2– كِتابُ الْعِلْمِ
2. విజ్ఞాన పుస్తకం
మానవునికి గౌరవం, గొప్పతనం విద్యాజ్ఞానాలవల్లే లభించాయి. అన్నిటికంటే ముందు మానవునికి విద్యాజ్ఞానాలు ప్రసాదించబడ్డాయి. ఆదమ్ (అ)కు విద్యాజ్ఞానాలు ప్రసాదించబడ్డాయి. అందువల్లే దైవదూతల కంటే గొప్ప స్థానాన్ని పొందారు. ఖుర్‌ఆన్‌లో మొట్ట మొదటి ఆయతు విద్యాజ్ఞానాలను గురించే అవతరింపజేయబడింది.అల్లాహ్ ఆదేశం: ”చదువు! నీ ప్రభువు పేరుతో, ఆయనే (సర్వాన్ని) సృష్టించాడు! ఆయనే మానవుణ్ణి రక్తముద్దతో (జీవకణంతో) సృష్టించాడు. చదువు! మరియు నీ ప్రభువు పరమదాత. ఆయన కలం ద్వారా నేర్పాడు. మానవుడు ఎరుగని జ్ఞానాన్ని అతనికి బోధించాడు.” (సూ. అల్-అలఖ్, 96:1-5)
మరోచోట ”…విజ్ఞానులు మరియు అజ్ఞానులు సరిసమానులు కాగలరా?…” (సూ. అజ్-జుమర్, 39:9) అని ఆదేశించాడు. అంటే కాలేరని అర్థం. ఎందుకంటే జ్ఞానవంతులకు అల్లాహ్(త) ఉన్నత స్థానాలు ప్రసాదించాడు. ఇక్కడ విద్యాజ్ఞానాలు అంటే ధార్మిక విద్యాజ్ఞానాలు. వీటికి అనుగుణంగా ఉండేవి. క్రింద వీటికి సంబంధించిన హదీసులు పేర్కొనబడ్డాయి.
మొదటి విభాగం اَلْفَصْلُ الْأَوَّلُ
198 – [ 1 ] ( صحيح ) (1/70)
عَنْ عَبْدِ اللهِ بْنِ عَمْرٍو, قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “بَلِّغُوْا عَنِّيْ وَلَوْآيَةً, وَحَدِّثُوْا عَنْ بَنِيْ إِسْرَائِيْلَ وَلَا حَرَجَ, وَمَنْ كَذَبَ عَلَيَّ مُتَعَمِّدًا فَلْيَتَبَوأَ مَقْعَدَهُ مِنَ النَّارِ”. رَوَاهُ الْبُخَارِيُّ
198. (1) [1/70–దృఢం]
’అబ్దుల్లాహ్ బిన్ ’ఉమర్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”నా నుండి వచ్చింది ఒక్క ఆయతు అయినా సరే (ఇతరులకు) అందజేయండి. ఇంకా బనీ ఇస్రాయీ’ల్ సంఘటనలను వివరించండి. ఇందులో ఎటువంటి అభ్యం తరం లేదు. అయితే నేను అనని దాన్ని ఉద్దేశ్యపూర్వకంగా నాకు అంటగట్టిన వాడు తన నివాసాన్ని నరకంలో ఏర్పరచుకుంటాడు.” [1](బు’ఖారీ)
199 – [ 2 ] ( صحيح ) (1/70)
وَعَنْ سَمُرةَ بْنِ جُنْدُبٍ, وَالْمُغَيْرَةِ بْنِ شُعْبَةَ, قَالَا: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَنْ حَدَّثَ عَنِّيْ بِحَدِيْثٍ يَرَى أَنَّهُ كَذَبَ, فَهُوَ أَحَدُ الْكَاذِبِيْنَ”. رَوَاهُ مُسْلِمٌ .
199. (2) [1/70-దృఢం]
సముర బిన్ జున్‌దుబ్ మరియు ము’గైర బిన్ షు’అబహ్ కథనం: ప్రవక్త (స) ప్రవచనం, “ ‘అసత్య మైన ‘హదీస’ని తెలిసినప్పటికీ, ఉద్దేశ్యపూర్వకంగా అది నా (ప్రవక్త) తరఫు నుండి,’ అని ఉల్లేఖించిన వాడు, అసత్యవంతుల్లో ఒకడు.” [2] (ముస్లిమ్)
200 – [ 3 ] ( متفق عليه ) (1/70)
وَعَنْ مُعَاوِيَةَ, قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “مَنْ يَّرِدِ اللهُ بِهِ خَيْرًا يُّفَقِّهْهُ فِيْ الدِّيْنِ, وَإِنَّمَا أَنَا قَاسِمٌ وَاللهِ يُعْطِيْ”. متفق عليه
200. (3) [1/70–ఏకీభవితం]
ము’ఆవియహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”అల్లాహ్(త) ఒకరికి మంచి చేయాలనుకుంటే, అతనికి ధార్మిక జ్ఞానం ప్రసాదిస్తాడు. నేను కేవలం పంచేవాడిని మాత్రమే. ప్రసాదించే వాడు అల్లాహ్‌యే.” [3] (బు’ఖారీ, ముస్లిమ్)
201 – [ 4 ] ( صحيح ) (1/70)
وَعَنْ أَبِيْ هُرَيْرَةَ رضي الله عَنْهُ, قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “اَلنَّاسُ مَعَادِنُ كَمَعَادِنِ الذَّهَبِ وَالْفِضَّةِ خِيَارُهُمْ فِيْ الْجَاهِلِيَّةِ خِيَارُهُمْ فِيْ الْإِسْلَامِ إِذَا فَقَهُوْا”. رَوَاهُ مُسْلِمٌ .
201. (4) [1/70–దృఢం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ప్రజలు బంగారం, వెండి గనుల వంటివారు. అజ్ఞాన కాలంలో ఉత్తములు, ఇస్లామ్‌లో కూడా ఉత్తములే. అయితే వారు తెలివిగలవారై ఉండాలి.” [4] (ముస్లిమ్)
202 – [ 5 ] ( متفق عليه ) (1/70)
وَعَنْ ابْنِ مَسْعُوْدٍ, قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “لَا حَسَدَ إِلَّا فِيْ اِثْنَتَيْنِ: رَجُلٌ آتَاهُ اللهُ مَالَا فَسَلَّطَهُ عَلَى هَلَكَتِهِ فِيْ الْحَقِ, وَرَجُلٌ آتَاهُ اللهُ الْحِكْمَةَ فَهُوَ يَقْضِيْ بِهَا وَيُعَلِّمُهَا”.
202. (5) [1/70–ఏకీభవితం]
ఇబ్నె మస్’ఊద్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఇద్దరు వ్యక్తులపట్ల, రెండు విషయాల్లో ఈర్ష్య చెందటం సమంజసమే, ఒకడు అల్లాహ్(త) ధనసంపదలు ప్రసాదించి, వాటిని దైవమార్గంలో ఖర్చుచేసే భాగ్యం ప్రసాదించబడిన వ్యక్తి. మరొకడు అల్లాహ్(త) విద్యాజ్ఞానాలు ప్రసాదించి, వాటి ప్రకారం ఆచరించే, బోధించే, తీర్పులు చేసే భాగ్యం ప్రసాదించబడిన వ్యక్తి.” [5] (బు’ఖారీ, ముస్లిమ్)
203 – [ 6 ] ( صحيح ) (1/71)
وَعَنْ أَبِيْ هُرَيْرَةَ رضي الله عَنْهُ, قَالَ: قَالَ رَسُوْلُ اللهِ صلى الله عليه وسلم: “إِذَا مَاتَ الْإِنْسَانُ اِنْقَطَعَ عنه عَمَلُهُ إِلَّا مِنْ ثَلَاثَةِ أَشْيَاءٍ: صَدَقَةٍ جَارِيَةٍ, أَوْعِلْمٍ يُّنْتَفَعُ بِهِ, أَوْ وَلَدٍ صَالِحٍ يَدْعُوْ لَه”. رواه مسلم .
203. (6) [1/71–దృఢం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”మానవుడు మరణించిన తరువాత అతని ఆచరణా మార్గాలన్నీ మూసుకుంటాయి. అయితే మూడు మార్గాలు తెరచి ఉంటాయి. 1. ‘సదఖహ్ జారియహ్, 2. అతడు బోధించిన లాభదాయకమైన విద్య, 3. తల్లి దండ్రులకొరకు దు’ఆ చేసే ఉత్తమ సంతానం. [6] (ముస్లిమ్)
204 – [ 7 ] ( صحيح ) (1/71)
وَعَنْهُ, قَالَ: قَالَ رَسُولُ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: “مَنْ نَفَّسَ عَنْ مُؤْمِنٍ كُرْبَةً مِنْ كُرَبِ الدُّنْيَا, نَفَّسَ اللَّهُ عَنْهُ كُرْبَةً مِنْ كُرَبِ يَوْمِ الْقِيَامَةِ. وَمِنْ يَسَّرَ عَلَى مُعْسِرٍ يَسَّرَ اللَّهُ عَلَيْهِ فِي الدُّنْيَا وَالْآخِرَةِ. وَمَنْ سَتَرَ مُسْلِمًا سَتَرَهُ اللَّهُ فِي الدُّنْيَا وَالْآخِرَةِ. وَاللَّهُ فِي عَوْنِ الْعَبْدِ مَا كَانَ الْعَبْدُ فِي عَوْنِ أَخِيهِ. وَمَنْ سَلَكَ طَرِيقًا يَلْتَمِسُ فِيهِ عِلْمًا سَهَّلَ اللَّهُ لَهُ بِهِ طَرِيقًا إِلَى الْجَنَّةِ. وَمَا اجْتَمَعَ قَوْمٌ فِي بَيْتٍ مِنْ بُيُوتِ اللَّهِ يَتْلُونَ كِتَابَ اللَّهِ وَيَتَدَارَسُونَهُ بَيْنَهُمْ, إِلَّا نَزَلَتْ عَلَيْهِمُ السَّكِينَةُ, وَغَشِيَتْهُمُ الرَّحْمَةُ, وَحَفَّتْهُمُ الْمَلَائِكَةُ, وَذَكَرَهُمُ اللَّهُ فِي مَنْ عِنْدَهُ. وَمَنْ بَطَّأَ بِهِ عَمَلُهُ لَمْ يُسْرِعْ بِهِ نسبه”. رَوَاهُ مُسلم.
204. (7) [1/71–దృఢం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఎవరైనా ఒక ముస్లిమ్ వ్యక్తి ప్రాపంచిక కష్టాలను దూరం చేస్తే, అల్లాహ్(త) అతని ప్రళయదిన కష్టాలను దూరం చేస్తాడు. అదేవిధంగా ఎవరైనా మరొకరి కష్టాన్ని సులభతరం చేస్తారో, తీర్పుదినం నాడు వారి కష్టాన్ని అల్లాహ్ (త) సులభతరం చేస్తాడు. ఒక ముస్లిమ్ లోపాలను కప్పిపుచ్చిన వారి లోపాలను అల్లాహ్(త) ఇహలోకంలో, పరలోకంలో కప్పిపుచ్చు తాడు. అదేవిధంగా ఒకరు మరో ముస్లిమ్ వ్యక్తి సహాయంలో ఉన్నంతవరకు, అల్లాహ్(త) అతని సహాయంలో ఉంటాడు. అదేవిధంగా విద్యాభ్యాసం కోసం బయలు దేరిన వారి స్వర్గమార్గం అల్లాహ్(త) సులభతరం చేస్తాడు. అదేవిధంగా అల్లాహ్(త) గృహాలైన (మస్జిదుల్లో, మద్‌రసాల్లో) చేరి ఖుర్‌ఆన్ నేర్చుకోవటం, నేర్పించటం చేసే వారిపై అల్లాహ్ (త) ప్రశాంతత అవతరిస్తుంది. ఇంకా దైవకారుణ్యం వారిని ఆవరిస్తుంది. ఇంకా కారుణ్య దూతలు వారిని చుట్టుముడుతారు. ఇంకా అల్లాహ్(త) తన చుట్టూ ఉన్న దైవదూతలతో వారి గురించి ప్రస్తావిస్తాడు. అదేవిధంగా సత్కార్యాలు చేయని వారికి, వారి వంశం, కుటుంబం ఏ మాత్రం పనికిరావు. (ముస్లిమ్)
205 – [ 8 ] ( صحيح ) (1/71)
وَعَنْهُ, قَالَ: قَالَ رَسُولُ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسلم: “إِن أول النَّاس يقْضى عَلَيْهِ يَوْمَ الْقِيَامَةِ رَجُلٌ اسْتُشْهِدَ, فَأُتِيَ بِهِ فَعَرَّفَهُ نِعَمَهُ فَعَرَفَهَا, فقَالَ: مَا عَمِلْتَ فِيهَا؟ قَالَ: قَاتَلْتُ فِيكَ حَتَّى اسْتُشْهِدْتُ. قَالَ: كَذَبْتَ؛ وَلَكِنَّكَ قَاتَلْتَ لِأَنْ يُقَالَ: جَرِيءٌ, فَقَدْ قِيلَ, ثُمَّ أَمر بِهِ فسحب على وَجهه حَتَّى ألقِي فِي النَّارِ. وَرَجُلٌ تَعَلَّمَ الْعِلْمَ وَعَلَّمَهُ, وَقَرَأَ الْقُرْآنَ, فَأُتِيَ بِهِ فَعَرَّفَهُ نِعَمَهُ فَعَرَفَهَا. قَالَ: فَمَا عَمِلْتَ فِيهَا؟ قَالَ: تَعَلَّمْتُ الْعِلْمَ وَعَلَّمْتُهُ, وَقَرَأْتُ فِيكَ الْقُرْآنَ. قَالَ: كَذَبْتَ؛ وَلَكِنَّكَ تَعَلَّمْتَ الْعلم ليقال: إنَّك عَالِمٌ, وَقَرَأْتَ الْقُرْآنَ لِيُقَالَ: هُوَ قَارِئٌ, فَقَدْ قِيلَ, ثُمَّ أُمِرَ بِهِ فَسُحِبَ عَلَى وَجْهِهِ حَتَّى أُلْقِيَ فِي النَّارِ. وَرَجُلٌ وَسَّعَ اللَّهُ عَلَيْهِ وَأَعْطَاهُ مِنْ أَصْنَافِ الْمَالِ كُلِّهِ, فَأُتِيَ بِهِ فَعَرَّفَهُ نِعَمَهُ فَعَرَفَهَا, قَالَ: فَمَا عَمِلْتَ فِيهَا؟ قَالَ: مَا تَرَكْتُ مِنْ سَبِيلٍ تُحِبُّ أَنْ يُنْفَقَ فِيهَا إِلَّا أَنْفَقْتُ فِيهَا لَكَ. قَالَ: كَذَبْتَ, وَلَكِنَّكَ فَعَلْتَ لِيُقَالَ: هُوَ جَوَادٌ؛ فَقَدْ قِيلَ, ثُمَّ أُمِرَ بِهِ فَسُحِبَ عَلَى وَجْهِهِ ثُمَّ أُلْقِيَ فِي النَّارِ”. رَوَاهُ مُسْلِمٌ.
205. (8) [1/71–దృఢం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”తీర్పుదినం నాడు అన్నిటికంటే ముందు వీరమరణం పొందిన వ్యక్తిని విచారించడం జరుగుతుంది. తీర్పు మైదా నంలో అల్లాహ్(త) ముందు ప్రవేశపెట్ట బడతాడు. అల్లాహ్ (త) తన అనుగ్రహాల గురించి ప్రస్తావిస్తాడు. అతడు అన్నిటిని గుర్తిస్తాడు. అప్పుడు అల్లాహ్(త), ‘నీవు ఈ అనుగ్రహాలను పొంది, ఏం కర్మలు చేశావు?’ అని ప్రశ్నిస్తాడు. అప్పుడు ఆ వ్యక్తి, ‘నీ మార్గాంలో పోరాటం చేశాను. చివరికి వీరమరణం పొందాను,’ అని అంటాడు. అప్పుడు అల్లాహ్(త), ‘అసత్యం పలుకుతున్నావు, కాని ఈ వ్యక్తి మహా వీరుడు శూరుడు అనడానికి పోరాటం చేసావు,’ అని చెప్పి, అతన్ని గురించి ఆదేశిస్తాడు. అతన్ని బోర్లాపడవేసి ఈడ్చుకు పోయి నరకంలో పడవేయడం జరుగుతుంది. ఆ తరువాత ఒక పండితుడ్ని, ఖుర్‌ఆన్ పఠించేవాడ్ని తీసుకురావటం జరుగుతుంది. అతన్ని అల్లాహ్(త) ముందు ప్రవేశ పెట్టటం జరుగుతుంది. అల్లాహ్(త) అతనికి తన అనుగ్రహాలను గుర్తుచేస్తాడు. అతడు గుర్తిస్తాడు. అప్పుడు అల్లాహ్(త) వీటిని పొంది, ‘నీవు ఏం చేశావు?’ అని అంటాడు. దానికి అతడు, ‘నేను విద్యనభ్యసించాను, ఇతరులకు నేర్పించాను, నీ ప్రీతి కోసం ఖుర్‌ఆన్ పఠించాను,’ అని అంటాడు. దానికి అల్లాహ్(త), ‘నీవు అసత్యం పలుకుతున్నావు,’ అని అతన్ని గురించి ఆదేశిస్తాడు. అతన్ని నరకంలో పడవేయటం జరుగుతుంది. ఆ తరువాత ఒక దానం చేసే వాడిని తీసుకురావటం జరుగుతుంది. అతనికి అల్లాహ్ (త) అన్నిరకాల ధనసంపదలు ఇచ్చి ఉంటాడు. అల్లాహ్ (త) అతనికి కూడా తన అనుగ్రహాలను గుర్తుచేస్తాడు. ఇంకా, ‘వీటిని పొంది నీవు ఏంచేశావు?’ అని ప్రశ్నిస్తాడు. దానికి ఆ వ్యక్తి, ‘నీ మార్గంలో ఖర్చుచేశాను,’ అని అంటాడు. అప్పుడు అల్లాహ్(త), నీవు నాకోసం కాదు, పేరు ప్రఖ్యాతుల కోసం చేశావు, అది జరిగిపోయింది,’ అనిచెప్పి, అతన్ని నరకంలో వెల్లకిలా పడవేయటం జరుగుతుంది.” [7] (ముస్లిమ్)
206 – [ 9 ] ( متفق عليه ) (1/72)
وَعَنْ عَبْدِ اللَّهِ بْنِ عَمْرٍو, قَالَ: قَالَ رَسُولُ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: “إِنَّ اللَّهَ لَا يَقْبِضُ الْعِلْمَ انْتِزَاعًا يَنْتَزِعُهُ مِنَ الْعِبَادِ, وَلَكِنْ يَقْبِضُ الْعِلْمَ بِقَبْضِ الْعُلَمَاءِ, حَتَّى إِذَا لَمْ يُبْقِ عَالِمًا؛ اتَّخَذَ النَّاسُ رُؤوسًا جُهَّالًا, فَسُئِلُوا فَأَفْتَوْا بِغَيْرِ عِلْمٍ , فضلوا وأضلوا”. متفق عليه.
206. (9) [1/72–ఏకీభవితం]
‘అబ్దుల్లాహ్ బిన్ ‘అమ్ర్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”అల్లాహ్(త) ఇహలోకం నుండి విద్యా జ్ఞానాలను ఒకేసారి లాక్కోవటం, ఎత్తుకోవటం జరుగదు. సత్య-బోధకులను, పండితులను ఎత్తు కోవటం జరుగు తుంది. ఆచరణలతో కూడిన పండితులెవరూ ఉండరు. అప్పుడు ప్రజలు విద్యాజ్ఞానాలులేని అజ్ఞానులను తమ నాయకులుగా ఎన్నుకుంటారు. వారిని ధార్మిక సమస్యలను గురించి అడగటం జరుగుతుంది. దానికి వారు ఏమీ తెలియకుండానే సమాధానాలు ఇవ్వటం జరుగు తుంది. ఫలితంగా తామూ మార్గభ్రష్టత్వానికి గురవుతారు, ఇతరులను కూడా మార్గభ్రష్టత్వానికి గురి చేస్తారు. [8](బు’ఖారీ, ముస్లిమ్)
207 – [ 10 ] ( متفق عليه ) (1/72)
وَعَن شَقِيق: كَانَ عبد الله يُذَكِّرُ النَّاسَ فِي كُلِّ خَمِيسٍ فَقَالَ لَهُ رَجُلٌ: يَا أَبَا عَبْدِ الرَّحْمَنِ! لَوَدِدْتُ أَنَّكَ ذكرتنا في كُلِّ يَوْمٍ. قَالَ: أَمَا إِنَّهُ يَمْنَعُنِي مِنْ ذَلِكَ أَنِّي أَكْرَهُ أَنْ أُمِلَّكُمْ, وَإِنِّي أَتَخَوَّلُكُمْ بِالْمَوْعِظَةِ كَمَا كَانَ رَسُولُ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ يَتَخَوَّلُنَا بِهَا مَخَافَةَ السَّآمَةِ عَلَيْنَا. متفق عليه.
