవక్త (స), ‘అవును, ప్రవక్తలందరూ మేకలను కాచారు,’ అని సమాధానం ఇచ్చారు. (బు’ఖారీ, ముస్లిమ్)
4187 – [ 29 ] ( صحيح ) (2/1214)
وَعَنْ أَنَسٍ قَالَ: رَأَيْتُ النَّبِيَّ صلى الله عليه وسلم مُقْعِيًا يَأْكُلُ تَمْرًا وَفِيْ رِوَايَةٍ: يَأْكُلُ مِنْهُ أَكْلًا ذَرِيْعًا. رَوَاهُ مُسْلِمٌ .
4187. (29) [2/1214– దృఢం]
అనస్ (ర) కథనం: ప్రవక్త (స) ను మోకాళ్ళపై కూర్చొని ఖర్జూరాలు తినటం నేను చూసాను. అంటే మోకాళ్ళపై కూర్చొని ఖర్జూరాలు త్వరగా తింటూ ఉన్నారు. (ముస్లిమ్)
4188 – [ 30 ] ( متفق عليه ) (2/1214)
وَعَنِ ابْنِ عُمَرَ قَالَ: نَهَى رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم أَنْ يَقْرِنَ الرَّجُلُ بَيْنَ التَّمْرَتَيْنِ حَتَّى يَسْتَأْذِنَ أَصْحَابَهُ. متفق عليه.
4188. (30) [2/1214 –ఏకీభవితం]
ఇబ్నె ‘ఉమర్ (ర) కథనం: ప్రవక్త (స) రెండేసి ఖర్జూ రాలను ఒకేసారి తినటాన్ని వారించారు. అయితే తన ప్రక్కవారి అనుమతి తీసుకోవాలి. [10] (బుఖా’రీ, ముస్లిమ్)
4189 – [ 31 ] ( صحيح ) (2/1214)
وَعَنْ عَائِشَةَ رَضِيَ اللهُ عَنْهَا إِنَّ النَّبِيَّ صلى الله عليه وسلم قَالَ: “لَا يَجُوْعُ أَهْلُ بَيْتٍ عِنْدَهُمْ التَّمْرُ”.
وَفِيْ رِوَايَةٍ: قَالَ: “يَا عَائِشَةَ بَيْتٌ لَا تَمْرَ فِيْهِ جِيَاعٌ أَهْلُهُ”. قَالَهَا مَرَّتَيْنِ أَوْ ثَلَاثًا. رَوَاهُ مُسْلِمٌ.
4189. (31) [2/1214 –దృఢం]
‘ఆయి’షహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఖర్జూరం ఉన్న ఇంటివారు పస్తులు ఉండరు.” మరో ఉల్లే ఖనంలో ఇలా ఉంది, ”ఓ ‘ఆయి’షహ్! ఖర్జూరం లేని ఇంటి వారు పస్తులు ఉంటారు.” ఇలా రెండు లేక మూడుసార్లు ప్ర వచించారు. [11] (ముస్లిమ్)
4190 – [ 32 ] ( متفق عليه ) (2/1214)
وَعَنْ سَعْدٍ قَالَ: سَمِعْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ: “مَنْ تَصَبَّحَ بِسَبْعِ تَمراتٍ عَجْوَةٍ لَمْ يَضُرَّهُ ذَلِكَ الْيَوْمَ سُمٌّ وَلَا سِحْرٌ”.
4190. (32) [2/1214– ఏకీభవితం]
స’అద్(ర) కథనం: ప్రవక్త (స) ఇలా ప్రవచిస్తూ ఉండగా నేను విన్నాను, ”ఉదయాన్నే 7 ‘అజ్వహ్ ఖర్జూ రాలు తిన్నవారికి ఆ రోజు అతనికి విషంగానీ, చేతబడి గానీ హాని చేకూర్చ లేవు.” [12] (బు’ఖారీ, ముస్లిమ్)
4191 – [ 33 ] ( صحيح ) (2/1214)
وَعَنْ عَائِشَةَ رَضِيَ اللهُ عَنْهَا أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم قَالَ: “إِنَّ فِي عَجْوَةِ الْعَالِيَةِ شِفَاءٌ وَإِنَّهَا تِرْيَاقٌ أَوَّلَ الْبُكْرَةِ”. رَوَاهُ مُسْلِمٌ .
4191. (33) [2/1214–దృఢం]
‘ఆయి’షహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మదీనహ్ లోని ‘అజ్వహ్ ఖర్జూరాలు చాలా మహిమ గలవి. ఆరోగ్య ప్రదమైనవి. ఉదయం వీటిని తిన్నవారికి విషం ఏమాత్రం హాని చేకూర్చదు.” [13] (ముస్లిమ్)
4192 – [ 34 ] ( متفق عليه ) (2/1214)
وَعَنْهَا قَالَتْ: كَانَ يَأْتِيْ عَلَيْنَا الشَّهْرُ مَا نُوْقِدُ فِيْهِ نَارًا إِنَّمَا هُوَ التَّمْرُ وَالْمَاءُ إِلَّا أَنْ يُؤْتَى بِاللُّحَيْمِ.
4192. (34) [2/1214 –ఏకీభవితం]
‘ఆయి’షహ్ (ర) కథనం: ఒక్కోసారి నెల గడిచి పోతుంది గాని, మా ఇంట్లో పొయ్యి వెలగదు. కేవలం ఖర్జూరం, నీళ్ళతోనే గడిపేవాళ్ళం. ఎవరైనా కాను కగా మాంసం పంపితే తప్ప. (బు’ఖారీ, ముస్లిమ్)
4193 – [ 35 ] ( متفق عليه ) (2/1214)
وَعَنْهَا قَالَتْ: مَا شَبَعَ آلُ مُحَمَّدٍ يَوْمَيْنِ مِنْ خُبْزِ بُرٍّ إِلَّا وَأَحَدُهُمَا تَمْرٌ.
4193. (35) [2/1214 –ఏకీభవితం]
‘ఆయి’షహ్ (ర) కథనం: ప్రవక్త (స) కుటుంబం కనీసం రెండు రోజులు రొట్టె తినేవారు కాదు. ఆ రెండు రోజుల్లో ఒక రోజు ఖర్జూరం తప్పకుండా ఉండేది. (బు’ఖారీ, ముస్లిమ్)
4194 – [ 36 ] ( متفق عليه ) (2/1214)
وَعَنْهَا قَالَتْ: تُوُفِّيَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم ومَا شَبِعْنَا مِنَ الْأَسْوَدَيْنِ .
4194. (36) [2/1214– ఏకీభవితం]
‘ఆయి’షహ్ (ర) కథనం: ప్రవక్త (స) మరణం వరకు కనీసం ఖర్జూరం, నీళ్ళు అయినా సరిగా ఉండేవి కావు.[14] (బు’ఖారీ, ముస్లిమ్)
4195 – [ 37 ] ( صحيح ) (2/1215)
وَعَنِ النُّعْمَانِ بْنِ بَشِيْرٍ قَالَ: أَلَسْتُمْ فِيْ طَعَامٍ وَشَرَابٍ مَا شِئْتُمْ؟ لَقَدْ رَأَيْتُ نَبِيَّكُمْ صلى الله عليه وسلم وَمَا يَجِدُ مِنَ الدَّقَلِ مَا يَمْلَأُ بَطْنَهُ. رَوَاهُ مُسْلِمٌ .
4195. (37) [2/1215–దృఢం]
ను’అమాన్ బిన్ బషీర్ (ర) కథనం: ఈ కాలంలో మీరు మీరు కోరినట్లు తింటున్నారు, త్రాగుతున్నారు. ఎటు వంటి కష్టం లేదు. ప్రవక్త (స) చాలీ చాలని రద్దీ ఖర్జూరాలను తిని గడిపేవారు. కడుపు కూడా సరిగా నిండేది కాదు. (ముస్లిమ్)
4196 – [ 38 ] ( صحيح ) (2/1215)
وَعَنْ أَيُّوْبٍ قَالَ: كَانَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم إِذَا أُتِيَ بِطَعَامٍ أَكَلَ مِنْهُ وَبَعَثَ بِفَضْلِهِ إِلَيَّ وَإِنَّهُ بَعَثَ إِلَيَّ يَوْمًا بِقَصْعَةٍ لَمْ يَأْكُلْ مِنْهَا لِأَنَّ فِيْهَا ثَوْمًا فَسَأَلْتُهُ: أَحْرَامٌ هُوَ؟ قَالَ: “لَا وَلَكِنْ أَكْرَهُهُ مِنْ أَجَلٍ رِيْحِهِ”. قَالَ: فَإِنِّيْ أَكْرَهُ مَا كَرِهْتَ. رَوَاهُ مُسْلِمٌ.
4196. (38) [2/1215 –దృఢం]
అబూ అయ్యూబ్ అ‘న్సారీ (ర) కథనం: ప్రవక్త (స) ముందు భోజనం వస్తే, తాను తిని మిగిలింది నాకు పంపే వారు. ఒకసారి ప్రవక్త (స)కు భోజనం పంపాను. కాని ప్రవక్త (స) తినలేదు. తిరిగి పంపివేసారు. ఎందుకంటే అందులో తెల్లుల్లి పడి ఉంది. ‘ఓ ప్రవక్తా! ఇది నిషిద్ధమా,’ అని అడిగాను. దానికి ప్రవక్త (స), ‘నిషిద్ధం కాదు. కాని దాని వాసన నాకు ఇష్టం లేదు,’ అని అన్నారు. అప్పుడు నేను, ‘ఓ ప్రవక్తా! మీకు ఇష్టం లేనిది నాకూ, ఇష్టంలేదు’ అని అన్నాను.[15] (ముస్లిమ్)
4197 – [ 39 ] ( متفق عليه ) (2/1215)
وَعَنْ جَابِرٍ أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم قَالَ: “مَنْ أَكَلَ ثَوْمًا أَوْ بَصَلًا فَلْيَعْتَزِلْنَا”. أَوْ قَالَ: “فَلْيَعْتَزِلْ مَسْجِدَناَ أَوْ ليَقْعُدْ فِيْ بَيْتِهِ”. وَإِنَّ النَّبِيَّ صلى الله عليه وسلم أُتِيَ بِقَدْرٍ فِيْهِ خَضِرَاتٌ مِنْ بُقُوْلٍ فَوَجَدَ لَهَا رِيْحًا فَقَالَ: “قَرِّبُوْهَا” إِلى بَعْض أَصْحَابِهِ وَقَالَ: “كُل فَإِنِّيْ أُنَاجِيْ مَنْ لَا تُنَاجِيْ”.
4197. (39) [2/1215 –ఏకీభవితం]
జాబిర్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”పచ్చి తెల్ల ఉల్లిని తిని వచ్చేవారు మాకు దూరంగా ఉండాలి. మా మస్జిదుల్లోనికి రాకూడదు, తనఇంట్లో కూర్చోవాలి. ప్రవక్త (స) వద్దకు ఒక గిన్నె తీసుకు రావటం జరిగింది. అందులో ఆకుకూరలు ఉన్నాయి. అంటే అందులో ఉలి, తెల్లుల్లి మొదలైనవి ఉన్నాయి. ప్రవక్త (స) దాని నుండి ఒక విధమైన వాసన గ్రహించి, ‘దీన్ని నా స్నేహితులకు ఇచ్చేయండి వాళ్ళు తింటారు. ఎందుకంటే నేను ఎలాంటి వాళ్ళతో మాట్లాడుతానంటే వారితో వీరు మాట్లాడలేరు,’ అని అన్నారు.” (బు’ఖారీ, ముస్లిమ్)
4198 – [ 40 ] ( صحيح ) (2/1215)
وَعَنِ الْمِقْدَامِ بْنِ مَعْدِيْ كَرِبَ عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ: “كِيْلُوْا طَعَامَكَمْ يُبَارَكْ لَكُمْ فِيْهِ”. رَوَاهُ الْبُخَارِيُّ .
4198. (40) [2/1215 –దృఢం]
మిఖ్‌దామ్ బిన్ మ’అదీ కరబ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మీరు మీ ఆహార ధాన్యాలను, తినే వస్తువులను తూచుకోండి. అందులో శుభం ప్రసాదిం చడం జరుగుతుంది.” [16] (బు’ఖారీ)
4199 – [ 41 ] ( صحيح ) (2/1215)
وَعَنْ أَبِيْ أُمَامَةَ أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم كَانَ إِذَا رَفَعَ مَائِدَتُهُ قَالَ: “اَلْحَمْدُ لِلّهِ حَمْدًا كَثِيْرًا طَيِّبًا مُبَارَكًا فِيْهِ غَيْرَ مَكْفِيٍّ وَلَا مُوَدَّعٍ وَلَا مُسْتَغْنَى عَنْهُ رَبَّنَا”. رَوَاهُ الْبُخَارِيُّ .
4199. (41) [2/1215 –దృఢం]
అబూ ఉమామ(ర) కథనం: ప్రవక్త(స) తన ముందు నుండి దస్తర్ఖాన్ ఎత్తుకున్న తరువాత ఇలా ప్రార్ధించే వారు, ”ఓ అల్లాహ్ ! అత్యత్తమమైన, అనంతమైన, అతి శ్రేష్టమైన, శుభకరమైన స్తోత్రాలన్నీ నీ కొరకే, అంతం కానివి, వదల జాలనివి, ఎల్లప్పుడూ వాటి అవసరం ఉన్నవి.” (బు’ఖారీ)
4200 – [ 42 ] ( صحيح ) (2/1215)
وَعَنْ أَنَسٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِنَّ اللهَ تَعَالى لَيَرْضَى عَنِ الْعَبْدِ أَنْ يَأْكُلَ الْأَكْلَةَ فَيَحْمَدُهُ عَلَيْهَا أَوْ يَشْرَبَ الشَّرْبَةَ فَيَحْمَدُهُ عَلَيْهَا”. رَوَاهُ مُسْلِمٌ وَسَنَذْكُرُ حَدِيْثَيْ عَائِشَةَ وَأَبِيْ هُرَيْرَةَ: مَا شَبِعَ آلُ مُحَمَّدٍ وَخَرَجَ النَّبِيُّ صلى الله عليه وسلم مِنَ الدُّنْيَا فِيْ “بَابِ فَضْلِ الْفُقَرَاءِ” إِنْ شَاءَ اللهُ تَعَالى
4200. (42) [2/1215–దృఢం]
అనస్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఒక ముద్ద తిని ‘అల్‌హమ్‌దులిల్లాహ్’ అని, ఒక గుక్కెడు నీళ్ళుత్రాగి, ‘అల్‌హమ్‌దులిల్లాహ్’ అని పలికే దాసుని పట్ల అల్లాహ్(త) సంతోషం వ్యక్తం చేస్తాడు. (ముస్లిమ్)
అంటే ప్రతి ముద్దపై, ప్రతి గుక్కెడు నీటిపై, ‘అల్ ‘హమ్‌దు లిల్లాహ్,’ అని పలకాలి.
—–
اَلْفَصْلُ الثَّانِيْ రెండవ విభాగం
4201 – [ 43 ] ( لم تتم دراسته ) (2/1216)
عَنْ أَبِيْ أَيُّوْبَ قَالَ: كُنَّا عِنْدَ النَّبِيَّ صلى الله عليه وسلم فَقُرِّبَ طَعَامٌ فَلَمْ أَرَ طَعَامًا كَانَ أَعْظَمُ بَرَكَةً مِنْهُ أَوَّلُ مَا أَكَلْنَا وَلَا أَقَلّ بَرَكَةً فِيْ آخِرِهِ. قُلْنَا: يَا رَسُوْلَ اللهِ كَيْفَ هَذَا؟ قَالَ: “إِنَّا ذَكَرْنَا اسْمَ اللهِ عَلَيْهِ حِيْنَ أَكَلْنَا ثُمَّ قَعَدَ مَنْ أَكَلَ وَلَمْ يُسَمِّ اللهِ فَأَكَلَ مَعَهُ الشَّيْطَانُ”. رَوَاهُ فِيْ شَرْحِ السُّنَّةِ .
4201. (43) [2/1216 –అపరిశోధితం]
అబూ అయ్యూబ్ అ’న్సారీ (ర) కథనం: మేము ప్రవక్త (స) వద్ద కూర్చొని ఉన్నాం. ఇంతలో ప్రవక్త (స) వద్దకు భోజనం తీసుకురావటం జరిగింది. ఆ భోజనంలో ఎంత అధికంగా శుభం ఉండేదంటే, మరే భోజనంలో అంత శుభం చూడలేదు. అంటే ప్రారంభంలో చాలా అధికంగా శుభం చూసాము. చివరిలో ఆ శుభం కనబడలేదు. అప్పుడు మేము ప్రవక్త (స)ను, ‘విషయం ఏమిటి?’ అని విన్నవించు కున్నాం. దానికి ప్రవక్త (స), ”మనం ప్రారంభంలో, ‘బిస్మిల్లాహ్’ పఠించి భోజనం ప్రారంభించాం, కాని తరువాత మరి కొందరు వచ్చి చేరారు. వారు, ‘బిస్మిల్లాహ్’ అని పలకకుండా తినటం ప్రారం భించారు. వారితో పాటు షై’తాన్ కూడా తినసాగాడు. అందు వల్లే శుభం లేకుండా పోయింది,” అని అన్నారు.[17] (షర్’హు స్సున్నహ్)
4202 – [ 44 ] ( صحيح ) (2/1216)
وَعَنْ عَائِشَةَ قَالَتْ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِذَا أَكَلَ أَحَدُكُمْ فَنَسِيَ أَنْ يَذْكُرَ اللهَ عَلَى طَعَامِهِ فَلْيَقُلْ: بِسْمِ اللهِ أَوَّلَهُ وَآخِرَهُ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَأَبُوْ دَاوُدَ .
4202. (44) [2/1216– దృఢం]
‘ఆయి’షహ్ (ర) కథనం: ప్రవక్త(స) ప్రవచనం, ”ప్రారం భంలో ‘బిస్మిల్లాహ్’ పఠించటం మరచిపోతే, గుర్తుకు రాగానే ‘బిస్మిల్లాహి అవ్వలహు వ ఆఖిరహు,’ అని పలకాలి. (తిర్మిజి’, అబూ దావూద్)
4203 – [ 45 ] ( ضعيف ) (2/1216)
وَعَنْ أُمَيَّةَ بْنِ مَخْشِيِّ قَالَ: كَانَ رَجُلٌ يَأْكُلُ فَلَمْ يُسَمِّ حَتّى لَمْ يَبْقَ مِنْ طَعَامِهِ إِلَّا لُقْمَةٌ فَلَمَّا رفَعَهَا إِلَى فِيْهِ قَالَ: بِسْمِ اللهِ أَوَّلَهُ وَآخِرَهُ فَضَحِكَ النَّبِيُّ صلى الله عليه وسلم ثُمَّ قَالَ: “مَا زَالَ الشَّيْطَانُ يَأْكُلُ مَعَهُ فَلَمَّا ذُكِرَ اسْمُ اللهِ اسْتَقَاءَ مَا فِيْ بَطَنِهِ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ .
4203. (45) [2/1216 –బలహీనం]
ఉమయ్య బిన్ మ’ఖ్‌షియ్యి (ర) కథనం: ఒక వ్యక్తి భోజనానికి ముందు ‘బిస్మిల్లాహ్’ పఠించలేదు. ఇంకా ఒక్క ముద్ద మిగిలి ఉంది. అప్పుడు అతనికి గుర్తుకు వచ్చింది. వెంటనే ఆ వ్యక్తి, ‘బిస్మిల్లాహి అవ్వలహు వ ఆఖిరహు,’ అని పఠించాడు. నేను ప్రవక్త (స)ను చూసాను, ఫక్కున నవ్వారు. ‘బిస్మిల్లాహ్’ చదవ కుండా అతను తింటున్నప్పుడు అతనితో పాటు షై’తాన్ కూడా తిన్నాడు. గుర్తుకు వచ్చి ‘బిస్మిల్లాహ్ పఠించగానే షై’తాన్ తిన్నదంతా వాంతి చేసివేసాడు.[18] (అబూ దావూద్)
4204 – [ 46 ] ( ضعيف ) (2/1216)
وَعَنْ أَبِيْ سَعِيْدِ الْخُدْرِيِّ قَالَ: كَانَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم إِذَا فَرَغَ مِنْ طَعَامِهِ قَالَ: “اِلْحَمْدُ لِلّهِ الَّذِيْ أَطْعَمَنَا وَسَقَانَا وَجَعَلَنَا مُسْلِمِيْنَ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَأَبُوْ دَاوُدَ وَابْنُ مَاجَهُ .
4204. (46) [2/1216 –బలహీనం]
అబూ స’యీద్ ‘ఖుద్రీ (ర) కథనం: ప్రవక్త (స) భోజనం చేసిన తర్వాత ఈ దు’ఆ చదివేవారు, ”అల్హమ్దు లిల్లా హిల్లజీ అత్అమనా, వ సఖానా వ జఅలనా మినల్ ముస్లిమీన్.” (తిర్మిజి’, అబూ దావూద్, ఇబ్నె మాజహ్)
4205 – [ 47 ] ( لم تتم دراسته ) (2/1217)
وَعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “الطَّاعِمُ الشَّاكِرُ كَالصَّائِمِ الصَّابِرِ”. رَوَاهُ التِّرْمِذِيُّ .
4205. (47) [2/1217 –అపరిశోధితం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”భోజనం చేసి కృతజ్ఞతలు తెలిపేవాడు సహనంతో ఉపవాసం పాటించినట్టు.” [19] (తిర్మిజి’)
4206 – [ 48 ] ( لم تتم دراسته ) (2/1217)
وَابْنُ مَاجَهُ وَالدَّارَمِيُّ عَنْ سِنَانِ بْنِ سَنَّةَ عَنْ أَبِيْهِ.
4206. (48) [2/1216– అపరిశోధితం]
సినాన్ బిన్ సన్నహ్ కథనం. (ఇబ్నె మాజహ్, దార్మి)
4207 – [ 49 ] ( صحيح ) (2/1217)
وَعَنْ أَبِيْ أَيُّوْبِ قَالَ: كَانَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم إِذَا أَكَلَ أَوْ شَرِبَ قَالَ: “اَلْحَمْدُ لِلّهِ الَّذِيْ أَطْعَمَ وَسَقَى وَسَوَّغَهُ وَجَعَلَ لَهُ مَخْرَجًا”. رَوَاهُ أَبُوْ دَاوُدَ .
4207. (49) [2/1217– దృఢం]
అబూ అయ్యూబ్ అ’న్సారీ (ర) కథనం: ప్రవక్త (స) భోజనం చేసి, నీళ్ళు త్రాగిన తర్వాత ఈ దు’ఆ చదివే వారు, ”అల్‌హమ్‌దులిల్లా హిల్లజీ అత్‌అమ వ సఖా వ సవ్వ’గహు వ జఅల లహు మ’ఖ్‌రజన్.”- ‘స్తోత్రాలన్నీ అల్లాహ్(త)కే, ఆయనే అన్నం తిని పించాడు, దాహం తీర్చాడు, తినేశక్తి ప్రసాదించాడు, బయటకు వచ్చేమార్గం ప్రసాదించాడు.” (అబూ దావూద్)
4208 – [ 50 ] ( ضعيف ) (2/1217)
وَعَنْ سَلْمَانَ قَالَ: قَرَأْتُ فِي التَّوْرَاةِ أَنَّ بَرَكَةَ الطَّعَامِ الْوُضُوْءُ بَعْدَهُ فَذَكَرْتُ ذَلِكَ لِلنَّبِيِّ صلى الله عليه وسلم. فَقَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “بَرَكَةُ الطَّعَامِ الْوُضُوْءُ قَبْلَهُ وَالْوُضُوْءُ بَعْدَهُ”. رَوَاهُ التِّرْمِذِيُّ وأَبُوْ دَاوُدَ.
4208’ (50) [2/1217– బలహీనం]
సల్మాన్ (ర) కథనం: నేను తౌరాతులో ఇలా చదివాను, ”తినటానికి ముందు, తిన్న తరువాత వు’దూ చేయటంలో అంటే కాళ్ళూ చేతులు కడుక్కోవడం వల్ల ఆహారంలో శుభం కలుగుతుంది.” (తిర్మిజి, అబూ దావూద్)
4209 – [ 51 ] ( لم تتم دراسته ) (2/1217)
وَعَنِ ابْنِ عَبَّاسٍ أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم خَرَجَ مِنَ الْخَلَاءِ فَقُدِّمِ إِلَيْهِ طَعَامٌ فَقَالُوْا: أَلَّا نَأْتِيْكَ بِوُضُوْءٍ؟ قَالَ: “إِنَّمَا أُمِرْتُ بِالْوُضُوْءِ إِذَا قُمْتُ إِلى الصَّلَاةِ”. رَوَاهُ التِّرْمِذِيُّ وأَبُوْ دَاوُدَ وَالنَّسَائِيُّ .
4209. (51) [2/1217– అపరిశోధితం]
ఇబ్నె ‘అబ్బాస్ (ర) కథనం: ప్రవక్త (స) మల మూత్ర విసర్జన చేసి వచ్చారు. ప్రవక్త (స) ముందు భోజనం తీసుకు రావటం జరిగింది. అప్పుడు అనుచరులు, ‘వు’దూ కోసం నీళ్ళు తీసుకురావాలా?’ అని విన్నవించుకున్నారు. దానికి ప్రవక్త (స), ‘నమా’జు కోసం వెళ్ళినపుడు నాకు వు’దూ చేయమని ఆదేశించడం జరిగింది,’ అని ప్రవచించారు. (తిర్మిజి’, అబూ దావూద్, నసాయి’)
4210 – [ 52 ] ( لم تتم دراسته ) (2/1217)
وَرَوَاهُ ابْنُ مَاجَهُ عَنْ أَبِيْ هُرَيْرَةَ.
