20. వేట | మిష్కాతుల్ మసాబీహ్

20- كِتَابُ الصَّيْدِ وَالذَّبَائِحِ
20. వేట మరియు జి’బ్’హ పుస్తకం

మక్కహ్లో మరియు ఇ’హ్‌రామ్‌ స్థితిలో వేటాడటం ధర్మం కాదు. ఇవి తప్ప ఇతర ప్రాంతాలలో వేటాడ వచ్చును. అల్లాహ్‌ ఆదేశం: ”ఓ విశ్వాసులారా! మీరు ఇ’హ్రామ్‌ స్థితిలో ఉన్నప్పుడు వేటాడకండి. మీలో ఎవరైనా బుధ్ధి పూర్వకంగా వేటచేస్తే, అతడు చంపిన జంతువుతో సరితూగే ఒక పశువును పరిహారంగా సమర్పించుకోవాలి. దానిని (ఆ పశువును) మీలో న్యాయవర్తులైన ఇద్దరు వ్యక్తులు నిర్ణయించాలి. పశువును ఖుర్బానీ కొరకు క’అబహ్ వద్దకు చేర్చాలి. లేదా దానికి పరిహారంగా కొందరు పేదలకు భోజనం పెట్టాలి, లేదా దానికి పరిహారంగా – తాను చేసిన దాని ప్రతిఫలాన్ని చవిచూడ టానికి – ఉపవాస ముండాలి. గడిచిపోయిన దానిని అల్లాహ్‌ మన్నించాడు. కాని ఇక ముందు ఎవరైనా మళ్ళీ అలా చేస్తే అల్లాహ్‌ అతనికి ప్రతీకారం చేస్తాడు. మరియు అల్లాహ్‌ సర్వశక్తి సంపన్నుడు, ప్రతీకారం చేయగల వాడు.” (అల్ మాయి’దహ్‌, 5: 95)

ఈ ఆయతు ద్వారా వేటాడే అనుమతి వ్యక్తం అవుతుంది. అయితే ఇ’హ్‌రామ్‌ స్థితిలో నిషేధించడం జరిగింది. ఒకవేళ ఎవరైనా పాల్పడితే తగిన పరిహారం చెల్లించాలి. అల్లాహ్‌ ఆదేశం: ”ఓ విశ్వాసులారా! ఒప్పందాలను పాటించండి. మీ కొరకు పచ్చికమేసే చతుష్పాద పశువులన్నీ (తినటానికి) ధర్మసమ్మతం (‘హలాల్‌) చేయబడ్డాయి; మీకు తెలుపబడిన పశువులు తప్ప! మీరు ఇ’హ్రామ్‌ స్థితిలో ఉన్నప్పుడు వేటాడటం మీకు ధర్మసమ్మతం కాదు. నిశ్చయంగా, అల్లాహ్‌ తాను కోరింది శాసిస్తాడు. విశ్వాసులారా! అల్లాహ్‌ (నియమించిన) చిహ్నాలను మరియు నిషిధ్ధ మాసాలను  ఉల్లంఘించకండి. మరియు బలి పశువులకు మరియు మెడలలో పట్టీలు ఉన్న పశువులకు (హాని చేయకండి). మరియు తమ ప్రభువు అనుగ్రహాన్ని మరియు ప్రీతిని కోరుతూ పవిత్ర గృహానికి (క’అబహ్ కు) పోయేవారిని (ఆటంకపరచకండి). కానీ ఇ’హ్రామ్‌ స్థితి ముగిసిన తరువాత మీరు వేటాడవచ్చు. మిమ్మల్ని పవిత్ర మస్జిద్‌ (మస్జిద్అల్హరామ్) ను సందర్శించకుండా నిరోధించిన వారిపట్ల గల విరోధం వలన వారితో హద్దులు మీరి ప్రవర్తించకండి. మరియు పుణ్య కార్యాలు మరియు దైవభీతి విషయాలలో, ఒకరి కొకరు తోడ్పడండి. మరియు పాపకార్యాలలో గానీ, దౌర్జన్యాలలో గానీ తోడ్పడకండి. అల్లాహ్‌ యందు భయ-భక్తులు కలిగి ఉండండి. నిశ్చయంగా, అల్లాహ్‌ శిక్ష విధించటంలో చాల కఠినుడు.” (అల్‌ మాయి’దహ్‌, 5:1-2)

మరోచోట అల్లాహ్‌ (త) ఇలా ఆదేశించాడు: ”(సహజంగా) మరణించింది, రక్తం, పంది మాంసం మరియు అల్లాహ్‌ తప్ప ఇతరుల కొరకు (ఇతరుల పేరుతో) వధింపబడినది (జిబ్‌’హ్ చేయబడినది), గొంతు పిసికి ఊపిరాడక, దెబ్బతగిలి, ఎత్తునుండి పడి, కొమ్ముతగిలి మరియు క్రూరమృగం నోటపడి చచ్చిన (పశువు / పక్షి) అన్నీ, మీకు తినటానికి నిషిధ్ధం (‘హరామ్‌) చేయబడ్డాయి. కాని (క్రూరమృగం నోట పడినదానిని) చావకముందే మీరు జిబ్‌’హ్ చేసినట్లైతే అది నిషిధ్ధం కాదు. మరియు బలిపీఠం మీద వధించబడినది,మరియు బాణాల ద్వారా శకునం చూడటం నిషేధింపబడ్డాయి. ఇవన్నీ ఘోర పాపాలు (ఫిస్ఖున్). ఈనాడు సత్యతిరస్కారులు, మీ ధర్మం గురించి పూర్తిగా ఆశలు వదలుకున్నారు. కనుక మీరు వారికి భయపడకండి, నాకే భయపడండి. ‘ నాడు నేను మీ ధర్మాన్ని మీ కొరకు పరిపూర్ణం చేసి, మీపై నా అనుగ్రహాన్ని పూర్తిచేశాను మరియు మీ కొరకు అల్లాహ్కు విధేయులుగా ఉండటాన్నే (ఇస్లాంనే) ధర్మంగా సమ్మతించాను.’  ఎవడైనా ఆకలికి ఓర్చు కోలేక, పాపానికి పూనుకోక, (నిషిధ్ధమైన వస్తువులను తిన్నట్లైతే)! నిశ్చయంగా, అల్లాహ్‌ క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత. వారు (ప్రజలు) తమ కొరకు ఏది ధర్మసమ్మతం (‘హలాల్‌) అని నిన్ను అడుగు తున్నారు. నీవు ఇలా అను: ”పరిశుధ్ధ వస్తువులన్నీ మీ కొరకు ధర్మసమ్మతం (‘హలాల్‌) చేయబడ్డాయి. మరియు మీకు అల్లాహ్‌ నేర్పినవిధంగా మీరు వేట శిక్షణ ఇచ్చిన జంతువులు మీ కొరకు పట్టినవి కూడా! కావున అవి మీకొరకు పట్టుకున్న వాటిని మీరు తినండి కాని దానిపై అల్లాహ్‌ పేరును ఉచ్చరించండి. అల్లాహ్‌ యందు భయభక్తులు కలిగి ఉండండి. నిశ్చయంగా, అల్లాహ్‌ లెక్క తీసుకోవటంలో అతి శీఘ్రుడు. (అల్‌ మాయి’దహ్,5:34)

—–

اَلْفَصْلُ الْأَوَّلُ    మొదటి విభాగం

4064 – [ 1 ] ( متفق عليه ) (2/1191)

عَنْ عَدِيِّ بْنِ حَاتِمٍ قَالَ: قَالَ لِيْ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِذَا أَرْسَلْتَ كَلْبَكَ فَاذْكُرِ اسْمَ اللهِ فَإِنْ أَمْسَكَ عَلَيْكَ فَأَدْرَكْتَهُ حَيًّا فَاذْبَحْهُ وَإِنْ أَدْرَكْتَهُ قَدْ قَتَلَ وَلَمْ يَأْكُلْ مِنْهُ فَكُلْهُ وَإِنْ أَكَلَ فَلَا تَأْكُلْ فَإِنَّمَا أَمْسَكَ عَلَى نَفْسِهِ فَإِنْ وَجَدْتَّ مَعَ كَلْبِكَ كَلْبًا غَيْرَهُ وَقَدْ قُتِلَ فَلَا تَأْكُلْ فَإِنَّكَ لَا تَدْرِيْ أَيَّهُمَا قَتَلَ. وَإِذَا رَمَيْتَ بِسَهْمِكَ فَاذْكُرِ اسْمَ اللهِ فَإِنْ غَابَ عَنْكَ يَوْمًا فَلَمْ تَجِدْ فِيْهِ إِلّا أَثَرَ سَهْمِكَ فَكُلْ إِنْ شِئْتَ وَإِنْ وَجَدْتَّهُ غَرِيْقًا فِي الْمَاءِ فَلَا تَأْكُلْ”.

4064. (1) [2/1191ఏకీభవితం]

‘అదీ బిన్‌ ‘హాతిమ్‌ (ర) కథనం: నేను ప్రవక్త (స) వద్దకు వెళ్ళాను. వేట గురించి అడిగాను. దానికి ప్రవక్త (స) సమా ధానం ఇస్తూ నీవు కుక్కను, ‘బిస్మిల్లాహ్‌ అల్లాహు అక్బర్,’ అని పలికి వేటకు వదిలితే, ఆ కుక్క వెళ్ళి వేటాడి తెచ్చింది, ఒకవేళ ఆ జంతువు బ్రతికి ఉంటే దాన్ని జబహ్‌ చేసివేయి, ఒకవేళ అది చనిపోయి కుక్క ఏమీ తినకుండా ఉంటే నీవు దాన్ని తిన వచ్చు. ఒకవేళ కుక్క కొంత తిని ఉంటే దాన్ని తినకు. ఎందుకంటే అది తన కోసం వేటాడింది నీ కోసం కాదు. అదేవిధంగా వేటలో మరొకరి కుక్క కూడా పాల్గొంది. దానిపై ‘బిస్మిల్లాహ్‌’ అని పఠించబడలేదు. ఒకవేళ అవి, దాన్ని పట్టి చంపి ఉంటే దాన్ని తినకు. ఎందుకంటే ఏ కుక్క చంపిందో నీకు తెలియదు. అనుమానం వల్ల దాన్ని వదలివేయి. అదే విధంగా నీవు, ‘బిస్మిల్లాహ్‌ అల్లాహ్‌ అక్బర్‌,’ అని బాణం వదిలితే, ఆ పక్షి లేదా ఆ జంతువు ఒకటి రెండు రోజులు కనబడకుండా ఉండి తరువాత కనబడితే, మీ బాణాల చిహ్నాలు ఉంటే తినవచ్చును. అయితే ఇతరుల బాణాల చిహ్నాలు కూడా ఉంటే దాన్ని తినరాదు. అదేవిధంగా వేటాడిన జంతువు నీటిలో మునిగి చనిపోతే తినరాదు. ఎందుకంటే అది మునిగి చచ్చింది,’ అని ప్రవచించారు. (బు’ఖారీ, ముస్లిమ్‌)

4065 – [ 2 ] ( متفق عليه ) (2/1191)

وَعَنْهُ قَالَ: قُلْتُ: يَا رَسُوْلَ اللهِ إِنَّا نُرْسِلُ الْكِلَابَ الْمُعَلَّمَةَ قَالَ: “كُلْ مَا أَمْسَكْنَ عَلَيْكَ” .قُلْتُ: وَإِنْ قَتَلْنَ؟ قَالَ: “وَإِنْ قَتَلْنَ” قُلْتُ: إِنَّا نَرْمِيْ بِالْمِعْرَاضِ. قَالَ: “كُلْ مَا خَزَقَ وَمَا أَصَابَ بِعَرْضِهِ فَقَتَلَهُ فَإِنَّهُ وَقِيْذٌ فَلَا تَأْكُلْ”.

4065. (2) [2/1191ఏకీభవితం]

‘అదీ బిన్‌ ‘హాతిమ్‌ (ర) కథనం: మేము ప్రవక్త (స)ను, ‘మేము శిక్షణ ఇచ్చి కుక్కలను వదులుతామని, అది వేటాడిన జంతువును మేము తినవచ్చా, తినకూడదా అని విన్నవించుకున్నాం.’ ప్రవక్త (స) సమాధానంగా, ‘మీ కోసం జంతువును పట్టుకొని, తినకుండా ఉంటే మీరు తినవచ్చు,’ అని అన్నారు. దానికి నేను, ‘ఒకవేళ చంపివేసి ఉన్నప్పటికీ,’ అని అంటే, ‘చంపివేసి ఉన్నప్పటికీ,’ అని అన్నారు. నేను మళ్ళీ, ‘మేము సూదిగా లేనటువంటి బాణాలతో వేటాడుతాం,’ అని అన్నాను. దానికి ప్రవక్త(స), ‘ఆ బాణం గుచ్చుకొని చని పోయినా ఫరవాలేదు. తినవచ్చును. కాని బాణం గుచ్చుకోకుండా దెబ్బతగిలి మరణిస్తే తినకండి,’ అని అన్నారు.[1]  (బు’ఖారీ, ముస్లిమ్‌)

4066 – [ 3 ] ( متفق عَلَيهِ ) (2/1191)

وَعَنْ أَبِيْ ثَعْلَبَةَ الْخُشَنِيِّ قَالَ: قُلْتُ: يَا نَبِيَّ اللهِ إِنَّا بِأَرْضِ قَوْمٍ أَهْلِ كِتَابِ أَفَنَأْكُلُ فِيْ آنِيَتِهِمْ وَبِأَرْضِ صَيْدٍ أصِيْدُ بِقَوْسِيْ وَبِكَلْبِي الَّذِيْ لَيْسَ بِمُعَلَّمٍ وَبِكَلْبِي الْمُعَلَّمِ فَمَا يَصْلُحُ؟ قَالَ: “أَمَا ذَكَرْتَ مِنْ آنِيَةِ أَهْلِ الْكِتَابِ فَإِنْ وَجَدْتُّمْ غَيْرَهَا فَلَا تَأْكُلُوْا فِيْهَا وَإِنْ لَمْ تَجِدُوْا فَاغْسِلُوْهَا وَكُلُوْا فِيْهَا وَمَا صِدْتَّ بِقَوْسِكَ فَذَكَرْتَ اِسْمَ اللهِ فَكُلْ وَمَا صِدْتَّ بِكَلْبِكَ الْمُعَلَّمِ فَذَكَرْتَ اِسْمَ اللهِ فَكُلْ وَمَا صِدْتُّ بِكَلْبِكَ غَيْرَ مُعَلَّمٍ فَأَدْرَكْتَ ذَكَاتَهُ فَكُلْ”.

4066. (3) [2/1191ఏకీభవితం]

అబూ స”అలబహ్ ‘ఖుషనీ (ర) కథనం: నేను ప్రవక్త (స)ను ఇలా విన్నవించుకున్నాను, ”ఓ ప్రవక్తా! మేము గ్రంథ ప్రజల వద్దకు వస్తూ పోతూ ఉంటాము. మేము వారి ప్లేటుల్లో తినవచ్చునా? ఇంకా మేము మా బాణాల ద్వారా వేటాడుతాం. బాణం ద్వారా వేటాడే జంతువు మా కోసం ధర్మమా అధర్మమా? ఇంకా నేను ఈ కుక్క ద్వారా కూడా వేటాడుతాను. శిక్షణ ఇవ్వబడి ఉండదు, అదేవిధంగా శిక్షణ ఇవ్వబడిన కుక్క ద్వారా కూడా వేటాడుతాను. వీటిలో నా కోసం ఏది ధర్మం, ఏది అధర్మం,’ అని ప్రశ్నించారు. దానికి ప్రవక్త(స), ‘నువ్వు గ్రంథప్రజల పేట్ల గురించి అడిగావు, ఒకవేళ అక్కడ వారితో పాటు ఇతరుల ప్లేట్లు కూడా ఉంటే తినవద్దు. ఒకవేళ ఇతరుల ప్లేట్లు లేకపోతే వాటిని ఇటువంటి పరిస్థితుల్లో గ్రంథప్రజల ప్లేట్లను శుభ్రపరచి వాటిలో తిన వచ్చును. అదేవిధంగా బాణం వేటగురించి నువ్వు ప్రశ్నించావు. ఒకవేళ బాణం వదలినపుడు ‘బిస్మిల్లాహ్‌ అల్లాహు అక్బర్‌,’ అని పలికి ఉంటే దాన్ని తినవచ్చు. అదే విధంగా నువ్వు శిక్షణ ఇచ్చిన కుక్క గురించి ప్రశ్నించావు. ఒకవేళ ఆ కుక్కను వదలినపుడు నువ్వు ‘బిస్మిల్లాహ్‌ అల్లాహు అక్బర్‌,’ అని పలికి ఉంటే, దాన్ని కూడా తినగలవు. అదేవిధంగా ఒకవేళ శిక్షణ ఇవ్వనికుక్క వేటాడి, అది బ్రతికిఉంటే దాన్ని జబహ్‌ చేసి తినగలవు. ఒకవేళ అది సజీవంగా ఉండక జబహ్‌ చేసే అవకాశం దొరక్కపోతే అంటే అది చనిపోయి ఉంటే దాన్ని నువ్వు తినకూడదు,’ అని అన్నారు. (బు’ఖారీ, ముస్లిమ్‌)

4067 – [ 4 ] ( صحيح ) (2/1192)

وَعَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِذَا رَمَيْتَ بِسَهْمِكَ فَغَابَ عَنْكَ فَأَدْرَكْتَهُ فَكُلْ مَا لَمْ يُنْتِنْ”. رَوَاهُ مُسْلِمٌ.

4067. (4) [2/1192 దృఢం]

స”అలబహ్ ‘ఖుషనీ కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”నువ్వు నీ బాణాన్ని వేట జంతువుపై విసిరి, అది కనబడ కుండాపోయి, ఆ తర్వాత ఆ వేట జంతువు కనబడితే, దాన్ని తినగలవు. అయితే అందులో ఎలాంటి దుర్వాసన గానీ, ఎటువంటి మార్పుగానీ ఉండకూడదు.” (ముస్లిమ్‌)

4068 – [ 5 ] ( صحيح ) (2/1192)

وَعَنْهُ عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ فِي الَّذِيْ يُدْرِكُ صَيْدَهُ بَعْدَ ثَلَاثٍ: “فَكُلهُ مَا لَمْ يُنْتِنْ”. رَوَاهُ مُسْلِمٌ .

4068. (5) [2/1192 దృఢం]

అబూ స”అలబహ్ ‘ఖుష్‌నీ కథనం: ప్రవక్త (స) మూడు రోజుల తర్వాత దొరికిన వేటాడిన జంతువు గురించి ప్రస్తా విస్తూ ఒకవేళ అది క్రుళ్ళకుండా ఉంటే దాన్ని తినవచ్చును అని  సెలవిచ్చారు. (ముస్లిమ్‌)

4069 – [ 6 ] ( صحيح ) (2/1192)

وَعَنْ عَائِشَةَ قَالَتْ: قَالُوْا: يَا رَسُوْلَ اللهِ إِنَّ هُنَا أَقْوَامًا حَدِيْثُ عَهْدُهُمْ بِشِرْكٍ يَأْتُوْنَنَا بِلُحْمَانٍ لَا نَدْرِيْ أَيَذْكُرُوْنَ اسْمَ اللهِ عَلَيْهَا أَمْ لَا؟ قَالَ: “اذْكُرُوْا أَنْتُمْ اِسْمَ اللهِ وَكُلُوْا”. رَوَاهُ الْبُخَارِيُّ.

4069. (6) [2/1192 దృఢం]

‘ఆయి’షహ్‌ (ర) కథనం: ప్రవక్త (స)ను ప్రజలు ఇలా విన్నవించుకున్నారు, ”ఓ ప్రవక్తా! ఇక్కడ  చాలా మంది నూతన ముస్లిములున్నారు. వీళ్ళు ఇప్పు డిప్పుడే ఇస్లామ్‌ స్వీకరించారు. వీళ్ళు అమ్మటానికి మా దగ్గరకు మాంసం తెస్తారు. అయితే ఆ మాంసం ఏ జంతువుదో, దాన్ని ‘జిబహ్‌ చేసినపుడు ‘బిస్మిల్లాహ్‌ అల్లాహు అక్బర్‌,’ అని పలికారో లేదో కూడా మాకు తెలియదు. ఏమి చేయాలి?” అప్పుడు ప్రవక్త (స) ”మీరు ‘బిస్మిల్లాహ్‌’ పఠించి తినండి” అని ఉపదేశించారు. (బు’ఖారీ)

4070 – [ 7 ] ( صحيح ) (2/1192)

وَعَنْ أَبِي الطُّفَيْلِ قَالَ: سُئِلَ عَلِيٌّ: هَلْ خَصَّكُمْ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم بِشَيْءٍ؟ فَقَالَ: مَا خَصَّنَا بِشَيْءٍ لَمْ يَعُمَّ بِهِ النَّاسَ إِلَّا مَا فِيْ قِرَابِ سَيْفِيْ هَذَا فَأَخْرَجَ صَحِيْفَةً فِيْهَا: “لَعَنَ اللهُ مَنْ ذَبَحَ لِغَيْرِ اللهِ وَ لَعَنَ اللهُ مَنْ سَرَقَ مَنَارَ الْأَرْضِ.