207. (10) [1/72–ఏకీభవితం]
షఖీఖ్ (ర) కథనం: ’అబ్దుల్లాహ్ బిన్ మస్’ఊద్ (ర) ప్రతివారం, గురువారం నాడు ధార్మిక విషయాలను బోధించే వారు. ఒకరోజు ఒక వ్యక్తి అతని వద్దకు వచ్చి, ఓ అబూ ‘అబ్దుర్ర’హ్మాన్! ‘మీరు మమ్మల్ని ప్రతి రోజూ బోధించాలని మేము కోరుకుంటున్నాం,’ అని విన్నవించుకున్నాడు. దానికి ‘అబ్దుల్లాహ్ బిన్ మస్’ఊద్ (ర) నేను అలా చేయగలను, కాని అలా చేసి నేను మిమ్మల్ని విసిగిపోయేలా చేయదలచుకోలేదు. ఎందు కంటే, ప్రవక్త (స) బోధించిన విధంగానే నేను మిమ్మల్ని బోధిస్తున్నాను. విసుగుచెందకుండా మాపట్ల వ్యవహరించి నట్టే, నేనూ మీపట్ల వ్యవహ రిస్తున్నాను.” [9](బు’ఖారీ, ముస్లిమ్)
208 – [ 11 ] ( صحيح ) (1/72)
وَعَنْ أَنَسٍ, قَالَ: كَانَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ إِذَا تَكَلَّمَ بِكَلِمَةٍ أَعَادَهَا ثَلَاثًا حَتَّى تُفْهَمَ عَنْهُ, وَإِذَا أَتَى عَلَى قَوْمٍ فَسَلَّمَ عَلَيْهِمْ سَلَّمَ عَلَيْهِمْ ثَلَاثًا”. رَوَاهُ الْبُخَارِيُّ.
208. (11) [1/72-దృఢం]
అనస్ (ర) కథనం: ప్రవక్త (స) మాట్లాడితే, మూడు సార్లు పలుకుతారు. ఒకవేళ ఒక వర్గం లేదా ఒక బృందం వద్దకు వెళితే, మూడుసార్లు సలామ్ చేస్తారు.[10](బు’ఖారీ)
209 – [ 12 ] ( صحيح ) (1/72)
عَن أبي مَسْعُود الْأَنْصَارِيِّ, قَالَ: جَاءَ رَجُلٌ إِلَى النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ فَقَالَ: إِنِّه أُبْدِعَ بِي فَاحْمِلْنِي. فَقَالَ: “مَا عِنْدِي “فَقَالَ رَجُلٌ: يَا رَسُولَ اللَّهِ! أَنَا أَدُلُّهُ عَلَى مَنْ يَحْمِلُهُ. فَقَالَ رَسُولُ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: “مَنْ دَلَّ عَلَى خَيْرٍ فَلَهُ مثل أجر فَاعله”. رَوَاهُ مُسلم.
209. (12) [1/72–దృఢం]
అబూ మస్’ఊద్ అ’న్సారీ (ర) కథనం: ప్రవక్త (స) వద్దకు ఒక వ్యక్తి వచ్చి, ప్రవక్తా! ‘నా ఒంటె బలహీనపడి అలసి పోతుంది, నడవలేక పోతుంది. ఏదైనా వాహనం ఉంటే ఇప్పించండి,’ అని విన్నవించుకున్నాడు. అప్పుడు ప్రవక్త (స), ‘ప్రస్తుతం నా దగ్గర వాహనం ఏదీ లేదు,’ అని అన్నారు. అప్పుడు ఒక వ్యక్తి లేచి, ‘ప్రవక్తా! నాకు తెలిసిన ఒక వ్యక్తి ఉన్నాడు. అతడు ఇతనికి వాహనం ఇవ్వగలడు,’ అని విన్నవించుకున్నాడు. అప్పుడు ప్రవక్త (స), ‘మంచి విషయాలను తెలిపేవారికి దాన్ని ఆచరించే వానితో సమానంగా పుణ్యం లభిస్తుంది,’ అని ప్రవచించారు. (ముస్లిమ్)
210 – [ 13 ] ( صحيح ) (1/72)
وَعَن جرير, قَالَ: كُنَّا فِي صدر النهارعند رَسُولِ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ, فَجَاءَهُ قَوْمٌ عُرَاةٌ مُجْتَابِي النِّمَارِ أَوِ الْعَبَاءِ مُتَقَلِّدِي السُّيُوفِ, عَامَّتُهُمْ مِنْ مُضَرَ, بَلْ كُلُّهُمْ مِنْ مُضَرَ, فَتَمَعَّرَ وَجْهُ رَسُولِ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ لِمَا رَأَى بِهِمْ مِنَ الْفَاقَةِ, فَدَخَلَ ثُمَّ خَرَجَ فَأَمَرَ بِلَالًا فَأَذَّنَ: وَأَقَامَ فَصَلَّى ثُمَّ خَطَبَ فَقَالَ: “(يَا أَيُّهَا النَّاسُ اتَّقُوا رَبَّكُمُ الَّذِي خَلَقَكُمْ مِنْ نَفْسٍ وَاحِدَةٍ) إِلَى آخَرِ الْآيَةِ (إِنَّ اللَّهَ كَانَ عَلَيْكُمْ رقيبا؛ 4: 1) ,
وَالْآيَةُ الَّتِي فِي الْحَشْرِ (اتَّقُوا اللَّهَ وَلْتَنْظُرْ نَفْسٌ مَا قَدَّمَتْ لِغَدٍ؛ 59: 18) تَصَدَّقَ رَجُلٌ مِنْ دِينَارِهِ, مِنْ دِرْهَمِهِ, مِنْ ثَوْبِهِ, مِنْ صَاعِ بُرِّهِ, مِنْ صَاعِ تَمْرِهِ, حَتَّى قَالَ: وَلَوْ بِشِقِّ تَمْرَةٍ “قَالَ: فَجَاءَ رَجُلٌ مِنَ الْأَنْصَارِ بِصُرَّةٍ كَادَتْ كَفُّهُ تَعْجَزُ عَنْهَا, بل قد عجزت, ثُمَّ تَتَابَعَ النَّاسُ حَتَّى رَأَيْتُ كَوْمَيْنِ مِنْ طَعَامٍ وَثِيَابٍ. حَتَّى رَأَيْتُ وَجْهُ رَسُولِ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ يَتَهَلَّلُ كَأَنَّهُ مُذْهَبَةٌ فَقَالَ رَسُولُ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: “مَنْ سَنَّ فِي الْإِسْلَامِ سُنَّةً حَسَنَةً فَلَهُ أَجْرُهَا وَأَجْرُ مَنْ عَمِلَ بِهَا مِنْ بَعْدِهِ مِنْ غَيْرِ أَنْ يَنْقُصَ مِنْ أُجُورِهِمْ شَيْءٌ, وَمَنْ سَنَّ فِي الْإِسْلَامِ سُنَّةً سَيِّئَةً كَانَ عَلَيْهِ وِزْرُهَا وَوِزْرُ مَنْ عَمِلَ بِهَا مِنْ بَعْدِهِ مِنْ غَيْرِ أَنْ يَنْقُصَ مِنْ أَوْزَارِهِمْ شَيْء”. رَوَاهُ مُسلم.
210. (13) [1/72–దృఢం]
జరీర్ (ర) కథనం: ఒకరోజు మేము ఉదయంపూట ప్రవక్త (స) వద్ద కూర్చుని ఉన్నాము. అప్పుడు కొంతమంది వచ్చారు. వారి శరీరంపై కంబళి లేదా ‘అబా’ వేసుకొని ఉన్నారు. వారి మెడలో కరవాలం వ్రేలాడుతుంది. వారిలో అధిక శాతం అంటే అందరూ ము’దర్ తెగకు చెందిన వారే. వారు ఆకలి దప్పులతో దీనస్థితిలో ఉన్నారు. వారి స్థితి చూసి, ప్రవక్త (స) ముఖవర్చస్సు మారిపోయింది. ప్రవక్త (స) ఇంటిలోపలికి వెళ్ళారు. అనంతరం బయటకు వచ్చారు. బిలాల్‌ను అ’జాన్ ఇవ్వమని ఆదేశించారు. అ’జాన్ అయ్యింది. అందరూ వచ్చిన తర్వాత ఇఖామత్ అయ్యింది. ప్రవక్త (స) నమా’జ్ చదివించారు. నమా’జు తర్వాత ప్రసంగిస్తూ ఈ వాక్యాలు పఠించారు.
1. ” ఓ మానవులారా! మీ ప్రభువు పట్ల భయభక్తులు కలిగి ఉండండి. ఆయన మిమ్మల్ని ఒకేప్రాణి (ఆదమ్) నుండి సృష్టించాడు మరియు ఆయనే దాని (ఆ ప్రాణి) నుండి దాని జంట(‘హవ్వా)ను సృష్టించాడు మరియు వారిద్దరి నుండి అనేక పురుషులను మరియు స్త్రీలను వ్యాపింపజేశాడు. మరియు ఆ అల్లాహ్ యందు భయ భక్తులు కలిగి ఉండండి, ఎవరి ద్వారా నైతే (పేరుతోనైతే) మీరు మీ పరస్పర (హక్కులను) కోరుతారో; మరియు మీ బంధుత్వాలను గౌరవించండి (త్రెంచకండి). నిశ్చయంగా అల్లాహ్ మిమ్మల్ని సదా కనిపెట్టుకొని ఉన్నాడు. (సూ. అన్నిసా, 4:1)
2. ”ఓ విశ్వాసులారా! అల్లాహ్ పట్ల భయభక్తులు కలిగి ఉండండి. మరియు ప్రతివ్యక్తి, తాను రేపటి కొరకు ఏమి సమకూర్చుకున్నాడో చూసుకోవాలి. మరియు అల్లాహ్ పట్ల భయభక్తులు కలిగి ఉండండి. నిశ్చయంగా, మీరు చేసేదంతా అల్లాహ్ ఎరుగును!” (సూ. అల్-హష్ర్, 59:18)
అనంతరం ప్రవక్త (స), ”ప్రజలు తమ సంపదలలో నుండి దైవమార్గంలో దానధర్మాలు చేయాలి. చివరికి ఖర్జూరం ముక్క అయినా సరే,” అని అన్నారు. అది విన్న ఒక అన్సారీ వ్యక్తి కాసులతో కూడిన ఒక సంచిని తీసుకువచ్చారు. అది చాలా బరువుగా ఉన్నందువల్ల దాన్ని మోయలేక పోతున్నాడు. చివరికి తెచ్చిపెట్టాడు. అది చూసి ఇతరులు కూడా తమ తమ ధనసంపదల నుండి తీసుకురావటం జరిగింది. చివరికి కాసులు, బట్టలు, ఆహార ధాన్యాలు ప్రోగులు ఏర్పడ్డాయి. అది చూసి, ప్రవక్త (స) చాలా సంతోషించారు. చివరికి ప్రవక్త (స) ముఖ వర్చస్సు సంతోషంతో మెరవసాగింది. అప్పుడు ప్రవక్త (స), ‘ఇస్లామ్‌లో ఒక వ్యక్తి మంచి పద్ధతి ప్రారంభిస్తే, అతనికి దాని పుణ్యంతో పాటు దాన్ని అనుసరించిన వారి పుణ్యం కూడా లభిస్తుంది. అనుసరించిన వారి పుణ్యం ఏమాత్రం తగ్గదు. అదేవిధంగా ఇస్లామ్‌లో ఒక చెడు పద్ధతిని ప్రారంభిస్తే, అతనికి దాని పాపంతో పాటు, అనుసరించేవారి పాపం కూడా చుట్టుకుంటుంది. అనుసరించేవారి పాపం ఏమాత్రం తగ్గదు,’ అని ప్రవచించారు.” (ముస్లిమ్)
211 – [ 14 ] ( متفق عليه ) (1/72)
وَعَنِ ابْنِ مَسْعُودٍ، قَالَ: قَالَ رَسُولُ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: “لَا تُقْتَلُ نَفْسٌ ظُلْمًا إِلَّا كَانَ عَلَى ابْنِ آدَمَ الْأَوَّلِ كِفْلٌ مِنْ دَمِهَا؛ لِأَنَّهُ أَوَّلُ مَنْ سَنَّ الْقَتْلَ”. متفق عليه.
وَسَنَذْكُرُ حَدِيثَ مُعَاوِيَةَ: “لَا يَزَالُ مِنْ أُمَّتِي” فِي بَابِ ثَوَابِ هَذِهِ الْأُمَّةِ إِنْ شَاءَ الله تَعَالَى .
211. (14) [1/72–ఏకీభవితం]
ఇబ్నె మస్’ఊద్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ప్రపంచంలో అన్యాయంగా చంపబడిన ప్రతి వ్యక్తికి బదులు, ఆదమ్ (అ) కుమారుడైన ఖాబిల్‌కు ఒక పాపం చుట్టుకుంటుంది. ఎందుకంటే హత్యను మొట్టమొదట ప్రారంభించిన వాడు అతడే!” (బు’ఖారీ, ముస్లిమ్)
—–
రెండవ విభాగం اَلْفَصْلُ الثَّانِيْ
212 – [15] ( حسن ) (1/74)
عَن كثير بن قيس, قَالَ: كُنْتُ جَالِسًا مَعَ أَبِي الدَّرْدَاءِ فِي مَسْجِد دمشق , فَجَاءَ رَجُلٌ فَقَالَ: يَا أَبَا الدَّرْدَاءِ! إِنِّي جِئْتُكَ مِنْ مَدِينَةِ الرَّسُولِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ, مَا جِئْتُ لِحَاجَةٍ. قَالَ: فَإِنِّي سَمِعْتُ رَسُولَ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ يَقُولُ: “مَنْ سَلَكَ طَرِيقًا يَطْلُبُ فِيهِ عِلْمًا سَلَكَ اللَّهُ بِهِ طَرِيقًا مِنْ طُرُقِ الْجَنَّةِ, وَإِنَّ الْمَلَائِكَةَ لَتَضَعُ أَجْنِحَتَهَا رِضًى لِطَالِبِ الْعِلْمِ, وَإِنَّ الْعَالِمَ يسْتَغْفر لَهُ من فِي السَّمَوَات وَمَنْ فِي الْأَرْضِ وَالْحِيتَانُ فِي جَوْفِ الْمَاءِ, وَإِنَّ فَضْلَ الْعَالِمِ عَلَى الْعَابِدِ كَفَضْلِ الْقَمَرِ لَيْلَةَ الْبَدْرِ عَلَى سَائِرِ الْكَوَاكِبِ, وَإِنَّ الْعُلَمَاءَ وَرَثَةُ الْأَنْبِيَاءِ, وَإِنَّ الْأَنْبِيَاءَ لَمْ يُوَرِّثُوا دِينَارًا وَلَا دِرْهَمًا, وَإِنَّمَا وَرَّثُوا الْعِلْمَ, فَمَنْ أَخَذَهُ أَخَذَ بِحَظٍّ وَافِرٍ”. رَوَاهُ أَحْمَدُ وَالتِّرْمِذِيُّ وَأَبُو دَاوُدَ وَابْنُ مَاجَهْ وَالدَّارِمِيُّ. وَسَمَّاهُ التِّرْمِذِيُّ قَيْسَ بن كثير.
212.(15) [1/74–ప్రామాణికం]
కసీ‘ర్ బిన్ ఖైస్ (ర) కథనం: దమిష్క్ జామె మస్జిద్‌లో అబూ-దర్దా’ (ర) వద్ద నేను కూర్చొని ఉన్నాను. ఇంతలో ఒకవ్యక్తి అతని వద్దకు వచ్చి, ‘మీ వద్ద ప్రవక్త (స)కు సంబం ధించిన ఒక ‘హదీసు’ ఉందని మదీనహ్ మునవ్వరహ్ లో విన్నాను. అక్కడి నుండి కేవలం ఆ’హదీసు’ నేర్చుకోవ టానికి వచ్చాను. నాకు మరేం పని లేదు,’ అని అన్నాడు. అది విన్న అబూ-దర్దా’, నేను ప్రవక్త (స), ‘విద్యాభ్యాసం కోసం బయలుదేరిన వ్యక్తికొరకు, అల్లాహ్(త) అతన్ని స్వర్గ మార్గంపై నడిపిస్తాడు, దైవదూతలు విద్యార్థులపై తమ రెక్కలను విప్పి నీడ కల్పిస్తారు. ఆచరించే పండితుని క్షమాపణ కొరకు భూమ్యాకాశాల్లో ఉన్న ప్రాణులన్నీ ప్రార్థిస్తాయి. చివరికి చేపలు కూడా ప్రార్థిస్తాయి. పండితుని స్థానం భక్తులపై, నక్షత్రాలపై వెన్నెల రాత్రి చంద్రునిలా ఉంటుంది. పండితులు ప్రవక్తల వారసులు. ఎందుకంటే దైవప్రవక్తలు వారసత్వ సంపదగా ధనాన్ని, ఆస్తులను వదల లేదు. విద్యాజ్ఞానాలను వారసత్వంలో వదిలారు. అందువల్ల విద్యాజ్ఞానాలను పొందినవాడు తన పరిపూర్ణ వంతును పొందినట్లు” అని ప్రవచిస్తూ ఉండగా విన్నాను,’ అని అన్నారు.[11] (అ’హ్మద్, తిర్మిజి’, అబూ దావూద్, ఇబ్నె మాజహ్, దార్మీ)
213 – [ 16 ] ( حسن ) (1/74)
وَعَن أبي أُمَامَة الْبَاهِلِيّ، قَالَ: ذُكِرَ لِرَسُولِ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ رَجُلَانِ أَحَدُهُمَا عَابِدٌ وَالْآخَرُ عَالِمٌ. فَقَالَ رَسُولُ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: “فَضْلُ الْعَالِمِ عَلَى الْعَابِدِ كَفَضْلِي عَلَى أَدْنَاكُمْ”. ثُمَّ قَالَ رَسُولُ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: “إِنَّ اللَّهَ وَمَلَائِكَتَهُ وَأَهْلَ السَّمَاوَاتِ وَالْأَرْضِ حَتَّى النَّمْلَةَ فِي جُحْرِهَا، وَحَتَّى الْحُوتَ، لَيُصَلُّونَ عَلَى معلم النَّاس الْخَيْ”. رَوَاهُ التِّرْمِذِيّ وَقَالَ حسن غَرِيب .
213. (16) [1/74–ప్రామాణికం]
అబూ-ఉమామ బాహిలీ (ర) కథనం: ప్రవక్త (స) వద్ద ఇద్దరు వ్యక్తులను గురించి ప్రస్తావించటం జరిగింది. ఒకడు పరమభక్తుడు, మరొకరు పండితుడు. ప్రవక్త (స) మాట్లాడుతూ మీలో నాకు ఎటువంటి ప్రాముఖ్యత ఉందో, భక్తులపై పండితుడికి అటువంటి ప్రాముఖ్యత ఉంది. ఇంకా అల్లాహ్(త), ఆయన దూతలు, భూమ్యా కాశాలలో ఉన్న ప్రాణులు, చివరికి చీమలు, చేపలూ, ప్రజలకు మంచిని బోధించేవారి గురించి ప్రార్థిస్తారు,” అని అన్నారు. (తిర్మిజి’ / ప్రామాణికం, ఏకోల్లేఖనం)
214 – [ 17 ] ( حسن ) (1/75)
وَرَوَاهُ الدَّارِمِيُّ عَنْ مَكْحُولٍ مُرْسَلًا، وَلَمْ يَذْكُرْ: رَجُلَانِ وَقَالَ: “فَضْلُ الْعَالِمِ عَلَى الْعَابِدِ كَفَضْلِي عَلَى أَدْنَاكُمْ، ثُمَّ تَلَا هَذِهِ الْآيَةَ: (إِنَّمَا يخْشَى الله من عباده الْعلمَاء؛ 35: 28)”. وسرد الحَدِيث إِلَى آخِره .