4210. (52)[2/1217 –అపరిశోధితం]
అబూ హురైరహ్ (ర) కథనం. [20] (ఇబ్నె మాజహ్)
4211 – [ 53 ] ( صحيح ) (2/1217)
وَعَنِ ابْنِ عَبَّاسٍ عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم: أَنَّهُ أُتِيَ بِقَصْعَةٍ مِنْ ثَرِيْدٍ فقَالَ: “كُلُوْا مِنْ جَوَانِبِهَا وَلَا تَأْكُلُوْا مِنْ وَسْطِهَا فَإِنَّ الْبَرَكَةَ تَنْزِلُ فِيْ وَسْطِهَا”. رَوَاهُ التِّرْمِذِيُّ وَابْنُ مَاجَهُ وَالدَّارَمِيُّ. وَقَالَ التِّرْمِذِيُّ: هَذَا حَدِيْثٌ حَسَنٌ صَحِيْحٌ .
4211. (53) [2/1217–దృఢం]
ఇబ్నె ‘అబ్బాస్ (ర) కథనం: ప్రవక్త (స) ముందు స‘రీత్ గిన్నె తెచ్చి ఉంచటం జరిగింది. ప్రవక్త (స) తన అనుచరులతో, ‘ప్రక్కనుండి తినండి, ఎందుకంటే మధ్య శుభం అవతరిస్తుంది,’ అని అన్నారు. [21] (తిర్మిజి’ / ప్రామాణికం, -దృఢం, ఇబ్నె మాజహ్, దార్మి)
అబూ దావూద్‌లోని ఒక ఉల్లేఖనంలో ఇలా ఉంది, ”మీరు తిన్నప్పుడు ప్లేటు ప్రక్క క్రింది భాగం నుండి తినండి. ఎందుకంటే మధ్య అంటే పైన శుభం అవతరిస్తుంది.
4212 – [ 54 ] ( صحيح ) (2/1217)
وَعَنْ عَبْدِ اللهِ بْنِ عَمْرٍو قَالَ: مَا رُئِيَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم يَأْكُلُ مُتَّكِئًا قَطُّ وَلَا يَطَأُ عَقِبَهُ رَجُلَانِ. رَوَاهُ أَبُوْ دَاوُدَ
4212. (54) [2/1217 –దృఢం]
‘అబ్దుల్లాహ్ బిన్ ‘అమ్ర్ (ర) కథనం: ప్రవక్త (స)ను తలగడపై వాలుగా కూర్చొని తినటం నేను చూడలేదు. అతను (స) వెనుక ఇద్దరు వ్యక్తులను నడవటం కూడా చూడలేదు. (అబూ దావూద్)
ప్రవక్త (స) నిదానంగా వెనుక నడిచేవారు. ఇతరులను తన ముందు నడవమని ఆదేశించేవారు. ఎందుకంటే ప్రవక్త (స) పర్యవేక్షకులు మరియు బాధ్యులు. సాధారణంగా బాధ్యత గలవారు వెనుకనే నడుస్తారు.
4213 – [ 55 ] ( لم تتم دراسته ) (2/1218)
وَعَنْ عَبْدِ اللهِ بْنِ الْحَارِثِ بْنِ جَزُءٍ قَالَ: أُتِيَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم بِخُبْزٍ وَلَحْمٍ وَهُوَ فِي الْمَسْجِدِ فَأَكَلَ وَأَكَلْنَا مَعَهُ. ثُمَّ قَامَ فَصَلّى وَصَلينَا مَعَهُ. وَلَمْ نَزِدْ عَلَى أَنْ مَسَحْنَا أَيْدِيَنَا بِالْحَصْبَاءِ. رَوَاهُ ابْنُ مَاجَهُ.
4213. (55) [2/1218 –అపరిశోధితం]
‘అబ్దుల్లాహ్ బిన్ ‘హారిస్’ బిన్ జజుయి’న్ (ర) కథనం: ప్రవక్త (స) మస్జిద్‌లో ఉన్నారు. ప్రవక్త (స) ముందుకు రొట్టె మాంసం తీసుకురావటం జరిగింది. ప్రవక్త (స) తిన్నారు, మేము కూడా ప్రవక్త (స)తో పాటు తిన్నాము. ఆ తరువాత ప్రవక్త (స) నిలబడి నమాజు చదివారు, మేము కూడా నమాజు చదివాము. మేము మా చేతులను కంకర రాళ్ళతో తుడుచుకున్నాం, కడుక్కోలేదు. (ఇబ్నె మాజహ్)
అంటే భోజనం తరువాత చేతులు కడుక్కోనక్కర లేదు. తుడుచుకున్నా చాలు.
4214 – [ 56 ] ( لم تتم دراسته ) (2/1218)
وَعَنْ أَبِيْ هُرْيَرَةَ قَالَ: أُتِيَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم بِلَحْمٍ فَرُفِعَ إِلَيْهِ الذِّرَاعُ وَكَانَتْ تُعْجِبُهُ فَنَهَسَ مِنْهَا. رَوَاهُ التِّرْمِذِيُّ وَابْنُ مَاجَهُ.
4214. (56) [2/1218 –అపరిశోధితం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) ముందు మాంసం ఉంచటం జరిగింది. అందులో నుండి తొడ మాంసం పళ్ళతో తీసుకొని తిన్నారు. తొడ మాంసం అంటే ప్రవక్త (స)కు చాలా ఇష్టం. (తిర్మిజి’, ఇబ్నె మాజహ్)
4215 – [ 57 ] ( لم تتم دراسته ) (2/1218)
وَعَنْ عَائِشَةَ قَالَتْ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَا تَقْطَعُوا اللَّحْمَ بِالسِّكِّيْنِ فَإِنَّهُ مِنْ صُنْعِ الْأَعَاجِمِ وَانْهَسُوْهُ فَإِنَّهُ أَهْنَأُ وَأَمْرَأُ”. رَوَاهُ أَبُوْدَاوُدَ وَالْبَيْهَقِيُّ فِيْ شُعَبِ الْإِيْمَانِ وَقَالَا:لَيْسَ هُوَ بِالْقَوِيِّ .
4215.(57) [2/1218 –అపరిశోధితం]
‘ఆయి’షహ్ (ర) కథనం : ప్రవక్త (స) ప్రవచనం, ”కత్తులతో మాంసం కోసి తినకండి. ఇది అరబ్బే తరుల అలవాటు. మీరు పళ్ళతో లాగి తినండి. ఎందుకంటే పళ్ళతో నమిలి తింటే మాంసం రుచిగా ఉంటుంది. త్వరగా జీర్ణం అవుతుంది కూడా.” (అబూ దావూద్, బైహఖీ-షు’అబుల్ ఈమాన్ / బలహీనం)
4216 – [ 58 ] ( حسن ) (2/1218)
وَعَنْ أُمِّ الْمُنْذِرِ قَالَتْ: دَخَلَ عَلَيَّ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم وَمَعَهُ عَلِيٌّ وَلَنَا دَوَالٍ مُعَلَّقَةٌ فَجَعَلَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم يَأْكُلُ وَعَلِيٌّ مَعَهُ يَأْكُلُ فَقَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم لِعَلِّيٍ: “مَهْ يَا عَلِيُّ فَإِنَّكَ نَاقِهٌ. “قَالَتْ: فَجَعَلْتُ لَهُمْ سِلْقًا وَشَعِيْرًا. فَقَالَ النَّبِيُّ صلى الله عليه وسلم: “يَا عَلِيُّ مِنْ هَذَا فَأَصِبُ فَإِنَّهُ أَوْفَقَ لَكَ”. رَوَاهُ أَحْمَدُ وَالتِّرْمِذِيُّ وَابْنُ مَاجَهُ.
4216. (58) [2/1218– ప్రామాణికం]
ఉమ్ము మున్‌జి’ర్ (ర) కథనం: ప్రవక్త (స) మా ఇంటికి వచ్చారు. ఆయన వెంట ‘అలీ (ర) కూడా ఉన్నారు. మా ఇంట్లో ఖర్జూరం గుత్తులు వ్రేలాడుతూ ఉన్నాయి. ప్రవక్త (స) వాటిని తినసాగారు. ‘అలీ (ర) కూడా తినసాగారు. అది చూచి ప్రవక్త (స), ‘నువ్వు అది తినకు, ఎందుకంటే నువ్వు ఇప్పుడిప్పుడే జబ్బుపడి లేచావు, ఇంకా ఆ బలహీనత ఉంది. ఇప్పుడే ఖర్జూరాలు తినటం నీకంత మంచిది కాదు,’ అని అన్నారు. మేము చుఖన్‌దర్, జొన్నలు కలిపి వండిన అన్నాన్ని తయారు చేసాము. అప్పుడు ప్రవక్త (స) ‘అలీ నువ్వు అది తిను, ఇది నీకు బాగుంటుంది,’ అని అన్నారు. (అ’హ్మద్, తిర్మిజి’, ఇబ్నె మాజహ్)
4217 – [ 59 ] ؟ (2/1219)
وَعَنْ أَنَسٍ قَالَ: كَانَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم يُعْجِبُهُ الثّفْلُ. رَوَاهُ التِّرْمِذِيُّ وَالْبَيْهَقِيُّ فِيْ شُعَبِ الْإِيْمَانِ .
4217. (59) [2/1219 ? ]
అనస్ (ర) కథనం: ప్రవక్త (స)కు ‘ఖుర్చన్ అంటే చాలా ఇష్టం. [22] (తిర్మిజి, బైహఖీ- షు’అబుల్ ఈమాన్)
4218 – [ 60 ] ؟ (2/1219)
وَعَنْ نُبْيَشَةَ عَنْ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم قَالَ: “مَنْ أَكَلَ فِيْ قَصْعَةٍ فَلَحِسَهَا اسْتَغْفَرْتُ لَهُ الْقَصْعَةُ “. رَوَاهُ أَحْمَدُ وَالتِّرْمِذِيُّ وَابْنُ مَاجَهُ وَالدَّارَمِيُّ. وَقَالَ التِّرْمِذِيُّ : هَذَا حَدِيْثٌ غَرِيْبٌ .
4218. (60) [2/1219– ? ]
నుబైషహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఎవరైనా ప్లేటును గానీ, గిన్నెను గానీ తిన్న తర్వాత, దాన్ని నాకి శుభ్రపరిస్తే, అది అతని కొరకు దు’ఆ చేస్తుంది.” (అ’హ్మద్, ఇబ్నె మాజహ్, దార్మి, తిర్మిజీ / ఏకోల్లేఖనం)
4219 – [ 61 ] ( جيد ) (2/1219)
وَعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَنْ بَاتَ وَفِيْ يَدِهِ غَمَرٌ لَمْ يَغْسِلْهُ فَأَصَابَهُ شَيْءٌ فَلَا يَلُوْمَنَّ إِلَّا نَفْسَهُ”. رَوَاهُ التِّرْمِذِيُّ وأَبُوْ دَاوُدَ وَابْنُ مَاجَهُ .
4219. (61) [2/1219- ఆమోదయోగ్యం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఎవరైనా రాత్రి భోజనం తర్వాత చేయి కడుక్కోకుండా పడుకొని, అతని చేయి జిడ్డుగా ఉండి, ఎలుక లేదా మరేదైనా ప్రాణి కరిస్తే అతడు తన్ను తాను నిందించు కోవాలి.” (తిర్మిజి’, అబూ దావూద్, ఇబ్నె మాజహ్)
4220 – [ 62 ] ( لم تتم دراسته ) (2/1219)
وَعَنِ ابْنِ عَبَّاسٍ قَالَ:كَانَ أَحَبَّ الطَّعَامِ إِلَى رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم الثَّرِيْدُ مِنَ الْخُبْزِ وَالثَّرِيْدُ مِنَ الْحَيْسِ. رَوَاهُ أَبُوْ دَاوُدَ.
4220. (62) [2/1219 –అపరిశోధితం]
ఇబ్నె ‘అబ్బాస్ (ర) కథనం: ప్రవక్త (స) కు వంటకాల్లో స‘రీద్ అంటే చాలా ఇష్టం. అదేవిధంగా హల్వాల్లో ఖర్జూరం హల్వా అంటే చాలా ఇష్టం. (అబూ దావూద్)
4221 – [ 63 ] ( لم تتم دراسته ) (2/1219)
وَعَنْ أَبِيْ أُسَيْدِ الْأَنْصَارِيِّ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “كُلُوا الزَّيْتَ وَادَّهِنُوْا بِهِ فَإِنَّهُ مِنْ شَجَرَةٍ مُبَارَكَةٍ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَابْنُ مَاجَهُ وَالدَّارَمِيُّ .
4221. (63) [2/1219 –అపరిశోధితం]
అబూ ఉసైద్ అన్సారీ (ర) కథనం: జైతూన్ తినండి, దాని నూనె కూడా ఉపయోగించండి. ఎందుకంటే ఇది శుభకరమైన చెట్టునుండి పుడుతుంది. [23] (తిర్మిజి’, ఇబ్నె మాజహ్, దార్మి)
4222 – [ 64 ] ( لم تتم دراسته ) (2/1219)
وَعَنْ أُمِّ هَانِئٍ قَالَتْ: دَخَلَ عَلَيّ النَّبِيُّ صلى الله عليه وسلم فَقَالَ: “أَعِنْدَكَ شَيْءٌ”. قُلْتُ: لَا إِلَّا خُبْزٌيَابِسٌ وَخَلٌّ فَقَالَ: “هَاتِي مَا أَقْفَرَبَيْتٌ مِنْ أُدُمٍ فِيْهِ خَلٌّ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَقَالَ: هَذَا حَدِيْثٌ حَسَنٌ غَرِيْبٌ .
4222. (64) [2/1219 –అపరిశోధితం]
ఉమ్మె హానీ (ర) కథనం: ప్రవక్త (స) మా ఇంటికి వచ్చారు. ‘నీ దగ్గర ఏమైనా ఉందా,’ అని అడిగారు. నేను, ‘కేవలం ఎండు రొట్టె, సిర్క ఉంది, మరేం లేదు,’ అని అన్నాను. అది విని ప్రవక్త (స), ‘సిర్క ఉన్న ఇల్లు కూర లేకుండా ఉండదు. పైగా కూరగా సిర్క చాలు,’ అని అన్నారు. (తిర్మిజి’ / ప్రామాణికం -ఏకోల్లేఖనం)
4223 – [ 65 ] ( ضعيف ) (2/1219)
وَعَنْ يُوْسُفَ بْنِ عَبْدِ اللهِ بْنِ سَلَامٍ قَالَ: رَأَيْتُ النَّبِيَّ صلى الله عليه وسلم أَخَذَ كِسْرَةً مِنْ خُبْزِ الشَّعِيْرِ فَوَضَعَ عَلَيْهَا تَمْرَةً فَقَالَ: “هَذِهِ إِدَامُ هَذِهِ” وَأَكَلَ. رَوَاهُ أَبُوْ دَاوُدَ.
4223. (65) [2/1219– బలహీనం]
యూసుఫ్ బిన్ ‘అబ్దుల్లాహ్ బిన్ సలామ్ కథనం: నేను ప్రవక్త (స)ను చూసాను, ”జొన్న / యవ్వ రొట్టె ముక్కను తీసుకొని దానిపై ఖర్జూరం ఒకటి ఉంచి, ఇది దీని కూర అని నోట్లో వేసుకున్నారు.” (అబూ దావూద్)
4224 – [ 66 ] ( لم تتم دراسته ) (2/1220)
وَعَنْ سَعْدٍ قَالَ: مَرِضْتُ مَرْضًا أَتَانِي النَّبِيُّ صلى الله عليه وسلم يَعُوْدُنِيْ فَوَضَعَ يَدَهُ بَيْنَ ثَديَيَّ حَتَّى وَجَدْتُّ بَرْدَهَا عَلَى فُؤَادِيْ وَقَالَ: “إِنَّكَ رَجُلٌ مَفْؤُوْدُ ائْتِ الْحَارِثَ بْنَ كَلَدَةَ أَخَا ثَقِيْفٍ فَإِنَّهُ رَجُلٌ يَتَطَبَّبُ فَلْيَأْخُذْ سَبْعَ تَمَرَاتٍ مِنْ عَجْوَةِ الْمَدِيْنَةِ فَلْيَجَأْهُنَّ بَنَوَاهُنَّ ثُمَّ لْيَلُدَّكَ بِهِنَّ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ .
4224. (66) [2/1220– అపరిశోధితం]
స’అద్ బిన్ అబీ వఖ్ఖాస్ (ర) కథనం: నేను అనారోగ్యానికి గురయ్యాను. ప్రవక్త (స) పరామర్శించ డానికి మా ఇంటికి వచ్చారు. ప్రవక్త (స) తన చేతిని నా గుండెపై పెట్టారు. నేను ఆయన చేతి చల్లదనాన్ని గ్రహించాను. నీ గుండె అనారోగ్యానికి గురైంది, నువ్వు ‘హారిస్’ బిన్ కలదహ్ వద్దకు వెళ్ళు, అతను వైద్యుడు. ”మదీనహ్కు చెందిన 7 ‘అజ్‌వహ్ ఖర్జూరాలను గింజలతో పాటు వాటిని నూరి నీకు తినిపించమను,” అని అన్నారు. (అబూ దావూద్)
4225 – [ 67 ] ( صحيح ) (2/1220)
وَعَنْ عَائِشَةَ أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم كَانَ يَأْكُلُ الْبِطِّيْخَ بِالرُّطَبِ. رَوَاهُ التِّرْمِذِيُّ وَزَادَ أَبُوْ دَاوُدَ: وَيَقُوْلُ: “يُكْسَرُحَرُّهَذَا بِبَرْدِهَذَا وَبَرْدُهَذَا بِحَرِّهَذَا”. وَقَالَ التِّرْمِذِيُّ: هَذَا حَدِيْثٌ حَسَنٌ غَرِيْبٌ .
4225. (67) [2/1220 –దృఢం]
‘ఆయి’షహ్ (ర) కథనం: ప్రవక్త (స) ఖర్‌బూజహ్ను తాజా ఖర్జూరాలతో పాటు తినేవారు.
అబూ దావూద్ ఉల్లేఖనంలో ఇలా ఉంది. ఈ ఖర్‌బూజహ్ ఖర్జూరపు వేడిని తొలగిస్తుంది. (తిర్మిజి’ / ప్రామాణికం, -ఏకోల్లేఖనం, అబూ దావూద్)
4226 – [ 68 ] ( لم تتم دراسته ) (2/1220)
وَعَنْ أَنَسٍ قَالَ: أُتِيَ النَّبِيُّ صلى الله عليه وسلم بِتَمَرٍعَتِيْقٍ فجَعَلَ يُفَتِّشُهُ وَيُخْرِجُ السُّوْسَ مِنْهُ. رَوَاهُ أَبُوْ دَاوُدَ .
4226. (68) [2/1220– అపరిశోధితం]
అనస్ (ర) కథనం: ప్రవక్త (స) వద్దకు పాత ఖర్జూరం తీసుకురావటం జరిగింది. అందులో పురుగులు పుట్టి ఉన్నాయి. ఖర్జూరం గింజను చీల్చి పురుగులను తీసి పారవేసేవారు. (అబూ దావూద్)
4227 – [ 69 ] ( لم تتم دراسته ) (2/1220)
وَعَنِ ابْنِ عُمَرَ قَالَ: أُتِيَ النَّبِيُّ صلى الله عليه وسلم بِجُبْنَةٍ فِيْ تَبُوْكَ فَدَعَا بِالسِّكِّيْنِ فَسَمّى وَقَطَعَ. رَوَاهُ أَبُوْ دَاوُدَ .
4227. (69) [2/1220 –అపరిశోధితం]
‘అబ్దుల్లాహ్ బిన్ ‘ఉమర్ (ర) కథనం: తబూక్ యుద్ధంలో ప్రవక్త (స) వద్దకు పనీర్ ముక్క తీసుకు రావటం జరిగింది. ప్రవక్త (స) కత్తి తెప్పించారు, ‘బిస్మిల్లాహ్’ పలికి దాన్ని కోసారు. (అబూ దావూద్)
దీనివల్ల దేన్నయినా సరే, ‘బిస్మిల్లాహ్’ అని పలికి కోయాలని తెలిసింది.
4228 – [ 70 ] ( لم تتم دراسته ) (2/1220)
وَعَنْ سَلْمَانَ قَالَ: سُئِلَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم عَنِ السَّمْنِ وَالْجُبْنِ وَالْفِراءِ فَقَالَ: “اَلْحَلَالُ مَا أَحَلَّ اللهُ فِيْ كِتَابِهِ وَالْحَرَامُ مَا حَرَّمَ اللهُ فِيْ كِتَابِهِ. وَمَا سَكَتَ عَنْهُ فَهُوَ مِمَّا عَفَا عَنْهُ”. رَوَاهُ ابْنُ مَاجَهُ وَ التِّرْمِذِيُّ وَقَالَ: هَذَا حَدِيْثٌ غَرِيْبٌ وَمَوْقُوْفٌ عَلَى الْأَصَحِّ .
4228. (70) [2/1220 –అపరిశోధితం]
సల్మాన్ (ర) కథనం: ప్రవక్త (స) ను నెయ్యి లేదా పనీర్ లేదా అడవిగాడిద గురించి ప్రశ్నించడం జరిగింది. దానికి ప్రవక్త (స), ”అల్లాహ్ (త) తన గ్రంథంలో హలాల్ చేసినది హలాల్, హరామ్ చేసినది హరామ్. మౌనంగా ఉన్నవి క్షమించబడ్డాయి,” అని అన్నారు . (ఇబ్నె మాజహ్, తిర్మిజి’ / ఏకోల్లేఖనం) అంటే నెయ్యి, పనీర్ అడవి గాడిద మొదలైనవన్నీ ధర్మ సమ్మతమే.
4229 – [ 71 ] ( لم تتم دراسته ) (2/1221)
وَعَنِ ابْنِ عُمَرَقَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “وَدِدْتُ أَنَّ عِنْدِيْ خُبْزَةً بَيْضَاءَ مِنْ برةِ سَمْرَاءَ مُلَبَّقَةً بِسَمَنٍ وَلَبَنٍ” فَقَامَ رَجُلٌ مِنَ الْقَوْمِ فَاتَّخَذَهُ فَجَاءَ بِهِ فَقَالَ: “فِيْ أَيِّ شَيْءٍ كَانَ هَذَا؟” قَالَ فِيْ عُكَّةِ ضَبٍّ قَالَ: “ارْفَعْهُ “. رَوَاهُ أَبُوْدَاوُدَ وَابْنُ مَاجَهُ وَقَالَ أَبُوْدَاوُدَ: هَذَا حَدِيْثٌ مُنْكَرٌ
4229. (71) [2/1221–అపరిశోధితం]
ఇబ్నె ‘ఉమర్ (ర) కథనం: ప్రవక్త (స) ‘తెల్ల గోదుమలతో చేసిన రొట్టె, నెయ్యి, పాలతో తయారు చేసిన వంటకంతినాలని ఉంది’ అన్నారు. అక్కడున్న వారిలో ఒకరు వెళ్ళి తయారుచేసి తీసుకొని వచ్చారు. ప్రవక్త (స), ‘ఈ నెయ్యి ఎందులో ఉండేది,’ అని అడిగారు. దానికి ఆ వ్యక్తి, ‘ఉడుము చర్మంతో చేసిన సంచిలో ఉండేది,’ అని అన్నాడు. దానికి ప్రవక్త (స), ‘అయితే తీసుకొని వెళ్ళు’ అని అన్నారు. (అబూ దావూద్ / తిరస్కృతం, ఇబ్నె మాజహ్)
ఉడుము అంటే ప్రవక్త (స)కు అసహ్యంగా ఉండేది. అందువల్లే తిరిగి పంపివేసారు.
4230 – [ 72 ] ( لم تتم دراسته ) (2/1221)
وَعَنْ عَلِيٍّ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: نَهَى رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم عَنْ أضكْلِ الثَّوْمِ إِلَّا مَطْبُوْخًا. رَوَاهُ التِّرْمِذِيُّ وأَبُوْ دَاوُدَ.
4230. (72) [2/1221–అపరిశోధితం]
‘అలీ (ర) కథనం: ప్రవక్త (స) పచ్చి వెల్లుల్లి తినకూడదని వారించారు. అయితే వండినది తినవచ్చును. (తిర్మిజి’, అబూ దావూద్)
4231 – [ 73 ] ( لم تتم دراسته ) (2/1221)
وَعَنْ أَبِيْ زِيَادٍ قَالَ: سُئِلَتْ عَائِشَةَ عَنِ الْبَصَلِ فَقَالَتْ :إِنَّ آخِرَ طَعَامٍ أَكَلَهُ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم طَعَامٌ فِيْهِ بَصَلٌ. رَوَاهُ أَبُوْ دَاوُدَ.
4231. (73) [2/1221 –అపరిశోధితం]
అబూ ‘జియాద్ కథనం: ‘ఆయి’షహ్ (ర) ను ఉల్లిని తినటాన్ని గురించి ప్రశ్నించడం జరిగింది. దానికి ఆమె, ‘ప్రవక్త (స) చివరిసారిగా చేసిన భోజనంలో ఉల్లి ఉండేది,’ అని సమాధానం ఇచ్చారు. (అబూ దావూద్)
అంటే దాన్ని ఉల్లివేసి వండడం జరిగింది. వండడం వల్ల దుర్వాసన పోతుంది. పచ్చి ఉల్లిలో దుర్వాసన ఉంటుంది.
4232 – [ 74 ] ( لم تتم دراسته ) (2/1221)
وَعَنِ ابْنَيْ بُسْرِالسُّلَمِيَّيْنِ قَالَا: دَخَلَ عَلَيْنَا رَسُوْلُ اللهِ صلى الله عليه و سلم فَقَدَّمْنَا زُبْدًا وَتَمْرًاوَكَانَ يُحِبُّ الزُّبْدَ وَالتَّمْرَ. رَوَاهُ أَبُوْدَاوُدَ .