وَفِيْ رِوَايَةٍ مَنْ غَيَّرَمَنَارَالْأَرْضِ وَ لَعَنَ اللهُ مَنْ لَعَنَ وَالِدَهُ وَلَعَنَ اللهُ مَنْ آوَى مُحْدِثًا”. رَوَاهُ مُسْلِمٌ .

4070. (7) [2/1192దృఢం]

అబూ ‘తుఫైల్‌ (ర) కథనం: ‘అలీ (ర)ను, ‘మీకు మాత్రమే ప్రత్యేకించబడిన ఏదైనా విషయం గురించి ప్రవక్త (స) ప్రస్తావించడం జరిగిందా,’ అని ప్రజలు ప్రశ్నించడం జరిగింది. ‘అలీ (ర) సమాధానంగా, ”ప్రత్యేకంగా మాకు సంబంధించిన విషయం అంటూ ఏదీ లేదు. అయితే కొన్ని విషయాలు, ఈ నా ఒరలో ఉన్నాయి అని అంటూ తన ఒరలో నుండి ఒక పత్రం తీసి ఇలా చదివి వినిపించారు, ‘అల్లాహ్‌(త)ను వదలి ఇతరుల పేర జంతువును జిబహ్ చేసిన వారిపై దైవశాపం అవతరించుగాక! భూమి గుర్తుల్లో మార్పులు, చేర్పులు చేసిన వానిపై అల్లాహ్‌(త) శాపం అవతరించుగాక! ఇంకా తన తల్లి దండ్రులను శపించిన వారిని అల్లాహ్‌(త) శపించుగాక! ఇంకా బిద్అతీకి ఆశ్రయం కల్పించిన వారిని కూడా అల్లాహ్‌(త) శపించుగాక!”  [2] (ముస్లిమ్‌)

4071 – [ 8 ] ( متفق عليه ) (2/1192)

وَعَنْ رَافِعِ بْنِ خَدِيْجٍ قَالَ: قُلْتُ: يَا رَسُوْلَ اللهِ إِنَّا لَاقُوا الْعَدُوِّ غَدًا وَ لَيْسَتْ مَعَنَا مُدَى أَفَنَذْبَحُ بِالْقَصَبِ؟قَالَ: “مَا أَنْهَرَالدَّمَ وَذُكِرَ اسْمُ اللهِ فَكُلْ لَيْسَ السِّنَّ وَالظُّفُرَوَسَأُحَدِّثُكَ عَنْهُ: أَمَا السِّنُّ فَعَظْمٌ وَأَمَّا الظُّفْرُ فَمُدَى الْحَبَشِ”. وَأَصَبْنَا نَهَبَ إِبْلٍ وَغَنَمٍ فَنَدَّ مِنْهَا بَعِيْرٌ فَرَمَاهُ رَجُلٌ بِسَهْمٍ فَحَبَسَهُ فَقَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِنَّ لِهَذِهِ الْإِبِلِ أَوَابِدَ كَأَوَابِدِ الْوَحْشِ فَإِذَا غَلَبَكُمْ مِنْهَا شَيْءٌ فَافْعَلُوْا بِهِ هَكَذَا . متفق عليه.

4071. (8) [2/1192ఏకీభవితం]

రాఫె’అ బిన్‌ ‘ఖదీజ్‌ (ర) కథనం: నేనిలా విన్న వించు కున్నాను. ”ఓ ప్రవక్తా! రేపు మేము అవిశ్వాస శత్రువులను కలవబోతున్నాము. మా వద్ద క్రొవ్వు నూనె లేదు, అక్కడ జంతువులను ‘జిబహ్‌ చేసే అవసరం ఏర్పడవచ్చు. మేము వెదుర్ల ద్వారా ‘జబహ్‌ చేయ వచ్చునా?” దానికి ప్రవక్త (స), ‘రక్తాన్ని ప్రవహింపజేసే దాన్ని ఉపయోగించి అల్లాహ్‌ (త)ను స్మరించి ‘జిబహ్‌ చేస్తే, దాన్ని మీరు తినవచ్చు. ఎందుకంటే పళ్ళు, గోళ్లు ‘హబ్‌షీల చాకు వంటివి. ఈ రెండు ‘జిబహ్‌ చేయడానికి తగవు’ అని అన్నారు. ఆ తరువాత మాకు యుద్ధధనంలో ఒంటెలు, మేకలు లభించాయి. ఒంటెల్లో ఒక ఒంటె పారిపోయింది. ఒక వ్యక్తి దాన్ని బాణంతో కొట్టి స్వాధీన పరచుకున్నాడు. అప్పుడు ప్రవక్త (స), ‘ఈ ఒంటెలు అడవి జంతువుల్లా పారిపోయినపుడు, వాటిని అధీనంలోనికి తీసుకురావటం కష్టం అయినపుడు ‘బిస్మిల్లాహ్‌ అల్లాహు అక్బర్‌’ అని పలికి బాణం వేసేయండి, అవి మనకోసం ధర్మసమ్మతం అయి పోతాయి’ అని అన్నారు.  (బు’ఖారీ, ముస్లిమ్‌)

4072 – [ 9 ] ( صحيح ) (2/1193)

وَعَنْ كَعْبِ بْنِ مَالِكٍ أَنَّهُ كَانَ لَهُ غَنَمٌ تَرْعَى بِسَلْعٍ فَأَبْصَرَتْ جَارِيَةٌ لَنَا بِشَاةٍ مِنْ غَنَمِنَا مَوْتًا فَكَسَرَتْ حَجْرًا فَذَبَحَتْهَا بِهِ فَسَأَلَ النَّبِيَّ صلى الله عليه وسلم فَأَمَرَهُ بِأَكْلِهَا. رَوَاهُ الْبُخَارِيُّ .

4072. (9) [2/1193దృఢం]

క’అబ్‌ బిన్‌ మాలిక్‌ (ర) కథనం: అతని మేకలు సలకొండ ప్రాంతంలో మేస్తున్నాయి. ఆ మేకల్లో ఒక మేక ప్రాణాలు కోల్పోతుండటం అతని బానిసరాలు చూచి చురకత్తిలా ఉన్న రాయితో జబహ్‌ చేసివేసింది. అతను ప్రవక్త (స)ను ఈ విషయం గురించి అడిగారు. ప్రవక్త (స) దాన్ని తినవచ్చని అనుమతించారు. (బు’ఖారీ)

4073 – [ 10 ] ( صحيح ) (2/1193)

وَعَنْ شَدَّادِ بْنِ أَوْسٍ عَنْ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم قَالَ: “إِنَّ اللهَ تَبَارَكَ وَتَعَالى كَتَبَ الْإِحْسَانَ عَلَى كُلِّ شَيْءٍ فَإِذَا قَتَلْتُمْ فَأَحْسِنُوا الْقِتْلَةَ وَإِذَا ذَبَحْتُمْ فَأَحْسِنُوا الذِّبْحَ وَلْيُحِدَّ أَحَدُكُمْ شُفْرَتَهُ وَلْيُرحْ ذَبِيْحَتَهُ”. رَوَاهُ مُسْلِمٌ .

4073. (10) [2/1193దృఢం]

షద్దాద్‌ బిన్‌ ఔస్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, అల్లాహ్‌ (త) ప్రతి విషయంలో ఉపకారం తప్పనిసరి చేసాడు. చివరికి మీరు ఎవరినైనా చంపినా మంచి తనంతో చంపండి. అదేవిధంగా మీరు ఒక జంతువును ‘జబహ్‌ చేసినా కత్తిని పదునుగా చేసుకొని జంతువును త్వరగా శాంతి చేకూర్చండి. అంటే త్వరగా ‘జిబహ్‌ చేయండి. (ముస్లిమ్‌)

4074 – [ 11 ] ( متفق عليه ) (2/1193)

وَعَنِ ابْنِ عُمَرَ قَالَ: سَمِعْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يَنْهَى أَنْ تُصْبَرَ بَهِيْمَةٌ أَوْ غَيْرَهَا لِلْقَتْلِ.

4074. (11) [2/1193ఏకీభవితం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘ఉమర్‌ (ర) కథనం: నేను ప్రవక్త (స)ను ఏ జంతువునైనా, దాని కాళ్ళు కట్టివేసి రాళ్ళతో కొట్టటం హింసించడం గురించి వారిస్తూ ఉండగా నేను విన్నాను.[3]   (బు’ఖారీ, ముస్లిమ్‌)

4075 – [ 12 ] ( متفق عليه ) (2/1193)

وَعَنْهُ أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم لَعَنَ مَنِ اتَّخَذَ شَيْئًا فِيْهِ الرُّوْحُ غَرَضًا .

4075. (12) [2/1193ఏకీభవితం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘ఉమర్‌ (ర) కథనం: ఏ ప్రాణినైనా గురి పెట్టి కొట్టే వారిని ప్రవక్త(స) శపించారు. (ముస్లిమ్‌, బు’ఖారీ)

4076 – [ 13 ] ( صحيح ) (2/1193)

وَعَنِ ابْنِ عَبَّاسٍ أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم قَالَ: ” لَا تَتَّخِذُوْا شَيْئًا فِيْهِ الرُّوْحُ غَرَضًا ” . رَوَاهُ مُسْلِمٌ .

4076. (13) [2/1193దృఢం]

అబ్బాస్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మీరు ఏ ప్రాణికి గురిపెట్టకండి.”  [4]  (ముస్లిమ్‌)

4077 – [ 14 ] ( صحيح ) (2/1193)

وَعَنْ جَابِرٍ قَالَ: نَهَى رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم عَنِ الضَّرْبِ فِي الْوَجْهِ وَعَنِ الْوَسَمِ فِي الْوَجْهِ. رَوَاهُ مُسْلِمٌ .

4077. (14) [2/1193దృఢం]

జాబిర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ముఖంపై కొట్టటాన్ని, ముఖంపై వాతలు వేయటాన్ని వారించారు.[5](ముస్లిమ్‌)

4078 – [ 15 ] ( صحيح ) (2/1193)

وَعَنْهُ أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم مَرَّ عَلَيْهِ حِمَارٌ وَقَدْ وُسِمَ فِيْ وَجْهِهِ قَالَ: “لَعَنَ اللهُ الَّذِيْ وَسَمَهُ”. رَوَاهُ مُسْلِمٌ .

4078. (15) [2/1193దృఢం]

జాబిర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ముందు నుండి ఒక గాడిద వెళ్ళింది. దాని ముఖంపై వాతలు పెట్టబడి ఉన్నాయి. అప్పుడు ప్రవక్త (స) వాతలుపెట్టిన వాడ్ని అల్లాహ్‌(త)శపించుగాక! అని శపించారు. [6]  (ముస్లిమ్‌)

4079 – [ 16 ] ( متفق عليه ) (2/1193)

وَعَنْ أَنَسٍ قَالَ: غَدَوْتُ إِلى رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم بِعَبْدِ اللهِ بْنِ أَبِيْ طَلْحَةَ لِيُحَنِّكَهُ فَوَافَيْتُهُ فِي يَدِهِ الْمِيْسَمُ يَسِمُ إِبِلَ الصَّدَقَةِ . متفق عليه.

4079. (16) [2/1193ఏకీభవితం]

అనస్‌ (ర) కథనం: నా సోదరుడు ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ అబీ ‘తల్‌’హా జన్మించిన రోజు ఉదయాన్నే అతన్ని తీసుకొని శుభ వార్త ఇవ్వడానికి ప్రవక్త(స) వద్దకు వెళ్ళాను. అక్కడ ప్రవక్త (స) చేతిలో వాతలు పెట్టే పరికరం ఉంది. దాని ద్వారా సదఖా ఒంటెలకు వాతలు పెడుతున్నారు.[7](బు’ఖారీ, ముస్లిమ్‌)

4080 – [ 17 ] ( متفق عليه ) (2/1194)

وَعَنْ هِشَامِ بْنِ زَيْدٍ عَنْ أَنَسٍ قَالَ: دَخَلْتُ عَلى النَّبِيِّ صلى الله عليه وسلم وَهُوَ فِيْ مِرْبَدٍ فَرَأَيْتُهُ يَسِمُ شَاءَ حَسِبْتُهُ قَالَ:فِيْ آذَانِهَا

4080. (17) [2/1194ఏకీభవితం]

హిషామ్‌ బిన్‌ ‘జైద్‌ అనస్‌(ర) ద్వారా కథనం: అనస్‌ (ర) ఇలా అన్నారు, ”నేను ప్రవక్త (స) వద్దకు వెళ్ళాను. అప్పుడు ప్రవక్త (స) పశువులశాలలో ఉన్నారు. ప్రవక్త (స) పశువులకు వాతలు వేస్తూ ఉండటం నేను చూచాను.”  (బు’ఖారీ, ముస్లిమ్‌)

—–

اَلْفَصْلُ الثَّانِيْ రెండవ విభాగం   

4081 – [ 18 ] ( لم تتم دراسته ) (2/1194)

عَنْ عَدِيِّ بْنِ حَاتِمٍ قَالَ: قُلْتُ يَا رَسُوْلَ اللهِ أَرَأَيْتَ أَحَدُنَا أَصَابَ صَيْدًا وَلَيْسَ مَعَهُ سِكِّيْنٌ أَيَذْبَحُ بِالْمَرْوَةِ وَشِقَّةِ الْعَصَا؟ فَقَالَ: “أَمْرِرِ الدَّمَ بِمَ شِئْتَ وَاذْكُرِ اسْمَ اللهِ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ وَالنَّسَائِيُّ.

4081. (18) [2/1194అపరిశోధితం]

‘అదీ బిన్‌ ‘హాతిమ్‌(ర) కథనం: నేను ”ఓ ప్రవక్తా! మేము వేటాడుతాం. ఒక్కోసారి ‘జిబహ్‌ చేయడానికి కత్తి మా దగ్గర ఉండదు. పదునైన రాయితో లేదా కర్ర ముక్కతో లేదా వెదురు కత్తెరతో జ’బహ్‌ చేసుకుంటే అది ధర్మసమ్మతమా కాదా ఆదేశించండి” అని విన్న వించు కున్నాను. దానికి ప్రవక్త (స), ‘దేనిద్వారానైనా, ‘బిస్మిల్లాహ్‌ అల్లాహు అక్బర్‌’ అని పలికి రక్తం చిందింపజేయండి. అది కత్తి అయినా, పదునైన రాయి అయినా, వెదురు కత్తెర అయినా సరే,’ అని ఉపదేశించారు.  (అబూ  దావూద్‌, నసాయి’)

4082 – [ 19 ] ( لم تتم دراسته ) (2/1194)

وَعَنْ أَبِي الْعُشَرَاءِ عَنْ أَبِيْهِ أَنَّهُ قَالَ: يَا رَسُوْلَ اللهِ أَمَا تَكُوْنُ الذَّكَاةُ إِلَّا فِي الْحَلْقِ وَاللَّبَّةِ؟ فَقَالَ: “لَوْ طَعَنْتَ فِيْ فَخِذهَا لَأَجْزَأَ عَنْكَ”. رواهُ التِّرْمِذِيُّ وَأَبُوْ دَاوُدَ وَالنَّسَائِيُّ وَابْنُ مَاجَهُ وَالدَّارَمِيُّ وَقَالَ أَبُوْ دَاوُدَ: وَهَذِهِ ذَكَاةُ الْمُتَرَدِّيْ وَقَالَ التِّرْمِذِيُّ: هَذَا فِي الضَّرُوْرَةِ.

4082. (19) [2/1194అపరిశోధితం]

అబుల్‌ ‘ఉషరా తన తండ్రి ద్వారా కథనం: అతను ఇలా అన్నారు, ”ఓ ప్రవక్తా! ‘జిబహ్‌ మరియు ‘హలఖ్ గుండె పరిధిలో ఉన్నదా? దానికి ప్రవక్త (స), ‘ఒకవేళ నువ్వు చాకు మొదలైనవి పశువు తొడలో పొడిచినా సరిపోతుంది,’ అని అన్నారు.” [8]  (తిర్మిజి’, అబూ దావూద్‌, నసాయి’, ఇబ్నె మాజహ్, దార్మి)

4083 – [ 20 ] ( لم تتم دراسته ) (2/1194)

وَعَنْ عَدِيّ بْنِ حَاتِمٍ أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم قَالَ: “مَا عَلَّمْتَ مِنْ كَلْبٍ أَوْ بَازٍ ثُمَّ أَرْسَلْتَهُ وَذَكَرْتَ اسْمَ اللهِ فَكُلْ مِمَّا أَمْسَكَ عَلَيْكَ”. قُلْتُ: وَإِنْ قَتَلَ؟ قَالَ: “إِذَا قَتَلَهُ وَلَمْ يَأْكُلُ مِنْهُ شَيْئًا فَإِنَّمَا أَمْسَكَهُ عَلَيْكَ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ.

4083. (20) [2/1194అపరిశోధితం]

‘అదీ బిన్‌ ‘హాతిమ్‌ (ర)కథనం: ప్రవక్త (స) కుక్కను లేదా గ్రద్దను శిక్షణ ఇచ్చి వేటాడటం నేర్పి ఉంటే, ‘బిస్మిల్లాహ్‌ అల్లాహు అక్బర్‌,’ అని వాటిని వేటకు వదిలితే, అది దాన్ని వేటాడి మీ కోసం ఉంచితే దాన్ని తినవచ్చును,’ అని అన్నారు. దానికి నేను, ‘ఒకవేళ చంపివేసినా?’ అని అన్నాను. దానికి ప్రవక్త (స), ‘శిక్షణ ఇవ్వబడిన కుక్క దాన్ని చంపి, అందులో నుండి ఏమీ తినకుండా ఉంటే దాన్ని మీరు తినవచ్చును’ అని అన్నారు. (అబూ దావూద్‌)

4084 – [ 21 ] ( لم تتم دراسته ) (2/1194)

وَعَنْهُ قَالَ: قُلْتُ: يَا رَسُوْلَ اللهِ أَرْمِي الصَّيْدَ فَأَجِدُ فِيْهِ مِنَ الْغَدِ سَهْمِيْ قَالَ: “إِذَا عَلِمْتَ أَنَّ سَهْمَكَ قَتَلَهُ وَلَمْ تَرَ فِيْهِ أَثَرَ سَبعٍ فَكُلّ”. روَاهُ أَبُوْ دَاوُدَ .

4084. (21) [2/1194అపరిశోధితం]

‘అదీ బిన్‌ ‘హాతిమ్‌(ర) కథనం: ఓ ప్రవక్తా! నేను వేటలో బాణాలు వదులుతాను. ఒక్కోసారి ఒక రోజు తరువాత అది నా చేతికి చిక్కుతుంది. దాన్ని తినగలనా లేదా? అని విన్నవించుకున్నాను. దానికి ప్రవక్త (స), ‘నీవు నీ బాణం గుచ్చుకొని ఉన్న జంతువు నీ బాణమే గుర్చుకొని ఉందని తెలిసినపుడు దానిపై ఇతర ఏ క్రూర జంతువు చిహ్నాలు లేనప్పుడు నీవు దాన్ని తినవచ్చు. ఆ వేట నీకు చెందినదే అవుతుంది,’ అని అన్నారు. (అబూ  దావూద్‌)

4085 – [ 22 ] ( لم تتم دراسته ) (2/1194)

وَعَنْ جَابِرٍقَالَ: نُهِيْنَا عَنْ صَيْدِ كَلْبِ الْمَجُوْسِ. رَوَاهُ التِّرْمِذِيُّ.