214. (17) [1/75–ప్రామాణికం]
ఈ ‘హదీసు’ను దార్మీ, మక్’హూల్ (ర) ద్వారా ఉల్లేఖించారు. అయితే అందులో వీరిద్దరి ప్రస్తావన లేదు. ఇంకా ప్రవక్త (స) మీలో నాకు ఎటువంటి ప్రాముఖ్యత ఉందో, భక్తులపై పండితునికి అటువంటి ప్రాముఖ్యత ఉంది. ఆ తరువాత ప్రవక్త (స) ఈ ఆయతును పఠించారు. ”అల్లాహ్ దాసులలో జ్ఞానం గలవారు మాత్రమే ఆయనకు భయపడతారు…” (సూ. ఫాతిర్, 35:28) తరువాత చివరి వరకు ‘హదీసు’ను పేర్కొన్నారు.
215 – [ 18 ] ( ضعيف ) (1/75)
وَعَنْ أَبِي سَعِيدٍ الْخُدْرِيِّ، قَالَ: قَالَ رَسُولُ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: “إِنَّ النَّاسَ لَكُمْ تَبَعٌ، وَإِنَّ رِجَالًا يَأْتُونَكُمْ مِنْ أَقْطَارِ الْأَرْضِ يَتَفَقَّهُونَ فِي الدِّينِ، فَإِذَا أَتَوْكُمْ فَاسْتَوْصُوا بهم خيرا”. رَوَاهُ التِّرْمِذِيّ.
215. (18) [1/75–బలహీనం]
అబూ-స’యీద్ ‘ఖుద్రీ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”వాస్తవంగా ప్రజలు మిమ్మల్ని అనుస రిస్తారు. భూమిపై అన్నివైపుల నుండి ప్రజలు ధార్మిక విద్య అభ్యసించటానికి మీ వద్దకు వస్తారు. వాళ్ళు మీ వద్దకు వస్తే, మీరు వారి పట్ల మంచిగా ప్రవర్తించాలని హితబోధ చేస్తున్నాను.” [12] (తిర్మిజి’)
216 – [ 19 ] ( ضعيف ) (1/75)
وَعَنْ أَبِي هُرَيْرَةَ رَضِيَ اللَّهُ عَنْهُ ، قَالَ: قَالَ رَسُولُ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: “الْكَلِمَةُ الْحِكْمَةُ، ضَالَّةُ الْحَكِيمِ، فَحَيْثُ وَجَدَهَا فَهُوَ أَحَقُّ بِهَا”. رَوَاهُ التِّرْمِذِيُّ وَابْنُ مَاجَهْ. وَقَالَ التِّرْمِذِيُّ: هَذَا حَدِيثٌ غَرِيبٌ، وَإِبْرَاهِيمُ بْنُ الْفَضْلِ الرَّاوِي يضعف فِي الحَدِيث
216. (19) [1/75–బలహీనం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”వివేకవంతమైన వచనాలు, విషయాలు వివేకవంతుని తప్పిపోయిన సొత్తు. వాటిని ఎక్కడ పొందినా అతడే దానికి అర్హుడు.” [13] (తిర్మిజీ / ఏకోల్లేఖనం. ఇబ్రాహీమ్ బిన్ ఫ’దల్ ఈ ‘హదీస్’ ను బలహీన మైనదిగా పేర్కొన్నారు.
217 – [ 20 ] ( موضوع ) (1/75)
وَعَنِ ابْنِ عَبَّاسٍ، قَالَ: قَالَ رَسُولُ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: “فَقِيهٌ وَاحِدٌ أَشَدُّ عَلَى الشَّيْطَانِ مِنْ أَلْفِ عَابِدٍ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَابْن مَاجَه.
217. (20) [1/75–కల్పితం]
ఇబ్నె ‘అబ్బాస్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”బుద్ధీ జ్ఞానాలు కలిగి, ఆచరణాపరుడైన పండితుడు షైతాన్‌పై 1000 మంది భక్తుల కంటే దృఢమైన వాడు.”[14] (తిర్మిజి’, ఇబ్నె మాజహ్)
218 – [ 21 ] ( حسن لغيره) (1/76)
وَعَنْ أَنَسِ بْنِ مَالِكٍ، قَالَ: قَالَ رَسُولُ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: “طَلَبُ الْعِلْمِ فَرِيضَةٌ عَلَى كُلِّ مُسْلِمٍ، وَوَاضِعُ الْعِلْمِ عِنْدَ غير أَهله كمقلد الْخَنَازِير الْجَوْهَر واللؤلؤ وَالذَّهَبَ”. رَوَاهُ ابْنُ مَاجَهْ. وَرَوَى الْبَيْهَقِيُّ فِي “شُعَبِ الْإِيمَانِ” إِلَى قَوْلِهِ “مُسْلِمٍ”. وَقَالَ: هَذَا حَدِيثٌ مَتْنُهُ مَشْهُورٌ، وَإِسْنَادُهُ ضَعِيفٌ، وَقَدْ رُوِيَ من أوجه كلهَا ضَعِيف .
218. (21) [1/76–పరాప్రామాణికం]
అనస్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”విద్యనభ్య సించటం ప్రతి ముస్లిమ్ స్త్రీ పురుషులపై తప్పనిసరి విధి. అర్హతలేని వాడికి విద్య నేర్పినవాడు, పంది మెడలో ముత్యాల హారం, బంగారు హారం వేసిన వాడితో సమానం.” [15] (ఇబ్నె మాజహ్, బైహఖీ-షు’అబిల్ ఈమాన్ / ఆధారాలు బలహీనం)
బైహఖీ దీని మూలం ప్రసిద్ధిచెందినదని, ప్రామాణికత బలహీనమైనదని, ఇది అనేక మార్గాల ద్వారా ఉల్లేఖించబడిందని, అయితే మార్గాలన్నీ బలహీన మైనవని పేర్కొన్నారు.
219 – [ 22 ] ( ضعيف ) (1/76)
وَعَنْ أَبِي هُرَيْرَةَ، قَالَ: قَالَ رَسُولُ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: “خَصْلَتَانِ لَا تَجْتَمِعَانِ فِي مُنَافِقٍ: حُسْنُ سَمْتٍ، وَلَا فِقْهٌ فِي الدّين”. رَوَاهُ التِّرْمِذِيّ .
219. (22) [1/76–బలహీనం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఈ ఉత్తమ గుణాలు కపటాచారిలో ఉండవు. 1. మంచి ప్రవర్తన 2. ధార్మిక అవగాహన. [16](తిర్మిజి’)
220 – [ 23 ] ( ضعيف ) (1/76)
وَعَنْ أَنَسٍ، قَالَ: قَالَ رَسُولُ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: “مَنْ خَرَجَ فِي طَلَبِ الْعِلْمِ فَهُوَ فِي سَبِيلِ اللَّهِ حَتَّى يرجع”. رَوَاهُ التِّرْمِذِيّ والدارمي.
220. (23) [1/76–బలహీనం]
అనస్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”విద్యాభ్యాసం కోసం బయలుదేరిన వ్యక్తి తిరిగివచ్చే వరకు దైవమార్గంలో ఉన్నట్టే. [17] (తిర్మిజి’, దార్మీ)
221 – [ 24 ] ( ضعيف ) (1/76)
وَعَن سَخْبَرَة الْأَزْدِيّ، قَالَ: قَالَ رَسُولُ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: “مِنْ طَلَبَ الْعِلْمَ كَانَ كَفَّارَةً لِمَا مَضَى”. رَوَاهُ التِّرْمِذِيُّى وَالدَّارِمِيُّ. وَقَالَ التِّرْمِذِيُّ: هَذَا حَدِيثٌ ضَعِيفُ الْإِسْنَادِ. وَأَبُو دَاوُدَ الرَّاوِي يُضَعَّفُ.
221. (24) [1/76–బలహీనం]
స’ఖ్‌బరహ్ అల్ అ’జదీ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ధార్మిక విద్యాభ్యాసం పొందిన వ్యక్తి యొక్క వెనుకటి పాపాలు క్షమించబడతాయి.” (తిర్మిజి’ / బలహీనం, దార్మీ, అబూ దావూద్ / రావీ-బలహీనం)
222 – [ 25 ] ( ضعيف ) (1/77)
وَعَنْ أَبِي سَعِيدٍ الْخُدْرِيِّ، قَالَ: قَالَ رَسُولُ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: “لَنْ يَشْبَعَ الْمُؤْمِنُ مِنْ خَيْرٍ يَسْمَعُهُ حَتَّى يَكُونَ مُنْتَهَاهُ الْجنَّة”. رَوَاهُ التِّرْمِذِيّ .
222. (25) [1/77–బలహీనం]
అబూ స’యీద్ ‘ఖుద్రీ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”విశ్వాసికి విద్యాజ్ఞానాలు, మేలు విషయాల్లో ఎన్నడూ కడుపు నిండదు. అతడు చివరికి స్వర్గానికి చేరుకుంటాడు. అంటే మరణం వరకు విద్యనభ్యసించినా తక్కువే. జీవిత మంతా విద్యాభ్యాసం, శిక్షణల్లోనే గడుపుతాడు. చివరికి స్వర్గానికి చేరుకుంటాడు. (తిర్మిజి’)
223 – [ 26 ] ( صحيح ) (1/77)
وَعَنْ أَبِي هُرَيْرَةَ رَضِيَ اللَّهُ عَنْهُ، قَالَ: قَالَ رَسُولُ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: “من سُئِلَ عَنْ عِلْمٍ عَلِمَهُ ثُمَّ كَتَمَهُ؛ أُلْجِمَ يَوْمَ الْقِيَامَةِ بِلِجَامٍ مِنْ نَارٍ”. رَوَاهُ أَحْمَدُ وَأَبُو دَاوُد وَالتِّرْمِذِيّ .
223. (26) [1/77–దృఢం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”అతనికి తెలిసి ఉన్న ధార్మిక విషయం గురించి ప్రశ్నించబడి, అతడు తెలియపరచకపోతే తీర్పుదినం నాడు అతని నోటికి అగ్నికళ్ళెం వేయబడుతుంది.” (అ’హ్మద్, అబూ దావూద్, తిర్మిజి’)
224 – [ 27 ] ( صحيح ) (1/77)
وَرَوَاهُ ابْن مَاجَه عَن أنس .
224. (27) [1/77–దృఢం]
ఇబ్నె మాజహ్ ఈ ‘హదీస్’ ను, అనస్ (ర) ద్వారా ఉల్లేఖించారు.
225 – [ 28 ] ( ضعيف ) (1/77)
وَعَنْ كَعْبِ بْنِ مَالِكٍ، قَالَ: قَالَ رَسُولُ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: “مَنْ طَلَبَ الْعِلْمَ لِيُجَارِيَ بِهِ الْعُلَمَاءَ، أَوْ لِيُمَارِيَ بِهِ السُّفَهَاءَ، أَوْ يصرف بِهِ وُجُوه النَّاس إِلَيْهِ؛ أَدخله الله النَّار”. رَوَاهُ التِّرْمِذِيّ.
225. (28) [1/77–బలహీనం]
క’అబ్ బిన్ మాలిక్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”గొప్ప పండితునిగా పేరు ప్రఖ్యాతులు గడించటానికి, అజ్ఞానులపై గర్వాహంకారాలు ప్రదర్శించటానికి, ప్రజలను ఆకర్షించటానికి విద్య నభ్యసించిన వారిని అల్లాహ్ (త) నరకంలో పడవేస్తాడు.” (తిర్మిజి’)
226 – [29] ( ضعيف ) (1/77)
وَرَوَاهُ ابْن مَاجَه عَن ابْن عمر.
226. (29) [1/77–బలహీనం]
ఇబ్నె మాజహ్ ఈ ’హదీసు‘ను, ‘అబ్దుల్లాహ్ బిన్ ‘ఉమర్ ద్వారా ఉల్లేఖించారు.
227 – [ 30 ] ( صحيح ) (1/77)
وَعَنْ أَبِي هُرَيْرَةَ رَضِيَ اللَّهُ عَنْهُ، قَالَ: قَالَ رَسُولُ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: “مَنْ تَعَلَّمَ عِلْمًا مِمَّا يُبْتَغَى بِهِ وَجْهُ اللَّهِ، لَا يَتَعَلَّمُهُ إِلَّا لِيُصِيبَ بِهِ عَرَضًا مِنَ الدُّنْيَا؛ لَمْ يَجِدْ عَرْفَ الْجَنَّةِ يَوْمَ الْقِيَامَةِ”. يَعْنِي رِيحَهَا. رَوَاهُ أَحْمَدُ وَأَبُو دَاوُدَ وَابْن مَاجَه.
227. (30) [1/77–దృఢం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”విద్యాజ్ఞానాలు పొందినవాడు దైవప్రీతిని కోరడం జరుగుతుంది. కాని కేవలం ప్రాపంచిక ప్రయోజనాలు పొందటానికి మాత్రమే విద్యనభ్యసించినవారు, తీర్పు దినం నాడు స్వర్గసువాసన కూడా ఆస్వాదించ లేరు.” (అ’హ్మద్, అబూ దావూద్, ఇబ్నె మాజహ్)
228 – [31] ( صحيح ) (1/78)
وَعَنِ ابْنِ مَسْعُودٍ، قَالَ: قَالَ رَسُولُ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: “نَضَّرَ اللَّهُ عَبْدًا سَمِعَ مَقَالَتِي فَحَفِظَهَا وَوَعَاهَا وَأَدَّاهَا. فَرُبَّ حَامِلِ فِقْهٍ غَيْرِ فَقِيهٍ. وَرُبَّ حَامِلِ فِقْهٍ إِلَى مَنْ هُوَ أَفْقَهُ مِنْهُ. ثَلَاثٌ لَا يَغِلُّ عَلَيْهِنَّ قَلْبُ مُسْلِمٍ: إِخْلَاصُ الْعَمَلِ لِلَّهِ وَالنَّصِيحَةُ لِلْمُسْلِمِينَ . وَلُزُومُ جَمَاعَتِهِمْ، فَإِنَّ دَعْوَتَهُمْ تُحِيطُ مِنْ ورائهم”. رَوَاهُ الشَّافِعِي وَالْبَيْهَقِيّ فِي الْمدْخل.
228. (31) [1/78–దృఢం]
‘అబ్దుల్లాహ్ బిన్ మస్’ఊద్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”నా ‘హదీసు’లను విని, గుర్తుంచుకొని, ప్రజలకు అందజేసే వారిని అల్లాహ్(త) ఎల్లప్పుడూ సంతృప్తి కరంగా ఉంచుగాక!” అంటే ఇతరులకు నేర్పించేవాడు. కొందరు పండితులు వారికంటే తెలివి గలవారికి ‘హదీసు’లను అందజేస్తారు. మూడు విషయాల్లో ముస్లిమ్ విశ్వాసి ద్రోహం తలపెట్టడు: 1. అల్లాహ్(త) కోసం సరైన విధంగా ఆచరించటం, 2. ముస్లిముల పట్ల శ్రేయోభిలాష, 3. ముస్లిముల వర్గాన్ని అంటిపెట్టుకొని ఉండటం. ఎందు కంటే ముస్లిముల దీవెనలు వారిని ఆవరించి ఉంటాయి. (షాఫయీ, బైహఖీ-ము’ద్ఖిల్ లో)
229 – [ 32 ] ( صحيح ) (1/78)
وَرَوَاهُ أَحْمَدُ وَالتِّرْمِذِيُّ وَأَبُو دَاوُدَ وَابْنُ مَاجَهْ وَالدَّارِمِيُّ، عَنْ زَيْدِ بْنِ ثَابِتٍ. إِلَّا أَنَّ التِّرْمِذِيّ وَأَبا دواد لَمْ يَذْكُرَا: “ثَلَاثٌ لَا يَغِلُّ عَلَيْهِنَّ” إِلَى آخِره .
229. (32) [1/78–దృఢం]
అ’హ్మద్, తిర్మిజి’, అబూ-దావూద్, ఇబ్నె-మాజహ్, దార్మీ, ఈ ’హదీసు‘ను ‘జైద్ బిన్-సా’బిత్ ద్వారా ఉల్లేఖించారు. కాని తిర్మిజి’, అబూ-దావూద్ ఈ మూడు విషయాలను పేర్కొనలేదు. [18]
230 – [ 33 ] ( صحيح ) (1/78)
وَعَن ابْن مَسْعُودٍ، قَالَ: سَمِعْتُ رَسُولَ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ يَقُولُ: “نَضَّرَ اللَّهُ امْرَأً سَمِعَ مِنَّا شَيْئًا فَبَلَّغَهُ كَمَا سَمِعَهُ، فَرُبَّ مُبَلَّغٍ أَوْعَى لَهُ مِنْ سَامِعٍ”. رَوَاهُ التِّرْمِذِيُّ وَابْنُ مَاجَهْ.
230. (33) [1/78–దృఢం]
‘అబ్దుల్లాహ్ బిన్-మస్’ఊద్ (ర) కథనం: ప్రవక్త (స) ఇలా అంటూ ఉండగా నేను విన్నాను, ”మా నుండి ‘హదీసు’లు విని, విన్నది విన్నట్టు ప్రజలకు అందజేసిన వారిని అల్లాహ్ (త) సుఖసంతోషాలు ప్రసా దించుగాక!
ఎందుకంటే, విని అందజేసినవారి కంటే అందజేయ బడిన వారు బాగా గుర్తుంచుకోవచ్చు.” (తిర్మిజి’, ఇబ్నె మాజహ్)
231 – [34] ( صحيح ) (1/79)
وَرَوَاهُ الدَّارمِيّ عَن أبي الدَّرْدَاء.
231. (34) [1/79–దృఢం]
దార్మీ, ఈ ‘హదీస్’నే అబూ దర్‌దా’ ద్వారా ఉల్లేఖించారు.
232 – [ 35 ] ( صحيح ) (1/79)
وَعَنِ ابْنِ عَبَّاسٍ رَضِيَ اللَّهُ عَنْهُ، قَالَ: قَالَ رَسُولُ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: “اتَّقُوا الْحَدِيثَ عَنِّي إِلَّا مَا عَلِمْتُمْ، فَمَنْ كَذَبَ عَلَيَّ مُتَعَمِّدًا فَلْيَتَبَوَّأْ مَقْعَدَهُ مِنَ النَّارِ”. رَوَاهُ التِّرْمِذِيّ .
232. (35) [1/79–దృఢం]
ఇబ్నె’అబ్బాస్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”నా నుండి విన్న ‘హదీసు’లనుమాత్రమే అంద జేయండి. ఇతర ‘హదీసు’లకు దూరంగా ఉండండి. ఉద్దేశ్యపూర్వకంగా నాపై అసత్యం అంటగట్టినవాడు తన నివాసాన్ని నరకంలో ఏర్పాటు చేసుకుంటాడు.” (తిర్మిజి’)
233 – [ 36 ] ( صحيح ) (1/79)
وَرَوَاهُ ابْنُ مَاجَهْ عَنِ ابْنِ مَسْعُودٍ وَ جَابِرٍ وَلَمْ يَذْكُرِ: “اتَّقُوا الْحَدِيثَ عَنِّي إِلَّا مَا علمْتُم”.
233. (36) [1/79–దృఢం]
ఇబ్నె మాజహ్, ఈ‘హదీసు‘ను, ఇబ్నె మస్’ఊద్ మరియు జాబిర్ (ర) ద్వారా ఉల్లేఖించారు. అయితే అందులో ”ఇత్తఖుల్–‘హదీస్‘ ‘అన్నీ ఇల్లా మా ‘అలిమ్తుమ్” లేదు.