4232. (74) [2/1221 –అపరిశోధితం]
బుస్‌ర్ కుమారులైన ‘అబ్దుల్లాహ్, ‘అతియ్యల కథనం: ప్రవక్త (స) మా ఇంటికి వచ్చారు. మేము వెన్నెను, ఖర్జూరాలనూ కానుకగా ఇచ్చాము. ప్రవక్త (స)కు ఈ రెండంటే చాలా ఇష్టం. (అబూ దావూద్)
4233 – [ 75 ] ( لم تتم دراسته ) (2/1221)
وَعَنْ عِكْرَاشِ بْنِ ذُؤَيْبٍ قَالَ: أَتَيْنَا بِجَفْنَةٍ كَثِيْرَةِ مِنَ الثِّرِيْدِ وَالْوَذْرِ فَخَبَطْتُ بِيَدِيْ فِيْ نَوَاحِيْهَا وَأَكَلَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم مِنْ بَيْنَ يَدَيْهِ فَقَبَضَ بِيَدِهِ الْيُسْرَى عَلَى يَدِي الْيُمْنَى ثُمَّ قَالَ: “يَا عِكْرَاشُ كُلْ مِنْ مَوْضِعٍ وَاحِدٍ فَإِنَّهُ طَعَامٌ وَاحِدٌ”. ثُمَّ أُتِيْنَا بِطَبَقٍ فِيْهِ أَلْوَانُ التَّمَرِ فَجَعَلْتُ آكُلُ مِنْ بَيْنَ يَدِيَّ وَجَالَتْ يَدُ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم فِي الطَّبَقِ فَقَالَ: “يَا عِكْرَاشُ كُلْ مِنْ حَيْثُ شِئْتَ فَإِنَّهُ غَيْرُ لَوْنٍ وَاحِدٍ”. ثُمَّ أُتِيْنَا بِمَاءٍ فَغَسَلَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم يَدَيْهِ وَمَسَحَ بَلَلَ كَفَّيْهِ وَجْهَهُ وَذِرَاعَيْهِ وَرَأْسَهُ وَقَالَ: “يَا عِكْرَاشُ هَذَا الْوُضُوْءُ مِمَّا غَيَّرَتِ النَّارُ”. رَوَاهُ التِّرْمِذِيُّ .
4233. (75) [2/1221 –అపరిశోధితం]
ఇక్‌రాష్ బిన్ జు’వైబ్ (ర) కథనం: ప్రజల ముందు ఒక గిన్నెలో స’రీద్ వంటకాన్ని పెట్టటం జరిగింది. అందులో మాంసం ముక్కలు కూడా ఉన్నాయి. నా చేయి కంచంలో అటూ ఇటూ తిరిగేది. ప్రవక్త (స) తన ముందు నుండి తింటున్నారు. ప్రవక్త (స) ఎడమచేత్తో నా చేయి పట్టుకొని, ‘ఇక్రాష్ నీముందునుండి తిను, ఎందుకంటే అంతా ఒకటే అని,’ అన్నారు. ఆ తరువాత మా వద్దకు ఒక పళ్ళెం వచ్చింది. అందులో అనేక రకాల ఖర్జూరాలు ఉన్నాయి. అంటే మంచివి, చెడ్డవి, పచ్చివి, పండినవి. నేను నా ముందు నుండి తింటున్నాను. ప్రవక్త (స) అన్ని వైపుల నుండి తినేవారు. నువ్వు ఎక్కడి నుండైనా తీసుకో, ఎందుకంటే ఇందులో రకరకాల ఖర్జూరాలు ఉన్నాయి. ఆ తరువాత మా వద్దకు నీళ్ళు వచ్చాయి. ప్రవక్త (స) తన చేతులను కడుక్కున్నారు, తడి చేతులతో ముఖాన్ని, భుజాలను తుడుచుకున్నారు. ఇంకా నాతో ఇక్రాష్ ఇదే వు’దూ అన్నారు. అంటే ముఖం, చేతులు కడుక్కోవడం అన్నారు.[24] (తిర్మిజి’)
4234 – [ 76 ] ( لم تتم دراسته ) (2/1222)
وَعَنْ عَائِشَةَ قَالَتْ: كَانَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم إِذَا أَخَذَ أَهْلَهُ الْوَعْكُ أَمَرَ بِالْحَسَاءِ فَصُنِعَ ثُمَّ أَمَرَ فَحَسَوْامِنْهُ وَكَانَ يَقُوْلُ: “إِنَّهُ لَيَرْتُوْ فُؤَادَالْحَزِيْنِ وَيَسْرُوْعَنْ فُؤَادِ السَّقِيْمِ كَمَا تَسْرُوْا إِحْدَاكُنَّ الْوَسَخَ بِالْمَاءِ عَنْ وَجْهِهَا”. رَوَاهُ التِّرْمِذِيُّ وَقَالَ: هَذَا حَدِيْثٌ حَسَنٌ صَحِيْحٌ.
4234. (76) [2/1222– అపరిశోధితం]
‘ఆయి’షహ్ (ర) కథనం: ప్రవక్త (స) కుటుంబంలో ఎవరైనా అనారోగ్యానికి గురైతే, ప్రవక్త (స) హరీరహ్ వండమని ఆదేశించేవారు. తయారయిన తర్వాత త్రాగమని ఆదేశించేవారు. ఇంకా ప్రవక్త (స), ”ఇది బలహీనతకు శక్తినిస్తుంది, రోగినుండి దుఃఖ విచారాలను దూరం చేస్తుంది, మీరు నీటి ద్వారా ముఖాన్ని శుభ్రపరచుకున్నట్లు,” అని అన్నారు. (తిర్మిజి’ / ప్రామాణికం, -దృఢం)
4235 – [ 77 ] ( لم تتم دراسته ) (2/1222)
وَعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “اَلْعَجْوَةُ مِنَ الْجَنَّةِ وَفِيْهَا شِفَاءٌ مِّنَ السَّمِّ وَالْكَمْأَةُ مِنَ الْمَنِّ وَمَاؤُهَا شِفَاءٌ لِلْعَيْنِ”. رَوَاهُ التِّرْمِذِيُّ .
4235. (77) [2/1222 –అపరిశోధితం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ” ‘అజ్‌వహ్ ఖర్జూరాలు స్వర్గంలోనివి. వీటిలో విషానికి మందు ఉంది, ఇంకా ఖంబీమన్ వంటిది, ఇందులో కళ్ళకు మందు ఉంది.” (తిర్మిజి’)
—–
اَلْفَصْلُ الثَّالِثُ మూడవ విభాగం
4236 – [ 78 ] ( لم تتم دراسته ) (2/1222)
عَنِ الْمُغِيْرَةِ بْنِ شُعْبَةَ قَالَ: ضِفْتُ مَعَ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم ذَاتَ لَيْلَةٍ فَأَمَرَ بِجَنْبٍ فَشُوِيَ ثُمَّ أَخَذَ الشَّفْرَةَ فَجَعَلَ يُحَزُّ لِيْ بِهَا مِنْهُ فَجَاءَ بِلَالٌ يَؤْذِّنُهُ بِالصَّلَاةِ فَأَلْقَى الشَّفْرَةَ فَقَالَ: “مَا لَهُ تَرِبَتْ يَدَاهُ؟” قَالَ: وَكَانَ شَارِبُهُ وَفَاءً. فَقَالَ لِيْ: “أقُصُّهُ عَلَى سِوَاكٍ؟ أَوْ قُصَّهُ عَلَى سِوَاكٍ”. رَوَاهُ التِّرْمِذِيُّ .
4236. (78) [2/1222– అపరిశోధితం]
ము’గీరహ్ బిన్ షూబహ్ (ర) కథనం: ఒక రాత్రి నేను ప్రవక్త (స) వద్దకు అతిథిగా వెళ్ళాను. ప్రవక్త (స) మేక తొడను కాల్చమని ఆదేశించారు. అంటే ఆతిధ్యం కోసం మేక జ’బహ్ చేయటం జరిగింది. ఆ తరువాత ప్రవక్త (స) కత్తి తీసుకొని అందులోనుండి కోసి నాకు ఇచ్చేవారు. నేను తినసాగాను. ఇంతలో బిలాల్ (ర) నమా’జు గురించి తెలియపరిచారు. ప్రవక్త (స) కత్తి అక్కడ పెట్టి బిలాల్ (ర)తో ‘చేతులు మట్టిగాను, తింటున్నప్పుడు వచ్చేసాడు,’ అని అన్నారు. ముగీరహ్ బిన్ షూబ మీసాలు చాలా పెరిగి పోయాయి, ప్రవక్త (స) మిస్వాక్‌పై పెట్టి వాటిని కత్తిరించారు. (తిర్మిజి’)
4237 – [ 79 ] ( صحيح ) (2/1222)
وَعَنْ حُذَيْفَةَ قَالَ: كُنَّا إِذَا حَضَرْنَا مَعَ النَّبِيِّ صلى الله عليه وسلم لَمْ نَضَعُ أَيْدِيَنَا حَتّى يَبٍدَأَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم فَيَضَعَ يَدَهُ وَإِنَّا حَضَرْنَا مَعَهُ مَرَّةً طَعَامًا فَجَاءَتْ جَارِيَةٌ كَأَنَّهَا تُدْفَعُ فَذَهَبَتْ لِتَضَعَ يَدَهَا فِي الطَّعَامِ فَأَخَذَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم بِيَدِهَا ثُمَّ جَاءَ أَعْرَابِيُّ كَأَنَّمَا يُدْفَعُ فَأَخَذَهُ بِيَدِهَ. فَقَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِنَّ الشَّيْطَانَ يَسْتَحِلُّ الطَّعَامَ أَنْ لَا يُذْكَرَ اسْمُ اللهِ عَلَيهِ وَإِنَّهُ جَاءَ بِهَذِهِ الْجَارِيَةِ لِيَسْتَحِلَّ بِهَا فَأَخَذْتُ بِيَدِهَا فَجَاءَ بِهَذَا الْأَعْرَابِيُّ لِيَسْتَحِلَّ بِهِ فَأَخَذْتُ بِيَدِهِ وَالَّذِيْ نَفْسِيْ بِيَدِهِ إِنَّ يَدَهُ فِيْ يَدِيْ مَعَ يَدِهَا”. زَادَ فِيْ رِوَايَةٍ: ثُمَّ ذَكَرَ اسْمَ اللهِ وَأَكَلَ. رَوَاهُ مُسْلِمٌ .
4237. (79) [2/1222– దృఢం]
హుజై’ఫహ్ (ర) కథనం: మేము ప్రవక్త (స)తో పాటు భోజనంలో పాల్గొంటే ప్రవక్త (స) ప్రారంభించే వరకు మేము ప్రారంభించే వాళ్ళం కాదు. ఒకసారి మేము ప్రవక్త (స) వద్ద భోజనానికి కూర్చున్నాము. ఒక అమ్మాయి పరిగెత్తు కుంటూ వచ్చి భోజనాల చాపపై కూర్చొని తినటానికి చేయి ముందుకుచాపింది. ప్రవక్త (స) ఆమె చేయి పట్టుకున్నారు, ఒక పల్లెవాసి కూడా వచ్చి తినడానికి చేయి ముందుకుచాపాడు. ప్రవక్త (స) అతని చేయి కూడా పట్టుకున్నారు. ఆ తరువాత ఈ అమ్మాయి బిస్మిల్లాహ్ పఠించకుండా తినడానికి ప్రయత్నించింది, ఇంకా ఈ పల్లెవాసి, షై’తాన్ కూడా వారితో పాటు తినాలని ప్రయత్నించాడు. నేను వాడిచేయి కూడా పట్టుకున్నాను. షై’తాన్ చేయికూడా నా చేతిలో ఉంది. ఎందుకంటే ‘బిస్మిల్లాహ్’ పఠించకుండా తింటే షై’తాన్ ఆ అన్నంలో చేరిపోతాడు అని పలికి ప్రవక్త (స) ‘బిస్మిల్లాహ్’ పలికి ప్రారంభించారు, కడుపునిండా తిన్నారు. (ముస్లిమ్)
4238 – [ 80 ] ( لم تتم دراسته ) (2/1223)
عَنْ عَائِشَةَ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم أَرَادَ أَنْ يَشْتَرِيَ غُلَامًا فَأَلْقَى بَيْنَ يَدَيْهِ تَمْرًا فَأَكَلَ الْغُلَامُ فَأَكْثَرَ. فَقَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِنَّ كَثْرَةَ الْأَكْلِ شُؤْمٌ”. وَأَمَرَ بِرَدِّهِ. رَوَاهُ الْبَيْهَقِيُّ فِيْ شُعَبِ الْإِيْمَانِ.
4238. (80) [2/1223 –అపరిశోధితం]
ఆయిషహ్ (ర) కథనం: ప్రవక్త (స) బానిసను కొనగోరి అతనికి పరీక్షగా అతని ముందు ఖర్జూరాలు పెట్టారు. ఆ బానిస చాలా ఖర్జూరాలు తినేసాడు. అది చూచి ప్రవక్త (స) అధికంగా తినటం అపశకునం, అశుభం మొదలైన వాటికి కారణం అని ప్రవచించి, ఆ బానిసను త్రిప్పి పంపమని ఆదేశించారు. (బైహఖీ / షు’అబిల్ ఈమాన్)
4239 – [ 81 ] ( لم تتم دراسته ) (2/1223)
وَعَنْ أَنَسِ بْنِ مَالِكٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “سَيِّدُ إِدَامِكُمُ الْمِلْحُ”. رَوَاهُ ابْنُ مَاجَهُ.
4239. (81) [2/1223– అపరిశోధితం]
అనస్ బిన్ మాలిక్ (ర) కథనం: ప్రవక్త (స) మీ కూరలకు ప్రధానమైనది ఉప్పు అని ప్రవచించారు. (ఇబ్నె మాజహ్)
4240 – [ 82 ] ؟ (2/1223)
وَعَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِذَا وُضِعَ الطَّعَامُ فَاخْلَعُوْا نِعَالَكُمْ فَإِنَّهُ أَرْوَحُ لِأَقْدَامِكُمْ”.
4240. (82) [2/1223– ? ]
అనస్ బిన్ మాలిక్ (ర)కథనం: ప్రవక్త (స) భోజనం మీ ముందుకు వస్తే చెప్పులను తీసివేయండి, దాని వల్ల కాళ్ళకు కొంత విరామం లభిస్తుంది. (దార్మి)
అంటే భోజనం చేసేటప్పుడు చెప్పులు తీసివేయాలి.
4241 – [ 83 ] ( لم تتم دراسته ) (2/1223)
وَعَنْ أَسْمَاءِ بِنْتِ أَبِيْ بَكْرٍ: أَنَّهَا كَانَتْ إِذَا أُتِيَتْ بِثَرِيْدٍ أَمَرَتْ بِهِ فَغُطِّيَ حَتّى تَذْهَبَ فَوْرَةُ دُخَانِهِ وَتَقُوْلُ: إِنِّيْ سَمِعْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ: “هُوَ أَعْظَمُ لِلْبَرَكَةِ”. رَوَاهُمَا الدَّارَمِيُّ .
4241. (83) [2/1223 –అపరిశోధితం]
అస్మా బిన్‌తె అబీ బకర్ (ర) కథనం: స’రీద్ వంటకం తయారుచేసి ఆమె వద్దకు తీసుకువస్తే, దానిపై మూత కప్పమని ఆదేశించేది. అందులోని ఆవిరి, వేడిపోయే వరకు ఉంచడం జరిగేది. ఇంకా ఆమె ప్రవక్త (స) అన్నంలోని వేడి పోవటం శుభకరం అని ప్రవచించేవారని చెప్పారు. [25] (దార్మి)
4242 – [ 84 ] ( لم تتم دراسته ) (2/1223)
وَعَنْ نُبَيْشَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَنْ أَكَلَ فِيْ قِصْعَةٍ ثُمَّ لَحَسَهَا تَقُوْلُ لَهُ الْقَصْعَةُ: أَعْتَقَكَ اللهُ مِنَ النَّارِ كَمَا أَعْتَقْتَنِيْ مِنَ الشَّيْطَانِ”. رَوَاهُ رَزِيْنٌ .
4242. (84) [2/1223 –అపరిశోధితం]
నుబైషహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఎవరైనా ప్లేటులో తిని, దాన్ని నాకి శుభ్రపరిస్తే ఆ ప్లేటు అతన్ని గురించి నన్ను నువ్వు షై’తాన్ నుండి విముక్తి ప్రసాదించి నట్లు నిన్ను అల్లాహ్ (త) నరకం నుండి విముక్తి ప్రసాదించు గాక! అని దు’ఆ చేస్తుంది.” (ర’జీన్)
మరో ‘హదీసు’లో ఇలా ఉంది, ”ఆ గిన్నె అతని క్షమాపణ గురించి దు’ఆ చేస్తుంది. మరో ఉల్లేఖనంలో ఇలా ఉంది, ”గిన్నెను, వ్రేళ్ళను నాకిన వారి గురించి నిన్ను అల్లాహ్ (త) ఇహపర లోకాల్లో సుఖ సంతోషాలతో ఉంచు గాక!” అని దీవిస్తుంది.
=====
1- بَابُ الضِّيَافَةِ
1. అతిథి మర్యాదలు
మేము ఇస్లామీ తాలీమ్ యొక్క 9వ భాగంలో అతిథుల సేవల గురించి పేర్కొన్నాము. మానవుల్లో పరస్పరం అతిథులు కావటం తరచూ, జరుగుతూ ఉంటుంది. అందు వల్ల ఒకవేళ మీరు మీ అతిథుల పట్ల గౌరవంగా మంచిగా ప్రవర్తిస్తే, మీరు వారి అతిథులు అయినప్పుడు మీకు కూడా గౌరవాదరణలు లభిస్తాయి. ప్రపంచంలో ఇలాగే వ్యవహ రించడం జరుగుతుంది. కాని ఇస్లామ్‌లో దీనికి చాలా ప్రాధాన్యత ఉంది. అతిథి మర్యాదలు నైతికతను కూడా సూచిస్తాయి. అతిథి సత్కారం, అతిథి సేవ విశ్వాసం లోని ఒక భాగంగా పరిగణించడం జరుగుతుంది.
దైవప్రవక్తలు కూడా తమ అతిథుల పట్ల గౌరవాదరణలతో ప్రవర్తించే వారు, ఇబ్రాహీమ్ అతిథుల గురించి ఖుర్‌ఆన్‌లో ప్రస్తావించడం జరిగింది:
”ఏమీ? ఇబ్రాహీమ్ యొక్క గౌరవనీయులైన అతిథుల గాథ నీకు చేరిందా? వారు అతని వద్దకు వచ్చినపుడు: “మీకు సలాం!” అని అన్నారు. అతను: “మీకూ సలాం!” అని జవాబిచ్చి: “మీరు పరిచయంలేని (కొత్త) వారుగా ఉన్నారు.” అని అన్నాడు. తరువాత అతను తన ఇంటిలోకి పోయి బలిసిన (వేయించిన) ఒక ఆవు దూడను తీసుకొని వచ్చాడు. దానిని వారి ముందుకు జరిపి: “ఏమీ? మీరెందుకు తినటం లేదు?” అని అడిగాడు. (వారు తినకుండా ఉండటం చూసి), వారి నుండి భయపడ్డాడు. వారన్నారు: “భయపడకు!” మరియు వారు అతనికి జ్ఞానవంతుడైన కుమారుని శుభవార్త నిచ్చారు.” (అజ్జారియాత్, 51:24-28)
వీరు దైవదూతలు. మానవుల రూపాల్లో వచ్చారు. ఇబ్రాహీమ్ (అ) వారిని మానవులుగా భావించి ఆతిథ్య బాధ్యతను నెరవేర్చారు. ఈ సంఘటన ద్వారా ఆతిథ్య నియమ నిబంధనలు తెలుసుకోవాలి.
1. అతిథులు, ఆతిథ్యం ఇచ్చేవారు సంభాషణ సలామ్‌తో ప్రారంభించాలి. ప్రవక్త (స) మాట్లాడే ముందు సలామ్ చేయాలని ప్రవచించారు. (తిర్మిజి’)
2. అతిథి ఉండే ఏర్పాటు చేయాలి, భోజన సదుపాయాలను కల్పించాలి. ఎందుకంటే ఇబ్రాహీమ్ (అ) సలామ్ చేసిన తర్వాత వెంటనే భోజనం ఏర్పాటు చేసారు. అన్నిటికంటే మంచి భోజనం కాల్చబడిన మాంసం వారి ముందు ఉంచారు. ప్రవక్త (స) ప్రవచనం, ”అల్లాహ్‌నూ, తీర్పుదినాన్ని విశ్వసించే వ్యక్తి తన అతిథిని గౌరవించాలి. మూడురోజుల వరకు ఆతిథ్యం అవుతుంది. ఆ తరువాత దానం అవుతుంది. (బు’ఖారీ)
3. అతిథుల భోజన సదుపాయం వారి కంట పడకుండా చేయాలి. ఇబ్రాహీమ్ (అ) చేసినట్లు.
4. అతిథులను తన భార్యా పిల్లలను దూరంగా ఉంచాలి.
5. అతిథులను విశ్రాంతి ఏర్పాటు చేసిన తరువాత కొంత సేపు వారికి దూరంగా ఉండాలి.
6. భోజనం అతిథుల ముందు పెట్టాలి.
7. అతిథులు తింటే సంతోషించాలి. తినకపోతే విచారించాలి.
8. అతిథులు తినని పక్షంలో ఆతిథ్యం ఇచ్చేవారికి తగిన కారణం తెలియపరచాలి. వారికి బాధ కలగ కుండా ఉండటానికి.
9. అతిథి తనకు చాలినంత తిన్న తర్వాత ఇంకా తినమని అతిథిని బలవంతం చేయరాదు.
10. భోజనాలు, ఇతర విషయాలు పూర్తయిన తర్వాత నిదానంగా వారిని ఏ పనిమీద రావడం జరిగిందని తెలుసు కోవాలి.
11. అతిథులతో నగుమోముతో, చిరునవ్వుతో, ఉత్తమంగా మాట్లాడాలి. అనవసరమైన విషయాలు మాట్లాడి వారిని పీడించరాదు.
12. అతిథులను గౌరవించటం విశ్వాసంలోని భాగం. ఒకవేళ ఎవరైనా అతిథుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే, వారిపై తగిన చర్య తీసుకోవాలి.
13. అతిథులు ఎవరివద్దనైనా అనవసరంగా 3 రోజుల కంటే అధికంగా బసచేయరాదు. దానివల్ల ఆతిథ్యం ఇచ్చేవారికి కష్టాలకు గురిచేసి నట్లవుతుంది. క్రింది ‘హదీసు’లను చదవండి, వాటి ప్రకారం ఆచరించండి.
اَلْفَصْلُ الْأَوَّلُ మొదటి విభాగం
4243 – [ 1 ] ( متفق عليه ) (2/1224)
عَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَنْ كَانَ يُؤْمِنُ بِاللهِ وَالْيَوْمِ الْآخِرِفَلْيُكْرِمْ ضَيْفَهُ وَمَنْ كَانَ يُؤْمِنُ بِاللهِ وَالْيَوْمِ الْآخِرِ فَلَا يُؤْذِ جَارَهُ وَمَنْ كَانَ يُؤْمِنُ بِاللهِ وَالْيَوْمِ الْآخِرِ فَلْيَقُلْ خَيْرًا أَوْ لِيَصُمَّتْ”.
وَفِيْ رِوَايَةٍ: بَدْلَ”الْجَارِ” –“وَمَنْ كَانَ يُؤْمِنُ بِاللهِ وَالْيَوْمِ الْآخِرِ فَلْيَصِلْ رَحِمَهُ ” .
4243. (1) [2/1224– ఏకీభవితం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”అల్లాహ్(త)నూ, తీర్పుదినాన్ని విశ్వసించే వ్యక్తి తన అతిథిని గౌరవించాలి. అల్లాహ్(త)నూ, తీర్పుదినాన్ని విశ్వసించే వ్యక్తి తన పొరుగు వారిని పీడించరాదు. అల్లాహ్(త)నూ తీర్పుదినాన్ని విశ్వసించే వ్యక్తి మాట్లాడితే మంచే మాట్లాడాలి. లేదా మౌనంగా ఉండాలి. అల్లాహ్(త)నూ, తీర్పుదినాన్ని విశ్వసించే వ్యక్తి బంధుత్వాన్ని చెల్లించాలి.” (బు’ఖారీ, ముస్లిమ్)
4244 – [ 2 ] ( متفق عليه ) (2/1224)
وَعَنْ أَبِيْ شُرَيْحِ الْكَعْبِيِّ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم قَالَ: “مَنْ كَانَ يُؤْمِنُ بِاللهِ وَالْيَوْمِ الْآخِرِفَلْيُكْرِمْ ضَيْفَهُ جَائِزَتُهُ يَوْمٌ وَلَيْلَةٌ وَالضِّيَافَةُ ثَلَاثَةَ أَيَّامٍ فَمَا بَعْدَ ذَلِكَ فَهُوَ صَدَقَةٌ وَلَا يَحِلُّ لَهُ أَنْ يَثْوِيَ عِنْدَهُ حَتَّى يُحَرِّجَهُ”.
4244. (2) [2/1224 –ఏకీభవితం]
అబూ షురై’హ్ క’అబీ కథనం: ప్రవక్త (స) కథనం, ”అల్లాహ్(త)నూ, తీర్పుదినాన్ని విశ్వసించే వ్యక్తి తన అతిథిని గౌరవించాలి. విందు ఒక దినం ఒక రాత్రి, ఆతిథ్యం మూడు రోజులు, ఆ తరువాత అతిథి తిన్నది దానంగా పరిగణించబడుతుంది. అతిథులు మూడు రోజుల కంటే ఎక్కువగా బసచేయరాదు. ఇంటివారిని కష్టాలకు గురిచేసినట్టవుతుంది.[26] (బు’ఖారీ, ముస్లిమ్)
4245 – [ 3 ] ( متفق عليه ) (2/1224)
وَعَنْ عُقْبَةَ بْنِ عَامِرٍ قَالَ: قُلْتُ لِلنَّبِيِّ صلى الله عليه وسلم: “إِنَّكَ تَبْعَثُنَا فَتَنْزِلُ بِقَوْمٍ لَا يَقْرُوْنَنَا فَمَا تَرَى؟ فَقَالَ لَنَا: “إِنْ نَزَلْتُمْ بِقَوْمٍ فَأَمَرُوْا لَكُمْ بِمَا يَنْبَغِيْ لِلضَّيْفِ فَاقْبِلُوْا فَإِنْ لَمْ يَفْعَلُوْا فَخُذُوْا مِنْهُمْ حَقَّ الضَّيْفَ الَّذِيْ يَنْبَغِيْ لَهُمْ”.