4085. (22) [2/1194అపరిశోధితం]

జాబిర్‌(ర) కథనం: మన ముస్లిములను అగ్ని ఆరాధకుల కుక్కల వేటను తినటాన్ని నిషేధించడం జరిగింది. [9]  (తిర్మిజి’)

4086 – [ 23 ] ( لم تتم دراسته ) (2/1194)

وَعَنْ أَبِيْ ثَعْلَبَةَ الْخُشَنِيِّ قَالَ: قُلْتُ: يَا رَسُوْلَ اللهِ إِنَّا أَهْلُ سَفَرٍ تَمُرُّ الْيَهُوْد وَالنَّصَارَى وَالْمَجُوْسِ فَلَا نَجِدُ غَيْرَآنِيَتِهِمْ قَالَ: “فَإِنْ لَمْ تَجِدُوْا غَيْرَهَا فَاغْسِلُوْهَا بِالْمَاءِ ثُمَّ كُلُوْا فِيْهَا وَاشْرَبُوْا”. رَوَاهُ التِّرْمِذِيُّ .

4086. (23) [2/1194అపరిశోధితం]

అబూ సఅ’లబహ్ ‘ఖుష్‌నీ (ర) కథనం: ‘ఓ ప్రవక్తా! మేము ప్రయాణంలో వెళుతూ ఉంటాం. యూదులు, క్రైస్తవులు, మజూసీల దగ్గరకు వెళుతూ ఉంటాం. వాళ్ళ గిన్నెలు తప్ప మరేమీ ఉండవు. వాటిలో మేము తిన గలమా?’ అని ప్రశ్నించాను. దానికి ప్రవక్త (స), ‘అవి తప్ప మరేమీ లభించనపుడు వాటిని శుభ్రపరచి వాటిలో తినండి, త్రాగండి,’ అని ఉపదేశించారు. (తిర్మిజి’)

4087 – [ 24 ] ( لم تتم دراسته ) (2/1195)

وَعَنْ قَبِيْصَةَ بْنِ هُلْبٍ عَنْ أَبِيْهِ قَالَ: سَأَلْتُ النَّبِيَّ صلى الله عليه وسلم عَنْ طَعَامِ النَّصَارَى.

وَفِيْ رِوَايَةٍ: سَأَلَهُ رَجُلٌ فَقَالَ: إِنَّ مِنَ الطَّعَامِ طَعَامًا أَتَحَرَّجُ مِنْهُ فَقَالَ: “لَا يَتَخَلَّجَنَّ فِيْ صَدْرِكَ شَيْءٌ ضَارَعْتَ فِيْهِ النَّصْرَانِيَّةَ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَ أَبُوْ دَاوُدَ.

4087. (24) [2/1195అపరిశోధితం]

ఖబీ’సహ్ బిన్‌ హులబ్‌ తన తండ్రి ద్వారా కథనం: అతను ఇలా అన్నారు, ”ప్రవక్త (స)ను నేను క్రైస్తవుల ఆహార పదార్థాల గురించి అడిగాను. అంటే వారు వండిన పదార్థాలు తినవచ్చునా లేదా?

మరో ఉల్లేఖనంలో ఇలా ఉంది, ఒక వ్యక్తి ప్రవక్త(స)తో, ‘వారి కొన్ని వంటకాల నుండి నేను దూరంగా ఉంటాను,’ అని అన్నాడు. దానికి ప్రవక్త (స) క్రైస్తవుల్లా నీ మెదడులో కూడా అనుమానాలు, అపార్థాలూ రాకూడదు,” అని అన్నారు. [10]  (అబూ  దావూద్‌, తిర్మిజి’)

4088 – [ 25 ] ( لم تتم دراسته ) (2/1195)

وَعَنْ أَبِي الدَّرْدَاءِ قَالَ: نَهَى رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم عَنْ أَكْلِ الْمُجَثَّمَةِ. وَهِيَ الَّتِيْ تُصْبَرُ بِالنَّبْلِ. رَوَاهُ التِّرْمِذِيُّ .

4088. (25) [2/1195అపరిశోధితం]

అబూ దర్దా (ర) కథనం: ప్రవక్త (స) ముజస్సహ్ తినటాన్ని నిషేధించారు. ముజస్సహ్ అంటే గురి సరి చేయ టానికి కట్టివేయబడిన జంతువు. (తిర్మిజి’)

4089 – [ 26 ] ( لم تتم دراسته ) (2/1195)

وَعَنِ الْعِرْبَاضِ بْنِ سَارِيَةَ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم نَهَى يَوْمَ خَيْبَرَ عَنْ كُلِّ ذِيْ نَابٍ مِنَ السِّبَاعِ وَعَنْ كُلِّ ذِيْ مِخْلَبٍ مِّنَ الطَّيْرِ وَعَنْ لُحُوْمِ الْحُمُرِ الْأَهْلِيَّةِ وَعَنِ الْمجثَّمَةِ وَعَنْ الْخَلِيْسَةِ وَأَنْ تُوْطَأَ الْحُبَالَى حَتَّى يَضَعْنَ مَا فِيْ بُطُوْنِهِنَّ. قَالَ مُحَمَّدُ بْنُ يَحْيَى: سُئِلَ أَبُوْ عَاصِمٍ عَنِ الْمُجَثَّمَةِ فَقَالَ: أَنْ يُنْصَبَ الطَّيْرُ أَوْ الشَّيْءُ فَيُرْمَى وَسُئِلَ عَنِ الْخَلِيْسَةِ فَقَالَ: الذِّئْبُ أَوِ السَّبعُ يُدْرِكُهُ الرَّجُلُ فَيَأْخُذُ مِنْهُ فَيَمُوْتُ فِيْ يَدِهِ قَبْلَ أَنْ يُذَكِّيَهَا. رَوَاهُ التِّرْمِذِيُّ.  

4089. (26) [2/1195అపరిశోధితం]

‘ఇర్‌బా’ద్ బిన్‌ సారియహ్ (ర) కథనం: ప్రవక్త (స) ‘ఖైబర్‌ నాడు పంజాలతో చీల్చి తినే జంతువుల, పక్షుల, కంచర గాడిదల మాంసాన్ని, ముజస్సను, ఖలీసహ్ మాంసాన్ని, గర్భిణీ బానిస స్త్రీలతో సంభోగం చేయటాన్ని, వారు ప్రసవించే వరకు నిషేధించారు.

కథనం: ము’హమ్మద్‌ బిన్‌ య’హ్యా ముజస్సహ్ ను గురించి అబూ ‘ఆసిమ్‌ను అడిగారు. దానికి అతడు, ‘పక్షిని, లేదా జంతువును కట్టి దానిపై గురిని సరిచేయడం, బాణాలు గురిపెట్టటం. అదేవిధంగా ఖలీసహ్ ను గురించి ప్రశ్నించగా తోడేలు లేదా క్రూర మృగం చీల్చివేసిన కొద్ది ప్రాణం ఉండగా ఒక వ్యక్తి చేతిలో ప్రాణం వదిలిన జంతువు,’ అని అన్నారు. [11]   (తిర్మిజి’)

4090 – [ 27 ] ( لم تتم دراسته ) (2/1195)

وَعَنِ ابْنِ عَبَّاسٍ وَأَبِيْ هُرَيْرَةَ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم نَهَى عَنْ شَرِيْطَةِ الشَّيْطَانِ.

زَادَ ابْنُ عِيْسَى: هِيَ الذَّبِيْحَةُ يُقْطَعُ مِنْهَا الْجِلْدُ وَلَا تُفْرِىَ الْأَوْدَاجُ ثُمَّ تُتْرَكُ حَتّى تَمُوْتَ. رَوَاهُ أَبُوْدَاوُدَ .

4090. (27) [2/1195అపరిశోధితం]

ఇబ్నె ‘అబ్బాస్‌ (ర), అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) షరీ’తత్  షైతాన్ నుండి వారించారు.

ఇబ్నె ‘ఈసా ఉల్లేఖన కర్త ఈ మాత్రం అధికం చేసారు, ”షరీ’తత్ షైతాన్‌ అంటే కేవలం మెడపై ఉన్న చర్మం మాత్రమే కోయబడి, రక్త నాళం కోయబడకుండా ఉండి, అది విలవిలలాడి కొట్టుకొని చనిపోయిన ప్రాణి. [12] (అబూ దావూద్‌)

4091 – [ 28 ] ( صحيح ) (2/1195)

وَعَنْ جَابِرٍ أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم قَالَ: ” ذَكَاةُ الْجَنِيْنِ ذَكَاةُ أُمِّهِ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ وَالدَّارَمِيُّ .

4091. (28) [2/1195 –దృఢం]

జాబిర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”పశువును జి’బహ్‌ చేయటం, దాని గర్భంలో ఉన్న బిడ్డను జ’బహ్‌ చేయటం వంటిది.” (అబూ  దావూద్‌, దార్మి)

4092 – [ 29 ] ( صحيح ) (2/1195)

وَرَوَاهُ التِّرْمِذِيُّ عَنْ أَبِيْ سَعِيْدٍ .

4092. (29) [2/1195దృఢం]

ఇటువంటి ‘హదీసు’ను అబూ స’యీద్ ద్వారా తిర్మీజి’ ఉల్లేఖించారు. [13] 

4093 – [ 30 ] ( لم تتم دراسته ) (2/1196)

وَعَنْ أَبِيْ سَعِيْدِ الْخُدْرِيِّ قَالَ: قُلْنَا: يَا رَسُوْلَ اللهِ نَنْحَرُ النَّاقَةَ وَنَذْبَحُ الْبَقَرَةَ وَالشَّاةَ فَنَجِدُ فِيْ بَطْنِهَا اَلْجَنِيْنَ أَنُلْقِيْهِ أَمْ نَأْكُلُهُ؟ قَالَ: “كُلُوْهُ إِنْ شِئْتُمْ فَإِنَّ ذَكَاتَهُ ذَكَاةُ أُمِّهِ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ وَابْنُ مَاجَهُ.

4093. (30) [2/1196 –అపరిశోధితం]

అబూ స’యీద్‌ ‘ఖుద్రీ (ర) కథనం: ఓ ప్రవక్తా! మేము ఆడ ఒంటెకు హర్ చేస్తాం, ఆవును, మేకలను జి’బహ్‌ చేస్తాం. ఒకవేళ గర్భంలో బిడ్డ ఉంటే తినవచ్చా? అని ప్రశ్నించాను. దానికి ప్రవక్త (స) తినగోరితే తినవచ్చును, ఎందుకంటే తల్లి జ’బహ్‌ కావటం వల్ల బిడ్డ కూడా జి’బహ్‌ అయినట్టే అని ప్రవచించారు. (అబూ దావూద్, ఇబ్నె మాజహ్)

4094 – [ 31 ] ( لم تتم دراسته ) (2/1196)

وَعَنْ عَبْدِ اللهِ بْنِ عَمْرِوبْنِ الْعَاصِ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم قَالَ: “مَنْ قَتَلَ عُصْفُوْرًا فَمَا فَوْقَهَا بِغَيْرِ حَقِّهَا سَأَلَهُ اللهُ عَنْ قَتْلِهِ. “قِيْلَ: يَا رَسُوْلَ اللهِ وَمَا حَقُّهَا؟ قَالَ: “أَنْ يَذْبَحَهَا فَيَأْكُلَهَا وَلَا يَقْطَعَ رَأْسَهَا فَيَرْمِيَ بِهَا”. رَوَاهُ أَحْمَدُ وَالنَّسَائِيُّ وَالدَّرَامِيُّ .

4094. (31) [2/1196అపరిశోధితం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ అమ్ర్‌ బిన్‌ ‘ఆ’స్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”పిచ్చుకనైనా, పశువునైనా అన్యాయంగా చంపిన వారిని అల్లాహ్‌ (త) తీర్పుదినం నాడు ఆ హత్యా నేరం క్రింద విచారిస్తాడు.” దానికి ప్రజలు, ‘వాటి న్యాయం ఏమిటి,’ అని విన్నవించు కున్నారు. అప్పుడు ప్రవక్త (స), ‘వాటిని జి’బహ్‌ చేయండి, తినండి. అనవసరంగా తల నరికి పారవేయటం చేయరాదు,’ అని అన్నారు. (అ’హ్మద్‌, నసాయి’, దార్మి)

4095 – [ 32 ] ( لم تتم دراسته ) (2/1196)

عَنْ أَبِيْ وَافِدِ اللَّيْثِيِّ قَالَ: قَدِمَ النَّبِيُّ صلى الله عليه وسلم اَلْمَدِيْنَةَ وَهُمْ يَجُبُّوْنَ أَسْنِمَةَ الْإِبِلِ وَيَقْطَعُوْنَ أَلْيَاتِ الْغَنَمِ فَقَالَ: “مَا يَقْطَعُ مِنَ الْبَهِيْمَةِ وَهِيَ حَيَّةٌ فَهِيَ مَيْتَةٌ لَا تُؤْكَلُ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَأَبُوْ دَاوُدَ .

4095. (32) [2/1196అపరిశోధితం]

అబూ వాఖిద్‌ లైసీ (ర) కథనం: ప్రవక్త (స) మదీనహ్ విచ్చేసారు. అప్పుడు మదీనహ్ ప్రజలు ఒంటెలు బ్రతికి ఉండగానే శిఖరాలను కోసివేసేవారు. అది చూచి ప్రవక్త (స), ‘సజీవంగా ఉన్నవాటి నుండి మాంసం కోయడం మృత పరిధిలోకి వస్తుంది. దీన్ని తినటం ధర్మం కాదు ఎందుకంటే అది నిషిధ్ధం’ అని అన్నారు. (తిర్మిజి’, అబూ దావూద్‌)

—–

اَلْفَصْلُ الثَّالِثُ మూడవ విభాగం 

4096 – [ 33 ] ( لم تتم دراسته ) (2/1196)

عَنْ عَطَاءِ بْنِ يَسَارٍ عَنْ رَجُلٍ مِنْ بَنِيْ حَارِثَةَ أَنَّهُ كَانَ يَرْعَى لِقْحَةً بِشَعْبٍ مِنْ شِعَابِ أُحُدٍ فَرَأَى بِهَا الْمَوْتَ فَلَمْ يَجِدْ مَا يَنْحَرُهاَ بِهِ فَأَخَذَ وَتِدًا فَوَجَأَ بِهِ فِيْ لَبَّتِهَا حَتَّى أَهْرَاقَ دَمَهَا ثُمَّ أَخْبَرَ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم فَأَمَرَهُ بِأَكْلِهَا. روَاهُ أَبُوْ دَاوُدَ وَماَلِكٌ

وَفِيْ رِوَايَتِهِ: قَالَ: فَذَكَّاهَا بِشَظَاظٍ.

4096. (33) [2/1196అపరిశోధితం]

‘అ’తా బిన్‌ యసార్‌ బనీ ‘హారిసహ్ కు చెందిన ఒక వ్యక్తి ద్వారా కథనం: అతను ఉ’హుద్‌ కొండల్లో ఒంటెలను మేపుతున్నారు. వాటిలో ఒక ఆడ ఒంటె మరణావస్థలో కనబడింది. హర్ చేయడానికి సరైన వస్తువూ ఏదీ లేదు. ఒక మేకు తీసుకొని దాని కంఠంలో పొడిచాడు. అక్కడి నుండి రక్తం కారసాగింది. ఆ తరువాత ప్రవక్త (స) వద్దకు వచ్చి జరిగింది వివరించాడు. ప్రవక్త (స) దాన్ని తినమని ఆదేశించారు. (అబూ  దావూద్‌, మాలిక్‌)

మరో ఉల్లేఖనంలో అతడు ఒక పదునైన కర్రతో జబహ్‌ చేసాడు.

4097 – [ 34 ] ( لم تتم دراسته ) (2/1196)

وَعَنْ جَابِرٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَا مِنْ دَابَّةٍ إِلَّا وَقَدْ ذَكَّاهَا اللهُ لِبَنِيْ آدَمَ”. رَوَاهُ الدَّارَقُطْنِيُّ .

4097. (34) [2/1196అపరిశోధితం]

జాబిర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”నీటి జంతువులన్నిటినీ అల్లాహ్‌ (త) మానవుల కోసం జి’బహ్‌ చేసివేసాడు.”  [14]  (దారు ఖుతునీ)

=====

1- بَابُ ذِكْرِ الْكَلْبِ

1. కుక్కలు

అంటే కుక్కలను పెంచటం, ఇంటిలోపల ఉంచ వచ్చునా? లేదా? ఎటువంటి కుక్కలను చంపాలి, ఎటు వంటి కుక్కలను చంపకూడదు.

اَلْفَصْلُ الْأَوَّلُ     మొదటి విభాగం

4098 – [ 1 ] ( متفق عليه ) (2/1197)

عَنِ ابْنِ عُمَرَقَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَنِ اقْتَنَى كَلْبًا إِلَّا كَلْبَ مَاشِيَةٍ أَوْضَارٍنَقص مِنْ عَمَلِهِ كُلَّ يَوْمٍ قِيْرَاطَانِ”. متفق عليه.

4098. (1) [2/1197ఏకీభవితం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘ఉమర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”కుక్కలను పెంచేవాని పుణ్యంలో నుండి రెండు ఖీరాత్‌ల పుణ్యం తగ్గుతూ ఉంటుంది. అయితే పశువుల, పొలాల, పంటల రక్షణ కోసం కుక్కలను పెంచవచ్చును. ఈ సంకల్పంతో పెంచటం వల్ల పుణ్యమూ తగ్గదు. దైవదూతలు ఇంట్లో ప్రవేశించరనే భయమూ  ఉండదు.” (బు’ఖారీ, ముస్లిమ్‌)

4099 – [ 2 ] ( متفق عليه ) (2/1197)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَنِ اتَّخَذَ كَلْبًا إِلّا كَلْبَ مَاشِيَةٍ أَوْ صَيْدٍ أَوْ زَرْعٍ اِنْتَقَصَ مِنْ أَجْرِهِ كُلَّ يَوْمٍ قِيْرَاطٌ”.

4099. (2) [2/1197ఏకీభవితం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”కుక్కలను పెంచేవారి పుణ్యం నుండి ప్రతిరోజూ ఒక ఖీరాత్‌ పుణ్యం తగ్గుతూ ఉంటుంది. అయితే పశువుల, పంటపొలాల రక్షణకు, వేటకు కుక్కలను పెంచటంలో ఎటువంటి అభ్యంతరం లేదు.”  [15] (బు’ఖారీ, ముస్లిమ్‌)

4100 – [ 3 ] ( صحيح ) (2/1197)

وَعَنْ جَابِرٍ قَالَ: أَمَرَنَا رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم بِقَتْلِ الْكِلَابِ حَتَّى إِنَّ الْمَرْأَةَ تَقْدَمُ مِنض الْبَادِيَةِ بِكَلْبِهَا فَتَقْتُلَهُ ثُمَّ نَهَى رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم عَنْ قَتْلِهَا وَقَالَ: “عَلَيْكُمْ بِالْأَسْوَدِ الْبَهِيْمِ ذِي النُّقْطَيْنِ فَإِنَّهُ شَيْطَانٌ”. رَوَاهُ مُسْلِمٌ .

4100. (3) [2/1197దృఢం]

జాబిర్‌ (ర) కథనం: ప్రవక్త (స) మమ్మల్ని కుక్కలను చంపమని ఆదేశించారు. కుక్కలు ఎక్కడ కనబడినా మేము చంపివేసేవారము. చివరికి ఇతర ప్రాంతాల నుండి స్త్రీలు వస్తే, వారి వెంట కుక్కలు ఉంటే వాటిని కూడా మేము చంపివేసే వారం. ఆ తర్వాత కుక్కలన్నిటినీ చంపవద్దని నల్లగా ఉండి, కళ్ళలో రెండు తెల్లటి మచ్చలుగల కుక్కను చంపమని ఆదేశించారు. ఎందు కంటే అది షై’తాన్‌, మరియు చాలా ప్రమాదకరమైనది.[16]  (ముస్లిమ్‌)

4101 – [ 4 ] ( متفق عليه ) (2/1197)

وَعَنِ ابْنِ عُمَرَ أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم أَمَرَ بِقَتْلِ الْكِلَابِ إِلَّا كَلْبَ صَيْدٍ أَوْ كَلْبَ غَنَمٍ أَوْ مَاشِيَةٍ. متفق عليه.