234 – [ 37 ] ( ضعيف ) (1/79)
وَعَنِ ابْنِ عَبَّاسٍ، قَالَ: قَالَ رَسُولُ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: “مَنْ قَالَ فِي الْقُرْآنِ بِرَأْيِهِ فَلْيَتَبَوَّأْ مَقْعَدَهُ مِنَ النَّارِ”.
وَفِي رِوَايَةٍ: “مَنْ قَالَ فِي الْقُرْآنِ بِغَيْرِ عِلْمٍ فَليَتَبَوَّأ مَقْعَده من النَّار”. رَوَاهُ التِّرْمِذِيّ.
234. (37) [1/79–బలహీనం]
ఇబ్నె ‘అబ్బాస్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”తన అభిప్రాయాల ద్వారా ఖుర్‌ఆన్ వ్యాఖ్యానం చేస్తే, అంటే ఖుర్‌ఆన్ వ్యాఖ్యానం బుద్ధి నుపయోగించి, దైవగ్రంథం మరియు ప్రవక్త(స) సాంప్రదాయాలను ఉపయోగించకుండా చేస్తే, అటు వంటి వ్యక్తి తన నివాసాన్ని నరకంలో ఏర్పాటు చేసుకుంటాడు.
మరో ఉల్లేఖనంలో జ్ఞానం లేకుండా ఖుర్‌ఆన్ గురించి మాట్లాడే వ్యక్తి తన నివాసాన్ని నరకాగ్నిలో నిర్మించు కుంటాడు.” (తిర్మిజి’)
235 – [ 38 ] ( ضعيف ) (1/79)
وَعَنْ جُنْدُبٍ، قَالَ: قَالَ رَسُولُ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: “مَنْ قَالَ فِي الْقُرْآنِ بِرَأْيِهِ فَأَصَابَ فقد أَخطَأ”. رَوَاهُ التِّرْمِذِيّ وَأَبُو دَاوُد.
235. (38) [1/79–బలహీనం]
జున్‌దుబ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఎవ రైనా ఖుర్‌ఆన్ విషయంలో తన సొంత అభిప్రాయం ప్రకారం వ్యాఖ్యానించి అనుకోకుండా అది సరైనదయినా అతడు పొరపాటు చేసినట్టే.” (తిర్మిజి’, అబూ దావూద్)
236 – [ 39 ] ( صحيح ) (1/79)
وَعَنْ أَبِي هُرَيْرَةَ رَضِيَ اللَّهُ عَنْهُ، قَالَ: قَالَ رَسُولُ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: “الْمِرَاءُ فِي الْقُرْآنِ كُفْرٌ”. رَوَاهُ أَحْمَدُ وَأَبُو دَاوُد.
236. (39) [1/79–దృఢం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఖుర్‌ఆన్ విషయంలో వాదనలకు దిగటం అవిశ్వాసం అవుతుంది.” [19] (అ’హ్మద్, అబూ దావూద్)
237 – [ 40 ] ( حسن ) (1/79)
وَعَنْ عَمْرِو بْنِ شُعَيْبٍ، عَنْ أَبِيهِ، عَنْ جَدِّهِ، قَالَ: سَمِعَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ قومًا يتدارؤون فِي الْقُرْآنِ، فَقَالَ: “إِنَّمَا هَلَكَ مَنْ كَانَ قَبْلَكُمْ بِهَذَا: ضَرَبُوا كِتَابَ اللَّهِ بَعْضَهُ بِبَعْضٍ، وَإِنَّمَا نَزَلَ كِتَابُ اللَّهِ يُصَدِّقُ بَعْضُهُ بَعْضًا، فَلَا تُكَذِّبُوا بَعْضَهُ بِبَعْضٍ، فَمَا عَلِمْتُمْ مِنْهُ فَقُولُوا، وَمَا جَهِلْتُمْ فَكِلُوهُ إِلَى عَالِمِهِ”. رَوَاهُ أَحْمد، وَابْن مَاجَه.
237. (40) [1/79–ప్రామాణికం]
‘అమ్ర్ బిన్ షు’ఐబ్ (ర) తన తండ్రి ద్వారా, అతను తన తండ్రి ద్వారా కథనం: ప్రవక్త (స), ‘నేను, కొంత మందిని ఖుర్‌ఆన్ విషయంలో వాదోపవాదం, ఘర్షణ, దూషించుకోవటం, చేస్తున్నట్లు విన్నాను. ప్రాచీన కాలపు ప్రజలు దీని మూలంగానే నాశనం అయ్యారు. వారు అల్లాహ్ (త) గ్రంథంలోని కొన్ని విషయాలను స్వీకరించేవారు. మరి కొన్ని విషయాలను తిరస్కరించే వారు. అంటే కొన్ని ఆయతులు కొన్ని ఆయతులకు భిన్నంగా ఉన్నాయన్నారు. వాస్తవం ఏమిటంటే, కొన్ని ఆయతులు మరికొన్ని ఆయతులను ధృవీక రిస్తున్నాయి. అందువల్ల కొన్ని వాక్యాలను స్వీకరించి, మరికొన్ని వాక్యాలను తిరస్కరించకండి. ఖుర్‌ఆన్ నుండి మీకు అర్థమైనంత వివరించండి. మీకు తెలియనిదాన్ని తెలిసిన వారిని అడిగి తెలుసుకోండి,” అని ప్రవచించారు. (అ’హ్మద్, ఇబ్నె మాజహ్)
238 – [ 41 ] ( لم تتم دراسته ) (1/80)
وَعَنِ ابْنِ مَسْعُودٍ، قَالَ: قَالَ رَسُولُ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: “أُنْزِلَ الْقُرْآنُ عَلَى سَبْعَةِ أَحْرُفٍ. لِكُلِّ آيَةٍ مِنْهَا ظَهْرٌ وَبَطْنٌ. وَلِكُلِّ حَدٍّ مَطْلَعٌ”. رَوَاهُ فِي شَرْحِ السُّنَّةِ.
238. (41) [1/80–అపరిశోధితం]
‘అబ్దుల్లాహ్ బిన్ మస్’ఊద్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఖుర్‌ఆన్ 7 విధాలలో అవతరింపజేయ బడింది. ప్రతి ఒక్కఆయత్ కు అంతర్బాహ్యాలు ఉన్నాయి. ఇంకా ప్రతి హద్దుకు ఒక ప్రత్యేక సంసిధ్ధత ఉంది.” [20] (షర్’హ్ సున్నహ్)
239 – [ 42 ] ( ضعيف ) (1/80)
وَعَنْ عَبْدِ اللَّهِ بْنِ عَمْرٍو، قَالَ: قَالَ رَسُولُ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: “الْعِلْمُ ثَلَاثَةٌ: آيَةٌ مُحْكَمَةٌ، أَوْ سُنَّةٌ قَائِمَةٌ، أَوْ فَرِيضَةٌ عَادِلَةٌ. وَمَا كَانَ سِوَى ذَلِكَ فَهُوَ فضل”. رَوَاهُ أَبُو دَاوُد ، وَابْن مَاجَه .
239. (42) [1/80–బలహీనం]
’అబ్దుల్లాహ్ బిన్ ’అమ్ర్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”జ్ఞానం 3 రకాలు. 1. ము’హ్‌కమతున్, అంటే స్పష్టమైనది. రద్దు కానిది. 2. సున్నతె ఖాయిమతున్, 3. ఫరీ’దతున్ ’ఆదిలతున్. ఇవేకాక ఇంకా ఉన్నాయి. [21] (అబూ-దావూద్, ఇబ్నె-మాజహ్)
240 – [ 43 ] ( صحيح ) (1/80)
وَعَن عَوْف بن مَالك الْأَشْجَعِيّ، قَالَ: قَالَ رَسُولُ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: “لَا يَقُصُّ إِلَّا أَمِيرٌ أَوْ مَأْمُورٌ أَو مختال”. رَوَاهُ أَبُو دَاوُد.
240. (43) [1/80–దృఢం]
’ఔఫ్ బిన్ మాలిక్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ముగ్గురు వ్యక్తులు ప్రసంగం చేస్తారు. పాలకుడు, పాలకులు, అహంకారి.” (అబూ దావూద్)
241 – [ 44 ] ( ضعيف ) (1/80)
وَرَوَاهُ الدَّارِمِيُّ، عَنْ عَمْرِو بْنِ شُعَيْبٍ ، عَنْ أَبِيهِ ، عَنْ جَدِّهِ ، وَفِي رِوَايَته يوجد “أَو مُرَاءٍ” بدل ” أَو مختالٌ”.
241. (44) [1/80–బలహీనం]
దార్మీ కూడా దీన్ని, ‘అమ్ర్ బిన్ షు’ఐబ్, అతని, తండ్రి, తాతల ద్వారా, ఉల్లేఖించారు. [22]
242 – [ 45 ] ( حسن ) (1/81)
وَعَنْ أَبِي هُرَيْرَةَ رَضِيَ اللَّهُ عَنْهُ، قَالَ: قَالَ رَسُولُ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: “مَنْ أَفْتَى بِغَيْرِ عِلْمٍ كَانَ إِثْمُهُ عَلَى مَنْ أَفْتَاهُ، وَمَنْ أَشَارَ عَلَى أَخِيهِ بِأَمْرٍ يَعْلَمُ أَنَّ الرُّشْدَ فِي غَيْرِهِ فَقَدْ خانه”. رَوَاهُ أَبُو دَاوُد.
242. (45) [1/81–ప్రామాణికం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”విషయం గురించి తెలియకుండా ఫత్వా (తీర్పు) ఇవ్వబడిన వ్యక్తి పాపం ఫత్వా ఇచ్చిన వ్యక్తిపై పడుతుంది. అదేవిధంగా తన సోదరునికి లాభంలేని విషయం గురించి సలహా ఇచ్చినవాడు ద్రోహం చేసినట్టే. అంటే అతడు తప్పుడు సలహా ఇచ్చాడు. ఇది ద్రోహం అవుతుంది.” (అబూ దావూద్)
243 – [ 46 ] ( ضعيف ) (1/81)
وَعَنْ مُعَاوِيَةَ، قَالَ: إِنَّ النَّبِيَ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ نَهَى عَنِ الْأُغْلُوطَاتِ. رَوَاهُ أَبُو دَاوُد.
243. (46) [1/81–బలహీనం]
ము’ఆవియహ్ (ర) కథనం: ప్రవక్త (స) చిక్కుల్లో పడవేయటాన్ని వారించారు.[23](అబూ దావూద్)
244 – [ 47 ] ( ضعيف ) (1/81)
وَعَنْ أَبِي هُرَيْرَةَ رَضِيَ اللَّهُ عَنْهُ، قَالَ: قَالَ رَسُولُ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: “تَعَلَّمُوا الْفَرَائِضَ وَالْقُرْآنَ وَعَلِّمُوا النَّاسَ فَإِنِّي مَقْبُوضٌ”. رَوَاهُ التِّرْمِذِيّ.
244. (47) [1/81–బలహీనం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”విధులను, ఖుర్‌ఆన్‌ను నేర్చుకోండి, ప్రజలకు నేర్పించండి. ఎందుకంటే నన్ను లేపుకోవటం జరుగు తుంది.” [24](తిర్మిజి’)
245 – [ 48 ] ( صحيح ) (1/81)
وَعَنْ أَبِي الدَّرْدَاءِ، قَالَ: كُنَّا مَعَ رَسُولِ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ فَشَخَصَ بِبَصَرِهِ إِلَى السَّمَاءِ ثُمَّ قَالَ: “هَذَا أَوَانٌ يُخْتَلَسُ فِيهِ الْعِلْمُ مِنَ النَّاسِ، حَتَّى لَا يَقْدِرُوا مِنْهُ على شَيْء”. رَوَاهُ التِّرْمِذِيّ.
245. (48) [1/81–దృఢం]
అబూ దర్దా‘ (ర) కథనం: మేము ప్రవక్త (స) వద్ద ఉన్నప్పుడు ప్రవక్త (స) ఆకాశంపై దృష్టిసారించి, ఈ సమయం ప్రజల వద్ద నుండి జ్ఞానాన్ని(వహీని) హరిస్తుం తుంది. చివరికి వారు ఏమాత్రం శక్తిలేని వారిగా ఉండి పోతారు అని అన్నారు.” [25] (తిర్మిజి’)
246 – [ 49 ] ( ضعيف ) (1/82)
وَعَن أبي هُرَيْرَة رِوَايَةً: “يُوشِكُ أَنْ يَضْرِبَ النَّاسُ أَكْبَادَ الْإِبِلِ يَطْلُبُونَ الْعِلْمَ، فَلَا يَجِدُونَ أَحَدًا أَعْلَمَ مِنْ عَالم الْمَدِينَة”. رَوَاهُ التِّرْمِذِيّ فِي جَامِعِهِ.
قَالَ ابْنُ عُيَيْنَةَ: إِنَّهُ مَالِكُ بْنُ أنس، وَمثله عَن عبد الرَّزَّاق.
قَالَ اسحق بْنُ مُوسَى: وَسَمِعْتُ ابْنَ عُيَيْنَةَ أَنَّهُ قَالَ: هُوَ الْعُمَرِيُّ الزَّاهِدُ وَاسْمُهُ عَبْدُ الْعَزِيزِ بْنُ عبد الله.
246. (49) [1/82–బలహీనం]
అబూ హురైరహ్ (ర) కథనం: అతి త్వరలోనే ప్రజలు విద్యనభ్యసించటానికి ఒంటెలను చితకబాదు తారు. అంటే ఒంటెలను వేగంగా నడుపుతారు. విద్య నేర్చుకోవటానికి దూర ప్రాంతాలకు ప్రయాణం చేస్తారు. కాని మదీనహ్ పండితుని కంటే గొప్ప పండితుడు వారికి దొరకడు. (తిర్మిజి’)
ఇబ్ను ఉయైన మరియు ‘అబ్దుర్ర’జ్జాఖ్, అభిప్రాయంలో, మదీనహ్ కు చెందిన గొప్ప పండితుడు అంటే మాలిక్ బిన్ అనస్.
ఇక ఇస్’హాఖ్ బిన్ మూసా కథనంలో: ఇబ్ను ఉయైన అభిప్రాయంలో, ”మదీనహ్ పండితుడు అంటే ‘ఉమ్‌రీ ‘జాహిద్, అంటే ‘ఉమర్ కుటుంబానికి చెందిన అబ్దుల్ ‘అ’జీ’జ్ బిన్ ‘అబ్దుల్లాహ్.” [26]
247 – [ 50 ] ( صحيح ) (1/82)
وَعَنْهُ، فِيمَا أَعْلَمُ عَنْ رَسُولِ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ قال: “إِنَّ اللَّهَ عَزَّ وَجَلَّ يَبْعَثُ لِهَذِهِ الْأُمَّةِ عَلَى رَأْسِ كُلِّ مِائَةٍ سَنَةٍ مَنْ يُجَدِّدُ لَهَا دِينَهَا”. رَوَاهُ أَبُو دَاوُد.
247. (50) [1/82–దృఢం]
అబూ హురైరహ్ (ర) కథనం: నాకు తెలిసినంత వరకు ప్రవక్త (స) ఇలా ప్రవచించారు: ”అల్లాహ్ ఈ అనుచర సమాజం కొరకు ప్రతి శతాబ్దంలో ఒక వ్యక్తిని పంపుతూ ఉంటాడు. అతడు ఈ ధర్మాన్ని నూతన ఉత్సాహాన్ని నింపుతూ ఉంటాడు.” [27] (అబూ దావూద్)
248 – [ 51 ] ( صحيح ) (1/82)
وَعَنْ إِبْرَاهِيمَ بْنِ عَبْدِ الرَّحْمَنِ الْعُذْرِيِّ، قَالَ: قَالَ رَسُولُ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسلم: “يَحْمِلُ هَذَا الْعِلْمَ مِنْ كُلِّ خَلَفٍ عُدُولُهُ، يَنْفُونَ عَنْهُ تَحْرِيفَ الْغَالِينَ، وَانْتِحَالَ الْمُبْطِلِينَ، وَتَأْوِيلَ الْجَاهِلين”. رَوَاهُ الْبَيْهَقِيّ.
248. (51) [1/82–దృఢం]
ఇబ్రాహీమ్ బిన్ అబ్దుర’హ్మాన్ ‘ఉజ్రీ‘ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ధర్మ (ఖుర్‌ఆన్, ‘హదీసు’ల) జ్ఞానాన్ని ముందు తరాలవారిలో పుణ్యాత్ములు అభ్యసిస్తారు. ధర్మం లోని కల్పితాలను, మూఢా చారాలను, మార్పులు చేర్పులను, తప్పుడు అర్థాలను దూరం చేస్తారు.” [28](బైహఖీ)
—–
మూడవ విభాగం اَلْفَصْلُ الثَّالِثُ
249 – [ 52 ] ( ضعيف ) (1/83)
عَنِ الْحَسَنِ مُرْسَلًا، قَالَ: قَالَ رَسُولُ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: “مَنْ جَاءَهُ الْمَوْتُ وَهُوَ يَطْلُبُ الْعِلْمَ لِيُحْيِيَ بِهِ الْإِسْلَامَ، فَبَيْنَهُ وَبَيْنَ النَّبِيِّينَ دَرَجَةٌ وَاحِدَةٌ فِي الْجَنَّةِ”. رَوَاهُ الدَّارمِيّ.
249. (52) [1/83–బలహీనం]
‘హసన్ బ’స్రీ కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఇస్లామ్ అభివృద్ధి కోసం, ధార్మిక విద్య అభ్యసిస్తున్న వ్యక్తి మరణిస్తే, అతనికి ప్రవక్తలకు ఒక్కస్థానమే తేడా ఉంటుంది.” (దార్మీ)
250 – [ 53 ] ( حسن ) (1/83)
وَعَنْهُ مُرْسَلًا، قَالَ: سُئِلَ رَسُولُ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ عَنْ رَجُلَيْنِ كَانَا فِي بَنِي إِسْرَائِيلَ: أَحَدُهُمَا كَانَ عَالِمًا يُصَلِّي الْمَكْتُوبَةَ، ثُمَّ يَجْلِسُ فَيُعَلِّمُ النَّاسَ الْخَيْرَ، وَالْآخِرُ يَصُومُ النَّهَارَ وَيَقُومُ اللَّيْلَ؛ أَيُّهُمَا أَفْضَلُ؟ قَالَ رَسُولُ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: “فَضْلُ هَذَا الْعَالِمِ الَّذِي يُصَلِّي الْمَكْتُوبَةَ ثُمَّ يَجْلِسُ فَيُعَلِّمُ النَّاسَ الْخَيْرَ عَلَى الْعَابِدِ الَّذِي يَصُومُ النَّهَارَ وَيَقُومُ اللَّيْلَ كَفَضْلِي عَلَى أَدْنَاكُمْ”. رَوَاهُ الدَّارِمِيُّ
250. (53) [1/83–ప్రామాణికం]
‘హసన్ బ’స్రీ కథనం: ప్రవక్త (స)ను బనీ ఇస్రాయీ’ల్‌కు చెందిన ఇద్దరు వ్యక్తుల గురించి ప్రశ్నించటం జరిగింది. ‘వారిలో ఒకరు పండితుడు. అతడు విధి నమా’జులు చదివే వాడు, ప్రజలకు మంచి విషయాలు బోధించేవాడు. రెండవ వ్యక్తి పగలు ఉపవాసం ఉండేవాడు, రాత్రి నమా’జు చదివే వాడు. వీరిద్దరిలో ఎవరు గొప్పవారు’ అని ప్రశ్నించటం జరిగింది. అప్పుడు ప్రవక్త (స), ‘పగలు ఉపవాసం ఉండి, రాత్రి నమాజులు చదివే భక్తునిపై — కేవలం విధి నమా’జులు చదివి ప్రజలకు మంచి విషయాలు బోధించే పండితునికి — మీలోని సామాన్య వ్యక్తిపై, నాకు ఎటువంటి స్థానంఉందో అటువంటి స్థానం ఉంది.” అని సమాధానం ఇచ్చారు. (దార్మీ)
251 – [ 54 ] ( موضوع ) (1/83)
وَعَنْ عَلِيٍّ رَضِيَ اللَّهُ عَنْهُ، قَالَ: قَالَ رَسُولُ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: “نِعْمَ الرَّجُلُ الْفَقِيهُ فِي الدِّينِ؛ إِنِ احْتِيجَ إِلَيْهِ نَفَعَ، وَإِنِ اسْتُغْنِيَ عَنْهُ أَغْنَى نَفْسَهُ”. رَوَاهُ رزين.