4245. (3) [2/1224– ఏకీభవితం]
‘ఉఖ్‌బహ్ బిన్ ‘ఆమిర్ (ర) కథనం: నేను ప్రవక్త (స)ను ‘తమరు మమ్మల్ని దూర ప్రాంతాలకు పంపు తున్నారు. ఒక్కోసారి ఎలాంటి ప్రాంతాలకు వెళ్ళవలసి వస్తుందంటే, అక్కడున్నవారు మాకు ఆతిథ్యం ఇవ్వరు. ఇటువంటి పరిస్థితుల్లో మేము ఏం చేయాలి,’ అని విన్నవించుకున్నాను. దానికి ప్రవక్త (స), ‘మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆతిథేయులు మీ ముందు ఉంచిన దాన్ని స్వీకరించండి. ఒకవేళ వారు సంతోషంగా ఆతిథ్యం ఇవ్వకపోతే ఆతిథ్య హక్కును అతన్నుండి వసూలు చేయండి,’ అని బోధించారు.[27] (బు’ఖారీ, ముస్లిమ్)
4246 – [ 4 ] ( صحيح ) (2/1224)
وَعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: خَرَجَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم ذَاتَ يَوْمٍ وَلَيْلَةٍ فَإِذَا هُوَ بِأَبِيْ بَكْرٍ وَعُمَرَ فَقَالَ: “مَا أَخْرَجَكُمَا مِنْ بُيُوْتِكُمَا هَذِهِ السَّاعَةِ؟” قَالَا: اَلْجَوْعُ قَالَ: “وَأَنَا وَالَّذِيْ نَفْسِيْ بِيَدِهِ لَأَخْرَجَنِي الَّذِيْ أَخْرَجَكُمَا قُوْمُوْا”. فَقَامُوْا مَعَهُ فَأَتَى رَجُلًا مِنَ الْأَنْصَارِفَإِذَا هُوَ لَيْسَ فِيْ بَيْتِهِ فَلَمَّا رَأَتْهُ الْمَرْأَةُ قَالَتْ: مَرْحَبًا وَأَهْلًا. فَقَالَ لَهَا رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “أَيْنَ فُلَانٌ؟” قَالَتْ: ذَهَبَ يَسْتَعْذَبُ لَنَا مِنَ الْمَاءِ إِذْ جَاءَ الْأَنْصَارِيُّ فَنَظَرَ إِلَى رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم وصاحبيه ثُمَّ قَالَ: اَلْحَمْدُ لِلّهِ مَا أَحَدُ الْيَوْمَ أَكْرَمَ أَضْيَافًا مِنِّيْ قَالَ: فَانْطَلَقَ فَجَاءَهُمْ بِعِذْقٍ فِيْهِ بُسْرٍوَتَمْرٍ وَرُطْبٍ فَقَالَ: كُلُوْا مِنْ هَذِهِ وَأَخَذَ الْمُدْيَةَ فَقَالَ لَهُ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِيَّاكَ وَالْحَلُوْبَ “فَذَبَحَ لَهُمْ فَأَكَلُوْا مِنَ الشَّاةِ وَمِنْ ذَلِكَ الْعِذْقِ وَشَرِبُوْا فَلَمَّا أَنْ شَبِعُوْا وَرَوُوْا قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم لِأَبِيْ بَكْرٍ وَعُمَرَ: “وَ الَّذِيْ نَفْسِيْ بِيَدِهِ لَتُسْأَلُنَّ عَنْ هَذَا النَّعِيْمِ يَوْمَ الْقِيَامَةِ أَخْرَجَكُمْ مِنْ بُيُوْتِكُمْ الْجُوْعُ ثُمَّ لَمْ تَرْجِعُوْا حَتّى أَصَابَكُمْ هَذَا النَّعِيْمُ”. رَوَاهُ مُسْلِمٌ. وَذُكِرَحَدِيْثُ أَبِيْ مَسْعُوْدٍ: كَانَ رَجُلٌ مِنَ الْأَنْصَارِ فِيْ “بَابِ الْوَلِيْمَةِ”.
4246. (4) [2/1224– దృఢం]
అబూ హురైరహ్ (ర) కథనం: ఒకరోజు లేదా ఒకరాత్రి ప్రవక్త (స) ఇంటినుండి బయటకు వెళ్ళారు. దారిలో అబూ బకర్ (ర), ‘ఉమర్ (ర)ను కలిసారు. ప్రవక్త (స) వారితో, ‘మీరు ఈ సమయంలో ఇంటి నుండి బయటకు ఎందుకు వచ్చారు?’ అని ప్రశ్నించారు. దానికి వారు, ‘ఆకలి’ అని విన్నవించుకున్నారు. అప్పుడు ప్రవక్త (స) ‘ఎవరి చేతిలో నా ప్రాణం ఉందో ఆ అల్లాహ్(త) సాక్షి! ఏ కారణం వల్ల మీరు బయటకు వచ్చారో నేనూ దానివల్లే బయటకు వచ్చాను’ అని అన్నారు. అందరూ నిలబడ్డారు. ఒక అ’న్సారీ ఇంటికి వెళ్ళారు. అప్పుడు ఆ అ’న్సారీ ఇంట్లో లేరు. అతని భార్య వీరిని చూచి స్వాగతం పలికింది. ప్రవక్త (స) ఆమెతో, ‘నీ భర్త ఎక్కడ,’ అని అడిగారు. దానికి ఆమె, ‘మంచి నీళ్ళు తీసుకు రావటానికి వెళ్ళారు,’ అని చెప్పింది. ఇంతలో అతడు రానే వచ్చాడు. తన ఇంటిలో ప్రవక్త (స)ను, అబూ బకర్, ‘ఉమర్‌లను చూచి చాలా సంతోషించాడు. ఈ రోజు నాకన్నా ఉత్తమ వ్యక్తులు అతిథులుగా ఉన్న వ్యక్తి మరొకడుండడు అని తన తోటలోనికి వెళ్ళి ఖర్జూరం పళ్ళ గుత్తులు తీసుకొని వచ్చి ఆరగించండని ముందుంచాడు. ఆ తరువాత భోజనానికి జంతువును జ’బహ్ చేయటానికి కత్తి పట్టుకున్నాడు. అది చూచి ప్రవక్త (స), ‘పాలిచ్చే పశువును జ’బహ్ చేయకు,’ అని అన్నారు. అతడు ఒక మేకను జ’బహ్ చేసి, దాని మాంసం వండి, అతిథులకు రొట్టె, మాంసం తినిపించాడు, ఖర్జూరం పళ్ళు కూడా తిన్నారు, చల్లని నీళ్ళు కూడా త్రాగారు. అందరూ కడుపు నిండా తిన్న తర్వాత ప్రవక్త (స) అబూ బకర్, ‘ఉమర్‌లతో ఎవరి చేతిలో నా ప్రాణం ఉందో ఆయన సాక్షి! తీర్పు దినం నాడు ఈ అనుగ్రహాలను గురించి ప్రశ్నించడం జరుగుతుంది. ఆకలితో మీరు మీ ఇళ్ళనుండి బయలుదేరారు. కడుపులు నిండి మీరు మీ ఇళ్ళకు తిరిగి వెళుతున్నారు. [28](ముస్లిమ్)
—–
اَلْفَصْلُ الثَّانِيْ రెండవ విభాగం
4247 – [ 5 ] ( لم تتم دراسته ) (2/1225)
عَنِ الْمِقْدَامِ بْنِ مَعْدِيْ كَرَبَ سَمِعَ النَّبِيُّ صلى الله عليه وسلم يَقُوْلُ : ” أَيُّمَا مُسْلِمٍ ضَافَ قَوْمًا فَأَصْبَحَ الضَّيْفُ مَحْرُوْمًا كَانَ حَقًّا عَلَى كُلِّ مُسْلِمٍ نَصْرُهُ حَتَّى يَأْخُذَ لَهُ بِقَرَاهُ مِنْ مَالِهِ وَزَرْعِهِ ” . رَوَاهُ الدَّارَمِيُّ وَأَبُوْ دَاوُدَ وَفِيْ رِوَايَةٍ : ” وَأَيُّمَا رَجُلٍ ضَافَ قَوْمًا فَلَمْ يَقْرُوْهُ كَانَ لَهُ أَنْ يُعْقِبَهُمْ بِمِثْلِ قَرَاهُ ” .
4247. (5) [2/1225 –అపరిశోధితం]
మిఖ్‌దామ్ బిన్ మ’అదీ కరబ్ (ర) కథనం: ప్రవక్త (స) ఇలా ప్రవచిస్తూ ఉండగా నేను విన్నాను, ”ఎవరైనా ఒక వ్యక్తి వద్దకు అతిథిగా వచ్చాడు. అతను ఆ వ్యక్తికి ఆతిథ్యం ఇవ్వలేదు. అంటే అన్న పానీయాలు సమకూర్చ లేదు. రాత్రంతా ఆకలితో గడిపి ఉదయం లేచాడు. ఇటువంటి వ్యక్తికి సహాయం చేయటం ప్రతి ముస్లిమ్ యొక్క విధి. అతని ఆతిథ్య హక్కును అతనికి ఇప్పించాలి. ధనం రూపంలోనైనా, ఆహార ధాన్యాల రూపంలోనైనా. (దార్మి)
4248 – [ 6 ] ( لم تتم دراسته ) (2/1225)
وَعَنْ أَبِيْ الْأَحْوَصِ الْجُشَمِيِّ عَنْ أَبِيْهِ قَالَ: قُلْتُ: يَا رَسُوْلَ اللهِ أَرَأَيْتَ إِنْ مَرَرْتُ بِرَجُلٍ فَلَمْ يَقِرْنِيْ وَلَمْ يُضِفْنِيْ ثُمَّ مَرَّ بِيْ بَعْدَ ذَلِكَ أَقْرِيْهِ أَمْ أَجْزِيْهِ؟ قَالَ: “بَلْ اَقْرِهِ”. رَوَاهُ التِّرْمِذِيُّ .
4248. (6) [2/1225– అపరిశోధితం]
అబుల్ అ’హ్‌వ’స్ జుషమియ్యి తన తండ్రి ద్వారా కథనం: నేను ఇలా విన్నవించుకున్నాను, ”ఓ ప్రవక్తా! నేను ఒక వ్యక్తి వద్దకు వెళితే ఆ వ్యక్తి ఆతిథ్యం ఇవ్వలేదు, ఏమీ తినిపించ లేదు. ఆ వ్యక్తి నా దగ్గరకు వస్తే నేను ఆతిథ్యం ఇవ్వాలా లేక ప్రతీకారం తీర్చుకోవాలా?” దానికి ప్రవక్త (స) ”కాదు, నువ్వు అతన్ని గౌరవించి, ఆదరించు, ఆతిథ్యం ఇవ్వు,” అని అన్నారు. (తిర్మిజి’)
అంటే చెడుకు చెడు ద్వారా ప్రతీకారం తీర్చుకోకూడదు. చెడుకు మంచి ద్వారా సమాధానం ఇవ్వాలి. ఇదే ఉత్తమ గుణం.
4249 – [ 7 ] ( صحيح ) (2/1226)
وَعَنْ أَنَسٍ أَوْ غَيْرِهِ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم اِسْتَأْذَنَ عَلَى سَعْدِ بْنِ عُبَادَةَ فَقَالَ: “السَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ اللهِ “فَقَالَ سَعْدٌ: وَعَلَيْكُمُ السَّلَامُ وَرَحْمَةُ اللهِ وَلَمْ يُسْمِعِ النَّبِيّ صلى الله عليه وسلم حَتّى سَلَّمَ ثَلَاثًا وَرَدَّ عَلَيْهِ سَعْدٌ ثَلَاثًا وَلَمْ يُسْمِعْهُ فَرَجَعَ النَّبِيُّ صلى الله عليه و سلم فَاتَّبِعْهُ سَعْدٌ فَقَالَ: يَا رَسُوْلَ اللهِ بِأَبِيْ أَنْتَ وَأُمِّيْ مَا سَلَّمْتَ تَسِلِيْمَةً إِلَّا هِيَ بِأذْنِيْ: وَلَقَدْ رَدَدْتُ عَلَيْكَ وَلَمْ أُسْمِعْكَ أَحْبَبْتُ أَنْ أَسْتَكْثِرَ مِنْ سِلَامِكَ وَمِنَ الْبَرَكَةِ ثُمَّ دَخَلُوْا الْبَيْتَ فَقَرَّبَ لَهُ زَبِيْبًا فَأَكَلَ نَبِيُّ الله صلى الله عليه وسلم فَلَمَّا فَرَغَ قَالَ: “أَكَلَ طَعَامَكُمُ الْأَبْرَارُوَصَلَّتُ عَلَيْكُمُ الْمَلَائِكَةُ وَأَفْطَرَعِنْدَكُمْ الصَّائِمُوْنَ”. رَوَاهُ فِيْ”شَرْحِ السُّنَّةِ ” .
4249. (7) [2/1226– దృఢం]
అనస్ (ర) కథనం: ప్రవక్త (స) స’అద్ బిన్ ‘ఉబాదహ్ వద్దకు వెళ్ళి కలవడానికి అనుమతి కోరారు. సలామ్ చేసారు. స’అద్ బిన్ ‘ఉబాదహ్ మెల్లగా సమాధానం ఇచ్చారు. ప్రవక్త (స)మళ్ళీ సలామ్ చేసారు. స’అద్ బిన్ ‘ఉబాదహ్ మళ్ళీ మెల్లగా సమాధానం ఇచ్చారు. ప్రవక్త (స) మళ్ళీ సలామ్ చేసారు. స’అద్ బిన్ ‘ఉబాదహ్ మళ్ళీ మెల్లగా సలామ్ చేసారు. ప్రవక్త (స) తిరిగి వెళ్ళ సాగారు. అప్పుడు స’అద్(ర) పరిగెత్తుకుంటూ వచ్చి కలసి, ‘ఓ ప్రవక్తా! తమరు సలామ్ చెప్పినప్పుడల్లా నేను సమాధానం ఇచ్చాను. అయితే బిగ్గరగా ఇవ్వలేదు. తమరు మళ్ళీ సలామ్ చేయాలని, దాని శుభం వల్ల లాభం పొందాలని’ అని విన్నవించు కున్నారు. ఆ తరువాత ప్రవక్త (స) ఇంట్లోనికి వెళ్ళారు. తినటానికి ప్రవక్త (స) ముందు కిష్‌మిష్ తెచ్చి ఉంచటం జరిగింది. ప్రవక్త (స) కిష్‌మిష్ తిన్నారు. తిన్న తరువాత ఈ దు’ఆ పఠించారు, ”సజ్జనులు మీ ఆహారాన్ని తిన్నారు. దైవదూతలు మీ కోసం దు’ఆ చేసారు, ఉపవాసకులు ఉపవాసాన్ని విరమించారు.” (షర్’హుస్సున్నహ్)
4250 – [ 8 ] ( لم تتم دراسته ) (2/1226)
وَعَنْ أَبِيْ سَعِيْدٍ عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ: “مَثَلُ الْمُؤْمِنِ وَمَثَلُ الْإِيْمَانِ كَمَثَلِ الْفَرَسِ فِيْ آخِيَّتِهِ يَجُوْلُ ثُمَّ يَرْجِعُ إِلى آخِيَّتِهِ وَإِنَّ الْمُؤْمِنَ يَسْهُوْ ثُمَّ يَرْجِعُ إِلى الْإِيْمَانِ فَأَطْعِمُوْا طَعَامَكُمْ الْأَتْقِيَاءَ وَأُوْلُوْا مَعْرُوْفَكُمُ الْمُؤْمِنِيْنَ”. رَوَاهُ الْبَيْهَقِيُّ فِيْ “شُعَبِ الْإِيْمَانِ ” وَأَبُوْ نُعَيْمٍ فِيْ ” الْحِلْيَةِ ” .
4250. (8) [2/1226– అపరిశోధితం]
అబూ స’యీద్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”విశ్వాసి మరియు విశ్వాసం ఉదాహరణ గుర్రం వంటిది. త్రాళ్ళతో కట్టబడి ఉన్న కొక్కెం చుట్టూ తిరుగుతుంది. విశ్వాసి ఏమరుపాటుకు గురౌతాడు, ఆ తరువాత క్షమాపణ, పశ్చాత్తాపంచెంది విశ్వాసం వైపు తిరిగి వస్తాడు. మీరు ఉత్తములకు, దైవభీతి పరులకు తినిపించండి. విశ్వాసులపట్ల మేలు, న్యాయం చేయండి.” [29] (బైహఖీ – షు’అబుల్ ఈమాన్, అబూ న’యీమ్ -‘హిల్‌యహ్)
4251 – [ 9 ] ( لم تتم دراسته ) (2/1226)
عَنْ عَبْدِ اللهِ بْنِ بُسْرٍقَالَ: كَانَ لِلنَّبِيِّ صلى الله عليه وسلم قَصْعَةٌ يَحْمِلُهَا أَرْبَعَةٌ رِجَالٍ يُقَالُ لَهَا: اَلْغَرَّاءُ فَلَمَّا أَضْحَوْا وَسَجَدُوْا الضُّحَى أُتِيَ بِتِلْكَ الْقصعَةِ وَقَدْ ثَرَّدَ فِيْهَا فَالْتَفُّوْا عَلَيْهَا فَلَمَّا كَثَرُوْا جَثَا رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم فَقَالَ أَعْرَابِيٌّ: مَا هَذِهِ الْجَلْسَةُ؟ فَقَالَ النَّبِيُّ صلى الله عليه وسلم: “إِنَّ اللهَ جَعَلَنِيْ عَبْدًا كَرِيْمًا وَلَمْ يَجْعَلْنِيْ جَبَّارًا عَنِيْدًا”. ثُمَّ قَالَ: “كُلُوْا مِنْ جَوَانِبِهَا وَدَعَوْا ذِرْوَتَهَا يُبَارَكَ فِيْهَا”. رَوَاهُ أَبُوْ دَاوُدَ.
4251. (9) [2/1226 –అపరిశోధితం]
‘అబ్దుల్లాహ్ బిన్ బుస్ర్ (ర) కథనం: ప్రవక్త (స) వద్ద ఒక పెద్ద గిన్నె ఉండేది. దాన్ని నలుగురు వ్యక్తులు ఎత్తే వారు. దాన్ని ‘గర్రా అనే వారు. అందులో తినే పదార్థం వేసిన తర్వాత నలుగురు వ్యక్తులు ఎత్తేవారు. ఉదయం చాష్త్ నమా’జు తర్వాత అందులో స’రీద్ వంటకం వేసి తెచ్చి పెట్టటం జరిగింది. దాని చుట్టూ కూర్చొని తినటం ప్రారంభిస్తారు. జనం అధికంగా ఉంటే ప్రవక్త (స) ముడుకులపై కూర్చు న్నారు. ఒక బదూ అది చూచి, ‘ఇలా కూర్చోవటం మీకు తగదు’ అని అన్నాడు. దానికి ప్రవక్త (స), ‘ఇలా కూర్చోవటం మీకు తగదు,’ అని అన్నారు. దానికి ప్రవక్త(స), ‘అల్లాహ్ (త) నన్ను వినయవిధేయతలు గలవాడిగా సృష్టించాడు, గర్వాహంకారాలు గలవాడిగా సృష్టించలేదు.’ ఆ తరువాత, ‘గిన్నె మూలల నుండి తినండి. మధ్య నుండి తినకండి. మధ్య శుభం అవతరిస్తుంది,’ అని అన్నారు.’ (అబూ దావూద్)
4252 – [ 10 ] ( لم تتم دراسته ) (2/1227)
وَعَنْ وَحْشِيِّ بْنِ حَرْبٍ عَنْ أَبِيْهِ عَنْ جَدِّهِ: أَنَّ أَصْحَابَ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم قَالُوْا: يَا رَسُوْلَ اللهِ إِنَّا نَأْكُلُ وَلَا نَشْبَعُ قَالَ: “فَلَعَلَّكُمْ تَفْتَرِقُوْنَ؟” قَالُوْا :نَعَمْ. قَالَ: “فَاجْتَمِعُوْا عَلَى طَعَامِكُمْ وَاذْكُرُوْا اسْمَ اللهِ يُبَارَكُ لَكُمْ فِيْهِ”. رَوَاهُ التِّرْمِذِيُّ .
4252. (10) [2/1227 –అపరిశోధితం]
వ’హ్‌షీ బిన్ ‘హర్‌బ్ తన తండ్రి తాతల ద్వారా కథనం: ప్రవక్త (స) అనుచరులు ప్రవక్త (స)తో, ‘ఓ ప్రవక్తా! మేము తింటున్నాము, కాని కడుపులు నిండవు,’ అని అన్నారు. దానికి ప్రవక్త (స), ‘మీరు వేర్వేరుగా తింటున్నారా?’ అని అన్నారు. దానికి మేము, ‘అవును’ అన్నాము. ప్రవక్త (స), ‘మీరంతా ఒకచోట కూర్చోని తినండి. అల్లాహ్(త) పేరు పలికి తినండి. అందులోనే మీకు శుభం ప్రసాదించబడు తుంది,’ అని అన్నారు. (తిర్మీజి’)
—–
اَلْفَصْلُ الثَّالِثُ మూడవ విభాగం
4253 – [ 11 ] ؟ (2/1227)
عَنْ أَبِيْ عَسِيْبٍ قَالَ: خَرَجَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم لَيْلًا فَمَرَّ بِيْ فَدَعَانِيْ فَخَرَجْتُ إِلَيْهِ ثُمَّ مَرَّ بِأَبِيْ بَكْرٍ فَدَعَاهُ فَخَرَجَ إِلَيْهِ ثُمَّ مَرَّ بِعُمَرَ فَدَعَاهُ فَخَرَجَ إِلَيْهِ فَانْطَلَقَ حَتَّى دَخَلَ حَائِطًا لِبَعْضِ الْأَنْصَارِ. فَقَالَ لِصَاحِبِ الْحَائِطِ: “أَطْعِمْنَا بُسْرًا”. فَجَاءَ بِعِذْقٍ فَوَضَعَهُ. فَأَكَلَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم وَأَصْحَابُهُ ثُمَّ دَعَا بِمَاءٍ بَارِدٍ. فَشَرِبَ فَقَالَ: “لَتُسْأَلُنَّ عَنْ هَذَا النَّعِيْمَ يَوْمَ الْقِيَامَةِ”. قَالَ: فَأَخَذَ عُمَرُ الْعِذْقِ فَضَرَبَ فِيْهِ الْأَرْضِ حَتَّى تَنَاثَرَالْبُسْرَقَبْلَ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم ثُمَّ قَالَ: يَا رَسُوْلَ اللهِ إِنَّا لَمَسْؤُوْلُوْنَ عَنْ هَذَا يَوْمَ الْقِيَامَةِ؟ قَالَ: “نَعَمْ إِلَّا مِنْ ثَلَاثٍ خِرْقَةٍ لَفَّ بِهَا اَلرَّجلُ عَوْرَتَهُ أَوْ كِسْرَةٍ سَدّ بِهَا جُوْعَتَهُ أَوْ حُجُرٍ يَتَدَخَّلُ فِيْهِ مِنَ الْحَرِّ وَالْقَرِّ”. رَوَاهُ أَحْمَدُ وَالْبَيْهَقِيُّ فِيْ “شُعَبِ الْإِيْمَانِ”. مُرْسَلًا .
4253. (11) [2/1227 ? ]
అబూ ‘అసీబ్ (ర) కథనం: ప్రవక్త (స) ఒక రాత్రి ఇంటి నుండి బయటకు వెళ్ళారు. నా దగ్గరకు వచ్చి నన్ను పిలిచారు. నేను బయటకు వచ్చాను. ఇంతలో అబూ బకర్ (ర) ఆ మార్గం గుండా వెళుతుండగా అతన్ని కూడా పిలిచారు. అతను వచ్చారు. ఆ తరువాత ‘ఉమర్ (ర) ఆ మార్గం గుండా వెళుతున్నారు. అతన్ని పిలిచారు. అతను కూడా వచ్చారు. ఆ తరువాత ప్రవక్త (స) వీరందరితో పాటు ఒక అ’న్సారీ తోటలోనికి వెళ్ళారు. ఆ తోట యజమానితో, ‘ఈ రోజు మాకు ఖర్జూరంపళ్ళు తినిపించు,’ అన్నారు. అతడు ఖర్జూరాల గుత్తులు తీసుకువచ్చి ప్రవక్త (స) ముందు పెట్టాడు. ప్రవక్త (స) ఆయన సహచరులు తినసాగారు. ప్రవక్త (స) చల్లని నీళ్ళు కోరారు. చల్లని నీళ్ళు త్రాగి ప్రవక్త (స), ‘తీర్పుదినంనాడు ఈ అనుగ్రహాల గురించి మిమ్మల్ని ప్రశ్నించడం జరుగుతుంది.’ ఉమర్ (ర) ఒక గుత్తిని తీసుకొని నేలకేసి కొట్టారు. ఖర్జూరాలు చెల్లాచెదురై పోయాయి. ఆ తరువాత, ‘ప్రవక్తా! ఈ మామూలు అనుగ్రహాలను గురించి తీర్పుదినం నాడు మమ్మల్ని ప్రశ్నించడం జరుగుతుందా,’ అని విన్నవించు కున్నారు. దానికి ప్రవక్త (స), ‘అవును కాని, మూడు విషయాల గురించి ప్రశ్నించడం జరుగదు. అవి గుడ్డముక్క అంటే మనిషి తన మర్మాంగాన్ని దాచుకునే గుడ్డ ముక్క, లేదా రొట్టె ముక్క, ఆకలి గొన్నవాడు తిని తన ఆకలి తీర్చుకున్న రొట్టెముక్క లేదా గుడిసె, దానివల్ల మనిషి తన్ను తాను రక్షించుకునేది,’ అని ప్రవచించారు. (అ’హ్మద్, బైహఖీ- షు’అబుల్ ఈమాన్ / తాబ’యీ ప్రోక్తం)
4254 – [ 12 ] ( لم تتم دراسته ) (2/1227)
وَعَنِ ابْنِ عُمَرَقَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِذَا وُضِعَتِ الْمَائِدَةُ فَلَا يَقُوْمُ رَجُلٌ حَتّى تُرْفَعُ الْمَائِدَةُ وَلَا يُرْفَعُ يَدَهُ وَإِنْ شَبِعَ حَتّى يَفْرُغَ الْقَوْمُ وَلْيُعْذِرْ فَإِنَّ ذَلِكَ يَخْجِلُ جَلِيْسُهُ فَيَقْبِضُ يَدَهُ وَعَسَى أَنْ يَكُوْنَ لَهُ فِي الطَّعَامِ حَاجَةٌ”. رَوَاهُ ابْنُ مَاجَهُ وَالْبَيْهَقِيُّ فِيْ شُعَبِ الْإِيْمَانِ.