4101. (4) [2/1197ఏకీభవితం]

ఇబ్నె ‘ఉమర్‌ (ర) కథనం: ప్రవక్త(స) కుక్కలను చంపమని ఆదేశించారు. అయితే వేట, పశువుల రక్షణ కోసం పెంచే కుక్కలను చంపవద్దని ఆదేశించారు. (బు’ఖారీ, ముస్లిమ్‌)

—–

اَلْفَصْلُ الثَّانِيْ రెండవ విభాగం 

4102 – [ 5 ] ( لم تتم دراسته ) (2/1197)

عَنْ عَبْدِ اللهِ بْنِ مُغَفَّلٍ عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ: “لَوْلَا أَنَّ الْكِلَابَ أُمَّةٌ مِّنَ الْأُمَمِ لَأَمَرْتُ بِقَتْلِهَا كُلِّهَا فَاقْتُلُوْا مِنْهَا كُلُّ أَسْوَدَ بَهِيْمٍ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ وَالدَّارَمِيُّ وَزَادَ التِّرْمِذِيُّ وَالنَّسَائِيُّ .”وَمَا مِنْ أَهْلِ بَيْتٍ يَرْتَبِطُوْنَ كَلْبًا إِلَّا نَقَصَ مِنْ عَمَلِهِمْ كُلَّ يَوْمٍ قِيْرَاطٌ إِلّا كَلْبَ صَيْدٍ أَوْ كَلْبَ حَرْثٍ أَوْ كَلْبَ غَنَمٍ”.

4102. (5) [2/1197పరిశోధితం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ము’గప్ఫల్‌(ర) కథనం: ప్రవక్త(స) ప్రవచనం, ”ఒకవేళ జాతుల్లో లేదా దైవ సృష్టితాల్లో కుక్కలు లేకపోతే నేను కుక్కలన్నిటినీ చంపమని ఆదేశించేవాడిని. మీరు కేవలం నల్లటి కుక్కలను చంపివేయండి.” [17] (అబూ దావూద్‌, దార్మి, తిర్మిజి’, నసాయి’)

4103 – [ 6 ] ( لم تتم دراسته ) (2/1198)

وَعَنِ ابْنِ عَبَّاسٍ قَالَ: نَهَى رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم عَنِ التَّحْرِيْشِ بَيْنَ الْبَهَائِمَ. رَوَاهُ التِّرْمِذِيُّ.

4103. (6) [2/1198పరిశోధితం]

ఇబ్నె ‘అబ్బాస్‌ (ర) కథనం: ప్రవక్త(స) పశువులు, పక్షుల మధ్య పందాలు, పోట్లాటలు పెట్టటాన్ని వారించారు.[18]   (తిర్మిజి’, అబూ దావూద్‌)

هَذَا الْبَابُ خَالٍ مِنَ الْفَصْلُ الثَّالِثُ

ఇందులో మూడవ విభాగం లేదు

=====

2– بَابُ مَا يَحِلُّ اَكْلُهُ وَمَا يَحْرُمُ

2. తినుటకు ధర్మసమ్మతమైన ధర్మసమ్మతం కాని జంతువులు

اَلْفَصْلُ الْأَوَّلُ   మొదటి విభాగం

4104 – [ 1 ] ( صحيح ) (2/1199)

عَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “كُلُّ ذِيْ نَابٍ مِّنَ السِّبَاعِ فَأَكْلُهُ حَرَامٌ”. رَوَاهُ مُسْلِمٌ .

4104. (1) [2/1199దృఢం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”చీల్చితినే ప్రతి జంతువు నిషేధించబడింది.” (ముస్లిమ్‌)

ఉదా: సింహం, పులి, తోడేలు మొదలైనవి.

4105 – [ 2 ] ( صحيح ) (2/1199)

وَعَنِ ابْنِ عَبَّاسٍ قَالَ نَهَى رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم عَنْ كُلِّ ذِيْ نَابٍ مِّنَ السِّبَاعِ وَكُلِّ ذِيْ مِخْلَبٍ مَّنَ الطَّيْرِ. رَوَاهُ مُسْلِمٌ.

4105. (2) [2/1199దృఢం]

ఇబ్నె ‘అబ్బాస్‌ (ర) కథనం: ప్రవక్త (స) చీల్చితినే, పంజాలతో దాడిచేసే క్రూర జంతువులను, పశువులను తినటాన్ని నిషేధించారు.  (ముస్లిమ్‌)

4106 – [ 3 ] ( متفق عليه ) (2/1199)

وَعَنْ أَبِيْ ثَعْلَبَةَ قَالَ: حَرَّمَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم لُحُوْمَ الْحُمُرِ الْأَهْلِيَةِ. متفق عليه.

4106. (3) [2/1199ఏకీభవితం]

అబూ స”అలబహ్ (ర) కథనం: ప్రవక్త (స) పెంపుడు గాడిదలను తినటాన్ని నిషేధించారు. (బు’ఖారీ, ముస్లిమ్‌)

4107 – [ 4 ] ( متفق عليه ) (2/1199)

وَعَنْ جَابِرٍ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم نَهَى يَوْمَ خَيْبَرَ عَنِ لُحُوْمِ الْحُمُرِ الْأَهْلِيَّةِ. وَأَذِنَ فِيْ لُحُوْمِ الْخَيْلِ

4107. (4) [2/1199ఏకీభవితం]

జాబిర్‌ (ర) కథనం: ‘ఖైబర్‌ యుద్ధ సందర్భంగా ప్రవక్త (స) పెంపుడు గాడిదలను తినటాన్ని నిషేధించారు. అయితే గుర్రం మాంసం తినటాన్ని అనుమతించారు. (బు’ఖారీ, ముస్లిమ్‌)

4108 – [ 5 ] ( متفق عليه ) (2/1199)

وَعَنْ أَبِيْ قَتَادَةَ أَنَّهُ رَأَى حِمَارًا وَحْشِيًّا فَعَقَرَهُ. فَقَالَ النَّبِيُّ صلى الله عليه وسلم: “هَلْ مَعَكُمْ مِنْ لَحْمِهِ شَيْءٌ؟”  قَالَ: مَعَنَا رِجْلُهُ فَأَخَذَهَا فَأَكَلَهَا.

4108. (5) [2/1199ఏకీభవితం]

అబూ ఖతాదహ్‌ (ర) కథనం: అతడు అడవి గాడిదను చూచారు, దాన్ని జ’బహ్‌ చేసివేసారు. ఆ తర్వాత దాన్ని గురించి ప్రవక్త(స)ను విన్నవించుకున్నారు. దానికి ప్రవక్త (స) ‘దాని మాంసం ఇప్పుడు మీ దగ్గర ఉందా?’ అని అడిగారు. అబూ ఖతాదహ్, ‘అవును, దాని తొడ ఉంది,’ అని అన్నారు. ప్రవక్త (స) దాని నుండి తిన్నారు. (బు’ఖారీ, ముస్లిమ్‌)

4109 – [ 6 ] ( متفق عليه ) (2/1199)

وَعَنْ أَنَسٍ قَالَ: أَنْفَجْنَا أَرْنَبًا بِمَرِّالظَّهْرَانِ فَأَخَذْتُهَا فَأَتَيْتُ بِهَا أَبَا طَلْحَةَ فَذَبَحَهَا وَبَعَثَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم بِوَرِكِهَا وَفَخِذَيْهَا فَقَبِلَهُ. متفق عليه.

4109. (6) [2/1199ఏకీభవితం]

అనస్‌ (ర) కథనం: మర్రి ”జహ్రాన్ అనే చోట ఒక కుందేలును వేటాడాము. దాన్ని అబూ ‘తల్‌’హా వద్దకు తీసుకువచ్చాము. అతడు దాన్ని జి’బహ్‌ చేసిన తర్వాత దాని ప్రక్క లేదా తొడను ప్రవక్త(స)కు పంపించారు. ప్రవక్త (స) దాన్ని స్వీకరించారు. (బు’ఖారీ, ముస్లిమ్‌)

అంటే కుందేలు మాంసం తినవచ్చు.

4110 – [ 7 ] ( متفق عليه ) (2/1199)

وَعَنِ ابْنِ عُمَرَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “اَلضَّبُّ لَسْتُ آكُلُهُ وَلَا أُحَرِّمُهُ”.

4110. (7) [2/1199ఏకీభవితం]

ఇబ్నె ‘ఉమర్‌ (ర) కథనం: ప్రవక్త(స) ప్రవచనం, ఉడుమును నేను తినను, నిషిద్ధంగా భావించను. (బు’ఖారీ, ముస్లిమ్‌)

4111 – [ 8 ] ( متفق عليه ) (2/1200)

وَعَنِ ابْنِ عَبَّاسٍ: أَنَّ خَالِدَ بْنَ الْوَلِيْدِ أَخْبَرَهُ أَنَّهُ دَخَلَ مَعَ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم عَلَى مَيْمُوْنَةَ وَهِيَ خَالَتُهُ وَخَالَةُ ابْنِ عَبَّاسٍ فَوَجَدَ عِنْدَهَا ضَبًّا مَحْنُوْذًا فَقَدَّمَتِ الضَّبَّ لِرَسُوْلِ اللهِ صلى الله عليه وسلم فَرَفَعَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم يَدَهُ عَنِ الضَّبِّ. فَقَالَ خَالِدٌ: أَحَرَامُ الضَّبُّ يَا رَسُوْلَ اللهِ؟ قَالَ: “لَا وَلَكِنْ لَمْ يَكُنْ بِأَرْضِ قَوْمِيْ فَأَجِدُنِيْ أَعَافَهُ “. قَالَ خَالِدٌ: فَاجْتَرَرْتُهُ فَأَكَلْتُهُ. وَرَسُوْلُ اللهِ صلى الله عليه وسلم يَنْظُرُ إِلَيَّ.

4111. (8) [2/1200ఏకీభవితం]

ఇబ్నె ‘అబ్బాస్‌(ర) కథనం:  ‘ఖాలిద్‌ బిన్‌ వలీద్‌ (ర) ఇలా పేర్కొన్నారు: ”అతడు ప్రవక్త (స) వెంట మైమూనహ్ (ర) ఇంటికి వచ్చారు. మైమూనహ్ (ర) ‘ఖాలిద్‌కు, ‘అబ్బాస్‌ (ర)కు పిన్ని అవుతారు. మైమూనహ్ (ర) వద్ద ఉడుము కాల్చబడి ఉంది. దాన్ని ప్రవక్త (స) ముందు ఉంచడం జరిగింది. ప్రవక్త (స) తినటానికి చేయి ముందుకు చాచి నపుడు అది ఉడుము మాంసం అని తెలియపరచటం జరిగింది. వెంటనే ప్రవక్త(స) తన చేతిని వెనక్కి తీసుకున్నారు. అప్పుడు ‘ఖాలిద్‌ (ర) ‘ప్రవక్తా! ఉడుము కూడా నిషిద్ధమా?’ అని ప్రశ్నించారు. దానికి ప్రవక్త (స), ‘ఇది నిషిద్ధం కాదు. కాని మా ప్రాంతంలో దీన్ని తినే సాంప్రదాయం లేదు. నాకు దీన్ని చూస్తే అసహ్యం వేస్తుంది,’ అని అన్నారు. ‘ఖాలిద్‌ (ర) దాన్ని తీసుకొని తన ముందు ఉంచుకొని తినసాగారు. ప్రవక్త (స) చూస్తూ ఉండిపోయారు.” (బు’ఖారీ, ముస్లిమ్‌)

4112 – [ 9 ] ( متفق عليه ) (2/1200)

وَعَنْ أَبِيْ مُوْسَى قَالَ: رَأَيْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يَأْكُلُ لَحْمَ الدَّجَاجِ . متفق عليه.

4112. (9) [2/1200ఏకీభవితం]

అబూ మూసా (ర) కథనం: ప్రవక్త (స) ను కోడి మాంసం తింటూ ఉండగా నేను చూచాను. (బు’ఖారీ, ముస్లిమ్‌)

4113 – [ 10 ] ( متفق عليه ) (2/1200)

وَعَنِ ابْنِ أَبِيْ أَوْفَى قَالَ: غَزَوْنَا مَعَ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم سَبْعَ غَزَوَاتٍ كُنَّا نَأْكُلُ مَعَهُ الْجَرَادَ. متفق عليه.

4113. (10) [2/1200ఏకీభవితం]

ఇబ్నె అబూ అవ్‌ఫా (ర) కథనం: ప్రవక్త(స) వెంట 7 యుద్ధాలలో పాల్గొన్నాను. ప్రవక్త (స) తో పాటు మేము కూడా  టిడ్డీలను  తినేవాళ్ళం.

4114 – [ 11 ] ( متفق عليه ) (2/1200)

وَعَنْ جَابِرٍ قَالَ: غَزَوْتُ جَيْشَ الْخَبَطِ وَأُمِّرَ عَلَيْنَا أَبُوْ عُبَيْدَةَ فَجُعْنَا جُوْعًا شَدِيْدًا. فَأَلْقَى الْبَحْرُ حُوْتًا مَيِّتًا لَمْ نَرَ مِثْلَهُ. يُقَالُ لَهُ: اَلْعَنْبَرُ. فَأَكَلْنَا مِنْهُ نِصْفُ شَهْرٍ فَأَخَذَ أَبُوْ عُبَيْدَةَ عَظْمًا مِنْ عِظَامِهِ فَمَرَّ الرَّاكِبُ تَحْتَهُ فَلَمَّا قَدِمْنَا ذَكَرْنَا ذَلِكَ لِلنَّبِيِّ صلى الله عليه وسلم فَقَالَ: “كُلُوْا رِزْقًا أَخْرَجَهُ اللهُ إِلَيْكُمْ وَأَطْعِمُوْنَا إِنْ كَانَ مَعَكُمْ”. قَالَ: فَأَرْسَلْنَا إِلَى رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم مِنْهُ فَأَكَلَهُ. متفق عليه.

4114. (11) [2/1200ఏకీభవితం]

జాబిర్‌ (ర) కథనం: జైషుల్‌ ‘ఖబత్ యుద్ధంలో నేను పాల్గొన్నాను. అప్పుడు అబూ ‘ఉబైదహ్‌ (ర) మాకు నాయకులుగా ఉన్నారు. ఆహారపదార్థాలు అయి పోవడం వల్ల మేము చాలా తీవ్ర ఆకలికి గురయ్యాము. సముద్రంలో నుండి చనిపోయిన ఒక చేప ఒడ్డుకు కొట్టుకొని వచ్చింది. దాన్ని అంబర్‌ అంటారు. 15 రోజుల వరకు దాన్ని మేము తిన్నాము. అబూ ‘ఉబైదహ్ దాని దుమ్ముల్లో నుండి ఒక దుమ్మును తీసుకున్నారు. దాన్ని నిలబెట్టారు. ఒంటె దాని క్రిందనుండి వెళ్ళ గలిగింది. మదీనహ్ వచ్చిన తర్వాత మేము ప్రవక్త (స)కు దాన్ని గురించి విన్నవించుకున్నాం. దానికి ప్రవక్త (స), ‘అల్లాహ్‌ (త) ఉపాధిని తినండి. దాన్ని అల్లాహ్‌ (త) మీ కోసం పంపాడు. ఒకవేళ మీ దగ్గర ఉంటే మాకు కూడా తినిపించండి’ అని అన్నారు. మేము మా దగ్గర ఉన్నదాన్ని ప్రవక్త(స)కు పంపాము. ప్రవక్త (స) దాన్ని ఆరగించారు.”  [19]  (బు’ఖారీ, ముస్లిమ్‌)

4115 – [ 12 ] ( صحيح ) (2/1200)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم قَالَ: “إِذَا وَقَعَ الذُّبَابُ فِيْ إِنَاءِ أَحَدِكُمْ فَلْيَغْمِسْهُ كُلَّهُ ثُمَّ لِيَطْرَحْهُ فَإِنَّ فِيْ أَحَدِ جَنَاحَيْهِ شِفَاءً وَفِيْ الْآخَرِ دَاءً”. رَوَاهُ الْبُخَارِيُّ.

4115. (12) [2/1200దృఢం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మీ ఆహార పానీయాల్లో ఈగ పడితే, దాన్ని ముంచి తీసి పార వేయాలి. ఎందుకంటే ఈగ రెండు రెక్కల్లోని ఒక రెక్కలో స్వస్థత ఉంటుంది. మరో రెక్కలో వ్యాధి మరియు విషం ఉంటుంది. ఈగ వాటిలో పడినపుడు వ్యాధి, విషం ఉన్న రెక్క వైపు వంగి పడుతుంది. స్వస్థత గల రెక్క పైన ఉంచుతుంది. దాన్ని ముంచడం వల్ల స్వస్థత గల రెక్క కూడా మునిగిపోతుంది. దాని వల్ల విషయం విరిగి పోతుంది. (బు’ఖారీ)

4116 – [ 13 ] ( صحيح ) (2/1200)

وَعَنْ مَيْمُوْنَةَ أَنَّ فَأرَةً وَقَعَتْ فِيْ سَمْنٍ فَمَاتَتْ فَسُئِلَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم فَقَالَ: “أَلْقُوْهَا وَمَا حَوْلَهَا وَكُلُوْهُ”. رَوَاهُ الْبُخَارِيُّ .

4116. (13) [2/1200దృఢం]

మైమూనహ్ (ర) కథనం: నెయ్యిలో ఎలుకపడి పోయింది. ప్రవక్త (స)ను నేను దీన్ని గురించి సలహా కోరాను. దానికి ప్రవక్త (స) ఎలుకను దాచి చుట్టుప్రక్కల నెయ్యిని పారవేసి మిగిలిన నెయ్యిని ఉపయోగించ వచ్చని  ఉపదేశించారు.  (బు’ఖారీ)

4117 – [ 14 ] ( متفق عليه ) (2/1201)

وَعَنِ ابْنِ عُمَرَأَنَّهُ سَمِعَ النَّبِيّ صلى الله عليه وسلم يَقُوْلُ: “اقْتُلُوا الْحَيَّاتِ وَاقْتُلُوْا ذَا الطُّفَيَّتَيْنِ وَالْأَبْتَرَ فَإِنَّهُمَا يَطْمِسَانِ الْبَصَرَ وَ يَسْتَسْقِطَانِ الْحَبَلَ. قَالَ عَبْدُ اللهِ: فَبَيْنَا أَنَا أُطَارِدُ حَيَّةً أَقْتُلُهَا نَادَانِيْ أَبُوْ لُبَابَةَ: لَا تَقْتُلْهَا فَقُلْتُ: إِنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم أَمَرَبِقَتْلِ الْحَيَّاتٍ.فَقَالَ: إِنَّهُ نَهَى بَعْدَ ذَلِكَ عَنْ ذَوَاتِ الْبُيُوْتِ وَهُنَّ الْعَوَامِرُ.