251. (54) [1/83–కల్పితం]
‘అలీ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ధార్మిక విషయాల్లో బుద్ధిగల వ్యక్తి మంచివాడు. ఒకవేళ ఎవరైనా అవసరం ఉందని వస్తే సహాయం చేస్తాడు. ఒకవేళ అతనికి దూరంగా ఉంటే, తాను అక్కరలేని వాడిగా ఉంటాడు.” [29] (ర’జీన్)
252 – [ 55 ] ( صحيح ) (1/84)
وَعَن عِكْرِمَة، أَنَّ ابْنَ عَبَّاسٍ، قَالَ: حَدِّثِ النَّاسَ كُلَّ جُمُعَةٍ مَرَّةً، فَإِنْ أَبَيْتَ فَمَرَّتَيْنِ، فَإِنْ أَكْثَرْتَ فَثَلَاثَ مَرَّاتٍ، وَلَا تُمِلَّ النَّاسَ هَذَا الْقُرْآنَ؛ وَلَا أُلْفِيَنَّكَ تَأْتِي الْقَوْمَ وَهُمْ فِي حَدِيثٍ مِنْ حَدِيثِهِمْ فَتَقُصُّ عَلَيْهِمْ فَتَقْطَعُ عَلَيْهِمْ حَدِيثَهُمْ فَتُمِلَّهُمْ؛ وَلَكِنْ أَنْصِتْ، فَإِذَا أَمَرُوكَ فَحَدِّثْهُمْ وَهُمْ يَشْتَهُونَهُ، وَانْظُرِ السَّجْعَ مِنَ الدُّعَاءِ فَاجْتَنِبْهُ، فَإِنِّي عَهِدْتُ رَسُولَ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ وَأَصْحَابُهُ لَا يَفْعَلُونَ ذَلِك. رَوَاهُ البُخَارِيّ.
252. (55) [1/84–దృఢం]
‘ఇక్రమహ్ (ర) కథనం: ఇబ్నె ‘అబ్బాస్ (ర) ‘ఇక్రమతో, ”నీవు ప్రతి శుక్రవారం హితబోధ చేస్తూ ఉండు. ఒకవేళ నీకు ఇష్టమైతే వారానికి రెండుసార్లు హితబోధచేయి. ఒకవేళ ఇంకా ఎక్కువగా చేయదలచుకుంటే, వారానికి మూడు సార్లు హితబోధ చేయి. అయితే ప్రజలకు ఖుర్‌ఆన్ వినిపించి విసుగుచెందేలా చేయకు. వారిని ఆందోళనకు గురిచేయకు. ఇంకా ఓ ‘ఇక్రమ! నీవు ప్రజల వద్దకు వెళ్ళినపుడు వారు మాటల్లో నిమగ్నమయి ఉంటే, వారి మాటలు ఆపి నీవు హితబోధ ప్రారంభించరాదు, వారిని బాధపెట్టకు. అటువంటి సమయంలో నీవు మౌనంగా ఉండు. వారు స్వయంగా హితబోధ చేయమని చెబితే, నీవు హితబోధ చేయి. అయితే అందులోనూ, వారు విసుగు చెందేలా ప్రవర్తించకు. వారిలో వినేశక్తి, ఉత్సాహం, శ్రద్ధ ఉన్నంతవరకు వారిని బోధించు. వారు కోరితేనే, హితబోధ ప్రారంభించు. ఇంకా దు’ఆలను కవిత్వంలా పఠించకు. ఎందుకంటే ప్రవక్త (స) ‘ఇలా చేసేవారు కాదు. సాధారణ పద్ధతిలో దు’ఆ చేయి.” (బు’ఖారీ)
253 – [ 56 ] (ضعيف جدا) (1/84)
وَعَنْ وَاثِلَةَ بْنِ الْأَسْقَعِ، قَالَ: قَالَ رَسُولُ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: “مَنْ طَلَبَ الْعِلْمَ فَأَدْرَكَهُ، كَانَ لَهُ كِفْلَانِ مِنَ الْأَجْرِ؛ فَإِنْ لَمْ يُدْرِكْهُ، كَانَ لَهُ كفل من الْأجر”. رَوَاهُ الدِّرَامِي.
253. (56) [1/84–అతి బలహీనం]
వాసి‘లహ్ బిన్ అస్‌ఖ’అ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”విద్యను అర్థించి, అభ్యసించిన వాడికి రెండింతలు పుణ్యం లభిస్తుంది. ఒకవేళ అభ్యసించ లేకపోతే అతనికి ఒక పుణ్యం లభిస్తుంది.” [30] (దార్మీ)
254 – [ 57 ] ( حسن ) (1/84)
عَنْ أَبِي هُرَيْرَةَ، قَالَ: قَالَ رَسُولُ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: “إِنَّ مِمَّا يَلْحَقُ الْمُؤْمِنَ مِنْ عَمَلِهِ وَحَسَنَاتِهِ بَعْدَ مَوْتِهِ: عِلْمًا عَلِمَهُ ونَشَرَهُ، وَوَلَدًا صَالِحًا تَرَكَهُ، أومُصْحَفًا وَرَّثَهُ، أَوْ مَسْجِدًا بَنَاهُ، أَوْ بَيْتًا لِابْنِ السَّبِيلِ بَنَاهُ، أَوْ نَهْرًا أَجْرَاهُ، أَوْ صَدَقَةً أخرجهَا من مَاله فِي صِحَّته وحياته، تُلْحقهُ مِن بعد مَوته”. رَوَاهُ بن مَاجَه وَالْبَيْهَقِيّ فِي “شعب الْإِيمَان”.
254. (57) [1/84–ప్రామాణికం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”విశ్వాసి మరణానంతరం, అతనికి పుణ్యం లభించే మార్గాల్లో: 1. ఒకటి విద్య. అతడు విద్యనభ్యసించి, దాన్ని ప్రచారం చేసి ఉంటాడు, 2. ఉత్తమ సంతానం, 3. ఖుర్‌ఆన్ ప్రతి వారసుల కిచ్చి ఉంటాడు, 4. మస్జిద్ నిర్మించి ఉంటాడు, 5. ప్రయాణీకుల నిమిత్తం ధర్మశాల, 6. కాలువ త్రవ్వించి ఉంటాడు, 7. తన జీవితంలో చేసిన దాన ధర్మాలు. వీటన్నిటి పుణ్యం అతని మరణానంతరం కూడా అతనికి లభిస్తూ ఉంటుంది.” (ఇబ్నె మాజహ్, బైహఖీ-షు’అబిల్ ఈమాన్)
255 – [ 58 ] ( صحيح ) (1/85)
وَعَنْ عَائِشَةَ، أَنَّهَا قَالَتْ: سَمِعْتُ رَسُولَ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ يَقُولُ: “إِنَّ اللَّهَ عَزَّ وَجَلَّ أَوْحَى إِلَيَّ: أَنَّهُ مَنْ سَلَكَ مَسْلَكًا فِي طَلَبِ الْعِلْمِ، سَهَّلْتُ لَهُ طَرِيقَ الْجَنَّةِ؛ وَمَنْ سَلَبْتُ كَرِيمَتَيْهِ؛ أَثَبْتُهُ عَلَيْهِمَا الْجَنَّةَ. وَفَضْلٌ فِي عِلْمٍ خَيْرٌ مِنْ فَضْلٍ فِي عِبَادَةٍ. وَمِلَاكُ الدِّينِ الْوَرَعُ”. رَوَاهُ الْبَيْهَقِيُّ فِي “شعب الْإِيمَان“.
255. (58) [1/85–దృఢం]
‘ఆయి’షహ్ (ర) కథనం: ప్రవక్త (స) ఇలా ప్రవచిస్తూ ఉండగా నేను విన్నాను, ”అల్లాహ్(త) నా వైపు దైవవాణి ఇలా పంపాడు, విద్యనభ్యసించిన వ్యక్తి కొరకు స్వర్గమార్గం సులభతరం చేస్తాను, ఇంకా నేను రెండు కళ్ళు తీసుకున్న వారికి వాటికి బదులుగా స్వర్గం ప్రసాదిస్తాను. ఆరాధన ఆధిక్యత కంటే విద్య ఆధిక్యత గొప్పది. ఇంకా ధర్మానికి మూలం దైవభీతి.”[31] (బైహాఖీ-షు’అబిల్ ఈమాన్)
256 – [ 59 ] ( ضعيف ) (1/85)
وَعَن ابْن عَبَّاس، قَالَ: تَدَارُسُ الْعِلْمِ سَاعَةً مِنَ اللَّيْلِ خَيْرٌ من إحيائها. رَوَاهُ الدَّارمِيّ.
256. (59) [1/85–బలహీనం]
ఇబ్నె ‘అబ్బాస్ (ర) కథనం: ”రాత్రిపూట కొంతసేపు చదవటం, చదివించటం, రాత్రంతా ప్రార్థించటం కంటే గొప్పది.” (దార్మీ)
257 – [ 60 ] ( ضعيف ) (1/85)
وَعَنْ عَبْدِ اللَّهِ بْنِ عَمْرٍو، أَنَّ رَسُولَ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ مَرَّ بِمَجْلِسَيْنِ فِي مَسْجِدِهِ فَقَالَ: “كِلَاهُمَا عَلَى خَيْرٍ، وَأَحَدُهُمَا أَفْضَلُ مِنْ صَاحِبِهِ؛ أَمَّا هَؤُلَاءِ فَيَدْعُونَ اللَّهَ وَيَرْغَبُونَ إِلَيْهِ، فَإِنْ شَاءَ أَعْطَاهُمْ وَإِنْ شَاءَ مَنَعَهُمْ. وَأَمَّا هَؤُلَاءِ فَيَتَعَلَّمُونَ الْفِقْهَ أَوِ الْعِلْمَ وَيُعَلِّمُونَ الْجَاهِلَ، فَهُمْ أَفْضَلُ وَإِنَّمَا بُعِثْتُ مُعَلِّمًا”. ثمَّ جلس فيهم. رَوَاهُ الدَّارمِيّ.
257. (60) [1/85–బలహీనం]
‘అబ్దుల్లాహ్ బిన్ ‘ఉమర్ (ర) కథనం: ప్రవక్త (స) మస్జిదులో రెండు బృందాలు కూర్చుని ఉండటం చూచి, ”మీరెండు బృందాలవాళ్ళు మంచిపని చేస్తున్నారు. కాని మీలో ఒక బృందం మరొక దానికంటే శ్రేష్ఠమైనది. ఒక బృందం దైవారాధనలో నిమగ్నమయి ఉంది, దైవాన్ని ప్రార్థిస్తుంది. తన కోరికలను తెలుపుకుంటుంది. దైవం కోరితే ప్రసాదించవచ్చు, ప్రసాదించకపోవచ్చు. మరొక బృందం విద్యాభ్యాసంలో నిమగ్నమయి ఉంది, తెలియని వారికి విద్య నేర్పుతుంది. వీరే ఉత్తములు. ఎందుకంటే నేను బోధకునిగా పంపబడ్డాను,” అని చెప్పి వారి దగ్గరే కూర్చున్నారు. [32](దార్మీ)
258 – [ 61 ] ( ضعيف ) (1/86)
وَعَنْ أَبِي الدَّرْدَاءِ، قَالَ: سُئِلَ رَسُولُ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: مَا حَدُّ الْعِلْمِ الَّذِي إِذَا بَلَغَهُ الرَّجُلُ كَانَ فَقِيهًا؟ فَقَالَ رَسُولُ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: “من حَفِظَ عَلَى أُمَّتِي أَرْبَعِينَ حَدِيثًا فِي أَمْرِ دِينِهَا بَعَثَهُ اللَّهُ فَقِيهًا وَكُنْتُ لَهُ يَوْمَ الْقِيَامَة شافعا وشهيدا”.
258. (61) [1/86–బలహీనం]
అబూ దర్దా’ (ర) కథనం: ప్రవక్త (స) ను పండితుడు కావటానికి జ్ఞాన పరిమాణం ఏమిటి అని ప్రశ్నించటం జరిగింది. దానికి ప్రవక్త (స) సమాధానమిస్తూ, నా అనుచర సమాజానికి లాభం చేకూర్చటానికి, ధర్మానికి చెందిన 40 ‘హదీసు’లు గుర్తుంచుకున్న వారిని, అల్లాహ్ (త) తీర్పుదినం నాడు, పండితునిగా లేపుతాడు. ఇంకా నేను అతని గురించి సిఫారసు చేస్తాను, సాక్ష్యం ఇస్తాను.” (బైహఖీ-షు’అబిల్ ఈమాన్)
259 – [ 62 ] ( ضعيف ) (1/86)
وَعَنْ أَنَسِ بْنِ مَالِكٍ، قَالَ: قَالَ رَسُولُ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: “هَلْ تَدْرُونَ مَنْ أَجْوَدُ جُودًا؟” قَالُوا: اللَّهُ وَرَسُولُهُ أَعْلَمُ. قَالَ: “اللَّهُ تَعَالَى أَجْوَدُ جُودًا، ثُمَّ أَنَا أَجْوَدُ بَنِي آدَمَ، وَأَجْوَدُهُمْ مِنْ بَعْدِي رَجُلٌ عَلِمَ عِلْمًا فَنَشَرَهُ، يَأْتِي يَوْمَ الْقِيَامَةِ أَمِيرًا وَحده، أَو قَالَ: أمة وَحده”.
259. (62) [1/86–బలహీనం]
అనస్ బిన్ మాలిక్ (ర) కథనం: ప్రవక్త(స) అందరికంటే దానధర్మాలు చేసేవారెవరో మీకు తెలుసా? అని ప్రశ్నించారు. దానికి అనుచరులు అల్లాహ్ (త)కు, ఆయన ప్రవక్తకే బాగా తెలుసు అని విన్నవించుకున్నారు. అప్పుడు ప్రవక్త (స), ”అందరికంటే అధికంగా దాతృత్వ గుణం గలవాడు అల్లాహ్ (త). మానవుల్లో అందరికంటే దాతృత్వ గుణం గలవాడిని నేను. నా తరువాత అందరి కంటే దాతృత్వగుణం గలవాడు విద్య నేర్చుకొని దాన్ని ఇతరులకు అందజేసేవాడు. తీర్పు దినంనాడు ఆ వ్యక్తి ఒక నాయకునిగా, ఒక బృందంగా వస్తాడు” అని అన్నారు. [33] (బైహఖీ -షు’అబిల్ ఈమాన్)
260 – [ 63 ] ( صحيح ) (1/86)
وَعَنْهُ، أَنَّ النَّبِيَّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ: “مَنْهُومَانِ لَا يَشْبَعَانِ: مَنْهُومٌ فِي الْعِلْمِ لَا يَشْبَعُ مِنْهُ، وَمَنْهُومٌ فِي الدُّنْيَا لَا يَشْبَعُ مِنْهَا”. رَوَى الْبَيْهَقِيُّ الْأَحَادِيثَ الثَّلَاثَةَ فِي”شُعَبِ الْإِيمَانِ” وَقَالَ: قَالَ الْإِمَامُ أَحْمَدُ فِي حَدِيثِ أَبِي الدَّرْدَاءِ: هَذَا مَتْنٌ مَشْهُورٌ فِيمَا بَين النَّاس وَلَيْسَ لَهُ إِسْنَاد صَحِيح.
260. (63) [1/86–దృఢం]
అనస్ బిన్ మాలిక్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”ఇద్దరు వ్యక్తులకు ఎన్నడూ తనివి తీరదు. 1. పండితుడు ఎంత విద్యనేర్చుకున్నా అతని కడుపు నిండదు. 2. ఐహిక వాంఛగలవాడు. ఎంత సంపాదించినా అతని కడుపు నిండదు.” (బైహఖీ-షు’అబిల్ ఈమాన్)
దీన్ని గురించి అ’హ్‌మద్ పేర్కొంటూ, ”ఈ ‘హదీసు’ ప్రాచుర్యంలో ఉంది, కాని దీనికి ప్రామాణికత లేదు,” అని అన్నారు.
261 – [ 64 ] ( ضعيف ) (1/87)
عَن عَوْنٍ، قَالَ: قَالَ عَبْدُ اللَّهِ بْنُ مَسْعُودٍ: مَنْهُومَانِ لَا يَشْبَعَانِ صَاحِبُ الْعِلْمِ، وَصَاحِبُ الدُّنْيَا، وَلَا يَسْتَوِيَانِ؛ أَمَّا صَاحِبُ الْعِلْمِ فَيَزْدَادُ رِضًى لِلرَّحْمَنِ، وَأَمَّا صَاحِبُ الدُّنْيَا فَيَتَمَادَى فِي الطُّغْيَانِ. ثُمَّ قَرَأَ عَبْدُ اللَّهِ: (كَلَّا إِنَّ الْإِنْسَانَ لَيَطْغَى أَنْ رَآهُ اسْتَغْنَى؛ 96: 6)
قَالَ: وَقَالَ الْآخَرُ (إِنَّمَا يَخْشَى اللَّهَ مِنْ عباده الْعلمَاء؛ 35: 28). رَوَاهُ الدَّارمِيّ .
261. (64) [1/87–బలహీనం]
’ఔన్ (ర) కథనం: ‘అబ్దుల్లాహ్ బిన్ మస్’ఊద్ (ర), ”ఇద్దరు ఆసక్తి గలవారి కడుపు ఎన్నడూ నిండదు. ఒకటి పండితునిది, రెండు ఐహికవాంఛ గలవాడిది. అయితే వీరిద్దరి స్థానం ఒకటి కాదు. పండితుడు దైవప్రీతిని అధికం చేస్తాడు. ఐహికవాంఛగల వాడిలో తలబిరుసుతనం అధిక మవుతుంది అని చెప్పి, దీన్ని సమర్థిస్తూ ఈ ఆయత్: ”…మానవుడు తలబిరుసుతనంగా ప్రవర్తిస్తాడు. ఎందుకంటే అతడు తనను తాను నిరపేక్షాపరుడిగా భావిస్తాడు,” (సూ. అల్-‘అలఖ్, 96:6) పఠించారు. ఇంకా పండితుని గురించి దీన్ని సమర్థిస్తూ ఈ ఆయత్, ”అల్లాహ్ దాసులలో జ్ఞానం గలవారు మాత్రమే ఆయనకు భయపడతారు…” (సూ. ఫాతిర్, 35:28) (దార్మీ)
262 – [ 65 ] ( ضعيف ) (1/87)
وَعَنِ ابْنِ عَبَّاسٍ، قَالَ: قَالَ رَسُولُ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسلم قَالَ: “إِنَّ أُنَاسًا مِنْ أُمَّتِي سَيَتَفَقَّهُونَ فِي الدِّينِ ويقرؤون الْقُرْآن، يَقُولُونَ: نَأْتِي الْأُمَرَاءَ فَنُصِيبُ مِنْ دُنْيَاهُمْ وَنَعْتَزِلُهُمْ بِدِينِنَا. وَلَا يَكُونُ ذَلِكَ، كَمَا لَا يُجْتَنَى مِنَ الْقَتَادِ إِلَّا الشَّوْكُ، كَذَلِكَ لَا يُجْتَنَى مِنْ قُرْبِهِمْ إِلَّا – قَالَ مُحَمَّدُ بْنُ الصَّبَّاحِ: كَأَنَّهُ يَعْنِي – الْخَطَايَا”. رَوَاهُ ابْن مَاجَه .