4254. (12) [2/1227–అపరిశోధితం]
‘అబ్దుల్లాహ్ బిన్ ‘ఉమర్ (ర) కథనం: ప్రవక్త (స)ప్రవచనం, ”భోజనాలు వడ్డించి అందరూ కూర్చుని భోజనాలు తిన్న తర్వాత చాప ఎత్తేవరకు ఎవరూ లేవరాదు. ఇంకా ఎవరూ అందరూ ఆపివేసే వరకు తినటం ఆపరాదు. ఒకవేళ ఏదైనా అత్యవసర పని ఉంటే తప్ప. ఎందుకంటే ఒకరు ఆపివేస్తే ఇతరులను అవమానపరిచినట్టు ఉంటుంది. వాళ్ళకు ఇంకా తినాలని కోరిక ఉన్నా వాళ్ళు కూడా ఆపివేస్తారు.” (ఇబ్నె మాజహ్, బైహఖీ- షు’అబుల్ ఈమాన్)
4255 – [ 13 ] ( لم تتم دراسته ) (2/1228)
وَعَنْ جَعْفَرِ بْنِ مُحَمَّدٍ عَنْ أَبِيْهِ قَالَ: كَانَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم إِذَا أَكَلَ مَعَ قَوْمٍ كَانَ آخِرَهُمْ أَكْلَا. رَوَاهُ الْبَيْهَقِيُّ فِيْ ” شُعَبِ الْإِيْمَانِ ” مُرْسَلًا .
4255. (13) [2/1228– అపరిశోధితం]
జ’అఫర్ బిన్ ము’హమ్మద్ తన తండ్రి ద్వారా కథనం: ప్రవక్త (స) ఇతరులతో పాటు తింటే చివరివరకు తినేవారు. అంటే అందరూ తినేవరకు, ఇతరులు సిగ్గుపడ కుండా ఉండడానికి. (బైహఖీ- షు’అబుల్ ఈమాన్ / తాబ’యీ ప్రోక్తం)
4256 – [ 14 ] ( لم تتم دراسته ) (2/1228)
وَعَنْ أَسْمَاءِ بِنْتِ يَزِيْدٍ قَالَتْ: أُتِيَ النَّبِيُّ صلى الله عليه وسلم بِطَعَامٍ فَعَرَضَ عَلَيْنَا فَقُلْنَا: لَا نَشْتَهِيْهِ. قَالَ: “لَا تَجْتَمِعْنَ جُوْعًا وَكَذِبًا”. روَاهُ ابْنُ مَاجَهُ.
4256. (14) [2/1228 –అపరిశోధితం]
అస్మా బిన్‌తె య’జీద్ (ర)కథనం: ప్రవక్త (స) ముందు భోజనం పెట్టటం జరిగింది. మా ముందు ఉంచారు. మేము, ‘ఓ ప్రవక్తా! ఆకలిగా లేదు,’ అని అన్నాము. దానికి ప్రవక్త (స), ‘ఆకలిని, అబద్ధాన్ని ఒకచోట చేర్చకండి,’ అని అన్నారు.[30] (ఇబ్నె మాజహ్)
4257 – [ 15 ] ( لم تتم دراسته ) (2/1228)
وَعَنْ عُمَرَبْنِ الْخَطَّابٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “كُلُوْا جَمِيْعًا وَلَا تَفَرَّقُوْا فَإِنَّ الْبَرَكَةَ مَعَ الْجَمَاعَةِ”. رَوَاهُ ابْنُ مَاجَهُ .
4257. (15) [2/1228 –అపరిశోధితం]
‘ఉమర్ (ర)కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”అందరూ కలసి తినండి. వేర్వేరుగా కూర్చొని తినకండి. ఎందు కంటే శుభం సమూహంలోనే ఉంటుంది.” (ఇబ్నె మాజహ్)
4258 – [ 16 ] ؟ (2/1228)
وَعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مِنَ السُّنَّةِ أَنْ يَخْرُجَ الرَّجُلُ مَعَ ضَيْفِهِ إِلَى بَابِ الدَّارِ”. رَوَاهُ ابْنُ مَاجَهُ .
4258. (16) [2/1228– ? ]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”అతిథి తిరిగి వెళ్ళినపుడు తన ఇంటి ద్వారం వరకు వదలి రావటం అభిలషనీయమైన సాంప్రదాయం.” (ఇబ్నె మాజహ్)
4259 – [ 17 ] ( لم تتم دراسته ) (2/1228)
وَرَوَاهُ الْبَيْهَقِيُّ فِيْ” شُعَبِ الْإِيْمَانِ”عَنْهُ وَعَنِ ابْنِ عَبَّاسٍ وَقَالَ: فِيْ إِسْنَادِهِ ضَعِيْفٌ.
4259. (17) [2/1228 –అపరిశోధితం]
అబూ హురైరహ్(ర), ఇబ్నె అబ్బాస్(ర) కథనం. [31] (బైహఖీ-షు’అబుల్ ఈమాన్ / బలహీన ఆధారాలు)
4260 – [ 18 ] ( لم تتم دراسته ) (2/1228)
وَعَنِ ابْنِ عَبَّاسٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “اَلْخَيْرُ أَسْرَعُ إِلَى الْبَيْتِ الَّذِيْ يُؤْكَلُ فِيْهِ مِنَ الشَّفْرَةِ إِلى سَنَامِ الْبَعِيْرِ”. رَوَاهُ ابْنُ مَاجَهُ .
4260. (18) [2/1228 –అపరిశోధితం]
ఇబ్నె ‘అబ్బాస్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”అన్నం తినిపించబడే ఇంటిలో ఉపాధి చాలా వేగంగా వస్తుంది. అంటే ఒంటె మెడపై త్రిప్పే కత్తి కంటే వేగంగా.” (ఇబ్నె మాజహ్)
=====
2- بَابٌ اكل المُضْطَر
2. గత్యంతరం లేని పరిస్థితిలో తినడం
ఈ అంశంపై మొదటి, మూడవ అధ్యాయాలు లేవు. నిషిద్ధ వస్తువు ఒక్కోసారి గత్యంతరం లేని, నిస్సహాయ స్థితిలో ధర్మ సమ్మతం అయిపోతుంది. అల్లాహ్ ఆదేశం: ”(సహజంగా) మరణించింది, రక్తం, పందిమాంసం మరియు అల్లాహ్ తప్ప ఇతరుల కొరకు (ఇతరుల పేరుతో) వధింపబడినది (జిబ్’హ్ చేయబడినది), గొంతుపిసికి ఊపిరాడక, దెబ్బతగిలి, ఎత్తునుండి పడి, కొమ్ముతగిలి మరియు క్రూరమృగం నోటపడి చచ్చిన (పశువు / పక్షి) అన్నీ, మీకు తినటానికి నిషిధ్ధం (‘హరామ్) చేయబడ్డాయి. కాని (క్రూరమృగం నోట పడినదానిని) చావకముందే మీరు జిబ్’హ్ చేసినట్లైతే అది నిషిధ్ధం కాదు. మరియు బలిపీఠం మీద వధించబడినది,మరియు బాణాలద్వారా శకునం చూడటం నిషేధింపబడ్డాయి. ఇవన్నీ ఘోరపాపాలు (ఫిస్ఖున్). ఈనాడు సత్యతిరస్కారులు, మీ ధర్మం గురించి పూర్తిగా ఆశలు వదలుకున్నారు. కనుక మీరు వారికి భయపడకండి, నాకే భయపడండి. ‘ఈ నాడు నేను మీ ధర్మాన్ని మీ కొరకు పరిపూర్ణం చేసి, మీపై నా అనుగ్రహాన్ని పూర్తిచేశాను మరియు మీ కొరకు అల్లాహ్కు విధేయులుగా ఉండటాన్నే (ఇస్లాంనే) ధర్మంగా సమ్మతించాను.’ ఎవడైనా ఆకలికి ఓర్చుకోలేక, పాపానికి పూనుకోక,[32] (నిషిధ్ధమైన వస్తువులను తిన్నట్లైతే)! నిశ్చయంగా, అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణాప్రదాత.” (అల్ మాయిదహ్, 5:3)
وَهَذَا الْبَابُ خَالٍ مِنَ الْفَصْلُ الْأَوَّلُ واَلْفَصْلُ الثَّالِثُ
ఇందులో మొదటి, మూడవ విభాగాలు లేవు
—–
اَلْفَصْلُ الثَّانِيْ రెండవ విభాగం
4261 – [ 1 ] ( لم تتم دراسته ) (2/1229)
عَنِ الْفُجَيْعِ الْعَامِرِيُّ أَنَّهُ أَتَى النَّبِيَّ صلى الله عليه وسلم فَقَالَ: مَا يَحِلُّ لَنَا مِنَ الْمَيْتَةِ؟ قَالَ: “مَا طَعَامُكُمْ؟” قُلْنَا: نَغْتَبِقُ وَنَصْطَبِحُ قَالَ أَبُوْ نُعَيْمٍ: فَسرَهُ لِيْ عُقْبَةُ: قَدَحٌ غُدْوَةٌ وَقَدَحٌ عَشِيَّةٌ قَالَ: “ذَاكَ وَأَبِي الْجُوْعُ”. فَأَحَلَّ لَهُمُ الْمَيْتَةَ عَلَى هَذِهِ الْحَالِ. رَوَاهُ أَبُوْ دَاوُدَ .
4261. (1) [2/1229– అపరిశోధితం]
ఫుజై’అ ‘ఆమిరీ (ర) ప్రవక్త (స) వద్దకు వచ్చి, ‘ఓ ప్రవక్తా! మృతపశువు, ఎప్పుడు ధర్మసమ్మతం అవుతుంది?’ అని విన్నవించుకున్నారు. ప్రవక్త (స), ‘మీ ఆహారం ఏమిటి?’ అని ప్రశ్నించారు. దానికి అతడు, ‘ప్రవక్తా! ఉదయం, సాయంత్రం ఒక గ్లాసు పాలు దొరికిపోతాయి, దానివల్ల కడుపూ నిండదు, ఆకలీ తీరదు,’ అని అన్నాడు. ప్రవక్త (స) ఇటువంటి పరిస్థితిలో తినమని అనుమతించారు. [33] (అబూ దావూద్)
4262 – [ 2 ] ( لم تتم دراسته ) (2/1229)
وَعَنْ أَبِيْ وَاقِدِ اللَّيْثِيِّ أَنَّ رَجُلًا قَالَ: يَا رَسُوْلَ اللهِ إِنَّا نَكُوْنُ بِأَرْضٍ فَتُصْيِبُنَا بِهَا الْمَخْصَمَةً فَمَتَى يَحِلُّ لَنَا الْمَيْتَةُ؟ قَالَ: “مَا لَمْ تَصْطَبِحُوْا وَ تَغْتَبِقُوْا أَوْ تَحْتَفِئُوْا بِهَا بقْلًا فَشَأنَكُمْ بِهَا”. مَعْنَاهُ: إِذَا لَمْ تَجِدُوْا صَبُوْحًا أَوْغَبُوْقًا وَلَمْ تَجِدُوْا بِقْلَةً تَأْكُلُوْنَهَا حَلَّتْ لَكُمُ الْمَيْتَةُ. رَوَاهُ الدَّارَمِيُّ .
4262. (2) [2/1229 –అపరిశోధితం]
అబూ వాఖిద్ లైసీ’ (ర) కథనం: ఒక వ్యక్తి ప్రవక్త (స) ను ‘ఓ ప్రవక్తా! మేము తినడానికి ఏ వస్తువూ దొరకనటువంటి ప్రాంతంలో ఉంటాము. మాకు ఆకలివేస్తే, మేము మృత పశువును ఎప్పుడు తినాలి’ అని విన్నవించు కున్నారు. అప్పుడు ప్రవక్త (స) ‘ఉదయం, సాయంత్రం ఏదీ దొరకనప్పుడు, ఆకుకూరలు, కూరగాయలు దొరకనపుడు మీరు మృతపశువును తినవచ్చును,’ అని సమాధానం ఇచ్చారు. (దార్మి)
=====
3- بِابُ الْأَشْرِبَةِ
3. పానీయాలు
మానవ జీవితానికి తినటం, త్రాగటం తప్పనిసరి. త్రాగటానికి తినటం కంటే అధిక ప్రాధాన్యత ఉంది. తినటానికి నియమనిబంధనలు ఉన్నట్టు, త్రాగటానికి కూడా నియమ నిబంధనాలు ఉన్నాయి. క్రింద వీటికి సంబంధించిన ‘హదీసు’లు పేర్కొనడం జరిగింది.
اَلْفَصْلُ الْأَوَّلُ మొదటి విభాగం
4263 – [ 1 ] ( متفق عليه ) (2/1230)
عَنْ أَنَسٍ قَالَ: كَانَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم يَتَنَفَّسُ فِي الشَّرَابِ ثَلَاثًا. مُتَّفَقٌ عَلَيْهِ. وَزَادَ مُسْلِمٌ فِيْ رِوَايَةٍ وَيَقُوْلُ: “إِنَّهُ أَرْوَى وَأَبْرَأُ وَأَمْرَأُ”.
4263. (1) [2/1230 –ఏకీభవితం]
అనస్ (ర) కథనం: ప్రవక్త (స) మూడు శ్వాసలలో నీళ్ళు త్రాగేవారు. ఇంకా, ‘శ్వాస తీసుకుంటూ నీళ్ళు త్రాగితే దాహం తీరుతుంది. శరీరానికి శక్తి లభిస్తుంది. రుచికరంగా ఉంటుంది,’ అని ప్రవచించారు. (బు’ఖారీ, ముస్లిమ్)
4264- [ 2 ] ( متفق عليه ) (2/1230)
وَعَنِ ابْنِ عَبَّاسٍ قَالَ نَهَى رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم عَنِ الشُّرْبِ مِنْ قِي السِّقَاءِ .
4264. (2) [2/1230 –ఏకీభవితం]
ఇబ్నె ‘అబ్బాస్ (ర) కథనం: ప్రవక్త (స) నీటి జగ్గును లేదా సంచికి నోరు తగిలించి నీళ్ళు త్రాగరాదని వారించారు. (బు’ఖారీ, ముస్లిమ్)
ఎందుకంటే ఇటువంటి సమయంలో నీటిలోపల ఏముందో కనబడక, హానికరమైనదేదైనా నోట్లోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. అందువల్ల గ్లాసులో వేసి చూసి త్రాగాలి.
4265 – [ 3 ] ( متفق عليه ) (2/1230)
وَعَنْ أَبِيْ سَعِيْدِ الْخُدْرِيِّ قَالَ: نَهَى رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم عَنْ اِخْتِنَاثِ الْأَسْقِيَةِ. زَادَ فِيْ رِوَايَةٍ: وَاخْتِنَاثُهَا :أَنْ يُّقْلَبَ رَأْسُهَا ثُمَّ يُشْرَبَ مِنْهُ .
4265. (3) [2/1230 –ఏకీభవితం]
అబూ స’యీద్ ‘ఖుద్రీ (ర) కథనం: ప్రవక్త (స) నీటి సంచిని పైకెత్తి నోరు తగిలించి త్రాగటాన్ని వారించారు. (బు’ఖారీ, ముస్లిమ్)
4266 – [ 4 ] ( صحيح ) (2/1230)
وَعَنْ أَنَسٍ عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم أَنَّهُ نَهَى أَنْ يَشْرَبَ الرَّجُلُ قَائِمًا. رَوَاهُ مُسْلِمٌ .
4266. (4) [2/1230 –దృఢం]
అనస్ (ర) కథనం: ప్రవక్త (స) నిలబడి నీళ్ళు త్రాగరాదని వారించారు. (ముస్లిమ్)
4267 – [ 5 ] ( صحيح ) (2/1230)
وَعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَايَشْرِبَنَّ أَحَدٌ مِنْكُمْ قَائِمًا فَمَنْ نَسِيَ مِنْكُمْ فَلْيَسْتَقِئَ”. رَوَاهُ مُسْلِمٌ
4267. (5) [2/1230 –దృఢం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) ఒకవేళ ఎవరైనా నిలబడి త్రాగితే, అతడు వాంతి చేసివేయాలి. (ముస్లిమ్)
ఇది వారింపు మాత్రమే, నిషిధ్ధం కాదు.
4268 – [ 6 ] ( متفق عليه ) (2/1230)
وَعَنِ ابْنِ عَبَّاسٍ قَالَ: أَتَيْتُ النَّبِيَّ صلى الله عليه وسلم بِدَلْوٍ مِنْ مَاءٍ زَمْزَمَ فَشَرِبَ وَهُوَ قَائِمٌ .
4268. (6) [2/1230–ఏకీభవితం]
ఇబ్నె ‘అబ్బాస్ (ర) కథనం: ప్రవక్త (స) వద్దకు నేను ‘జమ్ ‘జమ్ నీటిని చేదతో తీసుకువచ్చాను. ప్రవక్త (స) నిలబడి త్రాగారు. (బు’ఖారీ, ముస్లిమ్)
అంటే ‘జమ్’జమ్ నీటిని నిలబడి త్రాగవచ్చు. దీన్ని మినహాయించడం జరిగింది. కూర్చోవడానికి చోటు లేక పోయినా, జనం ఉన్నా, బురద, నీళ్ళు ఉన్నా నిలబడి త్రాగవచ్చును.
4269 – [ 7 ] ( صحيح ) (2/1230)
وَعَنْ عَلِيٍّ رَضِيَ اللهُ عَنْهُ: أَنَّهُ صَلَّى الظُّهْرَ ثُمَّ قَعَدَ فِيْ حَوَائِجِ النَّاسِ فِيْ رَحْبَةِ الْكُوْفَةِ حَتّى حَضَرَتْ صَلَاةُ الْعَصْرِ ثُمَّ أُتِيَ بِمَاءٍ فَشَرِبَ وَغَسَلَ وَجْهَهُ وَيَدَيْهِ وَذَكَرَرَأْسَهُ وَرِجْلَيْهِ ثُمَّ قَامَ فَشَرِبَ فَصْلَهُ وَهُوَ قَائِمٌ ثُمَّ قَالَ: إِنَّ أُنَاسًا يَكْرَهُوْنَ الشُّرْبَ قَائِمًا وَإِنَّ النَّبِيَّ صلى الله عليه وسلم صَنَعَ مِثْلَ مَا صَنَعْتُ. رَوَاهُ الْبُخَارِيُّ .
4269. (7) [2/1330 –దృఢం]
‘అలీ (ర) ”జుహ్‌ర్ నమా’జు చదివారు. ప్రజల సమస్యలు వినడానికి కూఫాలో అరుగు మీద కూర్చున్నారు. ప్రజల సమస్యలు పరిష్కరిస్తూ ఉన్నారు, చివరికి ‘అ’స్‌ర్ సమయం అయింది. నీళ్ళు తీసుకురావటం జరిగింది. దాహం వల్ల ముందు నీల్ళు త్రాగారు, ఆ తరువాత వు’దూ చేసారు, మిగిలిన నీటిని నిలబడి త్రాగారు. ఇంకా, ‘ప్రజలు నిలబడి నీళ్ళు త్రాగటాన్ని చెడుగా భావిస్తారు. కాని ప్రవక్త (స) నేను చేసినట్టే చేసారు’ అని అన్నారు. (బు’ఖారీ)
ఒకవేళ వు’దూ చేయగా మిగిలిన నీటిని త్రాగాలని కోరితే త్రాగవచ్చు.
4270 – [ 8 ] ( صحيح ) (2/1231)
وَعَنْ جَابِرٍأَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم دَخَلَ عَلَى رَجُلٍ مِنَ الْأَنْصَارِوَمَعَهُ صَاحِبٌ لَهُ فَسَلَّمَ فَرَدَّ الرَّجُلُ وَهُوَيُحَوِّلُ الْمَاءَ فِيْ حَائِطٍ. فَقَالَ النَّبِيُّ صلى الله عليه وسلم: “إِنْ كَانَ عِنْدَكَ مَاءٌ بَاتَ فِيْ شَنَّةٍ وَإِلَّا كَرَعْنَا؟” فَقَالَ: عِنْدِيْ مَاءٌ بَاتَ فِيْ شَنٍّ فَانْطَلَقَ إِلى الْعَرِيْشِ فَسَكَبَ فِيْ قَدَحٍ مَّاءٍ ثُمَّ حَلَبَ عَلَيْهِ مِنْ دَاجِنٍ فَشَرِبَ النَّبِيُّ صلى الله عليه وسلم. ثُمَّ أَعَادَ فَشَرِبَ الرَّجُلُ الَّذِيْ جَاءَ مَعَهُ. رَوَاهُ الْبُخَارِيُّ .
4270. (8) [2/1231–దృఢం]
జాబిర్ (ర) కథనం: ప్రవక్త (స) ఒక అ’న్సారీ ఇంటికి వెళ్ళారు. ఆయన (స) వెంట స్నేహితులు అబూ బకర్ (ర) కూడా ఉన్నారు. ప్రవక్త (స) సలామ్ చేసారు, ఆ అ’న్సారీ సలామ్‌కు జవాబు ఇచ్చారు. ఆ వ్యక్తి తన తోటలో నీటిని అటూ ఇటూ త్రిప్పుతున్నాడు. అది చూచిన ప్రవక్త (స), ‘ఒకవేళ నీ దగ్గర ఊరిన నీళ్ళు ఉంటే తెచ్చి ఇవ్వు, లేకపోతే మేము ఈ కాలువ నీటినే నోరు పెట్టి త్రాగుతాము,’ అని అన్నారు. దానికి ఆ వ్యక్తి నా దగ్గర ఊరిన నీళ్ళు ఉన్నాయి అని పలికి తన గుడిసెలోనికి తీసుకొని వెళ్ళాడు. ఒక గిన్నెలో నీటిని తెచ్చి, పెంపుడు మేకపాలు అందులో వేసి ఇచ్చాడు. ప్రవక్త (స) దాన్ని త్రాగారు. మళ్ళీ తెచ్చి తాను త్రాగాడు. (బు’ఖారీ)
4271 – [ 9 ] ( متفق عليه ) (2/1231)
وَعَنْ أُمِّ سَلَمَةَ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم قَالَ: “الَّذِيْ يَشْرَبُ فِيْ آنِيَةِ الْفِضَّةِ إِنَّمَا يُجَرْجِرُ فِيْ بَطْنِهِ نَارَجَهَنَّمَ”.
وَفِيْ رِوَايَةٍ لِمُسْلِمٍ:”إِنَّ الَّذِيْ يَأْكُلُ وَيَشْرَبُ فِيْ آنِيَةِ الْفِضَّةِ وَالذَّهَبِ”.
4271. (9) [2/1231–ఏకీభవితం]
ఉమ్మె సలమహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”వెండి గిన్నెల్లో త్రాగేవారు, తమ కడుపుల్లో నరకాగ్ని నింపు తున్నారు.”
మరో ఉల్లేఖనంలో ఇలా ఉంది, ”వెండి గిన్నెల్లో తినే, త్రాగే వారు తమ కడుపుల్లో నరకాగ్నిని నింపు తున్నారు.” (ముస్లిమ్)
4272 – [ 10 ] ( متفق عليه ) (2/1231)
وَعَنْ حُذَيْفَةَ قَالَ: سَمِعْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ: “لَا تَلْبَسُوا الْحَرِيْرَولَا الدِّيْبَاجِ وَلَا تَشْرَبُوْا فِيْ آنِيَةِ الذَّهَبِ وَالْفِضَّةِ وَلَا تَأْكُلُوْا فِيْ صِحَافِهَا فَإِنَّهَا لَهُمْ فِي الدُّنْيَا وَهِيَ لَكُمْ فِي الْآخِرَةِ”.
4272. (10) [2/1231 –ఏకీభవితం]
హుజై’ఫహ్ (ర) కథనం: ప్రవక్త (స) ను ఇలా ప్రవచిస్తూ ఉండగా విన్నాను, ”పట్టు, జరీ దుస్తులు ధరించకండి, ఇంకా బంగారు, వెండి పాత్రల్లో తినకండి, త్రాగకండి. ఇవన్నీ ఇహలోకంలో అవిశ్వాసుల కోసం ఉన్నాయి, మీ కోసం పరలోకంలో ఉన్నాయి.” (బు’ఖారీ, ముస్లిమ్)
4273 – [ 11 ] ( متفق عليه ) (2/1231)
وَعَنْ أَنَسٍ قَالَ: حُلِبَتْ لِرَسُوْلِ اللهِ صلى الله عليه وسلم شَاةٌ دَاجِنِ وَ شِيْبَ لَبَنُهَا بِمَاءٍ مِنَ الْبِئْرِ الَّتِيْ فِيْ دَارٍ أَنَسٍ فَأُعْطِيَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم اَلْقَدَحَ فَشَرِبَ وَعَلَى يَسَارِهِ أَبُوْبَكْرٍوَعَنْ يَمِيْنِهِ أَعْرَابِيٌّ. فَقَالَ عُمَرُ: أعْطِ أَبَا بَكْرٍ يَا رَسُوْلَ اللهِ فَأَعْطَى الْأَعْرَابِيّ الَّذِيْ عَنْ يَمِيْنِهِ ثُمَّ قَالَ: “الْأَيْمَنُ فَالْأَيْمَنُ.