4117. (14) [2/1201ఏకీభవితం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘ఉమర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ఇలా అంటూ ఉండగా మేము విన్నాము, ”పాములు ఎక్కడ కనబడినా చంపివేయండి. ప్రత్యేకంగా వీపుపై రెండు గీతలు ఉన్న, తోక చిన్నదిగా ఉన్న పాములను చంపివేయండి. ఈ రెండు రకాల పాములు చాలా ప్రమాదకరమైనవి. ఇవి దృష్టిని దోచు కుంటాయి. అంటే వాటిని చూడటం వల్ల మనిషి అంధుడైపోతాడు. స్త్రీల గర్భాన్ని తొలగించివేస్తాయి. అంటే గర్భిణీ స్త్రీ దాన్ని చూస్తే, భయం వల్ల గర్భస్రావం అయిపోతుంది. ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘ఉమర్‌ (ర) కథనం, ”ఒకసారి నేను ఒక పామును చంపటానికి ప్రయత్నించాను. అప్పుడు అబూ లుబాబహ్ ‘చంపవద్దు’ అని కేకవేసారు. దానికి నేను ప్రవక్త(స) చంపమని ఆదేశించారని అన్నాను. దానికి అతడు ఆ తరువాత వారించారు. ఇవి ఇళ్ళల్లో ఉంటాయి, ఇవి మాత్రం ప్రమాదకరమైనవికావు అని అన్నారని చెప్పారు.  (బు’ఖారీ, ముస్లిమ్‌)

4118 – [ 15 ] ( صحيح ) (2/1201)

وَعَنْ أَبِي السَّائِبِ قَالَ: دَخَلْنَا عَلَى أَبِيْ سَعِيْدِ الْخُدْرِيِّ فَبَيْنَمَا نَحْنُ جُلُوْسٌ إِذْ سَمِعْنَا تَحْتَ سَرِيْرِهِ فَنَظَرْنَا فَإِذَا فِيْهِ حَيَّةٌ فَوَثَبْتُ لِأَقْتُلَهَا وَأَبُوْ سَعِيْدٍ يُصَلِّيْ فَأَشَارَ إِلَيَّ أَنِ أجْلِسْ فَجَلَسْتُ فَلَمَّا انْصَرَفَ أَشَارَ إِلى بَيْتٍ فِي الدَّارِ فَقَالَ: أَتَرَى هَذَا الْبَيْتَ؟ فَقُلْتُ: نَعَمْ فَقَالَ: كَانَ فِيْهِ فَتَى مِنَّا حَدِيْثُ عَهْدٍ بِعُرْسٍ قَالَ: فَخَرَجْنَا مَعَ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم إِلى الْخَنْدَقِ فَكَانَ ذَلِكَ الْفَتَى يَسْتَأْذِنُ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم بِأَنْصَافِ النَّهَارِ فَيَرْجِعُ إِلى أَهْلِهِ فَاسْتَأْذَنَهُ يَوْمًا. فَقَالَ لَهُ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “خُذْ عَلَيْكَ سِلَاحَكَ فَإِنِّيْ أَخْشَى عَلَيْكَ قُرَيْظَةَ”. فَأَخَذَ الرَّجُلُ سِلَاحَهُ ثُمَّ رَجَعَ فَإِذَا امْرَأَتُهُ بَيْنَ الْبَابَيْنِ قَائِمَةٌ فَأَهْوَى إِلَيْهَا بِالرُّمْحِ لِيَطْعَنَهَا بِهِ وَأَصَابَتْهُ غَيْرَةٌ فَقَالَتْ لَهُ: اُكْفُفْ عَلَيْكَ رُمَحَكَ وَادْخُلِ الْبَيْتَ حَتّى تَنْظُرَ مَا الَّذِيْ أَخْرَجَنِيْ فَدَخَلَ فَإِذَا بَحَيَّةٍ عَظِيْمَةٍ مُنْطَوِيَةٍ عَلَى الْفِرَاشِ فَأَهْوَى إِلَيْهَا بِالرُّمْحِ فَانْتَظَمَهَا بِهِ ثُمَّ خَرَجَ فَرَكَزَهُ فِي الدِّارِ فَاضْطَرَبَتْ عَلَيْهِ فَمَا يَدْرِيْ أَيُّهُمَا كَانَ أَسْرَعَ مَوْتًا: اَلْحَيَّةُ أَمِ الْفَتَى؟ قَالَ: فَجِئْنَا رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم وَذَكَرْنَا ذَلِكَ لَهُ وَقُلْنَا: اُدْعُ اللهَ يُحْيِيْهِ لَنَا فَقَالَ: “اسْتَغْفِرُوْا لِصَاحِبِكُمْ ” ثُمَّ قَالَ: “إِنَّ لِهَذِهِ الْبُيُوْتِ عَوَامِرَ فَإِذَا رَأَيْتُمْ مِنْهَا شَيْئًا فَحَرِّجُوْا عَلَيْهَا ثَلَاثًا فَإِنْ ذَهَبَ وَإِلَّا فَاقْتُلُوْهُ فَإِنَّهُ كَافِرٌ”. وَقَالَ لَهُمْ: “اِذْهَبُوْا فَادْفِنُوْا صَاحِبَكُمْ”

وَفِيْ رِوَايَةٍ قَالَ: “إِنَّ بِالْمَدِيْنَةِ جِنًّا قَدْ أَسْلَمُوْا فَإِذَا رَأَيْتُمْ مِنْهُمْ شَيْئًا فَآذِنُوْهُ ثَلَاثَةَ أَيَّامٍ فَإِنْ بَدَا لَكُمْ بَعْدَ ذَلِكَ فَاقْتُلُوْهُ فَإِنَّمَا هُوَ شَيْطَانٌ”. رَوَاهُ مُسْلِمٌ.

4118. (15) [2/1201దృఢం]

అబూ సాయి’బ్‌ (ర) కథనం: నేను అబూ స’యీద్‌ ‘ఖుద్రీ (ర) ఇంటికి వెళ్ళాను. మేము కూర్చొని ఉన్నాం. అతని మంచం క్రింద అలజడి గ్రహించి చూస్తే అది పాము. నేను దాన్ని చంపటానికి వెంటనే సిద్ధపడ్డాను. అప్పుడు అబూ స’యీద్‌ ‘ఖుద్రీ (ర) నమా’జు చదువుతున్నారు. అతను కూర్చోమని సైగచేసారు. అతను తన నమా’జును ముగించిన తర్వాత ఇంట్లోని ఒక గదిని సూచిస్తూ, ‘ఈ గదిని చూసావా,’ అని అన్నారు. దానికి నేను, ‘అవును,’ అని అన్నాను. దానికి అబూ స’యీద్‌ ‘ఖుద్రీ (ర) ఈ గదిలో మా కుటుంబానికి చెందిన ఒక యువకుడు ఉండేవాడు. అతడికి అప్పుడప్పుడే వివాహం జరిగి ఉండేది. నేను, ఆ యువకుడు ప్రవక్త (స) వెంట కందకం యుద్ధంలో పాల్గొన్నాము. ఆ యువకుడు మధ్యాహ్నం వేళ ప్రవక్త (స) అనుమతితో ఇంటికి వచ్చేవాడు. రాత్రి ఇంట్లో ఉండి ఉదయం వచ్చేవాడు. ఒకరోజు అలవాటు ప్రకారం ప్రవక్త (స)ను అనుమతి కోరగా ప్రవక్త (స) తనతో పాటు ఆయుధాలు కూడా తీసుకొని వెళ్ళు, బనూ ‘ఖురై”జహ్ వల్ల నీకు ముప్పు ఉందని,’ అన్నారు. ఆ యువకుడు ఆయుధాలు ధరించి ఇంటికి బయలు దేరాడు. ఇంటికి చేరేసరికి అతని భార్య ఇంటి గుమ్మం దగ్గర నిలబడి ఉంది. పౌరుషంతో భార్యపట్ల ఆగ్రహంతో చూచే సరికి భార్య, ‘ఆయుధాలు వెతకండి, ముందు లోపలికి వెళ్ళి చూడండి, దేనివల్ల నేను బయటకు వచ్చానో తెలు స్తుంది,’ అని అన్నది. ఆ యువకుడు ఇంట్లోకి ప్రవే శించి చూడగా పడకపై ఒక పాము ఉంది. ఆ యువ కుడు బల్లెంతో దాడిచేసాడు, ఆపాము కూడా అతన్ని కాటువేసింది. అతడు దాన్ని బల్లెంతో గుచ్చి ఇంటి బయటకు తీసుకొని వచ్చి ప్రాంగణంలో దాన్ని పాతి పెట్టాడు. పాము ఆ బల్లెంతో విలవిలలాడుతూ ప్రాణాలు విడిచింది. ఫలితంగా వారిద్దరిలో ఎవరు ముందు చచ్చారో తెలియలేదు. అంటే ఇద్దరూ చచ్చారు.

అబూ స’యీద్‌ ‘ఖుద్రీ (ర) కథనం: మేము ప్రవక్త (స) వద్దకు వెళ్ళాము. ఈ సంఘటన గురించి వివరించాము. ప్రవక్త (స)ను ఆ యువకుడ్ని అల్లాహ్‌(త) సజీవ పరచాలని దు’ఆ చేయమని విన్నవించుకున్నాం. ప్రవక్త (స) మీ స్నేహితుడ్ని గురించి క్షమాపణ కోరండి, ఇళ్ళల్లో తిరిగే సృష్టితాలూ ఉంటాయి. అంటే విశ్వాస జిన్నులు, అవిశ్వాస జిన్నులు, అవి పాముల రూపాల్లో కనిపిస్తాయి. మీలో ఎవరికైనా అవి పాముల రూపంలో కనబడితే, మీ వల్ల మాకు ఆందోళనగా ఉంది, కనుక మీరు ఇక్కడి నుండి వెళ్ళిపోండి అని చెప్పండి. అవి వెళ్ళిపోతే సరే లేదా వాటిని చంపివేయండి. ఎందుకంటే అవి అవిశ్వాసులు. ఆ తర్వాత అన్సార్లతో, ‘వెళ్ళి మీ సోదరుని ఖనన సంస్కారాలు పూర్తిచేయండి,’ అని అన్నారు. మరో ఉల్లేఖనంలో ఇలా ఉంది: ”ప్రవక్త(స) మదీనహ్లో జిన్నుల బృందం ఒకటి ఉంది. అది ఇస్లామ్‌ స్వీకరించింది. మీలో  ఎవరైనా వారిని పాము రూపంలో చూస్తే వారికి మూడు రోజులు గడువు, ఇచ్చి వేయండి, రెండు మూడు రోజుల తర్వాత అవి కనబడితే వాటిని చంపివేయండి. ఎందుకంటే అవి షైతానులు.” (ముస్లిమ్‌)

4119 – [ 16 ] ( متفق عليه ) (2/1202)

وَعَنْ أُمِّ شَرِيْكٍ: أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم أَمَرَ بِقَتْلِ الْوَزَغِ وَقَالَ: “كَانَ يَنْفَخُ عَلَى إِبْرَاهِيْمَ”.

4119. (16) [2/1202ఏకీభవితం]

ఉమ్మె షరీక్‌ (ర) కథనం: ప్రవక్త (స) తొండను (బల్లిని?) చంపమని ఆదేశించారు. ఇంకా ఇది ఇబ్రాహీమ్‌ (అ) పై అగ్ని జ్వాలను విసిరేది. [20] (బు’ఖారీ, ముస్లిమ్‌)

4120 – [ 17 ] ( صحيح ) (2/1202)

وَعَنْ سَعْدِ بْنِ أَبِيْ وَقَّاصٍ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم أَمَرَ بِقَتْلِ الْوَزَغِ وَسَمَّاهُ فَوَيْسِقًا. روَاهُ مُسْلِمٌ .

4120. (17) [2/1202దృఢం]

స’అద్‌ బిన్‌ అబీ వఖ్ఖా’స్‌ (ర) కథనం: ప్రవక్త (స) తొండ హానికరమైనదని, దాన్ని చంపివేయమని ఆదేశించారు. (ముస్లిమ్‌)

4121 – [ 18 ] ( صحيح ) (2/1202)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم قَالَ: “مَنْ قَتَلَ وَزَغًا فِي أَوَّلِ ضَرْبَةٍ كُتِبَتْ لَهُ مِائَةُ حَسَنَةٍ وَفِي الثَّانِيَةِ دُوْنَ ذَلِكَ وَفِي الثَّالِثَةِ دُوْنَ ذَلِكَ”. رَوَاهُ مُسْلِمٌ

4121. (18) [2/1202దృఢం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఒకే ఒక్క దెబ్బతో తొండను చంపినవారి కర్మల పత్రంలో 100 పుణ్యాలు లిఖించబడతాయి. రెండు దెబ్బల్లో చంపితే అంత కంటే తక్కువ పుణ్యం, మూడు దెబ్బల్లో చంపితే అంతకంటే తక్కువ పుణ్యం లిఖించబడతాయి.”  [21]  (ముస్లిమ్‌)

4122 – [ 19 ] ( متفق عليه ) (2/1202)

وَعَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “قَرَصَتْ نَمْلَةٌ نَبِيًّا مِّنَ الْأَنْبِيَاءِ فَأَمَرَ بِقَرْبَةِ النَّمْلِ فَأُحْرِقَتْ فَأَوْحَى اللهُ تَعَالى إِلَيْهِ: أضنْ قَرَصَتْكَ نَمْلَةٌ أَحْرَقْتَ أُمَّةً مِّنَ الْأُمَمِ تُسَّبِحُ؟”

4122. (19) [2/1202ఏకీభవితం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ప్రాచీన కాలంలో ఒక ప్రవక్తకు చీమ కుట్టింది. ఆ ప్రవక్త చీమల పుట్టలను కాల్చమని ఆదేశించారు. ఆదేశం ప్రకారం కాల్చివేయబడ్డాయి. అల్లాహ్‌ (త) అతని వద్దకు ”నీకు కేవలం ఒక్క చీమ కుట్టింది, మరి చీమల పుట్టల నెందుకు కాల్పించావు? ఇవి కూడా ఇతర సృష్టితాల్లానే దైవ సృష్టితాలు. ఇవి కూడా అల్లాహ్‌ను స్మరిస్తూ ఉంటాయి,” అని దైవవాణి పంపాడు. [22] (బు’ఖారీ, ముస్లిమ్‌)

—–

اَلْفَصْلُ الثَّانِيْ రెండవ విభాగం 

4123 – [ 20 ] ( لم تتم دراسته ) (2/1202)

عَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِذَا وَقَعَتِ الْفَأْرَةُ فِي السَّمْنِ فَإِنْ كَانَ جَامِدًا فَأَلْقُوْهَا وَمَا حَوْلَهَا وَإِنْ كَانَ مَائِعًا فَلَا تَقْرَبُوْهُ”. روَاهُ أَحْمَدُ وَأَبُوْ دَاوُدَ .

4123. (20) [2/1202అపరిశోధితం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ఇలా ప్రవచించారు, ”ఎలుక నెయ్యిలో పడిపోతే, నెయ్యి గడ్డ కట్టు కొని ఉంటే, ఎలుకను, దాని చుట్టూ ఉన్న నెయ్యిని తీసి పారవెయ్యండి. ఒకవేళ నెయ్యి తన అసలు స్థితిలో (గడ్డకట్టుకొనకుండా) ఉంటే దాన్ని తినకండి.” (అ’హ్మద్‌, అబూ దావూద్‌)

4124 – [ 21 ] ( لم تتم دراسته ) (2/1202)

وَرَوَاهُ الدَّارَمِيُّ عَنِ ابْنِ عَبَّاسٍ .

4124. (21) [2/1202అపరిశోధితం]

ఇబ్నె ‘అబ్బాస్‌ (ర) కథనం. (దార్మి)

4125 – [ 22 ] ( لم تتم دراسته ) (2/1203)

وَعَنْ سَفِيْنَةَ قَالَ: أَكَلْتُ مَعَ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم لَحْمَ حُبَارَى. رَوَاهُ أَبُوْ دَاوُدَ.

4125. (22) [2/1203అపరిశోధితం]

సఫీనహ్ (ర) కథనం: ప్రవక్త (స) వెంట నేను హుబారా పక్షి మాంసం తిన్నాను. (అబూ దావూద్‌)

4126 – [ 23 ] ( لم تتم دراسته ) (2/1203)

وَعَنِ ابْنِ عُمَرَ قَالَ: نَهَى رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم عَنْ أَكْلِ الْجَلَّالَةِ وَأَلْبَانِهَا. رَوَاهُ التِّرْمِذِيُّ

وَفِيْ رِوَايَةٍ أَبِيْ دَاوُدَ: قَالَ: نَهَى عَنْ رَكُوْبِ الْجَلَالَةِ .

4126. (23) [2/1203అపరిశోధితం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘ఉమర్‌ (ర) కథనం: ప్రవక్త (స) మలం తినే జంతువు తినటాన్ని, దాని పాలు త్రాగ టాన్ని, దానిపై స్వారీచేయటాన్ని నిషేధించారు.[23] (తిర్మిజి’, అబూ  దావూద్‌)

4127 – [ 24 ] ( حسن ) (2/1203)

وَعَنْ عَبْدِ الرَّحْمنِ بْنِ شِبْلٍ: أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم نَهَى عَنْ أَكْلِ لَحْمِ الضَّبِّ. رَوَاهُ أَبُوْ دَاوُدَ .

4127. (24) [2/1203 ప్రామాణికం]

‘అబ్దుర్ర’హ్మాన్‌ బిన్‌ షిబ్‌ల్‌ (ర) కథనం: ప్రవక్త (స) అడవి దున్న మాంసం తినరాదని వారించారు. (అబూ దావూద్‌)

4128 – [ 25 ] ( لم تتم دراسته ) (2/1203)

وَعَنْ جَابِرٍ رَضِيَ اللهُ عَنْهُ:  أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم نَهَى عَنْ أَكْلِ الْهِرَّةِ وَأَكْلِ ثَمَنِهَا. رَوَاهُ أَبُوْ دَاوُدَ وَالتِّرْمِذِيُّ .

4128. (25) [2/1203అపరిశోధితం]

జాబిర్‌ (ర) కథనం: ప్రవక్త (స) పిల్లి మాంసాన్ని, దాని ఖరీదు తినటాన్ని నిషేధించారు. (అబూ దావూద్, తిర్మిజి’)

ఈ ‘హదీసు’ ద్వారా పిల్లిని తినటం అధర్మం అని తెలిసింది. అదేవిధంగా పిల్లిని అమ్మటం, కొనడం కూడా నిషిద్ధమే.

4129 – [ 26 ] ( لم تتم دراسته ) (2/1203)

وَعَنْهُ حَرَّمَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم يَعْنِي يَوْمَ خَيْبَرَ الْحُمُرَ الْإِنْسِيَّةَ وَلُحُوْمَ الْبِغَالِ وَكُلّ ذِيْ نَابٍ مِّنَ السِّبَاعِ وَكُلّ ذِيْ مِخْلَبٍ مِّنَ الطَّيْرِ. رَوَاهُ التِّرْمِذِيُّ وَقَالَ: هذَا حَدِيْثٌ غَرِيْبٌ.

4129. (26) [2/1203అపరిశోధితం]

జాబిర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ‘ఖైబర్‌ నాడు పెంపుడు గాడిదల, కంచర గాడిదల, పీక్కుతినే క్రూర జంతువుల మాంసాన్ని నిషేధించారు. (తిర్మిజి’ /  ఏకోల్లేఖనం)

4130 – [ 27 ] ( لم تتم دراسته ) (2/1203)

وَعَنْ خَالِدِ بْنِ الْوَلِيْدِ: أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم نَهَى عَنْ أَكْلِ لُحُوْمِ الْخَيْلِ وَالْبِغَالِ وَالْحَمِيْرِ. رَوَاهُ أَبُوْ دَاوُدَ وَالنَّسَائِيُّ.

4130. (27) [2/1203అపరిశోధితం]

‘ఖాలిద్‌ బిన్‌ వలీద్‌ (ర) కథనం: ప్రవక్త (స) గుర్రం, కంచర గాడిద, గాడిదల మాంసాన్ని నిషేధించారు. (అబూ  దావూద్‌, నసాయి’)

4131 – [ 28 ] ( لم تتم دراسته ) (2/1203)

وَعَنْهُ قَالَ: غَزَوْتُ مَعَ النَّبِيِّ صلى الله عليه وسلم يَوْمَ خَيْبَرَ فَأَتَتِ الْيَهُوْدُ فَشَكَوْا أَنَّ النَّاسَ قَدْ أَسْرَعُوْا إِلَى خَضَائِرِهِمْ. فَقَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “أَلَا لَا يَحِلُّ أَمْوَالُ الْمَعَاهِدِيْنَ إِلَّا بِحَقِّهَا”. رَوَاهُ أَبُوْ دَاوُدَ .

4131. (28) [2/1203అపరిశోధితం]

‘ఖాలిద్‌ బిన్‌ వలీద్‌ (ర) కథనం: నేను ‘ఖైబర్‌ యుద్ధంలో ప్రవక్త (స)కు తోడుగా ఉన్నాను. యూదులు వచ్చి, ‘మీ వారు మా తోటల్లో ప్రవేశించి పళ్ళను తెంపుకున్నారు, అయితే మేము ఒప్పందానికి కట్టుబడి ఉన్నాం. అంటే మేము మీ అధీనంలో ఉన్నాం,’ అని ఫిర్యాదు చేసారు. అప్పుడు ప్రవక్త (స), ‘ఒప్పందం కుదుర్చుకున్నవారి ధనం సంపదలను దోచుకోవటం ధర్మం కాదు. అయితే దాని హక్కు ద్వారా అంటే పన్ను లేదా పరిహారంద్వారా’ అని అన్నారు.(అబూ దావూద్‌)

4132 – [ 29 ] ( جيد ) (2/1203)

وعَنْ ابن عمر قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “أُحِلَّتْ لَنَا مَيْتَتَانِ وَدَمَانِ: اَلْمَيْتَتَانِ: اَلْحُوْتُ وَالْجَرَادُ وَالدَّمَانِ: اَلْكَبِدُ وَالطِّحَالُ”. رَوَاهُ أَحْمَدُ وَابْنُ مَاجَهُ وَالدَّارَقُطْنِيُّ .

4132. (29) [2/1203 ఆమోదయోగ్యం]

అబ్దుల్లాహ్‌ బిన్‌ ఉమర్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”రెండు రకాల మృతులు, రెండు రకాల రక్తాలు మన కోసం ధర్మసమ్మతం చేయబడ్డాయి. రెండు రకాల మృతులు అంటే చేపలు, సముద్రపు పక్షులు, రెండు రకాల రక్తాలు అంటే కలీజి, తిల్లీ.” (అహ్మద్‌, ఇబ్నె మాజహ్, దారు ఖుతునీ)

4133 – [ 30 ] ( لم تتم دراسته ) (2/1204)

وَعَنْ أَبِيْ الزُّبَيْرِ عَنْ جَابِرٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَا أَلْقَاهُ الْبَحْرُ وَجَزَرَ عَنْهُ الْمَاءُ فَكُلُوْهُ وَمَا مَاتَ فِيْهِ وَطَفاَ فَلَا تَأْكُلُوْهُ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ وَابْنُ مَاجَهُ وَقَالَ مُحْييُ السُّنَّةِ: اَلْأَكْثَرُوْنَ عَلى أَنَّهُ مَوْقُوْف عَلَى جَابِرٍ .