262. (65) [1/87–బలహీనం]
ఇబ్నె ‘అబ్బాస్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”భవిష్యత్తులో నా అనుచర సమాజంలోని కొందరు ధార్మిక విద్య నేర్చుకుంటారు, ఖుర్‌ఆన్ పఠిస్తారు. ఇంకా, ‘మేము నాయకుల వద్దకు, ధనవంతుల వద్దకు వెళ్ళి ధనం సంపాదించి, ధర్మాన్ని వారినుండి కాపాడుతాము,’ అని అంటారు. కాని అది జరగనిపని. ఎందుకంటే ముళ్ళచెట్టు నుండి ముళ్ళే లభిస్తాయి. అదేవిధంగా ధనవంతులు, నాయకుల వద్దకువెళితే పాపం చుట్టుకోవటం తప్ప మరేమీ లభించదు.” (ఇబ్నె మాజహ్)
263 – [ 66 ] ( صحيح ) (1/87)
وَعَنْ عَبْدِ اللَّهِ بْنِ مَسْعُودٍ، قَالَ: لَوْ أَنَّ أَهْلَ الْعِلْمِ صَانُوا الْعِلْمَ، وَوَضَعُوهُ عِنْدَ أَهْلِهِ، لَسَادُوا بِهِ أَهْلَ زَمَانِهِمْ، وَلَكِنَّهُمْ بَذَلُوهُ لِأَهْلِ الدُّنْيَا لِيَنَالُوا بِهِ مِنْ دُنْيَاهُمْ؛ فَهَانُوا عَلَيْهِمْ. سَمِعْتُ نَبِيَّكُمْ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ يَقُولُ: “مَنْ جَعَلَ الْهُمُومَ هَمًّا وَاحِدًا هَمَّ آخِرَتِهِ، كَفَاهُ اللَّهُ هَمَّ دُنْيَاهُ، وَمَنْ تَشَعَّبَتْ بِهِ الْهُمُومُ فِي أَحْوَالِ الدُّنْيَا، لَمْ يُبَالِ اللَّهُ فِي أَيِّ أَوْدِيَتِهَا هَلَكَ”. رَوَاهُ ابْنُ مَاجَه.
263. (66) [1/87–దృఢం]
’అబ్దుల్లాహ్ బిన్ మస్’ఊద్ (ర) ఇలా అన్నారు, ”ఒకవేళ పండితులు విద్యను పరిరక్షిస్తే, విద్యార్థులకే నేర్పితే, వారు తమ కాలంలో నాయకులుగా రాణిస్తారు, కొనసాగుతారు. కాని వారు తమ విద్యను ఐహిక వాంఛగల వారి కొరకు నేర్చుకున్నారు. దాని ద్వారా ధనవంతుల ధనాన్ని సంపాదించాలని కోరారు. అందువల్లే వారు ధనవంతుల దృష్టిలో హీనులయ్యారు. నేను ప్రవక్త (స)ను ఇలా ప్రవచిస్తూ ఉండగా విన్నాను, ”పరలోక లక్ష్యంతో జీవించే వ్యక్తి యొక్క ప్రాపంచిక లక్ష్యాలను అల్లాహ్(త) నెరవేరుస్తాడు. అదే విధంగా ప్రాపంచిక లక్ష్యాలతో జీవించే వ్యక్తిని అల్లాహ్ ఏ మాత్రం పట్టించుకోడు. అతడు ఎలా ఉన్నా, ఎక్కడకు పోయి మరణించినా సరే. అంటే అతనిపై తన కారుణ్యాన్ని కురిపించడు. ఇంకా అతడి ప్రాపంచిక పరిస్థితులను చక్కదిద్దడు.” (ఇబ్నె మాజహ్)
264 – [ 67 ] ( صحيح ) (1/88)
وَرَوَاهُ الْبَيْهَقِيُّ فِي “شُعَبِ الْإِيمَانِ” عَنِ ابْنِ عُمَرَ مِنْ قَوْلِهِ: “مَنْ جَعَلَ الْهُمُومَ” إِلَى آخِره.
264. (67) [1/88–దృఢం]
బైహఖీ దీన్ని షు’అబిల్ ఈమాన్ లో ‘అబ్దుల్లాహ్ బిన్ ‘ఉమర్ (ర) ద్వారా ఉల్లేఖించారు.
265 – [ 68 ] ( ضعيف ) (1/88)
وَعَنِ الْأَعْمَشِ، قَالَ: قَالَ رَسُولُ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: “آفَةُ الْعِلْمِ النِّسْيَانُ، وَإِضَاعَتُهُ أَنْ تُحَدِّثَ بِهِ غَيْرَ أَهْلِهِ”. رَوَاهُ الدَّارِمِيُّ مُرْسلا .
265. (68) [1/88–బలహీనం]
అ’అమష్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”విద్యా జ్ఞానాల ఆపద, వాటిని మరచిపోవటం అవుతుంది. దానికి తగని వారికి బోధించటం దాన్ని వృథా చేయటం అవు తుంది.” [34] (దార్మీ / తాబయీ ప్రోక్తం)
266 – [ 69 ] ( ضعيف ) (1/88)
وَعَنْ سُفْيَانَ، أَنَّ عُمَرَ بْنَ الْخَطَّابِ رَضِيَ اللَّهُ عَنْهُ، قَالَ لِـكَعْبٍ: مَنْ أَرْبَابُ الْعِلْمِ؟ قَالَ: الَّذِي يَعْمَلُونَ بِمَا يَعْلَمُونَ. قَالَ: فَمَا أَخْرَجَ الْعِلْمَ مِنْ قُلُوبِ الْعُلَمَاءِ؟ قَالَ الطَّمَعُ. رَوَاهُ الدَّارِمِيُّ.
266. (69) [1/88–బలహీనం]
’సుఫియాన్ (ర) కథనం: ‘ఉమర్ (ర) క’అబ్ (ర)ను, ‘పండితులంటే ఎవరు,’ అని ప్రశ్నించారు. దానికి క’అబ్ సమాధానమిస్తూ, ‘తమ విద్యకు అనుగుణంగా ఆచరించే వారే పండితులు,’ అని అన్నారు. ఆ తరువాత ‘ఉమర్ (ర), ”పండితుల హృదయాలనుండి జ్ఞానాన్ని ఏ విషయం తొలగిస్తుంది,” అని ప్రశ్నించారు. దానికి క’అబ్, ”ఐహిక వాంఛలు, లాలస,” అని సమాధానం ఇచ్చారు. (దార్మీ)
267 – [ 70 ] ( ضعيف ) (1/88)
وَعَن الْأَحْوَص بن حَكِيم، عَنْ أَبِيهِ، قَالَ: سَأَلَ رَجُلٌ النَّبِيَّ صَلَّى الله عَلَيْهِ سلم عَنِ الشَّرِّ. فَقَالَ: “لَا تَسْأَلُونِي عَنِ الشَّرِّ، وَسَلُونِي عَنِ الْخَيْرِ. “يَقُولُهَا ثَلَاثًا ثُمَّ قَالَ: “أَلَا إِنَّ شَرَّ الشَّرِّ شِرَارُ الْعُلَمَاءِ، وَإِنَّ خيرالْخَيْر خِيَارُ الْعلمَاء”. رَوَاهُ الدَّارمِيّ .
267. (70) [1/88–బలహీనం]
అహ్‌వ’స్ బిన్ ’హకీమ్ (ర) తన తండ్రి ద్వారా కథనం: ప్రవక్త (స)ను ఒక వ్యక్తి, ‘చెడ్డవ్యక్తి అంటే ఎవరు,’ అని ప్రశ్నించాడు. దానికి ప్రవక్త (స), ”కేవలం చెడ్డవారి గురించే ప్రశ్నించకు, మంచివారిని గురించి, చెడ్డవారి గురించి ప్రశ్నించు,’ అని అన్నారు. ఇలా మూడుసార్లు అన్నారు. తర్వాత, ‘గుర్తుంచుకోండి, అందరికంటే నీచులైన పండితు లున్నారు, అందరికంటే ఉత్తములైన పండితులూ ఉన్నారు.” [35] (దార్మీ)
268 – [ 71 ] ( ضعيف جدا ) (1/89)
وَعَنْ أَبِي الدَّرْدَاءِ، قَالَ: “إِنَّ مِنْ أَشَرِّ النَّاسِ عِنْدَ اللَّهِ مَنْزِلَةً يَوْمَ الْقِيَامَةِ: عَالِمٌ لَا ينْتَفع بِعِلْمِهِ”. رَوَاهُ الدَّارمِيّ
268. (71) [1/89–అతి బలహీనం]
అబూ దర్దా’ (ర) కథనం: అల్లాహ్(త) వద్ద అందరి కంటే నీచుడు తన జ్ఞానం ద్వారా లాభం పొందని పండితుడు. [36] (దార్మీ)
269 – [ 72 ] ( صحيح ) (1/89)
وَعَن زِيَاد بن حُدير، قَالَ: قَالَ لِي عُمَرُ: هَلْ تَعْرِفُ مَا يَهْدِمُ الْإِسْلَامَ؟ قَالَ: قُلْتُ: لَا! قَالَ: يَهْدِمُهُ زَلَّةُ الْعَالِمِ، وَجِدَالُ الْمُنَافِقِ بِالْكِتَابِ. وَحُكْمُ الْأَئِمَّةِ المضلين”. رَوَاهُ الدِّرَامِي .
269. (72) [1/89–దృఢం]
’జియాద్ బిన్ ’హుదైర్ (ర) కథనం: ‘ఉమర్ (ర) నన్ను, ”ఇస్లామ్ పునాదిని ఏ విషయం పడగొడుతుందో నీకు తెలుసా?” అని అడిగారు. దానికి నేను, ‘నాకు తెలియదు,’ అని అన్నాను. అప్పుడు అతడు (ర), ”1. ధార్మిక పండితుడు తప్పటడుగు వేయటం, 2. దైవగ్రంథం విషయంలో కపటాచారి వాదనకు దిగటం. 3. జ్ఞాన హీనులైన పాలకులు తీర్పు ఇవ్వటం, ఈ మూడు విషయాలు ఇస్లామ్‌ను పడగొడతాయి” అని అన్నారు. [37] (దార్మీ)
270 – [ 73 ] ( ضعيف ) (1/89)
وَعَن الْحسن، قَالَ: الْعِلْمُ عِلْمَانِ: فَعِلْمٌ فِي الْقَلْبِ فَذَاكَ الْعلم النافع، وَعلم على اللِّسَان فَذَاك حُجَّةُ اللَّهِ عَزَّ وَجَلَّ عَلَى ابْنِ آدَمَ. رَوَاهُ الدَّارمِيّ.
270. (73) [1/89–బలహీనం]
’హసన్ బ’స్రీ కథనం: జ్ఞానం రెండు రకాలు: 1. హృదయంలో ఉన్నది. ఇది లాభదాయకమైనది. 2. నోటిపై ఉన్నది, ఈ జ్ఞానం మానవునిపై అల్లాహ్(త) యొక్క నిదర్శనం, సాక్ష్యాధారం. [38] (దార్మీ)
271 – [ 74 ] ( صحيح ) (1/89)
وَعَنْ أَبِي هُرَيْرَةَ رَضِيَ اللَّهُ عَنْهُ، قَالَ: حَفِظْتُ مِنْ رَسُولِ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ وِعَاءَيْنِ؛ فَأَمَّا أَحَدُهُمَا فَبَثَثْتُهُ فِيكُمْ، وَأَمَّا الْآخَرُ فَلَوْ بَثَثْتُهُ قُطِعَ هَذَا الْبُلْعُومُ – يَعْنِي مجْرى الطَّعَام . رَوَاهُ البُخَارِيّ .
271. (74) [1/89–దృఢం]
అబూ హురైరహ్ (ర) కథనం: ”నేను ప్రవక్త (స) ద్వారా రెండు గిన్నెలు అంటే రెండు రకాల విద్యలు నేర్చుకున్నాను. వాటిలో ఒకదాన్ని మీ అందరి మధ్య వ్యాపింపజేసాను. రెండవ విద్యను ఒకవేళ నేను ఇతరు లకు తెలియపరిస్తే నామెడ కోసివేయబడు తుంది.” [39] (బు’ఖారీ)
272 – [ 75 ] ( متفق عليه ) (1/90)
وَعَنْ عَبْدِ اللَّهِ بْنِ مَسْعُودٍ، قَالَ: يَا أَيُّهَا النَّاسُ! مَنْ عَلِمَ شَيْئًا فَلْيَقُلْ بِهِ، وَمَنْ لَمْ يَعْلَمْ فَلْيَقُلِ: اللَّهُ أعلم، فَإِنَّ مِنَ الْعلم أَن يَقُول لِمَا لَا تَعْلَمُ: اللَّهُ أَعْلَمُ. قَالَ اللَّهُ تَعَالَى لِنَبِيِّهِ: (قُلْ مَا أَسْأَلُكُمْ عَلَيْهِ مِنْ أَجْرٍ، وَمَا أَنا من المتكلفين؛ 38: 86).
272. (75) [1/90–ఏకీభవితం]
’అబ్దుల్లాహ్ బిన్ మస్’ఊద్(ర) కథనం: ప్రజలారా! ఎవరికైనా ఏదైనా విషయం తెలిసి ఉంటే, ఇతరులకు తెలియజేయాలి. తెలియని విషయాన్ని గురించి అడిగితే, ”అల్లాహ్(త)కే తెలుసు” అని పలకాలి. ఇది కూడా ఒక రకమైన జ్ఞానమే. అల్లాహ్(త) తన ప్రవక్త గురించి ఇలా పేర్కొన్నాడు, ”ఓ ప్రవక్తా! వారితో అను, ‘నేను దీని (ఈ సందేశం) కొరకు మీ నుండి ఎలాంటి ప్రతిఫలాన్ని అడగటం లేదు. మరియు నేను వంచకులలోనివాడనూ కాను.” (సూ. ‘సాద్, 38:86) (బు’ఖారీ, ముస్లిమ్)
273 – [ 76 ] ( صحيح ) (1/90)
وَعَنِ ابْنِ سِيرِينَ، قَالَ: إِنَّ هَذَا الْعِلْمَ دِينٌ؛ فَانْظُرُواعَمَّنْ تَأْخُذُونَ دِينَكُمْ. رَوَاهُ مُسْلِمٌ.
273. (76) [1/90–దృఢం]
ఇబ్నె సీరీన్ (ర) కథనం: ఖుర్‌ఆన్, ‘హదీసు’ల జ్ఞానమే ధర్మం. కనుక మీరు ఎవరి నుండి విద్యను అభ్యసిస్తున్నారో చూసుకోండి. [40] (ముస్లిమ్)
274 – [ 77 ] ( صحيح ) (1/90)
وَعَن حُذَيْفَة، قَالَ: يَا مَعْشَرَ الْقُرَّاءِ! اسْتَقِيمُوا، فَقَدْ سَبَقْتُمْ سَبْقًا بَعِيدًا، وَإِنْ أُخِذْتُمْ يَمِينًا وَشِمَالًا لَقَدْ ضلَلتم ضلالا بَعيدًا. رَوَاهُ البُخَارِيّ.
274. (77) [1/90–దృఢం]
’హుజై‘ఫహ్ (ర) కథనం: ఓ ఖుర్‌ఆన్ పారాయణం చేసే ప్రజలారా! మీరు తిన్నగా ఉండండి. ఎందుకంటే మీరే అందరికంటే ముందు ఉన్నారు. ఒకవేళ మీరు నిటారుగా వెళ్ళడానికి బదులు అటూ, ఇటూ తిరిగితే, మీరు మార్గభ్రష్టత్వానికి గురవుతారు. [41] (బు’ఖారీ)
275 – [ 78 ] ( ضعيف جدا ) (1/90)
وَعَنْ أَبِي هُرَيْرَةَ، قَالَ: قَالَ رَسُولُ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: “تَعَوَّذُوا بِاللَّهِ مِنْ جُبِّ الْحَزَنِ”. قَالُوا: يَا رَسُولَ اللَّهِ! وَمَا جُبُّ الْحَزَنِ؟ قَالَ: “وَادٍ فِي جَهَنَّمَ تَتَعَوَّذُ مِنْهُ جَهَنَّم كل يَوْم أَرْبَعمِائَة مرّة”. قِيلَ: يَا رَسُولَ اللَّهِ! وَمَنْ يَدْخُلُهَا؟ قَالَ: “الْقُرَّاءُ الْمُرَاؤُونَ بِأَعْمَالِهِمْ”. رَوَاهُ التِّرْمِذِيُّ، وَكَذَا ابْنُ مَاجَهْ، وَزَادَ فِيهِ: “وَإِنَّ مِنْ أَبْغَضِ الْقُرَّاءِ إِلَى اللَّهِ تَعَالَى الَّذِينَ يَزُورُونَ الْأُمَرَاءَ”. قَالَ الْمُحَارِبِيُّ: يَعْنِي الجورة.
275. (78) [1/90–అతి బలహీనం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స), ”దుఃఖాల గొయ్యి నుండి అల్లాహ్(త)ను శరణుకోరండి” అని హిత బోధ చేశారు. దానికి ప్రజలు, ఓ ప్రవక్తా! ‘దుఃఖాల గొయ్యి అంటే ఏమిటి,’ అని అడిగారు. అప్పుడు ప్రవక్త (స), ‘అది నరకంలోని ఒక లోయ, స్వయంగా నరకం దాన్నుండి రోజుకు 400 సార్లు అల్లాహ్(త)ను శరణు వేడుకుంటుంది.’ అని సమాధానం ఇచ్చారు. అప్పుడు ప్రజలు, ‘ప్రవక్తా! అందులో ఎవరు పడవేయ బడతారు?’ అని విన్నవించు కున్నారు. దానికి ప్రవక్త (స), ప్రదర్శనాబుద్ధితో, ‘ఖుర్‌ఆన్ చదివే, ఆచరించే వారు,’ అని సమాధాన మిచ్చారు.” (తిర్మిజి’)
అయితే! ఇబ్నెమాజ ఉల్లేఖనంలో ఈ పదాలు అధికంగా ఉన్నాయి, ”అల్లాహ్ వద్ద అందరికంటే పరమ నీచులు దుర్మార్గ పాలకులతో కలిసే ఖుర్‌ఆన్ పాఠకులు. అంటే ప్రదర్శనా బుద్ధితో పఠించేవారు ఈ భయంకరమైన గోతిలో శిక్షించబడుతారు. అందువల్ల ప్రతి ఆచరణలో చిత్తశుద్ధి ఉండాలి.”
276 – [ 79 ] ( ضعيف ) (1/91)
وَعَنْ عَلِيٍّ، قَالَ: قَالَ رَسُولُ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: “يُوشِكُ أَنْ يَأْتِيَ عَلَى النَّاسِ زَمَانٌ لَا يَبْقَى مِنَ الْإِسْلَامِ إِلَّا اسْمُهُ، وَلَا يَبْقَى مِنَ الْقُرْآنِ إِلَّا رَسْمُهُ، مَسَاجِدُهُمْ عَامِرَةٌ وَهِيَ خَرَابٌ مِنَ الْهُدَى، عُلَمَاؤُهُمْ شَرُّ مَنْ تَحْتَ أَدِيمِ السَّمَاءِ، مِنْ عِنْدِهِمْ تَخْرُجُ الْفِتْنَةُ، وَفِيهِمْ تَعُودُ”. رَوَاهُ الْبَيْهَقِيُّ فِي “شُعَبِ الْإِيمَان”.
276. (79) [1/91–బలహీనం]
‘అలీ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”అతి త్వరలో ప్రజలపై ఒక కాలం వస్తుంది. అప్పుడు ఇస్లామ్ పేరుకు మాత్రమే మిగిలి ఉంటుంది. అదేవిధంగా ఖుర్‌ఆన్ ను కూడా వ్యాఖ్యానంతో పనిలేకుండా ఆచరించటం జరుగుతుంది. మస్జిదులు ఉంటాయి కాని వాటిలో సన్మార్గం ఉండదు. అంటే నమా’జు చదివే వారుంటారు, కాని వారిలో విశ్వాసం ఉండదు. వారి పండితులు ఆకాశంక్రింద ఉన్న ప్రాణులన్నిటిలో కెల్లా నీచులై ఉంటారు. వారిలో నుండి ఉపద్రవాలు, కల్లోలాలు తలెత్తుతాయి. మళ్ళీ వారి వైపునకే మళ్ళుతాయి.” (బైహఖీ-షు’అబిల్ ఈమాన్)
277 – [ 80 ] ( صحيح ) (1/91)
وَعَن زِيَاد بن لبيد، قَالَ: ذَكَرَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ شَيْئًا، فَقَالَ: “ذَاكَ عِنْدَ أَوَانِ ذَهَابِ الْعِلْمِ”. قُلْتُ: يَا رَسُولَ اللَّهِ! وَكَيْفَ يَذْهَبُ الْعِلْمُ وَنحن نَقْرَأ الْقُرْآن ونقرِئُه أبناءنا، ويقرِؤُه أبناؤنا أَبْنَاءَهُم إِلَى يَوْم الْقِيَامَة؟ قَالَ: “ثَكِلَتْكَ أُمُّكَ زِيَادُ! إِنْ كُنْتُ لَأُرَاكَ مِنْ أَفْقَهِ رَجُلٍ بِالْمَدِينَةِ! أَوَلَيْسَ هَذِهِ الْيَهُودُ وَالنَّصَارَى يَقْرَؤُونَ التَّوْرَاةَ وَالْإِنْجِيلَ لَا يَعْمَلُونَ بِشَيْءٍ مِمَّا فِيهِمَا؟” رَوَاهُ أَحْمَدُ وَابْنُ مَاجَهْ وَرَوَى التِّرْمِذِيُّ عَنهُ نَحوه.