وَفِيْ رِوَايَةٍ: “اَلْأَيْمَنُوْنَ الْأَيْمَنُوْنَ أَلَا فَيَمِّنُوْا”.
4273. (11) [2/1231–ఏకీభవితం]
అనస్(ర) కథనం: ప్రవక్త (స) కోసం పెంపుడు మేకపాలు పితకబడ్డాయి. వారి బావి నుండే నీటిని తెచ్చి అందులో కలపడం జరిగింది. ప్రవక్త (స) కు ఇవ్వటం జరిగింది. ప్రవక్త (స) త్రాగారు. ప్రవక్త (స)కు ఎడమవైపు అబూ బకర్ (ర) కూర్చొని ఉన్నారు, కుడివైపు ఒక బదూ’ ఉన్నాడు. అప్పుడు ‘ఉమర్ (ర), ‘ఓ ప్రవక్తా! ఈ మిగిలిన నీళ్ళు అబూ బకర్ (ర)కు ఇచ్చివేయండి,’ అన్నారు. ప్రవక్త (స) ఆ బదూ’కు ఇచ్చి వేసారు. ఆ తరువాత, ‘ఈ కుడివైపు ఉన్నవాడే ఎక్కువ హక్కుగలవాడు అని పలికి, మీరెప్పుడైనా ఎవరికైనా ఏదైనా ఇస్తే ముందు కుడివైపు ఉన్నవారికి ఇవ్వండి,’ అని అన్నారు. (బు’ఖారీ, ముస్లిమ్)
4274 – [ 12 ] ( متفق عليه ) (2/1232)
وَعَنْ سَهْلِ بْنِ سَعْدٍ قَالَ: أُتِيَ النَّبِيُّ صلى الله عليه وسلم بِقَدَحٍ فَشَرِبَ مِنْهُ وَعَنْ يَمِيْنِهِ غُلَامٌ أَصْغَرُ الْقَوْمِ وَالْأَشْيَاخُ عَنْ يَسَارِهِ فَقَالَ: “يَا غُلَامُ أَتَأْذَنُ أَنْ أُعْطِيَهُ الْأَشْيَاخَ؟ “فَقَالَ: مَا كُنْتُ لِأُوْثِرَ بِفَضْلٍ مِنْكَ أَحَدًا يَا رَسُوْلَ اللهِ. فَأَعْطَاهُ إِيَّاهُ. وَحَدِيْثُ أَبِيْ قَتَادَةَ سَنَذْكُرُ فِيْ ” بَابِ الْمُعْجِزَاتِ “إِنْ شَاءَ اللهُ تَعَالى.
4274. (12) [2/1232– ఏకీభవితం]
సహల్ బిన్ స’అద్ (ర) కథనం: ప్రవక్త (స) వద్దకు ఒక పాత్రలో నీళ్ళు తీసుకురావటం జరిగింది. ప్రవక్త (స) కొంత త్రాగి తన కుడివైపు కూర్చొని ఉన్న యువకునితో, ‘నీవు అనుమతిస్తే ఎడమవైపు ఉన్న ముసలి వాళ్ళకు ఈ నీరు ఇస్తాను,’ అని అన్నారు. దానికి ఆ యువకుడు తమరు త్రాగగా మిగిలిన ప్రసాదాన్ని ఇతరులకు లేదా ఈ ముసలి వాళ్ళకు ఇచ్చే అనుమతి నేనివ్వను,’ అని అన్నాడు. అప్పుడు ప్రవక్త(స) అతనికే ఇచ్చివేసారు. ఎందుకంటే ఆ యువకుడే అర్హత కలిగిఉన్నాడు. (బు’ఖారీ, ముస్లిమ్)
—–
اَلْفَصْلُ الثَّانِيْ రెండవ విభాగం
4275 – [ 13 ] ( صحيح ) (2/1232)
عَنِ ابْنِ عُمَرَ قَالَ: كُنَّا نَأْكُلُ عَلَى عَهْدِ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم وَنَحْنُ نَمْشِيْ وَنَشْرِبُ وَنَحْنُ قِيَامٌ. رَوَاهُ التِّرْمِذِيُّ وَابْنُ مَاجَهُ وَالدَّارَمِيُّ. وَقَالَ التِّرْمِذِيُّ:هَذَا حَدِيْثٌ حَسَنٌ صَحِيْحٌ غَرِيْبٌ.
4275. (13) [2/1232 –దృఢం]
ఇబ్నె ‘ఉమర్ (ర) కథనం: ప్రవక్త (స) కాలంలో మేము నడుస్తూ నిలబడి తినేవాళ్ళం. (తిర్మిజి’ / ప్రామాణికం- దృఢం -ఏకోల్లేఖనం, ఇబ్నె మాజహ్)
అంటే అత్యవసర పరిస్థితుల్లో నిలబడి, నడుస్తూ తినవచ్చును.
4276 – [ 14 ] ( حسن ) (2/1232)
وَعَنْ عَمْرِو بْنِ شُعَيْبٍ عَنْ أَبِيْهِ عَنْ جَدِّهِ قَالَ: رَأَيْتُ رَسُوْلَ للهِ صلى الله عليه وسلم يَشْرَبُ قَائِمًا وَقَاعِدًا. رَوَاهُ التِّرْمِذِيُّ .
4276. (14) [2/1232 –ప్రామాణికం]
‘అమ్ర్ బిన్ షు’ఐబ్ తన తండ్రి మరియు తాతల ద్వారా కథనం: నేను ప్రవక్త (స)ను నిలబడి, కూర్చొని నీళ్ళు త్రాగటం చూచాను. (తిర్మిజి’)
4277 – [ 15 ] ( صحيح ) (2/1232)
وَعَنِ ابْنِ عَبَّاسٍ رَضِيَ اللهُ عَنْهُمَا قَالَ: نَهَى رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم أَنْ يُتَنَفَّسَ فِيْ الْإِنَاءِ أَوْ يُنْفَخَ فِيْهِ. رَوَاهُ أَبُوْ دَاوُدَ وَابْنُ مَاجَهُ.
4277. (15) [2/1232 –దృఢం]
ఇబ్నె ‘అబ్బాస్ (ర) కథనం: ప్రవక్త (స) పళ్ళెంలో శ్వాస పీల్చటం గానీ, ఊదటం గానీ చేయరాదని వారించారు. (అబూ దావూద్, ఇబ్నె మాజహ్)
4278 – [ 16 ] ( لم تتم دراسته ) (2/1232)
وَعَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَا تَشْرَبُوْا وَاحِدًا كَشُرْبِ الْبَعِيْرِ وَلَكِنْ اشْرَبُوْا مَثْنَى وَثُلَاثَ وَسَمُّوْا إِذَا أَنْتُمْ شَرِبْتُمْ وَاحْمَدُوْا إِذَا أَنْتُمْ رَفَعْتُمْ”. رَوَاهُ التِّرْمِذِيُّ .
4278. (16) [2/1232– అపరిశోధితం]
ఇబ్నె ‘అబ్బాస్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మీరు ఒంటెలా ఒకే శ్వాసలో త్రాగకండి, రెండు మూడు శ్వాసల్లో త్రాగండి. త్రాగేటప్పుడు, ‘బిస్మిల్లాహ్’ చదవండి ఇంకా తినేటప్పుడు కూడా, ఇంకా తిన్న తర్వాత, ‘అల్‌హమ్‌దులిల్లాహ్’ పఠించండి. (తిర్మిజి’)
4279 – [ 17 ] ( ضعيف ) (2/1232)
وَعَنْ أَبِيْ سَعِيْدِ الْخُدْرِيِّ أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم نَهَى عَنِ النَّفْخِ فِي الشَّرَابِ فَقَالَ رَجُلٌ: اَلْقَذَاةَ أَرَاهَا فِيْ الْإِنَاءِ قَالَ: “أَهْرِقْهَا” قَالَ: فَإِنِّيْ لَا أَرْوَى مِنْ نَفْسٍ وَّاحِدٍ قَالَ: “فَأَبِنِ الْقَدَحَ عَنْ فِيْكَ ثُمَّ تَنَفَّسَ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَالدَّارَمِيُّ.
4279. (17) [2/1232 –బలహీనం]
అబూ స’యీద్ ‘ఖుద్రీ (ర) కథనం: ప్రవక్త (స) నీటిలో ఊదటాన్ని వారించారు. ఒక వ్యక్తి ఓ ప్రవక్తా! ఒకవేళ నీటిలో చెత్తా చెదారం ఏదైనా ఉంటే అని ప్రశ్నించాడు. దానికి ప్రవక్త (స), ‘దాన్ని చేత్తో తీసిపార వేయండి,’ అని అన్నారు. ఆ వ్యక్తి, ‘నాకు ఒక శ్వాసలో త్రాగితే సరిపోదు’ అని అన్నాడు. దానికి ప్రవక్త (స), ‘శ్వాస తీసుకున్నప్పుడు గ్లాసును నోటి నుండి వేరుచేయాలి’ అని అన్నారు. (తిర్మిజి’, దార్మీ)
4280 – [ 18 ] ( لم تتم دراسته ) (2/1233)
وَعَنْهُ قَالَ: نَهَى رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم عَنِ الشُّرْبِ مِنْ ثُلْمَةِ الْقَدَحِ وَأَنْ يُنْفَخَ فِي الشَّرَابِ. رَوَاهُ أَبُوْ دَاوُدَ .
4280. (18) [2/1233 –అపరిశోధితం]
అబూ స’యీద్ ‘ఖుద్రీ (ర) కథనం: ప్రవక్త (స) గ్లాసు కన్నం నుండి నీళ్ళు త్రాగటాన్ని వారించారు. అదే విధంగా నీటిలో ఊదటాన్ని కూడా వారించారు. (అబూ దావూద్)
4281 – [ 19 ] ( صحيح ) (2/1233)
وَعَنْ كَبْشَةَ قَالَتْ: دَخَلَ عَلَيَّ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم فَشَرِبَ مِنْ فِيْ قِرْبَةٍ مُعَلَّقَةٍ قَائِمًا فَقُمْتُ إِلى فِيْهَا فَقَطَعْتُهُ. رَوَاهُ التِّرْمِذِيُّ وَابْنُ مَاجَهُ وَقَالَ التِّرْمِذِيُّ:هَذَا حَدِيْثٌ حَسَنٌ غَرِيْبٌ صَحِيْحٌ.
4281. (19) [2/1233– దృఢం]
కబ్‌షహ్ (ర)కథనం: ప్రవక్త (స) నా వద్దకు వచ్చారు, వ్రేలాడుతున్న సంచిలోనుండి నిలబడి నీళ్ళు త్రాగారు. నేను సంచి మూతిని కోసి ప్రసాదంగా ఉంచుకున్నాను. ఎందుకంటే దానికి ప్రవక్త(స) ఉమ్ము తగిలి ఉంది. (తిర్మిజి’ / ప్రామాణికం, – ఏకోల్లేఖనం, -దృఢం)
4282 – [ 20 ] ( لم تتم دراسته ) (2/1233)
وَعَنِ الزُّهْرِيِّ عَنْ عُرْوَةَ عَنْ عَائِشَةَ قَالَتْ: كَانَ أَحَبَّ الشَّرَابِ إِلَى رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم اَلْحَلْوُ الْبَارِدُ .رَوَاهُ التِّرْمِذِيُّ وَ قَالَ: وَالصَّحِيْحُ مَا رُوِيَ عَنِ الزُّهْرِيِّ عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم مُرْسَلًا.
4282. (20) [2/1233 –అపరిశోధితం]
ఇమామ్ జహ్‌రీ ‘ఉర్‌వహ్ నుండి, ‘ఉర్‌వహ్ ‘ఆయి’షహ్ (ర) ద్వారా కథనం: ప్రవక్త (స) కు చల్లటి త్రాగే నీరంటే చాలా ఇష్టం. (తిర్మిజి’ / దృఢం)
4283 – [ 21 ] ( ضعيف ) (2/1233)
وَعَنِ ابْنِ عَبَّاسٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِذَا أَكَلَ أَحَدُكُمْ طَعَامًا فَلْيَقُلْ: اَللّهُمَّ بَارِكْ لَنَا فِيْهِ وَأَطْعِمْنَا خَيْرًا مِنْهُ. وَإِذَا سُقِيَ لَبَنًا فَلْيَقُلْ: اَللّهُمَّ بَارِكْ لَنَا فِيْهِ وَزِدْنَا مِنْهُ فَإِنَّهُ لَيْسَ شَيْءٌ يُجزى مِنَ الطَّعَامِ وَالشَّرَابِ إِلّا اللَّبَنُ”. رَوَاهُ التِّرْمِذِيُّ وأَبُوْ دَاوُدَ.
4283. (21) [2/1233 –బలహీనం]
ఇబ్నె అబ్బాస్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఎవరైనా భోజనం చేస్తే, ‘ఓ అల్లాహ్! ఈ భోజనంలో శుభాన్ని ప్రసాదించు, ఇంతకంటె మంచి భోజనం తినిపించు’ అని పాలు త్రాగినపుడు ‘ఓ అల్లాహ్! ఈ పాలలో శుభం ప్రసాదించు, ఇంకా ఇంతకంటే అధికంగా ప్రసాదించు’ అని ప్రార్థించాలి.” (అబూ దావూద్, తిర్మిజి’)
4284 – [ 22 ] ( صحيح ) (2/1234)
وَعَنْ عَائِشَةَ قَالَتْ: كَانَ النَّبِيُّ صلى الله عليه وسلم يُسْتَعْذَبُ لَهُ الْمَاءُ مِنَ السُّقْيَا. قِيْلَ: هِيَ عَيْنٌ بَيْنَهَا وَبَيْنَ الْمَدِيْنَةِ يَوْمَانِ. رَوَاهُ أَبُوْ دَاوُدَ.
4284. (22) [2/1234– దృఢం]
‘ఆయి’షహ్ (ర) కథనం: ప్రవక్త (స) కోసం సుఖ్యహ్ కాలువ నుండి నీళ్ళు తీసుకురావటం జరిగేది. ఇది మదీనహ్ నుండి రెండు కోసుల దూరం ఉండేది. (అబూ దావూద్)
—–
اَلْفَصْلُ الثَّالِثُ మూడవ విభాగం
4285 – [ 23 ] ( ضعيف ) (2/1234)
عَنِ ابْنِ عُمَرَ أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم قَالَ: “مَنْ شَرِبَ فِيْ إِنَاءٍ ذَهَبٍ أَوْ فِضَّةٍ أَوْ إِنَاءٍ فِيْهِ شَيْءٌ مِنْ ذَلِكَ فَإِنَّمَا يُجَرْجِرُ فِيْ بَطْنِهِ نَارَ جَهَنَّمَ”. رَوَاهُ الدَّاَرقُطْنِيُّ .
4285. (23) [2/1234 –బలహీనం]
ఇబ్నె ఉమర్ (ర) కథనం: ప్రవక్త(స) ప్రవచనం, ”వెండి, బంగారు గిన్నెల్లో తినేవారి కడుపులో నరకాగ్ని వేయబడును.” [34] (దార ‘ఖుత్నీ)
=====
4– بَابُ النَّقِيْعِ وَالْأنْبِذَةِ
4. నఖీ‘అ, నబీజ్’ పానీయాలు
నఖీ‘అ అంటే తడపటం, అంటే ద్రాక్ష, ఖర్జూరం, కిష్‌మిష్ మొదలైనవి కాపు పెట్టకుండా నీటిలో నానపెట్టటం. దానివల్ల తీపిదనం అంతా నీటిలో కలసి పోతుంది. తియ్యటి పానీయం తయారవుతుంది. ఇది చాలా రుచికరంగా, కమ్మగా ఉంటుంది. నబీజ్’ అన్నా పై అర్థమే వస్తుంది. అయితే చాలా ఎక్కువ రోజులు ఉంచడం జరుగుతుంది. ఇందులో మత్తు రాకపోతే దీన్ని త్రాగవచ్చును. మత్తు ఉంటే దీన్ని త్రాగటం నిషిద్ధం. ద్రాక్ష, ఖర్జూరం పండే దేశాలలో దీన్ని చాలా అధికంగా తయారు చేస్తారు. ప్రవక్త (స) కాలంలో కూడా దీన్ని తయారు చేయడం జరిగేది.
اَلْفَصْلُ الْأَوَّلُ మొదటి విభాగం
4286 – [ 1 ] ( صحيح ) (2/1235)
عَنْ أَنَسٍ قَالَ: لَقَدْ سَقَيْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم بِقَدَحِيْ هَذَا الشَّرَابَ كُلَّهُ: اَلْعَسْلَ وَالنَّبِيْذَ وَالْمَاءَ وَاللَّبَنَ. رَوَاهُ مُسْلِمٌ .
4286. (1) [2/1235– దృఢం]
అనస్ (ర) కథనం: నేను ఈ పాత్రలో ప్రవక్త (స) కు తేనె, నబీజ్, నీళ్ళు, పాలు త్రాపించాను. (ముస్లిమ్)
4287 – [ 2 ] ( صحيح ) (2/1235)
وَعَنْ عَائِشَةَ قَالَتْ: كُنَّا نَنْبِذُ لِرَسُوْلِ اللهِ صلى الله عليه وسلم فِيْ سِقَاءٍ يُوْكَأُ أَعْلَاهُ وَلَهُ عَزْلَاءُ نَنْبِذُهُ غُدْوَةً فَيَشْرِبُهُ عِشَاءً وَنَنْبِذُهُ عِشَاءً فَيَشْرَبُهُ غُدْوَةً. رَوَاهُ مُسْلِمٌ .
4287. (2) [2/1235– దృఢం]
‘ఆయి’షహ్ (ర) కథనం: మేము ప్రవక్త (స) కోసం కుండలో నబీజ్’ తయారుచేసే వారం. దాని మూతిని మూసివేయటం జరిగేది. క్రింద నల్లా ఉండేది. ఉదయం నబీజ్’ తయారుచేస్తే సాయంత్రం త్రాగేవారు, సాయంత్రం చేస్తే ఉదయం త్రాగేవారు. (ముస్లిమ్)
4288 – [ 3 ] ( صحيح ) (2/1235)
وَعَنِ ابْنِ عَبَّاسٍ قَالَ: كَانَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم يُنْبَذُ لَهُ أَوَّلَ اللَّيْلِ فَيَشَرْبُهُ إِذَا أَصْبَحَ يَوْمَهُ ذَلِكَ وَاللَّيْلَةَ الَّتِيْ تُجِيْءُ وَالْغَدَ وَ اللَّيْلَةَ الْأُخْرَى وَالْغَدَ إِلى الْعَصْرِ فَإِنْ بَقِيَ شَيْءٌ سَقَاهُ الْخَادِمَ أَوْ أَمَرَ بِهِ فَصُبَّ. رَوَاهُ مُسْلِمٌ .
4288. (3) [2/1235 –దృఢం]
ఇబ్నె ‘అబ్బాస్ (ర) కథనం: ప్రవక్త (స) కోసం సాయంత్రం నబీజ్’ తయారుచేయడం జరిగేది, ఉదయం దాన్ని త్రాగేవారు, మరుసటి రాత్రి కూడా త్రాగేవారు. మిగిలిన నబీజ్’ ఉదయం లేదా సాయంత్రం త్రాగేవారు. అయితే అందులో మత్తు రాకముందు త్రాగేవారు. మిగిలితే సేవకులకు త్రాపించే వారు లేదా పారవేసేవారు. (ముస్లిమ్)
4289 – [ 4 ] ( صحيح ) (2/1235)
وَعَنْ جَابِرٍ قَالَ: كَانَ يُنْبَذُ لِرَسُوْلِ اللهِ صلى الله عليه وسلم فِيْ سِقَائِهِ فَإِذَا لَمْ يَجِدُوْا سِقَاءً يُنْبَذُ لَهُ فِيْ تَوْرٍمِنْ حِجَارَةٍ .رَوَاهُ مُسْلِمٌ
4289. (4) [2/1235 –దృఢం]
జాబిర్ (ర) కథనం: ప్రవక్త (స) కోసం సంచిలో నబీజ్’ తయారుచేయబడేది. ఒకవేళ సంచి దొరక్క పోతే రాతి గిన్నెలో నబీజ్’ తయారుచేసేవారు. (ముస్లిమ్)
4290 – [ 5 ] ( صحيح ) (2/1235)
وَعَنِ ابْنِ عُمَرَ: أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم نَهَى عَنِ الدُّبَّاءِ وَ الْحَنْتَمِ وَالْمُرَفَّتِ وَالنَّقِيْرِوَأَمَرَأَنْ يُنْبَذَ فِي أَسْقِيَةِ الْأَدَمِ. رَوَاهُ مُسْلِمٌ .
4290. (5) [2/1235–దృఢం]
‘అబ్దుల్లాహ్ బిన్ ‘ఉమర్(ర) కథనం: ప్రవక్త (స) గుమ్మడి కాయ పచ్చని గిన్నెలో, కర్ర గిన్నెలో, రంగులు పూసిన గిన్నెలో నబీజ్’ తయారు చేయరాదని వారించారు. ఇంకా చర్మంతో చేసిన సంచులలో నబీజ్’ తయారు చేయమని అందులో త్వరగా మత్తురాదని ప్రవచించారు. (ముస్లిమ్)
అయితే, తరువాత దీన్ని రద్దు చేయడం జరిగింది.
4291 – [ 6 ] ( صحيح ) (2/1236)
وَعَنْ بُرَيْدَةَ أَنَّ رَسُولَ اللهِ صلى الله عليه وسلم قَالَ: “نَهَيْتُكُمْ عَنِ الظُّرُوْفِ فَإِنَّ ظَرْفًا لَا يُحِلُّ شَيْئًا وَلَا يُحَرِّمُهُ وَكُلُّ مُسْكِرٍ حَرَامٌ”.
وَفِيْ رِوَايَةٍ:قَالَ: “نَهَيْتُكُمْ عَنِ الْأَشْرِبَةِ إِلّا فِيْ ظُرُوْفِ الْأَدَمِ فَاشْرَبُوْا فِيْ كُلِّ وِعَاءٍ غَيْرَأَنْ لَّا تَشْرَبُوْا مُسْكِرًا”. رَوَاهُ مُسْلِمٌ.
4291. (6) [2/1236 –దృఢం]
బురైదహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”నేను కొన్ని గిన్నెల్లో నబీజ్’ తయారు చేయరాదని వారించాను. అంటే ఎటువంటి గిన్నెనూ నేను నిషేధించ లేదు. ప్రతి మత్తు పదార్థం నిషిద్ధం. మరో ఉల్లేఖనంలో ఇలా ఉంది, ”చర్మం తప్ప మరే గిన్నెలో నబీజ్’ తయారుచేయరాదని నేను వారించాను. ఇప్పుడు ఎటువంటి గిన్నెలోనైనా తయారు చేసుకో వచ్చు. అయితే మత్తు పదార్థాలను సేవించకండి.
—–
اَلْفَصْلُ الثَّانِيْ రెండవ విభాగం
4292 – [ 7 ] ( صحيح ) (2/1236)
عَنْ أَبِيْ مَالِكٍ الْأَشْعَرِيُّ أَنَّهُ سَمِعَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ: “لَيَشْرَبَنَّ نَاسٌ مِنْ أُمَّتِي الْخمْرَيُسَمُّوْنَهَا بِغَيْرِ اسْمِهَا”. رَوَاهُ أَبُوْ دَاوُدَ وَابْنُ مَاجَهُ
4292. (7) [2/1236 –దృఢం]
అబూ మాలిక్ అష్’అరీ (ర) కథనం: ప్రవక్త (స) ఇలా ప్రవచిస్తూ ఉండగా నేను విన్నాను. భవిష్యత్తులో నా అనుచర సమాజంలోని ప్రజలు మత్తుపానీయాలు సేవిస్తారు. కాని దాన్ని మరో పేరుతో పిలుస్తారు. (అబూ దావూద్, ఇబ్నె మాజహ్)
—–
اَلْفَصْلُ الثَّالِثُ మూడవ విభాగం
4293 – [ 8 ] ( صحيح ) (2/1236)
عَنْ عَبْدِ اللهِ بْنِ أَبِيْ أَوْفَى قَالَ: نَهَى رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم عَنْ نَبِيْذِ الْجَرِّ الْأَخْضَرِ قُلْتُ: أَنَشْرَبُ فِي الْأَبْيَضِ؟ قَالَ: “لَا”. رَوَاهُ الْبُخَارِيُّ .
4293. (8) [2/1236 –దృఢం]
‘అబ్దుల్లాహ్ బిన్ అబీ అవఫా (ర) కథనం: ప్రవక్త (స), ‘పచ్చని గిన్నెల్లో నబీజ్’ తయారుచేయరాదని,’ వారించారు. మేము, ‘తెల్లని గిన్నెలో చేసిన నబీజ్’ త్రాగ వచ్చా? ‘ అని అడిగాము. దానికి ప్రవక్త (స), ‘వద్దు,’ అన్నారు. (బు’ఖారీ)
ఈ ఆదేశం మొదటిది. ఇది రద్దయిపోయింది. కొన్ని ఉల్లేఖనాల్లో ఇతర గిన్నెల్లో నబీజ్’ తయారు చేయవచ్చన్న ఆదేశం ఉంది.