4133. (30) [2/1204అపరిశోధితం]

జాబిర్‌(ర) ద్వారా అబూ ‘జుబైర్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”సముద్రం నుండి ఒడ్డుకు కొట్టుకు వచ్చిన దాన్ని తినవచ్చును. అయితే సముద్రంలో పడి చనిపోయి, ఉబ్బి పైకి తేలుతూ ఉండేదాన్ని మాత్రం తినకండి.” (అబూ దావూద్‌, ఇబ్నె మాజహ్, ము’హ్యియ్ సున్నహ్ /  జాబిర్  ప్రోక్తం)

4134 – [ 31 ] ( لم تتم دراسته ) (2/1204)

وَعَنْ سَلْمَانَ قَالَ: سُئِلَ النَّبِيُّ صلى الله عليه وسلم عَنِ الْجَرَادِ فَقَالَ: “أَكْثَرُ جُنُوْدِ اللهِ لَا آكُلُهُ وَلَا أُحَرِّمُهُ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ وَقَالَ مُحْيُي السُّنَّةِ: ضَعِيْفٌ .

4134. (31) [2/1204అపరిశోధితం]

సల్మాన్‌ (ర) కథనం: ప్రవక్త(స)ను సముద్రపు పక్షుల గురించి ప్రశ్నించగా అవి దైవ సృష్టితాలని, నేను వాటిని తిన్నాను, అవి నిషిద్ధం అని చెప్పను అని అన్నారు. (అబూ దావూద్‌, ము’హ్యియ్ సున్నహ్ /  ‘దయీఫ్‌)

4135 – [ 32 ] ( لم تتم دراسته ) (2/1204)

وَعَنْ زَيْدِ بْنِ خَالِدٍ قَالَ: نَهَى رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم عَنْ سَبِّ الدِّيْكِ وَقَالَ: “إِنَّهُ يُؤَذِّنُ لِلصَّلَاةِ”.  روَاهُ أَبُوْ دَاوُدَ.

4135. (32) [2/1204అపరిశోధితం]

జైద్‌ బిన్‌ ‘ఖాలిద్‌ (ర) కథనం: ప్రవక్త (స) కోడి పుంజును తిట్టటాన్ని వారించారు. ఎందుకంటే అది నమా’జుకు లేపుతుంది. (షర్‌’హు స్సున్నహ్‌)

4136 – [ 33 ] ( صحيح ) (2/1204)

وَعَنْهُ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَا تَسُبُّوا الدِّيْكَ فَإِنَّهُ يُوْقِظُ لِلصَّلَاةِ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ.

4136. (33) [2/1204దృఢం]

జైద్‌ బిన్‌ ‘ఖాలిద్‌ (ర) కథనం: ప్రవక్త (స) కోడి పుంజును తిట్టకండని, ఎందుకంటే అది నమా’జు కోసం లేపుతుందని ప్రవచించారు. (అబూ  దావూద్‌)

4137 – [ 34 ] ( لم تتم دراسته ) (2/1204)

وَعَنْ عَبْدِ الرَّحْمنِ بْنِ أَبِيْ لَيْلَى قَالَ: قَالَ أَبُوْ لَيْلَى: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِذَا ظَهَرَتِ الْحَيَّةُ فِي الْمَسْكَنِ فَقُوْلُوْا لَهَا: إِنَّا نَسْأَلُكَ بِعَهْدِ نُوْحٍ وَبِعَهْدٍ سُلَيْمَانَ بْنِ دَاوُدَ أَنْ لَا تُؤْذِيْنَا فَإِنْ عَادَتْ فَاقْتُلُوْهَا”. رَوَاهُ التِّرْمِذِيُّ وَأَبُوْ دَاوُدَ .

4137. (34) [2/1204అపరిశోధితం]

‘అబ్దుర్ర’హ్మాన్‌ బిన్‌ అబీ లైలా ప్రకారం అబూ లైలా కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఒకవేళ ఎవరి ఇంట్లోనైనా పాము కనబడితే, ‘మేము నూహ్‌, సులైమాన్‌ (అ)ల కాలం ద్వారా నిన్ను విన్నవించు కుంటున్నాం. నీవు మమ్మల్ని హింసించకు,’ అని పలకాలి, ఆ తరువాత కూడా కనబడితే దాన్ని చంపివేయండి.” (తిర్మిజి’, అబూ  దావూద్‌)

నూహ్‌ (అ) ఓడపైకి ఎక్కినప్పుడు పాములతో, ఇతర హానికరమైన జంతువులతో మానవులెవరినీ హాని చేకూర్చమని వాగ్దానం తీసుకున్నారు.

4138 – [ 35 ] ( لم تتم دراسته ) (2/1204)

وَعَنْ عِكْرَمَةَ عَنِ ابْنِ عَبَّاسٍ قَالَ: لَا أَعْلَمُهُ إِلَّا رَفَعَ الْحَدِيْثَ: أَنَّهُ كَانَ يَأْمُرُ بِقَتْلِ الْحَيَّاتِ وَقَالَ: “مَنْ تَرَكَهُنَّ خَشْيَةَ ثَائِرٍ فَلَيْسَ مِنَّا”. رَوَاهُ فِيْ شَرْحِ السُّنَّةِ.

4138. (35) [2/1204అపరిశోధితం]

‘ఇక్రమహ్, ఇబ్నె ‘అబ్బాస్‌ (ర) ద్వారా కథనం: ఇది ప్రామాణికమైన ‘హదీసు’ అని వారి అభిప్రాయం. ”ప్రవక్త (స) పాములను చంపమని ఆదేశించేవారు. అంతేకాదు, దాన్ని చంపితే, దానికి బదులుగా మరొకటి ప్రతీకారం తీర్చు కుంటుందని భావించి దాన్ని వదలివేసిన వారు ముస్లిమ్‌ కాడు.”  అని ప్రవచించారు. (ష’ర్హుస్సున్నహ్)

4139 – [ 36 ] ( لم تتم دراسته ) (2/1204)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَا سَالَمْنَاهُمْ مُنْذُ حَارَبْنَاهُمْ وَمَنْ تَرَكَ شَيْئًا مِنْهُمْ خِيْفَةً فَلَيْسَ مِنَّا”. رَوَاهُ أَبُوْ دَاوُدَ .

4139. (36) [2/1204అపరిశోధితం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) పాముల గురించి మాట్లాడుతూ, ”మేము వారితో యుద్ధం చేసి నప్పటి నుండి మాకు వారికి మధ్య ఒప్పందం కుదర లేదు. ఎవరైనా పామును చంపితే దాని జత ప్రతీకారం తీర్చుకుంటుందని భయపడి చంపడం వదలివేసిన వాడు ముస్లిమ్‌ కాడు.”  [24] (అబూ  దావూద్‌)

4140 – [ 37 ] ( لم تتم دراسته ) (2/1205)

وَعَنِ ابْنِ مَسْعُوْدٍ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “اُقْتُلُوْا الْحَيَّاتِ كُلَّهنَّ فَمَنْ خَافَ ثَأْرَهُنَّ فَلَيْسَ مِنِّيْ”. روَاهُ أَبُوْ دَاوُدَ وَ النَّسَائِيُّ.

4140. (37) [2/1205అపరిశోధితం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ మస్‌’ఊద్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”పాములన్నిటినీ చంపండి. వాటిని చంపటానికి భయపడేవారు ముస్లిములు కారు.” (అబూ  దావూద్‌, నసాయి’)

అయితే ఇళ్ళల్లోతిరిగే విషం లేని పాములను కాదు.

4141 – [ 38 ] ( لم تتم دراسته ) (2/1205)

وَعَنِ الْعَبَّاسِ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: يَا رَسُوْلَ اللهِ إِنَّا نُرِيْدُ أَنْ نَكْنِسَ زَمْزَمَ وَإِنَّ فِيْهَا مِنْ هَذِهِ الْجِنَّانِ يَعْنِيْ اَلْحَيَّاتِ الصِّغَارَ فَأَمَرَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم بِقَتْلِهِنَّ. رَوَاهُ أَبُوْ دَاوُدَ .

4141. (38) [2/1205అపరిశోధితం]

‘అబ్బాస్‌ (ర) కథనం: ఓ ప్రవక్తా! మేము ‘జమ్‌’జమ్‌ నుయ్యిని శుభ్రపరచగోరుతున్నాం. కాని అందులో అనేక చిన్న చిన్న పాములు ఉన్నాయి. ఏమి చేయాలి అని విన్నవించుకున్నారు. దానికి ప్రవక్త (స) వాటన్నిటినీ చంపివేయమని ఆదేశించారు. [25] (అబూ దావూద్‌)

4142 – [ 39 ] ( لم تتم دراسته ) (2/1205)

وَعَنِ ابْنِ مَسْعُوْدٍ رَضِيَ اللهُ عَنْهُ أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم قَالَ : ” اُقْتُلُوْا الْحَيَّاتِ كُلُّهَا إِلَّا الْجَانَّ الْأَبْيَضَ الَّذِيْ كَأَنَّهُ قَضِيْبُ فِضَّةٍ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ .

4142. (39) [2/1205అపరిశోధితం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ మస్‌’ఊద్‌ (ర) కథనం: ప్రవక్త (స) అన్నిరకాల పాములను చంపమని ఆదేశించారు. అయితే తెల్లని చిన్న పాములను చంపవద్దని, ఎందు కంటే అవి హానిచేకూర్చవని ప్రవచించారు. (అబూ దావూద్‌)

4143 – [ 40 ] ( صحيح ) (2/1205)

وَعَنْ أَبِيْ هُرَيْرَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِذَا وَقَعَ الذُّبَابُ فِيْ إِنَاءِ أَحَدِكُمْ فَامْقُلُوْهُ. فَإِنَّ فِيْ أَحَدٍ جَنَاحَيْهِ دَاءً وَفِي الْآخَرِ شَفَاءً فَإِنَّهُ يَتَّقِيْ بِجَنَاحِهِ الَّذِيْ فِيْهِ الدَّاءُ فَلْيَغْمِسْهُ كُلَّهُ”. رَوَاهُ أَبُوْ دَاوُدَ.

4143. (40) [2/1205దృఢం]

అబూ హురైరహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మీ గిన్నెలో ఈగ పడిపోతే దాన్ని ముంచి తీసి పారవేయండి. ఎందుకంటే దాని ఒకరెక్కలో వ్యాధి, మరోరెక్కలో స్వస్థత ఉంటుంది. అది పడినపుడు వ్యాధిగల రెక్క వైపు పడుతుంది. మీరు దాన్ని పూర్తిగా ముంచటం వల్ల రెండు రెక్కలు మునిగి వ్యాధిని స్వస్థత తొలగిస్తుంది.” (అబూ  దావూద్‌)

4144 – [ 41 ] ( صحيح ) (2/1205)

وَعَنْ أَبِيْ سَعِيْدِ الْخُدْرِيِّ رَضِيَ اللهُ عَنْهُ عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ: “إِذَا وَقَعَ الذُّبَابُ فِي الطَّعَامِ فَامْقُلُوْهُ فَإِنَّ فِي أَحَدٍ جَنَاحَيْهِ سَمًّا وَفِي الْآخَرِ شِفَاءً وَإِنَّهُ يُقدِّمُ السّمّ وَيُؤَخِرُ الشِّفَاءَ”. رَوَاهُ فِي شَرْحِ السُّنَّةِ .

4144. (41) [2/1205దృఢం]

అబూస’యీద్‌ ‘ఖుద్రీ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మీ ఆహార పానీయాల్లో ఈగ పడిపోతే దాన్ని పూర్తిగా ముంచివేయండి. దాని ఒక రెక్కలో విషం, మరో రెక్కలో స్వస్థత ఉంది. అది విషం గల రెక్క వైపు పడుతుంది. స్వస్థతగల రెక్కను పైన ఉంచుతుంది.” (షర్‌’హు స్సున్నహ్)

4145 – [ 42 ] ( لم تتم دراسته ) (2/1205)

وَعَنِ ابْنِ عَبَّاسٍ قَالَ: نَهَى رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم عَنْ قَتْلِ أَرْبَعٍ مِّنَ الدَّوَابِّ: اَلنَّمْلَةِ وَالنَّحْلَةِ وَالْهُدْهُدِ وَالصُّرَدِ. رَوَاهُ أَبُوْ دَاوُدَ وَالدَّارَمِيُّ .

4145. (42) [2/1205అపరిశోధితం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘అబ్బాస్‌ (ర) కథనం: ప్రవక్త (స) నాలుగు రకాల ప్రాణులను చంపటాన్ని నిషేధించారు. 1. చీమలు 2. తేనెటీగలు 3. హుద్‌ హుద్‌ 4. గోరింక (అబూ దావూద్‌, దార్మి)

—–

اَلْفَصْلُ الثَّالِثُ మూడవ విభాగం 

4146 – [ 43 ] ( لم تتم دراسته ) (2/1206)

عَنِ ابْنِ عَبَّاسٍ رَضِيَ اللهُ عَنْهُمَا قَالَ: كَانَ أَهْلُ الْجَاهِلِيَّةِ يَأْكُلُوْنَ أَشْيَاءَ وَيَتْرُكُوْنَ أَشْيَاءَ تَقَذُّرًا.فَبَعَثَ اللهُ نَبِيَّهُ وَأَنْزَلَ كِتَابَهُ وَأَحَلَّ حَلَالَهُ وَحَرَّمَ حَرَامَهُ فَمَا أَحَلَّ فَهُوَ حَلَالٌ وَمَا حَرَّمَ فَهُوَ حَرَامٌ وَمَا سَكَتَ عَنْهُ فَهُوَ عَفْوٌ وَتَلَا(قُلْ لَا أَجِدُ فِيْمَا أُوْحِيَ إِلَيَّ مُحَرَّمًا عَلَى طَاعِمٍ يَطْعَمُهُ إِلَّا أَنْ يَكُوْنَ مَيْتَةً أَوْ دَمًا؛6:145) رواه أبو داود.

4146. (43) [2/1206అపరిశోధితం]

‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘అబ్బాస్‌ (ర) కథనం: అజ్ఞాన కాలంలో ప్రజలు అనేక ప్రాణులను తినేవారు. అదేవిధంగా అనేక ప్రాణులను అసహ్యించుకుంటూ తినేవారుకారు. అల్లాహ్‌ (త) తన ప్రవక్తను పంపాడు, తన గ్రంథాన్ని పంపాడు. హలాల్‌ను హలాల్‌గా, హరామ్‌ను హరామ్‌గా నిర్దేశించాడు. అల్లాహ్‌ (త) హలాల్‌గా చూపినది హలాల్‌, అల్లాహ్‌ (త) హరామ్‌గా చూపినది హరామ్‌, అదేవిధంగా అల్లాహ్‌ (త) మౌనం వహించినది క్షమించడం జరిగింది. ఆ తరువాత ప్రవక్త (స) ఈ ఆయతును పఠించారు.

”(ఓ ప్రవక్తా!) వారికి తెలుపు: “నాపై అవతరింప జేయబడిన దివ్యజ్ఞానంలో (హీలో): ఆహార పదార్థాలలో చచ్చిన జంతువు, కారినరక్తం, పంది మాంసం, ఎందు కంటే అది అపరిశుద్ధమైనది (రిజ్స్) లేక అల్లాహ్ కు అవిధేయతకు పాల్పడి – ఆయన పేరుతో గాక – ఇతరుల పేరుతో కోయబడిన జంతువు తప్ప, ఇతరవాటిని తినటాన్ని నిషేధించ బడినట్లు నేను చూడలేదు. కాని ఎవడైనా గత్యంతరం లేని పరిస్థితులలో దుర్నీతికి ఒడిగట్టకుండా, ఆవశ్యకత వలన, హద్దులు మీరకుండా (తింటే) నీ ప్రభువు నిశ్చయంగా, క్షమాశీలుడు, అపార కరుణాప్రదాత.” – అల్‌ అన్‌ ఆమ్‌. 6:145. (అబూ  దావూద్‌)

4147 – [ 44 ] ( صحيح ) (2/1206)

وَعَنْ زَاهِرِ الْأَسْلَمِيِّ قَالَ: إِنِّيْ لَأُوْقِدُ تَحْتَ الْقُدُوْرِ بِلُحُوْمِ الْحَمُرِ إِذْ نَادَى مُنَادِيْ رَسُوْلِ اللهِ صلى الله عليه وسلم: أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يَنْهَاكُمْ عَنْ لُحُوْمِ الْحُمُرِ. رَوَاهُ الْبُخَارِيُّ.

4147. (44) [2/1206దృఢం]

‘జాహిర్‌ అస్లమీ (ర) కథనం: నేను గాడిద మాంసం వండడానికి పొయ్యి వెలిగించాను. ఇంతలో ప్రవక్త (స) పంపిన వ్యక్తి ప్రవక్త (స) గాడిద మాంసాన్ని నిషేధించారు అని ప్రకటించాడు. (బు’ఖారీ)

4148 – [ 45 ] ( صحيح ) (2/1206)

وَعَنْ أَبِيْ ثَعْلَبَةَ الْخُشَنِيِّ يَرْفَعُهث: “اَلْجِنُّ ثَلَاثَةُ أَصْنَافٍ صِنْفٌ لَهُمْ أَجْنِحَةٌ يَطِيْرُوْنَ فِي الْهَوَاءِ وَصِنْفٌ حَيَّاتٌ وَكِلَابٌ وَصِنْفٌ يَحُلُّوْنَ وَيَظْعَنُوْنَ”. رَوَاهُ فِيْ شَرْحِ السُّنَّةِ .

4148. (45) [2/1206దృఢం]

అబూ స’అలబ’ ఖుష్నీ (ర) కథనం: జిన్నులు మూడు ఆకారాలలో ఉంటారు. 1. వీరికి రెక్కలు ఉంటాయి, వీళ్ళు తమ రెక్కలతో గాలిలో ఎగురుతూ ఉంటారు. 2. పాములు, కుక్కలు అంటే పాముల, కుక్కల రూపంలో ప్రత్యక్షం అవుతారు. 3. వస్తూ పోతూ, ప్రయాణిస్తూ ఉంటారు. [26]  (షర్‌’హు స్సున్నహ్‌)

=====

3- بِابُ الْعَقِيْقَةِ

3. అఖీఖహ్

ఇస్లామీయ ధార్మిక భాషలో బాలుడు లేదా బాలిక జన్మిస్తే దైవానికి కృతజ్ఞతగా జిబహ్ చేయబడే జంతువు. బాలుని తరఫున రెండు పశువులు, బాలిక తరఫున ఒక పశువు. ఈ ‘అఖీఖహ్ ప్రవక్త సాంప్రదాయం. బిడ్డ జన్మించిన ఏడవ రోజు బిడ్డ తల గీయించాలి. పశువును జి’బహ్‌ చేయాలి, మంచి పేరు పెట్టటం ప్రవక్త సాంప్రదాయం. అనివార్య కారణాల వల్ల ఏడవ రోజు వీలుకాని పక్షంలో, వీలైనప్పుడు వెంటనే చెల్లించాలి. ‘అఖీఖహ్‌లో మేకనే జ’బహ్‌ చేయనక్కరలేదు. గొర్రె, ఆవు, ఒంటె, గేదెలతో కూడా అఖీఖహ్‌ చేయవచ్చును. ‘అఖీఖహ్‌ మాంసాన్ని అందరూ తినవచ్చును. దాన్ని అమ్మకూడదు. క్రింది ‘హదీసు’లు వీటినే సూచిస్తున్నాయి.

اَلْفَصْلُ الْأَوَّلُ మొదటి విభాగం   

4149 – [ 1 ] ( صحيح ) (2/1207)

عَنْ سَلْمَانَ بْنِ عَامِرِ الضَّبِيّ قَالَ: سَمِعْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ: “مَعَ الْغُلَامِ عَقِيْقَةٌ فَأَهْرِيْقُوْا عَنْهُ دَمًا وَأَمِيْطُوا عَنْهُ الْأَذَى”. رَوَاهُ الْبُخَارِيُّ .