277. (80) [1/91–దృఢం]
’జియాద్ బిన్ లబీద్ (ర) కథనం: ప్రవక్త (స) ఒక కల్లోలం గురించి ప్రస్తావించి, ‘ఇది ఎప్పుడు జరుగుతుందంటే, అప్పుడు ధార్మికజ్ఞానం నశిస్తూ ఉంటుంది’ అని అన్నారు. అది విని నేను, ‘ఓ ప్రవక్తా! మేము ఖుర్‌ఆన్‌ను పఠిస్తాము, మా సంతానానికి కూడా నేర్పుతాము, ఇంకా మా పిల్లలు తమ సంతానానికి నేర్పుతారు. ఈ విధమైన పరంపర తీర్పు దినం వరకు ఉంటుంది కదా, మరి ధర్మజ్ఞానం ఎలా నశిస్తుంది,’ అని ఆశ్చర్యం వ్యక్తం చేసుకున్నారు. దానికి ప్రవక్త (స), ‘నీ పాడుగాను, నువ్వు మదీనహ్ లోని తెలివిగల వారిలో ఒకడివని అనుకునే వాడివి. యూదులు, క్రైస్తవులు తమ గ్రంథమైన తౌరాతు, ఇంజీలును చదవరా? చదివించరా? అయినప్పటికీ వారు వాటి ఆదేశాలను పాలించరు. వాటి ప్రకారం నడవరు. అదేవిధంగా ఈ అనుచర సమాజానికి చెందినవారు కూడా పఠిస్తారు, బోధిస్తారు, కాని ఆచరించరు,’ అని అన్నారు. (అ’హ్మద్, ఇబ్నె మాజహ్, తిర్మిజి’)
278 – [ 81 ] ( ضعيف ) (1/91)
وَكَذَا الدَّارمِيّ عَن أبي أُمَامَة.
278. (81) [1/91–బలహీనం]
ఈ ‘హదీసు’ను, అబూ ఉమామ ద్వారా దార్మీ కూడా ఉల్లేఖించారు.
279 – [ 82 ] ( ضعيف ) (1/91)
وَعَنِ ابْنِ مَسْعُودٍ، قَالَ: قَالَ لِي رَسُولُ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: “تَعَلَّمُوا الْعِلْمَ وَعَلِّمُوهُ النَّاسَ، تَعَلَّمُوا الْفَرَائِضَ وَعَلِّمُوهَا النَّاسَ، تَعَلَّمُوا الْقُرْآنَ وَعَلِّمُوهُ النَّاسَ؛ فَإِنِّي امْرُؤٌ مَقْبُوضٌ، وَالْعِلْمُ سَيَنْقَبِضُ، وَتَظْهَرُ الْفِتَنُ حَتَّى يَخْتَلِفَ اثْنَانِ فِي فَرِيضَةٍ لَا يَجِدَانِ أَحَدًا يَفْصِلُ بَيْنَهُمَا”. رَوَاهُ الدَّارِمِيُّ وَالدَّارَقُطْنِيّ.
279. (82) [1/91–బలహీనం]
ఇబ్నె మస్’ఊద్ (ర) కథనం: ప్రవక్త (స) నన్ను ఇలా ఉపదేశించారు, ”విద్యనేర్చుకో, నేర్పించు, ఇంకా ఆస్తి పంపకాల విద్యను కూడా నేర్చుకో, ఇతరులకు నేర్పించు, ఖుర్‌ఆన్‌ను కూడా నేర్చుకో, ఇతరులకు నేర్పించు, ఎందు కంటే అతి త్వరలో నేను వెళ్ళిపో నున్నాను. విద్య కూడా నశిస్తుంది. అనేక ఉపద్రవాలు తలెత్తుతాయి. చివరికి ఇద్దరు వ్యక్తులు ఒక విషయంపై వాగ్వివాదానికి దిగితే, వారి మధ్య తీర్పు ఇచ్చేవారెవరూ ఉండరు.” (దార్మీ, దార ఖు’త్నీ)
280 – [ 83 ] ( حسن ) (1/92)
وَعَنْ أَبِي هُرَيْرَةَ، قَالَ: قَالَ رَسُولُ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: “مَثَلُ عِلْمٍ لَا يُنْتَفَعُ بِهِ كَمَثَلِ كَنْزٍ لَا يُنْفَقُ مِنْهُ فِي سَبِيل الله”. رَوَاهُ الدَّارمِيّ.
280. (83) [1/92–ప్రామాణికం]
అబూ హురైరహ్ (ర) కథనం: ప్రవక్త (స) ప్రవచనం, ”లాభం చేకూర్చని విద్య, దైవమార్గంలో ఖర్చుచేయని నిధివంటిది.” [42] (దార్మీ)
*****
[1]) వివరణ-198: అంటే నా నుండి వచ్చిన దైవసందేశాన్ని ఇతరులకు అందజేయండి. అది ఒక్క ఆయతు అయినా సరే, చిన్నవిషయం అయినా సరే. ఇందులో విద్యా జ్ఞానాల ప్రచారం యొక్క ప్రాధాన్యత గురించి పేర్కొనడం జరిగింది. ప్రారంభంలో బనీ-ఇస్రాయీల్ కథలు, సంఘటనలను పేర్కొనటం నిషిద్ధంగా ఉండేది. ఇప్పుడు అనుమతించ బడింది. వీటిని వినిపించడంలో ఎటువంటి పాపం లేదు. అయితే వాటిని సమర్థించకూడదు, తిరస్క రించకూడదు. ఒకవేళ ఇస్లామ్‌కు అనుగుణంగా ఉంటే, స్వీకరించటంలో ఎటువంటి అభ్యంతరం లేదు. అదే విధంగా ప్రవక్త (స) అనని విషయాన్ని అతను (స) అన్నారని అనడం మహాపాపం. అటువంటి వాడి నివాసం నరకం. కొందరు దీన్ని అవిశ్వాసంగా భావించారు. ఇది ముతవాతిర్ ‘హదీసు‘. దీన్ని 62 మంది స’హాబాలు ఉల్లేఖించారు. వీరిలో అషరహ్ ముబష్షిరహ్ కూడా ఉన్నారు.
[2]) వివరణ-199: దీని ద్వారా విషదమయ్య్దేదేమిటంటే ‘హదీసు’లను, వాటి వాస్తవాలు, స్థితులు పేర్కొనకుండా వివరించటం తగదు. ఇది చాలా నీచమైన అపనింద అవుతుంది.
[3]) వివరణ-200: అంటే ఖుర్‌ఆన్ సున్నత్‌ల జ్ఞానం నాకు [ము’హమ్మద్ (స)కు] ప్రసాదించబడుతుంది. నేను దాన్ని ప్రజలకు వినిపిస్తాను, బోధిస్తాను.
[4]) వివరణ-201: ప్రజలు గనుల వంటివారు అంటే ప్రజల్లో వివిధ వంశాలు, కుటుంబాలు కలిగి ఉన్నారు. ఒక వంశం వారు వీరత్వం కలిగి ఉంటారు. ఒక వంశంలో దయా కారుణ్యాలు ఉంటాయి. ఒక వంశంలో న్యాయం ధర్మం ఉంటాయి. ఒక వంశంవారు నీచులు, ద్రోహులు, పిసినారులు, పిరికివారు, దుర్మార్గులు ఉంటారు. ఇస్లామ్‌కు ముందు ఇటువంటి వారుంటే, ఇస్లామ్‌లో కూడా మంచివారే ఎప్పుడూ మంచివారు. చెడ్డవారు ఎప్పుడూ చెడ్డవారే. ఇందులో దైవభీతి, విద్యాజ్ఞానాల ప్రాధాన్యతను గురించి పేర్కొనడం జరిగింది. వంశాల, కుటుంబాల గొప్పతనం ఏమీ లేదు. వీటిపై గర్వం, అహంకారం ఏమాత్రం తగదు. అయితే వీటికి తోడు విశ్వాసం, మంచి నడవడిక, సత్కార్యాలు, విద్యాజ్ఞానాలు ఉంటే ఎంతో ఉత్తమం. ప్రవక్త (స) మానవులను గనులతో పోల్చారు. గనుల్లో బంగారం ఉంటే, ప్రజలు దాన్ని గుర్తించరు. కాని ఆ బంగారాన్ని తీసి శుద్ధి చేసిన తర్వాత, ప్రజలు దాన్ని ఎంతో ఆశతో చూస్తారు. అదేవిధంగా మనిషి ఏ కుటుంబం, వంశానికి చెందినవాడై నప్పటికీ అతనిలో ఉత్తమ నడవడిక, సద్గుణాలు, మంచితనం ఉంటే, అతన్ని ప్రజలు ప్రేమిస్తారు.
[5]) వివరణ-202: ‘హసద్ = ఈర్ష్య, అసూయపడటం, అంటే ఇతరుల అనుగ్రహాలు నశించాలని కోరుకోవటం. ఇది ఎంత మాత్రం ధర్మసమ్మతం కాదు. మరోవిధంగా ఇతరులవలే తనకూ అనుగ్రహాలు లభించాలని కోరటం. మంచి ఉద్దేశ్యంతో ఇతరుల్లా తనకు ఆ అనుగ్రహాలు లభించాలని కోరటం ధర్మసమ్మతమే.
[6]) వివరణ-203: మానవుడు తన జీవితంలో చేసిన సత్కార్యాలకు తీర్పుదినం నాడు ప్రతిఫలం తప్పకుండా లభిస్తుంది. ఉదా. నమా’జు, జకాతు మొదలైనవి. మరణించిన తరువాత ఆ పరంపర ఆగిపోతుంది. అయితే మూడు మార్గాల ద్వారా పుణ్యం చేరుతూ ఉంటుంది: 1. మస్జిద్ నిర్మాణం లేదా మద్‌రసా నిర్మాణం, బావి నిర్మాణం మొదలైనవి, 2. విద్య నేర్పించటం, పుస్తకాలు వ్రాయటం, బోధించటం, 3. ఉత్తమ సంతానం తల్లిదండ్రుల మరణానంతరం వారి గురించి ప్రార్థిస్తుంది.
[7]) వివరణ-205: విశ్వాసం, కర్మల్లో చిత్తశుద్ధి చాలా అవసరం. చిత్తశుద్ధి లేకుండా ప్రదర్శనాబుద్ధితో చేస్తే, వాటికి అల్లాహ్(త) ముందు ఎటువంటి విలువ ఉండదు. ఈ ముగ్గురూ చిత్తశుద్ధితో కాక ప్రదర్శనాబుద్ధితో చేశారు. అందువల్లే వారి కర్మలు వృథా అయ్యాయి. నరకంలో వేయబడ్డారు. అల్లాహ్(త) మనందరికీ చిత్తశుద్ధి ప్రసాదించుగాక! ఇంకా చూపుగోలుకు, ప్రదర్శనాబుద్ధికి దూరంగా ఉంచుగాక!
[8]) వివరణ-206: ఇది ప్రవక్త (స) భవిష్యవాణి. చివరికాలంలో సత్యబోధనలు, పండితులు మరణిస్తారు, వారి మరణా నంతరం ధార్మిక విద్యాజ్ఞానాలు కూడా ఎత్తుకోబడతాయి, అప్పుడు చదివేవారూ ఉండరు, చదివించేవారూ ఉండరు. సరైన పండితులు లేక పోవటం వల్ల ప్రజలు అజ్ఞానులను నాయకులుగా, పండితులుగా స్వీకరించటం జరుగుతుంది. వారికి ధార్మిక విషయాలు ఏవీ తెలిసి ఉండవు, తప్పు ఒప్పులతో పనిలేకుండా తమకు తోచిన విధంగా తీర్పులు ఇస్తారు. ధర్మసమ్మతాలను నిషిద్ధాలుగా, నిషిద్ధాలను ధర్మ సమ్మతంగా చేసివేస్తారు. తామూ మార్గం తప్పుతారు, ఇతరులనూ మార్గం తప్పిస్తారు.
[9]) వివరణ-207: ప్రజలకు విసుగు పుట్టకుండా, వారానికి ఏదో ఒకరోజు ధార్మిక బోధనా తరగతులు నిర్వహించాలని ఈ ‘హదీసు’ ద్వారా బోధపడింది.
[10]) వివరణ-208: ముఖ్య విషయాల గురించి మాట్లాడి నపుడు, ఎదుటివారికి సరిగ్గా అర్థం కాలేదనే అనుమానం వచ్చినపుడు, విషయాన్ని గురించి మూడుసార్లు వల్లించే వారు. దాన్ని విని సరిగా గుర్తుంచుకోవాలని, సరిగా అర్థం చేసుకోవాలని. ఎక్కడికైనా వెళితే మూడు సలామ్‌లు చేసేవారు. వారి ఇంటికి వెళ్ళి బయటనుండి, లోపలికి వెళ్ళి కలిసినపుడు, తిరిగి వచ్చినపుడు.
[11]) వివరణ-212: ‘హదీసు’లోని భావం స్పష్టంగా ఉంది. అతడు కేవలం ‘హదీసు’ నేర్చుకోవటానికి మదీనహ్ నుండి దమిష్క్ వచ్చారు. అబూ దర్దా’ను కలుసుకొని ఆ ‘హదీసు’ను నేర్చుకున్నారు. అబూ-దర్‌దా’ ‘హదీసు’ల పట్ల అతని శ్రద్ధాసక్తులు చూసి, దీని ప్రత్యేకతను తెలుపుతూ ఈ ‘హదీసు’ వినిపించారు. దీని ద్వారా ‘హదీసు’ విద్య ప్రాముఖ్యత వెల్లడౌతుంది. ధార్మిక విద్య నేర్చుకునేవారి కొరకు విశ్వంలోని ప్రాణులన్నీ చివరికి దైవదూతలు కూడా ప్రార్థిస్తారు. దైవభక్తుల కన్నా, ధార్మిక విద్య నేర్చుకునేవారి స్థానం గొప్పది. అయితే ఆ ‘స’హాబీ పేరు తెలియలేదు. ఇంకా ఏ ‘హదీసు’ను గురించి వచ్చారో అని కూడా తెలయలేదు. దీన్ని గురించి ఇంకా అనేక ఉల్లేఖనా లున్నాయి. ఉదాహరణకు కొన్ని సంఘటనలను ఇక్కడ పేర్కొంటాం.
1. ‘అబ్దుల్లాహ్ బిన్-బురైదహ్ (ర) కథనం: ఒక ప్రవక్త (స) అనుచరుడు మదీనహ్ నుండి ఈజిప్టు వెళ్ళి ఫు’దాల బిన్ ‘ఉబైద్ అనే మరొక ప్రవక్త అనుచరుని వద్దకు వెళ్ళి, అతన్ని కలిశారు. అతడు తన ఒంటెను గడ్డి తినిపిస్తున్నారు. ఫు’దాల కలసి సలామ్ చేసిన తర్వాత స్వాగతం పలికారు. తరువాత ఆ వ్యక్తి, ‘నేను మీ వద్దకు కలవడానికి రాలేదు. మీరూ, నేను కలసి ప్రవక్త (స) నుండి ఒక ‘హదీసు’ విన్నాం. అది మీకు గుర్తుండి ఉంటుంది,’ అని అన్నాడు. దానికి, ‘ఫు’దాలా ఏ ‘హదీసు’,’ అని అడిగారు. దానికి అతడు, ‘ఫలానా ‘హదీసు’,’ అని అన్నారు.
2. జాబిర్ బిన్ ‘అబ్దుల్లాహ్ (ర) కథనం: ప్రవక్త (స) యొక్క ఒక ‘హదీసు’ ఒక వ్యక్తి ద్వారా నాకు చేరింది. దాన్ని నేను ప్రవక్త (స) ద్వారా వినలేదు. దాని పరిశోధనకు నేనొక ఒంటెను కొన్నాను. దానిపై మావటిని పెట్టి నెలరోజులు ప్రయాణంచేసి, సిరియా దేశం వెళ్ళాను. ‘అబ్దుల్లాహ్ బిన్ ఉనైస్ (ర) ఇంటి వద్దకు వెళ్ళి, అతనికి జాబిర్ వచ్చాడని చెప్పమని అన్నాను. ‘ఏ జాబిర్’ అని అడగటం జరిగింది. ‘జాబిర్ బిన్ ‘అబ్దుల్లాహ్’ అని సమాధానం ఇవ్వటం జరిగింది. అది విన్న ‘అబ్దుల్లాహ్ బిన్ ఉనైస్ త్వరగా బట్టలు ధరించి బయటకు వచ్చారు. సలామ్ తర్వాత జాబిర్ (ర), నీవు ఉల్లేఖించినట్టు ఖి’సా’స్‌కు చెందిన ఒక ‘హదీసు’ నాకు చేరింది. దాన్ని నేను ప్రవక్త (స) ద్వారా వినలేదు. మన మిద్దరం విడిపోతే ఆ విషయం అలాగే ఉండి పోతుంది. అది విన్న ‘అబ్దుల్లాహ్ బిన్ ఉనైస్ ఆ ‘హదీసు’ను పేర్కొన్నారు.
3. వా’హిబ్ బిన్ ‘అబ్దుల్లాహ్ అల్ మ’ఆరిఫీ (ర) కథనం: ఒక సారి ఒక అ’న్సారీ వ్యక్తి ప్రయాణం చేసి ముస్‌లమహ్ బిన్ ము’ఖల్లద్ వద్దకు వెళ్ళారు. అనుకోకుండా ఆ సమయంలో అతడు నిద్రపోతున్నాడు. ఆ అ’న్సారీ వ్యక్తి అతన్ని లేప మన్నాడు. ఇంటివారు లేపటానికి నిరాకరించారు. చివరికి అతని పట్టుకు ఆయన లేపబడ్డారు. అతని మాటలు విని స్వాగతం అని పలుకుతూ బయటకు వచ్చారు. వాహనంపై నుండి దిగమన్నారు. దానికి అతను, ‘ ‘ఉఖ్‌బహ్ బిన్ ‘ఆమిర్‌ను పిలుచుకురానంత వరకు నేను దిగనన్నారు. ‘ఉఖ్‌బహ్ బిన్ ‘ఆమిర్ వచ్చిన వెంటనే అ’న్సారీ అతనితో, ‘ప్రవక్త (స) ఇలా అనటం నీవు విన్నావా?’ అని అడిగారు. దానికతను అవునన్నారు.
4. అబుల్ ‘ఆలియహ్ (ర) కథనం: మేము బ’స్రాలో ‘హదీసు’లను వినేవారము. మళ్ళీ వాటిని పరికించ టానికి, పరిశోధించటానికి మదీనహ్ కు వెళ్శేవారము. నేరుగా ప్రవక్త (స) అనుచరుల నోటిద్వారా వినాలని. ‘హదీసు’ ప్రత్యేకతలను గురించి, ‘హదీసు’ విద్యార్థులను గురించి ముందు మాటలో పేర్కొనడం జరిగింది.