=====
5- بَابُ تَغْطِيَةِ الْأَوَانِيْ وَغَيْرَهَا
5. గిన్నెలపై మూత పెట్టడం, మూసి ఉంచటం
اَلْفَصْلُ الْأَوَّلُ మొదటి విభాగం
4294 – [ 1 ] ( متفق عليه ) (2/1237)
عَنْ جَابِرٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِذَا كَانَ جُنْحُ اللَّيْلَ أَوْ أَمْسَيْتُمْ فَكُفُّوْا صِبْيَانَكُمْ فَإِنَّ الشَّيْطَانَ يَنْتَشِرُحِيْنَئِذٍ فَإِذَا ذَهَبَ سَاعَةٌ مِنَ اللَّيْلِ فَخَلُّوْهُمْ وَأَغْلِقُوْا الْأَبْوَابَ وَاذْكُرُوْا اسْمَ اللهِ فَإِنَّ الشَّيْطَانَ لَا يَفْتَحُ بَابًا مُغْلَقًا وَأَوْكُوْا قِرَبَكُمْ وَاذْكُرُوْا اسْمَ اللهِ وَخَمِّرُوْا آنِيَتَكُمْ وَاذْكُرُوْا اسْمَ اللهِ وَلَوْ أَنْ تُعْرِضُوْا عَلَيْهِ شَيْئًا وَأطْفِئُوْا مَصَابِيْحَكُمْ”.
4294. (1) [2/1237 –ఏకీభవితం]
జాబిర్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”సాయంత్రం కాగానే పిల్లలను బయటకు వెళ్ళనివ్వకండి. రోడ్లపై బజారుల్లో తిరగనివ్వకండి. ఎందుకంటే ఆ సమయంలో షై’తానులు, జిన్నులు మొదలైనవి బజారుల్లో, వీధుల్లో తిరగటం ప్రారంభిస్తాయి. అవి హాని కలిగించవచ్చు. సూర్యాస్త మయం తరువాత వాటి ప్రభావం చాలా అధికంగా ఉంటుంది. రాత్రి ఒక భాగం గడచిపోతే షైతానుల ప్రభావం తగ్గిపోతుంది. వాటి ప్రభావం తగ్గిన తర్వాత పిల్లలను వదలివేయండి అంటే వీధుల్లో తిరగ గలరు. పడుకోవటానికి ముందు ఇంటి తలుపులు మూసి వేయండి. అయితే ఇంటి తలుపులు మూసినపుడు దైవం పేరు పలకండి. అంటే ‘బిస్మిల్లాహ్’ అని తలుపులు మూసివేయండి. ఎందుకంటే ‘బిస్మిల్లాహ్’ అని పలికి మూసివేసిన తలుపులు షై’తాన్ తెరువ లేడు. ఇంకా మీ గిన్నెలను, సీసాలను సంచులను మూసి వేయండి. అయితే అప్పుడు కూడా ‘బిస్మిల్లాహ్’ అని పలకండి. పాత్రలను మూసివేయండి. అంటే గిన్నెలు, డబ్బాలు, సీసాలు, కుండలు, తినే పదార్థాలు ఉన్నవి మూసివేయండి. అప్పుడు కూడా ‘బిస్మిల్లాహ్’ పఠించండి. ఒకవేళ మూయటానికి మూతలు లభించని పక్షంలో కర్ర పోచనైనా ‘బిస్మిల్లాహ్’ అని పలికి పెట్టి వేయండి. పడుకునే టప్పుడు దీపాలను ఆర్పివేయండి. ఎందుకంటే వెలుగు అవసరం ఉండదు, నూనె అనవసరంగా కాలుతుంది. (బు’ఖారీ, ముస్లిమ్)
4295 – [ 2 ] ( صحيح ) (2/1237)
وَفِيْ رِوَايَةٍ لِلْبُخَارِيِّ: قَالَ: “خَمِّرُوْا الْآنِيَةِ وَأَوْكُوْا الْأَسْقِيَةَ وَأَجِيْفُوا الْأَبْوَابَ وَاكْفِتُوْا صِبْيَانَكُمْ عِنْدَ الْمَسَاءِ فَإِنَّ لِلْجِنّ اِنْتِشَارًا أَوْ خَطْفَةً وَأَطْفِئُوا الْمَصَابِيْحَ عِنْدَ الْرُّقَادِ فَإِنَّ الْفُوَيْسَقَةَ رُبَّمَا اجْتَرَّتِ الْفَتِيْلَةَ فَأَحْرَقَتْ أَهْلَ الْبَيْتِ”.
4295. (2) [2/1237– దృఢం]
బు’ఖారీ ఉల్లేఖనంలో ఇలా ఉంది, ”మీరు మీ గిన్నెలపై మూతలు వేయండి, సంచులను కట్టి వేయండి. తలుపులను మూసివేయండి. సాయంత్రం పిల్లలను బయటకు వెళ్ళనివ్వకండి. ఎందుకంటే షై’తానులు, జిన్నులు తమ నివాసస్థలాల నుండి బయలుదేరి అటూ ఇటూ వ్యాపిస్తాయి. హాని చేకూరుస్తాయి. అందువల్ల సాయంత్రం పిల్లలను బయటకు పంపకండి. పడుకునేటప్పుడు దీపాలను ఆర్పివేయండి. ఎందుకంటే ఒక్కోసారి షై’తానులు ఎలుకల రూపంలో ప్రత్యక్షమై హాని తలపెట్టవచ్చు. (బు’ఖారీ)
4296 – [ 3 ] ( صحيح ) (2/1237)
وَفِيْ رِوَايَةٍ لِمُسْلِمٍ قَالَ: “غَطُّوا الْإِنَاءَ وَأَوْكُوْا السِّقَاءَ وَأَغْلِقُوا الْأَبْوَابَ وَأَطْفِئُوا السِّرَاجَ فَإِنَّ الشَّيْطَانَ لَا يُحِلُّ سِقَاءً وَلَا يَفْتَحُ بَابًا وَلَا يَكْشِفُ إِنَاءً فَإِنْ لَمْ يَجِدْ أَحَدُكُمْ إِلَّا أَنْ يَعْرِضَ عَلَى إِنَائِهِ عَوْدًا وَيَذْكُرَ اسْمَ اللهِ فَلْيَفْعَلْ فَإِنَّ الْفُوَيْسَقَةَ تُضْرِمُ عَلَى أَهْلِ الْبَيْتِ بَيْتَهُمْ”.
4296. (3) [2/1237– దృఢం]
ముస్లిమ్ ఉల్లేఖనంలో ఇలా ఉంది: ”ప్రవక్త (స) ప్రవచనం, ”గిన్నెలపై మూతలు పెట్టండి. సంచులను కట్టివేయండి. ఇంకా తలుపులు మూసివేయండి. దీపాలను ఆర్పివేయండి. ఎందుకంటే షై’తాన్ గిన్నెల, సంచుల, తలుపులను తెరువలేడు. ఒకవేళ గిన్నెలను మూయటానికి ఏదీ దొరకనప్పుడు కర్ర ముక్కనైనా పెట్టివేయండి. అయితే ‘బిస్మిల్లాహ్’ పఠించి, దీపాలు ఆర్పివేయండి, ఎందుకంటే అటూ ఇటూ కదిలి ఇంటికి నిప్పంటుకోవచ్చు. (ముస్లిమ్)
4297 – [ 4 ] ( صحيح ) (2/1238)
وَفِيْ رِوَايَةٍ لَهُ: قَالَ: “لَا تُرسِلُوْا فَوَاشِيَكُمْ وَصِبْيَانَكُمْ إِذَا غَابَتِ الشَّمْسُ حَتّى تَذْهَبَ فَحْمَةُ الْعِشَاءِ فَإِنَّ الشَّيْطَانَ يُبْعَثُ إِذَا غَابَتِ الشَّمْسُ حَتّى تَذْهَبَ فَحْمَةُ الْعِشَاءِ”.
4297. (4) [2/1238– దృఢం]
ఒక ఉల్లేఖనంలో ఇలా ఉంది: ”సూర్యాస్తమయ సమయంలో మీ పశువులను, పిల్లలను బయటకు వెళ్ళ నివ్వకండి. అయితే రాత్రి ఒక భాగం గడిచిపోతే ఫరవా లేదు. ఎందుకంటే సూర్యాస్తమయ సమయంలో షై’తానులు బయలుదేరుతాయి, మానవులకు హాని చేకూర్చటానికి ప్రయత్నిస్తాయి.
4298 – [ 5 ] ( صحيح ) (2/1238)
وَفِيْ رِوَايَةٍ لَهُ: قَالَ: “غَطُّوا الْإِنَاءَ وَأَوْكُوا السِّقَاءِ فَإِنَّ فِي السَّنَةِ لَيْلَةً يَنْزِلُ فِيْهَا وَبَاءٌ لَا يَمُرُّ بِإنَاءٍ لَيْسَ عَلَيْهِ غِطَاءٌ أَوْ سِقَاءٍ لَيْسَ عَلَيْهِ وِكَاءٌ إِلّا نَزَلَ فِيْهِ مِنْ ذَلِكَ الْوَبَاءِ”.
4298. (5) [2/1238– దృఢం]
మరో ఉల్లేఖనంలో ఇలా ఉంది: ”మీరు గిన్నెలపై మూతలు వేయండి, సంచులను కట్టివేయండి, ఎందుకంటే ఒక సంవత్సరకాలంలో ఏదో ఒక రాత్రి ఉంటుంది. అందులో వ్యాధి దిగుతుంది. మూతలు లేని వస్తువుల్లో అది ప్రవేశిస్తుంది. మానవులు తినేటప్పుడు ఆ ఆహార పదార్థంతో పాటు దాన్ని కూడా తింటాడు. దాని వల్ల అనారోగ్యానికి గురౌతాడు.
4299 – [ 6 ] ( متفق عليه ) (2/1238)
وَعَنْهُ قَالَ: جَاءَ أَبُوْ حُمَيْدٍ رَجُلٌ مِنَ الْأَنْصَارِ مِنَ النِّقِيْعِ بِإِنَاءٍ مِنْ لَبَنٍ إِلى النَّبِيِّ صلى الله عليه وسلم فَقَالَ النَّبِيُّ صلى الله عليه وسلم: “أَلَا خَمَّرْتَهُ وَلَوْ أَنْ تَعْرِضَ عَلَيْهِ عَوْدًا”.
4299. (6) [2/1238– ఏకీభవితం]
జాబిర్ (ర) కథనం: అబూ హమీద్ కథనం: ఒక అ’న్సారీ నఖీ ప్రాంతం నుండి ఒక గిన్నెలో ప్రవక్త (స) వద్దకు పాలు తెచ్చాడు. ప్రవక్త (స), ‘ఆ గిన్నెను తెరచి ఎందుకు తెచ్చావు. మూత పెట్టి ఎందుకు తేలేదు, ఏదీ దొరక్కపోతే కనీసం కర్రముక్క అయినా పెట్టలేక పోయావా?’ అని అన్నారు. (బు’ఖారీ, ముస్లిమ్)
ఏదైనా వస్తువును గిన్నెలో లేదా ప్లేటులో తెస్తే మూతపెట్టి తీసుకురావాలి, అని ఈ ‘హదీసు’ ద్వారా తెలిసింది.
4300 – [ 7 ] ( متفق عليه ) (2/1238)
وَعَنِ ابْنِ عُمَرَ عَنِ النَّبِيِّ صَلَى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ: “لَا تَتْرَكُوا النَّارَ فِيْ بُيُوْتِكُمْ حِيْنَ تَنَامُوْنَ”.
4300. (7) [2/1238– ఏకీభవితం]
‘అబ్దుల్లాహ్ బిన్ ‘ఉమర్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవ చనం, ”పడుకున్నప్పుడు దీపాలు వెలిగించి ఉంచ కండి. అగ్నిప్రమాదం ఉంది.” (బు’ఖారీ, ముస్లిమ్)
అంటే పడుకున్నప్పుడు దీపాలు, పొయ్యి ఆర్పి వేయాలి.
4301 – [ 8 ] ( متفق عليه ) (2/1238)
وَعَنْ أَبِيْ مُوْسَى قَالَ: احْتَرَقَ بَيْتٌ بِالْمَدِيْنَةِ عَلَى أَهْلِهِ مِنَ اللَّيْلِ فَحُدِّثَ بِشَأْنِهِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ: “إِنَّ هَذِهِ النَّارَ إِنَّمَا هِيَ عَدُوٌّ لَكُمْ فَإِذَا نِمْتُمْ فَأَطْفِئُوْهَا عَنْكُمْ”.
4301. (8) [2/1238 –ఏకీభవితం]
అబూ మూసా (ర) కథనం: మదీనహ్లోని ఒక ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఆ ఇంటివారు ఆ సమయంలో ఇంట్లోనే ఉన్నారు. ఈ సంఘటన గురించి ప్రవక్త (స) వద్ద ప్రస్తావించటం జరిగింది. అప్పుడు ప్రవక్త (స), ‘అగ్ని మీ శత్రువు, మీరు పడుకున్నప్పుడు అన్నీ ఆర్పివేయండి,’ అని అన్నారు. (బు’ఖారీ, ముస్లిమ్)
—–
اَلْفَصْلُ الثَّانِيْ రెండవ విభాగం
4302 – [ 9 ] ( لم تتم دراسته ) (2/1239)
عَنْ جَابِرٍ قَالَ:سَمِعْتُ النَّبِيَّ صلى الله عليه وسلم يَقُوْلُ: “إِذَا سَمِعْتُمْ نُبَاحَ الْكِلَابِ وَنَهِيقَ الْحَمِيْرِمِنَ اللَّيْلِ فَتَعَوَّذُوْا بِاللهِ مِنَ الشَّيْطَانِ الرَّجِيْمِ فَإِنَّهُنَّ يَرَيْنَ مَا لَا تَرَوْنَ. وَأَقِلُّوْا الْخُرُوْجَ إِذَا هَدَأَتِ الْأَرْجُلُ فَإِنَّ اللهَ عَزَّ وَجَلَّ يَبُثُّ مِنْ خَلْقِهِ فِيْ لَيْلَتِهِ مَا يَشَاءُ وَأَجِيْفُوا الْأَبْوَابَ وَ اذْكرُوْا اسْمَ اللهِ عَلَيْهِ فَإِنَّ الشَّيْطَانَ لَا يَفْتَحُ بَابًا إِذَا أَجِيْفَ وَذُكِرَ اسْمَ اللهِ عَلَيْهِ وَغَطُّوا الْجِرَارَوَأَكْفِئُوا الْآنِيَةَ وَأَوْكُوا الْقِرَبَ”. رَوَاهُ فِيْ شَرْحِ السُّنَّةِ.
4302. (9) [2/1239 –అపరిశోధితం]
జాబిర్ (ర) కథనం: ప్రవక్త (స) ఇలా ప్రవచిస్తూ ఉండగా నేను విన్నాను, ”మీరు రాత్రిపూట కుక్కల అరుపులు, గాడిదల కేకలు వింటే షై’తాన్ నుండి అల్లాహ్(త)ను శరణు కోరండి. అంటే ‘అఊజుబిల్లాహి మినష్షైతా నిర్రజీమ్’ అని పఠించండి. ఈ కుక్కలు, గాడిదలు వారిని చూస్తాయి, మీరు చూడలేరు. అంటే వారు షై’తాన్లను చూచి అరుస్తాయి, కేకలు వేస్తాయి. ఇంకా రాత్రిపూట ప్రజల అలజడి తగ్గిపోతే, బయటకు వెళ్ళకండి, ఎందుకంటే రాత్రి, అల్లాహ్ (త) తన సృష్టితాల్లోని తాను కోరిన వారిని పంపిస్తాడు. అయితే ‘బిస్మిల్లాహ్’ అని పలికి ఇంటి తలుపులు మూసి వేయండి. ఎందుకంటే దైవం పేరుతో మూసి వేయబడిన తలుపులను షై’తాన్ తెరువలేడు. కుండలను, బకెట్లను, సంచులను, గిన్నెలను మూసివేయండి. (షర్’హుస్సున్నహ్)
4303 – [ 10 ] ( لم تتم دراسته ) (2/1239)
وَعَنِ ابْنِ عَبَّاسٍ قَالَ: جَاءَتْ فَأرَةٌ تَجُرُّ الْفَتِيْلَةَ فَأَلْقَتْهَا بَيْنَ يَدَيْ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم عَلَى الْخُمْرَةِ الَّتِيْ كَانَ قَاعِدًا عَلَيْهَا فَأَحْرَقَتْ مِنْهَا مِثْلَ مَوْضِعِ الدِّرْهَمِ فَقَالَ: “إِذَا نِمْتُمْ فَأَطْفِئُواسُرُجَكُمْ فَإِنَّ الشَّيْطَانَ يَدُلُّ مِثْلَ هَذِهِ عَلَى هَذَا فَيُحَرِّقُّكُمْ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ.
4303. (10) [2/1239 –అపరిశోధితం]
ఇబ్నె ‘అబ్బాస్ (ర) కథనం: ”ఒక ఎలుక కాలుతున్న దీపాన్ని లాగింది. ప్రవక్త (స) కూర్చున్న చాపమీద పడవేసింది. అర్థ రూపాయి అంత గుండ్రంగా కాలి పోయింది. అది చూచి ప్రవక్త (స), ‘మీరు పడు కునేటప్పుడు దీపాలు ఆర్పివేయండి. ఎందు కంటే షై’తాన్ ఇటువంటి ప్రాణులను ఈ విధమైన పనులపై ప్రేరేపిస్తాడు . తద్వారా మీ ఇళ్ళకు నిప్పంటిస్తాడు,’ అని ప్రవచించారు.” (అబూ దావూద్)
—–
وهذا الباب خال من اَلْفَصْلُ الثَّالِثُ
ఇందులో మూడవ విభాగం లేదు
*****
[1]) వివరణ-4165: అంటే ఉపయోగించే పళ్ళెం, ప్లేటు మొదలైనవి. వీటిని మరియు చేతివ్రేళ్ళను నాకటం ప్రవక్త (స) సాంప్రదాయం. కాని వ్రేళ్ళను నోటిలో పెట్టుకో కూడదు.
[2]) వివరణ-4168: అంటే భూమిపై ఒక చేయి ఆనించి తిన కూడదు. లేదా తలగడపై వాలుగా కూర్చొని తిన కూడదు. ఎందుకంటే ఇలా చేయడం అహంకారానికి చిహ్నం.
[3]) వివరణ-4169: అంటే ప్రవక్త (స) ఏనాడూ టేబుల్, చౌకీపై కూర్చొని భోజనం చేయలేదు. ఎందుకంటే ఇలా కూర్చొని తినటం అహంకారుల గుణం, భూమిపై కూర్చొని తినటమే వినయవిధేయతలతో కూడిన పద్ధతి. వీటిపై కూర్చొని తినటం ప్రవక్త సాంప్రదాయానికి విరుద్ధం. చిన్న చిన్న ప్లేట్లలో తినకూడదు. అన్నం క్రిందపడే అవకాశం ఉంది. అందులో ఇతరులనూ చేర్చలేము. ప్రవక్త (స) సాంప్రదాయకమైన పద్ధతి ఏమిటంటే పెద్దపళ్ళెంలో వేసి ఎక్కువమంది తినటం మాత్రమే! ఇందులో ఎంతో శుభం ఉంటుంది. ఐకమత్యాన్ని కూడా సూచిస్తుంది. ప్రస్తుత కాలంలో ప్రతిఒక్కరూ వేర్వేరుగా తింటారు. అధికంగా తింటారు. అంతేకాక జీర్ణం అవడానికి కొన్నిరకాల మసాలాలు కూడా తింటారు. దీనివల్ల జీర్ణాశయం వ్యాధులకు గురవుతుంది. ప్రవక్త (స) బోధనల్లో ఇహపరాలకు చెందిన ఎన్నో శుభాలు ఉన్నాయి. అయితే వాటిపట్ల ఆలోచించాలి. మందుల ద్వారా ఆకలిని, కామ ఉద్రేకాన్ని పెంచటం అవివేకం, ఆకలి వేయనంత వరకు తినకూడదు. అదేవిధంగా కామకోరిక కలగనంత వరకు సంభోగం చేయరాదు. అనవసరంగా తినేవారికి, కామ కోరికలకు బానిస అయిన వారికే అనేక రోగాలు, వ్యాధులు వస్తాయి. ప్రవక్త (స) చర్మంతో చేయబడిన, ఖర్జూరం ఆకులతో చేయబడిన చాపపై భోజనం చేసేవారు.
[4]) వివరణ-4171: ప్రవక్త (స) దైవదౌత్యానికి ముందు రెండుసార్లు వ్యాపార నిమిత్తం సిరియా వెళ్ళారు. మార్గంలో బుహైరహ్ పండితుల్ని కలవడం జరిగింది. ఆతిథ్యం స్వీకరించడం జరిగింది. అప్పుడు జల్లెడ చేసిన పిండితో చేయబడిన రొట్టెలు తిన్నారు. దైవదౌత్యం తరువాత పేదరికం వల్ల తినలేకపోయారు.
[5]) వివరణ-4176: మానవుని కడుపులో 7ప్రేగులు ఉంటాయి. విశ్వాసి అయిన అవిశ్వాసి అయినా, విశ్వాసిని తక్కువగా తినమని ప్రోత్సహించాలి. ఎందుకంటే అధికంగా తినటం వల్ల హృదయం కఠినంగా తయారవుతుంది. కామ కోరికలు అధికమవుతాయి.
[6]) వివరణ-4177: నిదానంగా ‘బిస్మిల్లాహ్’ పలికి తినాలి. ఆ అన్నంలో శుభం కలుగుతుంది. ఎందుకంటే శుభం లేని అన్నం ఎంత తిన్నా కడుపు నిండదు.
[7]) వివరణ-4179: తల్బీనహ్ ఒక రకమైన ఆహారం. ఇది పాలు మరియు పిండితో తయారుచేయబడుతుంది. ఇందులో తేనె కూడా వేస్తారు. ఇది పాలవలె తెల్లగా ఉంటుంది. అంటే పర్వాన్నం మొదలైన వాటిలా.
[8]) వివరణ-4183: సిర్క అందరికీ తెలిసిన ఒక రకమైన పదార్థం. ఇది అనేక వస్తువులతో తయారుచేయబడు తుంది. చెరుకు, నేరేడు, ద్రాక్ష, ఖర్జూరం మొదలైన వాటన్నిటితో తయారుచేస్తారు. ఇది చాలా ఉపయోగ కరమైనది. అనేక వ్యాధులకు పనిచేస్తుంది.
[9]) వివరణ-4184: మజ్మఉల్ బిహార్ లో ఖంబీని మన్ అన్నారంటే, అది బనీ ఇస్రాయీల్ పై అవతరించబడిన మన్ కాదు. ఎందుకంటే అది ఆకాశంనుండి కురిసేది. ఇది భూమిపై పండుతుంది. దీన్నిషహ్ముల్ అర్జ్ అంటారు. కొందరు ఇది అల్లాహ్ అనుగ్రహాలలో ఒక అనుగ్రహం అని అభిప్రాయపడ్డారు. దీని నీరు కళ్ళకు మంచి మందు. అయితే కళ్ళు మండుతాయి. ప్రవక్త(స) ప్రవచనం సత్యమైనది. నేను ఒక వ్యక్తిని చూచాను, అతని కంటి చూపు క్షీణిస్తుంది. అతడు దాని నీరు కంట్లో వేసాడు. ఫలితంగా అతని కంటిచూపు బాగయిపోయింది. అబూ హురైరహ్ (ర) కథనం, నేను 3 లేదా 5 మన్ ల నీటిని పిసికి సీసాలో ఉంచాను. ఒక అమ్మాయి దాన్ని తన కంటిలో వేసుకుంది. ఆమెకళ్ళు బాగయి పోయాయి.
[10]) వివరణ-4188: అంటే అందరూ కలసి తింటున్నప్పుడు ఇతరులు ఒక్కొక్క ఖర్జూరం తింటున్నప్పుడు, తాను రెండేసి తీసుకొని తినరాదు. అయితే అనుమతి తీసుకుంటే మంచిది.
[11]) వివరణ-4189: అయితే ఖర్జూరాన్ని ఆహారంగా ఉపయో గించేవారికే ఇది వర్తిస్తుంది.
[12]) వివరణ-4190: మదీనహ్లో ఒక రకమైన ఖర్జూరాలు ఉన్నాయి. వాటిని ‘అజ్వహ్ ఖర్జూరాలు అంటారు. వీటి చెట్లను ప్రవక్త(స) స్వయంగా తన చేతులతో నాటారు. ఎవరైనా ఉదయం టిఫిన్‌లో 7 ‘అజ్‌వహ్ ఖర్జూరాలను తింటే, అతనికి విషంగాని, చేతబడిగానీ హాని చేకూర్చదు. దీనికి ప్రవక్త (స) చేతుల మహిమ, శుభం ప్రసాదించటం జరిగింది.
[13]) వివరణ-4191: ‘ఆలియహ్ మదీనహ్లోని ఒక ప్రదేశం పేరు. ఇది మస్జిదె ఖుబహ్కు సమీపంగా ఉంది. ఈ చుట్టుప్రక్కల ప్రాంతాన్ని ‘ఆలియహ్ అంటారు. ఎందుకంటే ఇతర ప్రాంతాల కంటే ఇది ఎత్తుగా ఉంది. ఈ ప్రదేశంలో ఖర్జూరం తోటలు ఉన్నాయి. ఇతర ప్రాంతాలకంటే ఈ ప్రాంతం సస్యశ్యామలంగా ఉంటుంది.
[14]) వివరణ-4194: అస్వదైన్ అంటే రెండు నల్ల వస్తువులు. ఖర్జూరం, నీళ్ళు అన్నమాట.
[15]) వివరణ-4196: ఈ ‘హదీసు’ ఉల్లేఖనకర్త అబూ అయ్యూబ్ అ‘న్సారీ. ఇతని పేరు ‘ఖాలిద్. ఇతడు బు’ఖార్ కుటుంబానికి చెందినవాడు. ఇతడు ఇస్లామ్ స్వీకరించి మక్కనుండి బయలుదేరి తన ఇంటివారికి, బంధు మిత్రులకు ఇస్లామ్ సందేశాన్ని అందజేసారు. అతని భార్య ఇస్లామ్ స్వీకరించారు. అల్లాహ్ (త) మదీనహ్ ప్రజలు ఇస్లామ్ స్వీకరించుట ద్వారా ఇస్లామ్‌కు ఒక సురక్షితమైన ప్రదేశాన్ని ప్రసాదించాడు. ముస్లిములు మక్కహ్ నుండి వలస వచ్చి మదీనహ్లో స్థిరపడ సాగారు. 13వ ఏట రబీఉల్ అవ్వల్ మాసంలో ప్రవక్త (స) కూడా మదీనహ్ రానే వచ్చారు. మదీనహ్ ప్రజలు ప్రవక్త (స) ఎప్పుడు వస్తారా అని వేచి చూడసాగారు. ఆ తరువాత ఒక రోజు ప్రవక్త (స) రాగా ఆయుధాలు ధరించి ప్రవక్త (స)కు స్వాగతం పలికారు.