4149. (1) [2/1207దృఢం]

సల్మాన్‌ బిన్‌ ‘ఆమిర్‌ (ర) కథనం: ప్రవక్త (స)ను ఇలా ప్రవచిస్తూ ఉండగా నేను విన్నాను, ”బిడ్డ జన్మించిన తర్వాత ‘అఖీఖహ్‌ చేయడం సున్నత్‌, ఆ బిడ్డ తరఫున పశువు జ’బహ్‌ చేయండి, ఇంకా ఆ బిడ్డ తల మాలిన్యాల్ని తొలగించండి. అంటే తల గీయించండి.” (బు’ఖారీ)

4150 – [ 2 ] ( صحيح ) (2/1207)

وَعَنْ عَائِشَةَ: أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم كَانَ يُؤْتَى بِالصِّبْيَانِ فَيُبَرَّكُ عَلَيْهِمْ وَيُحَنُّكُهُمْ. رَوَاهُ مُسْلِمٌ  .

4150. (2) [2/1207దృఢం]

‘ఆయి’షహ్‌ (ర) కథనం: ప్రవక్త (స) వద్దకు పుట్టిన బిడ్డలను తీసురురావటం జరిగేది. ప్రవక్త (స) వారిని దీవించే వారు, వారిని స్వాగతించేవారు. [27] (ముస్లిమ్‌)

4151 – [ 3 ] ( متفق عليه ) (2/1207)

وَعَنْ أَسْمَاءَ بِنْتِ أَبِيْ بَكْرٍأَنَّهَا حَمَلَتْ بِعَبْدِ اللهِ بْنِ الزُّبَيْرِبِمَكَّةَ قَالَتْ: فَوَلَدْتُّ بِقُبَاءَ ثُمَّ أَتَيْتُ بِهِ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم فوَضَعْتهُ فِيْ حَجْرِهِ ثُمَّ دَعَا بِتَمْرَةٍ فَمَضَغَهَا ثُمَّ تَفَلَ فِيْ فِيْهِ ثُمَّ حَنَّكَهُ ثُمَّ دَعَا لَهُ وبَرَّكَ عَلَيْهِ. فَكَانَ أَوَّلَ مَوْلُوْدٍ وُلِدَ فِيْ الْإِسْلَامِ.

4151. (3) [2/1207ఏకీభవితం]

అస్మా బిన్‌తె అబూ బకర్‌ కథనం, నేను అబ్దుల్లాహ్బిన్‌ ‘జుబైర్ (ర) ద్వారా మక్కహ్లో గర్భవతి అయ్యాను. మదీనహ్ వలస వచ్చిన తర్వాత ఖుబా ప్రాంతంలో నాకు బిడ్డ జన్మించాడు. నేను ఆ బిడ్డను తీసుకొని ప్రవక్త (స) వద్దకు వెళ్ళాను. ప్రవక్త (స) ఆ బిడ్డను తన ఒడిలోకి తీసుకొని, ఖర్జూరం నమిలి దాని తీపి ఉమ్మిని బిడ్డ నోటిలో పెట్టారు. బిడ్డను దీవించారు. వలస వచ్చిన తర్వాత మదీనహ్ మునవ్వరహ్ భూమిపై, ఇస్లామ్స్థితిలో పుట్టిన మొట్టమొదటి  బిడ్డ.[28] (బు’ఖారీ,  ముస్లిమ్‌)

—–

اَلْفَصْلُ الثَّانِيْ రెండవ విభాగం 

4152 – [ 4 ] ( صحيح ) (2/1207)

عَنْ أُمِّ كُرْزٍ قَالَتْ: سَمِعْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم يَقُوْلُ: “أَقِرُّوا الطَّيْرَ عَلَى مَكنَاتِهَا”. قَالَتْ: وَسَمِعْتُهُ يَقُوْلُ: “عَنِ الْغُلَامِ شَاتَانِ وَعَنِ الْجَارِيَةِ شَاةٌ وَلَا يَضُرُّكُمْ ذُكْرَانًا كُنَّ أَوْ إِنَاثًا”. رَوَاهُ أَبُوْ دَاوُدَ وَلِلتِّرْمِذِيِّ وَالنَّسَائِيّ مِنْ قَوْلِهِ: يَقُوْلُ: “عَنِ الْغُلَامِ” إِلَى آخِرِهِ وَقَالَ التِّرْمِذِيُّ: هَذَا صَحِيْحٌ .

4152. (4) [2/1207దృఢం]

ఉమ్మె కుర్‌’జ్‌ (ర) కథనం: ప్రవక్త (స) ఇలా ప్రవచిస్తూ ఉండగా నేను విన్నాను, ”మీరు పక్షులను వాటి గూళ్ళలోనే ఉండనివ్వండి, మగ బిడ్డ తరఫున 2 మేక పోతులు, ఆడ బిడ్డ తరఫున ఒక మేక పోతు జ’బహ్‌ చేయాలి. అది ఆడదైనా, మగదైనా సరే. [29] (అబూ దావూద్, తిర్మిజి’/  దృఢం, నసాయి’)

4153 – [ 5 ] ( صحيح ) (2/1208)

وَعَنِ الْحَسَنِ عَنْ سَمُرَةَ قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “اَلْغُلَامُ مُرْتَهَنٌ بِعَقِيْقَتِهِ تُذْبَحُ عَنْهُ يَوْمَ السَّابِعِ وَيُسَمّى وَيُحْلَقُ رَأْسَهُ”. روَاهُ أَحْمَدُ وَالتِّرْمِذِيُّ وَأَبُوْ دَاوُدَ وَالنَّسَائِيُّ

لَكِنْ فِيْ رِوَايَتِهِمَا “رَهِيْنَةٌ ” بَدْلَ” مُرْتَهَنٌ ” وَفِيْ رِوَايَةٍ لِأَحْمَدَ وَأَبِيْ دَاوُدَ: “وَيُدَمّى” مَكَانَ: “وَيُسَمّى” وَقَالَ أَبُوْ دَاوُدَ: “وَيُسَمّى ” أَصَحُّ .

4153. (5) [2/1208దృఢం]

‘హసన్‌, సమురహ్‌ల కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ప్రతి బిడ్డ తన అఖీఖహ్కు బదులు తాకట్టుగా ఉంచబడ్డాడు, 7వ రోజు ఆ బిడ్డ తరఫున పశువు జి’బహ్‌ చేయాలి, బిడ్డకు పేరు పెట్టాలి, ఇంకా తల గీయించాలి.[30] (అ’హ్మద్‌, తిర్మిజి’, అబూ దావూద్‌ – దృఢం, నసాయి)

4154 – [ 6 ] ( لم تتم دراسته ) (2/1208)

وَعَنْ مُحَمَّدِ بْنِ عَلِيِّ بْنِ حُسَيْنٍ عَنْ عَلِيِّ بْنِ أَبِيْ طَالِبٍ قَالَ: عَقَّ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم عَنِ الْحَسَنِ بِشَاةٍ وَقَالَ: “يَا فَاطِمَةُ اِحْلِقِيْ رَأْسَهُ وَتَصَدَّقِيْ بِزِنَةِ شَعْرِهِ فِضَّةً”. فَوَزَنَّاهُ فَكَانَ وَزْنُهُ دِرْهَمًا أَوْ بَعْضَ دِرْهَمٍ. روَاهُ التِّرْمِذِيُّ وَقَالَ: هَذَا حَدِيْثٌ حَسَنٌ غَرِيْبٌ وَإِسْنَادُهُ لَيْسَ بِمُتَّصِلٍ لِأَنَّ مُحَمَّدَ بْنَ عَلِيِّ بْنِ حُسَيْنٍ لَمْ يُدْرِكْ عَلِيَّ بْنَ أَبِيْ طَالِبٍ .

4154. (6) [2/1208అపరిశోధితం]

ము’హమ్మద్‌ బిన్‌ ‘అలీ బిన్‌ ‘హుసైన్‌, ‘అలీ బిన్‌ అబీ ‘తాలిబ్‌ (ర) ద్వారా కథనం: ప్రవక్త (స) ‘హసన్‌ తరఫున ‘అఖీఖహ్‌లో ఒక మేక జ’బహ్‌ చేసారు, ఇంకా ఫాతిమహ్ను ”నువ్వు ఈ బిడ్డ తల గీయించి, వెంట్రుకలకు సమానంగా వెండిని సదఖహ్ చేయమని ఆదేశించారు. మేము ఆ వెంట్రుకలను తూయగా అవి ఒక్క దిర్‌హమ్‌ లేదా దానికంటే కొంచెం తక్కువ ఉన్నాయి. [31]   (తిర్మిజి – ప్రామాణికం-ఏకోల్లేఖనం)

4155 – [ 7 ] ( صحيح ) (2/1208)

وَعَنِ ابْنِ عَبَّاسٍ: أَنَّ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم عَقَّ عَنِ الْحَسَنِ وَالْحُسَيْنِ كَبْشًا كَبْشًا. رَوَاهُ أَبُوْ دَاوُدَ

وَعِنْدَ النَّسَائِيُّ :كَبْشَيْنِ كَبْشَيْنِ .

4155. (7) [2/1208దృఢం]

ఇబ్నె ‘అబ్బాస్‌ (ర) కథనం:  ప్రవక్త (స) ‘హసన్‌, ‘హుసైన్‌ల తరఫున ఒక్కొక్క గొర్రెపోతు జి’బహ్‌ చేసారు. (అబూ దావూద్‌)

నసాయీ ఉల్లేఖనంలో రెండు గొర్రెపోతులు జి’బహ్‌ చేసినట్లు ఉంది. (నసాయి’)

4156 – [ 8 ] ( حسن ) (2/1208)

وَعَنْ عَمْرِو بْنِ شُعَيْبِ عَنْ أَبِيْهِ عَنْ جَدِّهِ قَالَ: سُئِلَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم عَنِ الْعَقِيْقَةِ فَقَالَ: “لَا يُحِبُّ اللهُ الْعُقُوْقَ” كَأَنَّهُ كَرِهَ الْاِسْمَ وَقَالَ: “مَنْ وُلِدَ لَهُ وُلِدَ فَأَحَبَّ أَنْ يَنْسُكَ عَنْهُ فَلْيَنْسُكْ عَنِ الْغُلَامِ شَاتَيْنِ وَعَنِ الْجَارِيَةِ شَاةً”. رَوَاهُ أَبُوْ دَاوُدَ وَالنَّسَائِيُّ .

4156. (8) [2/1208- ప్రామాణికం]

‘అమ్ర్‌ బిన్‌ షు’ఐబ్‌ తన తండ్రి తాతల ద్వారా కథనం: ప్రవక్త (స)ను, ‘అఖీఖహ్ గురించి ప్రశ్నించడం జరిగింది. ప్రవక్త (స) సమాధానమిస్తూ ”అల్లాహ్‌ (త) ఉఖూబ్ను ఇష్టపడడని, అంటే ఆ పదాన్ని ప్రవక్త (స) అసహ్యించు కున్నారు. ఇంకా ఎవరికైనా బిడ్డ జన్మిస్తే, మగ బిడ్డ తరఫున రెండు, ఆడ బిడ్డ తరఫున ఒకటి గొర్రెలు జ’బహ్‌ చేయాలని నా అభిలాష” అని అన్నారు. (అబూ దావూద్‌, నసాయి)

4157 – [ 9 ] ( لم تتم دراسته ) (2/1209)

وَعَنْ أَبِيْ رَافِعٍ قَالَ: رَأَيْتُ رَسُوْلَ اللهِ صلى الله عليه وسلم أَذَّنَ فِيْ أُذُنِ الْحَسَنِ ابْنِ عَلِيِّ حِيْنَ وَلَدَتْهُ فَاطِمَةُ بِالصَّلَاةِ. رَوَاهُ التِّرْمِذِيُّ وَأَبُوْ دَاوُدَ. وَقَالَ التِّرْمِذِيُّ: هَذَا حَدِيْثٌ حَسَنٌ صَحِيْحٌ

4157. (9) [2/1209అపరిశోధితం]

అబూ రాఫె’అ (ర) కథనం: నేను ప్రవక్త (స)ను ఇలా చూచాను. ప్రవక్త (స) ‘హసన్‌ బిన్‌ ‘అలీ జన్మించిన తర్వాత అతని చెవిలో అ’జాన్‌ పలికారు. [32]   (అబూ దావూద్‌, తిర్మీజీ  –  ప్రామాణికం, -దృఢం)

—–

اَلْفَصْلُ الثَّالِثُ మూడవ విభాగం 

4158 – [ 10 ] ( صحيح ) (2/1209)

عَنْ بُرَيْدَةَ قَالَ: كُنَّا فِي الْجَاهِلَيَّةِ إِذَا وُلِدَ لِأَحَدِنَا غُلَامٌ ذَبَحَ شَاةً وَلَطَّخَ رَأْسَةُ بِدَمِهَ فَلَمَّا جَاءَ الْإِسْلَامُ كُنَّا نَذْبَحُ الشَّاةَ يَوْمَ السَّابِعِ وَنَحْلِقُ رَأْسَهُ وَنُلَطِّخُهُ بِزَعْفَرَانِ. رَوَاهُ أَبُوْ دَاوُدَ وَزَادَ رَزِيْنٌ: وَنُسَمِّيْهِ .

4158. (10) [2/1209దృఢం]

బురైదహ్‌ (ర) కథనం: అజ్ఞాన కాలంలో మేము బిడ్డ జన్మిస్తే, మేకను జ’బహ్‌ చేసి దాని రక్తాన్ని తలపై రుద్దేవారు. అయితే ఇస్లామ్‌లో మేము 7వ రోజు మేక జ’బహ్‌ చేసి, బిడ్డ తల గీయించి, బిడ్డ తలపై కస్తూరి తగిలించి, పేరు పెట్టే వాళ్ళం. [33] (అబూ దావూద్‌, ర’జీన్‌)

*****


[1]) వివరణ-4065: రాద్ అంటే సూదిగా లేని బాణం, అది పొడవుగా దుడ్డుగా ఉంటుంది. మొనవల్ల అది దూసుకు పోవడం వల్ల చనిపోతే దాన్ని తినవచ్చును. ఒకవేళ దెబ్బతగిలి చనిపోతే, అది కర్రతో కొట్టటం అవుతుంది. దాన్ని తినకూడదు. అది నిషిద్ధం.

[2]) వివరణ-4070: అంటే ఈ ఆదేశాలు అందరికీ వర్తిస్తాయి. అంటే వీటిని గురించి కఠినంగా హెచ్చరించడం జరిగింది. అందువల్లే ఇవి మాకు ప్రత్యేకం అని భావించడం జరిగింది. 1. అల్లాహ్‌(త)ను వదలి ఇతరుల పేర జంతువులను ‘జబహ్‌ చేయడం అందరికీ నిషిధ్ధమే, ఇలాచేసేవాడు దైవశాపానికి గురవుతాడు. 2. భూమి గుర్తులు తారుమారు చేయడం అంటే, ఇద్దరి భూములు ప్రక్కప్రక్కన ఉన్నాయి. వారు తమ తమ భూములపై గుర్తులు వేసి ఉన్నారు. ఈ గుర్తులు మార్చివేస్తే ఎవరిది ఎంత భూమి ఉందో సరిగ్గా తెలియదు. అంటే గుర్తులు తారుమారు చేసిన వాడిలో దురుద్దేశ్యం ఉంది. ఇటు వంటి వ్యక్తిపై కూడా అల్లాహ్‌ శాపం పడుతుంది. 3. తన తల్లి దండ్రులను చీదరించుకోవటం, తిట్టటం, వారిపట్ల అసహ్యంగా ప్రవర్తించినవారిపై కూడా అల్లాహ్‌(త) అభిశాపం పడుతుంది. 4. బిద్‌’అతీలు అంటే ఇస్లామ్‌లో కల్పితాలకు పాల్పడిన వారిని ఆశ్రయం కల్పించేవారిపై కూడా అల్లాహ్‌(త) అభిశాపం పడుతుంది.

[3]) వివరణ-4074: అంటే ఏ జంతువునుగాని, పక్షినిగానీ, కట్టి ఉంచి దాన్ని రాళ్ళతో కొట్టటంగానీ, బాణాలతో కొట్టటంగానీ, అంటే అది రెక్కలు లేదా కాళ్ళూ కొట్టుకుంటూ చావటానికి, తమ గురి సరిచేసుకోవడానికి ఇలా చేస్తారు.

[4]) వివరణ-4076: కొందరు ప్రాణులను గురిపెట్టి అంటే ఒంటె, ఆవు, మేక, గొర్రె, గేదె మొదలైన వాటిని కట్టివేసి తమ గురిని సరిచేసుకుంటుంటారు. ఇది చాలా క్రూరమైనది. అందువల్లే దీన్ని నిషేధించారు.

[5]) వివరణ-4077: అంటే ముస్లిముల్లో ఎవరినైనా ముఖంపై కొట్టరాదు. కొన్ని ఉల్లేఖనాల్లో ”ముఖంపై కొట్టకండి, ఎందుకంటే అల్లాహ్‌ (త) దాన్ని ప్రత్యేకంగా నిర్మించాడు. ముఖంపై వాతలు పెడితే ముఖం అందవికారంగా తయారువుతుంది.

[6]) వివరణ-4078: అనవసరంగా ముఖంపై వాతలు వేయటం మంచిది కాదు. ఒకవేళ ఎవరైనా వైద్యంగా, అది తప్ప వేరే మార్గం లేకపోతే వాతలు పెట్టవచ్చును. చికిత్సగా ఎక్కడైనా వాతలు పెట్టవచ్చును. స్వయంగా ప్రవక్త (స) చికిత్సగా మ’ఆజ్‌కు వాతలు పెట్టారు. అంటే అవసరం పడితే వాతలు పెట్టటంలో ఎటువంటి అభ్యంతరం లేదు.

[7]) వివరణ-4079: అంటే ఖర్జూరం ముక్కలు మెత్తగా నమి లిన తర్వాత వచ్చిన తియ్యటి ఉమ్మిని పసివాడి నోట్లో పెట్టటం. మరో ఉల్లేఖనంలో ఇలా ఉంది, ”ఉమ్మె సులైమ్కు బిడ్డజన్మించాడు. ఆబిడ్డను ప్రవక్త(స) వద్దకు పంపారు. ప్రవక్త (స) ఖర్జూరం నమిలి ఆ బిడ్డనోట్లో పెట్టారు. కిర్మానీ అభిప్రాయం బిడ్డ జన్మించినపుడు ఖర్జూరం లేదా ఏదైనా తియ్యటి వస్తువు నోట్లో పెట్టటం ప్రవక్త సాంప్రదాయం. అదేవిధంగా పెట్టేవారు ఎవరైనా ఉత్తములు ఉంటే మరీ బాగుంటుంది. పెట్టేటప్పుడు బిడ్డ గురించి దు’ఆ చేయాలి. ఈ ‘హదీసు’ ద్వారా తెలిసిన మరో విషయం ఏమిటంటే బిడ్డను ఉత్తమ పురుషుల వద్దకు పంపడం కూడా సాంప్రదాయమే. అంతేకాదు, జన్మించినరోజే పేరుపెట్టటం కూడా మంచిదే, మంచిపేరు పెట్టాలి.

[8]) వివరణ-4082: అసలు జి’బహ్‌ గొంతులో చేయాలి. న’హర్‌ గుండెలోచేయాలి. కాని ఒకవేళ జి’బహ్‌ చేయడం సాధ్యం కాకపోతే, జి’బహ్‌ సంకల్పంతో కత్తి లేదా బల్లెం మొదలైన వాటితో ఎక్కడ పొడిచినా రక్తం ప్రవహిస్తే ఆ పశువు ధర్మసమ్మతం అవుతుంది. ప్రాణావస్థలో ఉన్న జంతువును, లేదా గోతిలో పడిపోయిన పశువును, ‘బిస్మిల్లాహ్‌ అల్లాహు అక్బర్‌,’ అని ఎక్కడ కొట్టినా, అది బహ్క్రిందికే వస్తుంది.

[9]) వివరణ-4085: ఎందుకంటే, ‘బిస్మిల్లాహ్‌ అల్లాహు అక్బర్‌,’ అని పలకబడలేదు. అందువల్ల దాన్ని వారించడం జరిగింది.