[12]) వివరణ-215: నా మరణానంతరం ప్రపంచ నలుమూలల నుండి ప్రజలు ధార్మికవిద్య అంటే ఖుర్‌ఆన్, ‘హదీసు’ల విద్య అభ్యసించటానికి వస్తారు. వాళ్ళు మీ వద్దకు వస్తే వాళ్ళపట్ల మంచిగా, ఉత్తమంగా ప్రవర్తించాలి. ఇది ప్రవక్త (స) అనుచరు లను ఉద్దేశించి ప్రవచించడం జరిగింది. కాని ఇది అందరికీ అంటే ధార్మిక విద్యాలయాలకు, కళాశాలలకు, విశ్వవిద్యాలయాలకు వాటి అధికారులకు, యంత్రాంగానికి కూడా వర్తిస్తుంది.
[13]) వివరణ-216: బుద్ధీ వివేకాల వచనాలు వివేకవంతుని సంపదలు. ఎక్కడ లభించినా వెంటనే వాటిని పొందాలి. ఎందుకంటే వివేకవచనాలు వివేకవంతులకే తగినవి. అంటే పోగొట్టుకున్న వివేక విషయాలు లభించినట్టు.
[14]) వివరణ-217: ఎందుకంటే బుద్ధీవివేకాలు గల పండి తుడ్ని షై’తాన్ ఎత్తులు, కుట్రలు తెలిసి ఉంటాడు. వాటి గురించి ప్రజలకు తెలియపరుస్తాడు. కాని భక్తుడు దైవారాధనలో నిమగ్నమయి ఉంటాడు. షై’తాన్ ఎత్తులు, కుట్రల గురించి అతనికి తెలిసి ఉండదు. అందువల్ల షై’తాన్ కుట్రలకు, పన్నాగాలకు గురిఅవుతాడు. అందువల్లే భక్తునిపై పండితునికి అధిక ప్రాధాన్యత ఇవ్వబడింది.
[15]) వివరణ-218: ఇక్కడ విద్య అంటే ధార్మిక విద్య. అంటే ప్రతి స్త్రీ పురుష ముస్లిములు ధార్మిక విద్య అంటే ఏకత్వం, దైవదౌత్యం, నమా’జు, ఉపవాసం, ‘హజ్జ్, ‘జకాత్, నికా’హ్, ‘తలాఖ్, ‘హైజ్, నిఫా’స్ మొదలైన విషయాలను అవసరార్థం తప్పనిసరిగా నేర్చుకోవాలి. జీవిత వివిధరంగాల్లో, వ్యవ హారాల్లో వీటి అవసరం ఎంతయినా ఉంటుంది. సరిగ్గా ఆచరించటానికి విద్య నేర్చుకోవాలి. విద్య నేర్చుకొని, ఆచరించనంత వరకు ఒక వ్యక్తి ముస్లిమ్ కాలేడు. ఈ ‘హదీసు’ బలహీనమైనది. కాని అనేక మార్గాల ద్వారా ఉల్లేఖించబడినందున ”హసన్ లి’గైరిహీ” అవటం వల్ల ఆచరణయోగ్యమైనది. చరిత్రహీనులకు విద్య నేర్పించటం వల్ల ఎటువంటి లాభంలేదు.
[16]) వివరణ-219: కపటాచారి ధార్మిక పండితుడు కాలేడు. ఈరెండు గుణాలు కలిగి ఉన్న వ్యక్తి కపటాచారికాలేడు. అందు వల్ల ఇటువంటి ఉత్తమ గుణాలు పొందటానికి ప్రయత్నించాలి.
[17]) వివరణ-220: అంటే ధార్మిక విద్యాభ్యాసం కోసం ఇల్లు వదలి వెళ్ళినవాడు పోరాటం చేసే వాడితో సమానం. ఏ విధంగా జిహాద్ చేసేవారికి పుణ్యం లభిస్తుందో, అదే విధంగా విద్య నేర్చుకునేవారికి లభిస్తుంది. ఎందు కంటే వీరిద్దరూ దైవ మార్గంలో కృషి చేస్తున్నారు.
[18]) వివరణ-229: అంటే ఇవి దీవెన వచనాలు. ప్రవక్త (స) ” ‘హదీసు’లను గుర్తుంచుకునే వారికి, అందజేసే వారికి అల్లాహ్(త) సుఖసంతోషాలు ప్రసాదించు గాక!” అని దీవించారు. ‘హదీసు’ విద్య నేర్చుకునేవారికి ఇది గొప్ప శుభవార్త మరియు గొప్ప దైవానుగ్రహం. ఈ ‘హదీసు’ వారే ప్రవక్త (స) వారసులు. ఎందుకంటే ప్రవక్త (స) వీరి గురించి ప్రత్యేకంగా ప్రార్థించారు.
‘అలీ (ర) కథనం: ఒకసారి ప్రవక్త (స) మా వద్దకు వచ్చి, ”ఓ అల్లాహ్(త)! నా ‘ఖలీఫాలను కరుణించు,” అని ప్రార్థించారు. అప్పుడు మేము, ”ఓ ప్రవక్తా! తమరి ‘ఖలీఫాలు ఎవరు,” అని విన్నవించుకున్నాము. దానికి ప్రవక్త (స), ”నా ఖలీఫాలు నా తరువాత వస్తారు, నా ‘హదీసు’లను, నా సాంప్రదాయాలను ఉల్లేఖిస్తారు, వాటిని ప్రజలకు బోధిస్తారు,” అని అన్నారు.
[19]) వివరణ-236: అంటే ఖుర్‌ఆన్ ఆయాతులలో వ్యతిరేకత సృష్టించి ఉద్దేశ్యపూర్వకంగా వాదనలకు దిగటం, లేదా కొన్ని వాక్యాలను స్వీకరించటం, మరికొన్ని వాక్యాలను తిరస్క రించటం.
[20]) వివరణ-238: హర్ఫ్ అంటే ఒక వైపు, లేక ఒక మూల అని అర్థం అంటే భాషలు. ఖుర్‌ఆన్ అరబ్బుల్లోని ప్రఖ్యాత తెగల భాషలలో అవతరింపజేయబడింది. అంటే 7 తెగల భాషలపై అవతరింపజేయబడింది. ఆ ప్రఖ్యాత తెగలు: ఖురైష్, ’తయ్, హవా’జిన్, అహ్‌లె యమన్, స‘ఖీఫ్, హు’జైల్, బనూ తమీమ్. ఎందుకంటే ఈ తెగలు భాషా పాండిత్యంలో పేరుగాంచాయి. అందువల్ల ఖుర్‌ఆన్ వీరి భాషా పదాల్లోనే అవతరింపజేయబడింది. బాహ్యపరంగా అంటే ఆ భాషవారు దాన్ని సులువుగా అర్థం చేసుకోగలరు. ఆంతర్యపరంగా అంటే ప్రత్యేక వ్యక్తులు దాన్ని తెలుసుకుంటారు. ఇంకా ‘హద్ అంటే అంతం. అంటే ఆంతర్యానికి, బహిర్గతానికి ఒక హద్దు ఉంటుంది. ప్రతిదానికి తెలుసుకునే ఒక సూచన ఉంటుంది. నేర్చుకోవటం, పరిశ్రమించటం, విధేయత అవసరం. ఆలోచించేవారికి అవి తెలుస్తాయి. ఇతరులకు తెలియవు. అయితే అల్లాహ్(త) కే అంతా తెలుసు.
[21]) వివరణ-239: అంటే ధార్మిక విద్య 3 రకాలు: 1. ఖుర్‌ఆన్‌లోని స్పష్టమైన వాక్యాలు. రద్దు కానివి, ఇవే మూల గ్రంథ సూచనలు, 2. సున్నతె ఖాయిమహ్ అంటే ప్రామాణిక ‘హదీసు’లు, 3. ఫరీ’దయె ’ఆదిలహ్ అంటే హక్కులకు సంబంధించినది.
[22]) వివరణ-241: మూడు రకాల వ్యక్తులు ప్రసంగం చేస్తారు. 1. పాలకుడు ప్రజల సుఖసంతోషాల కోసం, వారి మంచి కోసం హితబోధచేస్తాడు. లేదా దాని కోసం తన ప్రజల్లో ఎవరినైనా (పాలించబడేవాడిని) నియమించ వచ్చు. వీరిద్దరూ ప్రసంగించటం ధర్మసమ్మతమే. అయితే తన గొప్పతనాన్ని చాటుకునే నిమిత్తం ప్రసంగించటం మంచిది కాదు. ఎందుకంటే దీనివల్ల ప్రజల్లో అభిప్రాయభేదాలు, మనస్పర్థలు జనిస్తాయి.
[23]) వివరణ-243: అంటే పండితులను అనవసరంగా ప్రశ్నలు వేసి వారిని చిక్కుల్లో పడవేయటం, దీనివల్ల ఉపద్రవాలు, కల్లోలాలు తలెత్తుతాయి. అందువల్ల ప్రవక్త (స) దీన్నుండి వారించారు.
[24]) వివరణ-244: ఫరాయి’జ్ అంటే మానవునిపై విధించిన తప్పనిసరి అయిన విషయాలు. ఇవి లేకుండా ఒక వ్యక్తి పరిపూర్ణ ముస్లిమ్ కాలేడు. తౌహీద్, దైవదౌత్యం, సలాహ్, ఉపవాసాలు, ‘హజ్జ్, జకాత్ మొదలైనవి. లేదా ఆస్తికి సంబంధించిన విద్య. దీనితో ఆస్తితో, వారసులతో సంబంధం ఉంది. దీన్ని తెలుసుకోవటం కూడా తప్పనిసరి విషయమే. ఇది అర్థజ్ఞానం. ఖుర్‌ఆన్‌ను నేర్చుకోవటం, నేర్పించటం కూడా ప్రధానమైన విషయమే. ఎందుకంటే ఇది అన్నిటికీ కేంద్రం. ఇస్లామీయ విషయాలన్నీ దీనిపైనే ఆధారపడి ఉన్నాయి.
[25]) వివరణ-245: ఈ ‘హదీసు’లో జ్ఞానం అంటే దైవవాణి (వ’హీ) అని అర్థం. అంటే ప్రవక్త (స) నేను మరణిస్తానని, దైవవాణి అవతరించటం ఆగిపోతుందని పేర్కొన్నారు.
[26]) వివరణ-246: ఈ ‘హదీసు’ను అబూ హురైరహ్ (ర) ప్రవక్త (స) ద్వారా ఉల్లేఖించారు. ఇది ప్రామాణికమైన ‘హదీసు’. ఒంటెలను కొట్టటం అంటే, దూరప్రాంతాలకు ప్రయాణం చేయటం. ‘ఉమ్‌రీ అంటే ‘ఉమర్ (స) సంతానం. అతని పేరు: ‘అబ్దుల్ ‘అ’జీ’జ్ బిన్ ‘అబ్దుల్లాహ్ బిన్ ‘అమ్ర్ బిన్ ‘హ’ఫ్స్ బిన్ ‘ఆసిమ్ బిన్ ‘ఉమర్ బిన్ ‘ఖ’త్తాబ్. ఇది అతని అభిప్రాయం. మదీనహ్ లో పెద్దపెద్ద పండితులు, తాబియీన్లు, తబె-తాబియీన్లు ఉండేవారు. వీరు కూడా ఒకరై ఉండవచ్చు. తీర్పుదినానికి ముందు ధర్మజ్ఞానం మళ్ళీ మదీనహ్ కు పరిమితమై పోతుంది. అప్పుడు గొప్ప పండితులు మదీనహ్ లో తప్ప మరెక్కడా ఉండరు.
[27]) వివరణ-247: అల్లాహ్(త) ప్రతియుగంలో ఒక వ్యక్తిని సృష్టిస్తాడు. అతడు మూఢనమ్మకాలను, మూఢా చారాలను రూపుమాపి ధర్మాన్ని పరిశుద్ధపరుస్తాడు.
[28]) వివరణ-248: అంటే ము’హద్దిసీ’న్ల వర్గం. వీరు ప్రామాణిక ‘హదీసు’లను, బలహీనమైన ‘హదీసు’లను వేరుపరిచే ఒక నియమావళిని తయారుచేశారు. న్యాయ పరంగా ధర్మపరంగా దీన్ని అనుసరించటం జరిగింది.
[29]) వివరణ-251: అంటే పండితుడు ఇలాగే ఉండాలి. ఇదే అతనికి తగినది. ప్రజలకు లాభం చేకూర్చడం, గొప్పవారికి దూరంగా ఉండటం. అంటే అతడు తన ఆరాధనల్లో, బోధనల్లో, రచనలో, తీర్పులు ఇవ్వటంలో, పుస్తకాలు చదవటంలో నిమగ్నమయి ఉంటాడు.
[30]) వివరణ-253: అంటే శ్రమకు, పొంది ప్రజలకు నేర్పించి నందుకు రెండు పుణ్యాలు. ఒకవేళ పొందకపోతే కృషి ప్రయత్నాలకు ఒక పుణ్యం ఎలాగూ ఉంది. అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ పుణ్యం లభిస్తుంది.
[31]) వివరణ-255: దైవవాణి అంటే రహస్య దైవవాణి. అంటే అల్లాహ్(త) ఇలా ఆదేశిస్తున్నాడు, ”ధార్మిక విద్య అభ్యసించటానికి బయలుదేరిన వ్యక్తికోసం స్వర్గమార్గం సులభంచేసి వేస్తాను. ధార్మిక విద్యగ్రహించే, ఆరాధించే భాగ్యం ప్రసాదిస్తాను. దానిద్వారా అతడు స్వర్గంలో ప్రవేశిస్తాడు. అదేవిధంగా రెండుకళ్ళ దృష్టి కోల్పోయిన వాడు సహనం ఓర్పులను వహించి దైవంపై నమ్మకంతో ఉంటే, దానికి బదులుగా అతనికి స్వర్గం ప్రసాదిస్తాను. విద్యాధిక్యత, భక్తి ఆధిక్యత కన్నా గొప్పది. అయితే భయభీతులే ధర్మానికి మూలం.
[32]) వివరణ-257: అంటే మస్జిదులో ప్రవక్త (స) అనుచరుల రెండు బృందాలు వేర్వేరుగా కూర్చొని ఉన్నాయి. ఒక బృందం వారు దైవారాధనలో నిమగ్నమయి ఉన్నారు. రెండవ బృందం వారు విద్యాబోధనలో ఉన్నారు. ప్రవక్త (స) ఆ రెండు బృందాలను చూసి మీరిద్దరూ మంచిపని చేస్తున్నారు. అయితే, విద్యాబోధన చేస్తున్న బృందం అందరికంటే గొప్పది అని చెప్పి ప్రవక్త (స) విద్యాబోధన జరుగుతున్న బృందంలో కూర్చున్నారు. అంటే ధార్మిక విద్య నేర్చు కోవటం, నేర్పించటం చాలా ఉత్తమమైనవి.
[33]) వివరణ-259: అంటే ఆ వ్యక్తి ఒక బృందానికి నాయ కునిగా వస్తాడు.
[34]) వివరణ-265: మతిమరుపు యొక్క కారణాలకు దూరంగా ఉండాలి. మతిమరుపుకు కారణం పాపాలు. షాఫయీ కథనం, ”నేను మా గురువు వకీ’అతో నాకు మరచిపోయే వ్యాధి ఉందని అన్నాను. దానికి అతను నాతో పాపకార్యాలను వదలివేయి, ఎందుకంటే విద్యాజ్ఞానాలు అల్లాహ్ (త) అనుగ్రహాలు. అల్లాహ్ (త) అనుగ్రహాలు పాపాత్ములకు ఇవ్వబడవు.
[35]) వివరణ-267: చెడు గురించి అడిగితే, కేవలం నాకు చెడ్డ వారిగురించే అడగవద్దు, మంచివారి గురించి కూడా అడగండి అని అన్నారు. తనజ్ఞానానికి వ్యతిరేకంగా ఆచరించే పండితుడు అందరికంటే చెడ్డవాడు.
[36]) వివరణ-268: ధర్మజ్ఞానం పొంది లేదా ధర్మవ్యతిరేక జ్ఞానం పొంది, తను స్వయంగా దాన్ని ఆచరించలేదు, ఇతరులకు నేర్పలేదు. ఇటువంటి పండితునికి కఠిన మైన శిక్ష ఉంది. ”అజ్ఞానికి ఒక శిక్ష మరియు పండితునికి 7 శిక్షలు.”
[37]) వివరణ-269: అంటే వీటికి పాల్పడటం వల్ల ఇస్లామ్ యొక్క ముఖ్య విధులు తౌ’హీద్, రిసాలత్, ‘హజ్జ్’జకాత్ నమా’జ్, రో’జా మొదలైనవన్నీ వ్యర్థ మవుతాయి. ఒక్క ధార్మిక పండితుడు తప్ప టడుగు వేస్తే, అతన్ని చూసి చాలా పెద్ద సంఖ్యలో ప్రజలు తప్పటడుగు వేస్తారు జ్ఞానం, ఆచరణలేని కపటాచారి దైవగ్రంథం విషయంలో వాద-ప్రతివాదనలకు దిగటంవల్ల, ఇస్లామీయ వనరులకు హాని కలుగుతుంది. జ్ఞాన హీనులైన పాలకులు ఇస్లామ్‌ను పూర్తిగా చెరిపివేస్తారు.
[38]) వివరణ-270: జ్ఞానం రెండు రకాలు: 1. బహిర్గతమైనది, 2. రహస్యమైనది. బహిర్గతమైనది నోటిపై ఉంటుంది. ఆంతర్యంలో ఉన్న జ్ఞానంవల్ల హృదయంలో వెలుగు జనిస్తుంది. దానివల్ల దైవాన్ని గుర్తించడం జరుగుతుంది. ఇదే లాభం చేకూర్చుతుంది.
[39]) వివరణ-271: రెండు గిన్నెలు అంటే రెండు రకాల విద్యలు. 1. బహిర్గతమైనది. అంటే నమా’జు, రో’జా, ఇంకా ఇతర ఆదేశాలు, సద్గుణాలు. 2. రహస్యకరమైన విద్య. ప్రజల నుండి దాచి ఉంచడం జరిగింది. దాన్ని బహిరంగ పరచలేదు. ఎందుకంటే భవిష్యత్తులో జరగబోయే సంఘటనలు, ఉపద్రవాలు, కల్లోలాలు సూచిస్తాయి. ఒకవేళ నేను తెలిపితే ప్రజలు నన్ను చంపేస్తారు. వీటిని గురించి తెలిపే అవసరం లేదు.
[40]) వివరణ-273: మీ దగ్గర ఉల్లేఖించేవాన్ని, మీ గురువును బాగా పరీక్షించుకోండి. దైవభీతిపరుడైన, ఆచరించే పండితుని వద్ద ఖుర్‌ఆన్, ‘హదీసు’ల విద్య నేర్చుకోండి. కల్పితాలకు పాల్పడే వారివద్ద, దుర్మార్గుల వద్ద, పాపాత్ముల వద్ద విద్య నేర్చుకోకండి. లేకపోతే మీరు మార్గభ్రష్టత్వానికి గురవుతారు.
[41]) వివరణ-274: ’హుజై’ఫహ్ తన కాలానికి చెందిన ప్రవక్త (స) అనుచరులను, తాబయీన్లను ఉద్దేశించి, ఇతరులకన్నా మీరు చాలా ముందు ఉన్నారు. కనుక మీరు తిన్నగా ఉండాలి, మీ తర్వాత వచ్చేవారు మిమ్మల్ని అనుసరిస్తారు. ఒకవేళ మీరు అటూ ఇటూ తిరిగితే రుజుమార్గం తప్పుతారు.
[42]) వివరణ-280: విద్య నిధి వంటిది. ఎంత అధికంగా ఖర్చు చేస్తే అంతే అది పెరుగుతుంది. అదేవిధంగా ఎంత దాచితే, అంతే అది నాశనం అవుతుంది. అందువల్లే ‘హదీసు’లో ఈవిధంగా దు’ఆ ఉంది. ”ఓ అల్లాహ్! నాకు నేర్పిన దాని ద్వారా నాకు లాభం చేకూర్చు, లాభం చేకూర్చేదే నాకు నేర్పించు, నా జ్ఞానాన్ని వృద్ధిపరచు. ఓఅల్లాహ్! నేను నీ శరణు కోరుతున్నాను. లాభం చేకూర్చని విద్య నుండి, భయపడని హృదయం నుండి, తీరని తనివి నుండి, స్వీకరించని ప్రార్థన నుండి.”
***