మదీనహ్కు దగ్గరలోనే ఖుబాఅ‘ అనే ఒక ప్రాంతం ఉండేది. ప్రవక్త (స) కొన్ని రోజుల వరకు ఖుబాఅ‘లోనే నివసించారు. ఆ తరువాత మదీనహ్ వచ్చారు. మదీనహ్ చరిత్రలో ఇదొక అపూర్వ దినం. బనూ నజ్జార్ మరియు అ‘న్సార్లు ఆయుధాలు ధరించి ప్రవక్త (స) కు స్వాగతం పలికారు. నాయకులు తమతమ వీధుల్లో సిధ్ధమై ఉన్నారు. స్త్రీలు ఇళ్ళ నుండి బయటకు వచ్చారు. మదీనహ్ లోని హబషీ బానిసలు సంతోషంతో గారడీలు చేసి చూపిస్తున్నారు. బనూ నజ్జార్ కుటుంబానికి చెందిన అమ్మాయిలు డఫ్పు వాయిస్తూ, ”తలఅల్ బద్రు అలైనా,” అని స్వాగతపు పాటలు పాడుతున్నారు. ఈ విధంగా ప్రవక్త (స) సంతోష స్వాగత గీతాల మధ్య మదీహ్ లో ప్రవేశించారు. ఈ దృశ్యం ఎన్నటికీ మరువరానిది.
అప్పుడు ప్రవక్త(స) ఎవరి ఇంటిలో అతిథిగా దిగుతారు? ఎవరికి ఆ భాగ్యం లభిస్తుంది అని, ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తున్నారు. ప్రవక్త(స) ఎటువెళితే అటు ప్రజలు స్వాగతం సుస్వాగతం అని పలుకుతూ ముందుకు వచ్చి, ప్రవక్తా మా ఇంటికి రండి, మా ఇంటికి రండి అని పిలుస్తున్నారు. కాని దైవ నిర్ణయం అబూ అయ్యూబ్ అ‘న్సారీ ఇంటిని సూచించింది.
ప్రవక్త(స) ప్రజలతో, ‘ఒంటెకు దారివ్వండి, అది అల్లాహ్ ద్వారా తన స్ధలాన్ని వెతుక్కుంటుంది,’ అని అన్నారు.
ఇమామ్ మాలిక్ కథనం, ‘ఆ సమయంలో ప్రవక్త (స)పై దైవవాణి అవతరిస్తూ ఉంది. ప్రవక్త(స) దైవాదేశం కోసం ఎదురు చూస్తున్నారు. చివరికి దైవాదేశం రానేవచ్చింది. ఒంటె అబూ అయ్యూబ్ ఇంటి ముందు ఆగిపోయింది. అబూ అయ్యూబ్ ముందుకు వచ్చి, నా ఇల్లు దగ్గరే ఉంది, అనుమతిస్తే సామాన్లు దించుతాను అని విన్నవించుకున్నారు. ఇతరులు కూడా ఆశతో ఉన్నారు. అందువల్ల చీటీలు వేయడం జరిగింది. అబూ అయ్యూబ్ పేరు వచ్చింది. అతని సంతోషానికి అంతు లేకుండా పోయింది. ప్రవక్త(స) అబూ అయ్యూబ్ అన్సారీ ఇంట్లో సుమారు 6 నెలలు ఉన్నారు. ప్రవక్త(స) అబూ అయ్యూబ్ అ’న్సారీ చాలా విధేయతా పూర్వకంగా ఆతిథ్యం చెల్లించారు. ఇంకా అభిమానంతో ఉండటానికి మొదటి అంతస్తు ఇచ్చారు. కాని ప్రవక్త(స) తన మరియు వచ్చేవారి సౌకర్యం దృష్ట్యా క్రిందభాగం తీసుకున్నారు.
ఒకసారి పైభాగంలో ఉన్న అబూ అయ్యూబ్ అన్సారీ ఇంట్లో నీళ్ళు ఉన్న మట్టి కుండ విరిగిపోయింది. ఇంటి పైకప్పు బలహీనమైనది. నీళ్ళు కారి ప్రవక్త(స)కు బాధ కలుగుతుందని, భార్యభర్తలిద్దరూ కప్పుకోవడానికి ఉన్న ఒకే ఒక్క కంబలిని నీటిపై వేసి దాన్ని శుభ్రపరిచారు. ఇది వారికి ఏమంత కష్టమైన పనికాదు. భార్యా భర్తలిద్దరూ ఆ రాత్రంతా మూలల్లో రాత్రి గడిపారు. ఉదయం అబూ అయ్యూబ్ అ’న్సారీ ప్రవక్త (స) వద్దకు వెళ్ళి, రాత్రి సంఘటన గురించి ప్రస్తావిస్తూ పైకివచ్చి విశ్రాంతి తీసుకోమని, మేముక్రింద ఉంటామని విన్నవించు కున్నారు. ప్రవక్త(స) అతని విన్నపాన్ని మన్నించి పైకి వెళ్ళి విశ్రాంతి తీసుకున్నారు. ప్రవక్త(స) అతని ఇంట్లో ఉన్నంత కాలం అబూ అయ్యూబ్ అ’న్సారీ భోజనం పంపేవారు. ప్రవక్త (స) బోజనం చేసిన తరువాత గిన్నెలను తిరిగి పంపేవారు. అబూ అయ్యూబ్ అ’న్సారీ ప్రవక్త(స) తిన్న కంచంలోనే, ఎక్కడి నుండి ప్రవక్త(స) తిన్నారో, అక్కడి నుండే తినేవారు. ఒక సారి భోజనం తిరిగి వచ్చింది. ప్రవక్త (స) తినలేదని తెలిసింది. వెళ్ళి కారణం ఏమిటని అడిగారు. దానికి ప్రవక్త (స), ‘భోజనంలో తెల్లఉల్లి ఉంది. అది నాకు ఇష్టం లేదు,’ అని అన్నారు. అప్పుడు అబూ అయ్యూబ్ అ’న్సారీ, ‘తమరికి ఇష్టం లేనిది నాకూ ఇష్టం లేదు,’ అని అన్నారు.
అబూ అయ్యూబ్ అ’న్సారీ ఉత్తమ గుణాల్లో మూడు ప్రత్యేకతలు ఉండేవి. ప్రవక్త(స) ప్రేమ, విశ్వాస ఆవేశం, సత్యం పలకటం. ప్రవక్త(స)ను ఎంతో అధికంగా ప్రేమించే వారు. పైన పేర్కొన్న సంఘటనల వల్ల మనం తెలుసుకోగలం.
ప్రవక్త (స) మరణానంతరం తరచూ ప్రవక్త(స) సమాధి వద్దకు వెళ్ళేవారు. ఒకసారి అబూ అయ్యూబ్ అ’న్సారీ ప్రవక్త (స) సమాధి వద్ద తన ముఖాన్నిసమాధికి తగిలినట్టు కూర్చోని ఉన్నారు. ఆ కాలంలో మర్వాన్ మదీనహ్ గవర్నరు. అకస్మాత్తుగా వచ్చి అలా కూర్చోవటం ప్రవక్త సాంప్రదాయానికి వ్యతిరేకంగా భావించాడు. అయితే మర్వాన్ ధార్మిక విషయాల్లో అబూ అయ్యూబ్ అన్సా’రీ కంటే పండితుడేమీ కాదు. అతని అభ్యంతరాన్ని గ్రహించిన అబూ అయ్యూబ్ అ’న్సారీ, ‘ప్రవక్త (స) వద్దకు వచ్చాను, రాళ్ళు, ఇటుకల వద్దకు రాలేదు.’ అని సమాధానం ఇచ్చారు.
అబూ అయ్యూబ్ అ’న్సారీ విశ్వాస దృఢత్వం పైన పేర్కొనడం జరిగింది. పోరాటా లన్నిటిలోనూ పాల్గొన్నారు. 80 సంవత్సరాల వయసులో ఈజిప్టు మార్గం ద్వారా రూమ్ సముద్రాన్ని దాటి ఖుస్తున్తుని యాలో అల్లాహ్ ధర్మప్రచారంలో నిమగ్నులై పోయారు. అక్కడే మరణించారు. ఆయన సమాధి అక్కడే ఉంది.
అబూ అయ్యూబ్ అ’న్సారీ (ర) సత్యం పలకడంలో పాలకులను, అధికారులను ఎవ్వరికీ భయపడేవారు కాదు. ఒకసారి ప్రవక్త(స) అనుచరులు ఈజుప్టు గవర్నరు అయిన ‘ఉఖ్బహ్ బిన్ ‘ఆమిర్ జుహ్నీ ఏదోకారణం వల్ల మగ్రిబ్ నమాజులో ఆలస్యంగా వచ్చారు. అబూ అయ్యూబ్ అ’న్సారీ (ర) లేచి ” ‘ఉఖ్బహ్ ఇది ఎలాంటి నమా’జు,” అని అన్నారు. దానికి ‘ఉఖ్బహ్(ర), ‘పనివల్ల ఆలస్యం అయిపోయింది,’ అని అన్నారు. దానికి అబూ అయ్యూబ్ అ’న్సారీ (ర) మీరు ప్రవక్త(స) అనుచరులు, ఇలా చేయటం వల్ల ప్రవక్త(స)కూడా ఈ సమయంలోనే చదివేవారని ప్రజలు అనుకుంటారు. వాస్తవం ఏమిటంటే ప్రవక్త(స) మ’గ్రిబ్ నమా’జును త్వరగా చదివేవారు.
‘ఖాలిద్ బిన్ వలీద్ కుమారులు ‘అబ్దుర్ర‘హ్మాన్ ఒక యుధ్ధంలో నలుగురు ‘ఖైదీలను కాళ్ళూ చేతులూ కట్టి చంపివేసారు. ఈ విషయం అబూ అయ్యూబ్ అ’న్సారీ (ర) కి తెలిసింది. ‘ఇటు వంటి భయంకరమైన హత్యలను ప్రవక్త(స) నిషేధించారు. నేనైతే కోడిని కూడా ఈ విధంగా చంపడానికి ఇష్టపడను,’ అని అన్నారు. రూమ్ యుధ్ధ కాలంలో నావలో చాలామంది ఖైదీలు అధికారుల పర్యవేక్షణలో ఉన్నారు. అబూ అయ్యూబ్ అ’న్సారీ (ర) అటువైపు నుంచి వెళుతూ వారిలో ఒక స్త్రీ ఏడుస్తూ, కన్నీరు కారుస్తూ ఉండటం చూసారు. కారణం అడిగారు. దానికి అక్కడున్నవారు, ‘ఆమె బిడ్డను లాక్కోని ఆమెకు దూరంగా ఉంచారు,’ అని తెలియజేయటం జరిగింది. అబూ అయ్యూబ్ అ’న్సారీ (ర) బిడ్డచేయి పట్టుకొని తల్లి చేతిలో పెట్టారు. అధికారి పిర్యాదు చేసాడు. సైన్యాధికారి విచారించగా, ‘ప్రవక్త(స) ఈ విధంగా హింసించడాన్ని నిషేధించారు,’ అని అన్నారు.
అబూ అయ్యూబ్ అ’న్సారీ (ర) ఇస్లామ్‌కు వ్యతిరేకంగా ఏది చూసినా దానిపట్ల ప్రజలను హెచ్చరించేవారు. ఒకసారి సిరియా మరియు ఈజిప్టు వెళ్ళినపుడు అక్కడ టాయిలెట్లు ఖిబ్లా దిశగా నిర్మించి ఉండటం చూచి చాలా ఆశ్చర్యానికి గురయ్యారు. ఇంకా ప్రవక్త (స) దీన్ని గురించి వారించారని అన్నారు. అబూ అయ్యూబ్ అ’న్సారీ సిగ్గు పరిస్థితి ఎలా ఉండేదంటే నుయ్యి వద్ద స్నానం చేస్తే నాలుగు వైపుల వస్త్రంతో తెరచాటు చేసుకునేవారు. (సియరు అ’న్సార్)
[16]) వివరణ-4198: అంటే ఆహార ధాన్యాలను కొనేటప్పుడు, అమ్మేటప్పుడు భోజనం చేసిన తర్వాత తినే చాపను ఎత్తిన తర్వాత ఈ దు’ఆ పఠించేవారు. ”అల్’హమ్దు లిల్లాహి ‘హమ్దన్ కసీ‘రన్ ‘తయ్యిబన్ ముబారకన్ ఫీహి, ‘గైర మక్ఫియ్యన్, వలా మువద్ద‘యిన్, వలా ముస్త‘గ్నన్ ‘అన్హు రబ్బనా” — ‘స్తోత్రాలన్నీ అల్లాహ్(త) కొరకే, ఆయన పరిశుద్ధుడు, పవిత్రుడు. శుభాలమయుడు. అయినా అది నీకు చాలదు ఓ ప్రభూ! దాన్ని వదలివేయలేదు, అశ్రద్ధకు గురిచేయబడలేదు.’ (బు’ఖారీ)
[17]) వివరణ-4201: ‘బిస్మిల్లాహ్’ అని పలికి తింటే శుభం ఉంటుంది.
[18]) వివరణ-4203: ‘బిస్మిల్లాహ్’ పఠించబడిన అన్నం షై’తాన్ కడుపులోకి వెళ్ళదు.
[19]) వివరణ-4205: అల్లాహ్ (త) ఖుర్‌ఆన్‌లో, ”ఒకవేళ కృతజ్ఞులై ఉంటే ఇంకా అధికంగా ఇస్తానని” సెలవిచ్చాడు. తినే వస్తువును ‘బిస్మిల్లాహ్’ అని పలికి తినటం కృతజ్ఞత అవుతుంది. తిన్న తరువాత ‘అల్‌హమ్‌దులిల్లాహ్’ అని పలకటం, ప్రతి ముద్దకు ‘అల్‌హమ్‌దులిల్లాహ్’ అని పలకటం ఉన్నతమైన కృతజ్ఞత అవుతుంది. అల్లాహ్(త)కు ఉపవాసం ఉండేవాడు, మనోవాంఛలకు దూరంగా ఉండేవాడు చాలా ఇష్టం. ఈ ప్రత్యేకతలన్నీ ‘అల్‌హమ్‌దులిల్లాహ్’ అని పలికితే లభిస్తాయి.
[20]) వివరణ-4210: అల్లాహ్ ఆదేశం: ”నమా’జు కోసం సిద్ధమయినపుడు వు’దూ చేసుకోండి.” టాయిలెట్ నుండి బయటకు వచ్చిన తర్వాత భోజనానికి వు’దూ తప్పనిసరి కాదు, ఒకవేళ ప్రవక్త (స) అప్పుడు వు’దూ చేస్తే అనుచరులు భోజనానికి వు’దూ తప్పనిసరి అని భావిస్తారు. అందువల్ల ప్రవక్త (స) వు’దూ చేయటం సరి కాదని భావించారు.
[21]) వివరణ-4211: తన ముందు నుండి తినటం భోజన నియమాల్లో ఒక నియమం. ప్లేటు మధ్యలో నుండి, ఇతరుల వైపు నుండి తీసుకొని తినటం అసభ్యంగా ఉంటుంది. అంతే కాక ప్లేటు మధ్య భాగంలో శుభం అవతరిస్తుంది. స’రీద్ అంటే రొట్టె ముక్కలతో చేసిన భోజన పదార్థం.
[22]) వివరణ-4217: కొందరికి ఇదంటే ఇష్టం ఉండదు. దాన్ని అసహ్యించుకుంటారు. కాని ప్రవక్త (స) కు ఇదంటే చాలా ఇష్టంగా ఉండేది.
[23]) వివరణ-4221: జైతూన్ అనేది ప్రముఖ చెట్టు ఫలం. ఇది అరబ్ దేశాలలో అధికంగా పండుతుంది. ఖుర్‌ఆన్‌లో కూడా దీన్ని గురించి ప్రస్తావించడం జరిగింది. దీని నూనె కూడా తింటారు.
[24]) వివరణ-4233: ఈ ‘హదీసు’ ద్వారా ఒకవేళ తినే పదార్థం ఒకేవిధంగా ఉంటే తన ముందు నుండి తినాలి, ఒకవేళ భోజనంలో అనేక రకాల వంటకాలు ఉంటే తన ఇష్టప్రకారం తినవచ్చును.
[25]) వివరణ-4241: అంటే చల్లని పదార్థంలో శుభకరంగా ఉంటుంది. వేడిగా ఉండే వంటకం అశుభంగా, కష్టంగా ఉంటుంది. జామె’అ ‘సగీర్‌లో ఉన్న ‘హదీసు’ ప్రకారం పదార్థాల్ని చల్లారిన తర్వాత తినండి, వేడిగా ఉన్న పదార్థాల్లో శుభం ఉండదు. ఇంకా బైహఖీ ఉల్లేఖనంలో పదార్థాలు వేడిగా ఉన్నప్పుడు తినరాదని వారించడం జరిగింది.
[26]) వివరణ-4244: ఆతిథ్యం ఇవ్వటం విశ్వాసంలోని ఒక భాగం. అతిథులు వస్తే మొదటి రోజు సాధ్యమైనంత వరకు మంచి భోజనం తినిపించాలి, ఆ తరువాత సామాన్యంగా వండే భోజనం. అయితే అతిథి మూడు రోజులు మాత్రమే ఉండాలి. మూడు రోజుల తరువాత కూడా తినిపిస్తే అది దానం అవుతుంది.
[27]) వివరణ-4245: అంటే ఒకవేళ మీరు ఆకలితో అలమటించి, ఏ వస్తువూ దొరక్కపోతే, మీరు బలవంతంగా ఆతిథ్య హక్కును వసూలు చేయగలరు. లేదా ఒకవేళ పన్ను మొదలైనవి వసూలు చేయడానికి అధికారికంగా అక్కడకు వెళితే, పన్ను, సదఖా ఇవ్వటంతో పాటు అధికారికి భోజనం పెట్టటం కూడా తప్పనిసరి. ఒకవేళ సంతోషంగా ఇవ్వకపోతే పన్ను మొదలైనవి వసూలు చేసుకోండి.
[28]) వివరణ-4246: ఖుర్‌ఆన్‌లో అల్లాహ్ (త) ఇలా ఆదే శించాడు: ”(ఇహలోక)పేరాస మిమ్మల్ని ఏమరు పాటులో పడవేసింది; మీరు గోరీలలోకి చేరేవరకు. అలాకాదు! త్వరలోనే మీరు తెలుసు కుంటారు. మరొక సారి (వినండి)! వాస్తవంగా, మీరు అతి త్వరలోనే తెలుసుకుంటారు. ఎంత మాత్రము కాదు! ఒకవేళ మీరు నిశ్చిత జ్ఞానంతో తెలుసుకొని ఉంటే (మీ వైఖరి ఇలా ఉండేది కాదు). నిశ్చయంగా, మీరు భగభగ మండే నరకాగ్నిని చూడగలరు! మళ్ళీ అంటున్నాను! మీరు తప్పక దానిని (నరకాగ్నిని) నిస్సంకోచమైన దృష్టితో చూడగలరు! అప్పుడు, ఆ రోజు మీరు, (ఈ జీవితంలో అనుభవించిన) సౌఖ్యాలను గురించి తప్పక ప్రశ్నించ బడతారు!.” (అత్తకాసుర్, 102:1-8)
తఫ్‌సీర్ ఇబ్నె కసీర్‌లో ఇలా ఉంది, ”ఈ సూరహ్ అవతరించబడింది. ప్రవక్త (స) పఠించి వినిపించారు. అప్పుడు అనుచరులు ఖర్జూరాలు తింటున్నాం. నీళ్ళు త్రాగుతున్నాం, కరవాలాలు మెడల్లో వ్రేలాడు తున్నాయి, శత్రువు పొంచిఉన్నాడు మరి ఏ అను గ్రహాల గురించి ప్రశ్నించడం జరగుతుంది అని విన్నవించు కున్నారు. దానికి ప్రవక్త (స) భయపడండి అతి త్వరలో అనుగ్రహాలు వస్తాయి.
ఉమర్ (ర) కథనం: ”ఒకసారి మేము కూర్చొని ఉన్నాం. ఇంతలో ప్రవక్త (స) వచ్చారు. స్నానం చేసి వచ్చినట్టు ఉన్నారు. మేము, ‘తమరు చాలా సంతోషంగా ఉన్నట్టుంది,’ అని అన్నాము. దానికి ప్రవక్త(స) ‘అవును’ అని అన్నారు. ఆ తరువాత ప్రజలు ధన సంపదల గురించి మాట్లాడసాగారు. అప్పుడు ప్రవక్త (స) దైవభీతి గలవాడికి ధన సంపదలు ఏవీ హానికరమైనవి కావు. దైవభీతిగల వారికి ఆరోగ్యం ధన సంపదల కన్నా గొప్పది. సంతోషకరమైన స్వభావం కూడా దేవుని గొప్ప అనుగ్రహం. (ముస్నద్ అ’హ్మద్)
అంటే దైవానుగ్రహాల గురించి ప్రశ్నించడం జరుగుతుంది. అదేవిధంగా శరీర అవయవాల గురించి, ఆహార పదార్థాల గురించి, ఇవేకాక దైవం ప్రసాదించిన అనుగ్రహాలన్నిటిని గురించి ప్రశ్నించడం జరుగుతుంది. ‘స’హీ’హ్ బు’ఖారీలో ఇలా ఉంది, ”రెండు దైవానుగ్రహాల గురించి ప్రజలు ఏమరుపాటుకు గురై ఉన్నారు. అవి ఆరోగ్యం, తీరిక, ప్రజలు వీటి ప్రాముఖ్యతను, ప్రాధాన్యతను గ్రహించటం లేదు. సరైనవిధంగా ఉపయో గించటం లేదు.
ముస్నద్ అ’హ్మద్‌లో ఇలా ఉంది, ”అల్లాహ్ (త) తీర్పు దినం నాడు ఇలా ఆదేశిస్తాడు, ‘ఓ ఆదమ్ కుమారా! నేను నీకు గుర్రాలను, ఒంటెలనూ ప్రసాదించాను, స్త్రీలను నీకు కట్టబెట్టాను, నీవు సంతోషంగా, సుఖంగా జీవించాలని. వాటికి తగిన కృతజ్ఞత ఎక్కడుంది.
ఈ ‘హదీసు’ ద్వారా తెలిసిన విషయం ఏమిటంటే, అతిథి వచ్చిన తర్వాత అన్నిటికంటే ముందు ఒకవేళ ఫలహారాలు ఉంటే వారి ముందు పెట్టాలి. ఆ తరువాత రొట్టె మాంసం ఏర్పాటు చేయాలి. ఇబ్రాహీమ్ (అ) చేసినట్టు.
[29]) వివరణ-4250: అంటే విశ్వాసి దైవసాన్నిహిత్యాన్ని పొందుతాడు. ఒక్కోసారి పాపాలవల్ల దైవానికి దూరం అవుతాడు. కాని విశ్వాసం నుండి వేరుకాడు.
[30]) వివరణ-4256: చాలామంది ఇటువంటి సమయంలో మొహమాటానికి మాకు ఆకలిగా లేదని అంటారు. అయితే వాళ్ళకు ఆకలిగా ఉంటుంది. పైకి అబద్ధం పలుకుతారు. ప్రవక్త (స) మాటలకు అర్థం ఏమిటంటే ఒకవేళ ఆకలిగా ఉంటే తినండి, అబద్ధం పలకకండి.
[31]) వివరణ-4259: అంటే కనీసం తన ఇంటి గడప వరకైనా దిగబెట్టి రావాలి. కొన్ని ఉల్లేఖనాల్లో కొంత దూరం వరకు వెళ్ళేవారని ఉంది. ఇది ఉత్తమ నైతికత. అయితే ఈ ఉల్లేఖనం ‘దయీఫ్.
[32]) చూడండి, 2:173.
[33]) వివరణ-4261: ముస్నద్ అహ్మద్‌లో ఇలా ఉంది : ”ప్రజలు ప్రవక్త (స)ను మేము ఎటువంటి ప్రాంతంలో ఉంటున్నామంటే, ఒక్కోసారి కరువుకాటకాలకు గురి అవుతాము. ఇటువంటి పరిస్థితుల్లో మృత పశువును తినవచ్చునా? అని విన్నవించుకున్నారు. దానికి ప్రవక్త (స) ఉదయం, సాయంత్రం దొరక్కపోతే, ఆకుకూరలు, కూరగాయలు లభించని పక్షంలో మీరు తినవచ్చును అని అన్నారు. ఇబ్నె ఔస్ కథనం: హసన్ వద్ద సమురహ్ (ర) పుస్తకం ఉండేది. దాన్ని నేను అతని ముందు చదివే వాడిని. అందులో ఉదయం సాయంత్రం దొరక్క పోవటం గత్యంతరం లేని పరిస్థితి అని ఉంది. ఒక వ్యక్తి ప్రవక్త (స)ను నిషిద్ధమైనది ఎప్పుడు తినవచ్చును అని విన్నవించుకున్నాడు. దానికి ప్రవక్త (స) నువ్వు నీ బిడ్డలకు పాల ద్వారా కడుపులు నింపనపుడు అని సమాధానం ఇచ్చారు.
[34]) వివరణ-4285: అంటే వెండి బంగారు కంచాలు ఉపయోగించరాదు. ఎందుకంటే వీటిని ఉపయోగించటం వల్ల గర్వాహంకారాలకు గురౌతారు. అంటే గర్వం, అహంకారం స్పష్టంగా కనబడుతుంది.
***