[10]) వివరణ-4087: అది ధర్మమా? అధర్మమా? దాన్ని తినవచ్చునా? వారు తయారుచేసినా, అటువంటి వంట కాలయినా ఏ మాత్రం అభ్యంతరం లేదు. మనసులో అనుమానాలు, అపోహలు సృష్టించుకోరాదు. క్రైస్తవుల పాదరీలు కష్టాలను సృష్టించినట్టు సృష్టించకు. కఠినత్వాన్ని వదలిపెట్టు, నీవు ఒక ముస్లిమ్‌. ఇస్లామ్‌ సరైన ధర్మం. సులువైన ధర్మం. ఇందులో ఎటువంటి కాఠిన్యం లేదు. ఇస్లామ్‌లో ఎటువంటి సన్యాసత్వం లేదు. తన్ను తాను శిక్షించుకోవటం, కట్టుబాట్లు పెట్టుకోవటం మొదలైనవి. ఇస్లామ్‌లో ఇటువంటివి ఏవీ లేవు.  అల్లాహ్‌ (త) ప్రాపంచిక అనుగ్రహాలన్నిటినీ మనకోసం సృష్టించాడు. అల్లాహ్‌ (త) అనుగ్రహాలను పొందుతూ ఆయనకు కృతజ్ఞులై ఉండాలి. ఎల్లప్పుడూ అల్లాహ్‌ (త)ను స్మరిస్తూ ఉండాలి. కష్టాల పట్ల సహనం పాటించాలి.

[11]) వివరణ-4089: అంటే చీల్చి తినే జంతువులన్నీ నిషేధించబడ్డాయి. పంజాలతో చీల్చితినే పక్షులు కూడా నిషిద్ధమే. పెంపుడుగాడిద కూడా నిషిద్ధం. అయితే అడవి గాడిద ధర్మసమ్మతం. అదేవిధంగా యుద్ధంలో లభించిన బానిస స్త్రీలు, ఒకవేళ వారు గర్భిణులైతే వారితో వారు ప్రసవించే వరకు సంభోగం చేయరాదు.

[12]) వివరణ-4090: అంటే మెడపై కత్తి త్రిప్పటం. చర్మం తెగింది కాని రక్తనాళం తెగలేదు. ఆ జంతువు కొట్టుకుంటూ మరణించింది. అజ్ఞాన కాలంలో కొందరు ఇలా చేసేవారు.

[13]) వివరణ-4092: జనీన్‌ అంటే గర్భంలో ఉన్న బిడ్డ. గర్భం ధరించి ఉన్న ఆవు, మేక, ఆడ ఒంటె మొదలైనవి జి’బహ్‌ చేయబడితే, దాని గర్భంలో ఉన్న బిడ్డ ప్రాణాలతో ఉన్నా, మరణించి ఉన్నా ఆ బిడ్డ జి’బహ్‌ అయినట్టే. తినగోరేవారు దాన్ని తినవచ్చు.

[14]) వివరణ-4097: అంటే చెరువు లేదా సముద్రంలోని జంతువులన్నీ జి’బహ్‌ చేయబడి ఉన్నాయి.చేపలు, పీతలు, రొయ్యలు మొదలైనవి జబహ్‌ చేయనక్కర లేదు. అవి చనిపోయి ఉన్నా వాటిని తినవచ్చును.

[15]) వివరణ -4099: ఖీరాత్ అంటే తూనికల్లో ఒక ప్రమాణం. అదేవిధంగా కొండను కూడా అంటారు. ప్రవక్త (స) మక్కహ్ ప్రజల మేకలను కొన్నిఖీరాత్‌లకు బదులు మేపేవారు, కాసే వారు. అదేవిధంగా జనా’జహ్ నమా’జు చదివిన వారికి ఒక ఖీరాతు, ఆ తరువాత ఖనన సంస్కారాల్లో పాల్గొన్నవారికి రెండు ఖీరాత్‌ల పుణ్యం లభిస్తుందని ఉంది. ఈ ‘హదీసు’లో ఒక ఖీరాత్‌ గురించి ఉంది. మరో ‘హదీసు’లో రెండు ఖీరాతులు అని ఉంది. కుక్కనుబట్టి ఉంటుంది. అయితే పంట పొలాలకు, వేటకు, పశువుల రక్షణకు కుక్కలను పెంచవచ్చును.

[16]) వివరణ-4100: ఎందుకంటే మదీనహ్ పవిత్రమైన స్థానం. ఇక్కడ దైవవాణి అవతరిస్తుంది. దైవదూతలు ఇక్కడకు వస్తూపోతూ ఉంటారు. కుక్క ఉంటే కారుణ్య దూతలు అవతరించరు. అందువల్లే ప్రవక్త (స) కుక్కలను చంపమని ఆదేశించారు. అంటే కుక్కలను స్త్రీలు పెంచేవారు. కుక్కల అవసరం వారికి ఎంతైనా ఉండేది.

[17]) వివరణ-4102: మరో ఉల్లేఖనంలో ఇలా ఉంది, ”కుక్కలను తమ ఇళ్ళలో పెంచేవారి పుణ్యం నుండి ప్రతి రోజూ ఒక ఖీరాత్‌ పుణ్యం తగ్గుతూ ఉంటుంది. కాని వేట కోసం, పశువుల రక్షణ కోసం పెంచటం ధర్మమే.”

[18]) వివరణ-4103: అంటే పోతుల పందాలు, గొర్రెల పందాలు, కోళ్ళ పందాలు మొదలైన వాటిని వారించటం జరిగింది.

[19]) వివరణ-4114: అబూఉబైదహ్ (ర) పేరు ‘ఆమిర్‌. ఇతనికి అమీనుల్‌ ఉమ్మహ్‌ అనే బిరుదు ఉండేది. ఇతను ఖురైష్‌ వంశానికి చెందినవారు. అబూ బకర్‌ (ర) ప్రయత్నం వల్ల ఇస్లామ్‌ స్వీకరించారు. ఇస్లామ్‌ స్వీకరించిన తర్వాత ఖురైష్‌ హింసా దౌర్జన్యాల వల్ల అక్కడి నుండి హబ్‌షాకు వలస పోయారు. మళ్ళీ అక్కడి నుండి మదీనహ్కు వలస వచ్చారు. ఇతడు చాలా వీరత్వం గల సైనిక అధికారుల్లో ఒకరు. అనేక యుద్ధాల్లో పాల్గొన్నారు. అనేక యుద్ధాలు అతని నేతృత్వంలో జరిగాయి. మదీనహ్ చేరిన తర్వాత కూడా వదలలేదు. యుద్ధానికి కాలు దువ్వారు. ఈ పరంపరలో బద్ర్‌ యుద్ధం మొట్ట మొదటిది. అబూ ‘ఉబైదహ్‌ (ర) ఈ యుద్ధంలో వీరోచితంగా పాల్గొన్నారు. అతని తండ్రి ‘అబ్దుల్లాహ్‌ కూడా అప్పటికి సజీవంగా ఉన్నారు. అతను అవిశ్వాసుల తరఫు నుండి యుద్ధంలో పాల్గొన్నారు. తన కొడుకును చంపాలనే ప్రయత్నంలోనే ఉన్నారు. అబూ ‘ఉబైదహ్‌ అవకాశం చూసి తనతండ్రిని హతమార్చారు. ఏకత్వం దృష్టితో చూస్తే అవిశ్వాసులైన వారెవరైనా శత్రువుల్లా కనబడతారు. ఖుర్‌ఆన్‌లో అల్లాహ్‌ (త) దీన్ని మెచ్చుకుంటూ ఇలా ఆదేశించాడు:

”అల్లాహ్‌ మరియు పరలోకాన్ని విశ్వసించే జనులలో, అల్లాహ్‌ మరియు ఆయన సందేశహరుణ్ణి వ్యతిరేకించే వారితో స్నేహం చేసుకునేవారిని నీవు పొందలేవు! ఆ వ్యతిరేకించే వారు, తమ తండ్రులైనా లేదా తమ కుమారులైనా లేదా తమ సోదరులైనా లేదా తమ కుంటుంబంవారైనా సరే! అలాంటి వారి హృదయాలలో ఆయన విశ్వాసాన్ని స్థిరపరచాడు. మరియు వారిని తన వైపునుండి ఒక ఆత్మ శక్తి (రూహ్) ఇచ్చి బలపరిచాడు.” (అల్‌ ముజాదలహ్‌, 58:22)

హుద్ యుద్ధంలో ప్రవక్త (స) ముఖానికి గాయాలు తగిలాయి. కవచం యొక్క తీగలు గుచ్చుకున్నాయి. అబూ ‘ఉబైదహ్‌ (ర) పళ్ళతో పట్టి లాగారు. వీటిని తీయటంలో అతడు తన రెండు పళ్ళు పోగొట్టు కున్నారు. కానిప్రవక్త (స) సేవలో పళ్ళే కాదు, ప్రాణం కూడా పోయినా లెక్కచేయ ట్లుగా ఉండేవారు. కందక యుద్ధంలో, బనూ ‘ఖురై”జహ్‌ను అణచడంలోనూ చురుగ్గా పాల్గొన్నారు. 6వ హిజ్రీలో స”అలబహ్, అన్సారుల వర్గాలు కరువుకాటకాలకు గురయి మదీనహ్ ప్రాంతంలో దోపిడీకి పాల్పడేవారు. వారిని వారించడానికి రబీఉస్సా’నీ నెలలో 40 మందిని తీసుకొని వారి కేంద్రమైన జిల్ఖిస్సహ్పై దాడిచేసి అక్కడి నుండి వారిని కొండల వైపు తరిమివేసారు. ఒక వ్యక్తిని బంధించి తీసుకు వచ్చారు. ఆ వ్యక్తి సంతోషంగా ఇస్లామ్‌ స్వీకరించాడు. ఈ సంవత్సరమే బైఅతె రి’ద్వాన్‌లో పాల్గొన్నారు. హుదైబియాలో కుదిరిన ఒప్పందంపై అతను సాక్ష్యంగా సంతకం పెట్టారు. 7వ హిజ్రీలో ఖైబర్పై దాడిలో ప్రవక్త (స) వెంట ఉన్నారు. ఈ యుద్ధంలో వీరోచితంగా పోరాడారు. ఆ తర్వాత ప్రవక్త (స) జా’తుస్సలాసిల్‌ వైపు అమ్ర్బిన్ఆస్ను పంపారు. అక్కడకు వెళ్ళిన తర్వాత శత్రువుల సంఖ్య అధికంగా ఉందని అబూఉబైదహ్ (ర) నేతృత్వంలో 200 మంది వీరులను పంపారు. వీరిలో అబూ బకర్‌, ‘ఉమర్‌ వంటివారు కూడా ఉన్నారు. ఈ సైన్యం అమ్ర్‌ బిన్‌ అల్‌ ఆస్‌ వద్దకు చేరిన తర్వాత సైన్యాధికారి సమస్య తలెత్తింది. ఒకవిధంగా చూస్తే అబూ ‘ఉబైదహ్‌ (ర) వీరత్వం, అనుభవం ముందు అమ్ర్‌ బిన్‌ అల్‌ఆస్‌ తక్కువే. కాని అతని కోరిక, మంకుపట్టు వల్ల అబూ ‘ఉబైదహ్‌ విధేయతకు ఒప్పుకున్నారు. చాలా చాకచక్యంగా దాడిచేసి శత్రువులను ఓడించి విజయం సాధించారు. రజబ్‌ 8 హిజ్రీలో మరో యుద్ధానికి అబూ ‘ఉబైదహ్‌ను తీరప్రాంతంవైపు పంపడం జరిగింది. దీన్ని గురించే ‘హదీసు’లో పేర్కొనడం జరిగింది.

[20]) వివరణ-4119: అంటే ఇబ్రాహీమ్‌ (అ)ను అవిశ్వాసులు అగ్నిలో వేసినప్పుడు ప్రాణులన్నీ ఆ అగ్ని జ్వాలలను ఆర్పే ప్రయత్నం చేసాయి. కాని తొండ ఆ అగ్ని జ్వాలలను మరింత అధికం చేయసాగింది. దీనివల్ల తెలిసిన విషయం ఏమిటంటే తొండ మానవుని శత్రువు, క్రూరమైనది, ప్రమాదకరమైనది. అందువల్ల దీన్ని చంపివేయటమే మంచిది.

[21]) వివరణ-4121: అంటే మీరు తొండను ఎక్కడ చూచినా చంపటానికి ప్రయత్నించండి. ఒక్క దెబ్బలో, రెండు దెబ్బల్లో లేదా మూడు దెబ్బల్లో.

[22]) వివరణ-4122: కొన్ని ఉల్లేఖనాల ద్వారా ఇలా తెలుస్తుంది, ”వారు అల్లాహ్‌(త)తో ఇలా మొరపెట్టు కున్నారు, ”ఓ ప్రభూ! నీ శిక్ష వస్తే అందరిపై వస్తుంది. మంచివాళ్ళు, చెడ్డవాళ్ళు అందరూ గురి అవుతారు. పాపాత్ములను శిక్షించటం ధర్మమే కాని వారితో పాటు మంచి వాళ్ళను కూడా శిక్షించటం అధర్మం అనిపిస్తుంది.” అల్లాహ్‌ (త) ఈ సంఘటనపై అతన్ని ‘ఒక్క చీమ కుట్టితే అన్ని చీమలను ఎందుకు కాల్పించావు’ అని ప్రశ్నించటం జరిగింది. దీనికి సమాధానం ఏముంటుందో అటువంటి సమాధనమే  మన తరఫు నుండీ ఉంటుంది.

[23]) వివరణ-4126: ధర్మసమ్మతమైన జంతువు, దీని పాలు, నెయ్యి, మాంసం అన్నీ ధర్మసమ్మతమైనవి. కాని ఇది మలం తినే దానికి అలవాటుపడింది. ఇటువంటి జంతువు యొక్క మాంసం, పాలు మొదలైనవన్నీ అసహ్యకరమైనవి. కాని ప్రవక్త (స) కోడి మాంసం తిన్నారు.

[24]) వివరణ-4139: అంటే పాముల, మానవుల శత్రుత్వం మొట్టమొదటి నుండి ఉన్నదే. ఎందుకంటే పాము షైతాన్‌ కు సహాయం చేసింది. ఆదమ్‌(ర) ను మోసం చేసింది.

[25]) వివరణ-4141: ఎందుకంటే వాటిని చంపకుండా ‘జమ్‌ ‘జమ్‌ నుయ్యిని శుభ్రపరచడం సాధ్యం కాదు.

[26]) వివరణ-4148: అల్లాహ్‌ (త) ఖుర్‌ఆన్‌లో అనేకచోట్ల జిన్నులను గురించి ప్రస్తావించాడు. ప్రత్యేకంగా సూరహ్‌ జిన్‌ ప్రవక్త (స) పై అవతరింపజేసి జిన్నులు కూడా భూమిపై సంచరిస్తూ ఉంటాయని, తిరుగుతూ ఉంటాయని నిరూపించాడు. జిన్నుల ఒక బృందం ప్రవక్త (స) చేతిపై ఇస్లామ్‌ స్వీకరించింది కూడా. అవేకాక జిన్నుల గురించి అనేక విషయాలు ఖుర్‌ఆన్‌ గ్రంథంలో ప్రస్తావించబడ్డాయి.

[27]) వివరణ-4150: హ్నీక్అంటే ఖర్జూరం లేదా ఏదైనా తీపి వస్తువు బిడ్డ నోటిలో పెట్టటం, ఎవరైనా ఉన్నత వ్యక్తి ఇలా చేస్తే మంచిది.

[28]) వివరణ-4151: ఖుబాఅ ఒక ప్రదేశం పేరు. ఇది మదీనహ్ మునవ్వరహ్ కు సమీపంగా ఉంది. ప్రవక్త (స) వలస వచ్చిన తర్వాత ఇక్కడే దిగారు. 15 రోజుల వరకు ఇక్కడే ఉన్నారు. ఇక్కడ ఒక మస్జిద్‌ నిర్మించారు. దీని పేరు మస్జిదె ఖుబాఅ‘. ముహాజిరీన్లలో అందరికంటే ముందు జన్మించిన బిడ్డ ‘అబ్దుల్లాహ్‌ బిన్‌ ‘జుబైర్‌ (ర).

[29]) వివరణ-4152: మకినాత్ అంటే గూళ్ళు అని అర్థం. అంటే అజ్ఞాన కాలంలో మంచీ చెడు భావించడానికి పక్షులను వాటి గూళ్ళ నుండి ఎగురవేసేవారు. ఒకవేళ అవి కుడివైపు పోతే మంచిగా భావించేవారు, ఒకవేళ ఎడమవైపు ఎగిరితే చెడుగా భావించేవారు. ప్రవక్త (స) దీన్ని నిషేధించారు.

[30]) వివరణ-4153: అఖీఖహ్చేయడం ప్రవక్త సాంప్రదాయం. దీనివల్ల అనేక  లాభాలు ఉన్నాయి. 1. అఖీఖహ్ చేయటం వల్ల బిడ్డ ఆరోగ్యంగా ఉంటాడు. అఖీఖహ్ చేయక పోవటం వల్ల అనారోగ్యానికి గురవుతాడు. 2. దురదృష్ట వశాత్తు ఒకవేళ బిడ్డ బాల్యం చనిపోతే, అతని అఖీఖహ్ చేయబడి ఉంటే, తల్లి దండ్రుల కోసం సిఫారసు చేయగలడు. ఒకవేళ అఖీఖహ్ చేయకుండా ఉంటే, సిఫారసు చేసే అవకాశం లభించదు. 3. అఖీఖహ్ చేయటం దైవానికి కృతజ్ఞతలు తెలిపినట్లు ఉంటుంది. చేయకుండా ఉంటే కృతఘ్నతకు పాల్పడినట్లు అవుతుంది.

[31]) వివరణ-4154: ఇది ‘దయీఫ్‌ ‘హదీసు’. అఖీఖహ్లో మగబిడ్డ తరఫున రెండు మేకపోతులు జి’బహ్‌ చేయడం ప్రవక్త సాంప్రదాయం, ఇంకా వెంట్రుకలను వెండితో తూయటం, దానికి సమానంగా వెండిని దానధర్మాలు చేయటం అభిలషణీయమే.

[32]) వివరణ-4157: బిడ్డ జన్మించిన తర్వాత, కుడి చెవిలో అ’జాన్‌ పదాలను, ఎడమ చెవిలో ఇఖామత్‌ పదాలను పలకాలి. దీనివల్ల బిడ్డ వ్యాధులకు గురికాడు. అదేవిధంగా బిడ్డ చెవిలో ఇన్నీ యీజుహా బిక జుర్రిమతహా మినష్షైతా నిర్రజీమ్,” అని పలకడం కూడా మంచిదే.

[33]) వివరణ-4158: అత్యవసర సూచనలు: అఖీఖహ్కు చెందిన కొన్ని  మూఢాచారాలను పేర్కొనడం తప్పని సరిగా భావించడం జరిగింది. దీనివల్ల ప్రజలు బిద్‌’అత్‌లకు దూరంగా ఉంటూ సున్నత్‌ను అనుసరిస్తారు.  1. కొన్నిచోట్ల మంగలివాడు బిడ్డ తలగీయడానికి తలపై కత్తిపెట్టినపుడు జంతువును జ’బహ్‌ చేయడం జరుగుతుంది. ఇది పచ్చి మూఢాచారం. 2.అఖీఖహ్ రోజు కొన్నిచోట్ల బంధుమిత్రు లందరూ ఒకచోట చేరుతారు. ప్రత్యేకంగా ఆహ్వానించటం జరుగుతుంది. మంగలివాడు బిడ్డ తలగీసిన తర్వాత చేటలో, లేదా కప్పులో కొంత నగదు పెట్టి ఇవ్వటం జరుగుతుంది. ఇది కూడా మూఢాచారమే. 3. కొన్నిచోట్ల అఖీఖహ్లో మేక తల మంగలి వానికి, తొడ ఆయాకి ఇచ్చే మూఢాచారం ఉంది. ఇది ఎంత మాత్రం తప్పనిసరి కాదు. 4. మరికొందరు అఖీఖహ్లో దుమ్ములను విరచడం చెడుగా భావిస్తారు. సరిగా భావిస్తారు. ఇది కూడా మూఢాచారమే. 5. మరికొందరు బిడ్డ దంతాలు పడినపుడు శనగలు పంచటం తప్పనిసరిగా భావిస్తారు. ఇది కూడా మూఢాచారమే. 6. మరికొందరు పాలు విడగొట్టేటప్పుడు అనేక మూఢాచారాలకు పాల్పడతారు. 7. మరి కొన్ని చోట్ల ముడి వ్రతం పాటించటం జరుగుతుంది. ఈ సందర్భంగా విందు ఏర్పాటు చేయబడుతుంది. వీటికి ఎటువంటి ఆధారాలు లేవు. అల్లాహ్‌ (త) మనందరికీ షరీఅత్‌ ప్రకారం ఆచరించే భాగ్యం ప్రసాదించుగాక! (ఆమీన్‌)

***

%d bloggers like this: